breaking news
Kamareddy
-
అపోహల బ్రేకులు
ఆరోగ్య కవచానికిఅర్హత వయసున్న ప్రతి బాలిక హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. టీకా పూర్తి సురక్షితమైనది. తల్లిదండ్రులు వదంతులు నమ్మవద్దు. పిల్లలకు దగ్గరుండి టీకాలను ఇప్పించాలి. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. లక్ష్యం చేరుకోవడానికి కృషి చేస్తాం. – వెంకటి, డీఎంహెచ్‌వో, కామారెడ్డిప్రాణాంతక క్యాన్సర్లనుంచి రక్షణ కల్పించే టీకా విషయంలో ప్రచారం కరువయ్యింది. ఈ వ్యాక్సిన్‌పై ప్రజలకు సరైన అవగాహన లేదు. దీంతో వారు టీకా వేయిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న అపోహల్లో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సందేహాలను తీర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. -
జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎన్నిక
కామారెడ్డి టౌన్ : జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా దుంపటి రాజు, కై రా శ్రవణ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల అధ్యక్షులుగా బాలా గౌడ్, పోతగోనె ప్రసాద్ గౌడ్, నాగరాజు, సంజీవ్ కుమార్ ఎన్నికయ్యారన్నారు. 25న చలో హైదరాబాద్.. ఉపసర్పంచ్‌ల డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న ‘హలో ఉప సర్పంచ్ – చలో హైదరాబాద్’ నిర్వహించనున్నట్లు కమలాకర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. మహా ధర్నాను విజయవంతం చేయాలని, పార్టీలకు అతీతంగా ఉప సర్పంచ్‌లంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం నాయకులు, జిల్లాలోని ఆయా మండలాల ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలో ఈనెల 25 న నషా ముక్త్ భారత్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 ఉదయం 10 గంటలకు కామారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. కళాభారతి ఆడిటోరియం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.కామారెడ్డి అర్బన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీఎస్సీ, బీకాం మొదటి సంవత్సరం ప్రవేశానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ కామారెడ్డి స్టడీ సెంటర్ ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, సమన్వయకర్త సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌తో సమానమైన కోర్సు పాసైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అన్లైన్లో దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలన కోసం కామారెడ్డి స్టడీ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి టౌన్ : నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఈనెల 27, 28 తేదీలలో ఆరు జిల్లాల ప్రొ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలను మ్యాట్లపై, డే అండ్ నైట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు జిల్లా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు తెలిపారు. టోర్నీలో కామారెడ్డితో పాటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కామారెడ్డి టౌన్ : విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన ట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. సోమ వారం జిల్లాకేంద్రంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో వేలాది సర్కారు బడులను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. సర్కారు బడులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో దోపిడీని అరికట్టేందుకు తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపీ –2020ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ నాయకులు కౌశిక్, అక్షయ్, స్వస్తిక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ గ్రామ స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి నిజామాబాద్ వైపు వస్తున్న మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కారులోని భార్యాభర్తలు, మరో కారులోని ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఎల్లమ్మ ఆలయంలో చోరీ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎల్లమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న బంగారు వస్తువులను అపహరించుకుపోయారు. హుండీని గడ్డపారతో పెకిలించి అందులోని డబ్బులను దోచుకెళ్లారు. హుండీని, పగుల గొట్టిన తాళాలను ఆమడ దూరంలో పడేశారు. ఈ విషయమై గౌడ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ● పలు అభివృద్ధికి పనులు ప్రారంభం సదాశివనగర్(ఎల్లారెడ్డి): పేదల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం ధర్మారావ్‌పేట్‌లో ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని, లింగంపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, తిమ్మోజీవాడిలో ఇందిరమ్మ గృహాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తుక్కోజీవాడిలో మహిళ సమాఖ్య భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. అర్హులైన వారికే ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల బాగయ్య, తిమ్మోజివాడి సర్పంచ్ నందిపేట భవాని, ఉప సర్పంచ్ రవీందర్ రావు, సదాశివనగర్ ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, తుక్కోజివాడి సర్పంచ్ సంగారావు, తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి రామారెడ్డి(ఎల్లారెడ్డి): గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రామారెడ్డిలో మండల నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని డీసీసీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వేదికగా మండల పార్టీ కార్యాలయం నిలవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు గంగమ్మవాగు బిడ్జ్రిని పరిశీలించి పెండింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్‌లు బండి ప్రవీణ్, నవీన్, ఉప సర్పంచులు దోకి లచ్చయ్య, రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్‌గౌడ్ పాల్గొన్నారు. -
జిల్లా జడ్జి వరప్రసాద్‌కు ఘన వీడ్కోలు
కామారెడ్డి టౌన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ సాధారణ బదిలీపై హైదరాబాద్ వక్ఫ్ ట్రిబ్యునల్‌కు వెళ్తున్న సందర్భంగా సోమవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.నాగరాణి, సిబ్బంది జిల్లా జడ్జిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో న్యాయ సేవల విస్తరణకు, లోక్ అదాలత్‌ల విజయవంతమైన నిర్వహణకు వరప్రసాద్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. నిరంతరం న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయడంలో ఆయన విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ వి.చంద్రసేన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాన్, టైపిస్టులు శ్రావణ్, సంధ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టం ఆఫీస్ అసిస్టెంట్లు సాయిప్రణీత్, ఉదయజ్ఞాని, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పి.ముక్తిదా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పి.ముక్తిదా రానున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఆమె సాధరణ బదిలీపై జిల్లాకు రానున్నారు. -
పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం అడిషనల్ కలెక్టర్ ఎన్వీ గిరికి అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రెడ్డి, విజయరామరాజులు వినతి పత్రాలు అందజేశారు. 2024 నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. హెల్త్‌కార్డులు అమల్లోకి రాకముందే 1.5 శాతం కోత విధించడం ఎంత వరకు సమంజసమన్నారు. పెన్షనర్ల డబ్బులను ఇతర రంగాలకు మళ్లించడాన్ని నిలిపివేయాలని, సమన్వయకర్త కమిటీ నియమించి పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు జి.లచ్చయ్య, రవీందర్, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, రాజలింగయ్య, సత్తయ్య తదితరులు మాట్లాడారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఈ నెల 23న యూరియా యాప్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముదాం నర్సిములు తెలిపారు. ఆయన సోమవారం తాడ్వాయిలో మాట్లాడారు. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించడమే కాకుండా వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. సింగిల్ విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, సర్పంచ్ మంగారెడ్డి, ధర్మారెడ్డి, మంగారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్‌రావు, రాములు, రాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి విత్తన మేళాలు
బాన్సువాడ రూరల్: అన్నదాతలకు వ్యవసాయ రంగంలో సలహాలు సూచనలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు వేదికలు.. విత్తన విక్రయ కేంద్రాలుగా మారనున్నాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి వారం పాటు విత్తన మేళాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 104 క్టస్టర్ రైతువేదికల్లో ఏర్పాట్లు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సహకార సంఘాలు, వివిధ విత్తన కంపెనీలతో పాటు స్థానిక విత్తన డీలర్ల ఆధ్వర్యంలో స్టాల్స్ నిర్వహించనున్నారు. ఇందులో బోనస్ అందించే ఏడు రకాల వరి వంగడాలతోపాటు యూరియాను అందుబాటులో ఉంచనున్నారు. స్టాల్స్‌లో అందుబాటులో ఉండేవి.. రైతువేదికలో ఏర్పాటు చేసే స్టాల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించి ఏడు వరి వంగడాలతో పాటు, పేరున్న సంస్థలకు చెందిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వం బోనస్ అందించే బీపీటీ –5204, ఆర్ఎన్ఆర్ –15048, జైశ్రీరాం, హెచ్ఎంటీ, కేఎన్ఎం – 1638, డబ్ల్యూజీఎల్–44(సిద్ది), డబ్ల్యూజీఎల్–962 వరి వంగడాలతోపాటు పెసర, కంది, మినుము, వేరుశనగ, నువ్వులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను విక్రయిస్తారు. నానోయూరియా, నానో డీఏపీ సైతం అందుబాటులో ఉంచడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.దేశాయిపేట్‌లోని రైతువేదికప్రభుత్వమే చొరవ తీసుకుని విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. దీంతో నకిలీల బాధ తప్పుతుంది. సరసమైన ధరలకే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. రైతులు రైతు వేదికలను సందర్శించి, విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి. – మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిచాలాగ్రామాల్లో రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద బోరుబావులు ఉన్న రైతులు ఇప్పటికే వరినాట్లు ప్రారంభించారు. వ్యవసాయశాఖ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా నెలరోజుల ముందు స్టాల్స్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఇకపై పంట కొనుగోళ్లు పూర్తికాగానే స్టాల్స్ ఏర్పాటు చేయాలి. – కస్ప హన్మండ్లు, రైతు, బోర్లం రైతువేదికల్లో స్టాళ్ల ఏర్పాటు అందుబాటులో బోనస్ వర్తించే వరివంగడాలు, యూరియా ముందే ఏర్పాటు చేస్తే బాగుండేదంటున్న రైతులు -
చిన్న నిర్లక్ష్యం.. ప్రాణాలు తీసింది
బోధన్ రూరల్ : చిన్నపాటి విద్యుత్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. బ ట్టలు ఆరేసుకునేందుకు కట్టిన ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడంతో దంపతులు ప్రాణా లు కోల్పోయిన ఘటన ఊట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నావత్ సంజీవ్ (46) తన కుటుంబంతో కలిసి వ్యవసాయం, పాడి ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్ద రు భార్యలు. పెద్ద భార్య జ్యోతి (44), చిన్న భార్య తిరుమల (35) ఉన్నారు. జ్యోతికి ముగ్గురు కూతు ళ్లు గోదావరి, శ్వేత, సంధ్యారాణి ఉన్నారు. రెండో భార్యకు కూతురు, కొడుకు సంతానం ఉన్నారు. కుటుంబ అవసరా ల కోసం ఇంటి ముందు ఖాళీ స్థలంలో గేదెల కోసం రేకుల షెడ్ నిర్మించి అందులో ఫ్యాన్లు ఏ ర్పాటు చేశారు. అదే షెడ్డుకు బట్టలు ఆరేసుకోవడానికి జీఏ వైరు కట్టి దానిపై ప్రతిరోజూ బట్టలు ఆరేసుకునేవారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిన్న భార్య తిరుమల వైరు మీద ఉన్న బట్టలు తీస్తుండగా స్వల్పంగా కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఈ విషయాన్ని భర్త సంజీవ్‌కు చెప్పింది. దీంతో సంజీవ్ వైరు దగ్గరకు వెళ్లి చూడగా, ప్రమాదవశాత్తు అతడికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. సమీపంలో ఉన్న పెద్ద భార్య జ్యోతి భర్తను కాపాడాలనే హడావుడిలో ఆ వైర్‌ను పట్టుకోవడంతో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో భార్యాభర్తలిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. కుటుంబానికి అండగా నిలిచిన తల్లిదండ్రులు ఒక్కసారిగా దూరం కావడంతో పిల్లల రోదనలు అందరినీ కలచివేశాయి. కుమార్తె గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయ్, ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదంపై బోధన్ ట్రాన్స్‌కో డీఈ ముక్తార్‌ను ‘సాక్షి’ సంప్రదించగా పోలీస్ కేసు నమోదైన నేపథ్యంలో బాధిత కుటుంబానికి పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. బట్టలు ఆరేసిన తీగే బలితీసుకుంది విద్యుత్ షాక్‌తో భార్యాభర్తల మృతి క్షణంలో కుటుంబం చిన్నాభిన్నం.. బోధన్ మండలం ఊట్పల్లిలో ఘటన గ్రామంలో విషాదఛాయలు -
గడ్కోల్‌లో ఒకరి ఆత్మహత్య
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన దొమ్మాటి నితిన్ గౌడ్ (27) అనే యువకుడు కొన్ని రోజులుగా తమకు గ్రామంలో సొంత ఇల్లు లేదని, ఎంబీఏ చదువుకున్నప్పటికీ ఉద్యోగం లభించడం లేదని మానసికంగా బాధపడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం లొంక ఆలయానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గ మధ్యలో లొంకతండా దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైకుంఠధామం అభివృద్ధికి మరో అడుగు
● హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో సర్వే ● ‘మహాప్రస్థానం’లా తీర్చిదిద్దుతామంటున్న ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులుకామారెడ్డి టౌన్ : పట్టణంలోని హౌసింగ్ బోర్డులోగల హిందూ శ్మశాన వాటికను ’మహాప్రస్థానం’ తరహాలో అభివృద్ధి చేసేందుకు మరో అడుగు పడింది. ‘ఎస్ఆర్ ఫౌండేషన్’ ప్రతినిధులు సోమవారం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. వైకుంఠధామంలో సరైన సౌకర్యాలు లేక అంతిమ సంస్కారాలు చేసేందుకు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రిక ఏప్రిల్ 20న ‘అంతిమ కష్టం’ శీర్షికన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై బీబీపేట మండలం జనగామకు చెందిన ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి స్పందించి శ్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు ఇటీవల మున్సిపాలిటీ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఫౌండేషన్ ప్రతినిధులు శ్మశాన వాటికలో అందుబాటులో ఉన్న స్థలం, ప్రభుత్వ భూమి వివరాలను సర్వే చేయించారు. రూ. 4 కోట్లతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలా తీర్చిదిద్దుతామని, ఇక్కడ చేపట్టే పూర్తి స్థాయి ఆధునికీకరణ పనుల కోసం ప్రత్యేక డిజైన్ రూపొందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సర్వేలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట్‌గౌడ్, మట్ల శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, రాజాగౌడ్, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యం అధ్వానం
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని పెద్ద దేవిసింగ్ తండాలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. అంతర్గత డ్రైనేజీలు లేకపోవడంతో నెలల తరబడి రోడ్లపైనే మురికి నీరు పారుతు న్నాయి. దీంతో దోమల సంఖ్య గణనీయంగా పె రిగిపోయింది. పారిద్ధ్యానికి సంబంధించిన ఎటువంటి పనులు, దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో నీరు నిలువ ఉండి తండాలో రోడ్లు బురద కంపు కొడుతోంది..దోమల బెడద పెరిగింది. ఇప్పటికై న అధికార యంత్రాంగం దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందిరమ్మ కాలనీలో.. నస్రుల్లాబాద్: దుర్కి గ్రామంలో గల ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. రాబోయేది వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్ర బలే అవకాశం ఉంది. వీధులు శుభ్రంగా ఉంచా ల్సిన సిబ్బంది కనీసం కాలనీ వైపు కన్నెత్తి చూడటం లేదు. వీధులన్నీ దుర్వాసన వెదజల్లుతూ కంపు కొడుతున్నాయి. అధికార యంత్రాంగం స్పందించి కాలనీలోని మురికి కాలువలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. -
నియామకం
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రానికి చెందిన పోతగోని ప్రసాద్‌గౌడ్ ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సోమవారం ఎన్నికయ్యా రు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అమృత ఫంక్షన్ హాల్లో జిల్లా ఉపసర్పంచుల సమావేశం నిర్వహించారు. ప్రసాద్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల ఆయ న మోకాళ్ల శస్త్రచికిత్సలు చేయించుకుని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న నాయకులు ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనను పరామర్శించిన వారిలో మాజీ ఎంపీపీ సుదర్శన్, కాచాపూర్ ఉప సర్పంచ్ దశరథం, జంగంపల్లి సొసైటీ అధ్యక్షుడు సిద్ధిరాములు, నాయకులు యాదయ్య, అమృత, సత్యం, సంతోష్ గౌడ్ తదితరులున్నారు. భిక్కనూరు: ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్ ఇటీవల మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయనను చంద్రకాంత్ రెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవలు చేయాలని చెప్పారు. నాయకులు రాజు, శశి కుమార్ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ ఉన్నారు. మాచారెడ్డి: ఘన్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆస్పత్రి వైద్యుడు అభినయ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 226 మందికి పరీక్షలు నిర్వహించి 26 మందిని మోతి బిందు ఆపరేషన్ కోసం సిఫారసు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అభినయ్ మాట్లాడుతూ.. మోతి బిందు ఆపరేషన్ అయిన వారికి మందులతో పాటు కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సర్పంచ్ ప్రశాంత్ గౌడ్, ఉపసర్పంచ్ స్వామి యాదవ్, పంచాయతీ కార్యదర్శి చైతన్య, వార్డు సభ్యులు మహేష్, ప్రవీణ్, నరేష్, సతీష్ సురేష్ పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం కుప్రియాల్‌లో కాంగ్రెస్ గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడు గడ్డం భూపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి, సేవాదళ్ మాజీ అధ్యక్షుడు లింగాగౌడ్, ఉప సర్పంచ్ అన్వేష్ గౌడ్, చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు. -
కో–ఆప్షన్‌కు మోక్షం ఎప్పుడో?
● గ్రామ పంచాయతీల్లో ముగ్గురికి అవకాశం ● ఎదురుచూస్తున్న ఆశావహులుకమ్మర్పల్లి : గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరి గి ఆరు నెలలు గడుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా గ్రా మ పంచాయతీల్లో సలహాలు, సూచనలు ఇచ్చే వా రు లేక పాలకవర్గాలు నిధుల వినియోగం విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో జరిగిన గ్రా మ పంచాయతీ ఎన్నికల అనంతరం పాలకవర్గాల కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అప్పటి ప్ర భుత్వం గ్రామ పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎ న్నిక విధానం ప్రవేశపెట్టింది. కానీ, ప్రస్తుత ప్రభు త్వ హయాంలో పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జాడే లేకుండా పోయింది. పంచాయతీరాజ్–2018 చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ లో ముగ్గురు చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. వారికి వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. పాలకవర్గం కొలువుదీరిన 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వ రకు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 545 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. హోదా, అధికారం, బాధ్యతలు.. కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై న వారు పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. వీరికి వార్డు సభ్యులతో సమానమైన ప్రొటోకాల్, హోదా, గౌరవం దక్కుతుంది. సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ, తీర్మానాల ఆమోదంలో మాత్రం ఓటు హక్కు ఉండదు. కేవలం పంచాయతీకి సలహాదారులుగా మాత్రమే వ్యవ హరించాల్సి ఉంటుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పనలో కోఆప్షన్ సభ్యుల పాత్ర కీలకం అవుతుంది. సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమై గ్రామానికి చెందిన ముగ్గురిని కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఇందులో ఒకరు పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్, మరొకరు గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ఇంకొకరు పంచాయతీలకు స్థలాలు ఇచ్చిన దాతలు లేదా భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభివృద్ధికి దోహదపడే ప్రవాస భారతీయులను నియమించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. స్పష్టమైన ఆదేశాలు రాగానే అందుకనుగుణంగా గ్రామ పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపడతాం. – శ్రీనివాసరావు, డీపీవో, నిజామాబాద్ -
‘సర్’కు పార్టీలు సహకరించాలి
● అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. జిల్లాలో జరగనున్న సర్ ప్రక్రియపై కలెక్టరేట్లో సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. 25 నుంచి ఇంటింటికి.. సర్‌లో భాగంగా ఈనెల 25 నుంచి వచ్చేనెల 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫాంలను పంపిణీ చేసి, ఓటర్ల వివరాలను సేకరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆ పత్రాలను నింపి సంబంధిత బీఎల్వోలకు అందజేయడంతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్‌ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు వెంటనే బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, తహసీల్దార్ హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
ప్రయివేటుకు దీటుగా కస్తూర్బాలు
● బాలికలకు వసతితో కూడిన విద్యాబోధన ● జేఈఈ, నీట్, క్లాట్ కోసం శిక్షణ.. ● ప్రవేశాల కోసం పెరిగిన పోటీ ● సీట్ల భర్తీ కోసం ఎంట్రెన్స్ టెస్ట్నిజాంసాగర్: బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుతో పాటు తల్లిదండ్రులు లేనివారు, బడిబయటి బాలికలకు ఆశ్రయం కల్పించి విద్యనందించేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. వసతితోకూడిన విద్య అందిస్తున్నారు. దీంతోపాటు ఈ ఏడాదినుంచి జేఈఈ, నీట్, క్లాట్ కోసం శిక్షణ ఇవ్వనున్నారు. ప్రయివేటుకు దీటుగా నాణ్యమైన విద్య అందుతుండడంతో ఈ విద్యాలయాలలో చేరేందుకు పోటీ పెరుగుతోంది. 19 కేజీబీవీలు.. జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు బాలికలకు వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తుండడం, చక్కటి విద్య అందుతుండడంతో ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇందులో అనాథ బాలికలు, డ్రాపౌట్స్తోపాటు పేద తల్లిదండ్రులు తమ కూతుళ్లను చేర్పిస్తున్నారు. ఒక్కో తరగతిలో 40 సీట్లుంటాయి. ఆరోతరగతిలో ప్రవేశాలకోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 760 సీట్లకు గాను 1,098 దరఖాస్తులు వచ్చాయి. పోటీ ఎక్కువగా ఉండడంతో ప్రవేశ పరీక్ష నిర్వహించి, విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. 13 కళాశాలలు.. జిల్లాలోని భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, రాజంపేట, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లోని కేజీబీవీలను ఇంటర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఆయా కస్తూర్బాల్లో సీఈసీ, బైపీసీ, ఎంపీసీ, ఎంపీహెచ్ డబ్ల్యూ వంటి గ్రూపులున్నాయి. పలు గ్రూపుల్లో అడ్మిషన్లకోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి విద్యార్థినులు పోటీపడుతున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకు ఎస్సెస్సీ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. పోటీ పరీక్షలకు.. కేజీబీవీ విద్యార్థినులకు ఈ ఏడాదినుంచి జేఈఈ, నీట్, క్లాట్ల కోసం కోచింగ్ ఇవ్వనున్నారు. నిజాంసాగర్ కస్తూర్బాలో క్లాట్ శిక్షణ, భిక్కనూరు కస్తూర్బాలో జేఈఈ, లింగంపేట కస్తూర్బాలో నీట్‌కు శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంది.నిజాంసాగర్ కేజీబీవీలో ప్రవేశాలకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. ఈసారి ఆరో తరగతిలో ప్రవేశానికి 98 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనాథ పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. మిగతా సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించాం. త్వరలో భర్తీ చేస్తాం. – సరోజన, ప్రిన్సిపల్, నిజాంసాగర్ కస్తూర్బాజిల్లాలోని అన్ని కేజీబీవీల్లో కలిపి 6,318 మంది బాలికలు చదువుకుంటున్నారు. వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులు ఎస్సెస్సీతో పాటు ఇంటర్‌లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. – సుకన్య, జీఈసీవో, కామారెడ్డి -
‘ఐడీఏ ధరలకు దంత వైద్య సేవలు, చికిత్సలు’
కామారెడ్డి అర్బన్: దంత వైద్యులందరూ ఇండియన్ డెంటల్ అసోసియేషన్(ఐడీఏ) నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అచ్చుకట్ల జీవన్, ప్రధాన కార్యదర్శి నిమ్మ అభిషేక్ రెడ్డిలు అన్నారు. ఆదివారం రాత్రి ఐడీఏ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో దంతవైద్యుల వివిధ సమస్యలపై చర్చించారు. ఇష్టానుసారం కాకుండా అసోసియేష న్ నిర్ణయించిన ధరలను ప్రదర్శించి ఆ మేరకు దంత రోగులకు సేవలు, చికిత్సలు అందించాలని తీర్మానించారు. సమావేశంలో అసోసియేషన్ సీనియర్ సభ్యులు ఎం.మల్లికార్జున్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాజిద్, మాధవి, స్వాతి, సారా, కోశాధికారి కవిత తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం ఆత్మహత్యాయత్నం
భిక్కనూరు : రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. యాప్ ద్వారా బుక్ చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. యాప్‌తో సంబంధం లేకుండా ఎకరానికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, రాజంపేట గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా కోసం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సొసైటీ సిబ్బంది, పోలీసులు ఆ రైతు వద్దనున్న పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ జానకీ, ఏడీఏ అపర్ణ, ఏవో జ్యోత్స్న సొసైటీ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. ఏవో జ్యోత్స్న మాట్లాడుతూ సొసైటీ పరిధిలో 60 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మంగళవారం రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. మక్కల డబ్బుల కోసం మరో రైతు.. గాంధారి(ఎల్లారెడ్డి): మక్కల డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని మండల కేంద్రానికి చెందిన రైతు చిల్లాల గోపాల్ అనే రైతు సోమవారం స్థానిక సింగిల్ విండో కార్యాలయ సిబ్బందితో గొడవకు దిగా డు. అందరితోపాటు జమ అవుతాయని నచ్చజెప్పి నా వినకుండా హంగామా చేశాడని, బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని కార్యాయలంలో కూడా పెట్రోల్ చల్లినట్లు సిబ్బంది తెలిపారు.సమాచారం అందుకున్న ఏఎస్సై ప్రకాశ్ ఘ టనా స్థలానికి చేరుకొని రైతును స్టేషన్‌కు తీసుకొ చ్చి నచ్చజెప్పారు. కాగా, ఈ విషయమై విండో కార్యదర్శి సాయిలును వివరణ కోరగా కాంటా చేసి మక్కలు మార్క్ గోదాములకు పంపించామని, మార్క్‌ఫెడ్ అధికారులు జమచేస్తారని తెలిపారు. మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతిని సంప్రదించగా మూడు రోజుల్లో రైతులందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్పినట్లు కార్యదర్శి వివరించారు. -
స్వచ్ఛంద సంస్థల సహకారంతో శ్మశానవాటికల అభివృద్ధి
● టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని రెండు హిందూ శ్మశానవాటికలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని హిందూ శ్మశానవాటిక అభివృద్ధి కోసం ఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని, ఇందుకు మున్సిపాలిటీ నుంచి పూర్తి అనుమతులు లభించాయన్నారు. సోమవారం నుంచి ఫౌండేషన్ ప్రతినిధులు స్థల పరిశీలన ప్రారంభించారని, గదుల నిర్మాణంతో పాటు పూర్తి స్థాయి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇందిరానగర్ శ్మశానవాటిక అభివృద్ధికి మరో రెండు స్వచ్ఛంద సంస్థలు అంగీకరించాయని తెలిపారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం.. కామారెడ్డి కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సూచించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాల మేరకే ఉమ్మడిగా ముందుకెళ్తామన్నారు. పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయకుమార్ రెడ్డి, సబ్బని హరికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, సలీం, రంగ రమేష్ గౌడ్, పిడుగు సాయిబాబా, శంకర్రావు, జమీల్, రవీందర్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
బోధన్ : ఎడపల్లి మండలం జంలం గ్రామంలోని తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి నర్సయ్య కుటుంబీకులతో కలిసి వారం క్రితం బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలు అపహరించుకొని వెళ్లారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న నర్సయ్య తిరిగొచ్చి ఇంటిని పరిశీలించారు. దుండగులు మూడు తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు. -
13 ఏళ్ల తర్వాత కొలువుదీరిన కొత్త కార్యవర్గం
దోమకొండ : దోమకొండ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. 13 ఏళ్ల తర్వాత కొత్త కార్యవర్గం ఎన్నిక కాగా వారితో ఎన్నికల అధికారి భూమయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. 9 మంది డైరెక్టర్లు కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడుగా బత్తిసి సిద్ధరాములు, ఉపాధ్యక్షుడిగా గర్థాస్ గంగరాములు, కార్యదర్శిగా కూచని జగదీష్, కోశాధికారిగా కై రంకొండ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డైరెక్టర్లుగా అందే నాగభూషణం, బత్తిని సంతోష్‌కుమార్, బాలే సురేందర్, కోట సదానంద, బొమ్మెర యమునలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేనేత రంగ అభివృద్ది, నేతన్నల సంక్షేమం, సంఘ ప్రగతి లక్ష్యాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సింలు, కోశాధికారి సబ్బని ధర్మపురి, సర్పంచ్ ఐరేని నర్సయ్య, దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, కోశాధికారి అందే గణేష్, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డుసభ్యులు బీసు సతీష్, పాలకుర్తి శేఖర్, ఐరేని లత, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి మృతి
● మరొకరి పరిస్థితి విషమం ● ఆస్పత్రికి తరలింపు మాచారెడ్డి: ఆర్టీసీ బస్సు, ఓ బైకును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం పాల్వంచ బ్రిడ్జి సమీపంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం షేర్శంకర్ తండాకు చెందిన పెంట్యా (28), ఎల్లారెడ్డిపల్లికి చెందిన సక్కుబాయితో కలిసి బైక్‌పై కామారెడ్డి నుంచి మాచారెడ్డి వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో పెంట్యా అక్కడికక్కడే మృతి చెందగా, సక్కుబాయికి తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. పెంట్యా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
ఒత్తిడిని జయించేందుకు యోగా ఉత్తమ మార్గమని, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వక్తలు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పలు చోట్ల ఆయుష్ విభాగం, బీజేపీ, శ్రీకల్కి ఆలయ కమిటీతో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. వక్తలు మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి తన దైవందిన జీవితంలో యోగాను భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని అన్నారు. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్రం పోషిస్తుందని చెప్పారు. – సాక్షి నెట్వర్క్ -
తెయూలో ప్రశాంతంగా నీట్
● భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్చార్జీ సీపీ తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ – 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెయూ ఆర్ట్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాల్లో 960 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాశారు. డిచ్పల్లి సీఐ వినోద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించారు. కేంద్రాల వద్ద జామర్లు, బగ్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలతోపాటు కేంద్రం లోపల గోడ గడియారాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ ఇన్చార్జీ సీపీ రాజేశ్చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాశ్, డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ అరిఫ్ తదితరులున్నారు.పరీక్షకు వస్తున్న విద్యార్థిని -
తుకానికి నీళ్లు పెట్టబోయి..
– విద్యుత్‌షాక్‌తో రైతు మృతి దోమకొండ : వరి తుకానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన అబ్బగోని రాజయ్య(48)కు గ్రామశివారులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. వరి నారుమడికి ఆదివారం నీళ్లు పెట్టేందుకు వెళ్లి బోరుమోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై ప్రభాకర్ పరిశీలించి, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బాలుడి ప్రతిభ
ఇందల్వాయి: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన బాలుడు నోముల బద్దం ఆరూష్ రెడ్డి ప్రతిభ చాటాడు. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ ఆధ్వర్యంలో మే నెల చివరి వారంలో జరిగిన ఈపోటీల్లో ఆరూష్ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించినట్లు తల్లిదండ్రులు గౌతమి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఆరూష్రెడ్డిని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ : చెస్ ఆడటం ద్వారా పిల్లలు చదువులో కూడా ముందంజలో ఉంటారని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని అభ్యాస ద స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–11 బాలబాలికల చెస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిత్య సాధనతో చెస్ క్రీడలో ముందుకెళ్లవచ్చని తెలిపారు. బాలుర విభాగంలో విజేతలుగా సోహన్ (మోడల్ స్కూల్, ఆర్మూర్), ఆర్. అర్జన్ (ప్రెసిడెన్సీ స్కూల్), బాలికల విభాగంలో నిత్యశ్రీ (విజయసాయి, బోధన్), సాయి సహారా (కిడ్స్ టౌన్, బోధన్)లు నిలిచారు. నిత్యశ్రీ, సాయి సహారా బోధన్‌లోని సాయి సామల చెస్ అకాడమీలో శిక్షణ పొందారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఏ.రమేశ్, ఆర్బిటర్ శివ, సాయిబాబా పాల్గొన్నారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సులో ఆర్మూర్ నుంచి భీమ్‌గల్‌కు ప్రయాణించింది. ప్రయాణికులంతా వెళ్లిపోవడంతో డ్రైవర్ భాషాఖాన్, కండక్టర్ శ్రీనివాస్ బస్సును తనిఖీ చేయగా, సీట్లో పర్సు కనిపించింది. వెంటనే తెరిచి చూడగా, అందులో 5 తులాల బంగారం ఉంది. దీంతో డ్రైవర్, కండక్టర్ కలిసి పర్సు మరిచిపోయిన ప్రయాణికురాలి ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆమె ఆచూకీ తెలుసుకొని పర్సు, అందులోని బంగారాన్ని అప్పగించారు. పర్సు తీసుకున్న సదరు ప్రయాణికురాలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. -
కాంగ్రెస్‌లో కుదిరిన సయోధ్య!
● కలిసి పనిచేయాలని సూచించిన క్రమశిక్షణ కమిటీ ● చేతులు కలిపిన షబ్బీర్ అలీ, చంద్రశేఖర్రెడ్డికామారెడ్డి క్రైం: కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టింది. ఇరు వర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చింది. ఇరు వర్గాలు కలిసిపోవడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వర్గాలున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్మశానవాటిక అభివృద్ధి విషయంలో వీరి మధ్య విభేదాలు ముదిరి, రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వ్యక్తిగత వ్యవహారాలు, గౌరవం లేకుండా మాట్లాడడం, అవినీతి, అక్రమాల విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుని ఇరు వర్గాలు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించాయి. ఇటీవల లీక్ అయిన ఓ ఆడియో కాల్ వ్యవహారంతో పరిస్థితి మరింత ముదిరి, ఇరువర్గాలు ఎస్పీకి ఫిర్యాదులు సమర్పించాయి. ఆరోపణల వ్యవహారంలో షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్రెడ్డిలు ఇదివరకే వేర్వేరుగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. వివాదం పరిష్కారం! ఇరువర్గాల మధ్య ఆరోపణలతో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతోందని భావించిన పార్టీ.. నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. ఆదివారం హైదరాబాద్‌లో క్రమశిక్షణ కమిటీ సమక్షంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి గడ్డం ఇందుప్రియతో పాటు షబ్బీర్ అలీ సమావేశమయ్యారు. వివాదానికి కారణమైన ఆడియో కాల్ తదితర అంశాలపై మరోసారి కమిటీ విచారణ జరిపింది. కమిటీ చైర్మన్ మల్లు రవి ఇరువర్గాలతో విడివిడిగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి దంపతులతో కలిసి చర్చించి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని మల్లు రవి సూచించినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్రెడ్డిలు స్వీట్లు పంచుకుని, వివాదాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేస్తామని కమిటీకి హామీ ఇచ్చారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదరడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
భరోసా ఎంత?
దేశానికి అన్నం పెట్టే రైతు విషయంలో పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. పెట్టుబడి సాయం అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో ఏటా రెండు విడతల్లో అన్ని ఎకరాలకూ అందించిన సాయం విషయంలో ప్రస్తుతం నీలినీడలు అలుముకున్నాయి. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అందుతుందో తెలియక పంటలకు అవసరమైన పెట్టుబడుల కోసం అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కామారెడ్డి క్రైంయాసంగి సీజన్లో రెండెకరాలకే అందిన సాయంపంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. మొదట్లో రెండు విడతల్లో కలిపి ఎకరాకు రూ. 8 వేలచొప్పున అందరు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. తర్వాత దానిని రూ. 10 వేలకు పెంచారు. ఏటా రెండు విడుతల్లో రైతులకు రైతుబంధు అందింది. అయితే పెట్టుబడి సాయాన్ని రూ. 15 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలులో చేతులెత్తేసింది. పథకం పేరును రైతు భరోసా మార్చి ఎకరాకు రూ. 12 వేల చొప్పున మాత్రమే అందిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీజన్లో పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు. ఈసారి అందరికీ అందేనా? జిల్లాలో మొత్తం 3,32,611 మంది రైతులున్నారు. పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకం అమలు చేయడానికి రూ. 316.53 కోట్ల నిధులు అవసరం ఉంటాయి. గత ఖరీఫ్‌లో అందరు రైతులకు పెట్టుబడి సాయం అందించిన సర్కారు.. రబీకి వచ్చేసరికి రెండెకరాలకే పరిమితం చేసింది. అదీ సీజన్ పూర్తయిన తర్వాత అందించడం గమనార్హం. రబీలో 3,09,281 మంది రైతులకుగాను రూ.220.28 కోట్ల పెట్టుబడి సాయం అందింది. ఈసారి వానాకాలం సీజన్‌కు సంబంధించిన నిధులను నెలాఖరునుంచి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్ని విడతలలో, ఎన్ని ఎకరాలకు ఇస్తారో మాత్రం చెప్పలేదు. మళ్లీ ఒకటి, రెండు ఎకరాలకు వేసి చేతులెత్తేస్తారా, పూర్తి స్థాయిలో అమలు చేస్తారా అనే సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి.రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్ని ఎకరాలకు ఎన్ని విడతలలో అందిస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది. – మోహన్‌రెడ్డి, డీఏవో, కామారెడ్డిగతంలో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుబంధు పథకం వచ్చాక చాలావరకు అప్పులు చేయడం తగ్గింది. కానీ పథకాన్ని అమలు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా మళ్లీ రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. గతేడాది భారీ వర్షాలు, వరదలకు చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆశించిన దిగుబడులు రాలేదు. రబీలో చాలామందికి ధాన్యం, మక్కలు, జొన్నలు విక్రయించిన డబ్బులు ఇంకా పడలేదు. దీంతో పెట్టుబడులకు చేతిలో పైసలు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుభరోసాకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. నెలాఖరున ఖరీఫ్ నిధులు విడుదల చేస్తామన్న సర్కారు విడతలు, పరిమితిపై స్పష్టత కరువు పెట్టుబడులకోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఆందోళనలో అన్నదాతలు -
దుబాయి వెళ్లడం ఇష్టం లేక..
లింగంపేట(ఎల్లారెడ్డి): దు బాయ్ వెళ్లడం ఇష్టం లేక మండలంలోని మోతె గ్రా మానికి చెందిన ఓ యువకు డు శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై దీపక్ కుమార్ తెలిపి న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రంజిత్‌రెడ్డి(23) గతంలో రెండుసార్లు దుబాయి వె ళ్లి వచ్చాడు. తిరిగి ఆదివారం దుబాయి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో తనకు దుబాయి వెళ్లడం ఇష్టం లేక ఆ విషయం కుటుంబ సభ్యులకు చెబితే బాధపడతారని జీవితంపై విరక్తి చెంది శనివారం అర్ధరాత్రి ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లా డు. తన వ్యవసాయ బోరుబావి వద్ద ఉరేసుకొని ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం కు టుంబసభ్యులు రంజిత్‌రెడ్డికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు భాగ్య హన్మంత్‌రెడ్డి బోరున విలపించారు. మృతుడి అన్న రామ్మోహన్‌రెడ్డి ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. మృతుడి కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఓదార్చారు. కంజర్లో మరో యువకుడు.. మోపాల్ : మండలంలోని కంజర్లో ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..కంజర గ్రామానికి చెందిన మమత, నర్సింగ్‌పల్లి తండాకు చెందిన పృథ్వీనాయక్ అలియాస్ అనిల్ (34) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పృథ్వీనాయక్ ఆటో నడుపుకుంటూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఇరువురి మధ్య గొడ వలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన పృథ్వీనాయక్ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తల్లి నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
గంజాయి సరఫరా ముఠా అరెస్ట్
● రూ.1.93 కోట్లు విలువైన 3.87 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం ● ముగ్గురు నిందితుల రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: రాష్ట్రాలు దాటి అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. రూ.1.93 కోట్లు విలువైన 3.87 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి కామారెడ్డి మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, బీబీపేట ఎస్సై విజయ్, పిట్లం ఎస్సై ఆంజనేయులు, మాచారెడ్డి ఎస్సై అనిల్, సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్, సిబ్బందితో కూడిన ఐదు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి శనివారం రాత్రి తనిఖీలు ప్రారంభించారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై క్యాసంపల్లి శివారులో తనిఖీ చేస్తుండగా.. ఓ వ్యాన్‌లో పనస పండ్ల కింద దాచి ఉంచిన గంజాయిని గుర్తించారు. వాహనం పైభాగంలో పనసపండ్లు ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా వాటి కింద సంచుల్లో భారీ మొత్తంలో నిషేధిత గంజాయిని ఉంచారు. దీంతో పోలీసులు వాహనంలో ఉన్న మొత్తం 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 1.93 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిని నిజామాబాద్‌కు చెందిన షేక్ కరీముల్లా, గైని సుభాష్, షేక్ రహీమ్‌గా గుర్తించామన్నారు. పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించారు. -
యమకంకర రోడ్డు ఇది..
● మూడేళ్లు అవుతున్నా పూర్తి కాని బీటీ రోడ్డు ● పట్టించుకోని అధికార యంత్రాంగం కంకర తేలి ప్రమాదకరంగా మారిన రోడ్డుఎల్లారెడ్డి: గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు దారుణంగా తయారయ్యాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన వెల్లుట్ల–గండివేట్ బీటీ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రోడ్డు పనుల కోసం కంకర వేసి ఏడెనిమిది నెలలు కావస్తున్నా బీటీ వేయకపోవడంతో ఆ దారి ప్రమాదకరంగా తయారైంది. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామం నుంచి గండివేట్ శివారు వరకు ఆర్అండ్బీ శాఖ ద్వారా సుమారు 4 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 2023, జూన్‌లో కోటి 49 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. టెండర్లలో ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా అర్థాంతరంగా రోడ్డు పనులు వదిలేసి పత్తా లేకుండా పోయాడు. అనంతరం 2025 నవంబర్‌లో వేరే కాంట్రాక్టర్‌కు రోడ్డు నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ శాఖ అప్పగించింది. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఆ రోడ్డు మీద కంకర వేశారు. రోడ్డుపై కంకర వేసి 8 నెలలు కావస్తున్నా నిర్మాణ పనులు చేపట్టడం లేదు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బీటీ(తారు) ధరలు రెండింతలు అయ్యాయని మొదట చేసిన అగ్రిమెంటుకు తనకు రోడ్డు వేయడం సాధ్యం కాదని చేతులెత్తేశాడని తెలిసింది. ఎల్లారెడ్డి మండలం నుంచి గండివేట్, గాంధారి వెళ్లే ప్రయాణికులు, రైతులు, గ్రామస్తులతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై వేసిన కంకర ప్రమాదకరంగా మారింది. దాదాపు 4 కిలోమీటర్ల మేర కంకర తేలిన రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురువుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. వర్షాకాలంలో ఈ రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు ఈ విషయమై తక్షణం స్పందించి నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయించాలని వారు కోరుతున్నారు. ఎనిమిది నెలలుగా ఆగిపోయిన వెల్లుట్ల–గండివేట్ రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తాం. యుద్ధం కారణంగా బీటీ ధర పెరగడం కారణంగా కాంట్రాక్టర్ పనులను కొద్ది రోజులు వాయిదా వేశారు. ఈ విషయమై ఆయనతో చర్చించగా త్వరలో పూర్తి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. –నారాయణ, డిప్యూటీ ఈఈ, ఆర్అండ్బీ శాఖ, ఎల్లారెడ్డి -
అశోక్‌సాగర్‌లో పడి బ్యాంక్ అధికారి మృతి
నిజామాబాద్ అర్బన్: నగర శివారులోని అశోక్‌సాగర్‌లో పడి ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై సందీప్ తెలిపారు. ప్రగతి భవన్ బ్రాంచీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న కొటారి శ్రీధర్ ఆదివారం ఉదయం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. అశోక్‌సాగర్‌లో సాయంత్రం 6 గంటలకు ఓ మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తింపు కార్డు ఆధారంగా శ్రీధర్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాలకృత్యాలకు వెళ్లి అశోక్‌సాగర్‌లో పడి ఈతరాక మృతి చెందినట్లు భార్య కొటారి లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. -
ప్రశాంతంగా నీట్ రీ ఎగ్జామ్
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): నీట్ యూజీ– 2026 రీ ఎగ్జామ్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షాకేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు అమలు చేశారు. బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రిని పరీక్ష కేంద్రాలకు తరలించారు. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన నలుగురు విద్యార్థులను పోలీసులు అనుమతించలేదు. అలాగే బోధన్ సెంటర్‌కు వెళ్లాల్సిన మరో అభ్యర్థి పొరపాటున జీజీ కళాశాల సెంటర్‌కు వచ్చాడు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు నీట్‌కు దూరమయ్యారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థుల మెడల్లోని చైన్లను, ఆడపిల్లల చేతుల గాజులు, కమ్మలను తీసివేసిన తరువాతే అనుమతించారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష కొనసాగింది. పరీక్ష అసలు సమయం మూడు గంటలు కాగా, ఈసారి 15 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. 3,459 మంది అభ్యర్థులకు గాను 2,994 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరుశాతం 86.56గా నమోదైంది. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరు నమోదులో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కాపీయింగ్, పేపర్ లీక్‌కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వద్ద ఏర్పాటు చేసిన జామర్లను పరిశీలించారు. ఎన్టీఏ నిర్దేశించిన నిబంధనలను తప్పకుండా అమలు చేస్తూ, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసే వరకు ఎవరూ బయటికి వెళ్లకుండా చూడాలని, ఆన్సర్ షీట్స్, ఎగ్జామ్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 86.56 శాతం మంది అభ్యర్థుల హాజరు జీజీ కళాశాల సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన నలుగురికి అనుమతి నిరాకరణ వేరే సెంటర్‌కు వెళ్లి పరీక్షకు దూరమైన మరో విద్యార్థి కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
దారి చూపాడు...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో పడెరోనా అనే చిన్న పట్టణం. నాన్న వ్యవసాయంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల వ్యాపారం చేసేవారు. పదో తరగతి వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. చదు వు విలువ తెలిసిన నాన్న లెవంత్ క్లాస్ చదువుకోసం 1500 కిలోమీటర్ల దూరాన ఉ న్న రాజస్థాన్‌లోని కోటకు పంపించారు. అక్కడ ఐఐటీ ల క్ష్యంగా చదివి ముంబ యి ఐఐటీలో సీటు సా ధించా’ అని 2019 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి, కా మారెడ్డి డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చి న ఇంటర్వ్యూలో ‘నాన్న చూపిన దారిలో నడవడం వల్లే ఈ రోజు సివిల్ సర్వీసెస్ అధికారిగా మీ ముందున్నాను’ అని పేర్కొన్నారు. ‘మా ఊళ్లో కాంపిటెటివ్ బుక్స్ కూడా దొరికేది కాదు. అలాంటి ఊరు నుంచి ఐఐటీ సీటు సాధించి మా నాన్న గౌ రవాన్ని పెంచాను’ అని తెలిపారు. ముంబై ఐఐటీ లో సీటు రావడంతో నాన్న ఎంతో సంతోషపడ్డారు. ఐఐటీ చదువు పూర్తవగానే చదువుకు సంబంధం లే ని బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. మంచి ఉద్యోగం సాధించి ఐదేళ్లు పనిచేశాను. తరువాత యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలనే నా కోరికను నెరవేర్చుకునేందుకు ప్రిపేర్ అయ్యాను. మొదట ప్రిలిమినరీ క్లియ ర్ కాలేదు. రెండోసారి ప్రిలిమినరీ క్లియర్ అయినా మెయిన్స్‌లో సక్సెస్ కాలేదు. ఆ సమయంలో నాన్న నాకు ధైర్యాన్నిచ్చారు. మరింత పట్టుదలతో చదివి తే తప్పకుండా సక్సస్ అవుతావని భరోసా ఇచ్చా రు. నాన్న ఇచ్చిన ధైర్యం, భరోసాతో మూడో ప్ర యత్నంలో 20వ ర్యాంక్‌తో ఐఎఫ్ఎస్ సాధించాను. మొదటి పోస్టింగ్ ఎఫ్‌డీవోగా ఇల్లందులో లభించింది. అక్కడి నుంచి డీఎఫ్‌వోగా ఆసిఫాబాద్‌లో పనిచేసి, నెలకిందటే కామారెడ్డికి బదిలీపై వచ్చాను అని తెలిపారు. మా నాన్నకు చదువు విలువ తె లుసు. ఆయన ఉద్యోగం వచ్చి నా కొన్ని పరిస్థితుల వల్ల వ దులుకుని వ్యవసాయ అ నుబంధ పనిముట్ల వ్యా పారంలో స్థిరపడ్డారు. వ్యవసాయం కూడా చే యించాడు. చదువుకుంటే ఉన్నతంగా బత కొచ్చని చెబుతాడు. ఇ ష్టమైన చదువు ఏదైనా స రే చదవాలని చెబుతాడన్నా రు. నాన్న అశోక్, అమ్మ రేఖ నాతో పాటు అన్నను చదివించడాని కి వెనుకడుగు వేయలేదు. ఎంత ఖర్చయినా సరే మంచిగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆ కాంక్షించారు. వాళ్లిచ్చిన ప్రోత్సాహంతోనే ఇద్దరం రాణించాం. అన్న బ్యాంకింగ్ రంగంలో ఉండగా, నే ను యూపీఎస్సీ ద్వారా ఐఎఫ్ఎస్ అధికారినయ్యానన్నారు. ఐఐటీ టార్గెట్‌గా కోటాకు పంపించాడు ముంబయి ఐఐటీలో సీటు సాధించగానే సంతోషపడ్డాడు ఐదేళ్లు ఉద్యోగం చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా.. మూడో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ సాధించా ‘సాక్షి’తో డీఎఫ్‌వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్పిల్లల ఉన్నతి కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు. వాళ్ల మాటను గౌరవించాలి. వాళ్లు చూపిన దారిలో నడవడం ద్వారా ఎన్నో విజయాలు సాధించగలుగుతాం. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల ఇష్టాఇష్టాలను గమనించి వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలి. చదువు విషయంలో ఒత్తిడికి గురి చేయొద్దు. -
ఆయు పెంచుతున్న ఆరోగ్యం
నిజాంసాగర్/నాగిరెడ్డిపేట/దోమకొండ/పెద్దకొడప్గల్/భిక్కనూరు: ‘ఆరోగ్యమే...మహాబాగ్యం’అనగానే గుర్తుకు వచ్చేది యోగ. గ్రామీణ ప్రాంతాల్లో యోగ నేర్చుకునేందుకు యువత, విద్యార్థులు ఆసక్తితో ఉన్నా శిక్షకులు కరువయ్యారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యోగా శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ శిక్షకుడు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు తూతుమంత్రంగా యోగా శిక్షణ ఇస్తున్నారని పలువురు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. దోమకొండ మండల కేంద్రంలో ఆయూష్ ఆధ్వర్యంలో యోగా కేంద్రం కొనసాగుతోంది. మండల కేంద్రానికి చెందిన ప్రముఖ యోగా మాస్టర్ గర్థాస్ కృష్ణను యోగా ట్రైనర్‌గా నియమించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆయన విద్యార్థులకు యోగా నేర్పుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి మండలాల్లో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య స్వస్థత కేంద్రాల పేరిట యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిక్షకులను సైతం నియమించారు. యోగాశిక్షకులు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో గంటపాటు యోగాసానాలు వేయిస్తున్నారు. యోగాసానాలు వేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారని శిక్షకులు ప్రజలకు అవగాహాన కల్పిస్తున్నారు. గర్బీణులు నిత్యం యోగాసానాలు వేయడం వల్ల సుఖప్రసవం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యోగాకేంద్రాలను ప్రజలు పూర్తిస్థాయిలో ద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దకొడప్గల్ తహసీల్ కార్యాలయం ఆవరణలో యోగాపై ఆయుర్వేదిక్ వైద్యుడు వెంకటస్వామి అవగాహన కల్పించారు. తహసీల్దార్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యోగాతో మహిళల్లో సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుష్ భిక్కనూరు మండల వైద్యాధికారి భవానీప్రసాద్ అన్నారు. మహిళ సమాఖ్య భవనంలో మహిళలకు యోగాపై అవగాహన కల్పించారు. ఆయన వెంట యోగ శిక్షకులు ప్రశాంత్, సంధ్య, ఏపీఎం సాయిలు తదితరులు ఉన్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలోని భవానీరోడ్డులో ఉన్న ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం ఉదయం 7గంటల నుంచి 8 గంటల వరకు యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ఆయుష్, యూత్ అండ్ స్పోర్ట్స్, వైద్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో కామారెడ్డి శ్రీసరస్వతి విద్యామందిర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించేవారు. కాగా ఈ సారి కలెక్టర్ సరస్వతి విద్యామందిర్‌కు బదులుగా లింగంపేట నాగన్న బావి వద్ద అధికారికంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఆయుష్ అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఉదయం పూట అక్కడి చేరుకోవడం ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సందిగ్ధత తొలిగింది. యోగా అభిమానులు ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీకి చేరుకోవాలని అధికారులు కోరారు. జిల్లాలోని పలుచోట్ల ఆయుష్ యోగా కేంద్రాల ఏర్పాటు యోగా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్న ట్రైనర్లు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం -
రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం
● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అప్పుల నుంచి బయటపడుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. నాగిరెడ్డిపేట ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లో పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలని, అప్పుడు ప్రజలు బీజేపీని గెలిపించే బాధ్యత తీసుకుంటారన్నారు. అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ.. ఇటీవల వెలువడిన కాగ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో బాధ్యతలేని ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని ఆ పార్టీ నాయకులకు తెలుసునని, అందుకే అధికారంలో ఉన్నప్పుడే దోపిడీకి తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముకొని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని చెప్పారు. ఆస్తుల విషయమై కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన విభేదాలతోనే బీఆర్ఎస్ అంతమవుతుందని జోస్యం చెప్పారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన 200మంది బీజీపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజ్‌మోహన్‌రెడ్డి, హన్మాండ్లు, మండలాధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ భాస్కర్, నాయకులు నరేందర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్ పాల్గొన్నారు. -
యూరియా యాప్ తొలగించాలని బీఆర్ఎస్ నేతల ఆందోళన
దోమకొండ: యూరియా యాప్‌ను తొలగించాలంటూ మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. అనంతరం తహసీల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. యూరియా వచ్చిన అరగంటకే ఖాళీ అవుతుందని, రైతులు యాప్‌లో ఎంత ప్రయత్నం చేసినా యూరియా దొరకడం లేదన్నారు. అనంతరం మండల ఇంచార్జి వ్యవసాయాధికారితో పాటు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నా నేపధ్యంలో దోమకొండ పోలీసులు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. -
నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం
● బెర్త్ కింద దొరికిన 20 కిలోలు ● పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు కామారెడ్డి టౌన్ : కామారెడ్డి రైల్వేస్టేషన్లో శనివారం ఎకై ్సజ్ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. జిల్లా ఎకై ్సజ్ అధికారులు, ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి అరుణ్‌చంద్ర వివరాలను వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు శనివారం సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్ కామారెడ్డికి రాగానే ఎకై ్సజ్ బృందం రైలులోకి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్–7 బోగీలోని ఓ బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు గంజాయి బ్యాగులు లభ్యమయ్యాయి. వాటిని తెరిచి చూడగా మొత్తం 22 ప్యాకెట్లలో మొత్తం 20 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో కేజీ గంజాయి విలువ సుమారు రూ. 50 వేల చొప్పున ఉంటుందని, మొత్తం రూ. 10 లక్షల విలువ ఉంటుందన్నారు. అయితే, బ్యాగులను రవాణా చేస్తున్న నిందితుడు ఎవరనేది తెలియలేదని, అక్రమార్కుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో డీటీఎఫ్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్, శరత్ కుమారి, దీపిక, రైల్వే ఎస్సై మధుసూదన్, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 561 కేసుల పరిష్కారం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. జాతీయ న్యాయ సేవ ప్రాధికార సంస్థ, సుప్రీంకోర్ట్, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించినట్లు వారు తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగ్గ 561 కేసులను పరిష్కరించినట్లు వారు తెలిపారు. వీటిలో క్రిమినల్ 8, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ 14, పీటీ కేసులు 459, బ్యాంకుకు సంబంధించినవి 37, సైబర్ నేరాలకు సంబంధించి 5, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు 37, భత్యంకు సంబంధించి 1 కేసును పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు పండరి, శ్రీనివాస్, సతీష్, సాయిబాబా, సీఐ రాజారెడ్డి, ఎస్సై రాజు, ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద పరిధిలో 816 కేసులు బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జడ్జి వినిల్ కుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రకళ సమక్షంలో ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించుకున్నారు. భూతగాదాలు, ఎకై ్సజ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పేకాట ఇతర కేసులు మొత్తం 816 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి వినిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు ఆవేశానికి లోనై ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదికని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంతాలకు వెళ్లకుండా గొడవలు జరిగితే గ్రామ పెద్దల సమక్షంలో కూర్చుండి పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీపీ కిషోర్ కుమార్, న్యాయవాదులు లక్ష్మణ్‌రావు, ప్రకాష్, మనోజ్, విశ్వనాథ్, ఎస్సై రవి కోర్టు సిబ్బంది సుదర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అవును.. నాన్నే దేవుడు! తన కోసం కాదు తన పిల్లల కోసం భయపడుతూ బతుకుతూ.. బాధ్యత భారం కాదని తలుస్తూ.. తాను పడుతున్న కష్టం తన పిల్లలు పడొద్దని.. వారిని ఉన్నతస్థితిలో చూడాలని పరితపిస్తూ సంసార సాగరాన్ని ఈదుతున్న మహర్షి నాన్న. తన గుండెల్లోని బాధని కళ్లల్లో కనిపించ
● కానిస్టేబుల్ కృష్ణసాగర్ పితృభక్తినాన్నే దేవుడు..!గుండెల్లో నాన్న... పొలంలో గుడి..!డొంకేశ్వర్(ఆర్మూర్) : లోకం విడిచి వెళ్లినా తన గుండెల్లో ఉన్న నాన్నకు గుడి కట్టించి ఆరాదిస్తున్నాడు డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ కృష్ణసాగర్. వివరాల్లోకి వెళ్తే.. కీ.శే. కీని నల్ల రాజన్నకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసిన రాజన్న 2018 అక్టోబర్ 3న గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన హఠాన్మరణాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. అయితే తండ్రి బతికుండాగానే చిన్న కుమారుడు కృష్ణసాగర్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. కొడుకుని ఖాకీ దుస్తుల్లో చూసి రాజన్న మురిసిపోయేవాడు. తండ్రి భౌతికంగా దూరమైనా ఎప్పటికీ తమలోనే ఉండాలనే సంకల్పంతో కృష్ణసాగర్ తన వ్యవసాయ క్షేత్రంలో రాజన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కని గుడి కట్టించాడు. ప్రతి ఏటా తండ్రి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన నాన్నకు ఎంత చేసినా తక్కువే, ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని కానిస్టేబుల్ కృష్ణసాగర్ భావోద్వేగంతో పేర్కొన్నారు. -
బాల్య వివాహాలు చేయొద్దు
మాచారెడ్డి: బాల్య వివాహాలు చేయొద్దని గజ్యా నాయక్ తండా సర్పంచ్ రావుల వినోద అన్నారు. శనివారం గజ్యా నాయక్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని హెచ్చరించారు. అలాగే మహిళలపై గృహ హింస అరికట్టేందుకు మహిళా సంఘాలు అప్రమత్తం కావాలన్నారు. పోడు భూముల రక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. మహిళల సమస్యలపై జీపీలో ఫిర్యాదు చేస్తే అవగాహన కల్పిస్తామన్నారు. జీపీకార్యదర్శి దర్శన్, ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నారు. బీబీపేట: మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తుజాల్పూర్ ఉప సర్పంచ్ లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండల కేంద్రంలో మండల ఉపసర్పంచులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం ఉపాధ్యక్షుడిగా బీబీపేట ఉపసర్పంచ్ ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఉపసర్పంచులు పాత స్వామి, టంకరి బాబు, ప్రభాకర్, రాజు, సంతోష్‌రెడ్డి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. బీబీపేట: మండల కేంద్రంలోని తిమ్మయ్యగారి సుశీల నారాయణరెడ్డి బాలుర ఉన్నత పాఠశా ల ఉత్తమ పాఠశాలగా ఎంపికై న విషయం తెల్సిందే. దీనికి సంబంధించి శుక్రవారం అవార్డును హెచ్ఎం రవీంద్రారెడ్డి అందుకోవడంతో ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు శనివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల, శాలువాతో సత్కరించారు. ఫౌండేషన్ సభ్యులు మట్ట శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, పాత స్వామి, జీవన్‌రెడ్డి, సాయికుమార్, వెంకటరాంరెడ్డి, చాట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ ద్వారా కార్యక్రమాలు చేపడదామని నాగిరెడ్డిపేట ఇన్చార్జి ఏపీఎం దత్తు సూచించారు. నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో శనివారం ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బకాయిల వసూళ్ల కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. దీంతోపాటు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల లక్ష్యాలను నెరవేర్చాలని చెప్పారు. గ్రామాల్లో గ్రామసంఘాల భవనాల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షులు శాంత, సీసీలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే కూల్చేస్తాం
కామారెడ్డి టౌన్ :మున్సిపాలిటీకి సంబంధించిన ప్ర భుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే వా టిని తక్షణమే కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ టి.పర్వతాలు హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని వీక్లీమార్కెట్ రోడ్లో ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఆయన టౌన్న్ప్లానింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మాణం చేపడుతున్న వ్యక్తులతో కమిషనర్ మాట్లాడారు. తా ము ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టడం లేదని సదరు వ్యక్తి చెప్పడంతో నిర్మాణానికి సంబంధించిన మున్సిపల్ అనుమతి పత్రాలు, స్థల డాక్యుమెంట్లను తక్షణమే చూపించాలని కమిషనర్ ఆదేశించారు. ఇక్కడి సర్వే నంబర్ 6 ప్రభుత్వానికి సంబంధించినదని, ఇందులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణ అయితే కచ్చితంగా కూల్చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా భవన ని ర్మాణానికి సంబంధించిన అన్ని పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని యజమాని ని హెచ్చరించారు. కాగా ఈ సర్వే నంబర్–6 ప్రభు త్వ స్థలమని రెవెన్యూ అధికారులు నిర్ధారించడంతో నాలుగు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్వయంగా దగ్గరుండి ఇక్కడి అక్రమ నిర్మాణాలను కూల్చివేయించిన విషయం తెలిసిందే. ఆ స్థలాన్ని మున్సిపల్ సైతం స్వాధీనం చేసుకుంది. తనిఖీల్లో టీపీవో వినీత్, టీపీఎస్‌లు సాయి, కావ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు వేదికలో ఫర్నిచర్ ధ్వంసం
● యూరియా స్టాక్ లేదని ఆవేశంతో ఊగిపోయిన రైతులు ● పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు ● రామారెడ్డిలో ఘటన రామారెడ్డి(ఎల్లారెడ్డి) : యూరియా కొరత రామారెడ్డిలోని రైతు వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్టాక్ లేదని తెలిసి ఆవేశంతో ఊగిపోయిన రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు శుక్రవారం యూరియా బుకింగ్ విధానంపై అవగాహన కల్పించారు. యాప్ వాడటం తెలియని వారు, చిన్న ఫోన్లు ఉన్న వారు రైతు వేదికకు వస్తే, తామే స్వయంగా బుక్ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో రైతులు రైతు వేదికకు తరలివచ్చారు. అధికారులు బుకింగ్‌కు ప్రయత్నించగా, అప్పటికే కేటాయించిన యూరియా స్టాక్ అంతా అయిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు.. రెండు రోజులుగా తమను అధికారులే తిప్పించి ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. సహనం కోల్పోయిన కొందరు రైతులు రైతు వేదికలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని కామారెడ్డి ఆర్డీవో గిరి సందర్శించి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. -
పురుడుపోయని పీహెచ్‌సీలు!
కామారెడ్డి టౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా, స్థానికంగానే ప్రసవాలు (డెలివరీలు) జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీ) ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల లేమి, అందుబాటులో లేని వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా ఆశించిన స్థాయిలో ప్రసవాలు జరగడం లేదు. ప్రసవ వేదన మొదలవగానే గర్భిణులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెద్దాసుపత్రికో, ఏరియా ఆస్పత్రులకో లేదా ప్రైవేటు నర్సింగ్ హోమ్లకో పరుగులు తీయాల్సి వస్తోంది. సుఖప్రసవాలు చేసే అవకాశం ఉన్నా.. స్థానిక ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, రాత్రి వేళల్లో సేవలు కరువవ్వడంతో పీహెచ్‌సీల లక్ష్యం నీరుగారుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గత ఏడాది ఆర్థిక సంవ్సతరం ఎప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అందించిన అధికారిక ప్రసవాల నివేదికను పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 పీహెచ్‌సీలు, 2 యూపీహెచ్‌సీలు ఉండగా, అందులో సగానికి పైగా కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య అత్యంత తక్కువగా ఉంది. కామారెడ్డి డివిజన్ పరిధిలోని బీబీపేట్, ఎర్రాపహాడ్, రాజంపేట్, దేవునిపల్లి, రాజీవ్‌నగర్ యూపీహెచ్‌సీలతో పాటు బాన్సువాడ డివిజన్ పరిధిలోని డోంగ్లి, నిజాంసాగర్, పుల్కల్, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఉట్నూర్, అలాగే బాన్సువాడ, కామారెడ్డి యూఎఫ్‌డబ్ల్యూసీ కేంద్రాల్లో గడిచిన ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రసవం కూడా జరగలేదు. ఈ కేంద్రాలన్నీ సున్నా’ ప్రసవాల గణాంకాలతోనే సరిపెట్టుకున్నాయి. చాలా పీహెచ్‌సీల్లో కేవలం పగటిపూట మాత్రమే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాత్రి, అర్ధరాత్రి వేళల్లో ప్రసవ వేదన వస్తే అక్కడ చూసేవారే కరువవుతున్నారు. దీంతో గర్భిణుల కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి జిల్లా కేంద్రానికి తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో దారిలోనే ప్రసవాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలు మాత్రమే చూస్తు పెద్దాసుపత్రులకు రిఫర్ చేస్తున్న ఘటనలూ ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో. జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనూ ఇదే ప రిస్థితి నెలకొంది. పీహెచ్‌సీలతో పోలిస్తే సీహెచ్‌సీల లో వైద్యులు, సిబ్బంది ఎక్కువ. అలాగే మెరుగైన సౌకర్యాలు ఉన్నా ఇక్కడా తక్కువ సంఖ్యలోనే ప్రసవాలు నమోదవుతున్నాయి. ఏడాదిగా ప్రసవాల సంఖ్య చూస్తే మద్నూర్ సీహెచ్లో 70, బిచ్కుందలో 67, పిట్లంలో 57, గాంధారిలో 53, ఎల్లారెడ్డిలో 33, దోమకొండలో 12 ప్రసవాలు జరిగాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. పీహెచ్‌సీల్లో గర్భిణులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, మందులు అందుబాటులో ఉంచాం. ప్రతి నెలా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఏవైనా హైరిస్క్ కేసులు ఉంటే మాత్రమే జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలని సిబ్బందిని ఆదేశించాం. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యాధికారులతో త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. – డాక్టర్ వెంకట్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిపీహెచ్సీల్లో సరైన వసతులు, వైద్యులు అందుబాటులో లేక గర్భిణులు జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, ఎంసీహెచ్, ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రసవాల కోసం వెళ్తున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది కాలంలో 3,654 ప్రసవాలు జరగ్గా, బాన్సువాడ ఎంసీహెచ్‌లో అత్యధికంగా 4,036 ప్రసవాలు జరిగాయి. అంటే రెండు ప్రధాన ఆసుపత్రుల్లోనే ఏకంగా 7,690 ప్రసవాలు జరగడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 15,441 సాధారణ, సీజరియన్లు అయ్యాయి. ఎక్కడ.. ఎన్ని..?జుక్కల్ పీహెచ్సీలో అత్యధికంగా 134 ప్రసవాలు జరగ్గా, భిక్కనూర్‌లో 43, మాచారెడ్డి 12, బీర్కూర్ 10, లింగంపేట్ 13, నాగిరెడ్డిపేట్ 12 ప్రసవాలను రెండంకెల ప్రసవాల సంఖ్యను దాటగలిగాయి. ఏడాదంతా సింగిల్ డిజిట్ ప్రసవాల సంఖ్యను మరో ఐదు పీహెచ్‌సీలున్నాయి. డివిజనల్ పరిధిగా పీహెచ్సీలలో ఏడాది కాలంగా చేస్తే కామారెడ్డి డివిజనల్లో 62, బాన్సువాడలో 163, ఎల్లారెడ్డిలో 29 మాత్రమే ప్రసవాలు జరిగాయి. అంటే మొత్తం పీహెచ్సీలలో ఏడాది కాలంలో 254 ప్రసవాలు మాత్రమే జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో మందగించిన‘డెలివరీ’ సేవలు ఖాతా తెరవని పలు ప్రాథమిక ఆర్యోగ్య కేంద్రాలు సీహెచ్సీల్లోనూ తక్కువ సంఖ్యలో.. జిల్లా, ఏరియా ఆసుపత్రి, ప్రైవేటు సెంటర్లకు గర్భిణుల పరుగులు -
యూరియా స్టాక్ ఉండాలి
● రైతులకు యాప్‌పై అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి టౌన్ : రైతులకు యూరియా స్టాక్ అందుబాటులో ఉండేలా ఎరువుల విక్రయ కేంద్రాల్లో తగిన నిల్వలు ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్, సహకారశాఖ అధికారులతో కలెక్టర్ శనివారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఎరువుల సరఫరా, నిల్వలు, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. యూరియా యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని అన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు, అవసరాలు, సరఫరా పరిస్థితి వివరాలను తెలుసుకుని అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్‌ఫెడ్ ప్రతినిధులు, సహకార శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2.48 లక్షల బ్యాగుల యూరియా కొనుగోలు వానకాలం సాగు పనులు ఊపందుకోవడంతో జిల్లాలో ఎరువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రత్యేక యూరియా బులిటెన్‌ను ఒక ప్రకటనలో విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 96,519 మంది రైతులు 2.48 లక్షల బ్యాగుల యూరియాను కొనుగోలు చేసి లబ్ధి పొందినట్లు వివరించారు. ఎరువుల నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే యూరియాను కొనుగోలు చేసుకోవాలని డీఏవో తెలిపారు. -
‘సర్’ను పకడ్బందీగా చేపట్టాలి
బాన్సువాడ : ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి సూచించారు. శనివారం బాన్సువాడ రెడ్డి సంఘంలో బీఎల్వో, బీఎల్ఏ, బీఎల్ సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, అర్హులైన ఓటర్లను జాబితాలో చేరుస్తూ అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఓటర్ల వివరాలు మొబైల్ యాప్‌లో పొందపర్చాలని సూచించారు. తహసీల్దార్ నరేందర్‌గౌడ్, శిక్షకులు వెంకటరమణ, కొంతం వెంటేశం ఉన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై బీఎల్వోలకు ఆర్డీవో రొడ్డ ప్రభాకర్ అవగాహన కల్పించారు. శనివారం ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు సంబంధించిన బీఎల్వోల శిక్షణ కార్యక్రమం మండలంలోని మీసాన్‌పల్లి రైతు వేదికలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ట్రైనర్లు శ్రీనివాస్, దేవేందర్, బీఎల్వోలు పాల్గొన్నారు. -
ఓటు హక్కు అత్యంత విలువైనది
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక విస్తృత పునర్విమర్శ–2026 (సర్) కార్యక్రమంపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 2కే రన్‌ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఎన్నికల ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ఎంతో ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈనెల 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అక్టోబర్ 1న అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన అనంతరం ‘తుది ఓటరు జాబితా’ ప్రచురణ ఉంటుందని వివరించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వీ గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, డీఈవో మల్లికార్జున్, తహసీల్దార్ హిమబిందు, తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
వృద్ధుడి ఆత్మహత్య గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గుర్జాల్ గ్రామానికి చెందిన మంగళారం పోచయ్య (60) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేందర్ శనివారం తెలిపారు.పోచయ్య ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రా లేదు.19న కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులకు శనివారం బ్రాహ్మణ్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఒకరు ఉరేసుకొని మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని పోచయ్యగా గుర్తించారు. మృతుడి కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలుడిపై పిచ్చికుక్కల దాడి దోమకొండ: మండలంలోని అంచనూరు గ్రామంలో శనివారం ఓ బాలుడిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. గ్రామానికి చెందిన బైకరి రుత్విక్‌పై కుక్కలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే కుక్కలను తరిమివేసి బాలుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు తండ్రి బైకరి మహేశ్ తెలిపారు. రుత్విక్‌తోపాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. పేకాట స్థావరంపై .. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంపూర్‌గడ్డ తండా శివారులో శనివారం పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. పేకాడుతున్న వారి నుంచి రూ.21,610, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాలీ ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గేట్ వద్ద ఓ వ్యక్తిని ఢీకొట్టిన ట్రాలీ ఆటోడ్రైవర్ రత్నయ్యపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మాల్తుమ్మెద బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న జక్కుల భూషణం అనే వ్యక్తిని రత్నయ్య ట్రాలీ ఆటోతో ఢీకొట్టాడు. దీంతో భూషణం తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇరువర్గాల ఘర్షణ.. కేసు .. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నేరల్‌తండాలో భూమి కోసం ఘర్షణపడిన ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ శనివారం తెలిపారు. తండాకు చెందిన జాలం సింగ్, బాల్సింగ్ వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పర దాడులు చేసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. -
పాఠశాలలో విద్యావసతులు భేష్
బీబీపేట: కామారెడ్డి జిల్లా బీబీపేటలోని తిమ్మయ్యగారి సుశీల నారాయణ రెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అత్యంత నాణ్యమైన విద్య అందించడంతో పాటు వసతులు కూడా బాగున్నాయ ని సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వివరించిన సందర్భం శుక్రవారం హైదరబాద్‌లోని రవీంద్రభారతిలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలను అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేశారు. ఆ అవార్డును సీఎం, గవర్నర్ చేతుల మీదుగా బీబీపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూల రవీంద్రారెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా వేదికపైకి హెచ్ఎం రవీంద్రారెడ్డి వెళ్లిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు పరిచయం చేసి పాఠశాల గొప్పతనం గురించి వివరించారు. పాఠశాల హెచ్ఎం రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అవార్డు వచ్చిందని పేర్కొన్నారు. -
మదర్సా నుంచి బాలుడు అదృశ్యం
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న మదర్సా నుంచి 11 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. డిచ్పల్లికి చెందిన బాలుడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. గుర్జాల్‌లో వృద్ధుడు.. గాంధారి:గుర్జాల్‌కు చెందిన మంగళారం పోశయ్య(60) అదృశ్యమైనట్లు ఎస్సై మహేందర్ శుక్రవా రం తెలిపారు. ఈ నెల 16 న ఇంటి నుంచి వెళ్లిన పోశయ్య తిరిగిరాలేదు. కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
మాచారెడ్డి: ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించకుంటే ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయని గజ్యానాయక్ తండా సర్పంచ్ రావుల వినోద అన్నారు. శుక్రవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా తండాలోని ఇంటింటికి తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఆమె కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన,గుణాత్మక విద్య అందుతుందని అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు, పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి దేవి, ఉపాధ్యాయురాలు లత ఉన్నారు. దోమకొండ: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి అని మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ బదిలీ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు ఏ శాఖలో విధులు నిర్వహించినా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని.. అలాంటప్పుడే ఉద్యోగులు తృప్తి ఉంటుందన్నారు. అనంతరం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. సర్పంచులు, అధికారులు ఎంపీడీవోకు జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. తహసీల్దార్ స్వప్న, ఎస్సై ప్రభాకర్, ఎంఈవో విజయ్ కుమార్, ఎంపీవో రవికుమార్, ఏపీవో రజని, నాయకులు సీతారాం మధు, పులబోయిన రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని శివాపూర్ గ్రామ సర్పంచ్ పల్లె నాగరాజు తన ఇద్దరు పిల్లలు అక్షయ, అభినయ్లను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్షయ ఎల్లారెడ్డి మోడల్స్ స్కూల్లో ఏడో తరగతి చదువుతుండగా, కుమారుడు అభినయ్ నాగిరెడ్డిపేట మండలం బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని కామారెడ్డి డీఆర్డీవో దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో పర్యటించారు. ఐకేపీ కార్యాలయాన్ని పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు, సిబ్బందితో మాట్లాడారు. రుణాలను సకాలంలో చెల్లించేలా సిబ్బంది చర్యలు తీసుకొని వసూలు చేయాలని సూచించారు. ఏపీఎం ప్రసన్న కుమార్, సిబ్బంది ఉన్నారు. -
‘చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి’
కామారెడ్డి అర్బన్: చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపించాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. వచ్చే నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే చాకలి ఎస్సీ సాధన సమితి 9వ వార్షికోత్సవ సభ, ఛలో హైదరాబాద్‌కు సంబంధించిన కరప్రతాలను ఆమె శుక్రవారం కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాకలి కులాన్ని ఎస్సీలో చేర్చుతామని హామీ ఇచ్చిందని, దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చాకలి బంధు అమలు చేసి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని, చాకలి ఐలమ్మ భవనానికి రూ.5 కోట్లు కేటాయించాలని, ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలని, హైదరాబాద్‌లో హాస్టళ్లు నిర్మించాలని, జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటప్పయ్య, యూత్ సహాయ కార్యదర్శి దేవరి నందు, నాయకులు భూమన్న, విజయ్‌కుమార్, రాజయ్య, సుధాకర్, రాజు, మహేష్, నర్సింలు పాల్గొన్నారు. -
హుండీ చోరీ కేసులో నిందితుని అరెస్ట్
● రూ. 21,660 నగదు, స్కూటీ స్వాధీనం ● పరారీలో మరో నిందితుడు రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని సాయిఅయ్యప్ప దేవాలయంలో రెండు రోజుల క్రితం జరిగిన హండీ చోరీ కేసును ఛేదించినట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ. 21,660 నగదు, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం రుద్రూర్ నుంచి స్కూటీపై వస్తున్న వ్యక్తి పోలీసులకు చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకొని విచారించారు. పోలీసుల విచారణలో ఈ నెల 17న ఏడుకొండలు అనే వ్యక్తితో కలిసి చోరీకి పాల్పడినట్లు నిందితుడు రాజు అంగీకరించాడు. నిందితుడు ఏడుకొండలు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కేసు దర్యాప్తులో ఎస్సై శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ బస్వంత్ రావ్, కానిస్టేబుల్ యాదగిరి కీలకపాత్ర పోషించారని, అరెస్ట్ చేసిన కోటగిరి పోలీసులను ఏసీపీ అభినందించారు. -
సంక్షిప్తం..
కాంగ్రెస్ గ్రామ కమిటీల ఏర్పాటు లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీని శుక్రవారం మండల అధ్యక్షుడు గోకుల్ సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో నియమించారు. అధ్యక్షుడిగా అట్టెం మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా సాయగౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాములు, మహిళా అధ్యక్షురాలిగా ఏసవ్వలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సర్పంచ్ అట్టెం శ్రీనివాస్, మండల నాయకులు అశోక్, బాలరాజు, రవి, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం మర్కల్‌లో గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడిగా దొడ్లె రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా మాజీ అధ్యక్షుడు లింగాగౌడ్, ఉప సర్పంచ్ లింగం, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు మద్దెల బాగయ్య, ఏఎంసీ చైర్మన్ సంగ్యా నాయక్, పద్మాజీవాడి విండో చైర్మన్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. చేనేత సహకార సంఘానికి డైరెక్టర్ల ఏకగ్రీవ ఎన్నిక దోమకొండ: దోమకొండ చేనేత సహకార సంఘం ఎన్నికలకు గురువారం 9 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి భూమయ్య తెలిపారు. 10 మంది నామినేషన్లు వేయగా, గురువారం ఐరేని నర్సయ్య నామినేషన్ విరమించుకున్నట్లు వివరించారు. డైరెక్టర్లుగా బత్తిని సిద్దరాములు, సుంచు రాములు, అందే నాగభూషణం, బీసు సంతోష్‌కుమార్, బాలే సురేందర్, కూచని జగదీష్, బొమ్మెర జమున, కోట సదానంద, కై రంకొండ శ్రీనివాస్‌లు ఎన్నికై నట్లు వివరించారు. ఈనెల 24న వారిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, క్యాషియర్ ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, క్యాషియర్ అందే గణేష్, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిట్లంలో ఎన్నికలు ఏకగ్రీవం పిట్లం(జుక్కల్): పిట్లం మండల చేనేత సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి మురళీధర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిట్లం చేనేత సహ కార సంఘంలో 9 డైరెక్టర్ పోస్టులకు 9 నామినేషన్లు మాత్రమే రావడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించా రు. అనంతరం నియామక పత్రాలు అందజేశారు. పెండింగ్ పనులకు రూ.20 లక్షల నిధులు మంజూరు ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెండింగ్ పనులకు సంబందించి రూ.20 లక్షల నిధులను ఎమ్మెల్యే మదన్మోహన్ మంజూరు చేయించినట్లు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం తెలిపారు. దీంతో పాటు వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి పైప్‌లైన్ కోసం రూ.3.50 లక్షల నిధులు సైతం మంజూరు చేయించారని అన్నారు. దీంతో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు
దోమకొండ: దోమకొండలో గడికోట అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం సాముహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జూన్ 19న గడికో ట వారసులు కీర్తిశేషులు కామినేని ఉమాపతిరావ్ జయంతిని పురస్కరించుకొని అక్షరాభ్యా సం చేపట్టారు. అనంతరం పదో తరగతి పరీక్ష ల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ ట్రస్ట్ మేనేజర్ బాబ్జి అందజేశా రు. విద్యార్థుల కృషిని అభినందిస్తూ భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించా లని ఆకాంక్షించారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఐసీడీఎస్ సీడీపీవో రోషిష్మ, మాజీ సర్పంచ్ శ్రీమతి నల్లపు అంజలి, చాముండేశ్వరీ ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధారెడ్డి, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ సభ్యులు గణేష్ యాదవ్, రాజశేఖర్ వినయ్, వెంకట లక్ష్మి, కల్పన పాల్గొన్నారు. ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఏప్రిల్/మే–2026లో నిర్వహించిన యూజీ బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ 2వ, 4వతోపాటు 6వ సెమిస్టర్ల (రెగ్యులర్), 1వ, 3వ, 5వ (బ్యాక్లాగ్) సెమిస్టర్ (2025–26) పరీక్షా ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంపత్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పి. రాంమోహన్ రెడ్డి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి కే భరత్ రాజ్, కళాశాల అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు కే వినయ్ కుమార్, డాక్టర్ యస్ జయప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. https:// gdctg. cgg. gov. in/ nizamabad. edu లో ఫలితాలను చూసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆరో సెమిస్టర్లో 82.27 శాతం, నాలుగవ సెమిస్టర్ లో 50.17 శాతం, ఫస్ట్ ఇయర్ లో 47.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం ఖలీల్‌వాడి: ఎంబీఏలో అడ్మిషన్ తీసుకోవాలనే, ఐసెట్ – 2026 పరీక్ష రాయని వారికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే ఎంబీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ రాంమోహన్ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ రంజిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. -
పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ రాజేశ్ చంద్ర గాంధారి(ఎల్లారెడ్డి): పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, గంజాయి వినియోగం, విక్రయం, పేకాటపై గట్టి నిఘా పెట్టాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన గాంధారి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలను ఓపికతో వినాలని, వీలైనంత తొందరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో దొంగతనాల నివారణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, సైబర్ నేరాలపై నిఘా ఉంచాలని సూచించారు. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, స్థానిక ఎస్సై మహేందర్, సిబ్బంది ఉన్నారు. -
క్రైం కార్నర్
వర్ని: చందూర్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన జోషి బూమ్ జీ (56) మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. నాట్లు వేయటానికి వచ్చిన మహిళ చందూర్ వద్ద రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బోధన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా జోషి బూమ్ జీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మహిళ మృతికి కారణమైన కారు డ్రైవర్ సయ్యద్ వాజిద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త ఎర్రం పవన్‌కుమార్ (42) అప్పుల భాదతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో హార్డ్‌వేర్ దుకాణం నడుపుతున్న పవన్‌కుమార్‌కు అప్పులు ఎక్కువయ్యాయి. మనస్తాపం చెందిన ఆయన ఈ నెల 17న లక్కంపల్లి శివారులో గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న మిత్రులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నగరంలో మరొకరు... నిజామాబాద్ అర్బన్ : నగరంలోని బ్రాహ్మణకాలనీకి చెందిన అనంతరావు(50) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు 5వ టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. కిడ్నీ, షుగర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అనంతరావు శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ప్రస్తుతం రెండో భార్య గోదావరితో కలిసి ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యం
సుభాష్‌నగర్ : దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై) లక్ష్యమని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ ధర్మపురి పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఎంపీ అర్వింద్ వర్చువల్‌గా విన్నారు. అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో పీఎంవీబీఆర్‌వై పథకాన్ని 2047 లక్ష్యమే సాధనగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఉద్యోగుల సృష్టి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈపీఎఫ్‌వో ద్వారా కేంద్రం మొదట ఉద్యోగంలో చేరిన వారికి రూ.15 వేల ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో నిజామాబాద్ ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 764 మంది ఉద్యోగులకు సుమారు రూ.15.71లక్షలు లబ్ధి పొందారన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచి, ఉద్యోగులకు, యజ మానులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే కేంద్ర ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహక పథకం పీఎంవీబీఆర్‌వై అని ఎంపీ తెలిపారు. -
ఘనత కాంగ్రెస్‌దే
మహిళలను బస్సు ఓనర్లను చేసిన● వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం ● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నిజాంసాగర్(జుక్కల్): మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడమే కాకుండా బస్సు ఓనర్లుగా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. అనంతరం ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో విఠల్వాడి వరకు ప్రయాణించారు. శుక్రవారం జుక్కల్ మండలం సావర్గావ్లో కండెబల్లూర్– సావర్గావ్– విఠల్ వాడి గ్రామాలకు కొత్త బస్ సర్వీసును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళలను కోటిశ్వరులు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పథకాలు తీసుకొస్తున్నారని అన్నారు. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ బడులు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా రూపు రేఖలు మారుతున్నాయని అన్నారు. శుక్రవారం జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్యఅఽధితిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులను పంపిణి చేశారు. విద్యార్థులతో క లిసి భోజనం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎమ్మెల్యే కోరారు. డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఎన్ఆర్ఐ భాస్కర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు. సోయాబీన్ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి మద్నూర్(జుక్కల్): ప్రభుత్వం అందించే సోయాబీన్ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్(ఎన్ఏంఈవో) పథకంలో భాగంగా ఎఫ్‌పీవో(మద్నూర్) ద్వారా రైతులకు సోయాబీన్ విత్తనాలను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచించారు. ఏవో రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, ఎఫ్‌పీవో చైర్మన్ గోపాల్, నాయకులు సంతోష్మేసీ్త్ర, హన్మాండ్లు స్వామి, రైతులు పాల్గొన్నారు. -
యూరియా యాప్ మాకొద్దు
● పాతపద్ధతిలోనే అందించాలి ● రైతుల డిమాండ్ ● పర్మళ్లలో అవగాహన సదస్సు బహిష్కరణలింగంపేట: ‘ఈ యూరియా యాప్ మాకొద్దు. దీంతో ఇబ్బందిపడుతున్నాం. వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే సరఫరా చేయాలి’ అని రైతులు డిమాండ్ చేశారు. యూరియా యాప్‌పై అవగాహన కల్పించేందుకు శుక్రవారం పర్మళ్ల రైతు వేదికలో పర్మళ్ల, సజ్జన్పల్లి, ఎక్కపల్లి, మాలోత్‌తండా, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల క్లస్టర్‌కు సంబంధించిన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడీఏ సుధారాణి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే రైతులు యూరియా యాప్‌ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. యాప్‌తో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. యాప్ లేనప్పుడు ప్రతి రైతుకు యూరియా అందిందని, ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 26వేల ఎకరాల సాగు భూమి ఉందని, అవసరమైన యూరియాను ఒకేసారి సరఫరా చేయాలని కోరారు. సదస్సును బహిష్కరించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు రాజాగౌడ్, శ్రీను, రాజు, రవి, గంగారెడ్డి, సిద్దయ్య, దుర్గేష్, ప్రభురాజ్, సాయిలు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
బోనస్.. ఏడుపేనా?
ఎంపిక చేసిన వంగడాలకే ప్రోత్సాహకం ఇస్తామంటున్న సర్కారు● ఆలస్యంగా వెలువడిన ప్రకటన ● ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు ● పలుచోట్ల మొదలైన నాట్లు ● ఆందోళనలో అన్నదాతలుజిల్లాలో ప్రధాన పంట వరి. ఈ ఖరీఫ్‌లో 3.20 లక్షల ఎకరాలలో వరి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని తెలిసినా.. రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపారు. ప్రధానంగా నిజాంసాగర్, పోచారం, కౌలాస్ ప్రాజెక్టుతో పాటు సింగితం రిజర్వాయర్, చెరువులు, కుంటలతోపాటు వ్యవసాయ బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నారు మడులు కూడా సిద్ధం చేసుకున్నారు. వచ్చేవారంలో ప్రచారం.. ప్రభుత్వం బోనస్ కోసం ప్రతిపాదించిన ఏడు రకాల వరి వంగడాలపై 23వ తేదీనుంచి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 104 రైతు వేదికలలో సీడ్ మేళాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.మాగి శివారులో సిద్ధం చేసిన నారుమడినీటివనరులు ఉన్న రైతులు ముందస్తుగానే నాట్లు కూడా మొదలుపెట్టారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, కోటగిరి, ఎడపల్లి, బోధన్ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి నాట్లు వేస్తున్నారు.ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తుందన్న ఆశతో అత్యధిక శాతం రైతులు సన్నరకాలే సాగు చేస్తున్నారు. సన్న వరికి బోనస్ ఇస్తామన్న కొత్తలో వ్యవసాయ శాఖ సర్వేలు నిర్వహించి 33 రకాల సన్న వరి వంగడాలను వేసుకోవచ్చని సూచించింది. రైతులు తమ నేలలకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడి వచ్చే సన్న రకాలను ఎంచుకుని నారు పోశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా శిశిర–108, రేష్మ–1150, రేష్మ–1116, సిరి మసూరి, సిరి లీడర్ లాంటి అధిక దిగుబడి ఇచ్చే సన్న రకాలను వేసుకున్నారు. ఈ రకాలు మంచి దిగుబడి ఇవ్వడంతో పాటు తెగుళ్ల బారిన పడవని రైతులు అంటున్నారు. బోనస్ విషయంలో ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతిపాదించిన ఏడు రకాల వరి వంగడాలను సాగు చేసిన రైతులకే బోనస్ వర్తిస్తుందని చెప్పడంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ నిర్ణయమేదో నారుపోసుకోక ముందే తీసుకుంటే బాగుండేదని, ఆలస్యంగా ప్రకటించడంతో నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సన్నరకాలన్నింటికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.వరి వంగడం రకం పంటకాలం(రోజులలో) బీపీటీ –5204 140–150 తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ –15048) 120–125 కేఎన్ఎం – 1638 120–125 జైశ్రీరాం 130–135 హెచ్ఎంటీ 135–145 డబ్ల్యూజీఎల్–962 125–130 డబ్ల్యూజీఎల్–44(సిద్ది) 140–145 ఓవైపు వరుణుడి కరుణ లేక కాలం అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్న రైతులను.. బోనస్‌పై సర్కారు చేసిన ప్రకటన ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో నాట్లు కూడా మొదలయ్యాయి. ఈ పరిస్థితులలో ఏడు రకాల వరి వంగడాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. – నిజాంసాగర్/ఎల్లారెడ్డి -
నకిలీ విత్తు.. రైతన్న చిత్తు
● నష్టపరిహారం కోసం అన్నదాతల డిమాండ్ ● డీలర్ దుకాణం వద్ద ఆందోళనలింగంపేట: నకిలీ విత్తనాలతో వరి సాగు చేసి మోసపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఆందోళన బాటపట్టారు. శుక్రవారం లింగంపేటలో రాస్తారోకో చేశారు. రైతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పర్మళ్ల గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు గత ఖరీఫ్ సీజన్లో లింగంపేటలోని ఓ సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్ దుకాణంలో కిసాన్ సీడ్(కేఎస్–135) రకం వరి విత్తనాలను కొనుగోలు చేశారు. 10 కిలోల బస్తాకు రూ. 650 చెల్లించారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని డీలర్ చెప్పడంతో ఈ విత్తనాలు కొన్నారు. వరి పొట్ట దశలో 20 వరకు పిలకలు వచ్చాయి. అయితే అందులో మూడునాలుగు మాత్రమే గెలలు వేశాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు విత్తనాలు విక్రయించిన వ్యాపారిని కలిసి సమస్యను వివరించారు. ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావడంతో తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. దీంతో ఆయన కంపెనీ వారిని పిలిపించి నష్టపరిహారం అందేలా చూస్తానని చెప్పారు. సదరు వ్యాపారి సీడ్స్ పంపిణీ చేసిన కరీంనగర్ రాజు అలియాస్ నితీష్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన రాలేదు. దుకాణం యజమాని పర్మళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు లక్ష రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో మిగిలినవారు నష్టపరిహారం కోసం శుక్రవారం సదరు వ్యాపారిని కలిశారు. తాను ఎవరికీ పరిహారం ఇవ్వబోనని చెప్పడంతో రైతులు ఆగ్రహించి సర్పంచ్ గడ్డం బాబాయి ఆధ్వర్యంలో కేకేవై రోడ్డులో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎస్సై దీపక్‌కుమార్ రైతుల వద్దకు వచ్చి దుకాణం యజమానితో మాట్లాడతామని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం రైతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. -
నేడు జాతీయ లోక్ అదాలత్
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అథారిటీ సంస్థ చైర్మన్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, మోటారు వాహన ప్రమాదాలు, క్లెయిమ్‌లు, బ్యాంకు రుణ వివాదాలు, చెక్ బౌన్స్ తదితర కేసులు, కుటుంబ వివాదాలను కక్షిదారులు పరస్పర అంగీకారంతో ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. దీనికోసం జిల్లా కేంద్రమైన కామారెడ్డితో పాటు బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టుల పరిధిలో మొత్తం 8 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియాకు సంబంధించి 2026–27 సంవత్సరానికిగాను తైబజార్, మేకల సంతలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, అధికారుల సమక్షంలో ఈ వేలం పాట ఉంటుందని పేర్కొన్నారు. అర్హుత గల కాంట్రాక్టర్లు ఈ వేలంలో పాల్గొనాలని సూచించారు. కామారెడ్డి అర్బన్: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లేవారే దేనిలోనైనా సులభంగా విజయం సాధిస్తారని విశ్రాంత ఐఏఎస్ అధికారి చామర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శిశుమందిర్‌లో చదివి ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారితో పాటు ఒలింపియాడ్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో శ్రీసరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, జిల్లా కార్యదర్శి గీరెడ్డి రాజారెడ్డి, ప్రబంధకారిణి సభ్యులు గంగారెడ్డి, రంజిత్‌మోహన్, ప్రతాప్‌గౌడ్, సభ్యులు అశోక్‌రావు, ఎస్ఎన్ చారి, నారాగౌడ్, శ్రీనివాస్, నాగభూషణం, నగేష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: రాష్ట్రంలో వీఆర్ఏలుగా పనిచేసి రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, చైన్‌మెన్ కేడర్లలో విలీనం అయిన వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయమై రాష్ట్ర రికార్డు అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్టు రవీందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, సీసీఎల్ఏ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న సానిటేషన్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రీషియన్, ఆఫీస్ స్టాఫ్ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చేనెల 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ పర్వతాలుకు సమ్మె నోటీస్ అందజేశారు. తొలగించిన 41 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 60 ఏళ్లు నిండిన, అనారోగ్యంతో ఉన్న కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో 22న స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద, 26న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 3వ తేదీనుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సుధాకర్, చంద్రశేఖర్, రాజ నర్సు, నర్సింగ్, మెహబూబ్, అయాజ్ బేగ్, ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
‘స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలి’
బాన్సువాడ రూరల్: అన్ని గ్రామాలో వారం రోజుల పాటు ఉపాధ్యాయులు స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని డీఈవో మల్లికార్జున్ సూచించారు. శుక్రవారం ఆయన బాన్సువాడ మండల ప్రత్యేకాధికారి హోదాలో మండలంలో పర్యటించి పలు పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల నమోదుపై రోజూ సాయంత్రం నివేదిక పంపాలన్నారు. ప్రీప్రైమరీ తరగతుల ప్రారంభం, బడిబాట, జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై ఎంఈవో నాగేశ్వరరావుకు పలు సూచనలు ఇచ్చారు. కొయ్యగుట్టలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. -
మహాప్రస్థానానికి ముందడుగు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో అంతిమ కష్టాలు తీర్చేందుకు దారి సుగమమైంది. శ్మశాన వాటిక అభివృద్ధికి ముందుకొచ్చిన ఎస్ఆర్ ఫౌండేషన్‌కు మున్సిపాలిటీ అనుమతి లేఖ అందజేసింది. దింపుడుకళ్లెం దిమ్మె కూడా లేని కామారెడ్డిలోని ప్రధాన శ్మశాన వాటికలో నెలకొన్న కష్టాలపై ఏప్రిల్ 20న ‘సాక్షి’లో ‘అంతిమ కష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. సమస్య తీవ్రతను చూసి ఎందరో చలించిపోయారు. లక్షకుపైగా జనాభా ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైకుంఠధామాల దుస్థితిని చూసి అవాక్కయ్యారు. ఈ కథనం ప్రచురితమైన రోజే జరిగిన మున్సిపల్ సమావేశంలో ఆయా పార్టీల కౌన్సిలర్లు సాక్షి క్లిప్పింగ్‌ను చూపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ‘సాక్షి’ కథనాన్ని చదివి చలించిపోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం స్థాయిలో శ్మశాన వాటికను తీర్చిదిద్దడానికి ముందుకువచ్చిన ఆయన.. తన ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధుల ద్వారా జిల్లా అధికారులకు లేఖను అందించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సుభాష్‌రెడ్డిని కలిసి అభినందించారు. పట్టణంలోని పలు కుల సంఘాల ప్రతినిధులు సమావేశమై ఎస్ఆర్ ఫౌండేషన్‌కు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు.శ్మశాన వాటిక అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా అనుమతులు ఇవ్వడంతో బల్దియా తాత్సారం చేసింది. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో పట్టణ ప్రజల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఈనెల 11 న మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘సాక్షి’ కథనానికి స్పందించి ఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు రావడాన్ని ఈ సమావేశంలో సభ్యులు అభినందించారు. శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం ఎస్ఆర్ ఫౌండేషన్‌కు పరిపాలన అనుమతి ఇస్తూ తీర్మానం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఎస్ఆర్ ఫౌండేషన్‌కు పరిపాలన అనుమతి లేఖను అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతరావు, ఏఈ వేణుప్రసాద్, ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట్‌గౌడ్, రాజాగౌడ్, వెంకటరాంరెడ్డి, జీవన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మట్ట శ్రీనివాస్, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.‘అంతిమ కష్టం’ తీరే దారిలో.. ఇటీవలే తీర్మానం చేసిన బల్దియా తాజాగా ఎస్ఆర్ ఫౌండేషన్‌కు అనుమతి లేఖ అందజేత -
159 సెల్ఫోన్ల రికవరీ
కామారెడ్డి క్రైం: జిల్లాలో నెల రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 159 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 25.44 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మ్తొతం రూ. 7.90 కోట్ల విలువైన 4,939 సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే పాత సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. రికవరీ చేసినవాటి వివరాలను బాధితులకు తెలియజేస్తామని, వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్‌రాజు (87126 86114) ను సంప్రదించి ఫోన్లు తీసుకువెళ్లాలని సూచించారు.కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లావ్యాప్తంగా గురువారం ఒకే రోజు 383 మందికి కోర్టులు శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపరచగా.. ఇద్దరికి 5 రోజులు, ఒకరికి 3 రోజులు, నలుగురికి 2 రోజులు, 46 మందికి ఒకరోజు జైలు శిక్షలతో పాటు మొత్తం 383 మందికిగాను రూ.4,93,500 జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లావ్యాప్తంగా క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
క్రైం కార్నర్
కామారెడ్డి క్రైౖం: రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటన భిక్కనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. రైలు పట్టాల మధ్య ఓ మృతదేహం ఉందనే సమాచారం రావడంతో కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒంటిపై నలుపు, తెలుపు రంగుల చెక్స్ షర్టు, బూడిద రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడు. కుడి చేతికి స్టీల్ కడియం, లవ్ గుర్తు పచ్చబొట్టు ఉన్నాయి. మృతుని వయస్సు 30–35 మధ్య ఉంటుందని, ఘటన జరిగిన తీరు బట్టి ఆత్మహత్య చేసుకున్నారని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా ఆయనను గుర్తుపట్టినా, ఆనవాళ్లు తెలిసినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. భార్య కాపురానికి రావడం లేదని .. వర్ని: మోస్రా మండల కేంద్రానికి చెందిన గంగాప్రసాద్ (24) భార్య మమత కాపురానికి రావడం లేదని మనస్తాపంతో గురువారం తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మమత పుట్టింటికి వెళ్లి గత ఐదు నెలలుగా తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి చెందాడని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గడ్డివాము దగ్ధం ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని సాతెల్లి గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించి గడ్డి వాము దగ్ధమైందని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన జంగిలి బాలయ్యకు చెందిన 1500 గడ్డి మోపుల వాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుందన్నారు. మంటలు అంటుకున్న వెంటనే వాటిని ఆర్పే ప్రయత్నం చేశామని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించామని తెలిపారు. గడ్డి మోపులు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు బాలయ్య తెలిపారు. -
ఆదర్శంగా నిలిచిన సర్పంచ్
● ప్రభుత్వ బడిలో తన ముగ్గురు పిల్లలకు అడ్మిషన్లు ● ప్రైవేటు పాఠశాలలకు వెళ్లవద్దని గ్రామ పంచాయతీలో తీర్మానం లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ బడులు.. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవనే చెబుతూ తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ముస్తాపూర్ సర్పంచ్ రాధ. లింగంపేట మండలం ముస్తాపూర్ గ్రామ సర్పంచ్‌గా రాధ ఇటీవల ఎన్నికయ్యారు. రాధ భర్త కామారెడ్డి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు మండల అభివృద్ధి అధికారి నరేష్ అక్షరాభ్యాసం చేయించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్, న్యాయవాది దంపతులు వారి పిల్లలను చేర్పించడం అభినందనీయమన్నారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే సుమారు 40 మంది పిల్లలు స్థానిక ముస్తాపూర్ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించి సమాజానికి మంచి సందేశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లవద్దని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. దాంతో వార్డు సభ్యుల పిల్లలను సైతం ప్రభుత్వ బడిలో చేర్పించడం విశేషం. అనంతర మండల విద్యాధికారి అంజల్రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటుకు దీటుగా నాణ్యమైన విద్యను బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంప్లెక్స్ హెచ్ఎం కోటేశ్వర్రావు, హెచ్ఎం సుధాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యతోనే భవిష్యత్‌కు బలమైన పునాది’
కామారెడ్డి క్రైం: విద్యతోనే భవిష్యత్‌కు బలమైన పునాది పడుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం ఆయన గర్గుల్‌లో బడిబాట కార్యక్రమంలో పాల్గొని యూకేజీ తరగతిని ప్రారంభించి, అక్షరాలు దిద్దంచారు. సంచార జాతుల పిల్లలను పాఠశాలలో చేర్పించి వారికి అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో రెండు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. గర్గుల్ పాఠశాలకు చెందిన నలుగురు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న 12 మంది క్రీడాకారులను సన్మానించారు. ఇందిరమ్మ గృహాలకు భూమిపూజ.. గర్గుల్‌లో పూరి గుడిసెల్లో నివసిస్తున్న రావుల పెద్ద ఎల్లమ్మ, భిక్షపతి, దానబోయిన జ్యోతిలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ భూమిపూజ చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి నాణ్యతతో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా లబ్ధిదారులకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ దివ్య, డీఈవో మల్లికార్జున్, తహసీల్దార్ హిమబిందు, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంఈవో ఎల్లయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.కామారెడ్డి క్రైం: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో జరుగుతున్న జూనియర్ కళాశాలల్లో చేపడుతున్న మరమ్మతు పనులు, పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ, స్వయం సహాయక సంఘాల భవనాలు, గోదాములు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, జీపీ భవనాల పనులపై శాఖలవారీగా సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం, మరమ్మతు పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గిరి, డీపీవో మురళి, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, డీఈవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
‘యాప్’ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు
● పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలి ● ఎల్లారెడ్డి రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ఎల్లారెడ్డి: యూరియా యాప్ పేరుతో రైతులను ఇ బ్బందులకు గురిచేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎల్లారెడ్డిలోని తహసీల్ కార్యాలయం ఎదుట రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను టెక్నాలజీ పేరు తో ఇబ్బందుల పాలు చేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. స్మార్ట్ఫోన్లు లేని నిరక్షరాస్యులైన రై తులు యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారన్నారు. ఆధార్ కార్డు లేదా పట్టాదారు పాస్ పుస్తకం చూపిస్తే నేరుగా యూరియా ఇచ్చే పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి రెండు రోజులలో అని సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ నేతలు కపిల్‌రెడ్డి, తానాజీరావు, శ్రీనివాస్‌రెడ్డి, ముదాం సాయిలు, జలంధర్‌రెడ్డి, సతీష్, నర్సింలు, మనోహర్‌రెడ్డి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐపై విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ శిక్షణ
కామారెడ్డి అర్బన్: శాస్త్రసాంకేతిక యుగానికి విద్యార్థులను భావి ప్రపంచానికి సిద్ధం చేసే లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ ‘అన్న–అక్క’ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ప్రారంభించిందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నోడల్ అధికారి ఎ. రాజేందర్ అన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ అంశాలపై గురువారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అన్న–అక్క ఇంటర్న్‌షిప్‌లో భాగంగా 30 గంటల శిక్షణ అందిస్తామని నోడల్ అధికారి పేర్కొన్నారు. ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థుల్లో సమాజంపై బాధ్యత పెంచుతుందన్నారు.సమన్వయకర్తలు విశ్వప్రసాద్, సుధాకర్, శ్రీనివాస్‌రావు, రాములు, కవిత, రాంప్రసాద్‌తో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి కళాశాలల నోడల్ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కృషి
● కల్లూర్ గ్రామంలో జిల్లాలోనే తొలి మహిళా మండలి భవనం నిర్మాణం ● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి రుద్రూర్ : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో రూ.10 లక్షల ఎన్న్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... జిల్లాలోనే తొలి మహిళా మండలి భవనం కల్లూర్ గ్రామంలో నిర్మించబడటం అభినందనీయమన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. బాన్సువాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో విజయకుమారి, సర్పంచ్ రామ్‌రెడ్డి, డీఆర్డీవో సాయన్న, తహసీల్దార్ సందీప్, ఎంపీడీవో చందర్, ఐకేపీ ఏపీఎం భాస్కర్, మాజీ ఎంపీపీ పుప్పాల శంకర్, ఏఎంసీ చైర్మన్ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణా కమిటీ ముందు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజరు
కామారెడ్డి టౌన్: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియలు గురువారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కమిటీ ముందు హాజరై కమిటీ చైర్మన్ మల్లు రవికి తన వివరణ ఇచ్చారు. పక్షం రోజుల క్రితం కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీస్‌కు సమాధానమిస్తూ నివేదికలను చైర్మన్‌కు స్వయంగా అందజేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, చంద్రశేఖర్‌రెడ్డి మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నారు. కామారెడ్డి అర్బన్: సామాజిక సమరసత వేదిక ఇందూర్ విభాగ్ సంయోజక్‌గా సంగన్నగారి బాల్‌రాజ్ గౌడ్ నియమితులయ్యారు. వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ నూతన నియామకాలను ప్రకటించినట్టు జిల్లా అధ్యక్షుడు అమృత రాజేందర్ తెలిపారు. ఇందూర్ విభాగ్ సంయోజక్‌గా ఉన్న సూర్యనారాయణను సమరసత ప్రాంత సభ్యుడిగా నియమితులయ్యా రు. కామారెడ్డి నగర సంయోజక్‌గా ఉత్తునూరి దత్తురావుకు బాధ్యతలు అప్పగించారు. సైబర్ నేరాలపై అవగాహన లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సైబర్ నేరాలపై ఖాతాదారులు, బ్యాంకు సిబ్బందికి పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. సైబర్ నేరాలతో మోసపోతే టోల్ ఫ్రీ నంబర్ 1903కి కాల్ చేయాలని సూచించారు. ఎవరికి ఓటీపీలు చెప్పవద్దన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసులు ఓటీపీలు చెప్పమని ఎవరు అడగరని అన్నారు. అత్యవసర సమయాల్లో 100/112 నంబర్లకు డయల్ చేయాలన్నారు. కళాబృందం సభ్యులు తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు, షీటీమ్ సభ్యులు శ్రీశైలం, సుప్రజ, బ్యాంకు మేనేజర్ జ్యోతి, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ● మున్సిపల్ కార్మికుల డిమాండ్ ● రెండు రోజుల రిలే దీక్షలు ప్రారంభం కామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలను గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు రాజనర్సు, నర్సింగ్ మాట్లాడుతూ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. నిరసన దీక్షలో నాయకులు మహబూబ్, లక్ష్మణ్, దీవెన, అయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బోనాల పండుగ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్‌లో పెద్దమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా గురువారం భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనమెత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి అర్బన్: విద్యార్థులు ప్రతిరోజు ఉదయం సరస్వతిదేవి జపం, సూర్య నమస్కారాలు చేయాలని,తల్లిదండ్రులు, గురువులకు నమస్కారం చేయా లని శ్రీరామకోటి జప లిఖిత ప్రచారకులు కృష్ణానందస్వామీజీ అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని టేక్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కృష్ణానంద స్వామీజీ అధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. విద్యార్థులకు వివిధ శ్లోకాలు వినిపించి వాటిని ప్రతి రోజూ జపించాలని సూచించారు. రుద్రూర్: రుద్రూర్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా మనోజ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తు న్న ఆయన బదిలీపై రుద్రూర్ వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. -
28న పల్స్‌పోలియో
నాగిరెడ్డిపేట: జిల్లాలో ఈనెల 28న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో వెంకట్ తెలిపారు. నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల విషయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ సృజన్‌కు సూచించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. డయేరియా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పల్స్‌పోలియో ద్వారా జిల్లాలో 1.06 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట పీహెచ్సీ సూపర్వైజర్స్ సునంద, సుభాషిణి, అనిల్, డేవిడ్, ల్యాబ్ టెక్నిషియన్ గణేష్, స్టాఫ్‌నర్స్ మానస, మెయిల్ వర్కర్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఎర్రాపహాడ్ పీహెచ్సీ తనిఖీ తాడ్వాయి: ఎర్రాపహాడ్ పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. ఫార్మసీ, ల్యాబ్గదులను తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఖాసీం, హెచ్‌ఈవో నారాయణ, పీహెచ్ఎన్లు నక్షత్రం, సరస్వతి, శ్రీనివాస్, సుమలత, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం అదనపు కలెక్టర్ గిరిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ 2010 సంవత్సరం కన్నా ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు లక్ష్మీపతి, భాస్కర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్: ప్రభుత్వం ప్రతిపాదించిన 7 రకాల వరి విత్తనాలను రైతులకు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రెడ్డి సూచించారు. గురువారం మహమ్మద్‌నగర్‌లోని ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. సన్నరకాలకు సంబంధించి బోనస్ వచ్చే వంగడాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించి స్టాక్ వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట మండల ఏవో నవ్య తదితరులున్నారు. నిజాంసాగర్: ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పి స్తే వారి ఇంటి పన్నుతో పాటు నల్లా బిల్లులను చెల్లిస్తానని మంగ్లూర్ సర్పంచ్ నర్మాల రాజు ప్రకటించారు. గురువారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యశ్వంత్, ఉపాధ్యాయుడు చౌదరి నరేశ్, పంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కామారెడ్డి క్రైం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణ శివారులోని నర్సనపల్లి వద్ద అటవీ శాఖ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రెవాల్, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఏఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొయ్యగుండు తండా శివారులో గురువారం ఉదయం పెరుగు, పాలు తరలిస్తున్న ట్రాలీ ఆటో బాల్తాపడి ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు పెరుగు బకెట్లు, పాల ప్యాకెట్లతో వెళ్తున్న ట్రాలీ ఆటో కొయ్యగుండు తండా శివారులోకి రాగానే రోడ్డుదాటే ప్రయత్ని చేస్తున్న తండాకు చెందిన సునీతను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సతీశ్‌కు తీవ్రగాయాలు కాగా, సునీతకు స్వల్ప గాయాలయ్యాయయి. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిజామాబాద్ ఏరియా ఆస్పపత్రికి తరలించారు. -
హార్వెస్టర్ పనికి వచ్చి చోరీలు
● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్ అర్బన్: హర్యానా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హార్వెస్టర్ పనుల కోసం జిల్లాకేంద్రానికి వచ్చారు. ఉదయం పనులు చేస్తు రాత్రివేళలో చోరీలకు పాల్పడుతున్నట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఇటీవల హమాల్వాడిలో సాయిబాబా ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన రింకుసింగ్, రవిసింగ్, అమన్దీప్సింగ్లు రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. హమాల్వాడిలోని సాయిబాబా మందిరంలో దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు కాగా ఇటీవల మరొకరిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరిపై మూడో టౌన్లో రెండు కేసులు, రెండో టౌన్లో, మాక్లూర్‌లో ఒక్కొక్క కేసు, ఐదోటౌన్, ఆర్మూర్ టౌన్లో రెండేసి కేసుల చొప్పున నమోదైనట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. -
అనర్హుల ఓట్లు జాబితాలో లేకుండా చూడాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి అనర్హులను జాబితాలో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్వోలదేనని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ సూచించారు. గురువారం సదాశివనగర్, రామారెడ్డి, గాంధారి మండలాల బీఎల్వోలకు ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 25 నుంచి జూలై 26 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫాంను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాల్సిన బాధ్యత కూడా బీఎల్వోలపై ఉందన్నారు. తహసీల్దార్లు సత్యనారాయణ, ఉమాలత, రేణుకా చౌహాన్, ఎంఆర్ఐ సంతోష్‌కుమార్, బీఎల్వోలు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
● స్వార్థాన్ని వీడి దేశ హితం కోసం ఆలోచించాలి ● హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకామారెడ్డి టౌన్ : దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీనియర్ స్వయంసేవకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించానని, బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా నేర్చుకున్న దేశభక్తి, క్రమశిక్షణ, సంస్కారాలే తనను నిరంతరం నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. అందరూ స్వార్థాన్ని వీడి దేశ హితం కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎలాంటి గుర్తింపు, పదవులు లేని రోజుల్లో, కష్టకాలంలోనూ కేవలం దేశం కోసం నిలబడి సంఘకార్యాన్ని విస్తరించిన నాటి తరం కార్యకర్తల త్యాగాలు అమోఘమైనవని కొనియాడారు. తనకు కామారెడ్డితో చాలా అనుబంధం ఉందని, గతంలో ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పని చేశానని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల ప్రతినిధులు రంజిత్‌మోహన్, నీలం చిన్నరాజులు, మురళీధర్‌గౌడ్, జంగం నరేష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
గుడిసెలున్న అందరికి ఇందిరమ్మ ఇళ్లు
నిజాంసాగర్(జుక్కల్): గుడిసెలు, రేకులషెడ్లు, పాకల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించడం ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై జిల్లాస్థాయి అధికారుల సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులు, సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రెండో విడత ఇందిరమ్మ పథకం కింద గుడిసెలు ఉన్న వారికి ఇళ్లు ఇస్తున్నామన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను పకడ్బందీగా గుర్తించాలన్నారు. సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు గుడిసెలున్న కుటుంబాల సర్వే చేపట్టాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరై వివిధ కారణాలతో బిల్లులు రాని వారందరికి బిల్లులు ఇచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ ఎన్వై.గిరి, హౌసింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, ప్రజాపండరి, శ్యాం, తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటి కల నెరవేర్చిన ఇందిరమ్మ పథకం
భిక్కనూరు: నిరుపేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇండ్ల పథకం నెరవేర్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం రామేశ్వర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పార్టీలకతీతంగా అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామన్నారు.గుడిసెలు లేని రాష్ట్రంగా త్వర లోనే తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందన్నారు. రానున్న రోజుల్లో స్థలం లేని వారి కోసం కూడా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించేందుకు కసరత్తు చేస్తోందన్నారు. సర్పంచ్ చేపూరి రాణి, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, నేతలు నాగర్తి భూంరెడ్డి, శశికుమార్ రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం బీబీపేట: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాత రాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుదారు ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి పేదల ప్రభుత్వంగా గుర్తింపు పొందిందన్నారు. ఉపసర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు రోజా, కాంగ్రెస్ నాయకులు సుతారి రమేష్, మహేష్, స్వామి, అరుణ్ పాల్గొన్నారు. -
వెన్నాడుతున్న ముంపు సమస్య..
పెద్ద చెరువు అలుగు నీరు ప్రవహించే వాగు దారిపొడవునా ఆక్రమణలకు గురైంది. వాగుకు ఇరువైపులా మట్టిని నింపేసి ఎక్కడికక్కడ కబ్జా చేశారు. వాగు వెడల్పు తగ్గిపోయి చెరువు అలుగుపారినపుడల్లా నీరంతా ఇరువైపులా ఉన్న కాలనీలను చుట్టేస్తోంది. గతేడాది ఆగస్టు నెలాఖరులో వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. చెరువు అలుగు నుంచి వాగు దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. 60 మీటర్ల నుంచి 80 మీటర్ల వెడల్పు ఉండాల్సిన వాగు చాలాచోట్ల 20 మీటర్ల నుంచి 30 మీటర్లకు కుచించుకుపోయింది. కొన్నిచోట్ల పది మీటర్ల వెడల్పు కూడా లేదు. కాకతీయనగర్, ఎన్జీవోస్ కాలనీ, విద్యానగర్ కాలనీ, దేవునిపల్లి, నిజాంసాగర్ రోడ్డు తదితర ప్రాంతాల మీదుగా కామారెడ్డి పెద్దచెరువులోకి వెళ్లే నాళాలు చాలా వరకు ఉనికే లేకుండాపోయాయి. దీంతో వర్షం కురిసినపుడల్లా ఆయా కాలనీల్లో నీరు రోడ్లమీద నిలిచి ఇళ్లను ముంచేస్తోంది. చిన్న వర్షానికే నిజాంసాగర్ రోడ్డు చెరువును తలపిస్తుంటుంది. అలాగే అశోక్‌నగర్ రోడ్డు, రామారెడ్డి రోడ్ల పరిస్థితీ ఇంతే.. -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషనన్ను గురువారం ఎస్పీ రాజేశ్ చంద్ర ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. రోల్ కాల్ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. ఠాణాలో సిబ్బంది విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. ప్రతి కేసులోనూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని పక్కాగా అమలు చేయాలని సూచించారు. అన్ని రికార్డులను నిర్ణీత గడువులోగా సీసీటీఎన్ఎస్ పోర్టల్‌లో నమోదు చేసి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎస్‌హెచ్‌వోను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మైనర్ డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలి
కామారెడ్డి క్రైం: మైనర్ డ్రైవింగ్ నేరమని తెలిసినా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లల విషయంలో అతి విశ్వాసంతో వాహనాలను అప్పగిస్తున్నారు. ఇది ప్రాణాల మీదికి తెస్తోంది. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇల్చిపూర్ శివారులో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం నందివాడకు చెందిన పుల్గం వెంకటస్వామి (39) ఎనిమిదేళ్ల క్రితం లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన బొద్దుల పౌల్ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అతడికి భార్య స్వప్న, ఐదేళ్లలోపు వయసుగల కుమారు లు విస్తృత్, విహాల్ ఉన్నారు. అతడు కామారెడ్డిలోని ఓ ప్రై వేటు కంపెనీలో రికవరీ ఏ జెంట్‌గా పని చేస్తున్నాడు. రో జూ మాదిరిగానే గురువా రం ఇంటి నుంచి బైక్‌పై విధులకు వెళ్లాడు. ఇల్చిపూర్ శివారులో ఎదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ప్ర యాణించిన జిల్లాకేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన బాలుడికి గాయాలయ్యాయి. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పదో తరగతి పాసయ్యాడని స్పోర్ట్స్ బైక్! సదరు బాలుడు పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్లో అడుగుపెట్టాడు. కొడుకు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడన్న సంబురంతో అతడి తండ్రి రూ. 4 లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు. -
అభివృద్ధికి గ్రహణం!
గతేడాది ఆగస్టులో చెరువు అలుగు పొంగి ప్రవహించడంతో మునిగిన కాలనీలు (ఫైల్)చిన్నచిన్న పట్టణాలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతుంటే జిల్లా కేంద్రంగా ఎదిగిన కామారెడ్డి మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. పట్టణంలో ప్రధాన రోడ్లు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై ఇరుకుగా మారాయి. కూడళ్ల అభివృద్ధి అటకెక్కింది. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలాలు కబ్జాకు గురవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపై మురికి నీరు చేరుతోంది. గతేడాది ఆగస్టులో వచ్చిన వరదలు పట్టణాన్ని అతలాకుతలం చేసినా శాశ్వత పరిష్కారానికి ఇప్పటికీ ఎలాంటి అడుగులు పడకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. మాస్టర్ ప్లాన్ అమలయ్యేదెప్పుడో? పట్టణంలోని రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. సిరిసిల్ల రోడ్డులో పాత బస్టాండ్, రామారెడ్డి చౌరస్తాల వద్ద బస్సు ఆగిందంటే వెనక నుంచి వచ్చే వాహనాలు దాటేసి వెళ్లే పరిస్థితి ఉండదు. ఇందిరాచౌక్ నుంచి దాదాపు బైపాస్‌రోడ్డు వరకు రోడ్డును విస్తరించాల్సి ఉంది. నిజాంసాగర్ రోడ్డు నుంచి విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, సీఎస్ఐ చౌరస్తా మీదుగా అశోక్‌నగర్, రైల్వే గేట్, అడ్లూర్ రోడ్డు గుండా పాతబస్టాండ్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్లు ఉండాలి. కానీ చాలాచోట్ల 30 ఫీట్ల నుంచి 40 ఫీట్లే ఉంది. అడ్లూర్ రోడ్డులో బస్సు గానీ లారీ గాని వచ్చిందంటే చాలు ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. దర్శన్ టాకీస్ నుంచి శాంతిటాకీస్ మీదుగా పాతబస్టాండ్‌కు వెళ్లడం గగనమవుతోంది. రోడ్లపైనే కూరగాయల విక్రయాలు పట్టణంలో డెయిలీ మార్కెట్ అంతా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం నిధుల సమస్యతో మధ్యలో నిలిచిపోయింది. దీంతో రైతులు సీఎస్ఐ గ్రౌండ్, రోడ్లపై కూర్చొని కూరగాయలు విక్రయించాల్సి వస్తోంది. మార్కెట్ల విస్తరణ అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్లపై కూరగాయలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే.. వారికి సౌకర్యాలు కల్పించని మున్సిపాలిటీ తైబజార్ మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఇలా జిల్లా కేంద్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే నేతలు మాత్రం రాజకీయాలే తప్ప అభివృద్ది విషయంలో నోరు మెదపడం లేదు. ఇప్పటికై నా ముఖ్యనేతలు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిలో పోటీ పడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.పట్టణంలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. దీంతో చాలా ప్రాంతాల్లో డ్రెయినేజీ నీరు రోడ్లపైకి వచ్చి చేరుతోంది. పట్టణంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించేందుకు అవసరమైన నిధులు సమీకరించడంలో ప్రజాప్రతినిధులు, నేతలు విఫలమవుతున్నారు. చిరుజల్లులకే పట్టణంలోని రోడ్లు మురికికూపంగా మారుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గంజ్ రోడ్డు ప్రాంతంలో ఇటీవల డ్రెయినేజీ పొంగి దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జిల్లా కేంద్రంలో నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో అభివృద్ధి కుంటుపడుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక చిరుజల్లులకే రోడ్లు చెరువులను తలపించడం కామన్‌గా మారింది. వాగు ఉప్పొంగితే పలు కాలనీలు నీట మునగాల్సిందే.. ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపైనా పాలకులు దృష్టి సారించడం లేదు. ముఖ్య నేతలు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారే తప్ప ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి జిల్లాకేంద్రంలో విస్తరణకు నోచుకోని రోడ్లు, జంక్షన్లు చిరుజల్లులకే చెరువులను తలపించే రహదారులు వాగు పొంగితే మునిగిపోయే కాలనీలు ఆధిపత్య పోరులో ప్రజాసంక్షేమం పట్టని నేతలు -
చోరీ కేసులో ఒకరి అరెస్టు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని శాంతినగర్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడిన నేరస్తున్ని ఐదో టౌన్పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు.. శాంతినగర్‌లోని అజ్మీర్బేగం ఇంటిబయట నిద్రిస్తుంది. శాంతినగర్‌కు చెందిన పాతనేరస్తుడు రియాజ్‌ఖాన్ బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి రూ.లక్ష 20వేల నగదును , 20 తులాల వెండి, ఆరు గ్రాముల చెవి కమ్మలు చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా గురువారం ఉదయం ఖిల్లా చౌరస్తా వద్ద నేరస్తున్ని పట్టుకొని అతని వద్ద రూ.లక్ష 10వేల నగదును, ఇనుప సుత్తెలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, నిజామాబాద్ ఒకటో, మూడవ టౌన్లల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. -
ఆటో సీజ్ చేసిన ఎంవీఐ
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం ఎంవీఐ రాహుల్ కుమార్ వాహనాలను తనిఖీ చేశారు. ఆటోలో పరిమితికి మించి స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ.. ఆటోలో ముగ్గురికి మించి పిల్లలను ఎక్కించొద్దని, వాహనదారులు సీట్ బెల్టు ధరించడంతోపాటు స్పీడ్ లిమిట్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి జరిమానా విధించామన్నారు. ఏఎంవీఐ రోహిత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాఘవపల్లి శివారులో బుధవారం రాత్రి అక్రమంగా మొరం తవ్వకం పనులు చేపట్టిన జేసీబీ, ట్రాక్టర్‌ను పట్టుకొని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మొరం తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి జేసీబీని, ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని చెప్పారు. -
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన టాస్క్‌ఫోర్స్ బృందం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోలిలింగాల, చీనూర్ గ్రామాల్లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం టాస్క్‌ఫోర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కొనుగోలుకేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నేటికీ ధాన్యం కుప్పలు ఉండడంపై వారు కారణాలు తెలుసుకున్నారు. కొనుగోలుకేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించే తమను రైస్‌మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో క్వింటాల్‌కు 5–6 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని అధికారుల బృందం ఎదుట రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీధర్‌రెడ్డి, అసిస్టెంట్ సివిల్‌సప్లయ్ అధికారి సుదర్శన్‌రెడ్డి, డీఎస్పీ శేఖర్‌రెడ్డి, ఎసైన్స శ్రీనివాస్‌రావు, ఏన్ఫోర్స్మెంట్ డీటీ సురేష్, ఏపీఎం రాంనారాయణగౌడ్, ఏవో సాయికిరణ్, సీసీలు నారాయణ, రమేశ్, నజీర్ తదితరులున్నారు. -
చేనేత సహకార సంఘానికి 10 నామినేషన్లు
దోమకొండ: దోమకొండ చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి బుధవారం 10 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి భూమయ్య తెలిపారు. ఐరేని నర్సయ్య, బత్తిని సిద్ధరాములు, సుంచు రాములు, అందె నాగభూషణం, బీసు సంతోష్‌కుమార్, బాలే సురేందర్, కూచని జగదీష్, బొమ్మెర జమున, కోట సదానంద, కై రంకొండ శ్రీనివాస్‌లు నామినేషన్లు వేసినట్లు ఆయన తెలిపారు. గురువారం విత్‌డ్రాలకు అవకాశం.. ఈనెల 24న ఎన్నికలు ఉంటాయని ఆయన వివరించారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, క్యాషియర్ అందే గణేష్, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్’పై అప్రమత్తంగా ఉండాలి
● అర్హుల ఓటు హక్కును కాపాడాలి ● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకామారెడ్డి టౌన్ : ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్ శిక్షణ సదస్సు నిర్వహించారు. ఎస్ఐఆర్పై ప్రత్యేకంగా ముద్రించిన బుక్లెట్లను నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బోగస్ ఓట్లను సృష్టించి అనైతిక లబ్ధి పొందే కుట్రలను ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అర్హులైన వారి ఓటు హక్కును కాపాడడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు కై లాస్ శ్రీనివాస్, సందీప్, వివిధ మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. -
19న జాబ్ మేళా
కామారెడ్డి టౌన్ : యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 19న జిల్లా కేంద్రంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకోసం కలెక్టరేట్ సముదాయంలోని రూమ్ నంబర్ 121లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 89856 12908, 63057 43423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. దుబాయిలో ఉద్యోగాలకు.. కామారెడ్డి టౌన్ : దుబాయిలో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలోని టామ్‌కామ్ సంస్థ ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు 23 నుంచి 45 ఏళ్లలోపువారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 25వ తేదీలోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 94400 49520, 94400 48590 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 18న డైట్లో ప్రవేశాలకోసం ధ్రువపత్రాల పరిశీలన కామారెడ్డి అర్బన్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సులలో తొలి విడత ప్రవేశాలకు హాజరుకానివారు 18న నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ టి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో సూచించారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని పేర్కొన్నారు. అలాగే ధ్రువ పత్రాల పరిశీలన పూర్తై సీటు పొందని వారు, పొందిన వారు ఇతర కళాశాలల స్లైడిండ్ అవసరమయ్యే వారు 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. మిగతా వివరాలకు డీఈసెట్ వెబ్సైట్ సందర్శించాలని తెలిపారు. భిక్కనూరు: భిక్కనూరు పంచాయతీకి కేజేఎల్ పౌల్ట్రీస్ డైరెక్టర్ శ్రీనివాసరాజు రూ. 10 లక్షల విలువ చేసే వాహనాన్ని బుధవారం బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ తరఫున సామాజిక బాధ్యతలో భాగంగా చెత్తను తరలించే వాహనాన్ని అందజేశామన్నారు. ఆయనను సర్పంచ్ బల్యాల రేఖ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, ఈవో మహేశ్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, శ్రీసిద్దరామేశ్వరాలయం పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు లింబాద్రి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. భిక్కనూరు: రామేశ్వర్పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి రూ. 5.50 లక్షల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ రాణిరాజు, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, దేవాలయం డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, నాయకులు నర్సరెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి: తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను బు ధవారం ఎస్పీ రాజేశ్ చంద్ర తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో నాణ్యమైన ద ర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నారు. గడువులోగా కేసుల దర్యాప్తు పూర్తి చేసి నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరచాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై నరేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆలయాల్లో చోరీ
రుద్రూర్ : కోటగిరి శివారులోని అయ్యప్ప స్వామి, సాయిబాబా ఆలయాల్లో బుధవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి గర్భగుడిలోని రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. దేవాలయం సమీపంలోని కాలువ వద్ద హుండీల తాళాలు పగులగొట్టి అందులోని నగదును తీసుకుని పరారయ్యారు. ఉదయం ఆలయ నిర్వాహకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కార్యదర్శి నిశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఎస్సై తెలిపారు. శాంతినగర్‌లో.. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి శాంతినగర్‌లో చోరీ జరిగినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. కాలనీలోని అజుమారీ బేగం మంగళవారం తన తల్లి, తండ్రి, కూతురుతో నిద్రపోయింది. బుధవారం ఉదయం లేచేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించింది. బీరువాలోని రూ.40 వేల నగదు, ఆరు గ్రాముల బంగారం, మరొక బీరువాలోని రూ.80 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
రూ.108 వేతనం
● సమగ్ర శిక్షలో సీజీవీల శ్రమ దోపిడీ ● ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 46 మంది ఏడున్నర గంటల పని.. ఆర్మూర్: సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న భవిత కేంద్రాల్లో కిందిస్థాయి ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కేర్ గివింగ్ వలంటీర్ (ఆయా)లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు పని వేళల్లో.. వేతనంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 46 మంది సీజీవీలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్రాన్ని శుభ్రం చేసుకోవడంతో మొదలుకొని దివ్యాంగ విద్యార్థులు సపర్యలు చేయడంలో సీజీవీల పాత్ర కీలకంగా ఉంటోంది. ఉన్నతాధికారుల చిన్నచూపు కారణంగా వీరికి నెల వేతనం రూ.3,250గా నిర్ణయించి చెల్లిస్తున్నారు. రోజుకు ఏడున్నర గంటలు పనిచేసే వీరికి కేవలం రూ.108 మాత్రమే వేతనంగా అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ స్కూల్లలో ఆయాలకు రూ.6 వేలు, అంగన్వాడీ కేంద్రాల్లోని ఆయాలకు నెల వేతనం రూ.6 వేలు లభిస్తోంది. కానీ, వీరిద్దరికన్నా భవిత కేంద్రాల్లోని దివ్యాంగ పిల్లలకు సేవలందిస్తున్న ఆయాలకు తక్కువ వేతనాలు ఉండటంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
ఒకరి ఆత్మహత్య
మోపాల్ : మండలంలోని వడ్డెర కాలనీ గ్రామ పంచాయతీకి చెందిన వరి కుప్పల భీమారాజ్ (40) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జాడె సుస్మిత బుధవారం తెలిపారు. భీమారాజ్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కుటుంబ, వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో 16న ఇంటి నుంచి వెళ్లిన భీమారాజ్ సిర్పూర్ తండా నుంచి సిర్పూర్ వెళ్లే మార్గంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నాగ్లూర్లో మరొకరు.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్ గ్రామానికి చెందిన బాలగోల్ల సుధాకర్‌రావు(35) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేందర్ బుధవారం తెలిపారు. ఈ నెల 15న సుధాకర్‌రావు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సుధాకర్‌రావు గతంలో కూడా ఇంటి నుంచి వెళ్లి కొన్నిరోజులకు తిరిగి వచ్చేవాడని, అలానే వస్తాడని కుటుంబసభ్యులు భావించారు. గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వృద్ధురాలిని బంధువులకు అప్పగించిన పోలీసులు
కామారెడ్డి టౌన్ : హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చి దారి తప్పిన ఓ వృద్ధురాలిని పట్టణ పోలీసులు సురక్షితంగా ఆమె బంధువుల చెంతకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన సుగుణ (78) బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కామారెడ్డిలోని బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వచ్చారు. కొత్త బస్టాండ్‌లో బస్సు దిగిన ఆమెకు ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర ఆందోళనతో తికమకపడుతున్నారు. ఆ సమయంలో బస్టాండ్ వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు భవాని, సరిత వృద్ధురాలిని గమనించి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. పట్టణ సీఐ నరహరి స్పందించి వృద్ధురాలి బంధువుల ఆచూకీ కనుగొనాలని బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు నర్సింలు, అశోక్‌ను ఆదేశించారు. కానిస్టేబుళ్లు పట్టణంలో విచారణ జరిపి, ఆ వృద్ధురాలి బంధువులు కల్కినగర్‌లో నివాసం ఉంటున్న నరసింహచారిగా గుర్తించారు. ఇన్స్పెక్టర్ సమక్షంలో వృద్ధురాలిని సురక్షితంగా వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి వృద్ధురాలిని చేరదీసిన మహిళా కానిస్టేబుళ్లు, ఆచూకీ కనిపెట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది, సీఐ నరహరికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అసభ్య ప్రచారంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
కామారెడ్డి టౌన్: కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా, పరువు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇందుప్రియ మాట్లాడుతూ.. జూన్ 12న కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఫేస్బుక్ పేజీలో ముక్తార్ అనే వ్యక్తి తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర, అవమానకరమైన పోస్టును అప్లోడ్ చేశాడని వివరించారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ దుష్ప్రచారానికి తెరలేపారని పేర్కొన్నారు. షేరు, అంజాద్, పర్వేజ్ హైమద్, రాజేశ్వర్, గుడుగుల శ్రీనివాస్, ఇర్ఫాన్, కై ఫ్, సుచితాన్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు గ్రూపులుగా ఏర్పడి సోషల్ మీడియా వేదికగా మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్పర్సన్ హామీ ఇచ్చినట్లు ఇందుప్రియ తెలిపారు. -
ఒలింపిక్ డే రన్ చైర్మన్‌గా జైపాల్‌రెడ్డి
కామారెడ్డి టౌన్ : జిల్లా ఒలింపిక్ డే రన్–2026 చైర్మన్‌గా ఎం. జైపాల్‌రెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం మేరకు జిల్లా ఒలింపిక్ డే రన్ కమిటీని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ కన్వీనర్‌గా పి. అనిల్ కుమార్, సభ్యులుగా సందీప్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సాయి మౌర్యలు నామినేట్ అయ్యారు. ఈ మేరకు నూతన కమిటీ బాధ్యులను పలువురు క్రీడాకారులు అభినందించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ..అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న ఉదయం జిల్లా కేంద్రంలో శ్రీఒలింపిక్ డే రన్శ్రీను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కామారెడ్డి అర్బన్: భారీ వర్షాలు, ఈదురు గాలులపై ఎన్పీడీసీఎల్ హైపర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు ఎస్ఈ సాలియా నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక నైపుణ్యం సహాయంతో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడమే హైపర్ సిక్స్ స్టెప్ ఫార్ములా ఉద్దేశ్యమని ఎస్ఈ పేర్కొన్నారు. హైపర్ సిక్స్‌లో కంట్రోల్ రూం, మ్యాన్‌పవర్, మెటీరియల్, వేగవంతమైన సమాచారం, ప్లానింగ్, మొబిలైజేషన్, యుద్ధ ప్రాతిపదికన పనులు, నిర్దేశిత సమయంలో విద్యుత్ పునరుద్ధరణ ఉంటాయని, కృత్రిమ మేధను దీనిలో వినియోగిస్తుమని ఎస్ఈ వివరించారు. భిక్కనూరు:మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఈ నెల 21 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న గంగమ్మ ఉత్సవాలకు హాజరు కావాలని కో రుతూ విద్య దాత తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డికి గంగపుత్ర సంఘం ప్రతినిధులు బుధవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. గంగమ్మ ఉ త్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా వారు ఆయనను కోరారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): జనగాంలో కొన్ని రోజులుగా ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా సర్పంచ్ మధుబాయి మాట్లాడుతూ...ఆరాధ్య ఫౌండేషన్ సేవలు మరువలేనివన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. కొన్ని రోజులుగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ కో–ఆర్డినేటర్ కౌడి అనిత, ఉప సర్పంచ్ శ్యాంరావు, వార్డు సభ్యులు శ్రీకాంత్, ప్రవీణ్, రమేశ్ పాల్గొన్నారు. -
సానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని వార్డుల్లో సానిటేషన్ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పర్వతాలు హెచ్చరించారు. బుధవారం ఉదయం ఆయన 15, 16, 17 వార్డుల్లో పర్యటించి, పారిశుధ్య పనులను పరిశీలించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు తాగునీటి సరఫరా, వీధిలైట్ల సమస్యలపై సంబంధిత అధికారులు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ కార్మికులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ టీపీవో వినీత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
అన్నదాతను యూరియా కష్టాలు వెన్నాడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో చాలామంది బుక్ చేసుకోలేకపోతున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్నా.. క్షణాల్లోనే స్టాక్ ఖాళీ అవుతుండడంతో నిరాశ చెందుతున్నారు. దీంతో పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
యూరియా కోసం ఎల్లారెడ్డిలోని ఫర్టిలైజర్ దుకాణం వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు ● ఈనెల 15న భిక్కనూరు మండలానికి 4 వేల యూరియా బస్తాలు వచ్చాయి. రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించేలోగానే రెండు నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయింది. ● ఈనెల 16న ఎల్లారెడ్డి మండలానికి 2,682 బస్తాలు వచ్చాయి. మూడు నిమిషాల్లోనే స్టాక్ మొత్తం బుక్ అయ్యింది. నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ అవుతుండడంతో చాలా మంది రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉంది. భిక్కనూరులో రాస్తారోకోఎల్లారెడ్డి : రైతులకు యూరియా పంపిణీని సులభతరం చేయడానికి రాష్ట ప్రభుత్వం యూరియా యాప్‌ను తీసుకువచ్చింది. క్యూలైన్లలో రోజుల తరబడి నిల్చోవాల్సిన ఇబ్బందిని తప్పించడంతోపాటు ఇళ్ల వద్ద నుంచే మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. దీనిని గతేడాది డిసెంబర్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది. జిల్లాలో వానాకాలం సీజన్లో 5.59 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 3.20 లక్షల ఎకరాలలో వరి సాగవుతుందని, ఇందుకోసం 50,079 టన్నుల యూరియా అవసరమని భావించి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఫర్టిలైజర్ యాప్ బుకింగ్ ద్వారానే రైతులకు యూరియా సరఫరా చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణానికి రెండు బస్తాల చొప్పున అందిస్తున్నారు. ఒక దఫా ఎరువు పొందిన రైతులు తిరిగి యూరియా కోసం 15 రోజులు నిరీక్షించాల్సి ఉంటుంది. జిల్లాలో చాలామంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. దీనికితోడు పలువురు రైతులు నిరక్షరాస్యులు కావడంతో ఎరువులను బుక్ చేసుకోలేకపోతున్నారు. దీంతో వారు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు యూరియా బుక్ చేసుకోవడంపై సరైన అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసేలోగానే స్టాక్ ఖాళీ అవుతుండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులకు కూడా యాప్ లాగిన్, ఓటీపీలు, ఆన్లైన్ లింకులు, పేమెంట్లు వంటి ప్రక్రియలు అర్థం కావడం లేదు. దీంతో వారు ఇతరులపై లేదా సొసైటీలు, ఫర్టిలైజర్ డీలర్లపై ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. దీంతో రైతులు యాప్ బుకింగ్ పద్ధతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. మత్తమాల సొసైటీ కింద రైతులు మంగళవారం ఆందోళన చేశారు. బుధవారం భిక్కనూరులో రాస్తారోకో నిర్వహించారు. కౌలు రైతులకు ఇబ్బందులు.. కౌలు రైతుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. యాప్‌లో ఎరువులు బుక్ చేయాలంటే పట్టాదారు పాస్‌బుక్ నంబరుతోపాటు దానికి లింక్ అయిన ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీలు అవసరం ఉంటాయి. చాలా మంది భూ యజమానులు తమ పొలాలను కౌలుకు ఇచ్చి వేరే ప్రాంతాలలో ఉంటున్నారు. కొందరు వేరే దేశాలకు వెళ్లారు. కౌలు రైతుల వద్ద వారి పాస్‌బుక్‌లున్నా దానికి లింక్ ఉన్న ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారు. భిక్కనూరు: యూరియా కోసం భిక్కనూరులో రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకు డు అందె మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీజన్ ప్రారంభంలోనే ఎరువు దొరక్కపోతే పంటల సాగు మధ్యలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం సరపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు వచ్చి సముదాయించినా ఆందోళన విరమించలేదు. దీంతో ఏడీఏ అపర్ణ వచ్చి రైతుల తో మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం యూరియా అందుబాటులో ఉంచా లని కోరుతూ ఆమెకు వినతి పత్రం అందించా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు తున్కి వే ణు, అత్తెల్లి శ్రీనివాస్, భూంరెడ్డి, వెంకట్‌రెడ్డి, బ స్వయ్య, హన్మంత్‌రెడ్డి, దుర్గారెడ్డి, రంజిత్‌వర్మ, భిక్షపతి, తక్కళ్ల రవీందర్‌రెడ్డి, దేవర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.యూరియా బుకింగ్‌కు అవస్థలు స్మార్ట్ఫోన్లు లేక ఇబ్బందులు క్షణాల్లోనే స్టాక్ ఖాళీ అవుతుండడంతో అన్నదాతల్లో నిరాశ పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్మాకు అస్సలు సదువేరాదు. ఈ బుకింగ్‌లు, ఓటీపీలు ఎలా అర్థం అవుతయి. ఈ యారియా బుకింగ్ కోసం ఆల్ల ఈల్ల కాళ్లు మొక్కాల్సి వస్తున్నది. ఇవన్నీ లేకుండా పాత పద్ధతిలోనే యూరియా సంచులు ఇవ్వాలి. దుకాణానికి పోయి తెచ్చుకుంటం. –లాల్య, రైతు, అడవిలింగాలనా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. డబ్బా ఫోనే ఉంది. వాళ్లను వీళ్లను బతిమిలాడి బుక్ చేసుకున్నా.. మూడు సంచులు ఇస్తమని రెండు సంచులే ఇచ్చారు. యూరియా అయిపోయింది మళ్లీ రమ్మంటున్నారు. రెండెకరాలకు రెండు సంచులు ఏం సరిపోతయి. – బెస్త కాశీరాం, రైతు, కళ్యాణి యూరియా అవసరం ఇప్పుడే లేదు. అయితే అవసరం ఉన్నప్పుడు దొరకదేమోనని బుక్ చేసుకుంటున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు. ఈ సీజన్లో జిల్లాకు 50 వేల టన్నులు అవసరం ఉండగా ఇప్పటికే 20 వేల టన్నులు పంపిణీ చేశాం. మరో 30 వేల టన్నుల యూరియా సిద్ధంగా ఉంది. యాప్ ద్వారా ప్రతి రైతుకూ వారి భూ విస్తీర్ణం ప్రకారం ఎరువులు దొరుకుతాయి. – మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
‘సర్’కు అన్ని పార్టీలు సహకరించాలి
మద్నూర్: ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు అన్ని రాజీకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్వో, అదనపు కలెక్టర్ విక్టర్ కోరారు. బుధవారం మద్నూర్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. అర్హులైన ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు, పేరు, చిరునామాల సవరణ వంటి అంశాల్లో బీఎల్వోలకు, ఈఆర్వో కార్యాలయానికి సహకారం అందించాలని కోరారు. ఎస్ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను ప్రారభించారు. కార్యక్రమంలో ఎనిమిది మండలాల తహసీల్దార్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
చెరువులో పడి ఒకరు మృతి నవీపేట : మండలంలోని నాగేపూర్ శివారులోని చెరువులో పడి అదే గ్రామానికి చెందిన దేవరి నడిపి మోనన్న (55) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోనన్న భార్య లక్ష్మి 30 ఏళ్ల కిందట మృతి చెందడంతో శోభను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు చింటూ ఐదేళ్ల కిందట మృతి చెందడంతోపాటు రెండో భార్య అనారోగ్యానికి గురై మోనన్నకు దూరంగా ఉంటుంది. కుమార్తె మౌనిక కూడా కొద్ది రోజులుగా దూరంగా ఉంటుండటంతో జీవితంపై విరక్తితో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 16న చెరువు కట్టపై మద్యం సేవిస్తూ కనపడిన మోనన్న.. మరుసటి రోజు చెరువులో శవమై కనిపించాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి సోదరుడు నడిపొల్ల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ● వృద్ధురాలి బంగారు గుండ్లు అపహరణ నవీపేట : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు గుండ్లను దుండగులు అపహరించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన వృద్ధురాలు విజయ నవీపేటకు మంగళవారం వచ్చింది. తిరిగి బుధవారం ఇంటికి వెళ్లేందుకు నిజామాబాద్ బస్సు ఎక్కే క్రమంలో తోపులాట జరిగింది. రద్దీ నుంచి సీట్లో కూర్చున్నాక.. వృద్ధురాలి బంగారు గుండ్లు అపహరణకు గురైనట్లు గుర్తించింది. ఈ విషయమై ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం పెద్దకొడప్గల్(జుక్కల్) : మండల కేంద్ర శివారులోని 161 సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ట్రాన్స్ఫార్మర్లోని కాపర్‌ను అపహరించినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హైవే సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు. -
సాంకేతిక విద్యతోనే మెరుగైన ఉపాధి
వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి టౌన్ : జిల్లాలోని యువతకు మెరుగైన సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. తాడ్వాయిలోని ఏటీసీలో అందుబాటులో ఉన్న కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ ఏటీసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హులన్నారు. తాడ్వాయి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రస్తుతం ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లోగానీ నేరుగాగానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలు, కోర్సుల పూర్తి వివరాల కోసం తాడ్వాయిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇందూరులో గ్రీన్ లంగ్
ఆర్మూర్: ప్రజలకు కనువిందు చేసే ప్రకృతి అందాలు, ఒత్తిడిని తగ్గించే వాతావరణం, స్వచ్ఛమై న గాలినిచ్చే చెట్లు.. మొత్తానికి అటవీ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది అరణ్య అర్బన్‌పార్క్. నిజామాబాద్ నగరవాసులతోపాటు ఆయా ప్రాంతాల ప్రజలకు ‘గ్రీన్ లంగ్ స్పేస్’ (హరిత ఊపిరి తిత్తులు)గా ఉపయోగపడనుంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో మాక్లూర్ మండలం మానిక్ బండార్, అడవి మామిడిపల్లి, చిన్నాపూర్ శివార్లలోని రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన 476.30 ఎకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల నిధులతో అర్బన్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. పార్క్‌ను ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అఫారెస్టేషన్, కాంపా(సీఏఎంపీఏ), నుడా (ఎన్యూడీఏ), ఎన్ఎంసీ తదితర ప్రభుత్వ పథకాలతో 63వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఈ పార్క్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజలకు పచ్చదనాన్ని చేరువ చేయడం, పట్టణ పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభుత్వ సంకల్పానికి ఈ పార్క్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పట్టణాభివృద్ధిని సమన్వయం చేయడానికి ఇదొక నమూనా అని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. హాజరు కానున్న ప్రముఖులు అర్బన్ పార్కు ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరకానున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీ సువర్ణ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొననున్నారు.పార్క్‌లో ఏర్పాటు చేసిన నాలుగు అంతస్తుల వాచ్ టవర్ అర్బన్ పార్క్ ప్రధాన ద్వారం సదుపాయాలు గ్రావెల్ వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్, పిల్లల సాహస క్రీడలకు ప్రత్యేక స్థలం, వాచ్ టవర్, శౌచాలయాల సముదాయం, నాలుగు రచ్చబండలు, సందర్శకులకు విశ్రాంతి కోసం ప్రత్యేక స్థలాలు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారులో అర్బన్ పార్క్ ఏర్పాటు 476 ఎకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్యయంతో.. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి -
సమయ పాలన పాటించాలి
మాచారెడ్డి: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ గుణాత్మక విద్యను అందించాలని డీఈవో మల్లికార్జున్ సూచించారు. బుధవారం పాల్వంచ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగు దొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. హెచ్ఎం గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఏఎస్వో రమణ రావ్, ఎంఈవో రామ్ మనోహర్ రావ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): యాప్ లేకుండా రైతులకు యూరియాను పాత పద్ధతిలో సరఫరా చేయాలని తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాడ్వాయి సింగిల్ విండో కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. యాప్ వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ యాప్ వల్ల ఎరువుల కన్నా అధికంగా ట్రాన్స్‌పోర్టు చార్జీలు అధికంగా అవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యాప్‌ను రద్దుచేసి పాతపద్ధతిలో యూరియా ఎరువులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
● 12 కేసుల ఛేదన.. చోరీ సొత్తు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి టౌన్ : గంజాయితో పట్టుబడిన నిందితుల వద్ద కూపీ లాగితే వరుస చోరీల కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాహనాలు, మొబైల్ ఫోన్లు, షట్టర్ లిఫ్టింగ్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను కామారెడ్డి పట్టణ, సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాజేశ్చంద్ర కేసు వివరాలను వెల్లడించారు. పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్ కాలనీ డీలక్స్ బేకరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు బుధవారం గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో పట్టణ ఎస్సై సాయికృష్ణ, సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, రాష్ట్రవ్యాప్తంగా వారు చేసిన వరుస ఆస్తి నేరాల చిట్టా బయటపడింది. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన తిలిపితియ రూబిన్సింగ్ అలియాస్ రూబిన్సింగ్, మంగళ్‌సింగ్ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. గంజాయి, మద్యం వ్యసనాలకు బానిసలైన వీరు జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. వివిధ జిల్లాల్లో తిరుగుతూ మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు, ఇళ్ల తాళాలు పగలగొట్టడం, దుకాణాల షట్టర్లు లేపి దొంగతనాలకు పాల్పడుతున్నారు. జగద్గిరిగుట్ట, బచ్చుపల్లి, భిక్కనూరు, దేవునిపల్లి, రాజంపేట, మాచారెడ్డి, కామారెడ్డి, పోచారం, ఐటీ కారిడార్, ఘట్కేసర్, యాదాద్రి భువనగిరి, జనగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 నేరాలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లను అజంపురాకు చెందిన షేక్ ముజాహిద్, కల్కినగర్‌కు చెందిన ఆసం రాజేందర్‌కు విక్రయించేవారు. వీరిద్దరూ కామారెడ్డికి చెందిన సమీర్, శివ సహాయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి దొంగిలించిన మొబైల్ ఫోన్లను అన్‌లాక్ చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భారీగా సొత్తు స్వాధీనం నిందితుల నుంచి 6 మోటార్ సైకిళ్లు, 23 మొబైల్ ఫోన్లు, 2 డెస్క్‌టాప్ కంప్యూటర్లతోపాటు 95 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తక్కువ సమయంలోనే ఛేదించి సొత్తును స్వాధీనం చేసుకున్న కామారెడ్డి సీసీఎస్, పట్టణ పోలీస్ బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, పట్టణ సీఐ నరహరి తదితరులున్నారు. -
మహిళలు, చిన్నారులకు రక్షణగా భరోసా కేంద్రాలు
● అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి కామారెడ్డి క్రైం: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, వైద్య సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించేందుకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి అన్నారు. కామారెడ్డిలోని జిల్లా భరోసా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై నమోదవుతున్న కేసుల్లో వేగవంతమైన దర్యాప్తుతో పాటు, బాధితులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాస సేవల కల్పనలో పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు ఒకే వేదికపై అన్ని రకాల సహాయ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాధితులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే చోట అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు, చిన్నారులకు రక్షణగా భరోసా కేంద్రాలు
● అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి కామారెడ్డి క్రైం: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, వైద్య సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించేందుకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి అన్నారు. కామారెడ్డిలోని జిల్లా భరోసా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై నమోదవుతున్న కేసుల్లో వేగవంతమైన దర్యాప్తుతో పాటు, బాధితులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాస సేవల కల్పనలో పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు ఒకే వేదికపై అన్ని రకాల సహాయ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాధితులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే చోట అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ మధుసూదన్, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్ కవిత, డీసీపీవో స్రవంతి, తదితరులున్నారు. -
విద్యార్థులే లక్ష్యంగా గాంజా దందా
● నాందేడ్, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా ● భీమ్‌గల్ ఎకై ్సజ్ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు మోర్తాడ్(బాల్కొండ): గంజాయి వ్యాపారులు వి ద్యార్థులే లక్ష్యంగా తమ దందాను కొనసాగిస్తున్నా రు. దీంతో డబ్బులు కూడబెట్టుకోవాలనే దురాశపరుల కుట్రకు విద్యార్థులు బలైతున్నారు. చదువుతోపాటు క్రీడలపై దృష్టిపెట్టాల్సిన సమయంలో గంజాయి మత్తులో జోగుతూ యువత తమ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తమపై తల్లితండ్రు లు పెంచుకున్న ఆశలను విద్యార్థి దశలోనే తుంచివేస్తున్నారు. రూ.100కు తీసుకొచ్చి.. రూ.500కు విక్రయం. దుండగులు మహారాష్ట్రలోని నాందేడ్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ దందా కొనసాగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.100కు తీసుకవచ్చి రూ.500లకు విక్రయిస్తుండటంతో ఆదాయం పెరిగింది. కనీసం 10 నుంచి 20 ప్యాకెట్లు తీసుకవచ్చి తమ దందా కొనసాగిస్తున్నారు. గంజాయిని విద్యార్థులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు.. ఇటీవల భీమ్‌గల్ మండలం సంతోష్‌నగర్ తండా సమీపంలో ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించి భీమ్‌గల్‌కు చెందిన షేక్ మజాస్ అనే గంజాయి విక్రేతను అరెస్టు చేశారు. అతని నుంచి వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయిని మైనర్ విద్యార్థులకు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో అధికారులు గంజాయికి బానిసలైన విద్యార్థులను వారి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో కూడా గంజాయి విక్రయించిన కారెపల్లికి చెందిన బూక్యా రఘును అరెస్టు చేశారు. అతడిని విచారించగా విస్తూపోయే నిజాలు వెలుగులోకి రావడం గమనార్హం. నిందితులు పలు పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులకు గంజాయి రుచి చూపించి, తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని తేలింది. దాదాపు 40 మంది విద్యార్థులు గంజాయికి బానిసలైనట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులను ఎకై ్సజ్ స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌లో మార్పు రాకపోతే డీ అడిక్షన్ సెంటర్‌కు తప్పనిసరిగా పంపించాలని అధికారులు యోచిస్తున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం. ప్రజలు గంజాయి విక్రేతలపైనా, బానిసలపైనా దృష్టి పెట్టి మాకు, పోలీసులకు సమాచారం అందించాలి. గంజాయి విక్రయించేవారు, వారికి మద్దతు ఇచ్చేవారు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదు. – వేణుమాధవ్‌రావు, ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, భీమ్‌గల్ -
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్టు
నందిపేట్ (ఆర్మూర్): ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నందిపేట్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలను వెల్లడించారు. నందిపేట మండలం రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయీమ్ అనే యువకుడిపై మూడు రోజుల క్రితం పాత కక్షల కారణంగా సమీప బంధువులైన ఐదుగురు వ్యక్తులు ఇనుప రాడ్లు, కత్తులతో దాడులు జరిపి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన నందిపేటకు చెందిన షేక్ తాహీర్, షేక్ తాలిబ్, షేక్ గాలిబ్‌లతో పాటు కామారెడ్డికి చెందిన సయ్యద్ అబ్దుల్ హలీం, ఎస్కే ఫజల్ అనే వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్దనుంచి నేరానికి ఉపయోగించిన వస్తువులు, రెండు బైకులు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
పుస్తకావిష్కరణ
తెయూ(డిచ్పల్లి):తెలంగాణ విశ్వవిద్యాలయం పార్ట్‌టైం లెక్చరర్ డాక్టర్ ఆర్ సాయిలక్ష్మి రచించిన ‘నిజామాబాద్ జిల్లా సీ్త్రల సాహిత్యం–ఒక పరిశీలన’ (పీహెచ్డీ గ్రంథం) పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. తెయూ ఆర్ట్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో ఈ పుస్తకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలుగుశాఖ అధ్యక్షులు, బీవోఎస్ చైర్మన్ కనకయ్య, లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణచక్రవర్తి, పీఆర్వో రమణచారి, పున్నయ్య, ఆర్ట్స్ డీన్ మహమ్మద్ మూసా ఖురేషీ, పుప్పాల రవీందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంసీ నిర్వహణకు ఒప్పందం చేసుకోలేదు
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): డిచ్పల్లి మండలంలోని సీఎంసీ మెడికల్ కాలేజ్ నిర్వహణకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ (సీఎస్ఈటీఏ) మెదక్ డయాసిస్ మెడికల్ బోర్డు ఎవరితో అవగాహన ఒప్పందం (ఎంవోయూ)చేసుకోలేదని బోర్డు కన్వీనర్ దయానంద్ స్పష్టం చేశారు. సీఎంసీ హాస్పిటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది సీఎంసీ మెడికల్ కాలేజ్‌కు చైర్మన్‌నని ప్రచారం చేసుకున్న షణ్ముకలింగంకు ఎవరూ సహకరించవద్దని అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిచ్పల్లి సీఎంసీకి త్వరలోనే నర్సింగ్ కళాశాల మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. బీఎస్సీ నర్సింగ్,జనరల్ నర్సింగ్,ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులకు వారం పది రోజుల్లో అనుమతి వస్తుందని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, ఫ్యాకల్టీకి వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అడ్వైజర్ కేవీ ప్రసాద్, సీఎంసీ హాస్పిటల్ గౌరవ డైరెక్టర్ అజ్జశ్రీనివాస్, సీఎస్ఐ గోదావరి డీసీసీ చైర్మన్ రెవరెండ్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్ గ్రామంలో సోమవారం ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నాగ్లూర్ గ్రామానికి చెందిన సుబ్బారావు, సోని దంపతులు ఉదయం వ్యవసాయా పనులకోసం పొలానికి వెళ్లారు. వారితోపాటు వారి కుమారుడు శ్రీమన్షు (07) కూడా వెళ్లాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తుండగా, బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదన్నారు. నిజామాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. బీహార్ రాష్ట్రం, ఖగారియా జిల్లా, మారారు గ్రామానికి చెందిన బహేరి చౌదరి (48) వ్యక్తి కొన్ని రోజులుగా స్థానికంగా ఉంటూ కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. మండలంలోని ఖానాపూర్ శివారులో సోమవారం సాయంత్రం బహేరి చౌదరి తన సైకిల్‌పై ఖానాపూర్ శివారులో ఉన్న కాపర్తి రైస్ మిల్లో పని చేయడానికి వెళ్తుండగా, రైస్‌మిల్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన పల్సర్ బైక్ అతడిని ఢీకొట్టింది. ఈఘటనలో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి స్నేహితుడు సంజయ్ మండల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఒకరిపై దాడి నిజామాబాద్ అర్బన్: నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆస్మికాలనీలో ఒకరిపై దాడి జరిగిందని 5వ టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. అజ్మత్‌ఖాన్ అనే వ్యక్తిపై ముజాయిద్‌ఖాన్ డబ్బుల కోసం దాడి చేసినట్లు తెలిపారు. అలాగే మరికొందరు కర్రలతో దాడిచేసి ద్విచక్ర వాహనంను ధ్వంసం చేసి డ్రెయినేజీలో పడవేసినట్లు తెలిపారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పుస్తకావిష్కరణ
తెయూ(డిచ్పల్లి):తెలంగాణ విశ్వవిద్యాలయం పార్ట్‌టైం లెక్చరర్ డాక్టర్ ఆర్ సాయిలక్ష్మి రచించిన ‘నిజామాబాద్ జిల్లా సీ్త్రల సాహిత్యం–ఒక పరిశీలన’ (పీహెచ్డీ గ్రంథం) పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. తెయూ ఆర్ట్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో ఈ పుస్తకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలుగుశాఖ అధ్యక్షులు, బీవోఎస్ చైర్మన్ కనకయ్య, లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణచక్రవర్తి, పీఆర్వో రమణచారి, పున్నయ్య, ఆర్ట్స్ డీన్ మహమ్మద్ మూసా ఖురేషీ, పుప్పాల రవీందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి: జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్న మానవత సదన్ ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతసదన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదన్ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం నిజంగా అభినందనీయమని, కొందరు ఉద్యోగాలలో స్థిరపడటం అదర్శప్రాయమన్నారు. మిగతా విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సదన్ చిన్నారులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిస్వార్థంగా గత పదకొండు సంవత్సరాలుగా సదన్ పర్యవేక్షకులుగా సుధాకర్ రావు, పదేళ్లపాటు కేర్‌టేకర్‌గా అందె రమేష్ చేసిన సేవలను అభినందించారు. డీఈవో అశోక్, ఎంఈవో, సదన్ ఇన్చార్జి నరేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రీ ప్రైమరీ కేంద్రాలను రద్దు చేయాలి
మాచారెడ్డి: ప్రీ ప్రైమరీ కేంద్రాలను రద్దుచేసి అంగన్వాడీలకు అప్పగించాలని అంగన్వాడీ టీచర్లు కోరారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహంతోపాటు మాచారెడ్డి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అశోక్ కుమార్, ఘన్పూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శారదలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకులు విజయ మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ కేంద్రాల ఏర్పాటు వల్ల అంగన్వాడీ కేంద్రాలు ఖాళీ అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను నిర్వీర్యం చేయడానికి ఫ్రీ ప్రైమరీ కేంద్రాలను తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు సరిత, సందేశ, మాధవీలత, సుజాత, సుమలత, మంజుల, రజిత ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఈవో మల్లికార్జున్ అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలన్నారు. పాఠశాలలో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గ దిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యా హ్న భోజనాన్ని వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. హెచ్ఎం కల్యాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హోటళ్ల తనిఖీ బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ హోటళ్లలో మంగళవారం జిల్లా ఆహార భద్రతాధికారి నవిత తనిఖీలు నిర్వహించారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లతోపాటు రెస్టారెంట్లలో ఫ్రిజ్‌లలో మిగిలిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, టెస్టింగ్ సాల్ట్, సింథటిక్ రంగులను గుర్తించారు. అనంతరం ఫాస్ట్‌ఫుడ్, రెస్టారెంట్ యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు. నిజామాబాద్ అర్బన్: జిల్లాకు నూతనంగా వచ్చిన అదనపు కలెక్టర్ భుజరంగరావు, జిల్లా రెవెన్యూ అధికారి గీతను మంగళవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి శేఖర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, పెద్దోళ్ల నాగరాజు, తదితరులున్నారు. -
భూసార పరీక్ష.. పంటకు రక్ష
● పంటల మార్పిడితోనే ప్రయోజనాలు ● పరీక్షలు చేయించుకోవాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు మద్నూర్(జుక్కల్): రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా ప్రతి రైతు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. దీంతో భూమిలోని పోషక విలువలు తెలుసుకోని రసాయన ఎరువులు వాడొచ్చు. భూసార పరీక్షలపై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే పంటల మార్పిడిపై స్పష్టత వస్తుంది. దానికనుగుణంగా సాగుచేయొచ్చు. భూసార పరీక్షలు నిర్వహించి వాతావరణ పరిస్థితులకు తగిన పంటలను సాగు చేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవగాహన లేమితో పంట నష్టాలు రైతులు భూమిలోని పోషకాల స్థాయిని తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. విరివిగా రసాయన ఎరువుల వాడకం వల్ల వ్యయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై రైతు సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయ శాఖ పదేపదే సూచనలు చేస్తోంది. అయినప్పటికి రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అలాగే భూసార పరీక్షల ఫలితాలను అధికారులు సమయానికి అందించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఫలితాల ఆధారంగా సాగు మొక్కల పెరుగుదలకు 16 రకాల పోషకాలు అవసరమని, భూసార పరీక్షల ద్వారా భూమిలోని లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో అవసరమైన మోతాదులో ఎరువులను వినియోగించడం వల్ల దిగుబడి పెంచుకోవచ్చు. కొందరు రైతులు ఒకే పంటను తరుచుగా సాగు చేస్తుండడంతో పాటు అధిక రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూమి సారం కోల్పోయి పంట దిగుబడి తగ్గుతుంది. సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. రైతులు భూసార పరీక్షలు ఏటా చేయించుకోవాలి. ఈ పరీక్షలతో భూమి సారం ఎంతో తెలుస్తుంది. ఆ మేరకు భూమికి కావాల్సిన పోషకాలను అందించగలిగే ఎరువులు వాడుకునే అవకాశం ఉంటుంది. పంటల సాగులో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. –రాజు, ఏవో, మద్నూర్ -
మన మడిలో యూపీ దిహాడీదార్
వరినాట్లకు స్పెషలిస్టులు‘మీరు నారు పోసి పెట్టండి.. మేము గంటల వ్యవధిలో నాట్లు వేసేస్తాం’ అంటున్నారు యూపీ దిహాడీలు (రోజువారీ కూలీలు). వరినాట్లు వేయడంలో స్పెషలిస్టులుగా పేరున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలు ఉమ్మడి జిల్లాకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. గ్రూపులుగా విడిపోయి వరినాట్లు వేస్తున్నారు. 18 మంది కలిసి రోజుకు 7 ఎకరాల్లో నాట్లు పూర్తి చేస్తూ ఎకరానికి రూ.4,500 తీసుకుంటున్నారు. సమయం, డబ్బులు ఆదా కావడంతోపాటు యూపీ కూలీల పనిలో కచ్చితత్వం ఉంటుందని, నారును వరుస క్రమంలో నాటడంతో దిగుబడి బాగుటుందని రైతులు అంటున్నారు. వర్ని, చందూర్ ప్రాంతాలకు వలస వచ్చిన సుమారు 450 మంది కూలీలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జోరుగా వరినాట్లు వేస్తున్నారు. బాన్సువాడ డివిజన్లోని బిచ్కుంద శివారులో వరినాట్లు వేస్తున్న యూపీ కూలీలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
యూరియా నేరుగా అందించాలి
● రైతుల డిమాండ్ ● మత్తమాల సొసైటీ ఎదుట ఆందోళనవ్యవసాయ అధికారులకు సమస్యను విన్నవిస్తున్న రైతులుఎల్లారెడ్డి : స్మార్ట్ ఫోన్‌లేని తాము యూరియాను ఎ లా బుక్ చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాప్‌ను రద్దు చేసి నేరుగా యూరియా అందించా లని డిమాండ్ చేస్తూ మంగళవారం మత్తమాల సొ సైటీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. శివాన గర్, బ్రాహ్మణపల్లి, జంగమాయిపల్లి, మత్తమాల, అల్మాజీపూర్, మల్కాపూర్, రుద్రారం గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తమాల సొసైటీకి మంగళవారం 440 బస్తాల యూరియా వచ్చింది. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులు బస్తాలను తీసుకువెళ్లడానికి రాగా.. సొసైటీ పరిధిలోని గ్రామాల రై తులు ఆందోళనకు దిగారు. యాప్‌లో బుక్ చేసుకోకున్నా తమకు ముందు పంపిణీ చేశాకే ఇతరులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు సర్దిచెప్పి నా రైతులు వినలేదు. అనంతరం పోలీసులు వచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం సొసైటీ సిబ్బంది యాప్ ద్వారా యూరియా బుక్ చే సుకున్న రైతులకు బస్తాలు అందించారు. -
రెడ్‌క్రాస్ సభ్యత్వంలో జిల్లా ఫస్ట్
కామారెడ్డి క్రైం: రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానం సా ధించిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ర క్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రావన్నా రు. రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదులో జిల్లా అగ్రస్థానంలో కొనసాగడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నా రు. రక్తదానం చేసిన ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ‘బడిబాట’లో సామూహిక అక్షరాభ్యాసంలింగంపేట: బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం బడి బాట కార్యక్రమంలో భాగంగా శెట్పల్లి గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేశారు. అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానానికి అందరూ ముందుకు రావాలని సూచించారు. మండలంలో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పోతాయిపల్లి గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గోదామును పరిశీలించారు. రైతులు యురియా కోసం తప్పనిసరిగా యాప్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అనుబంధ’ వ్యాపారం
కామారెడ్డి టౌన్ : బడి గంట మోగింది.. పుస్తకాల సంచులు సర్దుకుని పిల్లలు పాఠశాలల బాట పట్టారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభంతో తల్లిదండ్రుల గుండెల్లో ఫీజుల దడ మొదలయ్యింది. ప్రైవేటు విద్యాసంస్థలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఏటా ఫీజులు పెంచేస్తూనే ఉన్నారు. జిల్లాలో విద్యాశాఖ అనుమతి పొందిన ప్రైవే ట్ ప్రైమరీ స్కూళ్లు 7, యూపీఎస్‌లు 96, హైస్కూ ల్స్ 80 ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా మరో 50 వరకు పాఠశాలలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో 70 వేలకు పైగా విద్యార్థులున్నారు. చాలా పాఠశాలలు ఏటా 10 శా తం వరకు ఫీజులు పెంచేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. అడ్మిష న్ ఫీజులు, డొనేషన్ల పేరుతో అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కమిటీలు ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అవి అమలు కావ డం లేదు. యాజమాన్యాలు నిర్ణయించిన ఫీజులను కట్టడానికి చాలామంది అప్పులపాలవుతున్నారు.ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజు లు వసూలు చేయవద్దు. పా ఠశాల ఆవరణలో పుస్తకా లు, ఇతర సామగ్రిని విక్రయించరాదు. విద్యార్థుల త ల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం. విద్యాశాఖ నిబంధనలకు పాటించని పాఠశా లల యజమాన్యాలకు నోటీసులు జారీచేస్తాం. – మల్లికార్జున్, డీఈవో, కామారెడ్డి ట్యూషన్ ఫీజులతోనే ఆగకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అనుబంధ దందాలూ నడిపిస్తున్నాయి. పుస్తకాలు, నోట్‌బుక్కులు, బ్యాగులు, యూనిఫాంలు సైతం పాఠశాలలోనే కొనుక్కోవాలి. అదీ వారు నిర్ణయించిన ధరకే.. చాలాచోట్ల పాఠశాల ప్రాంగణాల్లోనే ఈ దందా సాగుతోంది. కొన్నిచోట్ల వారు సూచించిన దుకాణాల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, బెల్టులు, షూస్ కొనుగోలు చేయాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి. వీటికోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని చాలా పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కి విద్యావ్యాపారం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
‘సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి’
భిక్కనూరు: ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి అవగాహన కల్పించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మంగళవారం ఆయన భిక్కనూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రోల్‌కాల్ ప్రాముఖ్యతను వివరించి వారు నిర్వహిస్తున్నర విధులు బాధ్యతలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణకోసం పోలీసులు తప్పనిసరిగా పెట్రోలింగ్ చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యను ఓపికగా విని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ నరేశ్, ఎస్సై ఆంజనేయులు ఉన్నారు. డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు కామారెడ్డి అర్బన్: డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మూడో విడత దరఖాస్తుల గడువును ఈనెల 21 వరకు పొడిగించినట్టు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. స్వయంప్రతిపత్తితో పాటు అన్ని సౌకర్యాలున్న కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఎంపిక చేసుకోవాలని కోరారు. ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: ఈ విద్యా సంవత్సరానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐలలో వివిధ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్ లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ విషయాన్ని ఏటీసీ జిల్లా కన్వీనర్ ప్రమోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపా రు. పదో తరగతి పాసైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకే దరఖాస్తు ద్వారా ప్రయివేట్, ప్రభుత్వ ఐటీ ఐ కళాశాలలతో పాటు ట్రేడ్లు ఎంపిక చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 వరకు గడువుందని తెలిపారు. 4 నుంచి డిగ్రీ వన్‌టైమ్ చాన్స్ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): డిగ్రీ వన్ టైమ్ చాన్స్ పరీక్షలు వచ్చేనెల 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలంగాణ యూనివర్సిటీ పరీ క్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ వన్ టైమ్ చాన్స్ (2016 నుంచి 2020 విద్యా సంవత్సరాలు) 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్ల పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. -
అందని ద్రాక్షే!
పీఎం కిసాన్..● ఏడేళ్లుగా కొత్తవారికి ఎదురుచూపులే.. ● కటాఫ్ తేదీని మార్చాలంటున్న అన్నదాతలు ● ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య ● కఠిన నిబంధనలతో జిల్లాలో పెట్టుబడి సాయానికి దూరమైన 51 వేల మంది రైతులుఎల్లారెడ్డి : చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకాన్ని తీసుకువచ్చింది. అర్హులైన వారికి ఏడాదికి మూడు విడతల్లో కలిపి మొత్తం రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ పథకానికి 2019 ఫిబ్రవరి 1 వ తేదీ కంటే ముందు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులను అర్హులుగా గుర్తించింది. ఇదే కటాఫ్ తేదీ కావడంతో ఆ తర్వాత భూయజమానులుగా మారినవారికి ఈ పథకం ప్రయోజనాలు అందడం లేదు. అర్హులకే లబ్ధి చేకూర్చేందుకు.. జిల్లాలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. ఈ పథకం విషయమై నిబంధనలను కఠినతరం చేయడం, కొత్త వారికి అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలో పథకం ప్రారంభించినప్పుడు 1,68,494 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తర్వాత నిబంధనలను కఠినతరం చేయడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. పథకం ప్రారంభంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా నమోదు జరిగినా.. కేంద్ర ప్రభుత్వం పథకానికి అర్హుల విషయంలో పలు నిబంధనలు తెచ్చింది. ఈ–కేవైసీ తప్పనిసరి చేసింది. మరోవైపు ఈ పథకం ప్రారంభమై ఏడేళ్లు దాటినా ప్రభుత్వం కటాఫ్ తేదీని పెంచనందున కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 1,16,805 కు తగ్గింది. అంటే పథకం ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకు 51,689 మంది ఈ పథకానికి అర్హత కోల్పోయారన్న మాట. ఎవరు అనర్హులంటే.. సంస్థలు లేదా కంపెనీల పేర్లపై ఉన్న వ్యవసాయ భూముల యజమానులను అనర్హులుగా పేర్కొంది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వ్యక్తులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు (గ్రూప్–డి లేదా మల్టీ టాస్కింగ్ సిబ్బందికి మినహాయింపు), నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ పథకం వర్తించడం లేదు. ప్రస్తుత లేదా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, సీఏ లు, ఆర్కిటెక్ట్‌లు వంటి వృత్తి నిపుణులు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ పథకానికి అనర్హులు. ఒక కుటుంబంలో ఎంతమంది పేర్లపై భూ ములు ఉన్నా ఒక్కరికే లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కి సాన్ పథకానికి సంబంధించి 2019 ఫిబ్రవరి 1ని కటా ఫ్ తేదీగా నిర్ణయించింది. ఆ తర్వాత భూములు కొన్న రై తులకు ఈ పథకం వర్తించ డం లేదు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలిస్తేనే కొత్తవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. – మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పీఎం కిసాన్ పథకానికి అర్హత పొందేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీ తర్వాత భూములు కొన్న రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదు. అయితే అనువంశికంగా భూములు పొందిన వారు మాత్రం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. అయితే ఈ భూమిపై గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందితేనే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు పెట్టుబడి సాయానికి అర్హులవుతారు.కఠిన నిబంధనల కారణంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడేళ్లలో జిల్లాలో 51 వేల పైచిలుకు రైతులు ఈ పథకానికి దూరమయ్యారు. మరోవైపు పథకం ప్రారంభం నుంచి కటాఫ్ తేదీ పెంచకపోవడంతో కొత్త రైతులు నిరాశ చెందుతున్నారు. -
2 నిమిషాలు 4 వేల బస్తాలు
● యూరియా దొరక్క రైతుల ఇబ్బందులు ● నిమిషాల వ్యవధిలోనే యాప్‌లో బుకింగ్ పూర్తి ● సింగిల్ విండోల ఎదుట రైతుల నిరసనభిక్కనూరు: రెండు నిమిషాల వ్యవధిలో 4వేలకు పైగా యూరియా బస్తాలు బుకింగ్ అయిపోవడంతో రైతులు అవాక్కయ్యారు. యూరియా యాప్‌పై అవగాహన లేకపోవడం, సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యల కారణంగా రైతులకు అవస్థలు తప్పడం లేదు. సోమవారం మూడు గంటలకు యాప్‌లో యూరియా బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు ప్రచారం నిర్వహించారు. రైతులు తమ పనులను మానుకుని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొబైల్ఫోన్లు పట్టుకుని కూర్చుని సరిగ్గా 3గంటలకు యూరియా బుక్ చేసేందుకు యాప్‌ను ఓపెన్ చేయగా రెండు నిమిషాల్లోనే నో స్టాక్ దర్శనమిచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురై మండలకేంద్రంతోపాటు పెద్దమల్లారెడ్డి, తిప్పాపూర్, అంతంపల్లి, రామేశ్వర్‌పల్లి, బబస్వాపూర్, జంగంపల్లి గ్రామాల్లోని సింగిల్‌విండోల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలంలోని భిక్కనూరు, బస్వాపూర్, రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్, జంగంపల్లి, అంతంపల్లి విండోల్లో 444 చొప్పున, పెద్దమల్లారెడ్డిలో 888, భిక్కనూరులోని మన గ్రోమోరులో 450 మొత్తం 4002 బస్తాల యూరియా స్టాక్ ఉన్నట్లు యాప్‌లో చూపింది. అయితే మొత్తం యూరియా కేవలం రెండు నిమిషాల్లో బుక్ అయిపోవడంతో రైతులు తీవ్ర అందోళనకు గురయ్యారు. -
మోగిన బడిగంట
● ఐదేళ్లలోపు పిల్లందరికీ చుక్కల మందు వేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో u● షబ్బీర్ అలీతో నేను మాట్లాడలేదు ● కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి కామారెడ్డి టౌన్ : తన పేరుతోపాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పే రును వాడు తూ సోషల్ మీ డియాలో ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని పోసానిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కామారెడ్డి డీఎస్పీ మ ధుసూదన్, పట్టణ సీఐ నరహరికి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 12వ తేదీ రాత్రి నుంచి కొందరు వ్యక్తులు నకిలీ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వి భేదాలు సృష్టించి, నాయకుల ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే కొందరు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. నకిలీ ఆడియోను సృష్టించిన వారిని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వా రిని సాంకేతికత ఆధారంగా గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు.కామారెడ్డి అర్బన్: వృద్ధులు సమాజానికి అమూల్యమైన సంపదని, వారి అనుభవాలు, విలువలు, మార్గ దర్శకత్వం కుటుంబాలకు, సమాజానికి ఎంతో అవసరమని అడిషనల్ కలెక్టర్ ఎన్వై గిరి అన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ రోజును పురస్కరించుకుని జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ గిరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కొంత మంది వృద్ధులు శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక వేధింపులకు గురువతున్నారని, ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమన్నారు. వివక్షకు గురవుతున్న వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు అండగా నిలిచి న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. కార్యదర్శి ఎం.రాజన్న, ప్రతినిధులు జైహింద్‌గౌడ్, పీవీ నర్సింహం తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి క్రైౖం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిని సోమవారం జిల్లాలోని ఆయా న్యాయస్థానాల్లో పోలీసులు హాజరుపర్చగా ఒకే రోజు 193 మందికి శిక్షలు ఖరారయ్యాయి. ఆయా పీఎస్‌ల పరిధిలో రెండు రోజులుగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని పోలీసులు కోర్టుల్లో హాజరుపరిచ్చారు. న్యాయస్థానాలు ముగ్గురికి రెండు రోజులు, మరో 10 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 193 మందికి రూ.2,07,300 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి టౌన్ : వేసవి సెలవులు ముగియడంతో జిల్లాలో సోమవారం బడి గంట మోగింది. నూతనోత్సాహంతో, సరికొత్త ఆశలతో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ, మొదటి రోజు ఆశించిన స్థాయిలో విద్యార్థుల సందడి కనిపించలేదు. అమావాస్య కావడంతో జిల్లాలోని మెజారిటీ పాఠశాలలు వెలవెలబోయాయి. సెంటిమెంట్ కారణంగా పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మొదటి రోజు హాజరు శాతం నిరాశాజనకంగా నమోదైంది. చాలా బడుల్లో విద్యార్థుల సంఖ్య కన్నా ఉపాధ్యాయులే సంఖ్యే ఎక్కువగా కనిపించింది. కొన్ని పాఠశాలల్లో ఒక్కరిద్దరు విద్యార్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. జిల్లాలో 1013 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 70 వేల మందికి పైగా విద్యార్థులున్నారు. అలాగే కేజీబీవీలు, మోడల్, సంక్షేమ పాఠశాలలు మరో 73 ఉండగా వాటిలో 22 వేల మందికి పైగా చదువుతున్నారు. మొదటి రోజు కనీసం 10 శాతం మంది విద్యార్థులు కూడా పాఠశాలల ముఖం చూడలేదు. దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లో 64 వేలు, ప్రభుత్వ సంస్థల పాఠశాలల్లో 3 వేల వరకు విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పలు చోట్ల ఉపాధ్యాయులు కార్పెట్లు పరిచి, పూలు చల్లుతూ, బొకెలు అందించి ఘనస్వాగతం పలికారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గంజ్ స్కూల్లో గంట కొడుతున్న సిబ్బందిబడిబాట, ఉపాధ్యాయుల సర్దుబాటు కసరత్తులు పూర్తి చేసుకుని ఉపాధ్యాయులంతా సమయానికే విధులకు హాజరైనప్పటికీ, తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పది కూడా దాటలేదు. ఫలితంగా, కొన్ని స్కూళ్లలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య కంటే హాజరైన విద్యార్థుల సంఖ్యే తక్కువగా ఉండటం గమనార్హం. ● నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట ప్రాథమిక పాఠశాల, బాన్సువాడ పట్టణ కేంద్రంలోని చామన్ గల్లి స్కూల్లో ఒక్కో విద్యార్థి మాత్రమే హజరయ్యారు. అలాగే గోపాల్పేట హై స్కూల్‌కు నలుగురు విద్యార్థులు వచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గంజ్ పాఠశాలకు ఏడుగురు విద్యార్థులు రాగా, 17 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. పెద్దొడప్గల్ మండలంలోని కాస్లామాద్ ప్రాథమిక పాఠశాలకు ఆరుగురు విద్యార్థులు మాత్రమే వచ్చారు.నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట హైస్కూల్లో హాజరైన నలుగురు విద్యార్థులుపాత బాన్సువాడ చమాన్ స్కూల్‌కు హాజరైన ఒకే ఒక్క విద్యార్థినాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట ప్రాథమిక పాఠశాలలో హాజరైన ఒకే ఒక్క విద్యార్థిమద్నూర్(జుక్కల్): కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులకు నకిలీ విత్తనాలు అంటగడతారని రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో ఫోన్లో విత్తనాలు, ఎరువులపై సమీక్షించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దున ఉన్న మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల రైతులు విత్తనాలు కోనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే విత్తనాలు తక్కువ ధర ఉండటంతో వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న పది దుకాణాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రభు త్వం పంట మార్పిడిపై రైతులకు అవగహన కల్పించాలని ఆదేశించిన వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు సాగు చేయాలని సూ చించారు. జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందొద్దన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ విక్టర్, గిరికామారెడ్డి క్రైం: ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. పల్స్ పోలియోతోపాటు డీ వార్మింగ్ డే, స్టాప్ డయేరియా క్యాంపెయిన్ల కూడా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆయా కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్లో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు అందేలా వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించిందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి చిన్నారికి పోలియో వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 733 పల్స్ పోలియో బూత్‌లు, 36 ట్రాన్సిట్ పాయింట్లు, 22 మొబైల్ బృందాలు, 199 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. ఈనెల 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించి మిగిలిపోయిన ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. జూన్, జూలై నెలల్లో నిర్ణీత తేదీల్లో డీ వార్మింగ్ డే, స్టాప్ అడయేరియా క్యాంపెయిన్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, జెడ్పీ సీఈవో చందర్‌నాయక్, డీఎంహెచ్‌వో వెంకట్, డీపీవో మురళి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.మొదటి రోజు స్కూళ్లకు హాజరైన విద్యార్థులో చాలా మంది సివిల్ డ్రెస్‌లోనే హాజరుకాగా, మరి కొందరు గతేడాది అందజేసిన ఏకరూప దుస్తుల్లో వచ్చారు. ఈ ఏడా ది ఏకరూప దుస్తులు ఎప్పుడిస్తారో తెలియ క విద్యాశాఖ అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క జత డ్రెస్సు పాఠశాలలకు చేరలేదు. నేరుగా ప్రభుత్వమే సరఫరా చేస్తుందా, లేక బట్ట జిల్లాలకు సరఫరా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈసారి దస్తులతోపాటు టై, బెల్డ్, షూ కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమచారం. సోమవారం పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అమావాస్య ఎఫెక్ట్.. మొదటి రోజు వెలవెలబోయిన ప్రభుత్వ పాఠశాలలు పది శాతం దాటని విద్యార్థుల హాజరు కొన్ని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కన్నా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఏకరూప దుస్తుల పంపిణి ఊసే లేదు -
ఇంటి నుంచే లైసెన్స్‌కు తొలి అడుగు
● ఆన్లైన్ పరీక్షలో పాసైతే వెంటనే లెర్నర్ లైసెన్స్● కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ సారథి పరివాహన్కు వెళ్లాలి. ● సారథి వెబ్సైట్లో రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ● అప్లై ఫర్ ఎల్ఎల్ఆర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ● ఆధార్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి. ● అవసరమైన ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ● దరఖాస్తు ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. ● ఆన్లైన్ పరీక్షకు అదనంగా రూ.50 చెల్లించాలి. ● ఆన్లైన్లో నిర్వహించే ఫేస్ లెస్ సర్వీస్ ద్వారా ట్రాఫిక్ రూల్స్, రోడ్ సెన్స్‌పై నిర్వహించే పరీక్ష రాయాలి. ● పరీక్షలో పాసైనవారు లెర్నర్ లైసెన్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైసెన్స్ ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది.ఎల్లారెడ్డి: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆర్టీవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు. ఇంటి నుంచే ఆన్లైన్లో దరఖాస్తు, పరీక్ష ప్రక్రియను పూర్తి చేసుకుని ఎల్ఎల్ఆర్ (లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) పొందవచ్చు. అవసరమైన ధ్రువపత్రాలు ● వయస్సు ధ్రువీకరించే ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా పాస్ పోర్ట్. ● నివాసాన్ని ధ్రువీకరించే ఆధార్‌కార్డు లేదా ఓటర్‌కార్డు లేదా రేషన్‌కార్డు. ● 50 సంవత్సరాలు దాటిన వారికి ఫారం–1ఏ డాక్టర్ సర్టిఫికేట్ అందించాలి. ● పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు. పరీక్ష విధానం 20 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే ఉత్తీర్ణులవుతారు. ట్రాఫిక్ నియమాలు, రహదారి సంకేతాలు, వాహనదారుల బాధ్యతలు, వేగ పరిమితులు, రోడ్డు భధ్రతా నియమాలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి . పరీక్ష సులభంగా పాస్ కావాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులపై అవగాహన పెంచుకోవాలి. మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి.డ్రైవింగ్ లైసెన్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రోడ్డు రవాణశాఖ పోర్టల్ సారథి పరివాహన్ వెబ్సైట్లో ఎల్ఎల్ఆర్ పరీక్ష పాసైతే చాలు. దళారులను, ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పనిలేదు. పరీక్ష పాసైతే లభించే లెర్నర్ లైసెన్స్ ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. – సంతోష్‌కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి -
స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి
సుభాష్‌నగర్ : వర్షాకాలం నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశముందని, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ తీగలు తెగిపడి కనిపించినా, స్తంభాలు ఒరిగిపోయినా,ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నా వెంటనే సమీప విద్యుత్ అధికారులకు, టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు. మొబైల్లో 8712481489 నెంబర్ ద్వారా వాట్సాప్‌లోకి వెళ్లి కావాల్సిన సేవలను సులభంగా పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా రైతులకు, గృహ వినియోగదారులకు పలు సూచనలు అందించారు. వినియోగదారులు ఇవి పాటించండి.. ● తడిసిన విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, సపోర్టు వైర్లు, స్విచ్ బోర్డులు, పరికరాలు ముట్టొద్దు. ● బట్టలు ఆరవేసేందుకు ప్లాస్టిక్ దండెలను మాత్రమే ఉపయోగించాలి. ● రేకులు, మెటల్ షీట్లు, గేట్లు మొదలైన వాటికి విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదమున్నందున వాటిని తాకకుండా జాగ్రత్త వహించాలి. ● సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో మాట్లాడొద్దు. ముందుగా ఛార్జింగ్ ఆఫ్ చేయాలి. ● ఇంటి వైరింగ్‌కు సరైన ఎర్తింగ్ తప్పనిసరి. ● ఐఎస్ఐ మార్క్ గల నాణ్యమైన ప్లగ్గులు, స్విచ్‌లు, ఛార్జర్లు మాత్రమే ఉపయోగించాలి. రైతు సోదరులకు .. ● మోటార్లు, ఫుట్వాల్వులు, పైపులు తడిగా ఉన్నప్పుడు తాకొద్దు. ● పంపుసెట్లు, స్టార్టర్లు తప్పనిసరిగా సరైన ఎర్తింగ్‌తో ఉండాలి. ● విద్యుత్ పనులు స్వ యంగా చేయకుండా అర్హత కలిగిన ఎలక్ట్రిషి యన్ ద్వారా మాత్రమే చేయించాలి. ● మోటార్లకు జాయింట్లు లేని నాణ్యమైన సర్వీస్ వైర్లు మాత్రమే వినియోగించాలి. ● పశువులను ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు తీసుకెళ్లొద్దు. ● ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేర్లు చేయొద్దు. ● ఎవరికై నా కరెంట్ షాక్ తగిలితే వెంటనే చేతులతో తాకొద్దు. కర్ర, ప్లాస్టిక్ వంటి విద్యుత్ ప్రసారం కాని వస్తువుతో వేరు చేయాలి. విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సేవలకు టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలి ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు -
ఎల్ నినో దెబ్బపడకుండా..
ఆర్మూర్: వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది. అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా దెబ్బ తినేది దుంప పంటలే.ప్రతికూల పరిస్థితుల్లో పసుపు లాంటి దుంప పంటల దిగుబడి దెబ్బతినకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉద్యాన, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ● బెడ్సిస్టం బెటర్.. పసుపు నాటే ముందు చదును భూమిలోనే విత్తనం వేస్తే భారీ వర్షం పడగానే నీరు నిలిచి దుంపలు కుళ్లిపోతాయి.అందుకే నాటే ముందు 4–5 అడుగుల వె డల్పు బెడ్లు తయారు చేసుకొని, రెండు బెడ్ల మధ్య కాలువలు తీసుకొని బెడ్డుపై పసుపును విత్తుకోవాలి. ఇలా చేస్తే ఆకస్మికంగా కురిసే భారీ వర్షాల్లోనూ నీరు బయటకు పోయి వేరుకు గాలి అందుతుంది. ● విత్తన శుద్ధి తప్పనిసరి.. పసుపు పంటకు దుంప తెగులు ఎక్కువగా విత్తనం ద్వారానే వస్తుంది. నాటే ముందు రోజు మాంకోజెబ్, రిడోమిల్ లేదా కార్బెండజిమ్‌తో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఇలా చేస్తే నాటిన తర్వాత వచ్చే వేరుకుళ్లు, రైజోమ్ రాట్ వంటి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ● బిందు సేద్యంతో నీరు, ఎరువు ఆదా... ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావొచ్చు, లేదా ఒక్కసారిగా కురవొచ్చు. బిందు సేద్యం ద్వా రా నీరు, ఎరువులు నేరుగా వేరు దగ్గర ఇ వ్వడం ఉత్తమం.ఇలా చేస్తే నీటి వృథా తగ్గడంతోపాటు ఎరువుల ఖర్చు కూడా 30%–40%తగ్గుతుంది. -
రక్తదానం.. మహాదానం
రక్తదానం మహాదానమని, ఒకరికి పునర్జన్మను ప్రసాదించే రక్తదానంపై అవగాహన కల్పించేలా ఆర్ట్ టీచర్ బాల్కిషన్ రావి ఆకుపై రక్తపు చుక్కను తీర్చిదిద్దాడు. మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న బాల్కిషన్ ఆదివారం వరల్డ్ బ్లెడ్ డోనర్ డే సందర్భంగా రావి ఆకుపై ప్రత్యేకంగా వరల్డ్ బ్లడ్ డోనర్ డే అని రాసి రక్తపు చుక్క ఆకారం వేశాడు. దేశంలో చాలా మంది రక్తం దొరక్క మృతి చెందుతున్నారని, రక్తదానం..ప్రాణ దానమని ఆయన పేర్కొన్నారు. – మద్నూర్ (జుక్కల్) -
వాతావరణానికి తగ్గ పద్ధతులు పాటించాలి
ఎల్ నినో నేపథ్యంలో పసు పు లేదా ఇతర ఏ పంట పండించే రైతులైనా స్థానిక వా తావరణ పరిస్థితులకు తగ్గ పద్ధతులను అవలంబిస్తూ పంటలను కాపాడుకోవాలి. ముఖ్యంగా పసుపు రైతులు మూడు పద్ధతులను పాటిస్తే పంటను రక్షించుకున్నవారవుతారు. – కే.సంధ్యారాణి, హర్టికల్చర్ ఆఫీసర్, ఆర్మూర్ తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తోంది. పసుపు రైతులు మాత్రం పైన చెప్పిన మూడు పద్ధతులు పాటిస్తే, వర్షం ఎలా ఉన్నా దిగుబడిని కాపాడుకోవచ్చు. – హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్ మండలం -
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి అర్బన్: వర్షాకాలంలో భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా చెట్లు, కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్ ప్రమాదాలపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్ఈ సాలియా నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఎక్కడైన విద్యుత్ లైన్ తెగిపోవడం, చెట్ల కొమ్మలు పడిపోవడం కనిపిస్తే వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. వ్యవసాయ బోరుబావుల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, సొంతగా మరమ్మతులు చేయొద్దని, టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. 87124 81489 నంబర్ ద్వారా వాట్సాప్‌లో సైతం విద్యుత్ సేవలు పొందవచ్చని తెలిపారు. జీపీఆర్ఎస్ కలిగిన అత్యవసర మరమ్మతుల బృందం వాహనం, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. కామారెడ్డి టౌన్ : సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా చలామణి అవుతున్న సదరం క్యాంప్ తేదీల పోస్టర్ నకిలీదని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) దామోదర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘జూన్ 14, 15, 21, 22 తేదీల్లో కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు’ అంటూ సాగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఫేక్ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు సదరం క్యాంపుల తేదీలు, నిర్వహించే స్థలం, సమయం తదితర పూర్తి వివరాలను వారు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మాత్రమే ఎస్ఎంఎస్ రూపంలో లేదా నేరుగా ఫోన్ కాల్ ద్వారా విద్యాశాఖ/డీఆర్డీఏ యంత్రాంగం తెలియజేస్తుందని స్పష్టం చేశారు. 17, 18 తేదీల్లో క్యాంపులు ప్రతి నెలా బుధ, గురు వారాల్లో నెలలో 8 వరకు సదరం క్యాంపులు నిర్వహిస్తామని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్ఎంవో సంతోష్ తెలిపారు. ఈనెలలో 17, 18 తేదీల్లో సదరం క్యాంపును జీజీహెచ్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 17న ఈఎన్టీ, మానసిక, 18న ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పిల్లల విభాగం వారు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని, 24, 25 తేదీల్లో సదరం క్యాంపు లేదని స్పష్టం చేశారు. సుభాష్‌నగర్: ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. అత్యధిక రక్తదానాలు చేయించినందుకు గాను నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తరఫున ఏసీపీ ప్రకాశ్, జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్‌రెడ్డి తరఫున ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ అవార్డులను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా అందుకున్నారు. 87 సార్లు రక్తదానం చేసిన తోట రాజశేఖర్‌ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, కోశాధికారి కరిపె రవీందర్, సభ్యుడు సూర్యనారాయణ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
డిచ్పల్లి : మండలంలోని సుద్దపల్లి సమీపంలోని సీఎంసీ మెడికల్ కళాశాల వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాల య్యాయి. డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరం పాటి గల్లి, ఫులాంగ్‌కు చెందిన మెట్టు రామ్ ధనుష్ (19), నాగారం ప్రాంతానికి చెందిన కచ్చకాయల తేజ ఇద్దరూ డిచ్పల్లి మండలం సుద్దపల్లికి పని నిమిత్తం వచ్చారు. అర్ధరాత్రి సుమారు 1 గంటకు తమ బైక్ పై నిజామాబాద్‌కు తిరిగి వెళ్తుండగా సీఎంసీ వద్ద రోడ్డును క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మెట్టు రామ్ ధనుష్ అక్కడికక్కడే మృతి చెందగా, తేజ తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ ఆరిఫ్ ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన తేజను హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. తేజ జిల్లా కేంద్రంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గాయపడిన తేజ -
హత్య చేసి..యాక్సిడెంట్‌గా చిత్రీకరించి
● యువకుడి హత్య కేసులో తండ్రి, తమ్ముడు అరెస్టు బాన్సువాడ : మద్యానికి బానిసైన కొడుకును హత్య చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ నమ్మించిన తండ్రితోపాటు తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన బాయికాడి లక్ష్మణ్(23) మద్యానికి బానిసై తరుచూ తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధిస్తూ, వారిని కొట్టేవాడు. గత నెల 21న రాత్రి మద్యం సేవించి మత్తులో ఇంటికి వచ్చిన లక్ష్మణ్ తల్లిదండ్రులపై కర్రలతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న లక్ష్మణ్ తమ్ముడు బాయికాడి శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో శ్రీకాంత్ పలుమార్లు లక్ష్మణ్ తలపై కొట్టగా అక్కడే ఉన్న తండ్రి బాయికాడి చిన్న గంగారం సైతం కర్రతో లక్ష్మణ్‌ను తీవ్రంగా కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యను దాచి పెట్టేందుకు రక్తపుమరకలను శుభ్రం చేసి లక్ష్మణ్ బైక్ పైనుంచి పడి చనిపోయాడని నిందితులు చిన్న గంగారం, శ్రీకాంత్ బంధువులు, స్థానికులను నమ్మించారు. ఎవరికీ అనుమానం రాకుండా లక్ష్మణ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై రాములు విచారణ చేయగా లక్ష్మణ్‌ను తామే చంపామని చిన్న గంగారం, శ్రీకాంత్ అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, మృతుడి తల్లి స్వరూప పరారీలో ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
యువకుడిపై దాడి
● ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు నందిపేట్(ఆర్మూర్): ఓ యువకుడిపై దాడి చేసి హత్యాయత్నం చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసిన ఘటన ఆదివారం నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండల కేంద్రంలోని రాజానగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన షేక్ నయ్యూంకు సమీప బంధువులతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కాగా, షేక్ నయ్యూం ఆదివారం ఉదయం వివేకానంద చౌరస్తా సురేశ్ నగర్ కాలనీ వద్ద తన అన్న షేక్ ఖయ్యూం దుకాణానికి వెళ్లాడు. పాత కక్షలతో ఉన్న సమీప బంధువులైన షేక్ తాలీబ్, షేక్ తాహేర్, సాజిద్, షాహేద్, గాలిబ్తోపాటు మరికొంత మంది వ్యక్తులు కారులో వచ్చి ఇనుప రాడ్లు, కత్తులతో షేక్ నయ్యూంపై దాడికి పాల్పడ్డారు. దీంతో నయ్యూం తల, చేతులు, పొట్టపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులను చూసి దాడికి పాల్పడిన వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితుడి అన్న షేక్ ఖయ్యూం ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. బాన్సువాడ రూరల్: ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం సందీప్(19) ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 13న రాత్రి మృతి చెందినట్లు బాన్సువాడ ఎస్‌హెచ్‌వో శ్రీధర్ తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బర్రెల కాపరిగా పనిచేసే సందీప్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ కొనసాగుతోందన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కృష్ణ బిల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో కింద పడడంతో తీవ్రగాయాలైనట్లు కార్మిక సంఘం నాయకులు రజాక్ ఆదివారం తెలిపారు. బిల్డింగ్ సెంట్రింగ్ పనులు చేస్తున్న సమయంలో ఈదురు గాలులు వీయడంతో కృష్ణ భవనంపై నుంచి కింద పడ్డాడు. దీంతో ఎల్లారెడ్డిలో ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కృష్ణను కార్మికసంఘం నాయకులు పరామర్శించారు. రక్తదానంతో ఎంతోమందికి పునర్జన్మ సుభాష్‌నగర్:రక్తదానం చేయడంతో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించవచ్చని రోటరీ క్లబ్ జేమ్స్ అ ధ్యక్షుడు పాకాల నర్సింహారావు తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోటరీ క్లబ్ జేమ్స్ ఆ ధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.21 మంది స్వచ్ఛందంగా రక్తదా నం చేశా రు.అనంతరం అధ్యక్షుడు నర్సింహారావు మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన యువకులు నిర్ధిష్ట సమయంలో రక్తదానం చేయడంతో వారి ఆరోగ్యానికి ఎ లాంటి ప్రమాదం ఉండదన్నారు.రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్య క్తంచేశారు.యువకులు ప్రతి మూడునెలలకొకసారి రక్తం దానం చేయవచ్చని తెలిపారు.కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ గంజి రమేశ్, ప్రాజెక్ట్ చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్, క్లబ్ సభ్యులు గిరీశ్ కుమార్,సంపత్ కు మార్,శేఖర్,ముక్కా శ్రీనివాస్,బంగారివీరబ్రహ్మం, నాగేశ్వరరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
బడి రూపురేఖలు మార్చిన టీచర్
ప్రైవేట్ పాఠశాలల కన్నా నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో తరగతి గదుల్లో పెయింటింగ్, డ్రాయింగ్ వేయించాను. దాదాపు రూ.10 వేల వరకు వెచ్చించాను. తరగతి గదులు విద్యార్థులకు ప్రేరణగా ఉండాలనేది నా ఆలోచన. హెచ్ఎం ప్రోత్సాహంతో అసంపూర్తిగా ఉన్న గది నిర్మాణాన్ని పూర్తి చేశాం. – శిరీష, టీచర్దోమకొండ: వచ్చామా.. పాఠం చెప్పామా... వెళ్లిపోయామా.. అన్నట్టు కాకుండా పిల్లలతో మమేకమవుతూ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శిరీష. తాను పని చేస్తున్న పాఠశాలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిద్దేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలోని అంబారిపేట ప్రభుత్వ హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శిరీష గతేడాది సంఘమేశ్వర్ గ్రామం నుంచి బదిలీపై వచ్చారు. అంబారిపేట పాఠశాలలో ఒకటే గది ఉండటం, దానిలోనే ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బోధించడం ఇబ్బందిగా ఉండటంతో పాఠశాల పై అంతస్తులో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేయించాలని నిర్ణయించారు. దీని కొసం విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చింగా, తాము పేదవాళ్లమని.. అయినప్పటికీ ఎంతోకొంత ఆర్థికసాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వెంటనే శిరీష హెచ్ఎం అంజన్ప్రసాద్తో మాట్లాడి తన సొంత నిధులు కొంత వెచ్చించి ముందుగా మేసీ్త్రలను పిలిపించి పనులు మొదలుపెట్టారు. అదనపు గది నిర్మాణం పూర్తి చేసేందుకు సుమారు రూ.2లక్షల 55 వేలకు పైగా వెచ్చించారు. దాంట్లో గ్రామస్తులు రూ.81 వేలు సమకూర్చగా, హెచ్ఎం రూ.11 వేలు అందించారు. మిగతా రూ.లక్షా 74 వేలు తన సొంత డబ్బులను శిరీష ఖర్రచు చేశారు. గది నిర్మాణంతో పాటు కిటికీలు, మెట్లకు సైడ్‌వాల్స్ బిగించి గదికి రంగులు, బొమ్మలను వేయించారు. హరిజనవాడలోని పిల్లలందరూ ఇదే పాఠశాలలో అభ్యసిస్తున్నారు. ఆటపాటలతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శిరీష. ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శంగా నిలుస్తున్న శిరీష అదనపు గది నిర్మాణానికి సొంతంగా సుమారు రూ.2లక్షల వరకు ఖర్చు -
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తా
● మద్నూర్–బోధన్ హైవే డీపీఆర్ సిద్ధం ● ఎంపీ సురేశ్ షెట్కార్ ● సలాబత్పూర్ ఆలయంలో పూజలుమద్నూర్(జుక్కల్): మద్నూర్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. మండలంలోని సలాబత్‌పూర్‌లోని హనుమాన్ ఆలయాన్ని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కార్యాలయంలో ఎంపీ మాట్లాడుతూ.. మద్నూర్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరైనప్పటికీ ఐదు ఎకరాల స్థలం అవసరమని అన్నారు. వెంటనే ఆయన తహసీల్దార్ ముజీబ్‌కు ఫోన్ చేసి కేవీ కోసం స్థల సేకరణ ఎంత వరకు వచ్చిందని అడిగారు. స్థలం సిద్ధం చేయాలని, తాను అధికారులతో మాట్లాడి కేవీ ప్రారంభమయ్యేలా కృషి చేస్తానన్నారు. జహీరాబాద్‌లో 15 ఎకరాల స్థలంలో కేవీ ప్రారంభించామని ఎంపీ తెలిపారు. హనుమాన్ ఆలయంలో కల్యాణమండపం, అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయాని, ప్రహరీ లేకపోవడంతో పందులు, కుక్కలు లోనికి వస్తున్నాయని భక్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, త్వరలో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటానన్నారు. మద్నూర్ – బోధన్ హైవే పనులపై ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోందని, బడ్జెట్, డిజైన్, విస్తరణ, మౌలిక వసతులు, సాంకేతిక అంశాలకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. మద్నూర్ మండల కేంద్రం నుంచి సిర్పూర్, నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్ మీదుగా బోధన్ వరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. కుర్లా సమీపంలో మంజీర నదిపై వంతెన తన హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. సర్పంచ్‌లు తుకారాం, దిగంబర్, మాధవ్‌రావ్, మాజీ జెడ్పీటీసీ సాహెబ్రావ్, మాజీ సర్పంచ్ గఫార్, నాయకులు నాగేశ్పటేల్, సచిన్ తదితరులున్నారు. -
పసుపు సాగు సంబురం
● పెరుగుతున్న పంట విస్తీర్ణం ● ఆశాజనకమైన ధర, పసుపు బోర్డు, పసుపు పరిశోధన కేంద్రంతో ఊతం మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు పసుపు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో జిల్లాలో 50 వేల ఎకరాల వరకు పసుపు సాగు చేశారు. ఆశించిన ధర లేకపోవడం, పెట్టుబడులు అధికం కావడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఏకంగా పసుపు సాగు 50 శాతానికి పడిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పసుపు జాతీయ బోర్డును జిల్లాలోనే ఏర్పాటు చేయడం, పసుపు పరిశోధన కేంద్రం ఇక్కడే ఉండటంతో సాగుకు ఊతమిచ్చినట్లు అయ్యింది. గడచిన సీజన్లో పసుపు పంటకు క్వింటాలుకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ధర లభించింది. ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ రకం పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలతోపాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో పసుపు సాగవుతుంది. ఈ సీజన్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, విదేశాలకు పసుపు ఎగుమతులు పెరిగితే సాగు విస్తీర్ణం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా...సంవత్సరం సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 2020–21 41,016 2021–22 40,061 2022–23 21,913 2023–24 24,509 2024–25 23,941 2025–26 28,000 2026–27 30,000 (అంచనా)పసుపు పంటకు ఇప్పుడు ఉన్న ధర కన్నా ఇంకా ఎక్కువ ధర లభించాలి. పెట్టుబడులు అధికం అవుతున్నాయి. కనీసం ఒక్కో క్వింటాలుకు రూ.16వేల వరకు ధర తగ్గకుండా ఉండాలి. అలా జరిగితేనే సాగు విస్తీర్ణంలో గణనీయమైన మార్పులు వస్తాయి. – పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, రైతు, దోంచంద పసుపు జాతీయ బోర్డు సాగు విస్తీర్ణంపై దృష్టి సారించాలి. రైతులకు నష్టాలు రాకుండా చూడాలి. మేలు రకమైన విత్తనాల సరఫరా, సేంద్రియ ఎరువుల ధర నియంత్రణ జరగాలి. ఎగుమతులు పెంచి పంటకు గిట్టుబాటు ధర దక్కితేనే ప్రయోజనం. – గడ్డం లింగారెడ్డి, రైతు, గుమ్మిర్యాల్ -
చినుకు కోసం చూపులు!
● ముందస్తు వర్షాలు కురిసి మళ్లీ కనిపించని వైనం ● నారుమడులు సిద్ధం చేసిన రైతుల్లో అయోమయంనిజాంసాగర్(జుక్కల్): జిల్లాలోని పలు ప్రాంతాల రైతులను మృగశిర కార్తె వర్షం మురిపించింది. ముందస్తు వర్షాలతో రైతులు సాగు పనులకు సన్నద్ధమయ్యారు. చాలాచోట్ల నారుమడులను సిద్ధం చేసి విత్తనాలు అలికారు. అయితే వారం, పది రోజులుగా మళ్లీ వర్షం కురవకపోవడంతో నారుమడులు ఎండుతున్నాయి. చెరువులు, కుంటలు, వర్షంపై ఆధారపడి పంట సాగు చేసే రైతులు నారుమడులను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. జూన్, జూలై నెలల్లో వర్షాలు కురిసినా.. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పూర్తిస్థాయిలో వర్షాలు ప్రారంభమైన తరువాతే సాగు పనులు ప్రారంభించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు అలికిన చోట్ల వర్షం లేక మొలకలు రావడం లేదు. మొలకలు వచ్చిన చోట్ల ఎండిపోయే పరిస్థితి ఉంది. మరోనాలుగైదు రోజుల్లో వర్షాలు కురకపోవతే నారుమడులు ఎండిపోయే ప్రమాదం ఉంది.నిజాంసాగర్ ప్రాజెక్టు 31,927 పోచారం 10,500 కౌలాస్ నాలా 9,000 జిల్లాలో చెరువులు ఆయకట్టు 2069 97,123 బోరుబావులు ఆయకట్టు 1,09,717 1,45,122వరి 3.20 లక్షలు మొక్కజొన్న 54,500 వేలు పత్తి 45,500 సోయా 90,684 మినుము 2,858 పెసర 3,382 కంది 41,500 చెరుకు 588 ఇతర పంటలు 278రోహిణి, మిర్గం రోజుల్లో వానపడటంతో నారు మడి వేసుకున్నా. వారం రోజుల సంది వర్షాలు లేవు. కుంటలో నుంచి నీటిని తెచ్చి నారుమడిని తడుపుతున్నా. వర్షాలు పడతాయని నమ్మకంతో సాగుకు సిద్ధమైన. – దనుల ఎల్లయ్య, రైతు, వెల్లుట్ల -
ఇక బడిబాట
సెలవులకు టాటాజిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకామారెడ్డి టౌన్ : వేసవి సెలవులు ముగియడంతో నేటి (సోమవారం) నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభు త్వ బడులు పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు స్వాగతం పలికేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. అయితే పలు పాఠశాలల్లో మౌలిక వసుతులు లేక విద్యార్థులకు ఈ ఏడాది సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. విద్యాశాఖ ముందస్తు ప్రణాళిక లేక విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాకు ఇంకా స్కూల్ యూనిఫామ్‌లు చేరుకోలేదు. ఇప్పటికే 5.32లక్షల పాఠ్యపుస్తుకాలు చేరాయి. ఈ సారి అన్ని తరగతులకు నోట్ బుక్స్ కూడా పంపిణీ చేయనున్నారు. చెల్లించింది 50 శాతం బిల్లులే.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, గురకులాలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు మొత్తం 1,086 ఉన్నాయి. వీటిలో గతేడాది 99,362 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రతిష్టాత్మకంగా ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. 973 స్కూళ్లను ఎంపిక చేసి తాగునీటి సౌకర్యం, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, మూత్రశాలల మరమ్మతులు, తరగతి గదుల మేజర్, మైనర్ రిపేర్ల కోసం ప్రభుత్వం రూ. 22 కోట్ల నిధుల ప్రతిపాదనలతో పనులు చేపట్టారు. రెండేళ్ల క్రితం పనులు చేపట్టినప్పటికీ పనులు పూర్తి చేసిన 715 పాఠశాలలకు కేవలం 50 శాతం బిల్లులు మాత్రమే రెండు దఫాలుగా చెల్లించారు. మరో రూ. 9.96 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉండిపోవడంతో పనులు చేసిన కమిటీలు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి, వంటగదులు, తరగతి గదులు, ఫర్నిచర్ కొరత తదితర సమస్యలతో 60 శాతం పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గర్ల్స్ హైస్కూల్లో విరిగిపోయిన తాగునీటి నల్లాలు ప్రైవేట్ 183 మండల పరిషత్ 994 కేజీబీవీ 19 రాష్ట్ర ప్రభుత్వ(డీఎన్టీ) 14 మోడల్ స్కూల్స్ 11 మిని గురుకుల 02 మైనారిటీ వెల్ఫేర్ 06 బీసీ వెల్ఫేర్ 08 ట్రైబల్ 04 సోషల్ వెల్ఫేర్ 11 2023–24 24–25 25–26 ప్రభుత్వ 81,864 76,184 76,082 ప్రైవేట్ 65,271 69,362 71,165నేడు మోగనున్న బడి గంట తెరుచుకోనున్న పాఠశాలలు బడుల్లో సదుపాయాలు అంతంతే.. ఇంకా చేరుకోని ఏకరూప దుస్తులు ఏటేటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం 81,864 మంది విద్యార్థులుండగా, గత విద్యాసంవత్సరానికి ఆ సంఖ్య 76,082కు తగ్గిపోయింది. మూడేళ్లలో దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయారు.సోమవారం నుంచి పా ఠశాలలు ప్రారంభమవుతు న్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని హెచ్ఎంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు పాఠ్య, నోట్ బుక్స్ పంపిణీ చేస్తాం. ఏకరూప దుస్తులు రాగానే పంపిణీ చేస్తాం. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలన్ని పరిష్కరిస్తాం. – మల్లికార్జున్, డీఈవో, కామారెడ్డిఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనైనా సర్కారు బడుల రూపరేఖలు మారుతాయని ఆశించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చిన్నపాటి వర్షాలకే చాలా పాఠశాలల ఆవరణలు బురదమయమవుతున్నాయి. వేసవి సెలవుల్లో ప్రహరీలు లేని పాఠశాలల్లో ఆకతాయిలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పలు పాఠశాలల్లో నల్లాలు, విద్యుత్ వైరింగ్, మరుగుదొడ్ల తలుపులను ధ్వంసం చేశారు. ‘మన ఊరు – మన బడి’ కింద చేపట్టిన భవన, డైనింగ్ హాళ్ల నిర్మాణాలు సగానికి పైగా నిలిచిపోయి అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. ఇరుకై న వంటశాలలు, అరకొర తాగునీటి సమస్యలు ఇంకా చాలా చోట్ల వేధిస్తున్నాయి. -
ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్
సిరికొండ: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల చుట్టు ఫెన్సింగ్ లేకపోవడంతో వాటితో ప్రమాదం పొంచి ఉంది. అలాగే తక్కువ ఎత్తులో ఉండటంతో కాలనీలోని చిన్నారులు ఆడుకుంటు ఆకస్మాత్తుగా అటు వైపు వెళితే విద్యుత్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వానాకాలం కావడంతో తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లతో ప్రమాదాలు సులువుగా జరిగే అవకాశం ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ల గద్దెల చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. -
వైర్లు పైకెత్తితేనే లారీ కదిలేది
బీబీపేట: పంట వేసిన నుంచి పంట చేతికి వచ్చి రైస్‌మిల్లుకు చేరే వరకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలు అయిన తర్వాత కూడా లారీని రైస్‌మిల్లు వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులు రైతుల మీదనే మోపుతున్నారు. బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఒక లారీలో ముగ్గురు రైతుల వడ్లను లోడ్ చేశారు. లారీ గ్రామం నుంచి రైస్‌మిల్లు వరకు వెళ్లే దారిలో సుమారు 5 చోట్ల విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో ఆ ముగ్గురు రైతులే వాటిని పైకి లేపుతూ లారీని ముందుకు తీసుకువెళ్లారు. కిందికి వేళాడుతున్న వైర్లను పైకి లేపుతూ రైస్ మిల్లుకు చేర్చారు. ప్రతిసారి లారీ వచ్చినప్పుడు రైతులకు ఈ తిప్పలు తప్పవని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే వైర్లు పూర్తిగా కిందికి ఉన్నాయని రైతులు వాపోయారు. -
సైక్లింగ్ పోటీ.. ఇందూరు మేటి
● ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులు ● సరదాగా మొదలై.. జాతీయ స్థాయి వరకు.. నిజామాబాద్ అర్బన్ : విశ్వ క్రీడల్లో అత్యంత ఆదరణ పొందిన సైక్లింగ్ పోటీల్లో ఇందూరు క్రీడాకారు లు ప్రతిభచాటుతున్నారు.రాష్ట్ర,జాతీయ స్థాయి పో టీల్లో పాల్గొని పతకాల పంట పండిస్తున్నారు. కోచ్ విజయ్‌కాంత్ రావు ఆధ్వర్యంలో క్రీడాకారులు తమ నైపుణ్యాన్నిమెరుగుపరుస్తూజిల్లాకువన్నెతెస్తున్నారు. నేషనల్ చాంపియన్‌షిప్ వరకు.. సైక్లింగ్ పోటీలలో జిల్లాకు చెందిన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు మెలకువలు అందిస్తున్నాం. జాతీయస్థాయిలో జిల్లాకు పేరు తీసుకురావాలన్నదే తమ లక్ష్యం. దానికి అనుగుణంగానే శిక్షణ కొనసాగిస్తున్నాం. – విజయ్‌కాంత్‌రావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సైక్లింగ్ పోటీలలో క్రీడాకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. శిక్షణకు మరింత సహాయం అందించాలి. సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మరింత మంది క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. – శిల్పా చౌహాన్, సైక్లింగ్ క్రీడాకారిణినగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన రాఘవేందర్ సైక్లింగ్‌లో అద్భుత ప్రతి భ కనబరుస్తున్నాడు. తల్లి సౌమ్య, తండ్రి విజయ్ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే సైక్లింగ్ ఆసక్తి పెంచుకున్నాడు. 2020 సంవత్సరంలో కరీంనగర్లో నిర్వహించిన నాల్గో డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్‌లో మొదటి బహుమతి, ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన 16వ నేషనల్ చాంపియన్‌షిప్‌లో ద్వితీయ బహుమతి సాధించారు. 2021లో సిద్దిపేట ఇంటర్ డిస్ట్రిక్ట్ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్, కర్ణాటకలో జరిగిన 17వ నేషనల్ చాంపియన్‌షిప్, ముంబైలో జరిగిన 25వ నేషనల్ రోడ్ చాంపియన్‌షిప్, రంగారెడ్డిలో నిర్వహించిన నేషనల్ రోడ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. అనంతరం కరీంనగర్లో నిర్వహించిన సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు అందుకున్నాడు. -
ఒకవైపు వృథా.. మరోవైపు వ్యథ
పెద్ద కొడప్గల్(జుక్కల్): మండలంలోని బేగంపూర్ జీపీ కార్యాలయం వద్ద గల కాలనీలో తాగునీరు వృథాగా పోతుంది. నీరు మురుగు కాలువ నుంచి రోడ్డుపై ప్రవహించడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మినీ వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. మండలంలోని బబుల్గావ్, చింతల్‌వాడి, కుబ్యానాయక్ తండాతో పాటు, పలు గ్రామాల్లో తాగునీరు రాక ప్రజలు తంటాలు పడుతున్నారు. తాగునీటిని వ్యవసాయ బావుల నుంచి, వాటర్ ట్యాంకర్ల ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది సరఫరా చేస్తున్నారు. దీంతో నీటి కోసం ఆయాగ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వృథా అవుతున్న తాగునీటిని అరికడుతాం. మురు గు నీటి సమస్యను పరిష్కరిస్తాం. సమస్య పరిష్కరించాలని గ్రామకార్యదర్శికి ఆదేశిస్తా. నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. – అభినవ్ చందర్, ఎంపీడీవో -
ఆడుడు ఆడుడే..
● పది రోజుల క్రితం నస్రుల్లాబాద్‌లో పేకాటఅడ్డాపై దాడి చేసిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.9,280 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● వారం క్రితం బీర్కూర్ మండలం బైరాపూర్ చెరువు స మీపంలోని పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,110 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.● 20 రోజుల క్రితం గాంధారి మండలం పొతంగల్ కలాన్ శివారులో నిర్వహిస్తున్న ఓ పేకాట స్ధా వరంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులో కి తీసుకున్నారు. రూ.10వేల నగదును సీజ్ చేశారు. కామారెడ్డి క్రైం : జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసులకు పట్టుబడుతున్నా ‘ఆడుడు ఆడుడే..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు పేకాటరాయుళ్లు. దాడులు జరుగుతాయని, ఆర్థికంగా నష్టమేనని తెలిసినా జూదంపై మోజు తగ్గడం లేదు. పేకాట మోజులో పడి ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయి వీధిన పడుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు పోలీసులు దాడలు చేస్తుండగా, మరోవైపు పేకాటరాయుళ్లు అడ్డాలు మారుస్తూ జూదం ఆడుతున్నారు. కేసులు నమోదవుతున్నా మార్పు రావడం లేదు. ప్రత్యేక నిఘా సారించి పేకాటను పూర్తిగా నియంత్రించాలని జిల్లావాసులు కోరుతున్నారు. కేసులు.. అరెస్ట్‌లు.. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 98 పేకాట కేసులు నమోదు కాగా, 525 మందిని అరెస్ట్ చేశారు. 2025లో 305 కేసుల్లో 1,733 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే 2023లో 155 కేసులు, 2024లో 214 పేకాట కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో వందల సంఖ్యలో పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట చేసి కోర్టులకు హాజరుపర్చారు. స్థానిక పోలీసులే కాకుండా టాస్క్‌ఫోర్స్ బృందాలు సైతం పేకాట స్థావరాలపై నిఘా సారించాయి. అయినా గుట్టుచప్పుడు కాకుండా జూదం జోరుగా నడుస్తోంది. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు సైతం పట్టుబడిన సందర్భాలున్నాయి. కొంత కాలం క్రితం భిక్కనూరులోని ఓ క్లబ్లో నిర్వహించిన పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి పరిస్థితికి అద్దం పడుతోంది.కాసులు కురిపిస్తున్న ఆట‘కేటు’ పేరిట గేమ్‌కు కొంత మొత్తం డబ్బు వ చ్చే అవకాశం ఉండడంతో కొంత మంది బడా బాబులు పేకాట నిర్వాహణను వ్యాపారంగా మార్చుకున్నారు. మామూళ్లు ముట్టజెప్పడంలో ఆరితేరిన పేకాటస్థావరాల నిర్వాహకులు ఏ మాత్రం భయం లేకుండా అపార్ట్మెంట్లు, హోటళ్లను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. జి ల్లా కేంద్రంలో ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్న భవనాలు, ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లు, శివా రు ప్రాంతాల్లోని ప్రముఖ హోటళ్లు పేకాటకు అడ్డాలుగా మారాయనే ఆరోపణలున్నాయి. కామారెడ్డితోపాటు ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మ ద్నూర్, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, గాంధారి, సదాశివనగర్, భిక్కనూరు తదితర ప్రాంతాలు పేకాటకు పెట్టింది పేరు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారి పై చర్యలు తప్పవు. పేకాటపై ప్రత్యేక ని ఘా ఉంది. పేకాట వ ల్ల కలిగే నష్టాలు, న మోదయ్యే కేసులపై గ్రామస్థాయిలో అవగాహ న కల్పిస్తున్నాం. పేకాట ఆడినా, నిర్వహించి నా సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – నరహరి, పట్టణ ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి పట్టుబడుతున్నా మారని పేకాటరాయుళ్ల తీరు అడ్డాలు మారుస్తూ జిల్లాలో జోరుగా జూదం పెడదారి పడుతున్న యువత ఈ ఏడాది ఇప్పటికే 98 కేసులు.. 525 మంది అరెస్ట్ ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు -
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై పురోగతి
● రాష్ట్ర ప్రభుత్వం సానుకులంగా ఉంది.. ● స్పష్టం చేసిన ఆర్ఎం ఎస్వీజీకే మూర్తినిజామాబాద్ రూరల్: ప్రభుత్వంలో టీజీఎస్ ఆర్టీసీ విలీనంపై పురోగతిలో స్పష్టత అభించిందని సంస్థ రీజియన్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి తెలిపారు. శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ప రిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్నదన్నారు. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏ ర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ ఇప్పటికే విలీనానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని తెలిపారు. అదేవిధంగా సమ్మెకాలంలో మిగిలిన డి మాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడి స్వరం వినిపించాలనేది కేబినెట్ సబ్ కమిటీ యాజమాన్యం ఉద్దేశమన్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ ప ర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగి న చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భా గస్వాములను చేస్తామన్నారు. వారిచ్చే సలహాలను సబ్ కమిటీ పరిశీలనకు పంపి అందరికీ ఆమోదయోగ్యంగా, నూటికి నూరు శాతం పారదర్శకంగా విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. -
సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మండలం గర్గుల్‌లో శనివారం ఉపాధి హామీ నిధులు రూ.15 లక్షలతో సిమెంట్ రోడ్డు పనులను సర్పంచ్ చింత దివ్య ప్రారంభించారు. ఉపసర్పంచ్ ప్రవీణ్, మాజీ సర్పంచులు నర్సింలు, రవితేజ గౌడ్, కాంగ్రెస్ నాయకులు భీంరెడ్డి, కిష్టారెడ్డి, కుమార్‌గౌడ్, లింబ్రాది, లింగం, వార్డు సభ్యులు స్వామి, శ్రీనివాస్, కిషోర్,రాజేష్‌రెడ్డి, నారాయణ, నవీన్‌రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని సురేశ్ నగర్ కాలనీలో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 28,140తోపాటు 7 మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. -
ఈదురుగాలి, వాన బీభత్సం
డిచ్పల్లి: మండలంలోని సుద్దులం గ్రామంలో శుక్రవారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన ఈదురుగాలులకు గ్రామశివారులోని పంట పొలాల వద్ద 9 చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి నేలకొరిగాయి. కరెంట్ వైర్లు తెగిపోయి నేలపై పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సుద్దులం – రామడుగు క్రాస్ రోడ్డు నుంచి గ్రామానికి వెళ్లే దారిలో చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. శనివారం ఉదయం సమాచారం అందుకున్న బర్దిపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ రాజేందర్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు, తెగిన కరెంట్ వైర్లను పరిశీలించారు. ఒక లైనుకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మిగిలిన ప్రాంతాలకు పునరుద్ధరించారు. రెండు రోజుల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్‌కు చెందిన వడ్ల రాజు కొత్తగా ఇల్లు నిర్మిస్తుండటంతో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. అద్దె ఇంటికి తాళం వేసి కొత్త ఇంటి వద్ద ఉండి రాత్రి ఆలస్యంగా రావడంతో తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 13 తులాల వెండి ఆభరణాలు, రూ. 1.20 లక్షల నగదు కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి వేలిముద్రలు సేకరించారు. -
మూడు నెలలకోసారి తండ్రీకొడుకుల రక్తదానం
జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ, ఆయన కుమారులు మృణాల్, తృషాల్ ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఏ నెగెటీవ్’ బ్లడ్ గ్రూప్ కలిగిన వెంకటరమణ గత ఏడేళ్లుగా ప్రతి 3 నెలలకోసారి, ఇప్పటివరకు 26 సార్లు రక్తదానం చేశారు. ‘ఏ పాజిటివ్’ బ్లడ్ గ్రూప్ కలిగిన పెద్ద కుమారుడు మృణాల్ ఏడాదికి నాలుగు సార్లు, ‘ఓ నెగటివ్’ బ్లడ్ గ్రూప్ కలిగిన చిన్న కుమారుడు తృషాల్ కూడా ఏడాదికి నాలుగు సార్లు రక్తదానం చేస్తున్నారు. గత ఏడేళ్లుగా తండ్రి, నాలుగేళ్లుగా కుమారులు రక్తదానం చేస్తూ కుటుంబమంతా ప్రాణదాతలుగా గుర్తింపు పొందారు. -
నా తండ్రికి అవసరమైనప్పుడు విలువ తెలిసింది
రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. 2012లో మా నాన్నకు బైపాస్ సర్జరీ అయినపుడు 3 యూనిట్ల ‘ఓ నెగిటీవ్’ రక్తం అవసరమైంది. అప్పడు తెలిసింది రక్తం విలువ. మా తండ్రికి రక్తం ఇచ్చిన దాతలు నాకు ఒకటే చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రక్తదానంపై అందరిని చైతన్యం చేయాలన్నారు. నాటి నుంచి కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా 31 సార్లు రక్తదానం చేశాను. రక్తం దానంతో ఎంతో సంతృప్తి చెందుతా. రక్తదాతల సమూహం అధ్యక్షునిగా రక్తదాన శిబిరాల్లో చురుకుగా పాల్గొంటున్నా. – జమీల్ అహ్మద్, అధ్యక్షుడు, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ గ్రూప్ -
ప్రతి ఓటునూ కాపాడుకుందాం
బిచ్కుంద(జుక్కల్) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో ప్రతి ఓటునూ కాపాడుకుందామని, ఏ ఒక్క ఓటరూ తన పేరును జాబితాలో నుంచి కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు, నాయకులపై ఉందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గుప్తా అన్నారు. బిచ్కుంద బండయప్ప ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ బీఎల్ఏలు, నాయకులు, సర్పంచులతో ఎస్ఐఆర్ ఓటరు సవరణ కార్యక్రమంపై శనివారం శిక్షణ నిర్వహించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గుప్తా, డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఓటును కాపాడుకుందామనే లక్ష్యంతో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించాలని కోరారు. ఎస్ఐఆర్ ద్వారా అర్హులైన లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించి బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందిందని ఆరోపించారు. మన రాష్ట్రంలో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్లో పోలింగ్ బూత్ ఆఫీసర్ దగ్గర ఉండి అర్హులైన ప్రతి ఓటును మ్యాపింగ్ చేయించాల్సిన బాధ్యత నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. ఓటర్లకు అందుబాటులో ఉంటూ వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన బూత్ లెవల్ ఏజెంట్ల సేవలను గుర్తించి భవిష్యత్తులో మంచి పదవులు దక్కేలా తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మున్సిపల్ చైర్పర్సన్ సీమా షెట్కార్, ఏఎంసీ చైర్మన్లు కవిత, నవీన్, నాగ్నాథ్, విఠల్‌రెడ్డి, రాంరెడ్డి, సాయాగౌడ్, మాధవరావు దేశాయి, రమేశ్ దేశాయి, మండల అధ్యక్షులు పండరి, సాయిలు, అసద్‌అలీ, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ శేణులు ఉద్యమంగా తీసుకోవాలి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గుప్తా బిచ్కుందలో బీఎల్ఏలకు అవగాహన సదస్సు


