breaking news
Vizianagaram
-
తిరుగు ప్రయాణంలో భవానీ భక్తుడి మృతి
చికెన్● గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదంపాలకొండ రూరల్: ఆధ్యాత్మిక చింతనతో భవానీ మాల ధరించిన పట్టణంలోని 16వ వార్డు కుమ్మరివీధికి చెందిన ద్రాక్షవరపు రాంబాబు(36) కూరగాయల మార్కెట్లో కలాసీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీక్ష ముగింపులో భాగంగా ఈ నెల 12న సహ దీక్షాధారులు 19 మందితో కలసి ప్రత్యేక వాహనంలో విజయవాడ పయనమయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం మాల విసర్జన పూర్తి చేసి 13వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో తమ వాహనం పుణ్యక్షేత్రం అన్నవరం సమీపంలో పత్తిపాడు ప్రాంతం వద్దకు చేరుకున్న క్రమంలో బహిర్భూమికి వెళ్లేందుకు వాహనం దిగివెళ్లిన రాంబాబు ఎంతసేపటికీ వాహనం దగ్గరకు చేరలేదు. తన వద్ద సెల్ఫోన్కుడా లేకపోవడంతో సహచరులు ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో మరునాటి ఉదయం వరకూ వాహనం నిలిపిన ప్రదేశంలో ఎదురు చూసి 14వ తేదీ ఉదయం అన్నవరం పోలీస్ స్టేషన్లో సహ భవానీలు ఫిర్యాదు చేశారు. పాలకొండ వచ్చిన వారికి మంగళవారం రాంబాబు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన నట్లు పోలీసుల నుంచి సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు, ఆ వార్డు కౌన్సిలర్ కడగల వెంకట రమణ అన్నవరం పయనమయ్యారు. దగ్గరుండి పోస్టుమార్టం పూర్తి చేయించి, రాంబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. మృతునికి భార్య రాజేశ్వరి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ బంధువులు కన్నీరుపెట్టారు. -
డీపీటీసీని తనిఖీచేసిన విశాఖ రేంజ్ డీఐజీ
విజయనగరం క్రైమ్: విజయనగర శివారు సారిపల్లి వద్ద ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని (డీపీటీసీ) విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం పరిశీలించారు. విజయనగరం 5వ బెటాలియన్‌లో ట్రైనీకానిస్టేబుళ్లకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందించేందుకు కావాల్సిన మౌలిక వసతుల పై ఆరా తీశారు. శిక్షణార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, కార్యాలయం, వంటగది, డైనింగ్‌హాల్, స్టోర్ రూమ్, వాష్‌రూమ్, స్నానపు గదులు, మినరల్ వాటర్ ప్లాంట్, పరేడ్ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, ఫైరింగ్ రేంజ్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, ఎస్బీ సీఐ లీలారావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు ఉన్నారు. -
ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో చెప్పండి?
● మెడికల్ కాలేజీలపై మీ ప్రాధాన్యత ఏమిటి? ● ప్రైవేటుకు అప్పగిస్తే ఉచిత వైద్యం అందుతుందా? ● పేదవాడి వైద్యానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌తో పోలికా ● మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఎందుకు నిర్వహించలేరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పాలని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా అవలంభించే విధానాన్ని తెలియజేయాలని కోరారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం తలపెట్టిన ప్రజాఉద్యమ ర్యాలీకి అపూర్వ స్పందన లభించిందన్నారు. జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేదవాడి వైద్యానికి, శంషాదాబాద్ విమానాశ్రయానికి పోలికచేస్తూ మంత్రి చేసిన వాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. మంత్రి కొండపల్లి తన నేపథ్యాన్ని, స్థానిక పరిస్థితులను పదవీ వ్యామోహంలో విస్మరించడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణపై ఆరోపణలు చేస్తున్న మంత్రి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలు ఇష్టపూర్వకంగా ఎందుకు సంతకాలు చేశారో తెలుసుకోవాలని హితవుపలికారు. అవసరమైతే వారి వివరాలు తామే ఇస్తామని చెప్పారు. ● పీపీపీ విధానంలో ప్రభుత్వమే కళాశాలలను నిర్మించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించిన తరువాత ప్రభుత్వం ఏం చేయగలుగుతుందని జెడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. అలా చేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఇంకెందుకని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉన్న మిమ్స్ మెడికల్ కాలేజీతో పాటు, పక్కనే విశాఖ జిల్లాలోని గీతం మెడికల్ కాలేజీలో రోగులకు ఉచితంగా సేవలందించగలరా అని ప్రశ్నించారు. అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే పేదలు డబ్బులిచ్చి వైద్యం చేయించుకోగలరా అని నిలదీశారు. దశాబ్దాల కిందట విశాఖలో నిర్మించిన కేజీహెచ్‌లో ఎంత మంది ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారో మంత్రి తెలుసుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వానికి సత్తా లేకే ఇటువంటి వాఖ్యలు చేస్తు న్నారని దుమ్మెత్తి పోశారు. ● రాష్ట్రప్రజలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని మజ్జి శ్రీని వాసరావు గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతో మంది నిరుపేదలు ఉన్నత చదువులు అభ్యసించి డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, వైద్యకళాశాలలో ఆరోగ్య భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అందించే సేవల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని మంత్రికి హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. జీతాల చెల్లింపులో తప్పుడు ప్రకటనలా...? అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ చెల్లించాల్సిన జీతాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న విషయం బాధ్యత గల మంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. నవంబర్ నెలలో పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ సహా 7 శాఖలకు చెందిన ఉద్యోగులకు 7 నుంచి 10వ తేదీల మధ్య జీతాలు చెల్లించారన్న విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలు మాత్రమే జీతాలు సక్రమంగా వేశారని, అనంతరం కాలంలో ఎప్పుడు వేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఉన్న సమన్వయం తేటతెల్లమవుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సిన ధాన్యంలో పారదర్శకత పాటిస్తున్నమంటూ మంత్రి కొండపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్వింటా దగ్గర 10 కేజీలు ధాన్యం రైతుల వద్ద నుంచి మిల్లర్లు దోపిడీ చేయడమేనా మీ పారదర్శకత అంటూ ఎద్దేవాచేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెందిన అనుకూల పత్రికలో ప్రత్యేక కథనం ఇచ్చారని, ఆ కథనాన్ని ఖండించి మాట్లాడాలని సవాల్ విసిరారు. -
వచ్చేనెల 8 నుంచి పండగ సర్వీసులు
విజయనగరం అర్బన్: సంక్రాంతి పండగ కోసం జిల్లాలోని స్వగ్రామాలకు రాకపోకలు జరిపే ప్రయాణికుల కోసం వచ్చేనెల 8వ తేదీ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతామని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. జిల్లాలోని విజయనగరం, ఎస్.కోట డిపోల పరిధిలోని బస్సులను విజయవాడ, భీమవరం, రాజోలు, విశాఖపట్నంకి ప్రత్యేక సర్వీసులుగా నడుపుతామని పేర్కొన్నారు. ఈ సర్వీనులలో సాధారణ చార్జీలు మాత్రమే వసూలుచేస్తామన్నారు. తిరుగు ప్రయాణం చేసేవారికోసం వచ్చేనెల 16 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించామని వివరించారు. ప్రయాణికులు ‘ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్.ఐఎన్’ వెబ్సైట్లో, లేదంటే దగ్గరలో ఉన్న బస్ స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్లు బుక్చేసుకోవాలని సూచించారు. 20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు ఆర్టీసీ కార్గో సేవల్లో డోర్ డెలివరీ మాసోత్సవాలను ఈ నెల 20 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. అతి తక్కువ చార్జీలతో పార్సిల్, కొరియర్ సర్వీసులను గమ్యస్థానాలకు చేర్చుతామన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో 50 కేజీల వరకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. -
మనమిత్రతో పోలీసు సేవలు సులభతరం
● ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం క్రైమ్: ‘మనమిత్ర‘ అనే వాట్సాప్ గ్రూప్‌తో పోలీసు సేవలు మరింత సులభతరం చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. డిజిటల్ పాలనలో భాగంగా పోలీస్ సేవలు మరింత సులభతరంగా, త్వరితంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువ చ్చామన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే పోలీసు సేవలను పొందవచ్చునన్నారు. ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈచలాన్ వివరాలు వంటివి సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే సులభంగా పొందవచ్చన్నారు. ఈ సేవలను పొందేందుకు ప్రజలు ముందుగా 9552300009 సెల్ నంబరును వారి మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకుని, ఆ నంబర్‌కు ఏజీ అని మెసేజ్ చేయగానే వివిధ రకాల ప్రభుత్వ సేవలు వివరాలు మొబైల్ కు వస్తాయన్నారు. అందులో పోలీసుశాఖ సేవలను ఎంచుకుని, ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్థితి, ఈచలాన్ వివారాలు సులభంగా ఇంటివద్ద నుంచే పొందవచ్చన్నారు. క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా పైన తెలిపిన పోలీసు సేవలు తక్షణమే పొందవచ్చునన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీసు ఆఫీసులలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ద్వారా ప్రజల సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. -
చట్ట ప్రకారం పిల్లల దత్తత
● ఐసీడీఎస్ పీడీ విమలరాణి విజయనగరం ఫోర్ట్: పిల్లలను చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్ పీడీ టి.విమలరాణి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని కేఎల్ పురంలో ఉన్న శిశు గృహాన్ని ఆకస్మికంగా ఆమె మంగళవారం తనిఖీ చేశారు. పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్ట రీత్యానేరమని తెలిపారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. శిశుగృహలో ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు, ప్రతిరోజూ మెనూ కచ్చితంగా అమలు చేయాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత మహారాణి పేటలో ఉన్న బాలసదన్‌ను తనిఖీ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు బాలసదన్‌లో ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 6 నుంచి11 సంవత్సరాల వయసు గల బాలికలు బాలసదన్‌లో ఆశ్రయం పొందుతారన్నారు. కార్యక్రమంలో డీఎంసీ సుజాత, శిశు గృహ మేనేజర్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు.రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేతబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి బొబ్బిలి పట్టణానికి తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆర్ఐ కొల్లి రామకుమార్ మంగళవారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.ఇసుక అక్రమ రవాణాలో మొదటిసారి దొరికినందున ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు ఆర్ఐ తెలియజేశారు. వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ విభాగం నిఘా ఉందని తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని, మరో మారు అక్రమ ఇసుకతో పట్టుబడితే కేసులు పెడతామని ట్రాక్టర్ యజమానులను ఆర్ఐ హెచ్చరించారు. గంజాయి కేసులో ముద్దాయికి ఎనిమిదేళ్లు జైలు శిక్షవిజయనగరం క్రైమ్: గంజాయితో పట్టుబడిన నిందితుడికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష, రూ.75 వేల జరిమానాను కోర్టు విధించిందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు మంగళవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..గతేడాది ఫిబ్రవరి 8 వ తేదీన దక్షిణ ఢిల్లీకి చెందిన నీరజ్ సింగ్(25)విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం 4,5లలో జీఆర్పీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని, 17.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అప్పటి విజయనగరం రైల్వే ఎస్సై వి.రవి వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందిడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి జైలు శిక్ష విధించారని, జరిమానా చెల్లించని ఎడల మరో ఆరు నెలలు జైలు శిక్ష వర్తిస్తుందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. -
గిరిజన యువకుడి ఆత్మహత్య
సీతంపేట: కొండపోడు పనికి నాతో రా, లేకపోతే అన్నయ్య కుమారుడికి జ్వరంగా ఉంది పాలకొండ ఆస్పత్రికి అయినా తీసుకువెళ్లు అని తాత చెబితే వినకుండా వాగ్వాదానికి దిగిన మనుమడు చివరకు క్షణికావేశంలో కత్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేట మండలంలో మంగళవారం జరిగిన ఈ సంఘటనపై స్థాని కులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. చాకలిగూడ గ్రామానికి చెందిన సవర ప్రేమ్‌కుమార్(23) తండ్రి రాజేష్, వెంకటమ్మలు పదేళ్ల కిందట అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. తాతయ్య గోపాలు, నాన్నమ్మ సుక్కమ్మ వద్ద ప్రేమ్‌కుమార్ ఉంటున్నాడు. వారితో పాటు అన్నయ్య శాంతకుమార్, వదిన వారి కుమారుడు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎవరి పనుల్లో వారు ఉండగా తాత గోపాలు కొండపోడు పనులకు వెళ్దామని చెప్పి ఒక సంచిలో కత్తి, వాటర్ బాటిల్ సిద్ధం చేసి పడుకుని ఉన్న ప్రేమ్‌కుమార్‌ను లేపి పనికి వెళ్దాం రమ్మని పిలిచాడు. నేను రాను అని చెప్పగా అయితే అన్నయ్యను పనికి తీసుకువెళ్తాను. అన్నయ్యకుమారుడికి జ్వరంగా ఉండడంతో వదినతో పాటు పాలకొండ ఆస్పత్రికి వెళ్లమని చెప్పాడు. అక్కడికి కూడా వెళ్లనని ప్రేమ్‌కుమార్ చెప్పడంతో కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తాత వంటింటిలోకి అన్నం పెట్టిన బాక్సు తీసుకురావడానికి వెళ్లాడు. దీంతో సంచిలో ఉన్న కత్తిని ప్రేమ్‌కుమార్ తీసుకుని పీక కోసేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మర్గమధ్యంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్నయ్య శాంతకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
బైక్, మినీ వ్యాన్ ఢీకొని మహిళ మృతి
చీపురుపల్లి: పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు ఆదిలక్ష్మి(25) మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజాంకు చెందిన బల్ల జగదీష్, ఆర్.ఠాగూర్లతో కలిసి చీపురుపల్లి పట్టణంలోని కూరాకుల వీధికి చెందిన పొందూరు ఆదిలక్ష్మి ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వెళ్తున్నారు. జీవీఆర్ కళాశాల వద్ద ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న మినీ లగేజ్ వ్యాన్‌ను బైక్‌తో ఢీకొట్టారు. దీంతో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. జగదీష్‌కు చేయి విరిగింది. ఠాగూర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాన్ని చీపురుపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ జి.శంకరరావు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తోటపాలెంలో పశువైద్య సేవలు విజయనగరం అర్బన్: స్థానిక పట్టణంలోని తోటపాలెం సత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పశువైద్య సేవలు అందించారు. పశు వైద్యులు మోహన్..పాడిరైతులు తీసుకువచ్చిన మూగజీవాలకు ఆరోగ్య తనిఖీలు నిర్వహించి, అవసరమైన వాటికి మందులు అందజేశారు. అలాగే వ్యాధులు రాకుండా నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలు
లక్కవరపుకోట: మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జిల్లా స్కూల్‌గేమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలను మంగళవారం నిర్వహించారు. ఈ ఎంపికల్లో జిల్లాస్థాయి జట్టుకు అండర్ 14,17,19 విభాగాల్లో బాల,బాలికలను ఎంపిక చేశారు. జిల్లాలోని 17 పాఠశాలల నుంచి 173 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికల్లో 30 మంది బాలికలను, 30 మంది బాలురును ఎంపిక చేసినట్లు చెప్పారు. వారు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగబోయే పోటీల్లో విజయనగరం జిల్లా జట్లుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.కార్యక్రమంలో ఎంఈఓ సీహెచ్.కూర్మారావు, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జి.లక్ష్మణరావు, చందులూరు పీడీ డాక్టర్ పి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలి
● ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్కుమార్విజయనగరం అర్బన్: రానున్న మార్చి 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను (ఐపీఈ–2026) ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం తోటపాలెంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి శివ్వాల తవిటినాయుడు అధ్యక్షతన వివిధ కళాశాలల యాజమాన్యాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.మోహన్ కుమార్ మారిన సిలబస్, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల విధానాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరానికి సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో (భాషా సబ్జెక్టులు మినహా) 14 సబ్జెక్టులకు నూతన సిలబస్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలు పూర్తిగా సీబీఎస్ఈ తరహాలో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. బోటనీ, జూవాలజీని బయాలజీగా కలిపి ఒకే సబ్జెక్టుగా చేయడం, గణితాన్ని 1ఏ, 1బీగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంగా ప్రవేశపెట్టడం, సైన్స్ పేపర్ల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించడం వంటి కీలక సంస్కరణలను వివరించారు. సిలబస్ మారిన 14 సబ్జెక్టులకు 32 పేజీల సమాధానం బుక్లెట్లు, బయాలజీ (బోటనీ–జూవాలజీ)కి 24 పేజీల బుక్లెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి పబ్లిక్ పరీక్షలు 30 రోజుల పాటు నిర్వహించే నేపథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు (డీఓలు) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో అధ్యాపకులు మారిన సిలబస్, పరీక్షల విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లాలోని 66 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఎం.సత్యనారాయణ, ఎన్ఎల్వీజగన్నాథరావు, కె.అప్పారావు, పీఎల్ఎస్ప్రకాష్ పట్నాయక్, వీకేవీకృష్ణారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు
● జేసీ సేతుమాధవన్ విజయనగరం అర్బన్: పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ చాంబర్లో మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలటీల్లో ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కమిటీ కన్వీనర్, విజయనగరం మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య వివరించారు. దీనిపై జేసీ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మొదటిసారి దొరికితే జరిమానాతో పాటు అవగాహన కల్పించాలని, రెండోసారి దొరికితే భారీ జరిమానా విధించాలని, అవసరమైతే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని సూచించారు. దాడులు నిర్వహించే అధికార బృందాలకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలని, వాటి తయారు చేసే కంపెనీలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు పి.నల్లనయ్య, ఎ.రామచంద్రరావు, ఎల్.రామలక్ష్మి, జనార్దనరావు, పర్యావరణ ఇంజనీరు సరిత, పరిశ్రమల శాఖ మేనేజర్, ఇతర శాఖల అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వెబ్సైట్లో మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఐదు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను విజయనగరం.ఎన్ఐసి.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్యకళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, పీఈటీ, లైబ్రరీ అసిస్టెంట్, స్పీచ్ థెరపిస్టు, సైకియాట్రీ సోషల్ వర్కర్ తదితర ఏడు కేటగిరీల పోస్టులకు సంబంధించిన షార్ట్‌లిస్ట్‌ను కూడా వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్–3, ఎలక్ట్రికల్ హెల్పర్, స్టోర్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల జాబితాను కూడా పొందుపరిచామని చెప్పారు. వీటిపై అభ్యంతరాలుంటే ఈ నెల 19వ తేదీలోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. 400 క్యూసెక్కుల నీరు విడుదల వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి ప్రధాన కాలువకు అధికారులు సాగునీటి సరఫరాను పెంచారు. రబీ పంటల సాగుకోసం ఇటీవల 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా... ప్రస్తుతం మరో 200 క్యూసెక్కుల నీటిని పెంచి 400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ఆయన వెల్లడించారు. సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు మహారాణిపేట: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు(55) నగరంలోని జాలరిపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12న ఫిషింగ్ హార్బర్ నుంచి ఐఎన్డీ ఏపీవీ5, ఎంఎం 872 నంబర్ గల బోటులో రాములుతో సహా మొత్తం ఎనిమిది మంది మత్స్యకారులు వేటకు బయలుదేరారు. హార్బర్ నుంచి తూర్పు వైపు విశాఖకు 70 మైళ్ల దూరంలో వారు చేపల వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి 8.30 గంటల సమయంలో వేటలో ఉండగా.. రాములు ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి మత్స్యకారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న ఇతర బోట్ల మత్స్యకారులకు సమాచారం అందించి వారి సాయంతో వెతికినా.. రాములు ఆచూకీ లభించలేదు. దీంతో బోటు డ్రైవర్ వాసుపల్లి లక్ష్మణరావు విషయాన్ని హార్బర్ అసోసియేషన్ నాయకులకు చేరవేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బోటు హార్బర్‌కు చేరుకోగానే మత్స్యకారులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు భామిని: సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఎంపీడీవో ఎస్.వసంతకుమారి మంగళవారం సందర్శించారు. సాక్షిలో ఈ నెల 15న ‘గురుకులంలో ఆకలికేకలు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఎంపీడీవో వసంతకుమారి గురుకులాన్ని సందర్శించి ప్రిన్సిపాల్ విజయనిర్మలతో కలిసి వంట గదిని నిశితంగా పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్, సిబ్బంది వహించాలన్నారు. చేసిన వంటలను పరిశీలించి మెనూ ప్రకారం అమలు చేయాలని సూచించారు. గురుకుల సిబ్బంది ఉన్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు గరివిడి విద్యార్థుల ఎంపిక
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి ఎస్డీఎస్ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఎం.అజయ్, ఎస్.ప్రవల్లికలు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీలో ఈ నెల 15న జరిగిన బేస్‌బాల్ టీమ్ సెలక్షన్లో ఈ విద్యార్ధులు అర్హత సాధించారు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 8 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారు. తమ కళాశాల విద్యార్థులు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల కరస్పాండెంట్ బి.రవి, ప్రిన్సిపాల్ డా.ఎ.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్.సురేష్‌కుమార్, పీడీ ఎం.భానుమూర్తి విద్యార్థులను మంగళవారం అభినందించారు. -
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఆరికతోట విద్యార్థులు
రామభద్రపురం: ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మండలంలోని ఆరికతోట ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రత్నకిషోర్ తెలిపారు.అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించింది. బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించిందన్నారు. అందులో ఆంఽధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే 16 మంది సభ్యులలో తమ పాఠశాలకు చెందిన రేజేటి శ్రావణి, బాలుర జట్టు తరఫున ఎం.రంజిత్ కుమార్‌లు ఎంపికై నట్లు తెలిపారు. జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్ఎం జి కృష్ణవేణి, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. -
చేతి వృత్తిదారులకు శఠగోపం
పార్వతీపురంటౌన్: చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడి జీవించేవారి అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మయోజన అమలులో నీరుగారిపోయింది. లక్ష్యాలు ఘనంగా ఉన్నా అమలు మాత్రం తూతూ మంత్రంగానే ఉంది. మొక్కుబడిగా లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పథకం చేరువ కాక పూర్తిస్థాయిలో నష్టపోతున్నామని లబ్ధిదారులు వా పోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో విశ్వకర్మ కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హత ఉన్నా సాంకేతికత, ఽధ్రువీకరణ పత్రాల అప్లోడేషన్ వంటి కారణాలతో లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బ్యాంకర్లు విశ్వకర్మ పథకం అమలుకు అసలు సహకారం అందించడం లేదని లబ్ధిదారుల నుంచి విమర్శలు చాలా ఉన్నాయి. బ్యాంకర్లను రుణాలు ఇచ్చేందుకు ఒప్పించడంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం విఫలమయ్యాయి. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. చేతివృత్తులు, కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక సహాయం, పనిముట్లు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఆధునిక పనిముట్లు, వస్తువుల కొనుగోళ్లలో రాయితీ అందించడం, చేతివృత్తుల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం ద్వారా సంప్రదాయ కళలు, చేతి వృత్తులను ప్రోత్సహించడం ఈ పథక ఉద్దేశం. ఈ మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రాథమిక, ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ప్రోత్సాహకం కింద రూ.15వేల కిట్లను అందజేశారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకు నుంచి తొలి విడతలో తక్కువ వడ్డీకి రూ.లక్ష, అనంతరం రూ.3లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. కుమ్మరి, వడ్రంగి, కమ్మరి, శిల్పి, స్వర్ణకారులు, దోబి, పూలమాలలు అల్లేవారు. చేపలు పట్టేవారు. ఇలా 18 రకాల వృత్తుల వారికి విశ్వకర్మ పథకం వర్తిస్తుంది. చేతి వృత్తుల వారు విశ్వకర్మ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా మొక్కుబడిగా మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. విశ్వకర్మ పథకం అమలులో నిర్లక్ష్యం వేలల్లో దరఖాస్తులు.. వందల్లో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 25,816 మంది దరఖాస్తులు ఎంపిక చేసింది కేవలం982మందిని మాత్రమే -
పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్యవిద్య ఉచితంగా అందాల్సిందేనని జనం నినదించారు. వైద్యకళాశాలలు ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు
ప్రజా కోర్టులో దోషిగా నిలబెడదాం మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో దోషిగా నిలబెడదాం. ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు. కూటమి నిర్ణయం ముమ్మాటీకి ప్రజావ్యతిరేక చర్య. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లాలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభించింది. జిల్లా కేంద్రంలో చేపట్టిన ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతాలను ఈనెల 18న రాష్ట్ర గవర్నరకు అందజేస్తాం. – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం -
సబ్‌జైలు సందర్శన
శృంగవరపుకోట: ఎస్.కోట సబ్‌జైలును జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత సోమవారం సందర్శించారు. న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి ఖైదీలకు అందుతున్న చట్టపరమైన సౌక ర్యాలు, సేవలపై ఆరా తీశారు. నేర ప్రవృత్తిని వీడి కొత్త జీవితం ప్రారంభించాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, జైలు సూపరింటెండెంట్ పాల్గొన్నారు. 21న పల్స్‌పోలియో కార్యక్రమం విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కోరారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో నివారణకు చుక్కల మందును వేయించాలన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన వైద్య, ఐసీడీఎస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,99, 386 మంది పిల్లలకు 1171 పోలియో బూతుల్లో పల్స్‌పోలియో నివారణకు చుక్కలమందు వేయాలన్నారు. ఈ నెల 21న పోలియో నివారణ మందు వేయించుకోలేని పిల్లలకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించి శతశాతం పోలియో చుక్కలు వేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో మురళి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టం/ పాలకొండ: ఎలాంటి పనినైనా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచార ఆర్భాటం చేయడం, అబద్ధాలను నిజమని నమ్మించడం.. హామీలిచ్చి మోసం చేయడంలో సీఎం చంద్రబాబునాయుడుని మించిన వారు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు చంద్రబాబు చేస్తున్న హడావుడి దీనికి అద్దం పడుతోంది. విమర్శలకు తావిస్తోంది. కానిస్టేబుల్ పోస్టులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30–11– 2022న నోటిఫికేషన్ ఇచ్చింది. 22–01–2023న రాతపరీక్ష కూడా నిర్వహించింది. అనంతరం కోర్టు కేసులతో పోస్టుల భర్తీ వాయిదా పడింది. 2024లో ప్రభుత్వం మారింది. కోర్టు కేసుల పరిష్కారంతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వాస్తవంగా నియామక పత్రాలు ఎస్పీ చేతుల మీదుగా అందజేయాలి. మంగళగిరిలో అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
సంతకంతో నిరసన
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే చంద్రబాబు ప్రభుత్వ పన్నాగాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల రూపంలో వారి నిరసన, ఆవేదనను తెలియజేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం, వైద్య విద్యను దూరంచేస్తే వారి ఉసురు తగలక మానదు. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి ఇదొక ప్రజా విన్నపం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనేది వైఎస్సార్ సీపీకి సంబంధించిన కార్య క్రమం కాదు. కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్న విన్నపం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయవద్దని సంతకంతో అందజేసిన వినతి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిస్తే మంచిదే. లేకుంటే వినాశనం తప్పదు. – డాక్టర్ తలే రాజేష్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి ఇదొక చారిత్రక ఉద్యమం కోటిసంతకాల సేకరణ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక చారిత్రక ఉద్యమం. ఇది బడుగు, బలహీన వర్గాలకు చెందిన భావితరాల వారికోసం ప్రతిపక్ష నేత బాధ్యత తీసుకున్న ఉద్యమం. భవిష్యత్‌లో నాడు జగన్ చేసిన ఉద్యమం ఫలితంగా వైద్యవిద్య అభ్యసించామని చెప్పుకునే రోజు వస్తుంది. పేద వర్గాలకు అందాల్సిన ఉచిత విద్య, వైద్యం కోసం కోట్లాది మంది అభిప్రాయాలను తెలియజేసే ఉద్యమం ఇది. ప్రభుత్వం కళ్లు తెరిపించి, బాధ్యతను గుర్తుచేసిన ప్రజా ఉద్యమం. – కడుబండి శ్రీనివాసరావు, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ఓ ఉద్యమంగా సాగింది. కోటి సంతకాల కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రజలు మద్దతుగా నిలిచి, సంతకాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత తెలిపారు. వైద్యాన్ని ప్రైవేటుపరం చేయొద్దని స్పష్టంచేశారు. – బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే చంద్రబాబుకు పేదలంటే చులకన సీఎం చంద్రబాబుకు పేదలంటే చులకన. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి, పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అందకుండా చేయాలని చూస్తే ప్రజల ఊరుకోరని ఈ రోజు స్పష్టమైంది. – బొత్స అప్పల నరసయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం -
విద్యుత్ పొదుపు ప్రగతికి మార్గం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డివిజయనగరం ఫోర్ట్: విద్యుత్ పొదుపు చేయడం ద్వారా ప్రగతికి మార్గం వేయవచ్చునని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విద్యుత్ పొదుపు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈపీడీసీఎల్ సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ జంక్షన్, మయూరి జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే, అంత అదనంగా ఉత్పత్తి చేసినట్లునన్నారు. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దీనికోసం విద్యుత్‌ను ఆదా చేసే 5స్టార్ పరికరాలను వినియోగించాలని సూచించారు. అవసరమైనప్పడు విద్యుత్ ఉపకరణాలను వినియోగించాలని కోరారు. తమ ఇళ్లలోని విద్యుత్ వినియోగాన్ని ఆడిట్ చేసుకుని విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. విద్యుత్‌ను వృథా చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, ఈఈలు పి.త్రినాథరావు, జి.సురేష్‌బాబు, బి.రఘు, ఏడీఈ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇందన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత పార్వతీపురం: ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యుత్ ఆదా చేసే విధానంపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ ఇంధనపొదుపు వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఇంధన పొదుపు కచ్చితంగా అమలు కావాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతిగృహాలు, సచివాలయాలు, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధనాన్ని పొదుపు చేసేలా అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ప్రతి ప్రభుత్వ భవనంలో విద్యుత్‌ను ఆదా చేయాలని సూచించారు. గత నెలలో విద్యుత్ బిల్లు ఆదారంగా వీలైనంతవరకు విద్యుత్ పొదుపు చేసి ఆదా చేయాలని కోరారు. విద్యుత్‌ను ఆదా చేయడమంటే విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమేనని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించి నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం, పొదుపు చేయడం తదితర అంశాలపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, విద్యుత్‌శాఖ ఎస్ఈ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు కంచరాం విద్యార్థి
రాజాం సిటీ: మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అలజంగి సంతోషిణి జాతీయస్థాయి పెంటాథ్లాన్ పోటీలకు ఎంపికై ందని పీడీ టి.దుర్గారావు, పీఈటీ బి.నారాయణనాయుడులు సోమవారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ఎంపికై ందన్నారు. విద్యార్థిని ఎంపికపట్ల హెచ్ఎం వీవీ వసంతకుమార్‌తోపాటు పాఠశాల స్టాఫ్ కార్యదర్శి మజ్జి మదన్మోహన్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థిని ఆత్మహత్యా యత్నంపై ఎటీడబ్ల్యూఓ విచారణసాలూరు: మండలంలోని కురుకుట్టి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆదివారం ఫినాయిల్తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటనపై ఏటీడబ్ల్యూఓ కృష్ణవేణి విచారణ చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఆమె పాఠశాలకు వెళ్లి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినితో మాట్లాడారు.ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగితెలుసుకున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని ఆమె తెలిపారు. రెండు బైక్‌లు ఢీకొని ఒకరికి గాయాలుపాచిపెంట: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పాచిపెంట మండలంలోని పణుకువలస సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. దీనిపై పోలీసులు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన మాదిరెడ్డి సత్యనారాయణ(35) రామభఽధ్రపురం మండల కేంద్రంలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మెకానిక్ పని నిమిత్తం ప్రతిరోజూ రామభధ్రపురం వెళ్లి వస్తూ ఉంటాడు. రోజులాగానే ఆదివారం పని ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ కృష్ణారావు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిరాజాం సిటీ: మండల పరిధి ఇప్పిలిపేట సమీపంలో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టొంపల సుమంత్ (26) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాజాంలో విధులు ముగించుకుని స్వగ్రామమైన గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఇప్పిలిపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుమంత్‌ను స్థానికులు రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వివరించారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి..గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. విజయనగరంలోని కణపాకకు చెందిన కోరాడ పైడిరాజు ఈనెల 12వతేదీన ఉదయం మార్నింగ్ వాక్కు వచ్చి తిరిగి వెళ్తుండగా రామవరం పప్పుల మిల్లు వద్ద నరవ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌తో వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు తొలుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడినుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. సాయికృష్ణ తెలిపారు. మర్మాంగాన్ని కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడుబొబ్బిలి: విశాఖకు చెందిన మతిస్థిమితం లేని ఓ యువకుడు తన మర్మాంగాన్ని సోమవారం రాత్రి కోసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికుల కథనం ప్రకారం స్థానిక ఫ్లైఓవర్ వద్ద ఓ యువకుడు కాళ్ల వెంబడి రక్తమోడుతూ తిరుగుతుండడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారమందించారు. అంబులెన్స్‌లో ఎక్కేటప్పుడు ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు గడియకోమాట చెబుతూ అర్థంలేని విధంగా ప్రవర్తించాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్సకూ ఇబ్బందులు పెట్టాడు. ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి జి.శశిభూషణ రావు పరీక్షించి విశాఖ రిఫర్ చేశారు. ఈ లోగా యువకుడు చెప్పిన మేరకు సమాచారం అందడంతో వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులు కూడా బొబ్బిలి చేరుకున్నారు. యువకుడిని చికిత్స నిమిత్తం వెంట తీసుకెళ్లారు. -
అర్జీలను సొంత సమస్యగా భావించాలి
చికెన్ ● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 117 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డిఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లోని రెవెన్యూ క్లినిక్‌లో కూడా కలెక్టర్ వినతులను స్వీకరించారు. వినతులలో కొన్ని.. ● పార్వతీపురం మండలం చందలింగి గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 28–5లో గల ఆర్ఓఎఫ్ఆర్ భూములను అక్రమంగా సాగు చేస్తున్నారని, ఆక్రమణ దారుల తొలగించి ఫారెస్టు భూములను కాపాడాలని ఆర్.ప్రభాకర్ అర్జీ అందజేశారు. ● తన ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి ప్రహరీ నిర్మించారని, ఆక్రమణలను తొలగించాలని కోరుతూ భామిని మండలం బాలేరు గ్రామానికి చెందిన నిమ్మక వసంతకుమార్ వినతిపత్రం అందజేశాడు. . ● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన జి. సత్యం తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. ● పార్వతీపురం పట్టణానికి చెందిన సీహెచ్. పైడిరాజు గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని నగదు జమ అయ్యేలా చూడాలని వినతిని అందజేశారు. ● పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన డి. శ్రీరాములు గృహ నిర్మాణం పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 19 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ఐటీడీఏ ఏపీఓ ఎస్.వి.గణేష్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 19 వినతులు వచ్చాయి. కొండచీపుళ్ల తయారీ యూనిట్ పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని అడ్డంగి గ్రామస్తుడు గోవిందరావు, మేకల యూనిట్ నిర్వహణకు లోన్ ఇప్పించాలని ఎం.సింగుపురం గ్రామస్తుడు సింహాచలం అర్జీలు అందజేశారు. జన్నోడుగూడ గ్రామస్తులు అంతర్గత సీసీరోడ్డు గ్రామానికి నిర్మించాలని విన్నవించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పారదర్శకంగా పరిష్కరించాలి: ఎస్పీ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన 9 అర్జీలను నేరుగా స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు ఫోన్లో ఎస్పీ ఆదేశాలను జారీ చేస్తూ ఫిర్యాదుల పూర్వా పరాలను విచారణ చేసి వాస్తవాలైనట్‌లైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమర జీవికి ఘనంగా నివాళి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమర జీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని ఆయన ఆశయాలు, సేవలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం కావాలని ఎస్పీ మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
విశాఖలో కార్మిక గర్జనకు సన్నాహాలు
విజయనగరం గంటస్తంభం: డిసెంబర్ 31నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ జాతీయ మహాసభలను కార్మికులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు రెడ్డి శంకరరావు, ఎ.జగన్మోహనరావులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాసభల ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక కోట జంక్షన్ ఆటోస్టాండ్ వద్ద సీఐటీయూ జెండాను రెడ్డి శంకరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం సీఐటీయూ సాగించిన పోరాటాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్ల పేరుతో కార్మికులు సాధించుకున్న హక్కులను కుదిస్తోందని విమర్శించారు. అలాగే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే జాతీయ మహాసభల్లో కార్మిక చట్టాల పరిరక్షణ, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకత, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలనే అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 4న విశాఖపట్నం బీచ్‌లో జరిగే బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బి.రమణ, పాపారావులతో పాటు ఆటో, కలాసీ కార్మికులు పాల్గొన్నారు. -
చోరీకి గురైన బంగారు ఆభరణాల రికవరీ
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో పట్టపగలు చోరీలకు పాల్పడిన వ్యక్తిని వల్లంపూడి పోలీసులు సోమవారం పట్టుకుని దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వావిలపాడు, వల్లంపూడి, రామస్వామిపేట గ్రామాల్లో పట్టపగలు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగిన విషయం విదితమే. దీనిపై వల్లంపూడి ఎస్సై సుదర్శన్, సిబ్బందితో నిర్వహించిన తనిఖీల్లో సోమవారం కుమ్మపల్లి జంక్షన్ వద్ద అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజును నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తివద్ద రామస్వామిపేటలో దొంగిలించిన ఐదున్నర తులాలు, వావిలపాడులో దొంగిలించిన తులంన్నర బంగారం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. వల్లంపూడిలో చోరీ చేసిన బంగారం చోడవరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు సీఐ చెప్పారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని కోర్టుకు తరలిస్తామన్నారు. -
నిధులు లేకుండా ముస్తాబులేమిటి?
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ఉత్తి మాటలతో ఊరు శుభ్రమవుతుందా.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలకే దిక్కులేదు.. నిధుల ఊసెత్తితే దాటవేస్తున్నారు.. ఖర్చు లేకుండా గ్రామాల్లో ‘ముస్తాబు’ అమలు చేయాలంటే ఎలా సాధ్యం?’ ఇదీ.. పలువురి సర్పంచ్ల ఆవేదన. పార్వతీపురంలోని ప్రైవేట్ కల్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ల సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సర్పంచ్‌లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోనూ కుటుంబం ముస్తాబు కావాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలు, పల్లెలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సర్పంచులే గ్రామాల కు బాస్‌లని.. ఆ దిశగా తమ గ్రామాలను అభివృద్ధిపరచాలని ఆకాంక్షించారు. ముస్తాబుపేరిట గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ, బహిరంగ మలమూత్ర విసర్జనకు కృషి చేయాలని కోరారు. కాలు వల శుభ్రత, చెత్తకుప్పలు లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎలాంటి ఖర్చూ లేకుండా ఇలాంటి పనులు నిర్వహించవచ్చ ని చెప్పారు. దీనిపై సర్పంచ్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలిచ్చేందుకే పంచాయతీల్లో నిధులు లేవని చెప్పా రు. ఎన్నోసార్లు విన్నవించుకున్నా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదన్నారు. పలు సమస్యలపై సర్పంచ్‌లు చెప్పేందుకు ప్రయత్నించగా.. అధికారులు మధ్యలోనే బ్రేక్ వేశారు. దీంతో కలెక్టర్‌కు తమ పంచాయతీల్లో సమస్యలపై నామమాత్రంగానే సర్పంచ్‌లు వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్: సర్పంచుల ఆవేదన జిల్లా యంత్రాంగం తీరుపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్ మాదిరి అధికారుల తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముస్తాబు పేరిట హడావిడి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తి మాటలతో ఊరు శుభ్రపడదని పేర్కొన్నారు. నిధులు ఊసెత్తితే దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులెవరికీ బాధ్యత లేదని విమర్శించారు. గ్రామాల్లో మిల్లర్ల దోపిడీ, రైతుల ఇబ్బందులపైనా పలువురు నిలదీశారు. మంచినీరు, మౌలిక సదుపాయాల సమస్యలనూ ప్రస్తావించారు. -
కోటి గళాల గర్జన
విజయనగరం: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వ వైద్యాన్ని, వైద్య విద్యను ప్రైవేటీకరణకు పూనుకున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై జనం నిరసన తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి సేకరించిన 4లక్షల 50వేల సంతకాల ప్రతులతో విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు 7 నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలు, మహిళలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరంలోని సీఎంఆర్ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎస్బిఐ మెయిన్ బ్రాంచి, డాబాగార్డెన్స్, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం కూడలి మీదుగా కార్పొరేషన్కార్యాలయం వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వరకు సాగింది. అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చే కోటి సంతకాల ప్రతుల వాహనానికి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపారు. ముందుంగా మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, డాక్టర్ తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, గొర్లె రవికుమార్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ శెట్టివీర వెంకటరాజేష్, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్, వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు పాల్గొన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలి ప్రజలకు ప్రధాన అవసరాలైన విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలన్నది ప్రజలందరి డిమాండ్. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్యాయం. అది తెలియజెప్పేందుకే బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రజాఉద్యమ ర్యాలీలు నిర్వహించాం. ప్రజలను మోసం చేయాలనుకుంటే తగిన శాస్తి తప్పదు. – కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, విజయనగరం ప్రైవేటీకరణను అడ్డుకుంటాం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున ప్రజ్యావతిరేకతను మూటగట్టుకుంది. అన్ని చేస్తామంటూ చంద్రబాబు చెప్పిన మాయమాటలు విని ఓట్లేసిన ప్రజలు మోసపోయారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఏరికోరి ఓట్లేసినవారే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో సేకరించిన 4లక్షల 50వేల సంతకాల ప్రతులను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించాం. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత. జిల్లా కేంద్రం నుంచి కోటి సంతకాల ప్రతుల తరలింపు విజయనగరంలో భారీ ర్యాలీ తరలివచ్చిన ఏడు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు -
సీఎస్పీపై మహిళా సంఘాల ఫిర్యాదు
రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన స్వయం సహాయ సంఘాల మహిళలు సోమవారం రేగిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సంఘాలకు సంబంధించిన పొదుపు నగదును గ్రామానికి చెందిన సీఎస్పీ అల్లు శ్రీధర్ స్వాహా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకులకు ప్రతి నెలా చెల్లించాల్సిన సొమ్మును అల్లు శ్రీధర్‌కు అందజేశామని, ఆ నగదు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ఆవేదన చెందారు. పొదుపు, రుణ చెల్లింపులకు సంబంధించి రూ.43 లక్షలు స్వాహా చేశాడని, బాధ్యుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఆధ్యాత్మికం.. ధనుర్మాసం
బలిజిపేట: పల్లెలు, పట్టణాల్లో దేవాలయాల ద్వారా ధనుర్మాసంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. ఆలయాల్లో నిత్య కై ంకర్య సేవలు, విశేష రోజులు, సేవలు, శ్రీ గోదా రంగనాఽథ స్వామివార్ల కల్యాణం, ప్రత్యేక పాశురాలు, పులకింపజేసే తిరుప్పావై ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలతో ధనుర్మాసం శ్రీమహా విష్ణువుకు అత్యంత్ర ప్రీతికరమైనదిగా ప్రాచుర్యం పొందింది. వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం అత్యంత పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించడం విశేషం. ధనుర్మాసంలో పండగ నెల ప్రారంభం కావడంతో పట్టణ, పల్లె ప్రాంతాలు పరవశిస్తాయి. నెల మొదలైన నాటినుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. హరిదాసు కీర్తనలతో పల్లెలు పులకిస్తాయి. గొబ్బెమ్మల కొలువు పండగ నెల ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటిముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. భోగిభాగ్యాలు గ్రామాలు, పట్టణాల్లో భోగి మంటలు వేస్తారు. దీంతో సకల దోషాలకు పరిహారం లభిస్తుందని భావిస్తారు. కనుమతో ధనుర్మాసం పూర్తి కనుమ పండుగతో ధనుర్మాసం ముగుస్తుంది. దీన్నే పశువుల పండుగ అని అంటారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో సాయం చేసిన పశువులకు రైతులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ధనుర్మాసం ప్రారంభం కాగానే పండగ వాతావరణంతో పల్లెలు కళకళలాడుతాయి. శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రం ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. వేకువనే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు చేస్తారు. తిరుప్పావై నిర్వహిస్తారు. సంక్రాంతి..పితృదేవతలకు శాంతి మకర సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు కొత్త బట్టలు పెట్టుకుని తర్పణాలు వదులుతారు. పంచభక్ష్య పరమాణ్నాలతో నైవేద్యం సమర్పించి పెద్దల ఆశీర్వచనం పొందుతారు. ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు 2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్ సేవ(తూమని మాడత్తు) డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి (ఉత్తరద్వార దర్శనం) 2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ) జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి (అన్జు ఇవ్వులగం) జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ (కూడారై వెల్లుం) జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం నేటి నుంచి వచ్చేనెల 14వరకు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం భోగి, సంక్రాంతి, కనుమల సమాహారం సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలంఎంతో పవిత్రమైనది ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. శ్రీగోదారంగనాథులను కొలుచుకుని వారి ఆశీస్సులను పొందినవారికి ఎంతోమేలు జరుగుతుంది. అధ్యాత్మికంగా ఈమాసం అందరినీ మేలుకొలుపుతుంది. – సురేష్, అర్చకుడు, బలిజిపేట వైష్ణవాలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు శ్రీవైష్ణవులకు తిరుప్పావై వ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతంలో నెలరోజులపాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి 5రోజులు నియమ, నిబంధనలకు సంబంధించిన పాశురాలు. 6వ రోజునుంచి 15 పాశురాలతో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16,17,18పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ పాశురంలో మంగళాశాసనం, 25, 26పాశురాలలో స్వామికి అలంకారాలైన ఆయుధాలలో పరా అనే వాయిద్యాన్ని తమ శరణాగతి అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఆఖరి రోజున గోదారంగనాథుల కల్యాణం అట్టహాసంగా నిర్వహిస్తారని అర్చకులు చెబుతున్నారు. గోదాదేవితో కూడుకుని ఉండే నారాయణ అర్చన సేవయే ఈమాసపు ప్రాధాన్యంగా పేరొందిందని, భగవంతుని ఏవిధంగా చేరుకోవాలో తెలిపే మాసం ఇది అని అర్చకులు తెలియజేస్తున్నారు. భక్తులు ఈమాసంలో స్వామివారి సేవలో పాల్గొని చూసి, విని తరించాలని అర్చకులు కోరుతున్నారు. -
ధాన్యం రైతు గగ్గోలు
● కొనుగోలు చేయని సంపత్స్వర్ణ రకం ● పొలాల్లోనే ధాన్యం బాడంగి: ఖరీఫ్‌లో సంపత్ స్వర్ణరకం పండించిన రైతులకు గడ్డుపరిస్థితి ఎదురైంది. ధాన్యం మరపట్టిస్తే బియ్యం ముక్కలవుతున్నాయంటూ కొనుగోలుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. మిల్లులకు తరలించినా వెనుకకు పంపిస్తున్నారు. దీంతో నూర్పిడి చేసిన ధాన్యం పొలాలు, కళ్లాల్లోనే ఉండిపోతున్నాయి. వాటిని కాపాలా కాసేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలనే సాగుచేశామని, ఇప్పుడు కొనుగోలు చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు మిల్లర్లు క్వింటాకు అదనంగా 10 కేజీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. -
వినతుల పరిష్కారంలో ఆలస్యం తగదు
● పీజీఆర్ఎస్లో కలెక్టర్ రాంసుదర్రెడ్డివిజయనగరం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి అందే వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ఎస్.రాంసుందర్‌రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలాగాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సమర్పించిన ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మొత్తం 186 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని, మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్వేశాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ టీమ్‌కు శిక్షణ ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ ఆధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ కేసులు, ఫ్రీ ఆడిట్, ఆడిట్, ప్రజల సంతృప్తి తదితర అంశాలు కచ్చితంగా ఉండేలా మరోసారి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ధరఖాస్తులు, గడువు దాటినవి, రీ ఓపెన్ అయినవాటిపై వివరంగా సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆన్లైన్ ద్వారా మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 25 ఫిర్యాదులు ● ఏఎస్పీ చాంబర్లో కార్యక్రమం నిర్వహణ విజయనగరం క్రైమ్: ప్రతి వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఈ వారం 25 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత సోమవారం డీపీఓలోని తన చాబర్లో ఫిర్యాదులు స్వీకరించారు.ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించిన ఏఎస్పీ సౌమ్యలత వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత సిబ్బందితో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను వివరించారు. ఏఎస్పీ స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 3, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఏఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె. కుమారస్వామి, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గురుకుల కళాశాల విద్యార్థిని
గుమ్మలక్ష్మీపురం: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల(పీటీజీ)లో సెకెండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న తోయక ప్రవల్లిక ఎంపికై నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డి.భారతి, ఫెన్సింగ్ కోచ్ పి.బాలరాజు సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వెనిగండ్లలోని శ్రీవేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఈనెల 13, 14వ తేదీల్లో జరిగిన 69వ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ ఫెన్సింగ్ పోటీల్లో ఫోయిల్ వ్యక్తిగత విభాగంలో ప్రవల్లిక పాల్గొ ని ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించిందన్నారు. ఈ విద్యార్థిని త్వరలో ఇంఫాల్‌లో జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలియజేస్తూ..జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు. -
పతకాలు పట్టిన పైలెట్
శృంగవరపుకోట: వెటరన్ అథ్లెట్‌గా పతకాలు పట్టేస్తున్న ఆ పైలెట్ మరోమారు సత్తాచాటి పతకాలు పట్టేశాడు. 108వాహనంలో పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ మూర్తి బాపట్లలోని ఆర్ట్స్ ఎండ్ సైన్స్ కళాశాల మైదానంలో డిసెంబర్ 13,14 తేదీల్లో నిర్వహించిన 7వ ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 45+ విభాగంలో పోటీపడిన ఎంఎస్ఎన్.మూర్తి జావెలిన్ త్రోలో స్వర్ణం, డిస్క్‌త్రోలో స్వర్ణం, హేమర్ త్రోలో రజత పతకాలను సాధించాడు. వరుసగా పతకాల పంట పండిస్తున్న వెటరన్ పైలెట్‌ను స్థానిక క్రీడాకారులు అభినందించారు. -
స్కూటీని ఢీకొట్టిన భారీ లారీ
● సంఘటన స్థలంలో వ్యక్తి మృతి ● కొన ఊపిరితో మృతుడి సోదరుడు ● తీవ్రంగా గాయపడిన మృతుడి ఇద్దరు పిల్లలుకొత్తవలస: అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో కొత్తవలస అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు, సీఐ సీహెచ్.షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన గొల్ల శంకరరావు(52)తన సోదరుడు దారప్పకు చెందిన స్కూటీపై తన ఇద్దరు పిల్లలైన భవానీశంకర్ (6),హరినాథ్(4)లను విశాఖపట్నంలోని ఆర్కేబీచ్ను చూపిద్దామని బయల్దేరారు. కొత్తవలస అగ్నిమాపక కేంద్రం సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన భారీ లారీ స్కూటీని పక్కనుంచి బలంగా ఢీకొట్టింది.దీంతో స్కూటీ వెనక కూర్ఛున్న శంకరరావు(52)తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. స్కూటీపై కూర్ఛున్న ఇద్దరు పిల్లలు తుళ్లిపడి రోడ్డుపై పడ్డారు. స్కూటీని డ్రైవ్ చేస్తున్న దారప్ప తల రోడ్డుకు బలంగా కొట్టుకోవడంతో తల భాగంలో బలమైన గాయాలై ముక్కు, చెవుల నుంచి అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు,108 వాహనానికి సమాచారం అందించిన ఎంతకీ రాకపోవడంతో రోడ్డు సేఫ్టీ వాహనం పోలీస్ సిబ్బంది అప్రమత్తమై క్షతగాత్రులను రోడ్డు సేప్టీ వాహననం వెనుక ట్రక్కులో వేసుకుని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించి దారప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. కాగా చిన్నారులు భవానిశంకర్, హరినాథ్‌లకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుడి మరో సోదరుడు ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. -
24/7 అందుబాటులో మద్యం
● మద్యం కేరాఫ్ మన్యం జిల్లా ● జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా బెల్ట్ షావుల నిర్వహణగఅనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా అనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎప్పటికప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో బెల్ట్ షావులపు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. సారా రవాణా తయారీ అమ్మకాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నాం. అనధికార మద్యం, సారా వంటివి విక్రయిస్తూ ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా పీడీయాక్ట్లను నమోదు చేస్తాం. బి.శ్రీనాథుడు, ఎకై ్సజ్ ఈఎస్, ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్: ఓ వైపు ప్రభుత్వ వైఫల్యం, మరోవైపు ఎకై ్సజ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్నాయి. గడిచిన ఏడాదిన్నరగా జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు, పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న మన్యం వాసులకు మద్యం కష్టాలు తెచ్చి పెడుతోంది. జిల్లాలో గ్రామ గ్రామాన మద్యం, సారా ఏరులై పారుతోంది. జిల్లా కేంద్రంలో వేకువ జాము నుంచే మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దానికి తోడు మన్యం జిల్లా వ్యాప్తంగా, ఏఓబీ గ్రామాల్లో, గిరిజన సీమల్లో, గిరిశిఖర గ్రామాల్లో మద్యం, సారా ఏరులై పారుతోంది. దాదాపు అన్ని గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాలు, గ్రామాల్లో, పట్టణాల్లో బహిరంగంగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఏఓబీ గ్రామాల్లో సారా తయారీ చేస్తున్న కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా ఏర్పడ్డాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, గెడ్డలు, వాగులు, నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలను వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుని బెల్లపు ఊటలను తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్రమంగా సారాను తయారు చేస్తూ జిల్లా కేంద్రంగా అనేక జిల్లాలకు దాటిస్తున్నారు. నెలలో ఏదో ఒకరోజు ఎకై ్సజ్ అధికారులు తామున్నామంటూ తూతూ మంత్రంగానే దాడులు నిర్వహిస్తూ మమ అనిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పూర్తిస్థాయిలో నిఘా లేకపోవడంతో మన్యం జిల్లా మద్యం, సారా క్రయ విక్రయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రతి నెలా మంత్లీలు బెల్ట్ షావు నిర్వహణకు ఎకై ్సజ్ దిగువ స్థాయి సిబ్బంది నుంచి పై అధికారుల వరకు ఒక్కొకరికి భారీ మొత్తంలో ముడుపులు అందిస్తున్నారన్న బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా అంతా రాత్రివేళలోనే.. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన సారాను కొంతమంది వ్యాపారులు రాత్రివేళల్లో ఆటోలు, బైక్‌ల ద్వారా మైదానం, పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన్యంలో సరిహద్దు గ్రామాలైన జయకోట, బొత్తరాపల్లి, మూలకర్ని, విక్రాంపురం, అలమండ, సోరుపల్లి, సందుబడి. రేగులపాడు, సంబలబాయి, ఎగువ పిల్లిడ్డి, జీడివలస, అత్తిగడ, జగ్గూడ, టికరపాడు, కప్పలాడ, మానిక్యంవలస, ఎడుగుమ్మలవలస, పొల్ల, చిన్నబగ్గ, కడగండి, ఓండ్రుజోల, వలగజ్జి, వలగజ్జి గ్రామాల మీదుగా జనసంచారం లేని మార్గాలగుండా సారాను తరలిస్తున్నారు. పార్వతీపురం, కురపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు ఇక్కడనుంచి ప్లాస్టిక్ కేన్లలో రవాణా చేస్తున్నారు. దీనిపై ఎకై ్సజ్ శాఖ నిఘా కొరవడింది. దీంతో రోజుకు కొన్ని వేల లీటర్ల సారా రవాణా అవుతోంది. జిల్లాలో అనధికారికంగా 600 పైగా మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఇప్పటి వరకు 700 కేసులు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. ఏఓబీ గ్రామాల్లో 18 అంతరాష్ట్ర దాడులు నిర్వహించి 4లక్షల లీటర్ల పులిసిన బెల్లపు ఉటలు ధ్వంసం చేశారు. 21 వేల లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో బతుకులు ఛిద్రం శుభకార్యాలు, పండుగల సమయాల్లో ఎక్కువగా మద్యాన్ని తాగుతారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యం మద్యం లభిస్తుండంతో వేకువజాము నుంచే మందుబాబులు బెల్ట్ షావుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. గతం కంటే అధిక ధరకే లభిస్తున్నా వెనుకంజ వేయడం లేదు. దీనికి బానిసలై బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. కాయకష్టం చేసి సంపాదించిన మొత్తం మద్యానికి తగలేసి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో ఆస్పత్రి పాలవుతున్నారు. మద్యం, సారా తాగడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో పెద్దగా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. దీంతో గిరిజనుల్లో చైతన్యం కొరవడింది. -
యూత్ ఏషియన్ పారా గేమ్స్‌లో గోల్డ్ మెడల్
విజయనగరం: దుబాయ్ వేదికగా జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025 పారా బాడ్మింటన్‌లో విజయనగరం జిల్లా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విజయాలు సాధించడం వెనుక ప్రేమ్ చంద్ సంకల్పం, నిరంతర సాధనతో పాటు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి అందించిన ప్రోత్సాహం ఉన్నాయన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు దుబాయ్‌లో జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్‌లో గతం కంటే పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ బాడ్మింటన్ ఎస్.హెచ్ 6 కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో మారు మోగేలా చేశాడని ప్రశంసించారు. పొట్నూరు ప్రేమ్ చంద్ విజయం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాం సుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వర రావులు అభినందనలు తెలియజేశారు. -
పంచాయతీ స్థలం ఆక్రమణ
● ఇంటి నిర్మాణానికి టీడీపీ నాయకుల యత్నం ● అడ్డుకున్న గ్రామస్తులు, మహిళలుబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇంటినిర్మాణానికి పూనుకున్న టీడీపీ నాయకుల ఆగడాలను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమరు 150 గజాల స్థలంపై టీడీపీ నాయకుల కన్నుపడింది. కొత్తగా ప్రభుత్వం ఇంటినిర్మాణాలకు రుణసహాయం చేస్తామని ప్రకటించడంతో ఇంటి నిర్మాణానికి అనుమతి తెస్తానని గ్రామ పంచాయతీకి చెందిన కాలువ, రోడ్డును ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని గ్రామ టీడీపీ నాయకుడి సూచనతో శనివారం రాత్రి జేసీబీతో అక్కడి మట్టిని తొలగించేందుకు ఆక్రమణ దారు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు, మహిళలు తిరగబడ్డారు. గ్రామంలో ఉన్న ప్రధాన మురుగునీరు పోయే కాలువను, రోడ్డును ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఆక్రమణపై పంచాయతీ సెక్రటరీ ఇప్పటికే నోటీసులిచ్చినా తోసిరాజని నిర్మాణానికి ప్రయత్నించడంపై పంచాయతీ శాఖ డీఈఈ వెంకటప్పారావుకు విషయాన్ని చేరవేశారు. జేఈతో సమగ్ర దర్యాప్తుకు డీఈఈ ఆదేశించగా ఇంతలోనే నిర్మాణానికి యత్నించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మురుగునీరు పారే కాలువ, వేగావతికి వెళ్లే రహదారి పూర్తిగా మూసుకుపోతుందని వెంటనే చర్యలు చేపట్టాలని ఇటీవల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో సైతం ఫిర్యాదు చేసినా ఆక్రమణను అధికారులు అడ్డుకోకపోవడం, అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇంటి నిర్మాణానికి పూనుకుం టుండంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా అక్కడి పనులను అడ్డుకున్నారు. పంచాయతీ అధికారులనుంచి స్పందన రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణ దారు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో దౌర్జన్యంగా జేసీబీతో పనులు చేపడుతున్నాడని, పంచాయతీ అధికారులు ఇచ్చిన నోటీసులను సైతం పట్టించుకోకుండా ఇంటినిర్మాణానికి పూనుకుంటున్నట్లు, అడ్డగించిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణానికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడి అండదండలున్నాయని ఈ దురాక్రమణను అడ్డుకోవాలని కోరారు. దీంతో ప్రస్తుతం నిర్మాణం ఆగిపోయినా మళ్లీ చేపడితే తీసుకోవాల్సిన చర్యలపై ఇరు వర్గాలను పిలిచి చర్చిస్తామని పోలీసులు తెలిపారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● మద్యం మత్తులో టిప్పర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహదారు భోగాపురం: మద్యం మత్తులో ఓ యువకుడు ద్విచక్ర వాహనానంపై వస్తూ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారు స్వల్ప గాయాలతో బయట పడగా పెనుప్రమాదం తప్పడంతో ముంజేరు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామంలో ఆర్అండ్బీ రహదారిపై ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని దేవరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు గండ్రేటి పాలవెల్లి రెడ్డికంచేరు సమీపంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయంలో జేసీబీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పూటుగా మద్యం తాగి బైక్‌పై భోగాపురం బయలు దేరాడు. భోగాపురం నుంచి ముక్కాం వైపు వస్తున్న టిప్పర్ ముంజేరు వద్దకు చేరుకునేసరికి మద్యం మత్తులో ఉండి ఎదురుగా బైక్‌పై వస్తున్న వాహదారును గమనించిన టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఆపివేశాడు. అయినప్పటికీ మద్యం మత్తులో ఉన్న ద్విచక్ర వాహనదారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు స్వల్ప గాయాలపాలైన పాలవెల్లిని లేపి సపర్యలు చేసి, టిప్పర్‌కు అడ్డంగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేశారు. -
ఉత్సాహంగా వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు
విజయనగరం: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాట్మింటన్ పోటీలు ఉల్లాసంగా సాగాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో గల ఇండోర్ స్టేడియంలో వెటరన్స్ విభాగంలో సీ్త్ర, పురుషులకు నిర్వహించిన బాడ్మింటన్ పోటీలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంబించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ బాడ్మింటన్‌కు జిల్లాలో పెరుగుతున్న ఆదరణ చూసి ఆనందంగా ఉందన్నారు. మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడతాయన్నారు. వెటరన్స్ ఇంతమంది ఆడడం వల్ల యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచినవారవుతున్నారనారు. జిల్లాస్థాయి పోటీల్లో క్రీడా స్ఫూర్తితో ఆడి రాష్ట్ర పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీశ్, అసోసియేషన్ నాయకులు డా.వీఎస్ ప్రసాద్, కుసుంబచ్చన్, కార్యదర్శి నున్నా సురేష్, అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో వెటరన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ధాన్యం కుప్పలు దగ్ధంబాడంగి: మండలంలోని రావివలస గ్రామానికి చెందిన గొర్లిలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన మూడు ధాన్యం కుప్పలు ఆదివారం కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. పాల్తేరు రెవెన్యూ పరిధిలోగల పెద్దచెరువు పొలంలో రెండెకరాల వరిచేనును ఒకేచోట మూడుకుప్పలుగా వేయగా కాలిపోయినట్టు కన్నీటి పర్యంతమైంది. మూడుకుప్పలను నూర్చితే సుమారు లక్షరూపాయలకు ధాన్యం వచ్చేవని విలపించింది. ఎవరో కావాలనే తనపై కక్షతో ఈపనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కల్పించుకుని తమకు న్యాయంచేయాలని మొరపెట్టుకుంటోంది. ఐదు దేవాలయాల్లో చోరీవేపాడ: ఒకే రాత్రి..ఒకే ఊరు..ఒకే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో హుండీలను దుండగులు పగులగొట్టి సొమ్ము దొంగిలించారు. ఈ సంఘటనతో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలంలోని బానాది గ్రామంలో ఎం.సింగవరం బల్లంకి వెళ్లే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో ఏడు హుండీలు పగులగొట్టి శనివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.41 వేల నగదు ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఎస్సై తెలిపారు. ఆదివారం ఉదయం ప్రజలు, ఆలయ అర్చకులు వచ్చేసరికి హుండీలు పగలగొట్లి ఆలయం బయట ఉండడంతో ఆవాకై ్క వెంటనే గ్రామపెద్దలు, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆలయ ఆర్చకుడు మేడపాటి కిశోర్‌శర్మ ఇచ్చిన ఫిర్యాదుమేరకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేశారు. ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు ఐదు ఆలయాల్లో చోరీ సంఘటనపై పరిశీలించి గ్రామస్తులను ఆరాతీశారు. క్లూస్ టీమ్ హుండీలు, ప్రధానగేట్పై వేలిముద్రలు సేకరించారు. బైక్‌పై నుంచి జారిపడి మహిళ మృతిసీతానగరం: మండలంలోని జాతీయరహదారిపై అంటిపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ మేరకు స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రామవరం పంచాయతీ, రెడ్డివాని వలస గ్రామానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి గ్రామంలో నుంచి ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై ఎక్కి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి జారి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. గాయాల పాలైన విజయలక్ష్మిని అదే మోటార్ సైకిల్‌పై చికిత్స నిమిత్తం బొబ్బిలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికలు, సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం పూర్తయ్యాయి. జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కార్పొరేషన్ కస్పా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 170 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హాజరైన క్రీడాకారులకు జూనియర్స్, సీనియర్స్ విబాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా పోటీలు సాగాయి. ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను జూనియర్స్ విభాగంలో ఎంపిక చేయగా.. సీనియర్స్ విభాగంలో మరో 30 మంది అర్హత సాధించారు. జూనియర్స్ విభాగంలో ఎంపికై న బాల, బాలికల క్రీడాకారులు ఈనెల 19,20,21 తేదీల్లో ప్రకాశం జిల్లా పంగులూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి పాల్గొననున్నారు. అదేవిధంగా సీనియర్స్ విభాగంలో అర్హత సాధించిన క్రీడాకారులు ఈనెల 24,26 తేదీల్లో గుడివాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక పోటీలను జిల్లా ఖోఖో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వీవీ రమణమూర్తి, అధ్యక్షుడు ఏఎంఎన్ కమలనాభరావు, ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లి కార్జునారావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎస్.విజయలక్ష్మి, పీడీ వరలక్ష్మి, రామకృష్ణ, రాంబాబు, హరీష్, సత్యనారాయణ, శ్రీను తదితరులు పర్యవేక్షించారు. -
రాజాంలో శ్రీలీల సందడి
రాజాం: పట్టణంలోని పాలకొండ రోడ్డులో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్‌ను సినీనటి, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల ఆదివారం ప్రారంభించారు. తొలుత షాపులో జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌లోని పలు రకాల వస్త్రాలను సందర్శించారు. షాపింగ్‌మాల్‌ను ప్రారంభించిన అనంతరం పక్కన ఏర్పాటుచేసిన ఓపెన్ స్టేజ్‌పైనుంచి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. డ్యాన్స్‌తో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్తో తనకెంతో అనుబంధం ఉందని వెల్లడించారు. సీఎంఆర్ అంటే నమ్మకమని వెల్లడించారు. నాణ్యమైన వస్త్రాలు, జ్యూవెలరీ అందరికీ అందుబాటులో సీఎంఆర్ అందిస్తుందన్నారు. రాజాం పట్టణంలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు అందరికీ సరసమైన ధరలకు వస్త్రాలు లభిస్తాయని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ రాజాంలో కొన్ని నెలల క్రితం సీఎంఆర్ జ్యూయలరీ ప్రారంభించామని, ప్రజలు ఎంతో ఆదరించారని తెలిపా రు. ఇప్పుడు వస్త్రదుకాణాన్ని ప్రారంభించామని, 20 మండలాల ప్రజలకు ఈ షాపింగ్ మాల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన వస్త్రాలును అందుబాటు ధరలో ఉంచుతున్నామని, అన్ని రకాల వస్త్రాలపై క్రిస్మస్, సంక్రాంతి ఆఫర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, సీఎంఆర్ డైరెక్టర్ బాలాజీ, లింగమూర్తి, సీవీ జగన్నాథస్వామి, కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, దొరబాబు, రైజింగ్ రాజు తదితరులు ప్రేక్షకులును అలరించారు. -
రామతీర్థసాగర్‌పై నిర్లక్ష్యం
● ఏడాదిన్నరగా ముందుకు సాగని పనులు ● ప్రాజెక్టు పూర్తయితే 24,710 ఎకరాలకు సాగునీరు ● విజయనగరం పట్టణానికి తాగునీరు ● కూటమిసర్కారు తీరుతో ఆందోళనలో రైతులుపూసపాటిరేగ: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయం పూర్తవుతున్నా ఒక్క పైసా కూడా విదల్చకపోవడంతో రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. రిజర్వాయర్ ట్యాంకులో అడవిని తలపించినట్లు తుప్పలు పెరిగాయి. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లోని 24,710 ఎకరాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందుతుంది. గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతినదిలో బ్యారేజీ నిర్మించి కాలువ ద్వారా రోజుకు 1200 క్యూసెక్కుల నీరు మళ్లించి 2.728 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లో నిల్వ ఉండే విధంగా డిజైన్ చేశారు. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు 25.22 కిలోమీటర్లు కాగా, సుమారు 12 కిలో మీటర్ల మేర పనులు మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి. మిగిలిన 13.22 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 0.48 టీఎంసీల నీటితో విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడానికి ప్రణాళిక సిద్ధమైంది. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత 18 నెలల కాలంగా రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదు. 2006లో రామతీర్థసాగర్ రిజర్వాయర్‌ను రూ.220 కోట్ల ఖర్చు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. దఫదఫాలు అంచనా వ్యయం పెంచిన ప్రభుత్వాలు 2025 ఫిబ్రవరి నాటికి రూ.808 కోట్లు అంచనా వ్యయంగా ఖరారు చేసింది. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు సుమారు రూ.100 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. రామతీర్ధసాగర్ ప్రాజెక్టు ద్వారా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన నీటితో పాటు జిల్లాలో నూతనంగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు కావాల్సిన నీరు ప్రాజెక్టు ద్వారానే అందించడానికి సన్నాహాలు చేశారు. ప్రాజెక్టు ప్రారంభమై 19 సంవత్సరాలు అవుతున్నా నేటికీ పనులు పూర్తికాని పరిస్థితి. ఇప్పటివరకు సుమారు 55 శాతం వరకు పనులు మాత్రమే జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026 నాటికి పనులు పూర్తి చేయడానికి ఒప్పందం జరిగినప్పటికీ పనుల్లో మాత్రం కదలిక లేదు. నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలు సాగునీరు, విజయనగరం పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలి రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే 55 శాతం పనులు పూర్తి అయ్యాయి. నేటి పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిలిచిపోయాయి. నియోజకవర్గంలో ప్రజలకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. తాళ్లపూడి అప్పలనాయుడు, రైతు, పూసపాటిరేగ ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలికోరాడపేట, ఏటీ అగ్రహారం గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి సుమారు 19 సంవత్సరాలు అవుతున్నా పనులు పూర్తి కాలేదు. సకాలంలో పునరావాసం కల్పించాలి. నిర్వాసితుల కాలనీలకు నిధులు మంజూరు చేసి గృహాలు తక్షణమే నిర్మాణం జరిగే విధంగా చూడాలి. కె.కృష్ణ, కోరాడపేట నిర్వాసితుడు -
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
రాజాం సిటీ: విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ చేసుకోవడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని పార్లమెంట్ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్పర్సన్, మూర్తి ట్రస్టు చైర్పర్సన్ సుధా మూర్తి అన్నారు. స్థానిక జీఎంఆర్ ఐటీలో ఆదివా రం నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఆంగ్లంలో పట్టు సాధించడంతో పాటు మాతృభాషను చిన్నచూపు చూడకూడదన్నారు. మాతృభా ష, ఆంగ్లభాష శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులైన దేవకి, యశోదలు వంటివన్నారు. ఆ రెండు భాషలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో మనసులను ఇతర ప్రభావాల నుంచి దూరం చేయడానికి నిరంతర కృషి, సాధన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు. విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాల్లో జీఎంఆర్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఉత్తేజపరిచారు. అనంతరం జీఎంఆర్ కేర్, నైరెడ్ లను సందర్శించారు. 19 మంది గిఫ్టెడ్ చిల్డ్రన్స్‌కు స్కూల్ బ్యాగులను అందించారు. వివిధ విభాగా ల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులను సత్కరించారు. అంతకుముందు జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడు తూ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా రచయితగా పేరుగాంచిన సుధామూర్తి ఎంతో మందికి ఆదర్శ మని కొనియాడారు. కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూపు చైర్మన్లు బీవీ నాగేశ్వరరావు, జీబీఎస్ రాజు, బొమ్మిడాల రమాదేవి, గ్రంథి పెదబాబు, పీడీకే రా వు, ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రహసనంగా... పరిష్కార వేదిక
●పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన అర్జీదారుడు ఒకరు పురపాలక పరిపాలన శాఖకు సంబంధించిన సమస్యను ఈ నెల 10న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీ పెట్టుకున్నారు. రెండు రోజుల్లో అంటే ఈ నెల 12న విచారణ నివేదికను అర్జీదారులకు పంపారు. అయితే విచారణ జరిగిన తేదీలు పరిహాసం కలిగించాయి. విచారణకు రమ్మని నోటీసు ఇచ్చిన తేదీలు గత నెల 28వ తేదీ అంటూ నివేదికలో ఇచ్చారు. పరిశీలనా ప్రశ్నలన్నింటినీ అర్జీదారుని కలిసినట్టు, విచారణ సమయంలో ఫొటో కూడా తీసినట్టు నివేదికలో ఇచ్చారు. నివేదిక చూసిన అర్జీదారుడు ఒకింత ఆశ్చర్యపోయారు. ●రేగిడి ఆమదాలవలస మండలం బూరాడ గ్రామంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణపై గడిచిన మూడు వారాలు జరిగిన పీజేఆర్ఎస్కి ఆ గ్రామ సర్పంచు వావిలపల్లి శశిభూషణరావు, ఎంపీటీసీ సభ్యులు వావిలపల్లి జగన్మోహనరావు, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులతో పాటు 11 మంది ఫిర్యాదులు ఇస్తునే ఉన్నారు. కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఆ గ్రామ పంచాయతీ సర్వే నెం.64–2 విస్తీర్ణం యూ.3.12 సెంట్లుతో వ్యవసాయ పట్టాలు రద్దు చేయమని కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు చెప్పుకున్నారు. ఆ అర్జీలు కాగితాలకే పరిమితమై రెవెన్యూ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి అర్జీదారుల వినతులను రీ ఓపెన్ చేస్తునే ఉన్నారు. కానీ పరిష్కార నివేదికలో మాత్రం కాకి లెక్కలతో సక్సస్ చూపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయనగరం అర్బన్: ప్రజల సమస్యలను పరిష్కరిస్తామనే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహణ ప్రజలను పరిహాసం చేస్తుంది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కేవలం కాగితాలపై పరిష్కార నివేదికలుగా మారాయి. గత ప్రభుత్వం ‘స్పందన’ పేరుతో సచివాలయ గ్రామ, వార్డు స్థాయిలోనే ఫిర్యాదులు తీసుకొని ముఖ్యమంత్రి పేషి దృష్టికి నేరుగా వెళ్లే వ్యవస్థను నిర్మించింది. నిర్థిష్ట సమయంలో అధికారులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకొనే పరిస్థితి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఆ వ్యవస్థను నీరుగార్చుతోందనే అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత స్పందన పేరును మార్చుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రారంభం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు అర్జీలు పరిశీలిస్తే అఽత్యధికంగా రెవెన్యూ విభాగానికే 26,849 వినతు లు వచ్చాయి. వీటిలో తొలిసారి పెట్టిన అర్జీకి పరిష్కారం కానివి 80 శాతం వరకు ఉన్నాయి. రెండోసారి ఫిర్యాదును రీ ఓపెన్ చేసినవి వాటిలో 60 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు పీజీఆర్ఎస్ నిర్వహణపై నమ్మకం లేక రీ ఓపెన్ చేయడం లేదని తెలుస్తుంది. మరో వైపు రెవెన్యూ శాఖలో ఇంతవరకు పరిష్కా రం కాకుండా పెండింగ్‌లో 1,879 వినతులు ఉన్నా యి. వీటిని మళ్లీ రీ ఓపెన్ చేస్తున్నారు. ఈ నెల ఒకటి నాటికి 4.12 శాతం అర్జీలను రీ వెరిఫికేషన్ పోర్టల్‌లో ఉంచారు. సాక్షి, గజపతినగరం సెల్ : 90102 04447 -
ప్రజా వ్యతిరేక నిర్ణయంపై పోరాటం
విజయనగరం: ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాల్లో కీలకమైన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలో తలపెట్టిన ప్రజా చైతన్య ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 15న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించతలపెట్టిన ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లును ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ జంక్షన్ వద్ద గల దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల ప్రతులతో ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించటం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే విజయనగరం జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజల స్వచ్ఛంద మద్దతుతో సేకరించిన సుమారు 4 లక్షల సంతకాల ప్రతులను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో భద్రపరచటం జరిగిందన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించేలా చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందన్నారు. సోమవారం నిర్వహించే ర్యాలీలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పక్షాలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ప్రజా మద్దతుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇలా సేకరించిన సంతకాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఈ నెల 18న రాష్ట్ర గవర్నరుకు అందజేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, నగర ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, కార్పొరేటర్లు బండారు ఆనంద్, బోనెల ధనలక్ష్మి, పట్నాన పైడిరాజు, పార్టీ నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, భోగాపురపు రవిచంద్ర, కాళ్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రజా వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ తమనెవ రూ ఆపలేరని... తన మాటే శాసనమని విర్రవీగిన చంద్రబాబు ప్రభుత్వ అహంకారాన్ని కలంతో ప్రజ లు నిలదీశారు. తమ ప్రాణాలకు విలువ లేదా.. ఆరోగ్యమంటే లెక్కలేదా..? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేసిన కృషిని నేటి కార్పొరేట్ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న యత్నాన్ని ప్రజలు గొంతెత్తి ప్రశ్నించారు. తమ పట్ల ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను.. మోసాన్ని సహించలేని ప్రజలు ఆగ్రహోగ్రులయ్యారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని దించేసి అధికారం ఉంటే కచ్చితంగా దించేసేవారే.. కానీ దానికింకా టైముంది.. అందుకే అందాకా సంతకాలతో తమ నిరసన తెలియజేశారు. కోటి సంతకాల సేకరణకు స్వచ్ఛంద ప్రజా మద్దతు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోగా.. అందులో 5 కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని తరగతులు ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. మిగిలిన 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక భారం పేరిట పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయటాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ఊరూ వాడా మద్దతు పలికింది. భవిష్యత్తు మీద ఆందోళనతో విద్యార్థి లోకం.. ఆరో గ్య భద్రతపై బెంగతో వృద్ధులు సైతం ఈ సంతకా ల్లో మేము సైతం అని పాల్గొన్నారు. మన్యం ప్రజ లు ఈ ఉద్యమానికి మోసులెత్తగా.. పట్టణ ప్రజలు పరుగులెత్తారు. పల్లెలు పట్టుగొమ్మలయ్యాయి.. విద్యార్థులు వీరులై కదలివచ్చారు. దీంతో మొత్తానికి విజయనగరం... పార్వతీపురం మన్యం జిల్లాల్లో కోటి సంతకాల ఉద్యమం ఘనంగా సాగింది. ఈ సంతకాల ప్రతులు ఇప్పుడు గ్రామాలూ.. మండలాలు.. పట్టణాలను దాటుకుని జిల్లా కేంద్రాలకు చేరుతున్నాయి. ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి గవర్నరుకు అందజేస్తారు. ప్రజా వ్యతిరేకతను గవర్నరుకు వివరించడం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు.. దమననీతిని దేశవ్యాప్తం చేసేందుకు వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించ తల పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న సోమ వారం విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లా కేంద్రంలో ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రాల నుంచి విజ యవాడలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం ఈ నెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నరుకు కోటి సంతకాలు అందజేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృత పరించేందుకు చేపట్టిన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలియజేయటం ద్వారా ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాల వివరాలు.. విజయనగరం : 54,889 ఎస్.కోట : 52,000 గజపతినగరం : 60,000 చీపురుపల్లి : 62,500 నెల్లిమర్ల : 67,019 బొబ్బిలి : 52,500 రాజాం : 51,000 పాలకొండ : 63,000 కురుపాం : 55,000 పార్వతీపురం : 64,000 సాలూరు : 35,000 -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పా రు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని సరిగా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదు ను తీసుకురావాలని సూచించారు. మండల, డివిజన్ అధికారుల కార్యాలయంలో కూడా పీ జీఆర్ఎస్ నిర్వహించాలని ఆదేశించారు. విజయనగరం టౌన్: గోవా గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త పూస పాటి అశోక్ గజపతిరాజు ఎంపికవ్వడం తెలు గు వారందరికీ గర్వకారణమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం ఆత్మీ య సత్కార సభను నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజాం : స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో రాజాంకు చెందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివా రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు కత్తులకవిటికి చెందిన ఎన్ఆర్ఐ, సామాజిక సేవా కార్యకర్త దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు, ఆయన బంధువులు ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్ర దర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కా ర్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్ : శాంతిభద్రతల దృష్ట్యా వైఎస్సార్సీపీ సోమవారం తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించినట్టు విజయనగరం ఇన్చార్జ్ ఆర్.గోవిందరావు వెల్లడించడంపై జనం విస్తుపోతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత మరింతగా బయటపడి చంద్రబాబు పాలనపై ప్రజాగ్రహం మరింత రెట్టింపు కావడం ఖాయ మనే భావనతోనే ప్రభుత్వమే ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేసే హక్కు పౌరులకు ఉంటుందని, దీన్ని అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలో ర్యాలీకి అనుమతి కోరారని.. కానీ ర్యాలీ నిర్వహించ తలపెట్టిన ప్రాంతం ముఖ్య వ్యాపార కూడళ్లు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా శాంతి దృష్ట్యా ర్యాలీకి అనుమతి నిరాకరించినట్టు ఇన్చార్జ్ డీఎస్పీ ఆదివారం వెల్లడించడంతో పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు, మేధావులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గడ్డివాములు దగ్ధం
తెర్లాం: మండలంలోని గొలుగువలస గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములతో పాటు ధాన్యం పాక్షికంగా కాలిపోయాయి. దీనికి సంబంధించి బాధితులు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాకేటి శ్రీనివాసరావు, అప్పలనాయుడులకు చెందిన గడ్డివాములు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. గడ్డివాముల పక్కనే నూర్పిడి చేసి నిల్వ ఉంచిన ఽగొట్టిపల్లి గణపతికి చెందిన ధాన్యం కూడా పాక్షికంగా మంటలకు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి మంటలను ఆదుపు చేయడంతో ధాన్యం పూర్తిగా కాలిపోకుండా నివారించగలిగామని రైతులు అంటున్నారు. గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ హేమంత్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు గ్రామానికి వెళ్లి కాలిపోయిన గడ్డివాములను, పాక్షికంగా దెబ్బతిన ధాన్యాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ ప్రతినిధి గర్భాపు రామారావు, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, ఎంపీటీసీ సభ్యురాలు సాకేటి నాగమణి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ఉన్నారు. నాకౌట్ దశకు సాఫ్ట్‌బాల్ పోటీలు వీరవాసరం: వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్‌బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు విజయనగరం జిల్లా బాలికల జట్టు గుంటూరు జట్టుపై 02:01 తేడాతో.. విజయనగరం జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 04–01 తేడాతో గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 12–01 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అలాగే బాలుర ఫలితాల్లో విజయనగరం జట్టు విశాఖ జట్టుపై 03–00 తేడాతో, విజయనగరం జట్టు చిత్తూరు జట్టుపై 05–00 తేడాతో విజయం సాధించాయి. బాలుర క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జట్టు ప్రకాశంపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాచింకి శ్రీనివాస్ తెలిపారు. ప్రారంభమైన పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు శనివారం స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది ఉండదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని కొనియాడారు. పారా రాష్ట్ర స్థాయి పోటీలను తొలిసారిగా విజయనగరంలో నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎవరికి తక్కువ కాదని, జిల్లాలో ప్రతిభ గల దివ్యాంగ క్రీడాకారులకు కొదవ లేదని వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహిస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, మాజీ రోటరీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు, రాష్ట్ర స్థాయి పోటీల కన్వీనర్ నాలుగెస్సుల రాజు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్, విశాఖపట్నం గౌరవ అధ్యక్షులు డాక్టర్ షీతల్ మదాన్, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గణేష్, సారధి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రదీప్, ప్రతాప్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం అవసరం
● విశాఖ ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత ● జేఎన్టీయూ జీవీలో ఘనంగా జెన్ ఏఐ హ్యాకథాన్ ప్రోగ్రామ్ విజయనగరం రూరల్: ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవపరం ఎంతైనా ఉందని విశాఖపట్నానికి చెందిన ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత అన్నారు. స్థానిక జేఎన్టీయూ – జీవీలో హైదరాబాద్‌కు చెందిన జెన్ ఏఐ వర్సిటీ, జేఎన్టీయూ జీవీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జెన్ ఏఐ హ్యాక్‌థాన్ ఫరధ నెక్ట్స్ జనరేషన్ జాబ్స్’ సాంకేతిక కార్యక్రమాన్ని శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్త సురేష్ బాత మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్య పూర్తయిన తరువాత విద్యార్థులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి ఇటువంటి హ్యాక్‌థాన్ కార్యక్రమాలకు హాజరవడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. తద్వారా కృత్రిమ మేధస్సును (ఏఐ) ఉపయోగించి సమాజానికి మేలు చేస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జెన్ ఏఐ వర్సిటీ చీఫ్ అకాడమీ అధికారి నరేంద్ర అల్లం మాట్లాడుతూ ఏఐలో నైపుణ్యం ఉన్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, మానవ మనుగడలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. జేఎన్టీయూ జీవీ రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుతో భావి తరాల నాయకులు, ఆవిష్కర్తలు, సమస్యలకు పరిష్కారాలు చూపే వారిని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర అల్లం రచించిన పైథాన్ ప్రోగ్రామింగ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాస్త్రవేత్త సురేష్ బాతను ఘనంగా సత్కరించారు. ప్రోగ్రామ్ కన్వీనర్, జేఎన్టీయూ జీవీ ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, సమన్వయకర్తలు డాక్టర్ జిజె.నాగరాజు, ఆర్డిడివి.శివరామ్, ఆచార్యులు కె.బాబు, జి.స్వామినాయుడు, కెసిబి.రావు, డి.రాజ్యలక్ష్మి, కలేషావలి, ఆర్.గురునాధ, కె.అచ్యుతకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి శృంగవరపుకోట : అరుకు ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువు పాలయ్యాడు. ఎస్.కోట పట్టణంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఇర్ఫాన్(19) శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్.కోట నుంచి మేక మాంసం తీసుకుని, స్నేహితునితో కలిసి అనంతగిరిలో ఇటీవల ప్రారంభించిన దుకాణానికి రాత్రి 9.30గంటల సమయంలో వెళ్తుండగా కాశీపట్నం టోల్గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టాడు. దీంతో ఇర్ఫాన్ బైక్ పై నుంచి ఎగిరి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తెచ్చి అక్కడి నుంచి విశాఖకు తరలిస్తుండగా మార్గం మద్యలోనే ఇర్ఫాన్ మృతి చెందాడు. ఇర్ఫాన్ తండ్రి మదీనా బైక్ మెకానిక్‌గా పని చేస్తుండగా, తల్లి, తమ్ముడు ఉన్నారు. -
కె.సీతారాంపురంలో ఘోర అగ్ని ప్రమాదం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో కె.సీతారాంపురంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్డీవో రామమోహన్‌రావు శనివారం గ్రామానికి వచ్చి పాపమ్మ మృతదేహాన్ని, బాధితులను పరామర్శించారు. రెవెన్యూ పరంగా ఐదు రోజులకు సరిపోయే ఆహార పదార్ధాలను బాధితులకు అందజేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో బాధితులకు పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ ఏర్పాటు చేశారని, ఇల్లు కాలిపోయిన బాధితులకు నష్టపరిహారంగా రూ.13వేలు చొప్పున అందించనున్నట్టు చెప్పారు. ఉప తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ కృష్ణమూర్తి, వీఆర్వోలు గణపతి, రాము, శ్రీనివాసరావు, సుధాకర్, రవి తదితరులు సంఘట జరిగిన నుంచి గ్రామంలోనే ఉండి వివరాలు సేకరించడంతో పాటు, బాధితులకు సేవలు అందించారు. బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్‌బాబు సంఘటనా స్థలానికి వచ్చి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పాపమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే మృతురాలికి శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం చేయించారు.తెర్లాం: మండలంలోని కొరటాం గ్రామ పంచాయతీ కె.సీతారాంపురం(చిన గొలుగువలస) గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోగా, 85ఏళ్ల వృద్ధురాలు సజీవ దహనమైంది. దీనికి సంబంధించి శనివారం స్థానికులు, బాధితులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని యాతవీధి(కల్లుగీత కార్మికులు)లో శుక్రవారం రాత్రి 10.30గంటల సమయంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో అదే వరుసలో ఉన్న 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ఉంటున్న ఆమె అత్త కోష్టు పాపమ్మ(85)మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన ఎద్దుమంటి వెంకటమ్మ, కోష్టు చినవెంకటయ్య, పోలారావు, లక్ష్మి, గురువులు, ఆదమ్మ, పెదవెంకట రమణమ్మ, పెదనర్సయ్య, అప్పడు, నక్క రవణమ్మ, చోడి సింహాచలం, రాములుకు చెందిన ఇళ్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.6లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని రాజాం అగ్నిమాపక కేంద్రం అధికారులు, రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. సజీవ దహనమైన వృద్ధురాలు పాపమ్మ గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో ఇంట్లో ఉన్న కోడలు, పిల్లలు భయంతో బయటకు వెళ్లిపోయారు. మంచంపై ఉన్న కోష్టు పాపమ్మ(85) అనే వృద్ధురాలు బయటకు రాలేకపోవడంతో మంటల్లో చిక్కుకుంది. గ్రామస్తులు స్పందించి ఆమెను మంటల్లో నుంచి బయటకు తీసేటప్పటికే కాలిపోయి మృతి చెందింది. మృతురాలు పాపమ్మకు కోడలు లక్ష్మి, ఆమె కుమారుని పిల్లలు మాత్రమే ఉన్నారు. పాపమ్మ అగ్ని ప్రమాదంలో మృతి చెందడంతో కోడలు, ఆమె మనవరాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. కట్టుబట్టలతో... ఈ అగ్ని ప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదంలో ఇళ్లల్లో ఉన్న సామగ్రి, బట్టలు, తిండి గింజలు, బంగారం, వెండి, నగదు, ఇండేన్ గ్యాస్ సిలెండర్లు, ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు, పెన్షన్ కార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కోష్టు గురువులకు చెందిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.80వేలు నగదు, 50తులాల వెండి, తిండి గింజలు కాలిపోయాయి. కోష్టు అప్పన్నకు చెందిన అర తులం బంగారు వస్తువులు, సారి సామాన్లకు ఉంచిన రూ.లక్ష నగదు కాలి బూడిదైంది. కోష్టు పెదనర్సయ్యకు చెందిన 10 తులాల వెండి, రూ.20 వేలు నగదు కాలిబూడిదైంది. కోష్టు లక్ష్మికి చెందిన పావు తులం బంగారం, 10తులాల వెండి పట్టీలు, రూ.8వేలు నగదు ఈ ప్రమాదంలో కాలిపోయాయని బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు. బాధితులందరికీ కట్టు బట్టలు మినహా ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలిపోయాయి. ప్రమాద విషయాన్ని రాజాం అగ్ని మాపక కేంద్రానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు.కె.సీతారాంపురం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అధికారులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు కాలిపోయిన 12 పూరిళ్లు మంటల్లో సజీవ దహనమైన వృద్ధురాలు కోష్టు పాపమ్మ బాధితులను పరామర్శించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో, తహసీల్దార్ రూ.6 లక్షల ఆస్తి నష్టం కె.సీతారాంపురం(చినగొలుగువలస) గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద వార్తను తెలుసుకున్న జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడుతో కలిసి శనివారం ఉదయం గ్రామానికి వచ్చి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను స్థానిక నాయకులను, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారితో పాటు తెర్లాం ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రతినిధులు నర్సుపల్లి బాబ్జీరావు, గర్భాపు రామారావు, వైస్ ఎంపీపీలు చేపేన సత్యనారాయణ, అప్పలరాజు, కొరటాం ఎంపీటీసీ సాకేటి నాగమణి, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పరామర్శించారు. -
లోక్‌అదాలత్‌లో 9,513 కేసుల పరిష్కారం
విజయనగరం లీగల్: రాజీయే రాజమార్గమని, కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహపూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్‌అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. జాతీయ లోక్‌అదాలత్ వల్ల కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు వృథా కాదన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో శనివారం నిర్వహించి జాతీయలోక్అదాలత్లలో 9,513 కేసులు పరిష్కరించినట్టు వెల్లడించారు. వాటిలో సివిల్ కేసులు 424, క్రిమినల్ కేసులు 9,028, ప్రీ లిటిగేషన్ కేసులు 61 ఉన్నాయన్నారు. బీమా కంపెనీకి చెందిన రూ.90 లక్షలను మోటారు ప్రమాద బీమా కేసుల్లో పిటిషనర్లకు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, నాలుగవ శ్రేణి న్యాయమూర్తి బి.అప్పలస్వామి, మహిళా మరియు ఐదవ జిల్లా న్యాయమూర్తి ఎన్.పద్మావతి, కె.నాగమణి, పోక్సోకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయమూర్తి ఎ.కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి, బార్ అసోసియేషన్ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌కు హాజరైన కక్షిదారులందరికీ న్యాయవాది కుమారస్వామి మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటుచేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
● జిల్లా పర్యటనలో టీఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు విజయనగరం అర్బన్: రాష్ట్రంలో సాస్కి (ఎస్ఏఎస్సీఐ) పథకం ద్వారా వచ్చే నిధులతో జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని టీఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీటీ కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు రహదారులను పరిశీలించారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్అండ్బీ అతిథిగృహాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డితో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారుల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ఈ ఏడాది సాస్కి పథకం కింద రూ.500 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏడాది నుంచి రూ.2 వేల కోట్లతో మరింత విస్తృతంగా పనులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి అనుకూల సమయమని గుంతల పూడ్చే పనులను వేగవంతం చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు వేగంగా చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లను పదోన్నతి ఇచ్చి గ్రేడ్–1 వర్క్ ఇన్స్పెక్టర్లుగా తీసుకునేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైల్వే సంబంధిత సమస్యలు పరిష్కారానికి పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డీఓ, రైల్వే అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఆర్అండ్బీ ఈఎన్సీ వి.రామచంద్ర, సూపరింటెండెంట్ ఇంజినీర్ కాంతిమణి, ఆర్డీవో దాట్ల కీర్తి, ఆర్అండ్బీ ఈఈలు, డీఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
బంగారం కోసం వృద్ధురాలి హత్య
● ఆర్అండ్ఆర్ కాలనీ ముడసర్లపేటలో దారుణం భోగాపురం: రెండు తులాల బంగారం కోసం వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీ ముడసర్లపేట గ్రామానికి చెందిన ముడసర్ల అప్పయ్యమ్మ (70) ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి ముక్కు, చెవి, మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు నగలను అపహరించుకుని మృతదేహాన్ని సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు వద్ద వదిలేసి పారిపోయారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు జీవనోపాధి కోసం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లాడు. చిన్న కుమారుడు భవానీ మాల వేసుకుని కుటుంబంతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ కొండకు వెళ్లాడు. దీంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో దుండగులు ఇంట్లోకి చొరబడి అప్పయ్యమ్మను దారుణంగా హత్య చేసి ముక్కు, చెవి, మెడలో ఉన్న బంగారాన్ని అపహరించుకుని పారిపోయారు. స్థానికులు ఉదయం వాటర్‌ట్యాంకు దగ్గర విగతజీవిగా పడి ఉన్న అప్పయ్యమ్మ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై పాపారావులు విశాఖపట్నం రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి పెద్ద కోడలు ముడసర్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే హత్య చేసిన దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. -
అంతా బాగుందనుకున్నారు... ఇంతలోనే...
● చికిత్స పొందుతూ మృత్యు ఒడికి చేరిన పాలిటెక్నిక్ విద్యార్థి ● కన్నీరుమున్నీరుగా విలపించిన తండ్రి ● ప్రాణం మీదకి తెచ్చిన ట్రాక్టర్ లిఫ్ట్చీపురుపల్లి: తానొకటి తలచితే.. దైవం మరొకటి తలచింది.. అన్న సామెత అక్షరాల ఆకాష్ విషయంలో స్పష్టమయ్యింది. ప్రతీ రోజూ మాదిరిగా కళాశాల విడిచిపెట్టారు. ఆకాష్ ఇంటికో.. వసతిగృహానికో.. వెళ్లిపోవాలనే రోడ్డెక్కాడు. స్నేహితులతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ రోడ్డుపై నడుస్తున్నాడు. కానీ విధి ఆ యువకుడుని మృత్యువు వైపు లాగుతుండడంతో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను లిఫ్ట్ అడిగేలా చేసింది. ఆ ట్రాక్టర్ లిఫ్ట్ కాస్త నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆకాష్‌ను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లింది. ఐదు రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పాలిటెక్నిక్ విద్యార్థి ఆకాష్(17) శనివారం మృతి చెందాడు. వెల్డింగ్ పని చేసుకుంటూ కొడుకుని బాగా చదివించుకోవాలని ఎంతో కోరికతో పాలిటెక్నికల్ విద్య చదివిస్తున్న ఆకాష్ తండ్రి కన్న కలలు చెదిరిపోయాయి. ఎంతో ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు కళ్ల ముందు విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. ప్రాణాల మీదకు తెచ్చిన ట్రాక్టర్ లిఫ్ట్ జామి మండలంలోని అలమండ గ్రామానికి చెందిన జి.ఆకాష్ పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక ఎస్సీ కళాశాలల బాలుర వతిసగృహంలో ఉంటూ చదువుతున్నాడు. ఈ నెల 6న కళాశాల ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆకాష్ తిరిగి 8న నేరుగా కళాశాలకు వచ్చాడు. ఆ రోజు కూడా తరగతులు ముగించుకుని పట్టణ శివారున ఉన్న కళాశాల నుంచి స్నేహితులతో కలిసి రోడ్డెక్కాడు. వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను లిఫ్ట్ అడిగాడు. కుర్రాళ్లు లిఫ్ట్ అడిగారు కదాని ట్రాక్టర్ డ్రైవరు ఆపి లిఫ్ట్ ఇచ్చాడు. నలుగురు స్నేహితులతో కలిసి ట్రాక్టర్ ఎక్కిన ఆకాష్ ట్రాక్టర్ కదిలిన కాసేపటికే ఇంజన్ – తొట్టె మధ్య భాగంలో ప్రమాదవశాత్తూ జారి పడిపోయాడు. దీంతో ఆకాష్‌పై నుంచి ట్రాక్టర్ వెళ్లింది. చికిత్స పొందుతూ మృత్యు ఒడిలోకి ఈ నెల 8న కేజీహెచ్‌లో చేరిన ఆకాష్‌కు కలెక్టర్ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో శస్త్ర చికిత్స కూడా నిర్వహించారు. గత ఐదు రోజులుగా వసతిగృహ సంక్షేమాధికారి మంగళగిరి శ్రీనివాసరావు కేజీహెచ్ వద్దనే ఉంటూ ఆకాష్ యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. శుక్రవారం నాటికి ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు కూడా చెప్పారు. కానీ ఇంతలోనే ఏమైందోగాని శనివారం మృతి చెందడం కలచివేసింది. ఈ మేరకు చీపురుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్జాతీయ వైజ్ఞానిక దృక్పథం అవసరం
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ విద్య కోర్సుల్లో అంతర్జాతీయ దృక్పథం ఉండాలని, అప్పుడే డిగ్రీ పూర్తయిన తరువాత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జర్మనీ స్మోల్ట్సిక్ అండ్ పార్ట్నర్ ప్రాజెక్టు మేననేజర్ సురేష్ టంకాల అన్నారు. సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘సిద్ధాంతం నుంచి వాస్తవంలో రూపంలోకి–ఇంజినీరింగ్ విద్యలో అంతర్జాతీయ దృక్పథాలు’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. సిద్ధాంతాత్మక జ్ఞానాన్ని ప్రాయోజిత ఇంజినీరింగ్ పనులతో అనుసంధానం చేయాలన్నారు. కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డి.వి.రామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకటలక్ష్మి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధితి జి.రవికిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌కు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.భార్గవి సమన్వయ కర్తగా వ్యవహరించారు. -
ధాన్యం సేకరణపై విచారణ
విజయనగరం ఫోర్ట్: తేమశాతం పేరుతో అదనంగా రైతుల నుంచి మిల్లర్లు ధాన్యం తీసుకుంటున్నారనే అంశంపై ‘రైతు కష్టం మిల్లర్ల పాలు..!’ అనే శీర్షికన ‘సాక్షిలో’ శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో సీఎస్‌డీటీ మూర్తి విచారణ చేపట్టారు. రావివలస వద్ద ఉన్న కనకదుర్గ మిల్లు యాజమాని అదనంగా ధాన్యం తీసుకున్నట్టు రైతులు కరకనాయుడు, పి.దేముడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. మడ్డువలస నీరు విడుదల వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా రబీ సీజన్‌కు ప్రాజెక్టు సిబ్బంది శనివారం సాగునీరు విడుదల చేశారు. తొలిరోజు 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా అవసరం మేరకు నీటి సరఫరా పెంచనున్నారు. ఈ సీజన్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని సిబ్బంది రైతులను సూచించారు. ఆయకట్టు పరిధిలో వంగరలో 996 ఎకరాలు, రేగిడి ఆమదాలవలసలో 6,777 ఎకరాలు, సంతకవిటిలో 6,599 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 3,029 ఎకరాలు, పొందూరులో 99 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఉడకని అన్నం.. రుచిలేని కూర..? ● పోటీల నిర్వహణకు ఏర్పాట్లు లేమి ● ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడాపోటీల నిర్వహణపై అసంతృప్తి విజయనగరం: ఉపాధ్యాయుల క్రీడాపోటీల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ... సౌకర్యాలు తక్కువ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పురుషుల విభాగంలో క్రికెట్, సీ్త్రల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి విజేతలకు విజయనగరం విజ్జి స్టేడియం వేదికగా శని, ఆదివారం డివిజిన్ స్థాయి పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం రూ.20వేలు చొప్పున కేటాయించారు. విజయనగరం డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన క్రీడా పోటీల నిర్వహణపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. నిర్దేశిత సమయానికి పోటీలు ప్రారంభించకపోవడం, కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. క్రికెట్ పోటీల్లో కార్క్ బాల్‌ను వినియోగించగా... అందుకు అవసరమైన బ్యాట్లు, ప్యాడ్లు, హెల్మెట్, గార్డ్స్ వంటి పరికరాలు సమకూర్చలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన పోటీలను 11 గంటల వరకు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయకపోగా... మధ్యాహ్నం భోజనం కూడా ఉడకని అన్నం... సాంబారు, ఒక్క కూరతో వడ్డించడాన్ని ఆక్షేపించారు. మొదటి రోజు పోటీలను ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ప్రారంభించారు. -
చిన్నారులకు ఆపన్నహస్తం
జామి: తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విజయ్, గౌతమ్‌లకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. చిన్నారుల దీన స్థితిపై ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, దాతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా జడ్జితో పాటు పలువురు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎస్.కోట యూట్యూబ్ ఛానల్‌కి చెందిన నవీన్రామ్సింగ్ శనివారం జన్నివలస గ్రామానికి వచ్చి పిల్లలకు చిన్నగృహం నిర్మాణం నిమిత్తం రూ.40 వేలును వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. నిత్యావసర సరుకులు, దుస్తులు వితరణగా అందజేశారు. పలువురు దాతలు చిన్నారులకు అండగా నిలుస్తుండడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి కథనానికి స్పందన -
కంటి తనిఖీ కోసం వెళ్లి మృతి
● మృతుడి నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు చీపురుపల్లి: ఆ ఇంటి పెద్ద అకాల మరణం కుటుంబాన్ని కుంగదీసింది. చీపురుపల్లిలో బయల్దేరి విజయనగరం కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. మనిషి లేడనే బాధలో దుఃఖంలో ఉన్నప్పటికీ నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చిన ఆ కుటుంబం ఆదర్శం కాగా ఆయన నేత్రాలు సజీవంగా మిగలనున్నాయి. పట్టణానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు(73) శుక్రవారం ఉదయం విజయనగరంలో కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని పట్టణంలోని జి.అగ్రహారం తీసుకొచ్చారు. నేత్రదానం కోసం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల పీఎంసీ చైర్మన్ గవిడి సురేష్ మృతుని కుటుంబసభ్యులకు వివరించగా దీనికి వారు అంగీకరించడంతో మానవీయత స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా రెడ్‌క్రాస్ నుంచి టెక్నీషియన్ హాజరై మృతుడు అప్పారావు నుంచి కార్నియా సేకరించారు. ఇక్కడ సేకరించిన కార్నియాను విశాఖపట్నంలోని ఎల్వీ.ప్రసాద్ ఆస్పత్రికి తరలించినట్లు గోవిందరాజులు తెలిపారు. విజయనగరం క్రైమ్: ఈ నెల 5న జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలైన నిండు గర్భిణి మౌనిక (28) కేజీహెచ్‌లో చిక్సిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్సై చంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..తోటపాలెంకు చెందిన గర్భిణి మౌనిక లంకాపట్నంలోని కన్నవారింటికి వచ్చింది. ఇంట్లో వంట చేస్తుండగా నైటీకి నిప్పంటుకోవడంతో ప్రమాదం సంభవించింది. దీంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
పూరిల్లు దగ్ధం: వృద్ధురాలికి గాయాలు
రాజాం సిటీ: మండల పరిధి బొమ్మినాయుడువలస పంచాయతీ విజయరాంపురం గ్రామంలో ఓ పూరిల్లు దగ్ధంకాగా అందులో నిద్రిస్తున్న వృద్ధురాలు గాయాల పాలైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన లింగాల పైడమ్మ అనే వృద్ధురాలి పూరిల్లు శుక్రవారం వేకువజామున విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో కూడా ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా నిద్రలో ఉన్న వృద్ధురాలి శరీరం కాలిపోవడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై ఆమెను ఎలాగోలా బయటకు తీసి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఎస్సై పి.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వృద్ధురాలిని గ్రామానికి చెందిన మాజీ వలంటీరు, ఆటో డ్రైవర్ దాలి అప్పలనాయుడు రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
కారుణ్య నియామకపత్రం అందజేత
విజయనగరం రూరల్: బాడంగి మండలానికి చెందిన జి.జోజమ్మను గంట్యాడ మండలంలోని వసంత జెడ్పీ ఉన్నత పాఠశాలలో కార్యాలయ సహాయకురాలిగా నియమిస్తూ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం నియామకపత్రం అందజేశారు. బాడంగి మండలం డొంకినవలస పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు జి.లక్ష్మణరావు మరణించడంతో ఆయన భార్య జోజమ్మకు కారుణ్య నియామకంలో ఉద్యోగం కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ, ఏవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు అలుగోలు విద్యార్థినెల్లిమర్ల రూరల్: మండలంలోని అలుగోలు ఉన్నత పాఠశాల విద్యార్థి గణేష్ రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. చింతపల్లి సముద్ర తీరంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో అండర్–14 విభాగంలో పాల్గొని సత్తా చాటాడు. ఈ నెల 20 నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు హజరుకానున్నాడు. ఈ మేరకు శుక్రవారం హెచ్ఎం కస్తూ రి, పీడీలు ధర్మారావు, మహేశ్వరరావు గణేష్‌ను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. 14న జిల్లా స్థాయి ఖోఖో పోటీలువిజయనగరం: జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జిల్లాస్థాయి సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏఎంఎన్ కమలనాభ రావు, కె.గోపాల్‌లు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని కస్పా కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు 2008 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించి ఎత్తు, బరువు, వయస్సు కలిపి 250 పాయింట్ల లోపు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, జరిమానావిజయనగరం క్రైమ్: మూడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ఎం.బబిత తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ హత్య కేసు వివరాలిలా ఉన్నాయి. చీపురపల్లికి చెందిన బంగారి రామ్మోహనరావును ఆగస్టు 18, 2022లో గుర్తుతెలియని వ్యక్తి గాయపరిచినట్టు తమ్ముడు వెంకటేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై మృతుని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆల్టరేషన్ మెమో ద్వారా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దీంతో అప్పటి చీపురుపల్లి సీఐ సంజీవరావు కేసు దర్యాప్తు చేపట్టి విచారణ చేసి హత్య నేరానికి పాల్పడినట్లు రాయిపల్లి మురళిని అరెస్ట్ చేసి రి మాండ్ తరలించి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కోర్ట్ విచారణలో రాయిపల్లి మురళిపై నేరారోపణలు రుజువు కావడంతో వి జయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గమనించారు. నగరంలోని ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా సులబ్ కాంప్లెక్స్‌వద్ద ఫుట్ పాత్‌పై మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని సీఐ ఆర్వీఆర్కే చౌదరి గుర్తించారు. ఈ మేరకు గుర్తు తెలియని మృతదేహం కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్ టౌన్లో సంప్రదించాలని సీఐ చౌదరి కోరారు. -
విశాఖ నుంచి వస్తూ కారు ప్రమాదం
పాలకొండ రూరల్: మండలంలోని అట్టలి గ్రామ మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయోత్పాతానికి గురిచేసింది. విశాఖ నుంచి దంపతులు పాలకొండ వయా పార్వతీపురం మీదుగా జియమ్మవలసకు తమ కారులో వెళ్తుండగా అట్టలి మలుపు దగ్గరకు చేరుకుంటున్న క్రమంలో వారి కారు అదుపు తప్పి కుడివైపు పంటపొలాల్లోకి దూసుకువెళ్లబోతూ అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవగాం విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే 11–కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోయింది. నిప్పులు చిమ్ముతూ సిమెంట్ స్తంభం కారుపైకి ఒరిగిపోవటంతో అక్కడివారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అదృష్టవశాత్తు కారు ముందు భాగం నుజ్జవడం మినహా అందులో ప్రయాణిస్తున్న దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికుల సహాయంతో దంపతులు సురక్షితంగా బయటపడి స్వగ్రామం పయనమయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
సెంచూరియన్ వర్సిటీతో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎంఓయూ
భువనేశ్వర్: ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌లోని సెంచూరియన్ యూనివర్సిటీ, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్‌ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
చింతూరు బస్సు దుర్ఘటనపై దిగ్బ్రాంతి
● మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, ● క్షతగాత్రులకు రూ.5 లక్షలు ప్రభుత్వం అందించాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరసాలూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్‌రోడ్డులో బస్సు ప్రమాద దుర్ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేట్ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి ,శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మరణించిన భక్తులకు రూ.15 లక్షలు ఇచ్చినట్లే, తీర్థయాత్రలకు వెళ్తూ మరణించిన భక్తులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలకు తక్కువ కాకుండా ఇవ్వాలన్నారు. కేంద్రప్రభుత్వం రూ.2 లక్షలు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు ప్రభుత్వమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించడంతో పాటు వారికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఈ రహదారిలో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చర్యలు చేపట్టాలని కోరారు. -
పేదోడి పళ్లెంలో ప్రోటీన్ మాయం
పిండి ఇచ్చి.. పప్పు ఎగ్గొడతారా? జనవరి నుంచి కిలో గోధుమపిండిని రూ.16కే ఇస్తామని, ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు 580.15 టన్నులు, మన్యం జిల్లాకు 280.93 టన్నుల పిండి అవసరమని లెక్కలు వేశారు. అయితే, గోధుమపిండితో సరిపెట్టి, అత్యంత ఖరీదైన కందిపప్పును మాత్రం ఎగ్గొట్టే ప్లానన్లో ప్రభుత్వం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత బకాయిలు, పాత సరుకులు సక్రమంగా ఇవ్వకుండా కొత్తవాటితో మసిపూసి మారేడుకాయ చేయడం తగదని ప్రజలు వాపోతున్నారు. కందిపప్పు పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ కొత్త సరుకులు ఏ మూలకు? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.పార్వతీపురం రూరల్: సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పేదవాడికి కనీస అవసరమైన ‘కందిపప్పు’ను అందించడంలో చేతులెత్తేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ గొప్పలు చెబుతున్న సర్కారు..ఆచరణలో మాత్రం పేదోడి కడుపు కొడుతోంది. గత ఏడాది కాలంగా రేషన్ డిపోల్లో కందిపప్పు జాడ లేదు. ఇప్పుడు కొత్తగా జనవరి నుంచి గోధుమపిండి, రాగులు ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం..‘చేతితో ఇచ్చి చేటతో లాక్కున్నట్లు’ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కందిపప్పు కరువై..ముద్ద దిగేదెలా? పేదలకు చౌకగా నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు మండుతుంటే, రేషన్ ద్వారా అందించాల్సిన పప్పును ఏడాదిగా నిలిపివేయడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పప్పు అన్నానికి కరువైన సామాన్యుడు..బయట మార్కెట్లో రూ.160కి పైగా పెట్టి కొనలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ప్రభుత్వం..ఇప్పుడు పప్పు గురించి మాట్లాడకుండా గోధుమపిండి, రాగులంటూ కొత్త పల్లవి అందుకోవడం ‘కంటితుడుపు చర్య’గానే కనిపిస్తోంది. ఇచ్చే బియ్యానికి ఎసరు ప్రభుత్వం కొత్తగా రాగులు ఇస్తున్నామంటూ గొప్పగా చెబుతున్నా..దాని వెనుక ఉన్న మెలిక చూసి లబ్ధిదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. రాగులను అదనంగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటాలో కోత విధించి మరీ ఇస్తున్నారు. ఉదాహరణకు 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబానికి..ఇకపై 17 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చి, మిగతా 3 కిలోల బదులు రాగులు ఇస్తారు. అంటే ఉన్న బియ్యాన్ని తగ్గించి, కొత్త సరుకు పేరుతో మభ్యపెట్టడమేనని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాదిగా లబ్ధిదారులకు అందని కందిపప్పు ఇప్పుడు బియ్యంలోనూ కోత పట్టించుకోని ప్రభుత్వం బియ్యం తగ్గించి..రాగులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయంపౌష్టికాహార పంపిణీపై పాలకులకు లేని చిత్తశుద్ధి అత్యంత కీలకమైన కందిపప్పును ఏడాది కాలంగా ఇవ్వకుండా పేదలకు మొండిచేయి చూపడం దారుణం. పేదవాడికి చౌకగా ప్రొటీన్లు అందించాల్సిన బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. ‘కొత్తగా రాగులు ఇస్తున్నామంటూ ఆర్భాటం చేస్తూ, ఇప్పుడు ఇస్తున్న బియ్యం కోటాలో మూడు కిలోలు తగ్గించడం అన్యాయం. అదనంగా సరుకులు ఇవ్వాల్సింది పోయి, ఉన్న కోటానే తగ్గిస్తున్నారు. ఇది ప్రజలను మోసగించడమే. గోధుమపిండి వంటి కొత్త సరుకులు సరే.. కానీ, ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పెంచడంపై దృష్టి సారించాలి. కేవలం కొత్త పథకాల పేరుతో పాత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం మానుకోవాలి. ప్రభుత్వం తక్షణమే కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలి.పాకల సన్యాసిరావు, సీపీఎం, పౌరసరఫరాల సంఘం నాయకుడు, పార్వతీపురం -
● పసివారికి సాయం
జామి: తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారి, పూరిగుడిసెలో నివసిస్తూ.. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతో కాలంగడుపు తున్న జామి మండలం జన్నవిస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల దీనస్థితిపై ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’లోశుక్రవారం ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయమూర్తి ఎ.కృష్ణ ప్రపాద్ శుక్రవారం గ్రామానికి వెళ్లి చిన్నారులు గౌతమ్, విజయ్ ఇంటిని చూసి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల విద్యాభ్యాసానికి భరోసా ఇచ్చారు. వసతి గృహల్లో విద్యాభ్యాసానికి నచ్చిన చోట తగిన ఏర్పాట్లు చేయిస్తానని భరోసా కల్పిడంతోపాటు చిన్నారులకు, వారి పెద్దమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్కట్ స్వచ్ఛంద సంస్థ వారు చిన్నారులకు బట్టలు, నిత్యావసర సరుకులను గ్రామసర్పంచ్ శీరెడ్డి చందునాయుడు, మాతృభూమి సేవాసంఘం సభ్యుడు కొట్యాడ రవి చేతుల మీదుగా వితరణగా అందించారు. కొత్తవలస ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న కృష్ణాపురం గ్రామానికి చెందిన బొజ్జ ప్రసాద్ గ్రామానికి చెందిన రామారావు చేతుల మీదుగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఐసీడీఎస్ పీఓ అచ్యుతకుమారి మిషన్ వాత్సల్య పథకం మంజూరుకు హామీ ఇచ్చారు. పలువురు దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, స్థానికులు వారికి అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు. స్పందించిన హృదయాలు చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయమూర్తి నిత్యావసర సరుకులు, నగదు వితరణ ‘సాక్షి’ కథనానికి స్పందన -
చెరకు రైతుకు ఊరట
రేగిడి: విజయనగరం జిల్లాలోనే కాకుండా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో చెరకు సాగుచేస్తున్న రైతులకు ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రభుత్వ అలసత్వం కారణంగా చెరకు రైతులు ఇప్పటికే సాగు తగ్గించేశారు. కాస్తో కూస్తో సాగుచేస్తున్న రైతులను ఆదుకునే పరిస్థితిలో కూటమిప్రభుత్వం లేదు. గతేడాది వరకూ మూడు జిల్లాల చెరకు రైతులకు ఆసరాగా మిగిలిన రేగిడి మండలంలోని సంకలి వద్ద గల ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం ఈ ఏడాది విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి చెరకును సేకరిస్తోంది. గతంలో రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించే ఈ ఫ్యాక్టరీ ఈ ఏడాది ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. మరో వైపు ప్రతి ఏటా దసరాకు చెరకు క్రషింగ్ ప్రారంభించే ఫ్యాక్టరీ ఈ ఏడాది ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించింది. తగ్గిన క్రషింగ్ లక్ష్యం గతేడాది కంటే ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యాన్ని ఈఐడీ కర్మాగారం తగ్గించింది. గతేడాది 3.50 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం కాగా, ఈ ఏడాది 2.64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే క్రషింగ్ లక్ష్యంగా చేసుకుంది. విజయనగరం, శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలోని చెరకు క్రషింగ్‌కు అనుమతిలిచ్చింది. ఈ ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లో కేవలం 9300 ఎకరాల్లో మాత్రమే చెరకు క్రషింగ్‌కు రిజిస్ట్రేషన్ నమోదైంది. ఈ మేరకు మాత్రమే సాగును అధికారులు చూపిస్తున్నారు. గతంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే ఇంతటి సాగు ఉండేది. ఈ ఏడాది సాగు తగ్గడం, క్రషింగ్ లక్ష్యం తగ్గడం చూస్తుంటే భవిష్యత్తులో ఈఐడీ ప్యారీ నడపడం కష్టంగా కనిపిస్తోంది. గతేడాది రూ.3,150 ఉన్న టన్ను చెరకు మద్దతు ధర ఈ ఏడాది రూ.3360గా చెరకు మద్దతు ధర ప్రకటించారు. పెట్టుబడులు పోను రైతుకు ఎకరా సాగులో కనిపించే ఆదాయం చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఈ మద్దతు ధరపై పెదవి విరుస్తున్నారు. బొబ్బిలి జోన్లో 75 వేల టన్నుల చెరకును, భీమసింగి ప్రాంతంలో 6వేల టన్నుల చెరకును, చోడవరంలో 20 వేల టన్నుల చెరకును క్రషింగ్‌కు తీసుకోగా, మిగిలిన చెరకును విజయనగరం జిల్లా నుంచి తీసుకుంటున్నట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. ప్రతికూల వాతావరణంగతేడాది కంటే ఈ ఏడాది చెరకు పంట దిగుబడి తగ్గింది. ప్రతికూల వాతావరణం కారణంగా పంటకునష్టం సంభవించినట్లు రైతులు వాపోతున్నారు. గతేడాది ఎకరా సాగులో 30 టన్నుల చెరకు దిగుబడి వస్తే ఈ ఏడాది సగటున 25 టన్నుల చెరకు ఒక ఎకరాపొలంలో దిగుబడి వస్తున్నట్లు వెల్లడించారు. ఎకరా సాగుకు రూ.35 వేలు పెట్టుబడి అవుతుండగా, ఈ ఏడాది రూ.40 వేల వరకూ పెట్టుబడులు పెరిగాయని ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గిందని పేర్కొంటున్నారు. సకాలంలో ఎరువులు అందకపోవడం మరో సమస్యగా రైతులు చెబుతున్నారు. ఎట్టకేలకు క్రషింగ్ ప్రారంభం సంకిలి ఈఐడీ ప్యారీ కర్మాగారంలో నెలరోజులు ఆలస్యంగా క్రషింగ్ చెరకు టన్ను ధర రూ.3,360 2.64 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం గ్రామాల్లో వడివడిగా చెరకు కటింగ్ పనులుఏప్రిల్ వరకు క్రషింగ్ ఈఐడీ ప్యారీస్ ఫ్యాక్టరీ వద్ద చెరకు క్రషింగ్ ప్రారంభించాం. తొలుత మా ఫ్యాక్టరీ సమీపంలోని రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నాం. మాకు విల్లింగ్ ఇవ్వడంతో పాటు చెరకును యాజమాన్య పద్ధతుల్లో సాగుచేసి దిగుబడి సాధిస్తున్న ఇతర ప్రాంతాల రైతులను కూడా గుర్తించాం. ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యం మేరకు మార్చి, ఏప్రిల్ నెలవరకూ గానుగ కొనసాగించే ఆలోచనలో ఉన్నాం. బి. వెంకటసూర్యనారాయణ,జనరల్ మేనేజర్, ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం, సంకిలి, విజయనగరం జిల్లా -
8,900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
● 70 లీటర్ల సారా స్వాధీనం ● ఏఓబీలో ఎకై ్సజ్‌శాఖ విస్తృత దాడులు కురుపాం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ బి.శ్రీనాఽథుడు ఆదేశాల మేరకు ఏఈఎస్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్‌శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు ఆంధ్రా–ఒడిశా ఎకై ్సజ్శాఖల సంయుక్త దాడులను సరిహద్దు గ్రామాలైన సందుబడి, తంలబాయి, రేగలపాడు గ్రామాల్లో దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం సిద్ధం చేసి 8,900 లీటర్ల పులిసిన బెల్లం ఊట ధ్వంసం చేయడంతో పాటు అక్రమంగా తరలించేందుకు ఉంచిన 70 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు.ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వీవీవీ శేఖర్ బాబు, బోర్డర్ మొబైల్ పార్టీ ఇన్స్పెక్టర్ వెంకటరాజు, రాజాం, చీపురుపల్లి, పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బందితోపాటు కురుపాం ఎకై ్సజ్ ఎస్సై శేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
–10లో● ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట ధర్నా ● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన పేదోడి పళ్లెంలో ‘ప్రొటీన్’ మాయం సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పేదవాడికి కనీస అవసరమైన ‘కందిపప్పు’ను అందించడంలో చేతులెత్తేసింది.చెరకు రైతుకు ఊరట విజయనగరం జిల్లాలోనే కాకుండా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో చెరకు సాగుచేస్తున్న రైతులకు ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట లభించింది. విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీలు కదం తొక్కారు. ఎన్నికల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై చొరవచూపకపోవడంపై మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. పోరాడతాం.. సాధించి తీరుతాం, అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని యాప్‌లు కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, అర్హతలను సడలించి మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ కార్యకర్తలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రాజకీయ వేధింపులు నిలిపివేసి రాజాం ప్రాజెక్టులో నలుగురు హెల్పర్లుకు పదోన్నతలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యూటీ అమలకు గైడ్‌లైన్స్ రూపొందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, ప్రీస్కూల్ విద్యను బలోపేతం చేయాలన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.పైడిరాజు, కార్యదర్శి అనసూయ, గౌరవాధ్యక్షరాలు వి.లక్ష్మి, జి.శారద, టి.మాలతి, ఎ. ఉషారాణి, ఎం. కృష్ణవేణి, జి.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ నిర్బంధం రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు అంగన్వాడీలు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం పోలీసులతో అడుగడుగునా ఆటంకం కలిగించింది. యూనియన్, సీఐటీయూ నాయకులను గృహ నిర్బంధం చేశారు. జిల్లా కేంద్రానికి బయల్దేరిన వర్కర్లను, నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సులు, ఆటోల్లో వస్తున్న వారిని మార్గంమధ్యంలోనే నిలుపుదల చేసి వెనక్కి పంపారు. కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిర్బంధాలను అధిగమించి అంగన్వాడీలు భారీగా నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు. ఉద్యోగభద్రత కల్పించాలి అంగన్వాడీలకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనాలు చెల్లించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలి. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. – బి.పైడిరాజు, అంగన్వాడీవర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎందుకంత వివక్ష అంగన్వాడీలపై కక్షతగదు. అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు తల్లికి వందనం పథకం అందజేయకపోవడం దారుణం. అంగన్వాడీ కేంద్రాలకు ఇటీవల సరఫరా చేసే పప్పుల్లో నాణ్యత తక్కువగా ఉంటోంది. నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి. – అనసూయ, అంగన్వాడీవర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి -
హౌసింగ్ డీఈ తీరుపై ఆందోళన
రామభద్రపురం: పీఎంఏవై పథకం కింద మంజూరయ్యే ఇంటి గ్రాంటు విషయంలో హౌసింగ్ డీఈ వివక్ష చూపుతున్నారంటూ రామభద్రపురం మండలంలోని నాయుడువలస గ్రామానికి చెందిన ఎస్సీ లబ్ధిదారులు ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. లబ్ధిదారులకు ఇంటి గ్రాంట్ మంజూరయ్యేలా చూడాలంటూ ఎంపీడీఓ రత్నంకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం 106 మంది దరఖాస్తుదారుల వివరాలను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ఆవాస్ ప్లస్ యాప్‌లో నమోదు చేశారని, అందులో టీడీపీకి చెందిన 32 మంది పేర్లు మాత్రమే హౌసింగ్ ఏఈ లాగిన్ నుంచి పంపి పరిశీలిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ ముద్రవేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. సొంతస్థలంలో ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇల్లు నిర్మించుకుందామన్న ఆశ అడియాశగానే మారుతోందని వాపోయారు. న్యాయం జరగకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు నడిమింటి సత్యంనాయుడు, కె.పార్వతి, ఎల్.సింహాచలం, ఎం.అప్పలనరసమ్మ, ఎం. వెంకటలక్ష్మి, ఇ.సింహాచలం, చింతాడ లక్ష్ము, శివ, జీనపాటి బంగారమ్మ, చింతాడ గురువులు, వెంకటరమణ, నవీన్, జీనపాటి సంజీవ్, తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల లబ్ధిదారుల జియోట్యాగింగ్‌లో వివక్ష టీడీపీ వారికి మాత్రమే గ్రాంట్ మంజూరుకు మొగ్గు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎస్సీ లబ్ధిదారుల ఆందోళన న్యాయం చేయాలంటూ ఎంపీడీఓకు వినతి -
ప్రజా వైద్యం.. ప్రజల హక్కు
విజయనగరం రూరల్: పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా మెరుగైన వైద్యం, వైద్యవిద్య అందించాలనే ధ్యేయంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయనగరంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజావైద్యం ప్రజల హక్కు అని, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలన్నారు. చంద్రబాబు సర్కారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాలలు ఉంటే 500 పడకల ఆస్పత్రి అనుసంధానంగా ఉంటుందని, చంద్రబాబు సర్కారు తీరుతో విజయనగరం ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ర్యాలీ విజయవంతం చేయాలి వైద్యకళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల ఉద్యమానికి 4 లక్షల మందికి పైబడి మద్దతు తెలిపారన్నారు. సేకరించిన సంతకాల ప్రతులతో ఈ నెల 15న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహిస్తామన్నారు. విజయనగరంలోని సీఎంఆర్ కూడలి సమీపంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ర్యాలీలో విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, మేధావివర్గాలు, విద్యావంతులు, రాజకీయ పార్టీలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నరసింహమూర్తి, రవికుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి.జైహింద్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేద విద్యార్థులకు వరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందుబాటులోకి తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యారని జెడ్పీ చైర్మన్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేసినట్టు వెల్లడించారు. గ్రామాల్లో 24 గంటలు వైద్యసేవలందించాలనే ధ్యేయంతో వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. కోవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కోవడం జగన్మోహన్రెడ్డి సమర్థవంతమైన పాలనకు నిదర్శనమన్నారు. స్క్రబ్స్టైఫస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందన్నారు. వైఎస్ జగన్ పాలనలో విద్య, వైద్యానికి పెద్దపీట విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో 4 లక్షలకు పైగా సంతకాల సేకరణ ఈ నెల 15న జిల్లా కేంద్రంలో సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
నిధుల స్వాహాపై అధికారుల విచారణ
● రూ.43.44లక్షలు స్వాహా అయినట్టు నిర్ధారణ రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన బ్యాంకు మిత్ర (సీఎస్పీ) ఆ గ్రామానికి చెందిన 39 సంఘాలకు సంబంధించి రూ.43.44 లక్షల నగదు సొంతానికి వాడుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. సెర్ప్ డీపీఎం ఎ.చిరంజీవి, బ్యాంకు లింకేజీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జె.లక్ష్మునాయుడు, సీ్త్రనిధి మేనేజర్ సుధాకర్‌తో పాటు రేగిడి యూనియన్ బ్యాంకు అధికారులు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. సభ్యుల వద్ద నగదుకు సంబంధించి వివరాలు సేకరించారు. సంఘాల నిధుల స్వాహాకు పాల్పడిన సీఎస్పీ అల్లు శ్రీధర్‌పై చర్యలకు సిఫార్స్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడుతూ సీ్త్ర నిధికి సంబంధించి రూ.2 లక్షలు, పొదుపు, బ్యాంకు లింకేజీలకు సంబంధించి రూ.41లక్షలకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని చెప్పారు. మహిళా సంఘాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం బాసిన గోవిందరావు, సిబ్బంది పాల్గొన్నారు. గాయపడిన మహిళకు ఎస్పీ సపర్యలు విజయనగరం క్రైమ్: గుర్ల మండల కేంద్రానికి సమీపంలో ప్రమాదానికి గురై గాయపడిన మహిళకు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సపర్యలు చేశారు. దగ్గరుండి ఆటోలో ఎక్కించి నెల్లిమర్ల మిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గరివిడిలో జరిగిన అభ్యుదయం సైకిల్‌యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా గుర్ల మండలం దుగ్గివలసకు చెందిన దంపతులు బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వెనుక కూర్చున్న మహిళ తీవ్రంగా గాయపడింది. అటుగా కారులో వస్తున్న ఎస్పీ దామోదర్ గుర్తించి వెంటనే వాహనాన్ని ఆపి గాయపడిన మహిళకు సపర్యలు చేశారు. తాగునీటిని అందించారు. భర్తకు ధైర్యం చెప్పి ఆస్పత్రికి తరలించారు. 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం విజయనగరం అర్బన్: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ నెల 24న నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18 నుంచి వారోత్సవాలను నిర్వహించాలని సూచించారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సంబంధిత అధికారులు, వినియోగదారుల సంఘాల సభ్యులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్ధ సత్వర పరిష్కారం’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వినియోగదారుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల, ఇంటర్ స్థాయివారికి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో వరుస ముగ్గురు విజేతలకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. జాతీయ విననియోగదారుల దినోత్సవాన్ని ఒక పాఠశాల లేదా కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం వారోత్సవాల ప్రచారపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి జి.మురళీనాథ్, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి.మన్మోహన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి.వెంకటరమణ, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు చదలవాడ ప్రసాద్, పీఎస్బీ నాయుడు, ఎం.ఎస్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
రైతు కష్టం మిల్లర్ల పాలు..!
విజయనగరం ఫోర్ట్: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన వరి పంటను కొందరు మిల్లర్లు దోచుకుంటున్నారు. తరుగు పేరుతో బస్తాకు 4 నుంచి 6 కేజీల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రైతు కష్టాన్ని సొమ్ముచేసుకుంటున్నారు. మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యంలో కోత వేయడం వల్ల ఎకరానికి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు రైతులు నష్ట పోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తేమ శాతం ఎక్కువగా ఉందంటూ బుకాయిస్తున్నారు. ధాన్యం దింపేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. చేసేదిలేక రైతులు మిన్నకుంటున్నారు. ట్రక్ షీట్లో 40 కేజీలుగా కొనుగోలు కేంద్రం సిబ్బంది నమోదు చేస్తుండగా, మిల్లు వద్ద 41 కేజీలు చొప్పన ధాన్యం లెక్కిస్తున్నారు. ప్రశ్నించేవారికి గోనె సంచు బరువు అని మిల్లర్లు చెబుతున్నారు. గోనె సంచి బరువు 50 గ్రాములకు మించి ఉండదు. 80 కేజీల బస్తాకు గోనెపేరు 2 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. తేమశాతం పేరుతో మరో 2 నుంచి 4 కేజీల వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై జిల్లా వ్యవసాయాధికారి వి.తారకరామా రావు స్పందిస్తూ ధాన్యం అదనంగా తీసుకున్న మిల్లులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంట్యాడ మండలంలోని ఓ రైస్ మిల్లు వద్ద ధాన్యం బస్తాలతో బారులు తీరిన వాహనాలు -
రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు
● అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేయాల్సిందే.. ● సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ రామభద్రపురం: మిల్లులకు ధాన్యం తెచ్చిన రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ మిల్లర్లను హెచ్చరించారు. సంపత్ స్వర్ణ, ఎంటీయూ–1064 రకాల ధాన్యం మరపట్టించే సమయంలో ముక్క అవుతుడండతో కొనుగోలు చేయలేమని, క్వింటాకు 10 కిలోలు అదనంగా ఇవ్వాలని మిల్లర్లు రైతులకు తెగేసి చెబుతున్నారు. ఆయా రకాలను మిల్లుల వద్ద దింపేందుకు ఇష్టపడడం లేదు. ధాన్యం లోడు చేసిన ట్రాక్టర్లు రోజుల తరబడి మిల్లుల వద్దనే ఉండాల్సిన దుస్థితి. ఇదే అంశంపై ఈ నెల 11వ తేదీన ‘ఎక్కడి ధాన్యం అక్కడే..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. తహసీల్దార్ అజు రఫీజాన్, సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ మండలంలోని ధాన్యం మిల్లులను పరిశీలించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలుచేయాలని సూచించారు. మరీ నాణ్యతలేని సరుకువస్తే మా దృష్టిలో పెట్టాలని, తాము రైతులతో మాట్లాడుతామని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్వోలు అనిల్, మహేషకుమార్ పాల్గొన్నారు. కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక ఏకగ్రీవం బొండపల్లి: మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్‌గా వైఎస్సార్సీపీ మదతుదారు షేక్ జైనబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో కో ఆప్షన్ మెంబర్‌గా పని చేసిన బొండపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ అబ్దుల్ రజాక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ స్థానానికి గురువారం ఎన్నిక నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి ఏవీ సాల్మన్‌రాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. పోటీకి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో జైనబీ ఎన్నిక ఏకగ్రీవమైంది. కార్యక్రమంలో ఎంపీపీ చల్లా చలంనాయుడు, వైస్ ఎంపీపీ గొండేల ఈశ్వరరావు, ఎంపీడీఓ జి.గిరిబాల, ఈఓపీఆర్డీ రఘుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం మెరకముడిదాం: మండల కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. మెరకముడిదాం గ్రామానికి చెందిన షేక్ సుభాన్ వైఎస్సార్సీపీ తరఫున గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికల అధికారి డీవీ మల్లికార్జునరావు సుభాన్ ఎన్నికై నట్లు ప్రకటించి ధ్రువీకరణపత్రం అందజేశారు. అనంతరం మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులతో ఎంపీపీ తాడ్డి కృష్ణవేణి అధ్యక్షతన ఎంపీడీఓ గొర్లె భాస్కరరావు సమావేశం నిర్వహించారు. -
● యూరియా కష్టాలు యథాతథం
విజయనగరం జిల్లా చిత్తరాపురం సచివాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు విజయనగరం జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. ఖరీఫ్‌లో యూరియా దొరకక నానా అగచాట్లు ఎదుర్కొన్నారు. రబీలోనూ అదే పరిస్థితి నెలకొంది. సంతకవిటి మండలం చిత్తారపురం సచివాలయం వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూకట్టారు. వాస్తవంగా అక్టోబర్ 10వ తేదీన యూరియా పంపిణీ చేయాల్సి ఉంది. చిత్తారపురం రెవెన్యూ పరిధిలో తమ భూములు ఉన్నాయని, తమకు కూడా యూరియా అందజేయాలంటూ గెడ్డబూరాడపేట, పనసపేట రైతులు డిమాండ్ చేశారు. వచ్చిన యూరియా తక్కువగా ఉండడం, డిమాండ్ అధికంగా ఉండడంతో పంపిణీని నిలిపివేశారు. ఆ రెండు గ్రామాల రైతులకు మరో లోడ్ వచ్చాక పంపిణీ చేస్తామని సీఐ, ఏఓ సీహెచ్ యశ్వంతరావు నచ్చజెప్పడంతో గురువారం పోలీసుల సమక్షంలో రైతుకు బస్తాచొప్పున యూరియా పంపిణీ చేశారు. – సంతకవిటి -
పరువు పాయె..!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకు చెందిన రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. పని తీరులో కంటే వివాదాల్లోనే టాప్‌లో ఉంటారన్న విషయం మరోసారి రుజువైంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే మంత్రి పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఫైళ్లను వేగంగా క్లియర్ చేసిన మంత్రుల్లో సంధ్యారాణి 19వ స్థానంలో నిలవడం గమనార్హం. రెండు కీలక శాఖలను చూస్తున్న ఆమె.. 5–7–2024 నుంచి 9–12–2025 వరకు (17 నెలల్లో) తన పరిధిలో పరిష్కరించిన ఫైళ్లు 545. ఒక్కో దరఖాస్తు పరిష్కారానికి సగటున 8 రోజుల 8 గంటల 20 నిమిషాల చొప్పున తీసుకున్నారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న గిరిజన సంక్షేమ శాఖలో ఒక్కో దస్త్రం పరిష్కారానికి 12 రోజులు చొప్పున తీసుకోవడం విశేషం. ‘గిరిజనులంటేనే వెనుకబడిన వారు. వారిని మీరు మరింత వెనుకబాటులోకి నెట్టేస్తున్నార’ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం మన మంత్రి పనితీరుకు అద్దం పడుతోంది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. జిల్లా అభివృద్ధిలోనూ, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శాఖల సంక్షేమంలోనూ చూపే శ్రద్ధ కంటే... వివాదాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రత్యర్థులను విమర్శించడం, దూషించడానికే ఆమె ప్రాధాన్యమిస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీని దూషించడానికే సంధ్యారాణికి మంత్రి పదవి ఉందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. దీనికితోడు.. ఆమె అనధికార పీఏ, కుమారుడి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి.. సొంత నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగినికే న్యాయం చేయలేకపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారని వినిపించింది. ఆమె అనధికార పీఏ ఆగడాలపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మక్కువ మండలం డి.శిర్లాం ఆశ వర్కరు మృతి వెనుక కూడా టీడీపీ నాయకుల వేధింపులు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాము మంత్రి కాళ్ల మీద పడి ప్రాథేయపడినా కనికరం చూపలేదని వారు వాపోయారు. మరోవైపు మంత్రి కారు డ్రైవర్ సామాజిక మాధ్యమాల వేదికగా తనను వేధిస్తున్నాడని మాజీ మంత్రి రాజన్నదొర వ్యక్తిగత సహాయకుడు ఇటీవల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇలా వరుస వివాదాల వల్ల ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలోనూ ఆమెకు ఆహ్వానం అందలేదని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. కేవలం కక్షసాధింపు రాజకీయాలు, చిరుద్యోగుల తొలగింపులకే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలున్నాయి. వివాదాల్లోనే మంత్రి టాప్.. పౌరసేవల్లో మనం ఎక్కడో..! ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబాటు సమస్యల పరిష్కారంలో అలసత్వం! రాష్ట్రంలోని మంత్రుల్లో సంధ్యారాణిది 19వ స్థానం వివాదాల్లోనే టాప్‌లో ఉంటారన్న విమర్శలు పౌరసేవల్లోనూ కానరాని చొరవ జిల్లాలో ఇంటబయటా విమర్శలు మరోవైపు పుర, నగరపాలక సంస్థల్లో ప్రజలకు అందిస్తున్న పౌరసేవల్లోనూ పార్వతీపురం మన్యం జిల్లా బాగా వెనుకంజలో ఉంది. పురపాలిక, నగర పంచాయతీల్లో ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణ, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, రహదారుల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, స్వయం సహాయ సంఘాలకు ఆర్థిక సాయం, ఆస్తి పన్నుల వసూళ్లు తదితర ఎనిమిది అంశాలను మదింపు చేసి ర్యాంకులు కేటాయించారు. మొదటి పది స్థానాల్లో జిల్లా చోటు దక్కించుకోలేకపోయింది. అసలే వెనుకబడిన జిల్లా.. ఆపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయలోపం వల్ల పార్వతీపురం మన్యం ఏ విధంగానూ ముందడుగు వేయలేకపోతోందని గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు. -
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్..!
● జిల్లాలో 10 కేసుల నమోదు ● ఆందోళన చెందుతున్న జనం ● సకాలంలో చికిత్స తీసుకోవాలంటున్న వైద్యులు విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలను స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంతో జనం భయాందోళన చెందుతున్నారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. చీపురుపల్లి, బొండపల్లి, గరివిడి తదితర మండలాల్లో కేసులు బయటపడ్డాయి. వ్యాధి నివారణకు సకాలంలో వైద్యసేవలు పొందడంలో అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉండడంతో భయపడుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుగులు కరిచినప్పుడు వ్యాధి వ్యాప్తి : మైట్స్ అనే చిన్న పురుగులు కరిచినప్పడు స్క్రబ్ టైఫస్ జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కళ్లు ఎర్రబడినట్టు కనిపించడం, దగ్గు, శ్వాసలో స్వల్ప ఇబ్బంది, పొట్టలో అసౌకర్యం వ్యాధి లక్షణాలు. పురుగు కరచినచోట చిన్న నల్లమచ్చ లేదా గాయం లాంటి బొట్టు కనిపిస్తుంది. ఇది దుస్తులు కింద ఉండే భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి ఉండదు. శరీరంలో ఎర్రబడిన దద్దర్లు వల్ల ఆహారం తినాలనిపించకపోవడం లాంటివి ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.... జ్వరం తగ్గక పోవడం, శ్వాసలో ఇబ్బంది, మతిమరుపు, గందర గోళం, మూత్రం తగ్గడం లాంటివి సంభవిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. సకాలంలో చికిత్స అవసరం.. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. వ్యాధి పట్ల అలసత్వం వహించరాదు. -
రుక్మిణి సిల్క్స్లో.. వస్త్రాల నిధి
● వస్త్రాలయం ప్రారంభోత్సవంలో సందడి చేసిన నిధి అగర్వాల్ ● సినీనటిని చూసేందుకు తరలివచ్చిన జనం నిధి అగర్వాల్ విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో సినీతార నిధి అగర్వాల్ గురువారం సందడి చేశారు. సినీ పాటలకు స్టెప్పులు వేసి యువతను అలరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఎస్వీఎన్ లేక్ ప్యాలస్ ఎదురుగా గురువారం చేపట్టిన రుక్మిణి సిల్క్స్ వస్త్రాలయం ప్రారంభోత్సవంలో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి వస్త్రాలయాన్ని ప్రారంభించారు. సినీతార నిధి అగర్వాల్ నాలుగు అంతస్తుల వస్త్రాలయాన్ని సందర్శించారు. వివిధ రకాల చీరలు ధరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు విక్రయించే రుక్మిణి సిల్క్స్ వస్త్రాలయాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాలని కోరారు. రానున్న సంక్రాంతి వరకు కేవలం రూ. 34కే చీరలు, రూ.150కే పురుషుల షర్ట్స్‌తో పాటు చిన్నపిల్లల దుస్తుల విక్రయాలపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే నెల్లూరు, ఖమ్మం జిల్లాల్లో విశేష ఆదరణ పొందుతున్న రుక్మిణీ సిల్క్స్ వస్త్రాలయం తాజాగా ప్రత్యేక ఆఫర్లు, సరమైన ధరల్లో విజయనగరంలో వస్త్రాల విక్రయాన్ని ప్రారంభించడం సంతోషయదాయకమన్నారు. వస్త్రాలయం అధినేతలు జి.వి.మురళి, జి.శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్రవ్యాపార రంగంలో 30 ఏళ్ల అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మూడవ బ్రాంచ్‌ను ప్రారంభించామని, అతి తక్కువ ధరలకే ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. వినియోగదారుల ఆదరణే తమ లక్ష్యమని, భవిష్యత్‌లో మరిన్ని జిల్లాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి సంక్రాంతి పండగ వేడుకకు అవసరమైన వస్త్రాలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. అభిమానులకు అభివాదం చేస్తున్న సినీ తార నిధి అగర్వాల్ -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
సీతంపేట: మండల కేంద్రం సీతంపేటకు చెందిన యువకుడు శేషపు చంద్రశేఖర్ (23) గడిగుడ్డి సమీపంలో జరిగిన బైక్ అదుపుతప్పి గురువారం వేకువ జామున మృతిచెందాడు. బుధవారం రాత్రి ఐటీడీఏ నుంచి సీతంపేటలో తాను నివాసముంటున్న ఎస్టీ కాలనీకి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో గడిగుడ్డి సమీపానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జెమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లారు జామున మృతిచెందినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతుడికి తండ్రి గోవిందరావు, సోదరుడు వంశీ ఉన్నారు. యువకుడి మృతివార్త విన్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అందరితోనూ సరదాగా ఉంటూ, మంచికి మారుపేరైన చంద్రశేఖర్ అకస్మాత్తుగా మృతిచెందడంతో స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
25వ బ్యాచ్ ఆర్టీసీ డ్రైవర్స్ శిక్షణ ప్రారంభం
విజయనగరం అర్బన్: ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణ క్వాలిటీతో కూడినదని అభ్యర్థులు క్రమశిక్షణతో నేర్చుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి.వరలక్ష్మి అన్నారు. స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ ట్రైనింగ్ కళాశాలలో 25వ బ్యాచ్ శిక్షణ తరగతులను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ ట్రైనింగ్ కళాశాల రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ అని శిక్షణ పొందిన వందలాది మంది అభ్యర్ధులు వివిధ డిపోల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత 25వ బ్యాచ్ అభ్యర్థులు కూడా క్రమశిక్షణ, మెలకువలు, సాఽంకేతిక నైపుణ్యాలు సమపాళ్లలో నేర్చుకుని ఉత్తమ డ్రైవర్లుగా పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ బ్యాచ్‌లో చేరిన మహిళా అభ్యర్థిని ఎన్.గీతను అభినందించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, శిక్షకులు డీఎన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ పంపిణీలో ‘విద్యుత్ షాక్’..!
బలిజిపేట: మండలంలోని పలగర పంచాయతీ గుడివాడ కాలనీలో లింగాల అసరయ్యకు ఈనెల పింఛన్ పంపిణీ చేస్తూ విద్యుత్ బిల్లు షాక్ ఇచ్చారు ఆ శాఖ అధికారులు. విద్యుత్ బిల్లులో వెయ్యి రూపాయలను విద్యుత్‌శాఖ సిబ్బంది కట్‌చేసినట్లు బాధితుడు వాపోయాడు. గుడివాడకాలనీకి చెందిన దళితుడు ఎల్.అసిరయ్యకు గతనెల విద్యుత్ రీడింగ్ తీయగా రూ.5వేలకు పైగా బిల్లు రావడంతో డిసెంబరు నెలలో అసిరయ్యకు పింఛన్ ఇచ్చే సమయంలో విద్యుత్‌శాఖ సిబ్బంది విద్యుత్ బిల్లులో పాక్షికంగా వెయ్యి రూపాయలు కట్ చేసి తీసుకున్నారు. పింఛన్లో ఈ విధంగా విద్యుత్ బిల్లు బకాయి విరుపుకోవడంపై బాధితుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని సీఐటీయూ నాయకుడు మన్మథరావు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఆధారం లేక వచ్చిన పింఛన్‌పై బతుకుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన దళితుల వద్ద ఈ విధంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులను ఎస్సై అశోక్ గురువారం అరెస్టు చేశారు. చెల్లూరు సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను తనిఖీ చేసి విచారణ చేసి అక్రమంగా 5 కేజీల గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై అశోక్ చెప్పారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
రామభద్రపురం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి రోజూ తాగుతుం డడంతో భార్య మందలించిందని మనస్తాపం చెంది పురగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం గజరాయినివలస గ్రామానికి చెందిన నల్ల ఈశ్వరరావు (32) మద్యానికి బాగా బానిసై రోజూ తాగుతాడుతున్నాడు.అలాగే గురువారం కూడా తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇలా రోజూ తాగితే ఎలా?మన భవిష్యత్‌తో పాటు పిల్లల భవిష్యత్ ఏమవుతుంది? అని భార్య వెంకటలక్ష్మి ప్రశ్నిస్తూ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఈశ్వరరావు మండలంలోని ఆరికతోట గ్రామం సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం పసివాళ్లు..!
జామి: జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన పైలపల్లి పైడిరాజు, దేవి దంపతులకు ఇద్దరు కుమారులు విజయ్(12), గౌతమ్(10). విజయ్ జామి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో 7వ తరగతి, గౌతమ్ జన్నివలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. తండ్రి పైడిరాజు వారి చిన్నతంలోనే మృతిచెందాడు. అప్పటి నుంచి తల్లి దేవి కూలిపనులు చేస్తూ ఇద్దరు కుమారులను సాకుతూ వచ్చింది. విధి ఆ కుటుంబపై పగబట్టింది. ఏడు నెలల కిందట దేవి గుండెపోటుతో మృతిచెందింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, రాత్రి పస్తులుంటూ.. పాఠశాలలో పెట్టిన ఒక్కపూట మధ్యాహ్నభోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. పాఠశాలకు సెలవు అయితే ఆ రోజు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. వారి పెద్దమ్మ కొండమ్మ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా.. చిన్నారుల దుస్థితి చూసి అప్పుడప్పుడు కాస్త ఆకలి తీర్చుతోంది. ఇద్దరు చిన్నారులు ఊరిలో ఉన్న పూరిగుడిసెలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చదువుకుంటే ప్రయోజకులవుతారన్న తల్లి మాటను గుర్తుచేసుకుంటూ ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో ప్రభుత్వం ఇస్తున్న తల్లికి వందనం పథకం కూడా వీరికి వర్తించలేదు. తల్లి బయోమెట్రిక్ ఉండాలన్న నిబంధన వీరికి శాపంగా మారింది. దుస్తులు కొందామంటే డబ్బులు లేవు... మాకు ఎవరూ లేరు. సంక్రాంతికి బట్టలు కొనుక్కుందామన్నా, అమ్మకి, నాన్నకి సంక్రాంతికి దుస్తులు కొని చూపుదామన్నా డబ్బులు లేవు. వర్షం కురిస్తే పూరిగుడిసె మొత్తం కారిపోతోంది. పుస్తకాలు తడిసిపోతున్నాయి. రాత్రిపూట నిద్రపోవాలంటేనే భయం వేస్తోంది. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే ఆకలి తీర్చుకుంటున్నాం. ఉదయం, రాత్రి భోజనం ఉండదు. చక్కగా చదువుకోవాలని అమ్మ చెప్పింది. అందుకే.. ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నాం. ఉన్నతాధికారులు, దాతలు స్పందించి తమను ఆదుకోవాలంటూ చిన్నారులు రెండు చేతులూ జోడించి ప్రార్థిస్తున్నారు. ఆదుకునే హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒక్కపూట భోజనం.. పూరిగుడిసే ఆవాసం తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు ఒకరికి ఒకరు తోడుగా పూరిగుడిసెలో నివాసం పాఠశాలలో పెట్టిన మధ్యాహ్నభోజనంతోనే జీవనం తిండిలేక పస్తులతో అల్లాడుతున్న చిన్నారులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపుసహాయం చేయాల్సిన వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 76740 96919 -
రెండు బైక్‌ల కాల్చివేత
విజయనగరం క్రైమ్: విజయనగరం టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదరవీధిలో బుధవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు బైక్‌లను గుర్తు తెలియని వ్యక్తి అగ్గిపెట్టెతో కాల్చివేశాడు. మేదరవీధికి చెందిన పూజారి పోలిపల్లి వీరబాబు బంధువు ఇంటి ముందు పల్సర్‌తో పాటు ఫ్యాషన్ బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తి గంజాయి మత్తులో కాల్చివేశాడు. ఈ మేరకు వీరబాబు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా సీఐ శ్రీనివాస్ క్రైమ్‌పార్టీ బృందం వాసు, షఫీజ్ లను ఘటనా స్థలానికి పంపించి ఆధారాలు సేకరించారు. గంజాయి మత్తులోనే గుర్తు తెలియని వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామని సీఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని ,త్వరలో ఆ వ్యక్తిని పట్టుకుంటామన్నారు. -
వృద్ధురాలికి అరుదైనశస్త్రచికిత్స
● విజయవంతంగా నిర్వహించిన సర్వజన ఆస్పత్రి వైద్యురాలు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృద్ధురాలికి ఎముకలవైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీకాంతం అనే 74 ఏళ్ల వృద్ధురాలికి 15 ఏళ్ల క్రితం ఎడమ కాలు విరిగితే విశాఖపట్నం కేజీహెచ్‌లో ఆపరేషన్ చేసి కృత్రిమ తుంటి ఎముక వేశారు. అయితే కొద్ది రోజుల క్రితం బూత్రూమ్లో ఆమె కాలు జరి పడిపోవడంతో మళ్లీ తుంటి ఎముక విరిగిపోయింది. పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తిరిగినప్పటికీ ఎవరూ చేయలేమని చెప్పడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృద్ధురాలు చేరింది. ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్బి 5 గ్రాములు ఉండడంతో 5 యూనిట్లు రక్తం ఎక్కించారు. క్లిష్టతరమైన శస్త్రచికిత్సను ఆర్ధో విభాగం హెచ్ఓడీ డాక్టర్ లోక్‌నాఽథ్, తోటి ఎముకల వైద్యురాలు, మత్తు వైద్యుల సహాయంతో ఆపరేషన్ విజయవంతం గా నిర్వహించారు. పాత కృతిమ తుంటి ఎముక తీసివేసి కొత్తది వేశారు. -
’కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 10 లక్షల చెక్కు అందజేత
పార్వతీపురం రూరల్: విధి చిన్న చపు చూసినా పోలీసు శాఖ మాత్రం ఆ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచింది. బ్రెయిన్ కేన్సర్‌తో పోరాడి ఇటీవల మృతిచెందిన సీతంపేట కానిస్టేబుల్ పాడి బాబూరావు కుటుంబానికి ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ అండగా నిలిచింది. ప్యాకేజీ నిబంధనల ప్రకారం మంజూరైన రూ.10 లక్షల బీమా చెక్కును ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మృతుని సతీమణి మాధురికి గురువారం అందజేసి ధైర్యం కల్పించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి, సాధారణ మరణానికి రూ.10లక్షల సాయం అందుతుందని, ఈ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని ఎస్పీ సూచించారు. బాధితులకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ థామస్ రెడ్డి, పాలకొండ ఎస్బీఐ మేనేజర్ హిమాన్షు తదితరులు పాల్గొన్నారు. -
ఐదు తులాల బంగారం అపహరణ
వేపాడ: మండలంలోని రామస్వామిపేట గ్రామంలో దొంగలు బంగారం అపహరించిన సంఘటనపై వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బెహరా ఈశ్వర్రావు, చిలకమ్మ దంపతులు గురువారం ఉదయం బయటకువెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి దొంగలు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా సీక్రెట్ లాకర్ పగలగొట్టి ఐదు తులాలు బంగారం అపరించుకుని పోయినట్లు గుర్తించారు. దీంతో ఈశ్వర్రావు కుమారుడు శంకరరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గత నెలలో వల్లంపూడిలో ఇదే తరహాలో పట్టపగలే దొంగతనం జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కోరుతున్నారు. -
విహారంలో విషాదం
● వంతెనను కారు ఢీకొని విద్యార్థి మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలుహుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): విహారయాత్రకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్‌ను గురువారం వేకువజామున సందర్శించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అరకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు మండలంలోని జాతీయరహదారిలో రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇంజనీరింగ్ విద్యార్థి గుడివాడ రుద్రసాయి(19) సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు నారికంట్ల శ్రీయన్ నిహర్(19), శ్రీవాత్సవ(19)కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవల అనంతరం హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మృతుడు రుద్రసాయి విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందినవాడు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని పోస్ట్‌మార్టం గదిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తండ్రి రామ్మూర్తినాయుడు, కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పొగమంచు అధికంగా ఉండడంతో రోడ్డు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
ట్రావెల్ బస్సులో రూ.69 లక్షల చోరీ
పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.69 లక్షలు పోయినట్లు శ్రీకాకుళంలోని గుజరాతి పేటకు చెందిన జామి చంద్రశేఖరరావు ,వి.వినోద్ బాబు తెలియజేశారు. బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం శ్రీకాకుళం నుంచి విజయవాడకు రెండు బ్యాగుల్లో రూ.కోటి 29లక్షలతో బస్సు ఎక్కారు. మార్గమధ్యంలో పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం సమీపంలో గల హోటల్ వద్ద భోజన విరామం కోసం బస్సును నిలుపుదలచేశారు. బాధితుల్లో ఒకరు బస్సులో భోజనం చేయగా, మరొకరు హోటల్‌కు వెళ్లారు. ఇంతలో గుర్తు తెలియని దుండగులు ఒకబ్యాగు పట్టుకుని పరుగులు పెట్టినట్లు బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు వెంటనే పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై దుర్గాప్రసాద్ రంగప్రవేశం చేసి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
ఆటో బోల్తా: ఎనిమిదిమందికి గాయాలు
కురుపాం: జిల్లాలోని సీతంపేట మండలం చింతమానుగూడ గ్రామానికి చెందిన పదిమంది కురుపాం మండలం సూర్యనగరం గ్రామానికి బంధువుల ఇంటికి ఆటోలో వస్తుండగా రస్తాకుంటుబాయి గ్రామసమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 8 మందికి గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు, వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.● ఓ విద్యార్థికి గాయాలు రాజాం సిటీ: మండల పరిధి కొత్తపేట జంక్షన్ నుంచి అరసబలగ వెళ్లే దారిలో గురువారం ఆటోను స్కూల్ బస్సు ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెర్లాం మండలంలోని మాదంభట్లవలస, అరసబలగ గ్రామాల నుంచి స్కూల్ విద్యార్థులు ఆటోలో రాజాం వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థి చింతా దుర్గాప్రసాద్ కుడిచేతికి తీవ్రగాయమైంది. వెంటనే రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం రిఫర్ చేశారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై పి.జనార్దనరావు తెలిపారు. -
13 తులాల బంగారం చోరీ
రేగిడి: మండల పరిధిలోని బాలకవివలస గ్రామంలో బంగారం చోరీ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు అందించిన సమా చారం మేరకు గ్రామానికి చెందిన కిల్లారి రమణ, భార్య కమల పొలం పనులకోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. పొలం పనులు ముగించుకుని తిరిగి వచ్చి చూసేసరికి ఎప్పటిలాగానే ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉంది. బీరువాలో ఉన్న 13 తులాల బంగారం చోరీకి గురైందని బాధితులు ఫిర్యాదు చేశారు. గడిచిన వారం రోజుల క్రితం ఇంటికి సంబంధించిన ఒక తాళం పోయిందని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర బుధవారం గ్రామానికి వెళ్లి ఇంటిని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నిర్లక్ష్య పాలనలో రైతాంగం అష్టకష్టాలు
● ప్రభుత్వంపై సీపీఐ తీవ్ర ఆగ్రహం విజయనగరం గంటస్తంభం: రాష్ట్రప్రభుత్వం రైతాంగ సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం బరిగిన నిరసనలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా నాయకులు బుగత అశోక్, రంగరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.అనంతరం ఇన్చార్జ్ డీఆర్ఓ నూకరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు మాట్లాడుతూ, ఖరీఫ్‌లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, కోట్లలో గోనెసంచులు సిద్ధం చేస్తామని ప్రభుత్వం చెప్పినా, చేతల్లో మాత్రం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రైతులకు గోనెసంచుల కొరత తీవ్రంగా ఉందన్నారు. తేమశాతం రంగు, రప్పలు ఉన్నాయంటూ కొనుగోలు కేంద్రాల్లో అనవసర ఇబ్బందులు పెడుతున్నారని, పంటను ఆరబెట్టుకునే స్థలాలు కూడా ఇవ్వకపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారిందన్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క దళారులకు ధాన్యం వెళ్లేలా చూస్తున్నారని, దీంతో 75 కేజీల బస్తాపై రూ.400 రూ.500 నష్టం రైతులపై పడుతోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఎఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డేగల అప్పలరాజు మాట్లాడుతూ, మొక్కజొన్న, పత్తి, అరటి రైతుల పరిస్థితి దయనీయమని, మద్దతు ధరలు ప్రకటించినా మార్కెట్లో రైతులకు తక్కువ ధరలే లభిస్తున్నాయన్నారు. -
మరువాడలో చిన్నారికి స్క్రబ్‌టైఫస్ పాజిటివ్
బొండపల్లి: మండలంలోని మరువాడ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ పాజిటివ్ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నీలం కాన్వి ప్రియ(3)కు మూడు రోజుల క్రితం జర్వం రావడంతో చిన్నారి తండ్రి నాగరాజు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లగా వైద్యులు పరీక్ష చేసి స్క్రబ్ టైఫస్పాజిటివ్గా నిర్ధారించారు. వైద్యం కోసం చేరాలని అక్కడి వైద్యులు సూచించగా తమకు డబ్బు పెట్టే స్థోమత లేదని చెప్పి గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం ఉదయం చేర్పించారు. ఆస్పత్రి వైద్యుడు ప్రవీణ్ వైద్య పరీక్షలు చేసి మరోసారి పరిక్షలు (ఎలిషా) చేయాలని సూచించడంతో జిల్లా కేంద్రంలోని మహారాజా ఆస్పత్రికి రక్త నమూనాలు తీసుకువెళ్లి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చిన్నారి ఒంటిపై స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఏవీ లేనప్పటికీ పాజిటివ్ రావడంతో ఏరియా ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రసుత్తం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో క్లోరినేషన్ చేయడంతో పాటు బ్లీచింగ్‌ను చల్లి, గ్రామస్తులను అప్రమత్తం చేసే పనిలో అధికారులు, వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు. -
జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఐదుగురు ఎంపిక
తెర్లాం: జాతీయస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. 2026 జనవరిలో నాగపూర్‌లో జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా మోదుకూరులో జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు విశేష ప్రతిభ కనబరిచాయి. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర జట్టు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని, బాలికల జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా జట్లలోని పలువురి సభ్యులను జాతీయస్థాయి పోటీలకు నిర్వాహకులు ఎంపిక చేశారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నచ వారిలో పి.జనార్దనసాయి(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం–సాలూరు), ఎస్.చరణ్(జెడ్పీ హైస్కూల్–ఉల్లిభద్ర), టి.మోహన్సాయి(జెడ్పీ హైస్కూల్–పారాది), బాలికల జట్టుకు యు.లోకేశ్వరి(జెడ్పీ హైస్కూల్–తూడెం), ఎం.ప్రసన్న(జెడ్పీ హైస్కూల్–బాడంగి)లు ఉన్నారు. వారంతా వచ్చే ఏడాది జనవరిలో నాగపూర్‌లో జరగనున్న జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు, జిల్లా జట్ల మేనేజర్ సీహెచ్.సత్యనారాయణ, కోచ్‌లు శివ, మహేష్‌లు అభినందించారు. -
అంతర్జాతీయ స్థాయిలో బాగెంపేట యువకుడి సత్తా
● శ్రీలంకలో జరిగిన ఫైనల్స్‌లో పారాత్రోబాల్ జట్టులో కీలక ప్రదర్శనవంగర: మండల పరిధి బాగెంపేట గ్రామానికి చెందిన బేపల పవన్‌కుమార్ పారాత్రోబాల్ విభాగంలో సత్తాచాటాడు. రాష్ట్రస్ఙాయి, జాతీయస్థాయి జట్టులో స్థానం సంపాదించి ప్రతిభకనబరచడంతో ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 4వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు శ్రీలంక దేశంలోని రత్నపూర్ నగరంలో జరిగిన సౌత్ ఏషియన్ పారాత్రోబాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీలో పాల్గొన్నాడు. బంగ్లాదేశ్, నేపాల్, భూఠాన్ దేశాలతో తలపడి అక్కడే జరిగిన ఫైనల్స్‌లో భారత జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. 21 ఏళ్ల యువ క్రీడాకారుడు తనదైన అద్భుత ప్రదర్శన చూపడంతో అక్కడి నిర్వాహకులు ప్రత్యేక మెమెంటో అందించారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న తరువాత ఈ క్రీడపై ప్రత్యేక శ్రద్ధ వహించాడు. కొంతకాలంగా తమిళనాడులో పారాత్రోబాల్ విభాగంలో శిక్షణ పొంది ఇండియా జట్టు తరఫున శ్రీలంక వెళ్లి జట్టులో రాణించాడు. తల్లిదండ్రులు ఝంగం, మంగమ్మలు, గ్రామ పెద్దలు ఈ సందర్భంగా యువకుడిని అభినందించారు. -
వ్యవసాయంలో యాంత్రీకరణ
● కూలీల కొరతను అధిగమించేందుకు రైతుల మొగ్గువిజయనగరం ఫోర్ట్: వ్యవసాయం పూర్తిగా వ్యయసాయంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు సాగు ఖర్చు తగ్గించుకునే విధంగా అలోచిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీల కొరతతో పాటు కూలీల ధరలు పెరగడంతో రైతులు యాంత్రీకరణవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వరి పంటలో యాంత్రీకరణను వినియోగించుకుంటున్నారు. వరి పంటలో కోత సమయంలో సాగు ఖర్చు పెరిగింది. యంత్రాల ద్వారా వరి కోతలు చేపట్టడం వల్ల రైతులకు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. జిల్లాలో ముమ్మురంగా వరి కోతలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వరి కోత యంత్రాల ద్వారా వరి పంటను కోస్తున్నారు. జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇప్పటి వరకు 60 శాతం వరకు కోతలు అయ్యాయి. పెరిగిన కూలీ ధరలు వరి పంటను కోసే కూలీల ధరలు పెరిగాయి. కూలీల ద్వారా కోయడానికి ఎకరాకి రూ. 4 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. మళ్లీ ఆపంటను పొలం నుంచి కళ్లానికి తీసుకురావడానికి మరో రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. పంటను నూర్పు చేయడానికి ట్రాక్టర్, కూలీలకు మరో రూ.5 వేలు వరకు ఖర్చవుతుంది. మొత్తంగా వరిపంటను కోయడానికి, మోయడానికి, నూర్చడానికి రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. యంత్రం ద్వారా ఎకరాకి రూ.3500 వరి పంటను వరికోత యంత్రం ద్వారా కోయడానికి కేవలం రూ. 3500 సరిపోతుంది. కోత, మోత, నూర్పు లేకుండా నేరుగా వరి కోత యంత్రం ద్వారా కోయడం వల్ల నేరుగా ధాన్యం వచ్చేస్తాయి. దీంతో ఎకరాకి రైతుకు రూ.10, 500 నుంచి రూ.11,500 రకు మిగులుతుంది. దీంతో రైతులు యంత్రాలు ద్వారా కోయడానికి అసక్తి చూపుతున్నారు.కూలీల అవసరం లేదు వరిపంటను కోయడానికి, మోయడానికి, నూర్పుచేయడానికి కూలీలు దొరక్క ఇబ్బంది పడేవాడిని. రెండేళ్లుగా వరికోత యంత్రాలు రావడం వల్ల కూలీల కోసం వెతుక్కోవాల్సిన అవసరం తీరింది. ఒక్క రోజులోనే ధాన్యం కళ్లానికి వచ్చేస్తున్నాయి. – కె.అప్పలనాయుడు, రైతు, రాకోడు గ్రామం రెండేళ్లుగా మిషన్‌తోనే కోత గడిచిన రెండేళ్లుగా మిషన్ ద్వారా కోత కోయిస్తున్నాను నాకు రెండు ఎకరాల పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. కూలీల ద్వారా అయితే ఎకరాకి కోతకు, మోతకు, నూర్పుకు రూ.15 వేలు అయ్యేది. ఇప్పడు రూ. 3500 సరిపోతోంది. – ఎస్. సత్యారావు, రైతు, పెదవేమలి గ్రామం -
ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం
● అంబేడ్కర్ గురుకులాల జిల్లా కన్వీనర్ మాణిక్యంరేగిడి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పది, ఇంటర్ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేయాలని గురుకులాల జిల్లా కన్వీనర్ ఎం.మాణిక్యం అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మండల పరిధి ఉంగరాడమెట్టలో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ బాలుర గురుకులంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో ఉన్న ప్రిన్సిపాల్స్‌కు ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడానికి విద్యార్ధులకు ఇప్పటి నుంచే తగిన తర్ఫీదునివ్వాలని సూచించారు. గురుకులాల్లో ప్రతి తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా పాఠ్యాంశాల బోధన చేయాలని హితవు పలికారు. పాత ప్రశ్నపత్రాలను ఎంపిక చేసుకుని తరచూ వస్తున్న ప్రశ్నలను గుర్తించి అటువంటి ప్రశ్నలకు వెనుకబడి ఉన్న విద్యార్థుల బోధనలో ప్రత్యేక అవగాహన కల్పించాలని కోరారు. రెండు జిల్లాల్లో బాలురు–5, బాలికలు–8 గురుకులాలున్నాయి. వాటిలో పదోతరగతిలో ఈ ఏడాది 911 మంది విద్యార్ధులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 639 మంది, ద్వితీయ సంవత్సరంలో 653 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని ఆమె వెల్లడించారు. అనంతరం డార్మిటరీ, వంటగది, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.రఘురామనాయుడు, వైస్‌ప్రిన్సిపాల్ డి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహాలకు గ్రహణం
● అగమ్యగోచరంగా ఆశ్రమ పాఠశాలలు ● అనాథల్లా మారిన విద్యార్థులు ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ ● జిల్లాలో సగం మంది వార్డెన్లే లేరు పార్వతీపురం రూరల్: జిల్లాలోని వసతి గృహాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. పేద విద్యార్థులకు ఆసరాగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాలలు, పాలకుల నిర్లక్ష్యంతో అవస్థల నిలయాలుగా మారుతున్నాయి. ‘బడికి పంపిస్తే బుద్ధి నేర్చుకుంటారు‘ అని తల్లిదండ్రులు ఆశపడితే..అక్కడ పర్యవేక్షణ కొరవడి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణను గాలికి వదిలేసిందనడానికి జిల్లాలో నెలకొన్న పరిస్థితులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. భయంతో పరుగులు..చీకటిలో ఆక్రందనలు విద్యాలయాలు విజ్ఞానాన్ని పంచాల్సింది పోయి, రౌడీయిజానికి అడ్డాగా మారుతున్నాయి. తాజాగా కొమరాడ మండలం పెదఖేర్జిల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనే ఇందుకు తార్కాణం. సెల్‌ఫోన్ అనే చిన్న కారణంతో జూనియర్లపై సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేయడం, ఆ దెబ్బలకు తట్టుకోలేక, ప్రాణభయంతో ఇద్దరు విద్యార్థులు అర్ధరాత్రి వేళ కాలినడకన ఇరవై, ముప్పై కిలోమీటర్లు పరుగులు తీయడం..వసతి గృహాల్లోని భద్రతా డొల్లతనానికి అద్దం పడుతోంది. ఆదుకోవాల్సిన యంత్రాంగం గాఢనిద్రలో ఉండడం గమనార్హం. సంరక్షకులు కరువు..సమస్యలు బరువు జిల్లావ్యాప్తంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ వసతి గృహాలు 116 వరకు ఉండగా, సుమారు 28 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 65 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉంటే, అందులో సగం చోట్ల కూడా సంరక్షకులు (వార్డెన్లు) లేకపోవడం శోచనీయం.వార్డెన్ లేని చోట విద్యార్థులకు దిక్కు ఎవరు? అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. దీంతో పిల్లలపై పర్యవేక్షణ ’శూన్యం’గా మారింది. ఫలితంగా క్రమశిక్షణ గాడితప్పుతోంది. ప్రభుత్వ వైఫల్యం..బాలల భవితకు గండం చంద్రబాబు ప్రభుత్వం విద్యావ్యవస్థపై చేస్తున్న గొప్ప ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న దుస్థితికి పొంతనే లేదు. వందల మంది విద్యార్థులు ఉన్న చోట కనీస పర్యవేక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సంరక్షకులను నియమించడంలో తాత్సారం, ఉన్న సిబ్బందిపై నియంత్రణ లేకపోవడం..వెరసి వసతి గృహాలు అరాచకానికి ఆనవాళ్లుగా మారుస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేసి, పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టకపోతే.. మరిన్ని ‘పెదఖేర్జిల‘ ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది.సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టపేద విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పూచికపుల్లతో సమానమైంది. వసతిగృహాల్లో వార్డెన్లను ని యమించకుండా, పర్యవేక్షణను గాలికి వదిలేయడం వల్లే నేడు విద్యార్థులు అనాథలుగా మారుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ ఉదాసీనత వల్లే వసతి గృహాల్లో సీనియర్లు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. బడికి వెళ్లిన బిడ్డలు అర్ధరాత్రి ప్రాణభయంతో రోడ్లపై పరుగులు తీస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదు. తక్షణమే ఖాళీగా ఉన్న వార్డెనన్ పోస్టులను భర్తీ చేసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికై నా సరిపడా సిబ్బందిని నియమించాలి, అలాగే సంబంధిత శాఖ పరమైన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటూ, ఆకస్మిక తనిఖీలు వసతి గృహాల్లో నిర్వహించాలి. బి.రవికుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్వతీపురం మన్యం జిల్లా -
నేల బావిలో పడి వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలకేంద్రంలోని దిగువ హరిజన వీధికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నేల బావిలో పడి మృతిచెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు మేరకు రామభద్రపురం దిగువ హరిజన వీధికి చెందిన రేజేటి మురళి(33) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నేల బావిలో పడి మృతిచెందాడు. భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మురళి స్థానిక అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు చెందిన కూరగాయల బస్తాలు మూతలు కుడుతూ వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్ద దికు కోల్పోవడంతో కుటుంబ జీవనం సాగేదెలా అని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
ఏఆర్ డీఎస్పీ మానవత్వం
విజయనగరం క్రైమ్: కాఠిన్యంతో ఎప్పుడూ ఉండే ఖాకీ గుండె కరిగింది. ఈ మేరకు ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి విజయనగరం ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి సపర్యలు చేసి, స్వయంగా హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించి శభాష్ పోలీస్ అని అనిపించుకున్నారు. విజయనగరం ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీగా పని చేస్తున్న ఈ.కోటిరెడ్డి విధుల్లో భాగంగా గంట్యాడ మండలం రామవరం వైపు బుధవారం వెళ్లారు. తిరిగే వస్తున్న క్రమంలో బైక్‌పై విజయనగరం నుంచి వస్తున్నఓ వ్యక్తి సెల్ఫ్ యాక్సిడెంట్‌కు గురై, రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడినట్లు డీఎస్పీ గుర్తించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, గాయపడిన వ్యక్తికి సపర్యలు చేసి, మంచినీరు అందించి, 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి..స్థానికుల సహకారంతో అంబులెన్స్ లోకి స్వయంగా ఎక్కించి, విజయనగరం మహారాజా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. స్థానికులు, బంధువులు డీఎస్పీ ఈ.కోటిరెడ్డి అందించిన సేవల పట్ల కృతజ్ఞతలు తెలిజేశారు. రోడ్డు ప్రమాద బాధితుడికి సహాయం -
ధాన్యం సేకరణలో తప్పిదాలు జరగనీయొద్దు
● జేసీ సేతుమాధవన్ విజయనగరం అర్బన్: ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ, మండల పరిషత్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 1,23,472 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 1,08,687 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందని, కొనుగోలు కేంద్రాల ద్వారా 17,578 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించినట్టు జేసీ తెలిపారు. రైతులకు ఇప్పటివరకు రూ.185.93 కోట్ల చెల్లింపులు జరిగాయని, బ్యాంకుల నుంచి రూ.172,84 కోట్ల బ్యాంకు గ్యారెంటీలు అందాయని వివరించారు. అవసరమైన గన్నీ సంచలు అందుబాటులో ఉంచాలని పౌరసరఫరాల డిప్యూటీ మేనేజర్‌ను ఆదేశించారు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించని మిల్లులను డీ–ట్యాగ్ చేయాలన్నారు. ఇప్పటికే అలాంటి మిల్లర్లకు నోటీసులు జారీచేశామని చెప్పారు. -
జనకోటి వ్యతిరేకత
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై.. సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి విజయనగరం జిల్లాలో విశేషఆదరణ లభించింది. నియోజక వర్గాలు, పట్టణాలు, మండలాలు, పంచాయతీల్లో యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ప్రైవేటీకరణపై వ్యతిరేకత తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై సంతకం రూపంలో నిరసన వ్యక్తంచేశారు. జన‘కోటి’ సంతకాల ప్రతులను జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి బుధవారం ర్యాలీగా విజయనగరం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యు లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోటి సంతకాల పత్రాలను శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలగట్ల వీరభధ్రస్వామి, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బొత్స అప్పలసనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పరిశీలించారు. ● విజయపథంగా... మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా సాగింది. సేకరించిన 54,899 సంతకాల ప్రతులను ర్యాలీగా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి తర లించారు. ముందుగా సంతకాల ప్రతులను పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఉంచి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సాగిన బైక్ ర్యాలీని ప్రారంభించారు. ● కోట నుంచి విజయనగరానికి... సంతకాల ఉద్యమ ముగింపు కార్యక్రమాన్ని ఎస్.కోట పట్టణంలోని దేవీ కూడలిలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంతకాల ప్రత్రులను వాహనంలోకి చేర్చి ర్యాలీగా విజయనగరంలోని పార్టీ కార్యాలయానికి చేర్చారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ● రామతీర్థం టు విద్యలనగరం.. నెల్లిమర్ల నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో రాములోరి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేలా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించారు. అనంతరం 67వేల సంతకాల ప్రతులను సుమారు 500 కార్లు, బైక్‌లతో ర్యాలీగా విజయనగరం జిల్లా కేంద్రానికి చేర్చారు. ● రాజాం నియోజకవర్గం ప్రజల నుంచి సేకరించిన 50 వేల సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో రాజాం అంబేడ్కర్ కూడలి నుంచి విజయనగరం తరలించారు. ముందుగా అంబేడ్కర్ కూడలి వద్ద ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ రాజాం సమన్వయకర్త తలే రాజేష్ సంతకాల ప్రతులను ప్రదర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రత్రులను బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీగా వేణుగోపాలస్వామి ఆలయం వద్దకు చేర్చారు. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, ప్రభుత్వ వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని దేవుడిని ప్రార్థించారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి సంతకాల ప్రతులను విజయనగరం చేర్చారు. కార్యక్రమంలో పార్టీ ఎస్ఈసీ సభ్యుడు ఇంటి గోపాలరావు, ఆర్థిక మండలి రాష్ట్ర మాజీ సభ్యుడు తూముల భాస్కరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.వి.మురళీకృష్ణారావు, పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ● గజపతినగరం నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల ప్రతులను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విజయనగరం చేర్చారు. ముందుగా సంతకాల ప్రతులతో గజపతినగరంలో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా నినదించారు. వైద్యకళాశాలలు ప్రైవేటీకరణ కావడం వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, ఎంపీపీలు సింహాద్రి అప్పలనాయుడు. బెల్లాన జ్ఞానదీపిక, జెడ్పీటీసీలు గార తౌడు, వర్రి నరసింహమూర్తి, రౌతు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ● చీపురుపల్లి నియోజకవర్గంలో సేకరించిన 50వేల సంతకాల ప్రతులతో మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్, కుమార్తె బొత్స అనూష, పార్టీ నాయకులు చీపురుపల్లిలో ర్యాలీ నిర్వహించారు. సంతకాల ప్రతులకు ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేర్చారు. వీటన్నింటినీ ఈ నెల 15న జిల్లా కేంద్రంతో ఉరేగింపు చేసి 17వ తేదీన గవర్నర్‌కు అందజేయనున్నారు. విజయనగరంలో సంతకాల ప్రతులతో బైక్ ర్యాలీ చంద్రబాబు ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై ప్రజావ్యతిరేకత వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల ఉద్యమానికి అనూహ్యస్పందన సంతకాల ప్రతులను ఊరేగింపుగా జిల్లా కేంద్రానికి తరలింపు -
టెట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డీఈఓ
డెంకాడ: మండలంలోని జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీ టెట్ నిర్వహ ణను డీఈఓ ఎం.మాణిక్యంనాయుడు బుధ వారం పరిశీలించారు. జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన పరీక్షకు 590కి 550 మంది, మధ్యాహ్నం పరీక్షకు 561కి 496 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు టెట్ కొనసాగుతుందన్నారు. మానవ హక్కులపై అవగాహన విజయనగరం అర్బన్: మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ రాష్ట్ర విభాగం ఆదేశా ల మేరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్స వం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు లు, ర్యాలీలు నిర్వహించారు. మహారాజా అటానమస్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎం.సాంబశివరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హక్కుల కోసం ప్రశ్నించడం నేర్చుకోవాలని, ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుందని పిలుపునిచ్చారు. కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలు రాకేష్, సంధ్యకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ ప్రసన్నకుమార్, అడ్వకేట్ కరుణాకర్, జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి జి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఎక్కడి ధాన్యం అక్కడే..!
● ధాన్యం అమ్మకంలో రైతుకు తప్పని తిప్పలు ● సంపత్, 1064 రకాల కొనుగోలుకు మిల్లర్లు ససేమిరా.. ● అదనంగా 10 కిలోలు డిమాండ్ రామభద్రపురంలోని ఓ మిల్లు వద్ద ధాన్యం దించకపోవడంతో జాతీయ రహదారికి ఇరువైపులా బారులు తీరిన ధాన్యం లోడులతో ఉన్న ట్రాక్టర్లు రామభద్రపురం: వరి పండించిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ఇబ్బందులు శాపంగా మారాయి. సంపత్, 1064 రకాలు ముక్క అవుతున్నాయని, బస్తాకు 10 కిలోలు అదనంగా ఇస్తేనే కొనుగోలు చేస్తామంటూ మిల్లర్లు తెగేసి చెప్పడం, ఆయా రకాలను మిల్లుల వద్ద దింపేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం లోడ్‌చేసిన ట్రాక్టర్లు రోజుల తరబడి మిల్లువద్దనే ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. ట్రాక్టర్ అద్దె చార్జీలు రైతుకు తడిసిమోపెడవుతున్నాయి. పొరుగు రాష్ట్రం ధాన్యం కొనుగోలుపై ఉన్న ఆసక్తి స్థానికంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చూపడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా మిల్లర్లు సైతం తమ సమస్యలను బహిరంగంగా చెబుతున్నారు. బియ్యం మరపట్టించి ఇచ్చినందుకు మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్లలో కొందరు అధికారులు కాజేస్తున్నారని, గతంలో 2 శాతం ఉంటే ఇప్పుడు 8 శాతం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ముక్క అయిన బియ్యం తీసుకోవడంలేదని, నష్టపోతున్నామని వాపోతున్నారు. చిత్రంలో మిల్లుకు తరలించేందుకు సిద్ధం చేసిన ధాన్యం రామభద్రపురం మండలంలోని ఆరికతోట గ్రామానికి చెందిన బూస ఎరకయ్యవి. ఆర్ఎస్కే సిబ్బంది ట్రక్ షీట్ ఇచ్చారు. తీరా మిల్లు వద్దకు వెళితే కొద్దిరోజులు ఆగాలని చెబుతున్నారు. చేసేదిలేక ధాన్యం బస్తాలను పొలంలోనే ఉంచి చలిలో కాపలాకాస్తున్నాడు. -
‘వైఎస్సార్సీపీతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయం’
సాక్షి,విజయనగరం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది. ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు. -
163 సెల్‌ఫోన్స్ రికవరీ
● బాధితులకు అప్పగించిన ఎస్పీ దామోదర్విజయనగరం క్రైమ్: ఏ మొబైల్ ఫోన్ పోయినా ఇక నుంచి సైబల్ సెల్ స్టేషన్‌కు వెళ్లవనసరం లేదని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా పోయిన 163 సెల్ ఫోన్స్ రికవరీ చేసి వాటిని పొగొట్టుకున్న వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ’మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానంతో విజయనగరంలో సైబర్ సెల్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్ పోగొ ట్టుకున్న వ్యక్తులు తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి, పోగొట్టుకున్న మొబైల్స్ వివరాల ను అందించినట్లయితే, ’మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ద్వారా పోయిన మొబైల్‌ను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.6.23కోట్ల విలువైన 3,463 మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసి, బాధితులకు అందజేశామన్నారు. అదే విధంగా ప్రస్తుతం మరో 163 మొబైల్ ఫోన్లు సైబర్ సెల్ పోలీసులు, సిబ్బంది నిరంతరం శ్రమించి, ట్రాక్ చేశారని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ శోభన్ బాబు, ఎస్బీ సీఐలు ఏవీ లీలారా వు, అంబేడ్కర్, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్సై రాజేష్, సైబర్ సెల్ సిబ్బంది శ్రీనివాసరావు, వాసుదేవ్, తిరుపతి నాయుడు, రాజేష్, నాగమణి, శిరీష పాల్గొన్నారు. -
హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ● వన్‌స్టాప్ సెంటర్ వాహనం ప్రారంభంవిజయనగరం ఫోర్ట్: హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో వన్‌స్టాప్‌సెంటర్ నూతన వాహనాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద వన్‌స్టాప్ సెంటర్ హెల్ప్ లెన్ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనంలో వైద్యం, న్యాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను అందించనున్నారని తెలిపారు. మహిళలను హింసజరిగే ప్రదేశం నుంచి (ఇల్లు, పని స్థలం) ఈకేంద్రాలకు తీసుకురావడం లేదా వారిని అవసరమైన ప్రదేశాలకు తరలించడానికి ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఆపదలో ఉన్న మహిళకు హెల్ప్‌లైన్ వాహనం వన్‌స్టాప్ సెంటర్‌గా ఉపయోగపడుతుందన్నారు. మహిళలకు హెల్ప్‌లైన్ 181, పోలీస్ 100, ఆస్పత్రి 108 లీగల్ సర్వీసెస్ అనుసంధానం చేసి ఉన్నందున 24 గంటల పాటు సేవలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎంసీ సుజాత, వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కీలక ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి విజయనగరం అర్బన్: జిల్లాలో అమలవుతున్న పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి ప్రాజెక్టు, తారకరామ తీర్థసాగర్, జాతీయ రహదారి 130సీ, జాతీయ రహదారి 519ఈ, ఖుర్దారోడ్–విజయనగరం మూడోలైన్, కొత్తవలస, విజయనగరం నాలుగోరైల్వే లైన్ తదితర మేజర్ ప్రాజెక్ట్‌ల భూసేకరణ ప్రకటనలు, పరిహార చెల్లింపులు వంటి అంశాలను వివరంగా సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే సేకరించిన ప్రభుత్వ భూమిని వెంటనే సంబంధిత శాఖలకు అప్పగించాలని మిగతా భూసేకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓలు దాట్ల కీర్తి, రామ్మోహన్, ఎస్డీసీ కళావతి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, అటవీశాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఆర్అండ్బీ, రైల్వే శాఖ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు (భూసేకరణ) పాల్గొన్నారు. -
గోపీనాథ ఆలయంలో చోరీ
● రాధాకృష్ణుల విగ్రహాలపై ఉన్న వెండి, బంగారు నగలు మాయంభామిని: వంశధార నదీ తీరంలో ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతున్న లివిరి గోపీనాథ రాధాకృష్ణ ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం వేకువ జామున దేవాలయంలో దొంగలు పడ్డారనే వార్త గుప్పుమంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని చుట్టుముట్టి జరిగిన చోరీపై చర్చించారు. ఈ సమాచారం అందుకున్న పాలకొండ డీఎస్పీ రాంబాబు, బత్తిలి ఎస్సై జి.అప్పారావులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెనువెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. చోరులు ఆలయం తలుపులకు ఉన్న నాలుగు తాళాలు దుండగులు విరగొట్టారు. రాధాకృష్ణుల మూర్తులపై ఉన్న ఆభరణాలను సీసీ కెమెరా వైర్లు కట్ చేసిన వీడియోలు నిలువ చేసే డీబీఎంను కూడా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో సుమారు 56 తులాల వెండి వస్తువులు, అరతులం బంగారు ముక్కెరలు పోయినట్లు ఆలయ ఆర్చకుడు గోపీనాథ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సర్పంచ్ బౌరి సౌదామిని, మాజీ ఏఎంసీ చైర్మన్ సోమరాజు గోపాలరావు, మాజీ సర్పంచ్ ఎస్.రమణారావు, మిల్లరు కై లాస్ గౌడో, మండల నాయకులు తరలివచ్చి పోలీసులకు సహకరించారు. -
చంద్రబాబు పాలనపై విరక్తి చెంది...
విజయనగరం: ఎన్నికలకు ముందు అమలు సాధ్యంకాని హమీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసగించడమే పరమావధిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనపై విరక్తి చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామమని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తన నివాసంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ పట్టా ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ పట్టణ మాజీ ఎస్సీసెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి సియ్యాదుల చంద్రశేఖర్‌తో పాటు 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువాలు వేసి కోలగట్ల సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీకి చెందిన నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారంటే చంద్రబాబు ప్రభుత్వం తీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సంక్రాంతి అనంతరం నగరంలో విస్తృత పర్యటనలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, భవిష్యత్‌లో మరింత మంది అధికార టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్‌కౌశిక్, కార్పొరేటర్లు బోనెల ధనలక్ష్మి, పట్నాన పైడిరాజు, ఆదినారాయణ, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి జె.శ్రీను, 49వ డివిజన్ ఇన్చార్జి కనుగల రాజా, నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడు జమ్ము మధు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన 50వ డివిజన్ వాసులు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి -
సీపీఎస్ రద్దుకు డిమాండ్
● కలెక్టర్‌కు ఏపీ సీపీఎస్ఈఏ నాయకుల వినతి విజయనగరం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అమలవుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏపీ సీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడువ బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. జిల్లా ఖజానా కార్యాలయంలో సీపీఎస్ ఉద్యోగులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా సీపీఎస్ రద్దుపై ఊసేలేదని విమర్శించారు. జీతాలు, డీఏ, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరీం రాజేశ్వరరావు, చీరల కిరణ్‌కుమార్, ఎల్బీ యుగంధర్, జి.సతీష్‌కుమార్, ఎస్టీయూ ఆదినారాయుణ, తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల్ని యంత్రాలుగా మార్చొద్దు
పదో తరగతి విద్యార్థులపై ‘వంద రోజుల ప్రణాళిక’ పేరిట తీవ్ర ఒత్తిడి పెంచడం తగదు . శని, ఆదివారాల్లో తరగతుల నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాం.ఇప్పటికే సిలబస్ పూర్తయినందున వారికి కావాల్సింది విశ్రాంతి, స్వయం పఠనమే. అలాగే మరోవైపు సెలవుల్లో పనిచేయిస్తూనే.. ఉపాధ్యాయులకు ‘సీసీఎల్’ మంజూరులో కఠిన నిబంధనలు, మెలికలు పెట్టడం అన్యాయం. బోధనేతర పనుల భారం తగ్గించి, సీసీఎల్‌పై విధించిన అసంబద్ధ నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. – ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయుడు ఎన్.బాలకృష్ణ -
సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తాచాటిన జిల్లా జట్లు
తెర్లాం: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లా బాలురు, బాలికల జట్లు సత్తా చాటాయి. ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా మోదుకూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించగా, బాలికల జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయని, ఈ పోటీల్లో విజయనగరం జిల్లా జట్లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు జిల్లా జట్ల మేనేజర్ చొక్కాపు సత్యనారాయణ మంగళవారం తెలియజేశారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఫైనల్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు కడప జట్టుతో తలపడి ప్రథమ స్థానం సాధించింది. అలాగే బాలికల జట్టు కడప బాలికల జట్టుతో పోటీపడి తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొన్న జిల్లా బాలురు, బాలికల జట్లకు కోచ్‌లుగా శివ, మహేష్, మేనేజర్‌గా పీడీ సత్యనారాయణ వ్యవహరించారు. జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో రాణించడంతో క్రీడాకారులను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు అభినందించారు. మరిన్ని పోటీల్లో జిల్లా బాలికల, బాలుర జట్లు మరింత బాగా రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని వారంతా ఆకాంక్షించారు. ఈనెల 6 నుంచి 8 వరకు గుంటూరు జిల్లాలో జరిగిన పోటీలు రాష్ట్రస్థాయిలో ప్రఽథమ స్థానం సాధించిన బాలుర జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్న బాలికల జట్టు -
● రబీలోనూ వీడని యూరియా వెతలు
ఖరీఫ్‌లో యూరియా కోసం తిప్పలు పడిన రైతులకు రబీలోనూ కష్టాలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం సాగులో ఉన్న కూరగాయలు, మొక్కజొన్న, ఉద్యానవన పంటలకు జల్లేందుకు యూరియా దొరకడం లేదు. చీపురుపల్లి మండలంలోని అలజంగి, గొల్లలములగాం, పెదనడిపల్లి, చీపురుపల్లి రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేసిన యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలానికి 49 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పంపిణీకి వ్యవసాయ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. పోలీసుల సమక్షంలో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. – చీపురుపల్లి -
ఆర్థిక బలోపేతమే ప్రధానం
● డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి రేగిడి: స్వయంశక్తి సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని వెలుగు పీడీ శ్రీనివాసపాణి అన్నారు. రేగిడి మండలంలోని ఐఏపీ కార్యాలయంలో స్వయంశక్తి సంఘాల మహిళలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో సంస్థను బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్వయంసహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సక్రమంగా చెల్లించాలన్నారు. వీఓఏలు, గ్రామసంఘ అధ్యక్షులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం బి.గోవిందరావు, ఎల్.సి.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. అల్లూరి డీఈఓగా రామకృష్ణారావు నెల్లిమర్ల: అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారిగా కె.రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన విజయనగరం డైట్‌కళాశాల ప్రిన్సిపాల్(ఎఫ్ఎసీ)గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై డీఈఓగా నియామకమయ్యారు. ఆయనను డైట్ సిబ్బంది అభినందించారు. మెరుగైన విద్యాబోధన అందించాలి నెల్లిమర్ల: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని పాఠశాల విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కె.విజయభాస్కర్ సూచించారు. నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీచ్‌టూల్ శిక్షణను ఆయన పరిశీలించారు. శిక్షణకు సంబంధించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు సూర్యనారాయణమూర్తి, జ్ఞానశంకర్, తదితరులు పాల్గొన్నారు. వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి ● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, అనుబంధ ఘోషా ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు, అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం (హెచ్‌డీఎస్)లో ఆయన మాట్లాడారు. హెచ్‌డీఎస్ ఫండ్స్ రూ.7కోట్లు వరకు ఉందని, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు వినియోగించాలని ఆదేశించారు. అత్యవసర వైద్య పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అత్యవసర విభాగాలను గాజులరేగ సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోకి తరలించేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పా రు. ఆస్పత్రికి కొత్తగా ఒక లైఫ్ సపోర్టు అంబులెన్సు సమకూర్చేందుకు, సీవేజ్ ట్రీటెమెంట్ప్లాంట్ నిర్మాణం, నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ యూనిట్, దానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు, దినసరి వేతనంపై ఇద్దరు క్షరకుల నియామకం, జనరిక్ మందుల షాపు ఏర్పాటు, ఘోషా ఆస్పత్రిలో పలు భవనాల నిర్మాణం, 15 సీసీ కెమెరాల ఏర్పాటు, రూ.20 లక్షల విలువైన డయా థెర్మీ పరికరం ఏర్పాటు, వివిధ ధ్రువపత్రాల చార్జీల పెంపు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం, వేతనాల పెంపుపై చర్చించి ఆమోదించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఆస్పత్రిలో రోగులకు వసతి సరిపోవడం లేదని, అందువల్ల తక్షణమే డీసీహెచ్ఎస్ కార్యాలయాన్ని తరలించాలన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ, ఇన్చార్జి డీఎంహెచ్ఓ రాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, ఎంపీహెచ్ఎంఐడీసీ భారతి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, కో ఆప్సన్ సభ్యులు జయ చంద్రనాయుడు, వి.అశోక్, ఇమ్మడి సుధీర్, అనూరాధ బేగం, తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పార్వతీపురం: పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు గల క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశమందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదన్నారు. అర్జున అవార్డు గ్రహీతలు, కోడిరామూర్తినాయుడు లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెయిట్ లిఫ్టర్లున్నారన్నారు. అలాగే జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారుల్లో రాణించిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 క్రీడా విభాగాల్లో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఈనెల 12, 13 తేదీలలో, ఈనెల 15, 16, 17వ తేదీలలో జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. అలాగే జిల్లాలో వాటర్ స్పోర్ట్స్ (జలక్రీడలు) నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. దీనికి సంబంధించి శాప్‌తో చర్చించగా అంగీకారం తెలిపిందన్నారు. 2030లో కామన్వెల్త్ గేమ్స్ భారతదేశానికి కేటాయించనున్న తరుణంలో క్రీడల్లో మరింత ప్రతిభ కనబరిచి కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో 3శాతం రిజర్వేషన్ ఉందని ఈమేరకు స్పోర్ట్స్‌లో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగాలు, ప్రవేశాలలో రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి పొల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
కురుపాం: కురుపాం–గొరడ ప్రధాన రహదారిలో బుడ్డెమ్మ ఖర్జ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఆదివారం సాయంత్రం ఢీ కొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గోళ్ల గౌరీశంకర్ కు తీవ్ర గాయాలైన సంఘటన విదితమే. ఈ మేరకు సంఘటన స్థలం నుంచి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించగా వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన తరువాత మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు గౌరీశంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ షాపులో అగ్నిప్రమాదంరాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి డోలపేట గ్రామంలోని ఎలక్ట్రానిక్స్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. షాపులోనుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో షాపు యజమానితోపాటు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఎస్సై పి.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఏసీ, ఫ్రిడ్జ్, రిమ్మల్స్ స్పేర్‌పార్ట్స్ కాలిపోగా సుమారు రూ.2లక్షలు ఆస్తినష్టం సంభవించిందని ఫైర్ ఎస్సై తెలిపారు. 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంకురుపాం: ఎకై ్సజ్ దాడుల్లో 800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు సర్కిల్ పరిధిలో కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం 800 లీటర్ల బెల్లం ఊట నిల్వ ఉంచినట్లు గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. సారా బట్టీ నిర్వాహకుడిగా తాడంగి గోపాల్‌ను ఈ దాడుల్లో గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి.వి.వి.ఎస్. శేఖర్‌బాబు, ఎస్సైలు రాజశేఖర్, చంద్రకాంత్, కురుపాం ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారన్నారు. 63 మద్యం బాటిల్స్ ధ్వంసం రాజాం సిటీ: స్థానిక టౌన్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడిన 63 మద్యం బాటిల్స్‌ను అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీరంగందొర మంగళవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటున్నామ న్నారు. ఇప్పటికే ఎకై ్సజ్ సిబ్బందికి బెల్టు నిర్వహణపై దాడులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అనంతరం పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ముత్తూట్ ఫైనాన్స్‌లో అరకిలో బంగారం మాయంవిజయనగరం క్రైమ్: విజయనగరం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో నుంచి అరకేజీ బంగారం మాయమైంది. ఆడిట్ తనిఖీకి వచ్చిన ఉద్యోగే ఏడు ప్యాకెట్లలో ఉన్న బంగారాన్ని సైడ్ చేశాడు. ఇందుకు సంబంధించి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై రవి కేసు నమోదు చేశారు. ఆడిట్ తనిఖీల్లో భాగంగా ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఆడిట్ ఇన్స్పెక్టర్ మనోజ్ తనిఖీలు చేసే క్రమంలో మేనేజర్‌తో మాట్లాడుతుండగానే దాదాపు రూ.48 లక్షలు విలువ చేసే అరకేజీ బంగారాన్ని స్వాహా చేశాడు. తనిఖీ అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించిన బ్రాంచ్ మేనేజర్ కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానే ఆ బంగారాన్ని పట్టుకెళ్లానని తిరిగి ఇమ్మని అడిగినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆత్మహత్య చేసుకుంటానని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్‌కు మెసేజ్ చేశాడు. దీనిపై వన్‌టౌన్ ఎస్సై రవి ఫండ్స్ మిస్ అప్రోప్రియేషన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వెనుకబడిన విద్యార్థులపై నిర్లక్ష్యం
పార్వతీపురం రూరల్: ర్యాంకుల రేసులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న అధికారుల తాపత్రయం పదో తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందా? ‘వంద రోజుల ప్రణాళిక’ పేరుతో విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యాచరణ విద్యార్థులను తీర్చిదిద్దడం పక్కన పెడితే..వారిని మానసిక ఒత్తిడిలోకి నెట్టివేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అందరికీ ఒకే మందు’ అన్న చందంగా.. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రూపొందించిన ఈ షెడ్యూల్ వల్ల విద్యార్థులు లాభం కంటే నష్టమే ఎక్కువ పొందే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ లోకం హెచ్చరిస్తోంది. బోధన కన్నా..‘యాప్’ల గోలే మిన్న పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పం మంచిదే అయినా.. ఆచరణలో ఉపాధ్యాయులపై పడుతున్న పని భారం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. రోజూ ఉదయం జిల్లా కార్యాలయం నుంచి వచ్చే వాట్సాప్ ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీయించడం, పరీక్ష పెట్టడం, ఆ వెంటనే మార్కులను సాయంత్రం లోపు ‘లీప్ యాప్’లో అప్లోడ్ చేయడం..ఇదంతా ఒక ప్రహసనంగా మారింది. బోధన కంటే ఈ సాంకేతిక పనులకే ఉపాధ్యాయుల సమయం హరించుకుపోతోంది. పిల్లలకు పాఠం చెప్పాలా? లేక యాప్ లో మార్కులు ఎక్కించాలా? అన్న సందిగ్ధంలో టీచర్లు కొట్టుమిట్టాడుతున్నారు. విరామం ఎరుగని ‘యంత్రాలు’ పిల్లలంటే యంత్రాలు కాదు..రక్తమాంసాలున్న మనుషులు. కానీ విద్యాశాఖ మాత్రం రెండవ శనివారాలు, ఆదివారాలు కూడా క్లాసులు పెట్టి వారిని రోబోల్లా మార్చేస్తోంది. ఇప్పటికే సిలబస్ పూర్తయిన తరుణంలో.. విద్యార్థులకు స్వయంగా చదువుకునేందుకు, పునశ్చరణ చేసుకునేందుకు సమయం ఇవ్వాలి. కానీ, సెలవు రోజుల్లో కూడా బడికి రప్పించడం వల్ల విద్యార్థులు తీవ్ర అలసటకు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ‘మెదడుకు కాస్తంత విశ్రాంతి దొరికితేనే చదివింది వంటబడుతుంది. ఇలా ఊపిరి ఆడనివ్వకుండా చదివిస్తే..అసలుకే ఎసరు వస్తుంది’ అని సీనియర్ ఉపాధ్యాయులు సైతం వాపోతున్నారు. పది పరీక్షలకు వంద రోజుల ప్రణాళికతో ‘స్లో లెర్నర్స్’ బలి! అందరికీ ఒకే విధానం.. ఎలా సాధ్యం? జిల్లాలో 187 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ర్యాంకుల పరుగులో విద్యార్థులకు గండం వందరోజుల ప్లాన్‌తో ఒత్తిడి -
బ్రెయిన్ యోగా ఒక అద్భుతం
● అంతర్జాతీయ బ్రెయిన్ యోగా గురువు పిడుగు శ్రీనివాసులువిజయనగరం: బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగా గురువు, అంతర్జాతీయ శిక్షకుడు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లాశాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టతను పెంచడం, ఆందోళనను తగ్గించడం, నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం, మెదడుకు రక్త ప్రసరణను పెంచడం, న్యూరోన్ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటివి బ్రెయిన్ యోగాతో సాధ్యమన్నారు. ఈ సందర్భంగా వివిధ ముద్రలతో బ్రెయిన్ ఎక్సర్సైజ్ విద్యార్థులతో చేయించడమే కాక వాటి విశిష్టతను విపులంగా వివరించారు. ఈ సందర్భంగా యోగా గురువు పిడుగు శ్రీనివాసులును, రోటరీ లీడ్ ఇండియా చైర్మన్ దుర్గాబాలాజీ, పాఠశాల ప్రిన్సిపాల్ పూడి శేఖర్‌తో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ లీడ్ ఇండియా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య, జగదీష్, లత తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ టెట్‌పై యూటీఎఫ్ నిరసన
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ జిల్లా కమిటీ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండురోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో తొలిరోజున జిల్లా వ్యాప్తంగా తాలూ కా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రెండోరోజు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2010కి ముందు నియమితమైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మనహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెట్ అర్హతపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు మినహాయించి రీ షెడ్యూల్ చేయాలని కోరారు. బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జేఏవీఏఆర్కే ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో యూటీఫ్ నాయకులు సీహెచ్ తిరుపతినాయుడు, జి.రాజారావు, శ్రీదేవి, అల్లు శంకరరావు, గంగాధర్, ఎస్.వెంకటరావు, పల్లి శ్రీనివాసరావు, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
13న పారా రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 4వ రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో పోటీలకు సంబంధించిన పోస్టర్స్‌ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా పారా రాష్ట్ర స్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు హాజరు కానున్నారని, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించనున్నారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఉత్తరాఖండ్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న పారా పవర్ లిఫ్టర్ లు ఈ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 9849377577 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్, కోచ్ తదితరులు పాల్గొన్నారు. -
సంతకాల ఉద్యమం విజయవంతం
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రభత్వు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు, మాజీఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్పష్టంచేశారు. గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో వారు మంగళవారం మాట్లాడారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకువస్తే.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున ప్రతిపక్షపార్టీ బాధ్యతగా కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్‌కు అందజేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 50వేల సంతకాలు పైబడి సంతకాల సేకరణ సాగిందన్నారు. ఈనెల 10న నియోజకవర్గ స్థాయిలో చీపురుపల్లి మూడు రోడ్లు కూడలి వద్ద రాష్ట్ర శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు సంతకాల సేకరణ బాక్సులతో ఉన్న వాహనాన్ని లాంఛనంగా ప్రారంబిస్తారని తెలిపారు. మూడు రోడ్ల కూడలి నుంచి ఆంజనేయపురంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి అనంతరం పార్టీ జిల్లా కార్యాలయానికి సంతకాల సేకరణ బాక్సులను అందజేస్తారన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోనూ సంతకాల ప్రతులతో ర్యాలీలు సాగుతాయని తెలిపారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో తలపెట్టిన సంతకాల ప్రతుల ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో విమానయానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలే నిలువెత్తు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాలల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. విమానయాన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక మంత్రి రామ్మోహన్నాయుడు తెలుగువారి పరువును తీసివేశారన్నారు. కార్యక్రమంలో బొత్స అనూష, వైఎస్సార్సీపీ నాయకుడు కె.వి.సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, వాకాడ శ్రీనివాసరావు, కొణిశ కృష్ణంనాయడు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, గుర్ల మండల నాయకులు సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తోట తిరుపతిరావు, మెరకముడిదాం మండల నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, నాలుగు మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ నాయకులు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. భవిష్యత్తు తరాల కోసం ఈ సంతకం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వపాలనపై సంతకంతో నిరసన తెలిపారు. సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడాలని వైఎస్సార్సీపీ నేతలను కోరారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దేశంలో ఎక్కడాలేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రాస్ట్రానికి తీసుకువచ్చిన విషయం విదితమే. 2023–24 కాలంలోనే ఇందులో ఐదు కళాశాలలను ప్రారంభించారు. అందులో విజయనగరం ప్రభుత్వ వైద్యకళాశాల ఒకటి. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా వంటి వెనుకబడిన గిరిజన ప్రాంతంలోనూ ప్రభుత్వ వైద్యకళాశాల ఆవశ్యకతను నాటి సీఎం జగన్మోహన్రెడ్డి గుర్తించి.. రూ.600 కోట్లతో కళాశాల మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ప్రజా ప్రయోజనాలను కాదని, కేవలం రాజకీయ కక్షతో వీటికి మంగళం పాడింది. తన బాధ్యత నుంచి తప్పుకుని, పీపీపీ విధానంలోని వీటిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే పేద విద్యార్థులకు వైద్యవిద్యను అభ్యసించాలన్న కల నెరవేరకుండా పోతోంది. పేదలకు, గిరిజనులకు జిల్లాలోనే ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందని పరిస్థితి. ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేట్‌పరం చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రజాఉద్యమానికి పార్టీ నేతలు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోను సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, పార్టీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేతలు సంతకాల ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు. వైద్యకళాశాలల ఆవశ్యకతను వివరించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను విడమర్చిచెప్పారు. ప్రజల మద్దతు కోరుతూ, కోటి సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్ర గవర్నర్‌కు అందజేయాలని నిర్ణయించారు. అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 3వ తేదీ వరకు జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో 60 వేల పైచిలుకు సంతకాలను సేకరించారు. ఈ నెల 10న సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనాల ద్వారా జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. అనంతరం 15వ తేదీన జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడి నుంచి ఈ నెల 17న గవర్నర్ వద్దకు వెళ్లి ప్రజాభిప్రాయాన్ని అందజేయనున్నారు. ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్సీపీ జిల్లాలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ విజయవంతం ప్రభుత్వ వైద్యకళాశాల పరిరక్షణకు ప్రజల నుంచి విశేష మద్దతు ఒక్కో నియోజకవర్గంలో 60 వేలకుపైగా సంతకాల సేకరణ 17న గవర్నర్ వద్దకు.. -
● ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు నిర్వహణ ● హాజరుకానున్న అభ్యర్థులు 13,985 మంది
బొబ్బిలి రూరల్: మోంథా తుఫాన్ వరదలకు విశాఖ–రాయగడ అంతరరాష్ట్ర రహదారిలో పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్వే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వరద సహాయ నిధి నుంచి రూ.15 లక్షలను కలెక్టర్ మంజూరు చేయడంతో ఆర్అండ్బీ అధికారులు మరమ్మతు పనులు పూర్తిచేశారు. కాజ్‌వేపై సోమవారం నుంచి భారీ వాహనాల రాకపోకలకు అనుమతించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేగావతి నదిపై కొత్తగా వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అప్పటి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పిల్లర్ల వరకు పూర్తయిన వంతెన పనులకు చంద్రబాబు ప్రభుత్వం మరో మూడున్నర కోట్లు బడ్జెట్ పెంచింది. శ్లాబ్ పనులను బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు సోమవారం ప్రారంభించారు. విజయనగరం టౌన్: సైనిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని జిల్లా సైనిక సంక్షేమాధికారి కేవీఎస్ ప్రసాద్ అన్నారు. భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని కలెక్టర్, జిల్లా సైనిక సంక్షేమ సంఘం చైర్మన్ రాంసుందర్‌రెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సాయుధ దళాల పతాక నిధికి విరివి గా విరాళాలివ్వాలన్నారు. సైనిక సంక్షేమానికి ప్రజలిచ్చిన ప్రతిపైసా భారత సైన్యంలో వీరమరణం పొందిన, రక్షణ దళంలో విశిష్ట సేవలందించిన కుటుంబాల సంక్షేమ సహాయానికి అందించబడతాయన్నారు. కార్యక్రమంలో డి. ఈ శ్వరరావు, ఎన్సీసీ అధికారులు, సైనిక సంక్షేమ సిబ్బంది, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష–2025 (ఏపీ టెట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 13,985 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. వీరికోసం 5 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని వివరించారు. గంట్యాడ: ప్రభుత్వం జీఓ నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, వేతన సవరణతో పాటు మధ్యంతర భృతి చెల్లించాలని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక నాయకుడు మంగయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగులతో కలిసి గంట్యాడ డీసీసీబీ బ్రాంచి ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ సిలింగ్ విధించి రూ.2 లక్షలు మాత్రమే చెల్లించడం సరికాదన్నారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని, రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
కదం తొక్కిన రైతులు
విజయనగరం ఫోర్ట్: గుర్ల మండలంలో ఏర్పాటుచేయనున్న సూపర్ స్మెల్టర్ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పలు గ్రామాల రైతులు కదం తొక్కారు. ట్రాక్టర్లపై వందలాది మంది కలెక్టరేట్‌కు చేరుకుని సోమవారం ఆందోళన చేశారు. ‘స్టీల్ ప్లాంట్ వద్దు.. పచ్చని పంట పొలాలే ముద్దు, భూములు ఇవ్వకు.. భవిష్యత్ చంపకు, మా భూమి.. మా హక్కు’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించా రు. సూపర్ స్మెల్టర్స్ప్లాంట్ వ్యతిరేక పోరాట కమి టీ గౌరవాధ్యక్షుడు బుద్దరాజు రాంబాబు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. ఏడాదికి రెండు పంటలు పండే భూములను ప్లాంట్ కోసం ఇచ్చేదిలేదని తెగేసిచెప్పారు. ఇక్కడి నేలను, నీరు, గాలిని కలుషితం చేస్తామంటే చూస్తూ ఊరుకోబో మన్నారు. ఆందోళనలో గుర్ల మండలంలోని దమరసింగి, వల్లాపురం, బెల్లాన పేట, మన్యపురిపేట, కెల్ల, ఎస్.ఎస్.ఎస్.ఆర్.పేట తదితర గ్రామాల రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ పొట్నూరు సన్యాసినాయుడు, గుర్ల సన్యాసినాయుడు, గుర్ల జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వి.వెంకటేశ్వర్లు, పోరాట కమిటీ కన్వీనర్ మీసాల ప్రసాద్, కో కన్వీనర్ మందపాటి కృష్ణం రాజు, వైఎస్సార్సీపీ నాయకులు కె.వి.సూర్యనారాయణ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఐ నాయకులు బుగత అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి తీరుతో తెలుగోడి గౌరవం నవ్వులపాలు
లక్కవరపుకోట: కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో నవ్వులపాలు చేశారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఎల్.కోటలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో పెద్ద పెద్ద ప్రసంగాలతో గొప్పలకు పోయిన మంత్రి ఈ రోజు దేశ విమానయానం సంక్షోభంలో పడిపోతే పలాయనం పుచ్చుకున్నారని ఎద్దేవాచేశారు. ప్రైవేటీకరణ ఎంత ప్రమాదమో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రైవేటీకరణతో దేశ, రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఈ రోజు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ ఉచ్చులోపడి పేదవారి భవిష్యత్తు విస్మరిస్తున్నాయన్నారు. ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చుతున్నారని, రాష్ట్రంలో ప్రస్తుత ఏడాదిలో 38.2 కోట్లు పనిదినాలను కోత వేయడం విచారకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 50వేలకు పైగా రైతులకు అన్నదాత సుఖీభవ వర్తించలేదన్నారు. గడిచిన 18 నెలల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు పాల్గొన్నారు. -
8వ తేదీ వచ్చినా జీతాల్లేవు
● రెండు శాఖల ఉద్యోగులు మినహా మిగిలిన వారికి అందని జీతం విజయనగరం అర్బన్: ‘వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలో కట్టుకున్న ఇల్లుకోసం బ్యాంకు రుణం తీసుకున్నారు. రుణం నెలవారీ వాయిదా మొత్తం 5వ తేదీలోపు జీతం నుంచి జమచేసుకోవాలని బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు 8వ తేదీ వచ్చినా జీతం జమకాకపోవడంతో అకౌంట్ బౌన్స్ చార్జీలతో పాటు సెబీ విలువ పడిపోయి డిఫాల్టర్‌గా మారిపోయాడు.’ ఇది ఒక వ్యవసాయ శాఖ ఉద్యోగి సమస్యేకాదు. విద్య, పోలీస్ శాఖ ఉద్యోగులు మినహా జిల్లాలోని మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి అని ఆయన వాపోయాడు. ‘గత ప్రభుత్వం జీతాలు వేయడంలో రెండుమూడురోజులు ఆలస్యం అయినా అన్ని శాఖల ఉద్యోగ, అధికారులకు ఒకేసారి వేసేది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులు అధికంగా ఉన్న విద్యాశాఖ, పొలీసు శాఖల ఉద్యోగులకు ముందుగా వేసి మిగిలిన శాఖల ఉద్యోగులకు పదోతేదీ దాటాక వేస్తోంది. అత్యవసర శాఖల ఉద్యోగులకు తొలుత వేయాలంటూ చెబుతున్న ప్రభుత్వం మిగిలిన శాఖల ఉద్యోగుల కుటుంబాలకు వేతనాలు అవసరం లేదా..? ఉద్యోగుల మధ్య ప్రభుత్వం వివక్షత చూపడం సరికాదు.’ అంటూ వేతనాలు ఇప్పటికీ పడని ఓ ఆర్అండ్బీ ఉద్యోగి ఆవేదన ఇది. అంతన్నారు.. ఇంతన్నారు... ప్రజాసంక్షేమ పథకాలను పక్కనపెట్టేశారు. కనీసం ఉద్యోగుల జీతాలను కూడా ఒకటో తేదీన చెల్లించలేని దుస్థితిలో చంద్రబాబు సర్కారు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లలో లక్షలకోట్ల రూపాయలు అప్పుడుచేసిన సర్కారు... జీతాల చెల్లింపులో జాప్యంపై ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. జీతాల చెల్లింపులో వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నాయి. 8వ తేదీ ముగిసినా జీతాలు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వివిధ విభాగాల్లో సుమారు 57 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 24 వేల మంది వరకు ఉన్న టీచర్లు, పోలీస్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు వేశారు. మిగిలిన వివిధ శాఖల సిబ్బందికి వేతనాలు పడలేదు. జీతాల చెల్లింపులో ఆలస్యంపై ఆయా ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఓటేసిన పాపానికి అనుభవిస్తున్నా మంటూ మదనపడుతున్నాయి. -
విజయనగరం
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కోటి సంతకాలకు విశేష స్పందన ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి భారీ సంఖ్యలో అర్జీలు అందాయి. –8లోరేగిడి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అనూహ్య స్పందన లభించిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. రేగిడిలో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 10న నియోజకవర్గ స్థాయిలో కోటి సంతకాల ప్రతుల సేకరణకు, ఈ నెల 15న జిల్లా స్థాయిలో చేపట్టనున్న కోటి సంతకాల ర్యాలీకి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు విడుదల కాక విద్యార్థులు, ఎరువులు, విత్తనాలు దొరకకపోవడం, పంట కొనుగోలు చేయక రైతులు, ఉద్యోగాలులేక, నిరుద్యోగ భృతి అందక నిరుద్యోగులు, పింఛన్లు మంజూరుకాక అర్హులు, రీ వెరిఫికేషన్‌తో దివ్యాంగులు.. ఇలా ప్రతి వర్గం ఇబ్బందులు పడుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు టి.అచ్చెన్నాయుడు, వి.జగన్మోహనరావు, దవళేశ్వరరావు, తదిరులు ఉన్నారు. -
మంత్రి కుమారుడిపై కేసు నమోదుకు డిమాండ్
● ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన పీఏను అరెస్టు చేయాలి ● రౌండ్‌టేబుల్ సమావేశంలో మహిళా సంఘాల డిమాండ్ పార్వతీపురం రూరల్: మహిళలకు రక్షణ కల్పించా ల్సిన సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగినికి రక్షణ కరువవడం సిగ్గుచేటని, వేధింపులకు పాల్పడిన మంత్రి కుమారుడిపై తక్షణమే కేసు నమోదుచేయాలని, అనధికారిక పీఏను అరెస్టు చేయాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్.శ్రీదేవి అధ్యక్షతన సోమవా రం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మ హిళా సంఘాల నాయకులు మాట్లాడారు. సాలూరుకు చెందిన మహిళా ఉద్యోగినిని మంత్రి పీఏ, కుమారుడు శారీరకంగా, మానసికంగా వేధించార ని ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా రాజ కీయ ఒత్తిళ్లకు తలొగ్గి మంత్రి కుమారుడిపై కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పీఏపై కేసు ఉన్నప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన అధికారులు ఆమెకు నిబంధనల ప్రకారం రావాల్సి న సెలవులు నిరాకరిస్తూ జీతాల్లో కోత విధిస్తూ వేధించడం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించా రు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో ఐద్వా, ప్రగతిశీల మహిళా సంఘం, శ్రామిక మహిళా సంఘం నాయకులు బి. లక్ష్మి, పి.రమణి, వి.ఇందిర, తులసి, కుమారి, తదితరులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన వినతులు
● త్వరితగతిన పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు ● 273 అర్జీల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ సంఖ్యలో అర్జీలు పోటెత్తాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 273 వినతులు స్వీకరించగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 120, డీఆర్డీఏకు 45, జిల్లా పంచాయతీ రాజ్‌కు 13, వైద్యశాఖకు 15, మున్సిపల్, విద్యుత్ శాఖలకు 10, గ్రామసచివాలయాలకు సంబంధించి 7, హౌసింగ్‌కు 4, ఇతర శాఖలకు 43, డీసీహెచ్ఎస్ శాఖకు రెండు అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై ఎండార్స్మెంట్ చేసే ముందు అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100కు అందే కాల్స్‌కు కూడా సత్వరం సరైన సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. వినతుల స్వీకరణలో కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను విని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో సర్వే ఎ.డి ఆర్. విజయకుమార్, కలెక్ట్రేట్ ఏవో దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ అన్నపూర్ణమ్మ, బీసీ సంక్షేమ అధికారి జ్యోతిశ్రీ, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, మార్క్‌ఫెడ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదు దారులపై పోలీస్ సిబ్బంది అసహనం విజయనగరం క్రైమ్: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ దామోదర్ తన చాంబర్లోను, ఏఎస్పీ సౌమ్యలత కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించారు. పీజీఆర్ఎస్లో 40 మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలను చెప్పుకోగా, సిబ్బంది మాత్రం ఫిర్యాదుదారులపై అసహనం వ్యక్తం చేశారు. ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదు దారుల సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి వారి సమస్యలపై వారిముందే సంబంధిత స్టేషన హౌస్ ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడారు.అనంతరం ఫిర్యాదు దారుల సమస్యలను డేటాలో నిక్షిప్తం చేసే క్రమంలో సిబ్బంది వారిపై అసహనం ప్రదర్శించారు. పనిలో వస్తున్న ఒత్తిడిని, ఫిర్యాదు దారులపై అసహనం రూపంలో వ్యక్తం చేశారు. సమస్యతో రోడ్డుక్కినప్పుడు లేని సిగ్గు, ఆందోళన, భయం..స్టేషన్ కు వెళ్లమంటే ఏమొచ్చిందంటూ ఓ పెద్దాయనతో డీపీఓలో సిస్టం ముందు కూర్చుని అంశాలను కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్న ఓ కానిస్టేబుల్ అసహనం వ్యక్తం చేశాడు. వచ్చిన ఫిర్యాదులను ఎస్హెచ్ఓలు క్షుణ్ణంగా పరిశీలించాలని వాటిని ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఎస్పీ దామోదర్ అదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సిబ్బందిని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ కె. కుమార స్వామి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, అంబేడ్కర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి
● జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు గోపాల్, విజయలక్ష్మివిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజేతలుగా తిరిగి రావాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు ఆకాంక్షించారు. ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరగనున్న అండర్ –14 బాలబాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లతో పాటు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో జరగనున్న అండర్–17 బాలుర హాకీ పోటీల్లో పాల్గొనబోయే జట్టు సోమవారం బయల్దేరాయి. ఈ సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యార్థి దశలో క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని, ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభాపాటవాలు కనబరచాలని ప్రోత్సహించారు. తద్వారా జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించి, ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఒలింపియాడ్ గోల్డ్ మెడలిస్ట్‌కు ఎస్పీ అభినందనలు
విజయనగరం: ఇటీవల ముంబైలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన ‘ఒలింపియాడ్ అమెచ్యూర్ ఇండియా‘ బాడీ బిల్డింగ్ పోటీల్లో దివ్యాంగుల విభాగానికి సంబంధించి జరిగిన పోటీలో జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని, ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రశంశించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్‌తో కలిసి సూర్యనారాయణ సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పుట్టుకతోనే పోలియో బారిన పడిన సూర్యనారాయణ ఏ మాత్రం నిరాశ చెందకుండా బాడీ బిల్డింగ్ పట్ల తనకున్న ఆశక్తితో సాధన చేస్తూ అనేక రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ సాధిస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. వచ్చే ఏడాది మార్చి 6న అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న సూర్యనారాయణ అక్కడ కూడా ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయిలో జిల్లా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచాలన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రే హంతకుడు
● అనుమానాస్పద మృతిలో వీడిన మిస్టరీ పాలకొండ రూరల్: ఇటీవల పాలకొండ మండలం బుక్కూరు గ్రామంలోని స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ జామి విఠల్‌రావు (49) మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీఐ ఆమిటి ప్రసాదరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. వ్యసనాలకు బాని సైన విఠల్‌రావు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను వేదిస్తుండేవాడన్నారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన రాత్రి మద్యం మత్తులో వచ్చిన విఠల్‌రావు ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో మృతుడి తండ్రి రామప్పడు కోపం తట్టుకోలేక, సహనం కల్పోయి గొడ్డలితో తన కుమారుడిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన విఠల్‌రావు మృతి చెండాడు. తమ దర్యాప్తులో తండ్రి ఈ నిజం అంగీకరించినట్లు సీఐ సోమవారం మీడియాకు తెలిపారు. మండల వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ మృతి కేసును కేవలం 7 రోజుల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన రోజు జాగిలాలు ఘటన స్థలం చుట్టూ తిరిగి రామప్పడు వద్దకు వచ్చి నిలిచిపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 82 వినతులు అందజేశారు. వినతుల్లో రెవెన్యూకు సంబంధించి 12, సాధారణ అర్జీలు 70 ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో డీఆర్ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసులు, ప్రజల మధ్య పరస్పర విశ్వాసం బలోపేతం చేయాలి పార్వతీపురం రూరల్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల నుంచి స్వీకరించిన సమస్యలను వీలున్నంత మేరకు పరిష్కరించి పోలీసుశాఖ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీపత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఎస్పీ ఫోన్లో మాట్లాడి వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలైనట్‌లైతే చట్టపరిధిలో చర్యలు చేపట్టి తీసుకున్న చర్యల నివేదికను తన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. మొత్తంగా 9 ఫిర్యాదులు ఎస్పీ పీజీఆర్ఎస్కు అందాయి. కార్యక్రమంలో ఎస్పీతోపాటు జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీసీఐ ఆదాం, ఎస్సై రమేష్‌నాయుడు మరికొందరు సిబ్బంది ఉన్నారు. డీకేటీ భూములకు అందని అన్నదాత సుఖీభవ సీతంపేట: డీకేటీ, ఆర్వోఎఫ్ఆర్ భూములు సాగుచేస్తున్న గిరిజన రైతులకు అన్నదాత సుఖీబవ నిధులు బ్యాంకు ఖాతాలో జమకాలేదని వైఎస్సార్సీపీ నాయకులు హెచ్.మోహన్‌రావు, వి.చలపతి, అప్పారావు, మంగయ్య, వెంకునాయుడు తదితరులు ఐటీడీఏలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పీహెచ్‌వో ఎస్వీ గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసాలో అందరికీ నిధులు వచ్చాయని, ఇప్పుడు పూర్తిగా అందలేదన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇతర వినతులు పరిశీలిస్తే ఓండ్రుజోలకు చెందిన అంగన్వాడీ ఆయా సునోమి 19నెలల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరింది. ఐటీఐ ఎదురుగా ఇళ్ల నిర్మాణం చేసుకున్న గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు వినతిపత్రం ఇచ్చారు. కిరాణాషాపు పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని శిలిగాంకు చెందిన సవర అప్పలమ్మ కోరింది. చింతలగూడకు చెందిన వి.సొంబరు ఆర్వోఎఫ్ఆర్ భూములను సర్వే చేసి పట్టాలిప్పించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీఈవో రామ్మోహన్రావు, వ్యవసాయాధికారి వాహినిణి, ఏపీడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
మత్తుపై సమర భేరి
● జిల్లా కేంద్రంలో అభ్యుదయ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం ● 3వేల మందితో భారీ మానవహారంపార్వతీపురం రూరల్: మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మార్గదర్వకత్వంలో పాయకరావుపేటనుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర సోమవారం జిల్లా కేంద్రంలో అడుగుపెట్టగా అపూర్వ స్పందన లభించింది. మరిపివలస నుంచి మొదలైన ఈయాత్ర జిల్లా కేంద్రంలోని చర్చి జంక్షన్‌కు చేరుకోగానే పండగ వాతావరణంలో కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి, జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనిషా రెడ్డిలు యాత్రకు ఘన స్వాగతం పలికారు. డప్పులు, తప్పెటగుళ్లు, కోలాటాల నడుమ అధికారులే స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొనడం యువతలో నూతనూత్తేజం నింపింది. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌వద్ద 3వేలమంది విద్యార్థులు, ప్రజలతో భారీ మానవహారంగా రూపొంది డ్రగ్స్ వద్దుబ్రో అంటూ ముక్తకంఠంతో నినదించారు. సరదాకోసం చేస్తే జీవితం బలి స్థానిక కన్యకాపరమేశ్వరి కల్యాణ మంటపంలో జరిగిన సభలో ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ యువతను పక్కదోవ పట్టించేందుకు కొందరు చాక్లెట్ల రూపంలో మత్తును చిమ్ముతున్నారని ఆకర్షణీయమైన మాటలతో వలవేసే వారిని నమ్మొద్దని , గంజాయి మహ్మరి మొదడును మొద్దుబార్చి, భవిష్యత్‌ను అంధకారం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లానే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు డీఐజీ గోపీనాఽథ్ జెట్టి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
ప్రణాళిక ఫలించేనా..!
రామభద్రపురం: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఎంతో కీలకం. ఆయా పరీక్ష ఫలితా ల్లో ఉత్తమ మార్కులు సాధించేందుకు ప్రతీ ఒక్క రూ శ్రమిస్తుంటారు. వారికి టీచర్లు తోడ్పాటు అందిస్తారు. ఈ క్రమంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కూడా ఈ ఏడాది పది, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నూ నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలనే ఆశయంతో సమగ్రశిక్ష అధికారులు ప్రణాళికలు రూపొందిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా అన్ని కేజీబీవీ విద్యాలయాలలో దాదా పు సిలబస్‌లు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నా రు. జిల్లాలోని 26 చొప్పున్న కేజీబీవీ పాఠశాల లు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పదో తరగతిలో 973 మంది, ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరంలో 750 మంది, సెకండియర్‌లో 750 వార్షిక పరీక్షల్లో హాజరు కానున్నారు. గతేడాది పదో తరగతి విద్యార్థులు 92 శాతం ఫలితాలతో రాష్ట్రంలో జిల్లా పదో స్థానం సాధించింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 79 శాతం ఫలితాలు సాధించి పదో స్థానంలో నిలవగా సెకెండియర్లో 93 శాతం ఫలితాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియెట్, మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది సుమారు అన్ని విద్యాలయాల్లో వంద శాతం ఫలితాలు సాధన కోసం విజయ పథం పేరుతో సమగ్రశిక్ష వంద రోజుల ప్రణాళికలు రూపొందించింది. కేజీబీవీ విద్యాలయాల్లో చదువుతున్న ఫస్టియర్ విద్యార్థినులకు ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనున్నందున ఆయా విద్యార్థినుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది స్టేట్ సిలబస్‌లో పరీక్షలు రాసి 79 శాతంతో రాష్ట్రంలో జిల్లా పదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సీబీఎస్ఈ సిలబస్ అమలుతో విద్యార్థినుల్లో కొత్తగా అనిపించడంతో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే ఆశయం సాధ్యమవుతుందా.. అని ఇటు టీచర్లు, అటు సమగ్ర శిక్ష అధికారుల్లో కూడా అందోళన వ్యక్తమవుతోంది. కేజీబీవీ విద్యార్థినుల పట్ల ఏపీసీ, జీసీడీవో ప్రతీ రోజూ పర్యవేక్షణ చేస్తున్నారు. అన్ని పాఠశాలలు విద్యార్థినుల అభ్యసన స్థాయిపై సమీక్షలు చేపడుతున్నారు. విద్యార్థుల చదువుతో పాటు మెనూ ప్రకారం భోజనం తీరుపై గూగుల్ మీట్ ద్వారా తెలుసుకుంటున్నారు. టీచర్లు పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధతో పాటు వారి లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం. ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్, రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజుకో పాఠ్యాంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహి స్తూ విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పు డు నివృత్తి చేస్తున్నారు. ఎస్ఏ–1 పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతీరోజు రాత్రి సమయంలో రోజుకో పాఠ్యాంశంపై స్టడీ అవర్స్ నిర్వహించి మరుసటి రోజు ఉదయం ఆ సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తున్నారు. మా కళాశాలలో అధ్యాపకులు అర్ధమయ్యే రీతి లో విద్యాబోధన చేస్తున్నారు. ప్రత్యేక తరగతు ల్లో సబ్జెక్టుల్లో సందేహా లను నివృత్తి చేస్తున్నా రు. ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్నారు. ఉత్తమ మార్కులు సాధనలో కొద్దిగా భయం ఉన్నా ప్రతీ రోజు తరగతులలో రోజుకో సబ్జెక్టుపై పరీక్షలు నిర్వహిస్తున్నందున కొంత మేర భయం పోయింది. మా అధ్యాపకుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధిస్తాను. – తోట లోకేశ్వరి, ఇంటర్ ఫస్టియర్ బైపీసీ, కేజీబీవీ, బూసాయవలస కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాల సాధనకు విజయ పథం పకడ్బందీగా అమలు చేస్తున్నాం. పదో తరగతితో పాటు ఇంటర్మీడియెట్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వంద శాతం ఫలితాలు లక్ష్యంగా ప్రతీరోజు పర్యవేక్షణ చేస్తున్నాం. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం ఉంది. – ఎ.రామారావు, ఏపీసీ, విజయనగరం -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనపుడు ఫోన్‌కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ చెక్ చేసుకోవచ్చన్నారు. నోటీసులు, ఎండార్స్‌మెంట్‌ను వాట్సాప్‌లో అందజేస్తు న్నామని, ఎండార్స్‌మెంట్‌ను రిజస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్‌గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలని అన్నారు. కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి ‘మీ కోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సంప్రదింవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమ్యలను పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు. -
శ్రీరామనామ సంకీర్తనతో మార్మోగిన రామతీర్థం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామివారి దేవస్థానం శ్రీరామనామ సంకీర్తనతో ఆదివారం మార్మోగింది. స్వామి సన్నిధిలో పలువురు భక్తులు సహస్ర శ్లోకీ రామాయణ పారాయణం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరాకాండ హోమాన్ని జరిపించారు. ఉత్సవమూర్తుల వద్ద స్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించిన అనంతరం భగవత్ రామానుజ దాస బృందానికి చెందిన భక్తులు సహస్ర శ్లోకి రామాయణం 72వ ఆవృతం, శ్రీమన్నారాయణ వైభవం 70వ ఆవృతం పారాయణం చేశారు. ఈ సందర్భంగా బృంద సభ్యుడు శ్రీమాన్ కందాల రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు సింహాచలం, శ్రీకూర్మం, పద్మనాభం, తదితర దివ్య క్షేత్రాల్లో పారాయాణాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసర ఆందోళన చెలరేగకుండా పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. స్క్రబ్ టైఫస్పై సమగ్ర సమాచారం అంది స్తూ ఈ వ్యాధి సమయానికి గుర్తిస్తే 100 శాతం నయమవుతుందని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మైట్స్ కాటు ద్వారా వచ్చే ఈ జ్వర వ్యాధి లక్షణాలను వివరాల ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి గుర్తించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా పీహెచ్సీ, సీహెచ్‌సీలో పరీక్ష చేయించుకుంటే అక్కడే ఉచితంగా అందే మందులతో పూర్తిగా నయమవుతుందని ఆలస్యం చేయొద్దని హెచ్చరించారు. అదనంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారిని వెంట నే పీహెచ్సీ లేదా సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించాలని ఆదేశించారు. స్క్రబ్ టైఫస్ భయపడాల్సిన వ్యాధి కాదని జాగ్రత్తలు పాటి స్తే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడికి కలిస్తే సులభంగా నయమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. విజయనగరం అర్బన్: హిందీ భాషాభిమానుల వేదికగా పేరొందిన హిందీ మంచ్ జిల్లా శాఖ కొత్త కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక పూల్‌బాగ్‌లోని సరస్వతి శిశుమందిర్‌లో జరిగిన ఎన్నికల సభలో జిల్లా అధ్యక్షులుగా ఏలూరు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా నందివాడ చిన్నాదేవి, గౌరవాధ్యక్షురాలుగా పి.ఉమాబాల, సహాధ్యక్షురాలుగా భోగరాజు సూర్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్ర కార్యదర్శి కోనే శ్రీధర్ ఎన్నికల సమన్వయకర్త గా వ్యవహరించారు. సంఘం కార్యదర్శిగా కె.రోజా, కె.శారదా పద్మావతి, ఉపాధ్యక్షులుగా ఆశాపు చంద్రారావు, విజయలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా సాలూరు సంతోషి, వై.సూర్యకుమారి, శ్రీదేవి ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా కె.సుబ్బారావు, గౌరవ సలహాదారుగా దవళ సర్వేశ్వరరావును ఎంపిక చేశారు. -
ధాన్యం దళారుల పాలు..!
●గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో ఓ రైతు నుంచి దళారి 61 బస్తాల ధాన్యం కొనుగోలు చేశాడు. 80 కేజీల బస్తాకుగాను 82 కేజీల 300 గ్రాముల చొప్పున తీసుకున్నాడు. అంటే బస్తా వద్ద 2కేజీల 300 గ్రాములు అదనంగా తీసుకున్నారు. 80 కేజీల బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.1895 చెల్లించాలి. కాని రూ.1750 మాత్రమే రైతుకు చెల్లించారు. ●విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో కూడా ఓ రైతు నుంచి దళారి 20 క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేశాడు. క్వింటాకు 100 కేజీల ధాన్యం తీసుకోవాల్సి ఉండగా సదరు దళారి 5 కేజీలు అదనంగా తీసుకున్నాడు. క్వింటాకు రూ.2369 చెల్లించాల్సి ఉండగా రూ.1800 మాత్రమే చెల్లించాడు. -
వాళ్ల పింఛన్లు ఆపేయండి..!
●గంట్యాడ మండలం వసాది గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి ఎర్రయ్యమ్మ భర్త లక్ష్మీనారాయణ ఏడాది క్రితం మరణించాడు. అతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. దీంతో అతని భార్య మరుసటి నెల స్పౌజ్ కోటా కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసింది. పింఛన్ మంజూరుకు సంబంధించి ఐడీ కూడా వచ్చింది. కాని ఆమెకు టీడీపీ నేతలు చెప్పారని అధికారులు పింఛన్ నిలిపివేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 8 నెలలుగా ఆమె పింఛన్ కోసం అధికారులను అడిగినా ఫలితం లేకుండా పోయింది. ●గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సారిక కళావతి భర్త పోలయ్య 2025 ఏప్రిల్ నెలలో మరణించాడు. అతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. దీంతో ఆమె స్పౌజ్ కోటా కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసింది. ఈమెకు వితంతు పింఛన్ మంజూరైనట్టు ఐడీ కూడా వచ్చింది. అయితే ఈమెకు కూడా టీడీపీ నేతలు చెప్పారని అధికారులు మంజూరైన పింఛన్ నిలిపివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా టీడీపీ నేతలు కూడా మేమే పింఛన్లు నిలిపివేసినట్టు ప్రచారం చేసుకుంటున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. గంట్యాడ: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతవుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సింది పోయి వారిని మరింత క్షోభకు గురిచేసే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. వితంతు పింఛన్ ఇచ్చి వారిని ఆదుకోవాల్సింది పోయి పసుపు కండువా కప్పుకుంటెనే పింఛన్ మంజూరు చేస్తామని టీడీపీ నేత లు బహిరంగంగానే చెబుతున్నారు. వితంతవుల పట్ల కూడా టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. మీరు మా కండువా కప్పుకోలేదు కాబట్టి మీ పింఛన్లు నిలిపివేశామని వితంతువుల వద్ద టీడీపీ నేతలు అన్నట్టు తెలుస్తుంది. లోకల్ లీడర్లను కలవండంటూ ఉచిత సలహాలు టీడీపీ నేతలకు వంతపాడే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లు ఏది చెబితే దానికి తలాడించే విధంగా నడుచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా సమస్య వస్తే తమ ఉద్యోగులకు ఎసరు వస్తుందనే విషయాన్ని ఉద్యోగులు తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా వారికి వితంతు పింఛన్ ఎందుకు మంజూరు కావడంలేదని డీఆర్డీఏకి చెందిన ఓ అధికారిని వితంతు బంధువు అడగ్గా లోకల్టీడీపీ లీడర్లను కలవాల్సింది కదా.. అని ఉచి త సలహా ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి కొండపల్లి ఇలాకాలోనే... మంత్రి కొండపల్లి ఇలాకా అయిన గంట్యాడ మండలంలో టీడీపీ నేతలు ఇలా వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ఉన్నారు.. మనల్ని ఆపేది ఎవడు.. అన్న విధంగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్స్, పాఠశాలల వాచ్మెన్లు, ఆయాలను, కేజీబీవీ ఆయా, వెలుగు వీవోఏలను తొలిగించేశారు. ఇప్ప డు పింఛన్‌దారులను కూడా వదలడం లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఫించను మంజూ రు చేయలేదు. వృద్ధాప్య పింఛన్ వచ్చే వ్యక్తి మరణిస్తే అతని భార్యకు భాగస్వామి పింఛన్ కింద ఇచ్చే వితంత పింఛన్ మంజూరులోనూ టీడీపీ నేత లు రాజకీయం చేస్తున్నారు. తమ కండువా వేసుకు ని తమతో తిరిగితేనే పింఛన్ మంజూరు చేస్తామని బాధితులకే బరి తెగించి చెబుతున్నారు. చంద్రబా బు ప్రభుత్వంలో రాజకీయ సిఫార్సులు, పసుపు కండువాలు వేసుకోవాలని బరితెగింపుగా చెప్పడం పట్ల జనం మండిపడుతున్నారు. సారికి కళావతి, ఎర్రయ్యమ్మ వితంతు పింఛ న్ల కోసం వచ్చిన దరఖాస్తులను అప్రూవల్ చేసి డీఆర్డీఏకు పంపించాం. అక్కడ ఏ సమస్యతో ఆగిందో తెలియదు. దీనిపై రెండుసార్లు డీఆర్డీఏకు లేఖ కూడా రాశాం. ఉన్నత అధికారుల కు పంపించామని వారు చెబుతున్నారు. – ఆర్.వి.రమణమూర్తి, ఎంపీడీవో -
పెరుగుతున్న ప్రకృతి సాగు
● ఆరోగ్యకరమైన జీవితం..సారవంతమైన భూమిభామిని: గ్లోబల్ వార్మింగ్ నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు భూ సారవంతాన్ని కాపాడి ఆరోగ్యం పంచే ప్రకృతి వ్యవసాయం వైపు పార్వతీపురం మన్యం జిల్లాలో జోరుగా అడుగులుపడుతున్నాయి. సుస్థిర వ్యవసాయ విధానాల వైపు రైతుల దృష్టి మరల్చి ప్రకృతి సాగు ప్రయోజనాలు వివరణతో పూర్తి స్థాయిలో సుస్థిర వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తున్నారు. మరోవైపు మిశ్రమ సాగు పద్ధతిలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతి అమలు చేస్తూ పాక్షికంగా మిశ్రమ పంటల సాగుకు ప్రోత్సహిస్తూ నిరంతర ఆదాయ వనరులు కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో క్రిమిసంహారక మందుల వాడకం, రసాయన ఎరువులతో కలిగే నష్టాలు వివరిస్తూ ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి సాగు సిబ్బంది రైతుల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.శ్రావణ్‌కుమార్ నాయుడు తెలియజేశారు. ఆర్గానిక్ కార్బన్ పెరుగుదల నివారించి భూమిశుద్ధి చేసే కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు. భూమి పొరల్లోని సూక్ష్మజీవులు,వానపాములను కాపాడడంతో పాటు భూసారాన్ని పెంచేందుకు సహకరించే సుస్థిర పద్ధతులను అలవరుస్తున్నామన్నారు. నవధాన్యాల సాగు పద్ధతిలో నిత్యం భూమిపై పచ్చదనం పెంచుతున్నట్లు వివరించారు. ప్రకృతి సాగులో విధానాలు.. ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడ,మూత్రంలో ద్రవామృతాలు,అందుబాటులోని ఆకులు,అలములతో కషాయాల తయారీతో ప్రకృతి వ్యవసాయం చేయించడాన్ని అలవర్చుతున్నారు. రైతుకు పంట పెట్టుబడి తగ్గించి,నికర ఆధాయానికి ఢోకా లేకుండా ఆరోగ్యవంతమైన వ్యవసాయం అలవర్చడం భూసారాన్ని కాపాడేందుకు సీడ్‌బాల్స్ పోలాల్లో జల్లించడంతో వర్షాకాలంలో అన్ని రకాల మొలకలు వచ్చి భూమి సారవంతాన్ని కాపాడుతుంది.నవధాన్యాల సాగు పేరున పది రకాల పంటలను పండించి అన్ని వేళల్లో పొలాల్లో పచ్చని పంటలు ఉండేలా పండిస్తున్నారు.సూర్యమండలం పేరున కూరగాయలు,ఆకుకూరలు,చిరుధాన్యాల,ఆహార పంటలు వేసే విధానం విస్తృతం చేస్తున్నారు. మహిళా సంఘాలకు ప్రోత్సాహం.. ఆరోగ్యకరమైన వాతావరణం,భూ సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. క్రిమిసంహారకాలు, రసాయనాలు వాడకుండా నివారిస్తున్నాం. అంతరించి పోతున్న పంటలను పునరుద్ధరించడం, భూ పొరల్లో సారవంతం పోకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించడానికి మార్గం సుగమం చేస్తున్నాం. .. ఎం.శ్రావణ్‌కుమార్,డీపీఎం,ఏపీసీఎన్ఎఫ్,పార్వతీపురం మన్యం జిల్లా -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌కు తీవ్రగాయాలు
కురుపాం: కురుపాం–గొరడ ప్రధాన రహదారిలో బుడ్డెమ్మ ఖర్జ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఆదివారం సాయంత్రం ఢీ కొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు గోళ్ల గౌరీశంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలం నుంచి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించగా వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్య సేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బుడ్డెమ్మఖర్జ గ్రామంలో శుభకార్యానికి వెళ్లి స్వగ్రామం పట్టాయి దొరవలసకు ఫీల్డ్ అసిస్టెంట్ తిరిగి వెళ్లిపోతుండగా బుడ్డెమ్మఖర్జ సమీపంలో కురుపాం నుంచి కొల్లిగూడ గ్రామానికి వెళ్తున్న పి.మహేష్ తన ద్విచక్రవాహనంతో ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి గౌరీశంకర్ చెవి, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
13మంది అగ్నివీర్‌కు ఎంపిక
చీపురుపల్లి: రన్‌మిషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 13 మంది యువకులు ఒకేసారి అగ్నివీర్ జవాన్లుగా ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన కంది హేమంత్ అనే ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి రన్‌మిషన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. రన్‌మిషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రతిరోజూ శరీరదారుఢ్యంలో శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు పరీక్షలకు సంబంధించిన సూచనలు, పుస్తకాలు కూడా ఇస్తున్నారు. రన్‌మిషన్ నేతృత్వంలో గతంలో కూడా ఎంతో మంది యువత సీఐఎస్ఎఫ్, కానిస్టేబుల్, ఆర్మీ, ఐటీబీపీ వ్యవస్థల్లో ఉద్యోగాలు సాధించారు. తాజాగా 13 మంది యువత అగ్నివీర్‌కు ఎంపికయ్యారు. హేమంత్ సెలవు రోజుల్లో యువతకు శిక్షణ ఇస్తుండగా ఆయన విధి నిర్వహణలో ఉన్న సమయంలో అసిస్టెంట్ కోచ్ నవీన్ యువతకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. తాజాగా అగ్నివీర్‌కు ఎంపికై న యువతను రన్‌మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించారు. ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష● పరీక్షకు 97.92 శాతం హాజరు విజయనగరం అర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రతిభా పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 డివిజన్ల పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో 4,094 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 97.92 శాతంతో 4,009 మంది హాజరయ్యారు. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లోని పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహణను డీఈఓ యూ.మాణిక్యం నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని సాఫీగా నిర్వహించామని తెలిపారు. మూడు షాపుల్లో చోరీరాజాం సిటీ: పట్టణ నడిబొడ్డున తిరుమలనగర్‌లో ఆదివారం వేకువజామున రెండు సెల్సాయింట్లు, టైలరింగ్ షాపుల్లో దొంగతనం జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం యథావిధిగా దుకాణాలకు వచ్చిన యజమానులు తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని చూసి ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. ఒక సెల్‌పాయింట్‌లో ఉంచిన ముప్పావు తులం బంగారంతో పాటు, రూ.10వేలు, మరో సెల్‌పాయింట్‌లో రూ.15వేలు అపహరణకు గురయ్యాయని బాధితులు పోలీసులు వద్ద వాపోయారు. అలాగే టైలరింగ్ షాపులో ఏమీ దొరకపోవడంతో బట్టలు చిందరవందరగా పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీపీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. ఆలయంలో చోరీ కేసులో ఇద్దరి అరెస్టుబొబ్బిలి: మండలంలోని పిరిడి గ్రామంలోని శాంకరిమాత ధ్యానమందిరంలో పుస్తెలతాడు,శతమానాలు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నవంబరు 5న శాంకరిమాత ధ్యానమందిరంలో భక్తులుగా ధ్యానం చేస్తున్నట్లు నటించి అక్కడే ఉన్న బంగారు పుస్తెల తాడు, శతమానాలను దొంగిలించారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులైన సీతానగరం మండలానికి చెందిన పోల భాస్కర్‌రావు, శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన సవర సూర్యంలను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. వారిద్దరూ గతంలో సీతానగరం మండలంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలోను వెండివస్తువుల దొంగతనానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని,జిల్లాలో పలు దొంగతనాల్లో వారి పాత్ర ఉందని తెలియజేశారు. -
వాటర్‌ఫాల్స్‌లో పడి యువకుడి మృతి
రామభద్రపురం: చేతికి అందివచ్చిన కొడుకు హఠాత్తుగా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఘోష అంతా ఇంత కాదు. కంటికీమింటికీ ఏకధారగా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. మండలకేంద్రానికి చెందిన యువకుడు ఆదివారం స్నేహితులతో కలిసి పిక్నిక్కు సాలూరు మండలంలోని కురికూటి వద్ద గల దళాయివలస వాటర్ ఫాల్స్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు లోయలో పడి మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలోని కోవెల వీధికి చెందిన గర్భాపు హరి బలరామకృష్ణ(26) కీర్తన గోల్డ్ లోన్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో పిక్నిక్కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. స్నేహితులతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని దళాయివలస వాటర్ ఫాల్స్ దగ్గరకు పిక్నిక్కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం సమయం వరకు సరదాగా గడిపాడు. మధ్యాహ్నం భోజన సమయంలో చేతులు కడుక్కుని వస్తానని స్నేహితులకు చెప్పి కింద లోయలోకి దిగాడు.ఇంతలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందకు పడిపోయాడు. ఎంతకీ రాకపోవడంతో స్నేహితులు వెళ్లి వెతకగా కనిపించలేదు. దీంతో దగ్గరలో ఉన్న గిరిజన వ్యక్తులను పిలిచి విషయం చెప్పారు. ఓ గిరిజన వ్యక్తి లోయలోని నీటిలోకి దిగి చూడగా హరి బలరామకృష్ణ నీటిలో దొరికాడు వెంటనే స్నేహితులు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబసభ్యులకు జరిగిన విషయంపై సమాచారం ఇచ్చారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రిలో మృతదేహాన్ని ఉంచారు.తండ్రి గోవిందరావు తాపీమేసీ్త్రగా పనిచేస్తుండగా తల్లి మగమ్మ గృహిణి. -
నెల్లిమర్ల టు విజయవాడ
● దుర్గమ్మ దర్శనానికి మూడోసారి సైకిల్ యాత్ర నెల్లిమర్ల రూరల్: భక్తి, దీక్ష, సంకల్ప బలానికి ప్రతీకగా నిలుస్తూ నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి, అలుగోలు గ్రామాలకు చెందిన భవానీ భక్తులు మూడోసారి సైకిల్ యాత్రకు పయనమయ్యారు. ఒమ్మి గ్రామంలో అమ్మవారి నామస్మరణతో, భక్తి నినాదాల నడుమ ఈ యాత్ర ప్రారంభమైంది. 41 రోజుల పాటు భవాని అమ్మవారి దీక్షను నిష్టగా నిర్వర్తించిన భక్తులు అంబళ్ల అప్పలనాయుడు, కోరాడ గోవర్ధన్‌లు గురుస్వామి నారాయణరావు ఆధ్వర్యంలో ఇరుముడి ధరించి సైకిళ్లపై విజయవాడకు బయలుదేరారు. ఇప్పటికే రెండు సార్లు సైకిల్‌పై వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నామని, సుమారు 480 కిలోమీటర్లు యాత్రను మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. లోక కల్యాణార్థం..హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఏటా ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గురుస్వాములు కురిమినేని నారాయణరావు, అంబళ్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రతకు ప్రాధాన్యం
● సిబ్బందితో ఎస్పీ దామోదర్ సెట్ కాన్ఫరెన్స్ విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ దామోదర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ దామోదర్ ఆదివారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారి భద్రత నియమాలను ప్రజలు తప్పక పాటించాలని ప్రమాదాల నియంత్రణకు సిబ్బంది భద్రతాచర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు,. వాహనదారులకు రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు వాహనం తాలూకా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలి. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రమాదాలు జరిగినప్పటికీ స్వల్పగాయాలతో ఎలా ప్రాణాలతో భయటపడవచ్చునో ద్విచక్ర వాహనదారులకు వివరించాలని కోరారు. ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భద్రత, మోటార్ వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. కాషనరీ బోర్బులు ఏర్పాటు చేయాలి రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్‌కు ఇరువైపులా కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్‌లో భాగంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులపై 19,077 కేసులు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై 2370 కేసులు, మైనర్లు వాహనాలను నడిపిన కారణంగా వాహన యజమానులపై 1020 కేసులు, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై 5510 కేసులు, గడిచిన 20 రోజులలో మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు శిక్ష పడిందన్నారు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 17,246 కేసులు నమోదు చేశామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. -
కవి అంటే భ్రష్టయోగి
● పచ్చడం పుస్తకావిష్కరణలో వాగ్గేయకారుడు గోరటి వెంకన్నరాజాం: కవి అంటే సాఫీగా జీవితాన్ని గడిపే వ్యక్తి కాదని, ఒక భ్రష్టయోగి అని వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఈ మేరకు ఆదివారం రాజాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాజాం రచయితల వేదిక నిర్వహించిన 11 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పచ్చడం పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. కవిలోపల భావాలెంతో గొప్పవని వెల్లడించారు. అతిశయాలు కవులకు శాపమని, పసితనమే కవులకు బలమని వివరించారు. ఈ సృష్టిలో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి వంటివి సౌందర్యవంతమైనవేనని, వాటిని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి స్వేచ్ఛగా ఆస్వాదించే అవకాశం లేకుండా రాజులు, భూ స్వాములు, పెత్తందారీలు, నిజాందారులు అణగదొక్కుతుంటే వాటి నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయగలిగేవే కవితలని పేర్కొన్నారు. జీవితం నుంచే కవిత్వం వస్తుంది. స్వప్నయోగంలో కవిత్వాలు పుడతాయి. ధూర్జటి, పోతన, కాళిదాసు వంటి కవులు మొదలుకుని ఈకవుల పరంపర కొనసాగుతోందని తెలిపారు. పరోపకారం కవి లక్షణమన్నారు. ఆకలి, దైన్యం, పేదరికం వంటివి చూసి, రాజులను ధిక్కరించేవి కవిత్వాలు. విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గురజాడ వంటివారందరూ పరోపకారానికి సంబంధించి కవితలు రాశారని వివరించారు. అటువంటి వారసత్వం నుంచి వచ్చినవారమే తామంతా అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ఎప్పటినుంచే కవులు రాజ్యధిక్కార కవితలు రాశారని గుర్తుచేశారు. పోరాటాలు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర పోరాటాలకు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర అని గోరటి వెంకన్న వెల్లడించారు. ఇక్కడ ఎన్నో పోరాటాలు కవుల నుంచి పుట్టుకొచ్చాయని, కవులు అంటే హాయిగా జీవితం గడిపేవారుకాదని పేర్కొన్నారు. క్షామంతో అల్లాడిపోతున్న పేదరికం కవి లక్షణమని, సంప్రదాయాన్ని, దైవత్వాన్ని ఎత్తుకుని ఆ పరంపరను కొనసాగించాలని, మానవత్వ విలువలు పెంచాలని, ఎప్పటికప్పుడు తనకు తాను కరిగిపోయి కవి నైతిక విలువలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. బుద్ధభగవానుడు పుట్టకుంటే దయ, జాలి వంటివి ఉండేవి కావేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి, రామలింగారెడ్డి, రంగమాచార్యులు, వేరుచూరి నారాయణరావు, పిల్లా తిరుపతిరావు, గార రంగనాథం వంటివారు తమ పద్ధతిలో తాము రచనలు చేస్తున్నారన్నారు. ప్రశంసలకు దూరంగా ఉన్నవారే మంచి కవిత్వాలు రాయగలరన్నారు. రాజాంలో రచయితల వేదిక 11 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం, 11 పుస్తకాలు ఆవిష్కరించడం చాలా ఆనందించదగిన విషయమన్నారు. రచయిత పిల్లా తిరుపతిరావు రచించిన పచ్చడం పుస్తకాన్ని రారవే నిర్వాహకులు సభలోని సభ్యులకు పరిచయం చేశారు. గోరటి వెంకన్న గొప్పతనాన్ని వివరించారు. పచ్చడం పుస్తకంలోని విశేషాలు వివరించారు. ఈ పుస్తకానికి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇన్చార్జ్ హెచ్ఎం బీవీ అచ్యుతరావు దంపతులు ఆర్థికసాయం అందించారని వెల్లడించారు. రచయిత తిరుపతిరావు తాను రచించిన పుస్తకంలోని సాహిత్య వ్యాసాలు వివరించారు. పలువురికి సత్కారం అనంతరం గోరటి వెంకన్నను రారవే సభ్యులు సత్కరించారు. పుస్తక రచయిత తిరుపతిరావును రారవే సభ్యులు, గోరటి వెంకన్న, స్నేహితులు, బంధువులు సత్కరించారు. పుస్తకావిష్కరణకు సహకరించిన అచ్యుతరావుతో పాటు ఆయన కుటుంబసభ్యులను రాజాం అమృత హాస్పిటల్ వైద్యురాలు సూర్యశైలజను అభినందించారు. అంతకుముందు సమతం మహేశ్వరరావు సమావేశాన్ని ప్రారంభించగా, డాక్టర్ ఆల్తి మోహనరావు, శ్రీనివాసరావు తదితరులు స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరానికి చెందిన రచయిత చీకటి దివాకర్, రాజాం రచయిత వెలుగు రామినాయుడు, మజ్జి మదన్మోహన్, రాజాం పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన రచయితలు, కవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇందువదన..కుందరదన
చీపురుపల్లి: అదో పల్లెటూరు. అక్కడ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి దేశ స్థాయిలో జరిగే 42వ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన కిలారి ఇందు పదో తరగతి చదువుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో జరిగే టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో ఎన్నో బంగారు పతకాలు సాధించింది. ఇందుకు చిన్న వయస్సు నుంచే టెన్నికాయిట్పై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావు నాణ్యమైన తర్ఫీదు ఇచ్చి మట్టిలో మాణిక్యాన్ని వెలికితీశారు. దీంతో ఇందు కోచ్ రామారావు వద్ద అకుంఠిత దీక్షతో శిక్షణ పొందుతోంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి కిలారి ఇందు మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో వ్యవసాయ వృత్తిలో ఉన్న గొల్ల, భారతి దంపతుల కుమార్తె. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు టెన్నికాయిట్ క్రీడలో రాణిస్తోంది. నవంబర్ 26 నుంచి 30 వరకు జమ్ముకశ్మీర్‌లో జరిగిన 42వ జాతీయ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న ఇందు ఉత్తమ ప్రతిభ కనపిరిచి బంగారు పతకం సాధించింది. కోచ్ రామారావు ప్రత్యేక శ్రద్ధతో పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావుకు క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. దీంతోనే పల్లెటూరిలో చదువుతున్న పిల్లలను చక్కగా తీర్చిదిద్దుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే దిశగా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కిలారి ఇందు టెన్నికాయిట్‌లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించింది.రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధించిన పతకాల ఇందుఅంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవాలి కేరళలో 2027లో జరగనున్న అంతర్జాతీయ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో భారతదేశం తరఫున పాల్గొని విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దీనికి కోచ్ రామారావు ప్రోత్సాహం పూర్తిగా ఉంది. ఆయన శిక్షణతోనే జాతీయ స్థాయి వరకు ఆడగలిగాను. అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ అవడమే నా లక్ష్యం. కిలారి ఇందు, జాతీయ క్రీడాకారిణి, పెదనడిపల్లి పల్లెలో మెరిసినన ‘బంగారుతల్లి’ పేదింటిలో పుట్టి ఆటల్లో దేశస్థాయిలో గుర్తింపు మట్టిలో మాణిక్యాన్ని తీర్చిదిద్దిన కోచ్ రామారావు టెన్నికాయిట్‌లో రాణిస్తున్న ఇందు అంతర్జాతీయ పోటీలకు సిద్ధం -
రాజ్యాంగం స్ఫూర్తితో సాగుదాం
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజలందరి కోసం రచించిన రాజ్యాంగం స్ఫూర్తితో ముందుకు సాగుదామని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, చెప్పిన మాటలను ఆచరించడమే ఆయనకు మనమిచ్చిన ఘన నివాళిగా పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని విజయనగరంలోని జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ భారత దేశం ముద్దుబిడ్డ అని కొనియాడారు. మానవాళి ఉన్నంత వరకు తన ఆశయాల రూపంలో అంబేడ్కర్ సజీవంగా ఉంటారని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు బుంగ భానుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించారు. 41 రోజుల పాటు ఉపవాస దీక్షతో గడిపారు. దైవనామస్మరణలో తరించారు. శబరి చేరుకుని మొక్కుబడి చెల్లించారు. తిరుగు ప్రయాణంలో నలుగురు భక్తులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. ఒకరిని ఆస్పత్రిపాల చేసింది. కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. దత్తిరాజేరు/గజపతినగరం: అయ్యప్పమాల ధరించి శబరి వెళ్లి.. తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలోని రామనారాయణపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం తెల్లవారు జామున ఆగి ఉన్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొనడంతో దత్తిరాజేరు మండలం కె.కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు, మరుపల్లికి చెందిన ఒక అయ్యప్ప భక్తుడు మృతి చెందారు. కె.కొత్తవలస అయ్యప్ప సన్నిధి నుంచి ఈ నెల 1వ తేదీన వంగర రామకృష్ణ(54), మరడ రాము(50), మార్పిన అప్పలనాయుడు(31)తో పాటు గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు రామచంద్రరరావు (35), గజపతినగరానికి బెవర శ్రీరాం ఇరుముడి కట్టుకొని కారులో శబరి బయలు దేరారు. 4వ తేదీన శబిరిలో అయ్యప్పకు మొక్కుచెల్లించారు. వచ్చేదారిలో కారు పక్కకు నిలిపి విశ్రాంతి తీసుకుంటుండగా వెనుక నుంచి మరో కారు ఢీ కొనడంతో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలు గురు మృతిచెందగా, డ్రైవర్ బెవర శ్రీరాం రామేశ్వరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ● గురుస్వామిగా పేరుపొంది... మృతుడు రామకృష్ణ 20 ఏళ్లుగా అయ్యప్ప మాలధారణ చేస్తున్నారు. కొత్తవలస గ్రామంలో గురుస్వామిగా పేరు పొందారు. వడ్రంగి పనిచేస్తూ భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు భవాని, లతతో పాటు వృద్ధురాలైన తల్లి సూరమ్మను పోషిస్తూ వస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు దైవదర్శనానికి వెళ్లి మృతిచెందడంతో విలపిస్తున్నారు. కుటుంబానికి దిక్కెవరంటూ భార్య లక్ష్మీ బావురమంటోంది. ● అనాథగా మారిన కుటుంబం మరుపల్లికి చెందిన బండారు రామచంద్రరావు మృతితో కుటుంబం అనాథగా మారింది. ఆయనకు భార్య సత్యవతితో పాటు తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీనివాస్, మూడేళ్ల పాప శ్రీసహిత ఉన్నారు. ● కూలీ కుటుంబంలో మృత్యుఘోష రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరడ రాము కూలిచేస్తేనే ఇల్లుగడిచే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అయ్యప్పస్వామిపై ఉన్న భక్తితో మాలధారణ చేశారు. ఇంటి పెద్ద దిక్కును మృత్యువు కాటేయడంతో భార్య పైడితల్లి, కుమారుడు ప్రసాద్, వృద్ధురాలైన తల్లి సింహాచలం విషాదంలో మునిగిపోయారు. మృతి చెందిన అయ్యప్ప భక్తులు అయ్యప్ప భక్తులను కాటేసిన మృత్యువు తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం నలుగురు మృతి.. ఒకరికి తీవ్రగాయాలు విషాదంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా... కె.కొత్తవలస నుంచి మొదటిసారి అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మార్పిన అప్పలనాయుడు(31)కు మూడేళ్ల కిందటే మేనమామ కూతురు గాయత్రితో వివాహం జరిగింది. పిల్లల కోసం దైవసేవలో ఉండగా మృత్యువు కాటేయడంతో భార్య రోదిస్తోంది. అప్పలనాయుడు అక్క అప్పలనర్సమ్మ కూలి పనులకు వెళ్లి చైన్నెలో లారీ ఢీకొనడంతో మృతి చెందింది. మేనమామ గంజి త్రినాఽథ్ కొడుకు కూడా 2018 ఆర్మీకి ఎంపికై విశాఖపట్నంలో స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఇప్పుడు రెండు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న అప్పలనాయుడు మృతితో తల్లిదండ్రులు రాములమ్మ, తిరుపతి, అత్త మామలు గంజి త్రినాథ్, లక్ష్మి కన్నీరుకార్చుతున్నారు. -
రైతన్నను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కారు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు బొబ్బిలి: విద్య, వైద్య రంగాలను ప్రైవేటుపరం చేయడం.. తన అనుయాయులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టడంతో పాటు రైతన్నను సైతం చంద్రబాబు ప్రభుత్వం నట్టేటముంచుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బొబ్బిలిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వరి రైతుల నుంచి క్వింటా వద్ద 5 నుంచి 10 కిలోలు అదనంగా దోచుకుంటున్నా పాలకులు స్పందించకపోవడం విచారకరమన్నారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు నష్టపోయారన్నారు. ప్రజలను, రైతులను నిత్యం మోసగిస్తూ పోతే ఊరుకునేది లేదని, ప్రజా గొంతుకై నినదిస్తామని, వారి పక్షాన పోరాడతామన్నారు. అసమర్థ యంత్రాంగాన్ని రోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. చెరకు పంటకు కర్మాగారం యాజమాన్యమే మద్దతు ధర నిర్ణయించడం దారుణమన్నారు. గతంలో జేసీ ఆధ్వర్యంలోని కమిటీ ధర నిర్ణయించేదని చెప్పారు. రైతుల పక్షాన జర్నలిస్టులు కూడా వెళ్లి క్షేత్ర పర్యటన చేసి సమస్యలు తెలుసుకోవాలన్నారు. విత్తన సరఫరాలో లోపాలున్నాయి.. విపత్తుల సమయంలో పరిహారాల్లేవు.. ఎరువు కష్టాలు వెంటాడుతున్నా పట్టించుకోవడం లేదు.. అన్నదాత సుఖీభవ రూ.20వేలకు రూ.10వేలు చేతిలో పెట్టారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. వైఎస్సార్ సీపీ హయాంలో జిల్లాలోని 2.50 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిందని, ఎరువులు, విత్తనాల సరఫరాతో ఉచిత పంటల బీమా పథకం వల్ల రైతులకు సకాలంలో పరిహారం అందిన విషయం గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో అరటి, మామిడి, మొక్కజొన్న, పత్తి, ధాన్యం రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. మిల్లర్లు, ప్రభుత్వ యంత్రాంగం కుమ్మకై ్క ధాన్యం రైతుల నుంచి అదనంగా వసూలుచేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన రైతుల వద్ద ఒకలా, మిల్లర్ల వద్ద మరొకలా అదనపు ధాన్యం గురించి మాట్లాడడంతో వారు రైతులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. పల్లెలు, పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోందని, బొబ్బిలి ఎమ్మెల్యేకు మద్యం బెల్ట్ షాపుల నుంచి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇంటి గోపాలరావు, ఆర్థిక మండలి రాష్ట్ర మాజీ సభ్యుడు తూముల భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాయుధ దళాల నిధికి విరాళాలను అందించాలి
పార్వతీపురం: సాయుధ దళాల పతాక నిధికి విరివిగా విరాళాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాయుధ దళాల పతాక నిధి స్టిక్కర్స్, ఫ్లాగ్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశమంతా గర్విస్తుందన్నారు. దేశం కోసం ఎంతో మంది సైనిక సోదరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రాణత్యాగం చేసిన అమరులు ఎంతో మంది ఉన్నారన్నారు. సైనికులకు మనమంతా ఎంతో రుణపడి ఉన్నామని, వారి త్యాగాలకు ఎవరూ విలువ కట్టలేరన్నారు. పతాక నిధికి వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు, పౌరులు, ఉద్యోగులు విరాళాలను అందించాలని కోరారు. ఈనెల 7న సాయుధ దళాల దినోత్సవం నిర్వహించుకోన్నట్లు తెలిపారు. విరాళాలను డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరున ఎస్బీఐ అకౌంట్ నంబర్ 33881128795, ఐఎఫ్ఐసీ కోడ్:ఎస్బీఐఎన్ 0016857కి అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. డీఆర్ఓ హేమలత -
దివ్యాంగుల జీవితాల్లో ‘గురుదేవా’ వెలుగులు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కొత్తవలస: వివిధ ప్రమాదాలు, పోలియో, కుష్టు వ్యాధితో అవయవాలు కోల్పోతున్నవారి జీవితాల్లో గురుదేవా చారిటబుల్ ట్రస్టు వెలుగులు నింపుతోందని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. మంగళపాలెం సమీపంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టును కలెక్టర్ శని వారం సందర్శించారు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయారీ యూనిట్ విభాగాలను పరిశీలించారు. కృత్రిమ అవయవాలను వినియోగిస్తున్న దివ్యాంగులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం దైవసేవగా భావించాలన్నారు. అతి తక్కువ ఖర్ఛుతో కృత్రిమ అవయవాలు తయారుచేసి అందజేయడం గొప్పవిషయమన్నారు. దివ్యాంగులకు సేవచేసే భాగ్యం గురుదేవాకు దక్కిందన్నారు. ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబును ప్రత్యేకించి అభినందించారు. ఈ సేవలు కొనసాగించేందుకు తనవంతు సహకారం అందస్తానని తెలిపారు. కార్యక్రమంలో కొత్తవలస తహసీల్దార్ పి.సునీత, ఆర్ఐ షణ్ముఖరావు, తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి రైస్ మిల్లుపై చర్యలు ● డీ ట్యాగ్ చేసిన అధికారులు విజయనగరం ఫోర్ట్: రైతుల నుంచి అదనంగా ధాన్యం డిమాండ్ చేస్తున్న రైస్ మిల్లును పోర్టల్ నుంచి డీ ట్యాగ్ చేశారు. శ్రీకేవీర్ వరలక్ష్మి రైస్ ఇండసీ్త్ర మిల్లు యాజమాన్యం అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నారని చీపురుపల్లి మండలానికి చెందిన రైతులు యల్లంటి సూర్యారావు, బూరాడ రమణ, తుంపల్లి త్రినాథ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం విచారణలో నిజమని తేలడంతో జేసీ సేతుమాధవన్ చర్యలు తీసుకున్నారు. రైస్ మిల్లుకు తదుపరి ధాన్యం కేటాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. 1800 కేజీల పేదల బియ్యం పట్టివేత సాలూరు రూరల్: సాలూరు మండలం సారిక గ్రామంలో అక్రమంగా తరలించేందుకు ఆటోలో సిద్ధంగా ఉన్న 1800 కేజీల పేదల బియ్యంను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సతీష్, సిబ్బంది శనివారం పట్టుకున్నారు. ఒడిశాకు అక్రమంగా తరలిస్తుండగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. నిందుతులు జంపా సురేష్, కొర్ర మహేంద్రపై కేసు నమోదుచేసి బియ్యాన్ని తహసీల్దార్‌కు అప్పగించామని తెలిపారు. -
అన్నక్యాంటీన్లో ఉడకని భోజనం
నెల్లిమర్ల: పట్టణంలోని అన్నక్యాంటీన్లో శనివారం ఉడికీ ఉడకనీ భోజనం వడ్డించారు. పొంగల్ బదులు వెజిటబుల్ బిర్యానీ, బంగాళాదుంప కూర, మజ్జిగ వడ్డించారు. వెజ్బిర్యానీ పూర్తిగా ఉడకలేదు.దీంతో భోజనం తిన్న పట్టణవాసులు నిర్వాహకులపై చిందులు వేశారు. ఉడికీ ఉడకనీ బిర్యానీ ఎలాపెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది తినకుండానే డస్ట్‌బిన్‌లో పడేశారు.ఇదే విషయమై నిర్వాహకులను సాక్షి ఫోన్లో సంప్రదించగా బిర్యానీ పూర్తిగా ఉడకలేదన్నది నిజమేనని ఒప్పుకున్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామని చెప్పారు. నిర్వాహకులపై పట్టణవాసుల చిందులు -
ఘనంగా హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం
● డీపీఓ నుంచి మహిళా పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ, మానవహారంవిజయనగరం క్రైమ్: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ సేవలు క్రియాశీలకమని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, హోంగార్డ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించి, పోలీసుశాఖకు, ప్రజలకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హెూంగార్డ్స్ అంతర్గత భాగమన్నారు. పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులను నిర్వహిస్తూ, పోలీస్‌శాఖలో క్రియాశీలకంగా మారారన్నారు. హోం గార్డులు నీతి, నిజాయితీ, అంకితభావంతో, క్రమశిక్షణతో పని చేసి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకుని రావాలని, తద్వారా రాష్ట్ర పోలీసుశాఖకు కూడా మంచి కీర్తిని తీసుకు వచ్చే విధంగా పని చేయాలని సూచించారు. అనంతరం, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన హెూంగార్డ్స్కు, పరేడ్ నిర్వహణలో ప్రతిభకనబర్చిన హోంగార్డ్స్కు ఎస్పీ బహుమతులను ప్రదానం చేశారు. హెూంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవాతు నిర్వహించగా, పరేడ్ కమాండర్‌గా ఎం.శివ సంతోష్ వ్యవహరించారు. హెూంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవానికి సూచికగా శాంతి కపోతాలను, బెలూన్స్‌ను ఎస్పీ ఏఆర్.దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఎగురవేశారు. నగరంలో ర్యాలీ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని ఎస్పీ ఏఆర్.దామోదర్ పచ్చ జెండా ఊపి, ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి దిశ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించి, మానవ హారంగా ఏర్పడి, హెూంగార్డ్స్ విధులు, సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సీఐలు ఆర్వీఆర్కే చౌదరి, ఈ.నర్సింహమూర్తి, సీహెచ్. సూరినాయుడు, బి.లక్ష్మణరావు, టి.శ్రీనివాసరావు, ఆర్ఐలు ఆర్.రమేష్ కుమార్, ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాసరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, కార్యాలయ పర్యవేక్షకులు లలితకుమారి, వెంకటలక్ష్మి, ఆర్ఎస్సైలు ముబారక్ అలీ, మంగలక్ష్మి, సూర్యనారాయణ, రామకృష్ణ, ఇతర పోలీను అధికారులు, హెూంగార్డ్స్ ఇన్చార్జ్ హెచ్‌సీలు డీఎస్ఎన్ రాజు, కె.శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురంలో.. పార్వతీపురం రూరల్: హోం గార్డులు పోలీసు శాఖకు వెన్నెముక లాంటివారని, నేర పరిశోధన నుంచి బందోబస్తు వరకు వారి సేవలు అద్భుతమని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి కొనియాడారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం పోలీస్ మల్టీఫంక్షన్ హాల్ గ్రౌండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేడుకల్లో కేవలం మూడు రోజుల శిక్షణతోనే పరేడ్‌ను నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన సిబ్బందికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి, డీఎస్పీ థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


