
శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం కన్యాకుమారి. ఈ సినిమాకు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ట్రైలర్ చూస్తే బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ అవ్వాలనుకుంటున్న అమ్మాయి, ఊర్లోనే వ్యవసాయం చేసుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథే ఈ కన్యాకుమారి. ట్రైలర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. పక్కా గ్రామీణ ప్రేమకథ కావడంతో ప్రేమికులకు ఫుల్‌గా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.