breaking news
Srikakulam
-
కూటమిలో కొండంత
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి నేతల మధ్య రాజకీయం రచ్చకెక్కుతోంది. గ్రావెల్ కొండ కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు, అనుచరులు పట్టుబడుతుండడంతో వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. రణస్థలం మండలం సంచాం కొండపై గ్రావెల్ తవ్వకాల విషయంలో గత ఎనిమిది నెలలుగా అంతర్గత పోరు జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా తవ్వకాలు జరిపిన యంత్రాలపై ఓ వర్గం గొడవకు దిగింది. అనుమతులు ఉన్నా స్థానికుల అభ్యంతరాలు ఉన్నాయని, తవ్వకాలు జరపడానికి వీల్లేదని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అనుచరులు పొక్లెయినర్ ధ్వంసం చేసి, అందులో ఉండాల్సిన రెండు బ్యాటరీలు, కొన్ని కేబుళ్లు పీకేయడమే కాకుండా మార్గం మధ్యలో రాకపోకలు సాగకుండా పెద్ద గుంత తీశారంటూ అసలు లీజుదారుడు, సబ్ లీజు దారుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణస్థలం మండలంలోని సంచాం కొండలోని గ్రావెల్ తవ్వకాల కోసం గత కొన్ని నెలలుగా బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు అండ్‌కో, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అండ్ కో మధ్య వివాదం నలుగుతోంది. సంచాం రెవెన్యూ పరిధిలోని 89/6లో గుండు కై లాష్ పేరున 7 ఎకరాల గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. కై లాష్ పేరు మీద అనుమతులు ఉన్నప్పటికీ వారి బంధువు లంకలపల్లి శంకరరావు నిర్వహణ చేస్తూ వస్తున్నారు. అయితే, లీజు తవ్వకాల నిర్వహణను తమకు ఇవ్వాలని ఎన్ఈఆర్ అండ్‌కో గత కొంతకాలంగా అడుగుతోంది. కానీ, వారి మధ్య ఆర్థిక పరమైన అంగీకారం కుదరకపోవడంతో వ్యవహరం చెడింది. ఇదే సమయంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోదరుడి కుమారుడు రాజేష్‌తో లీజు దారుడికి ఆర్థిక పరమైన ఒప్పందం జరిగింది. గతంలో అనధికార తవ్వకాల వివాదం.. సంచాం కొండపై అక్రమ తవ్వకాలు పరిపాటిగా మారిపోయాయి. అక్కడున్న గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుని పోతున్నారు. ఇదంతా అనధికారికమే. ఓ ఎమ్మెల్యే రాత్రి పగలు ఇక్కడ తవ్వకాలు జరిపి వందల లోడ్లు తరలించి తన ఇల్లు, స్కూల్ ప్రాంగణాలను సరిచేసుకున్నారు. అప్పట్లో గొడవ కూడా జరిగింది. అక్రమంగా తరలిస్తున్న లారీలను స్థానికులు పట్టుకున్నారు. కానీ పట్టుకున్న వారిని బెదిరించి, వేధింపులకు గురి చేయడంతో అక్రమం కాస్త సక్రమమైంది. ఆ తర్వాత కూడా వేలాది లోడ్లు ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే తరలించారు. తాజాగా అధికారిక తవ్వకాల గొడవ.. కొండపై పొక్లెయిన్, లారీలను పెట్టి బుధవారం పనులు ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు వరకు పనులు చేసి, ముగించుకుని పొక్లెయినర్‌ను కొండపైన వదిలేసి వెళ్లిపోయారు. గురువారం ఉదయం డ్రైవర్ వచ్చి చూసేసరికి పొక్లెయినర్ అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉండాల్సిన రెండు బ్యాటరీలు, కొన్ని కేబుళ్లు కనిపించలేదు. సమాచారం తెలుసుకున్న లీజుదారులు వచ్చి పరిసరాలు పరిశీలించారు. మార్గమధ్యంలో రాకపోకలు సాగకుండా పెద్ద గుంత తీసి ఉందని, పొక్లెయినర్ ధ్వంసం చేశారని ఇదంతా ఎమ్మెల్యే అనుచరులే చేశారని ఆరోపించారు. గొడవ పెద్దది కావడంతో ప్రత్యేక ఎస్టీఎఫ్ బలగాలతో పాటు, జేఆర్ పురం, లావేరు ఎస్ఐలు ఎస్.చిరంజీవి, జి.లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది భారీగా చేరుకున్నారు. కొంత సమయం తర్వాత తహసీల్దార్ వచ్చారు. ఇక్కడ తవ్వకాలకు అనుమతులు ఉన్నా స్థానిక గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తవ్వకాలు జరపరాదని, ఈ అంశంపై గత తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు నవంబర్ 2024లో భూగర్భ గనుల శాఖ అధికారులకు లేఖ రాశారని, ఆ లేఖపై ఇంకా ఎలాంటి వివరణ రానందున తవ్వకాలు నిలిపివేయాలని లీజుదారుడికి పోలీసుల సమక్షంలో చెప్పేశారు. ఎన్ఈఆర్ అనుచరులు వర్సెస్ కూన అనుచరులు రణస్థలం మండలం సంచాం కొండపై గ్రావెల్ గొడవ అనుమతుల లీజు కోసం పోరు ఆర్థిక వ్యవహారాల ఒప్పందం మేరకు దక్కించుకున్న కూన రవికుమార్ అండ్ కో తమకు ఇవ్వలేదన్న ఆవేదనలో ఎన్ఈఆర్ అండ్ కో రచ్చకెక్కుతున్న వ్యవహారం -
క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు
ఎచ్చెర్ల : ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు లభించింది. ఐబీఎం క్వాంటమ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చి క్విస్కిట్ఫాల్ ఫెస్ట్–2025 నిర్వహించేందుకు శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని ఎంపిక చేసింది. ఈ మేరకు డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 1,300 విశ్వవిద్యాలయాల నుంచి కేవలం 55 వర్సిటీలు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయని చెప్పారు. యేల్ యూనివర్శిటీ, యూసీఎల్ఏ, ఐఐటీ మద్రాస్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ తరఫున ఆర్జీయూకేటీ ఐఐఐటీ శ్రీకాకుళం ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఫెస్ట్ నిర్వహణ బృందంగా కటం నిఖిల్‌తేజ, కాశిం, వాలి, దుదేకుల ప్రవీణ్‌కుమార్, చెరుకూరి జాన్‌బాబు, చదువుల గుణశ్రీ కిమ్మిడి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, అకడమిక్స్ డీన్ డాక్టర్ శివరామకృష్ణ, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, హెచ్ఓడీ రమేష్‌బాబు, పీఆర్వో షణ్ముఖరావు తదితరులు అభినందించారు. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
పలాస: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పర్లాకిమిడి నుంచి బస్సులో గంజాయితో వచ్చి కాశీబుగ్గ బస్టాండ్‌లో బుధవారం దిగారు. అక్కడి నుంచి పలాస రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి అనుమానంతో తనిఖీ చేశారు. అందులో 10.815 కిలోల గంజాయిని గుర్తించడంతో వెంటనే అరెస్టు చేసి గంజాయిని సీజ్ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు గురువారం విలేకరులకు తెలియజేశారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అల్గాపూర్కు చెందిన రోహిత్, ఉన్నా జిల్లాకు చెందిన నూర్ దీన్ ఉన్నారు. వీరు ఒడిశారాష్ట్రం బడగర్త్ బిట్ కాలనీ చెందిన సుమన్ మానిక్ నుంచి గంజాయి తెచ్చారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ నర్సింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన
నరసన్నపేట: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులు, డీఎస్సీ –2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డీఎస్సీ–2003 ఫోరం జిల్లా కో కన్వీనర్ అంబటి లక్ష్మణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పాత తాలూకా కేంద్రం నరసన్నపేటలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాడాన రాజు, టి.జనార్దనరావు, రమణ, చిరంజీవి, వాసు, ఉమాశంకర్, సురేష్‌కుమార్, రజిని, రమేష్, లక్ష్మి, శాంతి, కమలకుమారి, రోజామణి,రామారావు, తవుడు, వాసుదేవరావు, తాతన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుతో ఇద్దరు మృతి
నరసన్నపేట: నడగాం పంచాయతీ శివరాంపురం గ్రామానికి చెందిన తోలాపి రమణమ్మ (50) పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 5న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 11 గంటల సమయంలో రమణమ్మకు పాము కరిచింది. కొద్ది సమయం గమనించిన రమణమ్మ కుటుంబ సభ్యులకు చెప్పడంతో నరసన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. భర్త సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రమణమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లుకలాపు రవి, నడగాం సర్పంచ్ జల్ల శిల్పా మాధురి సంతాపం వ్యక్తం చేశారు. బసవరాజుపేటలో.. హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు (38) గురువారం పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గ్రామ సమీపంలోని పొలంలో ఎరువులు వేస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే హిరమండలం పీహెచ్‌సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పలనాయుడుకు భార్య కుమారి, కుమార్తెలు చేతన, చైతన్య ఉన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 13న జరగనున్న అదాలత్‌లో రాజీకి అనువైన క్రిమినల్, సివిల్, మోటారు ప్రమాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కక్షిదారులు ఎలాంటి విభేదాలు లేకుండా సఖ్యతతో సమస్యలను ముగించుకోవాలని సూచించారు. భావోద్వేగాలకు లోనుకాకుండా, సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, అందువల్ల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు కూడా ఉన్నారు.విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి మందస: బుడార్సింగి పంచాయతీ కొరడాలు గ్రామానికి చెందిన సీర రమేష్(35) గురువారం తన ఇంట్లో టేబుల్ ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.యువకుడు ఆత్మహత్యఎచ్చెర్ల : ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన సీపాన రామకృష్ణ (27) అలియాస్ రాకీ అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ వరకు చదివిన రామకృష్ణ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సంస్థ వద్ద సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. తల్లి లక్ష్మీ వ్యవసాయ పనుల నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించింది. రామకృష్ణ తండ్రి జగన్నాథం పదిహేనేళ్ల క్రితం నుంచి ఇంటినుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. తల్లి అన్నీ తానై కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయ సిబ్బంది తిరుగుబాటు
జిల్లాలో ఎరువుల కొరత నిజమా.. కాదా..? నిల్వలు ఉన్నాయని నేతలు చెబుతున్న మాట వాస్తవమేనా..? వంటి ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక ఆందోళన సమాధానం చెప్పింది. జిల్లాలో ఎరువుల కొరత తీవ్రమన్న విషయం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ఆందోళనతో బట్ట బయలైపోయింది. ఓ వైపు ఎరువుల కొరత.. మరోవైపు నాయకుల వేధింపులతో విధి నిర్వహణ నరకంగా మారిందని వారంతా రాత్రిపూట కలెక్టర్ ముందు మొర పెట్టుకున్నారు. ఈ పని చేయడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెట్టారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎరువుల పంపిణీ నుంచి తమను తప్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు గురువారం కలెక్టరేట్ కార్యాలయా న్ని ముట్టడించారు. రాత్రిపూట కలెక్టర్ కార్యాల యం ముందు బైఠాయించి ధర్నా చేశారు. మేల్, ఫిమేల్ అసిస్టెంట్లు రాత్రి పది దాటినా ఆకలితో అక్కడే ఉండి తమ కష్టాలు చెబుతూ నినాదాలు చే శారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సొంత జిల్లాలో వ్యవసాయ శాఖకు చెందిన విలేజ్ అసిస్టెంట్ల తిరుగుబాటు సంచలనంగా మారింది.ప్రభుత్వం సరిపడా ఎరువుల సరఫరా చేయనందున ఉద్యోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని కోరినా పట్టించుకునే వారు లేరన్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని, సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. నిత్యం పోలీసుల బందోబస్తు ఇస్తున్నా భయంతోనే పనిచేస్తున్నామని, సిబ్బందిలో 50 శా తం మహిళలు ఉన్నారని, వారిలోనూ గర్భిణులు, బాలింతలు అధికంగా ఉన్నారని తెలిపారు. రాత్రి 10, 11గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టడం వల్ల మహిళా ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల నుంచి ఎరువుల అమ్మకం నగదును మార్కెఫెడ్ అధికారులు వసూలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నెల 30లోపు ఖరీఫ్ ఈ–క్రాప్ నమోదు చేయాల్సి ఉందని, అత్యంత కీలకమైన ఈ సమయంలో ఎరువుల పంపిణీ, రికార్డుల నిర్వహణ బాధ్యతలు తలకు మించిన భారంగా మారాయని తెలిపారు. ఎరువుల పంపిణీ రియల్ టైమ్‌లో జరగాలంటే ఐఎఫ్ఎంఎస్ సేల్స్, డీబీటీ కోసం ఈపాస్ యంత్రాలను సరిపడా సరఫరా చేయాల్సి ఉన్నా చేయలేదన్నారు.రైతు సేవా కేంద్రాల ఉద్యోగులకు ఎరువుల పంపిణీ మాత్రమే కాకుండా ఇతర విధులు కూడా ఉన్నాయని, ఎరువులు లేకపోవడం వల్ల ఇతర బాధ్యతలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఆలస్యానికి సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో పీఏసీఎస్, డీసీఎంఎస్, గిరిజన సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయని, రబీలోనైనా మన జిల్లాలో అలా చేయాలన్నారు. సిబ్బంది ధర్నా అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కొన్ని గంటల సేపు వారితో చర్చించారు. అంతకుముందు తన చాంబర్లో వినతి పత్రం తీసుకున్నారు. కలెక్టర్ ఎంత నచ్చ చెప్పినా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. రాత్రి 10గంటల దాటే వరకు ఆందోళన కొనసాగింది.100 బస్తాలు దాచేయమన్నాడు..నేను కిల్లాం మాకివలస రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ చూసేదాన్ని. చంద్రశేఖర్ అనే నాయకుడు డబ్బులు ఇవ్వకుండా 100 బస్తాలు దాచేయమని అన్నాడు. అప్పటికే రైతులు డబ్బులు, ఆధార్, ఇతర డాక్యుమెంట్స్ పట్టుకుని ఉన్నారు. వారిని కాకుండా 100 బస్తాలు ఎలా దాయగలను. ఆయన ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించలేదు. ఆధార్ ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకుండా కనీసం 60 బస్తాలైనా పక్కన పెట్టి ఇవ్వాలని అన్నారు. కానీ, నేను ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేకు చెప్పి నన్ను యారబాడుకు డిప్యుటేషన్‌పై వేసేశారు. నాకు చిన్న బాబు ఉన్నాడు. ఎంతో ఇబ్బందులు పడు తున్నాను. నాకు ఫోన్లు చేసి ఎంతో ఇబ్బంది పెట్టారు.– లావణ్య, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్బూతులు తిడుతున్నారురైతు సేవా కేంద్రం నాలెడ్జ్ సెంటర్‌గా అని పెట్టారు. ఇప్పుడది ఎరువుల కొట్టులా మారింది. మిగతా జిల్లాల్లో పీఏసీఏస్, డీసీఎంఎస్, గ్రోమోర్ వంటి సంస్థల ద్వారా విక్రయిస్తుంటే...ఇక్కడ మాచేత ఆ పనిచేయిస్తున్నారు. మమ్మల్ని కొందరు బూతులు తిడుతున్నారు. ప్రైవేటు డీలర్లు విక్రయిస్తున్న డేటా కూడా కలెక్ట్ చేసి ఇవ్వమంటున్నారు. దీని వల్ల మేము చేయాల్సిన పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఎప్పుడో చేయాల్సిన ఈక్రాప్ ఇప్పుడు చేయాల్సి వస్తోంది. ఇక, వీసీలు, ఇతరత్రా సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడి ఉంది.– జి.శరత్‌కుమార్, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్.ఎరువులు సరిపోవడం లేదుజిల్లాలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎరువుల పంపిణీకి రైతు సేవా కేంద్రాలకు ట్యాగ్ చేశారు. తక్కువ ఎరువుల సమయంలో 20, 30మంది రైతులు చుట్టుముట్టి, నానా దుర్భాషలాడుతున్నారు. భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నాం.– తేజస్విని, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ -
కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పటిష్ట భద్రత
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండల కేంద్రంలో గల కొత్తమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పా టు చేయనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం అయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌తో కలసి అలయ ప్రాంగణం పరిశీలించారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, రెవెన్యూ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఉత్సాహంగా కళాఉత్సవం పోటీలు గార: వమరవల్లి డైట్లో జిల్లాస్థాయి కళా ఉత్స వం పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను గురువారం సమగ్ర శిక్షా ఏపీసీ శశిభూషణరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఏపీసీ శశిభూషణ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ గౌరీ శంకర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. తొలిరోజు దాదా పు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గాత్ర సంగీతంలో వందరాపు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి వెంకటేష్, వాయిద్య సంగీతంలో ముత్యాలపేట స్కూల్ విద్యార్థిని సీహెచ్ వర్షిణి, గ్రూప్ సాంగ్‌లో టెక్కలి ఎంజేపీ ప్రథమ బహుమతి సాధించారు. కార్యక్రమంలో తాడేల వెంకటరావు, డైట్ లెక్చరర్లు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై మార్కెట్ కమిటీ చైర్మన్ దాడి
జలుమూరు: శ్రీముఖలింగంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చింతం రాంబాబుపై జలుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం, సోదరుడు కృష్ణ గురువారం దాడి చేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గతంలో రాంబాబు తన వీధిలో వైఎస్సార్ సీపీ బ్యానర్ కట్టగా బలరాం తొలగించేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో అది వివాదంగా మారింది. పాత కక్షల నేపథ్యంలో గురువారం శ్రీముఖలింగంలో వేరే గొడవ జరుగుతుండగా అదే చోటకు వచ్చి తనపై దాడి చేశారని, కర్రతో తలపై బలంగా కొట్టారని రాంబాబు ఆరోపించారు. దీనిపై జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం బుడితి సీహెచ్‌సీలో చికిత్స తీసుకున్నానని పేర్కొన్నారు. జూలైలో ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ బలరాంతోపాటు మరి కొందరు సామాజిక కార్యకర్త, అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్‌పై కూడా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో రాజశేఖర్ ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్‌తో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇది విచారణలో ఉండగా మళ్లీ ఈ గొడవ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు ఫిర్యాదుపై జలుమూరు ఎస్.ఐ అశోక్‌బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.14న జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మధుసూదనరావు, ఎం.సాంబమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 9 గంటలకు మొదలవుతాయని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 27 నుంచి 29 వరకు ఏలూరు జిల్లా అల్లూరి సీతారామరాజు స్టేడియం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్‌జిల్లాల) జూనియర్స్ బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్స్ పోటీలకు పంపించనున్నట్టు పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో జరిగే ఈ ఎంపికలకు 2005 అక్టోబర్ 15 నుంచి 2013 అక్టోబర్ 14 మధ్య జన్మించిన వారు అర్హులని స్పష్టంచేశారు. వివరాలకు 8500271575 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీ నియామకం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్షులుగా సతివాడ రామినాయుడు(నరసన్నపేట), జడ్యాడ జయరామ్(టెక్కలి), ప్రధాన కార్యదర్శులుగా నీలాపు ముకుందరావు(శ్రీకాకుళం), మురమండల ఉమాశంకర్(ఆమదాలవలస), బలగ గోవిందరావు(పాతపట్నం), మీసాల సురేష్‌బాబు(పలాస), నూతనపాటి బాబూరావు(ఇచ్ఛాపురం), కార్యదర్శులుగా కోటిపల్లి శ్రీనివాసరావు(నరసన్నపేట), గొండీల సుజాతకుమారి(టెక్కలి), కుందేశీ ప్రియ(ఇచ్ఛాపురం), కంఠ గోవిందరావు(ఆమదాలవలస), కలగాటి జాన్(ఆమదాలవలస), పంకు మోహనరావు(పాతపట్నం), బెలమాన జీవన్‌రావు(పలాస), వడ్డి జీవకుమార్(ఎచ్చెర్ల), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ముచ్చ జగన్(శ్రీకాకుళం), కుర్మాన జోషఫ్ (శ్రీకాకుళం), ఉంకిలి గోపాలకృష్ణ(నరసన్నపేట), అరమపల్లి రాము(నరసన్నపేట), కూరాకుల సుబ్బారావు(టెక్కలి), చల్ల అప్పలరాజు(టెక్కలి), ముద్దాడ ఈశ్వరరావు(ఆమదాలవలస), రావాడ వెంకటరావు(ఆమదాలవలస), గుడిబండ పోలయ్య(పాతపట్నం), రావాడ లక్ష్మీనారాయణ(పాతపట్నం), యలమల కృష్ణ(ఎచ్చెర్ల), లింగాల లక్ష్మణరావు(ఎచ్చెర్ల), జడ్యాడ దేవానంద(పలాస), పంకు దుర్యోధన(పలాస), లండ కృష్ణారావు(ఇచ్ఛాపురం), కొప్పల హేమంత్‌కుమార్(ఇచ్ఛాపురం)లను నియమించారు.హెల్త్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం ఎచ్చెర్ల : బొల్లినేని మెడ్ స్కిల్స్ (జెమ్స్ రాగోలు)తో సంయుక్తంగా నిర్వహిస్తున్న హెల్త్ సంబంధిత కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ బి.ఆర్.ఏ.యూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అనూరాధ గురువారం తెలిపారు. మాస్టర్ ఆఫ్ హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేటివ్ (రెండేళ్లు, 40సీట్లు), పీజీ డిప్లోమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్(ఏడాది–40సీట్లు) కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (జనరల్), బీఫార్మశీ, బీఎస్సీ (నర్సింగ్), బీహెచ్ఎంఎస్ లేదా బీఏఎంఎస్, బీఏ, బీకాం కోర్సులు పూర్తిచేసిన 20 నుంచి 35 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.వాల్తేరు ఏడీఆర్ఎంగా రామారావుసోంపేట: ఎర్రముక్కాం గ్రామానికి చెందిన కుందు రామారావు వాల్తేరు డివిజన్ ఏడీఆర్ఎంగా పదోన్నతి పొందారు. ఈయన ప్రస్తుతం గుంటూరు విజయవాడ దక్షిణ మధ్యరైల్వేలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏడీఆర్ఎంగా పదోన్నతి పొందడంతో గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రైల్వేస్టేషన్ల ఆధునీకరణలో భాగస్వామ్యం అయ్యానని, రైల్వేబోర్డు తరఫున బుల్లెట్ ప్రూఫ్ రైల్ అధ్యయనం కోసం జపాన్ సైతం వెళ్లానని చెప్పారు.అప్పారావు నేత్రాలు సజీవంశ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడివీధిలో నివాసముంటున్న అంధవరపు అప్పారావు (93) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన మరణానంతరం నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు ఎ.రామరాజు, నాగేశ్వరరావులు నేత్రాలను దానం చేసేందుకు ముందుకువచ్చారు. విషయం కె.సత్యనారాయణ ద్వారా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, నంది ఉమాశంకర్‌లు చేరుకుని అప్పారావు కార్నియాలను సేకరించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, సభ్యులు దుర్గాశ్రీనివాస్ కోరారు. -
మహిళలు–పిల్లల సంక్షేమంపై అవగాహన
శ్రీకాకుళం అర్బన్: మహిళలు, పిల్లల భద్రత కోసం చట్టాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉంటేనే లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందుతాయని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ సాధికారత అధికారి ఐ.విమల అన్నారు. జిల్లాలో సంకల్ప్ పేరిట 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐసీఈఎస్ పీడీ విమల సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. మహిళలు, పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలపై అధికారులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అవగాహన కల్పించారు. బేటీ బచావో– బేటీ పడావో, పీసీపీఎన్డీటీ యాక్ట్, ఎంటీపీ యాక్ట్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. జిల్లా ఆట్యా–పాట్యా జట్ల ఎంపిక రేపు శ్రీకాకుళం న్యూకాలనీ: ఆట్యా–పాట్యా జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల జట్ల ఎంపికలను శనివారం నిర్వహిస్తున్నట్టు జిల్లా సంఘ ముఖ్య ప్రతినిధులు కేకే రామిరెడ్డి, శ్యామలరా వు, కె.చిరంజీవి తెలిపారు. టెక్కలి ప్రభుత్వ ఉన్నత మైదానం వేదికగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ ఎంపికల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఎంపికైన జిల్లా జట్లను ఈనెల 25 నుంచి పల్నాడు జిల్లా నకరికల్లులోని ఎస్‌వీవీఆర్ జేపీ హైస్కూల్ వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా చాంపియన్‌షిప్–2025 పోటీలకు పంపించనున్నట్టు వారు చెప్పారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 94409 41974 నంబర్‌ను సంప్రదించాలన్నారు. థర్మల్ సర్వేను అడ్డుకున్న గిరిజనులు సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకోసం జరుగుతున్న డ్రోన్ సర్వేను వెన్నెలవలస వద్ద గురువారం గిరిజనులు అడ్డుకున్నా రు. వెన్నెలవలస సమీపాన ఏపీజెన్కో డిప్యూ టీ ఈఈ తిప్పాన హరిరెడ్డి, ఏపీశాక్ సైంటిస్ట్ తాతబాబు ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే నిర్వహిస్తుండగా పలువురు గిరిజనులు వారి వద్ద ను న్న సర్వే పరికరాల తీసుకొని సర్వేను అడ్డగించారు. దీంతో అఽధికారులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, బూర్జ ఎస్ఐ మొజ్జాడ ప్రవల్లిక ఘటనా స్థలానికి వచ్చి గిరిజనులతో మాట్లాడి పరికరాలను అధికారులకు అప్పగించారు. అధికారు లు సర్వే చేయకుండా వెనుదిరిగారు. మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాడుతామని గిరిజనులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్, డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు గురువారం శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐలతో కూడిన సంక్షేమాలు అమలు చేయాలన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల అప్పులు చేసి ఆటోలు కొనుక్కుని తిప్పుతున్నారని, ఇప్పుడు బేరాలు తగ్గిపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా ఆటో, వ్యాన్లు నడిపినా పూట గడవడం లేదన్నారు. ఫైనాన్స్ కట్టలేక మాట పడాల్సి వస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్, సెస్ ఎత్తివేయాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ ర మణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య, ఆటో యూనియన్ నాయ కులు ఎం.జగన్నాథం, పి.మోహనరావు, ఎం.కామేశ్వరరావు, ఎం.రామారావు, తమ్మినేని చంద్రునాయుడు పాల్గొన్నారు. -
17న నిరుద్యోగుల ఆవేదన సదస్సు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో నిర్వహించనున్న ‘నిరుద్యోగుల ఆవేదన సదస్సు’ను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలోని క్రాంతి భవన్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించి అన్ని ప్రాంతాలవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్, అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు లైబ్రరీ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను అన్ని విభాగాల్లోనూ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వలంటీర్లను కొనసాగిస్తూ విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీకి అవకాశం కల్పించాలని, పేద నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, ప్రతినిధులు రామోజీ, కిషోర్, భాస్కర్, మన్మధ, ప్రశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్‌ను ప్రశ్నించిన లీజుదారులు..
గ్రావెల్ లీజుకు అనుమతులు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఇబ్బంది పెడుతున్నారని లంకలపల్లి శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం ధ్వంసం చేశారని దీనిపై పోలీసులను ఆశ్రయిస్తామన్నారు. ఇదే కొండలో గత వారం రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది గ్రావెల్ లోడ్లు ఎలా తరలించారని, దీని వెనుక ఎవరున్నారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. అలాగే కూన రవికుమార్ అనుచరుడు సీహెచ్ శ్రీనివాస్ కూడా తహసీల్దార్‌తో వాగ్వాదం చేశారు. అనుమతులపై అభ్యంతరాలు ఉంటే భూగర్భ గనుల శాఖ ఈనెల 2వ తేదీన రూ. 25వేల సీనరేజీ ఫీజు ఎలా కట్టించుకుందని, సమస్య ఉంటే కట్టించకోరు కదా, ఇదే కొండలో పక్కన అనుమతుల్లేకుండా వేలాది లోడ్లు తరలించారు, వాటిని ఏ అధికారైనా పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో కూన రవికుమార్ ఫోన్ చేస్తున్నారు.. చూడండి అని తహసీల్దార్‌కు చెప్పగా ఈ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయలేమని చెప్పేశారు. -
చేనేతకు శాపం!
● బకాయిల చెల్లింపుల్లో జాప్యం ● ఆప్కో బకాయిలు రూ.1.23 కోట్లు పొందూరు : జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు ఆప్కో చెల్లించాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో చేనేత సొసైటీలతో పాటు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సహకారం సంఘాల నిర్వహణ కష్టతరమవుతోంది. దీంతో సొసైటీలపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు సకాలంలో అందాల్సిన మజూరీ డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. జిల్లాలో 36 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘాలన్నీ వస్త్రాలను తయారు చేసి ఆప్కోకు విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఆప్కో 14 సహకార సంఘాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆప్కో ఇచ్చిన ఆర్డర్ల మేరకు సాధారణ, ఇతర రకాల వస్త్రాలు తయారవుతున్నాయి. సహకార సంఘాలు ఇచ్చిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేపట్టాల్సిన ఆప్కో జాప్యం చేయడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లాభాల్లో ఉన్న సొసైటీలు సైతం బకాయి సొమ్ములు రాకపోవడంతో ఇబ్బందులు పాలవుతున్నాయి. బకాయిలు ఇలా.. ఆప్కో బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో జిల్లాలోని సహకార సంఘాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు ఏడాది నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని శ్రీకాకుళం డివిజన్, విజయనగరం జిల్లాలోని రాజాం డివిజన్ పరిధిలో రూ.1.23 కోట్లు బకాయిలు అందాల్సి ఉంది. పొందూరు సాయిబాచర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండు రోజుల్లో సొసైటీలకు సంబందించిన ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు. – టి.జనార్ధన, ఆప్కో ఇన్చార్జి డీఎం, శ్రీకాకుళం బా సొసైటీకి రూ.17 లక్షలు, అంపోలు అగస్తేశ్వర సహకార సంఘానికి రూ.18 లక్షలు, లావేరులో సహకార సంఘానికి రూ.19 లక్షలు, తోలాపిలో గౌరీశంకర చేనేత సహకార సంఘానికి రూ.లక్ష, అక్కుపేట సంఘానికి రూ. 2 లక్షలు, సోంపేట సంఘానికి రూ.లక్ష, పెనుబాక విశ్వేశ్వర చేనేత సహకార సంఘానికి రూ.18 లక్షలు, రాజాం శ్రీమల్లికార్జున వీవర్సు సొసైటీకి రూ.17 లక్షలు, సురవరం సంఘానికి రూ.79 వేలు, మామిడిపల్లి సంఘానికి రూ.76 వేలు, పాలకొండ సంఘానికి రూ.7 లక్షలు, బైరిసారంగిపురంలో సంఘానికి రూ.11 వేలు బకాయిలు అందాల్సి ఉంది. -
ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి
శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : పెరిగిన ఎస్సీ జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాల, రెల్లి, అనుబంధ కులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నందున ప్రభుత్వాలు పునారాలోచన చేయాలని కోరారు. క్రిమిలేయర్ రద్దు చేయాలని, ప్రైవేటు రంగాల్లోనూ ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాల జేఏసీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్‌కు వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో పాదయాత్ర చేపట్టారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పేరుతో చేపట్టిన ఈ పాదయాత్ర శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకూ కొనసాగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు తొల్లిబిల్లి అశోక్‌బాబు, డాక్టర్ చెన్నకేశవులు తదితరులు అంబేడ్కర్ జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. కార్యక్రమంలో అంబేడ్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, జిల్లా దళిత సంఘాల జేఏసీ నేతలు కళ్లేపల్లి రామ్‌గోపాల్, బడియా కామరాజు, కంఠ వేణు, ముంజేటి కృష్ణ, యజ్జల గురుమూర్తి, పొన్నాడ రుషి, దళిత ఉద్యోగుల సంఘ నేతలు ఆర్.వేణుగోపాల్, బోనెల రమేష్ , చల్లా రామారావు, న్యాయవాదులు మురళీకృష్ణ, జె.శ్రీనివాసరావు, పురుషోత్తం రాంబాబు, యడ్ల జానకి, నేతల అప్పారావు, సుంకు రమణ, పెయ్యల చంటి, అరుబారిక రాజు, లక్ష్మణ, రాము, సూర్యనారాయణ, బుడుమూరు రామారావు, పంకు మహేష్, పంకు మురళీ, అబ్బాస్, శంకర్ , భాస్కరరావు, లింగాల మల్లేశరి, శీర రాజేశ్వరి, హారతి పాల్గొన్నారు. -
హత్య చేసి.. బంగారం తాకట్టుపెట్టి..
● వీడిన చంద్రయ్యపేట మహిళ మృతి కేసు మిస్టరీ ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఆమదాలవలస : పట్టణంలోని చంద్రయ్యపేటలో ఆగస్టు 30న జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పోలీసులు చాకచక్యంగా విచారణ జరిపి హత్య కేసుగా నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. చంద్రయ్యపేటకు చెందిన సీపాన రమణమ్మ (45)కు సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి పంచాయతీ నందికొండ కాలనీకి చెందిన అడపాక నవీన్‌తో పరిచయం ఉంది. నవీన్ తరచూ ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఆగస్టు 30న ఓ యువతిని తీసుకొని రమణమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమెను పంపించేసిన తర్వాత రమణమ్మను కూడా బలవంతం చేయగా అందుకు నిరాకరించింది. కోపోద్రుక్తుడైన నవీన్ రమణమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న 98 గ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి, రూ.20 వేల నగదు దోచుకుని పారిపోయాడు. కొంత బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.3 లక్షలు తీసుకొని హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జల్సాలు చేశాడు. మిగతా బంగారం, వెండిని తన ఇంట్లోనే దాచిపెట్టాడు. మరోవైపు, పోలీసులు రమణమ్మ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయగా ఊపిరి ఆడకపోవడంతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రమణమ్మ మొబైల్ కాల్ డేటా ఆధారంగా నవీన్ కోసం గాలించగా ఆ విషయం నిందితుడికి తెలిసి సరుబుజ్జిలి రెవెన్యూ అధికారి వద్ద లొంగిపోయాడు. ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉన్న బంగారం, నిందితుడి ఇంటి వద్ద ఉన్న ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ధర్మాన సావిత్రమ్మకు నివాళులు
శ్రీకాకుళం రూరల్/పోలాకి: ధర్మాన సోదరుల మాతృమూర్తి ధర్మాన సావిత్రమ్మ 13వ వర్ధంతి కార్యక్రమం పెదపాడు పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించారు. సావిత్రమ్మ చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం షణ్ముఖప్రియ, హరిప్రియ సిస్టర్స్ శాసీ్త్రయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాధరావు, మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వైఎస్సార్ సీపీ యువనాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, గుండ లక్ష్మీదేవి తదితరులు న్నారు. అంతకుముందు పోలాకి మండలం మబగాంలోని ధర్మాన సావిత్రమ్మ స్మృతివనంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. కుమారులు కృష్ణదాస్, ప్రసాదరావు, రాందాస్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
ఎరువుల్లేవ్.. యాతన భరించలేకున్నాం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎరువుల కోసం రైతులు ఆందోళన చేయడం చూశాం... కానీ, ఎరువుల కొరత కారణంగా తాము నరకం చూస్తున్నామంటూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ) ఏకంగా కలెక్టరేట్‌ను ముట్టడించారు. అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో కావడం గమనార్హం. గురువారం పగటి వేళ విధులు నిర్వహించిన వీరు... రాత్రి కలెక్టరేట్‌కు వచ్చి ఆందోళన చేశారు. రాత్రి 10 దాటే వరకు నిరసన కొనసాగగా.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వారితో చర్చలు జరిపారు. కాగా, అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు రణస్థలం వరకు, అటు భామిని నుంచి ఇటు శ్రీకాకుళం వరకు జిల్లావ్యాప్తంగా 400 మంది వ్యవసాయ, ఉద్యాన సహాయకులు తరలివచ్చారు.వీరిలో సగంపైగా మహిళా ఉద్యోగులే. ‘‘నరసన్నపేటలో ఓ టీడీపీ నేత డబ్బులివ్వకుండా 50 బస్తాలు పక్కనపెట్టాలని డిమాండ్ చేశాడు. కుదరదని చెబితే చంటి పాప ఉన్న నన్ను సుదూర ప్రాంతానికి డిప్యూటేషన్‌పై వేశారు’’ అని లావణ్య వాపోయారు. ఎరువుల కొరతకు తోడు, రాజకీయ ఒత్తిళ్లతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నామని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. యూరియా లేక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నామని, నానా దుర్భాషలాడుతున్నారని, భౌతిక దాడులకు దిగే పరిస్థితులున్నాయని వాపోయారు.కార్యాలయంలోనే ఉన్న కలెక్టర్‌కు... సంబంధిత యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ బయటకు వచ్చి ఉద్యోగులతో మాట్లాడారు. ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించి, శాఖ విధులు అప్పగించేలా చూడాలని వీఏఏలు కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో వ్యవసాయ, ఉద్యానవన అసిస్టెంట్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 100 బస్తాల యూరియాకు 150 ఫోన్లు100 బస్తాల యూరియా వస్తే 150 పర్యవేక్షక ఫోన్లు, తమకంటే తమకు ఇవ్వాలని 150 మంది ఒత్తిడి చేస్తున్నారని వీఏఏలు వాపోయారు. నాయకుల సూచనల మేరకు తప్పులు జరిగితే చిరుద్యోగులైన తాము బలి అవుతున్నామని తెలిపారు. ఇలాంటి సమస్యలు క్షేత్ర స్థాయిలో అనేకం ఉన్నాయని, అధికారులకు తెలిసినా, పరిష్కారం చూపడం లేదని తెలిపారు. వ్యవసాయ సహాయకుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పలుచోట్ల యూరియా ఇతర ఎరువులను రాజకీయ నాయకులు పట్టుకెళ్లగా, ఆ ఆర్థిక భారం వీఏఏలపై పడిందని తెలిపారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలుసని, క్షేత్రస్థాయి ఉద్యోగులపై భారం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, అ«ధికార ఒత్తిళ్లతో ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నారని, నిబంధనల ప్రకారం వీఏఏలకు సంబంధం లేని పనులు అప్పజెప్పి టార్గెట్లు విధించి మనస్తాపానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. -
యూరియా దొరక్కపోతే చచ్చిపోతా
వజ్రపుకొత్తూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలకు అవసరమైన సమయంలో యూరియా కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. యూరియా కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిన ఓ రైతు సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నారు. యూరియా దొరక్కపోతే చచ్చిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం గణపతి అనే రైతు ఆవేదన ఇలా ఉంది. ‘గణపతి అనే నేను ఆటో నడపలేక నాలుగు ఆవులను కొనుక్కున్నా. మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. ఓ వైపు నీరు సరిపడా లేకపోయినా ఇంజిన్లు పెట్టుకొని బాధలు పడుతున్నాం.మరో వైపు యూరియా దొరకడం లేదు. గోల్మాల్ చేసేస్తున్నారు. ఎరువు కావాలంటే 1బి కావాలంటున్నారు. కౌలు రైతులకు 1బి, పాసు పుస్తకాలు ఇవ్వడం లేదు. సచివాలయాల్లో సిబ్బంది ఉండటం లేదు. రైతులకు దొరకని యూరియా బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.700 పైచిలుకుతో దొరుకుతోంది. మొన్నే మా ఫ్రెండ్ బ్లాక్ మార్కెట్లో రూ.750తో కొనుక్కొచ్చాడు. ఆర్బీకేల్లో యూరియా ఎందుకు దొరకడం లేదు? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. కూటమి పాలనలో చాలా ఇబ్బంది పడుతున్నాం.ఆటో వాళ్ల బతుకులు బాగో లేవు. రైతుల బతుకులూ అంతే. చదువుకున్న పిల్లలకు బతుకుదెరువు లేదు. డాక్టర్ కోర్సు చదవాలనుకున్న విద్యార్థులకు బతుకులు లేవు.. ఇలాగైతే ఎలా? ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఏమైనా అడిగితే అరెస్టులు.. తన్నండ్రా అని కూటమి నాయకులు అంటున్నారు. యూరియా దొరక్క.. ఎరువులు దొరక్క రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే.. ఏం చేయాలో చెప్పండి సార్.. ఎలా వ్యవసాయం చేయాలి.. బతకాలా, ఎండ్రీను తాగి సావాలా.. పరిష్కారం చెప్పండి సార్. యూరియా దొరక్కపోతే వారంలో చచ్చిపోవాలనుకుంటున్నా..’ అని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పురుగుల మందు డబ్బా చూపిస్తూ ఈ రైతు వ్యక్తం చేసిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
చేయి తడిపితేనే పనులు..
జిల్లా వైద్యారోగ్య శాఖలో ఇటీవల జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా పనిచేసిన బాలమురళీకృష్ణ నేరుగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి విదితమే. ఈ ఘటన తర్వాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో అంతా సవ్యంగా ఉంటుందని భావించినప్పటికీ.. మళ్లీ యథావిధిగా లంచాల జోరు పెరిగింది. తాజాగా జరిగిన ఏఎన్ఎంల బదిలీల్లో రూ.లక్షల్లో చేతులు మారిన సంగతి విదితమే. తాజాగా వర్గ పోరులతో సామాన్య ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. సర్వీస్ రెగ్యులైజేషన్, సరెండర్ లీవులు, మెడికల్ లీవులు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్, ఛైల్డ్ కేర్ లీవులు, మూమెంట్ ఆర్డర్లు తదితర పనుల నిమిత్తం ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి నిత్యం ఉద్యోగులు తమ వినతులను ఇస్తుంటారు. నెలలు గడుస్తున్నా ఫైళ్లకు మోక్షం కలగడం లేదని వాపోతున్నారు. ప్రతి పనికి రూ.5 వేల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఓ రెగ్యులైజేషన్ పెండింగ్ ఉన్న ఓ ఉద్యోగి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది సరెండర్ లీవుల పేరిట వస్తున్నప్పటికీ ఫైళ్లకు స్థానచలనం లేకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారనే విమర్శలున్నాయి. చేతికి లంచం ఇస్తే.. వెంటనే పనులు అవుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ఈ శాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
కలెక్టరేట్ వద్ద డ్రైవర్ల ధర్నా నేడు
రణస్థలం: ఉచిత బస్సు పథకం వలన ఉపాధి కోల్పోతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 వేలు చెల్లించాలని కోరుతూ, గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రణస్థలం, కోష్ట, పైడిభీమవరంలో ఆటో డ్రైవర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్నా కరపత్రాలు ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐలతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెల కాపరిని ఆదుకోవాలి రణస్థలం: మండలంలోని జేఆర్‌పురం పంచాయతీ సీతంవలసకు చెందిన గొర్రెల కాపరి పిట్ట రమణకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నాయకుడు కోనంగి నందుడు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు మద్దాడ రాజశేఖర్‌లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్, పశు సంవర్ధక శాఖ జేడీ కె.రాజగోపాల్రావు, ఏడీఏ బి.దుర్గారావులకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు. ఇటీవల పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని రమణకు చెందిన 20 గొర్రెలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన సుమారు రూ.5 లక్షల నష్టం వాటిళ్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని విన్నవించుకున్నారు. -
నేపాల్ సమాచారం కోసం హెల్ప్‌లైన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర హెల్ప్‌లైన్‌ను కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఏర్పాటు చేశారు. 9491222122 నంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. దీనిని పర్యవేక్షించేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి కిరణ్ (9949478989), సీనియర్ సహాయకులు ఎల్.రాజ్యలక్ష్మి (9441022669), సహాయ జిల్లా సమాచార అధికారి బి.విజయ్‌బాబు (9110769608) బృందం హెల్ప్‌లైన్‌కు వచ్చే ప్రతి కాల్‌ను స్వీకరించి వివరాలు నమోదు చేసుకుంటుంది. సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కు చేరవేసి సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతుంది. థర్మల్ ప్లాంట్ సర్వే అడ్డగింత బూర్జ: ఆదివాసీల జీవితాలతో పాటు పర్యావరణాన్ని నాశనం చేసే క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తమ ప్రాంతంలో చేపట్టవద్దంటూ ఆదివాసీలు నినాదాలు చేశారు. బుధవారం బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లోని జేవీ పురం, తిమడాం, జంగాలవలస, బొడ్లపాడు, వెన్నెలవలస గ్రామాల ఆదివాసీలు మూకుమ్మడిగా వచ్చి తిమడాం వద్ద సర్వే బృందాలను అడ్డుకున్నారు. సర్వే చేపట్టవద్దంటూ వారి వద్ద మెటీరియల్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆదివాసీలకు నచ్చజెప్పి మెటీరియల్‌ను తీసుకుని సిబ్బందికి అందజేశారు. ఈసందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ ప్రాణత్యాగం చేసైనా ప్లాంట్ నిర్మాణం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. -
బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా వర్సిటీ సీనియర్ అధ్యాపకుడు ఆచార్య బి.అడ్డయ్య నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ఆచార్య కె.ఆర్.రజని నియామక ఉత్తర్వులు బుధవారం అందజేశారు. ఇప్పటివరకు అడ్డయ్య వర్సిటీ రెక్టార్‌గా వ్యవహరించడమే కాకుండా, పలుమార్లు ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సేవలను అందించారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డులోని వేంకటేశ్వర థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఎం.పాపారావు ఇంట్లో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పాపారావు భార్య కుమారి పాలు మరిగిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. కొన్ని సెకన్లలోనే మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కుమారి భయంతో బయటకు పరుగులు తీసింది. వెంటనే స్థానికులు వచ్చి తడి గోనె సంచులు కప్పి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి, పరిశీలించి తగు సూచనలు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు. నార్త్‌జోన్ క్రికెట్ టోర్నీలో శ్రీకాకుళం బోణీ శ్రీకాకుళం న్యూకాలనీ: ఏసీఏ నార్త్‌జోన్ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో శ్రీకాకుళం జట్టు విజయంతో బోణీ కొట్టింది. జిల్లా బ్యాటర్ అబ్దుల్ సమీర్ 112 పరుగుల అజేయ సెంచరీతో, రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ డీవీ శ్రీరామ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 10 వికెట్లతో విజృంభించడంతో ఆతిథ్య విజయనగరంతో సోమవారం నుంచి బుధవారం వరకు జరిగిన మల్టీడేస్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీకాకుళం ఘన విజయం సాధించింది. విజయనగరం జిల్లా వేదికగా ఏసీఏ నార్త్‌జోన్ అంతర్ జిల్లాల త్రీడేస్ (మల్టీడేస్) పురుషుల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్ ఇటీవలే మొదలైంది. టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య విజయనగరం, శ్రీకాకుళం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు 148 పరుగుల వద్ద కుప్పకూలింది. 101 పరుగుల ఆధిక్యంతో తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విజయనగరం జట్టు 164 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 266 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జట్టు ధాటిగా బ్యాటింగ్చేసి 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. తదుపరి తూర్పుగోదావరితో మ్యాచ్ జరగనుంది. -
14న జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్టు జిల్లా కబడ్డీ సంఘ అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం సమీపంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. 2006 జనవరి 1 తర్వాత జన్మించిన బాలబాలికలు, బాలురు 70 కేజీలులోపు, బాలికలు 65 కేజీల్లోపు వయస్సు ఉండాలని స్పష్టం చేశారు. మ్యాట్‌పై జరిగే ఈ ఎంపికలకు క్రీడాకారులు షూ ధరించి హాజరుకావాలని కోరారు. ఎంపికై న జిల్లా జట్లను కృష్ణా జిల్లా విజయవాడ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి జూనియర్స్ కబడ్డీ చాంపియన్‌షిప్–2025 పోటీలకు పంపిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు(9441914214)ను సంప్రదించాలని కోరారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి శ్రీకాకుళం క్రైమ్ : గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళల అదృశ్యం కేసులపై పోలీసు అధికారులు దృష్టి సారించాలని, సాంకేతిక, శక్తి బృందాలు, ఇతర ఆధారాలతో వారిని గుర్తించాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నాన్ బెయిల్‌బుల్ వారెంట్ల అమలు, హత్య కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. ఇరువర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశమున్న కుటుంబ, ఆస్తి వివాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్, ఇతర కాంపౌండ్ కేసులను గుర్తించి లోక్ అదాలత్‌లో రాజీ అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ ఆర్ఎం శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీ్త్రశక్తి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) అమలు తీరుపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంపై మహిళల సూచనలు, సలహాలు, సమస్యలను 9959225603 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ‘క్వాంటమ్’తో సమూల మార్పులు ఎచ్చెర్ల : క్వాంటమ్ అధ్యయనాలే నేటి వైజ్ఞానిక రంగంలో సమూల మార్పులకు ఊతమిస్తున్నాయని డాక్టర్ బీఆర్‌ఏయూ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ తెలిపారు. ఎచ్చెర్లలోని అంబేడ్కర్ వర్సిటీలో ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ అనే అంశంపై ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు, అవకాశాలు ఏర్పడతాయన్నారు. నాగార్జున వర్శిటీ పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.సంధ్య, ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాడ్యుయేట్ స్టడీస్(బెంగుళూరు) ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.రామ్‌కుమార్‌లు మాట్లాడుతూ గణిత, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో పాటు పలు రంగాలకు క్వాంటమ్ కంప్యూటింగ్‌తో బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే క్వాంటమ్ ఏఈ వంటివి వారి ప్రగతిలో కీలకంగా మారాయని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ పి.సుజాత, ప్రిన్సిపాల్స్ ఎస్.ఉదయభాస్కర్, సీహెచ్ రాజశేఖరరావు, ఫిజిక్స్ అధ్యాపకులు పి.శివప్రసాద్‌రెడ్డి, ఎం.సుబ్బారావు, ఎ.గణేష్ బాబు, సుష్మారెడ్డి పాల్గొన్నారు. ఎరువుల కోసం ఆందోళన పడొద్దు శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. బుధవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి పలువురు రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
భవితకు నిచ్చెన..!
● వెల్డింగ్‌తో ఉపాధికి విస్తృత అవకాశాలు ● జిల్లాలో 250 వరకు శిక్షణ సంస్థలు ● విదేశాల్లో మంచి జీతాలు ● మోసపోవద్దని పోలీసుల సూచన వెల్డింగ్ శిక్షణ..మా శిక్షణ సంస్థలో నైపుణ్యతకు ప్రాధాన్యత ఇస్తాం. విదేశాలకు వెళ్లేందుకు యువతకు సూచనలతో పాటు అక్కడ చట్టాలు, తదితర అంశాలను వివరిస్తాం. స్వయంగా అభ్యర్థులు విశాఖ, ఇచ్ఛాపురం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇంటర్వ్యూలకు హాజరై విదేశాలకు వెళ్లి వస్తున్నారు. నేను పదేళ్లు విదేశాల్లో పనిచేశాను. టిగ్, ఆర్క్, గ్యాస్ కటింగ్‌లో అనుభవం ఉంది. మా ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో శిక్ష సంస్థ ఏర్పాటు చేశాం. రిజిస్ట్రేషన్ ఉన్న శిక్షణ సంస్థల్లో మాత్రమే శిక్షణ తీసుకోవాలి. మోసాలు బారిన పడకుండా చూసుకోవాలి. సబ్ ఏజెంట్లు, మోసగాళ్లను నమ్మి మోసపోకుండా చూసుకోవాలి. – కర్ని భీమారావు, దుర్గా గణపతి వెల్డింగ్ ఇనిస్టిట్యూట్, పూండి నేను సింగపూర్, మలేషియా, దుబాయ్, బ్యాంకాక్ తదితర దేశాల్లో ఉద్యోగం చేసి వచ్చాను. సొంతంగా శిక్షణ సంస్థ పెటుకున్నాను. దేశీయంగా వివిధ ప్రాజెక్టులు, కంపెనీల్లో నైపుణ్యత కలిగిన యువత కావాలని చాలా సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ప్రధానంగా మూలపేట పోర్టు, స్టీల్‌ప్లాంట్, ఎన్ఎండీసీ, తదితర కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు. వెల్డింగ్‌లో 3జీ, 4జీ, 6జీ, టిగ్, ఆర్క్ వెల్డింగుల్లో శిక్షణ ఇచ్చి సొంతంగా ఉపాధి అవకాశాలు కలిగేలా సూచనలు చేస్తున్నాం. సాంకేతిక విద్యలో స్కిల్ ఉంటే ఎక్కడైనా మంచి పొజిషన్ లభిస్తుంది. – జి.వైరెడ్డి, శిక్షణ సంస్థ యజమాని, దేవునల్తాడ వజ్రపుకొత్తూరు: నేటి యువత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కొలువులే కాకుండా వెల్డింగ్ రంగంపై కూడా ఆసక్తి పెంచుకుంటున్నారు. సాంప్రదాయ వెల్డింగ్‌తో పాటు హైటెక్ ఆటోమేటెడ్ పరికరాలను ఉపయోగించే పరిశ్రమలకు ఉపయోగపడే ప్రొఫెషనల్ వెల్డింగ్‌లోనూ నైపుణ్యం సాధిస్తున్నారు. వెల్డింగ్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సొంతంగా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్, ఫ్యాబ్రికేషన్లను ప్రారంభించి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. మరికొంతమంది విదేశాల బాట పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులతో సమానంగా నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఉత్తమ ఉపాధి అవకాశాలు చేతిలో పని(స్కిల్) ఉంటే ఎలాంటి సంస్థలైనా ఉపాధి కల్పిస్తాయని తెలుసుకుని ఇప్పుడు శిక్షణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికి ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. వెల్డింగ్, ఫిట్టర్, సేఫ్టీ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాల్లో జీతం నెలకు రూ.3.50 లక్షల వరకు సంపాదించే యువత కూడా ఉద్దానం ప్రాంతంలో ఉన్నారు. రష్యా, ఇటలీ, జపాన్, పోలెండ్ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. దీంతో యువకులు ఈ కోర్సులపై మొగ్గు చూపుతున్నారు. రేపటి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయడానికి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, హరిపురం, పలాస, పూండి, నరసన్నపేట, శ్రీకాకుళం, రూరల్, అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 250కి పైగా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నాయి. స్కిల్ ఉన్నవారిని పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తారని తెలుసుకుని యువకులు పోటీతత్వంతో ముందుకు సాగుతున్నారు. వీరికి వెల్డింగ్ రంగం గొడుగు పడుతోంది. సర్టిఫైడ్ కోర్సులకు డిమాండ్ ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం ఉపాధి కోసం సాంకేతిక విద్యను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా వెల్డింగ్, గ్యాస్ కటింగ్‌లపై శ్రద్ధ చూపిస్తున్నారు. వెల్డింగ్‌లో సెర్టిఫైడ్ కోర్సులను అభ్యసించి ఇండియాలో స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రాజెక్టుల్లో పాటు విదేశాల్లో సైతం ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడంలో విశాఖ, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పూండి ప్రాంతాల్లోని వెల్డింగ్ శిక్షణ కేంద్రాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఆరు నెలలు, ఏడాది పాటు శిక్షణ పొందితే చాలు ఏ సంస్థ అయినా వెల్డర్‌గా పనిలోకి తీసుకుంటుంది. ఇది నిరుద్యోగులకు వరంగా నిలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఉద్యోగం సాంపాదించడం కోసం వెల్డింగ్ నేర్చుకుని సింగపూర్, దుబాయ్, అబుదాబి, అమెరికా, ఆస్ట్రేలియా, పోలెండ్, రష్యా, అజర్బైజాన్, కత్తర్, థాయ్‌లాండ్, బ్యాంకాక్, మలేషియా వెళ్లిన యువకులు జిల్లాలో అనేక మంది ఉన్నారు. అధికంగా యువకులు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో వారి అవసరాలకు అనుగుణంగా వెల్డింగ్ శిక్షణ సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 250 వరకు శిక్షణ సంస్థలు 3జీ, 4జీ, 6జీ, టిగ్, ఆర్క్, మిగ్ వెల్డింగ్‌లో శిక్షణ అందిస్తున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఇంటర్, ఐటీఐ చేసిన వారిలో ఎక్కువ మంది వెల్డింగ్, ఫిట్టర్, సేఫ్టీ, క్యూసీ రంగంలో ఆసక్తి కనబరుచుకుని ప్రగతికి బాటలు వేసుకుంటున్నారు. ఆటోక్యాడ్ ఇతర సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందినవారితో పాటు ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం, టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తుండడంతో వెల్డింగ్‌కు విశేష ఆదరణ లభిస్తోందని శిక్షణ సంస్థల నిర్వహకులు చెబుతున్నారు. కాగా విదేశీ ఉద్యోగాల మోజులో యువత కొంతమంది ఏజెంట్లు, మధ్యవర్తులను నమ్మి మోసపోతున్నారు. లక్షలాది రూపాయలను వారి చేతిలో పెట్టి టూరిస్టు విసాలతో వెళ్లి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. గుర్తింపు పొందిన వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ అసోసియేషన్లలో నమోదైన సంస్థల్లో మాత్రమే శిక్షణ తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా యువత పెడచెవిన పెట్టి ఉద్దానం, తీర ప్రాంత గ్రామాల్లోని విదేశీ ఏజెంట్ల వలలో చిక్కిపోతున్నారు. నకిలీ వీసాలతో పాటు కంపెనీ కాంట్రాక్టు కాపీలు, జీతం, వసతి అలవెన్సులు తదితర విషయాల్లో సైతం మోసాలకు పాల్పడుతుండడంతో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. -
యూరియా వెతలు..!
బూర్జ మండలంలోని బూర్జ, గుత్తావల్లి, పాలవలస, ఏపీపేట గ్రామ రైతు సేవా కేంద్రాల ఆవరణలో ఎరువుల టోకెన్లు కోసం రైతులు గంటలు కొద్ది నిరీక్షిస్తున్నారు. బుధవారం రైతులకు టోకెన్లు అందజేసి గురువారం ఎరువుల అందజేస్తారనే సమాచారంతో రైతులు క్యూలో నిల్చొని టోకెన్లు అందుకున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయశాఖ ఏవో డి.ఉషారాణి మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం అధైర్యపడవద్దని సూచించారు. అందరికీ విడతల వారీగా ఎరువులు అందజేస్తామన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.– బూర్జ -
స్మార్ట్దోపిడీ!
● స్మార్ట్ రేషన్‌కార్డులకు అథెంటికేషన్ పేరిట దందా ● కార్డుకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూళ్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదించే మార్గాన్ని కొందరు టీడీపీ నాయకులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ఇటీవల లబ్ధిదారులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. కార్డులను సచివాలయాలు సిబ్బంది, రేషన్‌షాప్ డీలర్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ సమయంలో కార్డు అథంటికేషన్ చేయించుకోవాలి. దీనికి మూడు రకాల విధానాలను ప్రభుత్వం సూచించింది. ఫేషియల్ యాప్, ఓటీపీ, బయోమెట్రిక్ విధానాల్లో ఏదో ఒక విధానంలో వెరిఫై తప్పనిసరి చేసింది. ఈ సమయంలో లబ్ధిదారుల నుంచి ఒక్కొక్క కార్డుకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దందా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 6,57,758 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు 6,51,717 స్మార్ట్ కార్డులు విడుదల చేశారు. వీటి పంపిణీ గ్రామాల్లో ముమ్మరంగా జరుగుతుంది. అనేక చోట్ల డీలర్లు డబ్బులు తీసుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో డీలర్లకు టీడీపీ నాయకులకు మధ్య విభేదాలు సైతం తలెత్తుతున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల స్మార్ట్ కార్డు వసూళ్లు వెనుక డీలర్లతోపాటు స్థానిక కూటమి నాయకులు ఉన్నట్లు సమాచారం. -
ఇద్దరు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్
● యూరియా వివరాలు సక్రమంగా తెలియజేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం కంచిలి: పంట సాగు విస్తీర్ణం నమోదులో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, సచివాలయ ఉద్యోగుల మధ్య సమన్వయలోపం తలెత్తడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచిలి మండలం గోకర్ణపురం రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి గోకర్ణపురం, శాసనాం, వీరనారాయణపురం గ్రామాల్లో ఇంతవరకు సరఫరా చేసిన యూరియా, వాస్తవంగా అవసరమైన యూరియా వివరాలు తెలియజేయాలని రెండు శాఖల అధికారులను వేర్వేరుగా ప్రశ్నించారు. ఈ క్రమంలో వేర్వేరు నివేదికలు చెప్పిన వీఏఏ దిక్కల అన్వేష్, వీఆర్వో జి.వెంకటరమణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు. మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై తహశీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, మండల వ్యవసాయాధికారి కె.సురేష్లను మందలించారు. గోకర్ణపురం, శాసనాం సర్పంచ్‌లు యారడి ఆనందరావు, గుడ్డిపద్ర వేణులు స్థానిక రైతు ప్రతినిధులుగా వ్యవహరించి, ఇక్కడ ఏ మేరకు యూరియా అవసరం అనేది నివేదించడంతో.. త్వరలో 420 బస్తాల యూరియా పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం గోకర్ణపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె.అప్పలస్వామి, తహశీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు టి.భవానీ శంకర్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, మండల వ్యవసాయాధికారి కె.సురేష్, ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్, వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు. కాగా, రైతులకు సక్రమంగా యూరియా అందకపోవడం వెనుక గల కారణాలను పక్కన పెట్టి అనవసరంగా ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఏంటని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ సస్పెన్షన్లను నిలుపుదల చేయాలని రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వ బడులను విస్మరిస్తున్నారు
● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజం ● మురికింటిభద్ర పాఠశాల పరిశీలన మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడులను విస్మరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. మండలంలోని మర్రిపాడు.కె పంచాయతీ పరిధి మురికింటిభద్ర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పాఠశాల భవనం స్లాబ్ ఊడిపడి, తరగతి గదిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడి పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాల పరిస్థితి చూస్తుంటే విద్యకు కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత తెలుస్తోందని ఎద్దేవా చేశారు. వర్షం పడితే విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేశామని, కూటమి ప్రభుత్వం పాఠశాలలు, విద్యార్థులపై అవలంభిస్తున్న విధానాలు మార్చుకోవాలని సూచించారు. పాఠశాలలో ఇంత సమస్య ఉన్నా అధికారులు సైతం నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆదినాయుడు, మండల కన్వీనర్ పోలాకి జయమునిరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బమ్మిడి ఖగేశ్వరరావు, ఉర్లాన బాలరాజు, అలికాన మాధవరావు, పైల హరి, పల్లి యోగి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
గోతిలో దిగబడిన టిప్పర్
● వాహనాల రాకపోకలకు అంతరాయం మెళియాపుట్టి: మెళియాపుట్టి నుంచి పాతపట్నం వెళ్లే ఆల్ ఆంధ్రా రహదారిలో రోడ్డుకి అడ్డంగా టిప్పర్ లారీ దిగబడిపోయింది. పాతపట్నం నుంచి మెళియాపుట్టి వైపు ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ సుందరాడ వచ్చేసరికి, ఇటీవల కురిసిన వర్షాలకు జలజీవన్ మిషన్ పైప్లైన్ల కోసం తవ్విన గోతుల్లో నీరుచేరడంతో చక్రాలు దిగిపోయి కూరుకుపోయింది. దీంతో రాత్రి 7 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు జేసీబీలు లారీని బయటికి తీయడానికి విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మరలా ఇసుకంతా వేరే వాహనానికి తరలించి లారీని బయటకు తీశారు. అనంతరం వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. -
మర్యాదపూర్వక భేటీ
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టి కృషితో ముందుకు సాగాలని జగన్మోహన్రెడ్డి సూచించినట్లు రవికుమార్ పేర్కొన్నారు.– ఆమదాలవలస28 పశువులు పట్టివేతరణస్థలం: లావేరు మండలంలోని ఎన్‌హెచ్–16పై సుభద్రాపురం జంక్షన్లో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న రెండు ఐసర్ వ్యాన్లలో తరలిస్తున్న 28 పశువులను(గేదెలను) లావేరు పోలీసులు పట్టుకున్నారు. దీనిపై లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.ఇద్దరిపై కేసు నమోదుకొత్తూరు : నివగాం గ్రామానికి చెందిన బి.కమలహాసన్, బి.రాజేష్‌లు వెలుగు కార్యాలయంలోకి వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించారని ఏపీఎం లలిత పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ బుధవారం తెలిపారు. -
సహజ వనరుల దోపిడీకే ఆపరేషన్ కగార్
పలాస: దేశంలో సహజ వనరుల దోపిడీకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. మండలంలోని లొత్తూరులో సిక్కోలు పోరాట యోధులు కుమారన్న, సీతారాముల వర్ధంతి సభను బుధవారం నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రప్రకాష్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో పర్యావరణాన్ని రక్షిస్తూ అడవులను కాపాడుతున్న ఆదివాసీలను ఆపరేషన్ కగార్ పేరుతో అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గమైన చర్యని ప్రజలు ఖండించాలని కోరారు. అడవులను, ఆదివాసీలను కాపాడటానికే కుమారన్న, సీతారాములు తుపాకులు పట్టారని, వారిని కూడా ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాలను అణిచి పెట్టడానికి పూనుకుంటోందని, కనీసం రైతులకు ఎరువులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉండడం విచారకరమని మండిపడ్డారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి వంకల మాధవరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, సవలాపురం కృష్ణవేణి, గొరకల బాలకృష్ణ, మామిడి భీమారావు, జుత్తు వీరాస్వామి, పోతనపల్లి కుసుమ, బదకల ఈశ్వరమ్మ, ఎం.వినోద్, సొర్ర రామారావు, సార జగన్, సవర బంగ్లాకుమార్, సీమాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో దుర్మార్గ పాలన
ప్రజల హక్కులను కాపాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సాక్షి దినపత్రిక ద్వారా ప్రజలకు వివరిస్తుండటాన్ని అధికార పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. దీనిలో భాగంగానే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజలే కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. – సింగుపురం మోహన్‌రావు, న్యాయవాది -
వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం
టెక్కలి : వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎన్ని ధనుంజయరావు, టెక్కలి నియోజకవర్గానికి చెందిన కెల్లి జగన్నాయకులు, ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన గుమ్మడి రాంబాబులను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాకు చెందిన పలువురు నాయకులను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జన్ని అనిరుద్రుడు(ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ), బందపల్లి రాకేష్(ఎస్టీ సెల్ కార్యదర్శి), హరిబంద్ జన్నీ (నిత్యానంద)(ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ), కొనపల సురేష్(చేనేత విభాగం సెక్రటరీ), కాలేపు శ్రీదేవి(చేనేత విభాగం జాయింట్ సెక్రటరీ), పచ్చిగుళ్ల సాయిరాం(వాణిజ్య విభాగం జాయింట్ సెక్రటరీ), కిల్లి అజయ్‌కుమార్(ఐటీ విభాగం కార్యదర్శి), అదపాక ఉమాశంకర్(ఐటీ విభాగం జాయింట్ సెక్రటరీ), బంకుపల్లి లోకనాధం శర్మ(ప్రచార విభాగం కార్యదర్శి), తమ్మినేని మురళి(ప్రచార విభాగం కార్యదర్శి), కెళ్ల రామకృష్ణ(ప్రచార విభాగం జాయింట్ సెక్రటరీ), బెండి గాంధీ(ప్రచార విభాగం జాయింట్ సెక్రటరీ), గెళ్లంకి వెంకట్రావు(గ్రీవెన్స్ విభాగం జాయింట్ సెక్రటరీ), నూక సత్యరాజ్(పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షుడు), గురుబెల్లి శ్రీనివాసరావు(పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ), పూడి నీలాచలం(పంచాయతీరాజ్ విభాగం జాయింట్ సెక్రటరీ), వావిలాపల్లి మురళి(పంచాయతీరాజ్ విభాగం జాయింట్ సెక్రటరీ)లను నియమించారు. -
హా..స్టళ్లు..!
● పాడుబడిన భవనాలతో అవస్థలు ● కురిగాం, కొత్తూరు వసతి గృహాల్లో చేరని విద్యార్థులు కొత్తూరు: విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వ ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. దీనికి నిదర్శనంగా కొత్తూరు మండలం కురిగాం గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహం, కొత్తూరులోని ఎస్సీ బాలికల వసతి గృహాలను చెప్పుకోవచ్చు. ఈ వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది వేసవి సెలవుల అనంతరం ఇప్పటివరకు ఈ వసతి గృహాల్లో విద్యార్థులు చేరలేదు. దీంతో ఖాళీ భవనాలు దర్శనమిస్తున్నాయి. భయపెడుతున్న శిథిల భవనాలు కొత్తూరు ఎస్సీ బాలికల వసతి గృహం బాగా పాతబడిపోవడంతో విద్యార్థులు వసతి గృహంలో ఉండేందుకు భయపడుతున్నారు. వర్షాలు వచ్చే సమయంలో ఈ వసతి గృహం ముందు ఉన్న రోడ్డు మీదకు నీరు చేరి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతి గృహానికి వెళ్లే రహదారి సైతం అధ్వానంగా ఉంది. అలాగే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన వసతి గృహానికి వచ్చేందుకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. అదేవిధంగా కురిగాం వసతి గృహం గదులు బీటలువారి ప్రమాదపుటంచున ఉన్నాయి. ఇక్కడ గదులకు తలుపులు లేవు. వర్షం వస్తే నీరు కారుతోంది. దీంతో ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఫలితంగా రెండు వసతి గృహాల్లో ప్రస్తుతం విద్యార్థులు చేరలేదు. గత విద్యా సంవత్సరంలో కొత్తూరు ఎస్సీ బాలికలు వసతి గృహంలో 18 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు రాకపోవడంతో వసతి గృహానికి తాళం వేశారు. కురిగాం వసతి గృహంలో గత విద్యా సంవత్సరంలో 11 మంది విద్యార్థులు ఉండేవారు. సెలవులు తర్వాత విద్యార్థులు మరెవ్వరూ రాలేదు. ఫలితంగా ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఈ రెండు వసతి గృహాలు మూతపడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ రెండు వసతి గృహాల్లో నాల్గో తరగతి సిబ్బంది ఒక్కక్కొరు పనిచేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం కొత్తూరు, కురిగాం ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వార్డెన్లకు ఆదేశించాము. ఇప్పటికే వార్డెన్లు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. కురిగాంలో భవనాలు పాడవ్వడంతో వసతి గృహంలో చేరేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అలాగే కొత్తూరులో వార్డెన్ లేకపోవడంతో పక్కన ఉన్న వార్డెన్‌కు ఎఫ్ఏసీ ఇవ్వడం వలన అడ్మిషన్లపై దృష్టి సారించలేకపోయారు. విద్యార్థులు వచ్చినట్లయితే వసతి గృహాల్లో చేర్పించుకుంటాము. – శ్యామల, ఏఎస్‌డబ్ల్యూ, పాతపట్నం -
హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
ఆమదాలవలస: కొత్తవలస గ్రామానికి చెందిన అరసవెల్లి హరమ్మ హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ పి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆమదాలవలస పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో హరమ్మ తీవ్రంగా గాయపడిందన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 4వ తేదీన మృతిచెందిందన్నారు. ఈ ఘటనలో కొత్తవలస గ్రామానికి చెందిన దవల లక్ష్మణరావుతోపాటు మరో నలుగురు వ్యక్తులు, ఒక మైనర్‌పై హత్య కేసు నమోదు చేశామని తెలిపారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న నిందితులు పోలీసులకు దొరక్కుండా పరారయ్యారన్నారు. తదుపరి దర్యాప్తులో ఎస్సై ఎస్.బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు నిందితుల కదలికలపై సమాచారం సేకరించి మంగళవారం కొర్లకోట సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను జూనియర్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మైనర్ నిందితుడిని జువైనెల్ కోర్టు ఎదుట హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
అత్యాశతోనే అంతం చేశారు
నరసన్నపేట : అత్యాశకు పోయి సులువుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తాను మోలి అప్పలరాజు, జువ్వాది సంతోష్‌లు హత్య చేశారని టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు తెలిపారు. గుప్తా వద్ద కాజేసిన కేజీ 33 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని చెప్పారు. అప్పలరాజులు, జువ్వాది సంతోష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. నిందితుల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసిన శ్రీకాకుళం నగరానికి చెందిన ఆర్ఎస్ జ్యూయలరీ యజమానిని ఈ కేసులో మరో ముద్దాయిగా గుర్తించామని, ఈయన్ను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కేసు వివరాలను నరసన్నపేటలో మంగళవారం విలేకరులకు వెల్లడించారు. గెడ్డలో మృతదేహం లభ్యం.. బంగారం వ్యాపారం చేస్తున్న గుప్తా ఆగస్టు 26న తన బొలెరో వాహనంలో డ్రైవర్ సంతోష్‌తో పాటు విశాఖ వెళ్లారు. నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో గుప్తా సోదరుడు మన్మధరావు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. వారం తర్వాత గుప్తా మృతదేహం శ్రీకాకుళం సమీపంలోని రామిగెడ్డ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. శరీరంపై గాయాలు బట్టి హత్య కేసుగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ సంతోష్‌పై అనుమానంతో నిఘా పెట్టి విచారణ చేయగా బంగారం కోసమే గుప్తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. పెద్దపాడు వద్ద ఆదిత్య కార్ వరల్డ్ బిల్డింగ్ యజమాని మోలి అప్పలరాజు షాపులో గుప్తా మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం రామిగెడ్డలో మృతదేహాన్ని పడేశారు. ఆ సమయంలో వర్షాలు అధికంగా పడటంతో మృతదేహం కొట్టుకుపోతుందని భావించారు. ఇంతలో తుప్పలు అడ్డుపడటంతో మృతదేహాన్ని గుప్తా బంధువులు గుర్తించగలిగారు. డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే అప్పలరాజు ఈ హత్యలో పాలుపంచుకుని బంగారంలో అధిక భాగం తీసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పలరాజేనని డీఎస్పీ తెలిపారు. సంతోష్ భార్య ప్రశాంతి, బొరిగివలసకు చెందిన మణిలు కేసులో నిందితులు కాదని వివరించారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి ఎస్ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, అశోక్‌బాబు, అనిల్, రంజిత్‌లు చాకచక్యంగా కేసును దర్యాప్తు చేసి సకాలంలో బంగారాన్ని రికవరీ చేశారని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలో అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందించాలంటే ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి మంగళవారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో సదస్సు నిర్వహించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, అక్రమ రవాణా బాధితులు, ట్రాన్స్జెండర్లు, గిరిజనులు, అసంఘటిత కార్మికులు వంటి వివిధ వర్గాల ప్రయోజనాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విభాగాల అధికారులు తాము అందిస్తున్న పథకాలను వివరించగా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమాజానికి తాము చేస్తున్న సేవలను తెలియజేశారు. కార్యక్రమంలో డీసీపీవో రమణ, ఎల్ఏడీసీ ప్రధాన అధికారి కె.ఆఫీసు పాల్గొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎచ్చెర్ల : ఏపీ ఈఏపీ సెట్–2025 ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించిన బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు బీ–పార్మసీ, ఫార్మాడీ, బీ టెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సాంకేతిక విద్యాశాఖ ఉన్నత విద్యామండలి వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిందని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం సమన్వయకర్త కె.నారాణరావు మంగళవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రోసెసింగ్ కోసం ఈ నెల 11 నుంచి 16 వరకూ రుసుము చెల్లించాలని చెప్పారు. ఈ నెల 12 నుంచి 17లోగా ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి ఆన్లైన్ పరిశీలన, 13 నుంచి 18 వరకూ కళాశాలల కోర్సుల ఎంపికకు వెబ్ ఆప్షన్లు, 19న వెబ్ ఆప్షన్ల మార్పు, 21న కళాశాలలు, కోర్సుల కేటాయింపు జాబితా వెల్లడించనున్నట్లు వివరించారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 23లోగా కళాశాలల్లో రిపోర్టు చేసుకోవాలన్నారు. నిరసన ర్యాలీ విజయవంతం చేయండి శ్రీకాకుళం న్యూకాలనీ: విజయవాడ ధర్నాచౌక్ వద్ద బుధవారం ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుడు జామి శ్రీకాంత్‌బాబు మంగళవారం పిలుపునిచ్చారు. లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కొన్ని సంవత్సరాలుగా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక వయస్సు కూడా దాటిపోయి మానసిక సంఘర్షణ, ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. మెరుగైన ఫలితాలే లక్ష్యం పాతపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని, ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఉంటుందని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆర్.సురేష్‌కుమార్ అన్నా రు. మంగళవారం పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని, విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి దుర్గారావు, ప్రిన్సిపాల్ టి.హేమసుందరరావు, అధ్యాపకులు ఉన్నారు. -
నదిలో దూకిన బాలుడు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్ కొత్త వంతెన పై నుంచి ఓ బాలుడు నాగావళి నదిలో దూకేసిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు తెలిపిన వివరా ల్లోకి వెళ్తే.. నగరంలోని రెల్లివీధికి చెందిన బి.రమేష్ అంబేడ్కర్ జంక్షన్ వద్ద పళ్ల రసం దు కాణం నడుపుతున్నారు. ఆయన పెద్ద కుమారుడు ఓ స్కూల్లో నాల్గో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే యూనిఫాం ధ రించి స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి సరిగ్గా ఉదయం 9:15 గంటలకు డేఅండ్‌నైట్ సమీప కొత్త వంతెన పైనుంచి దూకేశాడు. దీన్ని గమనించిన ఏఆర్ కానిస్టేబుల్ అగ్నిమాపక శాఖకు సమా చారం అందించారు. విద్యార్థి తేలియాడుతూ కనిపించడంతో అటువైపుగా వెళ్తున్న పాలవ్యాపారి తన వద్దనున్న తాడు వేయడం, అప్పటికీ సరిపోకపోవడంతో ఓ జాలరి తన వద్ద నున్న తాడు కలిపి వేయడంతో బాలుడు అందుకున్నాడు. అప్పటికే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సైతం జాలరితో పాటు నదిలోకి దిగి బాలున్ని రక్షించి బయటకు క్షేమంగా తీశారు. ఈలోగా తల్లిదండ్రులు రావడంతో కౌన్సిలింగ్ చేశామని, చిన్న కారణానికే క్షణికావేశంలోనే బాలుడు నదిలో దూకాడని ఏడీఎఫ్‌ఓ శ్రీనుబాబు పేర్కొనడం విశేషం. అదే మార్గంలో బాలున్ని చూసేందుకు వాహనదారులు అధికంగా ఆగడంతో కాసేపు ట్రాఫిక్ అయ్యింది. -
ఆంక్షల సంకెళ్లు
● అన్నదాతలతో కలిసి గర్జించిన వైఎస్సార్సీపీ నేతలు ● గృహ నిర్బంధాలు, అరెస్టులు లెక్కచేయకుండా నిరసన ● ఎరువుల సమస్య తీరే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక అడుగడుగునా ఆంక్షలు.. అడుగు బయట పెట్టనీయకుండా నిర్బంధాలు.. నలుచెరగులా పోలీసు బలగాలు.. అయినా అన్నదాతల నినాదం దిక్కులు పిక్కటిల్లేలా అందరికీ వినిపించింది. వారి ఆందోళన పాలకుల పీఠాలు కదిలే స్థాయిలో జరిగింది. రైతన్నకు జత కలిసిన వైఎస్సార్సీపీ నేతలు ఎరువుల కొరతపై ప్రభుత్వాన్ని దునుమాడారు. నిర్లక్ష్యపు పాలనను అధికారులకు వినతి పత్రాలు అందజేసి మరీ వివరించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ మంగళవారం చేపట్టిన అన్నదాత పోరుబాటకు సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. పోలీసు సాయంతో ఆందోళన అణచివేయాలని అనుకుంది. కానీ రైతుల కోసం వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. అన్నదాతలు కలిసి రావడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అడ్డుకున్న పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు. ముందు అనుమతి ఇచ్చి.. సోమవారం రాత్రి 9 గంటల వరకు వైఎస్సార్సీపీ అన్నదాత పోరు బాటకు అనుమతులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ప్రభుత్వం కుట్రలు పన్నడం ప్రారంభించింది. అనుమతులు తూచ్ అంటూ రద్దు చేసేసింది. కేవలం 15 మందితో మా త్రమే వినతి పత్రం ఇచ్చుకోవాలని, ర్యాలీలు, నిరసనలు నిషేధమని ఆంక్షలు విధించింది. తెల్లారే సరికి ఆటంకాలు సృష్టించింది. నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పో లీసుల బలగాలతో మోహరించింది. కానీ నిర్బంధాలను ఛే దించుకుని వైఎస్సార్సీపీ నేత లు పోరుబాటను విజయ వంతంగా నిర్వహించారు. కాశీబుగ్గలో ఉద్రిక్తత కాశీబుగ్గలో తెల్లవారుజామున నుంచి ఉద్రిక్త పరిస్థి తి చోటు చేసుకుంది. పోలీసుల నిర్బంధాలు దాటుకుని రకరకాల మార్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్నదాతలు కాశీబుగ్గ తరలివచ్చారు. కానీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును గృహ నిర్బంధం చేశారు. దీంతో వాగ్వాదం జరి గింది. అనంతరం పోలీసులు కొందరిని బలవంతంగా వాహ నం ఎక్కించి ఆర్డీఓ ఆఫీస్‌కు తరలించారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నాక సీదిరి అప్పలరాజు తో పాటు పార్టీ పార్లమెంట్ పరిశీలకులు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) దుంపల రామారావు, రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, తదుపరి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు కవిటి మండలంలో వారి ఇళ్ల వద్ద జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు వారి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. టెక్కలిలో నిర్బంధాలు.. టెక్కలి వైఎస్సార్ జంక్షన్ సమీపంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ను పోలీసులు నిర్బంధించారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆర్డీవో కార్యాలయం వద్దకు వాహనంలో తరలించా రు. దీంతో వైఎస్సార్ జంక్షన్లో కార్యకర్తలు నినాదాలు చేయగా వా రిని అరెస్టు చేశారు. ఆర్డీవో కా ర్యాలయం వద్ద పార్టీ పార్లమెంట్ పరిశీలకులు కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, సమన్వయకర్త పేరాడ తిలక్ తదితరులు వినతి పత్రం అందజే శారు. అంతకుముందు పాతప ట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని, మిగతా నాయకుల ను గృహ నిర్బంధం చేశారు. నరసన్నపేటలో ఆంక్షలు నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎంపీపీ ఆరంగి మురళీలతో పాటు పలువురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ తర్వాత కృష్ణదాస్‌కు, కుంభా రవిబాబుకు అనుమతి ఇచ్చారు. 11 గంటలకు జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య పార్టీ కార్యాలయానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు, రైతులు ఒక్క సారిగా చేరారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద పూల మాల వేసి ధర్నా నిర్వహించారు. అక్కడే కృష్ణ చైతన్యతో రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) కరిమి రాజేశ్వరరావుతో పాటు పలువురు నాయకుల్ని అరెస్టు చేశారు. తర్వాత విడుదలైన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఎచ్చెర్లలో.. రణస్థలం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్న మా జీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, రైతులను పోలీసులు అడ్డగించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులను సైతం ఎక్కడికక్కడ నిర్బంధించారు. చివరికి కొద్దిమందితో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఆమదాలవలసలో.. ఆమదాలవలసలో పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను తొలుత ఆయన ఇంటి వద్ద నిర్బంధించారు. పార్టీ కార్యాలయం వద్ద కూడా పోలీసు లు నిర్బంధించారు. అనంతరం రైతులతో కలిసి త హసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి అందజేశారు. తమ్మినేని ఇంటి వద్ద ఉద్రిక్తత టెక్కలిలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన మాజీ స్పీకర్, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాంను ఆయన ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళంలో అడ్డంకులు శ్రీకాకుళంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు మో హరించారు. వారిని తప్పించుకుని ఆర్డీవో ఆఫీస్‌కు వచ్చి రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ జోన్ ప్రెసిడెంట్ గొండు రఘురాం, ధర్మాన రామ్ మనోహర్‌నాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ మోకళ్ల తాతబాబు, ఎచ్చెర్ల శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేశారు. నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు ప్రజా ఉద్యమాలను గృహ నిర్బంధాలతో ఆప లేరు. పాలన చేయలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు. రైతులు గంటల తరబడి యూరియా కోసం వేచి ఉండడం దారుణం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత దుర్భర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ ఎప్పుడూ నిర్లక్ష్యమే.. నాల్గో సారి సీఎంగా గద్దెనెక్కిన చంద్రబాబుకు వ్యవసాయం అన్నా, రైతులన్నా ఎప్పుడూ నిర్లక్ష్యమే. ఒక రోజు వ్యవసాయం దండగ అంటారు. మరో రోజు యూరియా అవసరం లేదంటారు. ఇంకోరోజు కొద్దిగా యూరియా సరిపోతుందంటారు. 15 రోజుల్లో వేయాల్సిన ఎరువు ఇప్పటికీ ఇవ్వకపోతే పంట ఏమైపోతుందోనన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి. యూరియా కేవలం టీడీపీ వాళ్లకే దొరుకుతోంది. మిగిలిన వారు కూడా రైతులే అన్న సంగతి గుర్తించాలి. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రైతుల కన్నీరు గుర్తించాలి ప్రభుత్వం రైతుల కన్నీరు చూడాలి. యూరియా కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. పల్లెల్లో ఎరువు పసుపు కండువా వేసుకున్న వారికే అందుతోంది. సీఎం ఫొటో మాత్రమే చంద్రబాబుది.. అధికారాలు మాత్రం లోకేష్‌వి. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో లేరో తెలీని పరిస్థితి. ఆ శాఖకు పూర్తిగా తాళాలు వేసేశారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి చంద్రబాబువి చేతకాని మాటలు జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంగా కాగా 37 శాతం కూడా పంపిణీ చేయలేదు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించడం అందరికీ తెలిసిందే. రైతులకు ఎరువులు ఇవ్వలేక చెబుతున్న చేతకాని మాటలివి. – కుంభా రవిబాబు, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరసన్నపేటలో రైతు నిరసన -
కుల సంఘాలు సమాజసేవ చేయాలి
నరసన్నపేట: కుల సంఘాలు సమాజ సేవలో ముందుండాలని కళింగ కోమట్లు సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధి, కళింగకోమటి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయిన రమేష్ అన్నారు. నరసన్నపేటలోని ఓ కన్వెన్షన్ హాలులో జిల్లా కళింగ కోమట్లు సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలన్నారు. కళింగ కోమట్లు రాష్ట్ర సంఘం ప్రతినిధి బోయిన గోవిందరాజులు, జిల్లా సంఘం ప్రతినిధి తంగుడు జోగారావు తదితరులు మాట్లాడుతూ కళింగ కోమట్ల అభివృద్ధే ధ్యేయమన్నారు. కాగా, జిల్లా కళింగ కోమట్లు సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక వాయిదా పడింది. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు జోగారావు తెలిపారు. కార్యవర్గం ఎన్నికకు గోవిందరాజులు అధ్యక్షతన మరో 8 మందితో కూడిన కమిటీని నియమించామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఇచ్ఛాపురం : విశాఖపట్నం సీతమ్మధారలో మూగబాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్–1 ఉలాల భారతి దివ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నేరస్తులను వెంటనే పట్టుకుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. -
తాయిలాల కోసం తోపులాట
తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలకు ఇచ్చే తాయిలాల కోసం తోపులాట జరిగింది. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలిలో గల ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంగళవారం నిర్వహించిన సీ్త్ర శక్తి కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభకు వస్తే తాయిలాలు ఇస్తామని చెప్పడంతో మహిళలు తరలివచ్చారు. వారికి జాకెట్ పీస్‌లు ఇస్తుండటంతో సభలో ఉన్నవాళ్లంతా ఒక్కసారి చేరడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే మిగిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం కల్పించామన్నారు. త్వరలోనే ట్రాన్స్జెండర్లకు, మహిళలకు ఉచిత ప్రయాణం కోసం స్మార్ట్‌కార్డులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైడిశెట్టి జయంతి, మాదారపు వెంకటేషు తదితరులు పాల్గొన్నారు. -
చిక్కుముడి!
బాల్యానికి.. ● జిల్లాలో ఆగని బాల్య వివాహాలు ● రాష్ట్రంలో మూడో స్థానం ● చదువుకు దూరమవుతున్న బాలికలు ● జీవితాంతం వెంటాడుతున్న రుగ్మతలు హిరమండలం: బడిబాట పట్టాల్సిన బాలికలు పెళ్లిపీటలెక్కుతున్నారు. తెలిసీ తెలియని వయసులో వారిని మూడుముళ్ల బంధంలో చిక్కుకుంటున్నారు. చదువు, ఆటపాటలతో హాయిగా గడవాల్సిన సమయంలో గర్భం దాల్చుతున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు, కట్టుబాట్లతో పెద్దలే చిన్నారులకు పెళ్లిచేసి అత్తారింటికి పంపుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వలసలు వెళ్లే పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 11 తీర ప్రాంతాల్లో సైతం బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు అనేవి ఒక సంప్రదాయంగా వస్తున్నాయి. అక్కడ కులం కట్టుబాట్లతో ఎక్కవగా చిన్ననాటే పెళ్లిళ్లు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో చాలావరకూ బాల్య వివాహాలు అదుపులోకి వచ్చాయి. అవగాహన ఉన్నవారు తమ పిల్లల విషయంలో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ, నిరక్షరాస్యులు మాత్రం ఆడపిల్లలను భారంగా పరిగణించి బాల్య వివాహాలు చేసేస్తున్నారు. సమాచారం అందుకుంటున్న అధికారులు 2020–21లో 114, 2021–22లో 68, 2022–23లో 144, 2023–24లో 96, 2024–25లో 28 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2025–26కు సంబంధించి 18 బాల్య వివాహాలను అడ్డుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక భారంతో.. శ్రీకాకుళం ప్రధానంగా వలసల జిల్లా. చాలా గ్రామాల్లో భార్య, భర్త ఇద్దరూ పనికి వెళితే గానీ పూటగడవని పరిస్థితి. ఈ నేపథ్యంలో పదో తరగతి వరకూ ఆడపిల్లలను చదివించి వెంటనే వివాహాలు జరిపించేస్తున్నారు. ఇలా చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని అనుకుంటున్నారే తప్ప.. బాల్య వివాహాలతో తమ పిల్లలను అనారోగ్య కూపంలోకి తోసివేస్తున్నామన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఆ జాబితాలో జిల్లా.. రాష్ట్రంలో 45 శాతానికి మించి బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం మూడోస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో 23 శాతం మంది 15 నుంచి 18 సంవత్సరాల్లోపు బాలికలే అమ్మలుగా మారుతున్నారు. బాల్యంలో తల్లులు కావడం అనేది గతంతో పోల్చుకుంటే తగ్గినప్పటికీ.. బాల్య వివాహాలు మాత్రం ఆగకపోడం ఆందోళన కలిగిస్తోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. 15 నుంచి 19 ఏల్ల వయసులోపు బాలికలు నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉంటారు. తల్లిగా మారే సమయంలో బాడీ మాస్ ఇండెక్స్ తగ్గడంతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో చనిపోవడం, వైకల్యంతో పుట్టడం, ఆరోగ్యకరమైన ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఫిర్యాదు చేయవచ్చు.. బాల్య వివాహాలు జరిగితే నిర్భయంగా 1098, 100, 181 వంటి టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలకు సైతం సమాచారం అందించవచ్చు. జిల్లా అధికారులు రంగంలోకి దిగి స్థానిక పోలీసుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణకు ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా కూడా బాల్య వివాహాల సమాచారం చేరవేయవచ్చు. అయితే, ఇటీవల ఫేక్ ఫిర్యాదులు చేస్తుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారాల కారణంగా కొంతమంది తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. నిజంగా బాల్య వివాహం జరుపుతుంటే మాత్రం నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు వచ్చి తప్పకుండా అడ్డుకుంటారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపిస్తే ఫిర్యాదు చేయాలి. ఎటువంటి భయం అవసరం లేదు. స్థానిక పోలీసుల రక్షణలోనే విచారణ జరుగుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. వారి సమ్మతితోనే వివాహాన్ని నిలుపుదల చేయిస్తాం. బాల్య వివాహాలతో అనారోగ్యం తప్పదు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. దీనిపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం – ఐ.విమల, ఐసీడీఎస్ పీడీ, శ్రీకాకుళం ఎల్‌ఎన్‌పేట మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు వివాహం చేయాలని నిశ్చయించారు. సన్నాహాలు కూడా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులో వివాహం జరిపితే కలిగే అనర్థాలను వివరించారు. దీంతో తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. హిరమండలానికి ఓ కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి చదువుతున్న కుమార్తెకు వివాహం జరపాలని నిర్ణయించారు. బాలికకు పెళ్లి ఇష్టం లేదు. దీంతో స్నేహితుల ద్వారా చైల్డ్‌లైన్ అధికారులను ఆశ్రయించింది. వారు వచ్చి కౌన్సెలింగ్ ఇవ్వడంతో తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. -
కదం తొక్కిన జీడి కార్మికులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం మందస జీడి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు, జీడి కార్మిక సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీడి కార్మికులకు పూర్తిస్థాయి పని దినాలు కల్పించాలని, కాల్చిన పిక్కలు అక్రమ తరలింపు ఆపాలని కోరుతూ శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందస జీడి యాజమాన్యాలు కాల్చిన పిక్కలను పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు ఇవ్వకుండా అక్రమంగా వేరే ప్రాంతాలకు తరలిస్తుంటే ప్రభుత్వం యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మికులకు పని కల్పించకుండా, లైసెన్సులు లేకుండా ఇతర ప్రాంతాలకు అక్రమ పద్ధతిలో తరలించడం సరికాదన్నారు. కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని, కనీస వేతనాలు గానీ, పీఎఫ్, ఈఎస్ఐ, అదనపు పనికి అదనపు వేతనం వంటివి అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల పోరాటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, రైస్ మిల్లు కార్మిక సంఘం నాయకులు కె.కేశవరావు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, జిల్లా జీడి కార్మిక సంఘం నాయకులు అల్లు హేమలత, సీహెచ్ చంద్రమ్మ, సీహెచ్ జానకమ్మ, కె.శేషమ్మ, పి.సావిత్రి, జి.బాలమ్మ, కె.కుమారి, కె.శాంతమ్మ, కె.సరస్వతి, బి.భారతి, కె.ధనం, డి.లక్ష్మి, ఎం.దానమ్మ, డి.భారతమ్మ పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతం కాకూడదు
● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం క్రైం: బాధితుల నుంచి స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి వారి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 52 మంది ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరితమైన, ఆస్తి తగదాలు, కొట్లాట, ఇతరత్రా సమస్యలపై 52 ప్రజా ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. -
సకాలంలో వినతులు పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్కు 75 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సకాలంలో అధికారులు పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా వివిధ శాఖలకు చెందిన 75 వినతులు స్వీకరించారు. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 23 దరఖాస్తులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు 16, మున్సిపల్ శాఖకు 5, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెరో 4 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా నీటి వనరులు, సర్వే సెటిల్మెంట్స్, వ్యవసాయం, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెరో 3 ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, డిప్యూటీ కలెక్టర్ (డీఎంపీసీ) టి.వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వినతులు పరిశీలిస్తే... ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్, డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.30,000ల చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఆటో డ్రైవర్లు వినతిపత్రం అందజేశారు. ఫ్రీ బస్సు పథకం వలన తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర అధిక వడ్డీలకు అప్పులతో ఆటోలను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ● సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు గ్రామ పంచాయతీ బొంతుగూడ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరారు. ● ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్‌లు, మౌఖాన్ల గౌరవ వేతనాలు చెల్లించాలని జిల్లా మైనారిటీ సెల్ కమిటీ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడం తగదన్నారు. ● తనకు వారసత్వంగా అనుభవ స్వాధీనంలో ఉన్న ఆస్తిని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేశారని శ్రీకాకుళం మండలం కనుగులవానిపేటకు చెందిన టీడీపీ నాయకుడు ఇప్పిలి వెంకట శివలక్ష్మీ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం మండలం కనుగులవానిపేట రెవెన్యూలోని సర్వే నంబర్ 208/2లో 5.50 ఎకరాలు షెడ్యూల్ ఆస్తికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, భూ హక్కులు కలిగి ఉన్న ఇప్పిలి వరలక్ష్మి మరణానంతరం, కనుగుల సత్యారావు దౌర్జన్యంగా ఆక్రమించుకొని, హక్కుదారులపై కేసులు బనాయిస్తున్నాడని వాపోయారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కాగా ఫిర్యాదు చేసిన ఇప్పిలి వెంకట శివలక్ష్మీ ప్రసాద్, ఆక్రమణలకు పాల్పడినవారు టీడీపీకి చెందినవారే కావడం గమనార్హం. బూర్జ మండలంలోని నీలాదేవిపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మోటార్లు పాడైపోయి 5 గ్రామ పంచాయతీల పరిధిలోని 800 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ విషయంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. అలాగే ఆమదాలవలస మండలం పొన్నంపేట గ్రామంలో ఇదివరకే ఒక శ్మశానవాటిక ఉంటుండగా, రాజకీయ కారణాలతో రెండో శ్మశానవాటిక ఏర్పాటు చేయడానికి అధికారుల సన్నాహాలు నిలుపుదల చేయాలన్నారు. పొందూరు మండలంలోని చాలా గ్రామాల్లో రైతులకు ఎరువులు అందలేదని, సక్రమంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆయనతో పాటు పలువురు రైతులు ఉన్నారు. -
అన్నదాత పోరును విజయవంతం చేయండి
నరసన్నపేట: రైతులు ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారని కనీసం యూరియా కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని వారికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ‘అన్నదాత పోరు’ కార్యక్రమం తలపెట్టిందని, దీన్ని జిల్లాలో విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గడిచిన నెల రోజులుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని అన్నారు. అందుకే జిల్లాలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. పలాస, టెక్కలిలో ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్లల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. -
23 నుంచి కొత్తమ్మ తల్లి జాతర
శ్రీకాకుళం పాతబస్టాండ్: కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ఈ సారి కూడా సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సమక్షంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ఉచిత దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని, శోభా యాత్ర, గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఫైర్ వర్క్స్, హెలికాప్టర్ రైడింగ్ సవ్యంగా నిర్వహించాలన్నారు. చిన్నపిల్లలకు పాలు, భక్తులకు మంచినీరు అందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమానికి టెక్కలి ఆర్డీవోను ఇన్చార్జిగా నియమించామని, ట్రాఫి క్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ బాధ్యతలు టెక్కలి ఎస్డీపీఓకు అప్పగించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో రోగుల అవస్థలు టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. అయితే వారు కూర్చునేందుకు సైతం సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కిందే కూర్చుని నిరీక్షించాల్సి వస్తోంది. ఆలయాల్లో గ్రహణ శుద్ధి అరసవల్లి: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం జిల్లాలో అన్ని ప్రధాన ఆలయాల తలుపులు తెరచుకున్నాయి. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంతో పాటు అన్ని ఆలయాల్లో గ్రహణానంతర శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ శాస్త్ర ప్రకా రం అక్కడి అర్చకులు జరిపించారు. అరసవల్లిలో సోమవారం వేకువజామున గ్రహణ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించి విశేష పూజలు చేశారు. తర్వాత ఉదయం 7.30 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచి భక్తులకు సర్వ దర్శనాలకు అనుమతించారు. ముఖలింగంలో.. జలుమూరు: సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం సోమవారం శ్రీముఖలింగం ఆలయంలో అర్చకులు శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఆలయంలోని విగ్రహాలకు గంగ, వంశధార జలాలలతో అభిషేకం చేశారు. శ్రీకూర్మంలో.. గార: శ్రీకూర్మనాథాలయంలో సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉషోదయం పూజలనంతరం భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
పలాస: టెక్కలి నుంచి ఒడిశా ప్రాంతానికి వ్యానులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కాశీబుగ్గ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు పోలీసులు దాన్ని అప్పగించారు. దీంతో పలాస సివిల్ సప్లయ్ అధికారి(సీఎస్‌డీటీ) ఎం.తిరుపతిరావు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్కలి, కోటబొమ్మాళిలో సేకరించిన ఈ బియ్యాన్ని ఒడిశా రాష్ట్రానికి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో, కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో లక్ష్మీపురం టోల్ గేటు వద్ద పట్టుకొని వాహనాన్ని సీజ్ చేసి తమకు అప్పగించారన్నారు. వాహనంలో మొత్తం 220 బస్తాల్లో సుమారు 10 టన్నుల బియ్యం ఉన్నాయన్నారు. బియ్యాన్ని పలాస ఎంఎల్సీ పాయింటు వద్ద అప్పగించి వాహనాన్ని తిరిగి పోలీసుస్టేషన్‌కు పంపిస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టరుకు చెప్పి తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.జాతీయ పోటీలకు నడగాం విద్యార్థినరసన్నపేట: జాతీయ స్థాయి యోగాసన పోటీలకు మండలంలోని నడగాం గ్రామానికి చెందిన బొత్స మనోహర్‌నాథ్ ఎంపికయ్యాడు. డిసెంబర్ 27 నుంచి 30వ తేదీ వరకూ రాంచీలో యోగా స్పోర్ట్స్ చాంపియన్–2025 పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో మనోహర్‌నాథ్ పాల్గోనున్నట్లు తండ్రి కేదారనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 6, 7వ తేదీల్లో ఏపీ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు తిరుమలలో జరిగాయన్నారు. ఈ పోటీల్లో మనోహర్‌నాథ్ కాంస్య పతకం సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ తరుపున పాల్గోనున్నట్లు వివరించారు. కాగా తమ గ్రామానికి చెందిన బాలుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై గ్రామానికి చెందిన నాయకులు లుకలాపు రవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.ఆటోపై కూలిన తాటి చెట్టురణస్థలం: మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షాలకు రణస్థలం మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో రామతీర్థాలు రహదారిపై వెళ్తున్న ఆటోపై తాటిచెట్టు విద్యుత్ వైర్లతో సహా ఆకస్మాత్తుగా కూలిపోయింది. అయితే అదృష్టావశాత్తు ఆటోలో ఉన్న డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న ప్రయాణిలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వర్షం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. -
నలుగురు వ్యక్తులకు రిమాండ్
ఆమదాలవలస: మండలంలోని చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి పూర్ణ (22) అనే వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి సింహాచలం, పద్మ దంపతుల కుమార్తె పూర్ణకు పట్టణంలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన సాయిపల్లి మధుసూదనరావుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. అయితే పూర్ణను అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడంతో కన్నవారింటికి చేరుకుంది. అనంతరం మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు కారణమైన భర్త మధుసూదనరావు, మామ లక్ష్మణ, అత్త సరస్వతీ, మరిది ఈశ్వరరావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. నలుగురి ముద్దాయిలను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ ఎస్.బాలరాజు పాల్గొన్నారు. గంజాయితో నలుగురు అరెస్టు పలాస: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి నెల్లూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పలాస రైల్వేస్టేషన్లో ఆదివారం నలుగురు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 6.115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో సోమవారం తెలియజేశారు. దీంతో నెల్లూరు జిల్లా బుజబుజ గ్రామానికి చెందిన సయ్యద్ సుల్తాన్, బి.అరుణకుమార్, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి గ్రామానికి చెందిన సాయిక్ జాఫర్, తమిళనాడు రాష్ట్రం అనిస్నగర్కు చెందిన విచిత్రదేవిలపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేసి, పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. వీరి నుంచి గంజాయితో పాటు ఒక సెల్‌ఫోను, రూ.1,020ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
చిత్తశుద్ధి కొరత
పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు క్యూలలో నిలబడుతున్నారు. స్టేషన్లలో ఉండాల్సిన పోలీసులు రైతులకు కాపలా కాస్తున్నారు. ఆర్ఎస్కేలలో ఉండాల్సిన ఎరువులు అధికార పార్టీ నేతల భవంతులకు వెళ్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన నాయకులు అసలు కొరతే లేదని చెబుతున్నారు. ఈ ఖరీఫ్‌కు సర్కారు సాయం లేకుండానే జిల్లాలో వ్యవసాయం జరుగుతోంది. సాగు విస్తీర్ణం మొదలుకుని, ఎరువుల ఇండెంట్ నమోదు వరకు అన్నింటా తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎరువుల కొరతతో పాటు సర్కారు చిత్తశుద్ధిలోనూ ‘కొరత’ కనిపిస్తోంది.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పొలం పనుల్లో తీరిక లేకుండా గడపాల్సిన అన్నదాతలు క్యూలో నిలబడి బేజారవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో 4.07లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ వరి పంటే 4లక్షల 15వేలకు పైగా సాగు అవుతున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇతర పంటలు ఉండనే ఉన్నాయి. వరికై తే ఎకరాకు 75 కిలోలు, మొక్కజొన్నకు ఎకరాకు 7 నుంచి 8 బస్తాలు, తోట పంటలకు ఎకరాకు 10 నుంచి 12 బస్తాల యూరియా అవస రం ఉంటుంది. ఈ లెక్కన వరికై తే 30 వేల టన్ను లు, మొక్కజొన్నకు 14వేల టన్నులు, వివిధ రకాల తోటలకు మరో 7వేల టన్నులు అవసరం ఉంటుంది. ఇలా జిల్లాకు 51వేల టన్నులు అవసరం ఉంటుంది. కానీ, ప్రభుత్వం ఇంతవరకు 23 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకొచ్చింది. ఇది ఎటూ సరిపోలేదు.ప్రణాళిక ఉందా..?వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా 44వేల నుంచి 46వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసేవారు. రైతుల నుంచి ముందుగా ఇండెంట్ తీసుకునేవారు. ఇప్పుడు ముందస్తు ప్రణాళిక అనేదే లేకుండాపో యింది. సరిపడా యూరియాను తీసుకురావడంలో సర్కారు విఫలమైంది. దానికి తోడు 23వేల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చినట్టు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ యూరియా కూడా కనిపించడం లేదు. పంపిణీలో రాజకీయం జోక్యం పెరగడంతో పాటు సరుకు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో యూరియా దొరకడం లేదు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియా కో సం నానా తిప్పలు పడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ. 270కు అమ్మాల్సిన యూరియా బస్తాను ధర పెంచి అమ్ముతున్నారు.వ్యూహం లేకుండా..జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి మూడు జోన్లు ఉన్నాయి. జోన్–1 పరిధిలోని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ముందు సాగు ప్రారంభం కానుండటంతో ఇక్కడ యూరియా సరఫరా చేయాలి. దీనికి 15 రోజుల్లో జోన్ 2 పరిధిలోని నరసన్నపేట నుంచి నందిగాం వరకు యూరియా సరఫరా చేయాలి. ఇక్కడికి 15 రోజుల్లో జోన్ 3 పరిధిలోని పలాస, ఇచ్ఛాపురం ఏరియాలకు యూరియా సరఫరా చేయాలి. దీనికోసం ముందు ఎరువుల ఇండెంట్ తీసుకుని పక్కాగా సిద్ధం చేయాలి. కూటమి ప్రభు త్వంలో వ్యూహాత్మక కార్యాచరణ కనిపించలేదు.మాఫియా కుట్రలు...జిల్లాలో ఆరుగురు హోల్ సేల్ డీలర్లు, 360 మంది రిటైలర్లు ఉన్నారు. జూన్ వరకు వచ్చిన యూరియాలో 50 శాతం ప్రభుత్వ సంస్థలకు ఇవ్వగా, మిగతా 50శాతం ప్రైవే టు వ్యాపారులకు ఇచ్చారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిల్లాకు 15 మెట్రిక్ టన్నుల యూ రియా వచ్చింది. వాస్తవంగా ఆ సమయానికి సాగు జరగలేదు. దీంతో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన యూరియాను కూడా ప్రైవేటు వ్యాపారులకే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జిల్లాలోని అత్యఽధిక మంది డీలర్లు కీలక నేత సోదరుడికి సన్నిహితంగా ఉండటంతో వారు చెప్పిందే వేదంగా నడుస్తోంది. ప్రైవేటుకు అన్ని ఎరువులు వెళ్లిపోయాక ఆ తర్వాత జిల్లాకొచ్చిన యూరియాలో ప్రభుత్వ సంస్థలకు 70శాతం, ప్రైవేటు వ్యాపారులకు 30శాతం కేటాయింపులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన యూరియాపై రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో అది కూడా పక్కదారి పట్టింది.● తెంబూరులో..తెంబూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో యూరియా వచ్చిందని రైతులకు తెలియటంతో ఒకేసారి రైతు సేవా కేంద్రానికి తెంబూరు, పెద్దలక్ష్మిపురం, రామచంద్రాపురం, వెంకటాపురం, పెద్ద సరియాపల్లి, ద్వారకాపురం రైతులు వచ్చి బారులు తీరారు. దీంతో వ్యవసాయాధికారులు టోకెన్ ద్వారా యూరి యా అందజేసి, మరో రెండు రోజుల్లో 8.5 మెట్రిక్ టన్నులు వస్తుందని సర్దిచెప్పారు. – పాతపట్నంరైతులు బతకొద్దా..?మాకు తగిన శాస్తే జరిగింది. ఉభాలు వేసి 45 రోజులవుతోంది. ఒక్కసారి కూడా ఎరువు వేయలేదు. ఇంకెప్పుడు వేయాలి. రైతులు బతకొద్దా..? – లక్ష్మణరావు, ముసిడిగట్టు● అధికారుల నిలదీతనరసన్నపేటలో సోమవారం యూరియా పంపిణీ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మన గ్రోమోర్ సెంటర్‌కు యూరియా వచ్చిందని రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 11 గంటల వరకు క్యూలో ఉన్నా ఒక్క బస్తా కూడా లభించలేదు. దీనికి తోడు అధికార పార్టీ వారు వచ్చి చీటీలు తీసుకెళ్లిపోయారు. ఈలోగా గ్రోమోర్ సెంటర్ షట్టర్లు మూసేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన ఎస్ఐ సీహెచ్ దుర్గప్రసాద్, ఏఓ సూర్యకుమారిలను నిలదీశారు. నరసన్నపేట రైతులకు మాత్రమే ఇక్కడ ఇస్తామని చెప్పగా.. మిగిలిన వారు రైతులు కాదా అని అక్కడున్న వారు ప్రశ్నించారు. –నరసన్నపేట● అన్నదాతల ధర్నాయూరియా కోసం కొత్తూరు రైతులు సోమవారం పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం తెల్లవారుజాము 6 గంటలకే రైతులు మన గ్రోమోర్ సెంటర్‌కు వచ్చారు. ఏడు గంటల నుంచి యూరియా ఇచ్చారు. కానీ వ్యవసాయ అధికారులు తమకు నచ్చిన వారికి మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం నెలకొంది. సుమారు రూ.1750 ఖరీదు గల పొటాష్ కొంటేనే యూరియా ఇస్తున్నారని కొందరు తెలిపారు. అలికాం–బత్తిలి రోడ్డులో రైతులు ధర్నాకు దిగారు. అధికారులు వెళ్లి యూరియా నిల్వలు ఉన్నాయని వారికి సర్ది చెప్పారు. వారందరినీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజి వద్దకు తీసుకు వెళ్లి స్లిప్పులు ఇచ్చి పంపించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. గ్రోమోర్ సెంటర్ సిబ్బంది నిర్వాకం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని అధికారులు తెలిపారు. యూరియా పక్కదారి పడుతోందని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు గండివలస ఆనందరావు ఆరోపించారు. – కొత్తూరు● రైతుల అగచాట్లుకంచిలి మన గ్రోమోర్ కేంద్రం వద్ద రైతులు అగచాట్లు పడ్డారు. ప్రభుత్వం ద్వారా సరపడా ఎరువులు సమయానికి సరఫరా చేయకపోవడంతో, సరఫరా చేసిన కొద్దిపాటి ఎరువుల కోసం రైతుల ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది. – కంచిలివ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో.. టెక్కలి: వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో యూరియా లేకపోవడంతో రైతులంతా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సోమవారం కోటబొమ్మాళిలో గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులంతా బారులు తీరారు. యూరియా కష్టాలపై మంగళవారం వైఎస్సార్ సీపీ ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో 48 గంటల్లో యూరియా వచ్చేస్తుందని ప్రచారాలు మొదలుపెట్టారు.రైతుర్యాలీపై పోలీసుల ఆంక్షలుటెక్కలిలో వైఎస్సార్సీపీ తలపెట్టిన రైతు ర్యాలీ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30 వరకు ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు చేయకూడదని ఆంక్షలు విధిస్తూ ప్రకటన జారీ చేశారు.అక్రమ ఎరువులు సీజ్ కంచిలి: డోలగోవిందపురం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు చేయడానికి రెండు గోడౌన్లలో నిల్వ చేసిన ఎరువుల్ని విజిలెన్స్ కమిటీ అధికారుల బృందం సోమవా రం సీజ్ చేసింది. అరవసరియాపల్లి గ్రామానికి చెందిన బొండాడ అప్పలస్వామి, బొండాడ తిరుపతి, బొండా డ టొంకాడు అనే వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నారని వారి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. లడ్డుకేశవ పాత్రోకు చెందిన రెండు గోడౌన్లలో నిల్వచేసిన 18 బస్తాల యూరియా, 15.15.15 కాంప్లెక్స్ ఎరువు 17 బస్తాలు, పొటాషియం హ్యూమేట్ 13 బస్తాలు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ 10 బస్తాలు, 20.20.0 కాంప్లెక్స్ 5 బస్తాలు సీజ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని పెదపాడు పరిసర ప్రాంతం మైస్టోర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెండువానిపేట గ్రామానికి చెందిన కింజరాపు గంగరాజు(30) అనే వ్యక్తి ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న పెదపాడుకు చెందిన ఒక వ్యక్తి ఢీకొన్నాడు. దీంతో గంగరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడు తండ్రి కింజరాపు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫోన్లో... రుణ రక్కసి..!
● లోన్ పేరుతో యువతకు యాప్‌ల వల ● ష్యూరిటీ లేకుండానే అప్పులు ● ఆపై అధిక వడ్డీల కోసం వేధింపులు ● ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు ఎటువంటి ష్యూరిటీ లేకుండానే క్షణాల్లో రుణం పొందవచ్చని ఆశ చూపుతారు. యాప్ డౌన్లోడ్ చేసి క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. చేతికొచ్చే నగదు ఖర్చు చేసేలోపే యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్ల మోత మొదలవుతుంది. వడ్డీ కట్టాలని వేధిస్తూ బూతులతో రెచ్చిపోతారు. కడతామని చెప్పినా.. వాళ్ల కర్కశం ఆగదు. మనకు తెలియకుండా డేటా చోరీ చేసి ఫేక్ నగ్న ఫొటోలను కాంటాక్ట్ లిస్టులో ఉన్నవాళ్లకు పంపే దుశ్చర్యకు పాల్పడతారు. ఇలా ఉక్కిరిబిక్కిరి చేసి మన పరువు తీసే వ్యూహానికి ఒడిగడతారు. వారి ఆగడాలకు బలైపోతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. అందుకే రుణ రక్కిసి వలలో చిక్కకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హిరమండలం: పెరుగుతున్న టెక్నాలజీని కొందరు కేటుగాళ్లు ఉపయోగించుకుంటూ అమాయకులకు గాలం వేస్తున్నారు. ష్యూరిటీ లేకుండానే రుణం అని చెప్పి ఆకర్షిస్తున్నారు. అలా ప్రైవేటు యాప్‌ల ద్వారా రుణం తీసుకున్న తర్వాత అసలు కథ మెదలవుతుంది. తీసుకున్న నగదు కంటే వడ్డీకి వడ్డీ వేసి అధిక మెత్తం కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే ఫేక్ నగ్న వీడియోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. వారి టార్చర్ తట్టుకోలేక కొందరు లోలోపలే కుంగిపోతుంటే.. మరికొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. అందువలన ప్రైవేటు యాప్స్‌లో రుణాలు తీసుకుని మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనేకమంది బాధితులు మీ సెల్ఫోన్లో ఒకే ఒక క్లిక్‌తో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హామీ లేకుండా రుణం పొందండంటూ రుణయాప్ నిర్వహకులు ఇచ్చే ప్రకటనలతో కొందరు వెంటనే డౌన్లోడ్ చేసేస్తున్నారు. ఇదే వారి పాలిట శాపంగా మారుతోంది. ఒక్కసారి యాప్ వలలో చిక్కితే బయటపడడం అసాధ్యం. ఇలా యాప్‌ల బారిన పడినవారు జిల్లాలో అనేక మంది బాధితులు బయటకు చెప్పుకోలేక మదన పడుతున్నారు. లోన్‌యాప్స్ నిర్వహకుల వలలో పడి అవస్థలు పడుతున్నారు. మీరు రుణం తీసుకోవడానికి ఎంపికయ్యారంటూ ఫోన్లు చేసి యువతకు వల వేస్తున్నారు. చూద్దామని చెబితే చాలు.. రుణం తీసుకునే వరకు ఫోన్ చేసి, ఏదోవిధంగా ఒప్పించి రుణం తీసుకునేలా చేస్తారు. తీరా లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంటే చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి స్మార్ట్ ఫోన్లో మనకు తెలియని యాప్‌లు కనిపిస్తే వాటి జోలికి వెళ్లవద్దు. అదేవిధంగా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమని అడిగినా చెప్పవద్దు. ప్రతీ యాప్‌ను క్లిక్ చేయకూడదు. క్లిక్ చేశారంటే ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. రుణయాప్‌లో అప్పులు తీసుకుని మెసపోవద్దు. హామీ లేకుండా రుణాలు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ పడవద్దు. రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోన్‌యాప్ నిర్వాహకుల నుంచి ఎటువంటి వేధింపులు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – సీహెచ్ ప్రసాద్, సీఐ, కొత్తూరు హిరమండలానికి చెందిన ఒక వ్యాపారి కుమారుడు లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. అయితే అతను సక్రమంగా చెల్లించకపోవడంతో యాప్ నిర్వహకులు గ్రామంలోని ఒకరికి ఫోన్‌చేసి మీరు ష్యూరిటీ పెట్టారు కదా చెల్లించండని వేధించారు. విసిగిపోయిన ఆయన మీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.. అని గట్టిగా చెప్పడంతో అప్పటినుంచి ఫోన్ కాల్స్ రావడం లేదు. ఇలాంటి బాధితులు గ్రామాల్లో ఎంతోమంది ఉన్నారు. బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. రుణం తీసుకున్న రోజు నుంచే చెల్లింపుల కోసం నిర్వాహకులు తీవ్రంగా ఒత్తిడి చేస్తారు. చెల్లింపులు ఆలస్యమయ్యే కొద్దీ వేధింపులు తీవ్రతరమవుతాయి. రుణ గ్రహీత మైబెల్కు పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులతో దుష్ప్రచారాలతో కూడిన సందేశాలు, అభ్యంతరకర ఫొటోలు పంపుతారు. బెదిరింపులను లెక్క చేయకపోతే రుణం తీసుకున్నవారి కుటుంబ సభ్యుల ఫొటోలను మార్పింగ్ చేసి, రుణం పొందిన వారి సెల్‌ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లకు వాట్సప్‌కు పంపుతారు. వీరి ఆగడాలు కొందరు బయట చెప్పుకోలేక నలిగిపోతున్నారు. కొందరు యువకులు రుణం తీర్చడానికి కుటుంబ సభ్యులను మోసం చేయడం, చోరీలకు సైతం పాల్పడడం జరుగుతున్నాయి. ముఖ్యంగా యాప్‌ల నిర్వాహకులు గ్రామీణ ప్రాంతాలపైనే కన్నేశారు. -
ఆర్ట్స్ కాలేజీ టు ఐఎన్ఎస్ఏ..
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) విజిటింగ్ సైంటిస్ట్‌గా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అప్లయ్డ్ సైన్సెస్ హెచ్ఓడీ డాక్టర్ మదమంచి ప్రదీప్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఐఎన్ఎస్ఏ నుంచి వర్తమానం అందుకున్నారు. న్యూఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ఏ ఏటా కొందరు శాస్త్రవేత్తలు, అధ్యాపకులను దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలైనా ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, నిట్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ప్రతిభ అధారంగా విజిటింగ్ సైంటిస్టులను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 70 మంది శాస్త్రవేత్తలు, లెక్చరర్లను ఐఎన్ఎస్ఏ ఎంపికచేయగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు లభించింది. ఆ జాబితాలో ఆర్ట్స్ కళాశాలకు చెందిన అప్లయిడ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ ప్రదీప్ ఒకరు. ఈయనతో పాటు మైలవరంలోని బోటనీ లెక్చరర్ జి.రాముడుకు అవకాశం లభించింది. తిరుపతిలో ప్రఖ్యాత విద్యాసంస్థ ఐఐఎస్ఈఆర్ వేదికగా నెలరోజుల పాటు పరిశోధన కార్యకలాపాలలో ప్రదీప్ భాగస్వామ్యం కానున్నారు. ప్రదీప్ సారథ్యంలో.. ఇండియన్ అకానమీ ఆఫ్ సైన్సెస్ రిఫ్రెషర్ కోర్సులను 2021, 2022 రెండు సంవత్సరాల్లో నిర్వహించారు. 50 మంది లెక్చరర్లకు కెరీర్ అడ్వాన్స్మ్మెంట్ స్కీమ్ (సీఏఎస్)లను అమలుపర్చగలిగారు. సెర్బ్ యాగ్జిలిలేటెడ్ విజ్ఞాన్ పథకంలో భాగంగా ఏడు రోజులపాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాంలు నిర్వహించారు. డీబీటీ సౌజ్యంతో ఎన్నో సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సైన్స్, అకాడమీల లెక్చరర్ల రీఫ్రీసెస్, డీఎస్టీ ఇన్స్పైర్ క్యాంప్స్, సైన్స్ ఎగ్జిబిషన్లు తదితర యాక్టివిటీలను నిర్వహించారు. కళాశాలకు ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు మంజూరయ్యేలా చేశారు. యూజీసీ–ఎన్ఎస్క్యూఎఫ్ ద్వారా ఆక్వా కల్చర్‌పై మూడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహించారు. పీసీఆర్ టెస్టులపై వర్క్‌షాప్, సర్టిఫికెట్ కోర్సులను అందించారు. డీబీటీ, యూజీసీ, సెర్బ్, రూసా రీసెర్చ్ ప్రాజెక్టులు చేశారు. యూజీ, పీజీ బయోటెక్నాలజీ విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వివిధ కంపెనీలు, లేబరేటరీలు, హాస్పిటల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరో ఏడు ఇండియన్ పేటెంట్స్, ఒక జర్మన్ పేటెంట్‌ను అందుకున్నారు. ఆరు బెక్చాప్టర్స్, స్కోపస్‌లో ఇండెక్స్‌లో నమోదైన 15 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించారు. తాజాగా 9,10, ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను పరిశోధనలవైపు ఆకర్షితులను చేసేందుకు ‘ప్రయాస్’ పేరిట ప్రత్యేక పథకాన్ని కొనసాగిస్తున్నారు. వీటిన్నింటిని ఆధారంగా చేసుకుని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) విజిటింగ్ సైంటిస్ట్‌గా ఎంపికచేశారు. 2022లో సెప్టెంబర్ 5న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు సైతం అందుకున్నారు. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయ గ్రామం. ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని విశాఖ–బి కాలనీలో నివాసముంటున్నారు. తల్లిదండ్రులు నరసింహ, ప్రమీల. కళాశాలలో నిర్విరామంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, రిసోర్స్ప్రొగ్రాంలు, ఓరియంటేషన్ కార్యక్రమాలతో విద్యార్థుల ఉన్నతికి, వారి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న డాక్టర్ ప్రదీప్ కళాశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. కళాశాలకు ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు కేటాయింపులో విశేష కృషి చేశారు. –డాక్టర్ శ్రీరాములు, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు) విజిటింగ్ సైంటిస్ట్ పథకం ద్వారా పరిశోధన సామర్థ్యం ఉన్నప్పటికీ అందుకు తగిన అవకాశాలు లేని అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పరిశోధన చేయటానికి వీలుపడుతుంది. కార్యక్రమంలో భాగంగా ఔషధ నిరోధక మూర్ఛరోగాలలో జీవ అణు అధ్యయనాలను రీసెర్చ్ చేయనున్నాం. దేశ్యాప్తంగా 70 మంది శాస్త్రవేత్తలు, లెక్చరర్ల జాబితాలో చోటులభించినందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ ప్రదీప్, హెచ్ఓడీ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ విజిటింగ్ సైంటిస్ట్‌గా డాక్టర్ ప్రదీప్ దేశవ్యాప్తంగా ఎంపికై న శాస్త్రవేత్తలు, లెక్చరర్ల జాబితాలో చోటు జిల్లా నుంచి ఎంపికై న మొదటి వ్యక్తిగా గుర్తింపు -
జీవనాధారం కూల్చేశారు
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఎంతో మంది ఫుట్‌పాత్ వ్యాపారులకు ఆసరాగా ఉన్న మహాత్మాగాంధీ కూరగాయల కాంప్లెక్స్‌ను ఆదివారం కూల్చేశారు. రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారాల్లో భాగంగా అరటిపళ్లు, ఇతర కూరగాయలు అమ్మకాలు చేసుకునే వారి కోసం 23 ఏళ్ల క్రితం అప్పటి సర్పంచ్ టంకాల పావనిరాణి నేతృత్వంలో ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ఎంతో మంది వీధి విక్రయదారులకు ఈ కాంప్లెక్స్ ఆసరాగా నిలిచింది. ఇప్పుడు దీనిని కూల్చివేయడంతో చిరువ్యాపారులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. -
వేతనం తూచ్..!
● సేవలకు ‘స్కోచ్’ఆంధ్రా, తెలంగాణలో పలు పోటీ పరీక్షలకు తెలుగు, ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లు బోధించడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్స్‌లో గత పదేళ్లుగా ఎకనామిక్స్‌తో పాటు తెలుగు సబ్జెక్ట్‌లో బోధిస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు ఎప్పుడూ జీతాల సమస్య లేదు. గ్రూప్–2, డీఎస్సీ శిక్షణ రెమ్యునరేషన్ మాత్రమే జాప్యమవుతూ వచ్చింది. గ్రూప్–2కు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ప్రిలిమినరీ శిక్షణా రెమ్యునరేషన్ విడుదలైంది. ఈ ప్రభుత్వం వచ్చాక మెయిన్స్‌కు సంబంధించి జీతాలు విడుదల చేయలేదు. అలాగే, డీఎస్సీ శిక్షణకు సంబంధించి కూడా జీతాలు రాలేదు. స్కోచ్ అవార్డు రావడం సంతోషమే. కానీ, జీతాలు రాకపోతే ఆ ఆనందం కడుపు నింపదు. – జి.రాంబాబు, బీసీ స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన ఫ్యాకల్టీ జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి బిల్లులు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే చెల్లింపులు చేస్తాం. బోధించిన ఫ్యాకల్టీకి తప్పకుండా జీతాలు వస్తాయి. – ఇ.అనురాధ, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి, శ్రీకాకుళం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గ్రూప్–2, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించింది బీసీ స్టడీ సర్కిల్. ఈ శిక్షణతో అనేక మంది అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించగా, ఆ విజయానికి గుర్తింపుగా బీసీ స్టడీ సర్కిల్ సేవలకు గాను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకు తాజాగా స్కోచ్ అవార్డు లభించింది. ఫ్యాకల్టీ సభ్యులు శ్రమించి, విద్యార్థులను విజయం వైపు నడిపించా రు. అయితే ఈ విజయానికి బలమైన పునాది వేసిన ఫ్యాకల్టీ సభ్యులు మాత్రం నిరాశలో మునిగిపోయారు. నెలల తరబడి బోధించినా ఇప్పటికీ వా రికి జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టానికి అవార్డు రావడం తమకు గర్వకారణమే గానీ ఆ అవార్డు కడుపు నింపదని వాపోతున్నారు. 270 మంది ఫ్యాకల్టీకి జీతాల్లేవు.. 15 నెలల క్రితం గ్రూప్–2 మెయిన్స్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా 70 మంది ఫ్యాకల్టీతో అభ్యర్థులకు శిక్షణ ఇప్పించింది. ఒక్కో పీరియడ్‌కి రూ.1000 చొప్పున ఇస్తామని చెప్పింది. దీంతో ఫ్యాకల్టీ అభ్యర్థులకు బోధించడం జరిగింది. వారికి ఇంతవరకు రెమ్యునరేషన్ ఇవ్వలే దు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సర్కిల్స్ ద్వారా 200 మంది ఫ్యాకల్టీ ద్వారా 10 నెలల కిందట డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఒక్కో పీరియడ్‌కి రూ. 600 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు వారికి జీతాలు విడుదల చేయలేదు. ఫ్యాకల్టీని విస్మరించిన ప్రభుత్వం ప్రతిభకు గుర్తింపుగా ఇటీవల బీసీ స్టడీ సర్కిల్‌కు స్కోచ్ అవార్డు లభించింది. ఇది సంస్థ ప్రతిష్టను పెంచింది. కానీ స్కోచ్ అవార్డు రావడానికి మూల కారణమైన ఫ్యాకల్టీ సభ్యులు మాత్రం బకాయి వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి బోధించినా ఇప్పటివరకు వారికి జీతాలు అందలే దు. ఉపాధ్యాయులకు వేతనం ఇవ్వకపోతే అది వారిలో విశ్వాసం దెబ్బ తీయడమే అవుతుందని వాపోతున్నారు. మొత్తానికి విద్యార్థుల విజయాల కు గుర్తింపు వచ్చింది. కానీ బోధించిన ఉపాధ్యాయులకు బకాయి వేతనాలే మిగిలాయి. బీసీ స్టడీ సర్కిల్ సేవలకు స్కోచ్ అవార్డు వేతనం కోసం ఎదురు చూపుల్లో ఫ్యాకల్టీ స్కోచ్ అవార్డు తెచ్చిన స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీకి తీవ్ర నిరాశ అవార్డు ప్రభుత్వానికి ప్రతిష్ట ఫ్యాకల్టీకి మాత్రం ఆర్థిక కష్టాలు -
రైతుకు న్యాయం చేయాల్సిందే
● ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ● జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ నర్తు రామారావు సోంపేట : కూటమి ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు న్యాయం చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరి యా విజయ, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎరువుల కష్టాలు తెలియజేసేందుకు ఈ నెల 9న పలాసలో నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమం వాల్‌పోస్టర్లను ఆదివారం సోంపేటలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. అధికారులకు, నాయకులకు విన్నవిస్తున్నా సమస్య పరిష్కా రం కావడం లేదన్నారు. రైతు సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్సీపీ ఆదేశాల మేరకు అన్నదా త పోరు కార్యక్రమం రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతుల కు ఇలాంటి కష్టాలు లేవని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని అన్నారు. ప్రభు త్వం దిగివచ్చి రైతులకు న్యాయం చేయడం కోసమే రైతుల తరఫున పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ రైతులు అధిక ధరకు యూరియా కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే దీనికి ప్రభు త్వ వైఫల్యమే కారణమన్నారు. ప్రభుత్వం గొప్ప లు చెప్పుకోవడం మాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్తు నరేంద్ర యాదవ్, సాడి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, పైల దేవదాస్ రెడ్డి, బోర పుష్ప, కడియాల ప్రకాష్, తడక జోగారావు, ఇప్పిలి కృష్ణారావు, పూడి నేతాజి, బతకల మోహనరావు, గుర్రాల శ్రీను, కారింగి మోహ నరా వు, శిలగాన భాస్కరరావు, పాతిర్ల రాజశేఖరరెడ్డి, బుద్దాన శ్రీకృష్ణ, దుర్గాసి దర్మారావు, బెందాళం శోభన్‌బాబు, కొనపల సురేష్, గుమ్మడి రాందాస్, నర్తు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలపై రణభేరి
శ్రీకాకుళం: పాఠశాల విద్యారంగ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలపై సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు జరిగే యూటీఎఫ్ రణభేరి జాతా విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లో కొనసాగుతున్నారని చెప్పారు. మూడు నెలలుగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాలు లేవన్నారు. మూడో వంతు ప్రైమరీ పాఠశాలలు సింగిల్ టీచర్లు స్కూల్‌గా మారిపోయాయని, సగంపైన హై స్కూల్స్ సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా తయారయ్యాయని, హైస్కూల్లో పనిచేయాల్సిన స్కూల్ అసిస్టెంట్లను సర్ప్స్ పేరుతో క్లస్టర్ టీచర్లుగా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్గా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించడం తగదన్నారు. పీఆర్ కమిషన్ వెంటనే నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు కె.దాలయ్య, బి.ధనలక్ష్మి, కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శులు పి.సూర్యప్రకాషరావు, టి.వి.టి.భాస్కరరావు, బి.శంకరరావు, ఎం.వి.రమణ, జి.శారద, ఎస్.స్వర్ణకుమారి, బి.గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి
జి.సిగడాం: జాడ పంచాయతీ ముక్కపేట గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ తాలాడ వెంకటరావు(40) విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందాడు. పంట పొలం వద్ద మరమ్మతులు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కే సమయంలో షాక్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మత్యువాతపడ్డాడు. ఇతన జాడ, ముషినివలస, సర్వేశ్వరపురం, ముక్కపేట, రౌతుపేట గ్రామాల్లో ప్రయివేట్‌గా విద్యుత్ పనులు చేస్తుండేవాడు. వెంకటరావు మరణవార్త వినగానే భార్య ఉమాహేశ్వరి, పిల్లలు యోగీ, ఉపేంద్రలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జి.సిగడాం ఎస్ఐ వై.మధుసూదనరావు హవెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
చినుకు పడితే వణుకే..
కంచిలి/నరసన్నపేట : చిన్నపాటి వర్షమొచ్చినా కంచిలి మెయిన్‌రోడ్డు చెరువులా మారుతోంది. పూర్తిస్థాయిలో డ్రైనేజీ లేకపోవడం, కొన్నిచోట్ల పూడికలతో నిండిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆదివారం కురిసిన వర్షానికి రోడ్డంతా జలమయం కావడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. నరసన్నపేట మేజరు పంచాయతీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నరసన్నపేటలో భూగర్భ డ్రైనేజ్ స్తంభించడంతో వీధుల్లోకి వర్షం నీరు, మురుగు నీరు వచ్చింది. గడ్డెయ్య చెరువు సమీపంలో శివనగర్ కాలనీ తదితర వీధుల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
50 సెంట్ల భూమి తెమ్మని వేధించేవారు
ఆమదాలవలస: చిట్టివలసలో పురుగు మందు తాగి పూర్ణ అనే గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆదివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వివాహిత తల్లిదండ్రులు సింహాచలం, పద్మ మాట్లాడుతూ తమ కుమార్తె పెళ్లి సమయంలో కట్నం కింద రూ.5లక్షల నగదు, ద్విచక్ర వాహనం, రూ.2 లక్షల సారె సమకూర్చినా మరో 50 సెంట్ల భూమి తీసుకురావాలని అత్తింటి వారు నిత్యం వేధించేవారని వాపోయారు. పెళ్లయిన నాలుగు నెలలకే ఇలాంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. వరకట్న వేధింపుల కారణంగా తమ కుమార్తె మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందని వివరించారు. విచారణలో ఎస్సై సనపల బాలరాజు, సర్పంచ్ ప్రతినిధి గుజ్జల లక్ష్మణరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
సృజనాత్మకతకు వేదిక.. విద్యార్థి విజ్ఞాన్ మంథన్
శ్రీకాకుళం: విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (సైన్స్ టాలెంట్ సెర్చ్).. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించే ప్రతిభా పరీక్ష. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదివే విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఇందులో ప్రతిభ కనబరిస్తే డీఆర్డీఓ, ఇస్రో, బీఏఆర్సీ వంటి ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఇంటర్నిషిప్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. దీనికి అదనంగా ప్రతినెలా రూ.2000 చొప్పున ఏటా రూ.24 వేలను ప్రోత్సాహకంగా అందిస్తారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో పరీక్ష రాసే సౌలభ్యం ఉంది. పాఠశాల స్థాయిలో ఎంపికై తే రాష్ట్రస్థాయికి తరగతుల వారీగా 150 మందిని ఎంపిక చేసి పంపిస్తారు. అక్కడ ప్రతిభ చూపిన వారికి ఒక్కో తరగతి నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసిజాతీయస్థాయిలో జరిగే పరీక్షలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచేవారికి రూ.5000, రూ.2000, రూ.1000, సర్టిఫికెట్లను అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.25 వేల నగదు బహుమతి ఏడాది పాటు ఉపకార వేతనం అందజేస్తారు. జాతీయస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు 20 రోజులు పాటు పేరొందిన సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 28 నుంచి 30 మధ్య ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష విద్యార్థులకు ఉపయోగకరం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడుతుంది. ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇంటర్న్‌షిప్ వల్ల ఉద్యోగం త్వరగా పొందే అవకాశం కలుగుతుంది. – ఏ.పున్నయ్య, విద్యార్థి విజాన్ మంథన్ జిల్లా కో ఆర్డినేటర్ స్కాలర్షిప్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు అర్హులు ఎంపికై న వారికి నెలకు రూ.2000 చొప్పున ప్రోత్సాహకం సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు గడువు -
వైద్య విద్యపై ప్రభుత్వం కుట్రలు
● ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలు ● యూరియా కోసం రైతుల తిప్పలు కనిపించడం లేదా..? ● మాజీ స్పీకర్ తమ్మినేని మండిపాటు టెక్కలి: డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల కలలను నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శనివారం టెక్కలి పార్టీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలు ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరుపేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే, వాటిలో 10 కళాశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. కొత్త వైద్య కళాశాలల కోసం ఇతర రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే, మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్లును రద్దు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మరోవైపు యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. రైతులు పడుతున్న కష్టాలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు అర్థ రహితం యూరియా కోసం రైతులు అవస్థలు పడుతుంటే, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని పేరాడ తిలక్ మండిపడ్డారు. భోజనాల కోసం ప్లేట్లు పట్టుకుని నిల్చున్నపుడు.. యూరియా కోసం క్యూలో నిలబడలేరా అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. 15 నెలల కూటమి పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. సమావేశంలో టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, పార్టీ మండల కన్వీనర్లు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్‌రాజు, బి.మోహన్‌రెడ్డి, టి.పాల్గుణరావు, నాయకులు సత్తారు సత్యం, టి.కిరణ్, అన్నెపు రామారావు, కె.బాలకృష్ణారావు, ఆర్.మల్లయ్య, జి.గురునాథ్‌యాదవ్, ఎం.అప్పారావు, యర్ర చక్రవర్తి, చిన్ని జోగారావు, కెల్లి గోవింద్, డి.రామకృష్ణారెడ్డి, పి.వెంకట్రావు, కె.అజయ్, పి.రమేష్, ఎన్.భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
240 లీటర్ల నాటుసారా పట్టివేత
కంచిలి: మండల పరిధిలో సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో శనివారం జరిపిన తనిఖీల్లో 240 లీటర్ల నాటుసారాను పట్టుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అవుతోందన్న సమాచారం మేరకు చొట్రాయిపురం బస్టాప్ వద్ద ఒక ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 1,200 నాటుసారా ప్యాకెట్లు(120 లీటర్లు)ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కంచిలి మండలం కాలాపాని గ్రామానికి చెందిన సవర నాయక్, బూరగాం గ్రామానికి చెందిన కొర్రాయి గోవింద్‌లను అరెస్టు చేశారు. ఈ నాటుసారా ప్యాకెట్లను బూరగాం గ్రామానికి చెందిన కర్రి మోహిని, రాపాక కృష్ణమూర్తి, గోకర్ణపురం గ్రామానికి చెందిన అయితి దాశరథికి సరఫరా చేస్తున్నట్లు చెప్పడంతో వారి మీద కూడా కేసులు నమోదు చేశారు. దేవిధంగా కంచిలి మండలంలో జలంత్రకోట పాతాళేశ్వరుని గుడి దగ్గర ఒక ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని, 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారాను రవాణా చేస్తున్న కంచిలి మండలం కుంబరినౌగాం గ్రామానికి చెందిన పింకు గౌడ, తలతంపర పంచాయతీ పరిధి కాకర్లపుట్టుగ గ్రామానికి చెందిన కాకర్ల సోమేష్లను అరెస్టు చేశారు. దాడుల్లో పోలీసు సిబ్బంది మార్కారావు, భాను, అరుణ్, ఉమాపతి, గుణాకర్ తదితరులు లు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
బూర్జ: అండర్–15 బాలికల బ్యాండ్మింటన్ విభాగంలో బూర్జ మండలం గుత్తావల్లి గ్రామానికి చెందిన బొడ్డేపల్లి చైత్రికా కృష్ణ జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో శుక్ర, శనివారాల్లో జాతీయ స్థాయి బ్యాండ్మింటన్ ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆమె ఎంపికై నట్లు తల్లిదండ్రులు శనివారం తెలియజేశారు. చైత్రిక పాలకొండలోని డీఏవీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చైత్రిక గతంలోనూ అండర్–13 బాలికల విభాగంలో జాతీయ ఛాంపియన్–23వ సంవత్సరంలో ఘన విజయం సాధించింది. అదేవిధంగా శాప్ బ్యాండ్మింటన్ పొటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి అండర్–11, అండర్–13, అండర్–15 విభాగాల్లో వరుసగా మూడు సంవత్సరాలు ఛాంపియన్‌గా నిలిచింది. విజయంపై పాఠశాల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు అభినందించారు. -
మళ్లీ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన 15 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోన్–1 మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోడానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా మహిళలను నిట్టనిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియాను సరఫరా చేసినప్పటికీ వాటిని టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ తరలించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడి చేసేసిందని విమర్శించారు. 80 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని, పర్మిట్ రూమ్‌లకు కూడా అనుమతులు ఇచ్చేశారని తెలిపారు. మద్యం కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, గంజాయిని హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పండిస్తున్నారని వివరించారు. వాటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్లీ దేవుడు రావాలని ప్రార్థిస్తున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రానున్న మూడేళ్లు ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి పాలనపై 15 నెలల్లో ప్రజా వ్యతిరేకత సూపర్ సిక్స్ పేరుతో నయవంచన యూరియా కోసం రైతులు రోడ్లెక్కడం దారుణం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, గంజాయితో అఘాయిత్యాలు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణిప్రజలకు రూ.81 వేల కోట్ల బకాయి కూటమి ప్రభుత్వం రైతులకు మొదటి ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చెప్పి ఒక్కో మహిళకు రూ.22,500 బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేల కింద ఇప్పటి వరకు రూ.45 వేలు బకాయి ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక్కరికి పింఛన్ గానీ, రేషన్ కార్డు గానీ మంజూరు చేయలేదన్నారు. పైగా రాష్ట్రంలో 3 లక్షల మంది అర్హులైన వారి పెన్షన్ తొలగించిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రూ.81వేల కోట్లు బాకీ పడిందని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 16 రకాల బస్సులు ఉంటే.. కేవలం 5 రకాల బస్సుల్లో అవకాశం కల్పించారన్నారు. అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. -
సాంకేతిక రంగంలో నైపుణ్యం పెంచుకోవాలి
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల్లో భాగంగా విద్యార్థులతో పాటు అధ్యాపకులు మరింత నైపుణ్యత పెంచుకోవాలని ప్రముఖ కంప్యూటర్ విభాగం సంస్థ క్వాంటమ్ కంప్యూటింగ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష ప్రియదర్శి పేర్కొన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలతో శనివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో సాంకేతిక రంగంలో అత్యంత ఆధునీకరణ సామర్థ్యం పొందిన తమ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందం వలన కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల పురోగతికి మేలు జరుగుతుందన్నారు. క్వాంటం టెక్నాలజీలో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు, సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొడక్ట్ లీడర్ ఎం.చంద్రమౌళి, కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అధ్యాపకుడు బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఐఆర్ ప్రకటించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హమీ మేరకు తక్షణమే ఐఆర్‌ను ప్రకటించాలని ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కె.ప్రవల్లికా ప్రియ అన్నారు. ఏపీ జేఏసీ మహిళా విభాగం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ వసతి గృహం సమావేశ మందిరంలో అవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైల్డ్ కేర్ లీవ్‌లు కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్చరాలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఆరు నెలలు మాత్రమే ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండేళ్ల పాటు సెలవు ఇవ్వాలని కోరారు. అలాగే తమకు రావాల్సిన నాలుగు డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల పే స్లిప్పులు సకాలంలో వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ కె.శ్రీరాములు, ఏపీ జేఏసీ కార్యదర్శి వెంకట రమణ, జి.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల హక్కులను పరిరక్షించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారుల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా స్పష్టం చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు భవనంలో జువైనెల్ జస్టిస్ – పిల్లల రక్షణ చట్టాలపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల హక్కుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో కుటుంబం, పాఠశాల, సమాజం కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, శ్రీకాకుళం కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపాల్ మేజిస్ట్రేట్ (జువైనెల్ జస్టిస్ బోర్డు) కేఎం జమ్రుత్ బేగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ యు.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మఠం భూములు హాంఫట్..!
● బావాజీ మఠం భూముల కబ్జా ● ఆక్రమణదారుల చేతుల్లోకి రూ.కోట్లు విలువైన భూములు ● అక్రమ లే అవుట్లకు అడ్డగోలు అనుమతులు ఇటీవల కబ్జా చేసిన స్థలం చదును చేసిన దృశ్యం ఆమదాలవలస రూరల్: ఆక్రమించుకునే అవకాశమే ఉండాలి గానీ.. ఆకాశాన్ని కూడా వదలరు ఇక్కడి అక్రమార్కులు. వీరి కన్నుపడితే ఎటువంటి భూములైనా మటాస్ కావాల్సిందే. దేవుడి భూములైనా.. ప్రభుత్వ బంజరు భూములైనా అన్యాక్రాంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దర్జాగా దురాక్రమణ చేయడమే కాదు.. అనధికార లే అవుట్లు వేయడంలోనూ ముందుంటారు. మహా నగరాలకు తీసిపోనివిధంగా భవంతుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆమదాలవలస రూరల్ మండలంలో కబ్జారాయుళ్ల దర్జా ఇది. ఇటీవల తోటాడ గ్రామంలో బావాజీ మఠం భూముల ఆక్రమణలే ఇందుకు నిదర్శనం. ఆగని ఆక్రమణల పర్వం గత కొంతకాలం నుంచి ఆమదాలవలస మండలం తోటాడ గ్రామంలో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికారుల కళ్లెదుటే ఈ కబ్జాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. సర్వే నంబర్ 121లో 199.48 ఎకరాల బావాజీ మఠం భూములు దర్జాగా కబ్జా చేశారు. కొందరు కూటమి నాయకుల అండతో అక్కడ భూదందా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒడిశాకు చెందిన మఠం యజమానులు ఇక్కడ నుంచి వెళ్లిపోవటంతో పాటు వారి వారసులు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. దీంతో కబ్జాదారులు ఈ భూములు ఆక్రమించుకొని వ్యాపారం సాగిస్తున్నారు. అలాగే జాతీయ రహదారికి ఆనుకొని కొత్తరోడ్డు వద్ద ఉన్నటువంటి మఠం భూములను సైతం ఆక్రమించారు. అధికారుల చేతివాటం ఇకపోతే ఆక్రమణదారుల అక్రమ లేఅవుట్లకు అనుమతులు అందించడంలో అధికారులు చేతివాటం చూపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వాస్తవానికి ఏదైనా లే అవుట్‌కు అనుమతి పొందాలంటే అందుకు సంబంధించిన భూపత్రాలు ఉండాలి. అయితే ఇతరులు భూములకు సంబంధించి అక్రమ లే అవుట్లకు అనుమతులు మంజూరు చేశారంటే దీని వెనుక ఎంత చేతివాటం ఉందో అన్న విషయం అర్థమవుతోంది. అక్రమ రిజిస్ట్రేషన్లు వాస్తవంగా మఠం భూములకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేసే అధికారం లేదు. అయితే సంబంధం లేని సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లతో ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సహకరిస్తున్నారని పలువురు మాట్లాడుకుంటున్నారు. అలాగే మఠం భూముల్లో వ్యాపార భవనాలు గానీ, అపార్ట్మెంట్లు గానీ నిర్మిస్తే విద్యుత్ సదుపాయం అందించకూడదు. కానీ విద్యుత్ శాఖ అధికారులు అధిక మొత్తంలో అక్రమార్జనకు పాల్పడి అడ్డగోలుగా ట్రాన్ఫార్మర్లు, మీటర్లు అందించినట్లు తెలుస్తోంది. జోరందుకుంటున్న నిర్మాణాలు ఈ స్థలంలో మహా నగరాలను తలపించేవిధంగా అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ఆక్రమణదారులు ఇతరులకు విక్రయించేందుకు కొందరు అపార్ట్మెంట్ నిర్మాణ గుత్తేదారులకు ఈ స్థలం అప్పగిస్తున్నారు. అంతేకాకుండా కొనుగోలుదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కూడా అందించడం విశేషం. ఏది ఏమైనా వందల ఎకరాల స్థలాన్ని ఆక్రమణదారులు యథేచ్ఛగా దోచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి ఈ కబ్జాలకు అడ్డుకట్టు వేయకపోతే మరిన్ని భూములు మాయమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పోస్టల్ ఖాతాదారుల ఆందోళన
ఇచ్ఛాపురం: స్థానిక పోస్టాఫీస్‌లో దాచుకున్న సొమ్ములను వెంటనే చెల్లించాలని ఖాతాదారులంతా ఆందోళనకు దిగారు. ఈ పోస్టాఫీసులో దాచుకొన్న సుమారుగా రూ.3 కోట్ల సొమ్మును ఆన్లైన్ స్కాం కారణంగా బాధితులంతా నష్టపోయిన విషయం జులై నెలలో బాధితులకు తెలిసింది. అయితే ఖాతాదారులు దాచుకొన్న సొమ్మును ఖాతాల్లో పడేటట్లు చూస్తామని జిల్లా పోస్టల్ అధికారులు హామీచ్చారు. కానీ ఇప్పటికీ ఖాతాల్లో నగదు జమ అవ్వకపోవడంతో శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సొమ్ములు రెండు వారాల్లోగా చెల్లించకపోతే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇదే విషయంమై ఈ కేసును సీబీఐకి ఇవ్వగా ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోస్టల్ జిల్లా అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖాతాదారులు చాట్ల లోహిదాస్, బాలరాజు, హైమా. కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో పడి వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని వాంబేకాలనీలో కాలువలో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ శనివారం వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. భార్య, ఇద్దరు పిల్లలతో జొన్నాడ రాజేష్ అనే వ్యక్తి వాంబే కాలనీలో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో రాజేష్ వినాయకుని ఊరేగింపునకు వెళ్లాడని.. అటునుంచి వచ్చే క్రమంలో రోడ్డుపక్కనే ఉన్న పెద్ద కాలువలో జారిపడిపోయాడన్నారు. ఎవరూ గమనించకపోవడం.. శనివారం ఉదయాన చనిపోయి ఉండడంతో తమకు సమాచారం వచ్చిందన్నారు. మృతదేహాన్ని రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
గూగుల్ అంబాసిడర్‌గా బీఆర్‌ఏయూ ఈసీఈ విద్యార్థి
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ గ్రామీణ ప్రాంత విద్యా సంస్థల కేటగిరీ నుంచి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్‌కు స్టూడెంట్ అంబాసిడర్ (జీఎస్ఏ)గా ఎంపికయ్యారు. ఏఐ ద్వారా జెమినీ ఏఐ, గూగుల్ టెక్నాలజీపై స్వల్ప కాలిక అవగాహన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సాయిప్రదీప్కు అవకాశం లభిస్తుంది. అలాగే సాంకేతిక సంబంధిత పోటీల నిర్వహణ, దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్ ఇన్నోవేటర్స్‌కు సంస్థను అనుసంధానం చేయడం, నాయకత్వ లక్షణాలు పెంచుకోవడంపై కూడా దృష్టి సారించవచ్చు. విద్యార్థి ఎంపికపై వర్సిటీ వీసీ ఆర్కే రజినీ, రిజిస్ట్రార్ పి.సుజాత ప్రత్యేకంగా అభినందించారు. గూగుల్ అంబాసిడర్ కిట్‌ను ఈ సందర్భంగా సాయిప్రదీప్కు అందజేశారు. -
ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలు
మందస,పలాస: మందస మండలం నారాయణపు రం గ్రామంలో ఎలుగుబంటి మరోసారి శనివారం దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. శుక్రవారం నారాయణపురం గ్రామంలోకి ప్రవేశించి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఒక వ్యక్తి ఎలుగు దాడిలో గాయాలపాలయ్యాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే శనివారం సాయంత్రం కూడా గొరకల పాపారావు, పందిరి గున్నయ్య, లక్ష్మీనారాయణ, మోహనరావులపై దాడి చేసి గాయపర్చింది. దీంతో గ్రామస్తులు ఎలుగును హతమార్చారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణనాయుడు సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. కాశీబుగ్గ నుంచి ముగ్గురు వైద్యులు వచ్చి క్షతగాత్రులను పరిశీలించారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం లేదని చెప్పారు. పోస్టు మార్టం చేసి తర్వాత ఎలుగుబంటి మృతదేహాన్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఎలుగుదాడికి గురైన నలుగురు వ్యక్తులు హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
జీరో బిజినెస్..
నరసన్నపేట: బంగారం వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఎవరిని నమ్మాలో.. ఎవరిని అనుమానించాలో అర్థం కాని పరిస్థితుల్లో వ్యాపారులు ఉన్నారు. అయితే ఈ సంఘటనకు మూలం వ్యాపారులు జీరో బిజినెస్ చేయడమేనని అందరూ అంటున్నారు. అత్యాశకు పోయి అడ్డదారుల్లో వ్యాపారం చేయడం తగదని అంటున్నారు. నమ్మిన వ్యక్తే పథ కం ప్రకారం ఇతరుల సాయంతో గుప్తాను హత్య చేయడం, శ్రీకాకుళం సమీపంలోని రామిగెడ్డలో మృత దేహాన్ని పడేయడం, హత్య జరిగిన 10 రోజుల తర్వాత మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం తెలిసిందే. ఈ సంఘటన బంగారం వ్యాపారుల్లో కనువిప్పు తెస్తుందా అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం నరసన్నపేటకు చెందిన నారాయణశెట్టి రవీంద్రనాద్ ఠాగూర్, గుడ్ల చంద్రభూషణ గుప్తాలు కూడా ఇదే తరహాలో హత్యకు గురయ్యారు. పర్లాకిమిడితో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బంగారు ఆభరణాలు సేల్ చేసి మిగిలిన ఆభరణాలు, సేల్ చేయగా వచ్చిన డబ్బుతో నరసన్నపేటకు తిరిగి వస్తుండగా నవతల ఘాటీ వద్ద పర్లాకిమిడికి చెందిన వ్యాపా రులు ఇచ్చిన సమాచారంతో కొందరు దుండగులు అటకాయించి వీరిని హతమార్చి ఆభరణాలు, డ బ్బు తీసుకుపోయారు. మృతదేహాలను బెండి రైల్వే గేటు వద్ద తుప్పల్లో వేసేశారు. రెండు రోజుల తర్వా త సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో గుప్తాను చంపేశారని వ్యాపారులు అంటున్నారు. నరసన్నపేటలో రిటైల్ బంగారం షాపులు 64 ఉన్నాయి. హోల్‌సేల్ షాపులు మరో 12 ఉన్నాయి. జిల్లాలో ఐదారు వందల షాపులు ఉన్నాయి. వీటి ల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేస్తున్న వారు కొందరే. మిగిలిన వారందరూ జీరో బిజినెస్ చేస్తున్నవారే. కోట్లల్లో వ్యాపారం చేస్తున్నా.. వేలల్లో కూడా ట్యాక్స్ కట్టరు. అంతా అక్రమ వ్యాపారమే. ఇటీవల బీఐఎస్ అధికారులు వచ్చి నరసన్నపేటలో తనిఖీలు చేపట్టగా హాల్‌మార్క్ వ్యవహారం బయ ట పడిన విషయం విదితమే. దీంట్లో భాగంగా గుప్తా కూడా జీరో బిజినెస్‌కు అలవాటు పడి విశాఖ తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు అక్రమంగా(లెఫ్ట్) బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి గ్రా ముకు కమీషన్ తీసుకుని స్థానికులకు ఆ బిస్కెట్లు అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా గడిచిన ఐదారేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నాడు. మొదట్లో కొందరు వ్యాపారుల వద్ద ముందుగా డబ్బు తీసుకొనేవాడు. బిస్కెట్స్ తెచ్చి ఆ మొత్తానికి ఇచ్చేవాడట. ఏడాది కిందటి నుంచి ఈయనే పెట్టుబడి పెట్టి బిస్కెట్స్ తేవడం, కమీషన్‌కు అమ్మకాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖకు తరచూ వెళ్లే గుప్తా ఎక్కువగా డ్రైవర్‌గా సంతోష్‌నే తీసుకువెళ్లేవాడు. అతని కళ్ల ముందే గుప్తా కోటీశ్వరుడు కావ డం సంతోష్‌కు కంటగింపుగా మారింది. దీంతో పథకం పన్ని ప్రాణాలు తీశాడు. గుప్తాను హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఎలాంటి ప్రలోభాలకు పోలీసులు గురికావద్దని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు. దీంట్లో భాగంగా నరసన్నపేటలో శనివారం బంగారం షాపులు మూసివేశారు. సాయంత్రం కొందరు వర్తకులు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించి అనంతరం పోలీసు అధికారులను కలిసి హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. -
తలో మాట.. ఎరువులకు తంటా
జిల్లాలో రైతులు యూరియా కోసం అవస్థలు పడుతుంటే నాయకులు, అధికారులు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. యూరియా లేకపోవడం నిజమేనని ఒకరు అంటే.. నిల్వలు ఉన్నాయని మరొకరు అంటున్నారు. కానీ రైతులు మాత్రం ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద గంటల తరబడి నిలబడి తిట్టి పోస్తుండడం నిజం. జిల్లాకు ఎంత ఎరువు అవసరమో, ప్రభుత్వం ఎంత తెప్పించిందో, రైతు చెంతకు ఎంత చేరుతుందో అన్నది చిదంబర రహస్యమైపోయింది. –జలుమూరు, శ్రీకాకుళం పాతబస్టాండ్ యూరియా కొరత ఉంది.. రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్ని దేశాల్లో యుద్ధాల వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రధానంగా ఏప్రిల్, జూన్ నెలల్లో నిల్వ చేయకపోవడం వల్ల ఈ అవస్థ వచ్చింది. అయినా ప్రభుత్వం యూరి యా కొరతకు ప్రత్యామ్నాయం చూపిస్తోంది. – శనివారం జలుమూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేసిన వ్యాఖ్యలివి.. -
యూరియా ఉంది
జిల్లాలో రైతులు ఆందోళ న చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఈ ఖరీఫ్ కు వరి, ఇతర పంటలు కలిపి 3,73,000 ఎకరాల్లో సాగవుతోంది. ఈ సాగుకు మొదటి, రెండో విడతల్లో కలిపి 20,481 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైంది. అయితే రైతుసేవా కేంద్రాలు, వ్యవసా య సహకార సంఘాల ద్వారా 11,443 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 12,393 మెట్రి క్ టన్నులు కలిపి, మొత్తం 23,836 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు రైతులకు సరఫరా చేశాం. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలు, సహకార సంఘాల వద్ద 415.3 మెట్రిక్ టన్ను లు, ప్రైవేట్ డీలర్ల వద్ద 123 మెట్రిక్ టన్నులు, బఫర్‌లో 561 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1,099 మెట్రిక్ టన్నుల యూరియా అందుబా టులో ఉంది. – ఈ నెల 1న కలెక్టర్ చెప్పిన మాటలివి.. -
ముప్పై నిమిషాలు ఉత్కంఠతో ఊపిరి బిగపట్టి..!
ముప్పై నిమిషాలు ఆమదాలవలస స్టేషన్ ఉత్కంఠతో ఊపిరి బిగపట్టి చూసింది. నిత్యం రైల్వే అనౌన్స్మెంట్లతో మార్మోగే ఆ ప్రాంగణం ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు గమనించింది. సమయానికే స్టేషన్‌కు వచ్చిన రైలు అక్కడే ఆగిపోవడం, నిమిషాలు గడిచిపోతున్నా కదలకపోవడం, ఓ గర్భిణికి రైలులోనే ప్రసవం జరుగుతోందని స్టేషన్ అంతా తెలియడం, పండంటి ఆడపిల్ల పుట్టిందని సమాచారం రావడం వంటి ఘటనలతో ముప్పై నిమిషాలు మూడు ఘడియల్లా గడిచిపోయాయి. కాసింత జాప్యానికే తిట్టుకునే ప్రయాణికులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆలస్యాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆమదాలవలస / శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి రైలులో ఓ గర్భిణి ప్రసవించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ అరుణ, రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ పల్ల కీర్తి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురానికి చెందిన జి.భూలక్ష్మి అనే గర్భిణి తన భర్త జానకిరామ్‌తో కలిసి విశాఖ వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. దారిలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఆమె భర్త రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును స్టేషన్లో నిలుపుదల చేసి రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కీర్తికి సమాచారం అందించారు. ఆమె హూటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నొప్పులు అధికం కావడంతో రైలులోనే ప్రసవంచేశారు. ఆడబిడ్డ జన్మింగా తల్లి గర్భంలో మరో శిశువు ఉన్నట్లు వైద్యురాలు గుర్తించారు. దీంతో వారిని వెంటనే రాగోలు జెమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. సంఘటనను రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అంతా వింతగా గమనించారు. దాదాపు 30 నిమిషాల పాటు రైలును ఆపేశారు. -
భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..!
శ్రీకాకుళం క్రైమ్: పెరుగుతున్న సాంకేతికతతో పాటు రోజురోజుకీ సైబర్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. రోజుకో మోసంతో సైబరాసురులు రూ.కోట్లలో భారీగా సొమ్ము కొల్లగొడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు పట్టిపీడించిన ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలే ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ప్రముఖ వైద్యులు, ఉపాధ్యాయ, రాజకీయ, వ్యాపారవర్గాలు, ఇంజినీర్లు సైతం సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని దారుణంగా మోసపోతున్నారు. మోసపోయాక పరువు పోతుందేమోనని కొందరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోయినా.. మరికొందరు భారీ అమౌంట్లు కావడంతో నేరుగా జిల్లా ఉన్నతాధికారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ లెక్కకు మించి సైబర్ కేసులు వివిధ స్టేషన్లలో పెండింగ్‌లోనే ఉంటున్నాయి. మరికొన్ని స్టేషన్లలో అయితే కనీసం కేసు కట్టడానికి సాహసించలేని స్థితిలో ఉండడం గమనార్హం. నమ్మారో.. నట్టేటా మునిగినట్లే.. » శ్రీకాకుళం సబ్ డివిజన్ కేంద్రంగా ఇటీవల ఒక ప్రముఖ వైద్యుడు ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.37.50 లక్షలు మోసపోయాడు. ఎప్పటినుంచో స్టాక్ మార్కెట్లోనే కాకుండా వివిధ మార్గాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్న ఆ వైద్యుడికి ఒక ఆపరిచిత వ్యక్తి వాట్సాప్ కాల్చేసి చిట్కాలు చెబుతాననడంతో సరే అన్నాడు. ముందుగా ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో సభ్యులను పరిచయం చేశాడు. రూ.10 లక్షలు పెడితే అదనంగా మరో రూ.10 లక్షలు వస్తుందని, రూ.20 లక్షలు పెడితే రూ.20 లక్షలు, రూ.30 లక్షలు పెడితే రూ.30 లక్షలు వస్తుందని మాయమాటలు చెప్పాడు. తన చిట్కాల ద్వారా గ్రూపులో సభ్యులకొస్తున్న అమౌంట్ స్క్రీన్షాట్లు తీసి వైద్యుడికి పెట్టసాగాడు. నమ్మకం కుదిరాక వైద్యుడు పలుమార్లు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు.. ఇలా వేస్తూనే ఉన్నాడు.. విత్‌డ్రా ఆప్షన్లో డబ్బులు అదనంగా కనిపిస్తుండడం తన అకౌంట్లో యాడ్ అవుతున్నట్లు ఆశ పుట్టింది. అలా ఒక రూ.15 లక్షల వరకు వేశాడు. డబ్బులైతే ఆప్షన్లో కనిపించి విత్ డ్రా అవ్వకపోవడంతో అపరిచిత వ్యక్తిని అడగగా.. మీరు కడుతుంటే ఒకేసారి వస్తాయనడంతో రూ.37 లక్షల వరకు కట్టేశాడు. కానీ అప్పటికీ విత్ డ్రా అవ్వకపోవడంతో పాటు అపరిచిత వ్యక్తికి ఫోన్‌చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. గ్రూపులో కూడా వైద్యుడిని రిమూవ్ÐŒ చేసేశారు. ఇక చేసేదేమీలేక వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఆర్మీకి చెందిన ఒక వ్యక్తి రూ.కోటికి పైగా సైబరాసురుల చేతిలో నష్టపోయానని ఫిర్యాదు చేయడంతో భారీ అమౌంట్ కావడంతో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేకపోయారు. » రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన దుంప కృష్ణ చిత్తూరు జిల్లా మెట్టూరు ఎస్బీఐలో ఒప్పంద ఉద్యోగిగా చేస్తున్నాడు. వాట్సాప్ ద్వారా వచ్చే వీడియోలు చూసి సబ్‌స్రై్కబ్ చేసుకున్న కృష్ణకు సైబర్ కేటుగాళ్లు టెలిగ్రామ్ ద్వారా లింకులు పంపించి గేమ్‌లు ఆడించారు. బహుమతులు, డబ్బులొస్తున్నట్లు ఆన్లైన్లో చూపించడంతో కృష్ణ రూ.11.50 లక్షల వరకు ట్రేడింగ్ చేశాడు. చివరికి డబ్బులు ఎంతకీ అకౌంట్లో పడకపోవడంతో జేఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో అఫైర్ నమోదు చేసి చిత్తూరు జిల్లా మెట్టూరుకు కేసు బదిలీ చేశారు.కేసులు నమోదు చేయలేని దుస్థితి ఈ తరహానే కాకుండా వివిధ సైబర్ మోసాలపై జిల్లాలో భారీస్థాయిలో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో స్టేషన్లో 4 నుంచి 6 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మోసం చేసే కేటుగాళ్లు వివిధ రాష్ట్రాలు, దేశాలు వారు కావడంతో అక్కడికి వెళ్లి ఆ అధికారులతో సమన్వయం చేసుకుని నోటీసులిచ్చేవరకే చేయగలుగుతున్నారు. ఈలోగా దారి ఖర్చులు, వసతి ఖర్చులు అన్నీ వీరిపైనే భారంగా పడుతున్నాయి. పోనీ కోర్టు వరకు నేరస్తులు వస్తున్నారంటే అదీ లేదు. ఒకట్రెండు సార్లు వచ్చీ ఆ తర్వాత వారి జాడే కనిపించనంతగా మాయమవుతున్నారు. దీంతో ఇటువంటి కేసులు కట్టాలంటేనే తమకు తలనొప్పిగా మారుతున్నాయంటూ కొంతమంది పోలీసు అధికారులే చెబుతుండడం శోచనీయం. అత్యాశే కారణం ప్రస్తుతం సైబర్ నేరాలు జిల్లాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రజలు అత్యాశతో వారి వలలో పడుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు వంటి మోసాలకు ఎక్కువగా చదువుకున్నవారే బలవుతున్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో గతంలో కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదు చేస్తున్నాం. క్షణాల్లో సైబర్ సెల్ నంబర్ 1930కు ఫిర్యాదు చేసి పోలీసులను, బ్యాంకు ప్రతినిధులను సంప్రదిస్తే మంచిది. – డీఎస్పీ వివేకానంద, శ్రీకాకుళం -
లగేజీ ఆటో ఢీకొని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: బెండి గేట్–కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో సరియాపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన కర్ని వెంకటరమణ (36) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. వెంకటరమణ పలాస మండలం పెదమాకన్నపల్లిలో ఉన్న అత్తారింటికి వెళ్లి బెండి గేట్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వెళ్తున్న లగేజీ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడి ఎడమ చేయి విరిగిపోగా, తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణ గల్ఫ్‌లో వెల్డర్‌గా పని చేస్తూ ఆరు నెలల కిందటే ఇంటికి వచ్చాడు. భార్య ద్రాక్షవేణి, కుమారుడు లక్కీ, కుమార్తె ప్రక్షత, తల్లి రాజేశ్వరి ఉన్నారు. వెంకటరమణ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆమదాలవలస: మెట్టక్కివలసలోని కుప్పిలివారివీధికి చెందిన బరాటం తాతయ్యలు(51) అనుమానాస్పదంగా మృతిచెందాడు. శుక్రవా రం ఆమదాలవలస ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాతయ్యలు మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో భార్య సత్యవతి ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో శుక్రవారం పట్టణంలోని లక్ష్మీనగర్ వీధి శివారులోని శ్మశాన వాటిక షెడ్డులో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి పరిశీలించగా తన భర్తేనని సత్యవతి నిర్ధారించింది. పోలీసులు అనుమానాస్పదకేసుగా దర్యాప్తు కొనసాగిస్తూ మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి శవపంచనామాకు తరలించారు. దుబాయ్‌లో చినవంక వాసి అదృశ్యం వజ్రపుకొత్తూరు రూరల్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తన భర్త సాన రాజేష్ ఆచూకీ తెలియడం లేదని చినవంక గ్రామానికి చెందిన ఢిల్లెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ 2015లో దుబాయ్ వెళ్లిన తన భర్త 2019 తర్వాత ఆచూకీ లేకుండా పోయారని, పదేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయిందని వాపోయింది. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నానని, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి భర్త ఆచూకీ తెలియజేయాలని ఢిల్లెమ్మ వేడుకుంది. శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న తంగుడు నాగమణి(40) అనారోగ్యంతో మృతి చెందారు. మరణానంతరం ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు టి.వెంకటరావు, కె.కుమారి, బరాటం మల్లేశ్వరరావులు కొల్లు సత్యనారాయణ ద్వారా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియచేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, నంది ఉమాశంకర్ ద్వారా నాగమణి కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్‌లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు తెలియజేయాలని కోరారు. -
కార్పొరేట్ గుప్పిట్లో మెడికల్ కాలేజీలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మెడికల్ కాలేజీలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్ సీపీ కళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందులో పది కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల సుమారు 1500 మెడికల్ సీట్లు కోల్పోయే దుస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో విలేజ్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్, 3256 రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఆసరాగా నిలిచారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అప్రజాస్వామికం శ్రీకాకుళం రూరల్: రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన విధానం మేరకు ప్రతి ఇంట్లో ఒకరు డాక్టర్ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదే పరంపర కొనసాగిస్తూ 2019లో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మెడికల్ విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రిమ్స్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతల స్వీకరణ శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఎస్.అప్పలనాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మశ్రీ నుంచి బాధ్యతలు చేపట్టారు. అప్పలనాయుడు గతంలో విజయనగరంలో ప్రొఫె సర్గా సేవలందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో సమావేశమై కళాశాల వివరాలను తెలుసుకున్నారు. ఎఫ్‌డీఓకు పదోన్నతి అరసవల్లి: జిల్లా మత్స్యశాఖలోని ఫిష్ సీడ్ ఫామ్‌లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎఫ్‌డీవో)గా విధులు నిర్వర్తిస్తున్న డి.గోపికృష్ణకు విజయవాడ కమిషనరేట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్‌నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎఫ్‌డీవోగా సేవలందించిన గోపీకృష్ణకు పదోన్నతి లభించడంపై సిబ్బంది, మత్స్యకారుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. వాస్తవికతకు దగ్గరగా ‘కన్యాకుమారి’ శ్రీకాకుళం అర్బన్: ఉత్తరాంధ్ర వాస్తవికతకు దగ్గరగా కన్యాకుమారి చిత్రం రూపొందించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఓ హోటల్లో శుక్రవారం ‘కన్యాకుమారి’ చిత్రం సక్సెస్ మీట్‌ను చిత్ర నిర్మాతల్లో ఒకరైన అట్టాడ అప్పలనాయుడు నిర్వహించారు. చిత్రనటులు అగ్గున బాబూరావు, జ్యోతి బత్తుల, గిరిజ శంకర్, తిరుమలరావు, సాహితీవేత్తలు కె.శ్రీనివాస్, ఉదయ్‌కిరణ్, న్యాయవాది మామిడి క్రాంతి, దాసరి రామచంద్రరావు, డాక్టర్ సతీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం యాస, సంస్కృతి, రైతును హీరోగా చూపడం చిత్రం గొప్పతనమన్నారు. చిత్ర దర్శకుడు అట్టాడ సృజన్‌కు మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, ఆహా ఓటీటీల్లోనూ రిలీజ్ అవుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాన కృష్ణచంద్, ఆగూరు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య
ఆమదాలవలస: చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి పూర్ణ (22) అనే వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమదాలవలస ఎస్ఐ ఎస్.బాలరాజు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస పట్టణంలోని ఐజేనాయుడు కాలనీకి చెందిన సాయిపల్లి మధుసూదనరావుతో పూర్ణకు నాలుగు నెలలు క్రితం వివాహం జరిగింది. కట్నం కింద రూ.5 లక్షలు, 8 తులాల బంగారం ఇచ్చారు. అయినప్పటికీ భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవారు. ఈ బాధలు భరించలేక పూర్ణ తన తల్లిదండ్రులు నవిరి సింహాచలం, పద్మలకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. అనంతరం భర్త, అత్తమామలను పిలిపించి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అదనపు కట్నం కోరడం తగదని చెప్పగా తాము ఇంకేమీ అడగబోమని భర్త, అత్తమామలు ఒప్పుకున్నారు. దీంతో పూర్ణ అత్తవారి ఇంటికి వెళ్లిపోయింది. మళ్లీ రెండురోజుల భర్త కొట్టడంతో పూర్ణ కన్నవారింటికి వచ్చేసింది. తల్లిదండ్రులతో కలిసి ఆగస్టు 17న భర్త వేధింపులపై ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేక సెప్టెంబర్ 2న పూర్ణ ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం పూర్ణ మృతి చెందింది. బాధితురాలి తండ్రి సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్ల వేధింపులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. పూర్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ శాఖల కార్మిక రంగ సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ భవన్లో జిల్లా చైర్మన్ ఎస్.శ్రీరాములు అధ్యక్షతన జిల్లా ప్రధాన కార్యదర్శి సీపాన వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిల వివరాలను పే స్లిప్పులు, సీఎఫ్ఎంఎస్లో చూపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని కోరారు. గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అర్లయ్య, క్లాస్–4 ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మల్లేశ్వరరావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ కె.ప్రవళ్లిక ప్రియ, పొదిలాపు శ్రీను, వీవీఎన్ రాజు, సీపాన గోవిందరావు, జల్లేపల్లి రామారావు, ఎం.కాళీప్రసాద్ పాల్గొన్నారు. డివిజన్ కమిటీల నియామకం.. ఏపీజేఏసీ అమరావతి సంఘం డివిజన్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీకాకుళం డివిజన్ చైర్మన్‌గా ఎస్.గణపతిరావు, ప్రధాన కార్యదర్శిగా పి.రాజశేఖర్, టెక్కలి డివిజన్ చైర్మన్‌గా బి.హేమసుందర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రావు, పలాస డివిజన్ చైర్మన్‌గా బి.అప్పలస్వామి, ప్రధాన కార్యదర్శిగా పి.కుమార్, మహిళా విభాగం శ్రీకాకుళం సిటీ యూనిట్ చైర్‌పర్సన్‌గా డి.అనురాధ, ప్రధాన కార్యదర్శిగా బి.సుభద్ర, శ్రీకాకుళం డివిజన్ చైర్మన్‌గా డి.వనజాక్షీ, ప్రధాన కార్యదర్శిగా పి.రాజేశ్వరి, టెక్కలి డివిజన్ చైర్మన్‌గా ఎస్.పవిత్ర, ప్రధాన కార్యదర్శిగా ఎన్.అనూష, పలాస డివిజన్ చైర్మన్‌గా ఎస్.కరుణమ్మ, ప్రధాన కార్యదర్శిగా బి.ఎస్.రాణిలను ఎన్నుకున్నారు. -
బంగారం కోసమే బలిగొన్నారా?
● వీడిన నరసన్నపేట వ్యాపారి అదృశ్యం మిస్టరీ ● పెదపాడు రామిగెడ్డలో లభ్యమైన మృతదేహం ● పోలీసుల అదుపులో నిందితులు! శ్రీకాకుళం రూరల్: నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా(45) అదృశ్యం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని పెదపాడు వద్ద రామిగెడ్డలో శుక్రవారం ఉదయం 11 గంటలకు గుప్తా మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. బంగారం కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నరసన్నపేటకు చెందిన గుప్తా బంగారాన్ని హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తూ నరసన్నపేటతో పాటు శ్రీకాకుళంలోని పలు షాపులకు విక్రయించేవారు. ఈయన వద్ద డ్రైవర్ సంతోష్ ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. గుప్తా వద్ద బంగారం కాజేయాలనే ఉద్దేశంతో సంతోష్ తన స్నేహితుడు కార్ డెకార్స్ యజమాని రాజుతో కలిసి ప్లాన్ వేశాడు. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఆగస్టు 26న విశాఖపట్నంలోని ఓ బంగారం దుకాణం వద్ద కేజీన్నర బంగారాన్ని గుప్తా కొనుగోలు చేశారు. విశాఖపట్నం నుంచి తన కారులో బంగారాన్ని తీసుకొస్తుండగా శ్రీకాకుళంలోకి రాగానే డ్రైవర్ సంతోష్‌తో పాటు ఆదిత్య డెకార్స్ యజమాని రాజు కలిసి పెదపాడు వద్ద కారుషెడ్లోనే దారుణంగా హత్య చేశారు. ఆగస్టు 26 నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడం, కాలువలు, గెడ్డలు గుండా పెదపాడు పరిసర ప్రాంతమంతా అత్యధికంగా నీటి ప్రవాహం ఉండటంతో మృతదేహాన్ని పాత్రునివలస రామిగెడ్డలో పడేశారు. అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి గుర్రపుడెక్కల మధ్యలో మృతదేహం చిక్కుకుపోయింది. గుప్తా వద్ద దోచుకున్న బంగారంలో సంతోష్, రాజులు ఒకరు 60శాతం, మరొకరు 40శాతం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదృశ్యం ఫిర్యాదుతో.. గుప్తా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు నరసన్నపేట పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. మృతిచెంది ఉండవచ్చనే సమాచారం మేరకు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, క్రైం పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి సీఐలు పైడపునాయుడు, శ్రీనివాసరావు, ఎస్ఐ రాము చేరుకుని మృతదేహన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పోలీసుల అదుపులో నిందితులు! గుప్తాను హత్యచేసిన ఉదంతంలో నరసన్నపేట పోలీసులు డ్రైవర్ సంతోష్, కారు డెకార్స్ యజమాని రాజును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నమే పెదపాడులోని కారు డెకార్స్ను నరసన్నపేట, శ్రీకాకుళం పోలీసులు పరిశీలించారు. హత్య ఎలా చేశారు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాగా, కార్ డెకార్స్ యజమాని ఓ టీడీపీ నాయకుడికి దగ్గర బంధువని సమాచారం. -
దివ్యాంగులకు దర్శన కష్టాలు!
● ఆదిత్యుని సన్నిధిలో కానరాని ‘ప్రత్యేక’ ఏర్పాట్లు ● ఆలయ స్థాయి పెరిగినా తీరు మారని వైనం వీల్చైర్లను వినియోగిస్తున్నాం.. దివ్యాంగుల దర్శనాలకు ప్రస్తుతానికి వీల్చైర్లను వినియోగించి దర్శనాలకు పంపుతున్నాం. రద్దీ సమయాల్లో వీఐపీ మార్గంలోనే పంపిస్తున్నాం. ఇప్పటివరకు శాశ్వత మరుగుదొడ్లు, అన్నదాన మండపాలేవీ నిర్మాణాలు కాలేదు. భవిష్యత్ నిర్మాణాల్లో కచ్చితంగా దివ్యాంగులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లతోనే కొత్త నిర్మాణాలు చేపడతాం. స్టాఫ్ లేకపోవడంతో ప్రత్యేక సిబ్బంది కేటాయింపు సమస్యగా మారింది. – కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఆలయ ఈవో, అరసవల్లి అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు కొలువుదీరిన అరసవల్లిలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన దివ్యాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక ఏర్పాట్లు కానరాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సాధారణ రోజులను పక్కన పెడితే ఆదివారం ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో దివ్యాంగులు క్యూలైన్ల వద్ద నరకయాతన అనుభవిస్తున్నారు. ఇనుప గ్రిల్స్‌కు ఆనించుకుని నిలబడి కృత్తిమ కాలు (ఆర్టిఫిషియల్ లెగ్)ను అమర్చుకోవడంతో పాటు కేశఖండన శాలలో తలనీలాలను తీయించుకున్న తర్వాత పైపుల వద్ద నిల్చుని స్నానాలకు ఆగచాట్లు పడుతున్నారు. మరుగుదొడ్లలో కూడా దివ్యాంగులకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం ముందు వరకు వెళ్తే మాత్రం నాలుగైదు వీల్చైర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో ఆదిత్యుని మహామండపం వరకు మాత్రమే వెళ్లేదుకు అనుమతిస్తున్నారు. దీంతో దూరం నుంచే ఆదిత్యున్ని దర్శించుకుని వెనుదిరగాల్సి వస్తుంది. ఆదిత్యుని ఆలయానికి వార్షిక ఆదాయం రూ.20 కోట్ల వరకు చేరడంతో డిప్యూటీ కమిషనర్ (డీసీ) హోదా పొందిన సంగతి విదితమే. అయినప్పటికీ అంతటి స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంపై స్థానికులు, భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేయాలి.. ఆదిత్యాలయానికి దివ్యాంగులు దర్శనాలకు అధికంగా వస్తున్నారు. వీరికి ఆలయంలో తగిన ఏర్పాట్లు లేకపోవడంతో దూరం నుంచి దర్శనం చేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇది మినహా మరే ఇతర ఆర్జిత సేవల్లోనూ పాల్గొనే అవకాశాలు లేకుండాపోతున్నాయనే ఆవేదన దివ్యాంగుల్లో వ్యక్తమవుతోంది. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలకు, కళ్యాణ సేవలకు, తలనీలాల మొక్కులు చెల్లింపులకు, అన్నప్రసాదాల స్వీకరణకు కూడా ఎలాంటి ‘ప్రత్యేక’ ఏర్పాట్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఆలయ అధికారులు, పాలకులు దృష్టి సారించి దివ్యాంగులకు ‘ప్రత్యేక’ దర్శనం కల్పించాలని కోరుతున్నారు. ● కాళ్లు, చేతులు కోల్పోయిన వారు, అంధత్వమున్న దివ్యాంగులకు ప్రత్యేక దర్శన మార్గం (క్యూలైన్లు) ఏర్పాటు చేయాలి. ● దివ్యాంగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలి. స్నానాల గదులతో పాటు కింద అంతస్థులోనే వసతి ఉండేలా చూడాలి. ● ఇంద్రపుష్కరిణి సమీపంలోనే తలనీలాల మొక్కులు చెల్లించుకునేందుకు..అక్కడికి సమీపంలోనే దివ్యాంగులు స్నానాలకు వీలుగా తక్కువ ఎత్తులో పైపులైన్లు ఏర్పాట్లు చేయాలి. ● దర్శనానికి వచ్చే మార్గంలో దివ్యాంగులు వచ్చే వాహనాలకు అనుమతివ్వడంతో పాటు ప్రత్యేకంగా ఆలయ సిబ్బందిని కనీసం ఆదివారం నాడైనా డెప్యూట్ చేయాలి. ● ఆర్జిత సేవల్లో దివ్యాంగులు పాల్గొనేలా సౌకర్యాలు కల్పించాలి. కనీసం గంట సమయం పట్టే సూర్యనమస్కారాల పూజల్లో పాల్గొనేందుకు వీలైన సౌకర్యాలు కల్పించాలి. ● ఉదయం ఆలయంలో ఉచిత ప్రసాదాల స్వీకరణకు, మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని తీసుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. -
జె.ఆర్.పురంలో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ లక్ష్మీనగర్‌లో డేవిడ్‌రాజ్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాస్టర్ శ్యాంకుమార్ కుమారుడు డేవిడ్‌రాజ్, కోడలు అరుణకుమారి అద్దె ఇంట్లో ఉంటున్నారు. డేవిడ్‌రాజ్ విశాఖపట్నంలో ఒక ప్రయివేటు కంపెనీలో పని చేస్తూ రెండు రోజులుగా అక్కడే ఉండిపోయారు. కోడలు అరుణకుమారి చీపురుపల్లి మండలం నడిపిల్లిలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి చీపురుపల్లి మండలం బొండపల్లిలోని కన్నవారింటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. డేవిడ్‌రాజ్ తమ్ముడు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటికి వెళ్లి చూడగా తలుపులు తీసి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మూడు తులాల బంగారం, రెండు లక్షల నగదు, కొన్ని వస్తువులు పోయినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు -
ఆటో డ్రైవర్ల పొట్టకొట్టిన కూటమి ప్రభుత్వం
కొతూరు : కూటమి ప్రభుత్వం ఆటోడ్రైవర్ల పొట్టకొట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాదరావు అన్నారు. కొత్తూరులో శుక్రవారం ఆటో డ్రైవర్లు నిరసన ర్యారీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండాపోతోందన్నారు. ఆదాయం లేక వాహన ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నారా లోకేష్ గతంలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకుంటానిని చెప్పి ఇప్పుడు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా కొంతమొత్తం చెల్లించడంతో పాటు వాహన మిత్ర పథకం ద్వారా ఏటా రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు, పెద్ద ఎత్తున డ్రైవర్లు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీలపై కూటమి కుట్ర
● ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ..? ● వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు అట్టర్ ఫ్లాప్ ● ప్రభుత్వ తీరుపై మండిపడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం న్యూకాలనీ: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబా బు నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. పీపీపీ విధానం ద్వారా 10 మెడికల్ కాలేజీలను తన వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్రకు తెరతీశారని, తద్వారా వేలకోట్లను దోచుకునేందుకు స్కెచ్ వేశారని దుయ్యబట్టారు. దార్శనికుడు జగన్.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అనే విషయాన్ని డాక్టర్ సీదిరి గుర్తుచేశారు. గత ప్రభుత్వం హ యాంలోనే రూ.2500 కోట్లు ఖర్చు చేసి, 5 మెడికల్ కాలేజీల భవన నిర్మాణాలు పూర్తయ్యి అడ్మిషన్లు మొదలుపెట్టిన విషయం వాస్తవం కా దా ? అని ప్రశ్నించారు. మరో రూ.6వేలు కోట్లు ఖర్చు చేసి 2025–26, 2026–27 నాటికి మిగిలిన 10 కాలేజీల్లో తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక చేశారని, కానీ ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయన్నారు. 15 నెలల్లో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రూ.6వేల కోట్లు వెచ్చించలేదా అని ప్రశ్నించారు. అక్రమాలపై ప్రశ్ని స్తానని చెప్పిన పవన్ కల్యాణ్ వారి పంచనే చేరి రుషికొండలో వేషాలు వేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు పాలన చీకటి రోజులను తలపిస్తోందన్నారు. ఎవరి లబ్ధి కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు పరం చేసి భీమా విధానంలోకి తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. మంత్రిగా తప్పుకో అచ్చెన్నాయుడు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయు డు జిల్లా పరువు మంటగలుపుతున్నారని అన్నా రు. యూరియాను సైతం అందజేయలేని దుస్థితి పై కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. పనిచేయడం చేయకాకపోతే వ్యవసాయశాఖ నుంచి తప్పుకో అచ్చెన్నాయుడు అని హితవుపలికారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం పాతపట్నం: గ్రామీణ నిరుద్యోగులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని ట్రస్ట్ ఇన్చార్జి ఎం.రామమూర్తి శుక్రవారం తెలిపారు. పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వైటీసీలో నాలుగు నెలల పాటు ఉచితంగా హస్టల్, వసతి సౌకర్యం ఉంటుందని, కంప్యూటర్ బేసిక్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లి ష్, పర్సనల్ డెవలప్మెంట్, స్కిల్స్, సోలార్ పీవీ ఇన్స్టాల్ కోర్సులకు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పదో తర గతి పాసై ఉండాలని, 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండాలని, దరఖాస్తు చేసుకోవాలని, 105 సీట్లు మాత్రమే ఉన్నాయని, మరిన్ని వివరాలకు 7416321186 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ట్రస్ట్ ఇన్చార్జి రామమూర్తి కోరారు. -
ఆ
నిమిషాలు.. 30ముప్పై నిమిషాలు ఆమదాలవలస స్టేషన్ ఉత్కంఠతో ఊపిరి బిగపట్టి చూసింది. నిత్యం రైల్వే అనౌన్స్మెంట్లతో మార్మోగే ఆ ప్రాంగణం ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు గమనించింది. సమయానికే స్టేషన్‌కు వచ్చిన రైలు అక్కడే ఆగిపోవడం, నిమిషాలు గడిచిపోతున్నా కదలకపోవడం, ఓ గర్భిణికి రైలులోనే ప్రసవం జరుగుతోందని స్టేషన్ అంతా తెలియడం, పండంటి ఆడపిల్ల పుట్టిందని సమాచారం రావడం వంటి ఘటనలతో ముప్పై నిమిషాలు మూడు ఘడియల్లా గడిచిపోయాయి. కాసింత జాప్యానికే తిట్టుకునే ప్రయాణికులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆలస్యాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆమదాలవలస / శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి రైలులో ఓ గర్భిణి ప్రసవించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ అరుణ, రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ పల్ల కీర్తి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురానికి చెందిన జి.భూలక్ష్మి అనే గర్భిణి తన భర్త జానకిరామ్‌తో కలిసి విశాఖ వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. దారిలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఆమె భర్త రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును స్టేషన్లో నిలుపుదల చేసి రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కీర్తికి సమాచారం అందించారు. ఆమె హూటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నొప్పులు అధికం కావడంతో రైలులోనే ప్రసవంచేశారు. ఆడబిడ్డ జన్మించగా తల్లి గర్భంలో మరో శిశువు ఉన్నట్లు వైద్యురాలు గుర్తించారు. దీంతో వారిని వెంటనే రాగోలు జెమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. సంఘటనను రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అంతా వింతగా గమనించారు. దాదాపు 30 నిమిషాల పాటు రైలును ఆపేశారు. ఆమదాలవలస రైల్వే స్టేషన్లో రైలులోనే ప్రసవం రైల్వే డాక్టర్ చొరవతో తల్లీబిడ్డ క్షేమం జెమ్స్ ఆస్పత్రిలో మరో బిడ్డ జననం -
టీచర్లతోనే బంగారు భవిష్యత్
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానో త్సవంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం కల్చరల్/ శ్రీకాకుళం న్యూకాలనీ/ జి.సిగడాం /మెళియాపుట్టి: భావితరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వగలిగేది ఒక్క ఉపాధ్యాయుడే అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్లతో పాటు తల్లిదండ్రులు తమ పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారిలో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటారని వారిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు టీవీ, సెల్ వాడకంపై నియంత్రణ ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం తాము ఎంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.శశిభూషణరావు, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, డైట్ ప్రిన్సిపాల్ గౌరీశంకర్, సాయిప్రసాద్, బెజ్జిపురం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రసాదరావు పాల్గొన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు అందుకుంటున్న టీచర్లు తిమ్మరాజు నీరజ, బూరవెల్లి విజయభారతి, కూర్మాన అరుణకుమారి, లెక్చరర్ రుంకు జనార్దనరావు -
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసే నీచ చరిత్ర చంద్రబాబుది’
సాక్షి,శ్రీకాకుళం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.మెడికల్ కాలేజీను ప్రైవేట్‌పరం చేసే దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు తోడు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీను చంద్రబాబు ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో ఉంచుకుంటున్నారా? లేదంటే అమ్ముకుంటున్నారో చెప్పండి’అని ప్రశ్నించారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగం హద్దు మీరుతోంది
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ● టెక్కలి డీఎస్పీ కార్యాలయం ముట్టడి టెక్కలి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం టెక్కలి నియోజకవర్గంలో పోలీసులు హద్దు మీరుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సంతబొ మ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన జీరు విశ్వనాథంపై నౌపడ ఎస్ఐ నారాయణస్వామి విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని తిలక్ పరామర్శించారు. ఎస్ఐ నారాయణస్వామి తీరును తప్పుబడుతూ మూలపేట గ్రామస్తులంతా టెక్కలి డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం పేరాడ తిలక్‌తో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, మూలపేట గ్రామస్తులు డీఎస్పీ లక్ష్మణరావును కలిసి ఫిర్యాదు చేశారు. నౌపడ ఎస్ఐతో పాటు సీఐ చేస్తున్న విధ్వంసాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు. అచ్చెన్నాయుడు చెప్పాడని, మూలపేటలో భీమారావు చెప్పాడని పోలీసులు అన్యాయంగా ప్రవర్తిస్తే సహించేది లేదని తిలక్ అన్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు మూలపేట సర్పంచ్ జీరు బాబు రావు, సంతబొమ్మాళి పార్టీ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, నాయకులు కె.గోవింద్, ఎం.అప్పారావు, దొర, ఎం.నాగభూషణ్ తదితరులు ఉన్నారు. -
మూలపేటపై అధికారమదం
అధికార పార్టీకి చెందిన వారేమో యథేచ్ఛగా దాడులకు పాల్పడతారు. ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి వచ్చి మరీ బెదిరిస్తారు. కానీ వీరిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇంటికొచ్చి కొట్టినా ఏమీ కానట్టే ఖాకీలు వ్యవహరిస్తారు. విపక్ష నాయకుడైతే మాత్రం గల్లా పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్లేంత తెగువ చూపిస్తారు. ఎందుకని ప్రశ్నిస్తే దాడి చేయడానికి కూడా వెనుకాడరు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో పరిస్థితి ఇది. ఏ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారో గానీ ఇక్కడ ప్రాథమిక హక్కులకు రక్షణ లేకుండాపోయింది. బుధవారం మూలపేట సర్పంచ్ ఇంటిపై దాడికి ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకుడు జీరు భీమారావు తదితరులు సంతబొమ్మాళి: మండలంలోని మూలపేటపై రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడ పడింది. అందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు అధికార పక్షమైతే ఒకలా, విపక్షమైతే మ రోలా ప్రవర్తిస్తున్నారు. ఈ వైఖరి గ్రామంలో సమస్యలు రేకెత్తిస్తోంది. ఈ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, సర్పంచ్ తమ్ముడైన జీరు విశ్వనాథంపై నౌపడ ఎస్ఐ నారాయణస్వామి దాడి చేయడంతో గ్రామస్తులంతా పోలీస్‌స్టేషన్ ముందు గురువారం నిరసన చేపట్టారు. మూలపేట సర్పంచ్ జీరు బాబూరావు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మూలపేట గ్రామానికి చేపల కట్టు వేలంపాట, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థాని క సర్పంచ్ జీరు బాబూరావు ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చిన డబ్బులను 12 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి వారి అకౌంట్లో రూ. 32 లక్షలు జమ చేశారు. అలాగే గ్రామానికి చెందిన మరో నలుగురి ఖాతాల్లో రూ. 40లక్షలు జమ చేశారు. గ్రామానికి సంబంధించి ఏవైనా కార్యక్రమాలు జరిగితే ఈ డబ్బు ఖర్చు చేసేవారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి సంబంధించిన డబ్బులు తమకు ఇవ్వాలని టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ జీరు భీమారావు అడిగారు. మీ హయాంలో మీ వద్దనున్న రూ.60లక్షల ఏమయ్యావో చెప్పాలని, ఆ డబ్బు ఊరికి ఇస్తే తమ వద్ద ఉన్న డబ్బులు అప్పగిస్తానని సర్పంచ్ బాబూరావు సమాధానం ఇచ్చారు. దీనిపై వివాదం చెలరేగింది. డబ్బుల కోసం పోలీసుల ద్వారా కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో టీడీపీ నాయకుడు జీరు భీమారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం మూలపేట సర్పంచ్ జీరు బాబూరావు ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో సర్పంచ్ తండ్రిపై దాడి చేశారు. గ్రామంలో గొడవలు వద్దని విషయం తెలిసినా సర్పంచ్ బాబూరావు మిన్నకుండిపోయారు. కానీ గురువారం టీడీపీ నాయకుల ఒత్తిడితో రొయ్యల చెరువు వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త మంగి రామారావును పోలీస్ స్టేషన్‌కు తీసుకుని రావడానికి నౌపడ ఎస్ఐ నారాయణస్వామి ప్రయత్నించారు. ఎందు కు తీసుకెళ్తున్నారని ప్రశ్నించిన సర్పంచ్ తమ్ముడు జీరు విశ్వనాథంపైన ఎస్ఐ ఇష్టానుసారం దాడి చేశారు. ముఖం, గుండైపెన చేతులతో దాడి చేసి షర్టు చింపి వేసి అక్కడ ఉన్న మంగి రామారావును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. గాయపడిన జీరు విశ్వనాథం టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చేరారు. దీనిపై ఊరుఊరంతా మండిపడింది. మహిళలతో పాటు గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు. మంగి రామారావును విడిచి పెట్టేంత వరకు వెళ్లబోమని తేల్చి చెప్పారు. విచారించి కొద్దిసేపట్లో విడిచిపెడతామని పోలీసులు చెప్పడంతో సర్పంచ్ జీరు బాబూరావుతో పాటు గ్రామస్తులు వెను తిరిగారు. దీనిపై గ్రామస్తులు టెక్కలి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నడిరోడ్డుపై నిలదీత గ్రామాల్లో తగాదాలకు కారణమవుతున్న టీడీపీ మండలాధ్యక్షుడు, మూలపేట మాజీ సర్పంచ్ జీరు భీమారావును నౌపడలో నడి రోడ్డుపైన మహిళలు, గ్రామస్తులు నిలదీశారు. మంగి రామారావును పోలీస్ స్టేషన్‌కు తీసుకుని రావడానికి జీరు భీమారావే కారణమని తెలుసుకున్న గ్రామస్తులు అతని ఇంటికి వెళ్లడానికి బయల్దేరగా.. సమాచారం తెలుసుకున్న జీరు భీమారావు తన ఇంటి నుంచి వేరొక చోటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అయితే నౌపడ మెయిన్‌రోడ్డులో ద్విచక్ర వాహనంపై వస్తు న్న జీరు భీమారావుని మహిళలు, గ్రామస్తులు అడ్డుకొని నిలదీశారు. గ్రామానికి సంబంధించిన రూ.రెండు లక్షల నలౖభై వేలు నగదు, 40 సిమెంట్ బస్తాలు 2014లో అప్పుగా తీసుకొని అంతవరకు ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలని అన్నారు. అధికారాన్ని ఉపయోగించి భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళలు, గ్రామస్తులు నిలదీయడంతో భయపడి నౌపడ పోలీస్ స్టేషన్లో దాక్కున్నారు. మూలపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఎస్ఐ దాడి దాడిని నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ముందు నిరసన టెక్కలి డీఎస్పీకి ఫిర్యాదు -
గంజాయి రవాణా గుట్టురట్టు
పలాస: గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ చెప్పారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా నియోగుడ గ్రామానికి చెందిన అరబింద ఆనంద్, తబరద గ్రామానికి చెందిన మైకీల్ రైతా, సెరంగో గ్రామానికి చెందిన ప్రాతిమా లిమ్మాలను పర్లాకిమిడి మీదుగా పలాస రైల్వే స్టేషన్‌కు బుధవారం రాగా పలాస రైల్వే స్టేషన్ కూడలి వద్ద పట్టుకుని విచారించారు. వారి వద్ద 16.435 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బైక్, రెండు సెల్ఫోన్లు, రూ.1580 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్‌పై తరలిస్తుండగా.. ఇచ్ఛాపురం రూరల్: ఒడిశా నుంచి ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. గురువారం ఇచ్ఛాపురం పట్టణ సర్కిల్ కార్యాలయంలో కవిటి ఎస్ఐ వి.రవివర్మతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొడల గ్రామానికి చెందిన సాగర్ బెహరా, అతని స్నేహితుడు పీతల గ్రామానికి చెందిన బాలుడు రాజేష్ జెన్నాతో కలిసి గురువారం ఒడిశా నుంచి స్థానిక 16వ నెంబర్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై 21.030 కేజీల గంజాయిని తరలిస్తుండగా కవిటి పోలీసులు కొజ్జిరియా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనపరచుకున్నామన్నారు. పలాస చేరుకొని అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో స్పిన్నింగ్ మిల్లులో కూలీగా పనిచేస్తున్న దేవేంద్ర పండికి ఇచ్చేందుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులకు ఆశపడి గంజాయి వ్యాపారీ సమీర్ సాహూ వద్ద నుంచి గంజాయిని తరలిచేందుకు అంగీకరించినట్లు నిందితులు తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు
మెళియాపుట్టి : మారడికోట పంచాయతీ సవర చీడిపాలెం గ్రామంలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. సవర భాస్కరరావు తన ఇంటి మేడపైకి వెళ్లి కరెంట్ తీగలను కదపడంతో షాక్‌కు గురై హైటెన్షన్ వైర్లకు అతుక్కుపోయాడు.వెంటనే గ్రామస్తులు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి సరఫరా నిలిపివేయడంతో కింద పడిపోయాడు. బాధితుడిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్లోచేర్పించారు. అయితే కరెంట్ తీగలను ఎందుకు కదపడానికి వెళ్లాడు అనే దానిపై స్పష్టత లేదు. భాస్కరరావు భార్య మూడేళ్ల కిందటే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బైక్ నుంచి జారిపడి మహిళ మృతి ఎచ్చెర్ల: సంతసీతారాంపురం సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన బస్వ పార్వతి (49) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్న పార్వతి తన కుమారుడు రామిరెడ్డితో కలసి ద్విచక్రవాహనంపై బుడగట్లపాలెం–సంతసీతారాంపురం మీదుగా రిమ్స్ ఆస్పత్రికి బయలుదేరింది. బైక్ వెనుక కూర్చున్న పార్వతికి ఒక్కసారిగా కళ్లు తిరగడంతో కుమారుడిని గట్టిగా పట్టుకుంది. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పార్వతిని 108 అంబులెన్సులో రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వల్పగాయాలతో బయటపడిన రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ–2 అప్పలరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంట పొలంలో గుర్తు తెలియని మృతదేహం
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రి దాటాక గూడేం వెళ్లే దారిలో వైన్‌షాప్ ఎదురుగా పంట పొలాల్లో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. నీలం వైట్ చెక్స్ టీషర్టు, నలుపు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. శరీరంపై గాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెంది సుమారు వారం గడిచి ఉంటుందని భావిస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతూ గుర్తు పట్టలేని విధంగా మారింది. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ పైడపునాయుడు, సిబ్బంది, క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలిస్తే శ్రీకాకుళం రూరల్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ రాము కోరారు. బంగారు వ్యాపారి అంటూ పుకార్లు.. గుర్తు తెలియని మృతదేహాన్ని చూసిన స్థానికులు ఇటీవల నరసన్నపేటలో అదృశ్యమైన ఓ బంగారు వ్యాపారిగా భావించడం కలకలం రేపింది. వెంటనే రూరల్ పోలీసులు నరసన్నపేట పోలీసులతో పాటు కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు వచ్చి చూసి వ్యాపారి మృతదేహం కాదని నిర్ధారణ చేశారు. -
చోరీకి గురైన బైకులు స్వాధీనం
పొందూరు: చోరీకి గురైన నాలుగు బైకులను, ఓ లగేజీ ఆటోను టెక్నాలజీ సాయంతో స్వాధీనం చేసుకున్నామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. పొందూరు పోలీసుస్టేషన్ పరిధిలో చోరీకి గురైన వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని పలు గ్రామాల్లో కార్డన్‌సెర్చ్ చేస్తున్న సమయంలో తమ బైకులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. బైక్‌ను పోగొట్టుకున్న యజమాని ఫోన్‌కు వచ్చిన మెసేజ్ ఆధారంగా సాంకేతికతను ఉపయోగించుకుని బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం మంగువారి తోటకు చెందిన బొమ్మలాట మోహనరావు, బొమ్మలాట ఢిల్లీశ్వరరావు, తోట శ్రీనివాసరావు, మెండ శివలు వాహనాలు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వీరిలో బైకు దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మోహనరావు మూడు ద్విచక్రవాహనాలను, ఢిల్వీశ్వరరావు ఒక ద్విచక్రవాహనాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. తోట శ్రీనివాసరావు, మెండ శివలు కొత్తూరులో చోరీ చేసిన లగేజి ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇటువంటి చోరీ చేసిన వాహనాలను ఢిల్లీశ్వరరావు కొనుగోలు చేసి విక్రయిస్తుంటాడని తెఇపారు. నాలుగు ద్విచక్రవాహనాలు, లగేజి ఆటోను ఢిల్లీశ్వరరావు నుంచి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ వాహనాలన్నీ పొందూరు మండలం రాపాక గ్రామసుతలకు చెందినవిగా గుర్తించామని చెప్పారు. జైలులో ఉన్న మోహనరావును పూర్తి స్థాయిలో విచారిస్తే మరికొన్ని ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందన్నారు. చోరీకి గురైన వాహనాల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన ఎస్సై వి.సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు సీఐ పి.సత్యనారాయణ, ఎస్ఐ వి.సత్యనారాయణ, ట్రైనీ ఎస్ఐ మోహిని, పోలీసు సిబ్బంది ఉన్నారు. సమస్మాత్మకత గ్రామాలపై దృష్టి... నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించినట్లు డీఎస్పీ తెలిపారు. పొందూరు మండలంలో ఇప్పటి నుంచే సమస్యాత్మక గ్రామాలలో సమావేశాలు నిర్వహించి వివాదాలు లేకుండా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈసారి బైండోవర్ కేసులలో చిక్కుకుంటే రూ. 2 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
మద్యం దందా!
జలుమూరు: కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దందాకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. జలుమూరు మండలం కొమనాపల్లి కేంద్రంగా గ్రామాల్లోని బెల్టుషాపులకు మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అటు సరుబుజ్జిలి, ఇటు హిరమండలం వరకూ ఇక్కడి వైన్ షాపు నుంచి మందు సరఫరా జరుగుతోంది. షాపు నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వాస్తవానికి ఇక్కడ పర్మిట్ రూమ్‌కు అనుమతులు లేవు. అయినా షాప్ చుట్టూ దాబా, నూడిల్స్, ఇతర తినుబండారాలు షాప్‌లు పెట్టి అక్కడే కుర్చీలు, బెంచీలు వేసి బహిరంగంగా మందుబాబులు మద్యం సేవిస్తుంటారు. ఈ సమయంలో సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులు వచ్చినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం రికార్డులు తనిఖీలు చేసి అమ్మకాలు, కొనుగోళ్లు చూస్తున్నారే తప్ప బెల్ట్ షాప్‌లు, మద్యం అక్రమ రవాణాపై కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఊరుకెళ్లినా బెల్టుషాపులే.. కొమనాపల్లి మద్యం షాప్ నుంచి ఇటు సరుబుజ్జిలి మండలం తెలికిపెంట, యరగాం, పాతపాడు, చిన్నకాగితాపల్లి, పెద్దమాలపేట, అగ్రహారం, లొద్దలకాగితాపల్లి తోపాటు మరో 20 గ్రామాలు, అటు హిరమండలంలోని కిట్టలపాడు కాలని, అక్కరాపల్లి, రెల్లివలస, అంబావిల్లి, పిండ్రువాడతోపాటు మరో 15 గ్రామాలు, జలుమూరు మండలం కొమనాపల్లి, శ్రీముఖలింగం, నగిరికటకం, కరకవలస, యలమంచిలి, తిమడాం, అల్లాడ, పర్లాం, మాకివలస, అందవరం మరో 16 గ్రామాలకు ఈ షాప్ నుంచి మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మంత్రి బంధువులనే వెనుకంజ.. కొమనాపల్లి మద్యం షాపు నిర్వాహకులు జిల్లాకు చెందిన మంత్రి సమీప బందువు. ఎకై ్సజ్ కార్యాలయం కూడా మంత్రి ఇలాకాలోని కోటబొమ్మాళిలో ఉండటంతో అధికారులు తనిఖీలకు వెనకంజ వేస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఫిర్యాదు రాలేదు.. ఈ విషయమై కోటబొమ్మాళి ఎకై ్సజ్ శాఖ ఎస్ఐ ఆర్.సీత వద్ద ప్రస్తావించగా కొమనాపల్లి మద్యం షాపుపై మాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. అయినా సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించి అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. షాపు ఉదయం తెరిచిన వెంటనే ఆయా బెల్ట్‌షాప్‌లు, పర్మిట్ రూమ్ నిర్వాహకుల సెల్‌కు మెసేజ్ వెళ్తుంది. వెంటనే వారు వచ్చి ఆటో, ద్విచక్ర వాహనాల ద్వారా దర్జాగా మద్యం బాటిళ్లు తీసుకెళ్లిపోతారు. ఉదయం 9 గంటల లోపల అవసరం పడితే ఒక్కో క్వార్టర్ బాటిల్‌కు రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. అదే 10 గంటలు దాటితే క్వార్టర్ బాటిల్‌కు రూ.50 అదనం. బెల్ట్‌షాప్, పర్మిట్ రూమ్‌లకు షాప్ నిర్వాహకులే నేరుగా మద్యం తీసుకెళ్తే క్వార్టర్‌కు రూ.70 వరకు వసూలు చేస్తుంటారు. రెండు నుంచి మూడు కిలోమీటర్లు దూరమైతే కాస్త ధర తగ్గించి అమ్మకాలు చేస్తున్నారు. యథేచ్ఛగా బెల్టుషాపులకు మద్యం తరలింపు అనుమతులు కొన్ని గ్రామాలకే.. అమ్మకాలు రెండు మండలాలకు.. క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.50 వసూలు! తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు -
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేతివాటం
● ఎరువుల పేరిట రైతుల వద్ద డబ్బులు వసూలు ● 25 మందికి పింఛనూ ఇవ్వని వైనం ● విచారణ చేపట్టిన ఏడీ ఎరువుల కోసం డబ్బులిచ్చా.. ముందుగా డబ్బులు ఇస్తే యూరి యా, డీఏపీ తెప్పిస్తానని డబ్బులు కట్టమంటే ఇచ్చాం. 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ ఎరువు ఇవ్వలేదు. అడిగితే ఇదుగో అదిగో అని వాయిదాలు వేస్తున్నారు. – చిన్నమ్మడు, చింతువానిపేట పింఛన్ ఇవ్వలేదు.. పింఛన్ కోసం ఎదురు చూస్తున్నాం. సచివాలయం చుట్టూ తిరిగాం.మూడు రోజుల నుంచి తిప్పించుకుంటున్నా డబ్బులు ఇవ్వలేదు. తీరా బుధవారం మా పింఛన్ డబ్బు సచివాలయం ఉద్యో గి తినేశాడని అంటున్నారు. మా పింఛన్ మాకు ఇప్పించండి. – ఆదెమ్మ, మహలక్ష్మి, కళావతి, పింఛన్ లబ్ధిదారులు నరసన్నపేట: ఉర్లాం సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గొల్లపల్లి భాస్కరరావు చేతివాటం చూపడంతో అటు రైతులు, ఇటు పించనుదారులు లబోదిబోమంటున్నారు. ఉర్లాంకు ఇటీవలే బదిలీపై వచ్చిన భాస్కరరావు వచ్చినప్పటి నుంచి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, కేర్ ఆసుపత్రిలో జాయిన్ చేశామని, డబ్బులు అవసరమంటూ స్థానికుల వద్ద రూ.రెండు లక్షలకు పైగా అప్పులు చేసినట్లు సమాచారం. యూరియా, డీఏపీ ఇస్తామని చెప్పి 110 మంది రైతుల నుంచి రూ.1,92,820 వసూలు చేశాడు. 15 రోజులైన ఎరువులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజావీధి, చెరువు గట్టుపై ఉన్న 61 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి రవికుమార్ ఆగస్టు 31న రూ.2.52 లక్షలు ఇచ్చారు. అయినా పింఛన్లు పంపిణీ చేయలేదు. కొందరు వృద్ధుల నుంచి వేలిముద్రలు వేయించుకుని డబ్బులు ఇవ్వలేదు. వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో బుధవారం ఉదయం 36 మందికి ఆదరాబాదరగా పింఛన్లు పంపిణీ చేశారు. మిగిలిన 25 మందికి ఇవ్వాల్సిన రూ.1,21,000 తన వద్ద లేవని, ఖర్చయిపోయాయని చెప్పడం గమనార్హం. ఈ మొత్తం కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో సమయం కోరినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండటంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఎరువు ఇస్తామని వసూలు.. ఉర్లాం ఆర్ఎస్కే పరిధిలోని రైతుల వద్ద 440 యూరియా బస్తాలు, 50 డీఏపీ బస్తాలకు రూ.1.92,820 లక్షలను భాస్కరరావు వసూలు చేశాడు. యూరియా బస్తాకు రూ.280 చొప్పున, డీఏపీ బస్తాకు రూ.1370 చొప్పున వసూలు చేశాడు. అందరికీ చేతి రసీదులు ఇచ్చారు. వీటిని పట్టుకొని రైతులు ప్రతిరోజూ ఆర్ఎస్కే, సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత రైతులు స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ మధు దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఆయన ఉర్లాం చేరుకొని సర్పంచ్ పోలాకి నర్శింహమూర్తి, మాజీ సర్పంచ్ జల్లు చంద్రమౌళి, గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు భాస్కరరావు అంగీకరించాడు. దీంతో తమకు ఎరువులు ఇప్పించాలని, లేదా డబ్బులైనా వాపసు చేయాలని రైతులు కోరారు. కాగా శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి నివేదిక పంపనున్నట్లు ఏడీ తెలిపారు. -
కేసులు పెడితే దోషులవుతారా?
● మాజీ మంత్రి ధర్మాన ధ్వజం ● ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్ సాక్షి, రాజమహేంద్రవరం/శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్‌రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోందని, ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి ధర్మాన బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఎంపీ మిథున్‌రెడ్డిపై కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదన్నారు. ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కారని చెప్పారు. న్యాయ వ్యవస్థ నిర్ధారించేంత వరకు వ్యక్తిగానే చూడాలన్నారు. మిథున్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇంతవరకు తుది చార్జిషీట్ వేయలేదన్నారు. చార్జీషీటు వేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయంతో మిథున్‌రెడ్డి ఉన్నారన్నారు. ములాఖత్ అయిన వారిలో ధర్మానతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, మామిడి శ్రీకాంత్, తదితరులు ఉన్నారు. బార్లకు రీ–నోటిఫికేషన్ శ్రీకాకుళం క్రైమ్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బార్ పాలసీ 2025–28లో భాగంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు ప్రకటన విడుదల చేశారు. గత నెల 19 బార్లకు రెండు సార్లు (ఓపెన్, రిజర్వ్ క్యాటగిరీ) వేర్వేరు నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం లాటరీ పద్ధతిలో డ్రా తీసేందుకు దరఖాస్తులు కోరగా ఐదు బార్లకే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన 14 బార్లలో శ్రీకాకుళం 6, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురాల్లో రెండేసి చొప్పున ఉన్న వాటికి ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ తీసి లైసెన్సుదారులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కిరాణాషాపులో ఎరువులు పట్టివేత రణస్థలం/శ్రీకాకుళం క్రైమ్: నారువ గ్రామంలో మామిడిపాక వెంకట సత్యనారాయణ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వచేసిన 25 బస్తాల యూరియా, ఎరువులను విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ డి.వి.వి.సతీష్ కుమార్‌కు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా 14 బస్తాల యూరియా, 11 బస్తాల పోటాషియం, అమ్మోనియా వంటి ఇతర ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటి విలువ రూ. 41వేలు ఉంటుందని చెప్పారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ తనిఖీలో విజిలెన్స్ ఎస్సై రామారావు, రణస్థలం వ్యవసాయ ఏవో డి.విజయభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఎరువులను బ్లాక్‌మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని, ఇప్పటికే దళారులపై నిఘా ఉంచామని విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. -
ప్రభుత్వ భవనాల కూల్చివేత దారుణం
● పంచాయతీ భవనాన్ని వెంటనే పునర్నిర్మించాలి ● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ పాతపట్నం: మండల కేంద్రం పాతపట్నంలోని పంచాయతీ భవనాన్ని కూల్చివేయడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నం మేజర్ పంచాయతీ కార్యాలయం భవనం కూల్చివేసిన స్థలాన్ని బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ భవనం, స్థలం ప్రజలు ఆస్తి అని, ఏ ఒక్క పార్టీది కాదన్నారు. అధికారులు ముందస్తుగా ప్రజలకు తెలియజేయకుండా భవనం కూల్చివేయడం సరికాదన్నారు. ఈ స్థలం దాతలు విరాళంగా ఇచ్చారని చెప్పారు. మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారని, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్న క్యాంటీన్ కోసం ఎటువంటి అనుమతి లేకుండా పంచాయతీ కార్యాలయం కూల్చివేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాత్రికి రాత్రే భవనం కూల్చివేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పంచాయతీ భవనాన్ని వెంటనే పునర్నిర్మించాలన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆమెతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఐటీ వింగ్ విభాగం అధ్యక్షుడు ఏనుగుతల సూర్యం, యరుకోల వెంకటరమణ, గోకవలస రాము, మజ్జి వరదరాజులు, పడ్డ నేతాజి, రామారావు, ఆఫీసు, రామకృష్ణ, తులుగు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
శ్రీకాకుళం కల్చరల్/మెళియాపుట్టి/జి.సిగడాం: జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. శ్రీకాకుళం నగర పరిధిలోని గుజరాతిపేటలో అంధవరపు వరాహ నరసింహం మున్సిపల్ హైస్కూల్ హిందీపండిట్ తిమ్మరాజు నీరజ, మెళియాపుట్టి మండలం నేలబొంతు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బూరవెల్లి విజయభారతి, జి.సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం డాక్టర్ కూర్మాన అరుణకుమారిల సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులను ఎంపిక చేస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ● సులువుగా హిందీ భాష బోధించడంలో నీరజ తనవంతు కృషి చేస్తున్నారు. పాటలు, నృత్యాలు, అంత్యాక్షరి రూపంలో సృజనాత్మకంగా బోధిస్తున్నారు. ● విజయభారతి భౌతిక శాస్త్రం పుస్తకాలు రాశారు. జాతీయ స్థాయిలో ప్రత్యేక శిక్షణ పొంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ● అరుణకుమారి వినూత్న రీతిలో విద్యాబోధన చేపడుతున్నారు. పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధిస్తుంటారు. వీరంతా ఈ నెల 5న అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు పొందనున్నారు. కాగా, మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన మెట్ట మోహనరావు విశాఖ జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. గోపాలపట్నం మండలం లక్ష్మీనగర్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. కూర్మాన అరుణకుమారి బూరవెల్లి విజయభారతి తిమ్మరాజు నీరజ -
పోషణ భారమై.. గోవులకు గుడ్‌బై!
అరసవల్లి : పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం పరిస్థితి. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ఆదిత్యాలయం వార్షికాదాయం సుమారు రూ.20 కోట్లకు చేరుకుంది. అయినా అందుకు తగ్గట్టుగా నిర్వహణ లేదనే చెప్పాలి. భక్తుల సౌకర్యాలు పక్కనపెడితే.. పవిత్రమైన గోమాతలను కూడా పోషించలేమని వాటిని వదిలించుకునేందుకు సిద్ధపడ్డారు. పోషణను భారంగా భావించి గోవులను ఇతరులకు అప్పగించాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది. భక్తుల అసంతృప్తి.. ఇప్పటికే అనేక వివాదాల చుట్టూ బిగుసుకున్న ఆదిత్యాలయంలో తాజాగా గోవుల తరలింపు నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 2002 నుంచి అరసవల్లి ఆలయంలో ఉన్న గోశాలలో పలు గోవులను పోషిస్తూవస్తున్నారు. ఆలయ వార్షిక బడ్జెట్లో కూడా ఈమేరకు కేటాయింపులుండటంతో కార్యనిర్వహణాధికారులు ఈ గోశాల అంశంలో వెనక్కితగ్గకుండా నిర్వహించారు. తాజాగా 13 గోవుల్లో (చిన్నవి పెద్దవి కలుపుకుని) ఏకంగా 8 ఆవులను రైతులుగా పేర్కొన్న ఓ నలుగురు ప్రైవేటు వ్యక్తులకు పశుపోషణకు అప్పగిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ పేరిట అధికారిక ప్రకటనను (ఆర్సీ–జి/9/2025) బుధవారం విడుదల చేసింది. గోశాలలో గోవులకు ఫల నివేదన చేసి పూజలు చేసిన తర్వాతే స్వామి దర్శనాలకు వచ్చే ఆచారం ఇక్కడ కొనసాగుతోంది. తాజా నిర్ణయంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థల సమస్య పేరిట... ఆదిత్యాలయంలో పాత గోశాలను తొలగించి 2023 ఆగస్టులో పశ్చిమగోదావరి జిల్లా పెద్దపుల్లేరుకు చెందిన వ్యాపారవేత్త కలిదిండి నరసింహరాజు దంపతులు సుమారు రూ.6 లక్షల సొంత నిధులతో సరికొత్తగా గోశాలను నిర్మించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రథసప్తమి రాష్ట్ర పండుగ నిర్వహణ ఏర్పాట్లులో భాగంగా గతేడాది డిసెంబర్లో ఆలయం ముందున్న దుకాణాలు, జింక్ షెడ్లు, వసతి గదులు, అన్నదాన మండపం, ప్రసాదాల తయారీ, టికెట్ కౌంటర్లను అనాలోచితంగా కూల్చివేశారు. ఈ క్రమంలోనే కొత్త గోశాలను కూడా కూల్చేసి దగ్గర్లో మరో స్థలంలో అదే మెటీరియల్‌తో గోశాలను నిర్మించారు. ఇక్కడే 13 గోవులు పోషణలో ఉన్నా యి. ఇప్పుడు స్థల సమస్యను కారణంగా చూపు తూ గోవుల సంఖ్యను తగ్గించే చర్యలకు దిగారు. వాస్తవానికి నాలుగు నెలల నుంచి వీటి పోషణకు అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదు. 13 ఆవులకు నెలకు 21 బస్తాల తవుడు, 3 లోడుల గడ్డి అవసరం. కాంట్రాక్టర్ సక్రమంగా తవుడు అందివ్వడం లేదనే కారణంతో పాటు ఒక్కో గడ్డి లోడు రూ.5 వేల వరకు ఉంటుందని.. ఇంత భారం మనకెందుకనే ధోరణిలోనే ఆవులను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎనిమిది ఆవులను పొగాకువానిపేటకు చెందిన బోర బాలకృష్ణ, వాడాడ (కొత్తరెడ్డిపేట)కు చెందిన పంచిరెడ్డి అప్పన్న, వాడాడకు చెందిన రెడ్డి జగన్నాథం, జలుమూరు మండలం బసివాడకు చెందిన అల్లు వెంకటప్పయ్యలకు రెండేసి చొప్పున ఆవులను అప్పగించేందుకు నిర్ణయించారు. అప్పగింతకు సిద్దమైన గోవు అరసవల్లి గోశాలలో 8 ఆవులు ఇతరులకు ఇచ్చేందుకు నిర్ణయం భక్తుల నుంచి తీవ్ర విమర్శలు అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు: ఈవో అభ్యంతరాల స్వీకరణ గోశాలలో స్థలాభావం, శాశ్వత గోశాల లేకపోవడంతో ఉన్న ఆవుల్లో 8 ఆవులను రైతులకు అప్పగించనున్నాం. ఎవరికై నా అభ్యంతరాలుంటే 8978914660 నంబర్‌కు ఏడు రోజుల్లో సంప్రదించి వివరాలు గానీ, అభ్యంతరాలు గానీ తెలియజేయవచ్చు. – కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఆలయ ఈవో, అరసవల్లి -
ఆదిత్యుని సన్నిధిలో ప్రభాస్ శ్రీను
శ్రీకాకుళం జిల్లా: ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామివారిని సినీ నటుడు పీరు శ్రీనివాస్ (ప్రభాస్ శ్రీను) బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. హైదరాబాద్‌లోని తన స్నేహితులతో పాటు నరసన్నపేటలో వినాయక చవితి మహోత్సవాలకు హాజరైన ప్రభాస్ శ్రీను.. ఆదిత్యున్ని దర్శించుకొని ఆలయ విశేషాలను స్నేహితులకు వివరించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ సిబ్బంది ప్రత్యేక స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్శర్మల బృందం వారికి వేదాశీర్వచనాన్ని, ప్రసాదాలను అందజేశారు. -
అండర్ పాసేజ్‌తో అవస్థలు
వజ్రపుకొత్తూరు: నందిగాం మండలంలోని కవిటి అగ్రహారం గ్రామానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అండర్ పాసేజ్‌లోకి వరద నీరు ఆరు అడుగుల మేర చేరిపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు స్థానిక రైల్వే ట్రాక్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి వెళ్లేందుకు పాత లెవిల్ క్రాసింగ్ రహదారిని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. రైల్వేశాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అండర్ పాసేజ్ నిర్మాణం పూర్తిగా ఫెయిల్ అయిందని, ముందుచూపు లేకుండా నిర్మించారని మండిపడ్డారు. వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి ఉంటోందని, చిన్నపాటి వర్షానికే అండర్ పాసేజ్ నిండిపోయి రాకపోకలు నిలిచిపోవడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు రైలు ట్రాక్ దాటి చిన్నారులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు, రైల్వే శాఖ అధికారులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి గ్రామస్తులతో చర్చలు జరిపారు. మూడు రోజుల్లో సమస్య పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. పెద్ద మోటార్లు తీసుకొచ్చి అండర్ పాసేజ్లో నీటిని తోడే ప్రయత్నాలు రైల్వేశాఖ అధికారులు ముమ్మరం చేశారు. -
కన్నబాబుకు ధర్మాన పరామర్శ
శ్రీకాకుళం రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబాన్ని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కాకినాడలోని వారి నివాసంలో బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ రాష్ట్ర తూర్పుకాపు అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, నాయకులు బలగ ప్రకాశ్, చిట్టి రవికుమార్, గంగు నరేంద్రకుమార్, యాళ్ల శ్రీను, బగ్గు అసిరినాయుడు, రెడ్డి తాతబాబు, గంగు సీతాపతి తదితరులు ఉన్నారు. -
వానా.. హైరానా
● జిల్లాలోని పలుచోట్ల ముంచెత్తిన వర్షం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు, చెరువులు, రోడ్లు, పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. వజ్రపుకొత్తూరు మండలంలోని నగరంపల్లి ప్రాథమిక పాఠశాలలోకి, పూండి గల్లిలోని పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గరుడఖండి – బ్రహ్మణతర్లా వద్ద ఉన్న అండర్ పాసేజ్ బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నరసన్నపేట మండలంలోని గొట్టిపల్లి మార్గంలో ఉన్న స్వయంభూ ఉమామహేశ్వర స్వామి ఆలయం వర్షానికి నీట మునిగింది. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి గ్రామ సమీపంలో గెడ్డ ప్రవాహం ఉధృతంగా మారింది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పాతపట్నంలో మహేంద్రతనయా నది పొంగిపొర్లుతోంది. పాతపట్నం నీలకంఠేశ్వరం ఆలయం వద్ద ఉన్న కాజ్వే బ్రిడ్జిపై నుంచి రెండు అడుగుల నీరు పారుతోంది. – సాక్షి నెట్వర్క్ -
ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతకు అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డున పారేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కూటమి పాలకులు రైతులకివ్వాల్సిన ఎరువులను ప్రైవేట్ డీలర్లకు అమ్మేసి, వారిచేత కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం సరికాదన్నారు. కౌలు రైతులను ఆదుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. మరోవైపు వికలాంగుల పింఛన్లను తొలగించే చర్యలు చేపట్టడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను విడనాడాలని సూచించారు. రైతులపై భారం సరికాదు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ మాట్లాడుతూ రైతులను దగా చేసే ప్రభుత్వాలేవీ ఇప్పటివరకు మనుగడలో లేవని గుర్తు చేశారు. ఉచిత పంటల బీమా ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఇవ్వకుండా ఆ భారం రైతులపై వేయడం సరికాదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడిన విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి కార్యకర్తలు ఇసుక, గ్రావెల్, ఉద్యోగాలు అమ్ముకోవడంతో పాటు చివరికి ఎరువులను సైతం వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, నాయకుడు లోకనాథం పాల్గొన్నారు. -
చేతబడి నెపంతో వృద్ధుడి హత్య
పలాస: కేశుపురం గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ రాములు(80) దారుణ హత్యకు గురయ్యాడు. చేతబడి(చిల్లంగి) చేస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మంగళవారం రాత్రి రాళ్లతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశుపురం గ్రామానికి చెందిన అంబలి తులసీరావు పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బోరుబద్ర గ్రామానికి చెందిన ఓ బూత వైద్యుడిని ఇంటికి పిలుపించుకొని పూజలు చేయించారు. అతను వెళ్లిపోయిన తర్వాత అదేరోజు రాత్రి తులసీరావు కుటుంబ సభ్యులు, బంధువులు ఉంగ రాములు ఇంటికి వెళ్లారు. రాములను బయటకు ఈడ్చుకొచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో రాము తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు, సీఐ పి.సూర్యనారాయణ బుధవారం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులను కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ సీఐ చెప్పారు. -
భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..!
శ్రీకాకుళం క్రైమ్: పెరుగుతున్న సాంకేతికతతో పాటు రోజురోజుకీ సైబర్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. రోజుకో మోసంతో సైబరాసురులు రూ.కోట్లలో భారీగా సొమ్ము కొల్లగొడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు పట్టిపీడించిన ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలే ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ప్రముఖ వైద్యులు, ఉపాధ్యాయ, రాజకీయ, వ్యాపారవర్గాలు, ఇంజినీర్లు సైతం సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని దారుణంగా మోసపోతున్నారు. మోసపోయాక పరువు పోతుందేమోనని కొందరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోయినా.. మరికొందరు భారీ అమౌంట్లు కావడంతో నేరుగా జిల్లా ఉన్నతాధికారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ లెక్కకు మించి సైబర్ కేసులు వివిధ స్టేషన్లలో పెండింగ్‌లోనే ఉంటున్నాయి. మరికొన్ని స్టేషన్లలో అయితే కనీసం కేసు కట్టడానికి సాహసించలేని స్థితిలో ఉండడం గమనార్హం. నమ్మారో.. నట్టేటా మునిగినట్లే.. ● శ్రీకాకుళం సబ్ డివిజన్ కేంద్రంగా ఇటీవల ఒక ప్రముఖ వైద్యుడు ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.37.50 లక్షలు మోసపోయాడు. ఎప్పటినుంచో స్టాక్ మార్కెట్లోనే కాకుండా వివిధ మార్గాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్న ఆ వైద్యుడికి ఒక ఆపరిచిత వ్యక్తి వాట్సాప్ కాల్చేసి చిట్కాలు చెబుతాననడంతో సరే అన్నాడు. ముందుగా ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో సభ్యులను పరిచయం చేశాడు. రూ.10 లక్షలు పెడితే అదనంగా మరో రూ.10 లక్షలు వస్తుందని, రూ.20 లక్షలు పెడితే రూ.20 లక్షలు, రూ.30 లక్షలు పెడితే రూ.30 లక్షలు వస్తుందని మాయమాటలు చెప్పాడు. తన చిట్కాల ద్వారా గ్రూపులో సభ్యులకొస్తున్న అమౌంట్ స్క్రీన్షాట్లు తీసి వైద్యుడికి పెట్టసాగాడు. నమ్మకం కుదిరాక వైద్యుడు పలుమార్లు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు.. ఇలా వేస్తూనే ఉన్నాడు.. విత్‌డ్రా ఆప్షన్లో డబ్బులు అదనంగా కనిపిస్తుండడం తన అకౌంట్లో యాడ్ అవుతున్నట్లు ఆశ పుట్టింది. అలా ఒక రూ.15 లక్షల వరకు వేశాడు. డబ్బులైతే ఆప్షన్లో కనిపించి విత్ డ్రా అవ్వకపోవడంతో అపరిచిత వ్యక్తిని అడగగా.. మీరు కడుతుంటే ఒకేసారి వస్తాయనడంతో రూ.37 లక్షల వరకు కట్టేశాడు. కానీ అప్పటికీ విత్ డ్రా అవ్వకపోవడంతో పాటు అపరిచిత వ్యక్తికి ఫోన్‌చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. గ్రూపులో కూడా వైద్యుడిని రిమూవ్వ్ చేసేశారు. ఇక చేసేదేమీలేక వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. ● ఇదే తరహాలో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఆర్మీకి చెందిన ఒక వ్యక్తి రూ.కోటికి పైగా సైబరాసురుల చేతిలో నష్టపోయానని ఫిర్యాదు చేయడంతో భారీ అమౌంట్ కావడంతో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేకపోయారు. ● రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన దుంప కృష్ణ చిత్తూరు జిల్లా మెట్టూరు ఎస్బీఐలో ఒప్పంద ఉద్యోగిగా చేస్తున్నాడు. వాట్సాప్ ద్వారా వచ్చే వీడియోలు చూసి సబ్‌స్క్రైబ్ చేసుకున్న కృష్ణకు సైబర్ కేటుగాళ్లు టెలిగ్రామ్ ద్వారా లింకులు పంపించి గేమ్‌లు ఆడించారు. బహుమతులు, డబ్బులొస్తున్నట్లు ఆన్లైన్లో చూపించడంతో కృష్ణ రూ.11.50 లక్షల వరకు ట్రేడింగ్ చేశాడు. చివరికి డబ్బులు ఎంతకీ అకౌంట్లో పడకపోవడంతో జేఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో అఫైర్ నమోదు చేసి చిత్తూరు జిల్లా మెట్టూరుకు కేసు బదిలీ చేశారు. కేసులు నమోదు చేయలేని దుస్థితి ఈ తరహానే కాకుండా వివిధ సైబర్ మోసాలపై జిల్లాలో భారీస్థాయిలో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో స్టేషన్లో 4 నుంచి 6 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మోసం చేసే కేటుగాళ్లు వివిధ రాష్ట్రాలు, దేశాలు వారు కావడంతో అక్కడికి వెళ్లి ఆ అధికారులతో సమన్వయం చేసుకుని నోటీసులిచ్చేవరకే చేయగలుగుతున్నారు. ఈలోగా దారి ఖర్చులు, వసతి ఖర్చులు అన్నీ వీరిపైనే భారంగా పడుతున్నాయి. పోనీ కోర్టు వరకు నేరస్తులు వస్తున్నారంటే అదీ లేదు. ఒకట్రెండు సార్లు వచ్చీ ఆ తర్వాత వారి జాడే కనిపించనంతగా మాయమవుతున్నారు. దీంతో ఇటువంటి కేసులు కట్టాలంటేనే తమకు తలనొప్పిగా మారుతున్నాయంటూ కొంతమంది పోలీసు అధికారులే చెబుతుండడం శోచనీయం. ప్రస్తుతం సైబర్ నేరాలు జిల్లాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రజలు అత్యాశతో వారి వలలో పడుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు వంటి మోసాలకు ఎక్కువగా చదువుకున్నవారే బలవుతున్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో గతంలో కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదు చేస్తున్నాం. క్షణాల్లో సైబర్ సెల్ నంబర్ 1930కు ఫిర్యాదు చేసి పోలీసులను, బ్యాంకు ప్రతినిధులను సంప్రదిస్తే మంచిది. – డీఎస్పీ వివేకానంద, శ్రీకాకుళం -
సాదాసీదాగా సలహా కమిటీ సమావేశం
టెక్కలి: టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేతృత్వంలో బుధవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఏడాది తర్వాత నిర్వహించిన సమావేశంలో భాగంగా ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకాలతో పాటు ఇతర సమస్యలపై కనీస ప్రస్తావన లేకుండా హడావుడిగా కొన్ని మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించి సమావేశాన్ని ముగించేశారు. ముందుగా కలెక్టర్ ఆస్పత్రిలో బాలల సత్వర కేంద్రాన్ని పరిశీలించారు. ఆయా ప్రాంగణంలో చిన్నారులకు సౌకర్యవంతంగా ర్యాంపులు నిర్మాణం చేయాలని, సుగంధ మొక్కలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఓపీ విభాగం, రక్తనిధి కేంద్రం, వివిధ ల్యాబ్‌లు, డాక్టర్ల విభాగాలతో పాటు మరికొన్ని విభాగాలను పరిశీలించారు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను మరింత విస్తరించాలని, దీనికి అవసరమైన సదుపాయాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అయితే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకాలతో పాటు మురుగు వ్యవస్థ ఇతర సమస్యలపై ప్రస్తావన లేకుండా, కొన్ని రకాల అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనపై నిధులు మంజూరు కోసం వివరాలు సేకరించారు. అంతకుముందు ఆస్పత్రిలో సుమారు రూ.40 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఆస్పత్రి గేటు, సోలార్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో నిధుల అంచనాపై కలెక్టర్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఆయనతో పాటు సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, డీఎంఅండ్‌హెచ్‌వో కె.అనిత, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీసీహెచ్ఎస్ కల్యాణ్‌బాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.సూర్యారావు, వైద్యులు లక్ష్మణరావు, మహారాజ్, రాజశేఖర్, వినోద్, జ్ఞానప్రసూణ తదితరులు పాల్గొన్నారు. -
ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం
నరసన్నపేట: స్థానిక లక్ష్మున్నపేటకు చెందిన వ్యాపారి వెంకట పార్వతీశం గుప్త ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు నరసన్నపేట సీఐ ఆఫీస్‌లో మకాం వేసి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచీ డీఎస్పీ నరసన్నపేటలోనే ఉన్నారు. వినాయక చవితి ముందు రోజు ఈనెల 26వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన గుప్త ఇంతవరకూ ఇంటికి రాలేదు. దీంతో నరసన్నపేట పోలీసులకు గుప్త సోదరుడు మన్మథరావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో కేసు నమోదు చేయడంలో స్థానిక పోలీసులు జాప్యం చేశారు. ఆ తర్వాత మాత్రం కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, పోలాకి ఎస్ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, రంజిత్‌లతో పాటు సిబ్బంది దర్యాప్తులో భాగస్వాములయ్యారు. సీసీ ఫుటేజీ పరిశీలన జాతీయ రహదారిపై, టోల్గేట్లు వద్దనున్న సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అదేరోజు సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. మడపాం టోల్గేట్ వద్దకు వచ్చేసరికి కారులో డ్రైవర్ తప్ప గుప్త లేరని సమాచారం. ఈ మేరకు మడపాం టోల్గేట్ సీసీ ఫుటేజీతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గుప్తను నరసన్నపేటలో దించానని డ్రైవర్ చెప్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో డ్రైవర్‌ను అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. బంగారు ఆభరణాలు తీసుకురావడానికి కారులో విశాఖ వెళ్లిన గుప్త, కేజీకి పైగా బంగారు ఆభరణాలు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారని తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో గుప్త ఏమయ్యారో.. బంగారు ఆభరణాలు ఏమయ్యాయి అనేది తెలియడం లేదు. మరో పక్క కుటుంబ సభ్యులు మన్మథరావుతో పాటు కొందరు వ్యాపారులను బుధవారం విచారించారు. దర్యాప్తు కొనసాగుతుందని కొన్ని చిక్కుముడులు వీడాలని పోలీసులు అంటున్నారు. గుప్త ప్రాణాలతో ఉన్నాడా.. లేదా అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గుప్తతో ఎవరికీ ఎటువంటి గొడవలు లేవని సోదరుడు చెబుతున్నాడు. కాగా గుప్త అదృశ్యమై బుధవారానికి 9 రోజులు అవుతుంది. -
నకిలీ మద్యం గుట్టురట్టు
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలింగిలో వైన్‌షాపు సమీపంలోని ఓ ఇంట్లో 205 లీటర్ల నకిలీ మద్యం, 172 ఖాళీ మద్యం బాటిళ్లు, ప్రింటింగ్ మెషిన్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. అవలింగిలోని వైన్‌షాపును జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.మురళీధర్, సీఐ కె.కృష్ణారావు బుధవారం తనిఖీ చేశారు. ఆ సమయంలో పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన తంగుడు మణికంఠ, కోటబొమ్మాళి గ్రామానికి చెందిన సదునుపల్లి సుందరరావు వాటర్ బాటిళ్లలో మద్యం అమ్ముతున్నట్టు గుర్తించారు. అనుమానం వచ్చి పరిశీలించగా 8 నకిలీ మద్యం బాటిళ్లు, అనుమానాస్పదంగా ఉన్న మరో 172 మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇవెక్కడివని ప్రశ్నింంచగా సకలాభక్తుల నీలకంఠం, పిట్టా పైడిరాజు, షాపు నౌకనామాదారుడు కలిసి విక్రయించమన్నారని తెలిపారు. అనంతరం షాపునకు 100 మీటర్ల దూరంలో ఓ ఇంట్లో తనిఖీ చేయగా నకిలీ మద్యం బాటిళ్లు, తేదీ, బ్యాచ్ నంబర్లు తయారు చేసే ప్రింటింగ్ మెషిన్, ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తంగుడు మణికంఠ, సదునుపల్లి సుందరరావులను అరెస్ట్ చేశారు. నీలకంఠం, పైడిరాజు పరారీలో ఉన్నారు. వీరందరిపైనా కేసులు నమోదు చేశామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
● ఇంటి స్థలం విషయంలో టీడీపీ వర్గీయుల వేధింపులు ● తట్టుకోలేక వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య
అవమాన భారం తట్టుకోలేకే.. మా మామయ్య మొదలవలస వరహా నరసింహులు పసుపు కుంకాల కింద నా భార్యకు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఇచ్చారు. హద్దులను వేసిన తర్వాత బండి దోవ ఉందని, ఇల్లు కట్టుకోవచ్చునని టీడీపీ నాయకుడు అన్నెపు రాము చెప్పాడు. దీంతో ఇంటిని ప్రారంభించి 50 శాతం పూర్తి చేశాం. ఆ స్థితిలో టీడీపీ కార్యకర్త అన్నెపు అసిరినాయుడు వచ్చి ఇబ్బందులు పెట్టాడు. మా ఇంటి ముందు కనిమెట్టకు చెందిన కుటుంబ సభ్యులతో కలిసి గోతులు తవ్వించాడు. దీంతో మళ్లీ అన్నెపు రాముని సంప్రదించాం. సమస్యను పరిష్కరించలేదు. వేరే పెద్ద మనుషుల సాయంతో తోవను చేసుకున్నాం. ఆ తర్వాతి రోజునే పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇది జరిగి సుమారు రెండు నెలలు గడిచింది. వివాదాన్ని పరిష్కరించకుండా కొనసాగిస్తుండటంతో మా మామయ్య సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. – గురుగుబెల్లి అన్నంనాయుడు, మృతుడి అల్లుడు, ధర్మపురం టీడీపీ వేధింపులే కారణం టీడీపీ నాయకుల వేధింపుల వల్లే నా తండ్రి చనిపోయారు. నేను కట్టుకున్న ఇంటికి తోవ ఇవ్వకుండా వేధించారు. జేసీబీతో గుంతలు తవ్వేశారు. అన్నెపు తులసమ్మ, శివాలు, అసిరినాయుడు, కృష్ణలు ఇంటిముందు జేసీబీతో తవ్వేశారు. పెద్దలను ఆశ్రయిస్తే తాము ఏం చేయలేమని అన్నెపు రాము చేతులెత్తేశాడు. అయితే వెనుక నుంచి మొత్తం నడిపించింది మాత్రం రామూనే. – గురుగుబెల్లి అశ్వని, మృతుడి కుమార్తె, ధర్మపురం తాను ఇచ్చిన స్థలంలో కూతురు ఓ ఇల్లు కట్టుకుని హాయిగా బతికితే చూడాలని ఆ తండ్రి కలలు కన్నాడు. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కడుతుంటే చూసి ఆనందపడ్డాడు. ఇరుగు పొరుగు వారు రాజకీయ కక్షలతో విషం కక్కుతుంటే అన్నింటినీ భరించాడు. కూతురు, అల్లుడు సొంత గూటిలో ఉంటే చాలని తలిచాడు. కానీ అతడికి ఆ ఆనందం మిగలలేదు. నిర్మాణం పూర్తయిన ఇంటికి దారివ్వకుండా అడ్డుకున్నారు. ఏకంగా జేసీబీలు పెట్టించి మరీ తోవను తవ్వించేశారు. ఇన్ని వేధింపులను ఆ గుండె భరించలేకపోయింది. రోజు రోజుకూ పెరుగుతున్న అరాచకాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేక పురుగు మందు తాగి తనువు చాలించాడు. సామాన్యుడిపై రాజకీయ కక్ష మరణంతో సమానమని ధర్మపురంలో జరిగిన ఈ ఘటన మళ్లీ రుజువు చేసింది. –పొందూరుపొందూరు మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మొదలవలస వరహా నరసింహులు(55) టీడీపీ వేధింపులు తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కూతురు అశ్వనికి ఇచ్చిన స్థలంలో సొంతంగా ఇల్లు కట్టుకుంటే.. పక్కనే ఉన్న టీడీపీకి చెందిన వారు మాటిమాటికీ తోవ విషయమై వివాదాలు రాజేసేవారు. రెండు మూడు సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినా.. వారి వైఖరి మారలేదు. దీంతో ఆయన పురుగు మందు తాగి ప్రాణాలు వదిలేశాడు. రెండు నెలల కిందట ఇరు వర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చామని, స్థల వివాదం విషయంలో అన్నెపు రాము ప్రోత్సాహంతో జరిగిన వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పొందూరు ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. జగన్ దృష్టికి తీసుకెళ్తా.. రిమ్స్‌లో వరహా నరసింహులు మృతదేహాన్ని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయ కర్త చింతాడ రవికుమార్ పరిశీలించారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్తానన్నారు. -
ఏపీఎల్ నుంచి ఇద్దరికి పిలుపు
● ఏసీఏ ఉమెన్ టీ–20 లీగ్‌కు నవ్య, వనజాక్షి ఎంపిక ● వైజాగ్ చీతాస్‌కు నవ్య, రాయలసీమ రాణీస్కు వనజాక్షి ప్రాతినిధ్యం శ్రీకాకుళం న్యూకాలనీ: మూడునాలుగేళ్లగా నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్న బూసి నవ్య, పనస వనజాక్షిలు ఏపీఎల్ నుంచి పిలుపు అందుకున్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో పటిష్టమైన వైజాగ్ చీతాస్ జట్టుకు నవ్య ప్రాతినిధ్యం వహించనుండగా, రాయలసీమ రాణీస్ జట్టుకు వనజాక్షి ప్రాతినిధ్యం వహిస్తుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ టోర్నీ త్వరలో మొదలుకానుంది. జిల్లా నుంచి వీరిద్దరూ ఉమెన్ ఏపీఎల్‌కు ఎంపిక కావడంపై జిల్లా క్రికెట్ సంఘం(జెడ్‌సీఏ) అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంఘ ప్రతినిధులు, కోచ్‌లు, సీనియర్ క్రికెటర్లు సంతోషం వ్యక్తంచేశారు. -
యూరియా కొరతపై 9న వైఎస్సార్సీపీ ఆందోళనలు
నరసన్నపేట: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన జిల్లాలోని పలాస, టెక్కలి డివిజన్లలో వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మబగాంలో వీరు విలేకరులతో మాట్లాడారు. రైతులు యూరియా కోసం అనేక ఇ బ్బందులు పడుతున్నారని, రైతుల పక్షాన వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలి పారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 9న పలాస, టెక్కలిలో అధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. కార్యక్రమంపై చర్చించేందుకు మాజీ మంత్రి అప్పలరాజు, టెక్కలి సమన్వయకర్త పేడాడ తిలక్ మంగళవారం మబగాంకు వచ్చారు. కృష్ణదాస్ మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎరువులు, విత్తనా లు సహా అన్నీ సులభంగా లభించేవని, కానీ ఇప్పుడు యూరియా సరఫరాలో తీవ్ర లోపం కనిపిస్తోందని అన్నారు. వచ్చిన యూరియా రైతులకు ఇవ్వకుండా టీడీపీ నాయకులు పక్క దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. యూరియా కోసం రైతుల నిరసన జి.సిగడాం: కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో మంగళవారం సర్వేశ్వరపురం కూడలి వైఎస్సార్ విగ్రహం వద్ద రైతులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు యూరియా అందించాలని వారు కోరారు. నిలబడాల్సిందేనా..? బూర్జ: వైకుంఠపురం గ్రామ రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం నుంచి 91 బస్తాల యూరియా వచ్చింది. మంగళవారం వైకుంఠపురంతో పాటు, కొరగాం బొడ్లపాడు, ఉప్పినివలస పరిసర గ్రామాల రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం వడ్డివాడ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మురపాల రెయ్యమ్మ(45) అనే మహిళ మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగి రామారావు, మురపాల రెయ్యమ్మలు కలసి ద్విచక్ర వాహనంపై బోరుభద్ర నుంచి సంతబొమ్మాళి వైపు వెళ్తుండగా అదే సమయంలో ముందు వెలుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెయ్యమ్మ, రామారావులతో పాటు మరో బైకుపై ఉన్న నెయ్యల రామకృష్ణకు సైతం గాయాలయ్యాయి. ముగ్గురినీ కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెయ్యమ్మ మృతిచెందింది. సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలో వికృత పాలన
టెక్కలి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వికృత పాలన కొనసాగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని న్యాయవాది, వైఎస్సార్సీపీ నాయకుడు సింగుపురం మోహన్‌రావు మండిపడ్డారు. టెక్కలిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ‘సాక్షి’ పత్రికపై విషం కక్కే విధంగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డీఎస్పీ, ఏఎస్పీ పదోన్నతుల్లో సీనియర్ పోలీస్ అధికారులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపిన ‘సాక్షి’పై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిలోకి అక్రమంగా చొరబడి భయాందోళన కలిగించే విధంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. తాజాగా మరోసారి సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసు నమోదు చేశారని తెలిపారు. పత్రికల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా దుందుడుకు చర్యలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు హెచ్చరిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు న్యాయ స్థానాల మార్గదర్శకాలను పరిహాసం చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
అరకొరగా ప్రసవాలు
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో తగ్గుతున్న సాధారణ కాన్పులు ● నెలకు 200 ప్రసవాలు జరగాల్సి ఉన్నా 80 దాటని వైనం ● ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న గర్భిణులుసమస్యలు పరిష్కారమయ్యేనా... టెక్కలి రూరల్ : టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య ఆశించిన మేర పెరడగం లేదు. ప్రధానంగా సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. ప్రాంతీయ ఆస్పత్రి నుంచి జిల్లా ఆస్పత్రిగా మారినప్పటికీ వైద్యసేవల్లో మాత్రం ఏమీ మార్పు రాలేదని, గతంలో మాదిరిగానే అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సీరియస్ కేసు వస్తే వెంటనే శ్రీకాకుళం రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రి కావడంతో పలాస, మెళియాపుట్టి, మందస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల నుంచి కేసులను టెక్కలి రిఫర్ చేస్తుంటే.. అందులో చాలా కేసులను ఇక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేస్తుండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే జిల్లా ఆస్పత్రిగా స్థాయి పెంచడం దేనికని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇక్కడి వైద్యులు మాత్రం సరైన పరికరాలు లేకపోతే తామేం చేస్తామంటూ వాపోతున్నారు. ఇదీ పరిస్థితి.. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, ఇద్దరు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు ఉన్నారు. వీరందరు మహిళ వైద్యులే. రోజుకు సుమారు 500పైగా వస్తున్న ఓపీలో 50కి పైగా ప్రసూతి విభాగానివే, అందులో 40 మంది వరకు గర్భిణులు వివిధ రకాల పరిక్షలు చేయించుకుంటున్నారు. అయినప్పటికి కాన్పుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. వివిధ కారణాల వల్ల నెలకు సుమారు 200 వరకు కాన్పులు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 80 కూడా దాటడం లేదు. అందులో సాధారణ కాన్పులు 30కు మించకపోవడం గమనార్హం. స్థానికులు ఏమంటున్నారంటే.. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులే ప్రైవేట్ క్లినిక్‌లు నడిపించడం వల్ల వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంటోందని స్థానికులు చెబుతున్నారు. ●గర్భిణులను ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకొచ్చాక ఆపరేషన్‌కు, బొడ్డు కొయ్యడానికి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, వార్డుకు తీసుకువెళ్లేందుకు.. ఇలా ప్రతిదానికీ కొందరు డబ్బులు అడుతున్నారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. ముర్రుపాలు పట్టించడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. ● కాన్పుకు ముందు చేయాల్సిన పరీక్షలన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకుని ప్రసవానికి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారని, ఇందులో కొందరు సిబ్బంది పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● ప్రసవం అయ్యాక బాలింతలకు పూర్తిస్థాయిలో బెడ్లు లేవు. టెక్కలి: టెక్కలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు వేధిస్తున్నాయి. పేరుకు పెద్దాసుపత్రి అయినప్పటికీ సేవల విషయంలో రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం విషయంలో పాలనా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ఆసుపత్రిలో వైద్యులు మొదలుకొని దిగువ స్థాయి సిబ్బంది కొరతతో పాటు మరి కొన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సేవలు అరకొరగానే అందుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఆస్పత్రిలో అభివృద్ధి సలహా సమావేశం నిర్వహించనున్నారు. గత ఏడాది ఆగస్టు 1న మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో కలెక్టర్ నేతృత్వంలో ఆస్పత్రి అభివృద్ధి సలహా సమావేశం నిర్వహించారు. అప్పట్లో పలు సమస్యలపై విన్నవించారు. వాటిలో ఆశించిన స్థాయిలో పరిష్కారం కాలేదు. ఈసారైనా చర్యలు చేపడతారో లేదో చూడాలి. ప్రధాన సమస్యలివే... టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. డెర్మటాలజీ, జనరల్ మెడిషిన్, రేడియాలజీ, జనరల్ సర్జన్, ఎనస్తీషీయా, ఆర్ఎంఓ, డీసీఎస్ జనరల్, సీఏఎస్ జనరల్ వైద్యులు కలిపి 10 మంది వైద్యులు అవసరం. 15 మంది స్టాఫ్ నర్స్‌ల కొరత వేధిస్తోంది. జీడీఏలు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అటెండర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాంగణంలోనే మార్చురీ విభాగం ఉండడంతో మృత దేహాల భద్రత జఠిలమైన సమస్యగా మారింది. సరైన మురుగు వ్యవస్థ లేకపోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో మురుగు నీరు ప్రవహిస్తోంది. టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రిలో డబ్బులు తీసుకుంటున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు చేపడతాం. ఆస్పత్రిలో వార్డులు కొన్నిసార్లు సరిపడటం లేదన్న విషయం వాస్తవమే. దానికి తగ్గట్టుగా ఆరోగ్యం బాగున్న వారిని వేరే వార్డులోకి షిప్ట్ చెయ్యిస్తున్నాం – బి.సూర్యారావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, టెక్కలి -
బీసీల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా, నియోజకవర్గాల, మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామగ్రామాన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జెండా ఎగిరేలా కృషి చేయాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 130 బీసీ కులాల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. బీసీ విద్యార్థుల వసతి గృహాల సమస్యల నుంచి జాతీయస్థాయిలో జనగణన, కుల గణన చేసేవరకు అనేక సమరశీల పోరాటాలు చేసి విజయాలు సాధించగలిగామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పైడి చందు బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొమ్ము రమణమూర్తి, జిల్లా నాయకులు రత్నాల మురళీమోహన్రావు, బగాది రమణమూర్తి, రాయల రాము, రాజమహంతి భానుచందర్, గానుగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
అధికార లాంఛనాలతో ఏఎస్ఐ అంత్యక్రియలు
నరసన్నపేట: అనారోగ్యంతో మృతి చెందిన పోలాకి ఏఎస్ఐ పి.ఆదినారాయణకు మంగళవారం నరసన్నపేటలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలాకి ఎస్ఐ రంజిత్ తెలిపారు. నరసన్నపేట, పోలాకి పోలీసుస్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం తిలారు–కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు పైబడి ఉంటుందని, చేతిపై శ్రీను అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. రైలు నుంచి జారి పడి మృతిచెందాడా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు. వివరాలు తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు పేర్కొన్నారు. -
అండర్–23 క్రికెట్ జట్టులో హరీష్
హిరమండలం: అండర్–23 విభాగంలో ఓ సంస్థ నిర్వహించే టీ–20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియాలో గొట్టా గ్రామానికి చెందిన బత్తుల హరీష్ చోటు సంపాదించాడు. నేపాల్‌లో డిసెంబర్ నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో హరీష్ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో హరీష్‌ను గ్రామపెద్దలతో పాటు గ్రామస్తులు అభినందించారు. గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం పలాస: పలాస కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన కోరాడ గవరయ్య (35) మంగళవారం ఉదయం పదునైన చాకుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. లక్ష్మమ్మకు సత్కారం వజ్రపుకొత్తూరు: సుమారు 50 ఏళ్లగా ఎంతోమందికి పురుడు పోసిన అంబటి లక్ష్మమ్మ సేవలు వెలకట్టలేనివని విశ్రాంత ఆర్మీ అధికారి కొయిరి ప్రసాదరావు అన్నారు. మంగళవారం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటలోని చిన్న వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మమ్మ సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. వైద్యం అందుబాటులో లేని సమయంలో ఉద్దాన, తీర ప్రాంత గ్రామాల్లో ప్రసవ వేదనలో ఉన్న ఎంతో మంది గర్భిణులకు అండగా నిలిచి ప్రతికూల పరిస్థితుల్లో తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు గాత ముకుందరావు, కె.కొర్లయ్య, కాంతారావు, దాలయ్య, సాధు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
గార : రామచంద్రాపురం పరిధిలోని నవజ్యోతి, దుర్గా ఎంటర్ప్రైజెస్ ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. దుర్గా షాపు లైసెన్సు రెన్యువల్ ఇంకా జరగకపోవడాన్ని గుర్తించారు. నిల్వ ఉన్న 5.50 మెట్రిక్ టన్నుల డీఏపీ, ఎంవోపీ, సాయిల్ కండీషనర్ ఎరువుల అమ్మకాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా విజిలెన్సు సీఐ డి.వి.వి.సతీష్‌కుమార్, వ్యవసాయాధికారి డి.పద్మావతిలు మాట్లాడుతూ ఎరువులు అధిక ధరలకు అమ్మినా, అదనపు ఎరువులతో లింక్పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
● ప్రేమ పెళ్లికి నిరాకరించినట్లు ఆవేదన శ్రీకాకుళం క్రైమ్: పెళ్లికి యువతి నిరాకరించిందనే కారణంతో ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు సెల్‌ఫోన్ టవర్ ఎక్కిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం వేకువజామున 3.30 గంటల సమయంలో శ్రీకాకుళం నగరంలోని పాత దీప మహాల్ సమీప టవర్ మీదకు ఒక యువకుడు అవలీలగా ఎక్కాడు. ఉదయమయ్యేసరికి అటుగా వెళ్లే ప్రజలు గమనించారు. ల్యాప్‌టాప్ పట్టుకుని సిగ్నల్స్ దొరకక అక్కడ కూర్చుని ఉన్నాడని అనుకున్నారు. అయితే ఎంతకీ దిగకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్న ఆందోళనతో ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణకు సమాచారమిచ్చారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు అగ్నిమాపక కార్యాలయానికి కూడా కాల్ వెళ్లింది. అంతే క్షణాల్లో ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 8.45 గంటలకు ఎస్ఐ హరికృష్ణ చొరవతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ పూర్తి చేసి యువకుడిని కిందికి దించగలిగారు. ఇదీ విషయం... పొందూరు మండలంలోని కింతలి గ్రామానికి చెందిన విభూది శివకుమార్ (30) అనే యువకుడు ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన ఒక యువతిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాని.. ప్రేమకు అంగీకరించిన యువతి వివాహానికి నిరాకరించిందని పోలీసుల వద్ద చెప్పాడు. దీనికి కారణం వారి పెద్దలేనని.. భరించలేకే ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ ఎం.హరికృష్ణ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో చట్ట పరిధిలో ఇటువంటి వ్యవహారం పరిష్కరించుకోవాలని సూచించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే చట్టప్రకారం తాము న్యాయం చేస్తామని యువకుడికి హామీ ఇచ్చి రిమ్స్‌కు పంపించారు. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆక్రమణల చెరలో ‘పోర్టుల్యాండ్’..?
● పట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది ● గాలికొదిలేసిన పోర్టు అథారిటీపోలాకి: ఒకప్పుడు వెలుగు వెలిగిన కళింగపట్నం ఓడరేవు ఆ తర్వాత కాలంలో నౌకల రవాణా నిలిచిపోవడంతో సదరు ఓడరేవుకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మండలంలో ప్రస్తుతం నిరుపయోగంగా కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే మిగిలిపోయిన పోర్ట్ల్యాండ్పై కొందరి కన్నుపడింది. అంపలాం పంచాయతీ పరిధి నందిగాం రెవెన్యూలో సర్వే నంబర్–77లో 31.45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములు ఇప్పుడు విలువైనవిగా మారడంతో కొందరు పెద్దలు అక్కడ గ్రద్దల అవతారం ఎత్తారు. గతంలో టీడీపీ హయాంలో(2014–19 మధ్యలో) అక్కడ మత్స్యకారుల విశ్రాంతి భవనం, వలలు, చేపలు నిల్వ గోదాముల నిర్మాణం చేపట్టిన సందర్భంలో సైతం పోర్టు అథారిటీస్ నుంచి ఎలాంటి క్లియరెన్స్‌లు ఇవ్వకపోయినా, అప్పటి నాయకత్వం ముందుకు వెళ్లడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గత నాలుగేళ్ల నుంచి ఈ భూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు సైతం నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వేరే ప్రభుత్వ సర్వే నంబరుతో వర్క్ ఐడీ క్రియేట్ చేసి పోర్టు భూముల్లో ఉపాధి పనులు చేపడుతూ ప్రజావేదిక ఆడిటింగ్ సమయంలో మేనేజ్ చేస్తూ వస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి. హక్కులు కల్పించాలని వినతి పోర్ట్‌ల్యాండ్ మొత్తం తమకే చెందుతుందని హక్కులు కల్పించాలని కోరుతూ ఇటీవల ఒక వ్యక్తి పోలాకి రెవెన్యూ కార్యాలయానికి వినతిపత్రం అందించిన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వినతి పత్రం వెనుక ఉన్నది ఎవరు అనే విషయంపై కూటమి పార్టీల నాయకుల్లో అంతర్గత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క పోర్టు భూముల్లో ఇప్పటికే ప్రైవేటు కార్యకలాపాలు జరుగుతున్నాయని సర్వే నిర్వహించి భూముల వివరాలు, వాస్తవ విస్తీర్ణంపై హద్దులతో సైతం ప్రజలకు తెలియజేయాలని మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం ఆక్రమణలపై ఎందుకో నిద్ర నటిస్తోంది. మరోపక్క తమ హక్కులను సైతం పోర్టు అథారిటీస్ గాలికొదిలేసింది. కనీసం తమ భూముల్లో ఫెన్సింగ్ వేసి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే ఆలోచన కూడా చేయడం లేదు. ఇదే కొనసాగితే రూ.కోట్లు విలువ చేసే పోర్టుల్యాండ్‌లో అక్రమార్కులు లంగరు వేసే పరిస్థితి మరెంత దూరంలో లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పోర్టుల్యాండ్ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. నందిగాం రెవెన్యూలో ఎస్ఎల్ఆర్లో ఫోర్టు అథారిటీస్‌కు 31.45 ఎకరాల భూములు ఉన్నట్లు వివరాలు ఉన్నాయి. ఆక్రమణలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. పోర్టు అథారిటీస్ వారు వచ్చి హద్దులు కోరితే చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. – పి.శ్రీనివాసరావు, తహసీల్దార్, పోలాకి -
పెళ్లీడొచ్చింది... లక్ష్యం ఏమైంది..!
● నిరుపయోగంగా బాలికా సంరక్షణ పథకం ● బాండ్లు ఉన్నా నిధులు అందని వైనం ● మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారుల మౌనం హిరమండలం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బాలికా సంరక్షణ పథకం అమలుపై అయోమయం నెలకొంది. బాలికల తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు అప్పట్లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎవరికై నా బాలిక ఉంటే వారికి పాసుపుస్తకం జారీ చేసి 21 ఏళ్లు నిండాక నగదు చెల్లించాలని పథకంలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేసి పేద కుటుంబంలో ఒక్కరే బాలిక ఉంటే 20 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహ ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఇస్తామని, ఇద్దరుంటే ఒక్కొక్కరికీ రూ.30 వేలు చొప్పున అందజేస్తామని ప్రకటించింది. అందుకుగాను అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అర్హులను ఎంపిక చేసి ఎల్ఐసీ బాండ్లు జారీ చేసింది. అయితే నిబంధనల మేరకు పేర్లు నమోదు చేసుకుని అప్పట్లో బాండ్లు పొందినవారికి, ప్రస్తుతం 20 ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ డబ్బులు అందకపోవడంతో పలువురు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆది నుంచి గందరగోళమే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన ఈ పథకం పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ పథకం అమలు తీరు ప్రారంభం నుంచి అయోమయంగానే ఉండేది. బాండ్లు జారీ అయ్యాక తొలుత లబ్ధిదారులు ఎవరికి వారే డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఈ ప్రక్రియ జరిగింది. బాండ్లు అందడంలో పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. 2005 నుంచి 2007 సంవత్సరాల్లో బాండ్లు పొందిన 4,880 మందికి మెచ్యూరిటీ తేదీ పూర్తయ్యి చాలాకాలమవుతున్నా ఇప్పటికీ స్పష్టత లేదు. ఎల్ఐసీ జారీ చేసిన బాండ్లును నగదుగా ఎలా మార్చుకోవాలో ఎవరికీ తెలియక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2007 తర్వాత ఈ పథకం గురించి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో లబ్ధిదారులకు ఎలా బదులివ్వాలనేది అధికారులకూ తెలియడం లేదు. లబ్ధిదారులు బాండ్లును ఎలా పొందాలో ప్రాజెక్టుల వారీగా తెలియజేస్తాం. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గడువు ముగిసిన బాండ్లును నగదుగా ఎలా మార్చుకోవాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – ఐ.విమల, ఐసీడీఎస్ పీడీ శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 41,821 మందిని అర్హులుగా అప్పట్లో అధికారులు గుర్తించారు. వీరిలో 26,935 మందికి గతంలో బాండ్లు అందించినట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలామంది లబ్ధిదారుల ఆడపిల్లలు ఇప్పుడు పెళ్లీడుకొచ్చారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట ఉన్నబాండ్ పత్రాలు తీసుకుని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. అయినా వారి నుంచి సరైన సమాధానం ఉండటం లేదు. డబ్బులు చెల్లింపునకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారు. -
పఽథకం ప్రకారమే రాజశేఖర్ హత్య
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ● ఆగస్టులో కత్తి కొనుగోలు చేసిన నిందితుడుజి.సిగడాం: స్నేహితుడి చేతిలో గత నెల 24న హత్యకు గురై, చికిత్స పొందుతూ గెడ్డకంచరాం గ్రామానికి చెందిన పుక్కళ్ల రాజశేఖర్ మృతి చెందిన కేసులో ముద్దాయి దమరసింగి గొల్లబాబు అలియాస్ శంకర్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి పొందూరు కోర్టుకు తరలించారు. ముద్దాయికి రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జైలుకు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం కేసు వివరాలు వెల్లడించారు. ఇంటి నుంచి కత్తి తీసుకొచ్చి మండలంలోని గెడ్డకంచరాం – బాతువ కూడలి వద్ద పుక్కళ్ల రాజశేఖర్ (35)ను గొబ్బూరు గ్రామానికి చెందిన దమరసింగి గొల్లబాబు(శంకర్) పథకం ప్రకారమే హత్య చేశాడని సీఐ తెలిపారు. గెడ్డ కంచరాం గ్రామంలో తోటి స్నేహితుడు మేసీ్త్ర అప్పన్న ఇంట్లో ఒక శుభ కార్యానికి రాజశేఖర్, శంకర్ అనే వ్యక్తితో కలిసి వెళ్లాడు. అక్కడ స్నేహితుడు ఇచ్చిన మద్యం సేవించారు. ముద్దాయి గొల్లబాబు ఆలస్యంగా వెళ్లి మద్యం అడగగా.. వారు అప్పటికే మద్యం అంతా తాగేశామని చెప్పడంతో మద్యం విషయంలో ఇద్దరూ గొడవకు దిగారు. ఈ గొడవను అవకాశంగా తీసుకుని ముద్దాయి శంకర్ తన ఇంటి వద్ద భద్రపరుచుకున్న కత్తిని తీసుకొచ్చి రాజశేఖర్‌కు ఫోన్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో లక్ష్మణ్ అనే వ్యక్తికి ఫోన్‌చేసి రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అయితే గొడవలు వద్దని లక్ష్మణ్ సూచించాడు. అనంతరం మృతుడు రాజశేఖర్, లక్ష్మణలు నడిచి వస్తుండగా గెడ్డకంచరాం గ్రామ కూడలి వద్ద మృతుడు రాజశేఖర్, ముద్దాయి గొల్లబాబు ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో రాజశేఖర్ కడుపులో పదునైన కత్తితో గొల్లబాబు పొడిచాడు. దీంతో వెంటనే లక్ష్మణ్ తన బైక్‌తో జి.సిగడాం ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో శ్రీకాకళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 25న మృతి చెందాడు. మృతుడు భార్య హరిప్రియ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మారణాయుధాలు స్వాధీనం మృతుడు రాజశేఖర్‌తో గత కొన్ని రోజులుగా ముద్దాయి శంకర్‌కు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆగస్టు నెలలోనే హత్య చేసేందుకు ఆన్లైన్ ద్వారా పదునైన కత్తిని కొనుగోలు చేశాడు. దీంతో హత్యకు ఉపయోగించిన కత్తిని ఎస్ఐ మధుసూదనరావు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో ముద్దాయి ఇంటి చుట్టూ తనికీ చేశారు. హత్య జరిగిన వారం రోజుల్లోనే ముద్దాయితో పాటు ఆయుధాలను సేకరించి, సోమవారం అరెస్టు చేసి కోర్టులో హజరు పరచడంపై జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం జి.సిగడాం ఎస్ఐ వై.మధుసూదనరావును అభినందించారు. -
కలెక్టర్ గ్రీవెన్స్‌కు 64 వినతులు
కవిటి: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు ఫిర్యాదు చేస్తున్న నారాయణస్వామి ఆక్రమణలపై చర్యలు తీసుకోండి కవిటి: మండలంలోని గొర్లెపాడు పంచాయతీలో భూ ఆక్రమణలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ భూముల్ని రక్షించే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలిన నారాయణస్వామి కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. గొర్లెపాడు పంచాయతీ పరిధిలోని చాలా వరకు ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, సంతలు ఆక్రమణలకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఒక ఆర్మీ జవాన్ భూములు కూడా అన్యాక్రాంతం అయినట్లు పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన భూములపై గతంలో ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ, ఎటువంటి చర్యలను చేపట్టడం లేదని తెలియజేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సరైన న్యాయం చేయలేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. వాస్తవానికి ఇదే భూ ఆక్రమణలపై గతంలో సాక్షి పత్రికలో సైతం కథనాలు వెలువడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా పలు శాఖలకు చెందిన అధికారులు మొత్తం 64 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 21, సెర్ప్‌కు 13, పంచాయతీరాజ్, విద్యుత్ పంపిణీ సంస్థలకు తలో 5, నీటి వనరులకు 3, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖలకు తలో 2 చొప్పున ఫిర్యాదులు అందాయి. మిగతా శాఖలకు ఒక్కొక్క ఫిర్యాదు చొప్పున నమోదైంది. ఈ పీజీఆర్ఎస్లో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే... రాష్ట్ర ప్రభుత్వం మండలాల పునర్విభజన చేయనున్న నేపథ్యంలో లావేరు మండలం మురపాక గ్రామం మండల కేంద్రంగా ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. అలాగే లావేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన ప్రజలు కూడా పీజీఆర్ఎస్లో బుడుమూరు మండల కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని వినతి అందజేశారు. నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన బడ్డి జోగారావు శతశాతం దివ్యాంగుడు. దీంతో ఆయనకు రూ.15 వేల పింఛను ఇప్పించాలని కోరారు. అలాగే రణస్థలం మండలానికి చెందిన దివ్యాంగుడు కొయ్య దుర్గాప్రసాద్ తనకు పింఛన్ ఇప్పించాలని కోరారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ తెలప్పరేడు వద్ద రహదారిపై మద్యం షాపును ఏర్పాటు చేశారు. ఈ షాపు వలన స్థానికులకు ఇబ్బందులు వస్తున్నాయని, అక్కడ నుంచి వేరే చోటుకు ఈ మద్యం షాపును తొలగించాలని ఆ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, గోవిందరావు తదితరులు కోరారు. శ్రీకాకుళం మండలం బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్–1లో సబ్ డివిజన్1, 4ల్లో ఉన్న ప్రభుత్వ భూమి వరదగట్టు (కోనేరు) దురాక్రమణలకు గురైందని, స్థానిక వీఆర్వో, సచివాలయం సర్వేయర్ కలిసి మండల రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన బోనెల చిరంజీవి ఫిర్యాదు చేశారు. -
కన్నబాబుకు మాజీ స్పీకర్ తమ్మినేని పరామర్శ
ఆమదాలవలస: మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం సోమవారం కాకినాడలోని కన్నబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మృతితో కుటుంబానికి మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాలకు కూడా తీరని లోటు ఏర్పడిందన్నారు. పరామర్శలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, పార్టీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, రాష్ట్ర ఇంటిలెక్చువల్ కార్యదర్శి రామకృష్ణరావు, జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి, బూర్జ ఎంపీపీ కర్నేన నాగేశ్వరరావు, బూర్జ జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, టెక్కలి వైఎస్సార్సీపీ నాయకులు, న్యాయవాది సింగుపురం మోహనరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముత్తా విజయ్, బొడ్డేపల్లి నారాయణరావు, జల్లు బలరాం నాయుడు, చింతాడ సూర్యనారాయణ, గుమ్మడి రాంబాబు, పొందూరు మండల నాయకులు పప్పల రమేష్, మామిడి కిరణ్, మామిడి శ్రీను, బెండి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నిరంకుశం
● ఎరువు అడిగితే దరువు! నిజం చెబితే నిర్బంధం.. నినాదం వినిపిస్తే నిరంకుశత్వం.. హామీలు గుర్తు చేస్తే ఆంక్షలు.. కూటమి ప్రభుత్వపు తీరు ఇది. గుండెలు అవిసేలా అన్నదాతలు ఎరువుల కోసం అడుగుతుంటే సర్కారు చెవికెక్కడం లేదు. ఎండనక, వాననక గంటల తరబడి క్యూలో రైతులు నిలబడుతుంటే ప్రభుత్వం కంటికి కనిపించడం లేదు. ఆఖరికి రైతు సమస్యపై వినతి పత్రం ఇస్తామన్నా.. తీసుకోవడానికి కూడా పాలకులకు మనస్కరించడం లేదు. ఎరువుల కొరతపై సోమవారం రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన ఆందోళనను ప్రభుత్వం ఖాకీల సాయంతో అణచివేయాలనుకుంది.అన్నదాతపై సర్కారుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరించింది. రైతుల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులను నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంది. హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ల కు తరలిస్తూ ప్రశ్నించే హక్కును కాలరాసింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్సీపీ రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మొద్దునిద్ర లో ఉన్న ప్రభుత్వం దిగి రావాలని, యూరియాతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అన్ని రకాలుగా విఫలమైన వ్యవసా య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. మడపాంలో దాసన్నకు అడ్డగింత మడపాం టోల్గేట్ దగ్గర పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో పాటు వస్తున్న నరసన్నపేట నియోజకవర్గ కేడర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల పక్షాన నిలబడటానికి స్వేచ్ఛ లేదా అంటూ ధర్మాన కృష్ణదాస్ గట్టిగా అడగడంతో ఆయన వెహికల్ మాత్రమే వదిలారు. మిగతా వారికి ఆంక్షలతో అడ్డుకట్ట వేశారు. రోడ్డుపై కిరణ్ బైఠాయింపు రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు నియోజకవర్గ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళంలో జరిగే నిరసన కార్య క్రమానికి వెళ్లవద్దని ఆంక్షలు విధించారు. రైతుల సమస్యలపై నిరసన చేస్తుంటే అడ్డుకోవడమేంటని గొర్లె కిరణ్‌కుమార్ ప్రతిఘటించినా పోలీసులు వదల్లేదు. దీంతో రహదారిపైనే కేడర్‌తో కలిసి బైఠాయించారు. ఆమదాలవలసలో ఉద్రిక్తత.. నిరసన కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను తన కార్యాలయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అక్కడ కూడా అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుకెళ్లేందుకు యత్నించిన రవికుమార్‌ను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల తీరును తప్పు పట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని పొందూరు, ఆమదాలవలస, సరుబుజ్జిలి తదితర మండలాల నుంచి శ్రీకాకుళంలోకి నిరసన కోసం వచ్చే వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. వేరే పనుల కోసం వస్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. శ్రీకాకుళమంతా ఆంక్షలే.. వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం జరగకుండా శ్రీకాకుళం నగరమంతా పోలీసులు ఆంక్షలు విధించారు. 80 అడుగుల రో డ్డు ఎంట్రన్స్ దగ్గర, వాంబే కాలనీ దగ్గర, పొన్నాడ బ్రిడ్జికి వెళ్లే రోడ్, సెవెన్ రోడ్ జంక్షన్, జెడ్పీ దగ్గర, సంతోషిమాత గుడి, కంపోస్టు కాలనీ ఏరియా వద్ద పోలీసులు దిగ్బంధం చేశారు. ఎవరినీ రానివ్వలే దు. దీంతో సాధారణ జనాలు కూడా ఇబ్బందులు పడ్డారు. రైతుల సమస్య కోసం నిరసన చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రజలు వాపోయిన పరిస్థితులు కనిపించాయి. జ్యోతిరావుపూలే విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను తీసేసి, అక్క డున్న వారందరినీ స్టేషన్‌కు తరలించేశారు. గేదెల పురుషోత్తం, చిట్టి జనార్ధన్, మార్పు పృథ్వీతో మరికొంతమందిని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. మిల్లు జంక్షన్ దగ్గర ముంజేటి కృష్ణ మూర్తి, బాలకృష్ణ, పీస గోపి, పీసీ శ్రీహరి, జిల్లా పరిషత్ దగ్గర నినాదాలు చేశారని అంధవరపు సూరిబాబు, కరిమి రాజేశ్వరరావు, బొడ్డేపల్లి పద్మజ, జయదేవ్, కణితి కృష్ణారావును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు రా ష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూ ప్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి, ఎంపీపీ గొండు రఘును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నాయకులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతు సమస్యలపై అధికారులకు వినతి పత్రం ఇచ్చే వెళ్లారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కలిసిన వారిలో పార్లమెంట్ పరిశీలకులు కుంభా రవిబాబు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, తూర్పు కాపు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, పోలినాటి వెలమ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్సీ విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు రౌతు శంకరరావు, వైఎస్సార్సీపీ నాయకురాలు కామేశ్వరి, యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నక్క రామరాజు, అల్లు లక్ష్మీనారాయణ, చిట్టి రవి, గద్దిబోయిన కృష్ణయాదవ్, వెంకటరమణి, ప్రసాద్, పీస గోపి, పీస శ్రీహరి తదితరులు ఉన్నారు. అన్నదాతల సమస్యలపై నినదించిన వైఎస్సార్సీపీ శ్రేణులపై ఆంక్షలు నిరసన చేపట్టకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు, అరెస్టులు రోడ్లపై బైఠాయించిన రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఇబ్బందులు పెట్టినా ఎరువు సమస్యలపై అధికారులకు నేతల విన్నపం -
మంచం పట్టిన చింతలగార
టెక్కలి రూరల్: మండలంలోని చింతలగార గ్రామంలో గత కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభి స్తున్నాయి. గ్రామంలో సుమారు 30 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. అందువల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని చెబుతున్నారు. గ్రామవాసులు టెక్కలి ప్రభుత్వాస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రోగులతో కిటకిట టెక్కలి: ప్రస్తుతం వ్యాధులు ముసురుతున్న నేపథ్యంలో టెక్కలి జిల్లా ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మరో వైపు గ్రామాల్లో సరైన ఫీవర్ సర్వే లు లేకపోవడంతో ప్రతి ఇంట్లో జ్వర పీడితులు అవస్థలు పడుతున్నారు. టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం రోజుకు 500 కు పైగా ఓపీ నమోదు కాగా వాటిలో సగానికి పైగా జ్వర పీడితులు ఉండడం గమనార్హం. జ్వరాల బారిన పడినవారిలో అధిక సంఖ్యలో పీడితులు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. -
వైఎస్సార్ వర్ధంతిలో భాగస్వాములు కండి
నరసన్నపేట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని మంగళవారం పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చా రు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు వైఎస్సార్‌కు రుణపడి ఉంటారని కృష్ణదాస్ అన్నారు. ఆయన విగ్రహాల వద్ద నివాళులర్పించాలని సూచించారు.వానలపై యంత్రాంగం అప్రమత్తంశ్రీకాకుళం పాతబస్టాండ్: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దీని ప్రభావం కారణంగా జిల్లాలో సోమ వారం నుంచి విస్తారంగా వర్షాలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండా లని ఆదేశించారు. కాలువలు, చెరువులను పర్యవేక్షించాలని సూచించారు. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మరింత జగత్తగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో జిల్లాలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. సో మవారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1, 2 మోస్తరు నుంచి భారీ వర్షాలు, సెప్టెంబర్ 3, 4 తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సెప్టెంబర్ 5 అల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం ఉత్తరాంధ్ర తీర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.‘జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు’శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో వరి, ఇత ర పంటలు కలిపి 3,73,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు జరిగిందని ఆయన వివరించారు. ఈ సాగుకు గాను మొదటి, రెండో విడతలలో కలిపి 20,481 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైందని అన్నారు. అయితే రైతుసేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 11,443 మె ట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 12,393 మెట్రిక్ టన్నులు కలిపి, మొత్తం 23,836 మెట్రి క్ టన్నుల యూరియా ఇప్పటివరకు రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ వివరించారు. అదనంగా స్పీక్ కంపెనీ ద్వారా శ్రీకాకుళం రోడ్డు రైలు హెడ్ వద్దకు 589 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతున్నాయని చెప్పారు. -
సెంచూరియన్ యూనివర్సిటీతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
కొరాపుట్/పర్లాకిమిడి: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో సెంచూరియన్ యూనివర్సిటీ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర ప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యా బొరేటరీ వర్సిటీల మధ్య ఈ నెల 29న ఎంఓయూ కుదిరింది. లక్నోలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పరిశోధనాత్మక, న్యాయ సంబంధిత, సాంకేతిక అంశాల్లో రెండు సంస్థలు పరస్పరం సహకారం అందించుకుంటాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ డీఐజీ రాజీవ్ కృష్ణతో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముక్తికాంత్ మిశ్రా సమాలోచనలు చేశారు. డీఐజీ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల కల యిక పరిశోధన రంగంలో నూతన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. సెంచూరియన్ వర్సిటీ ప్రెసిడెంట్ ముక్తి కాంత్ మిశ్రా మాట్లాడుతూ తాము 2016లోనే గుజరాత్ ఫోరెన్సిక్ విభాగంతో పనిచేశామని, ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో ఫోరెన్సిక్ సేవలు సమాజానికి ఉపయోగపడతాయన్నా రు. ఈ ఒప్పందంపై ఉత్తర్ ప్రదేశ్ ఏడీఐజీ నవీన్ ఆరోరా, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సుప్రియ పట్నాయిక్ సంతకాలు చేశా రు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ లక్నో లోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్, సెంచూరియన్ యూనివర్సిటీ అంతర్జాతీయ, ప్రభు త్వ సంబంధాల డైరెక్టర్ మెనాలిసా ఘోష్, డాక్టర్ రీనా, సి.జమాతానీ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణం
జలుమూరు: లోక కల్యాణం కోసమే శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణం నిర్వహించామని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు అన్నారు. ఆదివారం శ్రీముఖలింగంలో ఏకాదశ రుద్రపారాయణంలో పాల్గొని మాట్లాడారు. మానవాళికి ప్రేమ, సేవా మార్గాలును దశా దిశ నిర్దేశం చేసిన సాయి అందరిలోనూ ఉన్నాడన్నారు. మానవ సేవయే మాధవసేవ అని తలచి సాయి చేసిన సేవలు, లీలలు కొనియాడారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు కస్తూరి భాస్కర్ ప్రసాద్, తోట అరుణ, రాఘవరావు, విశ్వనాథరెడ్డి, జె.శాంతి, దుర్గాప్రసాద్, శ్రీదేవి, కిషోర్, గౌతమ్‌సాయి ఫణీంధ్ర, జిల్లా రైస్ ఇన్చార్జ్ పైడిశెట్టి వెంకటరమణ, సర్పంచ్ టి.సతీష్‌కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, గ్రామపెద్దలు బి.వి.రమణ, అర్చకులు నాయుడుగారి రాజశేఖర్, వెంకటాచలం, భక్తులు పాల్గొన్నారు.శ్రీముఖలింగంలో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏకాదశ రుద్రపారాయణం వివాదంగా మారింది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో బాబా పాదుకలు గర్భగుడిలో శివుని మూలవిరాట్టు స్వయం భూ లింగం వద్ద పెట్టడంతో పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుడి లింగం వద్ద పాదుకలు ఎలా పెడతారని అర్చకులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు ఈఓ వాసుదేవరావును ప్రశ్నించారు. దీనిపై ఈఓ స్పందిస్తూ వివరణ కోరగా రుద్రపారాయణం నిర్వహిస్తామని సత్యసాయి భక్తులు అడిగితే అనుమతి ఇచ్చామని, ఇలా పాదుకలు గర్భగుడిలో పెడతారని తెలియదన్నారు. కొందరు బాబాభక్తులు అత్యుత్సాహంతో పాదుకులు లోపల పెట్టడం తప్పేనని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పాదుకలు తొలగించామని తెలిపారు. కాగా, ఈ వివాదంపై ఆలయ అర్చకులు, ఈఓ నిర్లక్ష్య వైఖరిపై గ్రామానికి చెందిన భక్తులు కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. -
నేడు యూరియా కొరతపై ర్యాలీ
నరసన్నపేట: జిల్లాలో యూరియా కొరతపై రైతులకు మద్దతుగా సోమవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని నాలుగు నియోజకవర్గా ల రైతులతో ర్యాలీ కార్యక్రమం ఉందని, దీన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఉద యం 10 గంటలకు శ్రీకాకుళంలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరం వరకూ ర్యాలీ ఉంటుందని తెలిపా రు. శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాలకు చెందిన రైతు సోద రులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ఆదివారం రాత్రి కృష్ణదాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్ఛాపురం రూరల్: సాగునీరు లేక నారుమడులు, నాట్లు ఎండిపోతున్న దశలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీటితో నిండిపోయాయి. ఈ వర్షం కొబ్బరి తోటలకు ఎంతగానో మేలు చేసిందని కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రసుత్తం కురిసిన వర్షం వల్ల నాట్లకు చీడ,పీడలు తొలగిపోతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇచ్ఛాపురం రూరల్: ఈదుపురంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాస్పత్రి ఉన్నప్పటికీ వైద్యాధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. దీంతో స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు వైద్యులు, ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రతి వీధిలో జ్వర పీడితులు కనిపిస్తున్నారు. శ్రీకాకుళం అర్బన్: క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని తపాలాశాఖ సూపరింటెండెంట్ వండాన హరిబాబు అన్నారు. పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని ప్రధాన తపాలాశాఖ కార్యాలయం వద్దన ఉన్న మున్సిపల్ మైదానంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29 నుంచి పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రతిరోజు ఒక గంట మైదానంలో ఆడండి’ అనే థీమ్‌తో ఫిట్ ఇండియా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మూడు రోజులు గా ఫిట్నెస్ ప్రతిజ్ఞ, విద్యార్థులతో చర్చలు వంటి కార్యక్రమాలు చేపట్టి ఈ ఆదివారం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో సైకిల్ ర్యాలీ తో కార్యక్రమాలను ముగించినట్లు తెలిపారు. -
వ్యాపారి అదృశ్యంపై ఫిర్యాదు
నరసన్నపేట: స్థానిక లక్ష్మున్నపేటకు చెందిన వ్యాపారి వెంకట పార్వతీశం గుప్త అదృశ్యమయ్యారు. ఆగస్టు 26న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని సోదరుడు మన్మధరావు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గుప్త అదృశ్యం వెనుక పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుప్తా బంగారు ఆభరణాలు ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తుండటం, వ్యాపారులకు ఇస్తుండటం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండంతో పాటు లక్షల్లో లావాదేవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం తన కారులో స్థానిక పురుషోత్తంనగర్కు చెందిన కారు డ్రైవర్‌తో కలిసి విశాఖ వెళ్లగా.. డ్రైవర్ ఆ రాత్రే ఇంటికి చేరుకున్నారని, గుప్తా మాత్రం రాలేదని సమాచారం. సోదరుడు ఫోన్ చేస్తే వేరే వ్యక్తి లిఫ్ట్ చేసి తనకు బస్సులో ఫోన్ దొరికిందని చెప్పారు. ఆయన చెప్పిన చోటకు వెళ్లి ఫోన్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, విశాఖ పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. శ్రీకాకుళం కల్చరల్: యువ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితా పొటీల్లో విజేతల వివరాలను వేదిక అధ్యక్షులు తంగి యర్రమ్మ ఆదివారం ప్రకటించారు. గుణుపు శార్వాణి (పాతపట్నం) ప్రథమ, తలగాపు ధనుంజయ (పలాస) ద్వితీయ, ముట్నూరు బాల సుబ్రహ్మణ్యం (ఎల్‌ఎన్‌పేట) తృతీయ బహుమతికి ఎంపికయ్యారని తెలిపారు. కూన రంగనాయకులు, కాపురెడ్డి శ్రీనివాస్‌లకు కన్సొలేషన్ బహమతులు వచ్చాయని చెప్పారు. వీరికి త్వరలోనే బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. డాక్టర్ పిలకా శాంతమ్మ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ తులాల సవరమ్మలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. -
ఒకే మాట.. ఒక్కటే విగ్రహం
● తిప్పనపుట్టుగలో ఒక్కటే విగ్రహం ● ఐకమత్యంగా వినాయక చవితి ● 57 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఇచ్ఛాపురం రూరల్: వీధికో విగ్రహం.. వాడకో మండపం కొలువుదీరుతున్న రోజుల్లో 57 ఏళ్లుగా ఆ ఊరి వారు ఒకే మాటపై నిలబడ్డారు. ఒక్కటే విగ్రహాన్ని పెట్టి ఐకమత్యంగా పూజలు చేస్తున్నారు. ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన గ్రామం తిప్పనపుట్టుగ. పేరుకే రెండు మండలాల గ్రామస్తులు. గ్రామం ఒక్కటే కావడంతో అందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు చేస్తూ తమలో ఐక్యతను చాటుకుంటుంటా రు. పన్నెండువందల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 57 ఏళ్ల కిందట పెద్దలు నిర్ణయించిన విధంగానే స్థానిక బస్టాండ్ మర్రిచెట్టు కింద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా రెండు మండలాలకు చెందిన ప్రజలు కలసి ఈ విగ్రహం వద్దే పూజలు నిర్వహిస్తా రు. మండపం వద్ద డీజేలు, నృత్యాలు కాకుండా సామూహిక కుంకుమ పూజలు, భజనలు, మండల స్థాయిలో కబడ్డీ, క్విజ్ పోటీలు, కోలాటాలు, రేలారే లా వంటి జానపద నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తుంటారు. ఊరంతా నారీకేళ, కదళీ ఫలాలు ఉద్దానం ప్రాంతం కావడంతో ఈ గ్రామానికి చెందిన రైతులు వినాయక చవితి ఉత్సవానికి బహుమతిగా ప్రతి ఒక్క కొబ్బరి రైతు ఒక్కో కొబ్బరి గెలను, తమ తోటల్లో పండించే అరటి గెలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వీటిని గ్రామ పొడుగునా రెండు వైపులా అలంకరించడం ఇక్కడ ప్రత్యేకత. విగ్రహం నిమజ్జనం అనంతరం కొబ్బరి కాయలు, అరటి గెలతో ఒకే ప్రాంతానికి చేర్చి వీటితో పాటు లడ్డూను వేలం వేస్తారు. ఆ మొత్తాన్ని అన్నదానం, వచ్చే ఏడాది చవితి ఉత్సవాలకు వినియోగిస్తారు.గ్రామస్తులంతా కలసిమెలసి ఉండాలన్న ఉద్దేశంతో నా చిన్నతనంలో గ్రామ పెద్దలు గ్రామంలో ఒకే వినాయక విగ్రహం ఉండాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. – తిప్పన దాలయ్యరెడ్డి, గ్రామ పెద్ద, తిప్పనపుట్టుగ గ్రామంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తాం. మండలాలు రెండైనా.. గ్రామం ఒక్కటే కావడంతో అందరం కలసి మెలసిగా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటాం. ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతాం. గ్రామంలో నిర్వహించే పండగలను కూడా అలాగే నిర్వహిస్తుంటాం. – డాక్టర్ రత్నాల తారకేశ్వరరావు, పూజా కమిటీ సభ్యుడు, తిప్పనపుట్టుగ -
కొత్తూరు, హిరమండలం ఎస్ఐలకు వీఆర్
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని కొత్తూరు సర్కిల్ పరిధిలో కొత్తూరు, హిరమండలం ఎస్ఐలను జిల్లా పోలీసు కార్యాల యానికి వీఆర్ అటాచ్ చేస్తూ అధికారులు ఆదివా రం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఎస్ఐలు మహ్మద్ అమీర్ అలీ, మహ్మద్ యాసిన్‌లను వీఆర్ అటాచ్డ్ స్పెషల్ బ్రాంచికి బదిలీ చేశారు. కొత్తూరు ఎస్ఐ మహ్మద్ అమీర్ అలీ ఇదే నెలలో మండలంలోని శోభనాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టడంతో యువకుని బంధువులు, కుటుంబ సభ్యులు ఎస్పీ మహేశ్వరరెడ్డికి నేరుగా వెళ్లి ఫిర్యా దు చేసిన సంగతి తెలిసిందే. యువకుడు వెంకటరమణ అదే గ్రామంలో కొండపై భారీ పేలుళ్లతో క్వారీ నడుపుతున్న వారిని ప్రశ్నించడం, అక్కడ వాగ్వాదం జరగడం, ఆపై స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కొట్టడం పాఠకులకు విదితమే. హిరమండలం ఎస్ఐ మహ్మద్ యాసిన్ మండలంలో ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో రెండు వర్గాలు కొట్టుకునే కేసులోను, ఇతర పరిపాలన పరమైన అంశాల్లో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు చేస్తే చర్యలు తప్పవు.. ఎస్పీ మహేశ్వరరెడ్డి తమ విభాగంలో ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. ఇటీవలి కాలంలో గార ఎస్ఐ జనార్ధనరా వు, ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు, జి.సిగడాం ఎస్ఐ మధుసూదనరావులను వీఆర్‌కు పంపగా.. రౌడీషీటర్లతో కలాపాలు సాగించారని శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాముపై శాఖాపరంగా విచారణ జరిపారు. జి.సిగ డాం ఎస్ఐ మధుసూదనరావు డీఆర్‌వలస గ్రామంలో శనీశ్వర ఆలయంలోని నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేసిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించార నే కారణంతో వీఆర్‌కు పంపినా తిరిగి అదే కేసును ఛేదించడంతో ఇప్పుడు అదే మండలానికి ఎస్ఐగా కొనసాగుతున్నారు. జిల్లాలో మరో ముగ్గురు ఎస్ఐలు, ఇద్దరు సీఐల పైన వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారి వద్ద చిట్టా ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. -
రిమ్స్‌లో కొరవడిన నిఘా!
● 650 పడకలకే సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఒప్పందం ● ఆస్పత్రిలో ఉన్న పడకల సంఖ్య 930 ● పర్యవేక్షణ లేక తరచూ దొంగతనాలు శ్రీకాకుళం : నగరంలోని రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో నిఘా కొరవడుతోంది. నిత్యం ఏదో ఒక వార్డులో రోగులు, రోగుల సహాయకులకు సంబంధించిన సెల్ఫోన్లు, డబ్బులు, మోటారు సైకిళ్లు చోరీకి గురికావడం పరిపాటిగా మారింది. దొంగతనాలకు సంబంధించి ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొందరు రోగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కూడా పాఠకులకు తెలిసిందే. తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు చెబుతున్న అది కూడా ఆత్మహత్య అని రిమ్స్ వర్గాల నుంచే వినిపిస్తోంది. కారణం ఏదైనప్పటికీ నిఘా కొరవడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదేం లెక్క? రిమ్స్ సర్వజన ఆసుపత్రి 930 పడకల స్థాయిలో ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయిలో జరిగిన సెక్యూరిటీ ఒప్పందం మాత్రం 650కు మాత్రమే జరిగింది. రాష్ట్రస్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం ఈ ఒప్పందం జరిగినట్లు కొందరు రిమ్స్ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తొలుత 650 పడకలకు సెక్యూరిటీ ఒప్పందం జరిగినా అటు తర్వాత మరో వంద పడకలకు పెంచుతూ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రస్థాయిలో 750 పడకలకు లెక్కలు ఉండాలి. ఇందుకు భిన్నంగా 650 పడకలకే లెక్కలు ఉన్నట్లు చెబుతూ ఆ మేరకే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో రిమ్స్ పడకల స్థాయి 930కి చేరింది. ఈ కారణంగానే అప్పట్లో 930 స్థాయికి సెక్యూరిటీని పెంచలేకపోయారు. అటు తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం 930కి కాకపోయినా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు 750 పడకలకు కూడా సెక్యూరిటీ ఒప్పందాన్ని కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణ గాలికి.. రిమ్స్‌లో నిఘా సిబ్బంది సక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పడకల స్థాయి కంటే సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ వారితో సైతం సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోలేకపోతున్నారు. నిఘాను పర్యవేక్షించాల్సిన అధికారి తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో ఇటువంటి పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ అధికారి తన జాబ్ జార్టును వదిలి ఇతర రిమ్స్ అధికారుల విధుల్లో తలదూర్చడానికి ప్రాధాన్యత ఇస్తుంటారని రిమ్స్ వైద్యులే బహిరంగంగా చెబుతున్నారు ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి సక్రమంగా నిఘా అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
ఆమదాలవలస: పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డు చంద్రయ్యపేట వీధిలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీపాన రమణమ్మ (42) అనే మహిళ భర్త సింహాచలంతో కలిసి చంద్రయ్యపేటవీధిలో నివాసముంటోంది. సింహాచలం వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో శనివారం ఉదయం విధులకు వెళ్లిపోయారు. ప్రతిరోజూ స్థానికులతో కలిసి ఈవినింగ్ వాక్కు వెళ్లే రమణమ్మ శనివారం రాకపోవడంతో ఆమె భర్తకు సమాచారం అందించారు. అతను స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా మంచం పక్కన గచ్చుపై విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై సనపల బాలరాజు తెలిపారు. రమణమ్మ బ్రెయిన్ స్ట్రోక్‌తోనే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో నిర్ధారించినట్టు విశ్వసనీయ సమాచారం. -
‘యూపీహెచ్సీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి’
శ్రీకాకుళం అర్బన్: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని యూ పీహెచ్సీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం కోరారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన యూపీహెచ్సీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో యూపీహెచ్సీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మెరుగైన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలు పరిష్కారం చేయకుండా చిరు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తాం అంటూ ఆదే శాలు జారీ చేయడాన్ని ఖండించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా బి.మాలతి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డీఎస్ సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా జి.సూర్య ప్రవీణ్, కోశాధికారిగా పి. ఉపేంద్ర, వర్కింగ్ ఉమెన్స్ వింగ్ అధ్యక్షురాలిగా జి.కల్యాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టి.లక్ష్మి, జాయింట్ సెక్రెటరీగా బి.శ్రీనివాసరావు తదితరులు ఎంపికయ్యారు. -
రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా సునీల్ శర్మ
శ్రీకాకుళం కల్చరల్: సేవ్ టెంపుల్స్ భారత్ రాష్ట్ర కార్యక్రమాల సంచాలకుడిగా నగరానికి చెందిన తెన్నేటి సునీల్ శర్మను నియమితులయ్యారు. ఈమేరకు విశాఖలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సునీల్ శర్మకు అధ్యక్షుడు కేశినేని శ్రీనివాస్ (గజల్) నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, గోరక్షణ, మఠాలు, పీఠాలు, సాధువులు, సంతుల పరిరక్షణకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆపదలో అండగా.. కంచిలి: సోంపేట పట్టణానికి చెందిన పొట్నూ రు సాయిరోహిత్ కాలేయం పాడవ్వడంతో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కంచిలి పట్టణ కళింగ కోమటి సంఘం సభ్యులు రూ.1,65,211 సాయాన్ని ఆదివారం అందించారు. అంతకుముందు కూడా కొంత మొత్తాన్ని అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సాయిరోహిత్ తల్లిదండ్రులు, సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. చెట్టుకొమ్మ విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం జలుమూరు: సురవరం పంచాయతీ దొంపాక వద్ద ఆదివారం వేకువజామున ఎల్.కె.రోడ్డుపై మర్రి చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఉదయం పది గంటల వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో కూడా ఇదే రోడ్డు మీద ఓ చెట్టు కొమ్మ విరగడంతో అప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తరచూ ఇదే చెట్టు నుంచి కొమ్మలు పడటంతో వాహన చోదుకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రోడ్డు మీదుగా వందలాది ద్విచక్ర వాహనాలు, పాదచారులు, పొలం పనులకు వెళ్లే రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. సత్ప్రవర్తనతో మెలగాలి శ్రీకాకుళం క్రైమ్ : రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని.. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇరత ఆర్థిక లావాదేవీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ హెచ్చరించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పేకాట, బెట్టింగ్, గంజాయి సేవనం, క్రయ విక్రయాలు, బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్సు చేయడం, వినాయక ఉత్సవాల్లో వర్గ విభేదాలు సృష్టించి అల్లర్లకు పాల్పడటం వంటివి తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆనందరావుకు సత్కారం టెక్కలి: వసతి గృహం సంక్షేమాధికారిగా సత్తారు ఆనందరావు చేసిన సేవలు ఎనలేనివని వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమాధికారి టి.త్రినాథరావు కొనియాడారు. సంతబొమ్మాళి మండలం నౌపడ వసతి గృహం సంక్షేమాధికారిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సత్తారు ఆనందరావు, అరుణకుమారి దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఓవైపు వసతి గృహం సంక్షేమానికి కృషి చేస్తూ మరో వైపు అసోషియేషన్ బాధ్యతల్లో కీలకంగా పనిచేస్తూ అందరి మన్ననలను పొందిన వ్యక్తి ఆనందరావు అని కొనియాడారు. అనంతరం ఆనందరావు, అరుణకుమారి దంపతులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహం సంక్షేమాధికారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.గురువులు, వార్డెన్లు డి.రామారావు, గ్రామపెద్దలు కె.విష్ణుమూర్తి, వి.కృష్ణారావు, కెప్టెన్ ఎం.మన్మధరావు, ఎస్.కరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలతో సతమతం
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీని కూటమి పాలకులు గాలికొదిలేశారు. మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎవరు ముందుకు వస్తే ఎవరినెత్తిన భారం పడుతుందోనని కూటమి పాలకులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక్కడ ప్రతి ఏడాది మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా మహిళా వసతి గృహాలు లేవు. ప్రస్తుతానికి రెండు వసతి గృహాలు అవసరమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు విద్యుత్, మైదానం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. పాలకమండలి సమావేశాలకు మోక్షమెప్పుడో? వర్శిటీ పాలకమండలి సమావేశాలను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా సమావేశాలను నిర్వహించలేదు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి ఇవ్వాలి. ఇప్పటి వరకూ ఈ సమావేశాలకు ఎటువంటి ఆదేశాలను ఉన్నత విద్యామండలి జారీ చేయకపోవటంతో సమావేశాలు నిర్వహించలేదు. పాలక మండలి సమావేశం జరిగితే వర్శిటీ సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలను చేపట్టేందుకు ఆస్కారముంటుంది. వేధిస్తున్న విద్యుత్, వసతి సమస్యలు.. వర్సిటీలో ముఖ్యంగా విద్యుత్, వసతి సమస్యలు వేధిస్తున్నాయి. విద్యార్థినులకు రెండు వసతి గృహాలు అవసరం కాగా కనీసం ఒక్కటైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వర్శిటీకు ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్ లేదు. ఎచ్చెర్లలో కరెంట్ పోతే వర్శిటీలో కూడా విద్యుత్ ఉండటం లేదు. దీంతో కంప్యూటర్లు కోర్సు చదివే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆన్లైన్ పరీక్షలను నిర్వహించడానికి కూడా వీలులేకుండా పోతోంది. అందుకే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 11 కె.వి.స్మాల్ సబ్‌స్టేషన్‌ను వర్శిటీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పట్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఉన్న కళావెంకటరావు ఇక్కడ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత మర్చిపోయారు. విద్యార్థులకు సరిపడా మైదానం లేదు. ట్రాక్, పోల్స్ లేవు. ఆటలు ఆడుకునేందుకు వీలుగా మైదానం లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. ముఖం చాటేస్తున్న స్థానిక నేతలు.. అంబేద్కర్ వర్శిటీలో చేపడుతున్న కార్యక్రమాలకు స్థానికుల నాయకులకు ఆహ్వానం పంపిస్తున్నా వారు గైర్హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సమావేశాలకు హాజరైతే వర్శిటీ సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తారని, వాటిని పరిష్కరించాల్సి వస్తుందని హాజరుకావడం లేదని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్థానిక నేతలు వర్శిటీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై సమస్యలను పరిష్కరించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. -
జాప్యమెందుకో?
స్పోర్ట్స్ కోటా అమల్లో.. ● ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో కానరాని కోటా ● శాప్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం ● ప్రభుత్వం స్పందించాలని క్రీడాసంఘాల విజ్ఞప్తి శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ కోటా అమలు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనుక్కి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాక వందలాది మంది క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ క్లాసులు మొదలైపోయాయి. అయినా, స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ కావాల్సిన సీట్లను సంబంధిత శాఖాధికారులు జాప్యం చేస్తుండటంతో విద్యార్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో క్రీడాకారులు.. విద్యార్థులు ఎంసెట్, ట్రిపుల్ఐటీ సీట్ల రేసులో ఉన్నారు. వీరంతా ఇప్పటికే వివిధ క్రీడాంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని చాటిచెప్పారు. పతకాలు సాధించి సత్తాచాటారు. అయితే ఉన్నత చదువుల్లో అమలు కావాల్సిన స్పోర్ట్స్‌కోటాను అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితులు దాపరించాయి. డీఎస్సీపైనే ఫోకస్.. స్పోర్ట్స్ కోటా భర్తీ చేపట్టాలని ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు ఆదేశించింది. అయితే శాప్ అధికారులు కేవలం డీఎస్సీ ఉద్యోగాలపై మాత్రమే ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నారు. మిగిలిన ఉన్నత, ప్రొఫెషనల్, వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల సందర్భంగా స్పోర్ట్స్‌కోటా ద్వారా విద్యార్థుల భర్తీని విస్మరించారు. దీంతో ఎంసెట్, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జిల్లాలోని క్రీడా విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్ కోటా భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ఒలింపిక్ సంఘ నాయకులు, క్రీడాసంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సర్కారు బడిలో కంప్యూటర్ ల్యాబ్
● పూర్వ విద్యార్థి ఔదార్యం గార: తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో రూ.1.50 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలిచారు పూర్వ విద్యార్థి బొంది రమణ. గార మండలం కె.మత్స్యలేశం ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్‌కు అదే గ్రామానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి రమణ ఆరు కంప్యూటర్లతో పాటు ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయగా ఆదివారం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ శశిభూషణ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా సర్కారు బడిలో చదివే విద్యార్థుల కోసం ల్యాబ్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. దాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ చైతన్య, సర్పంచ్ బుడ్డా లలిత ఎర్రన్న, సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, హెచ్ఎం టి.సుధీర్‌కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ లక్ష్మీ, మైలిపిల్లి సూర్యనారాయణ, తులసీరావు తదితరులు పాల్గొన్నారు. -
కాసుల కోసం కాంట్రాక్టు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రణస్థలంలో ఉన్న యూబీ బీర్ల కంపెనీ కాంట్రాక్టులపై అధికార కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే కన్ను పడింది. బీర్ల రవాణా కాంట్రాక్ట్‌లు అన్నీ తనకే ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కాదంటే కంపెనీ నుంచి లారీలు వెళ్లవంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో బయట ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు బయటకు చెప్పుకోలేక... నష్టాలు భరించలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అన్ని డిపోల కాంట్రాక్టులు కావాలంటూ..రణస్థలంలోని యూబీ కంపెనీ నుంచి 29 డిపోలకు బీర్లు రవాణా అవుతుంటాయి. వీటిలో ఏడు డిపోలకు రవాణా కాంట్రాక్టును ఇప్పటికే ఒక ప్రజాప్రతినిధి తీసుకున్నారు. మిగతా 22 డిపోలకు బీర్ల రవాణా కాంట్రాక్టును నలుగురు కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు దక్కించుకున్నారు. ఇప్పుడా 22 డిపోల రవాణా కాంట్రాక్ట్ కూడా తనకు వదిలేయాలని ఓ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు నలుగురు కాంట్రాక్టర్లను నేరుగా అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.వారు అంగీకరించకపోవడంతో సదరు ఎమ్మెల్యే తన అనుచరులను రంగంలోకి దించినట్లు సమాచారం. దీంతో, రవాణా కోసం వచ్చే లారీలను కంపెనీ గేటు వద్ద వారు అడ్డుకుంటున్నారు. తమ ఎమ్మెల్యే చెప్పినట్లు చేసేవరకు లారీలను లోపలికి పంపించబోమని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రవాణా కోసం వచ్చే లారీలు రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయి. డ్రైవర్లు, సిబ్బంది పడిగాపులు పడుతున్నారు. కొద్దిరోజులుగా కంపెనీ నుంచి డిపోలకు సరుకు వెళ్లడం లేదని సమాచారం. మరోవైపు లారీల కిరాయి భారం కాంట్రాక్టర్లపై పడుతోంది. సమస్య పరిష్కారానికి కంపెనీ ప్రతినిధులు ప్రయతి్నంచినా... సమస్యను పరిష్కరించేందుకు యూబీ పరిశ్రమ హెడ్ ఆఫీస్ నుంచి రెండు రోజుల కిందట ఇద్దరు ప్రతినిధులు వచ్చినా ఫలితం లేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యకు యూబీ రణస్థలం పరిశ్రమలో ఉన్న ట్రాన్స్పోర్ట్ అండ్ కమర్షియల్ విభాగంలోని ఒక ముఖ్య అధికారి ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలో జరిగేదంతా ఆయన ఎప్పటికప్పుడు సదరు ఎమ్మెల్యేకు చేరవేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఏ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌కు ఎంత లాభం వస్తుందనే వివరాలను ఆయన చెప్పడం వల్లే కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే గట్టిగా పట్టుపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూబీ పరిశ్రమలో కొంతమంది ఉద్యోగులు కూడా ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా చక్కదిద్దకపోతే పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందనే చర్చ సాగుతోంది. -
ఎరువుల సరఫరా ఏకపక్షం
● కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ● రైతన్నకు తప్పని ఎరువు కష్టాలు ఆమదాలవలస రూరల్: అన్నదాతకు అందాల్సిన ఎరువులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువుల సరఫరా ఏకపక్షంగా జరుగుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి ఎరువులు చేరడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే పూర్తిగా ఎరువులు అందే పరిస్థితి ఏర్పడింది. దీనిపై జిల్లా అధికారులు కూ డా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తొలిదశలో రైతు సేవా కేంద్రాల ద్వారా కొంత సరఫరా చేసినా ఆ తర్వాత మొత్తం ఎరువులు వ్యాపారులకు అందించటంతో ఎరువు కరువుగా మారింది. గగ్గోలు పుట్టిస్తున్న ధరలు ఎరువుల వ్యాపారులు అధికార పార్టీ నాయకులు అండదండలతో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న సంగతి చాలా చోట్ల బయటపడింది. ఒక యూరియా బస్తాపై రూ. 100 నుంచి రూ.150 వరకు అదనంగా తీసుకుంటున్నారు. కాంప్లెక్స్ ఎరువులపైనా ఇదే స్థాయిలో దోపిడీ జరుగు తోంది. ముఖ్యంగా ఆమదాలవలసలో రైల్వేగూడ్స్ షెడ్ ఉండటం, ఇందుకు దగ్గరలో గోదాంలు కూడా ఉన్నందున వ్యాపారుల వ్యాపారం మూడుపువ్వు లు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇంత అక్రమాలు జరుగుతున్నా ఇక్కడ అధికారులు కనీసం తనిఖీ చేసేందుౖకైనా ముందుకు రావడం లేదు. నిఘా విభాగం సైతం నిద్ర నటిస్తోంది. తప్పని నిరీక్షణ బూర్జ: మండలంలో గల నీలాదేవిపురం (నీలంపేట) గ్రామ రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం నుంచి శనివారం 222 బస్తాల యూరియా వచ్చింది. నీలాదేవిపురంతో పాటు వావాం, ఉవ్వపేట, బూర్జ నుంచి రైతులు రావడంతో తోపులాట జరిగింది. అధికారులు పోలీసు సహాయం కోరడంతో ఎస్ఐ ఎం.ప్రవల్లిక సిబ్బందితో రైతులను క్యూలో నిలబెట్టారు. -
బార్లకు ముగిసిన డ్రా
● ఐదు బార్లకు లైసెన్సులు కేటాయింపు ● దరఖాస్తులు ఎక్కువగా పడక వెలవెలబోయిన అంబేడ్కర్ ఆడిటోరియం శ్రీకాకుళం క్రైమ్ : ఎకై ్సజ్ శాఖ బార్ పాలసీలో భాగంగా జిల్లాలో ఐదు బార్లకు లాటరీ పద్ధతిన లైసెన్సుదారులను అధికారులు నిర్ణయించారు. శనివారం ఉదయం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలతో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో టోకెన్ డ్రా పద్ధతిన లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగం నుంచి జిల్లా డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ఎ కై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం కార్పొరేషన్, పలాస–కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో జనరల్ కేటగిరీలో 17 బార్లకు గాను, రిజర్వ్ కేటగిరీలో (గీతకులాలవారికి) 2 బార్లకు గాను దరఖాస్తులు కోరగా 22 దరఖాస్తులే వచ్చాయన్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురంలో ఒక్క దరఖాస్తు కూడా పడకపోగా, శ్రీకాకుళంలో 3 జనరల్ కేటగిరీ, ఒక రిజర్వ్ కేటగిరీ (శ్రీశయన)కి, పలాస–కాశీబుగ్గలో ఒక రిజర్వ్ (సొండి) కేటగిరీకి దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ విధంగా చూసుకుంటే శ్రీకాకుళంలో 16 దరఖాస్తులు రాగా, పలాసలో ఆరు వచ్చాయని, ఒకే వ్యక్తి నాలుగు దరఖాస్తులు వేసిన సందర్భాలు రెండు చోట్ల ఎదురయ్యాయన్నారు. వెలవెలబోయిన ఆడిటోరియం.. బార్ల లైసెన్సు డ్రాలో దరఖాస్తుదారులకంటే ఎకై ్సజ్ సిబ్బందే ఎక్కువ ఉండటం గమనార్హం. కూటమి పార్టీలకు చెందిన మ ద్యం సిండికేట్ ముందస్తుగా వేసుకున్న ప్రణాళికతోనే టెండర్లు వేయలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కాశీబుగ్గల్లో జనరల్‌లో ఒక్క అప్లికేషన్ కూడా రాలేదన్నారు. పడని వాటికి తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు చెబు తున్నా టీడీపీ నాయకులు టెండర్లు వేయకుండానే తక్కువ డిపాజిట్లతో దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. -
యూరియా కోసం పాట్లు
పలాస: పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద రైతులు శనివారం యూరియా కోసం ఎగబడ్డారు. ఒక రైతుకు ఒకే బస్తా ఇస్తుండటంతో రైతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలాస ఎ.డి.ఎ రామారావును వివరణ కోరగా పలాస డివిజన్‌కు మొత్తం 19 టన్నుల యూరియా వచ్చిందని, సగానికి పైగా ఇప్పటికే అందజేశామన్నారు. ఒక ఎకరాకు అరబస్తా మాత్రమే ఇస్తున్నామని, రెండు దఫాలుగా ఒక బస్తా ఇస్తున్నామని ఇది ప్రభుత్వం నిబంధన అని చెప్పారు. టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు -
రుషికొండపై చేసిన విమర్శలు గుర్తున్నాయా..?
నరసన్నపేట: ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, విశాఖ వచ్చిన కూటమి నాయకులు మరోసారి దీన్ని రుజువు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విభాగాలుగా విభజించి ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీనిపై కూటమి నాయకులు స్పందించలేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌పై ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన నాయకులు ఇప్పుడు పెదవి విప్పాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఎప్పుడూ ఒకే విధానంపై ఉందని గుర్తు చేశారు. ఆనాడే అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశామన్నారు. విశాఖ ప్రజలు కూటమి నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రుషికొండ భవనాలపై విషం కక్కిన నాయకులు ఇప్పుడు వాటిని వాడుకోవడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. అప్పట్లో జగన్ ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేసి, ఇప్పుడు భవనాల వద్ద ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. జగన్ ప్యాలెస్ అన్న నాయకులు జీఓలో ఎందుకు అలా పెట్టలేదని ప్రశ్నించారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. -
అవస్థలు డబుల్!
అండర్ పాసేజ్‌లు ఎవరి కోసం నిర్మించారో అర్ధం కావడం లేదు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వీటి వల్ల కష్టాలు రెట్టింపయ్యాయి. వర్షం పడిన ప్రతిసారి రోజుల తరబడి చిక్కాలవలస వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో వాహనాలను రైల్వే ట్రాక్ పైనుంచే తీసుకెళ్లాల్సి వస్తోంది. రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. – ఎం. లక్ష్మునాయుడు, చిక్కాలవలస వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలు నడపలేకపోతున్నాం. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయినా రైల్వే శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా కష్టాలకు వదిలేయడం అన్యాయం. మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి నీరు నిల్వ లేకుండా చూడాలి. – కింతలి విశ్వనాథం, దాసరివానిపేట నరసన్నపేట : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది రైల్వే అండర్ పాసేజ్‌ల పరిస్థితి. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనచోదకుల నిరీక్షణకు తెరదించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ అండర్ పాసేజ్‌లు ఇప్పుడు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు పడేటప్పుడు నీటితో నిండిపోయి రాకపోకలకు వీలు లేకుండా చేస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనదారుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా అండర్ పాసేజ్‌లు నిర్మించింది. కొన్ని గంటల వ్యవధిలోనే అండర్ పాసేజ్‌లు నిర్మించామంటూ గొప్పగా చెప్పుకున్నారు. వీటిని నిర్మించేందుకు వారి ఆలోచన ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో ఇక్కడ ప్రజలు, వాహనదారులు పడుతున్న అవస్థలు మరోలా ఉన్నాయి. అండర్ పాసేజ్‌లు నిర్మాణం పూర్తయితే కష్టాలు తొలుగుతాయి అని వాహనదారులు ఆశించారు. అందుకు భిన్నంగా అవస్థలు మరింత పెరిగాయి. ‘అప్పడే బాగుండేది.. గేటు వేస్తే కొద్ది నిమిషాలు వేచి ఉండేవారం.. గేటు తీసి ఉంటే యథావిదిగా వెళ్లిపోయే వాళ్లం. ఇప్పుడలా కాదు. వర్షా కాలం వచ్చిందంటే రోజుల తరబడి అండర్ పాసేజ్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి..’ అంటూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న వర్షం పడినా అండర్ పాసేజ్‌ల వద్ద నీరు నాలుగైదు అడుగుల మేర నిలిచిపోతోంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 15 రోజుల క్రితం పడ్డ వర్షానికి నాలుగు రోజులు రాకపోకలు నిలిచిపోగా వారం క్రితం పడ్డ వర్షానికి మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. అండర్పాసేజ్ల్లో చేరిన నీరు తొలగించేందుకు, నీరు చేరకుండా ఉండేందుకు రైల్వే శాఖ చేపట్టిన చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాలుగు అడుగుల మేర నీరు.. నరసన్నపేట మండలంలో ఆర్అండ్బీ రహదారిపై నడగాం, చిక్కాలవలస, కంబకాయల వద్ద, పంచాయతీరాజ్ రహదారిపై దాసరివానిపేట వద్ద అండర్ పాసేజ్‌లు నిర్మించారు. నడగాం, దాసరివానిపేట, చిక్కాలవలసల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం నీరు నాలుగైదు అడుగుల మేర నిలిచిపోతోంది. దీంతో రోజుల తరబడి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాసరివానిపేట రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించిన అండర్ పాసేజ్ అసంపూర్తిగా ఉంది. పైన రేకులు(రూఫ్) వేయలేదు. దీనిని నిర్మించే ముందు గ్రామస్తులకు రైల్వే శాఖ పలు హామీలు ఇచ్చింది. దాసరివానిపేట నుంచి ఉర్లాం రైల్వే స్టేషన్ వరకూ రోడ్డు వేస్తామని, పోలాకి చానల్‌కు డ్రైన్ నిర్మించి అండర్ పాసేజ్లో నీరు లేకుండా చేస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. కష్టాలు రెట్టింపయ్యాయంటున్న వాహనచోదకులు రైల్వే అండర్ పాసేజ్‌లలో నిలిచిపోతున్న వర్షపు నీరు రోజుల తరబడిన స్తంభించిపోతున్న వాహనాల రాకపోకలు పట్టించుకోని రైల్వే అధికారులు