Trailer
-
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' ట్రైలర్ విడుదల
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కూడా.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ ఇందులో కనిపించనున్నాడు. అయితే, ఆ సందను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. ఎక్కువ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. -
'మెకానిక్ రాకీ' 2.O ట్రైలర్.. భారీగానే ప్లాన్ చేసిన విశ్వక్
'మెకానిక్ రాకీ'గా విశ్వక్సేన్ వస్తున్నాడు. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించగా రామ్ తాళ్లూరి నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక ట్రైలర్ విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో 'మెకానిక్ రాకీ'కి మరింత బజ్ క్రియేట్ అయింది.మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. గతంలో విశ్వక్ చెప్పినట్లుగా సినిమా విడుదల సమయంలో మరో ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే తాజాగా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుండగా ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం కోసం విశ్వక్ భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. -
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి'
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. కేవలం వినిపించడమే కాదు..డైలాగ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఆదివారం పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. బన్నీ ఫ్యాన్స్ సందడి అయితే అంతా ఇంతా కాదు. ఏ నగరంలో చూసిన టపాసులు పేలుస్తూ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.అయితే ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప రాజ్.. మరో క్రేజీ రికార్డ్ నమోదు చేశాడు. బిహార్‌లో పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఏకంగా 2.6 లక్షల మంది లైవ్‌లో వీక్షించారు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డ్‌ను సాధించలేదు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పుష్ప టీమ్ ట్విటర్లో పంచుకుంది. దీంతో పుష్ప-2 రికార్డులు చూస్తుంటే ఏ ఇండియన్ సినిమాకు ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న పుష్ప-2 ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే. His arrival means one thing - the existing records tumble 💥💥#Pushpa2TheRuleTrailer launch event registers the highest number of live viewers for an event with 2.6 LAKH concurrent viewers❤🔥❤🔥#RecordBreakingPushpa2TRAILER 🌋🌋▶️ https://t.co/FKXAngle5q… pic.twitter.com/vuCpMypShD— Pushpa (@PushpaMovie) November 18, 2024 -
'పుష్ప 2' కోసం బన్నీ.. మెగా సపోర్ట్ ఎక్కడ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ రిలీజైంది. చివర్లో బన్నీ చెప్పిన డైలాగ్‌లా వైల్డ్ ఫైర్‌లా ఉంది. ట్రైలర్ సంగతి అటుంచండి. పాట్నాలో ఆదివారం సాయంత్రం ఈవెంట్ జరిగితే లక్షకు పైగా జనాలు వచ్చారు. ఏ మాత్రం ముఖపరిచయం లేని ఓ తెలుగు హీరో కోసం ఇంతమంది రావడం ఏంటా అని చాలామంది ఇప్పటికే షాక్‌లో ఉన్నారు. అయితే టాలీవుడ్ మాత్రం 'పుష్ప 2'ని సరిగా పట్టించుకోవట్లేదా అనిపిస్తుంది!'బాహుబలి' ముందు వరకు టాలీవుడ్ అంటే దేశంలో ఓ ఇండస్ట్రీ మాత్రమే. కానీ ఈ సినిమా దెబ్బకు దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మార్మోగిపోయింది. దీని తర్వాత 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' తదితర చిత్రాలతో ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయా సినిమాల రిలీజ్ టైంలో తెలుగు స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?)'పుష్ప 2' విషయానికొస్తే ట్రైలర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత నాగవంశీ, హీరో శర్వానంద్ లాంటి కొద్దిమంది తప్పితే టాలీవుడ్ నుంచి అనుకున్నంతగా సపోర్ట్ రావడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇప్పటివరకు ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయలేదు. దీన్నిబట్టే అర్థమవుతోంది 'పుష్ప 2' కోసం అందరూ ఉన్నా బన్నీ ఒంటరిగానే పోరాడుతున్నాడని!టాలీవుడ్ నుంచి అనుకున్నంత సపోర్ట్ రానంత మాత్రాన 'పుష్ప 2'కి వచ్చిన నష్టమేమి లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ దెబ్బకు రూ.1000 కోట్ల కలెక్షన్ అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం సౌత్‌లో ఏమో గానీ బాలీవుడ్, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం పూనకాలు గ్యారంటీ. (ఇదీ చదవండి: మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్) -
మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్
'పుష్ప 2' ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఏమో గానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెగ చూసేస్తున్నారు. ఎంతలా అంటే ఇప్పటివరకు టాలీవుడ్లో మహేశ్ బాబు, ప్రభాస్ సినిమాల ట్రైలర్స్ వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని అల్లు అర్జున్ ఇంకా సమయం ఉండగానే దాటేశాడు. సరికొత్త రికార్డ్ సృష్టించాడు.(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్)తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లలో 24 గంటల్లో ఎక్కుమంది చూసింది అయితే మహేశ్ 'గుంటూరు కారం' ట్రైలర్‌నే. 37.68 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ప్లేస్‌లో ప్రభాస్ సలార్ 32.58 మిలియన్ వ్యూస్‌తో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కేవలం 15 గంటల్లో అల్లు అర్జున్ దాటేశాడు. 'పుష్ప 2' తెలుగు వెర్షన్ ట్రైలర్ ఈ స్టోరీ రాసేటప్పటికే అంటే 15-16 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. 24 గంటలు పూర్తయ్యేసరికి ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి?ఇక ట్రైలర్ విషయానికొస్తే కథనేం పెద్దగా రివీల్ చేయలేదు. కానీ జాతర ఎపిసోడ్, పుష్పరాజ్‌కి ఎలివేషన్స్, భన్వర్ సింగ్ షెకావత్ సీన్లు చాలానే చూపించారు. పక్కా కమర్షియల్‌గా ట్రైలర్ కట్ చేశారు. 2:48 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ వైల్డ్ ఫైర్ అనేలా ఉంది. డిసెంబరు 5న థియేటర్లలో బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?) -
పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?
అనుకున్నట్లుగానే 'పుష్ప 2' ట్రైలర్ వైల్డ్ ఫైర్‌లా ఉంది. పెద్దగా కథ రివీల్ చేయలేదు గానీ మూవీ ఎంత గ్రాండియర్‌గా ఉండబోతుందనేది శాంపిల్ చూపించారు. తొలి భాగంలో ఉన్న చాలామంది యాక్టర్స్.. ట్రైలర్లో కనిపించారు. వీళ్లతో పాటు పలు కొత్త పాత్రలు కూడా కనిపించాయి. మిగతా వాళ్ల సంగతేమో గానీ అరగుండుతో ఓ పాత్ర కనిపించింది. ఇంతకీ ఈ నటుడు ఎవరబ్బా అని అందరూ బుర్ర గోక్కుంటున్నారు.ట్రైలర్లో అర గుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన నటుడి పేరు తారక్ పొన్నప్ప. స్వతహాగా కన్నడ నటుడు అయిన ఇతడు 'కేజీఎఫ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న 'దేవర'లోనూ విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకుగా నటించాడు. ఇప్పుడు 'పుష్ప 2'లోనూ కీలక పాత్ర పోషించినట్లే కనిపిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పుష్ప 2లో చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ మూవీ టర్న్ అయ్యే ట్విస్ట్ మాత్రమే కాదు. పుష్ప లైఫ్ మారిపోయే ట్విస్ట్ & టర్న్ తీసుకొస్తుంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ తారక్ పొన్నప్ప చేసిన రోల్ ఏంటనేది మూవీ రిలీజైతే గాని తెలియదు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)పాట్నాలో ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇదిప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఎందుకంటే లక్షకు పైగా జనాలు అల్లు అర్జున్‌ని చూడటానిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్) -
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది.
-
పుష్ప-2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. వేదిక ఎలా ఉందో చూశారా?
-
Pushpa 2: వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పుష్ప-2 ట్రైలర్ వచ్చేసింది
ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బిహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రిలీజైన మాస్ ట్రైలర్ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి.తాజాగా విడుదలైన ట్రైలర్లో బన్నీ డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్ అంటూ రష్మిక చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ బన్నీ అదరగొట్టేశాడు. అలాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. వైల్డ్ ఫైర్ అంటూ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. ఇక ట్రైలర్ చూస్తే బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే పూనకాలు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
మహేశ్ మేనల్లుడి సినిమా ట్రైలర్ రిలీజ్
'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. లెక్క ప్రకారం నవంబర్ 14నే మూవీ రిలీజ్ కావాలి. కానీ 'మట్కా', 'కంగువ'తో పోటీ ఎందుకులే అని వాయిదా వేసుకున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలో ఉన్నట్లే హీరో ఎంట్రీ, హీరోయిన్ వెనక పడటం, విలన్, చివరలో కృష్ణుడి రిఫరెన్స్.. ఇలా ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లే అన్ని ఎలిమెంట్స్ చూపించారు.'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. ట్రైలర్‌లోని ఎలివేష్ షాట్స్ చూస్తుంటే యాక్షన్ కూడా బాగానే దట్టించినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది కానీ కృష్ణుడి అనే స్టోరీ పాయింట్ ఈ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుకు మార్చారు. అంటే డిసెంబర్ 5న పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు.తాజాాగా పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు మేకర్స్. ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అల్లు అర్జున్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఆ రోజు సాయంత్రం 06 గంటల 03 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను బిహార్‌లో పాట్నాలో భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.కాగా.. పుష్ప-2లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా శ్రీవల్లిగా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పుష్ప పార్ట్-1 లాగే ఈ సినిమాలో ప్రత్యేక ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేశారు. పార్ట్-1లో సమంత ఫ్యాన్స్‌ను అలరించగా.. పుష్ప-2లో కన్నడ బ్యూటీ శ్రీలీల అభిమానులను మెప్పించనుంది. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. Dropping an EXPLOSIVE BANGER before the MASS festival begins in Cinemas ❤🔥Experience the MASSIVE #Pushpa2TheRuleTrailer on 17th November at 6:03 PM 🌋🌋With a Blasting Event at PATNA 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/nCFKC4kYA5— Pushpa (@PushpaMovie) November 11, 2024 -
'చీకటి కోన పులులన్నీ ఏకమై ఉరిమితే'.. కంగువా రిలీజ్ ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'కంగువా'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు మేకర్స్.తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దుబాయ్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈవెంట్లో సూర్యతో పాటు బాబీ డియోల్ సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌తో కంగువాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. ఈ మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: సూర్య 'కంగువా' రిలీజ్.. మేకర్స్ బిగ్ ప్లాన్!)కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
పుష్ప-2 కౌంట్ డౌన్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుకు మార్చారు. అంటే డిసెంబర్ 5న పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు.పుష్ప-2 విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండడంతో ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. నెల రోజుల్లోనే పుష్ప-2 రానుందంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా ట్రైలర్ త్వరలోనే పేలనుందంటూ హింట్ ఇచ్చారు. అయితే ట్రైలర్ రిలీజ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే ఈ నెలలోనే పుష్ప-2 ట్రైలర్ విడుదలయ్యే అవకాశముంది. కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉండగా.. వరుసగా మరిన్నీ అప్డేట్స్ ఇవ్వనున్నారు. (ఇది చదవండి: ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది)గ్రాండ్‌గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద ప్లానింగే వేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఈనెల 15న ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా బాహుబలి-2 తర్వాత అత్యధిక బజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. #Pushpa2TheRule TRAILER EXPLODING SOON 🌋🌋#1MonthToGoForPushpa2RAGE#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/DylHFYbItZ— Pushpa (@PushpaMovie) November 5, 2024 -
నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ రిలీజ్
'కార్తికేయ 2' మూవీతో నిఖిల్.. పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాడు. అలాంటిది ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే ఎంత హడావుడి ఉండాలి. కానీ అలాంటిదేం లేకుండా ఉన్నట్లుండి ఓ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' పేరుతో తీసిన ఈ చిత్రం నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ట్రైలర్ చూస్తుంటే యూకేలోనే మూవీ అంతా తీసినట్లు కనిపిస్తుంది. డివైజ్ కోసం ఓ గ్యాంగ్ అంతా వెతుకుంటారు. అసలు ఇందులో హీరో, అతడి ఫ్రెండ్ ఎలా ఇరుక్కున్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీ అనిపిస్తుంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటించారు. నిఖిల్‌తోనే 'స్వామి రారా', 'కేశవ' సినిమాలు తీసిన సుధీర్ వర్మ ఈ మూవీకి దర్శకుడు. చాలా ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ఇప్పుడు మూవీని రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!) -
'ధూం ధాం'గా హెబ్బా పటేల్ కొత్త సినిమా ట్రైలర్
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొత్త సినిమా 'ధూం ధాం'. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. నవంబర్ 8న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటకు సోషల్‌మీడియాలో మంచి గుర్తింపు దక్కింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
వరుణ్ తేజ్ 'మట్కా' ట్రైలర్ రిలీజ్
'మట్కా' మూవీ ట్రైలర్ రిలీజైంది. చాన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది. 'మట్కా' అనే గేమ్ నేపథ్య కథతో దీన్ని తెరకెక్కించారు. మూడు విభిన్న గెటప్స్‌లో వరుణ్ కనిపించాడు. వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: పవన్‌తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే?)నవంబర్ 14న థియేటర్లలోకి 'మట్కా' రానుంది. అదే రోజు సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువ' కూడా థియేటర్లలోకి రానుంది. అయితేనేం ట్రైలర్ చూస్తుంటే వర్కౌట్ అయ్యే బొమ్మలా అనిపిస్తుంది. ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన 'నాకు ఇక్కడ (మెదడు).. ఇక్కడ (గుండె)... ఇక్కడ (ఇంకా ఇంకా కిందకు) కంట్రోలు ఉంది కాబట్టే ఇలా వున్నాను' అనే డైలాగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. (ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య) -
Jithender Reddy Trailer: జగిత్యాల టైగర్ అంటారు.. పేరు జితేందర్ రెడ్డి!
‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ
థియేటర్లలో అంటే కమర్షియల్ అంశాలు ఉండాలి, లేదంటే ప్రేక్షకులు చూడరు అంటుంటారు. ఓటీటీలకు అలాంటి ఇబ్బందులేం ఉండవు. ఏం చెప్పాలి అనిపిస్తే అది చెప్పేయొచ్చు. బౌండరీలు ఉండవు. దీంతో అప్పుడప్పుడు కొన్ని మంచి కథలు వస్తుంటాయి. తాజాగా రిలీజైన 'విజయ్ 69' అనే హిందీ మూవీ ట్రైలర్ చూస్తుంటే అదే అనిపించింది. ఇంతకీ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ)బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'విజయ్ 69'. పేరుకి తగ్గట్లే 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ పూర్తి చేసి రికార్డ్ సాధించాలనేది ఇతడి కల. ఇందులో భాగంగా 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కి.మీ సైక్లింగ్, 10 కి.మీ రన్నింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ విజయ్‌ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్, ఇలా ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ చేసేవాళ్లే. కానీ కలలకు వయసుతో సంబంధం లేదు. చెప్పాలంటే వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదని చివరకు నిరూపిస్తాడు. ఇదే కాన్సెప్ట్.నవంబరు 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా ఉంది. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే దట్టించినట్లు ఉన్నారు. ప్రస్తుతానికి హిందీ మాత్రమే అని చెప్పారు కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేటప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఎమోషనల్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం దీన్ని మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
కిరణ్ అబ్బవరం 'క' ట్రైలర్ రిలీజ్
యువహీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. గురువారం ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల కుదరలేదు. దీంతో తాజాగా దాన్ని రిలీజ్ చేశారు. పూర్తి రిచ్‌నెస్‌తో థ్రిల్లింగ్‌గా భలే అనిపించింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ.గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'క' సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. సుజీత్-సందీప్ దర్శకులు. దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో థియేటర్లలో రిలీజ్ అవుతోంది.(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ట్రైలర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్,సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.'లక్కీ భాస్కర్' దీపావళి కానుకగా థియేటర్లోకి రానున్నాడు. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రమని వారు చెప్పుకొచ్చారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ప్రశాంత్ నీల్ కథతో సినిమా.. 'బఘీర' ట్రైలర్ చూశారా?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్‌గా పుల్ ఫామ్‌లో ఉన్న నీల్.. 'బఘీరా' సినిమాకు స్టోరీ అందించాడు. తాజాగా ఆ చిత్ర తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బఘీరా' సినిమాను.. 'కేజీఎఫ్', 'సలార్' నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. డాక్టర్. సూరి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి 'కేజీఎఫ్' చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ట్రెలర్ బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్న ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీరా' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, 'అమరన్' అనే డబ్బింగ్ దీపావళికి రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి మరీ తెలుగులో 'బఘీరా' ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
'సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా'.. విశ్వక్సేన్ మాస్ ట్రైలర్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో మెకానిక్ రాకీ అంటూ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన మాస్ కా దాస్ మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్‌లోని మూసాపేట్లో ఉన్న శ్రీరాములు థియేటర్లో మెకానిక్ రాకీ ట్రైలర్ 1.0ను లాంఛ్ చేశారు. ట్రైలర్ చూస్తే మరోసారి మాస్ పాత్రలో విశ్వక్సేన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మెకానిక్ పాత్రలో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. అంతే కాకుండా మాస్ యాక్షన్‌తో పాటు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ రివీల్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో సునీల్, వీకే నరేష్, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెకానిక్ రాకీ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
బిచ్చగాడిలా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశారు. హిట్ కొట్టడంతో పాటు ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా తీస్తున్నారు. కొద్దోగొప్పో పలువురు చిన్న హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. తాజాగా తమిళ యంగ్ హీరోని బిచ్చగాడు పాత్రలో పెట్టి ఏకంగా సినిమా తీసేశారు.(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ))తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న కవిన్.. రీసెంట్ టైంలో 'దాదా' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఇప్పుడు ఇతడిని హీరోగా పెట్టి 'బ్లడీ బెగ్గర్' అనే మూవీ తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. బిచ్చగాడు పాత్రలో కనిపించిన సీన్స్ చూసి ఆశ్చర్యపోయారు. నిజం బెగ్గర్ ఏమో అనుకునేంతలా పరకాయ ప్రవేశం చేశాడనిపించింది.దివ్యాంగుడిలా నటిస్తూ బిచ్చమెత్తుకుంటే జీవించే ఓ బెగ్గర్.. ఊహించని పరిస్థితుల్లో ఓ ఇంట్లో పెద్ద కుటుంబం మధ్యలో చిక్కుకుపోతే ఏం జరిగింది? చివరకు ఆ ఇంటినుంచి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'బీస్ట్', 'జైలర్' సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న నెల్సన్.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంది. కొన్నాళ్లకు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!
అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం పొట్టేల్. 1980లోని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బందం రేగడ్, సవారీ చిత్రాల ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఆ కాలంలో మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూతురికి చదివించాలని తండ్రిపడే తపన.. ఆ నాటి పరిస్థితులే కథాంశంగా తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో పొట్టేల్ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీమందించారు. అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషించారు.