breaking news
Komaram Bheem
-
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆధ్వర్యంలో రెబ్బెన మండలానికి చెంది న బీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చే యాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా బొడ్డు మౌనిక, నానవేణి మల్లేశ్, బొడ్డు రాజ్‌కుమార్, గంగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇగురపురమేశ్ బీజేపీలో చేరా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నపూర్ణ, నాయకులు సుదర్శన్‌గౌడ్, ఎలమంచిలి సునీల్ చౌదరి, కుందారపు బాలకృష్ణ, సొల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కాటేస్తున్న కరెంటు!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గొమాసి పోశయ్య. దహెగాం మండలం పీకలగుండం గ్రామానికి చెందిన ఇతను గత నెల 18న పంట చేనులో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా జిల్లాలో విద్యుత్ ప్రమాదాల్లో ఏటా జంతువులు, మనుషులు మృత్యువాత పడుతున్నారు. పెంచికల్పేట్(సిర్పూర్): జిల్లాలో విద్యుత్ ప్రమాదాల కలవరపెడుతున్నాయి. కరెంట్ తీగలు యమపాశాలుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. నివాస గృహాలతోపాటు పంట పొలాల వద్ద జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజలు తీవ్రంగా గాయపడుతున్నారు. ప్రమాదాల నివారణకు విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితం ఉండటం లేదు. దీంతో జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఎనిమిది మంది మృత్యువాతజిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల పరిధిలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు అనేక విద్యుత్ ప్రమాదాలు జరగాయి. ఎనిమిది మంది మృత్యువాత పడగా, 18 జంతువులు మృతి చెందాయి. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటివరకు విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 19 జంతువులు చనిపోయాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులు సొంతంగా ఎలాంటి పనులు చేయొద్దని, సమస్యలు ఉంటే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరుతున్నారు. జాగ్రత్తలు అవసరంవర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ పరికరాలను తడిచేతులతో తాకొద్దు. తెగిపోయిన వైర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. గ్రామ్లాలోని విద్యుత్ లైన్ల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఇంట్లోని పాత విద్యుత్ తీగలు, లైట్లు, స్విచ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసమైతే కొత్తవి బిగించాలి. ఇనుప చువ్వల దగ్గర విద్యుత్ తీగలు లేకుండా జాగ్రత్త పడాలి. కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. రైతులు పంట రక్షణకు విద్యుత్ తీగలు వినియోగించవద్దు. మోటార్లు ఆన్ చేసే సమయంలో చేతులు తడిగా ఉండకుండా చూసుకోవాలి. సమాచారం అందించాలి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వేలాడే విద్యుత్ తీగలు ఉంటే సరిచేసుకోవాలి. కాలం చెల్లిన తీగలు, బోర్డుల స్థానంలో కొత్తవి బిగించుకోవాలి. విద్యుత్ తీగలు వేలాడుతున్నా, స్తంభాలు ఒరిగిపోయి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. సొంతంగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయొద్దు. – అంజల్‌కుమార్, విద్యుత్‌శాఖ ఏఈ, పెంచికల్పేట్ -
ఇప్పటికీ చుక్క రాలే..
ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: రూ.కోట్లు వెచ్చించి ఆసిఫాబాద్ పట్టణంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చినా పలు ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్నాయి. ఐదు రోజులుగా పలు కాలనీలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పట్టణంలోని రాజంపేట కాలనీలోని ఇళ్లకు ఇప్పటివరకు చుక్క నీరు సరఫరా కాలేదు. ఆసిఫాబాద్ మండలం మోతుగూడలో 570 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఇప్పటికీ నల్లాలు బిగించలేదు. ప్రజలు బావి నీళ్లే తాగుతున్నారు. వర్షాకాలంలో నీరు కలుషితమైతే డబ్బులు పెట్టి మినరల్ వాటల్ కొనుక్కుంటున్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్లో ఆదివారం పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 317 జీవో రద్దుకు పోరాడుతామన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సునార్కర్ అనిల్, జిల్లా గౌరవ అధ్యక్షుడు నరసింహచారి, నాయకులు రాకేష్, శ్రవణ్, గంగాభవానీ, ప్రకాశ్, హన్మంతు, అనురాధాబాయి, వేణుగోపాల్, ఇందారపు ప్రకాశ్, భిక్షపతి, దేవాజీ పాల్గొన్నారు. -
రెండు నెలలుగా దాహం కేకలు
లింగాపూర్: మండలంలోని పలు గ్రామాల్లో తాగునీరు సరఫరా కావడం లేదు. మండల కేంద్రంతోపాటు కీమానాయక్ తండా, పిక్లాతండా, మోతీగూడ గ్రామాలకు రెండు నెలలుగా భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని పంచాయతీ బోరుకు నాలుగు నెలలుగా మరమ్మతు కూడా చేయించడం లేదు. ఇక మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో 50 కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సమీపంలో ఉన్న ఒకేబోరుపై ఆధారపడుతున్నారు. పిల్లలకు కనీసం స్నానాలు చేయించేందుకు నీళ్లు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుదాం
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్య తిరేక విధానాలను ఎండగడుదామని సీఐటీ యూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమి టీ రాష్ట్ర ఐదో సదస్సు నిర్వహించారు. బాలభారతి స్కూల్ నుంచి వినయ్గార్డెన్ వరకు గుస్సాడీ, ఒగ్గు డోలు, ఆదివాసీ కళాకారులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం వినయ్ గార్డెన్లో సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు ఆర్.త్రివేణి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించారు. సాయిబాబు మాట్లాడుతూ బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజన, మెడికల్ అండ్ హెల్త్ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ప్రసూతి సెలవులు, ఈఎస్ఐ, పీఎఫ్, పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు భాస్కర్, రమ, భూపాల్, వెంకటేశ్, జయలక్ష్మి, పద్మ శ్రీ, శ్రీనివాస్, రాజేందర్, కూశన రాజన్న, దుర్గం దినకర్, కార్తీక్, టీకానంద్, ఆనంద్, ఆర్.మహేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ముంచిన ‘పెన్‌గంగ’
సిర్పూర్(టి): జిల్లాతోపాటు ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర కురుస్తున్న వర్షాలకు ఈ ఏడాది పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో పెన్‌గంగ వరద పరీవాహక ప్రాంతాల్లోని పంటలను ముంచెత్తింది. సిర్పూర్–టి మండలంలోని మాకిడి, హుడ్కిలి, జక్కాపూర్, వెంకట్రావ్‌పేట్, టోంకిని, పారిగాం, లోనవెల్లి గ్రామాల రైతుల పంటలు వరదనీటిలో మునిగిపోయాయి. పత్తితోపాటు మిరప మొక్కలు రోజుల తరబడి వరదలో ఉండటంతో కుళ్లిపోయాయి. తీవ్రస్థాయిలో నష్టంసిర్పూర్–టి మండలంలో అనేక గ్రామాలు పెన్‌గంగ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. అలాగే సిర్పూర్(టి) వాగు, లక్ష్మీపూర్ వాగు, భూపాలపట్నం జీడివాగు, చీలపెల్లి వాగు, ఇటిక్యాల పహాడ్ వాగులు కూడా ఉప్పొంగాయి. ఫలితంగా మండలంలో వందల ఎకరాలు పంటలు వరదనీటిలో మునిగిపోయి రైతులు నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు 400 ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేయగా, రైతులు మాత్రం ప్రతీ గ్రామంలో పంటలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగానే నష్టపోయినట్లు వాపోతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పంట సర్వేలు నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు. రైతులను ఆదుకోవాలి కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి సకాలంలో రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. – కిర్మరే శ్యాంరావ్, హుడ్కిలి, మం.సిర్పూర్(టి) -
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలి
ఆసిఫాబాద్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ నెల 3న జిల్లా కేంద్రంలో దుర్గా, శారదామాత నిమజ్జనం సందర్భంగా శాంతి యుతంగా ఊరేగింపు చేపట్టిన బ్రాహ్మణవాడ శారదా మండలి మహిళలపై ఎస్సై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిర్వాహకులపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం కేశవనాథ మినీ ఫంక్షన్ హాల్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ఉత్సవాలపై పోలీసుల పెత్తనమెంటని ప్రశ్నించారు. డీజేలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, యువకులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన సీఐ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. శుక్రవారం రాత్రి ఏఎస్పీ చిత్తరంజన్ ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, తెల్లవారుజామున నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసభ్యకరంగా మాట్లాడిన ఎస్సైని సస్పెండ్ చేయాలని, నిర్వాహకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. దీనిపై లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితికి అఖిలపక్షం అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల సంతోష్, మాజీ ఏఎంసీ చైర్మన్లు చిలువేరు వెంకన్న, గాదెవేణి మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాండ్రే విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ బంద్..!
మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలని ఖాళీ బిందెలతో గత నెల 29న కౌటాల మండలం మొగడ్దగడ్లో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రెండు వారాలుగా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుల సమ్మెతో నీటి సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు. కౌటాల(సిర్పూర్): జిల్లాలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మిషన్ భగీరథ పథకంకింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగడంతో సరఫరాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా కొన్నిప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు శుద్ధజలం అందడం లేదు. చేతిపంపులు, బోర్లు, బావులపై ఆధారపడి దాహం తీర్చుకుంటున్నారు. వర్షాలకు బావుల్లో నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలేవి..?జిల్లాలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అసంపూర్తి పైప్లైన్లు, లీకేజీలతో పాటు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. నిధుల లేమిలో పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో క్లోరినేషన్ పనులు నిలిపివేశారు. వర్షాకాలం కావడంతో బావుల్లోని నీటిని తాగితే సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. తాగునీటి కోసం జిల్లాలోని రెండు వందలకు పైగా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు సమ్మెలో ఉన్న విషయం తెలిసినా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. -
అవ్వల్‌పేన్ పూజలకు వేళాయె
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం జోడేఘాట్‌లో సోమవారం సాయంత్రం కుమురంభీం వారసులు అవ్వల్‌పేన్(పోచమ్మ)కు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. గిరిజనుల హక్కుల కోసం నిజాం ప్రభుత్వంతో సాగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన కుమురంభీం వర్ధంతికి ముందురోజు ఈ పూజ లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నిజాం సైనికులను ఎదుర్కొవడంలో భీంకు పోచమ్మ అండగా నిలిచిందని ఆదివాసీలు నమ్ముతారు. అనేకసార్లు భీంపై పోలీసులు కా ల్పులు జరిపినా అమ్మ ఆశీస్సులతోనే ఆయన తప్పించుకునేవారని చెబుతుంటారు. మంత్ర దండం శక్తి ద్వారా తేనెటీగలను అస్త్రాలుగా ఉపయోగించేవారని, ఆముదం విత్తనాలతో తనను తాను రక్షించుకునే వారని విశ్వసిస్తారు. ఈ కారణాలతో ఏటా కుమురంభీం వారసులు, ఆదివాసీలు పోచమ్మ తల్లికి ఘనంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం జోడేఘాట్లోని భీం సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఆక్కడ జెండాలు ఆవిష్కరిస్తారు. పోచమ్మకు గొర్రెను బలి ఇచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. -
సమావేశం సక్సెస్ చేయాలి
రెబ్బెన: కాగజ్‌నగర్‌లోని వినయ్ గార్డెన్స్‌లో ఈనెల 5, 6వ తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ శ్రామిక మహిళా ఐదో రాష్ట్ర కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం కోరారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి శ్రామిక మహిళా ఉద్యమ నాయకులు, ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మ హిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఉద్యోగ తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూ పొందిస్తారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5న ఉదయం 11గంటలకు ఎస్పీఎం గ్రౌండ్ నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వర కు భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్న ట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలా ల నుంచి అధికసంఖ్యలో శ్రామిక మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యుడు చాపిడి శివ, గ్రామకార్యదర్శి డోంగ్రి గజానంద్ పాల్గొన్నారు. -
ఎండిపోయిన మొక్కలు
గతంలో హరితవనంలో భాగంగా మ్యూజియం వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో టూరిజం, అటవీశాఖ అధికారులు సుమారు 29వేల మొక్కలు నాటారు. మనిషి ఆకృతిని నిర్మించి అవయవాల వద్ద 100రకాల ఔషధ మొక్కలు నాటి వది లేశారు. ఏ అవయవానికి అవసరమయ్యే మొక్కలను వాటి వద్దే నాటగా అవి నీరు లేక ఎండిపోయాయి. ప్రస్తుతం లోటస్‌పాండ్‌లోని మనిషి ఆకృతిలో ఔషధ మొక్కల స్థానంలో పిచ్చి మొ క్కలు దర్శనమిస్తున్నాయి. గతేడాది ఉపాధిహా మీ పథకంలో నాటిన కొన్ని మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. హరితవనంలో భాగంగా నాటి న సుమారు 29వేల మొక్కల్లో ప్రస్తుతం రెండువేల మొక్కలు కూడా కనిపించడం లేదు. -
నాసిరకం మందులు విక్రయిస్తే చర్యలు
రెబ్బెన: ఫర్టిలైజర్ షాపుల్లో నాసిరకం మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాఽధికారి వెంకట్ హెచ్చరించారు. శని వారం మండల కేంద్రంతోపాటు నారాయణపూర్‌లోని ఫర్టిలైజర్ షాపులు, నారాయణపూర్ రైతువేదికలో యూరియా పంపిణీని తనిఖీ చేశారు. షాపుల్లోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో ప్రభుత్వ ధరలకే ఎరువులు విక్రయించాలని సూచించారు. రై తులకు నకిలీ, నాసిరకం మందులు అంటగట్టినా, అధికధరలకు విక్రయించినా లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తనా లు, ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు తప్పనిసరిగా రశీదులు పొందాలని సూ చించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా అవుతోందని, మోతాదుకు మించి వాడి తే భూసారం దెబ్బతింటుందని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సా రించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఆయన వెంట ఏవో దిలీప్, ఏఈవోలు రాకేశ్, సంజీవ్, శివ తదితరులున్నారు. -
మరిచారా?
రణభూమిని కెరమెరి: చరిత్ర పుటల్లోకెక్కిన ఆదివాసీ వీరుడు కు మురంభీం జల్.. జంగల్.. జమీన్.. కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రాంతమైన జోడేఘాట్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. భీం వర్ధంతి సమీపిస్తుండడంతో సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, గడ్చందూర్ తదితర ప్రాంతాలకు చెందిన ఇక్కడికి వస్తున్నారు. అయితే.. సందర్శకులకు ఇక్కడా తాగునీరు కూడా లభించని దుస్థితి ఉంది. ఒక్కగానొక్క బోరు ఉండగా అది గ్రామస్తుల తాగునీటి అవసరాలకు సరిపోతోంది. దీంతో కనీస సౌకర్యాలు లేక ఇక్కడికి వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. నెరవేరని కేసీఆర్ హామీ2014లో నిర్వహించిన భీం వర్ధంతి సభలో అప్పటి సీఎం కేసీఆర్ జోడేఘాట్‌లో రూ.25కోట్లతో కుము రం భీం విగ్రహంతో పాటు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యకు తగినట్లు కాటేజీలు, హోటళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. పదకొండేళ్లయినా నేటికీ కార్యరూపం దాల్చ లేదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి జోడేఘాట్ అభివృద్ధిని విస్మరించారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ సర్కారుదీ అదే తీరు అప్పటి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్ర స్తుత ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జోడేఘాట్‌లో రూ.4.96 కోట్లతో టూరిజం అభివృద్ధి పనులకు ఈ ఏడాది జనవరి 13న శంకుస్థాపన చేశారు. మ్యూజియం వెనుక భాగంలోని స్థలంలో కాటేజీ లు, హోటళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. తొ మ్మిది నెలలైనా నేటికీ పనులు ప్రారంభించలేదు. 12 పోరు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. పనులు ప్రారంభించాలి పాలకులు జోడేఘాట్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పర్యాటకుల కోసం కాటేజీలు నిర్మించాలి. ఐటీడీఏ ఆధ్వర్యంలో హోటళ్లు ఏర్పాటు చేయాలి. ఎండిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కలు నాటించాలి. మొక్కల సంరక్షణకు నీటి సౌకర్యం కల్పించి ఓ కూలీని నియమించాలి. పాలకులు, అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలి. – పెందోర్ రాజేశ్వర్, పోరు గ్రామాల అధ్యక్షుడు ‘కుమురం భీం మ్యూజియం నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి కోసం కాటేజీలు, మంచి హోటల్ నిర్మిస్తాం. భవిష్యత్‌లో జోడేఘాట్ చారిత్రక ప్రదేశంగా మారుతుంది. పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరుగుతుంది’ – 7.10.2014న భీం వర్ధంతి సభలో అప్పటి సీఎం కేసీఆర్ అన్న మాటలివి. -
భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఈ నెల 7న నిర్వహించనున్న కుమురంభీం వర్ధంతికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో భీం వర్ధంతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాగునీరు, విద్యుత్, రవాణా, భోజన వసతి, వైద్య సౌకర్యాలు కల్పించాలని, పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రజల కు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల ని తెలిపారు. ఆర్టీసీ అధికారులు జోడేఘాట్‌కు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రహదారులు మరమ్మతు చేయాలని, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి వర్ధంతిని విజయవంతం చేయాలని సూ చించారు. డీపీవో భిక్షపతి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రమాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్పీవో ఒమర్ హుస్సేన్, ఇంజినీరింగ్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలిపంచాయతీ ఎన్నికలు నిబంధనలకు లోబడి సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ గదులను ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 9నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉన్నందున కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ గదుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్, జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 7న విద్యాసంస్థలకు సెలవుఆసిఫాబాద్రూరల్: కుమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నెల 7న సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జోడేఘాట్‌లో కుమురం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 7కు బదులు నవంబర్ 8న రెండో శనవారాన్ని పనిదినంగా పరిగణించనున్నట్లు తెలిపారు. -
‘పాలఘోరీ’పై ప్రత్యేక నిఘా
జన్నారం: అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పాలఘోరీ ఘటన మళ్లీ పు నరావృత్తం కాకుండా ఉండేందుకు ఆశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి స మస్య ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యా రు. ఏ క్షణంలోనైనా ఆదివాసీ గిరిజనులు గుడిసెలు వేసుకునే అవకాశం ఉండడంతో అటవీశాఖ అధికా రులు అదే ప్రాంతంలో తిష్ట వేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. గుడిసెలు తొలగింపుజన్నారం అటవీ డివిజన్, ఇందన్పల్లి రేంజ్ కవ్వాల్ అటవీ సెక్షన్, సోనాపూర్ తండా బీట్ పాలఘోరీ ప్రాంతంలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు వందమంది ఆదివాసీ గిరిజనులు ఆగస్టు 4న ఈ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. అట వీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు వారికి ప లుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఆప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించారు. కానీ, వారు వెళ్లకపోగా సెప్టెంబ ర్ 18న రాత్రి సుమారు 350 టేకుచెట్లను నరికారు. అడ్డుగా వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో 26 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సహాయంతో అడవిలో వేసుకున్న గుడిసెలను తొలగించారు. ప్రత్యేక నిఘాగుడిసెలు తొలగించిన తర్వాత మళ్లీ ఎప్పుడైనా ఆదివాసీ గిరిజనులు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చే అ వకాశం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశి ష్ సింగ్ పది రోజులపాటు అక్కడే ఉండాలని టా స్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. జన్నారం అటవీ డివిజనల్ అధికారి రామ్మోహన్ ఇందన్పల్లి, జన్నారం, తాళ్లపేట్ అటవీ రేంజ్లలోని సిబ్బందికి రోజువారీగా డ్యూటీలు వేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక టీం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు మరో టీం, సాయంత్రం 7గంటల నుంచి తెల్లవారుజాము వరకు మరో టీంను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. వీరితో పాటుగా ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీకాంతచారి, టాస్క్ ఫోర్స్ రేంజ్ అధికారి శ్రీనివాస్ పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా పాలఘోరీ ప్రాంతంలోని అటవీ సిబ్బందిలో మార్పులు చేశారు. డీఆర్వో, సెక్షన్ అధికారి, బీట్ అధికారులను నూతనంగా నియమించారు. ఇక్కడి బేస్‌క్యాంపు సిబ్బందిని మరోచోటకు పంపించి కొత్తవారిని నియమించారు. విధుల్లో చిన్న నిర్లక్ష్యం ప్రదర్శించినా వేటు తప్పదని సంకేతాలు ఇవ్వడంతో కిందిస్థాయి సిబ్బంది భయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కందకాల తవ్వకంపాలఘోరీ ప్రాంతంలో విలువైన టేకు చెట్లు నరికివేతకు గురి కావడాన్ని సీరియస్‌గా తీసుకున్న అట వీ అధికారులు ఆ ప్రాంత పరిసరాల్లో చుట్టూ కందకాలను తవ్వించారు. అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను సిబ్బందికి అప్పగించారు. అయితే టైగర్‌జోన్ సర్కిల్, జిల్లా అటవీశాఖ, జన్నారం డివిజన్ శాఖ నుంచి పాలఘోరీపై నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా ఉంచాం పాలఘోరీ ప్రాంతంలో కొందరు ఆదివాసీ గిరిజనులు అక్రమంగా వేసుకున్న గుడిసెలు తొలగించాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచాం. సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశాం. అటవీ భూమిలో అక్రమంగా గుడిసెలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – రామ్మోహన్, ఎఫ్‌డీవో, జన్నారం -
దసరా జోష్
ఆసిఫాబాద్: దసరా పండుగను పురస్కరించుకుని జిల్లాలో వ్యాపారాలు జోరుగా సాగాయి. వివిధ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడాయి. పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. కిరా ణా, పండ్లు, పూలు, మాంసం దుకాణాలు కొనుగో లుదారులతో రద్దీగా కనిపించాయి. బంగారు ఆభరణాల దుకాణాలు సందడిగా మారాయి. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడపడంతో ఆర్టీసీకి రోజూవారీ ఆదాయం పెరిగింది. జోరుగా మద్యం అమ్మకాలుదసరా సందర్భంగా జిల్లాలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. గత నెల 28నుంచి ఈ నెల ఒకటి వరకు జిల్లాలోని 32మద్యం దుకాణాల్లో రూ.5.47 కోట్ల విలువైన 7.098 ఐఎంఎల్ కేసులు, 3,203 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. డిమాండ్‌ను ఊహించిన వైన్స్ యజమానులు ముందుగానే సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచారు. వ్యాపారులకు లాభాలు ప్రధానంగా మద్యం, మాంసం విక్రయాలతో పా టు షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్ దుకాణాలు ఇతర వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. బతుకమ్మ సందర్భంగా పండ్లు, పూల వ్యాపారాలు జోరుగా సాగాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 100కు పైగా మాంసం దుకాణాల్లో సుమారు రూ.కోటికి పైగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా బిజినెస్ బాగా జరిగి వ్యాపారులకు లాభాలు వచ్చాయి. ఆర్టీసీకి సమకూరిన ఆదాయందసరా సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాకు చెందిన వందలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లకు తరలివచ్చారు. వ్యాపారులు, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారంతా సొంతూళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో గత నెల 25నుంచి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు వేశారు. కాగజ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రకు ప్రయాణికుల తాకిడి పెరి గింది. సాధారణంగా ఆసిఫాబాద్ డిపోకు నిత్యం సగటున రూ.16 లక్షల ఆదాయం సమకూరుతుండగా, దసరా సందర్భంగా అదనపు ఆదాయం వచ్చింది. గత నెల 26నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు రూ.1.78 కోట్ల ఆదాయం సమకూరినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. -
కాలువల ఆనవాళ్లేవి?
బర్రెలు సేద తీరుతున్న ఈ ప్రాంతం నీటిగుంట అనుకుంటే పొరపాటే. ఇది అడ ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువకు ఉప కాలు వ. కొన్నేళ్ల క్రితం సిమెంట్ లైనింగ్ కొట్టుకుపో యి ఇలా తయారైంది. సామేలా, కోమటిగూడ, దుబ్బగూడ, కనర్గాం గ్రామాల మీ దుగా ఆసిఫాబాద్ మండలంలోని గుండా వరకు విస్తరించిన దీనికి పలు పిల్ల కాలువలు న్నాయి. పలుచోట్ల కాలువకు గండ్లు పడి అటు వైపు ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఇది 39,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన అడ ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువ. ఇటీవల కురిసిన వర్షాలకు చిన్నవాంకిడి సమీపంలో భారీ గండి పడి నీరు వాగులో కలుస్తోంది. దీంతో దిగువ ప్రాంతంలో నీటిబొట్టూ లేకుండా ఎండిపోయింది. ఏళ్లుగా కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో సిమెంట్ లైనింగ్ కొట్టుకుపోయి పిచ్చి మొక్కలు, పూడికతో నిండి అధ్వానంగా, కళావిహీనంగా మారింది. వాంకిడి: సిమెంట్ లైనింగ్ కొట్టుకుపోయి పిచ్చి మొక్కలు, తుంగ, చెత్తాచెదారం, పూడికతో నిండిన అడ (కుమురంభీం) ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలు వ అధ్వానంగా మారింది. అధికారుల నిర్వహణ లోపంతో సాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. అడపాదడప చేపడుతున్న నాణ్యతలేని మరమ్మతు పనులతో తరచూ కాలువ తెగిపోతోంది. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతు లు ఇబ్బంది పడుతున్నారు. కాలువకు సమీపంలోని పొలాలకూ చుక్క నీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. మండలంలో సాగునీటికి ప్రధాన వనరుగా ఉన్నా ఈ ఎడమ కాలువ నిర్వహణ లోపంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. 39,500 ఎకరాల ఆయకట్టు అడ ప్రాజెక్ట్‌ను 2011లో ప్రారంభించగా ప్రధాన ఎడమ కాలువను వాంకిడి మండలం గుండా నిర్మించారు. 65కిలోమీటర్ల ఈ కాలువ 39,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇది వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) మండలాల మీదుగా విస్తరించి ఉంది. అనేక ఉప, పిల్ల కాలువతో సాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కొన్ని పిల్ల కాలువలకు నీటి సరఫ రా కూడా ప్రారంభించ లేదు. కట్టలు తెగిపోవడం, గండ్లు పడటం లాంటి అవాంతరాలు ఏర్పడిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం సాగునీరు ఒర్రెలు, వాగుల్లో కలిసిపోతున్న పరిస్థితి నెలకొంది. నామమాత్రంగా ఆరుతడి పంటలుఎడమ కాలువ నిర్వహణ సరిగా లేక వరి, కూరగాయలు లాంటి పంటల సాగు నామమాత్రంగానే ఉంది. వర్షాధారంపై సాగుచేసే పత్తి పంటకు చలి కాలం చివరలో సాగునీటి అవసరముంటుంది. రై తులు ఏటా ఈ కాలువకు ఆయిల్ ఇంజన్లు పెట్టి తడులు అందించేవారు. కానీ, కాలువ బండ్ తెగిపోగా ఈసారి ఆ పరిస్థితి లేదు. బండ్‌కు మరమ్మతు చేపట్టిన తర్వాత కూడా అధిక మొత్తంలో నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా అధిక మొత్తంలో నీరు విడుదల చేస్తే కాలువ మళ్లీ కోతకు గురయ్యే ప్రమాదముంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనప్పటికీ వర్షాలు తగ్గు ముఖం పడితే గాని ప నులు ప్రారంభించలేమని అధికారులు చెబుతున్నా రు. దీంతో పత్తికి నీటి తడులు అందించడం కష్టమే. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు పత్తి రైతు చిత్తవుతుండగా, చివరలో నీటి తడులు అందించలేని పరిస్థితుల్లో మరింత నష్టపోయే ప్రమాదముంది. మరమ్మతులు చేపట్టాలి ఇటీవల కురిసిన వర్షాలకు మా గ్రామ శివారులోని ప్రధాన కాలువ తెగగా నీటి సరఫరా నిలిపేశారు. త్వరగా మరమ్మతు చేపట్టి సాగునీరు సరఫరా అయ్యేలా చూడాలి. నా పొలం పక్క నుంచే పిల్ల కాలువ ఉన్నా ఇప్పటివరకు నీరు రాలేదు. నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటే చాలావరకు ఖర్చు తగ్గుతుంది. – వడ్గురె భూషణ్, రైతు, చిన్నవాంకిడి త్వరగా పనులు చేపట్టాలి చలికాలం చివరలో పత్తి పంటకు నీటి తడులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కాలువనీరే ఆధారం. ప్రస్తుతం కాలువ తెగిపోయి ఉండగా సాగునీరు అందుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. అధికారులు కాలువను పరిశీలించి వర్షాలు తగ్గుముఖం పట్టాక మరమ్మతులు చేపడతామన్నారు. త్వరగా పనులు చేపట్టాలి. – వడ్గురె పాపాలాల్, రైతు, చిన్నవాంకిడి చిన్నవాంకిడి వద్ద తెగిన బండ్ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదతో చిన్నవాంకిడి శివారులో ఎడమ కాలువ బండ్ తెగింది. దీంతో కాలువకు నీటి సరఫరా నిలి పివేశారు. మూడేళ్ల క్రితం వరద ధాటికి అదే ప్రాంతంలో బండ్ తెగిపోగా మరమ్మతు చే యించారు. కానీ, నాణ్యత లేమితో పనులు మూడేళ్లూ నిలవలేక పోయాయి. చిక్లీ వాగు పైనుంచి కాలువ నిర్మించగా తరచూ బండ్ తెగిపోతోంది. దీనిపై ప్రాజెక్ట్ డీఈ దామోదర్‌ను వివరణ కోరగా.. బండ్ మరమ్మతుకు రూ.40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వ ర్షాలు తగ్గుముఖం పట్టాక పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అయితే మరమ్మతులు చేపడితేనే గాని ఈ కాలువ గుండా నీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. -
చోరీలతో భయం.. భయం!
కాగజ్‌నగర్‌టౌన్: చోరీలతో కాగజ్‌నగర్ పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. ఆరు నెలలుగా వరుస ఘటనలు చోటు చేసుకుంటుండగా, వారం రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని ఫారెస్ట్ లైన్‌లోని ఎస్పీఎం టీఆర్టీ– 111 క్వార్టర్లో శుక్రవారం చోరీ జరిగింది. రాత్రి 10 గంటలకు దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు సెప్టెంబర్ 29న సద్దుల బతుకమ్మ రోజు కూడా రాత్రి ఓల్డ్ కాలనీలోని డి– 111 క్వార్టర్ ఇంటి పైకప్పు పగలగొట్టి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. రెండు తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా రాత్రిపూట అగంతకులు ఇంటి తలుపులు కూడా తడుతున్నారని మహిళలు భయాందోళనలు చెందుతున్నారు. పోలీసుల నిఘా తగ్గడంతోనే దొంగలు చేతికి పని చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. కొందరు బాధితులు ఫిర్యాదు చేస్తుండగా, కొందరు మాత్రం ఫిర్యాదుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు సైతం చోరీల వివరాలు బయటకు పొక్కకుండా ఇంటి యజమానులతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తిస్థాయి నిఘా ఏది..? కాగజ్‌నగర్ పట్టణంలో 30 వార్డులు ఉండగా, 70 వేల వరకు జనాభా ఉంది. పట్టణంలో పోలీసు నిఘా కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రిళ్లు కాసేపు పోలీసులు వాహనం తిప్పి ఫొటోలు తీసుకోవడం తప్ప పూర్తిస్థాయిలో నిఘా పెట్టడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. గతంలో చోరీలు చేసిన నేరస్తులను పట్టుకోకపోవడం, కేసుల్లో పురోగతి లేకపోవడంతో వారే మళ్లీ ఇక్కడే చోరీలు చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా పట్టణంలోని ఎస్పీఎం క్వార్టర్స్ ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. ఇళ్ల చుట్టూ చెట్లు ఏపుగా పెరిగి పెరిగాయి. సిర్పూర్ పేపర్ మిల్లులో ఇతర ప్రాంతాలైన బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఒక్కో క్వార్టర్లో 10 నుంచి 15మంది గ్రూప్‌లుగా ఉంటున్నారు. ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు చేయడం లేదో తెలియని పరి స్థితి నెలకొంది. రాత్రి సమయంలో ఓల్డ్ కాలనీ, న్యూకాలనీ క్వార్టర్లలో అపరిచితులు తిరుగుతున్నారని కాలనీల ప్రజలే చెబుతున్నారు. పోలీసులు నిఘా పెంచి చోరీలు అరికట్టాలని కోరుతున్నారు. నాలుగు టీంలు ఏర్పాటు చేశాం కాగజ్‌నగర్ పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రిపూట గస్తీ పెంచుతాం. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకుంటాం. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్ -
ప్రజలకు విజయాలు చేకూర్చాలి
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్ఆసిఫాబాద్: విజయ దశమి ప్రజలకు విజయాలు చేకూర్చాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఆయుధ పూజ, వాహన పూజ, శమీపూజ నిర్వహించారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ విజయదశమి పర్వదినం ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులు తమ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను దైవ స్వరూపంగా భావించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది స్నేహపూర్వకంగా అలయ్ బలయ్ నిర్వహించి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎస్పీ, ఏఎస్పీని ఎత్తుకుని సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు అంజన్న, పెద్దన్న, సీఐ బాలాజీ వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఆర్ఎస్సైలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆత్మగౌరవం, సమానత్వమే లక్ష్యంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. కేవీపీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న కేవీపీఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. అనేక ఉద్యమాలు, పోరాటాలతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పవన్, మల్లేశ్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి కార్తీక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తదతరులు పాల్గొన్నారు. -
ప్రయాణ భారం!
ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్దసంఖ్యలో వినియోగించుకుంటున్నారు. దీంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు తగినన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నా లగ్జరీ, లహరి వంటి బస్సులు, రైళ్లలో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ జిల్లా కేంద్రంలోని డిపో నుంచి 58 ప్రత్యేక బస్సులు నడిపింది. ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేశారు. డిపోలో 81 సర్వీసులు జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో 81 బస్సు సర్వీసులు ఉండగా, 75 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. వీటిలో రెండు లహరి, 14 లగ్జరీ, రెండు డీలక్స్, 10 ఎక్స్‌ప్రెస్, మిగిలినవి ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. డిపోలో 320 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 125 మంది కండక్టర్లు, 118 మంది డ్రైవర్లు, 77 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రతిరోజూ డిపో ఆదాయం రూ.18 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు సమకూరుతోంది. నిత్యం 36,516 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, వీరిలో 25,366 మంది సీ్త్రలు, 11,150 మంది పురుషులు ఉంటున్నారు. మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో 200 కోట్ల మహిళలు వినియోగించుకున్న నేపథ్యంలో జూలైలో ఆర్టీసీ ప్రత్యేక సంబురాలు నిర్వహించింది. ఇక డిపో పరిధిలో సుమారు 2 లక్షల మహిళలు ప్రయాణించగా, రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వయా కాగజ్‌నగర్‌తో సమయం వృథా.. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ 14 సూపర్ లగ్జరీ సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం ఏడు సర్వీసులు, రాత్రి ఏడు సర్వీసులు ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు నిత్యం రాత్రి సర్వీసుల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రాత్రి సర్వీసుల్లో కేవలం రెండు బస్సులు మాత్రమే నేరుగా హైదరాబాద్ వెళ్తుండగా, మిగిలిన సర్వీసులు వయా కౌటాల, కాగజ్‌నగర్, గోలేటి నుంచి వెళ్తున్నాయి. దీంతో నేరుగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. బస్సు చార్జీ అధికం కావడంతోపాటు వారి సమయం కూడా వృథా అవుతోంది. లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సంఖ్య పెంచడంతోపాటు జిల్లా కేంద్రం నుంచి నేరుగా నడిచే సర్వీసులు మరిన్ని అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 150 కిలోమీటర్లకు మించి నడపరాదు. ఆసిఫాబాద్ డిపో నుంచి కొత్త సర్వీసుల కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జిల్లా కేంద్రం నుంచి త్వరలో కొత్త సర్వీసులు ప్రారంభిస్తాం. – రాజశేఖర్, ఆర్టీసీ డీఎం, ఆసిఫాబాద్ 68 శాతం మహిళలే.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో 68 శాతం మహిళలే ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం వారికి కేవలం ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా, కొన్ని రూట్లలో ఆ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే మహిళలు ఎక్స్‌ప్రెస్‌లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఉచిత పథకం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లగ్జరీలో చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. రద్దీకి అనుగుణంగా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సంఖ్య పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అంబరాన్నంటిన దసరా సంబురం
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం దసరా వేడుకలు సంబురంగా జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయి మందిర్, కేస్లాపూర్ హనుమాన్ మందిర్ ఆవరణలో పెద్దఎత్తున వాహన పూజలు చేశారు. కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వద్ద అర్చకులు ఇందారపు మధుకర శర్మ, నిమ్మకంటి మహేశ్‌శర్మ, వారణాసి శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో శమీ పూజ నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణాసుర వధకు లక్కీడిప్ ద్వారా శ్రీరామ చంద్రుడిని ఎంపిక చేశారు. శ్రీరామచంద్రుడిగా ఎంపికైన పట్టణానికి చెందిన చిలుకూరి రాధాకృష్ణాచారిని బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బుల్లితెర దర్శక, నిర్మాత దండనాయకుల సురేశ్‌కుమార్, ఆలయ కమిటీ అధ్వక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు శాలువా, పూలదండలతో సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రావణాసురుడి ప్రతిమను రాధాకృష్ణాచారి చేతుల మీదుగా దహనం చేశారు. పెద్దఎత్తున టపాసులు పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. బుల్లితెర దర్శక, నిర్మాత సురేశ్‌కుమార్ మాట్లాడుతూ చెడును జయిస్తూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. సాంస్కృతిక కళాకారులు అన్వేశ్, గౌరీశ్, భవానీ ఆలపించిన భక్తిగీతాలు అకట్టుకున్నాయి. సాయి మందిరంలో అర్చకులు ఇందారపు మధుకర శర్మ, సాయిశర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సాయి బాబా ఉత్సవ విగ్రహాలతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్‌పై ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు దంపతులు శమీ వృక్షానికి పూజలు చేశారు. అనంతరం ఏఎస్పీ చిత్తరంజన్ రావణసుర దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. త్రిశూల్ పహాడ్‌పై ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణస్వామి, దుర్గామాతలను దర్శించుకున్నారు. భక్తులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సీఐ ప్రేంకుమార్, ఆలయ కమిటీ సభ్యులు మహవీర్ ప్రసాద్లోయ, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్, ప్రేమకుమార్, అగర్వాల్, పవన్ బల్దేవ్, అరుణ్‌లోయ పాల్గొన్నారు. -
పరిశుభ్రతకు సమయం కేటాయించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయం పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో గురువారం స్పెషల్ క్యాంపెయిన్ 5.0ను ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ స్పెషల్ క్యాంపెయిన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, సమాజంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజలు సమయం కేటాయిస్తే పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరిగూర పీవో మచ్చగిరి నరేందర్, ఏజీఎం కృష్ణమూర్తి, డీజీఎంలు ఉజ్వల్‌కుమార్, మదీనాబాషా, సీహెచ్‌పీ ఎస్ఈ కోటయ్య, ఏఎస్వో శ్రీధర్, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అర్హులకు ఇన్సెంటివ్ చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): అర్హులైన ప్రతీ కాంట్రాక్టు కార్మికుడికి ఇన్సెంటివ్ చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. కోల్ ట్రాన్స్‌పోర్టు లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గోలేటి సీహెచ్‌పీ దారిలో రాస్తారోకో చే పట్టారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమన్యం ఇటీవల ప్రకటించిన స్పెషల్ ఇన్సెంటివ్ రూ.5500 ఇప్పటికీ చాలా మంది డ్రైవర్లు, క్లీనర్లకు అందలేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏరియా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్సై వెంకట్‌కృష్ణ, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని ఏఐటీయూసీ నాయకులతో మాట్లాడారు. అర్హులకు ఇన్సెంటివ్ అందిస్తామని సింగరేణి అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏఐటీయూసీ నాయకుల రాస్తారోకోతో బొగ్గు సరఫరా లారీలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, కార్మికులు అశోక్, సతీశ్, రాజశేఖర్, రాజలింగు, శ్రీకాంత్, శ్రీనివాస్, రవీందర్, రాజన్న, వెంకటేశ్, హనుమంతు, శ్యాంరావు, విష్ణువర్థన్, గోపాల్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు అవగాహన
ఆసిఫాబాద్‌రూరల్: వృత్తివిద్య కోర్సులో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, డిజిటల్ ఫొటో స్టూడియోను సందర్శించారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సెలవులో వృత్తివిద్య కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్ షిప్లో భాగంగా ప్రత్యక్షంగా ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని పొందారని పేర్కొన్నారు. ఈ శిక్షణ జీవితంలో సొంతంగా రాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనర్ రాజు, సులోచన పాల్గొన్నారు. -
గాంధీ చూపిన మార్గంలో నడుద్దాం
ఆసిఫాబాద్: మహాత్మా గాంధీ చూపిన శాంతిమార్గంలో నడుద్దామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి శివకుమార్, తహసీల్దార్ రియాజ్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ స్పెషల్ సబ్‌జైలులో గాంధీ జయంతి పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన పొరపాట్లతో కుటుంబాలకు దూరంగా ఉండి శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో గాంధీ బాటలో నడవాలని సూచించారు. జైలులో ఖైదీలకు మెరుగైన సేవలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, డిప్యూటీ జైలర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
అధిక వర్షాలతో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: గత నెలలో కురిసిన అధిక వర్షాలతో బెల్లంపల్లి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి సాధించలేకపోయామని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌లో ఏరియాకు 2లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేషించగా అధిక వర్షాల కారణంగా ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడి కేవలం 74 వేల టన్నులు మాత్రమే సాధించామన్నారు. దీంతో కేవలం 37 శాతం ఉత్పత్తిని మాత్రమే సాధించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏరియాలో మోతాదుకు మించి వర్షాలు కురిసాయన్నారు. గతేడాది ఈ సమయానికి 1,207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి 1,829 నమోదైందన్నారు. గడిచిన మూడు నెలల్లో 93 రోజుల్లో 64 రోజులు వర్షాలే పడ్డాయని మిగిలిన 29 రోజుల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేయగలిగామన్నారు. అయినప్పటికీ ఉత్పత్తి, ఉత్పాదకతలో ఏరియా 83 శాతంలో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వర్షాలతో కోల్పోయిన ఉత్పత్తిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మహిషాసురమర్ధిని అవతారంలో అమ్మవారు
రెబ్బెన: దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత బుధవారం మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఇందిరానగర్‌లో గల కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో ప్రధాన అర్చకులు దేవార వినోద్‌స్వామి, ఆలయ ఆస్థాన అర్చకులు పూసాల మహేష్ శాస్త్రి ఆధ్వర్యంలో మహాచండీయాగం నిర్వహించారు. మహిషాసురమర్థిని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దుర్గామాత సన్నిధిలో విశ్వప్రసాద్‌రావు గోలేటిలో ఏర్పాటు చేసిన దుర్గామాతను డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నంబాల మాజీ సర్పంచ్ సోమశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం రవీందర్, కిషన్‌గౌడ్, పూదరి సాయికిరణ్, పర్వతి సాయికుమార్, పస్తం పోషం, తదితరులు పాల్గొన్నారు. -
‘గిరిజనులకు అనుకూల రిజర్వేషన్లు ఇవ్వాలి’
తిర్యాణి: ఐదో షెడ్యూల్ కిందికి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికల రిజర్వేషన్లు గిరిజనులకు అనుకులంగా ఇవ్వాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు తాము వ్యతిరేకించడం లేదని, ఐదో షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల్లో మాత్రం గిరిజనులకే అవకాశం కల్పించాలని కోరారు. లక్కీ లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను నిర్ణయించడం సరైనా పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఐదో షెడ్యూల్లోని ప్రాంతాల్లో రిజర్వేషన్లను మార్చకుంటే ఈనెల 8న హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సర్మేడి కుర్సింగ మోతీరాం, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు వెడ్మ భగవంత్‌రావు, నాయకులు నర్సింగరావు, ధర్ము, తదితరులు పాల్గొన్నారు.‘అమృత్ భారత్’కు హాల్టింగ్కాగజ్నగర్టౌన్: అమృత్ భారత్ రైలుకు సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు గురువారం జెండా ఊపి హాల్టింగ్ కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ నుంచి చర్లపల్లి స్టేషన్ వరకు ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారని తెలిపారు. ఈ రైలులో 11 జనరల్, 8 స్లీపర్ కోచ్‌లు ఉంటాయన్నారు. ఈ రైలును సామాన్య, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకోసం ప్రవేశపెట్టినట్లు ఆయ న పేర్కొన్నారు. కాగజ్‌నగర్, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట్ మీదుగా చర్లపల్లి వరకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రయాణికులకు రైలు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కౌటాల: రైతులకు యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకట్ అన్నారు. బుధవారం కౌటాల, ముత్తంపేట్, శీర్షా గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి రికార్డులు, ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేకుండా చూస్తామన్నారు. అన్ని సహకార సంఘాలు, ప్రైవేట్ దుకాణాలకు యూరియా పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయాధికారుల సమక్షంలోనే యూరియా పంపిణీ చేయాలన్నారు. యూరియాతో పాటు రైతులకు ఇతర లింక్ ఎరువుల బస్తాలు కలిపి ఇవ్వకూడదన్నారు. రోజు వారీగా స్టాక్ వివరాలు నోటీస్ బోర్డులో రాయాలన్నారు. ఆయన వెంట ఏవో ప్రేమలత, డీలర్లు ఉన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలి
ఆసిఫాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల పోలీస్స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, సీజ్ చేసిన క్రైమ్ వెహికిల్స్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డ్‌ని తనిఖీ చేస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను ఎస్హెచ్ఓను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతీ కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ బాధితులకు అండగా నిలవాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల నిషేధిత పదార్థాలు, అక్రమ మద్యం, రవాణా, అక్రమ డబ్బుల చలామణిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామాల్లో చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థల్లో, పనిస్థలాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్టేషన్ పరిధిలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ బాలాజీ వరస్రసాద్, ఎస్సైలు ఉన్నారు. -
చెడుపై మంచి సాధించిన విజయం
త్రిశూల్ పహాడ్‌పై రావణాసురుని ప్రతిమఆసిఫాబాద్అర్బన్: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటామని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి బుధవారం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మంచిమార్గాన్ని ఎంచుకుని జీవితంలో పైకిరావాలని, సమాజబాగు కోసం పాటుపడాలని సూచించారు. సన్మార్గంలో నడిచిన వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో ముందుండాలన్నారు.ఆసిఫాబాద్: విజయానికి ప్రతీకగా నిలిచే దసరా ఉత్సవాలను గురువారం వైభవంగా జరుపుకునేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5:30 గంటలకు మార్కండేయ స్వామి ఆలయ సమీపంలో, అనంతరం కేస్లాపూర్ హన్మాన్ ఆలయంలో షమీపూజ నిర్వహించనున్నారు. అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భూమి చదును చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టం, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జవర్దస్త్ కళాకారులు అన్వేశ్, గౌరీష్, సింగర్ భవానిచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం సాయి ఉత్సవ విగ్రహంతో నగర సంకీర్తన, జోలి భిక్ష నిర్వహించనున్నారు. ఆలయంలో ఉదయం కాకడ హారతి, మంగళస్నానం, పంచామృత అభిషేకం, సామూహిక అఖండ సాయి సచ్చరిత పారా యణం, పుస్తక పూజ, మంత్ర పుష్పం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్రిశూల్ పహాడ్‌పై రావణ దహనానికి ఏర్పాట్లు కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్పహాడ్పై రావణాసుర ప్రతిమను దహనం చేయనున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌తో పాటు పలువురు హాజరు కానున్నారు. భక్తుల సౌకర్యార్థం త్రిశూల్పాహడ్పై విద్యుత్దీపాలను అలంకరించారు. రోడ్డు వెంట విద్యుత్‌లైట్లు, వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని చదును చేశారు. అలాగే సౌంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. -
దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
ఆసిఫాబాద్‌అర్బన్: సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని, చెడుపై మంచి సాధించిన విజ యానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం విజయదశమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా దసరా నిలుస్తుందని, షమీపూజ చేసిన ఆకును బంగారంగా తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచికంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం పండుగ ప్రత్యేకమన్నారు. దసరాను ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. -
బీఆర్ఎస్లో చేరిక
ఆసిఫాబాద్: నార్నూర్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివా సంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు చేయాలన్నా నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో చౌహాన్ యశ్వంత్‌రావు, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మర్సుకోల సరస్వతి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
కెరమెరి: కుమురంభీం వర్ధంతి కార్యక్రమానికి రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కుమురంభీం మనవడు కుంరం సోనేరావు, కమిటీ చైర్మన్ లాల్శావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఐటీడీఏ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జోడేఘాట్ వెళ్లే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, మీటింగ్ స్థలం వద్ద షెడ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, జైనూర్ ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు. కేశవనాథుడి శోభాయాత్రఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ శ్రీ కేశవనాథస్వామి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం చివరిరోజు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గజవాహనంపై ఉంచి పట్టణ వీధుల గుండా భాజాభజంత్రీల మధ్య, భక్తి పాటలతో శోభాయాత్ర నిర్వహించారు. స్వామి వారికి భక్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంగళహారతి, మహా మంత్రపుష్పం, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు వైరాగడే మనోజ్‌కుమార్, సభ్యులు నిమ్మకంటి సుగుణాకర్, వైరాగడే ప్రతాప్, పరండె సాయి, ప్రవీణ్, వెంకట్, రవీందర్, అభయ్ ఆచార్య, శేషగిరి, గోపాల్, శ్రీనివాస్, బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు. -
సొంత ఊళ్లో జరుపుకోవడం ఇష్టం
ఆసిఫాబాద్‌అర్బన్: దసరా పండుగను సొంత ఊళ్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి జరుపుకోవ డం చెప్పలేని సంతోషంగా ఉంటుంది. కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వద్ద సాయంత్రం జమ్మిచెట్టుకు పూజ చేసి జగన్మాతను ఆహ్వానించిన తర్వాత మంగళహారతి ఇస్తారు. ఆ తర్వాత జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాం. 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా దసరా మాత్రం ఇక్కడే జరుపుకుంటాం. ప్రతిఒక్కరి జీవితం విజయాలతో ముందుకు సాగాలి. – నాగబాల సురేశ్‌కుమార్, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
సింగరేణి క్రీడాకారులు పతకాలు సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు కోలిండియా పోటీల్లో పతకాలు సాధించాలని డీజీఎం ఉజ్వల్‌కుమార్ బెహా రా అన్నారు. డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ వార్షిక క్రీడల్లో భాగంగా మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్లో నియర్‌బై ఏరియా క్యారమ్స్, చెస్ పోటీలు ప్రారంభించారు. డీజీఎం మాట్లాడుతూ కోలిండియా పోటీల్లో రాణించి సింగరేణికి గుర్తింపు తీసుకురావాలన్నారు. క్రీడానైపుణ్యాలు మెరుగుపర్చుకోవా లని సూచించారు. ఈ సందర్భంగా గతంలో కోలిండియాలో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు సన్నద్ధం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో పత్తి దిగుబడులు మరి కొద్దిరోజుల్లో రైతుల చేతికి అందనున్నాయి. దీంతో సీసీఐ ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. దిగుబడి అధికంగా వచ్చే ప్రాంతాలను గుర్తించి, రైతులకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉండేలా ఏడు కేంద్రాలను గుర్తించి సీసీఐకి నివేదికలు పంపించారు. ఆయా కేంద్రాల్లో వేబ్రిడ్జిలు, కంప్యూటర్లు, ఇతర వసతుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోళ్లు చేపట్టనుండగా, రైతులు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకుండా, రైతులు కూడా రోజుల తరబడి నిరీక్షించకుండా నిర్దేశించిన సమయంలో అమ్మకానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 3,33,779 ఎకరాల్లో సాగుజిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంట లు సాగవుతుండగా 3,33,779 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. జిల్లాలోని నేలలు పత్తికి అనుకూలంగా ఉండటంతో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది సుమారు 16లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఆసిఫాబాద్, వాంకిడి, కొండపల్లి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, జైనూర్‌లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోళ్లతోపాటు బిల్లుల చెల్లింపు కోసం ఆధార్‌కా ర్డు, వేలిముద్రలను పరిశీలించనున్నారు. కౌలు రైతులైతే పట్టాదారుల పాస్ పుస్తకంతోపాటు ఆధార్‌కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన పత్తికి రూ.8,110గా ప్రకటించింది. 8శాతం తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర దక్కుతుంది. అంతకంటే ఎక్కువ శాతం తేమ ఉంటే ఒక్కోశాతానికి రూ.81.10 చొప్పున తగ్గించి కొంటారు. పత్తిని సక్రమంగా ఆరబెట్టి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. యాప్‌లో స్లాట్ బుకింగ్పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని రైతులు సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకుంటే వ్యవసాయ అధికారుల సాయంతోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వా త పంట అమ్మకం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. రద్దీకి అనుగుణంగా రైతులకు తేదీ కేటాయిస్తారు. నూతన విధానం కొనుగోళ్లపై ఈ నెలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. -
అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
దుర్గాదేవి అవతారంలో అమ్మవారురెబ్బెన(ఆసిఫాబాద్): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పొటెత్తారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాలతో పాటు సమీపంలోని మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలోని కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళితోపాటు ఆలయం వెనుక గుహలో ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా మంగళవారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్‌నగర్ డీఎల్పీవో హరిప్రసాద్, నంబాల మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్, నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్, గోగర్ల రాజేశ్, మాజీ ఎంపీటీసీ సంఘం శ్రీనివాస్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల నిర్వహణపై అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో 15 జెడ్పీటీసీలు, 127 ఎంపీటీసీలు, 335 సర్పంచులు, 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ విడుదల చేసిందన్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలిస్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డీటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగదు, మద్యం, చీరల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, డీపీఆర్వో సంపత్‌కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నదీమ్, ముఖ్యప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. సర్వేలెన్స్ బృందాల ఏర్పాటుఎన్నికల నిర్వహణలో భాగంగా సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మ్యాన్ పవర్, హెల్ప్‌లైన్ ఫిర్యాదుల పరిష్కారాలు, రవాణా, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సామగ్రి నిర్వహణ, ఖర్చుల పర్యవేక్షణ నిర్వహణ, పరిశీలకులు, బ్యాలెట్ పేపర్, బాక్సుల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. -
కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించా లని, వేతనాలు చెల్లించాలని గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె మంగళవారం 19వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కార్మికులు మాట్లాడుతూ చేసిన పనికి వేతనా లు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. పెండింగ్ వేతనా లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి ఆరో పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, వర్కర్లు ప్రభాకర్, వసంత్‌రావు, కోటయ్య, భరత్, శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి, ప్రమీల, తిరుపతి, దివ్య, మాన్కుబాయి తదితరులు పాల్గొన్నారు. -
పత్తిలో మత్తు పంట
కెరమెరి మండలం ఇందాపూర్ గ్రామానికి చెందిన వాడాయి పోశెట్టి పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేశాడు. పక్కా సమాచారంతో పోలీసులు సెప్టెంబర్ 23న పొశెట్టి పత్తి చేనును తనిఖీ చేశారు. రూ.13 లక్షల విలువైన 130 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కెరమెరి ఎస్సై మధుకర్ గంజాయి సాగు చేసిన పొశెట్టిపై కేసు నమోదు చేశారు.జైనూర్ మండలం జాడుగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. పది మొక్కలను స్వాధీనం చేసుకుని లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు.కౌటాల(ఆసిఫాబాద్): తక్కువ సమయంలో ఎక్కు వ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు గంజాయి సాగు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పత్తి చేలలో అంతర పంటగా పండిస్తున్నారు. అడపాదడపా పోలీసుల ఆకస్మిక తనిఖీ లు చేపడుతుండగా భారీగా గంజాయి పట్టుబడుతోంది. మొక్కలను ధ్వంసం చేసి నిందితులపై కేసు నమోదు చేస్తున్నారు. సాగు చేస్తున్న వారిలో చాలా మంది దళారులకు విక్రయిస్తున్నారు. కొంతమంది మాత్రం మహారాష్ట్ర, హైదరాబాద్, ఇతర ప్రాంతా లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విచ్చలవిడిగా అందుబాటులో ఉండడంతో యువత మత్తుకు బానిసలవుతున్నారు. విచ్చలవిడిగా వినియోగం..గంజాయి సాగు చేసి సొమ్ము చేసుకునే అవకాశం ఉండటంతో అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. దీనికి తోడు గంజాయి విక్రయదారులపై పోలీసుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్ పట్టణం, మండల కేంద్రాల్లో రాత్రివేళల్లో కొంతమంది యువత మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా జైలు శిక్ష, జరిమానాతోపాటు నార్కోటిక్ చట్టం ప్రకారం 30 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. తక్కువ మోతాదులో రవాణా చేస్తే ఏడాది జైలుతో పాటు 20 కిలోలు లభిస్తే దాదాపు ఐదేళ్ల నుంచి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. రూ.25 వేలకు పైగా జరిమానా కూడా విధిస్తారు. పంట భూముల్లో సాగుచేస్తే వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు. కేసులు నమోదు చేస్తాం గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. యువత మత్తుకు బానిసై తమ జీవితాలు నాశనం చేసుకోవద్దు. పిల్ల ల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి. పోలీసులకు ప్రజలు సహకరించాలి. రైతులు, యువతకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎండీ వహీదుద్దీన్, కాగజ్‌నగర్ డీఎస్పీ అంతర పంటగా సాగుఅడువుల జిల్లా ఆసిఫాబాద్‌లో మారుమాల ప్రాంతాలు అధికం. దీంతో కొందరు అత్యాశతో.. మరి కొందరు ఎవరికి తెలియదనే ధీమాతో గంజాయి సాగు చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. కొందరు ఏళ్లుగా అక్రమ దందాను వృత్తిగా చేసుకుంటున్నారు. పత్తి, కంది, సోయా ఇతర పంట చేలలో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారు. సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, వాంకిడి, కాగజ్‌నగర్, రెబ్బెన మండలాల్లో అత్యధికంగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పండించిన పంట హైదరాబాద్ వంటి ప్రాంతాలకు సరఫరా అవుతోంది. పోలీసు శాఖ అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టడం మినహా ఆబ్కారీ శాఖ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.41.21 లక్షల విలువైన గంజాయిని పట్టకున్నారు. గంజాయి సాగు చేస్తే సంబంధిత రైతుకు వచ్చే ప్రభుత్వ పథకాలను నిలిపేస్తామని హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. -
రిజర్వేషన్ల పంచాయితీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రా మాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరి స్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుపై పునః పరిశీలన చేయాలని విన్నవిస్తున్నా రు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యా రు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. ఎందుకీ పరిస్థితి?2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల ర్యాంకింగ్ ఇచ్చారు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జరుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్‌గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్‌గా ర్యాంకింగ్‌లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50శాతం, వంద శాతం ఎస్టీలు ఉన్నచోట్ల వారికే నోటిఫై చే యడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాంకింగ్ ఇచ్చే క్రమంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయాచోట్ల రిజర్వేషన్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణంతో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుభవించని కారణంగా మరోసారి వారికే అవకాశం కల్పించేలా జీ వో జారీ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజ నులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకున్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదా లు జరగడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆయా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు పరిస్థితి మారే అవకాశం లేదు. ఉప సర్పంచ్‌లకే పగ్గాలుసర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచ్‌లే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించే అవకాశం ఉంది.జనాభా లేకున్నా అవకాశాలు -
కుమురం భీం
9మార్గ సూచి.. ప్రయోజనకారి ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీకి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. బోధన, పరీక్షలు, సెలవులు, తదితర కార్యక్రమాల షెడ్యూల్‌ను క్యాలెండర్లో పొందుపర్చింది. ఆశలు గల్లంతు! ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులపై నేతలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కెరమెరి మండలంలో రిజర్వేషన్లు మారిపోవడంతో గిరిజనుల్లో నిరుత్సాహం నెలకొంది. ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
పల్లెల్లో స్థానిక పండుగ!
ఆసిఫాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే అధికార యంత్రాంగం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితా విడుదల చేయడంతో గ్రామాల్లో సందడి మొదలైంది. ఏళ్లుగా పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. చట్టప్రకారం రిజర్వేషన్లు కేటాయించడంతో అనేక గ్రామాల్లో మహిళా అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు. జిల్లావ్యాప్తంగా 345 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. విడతల వారీగా ఎన్నికలుజిల్లాలో 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ, 335 పంచాయతీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న తొలి విడత ఎన్నికలు, 27న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం అదేరోజు గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న నిర్వహిస్తారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 8 జెడ్పీటీసీ స్థానాలు, 71 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా, రెండో విడతలో ఏడు మండలాల్లోని 7 జెడ్పీటీసీలు, 56 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో కొనసాగుతాయి. జిల్లాలోని ఐదు మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డుల్లో మొదటి విడతలో పోలింగ్ జరుగుతుంది. రెండో విడతలో ఆరు మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలు, 992 వార్డులు, మూడో విడతలో నాలుగు మండలాల్లోని 108 గ్రామ పంచాయతీలు, 938 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రిజర్వేషన్లతో అయోమయంస్థానిక సంస్థల రిజర్వేషన్లతో జిల్లాలో ప్రముఖ నాయకులు అయోమయంలో పడ్డారు. అనుకూలమైన స్థానాల్లో పోటీ చేయాలని ఎదురుచూస్తున్న చాలామంది అంచనాలు తారుమారయ్యాయి. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ స్థానా న్ని గతంలో ఎస్టీ మహిళకు కేటాయించగా, తాజాగా బీసీ జనరల్‌కు కేటాయించారు. జిల్లాలోని బీసీ నాయకులకు రిజర్వేషన్లు కలిసి వచ్చినా జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు అనుకూలించడం లేదు. ఆసిఫాబాద్ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేయడం జిల్లా కేంద్రంలోని స్థానిక నాయకులకు సమస్యగా మారింది. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆసిఫాబాద్ జెడ్పీటీసీ, ఎంపీపీగా ఎక్కువసార్లు గెలిచిన అరిగెల నాగేశ్వర్రావు, ఆయన సోదరుడు మల్లికార్జున్‌రావుకు స్థానికంగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. వీరు పొరుగు మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన కోనేరు కోనప్ప, ఆయన సోదురుడు కృష్ణారావుకు కూడా రిజర్వేషన్లు అనుకూలించడం లేదు. సి ర్పూర్(యూ), లింగాపూర్ జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్ కాగా, జైనూర్, తిర్యాణి, రెబ్బె న, కాగజ్‌నగర్, కౌటాల బీసీలకు కేటాయించా రు. పెంచికల్పేట్, సిర్పూర్(టి) ఎస్సీ, ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం ఎస్టీలకు కేటాయించడంతో స్థానిక నేతల అంచనాలు తప్పాయి. -
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు విద్యార్థి
కాసిపేట: మండలంలోని సోమగూడెంకు చెందిన పి.మణిదీప్ జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు డీఐఈవో అంజయ్య, ఎస్జీఎఫ్ సెక్రెటరీ బాబురావు తెలిపారు. ఈ నెల 25, 26, 27వ తేదీల్లో జనగాంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి అండర్–19 ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు. మందమర్రి మోడల్ స్కూల్ సెకండియర్ విద్యార్థి మణిదీప్ అక్టోబర్ 2నుంచి 12వరకు శ్రీనగర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. విద్యార్థిని డీఐఈవో, ఎస్జీఎఫ్ సెక్రెటరీ, ఒలింపిక్ అసోసియేషన్ ఫుట్‌బాల్ సెక్రెటరీ పిన్నింటి రఘునాథరెడ్డి, కోచ్ బాదే శేఖర్ అభినందించారు. -
జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్
ఆసిఫాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్‌లో ప్రారంభమయ్యే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తూ అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, ఇతర సామగ్రి జిల్లాలోకి సరఫరా కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పెండింగ్ కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు. మట్కా, గంజాయి, పేకాట వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దన్నారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆరు నెలల పెండింగ్ కమీషన్ విడుదల చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం రేషన్ డీలర్లు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న చాలీచాలని కమీషన్‌తో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో డీలర్లకు ప్రతినెలా రూ.5వేల గౌరవ వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. హమాలీల చార్జీలు ప్రభుత్వమే భరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శేషగిరిరావు, పురుషోత్తం, ఆత్మారావు, శంకరయ్య, శ్రీనివాస్‌గౌడ్, గోపాల్, నారాయణ, విలాస్ తదితరులు పాల్గొన్నారు. -
పవర్ ప్లాంటులో ప్రమాదం
జైపూర్: పండుగపూట పవర్ ప్లాంటులో విషాదం నెలకొంది. రాత్రి విధులకు హాజరైన సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ గార్డుకు అదే చివరి డ్యూటీ అయింది. ఊహించని విధంగా గేటురూపంలో మృత్యువు కబ ళించింది. గేటు మూసి వేస్తున్న క్రమంలో ఊడిపో యి మీద పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కొచ్చెర్లకు చెంది న నరహరిశెట్టి అర్జున సారధి(56) జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో సీఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి డ్యూటీ కి వచ్చిన ఆయన ఎస్టీపీపీ అడ్మిన్ భవనం ప్రధాన గేటు వద్ద రాత్రి విధులు ని ర్వర్తిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4గంట ల ప్రాంతంలో వీల్స్ గేటు మూసి వేస్తున్న క్రమంలో ఊడిపోయి ప్రమాదవశాత్తు అతడిపై పడింది. కిందనలిగిపోయిన అర్జున సాఽరధిని తోటి సిబ్బంది గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుటికే ఆయన మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో మృతదేహాన్ని సీఐఎస్ఎఫ్ డీఐజీ, ఐపీఎస్ డాక్టర్ ఎంజీ.రాఘవేంద్రకుమార్, ఎస్టీపీపీ సీఐఎస్ఎఫ్ కమాండెంట్ చంఛల్సర్కార్ పరిశీలించారు. మృతుడికి భార్య గంగాభవాని, కుమారుడు రాజసింహాదత్తు, కూతురు తేజసాయిశ్రీ ఉన్నారు. కేసు నమోదు దర్యాప్తున్న చేస్తున్నామని ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు– 2025, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ అందించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. షెడ్యూల్ విడుదలైనందున అధికారులు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలన్నారు. హ్యాండ్ బుక్‌ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలన్నారు. సందేహాలు, అపోహలు నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీపీవో భిక్షపతి గౌడ్, డీఎల్పీవో ఉమర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ’కు ఎంపికై న ఆరాధ్య
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ఆరాధ్య స్టార్ కిడ్ విభాగంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పురస్కారానికి ఎంపికై ంది. హైదరాబాద్‌కు చెందిన రౌండ్ టేబుల్ సంస్థ చేపట్టిన ఎంపిక పోటీల్లో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అల్లాడి సురేష్–శాంతి దంపతుల కుమార్తె ఆరాధ్య లక్ష్మి అవార్డుకు ఎంపికై ంది. పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా బాలలు పాల్గొనగా తుది పోటీలకు ఆరుగురు ఎంపికయ్యారు. వారిలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ ఓటింగ్ ద్వారా చిన్నారి ఆరాధ్యలక్ష్మి ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా పురస్కారం అందుకుంది. -
అమ్మ సన్నిధిలో భక్తజనం
భైంసా/బాసర: బాసరలోని చదువుల తల్లి సరస్వతీని అత్యంత ప్రీతిపాత్రమైన మూలానక్షత్ర శుభఘడియల్లో దర్శించుకునేందుకు రాష్టం నలు మూలల నుంచి భక్తులు సోమవారం వేలసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి వేకువజామునుంచే బారులు తీరారు. దివ్యమూహూర్తాన తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ప్రత్యేక అలంకరణ...మూలానక్షత్రం పూజల కోసం బాసర ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగ ణం పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించా రు. ప్రత్యేక అలంకరణల మధ్య అమ్మవారిని స్మరి స్తూ భక్తులు దర్శనం చేసుకున్నారు. ప్రసాదల కౌంటర్ వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో కనిపించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులు కొంతమేర ఇక్కట్లకు గురయ్యారు. వ్యాసగుహ, మ హంకాళి ఆలయం వద్ద భక్తుల సందడి కనిపించింది. ఆలయంలో మధుకర దీక్షలు స్వీకరించిన మాలధారులంతా స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఉప్పొంగిన గోదావరిసోమవారం సైతం బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. గంగమ్మ తల్లి సూర్యేశ్వర ఆలయాన్ని తాకుతూ వరద నీరు ప్రవహించింది. నెల రోజులుగా బాసర వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. మూల నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు రక్షణగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ భక్తులను కట్టడి చేశారు. ఆదాయం రూ.25,65,100 బాసర: బాసర సరస్వతీ ఆలయానికి సోమవారం భారీగా ఆదాయం సమకూరింది. భక్తుల మొక్కులు, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు ద్వారా ఆదాయం వచ్చింది. రూ.వెయ్యి అక్షరాభ్యాస పూజలు 1,065 జరిపించగా.. రూ.16,05,000, రూ.150 అక్షరాభ్యాసాలు 526 ద్వారా రూ.78,900, రూ.100 మండప ప్రవేశం 1930 ద్వారా రూ.1,93,000, రూ.50 మండప ప్రవేశం 310 ద్వారా రూ.15,500, రూ.100 అభిషేకం లడ్డు ప్రసాదం 2565 ద్వారా రూ.2,56,500, లడ్డు పులిహోర ప్రసాదాలతో రూ.4,16,200 సమకూరింది. మొత్తంగా రూ.25,65,100 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.పలువురి దర్శనం...సరస్వతీ అమ్మవారిని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ అభిలాష అభినవ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్తో పాటు పలువురు దర్శించుకున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలనక్షత్రం కలిసిరావడంతో సుదూర ప్రాంతాల భక్తులు ఒకరోజు ముందుగానే వచ్చారు. -
పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని శ్రీశ్రీ నగర్‌కు చెందిన రాసపల్లి దివ్య ఇటీవల సింగరేణి కోల్‌మైన్స్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. మంచిర్యాల డివిజన్ శ్రీరాంపూర్ ఏరియాలో జీఎం ఆఫీస్ పర్సనల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దివ్య 58 కిలోల విభాగంలో 250 కిలోల బరువు ఎత్తి పతకం అందుకుంది. డిసెంబర్లో నాగ్‌పూర్‌లో జరిగే కోలిండియా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొననుంది. దివ్యను తాజా మాజీ కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ, బీ స్ట్రాంగ్ జిమ్ నిర్వాహకులు గోదారి శ్రీనాథ్, జిమ్ సభ్యులు రవి, లక్ష్మీప్రసాద్ సన్మానించారు. -
‘సద్దుల’ సంబురం
ఆసిఫాబాద్ పట్టణంలోని బాపూనగర్‌లో.. వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో బతుకమ్మలతో మహిళలుకాగజ్నగర్లోని ఎస్పీఎం మైదానంలో సంబురాలుఆసిఫాబాద్అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్/రెబ్బెన: జిల్లావ్యాప్తంగా సోమవారం సద్దుల సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు ఆడిపాడారు. గౌరమ్మలకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని వివిధ కాలనీల్లో మహిళలు అర్ధరాత్రి వరకు ఆడిపాడి బతుకమ్మలను స్థానిక పెద్దవాగులో నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంబురాలను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. రెబ్బెన మండలం గోలేటిటౌన్‌షిప్‌లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో పాటు ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి బతుకమ్మలు నెత్తిన ఎత్తుకుని ఉత్సాహపరిచారు. గోలేటిలో బతుకమ్మ ఎత్తుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పక్కన జీఎం విజయ భాస్కర్రెడ్డిబజార్వాడి హనుమాన్ ఆలయం వద్ద..కాగజ్‌నగర్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు -
దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్
ఆసిఫాబాద్‌అర్బన్: దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు భగత్‌సింగ్ తన ప్రాణాలర్పించారని డీవైఎఫ్ఐ నాయకులు టీకానంద్, కార్తీక్ అన్నారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 23 ఏళ్లకే ఉరికొయ్యను ముద్దాడి తన ప్రాణాలర్పించిన గొప్ప ధైర్యశాలి భగత్‌సింగ్ అని కొనియాడారు. అయితే స్వాతంత్య్ర భారతదేశంలో పేదలకు విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై యువత ప్రభుత్వంపై పోరా టానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ నిషేధం కోసం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకుడు దుర్గం దినకర్, డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
అమ్మకు నీరా‘జనం’
సారంగపూర్/దిలావర్పూర్: జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం గల అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాత ర మహోత్సవం ఆదివారం ముగిసింది. శనివారం దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలోగల గోదావరి నదికి అశేష భక్తజన సందోహం మధ్య అమ్మవారి ఆభరణాల శోభాయాత్ర చేరింది. ఆది వారం తెల్లవారుజామున గోదావరి నీటితో భక్తులు ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం కాలినడకన ఆయా గ్రామాల మీదుగా తిరిగి అమ్మవారి ఆలయానికి ఆభరణాలు చేర్చారు. అమ్మవారికి నగలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ముగిసింది. దారి పొడవునా ‘అమ్మ’ నామస్మరణఅడెల్లి పోచమ్మ తల్లి ఆభరణాల ఊరేగింపు శోభా యాత్ర శనివారం ఉదయం సారంగపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాడేగాం, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రి సాంగ్వి పోచమ్మ ఆలయం వరకు కొనసాగింది. అమ్మవారి ఆభరణాల వెంట వచ్చిన భక్తులు శనివారం రాత్రంతా పోచమ్మ ఆలయ పరిసరాల్లో అమ్మవారి నామస్మరణ చేస్తూ జాగరణలో పాల్గొన్నారు. ‘గంగ నీకు శరణమే.. ఘనమైన పూజలే..’ ‘ఉయ్యాలో ఉయ్యాలో.. ఊరూవాడ జంపాలో..’ ‘పోచమ్మ తల్లి చల్లంగా చూడమ్మో..’ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకుంటూ ఆటాపాటలతో ఆభరణాలను ఆదివారం తెల్లవారుజామున గోదావరి తీరానికి తీసుకువెళ్లా రు. ఊరి పెద్దలు, అమ్మవారి ఆలయ పూజారులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను గడ ముంతల్లో తీసుకుని గంగనీళ్ల జాతరకు వచ్చిన భక్తులు అమ్మవారి ఆభరణాల వెంట వెళ్లారు. సాంగ్వి ఆలయం నుంచి ఉదయం ప్రారంభమైన గంగనీళ్ల జాతర అడెల్లి దేవస్థానానికి తిరుగు పయనమైంది. ఈక్రమంలో కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభాయాత్రకు మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. జాలుక దండతో ఘనస్వాగతందిలావర్పూర్ గ్రామానికి ఆభరణాల శోభాయాత్ర చేరుకోగానే గ్రామస్తులు జాలుక దండ (భారీ పూలతోరణం) తో స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహిహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు యాట పిల్లలను (గొర్రె పొట్టేళ్లు) బహూకరించారు. శివసత్తులు పూనకాలు, నృత్యాల మధ్య ముందుకుసాగారు. దారిపొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ, కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు మొక్కు తీర్చుకున్నారు. యాకర్పెల్లి గ్రామ గంగపుత్రులు సన్నని వలతో గొడుగుపట్టి ఆభరణాలను గ్రామ పొలిమేర ల వరకు సాగనంపారు. ఆభరణాల శోభాయాత్ర, జాతరలో పాల్గొన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏఎస్పీ రాజేశ్ మీనా, నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్‌తో పాటు పలువురు ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణంగంగనీళ్ల జాతర నేపథ్యంలో అడెల్లి మహాపోచమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబా ద్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబా ద్, మెదక్, మహారాష్ట్రల నుంచి అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ తీర్థప్రసాదాలు అందించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ యంత్రాంగం, వైద్య సిబ్బంది, ఆర్టీసీ సిబ్బందికి, ఆయా గ్రామాల ప్రజలకు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో రమేశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి సేవలో పలువురుఅడెల్లి మహాపోచమ్మను మాజీ మంత్రి ఐకేరెడ్డి దర్శించుకున్నారు. యాకర్పెల్లి వద్ద ఎస్పీ జానకీ షర్మిల అమ్మవారి నగలను నెత్తినెత్తుకున్నారు. మొ క్కులు చెల్లించుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాడేగాం గ్రామంలో అమ్మవారి ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్నా రు. అమ్మవారి ఆభరణాలు దిలావర్పూర్ గ్రామాని కి చేరుకోగానే వీడీసీ సభ్యులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అడెల్లి ఆలయ డైరెక్టర్ నర్సారెడ్డి, నాయకులు జంగం వీరేశ్‌కుమార్, పాల్దె అక్షర అనిల్, గంగవ్వ ముత్యంరెడ్డి, బక్కన్న, దేవేందర్‌రెడ్డి, కోడె రాజేశ్వర్, కట్కం రాజారెడ్డి, రమణ, ధనె రవి, నర్సయ్య, కుంట గంగారెడ్డి తదితరులు అమ్మవారి ఆభరణాలను దర్శించుకుని స్థానిక పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. -
అందుబాటులోకి ‘అమృత్ భారత్’
బెల్లంపల్లి: ఉత్తరాది రాష్ట్రమైన బీహార్‌లోని ముజా ఫర్పూర్ నుంచి హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి మధ్య నడిచే అమృత్ భారత్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ మంచిర్యాల, కుమురంభీ ఆసిఫాబాద్ జిల్లావాసులకు అందుబాటులోకి రానుంది. ప్రధా ని నరేంద్ర మోదీ ఈ రైలును సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు వీక్లీ స్పెషల్‌గా నడిపి, అక్టోబర్ 14 నుంచి రెగ్యులర్ సర్వీస్‌గా మార్చనున్నట్లు సమాచారం. 14న ముజాఫర్పూర్ నుంచి చర్లపల్లికి బయలుదేరే ఈ రైలు, 16న తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి ముజాఫర్‌పూర్‌కు వెళ్తుంది. తెలంగాణలో సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి జంక్షన్, కాజీ పేట జంక్షన్ స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వలస కార్మికుల సౌకర్యార్థం ఈ సర్వీస్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఉత్తరాది ప్రయాణికులకు ప్రయోజనం..ఈ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ తెలంగాణ ప్రాంతవాసులకు గణనీయమైన లాభాలు చేకూరుస్తుంది. తక్కువ స్టేషన్లలో మాత్రమే ఆగడంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రస్తుతం అవసరాలకు తగిన రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల, కు మురంభీ ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులకు ఉపయోగపడుతుంది. మొదట వారాంతపు రైలుగా నడిపి, ప్రయాణికుల స్పందన ఆధారంగా రెగ్యులర్‌గా మార్చాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రెగ్యులర్ సర్వీస్ అమలు కావడంతో మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఏసీ సదుపాయం మినహా, మిగిలిన అన్ని సౌకర్యాలు వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయి. 22 కోచ్‌లు..ప్రయాణికుల సౌలభ్యాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ రైలును 22 కోచ్‌లతో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 11 జనరల్ అన్రిజర్వ్డ్ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 2 ఎస్ఎల్ఆర్ కోచ్‌లు, 1 లగేజ్ కోచ్ ఉన్నాయి. ముందు, వెన క రెండు ఇంజిన్లు జతచేస్తారు. ముజాఫర్పూర్ నుంచి ప్రతీ మంగళవారం ఉదయం 10:40కి బయలు దేరి, బుధవారం రాత్రి 11:50 గంటలకు చర్లపల్లి చే రుతుంది. తిరుగు మార్గంలో గురువారం తెల్లవారుజాము 4:05కి చర్లపల్లి నుంచి ప్రారంభమై, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముజాఫర్‌పూర్‌కు చేరుకుంటుంది. -
దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
ఆసిఫాబాద్: వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మా ణం చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచార ప్ర ముఖ్ దుర్గం పురుషోత్తం అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ జనగామ ఖండ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్యసాయి సదన్‌లో విజయ దశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురుషోత్తం మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందని తెలిపారు. హిందువుల్లో ఐక్యతను సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం ఒక జీవన విధానమని, విశ్వశాంతికి ఆధారమన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు బోనగిరి సతీశ్‌బాబు, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
ఆసిఫాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా జసింత్ జోయల్
నిర్మల్‌ఖిల్లా: లక్ష్యం దిశగా శ్రమిస్తే స్వప్నం సాకారమవుతుంది. నిర్మల్‌కు చెందిన జసింత్ జోయల్ ఇందుకు నిదర్శనం. కరుణ–డేనియల్ దంపతుల పెద్ద కుమారుడు జసింత్ జోయల్ గ్రూప్–1 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బీసీ ‘సీ’ కేటగిరీలో రాష్ట్రస్థాయి తొలి ర్యాంక్ కై వసం చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆసిఫాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. జోయల్ ఎనిమిదో తరగతి వరకు నిర్మల్ సెయింట్ థామస్ పాఠశాలలో, 9–10 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో గల కేకేఆర్ గౌతం స్కూల్లో, ఇంటర్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో, బీటెక్ తమిళనాడులోని వెల్లూరులో పూర్తి చేశారు. అనంతరం బీహెచ్ఈఎల్లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత నాలుగేళ్లుగా సివిల్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. నిత్యం 18గంటలకు పైగా పుస్తకాలతో కుస్తీపట్టి శ్రమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇతని తల్లి కరుణ సా రంగపూర్ మండలం ధని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా, తండ్రి డేనియల్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తున్నట్లు జోయల్ తెలిపారు. జోయల్‌ను స్థానికులు అభినందిస్తున్నారు. -
రైలు పట్టాలు!
రక్తమోడుతున్న ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి కుటుంబ కలహాలతో కాగజ్‌నగర్ పట్టణంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వీరి కుటుంబం 20 రోజుల క్రితం పట్టణ శివారులోని ఓ ఇటుక బట్టిలో పనిచేసేందుకు వచ్చింది. కాగజ్‌నగర్ మండలం చింతగూడ గ్రామ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 22న ఆత్మహత్య చేసుకునేందుకు చింతగూడ రైల్వే క్రాసింగ్ వద్దకు స్వప్న తన కుమార్తె జాస్మితో కలిసి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త జగత్‌రాం వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తల్లీకుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. జగత్రాంకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలా.. రైలు పట్టాలు ప్రమాదాలు, ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి.కాగజ్‌నగర్‌టౌన్: మంచిర్యాల నుంచి సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ల మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 27 వరకు మంచిర్యాల జీఆర్పీ పోలీస్టేషన్ పరి ధిలోని పట్టాలపై పడి, ఆత్మహత్య చేసుకుని, రైలు పట్టాలు దాటుతూ, రైలు నుంచి జారిపడి వంటి కారణాలతో 139 మరణాలు నమోదయ్యాయి. పట్టాలు దాటుతూ, రైలు నుంచి జారిపడి 29 మంది గాయాల పాలయ్యారు. పట్టాలపై ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, క్షణాకావేశంలో విలువైన ప్రాణాలను పట్టాలకు బలిస్తున్నారు. మరికొందరు ప్రమాదవశాత్తు వెళ్తున్న రైలు నుంచి జారిపడి, అజాగ్రత్తతో పట్టాలు దాటుతూ మృతి చెందుతున్నారు. కారణాలు ఏవైనా రైలు పట్టాలపై ప్రజల ప్రాణాలు పోతున్నాయి. రద్దీ అధికం..కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో మంచిర్యాల, మందమర్రి, రవీంద్రఖని, బెల్లంపల్లి, రేచినీరోడ్, ఆసిఫాబాద్ రోడ్, సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్(టి) రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు నాగ్‌పూర్, సికింద్రాబాద్‌తోపాటు దూరప్రాంతా లకు రాకపోకలు సాగిస్తుంటారు. దసరా, దీపావళి పండగల సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ స్టేషన్ల నుంచి ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, రాజస్థా న్, మధ్యప్రదేశ్, బీహార్, నాగ్‌పూర్, హైదరాబాద్, విజయవాడ, కాజిపేట్, ఢిల్లీ, తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వందేభారత్, అమృత్భారత్తో పాటు పలు రైళ్లకు రెండు జిల్లాల్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించింది. దీంతో రద్దీ పెరిగింది. నిర్లక్ష్యంతో ప్రమాదాలుగమ్యం చేరుకోవాలనే తొందరలో ప్రయాణికులు పొరపాట్లు చేస్తుంటారు. రైలు వచ్చే సమయాల్లో హడావుడిగా ప్లాట్‌ఫాంపై పరిగెడుతూ, రైలు ఎక్కుతున్న సమయాల్లో, ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్ర యాణం చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నా రు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మంచిర్యాల– సిర్పూర్ (టి) రైల్వే స్టేషన్ల పరిధిలో ఎక్కువగా మంచిర్యాల గోదావరి బ్రిడ్జి, మందమర్రి సమీపంలోని వాగు, బెల్లంపల్లి రైల్వేస్టేషన్ నాలుగు కిలోమీటర్ల దూరం మధ్య, అలాగే రాళ్లపేట రైల్వే క్యాబిన్ సమీపంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కుమురంభీం జిల్లాలో ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్ పరిధి లోని పెద్దవాగు సమీపంలో, కాగజ్‌నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ సమీపంలో పట్టాలు దాటుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. చింతగూడ రైల్వేగేటు సమీపంలో పట్టాలు దాటుతుండగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.జాగ్రత్తలు పాటించాలి ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించే సమయంలో స్వీయ జాగ్రత్తలు పాటించాలి. గమ్యాన్ని చేరుకోవాలనే తొందరలో పట్టాలు దాటి విలువలైన ప్రాణాలు బలి చేసుకోవద్దు. ప్రయాణానికి 15 నిమిషాలు ముందు స్టేషన్‌కు చేరుకోవాలి. రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. – మహేందర్, జీఆర్పీ ఎస్సై, మంచిర్యాల రైల్వేస్టేషన్ఫ్లైఓవర్ బ్రిడ్జికి మెట్లు లేక..కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా ప్రయాణికులు ఎక్కేందుకు మెట్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టణంలోని కాపువాడ, సీబాపుకాలనీ, మారుతినగర్, లక్ష్మినగర్, జీడిచేను, భట్టుపల్లి గ్రామాల ప్రజలు నడుచుకుంటూ పట్టాలు దాటుతున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా మెట్లు లేకపోవడంతో రైలు రాకను గుర్తించకలేకపోతున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా మెట్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. -
రేబిస్ వ్యాధి నివారణకు టీకాలు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రపంచ రేబిస్ నివారణ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లోని పశువైద్యశాలల్లో పెంపుడు కుక్కలు, పిల్లులకు ఉచితంగా రేబిస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. జిల్లా పశువైద్యాధికారి సురేశ్ మాట్లాడుతూ పెంపుడు కుక్కలు, పిల్లులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించాలని సూచించారు. టీకాలు వేయించడం ద్వారా జంతువులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఇతరులకు వాటితో ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ డివిజన్లో 30, కాగజ్‌నగర్ డివిజన్లో 50 పెంపుడు జంతువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. మండల పశువైద్యాధికారులు మురళీకృష్ణ, సురేశ్, సిబ్బంది సుప్రియ, ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సాయిరాం సాధించాడు..
కౌటాల(సిర్పూర్): సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించారు కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన సాయిరాంగౌడ్. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్– 2 ఫలితాల్లో మెరిశారు. కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశంగౌడ్, తారక్క దంపతులకు ఇద్దరు సంతానం. తారక్క గృహిణి కాగా రాజేశంగౌడ్ గీత కార్మికుడిగా పనిచేస్తూ పిల్లలను చదివించారు. వారి కుమారుడు సాయిరాంగౌడ్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశారు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనే పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే పంచాయతీ కార్యదర్శిగా కొలువు సాధించారు. ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు కార్యదర్శిగా పనిచేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. గ్రూపు– 2 పరీక్షలకు హాజరై 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 191వ ర్యాంకు సాధించారు. మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా ఉద్యోగం పొందారు. గ్రూప్– 1 మెయిన్స్‌లో 436 మార్కులు రాగా, ఉద్యోగం రాలేదు. సివిల్స్ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. -
జైమాతా.. దుర్గమ్మ
చింతలమానెపల్లి(సిర్పూర్): జిల్లాలోని బెంగాళీ గ్రామాల్లో దసరా సందడి మొదలైంది. కాళీమాతకు మరో రూపమైన దుర్గాదేవిని బెంగాళీ ప్రజలు అ త్యంత ఆర్భాటంగా జరుపుకోనున్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అకాలి బోధన్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన వేదికలపై దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించనున్నారు. సిర్పూర్(టి) నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ మండలం ఈస్గాం, నజ్రూల్‌నగర్, సీతానగర్, నామానగర్తోపాటు 11 గ్రామాలు, సిర్పూర్(టి) మండలం లక్ష్మీపూర్, చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్– 1, రవీంద్రనగర్– 2లో నిర్వహించే ఉత్సవాలు స్థానికంగా ప్రసిద్ధి చెందాయి. నేటి నుంచి ఉత్సవాలుసాధారణంగా దసరా నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. కానీ బెంగాళీలు మాత్రం దుర్గాదేవి, దేవతామూర్తుల విగ్రహాలను ఐదురోజులు మాత్రమే పూజిస్తారు. ఆదివారం ప్రారంభమయ్యే అకాలి బోధన్ ఉత్సవాలు అక్టోబర్ 2న దసరా రోజు ముగుస్తాయి. వినాయకుడు, కార్తీకేయుడు, లక్ష్మీదేవి, సరస్వతిదేవి, మహిషాసురుడు, వారి వాహనాల విగ్రహాలను ఏర్పాటు చేస్తా రు. ఐదురోజులూ ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి. ప్రజలు నియమ, నిష్టలు పాటిస్తూ ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, మద్యమాంసాలకు దూరంగా ఉంటారు. చివరిరోజు నిమజ్జనం నిర్వహిస్తారు. దశాబ్దాలుగా నిర్వహిస్తున్నాం 1970 దశకంలో ఈ ప్రాంతానికి వచ్చాం. నాటి నుంచి ఏటా దసరా సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దశాబ్దాలుగా ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. దుర్గాదేవికి మొక్కుకుంటాం. బంధుమిత్రులను ఆహ్వానించి మిఠాయిలతో మా ఆతిథ్యం అందిస్తాం. – సుశీల్ మండల్, రవీంద్రనగర్–2 ప్రత్యేకతలు ఇవే..అకాలి బోధన్ ఉత్సవాల్లో మొదటిరోజు దుర్గాషష్ఠి పూజ చేస్తారు. వేదపండితుల ఆధ్వర్యంలో ముందుగా మహిషాసురునికి పూజలు నిర్వహిస్తారు. ఘాట్స్థాపన, కలశ పూజ అనంతరం విగ్రహాలు ప్రతిష్టిస్తారు. వేదికకు నలుదిక్కులా కలశాలు స్థాపన చేసి దీప ప్రజ్వలన, కుంకుమార్చనలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. -
భావితరాలకు కొండా లక్ష్మణ్ చరిత్ర అందించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన కొండా లక్ష్మ ణ్ బాపూజీ చరిత్రను భావితరాలకు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పద్మశాలి సేవా సంఘం, బీసీ సంఘం ప్రతినిధులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లావాసి కావడం గర్వకారణమన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ బాపూజీ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సజీవన్, సింగిల్ విండో చెర్మన్ అలీబిన్ అహ్మద్, పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు, కార్యదర్శి మల్లయ్య, బీసీ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
ఉత్కంఠకు తెర!
ఆసిఫాబాద్‌అర్బన్: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. స్థానిక సంస్థల నిర్వహణలో భాగంగా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని ధుల సమక్షంలో డ్రా పద్ధతిలో స్థానాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 15 మండలాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు. మారుతున్న సమీకరణాలురెండేళ్లుగా స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆశావహులు అనుకూలమైన స్థానాలు ఎంచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యతనిస్తూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో సమీకరణాలు పూర్తిగా మారాయి. అనేకచోట్ల ఆశావహుల అంచనాలు తారుమారయ్యాయి. ఎంతోకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా రిజర్వేషన్లు మారడంతో తలలు పట్టుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా జిల్లాలో భిన్నమైన పరిస్థితి ఉంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేరు. ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థల పోరు రసవత్తరంగా మారనుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జెడ్పీ పీఠం బీసీ జనరల్ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానాన్ని బీసీ జనరల్‌గా ఖరారు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎస్టీ మహిళ రిజర్వేషన్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో తాజాగా బీసీలకు స్థానం కేటాయించారు. జిల్లాలో ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు మండలం ఎంపీపీ జెడ్పీటీసీ లింగాపూర్ ఎస్టీ, మహిళ జనరల్(మహిళ) సిర్పూర్(యూ) ఎస్టీ, మహిళ జనరల్ ఆసిఫాబాద్ ఎస్టీ, మహిళ ఎస్టీ, జనరల్ జైనూర్ ఎస్టీ, జనరల్ బీసీ, జనరల్ బెజ్జూర్ ఎస్టీ, జనరల్ ఎస్టీ, జనరల్ వాంకిడి ఎస్టీ, జనరల్ ఎస్టీ, మహిళ పెంచికల్పేట్ ఎస్సీ, మహిళ ఎస్సీ, మహిళ దహెగాం ఎస్సీ, జనరల్ ఎస్టీ, మహిళ చింతలమానెపల్లి బీసీ, మహిళ ఎస్టీ, జనరల్ కాగజ్‌నగర్ బీసీ, మహిళ బీసీ, మహిళ సిర్పూర్(టి) బీసీ, జనరల్ ఎస్సీ, జనరల్ రెబ్బెన బీసీ, జనరల్ బీసీ, మహిళ కౌటాల బీసీ, జనరల్ బీసీ, జనరల్ తిర్యాణి జనరల్ బీసీ, మహిళ కెరమెరి జనరల్(మహిళ) బీసీ, జనరల్ -
వర్షంలోనూ బారులు
కాగజ్‌నగర్‌టౌన్/సిర్పూర్(టి): యూరియా కోసం రైతులు వర్షంలోనూ పడరాని పాట్లు పడుతున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పీఏసీ ఎస్ కార్యాలయంలో సిబ్బంది, వ్యవసాయాధి కారులు శనివారం యూరియా పంపిణీ చేశా రు. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురిసినా.. వర్షాన్ని లెక్కచేయకుండా రైతులు క్యూలో నిలబడ్డారు. చినుకుల్లో తడుస్తూ బస్తాలు తీసుకున్నారు. ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏఈవోలు సృజన, శ్రీనివాస్ పర్యవేక్షించారు. సిర్పూర్(టి) మండలం కేంద్రంతోపాటు లోనవెల్లిలోని రైతువేదికల వద్ద గంటలపాటు అన్నదాతలు బారులు తీరారు. -
చిరుత దాడిలో లేగదూడ మృతి
పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలంలోని ఎర్రగుట్ట అటవీ ప్రాంతంలో శుక్రవారం చిరుతపులి దాడిలో నైతం మౌనికకు చెందిన లేగదూడ మృతి చెందింది. బాధిత రైతు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం ఉదయం అటవీశాఖ సిబ్బంది పాదముద్రలు గుర్తించి చిరుతపులి దాడిని నిర్ధారించారు. పశువైద్యాధికారి రాకేశ్ ఆధ్వర్యంలో పంచనా మా నిర్వహించి లేగదూడను ఖననం చేశారు. బాధిత రైతుకు అటవీశాఖ నుంచి పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తెలంగాణకు గర్వకారణం బాపూజీ
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణకు కొండాలక్ష్మణ్ బాపూజీ గర్వకారణమని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శనివారం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ 1915 సెప్టెంబర్ 27న జన్మించిన కొండా లక్ష్మణ్‌బాపూజీ గాంధీజీ ఆలోచనలతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. నిజాం, రజాకారుల అణచివేతకు ఎదురొడ్డి స్వాతంత్య్రం కోసం పోరాడారన్నారు. 1952లో ఆసిఫాబాద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై .. డిప్యూటీ స్పీకర్, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 1969లో మంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన త్యాగ స్వభావానికి నిదర్శమన్నారు. ఆయన అనుసరించిన న్యాయం, సమానత్వం, త్యాగం, సేవ విలువలు పోలీసు శాఖకు మార్గదర్శక సూత్రాలు నిలుస్తాయని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ అంజన్న, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సీసీ కిరణ్, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. -
కోలిండియా పోటీల్లో సత్తా చాటాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): కోలిండియా స్థాయి పోటీల్లో సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు సత్తా చాటాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇటీవల భూపాలపల్లిలో జరిగిన కంపెనీ స్థాయి పవర్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏరియాకు చెందిన మహిళా క్రీడాకారులు అనురాధ, కోట్నాక మమత, బాడీ బిల్డింగ్ పోటీల్లో మొగిలి బంగారు పతకాలు సాధించి కోలిండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను శనివారం గో లేటిలోని జీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఉత్సాహం, స్ఫూర్తితో కోలిండియా స్థాయి పోటీల్లోనూ రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎస్వోటూ జీఎం రాజమల్లు, డీజీఎంలు ఎస్కే మదీనాబాషా, ఉజ్వల్‌కుమార్ బెహారా, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్, మేనేజర్ మహేశ్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆది కర్మయోగి
అభివృద్ధి బాటకులింగాపూర్లో అవగాహన కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు జితేంద్రసింగ్కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి అభియాన్ అమలు చేస్తోంది. జిల్లాలో మండలాల వారీ గా గ్రామాలను ఎంపిక చేసి కార్యాచరణ సిద్ధం చేశా రు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక టీంలు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశా యి. వికసిత్ భారత్ సాధనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాల కల్పనకు ఆది కర్మ యోగి అభియాన్‌ను రూపొందించింది. ఆదిమ గిరిజనులతోపాటు ఆదివాసీలు, ఇతర గిరిజనులకు అన్నిరకాల సంక్షేమ పథకాలను చేరువ చేయడం, అవగాహన కల్పించడం, సౌకర్యాలు మెరుగుపర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 102 గ్రామాల్లో అమలుజిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాల పరిధిలోని 102 గ్రామాల్లో ఆది కర్మ యోగి అభియాన్ అమలు కానుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో 2,356 కుటుంబాలు ఉండగా 98,991 జనాభా ఉంది. గిరిజన సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, డీఆర్డీఏ, ఐసీడీఎస్, జలశక్తి(మిషన్ భగీరథ), అటవీ శాఖ ఉద్యోగులు అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యక్రమాలను పర్యవేక్షించారు. శుక్రవారంతో అవగాహ న కార్యక్రమాలు పూర్తి కాగా అక్టోబర్ 2 నుంచి మండల కేంద్రాల్లో ఎంపీడీవోలు తీర్మానాలు స్వీకరించనున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనేక పథకాలు అమలు చేస్తున్నా గిరిజనుల దరికి చేరడం లేదు. నిరక్షరా స్యత, అవగాహన లేమితో పథకాలను వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు చేరేలా ఆది కర్మయోగి అభియాన్ కింద చర్యలు తీసుకుంటున్నారు. ఆదివాసీల ఆచార, వ్యవహార శైలి విభిన్నంగా ఉంటుంది. మైదాన ప్రాంతాల వా రితో పోలిస్తే వారికి అవగాహన తక్కువ. దీంతో అధికారులే ఆయా గ్రామాలకు వెళ్లి గిరిజనులను చైతన్యపరుస్తున్నారు. యువకులు, మహిళలకు స్థలంతో సంబంధం లేకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గి రిజన సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, అట వీ, తాగునీరు, మేకల పెంపకం, మునగ సాగు, అంగన్వాడీ, పాఠశాల భవనాలు, జీవిత బీమా, రోడ్డు రవాణా సౌకర్యాలు, ఆది సురక్ష బీమా వంటి పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గ్రామానికి అవసరమైన సౌకర్యాలపై అక్కడికక్కడే గిరిజనుల ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. విలేజ్ విజన్ –2030 ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయనున్నారు. సౌకర్యాల కల్పనకు ఉపయోగం గిరిజన గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు ఆది కర్మ యోగి అభియాన్ ఉపయోగపడుతుంది. 12 మండలాల్లో 102 గ్రామాలను మొదటి విడతలో ఎంపిక చేశాం. ఆయా గ్రామాల నుంచి వచ్చిన తీర్మానాలను అక్టోబర్ 2న ఎంపీడీవోలు స్వీకరిస్తారు. అనంతరం జిల్లా, ఆ తర్వాత రాష్ట్రస్థాయికి పంపిస్తాం. – పి.రమాదేవి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిగ్రామాల అభివృద్ధే లక్ష్యంలింగాపూర్(ఆసిఫాబాద్): గిరిజన గ్రామాల అభివృద్ధే ఆది కర్మయోగి అభియాన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు జితేంద్రసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రమాదేవితో కలిసి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అంతకు ముందు గ్రామస్తులు ఆయనకు డప్పుచప్పుళ్లతో సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ క్రీడాపోటీలను పరిశీలించారు. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలుమండలాలు గ్రామాలు ఆసిఫాబాద్ 4 బెజ్జూర్ 4 చింతలమానెపల్లి 3 జైనూర్ 15 కెరమెరి 8 కౌటాల 1 లింగాపూర్ 9 రెబ్బెన 1 సిర్పూర్(యూ) 14 తిర్యాణి 31 వాంకిడి 8 కాగజ్‌నగర్ 4 -
పర్యావరణ పరిరక్షణకు కృషి
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నా రు. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభ్రమైన గాలి, ఆరోగ్యవంతమైన ప్రజలు అనే నినాదంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే సమతుల్య వాతావరణాన్ని సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో పర్యావరణ విద్య అంబాసిడర్, జాతీయ హరితదళం జిల్లా సమన్వయకర్త మధుకర్, మెప్మా అధికారి మోతీరాం, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణాలపై పట్టింపేది?
కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వా రు కరువయ్యారు. అసంపూర్తి వంతెనలు పూర్తి చేయడంతోపాటు లోలెవల్ వంతెన వద్ద హైలెవల్ బ్రిడ్జీలు నిర్మించడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కెరమెరి మండలం అనార్పల్లి వాగు ఉప్పొంగి సకాలంలో ఆస్పత్రికి చేరుకోకపోవడంతో శుక్రవారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ మండలంలో గుండి వాగు, కెరమెరి మండలంలో లక్మాపూర్, అనార్పల్లి, చింతలమానెపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రజలు అత్యవసర సమయంలో ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు. అసంపూర్తిగా వంతెనలు..కెరమెరి మండలంలోని లక్మాపూర్ వాగుపై వంతెన రూ.3కోట్ల అంచనా వ్యయంతో 2016లో ప్రారంభమై 2017లో పూర్తి కావాల్సి ఉంది. కానీ పిల్లర్లు నిర్మించి వదిలేశారు. ముగ్గురు కాంట్రాక్టర్లు మారినా పనులు ముందుకు సాగడం లేదు. అలాగే అనార్పల్లి వాగుపై రూ.5కోట్ల అంచనా వ్యయంతో 2016లో పనులు ప్రారంభమై 2018 నాటికి పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. కరంజీవాడ, బోరిలాల్‌గూడ, జనకాపూర్ తదితర గ్రామాల ప్రజలు అనార్పల్లి వాగు దాటితేనే కెరమెరి మండల కేంద్రానికి చేరుకుంటారు. వాగులో వరద పెరిగితే వారు బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సిందే.. వాగు దాటేందుకు ప్రాణాలు పణంలక్మాపూర్, అనార్పల్లి వాగులు దాటేందుకు ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. 2023 సెప్టెంబర్ 6న అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను గ్రామస్తులు ఒంటి చేతులపై ఎత్తుకుని వాగు దాటించడం అప్పట్లో బాహుబలి సినిమాను తలపించింది. అనార్పల్లి వాగు దాటుతున్న ప్రజలు -
‘ప్రజాపాలనలో కార్మికులకు పస్తులేనా..?’
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజాపాలనలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు పస్తులేనా అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అతిపెద్ద పండుగ దసరాకు కార్మికులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ చానల్ ద్వారా నెలనెలా వేతనాలు ఖాతాల్లో జమ చేయాలన్నారు. జీవో 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జాడి మోరేశ్వర్, కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు, కార్మికులు శంకర్, విలాస్, రాణి, పుష్పలత, నగేశ్, వెంకటేశ్, రమేశ్, సంతోష్ పాల్గొన్నారు. -
ఐలమ్మఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులు, నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి, బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. రజక సామాజిక వర్గంలోని పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సజీవన్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, రజకసంఘం జిల్లా అధ్యక్షుడు కడ్తల మల్లయ్య, నాయకులు రవీందర్, భూమయ్య, సతీశ్, మధుకర్, శంకర్, మారుతి, సరస్వతి పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలుఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలపై ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే సద్దుల బతుకమ్మ కోసం నిమజ్జనం చేసే వాగులు, చెరువుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. -
వన్యప్రాణుల దాడిలో భార్యాభర్తలు మృతి!
సిర్పూర్(టి): సిర్పూర్(టి) మండలం అచ్చెల్లి బీట్ పరిధిలోని భీమన్న ఆలయ సమీపంలో గల అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు మృతిచెందారు. వన్యప్రాణుల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్(టి) మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు దూలం శేఖర్(52), సుశీల(46) దంపతులు రోజుమాదిరిగానే గురువారం పశువులు మేపేందుకు భీమన్న ఆలయం ప్రాంతంలోకి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. సమీప ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించారు. ఎస్సై సీహెచ్ సురేశ్ ఆధ్వర్యంలో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమన్న ఆలయ అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తించారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతదేహాలను మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గ్రామస్తుల ఆందోళనభార్యాభర్తల మృతికి గల కారణాలపై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. సాయంత్రం అటవీ, పోలీసుశాఖ అధికారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్ పోస్టుమార్టం చేసి విచారణ చేపట్టారు. అయినా దంపతుల మృతికి కారణాలను వెల్లడించేందుకు నిరాకరించారు. గ్రామస్తులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్సీ దండె విఠల్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్ హామీ ఇవ్వడంతో శాంతించారు. ఒక్కొక్కరికి రూ.10లక్షల పరిహారం, కుమార్తెల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. వీరి వెంట తహసీల్దార్ రహీమొద్దీన్, ఇన్చార్జి ఎఫ్ఆర్వో ప్రవీణ్, కౌటాల సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై సీహెచ్ సురేశ్ తదితరులు ఉన్నారు. దూలం శేఖర్, సుశీల మృతదేహాలుఅనుమానాలెన్నో..?అచ్చెల్లి బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భార్యభర్తలు దూలం శేఖర్, సుశీల మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వన్యప్రాణుల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు భావిస్తున్నా పోస్టుమార్టం అనంతరం కూడా పోలీసులు, అటవీశాఖ అధికారులు స్పష్టతనివ్వలేదు. పేద కుటుంబానికి చెందిన వీరు పశువుల కాపరులుగా పనిచేస్తున్నారు. రాజేశ్వరి, మౌనిక, రోహిణి, అజయ్ సంతానం ఉన్నారు. గురువారం సాయంత్రం పశువులు యజమానుల ఇళ్లకు చేరడం, తల్లిదండ్రులు రాకపోవడంతో ఆందోళనలకు గురై గ్రామస్తులతో కలిసి పశువులు తీసుకెళ్లే మార్గంలో గాలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. సీహెచ్‌సీలో వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం చేసినా ఏ వన్యప్రాణి దాడిలో గాయాలయ్యాయో తేల్చలేకపోయారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటాంసిర్పూర్(టి) మండలంలోని అచ్చెల్లి బీట్ పరిధిలో అటవీప్రాంతంలో మృతి చెందిన దూలం శేఖర్, సుశీల కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రి వద్ద మృతదేహాలను శుక్రవారం పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయంగా కుటుంబ సభ్యులకు నగదు అందించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫోన్లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రైజింగ్– 2047 పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల కళ్లకు కట్టే విధంగా ప్రగతి నివేదికలు రూపొందించామ ని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు గోరంత పనిచేసి, సోషల్ మీడియాలో కొండంత ప్రచా రం చేసుకుంటున్నాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మండల అధ్యక్షుడు చరణ్, నాయకులు రమేశ్, మునీర్, శివప్రసాద్, బలరాంనాయక్, ఖయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి రూ.15కోట్లుఆసిఫాబాద్: నూతన ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు తెలిపారు. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. -
భగీరథ కార్మికుల వ్యథ
ప్రధాన డిమాండ్లుతిర్యాణి(ఆసిఫాబాద్): ఇంటింటికీ తాగునీటి సరఫ రా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న మిషన్ భ గీరథ(గ్రిడ్) పథకం కాంట్రాక్టు కార్మికులు ఆరు నెలలుగా వేతనాలు రాక అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తుండగా, అవి కూడా నెలనెలా అందడం లేదు. క్షేత్రస్థాయలో సమస్యలతో సతమవుతున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 15 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భగీరథ నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. 600 మంది కార్మికులుజిల్లాలో మిషన్ భగీరథ పథకం కింద ఎల్అండ్టీ సంస్థ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పద్ధతిన వాల్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, సూపర్వైజర్లు, కూలీలుగా మొత్తం 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సూపర్వైజర్లకు రూ.15వేల వేతనం కాగా, మిగిలిన వారికి రూ.13వేల చొప్పున చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా కార్మికులు ప్రతిరోజూ గ్రామాలను సందర్శిస్తున్నారు. సురక్షితమైన భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ వీరికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు. పెట్రోల్‌కు కూడా డబ్బులు లేకపోవడంతో అప్పులు చేసి గ్రామాల్లో తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రేపుమాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
వీడని ముసురు
కౌటాల(సిర్పూర్): జిల్లాలో ముసురు వాన వీడటం లేదు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేని వర్షం పండింది. ఒర్రెలు, వాగులు ఉప్పొంగి లోలెవల్ వంతెనలపై నుంచి వరద ప్రవహించింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీడని వానతో జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కూలింది. వాగులు, నదులతోపాటు ప్రభావిత ప్రాంతాలను రెవెన్యూ అధికా రులు పరిశీలించారు. పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నా రు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణ హిత నది, తాటిపల్లి వద్ద వార్దా నది, గుండాయిపేట, వీర్ధండి వద్ద వైన్‌గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాలరులు చేపల వేటతోపాటు నాటు పడవల ప్రయాణాలు నిలిపివేశారు. కౌటాల తహసీల్దార్ కార్యాలయ భవనంలోకి వర్షపు నీరు చేరింది. వీర్ధండి గ్రామంలోని ఇళ్లలోకి వరద చేరింది. చింతలమానెపల్లి మండలం రణవెల్లి వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తంజిల్లాలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని కోరారు. జిల్లాలో వర్షపాతం వివరాలు (బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు) ప్రాంతం వర్షపాతం(మి.మీ.)బెజ్జూర్ 46.0 కౌటాల 48.9 చింతలమానెపల్లి 30.2 పెంచికల్పేట్ 41.4 దహెగాం 47.2 సిర్పూర్(టి) 44.8 రెబ్బెన 35.9 కాగజ్‌నగర్ 33.5 ఆసిఫాబాద్ 24.9 -
డీలర్ల లైసెన్స్‌లు రద్దు
కాగజ్‌నగర్‌టౌన్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యూరియా అమ్మకాలు సాగిస్తున్నారని ఈ నెల 24న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అర్ధరాత్రి అమ్మకాలు’ అనే కథనానికి వ్యవసాయశాఖ అధికారులు స్పందించారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో వ్యవసాయ అధికారుల అనుమతులు లేకుండా అర్ధరాత్రి అక్రమంగా యూరియా పంపిణీ చేసిన డీలర్ల లైసెన్సులు రద్దు చేసినట్లు ఏడీఏ మనోహర్ గురువారం వెల్లడించారు. కౌటాల మండలంలోని శీర్షా గ్రామానికి చెందిన కొండయ్య ట్రేడర్స్, శ్రీ ఆంజనేయ ట్రేడ ర్స్, సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నానికి చెందిన శ్రీనివాస్ ఫర్టిలైజర్స్ షా పు డీలర్లు అర్ధరాత్రి సమయంలో యూరియా పంపిణీ చేశారని వ్యవసాయ అధికారుల విచా రణలో రుజువైందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వారి లైసెన్సులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. డీలర్లు యూరియా, ఎరువులను వ్యవసాయాధికారుల సమక్షంలో పంపిణీ చేయాలని, అధికారులకు సమాచారం ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎఫెక్ట్ -
టెండర్లకు రెడీ
ఆసిఫాబాద్: నూతన ఎకై ్సజ్ పాలసీ(2025– 27) గెజిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో మాదిరిగానే జిల్లాలో 32 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో గురువారం లక్కీడ్రా ద్వారా షాపులు ఖరారు చేశారు. రిజర్వేష న్ ప్రాతిపదికన గౌడ కులస్తులకు రెండు, ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒక షాపు కేటాయించగా, ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలకు నాలుగు షాపులు కేటా యించారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నం.1, 4, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని నం.1, సిర్పూర్(టి) మండల కేంద్రంలోని షాపును ఎస్సీలకు కేటాయించగా, రెబ్బెన మండలం గోలే టి, బెజ్జూర్ మండల కేంద్రంలోని షాపును గౌడ కులస్తులు, కౌటాల మండల కేంద్రంలోని షాపును ఎస్టీలకు లక్కీడ్రా పద్ధతిన ఖరారు చేశారు. అలాగే గత ఎకై ్సజ్ పాలసీలో ఆదాయం రాని వైన్స్‌లను మరోచోటుకు తరలించారు. సిర్పూర్(టి) మండలం లోనవెల్లిలోని దుకాణాన్ని చింతలమానెపల్లికి, సిర్పూర్(యూ) మండలం రాగాపూర్ దుకాణాన్ని సిర్పూర్(యూ)కు, లింగాపూర్ షాపును జైనూర్‌కు మార్చారు. ఇక జనరల్ కేటగిరీలో 21 దుకాణాలు ఉన్నాయి. రిజర్వేషన్ ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, పాన్ కార్డుతోపాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులు ఆధార్, పాన్‌కార్డు, మూడు పాస్‌ఫొటోలు జత చేస్తే సరిపోతుంది. నేడు నోటిఫికేషన్ఎకై ్సజ్ నూతన పాలసీలో భాగంగా శుక్రవారం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. 21 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో ఎన్ని దుకాణాలైనా పొందవచ్చు. ఆదివారాలు మినహాయించి అన్ని పనిదినాల్లో అక్టోబర్ 18 వరకు జిల్లా కేంద్రంలోని జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు అందించవచ్చని అధికారులు తెలిపారు. అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. ఆ రోజు దరఖాస్తుదారులు ఉదయం 9 హాజరుకావాలని అధికారులు సూచించారు. దరఖాస్తుదారులు రాని పక్షంలో ఆథరైజేషన్ పొందిన వ్యక్తులు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. టెండర్లో దుకాణం పొందిన వ్యక్తి ఆరు విడతల్లో ట్యాక్స్ చెల్లించాలి. అలాగే వారు 25 శాతం బ్యాంకు గ్యారంటీ కూడా చూపించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి. పెరిగిన రుసుంగతంలో మద్యం దుకాణం దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలుగా ఖరారు చేశారు. 2021లో నిర్వహించిన మద్యం టెండర్లలో జిల్లావ్యాప్తంగా 26 దుకాణాలకు 763 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.15.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో నిర్వహించిన టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 1020 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.20.40 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటం, దరఖాస్తు రుసుం సైతం పెంచడంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది మద్యం టెండర్లలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయింపు 2025– 27 సంవత్సరానికి రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ కులస్తులకు 4, ఎస్టీలకు 1, గౌడ కులస్తులకు 2 మద్యం దుకాణాలను కేటాయించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. గురువారం కలెక్టరేట్ చాంబర్లో లక్కీ డ్రా పద్ధతిన రిజర్వేషన్ దుకాణాలు ఖరారు చేశారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 23న కలెక్టరేట్లో లక్కీడ్రా పద్ధతిన దుకాణాల కేటాయింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతి కిరణ్, ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమాచారాన్ని అప్డేట్ చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: విద్యాశాఖలో మండల స్థాయి అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం నిర్వహించిన విద్యా విభాగం సమగ్ర సమీక్ష వర్క్ షాపులో ఎంఈవోలు, గిరిజన అభివృద్ధి అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్పర్సన్లు, సిబ్బందికి శిక్షణ అందించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల వారీగా మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేసి నిర్ణీత నమూనాలో సమర్పించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రొఫైల్, యూడైస్‌లో ప్రధానోపాధ్యాయుల వివరాలు, విద్యార్థుల ఆధార్, ఆపార్ సంఖ్యల నమోదు, నిధుల నిర్వహణ, డిజిటల్ పరికరాల పరిస్థితి, తదితర వివరాలు అప్డేట్ చేయాలని చేయాలని ఆదేశించారు. సమాచారం పారదర్శకంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అబిద్ అలీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు నివాళి
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన అంత్యోదయ, ఏకాత్మక మానవ వాదం నినాదాల స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ద్వారా విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షుడు బండి రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు విజయ్, పెద్ద హరీశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఉండొద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని వైల్డ్‌లైఫ్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు విద్యుత్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో గురువారం విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో విద్యుత్ వైర్లు అమర్చొద్దన్నారు. రిజర్వ్ ఫారెస్టులోని విద్యుత్ లైన్లను తొలగించి రెవెన్యూ భూముల నుంచి వేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు, సీఐలు రాణాప్రతాప్, మూసావీర్, సద్దాం, విద్యుత్ శాఖ ఈఈ శేషారావు, ఏడీఈ రాజేశ్వర్, ఏఈ ఇర్ఫాన్ అహ్మద్, ఏఈ అంజల్ తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ కార్మికుల ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: మిషన్ భగీరథ(గ్రిడ్) పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కార్మికులకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈపీఎఫ్, ఈఎస్ఐ పూర్తి వివరాలు తెలియజేయాలని, ప్రతీ కార్మికుడికి బోనస్, కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలని, ప్రతినెలా 1న వేతనాలు విడుదల చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, నాయకులు బాలేశ్, షేక్ షకీర్, కార్మికులు రఫీక్, భగవత్, పురుషోత్తం, రవీందర్, సోహెల్, వెంకటేశ్, తాజ్, లక్ష్మణ్, శివ, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి
ఇంద్రవెల్లి: గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని పరిశీలించారు. మంచి పోషకాహారం, అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందిస్తున్న గుడ్లు, పాలు తీసుకోవాలని గర్భిణులకు సూచించారు. ఆస్పత్రిలో శుద్ధ జల సమస్య ఉందని సిబ్బంది పీవో దృష్టికి తీసుకెళ్లగా ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్, పూజిత, శ్వేత, సిద్ధార్థ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
రెండెకరాల్లో సాగు చేశా..
చెన్నూర్: మూడేళ్ల నుంచి బంతిపూల సాగు చే స్తున్నా. రెండేళ్లు పూ లకు మంచి డిమాండ్ ఉండడంతో లాభాలు వచ్చాయి. ఈ ఏడాది మండలంలో పూల సాగు పెరగడంతో డి మాండ్ తగ్గింది. గతేడాది వ్యాపారులు మా గ్రామానికి వచ్చి పూలు కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. ఈ ఏడాది మేమే హోల్‌సేల్ వ్యాపారుల వద్దకు పూలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలపైనే ఆశ ఉంది. – పుప్పాల రాజమౌళి, శంకరాపూర్ లాభదాయకమే.. వేమనపల్లి: నీల్వాయి సమీపంలో 30 గుంటలు కౌలుకు తీసుకుని బంతిపూలు సాగు చేశాం. కిలోకు రూ.వందచొప్పున విక్రయిస్తున్నాం. నీల్వాయి వాగు వంతెన సమీపంలో రహదారి పక్కనే ఉండటంతో చాలా మంది కొనుగోళ్ళకు వస్తున్నారు. 30 గుంటల్లో 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గోదావరిఖని, మంచిర్యాల నుంచి వ్యాపారులు వచ్చి పూలు కొనుగోలు చేస్తున్నారు. పురుగు బెడద లేకుండా మందులు పిచికారీ చేసుకుంటే బంతిసాగు మంచి లాభదాయకమే. – మోర్ల సమత, నీల్వాయి, వేమనపల్లి -
పాత నేరస్తులపై నిఘా పెంచాం..
పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెంచాం. మార్కెట్ ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్ మఫ్టీలో ఉంటూ నిఘా కొనసాగుతోంది. పెట్రోలింగ్ బీట్స్ పెంచాం. క్రైం టీమ్ మఫ్టీలో బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. పట్టణాల్లో 24గంటలూ పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. డయల్ 100కు సమాచారం ఇస్తే ఐదు నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్స్ పోలీసులు మీ వద్ద ఉంటారు. ఈ నెల 23న రాత్రి చెడ్డి గ్యాంగ్ వ్యూహాన్ని తిప్పికొట్టాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో వ్యభిచార ముఠా గుట్టును పట్టణ పోలీసులు రట్టు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన మహిళలు నాఫీస్ బేగం, బిల్కీస్ చంద్ నిర్మల్‌లోని ఇంద్రానగర్ ప్రాంతంలో ఓఇంటిని కేంద్రంగా చేసుకుని కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్నారు. మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారన్నారు. విటులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపా రు. పక్కా సమాచారంతో పోలీసులు ఇంటిపై దాడి చేసి మహిళలు, విటుడు ఇర్షద్ను అరెస్టు చేసి రెండు మొబైల్ ఫోన్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జిల్లాలో అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన షేక్ రౌఫ్ అలియాస్ షేక్ రౌఫ్ రహీం ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం పాలిషింగ్ చేసి విక్రయిస్తున్నాడన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని రైస్‌మిల్లుల్లో సన్నగా పాలిష్ చేసి తిరిగి కొన్ని బ్రాండ్ల పేరుతో నిర్మల్ జిల్లాతోపాటు చుట్టుపక్కల గల జిల్లాలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడన్నారు. గతంలో రౌఫ్‌కు సంబంధించిన 12 టైర్ల లారీని భైంసాలో జప్తు చేసినట్లు తెలిపారు. గతంలో నిర్మల్‌కు చెందిన వ్యక్తి కిడ్నాప్ పట్టణంలోని సోఫీనగర్‌కు చెందిన షేక్ తహేర్ బియ్యం దందా చేస్తున్నాడని, ఈ క్రమంలో ధర్మాబాద్ (మహారాష్ట్ర)కు చెందిన షేక్ రౌఫ్ భైంసాకు చెందిన అతని భాగస్వామి రహీజ్కు బియ్యం సంబంధిత లావాదేవీలలో రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో లావాదేవీల పరిష్కారానికి దందాలు చేసే ఇబ్రహీం బిల్డర్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ ఇబ్రహీంతో రూ.1.50 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో మహమ్మద్ అబ్దుల్ ఐదుగురితో కలిసి జూలై 2, 2025న నిర్మల్‌కు వచ్చి షేక్ తాహేర్ బంధువును కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో నిర్మల్ పోలీసులు ఇబ్రహీం బిల్డర్‌ను 5 జూలై, 2025న అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంట్లో ప్రధాన నిందితుడైన షేక్ రౌఫ్‌ను మంగళవారం రాత్రి నాందేడ్‌లో పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాగా షేక్ రౌఫ్‌పై భైంసా, బాసర, తానూరు పోలీస్స్టేషన్లలో సైతం కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
ఏరియా ఉద్యోగులకు బంగారు పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సింగరేణి కంపెనీ లెవల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. ఏరియాకు చెందిన అనురాధ 57కిలోల విభాగంలో బంగారు పతకం సాధించగా, కోటంక మమత 47కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు. సింగరేణి కంపెనీ లెవల్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వీరు కోల్ ఇండియా లెవల్ పోటీలకు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించిన ఏరియా క్రీడాకారులు అక్టోబర్ 14 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జరి గే కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులను ఏరి యా అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు. -
పండుగ అడ్వాన్స్ చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎన్హెచ్ఎం స్కీంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగుల మాదిరి డైస్, రేడియోగ్రాఫర్లకు దసరా పండుగ అడ్వాన్స్ చెల్లించా లని బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూని యన్ జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం రూ.20వేలను దసరా అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరా రు. పర్మినెంట్ ఉద్యోగులతో కలిసి శ్రమిస్తూ ఎన్హెచ్ఎం సంస్థ అభివృద్ధికి తోడ్పాడుతున్న వారిని విస్మరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో నగేశ్, ప్రవీణ్, షకీల్, జీవిత తదితరులు పాల్గొన్నారు. -
‘రైతులకు తీవ్ర అన్యాయం’
బెజ్జూర్: బీజేపీ నాయకులు తమ గోదాములకు యూరియా తరలించి తీవ్ర అన్యాయం చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.270కు లభించాల్సిన యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో రూ.వెయ్యికి దొరుకుతుందని తెలిపారు. దిందా పోడు రైతుల బాధ్యతను ఎమ్మెల్యే హరీశ్‌బాబు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అర్షద్ హుస్సేన్, సారయ్య, తిరుపతి, ఇస్తారీ, ఖాజా మోయినొద్దీన్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. ‘అజీమ్ ప్రేమ్‌జీ’ స్కాలర్‌షిప్‌పై అవగాహన కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో విద్యార్థులకు బుధవారం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న స్కాలర్షిప్ లపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ స్కాలర్‌షిప్‌నకు దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్ చదివి పాసై, ప్రభుత్వ కళాశాలలో డిగ్రీలో చదువుతున్న వారు అర్హులని తెలిపారు. ఎంపికై నవారికి ఏటా రూ.30వేల చొప్పు న సాయం అందిస్తారని అన్నారు. శ్యామ్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మందమర్రిరూరల్: మందమర్రి–బెల్లంపల్లి రైల్వేస్టేషన్ల మ ధ్య బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ తెలిపారు. హిస్సాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో గాయపడిన అతడిని బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని పేర్కొన్నారు. అతడి వయస్సు 40 నుంచి 45 మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 87126 58596 నంబరులో సంప్రదించాలని తెలిపారు. పిడుగుపాటుకు గేదెల కాపరి..నిర్మల్‌టౌన్: మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన సాకలి పోశెట్టి(52) పిడుగుపాటుకు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి గేదెలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. మంగళవారం మంజులాపూర్ పెద్దచెరువు సమీపంలో గేదెలు మోపుతున్నాడు. సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా.. బుధవారం నీటిమడుగులో విగత జీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆస్పత్రికి వెళ్లివస్తూ అనంతలోకాలకు..ఉట్నూర్‌రూరల్: కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉట్నూర్ మండలంలోని శంకర్ నాయక్ తండాకు చెందిన జాదవ్ బలిరాం(73)మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో బైక్‌పై హస్నాపూర్ తీసుకెళ్లాడు. తిరుగుప్రయాణంలో గ్రామ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు రిమ్స్‌కు రెఫర్ చేశారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. గడ్డెన్నవాగు కాలువలోపడి ఒకరు మృతిలోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామ సమీపంలో ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలువలోపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. బిహార్‌లోని ముధపర్నగర్కు చెందిన వినోద్ సహాని (35) ఉపాధి నిమిత్తం జిల్లాకు వచ్చి మండలంలోని రాజేశ్తండా సమీపంలోని రైస్‌మిల్లులో హమాలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ముఖఃదం గులాబ్ సహానితో కలిసి పుస్పూర్‌లో మద్యం సేవించాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు పుస్పూర్ గ్రామ శివారులోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు కాలువలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పెదనాన్న కుమారుడైన రాజ్‌గిర్ సహాని ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి రీ పోస్టుమార్టంఇచ్చోడ: మండలంలోని బావోజిపేట్లో విద్యుత్ ఉచ్చుకు బలైన మండాడి రంబు మృతదేహానికి బుధవారం రీపోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులు, స్థానిక ఇన్చార్జి తహసీల్దార్ జాదవ్ రమేశ్ సమక్షంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి రీపోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చి వేశామని, ఘటనకు బాధ్యుడైన చిక్రం పాండు ఫరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
పీజీ చదివి.. పూలబాట
● బంతి, చామంతి, సీతమ్మ జడల సాగు ● వాణిజ్య పంటల వైపు మొగ్గు లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన పెండ్యాల శ్రీనివాస్ హైదరాబాద్‌లో పీజీ(ఎమ్మెస్సీ జువాలజీ) పూర్తి చేశాడు. నాలుగేళ్లపాటు ఉద్యోగాన్వేషణ చేసినా ఫలితం లేకపోండంతో ఇంటిబాట పట్టాడు. తమ కుటుంబానికి ఉన్న ఆరెకరాల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకే రకమైన పంట కాకుండా విభిన్న రకాలుగా నూతన శైలిలో పండించాలని కొంత భాగం వరికి వదిలి పూల తోటల వైపు మళ్లాడు. దసరా, దీపావళికి చేతికొచ్చేలా బంతి, సీతమ్మజెడలు, చామంతి సాగు చేస్తున్నాడు. ఇవి పూర్తి కాగానే అదే భూమిలో బెండకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు సాగు చేస్తుంటాడు. దీంతో పంట మార్పిడితో దిగుబడి అధికంగా ఉంటోంది. బంతి, చామంతి, సీతమ్మజెడలు పూలను మంచిర్యాల, జగిత్యాల, జన్నారం తదితర ప్రాంతాల్లోని వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. వాణిజ్య పంటలపై దృష్టి సారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు పెండ్యాల శ్రీనివాస్ కోరుతున్నాడు. పనిముట్లు ఇవ్వాలని, శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపాడు. పంటమార్పిడి చాలా అవసరమని, ఒకే రకమైన పంటతో ఇబ్బందికరంగా ఉంటుందని, ఒకటి నష్టపోతే మరొకటి లాభంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
దేశీదారు పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్: అక్రమంగా మహరాష్ట్ర నుంచి జిల్లాకు దేశీదారు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పెన్‌గంగా నది ఒడ్డున పెండల్వాడ గ్రామ శివారులో రూ.30వేల విలువైన 404 దేశీదారు బాటిళ్లను పట్టుకున్నారు. పెండల్వాడ గ్రామానికి చెందిన అడిగే రమేష్, టార్పే వినోద్, పద్రె గజానంద్ దేశీదారు తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దేశీదారు అక్రమ రవాణా చేసినా, విక్రయాలు జరిపినా కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. -
పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్, గదుల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అర్ధంతరంగా నిలిచిపోయిన పనులపై కాంట్రాక్టర్లను సంప్రదించాలన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ ఎస్వోలు అబిద్ అలీ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నాపర్ నుంచి తప్పించుకున్న బాలుడు
ఆదిలాబాద్‌టౌన్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని చిల్కూరినగర్కు చెందిన భరత్ అనే ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నాపర్ చెర నుంచి తప్పించుకుని జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సికింద్రాబాద్‌లో రైలు ఎక్కి తలమడుగు మండలంలోని కోసాయి స్టేషన్లో బుధవారం దిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఏడుస్తూ కనిపించిన బాలుడి వివరాలు తెలుసుకున్న రైల్వేస్టేషన్ సిబ్బంది తలమడుగు పోలీసులతో పాటు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని కోసాయికి వెళ్లి బాలుడిని ఆదిలాబాద్ బాల రక్షక్ భవన్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. కాగా అపరిచిత వ్యక్తి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా తప్పించుకుని రైలు ఎక్కానని బాలుడు చెప్పినట్లు పేర్కొన్నారు. చందు, సునీత తన తల్లిదండ్రులుగా చెబుతున్నాడని, కాగా బాలుడి గురించి మల్కాజిగిరి డీసీపీవో సిబ్బందికి సమాచారం అందించామని వివరించారు. ఆయన వెంట ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ కిల్లారే వినోద్, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, వినోద్ తదితరులు ఉన్నారు. -
పండుగకు పస్తులేనా..?
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఒకే నెలలో దసరా, దీపావళి పండుగలు వస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల పరిధిలో 1035 మంది మల్టీపర్పస్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి అదనంగా రోజువారీగా మరో 400 మంది వరకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా వీరికి నెలనెలా వేతనాలు మాత్రం అందడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వంపై ఆశతో ఇతర పనుల్లోకి వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో కీలకం.. జిల్లాలోని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల శ్రమ కీలకం. వీధుల్లోని చెత్తను నిత్యం సేకరిస్తూ డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. రోజువారీ పనులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రత్యేక కార్యక్రమాల్లోనూ వీరు పాల్గొంటున్నారు. కార్మికులకు ప్రస్తుతం నెలకు రూ.9,500 చెల్లిస్తున్నారు. చాలీచా లని వేతనమైనా సకాలంలో అందడం లేదు. ప్రస్తుతం మూడు నెలలుగా పెండింగ్ ఉండటంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. జీతాలు ఆలస్యం కాకుండా గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా 1న చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం అమలు చేయాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సర్కారు విద్యార్థులకు సదావకాశం
ఆసిఫాబాద్‌రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక నిరుపేద విద్యార్థులు మధ్యలోనే చదువు వదిలేస్తున్నారు. అలాంటి వారికి ఆర్థిక చేయూత అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(ఎన్ఎంఎంఎస్) అందిస్తోంది. ప్రతిభ కలిగిన వారి ఉన్నత చదువులకు తోడ్పాటునందిస్తోంది. 2025– 26 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నవంబర్ 23న అర్హత పరీక్ష నిర్వహించనుండగా, ఆక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దరఖాస్తు ఇలా.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 721 ఉండగా, 29,246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ఎనిమిదో తరగతి వారు 3,821 మంది ఉన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మెరిట్ స్కాలర్‌షిప్‌నకు అర్హులు. వీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫారాలు తీసుకుని వివరాలు నింపాలి. వాటితోపాటు ఓసీ, బీసీ, మైనార్టీలు అయితే రూ.100, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.50 డీడీ తీసి దరఖాస్తును జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో అందించాలి. నవంబర్ 23న దేశవ్యాప్తంగా ఒకేసారి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ అందిస్తారు. అర్హతలు ఇవే.. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడో తరగతి వార్షిక పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 50 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50లోపు ఉండాలి. హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. వసతిగృహాల్లో చదివేవారు అర్హులు కారు. ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్ జత చేయాలి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎక్కువ మంది ఏటా స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధిస్తున్నారు. 180 మార్కులతో పేపర్ మల్టీపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కుల ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కోడింగ్, డీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ చిత్రాలు, వాటర్ ఇమేజెస్, రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్నాలు, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన అంశాలు ఉంటాయి, పార్ట్ బీలో 30 మార్కులు సాంఘిక శాస్త్రం, 30 మార్కులు సామాన్య శాస్త్రం, 8వ తరగతి సంబంధించిన 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్ల మీడియాల్లో అందిస్తారు.విద్యార్థులను ప్రోత్సహించాలిజిల్లాలోని ఉన్నత పాఠశాలలో 2025– 26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించి దరఖాస్తు చేయించాలి. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో అర్హత సాధిస్తే ఇంటర్ వరకు ఏటా రూ.12 వేలు స్కాలర్షిప్ వస్తుంది. విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదువుకుంటారు. ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించి పరీక్ష రాయించాలి. – ఉదయ్‌బాబు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి -
వెల్ఫేర్ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: జీవో నం.12ను సవరించి, భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పట్టణంలోని లేబర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ, ఇతర కార్మిక సంక్షేమ బోర్డుల ద్వారా అమలు చేస్తున్న నాలుగు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో 12ను విడుదల చేసిందని తెలిపారు. 1996 భవన నిర్మాణ కార్మికుల చట్టం నిబంధనల విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన రూ.346 కోట్లను తిరిగి వెల్ఫేర్ బోర్డు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలకిషన్, ఎస్కే గౌస్, జిల్లా కోశాధికారి ఆనంద్‌రావు, కార్మికులు పాల్గొన్నారు. -
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆసిఫాబాద్‌అర్బన్: నిత్య జీవితంలో పనిఒత్తిడితో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదని, ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్ శివాలయం ఆవరణలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వైద్యశిబిరంలో కీళ్లు, కాళ్ల నొప్పులు, హైబీపీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, జలుబు, దగ్గు ఇతర వ్యాధులకు ఆయుర్వేద ఔషధాలు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో క్యాంపు ఇన్చార్జి కిరణ్‌కుమార్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి వినోద్, డాక్టర్లు సుజాత, నరేందర్, రాకేశ్, ఫార్మసిస్టులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు. -
వాగు దాటితేనే ఊరికి..
ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి, ఆర్ఆర్ కాలనీ ప్రజలు వాగు ఉప్పొంగి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.86 కోట్లు మంజూరు చేసింది. దీంతో గతేడాది వాగుపై ఉన్న కల్వర్టు తొలగించి వంతెన పనులు ప్రారంభించారు. పనులు మధ్యలోనే వదిలేయడంతో గ్రామానికి సరైన దారి లేకుండా పోయింది. మంగళవారం వాగు ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామస్తులు ఇలా ప్రమాదకరంగా వాగు దాటారు. వరద ఉధృతి పెరిగితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నాయని, అధికారులు స్పందించి వంతెన పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – ఆసిఫాబాద్‌రూరల్ వాగు దాటుతున్న గ్రామస్తులు -
తనిఖీలు కరువు.. కల్తీల జోరు
కాగజ్‌నగర్‌లోని ఓ మార్ట్‌లో పట్టణానికి చెందిన వ్యక్తి మిల్కీ మిస్ట్ ప్యాక్‌లను ఈ నెల 13న కొనుగోలు చేశాడు. కుమారుడికి దానిని తాగించగా అస్వస్థతకు గురయ్యాడు. మళ్లీ ఈ నెల 21న మళ్లీ అదే షాపునకు వెళ్లి మూడు మిల్కీమిస్ట్ పానీయాలు కొన్నాడు. బిల్లు చెల్లించి వాటిపై ఉన్న గడువు తేదీని పరిశీలించగా, ఈ నెల 4న ముగిసినట్లు ఉంది. ఈ విషయంపై షాపు యజమానులను ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇలా జిల్లాలోని అనేక దుకాణాలు, బేకరీలు, హోటళ్లలో కాలం చెల్లిన, కల్తీ వస్తువులు విక్రయిస్తున్నా అధికారులు తనిఖీలు చేపట్టడం లేదు.కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు కొరవడడంతో షాపింగ్‌మాల్స్, కిరాణ షాపులు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్‌సెంటర్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పదార్థాలు, కల్తీ చేసిన వస్తువులు విక్రయిస్తున్నారు. మార్టులు, షాపుల్లో కాలం గడువు ముగిసిన వాటిని వినియోదారులకు అంటగడుతున్నారు. ముఖ్యంగా వాణిజ్యపరంగా కీలకమైన కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లోని హోటళ్లు, బేకరీలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. ఇక రోడ్ల పక్కనే నిర్వహించే హోటళ్లు, స్వీట్‌షాపులపై కనీస పర్యవేక్షణ లేకపోవడం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పట్టించుకునే వారేరి..?ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు కొరవడడంతో వినియోగదారుల ఆరోగ్య భద్రతను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇటీవల కాగజ్‌నగర్‌లోని ఓ మార్ట్‌లో ఒకరికి కాలంచెల్లిన మిల్కీమిస్ట్ ప్యాకెట్లు అంటగట్టారు. వినియోగదారుడు ప్రశ్నించగా.. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని షాపు యజమాని దురుసుగా ప్రవర్తించాడు. బాధితుడు ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. కనీసం నెలకు ఒకసారి స్వీట్‌హౌస్‌లు, బేకరీలు, తినుబండారాలు విక్రయించే షాపుల్లో తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు..చర్యలు తీసుకుంటాం కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని షాపింగ్ మాల్స్, స్వీట్‌షాపులు, హోటళ్లు, కిరాణ షాపుల్లో తనిఖీలు చేపడతాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. యజమానులు, నిర్వాహకులకు నోటీసులు అందించి శాఖ పరంగా చర్యలు చేపడుతాం. – రాజేందర్, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్అంతా కల్తీయే..!పండగలు, పుట్టిన రోజు, ఇతర ముఖ్యమైన రోజుల్లో సంతోషాన్ని పంచుకోవాలన్నా తీపితోనే మొదలవుతుంది. కానీ బేకరీలు, స్వీట్ షాపులు కల్తీ మిఠాయిలు విక్రయిస్తుండటంతో తిన్నవారు ఆస్పత్రుల పాలవుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ వాడడం, రుచి కోసం రసాయనాలు వినియోగించడం, కల్తీ పాలు, నెయ్యి, ఇతర పదార్థాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు తూతూమంత్రంగా ఏడాదికి ఒకసారి జిల్లాలో తనిఖీలు చేపడుతున్నారు. నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ కేవలం రెండు, మూడు హోటళ్లు, స్వీట్‌షాపులను తనిఖీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇటీవల కాగజ్‌నగర్‌లోని పలు హోటళ్లు నాణ్యత పాటించడం లేదని పలువురు పట్టణవాసులు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగా నోటీసులు అందించగా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై ఫుడ్ ఇన్స్పెక్టర్ తారాసింగ్ నాయక్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
‘మైక్రో బ్రూవరీల ఏర్పాటు సరికాదు’
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు సరికాదని, ఎకై ్సజ్‌శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ మైక్రో బ్రూవరీల ఏర్పాటుతో విద్యార్థులపై ప్రభావం పడుతుందని, మద్యం వినియోగం పెరిగి హింస, అశాంతికి దారి తీస్తుందన్నారు. ఇప్పటికే వైన్స్‌లు, బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని తెలిపారు. మైక్రో బ్రూవరీల నోటిఫికేషన్‌ను వెంట నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్, రాకేశ్, వికాస్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి అమ్మకాలు!
కౌటాల మండలం శీర్షా గ్రామంలోని శ్రీఆంజనేయ ట్రేడర్స్, శ్రీకొండయ్య ట్రేడర్స్‌లో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన యూరియా బస్తాలను ఈ నెల 20న వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల నుంచి రెండు లారీల్లో 523 యూరియా బస్తాలు తెచ్చి డీలర్లు రాత్రికి రాత్రే అధిక ధరలకు రైతులకు అమ్మేశారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి నిల్వ ఉంచిన 118 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.సిర్పూర్(టి) మండలం భూపాలపట్నంలోని శ్రీనివాస ఫర్టిలైజర్ దుకాణానికి ఈ నెల 19న అర్ధరాత్రి లారీలో 19.98 మెట్రిక్ టన్నుల యూరియా లోడ్ వచ్చింది. వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వకుండా బస్తాలను విక్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బస్తాలతోపాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి దందా చేసిన ఫర్టిలైజర్ షాపులో అమ్మకాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.కౌటాల(సిర్పూర్): వానాకాలం సీజన్లో సాగు చేసి న పంటలకు ఎరువులు వేయడానికి రైతులు గతంలో ఎప్పుడూ లేనివిధంగా అవస్థలు పడుతున్నారు. రైతువేదికలు, పీఏసీఎస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు అక్రమ దందాకు తెరతీస్తున్నారు. అర్ధరాత్రి అక్రమంగా అధిక ధరలకు బస్తాలు అమ్ముతున్నారు. 60 వేల మెట్రిక్ టన్నులు అవసరంజిల్లాలో 1.42 లక్షల మంది రైతులు వానాకాలం సీజన్లో 4.40 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, తదితర పంటలు సాగు చేస్తున్నారు. పంటలకు ఈ సీజన్లో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటివరకు 40 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మరో 20 వేల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. సహకార సంఘాల్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నా పట్టా పుస్తకానికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. జూలై, ఆగస్టులో యూరియా కోసం పట్టాపత్రాలు అందించిన వారికి ఈ నెల 20వ తేదీ వరకు అందించారు. పట్టా పాసుపుస్తకం అందించిన నెలన్నర రోజుల తర్వాతగానీ రైతులకు యూరియా అందడం లేదు. మరోవైపు పట్టాలు లేని కౌలు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అక్రమంగా దిగుమతి చేసుకుని..ప్రస్తుతం పత్తి పంట పూతకాత దశలో ఉండగా.. వరి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఎరువులు వేసే సమయం కావడంతో రైతులు బస్తాల కోసం తండ్లాడుతున్నారు. ఇదే అదనుగా భావించి కొందరు ప్రై వేట్ వ్యాపారులు లారీల్లో అక్రమంగా యూరియా ను మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. అధిక ధరలకు రైతులకు రాత్రిపూట రహస్యంగా అమ్ముతున్నారు. బస్తాల కోసం రోజుల త రబడి తిరిగి అలసిపోయిన అన్నదాతలు సహకార సంఘాలపై ఆశలు వదులుకుని డీలర్ల వద్దకు వెళ్తున్నారు. అసలు ధరకు నాలుగింతలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రైతులే ముందస్తు డబ్బులు చెల్లించి ధర ఎంతైనా బస్తాలు ఇవ్వాలని డీల్లర్ల చు ట్టూ తిరుగుతున్నారు. కాగా, సరిపడా యూరియా పంపిణీ చేయడంలో విఫలమవ్వడం, యూరియా ను ప్రైవేట్ వ్యాపారులకు కేటాయించారనే అభియోగాలపై జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరా వును ఆ శాఖ రాష్ట్ర సంచాలకుడు గోపి ఈ నెల 20 న సస్పెండ్ చేశారు. కొరతపై జిల్లా రైతన్నలు రోడ్డెక్కడం సైతం డీఏవోపై చర్యలు తీసుకోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది. అధికారులే నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ వ్యాపారులకు మద్దతుగా నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా యూరియా తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. అక్రమ రవాణాను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, పోలీసుశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. అన్ని అనుమతులు ఉంటేనే యూరియా రవాణా చేయాలి. – ఎండీ వహీదుద్దీన్, కాగజ్‌నగర్ డీఎస్పీ -
ఆదివాసీలకు అవకాశం కల్పించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి అటవీశాఖ రేంజ్ పరిధిలో వాచర్, ఎనిమల్ ట్రాకర్ పో స్టుల్లో ఆదివాసీలకు అవకాశం కల్పించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడారు. గిరిజన చట్టా లు అమలులో ఉన్న గిరిజన మండలంలో ఆయా పోస్టుల్లో ఆదివాసీలెవరూ లేరని తెలి పారు. ఉన్నత చదువులు చదివిన వారు నిరుద్యోగంతో సతమతం అవుతున్నారని, అధికా రులు ఆదివాసీలకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా సలహాదారుడు కనక ప్రభాకర్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొర్ల వెంకటేశ్, నాయకులు కుమురం మారుతి, ఆత్రం లక్ష్మణ్, బూత బాపూరావు పాల్గొన్నారు. -
సెపక్తక్రా పోటీల్లో ఉమ్మడి జిల్లాకు రెండోస్థానం
రెబ్బెన(ఆసిఫాబాద్): మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్రస్థా యి సీనియర్ సెపక్తక్రా పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పురుషుల జట్టు రెండోస్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన ఫైనల్లో ఉమ్మడి జిల్లా జట్టు హైదరాబాద్ జట్టుతో తలపడింది. హైదరాబాద్ జట్టు విజయం సాధించగా జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా ఒలింపిక్ చీఫ్ పాట్రాన్ ఆర్.నారాయణరెడ్డి, బాల్‌బ్యాడ్మింటన్ అసో సియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, సెపక్తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, సాంబయ్య, షార్ప్ స్టార్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అభినందించారు. -
అడవుల రక్షణలో ‘హంటర్’
పెంచికల్పేట్(సిర్పూర్): అడవుల్లో అక్రమంగా ప్రవేశించి చెట్లను నరకడం, వన్యప్రాణులను వేటాడడం, స్లగ్మింగ్ వంటి నేరాలను నియంత్రించడానికి కవ్వాల్ అభయారణ్యంలో అధికారులు డాగ్‌స్క్వాడ్ సేవలను వినియోగిస్తున్నారు. గతంలో నేరస్తులను పట్టుకోవడానికి వినియోగించిన చీతా అనే డాగ్‌స్క్వాడ్ గుండెపోటుతో మరణించింది. దానిస్థానంలో ఆగస్టు 15న హంటర్ అనే డాగ్‌ను విధుల్లోకి తీసుకున్నారు. జిల్లా అటవీశాఖ అధికారులు హంటర్ సేవలను జిల్లాలోనూ వినియోగిస్తున్నారు. నేరస్తులను పట్టుకోవడంలో డాగ్‌స్క్వాడ్ సాయం తీసుకుంటున్నారు. అలాగే అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏడు నెలల శిక్షణ..బెల్జియం షెప్పర్డ్ మెలనాయిస్ జాతికి చెందిన హంటర్ జాగిలానికి మూడు నెలలు వయస్సు నుంచి హర్యానా రాష్ట్రంలోని పంచకుళ ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ ఎనిమల్స్(ఎన్టీసీడీ)లో శిక్షణ అందించారు. అడవుల్లో వాసన పసిగట్టడం, జంతువుల కదలికలు, అటవీ ఉత్పత్తులు, స్మగ్లర్ల కదలికలపై దాదాపు ఏడు నెలలపాటు శిక్షణ కల్పించారు. అలాగే జన్నారం అటవీ రేంజ్లో ఎఫ్బీవోలుగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌కుమార్, పరమేశ్ కూడా జాగిలం వినియోగంపై శిక్షణ తీసుకున్నారు. ఈ జాగిలం జన్నారం కేంద్రంగా కవ్వాల్ అభయారణ్యంలో జరిగే అటవీ నేరాలను అదుపు చేయడంతోపాటు అడవుల రక్షణ, నేరస్తులను పట్టుకోవడానికి వినియోగిస్తున్నారు. ఇటీవల జన్నారం రేంజ్ పరిధిలోని గోండుగూడ అటవీ ప్రాంతంలో టేకు చెట్లు నరికిన హీరాలాల్ అనే వ్యక్తిని పట్టుకుంది. సుమారు 8 నుంచి 10 ఏళ్లపాటు ఈ జాగిలం సేవలు అందిస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం చెట్లు నరికివేత, వన్యప్రాణుల వేట, అటవీ ఉత్పత్తుల అక్రమ రవాణాను నిరోధించటానికి కవ్వాల్ రిజర్వు ఫారెస్టులో హంటర్ జాగిలం సేవలు వినియోగిస్తున్నారు. నూతనంగా విధుల్లో చేరిన జాగిలంతో జిల్లాలోని రేంజ్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది, ఎనిమల్ ట్రాకర్స్‌కు సైతం అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో అటవీ నేరాలు నియంత్రించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. జిల్లాలోనూ నేరస్తులను పట్టుకోవడానికి హంటర్ సేవలు సద్వినియోగం చేసుకుంటాం. – నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, జిల్లా అటవీశాఖ అధికారి -
శ్రమ ఫలం.. 34శాతం
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులు చెమటను రక్తంగా మార్చి.. ప్రాణాలు పణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు. అలాంటి కార్మికుల త్యాగానికి ఏదీ సరితూగదు. కానీ ప్రతీ సంవత్సరం వారి శ్రమ ఫలితంగా లభించే లాభాల వాటా కొంత ఊరటనిస్తుంది. గత ఆరు నెలల నిరీక్షణకు తెరపడింది. కంపెనీ గత 2024–25 ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల నుంచి కార్మికులకు 34శాతం వాటా చెల్లించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో కంపెనీ లాభాలు, వాటా ప్రకటించారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.6,364 కోట్లు లాభాలను ఆర్జించింది. ఇందులో భవిష్యత్ ప్రాజెక్టుల పెట్టుబడుల కోసం రూ.4,034 కోట్లు పక్కనబెట్టి మిగతా రూ.2,360 కోట్లు నికర లాభం చూపించారు. ఇందులో నుంచి కార్మికులకు 34శాతం వాటాగా రూ.802.4 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఏ తేదీన పంపిణీ చేస్తారనేది కంపెనీ అధికారులు త్వరలో ప్రకటిస్తారు. ఏడాదిలో కార్మికుల మస్టర్లు, వ్యక్తిగత, గ్రూపు పని తీరు ఆధారంగా ఈ మొత్తాన్ని పంచుతారు. కంపెనీలో 40,476మంది కార్మికులు లాభాల వాటా పొందుతారు. కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.2.50లక్షల వరకు చెల్లిస్తారు. ఒక్కో కార్మికునికి సగటున రూ.1.95లక్షలు లాభాల వాటా అందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో..ఆసిఫాబాద్ కుమురంభీం, మంచిర్యాల జిల్లాల పరిధిలోని బెల్లంపల్లి రీజియన్ గనుల్లో 14,137 మంది కార్మికులు పని చేస్తున్నారు. బెల్లంపల్లిలో 951, మందమర్రిలో 4,652, శ్రీరాంపూర్‌లో 8,534 మంది కార్మికులు ఉన్నారు. వీరితో పాటు సుమారు 3,800 మంది కాంట్రాక్ట్ కార్మి కులూ లాభాల వాటా పొందనున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.500 పెంపుకంపెనీలో ఓబీలు, సివిక్, స్టోర్స్, టింబర్యార్డులు, ఇతర డిపార్టుమెంట్లలో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. వీరికి బోనస్ కింద రూ.17 కోట్లు పంచనున్నారు. క్రితంసారి నుంచే లాభాల బోనస్‌ను ఇస్తున్నారు. మొదటిసారి ఒక్కొక్కరికి రూ.5 వేలు చెల్లించారు. ఈసారి రూ.500 పెంచి రూ.5,500 చెల్లించనున్నారు. మొదటిసారి ఆర్భాటం..ప్రతీసారి లాభాల వాటాను ముఖ్యమంత్రి, కొద్ది మంది మంత్రులు, సింగరేణి ప్రతినిధుల సమక్షంలో ప్రకటించేవారు. ఈసారి ఆర్భాటంగా ప్రకటన చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు, కోల్‌బెల్ట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రకటన చేశారు. ప్రతీసారి కంపెనీ అధికారులు లాభాలు ప్రకటిస్తే వాటాను ము ఖ్యమంత్రి ప్రకటించేవారు. ఈసారి లాభాలు, వా టా అన్ని సీఎం చేతుల మీదుగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ బలరాంతోపాటు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతా రామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్‌ప్రసాద్, యూనియన్ ముఖ్యనేతలు హాజరయ్యారు. పెరిగింది రూ.6.4 కోట్లే..!క్రితంసారి లాభాల వాటా పంపిణీతో పోల్చితే ఈసారి మొత్తంగా పంపిణీ చేసే లాభాలు రూ.6.4 కోట్లే పెరిగాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వాస్తవ లాభాలు రూ.4,071 కోట్లు ఉండగా భవిష్యత్ ప్రాజెక్టులకు పెట్టుబడులు కింద రూ.2,289 కోట్లు పక్కన పెట్టి నికర లాభం రూ.2,412 కోట్లు ప్రకటించి.. అందులో నుంచి 33శాతం వాటా కింద రూ.796 కోట్లు పంపిణీ చేశారు. ఈసారి రూ.802.4 కోట్లు పంపిణీ చేయనున్నారు. క్రితంసారి భవిష్యత్ ప్రాజెక్టుల కోసం పెట్టిన డబ్బుల కంటే అదనంగా రూ.1,745 కోట్లు చూపడంతో లాభాలు పెరిగినా వచ్చే వాటా డబ్బులు గతం కంటే స్వల్పమే అయ్యిందని కార్మికులు పెదవి విరుస్తున్నారు. కంపెనీ లాభాలు, పంపిణీ చేసిన వాటా వివరాలుఆర్థిక సం.. నికర లాభం వాటా శాతం పంపిణీ 2020–21 272.64 29 79.062021–22 1,227 30 3682022–23 2,222.46 32 711.182023–24 2,412 33 7962024–25 2,360 34 802.4నిరాశ పరిచారు.. కంపెనీ లాభాల వాటా నిరాశపర్చింది. గతం కంటే లాభాలు పెరిగినందుకు ఎక్కువగా వస్తాయనుకున్నాం. కానీ గుర్తింపు సంఘంతో ముందుగా సంప్రదించకుండా ఏకపక్షంగా వాటా ప్రకటించారు. వాస్తవ లాభాలపై వాటా ప్రకటించి ఉంటే కార్మికులకు మరింత ఆర్థిక ప్రయోజనం జరిగేది. – వీ.సీతారామయ్య, గుర్తింపు సంఘం అధ్యక్షుడు -
వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల నిరసన
ఆసిఫాబాద్‌అర్బన్: ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు పట్టణంలోని కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ము న్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పెరక శ్రీకాంత్ మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో దసరా, బతుకమ్మ పండుగకు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని డీఎంఎఫ్ నుంచి లేదా ఏదైనా ఇతర ఫండ్ నుంచి వేతనాలు ఇప్పించాలని కోరారు. యూనియన్ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి సమ్మయ్య, ఉపాధ్యక్షుడు శంకర్, నాయకులు మోతీరాం, శ్రీనివాస్, ప్రభాకర్, వెంకట్, సాగర్ పాల్గొన్నారు. -
త్వరగా నష్టపరిహారం చెల్లించాలి
ఆసిఫాబాద్: జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి త్వరగా నష్టపరిహారం చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అటవీ అధికారులు, అదనపు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ జాతీయ, గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణంలో కోల్పోతున్న భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల వివరా లు సేకరించాలన్నారు. అటవీశాఖ అనుమతులు, కోర్టు కేసులు పరిష్కరించి యజమానులకు నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలిస్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకు రిజర్వేషన్ ప్రక్రియ విధి విధానాలపై ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019లో ఎన్నికల రిజర్వేషన్లు, 2011 జనాభా, 2024లో వెనుకబడిన తరగతుల గణనను ప్రామాణికంగా తీసుకుని లోటుపాట్లు లేకుండా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
కొలువుదీరిన దుర్గమ్మ
ఇందిరానగర్‌లో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులుఆసిఫాబాద్/రెబ్బెన: జిల్లావ్యాప్తంగా సోమవారం శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. అలంకరించిన మండపాల్లో అమ్మవారు దుర్గామాత, శారదామాత రూపాల్లో కొలువుదీరారు. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీ ఆలయంలో అర్చకులు శ్రీధర్ శర్మ, వాసవీ మందిరంలో రాజశేఖరశర్మ, కేశవనాథ ఆలయంలో నరేశ్ శర్మ, మధుకరశర్మ ప్రత్యేక పూజలు చేశారు. కాగా, రెబ్బెన మండలంలోని గోలేటి, గంగాపూర్ గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించారు. ఇందిరానగర్‌లోని కనక దుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో అమ్మవారు మొదటి రోజు బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మొదట అమ్మవారికి ప్రాణప్రతిష్ట పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పలువురు భక్తులు అమ్మవారి మాల స్వీకరించారు. అమ్మవారికి పూజలు చేయడంతోపాటు గుహలో కొలువైన మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. -
పక్కాగా వసతుల లెక్క
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై కచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. సర్వే చేపట్టి వివరాలను ఆన్లైన్లో పకడ్బందీగా పొందుపర్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దీనిపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. సర్వే బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. గతంలోనే పంచాయతీ కార్యదర్శులు రోడ్లు, డ్రెయినేజీలు, ప్రభుత్వ భవనాల వివరాలను ప్రభుత్వానికి తెలియజేసినా.. కచ్చితమైన సమాచార సేకరణ కోసం ప్రభుత్వం మరోసారి సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శులు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. పంచాయతీ పాలన కోసం తీసుకువచ్చిన పల్లె ప్రగతి యాప్‌లోనే కొత్త ఆప్షన్ ఇచ్చి అప్డేట్ చేశారు. కార్యదర్శులకు అవగాహనసర్వేపై జిల్లా పంచాయతీ అధికారి అన్ని పంచాయతీల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివరాల సేకరణపై అవగాహన కల్పించారు. జాగ్రత్తలు, నివేదికల తయారీ కోసం చేపట్టాల్సిన చర్యలను వివరించారు. సర్వేకు నిర్దిష్టమైన గడువు విధించకపోయినా.. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. యాప్‌లో సమాచారం పొందుపరిచిన తర్వాత ఎంపీడీవోలు, డీపీవో ధ్రువీకరణ అనంతరం నివేదికలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్‌కు అందించనున్నారు. గ్రామ పంచాయతీల ప్రస్తుత స్వరూపం, అందుబాటులో ఉన్న వసతులపై ప్రభుత్వానికి కచ్చితమైన అవగాహన రానుంది. పంచాయతీల స్వరూపం తెలిసేలా..భవిష్యత్తులో పంచాయతీలకు కల్పించాల్సిన అదనపు వసతుల కోసం నిధుల కేటాయింపు, ఇతర అవసరాలకు సర్వే వివరాలు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాల తీరు, రోడ్లు, మురుగునీటి కాలువల పరిస్థితి, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాలీల స్థితిగతులపై అంచనా ఉంటుంది. శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ, పాఠశాల భవనాలకు నిధుల కేటాయింపు, మరుగుదొడ్లు, ప్రహరీలు, తాగునీటి వసతి మెరుపర్చేందుకు చర్యలు తీసుకోవచ్చు. అదనపు వీధిదీపాల ఆవశ్యకత వంటి అంశాలతోపాటు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు అవకాశం కలుగుతుంది. మొదలైన సమాచార సేకరణజిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే పంచాయతీల్లో మౌలిక వసతుల పక్కా సమాచారం కోసం సమాచార సేకరణ ప్రక్రియ మొదలైంది. పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు, వ్యవసాయ సంఘం, పశువైద్య ఉపకేంద్రాలు, పాఠశాల భవనాలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, వీధి దీపాలు, కుళాయిలు, బోర్లు, డ్రెయినేజీలు, లింకురోడ్లు, ఇంకుడు గుంతలు, ట్రాక్టర్, ట్రాలీలు, రైతువేదిక, గ్రామ మ్యాప్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాలసేకరణ కేంద్రాలు.. ఇలా అందుబాటులో ఉన్న ప్రతీ వసతిపై సర్వే చేపడుతున్నారు. పల్లె ప్రగతి యాప్‌లోనే జీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్ అనే కొత్త ఆప్షన్ ఇవ్వగా, వివరాలు అందులో పొందుపరుస్తున్నారు. 23 రకాల సమాచారాన్ని సేకరించి అప్లోడ్ చేసేలా యాప్‌ను సిద్ధం చేశారు. -
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: ఫిర్యాదులు క్షుణ్నంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పో లీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించా రు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత డీఎస్పీ, ఏఎస్పీ, సీఐలతో ఫోన్లో మాట్లాడారు. సమస్య స్థితి తెలుసుకుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలుమైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రిపుల్, రాష్, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజ మానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, ప్రజలకు ఇబ్బందులు సృష్టించేలా బైక్‌లకు సైలెన్సర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను చైన్‌స్నాచింగ్, ఇతర అంసాఘింక కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉందని, ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. -
అర్జీలు అందించి.. పరిష్కారం కోరి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు సమర్పించారు. తమ సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు విన్నవించారు. అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా దహెగాం మండలం చౌక గ్రామానికి రేషన్ షాపు మంజూరు చేయాలని గ్రామస్తులు అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ పరిధిలోని భీమన్నగూడకు బీటీ రోడ్డు నిర్మించాలని కొలాం గిరిజనులు కోరారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన ఆవిడపు శ్రీకర్ అర్జీ పెట్టుకున్నాడు. తమ భూమికి అక్రమంగా చేసిన పట్టా రద్దు చేసి, తమ పేరిట పట్టా మంజూరు చేయాలని రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన తురం రమేశ్ విన్నవించాడు. జీఎన్ఎం, వృత్తివిద్యా కోర్సు పూర్తి చేసిన తనకు ఉపాధి చూపాలని జైనూర్ మండలం గూడమామడ గ్రామానికి చెందిన మెస్రం యశోద అర్జీ సమర్పించింది. గృహజ్యోతి వర్తింపజేయాలని కౌటాల మండలం గురుడుపేట గ్రామానికి చెందిన నారాయణ దరఖాస్తు చేసుకున్నాడు. దివ్యాంగుడినైన తనకు ట్రైసైకిల్ మంజూరు చేయాలని కెరమెరి శివదాస్ నగర్‌కు చెందిన బానోత్ దస్రు కోరాడు. కౌటాల వారసంతలో నిర్మించిన మరుగుదొడ్లకు అధికారులు బిల్లులు ఇప్పించాలని మండల కేంద్రానికి మల్లయ్య దరఖాస్తు చేసుకున్నాడు. -
యూరియా కేటాయించాలని వినతి
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాకు మరింత యూరి యా కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ గోపికి సోమవారం హైదరాబాద్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. జిల్లాలోని రైతులు యూరియా సరిపడా అందక ఇబ్బందులు పడుతున్నారని, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా సక్రమంగా యూరియా పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మినర్సయ్య, మాజీ అధ్యక్షుడు గోలి మధుసూదన్, ఉపాధ్యక్షుడు రఘునాథ్, నాయకులు ఉన్నారు. -
యూరియా కోసం రైతుల రాస్తారోకో
బెజ్జూర్(సిర్పూర్): యూరియా సకాలంలో అందించడం లేదని సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వారు మాట్లాడుతూ గంటల తరబడి పడిగాపులు కాస్తు న్నా యూరియా అందడం లేదని, సకాలంలో ఎరువులు చల్లకపోతే పంటలు నష్టపోతామ ని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీఎంస్ ద్వారా యూరియా కేటాయించిన గ్రామాల్లోని రైతులు కూడా మళ్లీ సొసైటీకి రావాల్సి వస్తోందన్నారు. డీసీఎంఎస్ ద్వారా గ్రామాలకు కేటా యించిన యూరియా ఎక్కడ పంపిణీ చేశారో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వి షయం తెలుసుకున్న ఏవో నాగరాజ్, ఎస్సై సత్తార్ పాషా ఘటనాస్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కూపన్లు రాసి ఇస్తామని తె లపడంతో రైతులు రాస్తారోకో విరమించారు. -
జీవో 12ను సవరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జీవో 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ నిధులు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వంగూరి రాములు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన జిల్లా మూడో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన రూ.346 కోట్లను వెంటనే తిరిగి ఇవ్వాలన్నారు. 55 ఏళ్లు నిండిన కార్మి కులకు రూ.9 వేల కనీస పెన్షన్ ఇవ్వాలని, పెళ్లి, ప్రసూతి కానుక రూ.లక్షకు పెంచాలని, సహజ మరణానికి రూ.5లక్షలు ఆర్థికసాయం అందించాలన్నారు. వెల్ఫేర్ బో ర్డు ద్వారా కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు చెల్లించాలని కోరారు. పట్టణాల్లో కార్మికుల కోసం షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి శ్రీని వాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు అశోక్, ఆనంద్‌రావు, రాంచందర్, వెంకన్న, మహేశ్, సదయ్య, సత్తన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉరితాళ్లతో డైలీవేజ్ కార్మికుల నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పని చేసే డైలీవేజ్ వర్కర్ల సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న చెట్టుకు ఉరితాళ్లు వేసుకొని ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్, కృష్ణమాచారి, వసంత్ రావు, కోటయ్య, భరత్, కార్మికులు శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి, ప్రమీల, తిరుపతి, దివ్య, మాన్కుబాయి తదితరులు పాల్గొన్నారు. -
చేయూత
వీధి వ్యాపారులకు ఆసిఫాబాద్: వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం లోక్ కళ్యాణ్ మేళా కింద రుణాలు అందిస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఈ నెల 17 నుంచి స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు కొనసాగనుంది. కొత్తగా వీధి వ్యాపారాలు చేస్తున్న వారిని ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి(పీఎం స్వనిధి) పథకంలో చేర్చనున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు మేళాలు నిర్వహిస్తున్నారు. తొలివిడతగా రూ.15 వేలు, రెండో విడతలో రూ.25 వేలు, మూడో విడత రూ.50 వేల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. కూరగాయల వ్యాపారులతోపాటు వీధుల్లో ఇతర వ్యాపారం చేసుకునే వారికి ఈ పథకం అమలవుతుంది. అక్టోబర్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణజిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రత్యేక మేళాల్లో ఒక్కో మున్సిపాలిటీకి చెందిన 25 మందికి రుణాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోనే ఈ పథకం అమలువుతుండగా, కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్‌లో ఇంకా ప్రారంభించలేదు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3,125 మంది దరఖాస్తు చేసుకోగా 2900 మందికి రూ.3 కోట్ల వరకు రుణాలు అందించారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 90 మంది అర్హులను గుర్తించగా, వారిలో 25 మందికి రుణాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. రెండు విడతలుగా శిక్షణవీధి వ్యాపారులకు రెండు విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగం, కల్తీ నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు కూడా జారీ చేస్తారు. బ్యాంకు అధికారులు, డిజిటల్ ఎగ్రిగేటర్లు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు, ఎన్జీవోలు, వ్యాపారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పథకం కింద వీధి విక్రయదారులతోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధి కల్పించడం ద్వారా సామాజిక భద్రత కల్పించనున్నారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన జ్యోతి బీమా యోజన, పీఎం శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, పీఎం జన్‌ధన్ యోజన, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, జననీ సురక్ష యోజన, భవన నిర్మాణ కార్మికుల నమోదు, పీఎం మాతృవందన యోజన తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకోవాలి లోక్ కళ్యాణ్ మేళా(పీఎం స్వనిధి) కోసం కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు బ్యాంకుకు వెళ్లి వివరాలు సమర్పించాలి. పత్రాలన్నీ పరిశీలించిన అనంతరం రుణాలు మంజూరు చేస్తారు. పూర్తి వివరాలకు 9951716273 నంబర్‌తోపాటు జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలి. – జాడి మోతీరాం, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ ఆర్థికంగా చేయూతవీధి వ్యాపారుల కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలు సేకరించడం, వీధి విక్రేత సామర్థ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు సంక్షేమ పథకాలతో ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పునఃరూపకల్పన చేసిన పీ ఎం స్వనిధి పథకం కింద కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంజూరైన దరఖాస్తులకు రుణ పంపిణీ సులభతరం చేయ డం, బ్యాంకుల్లోని పెండింగ్ దరఖాస్తులను పరి ష్కరించడం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో వీధి ఆహార విక్రేత వ్యాపారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆహార పదార్థాలు విక్రయించే సమయంలో నాణ్యమైన ఆహార పదార్థాలు, కల్తీ లేకుండా వినియోగించడం తదితర అంశాలపై రెండు విడతలుగా వీధి వ్యాపారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌లు సైతం మంజూరు చేస్తారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో బ్యాంకులు, టౌన్ వెండింగ్ కమిటీలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎన్జీవోలు, విక్రేతల సంఘాలు, తదితర ఆర్గనైజేషన్లను భాగస్వాములను చేయనున్నారు. -
షరా మామూలే!
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఈ నెల 9న దహెగాం మండల కేంద్రంలో ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్కాపూర్‌కు చెందిన వ్యాన్‌లో కన్నెపల్లి నుంచి 54 క్వింటాళ్లు తరలించి దహెగాం మండల కేంద్రంలోని వాసవీ మోడ్రన్ రైస్ మిల్లులో అక్రమంగా అన్లోడ్ చేస్తుండగా మిల్లు యజమానితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేట్ సమీపంలో రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియాన్ని ఈ నెల 11న పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. సుమారు 100 క్వింటాళ్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. -
రైల్వేస్టేషన్‌కు దారేది?
ఇది కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారుల్లోఒకటి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సంజీవయ్య కాలనీ బోర్డు, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింది నుంచి ఈ మార్గం గుండా స్టేషన్‌కు చేరుకోవాలి. నిత్యం ఈ రోడ్డుపై ఆటోలు, ద్విచక్ర వాహనాలు నిలిపి ఉంటాయి. రోడ్డు సైతం ఇరుకుగా ఉంది. కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సరైన దారి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందేభారత్‌తోపాటు ఇతర ముఖ్యమైన రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం కల్పించడంతో ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు పెరిగాయి. సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) ప్రహరీ పక్క నుంచి ఉన్న రహదారి వెంట వెళ్లాలంటే అక్కడ ఎస్పీఎంకు సంబంధించి కర్రలోడ్ లారీలు ఉంటున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింది నుంచి అశోక్ కాలనీ మీదుగా వెళ్లాలంటే ఆ రోడ్డు ఇరుకుగా ఉంది. ఆటో లేదా ఫోర్ వీలర్ వాహనం వస్తే ఎదురుగా వచ్చే వాహనదారులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే రైల్వే స్టేషన్ పక్కన గల రోడ్డును రైల్వే అధికారులు వాహనాలు రాకుండా మూసివేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్టేషన్‌కు చేరుకోవడం కష్టంగా మారింది. ఈ సమస్యలను ఇటీవల పట్టణానికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ప్రయాణికులతోపాటు రైల్వే సేవా సమితి సభ్యులు విన్నవించారు. స్టేషన్ మీదుగా 121 రైళ్లుకాగజ్నగర్ రైల్వే స్టేషన్ మీదుగా 121 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్, సంపర్క్‌క్రాంతి, నవజీవన్, భాగ్యనగర్, ఇంటర్సిటి, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దానాపూర్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం బిలాస్పూర్, పాటలీపుత్ర, ధనాపూర్, గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లు, సంఘమిత్ర రైళ్లను స్థాని కులు ఎక్కువగా రాకపోకలకు వినియోగిస్తున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని వివిధ మండలాల నుంచి ప్రతీరోజు నాలుగు వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సా గిస్తున్నారు. రైల్వేకు టికెట్ ద్వారా రోజూ రూ.3లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఆదాయం వస్తున్నా సౌకర్యాలు మెరుగుపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇబ్బందులు పడుతున్నాం కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. అత్యవసర సమయంలో కారు, ఆటోలో వెళ్తే ఇరుకు రోడ్డుపై గంటల తరబడి ఆగాల్సి వస్తోంది. – పవన్ బల్దేవ్, రైల్వే యాత్రి సేవా సమితి పీఆర్వో, కాగజ్‌నగర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం స్టేషన్‌కు రావాలంటే రైల్వే క్వార్టర్ల పక్కన ఉన్న రోడ్డు గుండా ఇంతకు ముందు ఇబ్బందులు లేకుండా వచ్చేవాళ్లం. కొన్నిరోజుల క్రితం అధికారులు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు. గోడను తొలగించాలని వారికి విన్నవించాం. ప్రయాణికుల సౌకర్యార్థం సరైన రోడ్డు ఏర్పాటు చేయాలి. – అరుణ్ లోయ, కాగజ్‌నగర్ -
బాపూజీ సేవలు మరువలేనివి
ఆసిఫాబాద్‌అర్బన్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కో సం రాజీ లేని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయంగా, సామాజికంగా ఎత్తుపల్లాలు చూశారని తెలిపారు. ఉద్యమాలే ఊపిరిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేశారన్నారు. జిల్లాలో బాపూజీ విగ్రహ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, లింగ య్య, చిప్ప సురేశ్, ఇరుకుల మంగ, పుష్పలత, సునీత, క్రాంతి, రేవతి, శైలేందర్, మోహన్, తిరుపతి, ధర్మయ్య, రమేశ్, వెంకటేశ్, రవీందర్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పిస్తున్న నాయకులు -
కుటుంబ కలహాలతో భార్య హత్య
కొమరంభీం జిల్లా: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన ఘటన మండలంలోని నారాయణపూర్‌లో చోటుచేసుకుంది. రెబ్బెన సీఐ సంజయ్ కథనం ప్రకారం.. నారాయణపూర్ గ్రామానికి చెందిన గజ్జల తిరుపతి, మంచిర్యాల జిల్లా బూదకలాన్‌కు చెందిన స్రవంతి (38) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. తిరుపతి వ్యవసాయ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిచేస్తున్నాడు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. గత కొంతకాలంగా తిరుపతి మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో భార్యను ఎలాగైన హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న స్రవంతి మెడ, గొంతుపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలై అక్కడిక్కక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ, సీఐ సంజయ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య జరిగిన తీరును, అందుకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తమ్ముడు టేకుమట్ల సంజయ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
విద్యాసంస్థల అభివృద్ధికి చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఈవోలు, సెక్టోరియల్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఇన్చార్జి డీఈవో, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ తదితర కార్యక్రమాలను డీఈవోల సమన్వయంతో ప్రతీ పాఠశాలలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎంఈవోలు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం సందర్శించి బడుల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్, అబిద్ అలీ, మధుకర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అఖిల భారతీయ విజ్ఞాన మేళాకు ఎంపిక
ఆసిఫాబాద్‌అర్బన్: ఈనెల 18, 19, 20 తేదీ ల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణ భార త విజ్ఞాన మేళాలో సంస్కృతి బోధపరియోజన ప్రశ్నమంచ్ అంశంలో పాల్గొని అఖిత భారతీయ విజ్ఞాన మేళాకు జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ (ఇంగ్లిష్ మీడియం) విద్యార్థులు గుత్తి వెంకటరత్న, కల్లూరి చరణ్, హరిచరణ్ ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపా ధ్యాయుడు కోటేశ్వర్రావ్ శనివారం తెలిపా రు. వీరు నవంబర్ 4, 5, 6, 7తేదీల్లో బిహార్‌లోని సీతామడీలో నిర్వహించనున్న అఖిల భారతీయ విజ్ఞాన మేళాకు ఎంపికైనట్లు పే ర్కొన్నారు. వీరికి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షు డు చామర్తి ఉమామహేశ్వర్రావ్ బహుమతి ప్రదానం చేసి అభినందించారు. దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్‌రావ్ పాల్గొన్నారు. వి ద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సత్యనారాయణను సభ్యులు, ఆచార్యులు అభినందించారు. -
ఆడబిడ్డల పండుగ
బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ. తొమ్మిది రోజులపాటు పసుపుతో గౌరమ్మను తయారు చేసి మహిళలు గౌరీదేవిని పూజిస్తారు. చిన్నారులు, యువతులు, వృద్ధులు అనే భేదం లేకుండా అందరూ కలిసి జరుపకొంటారు. ఆడబిడ్డలు జరుపుకొనే తొమ్మిది రోజుల పండుగ కోసం పూల దగ్గర నుంచి నైవేద్యం తయారీ వరకు ఇంటిల్లిపాది సహకరిస్తారు. ప్రకృతిలో దొరికే పూలను దైవంగా భావించి పూజించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. – వేమారం మహేశ్వర్‌శర్మ, శివాలయం పురోహితుడు, చెన్నూర్ -
ప్రహరీ క్లబ్‌లతో డ్రగ్స్ నిర్మూలన
కెరమెరి(ఆసిఫాబాద్): పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మత్తు పదార్థాల నియంత్రణలో విద్యార్థులను భాగస్వాములను చేసేలా జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశా ల ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, సీనియర్ ఉపాధ్యాయుడు ఉపాధ్యక్షుడిగా ఆరు నుంచి పదో తరగతి వరకు ఇద్దరు విద్యార్థుల చొప్పున క్లబ్లో సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరికి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్‌కు సభ్యులుగా అవకాశం కల్పిస్తారు. ఇవీ.. నిబంధనలుడ్రగ్స్ నివారణపై పాఠశాల ఆవరణల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్ఫలితాలు, అవగాహన నినాదాలు, డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబర్లు 18005996969, 1800110031 పాఠశాల గోడలపై రాయించాలి. మాదక ద్రవ్యాల ను నివారిస్తామంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలి. విద్యాసంవత్సరంలో చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించాలి. అల్కహాల్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, నార్కోటెక్ పదా ర్థాల విక్రయాలు పాఠశాల నుంచి 100 మీటర్ల వరకు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శిస్తూ లోపాలను సవరించాలి. సమన్వయంతోనే నియంత్రణడ్రగ్స్ బాధితులను గుర్తించి చికిత్స అందించాలి. డ్ర గ్స్ నియంత్రణకు పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసే ప్రతీ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలి. విద్యార్థుల్లో ఏదైన అసాధారణ ప్రవర్తన గుర్తిస్తే కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలి. బాధితులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. పోలీస్, ఆరోగ్య, ఎకై ్సజ్ శాఖలతో పాటు ఎన్జీవోలతో పాఠశాల విద్యాశాఖ సమన్వయం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. కొనసాగుతున్న కార్యక్రమాలుప్రహరీ క్లబ్‌లలోని సభ్యులతోపాటు పోలీసులు కూ డా మాదక ద్రవ్యాల నిర్మూలనపై పాఠశాలల్లో వి ద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లోగల ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్ధాలను పోలీసులు విద్యార్థులకు వివరిస్తున్నారు. మొత్తంగా పాఠశాల స్థాయి నుంచి చేపడుతున్న డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఉన్నత పాఠశాలలు 60 ప్రాథమికోన్నత పాఠశాలలు 100 విద్యార్థులు 32,143జిల్లా సమాచారం -
చట్టపరమైన పరిజ్ఞానం అవసరం
ఆసిఫాబాద్‌అర్బన్: నేరాల నియంత్రణలో చట్టపరమైన పరిజ్ఞానం అవసరమని జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక చట్ట అవగాహన సమావేశం నిర్వహించగా ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్ష్యాధారా ల సేకరణలో జాగ్రత్తలు, దర్యాప్తు పద్ధతులు, ఎఫ్ ఐఆర్ నమోదు విధానం, మైనర్ కేసుల్లో చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాలు, మహిళలపై జరిగే నేరాల పరిధిలో అమలు చేయాల్సిన నిబంధనల గురించి విపులంగా వివరించారు. పోక్సో చట్టం 2012, జువైనల్ జ స్టిస్ యాక్ట్ 2015, మోటార్ వెహికిల్ యాక్ట్ 1998, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018, ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, సైబర్ నేరాలపై అమలు చేయాల్సిన చట్టా లు తదితర అంశాలపై ఉదాహరణలతో అవగాహ న కల్పించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు చట్టాలపై నిర్వహించే అవగాహన సమావేశాలను సద్వినియోగం చేసుకు ని పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, ప్రిన్సిపల్ జూని యర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, పీపీ రమణారెడ్డి, ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాలబాలికల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం కనక కర్నూ, పీడీ హీరాబాయి తెలిపారు. వీరిని శనివారం ట్రైబ్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.రమాదేవి, షూటింగ్ బాల్ జిల్లా కార్యదర్శి గురువేందర్, గిరిజన క్రీడల అధికారి మడావి షేకు, ఏసీఎం ఉద్ద వ్, జీసీడీవో శకుంతల, ఏటీడీఏ చిరంజీవి, హెచ్‌డబ్ల్యూవో మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, తిరుమ ల్, అరవింద్, రవి, యాదగిరి, రాకేశ్, సాయి, అ ధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. కబడ్డీ పోటీలకు సాయిదీక్ష..జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని బొట్టుపల్లి సాయిదీక్ష మంచిర్యాల జిల్లా మందమర్రి పట్ట ణంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన జోనల్ స్థాయి ఎస్జీఎఫ్ అండర్–19 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సాయిదీక్షను ఫిజికల్ డైరెక్టర్ తిరుపతి, శ్రీవర్ధన్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. నెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలుజిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో శనివారం జూనియర్, సీనియర్ విభాగాల్లో జిల్లాస్థా యి బాలబాలికలు, మెన్, ఉమెన్ నెట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జూనియర్ విభాగంలో బాలికలు 12మంది, బాలు రు 12మంది, సీనియర్ మెన్, ఉమెన్ విభాగాల్లో 12మంది చొప్పున వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి 100 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచినవారంతా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ మ హేశ్వర్, తిరుపతి, హరికృష్ణ, ఏడుకొండలు, రాకేశ్, కిరణ్, నాగమణి తదితరులు హాజరయ్యారు. కిక్ బాక్సింగ్‌లో రాణించిన విద్యార్థినులుదహెగాం: మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థి నులు రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్‌లో రాణించారని పీ ఈటీ శ్రీలత తెలిపారు. మూడురోజుల క్రితం హన్మకొండలో నిర్వహించిన ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో 9వ తరగతికి చెందిన తేజస్విని, ప్రథమ స్థానం, 10వ తరగతి విద్యార్థినులు కే అశ్విత, హిమబిందు తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో రాణించినందున శనివారం విద్యార్థినులను అభినందించారు. సాయిదీక్షను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ మహేశ్షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులు -
వేతన పోరాటం!
ఆసిఫాబాద్‌రూరల్/తిర్యాణి: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో వారు విధులు బహిష్కరించి ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. మరోవైపు వంట చేసేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెగ్యులర్ సిబ్బంది అధికారులు, విద్యార్థులతో కలిసి వంట పనులు చేస్తున్నారు. జిల్లాలో 48 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా, ఇందులో 68 మంది డైలీవేజ్ వర్కర్లు, 282 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మొత్తం 450 మంది పనిచేస్తున్నారు. దాదాపుగా 11,560 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హెడ్కుక్, కామటి, వాచ్మెన్ తదితర పనులు చేసే డైలీవేజ్ వర్కర్లకు రోజుకు రూ.619 చెల్లిస్తారు. ఇందులో ఏజెన్సీలో పనిచేసే వారికి నెలకు రూ.18 వేలు, నాన్ ఏజెన్సీ వారికి రూ.13,750, మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే వారికి రూ.15,000 అందుతున్నాయి. ఇక ఔట్సోర్సింగ్ కింద వసతిగృహాల్లో హెల్పర్, శానిటేషన్‌తోపాటు వాటర్, విద్యుత్, వాచ్మెన్ పనులు చేస్తున్న వారికి రూ.12వేలు చెల్లిస్తున్నారు. హామీల అమలుకు డిమాండ్గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు అందడం లేదు. 2023లో సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోవడంతోనే సమ్మె చేపట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. 30 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నా తమకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2012లో విడుదల చేసిన జీవో సవరించి 2014 నాటికి ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, కొత్త మెనూతో పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, ప్రతీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాదబీమా, మరణించిన కార్మికుల కుటుంబంలోని ఒకరికి ఉద్యోగావకాశం, రిటైర్మెంట్ తర్వాత రూ.5 లక్షలు బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. పండుగలోపు చెల్లించాలి ఏడు నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ అవసరాలకు ఇబ్బందులు పడుతున్నాం. దసరా పండుగలోపు వేతనాలు చెల్లించి న్యాయం చేయాలి. – రాంబాయి, డైలీవేజ్ వర్కర్, చెలిమెల ఎలా బతకాలి..? 30 ఏళ్లుగా తిర్యాణి మండలంలోని మంగీ పాఠశాలలో పని చేస్తున్న. బడ్జెట్ లేదు అంటూ ఏడు నెలలుగా జీతాలు ఆపారు. మేము ఎలా బతకాలి. – గిరుజుబాయి, మంగీ పాఠశాల విద్యార్థులతో పనులు చేయించొద్దు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల సమస్యను ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైన చోట ప్రైవేట్ వ్యక్తులను నియమించాం. విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించొద్దు. – రమాదేవి, డీటీడీవో విద్యార్థులతో వంట పనులు సమ్మె కారణంగా రెగ్యులర్ సిబ్బంది, విద్యార్థులపై భారం పడుతోంది. ఎనిమిది, పది మంది చేయాల్సి పనిని ఇద్దరు, ముగ్గురే చేస్తున్నారు. వారం రోజులగా వంట పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. పలుచోట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులే సిబ్బందికి సహకరిస్తున్నారు. విద్యార్థులతో పనులు చేయిస్తే చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తెలిపినా ఎక్కడా అమలు కాకపోవడం గమనార్హం.వేతనాలు విడుదల చేయాలి ఏళ్లుగా తక్కువ జీతానికి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయలేదు. 12 నెలల వేతనం పూర్తిగా చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనాలు వెంటనే విడుదల చేయాలి. – శశికళ, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆసిఫాబాద్ జీవో 64 రద్దు చేయాలి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వర్కర్లకు టైంస్కేల్ అమలు చేసి జీవో 64 రద్దు చే యాలి. కలెక్టర్ గెజిట్ ప్రకారం క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలి. – కృష్ణమాచారి, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షుడు -
దసరాకు ఆర్టీసీ ‘స్పెషల్’
ఆదిలాబాద్/మంచిర్యాలఅర్బన్: బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు వచ్చే వారి కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 414 సర్వీసులు నడపాలని నిర్ణయించింది. నేటి నుంచి అక్టోబర్ 1వరకు నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి షురూ..పాఠశాలలకు ఈనెల 21నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శని, ఆది రెండు రోజుల్లో విద్యార్థులు తమ సొంత ఊళ్ల బాట పట్టనున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఉమ్మడి జిల్లాకు చేరుకోనుండడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈనెల 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న దసరా పండుగలున్నాయి. తదనుగుణంగా బస్సులు నడిపేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రీజియన్ వ్యాప్తంగా మొత్తం 414 బస్సులను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా నడిపేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1వరకు రీజియన్ పరిధిలోని బస్సులు ఎంజీబీఎస్ నుంచి కాకుండా జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఆదిలాబాద్‌లోని వివిధ డిపోలకు నడపనున్నారు. అలాగే అక్టోబర్ 5, 6 తేదీల్లో తిరుగు ప్రయాణం దృష్ట్యా రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా..పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం శనివారం నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఒకే చోట 50 మంది విద్యార్థులు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో మేనేజర్లను సెల్ నంబర్లలో సంప్రదిస్తే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో (99592 26002), నిర్మల్( 99592 26003), భైంసా(99592 26005), ఆసిఫాబాద్ (99592 26006) మంచిర్యాల (99592 26004) నంబర్లలో సంప్రదించవచ్చు. రిజర్వేషన్ ఇలా..పండగల దృష్ట్యా రిజర్వేషన్ చేసుకోవాలనే ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే www. tgsrtcbus. in వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీలోనే సురక్షిత ప్రయాణం పండుగల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడపనున్నాం. రద్దీ దృష్ట్యా ముందస్తుగా రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల సౌకర్యార్థం (50 మంది ఉంటే) బస్సు కావాలనుకునే వారు డిపో మేనేజర్లను ఆయా నంబర్లలో సంప్రదించవచ్చు. – ఎస్.భవానీప్రసాద్, ఆర్ఎంవో, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో కేటాయించిన ప్రత్యేక సర్వీసులుడిపో కేటాయించిన బస్సులు ఆదిలాబాద్ 85 భైంసా 20 నిర్మల్ 123 ఉట్నూర్ 5 ఆసిఫాబాద్ 58 మంచిర్యాల 123 ప్రయాణికులపై అదనపు వడ్డన..ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ పెరిగింది. టికెట్ తీసుకున్న పురుష ప్రయాణికులు చాలా చోట్ల నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి. తాజాగా పండుగల వేళ స్పెషల్ బస్సుల్లోనూ రద్దీ ఉండనుంది. దీనికి తోడు ప్రత్యేక సర్వీసుల్లో ఏకంగా 50 శాతం అదనపు చార్జీ అమలుకు సంస్థ నిర్ణయించింది. దీంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. గతంలో సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని వంటి సర్వీసుల్లోనే అదనపు చార్జీలు వసూలు చేసిన సంస్థ ఈసారి పల్లె వెలుగు సర్వీసుల్లో కూడా అదనపు వడ్డనకు రంగం సిద్ధం చేసింది. -
ఆశల ‘ప్రాణహిత’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత పదిహేడేళ్లుగా ఉమ్మడి జిల్లా వాసుల చిరకాల కలగా ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణానికి సాగునీటి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించడం ఈ ప్రాంత రైతులకు పెద్ద ఊరటనిస్తోంది. 2008లో ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అటవీ అనుమతులు, కాలువల నిర్మాణం, భూ సేకరణ జరిగాయి. 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైనింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. బరాజ్‌ను కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డకు మార్చడంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మరుగున పడింది. తర్వాత ఈ ప్రాంత వాసులకు సాగునీటి కోసం డిమాండ్లు రావడంతో ప్రాణహిత, వార్దా, పెన్‌గంగ నదులపై పలు చోట్ల తక్కువ ఎత్తులో సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల కోసం ప్రాజెక్టు కడతామని ప్రణాళికలు వేసినా ముందుకు కదల్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత కడతామని ఇచ్చిన హామీపై ఆచరణ దిశగా సాగుతోంది. ప్రత్యేక చొరవ చూపితేనే..చుట్టూ నీరున్నా ఒక్క భారీ నీటి పారుదల ప్రాజక్టు లేక ఈ ప్రాంత రైతులు అల్లాడుతున్నారు. నీరులేక పత్తి, కంది తదితర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. చాలాచోట్ల వర్షాధారమే దిక్కు. వానాకాలంలో పంట వేస్తే యాసంగిలో భూములు బీడుగా ఉంటాయి. రెండో పంట వేసుకోలేని దుస్థితి. పల్లెల్లో పనులు లేని సమయాల్లో వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో సిర్పూర్ వంటి మారుమూల ప్రాంతంతోపాటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల పరిసర రైతులకు సాగునీరందే అవకాశాలు ఉన్నాయి. ఏళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాక సాగునీటికి దూరంగానే ఉంటున్నారు. మహారాష్ట్రతో గతంలోనే 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. తాజాగా 150మీటర్ల ఎత్తు కోసం అనుమతికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో నది అవతల గ్రామాల ముంపు, అటవీ అనుమతులు బరాజ్ నిర్మాణానికి ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి. ఏటేటా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం నిధుల ఖర్చులో ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది. చిత్తశుద్ధితో పూర్తి చేయాలి మారుమూల ప్రాంత రైతులకు సాగునీరందించే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం సంతోషకరమే. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుంది. బరాజ్ నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేయాలి. మహారాష్ట్రతో ఒప్పందంపై కేంద్ర ప్రభు త్వ సహకారంతో మా వంతు కృషి చేస్తాం. – పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే, సిర్పూర్ కాలువలు ధ్వంసం, పైపుల తరలింపుతుమ్మిడిహెట్టి నుంచి చింతలమానెపల్లి, దహెగాం, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల మండలాల మీదుగా నీళ్లు గోదావరిపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోవాలి. మరో ప్యాకేజీలో ఎస్సారెస్పీ నుంచి నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు నీటిని తరలించాలి. కాళేశ్వరం రాకతో ఈ నీటి తరలింపు నిలిచిపోయింది. దీంతో 40కి.మీపైన తవ్విన కాలువలన్నీ ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల కబ్జాలకు గురయ్యాయి. కొన్ని చోట్ల పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ఇతర ప్రజాప్రయోజనాలకు వాడుతున్నారు. ఇక కర్జెల్లి, సురగపల్లి, మైలారంలో రిజర్వాయర్ల నిర్మాణం కోసం భూ సేకరణ జరిగింది. వృథాగా ఉన్న పైపులను రెండేళ్ల క్రితమే ఇతర ప్రాంతాలకు తరలించారు. తాజాగా ఆ కాలువలను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. -
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి
ఆసిఫాబాద్: న్యాయవాదుల రక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం న్యాయవాదులతో కలిసి కోర్టు విధులు బహిష్కరించారు. రక్షణ చట్టం అమలు చే యాలని సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీ క్రిమినల్ కోర్టులోని న్యాయవాదులు అనిల్, హనుమాన్ నాయక్‌పై కక్షిదారులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. రోజురోజుకూ న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చరణ్, సీనియర్ న్యాయవాదులు ముక్త సురేశ్, బోనగిరి సతీశ్‌బాబు, నికోడె రవీందర్, కిశోర్, గణపతి, రామకృష్ణ, చంద్రకుమార్, రౌనక్ అగర్వాల్ పాల్గొన్నారు. -
లాభాల వాటా చెల్లించాలని ధర్నా
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి కార్మికులకు 35 శా తం వాటా చెల్లించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి డిమాండ్ చేశారు. గోలేటిలోని జీఎం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ యాజమాన్యం 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలన్నారు. సొంతింటి పథకం అమలు చేయాలని, అలవెన్స్‌లపై ఐటీని యాజమాన్యమే చెల్లించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, డిస్మిస్ కార్మికులకు మరోసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జీఎం విజయ భాస్కర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య, రాజేశ్, కిరణ్‌బాబు, చంద్రశేఖర్, ఆనంద్, ఫిట్ కార్యదర్శులు శ్రీనివాస్, రామయ్య, అశోక్, మల్లేశ్, రమేశ్, ఓదెలు, షిఫ్ట్ ఇన్చార్జి అంజయ్య, వెంకటేశ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఆసిఫాబాద్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టి.మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం చీఫ్ ఇంజినీర్ ఆపరేషన్ –1 అశోక్‌తో కలిసి విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందు కు అవసరమైన పరికరాలు అందిస్తామని తె లిపారు. జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లకు ప్రత్యామ్నాయ లైన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఉద్యోగులు పనిచేసే సమయంలో అన్నిరకాల భద్రత పరికరాలు ఉపయోగించాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో విద్యుత్‌శాఖ ఎస్ఈ రాథోడ్ శేషారావు, డీఈఈలు, ఏడీఈలు, ఏఈఈలు, సబ్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
వినూత్న పద్ధతుల్లో బోధించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో పాఠ్యాంశాలు బోధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శుక్రవారం జిల్లాస్థాయి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం) మేళా నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి విజేతలు రాష్ట్రంలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగులో వాంకిడి మండలంలోని ఎంపీపీఎస్ భీంగూడ పాఠశాలకు చెందిన నగేశ్ కుమార్ మొదటి స్థానంలో నిలవగా, ఆసిఫాబాద్ మండలం గోవింద్పూర్ ఎంపీపీఎస్ స్కూల్‌కు చెందిన హిమబిందు రెండోస్థానంలో నిలి చింది. ఇంగ్లిష్ టీఎల్‌ఎంలో తిర్యాణి మండలం ఉల్లిపిట్ట యూపీఎస్ ఉపాధ్యాయుడు వంశీకృష్ణ, దహెగాంలోని ముత్తపేట ఎంపీపీఎస్ టీచర్ సుప్రియ, గణితంలో ఆసిఫాబాద్ మండలం గోవింద్పూర్ ఎంపీపీఎస్ టీచర్ భాగ్యలక్ష్మి, తిర్యాణి మండలం గంభీరావుపేట యూపీఎస్ టీచర్ రవి, ఈవీఎస్‌లో జైనూర్ మండలం లక్ష్మిపూర్ ఎంపీపీఎస్ టీచర్ ప్రమీల, సిర్పూర్(టి) యూపీఎస్ టీచర్ వెంకటేశ్, ఉర్దూ మీడియంలో కాగజ్‌నగర్ మండలం దంతన్గూడ యూపీఎస్ టీచర్ సుల్తానా ఉత్త మ టీఎంఎల్లు ప్రదర్శించారు. కార్యక్రమంలో ని ర్వాహకులు క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఉదయ్‌బాబు, ఎంఈవోలు సుభాష్, ప్రకాశ్, హనుమంతు, వెంకటేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని, యజమానులపై కేసులు సైతం నమోదు చేస్తామని డీసీపీవో బూర్ల మహేశ్ అన్నారు. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి గ్రామంలో శుక్రవారం బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. 14 ఏళ్లలోపు బాలబాలికలను విధిగా పాఠశాలలకు పంపించాలన్నారు. బాల్య వివాహాలు చేయకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాల్యవివాహాల గురించి సమాచారం ఉంటే 1098 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి దేవిక, హెచ్ఎం నరహరి తదితరులు పాల్గొన్నారు. -
మగువలకు బతుకమ్మ కానుక
ఆసిఫాబాద్‌అర్బన్: బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది. గతంలో తెల్లరేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ చీరలు అందించగా, ప్రస్తుతం ఎస్‌హెచ్‌జీ సభ్యులకు మాత్రమే ఇందిరా మహిళా శక్తి కింద అందించనున్నారు. మరో రెండు రోజుల్లో అవసరమైన స్టాక్ జిల్లాలోని గోదాంలకు చేరుకోనుంది. సద్దుల బతుకమ్మకు ముందుగానే అర్హులకు అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. నాణ్యతపై ప్రత్యేక దృష్టిజిల్లాలో మొత్తం 8,897 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,02,992 మంది సభ్యులు గా కొనసాగుతున్నారు. మహిళా సంఘాల్లో ప్రస్తు తం 18 ఏళ్లు నిండిన వారికే అవకాశం ఉంది. ‘రేవంతన్న కానుక’గా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందించనుంది. గత ప్రభుత్వ హయాంలోనూ చీరలు పంపిణీ చేసినా నాణ్యతపై విమర్శలు వచ్చాయి. గతంలో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులో పేరున్న ప్రతీ మహిళకు బతుకమ్మ చీరలు అందించారు. నాణ్యత సక్రమంగా లేకపోవడం, డిజైన్లు ఒకేరీతిలో ఉండడంతో చాలా మంది వాటిని ధరించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదట చీరల పంపిణీని నిలిపివేసింది. ప్రస్తుతం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. క్షేత్రస్థాయిలో విమర్శలు రాకుండా మన్నికైన చీరల కోసం ఒక్కోదానికి సుమారు రూ.800 వెచ్చించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి విడతలో ఒకటే..!బతుకమ్మ కానుకగా ఒక్కో మహిళకు రెండు చొప్పు న చీరల అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి విడత ఒక్కటి మాత్రమే ఇవ్వనున్నారు. మరో రెండు రోజుల్లో జిల్లాకు 1,02,992 చీరలు రానున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటిని కౌటాల, జైనూర్, రెబ్బెన మండలం రాంపూర్‌లోని గోదాంలలో భద్రపర్చనున్నారు. గోదాంల నుంచి ఆయా గ్రామాలకు అవసరం మేరకు సరఫరా చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో మహిళా సంఘాలు, సభ్యుల సంఖ్య, ఏయే ప్రాంతాలకు ఏ మేరకు సరఫరా చేయాలనే వివరాలను మెప్మా, సెర్ప్ సిబ్బంది సేకరించారు. ఉన్నతాధికారులకు సైతం నివేదించారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 900 ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లు, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 279 గ్రూపుల్లో సభ్యులకు చీరలు అందించనున్నారు. రెండు రోజుల్లో జిల్లాకు.. బతుకమ్మ కానుకగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రభుత్వం ఉచితంగా చీరలు అందించాలని నిర్ణయింది. మరో రెండు రోజుల్లో అవసరమైన చీరలు జిల్లాకు చేరుకుంటాయి. వీటిని భద్రపరిచేందుకు వీలుగా జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గోదాంలు గుర్తించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం. – దత్తారావు, డీఆర్డీవోఅర్హులు, అవసరమైన చీరల వివరాలు మండలం ఎస్‌హెచ్‌జీ 6.30మీ. 9మీ. కాగజ్‌నగర్ 10,658 8,158 2,500 ఆసిఫాబాద్ 7,632 5,699 1933 వాంకిడి 8,223 5,023 3200 దహెగాం 5,988 3,588 2400 రెబ్బెన 8,061 4,661 3,400 తిర్యాణి 5,644 3,394 2,250 కౌటాల 6,965 4,179 2,786 సిర్పూర్(టి) 6,021 3,521 2,500 పెంచికల్పేట్ 2,909 1,209 1,700 బెజ్జూర్ 5,201 3,180 2,021 చింతలమానెపల్లి 5,317 3,190 2,127 జైనూర్ 6,347 2,539 3,808 కెరమెరి 5,929 2,464 3,465 సిర్పూర్(యూ) 3,658 1,583 2,075 లింగాపూర్ 3,219 1,288 1,931 మున్సిపాలిటీలుకాగజ్నగర్ 8,357 8,327 30 ఆసిఫాబాద్ 2,863 2,613 250 -
ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్
కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన పత్తి పంట క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర సక్రమంగా అందించేందుకు 2025– 26సంవత్సరంలో కొనుగోళ్లు కపాస్ కిసాన్ యాప్ ద్వారా చేపట్టనున్నారు. పత్తి సాగు చేసిన రైతులు ఈ నెల 30లోగా ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు పత్తి సాగుచేసిన భూమి సర్వే నంబర్, ఆధార్, ఇతర వివరాలు నమోదు చేయాలి. రెవెన్యూ అధికారుల నుంచి పత్తి పంట ధ్రువీకరణ పత్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలు అందించాలి. సాగు విస్తీర్ణంతోపాటు ఇతర వివరాలు నమోదు చేయగానే సీసీఐకి వివరాలు చేరిపోతాయి. ఏ ప్రాంతంలో ఎంత సాగు చేశారనే దానిపై అంచనా వస్తుంది. వివరాల ఆధారంగా సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతుంది. అండ్రాయిడ్ సెల్‌ఫోన్ లేని వారు సమీపంలోని మీసేవ కేంద్రాలతోపాటు ఏఈవోల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. -
పత్తాలాట.. కోడిపందేలు
కౌటాల మండలం గురుడుపేటకు చెందిన మహిళలు పేకాటను నియంత్రించాలని ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి వినతిపత్రం అందించారు. యువత పేకాడుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో నాటుసారా విక్రయాలు, అక్రమ దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురుడుపేట గ్రామంలోనే కాకుండా జిల్లాలోని పలు పల్లెల్లో పరిస్థితి ఇలాగే ఉంది. పత్తాలాట, కోడి పందేలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కౌటాల(సిర్పూర్): మరికొద్ది రోజుల్లో దసరా సంబురాలు ప్రారంభం కానుండగా, జిల్లాలో పేకాట, కోడి పందేలు జోరందుకున్నాయి. పోలీసుల దాడుల్లో కొందరు పట్టబడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా యువత జూద క్రీడలకు బానిసలుగా మారి అప్పులపాలవుతున్నారు. పేకాట, కోడి పందేల నిర్వహణకు ప్రత్యేక స్థావరాలు సైతం ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇదీ పరిస్థితి.. కౌటాల, వాంకిడి, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), జైనూర్ మండలాల్లో పేకాట జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గ్రామాల శివారుల్లోనూ నిత్యం స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల దాడులకు తాత్కాలికంగా భయపడినా మళ్లీ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటున్నారు. కాగజ్‌నగర్ పట్టణ శివారులోని ఈజ్గాం, భట్టుపల్లి, అంకుసాపూర్ ప్రాంతాలైతే పేకాట స్థావరాలకు పేరుమోశాయి. మరికొందరు బడాబాబులు ఏకంగా సరిహద్దు దాటి మహారాష్ట్రలోని దాబాల్లో రూ.లక్షలు పెడుతూ జూదంలో మునిగిపోతున్నారు. ఆది, బుధవారాల్లో మహారాష్ట్రకు..జిల్లాలోని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే పల్లెల్లో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతీ ఆదివారం, బుధవారం మహారాష్ట్రలో నిర్వహించే కోడి పందేలకు జిల్లా నుంచి పదుల సంఖ్యలో తరలివెళ్తున్నారు. దసరా పండుగకు నిర్వహించే పందేల కోసం ఇప్పటినుంచే ప్రత్యేకంగా పుంజులు పెంచుతున్నారు. రూ.వేలల్లో బెట్టింగ్ కాస్తూ అప్పులపాలవుతున్నారు. పోలీసులు పేకా ట, కోడి పందేలపై దాడులు నిర్వహించినా నిందితులపై పీటీ కేసులు మాత్రమే పెడుతున్నారు. నిందితులు కోర్టుల్లో నామమాత్రపు జరిమానా చెల్లించి బయటపడుతున్నారు. కొందరు పోలీసులు పేకాట నిర్వాహకులకు ముందుగానే సమాచారం ఇస్తూ సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి ఘటనలు కఠిన చర్యలు తప్పవు జిల్లాలో చట్టవిరుద్ధంగా పేకాట, కోడిపందేలు ఆడితే చర్యలు తప్పవు. కేసులు నమోదు చేస్తాం. వ్యసనాల బారిన పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. తరుచూ తనిఖీలు, దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీ గడిచిన ఎనిమిది నెలల్లో నమోదైన కేసులుదాడులు కేసులు నిందితులు పట్టుకున్న నగదు పేకాట 90 507 రూ.4,69,470 కోడి పందేలు 16 88 రూ.25,660 -
మోదీ ఆధ్వర్యంలో రైల్వేల అభివృద్ధి
కాగజ్‌నగర్‌టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలోని రైల్వేలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. గురువారం కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్ –నాగ్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్‌ను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది వందేభారత్ రైలును సికింద్రాబాద్– నాగ్‌పూర్ రైలును ప్రారంభించగా, అప్పటినుంచి కాగజ్‌నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించాలని డిమాండ్ ఉందన్నారు. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇక్కడ వందేభారత్‌కు స్టాప్ సౌకర్యం కల్పించారని తెలిపారు. సికింద్రాబాద్, నాగ్‌పూర్‌కు వెళ్లేందుకు ఉపయోగకరంఅనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్, నాగ్‌పూర్‌కు వెళ్లేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైల్వే స్టేషన్లో రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వారం రోజుల్లో నాలుగు రైళ్లకు హాల్టింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే సిర్పూర్ టౌన్ స్టేషన్లో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య మరో కొత్త రైలు ప్రవేశపెట్టాలని, చర్లపల్లి హౌరా వయా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు కొత్త రైలు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. సంజీవయ్య కాలనీ వద్ద అండర్ బ్రిడ్జి, చింతగూడ రైల్వే క్రాసింగ్, ఈస్గాం రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయన్నారు. కొత్త రైళ్ల హాల్టింగ్‌తో కాగజ్‌నగర్ స్టేషన్లో వందకు పైగా ట్రైన్లు ఆగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సికింద్రాబాద్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం.గోపాల్, ముఖ్య సంబంధాల అధికారి శ్రీధర్, దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్‌నాథ్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
పొర్లుదండాలతో నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పనిచేసే డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె ఏడో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల వేతనాలు చెల్లించాలన్నారు. సీఐటీయూ, సంఘాల నాయకులు ప్రభాకర్, కృష్ణమచారి, వసంత్ రావు, కోటయ్య, భరత్, వర్కర్లు శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి తదితరులు పాల్గొన్నారు. -
కేసులు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో వన్యప్రాణుల వేటకు సంబంధించిన కేసులను త్వరగా పరి ష్కరించాలని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పో లీసు కార్యాలయంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి గురువారం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ పోలీస్, అటవీశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేయాలన్నారు. అటవీ జంతువులను వేటాడిన కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్, సిబ్బంది ముసవీర్, ఝాన్సీరాణి, సద్దాం తదితరులు పాల్గొన్నారు. -
నేరరహిత సమాజం కోసం కృషి
ఆసిఫాబాద్‌అర్బన్: నేరరహిత సమాజం కోసం పోలీసులు కృషి చేయాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్టేషన్లకు వివిధ సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. కేసుల దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సీఐలు బాలాజీ వరప్రసాద్, రమేశ్, సత్యనారాయణ, సంజయ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలో గురువారం స్కూల్ గేమ్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా, జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో అండర్– 19 విభాగంలో వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖో, హ్యాండ్‌బాల్, రగ్బీ జోనల్‌స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 150 మంది బాలబాలికలు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ చూపిన 64 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురావు తెలిపారు. అలాగే జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో అండర్– 14, 17 విభాగంలో బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. మొత్తం 140 మంది బాలబాలికలు హాజరు కాగా, 72 మంది క్రీడాకారులను జోనల్‌స్థాయికి ఎంపిక చేశామని ఎస్జీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు. ఆదిలాబాద్‌లో త్వరలో జరిగే జోనల్‌స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ అరుణశ్రీ, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ యాదగిరి, పీడీ, పీఈటీలు షేకు, మీనారెడ్డి, చిన్నక్క, తిరుపతి, సాయి, నాగమణి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులుజోనల్ స్థాయికి ఎంపికై న క్రీడాకారులు -
‘సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు’
కాగజ్‌నగర్‌రూరల్: రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న స్పష్టం చేశారు. పట్టణంలోని స్టేషన్‌రోడ్‌లో గల సీపీఎం కార్యాలయంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం భూస్వాములు, జాగీర్దార్లు, రజాకార్లను తరిమికొట్టారని తెలిపా రు. ఈ పోరాటంలో ఎర్రజెండా పాత్రను కప్పిపెట్టడానికి నేటి పాలకులు ప్రజాపాలన, జాతీ య సమైక్యత, విమోచన, విద్రోహ దినం అంటూ ప్రజా పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోట శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు వనమాల పద్మ, ఎన్.పద్మ, సుదర్శన్, అంగల శ్రీనివాస్, శంకర్, సంజీవ్ పాల్గొన్నారు. -
‘సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె’
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీవేజ్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు. బుధవారం సమ్మె ఆరో రోజుకు చేరుకోగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కుమురం భీం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కు మురంభీం విగ్రహానికి పూలమాల వేసి నిరసన తె లిపారు. ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఏడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతుండగా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్, సదాశివ్, వర్కర్లు గంగుబాయి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం సూపరింటెండెంట్ ప్రవీణ్‌తో కలిసి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రారంభించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో 15 రోజులపాటు రోజుకు నాలుగు చొప్పున ప్రతీ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల్లో పనిచేసే గైనకాలజీ, నేత్ర, డెర్మటాలజీ, డెంటల్, తదితర వైద్యులు మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే బీపీ, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్, రక్తహీనత బారిన పడకుండా కిశోర బాలికలు, మహిళలకు అవగాహన కల్పించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: శాంతిభద్రతలో పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణకు అత్యంత వైభవమైన ఘన చరిత్ర, అఖండమైన వారసత్వం ఉందన్నారు. గొప్ప చారిత్రాత్మక వారసత్వం, మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. ఆపరేషన్ పోలో చర్య ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. నిజాయతీగా విధులు నిర్వర్తించి జిల్లా పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, సీఐలు, ఆర్ఐ లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.