Tollywood
-
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
‘‘నేను నటించిన ‘హృదయ కాలేయం’ విడుదలై పదకొండేళ్లయింది. ఇన్నేళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. ఈ నెల 25న ‘సోదరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి’’ అని సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) తెలిపారు. సాయి రాజేశ్ నీలం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హృదయ కాలేయం’. ఈ మూవీ ద్వారా సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. 2014 ఏప్రిల్ 4న ఈ చిత్రం విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ 11వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సంపూర్ణేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నరసింహాచారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయ కాలేయం’తో సంపూర్ణేష్ బాబుగా మార్చిన సాయి రాజేశ్ అన్నకు రుణపడి ఉంటాను. ఈ మూవీ టైమ్‌లో డైరెక్టర్ రాజమౌళిగారు చేసిన ట్వీట్ వల్ల నాకెంతో గుర్తింపు దక్కింది. ‘హృదయ కాలేయం’ టైమ్‌లో సందీప్ కిషన్ అన్న, మారుతి, తమ్మారెడ్డి భరద్వాజగార్లు ఎంతో సపోర్ట్ చేశారు. నా జీవన విధానానికి, ‘బిగ్ బాస్’ పరిస్థితికి సరిపోక ఆ షోలో ఉండలేకపోయాను. నా సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. కనీసం కారులో తిరగ్గలనా? అనుకున్న నన్ను విమానంలో తిరిగేలా చేశారు సాయి రాజేశ్ అన్న’’ అని తెలిపారు. -
ఏఐ కూడా ఊహించలేదుగా...
శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘శిల్పి ఎవరో...’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. ఈపాటకి శ్రీమణి సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్పాడారు. ‘ఏఐ కూడా ఊహించలేదుగా ఇంత అందాన్ని ఏం చెప్పినా’ అనే పల్లవితో ఈపాట ఆరంభం అవుతుంది. ‘‘తన జీవితంలోని ఇద్దరమ్మాయిల (కేతిక, ఇవానా) అందంపై శ్రీవిష్ణు ప్రశంసలు కురిపిస్తూ ఈపాట సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
అజిత్ కుమార్ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. Maamey!THE MASS CELEBRATION is here 🤩#GoodBadUglyTrailer out now ❤🔥▶️ https://t.co/9KbtVtrkqP#GoodBadUgly Grand release worldwide on April 10th, 2025 with VERA LEVEL ENTERTAINMENT 💥💥#AjithKumar @trishtrashers @MythriOfficial @Adhikravi @gvprakash @AbinandhanR… pic.twitter.com/d2ECC3CoJz— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2025 -
అతను లేకపోతే మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్
మ్యాడ్ స్క్వేర్ మూవీతో మరో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కల్యాణ్ శంకర్. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ నిర్వహించింది. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాట్ టీమ్‌ను ఉద్దేశించిన ఎన్టీఆర్ మాట్లాడారు. మ్యాడ్ స్క్వేర్ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు .జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నవ్వించడం అనేది ఒక పెద్ద వరం. అలా మనల్ని ఎప్పుడు నవ్వించడానికి మనకు కల్యాణ్ శంకర్ దొరికాడు. దర్శకుడికి నచ్చినట్లుగా మీరు చేయడం కూడా గొప్ప వరం. ఈ సినిమాలో లడ్డు(విష్ణు) లేకపోతే హిట్ అయ్యేది కాదేమో. అతను ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు. కానీ సినిమాలో అలా చేశాడు. సంగీత్ శోభన్‌ను చూసి ఆయన కుటుంబం అంతా గర్వపడుతున్నారు. రామ్ నితిన్.. నేను ఎలా ఉండేవాన్నో అలానే ఉన్నారు. కెమెరా ముందు నిలబడటం అంతా ఈజీ కాదు. కామెడీని పండించడం చాలా కష్టమైన పని. రామ్ నితిన్ నీకు మంచి భవిష్యత్తు ఉంది' అని అన్నారు.బామర్ది నార్నే నితిన్ గురించి మాట్లాడుతూ..'2011లో నాకు పెళ్లైంది. అప్పుడు నార్నే నితిన్ చిన్న పిల్లవాడు. మొదట నాతో మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసి మొట్టమొదటిసారి చెప్పిన మాట బావ నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నీ సావు నువ్వు చావు.. నా సపోర్ట్ అయితే నీకు ఉండదు అని చెప్పా. ఆ తర్వాత అతని కెరీర్‌పై నాకు భయం ఉండేది. నాకు ఏమి చెప్పొద్దు అనేవాడిని. ఏరోజు నన్ను ఏది అడగలేదు. ఈ రోజు తనను చూసి చాలా గర్వంగా ఉంది. మంచి దర్శకులు, నిర్మాతలతో పనిచేశాడు. కచ్చితంగా వారిని గుర్తు పెట్టుకో. నిన్ను నువ్వు నమ్ముకో. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంటికెళ్లాక మరోసారి నీతో మాట్లాడతా.' అంటూ సరదాగా మాట్లాడారు. -
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆయన డైరెక్టరా? డ్యాన్స్ మాస్టరా?
ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ సారి డబుల్ మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాయిరే నాయిరే అనే సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను ఊర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Director #KalyanShankar sets the stage on fire with #JrNTR's 'Nairey Nairey'. pic.twitter.com/mixonqAiR7— Suresh PRO (@SureshPRO_) April 4, 2025 -
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
బెంగాలీ బ్యూటీలో ముస్తాబైన యాంకర్ అనసూయఒమన్ ట్రిప్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న రష్మికహాట్ పోజులతో రెచ్చిగొట్టేస్తున్న జాన్వీ కపూర్చీరలో కిర్రెక్కిపోయే అందంతో కావ్య కల్యాణ్ రామ్పచ్చనిచెట్ల మధ్య తృప్తి దిమ్రి సోయగాల విందుఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెప్పిన అనుపమహాలీవుడ్ అందగత్తెలా కనిపిస్తున్న శ్రీలీల View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by ForeverNew India (@forevernew_india) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) -
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ?ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.ఎవరెలా చేసారంటే..? నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.టైటిల్ : 28°Cనటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులునిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్నిర్మాతలు: సాయి అభిషేక్ఎడిటింగ్: గ్యారీ BHదర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు విడుదల: ఏప్రిల్ 04, 2025 -
ఖరీదైన బైక్ కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట.. ధర ఎన్ని లక్షలంటే?
బుల్లితెరపై తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి విష్ణు ప్రియ. తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో ఫేమస్ అయింది. అంతేకాకుండా తమిళంలోనూ పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్‌తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 11/ఏ ఏటిగట్టు అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.అయితే తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన బీఎండబ్లూ బైక్‌ను కొనేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ బైక్ ధరలు దాదాపు లక్షల్లోనే ఉంటాయి. బీఎండబ్ల్యూ బ్రాండ్‌లో వీటి ప్రారంభ ధరలే దాదాపు రూ.3 లక్షల నుంచి మొదలవుతాయి. విష్ణు ప్రియ కొనుగోలు చేసిన ఈ ఖరీదైన బైక్ ధర దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) -
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆర్జీవి డెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు. -
'స్క్విడ్ గేమ్' నటుడికి శిక్ష విధించిన కోర్టు
'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు 'ఓ యోంగ్ సు'కు న్యాయస్థానంలో శిక్ష పడింది. 90 దేశాల్లో నెం.1గా కొనసాగిన ఈ సిరీస్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా గుర్తింపు ఉంది. 'స్క్విడ్ గేమ్' సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించిన 'ఓ యోంగ్ సు' మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసింది. 2017లో వచ్చిన అభియోగాలు నిజమేనని కోర్టు పేర్కొంది. దీంతో 80 ఏళ్ల ఈ నటుడికి దక్షిణ కొరియా కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.దక్షిణ కొరియాకు చెందిన 'ఓ యోంగ్ సు' కేసు తాజాగా తుది విచారణ జరిగింది. ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ.. నాటక రంగంలో దాదాపు 50 సంవత్సరాలుగా పేరు గడించిన అనుభవజ్ఞుడైన నటుడిగా ఆయన్ను అభివర్ణించారు. కానీ, అతని చర్యలు మాత్రం ఆదర్శవంతంగా లేవని పేర్కొన్నారు. సువాన్ జిల్లా కోర్టు 'ఓ యోంగ్ సు'కు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అలాగే సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది. గతంలో కూడా ఆయనపై మరో లైంగిక వేధింపుల కేసు కూడా ఉన్నట్లు న్యాయస్థానం దృష్టికి వచ్చింది.2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన యోంగ్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఓ సరస్సు దాటేందుకు సహాయం కోసం మాత్రమే ఆ మహిళ చేతిని పట్టుకున్నట్లు యోంగ్ తెలిపాడు. అందుకు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపాడు. కానీ వాస్తవంగా ఆ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పూర్తి ఆధారాలు కోర్టుకు దక్కడంతో ఆయనకు శిక్ష ఖరారు అయింది. -
'లూసిఫర్2' నిర్మాత ఆఫీస్లపై ఈడీ దాడులు.. రూ. 1000 కోట్ల కేసులో
మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత ఆఫీస్‌లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లను తప్పుగా ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఆపై విలన్ పేరును భజరంగిగా పెట్టడం కూడా తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ కూడా రాజ్యసభలో ఈ మూవీపై మాట్లాడారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో నిర్మాతపై ఈడీ దాడులు చేయడం చర్చనియాంశంగా మారింది.లూసిఫర్2 సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన తమిళనాడు, కేరళ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కోడంబాక్కంలోని గోకుల్ చిట్ ఫండ్స్ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి.పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు సుమారు రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాపై వివాదం రావడంతో సుమారు 17 సెన్సార్ కట్స్ చేశారు. దీంతో సినిమా నిడివి సుమారు 5నిమిషాలు తగ్గింది. -
దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్ పంపిన 'రామ్ చరణ్- ఉపాసన'
మార్చి 27న రామ్‌చరణ్ 40వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు ఒక గిఫ్ట్ పంపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తాజాగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారు. చరణ్ పంపిన ఆ కానుక చాలా ప్రత్యేకమైనదని అందులో బుచ్చిబాబు పేర్కొన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో పెద్ది సినిమా తెరకెక్కుతుండటం వల్ల వారిద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగిన విషయం తెలిసిందే.చరణ్- ఉపాసన గిఫ్ట్‌గా దర్శకుడు బుచ్చిబాబుకు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని పంపారు. అందులోనే హనుమంతుడి ప్రతిమ, శ్రీరాముని పాదుకలను కూడా ఆయనకు పంపారు. ఆపై బుచ్చిబాబు గురించి చరణ్ ఒక నోట్ ఇలా రాశారు.'కష్టకాలంలో హనుమాన్ నా వెంటే ఉన్నాడు. జీవితంలో నన్ను ఆయనే గైడ్ చేశాడు. ఇప్పుడు నేను 40వ దశకంలో అడుగుపెడుతున్నాను. ఇన్నేళ్లు నాకు శక్తిని ఇచ్చిన హనుమాను ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా మనసులో నీవు (బుచ్చిబాబు) ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటావు.' అని చరణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బుచ్చిబాబు కూడా చరణ్ దంపతులకు కృతజ్ఞతలు చెప్పాడు. హనుమంతుని ఆశీస్సులు మీకు మరింత బలాన్ని, శక్తిని ప్రసాదించుగాక అని బుచ్చిబాబు ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను బుచ్చిబాబు షేర్ చేశారు.Tqqq very much dear @AlwaysRamCharan Sir nd @upasanakonidela garu for the wonderful gift 🤍 Indebted to ur love nd support 🙏🏼May the blessings of Lord Hanuman be with you nd give more strength nd power to you Sir...Your values r truly inspiring nd always remind us to stay… pic.twitter.com/1pt1k01zkz— BuchiBabuSana (@BuchiBabuSana) April 4, 2025 -
'మ్యాడ్ స్క్వేర్' సెలబ్రేషన్స్ వివరాలు.. బావమరిది కోసం వస్తున్న ఎన్టీఆర్
'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాడ్ గ్యాంగ్ (నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ )తో తారక్ అల్లరి ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో చూడొచ్చు. 2023లో వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగవంశీ సమర్పకులుగా ఉన్నారు.మార్చి 28న విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' కేవలం ఐదురోజుల్లోనే రూ. 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వారంలోపే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి లాభాల బాట పట్టింది. దీంతో అభిమానుల కోసం సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. తన బావమరిది నార్నె నితిన్ 'మ్యాడ్ స్క్వేర్'తో వరుసగా హ్యాట్రిక్ కొట్టడంతో ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారో చూడాలి.ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయింత్రం 6గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ రాత్రి 8గంటలకు అక్కడికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో చిత్ర నిర్మాత నాగవంశీకి మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో 'మ్యాడ్' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన తారక్ ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. -
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్‌లో తెరకెక్కిన 'పెరుసు' (Perusu) సినిమా ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించింది. ఇప్పుడు ఈచిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో నటుడు వైభవ్‌తో(Vaibhav) పాటు సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిహారిక(Niharika NM) కీలక పాత్రలలో మెప్పించారు. ఆపై సునీల్ రెడ్డి, బాల శరవణన్, రెడిన్ కింగ్స్లీ, చాందిని తమిళరసన్ నటించారు. 'టాంటిగో' (శ్రీలంక చిత్రం) ఆధారంగా ‘పెరుసు’ మూవీని దర్శకుడు ఇళంగో రామ్ తెరకెక్కించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, బవేజా స్టూడియోస్, ఎంబర్ లైట్ స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి.మార్చి 14న కోలీవుడ్‌లో మాత్రమే విడుదలైన పెరుసు చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కథ తెగనచ్చేసిందంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెరుసు ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. తమిళ్, తెలుగు, కన్నడ,మలయాళంలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
మాధవన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో శివానీ రాజశేఖర్.. 'జి.డి. నాయుడు'పై సినిమా
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. భారత ప్రముఖ ఇంజనీరు జి.డి. నాయుడు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాజశేఖర్, జీవితల కుమార్తె కూడా నటిస్తున్నారు. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) షార్ట్‌గా జి. డి. నాయుడు అని కూడా అంటారు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రియమణి, జయరాం, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.జీడీ నాయుడు బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ కూడా నటించనుంది. ఇందులో మాధవన్‌తో పాటుగా బిగ్ స్క్రీన్‌పై ఆమె కనిపించనున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుండటంతో ఏర్పాట్లు స్పీడ్‌గా చేస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన జి.డి నాయుడు కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్‌లో కొన్ని పరికరాల ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో విప్లవం సృష్టించారని చెప్పవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించింది ఆయనే కావడం విశేషం. అందుకే ఆయన్ను ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 1893లో జన్మించిన ఆయన 1974లో మరణించారు. ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్‌లో మాధవన్ నటిస్తుండటం విశేషం. మరి... వెండితెరపై మిరాకిల్ మేన్‌గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. -
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
బుల్లితెరపై పలు సీరియల్స్‌లో సందడి చేసిన నందకిషోర్ హీరోగా నటించిన 'నరసింహపురం' చిత్రం తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ సిరి హనుమంతు హీరోయిన్గా నటించింది. శ్రీరాజ్ బళ్లా దర్శకత్వం వహించగా.. టి.ఫణిరాజ్, నందకిషోర్, శ్రీరాజ్ సంయుక్తంగా నిర్మించారు. సిస్టర్ సెంటిమెంట్‌కు రివేంజ్ లవ్ స్టోరీని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.నరసింహపురం సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ మూవీని చూడొచ్చు. ఈ సినిమాలో సిరి చాలా గ్లామర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ తర్వాత ఆమెకు పలు సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కాయి. సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్ కార్యక్రమంలో సిరి పాల్గొనలేదని నందకిషోర్ పలు విమర్శలు చేశారు.సినిమా విడుదల సమయంలో సిరిపై నందకిషోర్ చేసిన కామెంట్స్'తెలుగమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు ఇవ్వడం అరుదనే చెప్పాలి. అలాంటి సమయంలో వైజాగ్ అమ్మాయి సిరి హన్మంత్‌కు కథానాయికగా ఛాన్స్ ఇచ్చారు. మిగతా సినిమాల్లాగా కాకుండా హీరోయిన్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. ఇంత మంచి పాత్రలు తెలుగువాళ్లకు రావు. ఆమెను ప్రమోషన్స్‌కు పిలిచినప్పుడు నేను రాలేను అని చెప్పింది. ట్రైలర్లో తన పాత్ర అసభ్యంగా ఉందని, అది చూసినవాళ్లకు తన మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని తనకు తానే ఊహించుకుంది. దానికి, ప్రమోషన్స్‌కు రాకపోవడానికి సంబంధం ఏంటో నాకర్థం కాలేదు. ఏదేమైనా హీరోయిన్గా సినిమా ప్రమోషన్స్‌కు రావడం తన బాధ్యత. తన పాత్ర గురించి ముందు ఒకలా చెప్పారు కానీ తర్వాత వేరేలా చూపించారని ఆమె ఫీలైంది. కానీ ఒకసారి సిరి సినిమా చూస్తే దర్శకుడు తనను ఎంత బాగా చూపించాడో అర్థం అయ్యేది. నాకు తెలిసి ఆమె ఇప్పటికీ సినిమా చూసి ఉండదు, చూస్తే మాత్రం తన అభిప్రాయం మారొచ్చు' అని నంద కిషోర్ చెప్పుకొచ్చాడు. అయితే, సిరి మాత్రం బదులుగా తన నుంచి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. -
దేశభక్తి చిత్రాలకు కేరాఫ్ 'మనోజ్ కుమార్' ఇకలేరు
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్(87) శుక్రవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలీవుడ్లో ఆయన ఎక్కువగా దేశభక్తి చిత్రాలను తెరకెక్కించడంతో పాటు నటించారు. దీంతో ఆయన్ను అందరూ 'భరత్ కుమార్' అని కూడా పిలుస్తారు. ఉపకార్ (1967), పురబ్ ఔర్ పశ్చిమ్ (1970), క్రాంతి (1981) వంటి క్లాసిక్ సినిమాలను ఆయన అందించారు. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన అపారమైన కృషికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో కేంద్రప్రభుత్వం గౌరవించింది. సినిమాల నుంచి దూరం అయిన తర్వాత రాజకీయంగా ఆయన బీజేపీలో చేరారు. కానీ, ఎలాంటి పదవులు తీసుకోలేదు. మనోజ్ కుమార్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని మోదీ సంతాపంమనోజ్ కుమార్ మృతిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్‌మీడియా ద్వారా సంతాపం తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమలో ఐకాన్‌గా ఉన్న మనోజ్ మరణ వార్త తననెంతో బాధించిందన్నారు. ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ అన్నారు. మనోజ్ రచనలు తరతాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎక్స్ ద్వారా మోదీ సానుభూతి తెలిపారు. -
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్
పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలు కొట్టేశాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి. దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్ కథానాయకుడుగా జవాన్ చిత్రాన్ని చేశారు. ఇందులో నయనతార, దీపిక పడుకొనే హీరోయిన్స్‌గా నటించారు. అయితే, అల్లు అర్జున్‌తో నటించే హీరోయిన్ను కూడా అట్లీ ఫైనల్ చేశారట. ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో నటించడానికి ఆమె రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఆమె గనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవల్‌కు వెళుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్‌ను ఎంపిక చేశారట. భారీ పీరియాడిక్ డ్రామా కథతో రానున్నారట. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్న గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యముందని వైరల్ అవుతుంది. ఆగష్టులో ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభం కావచ్చు. -
ఎలాగా అయిపోయానే... ‘ఓ భామ అయ్యో రామ’ సాంగ్
సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. కాగా ‘ఎలాగుండే వాడ్నే... ఎలాగా అయిపోయానే...’ అంటూ సాగే ఈ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటకు శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా శరత్ సంతోష్ ఆలపించారు. మొయిన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘యూత్‌ఫుల్‌గా సాగే ఈ పాటలో హీరో, హీరోయిన్ ఎనర్జీ ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని హరీష్ నల్ల పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర బాగుంటుంది’’ అని రామ్ గోధల అన్నారు. -
డేట్ ఫిక్స్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల 18న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కల్యాణ్ రామ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ లుక్‌లో కల్యాణ్ రామ్ కనిపిస్తారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది -
సొంత ఊరి జ్ఞాపకాలు గుర్తొస్తాయి: రాజీవ్ కనకాల
రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వంలో నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ నేటి నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సిరీస్ ప్రివ్యూను హైదరాబాద్‌లో ప్రదర్శించారు.ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ‘‘హోమ్ టౌన్’ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సిరీస్ ప్రివ్యూ చూసిన వారిలో కొందరికి తమ సొంత ఊరు, మరికొందరికి తమ గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఈ సిరీస్‌లో పిల్లల అల్లరి చూస్తుంటే 35 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. నవీన్ మేడారంగారు ఈ సిరీస్‌కు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. నాతో కలిసి నటించిన ఝాన్సీగారికి, ఇతర టీమ్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత మా సంస్థలో చేసిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’.‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్‌లో నటించిన ఆ ముగ్గురు పిల్లలు ఓవర్ నైట్ స్టార్స్ ఎలా అయ్యారో, ‘హోం టౌన్’ సిరీస్ స్ట్రీమింగ్ తర్వాత ఈ ముగ్గురు పిల్లలకు కూడా అంతే పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు నవీన్ మేడారం.‘‘సొంతూరుతో ముడిపడిన జ్ఞాపకాలను మర్చిపోలేం. అలాంటి భావోద్వేగాలు ఈ ‘హోమ్ టౌన్’ వెబ్ సిరీస్‌లో ఉంటాయి. సిరీస్‌లోని అందరు వారి బెస్ట్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అవకాశం ఇచ్చిన నిర్మాత నవీన్, ఆహాకు థ్యాంక్స్’’ అని తెలిపారు శ్రీకాంత్‌రెడ్డి పల్లే. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనిరుధ్, అనీ, శ్రావ్య, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడారు. -
త్వరలో చూస్తారు!
‘దసరా’(2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని సంతృప్తిగా లేరని, అదేవిధంగా బడ్జెట్ బాగా పెరిగిపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ గత కొద్దిరోజులుగా ఆన్లైన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్తలపై చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. ‘‘ది ప్యారడైజ్’పై ఎలాంటి అనుమానాలొద్దు. మేము అనుకున్నవిధంగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ మూవీని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నామో త్వరలోనే చూస్తారు. ఆ సమయం వరకు పుకార్లు సృష్టిస్తూ కొందరు బతికేయచ్చు. ఎందుకంటే ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తుంటాయి కదా! మా సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను చాలా దగ్గరగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. ప్రేమ, ద్వేశాన్ని రెండింటినీ తీసుకుని.. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగులో ఉండే గొప్ప చిత్రాల్లో ఒకటిగా ‘ది ప్యారడైజ్’ ఉంటుంది. సినిమాపై పుకార్లు సృష్టిస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలి. అభిమానులంతా గర్వపడే చిత్రంతో నాని మీ ముందుకు వస్తారని మాట ఇస్తున్నాం’’ అని యూనిట్ పోస్ట్ చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమేరా: ఏఓ విష్ణు, సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
అలాంటి ఛాన్స్ వస్తే 'సై' అంటున్న టాలీవుడ్ హీరోయిన్స్
సిల్వర్ స్క్రీన్‌పై అందంగా మెరిసిపోతుంటారు కథానాయిలు. ఫర్ ఎ చేంజ్ డీ గ్లామరస్‌గా కనిపించే అవకాశం వస్తే... ‘సై’ అంటారు. అలాంటి పాత్రలు చేసినప్పుడు దక్కే కిక్కే వేరు అంటున్నారు ఈ భామలు. గ్లామర్.. డీ గ్లామర్... ఏదైనా కొందరు తారలు ప్రస్తుతం అదిరిపోయే లుక్కుల్లో కనిపించడం మాత్రమే కాదు... నటనపరంగానూ విజృంభిస్తున్నారు. అదిరిపోయే లుక్కుల్లో కనిపించనున్న ఆ అందాల భామల గురించి తెలుసుకుందాం.ప్రతీకారంతో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్ అనుష్కా శెట్టి నటించిన తాజా సినిమా ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) మూవీ తర్వాత అనుష్క టాలీవుడ్లో కమిటైన చిత్రమిది. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారట.బిజినెస్ ఉమన్‌గా సత్తా చాటుతున్న ఆమెను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. ఈ కారణంగా వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని టాక్. ఈ చిత్రంలో దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్ని తమిళ నటుడు విక్రమ్ ప్రభు పోషించారు. అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందిన ‘ఘాటీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో సహా పలు భాషల్లో ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్ ఆరంభమైనా చిత్రయూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో విడుదల ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.ఇటు అమ్మోరు తల్లి... అటు రాక్షసి...ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌లా ఉంటారు నయనతార. అలాగే డిఫరెంట్ రోల్స్ చేయడంలోనూ ఆమె ముందుంటారు. నటనలో వైవిధ్యం చూపిస్తుంటారు. ప్రస్తుతం నయనతార తమిళంలో ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. సుందర్.సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపిస్తారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవ్నీ సినీమ్యాక్స్, రౌడీ పిక్చర్స్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రూ. వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ఇటీవల మొదలైంది. ఇక 2020లో నయనతార లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్‌గా ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘రాక్కాయీ’ సినిమాలో తన చిన్నారిని రక్షించేందుకు ఎంతటి సాహసాలనైనా చేసే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార గెటప్ కొత్తగా ఉంటుంది. సెంథిల్ నల్లస్వామి డైరెక్షన్లో డ్రమ్‌స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వెర్స్ ఇండియా సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.నాగ సాధువుగా...ఓ వైపు హీరోయిన్గా, మరో వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు ప్రత్యేక పాటల్లో సందడి చేస్తున్నారు తమన్నా. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజయే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరించారు. తొలి భాగంలో జోడీగా నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా మలిభాగంలోనూ నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటించారు తమన్నా. ఓదెల గ్రామానికి ఊహించని కష్టం వస్తుంది. ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న స్వామి నాగ సాధు (తమన్నా) పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. పైగా ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సూపర్ హిట్ కావడంతో ‘ఓదెల 2’పై భారీ అంచనాలున్నాయి. రివాల్వర్ పట్టిన రీటా...‘నేను శైలజ’ (2016) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు కీర్తి. ఆమె టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రెడిన్ కింగ్సీ కీలక పాత్రలు పోషించారు.ప్యాషన్ స్టూడియోస్ అండ్ ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనీస్వామి నిర్మించారు. కామెడీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సాధారణ జీవితం గడుపుతున్న ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రీటా అనుకోని పరిస్థితుల్లో తుపాకీ చేతపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను హాస్య మూవీస్ అధినేత, నిర్మాత రాజేశ్ దండా సొంతం చేసుకున్నారు.డీ గ్లామరస్‌గా బుట్టబొమ్మ... తెలుగు తెరపై బుట్టబొమ్మలా పూజా హెగ్డే ఎంతో అందంగా కనిపించారు. ఎన్నో గ్లామరస్ రోల్స్ కూడా చేశారు. కానీ రొటీన్‌కి డిఫరెంట్‌గా పూజా హెగ్డే తొలిసారిగా ఓ డీ గ్లామరస్ రోల్ చేశారు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘రెట్రో’. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ ‘రెట్రో’ మూవీలోనే పూజా హెగ్డే డీ గ్లామరస్ రోల్ చేశారు. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ‘రెట్రో’ మే1న విడుదల కానుంది. ఇంకా రాఘవా లారెన్స్ సక్సెస్ఫుల్ హారర్ ఫ్రాంచైజీ ‘కాంచన’ లేటెస్ట్ మూవీ ‘కాంచన 5’లో పూజా హెగ్డే ఘోస్ట్ రోల్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే... పూజాకు ఈ రోల్, గెటప్ కూడా సరికొత్తదే.సీతగా సాయిపల్లవి... పల్లెటూరి అమ్మాయిలా, స్టూడెంట్‌లా... ఇలా హీరోయిన్ సాయిపల్లవి ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు చేశారు. కానీ ఇప్పటివరకు ‘రామాయణం, మహాభారతం’ వంటి ఇతిహాసాల నేపథ్యంలో రూపొందిన సినిమాల్లో సాయి పల్లవి స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే సీతగా సాయిపల్లవి ఎంత అద్భుతంగా వెండితెరపై మెరిసిపోతారో, వచ్చే ఏడాది దీపావళికి సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ’ మూవీ తీస్తున్నారు.ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవిదుబే, హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని సమాచారం. నితీష్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా రిలీజ్ కానున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలీవుడ్లో సాయిపల్లవి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే హిందీలో సాయి పల్లవి ‘ఏక్ దిన్’ అనే లవ్‌స్టోరీ మూవీ కూడా చేశారు. ఆమిర్ ఖాన్ తనయుడు జూనైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.మహిళల చుట్టూ పరదా...అనుపమా పరమేశ్వరన్ కూడా జోరుమీదున్నారు. అటు హీరోయిన్గా, ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. తాజాగా ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. దర్శనా రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియాపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. వైవిధ్యమైన సోషియో డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో సుబ్బు పాత్రలో నటించారు అనుపమ. ఆమె పుట్టినరోజు (ఫిబ్రవరి 18) సందర్భంగా చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. ‘పరదాలమ్మా పరదాలు... రంగురంగుల పరదాలు... డిజైనర్ పరదాలు.... తీసుకోవాలమ్మా తీసుకోవాలి’ అంటూ అనుపమ చెప్పే డైలాగులకి మంచి స్పందన వచ్చింది. మహిళల చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేటిని ప్రకటించనున్నారు మేకర్స్. స్వారీకి సై...‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు సంయుక్త. ఆ తర్వాత ‘బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. ప్రస్తుతం తెలుగులోనూ చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. ‘స్వయంభూ, నారి నారి నడుమ మురారి, హైందవ, అఖండ 2: తాండవం’ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారామె. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారు.ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఈ మూవీలో సంయుక్త కూడా పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉందట. ఈ స్టంట్స్ చేయడానికి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు సంయుక్త. మరి.. ఆమె పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. ఇదిలా ఉంటే... సంయుక్త టిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మోహన్‌లాల్ హీరోగా రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్త. యువరాణి పంచమి‘సవ్యసాచి’ (2018) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిధీ అగర్వాల్. ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్పై ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ మూవీ మే 9న విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిన ‘హరి హర వీరమల్లు’లో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా.. పంచమి అనే యువరాణి పాత్రలో నిధీ అగర్వాల్ సరికొత్తగా కనిపించనున్నారు. ఆమె పాత్రకు చాలాప్రాధాన్యం ఉంటుందట. ఈ కథానాయికలే కాదు... ఇంకొందరు కూడా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి, మెప్పించనున్నారు. -
పొట్టి గౌనులో సుప్రీత హోయలు.. బ్లూ శారీలో అనసూయ అందాలు!
పొట్టి గౌనులో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..కామాఖ్య ఆలయంలో సంయుక్త మీనన్ పూజలు..ఫ్యాషన్ షోలో మెరిసిన అత్తారింటికి దారేది హీరోయిన్..బ్లూ శారీలో అనసూయ బ్యూటీఫుల్ లుక్స్..రాబిన్‌హుడ్ హీరోయిన్ శ్రీలీల క్యూట్ పిక్స్.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
హృదయాలను హత్తుకునేలా ‘‘అనగా అనగా కథలా’ పాట
సత్య రాజ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న భారీ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. ఈ మూవీకి దర్శకుడు మోహన్ శ్రీవత్స. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్లు అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా మరో ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.అనగా అనగా కథలా అంటూ సాగే ఈ పాటను టీకేఆర్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో బుధవారం నాడు కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ పాటను కార్తిక్ ఆలపించారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన హృద్యమైన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక సనరే రాసిన సాహిత్యంతో తాతయ్య అనే ఎమోషన్, మనవరాలితో తాతయ్యకు ఉండే అనుబంధాన్ని చక్కగా వివరించారు.పాటను రిలీజ్ సందర్భంగా సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘టీకేఆర్ కాలేజ్‌లోని విద్యార్థుల ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇలా పద్నాలుగు వేల మంది విద్యార్థుల సమక్షంలో పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా పాటను విడుదల చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి.. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన హరనాథ్ రెడ్డి గారికి, అమర్ నాథ్ రెడ్డి గారికి థాంక్స్. త్రిబాణధారి బార్భరిక్ చిత్రంలోని 'అనగా అనగా కథలా' పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో సత్య రాజ్ గారు అవ్వడం నా అదృష్టం. 170 చిత్రాల్లో హీరోగా చేసిన సత్య రాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రంలోని పాటను ఈ కాలేజీలో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పాటను విడుదల చేసేందుకు సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి థాంక్స్. మా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు. -
‘డియర్ ఉమ’ వచ్చేస్తోంది
ప్రస్తుతం ప్రేక్షకులు సాధారణ ఫార్మాట్లో వచ్చే చిత్రాల కంటే విభిన్న కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో రూపొందిన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే, వినూత్నమైన కథాంశంతో ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్గా నటించడమే కాకుండా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుముఖ ప్రతిభ కలిగిన సుమయ రెడ్డి, సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు.నిర్మాణ బాధ్యతలను సుమయ రెడ్డి నిర్వహించగా, నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు రాసి, దర్శకత్వం వహించారు. అనేక విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రదన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ఇప్పటివరకూ ‘డియర్ ఉమ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. వీటిని బట్టి చూస్తే, ఇది ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. ఈ ప్రేమకథను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ అందమైన సందేశంతో పాటు అధిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తయారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. -
ఐకాన్ స్టార్ వారసుడి బర్త్ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్‌తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025 -
తమన్నాలా నేనెప్పుడు చేయలేదు: హెబ్బా పటేల్
‘ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైం లో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు’ అని హెబ్బా పటేల్(Hebah Patel) అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఓదెల 2 (Odela 2 Movie) సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 చాలా పెద్ద సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.⇢ ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్ లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్ లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ⇢ తమన్నా గారు ప్రతి క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. ఓదెల2 కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు. తమన్నా గారిలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు. ఫ్యూచర్లో అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను.⇢ సంపత్ గారు విజనరీ ఫిలిం మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సంపత్ గారు చాలా నైస్, కైండ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.⇢ కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.⇢ అజినీస్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. ఆయన మ్యూజిక్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. బ్యాగ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ కి కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ⇢ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తానని నమ్మకం ఉంది.⇢ ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది. -
ఓటీటీ ఆఫర్స్ రాలేదు..ఇది అది మార్చు అని ఇబ్బంది పెట్టారు: నవీన్ చంద్ర
ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు తప్పవు. ఆరేళ్ల క్రితం నా సినిమాలు సరిగా ఆడకపోవడం వల్ల అప్పుడు నటించిన ‘28°C’ మూవీకి బిజినెస్ జరగలేదు. ప్పటికి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇంతగా లేవు. ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు.పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు "28°C" సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. "28°C" థియేటర్ లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు యంగ్ హీరో నవీన్ చంద్ర అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్‌చంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికి నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. "28°C" సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.→ "28°C" సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం కానీ ఆ టైమ్ లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్ గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.→ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్ గా మలిచారు మా డైరక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్ గా రాశారు.→ కోవిడ్ తర్వాత థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ ఎక్కువయ్యాయి. మూవీస్ లో హింస పెరిగింది. సొసైటీలో కూడా హింస పెరిగింది. ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినిమాల్లోనూ అలాంటి క్రైమ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను హీరోగా చేసే సినిమాలకు ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నాను. క్యారెక్టర్స్ చేస్తే అది లైఫ్ లీడ్ చేయడానికి, కొంత డబ్బు సంపాదించడానికి, నా క్రాఫ్ట్ ను కెరీర్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నా.→ అరవింద సమేత వీర రాఘవలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి పేరొచ్చింది. నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రంలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. గేమ్ ఛేంజర్ లో ఉండిపోవడం వల్ల సూర్య రెట్రో మూవీలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం మిస్ అయ్యింది. ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో షో టైమ్ తో పాటు 11 అనే మరో మూవీ ఉంది. నాకు బాగా పేరు తెచ్చిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. -
దేవసేన తొలి పుట్టినరోజు.. మంచు మనోజ్ దంపతుల ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లాడారు. 2023లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్లే మంచు మనోజ్ ఆమెను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది ఈ జంట ముద్దుల కూతురిని తమ జీవితంలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తమ గారాలపట్టికి దేవసేన శోభ అని శోభనాగిరెడ్డి పేరు కలిసేలా నామకరణం చేశారు. ఈ జంటకు ఏప్రిల్ 2, 2024లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇవాళ తమ కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ సైతం చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. తనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.ఇక మనోజ్, మౌనిక దంపతులు తమ ముద్దుల కూతురి దేవసేన తొలి పుట్టినరోజు ఫోటోలను షేర్ చేశారు. ఓ పురాతన కట్టడంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ కూతురిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక తిరుగులేని బంధం. ఈ నాలుగు పిల్లర్స్ ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు అనంతమైన ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నికు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం.' అంటూ కూతురిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మనోజ్ దంపతుల ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
ట్రైలర్లో ఎక్కువగా బూతులు.. అందుకే వాడాల్సి వచ్చింది: సిద్ధు జొన్నలగడ్డ
డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. గతేడాది టిల్లు స్క్వేర్తో మరో అభిమానులను మెప్పించిన సిద్ధు సినిమాతో అలరించేందుకు రెడీ అయిపోయాడు. సిద్ధు- బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న సరికొత్త యాక్షన్ మూవీ జాక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరో సిద్ధు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే జాక్ ట్రైలర్లో ఎక్కువగా బూతు పదాలు ఉపయోగించడంపై సిద్ధును ప్రశ్నించారు.అవును.. బూతులు వాడాం.. కానీ అక్కడ సీన్‌కు తగినట్లుగానే పెట్టాల్సి వచ్చిందని సిద్ధు అన్నారు. ఈ విషయంలో హీరో క్యారెక్టర్‌కు.. ఆ సమయంలో ఎమోషన్‌కి ఆ డైలాగ్స్ పెట్టామని తెలిపారు. పీక్ క్లైమాక్స్ కావడంతో ఆ ఎమోషన్‌కు అది కరెక్ట్ అని అలా చేసినట్లు సిద్ధు వెల్లడించారు. అలాగే మీ మూవీ సెన్సార్ పూర్తయిందా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు ఇంకా తెలియదని బదులిచ్చారు.కాగా.. ఈ చిత్రంలో సిద్ధు సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
బుల్లితెరపై యాంకర్‌గా క్రేజ్ దక్కించుకున్న టాలీవుడ్ నటుడు ప్రదీప్ మాచిరాజు. పలు రియాలిటీ షోలకు యాంకర్‌గా పనిచేశారు. అలా యాంకరింగ్‌తో ఫేమస్ అయిన ప్రదీప్ పలు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆయనే హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. ఈ సినిమకు నితిన్- భరత్ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రదీప్. ఇటీవలే ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్వరలోనే ఓ రాజకీయ నాయకురాలితో మీ పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పుకుండా పెళ్లి అయితే చేసుకుంటానని అన్నారు.తన పెళ్లి గురించి ప్రదీప్ మాట్లాడుతూ.. 'నా పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు. ముందు జీవితంలో సెటిల్ కావాలనుకున్నా. నాకు సొంతంగా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ముందు వాటిని సాధించడమే నా లక్ష్యం. అవీ ఆలస్యం కావడంతోనే మిగిలిన పనులు కూడా వాయిదా పడుతున్నాయి. అన్నీ కూడా సరైన టైమ్‌కే పూర్తి అవుతాయని నమ్ముతున్నా. రాజకీయ నాయకురాలితో తన పెళ్లి అని వస్తున్న వార్తలు నేనూ విన్నా.. అంతకుముందే రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి అన్నారు.. త్వరలో క్రికెటర్‌తో పెళ్లి అంటారేమో. అన్నీ సరదా కోసమే చేస్తున్న ప్రచారం' అంటూ నవ్వుతూ మాట్లాడారు. కాగా.. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న విడుదల కానుంది. -
'హారర్' సినిమా సూపర్‌హిట్.. పార్ట్-3 కోసం లైన్ క్లియర్
కోలీవుడ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తీకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం 'డీమాంటీ కాలనీ'(Demonte Colony). తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది. అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హారర్ కథా చిత్రం 2015లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అజయ్ జ్ఞానముత్తు 9 ఏళ్ల తర్వాత డీమాంటీ కాలనీకి సీక్వెల్ చేశారు. ఇందులోనూ నటుడు అరుళ్ నిధినే కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి ప్రియా భవానీ శంకర్ నటించారు. అరుణ్ పాండ్యన్, నటి మీనాక్షి గోవింరాజన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పార్టు 1 కంటే మరింత భారీ బడ్జెట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది తెరపైకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది.కాగా ఈ చిత్రానికి పార్టు -3 ఉంటుందని చివరిలో లీడ్ ఇచ్చారు. దీంతో డీమాంటీ కాలనీ సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం డిమాంటీ కాలనీ –3 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించి చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులోనూ అరుళ్ నిధినే హీరోగా నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
'జాక్' నుంచి బ్లాక్‌బస్టర్ ట్రైలర్.. సిద్ధూ ఇరగదీశాడు
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కొత్త సినిమా 'జాక్' (Jack) ట్రైలర్ వచ్చేసింది. ఇందులో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకానే అనిపించేలా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్ వాయిస్‌తో ప్రారంభమైన ‘జాక్’ ట్రైలర్‌ను చూస్తే పూర్తి వినోదాత్మక చిత్రంలా ఉంది. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. -
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్ అవుతున్నాయి.పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్‌గా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు. He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister. - @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025 -
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి సరదాగా నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్స్ నితిన్–భరత్ చెప్పారు. ప్రదీప్ మాచిరాజు(pradeep Machiraju), దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్– మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నితిన్, భరత్ మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి ఫస్ట్ సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. అప్పుడే ఆయనతో సినిమా తీయాలనుకున్నాం. అలా మేం చెప్పిన కథ ప్రదీప్‌కి నచ్చడంతో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఆరంభమైంది. ఇది పవన్ కల్యాణ్ గారి సినిమా టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుందని అనుకున్నాం. అలాగే కాన్సెప్ట్ కూడా టైటిల్‌కి యాప్ట్‌గా ఉండడం వల్లే పవన్ కల్యాణ్ గారి టైటిల్ తీసుకోవడం జరిగింది. రొమాంటిక్ ఎంటర్టైనర్లా రూపొందిన ఈ సినిమాలో వినోదం సందర్భానుసారంగా, ఆర్గానిక్‌గా ఉంటుంది. తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుని, ఆడిషన్స్ చేసి, దీపికని తీసుకున్నాం. ప్రదీప్‌గారి ఫ్రెండ్స్ ఈ మూవీ నిర్మించారు. రథన్గారి అద్భుతమైన సంగీతం, బాల్ రెడ్డిగారి విజువల్స్ ఆకట్టుకుంటాయి. మా సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కి నచ్చడంతో విడుదల చేస్తున్నారు’’ అన్నారు. -
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు
‘‘34 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఆదిత్య 369’ (Aditya 369 Movie) రీ రిలీజ్ కావడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి రీ రిలీజ్ చేస్తుంటే... ప్రేక్షకులకే కాదు.. నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్’’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa) పేర్కొన్నారు. బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ సీక్వెల్‌కి కథ సిద్ధం చేశాం. ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు. కానీ, ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని అంటుంటారు. అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం. ఇక నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్. జి. వెల్స్ రచించిన ‘ది టైమ్ మిషన్’ నవల ఆధారంగా ‘ఆదిత్య 369’ తీశాను. ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా. పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్.. ఇలా ముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం. పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్‌ని, టైమ్ మెషిన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని తెలిపారు. -
తల్లిదండ్రులైన కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, సంగీత
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ, నటి సంగీత దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. గురువారం తెల్లవారుజామున చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో సంగీత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. లేటు వయసులో 2023 డిసెంబర్ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇప్పుడు తమకు కుమార్తె జన్మించినట్లు సోషల్‌మీడియా ద్వారా నటి సంగీత తెలిపింది. దీంతో వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.రెడిన్ కింగ్స్లీ, నటి సంగీత దంపతులకు కుమార్తె జన్మించడంతో వారి కుటుంబంలో మరింత సంతోషం నెలకొంది. ఈ క్రమంలో ఆమె ఒక పోస్ట్ షేర్ చేసింది. 'మా లిటిల్ ప్రిన్సెస్‌ను అందరూ ఆశీర్వదించాలని సంగీత కోరింది. మా జీవితంలో అద్బుతమైన కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో మీరందరూ నన్ను ఎంతగానో ప్రేమించారు. ఈ శుభవార్తతో మా ఫ్యామిలీ ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇంతకు మించిన మధురమైన క్షణాలు ఏవీ ఉండవు అనుకుంటున్నాను.' అని సంగీత తెలిపింది.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమాతో రెడిన్ కింగ్స్లీ బాగా పాపులర్ అయ్యాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.సంగీతకు రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై ఆ సమయంలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by Sangeetha.V🦋 (@sangeetha.v.official) -
ఇంటిమేట్ సీన్లో అతడు హద్దుమీరాడు: పోటుగాటు హీరోయిన్
బాలీవుడ్ నటి అనుప్రియా గోయెంకా(Anupriya Goenka) ఒక ముద్దు సీన్లో చాలా ఇబ్బంది పడ్డానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగులో పోటుగాడు, పాఠశాల సినిమాలతో తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టైగర్ 3, పద్మావత్ వంటి సినిమాలతో పాటు పాంచాలి, అసుర్, ఆశ్రమ్ వంటి వెబ్ సిరీస్‌లతో ఆమె మెప్పించింది. కథకు అవసరం అనుకుంటే ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు ఆమె ఏమాత్రం తగ్గదు. అయితే, ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక నటుడు తనతో కావాలనే అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ఆ నటుడి వివరాలను గోప్యంగానే ఉంచిన ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఒక సినిమాకు సంబంధించి ముద్దు సీన్‌ను షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సీన్లో నా దుస్తులు అసౌకర్యంగానే ఉంటాయి. కిస్సింగ్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు అతను తేలికగా నా నడుము పట్టుకోవచ్చు.. స్క్రిప్ట్‌లో కూడా అదే ఉంది. కానీ, ఆ సమయంలో అతను అసభ్యకరంగా మరోచోట చెయి వేశాడు. దీంతో చాలా బాధపడ్డాను. అలా ఎందుకు చేస్తున్నావ్ అని అతన్ని ప్రశ్నించవచ్చు.. కానీ, అడగలేదు. ఎందుకంటే పొరపాటు అయిందని సింపుల్‌గా చెప్పి వెళ్లిపోతాడని తెలుసు. అందుకే అడగలేదు. తర్వాతి టేక్‌లో ఇలా చేయకండి అంటూ అతనికి చెప్పాను. ఆ సీన్ తీస్తున్నప్పుడు అతను చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. నేనే కంట్రోల్ చేశాను. నాకు రెండుసార్లు ఇలా జరిగింది.' అని అనుప్రియా గోయెంకా చెప్పింది. 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' టెలివిజన్ సిరీస్ గురించి ఆమె మట్లాడినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. తాను ఒక సినిమా షూటింగ్ కారవాన్‌లో డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఒక డైరెక్టర్ లోపలికి వచ్చేశాడని తెలిపింది. అనుమతి లేకుండా రావడంతో అతనిపై మండిపడినట్లు కూడా ఆమె పేర్కొంది. సౌత్ దర్శకుడు అని క్లూ ఇచ్చిన ఈ బ్యూటీ కూడా అతని పేరు చెప్పలేదు. -
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
టాలీవుడ్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ సినిమా 'ది ప్యారడైజ్'(The Paradise ).. పోస్టర్‌తో పాన్ ఇండియా రేంజ్లో సినీ ప్రేక్షకులను మెప్పించిన ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓటీటీ ఢీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. కేవలం గ్లింప్స్‌తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని, కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు వైరల్ అయింది. ఆపై బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోవడం వల్ల ఈ సినిమాను ఆపేస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై చిత్ర యూనిట్ గట్టిగానే రియాక్ట్ అయింది.సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు రూమర్స్ వైరల్ చేసేవారిని జోకర్స్‌తో పోలుస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'ది ప్యారడైజ్ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అనుమానాలు వద్దు. మేము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నాం. దానిని మీరందరూ కూడా త్వరలో చూస్తారు. ఆ సమయం వరకు రూమర్స్‌తో కొందరు బతికేయవచ్చు. 'గజరాజు నడుస్తూ ఉంటే..గజ్జి కుక్కలు అరుస్తాయి'. ది ప్యారడైజ్ సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను మేము చాలా దగ్గరగా చూస్తునే ఉన్నాం. ఆపై ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. మేము ప్రేమ, ద్వేశాన్ని రెండూ తీసుకుంటాము. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగు పరిశ్రమలో ఉండే గొప్ప చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ ఉంటుంది. సినిమాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.. ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్యారడైజ్ సినిమాతో నాని తిరిగొస్తాడని మాట ఇస్తున్నాం.' అని ఒక చిత్ర యూనిట్ ఒక పోస్ట్ చేసింది.హిట్ 3 టీజర్లో మోస్ట్ వయోలెంట్ ఆఫీసర్‌గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్లో ది ప్యారడైజ్‌లో కనిపంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వచ్చే సంవత్సరం మార్చి 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో ది ప్యారడైజ్ విడుదల కానుంది. To all 🤡s out there, you feed on us... because we let you do so.#TheParadise is rising in all its glory. Rest assured, it is on the right track. And you all will witness it soon.Meanwhile, keep feeding on us as much as you can. Because...'Gajaraju nadiste..Gajji kukkalu…— THE PARADISE (@TheParadiseOffl) April 2, 2025 -
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
సాధారణంగా సినీ కుటుంబాలకు చెందిన వారసులు చిత్ర పరిశ్రమంలోనే పనిచేయాలని కోరుకుంటుంటారు. ముందు వేరే వృత్తులకు సంబంధించిన చదువులను అభ్యసించినప్పటికీ చివరికి వారి పయనం మాత్రం సినిమానే అవుతుంది. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. కాగా కోలీవుడ్‌లో ప్రముఖ సినిమా జంటల్లో దర్శకుడు సుందర్ సి, నటి, నిర్మాత కుష్బూల జంట ఒకటి. వృత్తిపరంగా విజయ పథంలో దూసుకుపోతున్న ఈ జంట 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ముచ్చటైన జంటకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు అందమైన కూతుర్లు ఉన్నారు. వీరి పేరుతోనే అవ్నీ సినీ మ్యాక్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా విత్తనం ఒకటైతే మొక్క మరొకటి అవుతుందా? అనే సామెత మాదరి దర్శకుడు సుందర్ సి, నటి కుష్బూ వారసులు కూడా వారి బాటలోనే నడుస్తారనిపిస్తోంది. ఎందుకంటే సుందర్ సి, కుష్బూ దంపతుల కుమార్తెలు అవంతిక, ఆనందిత ఇప్పుడు చదువులు పూర్తి చేసుకున్నారు. వీరిలో అవంతిక అచ్చు తన తల్లి కుష్బూ రూపురేఖలనే కలిగి ఉండడంలో అతిశయోక్తి కాదు.. అవంతికను చూస్తుంటే చిన్ననాటి కుష్బూనే స్మరణకు వస్తారు. అవంతిక తాజాగా ప్రత్యేకంగా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఎంతో గ్లామర్‌గా ఉన్న ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తెరపైకి కుష్బూ వారసురాలు రెడీ అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తండ్రి ప్రముఖ దర్శకుడు. తల్లి సంచలన నటి, నిర్మాత. వారికి తోడు సమ్మోహన రూపంతో కనిపించే అవంతికకు కథానాయకి కావడానికి ఇంతకంటే మరేం కావాలి. హీరోయిన్గా ఈ క్యూట్ గర్ల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by avantika (@avantikasundar) -
చిరంజీవి సినిమాలో అతిథి?
చిరంజీవి, వెంకటేశ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే... అవుననే సమాధానమే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ఈ సినిమాలోని అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
‘‘సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి? అనే అంశంపై తీసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. కథ రాసినప్పుడు నేను ఊహించనదానికంటే సినిమాను బాగా తీశాడు దర్శకుడు గిరికృష్ణ కమల్. ఈ సినిమా సబ్జెక్ట్‌ను చర్చిస్తున్నప్పుడు, అతని ఆలోచనలు నచ్చి, ‘శారీ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించాను’’ అని దర్శక–నిర్మాత–రచయిత రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘శారీ’. గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ పతాకాలపై రవిశంకర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ– ‘‘సత్య, ఆరాధ్య... ఇలా ప్రధానంగా రెండు పాత్రలతో సాగే ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఇది నాకో డ్రీమ్ ప్రాజెక్ట్’’ అని పేర్కొన్నారు ఆరాధ్య దేవి. ‘‘ఈ మూవీలో ఉన్నవి తక్కువ పాత్రలే అయినా, అవి ఎఫెక్టివ్‌గా ఉంటాయి’’ అని తెలిపారు సత్య యాదు. ‘‘గులాబి’ సినిమా నుంచి రామ్‌గోపాల్ వర్మతో వర్క్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఏ మూవీ కోసం పిలిచినా రెడీగా ఉంటాను’’ అని చె΄్పారు ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్. -
పాముతో సీన్స్ చేయడానికి భయపడ్డాను
హీరోయిన్ కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో, మహేశ్ శ్రీరామ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫణి’. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, ఏయూ అండ్ ఐ స్టూడియోల సమర్పణలో డా. మీనాక్షి అనిపిండి ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రెస్‌మీట్‌కు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై, ‘ఫణి’ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వీఎన్ ఆదిత్య కొత్త వాళ్లతోనూ సినిమా చేయగలడు, స్టార్స్‌తోనూ సినిమా చేయగలడు. ‘ఫణి’ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘నాకు పాములంటే భయం. దీంతో పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని ఆదిత్యగారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అయితే షూటింగ్ చివర్లో పాము కాంబినేషన్లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ పూర్తయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. మేలో మా ‘ఫణి’ మూవీని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు కేథరిన్. ‘‘యూఎస్ వెళ్లినప్పుడు నా సోదరి మీనాక్షి–బావ శాస్త్రిగారి ఇంట్లో ఉంటాను. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తామన్నప్పుడు నాకు భయం వేసింది. ‘ఫణి’ చిత్రాన్ని చిన్నగా మొదలు పెట్టాం. ఆ తర్వాత కేథరిన్గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది’’ అన్నారు వీఎన్ ఆదిత్య. ‘‘ఫణి’ మూవీతో కేథరిన్గారికి జాతీయ అవార్డు వస్తుంది’’ అని తెలిపారు నిర్మాత, సంగీత దర్శకురాలు డా. మీనాక్షి అనిపిండి. ‘‘హాలీవుడ్లో మోడలింగ్, మూవీస్ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించడంతో సొంత ఇంటికి వచ్చినట్లుంది’’ అన్నారు మహేశ్ శ్రీరామ్. ఈ చిత్రసమర్పకుడు పద్మనాభరెడ్డి, సహ–నిర్మాత శాస్త్రి అనిపిండి, రైటర్ పద్మ, నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. -
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్‌సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
హెచ్‌సీయూ వివాదంపై టాలీవుడ్ సినీతారలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రేణూ దేశాయ్, రష్మిక మందన్నా, నాగ్ అశ్విన్, సమంత కూడా స్పందించారు. దాదాపు 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలానికి పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది .యాంకర్ రష్మీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోను ఎలాంటి రాజకీయాల కోసం చేయటం లేదు. ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి విరుద్ధంగా పోస్ట్ చేయడం లేదు. హెచ్‌సీయూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. నేను చాలా సౌకర్యంగా అపార్ట్మెంట్లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను. గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగించారో నాకు కూడా తెలుసు' అని అన్నారు. 'కానీ ప్రస్తుతం హెచ్‌సీయూలో జరుగుతున్న అభివృద్ధి వల్ల నెమళ్లు, వేల పక్షులు సఫర్ అవుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన వీడియో చూసిన తర్వాత పక్షులు, జంతువులను వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రస్తుత వేసవికాలం అందులో పక్షులు, నెమళ్లు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఆ పశు, పక్షులను దృష్టిలో ఉంచుకుని పునరావాసం కల్పించండి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
గోల్ఫ్ ఆడుతూ చిల్ అవుతున్న ఐశ్వర్యా రాజేశ్హాట్ నెస్ తో కాక రేపుతున్న దిశా పటానీవిచిత్రమైన డ్రస్సులో ప్రియమణి పోజులు50 ఏళ్లకు దగ్గరవుతున్న వన్నె తగ్గని జ్యోతికవింత వేషధారణలో బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్చీరలో నాభి అందాలు చూపించేస్తున్న రీతూ చౌదరిబీచ్ రిసార్ట్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అను ఇమ్మన్యుయేల్ View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో 400 ఎకరాల భూ వివాదంపై స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna ) స్పందించారు. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "రాత్రికి రాత్రే బుల్డోజర్లు. విద్యార్థుల అరెస్టులు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో నిజంగా ఏమి జరుగుతోంది?" అంటూ ఆమె ప్రశ్నించారు.ఈ వివాదం గత కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చింది. విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మాణం కోసం వేలం వేయాలని ప్రతిపాదించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాజాగా రాజకీయ పార్టీలు తోడవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. (చదవండి: హార్డ్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!)400 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లను నరికివేయడంతో, ఆ అడవిపై ఆధారపడిన మూగజీవుల జీవనాధారం కోల్పోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, జీవవైవిధ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిరసనకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా మద్దతు ఇస్త్ననారు. స్టార్ హీరోయిన్ సమంత, నాగ్ అశ్విన్, నటి రేణూ దేశాయ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. -
కిడ్నాప్ చేసి నిన్ను ముంబై తీసుకెళ్లిపోతా: మంచు లక్ష్మీ
మంచు కుటుంబంలో మనోజ్, విష్ణు.. హైదరాబాద్ లో ఉంటున్నారు. కానీ మంచు లక్ష్మీ మాత్రం ముంబైలో ఉంటోంది. రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ గొడవల్లోనూ ఈమె ఎక్కడా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇన్ స్టాలో మనోజ్ కూతురు గురించి లక్ష్మీ క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది.మనోజ్ కూతురిని తెగ ముద్దు చేసేస్తున్న మంచు లక్ష్మీ.. చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమనంతా బయటపెట్టింది. 'నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. పని కూడా ఉంది. కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన. నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను. రోజంతా నీతోనే గడిపాను. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్.'(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)'మనిద్దరి మధ్య మంచి అనుబంధముంది. మాటల్లో అది చెప్పలేను. నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తని. నీ తొలి పుట్టినరోజున చాలా చెప్పాలని ఉంది. కానీ నువ్వు ఆనందంగా ఎదగాలి. నీ ప్రపంచం అందంగా ఉండాలి. నువ్వు మా ఇంటి రాణివి. నిన్ను తర్వలో కిడ్నాప్ చేసి ముంబై తీసుకెళ్లిపోతా (నవ్వుతూ). ఈ డైమండ్ ని నాకు ఇచ్చినందుకు మనోజ్-మౌనికకు థ్యాంక్యూ' అని మంచు లక్ష్మీ రాసుకొచ్చింది.మనోజ్, అతడి కూతురు దేవసేనతో మంచు లక్ష్మీ బాండింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. కానీ కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు.. ఇప్పుడు మనోజ్ కూతురు గురించి లక్ష్మీ పోస్ట్ పెట్టడం చూస్తుంటే మోహన్ బాబు-విష్ణు ఒకవైపు.. మనోజ్-లక్ష్మీ ఒకవైపు ఉన్నట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనలకు దిగడం..వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడంతొ ఈ వివాదం ఇంకాస్త పెద్దదైంది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదంతా పక్కకి పెడితే ప్రకృతి ప్రేమికులు మాత్రం 400 ఎకరాల్లో ఉన్న చెట్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు.(చదవండి: 'రేపోమాపో నేను చనిపోతాను.. తల్లిగా అడుక్కుంటున్నా..', 'మూగజీవాల్ని ఏం చేస్తారు?')సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రేణు దేశాయ్, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, యాంకర్ రష్మి తదితరులు ఈ వివాదంపై స్పందిస్తూ.. చెట్లను, జంతువులను కాపాడుకోవాలని కోరారు. ఇక తాజాగా ప్రముఖ హీరోయిన్ సమంత, యాంకర్, నటి అనసూయ సైతం ఈ వివాదంపై స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల కథనంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలంగాణ టుడేలో వచ్చిన ఆర్టికల్‌ని పోస్ట్ చేసిన సమంత..బులడోజర్స్ తో 400ఎకరాల్లో చెట్లను నరకటం చాలా బాధగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయని.. అడవుల్ని నరుక్కుంటూ పోతే.. ఇప్పటికే ఉన్న దానికంటే.. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అటవీ జంతువులు, పక్షులను కాపాడండి అని నినాదం ఇచ్చింది.ఇక సోషల్ మీడియా సంచలనం అనసూయ సైతం ఈ వివాదంపై ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. హెచ్‌సీయూ క్యాంపస్‌లోని రాత్రి పూట వీడియోలు, జింకలు, ఇతర మూగజీవాలు సేద తీరుతున్న వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ..ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ రాసుకొచ్చింది. -
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్.. ఇప్పుడు హీరోగా మరో మూవీ ఓకే చేశారు. 'కమిటీ కుర్రాళ్లు' మూవీతో నిర్మాతగా తొలి హిట్ అందుకున్న నిహారిక.. ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించింది. మానస శర్మ అనే కొత్తమ్మాయిని దర్శకురాలిగా పరిచయం చేస్తోంది. గతంలో ఈమె.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీసులకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు సినిమాకు డైరెక్షన్ వహించబోతుంది. ఇదివరకే నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ లో సంగీత్ శోభన్ నటించాడు. దానికే మానస శర్మ కూడా పనిచేసింది. అప్పుడు ఓటీటీ సిరీస్ కోసం పనిచేసిన ఈ ముగ్గురు.. ఇప్పుడు సినిమా కోసం ఒక్కటయ్యారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాదే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) -
హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి గిఫ్ట్.. ఎందుకో తెలుసా?
పెళ్లి సందడి తర్వాత టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది శ్రీలీల. ఇటీవలే నితిన్ సరసన రాబిన్‌హుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగులో స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సిక్కింలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా బహుమతులు అందజేశారు. అంతేకాకుండా మూవీ షూటింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎంఓ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ సందర్భంగా డైరెక్టర్ అనురాగ్ బసు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఇక్కడ షూటింగ్ సమయంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉందని కార్తీక్ ఆర్యన్ అన్నారు. మాకు భద్రత కల్పించినందుకు సిక్కిం పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా షూటింగ్ సజావుగా పూర్తి చేసేందుకు సహకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సిక్కింలోని ప్రకృతి దృశ్యాలు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనను ఆకర్షించాయని హీరోయిన్ శ్రీలీల అన్నారు. ఈశాన్య రాష్ట్రానికి తన మొదటి పర్యటనను నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు.It was a pleasure to meet Bollywood filmmaker Shri Anurag Basu and renowned actors Mr Kartik Aaryan and Ms. Sreeleela at my official residence, Mintokgang. They have been in the state for a week, shooting their upcoming film at iconic locations such as MG Marg and Tsomgo Lake.… pic.twitter.com/ycwHB8R7IG— Prem Singh Tamang (Golay) (@PSTamangGolay) April 2, 2025 -
విగ్ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) బయట ఎంత సింపుల్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎక్కువగా తెల్ల పంచె, షర్ట్ ధరించే కనిపిస్తాడు. సినిమా ఈవెంట్స్‌కి కూడా అలానే వెళ్తాడు. అవసరం అయితే తప్ప మేకప్ వేసుకోరు. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు ఎంత మంది ఉన్నారో..ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్లుకూడా అంతే ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ..రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా(Mukesh Khanna) ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ హీరోలలో ఎంతో మందికంటే రజనీకాంత్ చాలా గొప్పవాడని, రియల్ హీరో అంటే ఆయనేనని పొగడ్తలతో ముంచేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు రజనీకాంత్‌ని వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు కూడా మేకప్ వేసుకోరు. కనీసం విగ్గు కూడా ధరించడు. ఫ్యాన్స్‌తో ఓ సామాన్య వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడు.బాలీవుడ్ హీరోల్లో ఎవరూ కూడా రజనీకాంత్‌లా ఉండలేరు. మేకప్ లేకుండా వాళ్లు బయట తిరగలేరు. వాళ్లతో పోలిస్తే రజనీకాంత్ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రియల్ హీరో’ అని మేకేష్ చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ గురించి చెబుతూ.. డైలాగులు లేని కారణంగా చాలా పెద్ద సినిమాలు వదులుకున్నానని చెప్పారు. విలన్‌గా చేయడం ఇష్టంలేక సినిమాలను దూరం పెట్టానని చెప్పారు. ‘మహాభారతం’ సీరియల్లో మొదట దుర్యోధనుడి పాత్ర ఇస్తే నో చెప్పానని, ఆ తర్వాత భీష్ముడి పాత్ర వచ్చిందని చెప్పారు. బాలీవుడ్ హీరోలపై ముకేశ్ ఖన్నా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి."రూహీ"(1981) చిత్రంలో ముకేశ్ ఖన్నా తన సినీ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత అతను "వక్త్ కీ దీవార్" (1981), "దర్ద్ కా రిష్తా" (1982) వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు. 1980లలో అతను అనేక హిందీ చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు, కానీ అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1997లో దూరదర్శన్‌లో ప్రసారమైన "శక్తిమాన్" అనే టెలివిజన్ సీరియల్‌తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్లో అతను శక్తిమాన్ అనే సూపర్‌హీరో పాత్రను పోషించాడు. ఈ పాత్ర అతన్ని ఇంటింటికీ చేర్చింది, ముఖ్యంగా పిల్లల్లో అతను అత్యంత ప్రజాదరణ పొందాడు. "శక్తిమాన్" సీరియల్‌ను అతను స్వయంగా నిర్మించడం విశేషం.‘మహాభారతం’ లో పోషించిన భీష్మ పాత్ర అతన్ని భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. నటనతో పాటు నిర్మాణం మరియు దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చాటిన ముకేష్ ఖన్నా, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. -
మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి
ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనా గల్రానీ.. తెలుగులో మరికొన్ని మూవీస్ కూడా చేసింది. కాకపోతే అనుకున్నంత పేరు రాలేదు. కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులోనూ ఈమె పేరు వినిపించింది కానీ ప్రస్తుతానికి అంతా సైలెంట్. ఇకపోతే నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈమెకు ఇదివరకే ఓ కొడుకు ఉండగా.. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)తాజాగా ఉగాది సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో బేబీ బంప్ కనిపించేలా ఉన్న వీడియోస్, ఫొటోలని సంజన.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొడుకుతో కలిసి ఈ ఫొటోషూట్ లో పాల్గొంది. దీంతో ఈమెకు నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
ఆదిత్య 369 (Aditya 369 Movie).. 1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది.విజయశాంతిని అనుకున్నాం..ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఆదిత్య 369 సినిమా మొదటగా విజయశాంతిని అనుకున్నాం. తను కూడా సరేనంది. కానీ అప్పటికే ఆమె సినిమాలతో బిజీగా ఉంది. మీరు వేరే హీరోయిన్ను తీసుకోండి, నాకు విజయశాంతి కావాలని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. సరేలే అనుకుని రాధను సెలక్ట్ చేయాలనుకున్నాం. కానీ, ఆమె కాస్త బొద్దుగా మారటంతో మళ్లీ వేరే కథానాయికను వెతికే పనిలో పడ్డాం.నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైసినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. తమిళంలో 'ఈరమాన రోజావే' సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని సూచించాడు. అలా ఆమెను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేస్తే అందరికీ నచ్చింది. అలా మోహిని ఈ సినిమా చేసింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిందనుకుంటాను. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు ముగింపు పలికింది అని తెలిపాడు. ఇకపోతే ఆదిత్య 369 వచ్చిన 34 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కథ రెడీ అయిందని, త్వరలోనే పార్ట్ 2 ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.చదవండి: నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా -
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చలనచిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2: ద రూల్, ఛావా.. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుని బాక్సాఫీస్ క్వీన్‌గానూ మారింది. అయితే రంజాన్ పండక్కి రిలీజైన హిందీ సినిమా సికందర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.నా విషయంలో నిజం కాదుఅయితేనేం.. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. మరో మూడు రోజుల్లో రష్మిక మందన్నా బర్త్‌డే (ఏప్రిల్ 4). ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఇది నా బర్త్‌డే మంత్.. చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాను. వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్న ఆసక్తి సన్నగిల్లుతుందని విన్నాను.నమ్మబుద్ధి కావట్లేకానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు. ఏ యేటికాయేడు నా బర్త్‌డే జరుపుకునేందుకు మరింత సంతోషంగా, ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అప్పుడే నాకు 29 ఏళ్లు వచ్చేస్తున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. గడిచిన ఏడాదిలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. అందుకోసమైనా ఈ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే!' అని రాసుకొచ్చింది.చదవండి: హెచ్‌సీయూ వివాదం.. నేనెలాగో చనిపోతాను.. దయచేసి.. : రేణూ దేశాయ్ విన్నపం -
ట్రైలర్ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ప్రధాన పాత్ర పోషించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. కిశోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. రామస్వామి రెడ్డి, ఎ. చేతన్ సాయిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని వీక్షించి, తొలి టిక్కెట్‌ని కొనుగోలు చేసిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎల్.వై.ఎఫ్’ ట్రైలర్ చాలా బాగుంది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారణాసిలోని కాశీ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
అంతర్జాతీయ స్థాయి సక్సెస్‌లు అందుకుంటున్న టాలీవుడ్ (Tollywood)కు కేంద్ర బిందువు హైదరాబాద్. అలాంటి పరిశ్రమలో గ్లోబల్స్టార్స్గా పేరున్న అనేకమంది నటీనటులకు మన నగరం నిలయం. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న టాలీవుడ్ స్టార్స్ కూడా నగరంలోని కొన్ని రుచులకు దాసులే. వారు తమ అభి‘రుచుల్ని’ సంతృప్తి పరుచుకోడానికి నగరంలోని కొన్ని రెస్టారెంట్స్‌కి తరచూ రౌండ్స్ వేస్తుంటారు. అభిమానులకు చిక్కకుండా రహస్యంగా తమ టేస్ట్ బడ్స్‌ను శాంతింపజేస్తుంటారు. అదే విధంగా మన టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కి సైతం నగరంలో తనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు వడ్డించే రెస్టారెంట్స్ ఉన్నాయి.గత నెల్లో దేవర చిత్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు తారక్ తిరిగి నగరానికి వచ్చేశారు. అయితే తారక్ జపాన్ టూరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో నగరంలో తాను ఇష్టపడే రెస్టారెంట్స్ రుచుల వివరాలు ఆయన వెల్లడించడమే ఇందుకు కారణం.ఫ్రెండ్.. జపనీస్ ట్రెండ్.. నగరంలోని నాగ చైతన్య అక్కినేనికి చెందిన షోయు రెస్టారెంట్ ఎన్టీఆర్ ఎంచుకున్న మొదటి ఎంపిక. ‘ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్ నా స్నేహితుడు నాగ చైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్ వంటకమైన సుషీ అక్కడ సూపర్బ్. హైదరాబాద్‌లో జపనీస్ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్ అది. ఇది నిజంగా అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్’ అంటూ ఎన్టీఆర్ కొనియాడారు. మరికొన్ని ప్రదేశాలు.. జపనీస్ వంటకాలకు సంబంధించి తన ఫేవరెట్‌ను తెలియజేయడంతో పాటు అచ్చమైన హైదరాబాదీ వంటకాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ కొన్నింటిని పేర్కొన్నారు. తాను ఆస్వాదించే మరికొన్ని రుచుల కోసం.. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్‌లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్‌పేట్‌లోని కాకతీయ డీలక్స్ మెస్ కూడా ఆయన ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం -
తమన్నా స్పెషల్ రైడ్
స్పెషల్ సాంగ్స్ చేయడంలో హీరోయిన్ తమన్నా సమ్‌థింగ్ స్పెషల్. హీరోయిన్గా చేస్తూనే, మరోవైపు వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు తమన్నా. ఇలా కెరీర్లో ఇప్పటికే పదికి పైగా ప్రత్యేక పాటల్లో నటించారీ బ్యూటీ. అయితే రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా...’, రాజ్‌కుమార్ రావు–శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కా రాత్’ సాంగ్స్‌లో తమన్నా నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా అజయ్ దేవగన్ ‘రైడ్ 2’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని బాలీవుడ్ టాక్. అంతేకాదు... ఈ స్పెషల్ సాంగ్‌లో తమన్నాతో పాటు యో యో హనీ సింగ్ కూడా ఉంటారట. ఇంకా ‘ఆజ్ కీ రాత్..’ పాటకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీయే ‘రైడ్ 2’లోని స్పెషల్ సాంగ్‌కూ కొరియోగ్రఫీ చేయనున్నారట. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రైడ్ 2’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. 2018లో వచ్చిన ‘రైడ్’కి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందుతోంది. -
కౌంట్‌డౌన్ స్టార్ట్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ విడుదలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ప్రోడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. సరిగ్గా ఈ మూవీ విడుదలకు 30 రోజులు ఉండటంతో 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ చిత్రంలో నాని ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ...’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
హారర్ ఆహ్వానం
శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యా బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఒక మంచి హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించేలా ఈ మూవీ కథనం ఉంటుంది. హారర్ మూమెంట్స్, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: పద్మనాభన్ భరద్వాజ్, కెమేరా: జె. ప్రభాకర్ రెడ్డి. -
ఆరోగ్యకరమైన హాస్యంతో...
‘‘సారంగపాణి జాతకం’లో నాన్ తెలుగు యాక్టర్లు లేరు. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది. ఎవరి డబ్బింగ్ వాళ్లే చెప్పుకున్నారు. హీరోయిన్ అయిన తెలుగమ్మాయి రూపా కొడువాయూర్ చక్కగా నటించింది’’ అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘జెంటిల్మన్, సమ్మోహనం’ చిత్రాల తర్వాత కృష్ణప్రసాద్ కాంబినేషన్లో ‘సారంగపాణి జాతకం’ నాకు మూడో సినిమా. ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం ఇద్దరి మధ్య కొనసాగుతోంది. అన్ని వయసుల వారికి వినోదాన్ని అందించే ఆరోగ్యకరమైన హాస్యభరిత సినిమా ఇది. ఈ సినిమా చూసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కళ్లకు, చెవులకు చేతులు అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు’’ అన్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఇది జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుణ్ణి, జాతకాలని నమ్ముతాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని చెప్పారు. ‘‘ఇంద్రగంటిగారి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఇంద్రగంటిగారి సినిమాలో నటించడం నాకు ఎప్పుడూ స్పెషల్’’ అన్నారు శ్రీనివాస్ అవసరాల. ‘‘నాకు ఇష్టమైన డైరెక్టర్ ఇంద్రగంటిగారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఊహించని విధంగా ఆయన సినిమాలో నటించే చాన్స్ రావడం చాలా సంతోషాన్ని కలిగించింది’’ అని పేర్కొన్నారు రూపా కొడువాయూర్. సినిమాటోగ్రాఫర్ పీజీ విందా, నటీనటులు సమీరా భరద్వాజ్, నివితా మనోజ్, అశోక్‌కుమార్, ప్రదీప్, వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడారు. -
'చైనా పీస్' మూవీలో వాలిగా నిహాల్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'చైనా పీస్'. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నిహాల్ పుట్టినరోజు సందర్భంగా అతడు చేస్తున్న వాలి పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)ఇకపోతే ఈ సినిమాకు కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
డిజైనర్ డ్రస్సులో మాళవిక.. ముత్యంలా శ్రద్ధా మెరుపుల్
వైట్ డ్రస్సులో మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్బ్లాక్ ఔట్ ఫిట్ తో కాక రేపుతున్న మాళవిక మోహనన్12th ఫెయిల్ బ్యూటీ ఇంత హాట్ అయిపోయిందేంటి?దుబాయిలో చిల్ అవుతున్న దేవుళ్లు పాప నిత్యాశెట్టిక్యూట్ అండ్ స్వీట్ లుక్ లో అనికా సురేంద్రన్బీచ్ ఒడ్డున అలా సరదగా యష్ భార్య రాధికశివయ్య దర్శనం కోసం కాశీ వెళ్లిన నయని పావని View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Sonam Bajwa (@sonambajwa) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Medha Shankr (@medhashankr) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) -
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
‘మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే.. కథ, లాజిక్స్ ని పక్కన పెట్టి ఈ సినిమాని చూడమని మేము కోరాం. ప్రేక్షకులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కేవలం నవ్వుకోవడానికి ఈ సినిమాని చూస్తున్నారు. అందుకే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి’ అని అన్నారు నిర్మాత నాగవంశీ. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమా భారీ విజయం సాధించడంతో నాగవంశీ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..సినిమా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల బాట పట్టడం సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లను దృష్టిలో ఉంచుకొని, మొదటి వారాంతం కొన్ని చోట్ల టికెట్ ధరలను పెంచడం జరిగింది. మొదటి వారాంతం వచ్చిన వసూళ్లతో అందరూ సంతోషంగా ఉన్నాం. అందుకే ఈరోజు అన్ని చోట్లా సాధారణ టికెట్ ధరలతోనే సినిమాని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి, కుటుంబ ప్రేక్షకులు మరింత మంది మా సినిమాని చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.సీక్వెల్ హైప్ తో ఆడటానికి ఇది పెద్ద హీరో సినిమా కాదు, భారీ బడ్జెట్ సినిమా కాదు. అయినా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణం వినోదం. మేము స్వయంగా థియేటర్లకు వెళ్లి చూశాము. ప్రేక్షకులు సినిమా చూస్తూ, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.సెకండ్ హాఫ్ డల్ అయిందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ, నిజానికి ప్రేక్షకులు సెకండ్ హాఫ్ నే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. సునీల్ గారి ట్రాక్ అందరికీ బాగా నచ్చింది.ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఎలాగైతే మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో.. మ్యాడ్ స్క్వేర్ కూడా నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.రివ్యూ అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నచ్చితే నచ్చిందని రాస్తారు, లేదంటే నచ్చలేదని రాస్తారు. అందులో తప్పు లేదు. అలా నిజాయితీగా ఇచ్చే రివ్యూలను మేము స్వాగతిస్తాము. కానీ, కొందరు సినిమాని చంపేయాలనే ఉద్దేశంతో.. రివ్యూ రాసి ఊరుకోకుండా, అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే, అందరం బాగుంటాం అనే విషయాన్ని గ్రహించాలి. -
ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్
మంచు విష్ణు హీరో, నిర్మాతగా చేసిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. లెక్క ప్రకారం ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేస్తామని చాలారోజుల క్రితమే ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం వరకు ప్రచారం చేశారు. కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా మూవీ ప్రీమియర్ వేశారనే రూమర్స్ రాగా.. టీమ్ దీనిపై స్పందించింది.(ఇదీ చదవండి: హీరోయిన్ తమన్నా ఇంట్లో ప్రత్యేక పూజలు)'మార్చి 31న కన్నప్ప ప్రీమియర్ వేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. 15 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఫుటేజీ క్వాలిటీ మాత్రమే చెక్ చేశాం. మూవీ ఫస్ట్ కాపీని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాం. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దు. త్వరలోనే ఇతర వివరాలు ప్రకటిస్తాం' అని కన్నప్ప టీమ్ చెప్పుకొచ్చింది.ప్రసాద్ ల్యాబ్ నుంచి మంచు ఫ్యామిలీ నడిచొస్తున్న విజువల్స్ కొన్ని బయటకు రావడంతోనే ఈ ప్రీమియర్ వార్తలు వచ్చాయి. ఇకపోతే కన్నప్ప మూవీలో మంచు ఫ్యామిలీకి చెందిన విష్ణు, ఇతడి కూతుళ్లు-కొడుకు నటించారు. తండ్రి మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)Official Clarification from Team KannappaContrary to rumours spreading online, there was NO premiere or screening of the full movie yesterday. The Kannappa team only reviewed a 15-minute VFX segment for quality assessment and corrections.The film’s first cut is still under…— Kannappa The Movie (@kannappamovie) April 1, 2025 -
చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్లో హిట్ సినిమాకు ఈ పేరు కేరాఫ్‌గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాడు. రీసెంట్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్‌కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్ టైటిల్) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్‌ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్.. ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో పటాస్ చిత్రానికి అనిల్ రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు. సూపర్ హిట్ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. -
జార్జియా అధికారులతో ఇబ్బంది పడ్డా: నిర్మాత
‘28°C’ సినిమా 2019లోనే పూర్తయింది. 2020లో మేలో విడుల చేయాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. కొన్ని రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటే, అది నెలల తరబడి సాగింది. దీంతో మా సినిమా విడుదల ఆలస్యమై ఇప్పుడు (ఏప్రిల్ 4) రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మూవీ వైజాగ్ లో ప్రారంభించినప్పుడే నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఎన్ని సమస్యలు వచ్చినా కంటెంట్ మీద నమ్మకంతో ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తారనే ఆశిస్తున్నాం’ అన్నారు యువ నిర్మాత సాయి అభిషేక్. ఆయన నిర్మించిన తొలి సినిమా 28°C( 28 డిగ్రీల సెల్సియస్). నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా "28°C" రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సాయి అభిషేక్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..నేను, డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ సన్నిహిత స్నేహితులం. మాకిద్దరికీ సినిమాలంటే అమితమైన ఇష్టం ఉండేది. అనిల్ "క్షణం" సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు. నేను కూడా దర్శకత్వం వైపు కొన్ని ప్రయత్నాలు చేశాను. కొన్ని రోజుల తర్వాత, మేమిద్దరం కలిసి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాం. అనిల్ విశ్వనాథ్ "28°C" అనే టెంపరేచర్ ఆధారంగా చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకంతో సినిమాను ప్రారంభించాం.మొదట్లో ఈ సినిమా కోసం వేరే హీరోలను అనుకున్నప్పటికీ, చివరికి నవీన్ చంద్ర ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించాం. హీరోయిన్గా మొదట అంజలిని ఎంచుకున్నాం, కానీ కొంత ఆధునికత కోసం కొత్త ముఖం ఉంటే బాగుంటుందని షాలినీని ఎంపిక చేశాం. షూటింగ్‌ను వైజాగ్‌లో మొదలుపెట్టాం, ఆ తర్వాత గోవా, జార్జియాలకు వెళ్లాం. నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత నాణ్యతతో సినిమాను రూపొందించాం. సినిమా కథాంశంపై మా బృందం అందరికీ గట్టి విశ్వాసం ఉండేది.హీరో నవీన్ చంద్ర మాకు చాలా సహకరించాడు. సినిమాపై మాతో పాటు అతనికి కూడా గట్టి నమ్మకం ఉంది. షూటింగ్ సమయంలోనే కాకుండా, ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో కూడా మద్దతుగా నిలుస్తున్నాడు. అతని పాత్ర ప్రేక్షకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం. అలాగే, హీరోయిన్ షాలినీ కూడా అద్భుతంగా నటించింది. "28°C" టెంపరేచర్ వద్ద హీరోయిన్ ఆరోగ్య పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, ఆ ఉష్ణోగ్రత దాటితే ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ జంట ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఒకే జానర్లో సాగదు, విభిన్న జానర్లను కలుపుతూ ఒక తీవ్రమైన ప్రేమకథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.సినిమా తీసే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వైజాగ్‌లో షూటింగ్ ప్రారంభించినప్పుడే నా కాలు విరిగింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. మేము షూటింగ్ కోసం భారీగా ఖర్చు చేశామని స్థానిక మీడియా ద్వారా తెలుసుకున్న జార్జియా అధికారులు చివరికి చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, కథాంశంపై నమ్మకంతో ఇప్పటివరకు ధీమాగా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్లలో మా సినిమాకు సానుకూల స్పందన ఇస్తారని ఆశిస్తున్నాం.ప్రస్తుతం కొన్ని కథలు విన్నా, అయితే ఏదీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. "28°C" సినిమా రిలీజ్ తర్వాత మా సంస్థ నుంచి కొత్త మూవీని అనౌన్స్ చేస్తాం. -
వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?
ఉగాది-రంజాన్ కానుకగా థియేటర్లలోకి నాలుగైదు సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. వస్తున్న కలెక్షన్సే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు చేరువలో ఉంది.(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ)తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్, ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పొచ్చు. ఓవర్సీస్ లోనూ ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ వసూళ్లు దాటేసింది.ప్రస్తుతం ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.100 కోట్ల మార్క్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉందని చివర్లో ప్రకటించారు. మరి అది ఎప్పుడు తీసి రిలీజ్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!) -
తండ్రి వయసు వ్యక్తితో అలా చూసి, నాన్న షాక్ చెందారన్న నటి
సాధారణంగా అందంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందేంత అభినయం కూడా ఉండడం అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సాధించగలిగిన విజయం. అలాంటి విజయవంతమైన కధానాయికల్లో అమలాపాల్ ఒకరు. తమిళం, మలయాళం తెలుగు సినిమాలలో నటిస్తూ బహుభాషా నటిగా తన అందానికి, అభినయానికి సమాన ప్రశంసల్ని పొందిన ఈ నటి నిర్మాత కూడా. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతగా అమల పాల్(Amala Paul) పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఏమీ తెలీకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాటి అమలాపాల్‌కి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉందని ఆమె అంటోంది.అమలా పాల్,నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాను విజయాలు మాత్రమే కాదు మరెన్నో సవాళ్లతో నిండిన ప్రయాణాన్ని సాగించానని వెల్లడించింది. . వ్యక్తిగత వృత్తి పరమైన ఎదుగుదలతో పాటు జీవితంలోని హెచ్చు తగ్గులు తన మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాయి అంటోంది. మళ్లీ ప్రేమ, మళ్లీ పెళ్లి, తల్లి కావడం...ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ.. ఈ 15 సంవత్సరాలలో, ఆమె తన అనుభవాల ద్వారా ఎదురుదెబ్బల నుంచి చాలా నేర్చుకున్నానంది. అమలాపాల్ 2010లో నటించిన తమిళ చిత్రం ‘‘ సింధు సమవేలి’’ ఆమె కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఆమె సింధు సమవేలి(Sindhu Samaveli)లో ఓ బోల్డ్ పాత్రను పోషించింది ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కునేలా చేసింది.తండ్రి వయసు ఉండే తన మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్రలో ఆమె నటించిన ఆ చిత్రం విడుదలైన తర్వాత తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,.ఆ సినిమా విషయంలో వెల్లువెత్తిన ప్రతికూలత తనను బాగా భయపెట్టిందని, ముఖ్యంగా ఆ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించింది. తన పాత్ర చూపించే సామాజిక ప్రభావాన్ని తాను అంచనా వేయలేకపోయానని అంగీకరించింది. ‘మనం అలాంటి పాత్ర చేయకూడదని, అది చెడ్డదని లేదా అది మన సమాజం అంగీకరించే విషయం కాదని ఆ చిత్రం విడుదల తర్వాత మాత్రనే నేను అర్ధం చేసుకోగలిగాను’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. అయితే అప్పుడు తాను కేవలం 17 లేదా 18 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న నటిని.. కావడంతో దర్శకుడి సూచనలను గుడ్డిగా అనుసరించడం మాత్రమే చేయగలిగానంది. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ పరంగానూ వ్యతిరేక పరిణామాలకు దారి తీసింది. సింధు సమవేలి తరువాత, ఆమె తన తదుపరి చిత్రం మైనా ప్రారంభ ప్రమోషన్లలలో సైతం దేనికీ ఆమెను పిలవలేదు, ఆ తర్వాత ఆమెకు తరువాత కమల్ హాసన్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుంచి సైతం కాల్స్ వచ్చాయి, అయితే విపరీతమైన వ్యతిరేకత పట్ల భయం కారణంగా, ఆమె చెన్నైకి వెళ్లలేకపోయింది.అమలాపాల్ సక్సెస్ తర్వాత ఆ వివాదాస్పద చిత్రం మరోసారి రీ–రిలీజ్ అయింది. అప్పుడు కూడా ప్రమోషనల్ మెటీరియల్ తప్పుదారి పట్టిస్తోందంటూ వివాదాన్ని రేకెత్తించింది. వీటన్నింటి నేపధ్యం ‘‘ సినిమా కేవలం వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నేను గ్రహించాను, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నటి ఎదురు దెబ్బలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి‘ అని ఆమె స్పష్టం చేసింది. -
దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ
ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (mad square) చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఈ మధ్యకాలం అత్యధిక వసూళ్లను రాబట్టిన చిన్న చిత్రంగా రికార్డు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ సాధించడంతో పెంచిన టికెట్ల ధరను సాధారణ స్థాయికి తీసుకువచ్చామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ( Suryadevara Naga Vamsi) తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై గ్రహం వ్యక్తం చేశాడు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ఆయన ప్రశ్నించారు.‘సినిమా రిలీజ్ తర్వాత రివ్యూలు వచ్చాయి. అప్పుడు ప్రెస్ మీట్‌పెట్టాను కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేశారు అనుకున్నాను. కానీ, సినిమా బాగా ఆడుతున్నప్పటికీ.. ఆ రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని అంటున్నారు. ఈ సినిమ ఎలా ఉన్నా చూడటానికి ఇదేమైనా ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ కాదు కదా! సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ‘మ్యాడ్ స్క్వేర్’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. కంటెంట్ లేదు. సెకండాఫ్ పండలేదని అంటున్నారు. నేను థియేటర్లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్లకు తెలియడం లేదా?మీరు (మీడియా) మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్ రన్ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పనిచేస్తాయి. దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు.సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి’ అని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్
టాలెంట్ ఎంత ఉన్నా సరే చిత్రపరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఢిల్లీ బ్యూటీ 'పాయల్ రాజ్‌పుత్'(Payal Rajput) అన్నారు. 'RX 100' దర్శకుడు అజయ్ భూపతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు వారికి దగ్గరైంది. ఈ మూవీ తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినప్పటికీ ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, చాలారోజుల గ్యాప్ తర్వాత వచ్చిన 'మంగళవారం' సినిమాలో తన నటనతో విశ్వరూపం చూపింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా ఒక నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ‘మంగళవారం’లోని నటనకు గాను జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ నటిగా పాయల్ అవార్డ్ అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఛాన్సులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీపై పాయల్ ఒక పోస్ట్ చేసింది.ఒక నటిగా రాణించడం అనేది అన్నింటికంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ప్రతిరోజు కూడా అనిశ్చిత భారంతోనే మొదలౌతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రతిభను కప్పివేసే నెపోటిజం (బంధుప్రీతి ), పక్షపాతంతో నిండి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. నాకొక సందేహం ఉంది. నేను అంకితభావంతో ఎంతో కష్టపడుతున్నప్పటికీ వెలుగులు కనిపించడం లేదు. ఆధిపత్యం చెలాయించే ఈ ప్రపంచంలో నిజంగానే రాణించగలనా అనే సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చే చేయి జారిపోతున్నాయి. కొందరు తమ ఇంటిపేరు ఉపయోగించుకొని ఛాన్సులు తెచ్చుకుంటే మరికొందరు సరైన ఏజెంట్స్ ద్వారా దక్కించుకుంటున్నారు. ఇలాంటివి నేను చాలా గమనించాను. ఇలాంటి ప్రదేశంలో నేను రాణించగలనా అనే సందేహం వస్తుంటుంది.' అని పాయల్ అన్నారు. మంగళవారం (2023) తర్వాత పాయల్ రాజ్‌పూత్ మరో సినిమా నటించలేదు. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఆమెకు అవకాశాలు రాకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. కాస్త ఓపిక పడితే తప్పకుండా మంచి ఛాన్సులు వస్తాయని సోషల్‌మీడియా ద్వారా ఆమెకు చెబుతున్నారు. పాయల్ ట్వీట్‌ను తమ అభిమాన హీరోలు, దర్శకులకు ట్యాగ్ చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. అలా పాయల్‌పై తమ అభిమానాన్ని చాటుతున్నారు. Being an actor is one of the toughest careers out there. Each day starts with the weight of uncertainty, as I step into a world where nepotism and favoritism often overshadow talent. #struggleisreal 🎞️— paayal rajput (@starlingpayal) April 1, 2025There are moments of doubt when I question whether my hard work and dedication can truly shine through in a landscape dominated by privilege. I watch as opportunities slip away to those with famous last names or a powerful agent, wondering if my talent is enough to break…— paayal rajput (@starlingpayal) April 1, 2025 -
వాళ్ల కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు: కల్యాణ్ రామ్
‘‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలోని అమ్మ పాత్రకి విజయశాంతిగారు ఒప్పుకోవడం వల్లే నేను ఈ సినిమా చేశాను. అమ్మలను గౌరవించడం మన బాధ్యత. వాళ్ల కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. మా సినిమాని అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాం’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్, సయీ మంజ్రేకర్ జోడీగా, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘నాయాల్ది..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సోమవారం నరసరావుపేటలో రిలీజ్ చేశారు మేకర్స్. రఘురాం సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్ అజీజ్, సోనీ కొమాండూరి పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఈ వేడుక చూస్తుంటే పాట రిలీజ్‌లా లేదు.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సక్సెస్‌మీట్‌లా ఉంది’’ అన్నారు. ‘‘పల్నాటి పౌరుషం కల్యాణ్‌రామ్‌గారి క్యారెక్టర్లో కనిపిస్తుంది’’ అన్నారు ప్రదీప్ చిలుకూరి. ‘‘ఈ సాంగ్‌ను పల్నాడులో లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉంది’’ అని అశోక్ వర్ధన్ చెప్పారు. ఎన్టీఆర్.. సీఎం..సీఎం ఈ పాట ఈవెంట్‌కి కల్యాణ్‌రామ్ వచ్చింది మొదలు ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. హీరో ఎన్టీఆర్ ఫ్లెక్సీని ప్రద ర్శిస్తూ సీఎం.. సీఎం.. అనే నినాదాలతో హోరెత్తించారు. -
'Mega157' రఫ్ఫాడించే గ్యాంగ్ ఇదే.. వీడియోతో పరిచయాలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'Mega157' నుంచి 'రఫ్ఫాడిద్దాం' పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల సమయంలో వెంకటేష్‌తో అనిల్ చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సినిమాను ప్రతి ఇంటికి తీసుకెళ్లాయి. దీంతో ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ ఫార్మూలానే చిరంజీవి సినిమాకు ఇంకాస్త డిఫరెంట్‌గా అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.సంక్రాంతి-2026లో రఫ్ఫాడిద్దాం పేరుతో ఒక వీడియోను అనిల్ రావిపూడి క్రియేట్ చేశాడు. Mega157 ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న తన గ్యాంగ్ మొత్తాన్ని మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్‌తో చిరంజీవికి పరిచయం చేశాడు. డైరెక్షన్ టీమ్ నుంచి నిర్మాతల వరకు అందరినీ పరిచయం చేశారు. సుమారు రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో చాలా ఫన్నీగా ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఇదే వీడియోను చిరంజీవి కూడా తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు అంటూ ఆయన్ను చిరంజీవి ప్రశంసించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనిల్‌ను మెచ్చుకుంటూ కాంమెంట్లు చేస్తున్నారు. అనిల్ రావిపూడి తనదైన మార్క్‌తో అప్పుడే మొదలెట్టేశాడు రా బాబూ.. అంటూ ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. త్వరలో షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో చిరంజీవి తన సొంత పేరైన శివ శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳— https://t.co/KpR65ACX9L SANKRANTHI 2026 - రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025 -
మాపై నిందలు వేస్తూ.. కుట్రలకు పాల్పడుతున్నారు: ఆర్కే. సెల్వమణి
తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మంధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాల మధ్య కొంత కాలంగా తీవ్రమైన ఆరోపణలు ఒకరిపైమరోకరు చేసుకుంటూనే ఉన్నారు. నిర్మాతల నుంచి కార్మికులకు అందే వేతనాల విషయంలో ఈ వివాదం రాజకుంది. తాజాగా ఇవి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో తమిళ నిర్మాతల మండలి కార్మికులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి పోటీగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్యను ఎర్పాటు చేస్తున్నట్లు ప్రచారం వెలుగులోకి వచ్చింది.తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఇటీవల ఒక దిన పత్రికలో ప్రకటన వెలువడింది. దీంతో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము నిర్మాతల మండలి కోసం ఎంతగానో దిగొచ్చామని చెప్పారు. కార్మికుల వేతనాల నుంచి చాలా విషయాల్లో నిర్మాతకు సహకరిస్తున్నామన్నారు. అయితే వారిలో ఐక్యత లేక సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో సంఘాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇటీవల ఓ దినపత్రికలో తమిళ్ సినీ కార్మికుల సమాఖ్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. ఈ ప్రకటన వెనుక తమిళ్ నిర్మాతల మండలి ఉందని తెలిసిందని సెల్వమణి అన్నారు. నిర్మాతల మండిలి తెలివిగా మా మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందన్నారు.కుట్రలు పాల్పడుతోంది వారే.. కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లడని సెల్వమణి అన్నారు. కారణం తమ సమాఖ్య అంత కట్టుదిట్టంగా ఉందని , వారి శ్రేయస్సు కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే నిర్మాతలు తమ చిత్రాల షూటింగ్‌లను తమిళనాడులో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో చేస్తున్నారని, అందువల్ల తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. తప్పని సరి అయితేనే తమిళ చిత్రాల షూటింగ్‌లను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తే బాగుంటుందని, తమిళ చిత్రాలను నమ్ముకుని 25 వేల మంది కార్మికుల ఉన్నారని ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు. ఈ విషయంలో నటీనటులు కూడా ఆలోచించాలన్నారు. -
OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో విడుదలైంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసింది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో ఇందులో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యూత్‌ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమాను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సింప్లీ సౌత్ ఓటీటీలో కూడా ఈ చిత్రం తెలుగులో ఉంది. ఓ భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథతో ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ పథాకంపై ఈ సినిమాను నిర్మించారు. -
మా బాధ చూసి మమ్ముట్టి మెసేజ్.. కన్నీళ్లొచ్చాయి: పృథ్వీరాజ్ తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మరోసారి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక స్పందించారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ గొడవలో కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్‌ను మాత్రమే బలిపశువును చేస్తున్నారని ఆమె కామెంట్ చేశారు. తన కుమారుడికి చిత్ర పరిశ్రమలో చాలా మంది శత్రువులు ఉన్నారని మల్లిక తెలిపారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తుండటంతో అతని ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు ఎల్2: ఎంపురాన్ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని మల్లికా ఆరోపించింది.ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచిన ఏకైక స్టార్ హీరో మమ్ముట్టి మాత్రమే అని పృథ్వీరాజ్ తల్లి మల్లిక తాజాగా కామెంట్స్ చేశారు. ఆయన పంపిన సందేశం చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని ఆమె ఇలా చెప్పారు. "రంజాన్ పండుగ ఉన్నప్పటికీ, మమ్ముట్టి నాకు మెసేజ్ చేశారు. పృథ్వీరాజ్ గురించి ఫేస్బుక్లో నేను చేసిన పోస్ట్ చూసి చింతించవద్దని మమ్ముట్టి చెప్పారు. మాకు అండగా నిలబడుతానని మాట ఇచ్చారు. నా కుమారుడికి జరుగుతున్న అన్యాయం వల్ల నేను చాలా బాధలో ఉన్నానని ఆయనకు తెలుసు. మమ్ముట్టి ఒక మనస్సాక్షి ఉన్న కళాకారుడు.నా పిల్లల గురించి ఎక్కడైనా ప్రతికూలంగా ఏదైనా కనిపిస్తే.., అది నన్ను బాధపెడుతుందని అతను అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. నా పిల్లలకు కూడా మమ్ముట్టి చేసిన సాయాన్ని మర్చిపోవద్దని చెప్పాను. ఇంత జరుగుతున్నా చిత్ర పరిశ్రమ నుంచి మా కుటుంబం కోసం ఎవరూ మాట్లాడలేదు. కానీ, పరిశ్రమ నుండి సందేశం పంపిన ఏకైక వ్యక్తి మమ్ముట్టి మాత్రమే.. ఆయన పంపిన మెసేజ్ చూసినప్పుడు నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.'అని మనోరమ న్యూస్‌తో మల్లిక అన్నారు.'ఎల్ 2: ఎంపురాన్' చిత్రం ఇప్పటికే ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగానే వసూలు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సెట్ చేయబడిన సన్నివేశాల చిత్రీకరణపై వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం వల్ల ఈ చిత్రం నుంచి సుమారు 3 నిమిషాల నిడివిని తొలగించారు. -
శోభిత ధూళిపాళ టైమ్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్( Pa. Ranjith) కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి కూడా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మద్రాస్ చిత్రాల నుంచి సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి చిత్రాలే పా.రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. తంగలాన్‌లో నటుడు విక్రమ్ , నటి పార్వతీ, మాళవికా మోహన్ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్ తదుపరి సార్పట్ట పరంపర– 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్ హీరోగా,ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala) నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. మేడ్ ఇన్ హెవన్, మేజర్ వంటి చిత్రాల్లో శోభిత తన నటనతో మెప్పించింది. అయితే, పా.రంజిత్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఒకరు నటిస్తున్నారంటే వారి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అందుకు వారు సెట్ అవుతారని ఆయన భావిస్తేనే ఛాన్స్ ఇస్తారు. శోభితకు సరైన పాత్ర పడితే దుమ్మురేపుతుందని పేరు ఉంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయితే శోభిత టాలెంట్ చూపే టైమ్ వచ్చిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో( Naga Chaitanya) పెళ్లి తర్వాత ఆమె ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్ రెయోమ్స్ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ను 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
డబుల్ ధమాకా
ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హీరోయిన్ వైష్ణవీ చైతన్య. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’లో ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. తెలుగమ్మాయి అయిన వైష్ణవీ చైతన్య కెరీర్ ప్రారంభంలో ‘లవ్ ఇన్ 143 అవర్స్’, ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘అరెరే మానస’, ‘మిస్సమ్మ’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు.ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించిన ఆమె ‘బేబీ’(2023) మూవీతో హీరోయిన్గా మారారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచి, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీతో ఆడియన్స్ లో బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న వైష్ణవీ చైతన్య ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేశారు. అదేవిధంగా ‘90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు వైష్ణవి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. -
నేను అందుకున్న గొప్ప ప్రశంస అదే: కల్యాణ్ శంకర్
‘‘మ్యాడ్’ సినిమా ఎక్కువగా యువతకి చేరువైంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీని యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.. ఎంజాయ్ చేస్తున్నారు’’ అని డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తెలిపారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో సోమవారం కల్యాణ్ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మ్యాడ్ స్క్వేర్’లో పెద్ద కథ ఆశించి సినిమాకి రాకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి’ అని ముందే చెప్పడం మాకు చాలా ప్లస్ అయింది. రాజమౌళిగారు కూడా సినిమా మొదలుపెట్టే ముందే కథ ఇలా ఉండబోతుంది అని చెబుతుంటారు. అలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ పదిహేనేళ్ల తర్వాత థియేటర్లో చూసిన సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. ‘సినిమా చూస్తున్నప్పుడు నవ్వి నవ్వి కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అని ఆమె చెప్పడం నేను అందుకున్న గొప్ప ప్రశంస. ఇతర నిర్మాతల నుంచి కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాగవంశీగారితో నాకు మంచి ర్యాపో ఉండటంతో ఆయనతోనే వరుస సినిమాలు చేస్తున్నాను. రవితేజగారితో నేను చేయబోయే సినిమాలోనూ కచ్చితంగా వినోదం ఉంటుంది’’ అన్నారు. -
అందరూ గర్వపడే సినిమా కోర్ట్: చిరంజీవి
‘‘కోర్ట్’ సినిమా చూశాను.. ఎక్కడా బోర్ కొట్టలేదు. కథని ఆద్యంతం ఆసక్తిగా తీశారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు.. ప్రతి పాత్ర సహజంగా ఉంది. ఈ మూవీని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్ట్ డ్రామాగా భావిస్తున్నాను. అందరూ గర్వపడే సినిమా ‘కోర్ట్’’ అని హీరో చిరంజీవి తెలిపారు. ప్రియదర్శి, శివాజి, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలై, హిట్‌గా నిలిచింది. తాజాగా ‘కోర్ట్’ చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించి, సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ–‘‘కోర్ట్’లో చాలా బలమైన సందేశం ఉంది. నాని ఒక కథపై ఆసక్తి చూపించారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్‌లోనే చూడాలి’’ అన్నారు. -
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్లో డా. లతా రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా..మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ.. '2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా' అని చెప్పారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..'నా దర్శకుడు కృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లత చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. నాకు వచ్చిన ఆఫర్స్ మరెవరికీ రావు: బిగ్‌బాస్ ఆదిరెడ్డి
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.అయితే ఇటీవల టాలీవుడ్లో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు పోలీసుల ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి సైతం పోలీసులను ఆశ్రయించారు.నా పేరుతో టెలీగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రూపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అందుకే ఎస్పీని కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు వచ్చిన బెట్టింగ్ యాప్ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించినట్లు ఆదిరెడ్డి వివరించారు. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ ఆడొద్దని తన ఫాలోవర్స్‌కు సూచించారు.అయితే గతంలో తాను చేసిన ఫాంటసీ యాప్స్ మన ఇండియాలో లీగల్‌గానే చేశారని తెలిపారు. ఫాంటసీ యాప్స్ కుడా ఆంధ్రా, తెలంగాణలో ఓపెన్ చేయొచ్చు.. కానీ కేవలం ఫ్రీ లీగ్స్ మాత్రమే అడేందుకు మాత్రమే వీలవుతుందని వెల్లడించారు. అయితే ఇండియా మొత్తంలో లీగల్ ఫాంటసీ యాప్‌ను కూడా 9 నెలల క్రితమే ఆపేశానని ఆదిరెడ్డి వివరించారు . బెట్టింగ్ చేయాలి అనుకుంటే.. నాకు వచ్చిన అన్నీ ఆఫర్స్ ఎవరికి రావు అని అన్నారు. అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయలేదని పేర్కొన్నారు. 2020 తర్వాత నేను ఫాంటసీ యాప్స్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు.. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టమని ఎవ్వరికీ చెప్పలేదని వెల్లడించారు. అయితే ఆంధ్ర, తెలంగాణలో ఫాంటసీ యాప్‌లలో కేవలం ఉచిత లీగ్‌లు మాత్రమే ఆడగలరు.. కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఫాంటసీ లీగ్స్ ఆడే అనుమతులు ఉన్నాయని బిగ్‌బాస్ ఆదిరెడ్డి పేర్కొన్నారు. -
రకుల్ ముత్యాల డ్రస్.. మెగా కోడలు ట్రెడిషనల్ లుక్
పద్ధతిగా చీరకట్టులో మెరిసిపోతున్న లావణ్య త్రిపాఠిమల్లెపూలతో హాట్ నెస్ పెంచేసిన మలైకా అరోరాఅందచందాలతో రచ్చ లేపుతున్న ప్రగ్యా జైస్వాల్ట్రెండింగ్ బ్యూటీ కాయదు లోహర్ క్యూట్ పోజులుభర్తతో కలిసి ఉగాది-ఈద్ విషెస్ చెప్పిన అదితీముత్యాల డ్రస్సులో మైమరిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. 'నాయాల్దీ' వచ్చేసింది!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాయాల్ది అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘు రామ్ లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి.. నిజంగానే జరిగితే?
టాలీవుడ్లో రెబల్ స్టార్ పెళ్లి గురించి చర్చ ఇప్పటి నుంచి మొదలైంది కాదు. గత పదేళ్లుగా ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి ముచ్చట వినిపిస్తూనే ఉంటుంది. అలా మరోసారి ఇటీవలే ప్రభాస్ పెళ్లి లొల్లి మొదలైంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని ఆయన పెళ్లాడబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై ఆరా తీస్కే అదంతా ఒట్టి పుకారే తేలిపోయింది. ఈ విషయంపై ఆయన టీమ్ సైతం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలేనని కొట్టిపారేసింది.ఇక ప్రభాస్ అన్న పెళ్లి ముచ్చట వచ్చినప్పుడల్లా ఆ స్టార్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు జంటగా పలు సూపర్ హిట్ మూవీల్లో నటించారు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క శెట్టి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇదేది అంత ఈజీగా అయ్యే పనిలా మాత్రం కనిపించడం లేదు. అందుకే ఓ నెటిజన్ వినూత్న ఆలోచనతో ఓ వీడియోను రూపొందించాడు. అది చూస్తే ఈ జంట ఇంత చూడముచ్చటగా ఉన్నారా? అంటూ కామెంట్స్ చేయకుండా ఉండలేరు. అంతలా ఎడిట్ చేసిన ఓ నెటిజన్ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం పదండి.నెటిజన్ ఎడిట్ చేసిన ఫోటోలతో ప్రభాస్- అనుష్క శెట్టికి పెళ్లైనట్లు ఊహించుకుని ఓ వీడియోను రూపొందించాడు. పెళ్లి మాత్రమే కాదు.. ఈ జంటకు పిల్లలు పుడితే ఎలా ఉంటారో కూడా ఊహించి మరీ ఫోటోలు ఎడిట్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అలా ఎడిట్ చేసిన ఫోటోలు చూస్తే ప్రభాస్- అనుష్క జోడీ టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసి ఊహల్లో విహరించండి.Entraa idi entha realistic ga undi 🫠 pic.twitter.com/7JG14Sf4kC— x_tweet's 🌅 (@MididoddiSai1) March 31, 2025 -
యాంకర్ ప్రదీప్ కొత్త సినిమా.. రిలీజైన ట్రైలర్
తెలుగులో కొన్నేళ్ల పాటు పాపులర్ యాంకర్ గా కొనసాగిన ప్రదీప్ మాచిరాజు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో గతంలో హీరోగానూ నటించాడు. కానీ హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు యాంకరింగ్ ని పక్కనబెట్టి మరో మూవీలో హీరోగా నటించాడు. అదే 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)ట్రైలర్ బట్టి చూస్తుంటే సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఓ కుర్రాడు.. ఊహించని విధంగ ఓ పల్లెటూరికి వెళ్తాడు. ఆ ఊరిలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? ఇందులో హీరోయిన్ పాత్రేంటి? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ లో కామెడీ పర్లేదనేలానే ఉంది. ఏప్రిల్ 11న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ సరసన దీపిక పిల్లి హీరోయిన్ కాగా.. నితిన్-భరత్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. మరి ఈ సారైనా ప్రదీప్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత) -
విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలు చిత్రాలు తీసిన నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన పరిస్థితి తాజాగా విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత అంటే బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముళ్లపూడి బ్రహ్మానందం.. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు బంధువు. ఈవీవీ సోదరిని ఈయన పెళ్లి చేసుకున్నారు.అల్లరి నరేశ్ 'నేను', అల్లుడు గారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా తదితర సినిమాలని బ్రహ్మానందం నిర్మించారు. ఇప్పుడు ఈయన చనిపోవడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్) -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. లాలీ పాప్ డైలాగ్ అదిరిపోయింది!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. aఅయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేకమైన కెమియో పాత్రలో వార్నర్ మెరిశారు. ఈ సినిమాలో డ్రగ్ డీలర్‌గా కనిపించారు. అయితే కేవలం 2 నిమిషాల 51 సెకన్లపాటు మాత్రమే కనిపించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 20 సెకన్ల పాటు ఉన్న వీడియోను పంచుకున్నారు. ఇందులో డేవిడ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'లాలీ పాప్స్ ఆర్ రెడ్.. ఎనిమీస్ ఆర్ డెడ్' అంటూ డైలాగ్ చెప్పిన తీరు వార్నర్ ఫ్యాన్స్‌కు జోష్ నింపింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.DAVID BHAI 💥💥Enjoy @davidwarner31's MASS & SWAG on the big screens 🤩🔥Book your tickets for #Robinhood now!🎟️ https://t.co/ogblfmwZTd@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @davidwarner31 @gvprakash #RajendraPrasad @vennelakishore @DevdattaGNage #SaiSriram… pic.twitter.com/PsMo0emXl4— Mythri Movie Makers (@MythriOfficial) March 31, 2025 -
రూ.3 కోట్ల ఆఫర్.. అక్కర్లేదని రిజెక్ట్ చేశాం: శివబాలాజీ దంపతులు
బెట్టింగ్ యాప్స్ (Betting Apps).. ముందు నమ్మిస్తాయి, తర్వాత ముంచేస్తాయి. అది తెలియని అమాయకులు.. అన్ని కష్టాలకు ఒకే ఒక్క పరిష్కారం ఇదేనంటూ బెట్టింగ్ యాప్స్ వలలో పడుతున్నారు. చివరకు ఉన్నదంతా కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడం లేదు. ఇలాంటి యాప్స్‌ను బుల్లితెర సెలబ్రిటీల నుంచి సినిమా స్టార్స్ వరకు చాలామంది ప్రమోట్ చేస్తున్నారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని అడిగారుఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుని కొందరు దానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ యాప్స్ ప్రమోట్ చేయమని తనను కూడా సంప్రదించారంటున్నాడు టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ శివబాలాజీ (Shiva Balaji). శివ బాలాజీ, భార్య మధుమిత (Madhumitha)తో కలిసి ఇటీవల ఓ సాంగ్ చేశాడు. ఈ పాట రిలీజైన నేపథ్యంలో వీరిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.రూ.3 కోట్ల ఆఫర్ఈ సందర్భంగా శివ బాలాజీ, మధుమిత మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చారు. ట్రేడింగ్, బెట్టింగ్.. ఇలా చాలావాటిని ప్రమోట్ చేయమని అడుగుతుంటారు. మమ్మల్ని ఫాలో అయే అభిమానులను ఫ్యామిలీగా భావిస్తాం. వారినెప్పుడూ సరైన దారిలోనే నడవాలని ఎంకరేజ్ చేస్తాం తప్ప పొరపాటున కూడా తప్పులు సలహాలు, సూచనలు ఇవ్వం. అందుకే అలాంటి ప్రమోషన్స్ చేయలేదు. చేయము కూడా! అని పేర్కొన్నారు.చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్ -
'సర్దార్2' నుంచి ప్రోలాగ్ వీడియో.. భారీ యాక్షన్ సీన్స్‌లో కార్తి
కోలీవుడ్ హీరో కార్తి (Karthi) నటించిన సర్దార్2 (Sardar 2) నుంచి ‘ప్రోలాగ్’ను తాజాగా విడుదల చేశారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతుంది. ఇందులో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్( Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య(SJ Suryah) కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022లో స్పై, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా విడుదలైన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా సర్దార్2 మూవీని నిర్మించారు. సర్దార్ కొడుకు పాత్ర రా ఏజెంట్‌గా కార్తి కనిపించనున్నాడు. ఈ మిషన్ కంబోడియాలో జరగనుందని తెలుస్తోంది.సర్ధార్ –2 చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కొద్దిరోజుల క్రితమే కార్తి డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, జార్జ్ విల్లియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా సర్ధార్ –2 చిత్రం త్వరలోనే పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. -
'లగ్గం టైమ్' షూటింగ్ పూర్తి.. వేసవిలో విడుదల
రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'లగ్గం టైమ్'. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. కె.హిమ బిందు నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించగా దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. (ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)ఇక తాజా షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. 'లగ్గం టైమ్' లో యూత్ ను మాత్రమే కాదు టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని.. సినిమా చాలా బాగా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు. వేసవి కానుకగా మూవీ రిలీజ్ ఉండబోతుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే) -
'మ్యాడ్ స్క్వేర్' మూడురోజుల్లోనే కలెక్షన్ల రికార్డ్స్ క్లబ్లో ఎంట్రీ
మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. మార్చి 28 సినిమా విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. థియేటర్స్ రన్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ నవ్వులు, పంచ్ డైలాగ్స్‌తో మ్యాడ్ గ్యాంగ్ దుమ్మురేపుతున్నారు. అందరి అంచనాలను దాటేసి ఎవరూ ఊహించలేని కలెక్షన్లను ఈ సినిమా రాబడుతుంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం కేవలం మూడోరోజుల్లోనే ఫస్ట్ మైలురాయిని దాటేసింది.2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు.నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పిస్తున్నారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజే రూ. 20.8 కోట్లు, రెండో రోజు రూ. 16.4 కోట్లు, మూడోరోజు రూ. 13 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, నేడు రంజాన్ ఉంది కాబట్టి మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ మూవీ సత్తా చాటుతుంది. అక్కడ వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ గ్యాంగ్ పిచ్చెక్కిస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
ఉగాది, రంజాన్ రెండు పండుగల తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కూడా సినిమాల సందడి ఉంది. ఇప్పటికే థియేటర్స్‌లో లూసిఫర్, మ్యాడ్, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇంకో వారం పాటు బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాల హవా ఉంటుంది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్స్‌లోకి వచ్చే పెద్ద సినిమాలు లేవని చెప్పవచ్చు. విద్యార్థులకు దాదాపుగా పరీక్షలు ముగిశాయి. ఎండలు పెరిగాయి దీంతో ఇంట్లోనే ఉంటూ సరదాగా సినిమాలు చూసే వారికి చాలానే ఉన్నాయి. మండు వేసవిలో చల్లని వినోదాన్ని పంచడానికి ఓటీటీలో సినిమాలు సిద్ధమయ్యాయి. మరి ఏప్రిల్ మొదటి వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న చిత్రాలేంటి..? తెలుసుకుందాం.నెట్‌ఫ్లిక్స్🎥 టెస్ట్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 4🎥 కర్మ కొరియన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఎప్రిల్ 4అమెజాన్ ప్రైమ్🎥 బ్లాక్ బ్యాగ్- ఏప్రిల్ 1🎥 అక్టోబర్ 8- ఏప్రిల్1🎥 ది బాండ్స్‌మ్యాన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఏప్రిల్ 3జియో హాట్‌స్టార్🎥 జ్యూరర్ 2 (ఇంగ్లీష్/తెలుగు) ఏప్రిల్ 1🎥 హైపర్ నైఫ్ (కొరియన్/ తెలుగు) వెబ్ సిరీస్ ఏప్రిల్ 2🎥 ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 3🎥 టచ్ మీ నాట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4జీ5🎥 కింగ్స్‌స్టన్ (తెలుగు/తమిళ్)- ఏప్రిల్ 4ఆహా🎥 హోం టౌన్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4 -
'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్
ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు నితిన్ (Nithiin). ఇతడు హీరోగా నటించిన తొలి చిత్రం జయం (Jayam Movie). తేజ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ మూవీలో గోపీచంద్ విలన్‌గా నటించాడు. సదా హీరోయిన్గా పరిచమైంది. అయితే ఈ సినిమాలో మొదట సదాని కథానాయికగా అనుకోలేదట!రష్మీతోనే రిహార్సల్స్ చేశా..హీరో నితిన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఉగాది ఈవెంట్‌కు హాజరైన అతడు జయం సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. జయం సినిమాకు రష్మీ గౌతమ్ (Rashmi Gautam)తో కలిసి రిహార్సల్స్ చేసినట్లు తెలిపాడు. దాదాపు 90 శాతం సీన్లు రష్మీతో రిహార్సల్స్ చేశానని, చివర్లో ఏమైందో ఏమో కానీ హీరోయిన్ను మార్చేశారు అని పేర్కొన్నాడు.బుల్లితెరపై సెటిలైన రష్మీఒకవేళ రష్మీ గనక హీరోయిన్గా జయం సినిమా చేసుంటే అప్పట్లోనే స్టార్ అయిపోయేది. పేరుప్రఖ్యాతలతో పాటు మంచి అవకాశాలు వచ్చేవి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బోల్డ్ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. కానీ అవేవీ వర్కవుట్ కాకపోవడంతో బుల్లితెరపై సెటిల్ అయింది. గతంలో యువ సీరియల్లో నటించిన ఆమె ప్రస్తుతం కామెడీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.సినిమానితిన్ హీరోగా నటించిన లేటెస్ట మూవీ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయిక. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్ -
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు.. లూసిఫర్‌పై 'పృథ్వీరాజ్' తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్ అయ్యారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశారు.లూసిఫర్2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్ 2: ఎంపురాన్' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్‌లాల్ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు. నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్‌ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.2002 సమయంలో గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్‌గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి. -
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్‌కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దర్శకులు హరీశ్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే.. నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్‌గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.హరీశ్ శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్స్‌లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. -
'ఆదిత్య 369' రీరిలీజ్.. 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ట్రైలర్
టాలీవుడ్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్లో 'ఆదిత్య 369' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని దక్కించుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీరిలీజ్‌తో మరోసారి టైమ్‌మిషన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైందని ఇప్పటికే బాలకృష్ణ ప్రకటించారు. -
ఆదిత్య 369 సీక్వెల్‌కి కథ సిద్ధమైంది: బాలకృష్ణ
‘‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైంది. పార్టు 2 సబ్జెక్ట్‌ను ఒక రాత్రిలో ఫైనలైజ్ చేశాం. నేను, సింగీతంగారు మళ్లీ మాట్లాడుకోవాలి’’ అన్నారు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 34 సంవత్సరాల తర్వాత 4 ఓ డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ‘ఆదిత్య 369’ సినిమా రీ–రిలీజ్ ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఆదిత్య 369’ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. రీ రిలీజ్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఈ సినిమాకు ముఖ్యమైన శ్రీకృష్ణ దేవరాయల పాత్రను నేను చేయడానికి కారకులైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగార్లకు హ్యాట్సాఫ్’’ అన్నారు.‘‘ఆదిత్య 369’ని నిర్మించు... కొన్ని దశాబ్దాలపాటు గుర్తుంటుందని ఎస్పీ బాలుగారు అన్నారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోందంటే అది నా పూర్మజన్మ సుకృతం’’ అని తెలిపారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘నాడు రామారావుగారు వేసిన శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో (‘మహామంత్రి తిమ్మరుసు’లో) అంతే అద్భుతంగా రాణించాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యమౌతుందని భావించి, ఆయన్ను సంప్రదించాను.బాలకృష్ణ ఓకే అనడం... ‘ఆదిత్య 369’ స్టార్ట్ కావడం... చకా చకా జరిగిపోయాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్‌ను నమ్మి, నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్‌కి ఈ సినిమా క్రెడిట్లో సింహభాగం దక్కుతుంది’’ అని వీడియో బైట్ రిలీజ్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అతిథులుగా దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. -
వారంలో తొలి షాట్
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇటీవల పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా... సినిమా టైటిల్ ప్రకటించిన రోజునే ఈ సినిమాలోని రామ్‌చరణ్ లుక్‌ని విడుదల చేశారు. ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే... ఈ చిత్రానికి సంబంధించిన తొలి షాట్‌ను శ్రీరామ నవమి (ఏప్రిల్ 6)కి విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.మల్టీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమేరా: ఆర్. రత్నవేలు. -
పసందైన విందు
క్రేజీ కపుల్ సూర్య–జ్యోతిక ఆదివారం ఉదయం చెన్నైలోని తమ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాధికా శరత్ కుమార్, రమ్యకృష్ణ, త్రిష, నృత్య దర్శకురాలు బృంద తదితరులు పాల్గొన్నారు.∙సెల్ఫీ సందడి ‘‘రుచికరమైన ఆహారం... ఆప్త మిత్రులతో హ్యాపీగా సమయాన్ని గడిపాం. మేం ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు మరింత బలంగా మారిపోతాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు త్రిష. అలాగే తారలతో సూర్య తీసిన సెల్ఫీ వైరల్‌గా మారింది. – ‘సాక్షి’ తమిళ సినిమా, చెన్నై -
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం చేస్తున్నారు. తాజాగా ఉగాది పండుగను సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.తాజా పోస్టర్ చూస్తుంటే ఈ మూవీని ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కథగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నవీన్ చంద్ర గతంలో కూడా చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పోలిమేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. A family on edge.A cop at the door.And a story that’s about to explode💥Welcome to #SHOWTIME – First Look is out now!🌟ing @Naveenc212 #kamakshibhaskarla@SkylineMoviez @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop @gavireddy_srinu… pic.twitter.com/O2FSZA6IOt— Skyline Movies (@SkylineMoviez) March 30, 2025 -
Vaishnavi Chaitanya: ఒక్క హిట్...తెలుగమ్మాయికి భారీ రెమ్యునరేషన్
తారల తలరాతలు మార్చడానికి ఒకే ఒక్క సినిమా చాలు. హిట్ పడ్డాక ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ హిట్ కోసం తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) చాలా కాలమే ఎదురు చూసింది. కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్వేర్ డెవలపర్' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి... అటు తర్వాత 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమాల్లో చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ వాటితో కూడా యూత్ ను మెప్పించారు.అందువల్ల 'బేబీ' సినిమాలో వైష్ణవికి మెయిన్ హీరోయిన్ ఛాన్స్ వరించింది.ఆ ఒక్క చిత్రమే ఈ తెలుగమ్మాయి జీవితాన్ని మార్చేసింది.ఆ చిత్రంలో యూత్ లోనే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు వైష్ణవి. ఇప్పుడు ఆమె నటిస్తున్న 'జాక్' సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్ పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనున్నారు వైష్ణవి. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు, డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు. మొన్నటి వరకు ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఫామ్‌లో లేరు. ఇలాంటి టైంలో దర్సకనిర్మాతలకి వైష్ణవి చైతన్య వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది ఆమెకి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో వైష్ణవి పారితోషికం కూడా పెరిగినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట ఓ యువ నిర్మాత, దర్శకుడు. వైష్ణవికి యూత్‌లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శకనిర్మాతలు సిద్దమైనట్టు సమాచారం.ఇలా తన అప్ కమింగ్ సినిమాకి గాను వైష్ణవి పారితోషికం కోటి రూపాయల మార్క్ టచ్ అయినట్టు స్పష్టమవుతోంది. -
సమంత నిర్మాతగా తొలి మూవీ.. టీజర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల్లో నటించి చాలా రోజులైపోయింది. చివరగా 'ఖుషి'లో కనిపించింది. తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసిందంతే. మరోవైపు నిర్మాణ సంస్థ స్థాపించింది. ఇప్పుడు అందులో నిర్మించిన సినిమాని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేసింది కూడా.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమాకు శుభం టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం దీని గురించి బయటపెట్టగా.. ఇప్పుడు ఉగాది సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ) -
ఉగాది బుట్టబొమ్మలు.. సితార ఇలా మృణాల్ అలా
లంగాఓణీలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సితారఇంట్లో ఉగాది సెలబ్రేట్ చేసుకున్న అనసూయగిబిలీ ట్రెండ్ ప్రయత్నించిన యాంకర్ శ్రీముఖికామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ప్రగ్యా జైస్వాల్పద్ధతిగా కనిపించి షాకిచ్చిన కేతిక శర్మతిరుపతి దర్శనం చేసుకున్న హీరోయిన్ ఈషా రెబ్బలాక్మే ఫ్యాషన్ వీక్ లో రచ్చ లేపిన జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
ఇక్కడ తెలివిగా మిస్.. అక్కడ దెబ్బ పడింది!
చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రష్మికది ఇంకా చిన్న వయసే. కానీ సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. అందుకే ఇప్పడు పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన రష్మిక జోరుకి 'సికిందర్'తో ఇప్పుడు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి)అసలు విషయానికొస్తే ఈద్ సందర్భంగా సికందర్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజైంది. సల్మాన్ ఖాన్ హీరో కాగా రష్మిక హీరోయిన్. తొలి ఆట నుంచే దీనికి నెగిటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందే పైరసీ అవడం మరో మైనస్. సోషల్ మీడియా ట్రెండ్ చూస్తుంటే సినిమా గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది.మరోవైపు తెలుగులో రాబిన్ హుడ్ మూవీ తాజాగా రిలీజైంది. దీనికి కూడా మొదటి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. సోమవారం వస్తే అసలు ఫలితం తేలుతుంది. తొలుత ఈ మూవీలో రష్మికనే హీరోయిన్. కానీ కొన్ని కారణాలతో ఈమె తప్పుకోవడంతో శ్రీలీలకు ఛాన్స్ వచ్చింది. కాకపోతే హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో రష్మిక ఇక్కడ తప్పించుకుంది గానీ బాలీవుడ్ లో సికిందర్ దెబ్బకు దొరికేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్) -
హ్యాపీ ఉగాది.. అమ్మ చేసిన పచ్చడిని ఆస్వాదించిన జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు తనదైన పాత్రలతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నారు. గతేడాది పుష్ప-2లో మెప్పించిన జగపతి.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు గాటి, జాట్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు జగ్గు భాయ్.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటారు. సరదా పోస్టులతో అలరిస్తుంటారు. ఇటీవల ఆమనితో కలిసి ఓ మూవీ సెట్లో సరదాగా తన సినిమా శుభలగ్నం సీన్‌ను అందరికీ గుర్తు చేశారు. మళ్లీ అమ్మేయడానికి మేకప్ వేస్తున్నావా? అంటూ ఆటపట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ చేతులతో చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. అమ్మతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జగపతి బాబుకు ఉగాది శుభాకాంక్షలు చెబుతున్నారు.Manchivallandharikey ughaadhi subhakhankshalu… pic.twitter.com/Tc0Vq48YfT— Jaggu Bhai (@IamJagguBhai) March 30, 2025 -
కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా: కోర్ట్ టీమ్‌పై మెగాస్టార్ ప్రశంసలు
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ కింగ్ అనే విషయం మరోసారి రుజువైంది. ఆ మాటను ఇటీవల విడుదలైన కోర్ట్ మూవీ మరోసారి స్పష్టం చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించిన దానికంటే అధికంగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ మూవీపై పలువురు టాలీవుడ్ అగ్ర సినీతారలు ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ మూవీ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కోర్ట్ మూవీ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరు.. సినిమా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ఉండడంతో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావించానని అన్నారు. కానీ ఈ కథను చాలా స్ట్రైట్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో శివాజీ చాలా క్రూయల్‌గా నటించారని.. రోషన్, శ్రీదేవి అద్భుతంగా చేశారని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవితో ప్రియదర్శి కాసేపు సినిమా కాన్సెప్ట్ గురించి వివరించారు. ఠాగూరు మూవీ తర్వాత అంతలా చర్చించుకున్న సినిమా ఇదేనని ప్రియదర్శి అన్నారు. కాగా.. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఈ -
'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి
రామ్ చరణ్ కొత్త సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా రెండు పోస్టర్స్ రిలీజ్ చేసి మూవీ ఎంత రస్టిక్ గా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. అయితే పోస్టర్స్ తో సంతృప్తి పడని ఫ్యాన్స్.. గ్లింప్స్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. కొన్నాళ్ల క్రితం ఛాతీనొప్పి రావడంతో బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. దీంతో పుట్టినరోజున గ్లింప్స్ ఉండకపోవచ్చని అనుకున్నారు. అలానే జరిగింది. శ్రీరామనవమి రోజున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.బహుశా గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ క్యారెక్టర్ తో పాటు రిలీజ్ తేదీపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశముంది. వచ్చే ఏడాది మార్చి 27న అనుకుంటున్నారు. కానీ మరి అది నిజమో కాదో చూడాలి. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు.(ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ) -
పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ
పూరీ జగన్నాథ్ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్. కానీ రానురాను తన సినిమాలతో తానే డౌన్ ఫాల్ అవుతూ వచ్చాడు. ఇప్పటికీ పూరీ.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తే చూడాలనేది చాలామంది ఫ్యాన్స్ కోరిక. అలాంటిది వరస ఫ్లాప్స్ తర్వాత అదిరిపోయే హీరోని పట్టి, సినిమాని సెట్ చేశాడు.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నట్లే తమిళ హీరో విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఛార్మితో నిర్మిస్తున్నాడు కూడా. జూన్ షూటింగ్ మొదలవుతుందని, ఐదు భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నామని ఉగాది సందర్భంగా ఫొటో రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు.ఈ ప్రకటనతో కొన్ని విషయాల్లో పూరీ క్లారిటీ ఇచ్చినట్లయింది. ఛార్మితో విడిపోతారనే రూమర్స్ కొన్నిరోజుల క్రితం వచ్చాయి. కానీ ఇప్పుడు వాటికి చెక్ పెట్టారు. అలానే లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్స్ వల్ల చాలామంది బయ్యర్లు.. పూరీ తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మరి నిర్మాతగా మూవీస్ చేయడేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సేతుపతి మూవీని కూడా పూరీ-ఛార్మినే నిర్మిస్తూ ఆయా పుకార్లకు చెక్ పెట్టినట్లయింది.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్') View this post on Instagram A post shared by Puri Connects (@puriconnects) -
‘SSMB 29’లో నాన్న లుక్ అదిరిపోతుంది: సితార
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu) గారాల పట్టి సితార (Sitara) కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. సినిమాల్లోకి రాకపోయినా ఓ స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. ఆమె ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. అతి చిన్న వయసులోనే అత్యధిక ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. అయితే ఈ చిన్నారి త్వరలోనే వెండితెరపైకి రావడం ఖాయం. మహేశ్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పాడు. చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వచ్చే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్గా మారకముందే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటుంది. తాజాగా సీతూ పాప హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పీఎంజే 40వ స్టోర్ ఓపెనింగ్‌కి వెళ్లింది. దీంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివెళ్లారు. షాపు ఒపెనింగ్ అనంతరం సితార మీడియాతో మాట్లాడుతూ మహేశ్ బాబు, రాజమౌళి సినిమా(SSMB 29) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘ఎస్ఎస్ఎంబీ29’ నాన్న లుక్ అదిరిపోతుంది. మీరు ఊహించుకుంటున్నదానికంటే ఎక్కుకే ఈ సినిమా ఉంటుంది. ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను’ అని చెప్పింది. అలాగే తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పీఎంజే కోసం మరోసారి మహేశ్‌తో కలిసి యాడ్ చేయబోతున్నట్లు సితార వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందే సితార ఇలా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, షాపు ఓపెనింగ్స్ కి వెళ్లడం పట్ల ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బుల్లితెర సెలబ్రిటీల ఉగాది... సోనియా అలా.. శోభా శెట్టి ఇలా..!
పండగ వచ్చిందంటే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. పిండివంటలు, కొత్త బట్టలు.. ఇలా ఆరోజంతా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా ఉగాది అనగానే సాంప్రదాయ దుస్తులే ధరిస్తుంటారు. బుల్లితెర సెలబ్రిటీలు కూడా అంతే! వారు ట్రెడిషనల్ ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సోనియా ఆకుల, శోభా శెట్టి, ప్రియాంక జైన్, యష్మి గౌడ సహా పలువురు బిగ్‌బాస్ తారలు ఎలా రెడీ అయ్యారో కింద మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shobha Shetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Y A S H M I G O W D A (@yashmigowda) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) -
20 ఏళ్ల కిందట విడాకులు.. అమ్మ మాటలకు డిప్రెషన్లో..: ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) తనయుడు చరణ్ సింగర్ మాత్రమే కాదు నిర్మాత, నటుడు కూడా! ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లైఫ్: లవ్ యువర్ ఫాదర్. తండ్రిపై ప్రేమతో చరణ్ తన పేరును SPB చరణ్ (SPB Charan)గా మార్చుకున్నాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చరణ్ మాట్లాడుతూ.. నా జీవితంలో గెలుపు, ఓటమి.. రెండూ చూశాను. ఉదాహరణకు 2000వ సంవత్సరంలో అనుకుంటాను.. రూ.75 లక్షలు పెట్టి తొలిసారి ఓ సినిమా నిర్మిస్తే అంతా కోల్పోయాను.20 ఏళ్ల కిందటే విడాకులునా కుటుంబ విషయానికి వస్తే.. నేను అమెరికాలో ఓ అమ్మాయిని ప్రేమించాను. తనను ఇంట్లో పరిచయం చేశాను. అందరి ఆశీర్వాదంతో మేము పెళ్లి చేసుకున్నాం. మాకు జాహ్నవి, మయూక అని కవలపిల్లలు సంతానం. న్యూయార్క్‌లో చదువుకుంటున్నారు. తల్లితో కలిసి అక్కడే ఉంటున్నారు. నాకు, నా భార్యకు 2005లో విడాకులయ్యాయి. ప్రతి ఏడాది న్యూయార్క్ వెళ్లి కనీసం పది రోజులైనా పిల్లలతో కాలక్షేపం చేస్తుంటాను.డిప్రెషన్లోకి వెళ్లిపోయా..అయితే నా పెళ్లయిన కొత్తలో ఎక్కువగా ఖాళీగా ఉన్నాను. నేను కెరీర్లో స్లో అయ్యేసరికి అమ్మ తిట్టడం మొదలుపెట్టింది. ఈ వయసులో నాన్నను పనికి పంపించి నువ్వు దున్నపోతులా పడుకుంటున్నావేంట్రా అని విసుక్కునేది. ఆ మాటలు నా మనసుకు తగిలాయి. నా అంతట నేను ఏం చేయలేకపోతున్నానని డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు కె. బాలచందర్ ఆఫీస్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అలా సీరియల్ ఆడిషన్‌కు వెళ్లి అందులో యాక్ట్ చేశాను. అక్కడైన పరిచయాలతో నిర్మాతగా మారిపోయాను.హీరో అజిత్, నేను క్లోజ్..నిజానికి నేను చదువుకునే రోజుల్లోనే హీరోగా ఛాన్స్ వచ్చింది. అదెలాగంటే.. అజిత్, నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఐదారేళ్లపాటు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాను. సరిగ్గా అప్పుడే డైరెక్టర్ వాసంత్ ఆశై సినిమా కోసం మా నాన్నను సంప్రదించాడు. నా చదువు పాడు చేయడం ఇష్టం లేక నాన్న నా స్నేహితుడు అజిత్ పేరు సూచించాడు. అలా ఆశై అజిత్ చేయడం.. అది బ్లాక్‌బస్టర్ అవడం నాకు సంతోషంగా అనిపించింది. మేము కనిపిస్తే మాట్లాడుకుంటాం తప్ప పెద్దగా టచ్‌లో లేము అని ఎస్పీ చరణ్ చెప్పుకొచ్చాడు.సినిమా పాటలుఎస్పీ చరణ్.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా.., చెప్పవే ప్రేమా.., నేను నేనుగా లేనే.., ఒక తోటలో ఒక కొమ్మలో.., తెలుగు భాష గొప్పదనం, మెల్లగా కరగనీ.., అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే.., చాలు చాలు చాలు.., ఉయ్యాలో ఉయ్యాల.. ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: గంట లేటైందని సెట్లో కమల్ హాసన్ తిట్టాడు: సీనియర్ హీరోయిన్ -
'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే?
ఈసారి ఉగాది కానుకగా థియేటర్లలోకి నాలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా, రెండు డబ్బింగ్ బొమ్మలు. కానీ వీటిలో మ్యాడ్ స్క్వేర్ మాత్రమే ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజులో వచ్చాయి. ఏకంగా రెండో రోజుకే లాభాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్')2023లో మ్యాడ్ మూవీ రిలీజైనప్పుడు.. ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ పై హైప్ బాగానే ఏర్పడింది. మొదటితో దానితో పోలిస్తే అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నప్పటికీ యూత్ అంతా దీనికే ఓటు వేస్తున్నారు. కామెడీ మూవీ కావడం కూడా దీనికి ప్లస్ అయింది.అలా మ్యాడ్ స్క్వేర్ మూవీకి రెండు రోజుల్లో రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. తొలిరోజు ఎంతొచ్చిందనేది మాత్రం బయటపెట్టలేదు. ఈ సినిమా ఓవర్సీస్ లోనూ ($850k) మిలియన్ డాలర్ వసూళ్లకు దగ్గరగా ఉంది. ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్ లో రూ.100 కోట్ల మార్క్ చేరినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్'.. ఫారెన్ పోలీస్?)They came. They saw. They went full MAD 🔥🔥#MADSquare hits 37.2Cr Worldwide Gross in 2 days 💥💥Wishing you all a very #HappyUgadi ✨#BlockBusterMaxxMadSquare is turning this festive season into a MAD CELEBRATION at theatres ❤️🔥❤️🔥@NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/U9zor9ABrZ— Sithara Entertainments (@SitharaEnts) March 30, 2025 -
ప్రభాస్ 'స్పిరిట్'.. ఫారెన్ పోలీస్?
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ అంత బిజీ హీరో మరొకరు లేరేమో. ఎందుకంటే చేతిలో ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ ఉన్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' కోసం రెడీ అవుతున్నాడు. తాజాగా యూఎస్ లో ఓ చోట ఉగాది సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సందీప్.. మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్')'ప్రస్తుతం మెక్సికోలో లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాం. త్వరలో అక్కడే షూటింగ్ మొదలుపెడతాం' అని సందీప్ వంగా చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ల స్పిరిట్ కూడా లోకల్ పోలీస్ స్టోరీ ఏమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సందీప్.. మెక్సికో అంటుంటే ఫారెన్ పోలీస్ క్యారెక్టరా అని మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసి రెడీగా ఉన్న సందీప్.. ప్రభాస్ సెట్ కి రావడమే ఆలస్యం, షూటింగ్ చకచకా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవిలో స్పిరిట్ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మే నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)Finally An UGADI Treat 😍We are Planning to Shoot #Spirit in #Mexico... currently location recce is going on, Shoot Starts Soon 🔥💥- Sandeep vanga#Prabhas pic.twitter.com/3GmsWVhMuX pic.twitter.com/8YKCqCFLnx— PrabhasWarriors𝕏 (@PRABHASWARRlORS) March 30, 2025 -
Mega 157: ఉగాదికి స్టార్ట్.. సంక్రాంతికి రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో ఇది 157వ సినిమా. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది సందర్భంగా నేడు (మార్చి 30) రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగాయి. హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు.సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుందని, చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఒక పాత్ర కోసం ఇప్పటికే అదితిరావు హైదరిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ని ఇంకా ఫైనల్ చేయలేదు. చిరంజీవి సినిమాల విషయాలకొస్తే..ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
హీరో ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు
బంజారాహిల్స్(హైదరాబాద్): తనను చంపుతామని బెదిరించిన హీరో ప్రభాస్ పీఆర్వోగా చెప్పుకుంటున్న వ్యక్తిపై యూట్యూబర్ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–44లో డయల్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో విజయ్‌సాధు అనే జర్నలిస్ట్ అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. తన డయల్ స్యూస్ ఛానల్లో ఈ నెల 4న హీరో ప్రభాస్‌కు మేజర్ సర్జరీ జరిగిందంటూ ఓ వీడియోను విజయసాధు పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. మరుసటి రోజు సురేష్ కొండి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రభాస్ పీఆర్వోనని పరిచయం చేసుకున్నాడు. డార్లింగ్ ఇన్ డేంజర్ అనే హెడ్డింగ్‌తో ప్రభాస్‌కు మేజర్ సర్జరీ జరిగిందంటూ, అనారోగ్యం బారిన పడ్డాడంటూ డయల్ న్యూస్ యూట్యూబ్‌లో పెట్టిన పోస్ట్‌కు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని సురేష్ ప్రశ్నించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే ఈ వీడియోను విజయ్‌సాధు డిలీట్ చేయలేదు. దీంతో సురేష్ ఈ పోస్ట్‌ను ప్రభాస్ ఫ్యాన్స్‌కు పంపించాడు. ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు ఫోన్‌కాల్, ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజ్‌లలో విజయసాధును తీవ్రంగా దూషిస్తూ నిన్ను చంపేస్తాం..నీ ఆఫీసును తగలబెడతాం..అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 మంది యువకులు యూట్యూబ్ కార్యాలయానికి వచ్చి తాము ప్రభాస్ అభిమానులం అంటూ న్యూసెన్స్ చేయగా భయాందోళనకు గురైన విజయసాధు డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అల్లరి మూకలను పంపించి వేశారు. న్యూసెన్స్‌కు కారణమైన సురేష్ కొండిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సికందర్' సినిమా థియేటర్స్‌లోకి వచ్చేసింది. రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. రజనీకాంత్ దర్బార్ (2020) సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో సికిందర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. ఇప్పటికే పలుచోట్ల సినిమా చూసిన నెటిజన్లు సికిందర్‌పై తమ ఎక్స్ పేజీలలో ఇలా చెప్పుకుంటున్నారు.సికిందర్ అందరికి షాక్ ఇచ్చాడు అంటూ నెటిజన్లు పంచులు వేస్తున్నారు. సినిమా ఏమాత్రం అంచనాలకు కనీసం దగ్గర్లో కూడా లేదని చెబుతున్నారు. అవుట్ డేటెడ్ కథను ఎన్నిసార్లు మాకు చూపుతారంటూ చెబుతున్నారు. ఇందులో ఒక సాంగ్ మినహా సంగీతం చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు. సినిమా చూసి ఎంజాయ్ చేయాడానికి అందులో ఏమీ లేదని చెబుతున్నారు. సల్మాన్ , AR మురుగదాస్ కాంబోకి సికిందర్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం తెలుపుతున్నారు.సల్మాన్ ఖాన్ ఎంట్రీ సీన్ చాలా హైప్లో ఉంటుందని అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ నటించిన గత సినిమాలకు సికందర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది అందుకే ప్రేక్షకులకు నచ్చలేదని అభిమానులు తెలుపుతున్నారు. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయంటున్నారు. కానీ, సాధారణ ప్రేక్షకుల మాత్రం ఇదేం సినిమా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి కథ పట్టుకుని సల్మాన్‌ను మురగదాస్ ఎలా ఒప్పించాడు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. సినిమాపై డివైడ్ టాక్ భారీగా వస్తున్నా సల్లూ భాయ్ ఫ్యాన్స్ మాత్రం సికిందర్‌ను బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.పైసా వసూల్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు చెబుతున్నప్పటికీ కామన్ ఆడియెన్స్ నుంచి మాత్రం చెత్త సినిమా అంటూ రివ్యూలు ఇస్తున్నారు. మురుగదాస్ ఇకనైన సినిమాల నుంచి రిటైర్ అయిపోవడం మంచిదని తెలుపుతున్నారు. కాజల్ అగర్వాల్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. విలన్‌గా సత్యరాజ్ కూడా సెట్ కాలేదని తెలుపుతున్నారు. సల్మాన్ కనిపిస్తే చాలు బీజీఎమ్‌తో సంతోష్ నారయణ బాగా ఇబ్బంది పెట్టాడని ఒకరు కామెంట్ చేశారు. ఫస్టాఫ్ ఏదో కాస్త ఓకే అనుకుంటే సెంకండాఫ్లో స్టోరీ మరింత ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. ఫైనల్‌గా సల్మాన్‌కు సికిందర్ బిగ్ డిజాస్టర్‌గా మిగిలిపోతుందని ఎక్కువమంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. #Sikandar is a dull action drama with a lifeless story that fails to engage. The background music is very bad, and except for a few decent action scenes, there’s nothing to enjoy. Biggest disaster for Salman and AR Murugadoss combo.— LetsCinema (@letscinema) March 29, 2025#Sikandar Public reviews are coming out and it’s disappointing .. Another mess by salman khan on eid 😢#SikandarReview pic.twitter.com/JPZkestxMs— Cheemrag (@itxcheemrag) March 30, 2025Crowd goes crazy on Megastar #SalmanKhan entry scene in #Sikandar movie.Theatre Turn Into Stadium 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #SikandarReview #Sikandar pic.twitter.com/ytTrI7CQaO— Filmy_Duniya (@FMovie82325) March 30, 2025@ARMurugadoss pls get retire.#Sikandar #SalmanKhan We appreciate your contributions to the film industry with your successful movies. However, we kindly request that you refrain from directing any further films.. Heart-full Request.— Daino (@ursrokk) March 30, 2025The audience is showering love on #Sikandar. Another blockbuster loading for @iamRashmika and @BeingSalmanKhan. 🔥🔥#RashmikaMandanna ❤️#SalmanKhan #Sikandar 🔥 pic.twitter.com/xywPwUnhFA— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) March 30, 2025Sikandar Review ⭐️⭐️⭐️⭐️⭐Blockbuster, Blockbuster, Blockbuster......Just Saw sikandar- #Sikandar is the best #SalmanKhan film after Bajrangi Bhaijaan, Yes even better than Sultan and TZH.Even I cry after Watching it, Too emotional and Action packedMany goosebump moments. pic.twitter.com/QPqlNohEGG— taran adarsh (@taran_adarsh76) March 29, 2025 -
కోటు తొలగిస్తూ 'జాన్వీ కపూర్' ర్యాంప్ వాక్.. వీడియో వైరల్
లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన గ్లామర్ వాక్‌తో హీట్ పెంచింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు నటి జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. ఆయన డిజైన్ చేసిన దుస్తులను ఎందరో మోడల్స్ ధరించి పలు స్టేజీలపైనా ర్యాంప్ వాక్ చేశారు. ఇప్పుడు తొలిసారి జాన్వీ కూడా రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆకట్టుకుంది.జాన్వీ కపూర్ నల్లటి దుస్తుల్లో ర్యాంప్‌పై నడిచింది. పొడవాటి నల్లటి కోటు కింద అద్భుతమైన బంధానీ బాడీకాన్ డ్రెస్‌లో స్టేజీపై ఆమె అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె హీల్స్ కూడా ఎంచుకుంది. స్టేజీపై మధ్యలోనే జాన్వీ తన కోటు తీసేసి పోజులిచ్చింది. కొంతదూరం అలా తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించింది. డ్రెస్ డిజైనర్ బ్రాండ్ (AFEW Rahul Mishra) కోసం జాన్వీ భాగమైంది. భవిష్యత్‌లో మరిన్ని కొత్త డిజైన్ డ్రెస్‌లతో ఆమె ఫోజులు ఇవ్వనుంది.ఆమె ఆకర్షణీయమైన దుస్తులు, డైనమిక్ స్టైల్‌తో పాటు అక్కడ వినిపించే సంగీతం అన్నీ ఒకదానికొకటి ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. జాన్వీ ర్యాంప్ వాక్‌పై చాలా వరకు ప్రశంసలే వచ్చాయి. కానీ, కొందరు మాత్రం ఆమెను తప్పుపట్టారు. వేదికపై నిజమైన మోడల్స్ ఎక్కడ ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వేదికలపై సెలబ్రిటీలకు ఇలా ప్రాధాన్యత ఇవ్వడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇలా అయితే కొత్త మోడల్స్ ఎలా పరిచయం అవుతారని నిర్వాహకులను తప్పపట్టారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle) -
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై పిల్.. కొట్టివేసిన కోర్టు
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ( Sankranthiki Vasthunam) సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీతో దర్యాప్తు చేయించాలని విజయవాడకు చెందిన ఎం.లక్ష్మణకుమార్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ రవితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై తీర్పు ఇచ్చింది. ఏదైనా ఒక సినిమా నిర్మాణ కోసం పెట్టిన ఖర్చు విషయంలో దర్యాప్తు చేయమని తాము ఈడీని ఆదేశించలేమని న్యాయస్థానం తెలిపింది. అలా చేస్తే కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని తెలిపింది. అదంతా అధికార యంత్రాంగం పరిధిలో ఉన్న విషయం అని కోర్టు పేర్కొంది.సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తాము విచారించాల్సింది ఏమీ లేదని కోర్టు పేర్కొంది. ఆ సినిమాకు సంబంధించిన అదనపు షోల ప్రదర్శన ఇప్పటికే పూర్తయిందని గుర్తుచేసింది. కోర్టులో దాఖలు చేసిన పిల్ కేవలం ప్రచారం కోసం మాత్రమే ఉందని పేర్కొంది. భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వాలని గతంలో ఏపీ ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బడ్జెట్ విషయంలో ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. -
పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానంటే ఇలాంటి మాటలన్నారు: జెనీలియా
జెనీలియా( Genelia)... పరిచయం అక్కర్లేని పేరు. ‘అంతేనా... వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్సే. సుమంత్ హీరోగా రూపొందిన ‘సత్యం’ (2003) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ‘సాంబ, సై, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, ఆరెంజ్, రెడీ, బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్నారు. ‘నా ఇష్టం’ (2012) తర్వాత ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పెళ్లి, పిల్లల కారణంగా దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె.ఆ తర్వాత కమ్ బ్యాక్ అవుదామనుకుంటే తెలిసినవారెవరూ ప్రోత్సహించలేదనీ, పైగా నిరాశపరిచారనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు జెనీలియా. ‘‘పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్‌కు దూరం అయ్యాను. కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసినవాళ్లెవరూ ప్రోత్సహించలేదు. ‘పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? ఇది ఏమాత్రం వర్కౌట్ కాదు’ అంటూ నిరాశపరిచారు. కానీ వారి మాటలు వినకుండా ధైర్యంగా రీ ఎంట్రీ ఇచ్చాను. నా భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి నేను నటించిన ‘వేద్’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అన్ని విషయాల్లో ఇతరులను నమ్మకూడదని నాకు అనిపించింది’’ అని తెలిపారు జెనీలియా. ప్రస్తుతం ఆమె ‘సితారె జమీన్ పర్, జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. -
పాటకి వేళాయె
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా, విజయశాంతి కీలకపాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఆరంభించనున్నారు మేకర్స్.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘నాయాల్ది...’ అంటూ సాగే తొలిపాటని ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కల్యాణ్ రామ్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘యాక్షన్ ΄ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్, పృథ్వీరాజ్, సోహైల్ ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రామ్ ప్రసాద్. -
ఇదిదా సర్ప్రైజ్.. విలన్స్‌గా స్టార్ హీరోలు
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేసి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా విలన్ రోల్స్‌ను ప్రయత్నిస్తున్నారు కొందరు హీరోలు. ‘ఇదిదా సర్ప్రైజ్’ అంటూ ఇలా తమ నెగటివ్ షేడ్స్ ట్యాలెంట్‌తో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసిన, సర్ప్రైజ్ చేయనున్న కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.కూలీకి విలన్?సిల్వర్ స్క్రీన్‌పై నాగార్జున నెగటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఆడియన్స్‌లో తప్పక ఉంటుంది. పూర్తి స్థాయి గ్రే షేడ్స్ క్యారెక్టర్లో నాగార్జునను స్క్రీన్‌పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరుణం ఆసన్నమైందని, రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. ‘కూలీ’ సినిమా చిత్రీకరణప్రారంభమైనప్పుడు నాగార్జున ఓ వ్యక్తిని క్రూరంగా కత్తితో చంపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందనే వార్తలకు ఈ వీడియో రూపంలో బలం చేకూరినట్లయింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.బ్రహ్మ రాక్షస హీరోగా ప్రభాస్ కటౌట్‌కి ఉన్న బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఆడియన్స్ చూశారు. మరి... ప్రభాస్‌లాంటి కటౌట్ ఉన్న హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటే ఎలా ఉంటుందో ‘బిల్లా’ సినిమాలో శాంపిల్‌గా ఆడియన్స్ చూశారు. కానీ ఈ డోస్‌ను ఇంకాస్త పెంచి ‘బ్రహ్మ రాక్షస’ సినిమాతో ఆడియన్స్‌ని తన నెగటివ్ షేడ్ యాక్టింగ్ స్కిల్‌తో సర్ప్రైజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బ్రహ్మ రాక్షస’ అనే మూవీ రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తారు. ఈ ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే... ప్రశాంత్ వర్మతో ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను టేకాఫ్ చేస్తారు ప్రభాస్. ఈ లోపు రిషబ్ శెట్టితో ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను పూర్తి చేస్తారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్–ప్రశాంత్ వర్మ కాంబోలోని మూవీ 2026 చివర్లో లేదా 2027ప్రారంభంలో మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను తొలుత రణ్వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్ని కారణాల వల్ల రణ్వీర్ సింగ్ ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.బాలీవుడ్ వార్ ‘టెంపర్, జై లవకుశ’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఎంత రెచ్చిపోయారో ఆడియన్స్ చూశారు. కాగా ఎన్టీఆర్లోని నెగటివ్ షేడ్ యాంగిల్ ఈసారి నార్త్ ఆడియన్స్‌కు కూడా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుందని తెలిసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో హిందీలో ‘వార్ 2’ అనే మూవీ రానుంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ వీరేంద్ర నాథ్పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని, ఆయన క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 14న ‘వార్ 2’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.తొలిసారిగా విలన్‌గా... సిల్వర్ స్క్రీన్‌పై బ్లాక్ బస్టర్ హీరోస్లో అల్లు అర్జున్ ఒకరు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ చిత్రంలో ఆయన క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ‘పుష్ప’ వంటి ఎగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్స్ చేశారు కానీ, పూర్తి స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను అల్లు అర్జున్ చేయలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ రెండు రోల్స్‌లో ఓ రోల్లో నెగటివ్ షేడ్స్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. ఈ వేసవిలో చిత్రీకరణనుప్రారంభించి, 2026 చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంపై పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బ్లాక్ స్వార్డ్ హీరోగా తెలుగు స్క్రీన్‌పై సక్సెస్ అయ్యారు మంచు మనోజ్. ఇప్పుడు విలన్‌గా కనిపించనున్నారు. ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ మైథలాజికల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సూపర్ యోధపాత్రలో తేజ సజ్జా నటిస్తుండగా, బ్లాక్ స్వార్డ్పాత్రలో మంచు మనోజ్ విలన్‌గా కనిపిస్తారు. ఇక ‘మిరాయ్’ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ హీరోలే కాదు... ఇంకొందరు స్టార్స్ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌కి సై అన్నారు. – ముసిమి శివాంజనేయులుకోలీవుడ్ హీరోలు కూడా వీలైనప్పుడు విలన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో మెయిన్ విలన్‌గా కమల్‌హాసన్ నటించారు. కమల్‌హాసన్ హీరోగా చేసిన ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా విలన్‌పాత్రలో కనిపించారు సూర్య. ఇక సూర్య హీరోగా చేసిన ‘కంగువ’ మూవీలో కార్తీ విలన్‌గా కనిపించారు. కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’ సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. కమల్‌హాసన్ ‘విక్రమ్’, కార్తీ ‘ఖైదీ’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నేతృత్వంలోని ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంలోనివే. సో... ‘ఖైదీ 2’ చిత్రంలో సూర్య విలన్‌గా నటించే చాన్సెస్ ఉన్నాయి.⇒ ఇంకా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమా కోసం తొలిసారిగా విలన్‌గా స్క్రీన్‌పై కనిపించనున్నారు రవి మోహన్ (ఇటీవల ‘జయం’ రవి తన పేరును రవి మోహన్‌గా మార్చుకున్నారు). సుధ కొంగర దర్శకత్వంలోని ఈ మూవీ వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుందని తెలిసింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’లో అరుణ్ విజయ్ విలన్‌గా చేస్తున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇంకా వీలైనప్పుడల్లా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, మాధవన్ వంటి యాక్టర్స్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొంతమంది ఉన్నారు.⇒ బాలీవుడ్ హీరోలు కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా చేయ నున్న నెక్ట్స్ మూవీ ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘రామాయణ’ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిపాత్ర చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన అజయ్ దేవగన్ ‘సింగమ్ ఎగైన్’లో అర్జున్ కపూర్ విలన్‌గా చేశారు. ఇంకా బాలీవుడ్లో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న సంజయ్ దత్, బాబీ డియోల్ (హరిహర వీరమల్లు), ఇమ్రాన్ హష్మి (ఓజీ, జీ 2), జిమ్ సర్ఫ్ (కుబేర), సోహైల్ ఖాన్ (అర్జున్ సన్నాఫ్ వైజయంతి), దివ్యేందు (పెద్ది) వంటి వారు తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొందరు ఉన్నారు.⇒ కథ నచ్చితే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసేందుకు హీరోయిన్స్ సైతం వెనకాడటం లేదు. ఈ విషయంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ముందుంటారు. హీరోయిన్గా చేస్తూనే ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తుంటారామె. ఇక వెంకటేశ్ ‘సైంధవ్’లో ఆండ్రియా, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ‘వెన్నెల’ కిశోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో అనన్య నాగళ్ల, అజిత్ ‘విడాముయర్చి’ లో రెజీనా, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్, ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా రాయ్ వంటి వారు కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న సమయంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఇలా మరికొంతమంది ఉన్నారు. -
ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది.. త్రిష పోస్ట్‌కు అర్థమేంటో?
త్రిష (Trisha Krishnan).. తెలుగులోనే కాదు తమిళంలోనూ టాప్ హీరోయిన్. ఈమధ్య తన హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే విజిల్స్ పడాల్సిందే! గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన ఐడెంటిటీ, విడాముయర్చి ఇప్పటికే రిలీజయ్యాయి. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, విశ్వంభర, రామ్.. సహా సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.ప్రేమదే విజయంతాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. దీనికి 'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది' అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ముక్కుపుడక, మల్లెపూలతో సాంప్రదాయంగా ముస్తాబైంది. చెవికమ్మలకు మ్యాచ్ అయ్యే ఉంగరం ధరించింది. ఇది చూసిన కొందరు ఎంగేజ్మెంట్ జరిగిందా? లేదా పెళ్లికి రెడీ అని హింట్ ఇస్తుందా? అని ఆరా తీస్తున్నారు.పెళ్లికి గ్రీన్ సిగ్నల్?తమిళ హీరో విజయ్‌తో త్రిష ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ జీవితాంతం కలిసుందామని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి బుల్లోడు, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, నమో వెంకటేశా.. వంటి పలు చిత్రాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) చదవండి: చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ -
టీనేజ్ లవ్ స్టోరీ మధురం.. రిలీజ్ ఎప్పుడంటే?
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన చిత్రం మధురం. రాజేష్ చికిలే డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై యం.బంగార్రాజు నిర్మించాడు. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. 'మధురం.. ఇట్స్ ఎ క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని అన్నారు.చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. '1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టినట్లు చూపించాం. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది" అని చెప్పారు. హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.."ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరిని అలరిస్తుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు. -
డొక్కా సీతమ్మగా ఆమని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ (Andhrula Annapurna Dokka Seethamma). టి.వి. రవి నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతం అందించారు. ఎం.రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం..400 ఎంకరాలు అమ్మేసి..అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయులైన కథతో సినిమా తీస్తుండటం గొప్ప విషయం. ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాలి. నాలుగు వందల ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు. ఆమని గారు చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుంది’ అని అన్నారు. దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ.. ‘అందరిలాగే చిరంజీవి గారిని చూసి అభిమానిగా మారి 2012లో ఇండస్ట్రీకి వచ్చాను. నా అదృష్టం: దర్శకుడుమొదటి సినిమానే డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలైన కథతో చేస్తుండటం నా అదృష్టం. నా మొదటి చిత్రానికి సుచిత్రమ్మతో ఓ పాట చేయించాలని అనుకున్నాను. చంద్రబోస్ గారు ఇచ్చిన మాట సాయంతోనే ఈ సినిమా స్థాయి పెరిగింది. ఆమని గారు అద్భుతంగా నటించారు. మురళీ మోహన్ గారు అందించిన సహకారాన్ని మర్చిపోలేను. ఆర్ట్ డైరెక్టర్ రవన్న అద్భుతంగా సెట్స్ వేశారు. త్వరలోనే ట్రైలర్‌తో వస్తాం’ అని అన్నారు.ఆమనికి జాతీయ అవార్డు రావాలిమురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆమని చాలా మంచి ఆర్టిస్ట్. అలాంటి గొప్ప ఆర్టిస్ట్‌కు డొక్కా సీతమ్మ పాత్ర వచ్చింది. ఆమని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు. ఆమని మాట్లాడుతూ .. ‘దర్శకుడు వచ్చి డొక్కా సీతమ్మ గారి కథ చెప్పారు. నేను బెంగళూర్‌కు చెందిన వ్యక్తిని. నాకు ఆమె గురించి ఎక్కువగా తెలీదు. రాసిపెట్టి ఉండాలి: ఆమనిదర్శకుడు కథ చెప్పిన తరువాత గూగుల్‌లో ఆమె గురించి సర్చ్ చేశాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకర్థమైంది. ఇలాంటి పాత్ర చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. ఈ పాత్ర దొరకడం నా అదృష్టం’ అని అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయుల కథను సినిమాగా అనుకోవడమే పెద్ద సాహసం. డొక్కా సీతమ్మ అంటే బ్రిటీష్ వారికి కూడా తెలుసు. లండన్ రాజు గారి ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి ఇక్కడే ఉండి అందరికీ సేవ చేశారు. ఇలాంటి చిత్రంలో డొక్కా జోగన్న పాత్రను మురళీ మోహన్ గారు, డొక్కా సీతమ్మగా ఆమని గారు నటిస్తుండటం వారి అదృష్టం’ అన్నారు.చదవండి: నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్ల పంపిణీ -
చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) మార్చి 27న 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈసారి బర్త్‌డేను మెగా ఫ్యామిలీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో పాటు దగ్గరి ఫ్రెండ్స్ సమక్షంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలను చరణ్ భార్య ఉపాసన (Upasana Konidela) సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎంతో ప్రత్యేకం: ఉపాసనమార్చి 27.. ఎప్పటికీ గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మలిచిన అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. మొదటి ఫోటోలో చిరంజీవి- సురేఖ, రామ్ చరణ్ -ఉపాసనతో పాటు సుష్మిత కొణిదెల ఉంది. తర్వాతి ఫోటోల్లో చరణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫోటోలో అయితే చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఉన్నాడు. ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు.పార్టీలో కనిపించని 'అల్లు' కుటుంబంచరణ్ బర్త్‌డేరోజు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం చరణ్ కోసం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టు పెట్టలేదు. ఇప్పుడు బర్త్‌డే పార్టీలో కూడా అల్లు ఫ్యామిలీ లేకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం అలాగే కొనసాగుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చరణ్ సినిమాలురామ్చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రంగస్థలం తర్వాత చరణ్- సుకుమార్ కాంబినేషన్లో ఇది రెండో సినిమాగా తెరకెక్కనుందన్నమాట! రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్బస్టర్లు అందించిన సుకుమార్ ఈసారి అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్‌ను చూపించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: 'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?' -
ఆ సమయంలో చనిపోవాలనుకున్నా.. ధైర్యంతో ‘పొలిమేర’ స్క్రిప్ట్ రాశా: డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా అనిల్ మీడియాతో ముచ్చటిస్తూ తన తొలి సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో ఆయన మాటల్లో.. "28°C" సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇది మొదటి సినిమా. స్క్రిప్ట్ ను బాగా లవ్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాం. క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. మార్చి లో లాక్ డౌన్ వచ్చింది. ఆ తర్వాత సినిమాల రిలీజ్ ల పరిస్థితి ఎలా మారిందో మీకు తెలుసు. ఓటీటీకి ఆఫర్స్ వచ్చాయి గానీ మేము సినిమాకు పెట్టిన ఖర్చుకు వారు ఆడిగిన రేట్ కు సంబంధం లేదు. అందుకే మూవీని ఓటీటీకి ఇవ్వలేదు. పైగా మా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలనే కోరిక ఉండేది. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. "28°C" సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం వల్ల మంచే జరిగిందని భావిస్తాఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ షేడ్స్ ఉంటాయి. మెడికల్ గా 28°C అనే అంశాన్ని కథలో మిక్స్ చేశాం. బ్రెయిన్ డ్యామేజీ అయిన వారు ఎక్కువ వేడి, చల్లదనం తట్టుకోలేరు. అది థియరీగా ఉంది. ఈ అంశాన్ని సినిమా కోసం ఎఫెక్టివ్ గా ఉపయోగించాం. టైటిల్ కనిపించే ప్రశ్నార్థకం మిమ్మల్ని సినిమా చివరి వరకు క్యూరియాసిటికి గురిచేస్తుంది.ఈ సినిమాను మొదట అడివి శేష్ కోసం అనుకున్నాం. అయితే శేష్ క్షణం తర్వాత బిజీ అవడం వల్ల కుదరలేదు. నవీన్ చంద్రకు స్క్రిప్ట్ చెబితే ఆయనకు బాగా నచ్చి చేసేందుకు ముందుకొచ్చారు. జార్జియాలో 25 డేస్ షూటింగ్ చేశాం. ఆ షెడ్యూల్ కోసం మేము పడిన కష్టం మాటల్లో చెప్పలేను. అనివార్య కారణాలతో రెండుసార్లు జార్జియాకు వెళ్లకుండా అధికారులు తిరిగి పంపేశారు. థర్డ్ టైమ్ మేము అక్కడికి వెళ్లి షూట్ చేయగలిగాం. మూడోసారి కెమెరా కిట్స్ ఉన్నబ్యాగులు మిస్ అయ్యాయి. జార్జియాలో షాపింగ్ చేసి వాటిని కొని షూటింగ్ చేశాం. ఇలాంటి ఎక్సిపీరియన్స్ లు చాలా ఉన్నాయి కాబట్టే "28°C" సినిమా అనుభవాలతో పుస్తకం రాయాలని అనుకున్నా."28°C" రిలీజ్ ఆగిపోయినప్పుడు నా పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈ మూవీలో నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. సినిమా రిలీజ్ ఆగిపోయి నెక్ట్స్ ఏంటి అనే డైలమాలో ఉండేవాడిని. ఆత్మహత్య ఆలోచనలు కూడా కలిగేవి. అయితే బతికే సాధించాలనే పట్టుదలతో పొలిమేర స్క్రిప్ట్ చేసుకుని ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పొలిమేర 2 చేశాను. ఇప్పుడు పొలిమేర సిరీస్ లో థర్డ్ పార్ట్ చేస్తున్నాం. పొలిమేరతో వచ్చిన గుర్తింపుతో "28°C" సినిమా బాగా రిలీజ్ అవుతుందని నమ్ముతున్నా.నా స్నేహితుడు వంశీ నందిపాటి "28°C" సినిమా చూసి ఇంతమంచి మూవీని రిలీజ్ చేయాలని ముందుకొచ్చాడు. ఇప్పుడు మా లక్ష్యం ఈ సినిమాతో డబ్బులు సంపాదించడం కాదు మా ఫస్ట్ మూవీని థియేటర్స్ లో చూసుకోవడం. అందుకే వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ ఇప్పించమని వంశీని అడిగాను. "28°C" సినిమా చూసి నవీన్ చంద్ర ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు."28°C" సినిమా రిలీజ్ కావడం ఆలస్యమైంది. అయితే అదృష్టవశాత్తూ ఇలాంటి కథతో మరే మూవీ థియేటర్స్ లో గానీ ఓటీటీలో గానీ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే చాలా బాధపడేవాడిని. నేను యూనిక్ బ్యాక్ డ్రాప్స్ తో కథలు రాస్తాను. అదే నాకు అడ్వాంటేజ్ అయ్యిందని భావిస్తా. సినిమాను క్రిస్ప్ గా 2 గంటలు ఉంటుంది. అనవసర సన్నివేశాలు తీసేసి టు ది పాయింట్ మూవీని తెరపై చూపించబోతున్నాం.నా నెక్ట్స్ మూవీ పొలిమేర 3 త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తాం. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. సీజీ వర్క్ భారీగా ఉండబోతోంది. అందుకే ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పొలిమేర 3 పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రొడక్షన్ వ్యాల్యూతో ఉంటుంది. ఇందులో ఓ స్టార్ కీలక పాత్రలో నటిస్తారు.నేను షో రన్నర్ గా నా టీమ్ మెంబర్ నాని కాసరగడ్డ డైరెక్షన్ లో అల్లరి నరేష్ తో 12ఎ రైల్వే కాలనీ మూవీ చేస్తున్నాం. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశాను. నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు నాకు పెద్దగా సపోర్ట్ లేదు. నాకున్న గుర్తింపుతో ఇప్పుడు నా కొలీగ్స్ కు నేను ఆ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నా. నాకు షెర్లాక్ హోమ్స్ సాహిత్యం ఇష్టం. త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. -
'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?'
అరుణాచల శివుడిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు. అరుణాచలం దర్శనానికి ముందు, దర్శనం తర్వాత.. అన్నంతగా జీవితం మారిపోతుందంటారు. విక్టరీ వెంకటేశ్, కిరణ్ అబ్బవరం.. ఇలా ఎందరో సెలబ్రిటీలు ఆ ప్రదేశాన్ని ఎంతగానో ఆరాధిస్తారు. తాజాగా హీరోయిన్ స్నేహ (Actress Sneha) కూడా అరుణాచలం వెళ్లింది. భర్త ప్రసన్నకుమార్‌తో కలిసి గిరిప్రదక్షిణ చేసింది. గిరి ప్రదక్షిణసూర్యుడు ఉదయించడానికి ముందే ముఖానికి మాస్కులు ధరించి భార్యాభర్తలిద్దరూ కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. దారిలో ఎదురయ్యే ఆలయాల దగ్గర ఆగి కొబ్బరికాయలు కొడుతూ తర్వాత నడక సాగించారు. ఈ క్రమంలో తమకు ఎదురైన హిజ్రాలతో నవ్వుతూ ఫోటోలు కూడా దిగారు. అంతా బాగుంది కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్లిద్దరూ చెప్పులు, శాండిల్స్ ధరించారు. కాస్తయినా బుద్ధి లేదా?అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన భక్తులు, అభిమానులు స్నేహ దంపతులపై మండిపడుతున్నారు. కాళ్లకు చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడమేంటి? కొంచెమైనా బుద్ధి లేదా? ఇది మహాపాపం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం.. వారు తెలియక చేసుంటారని వెనకేసుకొస్తున్నారు.సినిమా- పర్సనల్ లైఫ్స్నేహ తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్గా రాణించింది. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు, రాధాగోపాలం, పాండురంగడు, అమరావతి, రాజన్న, సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన డ్రాగన్ మూవీలో డాక్టర్‌గా అతిథి పాత్రలో కనిపించింది. ఇకపోతే స్నేహ కథానాయికగా సక్సెస్ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న సమయంలోనే నటుడు ప్రసన్నకుమార్‌తో ప్రేమలో పడింది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు, కూతురు జన్మించారు. AK Fan Boy Prasanna Sir and Sneha Mam went to Girivilam.Prasanna sir will be eyeing for huge success for his character in GBU.#Ajith#AjithKumar#GoodBadUgly#Prasanna#SnehaPrasanna pic.twitter.com/fxQWoQvNzS— Deepak Kaliamurthy (@Dheeptweet) March 28, 2025 చదవండి: బాలీవుడ్లో అంతా గొర్రెలే.. సౌత్‌ను చూసి నేర్చుకోండి: నటుడు -
హృదయాన్ని కదిలించేలా ‘చూస్తున్నవేమో’ పాట
తల్లి సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకుని వచ్చిన పాటలన్నీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. అమ్మ ప్రేమను కీర్తించే టాలీవుడ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి మదర్ సెంటిమెంట్‌ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ‘మాతృ’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. ‘రా రాజా’ చిత్రంతో దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటిన బి. శివ ప్రసాద్, ఇప్పుడు ‘మాతృ’ సినిమాతో తన సినీ అభిరుచిని మరోసారి ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. మనసును ఆకట్టుకునే లిరికల్ వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు చిత్ర బృందం. తాజాగా, తల్లి కోసం పడే వేదనను హృదయస్పర్శిగా చూపించే ‘చూస్తున్నవేమో’ అనే ఎమోషనల్ పాటను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర స్వరకల్పన, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, కారుణ్య గాత్రంతో ఈ పాట పదే పదే వినాలనిపించేలా ఉంది. జాతీయ అవార్డు గ్రహీత అయిన సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం గుండెల్ని పిండేసేలా ఉండగా, కారుణ్య గొంతులోని ఆర్ద్రత శ్రోతలను భావోద్వేగంతో నింపుతోంది.ఈ అద్భుతమైన పాటను ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ప్రశంసించారు. హృదయాన్ని తడమగలిగిన ఈ పాటను మెచ్చుకుంటూ, ప్రస్తుత కాలంలో మదర్ సెంటిమెంట్‌పై సినిమాలు లేదా తల్లి ప్రేమను చాటే పాటలు అరుదుగా వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మాతృ’ టీంను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు. -
నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie) మరోసారి వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చెప్పిన సమయానికి రావడం లేదని, అందుకు మన్నించాలని కోరాడు. 'అత్యున్నత విలువలతో కన్నప్ప సినిమాను మీ ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్..అయితే కొన్ని కీలక సన్నివేశాలకు ఇంకా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఫలితంగా సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుంది. మీరందరూ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. శివ భక్తుడైన కన్నప్ప సినిమా చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ విశేషంగా కృషి చేస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని ఓ నోట్ షేర్ చేశాడు.సినిమాకన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు శివ భక్తుడు కన్నప్పగా నటించాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా యాక్ట్ చేశారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించారు. నిజానికి గతేడాది డిసెంబర్లో కన్నప్ప రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పుష్ప 2 ఆగమనంతో వెనకడుగు వేసి మార్చికి రిలీజ్ చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అనుకున్న సమయానికి రాలేమంటూ మరోమారు వాయిదా వేశారు. My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025 -
దివ్యభారతి ఆత్మ వెంటాడిందా? ఏడ్చేసిన నాగార్జున హీరోయిన్!
తక్కువ కాలమే నటించినా, యావద్భారత సినీ ప్రేక్షకులు మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం మరచిపోలేని కధాయికల్లో నెం1 గా నిలుస్తుంది దివ్యభారతి. చిరంజీవితో రౌడీఅల్లుడు, వెంకటేష్‌తో బొబ్బిలిరాజా, మోహన్‌బాబుతో అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాలలో నటించిన దివ్యభారతి అందాన్ని చూసేందుకు తెరకు కళ్లప్పగించిన ప్రేక్షకులెందరో. అటువంటి అందాల నటి, ఎంతో భవిష్యత్తు ఉన్న యువనటి అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆ తర్వాత అప్పటి ఆమె సహనటీనటులు ఆమె గురించి అడపాదడపా తలచుకుంటూ ఆవేదన చెందడం చూస్తున్నాం. అదే క్రమంలో తాజాగా అప్పటి దివ్యభారతి సహ నటి, అత్యంత ఆత్మీయ నేస్తం అయిన ఆయేషా ఝుల్కా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి గురించి కొన్ని విశేషాలు పంచుకుంది.దివ్యతో తనకున్న బంధం గురించి అయేషా మాట్లాడుతూ, ‘మేము రంగ్ షూటింగ్లో ఉండగా.. ఈ సంఘటన మొత్తం జరిగింది. నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు–ఆమె అందులో నా చెల్లెలిగా నటించింది–మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. ఇతర సెట్లలో చేస్తున్నప్పుడు కూడా ఆమె వచ్చి నాతోనే కబుర్లు చెబుతూ ఉండేది’’ అంటూ తమ అనుబంధం గురించి వివరించింది.ఆయేషా జుల్కా దివ్య భారతి 1993లో రొమాంటిక్ చిత్రం రంగ్లో కలిసి నటించారు. ఈ చిత్రంలో కమల్ సదానా, జీతేంద్ర, అమృతా సింగ్, ఖాదర్ ఖాన్ బిందు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అయేషా, దివ్య సిస్టర్స్‌గా నటించారు. అయితే సినిమా విడుదలకు ముందే దివ్య కన్నుమూసింది.సినిమా స్క్రీనింగ్ సమయంలో దివ్య తో అనుబంధాన్ని తలచుకుంటూ... ఆ దురదృష్ఖకర సంఘటన తర్వాత తాను చాలా రాత్రులు నిద్రపోలేకపోయానని ఆయేషా గుర్తు చేసుకుంది. ‘‘ మా మధ్య ఫ్రెండ్స్‌ని మించిన బంధం ఉంది, ఆ సంఘటన తర్వాత నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు, చేయలేకపోయాను, డబ్బింగ్ చెప్పడానికి బదులు నేను భోరున ఏడ్చాను దాంతో డబ్బింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. కాబట్టి అదంతా జరిగింది, ఆపై మేము ఫిల్మ్ సిటీలో ఆ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు... దివ్య తెరపై కనిపించిన క్షణంలో, స్క్రీన్ ఒక్కసారిగా పడిపోయినట్టయింది.. దివ్య నా చెంతనే ఉన్నట్టు ఓ ఫీలింగ్...బాధ అనుభవించాను దాంతో ఆ రాత్రి నేను చాలా సేపు నిద్రపోలేకపోయాను’’ అంటూ దివ్యభారతి మరణం తర్వాత కూడా తనతోనే ఉందని ఆమె చెప్పింది. గత 1991లో వచ్చిన కుర్బాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన అయేషా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది, ఆమెను లైమ్‌లైట్‌లోకి తీసుకెళ్లింది... అక్షయ్ కుమార్ సరసన ఖిలాడీలో ఆమె నటన ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది, ఆ తర్వాత అమీర్ ఖాన్ సరసన జో జీతా వోహీ సికందర్, మిథున్ చక్రవర్తి సరసన దలాల్ లతో పాటు మరిన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మూడు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్లో, 60 చిత్రాలకు పైగా పనిచేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన నేటి సిద్ధార్ధ సినిమాలో ఆమె నటించి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించింది. ఈ సినిమాలో నాగ్‌తో ఆమె లిప్‌లాక్ కూడా చేయడం విశేషం. -
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయకు ఛాన్సులు వచ్చాయి.త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడిగంట కొడుతోన్న ఫొటోను అభినయ పంచుకుంది. ఈ క్రమంలోనే మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఆమె ఫోటోలు షేర్ చేసింది. అతని పేరు 'సన్నీ వర్మ' అని తెలిపింది. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, ఎలక్ట్రికల్, మైనింగ్, రైల్వేల నిర్మాణంలో భాగమైన ఒక అంతర్జాతీయ సంస్థలో అతను పనిచేస్తున్నట్లు సమాచారం.కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను మొదటిసారి ఇలా రివీల్ చేసింది. 'నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్లో ఉన్నాను. 15 ఏళ్లుగా మా మధ్య బంధం ఉంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా వ్యక్తిగత విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా అతనితో పంచుకోగలను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మల మధ్య బ్రేకప్ అంటూ గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయ్ వర్మ (Vijay Varma) తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సంబంధంలో కోపం, బాధ, సంతోషం, చిరాకు వంటి భావోద్వేగాలన్నీ అనుభవించాలని, వాటిని స్వీకరించడం ద్వారానే ఆ బంధాన్ని సంతోషమయం చేసుకోవచ్చని అన్నారు. "రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ లాగా ఆస్వాదించాలి. అప్పుడే నీవు సంతోషంగా ఉంటావు" అని విజయ్ పేర్కొన్నారు.మరోవైపు, తమన్నా కూడా ప్రేమపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్నప్పుడే నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను" అని ఆమె అన్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తే, వీరు విడిపోయారనే వార్తలు నిజమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. అంతేకాక, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వెల్లడించారు. కానీ, ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బ్రేకప్ గురించి వీరిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఆ సినిమా క్లోజింగ్ కలెక్షన్లకు దగ్గరగా 'మ్యాడ్ స్క్వేర్' డే-1 నంబర్స్
మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాతో థియేటర్స్‌లో నవ్వులు పూయించిన మ్యాడ్ గాంగ్.. బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా మార్చి 28 సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.మ్యాడ్ స్క్వేర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద రూ. 20.8 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది. సినిమా విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మ్యాడ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లకు దగ్గరగా మ్యాడ్ స్క్వేర్ మొదటిరోజు కలెక్షన్లు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఆయన మాటే నిజం అయిందని నెటిజన్లు అంటున్నారు. 2023లో విడుదలైన మ్యాడ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు రూ. 26 కోట్లు అని తెలిసిందే. (ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీనే ఉంది. లూసిఫర్-2, వీర ధీర శూర, రాబిన్ హుడ్ వంటి సినిమాలు థియేటర్స్‌లో ఉన్నాయి. ఇలాంటి పోటీ సమయంలోనూ మ్యాడ్ స్క్వేర్ భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మ్యాడ్ పార్ట్-1 కోసం రూ. 8 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తే రూ. 26 కోట్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్ కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటిరోజే మ్యాడ్ స్క్వేర్ రూ. 20.8 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. -
అలాంటి ఫ్యాన్స్ ఉండడం నా అదృష్టం: విజయ్ దేవరకొండ
కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక స్టార్ హీరోగా తన వంతు కృషి చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన 'వాట్ ఇండియా థింక్స్ టుడే' కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. హీరోగా తన సక్సెస్, గ్లోబల్ గా తెచ్చుకున్న గుర్తింపు, పాన్ ఇండియా ట్రెండ్ లో టాలీవుడ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ వంటి అంశాలతో పాటు తన కొత్త సినిమా "కింగ్ డమ్" విశేషాలు ఈ కార్యక్రమంలో తెలిపారు.హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా, ఏ కొద్ది మందికో దక్కే అవకాశమిది. మనం అన్నిసార్లూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయకపోవచ్చు. కానీ ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. స్టార్ గా ఎదిగిన తర్వాత నాలో కలిగిన ఫీలింగ్ ఒక రిలీఫ్ లాంటిది. (చదవండి: లూసిఫర్2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్)మనం సాధించాల్సింది సాధించిన తర్వాత దక్కే సంతృప్తి అది. ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రపంచం చాలా చిన్నదైంది. మనం K డ్రామాస్ చూస్తున్నాం, కొరియన్ బీటీఎస్ ను ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు సౌత్ సినిమాను నార్త్ ప్రేక్షకులు అభిమానించడంలో ఆశ్చర్యం లేదు. సక్సెస్, ట్రెండ్ అనేది ఒక సర్కిల్ అయితే అందులో ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చింది. రేపు మరో ఇండస్ట్రీ లీడ్ తీసుకోవచ్చు. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా తమ మొదటి సినిమా నాతో చేశారు. ఇవాళ నేనిక్కడ ఉన్నానంటే వారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది.రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు అదొక పెద్ద రిస్క్. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ సాహసం చేశారు. ప్రతి ఇండస్ట్రీ ఇలాంటి స్ట్రగుల్ పడాలి. అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు. నా కొత్త సినిమా "కింగ్ డమ్"(Kingdom Movie) టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో తారక్ అన్న, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ తమ వాయిస్ లతో మా టీజర్ ను మరింత ఎఫెక్టివ్ గా చేశారు. వారి వాయిస్ వల్ల మా టీజర్ ఇంకా బాగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ప్రేక్షకులకు సరికొత్త కథలు చెప్పాలి, టాలీవుడ్ సక్సెస్ లో నా వంతు కృషి చేయాలని ప్రయత్నిస్తున్నా. అన్నారు. -
ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి: ‘రాబిన్‌హుడ్’ నిర్మాత
‘‘రాబిన్‌హుడ్’ (Robinhood Movie ) క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మేం థియేటర్స్‌కి వెళ్లి చూశాం. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి, సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత యలమంచిలి రవిశంకర్. (చదవండి: రాబిన్‌హుడ్ మూవీ రివ్యూ)నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇతర ΄ాత్రలు పోషించారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. (చదవండి: 'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!)ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’లో మంచి కథతో పాటు వినోదం, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో పాటు యువత వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అన్నారు. ‘‘మేము రెండు థియేటర్స్‌ని విజిట్ చేశాం. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుండటం సంతోషంగా అనిపించింది. ఈ ఉగాదికి మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది’’ అన్నారు వెంకీ కుడుముల. -
లూసిఫర్2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్
మలయాళ సినిమా 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, తాజాగా ఈ సినిమా రెండు రోజుల్లోనే బెంచ్‌మార్క్ కలెక్షన్స్ రాబట్టినట్లు మోహన్‌లాల్ ప్రకటించారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో లూసిఫర్2 చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రాన్ని స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు.లూసిఫర్2 కేవలం రెండురోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్లు మోహన్‌లాల్ ఒక పోస్టర్‌తో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 48 గంటల్లోపు రూ. 100 కోట్లను అధిగమించి, సినిమా చరిత్రలోనే కొత్త రికార్డ్‌ను లూసిఫర్ నెలకొల్పిందని మోహన్‌లాల్ అన్నారు. ఈ విజయంలో భాగమైనందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని ఒక పోస్ట్ చేశారు.మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. అయితే, ఎంపురాన్ 48 గంటల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఈ సినిమా ఫైనల్‌గా రూ. 200 కోట్లు దాటొచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవంగా 2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. అప్పట్లో లూసిఫర్ సినిమానే మొదటిసారి ఈ మార్క్‌ను దాటి రూ.127 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ రూ.242 కోట్లతో ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్ బ్రేక్ చేస్తుంది అని మోహన్‌లాల్ అభిమానులు అంటున్నారు. The Cicada himself. #L2E #Empuraan surpasses 100 crore at the box office worldwide in less than 48 hours, setting new benchmarks in cinematic history.A heartfelt thanks to all of you for being part of this extraordinary success! Your love and support made this possible. pic.twitter.com/SoGeHClLY2— Mohanlal (@Mohanlal) March 28, 2025 -
అనిల్- చిరంజీవి సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ రంగంలోకి దిగుతోంది. దర్శకుడు అనిల్ ఇప్పటికే స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. ఆపై మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభవ అవుతాయి అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా చిరు-అనిల్ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో చిరు నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం చుట్టనున్నారు. రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమంలో వెంకటేష్‌తో పాటు పలువురు స్టార్స్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి సందడి చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనలోని కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆపై ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు. -
ఓటీటీలో ఉపేంద్ర 'యూఐ' సినిమా..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఇప్పుడు డైరెక్ట్‌గా టెలివిజన్ ప్రీమియర్‌కు రానుంది. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 20న విడుదల అయింది. ఈ సినిమాని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వర్చువల్ రియాలిటీ పైప్‌లైన్‌లో చిత్రీకరించడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేదు. సుమారు రూ. 80 కోట్లతో ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 47 కోట్లు మాత్రమే రాబట్టి నష్టాలను మిగిల్చింది.యూఐ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఉపేంద్ర ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘యూఐ’ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారైనట్లు ఒక ప్రకటన చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 30న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో ‘యూఐ’ టెలికాస్ట్ అవుతుందని తెలిపారు. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. టాలీవుడ్ హీట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' మాదిరి యూఐ చిత్రం కూడా జీ5 ఓటీటీలో ఉగాది నాడే రావచ్చని చెబుతున్నారు. ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ రెండూ కూడా ఏక కాలంలో అందుబాటులోకి రావచ్చని సమాచారం.కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. -
సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు: హారిక సూర్యదేవర
‘మ్యాడ్ స్క్వేర్’ని కాలేజ్ స్టూడెంట్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. ఇలా మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం హ్యాపీగా ఉంది’’ అని హారిక సూర్యదేవర తెలిపారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.అన్ని షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ‘మ్యాడ్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ‘మ్యాడ్ స్క్వేర్’కి మాత్రం మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తుంటే... దీనికోసమే కదా మనం సినిమా తీసింది అనే అనుభూతి కలిగింది’’ అని కల్యాణ్ శంకర్ పేర్కొన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది’’ అన్నారు నార్నే నితిన్.‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అని రామ్ నితిన్ చెప్పారు. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు సంగీత్ శోభన్. ‘‘ఇలాంటి విజయవంతమైన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక జవాల్కర్ తెలిపారు. -
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!
టైటిల్: హత్య; నటీనటులు: ధన్యా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్ తదితరులు. నిర్మాత: ప్రశాంత్ రెడ్డి; కథ–స్క్రీన్ ప్లే–దర్శకత్వం: శ్రీవిద్య బసవ; సంగీతం: నరేశ్ కుమరన్.పి సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్; ఎడిటర్: అనిల్ కుమార్ .పి; ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో.అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి దర్శక–నిర్మాతలు లోతైన పరిశోధన చేసి, దాగి ఉన్న పలు విషయాలను సేకరించినట్లుగా సినిమా చూసినవారికి అనిపించడం సహజం.ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు చెప్పేలా కథ ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెంటనేపాపులర్ అయింది... నిజంగా ఏం జరిగింది? అనేదానికి ఈ సినిమా నిజమైన నమూనానా? హత్య వెనక ఉన్న నిజమైన హంతకులను ఈ సినిమా బయటపెట్టిందా? జరిగిన విషయాన్ని ఎలా తారుమారు చేసి, ప్రచారం చేస్తున్నారో ఈ సినిమా చూపించిందా? ‘హత్య’ సినిమా బయటపెట్టిన నిజాలు ఏంటి? ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారు, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అవుతున్నవారు చూడాల్సిన చిత్రం ఇది.ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే...ఇల్లందులో రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) దారుణ హత్యకు గురవుతాడు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడని నిర్ధారణ అవుతుంది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి (భరత్) నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సుధ (ధన్యా బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. ఆమె తన టీమ్‌తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారణ మొదలుపెడుతుంది. అజాత శత్రువు అయిన ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా నరికి చంపింది ఎవరు? ధర్మేంద్రకు, సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి? పొలిటికల్ ఎజెండాతో ఈ హత్య చేశారా?\ఆర్థిక సమస్యలే కారణమా? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు)ను తప్పుదోవ పట్టించింది ఎవరు? చిన్నాన్న హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చడానికి సీఎం కిరణ్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గత ప్రభుత్వం దగ్గర అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు ఈ కేసును ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అనేక ఒత్తిడిలను తట్టుకొని ఐపీఎస్ అధికారి సుధ ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది? కేసు విచారణ చివరి దశలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథంతా కల్పితమే అని చిత్రబృందం పేర్కొన్నప్పటికీ.. సినిమాప్రారంభంలోనే ఇది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆమె రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. సినిమాప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు దర్శకురాలు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వస్తుంటే.. ‘ఇది కదా అసలు నిజం’ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సలీమా, ధర్మేంద్రల మధ్య లవ్‌స్టోరీ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు ఎంతో పకడ్బందీగా రీసెర్చ్ చేసి, లవ్‌స్టోరీ చెప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్ పండించారు.ఎవరెలా చేశారంటే..ధర్మేంద్ర రెడ్డిపాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా ధన్యా బాలకృష్ణ తనపాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో పూజా రామచంద్రన్ మెప్పించారు. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్... మిగిలిన నటీనటులు వారిపాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నరేశ్ కుమరన్ .పి అందించిన నేపథ్య సంగీతం,పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
పట్టు పరికిణిలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఉప్పెన భామ కృతి శెట్టి గ్లామరస్ పిక్స్!
అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి..షిప్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి..బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ అదిరిపోయే లుక్స్...జీన్స్ డ్రెస్‌లో శ్రద్ధాదాస్ పోజులు... మేకప్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ భామ కాజోల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
హీరో విజయ్ కంటే మన హీరోనే స్మార్ట్..: మల్లారెడ్డి ప్రశంసలు
దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ చాలా ఏళ్ల తర్వాత 'లైఫ్'(లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్‌పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్నారు. భావన పోలేపల్లి కాస్ట్యూమ్ డిజైనర్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. 'ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డికి కృతజ్ఞతలు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేది. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు. ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటా. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టం. అలాగే సింగర్ ఎస్పీ చరణ్, నటుడు ప్రవీణ్‌తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతూ.. 'ముందుగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్‌గా ఉన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్.. అతని తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్.. వీరు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి నా అభినందనలు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజు ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలి' అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. 'తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. చరణ్ ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చింది. బాల సుబ్రహ్మణ్యం చరణ్‌ను మనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. బాల సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా మమ్మల్ని దీవిస్తూ ఉంటారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు' అని అన్నారు.సింగర్ ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. 'వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం. తన క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకు ధన్యవాదాలు . ఈ సినిమా హీరో శ్రీ హర్ష చాలా కష్ట పడ్డారు. వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి స్పెషల్ థాంక్స్. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్‌కు నా కృతజ్ఞతలు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా' అన్నారు. ఈ చిత్రంలో చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిినిమాను ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. రెండు నిమిషాలకే ఇంత హంగామా చేశారా?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు. దీంతో రాబిన్‌హుడ్‌లో డేవిడ్ రోల్‌పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెమియో రోల్ అయినప్పటికీ ట్రైలర్ ఎంట్రీ ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ అభిమానులు ఊహించినంత స్థాయిలో మాత్రం డేవిడ్ పాత్ర కనిపించలేదు. కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించి ఉస్సురుమనిపించారు. రాబిన్‌హుడ్‌లో కొద్దిసేపే కనిపించడంపై డేవిడ్ వార్నర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అది కూడా కేవలం డ్రగ్ డీలర్ పాత్రలో కనిపించడం.. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో మైనస్‌గా మారింది.మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వార్నర్ రోల్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం, స్వయంగా అతను కూడా మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం పది నిమిషాల పాటైనా వార్నర్ స్క్రీన్‌పై సందడి చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం. -
రాజమౌళి ఒక్కరే.. ఆయన స్థానం ఎవరూ పొందలేరు: బాలీవుడ్ నటుడు
నేను అడుగుపెడితే విజయమే తప్ప పరాజయం ఉండదు అని నిరూపిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే! అలాంటి దర్శకుడిని కాపీ కొట్టాలని చూస్తున్నారని.. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్థాయిని అందుకోలేరంటున్నాడు బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap).రాజమౌళి ఒరిజినల్తాజాగా అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్ ఇండియా హిట్లు తీయగానే రాజమౌళిపి కాపీ కొట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, వారెప్పటికీ ఆయనలా మారలేరు. ఎందుకంటే రాజమౌళి ఒక్కరే.. ఆయన ఒరిజినల్! ఎన్నటికీ ఆ చీప్ కాపీలు రాజమౌళి కాలేవు. అలాగే కేజీఎఫ్ సినిమా హిట్టవగానే చాలామంది అదే తరహా చిత్రాలు తీశారు. ఏవీ వర్కవుట్ కాలేదు.కాపీ కొట్టడం మానేసి..అయినా పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పటిది కాదు. చిరంజీవి (Chiranjeevi) 'ప్రతిబంధ్', నాగార్జున 'శివ', రజనీకాంత్ 'ఫౌలది ముక్క' (పాయం పులి).. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే.. నా చిన్నతనంలోనే ఈ పాన్ ఇండియా సినిమాలు చూశాను. నేనేమంటానంటే ఎవరికి వారే ప్రత్యేకం. అవతలివారిని కాపీ కొట్టడానికి బదులు తమలోని నైపుణ్యాన్ని బయటకు తీయాలి అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.ఆ సినిమాలెప్పుడు వచ్చాయంటే?చిరంజీవి 'ప్రతిబంధ్' సినిమా 1990లో వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూహీ చావ్లా కథానాయిక. రజనీకాంత్ హీరోగా నటించిన 'పాయం పులి' సినిమాకు హిందీ డబ్బింగ్ వర్షనే 'ఫౌలది ముక్క'. ఎస్పీ ముత్తుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1983లో రిలీజైంది. నాగార్జున హీరోగా నటించిన 'శివ' 1989లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. దీనికి రామ్ గోపాల్‌వర్మ దర్శకుడిగా వ్యవహరించాడు.చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్ -
కేవలం రెడీ చేసినందుకు రూ.1 లక్ష దాకా తీసుకుంటారు: రకుల్
సెలబ్రిటీల సంపాదనకు తగ్గట్లే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఏదైనా ఈవెంట్‌కు, అవార్డుల ఫంక్షన్‌కు వెళ్లాలంటే మేకప్, హెయిర్ స్టైలింగ్ చేసేవారు తప్పనిసరి. వీళ్లు సందర్భాన్ని బట్టి వేలు, లక్షల్లో తీసుకుంటారని చెప్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో రకుల్ మాట్లాడుతూ.. మేకప్ వేసేందుకు, డ్రెస్‌కు తగ్గట్లుగా హెయిర్ స్టైల్ చేసేందుకు ఒక టీమ్ పనిచేస్తూ ఉంటుంది.ఆరేళ్లుగా ఒకే టీమ్‌తో పని చేస్తున్నా..రెడ్‌కార్పెట్‌పై మేము అందంగా కనిపించేందుకు వీళ్లు సాయపడతారు. కేవలం ఒక్క లుక్ కోసం రూ.20 వేల నుంచి రూ.1 లక్ష వరకు తీసుకుంటారు. స్టైలిస్ట్‌కు, మేకప్ టీమ్‌కు, ఫోటోగ్రాఫర్‌కు.. ఇలా అందరికీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నేను ఆరేళ్లపాటు ఒకే మేకప్- హెయిర్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నాను. వారు నాకు కుటుంబసభ్యుల్లానే అనిపిస్తారు.పైసా ఖర్చుండదనేది నిజం కాదు!ఈవెంట్స్ కోసం డిజైనర్స్ మాకు ఉచితంగానే దుస్తులు పంపిస్తారు. దీనివల్ల మాకు పైసా ఖర్చు ఉండదని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్లు ఫ్రీగానే ఇచ్చినా దాన్ని తెచ్చినవారికి.. ఆ డ్రెస్‌కు తగ్గట్లుగా మమ్మల్ని అందంగా రెడీ చేసిన స్టైలిస్ట్‌కు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొరియర్ చార్జీలు కూడా అందులోనే జత చేస్తారు. అందుకే అంతర్జాతీయ డిజైనర్ రూపొందించిన డ్రెస్ ధరించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాకైతే నచ్చదుఆ డ్రెస్‌కు తగ్గట్లుగా ఎలా రెడీ అవ్వాలన్నది స్టైలిస్ట్ చూసుకుంటాడు. డిజైనర్లు మాకు డ్రెస్‌లు ఇవ్వాలని తహతహలాడుతుంటారు. ఎందుకంటే మేము వాటిని ధరించినప్పుడు ఎక్కువ అటెన్షన్ వస్తుంది. డిజైనర్ క్రియేటివిటీ ఎక్కువమందికి తెలుస్తుంది. వారి అమ్మకాలు కూడా పెరుగుతాయి. అయితే చాలామటుకు నేను ఉచితంగా దుస్తులు తీసుకోవడానికి ఇష్టపడను అని రకుల్ చెప్పుకొచ్చింది.చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్ -
శృతి హాసన్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. హైదరాబాద్ ఈవెంట్ వాయిదా
కమలా హాసన్ నట వారసురాలు శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. అయితే శృతి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్ కూడా. ఆమె సినిమాలతో పాటు మ్యూజిక్ కన్సర్ట్స్కు కూడా హాజరవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ కన్సర్ట్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా ఆడియన్స్ షాకిచ్చారు ఆర్గనెజర్స్. ఇవాళ జరగాల్సిన సంగీత కచేరీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఈ విషయాన్ని ఆర్గనైజింగ్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాంకేతిక కారణాలతో శృతిహాసన్ మ్యూజిక్ కన్సర్ట్ను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్న అతిథులకు అదనపు ఖర్చు లేకుండా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ఎవరైనా ఈవెంట్‌కు టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే డబ్బులు రిఫండ్ ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఉన్నట్లుండి ఈ మ్యూజిక్ కన్సర్ట్ను వాయిదా వేయడంపై ఆడియన్స్ మండిపడుతున్నారు.ఇక శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ చిత్రంలో కనిపించనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
పూరీ అడిగితే నో చెప్పా.. రకుల్ కామెంట్స్
కొన్నేళ్ల క్రితం తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం పెళ్లి చేసుకుని బాలీవుడ్ కి పరిమితమైపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి.. తన వైవాహిక జీవితం, సినీ కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ కి నో చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది.'కాలేజీ టైంలో మోడలింగ్ కూడా చేసేదాన్ని. అలా నా ఫొటోలు చూసి కన్నడ ఇండస్ట్రీలో తొలి అవకాశం వచ్చింది. అప్పుడు నాకు దక్షిణాది సినిమాల గురించి పెద్దగా తెలియదు. దీంతో చాలా ఆలోచించాను. కానీ నా తండ్రికి సదరు చిత్ర యూనిట్ ఫోన్ చేసి చెప్పడంతో కన్నడలో తొలి మూవీ చేశాను. ఇందులో నటనకు మంచి పేరొచ్చింది కానీ చదువుకి సమస్య రావడంతో సినిమాలు వద్దనుకున్నాను'(ఇదీ చదవండి: కోట్లాది రూపాయల స్కాంలో 'పుష్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్)'తొలి మూవీ రిలీజైన తర్వాత పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజుల కాల్ షీట్ అడిగారు. నేనేమో 4 రోజులైతేనే వస్తానని చెప్పా. నా ఇబ్బందిని ఆయన అర్థం చేసుకున్నారు. ఇదే కాదు.. ఇలా చాలా సినిమాలు కెరీర్ ప్రారంభంలో వదిలేసుకున్నా' అని రకుల్ చెప్పుకొచ్చింది.హిందీ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. కాకపోతే సినిమా అవకాశాలు గతంతో పోలిస్తే చాలా తగ్గిపోయాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్) -
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది: మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
డైరెక్టర్ మెహర్ రమేశ్ సోదరి మరణం పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. నా తమ్ముడు మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తాను నాకు కూడా సోదరేనని ఎమోషనల్ అయ్యారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి, నా తమ్ముడు మెహర్ రమేశ్‌కు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.(ఇది చదవండి: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం)మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ.. నా సోదరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు.తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025