Tollywood
-
ప్రేరణకు కలిసొచ్చిన లక్.. టాప్ 5పై గెలవని సీరియల్ బ్యాచ్
మరో ఐదు రోజుల్లో కంటెస్టెంట్లు ఉండరు, బిగ్‌బాస్ హౌసూ ఉండదు. ఉన్న నాలుగురోజులైనా టాప్ 5 కంటెస్టెంట్లను, వారి జర్నీని, బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామంటే బిగ్‌బాస్ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. వరుసపెట్టి సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూనే ఉన్నాడు. సీరియల్స్ ప్రమోషన్ జరిపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజెవరొచ్చారో నేటి (డిసెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సీరియల్ బ్యాచ్‌పై గెలుపువంటలక్క సీరియల్ టీమ్ హౌస్‌లోకి వచ్చింది. వీరితో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడి గెలిచారు. దీంతో బిగ్‌బాస్ రూ.10,928 ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు. తర్వాత మగువ.. ఓ మగువ సీరియల్ టీమ్ హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసింది. అప్పుడు కూడా అవినాష్ తన కామెడీ యాంగిల్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అనంతరం అందరూ కలిసి ఓ ఫన్ గేమ్ ఆడారు. ప్రేరణ నోటికి తాళంమ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఒకరి చేతిలోని బాక్స్‌ను మరొకిరి ఇస్తూ పోవాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో అయితే ఆ బాక్స్ ఉంటుందో దాన్ని తెరిచి అందులో ఏది రాసుంటే అది ఫాలో అయిపోవాలి. అలా మొదటగా ప్రేరణ చేతిలో బాక్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయింది. అందులో గేమ్ అయిపోయేవరకు ప్రేరణ నోరు తెరవకూడదని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని ఉంది. దెబ్బలు తిన్నాడ్రోయ్రెండో రౌండ్లో అవినాష్ వంతురాగా.. తనకు ఇచ్చిన టాస్క్ ప్రకారం అందరిపై ఫేక్ పొగడ్తలు కురిపించాడు. తర్వాత నిఖిల్ మార్నింగ్ పనులను డ్యాన్స్ రూపంలో చేయగా.. నబీల్ రెండు పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తిన్నాడు. చివర్లో అవినాష్ అందరితో దెబ్బలు తిన్నాడు. అనంతరం మగువ ఓ మగువ టీమ్‌తో ప్రేరణ, గౌతమ్ టాస్క్ ఆడి రూ.10,0010 గెలిచారు.ప్రేరణకు కలిసొచ్చిన అదృష్టంబీబీ పరివారంపై మా పరివారం ఇప్పటివరకు ఒక్క టాస్క్ గెలిచిందే లేదు! మరి రేపటి ఎపిసోడ్లో అయినా ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి! అలాగే వచ్చిన అందరూ.. హౌస్‌లో ఒక్క అమ్మాయే ఉందంటూ ప్రతి గేమ్‌లోనూ తననే సెలక్ట్ చేసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకుంటోంది ప్రేరణ. ఈ టాస్కుల్లో తన కష్టాన్ని చూసి ప్రేరణకు మరిన్ని ఓట్లు పడే అవకాశం లేకపోలేదు. -
కలియుగమ్ 2064.. వచ్చే నెలలోనే రిలీజ్
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064’’. ఆర్కే ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరిలో విడుదలకు సిద్ధం కానుంది. అసలే కలియుగమ్.. ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకబోతున్నారు? ఎలా చావబోతున్నారు? అనే అంశాలతో ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది.తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఇటీవల విడుదల చేశారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీలో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే దక్షిణాది భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్ర పోషించారు.ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ నార్వేలో చేశారు. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్‌కు చాలా అవసరమని, ఇది యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని, త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత కె.ఎస్.రామకృష్ణ తెలిపారు. -
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగ్గా ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు.నిర్లక్ష్యం!అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్న విషయాన్ని పోలీసులకు ముందుగా తెలియజేయడంలో అలసత్వం వహించడంతోపాటు భద్రత విషయంలోనూ నిర్లక్ష్యం వహించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బన్నీ.. తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.చదవండి: బాక్సాఫీస్ బాద్షాగా పుష్పరాజ్.. ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు -
బాక్సాఫీస్ బాద్షాగా పుష్పరాజ్.. ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు దాటేశాడు!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ సునామీ కొనసాగుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.(ఇది చదవండి: 'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ)తొలిరోజు రూ.294 కోట్లతో మొదలైన పుష్ప ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతోంది. హిందీలో ఏ బాలీవుడ్ చిత్రం సాధించిన రికార్డులు సృష్టిస్తోంది. భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్‌లో ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హిందీ చిత్రంగా పుష్ప -2 రికార్డులకెక్కింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.375 కోట్లు కలెక్ట్ చేసిన తొలి నాన్ హిందీ చిత్రంగా నిలిచింది. THE BIGGEST INDIAN FILM rewrites history at the box office 💥💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to cross 1000 CRORES GROSS WORLDWIDE in 6 days ❤🔥#PUSHPA2HitsFastest1000CrSukumar redefines commercial cinema 🔥Book your tickets now!🎟️… pic.twitter.com/c3Z6P5IiYY— Pushpa (@PushpaMovie) December 11, 2024 -
డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి.. యూట్యూబ్‌లో మార్మోగుతున్న సాంగ్
జయతి.. ఒకప్పుడు జెమినీ మ్యూజిక్‌లో వెన్నెల అనే షో ద్వారా వీడియో జాకీగా అలరించిన ఈమెకు అప్పట్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విపరీతమైన ఫాలోయింగ్ మాత్రమే కాదు, ఆంధ్ర మాధురి దీక్షిత్‌లా ఉందంటూ ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుండేవారు. వీడియో జాకీగా పనిచేసిన తర్వాత ఆ అమ్మడు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిర్మాతగా! తన సొంత నిర్మాణ సంస్థలో, లచ్చి అనే హారర్ కామెడీ జానర్ సినిమాను నిర్మిస్తూ అదే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది.ఆల్బమ్ సాంగ్స్అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తోంది. తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి అనే ఒక ఆల్బమ్ సాంగ్‌తో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు అందుకుంది. నివృతి వైబ్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజైన ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ ఫోక్ సాంగ్‌లో జయతి తనదైన శైలిలో ఆకట్టుకుంది. బిగ్‌బాస్ ఫేమ్ భోలె షావళి సంగీతం అందించిన ఈ పాటకు వరం ఆలపించాడు. -
Akhanda 2 Release Date: బాలయ్య యాక్షన్ తాండవం.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు అఖండ-2 తాండవం పేరుతో ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఇందులో బాలయ్య యాక్షన్ ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. The protector of Dharma will rage a powerful battle 🔱#Akhanda2 - Thaandavam shoot begins 💥💥Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥▶️ https://t.co/l2WnhFjwRj'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/oZeJPHNwQR— 14 Reels Plus (@14ReelsPlus) December 11, 2024 -
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’
శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించనున్నారు. మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. -
అలాంటి పాత్రలు చేయాలని ఉంది: అమృత అయ్యర్
డ్రీమ్ గర్ల్, క్వీన్, ప్రిన్సెస్ లాంటి పాత్రలు వస్తే చేయాలని ఉంది అంటోంది ‘హను-మాన్’ ఫైం అమృత అయ్యర్. అల్లరి నరేశ్, అమృత జంటగా నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అమృత అయ్యర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ హనుమాన్ షూట్ చేస్తున్నపుడు బచ్చల మల్లి కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో క్యారెక్టర్ కి కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది.→ 80లలో జరిగిఏ కథ ఇది. నాది సిటీ కల్చర్ ఉన్న టౌన్ అమ్మాయి పాత్ర. తను చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, నరేష్ గారి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వున్నాయి. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది.→ నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎలాంటి ఎమోషనైనా పండించగలరు. అన్ స్క్రీన్ అగ్రీసివ్ క్యారెక్టర్ వుంటుంది. కానీ అఫ్ స్క్రీన్ ఆయన చాలా సాఫ్ట్ పర్శన్. చాలా ఫ్రెండ్లీ. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.→ మీనింగ్ ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనేదే నా ఆలోచన. బచ్చలమల్లి లో కూడా చాలా మంచి పాత్ర. చాలా మంచి ఎమోషన్స్, కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది. → సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్. చాలా ఫోకస్ గా ఉంటారు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా తీశారు. బచ్చల మల్లి ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.→ ఓ కన్నడ, తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నాను. -
పెళ్లి డేట్ ప్రకటించిన సోనియా.. నాగార్జునకు ఆహ్వానం
బిగ్‌బాస్ షో వల్ల కంటెస్టెంట్ల కెరీర్ ముందుకెళ్తుందో, లేదో కానీ జనాల్లో పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. అయితే పాజిటివ్ కంటే నెగెటివ్ పబ్లిసిటీ మూటగట్టుకున్నవారే ఎక్కువ. ఆ జాబితాలోకి సోనియా ఆకుల వస్తుంది.దూకుడుకు చెక్మంథనికి చెందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పాల్గొంది. హౌస్‌లో అందరికంటే స్ట్రాంగ్ అనుకున్న నిఖిల్‌తో మొదట తలపడింది. కానీ కొద్దిరోజుల్లోనే అతడిని గుప్పిట్లో పెట్టుకుంది. అయితే అతడితో ప్రవర్తించిన తీరు కూడా జనాలకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఆమెను త్వరగానే ఎలిమినేట్ చేశారు.పెళ్లికి రెడీఇకపోతే సోనియా ఆకుల పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు యష్‌తో ఏడడుగులు వేసేందుకు ఆత్రంగా ఎదురుచూస్తోంది. గత నెలలో వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా ఇటీవలే పెళ్లిపత్రికలు కూడా అచ్చు వేయించారు. డిసెంబర్ 21న మధ్యాహ్నం 3.40 గంటలకు తమ వివాహం జరగనుందని తెలియజేస్తూ సోనియా సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే రిసెప్షన్ మాత్రం పెళ్లికి ఒకరోజు ముందే ప్లాన్ చేసినట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మంచు మనోజ్‌పై దాడి ఘటన.. ఒకరి అరెస్ట్
మంచు మనోజ్‌పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి సమయంలో కిరణ్ కుమార్ సీసీ ఫుటేజ్ మాయం చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు.కాగా.. రెండు రోజుల క్రితం మొదలైన ఫ్యామిలీ గొడవ మరింత ముదిరింది. మంచు మనోజ్‌ను జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తర్వాత మనోజ్ గేట్ బద్దలు కొట్టుకుని ఇంటిలోపలికి వెళ్లారు. ఈ గొడవ మరింత ముదరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచు విష్ణు, మోహన్ బాబు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.(ఇది చదవండి: హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!)మోహన్ బాబుకు ఊరట..మరోవైపు హైకోర్టులో మంచు మోహన్‌బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్‌బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది. మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
2025లో ప్రేమించే భాగస్వామి, సంతానం కూడా! సామ్ పోస్ట్ వైరల్
కాలం పరుగులు పెడుతూనే ఉంది. 2024 మొన్నే ప్రారంభమైందనుకులోపే ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లోనే 2025 ప్రారంభం కానుంది. అయితే వచ్చే ఏడాది తన రాశికి ఎలా ఉంటుందో చెబుతూ సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది. వృషభం, కన్య, మకరం.. ఇలా మూడు రాశులవారి గురించి రాసుంది.రాశిఫలాలుఅందులో ఏమని ఉందంటే.. ఏడాదంతా బిజీగా ఉంటారు. మీ వృత్తి జీవితంలో ఎదుగుల చూస్తారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ప్రేమ, విధేయత చూపించే భాగస్వామి దొరుకుతాడు. ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలు పొందుతారు. శారీరక, మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి అని రాసుంది.కొత్త లైఫ్?ఇందులో చాలావరకు పాజిటివ్ అంశాలే ఉన్నాయి. మరి సమంత విషయంలో ఇందులో ఎన్ని నిజమవుతాయో చూడాలి! కాగా సామ్‌తో విడిపోయిన నాగచైతన్య ఇటీవలే శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నాడు. సామ్ కూడా గతాన్ని శాశ్వతంగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: Bigg Boss 8 : గౌతమ్ హిస్టరీ క్రియేట్ చేసేనా? -
మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం.. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్!
మంచు ఫ్యామిలీ గొడవ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం మొదలైన వివాదం చివరికీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే మంగళవారం మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. మంచు మనోజ్ దంపతులను లోపలికి రాకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు.అయితే మంచు ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం ముంబయిలో ఉన్నారు. గొడవ విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే.. తాజాగా ఆమె చేసిన పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా తన కూతురి వీడియోను పోస్ట్ చేస్తూ పీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఈ పోస్ట్‌పై నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్‌ను చూస్తే శాంతించండి అంటూ ఇన్‌డైరెక్ట్‌గా మంచు లక్ష్మి సలహా ఇచ్చినట్లు అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
బన్నీ నటనకు కళ్లు తిప్పుకోలేకపోయా: విక్టరీ వెంకటేశ్
అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అధ్బుతమైన ప్రదర్శన చేశారని కొనయాడారు. అల్లు అర్జున్ నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయానని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు.పుష్ప-2లో హీరోయిన్ రష్మిక అసాధారణ ప్రదర్శన చేసినందని వెంకటేశ్ ప్రశంసించారు. గొప్ప విజయం సాధించిన సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ పుష్ప-2 పోస్టర్‌ను పంచుకున్నారు. అస్సలు తగ్గేదేలే అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.(ఇది చదవండి: 'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ)కాగా.. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.922 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. తొలి రోజు పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. రూ.294 కోట్లతో మొదలైన వసూళ్ల పర్వం అదేస్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటికే నార్త్‌లోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది పుష్ప-2. తొలిరోజే అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హిందీ సినిమాగా పుష్ప-2 సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. A thunderous and unforgettable performance @alluarjun!! Couldn't take my eyes off you on the screen ❤️❤️ So happy to see everyone celebrating the movie across the country! @iamRashmika you were phenomenal. Congratulations to #Sukumar @ThisIsDSP and the entire team of… pic.twitter.com/VcMxG5oLBA— Venkatesh Daggubati (@VenkyMama) December 11, 2024 -
హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!
హైకోర్టులో మంచు మోహన్‌బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్‌బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది. మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.కాలి నొప్పితో బాధపడుతున్న మోహన్ బాబుఅనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన మెడ, కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గురునాథ్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతు ఇదే విషయాన్ని చెప్పారు. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. -
Bigg Boss 8 : గౌతమ్ హిస్టరీ క్రియేట్ చేసేనా?
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ పోకిరిలో పూరీ రాసిన డైలాగ్ బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణకి బాగా సరిపోతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టినా.. తనదైన ఆటతీరుతో ముందు నుంచి ఉన్నవాళ్లను పక్కకి నెట్టి తన గ్రాఫ్‌ని పెంచుకున్నాడు. తనకు ఉన్న షార్ట్ టెంపర్‌కి మహా అయితే రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేడులే అనుకున్న వాళ్ల అంచనాలను తారుమారు చేస్తూ..టాప్ 5లోకి వచ్చేశాడు. అంతేకాదు సీజన్ 8 విన్నర్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో గౌతమ్ ఉండడం గమనార్హం.ఈ సీజన్లో టాప్ 5లోకి అవినాష్, నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్ చేరుకున్నారు. అయితే పోటీ మాత్రం నిఖిల్-గౌతమ్ మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా ఇద్దరి మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు నిఖిల్ పై స్థాయిలో ఉంటే..ఇప్పుడు మాత్రం గౌతమ్ టాప్ 1లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పలు వెబ్సైట్లు పెట్టిన పోలింగ్‌లోనూ విన్నర్ గౌతమే అని తేలుతోంది. ఈ సారి తెలుగు వాడే విన్నర్ అవుతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతుంది. తెలుగు వాడిని విన్నర్ చేయండి అంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు.Gautham nuvvu eliminated ane situation nunchi Gautham is the winner ane situation ki tisukoni vachadu💪🔥🔥This Is The Most Inspirational Journey In The Entire BB History💥🥵🥵🤙 #GauthamVote For Gautham Win🏆🏆😍#BiggBosTelugu8 #GauthamKrishna 🏆#VoteforGauthamKrishna pic.twitter.com/fmnRQBu22O— S.Harsha Vardhan (@Harsha3633) December 9, 2024కన్నడ వెర్సస్ తెలుగుబిగ్‌బాస్ షోలో ఈ సారి కంటెస్టెంట్స్ రెండు రకాలుగా విడిపోయారు. నిఖిల్, పృథ్వి, యష్మి కలిసి ఆడడంతో వాళ్లను కన్నడ బ్యాచ్‌గా, మిగతవారిని తెలుగు బ్యాచ్‌గా కంటెస్టెంట్స్‌తో పాటు వీక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇదంతా వైల్డ్ కార్టు ఎంట్రీ తర్వాతే జరిగింది. నిఖిల్, పృథ్వి, యష్మి కలిసి గేమ్ అడుతున్నారనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో గౌతమ్ సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో హోస్ట్ నాగార్జునతో కూడా వాగ్వాదానికి దిగడం గౌతమ్‌కి కలిసొచ్చింది.హిస్టరీ క్రియేట్ చేసేనా?వాస్తవానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఎంత బాగా ఆడినా..ఓటింగ్‌కి వచ్చేసరికి వెనుకబడిపోతారు. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం ప్రతి వారం నామినేషన్స్‌లో ఉన్నా.. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులు మనసులు గెలుచుకున్నాడు. గతంలో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు టాప్ 5లోకి చేరారు కానీ విన్నర్‌గా నిలవలేదు. ఆడియన్స్‌తో కూడా వాళ్లు విన్నర్ అవుతారని భావించలేదు. కానీ ఈ సారి మాత్రం విన్నర్ రేసులో గౌతమ్ పేరు బలంగా వినిపిస్తుంది. మరోవైపు నిఖిల్ కూడా విన్నర్ రేసులో ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయనకు కూడా భారీగా మద్దతు లభిస్తోంది. కానీ గత రెండు రోజులుగా గౌతమ్‌కి మద్దతు పెరుగుతోంది. తెలుగు వాడిని విన్నర్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బిగ్‌బాస్ మాజీలు అఖిల్ సార్థక్, ఆర్జే కాజల్, సోహైల్‌తో పాటు మరికొంతమంది సీరియల్ నటీనటులు గౌతమ్‌కు ససోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. మరి సీజన్ 8 విన్నర్ ఎవరనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే. #GauthamKrishna inspired everyone by highlighting that life's ups and downs are natural, urging us to rise above challenges with courage and determination. Let’s make him the Bigg Boss winner🏆vote for Gautham!Missed call to 7997983717#BiggBossTelugu8 #Biggboss #gautham pic.twitter.com/aoeXOxj1fM— Gautham Krishna (@igauthamkrishna) December 11, 2024 -
అమ్మ ఇంట్లోనే ఉంది.. మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా: మనోజ్
రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరైన మంచు మనోజ్ కీలక విషయాలు వెల్లడించారు. తానెప్పుడూ ఆస్తులు అడగలేదని.. నాపై కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్పల్లిలోని మా ఇంట్లోనే అమ్మ ఉందని.. ఆస్పత్రికి వెళ్లలేదని.. ఈ విషయంపై అబద్ధాలు చెబుతున్నారని మనోజ్ తెలిపారు.కూర్చోని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు. సిపీని కలిసి జరిగిందంతా వివరించినట్లు తెలిపారు. నా వైపు నుంచి ఎలాంటి గొడవ జరగదని సీపీకి చెప్పినట్లు వివరించారు. మీడియా ప్రతినిధులపై దాడి జరగడం దురదృష్టకరమని.. నాన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నానని మనోజ్ అన్నారు. ఇవాళ సాయంత్రం ప్రెస్మీట్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.కాగా.. మంగళవార మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మనోజ్‌ను సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఫ్యామిలీలో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు గన్స్ సీజ్ చేశారు. అంతేకాకుండా సీపీ ముందు హాజరవ్వాలని మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. -
అత్యంత ఆదరణ కలిగిన చిత్రంగా టాలీవుడ్ మూవీ.. సెకండ్ ప్లేస్ ఏదంటే?
తాజాగా ఈ ఏడాది ఐఎండీబీ సినిమా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యంత ఆదరణ కలిగిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో శ్రద్ధకపూర్ సూపర్ హిట్ చిత్రం స్త్రీ-2 నిలవగా.. మూడోస్థానాన్ని విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం దక్కించుకుంది.ఆ తర్వాత స్థానాల్లో వరుసగా.. అక్షయ్ కుమార్ సైతాన్, హృతిక్ రోషన్ ఫైటర్, మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్, బాలీవుడ్ మూవీ భూల్ భూలయ్యా-3, కిల్, సింగం ఏగైన్, లపట్టా లేడీస్ ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే మొదటిస్థానంలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్ నిలిచింది. ఈ జాబితాను ప్రకటిస్తూ ఐఎండీబీ పోస్టర్స్‌ను విడుదల చేసింది.కాగా.. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించారు.Presenting the Most Popular Indian Movies of 2024 that captured your hearts and kept you coming back for more! 💛📍Of all the movies released in India between January 1 and November 25, 2024, that have an average IMDb user rating of 5 or higher, these 10 titles were… pic.twitter.com/aP8nYcQuvO— IMDb India (@IMDb_in) December 11, 2024 ఐఎండీబీ టాప్-10 చిత్రాలు- 20241.కల్కి 2898 ఏడీ2.స్త్రీ-23.మహారాజా4.సైతాన్5.ఫైటర్6. మంజుమ్మెల్ బాయ్స్7.భూల్ భూలయ్యా-38.కిల్9.సింగం ఏగైన్10. లపట్టా లేడీస్టాప్-10 వెబ్ సిరీస్‌లు ఇవే..1. హీరామండి ది డైమండ్ బజార్2. మీర్జాపూర్ సీజన్-33.పంచాయత్ సీజన్-34.గ్యారాహ్ గ్యారాహ్5. సిటాడెల్ హనీ బన్నీ6.మామ్లా లీగల్ హ7.తాజా ఖబర్ సీజన్-28. మర్డర్ ఇన్ మహిమ్9. శేఖర్ హోమ్10.ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో -
'మంచు' ఫ్యామిలీలో గొడవ.. తొలిసారి స్పందించిన విష్ణు
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. చిన్నకొడుకు మనోజ్.. తండ్రిపై కేసు పెట్టడం, మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి తలుపులు తోసుకుని మరీ లోపలికి వెళ్లడం.. ఈ క్రమంలో జర్నలిస్టులతో మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించడం. కాసేపటికే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి.(ఇదీ చదవండి: నటుడు మోహన్ బాబు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)ప్రస్తుతానికి మీడియాలో మనోజ్ కనిపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు మాత్రం ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు తమ కుటుంబంలో జరుగుతున్న రచ్చపై మంచు విష్ణు స్పందించాడు. తండ్రికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచే మీడియాతో మాట్లాడాడు. ఇలాంటి పరిస్థితి తన కుటుంబానికి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.(చదవండి: ఆ విషయంలో సీపీకి హామీ ఇచ్చా: మంచు మనోజ్)'ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని ఊహించలేదు. మూడు తరాలుగా నాన్నగారు ఏంటనేది మీకు తెలుసు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సాధారణమే. అవి పరిష్కారమవుతాయని పెద్దలు కోరుకుంటారు. నేను ఎమోషనల్ పెయిన్‌ఫుల్‌గా ఉన్నాను. మా నాన్న చేసిన తప్పు మమల్ని విపరీతంగా ప్రేమించటం. మీడియా వారు.. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు''మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు తగిలాయి. లాస్ ఏంజెల్స్‌లో 'కన్నప్ప' మూవీ పనుల్లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసింది. దీంతో అన్నీ వదిలి వచ్చేశాను. మీడియా వ్యకికి గాయాలు తగలటం బాధాకరం. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు. మోహం మీద ఏదో పెట్టారని.. అలా జరిగిపోయింది. గాయమైన వ్యక్తి కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. పోలీసులు మా కంటే ముందు మీడియాకు లీక్ ఇస్తున్నారు. నోటీసులు ఈ రోజు 9:30కి జారీ చేశారు. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను'(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)'మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు. నాకు కలవాల్సిన అవసరం లేదు. కానీ వారిని గౌరవించి కలుస్తాను. ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేదేం లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. తమ్ముడు పెళ్లి శుభకార్యం.. బిడ్డను కన్నారు. దాని గురించి ఎవరు ఫీలవరు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయంకృషితో గొప్ప స్దాయికి ఎదిగారు. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి''మీడియాలో కొందరు హద్దు మీరుతున్నారు. పబ్లిక్ ఫిగర్స్‌పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత. లోపల తండ్రి స్దాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా? మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్ వాల్వ్మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ దాకా సమయం ఇస్తున్నాం. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చెస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. కాలమే అన్నింటికీ సమాధానాలు ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు' అని విష్ణు తన ఆవేదనని బయటపెట్టారు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
నటుడు మోహన్ బాబు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
మంచు ఫ్యామిలీలో గత రెండు రోజులుగా వివాదం నడుస్తోంది. తండ్రి కొడుకు.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం వరకు వచ్చింది. మంగళవారం రాత్రి ఇంటి దగ్గరకొచ్చి మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిచేయడం పెద్ద వివాదమైంది. ఈ క్రమంలోనే 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద ఈయనపై కేసు కూడా నమోదైంది. ఇదంతా పక్కనబెడితే రాత్రే మోహన్ బాబు ఆస్పత్రిలో కూడా చేరారు. ఇంతకీ ఈయన ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? డాక్టర్స్ ఏం చెబుతున్నారు?అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఏమైందా అని అందరూ అనుకున్నారు. వైద్యుల ఏం చెబుతున్నారంటే.. 'విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన స్థితిలో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఎడమ కంటి కింద గాయమైంది. బీపీ, రక్తపోటు కూడా పెరిగాయి. నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి' అని చెప్పారు.(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)మోహన్ బాబుకి ప్రస్తుతం చికిత్స చేస్తున్న డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.మరోవైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్‌ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండటంతో ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
మా నాన్న దేవుడు: మంచు మనోజ్
సాక్షి, హైదరాబాద్: మీడియా మిత్రులపై మా నాన్న(మంచు మోహన్‌బాబు) దాడి చేయడం బాధాకరమని, ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు మంచు మనోజ్. మీడియాపై మోహన్‌బాబు చేసిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు. తన కోసం వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేయడం దారుణమన్నారు. తనపై మోహన్‌బాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నేను ఆస్తుల కోసం ఏ రోజు కూడా గొడవ చేయలేదు. నా సొంత కాళ్లపై నిలబడుతున్నాను. నేను మద్యానికి బానిసై కొడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్న దేవుడు.. ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. మా బంధువులపై దాడి చేశారు. నా భార్య, ఏడు నెలల పాపను గొడవలోకి లాగుతున్నారు. ఈ గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది. ఇన్ని రోజులు ఆగాను.. ఇక ఆగలేను. అసలేం జరిగింది? గొడవ దేనికోసం అనేది ఈ రోజు(డిసెంబర్ 11) సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను’ అని మంచు మనోజ్ అన్నారు.(చదవండి: నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు)కాగా, సీనియర్ నటుడు మోహన్‌బాబు ఫ్యామిలీ గొడవలు మంగళవారం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి వరకు హైడ్రామా నడిచింది. మంచు విష్ణు, మనోజ్‌ల బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలతో ‘మంచు టౌన్’హీటెక్కింది. ఈ గొడవను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు. -
సినిమా అంటే సినిమా అంతే: ఎమ్మెల్సీ మల్లన్న
‘‘చిన్న సినిమా? పెద్ద సినిమా? అనే తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. సినిమా అంటే సినిమా అంతే. ‘ప్రణయ గోదారి’ టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్, సాంగ్స్ కూడా బాగా నచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా, సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పీఎల్వీ క్రియేషన్స్‌పై పారమళ్ల లింగయ్య నిర్మించారు. ఈ నెల 13న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎమ్మెల్సీ మల్లన్న, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ అతిథులుగా హాజరయ్యారు. పీఎల్ విఘ్నేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నా ఆస్తులు అమ్మడంతో పాటు అప్పులు తెచ్చాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం సులభం కాదనే విషయం అర్థమైంది’’ అన్నారు. ‘ఓ చిన్న చిత్రం బయటకు రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో నాకు తెలుసు. డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రారు. పేరు కోసం ఇక్కడకు వస్తారు. లక్ వస్తే.. డబ్బులు కూడా వస్తాయి. ప్రణయ గోదారి టీంలో అందరూ కొత్త వాళ్లే. వారి కష్టాన్ని గుర్తించి థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి’అని సోహైల్ అన్నారు. -
రెండేళ్ల తర్వాత 'జాతిరత్నాలు' అనుదీప్ కొత్త సినిమా
'జాతిరత్నాలు' సినిమాతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' అనే మూవీ చేశాడు. ఇది అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. దీంతో అనుదీప్ మరో మూవీ చేయలేకపోయాడు. మధ్యలో 'మ్యాడ్', 'కల్కి' మూవీస్‌లో అతిథి పాత్రల్లో కనిపించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తన కొత్త మూవీని మొదలుపెట్టాడు.(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో అనుదీప్ సినిమా చేయబోతున్నాడు. బుధవారం లాంఛనంగా పూజా కార్యక్రమం జరిగింది. 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీస్తున్న మూవీకి 'ఫంకీ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలవ్వాలి. కానీ పలువురు నిర్మాతల దగ్గరకు వెళ్లారు కానీ ఎక్కడా సెట్ కాలేదు. చివరగా సితార సంస్థ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు లాంఛనంగా మొదలైంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ ఉండే అవకాశముంది. ప్రస్తుతం విశ్వక్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు.. శపథం చేసిన నిఖిల్
బిగ్‌బాస్ 8వ సీజన్ సెంచరీ కొట్టేసింది. అంటే 100 రోజులు పూర్తయ్యాయి అనమాట. ప్రస్తుతం ఫినాలే వీక్ నడుస్తోంది. దీంతో టాస్కులు, గేమ్స్ అని పెట్టుకోకుండా వారమంతా ఎమోషనల్‌గా ఉండేలా బిగ్‌బాస్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే స్టార్ మాలో సీరియల్స్ చేస్తున్న నటీనటులు హౌసులోకి వచ్చి సరదాగా అలా కాసేపు గడిపి, హౌస్‌మేట్స్‌తో ముచ్చటించి వెళ్తున్నారు. మంగళవారం ఎపిసోడ్‌లోనూ అలా దీప్తి, సుహాసిని, ఆకర్ష్ వచ్చారు. ఇంతకీ బిగ్‌బాస్‌లో 100వ రోజు ఏం జరిగింది?'మామగారు' సీరియల్ జంట ఆకర్ష్-సుహాసిని హౌసులోకి వచ్చారు. అలానే ఇద్దరూ హౌస్‌మేట్స్‌ని తమ తొలి ప్రేమ- బ్రేకప్ స్టోరీలు చెప్పాలని అడిగారు. దీంతో నిఖిల్-గౌతమ్ తమ భగ్న ప్రేమకథల్ని బయటపెట్టారు. తొలుత గౌతమ్ ఓపెన్ అయ్యాడు. కాలేజీలో ఉన్నప్పుడు నేను చాలా సీరియల్ రిలేషన్లో ఉన్నాను. పెళ్లి చేసుకుందామని ఫిక్సయ్యా. కొన్ని కారణాల వల్ల అనుకున్నది జరగలేదు. చాలా బాధపడ్డా, డిప్రెషన్లోకి వెళ్లిపోయా. అప్పుడు నా కుటుంబం అండగా నిలిచింది. ఇలాంటి కష్టమొచ్చినప్పుడే కుటుంబం విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండటానికి రాలేదు. అది గుర్తుపెట్టుకొని జీవితాన్ని జాలీగా గడిపేసుకుంటూ వెళ్లాలని అర్థం చేసుకున్నా అని గౌతమ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)తర్వాత నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నా తొలి బ్రేకప్ జరిగినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్లాను. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావడం, తొలి మూవీ పోస్టర్.. మా ఊరిలో నేను చదివిన కాలేజీ పక్కన థియేటర్ బయట కటౌట్ పెట్టడం, తర్వాత నేను గుర్తుకురావడంతో తను ఫోన్ చేసి క్షమాపణ చెప్పింది. సారీ మీరెవరో నాకు తెలీదు అని నేను ఆమెని బ్లాక్ చేశా అని నిఖిల్ చెప్పాడు. బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. పరోక్షంగా కావ్య గురించి చెప్పాడు.అందరి జీవితంలో బ్రేకప్ జరుగుతుంది. అయితే మనం చూడాల్సింది మనకేంటి అని కాదు, వదిలేసేటప్పుడు ఏం కారణం చెప్పారా అనేది ముఖ్యం. భవిష్యత్తులో నాకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కూడా కొందరు బ్రేకప్ చెప్పి వెళ్తారు. ఉదాహరణ చెప్పుకొంటే.. నా వల్ల నీకు ఏమైనా అవుతుందా అని నిన్ను వదిలేసి వెళ్తాను, నువ్వు హర్ట్ అవ్వకూడదని.. అలాంటి బ్రేకప్‌ని బ్రేకప్ చేసుకోకుండా సెట్ చేసి పక్కన నిల్చోబెట్టుకోవడమే మంచిది.. నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావోనని వదిలేసి వెళ్లడం.. ఈ జనరేషన్లో కరెక్ట్ అనుకోవడం లేదని నిఖిల్ చెప్పాడు. అయితే ఇదంతా కూడా కావ్యని ఉద్దేశించి చెప్పాడా అనిపించింది.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)తర్వాత 'బ్రహ్మముడి' కావ్య పాత్రధారి దీపిక వచ్చింది. వచ్చీ రాగానే తనదైన వెరైటీ స్టెప్పులు, తింగరి మాటలు, పిచ్చివాగుడుతో అందరి బుర్రలు తినేసింది. ఓ దశలో ఈమె దెబ్బకు బిగ్ బాస్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. మిగతా వాళ్ల సంగతేమో గానీ దీప్తి, నిఖిల్‌ని ఓ ప్రశ్న అడిగింది. దీనికి అతడు చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నీకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. గతంలో నువ్వంటే తనకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు కాదు. మీకు తన మీద ఇంకా ప్రేమ ఉంది, కానీ నువ్వు వద్దు నిన్ను పెళ్లి చేసుకోను అని చెబుతుంది అలా అని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోలేదు. మీ ఇంట్లోనూ పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నుంచి ప్రెజర్ వస్తుంది. అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తారా? లేకపోతే వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారా? అని దీప్తి, నిఖిల్‌ని అడిగింది.ప్రేమ ఉందంటే నేను నిజంగా ఎదురుచూస్తా, ఎన్ని ఏళ్లయినా కచ్చితంగా వెయిట్ చేస్తా, అమ్మవాళ్లు చెప్పిన సంబంధం చేసుకోను, నేను మూవ్ ఆన్ అవ్వలేను ఆ అమ్మాయిపైన ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటే కచ్చితంగా ఆమె కోసం ఎదురుచూస్తానని నిఖిల్ చెప్పాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: నా గుండెలపై తన్నావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్) -
జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు
కుటుంబ వివాదంలో సతమతమవుతున్న నటుడు మోహన్ బాబుకి మరో షాక్ తగిలింది. మోహన్ బాబు ఫ్యామిలీలో అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు మంగళవారం రాత్రి పలువురు జర్నలిస్టులు జల్పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ప్రశ్న అడిగేందుకు ఓ రిపోర్టర్ ప్రయత్నించగా.. అతడి దగ్గరున్న మైక్ లాక్కొని సదరు జర్నలిస్టుపైనే మోహన్ బాబు దాడి చేశాడు.(ఇదీ చదవండి: నా గుండెలపై తన్నావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్)ఈ దాడిలో సదరు జర్నలిస్టు తలపై కాస్త గట్టిగానే గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని.. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ దాడి విషయమై 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద.. మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.118 బీఎన్ఎస్ యాక్ట్ విషయానికొస్తే.. 2023 భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీనికి ప్రతిగా మూడేళ్ల జైలుశిక్ష లేదంటే రూ.20 వేల జరిమానా విధించొచ్చు. కొన్నిసార్లు రెండింటిని కూడా విధించే అవకాశముంది.మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవ దృష్ట్యా.. తమ దగ్గరున్న లైసెన్స్ గన్స్ సరెండర్ చేయాలని పోలీసులు.. మోహన్ బాబు, విష్ణు, మనోజ్లని ఆదేశించారు. అలానే బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!) -
హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఆస్తుల విషయమై చిన్న కొడుకు మంచు మనోజ్ రచ్చ చేస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి చూస్తే తొలుత మోహన్ బాబు-మనోజ్ ఒకరిని ఒకరు కొట్టుకున్నారని.. హైదరాబాద్‌లోని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారని న్యూస్ వచ్చింది. ఇదంతా పక్కనబెడితే మంగళవారం రాత్రి మాత్రం పెద్ద గొడవ జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం, గేట్ల మూసేసరికి వాటిని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.(ఇదీ చదవండి: 'నిన్నే బాగా చూసుకున్నా.. కానీ నా గుండెలపై తన్నావ్': మోహన్ బాబు ఆవేదన)మరోవైపు ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం, ఇది జరిగిన కాసేపటికి మనోజ్‌ని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఆడియో విడుదల చేయడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆడియోలో చెప్పినట్లు ఈ గొడవల వల్ల మోహన్ బాబు భార్య ఆస్పత్రిలో చేరింది. ఇప్పుడు ఈయన కూడా పలు అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో మోహన్ బాబు బాధపడుతున్నారు.ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు. మరి ఈ వివాదంలో బుధవారం ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే ఇద్దరి దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్స్ తమకు సరెండర్ చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు మోహన్ బాబుతో పాటు అతడి కొడుకుల్ని ఆదేశించారు.బీపీ ఎక్కువ కావటంతో మోహన్ బాబుకు అస్వస్థత.. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో మోహన్ బాబు pic.twitter.com/V0GHBVpSUJ— Telugu Scribe (@TeluguScribe) December 11, 2024(ఇదీ చదవండి: ముదిరిన మంచు ఫ్యామిలీ గొడవ.. పోలీసుల కీలక నిర్ణయం!)