Mulugu
-
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
మల్లూరులో ఘనంగా రథోత్సవం
మంగపేట: మండల పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అమరవాది కృష్ణమాచార్యుల బృందం ఆగమనశాస్త్రం ప్రకారం పండితులు, రుత్వీకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు చతుస్త్రావార్చన, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, శిఖాంజనేయస్వామికి పంచామృతాలతో ఘనంగా అభిషేకాన్ని నిర్వహించారు. దేవతామూర్తులను పూలతో అలంకరించి రాత్రి 7 గంటలకు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకి మోసేందుకు భక్తులు బారులుదీరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన కుమారాచార్యులు, ఈశ్వర్‌చంద్, భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవాలయం పండితులు రుత్వీకులు, అమరవాది రామనర్సింహాచార్యులు, పెరుంబూదూర్ మధనమోహన్చార్యులు, మణిదీపాచార్యులు, అభిరామచార్యులు, రాచంద్రచార్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎర్రంగారి నరేశ్, నాసిరెడ్డి నాగిరెడ్డి, పల్నాటి సత్యం, దామెర సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
పున్నమి వెలుగుల్లో రామప్పబెటాలియన్ను సందర్శించిన ట్రెయినీ ఐపీఎస్‌లు గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయిలో గల తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్‌ను ట్రెయినీ ఐపీఎస్‌లు మంగళవారం ఇన్చార్జ్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రెయినీ ఐపీఎస్‌లు మన్నన్ భట్, రుత్విక్ సాయి, సాయి కిరణ్, వసుంధరలను కమాండెంట్ ఆహ్వానించి బెటాలియన్ వ్యవస్థ, పనితీరు గురించి వివరించారు. అనంతరం పస్రా బెటాలియన్ అవుట్ పోస్ట్‌ను సందర్శించి పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, ఆర్ఐలు శోభన్ బాబు, కార్తీక్, సల్మా న్ రాజు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతినెలా 400 మంది మహిళలకు వైద్యం వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని పీహెచ్సీలో ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా 400 మంది మహిళలకు వైద్యసేవలు అందిస్తున్నట్లు డీఫ్యూటీ డీఎంహెచ్ఓ విపిన్‌కుమార్ తెలిపారు. మంగళవారం పీహెచ్‌సీని ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రాముఖ్యతను ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి చీరాల శ్రీకాంత్, రిషిత, సీహెచ్ఓ పూర్ణ సంపత్‌రావు, ఫార్మసిస్ట్ రాజమణి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కోతలు లేకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలి గోవిందరావుపేట: మిల్లర్లు కోతలు విధించకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. మండల పరిధిలోని చల్వాయిలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించడంతో పాటు సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. తాలు, తేమ పేరుతో కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా మిల్లర్లు పెడ చెవిన పెడుతున్నారని తెలిపారు. కొందరు మిల్లర్లు అత్యుత్సాహం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటికప్పుడు మంత్రి సీతక్క సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ నివేదికలు తెప్పించుకుంటున్నారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొందరు మిల్లర్లు పని గట్టుకుని రైతులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మిల్లర్లను హెచ్చరించారు. మిల్లర్లు ఎవరైనా ధాన్యం కటింగ్‌కు పాల్పడితే ములుగు కంట్రోల్ రూం నంబర్ 9347416178కు, స్టేట్ కంట్రోల్ రూం 1967–180042500333కు ఫోన్ చేసి మిల్లు పేరుతో ఫిర్యాదు చేయాలని సూచించారు.సుందరీమణుల రాక సందర్భంగా రామప్ప ఆలయం జిగేల్‌మంటోంది. విదేశీ వనితలు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రత్యేక విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గార్డెన్లో స్టేజీ నిర్మించారు. సరస్సు కట్టపై ఉన్న హరి త కాటేజీలను ముస్తాబు చేశా రు. వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి నుంచే పోలీసులు విధుల్లో చేరారు. పర్యాటకులకు బుధవారం రామప్ప సందర్శనకు అనుమతి లేదు.● వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన ● రామప్పలో సందడి చేయనున్న అందాలభామలు ● అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు ● మూడంచెల భద్రత.. సీనియర్ అధికారుల పర్యవేక్షణ● 4గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్లో పాల్గొంటారు. ● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. ● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు. ● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు. ● రాత్రి 7.20 గంటలకు ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్‌కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు. ● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు. ● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది. ● సుమారు గంటపాటు హోటల్లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు. ఏయే దేశాల సుందరీమణులంటే.. ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు. ● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు. ● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. డిన్నర్లో ఇవే.. సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్‌కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్‌గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్గా నాన్ వెజిటేరియన్‌గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్‌గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్గా చాక్లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు. న్యూస్రీల్అందాల భామలకు ఆహ్వానంరామప్ప ఆలయంలో ఇలా..4.35 గంటలకు వరంగల్‌కు.. -
‘సీతక్కను విమర్శించే హక్కు కవితకు లేదు’
ములుగు: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను కవిత చదివారన్నారు. రామప్పను దర్శించుకోవడానికి వచ్చిన ఆమె రామప్ప ప్రతిష్ట గురించి మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. వర్షాల సమయంలో రైతులకు అండగా సీతక్క నిలిచి అండగా నిలిచారన్నారు. వర్షాలు పడినప్పుడు కనిపించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ సమావేశంలో ఎండీ చాంద్ పాషా, నల్లెల భరత్ కుమార్, మర్రి రాజు యాదవ్, మావిరపు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. -
ఎరుకలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెంకటాపురం(ఎం): ఎరుకలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మాజీ సీఎం కేసీఆర్ ఎరుకల ఎంటర్ ప్రిన్యూర్ షిప్ పథకాన్ని తీసుకొచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల పరిధిలోని రామాంజాపూర్ పరిధిలో గల ఎరుకల నాంచారమ్మ జాతరకు ఆమె సోమవారం హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 800 ఏళ్ల క్రితమే ఇక్కడ నాంచారమ్మ ఆలయం ఉన్నట్లుగా గుర్తులున్నాయన్నారు. నాంచారమ్మ ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఆమె ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, మాజీ జెడ్పీటీసీ రుద్రమదేవి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు, జిల్లా నాయకులు మల్క రమేష్, పోరిక గోవింద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప గార్డెన్లో కవిత విలేకర్లతో మాట్లాడారు. ఈ క్రమంలో పర్యాటకులు కవితతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. -
రామప్పలో పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు/వెంకటాపురం(ఎం): మిస్ వరల్డ్–2025 పోటీలలో పాల్గొడానికి వచ్చిన సుందరీమణు రాక సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ పరిసరాల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎస్పీ డాక్టర్ శబరీశ్‌తో కలిసి ఈ నెల 14వ తేదీ సుమారు 35 మంది సుందరీమణులు హైదరాబాద్ నుంచి తెలంగాణ జరూర్ ఆనా అనే టైటిల్‌తో రూపొందించిన ఏసీ బస్సులో నేరుగా రామప్పకు చేరుకుంటారని తెలిపారు. రామప్పను సందర్శించే సమయంలో ఎక్కడా ఏ చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందన్నారు. రామప్పలోని ఏర్పాట్లు అబ్బురపరిచేలా చూడాలన్నారు. రామప్ప జ్ఞాపకాలు మరిచిపోకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్.మహేందర్‌జీ, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి మందితో బందోబస్తు రామప్పకు ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో వెయ్యిమంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా ప్రవేశంలో ఉన్న మహ్మద్‌గౌస్‌పల్లి నుంచి రామప్ప ఆలయం, రామప్ప కట్ట, హరిత హోటల్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా నిర్వహించనున్నారు. సుమారు 35 మంది సుందరీమణులు ప్రత్యేక ఏసీ బస్సులో రామప్పకు రానున్నారు. వీరికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని తెలిపారు. బందోబస్తులో ఎస్పీ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ, ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 43 మంది ఎస్సైలు, 127 మంది ఏఎస్ఐ, హోంగార్డులు 360 మంది కానిస్టేబుళ్లు, 54 మంది హోంగార్డులు, 113 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, 125 మంది స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.సుందరీమణులు అంతా యువతులే కావడంతో వారి చుట్టూ వలయంలా ఉండి భద్రత చర్యలు చేపట్టేందుకు 160 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లోనికి ఎవరికీ అనుమతి ఉండదు. ఈ మేరకు సోమవారం సిబ్బందికి విధులు కేటాయించిన అనంతరం ఎస్పీ శబరీశ్ రామప్ప ఆలయం, హరిత్ హోటల్, చెరువు కట్ట ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వెయ్యి మందితో భారీ బందోబస్తు కలెక్టర్ టీఎస్.దివాకరలేజర్ షోకు ఏర్పాట్లు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం రామప్ప గార్డెన్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లేజర్‌షో ను నిర్వహించనున్నట్లు సమాచారం. సుమా రు 15 నిమిషాల పాటు సౌండ్ లైటింగ్ షో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది. అందుకోసం సోమవారం రాత్రి 9:45 గంటలకు లేజర్షోకు సంబంధించి ఏర్పాట్లు, లైటింగ్‌ను నిర్వాహకులు పరిశీలించారు. -
క్రాప్‌లోన్ ఉందని రైతుభరోసా డబ్బులు ఇవ్వడం లేదు..
ములుగు మండలం జంగాలపల్లి యూనియన్ బ్యాంక్‌లో రూ. రెండు లక్షల క్రాప్‌లోన్ ఉంది. ప్రభుత్వం అందించిన రైతు భరోసా డబ్బులు రూ.27 వేలు ఖాతాలో జమ అయ్యాయి. వాటిని డ్రా చేసుకోవడానికి వెళ్తే లోన్ అమౌంట్ ఉందని ఆపివేస్తున్నారు. రెండు నెలల నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. నాకు నాలుగు నెలల క్రితం పక్షవాతం వచ్చింది. రెండు నెలల క్రితం కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖర్చులకు డబ్బులు లేక నానా తంటాలు పడుతున్నాం. అధికారులు స్పందించి రైతుభరోసా డబ్బులు ఇప్పించాలి. – ఇస్లావత్ సక్రు, కాశిందేవిపేట ప్రభుత్వ సాయం అందలేదు.. మాది రైతు కుటుంబం. నా తండ్రి మేరుగు దేవేందర్ 2014లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమస్యతో 2017లో తల్లి అచల ఆత్మహత్యకు పాల్పడింది. నేను, నా తమ్ముడు లోకేష్ ఇద్దరం బరిగలానిపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందలేదు. తహసీల్దార్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో గత ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించాను. ప్రస్తుతం రెండోసారి వినతిపత్రం అందించడానికి వచ్చాను. – మేరుగు సౌమ్య, మల్లంపల్లి -
కనులపండువగా.. హేమాచలుడి కల్యాణం
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాన్ని యాగ్నికులు సోమవారం కనులపండువగా జరిపించారు. ఉదయం 7 నుంచి 9 గంటలకు ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణం జరిపించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శిష్యబృదం ఉదయం 10 గంటలకు ఉత్సవ మూర్తులను కల్యాణ మండపానికి చేర్చారు. మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల కల్యాణ మహోత్సవ క్రతువును వేదమంత్రోచ్ఛరణల నడుమ జిలకర బెల్లం, మంగళ సూత్రధారణ, ముత్యాల తలంబ్రాలతో ఆలయ సాంప్రదాయ ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు భక్తులు సుమారు 35వేలకు పైగా తరలివచ్చి కల్యాణం తిలకించి దర్శించుకున్నారు. ధృవమూర్తులకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి కల్యాణం తిలకించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఆమె తనయుడు సూర్య కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తిలకించారు. ఈ సందర్బంగా స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు సీతక్క పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అదే విదంగా కంచర్ల గోపన్న 10వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాస్ ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం జాతర సందర్భంగా ఆయలంలో రూ.17లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు, డ్రెయినేజీ, కిచెన్ షెడ్ ప్లోరింగ్ పనులను కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దాతల సాయంతో స్వామివారి కల్యాణ మహోత్సవానికి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి సీతక్క భారీగా తరలివచ్చిన భక్తులు -
ఇచ్చిన మాట తప్పేదే లేదు..
● మంత్రి సీతక్క మంగపేట: ప్రజలకు ఇచ్చిన మాట తప్పేదే లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలో గల శనిగకుంటలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరు చేసిన కలెక్టర్ దివాకరతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమాశేంలో సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా పాలన ప్రభుత్వం ప్రతీ పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని తెలిపారు. 2023లో శనిగకుంటలో జరిగిన అగ్నిప్రమాదంలో కొన్ని కుటుంబాలు సరస్వం కోల్పోవడంతో బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా సహకారం అందించామన్నారు. గతంలో తాను ఇచ్చన హామీ మేరకు నేడు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ,తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రుతదితరులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్‌కు వచ్చిన వినతుల వివరాలు..
ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన గిరిజనులు ఉపాధి కల్పించాలని విన్నవించారు. బ్యాంకు సబ్సిడీ ఇవ్వాలని పలువురు అర్జి పెట్టుకున్నారు. అలాగే పలువురు గిరిజనులు సబ్సిడీ రుణం మంజూరు చేయాలని కోరారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో సమ్మక్క–సారలమ్మ ప్రాంతంలో రంగులు వేసిన పెయింటింగ్ జీఎస్టీ బిల్లులు ఇప్పించాలని సదరు కాంట్రాక్టర్ పీఓను కోరారు. మంగపేట మండలం తొండ్యాల లక్ష్మీపురం ప్రాంతంలో ఎంఎస్‌ఏఈ పెయింటింగ్ యూనిట్ మంజూరు చేయాలని గిరిజనులు పీఓకు విన్నవించారు. కన్నాయిగూడెం మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే బహుళ అంతస్తులు కడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిని తొలగించాలని గిరిజనులు విన్నవించారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లా నుంచి ఏజెన్సీ సర్టిఫికెట్లపై డీఎల్ఎస్సీ నిర్వహించి జెన్యూనిటీ ఇప్పించాలని కోరారు. జనగామ జిల్లాలో 2017–18లో సీఆర్టీలుగా పనిచేసిన వేతనాలు ఇప్పించాలని సీఆర్టీలు విన్నవించారు. సాగులో ఉన్న పోడు భూములకు బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, దామోదర్ కోరారు. సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం నాయకులు కోరారు. కార్యక్రమంలో డీడీ పోచం, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ములుగు: రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం అవుతుందని డీఈఓ పాణిని తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ ఆదివారం శిక్షణ వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే శిక్షణకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. వివిధ సబ్జెక్టులకు కేటాయించిన షెడ్యూల్‌ను అనుసరించి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆయా తేదీల్లో సదరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. 13వ తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్ గణితం, సోషల్, ప్రాథమిక పాఠశాల ఎమ్మార్పీలకు, తెలంగాణ మోడల్ స్కూల్ చల్వాయి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయిలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే వారికి భోజన సౌకర్యం కల్పించడంతో పాటు ప్రతిరోజూ అటెండెన్స్ ఉంటుందని తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఇన్, అవుట్ టైమ్ నమోదు చేస్తామని వివరించారు. 13 నుంచి 17 వరకు శిక్షణ పొందిన ఎమ్మార్పీలు 20 నుంచి 24 వరకు ఆయా మండలాల్లోని మిగతా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. మిగితా సబ్జెక్టులైన తెలుగు, హిందీ, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రంలపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 26 నుంచి 30 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.డీఈఓ పాణిని -
ధాన్యం దిగుమతి చేసుకోం..
గోవిందరావుపేట: ధాన్యం దిగుమతి చేసుకోలేము.. నూకశాతం ఎక్కువగా వస్తుందంటూ ఓ రైస్‌మిల్లు యజమాని ధాన్యం లారీలను వాపస్ పంపించారు. ఈ ఘటన చల్వాయిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని చల్వాయిలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మూడు ధాన్యం లారీలను అదే గ్రామంలో ఉన్న మహాలక్ష్మీ రైస్‌మిల్లుకు పంపించారు. సరుకు చూసిన మిల్లు యజమాని ధాన్యం కటింగ్ ఎక్కువగా అవుతుంది.. దిగుమతి చేసుకోం అంటూ సంబంధిత రైతులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో రైతులు కలెక్టర్‌కు తెలిసిన నాయకులతో ఫోన్ చేయించగా సివిల్ సప్లయీస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మిల్లు యజమానితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ లారీలను జిల్లాలోని వేరే మిల్లులకు దిగుమతి కోసం పంపించారు. మాటమార్చిన మిల్లు యజమాని క్వింటాకు 6 కిలోల కటింగ్ చేసుకుని దిగుమతి చేసుకుంటామని రైతులకు తొలుత చెప్పిన సదరు మిల్లు యజమాని అధికారులు మిల్లుకు చేరుకోగానే మాట మార్చారు. ధాన్యం 40శాతం మాత్రమే రైస్ అవుతుంది. 60శాతం నూక అవుతుంది. 67శాతం రైస్ వస్తేనే దిగుమతి చేసుకుంటామని మాట మార్చి సివిల్ సప్లయీస్ అధికారులకు వెల్లడించారు. ఈ విషయంపై అధికారులు రైస్‌మిల్లు యజమానితో మాట్లాడగా ఒప్పుకోలేదు. దీంతో ఆ అధికారులు వేరే మిల్లులకు తరలించడం విస్మయానికి గురిచేసింది. ధాన్యం కొనుగోళ్ల విషయంపై మంత్రి సీతక్క ఎన్ని సార్లు మిల్లర్లతో మాట్లాడినా మంత్రి మాట కూడా పెడచెవిన పెట్టి వారు ఇష్టానుసారంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటనేది అర్ధం కాని పరిస్థితి నెలకొంది. 6 కేజీలు తరుగు కింద ఇస్తే.. ఎంతో కష్టపడి ధాన్యం పండించి పంటను మిల్లు దగ్గరికి తీసుకొస్తే క్వింటాకు 6 కిలోల తరుగు తీస్తాం అంటున్నారు. మేము 4 కిలోలకు ఒప్పుకున్నాం.. 6 కిలోలు ఇస్తేనే దిగుమతి చేసుకుంటాం అన్నారు. అధికారులు రాగానే నూక శాతం ఎక్కువగా ఉంది, బాయిల్డ్ మిల్లుకి పంపించండి మాకు రా రైస్ అయితే తీసుకుంటామని మాట మార్చారు. ఇప్పటికే వర్షాలు పడి తీవ్రంగా నష్ట పోయాం. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అధికారులు మిల్లర్ల ఆగడాలను అరికట్టి రైతులకు న్యాయం చేయాలి. – చాపల నరేందర్ రెడ్డి, రైతు, చల్వాయినూక ఎక్కువగా అవుతుందంటూ వాపస్ మహాలక్ష్మీ రైస్‌మిల్లు యజమాని కొర్రీలు దగ్గరుండి వేరే మిల్లులకు పంపించిన సివిల్ సప్లయీస్ అధికారులు -
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎస్సీలకు అన్యాయం
వాజేడు: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, కేటాయింపుల్లో ఎస్సీలకు అన్యాయం జరిగిందని దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్ద పిచ్చయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్నాథపురంలో 300 ఎస్సీ కుటుంబాలు ఉండగా అందులో 53 మందినే లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. వారిలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని వివరించారు. ఒక్కో కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇతే తరహాలో ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు. అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. మల్లూరుకు అంజన్న స్వాముల పాదయాత్ర ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయం ఆలయానికి చెందిన ఆంజన్నస్వామి మాలధారులు ఆదివారం సాయంత్రం రామాలయం గుడి నుంచి మల్లూరు గుట్టకు పాదయాత్రతో బయలుదేరారు. గురుస్వాములు నకిరబోయిన రమేష్, గాడిచర్ల సాంబయ్య, ఇర్సవడ్ల సంతోష్, మండల నాగరాజు ఆధ్వర్యంలో స్వాములు ఆంజనేయుడి జెండాలను పట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు. మల్లూరు గుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేడు జరగబోయే కల్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల వెంకటేశ్వర్లు, లక్క మహేశ్, మాదరి నరేష్, సిద్ధు, విజయ్, లవన్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం రేగొండ: మండలంలోని కోటంచ ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం ఆది వారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. ఆది వారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంత రం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనా ధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సింగరేణి సీఎండీ పూజలుకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని సింగరేణి సంస్థ సీఎండీ బలరాంనాయక్, రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అభిషేకం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. -
పీఆర్ రోడ్లకు మహర్దశ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ● వరంగల్ జిల్లా గీసుకొండ నుంచి మొగిలిచర్ల ఎక్స్‌రోడ్డు వరకు రోడ్డు స్పెషల్ రిపేర్స్ కోసం రూ.1.57 కోట్లతో అంచనా వేశారు. రూ.1,22,93,509లకు ఆన్లైన్ టెండర్ పిలువగా ఈనెల 17న గడువు ముగుస్తుంది. ● హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం జెడ్పీ రోడ్డు నుంచి అలియాబాద్ ద్వారా కామారెడ్డిపల్లి వరకు రోడ్డు ప్రత్యేక మరమ్మతులకు రూ.2 కోట్లతో అంచనాలు పంపారు. ప్రభుత్వం రూ.158,09,702లకు పరిపాలన అనుమతి ఇవ్వగా ఆన్లైన్ టెండర్ ద్వారా ఈనెల 17 తర్వాత పనులు ఖరారు చేయనున్నారు. ● మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ నుంచి బేరువాడ పీఆర్ రోడ్డు (మంచతండా) వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.1,25,48,271లతో టెండర్లు పిలువగా, ఈనెల 15 వరకు ఆన్లైన్లో దాఖలుకు అవకాశం ఉంది. .. ఇలా ఉమ్మడి వరంగల్‌లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఐదు జిల్లాల్లో పాత రోడ్లకు స్పెషల్ రిపేర్స్, అత్యవసర మరమ్మతులు, మట్టి రోడ్లపై తారు వేయడంతో పాటు రోడ్డులేని గ్రామం లేకుండా కొత్తరోడ్లు నిర్మించేందుకు ఈ నిధులు మంజూరు చేసింది. మొదటి విడతగా హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.69.33 కోట్లతో 62 రోడ్లకు గత నెలాఖరులో నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు పంచాయతీరాజ్ శాఖ వరంగల్ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం నుంచి టెండర్లు పిలిచారు. ఈనెల 8 నుంచి 17 తేదీ వరకు టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చారు. మానుకోటకు పెద్దపీట గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు పలు ప్రాంతాల్లో మరమ్మతులకు నోచుకోకపోగా.. మళ్లీ వర్షాకాలం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు స్పిల్ఓవర్ పనులకు ఎమ్మెల్యేలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపారు. 62 రోడ్లపై సుమారు రూ.75 కోట్ల మేరకు అవసరం ఉంటుందని ఎస్టిమేట్స్ రూపొందించగా, రూ.69.33 కోట్లు విడుదలయ్యాయి. హనుమకొండ జిల్లాలో 15 రోడ్లకు రూ.5.92 కోట్లు కేటాయించగా, ములుగు 11 రోడ్లకు రూ.17.10 కోట్లు, జయశంకర్ భూపాలపల్లికి ఐదు రోడ్లకు రూ.7.61 కోట్లు, వరంగల్ 10 రోడ్లకు రూ.9.20 కోట్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 21 రోడ్లకు రూ.27.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. మొత్తంగా విడుదలైన సుమారు రూ.69.33 కోట్లలో మానుకోటకు పెద్దపీట లభించింది. స్పెషల్ రిపేర్స్, బీటీ, నిర్మాణాలకు పెద్దపీట మరమ్మతులు, కొత్త రోడ్లపై తారుకు నిధులు ఐదు జిల్లాల్లో 62 రోడ్లకు రూ.69.33 కోట్లు... ఆన్లైన్లో టెండర్లు పిలిచిన పంచాయతీరాజ్ శాఖ ఈనెల 17తో ముగియనున్న ప్రక్రియ -
కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ
ములుగు: జిల్లా కేంద్రంలో ఆదివారం లంబాడ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత్, పాకిస్థాన్‌కు జరి గిన యుద్ధంలో వీరమరణం పొందిన మూడవత్ మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మా ట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మురళీనాయక్ గురువారం అర్ధరాత్రి కశ్మీర్ సరిహద్దుల్లో దేశ రక్షణలో భాగంగా శత్రువులతో వీరోచితంగా పోరాడి ఐదుగురు శత్రు సైనికులను హతమార్చి వీరమరణం పొందిన తొలి జవాన్ అన్నారు. మురళీనా యక్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. అనంతరం మురళీనాయక్ ఆ త్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్ నాయక్, జరుపుల బాలునాయక్, పోరిక రాహుల్, కుమార్ పాడ్యా, భూక్యా జంపన్న, హట్కర్ సమ్మయ్య, శంకర్, దేవ్‌సింగ్, సోమ, వినాయక్ పాల్గొన్నారు. -
ఆర్మీలో ఉద్యోగం నా కల
మహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్, ఆర్మీలో చేరాలన్నది నా కల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకశ్మీ ర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాపిడ్యాక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాను. – ఎడ్ల ఝాన్సీ, మానుకోట -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీసంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపోయి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం ప లుకుతారు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరి స్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తర్వాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్‌కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అందాలభామలనుఅబ్బురపర్చేలా ప్రదర్శనలు రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
ఆశయానికి ‘అమ్మ’ అండ..
జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శుత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్ల య్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సింధూర్–2 యుద్ధంలో సేవలు అందిస్తున్నాడు. ఆడపిల్లల నొదుటి బొట్టు తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించే విధుల్లో తన కొడుకు భాగస్వామిగా ఉండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తల్లి అన్నపూర్ణ గర్వంగా చెబుతున్నారు. -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి.. ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒ ప్పుకుంది.. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్‌గౌడ్‌కు సూచించింది. మొదటి ప్రయత్నంలో రాకపోవడంతో కొంత నిరుత్సాహ పడ్డాడు. మళ్లీ ఎలేందర్‌గౌడ్‌ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్‌లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్థాన్‌తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది. దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు●● భర్త మిలటరీలో మరణించినా.. బిడ్డలను కూడా పంపిన మరికొందరు.. ● సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లా యువత ● గర్వంగా ఫీలవుతున్న మాతృమూర్తులు నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవంన్యూస్రీల్ -
యునెస్కో ఆదేశాలు బేఖాతర్ !
● రామప్ప ఆలయానికి సిమెంట్ కాంక్రీట్‌తో మరమ్మతులు వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయానికి గుర్తింపు వచ్చినప్పటికీ పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. కాకతీయుల కట్టడమైన రామప్ప ఆలయాన్ని కేవలం ఇసుకనే పునాదిగా చేసి రాళ్లను పేర్చి ఆలయాన్ని నిర్మించారు. రామప్ప ఆలయ గోపురాన్ని సైతం నీటిలో తేలాడే ఇటుకలతో నిర్మించారు. యునెస్కో గుర్తింపు ఇచ్చే సమయంలో సాండ్ బాక్స్ టెక్నాలజీ, ఒకే రాతిలో రెండు రంగులు, పురాతన కట్టడాన్ని పరిగణలోకి తీసుకొని యునెస్కో గుర్తింపు ప్రకటించింది. యునెస్కో గుర్తింపు వచ్చాక సిమెంటు కాంక్రీట్‌తో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆలయానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టాలన్నా సున్నం, ఇటుక పొడి, కరక్కాయ, బెల్లం, ఇసుకను ఉపయోగించి మిశ్రమంగా తయారు చేసి మరమ్మతులు చేపట్టాలి. రామప్ప ఆలయం వర్షానికి కురిసినపుడు పైకప్పుకు సైతం ఇదే విధంగా మిశ్రమాన్ని తయారు చేసి మరమ్మతులు చేపట్టారు. రామప్ప ఆలయం చుట్టూ ఏర్పడిన సందులను (గ్యాప్‌ను) రెండు రోజులుగా సిమెంట్ కాంక్రీటుతో పనులు చేపడుతున్నారు. పురావస్తుశాఖ చేపట్టే పనులతో గుర్తింపునకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. -
పాలిసెట్ ఎంట్రెన్స్‌కు ఏర్పాట్లు
ములుగు: డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్–2025 ఎంట్రెన్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కో ఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జాకారం కళాశాలలో రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 720 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రలోకి అనుమతి ఉండదని వివరించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తో హాజరుకావాలని సూచించారు. హెచ్‌బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్‌నర్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు? వాజేడు: మండల పరిధిలోని ఓ గ్రామంలో తలదాచుకున్న మిలీషియా సభ్యులను శని వారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిలీషియా సభ్యులు తలదాచుకున్న విషయం తెలియడంతో అక్కడికి వెళ్లి పోలీసులు మొదట ఇద్దరిని, ఆ తర్వాత ఏడుగురిని మొత్తంగా 9 మందిని అదుపులోకి తీసుకుని ములుగుకు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం వాజేడు: గురుకులంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరడానికి దరఖాస్తులు చేసుకోవాలని టీయూటీడబ్ల్యూఆర్జేసీ వాజేడు ప్రిన్సిపాల్ కేబీ కిరణ్మయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి రీజియన్లలోని గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కోరారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరడానికి ఈ నెల 16న ఏటూరునాగారంలోని ఆర్జేసీ కళాశాలలో ఈ మేరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఎస్ఎస్సీ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదాయం, లోకల్ ఏరియా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ రెండు సెట్లు, నాలుగు పాస్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ‘న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి’ వాజేడు: భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి కోరారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని చట్టాలు, జీవోలు ప్రతీ ఆదివాసీ యువతీయువకులు తెలుసుకోవాలంటే న్యాయ కళాశాల ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు. చట్టాలపై అవగాహన పెంచుకొని రిజర్వేషన్లను పొందే విధంగా అవగాహన పెరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి గోవిందరావుపేట: కార్మిక చట్టాలను నర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 దేశ వ్యాప్తంగా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మిక చట్టాలను సవరణ చేస్తూ 12గంటల పని దినాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రైతుల చట్టాలను రద్దు చేశామని చెప్పి దొడ్డిదారిన మరోసారి రైతులపై భారం మోపడానికి కుట్రపన్నుతుందని ఆరోపించారు. అసంఘటిత రంగంలో కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేదన్నారు. కార్మికులకు కనీస భద్రత లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి చేపట్టిన బంద్‌తో పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. -
వైభవంగా ధ్వజారోహణం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు మురళీకృష్ణమాచార్యుల బృందం ధ్వజా రోహణం కార్యక్రమాన్ని వైభవంగా శనివారం నిర్వహించారు. హేమాచలక్షేత్రంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు ఉదయం 9గంటల నుంచి యాగశాలలో యాగ్నికుల బృందం అగ్నిప్రతిష్టాపన, సుదర్శన హోమం పూజా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణ నడుమ నిర్వహించారు. అలాగే 10గంటలకు యాగశాలలోని ధ్వజపఠాన్ని మంగళవాద్యాలతో వేదపండితులు ప్రధానాలయంలోని స్వయంభూ స్వామి వారి ఆలయానికి చేర్చి ధ్వజస్తంభం వద్ద వేదమంత్రోచ్ఛరణ నడుమ పూజలు నిర్వహించి ధ్వజా రోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో 6నుంచి 8 గంటల వరకు భేరీపూజా, దేవతాహ్వానం, నివేదన తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గరుడప్రసాదం పంపిణీ బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అనంతరం దంపతులకు సంతానార్థం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయంలో స్వయంభు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీనిలో భాగంగానే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దీంతో గరుడ ప్రసాదం కోసం దంపతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధ్వజారోహనం కార్యక్రమంలో భక్తిశద్ధలతో పాల్గొని గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు మధనమోహన్, రామనర్సింహా, మణిదీప్, వెంకటాచార్యులు, భరద్వాజ్, అభిరామ్, విరంచి ఆలయ పూజా రులు శేఖర్శర్మ, పవన్‌కుమార్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ, అజయ్, గణేశ్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు దంపతులకు సంతానార్థం గరుడ ప్రసాదం పంపిణీ -
ఆధార్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ములుగు: పీహెచ్‌సీలకు వచ్చే వ్యాధిగ్రస్తులు ఆధార్ కార్డుతో రావాలని, వారి వివరాలను నూతన పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వైద్యాధికారిని సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరా వు తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల వైద్యాధికారులతో నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్స్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈహెచ్‌ఎంఐఎస్ అనే కొత్త పోర్టల్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. పీహెచ్సీ లకు వైద్యం కోసం వచ్చే వ్యాధిగ్రస్తులు మొదట రి జిస్ట్రేషన్ నమోదు చేసుకుని వైద్యాధికారిని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. వైద్యాధికారులు పీహెచ్‌సీకి వచ్చే వ్యాధిగ్రస్తులకు ఆధార్‌కార్డులతో వచ్చేవిధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం డాటా ఎంట్రీ ఆపరేటర్స్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
వెంకటాపురం(ఎం): పాకిస్తాన్‌పై తలపెట్టిన ఆపరేషన్ సిందూర్ యుద్ధం విజయవంతంగా పూర్తి కావాలని, భారత సైనికులు సురక్షితంగా ఉండాలని కోరుతూ శుక్రవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో దేవాదాయ ధర్మదా య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండోమెంట్ పరిశీలకులు కవిత, ఈఓ బిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారులు హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లు రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని ఎల్లారెడ్డిపల్లెలో బేతి సతీష్ ఆధ్వర్యంలో, నల్లగుంటలో నాగుల రవి, రామగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులు పూజలు నిర్వహించారు. రామప్ప భూముల కౌలు ఆదాయం రూ. 2.38 లక్షలు రామప్ప ఆలయానికి చెందిన భూములను 2025–26 సంవత్సరానికి గాను కౌలుకు ఇచ్చేందుకు శుక్రవారం రామప్పలో వేలం పాటలు నిర్వహించగా రూ.2.38 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. లక్ష్మీదేవిపేట పరిధిలోని 9 ఎకరాలకు రూ. 1.10.000 వేలు, పాలంపేట పరిధిలోని గార్లగడ్డ మూడు ఎకరాల భూమికి రూ.97 వేలు, వెంకటాపూర్ పరిధిలోని రెండు ఎకరాల భూమికి రూ.31 వేల ఆదాయం కౌలు వేలం పాటల ద్వారా వచ్చినట్లు తెలిపారు. -
రామప్పను సందర్శించిన హనుమకొండ జిల్లా జడ్జి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని హనుమకొండ జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి జస్టిస్ పట్టాభి రామారావు, ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్‌కుమార్, వెంకటేష్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జక్కుల సతీష్ ఉన్నారు. ములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లిని ములుగు జిల్లా ఇన్చార్జ్ జడ్జి పట్టాభి రామారావు, జిల్లా జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్నలు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి కొత్త సదయ్య, కొత్త సురేందర్‌లు జడ్జిలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలి వెంకటాపురం(ఎం): మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మే 14న రామప్ప ఆలయానికి వస్తున్న నేపథ్యంలో రామప్పలో తలపెట్టిన పనులు రేపటి (ఆదివారం)లోగా పూర్తి చేయాలని అదనపు క లెక్టర్ మహేందర్ జీ సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం రామప్ప సరస్సుకట్టపై కాటేజీల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గురుకుల కళాశాలలో ప్రవేశానికి కౌన్సెలింగ్ ములుగు రూరల్: ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆసక్తి కలిగిన గిరిజన బాలురు, బాలికలు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆర్సీఓ హరిసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన బాలురకు ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్, 16న బాలికలకు ఏటూరునాగారం ఈజేసీ కళాశాలలో కౌన్సెలింగ్ ఉదయం 10 గంటలకు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు పదో తరగతి మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదా యం, నివాసం రిజినల్ సర్టిఫికెట్లు, నాలుగు పాస్ ఫొటోలు, 2 సెట్ల జిరాక్స్‌లను తీసుకురా వాలన్నారు. బాలుర కళాశాల వివరాలు కా టారంలో ఎంపీసీ, బీపీసీ, ఏటూరునాగారంలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, ములుగు ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, దామరవంచలో ఎంపీసీ, బీపీసీ, మహబూబాబాద్‌లో ఎంపీసీ, బీపీసీ, మరి పెడలో ఎంపీసీ, బీపీసీ, రెడ్యాలలో సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో అవకాశం ఉందని, బాలి కల కళాశాల కాటారంలో ఎంపీసీ, బీపీసీ, పీటీ, ఏటూరునాగారంలో ఎంపీసీ, బీపీసీ, సీ ఈసీ, ఏటీ, ఐఎం, వెంకటాపురంలో ఎంపీసీ, బీపీసీ, కొత్తగూడలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, కేసముద్రంలో సీఈసీ, హెచ్ఈసీ, మహబూబాబాద్‌లో ఎంపీసీ, బీపీసీలో అవకాశం ఉందన్నారు. -
మళ్లీ అదే పరిస్థితి
మంగపేట: మండలంలోని చుంచుపల్లి, వాడగూడెం గ్రామాల మధ్య ఏటూరునాగారం –బూర్గం పాడు ప్రధాన రోడ్డుపై శుక్రవారం రాత్రి 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రధా న రోడ్డుపై వచ్చి పోయే వందలాది ఇసుకలారీలు, బస్సులు, కార్లు, ఆటోలు గంటన్నర పాటు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. పాలాయిగూడెం వద్ద గోదావరి నుంచి టిప్పర్లతో ఇసుకను తీసుకువచ్చి ప్రధాన రోడ్డుకు ఇరువైపుల స్టాక్ చేస్తున్నారు. పట్టా ల్యాండ్ నుంచి వచ్చే ఇసుకలారీలు సైతం రోడ్డు దాటే క్ర మంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. సమస్యను పట్టించుకునే వారు లేకపోవడంతో ఇసుక క్వారీల నిర్వాహకులు స్వలాభం కోసం ప్రజలు, ప్రయాణికులు వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. మంగపేట, మల్లూరు, వాడగూడెం ఇసుకక్వారీల నుంచి వెళ్లే లారీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చే ఇసుకలారీలు వేబ్రిడ్జిల వద్ద నిలపడంతో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యంగా తయారైంది. అయిన ఏ ఒక్క అధికారి సమస్యను పట్టించుకోక పోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. చుంచుపల్లిలో ట్రాఫిక్ జామ్ గంటన్నర పాటు ప్రయాణికుల ఇబ్బందులు -
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురుబొంగులతో ప్ర త్యేక అందాలను ఇచ్చేవిధంగా బొమ్మలను త యారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా.. స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణఇచ్చాం. వారు తయారుచేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. కచ్చితంగా అందరిని ఆకర్షిస్తాయని భావిస్తున్నాం. – రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ● -
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
● దైత అమ్మవారికి తిరుమంజనం మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో (జాతర) రెండోరోజు గరుడాదివాసం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం ఆలయ ప్రాంగణంలోని దైత అమ్మవారికి తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రోచ్ఛారణతో కుంకుమ, చందనం, జలం, పాలతో అభిషేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సాయంత్రం యాగశాలలో గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 నుంచి గరుడపఠ లేకనం లిఖించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై టీవీఆర్ సూరి, ఆలయ బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్, అర్చకులు ముక్కామల శేఖర్శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, ఈ శ్వర్చంద్రామానుజం, యాగ్నికుల బృందం అమరవాది రామనర్సింహచార్యులు, పి. మధన మోహనాచార్యులు, మణిదీపాచార్యులు, అభిరామాచా ర్యులు, శ్రీమాన్ రామచంద్రాచార్యులు, ఆలయ సీ నియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది అజయ్, నవీన్, గణేష్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
మందుపాతర్లు పేల్చిన మావోయిస్టులు
వాజేడు/ఎంజీఎం/సాక్షి, హైదరాబాద్: కర్రిగుట్టలు మరోసారి దద్దరిల్లాయి. ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల పైనున్న పెనుగోలు గ్రామ సమీప నూగూరు అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను మావోయిస్టులు పేల్చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండోలు వడ్ల శ్రీధర్ (జేసీ4973/పీసీ1785), ఎన్.పవన్‌కల్యాణ్ (జేసీ10541/పీసీ) టి.సందీప్ (జేసీ 4638/పీసీ8124) అక్కడికక్కడే మృతి చెందారు. పైడిపల్లికి చెందిన అర్ఎస్ఐ సీహెచ్ రణదీర్ గాయపడ్డారు. మరో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. కాగా మెరుగైన వైద్యం కోసం రణదీర్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. భారీ ఎన్కౌంటర్ మరుసటి రోజే.. కర్రిగుట్టల్లో చేపట్టిన కగార్ ఆపరేషన్ 17 రోజులకు చేరుకుంది. కర్రి గుట్టలను చుట్టు ముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ఎన్కౌంటర్ చోటు చేసుకోగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ కోసం వచ్చే దళాలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని ముందే అమర్చిన మందుపాతరలను రిమోట్ల సహాయంతో పేల్చివేసినట్లు తెలుస్తోంది. 35 – 40 మందితో కూడిన మావోయిస్టుల బృందం (మహిళలు కూడా ఉన్నారు) ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. మృతదేహాలు పరిశీలించిన మంత్రి, డీజీపీ గ్రేహౌండ్స్ కమాండర్ల మృతదేహాలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రే హౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, ము లుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ మార్చురీ వద్ద పరిశీలించారు. ఈ ఘటనపై వాజేడు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 62, 148, 191(1), 191(3), 103, 109 ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్, సెక్షన్ 25(1–బీ)(ఏ), 27 ఏఆర్‌ఎమ్‌ఎస్ యాక్ట్, సెక్షన్ 10, 13 ,18,20, కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కాగా మందుపాతర్ల పేలుడులో మరణించిన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30)కు 9 నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది. నాలుగు గంటల పాటు పోస్టుమార్టం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకున్న పోలీసుల మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిపారు. బుల్లెట్ల గాయాలతోనే జవాన్లు మృతి చెందినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు: డీజీపీ ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఈడీల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులపై దూరంలో మాటేసిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చారని డీజీపీ తెలిపారు. సెర్చ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా భారీ కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు కాల్పులు ఆపేసి పారిపోయారన్నారు. ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దు: మావోయిస్టులు పోలీసుల వలలోపడి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని మావోయిస్టులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టు వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట గురువారం ఒక లేఖ విడుదల అయ్యింది. ‘పోలీసు బలగాల కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి కర్రిగుట్టలపై బాంబులు అమర్చాం. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాం. అయినా కొంతమంది ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలకు పోలీసులు మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. షికారు పేరుతో వారిని కర్రిగుట్టల వైపు పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులు పేలి వారు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..’అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.– 10లోuయాగశాలలో అంకురార్పణ, తిరుమంజనం పూజలు నిర్వహిస్తున్న యాగ్నిక పూజారులుబ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ 2–డిపో మేనేజర్ వి.జోత్స్న ఆదేశాల మేరకు గుట్ట పైనుంచి ఏటూరునాగారం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఏటూరునాగారం ఆర్టీసీ కంట్రోలర్ చల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు సురక్షితంగా గుట్టపైకి చేరుకునేందుకు మొదటి రోజు రెండు బస్సుల ద్వారా 12ట్రిప్పుల సర్వీసులను నడిపినట్లు వెల్లడించారు. 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 17 వరకు భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు గుట్టపైకి బస్సుల సంఖ్య కూడా పెంచుతామని తెలిపారు. బస్సు సర్వీసులు ప్రారంభం -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల అకాల వర్షం కురిసే అవకాశం ఉంది.మహిళల ఆర్థికాభివృద్ధికి అధికారుల కృషి ● మంత్రి ధనసరి సీతక్క ములుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సెర్ప్ అధికారులు ఎనలేని కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క కొనియాడారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలించడానికి ఏర్పాటు చేసిన సొసైటీల్లో ఉత్తమ పనితీరును కనబర్చిన జిల్లా సెర్ప్ అధికారులకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించగా మంత్రి సీతక్క గురువారం హైదారాబాద్‌లో సంబంధిత అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.226 కోట్లకు గాను రూ.235 కోట్లను అందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య, డీఆర్డీఓ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తే పతనం తప్పదు
ములుగు: పత్రికా స్వేచ్ఛను హరిస్తే పసుపు రంగు ప్రభుత్వానికి పతనం తప్పదని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ అన్నారు. ఏపీలోని విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో గురువారం పోలీసులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురిచేసినందుకు నిరసనగా ములుగు సాక్షి ఆర్సీ ఇన్చార్జ్ భూక్య సునిల్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ములుగు జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు షఫీ అహ్మద్, రామిడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ పేరుతో సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ‘సాక్షి’పై కక్షపూరితంగానే ఎడిటర్ ఇంటికి వెళ్లి పోలీసులచే ఏపీ ప్రభుత్వం డ్రామా ప్లే చేయించిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎడిటర్లు, జర్నలిస్టులను నియంత్రించాలనుకోవడం అవివేకమన్నారు. పత్రిక స్వేచ్ఛను అడ్డుకున్న ప్రతీ రాజకీయ పార్టీకి తగిన గుణపాఠం తప్పదవి వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు చేస్తున్న నిరసనకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజ్‌మహ్మద్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు గుర్రం శ్రీధర్, గాదం దేవేందర్, బైకాని నటరాజ్, బానోతు వెంకన్న, మాట్ల సంపత్, చుంచు రమేష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ -
అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రం పరిశీలన
వాజేడు: మండల పరిధిలో చెరుకూరు అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని గురువారం ములుగు డీసీఎస్ఓ ఫైజ్ హుస్సేన్, సివిల్ సప్లయీస్ డీటీ రామచందర్లతో కలిసి విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రి కార్డులను చూసిన వారు పలు సూచనలు చే శా రు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి లోడ్‌తో వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ధ్రు వీకరణ పత్రాలను తప్పని సరిగా పరిశీలించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.నాన్ మైనార్టీ విద్యార్థినుల ఎంపిక పూర్తిములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాలకు నాన్ మైనార్టీ విద్యార్థినులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా మైనార్టీ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ మైనారిటీ గురుకుల పాఠశాలలో 20 సీట్లకు గాను బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2 సీట్లను డ్రా పద్ధతిన భర్తీ చేసినట్లు తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నామని వివరించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రూ. 20 లక్షల వైద్య పరికరాల అందజేతములుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల విభాగానికి గురువారం ఈసీఐఎల్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో రూ.20లక్షల విలువ చేసే ఆపరేషన్ సీఆర్మ్ మెషిన్, ఓట్లైట్ ప్రాచ్చర్ టేబుల్ పరికరాలను కలెక్టర్ దివాకర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈసీఐఎల్ హైదరాబాద్ సంస్థ చేసిన సేవలను ఆయన అభినందించారు. భవిష్యత్‌లో ఆస్పత్రికి ఉపయోగ పడేలా మంచి పనులు చేయటానికి ముందుకు రావాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్, ఈసీఐఎల్ ప్రతినిధులు సి.మురళిధర్, ఈడీ సుదర్శన్ కుమార్, ఎడ్(పైనాన్స్) రంజన్ శ్రీవాస్తవ, ఏజీఎం (ఫైనాన్స్) పి.వేణుబాబు, సీఎంఓ, ఎస్డీజీఎం ఎ.రామకృష్ణ, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎ.సాంబమూర్తి, కార్పొరేట్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి● ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచంఏటూరునాగారం: గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గోల్డ్‌మెడల్ సాధించిన లావణ్యను డీడీ పోచం గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా సూర్య తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో కొమురం లావణ్య మాస్టర్ పర్యవేక్షణలో శిక్షణ పొందిందని తెలిపారు. మార్చిలో నిర్వహించిన ఇండియా, నేపాల్ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో 49 కిలోల కేటగిరిలో స్వారింగ్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు స్వీయ రక్షణకు కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ క్షేత్రయ్య, పీసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ పాల్గొన్నారు. -
పోస్టుమార్టం అంతా గోప్యం!
ఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారు జామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కళ్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు రాష్ట్రమంత్రి ధనుసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. కాగా, ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డికి ప్రాంతానికి చెందిన వారు. బుల్లెట్ గాయాలతోనే మృతి.. బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్‌మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్‌ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు డీజీపీ వచ్చాక సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల ప్రత్యేక బందోబస్తుతో హెడ్‌క్వార్టర్స్‌కు మృతదేహాల తరలింపు మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు.. సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఏటూరునాగారం/మంగపేట: జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏటూరునాగారంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని జీసీసీ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు గానీ సరైన రక్షణ, టార్పాలిన్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు కాక రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక ధాన్యం రాశుల వద్దనే నిరీక్షించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అదే విధంగా మంగపేట మండలంలో గురువారం ఉదయం, రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగి చల్లబడింది. పలుచోట్ల రైతులు కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. హేమాచలక్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు వచ్చిన చిరువ్యాపారుల పరిస్థితి భారీ వర్షంతో అత్యంత దయనీయంగా మారింది. జాతరకు వచ్చే భక్తులకు విక్రయించి ఉపాధి పొందేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చిరువ్యాపారులు స్వీట్లు, గాజులు, బొమ్మలు తదితర షాపులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ వర్షం రావడంతో సామగ్రిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. -
‘విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి’
ములుగు: విధి నిర్వహణలో ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్పీడీసీఎల్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల డీఈలు పులుసం నాగేశ్వరరావు, వెంకటేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బందితో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎల్సీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిబంధనలు పాటించాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
నిరుపేదలకు ‘కల్యాణలక్ష్మి’ వరం
చిట్యాల: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నిరుపేదలకు ఓ వరం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన 52మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ మేరకు నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీదేవి–సత్యం, టేకుమట్ల మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ కృష్ణ, కుమార్, లక్ష్మన్, అనిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ములుగు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ క్రీడామైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు వరల్డ్ అథ్లెటిక్స్ డేను పురస్కరించుకుని బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు దేహదారుఢ్యం, ఏకాగ్రత పెంపొందుతుందని వెల్లడించారు. అనంతరం కోచ్ పర్వతాల కుమారస్వామి మాట్లాడుతూ 4 నుంచి 7ఏళ్ల లోపు చిన్నారులు, 8నుంచి 11, 12నుంచి 14ఏళ్ల బాలబాలికలకు స్పూన్ రిలే, బ్రాండ్ జంప్, స్టాండింగ్ జంప్ రిలే పోటీలను నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేసినట్లు కోచ్ కుమారస్వామి తెలి పారు. ఈ కార్యక్రమంలో సంపత్, జగదీశ్, స్వామి, రమేష్, అబ్బు, హుస్సేన్, ఎల్లయ్య, మల్లయ్య, వెంకటేశ్వర్లు, రాజబాబు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో జాప్యం
ములుగు రూరల్: యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడం, అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. జిల్లాలో యాసంగి పంటల సాగు డిసెంబర్, జనవరి మాసాలలో సాగు చేయగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి వరి కోతలు మొదలయ్యాయి. కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు తేమశాతం వచ్చే సమయానికి అకాల వర్షాలు పడుతుండడంతో ధాన్యం తేమశాతం పెరుగుతుండడంతో కాంటాలు ఆలస్యం అవుతున్నాయి. దీనికి తోడు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యాసంగి ధాన్యం దిగుమతులను నిరాకరించడంతో కొంతమేర జాప్యం జరిగింది. సివిల్ సప్లయీస్ అధికారులు, కలెక్టర్ చొరవతో వరంగల్, హనుమకొండ మిల్లులను కేటాయించి అలాట్మెంట్ చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి మిల్లర్స్ అసోసియేషన్ దిగివచ్చి కోతలు లేకుండా ధాన్యం దిగుమతులు చేసుకుంటామని ఒప్పదం చేసుకున్నారు. తేమశాతం రాక ఇబ్బందులు యాసంగి కోతలు మొదలైన దగ్గర నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరి కోతలు చేపట్టి ధాన్యం ఆరబోస్తే అకాల వర్షాలకు రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం తేమశాతం వచ్చే సమయానికి వర్షాలు పడడంతో రైతులు ధాన్యం తిరిగి ఆరబోయాల్సి వస్తుంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.92,113 మెట్రిక్ టన్నుల లక్ష్యం జిల్లాలోని పది మండలాల్లో మొత్తం యాసంగి సాగులో సివిల్ సప్లయీస్ అధికారులు 92,113 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 12వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లాలో 153 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పీఏసీఎస్, జీసీసీ, ఐకేపీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు.జిల్లాలో 153 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 92,113 మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం ఇప్పటికి కొనుగోలు చేసింది 12 వేల మెట్రిక్ టన్నులు అకాల వర్షాలతో తేమశాతం రాక రైతుల ఇబ్బందులు -
బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు
ఏటూరునాగారం: నేటి నుంచి 17వ తేదీ వరకు మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా ఏటూరునాగారం నుంచి ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ జ్యోత్స్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా చేరుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏటూరునాగారం కంట్రోలర్లు సత్తయ్య, చల్లా శ్రీనివాస్ అందుబాటులో ఉంటారని, బస్సులు వివరాలు, ఇతర సాయం వారి నుంచి పొందాలని డీఎం సూచించారు.హానికర రసాయనాలు వాడొద్దుమల్హర్: మామిడికాయలు మాగబెట్టే ప్రక్రియలో హానికారక రసాయనాలు వాడొద్దని జిల్లా ఉద్యాన అధికారి సునీల్ అన్నారు. మామిడికాయలు మాగబెట్టే విధానంపై సేవా స్ఫూర్తి ఫౌండేషన్, జిల్లా ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్ ఆధ్వర్యంలో బుధవారం తాడిచర్ల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాయల పక్వత, కాయలు నిల్వచేసే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్‌రావు, డివిజన్ ఉద్యాన అధికారి మణి, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, రైతులు సుద్దతి రాజేశ్వర్‌రావు, గంగుల రవి, నరేష్, బండి రాజేందర్, ఓదెలు, కుమార్ పాల్గొన్నారు.విశ్రాంతి గది ప్రారంభంభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ గనిలో మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన విశ్రాంతి గదిని బుధవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. కేటీకే 5వ గనిలో మహిళా ఉద్యోగులు 35మంది పని చేస్తున్నారని, మహిళల భాగస్వామ్యం పెరిగే దృష్ట్యా విశ్రాంతి గదిని ఏర్పాటు చేసినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, వెంకటరమణ, జాకిర్హుస్సెన్, కార్మిక సంఘాల నాయకులు తిరుపతి, గట్టు రాజు పాల్గొన్నారు.పుష్కరాల పనులు పరిశీలించిన సీఎండీకాళేశ్వరం: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదు ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మన్‌ను ప్రారంభించారు. ఆయనతో రాజుచౌహాన్, ఎస్ఈ మల్చూరు నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు.కాళేశ్వరంలో దేవాదాయశాఖ కమిషనర్ పూజలుకాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు బుధవారం దర్శించుకున్నారు. ఆయన రాజగోపురం వద్దకు రాగా అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి దర్శనం అనంతరం కమిషనర్‌ను అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ శనిగెల మహేష్ స్వామి వారిని శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ సంధ్యారాణి, ఏసీ సునీత, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిలిచిన దేవాదుల పంపింగ్
డెడ్ స్టోరేజీకి చేరుకున్న సమ్మక్క బ్యారేజీకన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం సమీపంలోని దేవాదుల మోటార్ల పంపింగ్‌ను నిలిపివేశారు. గత కొద్ది రోజుల నుంచి ఒక మోటార్ ద్వారా పంపింగ్‌ను కొనసాగించిన అధికారులు గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో బుధవారం పంపింగ్‌ను పూర్తిగా నిలిపి వేశారు. పంపింగ్ వద్ద 10మోటార్లు ఉండగా గతంలో కొన్ని మోటార్లతో పంపింగ్‌ను కొనసాగించి వారం క్రితం బంద్‌చేసి ఒక మోటార్‌ను మాత్రమే పంపింగ్‌లో ఉంచారు. మంగళవారం వరకు ఒక మోటారు ద్వారా 247 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపింగ్ చేసిన అధికారులు బుధవారం ఒక మోటారు పంపింగ్‌ను కూడా పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంపింగ్ వద్ద 71.65 మీటర్ల నీటి మట్టం ఉంది. సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద.. తుపాకులగూడెం గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. కొన్ని రోజులుగా ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గాయి. దీంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.727టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పూర్తిలెవల్ 83మీటర్లు కాగా 72.10 మీటర్లకు చేరుకుంది. బ్యారేజీలో 59గేట్లు ఉండగా అందులో 58 గేట్లను మూసి ఒక గేటు ఓపెన్ చేసి దిగువకు 200క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరిలో తగ్గిన నీటిమట్టం సమ్మక్క బ్యారేజీ వద్ద డెడ్ స్టోరేజీ -
సమ్మె నోటీస్ అందజేత
ములుగు రూరల్: ఈ నెల 20వ తేదీన దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో ములుగు జిల్లా కార్మికులు పాల్గొంటున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం సివిల్ సప్లయీస్ డీఎం రాంపతికి కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44కార్మిక చట్టాలను తొలగించి 4లేబర్ కోడ్లను అమలు చేయడం వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు కనీస వేతనం చెల్లించాలని ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ధిక్కరిస్తుందన్నారు. ఈ మేరకు చేపట్టిన సమ్మెలో హమాలీ, భవన నిర్మాణ, వంట కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మొలుగూరి రాంబాబు, రొంటాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాద స్థావరాలపై దాడి భారత ఆర్మీ ఘనత
ములుగు రూరల్: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత భారతదేశ ఆర్మీదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై మూడు రంగుల జెండాలతో బుధవారం ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌లోని పహల్గాం దాడికి ప్రతీ దాడిగా ఇండియన్ ఆర్మీ సిందూర్ పేరున ఉగ్రవాదులపై దాడి చేశారని తెలిపారు. కశ్మీర్ అక్రమిత ప్రాంతంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మంది ఉగ్రవాదులను అంతం చేశారని తెలిపారు. భారత త్రివిధ దళాల సమన్వయంతో ఉగ్రవాద స్థావరాలపై దాడిలో భారత ఆర్మీ విజయం సాధించిందని వివరించారు. అక్రమంగా దేశంలో ఉంటున్న పాకిస్తానీయులు వెంటనే దేశం వదిలి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, కృష్ణాకర్, ఇమ్మడి రాకేశ్‌యాదవ్, నగరపు రమేష్, వాసుదేవరెడ్డి, కుమార్, శ్రీనివాస్, రవీందర్, హేమాద్రి, పాపిరెడ్డి, శ్రీహరి, ప్రవీణ్, సతీష్, రాజేందర్, నాగరాజు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన
వెంకటాపురం(కె): నేడు మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నట్లు తహసీల్దార్ లక్ష్మిరాజయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలకేంద్రంలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం, పాలెం గ్రామం నుంచి గోదావరి నది వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేయనున్నట్లు వెల్లడించారు.అర్ధరాత్రి భారీవర్షంములుగు: జిల్లాలోని ములుగు, వెంకటాపురం(ఎం), మంగపేట మండలాల్లో సోమవారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. వర్షంతో పాటు గాలి, ఉరుములు, మెరుపులు రావడంతో రైతన్నలు ఆందోళన చెందారు. దీంతో పలుచోట్ల కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఉదయాన్నే ధాన్యం రాశులను ఆర బెట్టడానికి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ములుగు మండలంలో అత్యధికంగా 26.8 ఎంఎం, వెంకటాపురం(ఎం) మండలంలో 7.4 ఎంఎం, మంగపేట మండలంలో 8.4 ఎంఎంల వర్షం కురిసింది.అంబులెన్స్‌కు దారిచ్చిన రైతులువాజేడు: పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం బాండు మొక్కజొన్న సాగుచేసి నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. అదే సమయంలో ఏటూరునాగారం వైపు నుంచి 108అంబులెన్స్ సైరన్‌తో వచ్చింది. ధర్నా చేస్తున్న రైతులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు దారి ఇవ్వగా అంబులెన్స్ వెళ్లిపోయింది.కోటగుళ్ల సందర్శనగణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ మంగళవారం సందర్శించారు. త్వరలో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న తరుణంలో అధికారుల బృందం సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించింది. గర్భాలయం ప్రదక్షిణ పదం, కాటేశ్వరాలయం నాట్యమండపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిలాశాసనం శివ ద్వారపాలక విగ్రహాలను పరిశీలించి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్కియాలజిస్ట్ అసిస్టెంట్ రోహిణి సీనియర్ కన్వర్జేటర్ మల్లేశం ఉన్నారు.వాటర్ కూలర్లు ప్రారంభంభూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన వాటర్ కూలర్లను మంగళవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెషెంట్లు, వారి బంధువులకు చల్లటి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ కూలర్లను ఏర్పాటు చేసినట్లు తె లిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీఎంఓ డాక్టర్ పద్మజ, కార్మిక సంఘాల నాయకులు మధుకర్‌రెడ్డి, రమేష్, శేషారత్నం, అధికార ప్రతినిధి మారుతి, డాక్టర్లు పాల్గొన్నారు.ప్రమాదాల నివారణే లక్ష్యంభూపాలపల్లి రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా విద్యుత్ భద్రత వారోత్సవాలను ప్రతిఏటా మే1వ తేదీ నుంచి 7వతేదీ వరకు నిర్వహిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ హెచ్ఆర్డీ (ఆపరేషన్స్) ఇన్చార్జ్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. ఎస్ఈ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మధుసూదన్ ముఖ్యఅతిథిగా హాజరై భద్రత వారోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి, సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎల్సీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సంబంధించి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. -
ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● డీఎంహెచ్ఓ గోపాల్‌రావు ఎస్‌ఎస్‌తాడ్వాయి: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఆశ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. ఆశ డేను పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని కొడిశాల పీహెచ్‌సీని సందర్శించి ఆశ కార్యకర్తలతో మాట్లాడారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ లాంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరించి నాలుగో విడత స్క్రీనింగ్ పరీక్షలకు ప్రజలు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని తెలిపారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహార ప్రాముఖ్యతను, సాధారణ ప్రసవాలు, తల్లిపాలు, వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతలను ప్రజలకు వివరించేందుకు ఆశ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, ప్రతీ ఆశ కార్యకర్త విధిగా తెమడ పరీక్షలు చేయించాలన్నారు. టీబీ నిర్ధారణ అయిన వ్యాధిగ్రస్తులకు మందులను అందజేసి టీబీ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను, ఐవీ ఫ్లూడ్స్, ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారికి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పవన్ కుమార్, సూపర్వైజర్లు పద్మ, బాలునాయక్, ఆరోగ్య కార్యకర్త సీతారాం నాయక్, ల్యాబ్ టెక్నీషియన్ పండు, ఫార్మాసిస్టు వెంకట్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న టీ హబ్ పరీక్షల కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ రికార్డులను పరిశీలించారు. -
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
చిట్యాల: కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ వచ్చిన వరి ధాన్యాన్ని సెంటర్ ఇన్‌చార్జ్‌లు త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.వీరునాయక్ కోరారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సెంటర్ సిబ్బందికి సూచనలు చేశారు. రైతులు వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. అనంతరం మండలకేంద్రంలోని రైతువేదికలో జరిగిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవాబుపేట గ్రామానికి చెందిన పున్నం అశోక్‌కు సంబంధించిన వరి విత్తనోత్పత్తి పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎఈఓ సన్నీ, రైతులు పాల్గొన్నారు. ఫార్మర్ ఐడీ తీసుకోవాలి టేకుమట్ల: రైతులందరూ ఫార్మర్ ఐడీ తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయాధికారి కల్యాణి ఆధ్వర్యంలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి ఆధార్ కార్డు వలే రైతులందరికీ ఫార్మర్ ఐడీ తీసుకోవాలని అన్నారు. ఫార్మర్ ఐడీలో రైతుల వ్యవసాయ భూములు వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారని అన్నారు. రైతులందరూ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రాహుల్, భరత్, అరుణ్, యోగిత పాల్గొన్నారు. -
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి’
ములుగు రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తాచాటాలని ఆపార్టీ మెదక్ జిల్లా ఇన్చార్జ్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాయలంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ పెసరు విజయచందర్‌రెడ్డి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిందన్నారు. పార్టీ నాయకులు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజల్లోకి తీసుకుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం నాయకులు భాస్కర్‌రెడ్డి, జవహర్, సురేందర్, నాగరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్షలపై అయోమయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సులకు సంబంధించి 2, 4,6 సెమిస్టర్లు, బ్యాక్లాగ్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 14వ తేదీనుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువు విధించారు. అయినప్పటికీ ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు పరీక్షల విభాగానికి చెల్లించలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన కళాశాలల విద్యార్థులకు మాత్రం ఈనెల 14నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 107 కాలేజీలు ఫీజుల చెల్లింపు.. కేయూ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్, గురుకులాలు కలిపి 292 డిగ్రీకాలేజీలు ఉన్నాయి. అందులో 217 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు రెండు సార్లు టైంటేబుల్‌ను ప్రకటించి ఫీజులు చెల్లించాలని కోరారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, అందువల్ల పరీక్షల నిర్వహణకు సహకరించబోమని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశారు. అయినా చాలా కాలేజీలు ముందుకు రాకపోవటంతో ఈనెల 4న కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏయే ప్రైవేట్ కాలేజీలు ఇప్పటివరకు పరీక్షల ఫీజులు చెల్లించలేదో గుర్తించారు. సెమిస్టర్ల పరీక్షలు జరిగేనా ? తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో వారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ఆరవ సెమిస్టర్ కీలకమైంది. ఈ పరీక్షలు జరగకుంటే వారు ఉన్నత చదువులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వారు టీజీ ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్లకు ప్రిపేరవుతున్నారు. ఆ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ విద్యార్థులనుంచి వినిపిస్తోంది. డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షలకు సుమారు 1.70లక్షలమందికిపైగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఫీజులు చెల్లించిన కాలేజీలకే పరీక్షలు నిర్వహిస్తే, చెల్లించని కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తోంది. ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు కేయూ పరిధిలో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసి కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు రాలేదని ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. వారికి సమయం కూడా ఇచ్చాం. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ఫీజులు చెల్లించిన అన్ని యాజమాన్యాల కాలేజీల్లో ఈ నెల14నుంచి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తాం. రెండు, మూడు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేస్తాం. ఇప్పటికై నా ఫీజులు చెల్లించని కాలేజీలు ఒకటి, రెండు రోజుల్లోనైనా ఫీజులు చెల్లించి నామినల్‌రోల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. – కె.రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారిఇటీవల దోస్త్ నోటిఫికేషన్.. 2025–2026 విద్యాసంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. కేయూ అధికారులు పరీక్షల ఫీజులు చెల్లించని 138 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పేర్లను దోస్త్‌నుంచి తొలగించారు. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేదు. దీంతోనైనా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకువస్తాయని భావించారు. మంగళవారం పరీక్ష ఫీజు గడువు ముగిసే వరకు 138 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే చెల్లించాయి. మొత్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి మంగళవారం వరకు 107కాలేజీలు ఫీజులు చెల్లించాయి. ఫీజులు చెల్లించని 138 కళాశాలలను దోస్త్‌నుంచి తొలగింపు వీటిలో ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలే.. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు వాయిదా ముగిసిన ఫీజు చెల్లింపు గడువు ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటీ? -
కలెక్టర్ సుడిగాలి పర్యటన
వాజేడు: నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాజేడు, వెంకటాపురం(ఎం) మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ దివాకర సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పర్యటనలో చేపట్టనున్న ఆభివృద్ధి పనులకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేడు మంత్రి శ్రీనివాసరెడ్డి వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం, నాగారం, ఎడ్జర్లపల్లి, వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని పాత్రాపురం, వెంకటాపురం గ్రామాల్లో పర్యటించి పలు ఆభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ కుమార్, మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. ఆశవర్కర్ల సమ్మె నోటీసు అందజేత ములుగు రూరల్: ఈ నెల 20వ తేదీన జాతీయ, రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని ఆశ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ మహేందర్, డీఎంహెచ్ఓ గోపాల్రావుకు ఆశ వర్కర్లు సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రవిగౌడ్, నీలాదేవి, మంజూల, రజిత, కవిత, రమాదేవి, సుధా, కోమల, సంధ్య పాల్గొన్నారు. -
హేమాచలుడి బ్రహ్మోత్సవం
రేపటి నుంచి ప్రారంభం ..12న లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్ల తిరుకల్యాణంమంగపేట: మల్లూరుగుట్టపై స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రంలో స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) రేపటి(గురువారం) నుంచి పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు (వేదపండితులు) అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వైభవంగా దేవతామూర్తుల కల్యాణం బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టం 12వ తేదీ ఉదయం 9గంటలకు ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తుల కల్యాణం, మధ్యాహ్నం 12.23 గంటలకు లభిజిన్ లగ్నంలో ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గర్భాలయం, ఆలయ ప్రాంగణంలోని వేణుగోపాలస్వామి ఆలయం, అభయాంజనేయస్వామి, దైత అమ్మవారి ఆలయంతో పాటు తదితర ఆలయాలు, ప్రధాన ఆర్చీలను వివిధ రాకల రంగులతో అలంకరించారు. జాతర ప్రాంగణంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎండ తగలకుండా ఉండేందుకు ఆలయ ప్రాంణంలోని దైత అమ్మవారి ప్రాంగణం నుంచి స్వామివారి కల్యాణ మండపం వరకు ప్రత్యేకంగా తడకలతో పందిళ్లను ఏర్పాటు చేశారు. భారీగా తరలిరానున్న భక్తులు బ్రహ్మోత్సవాలు(జాతరకు) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో దేవాదాయశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కూర్చోని తిలకించే విధంగా కల్యాణ మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, పలు చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ తెలిపారు. ప్రకృతి ప్రసాదం చింతామణి జలపాతం ఆలయ సమీపంలోని మామిడి తోపుల మధ్య ఔషధగుణాలు కలిగి చెట్ల వేర్ల నుంచి పారే చింతామణి జలపాతాన్ని భక్తులు ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. చింతామణి జలపాతం నీరు చల్లగా ఉండడమే కాకుండా సంవత్సరంలో 365 రోజులు పారుతూనే ఉంటుంది. నీరు మినరల్ వాటర్‌ను తలపించే విధంగా ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు ఎన్ని రోజులు నిల్వ ఉన్నా చెడిపోకుండా ఉండటం మరో విశేషం. ఔషధ గుణాలు కలిగిన చెట్ల వేర్ల కింది నుంచి వచ్చే నీటిని సేవిస్తే బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయమవుతాయని భక్తుల అపార నమ్మకం. ఇప్పటికి భక్తులు నీటిని క్యాన్లలో తీసుకువెళ్తుంటారు. 10 రోజుల పాటు కొనసాగనున్న జాతర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు -
అధికారులు పట్టించుకోలేదు..
దాతలు తమకు ఇచ్చిన భూమిలో మరొకరు ఇష్టానుసారంగా ఇంటి నంబర్ తీసుకొని అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్ వాసులు ఆరోపించారు. గతంలో ఇళ్లు లేదని ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నట్లు తెలిపారు. సల్లగొండ రామచంద్రారెడ్డి ఇచ్చిన భూమిని తన ముగ్గురు కొడుకుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. రికార్డులు తీసి అర్హులకు న్యాయం చేయాలని గత ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడే ఉన్న డీపీఓను పిలిపించి ఈ భూమిలో ఇల్లు ఉందా.. ఖాళీ ప్రదేశానికి ఇంటి నంబర్ కేటాయించారా తెలుసుకొని రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. -
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: విద్యుత్ ప్రమాదాలు, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డీఈఈ నాగేశ్వర్రావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరపత్రాలు పంపిణీ చేసి సోమవారం విద్యార్థులకు, పలువురికి విద్యుత్ సేఫ్టీ అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు వచ్చినప్పుడు విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దన్నారు. తడి చేతులు, కాళ్లకు చెప్పులు లేకుండా కరెంటు వస్తువులను తాకొద్దని వివరించారు. అలాగే ఏదైనా విద్యుత్ వైర్లు తెగి రోడ్ల మీద పడినప్పుడు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ అశోక్, లైన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్యతో పాటు లైన్మెన్లు రాజమౌళి, రవి, శ్రీనివాస్, జూనియర్ లైన్మెన్లు అమర్, సతీష్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యార్ధం చేస్తున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్‌జీ, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గుట్టపై తాత్కాలికంగా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్‌లు, నీడకోసం ఏర్పాటు చేస్తున్న తడుకల పందిల్లు, పార్కింగ్ స్థలం, సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. అదే విధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాల వివరాలను ఏటూరునాగారం కంట్రోలర్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రారంభం వరకు అన్ని పనులు పూర్తి చేయాలని భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా పనుల్లో వేగం పెంచాలని ఆలయ ఈఓ సత్యనారాయణ, ఇరిగేషన్, పంచాయతీ, ట్రాన్స్‌కో అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రు, పంచాయతీ కార్యదర్శి అజ్మత్ తదితరులు ఉన్నారు. -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్‌లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది క్రితం వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీలు వేర్వేరుగా పలుకోణాల్లో విచారణ చేపట్టాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి మొదలు ఆ శాఖ కీలక అధికారుల వరకు సుమారు 42 మందిపై మూడు శాఖలు అభియోగాలు మోపాయి. ఇందులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్‌లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు రూ.700 నుంచి రూ.1,200 కోట్ల వరకు స్కాం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిఘావర్గాలు.. కొందరినీ అరెస్టు చేసి.. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశాయి. ఆ కేసుల్లో ఉండి ఏడాదిలో ఉద్యోగ విరమణ చేసిన నలుగురు అధికారుల బెనిఫిట్స్ కూడా నిలిపి వేశారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా కాంట్రాక్టర్ మొయీనొద్దీన్ దుబాయికి పరారు కావడంతో అక్కడ బ్రేక్ పడింది. తాజాగా మొయీనొద్దీన్కు సంబంధించిన ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. ఆయన దగ్గర, ఆయన ద్వారా కొనుగోలు చేసిన పలువురిని విచారణకు పిలుస్తుండటం ఆశాఖలో కలకలం రేపుతోంది. యూనిట్ల వివరాలపై ఈడీ నోటీసులు.. గొర్రెల పంపిణీలో గోల్మాల్ వ్యవహారం మనీ ల్యాండరింగ్గా భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఆ స్కాం గుట్టు తేల్చేందుకు చివరి ప్రయత్నంగా జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూనిట్ల వివరాలు కోరింది. 2017 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన యూనిట్ల సమాచారం కావాలని ఈ మేరకు జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ వివరాలు గత నెలాఖరు వరకే ఈడీకి సమర్పించాల్సి ఉండగా, కొందరు అబ్స్ట్రాక్టు మాత్రమే ఇచ్చి, మరికొందరు సంపూర్ణంగా ఇవ్వగా.. రెండు జిల్లాల నుంచి సమాచారం వెళ్లలేదని తెలిసింది. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు పంపించని అధికారులు ఈనెల 10 వరకు ఇవ్వాలని మరోసారి రిమైండర్ లేఖ పంపించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై దృష్టి ఇదిలా ఉండగా 2017 నుంచి 2024 వరకు గొర్రెల పంపిణీ పథకంలో కీలకంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై మళ్లీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులపై రెండు నెలల క్రితం హనుమకొండ డీవీఏహెచ్‌ఓ కార్యాలయంలో ఆరా తీశారు. అలాగే గతంలో ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు సస్పెన్షన్‌కు గురై తిరిగి కొలువులో చేరిన కొందరికీ హైదరాబాద్ నుంచి ఏసీబీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.వీటిలోనే అక్రమాల లెక్కలు.. ఉమ్మడి వరంగల్‌లో 2017 జూలైలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని గొల్ల, కురుముల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 50 శాతం, రెండో విడతలో మరో 50 శాతం మంది చొప్పున 575 సహకార సంఘాలకు చెందిన 60 వేల మందికి మొదటి విడత(ఎ–లిస్టు)లో 49,276 యూనిట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది కమిటీగా.. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేపట్టారు. రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్‌లో 12,748, మహబూబాబాద్‌లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామ జిల్లాలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 12,123 యూనిట్ల తర్వాత అక్రమాలు వెలుగుచూడటంతో నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా విచారణకు ఆదేశించడం.. ఏడాది క్రితం అంతా అయిపోయిందని భావించిన తరుణంలో రెండు రోజులుగా మళ్లీ విచారణ స్పీడందుకుంది. ఉమ్మడి వరంగల్ అక్రమాలపైన మళ్లీ నోటీసులు జారీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధ్యులైన అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.పశుసంవర్థకశాఖలో మళ్లీ కలకలం యూనిట్ల వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసులు డీవీఏహెచ్ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’ కొందరు వీఏఎస్లను విచారణకు పిలిచిన ఏసీబీ? రిటైర్ అయినా తప్పని ఎంకై ్వరీ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పైనా పేచీ.. -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ములుగు/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో వివిధ సమస్యలపై వినతులు విన్నవించాం.. పరిష్కరించండి అంటూ ప్రజలు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 45 ఫిర్యాదులు రాగా కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావుతో కలిసి స్వీకరించారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 12 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు. మొత్తంగా 57 వినతులను పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు వినతులు సిఫారసు చేశారు. క్షుణ్ణంగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. భూసమస్యలు 16ఇందిరమ్మ ఇళ్లు 14పింఛన్లు 02ఇతర సమస్యలు 13దరఖాస్తుల వివరాలు.. ప్రజావాణిలో 45, గిరిజన దర్బార్‌లో 12 ఫిర్యాదులు ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు -
‘పాకిస్తానీయులను పంపించాలి ’
ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా పాకిస్తాన్‌కు చెందిన వారు స్థానికంటే ఉంటే వారిని వెంటనే గుర్తించి తిరిగి వారి దేశం పంపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాకిస్తాన్ మద్దతుతో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులు పహల్గాం దాడిలో 26మంది అమాయక పౌరులను బలిగొన్నారని తెలిపారు. ఉగ్రవాదులను ప్రోత్సహించే శక్తులపై ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు భూక్య జవహర్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, దొంతిరెడ్డి రవిరెడ్డి, నాగరాజు, కుమార్, వెంకన్న, శ్రీహరి, పాపిరెడ్డి పాల్గొన్నారు. -
‘వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్‌నగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కేజీబీవీలో వేసవి శిబిరాన్ని వారు ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆటలు, పాటలతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, గణిత సమస్యలను వేగంగా సాధించడం, యోగ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కేజీబీవీ విద్యార్థులే కాకుండా జిల్లాలోని 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు శిబిరంలో పాల్గొనవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ గ్యాదరి రమాదేవి, సమ్మర్ క్యాంపు కో ఆర్డినేటర్ జయ వసంతలక్ష్మి, సహాయ కోఆర్డినేటర్ జీవనప్రియ, డీసీఈబీ సహాయ కార్యదర్శి విక్రమ్, రిసోర్స్పర్సన్లు నరసింహా, రాజశేఖర్, నిరంజన్‌రెడ్డి, హరిత పాల్గొన్నారు. -
ఐటీడీఏలో వచ్చిన వినతులు ఇలా..
తాడ్వాయి మండలం రంగాపురం గ్రామానికి చెందిన నీలమ్మ సీఆర్టీ ఉద్యోగం ఇప్పించాలని పీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు. ములుగు మండల పరిధిలోని రాయినిగూడెంలో వ్యవసాయ భూములకు పంటల సాగుకోసం 10 హెచ్‌పీ మోటర్లు, పైపులు ఇప్పించాలని గిరిజనులు మంకిడి కృష్ణయ్యతో పాటు 14మంది రైతులు పీఓకు మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం మండల పరిధిలోని గంటలకుంటలో విద్యుత్ సరఫరా లేక చాలా రోజులు అవుతుందని, వెంటనే గూడేనికి విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు నంద, భద్రయ్య విన్నవించారు. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కొరగట్ల స్రవంతి తన భర్త రాజ్‌కుమార్ మరణించారని, అతడి పేరుపై ఉన్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాను తన పేరు మీదకు మార్చాలని పీఓకు విన్నవించారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ఐటీడీఏ క్వార్టర్స్‌లో వాటర్ మెన్ ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం మేడిపల్లికి చెందిన ఓ గిరిజనుడు జగ్గన్నపేట ఆశ్రమ జూనియర్ కళాశాలలో పీఈటీ ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. మంగపేట మండలం పొద్మూరు, అబ్బాయిగూడెం, మొర్రవానిగూడెంలో పీసా గ్రామ సభలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. పీఎంఏఏజీవై 2 బిల్స్, ఇతర బిల్లుల ఇప్పించాలని భూపాలపల్లి, చిన్నబోయినపల్లి కాంట్రాక్టర్లు విన్నవించారు. ములుగు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి యూనిఫాం వర్క్స్ ఆర్డర్ ఇవ్వాలని పలువురు గిరిజనులు విన్నవించారు. గోవిందరావుపేట బంధాల పోచాపురం గ్రామ పంచాయతీలో బోర్లు వేసుకోవడానికి అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు ఇప్పించాలని గిరిజనులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డీడీ పోచం, డీటీ అనిల్, ఏఓ కృష్ణారావు, మేనేజర్ శ్రీనివాస్, ఏఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు నిర్మించాలి.. కన్నాయిగూడెంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలి. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, మిషన్ భగీరథ, తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో తాగునీటిని సరఫరా చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలి. – పొడెం బాబు, కన్నాయిగూడెం, తుడుందెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి -
మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం
గోవిందరావుపేట: మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కారల్‌మార్క్స్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి మార్క్సిజం పరిష్కారం చూపుతుందన్నారు. మార్క్స్ చెప్పినట్లుగా పెట్టుబడి అతి కొద్ది మంది చేతుల్లో పోగుబడి ఉందన్నారు. మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే దూకుడుగా వ్యవహరిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, చిట్టిబాబు, రఘుపతి, వాసు, మల్లారెడ్డి, ఆదిరెడ్డి, గఫూర్, సౌమ్య, చిన్న, దేవయ్య, కృష్ణబాబు, దామోదర్, రాజేష్, చిరంజీవి, చారి తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్ -
ఓపికగా సమస్యలు వింటూ..
ములుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన అర్షం రవి తాపీమేసీ్త్రగా పనిచేసేవాడు. షుగర్‌తో రెండు కాళ్లు తీసేశారు. చిన్న గుడిసెలో భార్య, ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇంటికోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాడు. లీస్టులో పేరుసైతం వచ్చింది. తీరా సర్వే చేయగా ఇరవై ఏళ్ల క్రితం రవిపేరుతో ఇళ్లు సాంక్షన్ అయి ఉండడంతో రద్దు చేశారు. గతంలో ఇళ్లు మంజూరు అయిన విషయమే తనకు తెలియదని చెప్పినా అధికారులు వినలేదు. దీంతో భార్య రమతో కలిసి సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడే హాల్లోకి వెళ్తున్న కలెక్టర్ దివాకర వికలాంగుడిని చూసి స్వయంగా దగ్గరకు వెళ్లి దరఖాస్తు తీసుకున్నారు. ఓపికగా సమస్య విన్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించి న్యాయం చేస్తానని కలెక్టర్ తెలిపారు. పింఛన్ ఇప్పించండి.. జిల్లాకేంద్రానికి చెందిన కొయ్యడ సాంబలక్ష్మీ కుమార్తె సుమలత 15 సంవత్సరాలుగా మానసిక వికలాంగత్వంతో బాధపడుతోంది. వైద్యులను సంప్రదిస్తే వ్యాధి తగ్గదని చెప్పేశారు. దీంతో సదరం క్యాంపులో చూపించింది. మానసిక వికలాంగురాలిగా సదరం సర్టిఫికెట్ సైతం జారీ అయ్యింది. కానీ పింఛన్ రావడం లేదు. ప్రతినెలా కుమార్తె మందులకు రూ.2వేలు ఖర్చు అవుతున్నాయని తెలిపారు. పనిచేస్తే వచ్చే డబ్బుతో కుటుంబం గడపడం బిడ్డను చూసుకోవడం ఇబ్బందికరంగా ఉందని వాపోయింది. కుమార్తె నడవలేని స్థితిలో ఉన్న కారణంగా తానే వచ్చి దరఖాస్తు ఇచ్చానని చెప్పుకొచ్చారు. – కొయ్యడ సాంబలక్ష్మి, ములుగు● -
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025
ఇల్లు కేటాయించండి.. నాకు ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు చనిపోయాడు. మరో ఇద్దరు కొడుకులకు వివాహం అ య్యింది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరాఖాస్తు చేసుకున్నాం. కుమారులు శ్యామేల్, జాన్‌లకు రేషన్ కార్డులేదని ఇళ్లు కేటాయించలేదు. నాకు రేషన్‌కార్డు ఉంది. నేను వికలాంగుడిని. నాకై నా ఇల్లు ఇప్పించాలని కలెక్టర్ సారును కోరిన. ఇందిరమ్మ ఇంటికోసం రెండోసారి దరఖాస్తు కూడా చేసుకున్నా. వీరితో పాటు ఇదే మండలానికి చెందిన చంద్రపట్ల గ్రామానికి చెందిన మహిళలు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. – చంటి సదానందం, దివ్యాంగుడు, వెంకటాపురం(కె), ఎస్సీ కాలనీన్యూస్రీల్ -
ఆపరేషన్ చేశారు.. బ్యాండేజ్ క్లాత్ మరిచారు
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బ్యాండేజ్ క్లాత్ మరిచారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన అండ్రాసి తిరుమల వారం క్రితం ప్రసవం కోసం కమలాపూర్ సీహెచ్‌సీకి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆతర్వాత ఓ బ్యాండేజ్ క్లాత్ బయటకు తీయకుండా వదిలేశారు. దీంతో తిరుమలకు తీవ్రమైన నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న మరో వైద్యుడు ఆపరేషన్ చేసిన వైద్యురాలితో ఫోన్లో మాట్లాడి ఆ బ్యాండేజ్ క్లాత్‌ను తొలగించారు. ప్రసూతి కోసం ఆస్పత్రికి వస్తే ఫోన్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి బ్యాండేజ్ క్లాత్ మరిచిపోయారని బంధువులు చెబుతున్నారు. కాగా.. ప్రభుత్వాస్పత్రులపై నమ్మకంతో వస్తే వారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పరిస్థితి విషమించి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని బాలింత బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. -
రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి
గోవిందరావుపేట: ధాన్యం కొనుగోల్లలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పస్రా పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి ఆద్వర్యంలో మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్‌రెడ్డి హాజరై మాట్లాడారు. మండల పరిధిలో 20రోజుల నుంచి కురుస్తున్న వడగండ్ల వానలతో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని బయటకు తీయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు తీవ్రంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో కొంతమంది రైతులు సన్నధాన్యం పండించగా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వివరించారు. ఈ కార్యక్రమంలో పొదిళ్ల చిట్బిబాబు, తీగల ఆదిరెడ్డి, గొంది రాజేశ్, గుండు రామస్వామి, అంబాల మురళి, సూర్యనారయణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్‌రెడ్డి -
‘ఇసుక క్వారీ నిర్వహణపై కలెక్టర్ స్పందించాలి’
మంగపేట: మండల పరిధిలోని రమణక్కపేట కొమురంభీం ఎస్టీ ఇసుక క్వారీ నిర్వహించకపోవడంపై కలెక్టర్ దివాకర తక్షణమే స్పందించాలని ఇసుక క్వారీ సొసైటీ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రమణక్కపేట ఇసుక క్వారీ వద్ద సొసైటీ సభ్యులు, గ్రామస్తులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మార్చి 28న రమణక్కపేట 2, గొల్లగూడెం ఇసుక క్వారీల నిర్వహణపై నిర్వహించాల్సిన పెసా గ్రామసభను కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో నిలిపి వేయించి నెల రోజులు గడుస్తున్నా తిరిగి గ్రామసభను నిర్వహించకుండా పొంతన లేని కారణాలతో అడ్డు కుంటున్నాడని ఆరోపిస్తూ మూడు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామసభ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం మండల పరిధిలోని మల్లూరు, చుంచుపల్లి, కత్తిగూడెం గిరిజన సొసైటీ ఇసుక క్వారీలకు గ్రామసభలు నిర్వహించి నెల రోజులు గడుస్తున్నా తమ సొసైటీ క్వారీ నిర్వహణకు ఎందుకు గ్రామసభ నిర్వహించలేదనే విషయంపై కలెక్టర్ తక్షణమే వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. తమ గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు భూభారతి, అకాల వర్షాలు, పంటనష్టం సర్వే వంటి తదితర కారణాలు చెబుతున్న కలెక్టర్‌కు కత్తిగూడెం ఇతర సొసైటీలకు గ్రామసభలు నిర్వహించినప్పుడు అవి అడ్డు రాలేదా అని ప్రశ్నించారు. పొంతనలేని సాకులు చెబుతూ ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే ఉపాధి కోల్పోయిన ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి పెసా గ్రామసభ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు నాగార్జున్, సందీప్, వసంతరావు, గుమ్మల వీరస్వామి, కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా టాపర్‌కు ఆర్థిక చేయూత
గోవిందరావుపేట: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన డి.కారుణ్యకి జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణ అధికారి జయదేవ్ నగదు ప్రోత్సాహాకాన్ని ఆందజేశారు. మండల పరిధిలోని చల్వాయికి చెందిన కారుణ్య గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి జిల్లాలోనే 577మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచి జిల్లా పేరుని నిలబెట్టడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచినందుకు కారుణ్యకు శాలువా కప్పి ప్రోత్సాహకంగా రూ.10వేలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారికి నిత్య పూజలు, అలకరణ అనంతరం ఉత్సవమూర్తికి ఉదయం పల్లకీసేవ, సాయంత్రం శేషవాహనసేవ నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. సేవా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్‌కుమార్, డాక్టర్ లాల్కోట వెంకటాచారి, రాగిఫణి రవీంద్రాచారి, చొల్లేటి కృష్ణమాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నారోజు సత్యమనోరమ, శశిధర్శిల్పి తదితరులు పాల్గొన్నారు. -
ములుగులో మోడల్ బస్టాండ్
ములుగు: జిల్లాకేంద్రంలో అత్యాధునిక హంగులతో మోడల్ బస్టాండ్ నిర్మాణం పనులు వచ్చే నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఈడీతో మాట్లాడి ప్రతినెలా చేపడుతున్న పనులపై నివేదిక ఇచ్చి పనుల్లో వేగం పెంచాలని సూచించామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లాకేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో 32గుంటల స్థలంలో రూ.4.81 కోట్ల వ్యయంతో గ్రౌండ్, ఫస్ట్ఫ్లోర్గా నిర్మించనున్న మోడల్ బస్టాండ్ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ 1989లో నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క చెప్పగానే వెంటనే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మోడల్ బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. మంగపేట మండలంలో రూ.50లక్షలతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయన్నారు. ఏటూరునాగారం డివిజన్లో చేపట్టనున్న బస్‌డిపో పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గట్టమ్మ ఆలయం సమీపంలోని గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్ భవనం, వైద్య కళాశాలలకు అనుగుణంగా విద్యార్థులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మినీ బస్టాండ్ నిర్మిస్తామన్నారు. కలెక్టర్ ఎకరం స్థలం కూడా కేటాయిస్తామని తెలిపారని, అధికారులు నివేదిక అంచనా ఇస్తే రూ.45లక్షలతో పనులు చేపడతామన్నారు. బీసీలకు 42శాతం అమలుకు కృషి అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇప్పటికే ములుగు మున్సిపాలిటీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యిందని వివరించారు. ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలో ఉన్న కారణంగా రవాణా పరంగా ఆర్టీసీ సేవలు అవసరం అని చెప్పడంతో సీఎం రేవంత్‌రెడ్డి అడిగినన్ని నిధులు కేటాయిస్తున్నారని మంత్రి వివరించారు. ఆర్టీసీ బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి ప్రభాకర్‌కు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా గట్టమ్మ ఆలయంలో పూజలు చేసిన మంత్రి పొన్నం ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ నుంచి పార్టీ కార్యకర్తలు భారీ బైక్‌ర్యాలీ నడుమ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలకు భారీ గజమాలతో సత్కరించారు. అలాగే జిల్లా కేంద్రంలోని మహర్షీ భగీరథుడి జయంతిని ఉత్సవాల్లో సీతక్క పాల్గొన్నారు. అనంతరం దేవగిరిపట్నం గ్రామంలో బాలబ్రహ్మచారి కిషన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి, నందీశ్వర, ధ్వజస్తంభ, గణపతి, దక్షిణామూర్తి, సుబ్రమణ్యేశ్వర స్వాముల నూతన విగ్రహ ప్రతిష్టాపన, ఆలయాన్ని ఘనంగా ప్రారంభించిన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు పొన్న ప్రభాకర్ హాజరై పలు సూచనలు చేశారు. లీలాగార్టెన్లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమ్మేళన కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆర్టీసీ ఈడీ సల్మాన్‌రాజ్, డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, ఆర్డీఓ వెంకటేశ్, ఈఈ భాస్కర్, డిపో మేనేజర్లు జ్యోత్స్నచందర్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తాం.. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
పేదల కోసమే సన్నబియ్యం పంపిణీ
భూపాలపల్లి రూరల్: పేదోడి కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని మహిళా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఆమె పర్యటించారు. పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్డుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాంతినగర్ కాలనీలో పేద దళితుల ఇంట్లో కాలనీవాసులతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని తిన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంతకు ముందు అసోం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రి మహిళలకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు -
‘గాలికుంటు’ నివారణే లక్ష్యం
34బృందాలు వైద్యాధికారులు పారా వెటర్నరీ సిబ్బంది గోపాల మిత్రలుములుగు రూరల్: గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత టీకాలను పంపిణీ చేస్తున్నాయి. పశువుల సంరక్షణకు ప్రభుత్వాలు ఏడాదికి రెండుసార్లు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందిస్తున్నాయి. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రైతులకు గాలికుంటు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పశువులకు వచ్చే వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ రంగాల్లో గాలికుంటు వ్యాధి వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పది మండలాల్లో ఉచిత టీకా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 34 బృందాలు ఏర్పాటు చేశారు. 1.08 లక్షల పశువులకు ఉచిత టీకాలు అందిచాల్సి ఉండగా ఇప్పటి వరకు 38,880 పశువులకు టీకాలు వేశారు. వ్యాధి లక్షణాలు.. గాలికుంటు వ్యాధి సూక్ష్మక్రిములతో వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకి గేదెలు, ఆవులు ఆహారం సరిగా తీసుకోకపోవడంతో బక్కచిక్కి పోతాయి. పశువులకు రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం భారిన పడి నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలో వ్యాధి ముదిరిపోతుంది. పశువులు మేత, నీరు తీసుకోకపోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నివారణకు చికిత్స ఇలా.. వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టలను పొటాషియం పర్మాంగనేట్ లేదా సైలెన్ వాటర్‌తో శుభ్రం చేయాలి. రెండోసారి వ్యాధి సోకకుండా యాంటీబయాటిక్ మందులను, పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులను వాడాలి. గాలికుంటు వ్యాధిపై రైతులు నిర్లక్ష్యం వహించకూడదు. వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండు సార్లు టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి ప్రాణాంతకం కావడంతో అలసత్వం వహిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన పశువులకు.. గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో ఉంచకుండా వేరుగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పశువుల పాకను శుభ్రం చేయాలి. వారానికి ఒక సారి కొట్టంలో సున్నం చల్లి క్రిమీ కీటకాల నివారణ చర్యలు పాటించాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాత వినియోగించాలి. వ్యాధిసోకిన పశువులు మృతి చెందితే గోతిలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలి. టీకాలను సద్వినియోగం చేసుకోవాలి పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేయిస్తే పశుసంరక్షణ బాగుంటుంది. వ్యాధి బారిన పడిన పశువులను గుర్తించి ఆస్పత్రిలో చికిత్స అందించాలి. గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ చేపడుతున్నాం. ముందుగా రైతులకు సమాచారం అందిస్తున్నాం. – కొమురయ్య, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి 252313 -
రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని అన్ని గనుల్లో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అధికారులకు సూచించారు. జీఎం బొగ్గు ఉత్పత్తి, ఉత్పదాకతపై జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ కార్యాలయంలో అన్ని గనుల మేనేజర్లు, షిప్ట్ ఇన్‌చార్జ్‌లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ... సంస్థ నిర్దేశించిన ప్రకారం లక్ష్యాలను సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని కోరారు. ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. కార్మికులకు తప్పనిసరిగా ఇన్సెంటివ్ రావాలంటే నిర్దేశించిన టన్నుల బొగ్గు రవాణా జరిగేలా చూడాలన్నారు. కార్మికులు 22రోజులకు తగ్గకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, ప్రాజెక్ట్ అధికారులు, ఏజెంట్లు భిక్షమయ్య, వెంకటరమణ, అధికార ప్రతినిధి మారుతి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు సింగరేణి ఉన్నత పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అభినందించి ప్రోత్సాహక బహుమతులను అందించారు. 548మార్కులు సాఽధించిన ఎం.ఆశ్రితతో పాటు 500పై మార్కులు సాధించిన విద్యార్థులకు జీఎం కార్యాలయంలో శనివారం ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, పాఠశాల కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, అధికారులు రాజు, శ్రావణ్‌కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేదికపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే శ్రీహరి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షిప్రతినిధి, వరంగల్● ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్‌రెడ్డిల పర్యటన ● దేవాదుల పంపుహౌజ్, రిజర్వాయర్లపై రివ్యూ... ● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్ ● హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ ● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష -
వైద్యసేవలు విస్తరించాలి
ములుగు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాధినిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ, సంక్రమిత, అసంక్రమిత వైద్య సేవలను గ్రామాల్లో విస్తరింపజేయాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు సూచించారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని శాఖ కార్యాలయం నుంచి ఎంఎల్‌హెచ్‌పీలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. హెల్త్ మేళా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలంలో వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యాన్సర్ స్క్రీనింగ్, లైన్ లిస్టులను పీహెచ్‌సీల వారిగా కో ఆర్డినేట్ చేసుకొని జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి అందించాలని సూచించారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమాలను ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 100శాతం పూర్తి చేయాలన్నారు. వ్యాధి టీకాలు వేసిన అనంతరం ఆరోగ్య పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలని తెలిపారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పవన్‌కుమార్, డెమో సంపత్, ఎన్సీడీ కో ఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి, డీడీఎం ప్రవీణ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
ఆట వస్తువుల పంపిణీ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని నార్లాపూర్ సమీపంలోని తక్కళ్లపాడు గొత్తికోయగూడెంలోని పాఠశాలల చిన్నారులకు హైదరాబాద్‌కు చెందిన యూత్ అసెంబ్లీ సంస్థ సభ్యులు శనివారం ఆట వస్తువులను పంపిణీ చేశారు. గూడెంలోని పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడంతో స్పందించిన యూత్ అసెంబ్లీ ఎన్జీఎం సంస్థ వారు పాఠశాలను సందర్శించి గొత్తికోయ చిన్నారులకు ఆటవస్తువులు క్యారమ్బోర్డుతో పాటు తాగునీటి కోసం వాటర్ వీల్స్ క్యా న్లు, టీవీ అందజేశారు. ఈ సందర్భంగా యూత్ ప్రతినిధులు చిన్నారులతో మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
● ఆర్డీఓ వెంకటేశ్ వెంకటాపురం(ఎం): భూభారతి చట్టం అమలుకు మండలంలోని రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని వెల్తుర్లపల్లిలో ఆర్డీఓ వెంకటేశ్ శనివారం ఫీల్డ్ విజిట్ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తు చేసిన ప్రతీ రైతుకు చెందిన భూమిని పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
డ్రగ్స్‌కు బానిసలుగా మారొద్దు
వాజేడు: ప్రాణాలను బలి తీసుకునే డ్రగ్స్‌కు బానిసలుగా మారొద్దని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని చిన్న గొళ్లగూడెం గ్రామంలో పోలీసులు శనివారం డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లాంటివి సేకరించినా, అక్రమంగా విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌తో పట్టు బడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్సై తెలిపారు. కర్రిగుట్టల్లో కొనసాగుతున్న కూంబింగ్ వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో సాయుధ బలగాలు 12 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో మావోయిస్ట్ అగ్రనేతలతో పాటు సుమారు వెయ్యిమంది మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో కర్రిగుట్టలను కేంద్ర బలగాలు చుట్టు ముట్టాయి. ఆ గుట్టల చుట్టూ మావోయిస్టులు అమర్చిన మందు పాతరలను తొలగించుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. కాగా 12వ రోజు శనివారం కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ఇద్దరు జావాన్లు వడదెబ్బకు గురికావటంతో వారిని వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. మలేరియా జ్వర నిర్ధారణ పరీక్షలు వాజేడు: మలేరియా జ్వరాల నిర్ధారణ పరీక్షలను పేరూరు వైద్య సిబ్బంది కడేకల్ గ్రామంలో శనివారం నిర్వహించారు. పేరూరు వైద్యాధికారి రాహిల్ ఆధ్వర్యంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా ఈ పరీక్షలను చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న వలస కూలీల మూలంగా మలేరియా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందులో భాగంగా మలేరియా లేని మండలంగా మార్చడం కోసం ముందస్తుగా పరీక్షలను నిర్వహించి మందులను ఇస్తున్నట్లు వైద్యాధికారి రాహిల్ తెలిపారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ వేణుగోపాలకృష్ణ, తిరుపతి, శ్రీదేవి, శారద, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా వెంకటాపురం(కె): చెలిమ నీరే తాగునీరు శీర్షికన సాక్షిలో శనివారం కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. ఈ మేరకు మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామాన్ని అధికారులు సందర్శించారు. పర్శికగూడెం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందకు పంచాయతీ ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ వెంకటసతీష్, గ్రిడ్ ఏఈ రవితేజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దు ములుగు: నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఇసుక ర్యాంపుల యజమానులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకూడదని మంత్రి సీతక్క తనయుడు, రాష్ట్రయూత్ కాంగ్రెస్ కార్యదర్శి సూర్య శనివారం ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ రహదారిపై ఎక్కడబడితే అక్కడ లారీలను నిలిపి సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని తెలిపారు. అలాంటి ఇసుకక్వారీల యజ మానులపై చర్యలు తీసుకోవడానికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ర్యాంపుల రద్దుకు మద్దతిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆయా మండలాల నుంచి చాలా ఫిర్యాదులు అందుతున్నాయని వివరించారు. లారీలను రోడ్లపై ఆపడం ద్వారా వాహనదారులకు, ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రజాశ్రేయస్సే మంత్రి సీతక్క లక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వివరించారు. -
సుందరీమణుల సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు
● కలెక్టర్ దివాకర ములుగు: ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణుల సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ శబరీష్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షోబోట్ ప్రతినిధులు పలు దేశాలకు చెందిన సుందరీమణులు ఈ నెల 14న వెంకటాపురం(ఎం) మండలంలోని యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారని, హైదరాబాద్ నుంచి సుందరీమణులు నేరుగా రామప్ప హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారన్నారు. పోలీస్ శాఖ తరఫున బందోబస్తు నిర్వహించాలని సూచించారు. హరిత కాకతీయ నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని దైవ దర్శనం చేసుకుంటారని, ఆలయం వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ విశిష్టను సుందరీమణులకు వివరించాలని గైడ్లను ఆదేశించారు. ఫొటోషూట్, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టాలన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఈనెల 8 తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్న మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహా స్వామి కల్యాణ బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి
ములుగు: ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంభందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్మిట్టిల్తో కలిసి భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరాఖాస్తులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా తరఫున కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్‌జీ, సంపత్‌రావులు పాల్గొన్నారు. అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు. ఈదురుగాలులతో రూ.55లక్షల నష్టంవెంకటాపురం(ఎం): ఆకాలవర్షంతో పాటు ఈదురుగాలులకు రూ.55 లక్షల నష్టం వాటిల్లిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వెల్తుర్లపల్లిలో ఈదురుగాలులతో విరిగిన విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెల్తుర్లపల్లితో పాటు రేగొండ, గణపురం ప్రాంతాల్లో ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో 351 స్తంభాలు నేలకొరిగాయన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ రాజచౌహాన్, భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్‌నాయక్, జీఎం సురేందర్, ములుగు డీఈ నాగేశ్వర్రావు, డీఈలు పాపిరెడ్డి, సదా నందం తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకోవెంకటాపురం(ఎం): ఆకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండలంలోని పాపయ్యపల్లి రహదారిపై నర్సాపూర్, సింగరకుంటపల్లి, పాపయ్యపల్లి గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతోనే తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేశారు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఎస్సై జక్కుల సతీష్ రాస్తారోకో వ ద్దకు చేరుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కా ర్యక్రమంలో మూడు గ్రామాలకు చెందిన సు మారు 200మంది రైతులు పాల్గొన్నారు. 15వరకు టెన్త్ సప్లిమెంటరీ ఫీజు గడువు భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● మంత్రి ధనసరి సీతక్క ములుగు: వైకల్యమనేది కేవలం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల శాఖల మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ అధికారిణి శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల పరిధిలోని బళ్ల సంజయ్, నాగయ్య, కృష్ణ, కందికట్ల సాంబయ్య (నలుగురికి)లకు రూ.2లక్షల విలువైన బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లను కల్పించామన్నారు. ఉద్యోగాలు, ఉపాధికి ఏ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించిందన్నారు. కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంలో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ శాలినీ మిశ్రా మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో ఈ ఉపకరణాలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తదితరులున్నారు. చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలివిద్యార్థులు విద్యతో పాటు సంస్కారం నేర్చుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఇంటర్మీడియట్, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. పదో తరగతిలో ఎనిమిదో స్థానంలో నిలవడం సంతోషయమే అయినప్పటికీ రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ చైర్మన్ రవి చందర్, ఆర్డీఓ వెంకటేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, డీడీ పోచం, ఎస్ఓ రాజు కుమార్ అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గోన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఎదురౌవుతున్న సమస్యలు తెలుసుకోవడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ (ఏటూరునాగారం) పీఓ చిత్రమిశ్రా అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఇప్పటివరకు ఐటీడీఏ పరిధిలోని ఆరు జిల్లాలలో చేపట్టిన పనుల వివరాలను సేకరించి నివేదిక రూపంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఈఈ వీరభద్రం, డీడీ పోచం, అధికారులు పాల్గొన్నారు. -
సివిల్ సప్లయీస్‌కు ‘సీఎంఆర్‘ చిక్కులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైసుమిల్లుకు 2021–22, 2022–23 సంవత్సరాలకు కేటాయించిన సీఎంఆర్ కింద 4,310 మె.టన్నుల బియ్యానికి 1,889 మె.టన్నులు మాత్రమే సరఫరా చేశారు. సుమారు రూ.7.50 కోట్ల విలువైన బియ్యం ఎగవేయడంతో అప్పట్లో సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి బియ్యం లేకపోవడంతో కేసులు నమోదు చేసి డిఫాల్టర్ లిస్టులో చేర్చారు. ● మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో గత సీజన్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. అదే విధంగా కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించి కేసులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఈసారి డిఫాల్టర్లకు ఇవ్వొద్దని ప్రభుత్వంనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. 20 శాతం మిల్లర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. సివిల్ సప్లయీస్ అధికారులు వాటిపై పునరాలోచన చేస్తూ మిగతా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్‌లో 987 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాక్షికంగా సాగుతుండగా.. మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మెనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దాడులు, కేసులు పెట్టినా అదే మొండివైఖరి... సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాల్లో కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గత రబీ సీజన్లో సీఎంఆర్ కోసం కూడా హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. వరంగల్ జిల్లాలోని ఓ మిల్లులో రూ.3.79 కోట్ల విలువైన 12,360 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించి కేసు పెట్టారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌లో జరిపిన తనిఖీల్లో ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన రూ.201 కోట్లకు పైగా విలువైన బియ్యం బకాయి ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశామని, 6ఏ కేసులు కూడా నమోదు చేశామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు కూడా పెడతామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ ఆచితూచి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాయిల్డ్, రా రాస్ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి బకాయిలు సుమారు లక్షా 20వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు రావాల్సి ఉందని ఫైనల్‌గా తేల్చారు. సీఎంఆర్ బకాయి ఉన్న డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వరాదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ 10.24 లక్షల మె.టన్నుల మేరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసిన అధికారులు 987 కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇన్‌టైమ్‌లో సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫాల్టర్‌గా ఉన్న రైసుమిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్ ఇచ్చిన మిలర్లకు తరలించడమా... లేక ఈ సీఎంఆర్ బకాయి రాబట్టుకుని అదనంగా జమానత్‌లు తీసుకుని వారికే ఇవ్వడమా... అన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు. పెండింగ్‌లో గత రబీ, ఖరీఫ్ సీఎంఆర్ బియ్యం లక్ష్యానికి దూరంగా చాలామంది రైసుమిల్లర్లు గడువు పెంచినా కదలని సీఎంఆర్ బకాయి ఊపందుకున్న రబీ ధాన్యం కొనుగోళ్లు డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇవ్వద్దని సర్కారు ఆదేశం.. ‘ప్రత్యామ్నాయం’పై కసరత్తు -
ఘనంగా మేడే
కోర్టు ఆదేశాలు బేఖాతర్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటాయి. రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది.– 8లోuములుగు/ ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా జెండాలను ఆవిష్కరించారు. కార్మికులు 8గంటల పని విధానాన్ని అమలు చేయాలని చేసిన పోరాటంతో మే 1న కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు పలువురు నాయకులు వివరించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. 44కార్మి క చట్టాలను నాలుగు కోడ్లకు కుదించి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. -
అంగన్వాడీలకు సెలవులు ప్రకటించడం హర్షణీయం
ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడం హర్షణీయమని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యానియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ అన్నారు. ఈ మేరకు గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సీతక్కను శాలువాలతో సన్మానించి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడం ఐసీడీఎస్ చరిత్రలో మొదటి సారి అని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలని, మినీ అంగన్వాడీ టీచర్లకు పెంచిన వేతనాలు చెల్లించాలన్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సునీత, మంగ, శశికళ, రాజేందర్, సమ్మక్క, పద్మారాణి, భాగ్యలక్ష్మి, సరిత, రుక్మిణి, జమున, తదితరులు పాల్గొన్నారు.కార్మిక చట్టాల ఫలాలు అందరికీ అందాలిభూపాలపల్లి అర్బన్: కార్మిక చట్టాల ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే మేడే లక్ష్యం నెరవేరినట్లని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్, కాకతీయ హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మేడే ఉత్సవాల్లో జడ్జి పాల్గొని మాట్లాడారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత పెన్షన్ చాలా ముఖ్యమైనవన్నారు. ఈ ఫలాలు అందరికీ అందాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు, న్యాయవాదులు ప్రియాంక, కార్మిక సంఘాల నాయకులు సాయిలు, రమేష్, మహేందర్, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.ప్రధాన అర్చకుడి ఉద్యోగ విరమణకాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ ఽబుధవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన దేవస్థానంలో పలు హోదాల్లో అర్చక వృత్తిలో కొనసాగారు. గురువారం ఉద్యోగ విరమణ పొందిన దంపతులను ఈఓ శనిగెల మహేష్, అర్చక బృందం,సిబ్బంది, పలువురు నాయకులు సన్మానించారు.సద్వినియోగం చేసుకోవాలిమొగుళ్లపల్లి: వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు అన్నారు. మండలంలోని వేములపల్లి గ్రామంలో గురువారం కబడ్డీ కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని క్రీడలలో మెళకువలు నేర్చుకోవాలని కోరారు. ఈ శిక్షణ శిబిరాలు జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోచ్ మహేశ్, కేల్ ఇండియా కోచ్ శ్రీనివాస్, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్పలిమెల: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు గురువారం ముగిశాయి. క్రీడల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, మహారాష్ట్ర గచ్చిరోలి క్రీడాకారులతో పాటు, ములుగు, భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్ జట్టు మొదటి విజేతగా నిలిచింది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా.. భూపాలపల్లి జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా గుమ్మలకొండ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. -
కృషితో ఫలితం
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలివిద్యార్ధులను అభినందిస్తున్న మంత్రి సీతక్క పక్కన కలెక్టర్ దివాకరములుగు: మనం చేసే కృషితోనే ఏదైనా సాధించవచ్చు అనేది జిల్లా విద్యార్థులు నిరూపించారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రం స్థాయిలో జిల్లా 13వ స్థానంలో నిలవగా ఈ సారి 8వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా 9మండలాల్లో 3,134 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,060 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 97.64గా ఉత్తీర్ణత శాతం నమోదయింది. సెప్టెంబర్ నుంచి ప్రత్యేక ప్రణాళిక మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర చొరవతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణ చేపట్టారు. రోజువారీగా లీజర్ క్లాసుల్లో సబ్జెక్టుల వారీగా రివిజన్ తీసుకొని విద్యార్థుల ప్రతిభను గుర్తించారు. పాఠశాల వారీగా విద్యార్థులను ఏ, బీ, సీ కేటగిరీలుగా గుర్తించారు. సీ కేటగిరిలో 200మంది విద్యార్థులు ఉన్నట్లుగా గమనించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. మొదట వీరికి బిట్స్, చిన్న చిన్న ప్రశ్నలు వంటి వాటిపై పరీక్ష నిర్వహించి వారిలో ఉన్న చురుకుదనాన్ని గమనించారు. దీంతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, తహసీల్దార్ ఎంఈఓలు నిత్యం పర్యవేక్షణ చేస్తూ వచ్చారు. విద్యార్థుల మనోగతాన్ని తీసుకొని వారి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ చూపారు. సైన్స్, గణితంలో ఫెయిల్ సి కేటగిరిలోని 200 మందిని గుర్తించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 40 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా వారిలో కొంతమేర ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు మరింతగా ప్రోత్సహించారు. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా 74మంది ఫెయిలయ్యారు. ఇందులో ఎక్కువ శాతం సైన్స్‌లో 39 మంది, గణితంలో 30 మంది, తెలుగులో 10 మంది, సాంఘిక శాస్త్రంలో ఇద్దరు, ఇంగ్లిషులో ఒకరు ఫెయిలయ్యారు. ముఖ్యంగా గణితం సబ్జెక్టు పరీక్ష పేపర్ తప్పుగా వచ్చిందని విద్యార్థులు ఉపాధ్యాయులకు చెబుతున్నారు. ఫెయిల్ అయిన వారిని పాఠశాలకు రప్పించుకొని సప్లమెంటరీ పరీక్షల ద్వారా మరింత ఉత్తమ ఫలితాలు రాబట్టేలా విద్యాశాఖ తరఫున కసరత్తు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 8వ స్థానంలో నిలవడం సంతోషకరం రాష్ట్ర స్థాయిలో జిల్లా గతేడాది 95.65శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. ఈసారి 97.64శాతంతో 8వ స్థానంలో నిలవడం సంతోషకరం. ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రోత్సహించి సప్లమెంటరీలో పాస్ అయ్యేలా ప్రణాళిక రూపొందించాం. ఈ విషయాన్ని ఎంఈఓలు, హెచ్ఎంలకు ఉపాధ్యాయులకు తెలియజేస్తాం. – పాణిని, డీఈఓన్యూస్రీల్గతేడాది కంటే ‘పది’లో మెరుగైన ఫలితాలు రాష్ట్రంలో జిల్లాకు 8వ స్థానం అత్యధికంగా సైన్స్‌లో 39, గణితంలో 30మంది విద్యార్థులు ఫెయిల్ -
కులగణనను కేంద్రం ఆమోదించడం సంతోషం
● డీసీసీ అధ్యక్షుడు అశోక్ ములుగు: రాహుల్‌గాంధీ సూచనల మేరకు కేంద్రం ప్రభుత్వం కులగణనను దేశ వ్యాప్తంగా అమలు చేయడాన్ని ఆమోదించడం సంతోషకరమని డీసీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణను తొలిసారిగా అమలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ఇది ముమ్మాటికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విజయమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, ఇర్సవడ్ల వెంకన్న, బీసీ సెల్ అధ్యక్షుడు రవియాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ఖాన్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు మావిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
వెంకటాపురం(కె)/వాజేడు: కేంద్ర, రారష్ట్‌ర ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలుపుదల చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తాటి నాగరాజు అన్నారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో హెలికాప్టర్లతో బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కర్రిగుట్టను నిలుపుదల చేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం బోదెబోయిన సురేశ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు ఉయిక శంకర్ మాట్లాడుతూ కర్రిగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గుట్టల్లోని ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత పేరుతో కూంబింగ్ కొనసాగిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో కట్టం నర్సింహరావు, చిక్కుడు రజనీకుమార్, ఉయిక జగన్, మడప పగిడయ్య, పీర్ల మల్లిఖార్జునరావు, శ్యామల వెంకటేశ్వర్లు, బొగ్గుల సమ్మయ్య, కణితి శేషు, సోడి సారయ్య, శ్యామల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తీరని నష్టం
ఈ ఫొటోలోని రైతు పేరు అలుగం సమ్మయ్య. చల్వాయి గ్రామం. గౌరారం శివారులోని 5 ఎకరాల్లో 962 వరంగల్ వరి రకం పంట సాగు చేశాడు. బుధవారం రాత్రి 9గంటలకు వచ్చిన గాలివాన బీభత్సానికి పంట మొత్తం నేలవాలింది. దీంతో పంటసాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని పొలంలో కూర్చోని కన్నీటి పర్యంతం అయ్యాడు.● కోతకొచ్చిన సుమారు 500 ఎకరాల్లో నేలవాలిన వరి ● కన్నీటిపర్యంతం అవుతున్న అన్నదాతలు ● ఆదుకోవాలని వేడుకోలుములుగు/గోవిందరావుపేట: అకాల వర్షాలతో అన్నదాతలు అష్టకష్టాల పాలవుతున్నారు. జిల్లాలో బుధవారం రాత్రి వచ్చిన గాలి దుమారం, కురిసిన అకాల వర్షానికి కోతకొచ్చిన వరి పంట నేలవాలింది. పలుచోట్ల ధాన్యం గింజలు రాలిపోయాయి. ధాన్యం రాశులు తడిసిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కల్లాల్లో తడిసిన ధాన్యం ములుగులో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 9:30గంటల వరకు గాలివాన బీభత్సానికి ధాన్యం రాశులపై పరదాలు కొట్టుకపోయాయి. పలుచోట్ల టార్పాలిన్ కవర్లు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం ధాన్యం ఆరుతుందని కప్పిన పరదాలను తొలగించిన రైతులు చదును క్రమంలో మళ్లీ ఒక్కసారిగా కురిసిన వర్షంతో పూర్తిగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా అవస్థలు పడుతూ కనిపించారు. స్పందించిన మంత్రి సీతక్క రైతులు అధైర్యపడకూడదని శుక్రవారం నుంచి హన్మకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మిల్లులకు ధాన్యం తరలిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ములుగు మండలంలో 26.4ఎంఎం, వెంకటాపురం(ఎం) మండలంలో22.8 ఎంఎం, ఎస్ఎస్ తాడ్వాయిలో 9.6 ఎంఎం, గోవిందరావుపేటలో 9.2, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే భారీ గాలి దుమారానికి ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో బుధవారం రాత్రి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం కొన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా చేసిన అధికారులు 10గంటల తర్వాత మళ్లీ కోత విధించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. రాత్రి 7:50గంటలకు ములుగు పట్టణంలోని అన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా చేశారు. సుమారు 500ఎకరాల్లో నేలవాలిన వరి గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి, గోవిందరావుపేట, పస్రా, దుంపెల్లిగూడెం, లక్ష్మీపురం, కర్లపల్లి, మొద్దులగూడెం గ్రామాల్లో 20రోజుల నుంచి 5, 6రోజులకొకసారి కురుస్తున్న అకాల వర్షాలకు వరిధాన్యం రాలిపోయి మొలకెత్తుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలు కొన్ని చోట్ల కోసినా అవి కాస్త కాంటాలు కాక వివిధ రకాల కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై పట్టాలు కప్పి కాపాడుకుంటున్నారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మండల వ్యాప్తంగా సుమారుగా 500ఎకరాల్లో వరి పంట నేలవాలింది. అకాల వర్షాలు ఇలాగే కురిస్తే ధాన్యం రాలిపోయి మొలకలు వచ్చే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చేతికొచ్చిన పంట నష్టపోయాం.. ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట అకాల వర్షానికి పంట దెబ్బతింది. మా గోస ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. కౌలుకు తీసుకుని పంట సాగు చేశాను. చేతికి అందివచ్చి న పంట నేలవాలిపోయింది. దాన్ని ఎలా కోయించాలో అర్ధం కావడం లేదు. – సూరపనేని నాని, రైతు, చల్వాయి70శాతం ధాన్యం నేలరాలింది.. ఆరుగాలం కష్టపడి 6 ఎకరాల్లో వరి పంట పండించాను. 24గంటలు పంటను రక్షించుకున్నాను. అకాల వర్షాలు గాలిదుమారానికి రేపు కోయాల్సిన వరి ధాన్యం 70శాతం నేలరాలింది. దీంతో తీవ్రంగా పంట నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే ఆత్మహత్యనే శరణ్యం. – కొన్నె అశోక్, రైతు, చల్వాయి -
కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడ?
ములుగు, సాక్షి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రె గుట్టలను భద్రతా బలగాలు పూర్తిగా స్వాధీనపర్చుకున్నాయి. మావోయిస్టుల కోసం అన్నివైపులా నుంచి గాలింపు కొనసాగిస్తున్నాయి. వేల సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో.. ఆపరేషన్ కగార్‌లో భాగంగా పది రోజులుగా సాయుధ బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కర్రెగుట్టలలో 20వేల మంది సాయుధ బలగాలు అన్ని వైపుల నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో కర్రెగుట్టలో పై భాగంలో బేస్ క్యాంపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్యాంప్‌లో 10 వేల మంది సిబ్బంది భాగం అవుతారని సమాచారం. ఇప్పటికే ఈ క్యాంపు సమీపంలో భారీ సెల్ టవర్స్ నెలకొల్పారు. అలాగే.. బేస్ క్యాంపు వద్దకు డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ చేరుకోగా.. భారీగా ఆయుధాలలను తరలించారు. కర్రేగుట్టలోని దోబి కొండ నీలం సారాయి కొండలను పూర్తిగా సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ పది రోజుల్లో మావోయిస్టుల జాడ లభ్యం కాకపోవడం గమనార్హం. ఒకవైపు కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయి ఉంటారని ఏజెన్సీలో ప్రచారం భారీ ఎత్తున జరుగుతోంది. మరోవైపు భద్రతా బలగాలు మాత్రం మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను బలగాలు గుర్తించాయి. దీంతో భూగర్భంలో రహస్య స్థావరాలలో దాక్కుని ఉంటారని భావిస్తున్నాయి. అందుకు నిటారుగా ఉన్న కర్రెగుట్టలే కారణమని చెబుతున్నాయి. ఈ క్రమంలో.. మావోయిస్టులు స్థావరాల నుండి బయటకి వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నాయి. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
● వీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ములుగు: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా తరఫున కలెక్టర్ టీఎస్.దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. తాలు, తరుగు పేరుతో ఎలాంటి కోతలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పరిధిలో అత్యధికంగా రైస్ మిల్లులు మిల్లింగ్ చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీసీఓ సర్దార్‌సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైతులు ఆందోళన చెందొద్దు
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్‌లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో హనుమకొండ జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని పంపాలని అధికారులను ఆదేశించా రు. యాసంగి సీజన్లో జిల్లా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులను నిలిపి వేయాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీసీఓ సర్ధార్‌సింగ్ పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ ఉద్యోగులకు సహజం
ములుగు: ఉద్యోగ విరమణ ప్రతీ ఉద్యోగికి సహజం అని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై లక్ష్మారెడ్డి, పీసీఆర్ ఏఎస్సై రవీందర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఖాజామోయినుద్దీన్, ఏటూరునాగారం హెడ్ కానిస్టేబుల్ రామారావులు సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో నలుగురిని శాలువాలతో సన్మానించిన ఎస్పీ వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని తెలిపారు. ఇప్పటికై నా కుటుంబంతో ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నలువాల రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఐ వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి కృషి ములుగు: మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సాధు అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన జనరల్‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాధ్యమైనంత వరకు నూతన సొసైటీలను ఏర్పాటు చేయడంతో పాటు సభ్యులకు సభ్యత్వాలు ఇప్పిస్తానని తెలిపారు. సహకార సంఘాలకు నూతన భవనాల మంజూరుకు పాటు పడుతానని వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణించిన సభ్యుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించేలా చూస్తానని తెలిపారు. వచ్చే సీజన్లో సాధ్యమైనంత వరకు జులై, ఆగస్టు మాసాల్లో చేపపిల్లలను వదిలేలా తన వంతుగా చర్యలు తీసుకుంటానని వివరించారు. ఈదురు గాలులు.. భారీ వర్షం ములుగు: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి తడిసిపోయింది. కొంత మంది రైతులు అందుబాటులో ఉండి టార్పాలిన్లు కప్పి ఉంచగా మిగతా రైతులు అచేతనంగా ఉండి పోయారు. తెల్లారితే గాని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, కోతకు సిద్ధంగా ఉన్న వరి పరిస్థితులు తెలిసే అవకాశం ఉంది. -
ఆపరేషన్ కగార్ సక్సెస్.. కర్రెగుట్టలపై జాతీయ జెండా
ములుగు, సాక్షి: తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఆపరేషన్ కగార్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. కర్రెగుట్టలపై మొత్తానికి పట్టు సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి. అంతేకాదు.. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా 10 వేలకు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రెలగుట్టను చుట్టుముట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో కూంబింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించిన సంగతీ తెలిసిందే.డీఆర్జీ బస్తర్ ఫైటర్, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాయ్‌పూర్ నుంచి ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఐబీ చీఫ్ ఇవాళ నేరుగా కర్రెలగుట్టకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఆపరేషన్‌లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి.. అక్కడికి కొత్త టీంను మోహరింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో సీఆర్పీఎఫ్ అక్కడ బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్‌లకు ఉపయోగపడేలా ఈ బేస్ ఉండనున్నట్లు సమాచారం. -
అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి
ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1నుంచి 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్‌కు విన్నవించగా ప్రభుత్వం వేసవి సెలవులు ఇవ్వడానికి పరిశీలన చేస్తుందన్నారు. పోషన్ పక్వాడలో మంత్రి సీతక్కకు వేసవి సెలవులు ఇవ్వాలని వినతి అందించగా సెలవులు ఇస్తామని హామీనిచ్చి అమలు చేయలేదన్నారు. పాత పద్ధతిలో 15 రోజలు టీచర్, 15 రోజులు ఆయాలు విధులు నిర్వహించేలా సర్క్యూలర్ జారీ చేశారని వివరించారు. ఎండల తీవ్రత కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు, గర్భిణులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. అనంతరం మంత్రి సీతక్కతో యూనియన్ నాయకులు ఫోన్లో మాట్లాడారు. వేసవి సెలవుల విషయంలో యూనియన్ నాయకులు చర్చలకు రావాలని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, అంగన్వాడీలు సమ్మక్క, సరిత, జమునారాణి, ధనలక్ష్మీ, అరుంధతి, పార్వతీ, సూరమ్మ పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా -
ఒక్కసారి ఫెయిలైతే జీవితమే అయిపోయినట్టు కాదు
● దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్‌తో ముందుకెళ్లొచ్చు ● పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు ● ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్ ● పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు సాక్షి, వరంగల్: చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు...జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పేమీ కాదు...అందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఫెయిల్ అవుతారు...కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు...జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, ఆవేశమే. ఇవి సాధిస్తామన్న ఆశను చంపకూడదు. వారం క్రితం వెల్ల డైన ఇంటర్ ఫలితాల్లో తప్పిన కొందరు విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకున్నా దరిమిలా...పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడవుతున్న నేపథ్యంలో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఓ స్నేహితునిలా...గురువులా మెదిలి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. భవిష్యత్‌పై భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయం విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు 42,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల సమయంలో ర్యాంక్‌లు రాలేదని కొందరు...మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు...ఫెయిల్ అయ్యామని మరికొందరు మానసిక ఒత్తిడికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కంటే కూడా వారి ఫలితాలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఈ తరహా ఘటనలకు అవకాశం ఇస్తోంది. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించొద్దని సూచిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చ డం వల్ల పిల్లల మానసిక వ్యథకులోనై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అంటున్నారు. -
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
మీరు (పరీక్షల్లోనైనా, ఇతర అంశాల్లో అయినా) విఫలమైతే, ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వైఫల్యం అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని అర్థం. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం. అది మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది. – ఏపీజే అబ్దుల్ కలాంఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్‌కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు. ●న్యూస్‌రీల్ -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలలు వీచే అవకాశం ఉంది.ఉల్లాస్, న్యూఇండియా లిట్రసీ అమలుచేయాలి ● కలెక్టర్ దివాకర ములుగు: ఉల్లాస్, న్యూ ఇండియా లిట్రసీ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారి వివరాలను సేకరించి విద్యాశాఖకు అందించాలని సూచించారు. స్వచ్ఛందంగా వలంటీర్లను ఏర్పాటు చేసుకొని షెడ్యూల్ ప్రకారం అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఈఓ పాణిని, వైద్యశాఖ అధికారి గోపాల్‌రావు, డీడబ్ల్యూఓ శిరీష, డీపీఓ ఒంటేరు దేవరాజ్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి చంద్రకళ, అడల్ట్ ఎడ్యూకేషన్ నోడల్ అధికారి వేణుగోపాల్, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా బాధ్యులు అప్పని జయదేవ్, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. దర్యాప్తును ముమ్మరం చేయాలి ములుగు: దొంగతనాలు, ఆర్థిక నేరాలపై నమోదయ్యే కేసుల వివరాలను సేకరించి దర్యాప్తును ముమ్మరం చేయాలని పోగొట్టుకున్న నగదు, వస్తువులను బాధితులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు శాఖ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి తగిన విధంగా వివరాలను సేకరించి సమర్పించాలన్నారు. వేసవి కాలంలో ఉద్యోగులు, సామాన్య ప్రజలు సెలవులపై బయటికి వెళ్లే సమయంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలపై వీలైనంత వరకు సమాచారం సేకరించాలని ఆదేశించారు. యువత, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, ఎస్బీ సీఐ శంకర్, సీఐలు శ్రీనివాస్, కుమార్, రవీందర్, ఎస్సైలు సతీశ్, కమలాకర్, శ్రీకాంత్‌రెడ్డి, తాజుద్దీన్, టీవీఆర్ సూరి, రాజ్‌కుమార్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
త్వరలోనే కీమో, రేడియోథెరపీ వైద్యసేవలు
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు త్వరలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు కానున్న క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా బాధితులకు వైద్యం అందించడానికి కీమో, రేడియోథెరపీ సేవలు అందుబాటులోకి రానున్నాయని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్‌లో పీహెచ్సీ వైద్యులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎంఎల్‌హెచ్‌పీలు, ఆర్బీఎస్కే వైద్యులు, సూపర్వైజర్లతో అసంక్రమిత వ్యాధులపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోపాల్‌రావు మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా లక్షణాలు బయటపడకుండా మరణాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. మే 1నుంచి వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ వరకు నాలుగవ విడత స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. గ్రామ స్థాయిలో అంగన్ వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీలు భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలోని సబ్‌సెంటర్ల ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలపత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ పరిశీలకుడు సత్యేంద్రనాథ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్స్ రణధీర్, పవన్‌కుమార్, చంద్రకాంత్, డెమో సంపత్, ఎన్సీడీ కోఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం/మంగపేట: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మంగపేట మండల పరిధిలోని కోమటిపల్లి, గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పాఠశాల భవనాలకు పేయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. పరిశుభ్రత, విద్యుత్ సమస్యలు, డార్మెంటరీ మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తొండ్యాల, లక్ష్మీపూర్, వాగొడ్డుగూడెం, రమణక్కపేట గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను పరిశీలించి నాణ్యతతో చేపట్టాలని, సైడ్ బర్మ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రశాంత్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ రాము, ఎన్హెచ్ఎం హెల్త్ ప్రాజెక్ట్ మేనేజర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
‘సీతక్కను విమర్శించే స్థాయి నాగజ్యోతికి లేదు’
గోవిందరావుపేట: రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతికి లేదని కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బడే నాగజ్యోతి కావాలనే మంత్రి సీతక్కను విమర్శిస్తుందని తెలిపారు. అలా విమర్శలు చేస్తే పెద్ద నాయకురాలిగా గుర్తింపు వస్తుందనే భ్రమలో ఉందని విమర్శించారు. అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నాగజ్యోతికి రాజకీయ భిక్ష పెట్టింది సీతక్కనే అని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఐదేళ్లు జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్, చైర్పర్సన్ పదవుల్లో ఉండి జిల్లాలో ఏమి అభివృద్ధి పనులు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీతక్క గురించి మాట్లాడే అర్హత నాగజ్యోతికి లేదని, ఇంకోసారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా నాయకురాలు సూదిరెడ్డి జయమ్మ, గుండెబోయిన నాగలక్ష్మీ, చొప్పదండి వసంత, తోకల అహల్య, ల్యాగల అనిత, గురుకు మేరీల, గోపిదాసు వజ్రమ్మ, మిరియాల సోమలక్ష్మీ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ‘వజ్ర’తో అడవుల పరిరక్షణ ఏటూరునాగారం: జిల్లాలోని అడవులు, వన్యప్రాణి ప్రాంతాల్లో వజ్ర వాహనంతో పరిరక్షణ, పర్యవేక్షణ చేయనున్నట్లు సీసీఎఫ్ ప్రభాకర్ తెలిపారు. మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారి అటవీశాఖ సౌత్ రేంజ్‌పరిధిలో వజ్ర వాహనాన్ని ఆయన మంగళవారం జెండా ఊపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వాహనానికి వజ్రగా పేరు నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనం నేషనల్ హైవేపై గస్తీ తిరుగుతూ అటవీ పరిరక్షణకు పాటు పడుతుందన్నారు. ఎవరైనా అటవీ సంరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చిన్న నేరాలకు అప్పటికప్పుడు రూ.25వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. పెద్ద నేరాలకు కేసు నమోదైతే 14ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. వన్యప్రాణాలు, అడవులను రక్షించుకోవడం ప్రతీఒక్కరి బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీఓ రమేష్, ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్, సౌత్ రేంజ్ ఎస్ఎఫ్ఓలు, ఎఫ్‌బీఓలు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. కంటిచూపు ముఖ్యం వాజేడు: ప్రతీఒక్కరికి కంటి చూపు ముఖ్యమని ఆర్బీఎస్కే వైద్యాధికారి నవీన్, ఆప్తాల్మిక్ తిరుపతిరావు అన్నారు. మండల పరిధిలోని చండ్రుపట్లలో మంగళవారం ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు సూచన మేరకు కంటివైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా 55మందికి పరీక్షలను చేశారు. రోగులకు దగ్గర, దూరపు చూపు మందగించినట్లు గుర్తించి అందుకు తగ్గ సూచనలను చేశారు. కంటి లోపల కేటరాక్ట్ ఉందా లేదా అని పరీక్షించారు. ఇతర సమస్యలను పరీక్షించి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే ఏఎన్ఎం విజయ, ఆరోగ్య కార్యకర్త తిరుపతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ వెంకటాపురం(కె): మండల పరిధిలోని సూరవీడు సమీపంలోని మిర్చి తోటల్లో పనిచేస్తున్న కూలీలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బంది కూలీలకు వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆరోగ్య మహిళ కేంద్రంలో 84 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వారిలో 21 మంది మహిళల వద్ద రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ములుగు ఏరియా వైద్య శాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్నేహరెడ్డి, పవన్, వినయ్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ జాబితా క్రాస్ చెక్
ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. ఎంపిక చేసిన జాబితాను మళ్లీ క్రాస్ చెక్ చేస్తున్నారు.మనకెప్పుడు క్రికెట్ ‘వైభవం’.. చిన్న వయస్సులోనే వైభవ్ ఐపీఎల్ సెంచరీ కొట్టడంతో డీఎస్‌ఏలో శిక్షణ పొందుతున్న పలువురు యువ క్రికెటర్లను ‘సాక్షి’ పలకరించింది.– IIలోuరిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్‌గా తీసుకోవాలి... పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్‌గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి. – డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు -
దాతలిచ్చిన భూమి మాకే కేటాయించాలి..
గతంలో సాధన హైస్కూల్ సమీపంలో గట్టంపల్లి గ్రామం ఉండేది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంతో బూడిదయ్యింది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రేమ్‌నగర్‌లోని 1076, 1078 సర్వే నంబర్లలో దాతలు ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 5గుంటల చొప్పున కేటాయించింది. మాతాతలు ఇళ్లుకట్టుకున్నారు. తదనంతరం కూలిపోవడంతో మాతో పాటు మరో ఐదు కుటుంబాలకు చెందిన దళితులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. ఆ ప్రదేశంలో ప్రస్తుతం రామ చంద్రారెడ్డి అనే వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి ఇళ్లు లేకపోయినా తన కుమారుల పేరుమీద ఇళ్లు ఉన్నట్లుగా సృష్టించుకున్నారు. ఇది తమ భూమి అని చెప్పినా పట్టించుకోవడం లేదు. గ్రామస్తులను విచారిస్తే స్థలం తమదేనని చెప్తారు. గ్రామ పంచాయతీని ఆశ్రయిస్తే ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని నిరుపేద దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి. – కాకి సతీష్, ప్రేమ్‌నగర్, ములుగు -
గిరిజన దర్బార్‌లో వినతులు ఇలా..
ఏజెన్సీలో గిరిజన సొసైటీలను ఏర్పాటు చేయాలని, వలలు, తెప్పలు గిరిజన మత్స్యకారులకు అందజేయాలని నాయకులు సిద్ధబోయిన సురేందర్, ఆలం భాస్కర్ విన్నవించారు. ఏజెన్సీలోనిసొసైటీలకు బడ్జెట్ కేటాయించాలన్నారు. గిరిజన మత్స్యకారులకు చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని, చేపలపెంపకం కోసం ఐటీడీఏ ద్వారా ఐదు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. మంగపేట మండలం రమణక్కపేటలో పడిగ సంధ్య తన భర్త శ్రీకాంత్ పేరు మీద ఉన్న పట్టా భూమిని వేరేవాళ్ల మీదకు మార్చుకొని భూమిని లాక్కున్నారని తెలిపారు. గంగారం మండలం దుబ్బగూడెంకు చెందిన ప్రశాంత్, ఇతరుల ఎంఎస్ఎంఈ అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘మంత్రుల మతి భ్రమించింది’
ములుగు: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వచ్చిన జనం, పార్టీ అధినేత ప్రసంగం చూసి రాష్ట్ర మంత్రుల మతి భ్రమించిందని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్మ రమేష్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగంలో పసలేనప్పుడు ఉలికిపాటు ఎందుకని మంత్రి సీతక్కను ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. మంత్రి సీతక్క ఎలాంటి అభివృద్ధి చేశారో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. పెద్దపెద్ద కాన్వాయ్‌లో తిరిగితే మహిళల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు రాసమల్ల సురేందర్, మాజీ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, గొర్రె సమ్మయ్య, బైకాని సాగర్, మెరుగు సంతోష్, విజయ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలి
ములుగు: మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని అదివాసీ, గిరిజన, దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో రాయల్ప్లాజాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మావోయిస్టు పార్టీలతో వెంటనే శాంతి చర్చలు జరపాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లోని కర్రిగుట్టలపై మావోయిస్టులు ఉన్నారనే నెపంతో సాయుధబలగాలు బాంబులతో దాడి చేయడం వెంటనే మానుకోవాలని కోరారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాల చర్యల కారణంగా నిరాయుధులైన ఆదివాసీ గిరిజన మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా ప్రజలు భయానక జీవితాన్ని గడుపుతున్నారన్నారు. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన సంఘటనపై యావత్ ప్రపంచం స్పందించిన సమయంలో కర్రిగుట్టల విధ్వంసాన్ని కేంద్రం నేరుగా చేపట్టడాన్ని ప్రతిఒక్కరూ ప్రశ్నించాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను వెనక్కి రప్పించుకుని మావోయిస్టులతో శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు రేపు ములుగు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు మెమోరాండం అందించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తుండుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, గోర్సభ జాతీయ అధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్, సోమ రాంమూర్తి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య, గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ కిషన్, గోర్ సభ రాష్ట్ర అధ్యక్షుడు మంగిలాల్, ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, మేడారం ట్రస్టుబోర్డు తాత్కాలిక చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీలతో శాంతి చర్చలు జరపాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
కర్రిగుట్టల్లో కొనసాగుతున్న కూంబింగ్
వెంకటాపురం(కె): తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో కేంద్ర బలగాలు చేపడుతున్న కూంబింగ్ సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా దట్టమైన కర్రిగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించడంతో పాటు ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేస్తూ ముందుకుసాగుతున్నాయి. మావోయిస్టుల స్థావరాలను కనుగొనే క్రమంలో ఒక్కో అడుగును జాగ్రత్తగా ముందుకు వేస్తున్నాయి. అయితే ప్రతిరోజూ తుపాకుల మోతలు, బాంబుల చప్పుళ్లు వస్తున్నాయనే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
అర్హుల ఎంపిక త్వరగా పూర్తిచేయాలి
ములుగు: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం మండల స్థాయి వెరిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ మండలంలో నలుగురు అధికారులను నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు సమర్పించిన వివరాలు రాష్ట్రస్థాయిలో పరిశీలనలో ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని తెలిపారు. అయితే లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే రిమార్క్స్ కాలంలో నమోదు చేయాలని సూచించారు. గడువులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యంత నిరుపేదలు, అసలు ఇళ్లులేని వారిని అర్హులుగా ఎంపిక చేయాలని తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మూడు కేటగిరిల్లో విభజించినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఎల్ 1 కేటగిరిలో ఇంటి స్థలం ఉన్న వారిని, ఎల్ 2 కేటగిరిలో ఇంటి స్థలం, ఇల్లులేని వారిని, ఎల్ 3 కేటగిరిలో అర్హతలు లేని వారిని గుర్తించాలన్నారు. వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత గ్రామ పంచాయతీల్లో అర్హుల జాబితాను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, ఏపీడీ వెంకటనారాయణ, ఈడీఎం దేవేందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
రేషన్ డీలర్‌పై చర్య తీసుకోవాలి..
గ్రామంలోని షాపు నంబర్–9 డీలర్ నిరుపేదల నుంచి బియ్యం కొనుగోలు చేసి ప్రైవేటుగా అమ్ముకుంటున్నాడు. గతంలో ఫిర్యాదు చేస్తే పోలీసులను ఆశ్రయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశారు. తిరిగి విధుల్లోకి చేరాడు. కానీ ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో పాటు దివ్యాంగుడినైన తనకు ఇందిరమ్మ ఇంటిని కేటాయించాలని అధికారులను వేడుకున్నా.. అయినా స్పందించలేదు. ఎంపీడీఓను కలిస్తే కాంగ్రెస్ నాయకులను కలవమని చెబుతున్నారు. – లెంకలపల్లి కుమారస్వామి, దుంపెల్లిగూడెం, గోవిందరావుపేట -
ప్రభుత్వానికి రా రైస్ ఇవ్వలేం..
యాసంగి వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రా రైస్ ఇవ్వలేం అని జిల్లాలోని 40 మంది రైస్ మిల్లర్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. యాసంగిలో వచ్చే ధాన్యంతో బాయిల్డ్ బియ్యం మాత్రమే వస్తాయని ఈ విషయాన్ని సివిల్ సప్లయీస్ అధికారులకు చెప్పామని తెలిపారు. అధికారుల ఒత్తిడికి లోనై ధాన్యం దించుకుంటే మిల్లర్లు పూర్తిగా దివాళాతీసే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. గతంలో సైతం ప్రభుత్వానికి బాయిల్డ్ రైస్ మాత్రమే ఇచ్చేవాళ్లమని వివరించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రైస్ మిల్లర్లను ఆదుకోవాలని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి సహోదర్‌రెడ్డి, ఎలగందుల మోహన్, కొమురవెల్లి హరినాథ్, సుదర్శన్‌రెడ్డి, అక్కల రఘోత్తం, భద్రయ్య, వినయ్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. – రైస్ మిల్లర్లుకలెక్టర్ దివాకరకు వినతిపత్రం ఇస్తున్న రైస్‌మిల్లర్లు -
ఎస్జీఎఫ్ జాతీయస్థాయి బాక్సింగ్ కోచ్‌గా రమేశ్
వెంకటాపురం(ఎం): స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ (ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే బాక్సింగ్ టీంకు కోచ్‌గా మండల కేంద్రానికి చెందిన మామిడిపెల్లి రమేశ్ ఎంపికయ్యారు. ఈనెల 30నుంచి మే 5 వరకు ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో నిర్వహించబోయే 68వ ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే అండర్–19 బాలికల బాక్సింగ్ జట్టుకు కోచ్‌గా రమేశ్ వ్యవహరించనున్నారు. తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం ఏటూరునాగారం: ఈ నెల 26, 27వ తేదీల్లో హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఇండియా, నేపాల్ దేశాల మొదటి అంతర్జాతీయ తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల గిరిజన ఉపాధ్యాయుడు మైపతి సంతోష్ పాల్గొని కాంస్య పతకాన్ని సాధించినట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ మాస్టర్ పాయం నేశంత్ తెలిపారు. 61కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకం సాధించడం అభినందనీయన్నారు. సివిల్ కోర్టులో చలివేంద్రం ప్రారంభం భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్‌చారి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో కోర్టుకు వచ్చే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్‌చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రవణరావు, రాజ్ కుమార్, రాకేష్, అనిల్ పాల్గొన్నారు. సీసీఎస్ కానిస్టేబుల్ రాజుకు రివార్డు భూపాలపల్లి అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ఉప్పుల రాజు డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు రాజు చేసిన కృషికి రివార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజును డీజీపీ సన్మానించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా రాజును ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు. సివిల్స్ ర్యాంకర్‌కు సన్మానం భూపాలపల్లి అర్బన్: వారం రోజుల క్రితం విడుదల అయిన సివిల్స్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి 85వ ర్యాంకు సాధించిన బానోతు జితేంద్ర నాయక్‌ను సింగరేణి సీఎండీ బలరాం సన్మానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో జితేంద్ర నాయక్‌ను సీఎండీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారితల్లిదండ్రులను అభినందించారు. టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలిభూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించి, పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయని ఆరోపించారు. -
కేయూలో విద్యార్థుల ఆందోళన
కేయూ హాస్టళ్లు, మెస్‌లను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేశారు. హన్మకొండ: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తరచూ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటివద్ద నుంచి పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొత్తగా వాట్సాప్ చాట్‌బాట్‌ను తీసుకువచ్చింది. దీనిద్వారా విద్యుత్ వినియోగదారులు వాట్సాప్ ద్వారా తమ సమస్యను సులువుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
బాలికలకు స్వీయ రక్షణ అవసరం
ఏటూరునాగారం: బాలికలకు స్వీయ రక్షణ ఎంతో అవసరమని కరాటే మాస్టర్ అబ్బు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల జూనియర్ కళాశాల రెసిడెన్షియల్లో అడ్వాన్స్ కరాటే సమ్మర్ క్యాంపు ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, జిల్లా కరాటే అధ్యక్షుడు సూర్య సహకారంతో ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకతాయిలు బాలికల వెంటపడితే ఎలా రక్షించుకోవాలని ముఖ్యంగా నేర్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ 30వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్యాంపునకు హాజరైన 75మంది బాలబాలికలకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, కరాటే మాస్టర్లు హుస్సేన్, అమీర్, బాలకృష్ణ, ఇరుప రవి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కరాటే మాస్టర్ అబ్బు నాలుగు రోజుల పాటు సమ్మర్ క్యాంపు -
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
ఆదివాసీలపై దాడులను నిలిపివేయాలి ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడు లను నిలిపివేయాలని సీపీఐఎంఎల్ నాయకుడు విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీచే అవకాశం ఉంది.అన్నదాతల అరిగోస గోవిందరావుపేటలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాల నుంచి రైతులు తేరుకోకముందే మళ్లీ కురుస్తున్న వర్షానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు.సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 9లోuప్రసంగిస్తున్న కేసీఆర్, అభివాదం చేస్తున్న కేసీఆర్ఎల్కతుర్తి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలుసాక్షిప్రతినిధి, వరంగల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్‌రోడ్‌లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది 6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్ఎస్పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు. వైఎస్సార్ పాలనను.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు. సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు.. పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరిన్ని సభా విశేషాలు కట్టిపడేసిన ఆటాపాట.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్‌కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. మృతులకు నివాళి అర్పించి.. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు. గులాబీ వనంగా మారిన ఎల్కతుర్తి రోడ్లపైనే కిలోమీటర్ల మేర వాహనాలు ఆపరేషన్ కగార్‌ను ఆపాలి, నక్సల్స్‌తో చర్చించాలి.. తీర్మానానికి సభ ఆమోదం అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ శ్రేణుల్లో జోష్..చప్పట్లు, కేరింతల నడుమ సాగిన కేసీఆర్ ప్రసంగం -
కొనసాగుతున్న కూంబింగ్
● కర్రిగుట్టలపై గుహ ఉన్నట్లు ప్రచారం వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో ఆరు రోజులుగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో మావోయిస్టుల ఆగ్రనేతలతో పాటు సుమారుగా వెయ్యిమంది ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఆదివారం 6వ రోజు కూంబింగ్‌లో భాగంగా గుట్టలపై వెయ్యి మంది నివాసం ఉండే విధంగా గుహ ఉందని అందులో నీటి సదుపాయంతో పాటు నిత్యావసర సరుకులు, ఆయుధాలు ఉన్నట్లు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లిన జవాన్లు గుర్తించారని, జవా న్ల రాకను గమనించి అక్కడ తలదాచుకున్న మావోయిస్టులు వేరే ప్రాంతానికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. నిరసన ర్యాలీ మంగపేట: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ మండల పరిధిలోని కమలాపురం జామియా మసీదు కమిటీ సభ్యులు ఆదివారం అంబేడ్కర్ సెంటర్ నుంచి జామా మసీదు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలని కోరారు. -
నిర్దేశిత కాలవ్యవధిలో చార్జిషీట్లు సమర్పించాలి
ములుగు: ప్రతీ కేసును క్షుణ్ణంగా విచారించి నిర్దేశిత కాలవ్యవధిలో న్యాయస్థానానికి చార్జిషీట్లు సమర్పించాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ న్యాయ సంబంధిత కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాక్షులను హాజరుపర్చడంపై బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సమన్వయంగా ఉంటూ కేసుల పరిష్కారాన్ని వేగంగా ముందుకుసాగేలా చూడాలని తెలిపారు. న్యాయస్థానాల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలన్నారు. ప్రతీ అధికారి తన విధులను నిబద్ధతతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. వారెంట్లను అమలు చేసి అనుమానితులను, నేరస్తులను సకాలంలో సురక్షితంగా న్యాయస్థానాలకు తరలించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చేయడమే పోలీసుల ప్రధా న బాధ్యత అన్నారు. ఈ సమీక్షలో డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, ఎస్సై జగదీశ్, ఐటీ సెల్ సిబ్బంది రాజేంద్రప్రసాద్, సంధ్య, లైజనింగ్ అధికారులు, ట్రైనీ ఎస్సైలు పాల్గొన్నారు. ‘పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలి’ ములుగు: ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ఎదుట నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వ పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గందె జగన్నాధం, బానోత్ దేవ్సింగ్లు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం నేడు కాలం వెళ్లదీస్తూ వస్తుందని పేర్కొన్నారు. పెండింగ్ డీఏ, డీఆర్‌లను ప్రకటించాలని, పీఆర్సీ, 2023 జులై నుంచి అందాల్సిన మానిటరి బెనిఫిట్స్ అందించాలని కోరారు. ఈహెచ్ఎస్, హెల్త్ కార్డులపై చికిత్స అందించాలని కోరారు. 2024 మార్చి తర్వాత పదవీవిరమణ పొందిన వారికి అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. ఎంజేపీ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు షురూ ఏటూరునాగారం: ములుగులోని మహాత్మాజ్యోతిరావుపూలే మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఆడ్మిషన్లు ప్రారంభం అయినట్లు కళాశాల ప్రిన్సి పాల్ చెన్న సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రస్తుతం కాజీపేట మండల పరిధిలోని సోమిడిలో కొనసాగుతుందని వివరించారు. మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థినులు మే 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 9491685294లో సంప్రదించాలని కోరారు. సర్వే పనుల అడ్డగింత మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో నేషనల్ హైవే రోడ్డు సర్వే పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోతున్న తమకు సరైన న్యాయం జరగకతేనే సర్వే పనులను ముందుకు సాగనివ్వమని రైతులు ఆర్డీఓ రవికి మొరపెట్టుకున్నారు. సర్వే పనులకు రైతులు సహకరించాలని ఆర్డీఓ కోరారు. మే మొదటివారంలో ట్రస్టుబోర్డు?కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ట్రస్టుబోర్డు (పాలక వర్గం) నియామకానికి మే మొదటి వారంలోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. మే 15నుంచి 26వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంతో ట్రస్టుబోర్డు నియా మకం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టుబోర్డు కోసం జనవరి 6న నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల వారు ఽట్రస్టుబోర్డు డైరెక్టర్ల కోసం 86కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ధృవీకరణ పత్రాలు, పోలీసు కేసులు, ఇతర వ్యవహారాలు, వివరాలు సరిగ్గా లేని వారిని స్క్రూటినీలో తీసివేశారు. అన్ని సరిగ్గా ఉన్న 41మందిలో నుంచి 14మందిని డైరెక్టర్ల కోసం మంత్రి శ్రీధర్‌బాబు ఎంపికచేసి దేవాదాయశాఖకు లేఖ పంపించనున్నట్లు సమాచారం. ట్రస్టుబోర్డులో ఎక్స్అఫీషియోతో 15మంది డైరెక్టర్లు కాగా అందులో ఒక్కరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆశావహులు మంత్రి శ్రీధర్‌బాబు ఇతర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ములుగు రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ స్థాయిలో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు క్రీడలు మానసికోల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుంది. ఈ క్రీడా శిక్షణ శిబిరాలను యువజన సర్వీసుల క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఈ శిబిరాలను వినియోగించుకుని ఆసక్తి కలిగిన క్రీడల్లో రాణించాలి. శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కసరత్తు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 10 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో చేరేందుకు ఎనిమిదేళ్ల నుంచి 14ఏళ్ల బాలబాలికలు అర్హులు. మే 1వ తేదీ నుంచి 31 వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. ఉదయం 6 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు శిక్షణ ఇస్తారు. శిబిరాల్లో సైక్లింగ్, ప్లోర్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, క్రికెట్, ఖో–ఖో, తైక్వాండో, వాలీబాల్, కరాటే, రెజ్లింగ్ తదితర వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కోచ్‌ల ఎంపిక పూర్తి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కలెక్టర్ ఆదేశాల మేరకు కోచ్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం యువజన సర్వీసుల క్రీడల శాఖకు రూ.1.05లక్షలు కేటాయించింది. ఇందులో కోచ్‌లకు రూ.40 వేలు, క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.50 వేలు, మైదానం అభివృద్ధికి, శిక్షణ శిబిరం నిర్వహణకు రూ.10 వేలు, క్రీడల సమయంలో ప్రమాదం జరగడం, చిన్న చిన్న గాయాలైన వెంటనే చికిత్స అందించేందుకు రూ.5 వేలను కేటాయించింది. శిబిరాల్లో కోచింగ్ ఇచ్చే వారికి నెలకు రూ. 4వేల గౌరవ వేతనం అందించనున్నారు. శిబిరం నిర్వహణకు వెయ్యి చెల్లిస్తారు. ములుగులో క్రికెట్, కబడ్డీ, ఏటూరునాగారంలో కబడ్డీ, మదనపల్లిలో సైక్లింగ్, జగ్గన్నపేటలో రెజ్లింగ్, యోగా, వాజేడులో వాలీబాల్, ఏటూరునాగారంలో హ్యాండ్‌బాల్, ఆకులవారి ఘణపూర్‌లో అథ్లెటిక్స్ శిబిరాలను కొనసాగిస్తారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ క్రీడలకు సంబంధించిన 10 శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌ల ఎంపిక పూర్తి చేశాం. మే 1నుంచి 31వరకు శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి కలిగిన 14ఏళ్ల లోపు బాలబాలికలు అర్హులు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 25 మందికి అవకాశం ఉంటుంది. – తుల రవి, జిల్లా యువజన సర్వీసుల క్రీడల అధికారి మే 1నుంచి 31వరకు నిర్వహణ జిల్లాలో 10 శిబిరాలు.. కోచ్‌ల ఎంపిక పూర్తి ఒక్కో శిబిరంలో 20నుంచి 25 మంది విద్యార్థులు -
‘భూభారతి’తోనే సమస్యలు పరిష్కారం
ఏటూరునాగారం: భూభారతి చట్టంతోనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై ప్రజలు, నాయకులు, రైతులకు శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంలో 14అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. దీంతో భూమితో ఉన్న సమస్యలు, తగాదాలు, గట్టు పంచాయతీలు కూడా తొలిగిపోతాయన్నారు. భూమి రిజిస్ట్రేషన్ ఇక నుంచి పారదర్శంగా ఉంటుందని వివరించారు. నిబంధనల ప్రకారమే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారని వివరించారు. అంతేకాకుండా భూమి పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు, మార్పులు చేర్పులు చేసే క్రమంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత రైతుల వివరాలను సేకరించడంతో పాటు ఇరుగు పొరుగు వారి స్టేట్మెంట్ సైతం తీసుకుంటారని వివరించారు. చట్టంలో కీలకమైనది అప్పీలు వ్యవస్థ అని, ఎవరైనా రైతుకు అన్యాయం జరిగితే అప్పిల్ వ్యవస్థ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలలో అప్పిల్ చేసుకోవచ్చని తెలిపారు. త్వరలో గ్రామ పాలన అధికారి, లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో భూ సమస్యలను తగ్గించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. భూభారతితో ప్రజలందరికీ మేలు కన్నాయిగూడెం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రజలకు అన్నిరకాలుగా మేలు జరుగుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని రైతు వేదికలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును స్థానిక తహసీల్దార్ వేణుగోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ దివాకర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణికి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టానికి ఉన్న తేడాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సాజిద తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
కాంగ్రెస్ ఇక ఖతమే!● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. ● రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక – IVలోu -
నేడు చింతలపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు (ఆదివారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రజ తోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాల ను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో.. రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభను ఎల్కతుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి. బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి చూడముచ్చటగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక రెడీ అయ్యింది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్‌రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకోసం పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు.. గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ అవిశ్రాంతంగా శ్రమించారు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని చేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఎల్కతుర్తి: సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో ఎలాంటి అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 511 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు మిగతా డిస్ట్రిక్ట్ గార్డ్స్‌ను నియమించారు. మొత్తం 1,100 మందికిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ తదితర ప్రాంతాల్లో సేవలందించనున్నారు. వరంగల్ నగరం నుంచి ఎల్కతుర్తి వరకు ప్రదర్శనగా వెళ్తున్న ఆటోలుగంటకుపైగా ప్రసంగించనున్న కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న అధినేత కేసీఆర్ నేరుగా సభావేదికకు సుమారు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. సుమారు 5.30 గంటల సమయంలో వేదికపైకి చేరుకునే అవకాశం ఉంది. వేదికపై ఆయన సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. పాతికేళ్ల పండుగకు తరలుతున్న జనం ఉమ్మడి వరంగల్ టార్గెట్ 2.50 లక్షల మంది జన సమీకరణలో నాయకుల తలమునకలు సాయంత్రం 4.30 గంటలలోపు సభకు చేరేలా ప్లాన్ 5.30 గంటల సమయంలో వేదికపైకి అధినేత కేసీఆర్ -
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో కోల్‌బెల్ట్ ఏరియా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 46డిగ్రీలకుపై బడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్‌గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం..ఎంజీఎం : వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఎం.పవన్‌కుమార్ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకో వాల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు.● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది.● తేలిగ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి.● అహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది.● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగరాదు. బీపీ, షుగర్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి.● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్, ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్స్) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది.● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్ సలహా తీసుకోవాలి.● డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్‌గా షుగర్ పరీక్షలు చేయించుకోవాలి.● డాక్టర్ సలహా లేకుండా మందులు మానేయరాదు.● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.– డాక్టర్ ఎం.ప్రవన్‌కుమార్, ఎండీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, భూపాలపల్లివాహనాల బ్యాటరీపై అధిక లోడ్ ఉండకుండా చూసుకోవాలి..– ఎండీ జాఫర్, సీనియర్ మెకానిక్ఖిలా వరంగల్: వేసవిలో ఏ వాహనమైన ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజనాయిల్‌ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి. అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్ క్లాత్ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్ ఆయిల్ చెక్‌చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్ వేడి తగ్గి కూల్ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పార్కింగ్ చేయడం మంచిది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బైక్ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్ పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్ సర్క్యూట్‌కు ఆస్కారం ఉంటుంది.చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్‌కు గురవుతారు.హీట్ స్ట్రోక్ లక్షణాలు..● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు.● పసిపిల్లలు డల్‌గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి.● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి.● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి.● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి.మూగజీవాలకు తాగునీరు అందిద్దాం– నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేటజనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్ల వెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి.ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి– కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలి గిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండెలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్‌కు చూపించాలి.ఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలిహన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్, రూఫ్ గార్డెన్ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ కుటుంబానికి సరి పడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడు తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్ షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, క షాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. – చేరాల రాకేశ్, వరంగల్ ఉద్యాన అధికారి (టెక్నికల్) -
పిల్లల ఎదుగుదలపై శ్రద్ధ చూపాలి
ములుగు: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా సంక్షేమ అధికారి శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో శుక్రవారం సమగ్ర శిశు అభివృద్ధి అధికారులు, సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బందితో జిల్లా సంక్షేమ అధికారి కె.శిరీష పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్ఏఎం, ఎంఏఎం (లోప పోషణ) పిల్లల పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి చిన్నారులను పరిశీలించి ఎస్ఏఎం, ఎంఏఎ లోపం లేదని నిర్ధారించుకోవాలన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కేంద్రాల్లో తాగునీటి సరఫరాతో పాటు తదితర అంశాలపై సీడీపీఓలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం ద్వారా 18 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు కలెక్టర్ మంజూరు చేయగా పనుల వివరాలపై చర్చించినట్లు తెలిపారు. సొంత, అద్దె భవనాలు శిథిలావస్థలో ఉంటే వెంటనే మార్చాలని సూచించారు. అంగన్వాడీలు మొబైల్ అప్లికేషన్లో డేటా అప్డేట్ చేసే విధంగా ఎప్పటికప్పడు సీడీపీఓలు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీడీపీఓ ప్రేమలత, ఎస్‌ఎస్‌తాడ్వాయి సీడీపీఓ విజయ, ఉమ్మడి జిల్లా ఐటీ సమన్వయ కర్త మహేష్, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ మమత, బ్లాక్ కో ఆర్డినేటర్లు వెంకట్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
మహాజాతరలో శాశ్వత తాగునీటి పనులకు ప్రణాళికలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో 2026 ఫిబ్రవరిలో జరగనున్న మహాజాతరలో శాశ్వత తాగునీటి పనుల కోసం ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ సురేష్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి శుక్రవారం మేడారంలో పర్యటించారు. 2026లో జరిగే మహాజాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు శాశ్వత తాగునీటి వసతి కల్పించనున్న పనుల ప్రదేశాలను గుర్తించారు. మేడారం పరిసర ప్రాంతంలోని చింతల్ క్రాస్ రోడ్డు, కాల్వ పల్లి క్రాస్, కన్నెపల్లి, చిలకలగుట్ట, జంపన్నవాగు బ్రిడ్జి పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్, శివరాంసాగర్ చెరువు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో భక్తులు వేలాదిగా విడిది చేస్తారని గుర్తించారు. తాగునీటి పనుల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాశ్వత పనుల నిర్మాణానికి గుర్తించిన ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రణాళికలను తయారు చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. మేడారంలో 2026లో మహాజాతరకు వచ్చే భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వచ్చే మహాజాతరకు జాతర పరిసర ప్రాంతాల్లో సకల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేష్, ఈఈలు మాణిక్యరావు, రామాంజనేయులు, సుభాష్, డీఈలు సునీత, సతీష్, జీవన్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారుల బృందం పర్యటన -
‘ఆపరేషన్ కర్రెగుట్ట ఆపండి.. చర్చలకు రండి’
ములుగు: తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ్క్షప్తి చేశారు.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రబుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
ములుగు: పీసీ–పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం.. ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం.. నియమ, నిబంధనలు పాటించాలన్నారు. ఆస్పత్రుల్లో అందించే సేవల ధరల పట్టికను, వైద్యుల పేర్లను ప్రదర్శించాలన్నారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్, ఫైర్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలన్నారు. లేకపోతే రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ప్రతీ నెల ప్రైవేట్ నర్సింగ్ హోంలో అందించిన వైద్య సేవలను, హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో 5వ తేదీ వరకు నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేసే సమయంలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వెంటనే జిల్లా కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రణధీర్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ అధికారి పూర్ణ సంపత్‌రావు, ఎస్ఓ స్వరూపారాణి, మానిటరింగ్ సూపర్వైజర్ సురేశ్‌బాబు, డీఈఓ నిఖిల్, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
ఏటూరునాగారం: రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఏటూరునాగారం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు ఏటూరునాగారం కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ జిల్లా స్థాయి పోటీల్లో రాధిక, సాయి కీర్తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 29 నుంచి 30 వరకు ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి వరంగల్ టీం తరఫున పాల్గొంటారని ఆయన తెలిపారు.శిక్షణార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలిములుగు/ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)సెంటర్‌ను గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆకస్మికంగా పరిశీలించారు. నిరుద్యోగులకు అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు అందించాలని సూచించారు. ఏమైనా అవసరాలుంటే వెంటనే మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ నాయకుడు గూడెపు రాకేశ్, తదితరులు ఉన్నారు. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అజ్మీర దులమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబాన్ని గురువారం రవిచందర్ పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.మద్యం మత్తులో మహిళ ఆత్మహత్యాయత్నం!కన్నాయిగూడెం: మండలంలోని చిట్యాలలో ఓ మహిళ మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సర్వాయి గ్రామ పంచాయతీలోని చిట్యాలకు చెందిన బంధం సమ్మక్క(42) మద్యం మత్తులో పురుగుల మందు తాగిందా? లేక కుటుంబ గొడవలు ఏమైనా జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామస్తుల సహకారంతో మహిళను భర్త లక్ష్మయ్య 108లో వైద్యం కోసం ఏటూరునాగారం తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సలహా మేరకు ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిసింది.రాత్రి పది తర్వాతే లారీలు అనుమతించాలి..వెంకటాపురం(కె): రాత్రి పది గంటల తర్వాతే ఇసుక లారీలను మండలం నుంచి బయటకు వెళ్లేలా అనుమతించాలని ఆది వాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్సా నర్సింహమూర్తి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బుధవారం రాత్రి బర్గూడెం పంచాయతీ చిరుతపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇసుక లారీ ఢీకొని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా ఇసుక లారీలను అనుమతించడంతోనే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్ర మాదం జరిగితే లారీ ఓనర్స్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీల అతివేగం, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నాయన్నారు. వేగాన్ని నియంత్రిండంతో పాటు ప్రమాదాలు తగ్గేలా రాత్రి సమయాల్లో మాత్రమే లారీలను అనుమతించాలని కోరారు.అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులివ్వాలి..ములుగు రూరల్: అంగన్వాడీ సెంటర్లకు మే నెలలో వేసవి సెలవులివ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈమేరకు గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీడబ్యూఓ శిరీష, అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎండల తీవ్రత కారణంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తూ సర్క్యూలర్ జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, భాగ్యలక్ష్మి, సరిత, జమున, రాణి, సత్యనారాయణమ్మ, మీనా పాల్గొన్నారు. -
29న హేమాచల క్షేత్రంలో జాతర వేలం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 29న జాతర బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్లూరు గుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో మే 8 నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) ఆత్యంత వైభవంగా జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుట్టపై జరిగే పది రోజుల జాతరలో, జాతర ప్రారంభానికి ముందు మే 1 నుంచి 31 వరకు నెల రోజులు ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపులు ఏర్పాటు చేసుకుని విక్రయాలు జరిపేందుకు దేవాదాయశాఖ ద్వారా అనుమతి ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు రూ.లక్ష లడ్డు, పులిహోర ప్రసాదాలు తయారు చేసి విక్రయించేందుకు రూ.లక్ష, భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలు (పుట్టు వెంట్రుకలు) పోగు చేసుకునేందుకు రూ.2 లక్షలు, కొబ్బరి ముక్కలకు రూ.10 వేలు చెప్పుల స్టాండ్‌కు రూ.5 వేలు, ఫొటోలు తీసుకునేందుకు రూ.5 వేలు, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 24 నుంచి 28 వరకు దేవస్థానం కార్యాలయంలో రూ.500 చెల్లించి కొటేషన్ కొనుగోలు చేయాలని సూచించారు. కొటేషన్ కొన్న వారికి మాత్రమే, షెడ్యూల్లో పొందుపర్చిన దరావత్తు సొమ్ము డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంని పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ హైదరాబాద్ వారి తుది ఆమోద ఉత్తర్వుల మేరకు వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి సమాచారం కోసం హేమాచల క్షేత్రం ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మతిపోయేలా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి వియవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా పార్టీ నాయకులతో కలిసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేడారం జాతర మాజీ చైర్మన్ రేగ నర్సయ్య, జిల్లా నాయకుడు జగదీశ్, మాజీ మండల అధ్యక్షుడు మోహన్‌రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజేందర్, మాజీ ఉప సర్పంచ్ ఇంద్రాసేనారెడ్డి, నాయకులు ఎండీ రఫీక్, కొర్నెబెల్లి శేషగిరి, పత్తి గోపాల్‌రెడ్డి, నగేశ్, సోషల్ మీడియా ఇన్చార్జ్ కోట సురేశ్ పాల్గొన్నారు. -
మరమ్మతుకు నోచని ‘మల్లూరు’
మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టునిధులు కేటాయించాలి.. వేలాది ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం నిధులు కేటాయించాలి. మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టుతో పాటు ఈప్రాంత సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన మంత్రి సీతక్క ఈఅంశంపై స్పందించాలి. ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించాలి. – తాటి భిక్షం, రైతు, నర్సింహాసాగర్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాం.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ తూము లీకేజీలు, మత్తడి 1, 2, 3, 4 మరమ్మతులు, అపరాన్ల మరమ్మతులు చేపట్టేందుకు రూ.10.5 కోట్లు ఎస్టిమేట్ నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయానికి పంపించాం. – వలీమ్ మహ్మద్, ఏఈ, ఏటూరునాగారం సబ్డివిజన్మంగపేట: మండలంలోని మల్లూరు మధ్య తరహా ప్రాజెక్టు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టును ఆధునికీకరించి అభివృద్ధి చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన అధికారులు చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్నారని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26 అడుగుల నీటి మట్టం సామర్థ్యంతో 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రాజెక్టును ప్రారంభించారు. 1980లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. మొట్ట మొదటిసారి ఆయకట్టు భూములకు సాగునీటిని వదిలారు. నర్సింహాసాగర్, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, వాగొడ్డుగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి వరకు ఉన్న 17 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా సుమారు 4,300 ఎకరాలు, బాలన్నగూడెం, తిమ్మంపేట, మంగపేట, చెరుపల్లి తదితర గ్రామాల వరకు 8 కిలోమీటర్ల ఎడమ కాలువ ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరందాల్సి ఉంది. హామీలు నీటి మూటలు.. ప్రాజెక్టు అభివృద్ధిపై గడిచిన పదేళ్లలో అప్పటి పాలకులు ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. 2015లో స్వయంగా అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దివంగత మంత్రి చందూలాల్ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే ప్రాజెక్టు అభివృద్ధి కోసం.. కుడి, ఎడమ కాలువలు, తూముల నిర్మాణం, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్ నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలు అతీగతీ లేకుండా పోయాయి.ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే మత్తడి పలు చోట్ల కొతకు గురై కొట్టుకుపోయింది. అపరాన్ పూర్తిగా ధ్వంసమై మూడేళ్లు గడుస్తున్నా.. ఇరిగేషన్ అధికారులు ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. తూముల లీకేజీలకు వేసవి కాలం ప్రాజెక్టులో నీరు నిండుకున్న సమయంలో చేపట్టకుండా.. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీరు చేరిన తర్వాత మరమ్మతులు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు స్థానికులతో సంబంధిత అధికారులు కుమ్మకై ్క నాసిరకంగా మరమ్మతులు చేపడుతూ.. చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పొలాలకు ఉపయోగపడాల్సిన నీరు తూముల నుంచి లీకేజీ రూపంలో వృథాగా పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో గత 15 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నా.. ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఈఏడాది మత్తడి నుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తే మత్తడికే ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. అయిన్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం రావట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు.కొరవడిన పర్యవేక్షణ 27 ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిర్వాహణపై సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పాలకులు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో అభివృద్ధికి నోచుకోక పూర్తి నిరాధరణకు గురైంది. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు అనుకూలించిన రెండు నుంచి నాలుగు ధఫాలు తప్ప ఎప్పుడు కూడా పూర్తి ఆయకట్టు భూములకు సాగునీరందిన సందర్భాలు లేవని రైతులు వాపోతున్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమా అంటూ.. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.16 కోట్ల జపాన్(జైకా) నిధులు మంజూరయ్యాయి. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అసంపూర్తిగా చేసి కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు అందినకాడికి దండుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుడి, ఎడమ కాలువల తూములకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతుల పేరుతో గత 10 ఏళ్ల కాలంలో కొందరు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మకై ్క లక్షల రూపాయలు దండుకుని చేతులు దులుపుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. -
ఇసుక క్వారీ నిర్వహణకు ఏకగ్రీవ తీర్మానం
మంగపేట: మండలంలోని కత్తిగూడెం ఇసుక క్వారీ నిర్వహణను శ్రీ ఆంజనేయ ట్రైబల్ ఇసుక క్వారీ, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యాక్స్ లిమిటెడ్‌కు అప్పగిస్తూ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. పంచాయతీ పరిధి రిజిస్టర్డ్ ఇసుక లేబర్ సొసైటీల్లో ఇసుక రీచ్ నిర్వహణ కోసం సొసైటీని గుర్తించేందుకు జీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి చెదలవాడ కృష్ణాజీ అధ్యక్షతన గురువారం పెసా గ్రామ సభ నిర్వహించారు. ఎంపీడీఓ భద్రు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ భిక్షపతి పెసా నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శ్రీ ఆంజనేయ, సమ్మక్క సారక్క రెండు సొసైటీలు ఉండగా.. సమక్క సార క్క సొసైటీ ఆడిట్ లేకపోవడంతో శ్రీ ఆంజనేయ ట్రైబల్ ఇసుక క్వారీ, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యాక్స్ లిమిటెడ్‌కు క్వారీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు సొసైటీ సభ్యులు 12 మంది అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. నివేదికను ఉ న్నతాధికారులకు పంపిస్తామని ఎంపీడీఓ వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ కారోబార్ వల్లి శ్రీను, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎస్టీ వర్గీకరణ చేపట్టాలి..
ములుగు రూరల్: ఎస్టీ ఉపకులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేపట్టాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం మండలంలోని రాయినిగూడెంలో ఎస్టీ వర్గీకరణ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ తెగల్లో ఏబీసీడీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ.. 1996లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బకట్ల నర్సింగరావు ఆశయ సాధనకు ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్టీ, ఎస్సీ ఉప కులాలు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందేలా వర్గీకరణ చేపట్టాలని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏటూరునాగారంలో నేడు(శుక్రవారం) నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు తవిటి నారాయణ, నెమలి నర్సయ్య, స్వామి, జగ్గారావు, వజ్జ రాజు, రమేశ్, సాంబయ్య, వినీత్ పాల్గొన్నారు. -
డీసీసీలకు కొత్త సారథులు
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని జిల్లా కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లాకు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. మే 20 టార్గెట్‌గా సమావేశాలు.. జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్‌కు పొట్ల నాగేశ్వర్రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్‌కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్‌కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మ ల్లయ్య, కైలాశ్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది. ‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టి సారించిన అధిష్టానం వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆదేశం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు.. ఆరు జిల్లాల నుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులుడీసీసీ పీఠం కోసం పోటాపోటీ.. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాల నుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్‌రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడి నుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్‌రాజ్, నమిండ్ల శ్రీనివాస్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌గా కూడ వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీ పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి కీలకం కానున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోకే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్‌చంద్రా రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. -
ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
ములుగు, సాక్షి: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) మూడో రోజు కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాళ్లగూడెం వద్ద అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఇద్దరు జవాన్లు గాయపడగా.. బీజాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు వేల మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ మాత్రం ఆ సంఖ్య పదివేల దాకా ఉండొచ్చని చెబుతోంది. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టిట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా మూడు హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో డ్రోన్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్ కొనసాగుతోంది. మాకేం సంబంధం లేదుకర్రిగుట్టలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కూంబింగ్‌కు తమకు సంబంధం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఛత్తీస్‌గఢ్- కేంద్ర బలగాలు చూసుకుంటున్నాయని, తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రకటించారు. కూబింగ్‌లో పాల్గొంటున్న కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్గడ్ వైపు నుంచి ఊసూర్ బ్లాక్‌లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.కూంబింగ్ సరికాదుఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు. -
‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ టీఎస్.దివాకర వాజేడు: దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతుల భూములకు సంబంధించి పాస్ పుస్తకాల్లో ఉన్న పొరపాట్ల సవరణకు సైతం అవకాశం ఉందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన సదస్సులో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రతా భావానికి తావు లేకుండా జవాబుదారి తనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు, సాదా బైనామా వంటి సేవలు సులుభ తరం అవుతాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే గ్రామాల్లోని ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని వివరించారు. జిల్లాలో ఉన్న అసైన్మెంట్, సాదా బైనామాలు, పాస్ పుస్తకాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో భూములకు సంబంధించిన సర్వేలు చేసి కొలతలు, హద్దులు, భూముల వివరాలను ఒకే పుస్తకంలో ఉండేలా ఆధార్ తరహాలో భూధార్‌ను రూపొందించ నున్నట్లు వెల్లడించారు. భూ భారతి చట్టం ద్వారా భూమికి సంబంధించిన సమస్యలు జిల్లా స్థాయిలో సత్వరమే పరిష్కరించబడుతాయని వివరించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చింతూరు, లక్ష్మీపురం, ఆర్లగూడెం గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట దెబ్బతిందని తమకు న్యాయం చేయాలని రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సదస్సులో మండల ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. విశ్వ సుందరీమణుల రాకకు ఏర్పాట్లు వెంకటాపురం(ఎం): వచ్చే నెల 14వ తేదీన విశ్వ సుందరీమణుల రాక సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం రామప్ప ఆలయం, హరితహోటల్, ఇంటర్ర్పిటేషన్ సెంటర్లలో చేస్తున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామప్పను సందర్శించడానికి వచ్చే విశ్వ సుందరీమణుల కోసం స్వాగత ఆర్చ్, ఆలయంలో లైటింగ్‌తో సుందరీకరణ, గ్రీనరీ పెంచడం, కాకతీయ కట్టడాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడానికి విదేశీ పర్యాటకుల కోసం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా దేశాల సుందరీమణులను పర్యాటక ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, పర్యాటక అభివృద్ధి శాఖ అధికారులు, పురావస్తుశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
భయం గుప్పిట్లో ఏజెన్సీ
ములుగు: బచావో కర్రిగుట్టల పేరుతో కేంద్ర సాయుధ బలగాలు, తెలగాణ సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్‌తో సరిహద్దు గ్రామాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సాయుధులైన సుమారు 2000 మంది పోలీసు బలగాలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ముందుకు సాగుతున్నాయి. మంగళవారం నుంచి దట్టమైన అడవిలో కాలు మోపిన బలగాలకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలను అందించేందుకు కేంద్రం రెండు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. యుద్ధ బలగాలను గుర్తించి సరుకులను అందిస్తోంది. దీంతో బలగాలు రెట్టింపు వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే కర్రిగుట్టల చుట్టు బాంబులను అమర్చినట్లు మావోయిస్టులు కర పత్రాలను విడుదల చేసిన నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్స్ వాటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. 30గంటలు దాటినా కానరాని మావోయిస్టుల ఆచూకీ.. ఇదిలా ఉండగా పోలీసు బలగాలు కర్రిగుట్టల్లో అడుగు పెట్టి 30గంటల సమయం దాటుతున్నప్పటికీ మావోయిస్టుల ఆచూకీ తెలియలేదని సమాచారం. ఒక వేల కర్రిగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకొని ఉండి ఉంటే ఇప్పటికే పోలీసుల సమాచారం మావోయిస్టులకు తెలిసి ఉంటుంది. ఈ ప్రకారం గెరిల్లా శిక్షణ పొందిన మావోయిస్టులు ఎదురు దాడికి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తూర్పువైపు నుంచి ఛత్తీస్‌గఢ్ బలగాలు, పడమర నుంచి తెలంగాణ, కేంద్ర సాయుధ బలగాలు కర్రి గుట్టల్లో ప్రవేశించడం వెనుక గల ఆంతర్యంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. నివురుగప్పిన నిప్పులా మారిన కర్రిగుట్టల్లో తుపాకీ మోతల శబ్ధాలు వినిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై వాజేడు, వెంకటాపురం(కె) ములుగు జిల్లా పోలీసులను వివరణ కోరగా ఎలాంటి సమాచారం రావడం లేదు. కర్రిగుట్టలను చుట్టు ముట్టిన సాయుధ బలగాలు హెలికాప్టర్ల ద్వారా సిబ్బందికి నిత్యావసర సరుకులు బచావో కర్రిగుట్టల పేరుతో కొనసాగుతున్న కూంబింగ్హిడ్మా, దామోదర్ ఉన్నారా? రోజు రోజుకూ బలహీన పడుతున్న మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడం కోసం కేంద్ర కమిటీలో ఉన్న మడవి హిడ్మా, దామోదర్ వంటి అగ్రనేతలు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వ్యాపించి విస్తారంగా ఉన్న అడవిలో కర్రి గుట్టలను స్థావరంగా మార్చుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనతో బలగాలు రెట్టింపుగా కూంబింగ్‌కు దిగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులను కోల్పోవడం, మరి కొందరు లొంగుబాటుతో పార్టీకి దూరమవడంతో మావోయిస్టు పార్టీ రోజు రోజుకు బలహీన పడుతోంది. ఈ క్రమంలో మడవి హిడ్మా, దామోదర్‌లు కర్రి గుట్టల్లో ఉండవచ్చనే నిఘా వర్గాల సమాచారంతో సాయుధులైన పోలీసు బలగాలు ముందుకు చొచ్చుకు పోతున్నట్లు తెలుస్తోంది. -
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో 19మంది డీబార్
ములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని బండారుపల్లి మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్ పరీక్ష కేంద్రంలో 19మంది అభ్యర్థులను బుధవారం డీబార్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఓపెన్ పరీక్ష సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన స్క్వాడ్ బృందం తనిఖీలు చేయగా అభ్యర్థుల వద్ద మాస్‌కాపీయింగ్ స్లిప్‌లు దొరకడంతో డీబార్ చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులను మిగిలి ఉన్న మూడు పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేశారని వివరించారు. ‘భూ క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్‌లు ఇవ్వాలి’ ములుగు రూరల్: భూ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) ప్రొసీడింగ్‌లు ఇవ్వాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రచారి బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూల్ చేస్తుందని ఆరోపించారు. డబ్బు చెల్లించినా ప్రొసిడింగ్ కాపీలను అందించకుండా కాలయాపన చేయడం సరికాదని వివరించారు. జిల్లాలో 1,440 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.2.43 కోట్లు చెల్లిస్తే 582 మందికి మాత్రమే ప్రొసీడింగ్ అందించారని వివరించారు. వెంటనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీండింగ్లు అందించాలని కోరారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సీడీ ఆవిష్కరణ చిట్యాల: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన గూడెపు హర్షవర్ధన్ ఓరుగల్లుకు ‘ పోదాం పద ’ అనే పాటతో సీడీ రూపొందించాడు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సభా వేదిక ఏర్పాటు ప్రదేశంలో బుధవారం సీడీని ఆవిష్కరించారు. ఈసంద్భంగా గాయకుడిని కేటీఆర్ అభినందించారు. పాటను రచించిన కల్లెపెల్లి సతీష్, మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు, సహకారం అందించిన తౌటం నవీన్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, పీఏసీఏస్ చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి, రవీందర్ రావు, రాజేందర్, నవీన్, నాయకులు పాల్గొన్నారు. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు చిట్యాల: అభం శుభం తెలియని చిన్నారి నైనిషాపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జడల్పేట గ్రామానికి చెందిన రత్న రమేష్ కుమార్తె నైనిషా బుధవారం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అక్కడే ఉన్న మూడు కుక్కలు ఆమెను వెంటాడి గాయపరిచాయి. దీంతో చిన్నారరి మెడ చుట్టూ, వీపుపై గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చిన్నారి నైనిషాపై కుక్కలు దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ‘బాయిబాట’ భూపాలపల్లి అర్బన్: ఐఎన్టీయూసీ నాయకులు బుధవారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో బాయిబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6వ గనిలో కార్మికులను మ్యాన్ రైడింగ్ సమస్య, పని స్థలాల్లో గాలి, తాగునీరు సరఫరా చేయాలనే సమస్యలను కార్మికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్‌రెడ్డి తెలిపారు. ఈ సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. భూగర్బ గనిలోని వెళ్లి కార్మికుల పని స్థలాలను పరిశీలించి నేరుగా కార్మికుల సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు జోగు బుచ్చయ్య, హుస్సెన్, అశోక్, లక్ష్మీనారాయణ, రఘు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఆరబెట్టిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన కరాబు రాజు నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలం పత్తి పంటను సాగుచేయగా అధిక వర్షాలకు దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో పత్తి పంటను తొలగించి నాలుగు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోత కోసి ఆరేందుకు పొలంలోనే ఉంచాడు. బుధవారం ప్రమాదవశాత్తు పంటకు నిప్పు అంటుకుంది. ఇతర రైతులు గమనించి రాజుకు సమాచారం అందించారు. రైతులంతా కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. ఫలితంలేకుండాపోయింది. నాలుగు ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.4 లక్షల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. అలాగే మరో రైతు కృష్ణకు చెందిన రెండు ఎకరాలల్లోని మొక్కజొన్న పంట కోసి పొలంలో ఆరబెట్టగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. -
సేవాభావంతోనే ప్రతిభకు గుర్తింపు
ములుగు: ఉన్నత చదువులు చదివి సేవాభావం కలిగి ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 80.12శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలివడంపై హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రణవి, రితీష్ నాయక్, స్ఫూర్తి, నితీష్, కీర్తన, చైత్రను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఎంత నేర్చుకున్నాం అనేది ముఖ్యం కాదని.. నేర్చుకున్నది ఎవరికి ఉపయోగపడుతుందనేదే ముఖ్యం అన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయడానికి ముందుకురావాలన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగుతో పాటు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న అసిఫాబాద్ జిల్లాలు ఇంటర్ ఫలితాల్లో మొదటి, రెండో స్థానాల్లో నిలవడం అభినందనీయమన్నారు. త్వరలోనే స్వచ్ఛంద సంస్థలతో అవార్డులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి చంద్రకళ, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. రామాలయ అభివృద్ధి పనులకు భూమి పూజ జిల్లా కేంద్రంలోని రామాలయ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క బుధవారం భూమిపూజ చేశారు. రూ.10లక్షలతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి సీతక్కను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పనులను చేపట్టే విధంగా కృషి చేస్తానని వివరించారు. ములుగు నియోజకవర్గంలోని అన్ని ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తానని వెల్లడించారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
పర్యాటకులపై దాడి అమానుషం
ములుగు రూరల్: కశ్మీర్లో పహల్గాంలో పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపై ఉగ్రవాదుల దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్యులరిజం ముసుగులో రాజకీయ పార్టీలు హిందువులను జెండాలు మోసే బానిసలుగా చూస్తున్నాయన్నారు. దేశాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల జీవితాలను, భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్లాల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి హరీశ్, కృష్ణాకర్‌రావు, రాజ్‌కుమార్, నాగరాజు, హేమాద్రి, పాపిరెడ్డి, మహేందర్, రఘుపతి, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘బీఆర్ఎస్ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్‌లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్‌నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్‌లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటలలోపే చేరుకుంటారని, ఆలోగా ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్ చేయాలన్నారు. ఒక్కొక్కరిగా జనసమీకరణపై ఆరా... మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్న ఈ సమీక్షసమావేశంలో జనసమీకరణపై ఇప్పటివరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న నేతలను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బందిపడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్‌చార్జ్‌ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి సభభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసమీకరణ, జనం తరలింపుపై ఫోన్ల ద్వారా సమీక్షించడం జరుగుతుందని, ఆందరూ తమ లక్ష్యాలను మించాలని కోరారు.జనసమీకరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం ఓరుగల్లు ప్రతి ఇంటి నుంచి జనం కదలాలే సిల్వర్ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు... రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష... కీలక అంశాలపై చర్చ సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అభినందనలుసభా ఏర్పాట్లపై అభినందనలు.. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్‌నాయ క్, నన్నపనేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షణ్ముక ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య..
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాపురం(కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్య ఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్‌ను స్వాఽధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు.. సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. సాయి ప్రకాశ్ హత్య కేసులో కానిస్టేబుల్‌తో సహా ఆరుగురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీపీ సన్‌ప్రీత్‌సింగ్ -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పైర్’కు ప్రథమ ర్యాంకు
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పైర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్‌కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియా 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్‌కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్‌గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్‌లో మెరిశారు..
ఐదోసారి ఐఏఎస్ కొట్టాడు.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్‌కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్‌ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్‌గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్‌లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకులు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి పోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్‌కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబయిలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్‌లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్‌తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి సొంతంగా ప్రిపేర్.. ● సివిల్స్‌లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్‌లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి
ఏటూరునాగారం: దేశంలోని అన్ని రంగాల కార్మికుల కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని మే 20న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి కార్మికులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ 29కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం ఏక పక్షంగా రద్దు చేసిందన్నారు. అనంతరం నాయకులు మల్లికార్జున్, దావూద్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను మోసం చేస్తుందన్నారు. దేశ వ్యాప్తం సమ్మెకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, నాయకులు సద్దాం హుస్సేన్, మహేష్, పాప, రంజిత్, సడాలు, భిక్షపతి, సూరమ్మ, ఈశ్వరి, సుశాంత, నర్సమ్మ, రాంబాబు, రుక్మిణి, ఆదిలక్ష్మి, కాంత, కొమురయ్య, రాంబాబు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మాధవి -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్‌రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్‌రెడ్డి అభినందించారు. -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి,ఎం.సతీశ్‌కుమార్ అభినందించారు. -
రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్
బాలికలదే మొదటి స్థానం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరంలో మొత్తం 833 మంది బాలురు పరీక్ష రాయగా 616 మంది పాసై 73.95శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 802 మంది పరీక్ష రాయగా 694 మంది పాసై 86.53 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,635 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,310 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇక ఒకేషనల్ విభాగంలో బాలురు 56 మంది పరీక్ష రాయగా 41 మంది ఉత్తీర్ణులు అయ్యారు. బాలికలు 152 మంది పరీక్ష రాయగా 143 మంది పాసై ఏకంగా 94.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనరల్, ఒకేషనల్ విభాగంలో బాలికలే మొదటి స్థానంలో నిలిచారు.ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో జిల్లాస్థానం ● గతేడాది ఫస్టియర్‌లో ఫస్ట్, ఈఏడాది 13వ స్థానం ● కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను సన్మానించిన మంత్రి సీతక్క ములుగు: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఈ సారి 80.12 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. గతేడాది మొదటి సంవత్సరంలో ఇదే బ్యాచ్ వందశాతం ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఇంటర్మీడియట్ ఫలితాలపై మంత్రి సీతక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారి వివరాలను సేకరించి జిల్లా యంత్రాంగం తరఫున వారిని సన్మానించాలని కలెక్టర్‌కు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విభాగంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పెండ్యాల ప్రవళిక 984/1000 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచారు. అలాగే టి.నందిని బైపీసీ సెకండియర్‌లో 935మార్కులు సాధించగా ఎంపీసీ సెకండియర్‌లో నితీష 953మార్కులు సాధించింది. మాధవరావుపల్లిలోని కస్తూర్బాలో ఎంపీహెచ్‌డబ్ల్యూ మొదటి సంవత్సరంలో జాడి రష్మిత 468మార్కులు సాధించింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 13వ స్థానం ఇంటర్మీమీడియట్ మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 877 మంది బాలురు పరీక్ష రాయగా 734 మంది పాస్ కాగా శాతం ఉత్తీ ర్ణత సాధించారు. బాలికల విభాగంలో 832 మంది పరీక్ష రాయగా 625 మంది పాసై 75.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో 71 మంది బాలురు పరీక్ష రాయగా 45 మంది పాసై 63.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. 170 మంది బాలికలు పరీక్ష రాయగా 151 మంది పాసై 88.82 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తానికి రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్స రం ఫలితాల్లో జిల్లా 13 స్థానంలో నిలిచింది. అభినందించిన మంత్రి సీతక్క ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణతలో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను శాలువాలతో సన్మానించారు. అనంతరం విద్యాభివృద్ధికి సహకరించిన మంత్రి సీతక్కను సైతం అధికారులు సన్మానించారు.ఐఏఎస్ కావడమే లక్ష్యం వాజేడు: మండల కేంద్రానికి చెందిన డెక్క వెంకటస్వామి, మాలతీల కూతురు ధరణి ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఎంపీసీలో 983మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. తండ్రి టీవీ మెకానిక్ చేస్తుండగా తల్లి టైలరింగ్ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన ధరణి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని అన్నారు. ఎంతకష్టమైన పడి అనుకున్న లక్ష్యం చేసుకుంటానని చెబుతోంది. -
మహాజాతర పనులకు రూ.145 కోట్లు
ములుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరలో చేపట్టే వివిధ పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.145 కోట్లు కేటాయించనుందని, ఈ మేరకు అన్ని శాఖల అధికారులు ప్రణాళికతో పనులు పూర్తిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన మేడారం మహాజాతర 2026ను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించగా మంత్రికి పలుశాఖల అధికారులు వివిధ రకాల పనుల గురించి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారంలో 6 నెలల ముందుగా పనులు చేపట్టి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఏడాదిలో మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరతో పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రెండు పెద్ద పండుగలను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కుంభమేళా తరహాలో సాగుతున్న మేడారం జాతరను విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. గత మహాజాతర సందర్భంగా మిగిలి ఉన్న రూ.50 కోట్లను సైతం రానున్న మహాజాతరకు వినియోగిస్తామని వెల్లడించారు. గద్దెల పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు జంపన్న వాగుపై రూ.5 కోట్లతో పెద్దలు, పిల్లలు సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర సందర్భంగా తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ గతంలో మేడారం మహాజాతరలో పనిచేసిన అధికారుల సూచనలతో రానున్న మహాజాతరను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఆర్డీఓ వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఎఫ్డీఓ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే జాతర నాటికి మేడారంలో శాశ్వత పనులు చేయాలి ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు సమర్పించాలి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కభూ భారతితో సమస్యలు పరిష్కారం మంగపేట: ఽరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో అన్ని రకాల భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూ సమస్యలను పరిష్కరించి పట్టాలు అందజేసేలా సీఎం రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్‌జీ మాట్లాడుతూ భూభారతి చట్టంతో 90శాతం భూ సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం మంత్రి సీతక్క వివిధ గ్రామాలకు చెందిన 35మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రికి పలువురు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు తదితర సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. -
ములుగు
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 20259● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్‌వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు ● ఐఏఎస్ కావాలని లక్ష్యంతోనే ముందుకు.. ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్ -
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించి అణువణువు గాలిస్తున్నారు . దీంతో ఆ రీజియన్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల, మోడల్‌స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాసర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్ధూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్‌స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్ధూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులోనుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్ధేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిపోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్స్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు