breaking news
National
-
2026లో తొలి సూర్యోదయం.. ఢిల్లీ నుంచి పూరీ వరకూ..
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలంతా సరికొత్త ఆశలు, ఉత్సాహం, భక్తి భావాల మధ్య 2026కు ఘనంగా స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అస్సాంలోని గౌహతిలో ఆవిష్కృతమైన ఈ ఏడాది తొలి సూర్యోదయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లవారుజామున ఆకాశంలో పరుచుకున్న తొలి కిరణాలు ఒక సరికొత్త ఆరంభానికి ప్రతీకగా నిలిచాయి. దీనికి సంబంధించిన విజువల్స్‌ను ఏఎన్ఐ (ఏఎన్ఐ) షేర్ చేసింది. ఆధ్యాత్మిక ప్రార్థనలు, వేడుకల కోలాహలం మధ్య దేశ ప్రజలు నూతన ప్రయాణాన్ని అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు. ఏ ప్రాంతంలో వేడుకలు ఎలా జరిగాయనే వివరాల్లోకి వెళితే.. #WATCH | Assam | First sunrise of 2026 as seen from Guwahati pic.twitter.com/43vidO5R46— ANI (@ANI) January 1, 2026దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వేడుకలు జరుగుతున్నాయి. దాదాపు 20,000 మంది పోలీసుల పహారా కొనసాగుతోంది. నిఘాను మరింతగా పెంచి, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను పోలీసులు అరికట్టారు. మంచు కురుస్తున్న కశ్మీర్ లోయలో పర్యాటకుల సందడి నెలకొంది. గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాలు పర్యాటకులతో నిండిపోయాయి. శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద జరిగిన వేడుకలు కొత్త ఏడాదికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.#WATCH | Odisha | First sunrise of 2026 as seen from Puri pic.twitter.com/zjbIPss7FY— ANI (@ANI) January 1, 2026దేశంలోని మెట్రో నగరాల్లో పటిష్టమైన నిఘా నీడలో వేడుకలు జరిగాయి. ముంబై మహానగరంలో మెరైన్ డ్రైవ్, జుహు బీచ్ వంటి ప్రాంతాల్లో 17,000 మందికి పైగా సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు. మహిళలు, పిల్లల రక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బెంగళూరులో కూడా 20,000 మంది పోలీసుల కాపలా మధ్య నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పౌరులు సంయమనం పాటిస్తూ, ఉత్సవాల్లో పాల్గొనేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.#WATCH | Fireworks illuminate the night sky in Goa and people welcome #NewYear2026 pic.twitter.com/ZToByiyYxM— ANI (@ANI) December 31, 2025ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో కొత్త ఏడాది వేడుకలు భక్తి భావంతో మొదలయ్యాయి. ప్రసిద్ధ దశాశ్వమేధ ఘాట్‌లో 1,001 దీపాలను వెలిగించి, నిర్వహించిన గంగా హారతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ప్రయాగ్‌రాజ్, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలలో కూడా వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పూజలు నిర్వహించి నూతన ఏడాదిని ప్రారంభించారు.తూర్పు తీరాన ఉన్న పూరీ క్షేత్రం భక్త జన సంద్రంలా మారింది. జగన్నాథుని ఆశీస్సుల కోసం దాదాపు 3.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఎస్పీ ప్రతీక్ సింగ్ నేతృత్వంలో 2,100 మంది సిబ్బందితో కూడిన 70 ప్లాటూన్ల బలగాలను ఆలయ పరిసరాల్లో మోహరించారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచడమే కాకుండా, సముద్ర తీరంలో భక్తుల రక్షణ కోసం 300 మంది లైఫ్‌గార్డులను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: ‘ఆర్డర్ల’ సునామీ.. బిర్యానీలే కాదు, ఐఫోన్లు, బంగారు నాణేలు కూడా.. #WATCH | Dubai, UAE | Mesmerising fireworks, and a light and sound show illuminate the Burj Khalifa as the world rings in #NewYear2026 Source: Emaar pic.twitter.com/ir9rJHlp4k— ANI (@ANI) December 31, 2025 #WATCH | Varanasi, UP | Morning prayers being performed at Kashi Vishwanath Temple on the first day of #NewYear2026 Source: Kashi Vishwanath Temple Trust pic.twitter.com/q42QbqIlht— ANI (@ANI) January 1, 2026 -
గోవాలో చిల్ అవుతున్న సారా.. చేతిలో బీర్ బాటిల్..
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ప్రస్తుతం గోవా వెకేషన్లో ఉన్నారు. గోవా ట్రిప్‌లో సారా.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.గోవాలో పబ్లిక్‌గా బీరు బాటిల్‌తో సారా కనిపించడం విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో వీడియో ప్రకారం.. సారా టెండుల్కర్ తన ఫ్రెండ్స్‌తో గోవా వీధుల్లో వెళ్తున్నారు అటుగా వెళ్తున్న ఓ బైకర్.. వారికి వీడియో తీశారు. అయితే, ఆ సమయంలో సారా చేతుల్లో బీర్ బాటిల్ ఉండటం గమనార్హం. దీంతో సారా టెండూల్కర్ బీర్ తాగుతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కూతురి ప్రవర్తన ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సారాకు మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ కాలంలో మందు తాగడం చాలా కామన్ గురూ అని కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. ఎంజాయ్ చేయాలి బ్రో అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఇక మరి కొంతమంది తాగడం అవసరమా అని నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. అయితే, సచిన్ మాత్రం ‘తాను ఎప్పుడూ మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. Sachin Tendulkar : I will never promote alcohol and tobacco.Le his daughter Sara on streets of Goa with 🥲: pic.twitter.com/QDeQ8YGMoW— Career247Official (@Career247Offici) December 31, 2025ఇక, సారా టెండుల్కర్ హీరోయిన్‌కు మించిన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. ఆమె నిత్యం ఏదో ఒక ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.Sara Tendulkar chilling with a budwiser in Goa.#ShubmanGill #SaraTendulkar pic.twitter.com/QL8sATkFS2— AuraFarmer (@TheCricPundit) December 31, 2025 Sara Tendulkar isn’t going viral today because she is someone’s daughter,but because her simplicity, confidence, and grace truly resonate with people.There is a lot of noise on social media,but what is natural is what really reaches the heart. pic.twitter.com/AFW4C86RlY— Shalini Singh (@Bahujan_Era) December 24, 2025 -
‘ఆర్డర్ల’ సునామీ.. బిర్యానీలే కాదు, ఐఫోన్లు, బంగారు నాణేలు కూడా..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలు 2026 నూతన సంవత్సర సంబరాల్లో మునిగితేలుతున్నారు. నిన్న అర్థరాత్రి కొత్త సంవత్సరాన్ని స్వాగతించిన జనం డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy)కి కాసుల వర్షం కురిపించాయి. డిసెంబర్ 31 రాత్రి భారతీయులు పీక్ స్టేజ్‌లో ఫుడ్ ఆర్డర్లు చేస్తూ రికార్డులు సృష్టించారు. అయితే కేవలం ఆహార పదార్థాలే కాకుండా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా భారీగా ఆర్డర్ చేయడం గమనార్హం.డిసెంబర్ 31 రాత్రి వేళ తమకు వచ్చిన ఆర్డర్ల గురించి స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో ఎప్పటిలానే బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. స్విగ్గీ నిమిషానికి వందల సంఖ్యలో బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసింది. అయితే ఈసారి ప్రజలు కేవలం ఆహారానికే పరిమితం కాకుండా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేశారు. వేడుకల సమయంలో పలువురు ఏకంగా ఐఫోన్లను, బంగారు నాణేలను, స్మార్ట్ వాచ్‌లను కూడా ఆర్డర్ ఇచ్చారు. ఒకే రోజులో ఇన్ని రకాల విభిన్న వస్తువుల ఆర్డర్లు రావడం ఆశ్చర్యపరిచేదిగా మారింది. abhi 7:30 bhi nahi baje hai aur 2,18,993 biryanis order ho chuki hai. king fr 👑— Swiggy Food (@Swiggy) December 31, 2025గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాత్రి 8 గంటల సమయానికే స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితరత నగరాల్లో ఆర్డర్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కండోమ్స్, పార్టీ స్నాక్స్, కూల్ డ్రింక్స్, పూల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. డెలివరీ బాయ్స్ విరామం లేకుండా పనిచేస్తూ వేల సంఖ్యలో ఆర్డర్లను వినియోగదారులకు అందించారు.వినియోగదారుల నుండి వచ్చిన ఈ భారీ డిమాండ్‌ను తట్టుకునేందుకు స్విగ్గీ ముందస్తుగానే తగిన ఏర్పాట్లు చేసుకుంది. యాప్ క్రాష్ కాకుండా సంస్థ సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షించాయి. అత్యధిక రద్దీ ఉన్న సమయాల్లో కూడా డెలివరీ ఆలస్యం కాకుండా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. వేడుకల సమయాల్లో కస్టమర్ల అవసరాలను తీర్చడంలో.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ నూతన సంవత్సర ఆర్డర్లు నిరూపించాయి.ఆశ్చర్యపరిచే ఆర్డర్లు2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చాలామంది క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయించారు. ‘స్విగ్గీ’కి రాత్రి 7:30 గంటలకే రికార్డు స్థాయిలో 2,18,993 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. రాత్రి 9:30 గంటల సమయానికి 90,000 కంటే ఎక్కువ బర్గర్లు, 7,573 గజర్ కా హల్వా ఆర్డర్లు అందాయి. ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతూ, 4,244 మంది ఉప్మాను, బెంగళూరులో 1,927 మంది సలాడ్లను, 9,410 మంది కిచిడీని ఆర్డర్ చేశారు. బెంగళూరులో ఒక వినియోగదారుడు ₹1.8 లక్షల విలువైన రెండు ఐఫోన్లను, ముంబైలో మరొకరు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేశారు.ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో ‘ఫైనల్ ఇమేజ్- 2025’ హంగామా -
అడుగడుగునా ఉల్లంఘనలే
పనాజీ: గోవా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం, 25 మంది మరణంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మేజిస్టీరియల్ విచారణ పూర్తయ్యింది. నివేదికను అధికారులు బుధవారం బహిర్గతం చేశారు. డిసెంబర్ 6న ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బిర్చ్ బై రోమియో లేన్’లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ క్లబ్‌ను ఉప్పునీటి కయ్యపై చట్టవిరుద్ధంగా నిర్మించినట్లు విచారణలో తేలింది. చెల్లుబాటయ్యే ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడయ్యింది. అంతేకాకుండా అక్కడ ఎన్నో లోపాలు ఉన్నాయని, అవన్నీ చివరకు అగ్ని ప్రమాదానికి దారి తీశాయని విచారణ నివేదిక పేర్కొంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిసినప్పటికీ నైట్‌క్లబ్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలియజేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే బాణాసంచాను కాల్చారని వెల్లడించింది. అక్కడ ఫైర్ సెఫ్టీ పరికరాలు కూడా తగినంత లేవని గుర్తించినట్లు తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి నైట్‌క్లబ్‌లో అత్యవసర ద్వారాలు లేవని, అందుకే మరణాల సంఖ్య పెరిగినట్లు స్పష్టంచేసింది. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను క్లబ్ యాజమాన్యం ఫోర్జరీ చేశారని వెల్లడించింది. గడువు ముగిసినా పునరుద్ధరించుకోలేదు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మెజిస్టీరియల్ నివేదికను అధికారులు సమర్పించారు. నైట్‌క్లబ్‌కు 2023 డిసెంబర్ 16న అర్పోరా గ్రామ పంచాయితీ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఇచ్చినట్లు నివేదిక తెలియజేసింది. ఈ లైసెన్స్ కాలపరిమితి 2024 మార్చి 31న ముగిసిపోగా, ఆ తర్వాత పునరుద్ధరించుకోలేదని వెల్లడించింది. గోవా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 72ఏ ప్రకారం ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపార సంస్థను మూసివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయినప్పటికీ నైట్‌క్లబ్ విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు తప్పుపట్టింది. చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవమేనని గ్రామ సర్పంచ్ రోషన్ రెద్కార్ మేజిస్ట్రేట్ ఎదుట అంగీకరించారు. ఇదిలా ఉండగా, విచారణ నివేదికను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
రామ జన్మభూమి ఉద్యమం మహోన్నత గాథ
అయోధ్య: దేశంలో రామ జన్మభూమి ఉద్యమం ఒక మహోన్నత గాథ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివరి్ణంచారు. ఈ ఉద్యమం భవిష్యత్తుకు పునాది వేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శ్రీరాముడి ఆశయాల మేరకు మన దేశం నడుచుకున్నట్లు వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బుధవారం భవ్య రామమందిర ప్రాణప్రతిష్ట రెండో వార్షికోత్సవంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. గర్భాలయంలో బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ మందిరం ప్రాంగణంలోని అన్నపూర్ణ ఆలయంపై ధ్వజారోహణ గావించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ సనాతన సంప్రదాయాలను అంతం చేయడానికి విదేశీ దురాక్రమణదారులు ఎన్నో కుట్రలు సాగించారని చెప్పారు. అయినప్పటికీ నేడు రామ మందిరంపై కాషాయ ధ్వజం సగర్వంగా రెపరెపలాడుతూ నాగరికత కొనసాగింపు సందేశాన్ని ఇస్తోందని హర్షం వ్యక్తంచేశారు. వినమ్రతకు, మంచితనానికి మారుపేరైన శ్రీరాముడు అవసరమైతే దుషు్టలను అంతం చేయడానికి ఉగ్రరూపం కూడా దాలుస్తాడని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రాముడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లామని స్పష్టంచేశారు. రాముడి అసలు లక్ష్యం రావణుడిని అంతం చేయడం కాదని.. అధర్మాన్ని నిర్మూలించడమేనని అన్నారు. అదే తరహాలో ఉగ్రవాదులకు, వారి పోషకులకు బుద్ధి చెప్పడమే మన ధ్యేయమని వెల్లడించారు. ఆధునిక భారతదేశం సంఘర్షణల్లోనూ ‘మర్యాద’కు కట్టుబడి ఉంటుందన్నారు. అయోధ్యలో రాముడు కొలువుదీరడం కళ్లారా చూస్తున్నామని, అది మనకు గొప్ప సంతృప్తి ఇస్తోందని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. దశాబ్దంలో అయోధ్యలో పెనుమార్పులు: యోగి ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత దశాబ్దకాలంలో అయోధ్యలో పెనుమార్పులు వచ్చా యని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చె ప్పారు. గతంలో కొందరు వ్యక్తులు, మతోన్మాదు లు అయోధ్యను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. రామమందిర ప్రాణప్రతిష్ట రెండో వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. రామ జన్మభూమి ఉద్యమంలో రాజ్‌నాథ్ సింగ్ చురుకైన పాత్ర పోషించారంటూ ప్రశంసించారు. 500 ఏళ్ల తర్వాత రామ మందిరం సాకారం కావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని పేర్కొన్నారు. నగరానికి గతంలో తరచుగా ఉగ్రవాద బెదిరింపులు వచ్చేవని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరం పూర్తి సురక్షితంగా మారిందన్నారు. గత ఐదేళ్లలో 45 కోట్ల మంది భక్తులను అయోధ్యను దర్శించుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.మన విశ్వాసం, సంప్రదాయాల వేడుక: మోదీ అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది మన విశ్వాసం, సంప్రదాయాల మహోన్నత దైవిక వేడుక అని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ విదేశాల్లోనికోట్లాది మంది రామ భక్తుల తరఫున అయోధ్య రాముడి పాదపద్మాలకు వినమ్రంగా నమస్కరిస్తున్నట్లు ఉద్ఘాటించారు. రాముడి ఆశీస్సులతో ప్రజలకు శుభాలు చేకూరాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఐదు శతాబ్దాల ప్రజల సంకల్పం రెండు సంవత్సరాల క్రితం నెరవేరిందని వివరించారు. రామ్‌లల్లా ప్రతిష్ట ద్వాదశికి ఆలయంపైనున్న ధర్మధ్వజం ఒక ప్రతీకగా నిలుస్తోందన్నారు. గత నెలలో జరిగిన ధర్మధ్వజ వేడుకలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హృదయం సేవ, అంకితభావం, కరుణ అనే భావనలతో నిండిపోవాలని, స్వయం సమృద్ధ భారత్‌కు అదే పునాది అని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. -
ప్రగతికి ’త్రి’ఫార్మ్స్: మోదీ
న్యూఢిల్లీ: ‘దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలంటే సంస్కరణలు (రిఫార్మ్), పనితీరు (పర్ ఫార్మ్), రూపాంతరణ (ట్రాన్స్ ఫార్మ్) చాలా ముఖ్యం. అవే ప్రగతి మంత్రం‘ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) 50వ భేటీ బుధవారం ఢిల్లీలో మోదీ అధ్యక్షతన జరిగింది. గత పదేళ్లలో కనీసం రూ.85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులోనూ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. రూ.40 వేల కోట్లకు పైగా విలువైన ఐదు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ సందర్భంగా సమీక్షించారు. వీటిలో భాగంగా ఐదు రాష్ట్రాల పరిధిలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్, జల వనరులు, బొగ్గు వంటి రంగాల్లో పనులు చేపడుతున్నారు. పీఎం శ్రీ పథకం పనితీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మోదీ సూచించారు. రాష్ట్రాల్లోని ఇతర స్కూళ్లన్నింటికీ పీఎం శ్రీ స్కూళ్లు ఆదర్శ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. ‘సకాలంలో నిర్ణయాలు,, మెరుగైన సమన్వయం, జవాబుదారీతనం, వేగవంతమైన ప్రభుత్వ పనితీరు ఎంతటి సత్ఫలితాలను సాధిస్తా యో మా పాలనే ప్రజలకు చెబుతోంది. గుజరాత్ సీఎంగా ఉండగా స్వాగత్ పేరిట నేను అమలు చేసిన ప్రాజెక్టు తాలూకు అనుభవమే ప్రగతి వేదికకు మూలం‘ అని మోదీ గుర్తు చేసుకున్నారు. -
ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: శత్రు భీకర ప్రళయ్ క్షిపణులను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఒడిశా తీర సమీపంలో రెండు క్షిపణులను వెంటవెంటనే ప్రయోగించినట్టు సంస్థ వెల్లడించింది. ప్రళయ్ 150 నుంచి 500 కి.మీ.ల స్వల్ప శ్రేణి సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి. 500 నుంచి 1,000 కిలోల సంప్రదాయ పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. మేకిన్ ఇండియా మిషన్‌లో భాగంగా దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. పూర్తిస్థాయి కచ్చితత్వం ప్రళయ్ క్షిపణుల ప్రత్యేకత. ఇందులో అమర్చిన అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థే అందుకు కారణం. పరీక్షను విజయవంతం చేసినందుకు డీఆర్డీఓ, వాయుసేన, సైన్యంతో పాటు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందనలు తెలిపారు. ప్రళయ్ క్షిపణిని డీఆర్డీఓతో పాటు పలు రక్షణరంగ సంస్థలతో కలిసి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రూపొందించింది. -
2026కు విశ్వమానవాళి వెల్కమ్
మెల్బోర్న్/న్యూఢిల్లీ: కొత్త ఆశలను మోసుకొచ్చిన నూతన సంవత్సరానికి ప్రపంచదేశాలు ఆనందోత్సాహల నడుమ సాదర స్వాగతం పలికాయి. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో అత్యంత ఆడంబరంగా జరిగే బాల్ డ్రాప్ వేడుక కంటే 18 గంటలు ముందుగానే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కిరిటిమాటి ద్వీపవాసులు నూతన ఏడాది వేడుకలను జరుపుకున్నారు. స్థానికకాలమానం ప్రకారం కొత్త ఏడాది అన్నిదేశాలకంటే ముందుగా అక్కడే మొదలైంది. ఏటా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆ్రస్టేలియాలోని సిడ్నీ నగర హార్బర్ బ్రిడ్జిపై కన్నులపండువగా జరిగే బాణసంచా షోను చూసేందుకు జనం ఈసారి సైతం తండోపతండాలుగా తరలివచ్చారు. అయితే రెండు వారాల క్రితం బాండీ బీచ్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈసారి జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఆ్రస్టేలియాపోలీసులు మునుపెన్నడూ లేనంతగా మొహరించారు. చాలా మంది పోలీస్ అధికారులు తొలిసారిగా ర్యాపిడ్‌ఫైర్ రైఫిళ్లను వెంటేసుకుని తిరిగారు. న్యూజిలాండ్‌లోని అక్లాండ్ సిటీలో ప్రఖ్యాత స్కై టవర్‌పై పేల్చిన బాణసంచా అక్కడి వారికి కనువిందుచేసింది. ఆ్రస్టేలియా సమీప ఇండోనేసియాలోనూ సంబరాలు అంబరాన్నంటాయి. నెల క్రితమే వేయి మందికిపైగా ప్రజలను వరదలు కబళించిన బాధ నుంచి జనం తేరుకుని కొత్త ఏడాది వేడుకల్లో మునిగిపోయారు. అయితే ఇండోనేసియాలోని బాలీలో మాత్రం భారీ వేడుకలను ఈసారి రద్దుచేశారు. జపాన్‌లో జనం కొత్త ఏడాది గంట కొట్టగానే బౌద్ధారామాలను దర్శించుకున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్ వాసులూ తమదైన శైలిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. జర్మనీలోని బెర్లిన్ నగర క్యాథడ్రల్, ప్రఖ్యాత బ్రాండెన్‌బర్గ్ గేటు వద్ద జనం పోగై ఒకరికొకరు నూతన సంవత్సర శుభకాంక్షలు చెప్పుకున్నారు. భారత్‌లో ఊరూవాడా జనం సంబరాల్లో మునిగిపోయారు. -
చట్టాలు ఉల్లంఘిస్తే శిక్షలే!
న్యూఢిల్లీ: వలసదారులకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పింది. క్రిమినల్ నేరాల కింద శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ ఎంబసీ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘‘చట్టాలను గౌరవించకపోయినా, ఉల్లంఘించినట్లు తేలినా కఠిన చర్యలు తప్పవు. క్రిమినల్ నేరాలుగా పరిగణించి శిక్ష విధిస్తారు. అక్రమ వలసలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దేశ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం’’అని స్పష్టంచేసింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పోస్టు చేయడం గమనార్హం. వలసదారులపై ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీసా నిబంధనలు మార్చేసింది. ప్రధానంగా హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది. మరోవైపు హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ వృత్తినిపుణులు స్వదేశానికే పరిమితయ్యారు. ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను, పోస్టులను అమెరికా అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో చట్టాలను ఉల్లంఘించవద్దంటూ అమెరికా ఎంబసీ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం వారిపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 6.05 లక్షల మందిని బలవంతంగా బయటకు పంపించింది. అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని అమెరికా నుంచి వెళ్లగొట్టడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. -
కట్టల కొద్దీ నగదు... సూట్‌కేస్ నిండా నగలు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో దేశరాజధానిలోని ఒక ఇంట్లో జరిగిన సోదాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.5.12 కోట్ల నగదు, రూ.8.80 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్ కేసులో ఇంద్రజిత్ యాదవ్, అతని సహచరులపై హరియాణా, ఉత్తర ప్రదేశ్ పోలీసులు 14 ఎ‹ఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ కేసులో 26, 27 తేదీల్లో ఢిల్లీ, గురుగ్రామ్, రోహతక్‌లోని 10 ప్రదేశాల్లో ఈడీ మొదటి దశ సోదాలు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దక్షిణ ఢిల్లీలోని సర్వప్రియ విహార్‌లోని నివాస ప్రాంగణంలో ఈడీ బుధవారం దాడులు చేసింది. ఇప్పటివరకు రూ.5.12 కోట్ల నగదు, రూ.8.80 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలతో కూడిన సూట్‌కే‹స్, బ్యాంకు చెక్ పుస్తకాలు ఉన్న బ్యాగ్, రూ.35 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాదీనం చేసుకున్నది. వివిధ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న యాదవ్ పరారీలో ఉన్నాడని, యూఏఈ నుంచి పని చేస్తున్నాడని ఈడీ తెలిపింది. ప్రైవేట్ ఫైనాన్సర్ల నుంచి పెద్ద మొత్తాలను అప్పుగా తీసుకున్న అపోలో గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఝజ్జర్ కంపెనీలు పోస్ట్ డేటెడ్ చెక్కులను జారీ చేశాయని, ఈ వందల కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిగా యాదవ్ వ్యవహరించాడని ఈడీ తెలిపింది. -
ఎస్ఎస్ఎల్వీ మూడో దశ పరీక్ష విజయవంతం
బెంగళూరు: స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) మూడో దశ పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీలో మంగళవారం 108 సెకన్ల పాటు ప్రయోగం విజయవంతంగా జరిగినట్టు ఇస్రో వెల్లడించింది. మూడు దశల లాంచ్ వెహికల్ అయిన ఎస్ఎస్ఎల్వీని ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేసింది. డిమాండ్‌ను బట్టి వెంటవెంటనే అంతరిక్ష ప్రయోగాలు చేయగలగడం దీని ప్రత్యేకత. పేలోడ్‌కు సెకనుకు 4 కి.మీ.ల వేగాన్ని అందించడంలో మూడో దశ సాలిడ్ మోటార్ తాలూకు అప్పర్ స్టేజ్ విశేషంగా దోహదపడుతుందని ఇస్రో తెలిపింది. ‘‘ఈ పరీక్షలో వాడిన కార్బన్ ఎపోక్సీ మోటార్ కేస్ వల్ల ఉపగ్రహ బరువు బాగా తగ్గుతుంది. ప్రయోగం తాలూకు కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇగ్నైటర్, నాజల్ వ్యవస్థల డిజైన్‌ను ఈసారి మరింత ఆధునీకరించాం. తద్వారా ప్రయోగ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఇందులో వాడిన అధునాతన విడిభాగాలను సొంతంగా∙తయారు చేసుకున్నాం. కార్బన్ ఫిలమెంట్ వూండ్ మోటార్‌ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రంలోని కాంపోజిట్స్ ఎంటిటీ ప్లాంట్, సాలిడ్ మోటార్‌ను సతీశ్‌ధవన్ కేంద్రంలోని సాలిడ్ మోటార్ ప్రొడక్షన్ ప్లాంట్‌లో రూపొందించాం’’అని పేర్కొంది. శ్రీహరికోటలో సాలిడ్ మోటార్ ఉత్పత్తి వ్యవస్థలను గత జూలైలోనే ఏర్పాటు చేశారు. -
ఇలా ఉంటే చాలు
2026 జనవరి 1.. కొత్త ఏడాది వచ్చేసింది. ‘న్యూ’ ఇయర్లో మనకు నిజంగా కిక్ ఇచ్చేదేమిటి? ‘‘జన వరి 1 నుండి ఇలా ఉండాలి’’ అని గట్టిగా ఒట్టేసు కోవటమే కదా! కానీ ఏమౌతుంది? ఫిబ్రవరి రాగానే.. మాట మీద నిలబడలేక నీరసించి పోతాం. అలాంటి నీరసాలు రాకుండా ఉండాలంటే.. కాస్తంటే కాస్తంత ప్రాక్టికల్‌గా ఉండే చాలు. మీ జీవితంలో ఇది నిజంగానే ‘న్యూ ఇయర్’ అవుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవితం సినిమా కాదుజనవరి 1 నుంచి.. ఎవ్వరూ పూర్తిగా వేరే మనిషి అయిపోరు. లైఫ్ అంటే సినిమా కాదు, స్క్రీన్ ప్లే ప్రకారం మొదలవ్వడానికి! ఒక్క అడుగు ముందుకు పడినా అది విజయమే. సౌండ్ స్లీప్నిద్ర అంటే కష్టపడి పనిచేశాక, అలసిపోయి తీసుకునే విశ్రాంతి కాదు. బాడీ, మైండ్ అన్నింటికీ అదే ఆధారం. ఉదయం లేవగానే.. ఒక చాట్‌జీపీటీ లేదా జెమినై పనిచేసినట్టు చురుగ్గా పనిచేయాలంటే సౌండ్ స్లీప్ అవసరం. రాత్రి ప్రశాంతంగా పడుకోండి.. ఉదయాన్నే ఫ్రెష్‌గా నిద్ర లేవండి. ‘జలయజ్ఞం’ ఎందుకు?యాప్‌లతో కొలుచుకుంటూ, అదో ‘జలయజ్ఞం’లా నీళ్లు తాగకండి. స్విచ్చేస్తేనే పని చేస్తాం అన్నట్టు మనం మరీ యంత్రాల్లా తయారైపోతే ఎలా? పక్కనే ఒక వాటర్ బాటిల్లో ఉంచుకొని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక సిప్ వేయండి చాలు.కదలిక సరిపోతుందిమిమ్మల్ని జిమ్‌కి వెళ్లి బరువులు ఎత్తమని ఎవరన్నారు? ఎవరో జిమ్ చేసేస్తున్నారని మీరు ఫీలైతే ఎవరిది తప్పు? కాసేపు నడవండి. కాస్త ఒళ్లు విరుచుకోండి. ఓ 10 నిమిషాలు ఏదో ఒక పని చేయండి. నిన్నటి కంటే ఈరోజు కాస్త ఎక్కువ కదిలినా అదే పెద్ద సక్సెస్!వివరణల పురాణంఎవరికైనా, ఎందుకైనా ‘నో’ చెప్పటానికి వెయ్యి పురాణాల వివరణ ఇవ్వక్కర్లేదు. సోషల్ మీడియాలో లైకో షేరో కొట్టినంత ఈజీగా ‘నో’ చెప్పేయండి. మొదట ‘గిల్టీ’గా అనిపించినా, ఒకసారి ‘నో’ చెప్పేశాక చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఆన్లైన్ యుద్ధాలేల?!సోషల్ మీడియా యుద్ధాలను ఆపేయండి. ట్రెండింగ్ పోస్టు వైరల్ అయినంత వేగంగా బీపీ పెరగటం తప్ప, అక్కడ గెలిస్తే మీకేమీ ‘ఆస్కార్’ రాదు. కనిపించే ప్రతి పోస్ట్‌కీ, కామెంట్‌కీ సమాధానం చెప్పి మీ టైమ్‌నీ, ఎనర్జీనీ వేస్ట్ చేసుకోకండి.బండి ‘స్టార్ట్’ చేయండికాన్ఫిడెన్స్ వచ్చాకే మొదలుపెడదాం అని వెయిట్ చేయకండి! ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాతే ధైర్యం వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాకే అడుగు వేస్తాను అనుకుంటే, ఉన్నచోటే ఉండిపోతారు.‘క్యాష్’ ఫీలింగ్మీరు సంపాదించే ప్రతి రూపాయీ జాగ్రత్త. అలాగని.. తినే తిండిని, ఎంజాయ్మెంట్నీ కట్ చేయకండి. మీ జేబులోంచి రూపాయి ఎక్కడికి, ఎందుకు వెళ్తుందో గమనించండి. ఆ మాత్రం ‘క్యాష్’ ఫీలింగ్ ఉండాలి.ఒకటైనా ఫర్ఫెక్ట్గా..ఏ పనైనా స్టార్ట్ చేసిన తర్వాత వర్కవుట్ అవ్వట్లేదనిపిస్తే, దాన్ని అక్కడితో వదిలేసి ప్రశాంతంగా ఉండండి. సగం సగం వదిలేసిన పది పనుల కంటే, పర్ఫెక్ట్గా పూర్తి చేసిన ఒక్క పని మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.రక్త పిశాచులకు దూరం!మీ ఎనర్జీని పీల్చేసే రక్త పిశాచులకు కాస్త దూరంగా ఉండండి! మీ మనశ్శాంతిని మీరు కాపాడుకోవడం స్వార్థం ఏమీ కాదు, అది ఒక ‘లైఫ్ సేవింగ్’ టెక్నిక్. వారానికో ఆశమన సంతోషాన్ని మనమే షెడ్యూల్ చేసుకోవాలి. ఒక ప్లాన్ ఉందంటే, ‘ఆహా, ఈ సండే ఎంజాయ్ చేయొచ్చు’ అనే ఆశ ఉంటుంది. ఆ అనుభవం మధురానుభూతిగా మిగులుతుంది. లేదంటే ప్రతి వారం ఒకేలా చప్పగా ఉంటుంది.వదిలేసి చూద్దురూ..!పాత పగల్ని, కక్షల్ని, కోపాల్ని పట్టుకుని వేలాడకండి. అవి అనవసర రోగాలు తీసుకొచ్చి ఆసుపత్రులను పోషించడానికి తప్ప ఎందుకూ పనికిరావు. ఒకసారి పగలూ, కోపాలూ ప్రతీకారాలూ వదిలేసి చూడండి, సోషల్ మీడియా కాసేపు స్తంభించిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది.మీకు మీరే సపోర్ట్ఎప్పుడూ మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ, తక్కువ చేసుకుంటూ ఉంటే.. మీ పతనానికి బయట శత్రువులు అవసరమే లేదు. మీకు మీరే సపోర్టింగ్ పిల్లర్. ప్రాంప్ట్ ఇస్తేనే పనిచేసే ఏఐ చాట్‌బాట్‌లా ఉండకండి.కొత్తగా ఏదైనా..కొత్త లాంగ్వేజ్ లేదా ఒక కొత్త సాఫ్ట్వేర్ లేదా మ్యూజిక్.. ఇలా మీకు నచ్చింది, కొత్తది ఏదో ఒకటి నేర్చుకోండి. టార్గెట్లు అవీ పెట్టేసుకుని.. ఒక్కరోజులోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాల్సిన టాస్క్‌లా ఫీల వకండి. మెల్లగా నేర్చుకున్నా సరే, అది నేర్చుకోవడమే.చెప్పుకొంటే తప్పేంటిమీకు సలహా కావాలన్నా, కాస్త సపోర్ట్ కావాలన్నా, లేదంటే మీ గోడు వినే మనిషి కావాలన్నా.. మీ సర్కిల్లో ఎవరో ఒకర్ని ఎంచుకోండి. మీ బాధలు చెప్పే క్రమంలో.. తనను హింసించకండి. తను కూడా మీలాంటి మనిషే అని గుర్తుంచుకోండి.మారటం మంచిదేఈ ఏడాది మీ ఇష్టాలు మారొచ్చు, కొన్ని లక్ష్యాలు మీకు పనికిరావు అనిపించవచ్చు. అది ఫెయిల్యూర్ కాదు, మీ ఎదుగుదల! పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్స్ మార్చుకోవడం కూడా అప్డేట్ అవటమే.ఇల్లు ‘షోరూమ్’ కాదుమీ ఇల్లేమీ షోరూమ్ కాదు.. తళతళలాడుతూ ఉండాల్సిన అవసరమే లేదు. ఒకే రోజు ఇల్లంతా ఊడ్చి, తుడిచి, సర్ది నడుము విరగ్గొట్టుకోవడం కంటే.. రోజుకి కొంచెంగా క్లీన్ చేసుకోండి. అలాగే మెంటెయిన్ చేయండి చాలు!క్యాచ్ ద సిగ్నల్స్మీ బాడీ ఇచ్చే ‘సిగ్నల్స్’ని గమనించండి. అలసట, నొప్పులు.. ఊరికే రావు. అలాగని అన్నింటికీ భయాలూ పెంచుకోకండి. ఓ వయసు దాటాక అవసరమైన టెస్టులు చేయించుకోవ డం.. అత్యవ సరమైతే డాక్టర్లని సంప్రదించడం సర్వ సాధారణం అన్న విషయాన్ని మనసుకు సర్దిచెప్పండి.సిలబస్ ‘బుక్’ కాదుమంచి పుస్తకాల్ని చదవడం మంచిదే. కానీ అదేదో ఎగ్జామ్లానో సిలబస్ లానో ఫీల్ అవ్వకండి! ఎవరో చదువుతున్నారని మీరు కూడా ఏదో పుస్తకాన్ని కొని.. పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.అంతిమంగా..2026లో మీరు ఒక ‘పర్ఫెక్ట్ బొమ్మ’లా ఉండక్కర్లేదు. తప్పులు జరిగితే సరిచేసుకునే.. అలసిపోతే రెస్ట్ తీసుకునే.. మళ్లీ మళ్లీ ప్రయత్నించే ఒక ‘నిజమైన’ మనిషిగా ఉంటే చాలు. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా తడబడినా.. సో వాట్? తిరిగి కొత్తగా మొదలుపెట్టండి. దాని కోసం మళ్లీ జనవరి 1 దాకా ఆగక్కర్లేదు. ఏదో ఒక మామూలు గురువారం (ఇది మీ ఇష్టం) మధ్యాహ్నం (ఇది కూడా..) 3 గంటలకు (ఇది.. కూడా) మీ లైఫ్‌ని మీరు రీస్టార్ట్ చేయొచ్చు!మీ లైఫ్.. మీ ఇష్టం.. దాన్ని బాగుచేసుకునేందుకు అది మీరు పడే కష్టం. ఆ కష్టం ఎవ్వరూ పడరు.. మీకు కష్టమొస్తే ఎవ్వరూ తీర్చరు. మైండిట్!హ్యాపీ న్యూ ఇయర్.. -
ఐఐటీలకు ‘బూస్ట్’
సాక్షి, హైదరాబాద్: సీట్ల పెంపు, మౌలిక వసతుల కల్పన, కోర్సుల్లో నాణ్యత పెంపుతో దేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లను బలోపేతం చేయాలని ఆయా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలకు డిమాండ్ పెరుగుతోందని, అందువల్ల సీట్లు గణనీయంగా పెంచాలని విజ్ఞప్తి చేశాయి. 2026–27 విద్యా సంవత్సరంలోనే కనీసం 2 వేల సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకొస్తున్న నేపథ్యంలో దేశంలో ఎమర్జింగ్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐతో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కోర్సుల నాణ్యత పెంచాలని, లేబొరేటరీలను ఉన్నతీకరించాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు మౌలిక వసతులు సైతం పెంచాలని ఐఐటీలు ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాయి. ఆయా అంశాలపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఏఐకి అనుగుణంగా మెరుగులు‘దేశంలో ఏఐపై విస్తృత పరిశోధన జరుగుతోంది. డేటా కేంద్రాల పరిధి పెరుగుతోంది. అంతర్జాతీయ ఏఐ సంస్థలు ఐఐటీల నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నాయి. ఏఐఎంఎల్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఇన్‌డెప్త్ ప్రాజెక్టు ఇంటర్న్‌షిప్‌పై దృష్టి పెడుతున్నాయి. ఏఐ, డేటాసైన్స్‌కు బలమైన పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధి అవసరం పెరిగింది. ఈ మేరకు లేబొరేటరీలు ఏర్పాటు చేయడంతో పాటు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..’అని ఐఐటీలు కేంద్రానికి తెలిపాయి. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కూడా ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ ఏఐ, డేటాసైన్స్ లాంటి కోర్సులు పెంచాలని ఐఐటీ ముంబై సూచించింది. 120 గంటల హైబ్రిడ్ ఏఐ కోర్సులను అందించే దిశగా ఐఐటీ కాన్పూర్ ప్రణాళిక సిద్ధం చేసింది. కొన్నిచోట్ల ప్రైవేటు, ప్రభుత్వ సమన్వయంతో ముందుకెళ్ళే ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చాయి. ప్రధాన సమస్యగా హాస్టళ్ల కొరత.. ఐఐటీల్లో ప్రస్తుతం హాస్టళ్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. విద్యార్థుల సంఖ్య వేగంగా పెరగడం, వసతి సదుపాయాల విస్తరణ ఆ స్థాయిలో జరగకపోవడమే దీనికి మూలకారణం. గత పదేళ్ళుగా ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, పీహెచ్డీ సీట్లు భారీగా పెరిగాయి. 2008 తర్వాత ఏర్పడిన కొత్త ఐఐటీలకు ఇంకా క్యాంపస్‌ల నిర్మాణం పూర్తవ్వలేదు. ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్లకు కూడా వసతి అవసరమవుతోంది. హాస్టల్ ప్రాధాన్యత విద్యార్థులకే కాకుండా పరిశోధకులకు కూడా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతోంది. నిధులు, భూసేకరణ, నిర్మాణ ఆలస్యాలు, కేంద్రం నిధుల విడుదలలో జాప్యం తదితరాలు కూడా కారణమవుతున్నాయి. ఐఐటీ విద్యార్థులు, ఫ్యాకల్టీకి క్యాంపస్ వెలుపల అద్దె గదులు తీసుకోవాల్సి రావడంతో ఖర్చు పెరుగుతోంది. బయట ఉండేవారి ప్రయాణ సమయం పెరగడం.. బోధన, చదువుపై ప్రభావం చూపుతోంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు భద్రత పరమైన సౌకర్యాల సమస్య ఏర్పడుతోంది. టెక్నాలజీ అప్డేట్తో కూడుకున్న ఐఐటీ విద్యకు క్యాంపస్ హాస్టల్లోనే ఉండి చదువుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐఐటీల్లో 18,160 సీట్లు ఉన్నాయి. అయితే 12 వేల మందికి మాత్రమే ఐఐటీ ప్రాంగణాల్లో హాస్టల్ వసతి ఉండటం గమనార్హం. మిగతా విద్యార్థులను ప్రైవేటు వసతి గృహాల్లో ఉంచుతున్నారు. ఆ కోర్సులకే డిమాండ్.. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం 62,853 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40 వేలకు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనే ఉన్నాయి. గత నాలుగేళ్ళుగా ఏఐకి ప్రాధాన్యత పెరగడంతో కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో డేటాసైన్స్, ఏఐఎంఎల్, ఎంబీడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీలతో కలుపుకొని 16 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అయితే వీరిలో స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్న వారు 9 శాతమే ఉంటున్నారు. ఐఐటీల్లో విద్యా బోధన ప్రమాణాలు మెరుగ్గా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 78 శాతం ఉపాధి పొందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ల పెంపుపై కొన్నేళ్ళుగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఏఐ ఆధారిత కొత్త కోర్సుల మేళవింపుపై కేంద్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.సీట్ల పెంపు ప్రతిపాదనలు ఇలా..ఏఐ ఆధారిత కంప్యూటర్ కోర్సులను కోర్ సీఎస్ఈకి అనుసంధానం చేసి కనీసం 800 సీట్లు పెంచాలని ఐఐటీలు సూచిస్తున్నాయి. మరో 400 సీట్లు డేటా సైన్స్‌లో కోరుతున్నాయి. మరో 800 సీట్లు ఇతర కంప్యూటర్ ఎమర్జింగ్ కోర్సులను తీసుకొచ్చి పెంచాలని కోరుతున్నాయి. మరోవైపు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు (ఎన్ఐటీలు), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో (జీఎఫ్‌టీఐలు) మొత్తం 62 వేలకు పైగా సీట్లున్నాయి. వీటిల్లో సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటాసైన్స్ కోర్సులతో కూడిన కంప్యూటర్ కోర్సులను రీ డిజైన్ చేయాలని ఐఐటీలు సూచిస్తున్నాయి. -
రూ. 5 లక్షలు ఖర్చుపెట్టి.. విద్యార్థులను ఫ్లైట్ ఎక్కించిన హెడ్మాస్టర్
బెంగళూరు: బాల్యంలో ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఉపాధ్యాయుల ప్రేరణ చాలా ఉంటుంది. తల్లి దండ్రుల తరువాత పిల్లలపై తమ ప్రేమ అప్యాయతలను కురిపించేది టీచర్లు మాత్రమే. అందుకే గొప్ప గొప్ప నాయకులు, సెలబ్రిటీల జీవితాలపై టీచర్ల ప్రభావం ఉంటుంది. తాజాగా కర్ణాటకలోని కొప్పల్ జిల్లా బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యుడి చేసిన పని నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.విమానం ఎక్కాలనే విద్యార్థులకలను సాకారం చేసేందుకు కర్ణాటకకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు దాతృత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలిచింది. బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప అందగి 24 మంది విద్యార్థులను తొలి సారి విమానం ఎక్కించారు. తన సొంత ఖర్చులతో రూ. 5 లక్షలు వెచ్చించి మరీ తన విద్యార్థులను లైఫ్‌లో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చారు. 5-8 తరగతుల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, పాఠశాల అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు మొత్తం 40 మంది విమానంలో ప్రయాణించారు. వీరి కోసం తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుండి బెంగళూరుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.ప్రతీ క్లాస్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి ఆరుగుర్ని ఈ జర్నీకి ఎంపిక చేశారు.A truly heartwarming gesture 🙏✈️Twenty-four government school students from a village in Koppal experienced their first-ever flight, made possible by the selfless generosity of their headmaster, who personally funded the journey. Two enriching days in Bengaluru, learning,… pic.twitter.com/6E28SKHQVv— Ravi Boseraju (@raviboseraju) December 31, 2025 కొప్పల్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులు తమ తొలివిమాన ప్రయాణాన్ని అనుభవించారు, వారి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి సంతోషం పడే వారు తొలిసారి విమానం ఎక్కి తెగ సంతోష పడిపోయారు. బెంగళూరులో రెండు రోజులు ఉండి అనేక పర్యాటక ప్రదేశాలను, పాఠశాలలను సందర్శించి తమ అభిమాన హెడ్మాస్టర్కి శతకోటి అభివందనాలు కొప్పల్‌కు తిరిగొచ్చారు. ఎన్నో మధురమైన,సంతోషకరమైన క్షణాలను, అనుభవాలను మూటగట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగామారింది. ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి: నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ! -
‘మిమ్మల్ని ఓటర్ల జాబితా ఆయుధంగా మార్చారు’
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మరోసారి ధ్వజమెత్తింది. కొత్త ఏర్పాటైన ‘సర్’తో ఓటర్ల జాబితాలో తారుమారు జరుగుతుందంటూ మండిపడింది. ఈరోజు(బుధవారం, డిసెంబర్ 31) సీఈసీని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ.. కలిసి పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించారు. అనంతరం సీఈసీతో చర్చించారు. అయితే ఆపై బయటకొచ్చిన అభిషేక్ బెనర్జీ.. సీఈసీ టార్గెట్ తీవ్ర విమర్శలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న జ్ఞానేష్ కుమార్‌ను.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇష్టమొచ్చినట్లు వాడుకుంటుందని ఘాటు వ్యాఖ్యలుచేశారు. దేశాన్ని విచ్చిన్నం శక్తిగా జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం ఉపయోగించుకుంటుందన్నారు. తమకు ఈవీఎంల ఓటింగ్‌తో ఎటువంటి సమస్యా లేదని, కానీ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారనే అనుమానం మాత్రం ఉందన్నారు. ‘ మా ప్రశ్నలకు దేనికి కూడా సీఈసీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. సుమారు 20 ప్రశ్నల వరకూ సీఈసీని అడిగాం. కానీ వాటిలో స్పష్టత లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌ను ఓటర్ల జాబితా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. మీరు తయారు చేస్తున్న ఓటర్ల జాబితాను ప్రజల ముందు బహిర్గతం చేయండి. కనీసం అది కుదరకపోతే.. దాన్ని లాజికల్‌గానైనా నిరూపించండి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదనేది మా అనుమానం’ అని విమర్శించారు. -
చచ్చిపోయాడనుకుంటే..30 ఏళ్లకు తిరిగొచ్చాడు!
ఉత్తరప్రదేశ్‌లోని,ముజఫర్‌నగర్‌లో అద్భుత సంఘటన జరిగింది. 30 ఏళ్ల క్రితం చని పోయాడని భావిస్తున్న వ్యక్తి ఊహించని విధంగా కళ్ల ముందు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తొలుత అస్సలు నమ్మలేదు.ఈ తరువాత కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఖతౌలి పట్టణంలోని మొహల్లా బల్కారాం నివాసి షరీఫ్ 28 ఏళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులకు అందుబాటులో లేకుండా పొయ్యాడు. అయితే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో షరీఫ్ అధికారిక పత్రాలకోసం 1997 తరువాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అకస్మాత్తుగా వృద్ధుడైన షరీఫ్ ప్రత్యక్షం కావడంతో బంధువులు, పొరుగు వారు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని భార్యతో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాడు. ప్రారంభంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేవాడు. అయితే, కాలక్రమేణా అవీ ఆగిపోయాయి. అతను ఇచ్చిన అడ్రస్‌లో షరీఫ్‌ను సంప్రదించాలని ప్రయత్నించిన బంధువులకు నిరాశే ఎదునైంది. దీంతో అతను చనిపోయాడని భావించారు. అయితే ఎస్ఐఆర్ పుణ్యమా అని రెండు రోజుల క్రితం షరీఫ్ ఖతౌలికి తిరిగి వచ్చాడు. తొలుత ఎవరూ నమ్మలేదు. షరీఫ్ తిరిగి వచ్చాడన్న సమాచారంతో స్థానికంగా సందడి నెలకొంది. ఇరుగు పొరుగువారు, బంధువులు, పరిచయస్తుంతా గుమిగూడారు, దూరపు చుట్టాలు వీడియో కాల్స్ చేసి మురిసి పోయారు.ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారంగత 15, 20 ఏళ్లుగా అతని కోసం ఎంత వెదికినా ఫలితంలేదని మేనల్లుడు మొహమ్మద్ అక్లిమ్ తెలిపారు. అయితే రెండో పెళ్లి తరువాత ఆర్థిక పరిస్థితి, కమ్యూనికేషన్ సదుపాయం లేక పోవడం వల్ల తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఇపుడు ప్రభుత్వ పత్రాలు అవసరం కాబట్టి తిరిగి వచ్చానని, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతానని కూడా చెప్పాడు. అన్నట్టుగానే సంబంధిత పత్రాలను తీసుకొని బెంగాల్‌కు వెళ్లిపోయాడు. -
నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ!
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ప్రియుడు ఆకాష్ మోసం చేశాడంటూ ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె రికార్డు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.హాత్రాస్లోని ఆవాస్ వికాస్ కాలనీలో నివసించే కామిని శర్మ, ప్రియుడు ఆకాష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ‘‘నేను ఎపుడూ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. కానీ నాకు చావు మరో ఆప్షన్ మిగలకుండా చేశావ్. బలహీను రాల్నిచేసి ఆడుకున్నావ్...ఎవరి జీవితంతో ఆడుకోవడ్డం మీ ఇంట్లో వాళ్లు ఎపుడూ చెప్పలేదా.. కానీ మానవత్వం అనేది బతికి ఉంటే నీకు కూడా నాలాంటి గతే పడుతుంది. ఎందుకంటే నేను ఎవర్నీ మోసం చేయలేదు.. నిన్ను చాలా ప్రేమించాను’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. అంతేకాదు అమ్మా నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ తల్లివి. నా సూసైడ్‌కి బిహార్ వాలా ఆకాష్ కారణం అని తన వీడియోలో పేర్కొంది. అలాగే తన అత్తకు కూడా క్షమాపణలు చెప్పింది. నీలాంటి అత్త యూనివర్స్‌లో ఎక్కడా దొరకదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.Tragic incident in Hathras, UP: Girl records emotional video blaming her Ex-Boyfriend Aakash for forcing her ("You've forced me so much... I AM SORRY MUMMA. You are the BEST Mumma..."), then d!es by suicide. Heartbreaking. 💔pic.twitter.com/7f29omeO3i— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2025 కామినీ సోమవారం మధ్యాహ్నం విషం సేవించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంత్యక్రియల తర్వాత, కుటుంబ సభ్యులకు కామిని వీడియో గురించి తెలిసింది. దీంతో కామిని తల్లి రష్మి శర్మ కొత్వాలి సదర్‌లో ఫిర్యాదు చేసింది. కుమార్తె మరణానికి కారణమైన తన కుమార్తె ప్రియుడు ఆకాష్‌పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..! -
బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..!
ముంబైలో జరిగిన ఒక ఘోర బస్సు ప్రమాదం ఒక బాలనటి కుటుంబంలోనూ, ఆ చిన్నారి జీవితంలో మర్చిపోలేని విషాదాన్ని నింపింది. ఒక మూవీ ఆడిషన్కోసం వెళ్లిన 13 ఏళ్ల మరాఠీ బాలనటి చాలా ఉత్సాహంగా తిరిగి ఇంటికి బయలుదేరింది. కానీ అదే తన జీవితంలో అంతులేని శోకాన్ని మిగులుస్తుందని ఊహించలేదు. కళ్లముందే కన్న తల్లి ప్రాణాలు పోతోంటే.. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోయింది. పదే పదే ఆ దృశ్యాల్ని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.పోలీసులు అందించిన వివరాల ప్రకారం ముంబైలోని భాండుప్‌లో బెస్ట్ రూట్ 606లో ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అదుపు తప్పి బస్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. 35 ఏళ్ల ప్రణీత సందీప్ రసం, తన కుమార్తెను ఆడిషన్ కోసం దాదార్ వెళ్లి తిరిగి వస్తూ, భాండుప్ రైల్వే స్టేషన్ సమీపంలో దిగి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో బస్సు అదుపు తప్పిన బెస్ట్ ఎలక్ట్రిక్ బస్ తమవైపు దూసుకు రావడాన్ని గ్రహించిన తల్లి ప్రణిత, కుమార్తెను శక్తి కొలదీ పక్కకు తోసేసింది.క్షణాల్లో అంతా జరిగిపోయింది.తల్లి పక్కకు నెట్టివేయడంతో బాలనటి ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకుంది. కానీ ప్రణీత మాత్రం బస్సు చక్రాల కింద నలిగి పోయింది. తన కళ్లముందు తల్లి విగతజీవిగా మారిపోవడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఎలాగోలా తేరుకుని, వేరే వారి ఫోన్ ద్వారా తండ్రి సందీప్‌కు ఫోన్ చేసింది. ఆయన సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ప్రణీత గాయాలతో మరణించింది. తల్లి తనను కాపాడుతూ చనిపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాలనటిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. చికిత్స , కౌన్సెలింగ్ కోసం ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రణీత కుమార్తె మరాఠీ టీవీ సీరియల్స్‌లో చిన్న సహాయక పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హోంవర్క్, షూటింగ్‌లను మేనేజ్ చేస్తూ నటించి పేరు తెచ్చుకున్న ఆమె ప్రతిభ వెనుక ప్రణిత కృషిచాలా ఉందని పొరుగు వారు గుర్తు చేసుకున్నారు. పాపను ఆడిషన్స్, సెట్స్‌కు తీసుకెళుతూ ఇంటిని చక్కబెట్టుకొనేదని చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రణీతతోపాటు, మాన్సి మేఘశ్యాం గురవ్, 49, వర్ష సావంత్, 25, మరియు ప్రశాంత్ దత్తు షిండే, 45. మరో పదకొండు మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్, 52 ఏళ్ల సంతోష్ రమేష్ సావంత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.చదవండి: 2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలురూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనం విఖ్రోలి డిపోకు అనుబంధంగా ఉన్న రూట్ A-606 (సీనియర్ 34)లో నడుస్తున్న వెట్-లీజ్ ఒలెక్ట్రా బస్సు. సంఘటన జరిగిన సమయంలో డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ (52), కండక్టర్ భగవాన్ భావు ఘరే (47) విధుల్లో ఉన్నారని, ఇద్దరూ బెస్ట్ సిబ్బంది గా భావిస్తున్నారు. మరోవైపుమృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం -
ఇవాళ నుంచే అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం..!
అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం అంటే, మకర సంక్రాంతి రోజున శబరిమల అయ్యప్ప విగ్రహానికి పందళ మహారాజు పంపిన దివ్య స్వర్ణాభరణాలను అలంకరించి, ఆ అద్భుతమైన రూపంలో స్వామిని దర్శించుకోవడం. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది. ఈ దర్శనం మకర జ్యోతి దర్శనానికి ముందు జరుగే తంతు. ఇక పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ ఇవాల్టి (డిసెంబర్ 31) నుంచి భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది. ఈ రోజు(డిసెంబర్ 31) నుంచి జనవరి 11 వరకు ప్రతిరోజూ ఉదయం 5:30 నుండి రాత్రి 8:00 గంటల వరకు భక్తులు తిరువాభరణాలను దర్శించుకోవచ్చు. అలాగే జనవరి 12న తెల్లవారుజామున 4:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పందలం వలియ కోయిక్కల్ శ్రీ ధర్మశాస్త్ర క్షేత్రంలో తిరువాభరణాల దర్శనం ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం సరిగ్గా 1:00 గంటకు రాజప్రతినిధి నేతృత్వంలో తిరువాభరణాల పేటికలు శబరిమలకు పయనమవుతాయి. సాధారణంగా మండల కాలంలో (నవంబర్ నుంచి జనవరి వరకు) భక్తులు ఈ ఆభరణాలను దర్శించుకోవడానికి వీలు కల్పిస్తారు, ప్రత్యేకించి డిసెంబర్ 31 నుండి జనవరి 11 వరకు దర్శనం ఉంటుంది.పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ అంటే..అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాలు (Thiruvabharanam) భద్రపరిచే ప్రదేశం, దీని సంరక్షణ భాద్యత పందలం రాజకుటుంబం వారిది. ఆ ఆభరణాలు మకరజ్యోతి పండుగ సమయంలో శబరిమలకి ఊరేగింపుగా తీసుకెళ్లి..ఆ తర్వాత తిరిగి ఇక్కడికే వస్తాయి. ఈ మాళిగను మండలకాలంలో భక్తులు దర్శించుకోవచ్చు.(చదవండి: మండల పూజ సీజన్లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు) -
రెండు హైవే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఇవాళ( బుధవారం, డిసెంబర్ 31) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 20, 668 కోట్ల రూపాయలతో రెండు హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాసిక్ సోలాపూర్ హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 19,142 కోట్ల రూపాయలతో 374 కిలోమీటర్ల సూరత్ చెన్నై హై స్పీడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. చెన్నై సూరత్ హై కారిడా నిర్మాణంతో 45 శాతం ప్రయాణ సమయం తగ్గనుంది. 31 గంటల నుంచి 17 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.చెన్నై సూరత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కర్నూల్ కడప మీదుగా జాతీయ రహదారి వెళ్లనుంది. చెన్నై పోర్టు, హజీరా పోర్టుకు కనెక్టివిటీ పెరుగనుంది. కొప్పర్తి, ఓర్వకల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లకు హై స్పీడ్ నెట్వర్క్ ఉపయోగపడనుంది. రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తికానుంది.ఒడిశాలోని జాతీయ రహదారి 326 వెడల్పు, బలోపేతం కోసం రూ.1526 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024 జూన్ నుంచి రైల్వే, హైవే, మెట్రో, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12.6 లక్షల రూపాయల నిధులను కేబినెట్ కేటాయించింది. 43 రైల్వే ప్రాజెక్టుల కోసం 1,52,583 కోట్ల రూపాయలను కేటాయించింది. 24 జాతీయ రహదారుల నిర్మాణానికి 2, 18,312 కోట్ల రూపాయలు కేటాయించింది.8 మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1,31,542 కోట్లు, నాలుగు ఏర్పాట్లు నిర్మాణానికి 7339 కోట్లు, మేజర్ పోర్టు నిర్మాణానికి రూ.1,45,945 కోట్లు, రెండు కొత్త రోప్ వేల నిర్మాణానికి రూ.6811 కోట్లు, మూడు హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.28,432 కోట్లు, 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు రూ.28, 602 కోట్లు, పీఎం ఆవాస్ యోజన కోసం 5,36,137 కోట్లను కేంద్రం కేటాయించింది.వొడాఫోన్-ఐడియాకు ఉపశమనంకేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్-ఐడియాకు ఉపశమనం కల్పించింది. రూ.87,695 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
న్యూ ఇయర్ వేడుకల వేళ.. ఉగ్ర కుట్ర భగ్నం?
ఢిల్లీ: నూతన సంవత్సరం వేడుకల వేళ రాజస్థాన్‌లో కలకలం రేగింది. రాజస్థాన్ టోంక్ జిల్లాలో పేలుడు పదార్థాలు ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంచులతో ఉన్న కారును సీజ్ చేశారు. 200 కాట్రేడ్జిలు, ఐదు బండిల్స్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నిందితులు బుండీ నుండి టోంక్‌కు పేలుడు పదార్థాలను తరలిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వాలను అరెస్ట్ చేసిన పోలీసులుపలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.డీఎస్పీ మృత్యుంజయ మిశ్రా మాట్లాడుతూ.. నిఘా వర్గాల సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ చేపట్టామని.. వాహనం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని.. కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, అమోనియం నైట్రేట్‌ను పేలుడు పదార్థాలతో కలిపి వాడతారు. గత నెల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఉపయోగించారు. ఆ ఘటనలో 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలు
మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. కోటి ఆశలతో, మరింత నూతనోత్తేజంతో 2026 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ఉవ్విళూరుతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, సకల శుభాలు, ప్రేమ, ఉత్సాహంతో నిండిన సరికొత్త ప్రారంభానికి స్వాగతం చెబుతాం. అలాగే రాబోయే సంవత్సరంలో మహిళలు మరిన్ని అవకాశాలు రావాలని, సాధికారత దిశగా మరింత సాహసోపేతమైన అడుగులు పడాలని యావత్ మహిళా లోకం కలలు గంటోంది.కొత్త అడుగు వేసే ముందు, మునుపటి అడుగును, అనేక రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళలను గుర్తు చేసుకోవడం కూడా అవసరం.2025 సంవత్సరం సినిమా, రాజకీయం, సామాజిక రంగాలకు తీరని లోటును మిగిల్చింది. ఈ ఏడాది కన్నుమూసిన దేశీయ , అంతర్జాతీయ ప్రముఖ మహిళల వివరాలు చూద్దాంభారతీయ ప్రముఖులుబీ సరోజా దేవి (నటి): "అభినయ సరస్వతి"గా పేరుగాంచిన లెజెండరీ నటి సరోజా దేవి జూలై 14, 2025న కన్నుమూశారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో పోటా పోటీగా నటించి సినీ అభిమానులు గుండెల్లో సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నటి.సీ కృష్ణవేణి (నటి ): తొలితరం తెలుగు నటి, నిర్మాత అయిన కృష్ణవేణి గారు ఫిబ్రవరి 16, 2025న తన 100వ ఏట మరణించారు. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతలలో ఒకరు.కామినీ కౌశల్ (నటి): బాలీవుడ్ స్వర్ణయుగపు నటి కామినీ కౌశల్ నవంబర్ 13, 2025న మరణించారు. 'నీచా నగర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ఆమె ప్రసిద్ధి చెందారు.సిమోన్ టాటా (వ్యాపారవేత్త): భారతీయ సౌందర్య సాధనాల బ్రాండ్ 'లాక్మే' (Lakme) , 'ట్రెంట్/వెస్ట్‌సైడ్' అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యాపారవేత్త సిమోన్ టాటా డిసెంబర్ 5, 2025న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.యువ నటి షెఫాలీ: 'కాంటా లగా' గర్ల్‌గా గుర్తింపు పొందిన షెఫాలీ జూన్ 27, 2025న గుండెపోటుతో 42 ఏళ్ల వయసులో అకాల మరణం చెందడం ఆమె అభిమానులును తీవ్ర విషాదంలో ముంచేసింది.సంధ్యా శాంతారామ్ (నటి): సీనియర్ నటి సంధ్య ఈ ఏడాది అక్టోబర్ 4, మరణించారు. ఆమె 'జనక్ జనక్ పాయల్ బాజే' వంటి క్లాసిక్ సినిమాల్లో నటనతో నభూతో నభవిష్యతి అనుపించుకున్నారు. అంతర్జాతీయ ప్రముఖులుఖలీదా జియా (రాజకీయవేత్త): బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా డిసెంబర్ 30 న మరణించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా డిసెంబర్ 30, 2025న మరణించారు. పశ్చిమ బెంగాల్లో పుట్టి, బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా ఘనత సాధించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆమె ఒక శక్తివంతమైన మహిళా నేతగా నిలిచారు.జేన్ గుడాల్ (శాస్త్రవేత్త): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రైమాటాలజిస్ట్ మరియు పర్యావరణ కార్యకర్త జేన్ గుడాల్ అక్టోబర్ 1, 2025న 91 ఏళ్ల వయసులో మరణించారు. చింపాంజీల ప్రవర్తనపై ఆమె చేసిన పరిశోధనలు విప్లవాత్మకమైనవి.డయాన్ కీటన్ (హాలీవుడ్ నటి): ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ అమెరికన్ నటి డయాన్ కీటన్ అక్టోబర్ 11న మరణించారు.డేమ్ అన్నెట్ బ్రూక్: UKలో ఎక్కువ కాలం పనిచేసిన మహిళా లిబరల్ డెమొక్రాట్ MP ఈ ఏడాది ఆగస్టులో మరణించారు. 2001లో డోర్సెట్‌లో సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన తొలి మహిళా MPగా ఆమె రికార్డ్ సృష్టించారు. బ్రిజిట్ బార్డోట్ (నటి) ఫ్రెంచ్ సినిమా ఐకాన్ మరియు జంతు హక్కుల పోరాట యోధురాలు బ్రిజిట్ బార్డోట్ డిసెంబర్ 28, 2025న 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.కిమ్ సే-రాన్ (దక్షిణ కొరియా నటి): ప్రముఖ కొరియన్ నటి కిమ్ సే-రాన్ ఫిబ్రవరి 16, 2025న కేవలం 24 ఏళ్ల వయసులో మరణించడం ఆ దేశ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.బార్బీ హ్సు (తైవానీస్ నటి): 'మెటియోర్ గార్డెన్' సీరీస్ ద్వారా ఆసియావ్యాప్తంగా గుర్తింపు పొందిన బార్బీ హ్సు ఫిబ్రవరి 2, 2025న మరణించారు.వీరితోపాటు 2025 అనేక రంగాలకు చెందిన ప్రముఖులను కూడా కోల్పోయాం. ముఖ్యంగా సినీ రంగంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, గోవర్దన్ అస్రానీ, సతీష్ షా, పంకజ్ ధీర్, జుబీన్ గార్గ్ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ చకుర్కర్ ఈ ఏడాదిలోనే మరణించారు. హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా, టి.టి.కె. ప్రెస్టీజ్ కిచెన్ మొగల్ టి.టి. జగన్నాథన్ 77 ఏళ్ళ వయసులో మరణించారు ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకుడు , రచయిత కొన్ని దశాబ్దాల పాటు తన జీవితాన్ని పులుల సంరక్షణకు అంకితం చేసిన వాల్మిక్ థాపర్ క్యాన్సర్‌తో పోరాడుతూ 73 ఏళ్ళ వయసులో మే నెలలో కన్నుమూశారు. -
సోషల్ మీడియాలో ‘ఫైనల్ ఇమేజ్- 2025’ హంగామా
ఈ రోజు(డిసెంబర్ 31, బుధవారం)తో 2025 ముగియబోతోంది. దీంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో, సోషల్ మీడియా వేదికలలో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రతి ఏటా జనవరి ఒకటిన శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి నెటిజన్లు ఒక వినూత్నమైన ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. అదే ‘ఫైనల్ ఇమేజ్ ఆఫ్ 2025’ (2025 చివరి చిత్రం). పాత జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ, ఈ ఏడాదిలో తాము దిగిన ఆఖరి ఫోటోను షేర్ చేస్తూ, నెటిజన్లు సందడి చేస్తున్నారు.ఈ వైరల్ ట్రెండ్ ప్రధానంగా ‘ఎక్స్’, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర ప్లాట్‌ఫారమ్‌లలో విరివిగా కనిపిస్తోంది. యూజర్స్ తమ వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ సభ్యులతో దిగిన చిత్రాలు లేదా ప్రకృతి దృశ్యాలను ‘My Final Image of 2025’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఈ ట్రెండ్‌లో భాగస్వాములవుతున్నారు. గడిచిన ఏడాదిలో తాము సాధించిన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం విశేషం.ఈ ట్రెండ్ కేవలం ఫోటోల షేరింగ్‌కే పరిమితం కాలేదు. ఇది నెటిజన్లలో ఒక రకమైన భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతోంది. ఒక వైపు ఈ ఏడాది ముగిసిపోతున్నదనే బాధ, మరోవైపు కొత్త ఏడాదిపై ఉన్న ఆశలు.. ఈ పోస్ట్‌లలో ప్రతిబింబిస్తున్నాయి. లక్షలాది మంది ఈ ట్రెండ్‌ను అనుసరించడంతో సోషల్ మీడియా సర్వర్లు బిజీగా మారాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని నింపడంలో ఈ చిన్న ప్రయత్నం పెద్ద ప్రభావాన్నే చూపుతోంది.ఇలాంటి ట్రెండ్స్ సోషల్ మీడియాలో సరదాను నింపుతున్నప్పటికీ, వ్యక్తిగత గోప్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసేటప్పుడు లొకేషన్ వివరాలు లేదా సున్నితమైన సమాచారం బయటపడకుండా చూసుకోవడం ముఖ్యం. ఏదిఏమైనప్పటికీ 2026 నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది.ఇది కూడా చదవండి: ఎయిర్వేస్లో జాత్యహంకారం? .. ప్రయాణికురాలి మండిపాటు -
మరో ‘నిర్భయ’ ఉదంతం
ఫరీదాబాద్/చండీగఢ్: భారతావనిలో మహిళలకు రక్షణలేదని చాటిన అత్యంత దారుణమైన ‘నిర్భయ’ఉదంతాన్ని 13 ఏళ్ల తర్వాత మళ్లీ స్మరణకు తెస్తూ హరియాణాలోని ఫరీదాబాద్‌లో మృగాళ్లు యువతిని గ్యాంగ్‌రేప్ చేసి రోడ్డుపై పడేసి వెళ్లారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వ్యాన్‌ను పోనిస్తూ అందులో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రాక్షసపర్వం సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి మంగళవారం తెల్లవారుజాము మూడు, నాలుగింటిదాకా కొనసాగింది. ఈ హేయమైన అత్యాచారం తర్వాత యువతిని వేగంగా వెళ్తున్న వ్యాను నుంచి రోడ్డు మీదకు విసిరేసి వెళ్లారు. దీంతో తల, ముఖం, భుజానికి తీవ్రమైన గాయాలై యువతి నడిరోడ్డుపై రక్తమోడింది. జీవచ్ఛవంలా పడి ఉన్నా బలాన్ని కూడదీసుకుని ఎలాగోలా తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో హుతాశురాలైన సోదరి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాద్షా ఖాన్ పౌర ఆస్పత్రిలో చేరి్పంచింది. పరిస్థితి విషమించడంతో వెంటనే అక్కడి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వేగంగా రోడ్డుపైపడటంతో తల, ముఖం, భుజం దెబ్బతిన్నాయి. ఇప్పటికే 12కుపైగా కుట్లు వేశారు. ముఖంలో ఎముకలు విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని సూచించారు. విషయం తెల్సుకున్న హరియాణా పోలీసులు రంగంలోకి దిగి ఇంతటి దారుణానికి పాల్పడిన మృగాళ్లను అరెస్ట్‌చేశారు. వీరిలో ఒకరికి ఉత్తరప్రదేశ్కాగా మరొకరిది మధ్య ప్రదేశ్. వీళ్లిద్దరూ ఫరీదాబాద్‌లోనే నివసిస్తున్నారు. లిఫ్ట్ అడిగితే... బాధితురాలి సోదరి, ఫరీదాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతికేళ్ల బాధితురాలు వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా ఫరీదాబాద్‌లోని తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. సోమవారం రాత్రి 8.30 గంటలప్పుడు తల్లితో గొడవపడి సెక్టార్23 పరిధిలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాత్రి కాస్తంత ఆలస్యమయ్యాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు న్యూ ఇండ్రస్టియల్ టౌన్షిప్–2 వరకు ఆటోలో వచ్చింది. అక్కడి నడుచుకుంటూ మెట్రో చౌక్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ప్రజారవాణా బస్సులో ఇంటికెళ్లేందుకు రోడ్డు మీద ఎదురుచూసింది. అదే సమయంలో అటుగా వ్యానులో వచ్చిన ఇద్దరు నిందితులు తాము కూడా అదే కళ్యాణ్‌పురికి వెళ్తున్నామని నమ్మబలికారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి వ్యానులో ఎక్కించుకున్నారు. బాధితురాలిని గమ్యస్థానంలో దిగబెట్టకుండా వేరే మార్గంలో గురుగ్రామ్ సిటీ వైపు వ్యానును పోనిచ్చారు. కదులుతున్న వ్యానులోనే ఇద్దరూ ఆమెను గ్యాంగ్‌రేప్ చేశారు. ఆ వ్యాను రాజ్చౌక్ రోడ్డులో మంగళవారం రాత్రి 3 గంటలప్పుడు వెళ్తున్నప్పుడు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు సీసీటీవీ వీడియోలో రికార్డయింది. రేప్ చేశాక ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ములా హోటల్ వద్ద రహదారిపై విసిరేసి వెళ్లారు. కాపాడండంటూ సాయం కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా అర్ధరాత్రి రోడ్లు నిర్మానుష్యంగా ఉండటం, దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ఒక్కరూ స్పందించలేదని బాధితురాలు సోదరితో చెప్పినట్లు తెలుస్తోంది. గాయాలపాలైన యువతి ఎలాగోలా తన సోదరికి ఫోన్ చేయడంతో ఆమె వచ్చి ఆస్పత్రిలో చేర్పించింది. సోదరి ఇచ్చిన ఫిర్యాదులో కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు వెంటనే నిందితుల కోసం వేట మొదలెట్టి ఇద్దరినీ బుధవారం మధ్యాహ్నం అరెస్ట్‌చేసి సిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలిచ్చారు. నేరాన్ని నిందితులిద్దరూ జడ్జి ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘‘ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించేదాకా నిందితుల వివరాలను వెల్లడించబోము. తీవ్ర గాయాల కారణంగా బాధితురాలు ఆస్పత్రిలో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదు’’ అని ఫరీదాబాద్ పోలీస్ ప్రజాసంబంధాల అధికారి యశ్పాల్ యాదవ్ బుధవారం మీడియాతో చెప్పారు. దారుణోదంతంలో కీలకంగా మారిన వ్యానును మారుతి సుజుకీ ఎకోగా గుర్తించారు. దానిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు వ్యాను నుంచి బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. భారతీయ న్యాయ సంహితలోని 70(1) (యువతిపై గ్యాంగ్‌రేప్), 351(3) (నేరపూరిత లైంగికదాడి), 3(5) (మూకుమ్మడి దురుద్దేశం) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలున్నారు. ఇదీ చదవండి: అస్థిపంజరంలా ఆమె, ఆకలితో కన్నుమూసిన తండ్రి -
Uttarakhand: సొరంగంలో ఢీకొన్న రైళ్లు.. 60 మందికి తీవ్ర గాయాలు
చమోలీ: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఒక సొరంగంలో రెండు లోకో రైళ్లు (టన్నెల్ రైళ్లు) పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో మొత్తం 109 మంది కార్మికులు, అధికారులు ఉన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 9:30 గంటల సమయంలో షిఫ్ట్ మార్పు జరుగుతున్న వేళ చోటుచేసుకుంది. కార్మికులు, అధికారులను తీసుకెళుతున్న ఒక రైలు.. నిర్మాణ సామగ్రితో వెళ్తున్న మరో రైలును ఢీకొంది. సొరంగం లోపల వెలుతురు తక్కువగా ఉండటం, సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద తీవ్రతకు రైళ్ల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. #WATCH | Chamoli, Uttarakhand | Several workers injured after internal transport trains operating within the THDC hydropower project area at Pipalkoti, collided with each other.SP Chamoli, Surjeet Singh says, "42 people have been admitted to the district hospital, out of which… pic.twitter.com/gxVEXHwScB— ANI (@ANI) December 31, 2025ఈ ప్రమాదం కారణంగా సుమారు 60 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో 42 మందిని గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, మరో 17 మంది పీపల్‌కోటిలోని వివేకానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్రమైన గాయాలు అయినట్లు సమాచారం. జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, టీహెచ్‌డీసీ (టీహెచ్‌డీసీ)ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సొరంగం లోపల ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు భద్రతా నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. లోకో రైళ్ల రాకపోకల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడం, సొరంగం లోపల తగినంత వెలుతురు ఉండేలా చూడటంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. 2026కు పూర్తి కావాల్సిన ఈ 444 మెగావాట్ల ప్రాజెక్టు పనుల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: ‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్ టెస్ట్.. 180లోనూ తొణకని నీరు! -
2025 చివరి సూర్యోదయం చూశారా?
మరికొద్ది గంటల్లో.. 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం ఉత్సాహంతో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో.. చివరి సూర్యోదయం వీక్షించేందుకు తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరానికి జనం పోటెత్తారు. ప్రతిసారిలాగే.. ఈ ఏడాది చివరి రోజు ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రం కన్యాకుమారి సందర్శకులు, భక్తులతో కిక్కిరిసిపోయింది. తిరువల్లువర్ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి సూర్యోదయాన్ని వేలమంది వీక్షించారు. నారింజ రంగులో ఆకాశంలో కనిపించిన ఆ సుందర దృశ్యాలను కెమెరాలు, మొబైల్ ఫోన్లలో బంధించారు. 2025ன் கடைசி சன்ரைஸ்.. குமரியில் கண்டு ரசித்த சுற்றுலா பயணிகள் #kanyakumari #sunrise #newyear2026 #sun pic.twitter.com/f7U5H4FzpI— Thanthi TV (@ThanthiTV) December 31, 2025ప్రత్యేకం ఎందుకంటే.. కన్యాకుమారి భారతదేశ దక్షిణ అంచున ఉంది. ఇక్కడి సూర్యోదయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు ఇక్కడి సూర్యోదయాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు, పర్యాటకులు చేరుతారు. అందుకు కారణం.. అరేబియా సముద్రం, బెంగాల్ ఖాతం, భారత మహాసముద్రం కలిసే అరుదైన ప్రదేశం కాబట్టి. ఈ సంగమం వద్ద సూర్యోదయం చూడటం ఒక ప్రత్యేక అనుభవం. అలాగే సూర్యాస్తమయం కూడా. దేశంలో చాలా అరుదుగా ఒకే ప్రదేశంలో సముద్రంపై సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వీక్షించగల అవకాశం ఇక్కడ ఉంది. అయితే అరుదైన ప్రదేశాల్లో ఒకటిగానే కాకుండా.. ఆధ్యాత్మిక ధోరణిలోనూ ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. సూర్యోదయాన్ని దైవానుభూతిగా భావించే భక్తులు.. సంవత్సరాంతం, ఏడాది తొలిరోజు.. పండుగల సమయంలో ప్రత్యేకంగా సముద్ర స్నానాలు చేస్తారు. సుందర దృశ్యాలు.. ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో నారింజ, బంగారు, ఎరుపు రంగులతో కాంతులు కనిపిస్తాయి. సముద్రపు అలలపై ఆ ప్రతిబింబం పడటంతో ఆ దృశ్యాన్ని మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే నిత్యం ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుక పనిగట్టుకుని పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. -
దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల వేళ అందరినీ నిరుత్సాహ పరిచే వాతావరణం ఏర్పడింది. 2026 న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దట్టమైన పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పరిసరాల్లో దృశ్యమానత (Visibility) గణనీయంగా పడిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శీతాకాలపు చలి తీవ్రతకు పొగమంచు తోడవడంతో రాజధాని ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పొగమంచు ప్రభావంతో దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్‌జెట్,ఎయిర్ ఇండియా మొదలైనవి తమ విమాన సర్వీసుల్లో జాప్యం జరుగుతున్నదని వెల్లడించాయి. తక్కువ దృశ్యమానత కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ‘క్యాట్ III’ ప్రమాణాలకు అనుగుణంగా లేని విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల షెడ్యూల్లో మార్పులు తప్పవని స్పష్టం చేశారు.ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ఏడాది వేడుకల కోసం ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. విమానాల ఆలస్యం కారణంగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్స్ అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు చలి, మరోవైపు గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు సర్వీసులపై కూడా ఈ పొగమంచు ప్రభావం పడటంతో రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది.ఈ నేపధ్యంలో విమానయాన సంస్థల ప్రతినిధులు ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రయాణికులు ఇంటి నుండి బయలుదేరే ముందే తమ విమాన స్థితిగతులను తెలుసుకోవాలని, ఇందుకోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ లేదా యాప్‌ల ద్వారా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. అలాగే ఎయిర్‌లైన్స్ పంపే ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లను గమనిస్తూ ఉండాలని సూచించారు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే విమానయాన సంస్థల హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించాలన్నారు.ఇది కూడా చదవండి: ‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్ టెస్ట్.. 180లోనూ తొణకని నీరు! -
డీఎన్ఏలో తేలినా పెళ్లికి నో!
క్రైమ్: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన బీజేపీ నాయకుడు జగన్నివాస్ రావ్ కొడుకు కృష్ణ జె.రావ్ ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి శిశువుకు జన్మనిచ్చి నెలలు గడుస్తున్న సమస్య పరిష్కారం కాలేదు. కోర్టు ఆదేశాల మేరకు డీఎన్ఏ పరీక్షలు చేయగా జన్మనిచ్చిన శిశువుకు కృష్ణ జె.రావ్ తండ్రిగా తేలింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోడానికి కృష్ణ నిరాకరించారు. ఇదే విషయంపై ఆర్ఎస్ఎస్ నాయకుడు కల్లడ్క ప్రభాకర్ భట్‌తో పాటు అనేక మంది బీజేపీ నాయకులు రాజీ పంచాయతీ చేయగా అదీ విఫలమైంది. ఇక న్యాయ పోరాటమే మార్గమని బాధిత యువతి కుటుంబం నిర్ణయించింది. న్యాయపోరాటానికే సిద్ధం కోర్టు ద్వారా శిశువుకు తండ్రి, తనకు భర్త కావాలనే ఉద్దేశంతో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కృష్ణ జె.రావ్‌కు యువతితో పాఠశాల విద్యార్థి దశ నుంచీ పరిచయం. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గర్భవతిని చేసిన యువతినే పెళ్లి చేసుకోవాలని అనేక మంది కృష్ణ కుటుంబంపై ఒత్తిడి చేశారు. మొదట నిరాకరించినా కొద్ది రోజుల తరువాత ఒత్తిడికి తలొగ్గి పెళ్లి చేసుకోడానికి ఒప్పుకున్నారు. అయితే అతనికి 21 ఏళ్లు పూర్తి కాని కారణంగా, పూర్తికాగానే వివాహం చేస్తామని కృష్ణ తండ్రి జగన్నివాస రావ్ హామీనిచ్చారు. చేతులెత్తేసిన కృష్ణ శిశువు పుట్టగానే కృష్ణకు 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోడానికి నిరాకరించిన తరువాత విషయం పోలీసు స్టేషన్‌కు చేరింది. కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన కృష్ణ ఆ శిశువుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. దీంతో కోర్టు జోక్యం చేసుకొని డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. బాధిత యువతి, శిశువు, కృష్ణల రక్త నమూనాలను బెంగళూరు ప్రయోగాలయానికి తరలించి పరీక్షించగా కృష్ణే తండ్రి అని తేలింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. బీజేపీ నుంచి జగన్నివాస్ రావ్‌ను బహిష్కరించింది. పలు సార్లు రాజీ ప్రయత్నాలు శిశువు డీఎన్ఏ పాజిటివ్‌గా వచ్చిన తరువాత కృష్ణ కుటుంబం వివాహం చేసుకోడానికి నిరాకరిస్తున్నట్లు యువతి కుటుంబం అరోపిస్తోంది. మూడు నెలల నుంచి ఆర్ఎస్ఎస్ నాయకులు కల్లడ్క ప్రభాకర్ భట్, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సతీశ్ కుంపల, విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నంజుండి నేతృత్వంలో పలు మార్లు రాజీ ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. కోర్టు తీర్పుకే కట్టుబడతాం ఇలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి. ఇక న్యాయ పోరాటం చేయటమే మేలని భావించాం. జైలుకెళ్లిన కృష్ణ బెయిల్‌పై బయటకు వచ్చారు. శిశువుకు తండ్రి, తనకు భర్త దొరికితే చాలు. రాజీ ప్రయత్నాలు విఫలం కావటంతో కోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు బాధిత యువతి చెబుతోంది. డబ్బు ఆశ చూపారు, న్యాయం దొరకలేదు. ఇప్పుడు న్యాయ పోరాటమే తమకు శరణ్యమని బాధిత యువతి కుటుంబం అంటోంది. -
‘వందే భారత్ స్లీపర్’ స్పీడ్ టెస్ట్.. 180లోనూ తొణకని నీరు!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతమయ్యింది. రైల్వే రంగంలో సరికొత్త విప్లవం ఉద్భవించింది. ఎంతో కాలంగా దేశంలోని ప్రయాణికులంతా ఎదురుచూస్తున్న ‘వందే భారత్ స్లీపర్’ ఎక్స్‌ప్రెస్ రైలు వందశాతం మేరకు తన సత్తా చాటింది. రాజస్థాన్‌లోని కోటా - నాగ్డా సెక్షన్ మధ్య నిర్వహించిన హై-స్పీడ్ ట్రయల్ రన్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పట్టాలపై పరుగులు తీసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అద్భుతమైన ఘట్టానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. భారతీయ సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకుందో ఆ వీడియోలో వివరించారు.స్థిరత్వానికి పరీక్ష.. ‘వాటర్ టెస్ట్’ఈ నూతన ‘వందే భారత్ స్లీపర్’ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ కేవలం వేగానికి మాత్రమే పరిమితం కాలేదు. రైలు ప్రయాణంలో ఉండే స్థిరత్వాన్ని (Stability) కూడా పరీక్షించారు. 180 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకెళ్తున్న సమయంలో అదే రైలు లో ఉంచిన నీటి గ్లాసులు ఏమాత్రం కదలకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రి షేర్ చేసిన వీడియోలో, స్పీడోమీటర్ 180 కి.మీ వేగాన్ని చూపిస్తున్నా, టేబుల్ పై ఉన్న నీటి గ్లాసుల నుండి ఒక్క చుక్క నీరు కూడా కిందకు పడలేదు. ఇది రైలులోని అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, వైబ్రేషన్ నియంత్రణకు నిదర్శనంగా నిలిచింది. Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025సుదీర్ఘ ప్రయాణాల్లో సరికొత్త అనుభూతి ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు కేవలం కూర్చునే సదుపాయం (Chair Car) మాత్రమే కలిగి ఉన్నాయి.అయితే కొత్తగా రాబోతున్నఈ స్లీపర్ వెర్షన్ వందే భారత్.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వరంగా మారనుంది. రాత్రిపూట ప్రయాణించే ఈ రైలు ప్రయాణికులకు విమాన స్థాయి సౌకర్యాలను ఈ రైలు అందించనుంది. రైలులో మెరుగైన కుషన్ సీట్లు, అధునాతన ఏసీ వ్యవస్థ, శబ్దం తక్కువగా ఉండేలా రూపొందించిన కోచ్‌లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయనున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.‘కవచ్’ రక్షణతో సురక్షిత ప్రయాణం ఈ రైలు విషయంలో వేగంతో పాటు భద్రతకు కూడా రైల్వే శాఖ పెద్దపీట వేసింది. ఈ స్లీపర్ రైలులో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘కవచ్’ (Kavach) యాంటీ కొలిజన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ప్రమాదాలను నివారించడంలో కీలకంగా మారనుంది. దీనికితోడు అగ్నిప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, ఆటోమేటిక్ డోర్లు, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడేందుకు టాక్-బ్యాక్ సదుపాయం లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. త్వరలోనే ఈ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, ఇది భారత రైల్వే రూపురేఖలను మార్చనున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: చొరబాట్లకు మమత మద్దతు: అమిత్ షా -
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: ఇయర్ ఎండ్నాడు.. కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశరాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ ఉదయం నుంచి డెలివరీ సేవలు నిలిచిపోయాయి. జోమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.ఈ సమ్మెకు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ–ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో.. ఇవాళ భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంగా ఫుడ్, గ్రాసెసరీలపై అవి ఎక్కువగా ఉండే ఛాన్స్ఉంది. అయితే సమ్మె నేపథ్యంలో ఆ సేవలకు విఘాతం కలగనుంది. పుణె, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాతోపాటు టయర్–2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావ పడుతుందని అంటున్నారు. హైదరాబాద్‌లో ఐటీ కారిడార్ ఈ సమ్మె కారణంగా ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా కొందరు నెటిజన్లు సైతం gig workersకు మద్దతుగా నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకూ తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ‘ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారెంటీ లేదు, భద్రతతోపాటు గౌరవం కూడా లేదు’అని గిగ్‌వర్కర్లు వాపోతున్నారు. బ్రేక్ లేకుండా పనిచేస్తున్న తమకు న్యాయమైన జీతంతో పాటు కమీషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు.. 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్‌ను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే.. రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.నిజానికి ఈ డిమాండ్లతో.. క్రిస్మస్ రోజునే దాదాపు 40వేల మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా.. దాదాపు 50 శాతం డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా లక్షా 50వేల మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదను చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మెబాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతోంది.ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానుంది. అలాగే.. సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్–మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.సమ్మెతో లాస్ ఎవరికి?.. గిగ్ వర్కర్ల సమ్మె.. అంటే డెలివరీ బాయ్స్ ఆగిపోవడంతో కస్టమర్లకు ఫుడ్, గ్రోసరీ సేవలు నిలిచిపోతాయి. ఈ–కామర్స్ ఆర్డర్లు ఆలస్యం అవుతాయి. లేదంటే రద్దు కూడా కావొచ్చు. తద్వారా లక్షల మందికి ఇయర్ ఎండ్ ప్రణాళికలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. సమ్మె ద్వారా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైనవాటికి భారీగా ఆర్డర్లు నిలిచిపోవడం వల్ల ఆదాయం తగ్గిపోతోంది. రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలు దెబ్బ తినే అవకాశం ఉంది. రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. చిన్న వ్యాపారాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. గిగ్ వర్కర్లు (డెలివరీ ఏజెంట్లు) తాత్కాలికంగా ఆదాయం ఆగిపోతుంది. అయితే.. దీర్ఘకాలంలో తమ డిమాండ్లు నెరవేరితే ఉద్యోగ భద్రత, జీతం, బీమా లాంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉండడంతో.. ఇవాళ వచ్చే అదనపు కమిషన్ల కన్నా సమ్మెకే వాళ్లు మొగ్గు చూపిస్తుండడం గమనార్హం. వినియోగదారుల అసంతృప్తి, కంపెనీల ఒత్తిడి, కార్మిక సంఘాల డిమాండ్లతో.. వెరసి ఈ సమ్మెలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాగైనా.. గిగ్ వర్కర్లను కార్మిక చట్టాల్లో చేర్చే పాలసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్‌లు
ఢిల్లీ: చైనా విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి వచ్చే ఉక్కు(స్టీల్) ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధించింది. మూడేళ్ల పాటు ఈ సుంకాలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. అయితే, చైనా నుండి వచ్చే ఎగుమతుల పెరుగుదలను నియంత్రించే లక్ష్యంతో భారత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే, చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన, నాసిరకం ఉత్పత్తులను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుండి వచ్చే ఎగుమతుల పెరుగుదలను నియంత్రించే లక్ష్యంతో(సేఫ్ గార్డు డ్యూటీ) భారత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా భారత్.. చైనాపై మొదటి సంవత్సరంలో సుంకాన్ని 12 శాతంగా నిర్ణయించగా.. రెండో సంవత్సరంలో 11.5 శాతానికి తగ్గించనున్నారు. అలాగే, మూడో సంవత్సరంలో 11%కి తగ్గిస్తున్నట్టు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల్లో భారత్ (India) రెండో స్థానంలో ఉంది. చైనా (China) నుంచి నాసిరకం ఉక్కు తక్కువ ధరలకే వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల దేశీయ ఉక్కు తయారీదారులపై కూడా ప్రభావం పడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులకు దీనినుంచి ఉపశమనం కల్పించింది. చైనా, వియత్నాం, నేపాల్ దేశాలకు ఈ సుంకాలు వర్తించనున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఇది వర్తిస్తుంది. Big relief for domestic steel manufacturersGovt imposes safeguard duty on imports of certain steel productsSafeguard duty imposed for three years in a staggered mannerDuty will be imposed at 12% in the first year, 11.5% in the second year, followed by 11% in the third year pic.twitter.com/ehH2CPqYb2— Prakash Priyadarshi (@priyadarshi108) December 30, 2025ఇదిలా ఉండగా.. చౌక దిగుమతులు, నాసిరకం ఉత్పత్తుల కారణంగా దేశీయ ఉక్కు పరిశ్రమ దెబ్బతినకూడదని మంత్రిత్వ శాఖ పదేపదే చెబుతోంది. ఇటీవల, దిగుమత్తుల్లో గణనీయమైన పెరుగుదల ఉండటం దేశీయ కంపెనీలపై ప్రభావం చూపించింది. దీంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) మూడేళ్ల సుంకాన్ని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో సుంకాలను విధించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఈ సమస్యను ముందుగానే ఎత్తి చూపింది. ఆగస్టు 2025లో చౌక ఉక్కు దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్‌కు ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లోనే భారత్‌కు విదేశాల నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 12 శాతం తాత్కాలిక సుంకం విధించింది. 200 రోజులకు గాను విధించిన ఈ సుంకాలు గత నెలలోనే ముగిశాయి. -
నా భర్త అశ్లీల వీడియోలు చూస్తూ.. నరకం చూపిస్తున్నాడు..!
బెంగళూరు: భర్త విచిత్ర ప్రవర్తన, లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. హెచ్ఆర్గా ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయమై అనంతరం ప్రేమకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించిన అనంతరం 2025 సెపె్టంబరు 3 తేదీన కుటుంబ సభ్యులు చింతామణిలో మంజునాథ్‌తో వివాహం జరిపించారు.వివాహమైన అనంతరం భర్త సైకోలా ప్రవర్తిస్తుండగా ఫోన్ చూసి లైంగిక ప్రక్రియకు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో వారి ముందు నగ్నంగా తిరుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ప్రస్తుతం సైకో భర్త వేధింపులకు భార్య హడలిపోయింది. నేను వివాహం చేసుకుంది ఇలాంటి సైకో వ్యక్తినా అని మదనపడుతోంది. వివాహమైన కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉన్న భర్త ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తుండటంతో భార్య బెంబేలెత్తిపోతోంది. అత్తమామల ముందు కూడా నగ్నంగా సంచరిస్తుండటంతో పాటు ప్యాసేజ్లోకి వెళ్లి చుట్టుపక్కల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. భర్త విచిత్ర ప్రవర్తన, వేధింపులతో పాటు తనను భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా దూషించి దాడికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కేంద్ర విభాగం మహిళా స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు గిగ్ వర్కర్ల సమ్మె
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులవడమే కాకుండా, సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్–మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. ఈ సమ్మెకు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ–ఎన్సీఆర్, పశ్చిమబెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వారు సమ్మెలో పాల్గొంటున్నారు. ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకూ తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ‘ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారెంటీ లేదు, భద్రతతోపాటు గౌరవం కూడా లేదు’అని వాపోతున్నారు. పుణె, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాతోపాటు టయర్–2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావ పడుతుందని అంటున్నారు. -
కాటేసిన కలుషిత నీరు
ఇండోర్(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భగీరథ్‌పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అయిన కలుషిత నీటిని తాగిన ఉదంతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్యవిభాగ సిబ్బంది 2,703 నివాసాల్లోని దాదాపు 12,000 మంది స్థానికులకు వైద్య పరీక్షలు చేశారని చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ ప్రసాద్ హసానీ చెప్పారు.మధ్యస్థాయి రోగ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న 1,146 మందికి వెంటనే చికిత్సనందించారు. 111 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారని, ఆరోగ్యం మెరుగుపడటంతో 18 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. బాధితులందరికీ ప్రభు త్వ ఖర్చులతో వైద్యసాయం అందిస్తామని ఇండోర్ మేయర్ పుష్యామిత్ర భార్గవ హామీ ఇచ్చారు. నర్మదా నదీజలాలను శుద్ధి చేసి నల్లా కనెక్షన్ ద్వారా ఈ ప్రాంతానికి మంచినీటిని సరఫరాచేస్తున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాంపిళ్లను సేకరించారని ఆయన చెప్పారు. ఇండోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోన్ జిల్లాలోని జలూద్ నుంచి పైప్‌లైన్ ద్వారా నర్మదా నదీజలాలను నగరానికి సరఫరాచేస్తున్నారు. -
ఇకపై వాదనలకు ‘టైం’ లిమిట్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. కోర్టుల్లో కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు గంటల తరబడి వాదనలు వినిపించే సంప్రదాయానికి స్వస్తి పలకనుంది. కోర్టు విలువైన సమయాన్ని ఆదా చేయడంతో పాటు, సామాన్యుడికి సత్వర న్యాయం అందించే దిశగా సుప్రీంకోర్టు సరికొత్త విధానాన్ని (ఎస్ఓపీ) అమల్లోకి తెచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాల మేరకు కీలక సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం.. ఇకపై న్యాయవాదులు తమ వాదనలను నిర్ణీత సమయంలోపే ముగించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక వల్ల రోజుకు ఎక్కువ కేసులను విచారించే వీలుంటుందని, తద్వారా పెండింగ్ భారం తగ్గి సత్వర న్యాయం సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. కొత్త నిబంధనలు ఇవే.. 1. ముందుగానే టైం చెప్పాలి: కేసు విచారణకు హాజరయ్యే సీనియర్ న్యాయవాదులు తాము వాదనలు వినిపించడానికి ఎంత సమయం తీసుకుంటారో ముందే స్పష్టం చేయాలి. విచారణ తేదీకి కనీసం ఒక రోజు ముందుగా సుప్రీంకోర్టు ఆన్లైన్ అప్పియరెన్స్ పోర్టల్ ద్వారా ఈ వివరాలను నమోదు చేయాలి. 2. ఐదు పేజీల నోట్స్ తప్పనిసరి: కేవలం మౌఖిక వాదనలే కాకుండా.. విచారణకు మూడు రోజుల ముందే న్యాయవాదులు తమ వాదనలకు సంబంధించిన సంక్షిప్త లిఖితపూర్వక నోట్స్ సమర్పించాలి. ఇది ఐదు పేజీలకు మించకూడదు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ ద్వారా గానీ, నోడల్ కౌన్సిల్ ద్వారా గానీ వీటిని ఫైల్ చేయాలి. అలాగే ప్రతివాదులకు కూడా ఈ కాపీని అందజేయాలి. 3. గడువులోపే ముగించాలి: తాము ముందుగా నిర్ణయించుకున్న లేదా కోర్టు కేటాయించిన సమయంలోపే లాయర్లు తమ వాదనలను కచి్చతంగా ముగించాలి. అనవసర సాగదీతకు తావివ్వకుండా చూడాలి. -
2025 ఏ టు జెడ్
2025 ప్రపంచమంతటికీ తీపి, చేదుల మిశ్రమంగా గడిచింది. ప్రాకృతిక విపత్తులు, ఘోర ప్రమాదాలు, రాజకీయపుటెత్తులు, యుద్ధక్రీడలు, నేతల నోటి దురుసులు, ఎన్నికల సమరాంగణాలు... ఇలా మొత్తమ్మీద మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలావరకు ఖేదమే మిగిలించాయి. ఆంగ్ల అక్షరక్రమంలో అలాంటి ఘటనల సమాహారం...ఎ - ఎయిరిండియా ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా–171 విమానం టేకాఫైన 32 సెకన్లకే రన్‌వే ఎదురుగా ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. విమానంలోని 242 మంది, కింద ఉన్న మరో 19 మంది నిర్భాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపింది. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ప్రయాణికుడు మృత్యుంజయునిగా చిన్నపాటి గాయాలతో బయటపడటం విశేషం.బి - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ, ఆర్జేడీ సారథ్యంలోని విపక్ష మహాఘట్బంధన్ కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కూటమి 243 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 202 చోట్ల విజయదుందుభి మోగించి ఆశ్చర్యపరిచింది. ఘట్బంధన్ కేవలం 35 స్థానాలతో ఘోర పరాభవం మూటగట్టుకుంది. నితీశ్‌కుమార్ సీఎంగా ఏకంగా పదోసారి ప్రమాణస్వీకారం చేశారు. సి - క్యాస్ట్ సెన్సెస్ కరోనా కారణంగా 2020లో వాయిదాపడ్డ జనగణనను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇది 2027 మార్చి నుంచి మొదలవనుంది. అందులో భాగంగా కులగణన సైతం చేపడుతున్నట్టు వెల్లడించడం విశేషం. బ్రిటిష్ హయాంలో మన దేశంలో 1881 నుంచి 1931 దాకా కులగణన జరిగింది. కుల విభజనను పెంచరాదనే ఉద్దేశంతో స్వాతంత్య్రానంతరం ఆ ప్రక్రియను నిలిపేశారు. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేసినా దాన్ని పూర్తిస్థాయి కులగణనగా పరిగణించడం లేదు. డి - డీప్‌సీక్ ఈ చైనా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. డౌన్లోడ్ చార్టుల్లో చూస్తుండగానే అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్రత్యర్థి ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీని తోసిరాజంది. దాంతో పోలిస్తే కారుచౌకగా సేవలందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా డీప్‌సీక్–ఆర్1ను విడుదల చేసింది. దీని దెబ్బకు ఓపెన్ఏఐ మార్కెట్ విలువ 600 బిలియన్ల మేరకు తగ్గిపోయింది. ఇ - ఎప్స్టీన్ ఫైల్స్ 20 ఏళ్లనాటి ఈ కామ భూతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వారి లైంగికానందం కోసం బాలికలను ఎరవేసిన వ్యాపారి ఎప్స్టీన్ చివరికి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఉదంతం ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. ఈ కేసు విచారణ ఫైళ్లను బయటపెట్టాలన్న కాంగ్రెస్ ఉత్తర్వులపై ట్రంప్ అయిష్టంగానే సంతకం చేసినా, తనకు నష్టం లేనివాటిని మాత్రమే, అదీ విడతలవారీగా వదులుతూ సాగదీస్తున్నారు. ఎఫ్ - ఫ్లడ్స్ ఇన్ ఆసియా నానాటికీ తీవ్రమవుతున్న పర్యావరణ మార్పుల సమస్యకు ఈ ఏడాది ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వరదలు అద్దంపట్టాయి. శ్రీలంక, ఇండొనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాం తుఫాన్ల దెబ్బకు కుదేలయ్యాయి. ఈ విపత్తు భారత్‌ను కూడా తీవ్రంగానే నష్టపరిచింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆకస్మిక వరదలు, తుపాన్లు వేలాది నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జెన్–జెడ్ ఆందోళనలు ప్రభుత్వాల, పాలకుల కర్రపెత్తనంపై ఆన్లైన్ వీరులు ఆఫ్‌లైన్‌లో ఆందోళనలకు దిగితే ఎలా ఉంటుందో నవతరం రుచిచూపింది. ఈ నవయువత నిరసన గళాల ధాటికి నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దె దిగాల్సి వచ్చింది. జెన్–జెడ్ ఆందోళనలు నేపాల్‌కే పరిమితం కాలేదు. ఇండొనేసియా మొదలుకుని మడగాస్కర్, బల్గేరియా మీదుగా పెరు, మెక్సికో దాకా విస్తరించాయి.జి - హాంకాంగ్ అగ్ని ప్రమాదంఅగ్నిగోళంలా మండిపోతున్న ఆకాశహర్మ్యం. దానికేసి వేలెత్తి చూపుతూ, తన భార్య అందులో చిక్కుబడిందంటూ విలపిస్తున్న వృద్ధుని ఫొటో. ఇటీవల ఆన్లైన్లో వారాల తరబడి వైరల్‌గా మారిన చిత్రమిది. అందుకు కారణమైన హాంకాంగ్‌లోని వాంగ్‌ఫుక్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం 160 మందిని పొట్టనపెట్టుకుంది. 40 గంటలకు పైగా శ్రమిస్తేనే గానీ మంటలు అదుపులోకి రాలేదు.హెచ్ - ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్12 రోజుల యుద్ధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ పోరు ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, క్షిపణి దాడులు ఇరాన్ సైనిక వ్యవస్థలతో పాటు అణు వ్యవస్థలనూ తీవ్రంగా నష్టపరిచాయి. ఇరాన్‌పై బంకర్ బస్టర్ బాంబులేసి అమెరికా యుద్ధజ్వాలల్లో చలికాచుకుంది. తర్వాత తీరిగ్గా తానే సంధి చేసి జబ్బలు చరుచుకుంది.జె జగ్దీప్ ధన్ఖడ్మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ధన్‌ఖడ్. ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్‌గా సభలో చురుగ్గా వ్యవహరిస్తూ, అధికార పక్షానికి పెట్టని కోటగా నిలుస్తూ వచ్చిన ఆయన రాజీనామా సంచలనమే సృష్టించింది. ఇలా తప్పుకున్న తొలి ఉపరాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. పలు అంశాలపై కేంద్రంతో ఆయనకు కొంతకాలంగా అంతరం పెరుగుతూ వచ్చిందంటారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రాజ్యసభలో విపక్షాలిచ్చిన నోటీసును ధన్‌ఖడ్ స్వీకరించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టడం రాజీనామాకు తక్షణ కారణంగా నిలిచిందని అంటారు.కె కర్ణాటకలో సిద్ధూ వర్సెస్ డీకే కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత పవర్ పాలిటిక్స్ కుస్తీ పోటీలను తలపిస్తున్నాయి. గద్దె దిగేందుకు సీఎం సిద్ధరామయ్య ససేమిరా అంటుండటం, ఒప్పందం ప్రకారం కురీ్చని తనకు అప్పగించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పట్టుబడుతుండటం అధిష్టానానికి తీరని తలనొప్పిగా మారింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగేలా హైకమాండే ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో ఇప్పుడు తన వంతు వచ్చిందన్నది డీకే వాదన.ఎల్ - లౌరే దోపిడీ ఈ శతాబ్దంలోనే అతి పెద్ద దోపిడీగా సంచలనం సృష్టించింది. పారిస్‌లోని లౌరే ఆర్ట్స్ గ్యాలరీలోకి అక్టోబర్ 19న ఆదివారం వేళ నలుగురు దోపిడీ దొంగలు చొరబడ్డారు. అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యమున్న 8 అమూల్య ఆభరణాలను కాజేశారు. వాటి విలువ ఏకంగా 10 కోట్ల డాలర్లుగా తేలింది. ఇంతటి దోపిడీని దొంగలు కేవలం ఏడంటే 7 నిమిషాల్లో పని ముగించి జారుకోవడం విశేషం. ఎం - మోదీ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ మరింత పెరిగింది. నిజానికి గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీని నిలబెట్టుకోకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. జేడీ (యూ) వంటి పారీ్టల మద్దతు కీలకంగా మారడంతో మోదీకి ఇక కష్టకాలమేనన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ కీలకమైన ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాలతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపైనా మోదీ పేరుప్రఖ్యాతులు మరింతగా పెరిగాయి. జీ7తో పాటు ఏ శిఖరాగ్ర సదస్సులోనైనా ఆయనే ప్రధాన ఆకర్షణగా మారుతున్న పరిస్థితి!ఎన్ - నెట్‌ఫ్లిక్స్–వార్నర్ బ్రదర్స్ డీల్ ప్రపంచవ్యాప్తంగా వినోదపు తీరుతెన్నులనే సమూలంగా మార్చేయగల పరిణామంగా అంతా పేర్కొంటున్న ఒప్పందమిది. వార్నర్ బ్రదర్స్ టీవీ స్టూడియోలతో పాటు కీలకమైన స్ట్రీమింగ్ విభాగాన్ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 6.47 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది! హ్యారీపోటర్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, గేమ్ ఆఫ్ థోర్న్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ సిరీస్‌లతో పాటు స్కూబీ డూ, టామ్ అండ్ జెర్రీ కామిక్స్, హెచ్‌బీఓ మాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫాం, డిస్కవరీ చానల్ వంటివన్నీ వార్నర్ నుంచి నెట్‌ఫ్లిక్స్ సొంతమవుతాయి. ఈ దెబ్బకు చాలా దేశాల్లో సినిమా థియేటర్లు మూతబడటం ఖాయమన్న అంచనాలున్నాయి. ఓ - ఆపరేషన్ సిందూర్ మే 7 తెల్లవారుజాము. బైసారన్ లోయలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన సైన్యం కొట్టిన దెబ్బకు దాయాది గింగిరాలు తిరిగిన రోజు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వందలాది ముష్కరులను హతమార్చి భరతమాతకు రక్తసిందూరం దిద్దిన రోజు. సరిహద్దుల వెంబడి చిన్నాచితకా దాడులతో ఒకట్రెండు రోజులు ప్రతిఘటిస్తున్నట్టు నటించినా, మన దెబ్బకు కీలక వైమానిక స్థావరాలన్నీ వరుసబెట్టి ధ్వంసం కావడంతో మూడో నాటికే పాక్ కాళ్లబేరానికి వచ్చి సంధి చేసుకుంది. పి - పహల్గాం ఉగ్ర దాడి ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్‌లోని పహల్గాం ప్రాంతం అమాయక పర్యాటకుల రక్తంతో ఎరుపెక్కింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందువులనే లక్ష్యం చేసుకుంటూ ఉన్మాదులు హత్యాకాండకు తెగబడ్డారు. వారిని పేర్లడిగి మరీ కాల్చి చంపారు. దేశమంతటినీ ఆగ్రహావేశాలకు లోను చేసిన ఈ దారుణం ఆపరేషన్ సిందూర్‌కు దారితీసింది.క్యూ - క్వైట్, పిగ్గీ! మహిళా జర్నలిస్టులను అవమానించే దుర్లక్షణం ట్రంప్‌ను ఓ పట్టాన వదిలేలా లేదు. ఎప్స్టీన్ వివాదానికి సంబంధించి ప్రశ్నించిన బ్లూంబర్గ్ న్యూస్ జర్నలిస్టు కేథరిన్ లూసీపై ఆయన దారుణంగా నోరు పారేసుకున్నారు. అదే అంశంపై ఆమె రెట్టించడంతో ఉక్రోషానికి లోనై ‘క్వైట్, క్వైట్, పిగ్గీ!’అంటూ అవమానకర పదజాలం వాడుతూ అరుపులకు దిగారు. సదరు వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ట్రంప్ తీరును అంతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘క్వైట్, పిగ్గీ’ హా‹Ùట్యాగ్‌తో నెటిజన్లు హోరెత్తించారు. ట్రంప్‌ను గేలి చేస్తూ దీనిపై మీమ్లూ ఇంటర్నెట్ను ముంచెత్తాయి. ఆర్ - రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాం«దీకి 2025 కష్టకాలంగానే సాగింది. విపక్ష నేత పదవికి న్యాయం చేయడంలో ఆయన విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఢిల్లీతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ సోదిలో కూడా లేకుండాపోవడం రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలకు తావిచ్చింది. వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన సోదరి ప్రియాంకా పారీ్టలో ఇక మరింత ‘క్రియాశీలక’ పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పలువురు కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్న పరిస్థితి! ఎస్ - సెంగర్ అత్యాచార కేసు తీర్పు సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్ తాజాగా మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. అతని జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి ఒడిగట్టడమే గాక న్యాయ పోరాటానికి దిగిన తన తండ్రిని కూడా చంపించిన సెంగర్‌కు ఉరిశిక్ష పడేదాకా వదిలేది లేదని బాధితురాలు అన్నారు.ఎక్స్ - షీ జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ ఏడాది చాలారకాలుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ టారిఫ్‌లకు బెదరకుండా అమెరికాపై అంతకుమించిన స్థాయిలో టారిఫ్‌లు బాదారు. ఎన్నడూ లేనట్టుగా మోదీతో సాన్నిహిత్యం పెంచుకుని భారత్‌నూ ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నవ్వులు చిందిస్తున్న ఫొటో అయితే ట్రంప్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. వై - యమున ప్రక్షాళన నానాటికీ కాలుష్య కాసారంగా మారుతున్న యమునా నదిని తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఏకంగా రూ.57 వేల కోట్లతో మాస్టర్ ప్లానే ప్రకటించింది. దేశ రాజధానిలో మురుగునీటి శుద్ధి సామర్థ్యం పెంపు కోసం 9 ప్రాజెక్టులను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ పరిధిలోని కేవలం 22 కిలోమీటర్ల నిడివే యమున కాలుష్యంలో ఏకంగా 80 శాతానికి కారణంగా మారుతోంది! జెడ్ - జొహ్రాన్ మమ్దానీ ఒక మేయర్ ఎన్నికకు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా క్రేజ్ వచ్చిన సందర్భం బహుశా ఇదొక్కటేనేమో! న్యూయార్క్ మేయర్‌గా 34 ఏళ్ల ముస్లిం విద్యాధికుడు జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక పలు రకాలుగా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఆయన్ను ఓడించేందుకు ట్రంప్ అపార శక్తియుక్తులన్నీ వినియోగించినా లాభం లేకపోయింది. మమ్దానీ ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.టి - టారిఫ్‌లు ఈ ఏడాదంతా దేశదేశాలను వణికించిన పదమిది. ట్రంప్ ఎడాపెడా పెంచిన టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తొలుత బెంబేలెత్తిపోయాయి. కానీ చైనా ప్రతీకార టారిఫ్‌ల దెబ్బకు ట్రంపే చివరికి కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది. తర్వాత ఒక్కొక్క దేశంపైనా టారిఫ్‌లను ఇష్టానికి పెంచుతూ, తగ్గిస్తూ తన స్థాయినీ, అమెరికా స్థాయినీ పలుచన చేసుకున్నారాయన. భారత్‌పైనా ఒక దశలో 50 శాతం దాకా భారీ టారిఫ్‌లు విధించినా, వాటిని వెనక్కు తీసుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారు.యు - ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రపంచానికి ఈ ఏడాది కాస్త ఉపశమనం ఇచ్చిన ఉదంతమిది. మూడున్నరేళ్ల పై చిలుకు యుద్ధానికి తెర దించేందుకు రష్యా సుముఖత వెలిబుచ్చడంతో ఇరు దేశాలతో అమెరికా అత్యున్నత స్థాయిలో శాంతి చర్చలు జరుపుతోంది. ఈ శాంతి వీచికల కారణంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ధాటి బాగా తగ్గింది.వి - వెనెజులా ధిక్కారం వెనెజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన తెంపరి ట్రంప్, వాటిని సొంతం చేసుకునేందుకు అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెనకాడబోనని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చారు. ఆ దేశపు చమురు నౌకలను నానా సాకులతో దిగ్బంధిస్తూ, పేల్చేస్తూ కల్లోలం సృష్టిస్తున్నారు. ఏదేమైనా అమెరికాకు తలొగ్గేదే లేదని అధ్యక్షుడు మదురో ధిక్కార స్వరం వినిపించడంతో ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.డబ్ల్యూ - వక్ఫ్ సవరణ చట్టం మోదీ సర్కారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వివాదాలు చుట్టుముట్టాయి. వక్ఫ్ ఆస్తులపై కర్రపెత్తనమే దీని లక్ష్యమని ముస్లిం బోర్డులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పుంఖానుపుంఖాలుగా పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (దానం) ఇవ్వొచ్చు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిళ్లలో ఇద్దరు ముస్లిమేతర సభ్యుల వంటి నిబంధనలన్నీ వక్ఫ్ ఆస్తుల స్వా«దీనం కోసం పెట్టినవేనని దుయ్యబడుతున్నాయి. సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెట్టగా మరికొన్నింటిపై పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ కేసులో తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
కర్నాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో వింత సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే ఒక మహిళ మాజీ భర్తను కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆమె పదే పదే కొడుతున్నా జుట్టు పట్టిలాగినా, దుర్భాషలాడినా ఎగిరి తన్నినా, నవ్వుతూనే ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. అసలేం జరిగిందంటే.ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె భర్తకు ఉద్యోగం లేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కారు. విడాకులు మంజూరయ్యాయి. భరణం కోసం కూడా కేసు వేసింది. ఇక్కడే భర్త కపట తెలివితేటల్ని ప్రదర్శించాడు. అయితే విడాకులు మంజూరు అయితే భరణం చెల్లించాల్సి వస్తుందన్న కుట్రతో తన పేరిట ఉన్న ఆస్తులన్నింటిని తన తల్లి పేరు మీదు ముందుగానే బదలాయించేశాడు. ముందు అనుకున్న ప్లాన్ప్రకారమే తనకు ఎలాంటి ఆస్తులు, ఆదాయం లేదు కాబట్టి, భరణం ఇవ్వలేనని వాదించాడు. అతడి వాదనలను విశ్వసించిన కోర్టు భార్యకు షాకిచ్చింది. తనకు భరణం రాకుండా చేశాడనే ఆగ్రహంతో భార్య చేశాడని, కోర్టు బయటే భర్తను కొట్టింది. చెంపలు వాయించేసింది. జుట్టు పట్టుకొని కొట్టింది. దుర్భాషలాండింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే తాను అనుకున్నది సాధించిన అతగాడు మాత్రం ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలాగా నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో రికార్డైంది.ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. భర్తనుంచి విడి పోయిన మహిళల దీన పరిస్థితికి ఇది నిదర్శమని నెటిజన్లు కొందరు వ్యాఖ్యానించారు. ఇది అన్యాయం అని మరికొందరు భర్తపై మండిపడ్డారు. మరోవైపు మహిళలకు భరణంపై ఉండే ప్రేమకు ఇది నిదర్శమన కొందరు, దాడి చేసిన దోషిని శిక్షించాలని ఒకరు, ప్లాన్ ఏ ఎదురు దెబ్బ తగిలితే, ప్లాన్ బీ ఏమీ లేనప్పుడు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణంShe took a divorce chasing alimony.The husband had already transferred all his property to his mother’s name — the wife got nothing. 😁After the divorce, the guy is smiling even while getting beaten.On behalf of all men — salute to you! 😂😜pic.twitter.com/YEGociB8Hr— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 29, 2025 -
శబరిమల బంగారం మాయం కేసు: మాజీ మంత్రి పాత్రపై విచారణ
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆరేళ్ల క్రితం వెలుగుచూసిన బంగారం అపహరణ కేసులో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించింది. ఈ కేసులో దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు పలువురు అరెస్ట్ కాగా, తాజాగా ఇది దేవస్థానం శాఖ మంత్రిగా పని చేసిన కడకంపల్లి సురేంద్రన్ వద్దకు చేరింది. గత శనివారం కడకంపల్లి సురేంద్రన్ను సిట్ బృందం విచారించింది. శబరిమల ఆలయానికి సంబంధించి తలుపులకు పూసి ఉన్న బంగారం మాయం కావడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన నేరుగా పాలు పంచుకున్నారనేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట విచారణ చేపట్టింది. అయితే దేవస్థానం(దేవస్వం శాఖ) పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుందని, బంగారం పూత తొలగించడం, చెన్నైలోని ప్రైవేట సంస్థకు పంపడం వంటి నిర్ణయాలు టీడీబీ(ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు) స్వతంత్రంగా తీసుకుంటుందన్నారు. కేసు వివరాలుశబరిమల ఆలయంలోని విగ్రహాలు, తలుపులపై ఉన్న బంగారు పూతలో కొంత భాగం కనిపించకుండా పోయింది.మాజీ దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్, మాజీ టీడీబీ అధ్యక్షులు ప్రశాంత్, పద్మకుమార్ తదితరులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు SIT 10 మందిని అరెస్టు చేసింది, వీరిలో ఇద్దరు మాజీ టీడీబీ అధ్యక్షులు కూడా ఉన్నారు.ఈ కేసును విచారించేందుకు సిట్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కొత్త సాక్ష్యాలు, సంబంధాలు వెలుగులోకి వస్తే మరిన్ని అరెస్టులు జరగవచ్చు.బంగారం కనిపించకుండా పోయిన ఈ ఘటన 2019లో జరిగింది. -
ఆ ప్రాంతాల్లో గాలిపటం ఎగరేయొద్దు..!
సంక్రాంతి పండుగ సీజన్ సంధర్భంగా ప్రజలకు దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. రైల్వే విద్యుత్ తీగలపై చిక్కి వేలాడుతున్న గాలిపటం దారాలను ఎట్టిపరిస్థితుల్లో తాకకూడదని ప్రజలను హెచ్చరించింది. రైల్వే ప్రాంగణాల పరిసరాల్లో, యార్డులు, ట్రాక్‌లు మరియు సమీపంలోని జనసంచార ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల విద్యుదాఘాతానికి గురైన సంఘటనలు ఇదివరకూ అనేకం జరిగాయని తెలిపింది. పతంగీలు ఎగరవేయడంపై జాగ్రత్తలను సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది.గత సంక్రాంతి పండుగ సీజన్లో విద్యుధాఘాత ఘటనలు రైల్వేలోని అనేక జోన్లలో నమోదయ్యాయని తెలిపింది. కొంతమంది వ్యక్తులు 25 కె.వి ట్రాక్షన్ ఓవర్‌హెడ్ కండక్టర్లలో చిక్కుకున్న గాలిపటం దారాలను ముట్టుకోవడం ద్వారా విద్యుత్ షాక్‌లు తగిలి తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొంది. ప్రస్తుతం గాలి పఠాలు ఎగరవేయడంలో ప్రజలంతా ప్రధానంగా చైనా మాంజా వాడుతున్నారని అది చాలా ప్రమాదకరమని తెలిపింది. ఆదారాలు విద్యుత్ వాహకం ( విద్యుత్‌ను సులభంగా గ్రహించేవి) అవడం వలన మానవ ప్రాణాలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని రైల్వేశాఖ తెలిపింది. అంతే కాకుండా రైల్వే విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని పేర్కొంది.దీనివలన ప్రయాణీకులతో పాటు రైల్వే సిబ్బందికి, సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఇతర ప్రమాదాలకు దారి తీసే అవకాశాలున్నాయని తెలిపింది. కనుక ఈ విషయంలో ప్రజలు రైల్వేశాఖకు పూర్తి సహకారం అందించాలని రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు, యార్డులు మరియు ఇతర రైల్వే సంస్థాపనల దగ్గర గాలిపటాలు ఎగురవేయకూడదని రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా బాధ్యతాయుతంగా జరుపుకోవాలని రైలు కార్యకలాపాలను సజావుగా కొనసాగించడంలో సహాయపడాలని కోరింది. -
11 మంది ఉగ్రవాదుల అరెస్ట్
అసోంలో ఉగ్రవాదుల భారీ కుట్రను అధికారులు భగ్నం చేశారు. అసోం, త్రిపురలో దాడులకు స్కెచ్ వేసిన 11 మంది ఉగ్రవాదులను సోమవారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కేంద్రంగా ఈ టెర్రరిస్ట్ క్యాంపు నడుస్తోందని భారీదాడులకు వీరు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన సందర్భంలో ఉగ్రవాదుల వద్ద జిహదీ సాహిత్యంలో పాటు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు..కాగా ఇటీవల ఢిల్లీ ఎర్రకోట బాంబు దాడుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. అనుమానిత ప్రాంతాలలో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. ఈ దాడులలో ఉగ్రవాద దాడులకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించడంతో పలువురిని అరెస్ట్ చేసింది. కాగా గత నెల 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో దాదాపు 13 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. -
మండల పూజ సీజన్లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు
శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయం ఈ ఏడాది మండల-మకరవిళక్కు సీజన్ కోసం నవంబర్ 16 సాయంత్రం తలుపులు తెరిచింది. 41 రోజుల మండల పూజ కాలం పూర్తయినందున నవంబర్ 16 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. డిసెంబర్ 27 సాయంత్రం ఆలయం మూసివేయబడింది. తిరిగి డిసెంబర్ 30న మకర ఉత్సవాల కోసం తెరిచింది దేవస్వం బోర్డు. రికార్డ్ బ్రేకింగ్ రెవెన్యూదేవస్వం బోర్డు గత రికార్డులన్నింటినీ అధిగమించి ఆలయ ఆదాయంలో చారిత్రాత్మక పెరుగుదలను ప్రకటించింది. తాజా గణాంక నివేదిక ప్రకారం:మొత్తం ఆదాయం: గత 41 రోజుల్లోనే, ఆలయం రూ. 332.77 కోట్లు వసూలు చేసింది.అరవణ పాయసం అమ్మకాలు రూ. 142 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ. 12 కోట్లు వచ్చాయి.హుండీ (ఉడియల్) మొత్తం రూ. 83.17 కోట్లు.గతేడాది మండల పూజ ఆదాయం రూ. 297.06 కోట్లతో పోలిస్తే, ఈ సీజన్లో ఆలయం రూ. 35.70 కోట్ల ఆకట్టుకునే పెరుగుదలను చూసింది.రికార్డు స్థాయి దర్శనాలు..ఆన్లైన్ బుకింగ్ ద్వారా 30,91,183 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.స్పాట్ బుకింగ్ ద్వారా 4,12,075 మంది వచ్చారు.పుల్మేడు అటవీ మార్గం ద్వారా 1,29,933 మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు.గతేడాది మండల సీజన్లో 32,49,756 మంది భక్తులు సందర్శించగా, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3,83,435 మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం విశేషం.(చదవండి: శబరిమల యోగా దండం, జప మాల మరమ్మత్తు పనుల కేసుపై సిట్ దర్యాప్తు ముమ్మరం) -
అమిత్ షా ఆరోపణలకు దీదీ ఘాటు కౌంటర్
ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పశ్చిమ బెంగాల్ అడ్డాగా మారిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అలాంటప్పుడు పహల్గాం దాడిని కేంద్రమే జరిపించిందా? అని నిలదీశారామె. మంగళవారం బంకురా బిర్సింగ్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని, ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ఆ లెక్కన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు లేరంటే.. పహల్గాం దాడి ఎలా జరిగింది? దాన్ని మీరే చేయించారా?.. దేశ రాజధానిలో జరిగిన దాడికి కారణం ఎవరు?(ఎర్రకోట దాడిని ఉద్దేశించి..) అని ప్రశ్నించారామె. ప్రధాని మోదీని మహాభారతంలో దుర్యోధనుడిగా.. అమిత్ షాను దుశ్శాసనుడితో ఆమె పోల్చారు. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు.. ఇక్కడి నుంచి సమాచారం సేకరించేందుకు వచ్చారు. ఎన్నికల సమయంలోనే ఆ దుర్యోధన దుశ్వాసనలకు బెంగాల్ గుర్తుకు వస్తుంది. ఓట్ల కోసం ఎగబడి వచ్చేస్తుంటారు అని మండిపడ్డారామె. ఇక తీవ్ర చర్చనీయాంశమైన ఎన్నికల జాబితా వివాదం (SIR) ప్రస్తావిస్తూ కేంద్రంపై టీఎంసీ అధినేత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ ప్రజలను కేంద్రం ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తోంది. కోటిన్నర ఓట్లను తొలగించే యత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో.. రాజ్‌బన్షీలు, మటువాలు, ఆదివాసీలు లక్ష్యంగా మారతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎస్ఐఆర్ నిర్వహించడం పెద్ద మోసం. ఇది ఇలాగే కొనసాగితే చివరికి మీరు (అమిత్ షా) మరియు మీ కుమారుడు మాత్రమే మిగిలిపోతారు అని మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్రంపై దృష్టిసారించింది. ఈ నెల 20న బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించారు. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం మరో అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని ఆరోపించారు. అలాగే.. మమత పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని.. ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందకుండా టీఎంసీ సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలను కోరారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని.. అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని హామీ ఇచ్చారు. -
అస్థిపంజరంలా ఆమె, ఆకలితో కన్నుమూసిన తండ్రి
మనుషులుగా మానవత్వాన్నిమంట గలిపారు. కనీస వృత్తి ధర్మాన్ని పాటించ లేదు. మానవ విలువల్ని మరిచిపోయిన ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది ఈ అమానుషం. బాధితుడు 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, రైల్వేస్‌లో సీనియర్ క్లర్క్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆ చుట్టుపక్కల ఆయనకు మంచి వ్యక్తిగా పేరుంది. 2016లో భార్య మరణించడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. 27 ఏళ్ల కుమార్తె రష్మి మానసిక వికలాంగురాలు. దీంతో తనకు, తన బిడ్డకు సాయంగా ఉంటారనే ఆలోచనతో ఒక జంటను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. అన్నివిధాలా తోడు నీడగా ఉంటారనే ఉద్దేశంతో రాంప్రకాష్ కుష్వాహా, అతని భార్య రాందేవి అనే భార్యాభర్తల్ని కేర్టేకర్లుగా నియమించుకుని, ఇంట్లోనే చోటిచ్చారు ఓం ప్రకాష్. అయితే వారి బలహీనతను ఆసరాగా తీసుకున్న ఈ జంట క్రూరత్వాన్ని బయట పెట్టుకుంది. యజమానులకు ఆహారం, వైద్య సంరక్షణలాంటివేవీ పట్టించుకోలేదు. రాను రాను వారికి తిండీ, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. క్రమంగా ఇంటిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అలా ఐదేళ్లపాటు వీరి ఆగడాలు సాగాయి. దీంతో ఆహారం లేక ఓం ప్రకాష్ చిక్కిశల్యమై పోయి ప్రాణాలు విడిచారు.ఓంప్రకాష్ మరణం గురించి కుటుంబానికి సమాచారం అందించడంతో ఈ జంట దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఇంటికి చేరిన బంధువులు అక్కడి దృశ్యాలను షాక్ అయ్యారు. ఇక కుమార్తె రష్మి చీకటి గదిలో నగ్నంగా, స్పృహ లేకుండా కనిపించింది. దాదాపు చావు అంచులకు చేరిపోయింది. తన అన్న, కుమార్తె రష్మిని గ్రౌండ్ ఫ్లోర్‌కు పరిమితం చేసి, పైభాగంలో వారు హాయిగా జీవిస్తున్నారని ఓంప్రకాష్ సోదరుడు అమర్ సింగ్ ఆరోపించారు. బంధువులు ఎవరొచ్చినా, కలవడానికి ఇష్టం పడటం లేదంటూ తిప్పి పంపించేవారని తెలిపారు. ఓం ప్రకాష్ మర్యాదస్తుడనీ, చాలా గౌరవప్రద వ్యక్తి అంటూ ఆయన మరణంపై పొరుగువారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆకలితో రష్మి దేహం శుష్కించిపోయిందనీ, ఒంటిమీద కొంచెం కూడా కండలేక ఎముకల గూడులా ఉందని బంధువు పుష్ప సింగ్ రాథోడ్ తెలిపారు. రష్మి ఇప్పుడు కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంది, బాధ్యులకు కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఓంప్రకాష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టారు. పోస్ట్‌మార్టం, ఇతర వైద్య, ఫోరెన్సిక్ ఫలితాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం -
మంచంపై పులిరాజా.. ఓ చేదు నిజం!
గ్రామంలోకి చొరబడిన ఓ పెద్దపులి.. జనాలను బెంబేలెత్తించింది. ఓ వ్యక్తిపై దాడి చేశాక.. ఆరుబయట ఉన్న మంచంపై తీరికగా సేద తీరింది. ఆ దృశ్యాన్ని కొందరు ఫోన్లలో బంధించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన వెనుక ఉన్న చేదు నిజం గురించి చర్చ మాత్రం జరగడం లేదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(Bandhavgarh Tiger Reserve) ప్రాంతంలో గ్రామంలోకి చొరబడింది. అక్కడ ఆరుబయట సంచరిస్తుండగా దానిపై రాళ్లతో దాడి చేశారు. భయంభయంగానే అది దాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అది అక్కడే కట్టేసిన ఉన్న పశువుల జోలికి పోలేదు(గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు). అయితే రాళ్లు తగిలిన కోపంతో.. ఓ గ్రామస్తుడ్ని నేలకేసి కొట్టింది. ఆపై మరో ఇంట్లోకి వెళ్లి కొన్ని గంటలపాటు మంచంపై కూర్చుని సేదదీరింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. పులి బోనులోకి చేరడంతో పాటు గాయపడిన వ్యక్తికి కూడా ప్రాణాపాయం తప్పడంతో.. ఆ ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. आज मैं गाँव में पंचायत लगाकर सभी की सुनवाई करूँगा, क्यूँ मेरा जीना हराम कर रहे हो, मेरे जंगल में कब्ज़ा कर, मेरा इलाका ख़त्म करके ..??#MadhyaPradesh #bandhavgarh #umaria #tiger #viral #highlight pic.twitter.com/0rG8TAvwnk— DEEPAK YADAV (@YadavDeepakya22) December 29, 2025అయితే.. వేటగాళ్లకు భయపడే పులులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆ ఊరి ప్రజలు చెబుతుండడం ఇక్కడ చర్చించాల్సిన విషయం. టైగర్ స్టేట్‌గా పేరొందిన మధ్యప్రదేశ్‌లో పెద్దపులుల మరణాల లెక్కలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా.. సగర్ జిల్లాలోని ధానా ఫారెస్ట్ రేంజ్లో 10 ఏళ్ల ఆడ పులి మృతదేహం దొరికింది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఆరు పులులు మృత్యువాత పడగా.. ఈ ఒక్క ఏడాదిలోనే 55 పులులు మరణించడం గమనార్హం. बांधवगढ़ टाइगर रिजर्व में बाघ पर पत्थर बरसाएHuman-wildlife conflict management in Madhya Pradesh collapses 😔🐯 #tiger @CMMadhyaPradesh @PMOIndia @ntca_india @moefcc pic.twitter.com/OfWAFDo5zg— Ajay Dubey (@Ajaydubey9) December 29, 20251973లో మధ్యప్రదేశ్‌లో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పులులు అత్యధికంగా చనిపోయింది ఈ ఏడాదిలోనే. అందునా అసహజ మరణాలే 11 నమోదు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే.. అటవీ శాఖ వీటిని ఎక్కువగా పులుల మధ్య గొడవలుగా పేర్కొంటున్నాయి. కానీ, క్షేత్ర పరిస్థితులు అవి కావనే చెబుతున్నాయి. వేట, కరెంట్ ఉచ్చులు.. పర్యవేక్షణ లోపాలు, నిర్లక్ష్యం ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన అటవీ శాఖ నివేదికలో.. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, సరైన ఫోరెన్సిక్ పరిశీలన లేకపోవడం బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా నెట్వర్క్ ప్రధాన సూత్రధారి యాంగ్చెన్ లఖుంపా ఇటీవలె సిక్కిం బార్డర్లో అరెస్టు అయ్యాడు. మధ్యప్రదేశ్‌లో పులులను చంపి.. వాటి చర్మం, గోళ్లు పళ్లు.. అక్రమ రవాణా చేసిన అభియోగాలు అతనిపై ఉన్నాయి. సంరక్షణవాదులు(Conservationists) వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, సంస్కరణలు లేకపోతే మరణాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. మద్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. ప్రతి పులి మరణాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, నిపుణుల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని ఒక్క మాటతో తేల్చేస్తోంది. -
తమిళనాడు ప్రభుత్వానికి షాక్
తమిళనాడు ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్టాలిన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మద్రాస్ యూనివర్సిటీ సవరణ బిల్లును రాష్ట్రపతి భవన్ మంగళవారం వెనక్కి పంపించేసింది. మూడేళ్లుగా రాష్ట్రపతి వద్ద ఈ బిల్లు పెండింగ్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే.మద్రాస్ యూనివర్సిటీ చట్టం 1923 ప్రకారం.. తమిళనాడు గవర్నర్ యూనివర్సిటీకి ఎక్స్-ఆఫీషియో చాన్సలర్. వైస్ చాన్సలర్ నియామకం, తొలగింపు తదితర హక్కులు గవర్నర్ వద్దే ఉన్నాయి. అయితే.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో స్టాలిన్ సర్కార్‌కు పొసగడం లేదు. గవర్నర్ వల్లే తమిళనాడులో వర్సిటీల వీసీ నియామకాలు నిలిచిపోయాయని ప్రభుత్వం తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్రాస్ వర్సిటీ బిల్లు ద్వారా గవర్నర్ అధికారాలకు చెక్ పెట్టాలని స్టాలిన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వైస్ చాన్సలర్‌ను నియమించుకునే అధికారం పొందడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలకు అనుగుణంగా యూనివర్సిటీ పాలనను మార్చడం, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీని యూనివర్సిటీ సిండికేట్‌లో సభ్యుడిగా చేర్చడం తదితర అంశాలను బిల్లులో తమిళనాడు ప్రభుత్వం పొందుపరిచింది. అయితే ఈ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపగా.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లును ఆమోదించకుండానే తిరిగి పంపించారు. -
చొరబాట్లకు మమత మద్దతు: అమిత్ షా
కోల్‌కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన విమర్శలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని గత 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం అవినీతి, భయం, చొరబాట్లతో నిండిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర భద్రతకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని అమిత్‌షా అన్నారు.బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరుగుతున్న చొరబాట్లపై షా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని, సరిహద్దుల వద్ద కంచె వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అమిత్ షా పేర్కొన్నారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి, చొరబాటుదారులను బయటకు తరిమికొడుతుందని ఆయన అన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక్కడి ‘టోల్ సిండికేట్’,అవినీతి కారణంగా ప్రజలకు చేరడం లేదని అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, భయం, దుర్పరిపాలన నుండి విముక్తి పొంది అభివృద్ధి దిశగా సాగాలని నిశ్చయించుకున్నారని అమిత్ షా అన్నారు. 2026, ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు తృణమూల్ ప్రభుత్వానికి చరమగీతం పాడనున్నారని ఆయన జోస్యం చెప్పారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 15 నాటికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితర మహనీయులు కలలుగన్న బెంగాల్‌ను నిర్మిస్తామని, రాష్ట్ర సంస్కృతిని, పునరుజ్జీవనాన్ని కాపాడటానికి కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డిజిటల్ హోరులో 'ప్రింట్' జోరు.. యూపీ ముందడుగు -
హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం
బెంగళూరు : బెంగళూరులోని కుండలహళ్లిలో సోమవారం సాయంత్రం పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 23 ఏళ్ల ఐటీ ఉద్యోగం దుర్మరణం పాలయ్యాడు. ఏడు అంతస్తులు, 43 గదులున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.చనిపోయిన వ్యక్తిని బళ్లారికి చెందిన అరవింద్‌గా గుర్తించారు. ఇతను ఐటీ సేవల సంస్థ క్యాప్‌జెమినీలో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు సెవెన్ హిల్స్ సాయి కో-లివింగ్ పేయింగ్ గెస్ట్ హాస్ట్‌లో ఉంటున్న అరవింద్. టెర్రస్‌పై ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో పొగను గమనించాడు. ఏం జరిగిందో చూద్దాం అని కిందికి వచ్చిన సమయంలో గ్యాస్ పేలుడు సంబంధించిందని దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వైట్‌ఫీల్డ్) కె పరశురామ్ వెల్లడించారు. పోలీసుల ప్రకారం కమర్షియల్-గ్రేడ్ గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు.సమాచారం అందించిన సంఘటనా స్థలానికి చేరుకున్నస్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మంటలను అదుపు చేశాయి. గాయపడిన వారిలో ఒకరు హాస్టల్ పని చేస్తున్నవారు, ఇద్దరు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు. కర్నూలుకు చెందిన 28 ఏళ్ల వెంకటేష్, ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల విశాల్ వర్మ, ఉత్తరాఖండ్‌కు చెందిన 25 ఏళ్ల సివి గోయెల్ ప్రస్తుతం బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పీజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం -
డ్రైవర్ వీరంగం.. టోల్ ప్లాజా గేటు ధ్వంసం
బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని బ్రహ్మరకూట్లు టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్ ఫీజు చెల్లించే విషయంలో మొదలైన వివాదం టోల్ సిబ్బందిపై దాడికి దారితీసింది. లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి టోల్ గేటును ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి సిబ్బందిపై దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కమగళూరుకు చెందిన భరత్ (23) అనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్లో టోల్ ప్లాజా వద్దకు తీసుకువచ్చాడు. డ్యూటీలో ఉన్న టోల్ సిబ్బంది టోల్ రుసుము చెల్లించాలని కోరగా, డ్రైవర్ నిరాకరిస్తూ, గొడవకు దిగాడు. ఆవేశంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చి టోల్ గేటును ఢీకొట్టి, దానిని ధ్వంసం చేశాడు. అనంతరం డ్రైవర్ భరత్, క్లీనర్ తేజస్ (26) కలిసి అక్కడి సిబ్బంది అంకిత్, రోహిత్‌లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై దాడికి దిగారు.నిందితులు అంతటితో ఆగకుండా, తమకు తోడుగా మరికొందరిని పిలిపించి, మరోమారు టోల్ ప్లాజాపై దాడి చేశారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద కొంతసేపు పనులు నిలిచిపోయాయి. టోల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు బంట్వాల్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై కేసు నమోదు చేశారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టోల్ ప్లాజాల వద్ద సిబ్బంది రక్షణ కోసం భద్రతను పెంచాలని, ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై నిఘా పెట్టేందుకు సీసీటీవీ దృశ్యాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఏడాది చివరిలో ఘోరం.. ఏడుగురు మృతి -
ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. ప్రియాంక, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా (25) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు అవీవా బేగ్ (Aviva Baig)తో రేహాన్ నిశ్చితార్ధం చేసుకున్నారన్న వార్త కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.రేహాన్ వాద్రా (Raihan Vadra) ఇటీవల తన ఏడేళ్ల నాటి స్నేహితురాలు అవివా బేగ్‌కు ప్రపోజ్ చేశాడు. దానికి ఆమె ఓకే చెప్పారట. వీరి ప్రేమ ప్రయాణానికి రెండు కుటుంబాలు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ నిశ్చితార్థంపై ప్రియాంక గాంధీ కుటుంబం నుంచి గానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రేహాన్ వాద్రా గురించి..రేహాన్ వాద్రా డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నాడు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా చదువుకున్నది కూడా ఇక్కడే కావడం గమనార్హం. ఆ తర్వాత పొలిటిక్స్‌లో ఉన్నత విద్య కోసం లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)కి వెళ్లాడు. రేహాన్ ఒక విజువల్ ఆర్టిస్ట్ గత పదేళ్లుగా ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టాడు. ముంబైలోని కొలాబాలో ఉన్న సమకాలీన ఆర్ట్ గ్యాలరీ APRE ఆర్ట్ హౌస్‌లో అందుబాటులో ఉన్న బయో ప్రకారం, అతని పోర్ట్‌ఫోలియో వన్యప్రాణులు స్ట్రీట్, వ్యాపార ఫోటోగ్రఫీపై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. తన తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ప్రోత్సాహంతో, ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నాడు. అలాగే తాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీపై అభిరుచిని కలిగి ఉండేవారు.అవివా బేగ్ ఎవరు?ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడరన్ స్కూల్లో తన ప్రారంభ విద్యను, OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి మీడియా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీని పొందారు. అంతేకాదు ఆమె జాతీయ స్థాయి మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారిణి. అలాగే ఫోటోగ్రాఫర్ కూడా. 'యు కాంట్ మిస్ దిస్' (ఇండియా ఆర్ట్ ఫెయిర్, 2023), 'ది ఇల్యూసరీ వరల్డ్' (2019) వంటి అనేక విజయవంతమైన ప్రదర్శనలలో తన కళను ప్రదర్శించారు.ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం -
ఏడాది చివరిలో ఘోరం.. ఏడుగురు మృతి
అల్మోరా: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భికియాసైన్ నుండి రామ్‌నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి, వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 17 నుండి 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలాపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వందల అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిపోయిన క్షతగాత్రులను వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే భికియాసైన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా యంత్రాంగం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కూడా చదవండి: Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి -
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్‌కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్‌ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది. -
డిజిటల్ హోరులో 'ప్రింట్' జోరు.. యూపీ ముందడుగు
వార్తాపత్రిక అనేది అక్షర రూపంలో ఉన్న ఒక విజ్ఞాన గని. ఇది మనకు ప్రపంచంతో అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా, మన ఆలోచనలకు పదును పెడుతుంది. నిత్యం వార్తాపత్రికలు చదవడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. పదకోశం పెరుగుతుంది. సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న ఉత్తరప్రదేశ్ సర్కారు పాఠశాల విద్యలో పత్రికా పఠనాన్ని తప్పనిసరి చేసింది. ఇది దేశవ్యాప్తంగా విద్యావేత్తల మధ్య చర్చకు దారితీసింది. ఇదే సమయంలో ప్రస్తుతం దేశంలో వార్తా పత్రికల పరిస్థితి ఏమిటనే దానిని తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటికి సమాధానమివ్వడమే ఈ ‘కథనం’లోని ప్రయత్నం.యూపీ సర్కారు ముందడుగువిద్యార్థులలో సమకాలీన అంశాలపై అవగాహన పెంచడానికి, వారి భాషా నైపుణ్యాలను మెరుగుపరచడానికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘వార్తాపత్రిక పఠనాన్ని’ తప్పనిసరి చేస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రపంచం నలుమూలల జరుగుతున్న పరిణామాలను విద్యార్థులందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత కొంతకాలంగా డిజిటల్ విప్లవం కారణంగా విద్యార్థులు సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్లకు అధికంగా అలవాటు పడుతున్నారు. దీనివల్ల అవసరమైన సమాచారంపై అవగాహన తగ్గడమే కాకుండా, పఠనాశక్తి కూడా క్షీణిస్తోంది. ఈ ధోరణిని గమనించిన ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ, విద్యార్థులను తిరిగి పుస్తకాలు, వార్తాపత్రికల వైపు మళ్లించాలని నిర్ణయించింది.నోటీసు బోర్డులపై ‘ప్రధానాంశాలు’యూపీ అంతటా అమలుకానున్న ఈ నూతన విధానంలో రాష్ట్రంలోని ప్రతి పాఠశాల కనీసం రెండు హిందీ, ఒక ఆంగ్ల దినపత్రికను అందుబాటులో ఉంచాలి. ప్రతిరోజూ ఉదయం ప్రార్థన సమయం తర్వాత లేదా లైబ్రరీ పీరియడ్‌లో కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు విద్యార్థులచే ఉపాధ్యాయులు వార్తలు చదివించాలి. ముఖ్యంగా ఎడిటోరియల్ కాలమ్స్, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం, జాతీయ అంశాల పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాఠశాలల్లోని నోటీసు బోర్డులపై రోజువారీ ముఖ్య వార్తలను ప్రదర్శించడం కూడా ఈ ప్రణాళికలో ఒక భాగం. కాగా యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తల నుండి సానుకూల స్పందన వస్తోంది. విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో ఇది పునాదిగా మారుతుందని వారు అంటున్నారు.భారత్‌లో అద్భుతమైన వృద్ధిప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత వార్తాపత్రికా పరిశ్రమ 2025లో అద్భుతమైన వృద్ధిని చవిచూసింది. పాశ్చాత్య దేశాలలో వార్తాపత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నా, భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రింట్ మార్కెట్‌గా అవతరించింది. 1.4 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ప్రచురణలు, రోజువారీ 39 కోట్ల సర్క్యులేషన్‌తో ఈ రంగం వెలుగొందుతోంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) నివేదికల ప్రకారం, 2025 ప్రథమార్ధంలో వార్తాపత్రికల అమ్మకాలు 2.77% వృద్ధిని సాధించి, ప్రతిరోజూ 30 మిలియన్ల కాపీల మార్కును చేరుకోవడం గమనార్హం.న్యూస్‌ప్రింట్ ధరలలో అస్థిరత ఈ వృద్ధికి ప్రధానంగా ప్రాంతీయ భాషా పత్రికలు, ముఖ్యంగా హిందీ దినపత్రికలు వెన్నెముకగా నిలుస్తున్నాయి. మొత్తం సర్క్యులేషన్లో 51శాతం వాటాను హిందీ పత్రికలే దక్కించుకోగా, ప్రాంతీయ భాషలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక కోణంలో చూస్తే భారతీయ పత్రికలు నేటికీ ప్రకటనల ఆదాయంపైనే (60-70%) ఎక్కువగా ఆధారపడుతున్నాయి. పాఠకులకు వార్తాపత్రికను అందుబాటులో ఉంచేందుకు ధరను తక్కువగా ఉంచడం వల్ల, ఆయా సంస్థలకు ప్రకటనలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. 2024లో ఎన్నికలు, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాల వృద్ధి కారణంగా వార్తా పత్రికలకు ప్రకటన గణనీయంగా పెరిగాయి. అయితే రష్యా, కెనడా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్ ధరలలో అస్థిరత నిర్వహణ వ్యయాన్ని పెంచుతూ ప్రచురణకర్తలకు సవాలుగా మారుతున్నది.విశ్వసనీయత కోసం ముద్రిత పత్రికలుసాంకేతికత పరంగా చూస్తే 2025లో ‘డిజిటల్-ఫస్ట్’ హైబ్రిడ్ మోడల్ వైపు పరిశ్రమ వేగంగా అడుగులు వేస్తోంది. కాగా ఆన్లైన్ తప్పుడు సమాచారంపై విసిగిపోయిన పాఠకులు, విశ్వసనీయత కోసం తిరిగి ముద్రిత పత్రికలను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో యువతను ఆకట్టుకోవడానికి పలు పత్రికా సంస్థలు తమ ఈ-పేపర్లు, మొబైల్ యాప్‌లను బలోపేతం చేస్తున్నాయి. 68 శాతం మంది ఇంటర్నెట్ యూజర్స్ ఆన్లైన్ వార్తలను యాక్సెస్ చేస్తున్నందున.. ప్రీమియం కంటెంట్ ద్వారా డిజిటల్ ఆదాయాన్ని పెంచుకోవడంపై అన్ని వార్తా పత్రికలు దృష్టి సారించాయి.ఇది కూడా చదవండి: Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత -
ఢిల్లీ అతలాకుతలం: భారీ పొగమంచు.. వణికించే చలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఒకవైపు భారీ పొగమంచు కమ్మేయగా, మరోవైపు వణికించే చలి అందరినీ విలవిలలాడేలా చేస్తోంది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున నగరం మొత్తం దట్టమైన పొగమంచు ఆవరించింది. ఫలితంగా జనజీవనం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు శీతల గాలుల హెచ్చరికను జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. #WATCH | Delhi | Visibility in the national capital is affected as a layer of dense fog engulfs the city. (Visuals from Dwarka Expressway) pic.twitter.com/EzuKlWW0wK— ANI (@ANI) December 30, 2025ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (Visibility) భారీగా పడిపోయింది. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో సుమారు 130కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే శాఖ కూడా సుమారు 100కి పైగా రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాలం, సఫ్దర్‌జంగ్ తదితర ప్రాంతాల్లో దృశ్యమానత కేవలం 50 మీటర్లకు పడిపోయింది.ఒకవైపు ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలుష్యం, మరోవైపు విపరీతమైన చలి, ఇంకోవైపు దట్టమైన పొగమంచుతో ఢిల్లీలో వాయు నాణ్యత (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరింది. పొగమంచు కారణంగా వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నవారు బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రయాణికులు విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందు తమ ప్రయాణ సమయాల అప్డేట్లను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఐఎమ్‌డి అంచనా ప్రకారం రానున్న రెండు మూడు రోజుల పాటు ఈ పొగమంచు ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. వాహనదారులు ఫాగ్ లైట్లను ఉపయోగించాలని, అతివేగాన్ని తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత -
Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి
ముంబై: ముంబై మహానగరంలోని భండూప్ ప్రాంతంలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ముంబై నగర రవాణా సంస్థ (బెస్ట్)కు చెందిన ఒక ఎలక్ట్రికల్ బస్సు అదుపు తప్పి, పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.నిత్యం రద్దీగా ఉండే భండూప్ స్టేషన్ రోడ్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విఖ్రోలి డిపోకు చెందిన ఈ బస్సు (రూట్ నంబర్ A-606) తన ప్రయాణాన్ని ముగించుకుని స్టేషన్ సమీపంలో రివర్స్ తీస్తుండగా, ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త, సాంకేతిక లోపం కారణంగా బస్సు ఒక్కసారిగా వెనుక ఉన్న పాదచారులను బలంగా ఢీకొంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న ప్రయాణికులు, పాదచారులు అప్రమత్తమయ్యేలోపే బస్సు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన తొమ్మిది మందిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వెట్ లీజు (Wet Lease) ప్రాతిపదికన నడిచే బస్సుల నిర్వహణ, డ్రైవర్ల శిక్షణ, బస్సుల కండిషన్‌పై కఠినమైన తనిఖీలు ఉండాలని ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ కోరారు. రద్దీ ప్రాంతాల్లో బస్సులను వెనుకకు తీసే సమయంలో సహాయకులు (Helpers) ఉండాలని, డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాళ్లను తరిమేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
బోర్డోవా/గువాహటి: అస్సాం అభివృద్ధి, సంస్కృతికి ప్రతిబంధకంగా మారిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమికొట్టే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని అస్సాం ఓటర్లకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సోమవారం అస్సాంలో సుడిగాలి పర్యటన చేసిన అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గువాహటిలో నూతన పోలీస్ కమీషనరేట్, నిఘా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. చొరబాటుదారులతో పోరాటంతో ప్రాణత్యాగంచేసిన వీరులకు ‘స్వాహిద్ స్మారక్ క్షేత్ర’లో నివాళులరి్పంచారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు, సంఘ సంస్కర్త శ్రీమంత శంకర్‌దేవ్ ‘బతద్రవ థాన్’పుణ్యక్షేత్రంలో రూ.227 కోట్లతో పునరుద్ధరణ పనులను షా ప్రారంభించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపినాధ్ బోర్దోలాయ్, సంగీత సామ్రాట్ భూపెన్ హజారికా, యువ సంగీత తరంగం, దివంగత జుబెన్ గార్గ్, దిగ్గజ అహోం జనరల్ లాచిత్ బోర్ఫుకన్లకు షా నివాళులరి్పంచారు. తర్వాత బోర్డోవా పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మీ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రం నుంచి విదేశీ చొరబాటుదారులందరినీ మూకుమ్మడిగా తరిమికొట్టే సత్తా ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకోండి. చొరబాటుదారులను అనుమతించని సర్కార్‌ను ఎన్నుకోండి. అస్సాం అభివృద్ధికి పాటుపడే నేతలకే పట్టంకట్టండి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి కాంగ్రెస్ రాష్ట్రంలోకి విదేశీయుల చొరబాట్లను ప్రోత్సహించింది. ఇప్పుడది అస్సాం అస్థిత్వం, గుర్తింపునకు ముప్పుగా పరిణమించింది’’అని షా అన్నారు. మరో ఛాన్స్ ఇవ్వండి ‘‘అస్సాంలో బీజేపీ ప్రభుత్వాల హయంలో గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. ఆ అభివృద్ధి సరిపోదు. శ్రీమంత సాధువు జని్మంచిన పుణ్యస్థలి నుంచి మీకు వాగ్దానం చేస్తున్నా. మరో ఐదేళ్లు పరిపాలించే అవకాశం ఇవ్వండి. అస్సాం నుంచి చొరబాటుదారులందరినీ వెనక్కి పంపేస్తాం. ఈ రాష్ట్రమేకాదు ప్రతి రాష్ట్రం నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం. ప్రధాని మోదీ మీ సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించమేకాదు మీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారు’’అని షా అన్నారు. -
ఎన్నికల రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటీవల నియమితులైన నితిన్ నబిన్ అప్పుడే కార్యరంగంలోకి దూకారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రా పార్టీ ఇన్ఛార్జీలు, కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని తిరిగి నిలబెట్టడం, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జాతీయ పార్టీ అయినా, స్థానికంగానే ఆలోచించాలి’అన్న విధానంతో రాష్ట్రానికో ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో పట్టుకోసం.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబిన్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందులో ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంగా అధికారం అందుకోలేకపోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడం అంత సులభమయ్యేది కాదు. దీనికి తోడు ఇప్పటికే రెండుమార్లు అధికారంలో ఉన్న అస్సాంలో పార్టీని తిరిగి నిలబెట్టడం కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నబిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, వినోద్ తావ్డే, అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగానే ప్రతి బూత్‌కు ఒక ఇన్‌ఛార్జి, ఒక డేటా వలంటీర్, ఒక సోషల్ మీడియా వలంటీర్లను సిధ్దం చేయాలనే సూచనలు వచ్చాయి. ‘ఎన్నికలను స్టేజ్ మీద కాదు..బూత్ వద్ద గెలుస్తాం’అన్న విధానాన్ని అవలంబిస్తూనే..యువత, మహిళలను క్రియాశీలకం చేయాలని నిర్ణయించారు. స్థానిక సామాజిక సమీకరణలపై సర్వేలు, ప్రాంతాల వారీగా అధికంగా ఉండే వర్గాల మ్యాపింగ్, చిన్నచిన్న సమావేశాలు, స్థానిక భాషల్లో పార్టీ కంటెంట్ ప్రచారం వంటి దృష్టి సారించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని నబిన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న బన్సల్ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. కాయస్థ కులస్థుడైన నబిన్ సామాజిక వర్గానికి చెందిన జనాభా పశి్చమ బెంగాల్లో గణనీయమైన రాజకీయ, సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంది. కోల్‌కతా, అసన్సోల్, సిలిగురి వంటి నగరాల్లోని బిహారీ వలసదారుల జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచే తన తొలి రాష్ట్ర పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు వంటి అంశాలతో రాష్ట్రంలోకి చొచ్చుకెళ్లేలా, టీఎంసీకి బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో పార్టీకి అనుబంధం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే రోడ్‌మ్యాప్ ఖరారైనట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత నబిన్ బెంగాల్ పర్యటన ఉంటుందని అంటున్నారు. ఇక తమిళనాడులో బలమైన ప్రాంతీయ పార్టీలతో కూటమి..స్థానిక భాష, సంస్కృతి మీద గౌరం చూపేలా ప్రచారం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలతో బూత్ స్థాయి వరకు పార్టీని చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. జనవరి తొలి వారంలో నబిన్ ఇక్కడ పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఇక కేరళలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నబిన్ భావిస్తున్నారు. తిరువనంతపురం మున్సిపల్ మేయర్ పీఠాన్ని కైవసం అంశాన్ని భవిష్యత్ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని నిర్ణయించారు. తొలిసారి ఓటువేసే యువతకు తమ వైపు తిప్పుకోవడంతో పాటు..ఉద్యోగాలు, విద్య అంశాలపై ప్రచారం చేస్తూ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచితే గెలుపు సాధ్యమన్నది నబిన్ ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అస్సాంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పనితీరును హైలెట్ చేయడం, స్థానిక నాయకులను అప్రమత్తం చేయడం, కాంగ్రెస్‌పై మరింత పదునుగా విమర్శలకు దిగేలా ఇప్పటికే రాష్ట్ర పర్యటన సందర్భంగా నేతలకు నబిన్ మార్గదర్శనం చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలోనూ పర్యటించిన నబిన్, పారీ్టకి ఉన్న బలాన్ని నిలుపుకునే అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని నిలబెడుతూనే, కొరగరానికొయ్యగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే బలమైన పట్టుదలతో నబిన్ ముందుకెళ్తున్నారు. -
ఐఎన్ఎస్వీ కౌండిన్య చరిత్రాత్మక యాత్ర షురూ
పోరుబందర్: ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్యచిత్రంలోని అసంపూర్ణ అంశాలను గుదిగుచ్చి, ఎలాంటి యంత్రాలు, మేకులు, స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవనిర్మిత అద్భుతం ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ నౌక తొలి సముద్రయానాన్ని విజయవంతంగా ఆరంభించింది. సోమవారం గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీరనగరానికి పయనమైంది. వెస్టర్న్ నావల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ జెండా ఊపి నౌకాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్‌లో ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. ప్రాచీన భారతీయ నావికానిర్మాణ కౌశలాన్ని కళ్లకు కట్టేలా ‘కుట్టుడు పద్ధతి’లో నౌక నిర్మించామని భారత రక్షణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 15 రోజులపాటు 1,400 కిలోమీటర్ల సముద్రయానం చేశాక ఒమన్ తీరానికి నౌక చేరుకోనుంది. పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక అంటూ ప్రధాని ప్రశంస నౌక ప్రయాణంపై ప్రధాని మోదీ అమితానందం వ్యక్తంచేశారు. ‘‘ పోరుబందర్ నుంచి మస్కట్‌ను మన ప్రాచీనమూలాలున్న ఐఎన్ఎస్ కౌండిన్య బయల్దేరడం ఎంతో సంతోషదాయకం. నౌకలోని 18 మంది నావికుల ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నా. గల్ఫ్, ఆవలి ప్రాంతాలతోనూ భారత్ ప్రాచీనకాలంలో అద్బుతంగా సముద్రమార్గంలో వాణిజ్యం జరిపేదని ఈ నౌక ద్వారా చాటిచెప్పండి. మేకులకు బదులు తాళ్లతో విడిభాగాలను జతచేసే స్టిచ్చింగ్ పద్దతిలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నౌక భారత ఉజ్జ్వలమైన సముద్రసంప్రదాయాలను స్మరణకు తెచ్చింది. నౌకను నిర్మించిన కళాకారులు, సిబ్బందికి నా అభినందనలు. ఈ నౌక పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధంగా.. సమున్నతంగా.. → నౌక తయారీలో మేకులు ఉపయోగించలేదు. → స్టిచ్చింగ్ పద్ధతిలో విడిభాగాలను అత్యంత ధృడమైన తాళ్లతో ముడివేశారు. → కొబ్బరినారతో తయారుచేసిన తాళ్లను ఉపయోగించారు. ఈ నౌకలో ఇంజిన్ ఉండదు. కేవలం తెరచాపలతో గాలివాటానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. → సహజసిద్ద జిగురులతో విడిభాగాలను అతికించారు. చేప నూనెను పూత పూశారు. → ఐదో శతాబ్దంనాటి అజంతా గుహల్లో వెలుగుచూసిన ప్రాచీన నౌక చిత్రాల నుంచి డిజైన్‌ను సంగ్రహించారు. → ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైంది. నీటిలో మునిగే ప్రధాన భాగం, చదరపు తెరలు, తెడ్డులను ప్రాచీన తరహా డిజైన్‌లో రూపొందించారు. → పురాతన నౌకా నిర్మాణాలు, నౌకా నిర్మాణశాస్త్రం, సాంప్రదాయ విధానాలను మేళవించి నౌకకు తుదిరూపునిచ్చారు. → కర్ణాటకలోని వ్యూహాత్మకమైన కర్వార్ నౌకాస్థావరంలో దీనిని తయారుచేశారు. దీని పొడవు 65 అడుగులు. → ఒకటో శతాబ్దంలో హిందూమహాసముద్రంలో సముద్రయానం చేసిన భారత నావికుడు కౌండిన్య పేరుతో ఈ నౌకకు ‘ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్(ఐఎన్ఎస్వీ) కౌండిన్య అని నామకరణం చేశారు. → ఒక తెరచాపపై కదంబ పాలకుల రాజలాంఛనమైన గండభేరుండ పక్షి చిత్రం, మరో తెరచాపపై సూర్యుని ఆకృతిని చిత్రించారు. -
ఉరితీసే దాకా విశ్రమించం: బాధితురాలు
ఉన్నావ్: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఉన్నావ్ కేసు బాధితురాలు సోమవారం సంతృప్తి వ్యక్తంచేశారు. సెంగార్‌ను ఉరితీసే దాకా విశ్రమించే ప్రసక్తే లేదని బాధితురాలు తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం జరిగినట్లు భావిస్తున్నానని చెప్పారు. తనపై అత్యాచారం జరిగినప్పటి నుంచి న్యాయం కోసం గొంతు వినిపిస్తున్నానని పేర్కొన్నారు. ఏ కోర్టుపైనా తాను ఆరోపణలు చేయడం లేదని, అన్ని కోర్టులపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటానని స్పష్టంచేశారు. సెంగార్‌ను ఉరి తీస్తేనే పూర్తిగా న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని బాధితురాలి సోదరి చెప్పారు. సెంగార్ ఒక క్రూర జంతువు అని మండిపడ్డారు. తొలుత తన సోదరిని, తర్వాత తమ కుటుంబాన్ని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. అతడికి ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు నిలిపివేయడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ కేసులో పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. మరోవైపు బాధితురాలి తల్లి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన బిడ్డపై అత్యాచారం చేసి, తన భర్తను చంపిన నేరగాడికి మరణ శిక్ష పడాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సామాజిక కార్యకర్త యోగితా స్పందించారు. ఇది కేవలం ఉన్నావ్ బాధితురాలి పోరాటం కాదని.. మహిళలందరి పోరాటమని ఉద్ఘాటించారు. ఇది చాలా భిన్నమైన కేసు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. -
79వేల కోట్ల సైనిక హార్డ్‌వేర్ కొనుగోలుకు ఆమోదం
న్యూఢిల్లీ: సైన్యం సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ.79,000 కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాలు, హార్డ్‌వేర్ కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ స్థాయి తేలికైన రాడార్లు, పినాకా రాకెట్ వ్యవస్థ కోసం లాంగ్–రేంజ్ గైడెడ్ రాకెట్ మందుగుండు సామగ్రి, ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్, ఇంటర్‌డిక్షన్ సిçస్టమ్, ఆర్మీ ఫిరంగి రెజిమెంట్ల కోసం లోయిటర్ మునిషన్ వ్యవస్థల కొనుగోలుకు కూడా ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడికి లోయిటర్ మునిషన్ ఉపయోగిస్తారు. చిన్న పరిమాణంలో, తక్కువ ఎగిరే మానవరహిత వైమానిక వ్యవస్థలను తక్కువ స్థాయి తేలికైన రాడార్లు గుర్తించి, ట్రాక్ చేస్తాయి. సుదీర్ఘ లక్ష్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పినాకా రాకెట్, వ్యవస్థల పరిధి, ఖచ్చితత్వాన్ని పెంచడానికి లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్లను కొనుగోలు చేయనున్నారు. వ్యూహాత్మక యుద్ధ ప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లో భారత సైన్య కీలకమైన ఆస్తులను ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్, ఇంటర్‌డిక్షన్ సిస్టమ్ రక్షిస్తుంది. ఇక హిందూ మహాసముద్ర ప్రాంతంపై నిరంతర నిఘా కోసం పెద్ద సంఖ్యలో రిమోట్ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్పీఏఎస్)లను లీజుకు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆటోమేటిక్ టేకాఫ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్ ఏరోస్పేస్ వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుందని, ఆస్ట్రా ఎమ్– ఐఐ క్షిపణులు ప్రత్యర్థి విమానాలను తటస్థీకరించే యుద్ధవిమానాల సామర్థ్యాన్ని పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. -
దేశానికే అవమానం
డెహ్రాడూన్: ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన ఓ విద్యారి్థని విద్వేష పూరిత వ్యాఖ్యలతో వేధించి, దారుణంగా చంపిన ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రిపురకు చెందిన ఏంజెల్ చక్మా(24) ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీన కొందరు యువకులు కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 26వ తేదీన కన్నుమూశాడు. అంజెల్ చక్మా తండ్రి బీఎస్ఎఫ్ జవాను. ఈయన ప్రస్తుతం మణిపూర్‌లోని టంగ్జెంగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. డెహ్రాడూన్‌లో ఉంటున్న తన కుమారులు ఏంజెల్ చక్మా, మైకేల్ చక్మాలను కొందరు యువకులు ‘చైనీస్ మోమో’ అంటూ కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారని తరుణ్ ప్రసాద్ చక్మా ఆరోపించారు. మేం చైనీయులం కాము, భారతీయులమంటూ అడ్డు చెప్పినందుకు ఏంజెల్‌ను విద్వేషపూరితంగా వెక్కిరిస్తూ కత్తి, ఇతర పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టారన్నారు. ఈ విషయమై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సోమవారం తరుణ్ ప్రసాద్ చక్మాతో ఫోన్లో మాట్లాడారు. ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, నేపాల్‌కు పారిపోయిన మరొకరిని తీసుకువస్తామని చెప్పారు. నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఏంజెల్ చక్మా కుటుంబానికి పరిహారంగా మొదటి విడతలో రూ.4.12 లక్షల చెక్కును పంపిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఘటనను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ విభజనవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపించారు. డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థి దారుణ హత్య దేశానికే అవమానమని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ గడ్డపై పుట్టిన వారంతా భారతీయులే అనే మెలకువ సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమని పేర్కొన్నారు. ఘటనను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. హోం మంత్రి అమిత్ షా విద్వేష నేరాలపై స్పందించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానం అందిస్తామని త్రిపురలోని తిప్రా మోథా సుప్రీం ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేబ్‌వర్మ ప్రకటించారు. ఏంజెల్ చక్మాకు న్యాయం జరగాలంటూ సోమవారం డెహ్రాడూన్, అగర్తలాలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. -
2026 ప్రారంభంలోనే పీఎస్ఎల్వీ సీ62 ప్రయోగం!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ62 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ప్రయోగాన్ని 2026 జనవరి 5న గాని లేదా 10న నిర్వహించేందుకు సిద్ధం చేస్తోంది. ఈ నెల 26న ఈవోఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహం షార్ కేంద్రానికి చేరుకుంది. క్లీన్ రూమ్‌లో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి రాకెట్‌కు అనుసంధానం చేయనున్నారు.షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్ (ఫిఫ్)లో నాలుగు దశల పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాకెట్ అనుసంధానం తరువాత ఫిఫ్ నుంచి ఎంఎస్టీకి తరలించి అక్కడ ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో ఈవోఎస్–ఎన్1 (అన్వేష్) అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపబోతున్నారు.రాకెట్ ఆఖరి దశ అయిన పీఎస్–4 దశతో స్పెయిన్‌కి చెందిన స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ ఫారాడైమ్తో ప్రయోగాత్మకంగా ఓ పరీక్షను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. 25 కిలోల బరువైన కెస్ట్రెల్ ఇనీషియల్ డిమాన్్రస్టేటర్ (కేఐడీ) అనే క్యాప్సూల్స్‌ను పీఎస్–4 ద్వారా తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం కోసం దక్షిణ ఫసిఫిక్ మహా సముద్రంలో ఒక స్పాష్ డౌన్ జోన్‌ను గుర్తించారు. దీంతో పాటు ఇందులో 18 పేలోడ్స్‌ను కూడా పంపిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. -
ఆరావళి ‘ఎత్తు’ వివాదంలో కీలక మలుపు
న్యూఢిల్లీ/జైపూర్: ఆరావళి శ్రేణిలో వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న కొండలనే పర్వతాలుగా పరిగణిస్తూ కొత్త నిర్వచనం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తడంతో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 20వ తేదీన తాము ఇచ్చిన తీర్పును పక్కనబెడు తున్నట్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. వంద మీటర్ల కంటే ఎత్తున్న ఆరావళి పర్వతాలకే పర్యావరణ పరిరక్షణ లభిస్తుండటంతో ఎత్తు తక్కువ ఉన్నవి గనుల తవ్వకంతో కనుమరుగయ్యే ప్రమాదముందని పర్యావ రణవేత్తలు మొదలు నేతలు, సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయ స్థానం సూమోటోగా స్వీకరించింది. సోమవారం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల వెకేషన్ బెంచ్ విచారించి పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ఫలానా ఎత్తు ఉన్న కొండలనే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలనే నిర్వచనం ఇవ్వడంలో సహేతుకత లోపించినట్లు స్పష్టమవుతోంది. సంబంధిత కమిటీ నివేదికలో, తీర్పులో ఇలాంటి పలు సంక్లిష్టమైన, కీలక అంశాలపై దృష్టిపెట్టలేదు. అందుకే ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం, దర్యాప్తు, విచారణ అవసరం. అప్పటిదాకా మేం గతంలో ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నాం. 2010 ఆగస్ట్ 25వ తేదీన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) ఇచ్చిన నిర్వచనం మేరకు 2024 మే 9న మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరావళి పర్వతాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదు. నవంబర్ 20న మేం ఇచ్చిన తీర్పు, అందులో పర్వతం నిర్వచనాన్ని తప్పుగా ఆపాదించే పెను ప్రమాదముందని అర్థమవుతోంది. కొత్త నిర్వచనాన్ని మైనింగ్ సంస్థలు తప్పుగా అన్వయించి తమను అనువుగా అమలుచేసే ప్రమాదం పొంచి ఉంది. గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల్లో స్పష్టత కరువవడంతో ఇదంతా జరిగింది. ఆరావళి పర్వతాల పర్యావరణ పరిరక్షణ, సమగ్రత కాపాడేలా నిబంధనల్లో లోటుపాట్లను సమగ్ర స్థాయిలో పూడ్చాల్సి ఉంది. 100 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తున్న కొండలను మాత్రమే ఆరావళి పర్వత శ్రేణిగా పేర్కొనడంలో తర్కం లోపించింది. 500 మీటర్ల దూరం ఎడంగా ఉన్న కొండలనే ఆరావళి పర్వత శ్రేణిలో భాగంగా పరిగణించాలన్న నిబంధనలోనూ లోపాలున్నాయి. ఇలాంటి పలు నిబంధనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలులేవని అర్థమవుతోంది. పలు కీలక అంశాల్లో సంక్లిష్టత నెలకొంది. రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతాల్లో 12,081కిగాను కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. దీంతో మిగతా కొండలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. ఇలా చిన్న కొండలు పర్యావరణ పరిరక్షణ ఛత్రం ఆవల ఉండిపోవడం మేం ఏమాత్రం ఒప్పుకోం. మళ్లీ సమగ్ర స్థాయిలో శాస్త్రీయ, భౌగోళిక దర్యాప్తు జరగాల్సిందే. ఈ మేరకు స్థానిక నిపుణులతో అత్యున్నత కమిటీ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాం. ఈ విషయంలో మీ స్పందన తెలియజేయండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. ఆరావళి పర్వతాల పరిధిలోకి వచ్చే ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, గుజరాత్లకూ నోటీసులు పంపించింది. జనవరి 21వ తేదీలోగా స్పందన తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించింది.ఆరావళి పర్వతాల ప్రత్యేకత ఏంటి?ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలుగా ఆరావళి పర్వతాలకు పేరుంది. ఢిల్లీ నుంచి మొదలై హరియాణా, రాజస్థాన్, గుజరాత్లదాకా ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 37 జిల్లాల్లో ఈ పర్వతాలున్నాయి. రాజస్థాన్‌లోని థార్ ఎడారి నుంచి ఇసుక మేఘాలు ఢిల్లీసహా ఉత్తరభారతాన్ని కమ్మేయకుండా ఈ ఆరావళి పర్వతాలే అడ్డుకుంటున్నాయి. ఆరావళి కారణంగానే థార్ ఎడారి ఉత్తరదిశగా విస్తరించకుండా ఆగిపోయింది. అలా ఉత్తరభారతంలో జీవవైవిధ్యానికి, భూగర్భ జలాలకు ఆరావళి పర్వతాలు రక్షాకవచాలుగా నిలుస్తున్నాయి. ఆరావళి కొండల్లోని వర్షపు నీరు నేలలోకి ఇంకి ఆయా ప్రాంతాల భూగర్భజలాలను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేస్తున్నాయి. దీంతో భూసారం పరిరక్షించబడుతోంది. పరోక్షంగా జీవజాతుల మనుగడ సాధ్యమవుతోంది. ఆరావళిలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే పులుల అభయారణ్యాలుగా, జాతీయ వనాలుగా, పక్షుల సంరక్షణ కేంద్రాలుగా, పర్యావరణంపరంగా అత్యంత సున్నిత ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి.స్వాగతించిన పర్యావరణ నిపుణులుగత తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వెలు వర్చిన తాజా నిర్ణయంపై పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు. అత్యున్నత కమిటీ అనేది కేవలం ప్రభుత్వ ఉన్నతాధికారుల కూటమిగా మిగిలిపోకుండా జీవావరణ, పర్యావరణవేత్తలకూ స్థానం కల్పించాలని పర్యావరణవేత్త భావరీన్ కంధారీ డిమాండ్‌చేశారు. ‘‘ఇది తాత్కాలిక గెలుపు. ఇప్పటి దాకా జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని వెల్లడి స్తూనే ఇకమీదట మైనింగ్‌ను పూర్తిగా ఆపేలా తుది తీర్పు రావాలి’’ అని ‘పీపుల్స్ ఫర్ ఆరావళి’ వ్యవస్థాపక సభ్యురాలు నీలం అహ్లూవాలియా ఆశాభావం వ్యక్తంచేశారు. పర్యావరణవేత్త విమలేందు ఝా, జీవావర ణవేత్త విజయ్ ధాస్మాన తదితరులూ తాజా ఉత్తర్వును స్వాగతించారు. ‘‘ ఉత్తర్వును మేం కూడా స్వాగతిస్తున్నాం. ఆరావళి పరిరక్షణకు, పునరుద్ధరణకు మోదీ సర్కార్ కట్టుబడి ఉంది’’ అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ‘‘ కొత్త నిర్వచనం సరిగా లేదని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీ, కోర్టు అమికస్ క్యూరీ సైతం గతంలోనే చెప్పారు. అయినాసరే కొత్త నిర్వచనం సరైందేనంటూ మంత్రి యాదవ్ గతంలో చేసిన వాదనలన్నీ తప్పు అని నేడు తేలింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
ప్రయోగాలు తగ్గించిన ఇస్రో
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది కేవలం ఐదు ప్రయోగాలకే పరిమితమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి రెండు జీఎస్ఎల్వీ రాకెట్లు, రెండు ఎల్వీఎం–3 రాకెట్లు, ఒక్క పీఎస్ఎల్వీ రాకెట్‌ను మాత్రమే ప్రయోగించారు. గతంలో ఏడాదికి నాలుగుకుపైనే పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు ఉండేవి. జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 రాకెట్ ప్రయోగాలు ఏడాదికి ఒకటో రెండో ఉండేవి. ఈ ఏడాది ఒకే ఒక్క పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగించినప్పటికీ విఫలమైంది. పీఎస్ఎల్వీ ప్రయోగాలను తగ్గించి జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 రాకెట్ల ప్రయోగాలు పెంచుతున్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన క్రయోజనిక్ దశను వివిధ రూపాల్లో తయారు చేసి విజయాలు నమోదు చేస్తున్నారు. జనవరి నుంచే ప్రయోగాలు ఈ ఏడాది ప్రారంభంలోనే అంటే జనవరి 29న జీఎస్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ ద్వారా నావిగేషన్ శాటిలైట్ (ఎన్వీఎస్–02)ను ప్రయోగించారు. మే 18న పీఎస్ఎల్వీ సీ 61 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను ప్రయోగించగా విఫలమైంది. జూలై 30న జీఎస్ఎల్వీ ఎఫ్ 16 ద్వారా ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని, నవంబర్ 2న ఎల్వీఎం3 – ఎం5 రాకెట్ ద్వారా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎస్–03) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. డిసెంబర్ 24న ఎల్వీఎం – 3 – ఎం6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6,400 కిలోల అత్యంత బరువైన బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి ప్రపంచంలో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేశారు.ఇస్రో చరిత్రలో ఈ ఏడాది సువర్ణాక్షరాలతో లిఖించదగిన ప్రయోగాలు చేసింది. ఇస్రో బాహుబలిగా పేరుగాంచిన ఎల్వీఎం–3 రాకెట్‌ను ఎప్పుడో రెండు మూడేళ్లకు ఒకటి, రెండుసార్లు ప్రయోగించేవారు. అలాంటిది ఈ ఏడాది 52 రోజుల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేసి విజయాలను సొంతం చేసుకోవడం ఒక మైలురాయిగా నిలిచింది. ఇస్రో చరిత్రలో ఇప్పటిదాకా రెండువేల కిలోల నుంచి మూడువేల కిలోల బరువైన ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించారు. ఈ ఏడాది ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు చెందిన 6,400 కిలోల అత్యంత బరువైన ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించి చరిత్ర సృష్టించారు. లాంచింగ్ సౌకర్యాలు పెరిగినా.. ఆ స్థాయి ప్రయోగాలు లేవుశ్రీహరికోటలో లాంచింగ్ సౌకర్యాలు విపరీతంగా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో రాకెట్ ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రో వెనుకంజలోనే ఉంది. 2022, 2023 సంవత్సరాల్లో ఎనిమిదేసి ప్రయోగాలు చేసిన ఇస్రో 2024, 2025ల్లో అయిదేసి ప్రయోగాలకే పరిమితమైంది. 2020, 2021ల్లో కరోనా మహమ్మారి కారణంగా రెండేసి ప్రయోగాలతో సరిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్టాయి. మొదటి ప్రయోగవేదిక మీద ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసే సౌకర్యాలున్నాయి. రెండో ప్రయోగవేదికకు సంబంధించి రెండు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లతోపాటు ఎస్‌ఎస్‌ఏబీ భవనం కూడా ఉంది. అంటే ఇక్కడ కూడా ఒకేసారి అయిదు రాకెట్లు అనుసంధానం చేసే వీలుంది. ఇక్కడ ఘన ఇంధన మోటార్ల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచారు.ఇన్ని వసతులు మెరుగుపడినా ఆ స్థాయిలో రాకెట్లను ప్రయోగించడంలేదు. ఈ నెల 24న చేసిన ఎల్వీఎం3 – ఎం6 ప్రయోగంతో షార్ నుంచి 104 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇందులో నాలుగు.. ఉపగ్రహాలు లేకుండా ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ నెల 24న చేసింది.. ఉపగ్రహాలతో కూడిన వందో ప్రయోగం. వచ్చే మార్చి నాటికి తమిళనాడు తూత్తుకుడి సమీపంలోని కులశేఖరపట్నంలో నిర్మీస్తున్న రాకెట్ ప్రయోగకేంద్రం అందుబాటులోకి రానుంది. పీఎస్ఎల్వీ, ఎస్ఎస్ల్వీ రాకెట్ ప్రయోగాలను అక్కడి నుంచే నిర్వహించే అవకాశాలున్నాయి. భారీ ప్రయోగాల కోసం శ్రీహరికోట షార్ కేంద్రాన్ని బలీయమైన శక్తిగా తయారు చేస్తున్నారు. ఇక భవిష్యత్‌లో ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ అన్‌మ్యాన్ మిషన్, గగన్‌యాన్ మ్యాన్ మిషన్, చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ప్రయోగాలతోపాటు సుమారు 10 వేలకిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
జైల్లోనే సెంగార్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడికి బెయిల్ మంజూరు చేయడంతోపాటు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దని అధికారులకు తేలి్చచెప్పింది. ఐపీసీ ప్రకారం ఎమ్మెల్యేను ‘ప్రజాసేవకుడి’గా పరిగణించలేమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది. ఇది చట్టసభ సభ్యులకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుందన్నది.ఎమ్మెల్యే ప్రజాసేవకుడు కాదా? ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తోపాటు బాధితురాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సిందే. హైకోర్టు న్యాయమూర్తులు ఎంతో అనుభవజు్ఞలు, కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) నిర్వచనం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. చట్టం ప్రకారం ఒక కానిస్టేబుల్ ‘పబ్లిక్ సర్వెంట్’ అవుతారు. అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడు మాత్రం ప్రజా సేవకుడు కాదా? ఎమ్మెల్యేను మినహాయించడం సరైందేనా? చట్టసభ సభ్యులను దీని నుంచి మినహాయించడం సరైన ది కాకపోవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా ఒక దోషి లేదా అండర్ ట్రయల్ ఖైదీకి బెయిల్ ఇస్తూ కింది కోర్టు లేదా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పుడు అతడి వాదన వినకుండా ఆ ఉత్తర్వుపై స్టే విధించలేమని తెలియజేసింది. మరో కేసులో సెంగార్ దోషిగా తేలి, ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడని పేర్కొంది. ఈ నెల 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఉన్నావ్ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిలిపివేస్తున్నామని స్పష్టంచేసింది. బాధితురాలికి ప్రాణహాని ఉంది: తుషార్ సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘ఇది అత్యంత పాశవికమైన నేరం. ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్ల కంటే తక్కువ (15 ఏళ్ల 10 నెలలు). కేవలం ఏడేళ్ల జైలుశిక్ష పూర్తయిందన్న కారణంతో దోషికి బెయిల్ ఇవ్వడం సరికాదు. సవరించిన చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘నేరం జరిగిన సమయానికి ఈ చట్ట సవరణ రాలేదు కదా! ఆ తర్వాత వచ్చిన సవరణలను పాత కేసులకు ఎలా వర్తింపజేస్తాం?’ అని ప్రశ్నించింది. దీనికి తుషార్ బదులిస్తూ.. ‘మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంతో పనిలేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల దృష్టిలో బలమైన స్థానంలో ఉంటారు. ఎవరైనా సాయం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. అలాంటి నమ్మకమైన స్థానంలో ఉండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరం కచ్చితంగా తీవ్రమైన లైంగిక దాడి కిందకే వస్తుంది. ఆర్మీ ఆఫీసర్ విధుల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎలా శిక్షార్హుడో, ఎమ్మెల్యే కూడా అంతే’ అని వాదించారు. సెంగార్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెంగార్ ఇప్పటికే బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులోనూ దోషిగా తేలారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి సెంగార్ బయటకొస్తే బాధితురాలికి, ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరు గుతుంది. ఆ బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలి’ అని కోర్టును కోరారు. ఎల్.కె. అద్వానీ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఎంపీలు లేదా ఎమ్మె ల్యేలుగా పదవిలో ఉన్న వాళ్లను ప్రజా ప్రతినిధులుగానే పరిగణిస్తూ అప్పట్లో న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. సెంగార్ తరఫు న్యాయవాదుల వాదన సెంగార్ తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, ఎన్.హరిహరన్ వాదనలు వినిపించారు. ‘ట్రయల్ కోర్టు సెంగార్‌ను పబ్లిక్ సర్వెంట్‌గా పరిగణించడం వల్లనే జీవిత ఖైదు విధించింది. ఐపీసీలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనాన్ని తీసుకొచ్చి పోక్సో చట్టానికి ఆపాదించడం న్యాయం కాదు. ఒక చట్టంలోని నిర్వచనాన్ని మరో చట్టానికి వర్తింపజేయకూడదు’ అని సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. అలాగే సెంగార్‌కు బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయని, టీవీల్లో కొందరు చర్చలు సాగిస్తున్నారని సెంగార్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి ఇరుపక్షాల వాదనలు తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్ కాదనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ను నిలిపివేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని వెల్లడించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది.అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు(మరణించేదాకా జైలులోనే) విధించింది. మరోవైపు బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. ఈ కేసులోనూ సెంగాల్ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ అత్యాచారం కేసుతోపాటు సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఉన్నావ్ రేప్ కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల విచారించింది. సెంగార్ చేసిన నేరం పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) కింద ‘తీవ్రమైన లైంగిక దాడి’ పరిధిలోనికి రాదని అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి ‘పబ్లిక్ సర్వెంట్’ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. సెంగార్ ఇప్పటికే ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, జీవిత ఖైదును కూడా రద్దు చేస్తున్నట్లు ఈ నెల 23వ తేదీన తీర్పునిచ్చింది. -
2025..1.22 లక్షలు ఉద్యోగాలు ఔట్..
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికరంగ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ చిచ్చు ప్రధానంగా ఐటీ రంగంపైనే ప్రభావం చూపుతోంది. కంపె నీలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పునర్ వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో ఉద్యోగుల తీసివేతలు తప్పడం లేదన్నది పరిశ్రమ వర్గాల మాట. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొంత కాలంపాటు టెక్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా నియామ కాలు చేపట్టాయి. అయితే స్థూల ఆర్థిక ఒత్తిళ్లతోకొన్నాళ్లుగా మార్కెట్ దిద్దుబాటుకు గురవుతోంది. ఇటీవలి కాలంలో ఏఐ, ఆటోమేషన్ వైపు పరిశ్రమ మళ్లుతోంది. దీని ఫలితంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 257 టెక్ సంస్థలు 1.22 లక్షల మందికి ఉద్వాసన పలికాయని ఉద్యోగుల తొలగింపులను ట్రాక్ చేస్తున్న లేఆఫ్స్. ఎఫ్‌వైఐ వెబ్సైట్ వెల్లడించింది. సిబ్బందిని ఇంటికి సాగనంపిన సంస్థల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజాలూ ఉన్నాయి. కానీ 2023తో పోలిస్తే ఈ తీసివేతలు సగానికంటే తక్కువే కావ డం గమనార్హం. మరో సాంకేతిక దిగ్గజం యాపిల్ సైతం డజన్లకొద్దీ సేల్స్ సిబ్బందిని కుదించింది. ద్రవ్యోల్బణం, సుంకాల కారణంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వే షిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలా పాలను నిర్వహించడం, ఏఐపై ఆధారపడటం కంపెనీలకు ఆకర్షణీయమైన స్వల్పకాలిక పరిష్కారంగా కనిపిస్తోంది.లేఆఫ్స్‌కు ప్రధాన కారణాలు ఇవీ..1. ఓవర్ హైరింగ్–మార్కెట్ కరెక్షన్ కోవిడ్–19 సమయంలో ఈ–కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రిమోట్ వర్క్ టూల్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో టెక్ పరిశ్రమలో భారీ నియామకాలకు దారితీసింది. ప్రస్తుతం మార్కెట్ యథాతథ స్థితికి చేరుకోవడం, డిమాండ్ వృద్ధి సాధారణం కావడంతో కంపెనీలు తాము అధిక సిబ్బందితో ఉన్నట్లు గుర్తించాయి. ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా శ్రామిక శక్తిని సరైన పరిమాణంలో ఉపయోగిస్తున్నాయి.2. పెట్టుబడిదారుల డిమాండ్స్ అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాలు వంటి ప్రపంచ ఆర్థిక ఎదురుగాలులు నిర్వహణ ఖర్చులను పెంచడంతోపాటు లాభాలను తగ్గించాయి. పెట్టుబడి దారులు ఇప్పుడు లాభదాయకత, ఆర్థిక క్రమశిక్ష ణను కోరుతున్నారు. ఖర్చులను తగ్గించడానికి, లాభాలను మెరుగుపరచడానికి తొలగింపులను కంపెనీలు తక్షణ మార్గంగా భావిస్తున్నాయి.3. ఏఐ, ఆటోమేషన్ వైపు పయనం ఏఐ, ఆటోమేషన్ విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి, స్వీకరణ ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణం. కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలు, పరిశోధనలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. నిధులు సమకూర్చ డానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో రోజువారీ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తోంది. కార్మికుల అవసరాన్ని తగ్గిస్తోంది. ఐటీ పరిశ్రమలో నైపుణ్యాల పునఃసమీక్షకు దారితీస్తోంది.4. సమర్థతకు పెద్దపీట అనేక టెక్ దిగ్గజాలు నిర్వహణ సామర్థ్యం, వేగంపై దృష్టిసారించాయి. భవిష్యత్ వృద్ధి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా అప్రాధాన్య ప్రాజెక్టులు, పేలవమైన పనితీరుగల యూనిట్లను తగ్గించుకుంటున్నాయి.5. నిర్దిష్ట రంగాల్లో తగ్గుతున్న డిమాండ్ వ్యక్తిగత కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, సంప్రదాయ నెట్వర్కింగ్ హార్డ్‌వేర్ వంటి కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాటితో ముడిపడి ఉన్న నిర్దిష్ట వ్యాపార యూనిట్లలో ఉద్యోగాల కోతలు ఏర్పడుతున్నాయి. -
ఒక ఊపు ఊపిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది?
అస్సాం గణ పరిషత్..! ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలన విజయంతో రాజకీయాల్లో ఓ ఊపు ఊపిన ఏజీపీ ఇప్పుడు చతికిలపడిపోయిందా? విద్యార్థి నేతలు నడిపిన ఉద్యమంతో.. అధికారంవైపు అడుగులు వేసి.. రికార్డులు సృష్టించిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది? నాలుగు దశాబ్దాల క్రితం క్రిస్మస్కు ముందు అస్సాంలో అధికారాన్ని చేపట్టిన ఈ పార్టీ.. ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎందుకు తంటాలు పడుతోంది? ఒకప్పుడు అస్సాం రాజకీయాలను పూర్తిగా మార్చేసిన ఏజీపీ ఇప్పుడు పతనం అంచుల్లో ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.నాలుగు దశాబ్దాల క్రితం.. అంటే.. 1985 అక్టోబరు 14న భారత రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అస్సాం గణ పరిషత్ పేరుతో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చరిత్రలో విద్యార్థులు, విద్యార్థి ఉద్యమ నాయకులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, అదే సంవత్సరం సరిగ్గా క్రిస్మస్ ఈవ్ రోజున.. అంటే.. 1985 డిసెంబరు 24న అధికారాన్ని చేపట్టిన అరుదైన ఘట్టం చోటుచేసుకుంది అప్పుడే..! ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకుని, స్వదేశీయుల అస్తిత్వాన్ని కాపాడేందుకు అప్పట్లో విద్యార్థులు చేసిన ఉద్యమమే.. వారిని అస్సాంలో అధికారం వైపు నడిపించింది. నిజానికి ఇప్పుడు ఎన్నో దేశాల్లో జెన్-జీ ఉద్యమాలు జరుగుతున్నా.. చైనాలోని తియానన్మనెన్ స్క్వేర్ విద్యార్థి ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచినా.. అస్సాం విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో ఓ విప్లవమేనని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఆరేళ్ల పాటు జరిగిన అస్సాం విద్యార్థి ఉద్యమంలో రెండు విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత.. 1985 ఆగస్టు 15న ఈ రెండు విద్యార్థి సంఘాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారమే అదే ఏడాది అక్టోబరు 14న అస్సాం గణ పరిషత్ పార్టీని ఏర్పాటు చేశాయి. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘన విజయం సాధించింది. క్రిస్మస్ ఈవ్ రోజున అధికార పగ్గాలను చేపట్టింది. అదేరోజున దేశంలోనే అత్యంత యువ ముఖ్యమంత్రిగా ప్రపుల్లకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలా ఏజీపీ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. కాలేజీ నుంచి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నేత కూడా ప్రపుల్ల కావడం గమనార్హం..! ఆ సమయంలో ఆయన వయసు 33 సంవత్సరాలే..!ఏజీపీ ప్రస్తానం తెలుసుకోవాలంటే.. 70లలో జరిగిన పరిణామాలను పరిశీలించాల్సిందే..! 1971లో బంగ్లాదేశ్ అవతరణ జరిగాక.. లక్షల మంది భారత్‌కు అక్రమంగా వలస వచ్చారు. ఇప్పటికీ అస్సాంలో అక్రమ వలసల సమస్య తీవ్రస్థాయిలో ఉంది. అక్రమ వలసలు ఓ ముగింపు లేని సమస్యగా మారిపోయాయి. 1971లో భారత్‌లోకి చొరబడ్డ అక్రమ వలసదారులకు స్థానికులుగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తుండడంతో.. విద్యార్థి సంఘాలు అప్రమత్తమయ్యాయి. ఈ వలసల కారణంగా వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగడం మొదలైంది. 1979 మార్చిలో లోక్‌సభ సభ్యుడు హీరాలాల్ పట్వారీ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో.. వేల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ఓటర్ల జాబితాలో చోటు లభించిన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో.. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. అదే ఏడాది జూన్‌లో ఏఏఎస్‌యూ పిలుపునిచ్చిన బంద్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాంతో.. మరో కీలక విద్యార్థి సంఘం అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ కూడా ఉద్యమంలో భాగమైంది. అలా.. 1979 నుంచి 1985 ఆగస్టు వరకు విద్యార్థులు నిరంతరాయంగా తమ పోరాటాన్ని సాగించారు. ఈ సుదీర్ఘ ఉద్యమంతో దిగివచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థి నాయకుల డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. 1985 ఆగస్టు 15న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 1971 తరువాత అస్సాంలోకి ప్రవేశించిన వారిని బేషరతుగా బంగ్లాదేశ్‌కు తిప్పిపంపాలి. 1966–71 మధ్యకాలంలో వలస వచ్చిన వారికి మాత్రం షరతులతో కూడిన పౌరసత్వం ఇవ్వాలి. ఈ విజయంతో రెండు విద్యార్థి సంఘాలు కలిసి అస్సాం గణ పరిషత్గా రాజకీయ పార్టీని నెలకొల్పాయి. అస్సాం సాహిత్య సభ, అస్సాం జాతీయవాద దళ్, పూర్వాంచల్య లోక్ పరిషత్‌తోపాటు పలు ఉద్యోగ సంఘాలు కూడా ఏజీపీతో జతకట్టాయి. పార్టీ అధ్యక్షుడిగా ప్రపుల్ల కుమార్ మహంతా ఎన్నికయ్యారు.పార్టీగా ఆవిర్భవించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్ అఖండ విజయాన్ని సాధించింది. నిజానికి ఏజీపీ నేతలు ఆ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేశారు. ఘన విజయం తర్వాత ఏజీపీ గొడుగు కిందకు వచ్చారు. అంటే.. ఏజీపీ ఓ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందక ముందే.. 126 స్థానాలకు గాను 92 చోట్ల స్వతంత్రులుగా విద్యార్థి సంఘాల నేతలు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకు పరిమితమైంది. ఫలితంగా అస్సాం రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ప్రపుల్లకుమార్ మహంత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్యమం ముగిసిన వెంటనే.. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడం భారతదేశ చరిత్రలోనే అది మొదటిసారి. ఆ తర్వాతి కాలంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా, తెలంగాణలో బీఆర్ఎస్ ఆ ఘనతను సాధించాయి.అధికార పగ్గాలను చేపట్టినకప్పటికీ.. అనుభవ లోపం కారణంగా పరిపాలనలో ఏజీపీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ప్రపుల్ల కుమార్ నేతృత్వంలోని సర్కారులో భృగు కుమార్ భూయాన్, కేశబ్ మహంత, అతుల్ బోరా లాంటి యువ నేతలు మంత్రులుగా కొనసాగారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అనుభవం లేకపోవడంతో చోటుచేసుకున్న పరిణామాలు.. ఏజీపీ సర్కారును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు దారితీసింది. ఉల్ఫా ఉగ్రవాదం, ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగా.. 1980లో కేంద్రం అస్సాం సర్కారును రద్దు చేసింది. 1991లో ఏజీపీ చీలిపోయింది. నూతన్ ఏజీపీ ఏర్పాటైంది. దాంతో.. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ పతనం దిశలో అడుగులు వేసింది. 1991లో జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 19 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారపగ్గాలను చేపట్టింది.విడిపోయి ఓటమిపాలైన ఏజీపీ నేతలు తమ తప్పును తెలుసుకుని, మళ్లీ కలిశారు. 1996 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 59 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చారు. అత్తెసరు మెజారిటీ కావడంతో.. పరిపాలన సవ్యంగా సాగలేదనే చెప్పలి. 2001లో ఏజీపీ మరోమారు పరాజయం పాలవ్వగా.. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అస్సాంలో బలమైన పునాదులను వేసుకుంది. అయితే.. బీజేపీ వైపు మళ్లే ప్రతీ ఓటు.. ఏజీపీ ఖాతా నుంచి మైనస్ కావడం మొదలైంది. అలా బీజేపీ బలపడుతున్న కొద్దీ.. ఏజీపీ పునాదులు దెబ్బతినడం మొదలైంది. అనుభవరాహిత్యంతో పరిపాలనలో లోపాలు.. అవినీతి.. మహంతపై పెరిగిన వ్యతిరేకత వెరసి ఏజీపీ పతనం వేగవంతమైంది. నిజానికి ఏజీపీ ఆలోచనల నుంచే.. అస్సాంలో బీజేపీ ఎదిగిందనే అభిప్రాయాలు లేకపోలేదు. కాలక్రమంలో ఏజీపీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర మాజీ మంత్రి బిజోయ్ చక్రవర్తి కూడా అలాంటి నేతల్లో కొందరు. అస్తిత్వం కోసం ఏజీపీ అనేక పొత్తులను పరీక్షించింది. బీజేపీ ప్రధాన శక్తిగా మారడంతో.. ఆ పార్టీతో కలిసి నడుస్తోంది. 2016లో బీజేపీతో పొత్తుతో.. 14 స్థానాలను సాధించింది. పౌరసత్వ సవరణ చట్టం-2019తో మళ్లీ ఈ పొత్తు విఫలమైంది. ఆ తర్వాతి కాలంలో కుదిరిన రాజీతో తిరిగి బీజేపీతో జతకట్టింది. ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలున్న ఏజీపీ.. హిమంత బిశ్వ శర్మ సర్కారులో భాగంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ప్రపుల్ల పోటీ చేయలేదు. పార్టీ అధ్యక్షుడిగా అతుల్ బోరా ఉన్నారు. 2024లో బార్పేట లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. దీంతో.. రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీకి ఓ ఎంపీ సీటు దక్కినట్లైంది. పార్టీ తొలినాళ్లలో ప్రభుత్వంలో ఉన్న దినేశ్ గోస్వామి, భృగు భూయాన్ వంటి కీలక నేతల అకాల మరణం పార్టీకి తీరని నష్టమేనని చెప్పవచ్చు. క్రమంగా గ్రాఫ్ పడిపోతున్న ఏజీపీ భవిష్యత్‌లో నిలదొక్కుకుంటుందా? లేదా.. పలు ప్రాంతీయ పార్టీల్లాగా కనుమరుగైపోతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -హెచ్.కమలాపతిరావు -
17 రోజుల పాటు మృత్యువుతో పోరాడి..
''ఇలాంటిది మరెవరికీ జరగకూడదు. ఇది ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదు. మరే బిడ్డా ఇలా చనిపోకూడదు'' అంటూ తీవ్ర మనోవేదన చెందారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ తరుణ్ ప్రసాద్ చక్మా. తమకు న్యాయం చేయాలని, కడుపుకోత మిగిలిచ్చిన బాధ్యులకు మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిన జాతి వివక్ష దాడిలో తన పెద్ద కుమారుడు ఏంజెల్ చక్మా ప్రాణాలు కోల్పోవడంతో ఆయనీ విధంగా స్పందించారు. జాతి వివక్ష పేరుతో దాడులు చేయడం దారుణమని ఖండించారు. దేశంలో ఇలాంటి దాడులు ఇంతకుముందెన్నడూ జరగలేదని అన్నారు. అసలేం జరిగింది?త్రిపురలోని ఉనకోటి జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఏంజెల్ చక్మా (Anjel Chakma).. డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. డిసెంబర్ 9న తన తమ్ముడితో కలిసి సరుకులు కొనేందుకు బయటకు వెళ్లాడు. కొంత మంది వారిని ఉద్దేశించి జాతివ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, దుర్భాషలాడారు. అంతేకాదు వారిని చైనీయులుగా భావించి మరింత రెచ్చిపోయారు. తాము ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారమని, చైనీయులం కాదని ఎంత చెప్పినా దుండగులు వినిపించుకోలేదు. దీంతో అంజెల్ చక్మా.. వారిని వారించే ప్రయత్నంగా చేయగా అతడిపై దాడికి తెగబడ్డారు. పదునైన ఆయుధంతో మెడ, కడుపులో పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని గ్రాఫిక్ ఎరా ఆసుపత్రికి తరలించారు. 17 రోజుల పాటు ఐసీయూలో ఉన్న ఏంజెల్.. ఈనెల 26న ప్రాణాలు విడిచాడు. అతడు చివరిగా అన్న మాటలు ''మేము చైనీయులం కాదు. మేము భారతీయులం''. జాత్యాంహకార దాడికి నిరసనత్రిపుర విద్యార్థి ఏంజెల్ చక్మా మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జాత్యాంహకార దాడులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు గళమెత్తారు. జాతి వివక్ష వ్యతిరేక చట్టం తేవాలంటూ త్రిపురలో ఆందోళనలు చేపట్టారు. సోషల్ మీడియాలో #JusticeForAnjelChakma హ్యాష్‌టాగ్‌తో గళం విన్పిస్తున్నారు.విద్వేషదాడులు ప్రమాదకరం: రాహుల్ గాంధీడెహ్రాడూన్లో జరిగిన జాత్యాహంకార ఘటనపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ పాలనలో విద్వేషదాడులు సర్వసాధారణంగా మారాయని ధ్వజమెత్తారు. డెహ్రాడూన్‌లో ఏంజెల్ చక్మా, అతని సోదరుడు మైఖేల్‌పై జరిగిన దాడిని భయంకరమైన ద్వేషపూరిత నేరంగా ఆయన పేర్కొన్నారు. విద్వేష దాడులు దేశానికి ప్రమాదకరని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.చదవండి: మమ్మల్ని జైలులో పెట్టండి.. బాధితుల మొరకఠిన చర్యలు తప్పవు: ధామిఏంజెల్ చక్మాపై దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) ప్రకటించారు. ఏంజెల్ తండ్రి తరుణ్ ప్రసాద్ చక్మాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారు. ఈ నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నాడని తెలిపారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి కూడా తనతో మాట్లాడారని వెల్లడించారు. ఏంజెల్ చక్మా కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు. -
శబరిమల యోగా దండం, జప మాల మరమ్మత్తు పనుల కేసుపై సిట్ దర్యాప్తు ముమ్మరం
పథనంతిట్ట: శబరిమల ఆలయంలో ఆరోపణలు వెల్లువెత్తిన యోగా దండం, జపమాల మరమత్తుల కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తును వేగవంతం చేసింది. అసలు యోగా దండం, జప మాల స్థానంలో కొత్త వస్తువులు పెట్టారని నిందితుల్లో ఒకరు చేసిన ప్రకటనను అనుసరించి ఈ చర్య తీసుకుంది.2014 నాటి అక్రమాలపై దర్యాప్తు చేయాలని సిట్‌ను కోరుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ విస్తృత దర్యాప్తు జరుగుతోంది. 2019 ఏప్రిల్‌లో విషు పండుగ సందర్భంగా ఎ. పద్మకుమార్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరమ్మతు పనులు చేపట్టారు. మరమ్మతులను ఆయన కుమారుడు అందించాడని చెప్పుకున్నారు. దేవస్వం బోర్డు సన్నిధానం (ఆలయ ప్రాంగణం) వద్ద పనులు జరిగాయని పేర్కొంది.జూలై 2019లో బంగారు పూత కోసం ద్వారపాలక (సంరక్షక దేవత) శిల్పాలను తొలగించే ముందు మరమ్మతులు జరిగాయి. మార్చి 16 , 2019 నాటి దేవస్వం బోర్డు నిర్ణయం ప్రకారం , యోగా దండను బంగారంతో చుట్టడానికి బయటకు తీసుకెళ్లారు. మరమ్మతులు చేపట్టే బాధ్యతను జయశంకర్ పద్మన్‌కు అప్పగించారని కూడా ఈ నిర్ణయంలో పేర్కొన్నారు.యోగా దండం, రుద్రాక్ష మాల అనేవి గర్భగుడి లోపల ప్రత్యేకంగా ఉంచబడిన పవిత్ర వస్తువులు. ఆలయ ప్రతిష్ట సమయంలో పండలం ప్యాలెస్ మొదట యోగా దండను అందించేది.సన్నిధానంలో మరమ్మతులు హైకోర్టు అనుమతితో జరిగాయని అధికారులు పేర్కొన్నప్పటికీ, రికార్డులలో పని జరిగిన ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొనకపోవడం లేదా కోర్టు ఆర్డర్ నంబర్ వంటి వివరాలను అందించకపోవడంతో సిట్ ఆందోళన వ్యక్తం చేసింది.మరమ్మతులను డాక్యుమెంట్ చేసే మహాజర్ను ఏప్రిల్ 14 , 2019న తయారు చేశారు. దీనిలో అప్పటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ప్రస్తుతం జైలులో ఉన్న) మురారి బాబు , ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. సుధీష్ కుమార్ మరియు తిరువాభరణం కమిషనర్ కె. ఎస్. బైజు సంతకాలు ఉన్నాయి. ఈ అధికారులలో ఒకరి ప్రకటనలు సిట్ యోగా దండ సమస్యను నిశితంగా పరిశీలించడానికి కారణమయ్యాయని వర్గాలు తెలిపాయి.మహాజర్ ప్రకారం , యోగా దండపై ఉన్న బంగారు ఉంగరాలు మొదట్లో 19.2 గ్రాముల బరువు ఉండేవి. తరువాత , 18 ఉంగరాలు మరియు బేస్ వద్ద బంగారు టోపీని తయారు చేయడానికి 44.54 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు. రుద్రాక్ష మాలను చింతపండుతో కడిగి శుభ్రం చేశారని కూడా పత్రం పేర్కొంది.సాంప్రదాయ ఆలయ కళాకారుల కుటుంబానికి చెందిన ఆలయ శిల్పి తట్టవిల మహేష్ పనికర్ మాట్లాడుతూ, అసలు యోగా దండ ఎబోనీ (కరుంగలి) కలపతో తయారు చేయబడిందని మరియు దాని స్థానంలో బంగారంతో చుట్టబడిన వెదురు కర్రను ఉంచారని ఆరోపించారు. కాగా, 2018 నుంచే శబరిమల అయ్యప్ప ఆలయంలోని యోగదండం, ఏకముఖీ రుద్రాక్షల మాల మిస్సయినట్లు క్రైమ్ బ్రాంచఠ్ భావిస్తోంది. అప్పట్లో యోగదండాన్ని బంగారు పూత కోసం తరలించారు. అలా తరలించడం ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్(మజహర్ రికార్డు)లో నమోదు కాలేదు. అప్పట్లోనే అత్యంత ఖరీదైన పురాతన ఏకముఖీ రుద్రాక్షల మాలను కూడా బంగారు పూతకు తీసుకెళ్లారు. హైకోర్టు అనుమతి లేకుండానే.. ఓ అధికారి వీటిని బయటకు పంపేందుకు అనుమతినిచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.(చదవండి: శబరిమల యోగదండం మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఈడీ) -
కారుణ్య నియామకం హక్కు కాదు.. తక్షణ భరోసా: ఉన్నత న్యాయస్థానం
ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు కల్పించే కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కారుణ్య నియామక ప్రాతిపదికన ఒకసారి ఉద్యోగాన్ని అంగీకరించిన తర్వాత, తమకు అర్హత ఉన్నా అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.కేసు నేపథ్యంతమిళనాడు పట్టణ పంచాయతీల్లో స్వీపర్లుగా పనిచేస్తూ మరణించిన ఇద్దరు వేర్వేరు ఉద్యోగుల కుమారులకు (ఎం.జయబల్, ఎస్.వీరమణి) వారి తండ్రుల మరణానంతరం 2007, 2012 సంవత్సరాల్లో స్వీపర్లుగానే ఉద్యోగాలు లభించాయి. వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ కొలువుల్లో చేరారు. అయితే, సుమారు 3 నుంచి 9 ఏళ్ల తర్వాత తమకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని, అప్పట్లో అవగాహన లేక తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరామని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలుకారుణ్య నియామకం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 (సమానత్వ హక్కు)కు ఒక మినహాయింపు మాత్రమే. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబానికి తక్షణ భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇది ఒక హక్కు కాదు లేదా కెరీర్ అభివృద్ధి కోసం ఇచ్చే అవకాశం కాదు. అభ్యర్థికి ఉన్నత పదవికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నప్పటికీ ఖాళీలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తదుపరి నియామకం జరుగుతుంది. అర్హత ఉంది కదా అని ఉన్నత పదవిని డిమాండ్ చేసే హక్కు అభ్యర్థికి ఉండదు.ఉద్యోగంలో చేరిన చాలా ఏళ్ల తర్వాత (3-9 ఏళ్లు) కోర్టును ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘వేరే ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత పదవి ఇచ్చారు కాబట్టి, మాకూ ఇవ్వాలి’ అనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక అధికారి చేసిన తప్పును మరొకరికి వర్తింపజేయమని కోర్టులు ఆదేశించలేవని చెప్పింది. తప్పును పునరావృతం చేయలేమని స్పష్టం చేసింది.న్యాయ నిపుణుల విశ్లేషణఈ తీర్పుపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను కాపాడుతుందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు కేవలం మానవతా దృక్పథంతో చేసేవని, వీటిని సీనియారిటీ పెంచుకోవడానికి లేదా ఉన్నత పదవులు అనుభవించడానికి వాడుకోలేమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును కొట్టివేస్తూ, పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కారుణ్య నియామకం పొందిన వారు భవిష్యత్తులో ఉన్నత పదవుల కోసం ఇలాంటి క్లెయిమ్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.ఇదీ చదవండి: మీరు బిజినెస్‌లో కింగ్ అవ్వాలంటే.. -
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
న్యూఢిల్లీ: అరావళి పర్వత శ్రేణుల నిర్వచనాన్ని పరిమితం చేస్తూ, గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. సముద్ర మట్టం నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న భూభాగాలను మాత్రమే అరావళి పర్వతాలుగా పరిగణించాలంటూ, ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు కోర్టు మొగ్గు చూపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, కీలక నిర్ణయం తీసుకుంది.గత నవంబర్ 20న సుప్రీంకోర్టు.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం స్థానిక భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలనే అరావళి శ్రేణిగా గుర్తించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఎత్తును ప్రాతిపదికగా తీసుకుంటే, దాదాపు 90 శాతం అరావళి ప్రాంతం రక్షణ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతుందని వారు పేర్కొన్నారు.ఈ వివాదాస్పద నిర్వచనంపై పలు విమర్శలు వచ్చిన దరిమిలా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తిరిగి విచారించాలని నిర్ణయించింది. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అరావళి పర్వతాలు ఒక రక్షణ కవచం మాదిరిగా ఉపకరిస్తున్నాయని, దేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణులైన వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. కాగా గతంలో సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే తాజా స్టే ఆర్డర్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోనుంది. సోమవారం జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘ఆరావళి’పై విచారణ జరిపింది.ఇది కూడా చదవండి: Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం -
ఆ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు నిందితుడు కుల్దీప్కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లో బదులు ఇవ్వాలని సెంగార్‌ను అందులో కోర్టు ఆదేశించింది. ‘‘ఈ కేసులో జీవిత ఖైదు పడ్డ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు. ఓ కానిస్టేబుల్ పబ్లిక సర్వెంట్ అయినప్పుడు.. ఓ ఎమ్మెల్యే మాత్రం కాదా?.. ఈ కేసులో ఆ బెయిల్ ఇచ్చింది కూడా ఉత్తమ జడ్జీలే. మేం కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం కదా. ఇంతకీ ఎవరు పబ్లిక్ సర్వెంట్లు?’’ అంటూ సెంగార్ తరపు వాదించిన లాయర్లు సిద్ధార్థ దవే, హరిహరన్‌లను జస్టిస్ సూర్యకాంత ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి బీజేపీ నేత కుల్దీప్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తేలాడు. అయితే ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులను ఆశ్రయించినా.. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో బాధితురాలు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఈ కేసు.. హైప్రొఫైల్ కేసుగా గుర్తింపు దక్కించుకుంది. అయితే కేసు దర్యాప్తులో ఉండగానే.. బాధితురాలి తండ్రి సెంగార్ మనుషుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆపై ఆమె అనూహ్యంగా ప్రమాదానికి గురికాగా.. సురక్షితంగా బయటపడింది. అయితే ఆమె ఇద్దరి బంధువులు మాత్రం ప్రమాదంలో మరణించారు. ఈ యాక్సిడెంట్ కూడా సెంగార్ జరిపించాడనే అభియోగాలు నమోదు అయ్యాయి. 2018లో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. కేసు విచారణ యూపీ ట్రయల్ కోర్టు ఢిల్లీ కోర్టుకు మారింది. 2019 డిసెంబర్లో దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది కోర్టు. అయితే తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. సెంగార్‌కు పోక్సో చట్టం వర్తించదని చెబుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే.. కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను సస్పెండు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలాయి. బాధిత కుటుంబం దేశరాజధానిలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అదే సమయంలో.. యూపీ ఎన్నికల నేపథ్యంలో సెంగార్ కమ్యూనిటీ ఓట్ల కోసమే ఆయన్ని విడిపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విమర్శలు తలెత్తారు. ఈ పరిణామాల నడుమ.. సీబీఐతో పాటు బాధితురాలి తరఫు న్యాయవాదులు కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. -
ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు
బెంగళూరు: మద్యం ప్రియులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిసెంబర్ 31న (బుధవారం) ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒక గంట వరకు మద్యం విక్రయాలకు అవకాశం కల్పించారు. ఈ నిబంధన ఒక రోజు మాత్రమే అమలులో ఉంటుది. మిగతా రోజుల్లో గతంలో ఉన్న నిబంధనలే అమలులో ఉంటాయి. కొత్త సంవత్సర సంబరాల కోసం ఈ వెసులుబాటు కలి్పంచారు. అన్ని బార్లు, పబ్‌లు, వైన్‌షాప్‌లు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రైవేట్ పారీ్టలు, ప్రత్యేక కార్యక్రమాలు, తాత్కాలిక మద్యం పంపిణీకి వినియోగించే సీఎల్–5 లైసెన్స్ కలిగినవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుది. సాధారణంగా సీఎల్–5 లైసెన్స్ ఉంటే 24 గంటల వరకు మద్యం పార్టీ జరుపవచ్చనే అభిప్రాయముంది. అయితే కొత్త సంవత్సరం రోజున అవాంఛనీయ ఘటనలు జరిగేందుకు ఆస్కారం లేకుండా సమయ పరిమితి విధించారు. సీఎల్–5 లైసెన్స్ కలిగిన ప్రైవేట్ పారీ్టలు కూడా అర్ధరాత్రి 1 గంటలోగా కార్యకలాపాలు ముగించాలి. ఆ తర్వాత మద్యం విక్రయాలు జరిగితే లైసెన్స్ రద్దుతో పాటుగా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. -
ట్రాప్ చేసి సర్వం దోచుకున్న నయవంచకుడు
కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి సర్వం దోచుకుని మోసగిస్తున్న నయ వంచకుని ఉదంతమిది. చివరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో బెంగళూరు బాగలగుంట పోలీసులు గాలించి అరెస్టు చేశారు. హరియానాకు చెందిన శుభాంశు శుక్లా (27) ఆ కిలాడీ. ఇతడు గత నాలుగేళ్లుగా బెంగళూరులోని టీ దాసరహళ్లిలో నివసిస్తున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకుని ఫేస్బుక్, ఇన్‌స్టా తదితరాల ద్వారా నిందితుడు స్థానిక యువతులను ట్రాప్ చేయడం ప్రారంభించాడు. ముందు పరిచయం చేసుకుని, ఆపై తీయని మాటలతో ప్రేమ వల విసరడం, వారి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకోవడం, ఇతరత్ర మోసగించడం ఇతని నైజం. ఓ యువతితో ఇలాగే ప్రేమాయణం నడుపుతున్నాడు. ఆమె ద్వారా ఆమె మైనర్ చెల్లెలిని కూడా మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి రూ.34 లక్షలు వసూలు చేశాడు. ఇది తెలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అతని మోసాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. -
Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన బాధితులకు ప్రభుత్వం ఇంకా పరిహారం అందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా, తమ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నవంబర్ 10న జరిగిన ఈ పేలుడులో 15 మంది మరణించగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు.ఈ ఘటన జరిగిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ. ఐదు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ సాయం అందించడంతో తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, తాము అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. తమ కుటుంబానికి గల ఏకైక ఆధారం కోల్పోయామని, ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు రోదిస్తున్నారు. దీనిపై ‘ది హిందూ’ ఢిల్లీ ప్రభుత్వ వర్గాలను సంప్రదించగా, పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే అర్హులైన వారందరికీ పరిహారం చెల్లిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: ‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’ -
ఉన్నావ్ కేసు.. విచారణ వేళ ఉత్కంఠ
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరగనుంది. ఈ కేసులో దోషిగా తేలిన ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది.ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిని కాసేపట్లో కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో సెంగార్‌కు ఇటీవల బెయిల్ లభించటం సంచలనంగా మారింది. బెయిల్‌పై అతడు బయటకు రావటంతో.. బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు ఇంటివద్ద ఉన్న తన పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.‘సుప్రీంకోర్టులో న్యాయం దక్కుతుందన్న నమ్మకముంది. అతడికి బెయిల్ రాకుండా ఉండాల్సింది. నా తండ్రిని, కుటుంబాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా పిల్లల భద్రత కూడా ప్రమాదంలో పడింది’ అంటూ బాధితురాలు వాపోతున్నారు. బాధితురాలి భద్రత దృష్ట్యా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ విచారణలో సెంగార్ తరఫు వాదనలు ఎలా ఉండనున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది. -
‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో జరగబోయే పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అంశం కీలకంగా మారనుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీసీ) ఆయన బాబాయి శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ (ఎస్పీ )వర్గం పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) స్వయంగా ప్రకటించారు.‘రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’ఆదివారం పింప్రి-చించ్వాడ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అజిత్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు వర్గాల మధ్య ఐక్యతను ఆయన తెలియజేస్తూ.. ‘కుటుంబం (పరివార్) మళ్లీ ఒక్కటైంది’ అని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే సమయంలో, కలిసి పోటీ చేయాలని రెండు వర్గాలు నిర్ణయించుకున్నాయని అజిత్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.అభివృద్ధిని గుర్తుచేస్తూ..స్థానిక నేతలతో ఈ పొత్తు, సీట్ల పంపకాలపై చర్చలు జరిగాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అజిత్ పవార్ తెలిపారు. పింప్రి-చించ్వాడ్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, తాము తెచ్చిన అభివృద్ధిపై ఇక్కడి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా హింజేవాడిలో నిర్మించిన ఐటీ హబ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తు ఆయన చేశారు. 1992 నుండి 2017 మధ్యకాలంలో కార్పొరేషన్లో తన పదవీ కాలంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అజిత్ పవార్ పేర్కొన్నారు.‘వారు కలవడం కొత్తేమీ కాదు’పవార్ కుటుంబం తిరిగి ఏకమవడంపై పలువురు నేతలు స్పందించారు. వారిలో కొందరు శరద్ పవార్ (Shaead Pawar) త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అజిత్ పవార్.. శరద్ పవార్ ఆదేశాల మేరకే బీజేపీలో చేరారు. వారు తిరిగి కలవడం కొత్తేమీ కాదు. వారు ఏకం కావడం మాకు సంతోషంగా ఉంది. శరద్ పవార్ కూడా త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరతారని ఆశిస్తున్నాను’ అని బీజేపీ మహిళా నేత నవనీత్ రాణా అన్నారు. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత జీషన్ సిద్ధిఖీ కూడా ఈ కలయికను స్వాగతిస్తూ ‘రెండు కుటుంబాలు కలవడం మంచి విషయమే. దీనివల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుంది. మేము దీనిని స్వాగతిస్తున్నాం. ఇకపై రెండు పార్టీలు కలిసి పోరాడతాయి’ అని అన్నారు.‘ఇంటి పేరు ఇక్కడ పనిచేయదు’అయితే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం.. పవార్ల పొత్తును విమర్శిస్తూ.. ‘వారు కలిసిపోవచ్చు, కానీ ప్రజలు ఇంటి పేరును చూసి ఓట్లు వేయరు. మహారాష్ట్రలో ఇంటి పేరు రాజకీయాలు పనిచేయవు," అని పేర్కొంది. శివసేన మహిళా నేత షైనా ఎన్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఏ అన్నదమ్ములైనా కలిసిపోవచ్చు. ఇంటి పేరు రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. వారు అధికారం కోసమే కలిసి వస్తున్నారు. అయితే ప్రజలు కేవలం పనిని మాత్రమే చూస్తారు. పేరును కాదు. పవార్లు కలిసి వస్తున్నారని అంతా చర్చించుకోవచ్చు. దీనివల్ల వారికి ఓట్లు రావు. ప్రజలు పేరు ఆధారంగా ఓట్లు వేయరు’ అని ఆమె అన్నారు.29 మున్సిపల్ కార్పొరేషన్లకు..పింప్రి-చించ్వాడ్, పుణె సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మర్నాడు జనవరి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలుకు డిసెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. 2023లో ఎన్సీపీ చీలిక తర్వాత, అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం రాష్ట్ర స్థాయిలో బీజేపీ, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా చేరింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం తిరిగి ఇరు పార్టీలు జట్టు కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే! -
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం భయంకర వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోగా, మరోవైపు తీవ్రమైన చలి గాలులు నగరాన్ని తీవ్రంగా వణికిస్తున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటి ‘తీవ్రమైన’ శ్రేణికి చేరుకుంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీబీసీబీ) గణాంకాల ప్రకారం నేటి (సోమవారం) ఉదయం ఢిల్లీలో సగటు ఏక్యూఐ 404గా నమోదైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఆనంద్ విహార్, బవానా, జహంగీర్‌పురి తదితర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు 450 మార్కును దాటాయి. గాలి వేగం తగ్గడానికి తోడు తేమశాతం పెరగడం వల్ల వాహనాల ఉద్గారాలు, దుమ్ము కణాలు భూమికి సమీపంలోనే నిలిచిపోయి దట్టమైన పొగమంచులా ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వాయువ్య భారతం నుండి వీస్తున్న పొడి, చల్లని గాలుల కారణంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే అతి తక్కువగా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్న 48 గంటల పాటు శీతల గాలుల (Cold Wave) ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కాగా దృశ్యమానత (Visibility) 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో రోడ్డు, రైలు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. విమానాల రాకపోకల్లో కూడా జాప్యం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్)నాలుగో దశ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.‘గ్రాప్-4’లో భాగంగా నగరంలోకి అనవసరమైన ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది ఇంటి నుండే పని (Work from Home) చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు.. వాయు కాలుష్యం, చలి తీవ్రత దృష్ట్యా వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వారు బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా ఎన్-95 మాస్కులు ధరించాలని సూచించారు.ఇది కూడా చదవండి: హడలెత్తిస్తున్న రైలు ప్రమాదాలు.. గత 10 ఏళ్లలో.. -
హడలెత్తిస్తున్న రైలు ప్రమాదాలు.. గత 10 ఏళ్లలో..
మరో రెండు రోజుల్లో 2025 ముగియబోతోంది. ఇంతలోనే దేశంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి, ఒకరు మృతి చెందారు. రైల్వేకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో రైల్వే ప్రయాణాల్లో భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడచిన 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయి? ఎందరు మృతి చెందారు? తదితర గణాంకాలను ఇటీవలే రైల్వే బోర్డు విడుదల చేసింది.మృతులు వందల్లో, క్షతగాత్రులు వేలల్లో..సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)కింద దాఖలైన ప్రశ్నకు సమాధానంగా రైల్వే బోర్డు గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రైలు ప్రమాదాల వివరాలను అందించింది. ఈ గణాంకాలు రైల్వే ప్రయాణమంటేనే దడ పుట్టించేలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రయాణికులు గాయాల పాలయ్యారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 వరకు జరిగిన ప్రమాదాల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 766 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సుమారు 2,126 మంది ప్రయాణికులు తీవ్రంగా లేదా స్వల్పంగా గాయపడ్డారని వెల్లడయ్యింది.రైల్వే వ్యవస్థలో భద్రతా లోపాలురైల్వే బోర్డు అధికారికంగా వెల్లడించిన ఈ గణాంకాలు రైల్వే వ్యవస్థలో భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి. గడచిన పదేళ్లలో రైలు ప్రమాదాల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనైంది. 2014-15లో అత్యధికంగా 135 ప్రమాదాలు నమోదు కాగా, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ, కొన్ని భారీ ప్రమాదాలు చోటుచేసుకుని, ప్రాణనష్టం మాత్రం భారీగానే సంభవించింది. మరణాల పరంగా చూస్తే 2016-17 సంవత్సరం అత్యంత విషాదకరంగా నిలిచింది. ఆ ఒక్క ఏడాదిలోనే 193 మంది రైలు ప్రమాదాల్లో మరణించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా మరణాల సంఖ్య 296కు చేరుకుంది. ఇది దశాబ్ద కాలంలో.. ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక మరణాల సంఖ్యగా రికార్డులకు ఎక్కింది.ఒడిశా ఘోర ప్రమాదంలో అత్యధిక మృతులు2023-24లో రైలు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం. 2023, జూన్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొనడంతో సుమారు 290 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థపై చర్చకు దారితీసింది. రైల్వే బోర్డు నివేదిక ప్రకారం.. అత్యధిక శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం (Derailments) కారణంగానే చోటుచేసుకున్నాయి. గత పదేళ్లలో 438 సార్లు రైళ్లు పట్టాలు తప్పినట్లు గుర్తించారు. వీటితో పాటు లెవల్ క్రాసింగ్‌ల వద్ద అజాగ్రత్త, రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడం (Collisions), కోచ్‌లలో అగ్నిప్రమాదాలు ఇతర ప్రధాన కారణాలుగా ఉన్నాయి.ప్రమాదాల నివారణకు..రైళ్లలో ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే ‘కవచ్’ (Kavach) అనే స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఒకే పట్టాలపై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసి, ప్రమాదాన్ని నివారిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వ్యవస్థ కేవలం కొన్ని కిలోమీటర్ల మేరకే అందుబాటులో ఉంది, దీనిని దేశవ్యాప్తం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా రైల్వేవిభాగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయి. పాతబడిన పట్టాల మార్పిడి, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థల ఏర్పాటు, సిబ్బందికి సరైన శిక్షణ అందించడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించగలమని నిపుణులు సూచిస్తున్నారని ‘అవుట్ లుక్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.ఇది కూడా చదవండి: 2026కు 26 ట్రెండ్స్.. ఏఐ నుంచి జీరో వేస్ట్ వరకూ.. -
ప్రజలు కోరింది ఇవ్వకుంటే ఓట్లెలా వేస్తారు?
అహ్మదాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు ఓట్లెలా వేస్తారని రాహుల్‌ను ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ను రాహుల్‌కు అర్థమయ్యేలా చెప్పడం తనవల్ల కానిపని అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలే ఆయనకు ఈ విషయం చెప్పలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. మంత్రి అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్ నగర సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓ విషయం నన్నడిగారు..ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెసే ఎందుకు ఓటమిపాలవు తోంది అని. ప్రజలను అడగటానికి బదులుగా రాహుల్ ఈ ప్రశ్న నన్నడిగారు. రాహుల్ బాబా..! నేను ఇక్కడ ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాలను అర్థం చేసుకుంటే, నీకు సమాధానం దొరుకుతుంది’అని అమిత్ షా అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలోనే కాదు, 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిపాలవుతుంది. మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధిస్తుందని రాహుల్ తెలుసుకుంటారని ఆయన అన్నారు. ‘మా సిద్ధాంతాలతో ప్రజలు మమేకమ య్యారు. ‘అయోధ్యలో ఆలయాన్ని, ఉగ్రవాదు లపై సర్జికల్ స్ట్రయిక్స్‌ను, ఆర్టికల్ 370 రద్దును, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని, బంగ్లాదేశీ అక్రమ వలసదారులను వెళ్లగొట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇలా ప్రజలు కోరుకునే వాటిని వ్యతిరేకిస్తూ పోతే ఆ పార్టీకి ప్రజలు ఓట్లెలా వేస్తారు’అని అమిత్ షా పేర్కొన్నారు. -
వినియోగదారులకు ‘హెల్ప్‌లైన్’ భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువు కొని మోసపోయామనో, నాణ్యమైన సేవలు అందలేదనో వినియోగదారులు ఇకపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్’ (ఎన్సీహెచ్) వినియోగదారుల పక్షాన నిలుస్తూ మంచి ఫలితాలను సాధిస్తోంది. గత ఎనిమిది నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా బాధితులకు ఏకంగా రూ.45 కోట్ల రీఫండ్‌ను ఇప్పించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్ 25– డిసెంబర్ 26 మధ్య కాలంలో 31 వేర్వేరు రంగాలకు సంబంధించి వచ్చిన 67,265 ఫిర్యాదులను ఎన్సీహెచ్ పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఖర్చు లేకుండా ’ప్రీ–లిటిగేషన్’ (కేసు వేయక ముందే) దశలోనే సమస్యలను పరిష్కరిస్తుండటం వల్ల వినియోగదారుల కమిషన్లపై భారం తగ్గడంతో పాటు సామాన్యులకు త్వరితగతిన న్యాయం జరుగుతోంది. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ మోసాలే దేశంలో అధికంగా నమోదవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం రీఫండ్స్లో సింహభాగం ఈ–కామర్స్ రంగానిదే కావడం గమనార్హం. ఈ 8 నెలల్లో ఈ–కామర్స్ రంగానికి సంబంధించి 39,965 ఫిర్యాదులు పరిష్కారం కాగా, బాధితులకు రూ.32 కోట్లు తిరిగి వెనక్కి వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో ట్రావెల్ అండ్ టూరిజం రంగం ఉంది. ఈ రంగంలో 4,050 ఫిర్యాదులకు గాను రూ.3.5 కోట్లు రీఫండ్ అయ్యాయి. మొత్తం రీఫండ్స్లో 85 శాతానికి పైగా వాటా ఈ–కామర్స్, ట్రావెల్, ఏజెన్సీ సర్వీసులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఎయిర్‌లైన్స్ రంగాల నుంచే ఉండటం గమనార్హం. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు బాధితులు ఈ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయిస్తూ తమ సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. హెల్ప్‌లైన్ కోసం 1915 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు, వాట్సాప్ (8800001915), ఎన్సీహెచ్ యాప్, ఉమంగ్ యాప్, వెబ్సైట్ ద్వారా 17 భాషల్లో ఫిర్యాదు చేసే సౌకర్యం ఉంది. -
భారతీయ వారసత్వ విశ్వరూపం
ప్రయాగరాజ్ మహాకుంభం నుండి పారిస్ వేదికపై మరాఠా పరాక్రమం వరకు.. మట్టి ప్రమిదల వెలుగు నుండి వందేమాతరం శంఖారావం వరకు.. 2025 సంవత్సరం భారతీయ సంస్కృతికి స్వర్ణయుగంగా నిలిచింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురాతన సంప్రదాయాలను, ఆధునిక డిజిటల్ యుగంతో మేళవిస్తూ సాగిన ఈ ఏడాది ప్రయాణం.. ‘వికసిత్ భారత్’దిశగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం కాలాన్ని లెక్కించడం కాదు, ప్రపంచ యవనికపై భారత్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత ఘట్టం. మహా కుంభమేళా, ‘కళాగ్రామ్’ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాతి్మక కలయికగా భావించే కుంభమేళాను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద నిర్వహించారు. మహా కుంభమేళా జనవరి 13, 2025న ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన ఘట్టంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని టెంట్ సిటీలో 10.24 ఎకరాల్లో ’కళా గ్రామం’ ఏర్పాటు చేశారు. ఇది భారతీయ హస్తకళలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కుంభమేళా చిహ్నాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత కట్టడాలపై ప్రదర్శించి, దీనిని ఒక జాతీయ పండుగలా జరిపారు. వందేమాతరం @ 150 1875–76 ప్రాంతంలో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ’వందేమాతరం’ నినాదం పోషించిన వీరోచిత పాత్రను స్మరించుకుంటూ ఏడాది పొడవునా సాగే ఉత్సవాలకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నవంబర్ 2025లో శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద వందేమాతరం గీతంతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. బుద్ధుడి వారసత్వం – దౌత్య నీతి పైప్రావా (కపిలవస్తు) వద్ద లభించిన బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను థాయ్‌లాండ్, భూటాన్ దేశాల్లో ప్రదర్శించడం ద్వారా భారత్ తన ‘సాంస్కృతిక దౌత్యం’చాటింది. 1898లో కనుగొన్న అత్యంత విలువైన పిప్రావా పవిత్ర అవశేషాల వేలాన్ని హాంగ్‌కాంగ్‌లో భారత్ విజయవంతంగా అడ్డుకుంది. ఒక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థ, ప్రభుత్వ దౌత్య సహకారంతో అమూల్యమైన బంగారు, స్ఫటిక ఆభరణాల నిధిని తిరిగి స్వదేశానికి రప్పించింది. గుజరాత్ (దేవ్నిమోరి) నుండి లభించిన అవశేషాలను శ్రీలంకలోని కొలంబోకు 2026 ఫిబ్రవరిలో తీసుకెళ్లనున్నారు. జ్ఞాన భారతం – డిజిటల్ విప్లవం సెపె్టంబర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘జ్ఞాన భారతం’పోర్టల్ ద్వారా దేశంలోని అరుదైన రాత ప్రతులను భద్రపరిచి, డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యంలో భాగంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’తో ముగిసింది. దీపావళికి విశ్వ కిరీటం భారతీయుల ఆరాధ్య పండుగ ’దీపావళి’కి యునెస్కో తన ప్రతిష్టాత్మకమైన ’మానవత్వపు అమూల్య సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చోటు కల్పించింది. డిసెంబర్ 10న లభించిన ఈ గుర్తింపుతో భారత్ నుండి ఈ జాబితాలో చేరిన అంశాల సంఖ్య 16కు చేరింది.మరాఠా కోటల ప్రపంచ రికార్డు జూలైలో పారిస్‌లో జరిగిన సమావేశంలో శివనేరి, రాయ్‌గఢ్ సహా 12 మరాఠా సైనిక కోటలకు ‘ప్రపంచ వారసత్వ హోదా’లభించింది. శత్రు దుర్భేద్యమైన భారతీయ యుద్ధ తంత్రానికి ఇది దక్కిన అంతర్జాతీయ గౌరవం. మహనీయుల స్మరణఅహిల్యాబాయి హోల్కర్ 300 వ జయంతి, సర్దార్ పటేల్ 150వ జయంతి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (125 ఏళ్లు), గాడియా మిషన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద 150వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించి, భారతీయ మూలాలను స్మరించుకున్నారు. ఎర్రకోట వేదికగా ప్రపంచ సదస్సుయునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశాన్ని తొలిసారిగా భారత్ నిర్వహించింది. వారసత్వ సంపద రక్షణపై ‘ఢిల్లీ డిక్లరేషన్’ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని వేడుకగా జరుపుకోవడం, భవిష్యత్తు కోసం వారసత్వాన్ని భద్రపరచడం.. ఈ మూడింటి కలయికే 2025 భారత సాంస్కృతిక గమనం. భారతావనికి ఒక ‘సాంస్కృతిక వసంతం’! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడాన్ని బాధితురాలు వ్యతిరేకించారు. కోర్టు తీర్పును నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని, పటిష్ట భద్రత కలి్పంచాలని బాధితురాలు ప్రభుత్వాన్ని కోరారు. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగించారని, ఇప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆదుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి విన్నవించారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష తగ్గించడం ఏమిటని నిరసనకారులు ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని అన్నారు. సుప్రీంకోర్టుపై తమకు విశ్వాసం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తమ బంధువులపై దాడి చేశారని, తప్పుడు కేసులు పెట్టారని, జైలుపాలు చేశారని తెలిపారు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, బాధితురాలి ధర్నాకు అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించాయి. -
హదీ హంతకులు భారత్‌లోకి రాలేదు
షిల్లాంగ్: ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హదీ హంతకులు భారత్‌లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ చేస్తున్నవి నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రకటనలని మేఘాలయలో బీఎస్ఎఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓపీ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. హదీ హత్య కేసులో ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్ అనే కీలక అనుమానితులిద్దరు హలువాఘాట్ బోర్డర్ పాయింట్ మీదుగా స్థానికుల సాయంతో భారత్‌లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్‌లోని ఢాకా మెట్రోపాలిటన్ అదనపు పోలీస్ కమిషనర్ ఇస్లాం ఆదివారం ఆరోపించారు. ‘భారత్‌లోకి పారిపోయాక ఒకరు వీళ్లను మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు’అని ఇస్లాం చెప్పారు. ‘అనంతరం వీళ్లను భారత అధికారులు నిర్బంధించారు. ఈ విషయమై అనధికారిక వర్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిందితులను వెనక్కి తీసుకొస్తాం’ అని అన్నారు. ఆ ఇద్దరు నిందితులు భారత్‌లోకి ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఆయన వెల్లడించలేదు. బంగ్లా పోలీస్ అధికారి ప్రకటనపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘హలువాఘాట్ సెక్టార్ మీదుగా ఎవరూ మేఘాలయలోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అసత్యాలని తెలిపారు. గారో హిల్స్ ప్రాంతంలోని హలువాఘాట్ ద్వారా కొందరు వ్యక్తులు మన భూభాగంలోకి ప్రవేశించినట్లు తమకు ఎటువంటి నిఘా సమాచారం అందలేదని మేఘాయ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వివిధ నిఘా, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మోహరించిన జవాన్లు అత్యంత అప్రమత్తతతో ఉన్నారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దొంగచాటుగా ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారిని గుర్తించి, పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. -
ఆ ఓటర్లను విచారణకు పిలవొద్దు
కోల్‌కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సందర్భంగా ‘అన్ మ్యాప్డ్’గా పేర్కొన్న ఓటర్లను ప్రస్తుతానికి విచారణకు పిలవొద్దని జిల్లా స్థాయి ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. విచారణకు రావాలంటూ వారికి అందినవన్నీ ఆటో జనరేటెడ్ నోటీసులని స్పష్టంచేసింది. 2002 నాటి ఎలక్టోరల్ రోల్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఈ గందరగోళానికి దారితీసినట్టు బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ‘‘వాటి పీడీఎఫ్ వెర్షన్‌ను సీఎస్వీ ఫార్మాట్‌కు మార్చే క్రమంలో బూత్ అధికారుల యాప్‌లో లింకేజీ వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. నిజానికి అన్మ్యాప్డ్గా పేర్కొన్న ఓటర్లలో చాలామంది నిజమైన ఓటర్లే. ఈ కేసులను జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలించాలి. నిజంగా అవసరమని భావించిన కేసుల్లో మాత్రమే ఓటర్లకు నోటీసులిచ్చి విచారణకు పిలవాలి’’ అని పేర్కొన్నారు. -
మా విమానాలు కొంటే భారత్‌లో తయారీ
మారియెటా (యూఎస్): సైనిక రవాణా అవసరాల నిమిత్తం 80 భారీ విమానాల కొనుగోలుకు మోదీ సర్కార్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వందల కోట్ల డాలర్ల విలువైన ఆ కాంట్రాక్టు కోసం అతి పెద్ద రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్‌హీడ్ మార్టీన్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో కలిసి బిడ్ వేయడం విశేషం. తమ సీ–130జే సూపర్ హెర్క్యులెస్ భారీ విమానాలు భారత అవసరాలకు సరిగ్గా సరిపోతాయని ఈ అమెరికా దిగ్గజం తాజాగా పేర్కొంది. ఈ భారీ కాంట్రాక్టు లభిస్తే విమానాల తయారీకి భారత్‌లోనే మెగా హబ్ ఏర్పాటు చేస్తామని భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికా బయట తాము ఇలాంటి ప్లాంటు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అవుతుందని గుర్తుచేసింది. సీ–130జే సిరీస్‌లో లాక్‌హీడ్ ఇప్పటిదాకా 560కి పైగా విమానాలను సరఫరా చేసింది. అవి 23 దేశాల్లో సేవలందిస్తున్నాయి. మన వాయుసేవ వద్ద ప్రస్తుతం ఈ శ్రేణికి చెందిన 12 విమానాలున్నాయి. రవాణా అవసరాలతో పాటు నిఘా, ఎల్రక్టానిక్ వార్ఫేర్, గాలింపు, రెస్క్యూ మిషన్ల వంటి అవసరాల నిమిత్తం సీ–130జే శ్రేణిలో ప్రత్యేక కని్ఫగరేషన్లను సంస్థ అమరుస్తుంటుంది. ప్రస్తుతం డి్రస్టిబ్యూటెడ్ అపర్చర్ సిస్టమ్ తదితరాలతో వాటిని మరింత ఆధునీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఆ్రస్టేలియాతో పాటు జపాన్ కూడా సీ–130జే రవాణా విమానాల కొనుగోలు యోచనలో ఉన్నాయి. భారత వాయుసేన ప్రస్తుతం రవాణా అవసరాలకు సోవియెట్ కాలం నాటి ఏఎన్–32, ఐఎల్–76 రకం విమానాలపై ఆధారపడుతోంది. -
మెరుపులు.. కొన్ని మరకలు.. ఇంకొన్ని వివాదాలు
త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న 2025 సుప్రీంకోర్టు చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే ఏడాదిగా నిలవనుంది. పలు సంచలనాత్మక కేసులు, వక్ఫ్ చట్టం వంటి వివాదాస్పద అంశాలు, రాజ్యంగపరంగా కీలకమైన సందేహాలు లేవనెత్తిన రాష్ట్రపతి రిఫరెన్సు వంటివి సంవత్సరం పొడవునా అత్యున్నత న్యాయస్థానానికి ఊపిరి సలపనివ్వలేదు. ఆ కేసులను పరిష్కరించే క్రమంలో సుప్రీం పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించింది. ప్రజాప్రయోజనాలు, రాజకీయాలు, పర్యావరణం, నేర సంబంధిత కేసులతో పాటు పలు సంక్లిష్టమైన పౌరసంబంధ తగాదాలను సైతం సమర్థంగా పరిష్కరించింది. కీలకమైన కేసుల్లో రాష్ట్రపతి, గవర్నర్లకు డెడ్‌లైన్ వంటి తీర్పుల విషయంలో కాస్త చూసీచూడనట్టు పోయిందన్న అభిప్రాయాలకు కూడా తావిచ్చింది. ఈ ఏడాది అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన పలు కీలక కేసులను ఓసారి చూస్తే... వ్యవస్థల నడుమ... టగ్ ఆఫ్ వార్!గవర్నర్లు, విపక్ష పాలిత రాష్ట్రాల మధ్య చిరకాలంగా పెను వివాదంగా మారిన బిల్లుల ఆమోదం అంశం ఈ ఏడాది సుప్రీంకోర్టుకు అగ్నిపరీక్షే పెట్టింది. బిల్లులను తమిళనాడు గవర్నర్ రవి తొక్కిపట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో న్యాయవ్యవస్థకే సుదీర్ఘ, సంక్లిష్ట సవాలుకు తెరలేచింది. గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోపు బిల్లులకు ఆమోదం తెలపడం, వాటిని తిప్పి పంపడమో చేయని పక్షంలో అవి ఆమోదం పొందినట్టే భావించాలంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను సంచలనమే సృష్టించింది. అధికార బీజేపీకి ఖేదం, విపక్షాలకు మోదం కలిగించింది. దాంతో, ఇలా గడువు విధించడం సబబేనా అంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ, ఈ అంశంపై కోర్టుకు 14 ప్రశ్నాస్త్రాలు సంధించి వాటికి బదులు కోరారు. దాంతో సమస్య కీలక మలుపు తిరిగింది. ఒక దశలో అతి కీలకమైన న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అమీతుమీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు అలా గడువు విధించలేవంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించడం ద్వారా ఈ వివాదానికి సామరస్యపూర్వకంగా తెర దించింది. అయితే ఆ క్రమంలో న్యాయవ్యవస్థ ఒక మెట్టు దిగిందన్న అభిప్రాయాలు విపక్షాలతో పాటు న్యాయ నిపుణుల నుంచి కూడా విన్పించాయి. కాకపోతే గవర్నర్లు బిల్లులపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా సుదీర్ఘకాలం సాగదీస్తే ఊరుకునేది లేదని, అలాంటప్పుడు న్యాయసమీక్ష సబబేనని ధర్మాసనం పేర్కొనడం ప్రజాస్వామ్యవాదులకు కాస్త ఊరటనిచ్చింది. ‘వక్ఫ్’పై మధ్యేమార్గంవక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో మోదీ సర్కారు తీసుకొచ్చిన అత్యంత వివాదాస్పద కొత్త వక్ఫ్ (సవరణ) చట్టం–2025 కేసు విషయంలో సుప్రీంకోర్టు వీలైనంత సమతుల్యత పాటించే ప్రయత్నం చేసింది. వక్ఫ్ బై యూజర్ ప్రయోజనాన్ని తొలగింపు సక్రమమేనని, ఈ నిర్ణయం ద్వారా వక్ఫ్ భూములను కేంద్రం లాక్కుంటుందన్న వాదనలో పస లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వాళ్లు మాత్రమే వక్ఫ్ కింద దానాలు ఇవ్వొచ్చన్న నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. సోషల్ న్యూసెన్స్‌కు ముకుతాడుభావ ప్రకటన స్వేచ్ఛ పేరిట హద్దు మీరుతున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూ యన్సర్లకు సుప్రీంకోర్టు ముకుతాడు వేసింది. తల్లిదండ్రులు–పిల్లలపై అసహ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు చేసిన రణ్వీర్ అలహాబాదియా, దివ్యాంగులను కించపరిచిన సమయ్ రైనా వంటి పలువు రు ఇన్ఫ్లూయన్సర్లను కోర్టు గట్టిగా నలుగు పెట్టి వదిలింది. మున్ముందు ఇలాంటి ఉదంతాల్లో కఠిన శిక్షలు విధించేలా ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో గట్టి చట్టం తేవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆన్లైన్ కంటెంట్‌ను క్రమబద్ధీకరించేలా గైడ్‌లైన్స్ విడుదల రూపొందించాలని పేర్కొంది. గ్రామ సింహాల గోలఏ వీధికి వెళ్లినా సర్వసాధారణంగా కన్పించే వీధి కుక్కల బెడద సుప్రీం దృష్టికీ వెళ్లింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించడమే గాక వీధి కుక్కలను శాశ్వతంగా తరలించే దిశగా కేంద్ర, రాష్ట్రాలకు పలు నిర్దేశాలు జారీ చేసింది. దీనిపై జంతు ప్రేమికుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం లోతైన విచారణ జరిపింది. కుటుంబనియంత్రణ ఆపరేష్ల అనంతరం కుక్కల్ని తిరిగి వీధుల్లోకి వదలవచ్చంటూ తీర్పును కాస్త సవరించింది. సీజేపైకి బూటుఅక్టోబర్ 6వ తేదీ. సుప్రీంకోర్టులో అత్యంత అరుదైన, అవాంఛనీయమైన ఉదంతం జరిగిన రోజు. రాకేశ్ కిషోర్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా నాటి సీజేఐ జస్టిస్ గవాయ్‌పైకి బూటు విసిరి కలకలం రేపాడు. అంతకుముందు విచారణ సందర్భంగా హిందూ దేవీ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ మతిలేని చర్యకు పూనుకున్నాడు.న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడిన్యాయవ్యవస్థలో మరింత పారదర్శకత, విశ్వసనీయత దిశగా న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను బయట పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంది. అలాగే న్యాయ సిబ్బంది తదితర నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రజలకు రిజర్వేషన్ల కల్పన కూడా వినూత్నమే.జడ్జి ఇంట్లో నోట్ల కట్టలుదేశ రాజధానిలో హైకోర్టు న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు సగం కాలిపోయిన స్థితిలో బయటపడ్డ ఉదంతం దేశమంతటా పెను ప్రకంపనలు సృష్టించడమే గాక న్యాయవ్యవస్థ ప్రతిష్టకే మచ్చగా నిలిచింది. మార్చి 14వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో చెలరేగిన మంటలను ఆపేందుకు వెళ్లిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది స్టోర్ రూములో నేలపై పరిచిన భారీస్థాయిలో నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. ఇతర పౌరుల్లాగే ఆయన్ను కూడా చట్టప్రకారం కఠినంగా శిక్షించి న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సామాన్యులంతా ఆశించారు. సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత న్యాయ మూ ర్తుల కమిటీ సైతం ఆయన్ను దోషిగా తేల్చి చర్యలకు సిఫార్సు చేసింది. రాజీ నామా చేయాల్సిందిగా నాటి సీజేఐ జస్టిస్ ఖన్నా సూచించినా జస్టిస్ వర్మ ససేమిరా అన్నారు. దాంతో ఆయన్ను అభి శంసించాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానులకు సీజే లేఖ రాయాల్సి వచ్చింది. జస్టిస్ వర్మను తొలగించాలని పలువురు ఎంపీలు కూడా పార్లమెంటుకు లేఖ రాశారు. అభిశంసన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఆయనపై పార్లమెంటరీ ప్యానల్ విచారణ కొన సాగుతోంది. దాన్ని కూడా సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీం మెట్లెక్కడం అందరినీ నిర్ఘాంతపరిచింది.ముగ్గురు సీజేలుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ముగ్గురు అత్యంత సీనియర్ జడ్జీలు కొలువుతీరడం ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పొచ్చు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయ్ ఈ ఏడాదే రిటైరవగా జస్టిస్ సూర్యకాంత్ సీజేగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని నిలబెట్టే క్రమంలో రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి ప్రభుత్వ పదవులూ స్వీకరించబోమని జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్ స్పష్టం చేయడం మరో విశేషం.మరిన్ని కీలక తీర్పులు...→ పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలపైనా సుప్రీంకోర్టు ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను, ముఖ్యంగా వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బు కొల్లగొడుతున్న ఆన్లైన్ మోసగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిందిగా సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకోసం దేశవ్యాప్త విచారణ జరపాలని సూచించింది.→ బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే రాజకీయ రంగు పులుముకుని సుప్రీంకోర్టుకు చేరింది.→ పశ్చిమబెంగాల్లో దశాబ్దం క్రితం నియమి తులైన ఏకంగా 25,753 మంది ప్రభుత్వ టీచర్లు, సిబ్బంది నియామ కాన్ని సుప్రీం ఒక్క కలం పోటుతో రద్దు చేయడం మమత సర్కారుకు తీరని షాకిచ్చింది.→ లాయర్లు, కక్షిదారులను దర్యాప్తు సంస్థలు తమ ఇష్టమొచ్చిన రీతిలో విచారించేందుకు వీల్లేదంటూ, వారి ప్రత్యేక హక్కుల పరిరక్షణకు పలు చర్యలు ప్రకటించిన సుప్రీం తీర్పు కూడా చరిత్రాత్మకమైనదే.→ నోయిడాలో 2006లో 8 మంది పేద చిన్నారుల అస్థిపంజరాలు ఓ కాలువలో బయటపడ్డ ఉదంతంలో ప్రధాన నిందితుడు సురేంద్ర కోలీని నిరపరాధిగా సుప్రీం తేల్చడం విస్మయం కలిగించింది.→ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు లాయర్లకు కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరని, న్యాయాధికారులు బార్ కోటా కింద పదోన్నతి పరీక్షలు రాయొచ్చంటూ ఇచ్చిన తీర్పులు చర్చనీయంగా మారాయి.→ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి ఉదంతంపై తాము సూచించినట్టుగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలకు దిగడమూ సంచలనమే సృష్టించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విందుల హోరు.. యాంటాసిడ్స్ జోరు!
ఆరోగ్య సమస్య తలెత్తగానే ఆసుపత్రికో, మందుల షాపుకో పరుగు తీస్తుంటారు చాలా మంది. కోవిడ్–19 మహమ్మారి నేర్పిన పాఠాలతో జనంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సమస్య రాక ముందే భారతీయులు ముందస్తు నివారణకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే నచ్చిన వంటకాలను ఆరగించడంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. అందుకే కాబోలు శని, ఆదివారం వచ్చిందంటే చాలు యాంటాసిడ్స్ కోసం కస్టమర్లు పరుగులు తీస్తున్నారు.హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ ఫార్మ్ఈజీ తన వేదిక ద్వారా ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల అమ్మకాలు, రోగ నిర్ధారణ పరీక్షల బుకింగ్స్‌ను విశ్లేíÙంచి హెల్త్ రిపోర్ట్–2025 రూపొందించింది. విటమిన్స్, సప్లిమెంట్స్ కొనుగోళ్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్య సమస్యల పరిష్కారానికి చికిత్సలు.. కాలానుగుణంగా లేదా సంక్షోభం తలెత్తినప్పుడే కాకుండా ప్రణాళికాబద్ధంగా, ఏడాది పొడవునా అలవాట్లుగా ఉద్భవిస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ మెట్రోలకే పరిమితం కాలేదని.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వ్యాపించిందని వివరించింది. పోషకాహార లోపాలకు చెక్.. మొదటిసారిగా విటమిన్స్, సప్లిమెంట్స్ అత్యధిక ఆర్డర్లు నమోదైన కేటగిరీగా మారాయని నివేదిక తెలిపింది. పోషకాహార లోపాలకు చెక్ పెట్టడంలో భాగంగా మల్టీ విటమిన్స్‌కు కస్టమర్లు జై కొట్టారు. విటమిన్–బి సప్లిమెంట్లు టాప్‌లో నిలిచాయి. ఏడాదిలో వీటి విక్రయాలు 33% పెరిగాయి. కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్–డి తరువాతి స్థానాల్లో నిలిచాయి. పోషకాహార లోపాలు, ఎముకలు, కీళ్ల ఆరోగ్యం గురించి జనంలో అవగాహన పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ముందస్తుగా తెలుసుకోవడానికి.. రోగ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా అత్యధికులు విటమిన్–డి పరీక్షలు చేయించుకున్నారు. థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకునే టెస్టులు, రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే హెచ్‌బీఏ1సీ పరీక్షలు టాప్–3లో నిలిచాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయిస్తున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని వివరంగా చూపే కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ), కొవ్వు స్థాయిని తెలిపే లిపిడ్ ప్రొఫైల్స్ టెస్టులు క్రమంగా సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగమయ్యాయి. ఎప్పుడేం కొంటున్నారంటే..⇒ ఉదయం 6–9 మధ్య: విటమిన్స్, కాల్షియం, దీర్ఘకాలిక రోగాలకు మందులు. ⇒ రాత్రి 10 నుంచి ఉదయం 4 వరకు: రక్తపోటు, హృదయ సంబంధ ఔషధాలు, విటమిన్–సి, కాల్షియం సప్లిమెంట్స్. ⇒ వారాంతాల్లో: యాంటాసిడ్స్, స్కిన్ కేర్, సన్ కేర్, ఎనర్జీ డ్రింక్స్, ఓవర్ ద కౌంటర్‌కు మారిన కొత్త మందులు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మొక్కలతో తయారైన ఉత్పత్తులు, గ్లూకోజ్, బీపీని చెక్ చేసే డిజిటల్ మెషీన్స్.⇒ ఆదివారాల్లో: నచ్చిన వంటకాలతో ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేసే రోజు. బంధువులు, స్నేహితులు తోడైతే ఇక విందు భోజనమే. అందుకే కాబోలు యాంటాసిడ్స్ కొనుగోళ్లు 14–18% పెరిగాయి. కాలాన్నిబట్టి కొనుగోళ్లు.. వర్షాకాలం: జ్వరం సంబంధ టెస్టులు, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఫంగల్ క్రీమ్స్, దోమల నివారణ ఉత్పత్తులు. శీతాకాలం: జలుబు, దగ్గు మందులు, విటమిన్–సి, మాయిశ్చరైజర్స్. వేసవి: సన్‌్రస్కీన్స్, ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్.నివేదిక హైలైట్స్.. ⇒ 2025లో ఫార్మ్ఈజీ అమ్మకాల్లో 71% సోమ–శుక్రవారం మధ్య నమోదయ్యాయి. ⇒ కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబైలో మాస్క్‌లు, నెబ్యులైజర్స్, ఇన్హేలర్స్, ఆక్సిమీటర్స్ కొనుగోళ్లు ఎక్కువ. ⇒ ప్రతి రెండో కుటుంబం సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా జీర్ణ సంబంధ ఉత్పత్తిని కొనుగోలు చేసింది. ⇒ మధుమేహ (జీఎల్పీ–1) మందులు వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. ప్రతి నెల సేల్స్ 12% దూసుకెళ్తున్నాయి. ⇒ డయాబెటిస్ ఔషధాలు కొంటున్నవారిలో సగం మంది 25–45 ఏళ్ల మధ్య వయసు్కలు.నగరాల వారీగా ఇలా.. హైదరాబాద్: యాంటాసిడ్స్, ప్రోబయోటిక్స్ కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉండటంతో గట్–హెల్త్ హబ్‌గా ఉద్భవించింది. కడుపులో అధికంగా ఉండే ఆమ్లాన్ని తటస్థీకరించి గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలిగించే ఔషధాలే యాంటాసిడ్స్. ముంబై: మల్టీ విటమిన్స్, సప్లిమెంట్స్, ప్రివెంటివ్ కేర్‌లో ముందుంది. కాల్షియం, ప్రోటీన్ పౌడర్స్, ఫిట్నెస్ సప్లిమెంట్స్, ఒత్తిడిని కట్టడి చేసే ఆరోగ్య ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఉంది.ఢిల్లీ: కస్టమర్లు జీర్ణ వ్యవస్థ సంరక్షణ (గట్ కేర్), లైంగిక ఆరోగ్య ఉత్పత్తులను అధికంగా కొన్నారు. దగ్గు, జలుబు, అలెర్జీ మందుల అమ్మకాలూ ఎక్కువే.బెంగళూరు: రోగ నిర్ధారణకు పెద్దపీట వేశారు. గట్, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చారు. సాధారణ సప్లిమెంట్లను అధికంగా స్వీకరించారు.కోల్‌కతా: డైజెస్టివ్ ఎంజైమ్స్, ఎలక్ట్రోలైట్స్‌ను విపరీతంగా వాడారు. ఫిట్నెస్, ప్రోటీన్–వినియోగ మార్కెట్‌గా క్రమంగా మారుతోంది. చెన్నై: గర్భనిరోధక, పునరుత్పత్తి ఆరోగ్య ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ దక్షిణాది నగరం ప్రత్యేకంగా నిలిచింది. -
హనీమూన్‌లో గొడవ?.. నవ జంట బలవన్మరణం
కొత్తగా పెళలైన ఆ జంట.. హనీమూన్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలీయదు. తిరిగి రాగానే ఆమె ప్రాణం తీసుకుంది. అది తట్టుకోలేకనో.. కేసు భయం వల్లనో.. అతడు దూరంగా పారిపోయాడు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పచ్చని పందిళ్లు వేసి మూడు నెలలు తిరగకముందే.. ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఇప్పుడు.. బెంగళూరు: బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న (36), గణవి (26) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గణవి మొదట బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడగా, రెండు రోజుల తర్వాత సూరజ్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక హోటల్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.అక్టోబర్ 29వ తేదీన ఈ జంటకు వివాహం జరిగింది. అయితే ఈ మధ్యే హనీమూన్ కోసం శివన్న, గణవి శ్రీలంకకు వెళ్లారు. అక్కడి వెళ్లిన ఆ జంటకు మధ్యలోనే గొడవలు తలెత్తడంతో తిరిగి బెంగళూరుకు వచ్చారు. గణవి తన పుట్టింటికి వెళ్లింది. అత్తింట్లో ఎదురైన అవమానం, తిరస్కారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె కుటుంబం ఆరోపిస్తుండగా.. డిసెంబర్ 23న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరికి మృతి చెందింది.గణవి మరణం తర్వాత ఆమె కుటుంబం సూరజ్, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య సూరజ్ తన తల్లి జయంతితో కలిసి బెంగళూరును విడిచి నాగపూర్‌కి వెళ్లాడు. అక్కడ వార్ధా రోడ్‌లోని ఒక హోటల్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. అదే సమయంలో అతని తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంట జీవితం ఎంతటి విషాదాంతానికి దారితీసిందో చూపిస్తోంది. కుటుంబ తగాదాలు, వరకట్న వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు సమాజంలో ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
‘నేను నీ బానిసనా?’.. మేనేజర్‌కి బుద్ది చెప్పిన ఉద్యోగి!
లండన్: యూకేలో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) రెస్టారెంట్లో మేనజర్‌గా పనిచేస్తున్న శ్రీలంక మేనేజర్‌కి.. భారతీయ ఉద్యోగి గట్టిషాకిచ్చాడు. నువ్వు నా బానిసవి అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సదరు మేనేజర్ని ఆధారాలతో సహా కోర్టుకీడ్చాడు. కోర్టు సైతం మేనేజర్ని చివాట్లు పెట్టింది. భారత కరెన్సీలో రూ.81లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ 2023లో లండన్‌లోని వెస్ట్ విక్హామ్ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో ఉద్యోగం ప్రారంభించారు. కొద్ది నెలల్లోనే అతని మేనేజర్, శ్రీలంకకు చెందిన కజన్ థైవెంటిరం అతనిపై బానిస,భారతీయులు మోసగాళ్లు అంటూ అవమానించారు. దీంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కజన్‌పై రవిచంద్రన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. అంతేకాదు.. లీవ్ అడిగితే ఇవ్వకపోవడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పలు ఆధారాల్ని ట్రైబ్యునల్‌కు అందించాడు. ఈ కేసును పరిశీలించిన ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ రవిచంద్రన్‌కు అండగా నిలిచింది. మేనేజర్ ప్రవర్తనను జాతి వివక్షగా గుర్తించింది. కోర్టు తీర్పు ప్రకారం.. అతనికి 67వేల యూరోలు (సుమారు రూ.81 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ట్రైబ్యునల్ జడ్జి పాల్ అబ్బాట్ తీర్పులో ‘ఈ కేసులో జాతి వివక్ష స్పష్టంగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని’ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు యూకేలోని ఉద్యోగ రంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. -
జమ్మూలో 30 మంది ఉగ్రవాదులు?
జమ్మూ కశ్మీర్లోకి అక్రమంగా దాదాపు 30 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ఆ ప్రాంతంలో సైన్యం నిఘాను పెంచింది. 'చిల్లై కలాన్'( అత్యంత చలిఉండే కాలం)ను సైతం లెక్కచేయకుండా డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలతో భద్రత సంస్థలు నిరంతరం నిఘాను పెంచుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని వాతావరణ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సాధారణ సమయంలోనే ఎముకలు గడ్డకట్టే చలి ఉండే ఆ ప్రాంతంలో ఇక చలికాలం ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకూ మధ్య కాలాన్ని (చిల్లైకలాన్) అత్యంత కఠినమైన చలి ఉండే కాలం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. నదులు, సరస్సులు, గడ్డకట్డి పోతాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు చేరుకుంటాయి.ఇటువంటి సమయంలో అక్కడ జీవించడమే అత్యంత కష్టమైన పని కానీ భారత ఆర్మీ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడడం కోసం కఠినమైన ఆపరేషన్ చేపడుతుంది. జమ్మూ రీజియన్‌లో ముష్కరులకు ఎటువంటి సహాయం అందకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. సున్నిత ప్రాంతాలలో సైనికుల మోహరింపును పెంచింది. కొండలు, అడవులు, మారుమూల లోయ గ్రామాలను జల్లెడ పడుతోంది. గుల్మార్ల్, సోనాలేక్, థాల్ సరస్సు వంటి సమస్యత్మాక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచింది.అంతేకాకుండా ఉగ్రవాదులు సహాయం పొందే అవకాశాలున్న ప్రాంతాల్లో భద్రత పెంచింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సైన్యం కొద్దిగా వెనక్కి తగ్గితే ఉగ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లనే ఉద్దేశంతో జమ్మూకశ్మీర్ రీజన్లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
2025లో దక్షిణ మధ్య రైల్వే విజయాలివే..!
దక్షిణ మధ్య రైల్వే 2025 క్యాలెండర్ సంవత్సరంలో, అన్ని రంగాలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. ఈ కాలంలో, ఈ జోన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నూతన రైళ్ల ప్రవేశపెట్టడం, స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు సౌకర్యాల పెంపు, సిబ్బంది సంక్షేమం, లోడింగ్, రాబడి సృష్టి మరియు భద్రతను పెంపొందించడం మొదలైన విషయాలలో నూతన శిఖరాలను అధిరోహించి, అనేక మైలురాళ్లను దాటినట్లు పేర్కొంది.2025 క్యాలెండర్ సంవత్సరంలో రైల్వే సాధించిన విజయాలు. తెలంగాణ రాజధాని నగర ప్రాంతంలోని (హైదరాబాద్) మూడు ప్రధాన టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి ప్రయాణికులకు సులభమైన, ఇబ్బంది లేని ప్రయాణాన్ని అందించడానికి, చర్లపల్లిలో ఒక నూతన శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి చేసి ప్రధానమంత్రి చే జనవరి 2025లోప్రారంభించబడింది. జోన్ లోని వైద్య విభాగం ఫిబ్రవరి 2025లో రైల్వే అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్టుల మొదటి వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది. మార్చి-2025లో రైల్వే లబ్ధిదారుల ప్రయోజనం కోసం సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్లో 64 స్లైసెస్ సిటి స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్ మరియు వరంగల్ అనే మూడు ముఖ్యమైన రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసింది. వీటిని ప్రధానమంత్రి మే 2025లో వర్చువల్‌గా ప్రారంభించారు.ఇండో-సార్సెనిక్/ ఇండో-గోతిక్ వాస్తుశిలిలో నిర్మించబడిన కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వాన్ని సరైన కాంతివిధానంతో చాటి చెప్పడానికి రూ. 2.2 కోట్ల వ్యయంతో కాచిగూడ హెరిటేజ్ స్టేషన్‌కు వాస్తుశిల్ప సుందరీకరణతో విద్యుత్ దీపాలంకరణ పూర్తిచేసింది.కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి జూన్ 2025లో దీనిని దేశానికి అంకితం చేశారు. జూన్ 2025లో, రైల్వే లబ్ధిదారుల ప్రయోజనం కోసం సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్లో అంతర్గత కార్డియాక్ క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుగౌరవ రైల్వే కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ జూలై 2025లో కాచిగూడ ,భగత్ కీ కోటి మధ్య రోజువారీ రైలును ప్రవేశపెట్టి జెండా ఊపి ప్రారంభించారు. మార్గమధ్యంలో రైలు ఆలస్యాలను తగ్గించడానికి మరియు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి జూలై, 2025లో పెద్దపల్లి జంక్షన్ వద్ద ఒక కీలకమైన బైపాస్ లైన్ ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఆగస్టు, 2025లో సి.ఎస్.టి.ఎం మరియు జాల్న మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నాందేడ్ వరకు పొడిగించి, జెండా ఊపి ప్రారంభించారు.రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న డిసెంబర్, 2025లో తిరుపతి మరియు సాయినగర్ షిర్డీ మధ్య నూతన వీక్లీ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు.డిసెంబర్, 2025లో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ ల గౌరవ సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు.2025 సంవత్సరంలో జోన్ చేపట్టిన పైన పేర్కొన్న విజయవంతమైన కార్యక్రమాలతో పాటు, ఈ క్రింది తెలియజేయబడిన ప్రధాన మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపుదల ప్రాజెక్టులు, రాబడి సృష్టి మరియు ఇతర ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి :దక్షిణ మధ్య రైల్వే జనవరి నుండి నవంబర్, 2025 వరకు ఈ క్రింది విజయాలు సాధించిందిసరుకు రవాణాలో 136.2 మిలియన్ టన్నులు (జనవరి - నవంబర్ 24లో 128.4 మిలియన్ టన్నులతో పోలిస్తే).సరుకు రవాణా ఆదాయం లో రూ. 12841 కోట్లు(జనవరి - నవంబర్ 24లో రూ. 12597 కోట్లతో పోలిస్తే)ప్రయాణీకుల ఆదాయంలో రూ. 5525 కోట్లు ( సరుకు రవాణా ఆదాయం జనవరి - నవంబర్ 24లో రూ. 5261 కోట్లతో పోలిస్తే)రూ. 19314 కోట్ల స్థూల మొత్తం ఆదాయం (జనవరి - నవంబర్ 24లో రూ. 18831 కోట్లతో పోలిస్తే)దక్షిణ మధ్య రైల్వే 2025 సంవత్సరంలో 52 స్టేషన్లు/సేవా భవనాలకు అత్యధిక శూన్య/శూన్య ప్లస్ లేబులింగ్‌ను సాధించింది .ఈ స్టేషన్లు/సేవా భవనాలలో నికర ఇంధన దిగుమతికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ నికర ఇంధన ఎగుమతిని సాధించినందుకు భారతీయ రైల్వేలలో ఇది అత్యధికం.2025 సంవత్సరంలో మూడు గతి శక్తి కార్గో టెర్మినల్స్ ప్రారంభించబడ్డాయి.గుంతకల్లు డివిజన్లోని సంజమల వద్ద మెస్సర్స్ రామ్‌కో సిమెంట్స్గుంతకల్లు డివిజన్లోని యెర్పేడు వద్ద మెస్సర్స్ జగదీష్ , ఇతరులుగుంటూరు డివిజన్లోని జనపహాడ్ వద్ద మెస్సర్స్ డెక్కన్ సిమెంట్స్68 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించారు.22 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మరియు 60 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి.దక్షిణమధ్య రైల్వే ద్వారా 2025 లో 199 కి.మీ.ల ట్రాక్ జోడింపు (15 కి.మీ. కొత్త లైన్లు, 40 కి.మీ. డబుల్ లైన్ మరియు 144 కి.మీ. మూడవ లైన్)వాడి వద్ద 24 కి.మీ. పొడవునా విద్యుదీకరణతో పాటు (12 కి.మీ. డబుల్ లైన్) బైపాస్ లైన్‌ను ప్రారంభించారు. దీని వలన వాడి జంక్షన్‌కు వెళ్లకుండా రైళ్లను సజావుగా నడపడానికి సహాయపడుతుంది.దక్షిణ మధ్య రైల్వే 2025లో 184 ట్రాక్ కి.మీ. విద్యుదీకరించింది (డబ్లింగ్‌లో భాగంగా 40 కి.మీ. మరియు మూడవ లైన్లో భాగంగా 144 కి.మీ.). అదనంగా, హైదరాబాద్ డివిజన్లోని అక్కన పేట్ - మెదక్ సెక్షన్ మధ్య 17 రూట్ కి.మీ మరియు కలబురగి - ఖానాపూర్ సెక్షన్ మధ్య 97 రూట్ కి.మీ కూడా విద్యుదీకరించబడ్డాయి. దీనితో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్లో 100 శాతం విద్యుదీకరణను సూచిస్తుంది. వివిధ విభాగాలలో 529 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌ను విజయవంతంగా ప్రారంభించారు తద్వారా లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ఎక్కువ సంఖ్యలో రైళ్ల నిర్వహణకు సహాయపడింది.జోన్ సెక్షన్ సామర్థ్యాన్ని మరియు రైళ్ల సజావుగా నిర్వహణను పెంచడానికి వివిధ విభాగాలలో తొమ్మిది ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలను ప్రారంభించింది.దక్షిణ మధ్య రైల్వే 2025 సంవత్సరానికి గాను నాలుగు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను గెలుచుకుంది - గుంతకల్లు లోని డీజిల్ ట్రాక్షన్ శిక్షణా కేంద్రం ఉత్తమ పనితీరు గల యూనిట్ అవార్డును పొందగా, రాయచూర్, కాచిగూడ మరియు లింగంపల్లి మొదలైన 3 రైల్వే స్టేషన్లు మెరిట్ సర్టిఫికేట్‌ను పొందాయి. -
మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తుంటారు. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు.. ఎంతో పుణ్యం .. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఆ జ్యోతి దర్శన భాగ్యం కలుగదనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉంటారు. అలాంటి పవిత్ర ఘడియ మకర జ్యోతి 2026లో ఎప్పుడంటే..శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఆధ్యాత్మిక ప్రాముఖ్యతమకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలుసన్నిధానంపాండితావళంమాలికాపురం ప్రాంతం – అట్టతోడునీలిమలపుల్మేడుశరణ్ గుత్తిమరకూట్టంభక్తులకు సూచనలు..మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.(చదవండి: శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!) -
శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ శనివారం భక్తిశ్రద్ధలతో విజయవంతంగా ముగిసింది. ఈ ఒక్కరోజే సుమారు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావేన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. మండల పూజ సమయంలో ఆలయానికి మొత్తం రూ.332.77 కోట్ల ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.35.70 కోట్లు పెరగడం విశేషమన్నారు. మొత్తం ఆదాయంలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన ఆదాయం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వివరించారు. కాగా, శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం అనంతరం గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తిరిగి తెరుచుకోనుంది.(చదవండి: శబరిమలకు పోటెత్తిన భక్తులు) -
జలాంతర్గామిలో ముర్ము విహారం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ఐఎన్ఎస్ వాఘ్షీర్’ జలాంతర్గామిలో ప్రయాణించారు. తద్వారా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో పయనించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము రికార్డు సృష్టించారు. ఆదివారం కర్ణాటకలోని కర్వార్ నావికా స్థావరం ఇందుకు వేదికైంది. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన ముర్ము పూర్తిగా దేశీయంగా తయారైన కల్వరీ శ్రేణి అత్యాధునిక ఐఎన్ఎస్ వాఘ్షీర్ జలాంతర్గామిలో ఆదివారం ప్రయాణించారు. నావికా దళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వాఘ్‌షీర్‌లో ముర్ము రెండు గంటలపాటు గడిపారు. జలాంతర్గామి పనితీరు గురించి అధికారులను ఆమె స్వయంగా అడిగి తెల్సుకున్నారు. అనంతరం జలాంతర్గామి సిబ్బందితో రాష్ట్రపతి సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె నావికా దళ యూనిఫాం ధరించి ఆకట్టుకున్నారు. స్ఫూర్తినిచ్చింది: మేడిన్ ఇండియా సాఫల్యానికి తార్కాణమైన ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లో పయనించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ముర్ము పేర్కొన్నారు. ప్రయాణానంతరం అందులోని అతిథుల పుస్తకంలో ముర్ము తన మనోభావాలకు అక్షర రూపమిచ్చారు. ‘‘జలాంతర్గామిలోకి ప్రవేశం, అందులో ప్రయాణం, సాహసికులైన నావికులు, నావికాధికారులతో విలువైన సమయం గడపడం నాకు మరపురాని అనుభూతిగా మిగిలిపోతాయి. ‘వీర వర్చస్వ విజయ’ అన్న స్వీయ స్ఫూర్తి వాక్యాన్ని ఐఎన్ఎస్ వాఘ్షీర్ నిత్యం నిజం చేసి చూపుతూ వస్తోంది. ఎన్నో సాహస కార్యాలను విజయవంతంగా నెరవేర్చింది. దాని సిబ్బంది నిరంతర అప్రమత్తత, అంకితభావం అబ్బురపరుస్తున్నాయి. వారి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం నాలోనూ మరెంతో స్ఫూర్తి నింపాయి. మన జలాంతర్గాములు, నావికా దళం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నిత్యం సన్నద్ధంగా ఉన్నాయని మరోసారి వాఘ్షీర్ సిబ్బంది చాటారు’’ అంటూ ఆమె కొనియాడారు. త్రివిధ దళాలతో సుప్రీం కమాండర్ తరచూ భేటీ అవుతూ స్ఫూర్తి నింపుతున్న క్రమానికి ఇది కొనసాగింపు అని రాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. మన నావికా దళ వృత్తి నిబద్ధతకు, అద్భుత పాటవానికి, నిరంతర యుద్ధ సన్నద్ధతకు వాఘ్షీర్ జలాంతర్గామి అద్భుత ప్రతీక అని రాష్ట్రపతి కొనియాడినట్లు ఆ ప్రకటన పేర్కొంది. 2024 నవంబర్‌లో ముర్ము పూర్తిగా దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ విమానంలో ప్రయాణించడం తెలిసిందే. 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో ప్రయాణించారు.‘నిశ్శబ్ద’ కెరటం ఐఎన్ఎస్ వాఘ్షీర్ను నావికా దళం గర్వంగా ‘నిశ్శబ్ద కెరటం’గా పేర్కొంటూ ఉంటుంది. పీ75 స్కార్పీన్ ప్రాజెక్టులో ఇది ఆరో, చివరి జలాంతర్గామి. గత జనవరిలో నావికా దళానికి అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక సాంకేతికత, సదుపాయాలు దీని సొంతం. ప్రపంచంలోనే వేళ్లపై లెక్కించగల డీజిల్–ఎలక్ట్రిక్ సబ్మెరైన్లలో వాఘ్షీర్ ఒకటి అని నేవీ అధికారులు తెలిపారు. యాంటీ సబ్‌మెరైన్‌తో పాటు యాంటీ సర్ఫేస్ యుద్ధ తంత్రంలోనూ దీనికి తిరుగులేదు. నిఘా, సమాచార సేకరణతో పాటు పలు ప్రత్యేక రహస్య ఆపరేషన్లను ఇది నిశ్శబ్దంగా చక్కబెడుతుంటుంది. వైర్ గైడెడ్ టోర్పెడోలు, యాంటీ షిప్ క్షిపణులు, అత్యాధునిక సోనార్ వ్యవస్థలు వాఘ్షీర్ సొంతం. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) టెక్నాలజీ సాయంతో దీని భావి ఆధునీకరణలకు కూడా పూర్తిస్థాయిలో వీలుండటం విశేషం.President Droupadi Murmu embarked the Indian Navy's indigenous Kalvari class submarine INS Vaghsheer at Karwar Naval Base, Karnataka. The President is undertaking a sortie on the Western Seaboard. Chief of Naval Staff Admiral Dinesh K. Tripathi is accompanying the Supreme… pic.twitter.com/8LWzOkc4Ut— President of India (@rashtrapatibhvn) December 28, 2025 -
2025లో గర్వకారణమైన మైలురాళ్లు
న్యూఢిల్లీ: 2025వ సంవత్సరంలో మన దేశానికి గర్వకారణమైన మైలురాళ్లు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జాతీయ భద్రత, క్రీడలు, నూతన శాస్త్రీయ ఆవిష్కరణలతోపాటు ప్రపంచంలో అతిపెద్ద వేదికలపై ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. భారతదేశ ప్రభావం, కీర్తిప్రతిష్టలు అంతటా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. 2025లో ఇదే చివరి మన్ కీ బాత్. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక అని స్పష్టంచేశారు. దేశ భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు ఇచ్చామని వివరించారు. నూతన భారతదేశం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసొచ్చాయని అన్నారు. దేశ భద్రత పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రతి ఒక్కరూ మాతృభూమి పట్ల ప్రేమ, ఆరాధనతోపాటు భావోద్వేగాలు, కృతజ్ఞతలను విభిన్న రూపాల్లో వ్యక్తం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. చిరస్మరణీయమైన సంవత్సరం ‘‘ఆపరేషన్ సిందూర్ నాటి అదే స్ఫూర్తి వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగానూ ప్రజల్లో కనిపించింది. నా పిలుపునకు వారు ఉత్సాహంగా స్పందించారు. జాతీయ గీతం 150 ఏళ్ల వేడుకలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో సందేశాలు పంచుకున్నారు. క్రీడల విషయంలో 2025 మనకు చిరస్మరణీయమైన సంవత్సరం. పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించింది. మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. అంధుల టీ20 ప్రపంచ కప్‌లో మన మహిళల జట్టు విజేతగా నిలిచి, చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టీ20 , పారా అథ్లెటిక్స్‌లో మన క్రీడాకారులు అద్భుతమైన విజయాలు సాధించారు. మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించారు. కన్నడనాడు, నుడి నమ్మ హెమ్మే భారతీయ భాషలు, సం్కృతి ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దేశంలో తమిళ భాషకు ప్రాచుర్యం లభిస్తోంది. కొత్త తరాన్ని ఈ భాషతో అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్‌లో నివసించే కన్నడ కుటుంబాలు కన్నడ పాఠశాలను ప్రారంభించాయి. పిల్లలకు కన్నడ భాష నేరి్పస్తున్నాయి. కన్నడనాడు, నుడి నమ్మ హెమ్మే(కన్నడ భూమి, కన్నడ భాష మనకు గర్వకారణం). జమ్మూకశీ్మర్‌లోని బారాముల్లాకు సంబంధించిన మూడు బౌద్ధ స్తూపాల పాత ఫోటో ఒకటి ఫ్రాన్స్ మ్యూజియంలో కనిపించింది. కశీ్మర్‌కు రెండు వేల ఏళ్ల మహోన్నత చరిత్ర ఉంది. పురాతన కాలం నాటి మానవ నిర్మిత కట్టడాలు, వస్తువులు అక్కడ లభ్యమయ్యాయి. కశీ్మర్ గత వైభవాన్ని అవి మనకు తెలియజేస్తున్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది మణిపూర్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల శ్రీరామ్ మొయిరంగ్థెమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతడు తన గ్రామానికి విద్యుత్‌ను తీసుకొచ్చాడు. సౌర విద్యుత్‌తో వందలాది ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాడు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి నిరూపించాడు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కలి్పంచాడు. దాంతో అక్కడ నిరంతరాయంగా విద్యుత్ అందుతోంది. ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.80 వేల చొప్పున అందజేస్తోంది. అర్హులైన ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి. వైద్యుల సలహాతోనే మాత్రలు యాంటీబయోటిక్స్‌తోపాటు పలు రకాల ఔషధాలను జనం విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం ప్రమాదకరమే. డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా ఔషధాలు తీసుకోవద్దు. న్యుమోనియా, యూటీఐ వంటి వ్యాధులపై యాంటీబయోటిక్స్ ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఇటీవల ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. అంటే మనలో యాంటీబయోటిక్స్ నిరోధకత వచ్చేసింది. ఇది ఆందోళనకరమైన విషయం. ఇకనైనా పరిస్థితి మారాలి. ఒక మాత్ర వేసుకుంటే అన్ని రోగాలూ పోతాయని అనుకోవడం సరైంది కాదు. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే వైద్యుల సలహాతోనే మాత్రలు వేసుకోవాలి.భారత యువశక్తికి తిరుగులేదు సైన్స్, అంతరిక్ష రంగంలో గొప్ప ముందడుగు వేశాం. మన వ్యోమగామి శుభాంశు బుక్లా అంర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతగా వెళ్లొచ్చాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు గొప్ప ఆశతో చూస్తోంది. మన యువజన బలమే ఇందుకు కారణం. భారత యువశక్తికి తిరుగులేదు. సైన్స్, నవీన ఆవిష్కరణలు, టెక్నాలజీ విస్తరణలో మన విజయాలను ప్రపంచదేశాలు అబ్బురంగా వీక్షిస్తున్నాయి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘యంగ్ లీడర్స్ డైలాగ్’ నిర్వహిస్తున్నాం. నేను పాల్గొనే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మారాలని యువతను కోరుతున్నా. కొత్త ఆవిష్కరణలు, ఫిట్నెస్, స్టార్టప్స్, వ్యవసాయం వంటి అంశాలపై వారు తమ ఆలోచనలు పంచుకోవచ్చు. శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆసక్తులను ప్రదర్శించడానికి ఇప్పటి యువతకు ఎన్నో అవకాశాలు, వేదికలు ఉన్నాయి. అలాంటి ఒక వేదిక ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’. ఈ ఎనిమిదేళ్లలో 13 లక్షల మంది విద్యార్థులు ఈ హ్యాక్థాన్లో పాల్గొన్నారు. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై యువత దృష్టిపెట్టడం నిజంగా హర్షణీయం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ప్రశంసనీయం ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ప్రజల విశ్వాసం, సంస్కృతి, విశిష్టమైన భారతీయ వారసత్వం ఒకే వేదికపైకి చేరాయి. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాను చూసి ప్రపంచం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. అయోధ్య భవ్య రామమందిరంపై ధ్వజరోహణాన్ని చూసి ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. అలాగే స్వదేశీ ఉత్పత్తులకు ప్రజలు పెద్దపీట వేస్తుండడం ప్రశంసనీయం. భారతీయుల స్వేదం, భారతీయ మట్టి పరిమళం కలగలిసిన ఈ ఉత్పత్తులను విస్తృతంగా కొనుగోలు చేసి ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దేశంలో చీతాల సంఖ్య పెరుగుతుండడం సంతోషం కలిగిస్తోంది. ఇప్పుడు 30కిపైగా చీతాలు ఉన్నాయి. 2025వ సంవత్సరం మనకు మహోన్నత విశ్వాసాన్ని ఇచి్చందని చెప్పగలం. నూతన ఆశయాలు, సంకల్పాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి దేశం సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: 2026కు 26 ట్రెండ్స్.. ఏఐ నుంచి జీరో వేస్ట్ వరకూ.. -
2026కు 26 ట్రెండ్స్.. ఏఐ నుంచి జీరో వేస్ట్ వరకూ..
మరికొద్ది రోజుల్లో 2026 రానుంది.. కోటి ఆశలతో మనమంతా కొంగొత్త కాలంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ తరుణంలో కొత్త సంవత్సరంలో ఇవి చేయాలి.. అవి చేయాలి అంటూ కొందరు లక్ష్యాలను పెట్టుకుంటారు. ఇటువంటి తరుణంలో రాబోయే 2026 మన జీవనశైలిని, సాంకేతికతను, మార్కెట్లను ఎలా ప్రభావితం చేయనుంది? ఏయే అంశాలు రాజ్యమేలనున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుండి జీరో వేస్ట్ వరకు ఎలా ఉండబోతోంది.. ఏ టు జెడ్ ధోరణులపై సమగ్ర విశ్లేషణ మీకోసం..AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)2026లో ఏఐ రంగంలో అతిపెద్ద మార్పు రానుంది. ఇప్పటి వరకు కేవలం మన ప్రశ్నలకు సమాధానమిచ్చే చాట్బాట్ల స్థాయి నుండి, సొంతంగా పనులు పూర్తి చేసే ఏజెంటిక్ వ్యవస్థల వైపు అడుగులు పడనున్నాయి. అలాగే ప్రైవసీ, వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్లలోనే నేరుగా పనిచేసే ఏఐ ఆదరణ పొందనుంది.Beauty (సౌందర్యం)సౌందర్య సాధనాలు కేవలం అందం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా అన్నట్లుగా మారనున్నాయి. అంటే మేకప్ వేసుకుంటేనే చర్మం హైడ్రేట్ కావడం, సూర్యుడి నుండి రక్షణ పొందడం వంటి 'హైబ్రిడ్ ఫార్ములా'లు మార్కెట్‌ను ఏలబోతున్నాయని ‘ది ఎకనమిక్ టైమ్స్’తన విశ్లేషణలో పేర్కొంది.Cars (కార్లు)ప్రీమియం కార్లలో మాత్రమే ఉండే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ కెమెరాలు, ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్డేట్స్ వంటి ఫీచర్లు సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.Dining & Drinks (ఆహారం- పానీయాలు) భారతదేశంలో ఏటా 23 మిలియన్ల మంది కొత్తగా మద్యం తాగే వయస్సులోకి వస్తున్నారు. 2026లో క్రాఫ్ట్ బీర్లు, తక్కువ ఆల్కహాల్ ఉండే కాక్టెయిల్స్, రమ్ వంటి వాటికి ఆదరణ పెరగనుంది. ఆహార రంగంలో 'మైక్రో డైనర్స్', కేవలం రుచి మాత్రమే కాకుండా వాతావరణం కూడా అనుభూతినిచ్చే ‘మల్టీ-సెన్సరీ డైనింగ్’ కీలకం కానున్నాయి.Entertainment (వినోదం)వినోద రంగంలో ఏఐ వినియోగం పెరగడంతో కళాకారుల నుండి వ్యతిరేకత ఎదురుకానుంది. దీంతో పలువురు నటులు ఇప్పటికే తమ పేరు, రూపం, శైలిపై కాపీరైట్ హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రియేటివ్ కమ్యూనిటీని రక్షించేందుకు కఠినమైన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.Fashion (ఫ్యాషన్)2026ను పర్సనల్ స్టయిల్ సంవత్సరంగా పిలుస్తున్నారు. అల్గారిథమ్స్ చూపించే ట్రెండ్స్ కంటే తమకు నచ్చినట్లు దుస్తులు ధరించడానికి జనం మొగ్గు చూపుతారు. మెకిన్సే నివేదిక ప్రకారం కొత్త దుస్తుల కంటే సెకండ్ హ్యాండ్ ఫ్యాషన్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందనుంది.Gaming (గేమింగ్)గేమింగ్‌లో ఏఐ ప్రతి యూజర్ కోసం ప్రత్యేకమైన కథనాలను, పరిసరాలను సృష్టిస్తుంది. దీనివల్ల గేమ్స్ మరింత అడిక్టివ్గా మారనున్నాయి. అయితే ఇది గేమర్స్ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆందోళనకరంగా మారింది.Health (ఆరోగ్యం)జబ్బులు రాకముందే గుర్తించే 'ప్రిడిక్టివ్ హెల్త్‌కేర్’ సాధారణం కానుంది. పోషకాహార లోపం, గుండె పనితీరు, నిద్ర సమస్యలను ఏఐ విశ్లేషించి రోజువారీ సూచనలు అందిస్తుంది. నిరంతర హెల్త్ మానిటరింగ్ కీలకం కానుంది.Interiors (ఇంటీరియర్స్)కృత్రిమంగా కనిపించే ఇళ్ల కంటే సహజమైన కలప, వంపులు తిరిగిన ఫర్నిచర్, వైవిధ్యమైన టెక్స్చర్లకు 2026లో డిమాండ్ ఉంటుంది. పాతకాలపు వస్తువులను మళ్లీ ఇళ్లలో చేర్చుకోవడం ఫ్యాషన్‌గా మారుతుంది.Jobs (ఉద్యోగాలు)ఐటీ వంటి రంగాల్లో ఆటోమేషన్ వల్ల మార్పులు వచ్చినా, సరైన నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ మార్కెట్ బలంగా ఉంటుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీఎస్) విస్తరించడం వల్ల నియామకాలు పెరిగే అవకాశం ఉంది.Kids & Family (పిల్లలు-కుటుంబం)తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆడుకోవడం ద్వారా బంధాన్ని బలపరుచుకునే 'కిడల్టింగ్' (Kidulting) పెరుగుతోంది. ఇది పెద్దల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. పాఠశాలల్లో బట్టీ పట్టే పద్ధతుల కంటే అనుభవం ద్వారా నేర్చుకోవడం అనేదానికి ప్రాధాన్యత పెరుగుతుంది.Luxury (లగ్జరీ)కేవలం ఖరీదైన వస్తువులను కొనడం కంటే, ప్రత్యేకమైన ప్రయాణాలు, అరుదైన సాంస్కృతిక కార్యక్రమాలు, వెల్నెస్ రిట్రీట్స్ వంటి అనుభూతిని ఇచ్చే అంశాలకు ప్రాధాన్యత పెరుగుతుంది.Music (సంగీతం)పంజాబీ సంగీతం తరహాలోనే హర్యాన్వీ, భోజ్‌పురి, మలయాళం తదితర ప్రాంతీయ భాషల సంగీతం గ్లోబల్ స్థాయిలో పాపులర్ అవుతుంది. భారతీయ కళాకారులు తమ ఫ్యాన్ బేస్ నుండి ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషిస్తారు.Nutrition (పోషణ)జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడం కోసం, దీర్ఘాయువు కోసం ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) ను విపరీతంగా పెంచడం (Fiber maxing) అనేది 2026లో ప్రధాన హెల్త్ ట్రెండ్ కానుంది.Outdoors (అవుట్డోర్స్)రోజుకు 10 వేల అడుగులు నడవడమే కాకుండా, డిస్క్ గోల్ఫ్ , ఫ్రిస్బీ వంటి సామాజిక ఆటల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కమ్యూనిటీలుగా ఏర్పడి ఆరుబయట సమయం గడపడం పెరుగుతుంది.Pets (పెంపుడు జంతువులు)పెంపుడు జంతువులను కేవలం జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూసే ధోరణి మరింత పెరుగుతుంది. 2026లో ‘పెట్ పేరెంటింగ్’ శైలిలో మార్పులు రానున్నాయి. పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్, ఆర్గానిక్ ఆహారం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ‘పెట్ థెరపీ’ సెషన్లకు డిమాండ్ పెరుగుతుంది.Quiet Travel (ప్రశాంత ప్రయాణాలు)పర్యాటకులు.. రద్దీగా ఉండే ప్రదేశాల కంటే, ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండే ప్రాంతాల వైపు మొగ్గు చూపుతారు. దీన్నే 'క్వయిట్ ట్రావెల్’ అంటున్నారు. ధ్వని కాలుష్యం లేని ప్రాంతాలు, డిజిటల్ డిటాక్స్ అందించే రిసార్టులు 2026లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.Retail (రిటైల్)ఆన్లైన్ షాపింగ్, ఆఫ్-లైన్ స్టోర్స్ కలయికతో ఫిజిటల్' అనుభవం కొత్త పుంతలు తొక్కుతుంది. షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఏఆర్ (ఏఆర్) అద్దాల ద్వారా దుస్తులను ట్రై చేయడం, క్యూలో నిలబడకుండా నేరుగా యాప్ ద్వారా చెల్లింపులు చేయడం వంటివి సాధారణం కానున్నాయి.Sustainability (సుస్థిరత)పర్యావరణంపై శ్రద్ధ కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలోకి వస్తుంది. వినియోగదారులు వస్తువులను కొనేముందు అవి పర్యావరణానికి ఎంత హాని చేస్తాయో అనేది చూసి కొంటారు. కంపెనీలు కూడా రీసైకిల్ చేసిన ప్యాకేజింగ్‌ను విధిగా వాడాల్సి ఉంటుంది.Tech (సాంకేతికత)2026లో క్వాంటం కంప్యూటింగ్, 6G దిశగా పరిశోధనలు వేగవంతం అవుతాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)మన ఇళ్లలోని ప్రతి వస్తువును స్మార్ట్‌గా మారుస్తుంది. వ్యక్తిగత డేటా భద్రత కోసం మరిన్ని కఠినమైన సాంకేతిక నిబంధనలు అమల్లోకి వస్తాయి.Urban Farming (నగరాల్లో వ్యవసాయం)నగరాల్లో నివసించే వారు తమ మేడల మీద లేదా బాల్కనీలలో హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు పెంచుకోవడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారుతుంది. కెమికల్స్ లేని ఆహారం కోసం జనం ఈ దిశగా అడుగులు వేస్తారు.Virtual Reality (వర్చువల్ రియాలిటీ)వీఆర్ టెక్నాలజీ ఇకపై విద్య, వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లో కూర్చుని, ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా చారిత్రక కట్టడాలను వర్చువల్‌గా సందర్శించవచ్చు. అలాగే వైద్యులు సంక్లిష్టమైన సర్జరీల కోసం వీఆర్ సిమ్యులేషన్లను ఉపయోగిస్తారు.Work-Life Balance (వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యత)కంపెనీలు ‘ఫోర్ డే వర్క్ వీక్’ (వారానికి నాలుగు రోజులే పని) ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేయడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని పలు సంస్థలు భావిస్తున్నాయి.Xenotransplantation (జెనో-ట్రాన్స్‌ప్లాంటేషన్)జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే ‘జెనో-ట్రాన్స్‌ప్లాంటేషన్’ రంగంలో 2026లో కీలక పురోగతి కనిపించవచ్చు. అవయవ దాతల కొరతను తీర్చేందుకు జన్యుమార్పిడి చేసిన జంతువుల అవయవాలపై పరిశోధనలు పెరిగే అవకాశం ఉంది.Youth Activism (యువత క్రియాశీలత)రాజకీయ, సామాజిక మార్పులలో యువత పాత్ర మరింత కీలకం కానుంది. సోషల్ మీడియా వేదికగా వారు లేవనెత్తే అంశాలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయనున్నాయి.Zero Waste (జీరో వేస్ట్)చెత్తను పూర్తిగా తగ్గించే ‘జీరో వేస్ట్’ జీవనశైలిని జనం అలవాటు చేసుకుంటారు. ప్లాస్టిక్ బదులు తినగలిగే నీటి పాడ్స్ , భూమిలో కలిసిపోయే ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ఇన్నోవేషన్లు మార్కెట్లోకి రానున్నాయి. 2026వ సంవత్సరం మానవ మేధస్సు , పర్యావరణ స్పృహల కలయికగా ఉండనుంది. టెక్నాలజీ మన పనులను సులభతరం చేస్తే, పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తును కాపాడనుంది.ఇది కూడా చదవండి: -
కాంగ్రెస్ సిద్ధాంతాలకు మరణం లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అంటేనే ఒక సిద్ధాంతమని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు మరణం లేదని అన్నారు. ఆదివారం ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఖర్గే పార్టీ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ప్రసంగించారు. మహోన్నత కాంగ్రెస్ నాయకుల కృషి వల్లే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పని అయిపోందని చెబుతున్నవాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలని సూచించారు. తమ శక్తి కొంత తగ్గినప్పటికీ వెన్నెముక మాత్రం నిటారుగానే ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, లౌకికవాదం, పేదల హక్కుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి లేనప్పటికీ ఇతరుల వద్ద యాచించబోమని అన్నారు. మతం పేరిట కాంగ్రెస్ ఏనాడూ ఓట్లు అడగలేదన్నారు. మందిరం–మసీదు పేరిట ఏనాడూ విద్వేషాలు రగిలించలేదని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఏకం చేస్తుందని, బీజేపీ విడదీస్తుందని చెప్పారు. తమ దృష్టిలో మతం అంటే విశ్వాసం మాత్రమేనని పేర్కొన్నారు. కొందరు మాత్రం మతాన్ని రాజకీయంగా మార్చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పటికీ ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందని ఖర్గే స్పష్టంచేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. #WATCH | Delhi: Congress National President Mallikarjun Kharge says, "... On December 28, 1885, in Mumbai, Congress was founded. For 62 years, crores of Congressmen struggled, were jailed, and fought for the country, leading to our freedom. I pay tribute to the founders of… https://t.co/vl2DOsI0bC pic.twitter.com/KqkHbnQOud— ANI (@ANI) December 28, 2025భారతీయ ఆత్మ గొంతుక కాంగ్రెస్కాంగ్రెస్ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని.. అది భారతీయ ఆత్మ గొంతుక అని పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ప్రతి బలహీనుడికి, అణగారినవర్గాలకు, కష్ట జీవు లకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. విద్వేషం, అన్యాయం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి బలమైన సంకల్పం తీసు కున్నట్లు తెలిపారు. సత్యం కోసం తమ పోరా టం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ వ్యవ స్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగానికి పునాదులు వేయడంతోపా టు ప్రజాస్వా మ్యం, లౌకికవాదం, సామాజిక న్యా యం, సమానత్వ విలువలను బలోపేతం చేసినవారిని స్మరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
బంకర్లో దాక్కోమన్నారు
లాహోర్: ఈ ఏడాది మేలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో బంకర్లో దాక్కోవాలంటూ అధికారులు తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ వెల్లడించారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా సింధ్ ప్రావిన్స్‌లోని లార్కానాలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం తెలిపారు. ‘సర్, యుద్ధం మొదలైంది. సురక్షితంగా ఉండటం కోసం బంకర్‌కు వెళ్దాం రండి అంటూ నా సెక్రటరీ వచ్చి నాతో అన్నారు. అందుకు నేను అంగీకరించలేను. మృత్యువు వస్తే ఇక్కడికే రానీయండి. నేతలు ప్రాణాలొదలాల్సింది యుద్ధ క్షేత్రంలోనే..బంకర్లలో కాదని చెప్పా. నేతలు బంకర్లలో కూర్చుని చనిపోవడం సరికాదని అతడికి తెలిపాను. వాస్తవానికి యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తమకు తెలుసు’అని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 10 ఎక్కువే అయినా, ఆ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. #BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj— upuknews (@upuknews1) December 28, 2025అదంతా అబద్ధం: ఆర్మీ రిటైర్డు అధికారి ఆసిఫ్ జర్దారీ చేసిన ప్రకటనపై భారత లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డు) కేజేఎస్ ధిల్లాన్ ఘాటుగా స్పందించారు. యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తెలిస్తే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత క్షిపణులను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిం«ధూర్ వేళ ఆర్మీ చీఫ్ మునీర్ సహా రాజకీయ నేతలు, మిలటరీ కమాండర్లు బంకర్లోనే దాక్కున్నారన ధిల్లాన్ చెప్పారు. నూర్ ఖాన్ స్థావరంపై దాడి వాస్తవమేభారత్తో మేలో తలెత్తిన సంక్షోభం సమయంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాడికి గురైందని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ‘ఆ∙రోజు ఉదయం 8.15 గంటల వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసి..కాల్పుల విరమణకు భారత్ సిద్ధంగా ఉంది. మీరూ సిద్ధమా? అని నన్నడిగారు. పాక్ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుందని బదులిచ్చా’ అని తెలిపారు. -
కొత్త పెళ్లి జోష్.. పార్టీ మత్తు… నదిలో దూకుడు
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా కలియక్కావిలై దగ్గరలోని మెదుగుమ్మల్ ప్రాంతానికి చెందిన ఇవాంజెరీ (28), లాయర్ అయిన ఇతనిపై పలు కొట్లాట కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నెల క్రితం సాహినియా (25) అనే లాయర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొత్త వరుడు ఇవాంజెరీ, ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను స్నేహితులతో కలిసి ఉత్సాహంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 24వ తేదీన స్నేహితులతో కుళిత్తురైలోని ఓ ప్రైవేట్ మద్యం బార్‌కు వెళ్లి మద్యం విందులో పాల్గొన్నారు. అక్కడ అందరూ ఉత్సాహంగా మద్యం తాగారు. దీంతో మత్తులో ఉన్న ఇవాంజెరి మద్యం బార్ వెనుకకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అతను అకస్మాత్తుగా తామ్రపరణి నదిలోకి దూకాడు. తర్వాత నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్నేహితులు ఈ విషయాన్ని అగి్నమాపక కేంద్రానికి తెలియజేశారు. స్థానిక అగి్నమాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రం ఓ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. -
సంవత్సరాంతంలో ఆకాశ దీపావళి?
ఆకాశ దేశంలో వెలుగుల పండుగ. ధ్రువాల తరచూ కనువిందు చేసే వెలుగులు (అరోరా)లు ఈసారి మరీ అందంగా వెలుగొందాయి. కింద పెద్ద నగరాల తాలూకు విద్యుద్దీప కాంతులు, పైన అందరి గెలాక్సీ నుంచి పడ్డ వెలుగులు కలగలిసి అరోరాల అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. దాంతో అవి కాస్తా, ఇదుగో... ఇలా విస్మయం కలిగించేలా వింత శోభ సంతరించుకున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా సైంటిస్టు డాన్ పెటిట్ వాటిని ఇలా అద్భుతంగా కెమెరా కంటితో బంధించి పంపారు! అరోరాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ధ్రువకాంతులు. సూర్య కిరణాలతో సంయోగం చెందిన పై వాతావరణ పొరలోని అణువులు వాయు సంసర్గం పొందితే ఏర్పడే ఉంటా కాంతులు. ఆకుపచ్చ, ఊదాతో పాటు చిక్కని ఎరుపు రంగుల్లో మెరిసిపోవడం వీటి ప్రత్యేకత. సంవత్సరాంతంలో ఉత్తర ధ్రువం వద్ద ఆరోరాల సందడి కొత్తేమీ కాదు. కానీ అవి అంతరిక్ష వెలుగులతో కలగలిసి ఇలా కొత్త హొయలు పోవడమే చాలా అరుదు. శీతాకాలం అరోరాల్లో పెద్ద నగరాల తాలూకు దీప కాంతులు అరోరాలతో కలగలసి కనిపించడం అరుదు కాదు. కాకపోతే భూమికి ఏకంగా 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని ఆ్రన్డోమెడ గెలాక్సీ తాలూకు శోభ కూడా పెటిట్ ఫోటోల్లో నేపథ్యంలో కనిపిస్తోంది. ఈ విశేషం అందరి ఆకర్షిస్తోంది. పెటిట్ కూడా వీటిని ’బెస్ట్ హాలిడే లైట్స్’గా వరి్ణంచారు. సరిగ్గా క్రిస్మస్, న్యూ ఇయర్ నడుమ వెలుగు చూసిన ఈ ఇమేజీలు పండుగ వాతావరణానికి మరింత వన్నె తెచ్చాయి. -
Bihar: పట్టాలు తప్పిన గూడ్స్ .. ఎనిమిది వ్యాగన్లు తిరగబడి..
హాజీపూర్: బీహార్‌లోని హాజీపూర్ పరిధిలో రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిదికి పైగా వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి తూర్పు మధ్య రైల్వే పరిధిలో జరిగిన ఈ ఘటనతో అటు అప్, ఇటు డౌన్ లైన్లలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ప్రమాదం జరిగిందిలా..తూర్పు రైల్వేలోని అసన్సోల్ డివిజన్ పరిధిలో గల లాహబోన్- సిముల్తాలా స్టేషన్ల మధ్య శనివారం రాత్రి 11:25 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో (సీసీఆర్‌ఓ)వెల్లడించారు. గూడ్స్ రైలులోని ఎనిమిది వ్యాగన్లు ఒక్కసారిగా పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. అసన్సోల్, మధుపూర్, ఝాఝా ప్రాంతాల నుండి సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన రైలు పట్టాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.ఇటీవలి ఘటనలు..మొన్న డిసెంబర్ 16న జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కు చెందిన గువా సైడింగ్లో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే ఈ రైలులోని ఒక బోగీ పట్టాలు తప్పడంతో ఖనిజ రవాణాకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. అయితే, ఇది ప్రధాన మార్గంలో జరగకపోవడంతో సాధారణ రైళ్లపై దీని ప్రభావం పడలేదు. డిసెంబర్ 20న అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్‌తో పాటు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. అటవీ శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు ఘటనలు చాలు.. ‘టాటా’ రియల్ హీరో.. -
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల మేరకు.. మహారాష్ట్రలో పుణె మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో 28 సంస్థలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. స్థానిక గ్యాంగ్‌స్టర్, మనవడి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బందు అందేకర్ శనివారం నామినేషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఎరవాడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడు భారీ పోలీసు భద్రత నడుమ ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నాడు. పోలీసు వ్యాన్‌లో వచ్చిన బందు అందేకర్ చేతులకు తాళ్లు కట్టి ఉండగా, ముఖానికి నల్లటి గుడ్డ కప్పి ఉండటం గమనార్హం.Notorious Andekar Gang Leader Bandu Andekar was brought from Yerwada Jail under police escort to Bhawani Peth Regional Office to file his application for the Municipal Corporation elections in Dec 27. Express Video By Pavan Khengre. pic.twitter.com/o7gyBWnFG4— Express Pune Resident Editor (@ExpressPune) December 27, 2025అనంతరం, భవానీ పేటలోని నామినేషన్ కేంద్రానికి తీసుకురాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో నామినేషన్ దాఖలు చేసి మళ్లీ జైలుకు వెళ్లిపోయాడు. కాగా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందేకర్కు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. అందేకర్ మాత్రమే కాకుండా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న అతడి సోదరుడి భార్య లక్ష్మి అందేకర్, కోడలు సోనాలి అందేకర్ కూడా కోర్టు అనుమతితో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఇదిలా ఉండగా.. మాజీ కార్పొరేటర్, బందు అందేకర్ కుమారుడు వనరాజ్ అందేకర్ గతంలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే మనవడు ఆయుష్ కోమ్కర్‌ను సెప్టెంబర్ 5న కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ హత్య వెనుక అందేకర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో అందేకర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇక, అందేకర్ నామినేషన్‌కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. आंदेकर कुटुंब निवडणुकीच्या रिंगणात, फॉर्म भरताना काय घडलं? #Pune #Andekar #Crime pic.twitter.com/2CVYyxrlma— Mumbai Tak (@mumbaitak) December 27, 2025 -
ఈ ఐదు ఘటనలు చాలు.. ‘టాటా’ రియల్ హీరో..
ఆయన.. ఒక పారిశ్రామికవేత్తగానే కాకుండా, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగానూ పేరొందారు. అతని హృదయం వెన్నలాంటిదని, బంగారంలాంటి మనసు కలిగిన వారని సన్నిహితులు చెబుతుంటారు... ఆయనే దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.. ఈ రోజు ఆ స్ఫూర్తిదాయకుని జన్మదినం. 1937, డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా.. టాటా గ్రూప్ ఛైర్మన్‌గానే కాకుండా, అత్యుత్తమ జీవన ప్రమాణాలకు మారుపేరుగా నిలిచాయి. ఆయన ఆలోచనలు, పనులు.. ఆయనలోని గొప్ప మనిషిని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ, అతని జీవితంలో మానవత్వాన్ని చాటిన ఐదు అరుదైన సంఘటనలను గుర్తు చేసుకుందాం.పెంపుడు కుక్కకు అనారోగ్యం.. బ్రిటన్ యువరాజు ఆహ్వానం తిరస్కారం!రతన్ టాటా సన్నిహితుడు సుహేల్ సేథ్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 2018లో బ్రిటన్ యువరాజు (ప్రస్తుత రాజు) ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించారు. ఈ నేపధ్యంలో ‘బ్రిటిష్ ఏషియా ట్రస్ట్’ ఆధ్వర్యంలో రతన్ టాటాను సన్మానించేందుకు లండన్‌కు ఆహ్వానించారు. అయితే ఆ పర్యటనకు కొన్ని గంటల ముందు టాటా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కారణం ఏమిటంటే.. ఆయన పెంపుడు కుక్కలు 'టాంగో', 'టిటో'లలో ఒకటి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ‘నా పెంపుడు శునకాలను ఈ స్థితిలో వదిలి నేను రాలేను’ అని రతన్ టాటా సందేశం పంపారు. దీనికి ప్రిన్స్ చార్లెస్ ఆశ్చర్యపోతూ.. ‘టాటా గొప్పతనం ఇదే.. అందుకే టాటా సామ్రాజ్యం అంత పటిష్టంగా ఉంది’ అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు.‘తాజ్’లో మూగజీవాలకు రెడ్ కార్పెట్ముంబైలోని ప్రతిష్టాత్మక తాజ్ మహల్ హోటల్ ద్వారం వద్ద ఒక వీధి కుక్క ప్రశాంతంగా నిద్రపోతున్న దృశ్యాన్ని చూసిన ప్రముఖ హెచ్ఆర్ ప్రొఫెషనల్ రూబీ ఖాన్ ఆశ్చర్యపోయారు. దీని గురించి ఆమె ఆరా తీయగా.. హోటల్ సిబ్బంది ఒక ఆసక్తికర విషయం చెప్పారు. ‘హోటల్ లోపలికి వచ్చే మూగజీవాలను ఎంతో ప్రేమతో చూడాలని రతన్ టాటా నుంచి మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి’ అని వారు తెలిపారు. కేవలం తాజ్ హోటల్లోనే కాదు.. దక్షిణ ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం ‘బాంబే హౌస్’లో కూడా వీధి కుక్కలకు స్వేచ్ఛా ప్రవేశం ఉంటుంది. అక్కడ వాటికి ఆహారం, ఆశ్రయంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు.26/11 ముంబై దాడుల బాధితులకు అండగా..భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన 26/11 ముంబై ఉగ్రదాడులకు తాజ్ హోటల్‌కు చెందిన 80 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆ క్లిష్ట సమయంలో రతన్ టాటా స్వయంగా ఆ 80 మంది ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి, వారిని పరామర్శించారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలకు టాటా గ్రూప్ పూర్తి ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, మరణించిన లేదా గాయపడిన ఉద్యోగుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చును కూడా భరించింది.డ్రైవర్ పక్కన నిరాడంబరంగా..కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ రతన్ టాటా నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా కనిపిస్తారు. ఆయన కారులో వెళ్లేటప్పుడు తరచుగా డ్రైవర్ పక్క సీటులోనే కూర్చునేవారు. మనుషులందరూ సమానమేనని, ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలని ఆయన చెప్పేవారు. డ్రైవర్ అందుబాటులో లేనప్పుడు, ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లేవారట.ఆదర్శప్రాయమైన దాతృత్వంరతన్ టాటా తన జీవితకాలంలో చేసిన సేవా కార్యక్రమాలు అమోఘమైనవి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకునేందుకు రతన్ టాటా ఉదారంగా విరాళాలు అందించారు. దేశవ్యాప్తంగా పలు పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలకు ఆయన సాయం అందించారు. జంతువులపై అమితమైన ప్రేమతో 2024లో ముంబైలో ఒక అత్యాధునిక జంతువుల ఆసుపత్రిని కూడా నిర్మించారు. రతన్ టాటా 2024, అక్టోబర్ 9న కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు, పాటించిన విలువలు ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయి.ఇది కూడా చదవండి: 28న ఆరావళిపై సుప్రీం విచారణ -
అర్ధరాత్రి పోకిరీల వేధింపులు
కర్ణాటక: ఒకే బైకులో వెళుతున్న ముగ్గురు ఆకతాయిలు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని వేధించారు. ఈనెల 25వ తేదీన అర్ధరాత్రి బీటీఎం లేఔట్లో ఈ కీచకపర్వం జరిగింది. స్కూటర్లో హెల్మెట్ ధరించి వెళుతున్న యువతిని బైక్‌లో హెల్మెట్ ధరించకుండా అడ్డదిడ్డంగా నడుపుతున్న యువకులు వెంటాడారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర యువతిని ఫాలో చేస్తూ పదే పదే అడ్డు వస్తూ వేధింపులకు గురి చేశారు. ఈ మొత్తం ఘటనను ఒక కారులో ఉన్న వ్యక్తి వీడియో తీసి పోలీసులకు షేర్ చేశాడు. వీడియో ఆధారంగా, బైక్ నంబర్, యజమాని వివరాలను గుర్తించి, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. बेंगलुरु : देर रात सुनसान सड़क पर अकेली लड़की को छेड़ने लगे, मनचलों की करतूत का वीडियो पूरी खबर: https://t.co/BtbymEecXU #Bengaluru | #ViralVideo pic.twitter.com/DhDwa7IvTh— NDTV India (@ndtvindia) December 27, 2025 -
నిన్న భార్య.. నేడు భర్త.. రెండు నెలలకే విషాదాంతం
యశవంతపుర(బెంగళూరు): కల్యాణం.. కమనీయం అన్నారు. కానీ ఘోర విషాదంగా పరిణమించింది. పట్టుమని 2 నెలలు కూడా కాపురం చేయని నవ వధూవరులు ఆత్మహత్యలతో పరలోకానికి చేరారు. ఈ ఘోరం బెంగళూరులోనే జరిగింది. నవవివాహిత గానవి (26) ఆత్మహత్యాయత్నం, మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. భార్యను వేధించాడని, నపుంసకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త సూరజ్ మహారాష్ట్ర నాగపూర్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది తెలిసి సూరజ్ తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అట్టహాసంగా పెళ్లయితే.. గానవి, సూరజ్ (30)లకు అక్టోబర్ 29న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అట్టహాసంగా వివాహమైంది. 12 రోజుల కిందట శ్రీలంకకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య పోట్లాటలు జరిగి మధ్యలోనే ముగించుకొని బెంగళూరుకు వచ్చేశారు. మీ కూతురిని తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులకు సూరజ్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ గొడవలతో 24న గానవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో 26న చనిపోయింది. నాగపూర్‌కు వెళ్లిపోయి.. గానవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరజ్ కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యాయత్నం అభియోగాలతో రామమూర్తినగర పోలీసులు కేసును నమోదు చేశారు. అరెస్టు భయంతో సూరజ్, తల్లి జయంతి, సోదరుడు సంజయ్ నాగపూర్‌కు పరారయ్యారు. శనివారం అక్కడే ఓ విల్లాలో సూరజ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి జయంతి కూడా ఆస్పతిర్లో చికిత్స పొందుతోంది. ఈ మేరకు స్థానిక సోనేగావ్ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారమిచ్చారు.గానవి తల్లి ఏమన్నారు? సూరజ్ ఆత్మహత్యకు అతని తప్పుడు భావనలే కారణమని గానవి తల్లి ఆరోపించింది. నెలన్నర పాటు సూరజ్ సంసారం చేయలేదు, భార్య పక్కన కూర్చుని భోజనం కూడా చేసేవాడు కాదు. భర్త, అత్తల ప్రేమ కోసం గానవి ఎంతో ప్రయతి్నంచింది, పుట్టింటికీ వెళ్లను ఇక్కడ ఉండి బతుకుతా, నాకు ప్రేమను పంచండి అని గానవి భర్త, అత్తతో మొరపెట్టుకుంది. కానీ పుట్టింటికి వెళ్లిపో అని ఒత్తిడి చేశారు. తప్పుడు ఆలోచనలు, గానవి శాపమే సూరజ్ ఆత్మహత్యకు కారణం అని దుయ్యబట్టారు. భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు -
28న ఆరావళిపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: దేశంలోని ఆరావళి పర్వత శ్రేణుల నిర్వహణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు డిసెంబర్ 28న విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా (స్వచ్ఛందంగా) స్వీకరించడం గమనార్హం.చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోర్టు జాబితాలో ఈ అంశాన్ని ‘ఆరావళి కొండలు-పర్వత శ్రేణుల నిర్వచనం, సంబంధిత అంశాలు’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనం చుట్టూ వివాదం నెలకొంది. ఈ కొత్త నిబంధనల కారణంగా ఈ పర్వత పర్యావరణ వ్యవస్థలో భారీగా మైనింగ్‌కు అవకాశం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విస్తారమైన ఆరావళి ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతానికైతే మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి ప్రాంతంలో కొత్త లీజులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణం, భూగర్భ శాస్త్రం, ప్రకృతి పరిరక్షణ ఆధారంగా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ)ని ఆదేశించింది. కేంద్రం ఇప్పటికే నిషేధించిన ప్రాంతాలకు అదనంగా ఈ జోన్లను గుర్తించాల్సి ఉంటుంది. సోమవారం సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో ఆరావళి భవిష్యత్తుపై ఎటువంటి ఆదేశాలు వెలువడుతాయనే ఆసక్తి నెలకొంది.ఇది కూడా చదవండి: ‘షార్ట్‌లతో తిరగొద్దు’.. హుకుం జారీ! -
17 ఏళ్ల తర్వాత ఓటరుగా..
ఢాకా/న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ) తాత్కాలిక చైర్మన్, మాజీ మహిళా ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రెహ్మాన్ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ఓటరుగా తన పేరును నమోదుచేయించుకున్నారు. లండన్ నుంచి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చిన రెహ్మాన్ శనివారం ఓటరు జాబితాలో తన పేరును జతచేయడంతోపాటు జాతీయ గుర్తింపు(ఎన్ఐడీ) కార్డును సంపాదించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం ఢాకాలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన రహ్మాన్ నుంచి అధికారులు వేలి గుర్తులు, ఐరిస్ స్కాన్ తీసుకుని ఓటర్‌గా పేరు నమోదుచేశారు. అంతకుముందే రెహ్మాన్ తన ఓటరు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించారని ఎన్నికల కమిషన్‌లోని జాతీయ గుర్తింపు నమోదు విభాగ డైరెక్టర్ జనరల్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. రెహ్మాన్‌తోపాటు ఆయన కుమార్తె జైమా సైతం ఎన్ఐడీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2007–08 రాజకీయ సంక్షోభం తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని సైనిక తాత్కాలిక ప్రభుత్వం తొలిసారిగా 2008లో బంగ్లాదేశ్‌లో ఫొటో, బయోమెట్రిక్ డేటాతో ఓటర్ జాబితాను తయారుచేయడం తెల్సిందే. ఆ కాలంలో రాజకీయ ఖైదీగా ఉన్న రెహ్మాన్‌ను జైలు నుంచి విడుదలచేయగానే ఆయన 2008 సెపె్టంబర్ 11వ తేదీన లండన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన పేరు ఓట్ల జాబితాలో నమోదుకాలేదు. ఆ తర్వాత వైరి వర్గానికి చెందిన షేక్ హసీనా పార్టీ అధికారంలోకి రావడంతో రెహ్మాన్ ఇంకెప్పుడూ స్వదేశానికి రాలేదు. -
అస్సాంలో 10.56 లక్షల పేర్లు తొలగింపు
గౌహతి: అస్సాంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 10.56 లక్షల ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 2.51 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. అంతేకాకుండా 93,021 డి–ఓటర్లు(డౌట్ఫుల్ఓటర్స్) ఉన్నట్లు గుర్తించింది. మరణించడం, వలసవెళ్లడం, బహుళ ఎంట్రీలు వంటి కారణాలతో 10,56,291 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. పౌరసత్వం లేకున్నా ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారిని డి–ఓటర్లుగా పరిగణిస్తారు. వీరికి ఓటు వేసే హక్కు ఇవ్వడం లేదు. -
బొగ్గు గని ప్లాంట్ వద్ద నిరసన సెగ
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో జిందాల్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించిన బొగ్గు గని ప్లాంట్ వద్ద స్థానికులు చేపట్టిన ఆందోళన శనివారం హింసాత్మకంగా మారింది. తమనార్ పరిధిలోని లిబ్రా గ్రామంలో ఉన్న కోల్ హ్యాండింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు తరలించే వాహనాలను అడ్డుకుంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉద్యమ నాయకుడు రాధేశ్యామ్ శర్మ, మరో 40 మందిని అరెస్ట్‌చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అయితే సైకిల్‌పై వెళ్తున్న స్థానికుడిని మరో బొగ్గు ట్రక్కు ఢీకొట్టిందన్న వార్తతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తర్వాత ప్లాంట్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. కోల్ ప్లాంట్‌లోని కన్వేయర్ బెల్ట్, ట్రాక్టర్లు, పోలీస్ బస్సు, జీప్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. సెక్టార్–1 కోల్‌బ్లాక్ పరిధిలోని 14 గ్రామాలకు చెందిన వేయి మందికిపైగా గ్రామస్తులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారు. అయినాసరే పరిస్థితి అదపులోనే ఉందని జిల్లా ఎస్పీ శనివారం వెల్లడించారు. -
57 ‘ఇండిగో’లు రద్దు
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ విమానా శ్రయాల్లో అననుకూల వాతావరణం కారణంగా శనివారం 57 విమానాలను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. అదేవిధంగా, ఆదివారం నడిపే మరో 13 విమానాలను సైతం రద్దు చేసింది. వీటిలో రెండు నిర్వహణ పరమైన కారణాలు, మిగతావి ప్రతికూల వాతావరణం నెలకొనవచ్చనే అంచనాతో రద్దు చేశామని వెల్లడించింది. ఈ నెలారంభంలో నిర్వహణ పరమైన కారణాలు చూపుతూ వేలాదిగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తడం తెల్సిందే. అదేవిధంగా, గత వారం, పది రోజులుగా ఈ సంస్థ వాతావరణం సరిగా లేదనే కారణంతో పదుల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేస్తోంది. శనివారం రద్దయిన వాటిలో చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్, అమృత్సర్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె మొదలైన చోట్ల నుంచి రాకపోకలు సాగించాల్సినవి ఉన్నాయి. -
ఆపరేషన్ ఆఘాత్ 3.0
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ పోలీసులు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. శుక్రవారం వాయవ్య ఢిల్లీలో ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’పేరుతో చేపట్టిన దాడుల్లో భారీ సంఖ్యలో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మద్యంతోపాటు వాహనాలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా పలు నేరారోపణలపై 966 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల సమయంలో నివాస ప్రాంతాలు, మురికివాడల్లో నేరాలకు పాల్పడే వారిని, వీధి ఘర్షణలను అదుపు చేసేందుకే ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు. ఆపరేషన్ ఆఘాత్ 3.0 సమయంలో 21 దేశవాళీ పిస్టళ్లు, 20 తూటాలు, 27 కత్తులను ఆయుధాల చట్టం కింద స్వా«దీనం చేసుకున్నామని వివరించారు. 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6కిలోల గంజాయితోపాటు రూ.2.36 లక్షల నగదును గ్యాంబ్లర్స్ నుంచి సీజ్ చేసినట్లు చెప్పారు. మొత్తం 310 సెల్ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు, ఒక కారును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 600 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారన్నారు. నేరాలకు పాల్పడినట్లు తేలితే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 11, 112 కింద కేసులు నమోదు చేసి బహిష్కరణ దండన వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
హిమాచల్‌లో వైద్యుల నిరవధిక సమ్మె
సిమ్లా: రెసిడెంట్ డాక్టర్ల నిరవధిక సమ్మె కారణంగా శనివారం హిమాచల్‌ప్రదేశ్ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగిపై చేయిచేసుకున్నాడనే కారణంతో వైద్యుడిని 48 గంటల్లోనే విధుల నుంచి తొలగించడం అన్యాయమని వైద్యులు వాదిస్తున్నారు. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగారు. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు శుక్రవారం మూకుమ్మడి సెలవుపై వెళ్లారు. దీంతో, ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచి్చన రోగులు, వారి సంబంధీకులు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. సిమ్లాతోపాటు ధర్మశాల, నహాన్, హమీర్పూర్, ఉనా తదితర జిల్లాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. శనివారం నుంచి జరుగుతున్న నిరవధిక సమ్మె సందర్భంగా ఎమర్జెన్సీ సేవలు మాత్రమే పనిచేస్తాయని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ‘వైద్యుడు అవ్వాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వైద్యుడూ మానవమాత్రుడే. ఘటనలో అనుచిత ప్రవర్తనను మేమూ అంగీకరిస్తున్నాం. ఆరు గంటల్లో సస్పెండ్ చేశారు సరే. క్రమ శిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యుడైన వైద్యుడిని 48 గంటల్లోనే విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడం సరికాదు. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నదే మా ఏకైక డిమాండ్’అని వివరించింది. ‘ప్రభుత్వ చర్య వైద్య వర్గాల్లో తీవ్ర వ్యతిరేక ప్రభావం కలిగించింది. ఏమాత్రం భద్రత లేదని వైద్యులు భావించే పరిస్థితికి వైద్యులు చేరుకున్నారు’అని తెలిపింది. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ పల్మనరీ వార్డులో సోమవారం అర్జున్ సింగ్ అనే రోగి, రాఘవ్ నరులా అనే వైద్యుడిని నువ్వు అని సంబోధించడంతో మొదలైన గొడవ, ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. డాక్టర్ రాఘవ్ నరులా రోగిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారుల కమిటీ..ఇద్దరిదీ తప్పేనని తేలి్చంది. వైద్యుడు నరులా ప్రవర్తన ప్రజా సేవకుడి హోదాకు తగినట్లుగా లేదని పేర్కొనడంతో ప్రభుత్వం ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించింది. అయితే, హిమాచల్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, సిమ్లా అసోసియేషన్ ఆఫ్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ టీచర్స్, సిమ్లా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు డాక్టర్ నరులాకు మద్దతు ప్రకటించాయి. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం సీఎం సుఖ్వీందర్ సింగ్‌కు వినతిపత్రం సమర్పించాయి. -
తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీని కోరుతాం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)ఎస్ఐఆర్) సర్వే సమయంలో తొలగించిన 1.31 కోట్ల ఓటర్లకు సంబంధించిన జాబితా ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌ను కోరుతామని టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఈ నెల 31వ తేదీన జ్ఞానేశ్‌ను కలుస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఆ జాబితా ఇవ్వాలని అడుగుతామని, తమ డిమాండ్ నెరవేరని పక్షంలో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఘెరావ్ చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు తేలితే ఢిల్లీలోనే నిరసనలను కొనసాగిస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడించక పోవడానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సమయంలో కోటిన్నర మంది ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ టార్గెట్ అని దీనర్థమా అని బెనర్జీ వ్యాఖ్యానించారు. ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 58.20 లక్షల ఓటర్లలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ వలసదారులు ఎందరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ అనంతరం రాష్ట్రంలోని మొత్తం 10.05 కోట్ల జనాభాలో 5.79 శాతం జనాభా పేర్లను మాత్రమే తొలగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఇదే అత్యంత తక్కువని ఎత్తి చూపారు. పశ్చిమబెంగాల్లో 50 శాతం వరకు ఓటర్లను గుర్తించలేకపోయినట్లు ప్రకటించిన ఈసీ..89 శాతం మేర ఓటర్ల వివరాలను ఎలా ప్రచురించిందని నిలదీశారు. దీనిపై ఈసీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ముఖ్యమైన వ్యక్తులను సైతం చనిపోయిన జాబితాలో ఈసీ చేర్చిందన్నారు. ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయని, వీటిపై ఈసీపై కేసు ఎందుకు నమోదు చేయకూడదు? అంటూ బెనర్జీ నిలదీశారు. మీరు ఎస్ఐఆర్తో గెలవాలనుకుంటే, ప్రజలు ఎఫ్ఐఆర్తో బదులిస్తారని ఆయన ఈసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగిన త్రిపుర, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టడం లేదని ఈసీని అడిగారు. -
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
బనశంకరి: కర్ణాటక, కేరళ మధ్య తాజాగా చిచ్చు రేగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజరుతో ముస్లింల ఇళ్లను నేలమట్టం చేశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించడమే కారణం. బెంగళూరు యలహంకలోని కోగిలు లేఅవుట్ వద్ద ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులు నాలుగు రోజుల క్రితం కూల్చివేశారు. ఈ విషయమై విజయన్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బెంగళూరు ఫకీర్ కాలనీ, వసీం లేఅవుట్లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ముస్లింల ఇళ్లను బుల్డోజర్తో ధ్వంసం చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సంఘపరివార్ సర్కారు అనుసరిస్తున్న మైనారిటీ వ్యతిరేక ధోరణి కర్ణాటకలో కూడా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కపట ప్రవృత్తిని సెక్యులర్ ప్రజాస్వామ్య శక్తులు ఏకమై ఎండగట్టాలన్నారు. రాజకీయ జిమ్మిక్కులు వద్దు: డిప్యూటీ సీఎం డీకే కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పినరయి విజయన్ రాజకీయ జిమ్మిక్కులు చేయవద్దని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన స్పందిస్తూ.. ‘‘సీనియర్ నేత పినరయి విజయన్ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడారు. కొందరు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నివాసం ఉండడంతో మా ఎమ్మెల్యేలు, అధికారులు వాటిని తొలగించామని చెప్పారు. మాకు బెంగళూరు గురించి బాగా తెలుసు.. ఎవరు ఇళ్లు కోల్పోయినా వారికి రాజీవ్‌గాంధీ వసతి గృహమండలి ద్వారా ఇళ్లు కేటాయిస్తాం. మేము బుల్డోజర్ పద్ధతిని ఉపయోగించలేదు’’ అని తెలిపారు. విజయన్ ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడడం సరికాదని, ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలేది లేదని డీకే స్పష్టం చేశారు. -
మా ‘సిక్స్త్ సెన్స్’ ముందే చెప్పింది
న్యూఢిల్లీ: విబేధాలతో వ్యక్తిపై అత్యాచార కేసు నమోదుచేసిన బాధితురాలు తన మనసు మార్చుకుని అతడినే పెళ్లాడవచ్చని తాము ముందే ఊహించామని, తమ ‘సిక్స్త్ సెన్స్’ అదే చెప్పిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఓ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. మహిళను రేప్ చేశాడన్న కేసులో దోషిగా తేలి మధ్యప్రదేశ్ హైకోర్టులో పదేళ్ల శిక్ష పడిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సంబంధిత కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల విచారించింది. బాధితురాలు, దోషి వివాహంచేసుకుని గత ఆరునెలలుగా సంతోషంగా జీవిస్తున్న నేపథ్యంలో దోషికి గతంలో హైకోర్టు విధించిన శిక్షను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. డిసెంబర్ ఐదున వెలువ డిన ఈ కేసు తీర్పు వివరాలు ఆలస్యంగా శనివారం వెలుగుచూశాయి. ‘‘ శిక్షను రద్దుచేయాలంటూ అప్పీల్ చేసుకున్న వ్యక్తిని బాధితురాలు ఒకవేళ వివాహం చేసుకునేందుకు సుముఖత చూపితే ఇద్దరూ మళ్లీ కలిసిపోతారని మేం ముందే ఊహించాం. మా సిక్త్స్ సెన్స్ ఇదే చెప్పింది. ముందుచూపుతో ముందే ఊహించాం. ఇలాంటి కేసు నిజంగా అరుదైంది. బాధితురాలిని పెళ్లిచేసుకోవడం ద్వారా దోషిపై ఉన్న నేరారోపణలను, శిక్షను రద్దుచేస్తున్నాం’’ అని న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. 2015లో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వ్యక్తిని మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువతి ఇష్టపడింది. తర్వాత కొన్నాళ్లపాటు ఇద్దరూ సహజీవనంచేశారు. తర్వాత మనస్పర్థలొచ్చాయి. దీంతో పెళ్లాడతానని మాయమాటలు చెప్పి తనను పలుమార్లు అత్యాచారంచేశాడని మహిళ ఫిర్యాదుచేయడంతో 2021 నవంబర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది. తీర్పును అతను మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్‌చేయగా అక్కడా అతనికి చుక్కెదురైంది. పైగా పదేళ్ల కఠిన కారాగార శిక్షను, రూ.55,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పుచెప్పింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఇద్దరినీ, వాళ్ల తల్లిదండ్రులను సుప్రీంకోర్టు ధర్మాస నం పిలిపించింది. వివాహంచేసుకునేందుకు ఇరువైపులా సమ్మతి తెలపడంతో పెళ్లాడేందుకు వీలుగా అతనికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆ తర్వాత వాళ్లు పెళ్లాడారు. ఈ విషయంతెల్సి ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘‘ఇద్దరి మధ్య చిన్నపాటి బేధాభిప్రాయాలు ఉన్నట్లు మాకు అర్థమైంది. అనివార్య కారణాలతో వివాహం వాయిదావేద్దామని కలిసున్నకాలంలో అబ్బాయి చెప్పడంతో ఆగ్రహించిన అమ్మాయి నేరపూరిత రంగు పులిమి విషయాన్ని పెద్దదిచేసింది. వాస్తవానికి పెళ్లిచేసుకోవాలన్న ఉద్దేశం ఇద్దరికీ ఉందని మా సిక్త్స్ సెన్స్ ఎప్పుడో చెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా మాకు సంక్రమించిన అసాధారణ అధికారాలతో ఎఫ్ఐఆర్ను, ట్రయల్ కోర్టులో తీర్పును రద్దుచేస్తున్నాం. తద్వారా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంబంధిత కేసు నిర్వీర్యమైపోయినట్లే’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
ఫొటో 2025
వేయి వాక్యాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటో పట్టిచూపుతుందని ఒక విశ్లేషణ. అలా 2025 ఏడాదిలో విశ్వవ్యాప్తంగా పలు ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి.సమాజంపై ప్రభావితంచూపిన, చర్చనీయాంశమైన చిత్రాలివి..పెళ్లయి కాళ్లకు పారాణి కూడా ఆరకముందే ఉగ్రవాదుల పైశాచికకాండలో భర్తను కోల్పోయి అతని మృతదేహం వద్ద నిశ్చేష్టురాలై కూలబడిన నవ వధువు ఫొటో ఇది. పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లు నిండిపోయిన భారత నావికాదళాధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోగా కాపాడండి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరచి అలసిపోయిన భార్య హిమాన్షీ ఫొటో ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలో ప్రచురితమైంది. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం పరిధిలోని బైసారన్ పచ్చికబయళ్లలో అమాయక పర్యాటకులపై ఉగ్రమూకలు దాడిచేయడం, అందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేయడం తెల్సిందే.అగ్రరాజ్యాధినేత అధికారి నివాసం వైట్‌హౌస్ ఒక్కసారిగా రచ్చబండగా మారిన అరుదైన క్షణం తాలూకు ఫొటో ఇది. మాట్లాడుకుందాం అంటూ ఆహా్వనించి మీడియా ప్రతినిధుల ఎదుట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్కువచేసి మాట్లాడటం, దానికి జెలెన్స్కీ దీటుగా బదులివ్వడం, చివరకు ద్వైపాక్షిక భేటీ వాగ్వాదాలమయంగా మారడం తెల్సిందే. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ వాగ్వాదాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రపంచదేశాలన్నీ చూశాయి. అతిథిని అవమానించిన ట్రంప్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం గాల్లోకి లేచిన 32 సెకన్లకే ఎదురుగా ఉన్న వైద్యకళాశాల భవనంపై కుప్పకూలిన అత్యంత విషాధ ఘటన తాలూకు ఫొటో ఇది. 12 మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలి అగ్నిగుండంగా మారి బూడిదైంది. ఈ ఘటనలో ఒక్కరే బతికి బయటపడ్డారు. విమానంలో సాంకేతిక లోపమా? పైలట్ తప్పిదమా అనేది మిస్టరీగా మారింది. దేశీయ విమానయాన రంగ భద్రతపైనా ఈ దుర్ఘటన నీలినీడలు కమ్మేలా చేసింది.వేగంగా మండే స్వభావమున్న వెదురు కర్రలు, స్టీరోఫోమ్ కిటికీలను నెలలతరబడి మరమ్మతుల కోసం వినియోగించడంతో అనుకోకుండా అంటుకున్న నిప్పురవ్వలు చివరకు హాంకాంగ్‌లోని ప్రముఖ వాంగ్‌ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ బహుళ అంతస్తుల భవనాలను నిలువునా బూడిదచేసిన దారుణోదంతం ఫొటో ఇది. ఈ ఘటనలో ఏకంగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తర్వాత హాంకాంగ్‌లో వెదురు కర్రలు, స్టీరోఫోమ్ వినియోగంపై పెద్ద చర్చే మొదలైంది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, నేతల విలాసవంత జీవితం, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన నేపాల్ యువత ఉవ్వెత్తున నిరసనోద్యమంగా ఎగసిపడిన క్షణం నాటి ఫొటో ఇది. జెన్ జెడ్ ఉద్యమంగా నేపాల్ ప్రధాన నగరాల్లో వేలాదిగా బారులుతీసిన విద్యార్థులు ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోశారు. ఈ దెబ్బకు సెపె్టంబర్ 9న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, కేబినెట్ మంత్రులు పదవులకు రాజీనామాచేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం తెల్సిందే. వారం తిరిగేలోపే మాజీ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.గాజాపై నెలల తరబడి వేల కొద్దీ బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఇళ్లు, ఆస్పత్రులు సహా ప్రతి కట్టడం కుప్పకూలడంతో నిలువనీడలేక, తినడానికి తిండిలేక, దుర్భర దారి్రద్యంలో బతుకీడుస్తూ అన్నదాన శిబిరాల వద్ద గిన్నె పట్టుకుని ఆహారం కోసం పోటీపడుతున్న చిన్నారులు వీరంతా. ఈ ఏడాది మొదట్లో గాజాలో ఓ శరణార్థి శిబిరంలో తీసిన ఈ ఫొటో అక్కడి దయనీయ స్థితికి అద్దంపడుతోంది. ఇకనైనా ఇజ్రాయెల్ దారుణదాడులను నిలిపివేయాలని ప్రపంచదేశాలు వేడుకుంటున్నా అమెరికా అండతో ఇజ్రాయెల్ ఈ అభ్యర్థనలను పెడచెవిన పెడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2025: ట్రంప్ నామ సంవత్సరం
కాలం నిజంగానే మాయల మరాఠీ. రెప్పపాటే అనిపిస్తుంది గానీ చూస్తుండగానే శరవేగంగా సాగిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. మంచీ చెడుల మిశ్రమ అనుభూతులు పంచి 2025 త్వరలో వీడ్కోలు చెప్పనుంది. ఈ సంవత్సరంలో ఎంతోమంది ప్రముఖులు మెరుపులు మెరిపించారు. కొందరు మరకలు అంటించుకుని తల దించుకున్నారు. ఇంకొందరు అనన్య సామాన్యమైన సాహసాలు, రికార్డులతో ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. అలా 2025లో వార్తల్లో వ్యక్తులుగా నిలిచి అందరి నోళ్లలోనూ నానిన టాప్ 10 ప్రముఖుల గురించి ఒకసారి చూద్దాం...తంపులమారి (డొనాల్డ్ ట్రంప్) నిస్సందేహంగా 2025 ట్రంప్ నామ సంవత్సరమే అని చెప్పాలి. మీడియా వ్యతిరేకత, దు్రష్పచారాల మోత తదితరాలను సమర్థంగా కాచుకుంటూ 78 ఏళ్ల లేటు వయసులో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఔరా అనిపించారు. కానీ ఈ ఏడాది మొదట్లో పీఠమెక్కింది మొదలు రోజుకో ఆకస్మిక నిర్ణయంతో దేశాల గుండెల్లో అక్షరాలా రైళ్లు పరుగెత్తించారు. ముఖ్యంగా ఆయన ఎడాపెడా బాదిన టారిఫ్‌ల ధాటికి భారత్ తో సహా చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరే అయ్యాయి. అయితే వాటిని అంతే వేగంగా తగ్గించడం, రద్దు చేయడం వంటి చర్యలతో ట్రంప్ నవ్వులపాలు కూడా అయ్యారు. అమెరికాతో పరువుతో పాటు అగ్ర రాజ్య అధ్యక్ష పీఠం హుందాతనాన్నీ తన ప్రవర్తనతో పలుమార్లు పలుచన చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ఇప్పటికి కనీసం 75 సార్లకు పైగా ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ఖండించినా, పాక్ కాళ్లబేరానికి వచ్చినందుకే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసినా పట్టించుకోలేదు. ఈ విషయంలో సెంచరీ కొట్టడమే ట్రంప్ లక్ష్యం కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా పేలాయి. రష్యా–ఉక్రెయిన్, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాలను కూడా చిటికెలో ఆపేస్తానంటూ బీరాలు పలికినా అవిప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గాజాను స్వా«దీనం చేసుకునేందుకు, వెనిజులాలోని చమురు నిల్వలను చెర పట్టేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా కాక రేపుతున్నాయి. రెండో టర్ములో ఇంకా ఏడాదైనా పూర్తవకుండానే ఇన్ని చుక్కలు చూపిన తంపులమారి ట్రంపు 2026లో ఇంకెంత విశ్వరూపం చూపుతారో చూడాలి!నిప్పులు చిమ్మి... (ఎలాన్ మస్క్) ఈ ప్రపంచ కుబేరునికి 2025 అక్షరాలా ఒక పీడకలగా మిగిలిపోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ తో కుదిరిన దోస్తీ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. దాంతో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకంటూ ట్రంప్ తనకు అప్పగించిన డోజ్ సారథ్యం కూడా అటకెక్కింది. చూస్తుండగానే ట్రంప్ తో మస్క్ విభేదాలు రచ్చకెక్కాయి. వారి రచ్చ నిత్యం వార్తల్లో నిలిచింది. దాంతో మస్క్ కంపెనీలు ఎక్స్, టెస్లా షేర్లు ఈ ఏడాదంతా భారీగా నేల చూపులే చూశాయి. కాకపోతే, ఏదో ఒక రూపంలో నిత్యం పతాక శీర్షికల్లో మాత్రం నిలవడం ఒక్కటే ఆయనకు ఊరట!నిరసన పతాక (మరియా కొరీనా మచాడో) వెనిజులా విపక్ష నేత. మదురో నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసిన మడమ తిప్పని పోరాటానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆమెను వచ్చి వరించింది. దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపే పోరాటంలో అవసరమైతే ప్రాణార్పణకు కూడా సిద్ధమంటూ కొన్నాళ్ల క్రితం ఆమె చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంది. ఆమెకు నోబెల్ బహుమానం నేపథ్యంలో వెనిజులాలో మానవ హక్కుల ఉల్లంఘన, మదురో నియంతృత్వం తదితరాలు మరోసారి చర్చల్లో నిలిచాయి. ట్రంప్ ను వెనక్కి నెట్టి మరీ ఆమె నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడం విశేషం. అయితే, ’వెనిజులా ప్రజాస్వామిక పోరాటానికి ఇస్తున్న నిరంతర మద్దతుకు’ గాను ఆమె తన పురస్కారాన్ని ట్రంప్ కు అంకితం చేయడం విశేషంగా నిలిచింది. మచాడో తరఫున ఆమె కూతురు ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.కుట్రలకు బలి (షేక్ హసీనా)బంగ్లాదేశ్ లో తెర వెనక కుట్రలకు బలైన మరో నేతగా నిలిచిన మాజీ ప్రధాని. భారత్ తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించడమే ఆమె పాలిట శాపమైంది. విద్యార్థులు, యువత మాటు మతోన్మాద, భారత వ్యతిరేక శక్తులు ఆజ్యం పోసిన అల్లర్లకు ప్రధాన లక్ష్యంగా మారారు. ప్రధాని పదవిని, దేశాన్ని వీడి భారత్ కు పారిపోయి వచ్చారు. అనంతరం పలు నేరాలపై అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష తో సహా పలు కఠిన శిక్షలు విధించాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ గుర్తింపు కూడా రద్దయింది. 15 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన హసీనా ఇప్పుడు 78 ఏళ్ల వయసులో పొరుగు దేశంలో చివరి రోజులు గడపాల్సిన పరిస్థితిలో పడ్డారు. నారీ శక్తులు (వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి) నారీ శక్తికి ప్రతిరూపాలు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ లో మన సైన్యం సాగించిన విధ్వంసం తాలూకు విశేషాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరి స్తూ 3 రోజుల పాటు ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించారు. పాక్ తప్పుడు ప్రచారాలను రుజువులతో సçహా ఎండగట్టారు. యుద్ధరంగంలోనే గాక మీడియా వార్ లో కూడా భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలిపారు. దాంతో వారి పేర్లు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. అంతర్జాతీయ సైనిక కవాతులో భారత దళానికి సారథ్యం వహించిన తొలి మహిళా ఆఫీసర్ అన్న రికార్డు సోఫియాది. కాగా వైమానిక దళంలో ఉజ్వలమైన కెరీర్ తో దేశ మహిళలకు స్పూర్తినిచ్చారు వ్యోమిక.వ్యోమ వీరుడు (శుభాంశు శుక్లా) ఆక్సియం – 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో కాలు పెట్టిన రెండో భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఈ ఏడాది మన నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పేర్లలో చేరారు. వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు అంతరిక్ష యాత్ర దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆ రంగం పట్ల ఎనలేని ఆసక్తిని పెంచింది. జపాన్‌లో నారీ భేరి (సనాయే టకైచీ) ఈ అక్టోబర్ లో జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాజకీయ రంగంలో స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సంప్రదాయం ప్రబలంగా ఉన్న జపాన్ లో ఇది నిజంగా అనూహ్యమే. అయితే టకైచీ కేబినెట్ మాత్రం పూర్తిగా పురుషులతోనే కిటకిటలాడిపోవడం విశేషం. దాంతో, స్త్రీ శక్తిపరంగా నిజమైన మార్పులను ఊహించిన వారంతా ఆశాభంగమే చెందారు.నూతన సారథి (పోప్ లియో 14) పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం సుదీర్ఘ ఎంపిక ప్రక్రియ అనంతరం వాటికన్ పగ్గాలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్ కాథలిక్కులకు సారథిగా గత మే నెలలో కొలువుదీరారు. అమెరికా ఖండం నుంచి వచ్చిన తొట్ట తొలి పోప్ గా కొత్త చరిత్ర సృష్టించారు.అప‘హాస్యం’ (సమయ్ రైనా, రణ్ వీర్ అలహాబాదియ) హాస్యం కాస్తా శ్రుతి మించితే ఏమవుతుందో ఫేమస్ యూట్యూబర్ రణ్ వీర్, స్టాండప్ కమెడియన్ రైనా వివాదం నిరూపించింది. తల్లిదండ్రులు, పిల్లల గురించి లైంగికపరంగా అత్యంత అసభ్యమైన కామెంట్లు, దివ్యాంగుల గురించి చౌకబారు వ్యాఖ్యలతో ప్రసారమైన వీరి పాడ్ కాస్ట్ లు అందరి ఆగ్రహానికి గురయ్యాయి. చివరికి విషయం అంటున్న న్యాయస్థానం దాకా చేరింది. కోర్టు వాళ్లకు పదేపదే అక్షింతలు వేయాల్సి వచ్చింది. క్రియేటివ్ ఫ్రీడం పేరిట వెర్రితలలు వేసే పోకడలను భారత సమాజం హర్షించబోదని ఈ ఎపిసోడ్ మరోసారి చాటింది.కాసుల వర్షమే (టేలర్ స్విఫ్ట్) సూపర్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఈ ఏడాది అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె ’ఎరాస్’ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సింగిల్ టూర్ గా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ షోలో భాగంగా స్విఫ్ట్ ఏకంగా ఐదు ఖండాల్లో 149 షోలు చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దాంతో ’ఎరాస్’ షో దాదాపుగా 200 కోట్ల డాలర్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లమంది కడుపు నింపిన జాతీయ ఉపాధి హామీ (మన్రే) పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీన్ని పేదల ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రగా అభివర్ణించారు. ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడమంటే దేశ గౌరవాన్ని కించపర్చడమే అని మండిపడ్డారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. బహుళ ప్రయోజనాలను ఆశించి నిరుద్యోగ, రైతు కూలీలు, దళిత, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో యూపీఏ ప్రభుత్వం మన్రేగా పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.పేదలకు జీవనాధారంగా మారిన ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వారి కడుపుకొట్టిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి పేదల బాధలు పట్టవని, కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపే ‘వీబీ జీ రామ్ జీ పథకం’పై జాతీయస్థాయి ఉద్యమాలే శరణ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మోదీ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.రాహుల్‌తో మాటా మంతీసీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరదాగా సంభాషించుకున్నారు. సమావేశం ముందు, తర్వాత.. రేవంత్ అధిష్టానం పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి నడిచారు. ఈ సమయంలో రేవంత్ వారితో చాలాసేపు నవ్వుతూ మాట్లాడారు. అలాగే.. రాహుల్‌తో ప్రత్యేకంగా కొంతసేపు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు, 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల్లో విజయాలు, నామినేటెడ్ పదవులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో సీఎం రేవంత్‌రెడ్డి -
మీనాక్షిని మారుస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ త్వరలోనే మారుతున్నారా? పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణకు బడా నేతను ఇన్చార్జిగా పంపాలనే యోచనలో హైకమాండ్ ఉందా? 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులను అనుకూలంగా మార్చే రాజకీయ వ్యూహకర్తల అన్వేషణలో ఢిల్లీ పెద్దలున్నారా? పార్టీ వ్యవహారాలపై పట్టు బిగించాలంటే అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్ లాంటి ఉద్ధండులు అవసరమవుతారనే భావనలో వారున్నారా? కొత్త ఏడాదిలో జరిగే ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పు జరగబోతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్న ఇబ్బందులు, ప్రొటోకాల్ సమస్య, ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను సమన్వయపర్చాల్సిన అవసరం వెరసి మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి మార్చనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవమున్న అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, హరీశ్ రావత్లలో ఒకరు తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ కూడా వినిపిస్తోంది. దీనికితోడు రాష్ట్రంలో నెలకొన్న పార్టీ పరిస్థితుల నేపథ్యంలో తాను ఇమడలేననే అభిప్రాయాన్ని మీనాక్షి ఢిల్లీ పెద్దల ముందుంచారని సమాచారం. మేడమ్ సమ్మతిమేరకేనా..? అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకునే తనను ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ హైకమాండ్‌ను మీనాక్షి కోరినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం కొన్ని కఠిన, కీలక నిర్ణయాలు అమలు చేయాలని భావించినా, క్షేత్రస్థాయిలో అందుకు అనుగుణంగా లేని పరిస్థితులు, నేతల నుంచి కొరవడిన సహకారం నేపథ్యంలో ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకునేందుకే ఆమె మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఫైర్‌బ్రాండ్‌గా ఎంట్రీ దొరికినా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టిన మీనాక్షి తొలి నుంచి పార్టీపై తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేశారు. పార్టీ విషయంలో అత్యంత నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరును ఆమె వచ్చీ రావడంతోనే తెచ్చుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి గల కారణాలను విశ్లేíÙంచారు. రాష్ట్ర, క్షేత్రస్థాయి నాయకత్వానికి మధ్య విపరీతమైన గ్యాప్ ఉందని గుర్తించి దానిని చక్కదిద్దే పని మొదలుపెట్టారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పాత కేడర్‌కు ప్రాధాన్యత, వరంగల్ జిల్లా, పఠాన్‌చెరు నియోజకవర్గాల కొట్లాట లాంటి వ్యవహారాల్లో రాష్ట్ర పార్టీ అవలంబించిన విధానాలు ఆమె అసంతృప్తికి కారణమయ్యాయనే చర్చ జరుగుతోంది. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు బయటపడటం, ఈ వ్యవహారంలో కనీసం మందలింపు కూడా లేకుండా సులువుగా సమస్యను పరిష్కరించామనే భావనను కలిగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు వ్యవహరించిన తీరు పార్టీ కేడర్‌లో తన పట్ల ఉన్న గౌరవాన్ని పోగొట్టాయనే అభిప్రాయంతో ఆమె ఉన్నట్టు సమాచారం.దీన్ని చక్కదిద్ది కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందామని భావించినా, రాష్ట్ర నేతల్లో కొందరు ఒకవైపు, మరికొందరు ఇంకోవైపు ఉండటంతో ఆమె ఎలాంటి నిర్ణయాలు అమలు చేయలేకపోయారు. పార్టీ పదవుల నియామకంలో తానొకటి తలిస్తే రాష్ట్ర నేతలు మరొకటి అవలంబించడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఫైర్‌బ్రాండ్‌గా ఎంట్రీ దొరికినా ఏడాది తర్వాత అసలు తానున్నానో లేనో అనే భావన పార్టీ కేడర్‌లో వచ్చిందని, తనను తెలంగాణకు పంపిన ఉద్దేశం నెరవేరనప్పుడు ఎక్కువ కాలం ఆ బాధ్యతలు నిర్వర్తించడం మంచిది కాదనే అభిప్రాయంతోనే ఆమె తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు ఏఐసీసీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న చోట ఈజీ కాదనే... పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వంతో సమన్వయం చేయడం అంత ఈజీ పనికాదని ఏఐసీసీ పెద్దలు సైతం గ్రహించినట్లు ఢిల్లీ వర్గాలంటున్నాయి. గతంలోనూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రులను ఇంచార్జులుగా పంపేవారు., దిగి్వజయ్‌సింగ్, గులాం నబీ ఆజాద్ తదితరులు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరచే విషయంలో చాలా కీలకంగా వ్యవహరించే వారు. పార్టీపై పట్టుపోకుండా ముందుకు నడిపించే వారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేపథ్యంలో వీరికి ప్రొటోకాల్ సమస్య కూడా ఉండేది కాదు. కానీ పార్టీ పరంగా పెద్ద హోదాలో ఉన్న మీనాక్షికి, ప్రభుత్వంలోని పెద్దలకు నడుమ ప్రొటోకాల్ సమస్య కూడా తలెత్తుతోంది.ఆ ముగ్గురిలో ఎవరు? మీనాక్షి స్థానంలో మాజీ సీఎంలు భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), అశోక్ గెహ్లాట్ (రాజస్తాన్), హరీశ్ రావత్ (ఉత్తరాఖండ్)లో ఒకరిని తెలంగాణకు కొత్త ఇన్చార్జిగా పంపిస్తారనే చర్చ జరుగుతోంది. ఇందులో బఘేల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నా.. ఆయన ప్రస్తుతం పంజాబ్ బాధ్యతలు చూస్తున్నారు. ఆ రాష్ట్ర యూనిట్లో అంతర్గత కలహాలు అదుపులోకి వచ్చేలా, ఎన్నికలకు ముందే వ్యూహాలను అమలు చేసే బాధ్యతలు ఆయ నపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో బఘేల్‌కు రాష్ట్ర బాధ్యతల అప్పగింతపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. రాజస్తాన్‌లో యువనేత సచిన్ పైలట్ ను హైలైట్ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను అక్కడి నుంచి పూర్తిగా వేరుచేయాలని భావిస్తోంది.ఆయనను తెలంగాణకు పంపితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మీనాక్షిని మహారాష్ట్రకు ఇన్చార్జిగా పంపే అవకాశాలున్నాయని అంటున్నారు. వీటన్నింటిపై కొత్త ఏడాదిలోనే నిర్ణయాలు ఉంటాయని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మీనాక్షి మార్పుపై రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేత ఒకరిని ‘సాక్షి’ ప్రశ్నించగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని ఇన్చార్జిగా పంపుతారనే చర్చ కొంతకాలంగా ఉందని, అయితే ఇప్పట్లో మీనాక్షిని మారుస్తారని తాను అనుకోవడం లేదని చెప్పడం గమనార్హం. -
ఘోరం.. ఆడపిల్లని కోపంతో ఆరేళ్ల చిన్నారిని
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆడపిల్ల అనే కోపంతో ఆరు సంవత్సరాల పసికందును సుప్రియ అనే ఓ కిరాతక తల్లి పొట్టన బెట్టకుంది. అనంతరం గుండెపోటుతో పాప మృతి చెందిందని కట్టుకథ అల్లింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.మహారాష్ట్ర నావీ ముంబై కళంబోళిలో మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం చిన్నారి తండ్రి ఎప్పటిలాగా విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. అయితే రావడంతోనే పాప అపస్మారక స్థితిలో పడి ఉండడం చూశారు. దీంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలిచంగా అప్పటికే తను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.అయితే దీనిని గుండెపోటుగా చిత్రీకరించడానికి సుప్రియ ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు శవపరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో తనకు బాబు కావాలని ఉండేదని దానికి తోడు చిన్నారి మరాఠీ మట్లాడకపోవడంతో ఇంకా పగ పెంచుకుందని పోలీసులు తెలిపారు. గతంలోనూ సుప్రియ తన కూతురుకు పలుమార్లు హానీ కలిగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
మోదీని ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ కామెంట్స్
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఒకప్పడు సాధారణ కార్యకర్తలా పనిచేసిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎదిగారన్నారు. ప్రధాని మోదీ 1990 దశకంలో ఉన్న చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో జోడిస్తూ ఈ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌ను ఇరుకున పడేశాయి.ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే పెనం లోంచి పొయ్యి మీద పడ్డ చందాన కనిపిస్తుంది. ఇప్పటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు తరచుగా ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తూ సంస్థాగత లోపాలను ప్రశ్నిస్తుంటే.. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు హస్తానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.దిగ్విజయ్ సింగ్, ప్రధాని మోదీకి సంబంధించిన 1990 దశకం చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ చిత్రంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘోలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంలో తీసింది. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఉన్నారు. ఇందులో ప్రధాని మోదీ సాధారణ కార్యకర్తలా అద్వానీ ముందు నేలపై కూర్చొని ఉన్నారు. ఆ చిత్రాన్ని ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేశారు."ఈ చిత్రాన్ని నేను కోరాలో చూశాను. ఇది చాలా ఇంపాక్ట్ పుల్ అనిపించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంటుందో ఈ చిత్రం తెలుపుతుంది. ఒకప్పుడు నాయకుల ముందు నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు దేశానికే ప్రధాని అయ్యారు. ఇది సంస్థ యెుక్క గొప్పతనానికి నిదర్శనం. జైశ్రీరామ్" అని దిగ్వీజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆ పోస్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ట్యాగ్ చేశారు.ఈ పోస్టుతో బీజేపీ కాంగ్రెస్‌పై అటాక్ స్టార్ట్ చేసింది. దిగ్విజయ్ సింగ్ పోస్టులకు రాహుల్ సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన దిగ్విజయ్ సింగ్ తాను ఆర్ఎస్ఎస్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తాను కేవలం ఆర్గనైజేషన్ సంస్థగత నిర్మాణాన్ని మాత్రమే తాను ప్రశంసించానని తెలిపారు.కాగా వారం రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలోని లోపాలను బహిరంగంగా ప్రశ్నించారు "రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌కు ఎలా సంస్కరణలు అవసరమో కాంగ్రెస్‌కు సైతం అదేవిధంగా సంస్కరణలు అవసరం. నాయకత్వ వికేంద్రీకరణ జరగాలి. మీరు అది చేయగలరని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని ఒప్పించడమే పెద్ద ప్రాబ్లం అని రాహుల్‌ని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలపై గతంలో దుమారం చెలరేగింది. -
గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.బడ్జెట్ ప్రతిపాదనలు2025-26 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకతగ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..విద్యుత్తు బిల్లుల చెల్లింపులునీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులుల్యాండ్లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.ప్రయోజనాలుయుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్‌లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్వర్తినెస్’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.చట్టపరమైన, సాంకేతిక సవాళ్లుప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్‌ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్‌లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే.. -
ప్రధానిపై విరుచుకపడ్డ రాహుల్
ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్ జీ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒంటి చేత్తో రాష్ట్రాలతో పాటు పేదల బతుకులపై దాడి చేశారన్నారు.నోట్ల రద్దు మాదిరిగా ఈ నిర్ణయం సైతం ఏక పక్షంగా తీసుకున్నారని తెలిపారు. వీబీ- జీ-రామ్ బిల్లుకు నిరసనగా త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని రాహుల్ తేల్చి చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్" (వీబీ-జీ రామ్ జీ) బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి పార్లమెంటు లోని ఊభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా ఈ పథకానికి మహత్మా గాంధీ పేరు మార్చడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ చర్యలు ఖచ్చితంగా మహాత్మున్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ ఒంటి చేత్తో రాష్ట్రాల్ని, పేదల్ని దెబ్బకొట్టారు. నోట్లరద్దు సమయంలో మాదిరి ఇప్పుడు అలానే వ్యవహరించారు. ప్రతిపక్షాలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా MGNREGA పథకాన్ని రద్దు చేశారు. దీనిని మేము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు సైతం మాతో కలిసి వస్తాయని ఆశిస్తున్నాం". అని రాహుల్ అన్నారు.మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. అటువంటి గొప్ప పథకాన్ని రద్దు చేయడం రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడేమనని తెలిపారు. వీబీ-జీ-రామ్ జీ బిల్లుకు నిరసనగా జనవరి 5నుంచి ప్రత్యేకంగా MGNREGA బచావ్ అభియాన్ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. MGNREGA స్థానంలో ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వీబీ-జీ-రామ్-జీ బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పని కల్పిస్తుంది. -
‘షార్ట్‌లతో తిరగొద్దు’.. హుకుం జారీ!
బాఘ్‌పత్: ఆధునిక పోకడలతో యువత తప్పుదారి పడుతోందని భావించిన ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్ జిల్లా ‘థాంబా దేశ్ పంచాయతీ’ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో సంప్రదాయ విలువలను కాపాడటంతో పాటు, పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా టీనేజర్లపై పలు ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేసింది. 18 నుంచి 20 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులు స్మార్ట్ఫోన్లు వాడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో హాఫ్ ప్యాంట్లు (షార్ట్స్) ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు పంచాయతీ పెద్దలు ప్రకటించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని, వీటిని ఉల్లంఘించిన వారిపై సామాజిక చర్యలు ఉంటాయని హెచ్చరించారు.గౌరవ మర్యాదలకు భంగంఈ నిర్ణయానికి గల కారణాన్ని పంచాయతీ పెద్దలు వివరిస్తూ.. స్మార్ట్ఫోన్ల కారణంగా పిల్లలు కుటుంబానికి దూరమవుతున్నారని, ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లను కేవలం ఇళ్లకే పరిమితం చేయాలని, అవసరమైతే తప్ప బయటకు తీసుకురావద్దని వారు సూచించారు. పాశ్చాత్య దుస్తులైన హాఫ్ ప్యాంట్లు ధరించడం వల్ల గ్రామీణ ప్రాంత గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, అందుకే యువతీయువకులు సంప్రదాయ దుస్తులనే ధరించాలని తీర్మానించారు. యువత తమ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో కాకుండా కుటుంబ పెద్దలతో గడుపుతూ విలువలు నేర్చుకోవాలని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. #WATCH | Bagpat, Uttar Pradesh: Khap Panchayat banned boys from using smartphones and wearing shorts. pic.twitter.com/SiR4r4BQ2A— ANI (@ANI) December 26, 2025వాట్సాప్ ఆహ్వానాలు చాలు..వివాహ వేడుకల విషయంలోనూ పంచాయతీ పెద్దలు పలు మార్గదర్శకాలను తెలిపారు. ఆడంబరాలకు పోయి భారీ ఖర్చులతో పెళ్లిళ్లు చేయవద్దని, ఇళ్ల వద్ద నిరాడంబరంగా వివాహాలు జరపాలని కోరారు. అతిథుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు, ఖరీదైన వివాహ పత్రికలకు బదులుగా వాట్సాప్ ద్వారానే ఆహ్వానాలు పంపుకోవాలని సూచించారు. ఈ నిబంధనలపై పంచాయతీ పెద్దలు చౌధరి ఒంపల్ సింగ్, బ్రజ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. సామాజిక ఐక్యతను కాపాడేందుకే ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ఇవి ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేవి కావని పేర్కొన్నారు.అన్ని గ్రామాల్లో అమలు? ఈ నిర్ణయం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాఘ్‌పత్ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతుండగా, యువత మాత్రం ఈ ఆంక్షలపై అసహనం వ్యక్తం చేస్తున్నది. డిజిటల్ యుగంలో ఫోన్లపై నిషేధం విధించడం తగినది కాదని కొందరు విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఆంక్షలను అన్ని గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. 285 మంది అరెస్ట్ -
ఢిల్లీలో హై అలర్ట్.. 285 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: కొత్త ఏడాది సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులు చర్యలు ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పరిధిలో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఏకంగా 285 మంది నేరగాళ్లను పోలీసులు కటకటాల వెనక్కి తరలించారు. ఈ ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున మారణాయుధాలు, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో అసాంఘిక శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఈ మెగా డ్రైవ్ నిర్వహించారు.‘ఆపరేషన్ ఆఘాత్’ (Operation Aaghaat) పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో పోలీసులు పక్కా వ్యూహంతో నేరస్తుల అడ్డాగా పేరున్న పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 40కి పైగా అక్రమ ఆయుధాలు, లక్షలాది రూపాయల నగదు లభ్యమైంది. వీటితో పాటు భారీ పరిమాణంలో డ్రగ్స్, అక్రమ మద్యం నిల్వలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1,000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేర చరిత్ర ఉన్న 285 మందిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.న్యూ ఇయర్ వేడుకల సమయంలో గొడవలకు దిగే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల పని పట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై ఆయుధ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మందు పార్టీలు చేసుకునే వారిపై, న్యూ ఇయర్ ముసుగులో రెచ్చిపోయే పోకిరీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే! -
UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ప్రక్రియ ముగిసింది. ఓటర్ల జాబితాలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ భారీ కసరత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించనున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ 31న ఎన్నికల కమిషన్ అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నది.ఈ భారీ కసరత్తుకు సంబంధించి అధికారులు గణాంకాలను వెల్లడించారు. తొలగించిన పేర్లలో దాదాపు 1.25 కోట్ల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు బూత్ లెవల్ అధికారులు గుర్తించారు. అలాగే సుమారు 45.95 లక్షల మంది ఓటర్లు మరణించగా, 23.59 లక్షల మంది పేర్లు రెట్టింపు (డూప్లికేట్) అయినట్లు నిర్ధారించారు. మిగిలిన వారిలో సుమారు 84 లక్షల మంది ఓటర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం (మిస్సింగ్) గమనార్హం. ముఖ్యంగా రాజధాని లక్నోలోనే ఏకంగా 12 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు సమాచారం.ఈ పరిణామాల నేపధ్యంలో అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల పారదర్శకత కోసమే ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. లక్నో పరిధిలోని మలిహాబాద్, మోహన్‌లాల్‌గంజ్ తదితర నియోజకవర్గాల్లో 83 శాతం మంది దరఖాస్తులు సమర్పించగా, లక్నో కంటోన్మెంట్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చట్టబద్ధంగా అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఎన్నికల సంఘం తగిన సమయాన్ని కేటాయించింది.ప్రస్తుతం ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 31న ప్రకటించనున్న ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే 2026, జనవరి 30లోపు ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు. తుది ఓటర్ల జాబితాను 2026, ఫిబ్రవరి 28న అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ భారీ మార్పులు 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావితం చేస్తాయనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.ఇది కూడా చదవండి: మక్కాలో కలకలం.. వీడియో వైరల్ -
మరో దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి రెడీ: సీడబ్ల్యూసీలో ఖర్గే
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరుగుతున్న ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఇతర సీనియర్లు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వీబీ జీ రామ్ జీ మార్చడంపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తుడిచి వేసే ప్రయత్నం చేస్తుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపైనే దేశవ్యాప్త పోరాటాలు చేయాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ.. ఎంజీఎన్ఆర్ఈజీఏ రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువు. పథకాన్ని రద్దు చేయడం(పేరు మార్చడం)మహాత్మా గాంధీకి అవమానమే. యూపీఏ హయాంలో.. దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చిన పథకం. అలాంటి పథకాన్ని ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేశారు. హయాంలో అమలైన హక్కులను కావాలనే కూల్చేస్తున్నారు. పని హక్కు మీద మోదీ సర్కార్ చేస్తున్న క్రూర దాడి ఇది. పేదల కంటే కార్పొరేట్ల లాభాలే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యం. మూడు నల్ల వ్యవసాయ చట్టాల తరహాలోనే. .. ఎంజీఎన్ఆర్ఈజీఏ MGNREGAపై దేశవ్యాప్త పోరాటం అవసరం. కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధం. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం’’ అని ప్రకటించారాయన. అలాగే.. ఈడీ, ఐటీ, సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల హక్కులపై కుట్ర జరుగుతోంది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పేర్లు తొలగించొద్దు. నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. అలాగే.. దేశంలో సామరస్యం దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అని ఖర్గే పేర్కొన్నారు.కాంగ్రెస్ ‘సంస్థా శ్రీజన్ అభియాన్’ కొనసాగుతోంది. ఇప్పటికే 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అయ్యింది. బూత్ స్థాయి వరకూ పార్టీ బలోపేతం చేస్తాం. 2026లో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అని ఖర్గే అన్నారు. థరూర్ పరుగు.. నమస్తేచాలాకాలంగా కాంగ్రెస్ కీలక సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ.. హట్ టాపిక్‌గా మారిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఎట్టకేలకు ఇవాళ సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యారు. ఆ సమయంలో మీడియా కెమెరాలు ఆయన వైపే తిప్పాయి. దీంతో ఆయన వేగంగా పరిగెత్తుకుంటూ డోర్ దాకా వెళ్లారు. అక్కడ నుంచి అందరి చూస్తూ నమస్కారం చేసి లోపలకు వెళ్లిపోయారు. అంతకు ముందు.. ఇందిరా భవన్ ప్రాంగణంలో కనిపించిన ప్రతీ ఒక్కరికీ షేక్‌హ్యాండ్ ఇస్తూ చిరునవ్వుతో పలకరించారాయన. Delhi: Congress MP Shashi Tharoor reaches the Congress headquarters for the CWC meeting pic.twitter.com/AT3XlczxIG— IANS (@ians_india) December 27, 2025గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక లైన్ అంశాలపై మాట్లాడుతున్న ఆయన.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కీలక భేటీ సహా మూడు సమావేశాలకు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం కేంద్రం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందులో థరూర్ పాల్గొని కాంగ్రెస్ సీనియర్లతోనే విమర్శలు ఎదుర్కొన్నారు.సోనియా, రాహుల్‌తో రేవంత్ భేటీఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, అటు ఏపీ నుంచి సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజులు హాజరయ్యారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ కాసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
డిజిటల్ సంస్కరణలకు జగన్ మోడల్‌ను అప్లై చేస్తే..
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే రూపాయిలో.. ప్రజలకు చేరేది కేవలం 15 పైసలు మాత్రమే. మధ్యలో అవినీతి, పరిపాలనా ఖర్చులే అందుకు కారణాలుగా ఉన్నాయ్.. ఈ మాట ఒకప్పడు ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ చేసింది. తరువాతి దశాబ్దాల్లో, సంక్షేమ పథకాలలో లీకేజీలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇన్నేళ్లు గడిచాక డిజిటల్ విప్లవం కారణంలో ఆ పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు కనిపిస్తోంది.తప్పుడు క్లెయిమ్స్, ప్రజా సంక్షేమ పథకాలలో అవినీతి.. అర్హత లేని లబ్ధిదారులు అనేవి ఇందులో ప్రదానంగా సమస్యలు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1–3 ట్రిలియన్ డాలర్ల వరకు ఆ నష్టం జరుగుతోంది. అయితే.. దీనిని తగ్గించడానికి భారత్ సహా అనే దేశాలు ఏఐ, డిజిటల్ ఐడెంటిటీ, ప్రాసెస్ రీడిజైన్ వంటి పద్ధతులను పాటిస్తూ మెరుగైన ఫలితాలు రాబట్టుకోలుగుతున్నాయి.ఆయా దేశాల్లో..ఈ ఏడాది బీసీజీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూఎస్ మెడికెయిడ్(అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం) ఏఐని ఉపయోగించి తప్పుడు క్లెయిమ్స్‌ను తప్పించుకుని 1 శాతం ఖర్చు.. అంటే దాదాపు 9 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకోగలిగింది. ఆసియా-ఫసిఫిక్ రీజియన్లలో డాక్టర్లు పేషెంట్లకు అత్యధికంగా యాంటీబయటిక్స్ను సూచించిన విషయాన్ని డాటా బేస్ ఆధారంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఆ వెంటనే వైద్యులను కంపేరిజన్ లేఖల ద్వారా అప్రమత్తం చేసింది. దీంతో ఒక ఏడాదిలోనే అలాంటి ప్రిస్క్రిప్షన్లలో 12 శాతం తగ్గుదల కనిపించింది.సింగపూర్‌లో ప్రజా సంక్షేమ పథకాల కోసం ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ (చాట్‌బాట్/డిజిటల్ సహాయకుడు) ప్రవేశపెట్టారు. దీంతో కాల్ సెంటర్లకు కాకుండా.. ప్రజలు ఏఐ అసిస్టెంట్ ద్వారా నేరుగా సమాధానాలు పొందగలిగారు. ఈ ప్రభావంతో ఫోన్ కాల్స్ సంఖ్య 50 శాతానికి తగ్గింది. ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రజలకు సమాచారం అందడం సులభతరం అయింది.కెనడా రెవెన్యూ ఏజెన్సీ.. ఏఐను ఉపయోగిస్తూ ట్యాక్స్ మోసాలకు చెక్ పెడుతోంది. యునైటెడ్ కింగ్డమ్లో డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్(DWP) డేటా ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చుకుంది. ఈ డాటా ద్వారా తప్పుగా జరిగే చెల్లింపులను (overpayments) తగ్గించుకుని.. ఈ ఒక్క ఏడాదిలోనే 500 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.5,000 కోట్లకు పైగా) నష్టం జరగకుండా చూసుకుంది.మరి భారత్ విషయానికొస్తే..భారత్‌లో సంక్షేమ పథకాల లభ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. అయితే వీటిల్లో లీకేజీలని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్పలితాలనే ఇస్తున్నాయి. భారత్‌లో బయోమెట్రిక్, ఆధార్ తరహా డిజిటల్ ఫస్ట్ ఐడీ.. వాటి అనుసంధానాలతో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ డిజిటల్ చెల్లింపుల సంస్కరణలతో ఈ ఏడాది సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న ధనంలో దాదాపు 13% లీకేజీలు తగ్గాయని బీసీజీ నివేదిక ఇచ్చింది. అంటే.. అప్పటిదాకా వెళ్ళిన నిధుల్లో కొంత అర్హత లేని/నకిలీ లబ్ధిదారులకు వెళ్ళిందని సూచించినట్లే కదా.జగన్ మోడల్ కలిస్తే..ప్రజా సంక్షేమంలో భారత్ పూర్తిస్తాయి లీకేజీలను అరికట్టాలంటే .. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిన డీబీటీ వ్యవస్థ(Direct Benefit Transfer) కచ్చితంగా అవసరమనే చర్చ నడుస్తోంది. అందుకు సహేతుకమైన కారణాలను వివరిస్తున్నారు. డీబీటీ మన దేశానికి కొత్తది కాదు. ఇది 2013లోనే ప్రారంభమైంది. అయితే ఇన్నేళ్ల కాలంలో సంపూర్ణంగా.. అదీ సమర్థవంతంగా అమలు చేసింది మాత్రం ఒక్క జగన్ ప్రభుత్వమే!.2019లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సంక్షేమ పథకాలను (అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా పథకాలెన్నో) వంద శాతం డీబీటీ ఆధారంగా మార్చింది. ఆధార్ అనుసంధానం(తప్పనిసరి), బయోమెట్రిక్ ధృవీకరణలకు బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరి చేసింది. తద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేసింది. అలా.. జగన్ స్వయంగా బటన్ నొక్కడం ద్వారా ఐదేళ్ల కాలంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసిన నగదు.. అక్షరాల రూ.2.70 లక్షల కోట్లు.వైఎస్సార్సీపీ హయాంలో మధ్యవర్తుల అవసరం లేకుండా పోయింది. లంచాల రూపంలో అవినీతికి ఆస్కారం కనిపించలేదు. నేరుగా అర్హత ఉన్నవాళ్ల ఖాతాల్లోకే వెళ్తున్నందునా.. ఒక్క పైసా కోత పడేది కాదు. ఆఖరికి కరోనా టైంలోనూ డీబీటీ ద్వారానే సంక్షేమం అందించడం ఇక్కడ మరో రికార్డు. కాబట్టి.. జగన్ డీబీటీ మోడల్‌ను అనుసరిస్తూనే ఏఐ, బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తే ప్రజా సంక్షేమంలో లీకేజీలను తగ్గించి ప్రతీ రూపాయి కూడా అర్హులైన వారికి చేరగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
యశవంతపుర (బెంగళూరు): ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో మహిళలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను మొబైల్‌ఫోన్ రికార్డ్ చేయడానికి యత్నించాడో జూనియర్ టెక్నిషియన్. నాగరబావి సెకండ్ స్టేజ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సువెందు మెహతా (23) అనే కామోన్మాదిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడు ఏడాదిగా ఈ ఆస్పత్రిలో టెక్నిషియన్‌గా పని చేస్తూ పీజీ హాస్టల్లో ఉండేవాడు. 20న ఉదయం 8:30 గంటలకు శస్త్రచికిత్స విభాగం గదిలో మహిళా సిబ్బంది బట్టలు మార్చుకొనే దృశ్యాలను రికార్డ్ చేయడానికి రహస్యంగా మొబైల్ఫోన్ని పెట్టాడు. ఫోన్ చూసిన నర్సులు కేకలు వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది! -
బులెట్ బైక్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు..
యశవంతపుర: అచ్చం సినిమా స్టైల్లో ఈ ఘటన జరిగింది. కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న కారు.. ముందు వెళుతున్న బులెట్ బైక్‌ను ఢీకొని అర్ధ కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. సుమనహళ్లి వంతెనపై బుధవారం రాత్రి జరిగిన ఘటన వీడియో ఆలస్యంగా వైరల్ అయ్యింది. కారులోని వ్యక్తి ఇస్టానుసారం నడుపుతూ బులెట్ బైకును లాక్కొని వెళ్లాడు. నీ కారుకు బైక్ చిక్కుకుందని పక్కలో వెళ్లతున్న మరో కారు డ్రైవర్ హెచ్చరించినా పట్టించుకోలేదు. బుల్లెట్వాహనదారు రోహిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ రభసకు కారు కింద నిప్పురవ్వుల ఎగజిమ్మాయి, మంటలు వ్యాపించటంతో ఇతర వాహనదారులు భయపడ్డారు. నాయండహళ్లి జంక్షన్ వద్ద కొందరు ఆ కారును అడ్డుకొని పోలీసులకు పట్టించారు. డ్రైవర్ తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. తాగిన మత్తులో ఉన్నాడని తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుదొడ్డబళ్లాపురం: గత నాలుగు రోజుల్లో బెంగళూరులో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసారు. 1,27,938 వాహనాలు తనిఖీ చేయగా మద్యం తాగి నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. नशे में धुत कार ड्राइवर ने बुलेट को मारी टक्कर, 500 मीटर तक घसीटा #BhrashtMahayutiBMC pic.twitter.com/CfJD2pD7NX— HASHTAG BHARAT NEWS (@HTB_tweets) December 26, 2025 -
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ఆఫీస్ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్‌కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు. ఒక్క నిమిషం ఆమెకు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ వెంటనే ధైర్యం తెచ్చుకున్న యువతి ఆ మృగాడి చెంపలు చెడామడా వాయించింది.డిసెంబర్ 23 సాయంత్రం నమ్మా మెట్రో(బెంగళూరు) ప్రయాణిస్తున్న ఒక యువతి, తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘నా ప్రయాణం అప్పటిదాకా సాఫీగా సాగింది. మధ్యలో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దిగిపోవడంతో, మరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. నా మీద పడడం, శరీర భాగాలకు తాకడంతో ఇబ్బంది పడ్డా. అయితే రద్దీ కాబట్టి యాదృచ్ఛికమని భావించా. ఈలోపు.. అతని తీరు మారింది. కావాలనే చేస్తున్నాడని అర్థమైంది. ఇదేమిటన్నట్లు చూస్తే వెకిలినవ్వులు నవ్వాడు. ఇంతలో.. నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది. అతను మరికొందరిని కూడా ఇలాగే వేధించే అవకాశం ఉందని భావించా. అతని చెంప పగలకొట్టి లేవమన్నా. స్టేషన్ బయటకు వచ్చాక మరోసారి చెంప పగలకొట్టా. కెంపగౌడ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బంది అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం ఏ అమ్మాయికీ లేదు’’ అంటూ ఆమె వీడియో ఉంచింది. ఈ ఘటనపై ఆ యువతి ఉప్పారపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అతని పేరు ముత్తప్ప (48) అని తెలిసింది. తర్వాత తప్పయిపోయిందంటూ అతడు యువతి పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు. యువతి అంగీకరించడంతో అతనిని మందలించి పంపించివేశారు. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. Namma Metro Harassment Case | ನಮ್ಮ ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಕಾಮುಕ ಅಂಕಲ್ ಕಾಟ | Bengaluru....#NammaMetro #MetroHarassment #BengaluruNews #WomenSafety #MajesticMetro #PublicSafety #HarassmentCase #bengaluru pic.twitter.com/YaNsNgACW4— Sanjevani News (@sanjevaniNews) December 26, 2025 -
నవ్య– మానస చావులోనూ స్నేహబంధం
సాక్షి, బళ్లారి: బెంగళూరు నుంచి గోకర్ణకు బయలుదేరిన ప్రైవేటు సీబర్డ్ స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సును– కంటైనర్ లారీ ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులోని నలుగురు యువతులు, ఓ బాలిక, లారీ డ్రైవర్ కలిసి ఆరు మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకాలో 48వ హైవేలో జరిగిన ఘోర దుర్ఘటన ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. సుమారు 25 మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ రఫీ మృతి బస్సు డ్రైవర్ మహమ్మద్ రఫీ హుబ్లీ కేఎంసీఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ప్రమాదం జరగగానే కిటికీలో నుంచి రఫీ దూకేశాడు. ఆ సమయంలో కాళ్లు చేతులకు గాయాలు తగిలాయి, కానీ కోలుకోలేకపోయాడు. దీంతో మృతుల సంఖ్య 7కు పెరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయపడినవారు ఇప్పటికీ ఆ ఘోరాన్ని తలచుకుని వణికిపోతున్నారు. బయటపడ్డ బండారి యశవంతపుర: కార్వార కుమటాకు చెందిన విజయ్ బండారి అనే యువకుడు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఆ తొందరలో మొబైల్‌ఫోన్, లగేజీని బస్సులోనే వదిలేయడంతో బూడిదయ్యాయి. కుటుంబసభ్యులను సంప్రదించడం వీలు కాకపోయిందని చెప్పాడు. చివరికి ఎలాగో వారికి క్షేమ సమాచారం పంపించాడు.నవ్య– మానస చావులోనూ స్నేహబంధంఅందరి మృతదేహాలు హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో ఉండడంతో కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరారు. నవ్య కుటుంబ సభ్యుల వేదనను ఆపడం ఎవరితరమూ కాలేదు. మృతులు నవ్య, మానస ఒకటవ తరగతి నుంచి స్నేహితులని, ఎంటెక్ వరకు ఒకే కాలేజీలో చదువుకొని బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. హాసన్ జిల్లా చెన్నరాయపట్టణవాసి మానస, మండ్య జిల్లా కేఆర్ పేట తాలూకావాసి నవ్య. నిజానికి ఒకే రోజు తమ తమ పెళ్లిళ్లు జరగాలని కూడా అనుకున్నారు. మృత్యువులోనూ కలిసే వెళ్లారని బంధువులు తెలిపారు. ఎవరి మృతదేహం ఎవరిదో తెలియనంతగా కాలిపోవడంతో మృతుల బంధువుల నుంచి, శవాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదికలను బట్టి మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నివేదికలు వస్తాయని చెప్పారు.కళ్ల ముందే స్నేహితురాలు..బనశంకరి: బస్సు ప్రమాదంలో గాయపడిన టెక్కీ గగనశ్రీ బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో శుక్రవారం ఆ ఘోర దుర్ఘటన గురించి వివరించింది. బస్‌లో పైన సీటులో నిద్రపోయిన నేను, ప్రమాదం జరిగిన వెంటనే రక్షితతో కలిసి బయటకు దూకాము. రశ్మి కూడా దూకేలోపు ఆమె మంటల్లో చిక్కుకుందని తెలిపింది. గోకర్ణ కు వెళ్లి రశ్మి ఇంటికి వెళ్లాల్సి ఉంది, బస్లోపల ఉన్న లగేజీ బ్యాగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి, రశ్మి బయటకు రావడానికి దేవుడు సమయం ఇవ్వలేదు అని ఆమె ఆవేదన చెందింది. మృతురాలు రశ్మి మురుడేశ్వరవాసి. ఈ ముగ్గురు ప్రమాదానికి ముందు తీసుకున్న ఫోటో వైరల్ కావడం తెలిసిందే. ప్రి వెడ్డింగ్ పారీ్టపై నిప్పులు బాధితుల్లో 7 మంది బృందం బెంగళూరు మావళ్లి, బిన్నిమిల్స్వాసులు. మంజునాథ్– కాబోయే భార్య కవిత, స్నేహితులు దిలీప్, సంధ్య, శశాంక్, బిందు–ఆమె కూతురు గ్రేయ. వీరందరూ బెంగళూరులో టెక్కీలుగా పనిచేస్తారు. మంజునాథ్– కవితకు ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో స్నేహితులకు గోకర్ణలో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలనుకుని అందరూ ఈ బస్సులో ఎక్కారు. మంజునాథ్‌కు తీవ్ర కాలినగాయాలు కాగా, బెంగళూరు విక్టోరియాలో చికిత్స పొందుతున్నాడు. ఇక దిలీప్‌కు బిందు సొంత సోదరి అవుతుంది. ఇలా ఒకరికొకరికి బంధుత్వాలు కూడా ఉన్నాయి. బిందు, ఆమె కూతురు ప్రమాదంలో చనిపోయారు. -
బలుపు మాటలకు భారత్ రియాక్షన్
భారత్ దృష్టిలో తాము పరారీలో ఉన్న కీలకమైన వ్యక్తులమంటూ.. లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అలాంటి వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్‌లో పార్టీలు చేసుకుంటూ.. భారత దర్యాప్తు సంస్థలను(Enforcement Agencies) ఎగతాళి చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రంధీర్ జైస్వాల్ శుక్రవారం జరిగిన ప్రెస్మీట్లో స్పందించారు. “అలాంటి పరారీలను తిరిగి తీసుకురావడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రక్రియలో అనేక ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. అయితే.. చట్టపరమైన అనేక దశల కారణంగా ఆలస్యం జరుగుతోంది.అంతేతప్ప మరొక ఉద్దేశం లేదు. అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారాయన.VIDEO | Delhi: “The Government of India is committed to bringing back all fugitives who have fled the country and evaded the law. Discussions are ongoing with several countries in this regard, and I want to assure you that we are firm and fully committed to ensuring their… pic.twitter.com/f7wcs5kwrR— Press Trust of India (@PTI_News) December 26, 2025బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం నుంచి పరారై లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా ఇటీవల(డిసెంబర్ 16న) 70వ పుట్టినరోజు చేసుకున్నారు. దీనికి భారత బిలియనీర్ కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ లలిత్ మోదీ, విజయ్ మాల్యా తాము అతి పెద్ద పరారీలో ఉన్న వ్యక్తులుగా నిలిచామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘లెట్స్ బ్రేక్ ద ఇంటర్నెట్ డౌన్ ఇన్ ఇండియా ఎగెయిన్ (మళ్లీ భారత్‌లో ఇంటర్నెట్ను బద్దలు కొడదాం)’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఫ్రాడ్, మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన వీళ్లు ఇలా వెటకారంగా స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయి లండన్‌లో తలదాచుకున్నాడు. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఆ మధ్య ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన వెల్లడించాడు. కానీ, భారత ప్రభుత్వం ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల అబియోగాలు నమోదు చేసింది. ఇక మరో బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్‌కు కావలసిన నిందితుడు. 2017లో లండన్‌లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈడీ ఇప్పటికే మాల్యా ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన నిధులను ఉద్యోగులకు, బ్యాంకులకు తిరిగి ఇచ్చింది. అలాగే.. ఆయన్ని భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో కూడా పురోగతి కనిపిస్తోంది. అయితే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిందటి ఏడాది పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా.. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆర్థిక మంత్రి ప్రకటన సమయంలో.. విజయ్ మాల్యా తీవ్రంగా స్పందించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్‌డే శుభాకాంక్షలు’’ అంటూ ఓ పోస్ట్ చేశాడు. -
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల(బీఎంసీ) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఎన్నికల చర్చలు విఫలమైనట్టు సమాచారం. పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అంశంపై సీట్ల పంపకాలపై శుక్రవారం పూణేలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శరద్ పవార్ వర్గానికి కేవలం 35 స్థానాలను మాత్రమే ఇస్తానని, అది కూడా గడియారం గుర్తుపై పోటీ చేయాలని అడిగారు. అయితే, ఈ ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం శరద్ పవార్ ముభావంగా అక్కడి నుంచి వెనుదిరిగినట్టు తెలిసింది. అజిత్‌తో చర్చలు విఫలమైన తర్వాత శరద్ పవార్.. సీట్ల పంపకాలపై చర్చల కోసం మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) వద్దకు తిరిగి వెళ్లారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్‌తో ముమ్మర చర్చలు జరిపినట్టు సమాచారం. పూణేలోని ఒక హోటల్లో జరిగిన ఎంవీఏ సమావేశంలో శరద్ పవార్ ఎన్సీపీ వర్గం నుండి బాపుసాహెబ్ పఠారే, అంకుష్ కాకడే.. కాంగ్రెస్ నుండి అరవింద్ షిండే, రమేష్ బాగ్వే.. అలాగే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వసంత్ మోరే చర్చల్లో పాల్గొన్నారు. మహాయుతి దూకుడు..మరోవైపు.. బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది. మహాయుతి వర్గాల ప్రకారం మొత్తం 227 సీట్లలో బీజేపీ 140 స్థానాల్లో పోటీ చేయనుంది. శివసేన (షిండే వర్గం) 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 210 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక, బీఎంసీ ఎన్నికలకు జనవరి 15, 2026న పోలింగ్ జరగనుంది. -
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
యశవంతపుర: ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ వధువు గానవి (26) గురువారం రాత్రి చనిపోయింది. వివరాలు.. అక్టోబర్ ఆఖరిలో సూరజ్‌తో గానవికి వివాహమైంది. వీరిద్దరూ బెంగళూరువాసులే. ఇటీవల శ్రీలంకకు హనుమూన్కు వెళ్లాగా అక్కడే గొడవపడి తిరిగి వచ్చారు. మూడురోజుల కిందట ఆమె భర్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. బ్రెయిన్‌డెడ్ అయి చివరకు మరణించింది. అతడు మగాడు కాదు గానవి పెద్దమ్మ మాట్లాడుతూ భర్త నపుంసకుడని, సంసారానికి పనికిరాడని గానవి తొలి రాత్రిరోజే తనకు చెప్పి బాధపడిందన్నారు. పెద్దమొత్తంలో బంగారం, స్థలం, కారు, ప్రతి నెలా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని భర్త వేధించేవాడని బంధువులు అరోపించారు. వారి ఫిర్యాదు మేరకు రామమూర్తినగర పోలీసులు నమోదుచేశారు. -
వార్తల వెం‘బడి’!
స్మార్ట్ఫోన్ల స్క్రీన్ల మధ్య నలిగిపోతున్న బాల్యాన్ని అక్షరాల వైపు మళ్లించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ’వార్తాపత్రిక పఠనం’ తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం చదవడమే కాదు.. విశ్లేíÙంచడం, నేర్చుకోవడం లక్ష్యంగా ఈ ’పఠన ప్రచారం’ సాగనుంది. నూతన మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో జరిగే మార్పులివే.. అసెంబ్లీలో 10 నిమిషాల పఠనం రోజూ ఉదయపు ప్రార్థన సమయంలో కనీసం 10 నిమిషాలు వార్తాపత్రికలు చదవాలి. జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలతో పాటు ముఖ్యమైన సంపాదకీయాలను విద్యార్థులు అందరికీ చదివి వినిపించాలి. పద సంపద ప్రదర్శన రోజూ దినపత్రికల్లోని ఐదు కఠిన పదాలను ఎంపిక చేసి, వాటిని నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. దీనివల్ల విద్యార్థుల పద సంపద మెరుగుపడుతుంది. పాఠశాల గ్రంథాలయాల్లో మాతృభాష హిందీతో పాటు ఆంగ్ల దినపత్రికలను కూడా అందుబాటులో ఉంచాలి. పువ్వులు వద్దు.. పుస్తకాలే ముద్దు.. నినాదంతో పాఠశాల వేడుకల్లో ట్రోఫీలకు బదులు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్లు, సంపాదకీయ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. పాఠశాల మ్యాగజైన్లు లేదా సొంతంగా పత్రికల నిర్వహణ, సుడోకు, క్రాస్‌వర్డ్ పోటీలను ప్రోత్సహిస్తారు. చిన్న పిల్లల కోసం వార్తల కటింగ్స్‌తో స్క్రాప్ బుక్ తయారు చేయిస్తారు. ఫోన్లకు బానిస కాకుండా.. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పార్థసారథి సేన్ శర్మ తెలిపారు. ‘వార్తాపత్రికలు చదవడం వల్ల పిల్లల్లో జనరల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సహాయపడుతుంది. ఏది నిజమైన వార్త, ఏది నకిలీ వార్త అనే తేడాను గుర్తించే పరిణతి వారిలో వస్తుంది’.. అన్నారాయన. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి.. విద్యార్థులను అక్షరాల వైపు మళ్లించేందుకు యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ పొట్ట కొట్టింది.. డిజైనర్ దారి తప్పాడు
ఒకవైపు ఆధునిక ప్రపంచం ’ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’ విజయాలను వేడుక చేసుకుంటుంటే.. అదే టెక్నాలజీ ఒక 18 ఏళ్ల కుర్రాడి పొట్ట కొట్టింది. చేతిలోని పనిని ఏఐ లాగేసుకోవడంతో, ఆకలి తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితురాలితో కలిసి చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఏం జరిగిందంటే? ఇండోర్‌లోని రావు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 22వ తేదీ రాత్రి ఒక నగల దుకాణంలో సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు చోరీ అయ్యాయి. ఈ కేసును ఛేదించిన పోలీసులు, భోపాల్‌లో తలదాచుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు 18 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ కాగా, మరొకరు డాక్టర్ కావాలని కలలు కంటూ ’నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి. ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా స్ఫూర్తితో.. డీసీపీ శ్రీకృష్ణ లాల్చందాని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. 2005లో వచి్చన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. బతకడం కష్టమై తప్పు చేశా.. పోలీసుల విచారణలో.. ‘నేను ఒక ఐటీ కంపెనీలో పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేసేవాడిని. కానీ కంపెనీ వాళ్లు ఏఐ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టి, నా ఉద్యోగం తీసేశారు. చేతిలో పైసా లేక, బతకడం కష్టమై ఈ దారి ఎంచుకున్నాను’.. అని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసింది. దొంగతనం చేసిన నగలను అమ్మడానికి వారు ప్రయతి్నంచారు కానీ, చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉండటంతో ఎవరూ వాటిని కొనడానికి ముందుకు రాలేదు. తక్కువ ధర కోట్ చేయడంతో, క్రిస్మస్ సెలవుల తర్వాత నిదానంగా అమ్ముదామని వేచి చూస్తుండగా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసులు వారి దగ్గర నుండి నగలను స్వా«దీనం చేసుకున్నారు. సాంకేతికత తెచి్చన మార్పు ఒక యువకుడిని నేరస్తుడిగా మార్చడం.. నేటి సామాజిక సంక్షోభానికి అద్దం పడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) పేరుతో తెచి్చన కొత్త చట్టంతో పాటు దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో అక్కడి వైఫల్యాలపైనా చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న పశి్చమబెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పారీ్టలతో పొత్తుల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను భేటీలో విశ్లేíÙంచనున్నారు. దీంతో పాటే యూపీఏ ప్రభుత్వం తీసుకువచి్చన నరేగా పథాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా తెచ్చి జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తెచి్చన నేపథ్యంలో, దీనిపై. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై భేటీలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిరసనలపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి సభ్యుల నుంచి ప్రతిపాదనలు కోరనున్నట్లు తెలిసింది. కొత్త చట్టంపై కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ తీసుకునే కార్యాచరణ కీలకం కానుంది. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహా ఢిల్లీకి చేరుకున్నారు. -
అది ‘పండోర బాక్స్’ తెరిచినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫయర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పక్కనపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు జీఎస్టీని తగ్గిస్తే అది ‘పండోర బాక్స్’తెరిచినట్లవుతుందని, దీనివల్ల భవిష్యత్తులో అనేక క్లిష్ట సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫయర్లను ‘వైద్య పరికరాల’జాబితాలో చేర్చాలని, ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సమాఖ్య వ్యవస్థకు ముప్పు: కేంద్రం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపించారు. జీఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని గుర్తు చేశారు. పన్ను రేట్ల తగ్గింపు అనేది కేంద్రం, రాష్ట్రాల చర్చల ద్వారా, ఓటింగ్ ద్వారా నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు. ’ఇప్పుడు కోర్టు ఆదేశాలతో పన్నులు తగ్గిస్తే.. రేపు ప్రతి ఒక్కరూ పిటిషన్లు వేసి పన్నులు తగ్గించమని అడుగుతారు. ఇది ఒక పండోర బాక్స్ తెరిచినట్లవుతుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం. కానీ పద్ధతి ప్రకారం వెళ్లాలి’అని కోర్టుకు నివేదించారు. అసలు ఈ పిటిషన్ వెనుక ఎవరున్నారో ఆరా తీయాల్సి ఉందని, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సామాన్యుడు ఎలా కొంటాడు?: హైకోర్టు ఆగ్రహం జస్టిస్ వికాస్ మహాజన్, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది. ’ఒక ఎయిర్ ప్యూరిఫయర్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేలు వరకు ఉంది. సామాన్యుడు దీన్ని ఎలా కొనగలడు? జీఎస్టీని తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తేవచ్చు కదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని అత్యవసరంగా జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని గతంలోనే చెప్పామని గుర్తు చేసింది. దీనిపై సమగ్ర సమాధానం ఇచ్చేందుకు (కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు) కేంద్రం గడువు కోరడంతో, కోర్టు 10 రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9, 2026కి వాయిదా వేసింది. సెలవుల తర్వాత వెంటనే ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు చర్చించగలదో తెలపాలని ఆదేశించింది. విలాసం కాదు.. అవసరం: పిటిషనర్ పిటిషనర్ కపిల్ మదన్ వాదిస్తూ.. ఢిల్లీలో కాలుష్యం ఎమర్జెన్సీ స్థాయికి చేరిందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్ ఇప్పుడు లగ్జరీ కాదని, ప్రాణాలను కాపాడే వైద్య పరికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని, దీనివల్ల నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యూరిఫయర్లను తప్పుడు కేటగిరీలో ఉంచి పన్ను వసూలు చేస్తున్నారని వాదించారు. -
ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఏటీఎస్.. యాంటీ టెర్రర్ గ్రిడ్
న్యూఢిల్లీ: దేశంలోని పోలీసు వ్యవస్థ కోసం ఏటీఎస్(అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అదేవిధంగా, యాంటీ టెర్రర్ గ్రిడ్‌ను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ఉగ్రదాడులను ప్రతి స్థాయిలోనూ ఉమ్మడిగా వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని చెప్పారు. ‘వ్యవస్థీకృత నేరాలపై 360– డిగ్రీల దాడి’అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జీరో టెర్రర్ పాలసీకి ఇది అత్యంత కీలకంగ మారనుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం మొదలైన రెండు రోజుల యాంటీ టెర్రరిజమ్ కాన్ఫరెన్స్–2025లో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ‘బలవంతంగా డబ్బు వసూలు చేయడమనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు ఏర్పడుతాయి. వాటి నేతలు విదేశాలకు పారిపోయి, అక్కడే స్థిరపడిపోయాక.. ఇక్కడుండే నెట్వర్క్ ఉగ్ర గ్రూపుల ఆ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. అటు తర్వాత, ఆ నెట్వర్క్ ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు దోహదపడుతోంది’అని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గనైజ్డ్ క్రైం నెట్వర్క్ డేటాబేస్, వెపన్స్ డేటా బేస్ ఫర్ లాస్ట్, లూటెడ్ అండ్ రికవరీ ఆరŠమ్స్‌కు సంబంధించిన రెండు డేటాబేస్లను ఆయన ప్రారంభించారు. జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) రూపొందించిన ఈ డేటాబేస్లను దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా విభాగాలు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. వీటితోపాటు ఉగ్రవాదులు, నేరగాళ్లకు సంబంధించిన డేటాబేస్లను కూడా రూపొందించాలని సూచించారు. -
‘హెచ్–1బీ’ కష్టాలపై అమెరికాతో చర్చిస్తాం
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలు హఠాత్తుగా వాయిదా పడడం, తద్వారా అమెరికా ప్రయాణాలు ఆగిపోవడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు నాలుగైదు నెలలపాటు వాయిదా పడ్డాయి. వేలాది మంది భారతీయుల ఇబ్బందులకు గురవుతున్నారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను నిశితంగా పరిశీలించడానికి వీలుగా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మే నెల దాకా వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఈ–మెయిల్ సందేశాలు రావడం గమనార్హం. దాంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం స్పందించారు. దరఖాస్తుదారుల కష్టాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా సంప్రదింపులు జరుపుతామని వివరించారు. వీసా దరఖాస్తుదారుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూల విషయంలో ఆలస్యాన్ని భారీగా తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు. ఇబ్బందులకు త్వరలోనే తెరపడుతుందని రణ«దీర్ జైస్వాల్ ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి హెచ్–1బీ వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మొదట మూడేళ్ల కాలానికి ఈ వీసా జారీ చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తారు. హెచ్–1బీ వీసాలు స్వీకరించినవారిలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వీసాలు పొందడం కష్టతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట పడకపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. మైమన్సింగ్ ప్రాంతంలో గతవారం హిందూ యువకుడిని మూక దాడిలో చంపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత తారిఖ్ రెహ్మాన్ తిరిగి స్వదేశానికి చేరుకోవడంపై ఆచితూచి స్పందించింది. ఆ దేశంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా పార్లమెంట్ ఎన్నికలు జరగాలని భారత్ చేస్తున్న ప్రయత్నాల కోణంలోనే దీనిని చూడాలని పేర్కొంది. బంగ్లా విముక్తి పోరాటం దగ్గర్నుంచి ఆ దేశంతో సన్నిహిత, స్నేహ సంబంధాలనే భారత్ కోరుకుంటోందని చెప్పింది. ఫ్యాక్టరీ కారి్మకుడు దీపు చంద్ర దాస్‌ను చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులతోపాటు క్రైస్తవులు, బౌద్ధులపైనా అతివాదులు పాల్పడుతున్న దాడులు ఆగకపోవడం తీవ్ర ఆందోళన కరమైన అంశమన్నారు. మధ్యంతర ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా మైనారిటీల హత్యలు, భూ ఆక్రమణలు, దాడులకు సంబంధించిన ఘటనలు 2,900కు పైగా నమోదయ్యాయన్నారు. వీటిని మీడియా చేస్తున్న అతి ప్రచారంగానో లేదా రాజకీయ హింసగానో చూడరాదని జైశ్వాల్ తెలిపారు. -
సిక్కుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
న్యూఢిల్లీ: సిక్కుల పదో మత గురువు గురు గోవింద్ సింగ్ వారసులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ దేశం కోసం మహోన్నత త్యాగం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆనాటి మొగల్ పాలకుల క్రూరత్వం, మతోన్మాదం, ఉగ్ర భావజాలానికి వ్యతిరేకంగా వారు చేసిన ప్రాణ త్యాగం భారతదేశ అసమాన ధైర్యసాహసాలు, వీరత్వం, శౌర్యానికి అత్యున్నత ప్రతీక అని ఉద్ఘాటించారు. గురు గోవింద్ సింగ్ వారసుల త్యాగాన్ని స్మరిస్తూ శుక్రవారం నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పీడనకు వ్యతిరేకంగా ఇద్దరు యువరాజులు సాగించిన పోరాటాన్ని దేశం ఎప్పటికీ స్మరించుకుంటుందని అన్నారు. వారు మనకు గర్వకారణమని చెప్పారు. వయసు, ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు. చిన్న వయసులోనే మొగల్ పాలకులకు ఎదురొడ్డి నిలిచారని తెలిపారు. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ ఉండదని యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నిజాలను అణచివేశారు ‘‘సిక్కు యువరాజుల త్యాగాల గురించి దేశంలో ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. దురదృష్టవశాత్తూ ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వలసవాద ఆలోచనావిధానం కొనసాగుతుండడం విచారకరం. వలసవాద మనస్తత్వానికి బ్రిటిష్ రాజకీయ నాయకుడు మెకాలే ఆద్యుడు. ఇప్పటికీ దాన్ని వదిలించుకోలేకపోతున్నాం. దశాబ్దాలపాటు నిజాలను అణచివేశారు. బ్రిటిష్ కాలంనాటి ఆలోచనా విధానం నుంచి విముక్తి పొందాలన్నదే మన అసలైన సంకల్పం. భారతీయుల ధైర్య సాహసాలు, త్యాగాలు ఇకపై అణచివేతకు గురికాకూడదు. వారి గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవాలను గ్రహించాలి. మెకాలే కుట్రకు 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. మరో పదేళ్లలో వలసవాద మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చెందాలి. అదే మన లక్ష్యం. అప్పుడు మనం స్వదేశీ సంప్రదాయాలు, సంస్కృతులను గర్వకారణంగా భావిస్తాం. ‘స్వయం సమృద్ధి’మార్గంలో ముందుకు పయనిస్తాం’’ అని మోదీ అన్నారు. భాషల వైవిధ్యమే మన బలం జెన్ జెడ్ (1997 నుంచి 2021 మధ్య జని్మంచినవారు), జెన్ అల్ఫా(2010 నుంచి 2025 మధ్య జని్మంచినవారు) భుజస్కందాలపై పెద్ద బాధ్యత ఉంది. ‘వికసిత్ భారత్’అనే లక్ష్య సాధన దిశగా దేశాన్ని ముందుకు నడిపించాలి. వారి నైపుణ్యాన్ని, విశ్వాసాన్ని అర్థం చేసుకున్నా. వారిపై నాకు సంపూర్ణంగా నమ్మకంగా ఉంది. వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకుంటే మన భాషల వైవిధ్యమే మనకు బలంగా మారుతుంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 160 మంది ఎంపీలు వారి మాతృభాషలో ప్రసంగించారు. తమిళం, మరాఠీ, బంగ్లా వంటి భాషల్లో ప్రసంగాలు సాగాయి. వేర్వేరు కీలక రంగాల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించినవారికి ప్రతిఏటా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందజేస్తున్నాం, ఈ ఏడాది 20 మందికి ప్రదానం చేశాం’’అని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. -
వీరు దేశానికి గర్వకారణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు స్వీకరించిన చిన్నారులు వారి కుటుంబాలకు, మొత్తం దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ పురస్కారాలు దేశవ్యాప్తంగా బాలబాలికలందరికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. రాష్ట్రపతి శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘వీర్ బాల్ దివస్’కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహస బాలలతోపాటు సామాజిక, సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అసమాన ఘనతలు సాధించిన 20 మంది చిన్నారులకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీర్ బాల్ దివస్ ప్రాముఖ్యతను వివరించారు. 320 ఏళ్ల క్రితం గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులు సత్యం, న్యాయం కోసం పోరాడుతూ ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. చిన్న కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశ విదేశాల్లో గౌరవాన్ని అందుకుంటున్నాయని తెలిపారు. చిన్నారుల్లోని దేశ భక్తి, ఉన్నత విలువలను బట్టి ఒక దేశం గొప్పతనాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఇద్దరు తెలుగు బాలలకు పురస్కారాలు ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను 18 మంది పిల్లలకు, మరణానంతరం మరో ఇద్దరి తరఫున వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి ముర్ము అందజేశారు. పురస్కారాల గ్రహీతల్లో ఇద్దరు తెలుగు బాలలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. కార్తికేయ పర్వతారోహకుడు. 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సెవెన్ సమ్మిట్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అతిపిన్న వయసు్కడిగా ఘనత సాధించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల పారా అథ్లెట్ శివానీ హోసూరు ఉప్పర సైతం క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. ఈమె షాట్‌పుట్, జావలిన్ థ్రోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులు సాధించారు. పురస్కార గ్రహీతలకు మెడల్, సరి్టఫికెట్‌తోపాటు రూ.లక్ష నగదు ప్రోత్పాహకాన్ని రాష్ట్రపతి అందజేశారు. పురస్కార గ్రహీతలతో ప్రధాని మోదీ భేటీ బాల పురస్కారాలు అందుకున్న చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్ మండపంలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో భాగంగా వారితో ముచ్చటించారు. చిన్న వయసులోనే ఇతరులకు స్ఫూర్తినిచ్చే విజయాలు సాధించారని ప్రశంసించారు. ఈ విజయాలు ఆరంభం మాత్రమేనని, ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సి ఉందని చెప్పారు. ఈ తరంలో జని్మంచడం ఈ చిన్నారుల అదృష్టమని, వారి ప్రతిభకు దేశమంతా మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. ప్రతిభావంతులైన బాలలను మరింత ముందుకు నడిపించేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తాత్కాలిక ప్రజాదరణ, గ్లామర్‌కు ఆకర్షితులు కాకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని చిన్నారులకు ప్రధాని మోదీ సూచించారు. -
పాక్ గుండెల్లో ‘సిందూర్ 2.0’ గుబులు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచి్చంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరో కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. భారత సైన్యం దాడులకు దిగితే తిప్పికొట్టడానికి పీఓకేలోని మూడు సెక్టార్లలో కౌంటర్–అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్(సీ–యూఏఎస్)ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్ఓసీ వద్ద 30కిపైగా యాంటీ–డ్రోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎల్రక్టానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.శత్రు డ్రోన్లపై నజర్ భారత్‌లోని పూంచ్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న రావల్కోట్లో యాంటీ–డ్రోన్ల వ్యవస్థలను రెండో ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తోంది. రాజౌరీ, నౌషెరా, సుందర్బనీ సెక్టార్లకు ఎదురుగా ఉండే కోట్లీలో వీటి నిర్వహణ బాధ్యతను మూడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు, భింబర్‌లో నిర్వహణను ఏడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఎల్ఓసీ వెంట ఎల్రక్టానిక్, కైనటిక్ కౌంటర్–యూఏఎస్‌లను పాక్ రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో కీలకమైన స్పైడర్ వ్యవస్థ కూడా ఉంది. ఇది పది కిలోమీటర్ల దూరంలోని శత్రు డ్రోన్లను కూడా సరిగ్గా గుర్తించగలదు. అంతేకాకుండా పాక్ అమ్ముల పొదిలో సఫ్రా యాంటీ–యూఏవీ జామింగ్ గన్ కూడా ఉంది. దీనిని మనుషులు ఆపరేట్ చేస్తుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను కూలి్చవేయొచ్చు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను కూల్చడానికి సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా పాక్ ఉపయోగిస్తోంది. జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ– ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, అజ్నా ఎంకే–2, ఎంకే–3 మ్యాన్–పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ వద్ద ఉన్నాయి. తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను వీటితో కూల్చవచ్చు.తుర్కియే, చైనాలతో పాక్ చర్చలు ఇటీవలి కాలంలో పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు ముమ్మరమయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం తరచుగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాక్ సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరిస్తున్నారు. ఈ పరిణామాలతో పాక్ అప్రమత్తమైనట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నూతన డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం తుర్కియే, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటర్–డ్రోన్ సామర్థ్యాల విషయంలో పాక్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ విషయం నిరూపితమైంది. అందుకే డ్రోన్లతో జరిగే దాడిని తట్టుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. -
ఖర్చు తక్కువైతేనే విదేశీ విద్య!
‘విదేశాల్లోని పేరొందిన యూనివర్సిటీల్లో చదువుకోవాలి. కోర్సు పూర్తి కాగానే మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాలి’అన్నది భారతీయ విద్యార్థుల కల. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిణామాలు, వీసా విధానాలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల ర్యాంకుల బదులుగా తక్కువగా ఉండే విదేశీ చదువు ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు, చేసిన ఖర్చుకు వచ్చే రాబడి వంటి అంశాలు విద్యార్థుల ‘విదేశీ విద్య’నిర్ణయాలను అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్కెట్ విలువ ఆధారంగా లెక్కలు.. మంచి జరుగుతుందని వేచి చూసే ధోరణి గతం. ఈ విధానం నుంచి విద్యార్థులు బయటకు వచ్చారు. చేయబోయే కోర్సు లేదా డిగ్రీ ఉత్తమమైనదా కాదా అని బేరీజు వేసుకొనే రోజులు వచ్చాయి. ప్రపంచ పోటీ నేపథ్యంలో ప్రతి డిగ్రీకి మార్కెట్ విలువ ఉందా అని లెక్కలు వేసుకుంటున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే అభ్యర్థులకు సహాయం, సమాచారం అందిస్తున్న లీప్ స్కాలర్ అనే కంపెనీ 2020–2025 మధ్య 30 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణుల దరఖాస్తులు, పరస్పర సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తక్కువ వ్యయంతో.. ‘విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లగలనా’అనే సందేహం స్థానంలో ‘ఈ డిగ్రీ నాకు నిజంగా ఏమి ఇస్తుంది’అని విద్యార్థులు ప్రస్తుతం ప్రశ్నించుకుంటున్నారు. యూఏఈలో చదువుకోవడానికి పెరిగిన 55 రెట్ల ఆసక్తి మొదలు.. ట్యూషన్ ఫీజురహిత జర్మనీలో అడుగుపెట్టాలన్న కుతూహలం వరకు.. భారతీయ విద్యార్థులు తక్కువ వ్యయంతో అధిక నైపుణ్యాన్ని అందించే దేశాల కోసం ప్రపంచ పటాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు వృత్తి నిపుణులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్న డిమాండ్ కారణంగా ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) మాస్టర్స్ చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఏకంగా 186% పెరిగింది.తిరిగి ఏం లభిస్తుంది? చదువుకు నిధులు సమకూర్చుకోవడం నుంచి కెరీర్‌కు ఆర్థిక సాయం చేసుకోవడం వైపు విద్యార్థుల ఆలోచనలు మళ్లుతున్నాయి. స్పష్టమైన కెరీర్ మార్గాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగేలా ఉపాధి, దీర్ఘకాలిక నివాస స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2025–26లో ఆశావహులు విద్యను వ్యూహాత్మక పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఒక నిర్దిష్ట డిగ్రీ వారి దీర్ఘకాలిక ఆదాయ సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో లెక్కించడానికి అభ్యాసంపై రాబడిని (రిటర్న్ ఆన్ లెర్నింగ్) కొలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలేజీల్లో ప్రవేశాలు కేవలం డిగ్రీ గురించి కాదు.. ప్రపంచ జాబ్ మార్కెట్లో స్థానం సంపాదించడం కోసం అని స్పష్టం అవుతోంది. రూట్ మారింది.. సంప్రదాయ కేంద్రాలకు అతీతంగా విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాలు మారుతున్నాయి. సంప్రదాయ కేంద్రాలైన యూఎస్, యూకే, కెనడా, ఆ్రస్టేలియాలో అధిక ఖర్చులు, మారుతున్న వీసా నిబంధనలు విద్యార్థుల ప్రాథమ్యాలను మార్చాయి. వారసత్వ ప్రతిష్ట కంటే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికిగాను యూఏఈకి 5,400%, న్యూజిలాండ్ 2,900%, జర్మనీకి 377% దరఖాస్తులు పెరగడం ఇందుకు నిదర్శనం. కెరీర్ పురోగతికే పట్టం.. ⇒ 85% మంది అభ్యర్థులు విద్యార్హతల కంటే చదువు తర్వాత కెరీర్ పురోగతికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ⇒ 68% మంది విద్యార్థులు ‘అందుబాటులో వ్యయాలు’అత్యంత ప్రాధాన్యంగా పేర్కొంటున్నారు. ⇒ విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్న అభ్యర్థుల్లో 65.5% మంది 18–25 ఏళ్ల వయస్కులు. ⇒ 26 ఏళ్లకుపైగా ఉన్నవారి వాటా 34.5%. కెరీర్ పురోగతికై ప్రత్యేక డిగ్రీలను వృత్తి నిపుణులు కోరుకుంటున్నారు. ⇒ విద్యార్థుల్లో పురుషులు 58%, మహిళలు 42% ఉన్నారు. ⇒ అభ్యర్థుల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ 54.7%, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కోరుకునేవారు 23.7% ఉన్నారు. ⇒ దరఖాస్తుల్లో 6.3% పీహెచ్డీ కోసం అభ్యరి్థంచినవే. వీటి సంఖ్య ఏడాదిలో 60% పెరిగింది.ఏఐపై పట్టు సాధించేందుకు.. ⇒ ఏఐ కోర్సుల్లో ప్రత్యేక మాస్టర్స్ ప్రవేశాలు 2023తో పోలిస్తే 2024లో దాదాపు 3 రెట్లు పెరిగాయి. ⇒ ఈ విద్యార్థులలో 49.9% మంది పూర్తిగా రంగాలను మార్చడం కంటే మార్కెటింగ్ అనలిటిక్స్, ఫైనాన్స్ వంటి వారి ప్రస్తుత రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ⇒ ఏఐ కోర్సులు చేద్దామనుకుంటున్న ఆశావహుల్లో దాదాపు 36% మంది ఇప్పటికే వృత్తి నిపుణులు. సాంకేతిక నైపుణ్యం పెంచుకోవడం వృత్తిపరంగా అవసరమని వారు రుజువు చేస్తున్నారు. -
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?
సోషల్ మీడియా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిలో మునిగిపోతున్నారు. పిల్లల్లో అయితే సామాజిక మాధ్యమాల ఎఫెక్ట్ మరింత అధికంగా ఉంటుంది. అయితే మద్రాస్ హైకోర్టు పిల్లల్లో సోషల్ మీడియా వాడకంపై కీలక సూచన చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వాటిని వాడకుండా నియంత్రించాలని సూచించింది. పిల్లల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మానసికంగా, శారీరకంగా ఎదగాల్సిన వయస్సులో గంటల గంటలు ఫోన్లకు అతుక్కపోయి వాటిలోనే గడపడంతో ఆందోళన, డిఫ్రెషన్, ఒత్తిడి తదితర సమస్యలు చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లకు దూరం చేద్దామని ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తెలిపింది.16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలకు అనుమతించకుండా చట్టం రూపొందించాలని కోర్టు పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఈ మధ్య ఇటువంటి చట్టం రూపొందించారని భారత్‌లో సైతం ఈ విషయం ఆలోచించాలని తెలిపింది. తద్వారా హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను పిల్లలు చూడకుండా నియంత్రిచవచ్చని పేర్కొంది. అదేవిధంగా అటువంటి కఠిన చట్టాలు రూపొందించే వరకూ పిల్లలు ఇంటర్నెట్ను సురక్షితంగా వాడేలా రాష్ట్ర ప్రభుత్వం, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. -
అగర్‌బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!
వినియోగదారుల భద్రతను.. ఇండోర్ గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అగర్బత్తులకు బీఐఎస్ ప్రమాణాలు ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి 'ప్రహ్లాద్ జోషి' కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ''ఐఎస్ 19412:2025 – అగరుబత్తి - స్పెసిఫికేషన్''ను విడుదల చేశారు.కొత్త నిబంధనల ప్రకారం.. అగర్‌బత్తులలో వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యతకు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని క్రిమిసంహారక రసాయనాలు & సింథటిక్ సువాసన పదార్థాల వాడకం పూర్తిగా నిషేధం. జాబితాలో అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ & ఫిప్రోనిల్ వంటి కొన్ని క్రిమిసంహారక రసాయనాలు.. అలాగే బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ & డైఫెనిలమైన్ వంటి సింథటిక్ సువాసన పదార్థాలు ఉన్నాయి.కొత్త ప్రమాణాలు.. అగర్బత్తులను యంత్రాలతో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవి మరియు సాంప్రదాయ మసాలా వర్గాలుగా వర్గీకరిస్తుంది. అంతే కాకుండా.. ముడి పదార్థాలు, బర్నింగ్ నాణ్యత, సువాసన పనితీరు & రసాయన పారామితుల కోసం స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. దీంతో అగర్బత్తులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. ఇవి మానవ, పర్యావరణ హితంగా ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా.. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది.అగర్బత్తుల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్..ప్రపంచంలో అగర్బత్తుల ఉత్పత్తి & ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అగరుబత్తీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోంది. మన దేశం సుమారు 150 దేశాలకు అగర్బత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. -
పావురాలకు ఆహారం పెట్టినందుకు.. రూ.5 వేల జరిమానా
ముంబై: బహిరంగ ప్రదేశంలో పావురాలకు ఆహారం (తిండి గింజలు) చల్లిన వ్యాపారవేత్తకు ముంబై కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారని కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పావురాలకు గింజలు చల్లడంపై నిషేధం అమలులో ఉంది.నగరంలోని మహిమ్ ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 1న దాదర్ నివాసి నితిన్ సేథ్.. పావురాలకు తిండి గింజలు వేశారు. ఆయనపై కేసు నమోదైంది. పావురానికి ఆహారం ఇచ్చే విషయం కోర్టుకు చేరుకుంది. డిసెంబర్ 22వ తేదీన ఆ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వీయూ మిసాల్ ఆ వ్యాపారవేత్తను దోషిగా తేల్చారు. అయితే క్షమాపణ కోరడంతో అతనికి కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది.బహిరంగంగా పావురాలకు ఫీడింగ్ చేయడం వల్ల ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 ఉల్లంఘించినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. ఆయనపై బీఎన్ఎస్లోని సెక్షన్ 271 కింద కూడా కేసు నమోదు చేశారు. -
శబరిమలకు పోటెత్తిన భక్తులు
అయ్యప్పస్వామి మండల దీక్ష పూజకు సమయం సమీపిస్తున్న వేళ శబరిమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. మణికంఠ స్వామిని ఇప్పటివరకూ దర్శించుకున్న భక్తుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అయ్యప్పస్వామి అభరణాల ఊరేగింపు "తంగాఅంకి" సందర్భంగా నేడు ( శుక్రవారం) నుంచి పలు ఆంక్షలు విధించినట్లు అధికారులు ప్రకటించారు.అయ్యప్పస్వామి మండలి పూజ డిసెంబర్ 27న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధానానికి భక్తుల రద్దీ పెరిగింది. డిసెంబర్ 25, 2025 నాటికి స్వామివారిని 30,01,532 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే గతేడాది ఈ సంఖ్య 32,49,756 గా ఉందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిమేర తగ్గినట్లు తెలిపారు.కాగా అయ్యప్పస్వామికి అభరణాల ఊరేగింపు ఉత్సవానికి అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కుంబజా, పలమారుర్ వంచిప్పాడి, పులిముక్కు, ఇలకొల్లూర్ తదితర ప్రాంతాలలో స్వామివారి అభరణాల ఊరేగింపు సందర్భంగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా రేపు శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల పూజ ముగింపు కార్యక్రమం ఉంటుంది.


