Business
-
మార్కెట్లకు సైబర్ దాడి ముప్పు
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని మార్కెట్ వర్గాలను స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈ హెచ్చరించింది. రిసు్కలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. రిస్క్ లను మదింపు చేసుకుని, నివారణ చర్యలు తీసుకోవాలని, సిస్టంల భద్రతకు సంబంధించి పర్యవేక్షణను పటిష్టపర్చుకోవాలని, దాడులు జరిగిన పక్షంలో సత్వరం స్పందించేలా తగు ప్రణాళికలతో సన్నద్ధంగా ఉండాలని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత సైన్యం క్షిపణి దాడులతో విరుచుకుపడిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. -
స్టార్‌లింక్ శాట్‌కామ్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్‌కామ్ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్), ఐఎస్పీ, వీశాట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్.. ఇప్పటికే యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్ ఆర్బిట్’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది. -
కియా క్లావిస్ వచ్చేసింది: రేపటి నుంచే బుకింగ్స్..
కియా కారెన్స్ క్లావిస్ మార్కెట్లో విడుదలైంది. కంపెనీ ఈ కారు బుకింగ్‌లను మే 9నుంచి స్వీకరించనుంది. దీనిని బ్రాండ్ వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ MPV ఆరు పవర్‌ట్రెయిన్ ఎంపికలు, ఏడు వేరియంట్ (HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+)లలో అందుబాటులో ఉంటుంది.కొత్త డిజైన్ కలిగిన కియా క్లావిస్ డిజిటల్ టైగర్ ఫేస్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, యాంగ్యులర్ రియర్ బంపర్, డ్యూయల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, లైట్ బార్, బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. లోపల 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో పాటు.. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్, 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.కియా క్లావిస్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్కింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్ అనే ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
'ది కాస్కేడ్స్ నియోపోలిస్'కు రెరా గ్రీన్ సిగ్నల్: జీహెచ్ఆర్ ఇన్ఫ్రా
జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ (GHR Lakshmi Urbanblocks Infra LLP) తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'ది కాస్కేడ్స్ నియోపోలిస్'కు (The Cascades Neopolis) రెరా అనుమతి పొందింది. ఈ విషయాన్ని సంస్థ గర్వంగా ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో 7.34 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు 63 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ఉంది. దీని రెరా నంబర్ P02400009538. ఈ అనుమతి ద్వారా సంస్థ పారదర్శకత, చట్టపరమైన నిబంధనలు, వినియోగదారుల నమ్మకానికి కట్టుబడి ఉంటుందని తెలిపింది.ఈ ప్రాజెక్టులో 1,189 అద్భుతమైన, పర్యావరణ అనుకూల గృహాలు, 10 ట్రిప్లెక్స్ పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు యూహెచ్ఏ లండన్, కూపర్స్ హిల్ (సింగపూర్), స్టూడియో హెచ్‌బీఏ (సింగపూర్) దీనిని రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతతో, ప్రపంచ స్థాయి డిజైన్‌తో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇది వెల్ ప్రీ-సర్టిఫైడ్, ఐజీబీసీ ప్రీ-సర్టిఫైడ్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, అంతర్జాతీయ కాన్సియర్జ్ సేవలు వంటి ప్రత్యేకతలున్నాయి. ఆరోగ్యం, స్థిరత్వం, స్మార్ట్ లివింగ్ అనే మూడు అంశాల చుట్టూ ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. కొనుగోలుదారులు ప్రాజెక్టును సందర్శించడానికి వీలుగా కోకాపేటలో సేల్స్ లాంజ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ భాగస్వామి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ రెరా అనుమతి మేము నాణ్యతకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. హైదరాబాద్‌లో పట్టణ స్థలాన్ని పునర్నిర్వచించడానికి మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైన విజయం" అన్నారు.లక్ష్మీ ఇన్ఫ్రా భాగస్వామి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, "ది కాస్కేడ్స్ నియోపోలిస్‌కు రెరా అనుమతి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పారదర్శకత, సృజనాత్మకత, వినియోగదారుల ప్రాధాన్యతలతో కూడిన గృహాలను అందించాలనే మా కలను ఇది నిజం చేస్తుంది" అని అన్నారు.అర్బన్ బ్లాక్స్ రియాల్టీ భాగస్వామి శరత్ మాట్లాడుతూ, "రెరా అనుమతి మా కృషికి గుర్తింపు. నిబంధనలు, స్థిరత్వం, సృజనాత్మకతతో కూడిన ప్రాజెక్టును సృష్టించడం ద్వారా గృహ నిర్మాణ రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని తెలిపారు.ఈ ప్రాజెక్టు ప్రధాన వ్యాపార కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సౌకర్యాలకు చేరువలో ఉంది. విలాసవంతమైన సౌకర్యాలు, నగర కేంద్రంలో ఉండటం వల్ల, ఇది గృహ కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు మొదటి ఎంపికగా నిలుస్తుందని భావిస్తున్నారు. -
రజనీకాంత్ కార్ల ప్రపంచం.. చూశారా?
తమిళ్ సూపర్ స్టార్ 'రజనీ కాంత్' గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే తన నటనతో, స్టైల్‌తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా.. ఎంతో ఎనర్జిటిక్‌గా సినిమాల్లో కనిపిస్తున్నారు. సినిమాల్లో నటించడమే కాకుండా ఈయన ఓ ఆటోమొబైల్ ప్రేమికుడు కూడా. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు, మన దేశంలో తయారైన కార్లు కూడా ఉన్నాయి.రజినీకాంత్ కార్లు➤ప్రీమియర్ పద్మిని➤హోండా సివిక్➤బీఎండబ్ల్యూ ఎక్స్5➤బీఎండబ్ల్యూ ఎక్స్7➤మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్➤రోల్స్ రాయిస్ ఫాంటమ్➤రోల్స్ రాయిస్ ఘోస్ట్➤కస్టమ్-బిల్ట్ బెంట్లీ లిమోసిన్➤లంబోర్గిని ఉరుస్ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!రజనీకాంత్ (అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్) ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ మొత్తం ఆస్తి రూ. 430 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. -
Operation Sindoor: వెనక్కి తగ్గిన రిలయన్స్.. ట్వీట్ వైరల్
ఆపరేషన్ సిందూర్ కోసం రిలయన్స్ కంపెనీ ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేసిందని వస్తున్న వార్తలపై సంస్థ స్పందించింది. ''ఆపరేషన్ సిందూర్'' అనే పదాన్ని ట్రేడ్‌మార్క్ చేసే ఉద్దేశ్యం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ అయిన జియో స్టూడియోస్ అనుమతి లేకుండా ఒక జూనియర్ వ్యక్తి అనుకోకుండా దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్.. దాని వాటాదారులందరూ చాలా గర్వంగా ఉన్నారు. ఉగ్రవాదం అనే దుష్టత్వానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న రాజీలేని పోరాటమే ఈ ''ఆపరేషన్ సిందూర్" అని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదనఉగ్రవాదంపై పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, సాయుధ దళాలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి మేము కట్టుబడి ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తులుమే 7న ఉదయం 10:42 గంటల నుంచి సాయంత్రం 6:27 గంటల మధ్య, 'ఆపరేషన్ సిందూర్' కోసం నాలుగు వేర్వేరు ట్రేడ్‌మార్క్ దాఖలు అయ్యాయి. ఇందులో రిలయన్స్ మాత్రమే కాకుండా.. ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్, ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారని బార్ అండ్ బెంచ్ నివేదించింది. అయితే ఇప్పుడు ట్రేడ్‌మార్క్ దాఖలు రిలయన్స్ కంపెనీ ఉపసంహరించుకుంది. మిగిలినవాళ్లు ఉంసంహరించుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.Media StatementReliance Industries has no intention of trademarking Operation Sindoor, a phrase which is now a part of the national consciousness as an evocative symbol of Indian bravery.Jio Studios, a unit of Reliance Industries, has withdrawn its trademark application,…— Reliance Industries Limited (@RIL_Updates) May 8, 2025 -
విజనరీ మిలియన్ మైండ్స్ టెక్ సిటీని ఆవిష్కరించిన గణేష్ హౌసింగ్
గుజరాత్ ఐటీ /ఐటీఈఎస్ పాలసీ 2022-27 కోసం గుజరాత్ ప్రభుత్వం.. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ భాగస్వామ్యంతో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ మూడవ రోడ్‌షోను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. అసోచామ్ సహకారంతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. భారతదేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రముఖ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ రోడ్ షోలో గణేష్ హౌసింగ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, మిలియన్ మైండ్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్‌వర్క్‌కు పరిచయం చేయటంతో పాటుగా గుజరాత్ యొక్క పరివర్తనాత్మక కార్యక్రమాలు, విధానాలను ప్రదర్శించారు.గుజరాత్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని.. గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మిలియన్ మైండ్స్ టెక్ సిటీ ఆవిష్కరణ ఈ రోడ్‌షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గురించి గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ అన్మోల్ పటేల్ తన సంతోషం వ్యక్తం చేస్తూ .. భారతదేశంలో ప్రధాన ఐటీ హబ్‌గా వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది, అనేక ప్రముఖ టెక్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ వాటాదారులను కలుసుకోవటం, మా మిలియన్ మైండ్స్ టెక్ సిటీ విలువ ప్రతిపాదనను ప్రదర్శించడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. హైదరాబాద్ రోడ్‌షోకు లభించిన అఖండ స్పందన మాకు నిజంగా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ మోనా ఖాంధర్, ఐఏఎస్ మాట్లాడుతూ.. గుజరాత్ ఐటి/ఐటీఈఎస్ పాలసీ 2022-27 అత్యున్నత శ్రేణి తయారీ, ఆర్&డి, డిజిటల్ పరివర్తనను సజావుగా అనుసంధానించే శక్తివంతమైన.. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే మా లక్ష్యం ప్రతిబింబిస్తుంది. ధోలేరాలోని సెమీకండక్టర్ హబ్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు , నైపుణ్యం, పరిశోధనలపై అధికంగా దృష్టి సారించటం వంటి మార్గదర్శక కార్యక్రమాలతో , పోటీతత్వ ప్రపంచ దృశ్యంలో అభివృద్ధి చెందడానికి మేము పరిశ్రమలు మరియు స్టార్టప్‌లను శక్తివంతం చేస్తున్నామని అన్నారు. -
నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదన
నెల మొత్తం పనిచేసినా జీతాలు సరిగ్గా ఇవ్వని సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే నెలకు కేవలం వారం రోజులు మాత్రమే పనిచేస్తూ.. ఓ వ్యక్తి ఏడాదికి 66 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.నేను సంవత్సరానికి రూ. 66 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఉద్యోగం విషయంలో చాలా ఖచ్చితంగా, సమర్థవంతంగా ఉంటాను. అయితే నెలకు వారం రోజులు మాత్రమే పనిచేస్తాను. మిగిలిన సమయం మొత్తం టీవీ షోలు చూడటం, పాడ్‌కాస్ట్‌లు వంటివి చూడటం వంటివి చూస్తానని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నాడు.నేను ఉద్యోగంలో చేరినప్పుడు చాలా వెనుకబడి ఉండేవాడిని. ఆ తరువాతనే అన్నీ నేర్చుకున్నాను. పనిచేయడం వేగంగా నేర్చుకున్నాను. నేను నిమిషానికి 75 పదాలు టైప్ చేయగలిగాను. ఎటువంటి తప్పులు లేకుండా పనిచేయగలిగాను. నా పనికి సంబంధించి ఎవరూ కంప్లైంట్స్ చేయలేదు. నేను మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయిగా నిలిచాను. క్లయింట్లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నా పనిని నేనే పూర్తి చేస్తాను. అయితే వారం రోజులు మాత్రమే పనిచేస్తానని ఆ వ్యక్తి స్పష్టం చేసాడు.నేను కూడా ఒకప్పుడు చాలా చదివేవాడిని. ఒక సంవత్సరంలో 200 పుస్తకాలు చదివాను. నాకు ఇష్టమైన ప్రతి అంశంపై లోతుగా పరిశోధన చేసాను. మరి ఇప్పుడు.. నాకు బోర్ కొడుతోంది. ప్రతిదీ సరిగ్గా చేయడం మంచిదని నేను అనుకున్నాను. తక్కువ పనిలోనే ఎక్కువ సాధిస్తున్నాను. అయితే ఏదో ఒక విధంగా నేను కష్టపడుతున్నప్పుడు కంటే ఇప్పుడు అధ్వాన్నంగా ఉన్నాను. ఇది సరైనది కాదని చెప్పాడు.ఇదీ చదవండి: రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలుఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మా పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. ఇంకొందరు పనిలో తీరిక లేకుండా పోతోందని నిరాశను వ్యక్తం చేశారు. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 411.97 పాయింట్లు లేదా 0.51 శాతం నష్టంతో 80,334.81 వద్ద, నిఫ్టీ 140.60 పాయింట్లు లేదా 0.58 శాతం నష్టంతో 24,273.80 వద్ద నిలిచాయి.గిన్ని ఫిలమెంట్స్, పావ్నా ఇండస్ట్రీస్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, గ్రిండ్‌వెల్ నార్టన్, శ్రీరామ్ పిస్టన్స్ & రింగ్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరగా.. అవలోన్ టెక్నాలజీస్, గోధా క్యాబ్కాన్ అండ్ ఇన్సులేషన్, రవీంద్ర ఎనర్జీ, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా), డీబీ కార్ప్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
Operation Sindoor: కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు..
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. గురువారం పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ గంటసేపు నిలిచిపోయింది. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగాయి. దీంతో పాకిస్తాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కేఎస్ఈ -30 గురువారం 7.2 శాతం వరకు పడిపోయి.. వరుసగా రెండవ సెషన్లో కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కేఎస్ఈ 100 13 శాతం క్షీణించగా, కేఎస్ఈ 30 ఇప్పటివరకు 14.3 శాతం పడిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో పాక్ బెంచ్ మార్క్ షేర్ ఇండెక్స్ బుధవారం దాదాపు 6 శాతం నష్టంతో ప్రారంభమై, చివరకు 3.1 శాతం నష్టంతో సెషన్ ముగిసింది. ఈ రోజు కూడా భారీ నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది. -
రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలు
టికెట్ లేకుండా ట్రైన్లలో ప్రయాణించేవారి సంఖ్య చాలానే ఉంది. దీనిని నివారించడానికి ఇండియన్ రైల్వే ఓ విన్నూత చర్యకు శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ సుమారు 24 మిలియన్ల మంది ప్రయానికులకు సేవలందిస్తున్న ముంబై డివిజన్.. ఎఫ్‌సీబీ ఇండియా యాడ్ ఏజన్సీతో జతకట్టి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభించింది.ఇండియన్ రైల్వే.. ప్రారంభించిన ఈ లక్కీ యాత్ర ప్రచారంలో భాగంగా ప్రతి రోజూ ఒక ప్రయాణికునికి రూ. 10వేలు, వారానికి ఒక ప్రయాణికునికి రూ. 50వేలు ఫ్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం ప్రారభించడం జరిగింది. ఇది వచ్చే వారం నుంచి ప్రారంభమై ఎనిమిది వారాలు పాటు అమలులో ఉంటుందని తెలుస్తోంది.టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల.. ఇండియన్ రైల్వే ప్రతి ఏటా కోట్ల రూపాయలను కోల్పోతోంది. అయితే ఇప్పుడు ప్రైజ్ మనీ అనే ప్రచారం ప్రారభించడంతో.. ప్రైజ్ కోసమైనా కొందరు ట్రైన్ టికెట్ కొనుగోలు చేస్తారు. ప్రైజ్ మనీ కేవలం ట్రైన్ టికెట్ తీసుకునే వారికి మాత్రమే కాకుండా.. సీజన్ పాస్‌లు తీసుకున్నవారికి కూడా లభిస్తుంది.ప్రతిరోజు.. సబర్బన్ స్టేషన్లో టికెట్ ఎగ్జామినర్ ఒక ప్రయాణికుడిని ఎంపిక చేస్తారు. అతడు చెల్లుబాటు అయ్యే రోజువారీ టికెట్ లేదా సీజన్ పాస్‌ను కలిగి ఉన్నట్లయితే.. రూ. 10,000 నగదు బహుమతిని అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే వారానికి ఒకరిని ఎంపిక చేసి రూ. 50000 ప్రైజ్ మనీ అందిస్తారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌ల సమయంలో రోజుకు 4,000 నుంచి 5,000 మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను తగ్గించడానికి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభమైంది. దీని ద్వారా ఎక్కివమందిని టికెట్స్ కొనేలా చేయొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రచారం ప్రస్తుతం ముంబైలో మాత్రమే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘హిందీ నేర్చుకుని ఉంటే రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని’
దేశ టెలికం పరిశ్రమలో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన పారిశ్రామికవేత్త ఆయన. సొంతంగా రెండు ఐలాండ్లు.. విదేశాలలో వందల కోట్ల విలువైన విలాస భవనాలతో రాజభోగం అనుభవించిన ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తర్వాత కాలం కలిసిరాక నష్టాలలో కూరుకుపోయి దివాళా తీశారు. జీవితంలో ప్రతిఒక్కరికీ గతంలో చేసిన పొరపాట్ల గురించి పశ్చాత్తాపం ఉంటుంది. అప్పుడా తప్పు చేయకపోయింటే బాగుండు అని అనుకుంటుంటారు. శివశంకరన్ కూడా అలాంటి పశ్చాత్తాపాలనే వ్యక్తం చేశారు.రెండే తప్పులుదివాళా తీసిన సెల్యులార్ ఆపరేటర్ ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ ఇటీవల తనలో ఇంకా ఉన్న పశ్చాత్తాపాల గురించి నోరు విప్పారు. రణ్వీర్ అల్లాబాడియాతో కలిసి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ పారిశ్రామికవేత్త రూ.7,000 కోట్లు కోల్పోయి తిరిగి పుంజుకున్న తన ప్రయాణం గురించి వెల్లడించారు. తన జీవితకాల అదృష్టాన్ని పోగొట్టిన రెండు చిన్న తప్పులను బయటపెట్టారు. అవి ఒకటి హిందీ నేర్చుకోకపోవడం, మరొకటి తన కెరీర్ ప్రారంభంలో ఢిల్లీ లేదా ముంబై వంటి ప్రధాన నగరాలకు మకాం మార్చకపోవడం.హిందీ నేర్చుకుని ఉంటే..తాను హిందీ నేర్చుకుని ఉంటే 140 కోట్ల మంది భారతీయులను ఆకర్షించేవాడినని శివశంకరన్ అన్నారు. కచ్చితంగా రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని. భౌగోళికం, భాష తనను భారతదేశ అధికార కారిడార్ల నుంచి ఎలా దూరం చేశాయో స్వయంకృషితో ఎదిగిన ఈ బిజినెస్ టైకూన్ వివరించారు.అప్పు ఎప్పుడూ చేయలేదు'నేను ఎప్పుడూ అప్పులు చేయాలనుకోను. నేను డబ్బును ఆకర్షిస్తాను" అని శివశంకరన్ అన్నారు. 68 ఏళ్ల జీవితంలో తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ రూ.100 కూడా అప్పు తీసుకోలేదన్నారు. వ్యవస్థాపక ప్రవృత్తి, బిజినెస్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అతిపెద్ద డీల్స్ చేజారడానికి కారణం తనకు దూరదృష్టి లేకపోవడం కాదని, బహుశా కనెక్షన్ లేకపోవడం వల్ల కావచ్చునని వెల్లడించాడు.రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులుదివాలా దాఖలు చేయడానికి ముందు తన అత్యంత ఖరీదైన కొనుగోళ్లను కూడా శివశంకరన్ వెల్లడించాడు. రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టానని, ప్రపంచవ్యాప్తంగా అనేక ఇళ్లు కొన్నానని చెప్పారు. సీషెల్స్ లో తనకు రెండు ద్వీపాలు ఉండేవని, వాటిని ఇప్పుడు అమ్మేశానని వెల్లడించారు. రిపబ్లిక్ ఆఫ్ శివ పేరుతో సొంత దేశంలా ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉండాలని ఈ దీవులను కొనుగోలు చేశానని చెప్పారు. అన్ని ఖండాల్లో నివాసం ఉండాలనే కోరికతో సీషెల్స్, అమెరికా, కెనడా, లండన్‌లో ఇళ్లు కొన్నట్లు శివశంకరన్ చెప్పుకొచ్చారు. -
చిర్రెత్తిన యంత్రుడు.. ఎవరికీ చిక్కడు
కృత్రిమ మేధ ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు. ప్రపంచంలో నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలే అందుకు కారణం. రజనీకాంత్ రోబో సినిమాలో విలన్ సైంటిస్ట్ తయారు చేసిన రోబో టేబుల్‌పై నుంచి బన్ తీయమంటే గన్ తీస్తుంది కదా. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ విలన్నే గన్‌తో చంపాలనుకుంటుంది. దాదాపు అలాంటి సంఘటనలే ప్రస్తుతం జరుగుతున్నాయి. హ్యుమనాయిడ్ రోబోల పరీక్ష సమయంలో చాలా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.యునిట్రీ అనే కంపెనీ రూపొందించిన హ్యుమనాయిడ్ రోబోను ఇటీవల పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదకర సంఘటన జరిగింది. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియో వైరల్‌గా మారింది. అందులోని వివరాల ప్రకారం.. చైనా ఫ్యాక్టరీలో ఈ హ్యుమనాయిడ్ రోబోను క్రేన్ ఆసరాతో నిలబెట్టారు. టెస్టింగ్ సమయంలో ఒక్కసారిగా రోబో ఉన్నట్టుండి తన చేతులతో దాడికి పాల్పడింది. క్రేన్‌కు వేళాడుతున్నా ఆ రోబో చుట్టూ కదులుతూ, క్రేన్‌ను సైతం లాగుతూ సమీపంలోని వస్తువులను చిందరవందర చేసింది. వెంటనే దాన్ని పరీక్షించే వ్యక్తి రోబో కనెక్షన్ కట్ చేయడంతో నిదానించింది.An AI robot attacks its programmers as soon as it is activated in China. pic.twitter.com/d4KUcJQvtD— Aprajita Nefes 🦋 Ancient Believer (@aprajitanefes) May 2, 2025ఇదీ చదవండి: గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!ఇతర కంపెనీ రోబోలు కూడా..యునిట్రీ రోబోలు మాత్రమే కాదు.. ఇంతర కంపెనీలకు చెందిన రోబోలు ఇలా విచిత్రంగా ప్రవర్తించిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ ప్రదర్శనలో హ్యూమనాయిడ్ రోబోలు గుంపులుగా వెళ్తూ ఒకటి మానవులపైకి దూసుకొస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈశాన్య చైనాలోని టియాంజిన్‌లో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో తీసిన వీడియోలో జాకెట్ ధరించిన రోబో అకస్మాత్తుగా బారికేడ్ వెనుక గుమిగూడిన ప్రేక్షకుల గుంపు వైపు దూసుకెళ్లింది. గతంలో ఓ కంపెనీ కర్మాగారంలో రోబోట్ ఇంజినీర్‌పై దాడి చేసిందని వార్తలొచ్చాయి. సాఫ్ట్వేర్ లోపాలు, అంతర్లీనంగా ఉండే కారణాలతో కొన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా మానవుల సమూహంతో కలిసి వీటిని వాడుకలోకి తీసుకురావాలంటే కచ్చితమైన, స్పష్టమైన ఎన్నో పరీక్షలు నిర్వహించాలని, వీటి పాలసీల్లో పక్కా నిబంధనలు రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!
విస్తృత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాలను పర్యవేక్షించే గ్లోబల్ బిజినెస్ యూనిట్ నుంచి గూగుల్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. టీమ్ సహకారాన్ని పెంపొందించడానికి, కస్టమర్ సేవను మెరుగుపరచడానికి, క్రమబద్ధమైన కార్యకలాపాలను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఇప్పటికే ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ వంటి కీలక ఉత్పత్తులను కలిగి ఉన్న గూగుల్ ప్లాట్‌ఫామ్ వివిధ విభాగాల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. మారుతున్న మార్కెట్ డిమాండ్లు, పరిశ్రమ ధోరణుల నేపథ్యంలో తాజా లేఆఫ్స్‌ను ప్రకటించినట్లు పేర్కొంది. గూగుల్ కృత్రిమ మేధ, డేటా సెంటర్ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడి పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెక్ కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. భవిష్యత్తు వృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానాలకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. దాంతో ఉన్న ఉద్యోగులను ఆయా విభాగాలకు కేటాయిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్ప్రముఖ కంపెనీల్లోనూ ఇదే ధోరణిగూగుల్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇది పరిశ్రమ వ్యాప్తంగా ఉద్యోగుల పునర్నిర్మాణాన్ని సూచిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పోటీ పడేందుకు కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. -
ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ప్రముఖ ఆడిటింగ్ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) 1,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ తాజా నిర్ణయంతో యూఎస్ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపు దాని మొత్తం సిబ్బందిలో 2 శాతంగా ఉంది. ఆడిట్, ట్యాక్స్ విభాగాలకు చెందిన బాధిత ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ద్వారా లేఆఫ్స్ సమాచారం అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.తొలగింపునకు కారణాలుప్రస్తుత వ్యాపార డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సమీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ఆలోచనాత్మకంగానే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి, మారుతున్న ఖాతాదారుల డిమాండ్లు, పునర్నిర్మాణ ప్రయత్నాలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ డెలాయిట్, కేపీఎంజీ వంటి సంస్థలు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మార్కెట్ తీరుకు అనుగుణంగా సంస్థలు మారుతున్నాయి.ఇదీ చదవండి: దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..సవాళ్లుతొలగింపులతో ప్రభావితమైన ఉద్యోగులు తిరిగి కొలువు సాంపాదించాలంటే సవాళ్లను ఎదుర్కోకతప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ రంగంలో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. పెరిగిన ఆటోమేషన్, వ్యాపార వ్యూహాలతో ఆడిట్, ట్యాకేషన్ నిపుణులు డేటా అనలిటిక్స్, అడ్వైజరీ సర్వీసులు లేదా ప్రత్యేక ఫైనాన్స్ రంగాల్లో కొత్త అవకాశాలకు అనుగుణంగా మారవలసి ఉంటుంది. -
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold Prices) భగ్గుమంటున్నాయి. వరుసగా నాలుగో రోజూ భారీగా పెరిగాయి. నాలుగు రోజుల్లో పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.4వేలకు పైగా ఎగిసింది. దీంతో తులం బంగారం మళ్లీ రూ.లక్షకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్‌లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మే 8 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,600- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,300హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,600- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,300చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,750- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,450ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,600- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,300ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,600- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.91,300బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.600, రూ.550 చొప్పున పెరిగాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,11,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..
టెలికాం సేవల వినియోగదారుల్లో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య మార్చిలో పెరిగి మొత్తం 116.37 కోట్లకు చేరుకుంది. ఇది ఫిబ్రవరిలో 116.33 కోట్లుగా ఉంది. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ సబ్ స్క్రిప్షన్లు పెరగగా, పట్టణ సబ్ స్క్రిప్షన్లు స్వల్పంగా తగ్గాయని తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు భారత టెలికాం పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చందాదారుల చేరికల్లో అగ్రగామిగా నిలిచాయి.భౌగోళికంగా ఢిల్లీ సర్వీస్ సెంటర్ అత్యధిక టెలి-సాంద్రతను కలిగి ఉంది. అంటే యూనిట్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మొబైల్ చందాదారులను కలిగి ఉండడం. బిహార్ అతి తక్కువ టెలి-సాంద్రతను నమోదు చేసింది. పెరుగుతున్న సబ్‌స్రైబర్ల సంఖ్య దేశంలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనను హైలైట్ చేస్తుంది. ఎక్కువ మంది గ్రామీణ వినియోగదారులు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. యూజర్ డెమోగ్రాఫిక్స్, నెట్వర్క్ డిమాండ్లకు సంబంధించి టెలికాం ఆపరేటర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: 27 ఎయిర్‌పోర్ట్‌లు, 430 విమానాలు నిలిపివేతవైర్లెస్ సబ్‌స్రైబర్ల సంఖ్య పెరగడం చాలా అంశాలను ప్రభావితం చేస్తుంది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీకి అవకాశం అందిస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సేవలు ఎక్కువ మంది పొందేందుకు వీలవుతుంది. ఈ-కామర్స్, ఫిన్ టెక్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాలు వృద్ధి చెందుతాయి. మొబైల్ వినియోగదారులకు సేవలందించే వ్యాపారాలు.. ముఖ్యంగా మొబైల్ అప్లికేషన్లు, స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ సర్వీసులు పెరుగుతాయి. హై-స్పీడ్ కనెక్టివిటీని నిర్ధారించడానికి నెట్వర్క్ విస్తరణకు, 5జీ వినియోగానికి టెలికాం ప్రొవైడర్లు మరింత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. -
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు నష్టపోయి 24,391కు చేరింది. సెన్సెక్స్(Sensex) 29 పాయింట్లు దిగజారి 80,701 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 61.55 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.43 శాతం లాభపడింది. నాస్డాక్ 0.27 శాతం ఎగబాకింది.భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు నిన్న పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
27 ఎయిర్‌పోర్ట్‌లు, 430 విమానాలు నిలిపివేత
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడి చేసిన నేపథ్యంలో స్థానిక విమానాశ్రయాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలు మే 10 వరకు వాణిజ్య కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ చర్య ఫలితంగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 430 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రద్దు అయినట్లు తెలిసింది. ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్డ్ విమానాల్లో 3%గా ఉంది. ఈ ప్రభావం ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లోని విమానయాన సంస్థలు కూడా 147 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇది వారి రోజువారీ షెడ్యూల్లో 17%గా ఉంది.ఇదీ చదవండి: ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లుదేశంలోని ప్రభావిత విమానాశ్రయాలు..శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్సర్, లుధియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్‌కోట్, భుంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్‌గఢ్, జైసల్మేర్, జోద్పూర్, బికనీర్, ముంద్రా, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్బందర్, కాండ్లా, గ్వాలియర్, హిండన్ సహా కీలక వ్యూహాత్మక విమానాశ్రయాలను మూనివేస్తున్నట్లు చెప్పారు. విమాన రాకపోకల్లో అంతరాయాలను తగ్గించడానికి సంస్థలు పని చేస్తున్నట్లు తెలిపాయి. విదేశీ విమానయాన సంస్థలు సున్నితమైన జోన్లలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసి ముంబై, అహ్మదాబాద్ మీదుగా ప్రయాణించే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. విమానయాన సంస్థలు షెడ్యూళ్లను సర్దుబాటు చేయడానికి, ప్రభావిత ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ప్రయాణాల్లో ఆలస్యం అనివార్యం అవుతుంది. -
ఆర్మీ సిబ్బందికి ఎయిర్ ఇండియా తోడ్పాటు
పాకిస్తాన్‌తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు రద్దు చేసుకుని విధులకు వస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రయాణాల కోసం తమ వద్ద టికెట్లు బుకింగ్ చేసుకున్న ఆర్మీ సిబ్బంది టికెట్లను రద్దు చేసుకుంటే ఉచిత రీషెడ్యూల్ లేదా పూర్తి రీఫండ్స్ అందించనున్నట్లు ప్రకటించాయి.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న బలగాలను వెంటనే విధులకు రప్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), ఐటీబీపీ (ITBP) సహా అన్ని పారామిలిటరీ బలగాలు తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సిబ్బంది ఇప్పటికే బుక్ చేసుకున్న విమాన టికెట్లను ఎటువంటి అదనపు రుసుములు లేకుండా రద్దు చేసుకునేందుకు, రీ షెడ్యూల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది."ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలలో డిఫెన్స్ కోటా కింద 2025 మే 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న సిబ్బందికి తమ డ్యూటీ కమిట్మెంట్లకు మద్దతుగా 2025 జూన్ 30 వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడంపై పూర్తి రీఫండ్, వన్ టైమ్ మినహాయింపును అందిస్తున్నాం" అని ఎయిరిండియా ఒక పోస్ట్‌లో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేసింది. -
బ్రిటన్ ఎఫ్టీఏతో వస్త్ర పరిశ్రమకు బూస్ట్..
న్యూఢిల్లీ: బ్రిటన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో (ఎఫ్‌టీఏ) కారి్మక శక్తి ఎక్కువగా ఉండే వ్రస్తాలు, లెదర్ తదితర దేశీ పరిశ్రమలకు తోడ్పాటు లభిస్తుందని ఎగుమతిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటీష్ మార్కెట్లో బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశాలతో మనం కూడా పోటీపడేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఈ ఎఫ్టీఏతో చాలా మటుకు భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గడమో లేదా పూర్తిగా తొలగించడమో జరుగుతుంది కాబట్టి మనకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. నియంత్రణ ప్రక్రియలను క్రమబదీ్ధకరించడంతో బ్రిటన్‌లో జనరిక్ ఔషధాలకు అనుమతులు వేగవంతం కాగలవని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. చేనేతకారులు, తయారీదారులు, ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు లభిస్తాయని, వాణిజ్య అవరోధాలు తొలగిపోతాయని, ప్రీమియం మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అపారెల్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) వైస్ చైర్మన్ ఎ. శక్తివేల్ వివరించారు. అంతర్జాతీయ వ్యవస్థకు భారత్‌ను మరింతగా అనుసంధానం చేసేందుకు, విశ్వసనీయ తయారీ భాగస్వామిగా అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని పటిష్టం చేసేందుకు ఇలాంటి ఒప్పందాలు కీలకమని రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా తెలిపారు. -
బంగారం మళ్లీ లక్ష పైకి
న్యూఢిల్లీ: పసిడి మరోసారి రూ.లక్ష మార్క్‌పైకి చేరింది. ఇటీవలే మొదటిసారి రూ.లక్ష దాటిన తర్వాత అమ్మకాల ఒత్తిడితో పుత్తడి ఆ స్థాయిని కోల్పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగారానికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా 99.9 శాతం స్వచ్ఛత బంగారం బుధవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,00,750 స్థాయిని చేరుకుంది. పాకిస్తాన్–భారత్ మధ్య ఉద్రిక్తతలతో కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,050 పెరిగి రూ.1,00,350 స్థాయికి చేరింది. ఏప్రిల్ 22న పసిడి రూ.1,01,600 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేయడం గుర్తుండే ఉంటుంది. మరోవైపు వెండి కిలోకి రూ.440 పెరిగి రూ.98,940 స్థాయిని సమీపించింది. అంతర్జాతీయ మార్కెట్లో భిన్నమైన పరిస్థితి కనిపించింది. బంగారం 25 డాలర్ల నష్టంతో 3,397 డాలర్ల వద్ద ఉంది. యూస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయాలకు ముందు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరించినట్టు తెలుస్తోంది. ‘వాణిజ్య చర్చల్లో పురోగతిపై ఆశలతో మళ్లీ రిస్కీ ఆస్తులవైపు మార్కెట్లు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ మధ్య ప్రాచ్యం, రష్యా–ఉక్రెయిన్, భారత్–పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది’ అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా పేర్కొన్నారు. -
ప్రైవేటు పెట్టుబడులు తగ్గుముఖం!
న్యూఢిల్లీ: ప్రైవేటు మూలధన వ్యయాలు (పెట్టుబడులు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మేర తగ్గిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ సర్వే అంచనా వేసింది. రూ.4.88 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ నిర్వహించిన ‘ఫార్వార్డ్ లుకింగ్ సర్వే’ తెలిపింది. 2024–25లో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు రూ.6.56 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2023–24లో రూ.4.22 లక్షల కోట్లు కాగా, 2022–23లో రూ.5.72 లక్షల కోట్లు, 2021–22లో రూ.3.94 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. వీటి ప్రకారం 2021–22 నుంచి 2024–25 మధ్య కాలంలో మొత్తం మీద ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 66.3 శాతం పెరిగా యి. 2021–22లో ఒక్కో సంస్థ గ్రాస్ ఫిక్స్డ్ అస్సెట్ (జీఎఫ్ఏ) రూ.3,151 కోట్లుగా ఉంది. ఇది 2022–23లో రూ.3,279 కోట్లకు (4 శాతం వృద్ధి).. 2023–24లో రూ.4,183 కోట్లకు (27 శాతం వృద్ధి) పెరిగింది. విద్యుత్, గ్యాస్, స్టీమ్, ఎయిర్ కండీషనింగ్ సప్లై విభాగంలో ఒక కంపెనీ నుంచి అత్యధిక జీఎఫ్ఏ రూ.14,000 కోట్లుగా ఉంది. 2021–22లో ఒక్కో సంస్థ సగటున రూ.109 కోట్లను మూలధన వ్యయాలపై వెచ్చించింది. 20 22–23లో ఇది రూ.149 కోట్లు, 2023–24లో రూ. 1.07 కోట్లు, 2024–25లో రూ.172 కోట్ల చొప్పున ఉన్నాయి. తయారీ రంగం నుంచి 43.8 % మూ లధన వ్యయాలు ఉంటే.. ఐటీ నుంచి 15.6 %, రవాణా, స్టోరేజీ నుంచి 14 % చొప్పున ఉన్నాయి. వృద్ధి కోసమే పెట్టుబడులు.. ప్రస్తుత ఆస్తుల విలువను పెంచుకోవడంపై పెట్టుబడులకు 28.4 శాతం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 11.5 శాతం సంస్థలు అవకాశాలను విస్తృతం చేసుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆదాయ వృద్ధి కోసం 2024–25లో మూలధన వ్యయాలు చేసినట్టు 49.6 శాతం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు తెలిపారు. 30.1 శాతం సంస్థలు సామర్థ్యాల పురోగతికి, 2.8 శాతం సంస్థలు వైవిధ్యంపై పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించాయి. -
టారిఫ్‌లకు రెండు వైపులా పదును
న్యూఢిల్లీ: టారిఫ్‌లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అమెరికాలాంటి పెద్ద మార్కెట్లలో టారిఫ్ ప్రభావిత పరిశ్రమలు నెమ్మదించినా వాటికి సేవలు కొనసాగించాల్సి రావడం ఒకెత్తైతే, టారిఫ్‌లవల్ల వ్యయాలు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కూడా భారతీయ ఐటీ కంపెనీలు కొత్త వ్యాపారావకాశాలను దక్కించుకునేందుకు కూడా తోడ్పడవచ్చని, ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడగలదని ఆమె తెలిపారు. అమెరికా టారిఫ్‌ల ప్రభావం నేరుగా ఐటీ సంస్థలపై పడకపోయినా, అవి సేవలందించే మార్కెట్లలో పరిశ్రమలు మందగించడం వల్ల పరోక్షంగా దెబ్బతినొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రోష్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టారిఫ్‌లు, డీగ్లోబలైజేషన్లాంటి భౌగోళికరాజకీయాంశాలు ఐటీ సేవలపై ప్రభావం చూపొచ్చని ఇటీవలే ఆరి్థక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్ కూడా తెలిపారు. -
హైదరాబాద్‌లో 5% పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి త్రైమాసింకంలో 5 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి రూ.7,053గా ఉంటే, 2025 మార్చి చివరికి రూ.7,412కు చేరుకుంది. ఎంఎంఆర్, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణె, చెన్నై నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగగా.. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో ధరలు 4–5 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. ఇళ్ల ధరలు గత కొన్నేళ్ల నుంచి ఏటా పెరుగుతూ వచ్చాయని.. ఆ పెరుగుదల వేగం ఇటీవలి త్రైమాసికాల్లో నిదానించినట్టు తెలిపింది. 2022–24 మధ్య ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగిన అనంతరం.. మోస్తరు స్థాయికి చేరడంతో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తుందని పేర్కొంది. టాప్–8 నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం తక్కువగా 98,095 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్ టైగర్ గత నెలలో విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. గత కొన్ని త్రైమాసికాలుగా ఇళ్ల ధరల పెరుగుదల మోస్తరుగా ఉండడం మార్కెట్ స్థిరపడినట్టు సంకేతమిస్తోందని హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. ధరలు తగ్గడం నిజమైన కొనుగోలుదారులకు ప్రేరణనిస్తుందని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడి అభిప్రాయపడ్డారు. నగరాల వారీగా ధరలు.. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.12,600గా ఉంది. → ఢిల్లీ–ఎన్సీఆర్లోనూ ఎలాంటి మార్పు లేకుండా రూ.8,106, చెన్నైలో 7,173, పుణెలో రూ.7,109 చొప్పున చదరపు అడుగు ధర మార్చి త్రైమాసికంలో ఉంది. → అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర డిసెంబర్ చివరికి రూ.4,402గా ఉంటే, మార్చి చివరికి రూ.4,568కి చేరింది. → బెంగళూరులో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.7,536 నుంచి రూ.7,881కి చేరింది. → కోల్‌కతాలో రూ.5,633 నుంచి రూ.5,839కి పెరిగింది. -
చమురుపై రూ.1.8 లక్షల కోట్లు ఆదా
న్యూఢిల్లీ: చమురు ధరలు కనిష్ట స్థాయికి చేరిన క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వీటి దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల రూపంలోనే సమకూరుతుండడం తెలిసిందే. వీటి దిగుమతుల కోసం భారత్ 2024–25లో 242.4 బిలియన్ డాలర్లను (రూ.20.60 లక్షల కోట్లు) వెచ్చించినట్టు ఇక్రా నివేదిక తెలిపింది. ఎల్ఎన్జీ దిగుమతుల కోసం 15.2 బిలియన్ డాలర్లు (రూ.1.29 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఈ వారంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 60.23 డాలర్ల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. 2021 ఫిబ్రవరి తర్వాత కనిష్ట స్థాయికి చమురు ధరలు చేరుకుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. 2024 మార్చితో పోల్చి చూసుకున్నా బ్యారెల్ ముడి చమురు ధర 20 డాలర్లు తక్కువగా ఉంది. నాడు పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.2 చొప్పున తగ్గించడం తెలిసిందే. 2025–26 సంవత్సరంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 60–70 డాలర్ల మధ్య ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ ధరల ప్రకారం అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలకు (ముడి చమురు ఉత్పత్తి సంస్థలు) రూ.25,000 కోట్ల మేర పన్నుకు ముందు లాభం సమకూరుతుందని అంచనా వేసింది. ఇక ఎల్ఎన్జీ దిగుమతులపై రూ.6,000 కోట్లు, ముడి చమురు దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్ల చొప్పున మిగులుతుందని పేర్కొంది. ఆయిల్ మార్కెటింగ్ (రిటైల్) సంస్థలకు మార్జిన్లు మెరుగ్గా ఉంటాయని.. ఎల్పీజీపై నష్టాలు తగ్గుతాయని వెల్లడించింది. -
ఐటీ ఉద్యోగం ఒక్కసారి పోతే.. ఇక అంతే..!
ప్రస్తత పరిస్థితిలో ఐటీ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడమూ అంతే కష్టం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ మంచి పనితీరు కనబర్చాలి. వెనకబడిన ఉద్యోగులను కంపెనీలు ఉపేక్షించడం లేదు. వెంటనే ఉద్వాసన పలుకుతున్నాయి. దీనికి సంబంధించే ప్రపంచ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది.పనితీరు సమస్యలతో ఉద్యోగం కోల్పోయి కంపెనీని వీడిన ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ రెండేళ్ల నిషేధం విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇలా జాబ్ పోగుట్టుకుంటే మళ్లీ రెండేళ్ల వరకూ ఆ ఛాయలకూ కూడా వెళ్లే అవకాశం ఉండదన్న మాట. అంతేకాదు.. ఈ ఉద్యోగాల కోతలను 'గుడ్ అట్రిషన్'గా పిలుస్తారు. అంటే కంపెనీని విడిచిపెట్టాలనుకునే ఉద్యోగులను సంతోషం.. దయచేయండి.. అని భావిస్తుందని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.గత రెండు నెలలుగా మైక్రోసాఫ్ట్ తన సిబ్బంది పనితీరు నిర్వహణ ప్రక్రియను పునర్వ్యవస్థీకరిస్తోంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులపై కంపెనీ కఠినంగా వ్యవహరించింది. పనితీరు కనబరచని ఉద్యోగులను తొలగించే సంస్థ వ్యూహంలో భాగంగా ఈ రెండు కొత్త టూల్స్ ఉన్నాయి.ఈ ఏడాది పనితీరు తక్కువగా ఉన్న 2000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించింది. పనితీరు సరిగా లేని ఉద్యోగులకు కంపెనీ సెవెరెన్స్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం కంపెనీ 'గుడ్ అట్రిషన్' ప్రణాళిక ప్రతి సంవత్సరం నిర్ణీత శాతం ఉద్యోగులను తొలగించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.బడా టెక్ కంపెనీల పనితీరు విధానాల్లో మార్పుబడా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల నిలుపుదల, పనితీరు విధానాల్లో విస్తృత మార్పు వచ్చింది. మెటా, అమెజాన్ వంటి కంపెనీలు కూడా తమ ప్రస్తుత, ఔట్ గోయింగ్ ఉద్యోగుల పనితీరుపై కఠిన విధానాలను ప్రవేశపెట్టాయి. గతంలో అమెజాన్ 'అన్ గ్రేటెడ్ అట్రిషన్'ను ప్రవేశపెట్టింది.దీని ప్రకారం మేనేజర్లు ప్రతి సంవత్సరం తమ బృందంలో కొంత మందిని తొలగించాల్సి ఉంటుంది. పనితీరు తక్కువగా ఉన్న తమ ఉద్యోగులపై కూడా మెటా వేటు వేస్తోంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం ఇక తిరిగి నియమించుకోకూడదనంటూ కొంతమంది మాజీ ఉద్యోగులను ఈ కంపెనీ జాబితా చేసిపెట్టుకుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈఎంఐలు తగ్గుతాయ్...
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లోన్ కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అంటే 0.15% తగ్గించింది.ఈ సవరణ తరువాత,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు రుణ కాలపరిమితిని బట్టి 9 శాతం నుంచి 9.20 శాతం వరకు ఉంటుంది. ఇది ఇంతకు ముందు 9.10 శాతం నుంచి 9.35 శాతం ఉండేది. సవరించిన రేట్లు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో తరువాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ఎంసీఎల్ఆర్లో మార్పులు చేసింది. 2025 ఫిబ్రవరి నుండి రెపోరేటు మొత్తం తగ్గింపు 50 బేసిస్ పాయింట్లకు చేరుకుంది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు. ఇది తగ్గితే సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో రుణ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకులు తక్కువ రుణ రేట్ల ద్వారా తక్కువ ఫండింగ్ ఖర్చుల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.రుణగ్రహీతలకు ఏంటి ప్రయోజనం?ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం ఒక ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రత్యేకంగా ఆర్బీఐ సవరిస్తే తప్ప ఇదే రేటును బ్యాంకులు అమలు చేస్తాయి. 2016లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఎంసీఎల్ఆర్ను గృహ, వ్యక్తిగత, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్ రేట్ రుణాలకు ఉపయోగిస్తారు. ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణం ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడిన రుణ ఈఎంఐలు తగ్గుతాయి లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుఓవర్నైట్: 9.00%1 నెల: 9.00%3 నెలలు: 9.05%6 నెలలు: 9.15%1 సంవత్సరం: 9.15%2 సంవత్సరాలు: 9.20%3 సంవత్సరాలు: 9.20% -
ఎగిసిన స్టాక్ ఎక్స్ఛేంజీల లాభాలు
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 2,650 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,488 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 4,397 కోట్లకు పరిమితమైంది.అంతక్రితం క్యూ4లో రూ. 5,080 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 35 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 11.46 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎన్ఎస్ఈ నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 12,188 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 19,177 కోట్లకు బలపడింది. ఈ కాలంలో మొత్తం రూ. 59,798 కోట్లమేర సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) చెల్లించింది. బీఎస్ఈ లాభం హైజంప్మరో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం హైజంప్ చేసి రూ. 494 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 107 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 926 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 23 డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 5 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది.కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్ఈ నికర లాభం 3 రెట్లు దూసుకెళ్లి రూ. 1,322 కోట్లను తాకింది. 2023–24లో కేవలం రూ. 404 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 3,236 కోట్లకు బలపడింది. ఈ కాలంలో ఈక్విటీ డెరివేటివ్స్‌లో 30.5 బిలియన్ కాంట్రాక్టులు ట్రేడ్‌కాగా.. రూ. 1,415 కోట్ల ఆదాయం నమోదైనట్లు బీఎస్ఈ వెల్లడించింది. -
పాక్‌కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు!
లండన్: చదువు, ఉద్యోగం కోసం వెళ్లి శరణార్థి పేరిట అక్కడే శాశ్వతంగా తిష్ట వేస్తున్న పాకిస్తాన్ పౌరులకు యూకే షాకిచ్చింది. ఆసైలం (శాశ్వత నివాసం) దరఖాస్తుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాకిస్తానీ పౌరులకు యూకే వీసా నిబంధనలను కఠినం చేయనుంది. వీసా ఓవర్‌స్టేలు, ఆసైలం దరఖాస్తులపై కఠిన చర్యల్లో భాగంగా, యూకే ప్రభుత్వం పాకిస్తానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుండి వచ్చే వారికి స్టడీ, వర్క్ వీసాలపై కఠినమైన పరిమితులను విధించనుందని టైమ్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది.యూకే శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుండి దరఖాస్తులు ఇటీల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో పాకిస్తానీ పౌరులు అగ్రస్థానంలో ఉన్నారు. హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం.. 2024లో మొత్తం 108,000 మంది ఆసైలం కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అత్యధికంగా 10,542 మంది పాకిస్తానీ పౌరులే ఉన్నారు.వీరిలో 16,000 మంది స్టూడెంట్ వీసాలపై యూకేకి వచ్చారు. పాకిస్తానీ, నైజీరియన్, శ్రీలంక దేశీయులు వర్క్, స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై వచ్చి ఆ తర్వాత ఆసైలం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిని అధికారులు "సిస్టమ్ దుర్వినియోగం"గా వర్ణించారు. ఈ నేపథ్యంలో వీసాలిచ్చే సమసయంలోనే కఠినంగా వ్యవహరించాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.కొత్త నిబంధనల్లో భాగంగా వీసా దరఖాస్తుదారులను వారి ఆసైలం దరఖాస్తు రిస్క్‌ను అంచనా వేయడానికి ప్రొఫైలింగ్ చేస్తారు. అధిక రిస్క్‌గా భావించిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. అంతేకాదు..వీసా హోల్డర్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు నిరూపించుకోకపోతే, వారికి పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే వసతి సౌకర్యాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూకే ప్రభుత్వం 2024లోనూ కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు డిపెండెంట్లను తీసుకురాకుండా కఠిన నిబంధనల విధించించింది. దీంతో అప్పటి నుంచి 2025 మార్చి నాటికి వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గి 7,72,200కి తగ్గాయి.అయితే, ఈ ప్రతిపాదనలు వివాదాన్ని రేకెత్తించాయి. జాతీయత ఆధారంగా ప్రొఫైలింగ్ చేయడం వివక్ష దావాలకు దారితీయవచ్చని ఇమ్మిగ్రేషన్ లాయర్ అహ్మద్ ఖాన్, హెచ్చరించారు. "ఈ విధానాలు మూల కారణాలను పరిష్కరించకుండా మొత్తం సమాజాలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం, శ్రామిక లోటుతో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు కూడా ఆర్థిక ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. -
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ఆర్థిక ఉత్పత్తులు
టైర్ 2, ఇతర పట్టణాల్లో చిన్నతరహా వ్యాపారాలు నిర్వహించే మహిళలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఆర్థిక ఉత్పత్తులను కోరుకుంటున్నట్టు ‘భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) 2025’ నివేదిక వెల్లడించింది. బిజినెస్ మేనేజన్మెంట్ ప్లాట్‌ఫామ్ ‘టైడ్’ దీన్ని విడుదల చేసింది.అంతేకాదు ఆయా పట్టణాల్లో చిన్నతరహా మహిళా పారిశ్రామికవేత్తల్లో మూడింట ఒక వంతు మంది రుణం పొందే విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తనఖా నిబంధనలు కఠినంగా ఉండడం, ఆర్థిక అక్షరాస్యత తగినంత లేకపోవడం వీరిని రుణ సదుపాయానికి దూరం చేస్తోందని, వీరికి తనఖా రహిత సూక్ష్మ రుణాలు సహా తదితర ప్రత్యామ్నాయ రుణ సదుపాయాలు అందించేందుకు సత్వర విధానపరమైన చర్యలు అవసరమని ఈ నివేదిక సూచించింది.‘‘టైర్ 2, 3, అంతకంటే చిన్న పట్టణాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు డిజిటల్ అవగాహనతో వృద్ధి చెందాలన్న ఆకాంక్షలతో ఉన్నారు. కానీ, రుణ సదుపాయం, నెట్‌వర్క్‌లు, తదితర సంస్థాగత అంతరాలు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి’’అని తెలిపింది. మహిళల అభిప్రాయాలు.. 1,300 మంది మహిళా వ్యాపారవేత్తల అభిప్రాయాలను బీడబ్ల్యూఏఐ సర్వే చేసింది. ఆరి్థక, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందని 58% మంది చెప్పడం గమనార్హం. డిజిటల్ నైపుణ్యాలను పెంచుకోవాలన్న బలమైన ఆకాంక్ష 12 శాతం మందిలో కనిపించింది.28 శాతం మంది నిధుల విషయంలో తమ కుటుంబం నుంచి పురుష సభ్యుడి సహకారం అవసరమని చెప్పారు. వ్యవస్థాపకులుగా వారి ప్రయాణంలో ఇదొక పెద్ద అడ్డంకిగా నివేదిక పేర్కొంది.డిజిటల్ నైపుణ్యాల పెంపు, వారికి లభిస్తున్న వివిధ పథకాల సమాచారం అందించడం, నెట్వర్కింగ్ పెంపు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాలను సులభతరం చేయొచ్చని ఈ నివేదిక సూచించింది. -
Operation Sindoor: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్
ఉగ్రమూకలను ఏరివేసేందుకు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైన్యం చేసిన కచ్చితమైన దాడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 105.71 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 80,746.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34.80 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 24,414.40 వద్ద ముగిసింది.బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.36 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.16 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి.రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్ కేర్ మినహా మిగతా అన్ని రంగాలు గ్రీన్‌లో ముగియడంతో ఆటో, మీడియా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతానికి పైగా పెరిగాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ 5.2 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.02 శాతం, ఎటర్నల్ 1.41 శాతం, అదానీ పోర్ట్స్ 1.41 శాతం, టైటాన్ 1.27 శాతం లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 4 శాతం, సన్ ఫార్మా 1.95 శాతం, ఐటీసీ-1.3 శాతం, నెస్లే ఇండియా-1.06 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.01 శాతం నష్టపోయాయి.పాక్ స్టాక్ మార్కెట్ కుదేలుపాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత్ జరిపిన దాడుల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. ఆ దేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కేఎస్ఈ 100 (కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్) ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు లేదా 6 శాతం పడిపోయింది. భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టిన కొన్ని గంటల్లోనే కేఎస్ఈ-100 సూచీ క్షీణించి 1,12,076.38 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్) కోలుకునే సూచనలు కనిపించలేదు. పీఎస్ఎక్స్ వెబ్సైట్ మూతపడింది. ఆ వెబ్సైట్ తెరిస్తే "తదుపరి నోటీసు వచ్చే వరకు నిర్వహణలో ఉంటుంది" అన్న సందేశం కనిపిస్తోంది. -
జెన్సోల్పై కేంద్రం దర్యాప్తు
కంపెనీల చట్ట నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా జెన్సోల్ ఇంజనీరింగ్, బ్లూస్మార్ట్ మొబిలిటీలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. నిధుల అక్రమ మళ్లింపు, కార్పొరేట్ పాలనలో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏప్రిల్‌లో చర్యలకు తెరతీసిన సంగతి తెలిసిందే.కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. బుకింగ్ ద్వారా క్యాబ్(రైడ్‌హెయిలింగ్) సర్వీసులు అందించే బ్లూస్మార్ట్ మొబిలిటీని సైతం అన్మోల్ ప్రమోట్ చేయడం గమనార్హం!కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జెన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని గత నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. -
ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లు
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఈ రోజు తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపుదాడికి పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది స్థావరాలను భారత ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆపరేషన్ సింధూర్‌లో రఫేల్, సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలను మోహరించింది. వాటి గురించి తెలుసుకుందాం.డసాల్ట్ రఫేల్డసాల్ట్ రాఫెల్ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఇది అధునాతన ఏవియానిక్స్, మెరుగైన పోరాట సామర్థ్యాలకు ప్రసిద్ది చెందింది. అటాక్ చేసే సమయంలో యుద్ధభూమిలో పరిస్థితుల అవగాహన కోసం ఆర్బీఈ2 ఏఈఎస్ఏ రాడార్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, ఫ్రంట్-సెక్టార్ ఆప్ట్రోనిక్స్ను అమర్చారు. రెండు ఎస్ఎన్సీఎంఏ ఎం88 టర్బోఫాన్ ఇంజిన్లను ఇందులో ఉపయోగించారు. ఇది సూపర్ క్రూయిస్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 9,500 కిలోల వరకు ఆయుధాలు, ఇంధనాన్ని మోసుకెళ్లగలదు. ఫైటర్ పైలట్లకు యుద్ధభూమిలో రియల్ టైమ్ సమాచారం అందించేందుకు బహుళ సెన్సార్లను ఉపయోగించారు. నౌకాదళం కోసం 26 రఫేల్-మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ గతంలో రూ.63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఈ జెట్లను ఉంచాలని నిర్ణయించింది.సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐఈ ట్విన్ ఇంజిన్, మల్టీరోల్ ఎయిర్ సుపీరియరిటీ ఫైటర్ జెట్ సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం రష్యాకు చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ ఆయుధాగారంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటి.ఇది థ్రస్ట్ వెక్టరింగ్ కంట్రోల్‌తో ఏఎల్-31FP టర్బోఫాన్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఇంధనం నింపితే గరిష్టంగా 3,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంధనం నింపితే 8,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.మల్టీ-మోడ్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ)ను కలిగి ఉంది. ఇజ్రాయెల్, ఫ్రెంచ్, ఇండియా ఏవియానిక్స్‌లో ఇవి ఉన్నాయి.గగనతల క్షిపణులు, గైడెడ్ బాంబులతో సహా 8,000 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు.భారత వైమానిక దళంలో 260కి పైగా ఈ జెట్లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ రుణం దిగిరావాలిసెపెకాట్ జాగ్వార్సెపెకాట్ జాగ్వార్ అనేది ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్ ఇంజిన్, సూపర్ సోనిక్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్. తక్కువ ఎత్తులో హైస్పీడ్ ఆపరేషన్స్ కోసం రూపొందించారు. శత్రు భూభాగంలో దాడులకు అనువైనది. మెరుగైన రాడార్, జీపీఎస్ నావిగేషన్, నైట్ ఫ్లయింగ్ వ్యవస్థలను కలిగి ఉంది. రెండు రోల్స్ రాయిస్ టర్బోమెకా అడౌర్ టర్బోఫాన్ ఇంజిన్లతో దీన్ని రూపొందించారు. లేజర్ గైడెడ్ బాంబుల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారత వైమానిక దళంలో జాగ్వార్ 1979 నుంచి కీలక స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అంబాలా, గోరఖ్‌పూర్, జామ్ నగర్ వైమానిక స్థావరాల్లో వీటిని మోహరించారు. -
ప్రభుత్వ రుణం దిగిరావాలి
పెరిగిన ప్రభుత్వ రుణం మోస్తరు స్థాయికి దిగిరావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్ అన్నారు. తద్వారా వడ్డీ చెల్లింపులు తగ్గుతాయని, అప్పుడే రేటింగ్ అప్‌గ్రేడ్ అవుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అనిశ్చితులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ఏదో ఒక నిర్ధిష్టమైన మార్గానికి పరిమితం కాకూడదన్నారు.‘మారుతున్న పరిణామాలకు మనం చురుగ్గా స్పందించాలి. నేడు భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి సమీపించింది. మిగిలిన ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందన్నది తెలుసుకునేంత సామర్థ్యం మనకు ఉంది. ఈ దిశగా మనదైన మార్గాన్ని గుర్తించాలి’ అని వివరించారు. ప్రభుత్వ రుణం ప్రస్తుత స్థాయిల నుంచి కచ్చితంగా దిగిరావాలంటూ.. అందుకు ద్రవ్య స్థిరీకరణను మార్గంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?దేశ జీడీపీలో పన్నుల వాటా దశాబ్దం క్రితం 16.5 శాతంగా ఉంటే, అది ప్రస్తుతం 18 శాతానికి చేరినట్టు అజయ్‌సేత్ తెలిపారు. ప్రస్తుత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే మరో 5–6 ఏళ్లలో 20 శాతానికి పన్నుల వాటా చేరుకోగలదన్నారు. వ్యయాల గురించి మాట్లాడుతూ.. మూలధన వ్యయాలకు అనుకూలంగా తగిన సర్దుబాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. -
యాపిల్ మొబైల్స్ అన్నీ భారత్‌లోనే తయారీ
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఉత్పత్తి చేయడం ప్రతి కంపెనీకి ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. తాము అమెరికాలో విక్రయించబోయే అధిక శాతం ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయంటూ టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించడం ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.‘రాబోయే రోజుల్లో తమ మొబైల్ ఫోన్లు అన్నింటినీ భారత్‌లోనే తయారు చేయాలని, సోర్సింగ్ చేయాలని యాపిల్ నిర్ణయించుకుంది. కాబట్టి భారత్‌లో ఇన్వెస్ట్ చేశారంటే విశ్వసనీయతను, సహజత్వాన్ని, అఫోర్డబిలిటీని (తక్కువ వ్యయాల ప్రయోజనాలు) ఎంచుకున్నట్లే’ అని భారత్ టెలికం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం దన్నుతో దేశీయంగా టెలికం పరికరాల మార్కెట్ అనెక రెట్లు వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. రూ.4,000 కోట్ల పెట్టుబడులనేవి రూ.80,000 కోట్ల విక్రయాలకు, రూ.16,000 కోట్లు విలువ చేసే ఎగుమతులతో పాటు 25,000 ఉద్యోగాల కల్పనకు దోహదపడినట్లు సింధియా చెప్పారు.ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇదివరకే ప్రకటించారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు. -
అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,750 (22 క్యారెట్స్), రూ.99,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.500, రూ.540 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.500 పెరిగి రూ.90,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.540 పెరిగి రూ.99,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)లు కూడా భారీగానే పెరిగాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాయాది దేశంపై పంజా విసిరింది. పాకిస్థాన్‌లోని సాధారణ ప్రజలపై కాకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. దీనిపై సానుభూతి కోసం పాక్ ఇతర దేశాల సాయం కోరకుండా భారత్ చాకచక్యంగా వ్యవహరించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.మార్కెట్ రియాక్షన్మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి నిఫ్టీ 50 24,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయింది. గిఫ్ట్ సిటీలోని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ సుమారు 1.19% క్షీణించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతుంది.పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎఫ్ఐఐలు కీలకం24-48 గంటల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తే మార్కెట్లు ముందుకు సాగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం కొంతకాలం మార్కెట్లో దిద్దుబాటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొనుగోలుదారులుగా ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కొంత కాలం అనిశ్చితులు కొనసాగవచ్చు.ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలుగతంలో ఇలా..ఇండో-పాక్ ఘర్షణల నేపథ్యంలో మార్కెట్లు గతంలోనూ కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తరువాత సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ సెషన్ ప్రారంభంలో పడిపోయినప్పటికీ మరుసటి రోజు తిరిగి పుంజుకున్నాయి. పహల్గాం దాడి తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలు, చైనా లిక్విడిటీ చర్యలు వంటి అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మార్కెట్లో కొంత సానుకూల సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది. -
సేవల రంగం .. స్వల్పంగా మెరుగు
కొత్త ఆర్డర్ల రాకతో దేశీ సర్వీసుల రంగం ఏప్రిల్‌లో స్వల్పంగా మెరుగుపడింది. దీంతో సేవల రంగం పనితీరుకు ప్రామాణికంగా పరిగణించే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ గత నెలలో 58.7కి చేరింది. మార్చిలో ఇది 58.5గా నమోదైంది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పరిభాషలో సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.తాజా గణాంకాలు, దీర్ఘకాలిక సగటు అయిన 54.2 స్థాయికన్నా అధికంగానే ఉన్నట్లు హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు. మార్చిలో కాస్త నెమ్మదించిన ఎగుమతి ఆర్డర్లు ఏప్రిల్‌లో తిరిగి పుంజుకున్నట్లు వివరించారు. ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, అమెరికావ్యాప్తంగా భారతీయ కంపెనీల సేవలకు డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: జీడీపీ వృద్ధి 6.3 శాతమే! కారణం..సగటు విక్రయ ధరలను పెంచడం ద్వారా సర్వీసుల కంపెనీలు తమ అధిక వ్యయాల భారాన్ని క్లయింట్లకు బదలాయించినట్లు పీఎంఐ సర్వేలో వెల్లడైంది. వ్యయాలపరంగా ఒత్తిళ్లు తగ్గి, రేట్లను పెంచడంతో మార్జిన్లు మెరుగుపడ్డాయి. కార్యకలాపాలు పుంజుకోవడంపై సర్వీస్ ప్రొవైడర్లు ఆశావహంగా ఉన్నప్పటికీ అంచనాలు మాత్రం తగ్గాయి. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 47 పాయింట్లు పెరిగి 24,426కు చేరింది. సెన్సెక్స్(Sensex) 134 పాయింట్లు పుంజుకుని 80,777 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 62.52 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.77 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.87 శాతం దిగజారింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో స్టాక్ సూచీలకు కొంత ఊరట లభిస్తున్నా, ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడుల పరిణామాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగరావడంతో దేశీయ ఆయిల్ రిఫైనరీ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీడీపీ వృద్ధి 6.3 శాతమే! కారణం..
భారత జీడీపీ 2025లో 6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడీస్ రేటింగ్స్ తాజా అంచనాలు ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ గతంలో వెల్లడించిన అంచనాలను తగ్గించింది. అమెరికా టారిఫ్‌లు, వాణిజ్య ఆంక్షలతో వృద్ధి నిదానించొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు.. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు సైతం జీడీపీ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.ఈ నేపథ్యంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ విస్తరణ చేపట్టాలి, ముడి పదార్థాల సమీకరణ తదితరాల వ్యయాలు పెరిగిపోవ్చని పేర్కొంది. 2026 సంవత్సరానికి మాత్రం లోగడ ప్రకటించిన 6.5 శాతం వృద్ధి రేటు అంచనాలనే మూడీస్ కొనసాగించింది. 2024 కేలండర్ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండడం గమనార్హం. విధానపరమైన అస్పష్టత, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి అంతర్జాతీయ వృద్ది రేటు అంచనాలను తగ్గిస్తున్నట్టు మూడీస్ రేటింగ్స్ తెలిపింది.ప్రపంచ వృద్ధిపైనా ప్రభావం..టారిఫ్‌లకు అమెరికా స్వల్పకాలం పాటు విరామం ఇచి్చనప్పటికీ చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలు జీ–20 దేశాల వ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. 2025లో అమెరికా, చైనా జీడీపీ అంచనాలను సైతం కుదించింది. అమెరికా జీడీపీ 2025లో 1 శాతం, 2026లో 1.5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా వేసింది. గత అంచనాలు కుదించింది. చైనా 2025లో 3.8 శాతం, 2026లో 3.9 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలుమొత్తం మీద అమెరికాకు సంబంధించి టారిఫ్‌లు గరిష్ట స్థాయికి చేరాయని.. రానున్న రోజుల్లో ఇవి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. తరచుగా ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) కఠినతరం చేస్తాయని, ఇది నిధులపై వ్యయాలు గణనీయంగా పెరిగేందుకు దారితీస్తుందని మూడీస్ తెలిపింది. వృద్ధికి ఇది విఘాతం కలిగించొచ్చని పేర్కొంది. -
ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలు
ఆర్బీఐ ప్రతిపాదించిన నూతన ముసాయిదా నిబంధనలు ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) బంగారం రుణ ఆస్తులు నిదానించేలా చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం), రుణాల పునరుద్ధరణ, టాపప్ బుల్లెట్ రుణాలపై ఈ ముసాయిదా దృష్టి పెట్టిందని.. ఈ నిబంధనలు ఎన్బీఎఫ్సీ రుణ ఆస్తుల వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన ఆర్బీఐ, భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానించింది.బంగారం రుణాల విషయంలో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య వ్యత్యాసాలు తగ్గించి, ఏకరూపత తీసుకురావడం ముసాయిదా నిబంధనల లక్ష్యంగా ఉంది. బంగారం రుణాల విషయంలో అసాధారణ ప్రక్రియలను ఎన్బీఎఫ్సీలు పాటిస్తుండడం, బంగారం విలువపై అధిక నిష్పత్తిలో రుణాలు జారీ చేస్తుండడంపై ఆర్బీఐ గతేడాది సెప్టెంబర్‌లో కాస్తంత హెచ్చరించే ధోరణిని వ్యక్తం చేయడాన్ని నివేదిక ప్రస్తావించింది. 2024–25లో వ్యవస్థ వ్యాప్తంగా బంగారం రుణాలు 50 శాతానికి పైనే పెరిగాయని, బ్యాంక్‌ల బంగారం రుణ ఆస్తుల విలువ రెట్టింపైనట్టు పేర్కొంది. ఆభరణాలపై తక్కువ రుణాలు..ఎల్టీవీపై ఆర్బీఐ కొత్త నిబంధనల కింద ఎన్బీఎఫ్సీలు బంగారం రుణాల మంజూరు విలువను క్రమబద్దీకరించుకోవాల్సి వస్తుందని తెలిపింది. బుల్లెట్ రుణాలకు సంబంధించిన ఎల్టీవీ ప్రస్తుతమున్న 65–68 శాతం నుంచి 55–60 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. దీంతో అంతే విలువ కలిగిన బంగారం ఆభరణాలపై మంజూరు చేసే రుణం తగ్గుతుందని తెలిపింది. కస్టమర్ల వద్ద నుంచి నిర్ణీత రోజులకు ఒకసారి (నెల) బంగారం రుణంపై వడ్డీని ఎన్బీఎఫ్సీలు వసూలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, ఈ సంస్థలు ఈఎంఐ ఆధారిత బంగారం రుణాలపై దృష్టి పెట్టొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలుఎల్టీవీ పరిమితి మించితే అదనపు నిధుల కేటాయింపులు చేయాలన్న నిబంధన ఎన్బీఎఫ్సీలపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అభిప్రాయపడింది. ఆర్బీఐ ప్రతిపాదిత నిబంధనలు కొంత కాలానికి ఈ రంగం సామర్థ్యాలను బలోపేతం చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
ఐపీవోకు 5 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా పుంజుకున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో పలు కంపెనీలు మరోసారి లిస్టింగ్ బాటలో సాగుతున్నాయి. తాజాగా ఐదు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో వెరిటాస్ ఫైనాన్స్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, అజయ్ పాలీ, జజూ రష్మీ రిఫ్రాక్టరీస్, రెగాల్ రిసోర్సెస్ చేరాయి. ఈ 5 కంపెనీలు 2024 డిసెంబర్, 2025 జనవరిలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఈ ఏడాది జనవరి 6న లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసిన ఎర్తూడ్ సరీ్వసెస్ ఇటీవల ఐపీవో డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుంది.రూ. 2,800 కోట్లు: నాన్డిపాజిట్ ఎన్బీఎఫ్సీ వెరిటాస్ ఫైనాన్స్ ఐపీవో ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,200 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ విభాగంపై అధిక దృష్టిపెట్టిన కంపెనీ ఈక్విటీ జారీ నిధులను రుణ విడుదలకు సహకరించే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎన్బీఎఫ్సీ..: ఎన్బీఎఫ్సీ.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఐపీవోలో భాగంగా 1.04 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 56.38 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు సహకరించే మూలధన పటిష్టత, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిఫ్రిజిరేషన్ సీలింగ్: రిఫ్రిజిరేషన్ సీలింగ్ సొల్యూషన్లు అందించే అజయ్ పాలీ ఐపీవోలో భాగంగా రూ. 238 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 93 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు ప్లాంట్, మెషినరీ తదితర పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. రూ. 190 కోట్లు సహా..: రెగాల్ రిసోర్సెస్ ఐపీవోలో భాగంగా రూ. 190 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్ 90 లక్షల షేర్ల వరకూ ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రూ. 150 కోట్లు మాత్రమే: ప్రాస్పెక్టస్ ప్రకారం జజూ రష్మీ రిఫ్రాక్టరీస్ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను జార్ఖండ్‌లోని బొకారో ఫెర్రో అల్లాయ్స్ విస్తరణకు వీలుగా కొత్త తయారీ సౌకర్యాలపై వెచి్చంచనుంది. నిధులలో కొంతమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు సైతం వినియోగించనుంది.మెప్పించని ఏథర్ ఎనర్జీ ఎంట్రీ ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ షేరు లిస్టింగ్ రోజే నష్టాలు చవిచూసింది. ఇష్యూ ధర(రూ.321)తో పోలిస్తే బీఎస్ఈలో 1.57% స్వల్ప ప్రీమియంతో రూ.326 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో 4% లాభపడి రూ.333 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనై ఆరంభ లాభాలు కోల్పోయింది. ఒకానొక దశలో 6.50% క్షీణించి రూ.300 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ. 302.50 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.11,267 కోట్లుగా నమోదైంది. ‘‘ఏథర్ ఎనర్జీ షేరు నామమాత్రపు ధరతో లిస్టింగ్ అవ్వడం, ఇంట్రాడేలో 6.50% పతనం పరిణామాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్లు అధిక వాల్యుయేషన్ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తుంది’’ అని లెమాన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకుడు గౌరవ్ గార్గ్ తెలిపారు. -
లాభాల్లోంచి నష్టాల్లోకి..
ముంబై: భారత్ – పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 24,380 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, యూఎస్–చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 80,481 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పతనమై 24,331 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఫెడ్ వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆటో, టెక్ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా సూచీల్లో రియల్టీ 3.5%, విద్యుత్, సర్వీసెస్ 2.5%, యుటిలిటీ, ఇండస్ట్రీయల్, క్యాపిటల్ గూడ్స్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ ఒకటిన్నర శాతం నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2%కి పైగా క్షీణించాయి. -
పసిడి.. మళ్లీ లక్షకు చేరువలో
న్యూఢిల్లీ: పసిడి మరోసారి ర్యాలీ చేసింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 లాభపడి రూ.99,750 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా టారిఫ్‌లపై చేసిన ప్రకటన, భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. జ్యుయలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.2,400 పెరిగి రూ.99,300 వద్ద స్థిరపడింది. ‘‘ట్రంప్ ఫార్మాస్యూటికల్స్‌పై, అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లను ప్రతిపాదించారు. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి, అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో సురక్షిత సాధనమైన బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. బుధవారం యూఎస్ ఫెడ్ పాలసీ సమీక్ష వివరాల కోసం మార్కెట్ భాగస్వాములు ఎదురుచూస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో వెండి ధర కిలోకి రూ.1,800 పెరిగి రూ.98,500కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 3,400 డాలర్లపైకి అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. ఔన్స్‌కు 100 డాలర్ల వరకు పెరిగి 3,422 డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా డాలర్ బలహీనత సైతం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
'2032 నాటికి దేశంలో 12 కోట్ల ఈవీలు'
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ మరియు కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ విడుదల చేసిన ఒక నివేదికలో.. 2032 నాటికి ఇండియాలో 12.3 కోట్ల వాహనాలు ఉంటాయని వెల్లడించింది.దేశం అభివృద్ధి వైపు సాగుతున్న సమయంలో.. 2070 నాటికి సున్నా ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా వాహన కొనుగోలుదారులు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే 2030 నాటికి భారతీయ రోడ్లపై ఉన్న వాహనాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.ఎలక్ట్రిక్ వాహన వినియోగం లేదా కొనుగోలును పెంచడానికి ఫేమ్-2 వంటి స్కీమ్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ డిమాండును ప్రోత్సహించడానికి మాత్రమే కాకుండా.. పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పెంపుకు కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!2030 నాటికి ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్లు 80 శాతానికి, ఫోర్ వీలర్స్ 30 శాతం, కమర్షియల్ కార్లు 70 శాతం, ఎలక్ట్రిక్ బస్సులు 40 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు పెరిగితే.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 76000 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2032 నాటికి 21 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం. -
నష్టాల్లో జీ మీడియా.. భారీగా తగ్గిన ప్రకటనల ఆదాయం
న్యూఢిల్లీ: జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ నష్టం మార్చి త్రైమాసికంలో మరింత పెరిగిపోయింది. రూ.37 కోట్ల నష్టాన్ని సంస్థ నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం కేవలం రూ.6.51 కోట్లుగానే ఉంది. దీంతో పోల్చి చూస్తే ఆరు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది.ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గి రూ.156 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 6 శాతానికి పైగా పెరిగి రూ.200 కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్లో ప్రకటనల ఆదాయం 13.5 శాతం తక్కువగా రూ.145 కోట్లకు పరిమితమైంది.సబ్స్క్రిప్షన్ ఆదాయం 6.9 శాతం తగ్గి రూ.10 కోట్లుగా ఉంది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీ మీడియా కార్పొరేషన్ రూ.119 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.98 కోట్లుగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 4 శాతానికి పైగా తగ్గి రూ.633 కోట్లుగా ఉంది. -
చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్ -
దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్
భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రిటైల్ సంస్థలలో ఒకటైన ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AMPL) విజయవాడలో.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.విజయవాడలోని ఏలూరు రోడ్డు, ఎనికెపాడులో ఉన్న ఈ కొత్త డీలర్షిప్ 1.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 14 వాహనాలను ఒకేసారి ప్రదర్శించగల కెపాసిటీ ఉన్న ఈ షోరూమ్‌లో.. ప్యాసింజర్ వెహికల్ (ఐసీఈ & ఈవీ), స్మాల్ కమర్షియల్ వెహికల్ (ఎస్సీవీ), లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎల్ఎంఎం) వాహనాలన్నీ లభిస్తాయి.ఈ కొత్త డీలర్షిప్ ద్వారా కేవలం సేల్స్ మాత్రమే కాకుండా.. సర్వీస్, వాహనాలకు అవసరమైన ఫాస్ట్-ఛార్జింగ్ సౌకర్యం కలిగి ఉంటుంది. టెక్నాలజీని ప్రతిబింబించేలా.. ఆకర్షణీయమైన డిజైన్ పొందిన ఈ షోరూమ్ 61 కొత్త సర్వీస్ బేలు కలిగి ఉంది. ఇవి ఏడాదికి 28000 మందికి సేవలను అందించగలవు.అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్ ప్రారంభంతో.. ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తన విస్తృత నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 135 మహీంద్రా టచ్పాయింట్లను నిర్వహిస్తోంది.FY 2025లో ఈ గ్రూప్ 37,000 మహీంద్రా వాహనాలను విక్రయించింది. అంటే ప్రతి 13 నిమిషాలకు ఒక వాహనం అమ్ముడుపోయిందనమాట. దీంతో AMPL భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న OEM కోసం అతిపెద్ద సేల్స్ అండ్ ఆఫ్టర్-సేల్స్ భాగస్వామిగా నిలిచింది. -
ఏఐ వినియోగంలో దూసుకెళ్తున్న భారత్: కేపీఎంజీ రిపోర్ట్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏ రంగంలో చూసినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల కంటే కూడా ఏఐను ఎక్కువగా ఇండియా నమ్ముతోందని కేపీఎంజీ (KPMG) నివేదికలో వెల్లడించింది.ట్రస్ట్, యాటిట్యూడ్స్, అండ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ గ్లోబల్ స్టడీ 2025పై KPMG వెల్లడించిన నివేదిక కోసం 47 దేశాలలోని సుమారు 48,000 మందిని సర్వే చేసింది. ఇందులో సుమారు 76 శాతం భారతీయులు ఏఐను విశ్వసిస్తున్నట్లు తెలిసింది.ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాకుండా ఎకానమీ, విద్య, వినోదం వంటి దాదాపు అన్ని పరిశ్రమలలో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో మానవ ప్రమేయం తగ్గుతుందని.. ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని సుమారు 78 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 97 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తమ పనిలో AIని ఉపయోగిస్తున్నారని, 67 శాతం మంది అది లేకుండా తమ పనులను పూర్తి చేయలేరని పేర్కొన్నారు.భారతదేశంలో ఏఐ వినియోగం పెరిగిపోతుండంతో.. ఏఐ-బేస్డ్ ఆర్థిక వృద్ధి & ఆవిష్కరణలలో ఇండియా అగ్రగామిగా దూసుకెళ్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదుగురిలో ముగ్గురు వ్యక్తులు ఏఐను విశ్వసిస్తారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో ఐదుగురిలో ఇద్దరు మాత్రమే దీనిని విశ్వసిస్తున్నారు. -
449 కిమీ రేంజ్ అందించే.. విండ్సర్ ఈవీ ప్రో: ధర ఎంతంటే?
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా.. ఇండియన్ మార్కెట్లో విండ్సర్ ప్రో లాంచ్ చేసింది. ఇది ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది. దీని ధర రూ. 17.46 లక్షలు. ఈ ధర మొదటి 8000 మందికి మాత్రమే అని కంపెనీ వెల్లడించింది. ఆ తరువాత ధరలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది. ఇవి కాకుండా సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది. -
టీ రూ.10.. సమోసా, కాఫీ రూ.20: ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ ధరల్లో..
టీ రూ.10, కాఫీ రూ.20 అనే ధరలు వింటుంటే ఆ ఏముంది? రోడ్డు పక్కన టీ బండిలో రేట్లు అవే కదా అందులో వింతేముంది?.. అనిపించవచ్చు కానీ... ఆ రేట్లు ఎయిర్‌పోర్ట్‌లోని కేఫ్‌లో అంటే..మాత్రం విస్తుపోవాల్సిందే. అవును మరి.. రాబోయే కొన్నేళ్లలో విమానాలు ఎక్కని వారు అంటూ ఉండరేమో కానీ.. విమానాశ్రయాల్లో టీ కూడా తాగని వారు మాత్రం బోలెడంత మంది ఉంటారేమో అనే అంచనాలు ఉండేవి. ఎందుకంటే..రాను రాను విమానయానం అందుబాటులోకి వస్తోంది. కానీ ఎయిర్‌పోర్ట్స్‌లో కనీసం టీ కూడా అందుబాటు ధరలో ఉండడం లేదు కాబట్టి.అడపాదడపా ఎయిర్‌లైన్స్ వాళ్లు అందించే ఆఫర్లు ఒక్కోసారి రైలు ఛార్జీల కన్నా కూడా తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల సామాన్యులకు కూడా విమాన ప్రయాణం సాధ్యమవుతోంది. కానీ విమానాశ్రయాల్లో కాసింత సేద తీరాలని టీ, కాఫీ లాంటివి తాగాలనుకున్నా, సమోసా, బిస్కెట్స్ వంటి చిరు తిండి తినాలన్నా అదేదో పెద్ద కలలాగా మారింది. ఎందుకంటే ఆ ధరల పట్టీ ఇంకా సామాన్యులకు అందనంత దూరంలోనే ఉంది. మన శంషాబాద్ విమానాశ్రయాల వంటి చోట అయితే కేఫ్స్‌లో ధరలు చూస్తే విమానం ఎక్కకుండానే కళ్లు తిరుగుతాయ్.రకరకాల అవకాశాలవల్ల.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనో విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా తప్పడం లేదు. అయినప్పటికీ విమాన ప్రయాణీకులు అంటేనే సంపన్నులు అనే రీతిలో ఈ ధరలు ఉండడం సామాన్యులకు మింగుడు పడని పరిస్థితి.ఈ నేపథ్యంలో పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘ఉడాన్ యాత్రి కేఫే’ అనే సేవను ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఇప్పటికి ఎదురు చూసిన రోజులు ముగిశాయి టీ రూ.10, కాఫీ రూ.20 కి పూణే విమానాశ్రయంలో అందుబాటులోకి రాబోతున్నాయి,‘ అని ఆయన ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు ఐదేళ్లు జైలు శిక్షప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేఫేని ఏర్పాటు చేశారు.. ఈ కేఫే లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే పూణే విమానాశ్రయంలో, ఈ విధంగా తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఆహార పదార్థాలు అందుబాటులోకి రావడం ఒక సమయోచిత మార్పుగా భావిస్తున్నారు ప్రయాణికులు. సమోసా తదితర తినుబండారాలు సైతం రూ.20 ధరల్లో అందిస్తున్న ఈ కేఫ్స్ కోల్‌కతా, చెన్నై, ముంబయిలలో కూడా సేవలు అందిస్తున్నాయి. విమానాశ్రయాలు సంపన్నులుకు తప్ప సామన్యులకు కావనే అభిప్రాయాలను మార్చేలా, అత్యధిక జనాభాకు ఉపయోగపడేలా ఇలాంటి మార్పులు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో రావాలని సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్నారు. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 155.77 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 80,641.07 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 24,379.60 వద్ద నిలిచాయి.సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, ఓరియంట్ బెల్, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, పాలీ మెడిక్యూర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సెంచరీ ఎంకా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కేసాల్వ్స్ ఇండియా, ప్రైమ్ ఫోకస్, ఓరియంటల్ హోటల్స్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజాల హవా!.. ఏప్రిల్‌లో కార్ సేల్స్ ఇలా..
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో కార్ల తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి ఇండియా వాటా ఏప్రిల్‌లో 40 శాతం లోపునకు పడిపోయింది. 1,38,021 వాహన విక్రయాలతో 39.44 శాతానికి పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో 1,39,173 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 40.39 శాతం మార్కెట్ వాటా నమోదు చేసింది.ఆటోమోటివ్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం భారీ స్థాయిలో ఎస్యూవీ విక్రయాలతో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఏప్రిల్‌లో అత్యధికంగా లబ్ధి పొందింది. నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.కంపెనీ అమ్మకాలు 38,696 యూనిట్ల నుంచి 48,405 యూనిట్లకు పెరగడంతో.. మార్కెట్ వాటా 11.23 శాతం నుంచి 13.83 శాతానికి పెరిగింది. ఇక సుదీర్ఘకాలంగా రెండో స్థానంలో కొనసాగుతూ వస్తున్న హ్యుందాయ్ మోటార్స్ (హెచ్ఎంఐఎల్) 43,642 యూనిట్ల అమ్మకాలు, 12.47 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానానికి పడిపోయింది. టాటా మోటార్స్ 44,065 వాహన విక్రయాలతో మూడో స్థానంలో కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 3,44,594 యూనిట్ల నుంచి 1.55 శాతం వృద్ధితో 3,49,939 యూనిట్లకు చేరాయి.2024–25 పూర్తి సంవత్సర వివరాలు..➤గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 16,71,559 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ 40.25 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. 2023–24లో 16,08,041 వాహనాలు విక్రయించగా, మార్కెట్ షేర్ 40.6 శాతంగా నమోదైంది.➤హెచ్ఎంఐఎల్ 5,59,149 యూనిట్లు, 13.46 శాతం మార్కెట్ వాటాతో 2024–25లో మారుతీ తర్వాత రెండో స్థానంలో ఉంది. 2023–24లో 5,62,865 వాహన విక్రయాలు, 14.21 శాతం వాటాను సాధించింది.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!➤టాటా మోటార్స్ 5,35,960 యూనిట్లు విక్రయాలు, 12.9 శాతం వాటాతో మూడో స్థానంలో కొనసాగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 5,39,567 యూనిట్లు కాగా, మార్కెట్ వాటా 13.62 శాతం. ➤5,12,626 యూనిట్ల అమ్మకాలు, 12.34 శాతం మార్కెట్ వాటాతో ఎంఅండ్ఎం నాలుగో స్థానంలో నిలి్చంది. 2023–24లో కంపెనీ రిటైల్ అమ్మకాలు 4,27,390 యూనిట్లు కాగా, మార్కెట్ వాటా 10.79 శాతంగా ఉంది. -
దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలు
భారత్‌లో ఉద్యోగుల ప్రాధాన్యాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఓఎన్ 2025 ఎంప్లాయ్ సెంటిమెంట్ స్టడీ ప్రకారం ఈ ఏడాది దేశంలో 82 శాతం మంది తాము చేస్తున్న సంస్థలు మారాలని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 శాతంగా ఉంది. మెరుగైన పనిప్రాంత ప్రయోజనాలు, కెరీర్ అవకాశాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ధోరణి నొక్కి చెబుతుంది.ప్రయోజనాలకే ప్రాధాన్యతఏఓన్ రిపోర్ట్‌లోని అంశాల ప్రకారం.. భారతీయ ఉద్యోగులు 76 శాతం మంది తమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న వెసులుబాట్లను విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగులకు కోరుకునే ఐదు అత్యంత విలువైన ప్రయోజనాలను విశ్లేషించింది.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌లు: ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్లు, రిమోట్ వర్క్ ఆప్షన్ల కోసం ఉద్యోగులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.మెడికల్ కవరేజ్: ఆసుపత్రిలో చేరడం, అవుట్ పేషెంట్ సేవలు వంటి ఆరోగ్య సంరక్షణ చర్యలు మెరుగ్గా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు: ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతోపాటు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మెంటార్షిప్, లీడర్ షిప్ ట్రైనింగ్ వంటి సదుపాయాలు కోరుకుంటున్నారు.వేతనంతో కూడిన సెలవులు: పెయిడ్ సెలవులు, పేరెంటల్ లీవ్, వెకేషన్ల కోసం సెలవులు ఇచ్చే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు.రిటైర్మెంట్ పొదుపు పథకాలు: పెన్షన్ పథకాలు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి పెట్టుబడి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మంది ఉద్యోగులతో పోలిస్తే భారత్‌లో కేవలం 7 శాతం మంది మాత్రమే తక్కువ సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే భావనతో ఉంటున్నారు.వైద్య కవరేజ్ తరతరాలుగా అత్యధిక విలువ కలిగిన ప్రయోజనాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. జెన్ ఎక్స్(1965-80 మధ్య జన్మించినవారు), జెన్ వై(1980-1995 మధ్య జన్మించినవారు) జెన్ జెడ్(1995-2005 మధ్య జన్మించినవారు) కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జెన్ జెడ్ ఉద్యోగులు వర్క్-లైఫ్ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.వెల్నెస్ ప్రోగ్రామ్‌లకు ప్రాముఖ్యతకొవిడ్ తర్వాత కంపెనీలు తమ బ్రాండ్‌ను రూపొందించడంలో వెల్నెస్ ప్రోగ్రామ్‌ల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయని ఏఓఎన్లోని టాలెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా హెడ్ నితిన్ సేథీ పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యం, వెల్నెస్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సొల్యూషన్స్‌ను తమ పాలసీల్లో పొందుపరిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగులను నిలుపుకోవడానికి, టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుందని చెప్పారు.యువ నిపుణుల్లో పదవీ విరమణ, ఆర్థిక ప్రణాళిక అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని ఏఓఎన్ హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్న వేతనాల ఆందోళనలే ఈ మార్పుకు కారణమని చెప్పారు. ఇది ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టడానికి దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేతఅభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి 43% మంది భారతీయ ఉద్యోగులు తమ ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఏఓఎన్ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి 35 శాతంగా ఉంది. 10 శాతం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం వారి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు. -
దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష
దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.షెల్ కంపెనీల నెట్వర్క్ ద్వారా 150 మిలియన్ దిర్హామ్‌లను లాండరింగ్ చేయడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు పాల్పడినందుకు బల్వీందర్ సింగ్ సాహ్ని శిక్ష.. జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారవేత్త నుంచి 5,00,000 AED (రూ. 1.14 కోట్లు) తో పాటు 150 మిలియన్ AED (రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.'అబు సబా' గా ప్రసిద్ధి చెందిన బల్వీందర్ సింగ్ సాహ్ని.. రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) ఫౌండర్. ఈ కంపెనీ యూఏఈలో మాత్రమే కాకుండా.. అమెరికా, ఇండియాతో సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. విలాసవంతమైన జీవితం గడిపే సాహ్ని.. ఎమిరేట్స్‌లో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లలో ఒకటైన 'డీ5' కోసం సుమారు రూ. 75 కోట్ల ఖర్చు చేశారు.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలుకార్ల ధరల కంటే కూడా.. ఆ కార్ల కోసం కొనుగోలు చేసిన నెంబర్స్ ధరలే ఎక్కువని సాహ్ని.. ఓ సందర్భాల్లో చెప్పారు. ఈయన వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. -
క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి కారణంగా ఇజ్రాయెల్-యెమెన్ ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.క్షిపణి దాడియెమెన్కు చెందిన హౌతీలు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పరిధిలో దాడికి పాల్పడ్డారు. దాంతో విమానాశ్రయం సమీపంలో టెర్మినల్ 3 పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మే 4న జరిగిన ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. బోయింగ్ 787కు చెందిన ఎయిరిండియా విమానం ఏఐ139 ల్యాండ్ అవ్వడానికి గంట ముందు ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్రాడార్24.కామ్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం జోర్డాన్ గగనతలంలో ఉందని, దాడి సమాచారం తెలిసిన వెంటనే దాన్ని అబుదాబికి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: సాంకేతికతతో యుద్ధానికి సైఎయిరిండియా స్పందనమే 4న జరిగిన ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఎయిరిండియా మొదట టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగిస్తున్న విమానాలను మే 6 వరకు నిలిపివేసింది. అక్కడ కొనసాగుతున్న భద్రతా కారణాల వల్ల విమానాల నిలిపివేతను మే 8 వరకు పొడిగించింది. టెల్ అవీవ్‌కు ఎయిరిండియా వారానికి ఐదు విమానాలను నడుపుతోంది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో సంస్థ బృందాలు ప్రభావిత ప్రయాణీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. -
ఎకాఎకి భారీగా పెరిగిన బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,250 (22 క్యారెట్స్), రూ.98,460 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.2,500, రూ.2,730 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,730 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.98,460 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,500 పెరిగి రూ.90,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,750 పెరిగి రూ.98,610 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై స్వల్పంగా రూ.100 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,07,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సాంకేతికతతో యుద్ధానికి సై
సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. అందుకు యుద్ధ భూమి ఏమీ అతీతం కాదు. శత్రువులపై యుద్ధం సాధించేందుకు, స్పష్టమైన ఫలితాల కోసం టెక్నాలజీ వాడుతున్నారు. ఇందులో భాగంగా మానవరహిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్, డ్రోన్లు, రోబోటిక్స్, అన్ మ్యాన్డ్ అడ్వాన్స్డ్ వెపన్స్.. వంటి చాలా పరికరాల్లో సాంకేతికతను వినియోగిస్తున్నారు. కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో రణరంగంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం.ఏఐ, మెషిన్ లెర్నింగ్యుద్ధ సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, ఇంటెలిజెన్స్ విశ్లేషణను మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు. యుద్ధరంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తోంది. శత్రువుల కదలికలను అంచనా వేయడానికి లేదా వ్యూహాత్మక లక్ష్యాలను గుర్తించడానికి ఏఐ విస్తారమైన డేటాసెట్లను ప్రాసెస్ చేస్తుంది. అటానమస్ విధానం ద్వారా డ్రోన్లు, వాహనాలకు ఏఐ సామర్థ్యాలు జోడిస్తున్నారు. ఇది మానవ ప్రమేయం లేకుండా రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్‌కు వీలు కల్పిస్తుంది. సైబర్ బెదిరింపులను గుర్తించి సమర్థంగా కట్టడి చేసేందుకు మెషిన్ లెర్నింగ్ తోడ్పడుతుంది. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షిస్తుంది.మానవ రహిత వ్యవస్థలు (డ్రోన్లు, రోబోటిక్స్)యుద్ధంలో మానవరహిత వ్యవస్థలు అనివార్యంగా పెరుగుతున్నాయి. ఇది సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని తగ్గిస్తుంది. ఇందులో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. ఏరియల్ డ్రోన్లను నిఘా, దాడుల్లో కచ్చితత్వం కోసం ఉపయోగిస్తున్నారు. అమెరికా ఆర్మీకి చెందిన స్మాల్ అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్ (ఎస్‌యూజీవీ) వంటి రోబోలు బాంబుల తొలగింపును నిర్వహిస్తున్నాయి. మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ (యూయూవీ) మైన్ డిటెక్షన్, సబ్ మెరైన్ ట్రాకింగ్ పనులు చేస్తున్నాయి.సైబర్ వార్ఫేర్ టెక్నాలజీయుద్ధ సమయంలో కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థలు, ఇతర రక్షణ వ్యవస్థలకు అంతరాయం కలిగించేలా సైబర్ దాడులు నిర్వహించే అవకాశం ఉంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబర్ వార్‌పేర్ డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఇందులో భాగంగా మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్ ద్వారా ప్రభుత్వ ప్రాయోజిత వెబ్‌సైట్‌ల్లోని సమాచారం శత్రు దేశాల్లోని నెట్‌వర్క్‌లోకి వెళ్లకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ ద్వారా మిలిటరీ నెట్‌వర్క్‌లను రక్షిస్తున్నారు.అధునాతన ఆయుధాలుఆధునిక ఆయుధాల ద్వారా ప్రమాద పరిధి పెరుగుతుంది. రష్యాకు చెందిన కింజాల్ అనే హైపర్ సోనిక్ ఆయుధాలు లేదా చైనాకు చెందిన డీఎఫ్-జెడ్ ఎఫ్ వంటి క్షిపణులు సంప్రదాయ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే తప్పించుకుంటాయి. లేజర్లు, మైక్రోవేవ్ వ్యవస్థలు డ్రోన్లు లేదా క్షిపణులను కచ్చితత్వంతో నిలిపివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జీపీఎస్ గైడెడ్ బాంబులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేదిస్తాయి.ఇదీ చదవండి: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ బ్రాండ్ ఇదే..శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీస్సైనిక కార్యకలాపాలకు అంతరిక్షం కీలకమైన డొమైన్‌గా మారింది. నిఘా ఉపగ్రహాలతో రియల్ టైమ్ ఇమేజ్‌లు, ప్రత్యేకంగా సిగ్నలింగ్ సదుపాయాలను పొందుతున్నారు. దళాల కదలికల కోసం జీపీఎస్, నావిగేషన్‌ను వాడుతున్నారు. కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించే శత్రు ఉపగ్రహాలను నిలిపివేయడానికి లేదా నాశనం చేయడానికి యాంటీ శాటిలైట్ వెపన్స్ రూపొందిస్తున్నారు. -
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ బ్రాండ్ ఇదే..
దేశీయంగా మార్చి త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ 8 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ప్రీమియం స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటం, రిటైల్ స్టోర్స్‌ను కంపెనీ విస్తరించడం, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇందుకు గణనీయంగా దోహదపడ్డాయి. దీంతో సూపర్ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 50,000–రూ. 1 లక్ష వరకు ధర ఉండే ఫోన్లు) యాపిల్ వాటా 28 శాతానికి, ఉబర్–ప్రీమియం విభాగంలో (రూ. 1 లక్ష పైగా రేటు ఉండే ఫోన్లు) 15 శాతానికి చేరింది. జనవరి–మార్చ్ త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్ఫోన్ల సరఫరాపై సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దేశీయంగా మొత్తం స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 21 శాతం వాటాతో చైనా సంస్థ వివో అగ్రస్థానంలో నిలవగా, 19 శాతం షేర్‌తో కొరియన్ దిగ్గజం శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. షావోమీ వాటా ఏకంగా 37 శాతం పడిపోయింది. 13 శాతం మార్కెట్ షేర్‌తో మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఒప్పో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 8 శాతం పెరగ్గా, మార్కెట్ వాటా 12 శాతంగా నమోదైంది. ఇదీ చదవండి: ఈ ఏడాదిలో ఆర్బీఐ మరోసారి తీపికబురుమరిన్ని ముఖ్యాంశాలు..మార్చి త్రైమాసికంలో భారత్‌లో సరఫరా అయిన మొత్తం ఫోన్లలో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 86 శాతంగా నమోదైంది. వార్షికంగా 14 శాతం పెరిగింది. రూ. 8,000 నుంచి రూ. 13,000 వరకు ఖరీదు చేసే 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 100 శాతం పెరిగాయి.ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లో చైనాకు చెందిన ఐటెల్ మార్కెట్ వాటా వార్షికంగా చూస్తే 6 శాతం తగ్గినప్పటికీ, మొత్తం మీద 41 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ చిప్సెట్ మార్కెట్లో మీడియాటెక్ 46 శాతం వాటాతో టాప్‌లో నిల్చింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో (రూ. 25,000 పైగా రేటు ఉన్నవి) 35 శాతం వాటాతో క్వాల్కామ్ అగ్రస్థానం దక్కించుకుంది. -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 11 పాయింట్లు పెరిగి 24,465కు చేరింది. సెన్సెక్స్(Sensex) 6 పాయింట్లు పుంజుకుని 80,807 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.87 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 61.16 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.64 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.74 శాతం దిగజారింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో స్టాక్ సూచీలు సోమవారం ఈ ఏడాది(2025) గరిష్టంపై ముగిశాయి. అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగరావడంతో దేశీయ ఆయిల్ రిఫైనరీ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ ఏడాదిలో ఆర్బీఐ మరోసారి తీపికబురు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల మేర (1.25–1.5 శాతం) రేట్లను తగ్గించొచ్చని ఎస్బీఐ అధ్యయన నివేదిక అంచనా వేసింది. దీంతో మొత్తం మీద రేట్ల తగ్గింపు 150 బేసిస్ పాయింట్లుగా ఉంటుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అంచనాలకు వచ్చింది. 0.25 శాతం స్థానంలో 0.50 శాతం చొప్పున జంబో రేటు తగ్గింపు చేపడితే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.34 శాతానికి పరిమితం కావడం తెలిసిందే. ఇది 67 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఆహార ద్రవ్యోల్బణం శాంతించడంతో 2025–26 సంవత్సరంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 4 శాతం లోపు ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. మరీ మఖ్యంగా ప్రస్తుత త్రైమాసికంలో ఇది 3 శాతంలోపునకు దిగివస్తుందని పేర్కొంది. నామినల్ జీడీపీ (ద్రవ్యోల్బణం మినహాయించని) 9–9.5 శాతం స్థాయిలో 2025–26 సంవత్సరానికి ఉంటుందని (బడ్జెట్ అంచనా 10 శాతం) అంచనా వేసింది. తక్కువ వృద్ధి రేటు, కనిష్ట ద్రవ్యోల్బణం నేపథ్యంలో రేట్ల తగ్గింపునకు అనుకూల తరుణంగా వివరించింది. ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం ఈ నివేదికను రూపొందించింది.ఆగస్ట్ నాటికి 0.75 శాతం.. ‘మార్చిలో కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం దిగిరావడం.. రానున్న కాలంలోనూ పరిమిత స్థాయిలోనే ఉంటుందన్న అంచనాలతో వచ్చే జూన్, ఆగస్ట్ పాలసీ సమీక్షల్లో ఆర్బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చు. తిరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో మరో 50 బేసిస్ పాయింట్ల రేట్లను చేపట్టొచ్చు. దీంతో మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అవకాశం ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి సమీక్షలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించడం జరిగింది’ అని ఈ నివేదిక వెల్లడించింది. కాకపోతే ఒకేసారి 25 బేసిస్ పాయింట్లకు బదులు 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును చేపట్టడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని భావిస్తున్నట్టు వివరించింది. ఇదీ చదవండి: అనిశ్చితులున్నా బలమైన వృద్ధిద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత స్థాయి అయిన 2–6 శాతం పరిధిలోనే ఉండడాన్ని గుర్తు చేసింది. ఆర్బీఐ ఇప్పటికే రెండు విడతల్లో 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించగా, రెపో అనుసంధానిత రుణాలపై ఈ మేరకు ప్రయోజనాన్ని బ్యాంకులు బదిలీ చేసినట్టు తెలిపింది. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై రేటు తగ్గింపు ఇంకా ప్రతిఫలించాల్సి ఉందని పేర్కొంది. -
అనిశ్చితులున్నా బలమైన వృద్ధి
సరైన వ్యూహాలు, క్రమబద్ధమైన సంస్కరణలకు తోడు మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడం అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత్ బలమైన వృద్ధి సాధించడానికి దోహదం చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మార్చి ఎడిషన్ నివేదిక పేర్కొంది. స్థూల ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యలోటు తగ్గుతుండడం, ద్రవ్యోల్బణం ఉపశమించడం, ఉపాధి అవకాశాల విస్తృతి, అధిక వినియోగ వ్యయాలు ఇవన్నీ దీర్ఘకాల వృద్దికి మేలు చేస్తాయని తెలిపింది. ఈ అనుకూలతలు కొనసాగాలంటే ప్రైవేటు రంగం నుంచి మూలధన వ్యయాలు కీలకమని అభిప్రాయపడింది. విధానాలు, నియంత్రణ చర్యలతో ఈ అంతరాన్ని పూడ్చొచ్చని తెలిపింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత్‌కు సవాళ్లు విసురుతున్నప్పటికీ.. అంతర్జాతీయ వాణిజ్యం, తయారీలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. కొన్ని వస్తు, సేవల్లో భారత్‌కు ప్రత్యేక అనుకూలతలున్నట్టు గుర్తు చేసింది. వ్యూహాత్మకమైన వాణిజ్య చర్చలు, దేశీ సంస్కరణలు, తయారీపై పెట్టుబడులతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను అధిగమించొచ్చని వివరించింది. ‘అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఏర్పడుతున్న అనిశ్చితులు 2025–26లో వృద్ధి అంచనాలకు కీలక రిస్క్‌గా కనిపిస్తున్నాయి. కేవలం వాణిజ్యమే కాదు, దీర్ఘకాలం పాటు అనిశ్చితి ప్రైవేటు రంగ మూలధన ప్రణాళికలు నిలిచిపోయేందుకు దారితీయవచ్చు. ప్రైవేటు రంగం, విధాన నిర్ణేతలు ఈ రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని అనిశ్చితులను తొలగించుకునేందుకు వెంటనే కృషి చేయాల్సి ఉంది’ అని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. అవకాశాన్ని విడుచుకోరాదు..పెట్టుబడులు–వృద్ధి–డిమాండ్ పెరుగుదల–అదనపు సామర్థ్యం ఏర్పాటు అనే పరస్పర ప్రయోజన సైకిల్‌కు మూలధన వ్యయాలు దారితీస్తాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ‘సాధారణ సమయాలతో పోల్చి చూస్తే ప్రస్తుతం కార్యాచరణ, నిర్వహణ ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఇదొక అవకాశం. దీన్ని కోల్పోరాదు’ అని తెలిపింది. పెట్టుబడుల కార్యకలాపాలు ఊపందుకున్నాయని.. ఇవి ఇంకా బలపడనున్నట్టు అంచనా వేసింది. ప్రైవేటు రంగ పెట్టుబడులకు నిధులు సమకూర్చేందుకు వీలుగా దేశీ పొదుపులు మెరుగుపడినట్టు పేర్కొంది. ఇక్కడి నుంచి జీడీపీలో ప్రభుత్వ రుణ భారాన్ని క్రమంగా తగ్గించుకోవడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులకు అదనపు నిధులు లభించేలా చూడొచ్చని.. రాష్ట్రాలు సైతం తమ రుణ భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని సూచించింది. వ్యవసాయ వృద్ధి ఆశావహంవ్యవసాయరంగలో వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉన్నట్టు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. రిజర్వాయర్లలో తగిన నీటి నిల్వలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాగు దిగుబడి బలంగా ఉంటుందని తెలిపింది. ఇది గ్రామీణ వినియోగాన్ని పెంచుతుందని.. పట్టణ డిమాండ్ స్థిరంగా మెరుగుపడుతున్నట్టు వివరించింది. తయారీ కార్యకలాపాలు కోలుకుంటున్నట్టు.. సేవల రంగం కార్యకలాపాలు సైతం బలంగా ఉన్నట్టు తెలిపింది. రానున్న సంవత్సరంలో ఉపాధి అవకాశాల పట్ల పలు సర్వేలు వెల్లడించిన సానుకూల అంచనాలను గుర్తు చేసింది.ఇదీ చదవండి: ‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!వస్తు ఎగుమతులకు సవాళ్లు..అంతర్జాతీయ అనిశ్చితులతో ఎగుమతులు సవాళ్లు ఎదురుకావొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. సేవల ఎగుమతులు బలంగానే ఉంటాయని పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యంలో రిస్‌్కలను జాగ్రత్తగా గమనిస్తూ.. కొత్త మార్కెట్లలోకి అవాకాశాలను వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. భిన్నమైన ఉత్పత్తులు, నాణ్యతపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఇదంటూ ప్రైవేటు రంగానికి సూచించింది. -
3జీ క్యాపిటల్ చేతికి స్కెచర్స్
న్యూయార్క్: షూస్ తయారీ సంస్థ స్కెచర్స్ను ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం 3జీ క్యాపిటల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 9 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కొనుగోలు తర్వాత ప్రైవేట్ సంస్థగా మార్చనుంది. ఈ ఒప్పందానికి స్కెచర్స్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొనుగోలు అనంతరం కూడా కంపెనీకి స్కెచర్స్ చైర్మన్, సీఈవో రాబర్ట్ గ్రీన్బర్గ్, ఆయన మేనేజ్మెంట్ బృందం సారథ్యం వహిస్తుంది. సంస్థ హెడ్‌క్వార్టర్స్ కూడా మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన చోటే (కాలిఫోరి్నయా) కొనసాగుతుంది. -
మహీంద్రా కొత్త ప్లాంట్
ముంబై/న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (2024–25, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 13.3% ఎగబాకి రూ.3,542 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,125 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.35,373 కోట్ల నుంచి రూ.42,586 కోట్లకు పెరిగింది. 20% వృద్ధి చెందింది. వాహన, వ్యవసాయ పరికరాల విభాగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదం చేసినట్లు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈఓ అనీష్ షా చెప్పారు. కాగా, క్యూ4లో కంపెనీ 18 శాతం పెరుగుదలతో మొత్తం 2.53 లక్షల వాహనాలను విక్రయించింది. ఇందులో ఎస్‌యూవీలు 1.49 లక్షలుగా ఉన్నాయి. కొత్త ప్లాంట్... ప్యాసింజర్ వాహనాల (పీవీ) తయారీ కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2028 మార్చి నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించవచ్చని అంచనా. ‘మేము భవిష్యత్తు తరం వాహనాల నిమిత్తం ఒక కొత్త ప్లాంట్‌ను నెలకొల్పనున్నాం. ప్రధానంగా పీవీల కోసం ప్రణాళిక రూపొందిస్తున్నప్పటికీ.. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర ప్రత్యేక వాహనాలను కూడా జత చేసే అవకాశం ఉంది. ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం’ అని మహీంద్రా సీఈఓ (ఆటోమోటివ్, వ్యవసాయ పరికరాలు) రాజేష్ జెజూరికర్ పేర్కొన్నా రు. కాగా, చకన్ (పుణే)లో అదనంగా 1.2 లక్షల వార్షిక తయారీ సామర్థ్యాన్ని జత చేసేలా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న దీన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ఎక్స్‌యూవీ3ఎక్స్ఓ, థార్ రాక్స్ తయారీ సామర్థ్యాన్ని 2025–26లో 3,000 మేర పెంచుతామని వెల్లడించారు. పూర్తి ఏడాదికి... మార్చితో ముగిసిన 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.14,073 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది లాభం రూ.12,270 కోట్లతో పోలిస్తే 15 శాతం ఎగసింది. మొత్తం ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.1,38,279 కోట్ల నుంచి రూ.1,58,750 కోట్లకు చేరింది. కాగా, ఒక్కో షేరుకు రూ.25.30 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు బీఎస్ఈలో 3 శాతం ఎగసి రూ.3,021 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 11,322 కోట్లు ఎగసి రూ.3,72,720 కోట్లకు చేరింది. -
భారీ ఐపీవోకి అవాడా గ్రూప్
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ రంగానికి చెందిన అవాడా గ్రూప్‌లో భాగమైన సోలార్ మాడ్యూల్స్ తయారీ విభాగం భారీ ఐపీవో సన్నాహాల్లో ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 4,000–5,000 కోట్ల వరకు సమీకరించడంపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవోని నిర్వహించేందుకు పలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, న్యాయసేవల సంస్థలతో గ్రూప్ సంప్రదింపులు జరిపినట్లు వివరించాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను 5 గిగావాట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్, సెల్ తయారీ ప్లాంటు నిర్మాణం సహా ఇతరత్రా పెట్టుబడుల కోసం సంస్థ వినియోగించనుంది. అవాడా గ్రూప్‌లో బ్రూక్‌ఫీల్డ్‌కి చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఫండ్, థాయ్‌ల్యాండ్‌కి చెందిన జీపీఎస్సీ మొదలైనవి 1.3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. సోలార్ మాడ్యూల్స్ తయారీ, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా మొదలైన విభాగాల్లో గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో పలు సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థలు ఐపీవో ద్వారా నిధులు సమీకరించగా, మరిన్ని ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ రూ. 2,830 కోట్లు, అక్టోబర్‌లో వారీ ఎనర్జీస్ రూ. 4,321 కోట్లు సమీకరించాయి. -
ఆర్బీఐ ఖజానాలో పసిడి మెరుపులు
ముంబై: పసిడిపై ఆర్బీఐ మోజు కొనసాగుతూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల పసిడిని ఆర్బీఐ కొనుగోలు చేయగా.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 57 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. దీంతో ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు మార్చి నాటికి 879.59 టన్నులకు చేరినట్టు అధికారిక డేటా తెలియజేస్తోంది. ఈ కాలంలో పసిడి ధరలు 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. గత ఏడేళ్లలోనే ఆర్బీఐ అత్యధికంగా పసిడిని గత ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో సురక్షిత సాధనమైన బంగారానికి ఆర్బీఐ ప్రాధాన్యం పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఆర్బీఐ పసిడి నిల్వల్లో 512 టన్నులు స్థానిక ఖజానాల్లో ఉంటే, 348.62 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద, మరో 18.98 టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆర్బీఐ తన బంగారం నిల్వల్లో కొంత మొత్తాన్ని స్థానిక ఖజానాలకు మళ్లించడం గమనార్హం. 2024 మార్చి నాటికి స్థానిక నిల్వలు 408 టన్నులే కాగా, గత సెప్టెంబర్ నాటికి 510.46 టన్నులకు పెంచుకుంది. ఫారెక్స్ నిల్వల్లో 11.70 శాతం.. ఇక విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) బంగారం వాటా 2024 మార్చి నాటికి 9.32% కాగా, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ఇక 2024 సెప్టెంబర్ నాటికి 706 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 668.33 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇవి 10.5 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతాయి. -
మార్కెట్ సమయాలపై ఆర్బీఐ సూచనలు
ముంబై: ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లకు ప్రస్తుత ట్రేడింగ్ వేళలనే కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సిఫార్సు చేసింది. కాల్ మనీ మార్కెట్ టైమింగ్స్‌ను మాత్రం రాత్రి 7 గం.ల వరకు పొడిగించాలని సూచించింది.ప్రస్తుతం కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 3.30 గం.ల వరకు ఉంటున్నాయి. అయితే, ఆన్‌షోర్ మార్కెట్ వేళల తర్వాత నాన్ రెసిడెంట్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించేందుకు సాయంత్రం 5 గం.ల నుంచి రాత్రి 11.30 గం.ల వరకు ట్రేడింగ్ వేళలు ఉంటున్నాయి.మరోవైపు, కాల్ మనీ మార్కెట్ వేళలు ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు, రెపో మార్కెట్ టైమింగ్స్ ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 2.30 గం.ల వరకు ఉంటున్నాయి. -
UPIలో కీలక మార్పులు: జూన్ 16 నుంచే అమలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.యూపీఐ వినియోగదారులు.. లావాదేవీలు చేయడానికి కనీసం 30 సెకన్ల సమయం కేటయించాల్సి ఉంది. ఈ సమయాన్ని తగ్గించడానికి NPCI చర్యలు తీసుకుంటోంది. ఇది అమలులోకి వచ్చిన తరువాత.. ట్రాన్సక్షన్స్ మరింత సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలులావాదేవీలు, డెబిట్, క్రెడిట్ సేవల కోసం యూజర్ ఇప్పుడు 30 సెకన్ల సమయం వెచ్చించాల్సి ఉంది. దీనిని 15 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీలు చేయడానికి సంబంధించిన టైమ్ తగ్గితే.. యూజర్ల సమయం కూడా ఆదా అవుతుంది. -
30 మందికి మాత్రమే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జీప్'.. ఇండియన్ మార్కెట్లో రాంగ్లర్ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ విల్లీస్ '41 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 73.24 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎడిషన్ భారత సైన్యానికి గుర్తుగా స్పెషల్ కలర్ పొందింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం. అంటే ఈ కారును 30 మంది కస్టమర్లు మాత్రమే కొనుకోలు చేయగలరు. జీప్ రాంగ్లర్ టాప్ స్పెక్ రూబికాన్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. 1941 అనే డెకాల్ హుడ్‌పై ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!కొత్త స్పెషల్ ఎడిషన్ రాంగ్లర్‌లో పవర్డ్ సైడ్ స్టెప్, కొత్త ఇంటీరియర్ గ్రాబ్ హ్యాండిల్స్, వెదర్ ఫ్లోర్ మ్యాట్లు, ఫ్రంట్ అండ్ రియర్ డాష్‌క్యామ్‌లు కూడా ఉన్నాయి. డిజైన్ కొంత కొత్తగా అనిపించినప్పటికీ.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 270 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. -
ఎయిర్టెల్, టాటా చర్చలకు చెక్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ మధ్య డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్ విలీనానికి చెక్ పడింది. విలీన చర్చలను విరమించుకున్నట్లు ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది.చర్చలలో రెండువైపులా సంతృప్తికర ఫలితాలను సాధించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. డీటీహెచ్ బిజినెస్‌ల విలీనానికి టాటా గ్రూప్ డీటీహెచ్ విభాగం టాటా ప్లేతో అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా చర్చిస్తున్నట్లు 2025 ఫిబ్రవరి 26న ఎయిర్టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో రెండు సంస్థలూ సరైన పరిష్కారాన్ని సాధించలేకపోవడంతో చర్చలు విరమించుకున్నట్లు వివరించింది. -
పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.అమెరికాలో ఆర్థిక లోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో నిర్ణయించలేకపోతున్నామని బఫెట్ అన్నారు. మనం చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పనిచేస్తున్నాము. ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందని వెల్లడించారు.యూఎస్ డాలర్ పతనావస్థలో ఉంది. ఒక దేశంగా మనకు ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది మాత్రం మనమే తెచ్చుకున్న సమస్య. అమెరికా ఆర్ధిక విధానాలు, వాణిజ్య విధానం వంటివన్నీ డాలర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని బఫెట్ వివరించారు.సీఈఓగా వారెన్ బఫెట్ పదవీ విరమణశనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్ -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 294.85 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో.. 80,796.84 వద్ద, నిఫ్టీ 114.45 పాయింట్లు లేదా 0.47 శాతం లాభంతో 24,461.15 వద్ద నిలిచింది.టాప్ గెయినర్స్ జాబితాలో అషిమా, యూనివర్సల్ కేబుల్స్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ఆర్ఆర్ కాబెల్ వంటి కంపెనీలు చేరగా.. జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, కేసాల్వ్స్ ఇండియా, లోటస్ ఐ కేర్ హాస్పిటల్, వీ-మార్ట్ రిటైల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?
2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.ఫారం 16 అంటే ఏమిటి?యజమాని తన దగ్గర చేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జారీ చేసేది ఫారం 16. ఇందులో మొదటి భాగంలో ఉద్యోగులు, యజమాని ప్రాథమిక వివరాలు ఉంటాయి. రెండో భాగంలో జీతభత్యాలకి సంబంధించిన పూర్తి వివరాలు .. అంటే జీతాలు, అలవెన్సులు, టాక్సబుల్ ఇన్‌కం వివరాలు, మినహాయింపులు, తగ్గింపులు, డిడక్షన్లు, నికరజీతం లేదా ఆదాయం, టీడీఎస్ వివరాలు ఉంటాయి. ‘సులభతరం, పారదర్శకత, స్పష్టత’ అనే లక్ష్యాలతో ఫారం 16 రాబోతోంది.ఫారం 16 చాలా ముఖ్యమైంది..రిటర్నులు వేయడానికి మొదటగా చూసే డాక్యుమెంటు ఇదే. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు ఈ ఫారంనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఈ ఫారంతో ఉద్యోగి ‘రుణ స్తోమత’ నిర్ధారిస్తారు. దీంతోనే పన్ను భారం, చెల్లింపులు నిర్ధారించవచ్చు. రీఫండు కోసం కూడా ఇదే ఫారంని ‘బేస్’గా తీసుకుంటారు. ఎందుకంటే, పన్ను వసూలు చేయడం, దాన్ని ప్రభుత్వానికి చెల్లించడాన్ని దీని ద్వారానే నిర్ధారించుకుంటారు. ఇవే అంశాలు 26ఏఎస్‌లో ఉంటాయి.ప్రతి మూడు నెలలకు సమ్మరీ, జీతం, టీడీఎస్ చెల్లించినది, గవర్నమెంటుకు ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, ఏ తేదీన కట్టారు, చలాన్ నంబరు ఎంత వగైరా వివరాలన్నీ ఉంటాయి. జీతం, అలవెన్సులు, బోనస్‌లు, ఏరియర్స్, సెక్షన్ 10 ప్రకారం మినహాయింపులు, ఇంటి అద్దె అలవెన్సు, గ్రాట్యుటీ మొదలైన అన్ని డిడక్షన్లు 80 C నుంచి 80 TTA వరకు ఉంటాయి. ఆ తరువాత పన్ను భారం లెక్కింపులు, స్టాండర్డ్ డిడక్షన్లు ఉంటాయి. 89(1) రిలీఫ్ కూడా ఉంటుంది. వచ్చిన మార్పులు ఏమిటంటే..80 ఇఇఏ ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కి ఇచ్చిన విరాళాలకు సంబంధించిన మినహాయింపు ఉంటుంది. జీతాలకు సంబంధించిన అంశాలు వర్గీకరిస్తారు. హెచ్ఆర్ఏకి సంబంధిత వివరాలుంటాయి. అలాగే రెంట్‌ఫ్రీ వివరాలు, ఇతర ప్రిరిక్వజిట్లు, ప్రతి డిడక్షన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు పొందుపరుస్తారు. కొత్త కాలమ్ ద్వారా టీడీఎస్, టీసీఎస్కి సంబంధించిన వివరాలు తెలిసేలా, సరి చేసుకునే వీలు కల్పించడానికి ఫారం 24 Q టీడీఎస్/టీసీఎస్ రిటర్నులు కనిపించేలా చేస్తారు. దీనివల్ల 26 Aను అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్మీరు చేయాల్సిందేమింటంటే..ఫారం 16 యజమాని ఇచ్చే సర్టిఫికేట్. ఇది విలువైంది. ఎందుకంటే ఇది మీ టీడీఎస్, టీసీఎస్ రికవరీ అయినట్లు... చెల్లించినట్లు. గవర్నమెంటు చేతికందినట్లూ. మీ ఖాతాలో జమ అయినట్లు ధృవీకరించే ఏకైక పత్రం. అయితే ఇందులో ప్రతి అంశాన్ని మీరే సరి చూసుకోవాలి. నెలసరి శాలరీ స్లిప్పులతో మినహాయింపు, తగ్గింపులు... మొదలైనవి చెక్ చేసుకోవాలి. మీరు ఇచ్చే ఆదాయపు వివరాలు ఉన్నాయా లేదా ఎక్కువ పడ్డాయా చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాగితాలు భద్రపరుచుకోవాలి. మీరు కొత్త రెజీమ్‌లో ఉన్నారా లేక పాత పద్ధతిలో ఉన్నారో చెక్ చేసుకొండి. మీరు సంవత్సరంలో ఉద్యోగం మారితే రెండు ఫారం 16లు ఉంటాయి. అప్పుడు రిపోరి్టంగ్లో హెచ్చు తగ్గులు... డబుల్ క్లయిమ్/తప్పుడు క్లయిమ్ ఉండొచ్చు. చెక్ చేసుకోండి. యజమానికి అంటే ‘డిస్బర్సింగ్’ అధికారి ఇవన్నీ అదనపు భాద్యతలు... తగిన జాగత్ర వహించాలి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు కొత్త ఫారమ్ 16 వల్ల రావని ఆశిద్దాం! ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఇలా..
న్యూఢిల్లీ: కీలక ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వినియోగం ఏప్రిల్‌లో పెరిగింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణత అనంతరం 4 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్‌లో డీజిల్ వినియోగం 8.23 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్ నెల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగినట్టు పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోని) డేటా తెలియజేస్తోంది.2023 ఏప్రిల్ నెల విక్రయాలతో పోల్చి చూసినా 5.3 శాతం మేర వినియోగం పెరిగింది. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10.45 శాతం అధికం కావడం గమనించొచ్చు. కస్టమర్లు క్రమంగా ఎలక్ట్రిక్, పెట్రోల్ వేరియంట్ల వైపు మొగ్గు చూపిస్తుండడంతో డీజిల్ వినియోగంపై కొంత కాలంగా నెలకొన్న సందేహాలకు తాజా గణంకాలు తెరదించినట్టయింది. మొత్తం పెట్రోలియం ఇంధనాల్లో డీజిల్ వాటా 38 శాతంగా ఉంటుంది.ఇక ఏప్రిల్ నెలలో పెట్రోల్ అమ్మకాలు సైతం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 4.6 శాతం పెరిగి 3.43 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా పెట్రోల్ అమ్మకాలు 19 శాతం వృద్ధిని నమోదు చేయగా, నాటి గరిష్ట పరిమితి మీద మెరుగైన వృద్ధి నమోదైంది. ఎల్పీజీ విక్రయాలు 6.7 శాతం పెరిగి 2.62 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 3.25 శాతం తగ్గి 7,66,000 టన్నులుగా ఉన్నాయి. -
‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!
మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలానే కారణాలుండొచ్చు.. అయితే దాంపత్య జీవితంలో భాగస్వామికి డబ్బు లేకపోవడం, అప్పులుండడం, ఖర్చు చేయలేకపోవడం.. వంటివి కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెడుతోంది. కలకాలం సంతోషంగా జీవించాల్సిన జంటను ఈ డబ్బు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిస్తోంది. విడిపోయే జంటల జీవితాలను మనీ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.రుణాలు..కొత్తగా పెళ్లయిన జంటను స్థిరమైన ఆర్థిక ఒత్తిళ్లు వేరు చేస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లికి చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. సంపన్నులకు డబ్బు ఖర్చయినా తిరిగి సంపాదిస్తారు. పేదవారు కూడా ఉన్నంతలో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిస్తారు. కానీ సమస్య అంతా మధ్య తరగతి ప్రజలతోనే. బంధువుల్లో గొప్ప కోసమో.. మళ్లీ చేయని కార్యక్రమం అనో.. పెళ్లికి బాగానే డబ్బు ఖర్చు చేస్తారు. మధ్య తరగతివారికి సరైన సంపాదన ఉండకపోవడంతో దీనికోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం కోసం భాగస్వామిపై వేదింపులు సాగిస్తారు. అది చివరకు విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.ఆర్థిక అస్థిరతపెళ్లైనప్పటి నుంచి వధువరులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి తర్వాత పిల్లలు, వారి చదువులు, వాహనాల కొనుగోలు, ఆస్తులు కూడబెట్టడం.. వంటి కార్యకలాపాల కోసం చాలామంది అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించలేక మానసిక ఒత్తిడితో భాగస్వామితో సఖ్యతగా నడుచుకోకుండా చివరకు కాపురాన్ని కూల్చుకుంటున్నారు.దుబారా ఖర్చులు..పెళ్లికి ముందు చాలా మందికి దుబారాగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. వివాహం తర్వాత కూడా అది కొనసాగితే అప్పులు తప్పవు. సంపాదన భారీ మొత్తంలో ఉన్న కుటుంబాలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలపై ఈ వ్యవహార శైలి తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది దంపతుల మధ్య గొడవలు జరిగేందుకు కారణమవుతుంది. ఇది కూడా విడాకులకు దారితీస్తుంది.ఇదీ చదవండి: వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలుమరేం చేయాలి..జల్సాలకు, దుబారా ఖర్చులకు అలవాటుపడే వారు, పెళ్లి కోసం అనాలోచితంగా చేసే భారీగా ఖర్చు చేసేవారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఆ దంపతులు తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు చాలాసార్లు కారణమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సవాళ్లు అనివార్యమైనప్పటికీ సరైన ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ వల్ల సమస్యలను గట్టెక్కవచ్చు. ఆ దిశగా దంపతులు ఆలోచించాలి. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేయకుండా పెట్టుబడి, పొదుపుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరెన్సీ నోటు కాపురాలను కలకాలం నిలబెడుతుంది.. అదే కాపురాలను చిదిమేస్తుందని గుర్తుంచుకోవాలి. -
వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలు
ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తే దేశీయంగా రెస్టారెంట్ రంగం 2028 నాటికి 1.5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) వైస్ ప్రెసిడెంట్ జొరావర్ కల్రా తెలిపారు. ఇందుకోసం ‘పరిశ్రమ’ హోదా కల్పించాలని, జీఎస్టీపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాల్లాంటివి ఇవ్వాలని కోరారు.ప్రస్తుతం 85 లక్షల మంది ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఎన్‌ఆర్‌ఏఐలో సుమారు 5 లక్షల రెస్టారెంట్లకు సభ్యత్వం ఉంది. సొంత ప్రైవేట్–లేబుల్ బ్రాండ్లతో క్విక్ కామర్స్ విభాగంలో దూసుకెళ్లిపోతున్న స్విగ్గీ, జొమాటోలాంటి ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లతో నెలకొన్న వివాదం సామరస్యంగా సద్దుమణుగుతుందని కల్రా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇండియా ఫుడ్ సర్వీసెస్ రిపోర్ట్ 2024 అంచనా ప్రకారం ఈ రంగం విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.5.69 లక్షల కోట్లు. ఇది 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.7.76 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.ఇదీ చదవండి: పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..రెస్టారెంట్ రంగాన్ని అభివృద్ధి చేసే సాంకేతిక అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డైనమిక్‌గా వ్యవహరిస్తోంది. వీటి కార్యకలాపాలను పెంచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్, ఏఐ ఆధారిత రిజర్వేషన్ సిస్టమ్‌లు, ఆటోమేటెడ్ ఆర్డర్ ప్రాసెసింగ్‌లను చాలా సంస్థలు మెరుగుపరుస్తున్నాయి. ఇది క్లౌడ్-ఆధారిత నిర్వహణ సాఫ్ట్‌వేర్‌లో ట్రాకింగ్‌ను క్రమబద్ధీకరించడానికి, వ్యర్థాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది. -
పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.95,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఎన్నడూ లేనంత ఆర్థిక అనిశ్చితి
ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గణనీయంగా తగ్గించేసింది. కరోనా సమయం కంటే అధిక అనిశ్చితి నెలకొన్నట్టు పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2025లో 2.8 శాతం, 2026లో 3 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని తాజాగా అంచనా వేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి 2025లో 0.8 శాతం, 2026లో 1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ విడుదల చేసిన గణాంకాలతో పోల్చి చూస్తే ప్రపంచ వృద్ధి అంచనా 0.5 శాతం తగ్గగా, యూరో ప్రాంతం వృద్ధి అంచనా 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. మూడు నెలల క్రితంతో పోలి్చతే మరింత అనిశ్చితుల్లో నేడు ప్రపంచం ఉన్నట్టు ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. టారిఫ్‌లు, అనిశ్చితి..అమెరికా టారిఫ్ విధానాలను ఊహించలేకుండా ఉన్నామని ఐఎంఎఫ్ తెలిపింది. 2025 ఏప్రిల్ 2 లిబరేషన్ డే అన్నది ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద టారిఫ్‌ల పెంపుగా నిలిచిపోతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల పెంపునకు 90 రోజుల విరామం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే డిసెంబర్, రెండేళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? చైనా–అమెరికా మధ్య టారిఫ్‌ల పోరు ఎంత కాలం పాటు కొనసాగుతుంది? వీటికి సమాధానాలు ఎవరికీ తెలియవంటూ ఐఎంఎఫ్ నిట్టూర్చింది. ఐఎంఎఫ్ ప్రపంచ వాణిజ్య అశ్చితి సూచీ 2024 అక్టోబర్ నాటితో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇది కరోనా విపత్తు నాటితో పోల్చినా గరిష్టానికి చేరింది. టారిఫ్‌ల కారణంగా కంపెనీలు తమ తయారీ చైన్‌ను పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుందని, వినియోగదారులు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వైపు చూడొచ్చని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. ఆర్థిక అస్థిరత..టారిఫ్‌లు, ప్రణాళికలు తరచూ మారిపోతుండడం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెద్ద ఎత్తున అస్థిరతకు దారితీస్తుందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నాటి స్థాయి అనిశ్చితులను ఫైనాన్షియల్ మార్కెట్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘ఐదేళ్ల క్రితం అమెరికా రుణ భారంతో అనిశ్చితులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణితో ఇన్వెస్టర్లు అధిక రిస్క్‌తో కూడిన సాధనాల్లో (ఈక్విటీ) అమ్మకాలు చేసి, బంగారం, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితిని చూస్తున్నాం. యూఎస్ బాండ్ల ధరలు లిబరేషన్ డే నాటి నుంచి తగ్గిపోయాయి. అంటే ఇన్వెస్టర్లు వాటిని విక్రయిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలను సురక్షిత పెట్టుబడి సాధనంగా మార్కెట్లు భావించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, అమెరికా రుణానికి ఉన్న పాత్రను దృష్టిలో పెట్టుకుని చూస్తే, భవిష్యత్తులో మరింత ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు’ అని ఐఎంఎఫ్ తెలిపింది.ఇదీ చదవండి: అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?కరోనా సమయంలో ఉత్పత్తి కార్యకలాపాలను బలవంతంగా నిలిపివేయాల్సి రావడంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అవరోధాలు ఏర్పడగా.. నేడు టారిఫ్‌ల కారణంగా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. నేడు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితులకు ఎలాంటి వైరస్ కారణం కాదంటూ.. ట్రంప్ సలహాదారులు అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోణంలో వీటికి కారణమవుతున్నట్టు తెలిపింది. -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:16 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు పెరిగి 24,478కు చేరింది. సెన్సెక్స్(Sensex) 391 పాయింట్లు పుంజుకుని 80,891 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 59.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.47 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీంతోపాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ను మార్కెట్లు గమనిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయని విన్నాను. ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్ పరిమితుల్లోనూ మార్పులు చేసినట్టు తెలిసింది. సీనియర్ సిటిజన్‌గా (60 ఏళ్లకు పైన) నాకు డెట్ సాధనాలపై వస్తున్న వడ్డీ ఆదాయమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఆదాయపన్ను మార్పుల ప్రభావం నాపై ఏ మేరకు ఉంటుంది? – వినోద్ బాబుకొత్త విధానం కింద ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయన్నది నిజమే. టీడీఎస్ పరిమితిని సీనియర్, నాన్ సీనియర్ సిటిజన్లకూ (60 ఏళ్లలోపు) తగ్గించారు. సీనియర్ సిటిజన్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఉంది. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఆదాయం ఈ లోపు ఉంటే టీడీఎస్ వర్తించదు. నాన్ సీనియర్ సిటిజన్స్‌కు రూ.40,000గా ఉన్న పరిమితి రూ.50,000కు పెరిగింది. అంటే వడ్డీ ఆదాయం రూ.50వేలు మించినప్పుడే టీడీఎస్ వర్తిస్తుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్ అమలును రూ.2.4 లక్షల పరిమితి నుంచి రూ.6లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అంటే ఫండ్స్ నుంచి డివిడెండ్ ఆదాయం రూ.10,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను శ్లాబుల్లోనూ మార్పులు జరిగాయి. మొత్తం ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటే సెక్షన్ 87ఏ కింద రాయితీ ప్రయోజనంతో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే మూలధన లాభాలు కూడా రూ.12 లక్షల ఆదాయంలోపే ఉన్నప్పటికీ.. మూలధన లాభాలపై విడిగా పన్ను చెల్లించడం తప్పనిసరి. ఇదీ చదవండి: రేట్ల తగ్గింపు ప్రతికూలం!మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – ఉషమార్కెట్లలో అస్థిరతలు సహజమే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆటుపోట్లను చూశాం. భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. వీటిని ఎదుర్కొనే విధంగా ఇన్వెస్టర్ల పెట్టబడుల ప్రణాళిక ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాల్సి ఉంటుంది. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య రక్షణ కలి్పంచుకోవాలి. ఊహించని అవసరాలు ఏర్పడితే ఈక్విటీ పెట్టబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి అయి ఉండాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అస్థిరతల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్ కరెక్షన్లలో మంచి పెట్టుబడుల అవకాశాలు వస్తుంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌక ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబడులను పెంచుకోవచ్చు.ధీరేంద్ర కుమార్సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రేట్ల తగ్గింపు ప్రతికూలం!
ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో 2025– 26లో బ్యాంకుల లాభదాయకత 0.20 శాతం మేర తగ్గిపోతుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. లాభదాయకతకు సంబంధించి కీలక కొలమానమైన రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ/ఆస్తులపై రాబడి) 0.10–0.20 స్థాయిలో తగ్గి 1.1–1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. 2024–25లో ఇది 1.3 శాతంగా ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లో ఇదే స్థాయి క్షీణత ఆర్వోఏ తగ్గేందుకు కారణమవుతుందని వివరించింది. వడ్డీ రేట్లు తగ్గే క్రమంలో డిపాజిట్ల కంటే రుణాలపైనే వడ్డీ రేట్ల కుదింపు వేగంగా ఉంటుందని గుర్తు చేసింది.‘బ్యాంకు రుణాల్లో 45 శాతం ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు (ప్రధానంగా రెపో) ఆధారితమే ఉంటాయి. రేట్ల తగ్గింపుతో ఈ రుణాల రేటు సవరణ వేగంగా చేయాల్సి వస్తుంది. మరోవైపు టర్మ్ డిపాజిట్లపై రేటు తగ్గింపు అన్నది తాజా డిపాజిట్లకే వర్తిస్తుంది. కనుక డిపాజిట్లపై రేట్ల తగ్గింపు అన్నది నిదానంగా ఉంటుంది’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ శుభశ్రీ నారాయణన్ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లకు తోడు రుణ వ్యయాలు కూడా బ్యాంకుల లాభాలపై ప్రభావం చూపిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. రుణ వ్యయాలు కనిష్ట స్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ఇతర ఆదాయం, నిర్వహణ వ్యయాలు ఫ్లాట్‌గా ఉంటాయని అంచనా వేసింది. దీంతో నికర వడ్డీ మార్జిన్ల తగ్గుదల నేరుగా ఆర్వోఏపై ప్రభావానికి దారితీస్తుందని వివరించింది.ఇదీ చదవండి: సరళతర ఎఫ్‌డీఐ విధానం.. అవకాశాలు అపారండిపాజిట్లపై వ్యయాలు కీలకం..డిపాజిట్లపై వ్యయాలను తగ్గించుకోవడంపైనే బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ల తగ్గుదల ఆధారపడి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. అయితే డిపాజిట్ల కోసం ఉన్న పోటీ దృష్ట్యా ఈ వెసులుబాటు పరిమితమేనని అభిప్రాయపడింది. వ్యవస్థలో తగినంత లిక్విడిటీకి ఆర్బీఐ ప్రాధాన్యం ఇస్తుండడం బ్యాంకుల లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి 6 శాతం పెరిగేందుకు సాయపడుతుందని తెలిపింది. అన్ని బ్యాంక్‌లు సేవింగ్స్ డిపాజిట్ రేటును 0.25 శాతం తగ్గించడం వల్ల వాటి నికర లాభాల మార్జిన్ 0.06 శాతం పెరిగేందుకు దారితీస్తుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ వాణి ఓజస్వి తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 0.1–0.2 శాతం స్థాయిలో తగ్గి 2.8–2.9 శాతానికి పరిమితం కావొచ్చన్నారు. -
సరళతర ఎఫ్‌డీఐ విధానం.. అవకాశాలు అపారం
భారత్ అమలు చేస్తున్న సరళతర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం (ఎఫ్‌డీఐ) విదేశీ ఇన్వెస్టర్లకు అపారమైన పెట్టుబడి అవకాశాలను ఆఫర్ చేస్తోందని డెలాయిట్ ఇండియా తెలిపింది. ఫార్మాస్యూటికల్స్, ఆటో, పర్యాటక రంగాలకు ఎఫ్‌డీఐలను ఆకర్షించే శక్తితోపాటు ఉపాధి కల్పనకు చోదకాలుగా నిలవగలవని పేర్కొంది. వీటికితోడుగా ఎగుమతులు, ఆవిష్కరణలు భారత్ తదుపరి దశ వృద్ధిని నడిపించగలవని తెలిపింది.చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో(అనుమతుల్లేని) 100 శాతం ఎఫ్‌డీఐల రాకకు అనుమతించడం ద్వారా భారత్ ఎంతో ప్రగతి సాధించినట్టు డెలాయిట్ ఇండియా గుర్తు చేసింది. పర్యాటకం, నిర్మాణం, హాస్పిటల్స్, మెడికల్ డివైజ్‌లను ప్రస్తావించింది. ఈ విధాన నిర్ణయాలు స్థిరత్వాన్ని, స్పష్టతను అందిస్తున్నట్టు డెలాయిడ్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ పేర్కొన్నారు. 70 బిలియన్ డాలర్ల జాతీయ మోనిటైజేషన్ పైపులైన్, 100 పట్టణాల్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు వెంటనే కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలైన పెట్టుబడి జోన్లను అందిస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్పర్యాటకం, ఆతిథ్య రంగంలో హోటళ్లు, రిక్రియేషన్ కేంద్రాల నిర్మాణానికి 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నట్టు మజుందార్ గుర్తు చేశారు. పారదర్శక, స్థిరమైన పెట్టుబడుల కేంద్రంగా భారత్ ప్రతిష్ట దీంతో మరింత ఇనుమడిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం, సరళతర ఎఫ్‌డీఐ విధానం.. లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి రంగాల్లో అపార అవకాశాలను తీసుకొస్తున్నట్టు మజుందార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2024–2025) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) 27 శాతం అధికంగా 40.67 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ భారత్‌లోకి రావడం గమనార్హం. -
మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్
దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ పలు కీలక అంశాలపై ఆధారపడనుంది. దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షకు తెరతీయనుంది. మరోపక్క భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ వారం ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లకు దిక్సూచిగా నిలవగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బుధవారం పాలసీ సమీక్షను ప్రకటించనుంది. రెండు రోజులపాటు సమావేశమయ్యే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) 7న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే మార్చి నెల సమావేశంమాదిరిగా ఈసారికూడా ఫెడ్ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడే అవకాశమున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గత సమావేశంలో ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఏప్రిల్ నెలకు యూఎస్ సర్వీసుల పీఎంఐ గణాంకాలు సోమవారం(5న) విడుదలకానున్నాయి. ఇక చైనా ఏప్రిల్ వాణిజ్య గణాంకాలు 9న వెల్లడికానున్నాయి. మార్చిలో ఎగుమతుల జోరు కారణంగా 102 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు నమోదైంది.బ్లూచిప్స్ ఫలితాలుఈ వారం ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్ హోటల్స్, ఆటో దిగ్గజం ఎంఅండ్ఎం(5న), బ్యాంక్ ఆఫ్ బరోడా(6న), కోల్ ఇండియా, డాబర్(7న), మౌలిక దిగ్గజం ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, బయోకాన్, టైటన్(8న), డాక్టర్ రెడ్డీస్(9న) గత ఆర్థి క సంవత్సరం చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. గత వారాంతాన(3న) బ్యాంకింగ్ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్, కొటక్ మహీంద్రాతోపాటు డీమార్ట్ క్యూ4 ఫలితాలు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(5న) మార్కెట్లలో కనిపించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. కాగా.. హెచ్ఎస్బీసీ పీఎంఐ సరీ్వసుల డేటా 6న విడుదలకానుంది.యుద్ధ భయాలుపహల్గావ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఓవైపు ఆందోళనలు నెలకొన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఫలితంగా భారత్, పాకిస్తాన్ మిలటరీ దళాల ప్రతీ కదలికలనూ కూలంకషంగా పరిశీలించే వీలున్నట్లు వివరించారు. ఫలితంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకులు గౌరవ్ గార్గ్ అంచనా వేశారు. సాంకేతికంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,400 పాయింట్ల వద్ద కీలక అవరోధాన్ని ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ స్థాయికి ఎగువన నిలిస్తే మరింత బలపడవచ్చని, లేదంటే పరిమిత శ్రేణి కదలికలకే పరిమితంకావచ్చని అంచనా వేశారు. క్యూ1లో యూఎస్ జీడీపీ నీరసించడం గ్లోబల్‌స్థాయిలో అనిశ్చితికి దారితీస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ విశ్లేషించారు. దీంతో ఫెడ్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు.గత వారమిలా..గురువారం సెలవు కావడంతో 4 రోజులకే ట్రేడింగ్ పరిమితమైన గత వారం.. సెన్సెక్స్ 1289 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 80,502కు చేరింది. నిఫ్టీ 307 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,347 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడగా.. స్మాల్ క్యాప్ మాత్రం 1.33 శాతం క్షీణించింది.ఇదీ చదవండి: న్యూ ఫండ్ ఆఫర్లపై ఓ లుక్కేయండి!ఎఫ్‌పీఐల దన్నుఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు టారిఫ్‌ల విషయంలో యూఎస్‌తో ఒప్పందం కుదరనున్నట్లు అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీంతో గత 12 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు పెట్టుబడులకే ఆసక్తి చూపుతున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. ఫలితంగా యూఎస్ డాలరుతో మారకంలో రూపాయి వేగంగా బలపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తున్నట్లు వివరించారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 99కు బలహీనపడటం కూడా రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఆరి్థకవేత్తలు పేర్కొన్నారు. దేశీయంగా తొలి మూడు నెలల(జనవరి–మార్చి) తదుపరి ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
న్యూ ఫండ్ ఆఫర్లపై ఓ లుక్కేయండి!
యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్వివిధ మార్కెట్ క్యాప్స్‌వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రకటించింది యూటీఐ మ్యూచువల్ ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 13 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ స్టాక్స్‌లో 3ఎస్ విధానంతో (సైజు, సెక్టార్, స్టయిల్) ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఒక్కో సెగ్మెంట్‌కి కనీసం 25 శాతం మొత్తాన్ని కేటాయిస్తుంది. పటిష్టమైన ఫండమెంటల్స్‌తో టర్న్‌రౌండ్ అవకాశాలు ఉండి ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్‌లో లభించే స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని యూటీఐ ఏఎంసీ సీఐవో వెట్రి సుబ్రమణియమ్ తెలిపారు. దీనికి కార్తీక్‌రాజ్ లక్ష్మణన్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 6న మొదలు కానుంది. 20వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్లకు అనుమతి ఉంటుంది. ఈ పథకానికి ప్రామాణిక సూచీగా ‘నిఫ్టీ 200 క్వాలిటీ 30 టీఆర్ఐ’ కొనసాగుతుంది. ఇహబ్ దల్వాయ్, మసూమి జుర్మర్‌వాలా ఫండ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. బలమైన ఆర్థిక మూలాలు, పటిష్టమైన నగదు ప్రవాహాలు, రుణ భారం తక్కువగా ఉండి, నిధుల వ్యయాల సామర్థ్యాలు గొప్పగా ఉన్న కంపెనీలను పెట్టుబడులకు ఎంపిక చేస్తుంది. అందుకే పథకానికి క్వాలిటీ అని పేరు పెట్టారు. సుమారు 625 కంపెనీలను జల్లెడ పట్టి అందులో మెరుగైన 40–60 కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంది. భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి సవాళ్లను నాణ్యమైన కంపెనీలు ఎదుర్కొని బలంగా నిలబడగలవని భావిస్తూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ పథకాన్ని తీసుకొచి్చంది. పెట్టుబడులను ఏడాదిలోపు విక్రయిస్తే విలువపై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ అమలవుతుంది. ఏడాది తర్వాత విక్రయిస్తే ఎగ్జిట్ చార్జీలు ఉండవు. ఇదీ చదవండి: త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థగ్రో సిల్వర్ ఈటీఎఫ్వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం గ్రో మ్యూచువల్ ఫండ్ ‘గ్రో సిల్వర్ ఈటీఎఫ్’ ఎన్‌ఎఫ్‌వోను ప్రారంభించింది. ఈ నెల 16 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. అనంతరం మే 30 నాటికి స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీ పెట్టుబడులు, విక్రయాలకు అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దేశీ వెండి ధరలకు అనుగుణంగా గ్రో సిల్వర్ ఈటీఎఫ్ ట్రేడవుతుంటుంది. వెండి ధరల గమనానికి అనుగుణంగానే ఇందులో లాభ, నష్టాలు ఆధారపడి ఉంటాయి. భౌతిక వెండి కొనుగోలు, నిల్వ, విక్రయం వంటి సమస్యలను సిల్వర్ ఈటీఎఫ్ తప్పిస్తుంది. ఇందులో కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో రాబడులు కోరుకునే వారికి ఇది అనుకూలమని సంస్థ తెలిపింది. ప్రస్తుతం బంగారం–వెండి నిష్పత్తి 91.64 వద్ద ఉందని.. ఈ ప్రకారం చూస్తే బంగారం కంటే వెండి ధరలే అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. -
త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ
న్యూఢిల్లీ: కేంద్రీకృత కేవైసీ (నో యువర్ కస్టమర్) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ, ఆర్థిక నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. కస్టమర్ల కేవైసీ వివరాలను ఒకే చోట నిర్వహించేదే సెంట్రల్ కేవైసీ. దీనివద్ద కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తే.. అన్ని ఆర్థిక సంస్థల వద్ద ఆటోమేటిక్‌గా అది అప్డేట్ అయిపోతుంది.ఎప్పటిలోగా ఈ వ్యవస్థను తీసుకొచ్చేదీ పాండే స్పష్టంగా వెల్లడించలేదు. కానీ వీలైనంత త్వరగా చేయాల్సి ఉందన్నారు. ఉమ్మడి కేవైసీ వ్యవస్థ గురించి ఎదురైన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఈ విషయంలోనూ మేము సానుకూలంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. మరింత సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన గల కమిటీ ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.ఇదీ చదవండి: బఫెట్ వారసుడొచ్చాడు..!2025లో నూతన సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీని తీసుకురానున్నట్టు బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. సెక్యూరిటీలకు సంబంధించి టీప్లస్0 సెటిల్మెంట్ ప్రస్తుతం ఐచ్ఛికంగానే ఉందని పాండే చెప్పారు. దీనివల్ల మార్కెట్ భాగస్వాములు క్రమంగా కొత్త వ్యవస్థకు మారేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. నిఘా, ఐపీవో దరఖాస్తులను వేగంగా మదింపు వేసేందుకు ప్రస్తుతం సెబీ కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల దీన్ని వాడనున్నట్టు తెలిపారు. టీప్లస్1 ప్రస్తుతం తప్పనిసరిగా అమల్లో ఉన్న విధానం. స్టాక్స్ కొనుగోలు చేసిన తర్వాతి పనిదినం రోజున అవి కస్టమర్ల డీమ్యాట్ ఖాతాలకు జమ అవుతాయి. -
ఐటీఆర్–3ని నోటిఫై చేసిన ఆదాయపన్ను శాఖ
న్యూఢిల్లీ: వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం కలిగిన వారు దాఖలు చేయాల్సిన ఐటీఆర్ పత్రం ఫారమ్ 3ని ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. ఐటీఆర్ 3ని ఏప్రిల్ 30న నోటిఫై చేసినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) వ్యాపారం నుంచి లాభ/నష్టాలు ఉంటే లేదా వృత్తిపరమైన ఆదాయం ఉంటే వారికి ఐటీఆర్ ఫారమ్ 3 వర్తిస్తుంది. ‘షెడ్యూల్ ఏఎల్’ కింద వెల్లడించాల్సిన ఆస్తులు/అప్పుల పరిమితి ఇప్పటివరకు రూ.50 లక్షలుగా ఉంటే రూ.కోటికి పెంచింది. దీనివల్ల ఆలోపు ఆదాయం ఉంటే వివరాలు వెల్లడించాల్సిన భారం తొలగిపోయింది. ఐటీఆర్ క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్లో మూలధన లాభాలను ఇకపై 2024 జూలై 23 ముందు, తర్వాత వాటిని వేరుగా చూపించాల్సి ఉంటుంది. బడ్జెట్లో రియల్ ఎస్టేట్‌పై మూలధన లాభాలను గతంలో ఉన్న 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించడం తెలిసిందే. దీని ప్రకారం 2024 జూలై 23కు ముందు ప్రాపర్టీని కొనుగోలు చేసిన వారు కొత్త పథకం కింద ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 12.5 శాతం మూలధన లాభాల పన్నును ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే పాత విధానంలో మాదిరిగా ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం పన్ను అయినా చెల్లించొచ్చు. -
పెట్టుబడులకు కాస్త స్థిరత్వం
పెట్టుబడులకు వైవిధ్యం ఎంత అవసరమో ఇటీవలి మార్కెట్ పతనం చూసి తెలుసుకోవచ్చు. లార్జ్‌క్యాప్‌తో పోల్చితే మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో గణనీయమైన దిద్దుబాటు కనిపించింది. పెట్టుబడులపై మెరుగైన రాబడులు కోరుకోవడంలో తప్పులేదు. అదే సమయంలో ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడులకు స్థిరత్వం కూడా అవసరమే. కనుక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ నిర్ణీత శాతం మేర డెట్ సాధనాలకూ కేటాయించుకోవాలి. ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ ఇదే పని చేస్తాయి. ఇవి ఈక్విటీతోపాటు కొంత మేర డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. తద్వారా పెట్టుబడిపై మెరుగైన రాబడికి తోడు అస్థిరతల్లో మెరుగైన రక్షణను ఆఫర్ చేస్తుంటాయి. ఈ విభాగంలో కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకంలో ఏడాది కాల రాబడి 10 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో మార్కెట్లలో అస్థిరతలు, దిద్దుబాట్ల నేపథ్యంలో దీన్ని మెరుగైన రాబడిగానే చూడొచ్చు. మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఏటా 14 శాతానికి పైనే రాబడి తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్లలో 18.55 శాతం, ఏడేళ్లలో 13.95 శాతం, పదేళ్లలో 13.45 శాతం చొప్పున ఈ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో రాబడులు కనిపిస్తాయి. పెట్టుబడుల విధానం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ పథకాలు ఈక్విటీ, డెట్ కలయికగా పెట్టుబడులు పెడుతుంటాయి. ఈక్విటీల వ్యాల్యుయేషన్స్ (స్టాక్స్ విలువలు) ఆకర్షణీయంగా ఉన్న సందర్భాల్లో మొత్తం పెట్టుబడుల్లో 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి మిగిలిన 20 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే విధంగా ఈక్విటీ వ్యాల్యూయేషన్లు ఖరీదుగా మారాయని భావించి సందర్భాల్లో ఈక్విటీ కేటాయింపులను 65 శాతానికి పరిమితం చేసి, మిగిలిన మేర డెట్ సాధనాలకు మళ్లిస్తుంటాయి. ఇలా పరిస్థితులకు తగినట్టు మార్పులు చేస్తూ అధిక రాబడులు తెచి్చపెట్టే విధంగా ఈ పథకాలు పనిచేస్తాయి. మార్కెట్ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేస్తుంటాయి. ఈ తరహా పెట్టుబడుల వ్యూహాలను ఈ పథకంలో గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.10,372 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 71 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్‌లో 25.58 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. మరో 3.29 శాతం పెట్టుబడులను నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లో అనిశ్చితుల నేపథ్యంలో కొంత నగదు నిల్వలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పోర్ట్‌ఫోలియోలో 64 స్టాక్స్‌ను కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 77 శాతం మేర కేటాయింపులు మెగా, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 19.78 శాతం ఉంటే, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 3 శాతం పెట్టుబడులు ఉన్నాయి. డెట్‌లో రిస్క్ అత్యంత కనిష్టంగా ఉండే ఏఏఏ రేటెడ్, ఎస్వోవీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఈక్విటీ పెట్టుబడుల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిల్లో 25 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 8.99 శాతం, ఇండ్రస్టియల్ కంపెనీలకు 8.28 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీలకు 6.55 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 6 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
బఫెట్ వారసుడొచ్చాడు..!
ఒమాహ: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ (94) ‘బెర్క్‌షైర్ హాతవే’ చైర్మన్‌గా ఈ ఏడాది చివర్లో తప్పుకోనున్నారు. తన స్థానంలో వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించాలంటూ కంపెనీ బోర్డుకు సిఫారసు చేయనున్నట్టు శనివారం ప్రకటించి ఇన్వెస్టర్లను, ఫాలోవర్లను షాక్‌కు గురిచేశారు. దీంతో ఆరు దశాబ్దాల పెట్టుబడుల యాత్రకు బఫెట్ ముగింపు పలకనున్నారు. ‘‘కంపెనీ సీఈవోగా ఈ ఏడాది చివర్లో గ్రెగ్ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైంది’’అంటూ వాటాదారులతో నిర్వహించిన ప్రశ్న–జవాబుల కార్యక్రమం చివర్లో బఫెట్ ప్రకటించారు.దీనిపైపై మాత్రం ప్రశ్నలకు అనుమతించలేదు. ఈ నిర్ణయం కంపెనీ బోర్డు సభ్యులైన తన ఇద్దరు పిల్లలు హోవర్డ్, సూసీ బఫెట్‌కు మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వేదికపై బఫెట్ పక్కనే గ్రెగ్ అబెల్ ఆసీనులై ఉండడం గమనార్హం. ‘‘బెర్క్‌షైర్ హాతవే కంపెనీ షేరు ఒక్కటి కూడా విక్రయించాలన్న ఉద్దేశం నాకు లేదు. చివరికి వీటిని విరాళంగా ఇచ్చేయాల్సిందే. కానీ, ప్రతీ షేరును కొనసాగించాలన్న నిర్ణయం ఆర్థిక కోణంలో తీసుకున్నదే. ఎందుకంటే నా కంటే కూడా గ్రెగ్ నాయకత్వంలో బెర్క్‌షైర్ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాను’’అని బఫెట్ తెలిపారు.ఇప్పటికే కీలక బాధ్యతలు..బఫెట్ భవిష్యత్ వారసుడిగా గ్రెగ్ అబెల్ (62) గతంలోనే నియమితులయ్యారు. కంపెనీ నాన్ ఇన్సూరెన్స్ వ్యాపార బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. కానీ, బఫెట్ మరణానంతరమే ఆయన స్థానంలో కంపెనీ బాధ్యతల్లోకి గ్రెగ్ వస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. తనకు రిటైర్మెంట్ ప్రణాళికలేవీ లేవంటూ లోగడ బఫెట్ ప్రకటించడం ఇందుకు దారితీసింది. బెర్క్‌షైర్ కంపెనీని నడిపించే సామర్థ్యాలు గ్రెగ్ అబెల్‌కు ఉన్నాయని చాలా మంది ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.ఇకపై ఇన్సూరెన్స్ వ్యాపారం బాధ్యతల నిర్వహణతోపాటు కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను (2024 చివరికి 334 బిలియన్ డాలర్లు) అబెల్ ఎలా పెట్టుబడులుగా మలుస్తారన్న ఆసక్తి నెలకొంది. బఫెట్ ప్రకటన తర్వాత వేలాది మంది ఇన్వెస్టర్లు నిల్చుని మరీ దిగ్గజ ఇన్వెస్టర్ సేవలకు ప్రశంసలు కురిపించడం కనిపించింది. బఫెట్ సారథ్యంలో (1965 నుంచి నేటి వరకు) బెర్క్‌షైర్ ఎస్అండ్పీ 500 కంటే (ఏటా 10.4 శాతం) రెట్టింపు స్థాయిలో ఏటా 19.9 శాతం కాంపౌండెడ్ రాబడులు అందించడం గమనార్హం. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం వారెన్ బఫెట్ సంపద విలువ ప్రస్తుతం 169 బిలియన్ డాలర్లుగా ఉంది. -
సెకీతో రిలయన్స్ న్యూ సన్‌టెక్ ఒప్పందం
ముంబై: రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ సన్‌టెక్ తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో పాతికేళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం వచ్చే 24 నెలల్లో సమీకృత సోలార్ అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై రూ. 10,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కేడబ్ల్యూహెచ్‌కి రూ. 3.53 ఫిక్సిడ్ రేటు చొప్పున విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. -
ఐదు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా.. భారీ జరిమానా
నిబంధనలు పాటించడంలో విఫమైతే 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI).. ఏ బ్యాంకుపై అయిన కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్‌లతో సహా మొత్తం ఐదు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానాలు విధించింది.బ్యాంకులలో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్,కేవైసీ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ మొదలైనవాటికి సంబంధించిన ఆదేశాలను పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంకుకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 97.80 లక్షల జరిమానా విధించింది.కస్టమర్ సేవలు, బ్యాంకులు అందించే ఆర్థిక సేవలకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంక్ ఆఫ్ బరోడా విఫలమైందని.. ఆర్బీఐ రూ. 61.40 లక్షల జరిమానా విధించింది. అంతర్గత ఖాతాల అనధికార నిర్వహణకు సంబంధించిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంకుకు కూడా రూ. 29.60 లక్షల జరిమానా పడింది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందిన వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం స్వల్పకాలిక రుణాలకు వడ్డీ రాయితీ పథకంపై కొన్ని ఆదేశాలను పాటించనందుకు ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌పై కేంద్ర బ్యాంకు రూ. 31.8 లక్షలు, కేవైసీకి సంబంధించిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ. 31.80 లక్షల జరిమానా విధించింది. -
ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్
భారతదేశంలో రైల్వే స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రేల్వే దేశవ్యాప్తంగా ఒక పోటీ ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో, స్టేషన్ ప్రాంగణాలలో ఉపయోగించే గడియారాలు ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ పోటీలో పాల్గొనేవారిని ''ప్రొఫెషనల్స్, కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు (12వ తరగతి వరకు)'' అని మూడు వర్గాలుగా విభజించడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్లను 2025 మే 1 నుంచి మే 31 మధ్య ఆన్లైన్లో (contest.pr@rb.railnet.gov.in) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఈ పోటీ గురించి రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'దిలీప్ కుమార్' మాట్లాడుతూ.. గెలుపొందిన విజేతకు.. మొదటి బహుమతి రూ. 5 లక్షలు అందిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా మూడు విభాగాలలో ఇదుమందికి కన్సోలేషన్ బహుమతులుగా రూ. 5000 చొప్పున ఇవ్వనున్నట్లు స్పష్టంగా చేశారు.ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్లను.. హై రిజల్యూషన్‌లో, ఎలాంటి వాటర్ మార్క్ లేదా లోగో వంటివి లేకుండా, ఒరిజినాలిటీ సర్టిఫికెట్తో సబ్మిట్ చేయాలని దిలీప్ కుమార్ పేర్కొన్నారు. డిజైన్ వెనుక ఉన్న థీమ్.. ఆలోచనను వివరించే కాన్సెప్ట్ నోట్ కూడా ఉండాలి. మీరు సబ్మిట్ చేసే డిజైన్స్ అసలైనవిగా ఉండాలి, వాటిపై ఎలాంటి కాపీరైట్స్ ఉండకూడదని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!పాఠశాల విభాగంలో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్ ఐడీ కార్డును సైతం అప్లోడ్ చేయాలి. కళాశాల విభాగంలో ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో చేరిన వ్యక్తులు సంబంధిత ఐడీ కార్డును అందించాలి. మిగిలినవారు ప్రొఫెషనల్ కేటగిరీ కిందకు వస్తారని ఆయన అన్నారు. -
ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) 2025 ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ గత నెలలో 4,80,896 యూనిట్ల అమ్మకాలు జరిగిపింది. ఇందులో దేశీయ అమ్మకాలు 4,22,931 యూనిట్లు కాగా.. ఎగుమతులు 57,965 యూనిట్లు. 2024 ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమ్మకాలు 11.26 శాతం తగ్గాయి.ఏప్రిల్ నెలలో.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా హెచ్ఎంఎస్ఐ లేటెస్ట్ అప్గ్రేడ్లను కలిగి ఉన్న డియో 125 అప్డేట్ వెర్షన్ ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ప్రీమియం మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా.. సీబీ350, సీబీ350 హైనెస్, సీబీ350ఆర్ఎస్ 2025 ఎడిషన్లను.. కొత్త కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఇదీ చదవండి: ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న కారు ఇదే..హోండా మోటార్‌సైకిల్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తోంది. ఈ కారణంగానే మార్కెట్లోని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. ఆశించిన అమ్మకాలను పొందగలుగుతోంది. -
ధీరూభాయ్ అంబానీ అసలు పేరేంటో తెలుసా?
భారదేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. రిలయన్స్ సామ్రాజ్యం గురించి తెలిసిన దాదాపు అందరికీ, ఈ కంపెనీ ప్రారంభించిన వారు ధీరూభాయ్ అంబానీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధీరూభాయ్ అంబానీ అసలు పేరు ఏమిటో.. బహుశా చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో ఆ విషయం తెలుసుకుందాం.సాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చి.. ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు.వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. అందరూ ఈయనను 'ధీరూభాయ్ అంబానీ' అని పిలుచుకునే వారు. కానీ ధీరూభాయ్ అనేది ఆయన ముద్దుపేరు, అంబానీ అనేది ఇంటిపేరు.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ధీరూభాయ్ అంబానీ అసలు పేరు.. 'ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ' (Dhirajlal Hirachand Ambani). 1932 డిసెంబర్ 28న జన్మించిన ఈయన.. ఏడుపదుల వయసులో 2002 జులై 6న మరణించారు. అప్పటికే రిలయన్స్ సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. -
ఇవన్నీ ఉంటే అయిపోదా.. స్మార్ట్ కిచెన్
ఇంటి ఆరోగ్యం, ఆనందం అంతా ఉండేది వంటగదిలోనే.. మరి అలాంటి వంటగదిని ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మార్చేయాలంటే.. ఇలాంటి గ్యాడ్జెట్స్ (కిచెన్ టీవీ, పిజ్జా ఓవెన్, ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్, థర్మా ‘మీట్’ర్) ఉండాల్సిందే!. ఈ గ్యాడ్జెట్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కిచెన్ టీవీ‘వంట చేయడం పెద్ద పనేం కాదు’ అని చేయి తిరిగిన నిపుణులు చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ఇదే మాటను వంట రాని వారు కూడా చెప్పగలరు. వాళ్ల వంటగదిలో ఈ ‘జీఈ కిచెన్ క్లబ్’ ఉంటే చాలు. ఇదొక స్మార్ట్ టీవీ లాంటిది. 27 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. వంటగదిలో దీనిని అమర్చుకుంటే, మనకు కావాల్సిన వంటను ఎలా వండాలో, ఏంమేం కావాలో, ఎంత మోతాదులో వేయాలో ఎప్పటికప్పుడు చూపిస్తూ, తెలియజేస్తుంది. మొబైల్, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ధర 999 డాలర్లు (రూ. 85,301).పిజ్జా ఓవెన్ఆర్డర్ చేసిన అరగంటలో వచ్చే పిజ్జాను వెంటనే తినేయాలి, చల్లారితే అసలు బాగోదు. ఇంట్లో ఉంటే, వెంటనే ఓవెన్లో పెట్టి వేడి చేసుకొని తింటాం. అదే బయట ఉంటే.. సాధ్యం కాని పని. ఇందుకోసం ఈ ‘ఓనీ కోడా 2 పిజ్జా ఓÐð న్’ బాగా ఉపయోగపడుతుంది. ఇదొక గ్యాస్ పవర్డ్ పిజ్జా ఓవెన్. కేవలం పిజ్జాను మాత్రమే ఇందులో వేడి చేసుకొని తినొచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లవచ్చు. విహార యాత్రలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ధర 449 డాలర్లు ( రూ. 38,338).ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్ఫ్రిజ్లో ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. అదే ఈ ‘ఎకోజీ స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్’ సాయంతో చాలా త్వరగా ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. యాప్ ద్వారా కూడా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. దీని ధర 239 డాలర్లు (రూ. 20, 407) మాత్రమే!థర్మా ‘మీట్’ర్సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి మాంసం తినటం వలన శరీరంలోకి టేప్ వార్మ్‌లు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే, మాంసం సరిగ్గా ఉడికిందా లేదా అని తెలసుకోవడానికి రూపొందించినదే ఈ ‘మీట్ర్ ప్లస్’. దీనికున్న సూదికొనను మాంసానికి గుచ్చితే, కేవలం పదిసెకండ్లలోనే మాంసం ఎంత వరకు ఉడికిందో పూర్తి సమాచారం ఇస్తుంది. మాంసం లోపలి ఉష్ణోగత్రను సుమారు 212 డిగ్రీ ఫారన్‌హీట్ వరకు, బయటి ఉష్ణోగత్రను 527 డిగ్రీ ఫారన్ హీట్ వరకు చెప్పగలదు. బ్లూటూత్ కెనెక్టివిటీతో మొబైల్‌కు కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర 99 డాలర్లు (రూ. 8,543). -
మరిన్ని కంపెనీలు కొంటాం: ప్రముఖ సీఈవో
న్యూఢిల్లీ: వేల్యుయేషన్ సముచితంగా ఉంటే మరిన్ని కంపెనీలను కొనుగోలు చేస్తామని ‘యూనికామర్స్ ఈసొల్యూషన్స్’ సీఈవో కపిల్ మఖీజా తెలిపారు. గత నాలుగేళ్లుగా ఈ–కామర్స్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని, ఆమ్నిచానల్లాంటి కొత్త మోడల్స్ తెరపైకి వచ్చాయని ఆయన చెప్పారు.కంపెనీ ఇటీవలే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం షిప్వేను కొనుగోలు చేసిన నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూనికామర్స్ ప్రస్తుతం 7,000 పైచిలుకు వ్యాపారాలకు సేవలు అందిస్తోందని ఆయన వివరించారు.ఈ–కామర్స్ వ్యవస్థలో కస్టమర్లతో సంప్రదింపుల దశ, లావాదేవీలను ప్రాసెస్ చేసే దశ, ఆర్డరును పూర్తి చేసే దశ అని మూడు దశలు ఉంటాయని, తమ సంస్థ ఈ మూడు అంశాల్లోనూ సర్వీసులు అందిస్తోందని కపిల్ వివరించారు. తాము ఇప్పటికే భారత్ కాకుండా ఆరు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, మరింతగా విస్తరించే యోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. -
బెర్క్‌షైర్ హాత్వేను వీడనున్న వారెన్ బఫెట్: నెక్స్ట్ సీఈఓ ఎవరంటే?
శనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.బెర్క్‌షైర్ హాత్వే సీఈఓగా గ్రెగ్ అబెల్ పేరును ప్రస్తావించగానే.. గ్రెగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. గ్రెగ్‌ను సీఈఓగా నియమించాలనే నిర్ణయం తన కుటుంసభ్యులకు తప్ప, గ్రెగ్‌కు కూడా తెలియవని బఫెట్ పేర్కొన్నారు.కంపెనీని నడిపించడానికి.. రెండు దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తున్న గ్రెగ్ అబెల్ సరైన వ్యక్తి అని కొందరు భావించినప్పటికీ.. పెట్టుబడుల విషయంలో ఈయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీనికి బఫెట్ సమాధానమిస్తూ.. గ్రెగ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి నా సంపద మొత్తానికి కంపెనీలో పెట్టుబడిగా పెడతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా.. నా సారథ్యంలో కంటే.. గ్రెగ్ సారథ్యంలో కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన బఫెట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మంచంలో సగం అద్దెకు: కొత్త ఆలోచనతో డబ్బు సంపాదిస్తున్న మహిళఎవరీ గ్రెగ్ అబెల్?62 ఏళ్ల గ్రెగ్ అబెల్.. రెండు దశాబ్దాలకు పైగా బెర్క్‌షైర్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన అబెల్ చిన్నప్పుడు బాటిల్స్ సేకరించడం, అగ్నిమాపక యంత్రాలను సర్వీసింగ్ చేయడం వంటి ఉద్యోగాలు చేశారు. ఆ సమయంలో ఉన్నతమైన విలువలను పొందారు. 1984లో ఆల్బెర్టా యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివారు. బెర్క్‌షైర్ హాత్వేలో చేరిన తరువాత దినదినాభివృద్ధి చెందిన.. కీలకమైన పదవులను అలంకరించారు. ఇప్పుడు ఈయనను సీఈఓ పదవి వరించింది. -
కంపెనీల కార్పొరేట్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
షాపర్స్‌స్టాప్ లాభం పతనంరిటైల్ స్టోర్ల దిగ్గజం షాపర్స్‌స్టాప్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 91 శాతంపైగా పడిపోయి రూ. 2 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23 కోట్లుపైగా ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 1,064 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,046 కోట్ల అమ్మకాలు సాధించింది. మొత్తం వ్యయాలు 4 శాతం పెరిగి రూ. 1,090 కోట్లకు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 86 శాతం క్షీణించి రూ. 11 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 77 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం వృద్ధితో రూ. 4,628 కోట్లకు చేరింది.ఈక్విటాస్ లాభం పతనంప్రయివేట్ రంగ సంస్థ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 80 శాతం క్షీణించి రూ. 42 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 208 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,685 కోట్ల నుంచి రూ. 1,869 కోట్లకు ఎగసింది. ప్రొవిజన్లు రూ. 107 కోట్ల నుంచి రూ. 258 కోట్లకు భారీగా పెరిగాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.61 శాతం నుంచి 2.89 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 1.17 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గాయి.ఇదీ చదవండి: లోకల్ కంటెంట్‌పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడిలాటెంట్ వ్యూ అనలిటిక్స్ నికరలాభం రూ.51 కోట్లుడిజిటల్ అనలిటిక్స్ కన్సల్టింగ్ అండ్ సొల్యూషన్స్ ప్రొవెడర్ లాటెంట్ వ్యూ అనలిటిక్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.51.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు 2023–24 ఇదే క్వార్టర్లో నికరలాభం రూ.45.23 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.187.45 కోట్ల నుంచి రూ.253.29 కోట్లకు పెరిగింది. ‘‘త్రైమాసిక ప్రాతిపదికన 1.9%, వార్షిక ప్రాతిపదికన 35.3 శాతం పెరుగుదలతో వరుసగా తొమ్మిదో సారి ఆదాయం వృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. బలమైన వ్యాపార మూలాలు, క్లయింట్లతో సత్సంబంధాలు మా స్థిరమైన పనితీరుకు నిదర్శనం’’ అని కంపెనీ సీఈవో రాజన్ సేతురామన్ తెలిపారు. 2025 మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం రూ.173.49 కోట్లు, మొత్తం ఆదాయం రూ. 916.78 కోట్లుగా ప్రకటించింది. -
ఐపీవోకు సిద్ధమవుతున్న ప్రముఖ కంపెనీలు
ఐపీవోకు ప్రయారిటీ జ్యువెల్స్ఆభరణాల రిటైల్ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 75 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ బంగారం, ప్లాటినం, వెండిసహా వజ్రాలతోకూడిన ఆభరణాలను తయారు చేసి విక్రయిస్తోంది. క్యారట్‌లేన్, కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, రిలయన్స్ రిటైల్, టీబీజెడ్, సెన్కో గోల్డ్ తదితర జ్యువెలరీ రిటైల్ స్టోర్లకు సైతం ప్రొడక్టులు సరఫరా చేస్తోంది. ఎన్ఎస్ఈ ఐపీవోపై సెబీతో చర్చలుపబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తోంది. కొన్ని కీలక అంశాల పరిష్కారం కోసం ఎన్ఎస్ఈ, సెబీ మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లింపులు, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్లో మెజారిటీ ఓనర్షిప్ తదితర అంశాలపై సెబీ ఎన్ఎస్ఈతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్వోసీ కోసం సెబీకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీకొరోనా రెమిడీస్ ఐపీవోఫార్మా రంగ కంపెనీ కొరోనా రెమిడీస్ ఐపీవో బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 800 కోట్లు సమీకరించనున్నప్పటికీ నిధులు కంపెనీకి లభించబోవు. మహిళా ఆరోగ్య పరిరక్షణ, కార్డియో– డయాబెటో, పెయిన్ మేనేజ్మెంట్, యూరాలజీ తదితర విభాగాలలో కంపెనీ ప్రొడక్టులు రూపొందిస్తోంది. -
ఎన్‌పీఎస్‌లో కొత్తగా 12 లక్షల మంది
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో (ఎన్పీఎస్) గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) కొత్తగా 12 లక్షల మంది ప్రైవేటు రంగం నుంచి సభ్యులుగా చేరారు. దీంతో మొత్తం ప్రైవేటు రంగ సభ్యులు 2025 మార్చి నాటికి 165 లక్షలకు చేరారు. చిన్నారుల పేరిట ప్రారంభించేందుకు ఉద్దేశించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకం గేతడాది సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రాగా, ఇందులో సభ్యులు లక్ష దాటారు.ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీఈ వివరాలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్ఏడీఏ) వెల్లడించింది. పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షణలోని ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) నిర్వహణలోని ఆస్తులు 2024–25లో 23 శాతం పెరిగి రూ.14.43 లక్షల కోట్లకు చేరాయి. 2025 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిక్స్డ్ పెన్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
లోకల్ కంటెంట్‌పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి
డిస్నీ-రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పడిన మీడియా సంస్థ జియోస్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32,000-33,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం రూ.30,000 కోట్ల పెట్టుబడితో పోలిస్తే 7% అధికం. స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ విస్తరణపై ఫోకస్‌గా ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా స్థానిక కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. లోకల్ కంటెంట్‌కు ఆదరణ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.వ్యూహాత్మక పెట్టుబడిగత మూడేళ్లలో జియోస్టార్ రూ.85,000 కోట్లు వెచ్చించి ప్రముఖ మీడియా సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా రీజినల్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్‌లో భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ దృష్టి సారించింది. ఐపీఎల్ సీజన్లో 300 మిలియన్ల సబ్స్రైబర్లను చేరుకోవడం, క్రికెట్ పట్ల దేశంలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమింగ్‌లో సాంకేతిక పురోగతిని పెంచడానికి పెద్దపీట వేస్తుంది.ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీస్థానిక కంటెంట్ విస్తరణ విభిన్న భాషా, సాంస్కృతిక ప్రేక్షకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో జియోస్టార్ హైపర్-లోకల్, ఇండియన్ సెంట్రిక్ కంటెంట్‌పై ఆసక్తిగా ఉంది. ఇందులో ప్రాంతీయ క్రీడలు, వినోదం కీలకంగా మారబోతున్నట్లు కంపెనీ తెలిపింది. 5జీ, 4జీ నెట్వర్క్ విస్తరిస్తున్నందున జియోస్టార్ తన డిజిటల్ పంపిణీ ఛానళ్లను బలోపేతం చేస్తోంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు లేదా ప్రత్యక్ష ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృత ప్రేక్షకులకు కంటెంట్ అందుబాటులో ఉండేలా చూస్తోంది. -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ
ఒకసారి ఛార్జ్ చేస్తే యాభై సంవత్సరాలు నిరాటంకంగా పని చేసేలా కాంపాక్ట్ న్యూక్లియర్ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు చైనీస్ బ్యాటరీ తయారుదారు బీటెవోల్ట్ ప్రకటించింది. ఇది కాంపాక్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో పురోగతిని సూచిస్తుంది. బీవీ 100 నికెల్-63 ఐసోటోపులను ఉపయోగించి రేడియోధార్మికత ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. డైమండ్ సెమీకండక్టర్ల ద్వారా ఈ చర్యలో విడుదలైన శక్తిని విద్యుత్తుగా మారుస్తున్నట్లు పేర్కొంది.బీవీ 100 న్యూక్లియర్ బ్యాటరీ ఫీచర్లుపరిమాణం: ఒక చిన్న నాణెం (15x15x5 మిమీ) పరిమాణంలో ఉంటుంది.పవర్ అవుట్ పుట్: 3 వోల్ట్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ 100 మైక్రోవాట్ల పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటినికి 1 వాట్ పవర్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీలను తయారు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.జీవితకాలం: ఈ న్యూక్లియర్ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే మళ్లీ ఛార్జ్, మెయింటెనెన్స్ అవసరం లేకుండా 50 ఏళ్లు పనిచేస్తుంది.సామర్థ్యం: ప్రస్తుతం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల కంటే 10 రెట్లు అధికం సామర్థ్యంతో పని చేస్తాయి.ఇదీ చదవండి: పాకిస్థాన్ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?సేఫ్టీ: విపరీతమైన ఉష్ణోగ్రతల్లో (-60°C నుంచి +120°C) మెరుగ్గా పనిచేస్తుంది. వీటివల్ల మంటలు లేదా పేలుడు ప్రమాదాలను జరగవని కంపెనీ తెలుపుతుంది. పూర్తిస్థాయిలో ఈ బ్యాటరీలు వినియోగంలోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఉపయోగాలు: వైద్య పరికరాలు, ఏరోస్పేస్ పరికరాలు, ఏఐ వ్యవస్థలు, డ్రోన్లు.. వంటి నిరంతరం విద్యుత్ అవసరమయ్యే పరికరాలకు ఈ బ్యాటరీలో ఎంతో అనువైనవిగా సంస్థ చెబుతుంది. -
పాకిస్థాన్ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశంగా పాకిస్థాన్‌కు ప్రపంచంలో బహు గొప్ప పేరే ఉంది. బరాక్ ఒబామా పాలనలో యూఎస్ ఆర్మీ 2011లో అల్-ఖైదా నాయకుడు బిన్‌లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబత్తాబాద్‌లో చంపేశారు. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ తమకు తెలియకుండానే అక్కడ తలదాచుకున్నాడని అప్పట్లోనే పాక్ ప్రపంచ దేశాల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించింది. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందనే ముసుగును తొలగించుకునేందుకు ఎనాడూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి ప్రజలైనా ఆర్థికంగా, సామాజికంగా మెరుగువుతున్నారా అంటే దేశం అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే అదనుగా చైనా అధిక వడ్డీలకు పాక్‌కు అప్పులిచ్చి, తనకు భవిష్యత్తులో అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మాత్రం అభివృద్ధి చేస్తోంది. దీన్ని పాక్ గ్రహించినా చేసేదేమిలేక మిన్నకుండిపోతుంది. పాక్ అప్పుల చిట్టా రూ.లక్షల కోట్లకు పెరిగింది.పాకిస్థాన్ మొత్తం రుణం పాక్ రూపాయి(పీకేఆర్)ల్లో 70.36 ట్రిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.21.15 లక్షల కోట్లు) చేరింది. ఇందులో దేశీయ, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు రెండూ ఉన్నాయి. వీటిలో గణనీయమైన భాగం చైనాకు చెందినవే. పాక్ మొత్తం అప్పుల్లో సుమారు 22 శాతం చైనా సమకూర్చినవే కావడం గమనార్హం.పాక్ విదేశీ రుణం: 130 బిలియన్ డాలర్లు(సుమారు రూ.10.7 లక్షల కోట్లు).స్వల్పకాలిక విదేశీ చెల్లింపులు: వచ్చే ఏడాదిలో 30.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2.53 లక్షల కోట్లు).రుణ-జీడీపీ నిష్పత్తి: ప్రభుత్వ ఆదాయంలో 50-60% వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేయడంతో 70% పైగా ఉంది.ఐఎంఎఫ్ బెయిలవుట్: ఐఎంఎఫ్ బెయిలవుట్ అనేది అధిక రుణం, కరెన్సీ అస్థిరత లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అందించే ఆర్థిక సహాయ ప్యాకేజీ. ఈ బెయిలవుట్లు సాధారణంగా రుణాల రూపంలో వస్తాయి. అందుకు తరుచూ దేశం తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా గ్యాస్ టారిఫ్ పెంపు, కొత్త పన్నులు వంటి కఠిన షరతులతో 2023లో పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ బెయిలవుట్ ప్యాకేజీని పొందింది.విదేశీ నిల్వలు: 2025 ఏప్రిల్ నాటికి 15.4 బిలియన్ డాలర్లు(రూ.1.27 లక్షల కోట్లు). ఇది మూడు నెలల దిగుమతులకు సరిపోదు.సైనిక వ్యయంపై ప్రభావం: పెరుగుతున్న అప్పుల కారణంగా పాకిస్థాన్ సైన్యానికి అందించే రేషన్‌ను తగ్గించింది. ఇంధన కొరత కారణంగా సైనిక విన్యాసాలను రద్దు చేయవలసి వచ్చింది.ఇదీ చదవండి: డబుల్ ప్రాఫిట్!ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతులను భారత్ నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. ప్రస్తుతం పాకిస్థాన్ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.281గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో రూ.400కు పడిపోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ సాయాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పరిమిత విదేశీ నిల్వలు, పెరుగుతున్న తిరిగి చెల్లించే అప్పులతో పాకిస్థాన్ రుణ సంక్షోభం తీవ్రమవుతోంది. -
డబుల్ ప్రాఫిట్!
మొండిబకాయిలు తగ్గడం, ప్రధాన ఆదాయం పెరగడంతో ప్రభుత్వ రంగ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.313 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆరి్థక సంవత్సరం ఇదే క్యూ4లో ఆర్జించిన లాభం రూ.139 కోట్లతో పోలిస్తే ఇది 125% అధికం. ఇదే మార్చి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.2,894 కోట్ల నుంచి రూ.3,836 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.2,481 కోట్ల నుంచి రూ.3,159 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ.689 కోట్ల నుంచి రూ.1,122 కోట్లకు బలపడింది.ఆస్తుల నాణ్యత పరిశీలిస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 5.43% నుంచి 3.38 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 1.63% నుంచి 0.96 శాతానికి పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 88.69% నుంచి 91.38 శాతానికి పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.16% నుంచి 17.41 శాతానికి పెరిగింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.0.07 పైసల డివిడెండ్ ప్రకటించింది.ఇదీ చదవండి: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు లాభమా..? నష్టమా..?పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ నికరలాభం 71% వృద్ధి చెంది రూ.1,016 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.10,915 కోట్ల నుంచి రూ.13,049 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,841 కోట్ల నుంచి రూ.3,784 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 2.45% నుంచి 2.85 శాతానికి చేరుకున్నాయి. -
కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు లాభమా..? నష్టమా..?
సూక్ష్మ రుణాల విభాగంలో ఒత్తిళ్ల కారణంగా గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం 8 శాతం (కన్సాలిడేటెడ్) క్షీణించింది. రూ.5,337 కోట్ల నుంచి తగ్గి రూ. 4,933 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 4,133 కోట్ల నుంచి 14 శాతం క్షీణించి రూ. 3,552 కోట్లకు తగ్గింది. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 7,284 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 5.28 శాతం నుంచి 4.97 శాతానికి క్షీణించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 2.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.మార్జిన్ల ఎఫెక్ట్..పాలసీ రేట్ల కోతతో పాటు సూక్ష్మ రుణాల విభాగానికి సంబంధించిన సవాళ్ల వల్ల బ్యాంకు ఎన్‌ఐఎంలపై ప్రతికూల ప్రభావం పడింది. మైక్రోఫైనాన్స్ విభాగంలో సవాళ్లు మరో త్రైమాసికంపాటు కొనసాగవచ్చని, ఆ తర్వాత సాధారణ స్థాయికి రావచ్చని బ్యాంక్ సీఈవో అశోక్ వాస్వానీ తెలిపారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల సెగ్మెంట్లలో తీవ్ర ఒత్తిళ్లేమీ ప్రస్తుతం లేవని ఆయన పేర్కొన్నారు. నామినల్ జీడీపీ వృద్ధికి 1.5 నుంచి 2 రెట్లు రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వాస్వానీ చెప్పారు. పోటీ బ్యాŠంకుల తరహాలోనే స్వల్పకాలికంగా తమ ఎన్ఐఎంపైనా ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏ అనుబంధ సంస్థలోనూ వాటాలను విక్రయించే యోచనేదీ లేదని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల నుంచి బైటపడటంతో వచ్చే ఆరు నెలల్లో, పూర్వ స్థాయికి నెలవారీ క్రెడిట్ కార్డుల జారీని పెంచుకోనున్నట్లు వాస్వానీ చెప్పారు. రుణాల పోర్ట్‌ఫోలియోలో అన్సెక్యూర్డ్ లోన్స్ (క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైనవి) వాటా 10.5 శాతానికి తగ్గిందని, దీన్ని 15 శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెడతామని వివరించారు. ఇదీ చదవండి: తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయంమరిన్ని కీలకాంశాలు..మార్చి క్వార్టర్లో స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.15,285 కోట్ల నుంచి రూ.16,712 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.27,907 కోట్ల నుంచి రూ.27,174 కోట్లకు తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ నికర లాభం (స్టాండెలోన్) రూ.13,782 కోట్ల నుంచి రూ.16,450 కోట్లకు (కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌ను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.2,730 కోట్లతో పాటు) చేరింది. వార్షికంగా చూస్తే ఇది 19 శాతం అధికం. కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ విక్రయ మొత్తాన్ని మినహాయిస్తే నికర లాభం రూ.13,720 కోట్లు వచ్చింది. మొండిబాకీల విషయానికొస్తే.. స్థూల ఎన్పీఏలు 1.39 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 1.42 శాతానికి చేరాయి. అయితే, నికర ఎన్పీఏలు మాత్రం 0.34 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గాయి. గ్రూప్ లాభాల్లో అనుబంధ సంస్థల వాటా 29 శాతం పెరగడంతో, సూక్ష్మ రుణాలు..ఆర్బీఐ ఆంక్షల వల్ల తలెత్తిన సవాళ్లను బ్యాంకు కొంత అధిగమించగలిగింది. -
జీడీపీ వృద్ధిపై అంచనాలు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5–6.7 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహయింపు చర్యలు దేశీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాల్లో వస్తున్న మార్పులు, దేశీ వినియోగ డిమాండ్ పెంపు మధ్య ప్రభుత్వం ఎలా సమతూకాన్ని తీసుకొస్తుందన్న దానిపైనే 2025–26 వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రెండు వ్యతిరేక శక్తుల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపింది.అంతర్జాతీయ అనిశ్చితులు మన ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి.. అదే సమయంలో పన్ను రాయితీలు దేశీ వినియోగాన్ని ఏ మేరకు పెంచుతాయో చూడాల్సి ఉందని పేర్కొంది. వీటి ఆధారంగా జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 6.7 శాతం మధ్య ఉండొచ్చని తెలిపింది. 2025–26 బడ్జెట్లో కేంద్రం రూ.లక్ష కోట్ల మేర పన్ను రాయితీలను ప్రకటించడం తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలకు దీంతో ప్రయోజనం చేకూరనుంది.ఇదీ చదవండి: తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయంపన్ను రాయితీలతో యువత చేతుల్లో ఖర్చు చేసే మిగులు ఆదాయం పెరుగుతుందని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి ముజుందార్ తెలిపారు. అమెరికా ప్రతీకార సుంకాలను భారత్ ఎలా ఎదుర్కొంటుంది? ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఏ మేరకు పురోగతి సాధిస్తుందన్నది కీలకమన్నారు. ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ 0.1–0.3 శాతం తగ్గిపోవచ్చని ముజుందార్ అభిప్రాయపడ్డారు. వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్ కొత్త అవకాశాలను సొంతం చేసుకోగలదన్నారు. -
తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయం
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండిబాకీలు తగ్గడం, ఆదాయం పెరగడంతో రూ.2,956 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.2,247 కోట్లతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. ఇక బ్యాంకు మొత్తం ఆదాయం రూ.16,887 కోట్ల నుంచి రూ.18,599 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,015 కోట్ల నుంచి రూ.6,389 కోట్లకు చేరింది. అసెట్ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 3.95 శాతం నుంచి 3.09 శాతానికి దిగి వచ్చాయి. అలాగే, నికర ఎన్పీఏలు కూడా 0.43 శాతం నుంచి 0.19 శాతానికి తగ్గాయి.ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులురూ.16.25 డివిడెండ్..పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేస ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 16.25 చొప్పున డివిడెండు ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర లాభం 35 శాతం వృద్ధి చెంది రూ. 8,063 కోట్ల నుంచి రూ. 10,918 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 63,482 కోట్ల నుంచి రూ. 71,226 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో రూ. రూ. 5,000 కోట్ల మొత్తాన్ని క్విప్ లేదా రైట్స్ ఇష్యూ లేదా రెండింటి మేళవింపుతో బ్యాంకు సమీకరించుకోనుంది. మరో 2,000 కోట్లను బాండ్ల ద్వారా సమకూర్చుకోనుంది. -
IMF నుంచి కృష్ణమూర్తిని తొలగించిన భారత్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) బోర్డు నుంచి డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్(dr krishnamurthy subramanian)ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఆ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ఐఎంఎఫ్ వెబ్సైట్ ప్రకటించింది.ఐఎంఎఫ్(IMF) బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆగష్టు 2022లో భారత్ కృష్ణమూర్తిని నామినేట్ చేసింది. నవంబర్ 1, 2022లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది నవంబర్‌తో ఆయన పదవీ కాలపరిమితి ముగియనుంది. ఈ లోపే భారత ప్రభుత్వం ఆయన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.కృష్ణమూర్తి సుబ్రమణియన్ కేవలం భారత్‌కు మాత్రమే కాదు.. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకకు సైతం ప్రాతినిధ్యం వహించారు. మే 2వ తేదీతో ఆయన పదవి కాలపరిమితి ముగిసినట్లు ఐఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ ప్రకటించింది. అంతకు ముందు కృష్ణమూర్తి భారత్‌కు ప్రధాన ఆర్థిక సలహాదారుగా (2018-2021)గా వ్యవహరించారు. అయితే ఆ టైంలోనూ ఆరు నెలల కంటే ముందు ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన్న అజయ్ సేత్.. ఈ జూన్‌లో రిటైర్ కాబోతున్నారు. ఈయన పేరును ఐఎంఎఫ్ బోర్డుకు భారత్ నామినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం. మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో పాక్‌కు ఇవ్వబోయే ఆర్థిక సాయం గురించి చర్చించబోతున్నారు. పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఫండింగ్ ఇవ్వొద్దని.. ఆ నిధులను ఉగ్రవాదులకు తరలిస్తోందంటూ భారత్ వాదిస్తున్ను సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కృష్ణమూర్తిని బోర్డు నుంచి తొలగిస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.కారణాలేంటో?ఐఎంఎఫ్ నుంచి కృష్ణమూర్తి తొలగింపుపై ఆర్థిక నిపుణలు విశ్లేషణలు జరుపుతున్నారు. ఐఎంఎఫ్ పని తీరుపై.. దాని డాటా మెకానిజంపై ఆయన చేస్తున్న తీవ్ర విమర్శలే అందుకు కారణమై ఉండొచ్చనే భావిస్తున్నారు. అలాగే.. ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగే అవకాశాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన India@100 పుస్తకం కోసం ఆయన చేస్తున్న ప్రమోషన్ కూడా మితిమీరడం కూడా కారణం అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఒప్పందానికి ముందు అవకాశాల అన్వేషణ
న్యూఢిల్లీ: మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు కొనసాగిస్తున్న భారత్–అమెరికా, దీనికంటే ముందు పరస్పర ప్రయోజనాన్నిచ్చే అవకాశాలను గుర్తించే పనిలో పడ్డాయి. వచ్చే సెపె్టంబర్–అక్టోబర్ నాటికి ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని కేంద్ర సర్కారు ఇప్పటికే సంకేతాలు ఇచి్చంది. రెండు దేశాలూ రంగాల వారీ చర్చలు మొదలు పెట్టాయని, మే చివరి నుంచి మరింత విస్తృత సంప్రదింపుల ప్రణాళికతో ఉన్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. భారత్ తరఫున కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ రాజేష్ అగర్వాల్, అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (దక్షిణాసియా) బ్రెండన్ లించ్ వాషింగ్టన్లో గత వారం మూడు రోజుల పాటు చర్చలు నిర్వహించారు. ‘‘మొదటి దశ పరస్పర ప్రయోజనకర, బహుళ రంగాల వాణిజ్య ఒప్పందాన్ని (బీటీఏ) 2025 చివరికి (సెపె్టంబర్–అక్టోబర్) ముగించే దిశగా మార్గసూచీపై బృందం చర్చించింది. తొలి దశలో పరస్పర విజయావకాశాలపైనా దృష్టి పెట్టింది’’అని వాణిజ్య శాఖ తెలిపింది. భారత్‌పై విధించిన అదనపు సుంకాలను 90 రోజుల పాటు (జూలై 9 వరకు) అమెరికా నిలిపివేసిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే మొదటి దేశం భారత్ అవుతుందంటూ యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. పరస్పర డిమాండ్లు.. కార్మికుల ప్రాధాన్యం కలిగిన టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యుయలరీ, తోలు ఉత్పత్తులు, గార్మెంట్స్, ప్లాస్టిక్, కెమికల్స్, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి ఎగుమతులపై సుంకాల రాయితీలను భారత్ కోరుతోంది. అమెరికా తన వైపు నుంచి ఇండస్ట్రియల్ గూడ్స్, ఆటోమొబైల్స్, వైన్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డైరీ, యాపిల్, నట్స్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేస్తోంది.ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి నియమ, నిబంధనలను రెండు దేశాలూ ఇప్పటికే ఖరారు చేసుకోవడం తెలిసిందే. అమెరికాతో భారత్‌కు వాణిజ్య మిగులు ఏటేటా పెరుగుతుండడం గమనార్హం. 2024–25లో ఇది 41.18బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఆరి్థక సంవత్సరాల్లో ఇది 35.32 బిలియన్ డాలర్లు (2023–24), 27.7 బిలియన్ డాలర్లు (2022–23) చొప్పున ఉంది. దీన్ని సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. -
ఎస్బీఐ లాభం రూ. 19,600 కోట్లు
న్యూఢిల్లీ: నికర వడ్డీ మార్జిన్లు క్షీణించిన ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సుమారు 8 శాతం క్షీణించింది. రూ. 19,600 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 21,384 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 1,64,914 కోట్ల నుంచి రూ. 1,79,562 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 32 బేసిస్ పాయింట్లు తగ్గి 3.15 శాతానికి పరిమితమైంది. స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే లాభం వార్షికంగా రూ. 20,698 కోట్ల నుంచి సుమారు 10 శాతం తగ్గి రూ. 18,642 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ. 1,28,412 కోట్ల నుంచి రూ. 1,43,876 కోట్లకు ఎగిసింది. 2024–25కి గాను బ్యాంకు ఒక్కో షేరుపై రూ. 15.90 మేర డివిడెండును ప్రకటించింది. పెట్టుబడులపై టారిఫ్‌ల అనిశ్చితి ప్రభావం.. ‘భారత ఎకానమీపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండనప్పటికీ, సుంకాలపై అనిశ్చితి కారణంగా ఎకానమీ, అలాగే పెట్టుబడులపై మాత్రం ప్రభావం పడొచ్చు‘ అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటంతో తదుపరి మరింతగా రేట్ల కోత ఉండొచ్చని భావిస్తున్నట్లు శెట్టి వివరించారు. తమ రుణాల్లో 27 శాతం భాగం రెపో రేటుతో అనుసంధానమై ఉండటం, ఆర్బీఐ రేట్లను తగ్గించే అవకాశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఐఎంలపై ఒత్తిడి కొనసాగవచ్చని శెట్టి చెప్పారు. నిర్దిష్ట అంశం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం బ్యాంకు లాభం అధికంగా నమోదైందని, దానితో పోల్చి చూస్తే ప్రస్తుతం తగ్గిందని పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 12–13 శాతం రుణ వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు. టారిఫ్ యుద్ధాల ప్రభావం రుణ వృద్ధిపై కూడా పడే అవకాశం ఉందని శెట్టి వివరించారు. వాణిజ్య విధానాల్లో మార్పులతో అంతర్జాతీయ ఎకానమీలో అనిశ్చితి నెలకొన్నందున కంపెనీలు తమ పెట్టుబడుల ప్రణాళికలను నెమ్మదిగా అమలు చేసే అవకాశం ఉందన్నారు. దీనితో బ్యాంకులపరంగా రుణ వృద్ధిపైనా ప్రభావం పడుతుందని శెట్టి చెప్పారు. అసెట్ క్వాలిటీ మరింత కాలం మెరుగ్గానే కొనసాగవచ్చన్నారు. 18వేల కొలువులు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఏకంగా 18,000 నియామకాలు చేపట్టనున్నట్లు శెట్టి తెలిపారు. దశాబ్దకాలంలోనే ఇది అత్యధికమని ఆయన పేర్కొన్నారు. ఇందులో 13,400 మంది క్లర్కులు, 3,000 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1,600 మంది స్పెషలిస్టు ఆఫీసర్లు (టెక్నాలజీ తదితర విభాగాల్లో) ఉంటారని వివరించారు. మరిన్ని విశేషాలు.. ⇒ పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను స్టాండెలోన్ చూస్తే ఎస్బీఐ నికర లాభం 16 శాతం పెరిగి రూ. 61,077 కోట్ల నుంచి రూ. 70,901 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ. 1,11,043 కోట్ల నుంచి రూ. 1,19,666 కోట్లకు పెరిగింది. అసెట్ క్వాలిటీ కూడా మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 2024 మార్చి ఆఖరు నాటికి 2.24 శాతంగా ఉండగా తాజాగా 1.82 శాతానికి తగ్గింది. నికర ఎన్పీఏలు సైతం 0.57 శాతం నుంచి 0.47 శాతానికి తగ్గాయి. ⇒ 2025–26లో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్)/ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) లేదా ఇతరత్రా మార్గాల్లో ఏకమొత్తంగా లేదా విడతలవారీగా రూ. 25,000 కోట్ల వరకు మూలధనం సమకూర్చుకునే ప్రతిపాదనకు ఎస్బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. ⇒ ప్రస్తుతం ఎస్బీఐ కార్పొరేట్ రుణాల పైప్‌లైన్ (ఇప్పటికే మంజూరైనా ఇంకా విడుదల చేయాల్సినవి, భవిష్యత్ అవసరాల కోసం సంప్రదింపుల దశలో జరుపుతున్నవి) రూ. 3.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. మౌలిక రంగం, రెన్యువబుల్ ఎనర్జీ, డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్టీ సెగ్మెంట్ల నుంచి రుణాలకు డిమాండ్ నెలకొంది. మార్చి త్రైమాసికంలో కార్పొరేట్ రుణాల వృద్ధి 9 శాతానికి పరిమితం కాగా, రిటైల్ వ్యక్తిగత రుణాలు 11 శాతం పెరిగాయి. ఇందులో గృహ రుణాల వృద్ధి 14 శాతంగా ఉంది. ⇒ అన్సెక్యూర్డ్ పర్సనల్ రుణాల విభాగంలో పెద్దగా సవాళ్లేమీ లేనందున దీనిపై బ్యాంకుపై మరింతగా దృష్టి పెట్టనుంది. భారీ కార్పొరేట్ లోన్ల విషయంలోనూ సమస్యేమీ లేకపోవడంతో మరికొన్నాళ్ల పాటు అసెట్ క్వాలిటీ మెరుగ్గానే కొనసాగవచ్చు. మొండి పద్దుల నిష్పత్తి రెండు శాతం లోపే కొనసాగవచ్చు. -
ఏప్రిల్‌లో ఎక్కువ అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు
భారతీయ మార్కెట్లో.. ఎలక్ట్రిక్ వాహనాలకు (ఫోర్ వీలర్స్, టూ వీలర్స్) డిమాండ్ పెరుగుతోంది. అమ్మకాల్లో కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. గత నెలలో (2025 ఏప్రిల్) దేశీయ విఫణిలో ఎక్కువ అమ్మకాలు జరిపిన ఐదు కంపెనీల గురించి తెలుసుకుందాం.వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం ఏప్రిల్ 2025లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా టీవీఎస్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కంపెనీ గత నెలలో 19,736 యూనిట్లను విక్రయించి 154 వృద్ధిని పొందింది. 2024 ఏప్రిల్‌లో కంపెనీ మొత్తం సేల్స్ 7,762 యూనిట్లు.ఓలా ఎలక్ట్రిక్ 2025 ఏప్రిల్‌లో 19,709 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఈ అమ్మకాలు 2024 ఏప్రిల్ (34163 యూనిట్లు) కంటే 42 శాతం తక్కువ.ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు2025 ఏప్రిల్‌లో బజాజ్ అమ్మకాలు 19,001 యూనిట్లు కాగా.. ఏథర్, హీరో కంపెనీల సేల్స్ వరుసగా 13,167 యూనిట్లు, 6,123 యూనిట్లు. ఈ మూడు కంపెనీలు అమ్మకాలు వరుసగా 151 శాతం, 218 శాతం, 540 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీన్ని బట్టి చూస్తే ఈ మూడు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
ఫార్మా జీసీసీలకు హబ్‌గా భారత్
సాక్షి, సిటీబ్యూరో: ఫార్మా రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్‌గా భారత్ అవతరిస్తోంది. అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు ఇండియాలో జీసీసీల ఏర్పాటుపైనే దృష్టి సారిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం,వినియోగం కూడా బాగుంటుండటంతో అవి భారత్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. 2,500లకు పైగా సెంటర్లు, 45 లక్షల మందికి పైగా నిపుణులతో త్వరలోనే భారత జీసీసీ మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమిస్తోందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక పేర్కొంది.లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగాలలో 2024లో 100 సెంటర్లు ఉండగా.. 2030 నాటికి వీటి సంఖ్య 160కి, వీటిలో ఉద్యోగుల సంఖ్య 4,20,000కి చేరనుందని అంచనా వేసింది. భారత్‌లో టెక్నాలజీ నిపుణుల లభ్యత గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంటుండగా.. ఇక్కడ వర్ధమాన స్టార్టప్ వ్యవస్థ కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలాంశంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. దిగ్గజ కంపెనీల జీసీసీల నియామకాలు కూడా భారీగానే ఉంటున్నాయి. డిమాండ్, వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఫార్మా దిగ్గజాలు భారత్‌లోని తమ హబ్‌లలో జోరుగా నియామకాలు చేపడుతున్నాయి. -
మంచంలో సగం అద్దెకు.. ఆశ్చర్యపడే ఆదాయం సంపాదిస్తున్న మహిళ!
అద్దెకు తీసుకోవడం అనే మాట వినిపిస్తే.. సాధారణంగా ఇల్లు, కారు, బైకు మొదలైనవి రెంటుకు తీసుకోవడం అని అనుకుంటారు. కానీ ఒక మనిషి ఉపయోగించే మంచంలో సగం అద్దెకు తీసుకుంటారా?, ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇదే ఆలోచనతో ఓ మహిళ నెలకు రూ. 54,000 సంపాదిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ఈ కథనంలో తెలుసుకుందాం.క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ 'మోనిక్ జెరెమియా'.. "హాట్ బెడ్డింగ్" అనే కొత్త ట్రెండ్ ద్వారా అదనపు డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. ఆమె తన మంచంలో సగం అద్దెకు ఇస్తూ నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లను (రూ.54,000) వసూలు చేస్తోంది. ఎటువంటి భావోద్వేగ సంబంధాలు లేకుండా ఎవరి పక్కనైనా పడుకోవాలనేది ఆమె ఆలోచన.హాట్ బెడ్డింగ్ ద్వారా బెడ్ షేర్ చేసుకునే వ్యక్తులు ఇద్దరూ నియమాలను అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గమని జెరెమియా నమ్మింది. మీరు నాలాగే సాపియోసెక్సువల్ అయితే, శారీరక సాన్నిహిత్యం కంటే.. మానసిక సాంగత్యాన్ని ఇష్టపడితే.. ఒకే బెడ్ మీద ఇద్దరు నిద్రపోవచ్చని చెబుతోంది.2020 కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ కోల్పోయి.. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ "హాట్ బెడ్డింగ్" ఆలోచన వచ్చింది. తన మొదటి బెడ్ క్లయింట్ తనకు తెలిసినవాడేనని.. అందువల్ల ప్రారంభంలో అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదని మోనిక్ జెరెమియా చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ.. నియమాలను గౌరవించుకుంటే.. ఒక రూమ్ షేర్ చేసుకున్నట్లు, బెడ్ షేర్ చేసుకోవచ్చు అని అంటోంది. కష్ట సమయంలో.. డబ్బు సంపాదించడానికి హాట్ బెడ్ ఐడియా ఒక స్మార్ట్ మార్గం అని జెరెమియా చెబుతోంది.ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి -
మూడు ముక్కల్లో అంబానీ 'సక్సెస్ మంత్ర'
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ అధినేత 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన ఈయన ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఇటీవల ముకేశ్ అంబానీని పెట్టుబడి ఆధారిత కంపెనీ వ్యవస్థాపకుడు 'అనంత్ లాధా' కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంత్ లాధా.. ముకేశ్ అంబానీని కలిసి కొంతసేపు ముచ్చటించారు. ఆ సమయంలో 'విజయం సాధించడానికి ఏమి కావాలి?' అని ప్రశ్నించారు. 'ఫోకస్, డెలిగేట్, డైవర్సిఫై' ఈ మూడు ఉంటే తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని రిలయన్స్ అధినేత సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం లాధాను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండిముకేశ్ అంబానీ చెప్పిన సక్సెస్ ఫార్ములాను.. అనంత్ లాధా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. ఇది నెటిజన్లను కూడా ఎంతంగానో ఆకట్టుకుంది. ఇది చాలా గొప్ప సలహా అని ఒక నెటిజన్ వెల్లడించగా.. ఇది బంగారం లాంటి సలహా అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా అంబానీ ఇచ్చిన సలహా ఎంతోమందిని ఫిదా చేసింది. View this post on Instagram A post shared by Anant Ladha (@anantladha1234) -
లాంచ్‌కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు
2025 ప్రారంభం నుంచి అనేక వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. కాగా ఈ నెలలో (2025 మే) వోక్స్వ్యాగన్, కియా, ఎంజీ మోటార్ వంటి కంపెనీలు తమ కార్లను పరిచయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ కథనంలో త్వరలో మార్కెట్లో లాంచ్ కానున్న కార్లను గురించి తెలుసుకుందాం.కియా క్లావిస్ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కార్ల జాబితాలో కియా క్లావిస్ ఒకటి. ఇది అప్డేటెడ్ కియా కారెన్స్ అని తెలుస్తోంది. అయితే క్లావిస్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్ ఫీచర్స్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డేటైమ్ రన్నింగ్ లైట్లు అన్నీ కూడా అప్డేట్ అయ్యాయని సమాచారం. రియర్ బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ అన్నీ కూడా కారెన్స్ కంటే భిన్నంగా ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. అంతే కాకుండా ఇది మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు తెలుస్తోంది.ఎంజీ విండ్సర్ (50 కిలోవాట్ బ్యాటరీ)ప్రస్తుతం 39 కిలోవాట్ ప్యాక్ కలిగిన ఎంజీ విండ్సర్ కారు.. ఈ నెలలో 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ కానుంది. ఇది 460 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 39 కిలోవాట్ ప్యాక్ 332 కిమీ రేంజ్ అందిస్తుంది. రాబోయే ఎంజీ విండ్సర్ డిజైన్, ఫీచర్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ మోటారు విషయంలో స్పష్టత రావడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.ఇదీ చదవండి: ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న కారు ఇదే..ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐగ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ ఈ నెలలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది సొగసైన ఎల్ఈడీ లైట్ సిగ్నేచర్, జీటీఐ బ్యాడ్జింగ్, హానీ కూంబ్ గ్రిల్, వెనుక భాగంలో డిఫ్యూజర్, రిఫ్రెష్డ్ టెయిల్‌లైట్ మొదలైనవి ఉన్నాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, టెయిల్‌గేట్‌పై GTI బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి. అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 265 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్2020లో ప్రారంభమైన టాటా ఆల్ట్రోజ్ త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రీపోజిషన్ డీఆర్ఎల్, అప్డేటెడ్ ఫ్రంట్ ఎండ్ వంటి వాటితో పాటు.. కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. ఈ కారులో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే టాటా లోగోతో కూడిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్. ఇది కాకుండా.. పెద్ద టచ్‌స్క్రీన్, అప్డేటెడ్ డాష్‌బోర్డ్, ఏసీ కంట్రోల్స్,, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీల కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కూడా ఇందులో ఉండనున్నాయి. -
కొత్త రిసార్ట్‌లను ప్రారంభించిన క్లబ్ మహీంద్రా
మహీంద్రా హాలిడేస్ & రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ (MHRIL)లో ప్రధాన బ్రాండ్ అయిన 'క్లబ్ మహీంద్రా' దాని పోర్ట్‌ఫోలియోలో మూడు కొత్త రిసార్ట్‌లను జోడించినట్లు ప్రకటించింది. బ్రాండ్ విస్తరణలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించింది. అంతే కాకుండా.. బ్రాండ్ వియత్నాంలోని సైగాన్ ప్రాంతం.. అబుదాబిలో కూడా తన ఉనికిని బలోపేతం చేసుకుంది.ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరిలోని దిండి ఆర్వీఆర్.. అద్భుతమైన నదీతీర రిట్రీట్ గంభీరమైన గోదావరి నది వెంబడి ఉంది. పచ్చని కొబ్బరి తోటలు, సుందరమైన బ్యాక్ వాటర్‌లతో చుట్టుముట్టబడిన ఈ రిసార్ట్, కుటుంబం & స్నేహితులతో కాలం గడపడానికి అనువైన ప్రదేశం. ఈ రిసార్ట్‌లో 100 గదులు ఉన్నాయి. మొదటి దశలో 50 గదులు ప్రారంభమవుతాయి. మిగిలిన 50 గదులు ఈ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి ప్రారంభమవుతాయని సమాచారం. -
వంట గది ఆహ్లాదం.. చిమ్నీ పాత్ర కీలకం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటిలో వంట గది ప్రత్యేకతే వేరు. కుటుంబ సభ్యుల ఆనందం, ఆరోగ్యంలో కిచెన్ కీలకమైంది. వంట ఏదైనా సరే ఘాటు వాసన, పొగ ఇళ్లంతా వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అందుకే వంట గదిలో చిమ్నీల ఏర్పాటు అనివార్యమైపోయింది. దీంతో ఇంటిలో ఘాటు వాసనలు వ్యాపించకపోవడమే కాకుండా చమురు, జిడ్డు మరకలు గోడలు మసకబారకుండా శుభ్రంగా ఉంటాయి.చిమ్నీ రకాలు బోలెడువాల్ మౌంటెడ్: స్టౌ గోడకు ఆనుకొని ఉంటే వాల్‌మౌంటెడ్ చిమ్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని గోడలకు అమర్చడం వల్ల నేరుగా పొగ, ఘాటు వాసనలను సంగ్రహించుకోవడంలో బాగా పనిచేస్తాయి.ఇన్‌బిల్ట్: కిచెన్ క్యాబినెట్ లేదా గోడలో ఇన్ బిల్ట్ చిమ్నీ కలిసిపోతుంది. ఘాటైన వాసనలు పీల్చే శక్తివంతమైన వ్యవస్థగా పనిచేస్తుంది. టెలిస్కోపిక్: ఈ రకం పైకప్పులలో ఇమిడిపోతాయి. వంట చేసేటప్పుడు చిమ్నీని పొడిగించుకోవచ్చు కూడా. చిన్న వంటగదిలో ఉపయోగపడతాయి. కార్నర్: స్థలం తక్కువగా ఉండే వంట గదిలో ఓ మూలన వినియోగిస్తారు. డక్ట్‌లెస్: గొట్టాలను అమర్చడానికి వీలులేని వంట గదిల్లో వినియోగిస్తారు. ఇవి గాలిని వెలుపలికి వదలకుండా వాటిలో ఉండే ఫిల్టర్స్ పొగ, ఆవిరి, చమురును పీల్చుకొని శుద్ధి చేస్తాయి. కన్వర్టబుల్: డక్టెడ్, డక్ట్‌లెస్ చిమ్నీలుగా మార్చుకునే అవకాశం ఉండేవే కన్వర్టబుల్. దీన్ని వంట గదికి అనుగుణంగా మార్చుకునే వీలుంటుంది. స్టాంటెండ్: కుక్‌టాప్ వద్ద వాలుగా ఉండే ఈ చిమ్నీ విలాసవంతంగా కనిపిస్తుంది. టెక్నీషియన్స్ ద్వారా శుభ్రం చేయించుకోవాల్సి ఉంటుంది. బయటకు కనిపించకుండా సీలింగ్ మౌంటెడ్లో అమరుస్తారు. ఐలాండ్: స్టౌ వేదిక ద్వీపంలా, కిటికీల చెంత స్టౌలు ఉంటే ఐలాండ్ లేదా సీలింగ్ మౌంటెడ్ చిమ్నీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇవి గోడల నుంచి దూరంగా ఉండటం వల్ల మరింతగా వాసనలు, పొగను సంగ్రహిస్తాయి. -
'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్‌కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్‌కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్ పోస్ట్‌కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025 -
సుందరం.. పూజా మందిరం
సాక్షి, సిటీబ్యూరో: కట్టిన ఇల్లు కొంటున్నా.. దగ్గరుండి కట్టించుకుంటున్నా.. ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది ఉండాలని కోరుకుంటున్నారు. ఇంటి విస్తీర్ణం మేరకు ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటున్న వారు కొందరైతే మరికొందరు మాత్రం మార్కెట్లో కోరుకున్న డిజైన్లు, విభిన్న ఆకృతుల్లో లభించే పూజా మందిరాలను కొనుగోలు చేసుకొని ఏర్పాటు చేసుకుంటున్నారు.పూజా గది ఏర్పాటు చేసుకునే సౌలభ్యం లేని వారు పూజా మందిరాలపై ఆధారపడుతున్నారు. ఒకప్పుడు చెక్కతో గోడకు ఒకచోట దేవుడి ఫొటోలు పెట్టుకునేలా ఏర్పాట్లు చేసుకునేవారు. కానీ సొంతిల్లు కొనుగోలు చేసిన వారు మాత్రం ప్రస్తుతం.. చిన్నదైనా సరే పూజా మందిరం ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటివారి కోసం దాదాపు నగరంలోని అన్ని ఫర్నీచర్ షోరూంలలో పూజా మందిరాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒకటి, రెండు డిజైన్లు మాత్రమే ఉండగా.. వాటినే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కానీ, ప్రస్తుతం కావాల్సిన డిజైన్‌లో నచ్చిన ఆకారంతో పూజా మందిరాలు రెడీగా ఉన్నాయి. నచ్చిన విధంగా కావాలంటే ఆర్డర్‌పై తయారు చేసే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..ధరల్లో వ్యత్యాసం..పూజా మందిరాల్లో సైజు, డిజైన్, ఆకృతిని బట్టి ధరలు ఉంటాయి. సహజంగా వెడల్పు, ఎత్తును బట్టి పూజా మందిరాలు తయారు చేస్తున్నారు. స్థలానికి అనుగుణంగా ఆర్డర్‌పై తయారు చేయించుకోవచ్చు. అయితే వీటి తయారీలో ఉపయోగించే చెక్కను బట్టి ధరలు ఆధారపడి ఉంటాయి. టేక్‌వుడ్, సీసం వుడ్ ఇలా కావాల్సిన అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకునే అవకాశం ఉంది. సాధారణ చెక్కతో చిన్న సైజువి ఒక మోస్తారు సైజు వరకు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు లభ్యమవుతున్నాయి. సహజంగా మందిరాలను ఓం, స్వస్తిక్ బొమ్మలతో తయారు చేయించుకుంటున్నారు.