Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bad News For RCB, Josh Hazlewood Unlikely To Return For IPL 2025: Reports1
ఆర్సీబీకి భారీ షాక్‌.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయ‌ర్ ఔట్‌?

ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు మొద‌లు పెట్టింది. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించేందుకు భార‌త క్రికెట్ బోర్డు సిద్ద‌మ‌వుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మే 15 లేదా మే 16న ఐపీఎల్ మ్యాచ్‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ పునఃప్రారంభమవుతున్న వేళ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు భారీ షాక్ త‌గిలే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఆ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్‌, ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్‌ జోష్ హాజిల్ వుడ్ గాయం కార‌ణంగా ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. హాజిల్ వుడ్ ప్ర‌స్తుతం భుజం నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే మే 3న సీఎస్‌కేతో జ‌రిగిన మ్యాచ్‌కు అత‌డు దూర‌మ‌య్యాడు. అయితే అత‌డు జ‌ట్టుతో పాటు ఉండ‌డంతో త‌ర్వాతి మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉంటాడ‌ని ఫ్యాన్స్ భావించారు. కానీ అంత‌లోనే బీసీసీఐ ఐపీఎల్‌ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. దీంతో హాజిల్‌వుడ్ త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయాడు.ఈ క్ర‌మంలో అత‌డు తిరిగి భార‌త్‌కు వ‌చ్చే సూచ‌న‌లు క‌న్పించ‌డం లేదు. జూన్‌లో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్ర‌త్త‌గా అత‌డిని తిరిగి పంప‌కూడ‌ద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఇదే జ‌రిగితే ఆర్సీబీకి గ‌ట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఈ ఏడాది సీజ‌న్‌లో హాజిల్‌వుడ్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా ఉన్నాడు. మ‌రోవైపు సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌, స్టార్ ప్లేయ‌ర్ ట్రావిస్ హెడ్ కూడా తిరిగి వ‌చ్చేది అనుమాన‌మే. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో ఆర్సీబీ దుమ్ములేపుతోంది. 11 మ్యాచులలో 8 విజయాలు సాధించి.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది.చ‌ద‌వండి: #Virat Kohli: మ‌న‌సు మార్చుకోని కోహ్లి.. త్వ‌ర‌లోనే రిటైర్మెంట్‌?

Virat Kohli most likely to confirm retirement: Reports2
మ‌న‌సు మార్చుకోని కోహ్లి.. త్వ‌ర‌లోనే రిటైర్మెంట్‌?

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌కటించేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టెస్టు క్రికెట్ నుంచి కోహ్లి త‌ప్పుకుంటాడ‌ని, ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని బీసీసీఐకి తెలియ‌జేసిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.ఈ క్ర‌మంలో క‌నీసం ఇంగ్లండ్ సిరీస్ వ‌ర‌కైనా కొన‌సాగేలా కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. చాలా మంది మాజీ క్రికెట‌ర్లు కూడా కోహ్లిని త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ సిరీస్‌తోనే టీమిండియా 2025- 27 వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్ ప్రారంభం కానుంది. ఒకవేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఈసారి ఇంగ్లండ్‌కు వెళ్లే జ‌ట్టులో అనుభవం లేని యువ ఆట‌గాళ్లే ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ అత‌డి మ‌న‌సు మార్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.మ‌న‌సు మార్చుకోని కోహ్లి.. కానీ కోహ్లి మాత్రం రిటైర్మెంట్ దిశ‌గానే అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. విరాట్ త‌ను మొద‌ట తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉన్నాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కోహ్లి త‌న టెస్టు రిటైర్మెంట్ విష‌యంపై వారాల క్రితమే సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌లో ఆడేలా అత‌డిని ఒప్పించడానికి బీసీసీఐ ప్ర‌య‌త్నిస్తోంది.కానీ అత‌డి మాత్రం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకునేలా క‌న్పించ‌డం లేదు. వచ్చే వారం జరిగే సెలక్షన్ సమావేశంలో కోహ్లి కొన‌సాగుతాడా? లేదా అన్నది తేలిపోనుంది అని బీసీసీఐ వ‌ర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి. కాగా రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టికే టెస్టుల‌కు విడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్దానంలో భార‌త టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపికయ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌కు భార‌త జ‌ట్టును మే 23న బీసీసీఐ ప్ర‌క‌టించ‌నుంది. విరాట్ ఇప్పటివరకు 123 టెస్టుల్లో భార‌త్‌ ప్రాతినిధ్యం వహించాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి.చ‌ద‌వండి: IND vs SL: ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్.. ఫైన‌ల్లో శ్రీలంక చిత్తు

IPL 2025 Final most likely to be shifted from Kolkata to Ahmedabad3
ఐపీఎల్‌-2025 ఫైన‌ల్ వేదిక, తేదీ మార్పు?

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ద‌మ‌వుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభిస్తే మే 15 లేదా 16వ తేదీన ఐపీఎల్ తిరిగి మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ఆదేశాలు జారీ చేసినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.ఈ నేప‌థ్యంలో బీసీసీఐ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ఫైన‌ల్ వేదిక‌ను మార్చాల‌ని భార‌త క్రికెట్ బోర్డు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైన‌ల్ వేదిక‌ను మార్చ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫైన‌ల్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు చోటు చేసుకోనున్న‌ట్లు ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మే 25 బ‌దులుగా మే 30న తుది పోరు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌ల కార‌ణంగా ఐపీఎల్‌-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌ల‌కు విదేశీ ఆట‌గాళ్ల అందుబాటుపై సందిగ్ధ‌త కొన‌సాగుతోంది. చాలా మంది ఫార‌న్ ప్లేయ‌ర్లు ఇప్ప‌టికే త‌మ స్వ‌దేశాల‌కు వెళ్లిపోయారు.చ‌దవండి: IND vs SL: ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్.. ఫైన‌ల్లో శ్రీలంక చిత్తు

India wins Women's ODI Tri-Series, beats Sri Lanka by 97 runs in final4
ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్.. ఫైన‌ల్లో శ్రీలంక చిత్తు

మ‌హిళ‌ల ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆదివారం కొలంబో వేదిక‌గా ఆతిథ్య శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్‌లో 97 ప‌రుగుల తేడాతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఈ తుది పోరులో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.భార‌త బ్యాట‌ర్ల‌లో స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగింది. మంధాన క్రీజులో ఉన్నంతసేపు బౌండ‌రీల వర్షం కురిపించింది. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. ఆమెతో పాటు హ‌ర్లీన్ డియోల్‌(47), రోడ్రిగ్స్‌(44), హర్మ‌న్ ప్రీత్ కౌర్‌(41) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌల‌ర్ల‌లో మల్కీ మదార, విహంగా, కుమారి త‌లా వికెట్ సాధించారు.అమ‌న్ అదుర్స్‌.. నాలుగేసిన రాణాఅనంత‌రం 343 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీలంక అమ్మాయిల జ‌ట్టు భార‌త బౌల‌ర్ల దాటికి 48.2 ఓవ‌ర్ల‌లో 245 ప‌రుగులకు కుప్ప‌కూలింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ చ‌మీరా ఆత‌ప‌ట్టు(51), నీలాక్షి డి సిల్వా(48), విష్మి గుణరత్నే(36) రాణించారు. మిగితా బ్యాట‌ర్లంతా నామమాత్ర‌పు స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.భార‌త బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు సాధించారు. కాగా భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన హ‌ర్మ‌న్ సేన‌... 6 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది.

India As Probable Squad for Unofficial Tests vs England Lions5
ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. కిష‌న్‌, క‌రుణ్ నాయ‌ర్‌కు పిలుపు?

భార‌త క్రికెట్ జ‌ట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27లో భాగంగా జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్‌లో ఎలాగైనా గెలిచి డ‌బ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో బోణీ కొట్టాల‌ని టీమిండియా భావిస్తోంది. జూన్ 20 నుంచి భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టును బీసీసీఐ మే 23న ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు కొత్త కెప్టెన్‌తో వెళ్ల‌నుంది.రోహిత్ శ‌ర్మ టెస్టుల‌కు విడ్కోలు ప‌లక‌డంతో టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ రానున్నాడు. కెప్టెన్సీ రేసులో శుబ్‌మ‌న్ గిల్ ముందు వ‌రుస‌లో ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండ‌గా.. ఈ టెస్టు సిరీస్‌కు ముందు భార‌త‌-ఎ జ‌ట్టు కూడా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఇండియా-ఎ జ‌ట్టు ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు మే 26 నుండి జూన్ 19 వరకు జరగ‌నున్నాయి.ఈ అనాధికారిక సిరీస్ కోసం భార‌త-ఎ జ‌ట్టును బీసీసీఐ మే 13 న ప్ర‌కటించనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయ్య‌ర్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఒక‌వేళ పంజాబ్ కింగ్స్ ఫైన‌ల్‌కు చేరితే అయ్య‌ర్ తొలి అనాధికారిక టెస్టుకు దూర‌మయ్యే అవ‌కాశ‌ముంది.అయితే ప్ర‌స్తుతం మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజ‌న్ తిరిగి మే 15 నుంచి ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఒక‌వేళ ఐపీఎల్ తిరిగి ప్రారంభమ‌వ్వ‌డం ఆల‌స్యమైతే భార‌త‌-ఎ జ‌ట్టుతో పాటే అయ్య‌ర్ ఇంగ్లండ్‌కు వెళ్ల‌నున్నాడు. శ్రేయ‌స్‌తో పాటు కరుణ్ నాయ‌ర్, ఇషాన్ కిష‌న్‌ల‌ను కూడా భార‌త‌-ఎ జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్లు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.సాయి సుద‌ర్శ‌న్‌, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, తనుష్ కోటియన్‌ల‌ను కూడా ఇండియా-ఎ జ‌ట్టు త‌ర‌పున ఇంగ్లండ్ పంప‌ననున్న‌ట్లు వినికిడి. ప్ర‌ధాన జ‌ట్టులో ఉండే చాలా మంది ఆట‌గాళ్లు ఇండియా-ఎ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌నున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Yuvraj Singh Doesn't Want His son to follow in his footsteps, Reveals Why?6
నా కుమారుడు క్రికెటర్‌ కావాలని కోరుకోను.. ఎందుకంటే..: యువీ

టీమిండియా మేటి క్రికెటర్లలో యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) ఒకడు. అద్భుత ఆటతీరుతో ఆల్‌రౌండర్‌గా భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌ టీ20 ప్రపంచకప్‌-2007 (T20 WC 2007), వన్డే వరల్డ్‌కప్‌-2011 (ODI WC 2011) గెలవడంలో యువీది కీలక పాత్ర.నాటి ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శన చేసిన యువీ.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు. మొత్తంగా తన కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ ఎడమచేతివాటం బ్యాటర్‌.. ఆయా ఫార్మాట్లలో 3277, 9924, 863 పరుగులు సాధించాడు.అంతేకాదు.. ఈ లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ యువ తరం ఆటగాళ్లకు అభిమాన క్రికెటర్‌గా కొనసాగుతున్న యువీ..తన కుమారుడిని మాత్రం క్రికెటర్‌ని చేయాలనుకోవడం లేదట!నా కుమారుడు క్రికెటర్‌ కావాలని కోరుకోనుకామియా జానీతో ఇటీవల జరిపిన సంభాషణ సందర్భంగా యువరాజ్‌ సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘మా కొడుకు క్రికెట్‌ ఆడటం నాకైతే ఇష్టంలేదు. ఒకవేళ తాను క్రికెటర్‌ కావాలని కోరుకుంటే మాత్రం నేను అడ్డుచెప్పను.ఎందుకంటే.. ప్రస్తుత సమాజంలో ఓ పిల్లాడు క్రికెట్‌ ఆడుతున్నాడంటే అతడిపై భరించలేనంత ఒత్తిడి పడుతోంది. ఇక చాలా మంది పిల్లల్ని వాళ్ల నాన్నలతో పోలుస్తూ.. వారసత్వాన్ని గురించి చర్చిస్తూ ఉంటారు.ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో టాలెంట్‌నిజానికి అది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే రంగంలో ప్రతిభ ఉండాలనే నిబంధన ఏమీ లేదు. అదే విధంగా అందరూ సమానంగా రాణించాలనీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో టాలెంట్‌ ఉంటుంది. కాబట్టి ఎవరి అభీష్టాలకు అనుగుణంగా వారు ఎదిగేలా ప్రోత్సహిస్తే మంచిది’’ అని యువీ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేసిన యువరాజ్‌ సింగ్‌ .. శుబ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ వంటి పంజాబీ యువ సంచలనాలకు మెంటార్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 132 మ్యాచ్‌లు ఆడిన యువీ 2750 పరుగులు చేయడంతో పాటు.. 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ముచ్చటైన కుటుంబంఇక యువీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. నటి హాజిల్‌ కీచ్‌తో చాన్నాళ్లు ప్రేమలో ఉన్న అతడు 2017, నవంబరు 30న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2022లో మొదటి సంతానంగా కుమారుడు ఓరియోన్‌ జన్మించాడు. ఇక రెండో సంతానంగా కుమార్తె జన్మించగా ఆమెకు ఆరా అని నామకరణం చేశారు.చదవండి: Smriti Mandhana: శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్‌.. సరికొత్త చరిత్ర

IPL 2025: Jitesh Sharma was supposed to lead RCB against LSG7
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శ‌ర్మ‌..?

భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌ల కార‌ణంగా ఐపీఎల్‌-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌రిస్థితులు కాస్త‌ చ‌ల్లార‌డంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌ను తిరిగి ప్రారంభించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. మే 15 నుంచి ఐపీఎల్ రీ స్టార్ట్ కానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స‌మాచారం. డబుల్‌ హెడర్‌ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించి, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే మే 25న ఈ ఏడాది సీజ‌న్‌కు ముగింపు ప‌ల‌కాల‌ని బీసీసీఐ యోచిస్తోంది.ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శ‌ర్మ‌..ఇక ఇది ఇలా ఉండ‌గా.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ర‌జత్ పాటిదార్ గాయం కార‌ణంగా క‌నీసం ఒక మ్యాచ్‌కైనా దూరమ‌య్యే అవ‌కాశ‌ముంది. మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాటిదార్ చేతి వేలికి గాయమైంది. దీంతో అత‌డికి రెండు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. ఈ క్ర‌మంలో అత‌డు కనీసం రెండు మ్యాచ్‌ల‌కైనా దూర‌మ‌వుతాడ‌ని అంతా భావించారు.కానీ ఐపీఎల్‌-2025లో మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డంతో ఆర్సీబీకి క‌లిసొచ్చింది. అత‌డు చేతి వేలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఒక‌వేళ ఐపీఎల్‌-2025 మే 15 నుంచి తిరిగి ప్రారంభ‌మైతే.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్‌ కానున్నాడు. పాటిదార్ గైర్హ‌జ‌రీలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేష్ శ‌ర్మ ఆర్సీబీ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని జితేష్ శ‌ర్మ ధ్రువీక‌రించాడు."ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్ దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో కెప్టెన్‌గా నాకు అవ‌కాశ‌మిచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెల‌పాల‌నుకుంటున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి చాలా గొప్ప విష‌యం. దేవదత్ ప‌డిక్క‌ల్‌, ర‌జిత్ పాటిదార్ ఇద్ద‌రూ అందుబాటులో లేనందున, వారిస్ధానాల‌ను ఎవ‌రితో భ‌ర్తీ చేయాల‌ని నేను ఆలోచిస్తున్నాను. నాకు నిజంగా ఇది చాలా పెద్ద బాధ్య‌త" అని ఐపీఎల్ స‌స్పెన్ష‌న్‌కు ముందు జితేష్ శ‌ర్మ ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ మే 15న ఐపీఎల్ తిరిగి ప్రారంభం కాక‌పోతే కెప్టెన్సీ అవకాశాన్ని జితేష్ కోల్పోయే ఛాన్స్ ఉంది.చ‌ద‌వండి: ENG vs IND: రోహిత్ శర్మ స్థానంలో యువ సంచ‌ల‌నం..? ఇక భార‌త్‌కు తిరుగులేదు?

Sai Sudharsan likely to replace Rohit Sharma as India opener in Test series against England8
రోహిత్ శర్మ స్థానంలో యువ సంచ‌ల‌నం..? ఇక భార‌త్‌కు తిరుగులేదు?

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భార‌త క్రికెట్ జ‌ట్టు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే రోహిత్ శ‌ర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికి షాకివ్వ‌గా.. హిట్‌మ్యాన్ బాట‌లోనే స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని కోహ్లి నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.విరాట్ త‌న నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికే బీసీసీఐకి తెలియ‌జేసిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే ఇంగ్లండ్ సిరీస్ వ‌ర‌కు అయినా కొన‌సాగాల‌ని కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వినికిడి. కోహ్లి టెస్టుల్లో కొన‌సాగుతాడా లేదా రోహిత్ బాట‌లోనే న‌డుస్తాడా? అన్న‌ది మే 23న తేలిపోనుంది. ఆ రోజున ఇంగ్లండ్ టూర్‌కు భార‌త జ‌ట్టుతో పాటు కొత్త కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్ర‌క‌టించ‌నుంది. కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపిక దాదాపు ఖాయం కాగా.. ప్లేయ‌ర్‌గా రోహిత్ శ‌ర్మ స్దానాన్నిమాత్రం త‌మిళ‌నాడు యువ సంచ‌ల‌నం సాయిసుద‌ర్శ‌న్‌తో భ‌ర్తీ చేయాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. సాయిసుద‌ర్శ‌న్ ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్‌-2025లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున ఆడుతున్న సుద‌ర్శ‌న్ ప‌రుగులు వ‌ర‌ద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. అత‌డి ఆట‌ను చూసి మాజీలు ఫిదా అయిపోయారు. ర‌విశాస్రి వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్లు సుద‌ర్శ‌న్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్ల‌ను సూచించారు.దీంతో భార‌త త‌ర‌పున వ‌న్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన సుద‌ర్శ‌న్‌.. ఇప్పుడు టెస్టుల్లో ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. సుద‌ర్శ‌న్‌కు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. రంజీ ట్రోఫీ సీజ‌న్ల‌లో త‌మిళ‌నాడు త‌ర‌పున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో 1957 పరుగులు చేశాడు. సుద‌ర్శ‌న్ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 213గా ఉంది. భారత్ తరుపున ఆడిన 3 వన్డేలలో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభ‌వం కూడా అత‌డికి ఉంది. ఈ క్ర‌మంలో రోహిత్ శర్మ స్థాన్నాన్ని సుదర్శన్‌తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 20 నుంచి భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది.చ‌ద‌వండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌..!

Mohammed Shami Selection Doubtful For England Tour9
ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌..!

ఐపీఎల్‌-2025 సీజ‌న్ మ‌ధ్య‌లో నిలిచిపోవ‌డంతో ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి భారత్‌-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌పై మళ్లింది. ఈ ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.అదే రోజున భారత కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ విడ్కోలు పలకడంతో కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్‌​ గిల్ ఎంపిక దాదాపు ఖాయమైంది. గిల్ ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమావేశమయ్యాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్ సిరీస్‌కు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. షమీ వైట్‌బాల్ క్రికెట్‌లో ఆడుతున్నప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడేంత ఫిట్‌నెస్ ఇంకా సాధించలేదని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వన్డే ప్రపంచకప్‌-2023 తర్వాత గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు షమీ దూరంగా ఉన్నాడు.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫర్వాలేదన్పించాడు. వికెట్లు పడగొట్టినప్పటికి అంత రిథమ్‌లో మాత్రం షమీ కన్పించలేదు. అదేవిధంగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న షమీ.. అక్కడ కూడా పూర్తిగా తేలిపోతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో షమీ బాగా అలిసిపోతున్నాడని, తన రన్-అప్‌లను పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా చిన్న స్పెల్‌ల తర్వాత డగౌట్‌లకు తిరిగి వస్తున్నాడని, అందుకే ఇంగ్లండ్ టూర్‌కు అతడి ఎంపికయ్యేది అనుమానంగా మారిందని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. ష‌మీ స్దానంలో ప్ర‌సిద్ద్ కృష్ణను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది.చ‌ద‌వండి: IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?

BCCI Asks Franchises to Re Assemble Players by May 13: Reports10
IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?

ఐపీఎల్‌-2025 టోర్నీని వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలనిఫ్రాంఛైజీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.అదే విధంగా.. విదేశీ ఆటగాళ్లను కూడా వీలైంత త్వరగా భారత్‌కు రప్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే మే 25న ఫైనల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లుఇందులో భాగంగా డబుల్‌ హెడర్‌ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ 57 మ్యాచ్‌లు పూర్తైన తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే.పహల్గామ్‌ ఉగ్రదాడికి.. భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టిగా బదులిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌- పాకిస్తాన్‌ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని భారత్‌ దాడులు చేస్తే.. పాకిస్తాన్‌ మాత్రం సామాన్యులు, భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే, భారత సైన్యం వీటిని సమ ర్థవంతంగా తిప్పికొట్టింది.అర్ధంతరంగా ముగిసిపోయిందిఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ అర్ధంతరంగా ముగిసిపోయింది. శత్రువును దారి మళ్లించే క్రమంలో ధర్మశాలలో బ్లాకవుట్‌ (విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం) విధించడంతో ఆట మధ్యలోనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.ఈ నేపథ్యంలో తాజా ఐపీఎల్‌ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. అయితే, శనివారం భారత్‌- పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, దాయాది మరోసారి తన వంకర బుద్ధిని చూపి.. దాడులకు తెగబడింది. తెల్లవారిన తర్వాత మాత్రం పరిస్థితులు కాస్త సద్దుమణినట్లు తెలుస్తోంది.ఆ జట్టుకు మాత్రం తటస్థ వేదికఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం భేటీ అయిన బీసీసీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘మంగళవారం నాటికి అన్ని ఫ్రాంఛైజీలు తమ మ్యాచ్‌లు జరిగే వేదికలకు ఆటగాళ్లను చేర్చాలని బోర్డు ఆదేశించింది.పంజాబ్‌ జట్టుకు మాత్రం తటస్థ వేదిక ఉంటుంది. కాబట్టి ఇంకా వారి గమ్యస్థానాన్ని నిర్దేశించలేదు. త్వరితగతిన టోర్నీని పూర్తి చేసేందుకు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది’’ అని తెలిపాయి.కాగా ఐపీఎల్‌-2025 ప్లే ఆఫ్స్‌ దశకు చేరుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ టాప్‌-4లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతేభారత్‌- పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ మాట్లాడుతూ.. ‘‘మిగిలిన మ్యాచ్‌లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. వేదికలు, తేదీలు కొత్తగా ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది.స్టేక్‌హోల్డర్లు, జట్ల యజమానులు, ప్రసారకర్తలు.. ఇలా లీగ్‌లో భాగమైన ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: BCCI: ప్లీజ్‌ కింగ్‌!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement