Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

ఫొటోలు

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Bipasha Basu Daughter Devi Clicks by Paparazzi, Actress Angry On Them1
ఎవరు మీరంతా? కూతురి ముఖం దాచేసిన బిపాసా!

హీరోయిన్‌ బిపాసా బసు- నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ దంపతులు కూతురు దేవిని తీసుకుని బయటకు వెళ్లారు. సెలబ్రిటీలు ఎక్కడుంటే అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమయ్యే పాపరాజీ(ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు) బిపాసా దంపతులను ఫాలో అయ్యారు. హీరోయిన్‌ను, ఆమె కూతురు దేవిని ఫోటోలు తీశారు. దీంతో బిపాసా‌ కాస్త అసహనానికి లోనైంది. వెంటనే కూతురు ముఖాన్ని దాచేసింది. అసలు ఎవరు మీరంతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా కోపంతోనే ఓ బిల్డింగ్‌లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.చిగురించిన లవ్‌ స్టోరీ2015లో వచ్చిన ఎలోన్‌ సినిమా షూటింగ్‌లో కరణ్‌ సింగ్‌- బిపాసా కలుసుకున్నారు. వెండితెరపై జంటగా కనిపించిన ఈ జోడీ రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమలో పడింది. ఏడాదిపాటు ప్రేమకబుర్లు చెప్పుకున్న వీరు 2016 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2022లో కూతురు దేవి జన్మించింది. సినిమాసినిమాల విషయానికి వస్తే.. తెలుగులో టక్కరిదంగ సినిమాలో నటించింది. బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణించిన బిపాసా కొంతకాలంగా మూవీస్‌కు దూరంగా ఉంటోంది. చివరగా డేంజరస్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె భర్త కరణ్‌ సింగ్‌ కూడా నటించాడు. ఇతడు చివరగా ఫైటర్‌ మూవీలో యాక్ట్‌ చేశాడు. View this post on Instagram A post shared by Bollywood Reporter (@bollywoodreporter.in) చదవండి: ఓటీటీలో మోగ్లీ మూవీ.. ఎక్కడంటే?

Singer S Janaki son Murali Krishna Passed away2
గాయని ఎస్‌.జానకి కుటుంబంలో విషాదం

ప్రముఖ గాయని ఎస్‌.జానకి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ సింగర్‌ చిత్ర సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. మురళీకృష్ణ మరణం తనను షాక్‌కు గురిచేసిందని తాను మంచి సోదరుడిని కోల్పోయానంటూ తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరారు. మురళీకృష్ణకు కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాల్లో ఆయన నటించారు. భరతనాట్యంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. మురళీకృష్ణ మరణంతో సౌత్‌ ఇండియా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Velle Darilona Song Out From Sri Chidambaram Movie3
కీరవాణి నోట మరో అద్భుతమైన పాట.. 'వెళ్లేదారిలో..’ విన్నారా?

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన విలేజ్‌ డ్రామా ‘శ్రీ చిదంబరం’. వినయ్‌ రత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి గారు ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే ఓ పాట బ్యూటిఫుల్‌ పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి అభినందనలతో.. ఆయన సినిమాకు బెస్ట్‌ విషెస్‌ చెబుతూ పాటను విడుదల చేశారు. చందు రవి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రశేఖర్‌ సాహిత్యాన్ని సమాకూర్చారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్‌ అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా కీరవాణి గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ'' కీరవాణి గారు ఈ పాటలను ఆలపించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన గాత్రంతో ఆ పాట ఎంతో గొప్పగా మారింది. సినిమా విషయానికొస్తేఇదొక ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామాలో పూర్తి కొత్తదనం నిండి ఉంటుంది. ప్రతి పాత్ర, ప్రతి విజువల్‌ ఎంతో సహజంగా ఉంటుంది.ఇక ఇందులో హీరోకి ఉన్న అసలు పేరు కాకుండా.. ఊరంతా కూడా చిదంబరం అని ఎందుకు పిలుస్తుంటారు.. మరి అలా ఎందుకు పిలుస్తారు? అసలు హీరో ఎప్పుడూ కూడా కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? అలా చేయడానికి గల కారణం ఏంటి? అనే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. కొత్తదనంతో నిండిన సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా చిత్రం నచ్చుతుంది' అన్నారు.

Mowgli Movie OTT Streaming Now South Indian Languages4
ఓటీటీలో 'మోగ్లీ' సినిమా.. 3 భాషల్లో స్ట్రీమింగ్‌

యాంకర్‌ సుమ కుమారుడు రోషన్‌ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ’. గతేడాది డిసెంబరు 13న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సాక్షి మడోల్కర్‌ హీరోయిన్‌గా నటించగా.. బండి సరోజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.మోగ్లీ(Mowgli) సినిమా ఇప్పటికే ఒక ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video)లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఇతర భాషలకు విస్తరించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‌ అవుతుంది. టాలీవుడ్‌లో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఇతర భాషలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.కథేంటి..?మోగ్లీ (రోషన్‌ కనకాల) ఓ అనాథ. పార్వతీపురం గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఉంటూ.. ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. బతుకుదెరువు కోసం తన ప్రాణ స్నేహితుడు బంటి(వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి జూనియర్‌ ఆర్టిస్టులను అందిస్తూ..రిస్కీ సీన్లకు హీరో డూప్‌గా నటిస్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్‌లో సైడ్‌ డ్యాన్సర్‌గా వచ్చిన జాస్మిత్‌(సాక్షి మడోల్కర్‌)తో ప్రేమలో పడతాడు. ఆమెకు వినికిడి లోపంతో పాటు మాటలు కూడా రావు. జాస్మిత్‌ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఎస్సై క్రిప్టోఫర్‌ నోలన్‌(బండి సరోజ్‌ కుమార్‌).. జాస్మిత్‌పై మోజు పడతాడు. ఆమెను వాడుకోవాలని చూస్తాడు. అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్‌ బారీ నుంచి జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్‌ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Venkatesh Remuneration For Manas Sankara varaprasad garu movie5
'వెంకటేశ్‌' రెమ్యునరేషన్‌ ఎంతో చెప్పిన సుస్మిత

చిరంజీవి- వెంకటేశ్‌ కాంబినేషన్‌లో విడుదలైన చిత్రం మన శంకర వరప్రసాద్‌ గారు.. తాజాగా ఈ మూవీ రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి రేసులో భారీ విజయం అందుకున్న ఈ మూవీలో వెంకటేశ్‌ పాత్ర చాలా కీలకంగానే ఉంటుంది. దీంతో ఆయన రెమ్యునరేషన్‌ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ కమ్రంలోనే నిర్మాత సుస్మిత కొణిదెల ఒక క్లారిటీ ఇచ్చారు.మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ కోసం వెంకటేష్‌ రెమ్యునరేషన్‌ రూ. 10 కోట్లు పైమాటేనని చాలా కథనాలు వచ్చాయి. అదేం కాదు చిరు మీద ప్రేమతో తను చాలా తక్కువ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు మరికొందరు తెలిపారు. దీనిపై సుస్మిత అసలు విషయం చెప్పారు. అయితే, ఆమె కూడా తెలివిగా నంబర్స్‌ రూపంలో వెంకీ రెమ్యునరేషన్‌ గురించి చెప్పలేదు. కానీ, వెంకటేశ్‌ గారు తమ ఫ్యామిలీ మెంబర్‌ లాంటి వ్యక్తి అని సుస్మిత చెప్పారు. అందుకే రెమ్యునరేషన్‌ విషయంలో తమ మధ్య డిబేట్‌ ఏం జరగలేదన్నారు. ఆయనకు ఎంత ఇవ్వాలన్నా తమకు ఆనందమేనని చెప్పారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం చాలా విలువైనదని ఆమె గుర్తుచేసుకున్నారు. స్క్రీన్‌పై వెంకీ గారు కనిపించిన దగ్గర నుంచి ప్రేక్షకులు మరింతగా కనెక్ట్‌ అయ్యారని తెలిపారు. అందుకే ఆయన ఆడిగిన రెమ్యునరేషన్‌ ఇచ్చామని సుస్మిత చెప్పారు. డబ్బు కోసం కాకుండా.. కేవలం తన అభిమానులతో పాటు మూవీ ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసం వెంకీ నటించారని తెలుస్తోంది.

Faria Abdullah Reveal Love With Movie Choreography6
డేటింగ్‌లో ఉన్నా.. కానీ, తను ముస్లిం కాదు: ఫరియా అబ్దుల్లా

తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్‌కు దగ్గరైన బ్యూటీ ఫరియా అబ్దుల్లా .. రీసెంట్‌గా గుర్రంపాపిరెడ్డి మూవీతో పాటు అనగనగా ఒక రాజులో ప్రత్యేక పాత్రలో మెరిసింది. కెరీర్‌ ప్రారంభంలో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు. కానీ, ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది.ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని తెలిపింది. తన ప్రియుడి గురించి మాట్లాడుతూ.. అతడు ముస్లిం కాదని, హిందూ కుటంబానికి చెందిన యువకుడని స్పష్టం చేసింది. అందరూ అనుకుంటున్నట్లు అతడు తన బాల్య స్నేహితుడు కాదని క్లారిటీ ఇచ్చింది. అయితే, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనంటూ క్లూ ఇచ్చింది. అతను ఒక కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడని చెప్పింది. తాము ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ఒక టీమ్‌లా ముందుకు వెళ్తున్నట్లు మాట్లాడింది. కొంత కాలంగా తనలోని డ్యాన్స్, ర్యాప్‌లో వచ్చిన మార్పులకు అతనే కారణమని ఫరియా గుర్తుచేసుకుంది. తమ మధ్య ఉండే బంధం లవ్ అఫైర్‌ కాదని అదొక అనుబంధం అంటూ తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి చెప్పింది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)

Tumbbad Director Movie Mayasabha The Hall of Illusion Trailer Out Now7
ఏడేళ్ల తర్వాత 'తుంబాడ్' దర్శకుడి కొత్త సినిమా.. గూస్‌ బంప్స్‌ ట్రైలర్‌

'తుంబాడ్' సినిమాతో దర్శకుడు రాహి అనిల్‌ బార్వే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. సుమారు ఏడేళ్ల తర్వాత ఆయన డైరెక్ట్‌ చేసిన మరో సినిమా మయసభ.. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జావేద్ జాఫేరీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వీణా జామ్కర్, దీపక్ దామ్లే, మహమ్మద్ సమద్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఓ దర్శకుడి జీవితం ఆధారంగా ఈ మూవీని తీసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'మయసభ: ది హాల్ ఆఫ్ ఇల్యూజన్’ (Mayasabha: The Hall Of Illusion)' చిత్రాన్ని పికల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్పిస్తుండ‌గా.. జిర్కాన్ ఫిల్మ్స్ పీ లిమిటెడ్ నిర్మిస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. బంగారం కోసం వేట.. అందులో దాగిన రహస్యంతో పాటు భ్రమలతో కూడిన ఓ కొత్త ప్రపంచాన్ని ఇందులో చూపించనున్నారు. ఒక థియేటర్‌లో టన్నుల కొద్ది బంగారం దాచి మరిచిపోయారనే ఆసక్తికర డైలాగ్స్‌ మెప్పించేలా ఉన్నాయి.

Rashmika Mandanna Comments On Sikandar Movie Result8
రష్మిక, మురగదాస్‌ ఇద్దరి మాట ఒక్కటే..

ఎవరైనా విజయాలను తమకు ఆపాదించుకోవడంలో ముందుంటారు. అపజయాలను ఇతరులపై నెడుతుంటారు. ఇది సహజం. అపజయాలకు బాధ్యత వహించేవారు చాలా తక్కువనే చెప్పాలి. ఆ మధ్య సల్మాన్‌ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన హిందీ చిత్రం సికిందర్‌. తమిళ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై పూర్తిగా నిరాశ పరచింది. దీంతో ఈ చిత్రం ఫ్లాప్‌పై దర్శకుడు మురుగదాస్‌ స్పందిస్తూ ఉత్తరాదిలో సల్మాన్‌ఖాన్‌ బెదిరింపులను ఏదుర్కొంటున్న కారణంగా షూటింగ్‌ను పగలు చేయడం సాధ్యం కాక పగలు చిత్రీకరించాల్సిన సన్నివేశాలను కూడా రాత్రి వేళల్లో చేయాల్సి వచ్చిందని చెప్పారు. సల్మాన్‌ఖాన్‌ షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చేవారు అని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. సికిందర్‌ డిజాస్టర్‌లో తన పాత్ర లేదని కూడా చెప్పారు. దీంతో సల్మాన్‌ అభిమానులు దర్శకుడు మురుగదాస్‌పై విమర్శల దాడి చేశారు. సల్మాన్‌ఖాన్‌ కూడా మురుగదాస్‌ వ్యాఖ్యలకు పరోక్షంగా గట్టిగానే బదులిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్నా ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సికిందర్‌ కథను దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ తనకు చెప్పినప్పుడు బాగుందని. అయితే షూటింగ్‌లో వేరే విధంగా మారిపోయిందని పేర్కొన్నారు. ఆ చిత్ర అపజయంలో తన బాధ్యత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కాగా హిందీలో మంచి సక్సెస్‌లో ఉన్న రష్మిక మందన్నాకు సికిందర్‌ చిత్రం పూర్తిగా నిరాశపరిచందన్నది గమనార్హం. మొత్తం మీద సికిందర్‌ చిత్రం విడుదలై చాలా కాలం అయినా, దాని గురించి రచ్చ ఇంకా జరుగుతూనే ఉందన్నది గమనార్హం.

Tollywood Sankranthi Box Office Hit But next 2 Months Have No Big movies9
తర్వాతి రెండు నెలలు డ్రై?

2026 సంవత్సరానికి టాలీవుడ్ ఘనంగా శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళకళలాడాయి. ఒక్క సినిమా తప్ప మిగతావన్నీ క్లిక్ అవ్వడం సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన శుభారంభం. ప్రేక్షకులు కూడా ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే సంక్రాంతి ఊపు కొనసాగించాల్సిన సమయంలో షెడ్యూల్‌లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా సైడ్ అవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. జనవరి చివరి వారాల్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమా లేదు. చిన్న సినిమాలే వరుసగా రావడం వల్ల బాక్సాఫీస్‌లో స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోంది. ఫిబ్రవరిలో పెద్ద సినిమా స్వయంభూ మాత్రమే కనిపిస్తోంది. కానీ ఈ సినిమా విడుదల తేదీపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. వాయిదా పడుతుందేమో అనే వార్తలు రోజురోజుకు బలపడుతున్నాయి. స్వయంభూ వాయిదా పడితే ఫిబ్రవరిలో మరో పెద్ద సినిమా లేదు. మార్చి నుంచి మళ్లీ పెద్ద సినిమాల హవా మొదలవుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మార్చి కూడా డ్రైగానే ముగిసేలా ఉంది. ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడినట్టే. పెద్ది సినిమా కూడా బాలీవుడ్ పోటీ కారణంగా తటపటాయిస్తోంది. కొంతమంది మాత్రం పెద్ది కూడా వాయిదా పడుతుందని అంటున్నారు. కానీ చెప్పలేం ఏం జరుగుతుందో చూడాలి.ఒకవేళ మార్చిలో పెద్ది కూడా వాయిదా పడితే డెకాయిట్ తప్ప మరో పెద్ద సినిమా లేకపోవడం ఖాయం. దీంతో మొత్తం పరిస్థితి టాక్సిక్ సినిమాకే దారిచ్చినట్టవుతుంది. రాబోయే రెండు నెలలు పెద్ద సినిమాల లేని డ్రై సీజన్‌గా మారే అవకాశం ఉంది. ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.కానీ విడుదలల అనిశ్చితి వల్ల ఆ ఉత్సాహం తగ్గిపోయే అవకాశం ఉంది.

Tollywood actresses daily Social Media Updates goes viral10
కొత్త లోకా బ్యూటీ ఢిల్లీ టూర్.. కృతి శెట్టి గ్లామరస్ లుక్..!

కొత్త లోకా బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ఢిల్లీ టూర్..స్టైలిష్ డ్రెస్‌లో శ్వేతా మీనన్ గ్లామరస్ లుక్స్..బాలీవుడ్ భామ కుబ్రా సైత్ డిఫరెంట్ లుక్..ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గ్లామరస్‌ పోజులు..కలర్‌ఫుల్ డ్రెస్‌లో హీరోయిన్ కీర్తి సురేశ్‌.. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Shwetha Menon (@shwetha_menon) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Advertisement
Advertisement