'డియర్ ఉమ'ని చూసి సక్సెస్ చేయండి: మూవీ టీమ్ | Dear Uma Movie Trailer Launch Highlights | Sakshi
Sakshi News home page

Dear Uma Movie: డియర్ ఉమ ట్రైలర్ లాంచ్.. హీరోయిన్ ఏమందంటే?

Published Sat, Apr 12 2025 4:27 PM | Last Updated on Sat, Apr 12 2025 4:27 PM

Dear Uma Movie Trailer Launch Highlights

తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌, నిర్మాత, రచయితగా తీసిన సినిమా ‘డియర్ ఉమ’. ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది. పృథ్వీ అంబర్ హీరో. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) 

సింగర్ అవ్వాలని ప్రయత్నించే హీరో.. డాక్టర్ అవ్వాలని హీరోయిన్.. రెండు వేర్వేరు లక్ష్యాలతో ఉన్న ఆ ఇద్దరూ కలవడం, ఆ తరువాత ప్రమాదం జరగడం, వైద్య రంగంలోని లోపాల్ని చూపుతూ సాగిన సీన్లు ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. 

సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ‘ఓ మంచి కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాను. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా విజయం వెనుక నా టీం ఉంది. ఏప్రిల్ 18న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement