breaking news
Orissa
-
కనుమరుగైన గిరిధారి అలంకరణ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుడు నిత్య శోభాయమానుడు. ఏడాది పొడవునా నిత్య నూతనంగా శోభిల్లుతాడు. పవిత్ర భాద్రపద మాసంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ప్రారంభమైన వేడుకలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా భాద్రపద మాసం కృష్ణ పక్ష త్రయోదశి నాడు శ్రీమందిరం రత్న వేదికపై మూల విరాటులు కృష్ణ బలరాం, యోగమాయ అలంకరణలో శోభిల్లాడు. వాస్తవానికి శ్రీమందిరంలో గిరి గోవర్ధన్ అలంకరణ కనుమరుగు కావడంతో ఈ అలంకరణ కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్న ధూపం తర్వాత ఈ అలంకరణ సన్నాహాలు ప్రారంభించారు. రత్న వేదికపై బలభద్ర స్వామి బలరాముడి రూపంలో, మహాప్రభు శ్రీ జగన్నాథుడు శ్రీ కృష్ణుని రూపంలో, దేవి సుభద్రను యోగమాయ అలంకరణతో రూపుదిద్దారు. గతంలో ఏటా భాద్రపద మాసం కృష్ణ పక్ష త్రయోదశి నాడు స్థానిక పెద్ద ఒడియా మఠం ఆధ్వర్యంలో శ్రీమందిరం రత్న వేదికపై శ్రీ జగన్నాథునికి గిరిధారి అలంకరణ జరిగేది. కాలక్రమేణా కొన్ని సమస్యల కారణంగా ఈ అలంకరణ నిలిపి వేశారు. దీర్ఘకాలం తర్వాత 1943 సంవత్సరంలో ఈ అలంకరణ పునరుద్ధరించినా తాత్కాలికంగానే కొనసాగింది. కటక్ జిల్లా సాలేపూర్ ప్రాంతం ఖొండొసాహి జమీందార్ రాయ సాహెబ్ చౌదరి గోపబంధు మిశ్రా పుత్ర సంతానం కోసం భగవంతుడిని ప్రార్థించి ఒక కొడుకును పొందాడు. ఈ సందర్భంగా దివంగత సదాశివ రథశర్మ, పుష్పాలక్ సేవకుడు అలేఖ్ కొరొ కోరిక మేరకు, సాహెబ్ నిలిపివేసినగిరి గోవర్ధన్ అలంకరణ పునరుద్ధరణకు అంగీకరించారు. యథాతథంగా పూర్వ రీతిలో పెద్ద ఒడియా మఠం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ అలంకరణ కొద్ది కాలం మాత్రమే కొనసాగింది. ఈ అలంకరణ నిర్వహణలో వివిధ అడ్డంకులు ఎదురు కావడంతో ప్రముఖుల సంప్రదింపుల మేరకు శ్రీ మందిరంలో కృష్ణ బలరాం అలంకరణ నిర్వహించాలని నిర్ణయించారు. తదనుగుణంగా గజపతి రాజుల శాసనం ప్రకారం 1945 సంవత్సరం నుంచి ఏటా భాద్రపద కృష్ణ పక్ష త్రయోదశి నాడు క్రమం తప్పకుండా కృష్ణ బలరాం అలంకరణ కొనసాగుతోంది. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత ● దుప్పిలపాడులో విషాదఛాయలు టెక్కలి రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణస్నేహితులు దుర్మరణం పాలైన ఘటన కోటబొమ్మాళి మండలం శ్రీపురంలో గురువా రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కోటబొమ్మాళి మండలం దుప్పిలపాడుకు చెందిన సబ్బి అప్పన్న (35) హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. కొద్ది రోజుల కిందటే స్వగ్రామం వచ్చాడు. గురువారం అత్తవారి గ్రామమైన పాకివలస వెళ్లాడు. అక్క డ స్నేహితుడు పిట్ట గంగయ్య(32)తో కలిసి సమీపంలోని తర్లిపేటలో ఉన్న దాబాకు వెళ్లా రు. భోజనం చేశాక తిరిగి పాకివలస వస్తుండ గా శ్రీపురం సమీపంలో ద్విచక్ర వాహనం అదు పు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. హెల్మెట్లు లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్క డే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరా లు నమోదు చేశారు. మృతదేహాలను శవపంచనామ నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అప్పన్న కు భార్య లావణ్య, పిల్లలు ప్రియాంక, హారిక, మణికంఠ ఉన్నారు. గంగయ్యకు భార్య వాణిశ్రీ, పిల్లలు నిఖిల్, దీక్షిత్ ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. -
సిద్ధేశ్వర మిశ్రా, కన్హుచరణ్ భుయ్యాన్ సస్పెండ్
పర్లాకిమిడి: బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు సిద్ధేశ్వర మిశ్రా (డుల్లు), కుజాసింగి మాజీ సర్పంచ్ కున్హు చరణ్ భుయ్యాన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదు మేరకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో విలేకరుల సమావేశంలో గురువారం ప్రకటించారు. స్థానిక పీడబ్ల్యూడీ డాక్ బంగళాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నబకిశోర్ శోబోరో, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు తదితరులు మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీలో ఉండి ఇతర పార్టీకి పనిచేయడం, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిపై ఆక్రమణ, అనేక యువ మోర్చాలను ఏర్పాటుచేసి సమాంతర పార్టీ కార్యకలాపాలు చేస్తున్నందుకు మండలాధ్యక్షుల ఫిర్యాదు మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి పంపామన్నారు. పార్టీ నాయకులు ప్రసన్నకుమార్ నాయక్, కోడూరు జీవన్, తదతరులు పాల్గొన్నారు. -
చదువుపై ఆసక్తి తగ్గి.. జీవితంపై విరక్తి కలిగి..
ఎచ్చెర్ల/వేంపల్లె : వైఎస్సార్ కడప జిల్లా ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ సెకెండియర్ చదువుతున్న ఎచ్చెర్ల మండలం ఫరీదుపే ట గ్రామానికి చెందిన గురుగుబిల్లి నరసింహనాయుడు (17) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువా రం వేకువజామున వసతి గృహం బాత్రూమ్లో కిటికీకి నరసింహనాయుడు ఉరి వేసుకుని ఉండటాన్ని తోటి విద్యార్థులు గమనించి సిబ్బందికి సమాచారం అందించగా వేంపల్లి ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. విద్యార్థి మృతితో ఫరీదుపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఏం జరిగిందో.. నరసింహనాయుడు తండ్రి అప్పలనాయుడు అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి రాజు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. సోదరి శ్రావ్య కుప్పిలి ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. టెన్త్‌లో 576 మార్కులు రావడంతో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యాడు. అక్కడ వసతి చాలకపోవడంతో ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో వీరికి తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నా డో అర్ధం కావడం లేదని, మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని తల్లి చెబుతోంది. అనంతరం హుటాహుటిన ఇడుపులపాయ బయల్దేరివెళ్లింది. ట్రిపుల్ ఐటీ ఇష్టం లేక.. నరసింహనాయుడుకు చదువులో మంచి పట్టుంది. పీయూసీ ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించాడు. అయితే ట్రిపుల్ ఐటీలో చదవడం ఇష్టం లేనట్లు తెలిసింది. తాను నర్సింగ్ చేయాలని అనుకుంటున్నట్లు తోటి విద్యార్థులతో చెప్పేవాడు. చదవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండేవాడని తెలిసింది. విద్యార్థి నాలుగు రోజులుగా ముభావంగా ఉండేవాడని తోటి విద్యార్థులు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో విద్యార్థి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. కాగా, విద్యార్థి మృతి పట్ల విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలాస: పలాస లేబరుకాలనీలో నివాసముంటున్న శాసనపురి వెంకటరావు(59) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావు బుధవారం ఉదయం శ్రీకాకుళంలోని తన కుమార్తె చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ల కోసం వెళ్లాడు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో స్వగ్రామం గొప్పిలి వెళ్లడానికి బెండిగేటు నుంచి టెక్కలిపట్నం వెళ్తుండగా మోదుగులపుట్టి వద్ద బైక్ అదుపు తప్పింది. తలకు బలమైన గాయాలు కావడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో 108లో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాశీబుగ్గ ఏఎస్ఐ ప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణస్థలం: లావేరు మండలం బుడుమూరు కూడలి సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు పక్కన నడుస్తున్న బొడ్డ గోవిందరాజులు (66)ను శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వగ్రామం విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం బక్కన్నపాలెం. బుడుమూరులోని కుమార్తె ఇంటికి పది రోజుల కిందట వచ్చాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లి రోడ్డు పక్కన నడుస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఏఎస్సై ప్రసాదరావు కేసు నమోదు చేశారు. క్రైమ్ కార్నర్ -
తృణధాన్యాలు పండించాలి
పర్లాకిమిడి: జిల్లా స్థాయి వ్యవసాయదారుల ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెట్ లింకేజిపై జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో స్థానిక జిల్లా పరిషత్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్లో పంట వైవిధ్యీకరణపై ఒక్కరోజు వర్క్‌షాపును అధికారులు గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ముఖ్య వ్యవసాయశాఖ అధికారి సంజయ్ కుమార్ దోళాయి, జిల్లా ఉద్యానవనాల శాఖ, ఉపసంచాలకులు సుశాంత కుమార్ దాస్, జిల్లాపరిశ్రమల శాఖ పర్యవేక్షకులు సునారాం సింగ్, జిల్లా ప్రాజెక్టుల అధికారి, జీవికా మిషన్ అధికారి టిమోన్ బోరా, సెంచూరియన్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, ప్రాజెక్టు ఆఫీసర్ కె.సూరజ్‌కుమార్ పాత్రో హాజరయ్యారు. రైతులు, మహిళా స్వయం సహాయక గ్రూపులు కలిసి క్రయ, విక్రయాలు సమన్వయంతో చేస్తే లాభాలు పొందవచ్చని జిల్లా పరిశ్రమలశాఖ అఽధికారి సునారం సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ నినాదంతో తృణ ధాన్యాలు పండించి వ్యవసాయదారులు అధిక లాభాలు పొందాలన్నారు. కేవలం సబ్సిడీల కోసం కాకుండా ధాన్యేతర వాణిజ్యపంటలు, తృణ ధాన్యాలు పండించాలని జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి సంజయ్‌కుమార్ దోళాయి అన్నారు. కార్యక్రమాన్ని గుమ్మ వ్యవసాయ విస్తరణాధికారి నారాయణ చాంద్, సూరజ్ పాత్రో పలువురి రైతులకు, మహిళా గ్రూపులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. -
చెరువులో మునిగి తల్లీకూతుళ్ల మృతి
● కుమార్తెను రక్షించడానికి వెళ్లి తల్లి కూడా మృతి కొరాపుట్: కుమార్తెను రక్షించడానికి వెళ్లి తల్లి కూడా మృతి చెందింది. గురువారం కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లమ్తాపుట్ సమితి కుమార్ గందన పంచాయతీ బలియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బిలాపుట్ గ్రామ పంచాయతీ హర్గండా గ్రామానికి చెందిన నవీనా మజ్జి (40), తన కుమార్లె అంబికా మజ్జి (15)తో కలిసి అల్లం పంట సాగు కోసం వెళ్లారు. నవీనా పొలం పనిలో ఉండగా కుమార్తె అంబికా సమీపంలో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లింది. లోతు తెలియక దిగడంతో అంబికా చెరువులో మునిగిపోతూ కేకలు పెట్టింది. ఇది గమనించిన నవీనా కుమార్తెను రక్షించడానికి వెళ్లి మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నందపూర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. హోటళ్లు, లాడ్జిలు, రెస్టారెంట్లలో తనిఖీలు జయపురం: జయపురంలోని అన్ని హోటల్లు, లాడ్జీలు, రెస్టారెంట్లపై పోలీసులు బుధవారం అర్ధ రాత్రి వరకు దాడులు నిర్వహించారు. పట్టణంలో మొసగాళ్లు, దుండగులు, డెకాయిట్లు పెరగటంతో వారిపై పోలీసులు నిఘా పెట్టి విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జయపురం పట్టణ పోలీసు, జయపురం సదర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లకు వచ్చే వారి పరిచయపత్రాలు, ఆధార్ కార్డులు పరిశీలించాలని, ఏ వ్యక్తిపైనా అయినా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. కొరాపుట్ జిల్లా ఎస్పీ ఆదేశంతో దాడులు నిర్వహించారు. జయపురం పట్టణ పోలీసు అధికారి, సదర్ పోలీసు అధికారుల నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాటిచెట్లపాలెం(విశాఖ): వాల్తేరు రైల్వే డివిజన్ టికెట్ తనిఖీ సిబ్బంది మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సిబ్బందిని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర గురువారం సత్కరించారు. మేలో టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ రూపాలలో రూ.2,41,20,627 ఆదాయాన్ని ఆర్జించారు. గత సంవత్సరం మేలో సాధించిన రూ. 2,27,34,221 ఆదాయంతో పోలిస్తే, ఈసారి అధిక ఆదాయాన్ని నమోదు చేశారు. ఈ రికార్డు ఆదాయం సాధించడంలో వ్యక్తిగతంగా ఇద్దరు ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. విజయనగరం, టీటీఐ వై. అప్పలరాజు.. 836 కేసులు నమోదు చేసి రూ.4,89,320 జరిమానాలు, అదనపు టికెట్ రుసుముగా వసూలు చేశారు. శ్రీకాకుళం రోడ్డు టీటీఐ కె.శ్రీనివాసరావు 815 కేసులు నమోదు చేసి రూ. 4,42,900 వసూలు చేశారు. వీరిని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ సమక్షంలో సత్కరించారు. ఇచ్ఛాపురం రూరల్: డొంకూరు సముద్రంలో ఉప్పుటేరు కలిసిన చోట ఇసుక మేటలు వేయడంతో బూర్జపాడు పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయిన విషయం విదితమే. రైతులు పడుతున్న ఇబ్బందులపై ‘పొగురు తెచ్చిన చేటు’ శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ప్రొక్లెయినర్ సహాయంతో పొగురు తీత పనులు చేయించారు. పంట పొలాల్లో ఉన్న వరద నీరు ఉప్పుటేరు గుండా సముద్రంలో కలవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గార: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలుర, బాలికలు, ఉపాధ్యాయ యాజమాన్యాలను కళాఉత్సవ్– 2025 పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు వమరవల్లి డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకర్ గురువారం తెలిపారు. 9, 10, 11, 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, సంప్ర దాయ కథ చెప్పడం, దృశ్య కళలు వంటి పోటీలను సెప్టెంబర్ 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని, వివరాలకు 7702391639, 9000726375 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
10 కేజీల గంజాయి స్వాధీనం
● ఒకరు అరెస్టు జయపురం: జయపురం రైల్వే స్టేషన్లో 10 కేజీల గంజాయిని కొరాపుట్ రైల్వే పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు జరుపుతుండగా ఓ వ్యక్తి బస్తాతో నిలిచి ఉండటంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆ బస్తాలో గంజాయి ఉండటంతో ఆ వ్యక్తి అరెస్టు చేశారు. గంజాయి 10 కేజీలు ఉన్నట్ల రైల్వే పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. లక్ష ఉంటుందన్నారు. అరెస్టు అయిన వ్యక్తి శ్యామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు కోసం బస్తాతో నిరీక్షిస్తున్నాడని, అతడు జయపురం నుంచి రాయగడ వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ మీదుగా పంజాబ్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. అరెస్టు అయిన వ్యక్తి పంజాబ్ రాష్ట్ర లుథియాన ప్రాంతం అసమాన్(25) అని జీఆర్పీ అధికారి సంతోష్ మహంత వెల్లడించారు. ఈ సంఘటనపై కొరాపుట్ జీఆర్పీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎక్కడ నుంచి గంజాయి తీసుకు వస్తున్నాడు, ఎక్కడ అమ్ముతున్నాడనే విషయాలపై దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించారు. తనిఖీలు నిర్వహించిన వారిలో సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణహంతి, జి.గణేష్, తదితరులు ఉన్నారు. -
● తీరని డోలీ కష్టాలు
కొరాపుట్: అనారోగ్యంతో ఉన్న రోగిని డోలీలో తరలించిన సంఘటన జరిగింది. గురువారం కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితి లులా గ్రామ పంచాయతీ బారా కౌడీ గ్రామంలో లబి శాంత అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గిరిజనలు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆ గ్రామం వెళ్లడానికి మార్గం లేకపోవడంతో అంబులెన్స్ రెండు కిలో మీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో గిరిజనులు మంచాన్ని డోలిగా చేసుకోని బాధితుడిని అంబులెన్స్ వద్దకు చేర్చారు. అంబులైన్లో దశశమంత్పూర్ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. -
పశ్చిమ బెంగాల్ దంపతులకు మగ శిశువు దత్తత
పర్లాకిమిడి: ప్రభుత్వ స్వతంత్ర శిశు దత్తత కేంద్రం నుంచి 73వ శిశువును గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత చేతులమీదుగా గురువారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు అప్పగించారు. స్థానిక కేంద్ర ప్రభుత్వ పెద్దాసుపత్రి క్రెడాల్ కేంద్రం వద్ద గుర్తు తెలియని తల్లి ఒక శిశువును వదిలి వెళ్లిపోయింది. జిల్లా చైల్డ్ లైన్, జిల్లా స్వతంత్ర దత్తత కేంద్రం వారు చేరదీసి సపర్యలు చేశారు. అనంతరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఆదేశాల మేరకు సంతాన దత్తత కేంద్రంలో పెంచారు. కేంద్ర దత్తత పోర్టల్‌లో చూసిన పశ్చిమ బెంగాల్ దంపతులు దరఖాస్తు చేసుకున్న మీదట గురువారం నాలుగేళ్ల మగ శిశువును కలెక్టర్ మధుమిత చేతుల మీదుగా అఽధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్వినీ కుమార్ మహాపాత్రో, డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి మమతా శథపతి, తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి బొరిగుమ్మలో నిరవధిక బంద్
కొరాపుట్: రాష్ట్రంలో అతి పెద్ద సమితి బొరిగుమ్మలో నిరవధిక బంద్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తారా ప్రసాద్ బాహిణీపతి ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12 పట్టణాలకు నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్ఏసి) ల హోదా ఇస్తున్నట్లు ప్రకటించిందన్నారు. కానీ అందులో బొరిగుమ్మ పట్టణం లేదన్నారు. గత ప్రభుత్వం బొరిగుమ్మని ఏన్ఏఏసీగా ప్రకటించినప్పటికీ అధికారం కోల్పోవడం తో అది అమలు కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని కాబట్టి బొరిగుమ్మకి అన్యాయం చేసిందన్నారు. అందుకే గురువారం నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బొరిగుమ్మలో అన్నీ పార్టీలు ఈ బంద్‌ను సమర్థిస్తున్నాయని ప్రకటించారు. బంద్ జరిగితే ఆంధ్రా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచి పోతాయి. -
ఎస్ఐఆర్కు బీజేడీ వ్యతిరేకం
భువనేశ్వర్: బీహార్ తరహాలో ఒడిశాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలు పట్ల బిజూ జనతా దళ్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ చర్యతో పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన ఓటర్లు మినహాయించబడతారని, ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘానికి బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. బీహార్‌లో ఈ ప్రక్రియలో వాస్తవ ఓటర్లను విస్మరించారని తెలిసిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించే సదుద్దేశంతో అన్ని వర్గాల వాటాదారుల చురుకై న భాగస్వామ్యంతో ఎస్ఐఆర్ అమలు చేయాలని భారత ఎన్నికల సంఘానికి ప్రతినిధి బృందం విన్నవించింది. ఈ బృందం ప్రతిపాదనల్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలించడం జరగుతుందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అభయం ఇచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ అవకతవకలు తలెత్తాయి. వాటికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ నుంచి డజనుకు పైగా లేవనెత్తిన వివిధ అంశాలపై ఎన్నికల సంఘం స్పందన కొరవడిందని ప్రతినిధి బృందం విచారం వ్యక్తం చేసింది. అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఫారం 17–సి జారీ చేయకపోవడంతో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓటర్ల మనస్సులో ఏర్పడిన సందేహాలు నివృత్తి కావడం లేదని వివరించారు. 2024 ఎన్నికలు పురస్కరించుకుని ఈవీఎంలలో నమోదైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బూత్ స్థాయి, పార్లమెంటరీ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం మధ్య వ్యత్యాసం గురించి పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇంత వరకు సంతృప్తికరమైన సమాధానం రాలేదని ఎన్నికల సంఘం ప్రముఖులతో సమావేశంలో బీజేడీ ప్రతినిధి బృందం ప్రస్తావించింది. ఓటింగ్ తర్వాత, అనేక బూత్‌లలో ఫారం 17–సిలో పేర్కొన్న ఓట్ల సంఖ్య, లెక్కింపు సమయంలో వచ్చిన ఓట్ల సంఖ్యతో సరిపోలలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలింగ్ నాడు సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్ల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంపై విస్మయపరిచింది. ఎన్నికల్లో స్వచ్ఛమైన, నిష్పాక్షిక ప్రక్రియ కోసం బిజూ జనతా దళ్ పలుమార్లు ఎన్నికల సంఘానికి చేసిన అభ్యర్థనలు ఇంత వరకు ఎలాంటి స్పందన నోచుకోక పోవడం విచారకరమని తెలియజేశారు. దేబీ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ప్రమీలా మల్లిక్, సంజయ్ దాస్ బర్మా, డాక్టర్ అమర్ పట్నాయక్, సులతా దేవ్‌లతో సహా బీజేడీ ప్రతినిధి బృందం న్యూ ఢిల్లీ నిర్వాచన్ సదన్‌లో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో ముఖాముఖి సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేశారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నాయకులతో కొనసాగుతున్న సంభాషణలలో ఈ సమావేశం భాగమని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో ఈ సలహాలు, సూచనలు దీర్ఘకాల ప్రయోజనాలకు దోహదపడతాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆశాభావం వ్యక్తం చేసింది. -
సైబర్ వలలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి
రాయగడ: సైబర్ మోసాల వలలో ఒక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి చిక్కుకున్నారు. స్థానిక ఇందిరానగర్ మూడో లైన్లో నివసిస్తున్న ప్రజారోగ్య శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగి పూర్ణ చంద్ర త్రిపాఠి ఖాతా నుంచి రూ.1.24 లక్షలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. ఈ మేరకు బాధితుడు స్థానిక సైబర్ సెల్‌ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బాధితుడి వమొబైల్కు వచ్చి సందేశాన్ని తెరచి చూస్తే.. తన ఎస్బీఐ ఖాతా నుంచి రూ.1.24 లక్షలు డెబిట్ అయినట్లు ఉంది. అనంతరం అతడు బ్యాంకు అధికారులకు సంప్రదించగా సైబర్ నేరగాళ్లు ఖాతా నుంచి డబ్బులు కాజేశారని తెలిపారు. అనంతరం తాత్కాలికంగా అతని బ్యాంకు ఖాతాను మూసివేశారు. కేసు నమోదు చేసిన సైబర్ పోలీస్ విభాగం ఈ మేరకు దర్యాప్తు చేస్తుంది. -
నకిలీ బంగారు శంఖంతో మోసం
జయపురం: జయపురంలో నకిలీ బంగారు శంఖాల మోసం జరిగింది. ఒక నకిలీ బంగారంతో తయారు చేసిన శంఖాన్ని ఒక వ్యాపారికి ఇచ్చి రూ.10 లక్షలు మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. జగత్సింగపూర్ జిల్లా కుజంగ పోలీసు స్టేషన్ గండకిపూర్ వ్యాపారి నిత్యానంద మహాపాత్రోకి బంగారు శంఖం ఇస్తామని కొందరు మోసగాళ్లు నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం నిత్యానంద మహాపాత్రో భువనేశ్వర్‌లో వ్యాపారం చేస్తున్నారు. అతడికి జయపురంలో బంగారు శంఖం ఇస్తానని ఓ వ్యక్తి తెలిపాడు. ఈ నెల 16న స్థానిక ఒక హొటల్కు ఆ వ్యక్తి అతడి అనుచరులు వచ్చారు. మహాపాత్రోకు బంగారంలా కనిపించే ఒక శంఖం ఇచ్చి రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. తర్వాత మహాపాత్రో బంగారు శంఖాన్ని పరీక్షించగా అది ఇత్తడి అని బయట పడింది. వారికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ రాజేంద్ర పంగి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సెప్టెంబర్ 18 నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ నెల 18 నుండి 25 వరకు జరగనున్నాయి. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసన సభ వ్యవహారాల మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఏడు పని దినాలు ప్రణాళిక చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజన అంశాలపై చర్చలు, ప్రతిపాదిత కీలక బిల్లులు, అధికార పార్టీ, ప్రతిపక్షాల క్రియాశీల భాగస్వామ్యం ఉంటాయి. ఏడు రోజులలో, ఒక రోజు ప్రైవేట్ సభ్యుల బిల్లులకు, మరొక రోజు కార్యాలయం రహిత దినం (నో ఆఫీస్ డే) ఉంటుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం, ఈ సమావేశంలో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. ప్రతిపక్షాలు ప్రతిపాదించే ఏ అంశంౖపైనెనా ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధ్రువీకరించింది. ప్రతిపక్ష పార్టీలు సమర్పించిన నిర్మాణాత్మక ప్రతిపాదనలపై కూడా చర్చలను ప్రభుత్వం స్వాగతిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ పేర్కొన్నారు. ఇటీవలి సంఘటనలు, భారత ప్రభుత్వం దాదాపు రూ. 8,000 కోట్లు మంజూరు చేసిన క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్ (సీఆర్ఆర్ఆర్), ఒడిశాకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 4,500 కోట్ల విలువైన రెండు సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పరిధితో సహా రాష్ట్రానికి మంజూరు చేసిన నాలుగు జలమార్గ ప్రాజెక్టులు వంటి కీలక అంశాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు రాష్ట్ర శాసన సభవ్యవహారాల మంత్రి ముఖేష్ మహాలింగ్ తెలిపారు. శాసన సభ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు, కీలక బిల్లులు, రైతుల దుస్థితి, మహిళలు, బాలికలు మరియు విద్యార్థులపై నేరాలు, సామూహిక అత్యాచారం, గూండాయిజం మరియు భువనేశ్వర్ మెట్రో (రైలు) ప్రాజెక్టు నిలిపివేత వంటి సంబంధిత అంశాలను శాసన సభ వర్షా కాలం సమావేశాల్లో ప్రస్తావిస్తామని విపక్ష బిజూ జనతా దళ్ నాయకురాలు ప్రమీలా మల్లిక్ అన్నారు. ఆయా అంశాల్లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సమస్యల పట్ల ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరడం తమ ఉద్దేశమని పేర్కొన్నారు. -
ఘాటీలో కమాండర్ జీపు బోల్తా
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా బాయపోడ ఘాటీలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఓ కమాండర్ జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. సాధారణంగా జీపులో 15 మంది మాత్రమే ప్రయాణించాలి. కానీ 25 మంది ప్రయాణిస్తున్నారు. కోరుకొండ సమితి నక్కమామ్ముడి పంచాయతీ ఆమలిబేడ గ్రామస్తులంతా కలిసి కుడుములగుమ్మ వద్ద జరుగుతున్న వారపు సంతకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న వారు చూసి కుడుములగుమ్మ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. వారిని ముందు కుడుములగుమ్మ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మల్కన్‌గిరి ఆస్పత్రికి పంపించారు. బలిమెల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
అరుదైన ఊసరవెల్లి
కొరాపుట్: అరుదైన ఊరసవెల్లిని గిరిజనులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి పటకలియా పంచాయితీ బడకనా గ్రామంలో ఊసరవెల్లిని గిరిజనులు గమనించారు. దీన్ని చూడడం అరిష్టమని వారు భావిస్తారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు గ్రామానికి చేరుకుని ఊసరవెల్లిని రక్షించి అటవీ శాఖాధికారులకు అప్పగించారు. వారు దాన్ని అడవిలోకి విడిచిపెట్టారు. దసరా ఉత్సవాలకు భూమిపూజ రాయగడ: సదరు సమితి పరిధిలోని జేకేపూర్‌లో ఉన్న జేకే పేపర్ మిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు గురువారం భూమిపూజ కార్యక్రమం జరిగింది. జేకేపేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతీ ఏడాది అత్యంత ఘనంగా జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టినట్లు ద్వివేది తెలియజేశారు. పూజా కార్యక్రమాల్లో మిల్ సీనియర్ ఉద్యోగులు బిశ్వజీత్ ద్వివేది, రాఘవేంద్ర హర్బర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శిగా డాక్టర్ లలాటేందు సాహు భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఓఏఎస్ (ఎస్ఏజీ) అధికారి డాక్టర్ లలాటేందు సాహు నియమితులయ్యారు. ఒడిశా పర్యటన అభివృద్ధి కార్పొరేషన్ ఓటీడీసీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు బదిలీ చేసి ఈ నియామకం చేసినట్లు రాష్ట్ర సాధారణ పాలన, ప్రజాభియోగాల విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కోలుకున్న నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, విపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి నవీన్ నివాస్‌కు సురక్షితంగా చేరారు. డీహైడ్రేషన్ కారణంగా చికిత్స కోసం ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఆయన ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో బుధవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజల ఆత్మీయ అనురాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆస్పత్రిలో తన బాగోగులు తెలుసుకునేందుకు సందర్శించిన ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, ఇరువురు మంత్రులు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. మాజీ గవర్నర్ పరామర్శ ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. -
నీట్ టాపర్ పూషన్ మహాపాత్రోకు అభినందనలు
భువనేశ్వర్: నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించిన పూషన్ మహాపాత్రో, ఆయన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అత్యున్నత ఉత్తీర్ణత సమగ్ర ఒడిశాకు సంతోషకరమని, ఇంత కఠినమైన పోటీ పరీక్షలో విజయం సాధించి సమగ్ర భారత దేశంలోనే మొదటి స్థానం సాధించడం కచ్చితంగా ఒక సవాలని అన్నారు. ఇలాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువతకు ఈ ఉత్తీర్ణత స్ఫూర్తిదాయకం అవుతుందని ముఖ్యమంత్రి అభినందించారు. మీలాంటి ప్రతిభావంతులైన, కష్టపడి పనిచేసే మరియు ఔత్సాహిక వ్యక్తుల సేవలు రాష్ట్రానికి అవసరమని. శ్రీ జగన్నాథుడి కృపతో భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. -
‘ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టులు తక్షణమే తొలగించాలి’
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అత్యున్నత రాజకీయ నాయకులలో ఒకరుగా కొనసాగుతున్నారు. ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సందర్భంగా అతని సన్నిహితులు వీకే పాండ్యన్, అతని భార్యపై ఫేస్బుక్లో కొన్ని అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన పోస్ట్‌లను ప్రసారం చేశారు. దీనిపై నవీన్‌పట్నాయిక్ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. మెటాతో సంప్రదించి తక్షణమే పోస్టులు తొలగించడంతో పాటు వాటిని ఎవరు వేశారో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బిజూ జనతా దళ్ ఐటీ, సోషల్ మీడియా సెల్ ఇంచార్జి, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అమర్ పట్నాయక్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదును దాఖలు చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి చర్య తీసుకోకపోతే, ఈ పోస్టులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం ఆదేశాల మేరకు నకిలీ హ్యాండిళ్ల నుంచి ఈ పోస్టులు విడుదలై ప్రసారం చేసినట్లు విశ్వసించాల్సి వస్తుందన్నారు. పద్మపూర్‌ను ఎన్‌ఏసీగా గుర్తించాలి రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌ను ఎన్‌ఏసీగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో నేతృత్వంలో సబ్ కలెక్టర్ దుదుల్ అభిషేక్ దిలీప్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పద్మపూర్ సమితిని ఎన్‌ఏసీగా గుర్తించేందుకు గత బీజేడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబితాలో పద్మపూర్‌ను విస్మరించడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టిసారించి పద్మపూర్‌ను ఎన్‌ఏసీగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాజీవ్ లోచన్ సాహు, రమేష్ చంద్ర పండ, ఉదయ్ సాహు, అనిల్ కుమార్ చౌదరి, జగన్నాథ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం కొరాపుట్: ఇంద్రావతి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తామని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరి శంకర్ మజ్జి ప్రకటించారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి ఖాతీగుడ సమీపంలో అప్పర్ ఇంద్రావతి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్‌కి అనుసంధానం ఉన్న రిజర్వాయర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడ ఎకో టూరిజం ఏర్పాటుకి సాధ్యాసాధ్యాలు గురించి అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరలో నివేదికలు సమర్పించాలని సూచించారు. ఆయనతో పాటు కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, తెంతుకుంటి బీడీవో మనోజ్ కుమార్ పాణిగ్రాహి, బీజేపీ నాయకులు సురేష్ శాస్త్రి, దేవదాస్ మహంకుడోలు ఉన్నారు. బాలుని మృతదేహం లభ్యం రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పుటాసింగి పోలీస్‌స్టేషన్ పరిధి టిటిమిరి పంచాయతీ జంగపూర్ముండా గ్రామ సమీపంలోని మహేంద్రతనయ నదిలో బాలుడి మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది గురువారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు టిటిమిరి గ్రామానికి చెందిన జాస్మిన్ సొబొరొ(6)గా గుర్తించారు. బుధవారం బాలుడి తల్లి లయని, తండ్రి పితసొబొరొలు వ్యవసాయ పనులకు వెళ్లగా జాస్మిన్ తన స్నేహితులతో కలిసి నదికి స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
● సత్యం, అహింస, కరుణతో సుసంపన్న సమాజం సాధ్యం ● స్మారకోత్సవంలో గవర్నర్ కంభంపాటి హరిబాబు
భువనేశ్వర్ : మహాత్మాగాంధీ అనుసరించిన సత్యం, అహింస, కరుణను ఆదర్శంగా స్వీకరించి నైతిక పద్ధతుల్లో సుసంపన్న సమ్మిళిత సమాజాన్ని నిర్మి ద్దామని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపా టి ప్రజలకు పిలుపునిచ్చారు. కటక్ నువా బజారు ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్ద కుష్టు ఆశ్రమా నికి గాంధీ చేపట్టిన పాదయాత్రకు శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో బుధవారం స్మారక కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆశ్రమం కేవలం చికిత్సకు కేంద్రం మాత్రమే కాదని, వైద్యం, ఆశ, మానవ గౌరవానికి నిలయమని పేర్కొన్నారు. వైజ్ఞానికత, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంతో భారత దేశం ముందుకు సాగుతున్న తరుణంలో మౌలిక మానవ విలువల పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. యుద్ధాలు, విభజనలు విచ్ఛిన్నతలు కాకుండా సరళత, కరుణ, అహింసతో జీవించడాన్ని గాంధీజీ నుంచి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వందేళ్ల కిందట 1925లో మహాత్ముడు కుష్టు ఆశ్రమానికి చేపట్టిన పాదయాత్రను నైతిక తీర్థ యాత్రగా అభివర్ణించా రు. కుష్టు రోగులను అవమానించి, వారిని అణగ దొక్కే సమయంలో గాంధీ వారి పట్ల సానుభూతి, గౌరవంతో ముందడుగు వేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం సమాజాంలో హెచ్ఐవీ, ఎయిడ్స్, ఇతర బాధితులను వివక్షతో చూడటం మానుకోవాలన్నా రు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో గవర్నర్ మ హాత్మా కుష్టు సేవా స్మృతి వనం ప్రారంభించారు. ●రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మాట్లాడుతూ ప్రభు త్వం కుష్టు రోగులకు ఆధునిక చికిత్సతో కృత్రిమ అవయవాలు, పునరావాసం సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కటక్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ భర్తృ హరి మహతాబ్ మాట్లాడుతూ స్వేచ్ఛ అందరికీ ఒక టేనన్నారు. దళితులు, అణచివేతకు గురైనవారు, అణగారిన వర్గాలకు సమాన స్వేచ్ఛను అందించాలనేది మహాత్ముని కల అని చెప్పారు. కార్యక్రమంలో కటక్ నగర పాలక సంస్థ (సీఎంసీ) మేయర్ సుభాష్ చంద్ర సింగ్, చౌద్వార్ కటక్ ఎమ్మెల్యే సౌవిక్ బిస్వాల్, కటక్ సదర్ ఎమ్మెల్యే, ఇంజినీర్ ప్రకాష్ చంద్ర సెఠి, కటక్ జిల్లా మేజిస్ట్రేట్ దత్తాత్రేయ భౌసాహెబ్ షిండే, కటక్ నగర పాలక సంస్థ (సీఎంసీ) కమిషనర్ కిరణ్‌దీప్ కౌర్, నయన్ కిషోర్ మహంతి పాల్గొన్నారు. -
తల్లికి తనయ తలకొరివి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ హరిహర సత్ప తి సతీమణి కుంతల కుమారి సత్పతి (56) మృతి బుధవారం చెందింది. అంత్యక్రియల కోసం డీఎన్‌కే శ్మశానాకి తీసుకెళ్లారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నారు. మృతురాలి చిన్న కుమార్తె లోప ముద్ర సత్పతి ముఖాగ్ని పెట్టడానికి ముందుకు వచ్చి ముఖాగ్ని పెట్టింది. జిల్లాలోని మేధావులు, సంఘ సంస్కర్తలు హర్షం వ్యక్తం చేశారు. భువనేశ్వర్: నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలో కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీకి చెంది న పూషన్ మహాపాత్రొ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు. రాయగడ: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని రైల్వే, అబ్కారీశాఖ పోలీసులు బుధవా రం అరెస్టు చేశారు. వారి నుంచి 23.140 కిలో ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కంధమాల్ జిల్లాకు చెందిన నివేదిత్ శెఠి, సుభస్మిత డెహురి ఉన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి గంజాయి అక్రమ రవాణా జరుతున్నట్లు అందిన సమా చారం మేరకు స్థానిక అబ్కారీ సిబ్బంది, రైల్వే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడు చేపట్టారు. ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో గంజాయి పట్టుబడింది. యువకుడు, యువతి ఈ గంజాయిని బెంగుళూరు తరలించేందుకు రైల్వే స్టేషన్ వద్ద వేచి ఉన్న సమయంలో నిర్వహించిన దాడుల్లో పట్టుబడ్డారు. మునిగుడలో.. జిల్లాలోని మునిగుడ రైల్వే స్టేషన్లో బుధవా రం అబ్కారీ, రైల్వే పోలీసులు నిర్వహించిన దాడుల్లో 45 కిలోల గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. జయపురం: స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ యువతకు మార్గదర్శకులని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. బుధవారం రాజీవ్‌గాంధీ 81వ జన్మదినోత్సవాన్ని స్థానిక కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ భవనంలో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కొరాపుట్ జిల్లా మైనారిటీవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు హసన్ మదాని మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ యువతరానికి మార్గదర్శకులన్నారు. ప్రధాన మంత్రిగా దేశానికి, ముఖ్యంగా పేద, బడుగు వర్గాల ప్రజల ఆర్థిక సామాజిక ఉన్నతికి పలు పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనకు ఆయన చేపట్టిన పథకాలు నేటికీ ప్రజలు మరువలేనివని అన్నారు. నేటి యువత రాజీవ్‌గాంధీ అడుగు జాడలలో నడచి దేశ సమగ్రతకు, సమైఖ్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొరాపుట్ ఎంపీ జయపురం ప్రతినిధి కృష్ణ చంద్రనేపక్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కాంత పాఢీ, కొరాపుట్ జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు రామ నాయిక్ పాల్గొన్నారు. మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామ పంచాయతీ చినహంస గ్రామానికి చెందిన లండ రామారావు అనే వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఒడిశాలోని రాధా సాగరంలో రామారావు గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఒడిశా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్లాకిమిడి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృత్యువాతపడడంతో భార్య లక్ష్మి రోదనలు మిన్నంటాయి. -
రెండు ప్రైవేట్ చిల్డ్రన్ హోమ్స్ రద్దు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గుసాని సమితిలో ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ చిల్డ్రన్ హోస్టల్స్, హోమ్స్‌ను జిల్లా కలెక్టర్ ముధుమిత నిషేధిస్తూ బుధవారం ఉత్తరు్‌ువ్ల జారీ చేశారు. జిల్లా అధికారుల బృందం బాలల సంక్షేమ కమిటీ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మాయాధర్ సాహు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ గుసాని సమితి బి.సీతాపురంలో గుడ్ న్యూస్ ఇండియా అలియాస్ డ్రీమ్ సెంటర్, అంబాజరి మెట్టు గ్రామంలో న్యూ హోప్ చిల్డ్రన్ హోమ్‌ను సందర్శించి హోస్టల్ ఓనర్షిప్ కాగితాలు లేనందున రెండింటిపై చర్యలు తీసుకున్నారు. ఈ రెండు హోస్టళ్లలో 68 బాలబాలికలు ఉన్నారు. వీరిని పునరావాసం కింద ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బాలికల వసతి, కస్తూర్బా గాంధీ సంక్షేమ హోస్టల్, అర్బన్ ఎస్సీ, ఎస్టీ హోస్టల్ (పర్లాకిమిడి), ఉత్కల్ బాలాశ్రమానికి తరలించారు. దీనిపై జిల్లా బాలల సంరక్షణ అధికా రి (డి.సి.పి.యు.) అరుణ్‌కుమార్ త్రిపాఠి విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో గుసాని సమితిలో రెండు నిషేధిత బాలల హోస్టల్స్పై నిషేధించడమే కాకుండా ఇంకెక్కడైనా ఇలా ప్రభుత్వ అనుమతి లేని బాలబాలికల వసతులు వుంటే వాటిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
కొనసాగుతున్న భారీ వర్షాలు
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. గత 48 గంటలలో దాదాపు 300 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో నదులు, కొండవాగలు పొంగి పొర్లుతున్నాయి. విరామం లేకుండా వర్షాలు పడుతుండటం వలన బొయిపరిగుడ సమితి బలిగాం పంచాయతీలో కంగుగుడ గ్రామం వద్దగల నది నీటి ప్రవాహంతో పొంగిపొర్లుతోంది. దీంతో నదీ ప్రరివాహిక ప్రాంతంలోని కంగుగుడ, అటల్గుడ, జలియగుడ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఆ నదిపై వంతెన లేక పోవటంతో కంగుగుడ, అటల్గుడ, జలియగుడ ప్రజలు తాడు సాయంతో ప్రమాదకరంగా నదిని దాటుతున్నారు. కంగుగుడ గ్రామం వద్ద గల నదిపై వంతెన నిర్మించాలని తాము ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టంచుకోవటవలేదని వారు తెలిపారు. సాధారణ రోజులలో నది దాటడానికి కష్టం కాదని, అయితే వర్షాకాలంలో నదిలో వరదపొంగి పొర్లుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. -
తాగునీటికి చింత..!
వంశధార చెంత.. కొత్తూరు: తరాలు మారుతున్నా ఆ గ్రామ ప్రజల తలరాత మారడం లేదు. వంశధార నది నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంత గ్రామాలకు తాగునీటిని తరలిస్తున్న ఈరోజుల్లో, నది చెంతనే ఉన్నా గొంతెండుతున్న పరిస్థితి వారిది. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గుక్కెడు నీటికోసం చెలమ వైపు చూస్తున్నారు మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కడుము గ్రామం ప్రజలు. ఈ గ్రామంలో సుమారు 2,500 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మహిళలు వంశధార నది వద్దకు వెళ్లి చెలమ నీటిని బిందెల్లో తోడుకొని ఇళ్లకు తీసుకొని వెళ్తుంటారు. నదికి వరదలు వచ్చినట్లయితే చెలమ నీటికి సైతం అవకాశం ఉండదు. అటువంటి సమయంలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉండే ఒడిశా రాష్ట్రంలోని కిడిగాం గ్రామం బోరు నుంచి తాగునీటిని తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ బోర్లు నుంచి వచ్చే నీరు తాగేందుకు ఉపయోగపడడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెలమ నీటినే తాగడం వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నా రు. తమ గ్రామానికి సుజల ధార పథకంలో భాగంగా పైప్లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పట్టించుకోవడం లేదు మా గ్రామానికి తాగునీటి కోసం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఊట నీరు కలుషితమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఆ నీరే తాగుతున్నాం. గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు బాగులేకపోవడంతో ఊట నీరే మాకు దిక్కవుతోంది. అధికారులు స్పందించి తాగునీటి ఏర్పాట్లు చేయాలి. – లంక పార్వతి, కడుము గ్రామం, కొత్తూరు మండలం వరదలు వస్తే ఒడిశా వెళ్లాలివర్షాకాలంలో వంశధార నదికి వరద వచ్చినట్లయితే ఊట నీరు ఉండదు. అప్పుడు మా గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రం కిడిగాం గ్రామం సమీపంలో ఉన్న బోరు నుంచి తాగునీరు తీసుకొస్తాము. మేము తాగునీటి కోసం పడుతున్న కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మాకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. – బూరాడ స్వాతి, కడుము గ్రామం, కొత్తూరు మండలంచర్యలు తీసుకుంటాం కడుము గ్రామంలో ఇంటింటా కుళాయిలు వేసేందుకు ఉద్దానం ఫేజ్–2 పథకం నుంచి నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు త్వరలో చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – సాగర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ, కొత్తూరు మండలం రెండు కి.మీ నడుస్తున్నాంగ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు తాగేందుకు పనికి రావడం లేదు. దీంతో రానుపోను రెండు కి.మీ నడిచి నది వద్దకు నీటికోసం వస్తాము. వర్షాలు కురుస్తున్నా తాగునీటి కోసం నదికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. – కొల్లారి శ్రీదేవి, కడుము గ్రామం, కొత్తూరు మండలం -
ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరాలి
రాయగడ: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజలందరికీ చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఎస్.ఎన్.గిరీష్ అన్నారు. గత మూడు రోజులుగా జిల్లాలోని బిసంకటక్, గుణుపూర్, పద్మపూర్ తదితర ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదాల్ అభిషేక్ దిల్లిప్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ తదితరులు పాల్గొని వివిధ పథకాలపై సమీక్షించారు. ఆరోగ్యశాఖకు సంబంధించి జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు. గొపబంధు జన ఆరోగ్య పథకం, ఆయుస్మాన్ భారత్, ప్రధానమంత్రి జనారోగ్య పథకాల గురించి సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం గ్రామీణ అభివృద్ధిశాఖ ద్వారా జిల్లాలో నిర్మిస్తున్న వంతెనల పనితీరు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా, శిశు సంరక్షణకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలు గురించి వైద్యశాఖ అధికారులను అడిగారు. ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల ఆరోగ్య భద్రత, వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి చర్చించారు. -
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
రాయగడ: జిల్లాలో ఇటీవల పెరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సంబంధితశాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం డీఆర్డీఏ సమావేశంలో ఈ మేరకు జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, డీఎఫ్ఓ అన్నా సాహేబ్ అహోలే, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుధుల్ అభిషేక్ దిల్లిప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కులకర్ణి అధికారులతో మాట్లాడుతూ గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జిల్లాలో పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు విస్తృతంగా దాడులను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా సాగవుతున్న గంజాయిని రూపుమాపాలని పిలుపునిచ్చారు. గంజాయి సాగు వంటి సంఘ విద్రొహక చర్యలు చేపడితే చట్టరీత్యా నేరమన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అవగాహన కల్పించారు. వారికి జీవనోపాధికి మార్గం సుగమమం చేయగలిగితే గంజాయి వంటి సాగుకు వారు దూరంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. -
కోతకు గురవుతున్న నాగావళి తీరం!
రాయగడ: కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సదరు సమితి బొడోరాయిసింగి గ్రామ సమీపంలో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తీర ప్రాంతం కోతకు గురవుతుంది. పెద్ద బండరాళ్లు, మట్టిపెళ్లలు జారి పడుతున్నాయి. నదీ ప్రవాహం ఉద్ధృతం కావడంతో గ్రామం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ తీర ప్రాంతాలు కోతకు గురవ్వకుండా యంత్రాంగం చేపట్టిన చర్యల్లో భాగంగా గత ఏడాది బొడోరాయిసింగి నదీ తీర ప్రాంతంలో సురక్షిత గట్లను జలసంపద విభాగం చేపట్టింది. సుమారు 7.16 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాంతంతో రాళ్లతో పనులను చేపట్టారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రాళ్ల ప్యాకింగ్ నాణ్యత కోల్పోయి జారిపడుతున్నాయి. దీంతో తీరప్రాంతం కోతకు గురవుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నదీతీరం కోతకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ముచ్చటగా మూడు
భువనేశ్వర్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు చోట్ల ఒడిశా భవనాలను నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదిత ప్రాంతాల్లో అయోధ్య, హైదరాబాద్, సూరత్ చోటుచేసుకున్నాయి. న్యూఢిల్లీ చాణక్యపురి ప్రాంతంలో కొనసాగుతున్న ఒడిశా భవన్ నిర్మాణం పనులు, పురోగతిని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బుధవారం స్థానిక లోక్ సేవా భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా వారసత్వాన్ని ప్రతిబింబించేలా కొత్త భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటిలో సంప్రదాయ రాతి కళా నైపుణ్యం, సంబల్పురి ఇకత్, ఒడిశా సాంస్కృతిక మూలాంశాల్ని ప్రతిబింబించే రీతితో నిర్మాణ ప్రణాళిక ఖరారు చేశారు. ఈ భవన నిర్మాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ●సువిశాల 4,761 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 అంతస్తుల (జి+6)తో న్యూ ఢిల్లీలో ఒడిశా భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ భవన సముదాయంలో 45 గదులు, సూట్లతో పాటు ఆధునిక సమావేశ హాలు కలిగి ఉంటుంది. ● దేశంలో ప్రముఖ ప్రాంతాల్లో ఒడిశా భవనాల నిర్మాణం, అభివృద్ధి, విస్తరణ పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ముంబై ఒడిశా భవన్లో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నందున, అక్కడ మరిన్ని గదులు పెంచాలని యోచిస్తున్నారు. కోల్‌కతాలో ఒడిశా భవనం పునరుద్ధరణ, ఆధునీకరణ చేపట్టాలని అధికారులకు తెలిపారు. ● అయోధ్య, హైదరాబాద్, సూరత్‌లలో కొత్త ఒడిశా భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాలకు పలువురు ఒడియా ప్రజలు తీర్థ యాత్ర ఇతరేతర వ్యవహారాల కోసం తరచు సందర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం ఆ ప్రాంతాల్లో ఒడిశా భవనాల నిర్మాణం అవసరం పెరుగుతుందన్నారు. -
ఇద్దరు దొంగలు అరెస్టు
జయపురం: దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు జయపురం పట్టణ పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం హటొపొదర్ వాసి రింకు బెనియ, జయపురం వాసి సుశాంత ఖండపాణి ఉన్నారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్రరౌత్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి ఎనిమిది గ్రాముల బంగారు బిస్కెట్టు, ఒక జత బంగారు చెవి దుద్దులు, రెండు వెండి దీపపు కుందులు, రెండు వెండి ప్లేట్లు, ఒక వెండి చెంబు, రూ. 20 వేల నగదు, ఒక పల్సర్ బైక్, ఒక టాటా ట్రిగ్గార్ కార్, రెండు ఇనుప రాడ్లు, ఒక స్క్రూ డ్రైవర్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్ పరిధి పవర్ హౌస్ కాలనీ సమీప బికాశ్ బిద్యాలయ నివాసి బాబూజీ పట్నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల రెండో తేదీన హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో దొంగలు చొరబడి ఆస్తులను చోరీ చేశారు. ఈ నెల ఏడు తేదీన తమ ఇంటి పక్కన ఉంటున్న వారు తమకు ఫోను చేసి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పట్నాయక్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే తాము జయపురం వచ్చి చూడగా ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించి తమకు ఫిర్యాదు చేసినట్టు పోలీసు అధికారి వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. దొంగలు పట్టుబడినట్టు వివరించారు. -
పోలవరం ప్రాజెక్టుతో మల్కన్‌గిరి మునక
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా మల్కన్‌గిరిలోని అనేక ప్రాంతాలు మునిగిపోతాయని, ఈ ప్రాజెక్టు తీర ప్రాంతం గిరిజనుల జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని బిజూ జనతా దళ్ బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లింది. పోలవరం ప్రాజెక్టుతో ఒడిశాకు తలెత్తే సమస్యలకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన వినతిపత్రం సమర్పించింది. ఈ దిశలో తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. తగిన సంప్రదింపులు లేకుండా సవరించిన వరద ముంపు ప్రామాణికలతో పొరుగు రాష్ట్రం యథేచ్ఛగా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని విపక్ష బీజేడీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తాజా జల సంబంధ అంచనాలు, సమగ్ర వాటాదారుల సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఆంధ్ర ప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని విన్నవించింది. మల్కన్‌గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను బ్యాక్ వాటర్ ప్రభావాలు ముంచెత్తి తీర ప్రాంతంలో గిరిజన వర్గాల్ని నిరాశ్రయులుగా మార్చుతుందని చెప్పింది. 2024 నుంచి పదే పదే చేస్తున్న అభ్యర్థనల్ని పెడ చెవిన పెట్టి భద్రత, పునరావాసం, డిజైన్ సమస్యలను పరిష్కరించకుండా పొరుగు రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల్ని నిరవధికంగా కొసాగించడం తగదన్నారు. అత్యవసర ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయంగా పరిగణించి నిబంధనల ఉల్లంఘనతో కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు పని నిలిపివేతకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు సంబంధిత అన్ని వాటాదారుల రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి తాజా బ్యాక్ వాటర్ అధ్యయనం చేపట్టాలని ప్రతినిథి బృందం అభ్యర్థించింది. వరద అంచనాల్లో మార్పులతో ముప్పు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వరద పొంగు అంచనాల రూపకల్పనలో తరచు చోటు చేసుకుంటున్న మార్పులతో ముంపు ముప్పు తీవ్రతరం అవుతుందని వివరించారు. 1970లో 36 లక్షల క్యూసెక్కుల డిజైన్ వరదకు అనుమతిచ్చిన ఈ ప్రాజెక్టును 2006 లో 50 లక్షల క్యూసెక్కులకు సవరించారు. ఎగువ పరీవాహక (అప్ స్ట్రీమ్) రాష్ట్రాలతో తగిన సంప్రదింపులు, తాజా బ్యాక్ వాటర్ విశ్లేషణ లేకుండా ఈ మార్పులు చేపట్టడం పట్ల బిజూ జనతా దళ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ చర్యలు ఒడిశాలో గరిష్ట బ్యాక్ వాటర్ స్థాయి ఆర్.ఎల్. 174.22 అడుగులను 36 లక్షల క్యూసెక్కులుగా పరిగణించినట్లు బీజేడీ ప్రతినిథి బృందం కేంద్ర జల సంఘానికి గుర్తు చేసింది. బీజేడీ వాదన.. 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్యయనం, 2019 ఐఐటీ రూర్కీ అంచనాతో సహా తదుపరి నిర్వహించిన పరిశీలనలో 50 లక్షల క్యూసెక్కుల వద్ద ఆర్. ఎల్. 216 అడుగులు, 58 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద (పీఎంఎఫ్) వద్ద ఆర్.ఎల్, 232.28 అడుగులుగా గుర్తించాయి. ఈ గణాంకాలు నిజమైతే మల్కన్‌గిరి ముంపు తథ్యమనే సంకేతాలు బలపడతాయని బీజేడీ వాదిస్తోంది. బీజేడీ విన్నపం.. సీడబ్ల్యూసీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంప్రదింపులను బిజూ జనతా దళ్ ప్రతిపాదించింది. ఒడిశా నదుల కోసం ఎగువ పరీవాహక బ్యాక్ వాటర్ గణనలు ఎప్పుడైనా నిర్వహించబడ్డాయా లేదా అనే దానిపై నిర్ధారణ, గరిష్ట వరద సంఘటనలకు స్పిల్‌వే డిశ్చార్జ్ సామర్థ్యం, జలాశయం నిర్వహణ నియమాలపై స్పష్టత కోరింది. ఈ దిశలో జల సంఘం నికరమైన అభిప్రాయానికి వచ్చేంత వరకు 50 లక్షల క్యూసెక్ వరదల అంచనా ప్రామాణికంతో కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నిలిపివేతకు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. -
మునిగుడ బంద్ ప్రశాంతం
రాయగడ: పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రాయగడ జిల్లా మునిగుడ సమితిని ఎన్‌ఏసీగా గుర్తించాలని ఈ ప్రాంతీయులు కోరుతుతున్నారు. ఇదే డిమాండ్‌తో బుధవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. వాహనాల రాకకోకలను ఆందోళనకారులు నిలిపివేశారు. గత బీజేడీ ప్రభుత్వ హాయాంలో మునిగుడను ఎన్‌ఏసీగా గుర్తించినట్లు ప్రకటించనప్పటికీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఎన్ఏసి జాబితాలో విస్మరించిందని మునిగుడ ప్రగతి మంచ్ అధ్యక్షులు సీహెచ్ గణేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి మునిగుడను ఎన్ఏసిగా గుర్తించాలని కోరారు. లేదంటే భవిష్యత్‌లో తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన
పర్లాకిమిడి: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గజపతి జిల్లా కాశీనగర్ సమితిలో కింగ గ్రామం జలదిగ్భంధంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా బుధవారం పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కాశీనగర్ ప్రాంతంలో వరద ప్రాంతాలలో పర్యటించి రైతులు, ప్రజల సమస్యలను విన్నారు. భారీగా పంట నష్టం వాటల్లినందున తమను ఆదుకోవాలని కింగ గ్రామస్తులు విన్నవించారు. కాశీనగర్ – కింగ గ్రామానికి అనుసంధానమైన పాత వంతెన ఎత్తును పెంచాలని విజ్ఞప్తి చేశారు. గుమ్మ గెడ్డతో వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు జయపురం: అక్రమంగా నాటు సారా అమ్మేందుకు తీసుకెళ్తున్న ఒక మహిళతో పాటు మరొకరిని వేర్వేరు ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు జయపురం అబ్కారి విభాగ అధికారి సుభ్రతా కేశరి హిరన్ బుధవారం తెలిపారు.అరెస్టు అయిన వారు జయపురం సమితి బర్లాహండి గ్రామానికి చెందిన దుర్జోధన బిశాయి, రాణిపుట్ ప్రాంతానికి చెందిన మహిళ ఉన్నారన్నారు. ఇద్దరిపైన కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. తాము మంగళవారం తమ సిబ్బందితో జయపురం సమితిలోని పలు ప్రాంతాలలో పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో రొండాపల్లి ప్రాంతాలలో సారాను విక్రయించేందుకు తీసుకొని వెళ్తుండగా ఇద్దరు పట్టుబడినట్టు పేర్కొన్నారు రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన చందిలి పొలీస్ స్టేషన్ పరిధిలోని అమలాభట్ట సమీపంలో బుధవారం చోటుచేసుకోగా.. బుటి సంతొష్, సురేష్ కులిసికలు గాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మునిగుడ నుంచి బైకుపై రాయగడ వైపు వస్తున్న సురేష్, సంతోష్‌లు అమలాభట్ట కూడలికి చేరేసరికి ఎదురుగా వస్తున్న బొలేరో అదుపుతప్పి ఢీకొట్ట్డంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైకు కున డుపుతున్న సంతోష్ స్వల్ప గాయాలతో బయటపడగా.. వెనుక కూర్చున్న సురేష్‌కు తీవ్రగాయాలైనట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రయాణికుల భద్రతపై ఆరా భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ 22823 న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుల సౌకర్యాలు, పరిశుభ్రత, సేవా నాణ్యత, భద్రతా చర్యలు తనిఖీ చేశారు. అనంతరం భద్రక్ రైల్వే స్టేషన్ సందర్శించి ప్లాట్ ఫారంపై సౌకర్యాలు, సిబ్బంది లాబీని పరిశీలించారు. యార్డు కార్యాచరణ సామర్థ్యంపై దృష్టి సారించారు. నవీన్‌కు ప్రధాని పరామర్శ భువనేశ్వర్: బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక న్యూ ఢిల్లీలో కలుద్దామని అన్నారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నవీన్ పట్నాయక్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
బాలల హక్కులపై అవగాహన అవసరం
● సామాజికవేత్త సీహెచ్ శాంతాకర్ కొరాపుట్: బాలల హక్కులపై అధికారులకు అవగాహన ఉండాలని కొరాపుట్ జిల్లాకి చెందిన బాలల హక్కులు, చైతన్య కార్యక్రమాలు నిర్హహించే సామాజిక వేత్త సీహెచ్ శాంతాకర్ అన్నారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మిష న్ శక్తి సమావేశ మందిరంలో బాలల హక్కులపై బుధవారం నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగపరంగా బాలల సంరక్షణకు కల్పిస్తున్న హక్కులను వివరించారు. బాల్య వివాహాలు అరికట్టడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్తుందన్నారు. పోక్సో చట్టంపై క్షుణ్ణంగా అవగాహనకు రావాలసిన అవసరం ఉందన్నారు. బాలకార్మిక వ్యవస్థను అరికట్టే విధంగా అధికారులు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని శాంతాకర్ పేర్కొన్నారు. శిబిరంలో కార్మిక, శిశు సంక్షేమ, పోలీసు, సాంఘిక సంక్షేమ, విద్యా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వార్షిక ఫీజులు పెంపు
పర్లాకిమిడి: ఒడిశాలో 2025–26 విద్యాసంవంత్సరంలో అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలలో వార్షిక ఫీజులు తప్పనిసరిగా పెంచాల్సి వచ్చిందని ఒడిషా ప్రైవేటు మెడికల్ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. బుధవారం భువనేశ్వర్‌లో హైటెక్ మెడికల్ కళాశాల కాన్ఫరెన్సు హాలులో వారు మాట్లాడుతూ ప్రతి మూడేళ్లకు ప్రైవేటు మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులు పెంచాల్సి ఉన్నా ఏడేళ్ళుగా ఒడిషాలో మెడికల్ కోర్సుల ఫీజులు రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదన్నారు. రోగుల ఆరోగ్య సేవలు, చికిత్సా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న దృష్ట్యా కళాశాలల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఒడిషా ప్రైవేటు, ఇంజినీరింగ్ కళాశాలల చట్టం 2007 ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో కోర్సుల ఫీజుల పెంపునకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రికి సిఫారసు చేసినట్లు తెలిపారు. సమావేశంలో హైటెక్ మెడికల్ కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ గోపేశ్వర్ ఆచార్య, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జ్యోతిర్మయి పండా పాల్గోన్నారు. -
'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్
భారత్ 'అగ్ని 5' బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపుర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇది అణు సామర్థ్యం ఉన్న స్వదేశీ క్షిపణి. ఇది రక్షణ రంగంలో దేశానికి ఉన్న బలమైన సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది.ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) నిర్వహించింది. ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం గల 'అగ్ని 5' ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 5 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు.మూడు దశల ఘన ఇంధన ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ క్షిపణి.. ఇది భారత సరిహద్దులను మరింత సురక్షితం చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టీపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్’ సాంకేతికతతో రూపొందించారు. దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఈ ఏడాది జులైలో అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు. -
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నవీన్ పట్నాయక్ ఆరోగ్యం కోసం పూజలు జయపురం: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ పట్నాయిక్ ఆరోగ్యం కుదుటపడాలని జయపురం బిజూ యువ జనతా దళ్ సభ్యులు సుప్రసిద్ధ గుప్తేశ్వర్‌లో మంగళవారం పూజలు నిర్వహించారు. పూజల్లో యువ బీజేడీ నేతలు బిశ్వజిత్ నాయిక్, ఘనశ్యామ్ నాయిక్, సత్య నాయిక్, పూర్ణ ఢాకువ, బాసు ఖండి, రాజా పాఢి, బాపి పండ తదితరులు పాల్గొన్నారు. నిర్దోషిగా విడుదల రాయగడ: ఒక గంజాయి సాగు కేసును విచారించిన గుణుపూర్ ఎస్డీజేఎం దేవదత్త పట్నాయక్ నిందితుడిని నిర్దోషిగా తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ మేరకు ఆయన తన తీర్పును వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి రామనగుడ సమితి డుమురి, డుమురిగుడ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి సాగువుతుందన్న సమాచారం మేరకు 2016వ సంవత్సరం డిసంబర్ 3వ తేదీన గుణుపపూర్ పోలీసులు, అటవీ శాఖ, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది దాడులు చేపట్టారు. 24 ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూమి, మరో 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రైవేటు స్థలంలో గంజాయి సాగుపై దాడులు చేపట్టి గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఈ మేరకు భగీరథీ సబర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసు గుణుపూర్ ఎస్డీజేఎం కోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడు భగీరథిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. బోటు మునిగి ఒకరు గల్లంతు పర్లాకిమిడి: జిల్లాలో గుసాని బ్లాక్ గారబంద పోలీసుస్టేషన్ పరిధి లావణ్యగడ పంచాయతీలోని రాధా సాగరంలో మంగళవారం బోటు మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్నటువంటి నలుగురిలో ముగ్గురు వ్యక్తులు ఈతకొట్టి ఒడ్డుకు చేరుకోగా ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో పెద్దహంస గ్రామానికి చెందిన లండ రామారావు (40)గా గుర్తించారు. పర్లాకిమిడి నుంచి ఓడ్రాఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని రాధాసాగరంలో గాలించినా రామారావు ఆచూకీ లభించలేదని ఐఐసీ ప్రశాంత్ నిషిక తెలియజేశారు. రాధాసాగరం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది. ఘటనపై గారబంద పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. చేతబడి నెపంతో వ్యక్తిపై దాడి రాయగడ: చేతబడి నెపంతో ఒక యువకుడిపై దాడి జరిగిన ఘటన జిల్లాలోని శశిఖాల్ పోలీస్‌స్టేషన్ పరిధి బొడొలుకుటి గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బొడొలుకుటి గ్రామంలో నివాసముంటున్న భాషా మండంగి అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని అనుమానించిన గ్రామస్తులు జూలై 30వ తేదీన రాత్రి అతడి ఇంట్లో చొరబడి దాడి చేశారు. ఇంటి నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి గ్రామం బయట ఒక చెట్టుకు కట్టేసి తీవ్రంగా గాయపరిచి విడిచిపెట్టారు. తీవ్రగాయాలకు గురైన భాషాను అతని కుటుంబ సభ్యులు జిమిడిపేట ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. అయితే తన భర్తపై కొందరు గ్రామస్తులు అమానుషంగా దాడి చేశారని ఆగస్టు 1వ తేదీన భాష భార్య చింతా కొండగిరి శశిఖాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన రామ కొండగిరి, గౌరి కొండగిరి, జగన్నాథ కొండగిరి అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం వారిని విడిచిపెట్టారు. ఇంటి వద్దే ఉంటూ గాయాలతో చికిత్స పొందుతున్న భాష ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమించడంతో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి అతని భార్య చికిత్స కోసం తరలించడంతో విషయం బయటపడింది. దాడి చేసినవారిని పోలీసులు అరెస్టు చేయకుండా ఎందుకు విడిపెట్టారో తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై పోలీసులు మౌనం వహిస్తున్నారు. ● మట్టి విగ్రహాల్లో దిట్ట అమలాభట్ట ● వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 100 కుటుంబాలు ● వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు లభ్యంరాయగడ జిల్లా కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమలాభట్ట గ్రామం ఉంది. ఈ గ్రామంలోని సుమారు 100 కుటుంబాలు మట్టినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయి. వీరు ప్రకృతిహితంగా విగ్రహాలను తయారు చేస్తుంటారు. కేవలం మట్టినే ఉపయోగించి అందమైన విగ్రహాలను తయారు చేయడంలో అమలాభట్ట గ్రామానికి ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏడాది వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు వంటి ప్రత్యేక దినాల్లో విగ్రహాల తయారీలో ఇంటిళ్లపాది నిమగ్నమవుతుంటారు. ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలకు సంబంధించి విగ్రహాల తయారీ ఊపందుకున్నాయి. మూడు నెలల ముందుగానే విగ్రహాలను రూపొందించడంలో నిమగ్నమైన యువతీ, యువకులు రేయింబవళ్లు కష్టించి విగ్రహాలను తయారీ చేస్తున్నారు. మూడు నెలల పాటు కష్టపడి పనిచేస్తే సుమారు రూ.50 వేల వరకు ఆదాయం ఒకొక్కరికీ లభిస్తుందని చెబుతున్నారు. అయితే గత మూడేళ్లుగా తమ వ్యాపారాలు చాలా మందకొడిగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వినాయక విగ్రహాలకు సంబంధించి సహజ రంగులు ధరలు ఆకాశానంటుతుండడంతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో రూపొందించిన విగ్రహాల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గుతోందని చెబుతున్నారు. బాల వినాయకులకు గిరాకీ ఈ ఏడాది ఆర్డర్లు ఇచ్చేవారు బాల వినాయకుల ప్రతిమలకు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో పాటు ఆర్డర్లకు అనుకూలంగా విగ్రహాలను తయారు చేస్తుండడం విశేషం. మువ్వగోపాలుడు, బాల వినాయకుడు వంటి వేషధారణల్లో ఈ ఏడాది వినాయకుల విగ్రహాలు దర్శనం ఇవ్వనున్నాయి. రాయగడ జిల్లాలోని గుణుపూర్, గుడారి, మునిగుడ, పద్మపూర్ వంటి ప్రాంతాలతో పాటు గజపతి జిల్లా నుంచి అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన మన్యం జిల్లా పార్వతీపురానికి చెందినవారు కూడా ఈసారి వినాయక విగ్రహాలకు ఆర్డర్లు ఇచ్చారు. డైలీ మార్కెట్లో విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలను ఈ గ్రామానికి చెందిన యువతులు రూపొందిస్తున్నారు. వాటిని స్వయంగా తయారు చేసి రంగులు అద్ది, పూర్తయిన తర్వాత చవితికి మూడు రోజుల ముందుగానే రాయగడ పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తుంటారు. ప్రతీ ఏడాది మహిళలు వినాయక చవితి సందర్భంగా కష్టపడి విగ్రహాల తయారీతో పాటు వాటిని విక్రయించి కొంతమొత్తం ఆదాయం సంపాదించుకుని కుటుంబ పోషణకు అండగా నిలుస్తుంటారు.మెరుగులు దిద్దుకుంటున్న వినాయక విగ్రహాలు మువ్వగోపాలుడిగా రూపొందుతున్న గణనాథుడువివిధ రూపాల్లో గణనాథులు బాల గోపాలుడిగా గణపతి బాల గణపతి విగ్రహం గొంతెండుతోంది..!మైనర్ బాలికపై అత్యాచారం ● నిందితుడి అరెస్టు జయపురం: ఒక మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్ర రౌత్ వెల్లడించారు. అరైస్టెన వ్యక్తి స్థానిక గోపబందునగర్కు చెందిన రోహణ్ నాగ్ ఉరఫ్ రాజేంద్రగా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఒక వీధిలో నివాసముంటున్న మైనర్ బాలిక గత జూలై 10వ తేదీన తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు యువకులు వచ్చి ఆ బాలికను బలవంతంగా ఒక వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఈ విషయం ప్రత్యక్షంగా చూచినవారు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో గాలించినా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో జయపురం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆమె జాడ తెలియలేదు. ఎట్టకేలకు నవరంగపూర్ జిల్లా పపడహండిలో బాలిక ఉన్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలియడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ మైనర్ బాలికతో పాటు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహించి వాగ్మూలం రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం జరిపిన నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.ఆందోళన చేపడుతున్న మృతుడి కుటుంబ సభ్యులు జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ సమితి ఝొడొగుడ గ్రామం 26వ జాతీయ రహదారిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. మరణించిన వ్యక్తి బొరిగుమ్మ సమితి కమతా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నారాయణ జానిగా గుర్తించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణ జాని తన మిత్రుడితో కలిసి బైక్‌పై బొరిగుమ్మ వైపు వస్తున్నారు. వారి వెనుక ఒక ప్రైవేట్ బస్సు వస్తూ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వస్తున్న నారాయణ, అతడి మిత్రుడు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో నారాయణ జాని సంఘటనా స్థలం వద్దనే మరణించాడు. ప్రస్తుతం నారాయణ జాని బొరిగుమ్మ రాజ మేసీ్త్ర సంఘ కార్యదర్శి. నారాయణ ప్రమాదంలో మరణించినట్లు తెలిసిన వెంటనే రాజమేసీ్త్ర సంఘ సభ్యులు, అతడి బంధువులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో 26వ జాతీయ రహదారికి ఇరువైపులా అనేక వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే బొరిగుమ్మ అదనపు తహసీల్దార్ సతీష్ కుమార్ బొయిని, పోలీసులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అధికారులు ఇచ్చిన హామీలకు అంగీకరించి రాత్రి 8 గంటల సమయంలో ఆందోళన విరమించడంతో రాకపోకలు మరలా కొనసాగాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రాయగడ జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి సికరపాయి గ్రామంలోని లడొంగిరియా వీధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సికరపాయి నుంచి కల్యాణ సింగుపూర్, కాసీపూర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వీధిలో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందరి దాహాన్ని తీర్చేందుకు ఒకే గొట్టపు బావి ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న బీడీవో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే అందుకు వారు అంగీకరించకపోవడంతో, రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్న చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. – రాయగడముందస్తు ఆర్డర్ల ప్రకారమే...ఇదివరకు వినాయక చవితి దగ్గరపడుతుందంటే ఆరు నెలల ముందే విగ్రహాల తయారీకి సిద్ధమయ్యేవారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్లు బాగానే వస్తుండేవి. చేసిన వినాయక విగ్రహాలన్నీ దాదాపు అమ్ముడయ్యేవి. అయితే ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాల విక్రయాలు జోరందుకోవడంతో వీరి వ్యాపారాలు మందకొడిగా మారాయి. మట్టినే నమ్ముకున్న వీరి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ప్రత్యేక దినాల్లో తప్పా మిగతా రోజుల్లో వ్యాపారాలు కొనసాగక ఇతర పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అందువల్ల గత రెండేళ్ల నుంచి ఆర్డర్లు వచ్చేంత వరకు మాత్రమే విగ్రహాలను కళాకారులు రూపొందిస్తున్నారు. మట్టినే నమ్ముకుని జీవనాధారంగా పలువురు ఏటా తీరైన మట్టి విగ్రహాలను రూపొందిస్తూ తమ జీవనాన్ని సాగిస్తూ పుడమిపై మమకారాన్ని చాటుకుంటున్నారు.మనం చేసుకునే పండగలు వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అవ్వడం. కానీ ఆధునిక పోకడలు పర్యావరణ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఉపయోగిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో తయారు చేస్తున్న విగ్రహాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. దీనివలన జీవకోటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలనే సంకల్పంతో అమలాభట్ట గ్రామస్తులు మట్టితో విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. వీటిని ఉపయోగించడం వలన పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇలా మట్టి మేలు తలపెడుతున్న వారిని ఒకసారి పలకరిస్తే... – రాయగడ -
భద్రక్‌లో గవర్నర్ పర్యటన
భువనేశ్వర్: రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి మంగళవారం పర్యటించారు. బొడొబార్చికయన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్‌ను సందర్శించారు. స్వావలంబన, గ్రామీణ పరివర్తన, సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో ఇక్కడి వారి ప్రయత్నాలను ప్రశంసించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. కొడొబారంగొ గ్రామీణ పారిశ్రామిక పార్కు సందర్శించి స్వయం సహాయక బృందాలు, ఉత్పత్తిదారుల బృందాలు మరియు లఖ్పతి దీదీలతో సంభాషించారు. ఈ సంభాషణలో స్వావలంబన, మహిళా సాధికారత మరియు సామాజిక గ్రామీణ సంస్థల స్ఫూర్తిదాయకమైన అనుభవాలను పంచుకున్నారు. -
విస్తారంగా వర్షాలు
జయపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొరాపుట్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో 880.32 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జయపురం సబ్ డివిజన్ కోట్పాడ్ సమితిలో అత్యధికంగా 150 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అతి తక్కువ వర్షపాతం నారాయణపట్న సమితిలో 26.4 మి.మీ నమోదయ్యింది. అయితే బొయిపరిగుడ సమితిలో 143 మి.మీ, దశమంతపూర్లో 30 మి.మీ, లక్ష్మీపూర్‌లో 35.2 మి.మీ, సెమిలిగుడలో 53 మి.మీ, జయపురంలో 46.6 మి.మీ, కుంద్ర సమితిలో 42.4 మి.మీ, లమతాపుట్ సమితిలో 79 మి.మీ, పొట్టంగిలో 59.6 మి.మీ, మందుగాం సమితిలో 54 మి.మీ, నందపూర్ సమితిలో 55 మి.మీ, బొరిగుమ్మ సమితిలో 36 మి.మీ, కొరాపుట్ సమితిలో 73 మి.మీ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలతో మాచ్‌ఖండ్, అప్పర్ కొలాబ్, తెలింగిరి జలాశయాల్లో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. బొయిపరిగుడ సమితి బలిగాం పంచాయతీలో కంగుగుడ గ్రామం వద్ద నది నీటి ప్రవాహంతో పొంగిపొర్లుతోంది. దీంతో ఆ నదీ ప్రవాహిక ప్రాంతంలోని కంగుగుడ, అటల్గుడ, జలియగుడ గ్రామాలతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
మధ్యంతర నివేదిక సమర్పణ
భువనేశ్వర్: స్థానిక లోక్‌సేవ భవన్లో 6వ రాష్ట్ర ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికను సీఎం మోహన్ చరణ్ మాఝికి సమర్పించింది. ఈ సందర్భంగా కమిషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ పండా ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ అసిత్ రంజన్ మహంతి, ప్రొఫెసర్ అమరేష్ సామంతరాయ్, బిభు ప్రసాద్ నాయక్, సభ్య కార్యదర్శి డాక్టర్ సత్యప్రియ రథ్, ఎక్స్– అఫీసియో సభ్యుడు అరిందం డకువా ముఖ్యమంత్రిని కలిసి సమావేశమయ్యారు. కమిషన్ వివిధ సిఫార్సులను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ మరియు పట్టణ స్థానిక సంస్థల మధ్య రాష్ట్ర ఆదాయాల పంపిణీ నియంత్రణ వ్యవస్థ బలోపేతం దిశలో పలు సిఫార్సులతో నివేదిక రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. ఈ సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం ఆర్థిక సంఘం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. మధ్యంతర నివేదిక స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా తక్షణ ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు దోహదపడుతుంది. నిర్ణీత కాల పరిమితిలో తుది నివేదికను సమర్పించాలని కమిషన్ యోచిస్తోంది. రాష్ట్రం వసూలు చేసే పన్నులు, సుంకాలు, టోల్లు మరియు రుసుముల కేటాయింపును క్రమబద్ధీకరించడానికి కీలకమైన సూచనలను ప్రతినిధి బృందం చర్చించింది. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ మంత్రి రబీ నారాయణ్ నాయక్, గృహ నిర్మాణం – పట్టణాభివృద్ధి మరియు ప్రభుత్వ సంస్థల విభాగం మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్రో, ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, గృహ నిర్మాణం – పట్టణాభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషా పాఢి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ మిశ్రా, పంచాయతీ రాజ్ డైరెక్టర్ వినీత్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
మహిళలమే రూపొందిస్తుంటాం
వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతీ ఏడాది చిన్న చిన్న విగ్రహాలను మహిళలమే రూపొందిస్తుంటాం. తయారీ పూర్తయితే రంగులు అద్ది వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంటాం. రూ.10ల నుంచి రూ.100ల వరకు విగ్రహాలను రూపొందిస్తుంటాం. అయితే కొనుగోలుదారులు మా కష్టానికి తగ్గ ఆలోచించకుండా బేరసారాలు అడుతుంటారు. విక్రయాలు మందకొడిగా ఉంటే ఒకొక్కసారి గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ విక్రయించాల్సి వస్తుంది. ఒకవేళ అలా విక్రయించకపోతే పెట్టుబడి కూడా నష్టపోతాం. – పొందూరు లక్ష్మి, అమలాభట్ట షెడ్డు నిర్మిస్తే ప్రయోజనం గ్రామంలో సుమారు వంద కుటుంబాలు మట్టినే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాయి. వర్షం వస్తే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. చేసిన విగ్రహాలు వర్షాలకు తడిచి పాడవుతున్నాయి. పాలిథిన్ ఖరీదు చేసి వర్షం కురిసే సమయంలో విగ్రహాలను కప్పుకోవాల్సి వస్తోంది. అదే గ్రామంలో అందరి కోసం షెడ్డు ఉంటే అంతా అక్కడే విగ్రహాలు తయారీ చేసుకునే అవకాశం ఉండేది. షెడ్డు లేకపోవడంతో ఎవరి ఇంట్లో వారే విగ్రహాలను తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. భారీ వినాయకుల తయారీ కోసం బయట వేరొకరిపై ఆధారపడాల్సి వస్తోంది. – వంజరాపు రాజేష్, అమలాభట్ట అధికారులు దృష్టి సారించాలి గత రెండేళ్లుగా వచ్చిన ఆర్డర్ల ప్రకారమే విగ్రహాలను రూపొందిస్తున్నాం. ఆర్డర్లు లేకుండా తయారు చేస్తే అవి విక్రయాలు జరగక నష్టపోవాల్సి వస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నా, వాటి ఆదరణే అధికమవ్వడంతో మా వ్యాపారాలు దె దెబ్బతింటున్నాయి. మట్టినే నమ్ముకున్న మా కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. జిల్లా యంత్రాంగం వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – పి.వెంకటరావు, అమలాభట్ట -
విదేశీ మద్యంతో ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ వారాంతపు మార్కెట్ వద్ద ఎకై ్సజ్, విజిలెన్స్ స్క్వాడ్ ఒక కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో 17 లీటర్ల 600 మిల్లీ లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేశారు. ఈ అక్రమ విదేశీ మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు బబులా సాహు, బిజయ్ చౌదరిలను ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. ఈ మద్యాన్ని గజపతి జిల్లాలోని నువాగడ, ఖోజురిపద, సెరంగో, నారాయణ్‌పూర్, కోయిపూర్, జిరంగో, రామగిరికి తరలిస్తున్నట్లు కటక్ ఎకై ్సజ్ కమిషనర్ పి.అన్వేషా రెడ్డి తెలిపారు. రాయఘడ లిక్కర్ హోల్‌సేల్ షాపు సీసీటీవీ ఫుటేజీని ఎకై ్సజ్ కమిషనర్ పరిశీలిస్తున్నారు. దాడుల్లో హీరా దళపతి, బ్రజ కిషోర్ బింధాని, ఎస్ఐ షేక్ షకువాల్, కానిస్టేబుల్ గౌరంగ నాయక్, పద్మినీ నాయక్, పవిత్రా కుమార్ దాస్‌లు ఉన్నారు. నిందితులను బుధవారం ఉదయం కోర్టులో హాజరు పరుస్తామని అబ్కారీ కమిషనర్ పి.అన్వేషా రెడ్డి తెలియజేశారు. -
నీట్లో సత్తాచాటిన గిరిజన విద్యార్థిని
భువనేశ్వర్: రాష్ట్రంలో మారుమూల మల్కన్‌గిరి జిల్లాలోని కోరుకొండ మండలం నక్కమాముడి పంచాయతీ పరిధి అమ్లిబేడ గిరిజన గ్రామానికి చెందిన విద్యార్థిని చంపా రాస్పెదా నీట్ పరీక్షలో సత్తాచాటింది. నీట్ 2025లో అర్హత సాధించడంతో బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజ్ – ఆస్పత్రిలో సీటు సాధించింది. విద్యార్థిని తండ్రి సన్నకారు రైతు, తల్లి సాధారణ గృహిణి. చిత్రకొండ ఎస్ఎస్డీ బాలికల ఉన్నత పాఠశాలలో 2019 సంవత్సరంలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించింది. 2021 సంవత్సరంలో గోవిందపల్లి ఎస్ఎస్డీ ఉన్నత మాధ్యమిక పాఠశాల నుంచి +2 సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించి, బీఎస్సీ చదివేందుకు ఆర్థిక స్తోమత లేక డిగ్రీ చదువుకు స్వస్తి పలికింది. అయితే డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఏమాత్రం సడలిపోకుండా తన వంతు ప్రయత్నంలో తలమునకలైంది. బాలిక మేధస్సు, పట్టుదలని గుర్తించిన ఆమె మాజీ సైన్స్ ఉపాధ్యాయుడు ఉత్కళ కేశరి దాస్ మార్గదర్శిగా కల సాకారం చేయడంలో చేయూతనిచ్చారు. ఆశయ సాధనకు అందిన అవకాశం సద్వినియోగపరచుకుని బాలసోర్‌లోని ఉచిత నీట్ కోచింగ్ తరగతుల్లో చేరింది. ఈ కేంద్రంలో పొందిన శిక్షణతో తొలి ప్రయత్నంలోనే నీట్ పోటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సరికొత్త చరిత్రని ఆవిష్కరించింది. చంపా రాస్పెదా ఉత్తీర్ణతపై సీఎం మోహన్ చరణ్ మాఝి అమితానందం వ్యక్తం చేశారు. ఆమె భవిష్యత్‌లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. -
కొనసాగుతున్న రెవెన్యూ ఉద్యోగుల సమ్మె
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ వద్ద ఒడిశా రెవెన్యూ ఉద్యోగుల సంఘం సమ్మె మంగళవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. దీంతో కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు తమ పనులు జరగకపోవడంతో వెనుదిరుగుతున్నారు. రెవెన్యూ మినిస్టీరియల్ ఉద్యోగులకు ప్రారంభ మూల వేతనం పెంచాలని, అలాగే పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలకు రాలేదు. సమ్మె కాలంలో జీతాలు ఆపివేస్తామని, ఎస్మా చట్టం ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సంతును మిశ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హెచ్చరికలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనలో ఉపాధ్యక్షుడు సోరెన్ శంకర్‌లాల్, రెవెన్యూ అమలా సంఘం అధ్యక్షుడు జుధిస్టర్ రణసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి
రాయగడ: రాష్ట్ర నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శి, కమిషనర్ ఎస్.ఎన్.గిరీష్‌కు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ లిమామెడా గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి పద్మపూర్, గుణుపూర్లలో సోమవారం పర్యటించిన ఆయనకు గ్రామస్తులు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. లిమామోడ గ్రామంలో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య వేధిస్తోందని వివరించారు. గుణుపూర్‌లోని మెగా తాగునీటి ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి నీరు అందేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ గిరీష్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామానికి భవిష్యత్‌లో తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. -
జీవనాధారం నీవేనయ్య..!
● విగ్రహాల తయారీనే నమ్ముకున్న కళాకారులు ● స్థానికులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాక ● ట్రెండ్‌కు తగ్గట్టు రూపుదిద్దుకుంటున్న విగ్రహాలు ● వారం రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు వజ్రపుకొత్తూరు రూరల్ : వినాయక చవితి సందడి మరో వారం రోజుల్లో మొదలుకానుంది. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు ప్రారంభమై నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవం ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కళాకారులు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విగ్రహాలు తయారు చేసే కళను నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాలకు అవసరమైన బొజ్జ గణపయ్య విగ్రహాలను కళాకారులు తయారు చేసి ఏడాదికి సరిపడ ఆదాయాన్ని అర్జించి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ప్రధానంగా ఈ సీజన్లో రాజస్థాన్, కోల్కత్తా, రాజమండ్రి తదితర ప్రాంతాలలో పాటు జిల్లాలో ఉన్న పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, కాశీబుగ్గ, హరిపురం తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 200 విగ్రహా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కళాకారులు, వ్యాపారులు, కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఉత్సవాలకు మూడు నెలల ముందు విగ్రహాల తయారీ కేంద్రాలను ఎంపిక చేసుకొని అవసరమైన ముడి సామగ్రిని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోనుగోలు చేసుకొని సేకరించి నిల్వపెట్టుకున్నారు. రెండు నెలల ముందు విగ్రహాలను తయారీ చేయడం ప్రారంభించారు. ఉత్సవానికి సమయం దగ్గర పడటంతో విగ్రహాలకు తుది మెరుపులు దిద్దుతున్నారు. ఏటా ట్రెండింగ్‌లో ఉన్న వినాయక విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. పూజా కమిటీ నిర్వాహకుల అభిరుచికి తగ్గట్టుగా రకరకాల ఆకృతిలో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. 2 అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను తయారీ చేసి మార్కెట్లో అమ్మకాల కోసం సిద్ధం చేస్తున్నారు. విగ్రహాల మోడల్, సైజ్ బట్టి ఒక్కొక్క విగ్రహాన్ని రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు. కళాకారులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారీ చేస్తున్నారు. అయితే తాము ఆశించిన స్థాయిలు విగ్రహాలు అమ్ముడుపోతేనే తమ కుటుంబ పోషణకు భరోసా దొరుకుతుందని, లేదంటే నష్టాలు చవిచూడాల్చిన పరిస్థితి ఏర్పడుతుందని కళాకారులు చెబుతున్నారు. -
లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష
ఎచ్చెర్ల : మద్యం మత్తులో లారీని నడుపుతూ ప్రమాదానికి కారణమైన విజయవాడకు చెందిన డ్రైవర్ నాగరాజుకు జిల్లా సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 60 రోజుల జైలు శిక్ష విధించారు. ఎచ్చెర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి విజయవాడ నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నాగరాజు రాంగ్రూట్లో డ్రైవ్ చేస్తూ విశాఖ నుంచి ఒడిశా వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒడిశా లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్ నాగరాజుపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించగా 60 రోజులు జైలు శిక్షను విధించారని ఎస్సై సందీప్‌కుమార్ మంగళవారం తెలిపారు. పోలీసుల అదుపులో నిందితురాలు మెళియాపుట్టి: పట్టుపురంలో కాంచనే అనే మహిళపై దాడి చేసి పారిపోయిన ఘటనలో అనుమానితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పాతపట్నం సీఐ వి.రామారావు తెలిపారు. పూర్తి వివరాలు బుధవారం తెలియజేస్తామన్నారు. రాత్రిపూట యూరియా అమ్మకాలా? నరసన్నపేట: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటైన సొసైటీల్లో చీకటి పడ్డాక యూరియా అమ్మకాలు చేస్తుండటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నరసన్నపేట సొసైటీకి మూడు రోజుల కిందట 400 బస్తాల యూరియా వచ్చింది. ఆదివారం రైతులు అధికంగా చేరడం.. వాగ్వాదం జరగడంతో యూరియా పంపిణీ చేయలేదు. రెండో రోజు కొంత మంది రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇచ్చారు. మిగిలిన యూరియాను మంగళవారం రాత్రి విక్రయాలు చేపట్టారు. ఆటోలు, లగేజి వాహనాల్లో బస్తాలను ఇష్టానుసారంగా సరఫరా చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన యూరియా పక్కతోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో సొసైటీకి వచ్చిన యూరియా పక్క దారి పట్టిందని, కావాల్సిన వారికి లెక్కకు మించి పంపిణీ చేశారని పలువురు రైతులు అంటున్నారు. అభ్యంతరాల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ–డివిజనల్ మేనేజర్ పోస్టు రాత పరీక్ష ఆగస్టు 10న నిర్వహించగా.. ఫలితాలు, ప్రొవిజనల్ జాబితా జిల్లా వెబ్సైట్ srikakulam.a p.gov.inలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలను ఈ నెల 22లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. మార్కులపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా నిర్దేశిత తేదీ సాయంత్రం 5 గంటల లోగా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారికి నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు. -
కల్యాణ సింగుపూర్‌లో రైతుల ఆందోళన
రాయగడ: సకాలంలో ఎరువులు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సొమవారం కల్యాణసింగుపూర్‌లో గల ల్యాంప్స్ కార్యాలయానికి రైతులు తాళం వేశారు. ఎరువుల కోసం గంటల తరబడి ఎదురు చూసినా ల్యాంప్స్ అధికారులు పట్టించుకోవడం లేదని, ఎరువులను నల్ల బజారుకు తరలిస్తున్నారని ఆరోపించారు. సమితిలోని సుమారు 14 పంచాయతీలకు చెందిన వందలాది మంది రైతులు ఎరువుల కోసం ల్యాంప్స్ కార్యాలయం వద్ద పడిగాపులు కాసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం రహదారి వద్ద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్, పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను బుజ్జగించారు. రైతు గుడ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎరువుల పంపిణీ విషయంలో ల్యాంప్స్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, సకాలంలో రైతులకు ఇవ్వాల్సిన ఎరువులను ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్ -
మల్కన్‌గిరిలో ముఖ్యమంత్రి వాయు ఆరోగ్య సేవా శిబిరం
భువనేశ్వర్: రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి వాయు ఆరోగ్య సేవా యోజన కింద ప్రత్యేక వైద్య సేవలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా మల్కన్‌గిరి జిల్లా ప్రజలకు అధిక నాణ్యత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు కటక్ శ్రీ రామ చంద్ర భంజ్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నుంచి వైద్య నిపుణుల బృందం సోమవారం మల్కన్‌గిరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి బయల్దేరింది. ఈ వైద్య బృందంలో లాప్రోస్కోపీ శస్త్ర చికిత్స, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణులు, సహాయకులు ఉన్నారు. ఈ బృందం 21వ తేదీ వరకు అక్కడే ఉండి ప్రత్యేక సేవలు, చికిత్సను అందిస్తుంది. మల్కన్‌గిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 250 మందికి పైగా రోగులు ఈ సేవ కోసం ముందస్తుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. -
ముఖ్యమంత్రిని కలిసిన బ్యాడ్మింటన్ అక్కాచెల్లెళ్లు
భువనేశ్వర్: ప్యారిస్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాడ్మింటన్ అక్కాచెల్లెళ్లు రుతుపూర్ణ పండా, శ్వేతపూర్ణ పండా సోమవారం స్థానిక లోక్ సేవా భవన్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కలిశారు. వీరివురు భారత దేశ తొలి తోబుట్టువుల బ్యాడ్మింటన్ క్రీడాకారిణులుగా పేరొందారు. ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ప్యారిస్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రపంచ వేదికపై వారు అద్భుతమైన విజయాన్ని సాధించగల సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి హృదయపూర్వకంగా బ్యాడ్మింటన్ అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. జయపురం: జయపురం సమితి ఘివురి గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో మరో ఇరువురిని అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ సచీంధ్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. జూలై 31వ తేదీన ఘివురి గ్రామ కూడలి వద్ద కొంతమంది యువకులు మాట్లాడుతుండగా వారిమధ్య వివాదం తలెత్తి కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సదర్ పోలీసు స్టేషన్ పరిధి గగణాపూర్ పోలీసు పంటి అధికారి చిత్తరంజన్ ప్రదాన్ తన సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఉభయ వర్గాల వారిని శాంత పరచి గాయపడిన వారిని జయపురం జిల్లా కేంధ్ర హాస్పిటల్లో చేర్చారు. వారిలో ఎనిమిది మందిని ప్రాధమిక చికిత్స తరువాత విడిచి పెట్టామని తెలిపారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావటంతో వారిని కొరాపుట్ సహిద్ లక్ష్యణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్‌కు తరలించారు. కొట్లాటలో నిందితులైన వారిలో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారిలో ఘివురి గ్రామానికి చెందిన చందన హరిజన్, అజయ హరిజన్ ఉన్నారన్నారు. వారిని కోర్టులో హాజరుపరచినట్లు వెల్లడించారు. పుట్టగొడుగులు తిని ఎనిమిది మందికి అస్వస్థత పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ రామగిరి పోలీసుస్టేషన్ పరిధిలో విషాధ సంఘటన జరిగింది. రామగిరి పంచాయతీ దెవురి సాహి గ్రామంలో సోమనాథ బెహారా అడవిలో దొరికిన విషపు పుట్టగొడుగులు తిని వారి కుటుంబంలో ఎనిమిది మంది అస్వస్థతకు గురైయ్యారు. తొలుత క్షతగాత్రులను రామగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చిన తరువాత మెరుగైన చికిత్స కోసం చంద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం దెవురిసామి గ్రామంలో సోమనాథ బెహారా ఆవులు దొంగలాడటానికి వెళ్లి అడవిలో దొరికిన పుట్టుగొడుగులు సేకరించి ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు వండి తన అన్న కుటుంబానికి కూడా కూరను ఇచ్చాడు. పుట్టగొడుగులు కూర తిన్న రెండు కుటుంబ సభ్యులకు గొంతుకలో దురద ఏర్పడి తరువాత అస్వస్థత గురై అచేతనంగా పడిపోయారు. అంబులెన్సులో చంద్రగిరి సీహెచ్‌సీకి క్షతగాత్రులను తరలించారు. చికిత్స పొందిన తరువాత వారి ఆరోగ్యం కుదుటపడిందని డాక్టర్లు తెలియజేశారు. -
దివ్యాంగురాలిని మోసగించిన వ్యక్తి అరెస్టు
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి గగుడిగుమ్మ గ్రామంలో దివ్యాంగురాలని మోసగించిన కేసులో అదే గ్రామానికి చెందిన యువకుడు నగేష్ ధనును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నగేష్ దివ్యాంగురాలైన యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నిజమని నమ్మిన ఆమె శారీరకంగా అతనికి దగ్గరైంది. దీంతో గర్భవతయ్యింది. తొమ్మిది నెలల నిండిన అనంతరం ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. గ్రామస్తుల సమక్షంలో తానే ఆ శిశువుకు తండ్రినని నగేష్ అంగీకరించాడు. కొద్దిరోజులు గడిచిన తరువాత తనను విడిచిపెట్టి వెళ్లిపొయాడు. దీంతో యువతితోపాటు ఆమె తల్లిదండ్రులు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమెదు చేసిన పోలీసులు సోమవారం నగేష్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. చోరీ కేసులో బాలుడితోపాటు ఇద్దరు అరెస్టు జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ పోలీసులు ఒక దొంగతనం కేసులో బాలుడితో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి కేసు దర్యాప్తు అధికారి దీరేంద్ర బారిక్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బొయిపరిగుడ నివాసి బి.భాస్కరరావు విఐపి కాలనీలో సొంతిల్లు కడుతూ జయపురంలో ఉంటున్నారు. ఈ నెల 8 వ తేదీన ఇంటిని చూసేందుకు జయపురం నుంచి బొయిపరిగుడ వచ్చారు. అయితే ఇంటి నిర్మాణానికి వినియోగించే మూడు వాటర్ పంపు మోటార్లు, మూడు ఇనుప రాడ్ల బండిళ్లతో పాటు కొన్ని సామాన్లు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బొయిపరిగుడ సమితి పల్లిగుడ గ్రామంలో ఇద్దరిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో దొంగతనం చేసినట్లు వారు అంగీకరించారు. వారిలో ఒకరు బాలుడు కాగా మరొకడు పల్లిగుడ వాసి ధీనబందు బాగధెరియ (27) అని పోలీసు అధికారి వెల్లడించారు. బాలుడి ఇంటిలో రెండు వాటర్ పంపు మోటారులు, కొన్ని ఇనుప రాడ్ల బండిళ్లు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. -
రైలు పట్టాలపై సౌర విద్యుత్ ఉత్పాదన
భువనేశ్వర్: ప్రయాణికులు, సరుకు రవాణాలో సాటి లేని మేటి సంస్థగా వెలుగొందుతున్న భారతీయ రైల్వే బహుముఖ లాభసాటి చర్యలతో మరింత ఎదగాలనే దృక్పథాన్ని బలపరచుకుంటోంది. ప్రయాణికుల పాసింజరు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సరుకు రవాణా (గూడ్సు) రైళ్లు శరవేగంతో దూసుకు పోయేందుకు ఆధారంగా నిలిచే పట్టాల వినియోగాన్ని మరింత సఫలీకృతం చేసే దిశలో రైల్వే శాఖ వినూత్న ప్రయోగానికి సాహసించింది. రైలు పట్టాల మధ్య విస్తరించిన సుదూర పొడుగాటి స్థలంలో సౌర శక్తి ఉత్పాదన కోసం సంకల్పించింది. ఈ స్థలంలో సౌర శక్తి పలకలు (సోలార్ ప్యానెల్) వైజ్ఞానికతో కూడిన సాంకేతిక అమరికతో సౌర శక్తి ఉత్పాదన సుసాధ్యమేనని నిర్ధారించింది. భారత దేశంలో తొలి సారిగా వారణాసిలోని బెనారస్ లోకో మోటివ్ వర్‌ుక్స (బీఎల్డబ్ల్యూ) ఈ ప్రయోగానికి ముందడుగు వేసింది. సౌర శక్తి ఉత్పాదన అంచనా రైళ్లు పరుగులు తీస్తున్న పట్టాల మధ్య ఖాళీ స్థల భాగంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రామాణికంగా సౌర శక్తి పలకల అమరికతో హరిత విద్యుత్ ఉత్పాదన సాధ్యాసాధ్యాల కార్యాచరణ మొదలైంది. అధికారుల అంచనా ప్రకారం 70 మీటర్ల రైలు మార్గం (ట్రాక్) వెంబడి 28 సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో 15 కిలో వాట్ల పీక్ పవర్ ఉత్పత్తి సాధ్యమని భావిస్తున్నారు. ఈ ఏర్పాటుతో పర్యావరణ కాలుష్యం తలెత్తకుండా సరళమైన నిర్వహణ, పరిరక్షణ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని భారతీయ రైల్వే శాఖ ఆచి తూచి అడుగు వేస్తుంది. సాధారణ నిర్వహణ కార్యకలాపాలు, వర్షాలు, వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో పట్టాల మధ్య అమర్చిన సౌర శక్తి ఉత్పాదక పలకల తొలగింపు, పునరుద్ధరణ ఈ వ్యవస్థలో సానుకూల చొరవ. భారతీయ రైల్వే సంకల్ప సిద్ధితో దేశంలో సౌర శక్తి ఉత్పాదన గణనీయంగా పుంజుకునే అవకాశాల పట్ల సర్వత్రా ఆశాభావం వ్యక్తం అవుతుంది -
మల్కన్‌గిరిలో భారీ వర్షం
మల్కన్‌గిరి : మల్కన్‌గిరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. కలిమెల సమితి ఎంవీ 96 వంతెనపై 5 అడుగులు నీరు ప్రవహించడంతో మల్కన్‌గిరి–కలిమెల రహదారి పూర్తిగా నిలిచిపోయింది. కంగురుకొండ వద్ద కూడా వర్షం నీరు నిండి రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సోమవారం జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది. మోహనలో కుండపోత పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు దొంచి కొడుతున్నాయి. ఆదివారం నుంచి మోహన బ్లాక్‌లో కుండపోత కురుస్తోంది. దీని ప్రభావంతో శిరిసిపడ, తియ్యమా వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో నాలుగు గ్రామాలకు రవాణా, కమ్యూనికేషన్లు ఆగిపోయాయి. మోహనలో అత్యధికంగా 123.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆర్.ఉదయగిరిలో 45.0 మిల్లీమీటర్లు, గుసానిలో 71.0, కాశీనగర్‌లో 11.8, పర్లాకిమిడిలో 28.0, రాయగడ బ్లాక్‌లో 22.4, గుమ్మాలో 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
రాష్ట్ర బీజేపీ చీఫ్ సమావేశం
మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025అమిత్ షాతో.. భువనేశ్వర్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ మన్మోహన్ సామల్ సోమవారం న్యూ ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దీన్ని మర్యాదపూర్వక సమావేశంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర అగ్ర శ్రేణి నాయకులు తరచూ సమావేశం అవుతుండడంపై సర్వత్రా ఉత్కంఠ బిగుసుకుంటోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ కలయికలు, సమావేశాలు, చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నెల ప్రారంభంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్‌దేవ్ న్యూ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. గత వారం అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జె. పి. నడ్డాతో కలిసి వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఒడిశా అగ్ర శ్రేణి నాయకత్వంతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి నేతృత్వంలో రాష్ట్రంలో తొలి సారిగా ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నా మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరగ లేదు. మరో వైపు కీలకమైన రాష్ట్ర కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల అధిపతుల పేర్లను ఖరారు చేయడంపై ఊహాగానాల నేపథ్యంలో ఉభయ రాష్ట్ర, కేంద్ర నాయకుల సమావేశాలు చర్చనీయాంశమవుతున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రితో సోమవారం జరిగిన చర్చలకు సంబంధించి కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత సామర్ధ్యం బలోపేతం, రాష్ట్ర, జాతీయ ప్రాధాన్యతల సమన్వయంతో సమగ్ర పురోగతి అంశాలపై చర్చ కొనసాగినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ఒక సందేశం జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి లక్ష్యంగా వికసిత భారత్ సంకల్పం సాకారం చేయడంలో ఒడిశా కీలక పాత్రపై ప్రధాన చర్చ జరిగింది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మన్మోహన్ సామల్ వ్యూహాత్మక మార్గదర్శకత్వం పట్ల అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
బొరిగుమ్మలో ఘనంగా నందోత్సవాలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మలో నందోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. సాధారణంగా కృష్ణాష్టమి మరుసటి దినాన గోపాలకుల దినం లేక నందోత్సవంగా పాటిస్తారు. ఈ ఉత్సవాన్ని బొరిగుమ్మలో అనాదిగా వంశ పారంప ర్యంగా నిర్వహిస్తున్నారు. పురాతన వైష్ణవ సంప్రదాయ వై.కృష్ణ స్వామి కుటుంబం, బొరిగుమ్మ నవరంగపూర్ రోడ్డులోని కృష్ణ స్వామి నివాసంలో అంగ రంగౖ వెభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన నందోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని శ్రీకృష్ణునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్బంగా భజన సంకీర్తనలు నిర్వహించారు. -
సెంచూరియన్ వర్సిటీలో జాతీయస్థాయి సెమినార్
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ లో జాతీయ సాంకేతిక విద్యావ్యవస్థ (ఎన్ఐటీ) సహకారంతో ‘నెక్ట్స్ జనరేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్–ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీ’పై జాతీయ స్థా యి అధ్యాపక శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ఎన్ఐటీ (పాట్నా) డైరెక్టర్ ప్రొఫెసర్ పి.కె.జైన్, సెంచూరియ న్ వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ సుప్రియా పట్నాయక్‌లు ప్రారంభించారు. దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాల ప్రొఫెసర్, అధ్యాపకులు పాల్గొన్నా రు. శిక్షణ కార్యక్రమంలో 5జీ, 6జీ సిస్టం, ఎల్ఓటీ, ఆర్ఎఫ్, ఎనర్జీ హార్వెస్టింగ్, స్మార్ట్ కమ్యూనికేషన్ పై విస్తృతంగా చర్చించారు. శిక్షణ తరగతులు ఈ నె ల 29వ తేదీ వరకూ జరుగుతాయని డీన్ (కంప్యూటర్ సైన్సు) ప్రఫుల్ల పట్నాయక్ తెలియజేశారు. -
సమయం ఆసన్నమైంది
అంతరించిపోతున్న ప్రాచీన, సంప్రదాయ వస్త్ర తయారీ ప్రక్రియను బతికించేందుకు ఏఎఫ్‌కేకే సంఘం వడుకు, నేత ప్రక్రియలను నేర్పే శిక్షణా సంస్థగా అవతరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ మేరకు ఏఎఫ్‌కేకే సంఘం త్వరగా కేవీఐసీ సాయంతో శిక్షణలు ఇచ్చేందుకు భాగస్వామ్యం కోసం అడుగులు వేయాలి. పొందూరులో గతంలో 1,200 మంది స్పిన్నర్లు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 520 మందికి చేరింది. గతంలో 300 మంది నేత కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం కేవలం 80 కుటుంబాలు మాత్రమే నేత కార్మికులుగా మిగిలారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కార్మికులు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్తవారు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
అభివృద్ధి పనుల పరిశీలన
రాయగడ: రాష్ట్ర పంచాయతీ, నీటి పారుదల శాఖ ల కార్యదర్శి ఎస్.ఎన్.గిరీష్ జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిఽధిలో గల పద్మపూర్, గుణుపూర్ సమితుల్లో సోమవారం పర్యటించారు. ఆయా సమితుల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. గుణుపూర్‌లో గల సబ్ డివిజన్ హాస్పిటల్‌ను పరిశీలించి రోగులతో మాట్లాడారు. హాస్పిటల్లో అందుతున్న సౌకర్యాలు, ఎదురువుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి రొగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం సమితిలోని సానసారి, కులుసింగి గ్రామాల్లో పర్యటించారు. వికసిత్ ఒడిశా ద్వారా నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి పనులను సమీక్షించా రు. ఆయా ప్రాంతాల్లో ఈ పథకంలో నిర్మితమవుతున్న ఇళ్లను, లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు. కులుసింగ్లో జరుగుతున్న ప్రధానమంత్రి జన్మన్ పథకాన్ని పర్యవేక్షించారు. గ్రామస్తులతో చర్చించా రు. అనంతరం పుటాసింగిలో పర్యటించిన ఆయన ఎస్ఎస్డీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. మధ్యా హ్నం భోజన ఎలా ఉంది, సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సమితిలోని రైజింగ్ తల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించా రు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారా అని అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ పర్య టనలో గుణుపూర్ సబ్ కలెక్టర్ దుధల్ దిలీప్ అభి షేక్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయకుమార్ ఖెముండొ పాల్గొన్నారు. కార్యదర్శి గిరీష్‌కు లంజియా సవర లిపికి సంబంధించిన పెయింటింగ్‌ను అధికారులు బహూకరించారు. -
శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం
కేవీఐసీ డిప్యూటీ సీఈవో మదన్‌మోహన్‌రెడ్డి పొందూరు ఏఎఫ్‌కేకే సంఘా న్ని సందర్శించి హామీలివ్వడం వాస్తవమే. కొత్తవారికి వడుకు, నేత ప్రక్రియలపై శిక్షణలు ఇచ్చేందుకు కేవీఐసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణలిచ్చేందుకు ఏఎఫ్‌కేకే సంఘం సిద్ధంగా ఉంది. – దండా వెంకటరమణ, సెక్రటరీ, ఏఎఫ్‌కేకే సంఘం, పొందూరు ఖాదీ వస్త్రాలు తయారు చేసేందుకు పొందూరు ఏఎఫ్‌కేకే సంఘాన్ని కేవీఐసీతో ట్రైనింగ్ పార్టనర్‌గా ఉండమని సూచించాం. పొందూరు ఖాదీని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివలన కొత్తతరం వారు ఈ వృత్తిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా వడుకు, నేత ప్రక్రియలో శిక్షణ ఇచ్చేందుకు పొందూరు ఖాదీ సంస్థకు దరఖాస్తు చేయమని చెప్పాను. శిక్షణ ముగించుకున్న వారికి సర్టిఫికెట్లు సైతం అందజేస్తాం. ఏ జిల్లా నుంచైనా శిక్షణలకు పొందూరుకు రావచ్చు. వడుకు, నేత పని నేర్చుకోవచ్చు. – మదన్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఈవో, బెంగుళూరు, కేవీఐసీ ఎక్కువ కార్మికులు ఉండడం గమనార్హం. మాస్టర్ వీవర్స్ నేసే వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సొసైటీలు, సంఘాలకు నేసేవారికి ప్రభుత్వ సహకారం అందించాలి. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి సౌసైటీలు, సంఘాలకు నేసే కార్మికులకు వర్తింపజేయాలి. దుస్తులు నేసే వారికి షరతులు ఉండకూడదు. ఉదాహరణకు పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంలో ఏఎంసీ, ఎన్ఎంసీ వస్త్రాలు మాత్రమే లభిస్తున్నాయి. సీమనూలుతో నేసే వస్త్రాల తయారీ ఇక్కడ లేదు. అందువలన ఏరకమైన నూలుతోనైనా వస్త్రాలు తయారు చేయోచ్చన్న అనుమతి కేవీఐసీ నుంచి రావాలి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. కార్మికులకు ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతారు. -
రెవెన్యూ మినిస్టీరియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై చర్యకు డిమాండ్
జయపురం: కొరాపుట్ జిల్లా రెవెన్యూ మినిస్టీరియ ల్ ఆఫీసర్స్ అసోసియేషన్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఒడిశా అమలా సంఘ ఆఫీసర్స్ అసోసి యేషన్ సాధారణ కార్యదర్శి శశిభూషణ దాస్ ఆరోపించారు. సోమవారం ఉదయం జయపురం బ్లాక్ ఎడ్యకేషనల్ ఆఫీసర్స్ కార్యాలయంలో నిర్వహించి న పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం కొరాపుట్ జిల్లా రెవెన్యూ మినిస్టీరియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పిలవబడుతున్న వ్యక్తులు డి.ఎన్. కె సద్భావణ భవనం కొరాపుట్‌లో తమ డిమాండ్ ను నెరవేర్చుకొనేందుకు ఒడిశా అమలా సంఘం పేరుని, బేనర్, రిజిస్ట్రేషన్ నంబర్‌ను లెటర్ పేడ్ ను, బ్యానర్లను అక్రమంగా వినియోగించి సమావే శం నిర్వహించారని ఆరోపించారు. వారి చర్య చట్టవిరుద్ధమని నిందించారు. ఒడిశా అమలా సంఘ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆవిధమైన సమావేశం నిర్వహించమని ఏ జిల్లా అమలా సంఘాన్ని ఆదేశించాలని కోరలేదని శశిభూషణ దాస్ వెల్లడించారు. అయితే రెవెన్యూ మినీస్టీరియల్ ఆఫీ సర్స్ అసోసియేషన్ ఒడిశా అమలా సంఘ బేనరు, లెటర్ పేడ్, పేరును అక్రమంగా వాడుకొని ఒడిశా అమలా సంఘాన్ని తప్పుగా నిలబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఈ విషయం తాము కొరాపుట్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్టు చెప్పార. అక్రమ చర్యకు పాల్పడిన రెవెన్యూ అమలా సంఘ్ ఆఫీసు బేరర్సు మనోజ్ కుమార్ బారిక్, నిత్యానంద బ్రహ్మలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవా లని కోరామన్నారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి సంజయ కుమార్ పండ, సీనియర్ సభ్యులు వై.శ్రీనివాసరావు, కై లాష చంద్ర సామంతరాయ్, జగన్నాఽథ్దాస్ ఉన్నారు. -
నవీన్ నివాస్‌లో కలుద్దాం
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ స్వల్ప అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తు తం చికిత్స పొందుతున్నారు. ఆయనను చూడటానికి వస్తున్న సందర్శకులకు ఆత్మీయ సందేశాన్ని సోమవారం ఆస్పత్రి నుంచే జారీ చేశా రు. నన్ను కలవాలనుకుంటే, దయచేసి నవీన్ నివాస్‌కి రావాలన్నారు. తాను వైద్యుల సంరక్షణలో ఉన్నప్పుడు ప్రజలు ఆస్పత్రి సందర్శనకు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజల మమతానురాగాలకు నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. పర్లాకిమిడి: గజపతి మార్కెట్లో కాయగూరల వ్యాపారి బల్ల మహేష్‌పై కాంగ్రెస్ నాయకుడు బసంత పండా, చిల్లర వ్యాపారులు ఆదర్శ పోలీసు ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవా రం సంక్రాంతి నాడు మార్కెట్‌కు బంద్ సంద ర్భంగా కాయగూరల అమ్మకాలు మూసివేయించారన్నారు. చాలక రాజవీధి, మెడికల్ జంక్షన్, పాత కోర్టు జంక్షన్ వద్ద చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న మహిళా వ్యాపారులపై దౌర్జన్యం చేశాడని, సంక్రాంతి నాడు కూరగాయాలు అమ్మ కూ డదని రోడ్డుపై విసిరేశాడన్నారు. ఐఐసీ ప్రశాంత్ భూపతిని బసంత్ పండా, లోకనాథ మిశ్రా, సూర్యనారాయణ పాత్రో సనోజ్ పట్నాయక్ కలిసి ఫిర్యాదు చేశారు. గజపతి మార్కెట్లో కొంతమంది గూండాయిజం చెలాయిస్తున్నార ని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బసంత్ పండా కోరారు. రిమ్స్‌లో యువకుడి అనుమానాస్పద మృతి శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి లో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ముర పాక అక్కయ్య (30) పచ్చ కామెర్ల వ్యాధితో ఇటీవల చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రిలో చేరా డు. సోమవారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఉన్న బాత్రూమ్ వైపు అక్కయ్య వెళ్లాడు. తిరిగి వస్తుండగా జారిపడి స్పృహ కోల్పోయాడు. అక్కడికి కొద్ది సమయంలోనే వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించినా మృతికి గల కారణాలు తెలియరాలేదు. రోగి కుటుంబ సభ్యులు బాత్రూమ్కు వెళ్లక ముందు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియ దని వాపోతున్నారు. ఇదే విషయమై అవుట్ పోస్టు పోలీసుల వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా వైద్యులు సాధారణ మరణంగా ధ్రువీకరించి పంపించేశారన్నారు. బాత్రూమ్ లో పడిపోవడం వాస్తవమేనని పేర్కొన్నారు. రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలో జలుమూరు మండలంలోని గోటివాడ గ్రామానికి చెందిన ముక్త పవన్ కుమార్ (25) విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గత రెండు రోజులు సెలవులు కావడంతో ఇంటికి వచ్చి ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యాడు. జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10 గంటల సమయంలో లావేరు మండలంలోని తాళ్లవలస వచ్చేసరికి ముందు వెళ్తున్న ఆటో సడన్‌గా రోడ్డుపై నీరు ఉందని తిప్పాడు. దీంతో ఆటోను తప్పించి అధిగమించే క్రమంలో వెనువెంటనే వెనుక వచ్చిన వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి నరిసింగరావు, తల్లి ఉషారాణి, సోదరుడు సాయి ఉన్నారు. రోడ్డు ప్రమాదంపై లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఆదిత్యుని సన్నిధిలో న్యాయమూర్తి తుహిన్ కుమార్
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ సతీసమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవంగా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలను చేయించి, ఆలయ విశిష్టతను శంకరశర్మ వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. వారితో పాటు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి హరిబాబు, ఆర్డీవో సాయి ప్రత్యూష తదితరులు ఉన్నారు -
ఈసీ తీరు బాధాకరం
● కొవ్వొత్తులతో కాంగ్రెస్ నాయకుల ర్యాలీ శ్రీకాకుళం అర్బన్: దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎలక్షన్ కమిషన్, కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుండడం బాధాకరమని, ప్రజాస్వామ్యాన్ని పాతరేసేలా పనిచేస్తున్న ఎన్నికల కమిషన్ తీరును దేశ పౌరులంతా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదం వెంకట త్రినాథరావు, అంబటి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా విజ్ఞాన్ భవన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన ఓటుహక్కును కేంద్రంలో ఉన్న బీజేపీ దొంగలించి దొడ్డిదారిలో అధికారం చేపట్టడం శోచనీయమన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదుల్లాఖాన్, అంబటి లక్ష్మణరావు, తెంబూరు మధుసూదనరావు, అంబటి దాలినాయుడు, చాన్ భాష, మామిడి సత్యనారాయణ, ఆబోతుల వెంకట నాయుడు, బొచ్చ వెంకటరమణ, ఆదినారాయణ, బగ్గు రాము, సురియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
అత్యాధునిక సౌకర్యాలతో డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్
అరసవల్లి : జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటులో సింహద్వారం ప్రధాన రహదారిలో మహిళలు, చిన్నారుల వైద్యం కోసం డాక్టర్ శ్రీధర్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం స్థానిక మెడికవర్ ఆసుపత్రి పక్కన నూతనంగా నిర్మించిన డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు అత్యంత ప్రావీణ్యత ఉన్న వైద్యునిగా శ్రీధర్ గుర్తింపు పొందారని కొనియాడారు. శ్రీధర్ వంటి అనుభవజ్ఞులైన వైద్యులు ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్లో వైద్య సేవలను పరిచయం చేయడం జిల్లా ప్రజలకు శుభపరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దానేటి శ్రీధర్, ఆయన కుమారుడు డాక్టర్ దానేటి రూపాంక్, భార్య దానేటి రాధ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎచ్చెర్ల, నరసన్నపేట ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, అరకు మాజీ ఎంపీ జి.మాధవి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కిమ్స్ అధినేత డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, మెడికవర్ గ్రూప్ ఈడీ హరికృష్ణ, ప్రముఖ వైద్యులు పి.జె.నాయుడు, గూడేన సోమేశ్వరరావు, కె.అమ్మన్నాయుడు, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, టీడీపీ నేత మెండ దాసునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ లోడ్.. క్రమబద్ధీకరణకు చాన్స్
● కిలోవాట్‌పై 50 శాతం రాయితీ ● డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పెంపు ● సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు హిరమండలం: గృహవిద్యుత్ వినియోగదారులు అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణకు విద్యుత్ శాఖ మరో అవకాశం కల్పించింది. కిలో వాట్ విద్యుత్‌కు 50 శాతం రాయితీతో తగ్గించుకునేందుకు తొలుత మార్చి 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అయినా వినియోగదారుల నుంచి అంతంత మాత్రమే స్పందన వచ్చింది. దీంతో డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అఽధికారులు కోరుతున్నారు. వాస్తవానికి గృహ వినియోగదారుల్లో చాలామంది సర్వీస్ పొందే సమయంలో తక్కువ లోడు సామర్థ్యంతో కనెక్షన్ పొందుతారు. తర్వాత ఇంట్లో గృహోపకరణాలు పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం, లోడ్ రెండూ పెరుగుతాయి. ఆ మేరకు విద్యుత్ లోడ్ పెంచుకోకుంటే ఆ ప్రాంతంలో లోవోల్టేజీ సమస్య తలెత్తతుంది. క్షేత్రస్థాయిలో సర్వీసులు, లోడ్ ఆధారంగానే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తుంటారు. లో ఓల్టేజీ సమస్య తలెత్తినా అక్కడ లోడ్ ఎంత ఉందనే అధికారిక లెక్కల ప్రకారం కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో వినియోగదారులంతా తప్పనిసరిగా గృహోపకరణాల మేరకు లోడ్ పెంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు పెరుగుతున్న వినియోగం.. సాధారణంగా కనెక్షన్ ఇచ్చే సందర్భంలో కిలో వాట్ విద్యుత్ వినియోగానికి గృహాలకు రూ.2 వేలు, దుకాణాలకు రూ.2500 చొప్పున వసూలు చేస్తారు. చాలామంది గృహ వినియోగదారులు ఈ మొత్తానికి సంబంధించి తమ వినియోగం 1 నుంచి 2 కిలోవాట్ లోపలే చూపిస్తున్నారు. వినియోగంలో అంతకు రెట్టింపు కేటగిరీలో చేరిపోతున్నారు. వాణిజ్య కనెక్షన్లకు సంబంధించిన వినియోగమైతే చూపించిన దానికంటే ఏకంగా నాలుగింతలు ఉంటోంది. ఇటువంటి వారంతా అదనపు లోడు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. జరిమాన పడకుండా.. ● ఇప్పటివరకు అధిక లోడ్ నియంత్రణలో భాగంగా విద్యుత్ అధికారులు, సిబ్బంది తరుచూ ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేసేవారు. అధిక లోడ్ వినియోగిస్తున్న వారిని గుర్తించి రుసుంతో పాటు జరిమానా వసూలు చేసేవారు. ● జిల్లాలో సుమారు 6.71 లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని వినియోగదారుల్లో 50 శాతానికి మంచి కనెక్షన్ తీసుకున్న సమయంలో చూపించిన వినియోగం కంటే అధికంగానే విద్యుత్ వాడుతున్నారు. ● గత ఐదేళ్లుగా ప్రతి నెలా తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు రీడింగులు తనిఖీ చేసి అధిక లోడ్ వినియోగిస్తున్న వారికి అపరాధ రుసుం విధిస్తున్నారు. తీరనున్న లోఓల్టేజ్ సమస్య గృహాలు, దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లు తీసుకునే సమయంలో లైట్లు, ఇతర గృహోపకరణాల వినియోగాన్ని సగటున అంచనా వేసి లోడ్‌ను కిలోవాట్లలో లెక్కించి సెక్యూరిటీ డిపాజిట్ డెవలప్మెంట్ చార్జీలు వేస్తారు. అధిక శాతం గృహాలకై తే 1 నుంచి 2 కిలోవాట్లు, దుకాణాలకు 2 నుంచి 3 కిలోవాట్లకు మాత్రమే అనుమతి తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారమే ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. ● ఇంటిలో అవసరాలు పెరగడం, దుకాణాలకు సంబంధించి వ్యాపార లావాదేవీలు పెరగడం, వాతావరణ పరిస్థితుల వల్ల అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా విద్యుత్ వినియోగం ఉంటుంది. ● వినియోగం అంచనాకు మించడంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ ఎక్కువై తరచూ ట్రిప్ కావడంతో లోఓల్టేజ్ సమస్యలు పెరిగిపోతున్నాయి. విద్యుత్ వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదనంగా వినియోగిస్తున్న లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. వినియోగదారులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. ఇలా చేసుకుంటే అదనపు రుసుములు , జరిమానా బెడద ఉండదు. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు. – జి.వి.ఎస్.ప్రసాదరావు, ఏడీఈ విద్యుత్ శాఖ, టెక్కలి డివిజనల్ ప్రతి అదనపు కిలోవాట్‌కి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.200 నిర్ణయించారు. ఇదే సమయంలో డెవలప్మెంట్ చార్జీ రూ.1500 ఉంటుంది. కిలోవాట్లు పెరిగే కొద్దీ ఈ రుసుం మారుతుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ వరకు పొడిగించారు. కిలోవాట్ చొప్పున డెవలప్మెంట్ చార్జీలలో 50 శాతం రాయితీ లబిస్తుంది. -
చెరువు కాదు.. పాఠశాలే..
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా సమితిలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుండిమా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు సెలవు ప్రకటిస్తున్నారు. గుండిమా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నవి రెండే తరగతి గదులు. మధ్యాహ్న భోజన పథకం వంటశాల కూడా ఇప్పటి వరకూ లేదు. వర్షాల వల్ల మిడ్ డే మీల్ బడి పిల్లలకు అందించడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ఈ పాఠశాలలో ఆదనపు తరగతి గదులు, పైకప్పు మరమ్మతులు చేపట్టాలని ప్రధానోపాధ్యాయుడు అనేక సార్లు జిల్లా ముఖ్యవిద్యాధికారి మాయాధర్ సాహుకు లేఖలు రాసినా ఫలితం లేకపోయిందని తెలియజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ మధుమిత తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సీనియర్ సిటిజన్ల సమస్యలు పరిష్కరించాలి
పర్లాకిమిడి: స్థానిక పెద్దరాధాకాంత మఠంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సాధారణ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సభకు లక్ష్మీనారాయణ రోథో అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. వయోవృద్ధుల సమస్యలు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌కు ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహిని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రోథో అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ గౌరోహరి దాస్‌ను ఎమ్మెల్యే రూపేష దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి హరిమోహాన్ పట్నాయక్, విశ్రాంత ఉపాధ్యాయులు గౌరహరి పండా, ఇంజినీర్ రోథో, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకృష్ణుని జన్మాష్టమి పురస్కరించుకుని మూడవ రోజు బృందావనంలో యాదవులు ఉట్టె కోట్టి సంబరాలు నిర్వహిస్తారు. పర్లాకిమిడిలో సాయంత్రం శ్రీకరణం వీధి రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణుని తిరువీధిలో విహారంచినప్పుడు అనేక కూడళ్లలో ఉట్టెలు కోట్టి భక్తులు సందడి చేశారు. దీన
● మూన్నాళ్ల ముచ్చటే! ● నిర్మించిన మూడు నెలలకే శిథిలమైన రోడ్డుజయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో దసమంతపూర్ పంచాయతీ నుంచి పి.మాలిగుడ గ్రామ వరకు మూడు కిలోమీటర్ల రోడ్డును మూడు కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే రోడ్డు వేసిన కొంత కాలానికే తారు ఊడిపోయి గతుకల మయమైంది. రోడ్డు పరిస్థితి అధికారులకు తెలిపి మరమ్మతులు చేపట్టాలని ఎన్ని విజ్ఞప్తిలు చేసినా చెవిటి వాని మందు శంఖం ఊదిన చందమైందని ప్రజలు ఆరోపించారు. కొద్దిరోజులుగా పడుతున్న వర్షాలతో మూడు కిలో మీటర్ల రోడ్డు గుంతలుగా మారి బురద మయమైంది. దీంతో రోడ్డుపై ప్రయాణం ఇబ్బందిగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేక పోవటమేనని పి.మాలిగుడ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు
శ్రీకాకుళం కల్చరల్: భారత ప్రజాస్వామ్య వ్యవస్థను జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్‌గా నడిపిస్తోందని, అటువంటి జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు కావాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వపు వైస్ చాన్సలర్ డాక్టర్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీవో హోంలో ఆంధ్రప్రదేశ్ యునియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం సాక్షి బ్యూరో చీఫ్ కందుల శివశంకర్‌కు డీకే అవార్డు, జనదీపిక పత్రిక సంపాదకుడు సున్నపు చిన్నారావుకు శృంగారం ప్రసాద్ స్మారక అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీకే ట్రస్టు కార్యదర్శి దుప్పల రవీంద్రబాబు మాట్లాడుతూ ఎన్నో సేవలు అందించిన దుప్పల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఏటా ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లి ధర్మారావు, అవార్డు జ్యూరీ సభ్యులు సురేష్‌బాబు, న్యాయవాది బొడ్డేపల్లి మోహనరావు, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు గేదెల ఇందిరా ప్రసాద్, యూనియన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెండి నర్సింగరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొంచాడ రవిశంకర్, జి.శ్రీనివాసరావు, ఎంహెచ్ అవార్డు గ్రహీత గేదెల మాధవరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ జగదీష్, సనపల రమేష్, గరిమెళ్ల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎన్నేశ్వరరావు, సామ్నా నాయకులు చౌదరి సత్యనారాయణ, చైతన్య మల్లేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు మహారాణ, యోగి, నవీన్, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
22న ధర్మశాల మండల అధ్యక్షునిపై అవిశ్వాస తీర్మానం
భువనేశ్వర్: ధర్మశాల మండల అధ్యక్షుడు ప్రభాత్ బల్వంత్రాయ్పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదించారు. ఈ నెల 22న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ఈ నెల 11వ తేదీన, మండలంలో చెందిన 38 మంది సర్పంచ్‌లు, సమితి సభ్యులు మండల అధ్యక్షుని వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం దాఖలు చేశారు. విద్యుత్ షాక్‌తో ఇద్దరికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన ఓ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా అదే వీధికి చెందిన జోగి చందు, దేవాది లోహిత్‌లు కడుతుండగా విద్యుత్ వైర్లు తాకడంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఇద్దరూ గాయపడటంతో వెంటనే స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా టెక్కలి రూరల్: స్థానిక మెళియాపుట్టి రోడ్డు సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆదివారం వేకువజాము ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. కాకినాడ నుంచి పశ్చిమబెంగాళ్ వైపు వెళ్తున్న ట్యాంకర్ టెక్కలి సమీపంలో ముందు వెళ్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి అప్రోచ్ రోడ్డు మీదుగా సమీపంలో పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ జి.సూరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. నగర కళింగ కోమటి సంఘ అధ్యక్షుడిగా కోరాడ హరిగోపాల్ శ్రీకాకుళం : నగర కళింగ కోమటి సంఘ అధ్యక్షుడిగా కోరాడ హరిగోపాల్ ఎంపికయ్యారు. గత 15 రోజులుగా అధ్యక్ష ఎంపికపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పదవి కోసం పలువురు పోటీ పడగా చివరికి కోరాడ హరిగోపాల్, ఊణ్న సర్వేశ్వరరావు, కోరాడ రమేష్ మధ్య పోటీ ఏర్పడింది. ఆదివారం కళింగ వైశ్య సంఘం సమావేశం నిర్వహించగా రాష్ట్ర, జిల్లా సంఘ నాయకులు హాజరయ్యారు. ఆశావాహులంతా తమకే పదవి కావాలని పట్టుబట్టారు. కాగా, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వీరి ముగ్గురితో ప్రత్యేకంగా సమావేశమై రాజీకుదర్చడంతో హరిగోపాల్‌ను నగర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సర్వేశ్వరరావు, రమేష్‌లకు సముచిత స్థానం కల్పిస్తామని హామీఇచ్చారు. హరిగోపాల్ ప్రస్తుతం వర్తక సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘానికి ఇప్పటివరకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రాణాపాయం
జి.సిగడాం: మెట్టవలస గ్రామ సమీపంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. రాజాం నుంచి చిలకపాలెం మీదుగా విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, శ్రీకాకుళం నుంచి రాజాం వైపు వెళ్తున్న పేపర్ వ్యాన్‌ను మెట్టవలస కూడలి వద్ద ఢీకొట్టింది. వ్యాన్‌తో పాటు అటుగా వస్తున్న కారును కూడా ఢీకొట్టింది. వ్యాన్ రోడ్డుపక్కనే ఉన్న ఓ టిఫిన్ దుకాణంలోకి వెళ్లి బోల్తా పడింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దుకాణం మాత్రం ధ్వంసమైపోయింది. ఎస్ఐ వై.మధుసూదనరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మధుసూధనరావు తెలిపారు. -
కర్మయోగి పాఠాలపై ఒత్తిడి తగదు
పొందూరు: గత మే నుంచి ఐగాట్ కర్మయోగి పాఠాలు వీక్షించి తీరాలని ఉపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి తేవడం సమంజసం కాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న అన్నారు. పొందూరులోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీడియోలు వీక్షించి ఎసెస్‌మెంట్లను పూర్తి చేసి సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, తొలుత నాలుగు పాఠాలని చెప్పి ప్రస్తుతం సుమారు 20 పాఠాలు వినాలని కలెక్టర్ కార్యాలయం నుంచి సందేశాలు పంపుతున్నారని తెలిపారు. 6 పాఠాలకు మించని ఉపాధ్యాయుల పేర్లను వాట్సాప్‌లో పంపి భయభ్రాంతులకు గుర్తి చేస్తున్నారని చెప్పారు. ఇంత వరకు ఏ ఒక్క అధికారి ఐగాట్ కర్మయోగి అంటే ఏమిటి? ఎందుకు ఇందులో వీడియో పాఠాలు వినాలి? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఒక్క పాఠం పది నిమిషాలు వినేసరికే 2జీబీ ఇంటర్నెట్ అయిపోతుందని, రోజంతా యాప్‌ల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి తీసుకొస్తూ ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. యువకుడిపై కేసు నమోదు శ్రీకాకుళం రూరల్: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువకుడు మోసం చేశాడంటూ మోపసుబందరు గ్రామానికి చెందిన ఓ యువతి శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోపసుబందరు గ్రామానికి చెందిన యువతి సరసన్నపేట మండలం ఊటపేటలోని తాతయ్య ఇంటి వద్ద ఉంటూ ఇంటర్మీడియట్ చదివింది. ఆ సమయంలో పక్క గ్రామమైన ముసిడిగట్టుకు చెందిన సింహాద్రితో పరిచయం ఏర్పడింది. ఇంటర్ పూర్తయ్యాక కూడా ప్రేమ కొనసాగించారు. కొన్ని నెలల క్రితం సింహాద్రికి ఉద్యోగం రావడంతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ రాము ఆదివారం కేసు నమోదు చేశారు. వ్యక్తి ఆత్మహత్య పొందూరు: కనిమెట్ట పంచాయతీ రాందాసుపురం గ్రామానికి చెందిన పేడాడ అప్పలనాయుడు(60) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు భార్య అప్పలనరసమ్మతో కలిసి హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. తాగుడుకు బానిసయ్యాడు. వారం కిందట గ్రామానికి వచ్చి మద్యం తాగుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. హైదరాబాద్ వచ్చేయాలని భార్య చెప్పినా వినకుండా మద్యం తాగుతూ తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంటి ముందు తాడుతో ఉరేసుకుని మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. న్యాయం చేయాలని ఫిర్యాదు పలాస : పలాస సూదికొండ కాలనీకి చెందిన ఓ జీడి కార్మికురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. తాను పనిచేసే జీడిపిక్కల బడ్డీలో గుమస్తాగా పనిచేసిన పలాస అన్నపూర్ణాశ్రమ వీధికి చెందిన జామి నరేష్ పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా నమ్మించి మోసం చేస్తున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని కోరింది. -
చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి
● సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న ● రాయగడలో ఘనంగా నందోత్సవాలు రాయగడ: చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించేలా సామాజిక, సేవా సంస్థలు నడుం బిగించాలని రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న పిలుపునిచ్చారు. స్థానిక లయన్స్ క్లబ్లో క్లబ్ ద యంగ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీకృష్ణజన్మాష్టమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన నందోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హైందవ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇటువంటి తరహా కార్యక్రమాలను చేపట్టి చిన్నారుల్లో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తున్నందుకు అభినందనీయమన్నారు. చిన్నారులు వారి చదువుల్లో నిమగ్నమవుతూ మన హైందవ సంప్రదాయాలు, సంస్కృతులకు దూరంగా ఉంటున్నారన్నారు. దీంతో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగువుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్లబ్ ది యంగ్ ఇండియా అధ్యక్షులు సురేంద్ర ప్రసాద్ సాహు మాట్లాడుతూ.. ఏటా తమ క్లబ్ ద్వారా నందోత్సవాలను నిర్వహిస్తుండగా.. చిన్నారులు ఆసక్తితో పాల్గొంటున్నారని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో పాటు ప్రజల్లో సామాజిక చైతన్యం, సేవా కార్యక్రమాలను క్లబ్ నిర్వహిస్తుందని వివరించారు. రెండు దశాబ్దాలకుపైగా క్లబ్ తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుందని అన్నారు. క్లబ్ సాధారణ కార్యదర్శి దీపక్ కుమార్ పుష్టి క్లబ్ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. 36 మంది చిన్నారులు నందోత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణ వేషధారాణ పోటీల్లొ పాల్గొన్నారన్నారు. విజేతలు వీరే.. నంోత్సవాల్లొ భాగంగా నిర్వహించిన శ్రీకృష్ట వేషధారణ పోటీల్లో స్వీకృతి ఆచార్య ప్రథమ బహుమతిని గెలుపొందగా దేవాన్షి బక్షీపాత్రో ద్వితీయ, మోక్షిత బెహర తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. పది మందికి ప్రొత్సాహక బహుమతులను నిర్వాహకులు అందజేశారు. -
నవీన్ పట్నాయక్‌కు అస్వస్థత
భువనేశ్వర్: రాష్ట్ర ప్రతిపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. నవీన్ పట్నాయక్‌కు మంత్రి పరామర్శ భువనేశ్వర్: ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో సంప్రదించి చికిత్స, వైద్యం, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైతే విపక్ష నేత చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని మంత్రి ప్రకటించారు. చికిత్సకు స్పందిస్తున్నారు.. నవీన్ పట్నాయక్ ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు డీహైడ్రేషన్ కారణంగా స్థానిక సమ్ అల్టిమేట్ మెడికేర్‌లో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్సకు బాగా స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు సమాచారం జారీ చేశాయి. హోంగార్డు అభ్యర్థుల ఆందోళన పర్లాకిమిడి: గజపతి జిల్లాలో హోంగార్డు పోస్టులకు ఇటీవల శారీరిక, రాత పరీక్షలు జరిగి ఫలితాలను జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా శనివారం ప్రకటించారు. మొత్తం 144 పోస్టులకు 128 మంది జాబితా విడుదల చేశారు. కొంతమంది పరుగుపందెం పోటీలో అర్హత సాధించలేని అభ్యర్థులు కూడా జాబితాలో ఉన్నాయని, ఈ హోంగార్డు నియామకాల్లో అవకతవకలు జరిగాయన్నారు. బెత్తగుడ వద్ద జిల్లా పోలీసు బారక్ వద్ద ఆదివారం కొందరు నిరసన తెలిపారు. ఫలితాలు ప్రకటించిన తరువాత అభ్యర్థులు అభ్యంతరం లేవనెత్తడం ఏమిటని పోలీసు అధికారులు చెబుతున్నారు. బైకు దొంగలు అరెస్టు రాయగడ: జిల్లాలోని శశిఖాల్ పోలీసులు బైకుల దొంగతనం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండగా మరో ఇద్దరు యువకులు స్థానిక రెల్లివీధికి చెందిన అడప నిఖిల్, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా పార్వతీపురం మండలం గుమడ గ్రామానికి చెందిన కుప్పిలి శేఖర్లు ఉన్నారు. వారి నుంచి రెండు బైకులు, ఒక స్కూటీ, రెండు మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు తరలించారు. -
5 జిల్లాల్లో త్వరలో 500 మంది ట్రాఫిక్ వార్డెన్ల నియామకం
భువనేశ్వర్: జిల్లా స్థాయి రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా అధ్యక్షతన రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర రవాణా అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనల అమలు కట్టుదిట్టం, నిరవధిక జాతీయ రహదారి పహరా, సీసీటీవీ తనిఖీ, అవగాహన కార్యక్రమాలు, పాఠశాల, కళాశాల స్థాయిలో రోడ్డు భద్రతా విద్య వంటి అంశాలపై వివరంగా చర్చించారు. రాష్ట్రంలోని కెంజొహర్, మయూర్భంజ్, సుందర్‌గఢ్, గంజాం, ఖుర్ధా జిల్లాల్లో ప్రమాదాల రేటు పెరుగుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల్లో త్వరలో 500 మంది ట్రాఫిక్ వార్డెన్లను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు వారికి ట్రాఫిక్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారని డీజీపీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని డీజీపీ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల సామాన్యులు ప్రమాదాల బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ప్రమాదాలలో సామాన్యుల ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని జిల్లాలోని ఆర్టీఓ, పోలీసులు మరియు ఇతర శాఖ ఉద్యోగులకు డీజీపీ సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం, జాతీయ రహదారులపై నిరవధిక పహరా, కాలి నడక వంతెనలు మరియు భూగర్భ మార్గాల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, మద్యం తాగిన డ్రైవర్లపై చర్యలు, సీటు బెల్టులు మరియు హెల్మెట్లు ధరించడం, జాతీయ రహదారుల పక్కన నిలిపి ఉంచిన భారీ వాహనాలపై కఠిన చర్యలు, జాతీయ రహదారులపై ప్రమాద మరణాలను తగ్గించడానికి అంబులెన్స్‌ల మోహరింపు వంటి అంశాలపై వివరంగా చర్చించారు. సమావేశంలో అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ అరుణ్ బోత్రా, రాష్ట్ర రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్, అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్, రాష్ట్ర రవాణా అథారిటీ అధికారులు పాల్గొన్నారు. ఇన్ స్పెక్టర్ జనరల్ (సెంట్రల్) ఎస్. ప్రవీణ్ కుమార్, ఇన్స్పెక్టర్ జనరల్ (దక్షిణ) నితీష్ శేఖర్, డీఐజీ (తూర్పు) డాక్టర్ సత్యజిత్ నాయక్, డీఐజీ (పశ్చిమ) బ్రిజేష్ కుమార్ రాయ్, అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు వర్చువల్ మాధ్య మం ద్వారా సమావేశంలో పాలుపంచుకున్నారు. -
పూర్వ విద్యార్థుల రక్తదానం
పర్లాకిమిడి: రక్తదానం వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడిన వారమౌతామని వక్తలు అన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని నవోదయ విద్యాలయం పూర్వపు విద్యార్థుల (జాగో) సంఘం అధ్యక్షులు నూకల వెంకటేష్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు వద్ద ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 60 మంది రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ సంతును పాఢి హాజరయ్యారు. మొత్తం 17 యూనిట్ల రక్తం సేకరించి బ్లడ్ బ్యాంకు అందజేశారు. సీనియర్ ఫార్మసిస్టు జుధిస్టర బెహారా, ఇతర సిబ్బంది సహకారం అందించగా.. జాగో ఉపాధ్యక్షులు మనోజ్ పట్నాయక్, అభిరాం మండళ్, సాయిరాం పట్నాయక్ పాల్గొన్నారు. -
● ప్రగతికి రెక్కలు
● భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభంభువనేశ్వర్: ప్రాంతీయ అనుసంధానం, సమ్మిళిత వృద్ధిని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య ప్రత్యక్ష విమాన సేవలను లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్ర మార్గదర్శక ఏవియేషన్ ఆస్తులు, నెట్వర్క్ నిర్మాణం, నిర్వహణ (బి–మాన్) పథకం కింద ఈ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించారు. ఈ నెల 24 నుంచి పూర్తి స్థాయిలో ఈ సేవలు లభ్యమవుతాయి. వారానికి 4 రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య 76 సీట్ల ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి జెండా ఊపి ఈ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సేవలకు కొత్త గమ్యస్థాన విధానం కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ద్వారా మద్దతు లభిస్తుందన్నారు. భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య ప్రత్యక్ష విమాన సేవలు పశ్చిమ ఒడిశాను రాష్ట్ర రాజధానికి దగ్గరగా తీసుకురావడంతో పారిశ్రామిక వృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి, సామాజిక, ఆర్థిక పురోగతికి గణనీయంగా ప్రోత్సహిస్తుందన్నారు. అందరి విమానయానం కలను సాకారం చేసేదుకు రాష్ట్ర వాణిజ్య, రవాణా శాఖ ప్రాంతీయ వాయు నెట్‌వర్క్‌లను విస్తరణతో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో నిబద్ధతను పునరుద్ఘాటించిందన్నారు. -
వీడియో దుమారం
బాధితురాలి వాంగ్మూలం..● భగ్గుమన్న విపక్షం ● ప్రామాణికత ధ్రువీకరణకు పోలీసుల కసరత్తు భువనేశ్వర్: పూరీ జిల్లా నిమాపడా నియోజక వర్గం బొలొంగా ప్రాంతంలో అగ్నికి ఆహుతైన బాధితురాలి వాంగ్మూలం వీడియో ప్రసారం దుమారం రేపింది. బాలిక మరణంపై సందిగ్ధత తొలగని పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న దశలో రికార్డు చేసిన వీడియో ప్రసారం కావడం కలకలం రేపింది. ఈ ప్రసారంపై విపక్ష బిజూ జనతా దళ్ భగ్గుమంది. న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఒక మహిళా అధికారి బాధిత బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నట్లు చూపించే వీడియో ప్రసారం జరిగింది. ఈ ప్రసారంతో తెర వెనక బాగోతం బట్టబయలైందని ఉభయ విపక్షాలు బీజేడీ, కాంగ్రెస్ సహా రాష్ట్రంలోని పలు రాజకీయ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండు ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేడీ డిమాండ్ చేసింది. అగ్నికి ఆహుతి అయిన బాధితురాలు బలహీన వర్గానికి చెందిన బాలిక. ఆమెను సజీవ దహనం చేశారని లెనిన్ మహంతి ఆరోపించారు. విపక్షం ఒత్తిడితో బాధిత బాలికను చికిత్స కోసం భువనేశ్వర్ నుండి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వరుసగా 3 సార్లు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇలా జరిగిందని నిలదీశారు. న్యాయమూర్తి సమక్షంలో ఎన్నిసార్లు వాంగ్మూలం నమోదు చేశారన్నారు. బాలిక మరణించిన 10 నిముషాల తర్వాత పోలీసులు మరణ సమాచారం ట్వీట్ చేశారు. మరో వైపు పోలీసులు అత్యంత నిజాయితీతో దర్యాప్తు నిర్వహించారని, వేరెవరి ప్రమేయం లేదని ట్విట్టర్లో ప్రసారం చేశారు. ఈ చోద్యం గతంలో ఎన్నడు చవి చూడలేదని వ్యాఖ్యానించారు. బాధితురాలు మరణించిన 15 రోజుల తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వీడియోలో న్యాయమూర్తి అక్కడ ఉన్నారో లేదో అనే అస్పష్టత సందిగ్ధత ఉందని లెనిన్ మహంతి పేర్కొన్నారు. దీనిపై ఆరా తీసి వీడియో దుమారంపై పోలీసులకు కచ్చితత్వం చాటుకోవాలన్నారు. దీనిపై రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వివరణ వెల్లడించాలని కోరుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ప్రసారం చేసిన వారిని గుర్తించిన మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. వీడియో ప్రామాణికత ఽధ్రువీకరిస్తాం: ఎస్పీ ఆస్పత్రిలో బొలొంగా బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్న వైరల్ వీడియో యొక్క ప్రామాణికతను ధ్రువీకరించన్నట్లు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పినాక్ మిశ్రా ఆదివారం తెలిపారు. వీడియోను వైరల్ చేసిన వ్యక్తులపై దర్యాప్తు కోసం సైబర్ బృందం సహకారం తీసుకుని వీడియో క్లిప్ ప్రామాణికతను ధ్రువీకరిస్తామని మీడియాకు వివరించారు. ఈ ప్రసారం జువైనెల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 74 ఉల్లంఘనగా ఎస్పీ పేర్కొన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. చట్టం ప్రకారం బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఈ విషయంలో బాధితురాలి కుటుంబం, బంధువులకు కూడా సమాచారం అందజేయడం జరిగిందన్నారు. మరికొన్ని ఫోరెన్సిక్ వైద్య నివేదికలు అందాల్సి ఉంది. దర్యాప్తు పూర్తి కావడంతో సమగ్ర సమాచారాన్ని కోర్టుకు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. -
గోపాల సమాజ్ సేవలు చిరస్మరణీయం
జయపురం: గోపాల సమాజ్ సమాజానికి అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. ఆదివారం స్థానిక టౌన్ హాలు ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా క్షొహల్ఖండ్ గోపాల్ సమాజ్ నిర్వహించిన నందోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్యవక్తగా పాల్గొన్న సాహితీవేత్త డాక్టర్ సురేష్ దాస్ మాట్లాడుతూ గోపాల జాతిలో అనేక మంది మహానుభావులు ఉన్నారని తెలిపారు. కవిరాజ్ పరమేశ్వర పాత్రో అధ్యక్షతన జరిగిన నందోత్సవ కార్యక్రమంలో జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, జిల్లా యాదవ మహాసభ అధ్యక్షులు మదన మోహన నాయిక్, మాజీ కౌన్సిలర్ బినోద్ మహాపాత్రో, బీజేడీ నేత బాలారాయ్, జయపురం సాహితీ పరిషత్ అధ్యక్షులు హరహర కరసుధా పట్నాయిక్ తదితరులు ప్రసంగించారు. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు శుక్రవారం రాత్రి కోరుకొండ సమితి నీలాద్రినగర్ పంచాయతీ సోరలకొండ బ్యారేజీ వద్ద పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒక బైక్‌పై ఇద్దరు వ్యక్తులు అతివేగంగా రావడం గమనించి వారితో ఉన్నటువంటి బ్యాగును తనిఖీ చేశారు. తనిఖీల్లో గంజాయి బయటపడడంతో వారిని అరెస్టు చేసి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల్కన్‌గిరి సమితి ఎంవీ 25 గ్రామానికి చెందిన రాఖల్ వాలా, జ్యూటిపల్లి గ్రామానికి చెందిన భీమా పోడియామిలుగా తెలిపారు. వీరు ఈ గంజాయిని ఎంవీ 120 గ్రామంలో కొని మల్కన్‌గిరికి తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని తూకం వేయగా 7 కిలోలు ఉందని, దీని విలువ రూ.50 వేలు వరకు ఉంటుందని బలిమెల ఐఐసీ ధీరాజ్ పట్నాయిక్ వెల్లడించారు. నిందితులను సోమవారం కోర్టుకు తరలిస్తామన్నారు. -
వృత్తి వదల్లేరు.. బతుకు చక్రం కదలట్లేదు..!
● వినాయక విగ్రహాలకు డిమాండ్ తగ్గడంతో కుమ్మరుల్లో ఆందోళన ● బతుకు భారమైందంటూ ఆవేదన ● ఆదుకోని కూటమి ప్రభుత్వంసాలూరు: మరో పది రోజుల్లో వినాయకచవితి పండగ రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కుమ్మరి వీధులన్నీ సాధారణంగా వినాయక విగ్రహాల తయారీతో హడావిడిగా ఉండాలి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కుమ్మరి వీధుల్లో కనిపించడం లేదు. రథయాత్ర తరువాత ప్రారంభించే ఈ విగ్రహాల తయారీకి రెండు నెలల ముందు నుంచే సాలూరు, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి వినాయక కమిటీ నిర్వాహకులు వచ్చి భారీ పరిమాణంలో, వివిధ ఆకృతుల్లో వినాయక ప్రతిమల తయారీకి ఆర్డర్లు ఇచ్చేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని కుమ్మరులు వాపోతున్నారు. పెద్దబొమ్మలు ఆర్డర్లు చాలా వరకు తగ్గాయని, ఆ భయంతో గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే బొమ్మలను తయారు చేస్తున్నట్టు తయారీదారులు తెలిపారు. సాలూరు, పాచిపెంట పండగల ఎఫెక్ట్ ప్రతి ఏడాది వినాయక ఉత్సవాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఐక్యంగా స్థాయి కొద్దీ మండపాలు ఏర్పాటు చేసుకుని ఘనంగా పూజలు, అన్న సమారాధనలు, అనుపోత్సవం చేస్తుంటారు. ఈ ఏడాది సాలూరు, పాచిపెంట గ్రామదేవతల పండగలు జరగడంతో ప్రజల వద్ద చాలా వరకు డబ్బుల్లేవని దీనితో ఈ ఏడాది వినాయక ప్రతిమల ఆర్డర్లు తగ్గాయని కుమ్మరులు చెబుతున్నారు. వినాయకుడిని పెట్టిన తరువాత అన్న సమారాధన, అనుపోత్సవాలకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో నిర్వాహకులు కొంత వెనుకంజ వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. పెరిగిన తయారీ ఖర్చు బొబ్బిలి నుంచి తీసుకువచ్చే ట్రాక్టర్ మట్టికి కుమ్మరులు సుమారు 3500 రుపాయిలు చెల్లిస్తున్నారు. తయారీలో భాగంగా ముడి సరుకులు, రంగులకు అధిక డబ్బులు ఖర్చవుతున్నాయి. ఇంత డబ్బులతో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు కొనుగోలు జరగకపోతే ఇబ్బందులు పడతామని కావున గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే ఈ ఏడాది వినాయక విగ్రహాలు తయారీచేస్తున్నామని కుమ్మరులు చెబుతున్నారు. రూ.లక్షలు పెట్టి తీసుకువచ్చిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన పెద్ద విగ్రహాలకు ఇంకా ఆర్డర్లు రాకపోవడంతో ఆందోళన నెలకొందని తయారీదారులు వాపోతున్నారు. కుమ్మరి చక్రం కదలనంటున్నా.... కుమ్మరి వృత్తి తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయమని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తి తమ కడుపు నింపేదని, నేడు ఆ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పాత్రల వినియోగం తగ్గిపోవడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తే జీవనాధారంగా ఉండేదని, ప్రస్తుతం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఈ వృత్తి కడుపు నింపుతోందని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కుమ్మరి చక్రం కదలనంటున్నా.. తమ కుల వృత్తిని వదులుకోలేకపోతున్నామని, ప్రభుత్వం తమకు చేదోడువాదోడుగా నిలవాలని వారు కోరుతున్నారు.పంటల్లేవు.. పథకాల్లేవు..ప్రజలకు గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం కింద డబ్బులు వారి ఖాతాల్లో జమవ్వడంతో ఆ డబ్బులు వారికి ఇటువంటి పండగలు, ప్రత్యేక కార్యక్రమాలకు ఉపయోగపడేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజల వద్ద డబ్బులు కొరత నెలకొందని చర్చించుకుంటున్నారు. మరోవైపు పంటల పరిస్థితులు కూడా అనుకున్నంత సానుకూలంగా ఏమీ లేకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో పండగ వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. -
కన్యాశుల్కం ప్రదర్శన పూర్వజన్మ సుకృతం
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన కన్యాశుల్కం నాటకాన్ని 60 ఏళ్లకు పైబడిన మహిళలతో రవీంద్రభారతిలో ప్రదర్శించడం పూర్వజన్మ సుకృతమని దర్శకులు ఈపు విజయకుమార్ పేర్కొన్నారు. మహాకవి స్వగృహంలో శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసూర్య ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్యాశుల్కంలోని బొంకులదిబ్బ సీన్, మధురవాణి ఇల్లు–మంచం సీన్, అగ్నిహోత్రవధాన్లు ఇళ్లు – తాంబూలాల సీన్, సౌజన్యరావు పంతుల ఇళ్లు (డామిట్ కథ అడ్డం తిరిగింది సీన్)ను కేవలం వయోవృద్ధులైన మహిళలతో విజయవంతంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ నెల 12న రవీంద్రభారతిలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్–2025లో కన్యాశుల్కం ప్రదర్శించి ఆహుతుల మన్ననలు పొందామన్నారు. గాంధీ జ్ఞానప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేంద్రరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ బి.సత్యానందం, సినీన టి, సంఘసేవకురాల కరాటే కల్యాణి, అభినయ శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నామన్నారు. భోగరాజు సూర్యలక్ష్మి నిర్వహణ బాధ్యతలతో పాటూ గిరీశం పాత్రధారిలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఆహుతుల మన్ననలు పొందారన్నారు. వీరితో పాటూ మధురవాణిగా ఎ.సీతామహాలక్ష్మి, కరటకశాస్త్రిగా ముళ్లపూడి సుభద్రాదేవీ, అగ్నిహోత్రవధానులుగా కుమారి సామవేదుల గీతారాణి, వెంకటమ్మగా ఉదయగిరి నీలిమ, రామప్పపంతులుగా సిహెచ్.రాజకుమారి, బుచ్చమ్మగా పూటకూళ్లమ్మ, పోటోగ్రఫీ పంతులు నౌకరుగా సామవేదుల సత్యలత, సౌజన్యరావు పంతులుగా చీకటి చంద్రికారాణిలు పాత్రోచితమైన ప్రదర్శన చేసి ఆహుతుల కరతాళ ధ్వనులందుకున్నారని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎస్.రమణ రంగాలంకరణ, రూపాలంకరణ చేశారన్నారు. ఈ సందర్భంగా కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భోగరాజు సూర్యలక్ష్మి, సుభద్రాదేవీ, కన్యాశుల్కం టీమ్ సభ్యులు పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జి ఇంట సందడి
వీరఘట్టం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గేదెల తుహిన్‌కుమార్ ఇంట వద్ద శనివారం సందడి నెలకొంది. ఆయన హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామమైన వీరఘట్టం మండల కత్తులకవిటి గ్రామానికి వచ్చారు. దీంతో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక నేతలు, అధికారులు క్యూ కట్టారు. హైకోర్టు జడ్జిగా ఈ ప్రాంతానికి చెందిన మీరు ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. జడ్జి తుహిన్‌కుమార్‌ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే వీరఘట్టం, పాలకొండ, రేగిడి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కె.సూర్యప్రకాశరావు, డి.వెంకటరమణనాయుడు, కర్రి గోవిందరావు, పొట్నూరు లక్ష్మణరావు తదితరులు కలిశారు. వీరఘట్టం తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు తదితరులు జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల అదుపులో పొట్టేళ్ల పందెంరాయుళ్లు గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ పి.రమేష్‌నాయుడు శనివారం తెలిపారు. ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న ప్రదేశంలో దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. రెండు పొట్టేళ్లను, రూ.1680 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. నూతన బార్ పాలసీ విడుదల విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్లు 275, 276 ప్రకారం 2025–2028 సంవత్సరాలకు సంబంధించి నూతన బార్ పాలసీలను విడుదల చేసినట్టు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ ము న్సిపాలిటీ, నగర పంచాయతీలలో గల 282బి బార్స్ నోటిఫై చేశామన్నారు. వీటిలో మూడు టూబీ బార్స్ కళ్లు గీత కులాలకు కేటాయించామన్నారు. ఈ వేలం ద్వారా ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపాలిటీ, నగర పంచాయతీలో ఎనిమిది 2బి బార్స్‌ను నోటిఫై చేశామన్నారు. వాటిలో రెండు 2బి బార్స్ కళ్లుగీత కులాలకు కేటాయించామన్నారు. ఆసక్తి గలవారు వారి పరిధిలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 9440902360, 9440902362 (విజయనగరం), 8348523855, 9398630486 (పార్వతీపురం మన్యం) నంబర్లను సంప్రదించాలని సూచించారు. నేత్ర శస్త్ర చికిత్సకు 20 మంది ఎంపిక పూసపాటిరేగ: మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన నేత్ర వైద్య శిబిరానికి హాజరైన 180 మందిలో వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న 20 మందిని నేత్ర శస్త్రచికిత్సకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కరి కళ్లను వైద్య సిబ్బంది క్షుణ్నంగా తనిఖీలు చేసి, ఏవైనా సమస్యలుంటే చెప్పి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ టొంపల సీతారాం, స్వామి కంటి ఆస్పత్రి వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ స ర్కిల్ పరిధిలోని విజయనగరం రూరల్, గంట్యాడ పోలీస్టేషన్ల సిబ్బందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు శనివారం చేసినట్లు విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. విజయనగరానికి చెందిన మ్యాక్సి విజన్ మల్టీ స్పె షాలిటీ ఆస్పత్రి వారు వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి, అవసర మైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. శృంగవరపుకోట: ఓటర్లను చైతన్యపరచి వారికి తమ హక్కులు, విధులు, బాధ్యతలను తెలియచెప్పడమే లక్ష్యంగా ఓటరు అక్షరాస్యత వేదిక పని చేస్తోందని వేదిక అధ్యక్షుడు సూర్యారావు తెలిపా రు. ఓటరు అక్షరాస్యత వేదిక ద్వితీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం రాత్రి స్థానిక లైబ్రరీలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వైద్యులు ఆర్.త్రినాధరావు, పి. వరలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఓవరాల్ విజేతలైన జి.భవిష్య, బి.తేజస్విని, బి.ఊహలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ డి.శ్రీధర్, మోహన్‌రావు, చిన్నికృష్ణ, ఎల్.సాంబమూర్తి, తాతారావు, బి.అప్పారావు, పి.శ్రీనివాసరావు, మేఘన, తదితరులు పాల్గొన్నారు. -
భవనం పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
మెంటాడ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం పిట్టగోడ నిర్మాణంలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ కె.సీతారాం శనివారం అందించిన వివరాలు.. మెంటాడ మండల కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి పిట్టగోడ నిర్మాణం జరిగే సమయంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకకు చెందిన గురజాపు అప్పారావు(32) ప్రమాదవశాత్తూ జారి పడి గాయపడినట్టు ఎస్ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలోని సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సీతానగరం: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన ఆయకట్టు సంఘం చైర్మన్ ఈదిబిల్లి బలరాంనాయుడు వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై మూడు రోజుల కింద పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బలరాంనాయుడు(62) మృతి చెందినట్టు పోలీసులు శనివారం తెలిపారు. మృతుడి భార్య ఈదుబిల్లి అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భోగాపురం: వీరాస్వామి అనే లారీ డ్రైవర్ విజయవాడ నుంచి వస్తూ సుందరపేట హైవే జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుని భోగాపురం అన్నపూర్ణ హోటల్ సమీపంలో శనివారం లారీని కాసేపు ఆపాడు. తరువాత లారీ కింద మృతి చెంది కనిపించాడు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కుంభ జోవేష్ అనే వేరే లారీ డ్రైవర్ వీరాస్వామి మృతి చెందినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి డ్రైవర్ వీరాస్వామి గుండెపోటుతో మరణించాడా? వేరే ఏవిధంగానైన మరణించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం క్రైమ్ : అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం జీఆర్పీ పోలీసులు శనివారం గుర్తించారు. 50 సంవత్సరాల వయసు ఉండే ఈ వ్యక్తి తెలుపు రంగు కట్ బనియన్, ఖాకీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, రైలు నుంచి జారి పడి ఉండొచ్చని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో జారి పడడంతో తలకు తీవ్ర గాయాలై ఉండొచ్చని జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 9490617089, 830990038, 9491813163 నంబర్లను సంప్రదించాలని సూచించారు. వ్యక్తి ఆత్మహత్య దత్తిరాజేరు: మండలంలోని దాసరిపేట గోపినాధ పట్నాయక్ చెరువు గట్టుపై మెంటాడ మండలం మీసాలపేట గ్రామానికి చెందిన మహంతి రామునాయడు(55) ఉరి వేసుకొని మృతి చెందినట్టు పెదమానాపురం ఎస్ఐ జయంతి శనివారం తెలిపారు. పొలం పనులకు వెళ్తానని ఇంటి వద్ద చెప్పి దాసరిపేట చెరువు గట్టుపై మృతి చెందడంతో బంధువుల ద్వారా సమాచారం తెలియడంతో కుటుంబంలో ఒక్కసారి విషాదం నెలకొంది. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. మృతుడికి వివాహం అయిన కుమార్తెతో పాటు కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు. -
కనకాంబరాలతో కనక వర్షం
భామిని: పూల సాగులో కనకాంబరాలది ఓ ప్రత్యేకత. గ్రామీణ ప్రాంతాల్లో వాడంబారాలుగా పిలవబడే వీటిని కనకాంబరాలగానే పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూస్తూ సాగుదారులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. వీటిని ఒకసారి నాటితే మూడేళ్ల వరకు దిగుబడినిచ్చి సాగుదారులకు పుష్కలంగా ఆదాయాన్ని అందిస్తాయి. ఈ పూలు వాసన లేకున్నా వివిధ రంగుల్లో మహిళలను ఆకర్షిస్తాయి. అదే సమయంలో వివిధ శుభకార్యాల్లో వీటికున్న ప్రత్యేకత వేరు. వీటిని సీ్త్రల శిరోజాల అలంకరణతో పాటు శుభ కార్యాల్లో వేర్వేరు రూపాల్లో అలంకరించి ఆదాయాన్ని పొందుతారు. ఇవి ఎక్కువగా ఆరంజ్, ఎల్లో, ఎరుపు రంగుల్లో పూస్తాయి. మార్కెట్లో ఈ రకాలకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కొబ్బరి, మామిడి తోటల్లో అంతర పంటలుగా కూడా వీటిని సాగు చేయవచ్చని చెబుతున్నారు. పాలకొండ నియోజకవర్గంలో భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంది. స్థానికంగా వీటిని విక్రయించడంతో పాటు దూర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. పాతపట్నం, టెక్కలి, ఒడిశాలోని పర్లాకిమిడి, గుణుపూర్ ప్రాంతాలకు రోజూ రవాణా చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ సీజన్లోనే... ప్రస్తుతం కనకాంబరాలు నాటుకొనే సమయంగా రైతులు చెబుతున్నారు. ఏటా జూలై – ఆగస్టు నెలల్లో కొత్తగా తోటలు నాటుకుంటారు. రెండు నెలలుగా నారు పోసి సంరక్షించుకుని ఆ నారును మెట్టు భూముల్లో వేస్తారు. నాణ్యమైన నారు కోసం రామభద్రపురం, సాలూరు, రాజమండ్రి నర్సరీల నుంచి దీన్ని తెస్తున్నారు. అధిక తేమ, వేడి కలిగిన నేలల్లో సాగుకు ఇది అనుకూలం. చల్లని వాతావరణ పరిస్థితుల్లో అధిక దిగుబడినిస్తాయి. నీరు నిలువ లేని అన్ని రకాల నేలలు వీటి సాగుకు అనుకూలం. విత్తన తయారీ.. విత్తనం, కాండపు మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే రకాలను విత్తనాల ద్వారా తయారు చేస్తారు. ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. నిల్వ చేసిన విత్తనం మొలకెత్తే శాతం తక్కువ. అప్పుడే పూల గుత్తిల నుంచి వేరు చేసిన విత్తనాలను సిద్ధం చేసుకోవచ్చు. ఒక మీటరు పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడులు సిద్ధం చేసి నారు వేసుకోవాలి. మొక్కలు 4 నుంచి 6 ఆకులు వేసిన 50 నుంచి 60 రోజుల్లో నారును తీసి నాటుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. అయినా అవసరాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారానికి ఒకసారి అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే 4 లేదా 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. సాగుపై పెరుగుతున్న ఆసక్తి -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
మొక్కలు పెరిగే దశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలు పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోసిన తరువాత పూల గుత్తిలను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పూల దిగుబడి పెరుగుతుంది. మొక్కలు నాటిని రెండు లేక మూడు నెలలకు పూత వస్తుంది. జూన్ నుంచి జనవరి వరకు పూత బాగా ఉంటుంది. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది. రెండు రోజులకు పూలు విచ్చుకొంటాయి. ఉదయం లేదా సాయంకాలం మాత్రమే పూలు కోయాలి. – కొల్లి తిలక్, వ్యవసాయాధికారి, భామిని -
గురజాడ సాహిత్య సంపద, స్మారక భవనాన్ని కాపాడాలి
విజయనగరం గంటస్తంభం: మహాకవి గురజాడ అప్పారావు స్మారక భవనం గురించి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ పట్టకపోవడం శోచనీయమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గురజాడ రచనలను భద్రపరచాల్సిన ఆర్కియాలజీ విభాగం, రాష్ట్ర టూరిజం శాఖ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ గృహాన్ని, గురజాడ సాహిత్యాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమవుతున్నాన్నారు. గురజాడ గృహాంలో గురజాడకి శనివారం ఘన నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురజాడ అప్పారావు ఇంటిలో తాగుబోతు హాల్ చల్ చేసి, సాహిత్య సంపాదని, వస్తువులను చిందరవందర చేసినా అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరూ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత, విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలుగాని గురజాడ ఇంటిని సందర్మించడానికి కూడా తీరిక కల్పించుకోలేని పరిస్థితిలో ఉండడం పట్ల ఆయన మండిపడ్డారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచం నలుమూలలకి పంపి సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తికి మన నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గురజాడ అప్పారావు సాహిత్య సంపదకు, గురజాడ స్మారక భవనానికి తగిన రక్షణ కల్పించాలని భీశెట్టి కోరారు. పౌర వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పిడకల ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్మి జలంత్రి రామచంద్ర రాజు, సహాయ కార్యదర్మి తుమ్మగంటి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
18 నుంచి ఆలా హజరత్ ఉత్సవాలు
విజయనగరం టౌన్: దేశ వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ఆలా హజరత్ ఉత్సవాలను సున్నీ మసీదుల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు పట్టణ శాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.కోట, కురుపాం, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న మసీదుల్లో ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఆబాద్ వీధిలో ఉన్న మదరసా ఆల్ జామియాతుల్ హబీబియా అహ్మదీయా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం భారీ అన్న సమారాధన ఉంటుందని తెలిపారు. స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు విజయనగరం క్రైమ్: నగరంలోని ఏడు స్పా(మసాజ్) సెంటర్లలో వన్‌టౌన్ పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసా జ్ సర్వీసుకు వచ్చే సీ్త్ర, పురుషులను వేర్వేరుగా ఉంచాలని సీఐ ఆర్వీకే చౌదరి నిర్వాహకులకు సూచించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేర కు సీఐ చౌదరి, ఎస్ఐలు రామ్‌గణేష్, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్రనాయుడులు మసాజ్ కేంద్రాలకు వెళ్లి, పరిశీలించారు. తప్పనిసరిగా కేంద్రంలో అర్హులైన ఫిజియోథెరపిస్ట్‌లు ఉండాలన్నారు. రాత్రి వేళల్లో స్పా సెంటర్లకు అను మతి లేదని, ఎవరూ నిర్వహించవద్దన్నారు. అక్రమంగా పశువుల తరలింపు కొమరాడ: ఒడిశా నుంచి పార్వతీపురం సంతకు కొమరాడ మీదుగా జాతీయ రహదారిపై మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. బొలెరా వంటి వాహనాల్లో వందల సంఖ్యలో పశువులను అక్రమంగా తరలించేస్తున్నారు. వీటి రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం ఏమీ చూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. వీటిని కబేళాలకు తరలిస్తున్నట్టు అధికార యంత్రాంగానికి తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై దుమారం రేగుతోంది. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై వందలాది పశువులను తరలిస్తూ అక్రమ సంపాదనపై అక్రమార్కులు గురి పెట్టినా నిఘా వర్గాలకు ఏమీ పట్టడం లేదు. మరోవైపు వందలాది కిలోమీటర్ల పొడవునా వీటిని నడిపిస్తూ కూడా కబేళాలకు తరలిస్తున్నా ఇటు పోలీసులకుగాని, అటు జంతు సంక్షేమ సంఘాలకు అనుమానం కలగకపోవడం విశేషం. ఇప్పటికై నా అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీగి మూగజీవాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
రెండు ద్విచక్ర వాహనాల దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని టీకే రాజపురం గ్రామస్తులు శుక్రవారం పాలకొండ పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన జాడ దుర్గారావు అలియాస్ చిన్న అనే వ్యక్తి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్దింటి సూరిబాబుకు చెందిన ఎక్సెల్ వాహనంతో పాటు దోర భానుప్రసాద్‌కు చెందిన డీలక్స్ ద్విచక్ర వాహనం దగ్ధం చేశాడని ఎస్ఐ కె.ప్రయోగమూర్తి వద్ద వాపోయారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
రఘు మౌసా ఇక లేరు
భువనేశ్వర్: కటక్ మహా నగరం దొహి బొరా, ఆలూ దమ్ (పెరుగు గారె, బంగాళ దుంప కూర)కు ప్రసిద్ధి చెందింది. ఒడియా రుచికరమైన కాలక్షేప తినుబండారాల్లో ఈ వంటకం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు సాధించింది. కటక్ నగరం సందర్శించే పర్యాటకులు సైతం దీని కోసం ఉత్సాహం చూపిస్తారు. దొహి బొరా, ఆలూ దమ్ ప్రియులకు దీని ఆవిష్కర్త రఘునాథ్ సస్మల్ రఘు మౌసాగా ప్రాచుర్యం పొందాడు. అయితే 91 సంవత్సరాల వయసులో శనివారం బిడానాసి గోపాల్ సాహిలో తన నివాసంలో వృద్ధాప్య అనారోగ్యంతో కనుమూశారు. 1950లో తన 15 సంవత్సరాల వయసులో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఒక యుగం ముగిసిందని సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. రఘు మౌసా ప్రత్యేక వ్యవహార శైలి స్థానికులు, పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేది. సహజమైన దినుసులతో వండి సిద్ధం చేసిన కూరతో కూడిన పెరుగు గారె ఎవరైనా చెంచా లేకుండా ఆకుతో కుట్టిన దోనలో చేతితో తినాల్సిందే. ఈ వంటకానికి సేవు, పచ్చి ఉల్లి వగైరా అదనపు జోడింపులు లేకుండా సహజ రుచులతో నిండిన దొహి బొరా, ఆలూదమ్ కోసం వేచి ఉండేవారు. అమ్మకం ప్రారంభించిన ఒక్క గంటలో అమ్ముడుపోయేది. అయితే అతడు మరణించడంతో అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అతని భౌతిక కాయానికి నివాళులర్పించారు. -
ఎడతెరిపి లేకుండా వర్షం
● రాకపోకలకు అంతరాయం మల్కన్‌గిరి: జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో కలిమెల సమితి ఎంవీ 96 వంతెనపై శనివారం ఉదయం సుమారు 3 అడుగుల మేరకు వరద నీరు ప్రవహించింది. దీంతో మల్కన్‌గిరి నుంచి కలిమెల మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వెళ్లే బస్సులు వంతెన వద్దనే నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులు, భువనేశ్వర్ నుంచి మోటు వైపు వెళ్లే బస్సులను సైతం నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
కొత్త ఎన్ఏసీల ముసాయిదా ఉత్తర్వులు జారీ
భువనేశ్వర్: రాష్ట్రంలో కొత్తగా 12 నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీ) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో అంగుల్ జిల్లాలోని పల్లోలోహడా, సువర్ణపూర్ జిల్లాలోని బీర మహరాజ్‌పూర్, బాలాసోర్ జిల్లాలో బొస్తా, సిములియా, మయూర్భంజ్ జిల్లాలో బెట్నాటి, బంగిరిపొషి, చిత్తారా, రాయగడ జిల్లాలోని బిసంకటక్, సంబల్పూర్ జిల్లాలో రెంగాలి మరియు బమ్రా, భద్రక్ జిల్లాలో తిహిడి, ధుసురి చోటు దక్కించుకున్నాయి. సైనికుడి వీరమరణం భువనేశ్వర్: జమ్మూ – కాశ్మీర్ కిస్త్వార్లో కొండ చరియలు విరిగిపడి ఒడియా సైనికుడు మృతి చెందాడు. అమర జవాను అంగుల్ జిల్లా రాఖికమార్ గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ బిస్వాల్గా గుర్తించారు. ఎచ్చెర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎచ్చెర్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ, స్కిల్ హబ్ సెంటర్లలో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు శిక్షణను అందించనున్నారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు తెలిపారు. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగిన యువకులు అర్హులని చెప్పారు. శిక్షణ పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌తోపాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని సుధాకర్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత తెలుపు సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, 2 పాస్‌ఫొటోలతో ఆగస్ట్ 20వ తేదీలోపు ఎచ్చెర్ల స్కిల్హబ్ సెంటర్లో సంప్రదించాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 7989177887 నంబర్‌ను సంప్రదించాలన్నారు. టెక్కలి: తాను షాపు తెరవకపోయినా రూ.7,240ల విద్యుత్ బిల్లు వచ్చిందంటూ టెక్కలి పాత పెట్రోల్ బంక్ ఎదురుగా వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని కురుమోజు తేజ వాపోయాడు. తన చేయి విరిగిపోవడంతో గత రెండు నెలలుగా షాపు తెరవడం లేదని, అయినప్పటికీ స్మార్ట్ మీటర్ పుణ్యమా అని వేల రూపాయల విద్యుత్ బిల్లు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతకు మునుపు ప్రతి నెల రూ.700 లోపు బిల్లు వచ్చేదని వివరించాడు. స్మార్ట్ మీటర్ అమర్చిన కొత్తలో రూ.78 వేల బిల్లు వచ్చిందని, దీనిపై అధికారుల ఫిర్యాదు చేయగా రూ.700 బిల్లుకు అదనంగా మరో రూ.700 వేసి రూ.1400 వసూలు చేశారని తెలిపారు. అత్యధికంగా బిల్లుల మోత మోగిస్తున్న స్మార్ట్ మీటర్‌ను తక్షణమే తొలగించి తనకు వచ్చిన బిల్లును తగ్గించాలని కోరాడు. విజిలెన్స్ కమిషనర్‌కు సత్కారం శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ అనిలచంద్ర పునేఠా శనివారం కలెక్టర్ బంగ్లా వద్ద పంచముఖ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, ఆలయ కమిటీ సభ్యులు ఎల్.నందికేశ్వరరావు, రామలింగస్వామి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళి శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న పోరాటాలు భావితరాలకు తెలియాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజిలతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, చౌదరి బాబ్జీ, రమణమాదిగ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, డీబీసీడబ్ల్యూఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి వజ్రపుకొత్తూరు: పూండి రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో పట్టాలపై శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. మృతుడు గులాబీ టీ షర్టు, సిమెంట్ కలర్ షార్టు ధరించిన ఉన్నాడని, గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో మృతిచెంది ఉంటాడని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ నెంబరు 9440627537కు తెలియజేయాలని కోరారు. -
బాక్సింగ్ భార్గవ్
● జూనియర్ ఇండియన్ బాక్సింగ్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన సత్యభార్గవ్ ● ఇండియన్ కోచింగ్ క్యాంపునకు ఎంపిక ● భారత జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు యువ బాక్సింగ్ సంచలనం గంధం సత్యభార్గవ్ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నాడు. ఇప్పటికే అనేక టోర్నమెంట్లలో సత్తాచాటిన భార్గవ్ ప్రతిష్టాత్మక ఆలిండియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో హర్యానాలోని రోతక్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఇండియన్ కోచింగ్ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. రెండు వారాలపాటు శిక్షణ పాఠాలు నేర్చుకున్న భార్గవ్ క్యాంప్ ముగించుకుని జిల్లాకు పయనమయ్యాడు. ఇండియన్ బాక్సింగ్ జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. బలగలోని జంగమ వీధిలో నివాసముంటున్న భార్గవ్ తండ్రి గంధం వీరకుమార్ పురోహితుడు, తల్లి పుష్పలత గృహిణి. పురోహితమే వీరి జీవనాధారం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇద్దరు పిల్లలు ఢిల్లేశ్వర్, భార్గవ్ ఆటలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇద్దరూ డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావు వద్ద శిక్షణ పొంది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇండియన్ క్యాంప్‌కు ఎంపిక.. భార్గవ్ 2019లో బాక్సింగ్‌లో ప్రవేశం పొందాడు. కోవిడ్‌తో టోర్నీలు లేక.. ప్రాక్టీసుకే పరిమితమయ్యాడు. 2022లో విశాఖపట్నంలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌లో రజత పతకం, ఆ తర్వాత వరుసగా 2023 రాజమండ్రిలో, 2024లో విశాఖపట్నంలో జరిగిన స్టేట్‌మీట్‌లో బంగారు పతకాలు సాధించాడు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లోఅద్భుతంగా రాణించి బంగారు పతకంతో మెరిశాడు. బాక్సింగ్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో హర్యానాలోని రోతక్‌లో జూలై 18 నుంచి 24 వరకు జరిగిన ప్రతిష్టాత్మక 6వ జూనియర్ నేషనల్స్ బాక్సింగ్ మీట్లో 80–85 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. ఫైనల్ బెర్త్ కోల్పోయినా సెలక్టర్లను ఆకర్షించి ఇండియన్ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. హర్యానాలోని రోతక్ వేదికగా శిక్షణ ముగించుకుని జిల్లాకు తిరుగుముఖం పట్టాడు. అక్టోబర్‌లో మరోసారి జరిగే ఇండియన్ కోచింగ్ క్యాంప్‌లో పాల్గొనాలని బీఎఫ్ఐ ఎన్ఐసీ కోచ్‌లు సూచించినట్టు భార్గవ్ చెబుతున్నాడు. భార్గవ్ ప్రస్తుతం ఇంటర్మీడియెట్ సెకెండియర్ చదువుతున్నాడు. భార్గవ్‌ను బాక్సింగ్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఏ లక్ష్మణ్‌దేవ్, వంగా మహేష్, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, జిల్లా బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు అభినందించారు. తల్లిదండ్రులు, అన్నయ్య స్ఫూర్తితో బాక్సింగ్‌లో ప్రవేశం పొందాను. కోచ్ ఉమామహేష్, సంఘ పెద్దలు, కాలేజ్ ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో నిరంతరం సాధన చేస్తున్నాను. నేషనల్ మెడల్ సాధించి, ఇండియన్ కోచింగ్ క్యాంప్‌కు ఎంపికై నందుకు గర్వంగా ఉంది. భారత జట్టుకు ఎంపిక కావడం, ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడమే నా జీవిత ఆశయం. – గంధం సత్యభార్గవ్, బాక్సింగ్ ప్లేయర్ -
వాజపేయికి నివాళి
రాయగడ: భారత మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారి వాజపేయి వర్ధంతి కార్యక్రమం బీజేపీ శ్రేణులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు కీర్తిచంద్ర సాహు, బాదల్ ద, బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, బసంత ఉల్క, కలిరామ్ మాఝి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి: స్థానిక ఇరదల వీధిలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి నిర్వహించారు. వాజపేయి దేశానికి చేసిన సేవలను సీనియర్ నాయకుడు ఛిత్రి సింహాద్రి కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, కోట్ల యువరాజ్, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, కృషక్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ పాలో తదితరులు పాల్గొన్నారు. -
సిండ్రుబ గ్రామానికి ఎమ్మెల్యే రూపేష్
పర్లాకిమిడి: గుమ్మా బ్లాక్‌లోని భుభుని పంచాయతీ మారుమూల సిండ్రుబ గ్రామంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పర్యటించారు. గ్రామంలోని సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 2019లో వచ్చిన తుఫాన్ ప్రభావంతో కొండచరియలు విరిగిపడి గ్రామంలోని అనేక ఇల్లు నేలమట్టం అయ్యాయి. గ్రామంలో ప్రస్తుతం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ తాగునీరు, రోడ్డు, పాఠశాల సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. గ్రామంలో త్వరితగతిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు గుమ్మా బీడీవో దులారాం మరాండి, గుమ్మా బ్లాక్ చైర్మన్ సునేమీ మండల్, బీజేడీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌నాయక్ తదితరులు ఉన్నారు. -
● ఆదుకోండయ్యా..!
జయపురం: అగ్ని ప్రమాదంలో గాయపడిన తన రెండేళ్ల కుమార్తె తనీస హికాకి చికిత్స కోసం దాతలు సహకరించాలని ఆ బాలిక తండ్రి మీనా హికాక కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి ఒడియపెంట పంచాయతీ తొలకాయిపొదర్ గ్రామంలో ఈనె ల 5వ తేదీన మీనా హికాక ఇంటి సమీపంలోని కాలువలో పిల్లలు స్నానం చేశారు. అనంతరం చలిగా ఉందని మంట వేసుకొని చలి కాగుతున్నారు. ఆ సమయం అకస్మాత్తుగా తనీసకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు స్పందించి వెంటనే మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే తనీస శరీరం బాగా కాలిపోయింది. వెంటనే తల్లిదండులు బాలికను లమతాపుట్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కట ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కొరాపుట్ సాహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే 8 రో జుల పాటు అక్కడ చికిత్స అందించినా బాలిక పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బరంపురం గానీ కటక్ గానీ తీసుకెళ్లమని డాక్టర్లు సూచించారు. కానీ డబ్బులు లేకపోవడంతో తమ కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంటి వద్దనే ఉంచారు. తాను చిన్న రైతునని, ఐదుగురు పిల్లలతో కష్టం మీద జీవనం సాగిస్తున్నానని తండ్రి వాపోతున్నారు. దాతలు సహకరించి తమ కుమార్తెను కాపాలని కోరుతున్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
జయపురం: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోట్పాడ్ ఎకై ్సజ్ అధికారి నీలాద్రి బిహారి మిశ్ర అన్నారు. జయపురం సమితి కోట్పాడ్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిషా నివారణపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల వలన కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత తప్పటడుగులు వేస్తున్న పరిణామం సమాజానికి చేటు అన్నారు. అందువలన మత్తు పదార్థాలపై గ్రామాల్లో విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పొణిరో సాగర్, ఉపాధ్యాయులు సుజిత్ సర్కార్, రొతికాంత మహంతి, మహిమ ముండ, శుభాషిష్ పండ, ఆకాశ బిబార్, ప్రభాషిణీ లామాల్, దమయంతి సాహు, సయిత గొలారి తదితరులు పాల్గొన్నారు. -
రాయగడలో ‘చదువుకుందాం రండి’
రాయగడ: విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది. అందరికీ విద్య, అందరూ చదువుకోవాలి అనే నినాదంతో పట్టణంలోని ఇందిరానగర్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో చదువుకుందాం రండీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మెట్రిక్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెల్లడి భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్ఈ) నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన 3,457 మంది విద్యార్థుల్లో, 1,944 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత రేటు 56.23గా నమోదు అయింది. ఈ ఫలితాలతో పాటు రాష్ట్ర ఓపెన్ స్కూల్ (ఎస్ఓఎస్) పరీక్ష ఫలితాలను వెల్లడించారు. 10,809 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, 5,973 మంది ఉత్తీర్ణత సాధించారు. 55.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. శ్రీమందిరం శిఖరం ఎక్కేందుకు ప్రయత్నంభువనేశ్వర్: పూరీ శ్రీమందిరం శిఖరంపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన యాత్రికుడు పోలీసులకు పట్టుబడ్డాడు. బెహరొణొ ద్వారం వైపు నుంచి శిఖరం పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా శ్రీజగన్నాథ ఆలయం పోలీసుల (ఎస్జేటీపీ) దృష్టిలో పడింది. దాదాపు 5 నుంచి 7 అడుగుల వరకు పైకి ఎక్కిన తర్వాత అతడిని గుర్తించారు. ఈ యాత్రికుడు బీహార్ (రాంచీ)కు చెందినవాడిగా కనుగున్నారు. స్థానిక సింహద్వారం ఠాణా పోలీసుల అదుపులో ఉన్నాడు. -
ఎమ్మెల్యే తారాప్రసాద్పై దాడి
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 14వ తేదీన రాత్రి కొరాపుట్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే తారాప్రసాద్ పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మీదుగా ర్యాలీ కొనసాగుతుండగా.. అదే సమయంలో అకస్మాత్తుగా అక్కడి బస్టాండ్‌లో కళాసీల సంఘం అధ్యక్షుడు కృష్ణ కులదీప్ అక్కడికి చేరుకున్నాడు. ఆయన ఒక్కసారిగా ఎమ్మెల్యేపై దాడి చేశాడు. దీంతో ఎమ్మెల్యే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే కృష్ణ కులదీప్‌ను చితకబాదారు. ఎమ్మెల్యే గన్‌మెన్ అతనిపై కొరాపుట్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడు కూడా పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేశాడు. తనపై ఎమ్మెల్యే తారాప్రసాద్తో పాటు అతని సోదరులు హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మద్యం కోసం దారుణం
● భార్యను హత్య చేసిన భర్తమల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి ఎంవీ 79 పోలీసుస్టేషన్ పరిధి భువనపల్లి పంచాయతీ గిన్నిపల్లి గ్రామంలో భీమ కుంజ అనే వ్యక్తి భార్య భారతి కుంజ (40)ను శనివారం దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. భీమ తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు కొద్ది రోజులుగా నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతూ కొడుతున్నాడు. ఈ నేప థ్యంలో శనివారం భారతి పనికి వెళ్తూ భర్త తీసుకొచ్చిన మద్యం అతడికి దొరకకుండా దాచిపెట్టింది. అది తెలుసుకున్న భీమ పొంలం వద్దకు వచ్చి మ ద్యం ఎక్కడ దాచావని అడుగుతూ భార్యను కొట్టా డు. అయినా ఆమె చెప్పకపోవడంతో అక్కడే ఉన్నటువంటి కత్తితో పొడిచి చంపేశాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చారు. అయితే ఎవరైనా సాక్ష్యం చెబితే వారిని సైతం చంపుతానని భయపెట్టాడు. చివరికి గ్రామస్తులంతా కలిసి అతడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ చంద్రకాంత్ తండి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. -
ప్రైవేటు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు
రాయగడ: జిల్లాలో గుణుపూర్‌లోని కపిల్పూర్ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవి, జిల్లా అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మమత సాహులతో పాటు గుణుపూర్ ఎస్డీపీవో బబులి నాయక్, పద్మపూర్ తహసీల్దార్ శంకర్ బాగ్, గుణుపూర్ అగ్నిమాపక కేంద్రాధికారి రజనీకాంత్ గౌడా తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. లక్ష్మణ్ లావణ్య మాతృ చికిత్సాలయం, రీసెర్చ్ కేంద్రం పేరిట నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రిపై పలు ఆరోపణలు అధికారుల దృష్టికి రావడంతో ఈ దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అమాయక ఆదివాసీ గర్భిణులు చికిత్స కోసం వస్తే వారి వద్ద నుంచి ఫీజుల పేరిట అధిక డబ్బులు గుంజుతున్నారని ఆరోపణల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిసింది. కాగా గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ పండ ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రి నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
రాయగడ: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మహిళలు అన్నారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ శ్మశానవాటికలో సామాజిక కార్యకర్త చలపతిరావు అధ్వర్యంలో మొక్కలను శనివారం నాటారు. ఔషధ మొక్కలతో పాటు నీడనిచ్చే సుమారు 200 మొక్కలను నాటారు. మొక్కల ఆవశ్యకత గురించి మహిళలకు చలపతిరావు అవగాహన కలిగించారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు.విక్రమదేవ్ వర్మ విగ్రహం ఏర్పాటు చేయండి జయపురం: బహుముఖ ప్రజ్ఞాశాలి, జయపురం మహారాజు రాజర్శి విక్రమదేవ్ వర్మ విగ్రహాన్ని రాష్ట్ర విధాన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని జయపురం సాహిత్య పరిషత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం మోహన్ చరణ్ మాఝికి ఒక లేఖను పంపించారు. అవిభక్త కొరాపుట్ను మొదట నందపూర్ రాజధానిగా జయపురం రాజులు పాలించారన్నారు. జిల్లా అభివృద్ధికి విక్రమదేవ్ వర్మ ఎంతో కృషి చేశారని తెలియజేశారు. అయితే ఆయనకు తగినంత గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన ఇప్పటికై నా విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య శిబిరంరాయగడ: స్థానిక గాయత్రీనగర్ సరస్వతీ శిశు మందిరంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. శిశు మందిరంలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి, దంత వైద్య పరీక్షలను చేపట్టారు. మొత్తం 182 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించగా, వారిలో 122 మందికి దంత సమస్యలు ఉన్నట్లు గుర్తించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా మరో 60 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అనంతరం ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాక్టర్ లక్ష్మీనారాయణ సాహు నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో సాయి భక్తులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. చేతబడి నెపంతో యువకుడి హత్యరాయగడ: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని శశిఖాల్ పోలీస్‌స్టేసన్ పరిధి బొడొఅలుబడి పంచాయతీలోని గురుసిబడి గ్రామంలో చోటు చేసుకుంది. యువకుడికి గ్రామంలోని కొందరు బలవంతంగా విషం తాగించి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గ్రామ సమీపంలో తగులబెట్టారు. ఈ ఘటన అలస్యంగా వెలుగుచూసింది. తన అన్నయ్యను కొందరు గ్రామస్తులు హత్య చేశారని మృతుని తమ్ముడు శశిఖాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మేరకు 13 మందిని అరెస్టు చేసి శనివారం కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గురుసిబడి గ్రామంలో నివసిస్తున్న రామారావు జిలకర (20) అనే యువకుడు గత కొన్నాళ్లుగా చేతబడి చేస్తున్నాడని గ్రామంలోని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఒకరోజు నిర్వహించిన గ్రామసభలో చేతబడి చేసి, గ్రామంలో అశాంతిని నెలకొల్పుతున్న రామారావును ఎలాగైన హత్య చేయాలని సంకల్పించుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన రామారావును కొందరు యువకులు మాటల్లో పెట్టి ఒక పానీయంలో విషం కలిపి బలవంతంగా తాగించి దారుణ హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతి చెందాడని నిర్ధారించుకొని మృతదేహాన్ని గ్రామ సమీపంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. -
తప్పిన పెను ప్రమాదం
పొందూరు : మండల కేంద్రంలోని పొందూరులో మానసవేణి పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో శుక్రవారం ప్రమాదానికి గురైంది. 20 మందికి పైగా విద్యార్థులను ఎక్కించడంతో ఒరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బోల్తా కొట్టుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అంటున్నారు. పుస్తెలతాడు చోరీ టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నరసాపురం జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం ఓ మహిళ మెడలో పుస్తెలతాడును దుండగులు తెంచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం బడేకుప్పన్నపేటకు చెందిన బొమ్మాళి దాలమ్మ కోటబొమ్మాళిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకుని పరారయ్యారు. బాధితురాలు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 20 కేజీల గంజాయి స్వాధీనం పలాస: ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. నిందితులు మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన అనిసెంటు నాయక్ , రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్గా గుర్తించామని, వీరి వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపించామన్నారు. బైక్ ఢీకొని వ్యక్తి మృతి పలాస: మోదుగులపుట్టి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం చెప్పారు. నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన కంబకాయల దుర్యోధన టెక్కలిపట్నం బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా మోదుగులపుట్టి వద్ద వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బలమైన గాయాలు కావడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. దుర్యోధన కుమారుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి పొందూరు: సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. మండలంలోని వావిలపల్లిపేట కూడలికి సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్లో శక్తి యాప్‌పై శుక్రవారం అవగాహన కల్పించారు. వ్యక్తిగత ఖాతాల నుంచి నగదు డిబిట్ అయినట్లయితే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు జరగకుండా రక్షణ కల్పించేందుకు 1098 ఫోన్ చేయాలన్నారు. ఆపదలో ఉన్నప్పుడు మహిళలు శక్తి యాప్‌ను వినియోగించుకొని రక్షణ పొందాలని సూచించారు. మాస్కులు ధరించి వాహనాలు నడిపిన వారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పీవీవీ శేషుకుమార్, హెచ్ఎం నీలిమ తదితరులు పాల్గొన్నారు. రహదారి విస్తరణలో వివక్షత సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్లో నాలుగువైపులా రహదారుల విస్తరణలో అధికారులు వివక్షత ప్రదర్శిస్తున్నారని పలువురు వాపోతున్నారు. కొలతలు వేసే సమయంలో రహదారి మధ్య భాగం నుంచి రెండువైపులా సమానంగా మార్కింగ్ చేయాలి. కానీ అలా కాకుండా కొంతమంది నేతల ఒత్తిళ్ల మేరకు ఒక్కోచోట ఒక్కోవిధంగా సంబంధిత యంత్రాంగాలు భూమిని మార్కింగ్ చేస్తున్నాయని తెలిపారు. దీనివలన విలువైన జిరాయితీ భూములను కోల్పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. అధికారులు రహదారి విస్తరణ సమయంలో సమన్యాయంతో వ్యవహరించాలని కోరుతున్నారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
మెళియాపుట్టి: మండలంలోని పెద్ద లక్ష్మీపురం గ్రామం వద్ద ఒక కారు అదుపుతప్పి కరెంట్ స్తంభానికి ఢీకొంది. వివరాల్లోకి వెళ్తే.. పలాస నుంచి చాపర గ్రామానికి దంత వైద్యుడు ఎన్.హరిప్రసాద్ ప్రతిరోజూ వస్తుంటారు. ఆయన ఎప్పటిలాగే గురువారం ఒడిశాలోని గారబంద మీదుగా వస్తుండగా, ఒక్కసారిగా కుక్క అడ్డంగా రావడంతో రహదారి పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి ఢీకొని కారు ఆగిపోయింది. అయితే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు వైద్యుడు హరిప్రసాద్ తెలిపారు. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం ప్రధాన ఆలయంలో వారాహి అమ్మవారికి శ్రావణ మాసం నాలుగో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి, అమ్మవారికి అర్చనలు, దర్శనాలు, ఏకవార అభిషేకాలు, కుంకుమ పూజలు చేపట్టారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, పిండి వంటలు సమర్పించి మొక్కులు తీర్చారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
మొబైల్ నేత్రాలయ వాహనం ప్రారంభం
పర్లాకిమిడి: రాష్ట్ర ఖనిజ, వ్యాపార, రవాణాశాఖ మంత్రి బిభూతీ జెన్నా దేశాయి ఫౌండేషన్ ట్రస్టు ఏర్పాటు చేసిన విజన్ ఆన్ వీల్స్ అనే క్యాటరేట్, అంధులకు ఉపయోగపడే మొబైల్ వాహానాన్ని శుక్రవారం ప్రారంభించారు. సకల సౌకర్యాలు కలిగిన ఈ సంచార నేత్ర పరీక్ష మొబైల్ వ్యాన్ ద్వారా గజపతి జిల్లాలోని రాయఘడ, ఆర్.ఉదయగిరి సమితులలో 102 గ్రామీణ ప్రాంతాలలో అంధులకు, స్క్రీనింగ్ చేసి తదనంతరం ఆపరేషన్లకు శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆస్పత్రికి పేషెంట్లను తరలించనున్నట్టు దేశాయి ఫౌండేషన్ ప్రోగ్రాం మ్యానేజరు ప్రణవ్ ప్రతాప్ సింగ్ తెలియజేశారు. గజపతి జిల్లాలో ఈ విజన్ ఆన్ వీల్స్‌ను సి.సి.డి.స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అడ్డాల జగన్నాథరాజు తీసుకువచ్చారు. -
సెలవు రోజు తనిఖీలకు రావడమేంటి..?
● అధికారులను అడ్డుకున్న హాస్టల్ వార్డెన్ పాతపట్నం: స్థానిక ఆర్అండ్బీ బంగ్లా పక్కనున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసేందుకు మండల అధికారులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అయితే హాస్టల్ గేటుకు వేసిన తాళం తీయకుండా వార్డెన్ బి.శ్యామల అధికారులైన తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు, ఎంపీడీవో పి.చంద్రకుమారి, ఏఎస్‌డబ్ల్యూవో ఎం.శ్యామలను బయటనే ఉంచారు. సెలవు రోజుల్లో హాస్టల్‌కు రావడమేంటని ఎదురు ప్రశ్నలు వేశారు. దీంతో వెంటనే తహసీల్దార్ ప్రసాదరావు ఎస్ఐ బి.లావణ్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో హాస్టల్‌కు చేరుకుని తాళం తీయించారు. వార్డెన్ వేధిస్తున్నారు ఈ హాస్టల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 44 మంది విద్యార్థినులు ఉన్నారు. దీంతో వీరి వద్దకు అధికారులు వెళ్లి మాట్లాడారు. అయితే వార్డెన్ తమను వేధిస్తోందని విద్యార్థినులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తరుచూ కొడుతోందని, సక్రమంగా భోజనం పెట్టడం లేదని వాపోయారు. ఏమైనా ప్రశ్నిస్తే తమ తల్లిదండ్రులకు తమపై లేనిపోని చాడీలు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే హాస్టల్‌కు వస్తుందని పేర్కొన్నారు. వచ్చిన రోజుల్లో వేధిస్తుందని తెలిపారు. మెనూ సక్రమంగా పెట్టడం లేదని, పెట్టిందే తినాలని చెబుతుందని ఆరోపించారు. కాగా కలెక్టర్‌కు సాంఘిక సంక్షేమ జిల్లా అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు తనిఖీ చేయడానికి వచ్చామని తహసీల్దార్ తెలిపారు. విద్యార్థుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. -
మట్టి చరియలు పడి బాలుని మృతి
రాయగడ: నాగావళి నదిలో స్నానం చేస్తున్న సమయంలో పై నుంచి మట్టి చరియలు జారి పడడంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పొలమ పంచాయతీ పరిధిలోని పొంగాలి గ్రామంలో శుక్రవారం ఈ విషాదం జరిగింది. మృతుడు అదే గ్రామానికి చెందిన శంకరరావు హికక కొడుకు ధర్మ హికకగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంద్రాగస్టు వేడుకలను తిలకించేందుకు పొంగాలి గ్రామానికి చెందిన నలుగురు బాలురు గ్రామంలో గల పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తూ.. గ్రామానికి సమీపంలో గల నాగావళి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ధర్మ అనే బాలుడు స్నానం చేసి వస్తున్న సమయంలో నది ఒడ్డున గల మట్టి చరియలు అతనిపై పడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని తోటి బాలురు గ్రామస్తులకు తెలియజేయడంతో అంతా అక్కడికి వెళ్లి మట్టి చరియలని తొలగించారు. అయితే అప్పటికే ధర్మ మృతి చెందినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. -
ఆందోళనలో అన్నదాత
● వర్షాలు లేక ఎండిపోతున్న పొలాలు ● పంటలు బతికించుకునేందుకు రైతులకు తప్పని పాట్లు వర్షాల జాడలేక పంటపొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. మరో 10 రోజుల్లో నాట్లు జరగకపోతే వరినారును పశువుల మేతగా వదిలేస్తాం. ప్రస్తుతం సుదూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చి నారును బతికిస్తున్నాం. – టి.అప్పారావు, రైతు, జాడ గ్రామం మూడు వారాలుగా వాన జాడే లేదు. రైతులంతా దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుని నారును బతికించుకుంటున్నాం. చెరువుల్లోనూ చుక్క నీరు లేదు. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది వరి సాగు కష్టమే. – ఎం.చిరంజీవి, రైతు, జాడ గ్రామం జి.సిగడాం : వర్షాలు సకాలంలో అనుకూలించకపోవడంతో మెట్టు ప్రాంత రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరితో పాటు గోగు, మొక్కజొన్న, వేరుశనగ పంటలు ఎండిపోతుండటంతో వాటిని బతికించుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. వేలాది రూపాయలు మదుపులు పెట్టి పంటలు వేసినా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అవస్థలు తప్పడం లేదు. ఆగస్టు నెల సగం పూర్తయినా వరుణుడి కరుణ లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. జి.సిగడాం, జగన్నాథవలస, వెంకయ్యపేట చెట్టుపొదిలాం, ఎస్పీఆర్పురం, జాడ, డీఆర్‌వలస, ముషినివలస, మర్రివలస, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి పైపులైన్లు పెట్టి పంటకు తడిపెట్టాల్సిన దుస్థితి దాపురించింది. -
ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం
● మంత్రి గోకులానంద మల్లిక్రాయగడ: రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గోకులానంద మల్లిక్ అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుగా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ఖనిజ, ప్రాకృతిక సంపదలను సద్వినియోగపరచాలన్నారు. దాదాపు 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలకు ఆశాదీపం స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్ట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతోమంది నిరుపేదలైన అనాథ, ఆదివాసీ యువతులకు ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తూ ట్రస్టు ఆశాదీపంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. -
నిశ్చలానందను కలిసిన మోహన్ భగవత్
భువనేశ్వర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రముఖుడు మోహన్ భగవత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా పూరీ గోవర్దన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరివురి మధ్య వివిధ మతపరమైన అంశాలపై చర్చ సాగినట్లు తెలిపారు. 11 జిల్లాలకు అదనంగా 5 కిలోల బియ్యంభువనేశ్వర్: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని గరీబ్ కల్యాణ్ అన్న యోజన రేషను కింద అదనంగా 5 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. 3 నెలల పాటు నిరవధికంగా ఈ బియ్యం పంపిణీ చేస్తారు. 11 జిల్లాలకు ఈ సౌలభ్యం పరిమితంగా పేర్కొన్నారు. బౌధ్, గజపతి, కంధమల్ జిల్లాలతో పాటు 8 కేబీకే జిల్లాలు ఈ సౌకర్యాన్ని పొందుతాయి. 27 లక్షలకు పైగా కుటుంబాలు 3 నెలల పాటు ఈ లబ్ధి పొందుతాయి. సమగ్రంగా 41 వేల 82 మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం పంపిణీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి దాదాపు రూ.180 కోట్లు ఖర్చు చేస్తుంది. యువకుడిపై దాడి రాయగడ: స్థానిక ఎఫ్‌సీఐ కూడలి సమీపంలో ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందుతున్న ఒక యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో దాడిచేసి గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి స్థానికంగా నివసిస్తున్న ప్రమోద్ అగ్రవాల్గా గుర్తించారు. ఈ మేరకు తనపై దాడి జరిగిందని బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అగ్రవాల్ ఎప్పటిలాగే ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం కోసం తన దుకాణం తెరిచి, సామాన్లు సర్దుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఒక వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ క్రమంలో దాడి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో యువకుడి చేతులకు గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఇదివరకు తన దుకాణానికి ఆ వ్యక్తి వచ్చి తనతో పలుమార్లు గొడవ పడుతుండేవాడని, దీనిపై తాను ఇదివరకు ఒకసారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అదే కక్షతో తనపై దాడి చేసి ఉంటాడని బాధితుడు అగ్రవాల్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తనపై దాడి చేసిన వ్యక్తి వివరాలు తనకు తెలియదని వివరించాడు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం అగ్రవాల్ ఇంటికి వెళ్లిపోయాడు. బాలికలపై లైంగిక దాడి ● ఇద్దరు నిందితులు అరెస్టు జయపురం: బాలికలను వివాహం చేసుకుంటామని నమ్మించి అత్యాచారం చేసిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి ఆశ్రిత ఖల్కే వెల్లడించారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు బొరిగుమ్మ పోలీసుస్టేషన్ పరిధి జయంతిగిరి గ్రామానికి చెందిన కార్తీక పొరజ, మరొకరు జయపురంలోని చెందిన బైరాగి మఠానికి చెందిన ఉద్వభొ ఖిలోగా తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జయంతిగిరికి చెందిన కార్తీక పొరజ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకుంటానని నమ్మంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై గ్రామ పెద్దలు చర్చించి పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయితే సమస్య పరిష్కారమవ్వకపోవడంతో పాటు కార్తీక పొరజ కుటుంబ సభ్యులు భయపెట్టడంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు జయపురం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కార్తీక పొరజను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అటువంటి సంఘటనే జయపురం సదర్ పోలీసుస్టేషన్ బైరాగిమఠం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉద్వభొ ఖిలో అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. ఇప్పుడు అతడు మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిన మైనర్ బాలిక నిలదీసింది. దీంతో అతడు భయపెట్టాలని చూడడంతో జయపురం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు ఆశ్రిత ఖల్కే వెల్లడించారు. -
ఐక్యత ముద్దు
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025ద్వేషం వద్దు.. ● రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభం పాటి భువనేశ్వర్: పౌరులు ద్వేషాన్ని తిరస్కరించి ఐక్యతను బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపు నిచ్చారు. రాజ్ భవన్‌లోని నూతన అభిషేక్ హాల్లో గురువారం జరిగిన విభజన భయానక జ్ఞాపకాల దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ సతీమణి జయశ్రీ కంభంపాటి హాజరయ్యారు. భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఉన్నత విద్య, క్రీడలు, యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన గాయాలు చెరగని మచ్చలు మిగిల్చాయని, విద్వేష రాజకీయాలు విభజన పరిస్థితుల్ని పునరావృతం చేయరాదని, సహనం, సానుభూతి, న్యాయం ద్వారా ఐక్యతను పెంపొందించుకోవాని గవర్నర్ హితవు కోరారు. విభజన మానవాళి చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటిగా గవర్నర్ అభివర్ణించారు. విభజన ప్రభావంతో ఉపఖండం యొక్క సాంస్కృతిక, మతపరమైన బంధాలు విచ్ఛిన్నమై లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, మరెందరో ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. ఏటా ఆగస్టు 14న విభజన భయానక జ్ఞాపకాల దినం ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనీయులని గవర్నర్ కొనియాడారు. భావి తరాలు విషాద విభజన తీవ్రతను అర్థం చేసుకుని బలమైన సమైక్య భారత్ సంరక్షకులుగా ఎదిగేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విభజన సమయంలో సుదూరంగా ఉన్న ఒడిశా స్థానభ్రంశం చెందిన వారి పట్ల కారుణ్య ప్రతిస్పందన హర్షణీయమని అన్నారు ఈ మానవతా స్ఫూర్తి మన రాష్ట్ర నైతికతలో పెన వేసుకుపోయిందన్నారు. ఈ విలువల ఆదర్శం ప్రామాణికంగా యువత ఈ నేలపై మరోమారు విభజన చీకట్లు కమ్మకుండా విభజన నాశనం ధ్యేయంగా ఐక్యత భావాలతో సంకల్పబద్ధంగా శక్తివంతమైన భారత దేశ పౌరులుగా ఎదగాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రసంగిస్తూ ఈ దినం దేశ స్వేచ్ఛతో ముడిపడిన విషాదకర విభజనను గుర్తు చేస్తుంది. మనం స్వాతంత్య్రం పొందినప్పుడు, లక్షలాది కుటుంబాలు భయానకమైన స్థానభ్రంశంతో ప్రియమైన వారిని కోల్పోయిన దుఃఖాన్ని ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన పూర్వీకులు విభజన గాయాలను భరించి ఆ విధ్వంసం నుండి ఐక్యత కలలు కన్నారు. ఆగస్టు 14 నాటి భయానక సంఘటనలను గుర్తు చేసుకోకుండా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అసంపూర్ణంగా మిగిలిపోతాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. చరిత్ర నుండి నేర్చుకోకుండా, మనం ముందుకు సాగలేమన్నారు. విభజన సమయంలో ప్రజలు అనుభవించిన బాధకు చరిత్రలో సముచిత గుర్తింపు లభించలేదని రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్య వంశీ సూరజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్య సభ సభ్యుడు నిరంజన్ బిషి, ఏకామ్ర భువనేశ్వర్ నయోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, గవర్నర్ కార్యదర్శి, కమిషనర్ రూపా రోషన్ సాహు మరియు నిర్వాసిత పౌరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాసిత కుటుంబాలను సత్కరించారు. కటక్ నగరానికి తీపి కబురు -
గోడ మీద రాతలకు ఆధారాలు లభించాయి: ఎస్పీ
భువనేశ్వర్: పూరీ శ్రీమందిర్ ప్రాకార మార్గంలో దక్షిణం వైపు బుడి మా ఆలయం రాతి గోడపైన బెదిరింపు సందేశానికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. సీసీటీవీ రికార్డింగు ఆధారంగా ఉగ్రవాద దాడి బెదిరింపు రాతల వెనక ఉన్న వర్గాల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు సాగుతోందని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పినాక్ మిశ్రా తెలిపారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ ప్రాంతంలో తిరుగాడుతున్న వ్యక్తి గోడ మీద ఏదో రాస్తున్నట్లు కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. సీసీటీవీలో అతని గుర్తింపు స్పష్టంగా కనిపించడం లేదు. ప్రత్యేక బృందం అతని కోసం వెతుకుతోంది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత పూర్తి వివరాలు స్పష్టం అవుతాయని ఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి జయపురం: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోట్పాడ్ ఎకై ్సజ్ అధికారి నీలాద్రి బిహారి మిశ్ర అన్నారు. కోట్పాడ్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, మత్తు పదార్థాలు సమాజానికి పట్టిన చీడపురుగులని ఆవేదన వ్యక్తం చేశారు. వీటివలన కుటుంబాలు, జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. నిషా విముక్త సమాజానికి విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్ఎం పొణిరో సాగర్, ఉపాధ్యాయులు సుజిత్ సర్కార్, రొతికాంత మహంతి, మహిమ ముండ, శుభాషిస్ పండ, ఆకాశ బిబార్, ప్రభాషిణీ లామాల్, దమయంతి సాహు, సయిత గొలారి తదితరులు పాల్గొన్నారు. 8కిలోల గంజాయి పట్టివేత మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు బుధవారం రాత్రీ బలిమెల–చిత్రకొండ రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రెండు బైక్‌లతో ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా చిత్రకొండలో కొన్న గంజాయిని కలిమెల సమితి ఎంవీ 79 గ్రామానికి తరలిస్తామని తెలిపారు. తూకం వేయగా 8 కిలోలు ఉంది. నకిలీ విదేశీ మద్యం పట్టివేత మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కూడుములగూమ్మా పంచాయతీ సెంటర్లో ఉన్న విదేశీ మద్యం షాప్‌లో నకిలీ విదేశీ మద్యం పట్టుబడింది. నకిలీ మద్యంపై బలిమెల పోలీసులకు బుధవారం సమాచారం రావడంతో ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ తన సిబ్బందితో కలిసి గురువారం దుకాణంపై దాడి చేశారు. కుడుములగుమ్మ పోలీసు స్టేషన్ ఇన్చార్జి కృష్ణచంద్ర హియాల్ కూడా తనిఖీలు చేయగా షాప్ మేనేజర్ మరో ఉద్యోగి పారిపోయారు. షాప్‌లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేసి మద్యం బాటిళ్లపై ఉన్న నకిలీ బ్రాండ్లను గుర్తించారు. కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని అభిలేష్ కుమార్ యాదవ్, లాలన్ కుమార్ యాదవ్‌లుగా గుర్తించారు. -
గ్రానైట్ కంపెనీ మేనేజర్ కిడ్నాపర్ల అరెస్టు
పర్లాకిమిడి: గుసాని సమితి దుమ్మునిగ్రామం (దవిడిగాం) వద్ద శ్రీహరి గ్రానైట్స్ మేనేజర్ ధర్మేంద్ర కుమార్ తన కార్యాలయంలో బుధవారం పనిచేస్తుండగా తన ప్రత్యర్థి గోపాల్ సింగ్ రెండు కార్లతో ఏడుగురు గూండాలతో వచ్చి కత్తులతో బెదిరించి ధర్మేంద్ర కుమార్‌ను కిడ్నాప్ చేశారు. పది లక్షలు ఇస్తే విడిచిపెడతామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న దమ్మునిగాం జై శ్రీగ్రానైట్స్ మేనేజరు తారాసింగ్ యాదవ్ (రాజస్థాన్) స్థానిక ఆదర్శ పోలీసు స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటల సమాయంలో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విజయనగరంలో ఉన్న గోపాల్ సింగ్ (గ్రానైట్స్ కంపెనీ యజమాని) నుంచి కిడ్నాప్‌కు గురైన ధర్మేంద్రను విడిపించారు. కిడ్నాప్‌కు గురైన ధర్మేంద్ర కుమార్ గోపాల్ సింగ్‌కు వ్యాపార లావాదేవీల్లో డబ్బు బాకీ ఉన్నట్టు ఎస్పీ జ్యోతింద్ర పండా విలేకరుల సమావేశంలో తెలిపారు. పలుసార్లు ధర్మేంద్ర కుమార్‌కు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేసినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. కిడ్నాపర్స్ ఏడుగుర్ని ఒడిశా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.25వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు, రెండు కార్లు (మహీంద్ర, మారుతీ డిజైర్) ను పోలీసులు స్వాధీనం చేసుకుని పర్లాకిమిడికి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన ఏడుగురు కిడ్నాపర్లను ఆదర్శ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేఽశంలో హాజరుపరిచారు. అనంతరం జిల్లా కోర్టుకు నిందితులను తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ జ్యోతీంద్ర పండా విలేకరులతో అన్నారు. విలేకరుల సమావేశంలో సబ్ డివిజనల్ పోలీసు అఽధికారి మాధవానంద నాయక్, ఐఐసీ ప్రశాంత్ భూపతి పాల్గోన్నారు. -
బాలుడి అదృశ్యం.. గ్రామస్తుల ఆందోళన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి పోలీసు స్టేషన్ తెండకాపదర్ గ్రామంలో 14 ఏళ్ల బాలుడు భగవాన్ శాంత జూలై 19 ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. గడ్డి కోసి వస్తానని వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తాము అన్ని చోట్లా గాలించినా భగవాన్ జాడ తెలియక రామగిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అయితే భగవాన్ ఒక మిత్రునితో కలసి జయపురం వెళ్లినట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ మేరకు కనుక్కుంటే అతడు రాయగడలో ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. కానీ రామగిరి పోలీసుల దర్యాప్తుతో నిరాశకు గురయ్యామని బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో ఆందోళన జరిపి ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన భగవాన్ను వెతికేందుకు ఒక ప్రత్యేక టీమ్‌ను రాయగడ పంపుతామని బొయిపరిగుడ పోలీసు అధికారి రశ్మీ రంజన్ ప్రధాన్ వారికి హామీ ఇచ్చారు. -
కటక్‌లో హర్ ఘర్ తిరంగా ఊరేగింపు
భువనేశ్వర్: కటక్ బొయాలీస్ మౌజా ప్రాంతంలో గురువారం నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ఊరేగింపులో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి పాల్గొన్నారు. బొయాలీస్ మౌజా ప్రాంతంలో జింకిరియా వద్ద ప్రారంభమైన త్రివర్ణ పతాక ర్యాలీ చందులి వరకు దాదాపు 10 కిలోమీటర్ల పొడవునా కొనసాగింది. ఈ ఊరేగింపులో ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రజలు పాలుపంచుకున్నారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని బైక్‌లపై వందలాది మంది భారత్ మాతా కీ జై నినాదంతో ముఖ్యమంత్రితో కలిసి ఊరేగింపులో ఆద్యంతం పాల్గొన్నారు. అక్కడక్కడా మహిళలు ముఖ్యమంత్రిని పూలు, మంగళ హారతితో స్వాగతించారు. కటక్ ఎమ్మెల్యే ప్రకాష్ సెఠి, స్థానిక ప్రతినిధులు, వేలాది మంది ప్రజలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. -
సీపీఐ నాయకుల ఆందోళన
జయపురం: మన దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను నిరసిస్తూ జయపూర్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద సీపీఐ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. అమెరికా ప్రభుత్వానికి బాకా ఊదుతున్న మోదీ ప్రభుత్వం ఇప్పటికై నా మారాలని సూచించారు. అమెరికా నిర్ణయాల వలన పాలస్తీనా, గజాలో లక్షలాది మంది శిశువులు, ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ – పాకిస్తాన్ యుద్ధం తానే ఆపానని నేటికీ ట్రంప్ చెబుతున్నాడని, అయినా పీఎం నరేంద్రమోదీ పెదవి విప్పడం లేదని నిందించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని సూచించారు. ఆందోళనలో కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ట దాస్, మాజీ కార్యదర్శి జుధిష్టగర్ రౌలో, యువనేత సత్యబ్రత నంద, నంద హరిజన్, పదమణ మాలి తదితరులు పాల్గొన్నారు. -
త్రివర్ణ పతాకాల రెపరెపలు
జయపురం: జయపురం పట్టణం గురువారం త్రివర్ణ పతాకాల రెపరెపలతో మెరిసిపోయింది. పట్టణంలో పలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూడురంగుల జెండాలతో పట్టణంలో ప్రతి మార్గంలోనూ ర్యాలీలు నిర్వహించారు. ఉదయం 7 గంటల సమయంలో జయపురం మున్సిపాలిటీ అతి పెద్ద ర్యాలీ నిర్వహించింది. మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అయిన సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యారెడ్డి, అదనపు కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్, మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్మన్ బి.సుజాత, బ్లాక్ విద్యాధికారి చందన నాయిక్, జయపురం సబ్‌డివిజన్ సమాచార పౌర సంబంధాల అధికారి యశోద గదబ బాబు భాయ్ భజరంగ్, జయపురం సిటిజన్ కమిటీ అధ్యక్షురాలు బినోదినీ సాంతపాత్ర, కార్యదర్శి జి.వెంకట రెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. విక్రమ్‌దేవ్ విశ్వ విద్యాలయ విద్యార్థులు కూడా ర్యాలీ చేశారు. -
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
గార : శ్రీకూర్మం యూనియన్ బ్యాంకులో దోపిడి చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో బ్యాంకు గోడకు రంధ్రం పెట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పశ్చిమ వైపునున్న మేనేజర్ గది కిటికీపై సన్స్లేడ్ సమీపంలో మూడు ఇంచీల మేర రంధ్రం చేయడంతో పాటు పక్కనే ఉన్న ఇంటర్గ్రిల్ తొలగించేందు కు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బ్యాంకుపైన నివసిస్తున్న ఓ వ్యక్తి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. కన్నం పెట్టేందుకు ఉపయోగించిన, సుత్తి, కత్తవ, సన్నిగొడ్డ (రాయి)ని అక్కడే వదిలేశారు. వెంటనే స్థానికులు బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. గురువారం ఉదయం బ్యాంకు మేనేజర్ చినరామయ్య గార పోలీసులకు సమాచా రం అందించారు. ఒకటో పట్టణ స్టేషన్ సీఐ పైడపునాయుడు, ఎస్ఐ గంగరాజు, సీసీటీఎస్ సిబ్బంది బ్యాంకు పరిసరాలను పరిశీలించారు. శ్రీకూర్మం గ్రామంలో రాత్రి 11 గంటల నుంచి 4 గంటల వర కు విద్యుత్ సరఫరా లేకపోవడం, ఆ సమయంలో దొంగతనానికి పాల్పడటం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకూర్మం మెయిన్ రోడ్డులో ఉన్న ఈ బ్యాంకుపై ఆరు కుటుంబాలు నివసిస్తుండగా, ఎదురుగా కొన్ని కుటుంబాలున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే తల పగలగొట్టి..
● పట్టుపురంలో మహిళపై దాడి ● బురఖా ధరించి చోరీకి ప్రయత్నించిన మరో మహిళ మెళియాపుట్టి : పట్టపగలే ఓ మహిళ చోరీకి ప్రయత్నించడ మే కాకుండా.. మరో మహిళపై దాడి చేసి పారిపోయిన ఘటన మెళియాపుట్టి మండ లం పట్టుపురంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. పట్టుపురం గ్రామానికి చెందిన అంబల కాంచన ఎప్పటిలాగే గురువారం మెళియాపుట్టిలో ఉన్న సాయిబాబా ఆలయంలో సేవకు వెళ్లింది. కార్యక్రమం ముగించుకుని మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వచ్చి చూసేసరికే తలుపు చాటున బురఖా ధరించి ఉన్న గుర్తు తెలియని మహిళ ఇనుపరాడ్డుతో మహిళపై దాడికి పాల్పడింది. బాధితురాలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. గ్రామస్తులు వచ్చేసరికే గుర్తు తెలియని మహిళ ఒడిశా స్కూటీపై గారబంద వైపు వెళ్లిపోయింది. గ్రామస్తులు వెంబడించి నా ఆమె ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పాతపట్నం సీఐ వి.రామారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితురాలి భర్త ఆర్టిసీలో డ్రైవర్ గా విధుల్లో ఉండగా.. ఇద్దరు కుమారులు ఉపాధి నిమి త్తం వలస వెళ్లారు. నగదు, విలువైన వస్తువులు ఏవైనా చోరీకి గురయ్యాయా?లేదా? అనేకోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
పర్లాకిమిడి: గజపతి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయం నుంచి జాతీయ పతాకాలతో మోటారు సైకిళ్ల ర్యాలీని జిల్లా కలెక్టర్ మధుమిత జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జిల్లా అంతటా ఏడు రోజులు తిరంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి గజపతి స్టేడియం, హైస్కూల్ జంక్షన్, మార్కెట్, కొత్త బస్టాండ్, ప్యాలస్ వీధి మీదుగా ప్రభుత్వ ఆస్పత్రి మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో అధికారులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఏడీఎం ఫల్గుణీ మఝి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శంకర కెరకెటా, డీఎఫ్ఓ కె.నాగరాజు, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో, జిల్లా పరిషత్ అదనపు పీడీ ఫృథ్వీరాజ్ మండల్, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో.. పర్లాకిమిడి: భారతీయ జనతా పార్టీ స్థానిక ఇరదల వీధి పార్టీ కార్యాలయం నుంచి రాజవీధి మీదుగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తిరంగ శోభాయాత్ర ర్యాలీని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోరో శోబోరో, మాజీ అధ్యక్షుడు ముల్లి గోపాలరావు, సిద్ధేశ్వర మిశ్రా, కాశీనగర్ నాయకులు ఛిత్రి సింహాద్రి, యువజన నాయకులు కోట్ల యువరాజ్, కౌన్సిలరు బబునా బెహారా పాల్గొన్నారు. రాయడలో.. రాయగడ: జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారుల ఆధ్వర్యంలో గురువారం వివిధ పాఠశాలల విద్యర్థులు ర్యాలీ నిర్వహించారు. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. స్థానిక రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల్లో చేపట్టారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, జిల్లా అదనపు కలెక్టర్ నిహరి రంజన్ కుహోరో, జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి సుస్మీతా బౌరి, తదితరులు పాల్గొన్నారు. మల్కన్‌గిరిలో.. మల్కన్‌గిరి: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుంచి సాంస్కృతిక భవనం వరకు 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సంగ్ మడ్కామి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారీ టాంగులు, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సోభరో , జిల్లా సబ్ కలెక్టర్ అశ్ని, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భోజనంలో నిద్రమాత్రలు కలిపి..
● ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య ● వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు పాతపట్నం : పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరా లు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాల ని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు. పక్కా పథకం ప్రకారం.. మౌనిక, ఉదయ్‌కుమార్ కలిసి రాజు హత్యకు పథ కం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్‌కుమార్‌ను ఎక్కడికై నా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నా రు. ఇందుకు ఉదయ్‌కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్‌కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్‌కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను భార్య మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్‌కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బ్యాటిల్‌ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్న ట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్‌కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి.రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్‌లను అభినందించి, రివార్డులను డీఎస్పీ అందజేశారు. -
ఓట్ చోర్‌పై ఆందోళన
పర్లాకిమిడి: ఓట్ చోర్ వివాదంపై పర్లాకిమిడి కాంగ్రెస్ కార్యాలయం నుంచి పట్టణంలోని పలు కూడళ్లలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఓట్ల దొంగలు గద్దె దిగాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అభిమన్యుపండా, ఈశ్వర చంద్ర మఝి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాస్మిన్ షేక్, రంజితా పాణిగ్రాహి, సంజయ్ అధికారి, త్రినాథ పాత్రో తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ గురువారం అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు మరీ దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. పక్క మండలాలకు చెందిన టీడీపీ గూండాలను తీసుకొచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంతటి దారుణమైన ఘటనలు జరిగినా ఎన్నికలు కమిషన్, పోలీసు యంత్రాంగం ఏమీ తెలియనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు గుర్తించి అక్రమాలకు ఒడిగట్టారన్నారు. హిరమండలం: టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు పై ఉద్యోగులు గురువారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగు ల సంఘం పిలుపు మేరకు గాంధేయవాదం ప్రదర్శించారు. హిరమండలంలోని వంశధార ప్రాజెక్టు కట్టడాల విభాగం వద్ద ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, న్యాయబద్ధ చెల్లింపులు, ప్రభుత్వ హామీలపై చర్చించా రు. ప్రభుత్వం స్పందించే వరకూ ఐక్య పోరాటాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హిరమండలం తాలుకా యూనిట్ అధ్యక్షుడు మీసా ల వరప్రసాదరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగ్గి లి కళ్యాణ్, జాయింట్ సెక్రటరీ పైడి రవికుమా ర్, పిసిని రమేష్, టింగ మనోజ్, పైల వెంకట రమణ, రామకృష్ణ, నడిమింటి షన్ముఖరావు, వసంతరావు,రేగేటి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. రణస్థలం: లావేరుకు చెందిన ఎచ్చెర్ల గొల్ల (50) అనే రైతులు గుండెపోటుకు గురై పొలంలోనే మృత్యువాతపడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. లావేరు చెందిన గొల్ల అనే రైతు తాను కౌలుకు తీసుకున్న పొలానికి నీరు కడదామని గురువా రం మధ్యాహ్నం వెళ్లాడు. వ్యవసాయ బోరు రిపేర్ కావడంతో మెకానిక్ ను పిలిపించి బాగు చేయించాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో వరి పొలానికి నీరు కడుతుండగా గుండెపోటు వచ్చి వరిచేనులో పడిపోయాడు. విగత జీవిగా పడి ఉన్న రైతును స్థానికులు గుర్తించి లావేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు అందరితో కలిసి మెలిసి ఉండే గొల్ల ఆకస్మాత్తుగా చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన వ్యవసాయ పను లు లేనప్పుడు రణస్థలం జాతీయ రహదారిపై బస్టాప్ వద్ద చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య భాగ్యలక్ష్మి కుమార్తె స్వరూప, కుమారుడు రామకృష్ణ ఉన్నారు. సెప్టెంబర్ 13న లోక్ అదాలత్ శ్రీకాకుళం పాతబస్టాండ్ : కక్షిదారులు వివాదాలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. సెప్టెంబర్ 13న జరగబోయే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కువ కేసులు రాజీ చేయడానికి బీమా సంస్థలు, న్యాయవాదులు చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు భవనంలో బీమా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. వివాదాలు త్వరగా పరిష్కరించడానికి అదాలత్ మేలు చేస్తుందన్నారు. సమావేశంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.సువర్ణ రాజు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: అధికార యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో 1వ, 2వ, 4వ, 7వ స్థాయీ సంఘాల సమావేశాల్లో పలు శాఖల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కుని అధికారులు పనిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ముందస్తుగా సమాయత్తం కావాలన్నారు. కవిటి, సోంపేట ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు డయాలసిస్ సౌకర్యాలు పెంచడం, అవసరమైన బెడ్లను కల్పించడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పించన్లను వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవోల కు సూచించారు. డీడబ్ల్యూఎంఏ ద్వారా పూర్తయిన పనుల బిల్లులు తక్షణం చెల్లించాలని, పంచాయతీ రాజ్‌శాఖ కాలం చెల్లిన పనుల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఉద్దానం పైప్‌లైన్ లీకేజీలను సరిచేయాలన్నారు. లోవోల్టేజి సమస్యలను పరిష్కరించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం జరిగిన 3వ, 5వ, 6వ స్థాయీ సంఘాల సమావేశాల్లో కూడా పలు అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షిస్తూ, ప్రజా అవసరాల తీర్చడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
ఉపాధ్యాయుడు అరెస్ట్
పర్లాకిమిడి: మావోయిస్టులతో సంబంధం కలిగివున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బుధవారం అడవ పోలీసులు అరెస్టు చేశారు. గజపతి జిల్లా మోహానా నియోజకవర్గం అడవ పి.ఎస్ పరిధిలో నువా ఖోజురిపద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత కొద్ది నెలలుగా ఎక్స్‌క్యాడర్ టీచర్‌గా ప్రతాప్ కుమార్ నాయక్ పనిచేస్తున్నారు. 2011లో అడవలో అంధేరీ ఘాట్ మావోయిస్టుల బ్లాస్టింగ్, 2013లో మోహనా పి.ఎస్.పరిధిలో భలియాగుడలో జరిగిన మావోల హింసాకాండలో ప్రతాప్ నాయక్ ఉన్నట్టు అడవ పోలీసులు వెల్లడించారు. ఆయనపై అడవ పోలీసు స్టేషన్లో కేసు నమోదైందన్నారు. ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్లో మరికొన్ని కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు. ఉపాధ్యాయుడు ప్రతాప్ గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్టు ఎస్పీ తెలియజేశారు. ఈ రెండు కేసులు ఆధారంగా ప్రతాప్ కుమార్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేశారు. అడవ, మోహానా, ఆర్.ఉదయగిరిలలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మరి కొంతమంది ఉపాధ్యాయులు నక్సల్, గంజాయి రవాణా కేసుల్లో ఉన్నారని, వారు ఆయా పోలీసు ష్టేషన్లలో స్వచ్ఛందంగా లోంగిపోవాలని, లేకుంటే వారిని ఎక్కడున్నా పట్టుకుని అరెస్ చేస్తామన్నారు. -
సంబల్పూర్ పట్టణంలో..రాత్రీపగలూ నీటి సరఫరా
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశా సంబల్పూర్ పట్టణానికి రాత్రీపగలూ నిరవధికంగా తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన బుధవారం లోక్ సేవా భవన్ సమావేశం హాల్లో 24వ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 6 శాఖల నుంచి 7 ప్రధాన ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి, సహకార, ఆర్థిక, వాణిజ్యం– రవాణా, ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖలు ఒక్కో ప్రతిపాదన, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ 2 ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదానికి ప్రతిపాదించాయి. సమగ్రంగా ఈ 7 ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. సంబల్పూర్ పట్టణంలో రూ.382.40 కోట్ల వ్యయ ప్రణాళికతో రాత్రీపగలూ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోదించింది. ఈ ఆమోదం ప్రకారం ఈగిల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ 2043 నాటికి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.7 లక్షల మందికి ఆమోదిత తాగునీటి సరఫరా సేవలందించేదుకు ఇన్‌టేక్ బావులు, నీటి శుద్ధి కర్మాగారం, టర్బైన్ పంపులను నిర్మిస్తుంది. రూ. 300 కోట్ల రాష్ట్ర వ్యయ ప్రణాళికతో తొలి విడతలో 14 భారీ, 17 మధ్య, 7 చిన్న తరహా మండీల ఏర్పాటుకు మంత్రి మండలి మార్గం సుగమం చేసింది. ఈ మండీల్లో అధునాతన నిల్వ, పంటకోతలో డిజిటల్ వ్యవస్థ, పంటలకు సరసమైన ధరల నిర్ధారణ, వరి సేకరణలో పారదర్శకత, పంటల తర్వాత నష్టాల నియంత్రణకు అనుబంధ సౌకర్యాలతో సమగ్రంగా 38 ఆదర్శ మండీలను ఏర్పాటు చేయడానికి మంత్రి వర్గం అంగీకరించింది. 110 పట్టణ స్థానిక సంస్థలలో విద్యుచ్ఛక్తి వినియోగం తగ్గించే దృక్పథంతో రెట్రోఫిట్టింగ్ స్ట్రెచ్‌లలో ఎల్ఈడీ పబ్లిక్ స్ట్రీట్ లైటింగ్ కోసం నిధులు మంజూరు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మాన్ పథకం కింద భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచ శ్రేణి ఎంఆర్ఓ (నిర్వహణ, మర్మతు, ఓవర్‌హాల్) సౌకర్యం కల్పించేందుకు ఎయిర్ వర్‌ుక్స ఇండియా సంస్థకు ఐపీఆర్ 2022 కింద ప్రోత్సాహకాలను విస్తరించారు. ఈ ప్రాజెక్ట్ కింద ఒడిశాను ప్రాంతీయ విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసి 2031 నాటికి అంచనా ప్రకారం 117 అమెరిన్ బిలియన్ల డాలర్లు సామర్ధ్యంతో ప్రపంచ ఎంఆర్ఓ మార్కెట్లో రాష్ట్రం ఉనికిని బలపరచుకుంటుంది. ప్రభుత్వ సంస్థలలో నర్సింగ్ అధ్యాపక నియామకం మరియు పదోన్నతి విధానాల కోసం మంత్రి మండలి ప్రతిపాదిత ఒడిశా నర్సింగ్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, 2025ను ఆమోదించింది. ఈ తీర్మానంతో ప్రస్తుతం పని చేస్తున్న 8 నర్సింగ్ కళాశాలలు, 21 ఏఎన్ఎం శిక్షణా కేంద్రాలు, 7 కొత్తగా ఏర్పాటు కానున్న కళాశాలల్లో ఖాళీల భర్తీని పరిష్కరిస్తుంది. ఆయా సంస్థల్లో నాణ్యమైన బోధనను నిర్ధారించి నర్సింగ్ విద్యను బలోపేతం చేస్తుంది. సాంస్కృతిక నిర్వహణ, సమన్వయంతో రాష్ట్ర మ్యూజియం పనితీరును మెరుగుదల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు, సీటీ, జీఎస్టీ కార్యాలయాలలో ఒడిశా మినిస్టీరియల్ సేవల నియమాల ప్రతిపాదనలు మంత్రి మండలి ఆమోదం పొందాయి. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం -
32 వంతెనల నిర్మాణానికి ఆమోదం
భువనేశ్వర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో ‘సేతు బంధన్‘ యోజన కింద రాష్ట్రంలో 12 జిల్లాల్లో 32 వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బొలంగీర్, సువర్ణపూర్, నయాగడ్, సంబల్పూర్, మల్కన్‌గిరి, కొరాపుట్, జగత్సింగ్పూర్, బర్గడ్, బౌధ్, భద్రక్, కటక్, పూరీ జిల్లాల్లో ప్రతిపాదిత వంతెనలు నిర్మిస్తారు. అవయవదాత కుటుంబాలకు ఆర్థిక సాయంపర్లాకిమిడి: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆశ్వాన్ హాలులో బుధవారం ప్రపంచ అవయవదాన దినోత్సవం నిర్వహించారు. చనిపోతూ పులువురికి అవయవదానం చేసిన ఐదుగురు వ్యక్తులకు సంబంధించి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సూరజ్ పురస్కారాలు 2025 పేరిట ఆర్థిక సహాయం అందజేశారు. సాయం అందుకున్న వారిలో పర్లాకిమిడి సేరివీధికి చెందిన నర్సింహ ప్రసాద్ మహారాణా, పాటికోట గ్రామానికి చెందిన పి.శోబోరో, తెలుగు సొండివీధికి చెందిన కె.నారాయణ పట్నాయిక్, రాయగడ బ్లాక్ సన్నతుండి గ్రామానికి చెందిన అరుణ్ భుయ్యాన్ ఉన్నారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఏడీఎం ఫాల్గుణీ మాఝి అందజేశారు. కార్యక్రమంలో సి.డి.ఎం.ఒ. డాక్టర్ ఎం.ఎం.ఆలీ, అసిస్టెంట్ కలెక్టర్ జగన్నాథ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.నీటిగుంతలో పడి యువకుడు మృతి మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి పూజారిగూఢ గ్రామంలో ఓ యువకుడు కాలుజారి నీటిగుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనుగౌడ్ అనే యువకుడు రోజులాగానే బుధవారం పనికి వెళ్లాడు. వాటర్ ట్యాంక్ సమీపంలోని నీటిగుంత వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో జారిపడిపోయాడు. అక్కడ ఉన్నవారు మాజీ సర్పంచ్ రామ్‌చంద్రకు సమాచారం ఇచ్చారు. ఆయన సమితి అధ్యక్షుడు సధశివ పూజారికు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సోనును బయటకు తీసి మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారని పోలీసులు పేర్కొన్నారు. సోనుగౌడ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.’హర్‌ఘర్ తిరంగా’ ర్యాలీ పర్లాకిమిడి: రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు స్థానిక మహిళా కళాశాల విద్యార్థినులు ’హర్‌ఘర్ తిరంగా’ ర్యాలీని డోలా ట్యాంక్ నుంచి ప్యాలస్ వీధుల మీదుగా బుధవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళా కళాశాల అధ్యక్షురాలు డాక్టర్ రీనా సాహు, కళాశాల విద్యార్థిని సంఘం నాయకురాలు కల్పనా నాగవంశ, తదితరులు పాల్గొని వందేమాతరం నినాదాలు చేశారు.ప్రైవేటు బస్సు బోల్తా ● ఎనిమిది మందికి గాయాలు కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నూతలగుంటపాలెం వద్ద బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఎస్ఐ పి.మనోజ్‌కుమార్ అందించిన వివరాలు.. ఒడిశా రాష్ట్రం అడ్డుబంగి నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు.. ముందు వెళుతున్న వాహనాన్ని తిప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి నూతలగుంటపాలెం రిలయన్స్ బంక్ వద్ద రోడ్డు పక్కనున్న పల్లపు ప్రాంతంలోకి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. వారిని 108 వాహనంలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ అల్లు స్వామినాయుడు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిలో భరతన్, కృష్ణారావు, పార్వతి, ఉమా, మాధవి, సనాతన రాయ్, పి.శ్రీరాములు, రాములమ్మ, బృందావతి, కె.మోహన్‌రావు తదితరులు ఉన్నారు. -
ఊరూరా జాతీయ జెండాల ర్యాలీ
రాయగడ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని స్థానిక అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థులు వంద మీటర్ల పొడవైన జాతీయ జెండాతో బుధవారం పట్టణంలో ఊరేగింపు చేపట్టి తమ దేశభక్తి చాటుకున్నారు. మద్యం మానుకోవాలంటూ చైతన్య ర్యాలీని నిర్వహించారు. ● పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగురవేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శంకర కెరకెటా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్.ఉదయగిరిలో మంగరాజ్‌పూర్, కాశీనగర్ సమితిలో ఖరడ గ్రామాల్లో బ్లాక్ అధికారులు, స్వయం సహాయక గ్రూపులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. -
కాయగూరల దుకాణాలు తొలగించాలి
జయపురం: జయపురం ప్రధాన మార్గంలో ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు ఇరువైపులా కాయగూరల దుకాణాలను తొలగించాలని మున్సిపాలిటీ అధికారులు నిర్వాహకులను ఆదేశించారు. స్వచ్ఛందంగా తొలగించకపోతే మున్సిపాలిటీ సిబ్బంది తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు జయపురం మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి ఆదేశాల మేరకు అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు రాజానగర్ కూడలి నుంచి దుకాణదారులకు స్పష్టం చేశారు. -
దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు
రాయగడ: సదరు సమితి శేశిఖాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిమిడిపేట రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 3న రైలులో ప్రయాణిస్తున్న బంగారు వ్యాపారి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించిన కేసులో ఆరుగురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.25 లక్షల నగదు, 58 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో స్థానిక రామకృష్ణనగర్‌కు చెందిన గోవిందబాగ్, కపిలాస్ కూడలికి చెందిన ఉల్లకల్లు శ్రీను, నెహ్రూనగర్‌కు చెందిన ఎ.బేనుగోపాల్స్వామి, ఉత్కళమణి నగర్‌కు చెందిన బిధిహార్బాగ్, రాణిగుడ ఫారానికి చెందిన పలక మురళీకృష్ణ, నెహ్రూనగర్‌కు చెందిన అగుర్ ఈశులుగా గుర్తించారు. ఈ మేరకు బుధవారం రైల్వే పోలీసులు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన ఆర్.ముళ్ల అనే నగల వ్యాపారి రాయగడకు ఇక్కడ గల బంగారు దుకాణాల యజమానులతో వ్యాపార లావాదేవీలు పూర్తయిన అనంతరం విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరాడు. జిమిడిపేట స్టేషన్ వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు వ్యాపారి వద్ద బ్యాగ్ లాక్కొని పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. -
విజిలెన్స్ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు
పర్లాకిమిడి: స్థానిక జిల్లా ముఖ్యవైద్యాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తా జగదీష్ పట్నాయక్, అటెండర్ నిరంజన్ నాయక్‌లు ఒక యువ డాక్టర్ వద్ద నుంచి రూ.25 వేల లంచంగా తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న కాంట్రాక్ట్ డాక్టర్‌గా ఉద్యోగం పొందిన వ్యక్తి అపాయింట్మెంటు లెటర్ కోసం సి.డి.ఎం.ఓ. కార్యాలయానికి వెళ్లారు. గుమస్తా జగదీష్ పట్నాయక్, ప్యూన్ నిరంజన్ నాయక్ రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన విజిలెన్స్ అధికారులకు తెలియజేయడంతో వలపన్ని పట్టుకున్నారు. వెంటనే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జగదీష్ పట్నాయక్ ప్రభుత్వ క్వార్టర్, కార్యాలయంలోని ఆయన సీటు అల్మారా, డెస్‌లో వెతకగా సుమారు రూ.5 లక్షలు ఉండటంతో వాటిని సీజ్ చేశారు. ఈ దాడుల్లో బరంపురం విజిలెన్స్ పాల్గొన్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేసి, కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
రక్తదానంపై అవగాహన అవసరం
● విరివిగా శిబిరాలు ఏర్పాటు చేయాలి ● సదస్సులో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుభువనేశ్వర్: రక్తదానం ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. రాజ్ భవన్ అభిషేక్ హాల్లో బుధవారం భారతీయ రెడ్ క్రాస్ సంస్థ, ఒడిశా రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యా సంస్థల్లో సంవత్సరానికి కనీసం రెండు, మూడు సార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణాలను కాపాడటమేనని చెప్పారు. రక్తదానంపై నెలకొన్న అపోహలు తొలగించాలని సూచించారు. అనంతరం రాష్ట్రంలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిపై సమీక్షించారు. రోగులకు రక్తం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలు, మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, పాఠశాలలు, సామూహిక విద్య విభాగం మంత్రి నిత్యానంద గోండ్, గవర్నరు కమిషనర్, కార్యదర్శి రూప రోషన్ సాహు, భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ కార్యనిర్వాహక మండలి సభ్యులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పంచాయతీరాజ్, తాగునీరు, పాఠశాలలు, సామూహిక విద్య, ఉన్నత విద్యా శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
బ్యాంకు అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు
మల్కన్‌గిరి: రుణాలు చెల్లించినప్పటికీ తమను మోసం చేశారని మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 20 మంది మహిళలు ఆరోపించారు. కోరుకొండ సమితి కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో తమకు డబ్బులు ఆశ చూపి రుణం ఇప్పిస్తామని కొంతమంది మోసం చేశారని ఆరోపించారు. ఈక్రమంలో బుధవారం ముందుగా బ్యాంక్‌కు తాళం వేసి అనంతరం మహిళలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. 2024లో బ్యాంక్‌లో 20 మంది రూ. మూడు లక్షలు రుణం తీసుకున్నారు. బ్యాంక్ వారు ఇచ్చిన గడువులోగా తీసుకున్న రుణాన్ని చెల్లించారు. అయినా ఇంకా మీ గ్రూప్ సభ్యులు మూడు లక్షలు రుణం చెల్లించాల్సి ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఆందోళనతో బ్యాంకుకు చేరుకొని తాళాలువేసి కలెక్టర్ సోమేష్ ఉపాధ్యాయను కలిసి బ్యాంకు అధికారులపై ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
లైంగికదాడులు, శిశు సురక్ష చట్టాలపై అవగాహన
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం ద్వారా జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మిశ్ర పర్యవేక్షణలో స్థానిక సరస్వతీ శిశు విద్యాలయం శారదా విహార్‌లో లైంగిక నేరాలు, శిశు సురక్షా చట్టం –2012పై చైతన్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత పాల్గొని మాట్లాడారు. పోస్కో చట్టం లింగభేదం లేకుండా శిశు సంక్షేమం, సురక్షణ కోసం తగిన వ్యవస్థను నెలకొల్పిందని వెల్లడించారు. శిబిరంలో స్పెషల్ పోస్కో కోర్టులో అవిభక్త కొరాపుట్ జిల్లా స్పెషల్ పీపీ డాక్టర్ బి.గాయిత్రీ దేవి, డిప్యూటీ లీగల్, లీగల్ డిఫెన్స్ కౌన్సిలర్, పేనల్ న్యాయవాది పి.సన్యాసిరావు, సరస్వతీ శిశు విద్యాలయ సారదా విహార్ ప్రధాన ఆచార్య సత్యనారాయణ సెఠి, సరస్వతీ శిశు విద్యా మందిర్ శారద విహార్ విద్యార్థి న్యాయ సాక్షరత క్లబ్బు ఉపాధ్యాయులు రమేష్ చంద్రబెహర పాల్గొన్నార. ఈ సందర్భంగా 9, 10 తరగతుల విద్యార్థినులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు న్యాయ సేవ ప్రదీకరణ కార్యదర్శిణి సుజాత ప్రశంసా పత్రాలు, ట్రోఫీలతో సత్కరించారు. -
శ్రీమందిరంలో నాలుగు గంటలు దర్శనాలు నిలిపివేత
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో బుధవారం మూల విరాట్టు దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నాలుగు గంటల సేపు సర్వ దర్శనం నిలిపి వేశారు. శ్రీ మందిరం రత్న వేదికపై శ్రీ జగన్నాథుని రాహు రేఖ సేవ పురస్కరించుకుని సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేయడం అనివార్యమైనట్లు ఆలయ అధికార వర్గాలు తెలిపాయి. ఏటా భాద్రపద మాసం కృష్ణ పక్ష రేఖా పంచమి నాడు రాహు రేఖను అలంకరిస్తారు. ఇది గోప్య సేవ కావడంతో బుధ వారం సాయంత్రం నాలుగు గంటల పాటు దర్శనం ఆపి వేశారు.ప్రథమ భోగ మండప సేవ తర్వాత రాహు రేఖ సన్నాహాలు ప్రారంభించారు. రాహు రేఖ శ్రీ జగన్నాథుని ముఖాన ధగేలుమనే అర్ధ వలయ ఆకార బంగారు ఆభరణం. స్నాన పూర్ణిమ పురస్కరించుకుని దీనిని తొలగించారు. తిరిగి భాద్రపద మాసం కృష్ణ పక్షం పంచమి నాడు ఈ అలంకరణ పునరుద్ధరించడం ఆచారం. గోపాల వల్లభ్ భోగం నివేదన తర్వాత తొఢౌ కొరొణొ, దెవులొ కొరొణొ సేవకులు భండార్ మేకాప్ సేవకులతో సంప్రదించి రత్న భాండాగారంలో పదిల పరిచిన బంగారు రాహు రేఖను బయటకు తీస్తారు. బెహెరెణొ ద్వారం దగ్గర ఆలయ కంసాలి సేవకులు రాహు రేఖను శుభ్రం చేసి అలంకరణకు సిద్ధం చేస్తారు. ప్రథమ భోగ మండప సేవ ముగియడంతో పాలియా సేవకులు, దైతపతులు గర్భ ఆలయం లోనికి ప్రవేశించి జయ, విజయ ద్వారం తలుపులు మూసి వేసి గోప్యంగా రాహు రేఖ అలంకరణ చేశారు. ఆలయ ఆచారం ప్రకారం ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మూల విరాటులకు మహా స్నానం చేయించారు. -
ఎమ్మెల్యే ఎల్ఏడీ వెబ్ పోర్టల్ ప్రారంభం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బుధవారం లోక్ సేవా భవన్‌న్‌లో రాష్ట్ర మంత్రి మండలి సమక్షంలో ఎమ్మెల్యే స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎమ్మెల్యే–ఎల్ఏడీ), ముఖ్యమంత్రి ప్రత్యేక సహాయం (సీఎం–ఎస్ఏ) పథకాలకు సరళీకృత మార్గదర్శకాల సంచికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఎల్ఏడీ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కొత్త మార్గదర్శకాలు సుపరిపాలన ప్రక్రియను సరళీకృతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన, మౌలిక సదుపాయాలను త్వరగా, పారదర్శకంగా అమలు చేయడంలో ఈ సంస్కరణలు సహాయపడతాయన్నారు. కొత్త ‘ఎమ్మెల్యే ఎల్ఏడీ వెబ్ పోర్టల్’ ఆధ్వర్యంలో ప్రాజెక్టు సిఫార్సులు, ప్రాజెక్ట్ అవసరాల అంచనా, ప్రణాళిక , వ్యయ అంచనా తయారీ, ప్రాజెక్టుల ఆమోదం, పని ఆదేశాలు, పర్యవేక్షణ, తనిఖీ, వ్యయం, పని అమలు మొదలైన వాటిని ఎమ్మెల్యేలు సకాలంలో పూర్తి చేసేందుకు వీలవుతుందన్నారు. తాజా సరళీకరణతో ప్రాజెక్టు సిఫార్సు, వర్క్ ఆర్డర్ల జారీ మధ్య సమయాన్ని 30 రోజులకు పరిమితం చేశామన్నారు. ఇది వేగవంతమైన అమలును నిర్ధారిస్తుందన్నారు. శాసనసభ్యులు వెబ్ పోర్టల్ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల సిఫార్సు, ఆమోదాల పర్యవేక్షణ, అమలును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. జవాబుదారీతనాన్ని గుర్తించి నియోజకవర్గం బహుముఖ అభివృద్ధి ప్రతిపాదనల వాస్తవ కార్యాచరణలో జాప్యం నివారణకు ఈ పోర్టల్ దోహదపడుతుందన్నారు. 1997–98లో ప్రారంభమైన ఎమ్మెల్యే–ఎల్ఏడీ పథకం స్థానిక మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి కీలకమైన సాధనంగా అభివృద్ధి చెందిందన్నార9ఉ. 2025–26లో నియోజకవర్గానికి వార్షిక కేటాయింపును రూ.5 కోట్లకు పెంచామన్నారు. ఇది స్థానిక ప్రతినిధులకు సాధికారత కల్పించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను, పొరుగు రాష్ట్రాల ఉత్తమ పద్ధతుల సమాహారంతో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సరళీకృత మార్గదర్శకాలను రూపొందించామన్నారు. సంస్కరణ ప్రక్రియలో పాల్గొన్న అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్కరణ అభివృద్ధిని వేగవంతం చేయడంలో డిజిటల్ పాలన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందన్నారు. పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించి జాప్యం నివారణతో నియోజకవర్గాలలో అభివృద్ధి ప్రాజెక్టులను సకాలంలో అమలు చేయడం ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ పోర్టల్ యొక్క లక్ష్యాలు, కొత్త మార్గదర్శకాల యొక్క అవలోకనాన్ని సమర్పించారు. -
ముగ్గురు వలస కార్మికుల దుర్మరణం
● తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ● బాధితులకు న్యాయం చేయాలని నబరంగ్‌పూర్ జిల్లాలో ప్రతిపక్షాల ఆందోళన కొరాపుట్ : తెలంగాణా రాష్ట్రంలో ఒడిశాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటనలో మృతులకు న్యాయం చేయాలంటూ బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి కొకడాబెడా గ్రామంలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మంగళవారం తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కిసార పోలీస్ స్టేషన్ పరిధిలో సికిందర్ ఖమ్మం ప్రాంతంలో రోడ్డుపక్కన పంట భూమిలో వలస కార్మికులు మొక్కలు నాటుతున్నారు. ఈ సమయంలో వ్యాన్ దూసుకెళ్లడంతో కొకడాబెడా గ్రామానికి చెందిన జయరాం బోత్ర (56), నారాయణ బోత్ర (20), శేష్మన్ బోత్ర (21)లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను తెలంగాణా ప్రభుత్వం నబరంగ్‌పూర్ జిల్లాకు బుధవారం పంపించింది. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఒడిశా రాష్ట్రంలో మైదాన ప్రాంతాలలో కార్మికులు మృతి చెందితే ప్రభుత్వం తక్షణ పరిహారం ప్రకటిస్తుందని గుర్తు చేశారు. వీరికి కూడా ఒడిశా ప్రభుత్వం పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ రహదారిపై బీజేడీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ చంద్ర మజ్జి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భుజబల్ మజ్జి, కెమరాజ్ బాగ్, హరావతి గొండో తదితరులు బైఠాయించి నిరసన తెలియజేశారు. మరోవైపు ఉమ్మర్‌కోట్ డివిజన్ నుంచి ఉపాధి కోసం తెలంగాణా వెళ్తున్న వారు వరుస ఘటనలో మృత్యువాత పడుతున్నారు. ఇటీవల రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు దుర్మరణం చెందడంతో కార్మికుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన సుమారు 50 వేల మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్నట్లు అంచనా. అందులో అత్యధికులు తెలంగాణా రాష్ట్రంలోనే పని చేస్తున్నారు. -
పూరీ జగన్నాథ ఆలయం కూల్చేస్తాం
భువనేశ్వర్ : పూరీ జగన్నాథుని మందిరం కూల్చేస్తామని ప్రాకార గోడల మీద ఉగ్రవాద బెదిరింపు రాతలు తీవ్ర కలకలం రేపాయి. వీటిని ఉగ్రవాద రాతలుగా భావిస్తున్నారు. బుఢి మా మందిరం గోడపై రెండు చోట్ల ఈ రాతలు కనిపించాయి. దీంతో ఆలయ పరిసరాలలో భద్రత పటిష్టం చేశారు. గోడపై రాసిన రాతల్లో సూచించిన నంబర్‌కు ఫోన్ చేయమని భద్రతా వర్గాలకు సవాల్ విసరడం గమనార్హం. ఈ రాతల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు సైతం చోటు చేసుకుంది. ఇది ఎవరు ఎందుకు చేశారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి భువనేశ్వర్: పశుమాంసం రవాణా చేస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. రౌర్కెలా నుంచి సంబలపూర్కు పశువుల మాంసం తరలిస్తుండగా జమ్మొబహల్ సమీపంలో కారు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరి దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి కేసులో తీర్పు వెల్లడి ● నిందితుడు నిర్ధోషి రాయగడ: గంజాయి అక్రమ రవాణా కేసులో తీర్పు వెలువడింది. కేసును విచారించిన గుణుపూర్ ఏడీజేఎం దేవదత్త పట్నాయక్ నిందితుడు నిర్ధొషిగా తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే 2024 జూన్ 21వ తేదీన గుణుపూర్ సమితి భీమాపూర్ కూడలిలో రెండు బస్తాలతో ఉన్న 40 కిలోల గంజాయిని అబ్కారీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో పట్టుకున్నారు. గంజాయి రవాణాతో సంబంధం ఉందంటూ ప్రశాంత్ మాఝి అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసు విచారణకు రావడంతో సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితుడు ప్రశాంత్ మాఝి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సరైన సాక్ష్యాధారాలు లేకపొవడంతో కేసును ఏడీజేఎం కొట్టివేయడంతోపాటు ప్రశాంత్ మాఝి నిర్ధోషని తీర్పునిచ్చారు. హరిజన పద ప్రయోగం వద్దు భువనేశ్వర్: రాష్ట్రంలో అన్ని విభాగాలు, శాఖలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, సమాచార వ్యవహారాల్లో ‘హరిజన్’ అనే పద వినియోగం, ప్రయోగం నివారించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదం బదులుగా రాజ్యాంగబద్ధమైన ‘షెడ్యూల్డ్ క్యాస్ట్’ను ఆంగ్లంలో , ఒడియాలో దాని తగిన అనువాదాన్ని ఉపయోగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర షెడ్యూల్డ్ తెగలు, కులాల అభివృద్ధి, బలహీన – వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ బస్సును ఢీకొట్టిన వ్యాన్ ● విద్యార్థులకు స్వల్పగాయాలు రాయగడ: అదుపుతప్పిన పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతినగా.. అందులో ఉన్న విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సదరు సమితి అమలాభట్ట వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న చందిలి పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్‌ను స్వాధీనం చేసుకోగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 50 మంది విద్యార్థులతో పెంట గ్రామం వైపు బస్సు వస్తున్న సమయంలో జేకేపూర్ నుంచి లెరువలి వైపు వెళుతున్న పికప్ వ్యాన్ అమలాభట్ట కూడలిలో అదుపుతప్పి బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
మహిళల భద్రతకు ప్రాధాన్యం
భువనేశ్వర్: మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై బుధవారం లోక్ సేవా భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. ● మహిళల భద్రతలో తప్పిదాల్ని ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసులు త్వరితగతిన ప్రతిస్పందించి పటిష్టమైన పర్యవేక్షణతో సత్వర కార్యాచరణకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ● పాఠశాలలు, కళాశాలల సమీపంలో పోలీసులు పహారా కాయాలని అవాంఛనీయ సంఘటనలు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ● గత ఏడాది 8,035 మంది మహిళలు, 3,306 మంది బాలికలను పలు విపత్కర పరిస్థితుల్లో రక్షించారని, ఈ చర్యలు మరింత ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. ● పొరుగు రాష్ట్రాల నుంచి బ్రౌన్ షుగర్ వంటి మాదకద్రవ్యాల రవాణా కట్టడి కట్టుదిట్టం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ద్రవ్యాల రవాణా గొలుసు వ్యవస్థని ఛేదించేలా వ్యూహాత్మక చర్యలతో పోలీసులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ● బలమైన పోలీసు దళం కోసం ఖాళీ ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు కొత్త పోలీసు నియామక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ● గంజాయి సాగు, సంబంధిత అక్రమ రవాణాపై చర్యలను అడ్డుకోవాలని సూచించారు. ● అక్రమ ఆయుధ వ్యాపారం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం, బెయిల్ లేని వారెంట్లను అమలు చేయడంలో పోలీసుల చర్యలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. నిందితులను ఉపేక్షించవద్దు శాంతిభద్రతల సమీక్షలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ -
ఆర్టీసీ బస్సు బోల్తా
రాయగడ: పూరీ నుంచి కోట్పాడ్కు వెళ్తున్న ఓఎస్ఆర్టీసీ బస్సు జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధి అకుసింగి వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యింది. బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పద్మపూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి పద్మపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరాతీస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కోట్పాడ్ వెళ్లేందుకు పూరీలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు బస్సు బయలు దేరింది. ఈ సమయంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యలో ఒక డాబావద్ద బస్సును నిలిపి ప్రయాణికులు భోజనాలు చేసిన అనంతరం అక్కడ నుంచి తిరిగి అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరింది. ఈ క్రమంలోనే పద్మపూర్ సమీపంలోని అకుసింగికి బస్సు చేరే క్రమంలో బుధవారం వేకువ జామున మూడు గంటల సమయంలో బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి బోల్తా పడింది. మద్యం మత్తులో డ్రైవర్ డాబా వద్ద బస్సును ఆపిప్పుడు డ్రైవరు మద్యం తాగినట్టు కొందరు ప్రయాణికులు ఆరోపించారు. మద్యం మత్తులో బస్సును డ్రైవర్ నడపడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పెద్ద శబ్దంతో బస్సు బోల్తాపడడంతో భయంతో కేకలు వేశామని చెప్పారు. సెల్ఫోన్ల టార్చ్లైట్ల సహాయంతో బస్సు లోపల నుంచి ప్రాణాలతో బయటకు వచ్చామన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన పది మందిని అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద బయటకు తీయగలిగారని చెప్పారు. పది మందికి గాయాలు -
మత్తు పదార్థాలతో జీవితం చిత్తు
పర్లాకిమిడి: మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు సేవించడం జీవితం నాశనమవుతుందని ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా అన్నారు. జిల్లా నుంచి గంజాయి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోందని, ఈ ప్రాంతంలో 0.5 శాతం మాతం గంజాయి వినియోగిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. స్థానిక సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో బుధవారం మత్తు పదార్థాల విముక్తి భారత్ అభియాన్ నిర్వహించారు. కలెక్టర్ మధుమిత, జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, సబ్ కలెక్టర్ అనుప్ పండా, డీన్ (అగ్రికల్చర్) ఎస్.పి.నందా, డైరక్టర్ (అడ్మిషన్) దుర్గాప్రసాద్ పాఢి, సామాజిక భధ్రత, దివ్యాంగుల సాధికారత శాఖ అధికారి ఎల్.సంతోష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు విద్యార్థులు చదువులో ఒత్తిడి వల్ల మాదకద్రవ్యాలైన గంజాయి, సిగరెట్లు, ఛరాస్ సేవనం వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగినా తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వార్డెన్లు, అధ్యాపకులు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయాలన్నారు. తాను యూట్యూబ్, ఇన్‌స్టామ్‌గ్రామ్ వేదికగా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నానని చెప్పారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీన్ రితీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ మధుమిత బీటెక్ (అగ్రికల్చర్)విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. -
కలక్టర్ దృష్టికి డొంగిరియాల సమస్యలు
రాయగడ : కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని ఆదిమతెగకు చెందిన డొంగిరియా ఆదివాసీలు మంగళవారం భేటీ అయ్యారు. జిల్లాలోని బిసంకటక్ సమితి కుర్లి పంచాయతీ, మునిగుడ సమితి మునిఖొల్ పంచాయతీ, కల్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీలకు చెందిన డొంగిరియా ప్రజలు తమ ప్రాంత సమస్యలను వివరించారు. నియమగిరి పర్వత ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా తమకు అందడం లేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో సమాజ సేవకుడు, డొంగిరియా తెగ ప్రతినిధి జితు జకసిక తదితరులు పాల్గొన్నారు. -
విజిలెన్స్ వలలో సీహెచ్‌సీ ఆరోగ్య కార్యకర్త
రాయగడ: జిల్లాలోని మునిగుడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న కుంజో బిహారి రౌత్ విజిలెన్స్ వలలో చిక్కుకున్నారు. సీహెచ్‌సీలో జన్మధృవపత్రం మంజూరు చేయడంలో భాగంగా ఒకరి నుంచి మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా కొరాపుట్ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు రౌతుకు సంబంధించి మునిగుడకు వెళ్లే రహదారిలోని డుకుం గ్రామంలో ఉన్న ఇళ్లల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సీహెచ్‌సీలో బర్ట్ సర్టిఫికెట్ పొందాలంటే అందుకు ఆరు వేల రుపాయల లంచాన్ని రౌత్ ఒక రైతు వద్ద డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా మొదట మూడు వేల రూపాయలను కొద్దిరోజుల క్రితం ఆరోగ్య కార్యకర్తకు రైతు చెల్లించాడు. మిగతా మూడు వేల రూపాయలు చెల్లిస్తేగాని ధృవపత్రం ఇచ్చేదిలేదని మొండికేసి చెప్పడంతో బాధితుడు గత్యంతరం లేక విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు బుధవారం మూడు వేల రూపాయలను ఆరోగ్య కార్యకర్త కుంజొ బిహారి రౌత్‌కు అందజేస్తుండగా విజిలెన్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడితో రాష్ట్ర ప్రముఖుల భేటీ
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశంలో ఒడిశా అగ్ర నాయకత్వం భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, మంత్రులు డాక్టర్ ముఖేష్ మహాలింగ్, గణేష్ రామ్‌సింగ్ ఖుంటియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సునీల్ బన్సాల్, వినోద్ తావ్డే సమన్వయంలో జరిగిన ఈ సమావేశంలో ఒడిశా అభివృద్ధి రోడ్ మ్యాప్, పార్టీ సంస్థాగత ప్రాధాన్యతలపై చర్చించారు. బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆరోగ్య శాఖ, అటవీ పర్యావరణ విభాగం, పట్టణాభివృద్ధి, యువజన వ్యవహారాలు, క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రులు వర్చువల్‌గా సమావేశంలో పాలుపంచుకున్నారని ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తెలిపారు. -
ఎన్నికలకు ముందే పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ
● మంత్రి రబీ నాయక్ భువనేశ్వర్: రాష్ట్రంలో పంచాయతీలను పునర్ వ్వవస్థీకరించాలని నిర్ణయించామని రాష్ట్ర పంచాయతీరాజ్, రక్షిత మంచినీటి విభాగం మంత్రి రబీ నాయక్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ ప్రతిపాదన మేరకు పంచాయతీలను బలోపేతం చేయడానికి 2027 సంవత్సరానికి ముందుగానే పునర్నిర్మిస్తామన్నారు. అలాగే 2029 సంవత్సరానికి ముందుగానే కొత్త మండలాలు ఏర్పాటు అవుతాయన్నారు. పంచాయతీరాజ్, తాగునీరు శాఖల సమీక్ష సమావేశంలో మంగళ వారం రాష్ట్ర గవర్నర్ పంచాయతీల పెంపు ప్రతిపాదించారన్నారు. పంచాయతీరాజ్ చట్టం కింద పంచాయతీని బలోపేతం చేయాలని గవర్నర్ ప్రతిపాదించారని మంత్రి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తారన్నారు. వీటి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల మేరకు కొత్త పంచాయతీలు, మండలాల రూపురేఖలు ఖరారు చేస్తారని మంత్రి వివరించారు. -
● సీసీ కెమెరాలు ఏర్పాటు
జయపురం: మున్సిపాలిటీ పరిధి పారాబెడ ప్రాంతం సంతోషిమానగర్‌లో తరచూ జరుగుతున్న దొంగతనాలు, అసాంఘిక శక్తుల ఆగడాలపై నిఘా పెట్టేందుకు ఎట్టకేలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికోసం జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు. సీసీ కెమెరాలను ఎమ్మెల్యే బాహిణీపతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంతోషిమానగర్‌లో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు పార్క్ ఏర్పాటుకు సహకరిస్తానని తెలియజేశారు. సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్య రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాంతి భధ్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపడుతుందని సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కవాసీ వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నరేంద్ర కుమార్ మహంతి, కమిటీ అధ్యక్షుడు ప్రశాంత పండ, సురమ మహాపాత్రో, ప్రకాశ మిశ్ర, రామనాథ్ సాహు, అజయ మిశ్ర, చంద్రశేఖర మిశ్ర, అజయ పాడి, ప్రదీప్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. -
● క్లర్క్ ఉద్యోగుల ధర్నా
మల్కన్‌గిరి: జిల్లాలోని ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట మరోసారి మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా క్లర్క్ సంఘాలు అనేక సార్లు సమావేశమై సమస్యలు గురించి అధికారులకు తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకుంటే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి దిలీప్ నాయక్ టుకుణా పడియారి, రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు శ్యామ్ సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణదాతలకు సలాం!
పునర్జన్మ అవయవదానం మహోన్నతమైనది. ఒకరు దానం చేస్తే 8 మందికి పునర్జన్మ దక్కుతుంది. జిల్లాలో అవయవదానాలు పెరుగుతుండడం శుభపరిణామం. అయితే చాలామందిలో అపోహలు ఉన్నాయి. అయితే ఆపదకాలంలో ఉన్నవారికి తమవారి అవయవాలు దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. – ఫారుక్ హూస్సేన్, వైద్యాధికారి, హిరమండలం పీహెచ్సీ ● ఈ నెల 7న ఒడిశాలోని రాణిపేట గ్రామానికి చెందిన లెంక రవణమ్మ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. కుటుంబసభ్యులు రాగోలు జెమ్స్‌కు తీసుకురాగా బ్రెయిన్‌డెడ్‌గా చెప్పారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమె అవయవదానానికి అంగీకరించారు. దీంతో గ్రీన్‌చానెల్ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. ● జూలై 29న కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన పినిమింటి శ్రీరామ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే రాగోలు జెమ్స్‌కు తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్‌డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్‌చానెల్ ద్వారా అవయవాలను తరలించారు. -
‘ఉద్దానంలో విధ్వంసం సహించబోము’
మందస: కార్గో ఎయిర్ పోర్టు పేరుతో ఉద్దానంలో విధ్వంసం చేస్తే సహించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా ఎం.గంగువాడ నుంచి రాంపురం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ కార్గో ఎయిర్ పోర్టు పేరుతో బలవంతంగా భూములు తీసుకోవడం వల్ల ఇక్కడి ప్రజలు నిరాశ్రయులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు అయిన ఢిల్లీ కార్గో ఎయిర్ పోర్టుకి కేవలం 150 ఎకరాలు మాత్రమే ఉందని ఇక్కడ కార్గో ఎయిర్ పోర్టుకి 1400 ఎకరాలు ఎవరి ప్ర యోజనం కోసం కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ప్రముఖ ఎయిర్‌పోర్టులకు అనుంబంధంగానే కార్గో ఎయిర్‌పోర్టులు ఉన్నాయని, ఇక్కడెందుకు ప్రత్యేకంగా కార్గోను నిర్మిస్తున్నారని నిలదీశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం ప్రజల భూములు లూటీ చేస్తారా అని ప్రశ్నించారు. -
రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు
పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వలన రాష్ట్రంలోని రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సంఘటన్ అధ్యక్షుడు అభయ్‌కుమార్ సాహు అన్నారు. స్థానిక తెలుగు సొండివీధి కాంగ్రెస్ భవన్లో రైతుల పక్షాన సమర్ధన, కృషక్ ప్రిపరేటరీ సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు, సకాలంలో యూరియా అందడం లేదని మండిపడ్డారు. సకాలంలో సబ్సిడీ ఎరువులు అందజేయకపోవడం వల్ల బర్ఘడ్, సంబల్పూర్ జిల్లాల్లో యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్‌కు చేరుతున్నాయని విమర్శించారు. అలాగే 55 ఏళ్లు నిండిన రైతులకు రూ.10 వేల భృతి అందజేయాలని, వారిని ఫసల్ బీమా యోజనలో చేర్చాలని, అలాగే రైతులకు స్వస్థ్య బీమా కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. రానున్న అక్టోబర్, నవంబర్ మాసాల్లో గజపతి జిల్లా స్థానిక సమస్యలతో పాటు ప్రాంతీయ సమస్యలపై వివిధ సమితి కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, తూర్పు ఒడిశా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు స్థితికాంత మహంతి, నార్త్ కాంగ్రెస్ నాయకులు తపన్ మిశ్రా, రతన్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా తదితరులు పాల్గొన్నారు. -
● పెద్ద మనసు
రాయగడ: పుట్టినరోజు అంటే విందూ, వినోదాలతో సరదాగా గడిపేవారిని చూసుంటాం. అయితే సదరు సమితి పెంట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త దూడల శ్రీనివాస్ తన పుట్టినరోజు పురస్కరించుకొని చేపట్టిన సేవా కార్యక్రమం అందరి ప్రశంసలు పొందింది. ఆయన తన మిత్రులు, ఆత్మీయులతో కలిసి తాము నివసిస్తున్న పెంట (అమలాభట్ట) ప్రాంతం నుంచి కొత్తపేట వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి జాతీయ రహదారిలో గుంతలను సొంత ఖర్చులతో పూడ్చి వేసేందుకు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలిచారు. రాయగడ నుంచి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, బరంపురం వంటి ప్రధాన నగరాలకు వెళ్లేందుకు ఈ జాతీయ రహదారే ముఖ్యం. నిత్యం వందలాదిమంది ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ రహదారిలో ఉన్నటువంటి గుంతలను సిమెంటు కాంక్రిట్‌తో పూడ్చి వేశారు. సహకరించాల్సిందిగా చందిలి పోలీసులకు ముందస్తుగా తెలియజేయడంతో పోలీసులు తమ సహకారాన్ని అందించారు. దీంతో దూడల శ్రీనివాస్‌ను స్థానికులు, వాహన చోదకులు అభినందించారు. -
అధికారుల పనితీరుపై నిఘా
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, సిబ్బంది పనితీరుపై పటిష్ట నిఘా పెట్టనుంది. దీనిలో భాగంగా ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక లోక్‌సేవా భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన మంగళవారం ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు కల్పించడంలో జాప్యం నివారణ, ప్రభుత్వ పథకాల అమలు, కార్యాచరణ బలోపేతం చేసే దిశలో 10 ప్రధాన అంశాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్ని కార్యాలయాల్లో ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యదర్శులకు సూచనలు ● సీఎం కార్యాలయం నుంచి వచ్చే యూఐ నోట్స్‌పై తక్షణమే స్పందించాలి. ● అధికారులు సకాలంలో విధులకు హాజరవ్వాలి. ● అధికారులు పనితీరు మెరుగుపరచుకునేందుకు పూర్తి అవకాశం కల్పించాలి. ఆ తర్వాత కూడ తీరు మారకుంటే అనివార్య విరామం (సీఆర్ఎస్) మంజూరు. ● అన్ని జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కృత్రిమ మేధసు (ఏఐ) కెమెరాలు ఏర్పాటు. ● ప్రజలకు సేవలు అందించడంలో జాప్యాలు పర్యవేక్షించబడతాయి. అక్టోబర్ నుంచి ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డు ప్రారంభం. ● ప్రతినెలా 7వ తేదీన జిల్లా కలెక్టర్ కేంద్ర పథకాల అమలు, కార్యాచరణను సమీక్షిస్తారు. ● అటవీ, పర్యావరణ మరియు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు ప్రతినెలా 12వ తేదీన సమీక్షిస్తాయి. ● బడ్జెటు నిధుల సద్వినియోగంతో ఆదాయం పెంపుదలపై అన్ని విభాగాలు దృష్టిని కేంద్రీకరించాలి. ● క్షేత్ర సందర్శనలపై అధికారులు దృష్టి పెట్టాలి. సీఎస్ మనోజ్ ఆహుజా