Srikakulam
-
అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజలు ఇచ్చే అర్జీలను వేగవంతంగా అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజల నుంచి 154 విజ్ఞప్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి పారదర్శకమైన విచారణ జరిపి, నిర్ణీత సమయంలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ఆదేశించారు. ఈవోపై విచారణ చేయాలి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర ఆలయ ఈవో అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయన అవినీతిపై విచారణ చేయాలని మీకోసంలో శ్రీముఖలింగంకి చెందిన ఎన్.రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. కార్తీక మాసం, మహా శివరాత్రి పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలకు, తాత్కాలిక మౌలిక వసతులకు అయ్యే ఖర్చు, ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వహణ ఖర్చులకు దొంగ బిల్లులు పెట్టి అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ర్యాంపు నిర్వహణ ఆపాలి గార మండలంలోని గార గ్రామంలో నడుపుతున్న ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని ఎంపీపీ గొండు రఘురాం, పీస గోపీ, ముంజేటి కృష్ణమూర్తిలు కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ తవ్వకాల వలన గ్రామ ప్రజలతో పాటు మండలంలో ఉన్న వంశధార నదీ పరివాహక గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం నుంచి 100 మీటర్ల దూరంలో గార మండలానికి మంచినీటిని అందించే ప్రాజెక్టు ఉందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వలన ప్రాజెక్టుకు నీరు అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులకు చెందిన సుమారు 100 వ్యవసాయ పంపునట్లు ద్వారా వ్యవసాయానికి నీరు అందించే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికై నా అక్రమ ఇసుక తవ్వకాలపై తగు చర్యలను తీసుకోవాలని విన్నవించారు. ఐదు ల్యాప్‌టాప్‌ల పంపిణీ డిగ్రీ ఆపైన చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు విభిన్న ప్రతిభావంతులు, వయో వద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐదు ల్యాప్‌టాప్‌లు, ఒక స్మార్ట్‌ఫోన్‌ను కలెక్టర్ చేతుల మీదుగాా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిజబుల్ డిపార్టుమెంట్ ఏడీ కవిత తదితరులు ఉన్నారు. దౌర్జన్యాలను కట్టడి చేయండి కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు మీకోసంలో సోమవారం ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు, ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు, చిరుద్యోగులకు రక్షణ కరువైయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరుబుజ్జిలి మండలంలోని తెలికిపెంట గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ పంచాయతీ నిధులు తన భర్త పేరుమీద అన్యాక్రాంతం చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన వారిపై, విచారణకు వచ్చిన అధికారులపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఘటనపై విచారణ జరిపాలని కోరారు. సరుబుజ్జిలి మండలంలోని మతలబుపేట పంచాయతీలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేస్తూ, టీడీపీ నాయకులు తమ సొంత పొలాలకు సీసీ రోడ్లు వేస్తున్నారని, ఆ పనుల బిల్లులు నిలుపుదల చేయాలని విన్నవించారు. ఆమదాలవలస మున్సిపాలిటీలోని వూసవానిపేటకు చెందిన దివ్యాంగ బాలుడికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బూర్జ మండలంలోని కటకమయ్యపేట గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు వితంతు పెన్షన్లు రాజకీయ కారణాలతో మంజూరు చేయడంలేదని, వారికి పెన్షన్లు ఇప్పించాలని కోరారు. పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామంలో ఉపాధి పనుల్లో టీడీపీ నాయకులు చేస్తున్న అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు.ఎస్పీ గ్రీవెన్స్‌కు 45 ఫిర్యాదులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (గ్రీవెన్సు)లో 45 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు ప్రజల ఫిర్యాదులపై జాప్యం వహించరాదని, సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. -
విద్యుత్ షాక్‌తో బాలికకు తీవ్రగాయాలు
కవిటి: మండలంలోని సీహెచ్ కపాసుకుద్ది గ్రామంలో విద్యుత్ షాక్‌తో మైలపల్లి తులసీ(13) అనే బాలిక తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం వీధిలో నుంచి బాలిక నడిచి వెళ్తుండగా ట్రాన్స్ఫార్మర్కు సమీపంలోని వర్షపునీటి మడుగుకు బాలిక కాలు తగలడంతో షాక్‌కు గురయ్యినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్కు ఏర్పాటు చేసిన ఎర్త్ సిస్టం వైఫల్యం కారణంగానే సమీపంలోని వరద నీటికి విద్యుత్ ప్రసరించిందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలికను కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికకు ప్రథమ చికిత్స అందజేసి, మెరుగైన చికిత్స కోసం బరంపురం సిఫారుసు చేశారు. అయితే ట్రాన్స్ఫార్మర్ వద్ద తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రజారోగ్యానికి శాపాలు
పాపాలు..● ఒడిశా మార్కెట్లో కాలం చెల్లిన హెరిటేజ్ ఉత్పత్తులు ● ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలు ● విక్రయిస్తున్న దుకాణాలు సీజ్ ● సోషల్ మీడియా పొరాటంతో బయటపడిన బాగోతం కొరాపుట్: ఆంధ్రా నుంచి ఒడిశాకు వస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ అసలు బండారాన్ని అధికారులు బయటపెట్టారు. కాలం చెల్లిన సరుకులు అమ్ముతున్న వైనాన్ని జనం ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జయపూర్ వస్తున్న హెరిటేజ్ పెరుగు, పాల ప్యాకెట్లే లక్ష్యంగా పుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి వచ్చిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రబాత్ కుమార్ శెఠి నేతృత్వంలో అధికారులు హెరిటేజ్ ఉత్పత్తులు విక్రయిస్తున్న షాపులపై మెరుపు దాడులు చేశారు. ఎంజీ రోడ్డు, మెయిన్ రోడ్డు, సంగీత జంక్షన్ల వద్ద జరిపిన సోదాల్లో కాలం చెల్లిన పాడైన పెరుగు ప్యాకెట్లు పెద్ద ఎత్తున దొరికాయి. అంతా మా ఇష్టం వాస్తవానికి పాల ఉత్పత్తుల సంస్థల అవుట్ లెట్లలో విక్రయించే వారికి కొత్త ఉత్పత్తులు ఇచ్చేటప్పుడు కాలం చెల్లిన ఉత్పత్తులు తిరిగి తీసుకొని వెళ్తారు. ఇదే పద్ధతి ఒడిశా ప్రభుత్వ పాల ఉత్పత్తి సంస్థ అమలు చేస్తుంది. ప్రతి రోజూ కొత్త ఉత్పత్తులు ఇవ్వడంతో పాటు కాలం చెల్లిన ఉత్పత్తులను తమ వ్యాన్లోనే తిరిగి తీసుకొని పోతారు. కానీ హెరిటేజ్ ఈ నిబంధన పాటిండం లేదు. ఆంధ్రా నుంచి ఉత్పత్తులు తేవడమే తప్ప పాడైన వాటిని తిరిగి తీసుకువెళ్లడం లేదు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పక్క జిల్లా అధికారి రాక.. హెరిటేజ్ పై జయపూర్ ప్రజలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు రాష్ట్ర రాజధాని వరకు వెళ్లాయి. దాంతో పక్కనే ఉన్న మల్కన్ గిరి జిల్లా నుంచి ఫుడ్‌సేఫ్టీ అధికారి ప్రబాత్ కుమార్ శెఠిని ఇన్చార్జి హోదాలో పంపించి ప్రభుత్వం దాడులు చేయించింది. కొత్త ముఖాలు కావడంతో దాడుల నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. దాడుల అనంతరం ప్రబాత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్ పై వస్తున్న విమర్శలు నిజమేనని ప్రకటించారు. తానే స్వయంగా కలుషిత హెరిటేజ్ ఉత్పత్తులు పట్టుకున్నానని మీడియాకి చూపించారు. ఇంకా ఎక్కడైనా ఫిర్యాదులు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. బాధిత మహిళల ఇంటికి హెరిటేజ్ సిబ్బంది ఇటీవల జయపూర్ పట్టణంలో హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లు కొన్న మహిళలు అందులో కలుషిత పదార్థాలు చూసి సోషల్ మీడియాలో పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో హెరిటేజ్ కంపెనీ ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి అవి కాలం చెల్లినవని వివరణ ఇచ్చారు. మహిళల పోస్టింగ్స్ పెద్ద ఎత్తున వైరల్ కూడా అయ్యాయి.ప్రజారోగ్యంతో చెలగాటం హెరిటేజ్ సంస్ధ ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడింది. కాలం చెల్లిన పాలు, పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. పట్టణంలో దాడులు జరుగుతున్నప్పటికీ ఇతర షాపులలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగించారు. అందుకే అధికారులు హెరిటేజ్ సిబ్బందిని వెంటబెట్టుకొని వెళ్లి దాడులు చేసి తాము పట్టుకున్న కలుషిత హెరిటేజ్ ఉత్పత్తులు వారికి చూపించి వారి సమక్షంలోనే మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేశారు. ఈ దాడులు జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు వారి వెంట తరలి వెళ్లారు. పెద్ద మెత్తంలో పాడైన హెరిటేజ్ ఉత్పత్తులు ఉన్న షాపులను సీజ్ చేశారు. పలు షాపుల యజమానులకు ఫైన్లు విధించారు. -
పాత పింఛన్ విధానం అమలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని 2003 డీఎస్సీ జిల్లా ఫోరం కన్వీనర్ కొత్తకోట శ్రీహరి డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానం అమలు కోరుతూ శ్రీకాకుళంలోని జిల్లా ప్రధాన తపాలా కార్యాలయం వద్ద పోస్టుకార్డులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలకు సోమవారం పంపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ బలగ శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమలైన తేదీ 2004 సెప్టెంబర్ ఒకటి కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా తాము నియమితులయ్యామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు కేంద్ర మెమో 57 ప్రకారం పాత పింఛన్‌కు అర్హులని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విడతలు వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్సీ 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు గురుగుబెల్లి భాస్కరరావు, బుచ్చిబాబు, అనిల్ కుమార్, మాధవి, శ్రీదేవి, లోకనాథం, రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యార్థులపై సర్కారు నిర్లక్ష్యం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో దళిత విద్యార్థులను కూటమి ప్రభు త్వం చిన్నచూపు చూస్తోందని దళిత సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ విజ్ఞానమందిర్లో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు ఇస్తున్న కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వకుండా రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, విశాఖ జిల్లా గొలుగొండ, విజయనగరం జిల్లా కొప్పేర్ల మొదలుకొని చిత్తూరు జిల్లా వరకు దళిత విద్యార్థులు గురుకులాల్లో దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బాలికల/బాలుర గురుకుల పాఠశాల 1983 స్థాపించారని సుమారుగా 30 సంవత్సరాల నుంచి అవే భవనాలు ఉండడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లనే దళిత విద్యార్థులు విద్యా అవకాశాలకు దూరమైపోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేకమైన కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. -
భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత
రణస్థలం: మండలంలోని సంచాం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా జేఆర్‌పురం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. జేఆర్‌పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు సంచాం జంక్షన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక పల్సర్ బైక్ మధ్య మూడు అట్టపెట్టెలు పెట్టుకుని వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నలువైపుల నుంచి పోలీసులు వాళ్లను వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడినవారిలో మీసాల రాము(పండు), గంట్యాడ సాయికుమార్లు ఉన్నారు. వివిధ మద్యం షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి సంచాం గ్రామానికి చెందిన బొంతు గణేష్ ద్వారా అధిక ఆదాయం కోసం అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 193 మద్యం బాటిళ్లు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెనవారిని రిమాండ్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు రణస్థలం: మండలంలోని కొండములగాం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. జేఆర్‌పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మన్నెల మహాలక్ష్మి, వడ్డి మణికంఠ, మన్నెల వెంకటేష్‌లు కొండములగాం గ్రామంలో సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. శ్మశానాల చెరువు దగ్గర నుంచి ఇటుకబట్టీ పక్కనున్న మట్టి రోడ్డు మీదుగా రామతీర్ధాలు తారురోడ్డుపైకి వేగంగా వచ్చారు. అదే సమయంలో కమ్మసిగడాం వైపు నుంచి రణస్థలం వస్తున్న కూల్ డ్రింకుల లగేజీ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు, బైక్‌పై ఉన్న ముగ్గురు గాయపడ్డారు. ముగ్గురు వేతనదారులకు, అటో డ్రైవర్ మహంతి రమణకు తొలుత రణస్థలం సామాజిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. తదుపరి ఇద్దరు వేతనదారులు మన్నెల మహాలక్ష్మి, వడ్డి మణికంఠలను శ్రీకాకుళంలో రిమ్స్, మరొక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఉన్న మరో వ్యక్తి గొర్లె రమణకు కాలర్ బోను విరగడంతో శ్రీకాకుళంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మన్నెల మహాలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై జేఆర్‌పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వీఎంఆర్డీఏ మాజీ అధికారులపై విచారణ శ్రీకాకుళం(పీఎన్ కాలనీ): శ్రీకాకుళంలో తుపాను నీటి కాలువ నిర్మాణంలో అవకతవకలపై వీఎంఆర్డీఏ మాజీ అధికారులపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో చిన్న బజార్ నుంచి ఇల్లిసిపురం రోడ్డు మధ్య తుఫాను నీటి కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ పనుల నిర్వహణ విషయంలో పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి వీఎంఆర్డీఏ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ డి.విజయభారతి, క్వాలిటీ సెల్ ఏఈ ఎ.వి.రమణారావు, డీఈఈ జి.శ్యాంసుందర్లపై విచారణ చేయాలని నిర్ణయించింది. వీరు 15 రోజుల్లోగా ఈ ఆరోపణలపై రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ప్రభుత్వ ఐటీఐ స్థలం కబ్జాకు యత్నం
కాశీబుగ్గ: పలాసలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్థలాన్ని కబ్జా చేసి పునాదులు వేసేందుకు పలాసకు చెందిన ఇద్దరు వ్యక్తులు సోమవారం ప్రయత్నించారు. స్థలాన్ని జేసీబీ ట్రాక్టర్ పెట్టి చదును చేయగా సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ పైల జవహర్ సంఘటన స్థలానికి చేరుకొని అడ్డుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రిన్సిపల్ పై తిరగబడగా.. వారు ప్రిన్సిపాల్ జవహర్‌తో అసభ్యకరంగా మాట్లాడటంతో కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూదికొండకు వెళ్లే రహదారిలో ప్రైవేటు ఐటీఐ కళాశాలను మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం 25 సెప్టెంబరు 2010లో ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. దానికి ముందు అప్పటి తహసీల్దార్ సహకారంతో సర్వే చేయించి నాటి నివేదికలు ఆధారంగా సర్వే నంబర్ 232 /2ఎ3లో మూడు ఎకరాల 27 సెంట్లు భూమి, కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాలను ఉచితంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అప్పగించారు. అయితే ఐటీఐకి సెలవు దినాలలో, సిబ్బంది లేని సమయం చూసుకుని భూబకాసురులు స్థలాలను ఆక్రమించుకునేందుకు పునాదులు తవ్విస్తున్నారు. గతంలోనూ దీనిపై కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. సర్వే చేయించినా ఆ తర్వాతి కార్యకలాపాలు జరగలేదు. సెలవు దినాల్లో కూడా రోజుకొకరు చొప్పున కాపలా కాయాల్సిన వస్తోందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐటిఐ ప్రిన్సిపాల్ పైల జవహర్ కోరారు. -
ఉపాధ్యాయులకు ‘ప్రత్యేక పరీక్ష’
● పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులపై ఆదేశాలు ● ఆలస్యంగా ఉత్తర్వులు వెలువరించడంపై ఆవేదన శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మూడు రోజుల కిందట విడుదల చేసిన ఉత్తర్వులు ఉపాధ్యాయుల ఆవేదనకు దారి తీస్తున్నాయి. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేవరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించడంపై ఉపాధ్యాయ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వేసవి సెలవుల్లో విహారయాత్ర, తీర్థయాత్రలకు వెళ్లేందుకు పలువురు ఉపాధ్యాయులు కొన్ని నెలల కిందటి నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం గతంలోని లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక తరగతులపై ఆదేశాలు జారీ చేయడం, అదికూడా ముందస్తుగా కాకుండా వేసవి సెలవుల అయిన ఏప్రిల్ 23 తర్వాత ఉత్తర్వులు విడుదల చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు తప్పుపడుతున్నాయి. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల సెలవులు వినియోగించుకుంటే ఈఎల్‌సి మంజూరు చేయడం పరిపాటి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈఎల్‌సీ ప్రస్తావన లేదు. దీనిపైన కూడా ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. అందుబాటులో ఉన్న పలువురు ఉపాధ్యాయులు బోధన కోసం పాఠశాలలకు వెళ్లినా కొన్ని పాఠశాలల్లో ఒకరిద్దరు హాజరువుతుండటం, మరికొన్ని పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాకపోవడం తలనొప్పిగా మారింది. విద్యార్థులకు ఫోన్లు చేసినా వారు తరగతులుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తరగతులు బోధించినపుడు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉండగా, విద్యార్థులు హాజరుకాని సందర్భంలో ఏం చేయాలో పాలుపోక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేదు ఈఎల్‌సీలు ఇవ్వకుండా ఉపా ధ్యాయుల సేవలు వినియోగించుకున్న సందర్భాలు గతంలో లేవు. సప్లిమెంటరీ పరీక్ష మరో పది రోజులుండగా, ఇప్పుడు ప్రత్యేక తరగతులపై ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరం. ప్రభుత్వం తీసు కుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటుంది. – పేడాడ కృష్ణారావు, డీటీఎఫ్ నాయకుడు -
ఉద్దానం ప్రాజెక్టు ద్వారా ఇచ్ఛాపురానికి తాగునీరు
ఇచ్ఛాపురం: వైఎస్ జగన్ సర్కారు నిర్మించిన వైఎస్సార్ సుజలధార ఉద్దానం ప్రాజెక్టు ఇప్పుడు ఇచ్ఛాపురం మున్సిపాలిటీ దాహం తీర్చనుంది. మున్సిపాలిటీలో తాగునీటి కొరత ఏర్పడడంతో ఉద్దానం ప్రాజెక్టే పెద్దదిక్కుగా మారింది. మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి సంతపేట వద్ద ఉద్దానం వాటర్ ప్రాజెక్టుని మున్సిపల్ నీటి సరఫరా పంప్‌హౌస్‌కి అనుసంధానం చేశారు. ఈ నీటి సరఫరాను సోమవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ప్రారంభించారు. నదిలో ఇసుక తవ్వకాల వల్లనే మున్సిపాలిటీకి తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ సుజ లధార ఉద్దానం వాటర్ ప్రాజెక్టు ద్వారా కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, ఇచ్ఛాపురం మండలాలకు నీటి సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికార పక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఆఖరకు అదే ప్రాజెక్టు ఇప్పుడు దాహం తీరుస్తోంది. అయితే మున్సిపాలిటీ పంప్‌హౌస్‌కు అనుసంధానం చేసిన ఘనత తమదే అని ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం కనిపించింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, ఈఈ సుగుణాకర్‌రావు, మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్, జనసేన ఇన్చార్జి దాసరి రాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
సూదికొండ మిగలకుండా..
ఈ ఫొటోలో కనిపిస్తున్న కొండ పేరు సూదికొండ. పలాస–కాశీబుగ్గలో ఉంది. కూటమి ప్రభుత్వంలో కొండల్ని ఎలా కొల్లగొడుతున్నారో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. గ్రావెల్ కోసం మట్టి మాఫియా దాష్టీకానికి ఒడిగట్టింది. అక్రమార్కులకు సూదికొండ ఆదాయ వనరుగా మారింది. అనుమతుల పేరుతో ఇప్పటికే సగానికి పైగా కొండను తవ్వేశారు. మిగతాది తవ్వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాగే వదిలేస్తే సూదికొండ మిగలకుండా పోతుంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వంలో విధ్వంసం పతాకస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. పచ్చని కొండలు ఛిద్రమైపోతున్నాయి. కొండలు వన్యప్రాణులకు నెలవుగా ఉంటాయి. పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. తుఫాన్లు ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణగా నిలుస్తాయి. కానీ, ఇప్పుడా కొండలపైనే కూటమి నేతల కన్ను పడింది. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. పలాస నియోజకవర్గంలో సూదికొండపై గ్రావెల్ మాఫియా బరితెగించింది. రేయింబవళ్లు దర్జాగా తవ్వి తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికే సూదికొండ సగానికి పైగా తరిగిపోయింది. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 51లో 60 ఎకరాల విస్తీర్ణంలో సూదికొండ ఉంది. 2014–19లోనే పట్టణంలోని సూదికొండపై తమ్ముళ్ల కన్ను పడింది. ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చాలావరకు నిలువరించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక బరితెగించారు. ఎవరి హయాంలో విధ్వంసం ప్రారంభమైందో వారి హయాంలోనే మళ్లీ జడలు విప్పింది. విచిత్రమేమిటంటే అక్కడ క్వారీకి అధికారులు అనుమతులు ఇచ్చారని చెప్పి చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన నాయకుడు ఇదే మంచి అవకాశంగా తీసుకున్నారు. ఇష్టారీతిన తవ్వి తరలించేస్తున్నారు. మరోవైపు ఎంఐజీ లే అవుట్‌కు తరలిస్తున్నామంటూనే ఎక్కడెక్కడికో రవాణా చేసేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం కోసమని కూడా తవ్వకాలు జరుపుతున్నారు. చదును పేరుతో గ్రావెల్ బిజినెస్ చేస్తున్నారు. రూ.కోట్లలో అక్రమార్కులు ఆర్జిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కొన్నాళ్లకు ఇక్కడొక సూదికొండ ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కొండను కొల్లగొట్టేస్తున్న కూటమి పెద్దలు ఇప్పటికే సగానికిపైగా గుండు కొట్టేసిన వైనం పతాక స్థాయికి చేరిన విధ్వంసం -
ఎస్బీఐ మరో బ్రాంచిలో
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో వరుస పెట్టి అక్రమాలు బయటపడుతున్నాయి. గతంలో గార ఎస్బీఐలో తాకట్టు బంగారం బ్రాంచి నుంచి మాయమై, వేరే ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టిన ఘటన వెలుగు చూడగా, ఆ మధ్య నరసన్నపేట బజారు బ్రాంచిలో ఉద్యోగుల పేరుతో రుణాలను నొక్కేసిన బాగోతం బయటపడింది. తాజాగా కవిటి మండలం సిలగాం ఎస్బీఐ బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరుతో రుణాలను కాజేసిన వ్యవహారం వెలుగు చూసింది. ఇవన్నీ గతంలో జరిగినప్పటికీ కాలక్రమేణా బయటకు వస్తున్నాయి. కవిటి మండలం సిలగాం బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరుతో రుణాలను కాజేసిన తాజాగా వ్యవహారం వెలుగు చూసింది. శాఖా పరమైన విచారణలో అవినీతి బయటపడింది. దాంట్లో బాధ్యుడైన ఉద్యోగిని సస్పెండ్, డిస్మిస్ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఆడిట్లో అభ్యంతరం వస్తూ ఉండటంతో తాజాగా క్రిమినల్ చర్యల కోసం ఎస్బీఐ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు అధికారుల అంతర్గత పూర్తి విచారణ నివేదిక తీసుకొస్తే తప్ప ముందుకు వెళ్లలేమని పోలీసులు చెప్పడంతో ఇప్పుడా విచారణ నివేదికను, చర్యల ఫైల్‌ను పట్టుకుని వెళ్లే పనిలో బ్యాంకు ఉన్నతాధికారులు ఉన్నారు. డ్వాక్రా సంఘాలకు బురిడీ.. కవిటి మండలం సిలగాం బ్రాంచి పరిధిలోని డ్వాక్రా సంఘాలను బురిడీ కొట్టించారు. సంఘాలకు ఇచ్చింది కొంతైతే... వాటి పేరున నొక్కేసింది మరికొంత. డ్వాక్రా సంఘాలకు అధికారికంగా ఉన్న ఖాతాలకు కొంతమేర రుణాలిచ్చినట్టు చూపించగా, ఆ సంఘాల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి, మరికొంత రుణాలు తీసుకున్నారు. దీంతో బ్యాంకు లెడ్జర్లలోనూ, డీఆర్డీఏ రికార్డుల్లోనూ రుణాల లెక్కల్లో తేడా వచ్చింది. దీనిపై శాఖా పరమైన విచారణ చేపట్టడంతో గతంలోనే అవినీతి బట్టబయలైంది. కాకపోతే, వ్యవహారాన్ని గట్టు చప్పుడు కాకుండా ఉంచారు. అంతర్గతంగానే సెటిల్ చేసేశారు. కాకపోతే, బ్యాంకు ఆడిట్లో ఆ అక్రమంపై అభ్యంతరం వ్యక్తం కావడంతో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి సదరు బ్యాంకు అధికారులకు ఎదురైంది. దానిలో భాగంగా ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించారు. అవినీతి మాఫీ.. సిలగాం బ్రాంచిలో నాలుగేళ్ల క్రితం అవినీతి జరిగింది. ఆ అవినీతి కూడా మాఫీ అయిపోయింది. డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ప్రభుత్వం ఇస్తున్నందున ఈ సంఘాల పేరుతో రుణాలు నొక్కేసి, ఆ సొమ్మును బయట వడ్డీలకు తిప్పి మొత్తంలో సంపాదించుకున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేయడంతో బ్యాంకు అధికారులు సొంతానికి వాడుకున్న రుణాలు కూడా మాఫీ అయిపోయాయి. ఈ విధంగా మాఫీలో ఎంత లబ్ధి పొందారు, నకిలీ ఖాతాల పేరుతో ఎంత మేర రుణాలను కొట్టేశారో అన్నది ఇంతవరకు బయటికి వెల్లడి కాలేదు. బ్యాంకు అధికారులు గుట్టుగానే ఉంచారు. మౌఖికంగా ఫిర్యాదు చేయడానికి పోలీసుల వద్దకొస్తే ఆ మొత్తం అవినీతి నివేదిక తీసుకురావాలని చెప్పడంతో వెనక్కి వచ్చేశారు. నాటి బాగోతంలో క్యాష్ ఇన్చార్జి సరోజ్‌కుమార్ కీలక పాత్ర పోషించారని, ఆ కేసులో సస్పెండ్‌తో పాటు డిస్మిస్ అయినట్టు కూడా తెలిసింది. ఇప్పటికే నరసన్నపేట బజారు బ్రాంచిలో ఉద్యోగుల పేరు చెప్పి రుణాలు తీసుకుని, ఆ సొమ్ము దిగమింగేసిన ఘటనలో ఒకరు సస్పెండ్ అవ్వగా, గారలో తాకట్టు బంగారం మాయం చేసిన ఘటన అరెస్టులు, సస్పెన్ష్లు జరిగాయి. తాజాగా సిలగాం సరోజ్ కుమార్ ఒక్కరేనా? మిగతా వారి పాత్ర ఎంత? అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తేలే అవకాశం ఉంది. కవిటి మండలం సిలగాం ఎస్బీఐ బ్రాంచి వార్తల్లోకి ఎక్కిన సిలగాం బ్రాంచ్ డ్వాక్రా సంఘాల పేరుతో రుణాల కాజేసిన వైనం ఇప్పటికే బాధ్యుడిగా ఒకరిపై సస్పెన్షన్, డిస్మిస్ వరుస ఘటనలతో ఎస్బీఐకు అప్రతిష్ట -
స్కీమ్ కాదు.. అదో పెద్ద స్కామ్
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హామీలు నెరవేర్చకుండా అవినీతి మహిళలకు కుట్టుమిషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి ప్లాన్ వేసింది. తల్లికి వందనం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తానని హామీ ఇచ్చి చివరకు ఇలాంటి పనులు చేస్తున్నారు. హామీలు నెరవేర్చకుండా ఒకసారి మోసం చేశారు. అవినీతితో రెండోసారి మోసం చేస్తున్నారు. అన్ని వ్యవస్థల్లో అవినీతికి పాల్పడుతూ గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయలు కాజేయడం చంద్రబాబు నైజం. – పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ టెక్కలి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్‌బోన్ అని నమ్మిన వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎక్కడా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అర్హతే ప్రామాణికంగా నేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకే డబ్బులు జమ చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చంద్రబాబునాయుడికి మాత్రం స్కీమ్‌లు స్కామ్‌లతో సమానమని మండిపడ్డా రు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియా తో ఆయన మాట్లాడారు. మహిళా దినోత్సవం నాడు ప్రారంభించిన కుట్టుమిషన్ల శిక్షణ స్కీమ్ లో రూ.150కోట్లు స్కామ్ చేయడం అన్యాయమ న్నారు. వాస్తవానికి ఒక్కో మహిళకు కుట్టుమిషన్ ఇచ్చేందుకు రూ.4300, శిక్షణకు రూ.3 వేలు మొత్తం రూ.7300 అవ్వగా టెండర్లో మాత్రం ఏకంగా రూ.21500 చూపించడం దారుణమన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఈ పథకానికి యూనిట్, శిక్షణ ఇవ్వడానికి అయిన ఖర్చు కేవలం రూ.75.06 కోట్లు పోగా మిగిలిన రూ.146.02కోట్లు స్వాహా చేసేశారన్నారు. ఈ శిక్షణ కేవలం 50రోజుల్లో పూర్తిచేసి మిగతా మొత్తాన్ని చంద్రబాబునాయుడు కోట రీ బొక్కేయడం సరికాదన్నారు. కమ్మ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కులాలకు కుట్టు మిషన్ల పంపిణీ అంటూ రూ.115 కోట్లకు టెండర్లు పిలిచి అందులో మరో రూ.81.05 కోట్లు స్కామ్ చేశారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం టీడీపీ నేతల వెనక తిరగాల్సి వస్తోందని, వైఎస్సార్ సీపీ హయాంలో ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలన్నారు. కళింగవైశ్య కుల, తూర్పుకాపు, కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం మాట్లాడుతూ 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి బీసీ సంక్షేమాన్ని వైఎస్ జగన్ గొప్పగా నిర్వర్తించారని గుర్తు చేశారు. అర్హతే ప్రామాణికంగా తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు. బీసీలకు లోన్లు, కుట్టుమిషన్ల పేరు తో ఈ ప్రభుత్వం స్కామ్ చేస్తోందని దుయ్యబట్టారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ, గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణ, సాధు వైకుంఠరావు, గొండు రఘురాం, రాజాపు అప్పన్న, గుప్తా, బొబ్బాది ఈశ్వరరావు, భార్గరావు, తంగి అప్పన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. కూటమి స్కామ్‌లతో ఖజానా ఖాళీ కూటమి స్కామ్‌లతో ఖజానా ఖాళీ అవుతోంది. దాదాపు రూ.150 కోట్ల నిధులను దోపిడీ చేశారు. టెండర్ల దశ నుంచే అక్రమాలు జరిగాయి. రాష్ట్రంలోని బీసీ కార్యకర్తలు, బీసీ మహిళా సంఘాలు దీనిపై దృష్టి సారించాలి. –దుంపల లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రుణాల పేరుతో కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారు బీసీలను ఆదుకున్నది వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
ప్రశాంతంగా ఏయూఈఈటీ పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏ యూఈఈటీ – 2025 (ఆంధ్రా యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ టెస్ట్) సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఐదేళ్ల సమీకృత బీటెక్ కోర్సు కోసం ఏయూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. జిల్లాలో ఈ పరీక్ష కేంద్రానికి 433 మందిని కేటాయించగా, 391 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటలు వరకు పరీక్ష నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్‌గా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతాడ రాజశేఖర్‌రావు, జాయింట్ చీఫ్ సూపరింటెండెంట్‌గా పొన్నాడ రామకృష్ణారావు వ్యవహరించారు. ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు వద్దు మందస: దశాబ్దాలుగా ఉద్దానంలో కొబ్బరి, జీడి, పనస, మామిడిపై ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారని, కార్గో ఎయిర్‌పోర్టు రాకతో వీరంతా ఉపాధి కోల్పోతారని భేతాళపురం, గంగువాడ, రాంపురం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చటి ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు వద్దని చెబుతున్నా ప్రభుత్వం వినకపోవడం బాధాకరమన్నారు. ఎయిర్‌పోర్టును వ్యతిరేకిస్తూ వారంతా భేతాళపురంలో సోమ వారం ఆందోళన నిర్వహించారు. గత 180 రోజుల నుంచి నిరంతరం నిరసనలు చేస్తున్నామని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. ఎయిర్‌పోర్టు పేరుతో 1394 ఎకరాల భూమితో పాటు మూలపేట పోర్టు నుంచి కార్గో ఎయిర్‌పోర్టు వరకు 55 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు కోసం కూడా రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు మెళియాపుట్టి: ప్రేమ పేరుతో మభ్యపెట్టి బాలికను హైదరాబాద్ తీసుకుపోయిన యువకుడిపై టెక్కలి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. టెక్కలి ఎస్డీపీఓ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కనబడటం లేదని 22 ఏప్రిల్ 2025న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. గంగరాజపురం గ్రామానికి చెందిన ఫ్రఫుల్లో ప్రధాన్ అనే 21 ఏళ్ల యువకుడు బాలికను తీసుకెళ్లినట్లు సమాచారం అందడంతో ఈనెల 3వ తేదీన గంగరాజపురం గ్రామంలో యువకుడిని అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఎస్ఐ రమేష్ బాబు ఉన్నారు. -
భవిష్యత్‌కు గ్యారెంటీ
● ట్రిపుల్ ఐటీ.. ఆర్జీయూకేటీ ప్రాంగణం ఎచ్చెర్ల క్యాంపస్: ట్రిపుల్ ఐటీ సందడి మొదలైంది. పదో తరగతి తర్వాత అధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఈ సంస్థలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రత్యేక వెయిటే జీ ఇవ్వడమే దీనికి కారణం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. ట్రిపుల్ ఐటీలో చేరితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్ముతున్నారు. రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ప్రకాశం. శ్రీకాకుళం విద్యా సంస్థలో 1100 సీట్లు ఉన్నాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నా రు. ట్రిపుల్ ఐటీలో సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ఆరేళ్లు. రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు), నాలుగేళ్లు ఇంజినీరింగ్. పీయూసీ పూర్తయిన విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరుతారు. నూతన విద్యా విధానం–2020 మేరకు పీయూసీ పూర్తిచేసిన విద్యార్థులు రిలీవ్ కావచ్చు. ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం ఏటా రిలీవ్ కావచ్చు. విద్యార్హత బట్టి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజినీరింగ్‌లో సివి ల్, మెకానికల్, ట్రిపుల్ఈ, సీఎస్ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నారు. రిలీవ్ అయ్యే విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించటంతో పాటు గేట్ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. రెసిడెన్షియల్ పద్ధతిలో.. పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అర్హులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారు. పీయూసీకీ రూ.45 వేలు, ఇంజినీరింగ్‌కు రూ.50 వేలు ఏడాదికి ట్యూషన్ ఫీజు. ఇతర తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రవేశం పొందితే రూ. 1.50 లక్షలు ఏడాదికి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు ఆంధ్రా విశ్వావిద్యాలయం పరిధిలో 17 జిల్లాలకు 65.62 శాతం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో 9 జిల్లాలకు 34.38 శాతం సీట్లు కేటాయించి ప్రవేశాలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఈ నెల 20 చివరి తేదీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రవేశాల్లో వెయిటేజ్ ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు చదివే అవకాశం రెసిడెన్షియల్ విధానంలో విద్య మంచి ప్లేస్మెంట్లు సాధిస్తున్న రిలీవైన విద్యార్థులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ఆర్జీయూకేటీలో ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తాం. మంచి భవిష్యత్ ఉంటుంది. రిలీవ్ నాటికి మంచి ప్లేస్మెంట్లు లభిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువగా ప్రవేశాలు లభిస్తున్నాయి. విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. పూర్వపు విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆన్లైన్లో గడువు లోగా దరఖాస్తులు చేసుకోవాలి. – ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ, శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ దరఖాస్తుల స్వీకరణ.. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఏప్రిల్ 27 వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 20 చివరి తేదీ. జూన్ ఐదున ఎంపికై న విద్యార్థుల మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. 11 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూన్ 30 నుంచి క్లాస్‌వర్క్ ప్రారంభించి అకడమిక్ ఏడాది ప్రారంభిస్తారు. 10వ తర గతి మార్కులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెయిటేజీ, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దివ్యాంగులు, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్, వంటి ప్రత్యేక కేటగిరీలకు న్యూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
లక్ష్యానికి దూరం..
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదలకు దినసరి వేతనం కల్పించి, వలసల నివారణకు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో తగ్గుతోంది. ఈ పనులను నమ్ముకుని ఉన్న వేతనదారులకు న్యాయం జరగడం లేదు. అధికారులు–సిబ్బంది కుమ్ములాట, వ్యక్తిగత ప్రతిష్టలు ఈ శాఖలో మిగులుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో కూలీలకు న్యాయం జరగడం లేదు. ఒక పక్క అధికారుల అసమర్థత, మరో పక్క ప్రభుత్వం విధానాలతో ఈ పనులు మందగిస్తున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో పనులపై ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు జిల్లా రాష్ట్రస్థాయిలోనే పనుల కల్పనలో మొదటి, ద్వితీయ స్థానాల్లో ఉండేది. ఎన్ఆర్ఈజీఎస్ పనులు, వేతనదారులకు పనిదినాల కల్పన, వేతనాల చెల్లింపులు, మెటీరియల్ కాంపోనెంట్ జనరేషన్లో గుర్తింపు పొందింది. తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఫలితాలు దిగువ స్థాయికి చేరాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేవలం కాంపోనెంటు మొ త్తంలో మాత్రమే మూడో స్థానంలోకి చేరారు. మిగిలిన ప్రమాణాల్లో జిల్లా వెనుకబడిపోయింది. ఆర్ధిక సంవత్సరం లక్ష్యాలు 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక ప్రక్రియలో అంచనా విలువ రూ.1499.03 కోట్లుగా వేశారు. మొత్తం 41,523 పనులను గుర్తించారు. ఈ పనుల్లో భాగంగా గోశాల నిర్మాణం, సేద్యపు నీటి కుంటలు, సమతల, రింగు, కాంటూరు కందకాలు, కాలువలు, చెరువులు, పశువులకు నీటి తొట్టెలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, సోక్ పిట్స్, కంపోస్ట్ పిట్స్, చేపల చెరువులు, వరద కట్టలు, మట్టి రోడ్లు, భూ అభివృద్ధి పనులు, మినీ పెర్కొలేషన్ ట్యాంక్‌లు, హౌసింగ్ లబ్ధిదారులకు 90రోజులు పనిదినాలు, సరోవరాలు, కోనేరులు పూడిక తీత, పల్లె పుష్కరిణిలు తదితర పనులు చేపట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో తగ్గిన ఉపాధి పనులు లక్ష్యాలకు దూరంగా ఎన్ఆర్ఈజీఎస్ పనులు -
నీట్
● ప్రశాంతంగా ముగిసిన శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(నీట్) ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంలో 480 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 11 మంది గైర్హాజరయ్యారు. దీంతో 469 మంది పరీక్ష రాశారు. సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి అవస్థలు పడ్డారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కణితి శ్రీరా ములు సీఎస్‌గా వ్యవహరించి పర్యవేక్షించారు. ఎచ్చెర్ల క్యాంపస్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్ష నీట్–2025 ఆదివారం ప్రశాంతంగా జరిగింది. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎస్ఎంపురం క్యాంపస్‌లో 720 మంది విద్యార్థులకు 713 మంది హాజరయ్యారు. ఏడుగురు గైర్హాజరయ్యారు. కుశాలపురం పరిధి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 240 మంది వద్యార్థులకు 233 మంది హాజరయ్యారు. ఏడుగురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లోనికి 11.30 నుంచి విద్యార్థులను అనుమతించారు. మధ్యాహ్నం రెండు గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటలు వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉదయం 11 గంటలకే పరీక్ష కేంద్రాలను చేరుకున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ట్రిపుల్ ఐటీ ఏఓ ముని రామకృష్ణ, డీఎస్పీ వివేక నంద, తహసీల్దార్ బి.గోపాలరావు పరీక్షలు పర్యవేక్షించారు. -
ఆయుష్షు మిగలదు
ఆనవాలే ఉండదు.. పురుగు బారిన పడి నేలకొరిగిన కొబ్బరి మొక్కలు ఇచ్ఛాపురం రూరల్: ఉద్దానం కొబ్బరిపై ఎర్రముక్కు పురుగు పంజా విసురుతోంది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిత్లీ తుఫాన్‌కు నేలకొరిగిన కొబ్బరి చెట్ల ప్రాతంలో రైతులు కొబ్బరి మొ క్కలు నాటారు. మొక్కలు పెరుగుతున్న సమయంలో ఎర్రముక్కు పురుగు ఆశిస్తుండటంతో పచ్చగా కనిపిస్తూనే కొబ్బరి మొక్కలు నేలకొరుగుతున్నా యి. దీంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఈ పురుగు అన్ని వయస్సుల కొబ్బరి చెట్లను, తోటలను ఆశిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కొబ్బరి చెట్ల మొవ్వులో రంధ్రాలు చేసి, చెట్టు మరణానికి కారకాలుగా మారుతున్నాయి. మొక్కకు ఎర్ర ముక్కు పురుగు ఆశించినప్పటికీ చెట్టు పచ్చగానే ఉంటుండటంతో రైతులు త్వరగా మేలుకోలేకపోతున్నారని, కొబ్బరిదిగుబడి తగ్గడం, కొద్ది రోజుల తరువాత చెట్టును నష్టానికి గురిచేస్తుందని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. ఆనవాలు లేకుండానే.. చెట్టు లోపలి భాగంలో ఆవాసం ఏర్పాటు చేసుకు న్న ఎర్రముక్కు పురుగు అక్కడే సంతానోత్పత్తి చేసి ఆరోగ్యకరంగా ఉన్న కొబ్బరి చెట్టును నాశనం చేస్తుంది. చెట్టు నేలకొరిగే వరకు రైతు ఎలాంటి ఆనవాలు పసిగట్టలేకపోవడంతో నష్టపోతున్నాడు. దీంతో ఏడాదికి ఎకరానికి నాలుగైదు చెట్లను రైతు కోల్పోతున్నాడు. లేత కొబ్బరి చెట్లకు ఇది ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం కొబ్బరిని ఆశిస్తున్న ఎర్రముక్కు పురుగు నేలకొరుగుతున్న కొబ్బరి మొక్కలు పచ్చగా కనిపిస్తూనే పాడైపోతున్న వైనం సామూహిక సస్యరక్షణే మేలు -
అరసవల్లిలో వైశాఖ సందడి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వైశాఖ మాసం సందడి మొదలైంది. పవిత్ర వైశాఖ మొదటి ఆదివారం కావడంతో స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరాలయంలో ప్రత్యేక అలంకరణలో ఆదిత్యుడు సర్వదర్శనాలకు అనుమతించేలా ఆలయ అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకోగా మరికొందరు భక్తులు ఆరోగ్యం కోసం సూర్యనమస్కార పూజలు చేయించుకున్నారు. ఇంద్ర పుష్కరిణిలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయ పూజలు ఆశ్రయించారు. పంటల తొలిఫలాలను స్వామివారికి ప్రత్యేక ప్రసాదంగా నివేదించారు. పుష్కరిణి ప్రాంతంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ఈవో కె.శోభారాణి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేసినప్పటికీ కేశఖండనశాల, ఉచిత దర్శనాల క్యూలైన్లు తదితర చోట్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఒక్క రోజు ఆదాయం రూ.10.38లక్షలు.. వైశాఖ మొదటి ఆదివారం సందర్భంగా ఒక్కరోజులో రూ.10,38,252 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కె.శోభారాణి ప్రకటించారు. వివిధ దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.7.36 లక్షలు, విరాళాలు, పూజలు ద్వారా రూ.98,252, లడ్డూ, పులిహోర విక్రయాల ద్వారా రూ.2.04 లక్షల వరకూ ఆదాయం లభించినట్లు వివరించారు. ట్రాఫిక్‌జామ్.. అరసవల్లి ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ట్రాఫిక్ స్తంభించింది. గార, శ్రీకాకుళం నుంచి వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సుమారు గంట సేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనంతరం అసిరితల్లి ఆలయం పక్క నుంచి దేవాలయ తోట వరకూ వాహనాలను దారి మళ్లించారు. -
అఖిల భారత సమ్మె విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టనున్న అఖిలభారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కార్మిక, ప్రజా సంఘాల జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాలు కోసం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి వేసిందన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి, మరింత శ్రమదోపిడీ చేసేందుకు, పనిభారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసేందుకు, పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ సలహాదారు చిక్కాల గోవిందరావు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎస్.వెంకటరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మణికొండ ఆదినారాయణమూర్తి, బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాస్, బీఎస్ఎన్ఎల్ నాయకుడు ఎం.గోవర్ధనరావు, రైతు సంఘం నాయకుడు కొత్తకోట అప్పారావు, పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పార్వతీశం, రిమ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాకోటి చిన్నారావు, ఏపీ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు టి.ప్రవీణ, పద్మ, కళాసీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బోర చిన్నారావు, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
తవ్వకాల కలకలం
లుకలాంలో.. ● తాగునీటి ప్రాజెక్టు సమీపంలోనే ఇసుక తవ్వకాలు ● ఆందోళన చెందుతున్న స్థానికులు నరసన్నపేట : ఉచితం విధానం పేరిట వంశధార నదిలో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. నదిలో తమకే హక్కులు ఉన్నాయన్న చందంగా నది మొత్తం జేసీబీలతో గుల్ల చేసేస్తున్నారు. మంజూరు చేసిన విస్తీర్ణానికి మించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. చెంతనే తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని కూడా చూడకుండా ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీంతో లుకలాం గ్రామస్తులతో పాటు నరసన్నపేట మండలవాసులు ఆందోళన చెందుతున్నారు. లుకలాంలో అధికారికంగా ఇసుక ర్యాంపు ఇవ్వకపోయినా ఎదురుగా శ్రీకాకుళం రూరల్ మండలం బట్టేరు ర్యాంపునకు అధికారులు అనుమతులిచ్చారు. వారికిచ్చిన పరిధిని దాటి నదిలో నరసన్నపేట మండలం లుకలాం వైపు వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నదీ గర్భాన్ని ఛిద్రం చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ గోతులు పెట్టి జేసీబీలతో ఇసుకను తవ్వి లారీలతో తరలిస్తున్నారు. మిగిలిన ప్రాంతం మాట ఎలా ఉన్నా లుకలాం వద్ద ఉన్న రక్షిత మంచినీటి ప్రాజెక్టుకు సమీపాన భారీ ఎత్తున తవ్వకాలు చేస్తున్నారు. తాగునీటి సరఫరాకు ముప్పు.. ఇక్కడి తాగునీటి ప్రాజెక్టు నుంచి 18 గ్రామాలకు నీరు సరఫరా అవుతుంటుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును రూ.7 కోట్లతో నిర్మించారు. అప్పట్లో 30 గ్రామాలకుపైగా తాగునీరు సరఫరా అయ్యేది.. ప్రస్తుతం 18 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అప్పట్లో నీటి ఫిల్టర్లు నదిలో నిర్మించారు. ఇప్పుడు వీటికి దగ్గర్లోనే ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో నీటి కొరత ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నీటి ప్రాజెక్టుకు ఇబ్బంది.. వంశధార నదిలో శ్రీకాకుళం రూరల్ మండలం బట్టేరు ఇసుక ర్యాంపు నిర్వాహకులు తమ పరిధిని దాటి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నరసన్నపేట మండలం లుకలాం వైపు వచ్చి ఇసుక తవ్వేస్తున్నారు. రూ.7 కోట్లతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు సమీపంలోనే తవ్వకాలు జరుపుతుండటంతో గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో నీటి ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. – ఎస్.తవిటినాయుడు, సర్పంచ్, లుకలాం తవ్వకాలు ఆపాలి.. తాగునీటి ప్రాజెక్టు సమీపంలో ఇసుక తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలి. ఇదే విధంగా తవ్వకాలు జరిగితే లుకలాంతో పాటు మరో 18 గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదముంది. ముందుగానే అదికారులు మేల్గొని తగు చర్యలు తీసుకోవాలి. – చింతల సత్యం, మాజీ సర్పంచ్, లుకలాం -
బారువలో బారులు తీరిన పర్యాటకులు
బారువ తీరంలో ఆదివారం నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌కు పర్యాటకులు పోటెత్తారు. ఉత్సవం చివరి రోజు కావడంతో స్థానికులతో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఒడిశా నుంచి వేలాది సంఖ్యలో పర్యాటకులు బారువ తీరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫైర్ షో, ముగింపు వేడులు ఆకట్టుకున్నాయి. బోట్‌రైడింగ్ వంటి కార్యక్రమాలతో చిన్నారులు సందడి చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. – సోంపేట -
దర్గాలో చందనోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చౌక్బజారు దర్గాలో హజరత్ సయ్యద్ రోషన్ షావళిబాబా రహమతుల్లా షరీఫ్ చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. బాబా సమాధికి గంధం పూసి పూలదండలతో అలంకరించి చాదర్ కప్పి ఖురాన్ పఠించారు. షేక్‌సలీం సోదరుల ఆధ్వర్యంలో లంగర్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జామియా మసీదు ప్రతినిధులు షాన్, రఫీ, బాషా, అహమ్మద్, నజీరుద్దీన్, వహబ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారి అనుమానాస్పద మృతి కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడు రోడ్ల కూడలిలో ఉన్న ఓ దుకాణం అరుగుపై విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానిక వ్యాపారి వూన నాగరాజుగా గుర్తించి కుటుంబానికి తెలియజేశారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం జరజాం సమీపంలో బైపాస్ రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతిచెందాడు. బైక్ నడుపుతున్న అడపా సింహాచలం (39) ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే మృతి చెందిన విషయం తెలిసిందే. వెనుక కూర్చున్న బాలి సింహాచలం (64) తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుక్కల దాడిలో ఆవుదూడ మృతి పొందూరు: మండలంలోని తండ్యాం గ్రామంలో కుక్కల దాడిలో ఆదివారం ఉదయం లంకలపల్లి వెంకటరావుకు చెందిన ఆవుదూడ మృతి చెందింది. రైతు తన కల్లంలోని ఏడాది వయస్సు కలిగిన ఆవుదూడను కట్టి ఇంటికి వెళ్లే సరికి కుక్కలు గుంపు ఒక్కసారిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామపెద్ద భాస్కరరావు పొందూరు పశుసంవర్ధకశాఖ ఏడీకి సమాచారం ఇవ్వడంతో వైద్యులు వచ్చి చికిత్స చేసినా అప్పటికే దూడ మృతిచెందింది. కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ‘కూర్మ’లో వేసవి శిక్షణ శిబిరాలు హిరమండలం: ఆధ్యాత్మిక గ్రామం కూర్మలో యువతకు వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయని వర్ణాశ్రమ నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 వరకూ శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. భారత సనాతన సంస్కృతిని నెలకొల్పడం, స్వయం సమృద్ధి సాధించడం, పూర్వపు వృత్తులను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో చేనేత, గానుగ ఆడింపు, మట్టికుండల తయారీ, వడ్రంగి, కర్రసాము, వైదిక గృహనిర్మాణం, ప్రకృతి వ్యవసాయం, మంత్రధ్యానం, శ్రవణం, కీర్తనం, వైదిక జీవనం ప్రాముఖ్యత, రసాయనాలు లేని ఆహారం, శాస్త్ర అధ్యయనం, ఆధ్యాత్మిక సాధన తదితర అంశాల్లో యువతకు శిక్షణ ఇస్తామని వివరించారు. 15 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించాలని, సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యుత్‌తో పాటు ఇతరత్రా ఆధునిక సదుపాయాలేవీ ఉండవని, సరళం, సహజం, సంప్రదాయకం, ధార్మిక జీవనం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు 7732075607, 8712011776 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ధ్రువపత్రాలు సిద్ధమేనా..
హిరమండలం: పదో తరగతి, ఇంటర్మీడియెట్ తదితర పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఉన్నత చదువుల్లో భాగంగా కళాశాలల్లో చేరేందుకు పలు ధ్రువపత్రాలు తప్పనిసరి. వీటినిముందస్తుగా పొందేందుకు ఇదే మంచి తరుణమని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్న విద్యార్థుల కోసం సంబంధిత కార్యాలయాల్లోనూ అవసరమైన అన్ని పత్రాల అందజేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒత్తిడి పెరగకముందే.. సాధారణంగా మే, జూన్ నెలల్లో ముఖ్యంగా తహసీల్దార్ కార్యలయాల్లో సిబ్బందిపై ధ్రువపత్రాల జారీకి సంబంధించి అధిక ఒత్తిడి ఉంటుంది. దరఖాస్తుదారుల రద్దీ పెరుగుతుంటుంది. వీఆర్వో, ఆర్ఐల క్షేత్ర స్థాయి పరిశీలన, డిజిటల్ సంతకాలు తదితర పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు పలుమార్లు తిరగాల్సిరావడం, మధ్యవర్తులను ఆశ్రయించడం వంటి ఇబ్బందులు రావచ్చు. ఫలితంగా అనుకున్న సమయానికి ధ్రువపత్రాలు చేతికి అందకపోవచ్చు. ముందుగా మేల్కొంటే హైరానా తప్పుతుందని అధికారులు చెబుతున్నారు. ధ్రువపత్రాలు పొందాలంటే.. ● ప్రస్తుతం చదువుతున్న క్లాసుల నుంచి తదుపరి తరగతుల్లో ప్రవేశానికి ఆదాయం, కులం, ఈడబ్ల్యూస్, ఓబీసీ వంటి ధ్రువపత్రాలు తప్పనిసరి. వీటి కోసం మీ–సేవా కేంద్రాలు, సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ● ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలతో సంబంధిత అర్జీ పూర్తిచేసి అవసరమైన నకలను జతపర్చి సచివాలయం డిజిటల్ సహయకుడికి అందజేయాలి. ● ఆన్లైన్లో పొందపరిచిన వివరాలపై వీఆర్వో క్షేత్ర స్థాయిలో, మండల రెవెన్యూ ఇన్‌స్టెక్టర్ (ఆర్ఐ)నేరుగాను పరిశీలిస్తారు. అన్నీ పక్కాగా ఉంటే చివరిగా తహసీల్దార్ తన లాగిన్‌లో మరోసారి నిశితంగా పరిశీలించి డిజిటల్ సంతకం చేస్తారు. దీనిపై మొబైల్‌కు వచ్చే సందేశంతో దరఖాస్తుదారులు సచివాలయంలో గానీ, మీసేవా కేంద్రంలో గానీ ధ్రువపత్రాలు పొందవచ్చు దరఖాస్తు చేసుకోండి.. కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల్లో చేరే సమయంలో అవసరమయ్యే ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే మేలు. చివరి సమయంలో హడావుడి పడుతూ ఆందోళన చెందకుండా ప్రస్తుత సెలవుల్లోనే కార్యాలయాలను సంప్రదించాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీకి నిర్దేశించిన సమయం కంటే ముందు వీటిని జారీచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్.హనుమంతురావు, తహసీల్దార్, హిరమండలం కుల, ఆదాయ తదితర సర్టిఫికెట్లకు ఇదే సమయం విద్యాసంస్థల్లో ప్రవేశాలు నేపథ్యంలో ముందస్తుగా సిద్ధం కావడం మేలు -
భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం పాతబస్టాండ్: భగీరథ మహర్షి దివి నుంచి భువికి గంగను తెచ్చిన మహానుభావుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జి ల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరుగునపడిన వా రి జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇ.అనురాధ, బీసీ సంక్షేమ శాఖ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.దేవభూషణరావు, ఉప్పర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట రామారావు, సెక్రటరీ గజ్జల మాధవ రావు ఉపాధ్యక్షులు పిండి రాము, కలెక్టరెట్ ఏఓ సూర్యనారాయణ, బీసీ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
50 ఏళ్ల తర్వాత బేసి పోలమ్మ అమ్మవారి సంబరాలు
సోంపేట: మండలంలోని బేసి రామచంద్రాపురం గ్రామంలోని బేసి పోలమ్మ అమ్మవారి గ్రామ దేవత సంబరాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు సంబరాలు నిర్వహించనున్నారు. యాభై ఏళ్ల తర్వాత గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది. 5 నుంచి 13వ తేదీ వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటల తర్వాత గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 5న రాజమండ్రి వారి డ్యాన్స్ ఈవెంట్స్, 6న ఒడిశా వారి సాంస్కృతిక కార్యక్రమాలు, 7న కండక్టర్ ఝాన్సి, రమేష్ మాస్టర్ స్టేజ్ ఈవెంట్స్, 8న ఒరియా రామాయణం, 9న పల్సర్ బైక్ రమణ ఈవెంట్స్, 10న ప్రకాష్ మాస్టారు గ్రూప్ డ్యాన్స్‌లు, 11న విశాఖపట్నం రోషన్‌లాల్ ఆర్కెస్ట్రా, 12న బుల్లెట్ భాస్కర్ టీమ్ జబర్దస్త్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జోగిపోలమ్మ సిరిమాను పండగలు టెక్కలి: టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో సోమవారం నుంచి గ్రామదేవత జోగిపోలమ్మ సిరిమాను పండగలు జరగనున్నాయి. దశాబ్దాల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్పంచ్ కోరాడ కామేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు దేవర ఉత్సవంతో పాటు 13వ తేదీ సిరిమాను సంబరం, అమ్మవారి ఘటాల ఊరేగింపుతో 9 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. దశాబ్దాల తర్వాత నిర్వహిస్తున్న ఉత్సవాల కోసం సుదూర ప్రాంతాల నుంచి బంధువులంతా గ్రామానికి చేరుకోవడంతో సందడి చోటు చేసుకుంది. ఉత్సవాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
అడ్డగోలు పదోన్నతులు!
బీసీ సంక్షేమంలో..శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా బీసీ సంక్షేమ శాఖలో అవినీతి చుక్కలనంటుతోంది. రెండు రోజుల కిందట వసతి గృహ సంక్షేమాధికారులకు పదోన్నతులు కల్పించారు. ఇద్దరు హెచ్‌డబ్ల్యూఓలకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు ప్రమోషన్ ఇచ్చారు. కానీ సీనియారిటీ పాటించకుండా ఈ పదోన్నతులు కల్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు గ్రేడ్–1 పదోన్నతులు ఇచ్చారని కొందరు మండిపడుతున్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఈ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని, వారిపై ఉన్న క్రమశిక్షణ అంశాలను దృష్టిలో పెట్టుకుని పదోన్నతులు కల్పించాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించలేదని తెలుస్తోంది. పదోన్నతులు కల్పించే ముందు సీనియారిటీ జాబితా విడుదల చేయాలి. ఆపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి. ఈ సారి కూడా సీనియారిటీ జాబితాపై నాలుగు అభ్యంతరాలు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా 2008 నాటి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పించారు. ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని సిబ్బంది అంటున్నారు. అయితే ఎవరూ పదోన్నతులపై నోరు మెదపడం లేదు. డీబీసీ ఆదేశాల మేరకు అడ్డగోలుగా ఫైలును పెట్టి పదోన్నతులు కల్పించారని ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ సంగతేంటి..? ఈ బీసీ సంక్షేమంలో ఆరు కారుణ్య నియామకాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ ఫైల్‌కి సంబంధించిన అన్ని ప్రక్రియలు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పూర్తయ్యాయి. అయితే కావాలనే జాప్యం చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో ఈ నియామకాలు చేయలేదు. ఎన్నికల కోడ్ పూర్తయి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ నియామకాలు జరగలేదు. దీంతో వారు రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి సిఫార్సులు చేయించుకుని వచ్చినా జిల్లా అధికారి కనికరించడం లేదు. కారుణ్యంలో కూడా కాసులు దండుకునే స్థాయికి దిగజారిపోయారని సిబ్బంది అంటున్నారు. పదోన్నతుల్లో చేతివాటం గ్రేడ్–2 హెచ్‌డబ్ల్యూఓ నుంచి గ్రేడ్–1 వసతి గృహ సంక్షేమాధికారులుగా పదోన్నతులు పొందేందుకు రూ.లక్షల్లో చేతులు మారినట్లు ఆ శాఖ సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఒక్కో పదోన్నతిపై రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పదోన్నతులు పొందిన వారిలో ఒకరు ఈ ఏడాది ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంతే కాకుండా సంఘ నాయకులుగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నందునే ప్రమోషన్ వచ్చిందని మిగిలిన అధికారులు చెబుతున్నారు. సీనియారిటీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్లలో అవకతవకలు, అవినీతి వ్యవహారాలు, అడ్డగోలు పనితీరు వంటివి బీసీ సంక్షేమ శాఖకు పరిపాటిగా మారిందనే అపవాదు ఉంది. జిల్లాకు చెందిన మంత్రి పేరు చెప్పి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు పదవుల్లో ఉన్నా వారి పేరును వాడుకుని కలెక్టర్‌ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ జాబితాలను పక్కన పెట్టిన వైనం నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్ణయాలు -
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
గార: ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. శనివారం అంపోలు జిల్లా జైలును ఆయన సందర్శించారు. ముద్దాయిల ఆరోగ్య పరిస్థితి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేనివారికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆసరాగా నిలుస్తుందన్నారు. ఆయనతో పాటు న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, జైలు సిబ్బంది ఉన్నారు. జనావాసాల్లోకి జింక ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలోని సూదికొండ, పీర్లకొండ మధ్య ప్రాంతంలో సంచరిస్తున్న జింకల సమూహం నుంచి ఓ జింక దారి తప్పి జనావాసాల్లోకి చొరబడింది. బంగ్లారోడ్డులోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉండిపోయింది. స్థానికులు గుర్తించి కమిషనర్ ఎన్.రమేష్‌కు సమాచారం అందించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భానుమూర్తికి కమిషనర్ సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి జింకను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో పొదల్లోకి వెళ్లిపోవడంతో అందరూ వెనుదిరిగారు. ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా బుక్కూరు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ కార్యదర్శిగా బుక్కూరు ఉమమామహేశ్వరరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంలకు కృతజ్ఞతలు తెలిపారు. సెలవుల్లోనే బదిలీలు పూర్తిచేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ రమణమూర్తి, జి.రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మే 31 నాటికి అన్ని కేటగిరీల టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని, జూన్ 5 తర్వాత స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. అప్పటికే నూతన ఉపాధ్యాయులు పాఠశాలలో జాయినైతే ఎన్రోల్మెంట్ డ్రైవ్ నూతనోత్సాహంతో చేపట్టడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. పాఠశాల పని దినాల్లో బదిలీలు జరగడం వల్ల ఉపాధ్యాయులు.. విద్యార్థుల మీద దృష్టిపెట్టే విషయంలో కొంత సతమతమవుతారని విషయాన్ని అధికారులు మర్చిపోవద్దన్నారు. లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు నందిగాం: మండలంలోని ఆకుల రఘునాథపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం వేకువజామున లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ నుంచి రైలు బోల్టు, నట్లు లోడ్‌తో వచ్చిన లారీ ఆకుల రఘునాథపురం వద్దకు వచ్చే సరికి బస్ ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అజమ్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్లీనర్ ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాలు శ్రీకాకుళం అర్బన్/ఎచ్చెర్ల: గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం హిందీ పండిట్ రాజశేఖర్, గణిత ఉపాధ్యాయుడు జగదీష్ చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. బలగ హడ్కో కాలనీ గ్రంథాలయంలో లైబ్రేరియన్ పి.ఉగ్రసేన ఆధ్వర్యంలో పిల్లలకు నీతి కథలు చెప్పారు. లావేరు శాఖా గ్రంథాలయంలో రిసోర్స్‌పర్సన్ పి.పద్మావతి మాట్లాడుతూ అతిగా సెల్‌ఫోన్ వినియోగిస్తే కలిగే అనర్థాలను వివరించారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
పాతపట్నం: పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో కాకితోట వద్ద శనివారం ఉదయం గుణుపూర్ నుంచి పూరీ వెళుతున్న రైలు ఢీకొని పాతపట్నం మేజర్ పంచాయతీ శివశంకర్ ఒకటో వీధికి చెందిన బోయిన కామేశ్వరరావు(57) మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ తెలిపారు. ఈయన పాతపట్నం ఆల్‌ఆంధ్ర రోడ్డు కూడలిలో పకోడి బండి నడుపుతూ జీవనం సాగించేవాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమర్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ తెలిపారు. కామేశ్వరరావుకు భార్య బోయిన రవణమ్మ, కుమారుడు సంతోష్‌కుమార్ ఉన్నారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: కల్లేపల్లి గ్రామంలో కొయ్యి తాతారావు (66) అనే వ్యక్తి శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన విశాఖపట్నంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబంతో ఉంటున్నాడు. ఈ నెల 1న పెన్షన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వచ్చాడు. మద్యానికి బానిస కావడం, అనారోగ్య సమస్యలు ఉండటంతో మన స్థాపం చెంది పక్కనే గల తోటలోకి వెళ్లి లుంగీతో ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్తున్న ఉపాధి వేతనదారులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. తాతారావుకు భార్య పార్వతి, కుమార్తె ఉన్నారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీహెచ్‌ఓల సమస్యలు పట్టవా?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది పేద ప్రజలకు వైద్యసేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమంటే కూటమి ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి అన్నారు. కొన్ని రోజులుగా మండుటెండలో ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళం నగరంలో మహాత్మాజ్యోతిరావుపూలే పార్కు వద్ద జరుగుతున్న ధర్నా వద్దకు వెళ్లి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సీహెచ్‌ఓలు రెండేళ్లుగా జీతభత్యాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలన్న జీవోను వెంటనే అమలుజేయాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ ఓను పునరుద్ధరించాలని, క్లీనిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉషారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి, జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ రాజీవ్, జి.రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ విధ్వంసం
● సంచాం గ్రావెల్ కొండను పరిశీలించిన వీఆర్ఓలు ● సాక్షిలో కథనం వచ్చినా ఆగని తవ్వకాలు ● అనుమతులు లేవని చెప్పి నిలువరించి యంత్రాలను పంపించేసిన వైనం ● డంపింగ్ ప్రాంతానికి వెళ్లే సాహసం చేయని అధికారులు అధికారుల సాక్షిగా అక్రమం బట్టబయలైంది. సాక్షిలో వార్త ప్రచురితమై జనమంతా చర్చించుకుంటున్నా గ్రావెల్ అక్రమార్కులు మాత్రం తవ్వకాలను ఆపలేదు. వీఆర్ఓలు వెళ్లి అనుమతులు లేవని చెప్పి యంత్రాలను నిలువరిస్తే గానీ.. అక్కడ అక్రమ తవ్వకాలు ఆగలేదు. రణస్థలం మండలంలోని సంచాం, అర్జునవలస పరిధిలోని గ్రావెల్ తవ్వకాల విధ్వంసం వాస్తవమేనని అధికారుల పరిశీలనతో స్పష్టమైంది. రణస్థలం: సంచాం, అర్జునవలస రెవెన్యూ పరిధిలోని గల సంచాం కొండలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపే ప్రాంతాన్ని సంచాం, అర్జునవలస వీఆర్ఓలు డీవీ మురళీధర్, ఎ.చిన్నారావు శనివారం పరిశీలించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు గత నాలుగు రోజులుగా అక్రమంగా వందలాది లారీలతో గ్రావెల్ తరలించుకుపోయిన వైనంపై శనివారం ‘కొండను చెరబట్టి గ్రావెల్ కొల్లగొట్టి’ అనే శీర్షికతో ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు సంచాం కొండలో తవ్వకాలు జరిపిన ప్రాంతానికి వెళ్లారు. సాక్షిలో వార్త వచ్చినప్పటికి ఇంకా తవ్వకాలు జరుపుతుండడం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యం తవ్వకాలు జరపడమేమిటని దగ్గరకు వెళ్లి పనులు ఆపి పొక్లెయినర్లు, లారీలను అక్కడి నుంచి పంపించేశారు. అధికారులు కొండను పరిశీలిస్తే చాలా ఎక్కువగానే తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తామని, ప్రస్తుతం తహసీల్దార్ ఎన్.ప్రసాద్ అందుబాటులో లేరని వీఆర్ఓలు తెలిపారు. డంపింగ్ ప్రాంతానికి వెళ్లలేదు.. సుమారు వందలాది లోడ్లు గ్రావెల్ తరలించి డంపింగ్ చేసిన ఎన్ఈఆర్ స్కూల్ ప్రాంతానికి అధికారులు పరిశీలనకు వెళ్లకపోవడం కొసమెరుపు. ఎవరైనా సామాన్యుడు ఒక ట్రాక్టర్ గ్రావెల్ పట్టుకుని వెళితేనే అధికారులు ఎన్నో రూల్స్ మాట్లాడి బండిని సీజ్ చేస్తారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దీనికి తోడు అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు లారీలు, పొక్లెయినర్లు అక్కడే ఉన్నా సీజ్ చేసే సాహసం చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
వేలానికి వేళ కాలేదా?
జలుమూరు : ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భూముల సాగు వేలం జరగక ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఏడాదిన్నర కావస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలం జరగడం లేదు. శ్రీముఖలింగేశ్వర స్వామి పేరిట సుమారు 24 ఎకరాలు సాగు భూమి ఉంది. మూడున్నరేళ్ల క్రితం ఎకరాకు రూ.21 వేలు చొప్పున ముందు కౌలుకు పాట పాడేవారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి స్వామివారి భూములకు సంబంధించి దేవదాయ శాఖ అధికారులు బహిరంగ వేలంపాట నిర్వహించేవారు. ఎక్కువ మొత్తం పాడిన రైతులకు వాటి సాగుకు అనుమతిచ్చేవారు. జాప్యమెందుకో? దేవదాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఏడాదిన్నర గడుస్తున్నా పాట నిర్వహించడంలేదని గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా కౌలుసాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే దేవదాయ శాఖ నుంచి మాత్రం ఎటువంటి పాట నిర్వహించడం లేదని రైతులు చెబుతున్నారు. వేలం నిర్వహించి ఇందులో కొంత భాగం మొత్తం ముందుగానే బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. అన్ని నిబంధనలకు లోబడి కౌలు వేలం పాడేందుకు ఈ ఏడాది రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ కాలం కూడా ప్రారంభమైంది. ఇదే సమయంలో వేలం నిర్వహిస్తే ముందస్తు పనులు చేసేందుకు వీలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపిస్తాం.. శ్రీముఖలింగేశ్వర ఆలయ భూములు కౌలుకు సంబంధించి దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. అక్కడి నుంచి అనుమతి వచ్చాక కౌలుకు వేలం నిర్వహిస్తాం. – పి.ప్రభాకరరావు, ఈఓ, శ్రీముఖలింగం దేవస్థానం ఏడాదిన్నరగా జరగని శ్రీముఖలింగం భూముల కౌలు వేలం అధికారులు నిర్లక్ష్యం వీడాలంటున్న రైతులు జాప్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి -
రసాభాసగా పంచాయతీ నిధుల విచారణ
సరుబుజ్జిలి: మండలంలోని తెలికిపెంట పంచాయతీ నిధుల దుర్వినియోగంపై శనివారం నిర్వహించిన విచారణ రసాభాసగా మారింది. పంచాయతీలో 6వ అంశం నుంచి 11వ అంశం వరకు ఖర్చుచేసిన మెటీరియల్‌కు సంబంధించి రూ.2 లక్షల 70 వేల నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఈ ఏడాది జనవరి 6న పర్వతాలపేటకు చెందిన బెవర మల్లేశ్వరరావు కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేశారు. అదే నెల 31న ఈఓపీఆర్డీ బొడ్డేపల్లి రామారావు పంచాయతీలో విచారణ నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఆ నివేదికల ప్రకారం సచివాలయంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు డీఎల్పీఓ ఐ.వి.రమణ శనివారం గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. వ్యక్తిగత దూషణలు, తిట్ల దండకంతో సభలో గందరగోళ స్థితి ఏర్పడింది. దీంతో అధికారులు తలోదిక్కుకు పరుగులు తీశారు. ఒకానొక దశలో ఇరువర్గాలు కొట్లాటకు దిగే పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యాయి. ఇంతలో అధికారులు కల్పించుకుని ఇరువర్గాలు సహకరిస్తేనే విచారణ నిర్వహిస్తామని చెప్పి బయటకు వచ్చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని డీఎల్పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రామారావు, సర్పంచ్ నందివాడ రాజ్యలక్ష్మి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
సాగునీటి కోసం చలో కలెక్టరేట్
కాశీబుగ్గ: పలాస మండలం రేగులపాడు వద్ద చేపట్టిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌ను త్వరతగతిన పూర్తి చేసి శివారు భూములకు సాగునీరు, పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకు తాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరరావు డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి శివారు భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7న కలెక్టర్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. శనివారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద జీపుజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములను త్యాగం చేసిన రైతుల నిర్వాసితుల కాలనీల్లో నేటికీ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. గొట్టాబ్యారేజ్ ఆధునీకరణకు రూ.1600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వంశధార నదిని బాహుదా నదితో అనుసంధానం చేసి ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందించాలని కోరారు. మందస మండలం గోపాలసాగరాన్ని మినీ రిజర్వాయర్ చేసి మహేంద్రగిరి నుంచి వచ్చిన నీటిని గోపాలసాగరానికి మళ్లించాలన్నారు. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ చేసి కుడి, ఎడమ కాలువల ద్వారా శివారు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. మహాధర్నాలో రైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదరులు వి.రమణ, వి.పసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.భాస్కరరావు, వాసు, సూరయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్రికెట్ కోచింగ్‌కు వేళాయె
● రేపటి నుంచి జిల్లాలో క్రికెట్ కోచింగ్ క్యాంప్‌లు మొదలు శ్రీకాకుళం న్యూకాలనీ: సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపులకు రంగం సిద్ధమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సూచనల మేరకు జిల్లా క్రికెట్ సంఘం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణ శిబిరాల్లో క్రికెట్‌పై ఆసక్తి కలిగిన బాలబాలికలు ఎవరైనా హాజరుకావచ్చని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. 5 కేంద్రాల్లో శిక్షణ.. జిల్లాలో శ్రీకాకుళం జిల్లా కేంద్రం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలతోపాటు కళింగపట్నం, నరసన్నపేట, టెక్కలి, ఇచ్ఛాపురం సబ్సెంటర్లలో ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ఉద యం 6 ఉదయం 8.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 6.30 వరకు సబ్ సెంటర్లలో నిష్ణాతులైన కోచ్‌లు శిక్షణ ను అందించనున్నారు. శిక్షణకు హాజరయ్యే చిన్నారులు, బాలబాలికలకు ఫిట్నెస్తోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తదితర విభాగాల్లో తర్ఫీదును అందిస్తారు. తల్లిదండ్రులు వారి పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలని సబ్‌సెంటర్ల కోచ్‌లకు అందజేయాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ పేర్కొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్రీడాకారులకు జూన్ ఒకటో తేదీన ఆయా సబ్సెంటర్లలో సర్టిఫికెట్లను అందజేయనున్నట్టు వారు వెల్లడించారు. -
గంధపు చెట్లు నరికివేతపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సూర్యమహాల్ సమీప జామియా మసీదు వద్ద గంధం చెట్ల నరికివేతకు అంశం శుక్రవారం వెలుగులోకి వచ్చిన సంగతి విధితమే. శుక్రవారం నాటికి ఒక చెట్టునే తరలించారనుకున్న మత పెద్దలు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అటవీశాఖ అధికారులతో కలసి మొత్తం 12 ఎకరాలను కలియదిరగ్గా మరో మూడు చెట్లు నరికివేతకు గురై మాయమైనట్లు నిర్ధారణకొచ్చారు. ఒకటో పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచి పోలీసులు సైతం శనివారం ఈ ఘటనపై ఆరా తీశారు. ఎస్ఐ ఎం.హరికృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మొత్తం 12 ఎకరాల్లో కొబ్బరి, టేకు, గంధం, ఇతర చెట్లు అనేకమున్నాయని, గంధం చెట్లు నరికివేయడం ఘోరమని, చివరిసారిగా కొబ్బరి, టేకు చెట్లు ఫలసాయాన్ని వేలం పాట ద్వారా దక్కించుకున్న సర్ఫరాజ్ భయ్యాపై అనుమానాలున్నాయని న్యాయవాది ఎం.అసదుల్లా, ఎం.ఏ.రఫీ, జాఫర్ ఘోరీ, బాషా, రవూఫ్ ఖాన్, ఆర్.టి.ఖాన్, అమానుల్లా, ఢిల్లీఖాన్, షేక్ మదీనాలు అనుమానం వ్యక్తం చేశారు. అటవీశాఖ, పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ సాధిక్ మాట్లాడుతూ రంజాన్‌తో పాత కమిటీ కాలం ముగియడంతో ప్రస్తుతం తానే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాని, శుక్రవారం సమాచారం మత పెద్దల ద్వారా చేరిందని, శనివారం నాలుగు చెట్లు పోయినట్లు లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వక్ఫ్‌బోర్డు పరంగా కేసు నమోదు చేస్తామన్నారు. అటవీశాఖ శ్రీకాకుళం ఇన్స్పెక్టర్ సాయిరాం మహాపాత్రో మాట్లాడుతూ రంపంతో తొలగించిన ఆనవాళ్లున్నాయని, వాటిని శ్రీగంధం చెట్లుగా నిర్ధారించామన్నారు. వన్‌టౌన్ ఎస్ఐ ఎం.హరికృష్ణ మాట్లాడుతూ ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని చెప్పారు. -
టీచర్లకు ఆర్జిత సెలవులు మంజూరుచేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇటీవల వెలువడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేసవి సెలవుల్లో సైతం హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి స్వచ్ఛందంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారందరికీ ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రవి, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. విద్యార్థుల మానసిక స్థితి, మండే ఎండలు, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లావ్యాప్తంగా నాటుసారా స్థావరాలెక్కడ ఉన్నా విస్తృతంగా దాడులు జరిపి అరికట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) దోసకాయల శ్రీకాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి జిల్లాలో గల స్టేషన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్ట ర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో 80 అడుగుల రో డ్డు సమీప ఎకై ్సజ్ కార్యాలయంలో డీసీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 110 సారా గుర్తింపు గ్రామాలను సారా రహిత గ్రామాలుగా మార్చాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 212 ఐడీ కేసులు నమోదై 162 మందిని అరెస్టు చేసి 2231 లీటర్ల సారా, ఏడు వాహనాలను స్వాధీనపర్చుకున్నామన్నారు. 6735 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. అక్రమంగా మద్యం విక్రయించేవారిపై 874 కేసులు నమోదు చేసి అంతేమందిని అరెస్టు చేశామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, జిల్లా అధికారి తిరుపతినాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఎన్సీఈఆర్టీ అవార్డుకు ప్రాజెక్టు ఎంపిక కంచిలి: మండలంలోని చొట్రాయిపురం ప్రాథమి క పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు రూపొందించిన గణిత ప్రాజెక్టు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎన్సీఈఆర్టీ)వారు నిర్వహించిన అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆయనకు ఎన్సీఈఆర్టీ నుంచి సమాచారం వచ్చిందని ఆయన శనివారం ఓ ప్రకట నలో తెలిపారు. ఎన్సీఈఆర్టీ వారు జనవరి 13న జాతీయ గణిత విద్యా సమావేశాల నిర్వహణ సందర్భంగా దేశవ్యాప్తంగా గణిత ప్రాజెక్టులను ఆహ్వానించారు. అందులో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ‘గణిత ప్రాథమిక కార్యకలాపాల సన్నాహక దశలో విద్యార్థుల పనితీరు అంచనా వేయటానికి బోర్డు గేమ్ ప్రయోగం’ అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేశా రు. దేశవ్యాప్తంగా 105 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో మన రాష్ట్రం నుంచి 4 మాత్రమే ఉన్నాయి. అందులో తిరుపతిరావు ప్రాజెక్టు చోటు సంపాదించుకోవడం విశేషం. శ్రామికులే దేశానికి వెన్నెముక శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రామికులే దేశానికి వెన్నెముక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్‌లో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వివరించి, న్యాయ సహా యం అందించాల్సిన విధానాలను తెలియజేశారు. కార్మికులు తమ చెమటతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన అన్నారు. 1886 మే 1న అమెరికాలో ఎనిమిది గంటల పనిది నం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని, షికాగోలో హే మార్కెట్ కాల్పులను గుర్తుచేశారు. ఈ చరిత్రను యువతకి తెలియజేసి కా ర్మికుల హక్కులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, డి ప్యూటీ లేబర్ కమిషనర్ కె.అజయ్ కార్తికేయ, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
బీసీ సంక్షేమ శాఖలో..బీసీ సంక్షేమ శాఖలో అవినీతికి హద్దు లేకుండాపోతోంది. పదోన్నతులపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. –IIలోఎక్కడో ఊరవతల ఓ మర్రి చెట్టు.. ఎండన పడి తిరిగే వారిని కాసేపు కూర్చోండర్రా.. అని పిలుస్తూ ఉంటుంది. ఊరి మధ్యన రావి చెట్టు.. ఎర్రటి ఎండకు ఆకులతో గొడుగు పట్టి తన ఒడిలో కూర్చున్న వారికి ప్రాణ వాయువు అందిస్తూ ఉంటుంది. ఇంటివెనుక జామ చెట్టు.. తీయటి ఫలాలు అందించడంతో పాటు సందె వేళ కింద కూర్చుకుంటే చల్లటి గాలిని కానుకగా ఇస్తుంది. అందుకే వేసవిలో చెట్టుతో జట్టు కట్టడం అత్యవసరం. వేలానికి వేళ కాలేదా..? శ్రీముఖలింగం భూముల కౌలువేలం జరగడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. –IIలోఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025కూల్ స్పాట్గండ్రేడులోని మర్రి చెట్టు కింద కూర్చున్న ప్రజలు ●విశాలమైన ప్రాంగణం మాది గండ్రేడు. శివారు గ్రామం. నాగావళి నది ఒడ్డున ఉంది. నది నుంచి వచ్చే చల్లని గాలి మర్రిచెట్టు కిందకు వచ్చి మరింత కూల్‌గా మారిపోతుంది. దీంతో పెద్దలు ఇక్కడే నిద్రపోయేందుకు, సేద దీరేందుకు వస్తుంటారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనువుగా చెట్టు నీడ ఉంది. ఈ చెట్టు మా గ్రామానికి వరం. – చింతాడ సూర్యారావు, గండ్రేడు, పొందూరు మండలం ●ఎండ నుంచి ఉపశమనం మాది మలకాం గ్రామం. చి న్న పల్లెటూరు. వేసవి కాలం వచ్చిందంటే గ్రామంలోని ప్రజలు ఈ మర్రి చెట్టుకిందకే కూర్చునేందుకు వస్తుంటారు. ఇక్కడే సేద దీరుతుంటారు. మర్రిచెట్టు వయస్సు సుమారు 200 ఏళ్లు ఉంటుంది. బయట నుంచి వచ్చేవారంతా కచ్చితంగా ఇక్కడ కూర్చొని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. – జాడ అసిరినాయుడు, మలకాం, పొందూరు మండలం పొందూరు: పల్లెటూరు.. సందె వేళ.. మర్రి చెట్టు కింద మకాం.. కాసిన్ని కబుర్లు.. కావాల్సినంత చల్లని గాలి. అంతే వేసవి ఇట్టే గడిచిపోతుంది. చుట్టూ ఎండ తాండవం చేస్తున్నా చెట్టు నీడలో మాత్రం ఏసీ పెట్టినట్టే చల్లటి గాలి వీస్తుంది. అదే ఇప్పుడు పల్లెవాసులను రక్షిస్తోంది. పొందూరు మండలంలోని దళ్లవలస, కోటిపల్లి, మజ్జిలిపేట, గండ్రేడు, మలకాం, వీఆర్ గూడెం గ్రామాల్లో పెద్ద మర్రి చెట్లు వేసవి విడిదులుగా దర్శనమిస్తున్నాయి. ఈ చెట్లు సుమారు 60 ఏళ్ల నుంచి 200 ఏళ్ల వయస్సు ఉన్నవి. విశాలంగా వ్యాపించిన ఊడలతో నీడ అల్లుకుంటుంది. దీంతో ఎండకు దొరకకుండా పిల్లలు, పెద్దలు వాటి కిందనే సేద దీరుతున్నారు. మధ్యాహ్న సమయాల్లో చెట్ల కిందకు వచ్చి ముచ్చటించుకునేవారు కొందరు, నిద్రపోయే వారు మరికొందరు, ఆడుకునే పిల్లలు, వలస కూలీలు అక్కడే ఉంటున్నారు. న్యూస్‌రీల్ పచ్చని చెట్లే వేసవి విడిదులు పల్లెటూళ్లలో వృక్షాల కిందనే సేద దీరుతున్న ప్రజలు -
వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన
ఇచ్ఛాపురం రూరల్/సోంపేట: బూర్జపాడు నుంచి డొంకూరు మత్స్యకార గ్రామం మధ్య రెండు నూతన వంతెనల నిర్మాణానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బూర్జపాడు నుంచి పెద్ద లక్ష్మీపురం వరకు 5.45 కిలోమీటర్ల పొడవున రూ.486 లక్షలతో ప్రధానమంత్రి సడక్ యోజన కింద తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో పీఎంజీఎస్‌వై పథకం ద్వారా డొంకూరు ఉన్నత పాఠశాల వద్ద నూతన వంతెన నిర్మాణానికి రూ.6కోట్ల 30 లక్షలు, బూర్జపాడు ఉప్పుటేరు(కాజ్వే)పై రూ.10 కోట్ల 50 లక్షలతో మరో వంతెన నిర్మాణానికి రెండు సార్లు టెండర్లు వేసినప్పటికీ కంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే నిధులతో శనివారం వంతెన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జిల్లాలో 110 మత్స్యకార గ్రామాల వద్ద మత్స్య సాగర పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.4కోట్లు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలంలోని కొండిరేవు వంతెన, మహేంద్ర తనయ వంతెనలకు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే బి.అశోక్ శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, సర్పంచ్ యర్ర రజని, బారువ గ్రామస్తులు పాల్గొన్నారు. -
16 మంది వైద్య సిబ్బందికి నోటీసులు
నరసన్నపేట: విధులకు ఆలస్యంగా వస్తుండటంపై నరసన్నపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో 16 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనుబాబు తెలిపారు. గడిచిన మూడు నెలల్లో పదిరోజులకు మించి ఆలస్యంగా ఎఫ్ఆర్ఎస్ నమోదైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారని, వారి ఆదేశాల మేరకు నలుగురు వైద్యులతో పాటు మరో 12 మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చామన్నారు. శుక్రవారం వారి నుంచి వివరణ తీసుకున్నామని అన్నారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే అధికారుల ఆదేశాల మేరకు ఆలస్యమైన రోజు లను సెలవు దినాలుగా మార్చుతామని శ్రీనుబాబు తెలిపారు. సాగునీటి సమస్యలు పరిష్కరించాలి ఎచ్చెర్ల క్యాంపస్: సాగునీటి సమస్యలు కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాలు తప్పవని ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు ముర్రాపు సూర్యనారాయణ అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సాగునీటి కాలువలు, ప్రాజెక్టుల సందర్శనకు పూడివలస కూడలిలో జీపు యాత్రను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలంలో నారాయణపురం కుడి కాలువ కింద గత ఖరీఫ్‌లో పంటలు రైతులు కోల్పోయారని, ఈ ఏడాదైనా మరమ్మతులు నిర్వహించి సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎచ్చెర్ల నియోజక వర్గంలోని తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టు కింద సైతం సాగునీటి కష్టాలు ఉన్నాయని తెలిపారు. వంశధార, నాగావళి నధుల ఆధారంగా ఉన్న ప్రా జెక్టుల మరమ్మతులు నిర్వహించాలని చెప్పా రు. తక్కువ కేటాయింపులు రైతులకు శాపంగా మారుతున్నాయని అన్నారు. సాగునీటి సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు 7వ తేదీ ధర్నా చేస్తామన్నారు. రైతు సంఘం ప్రతినిధులు పొందూరు చంద్రరావు, కె. మోహనరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ కొత్తకోట అప్పారావు, వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు, భవిరి కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ జరుగుళ్ల కృష్ణారావు, కొత్తకోట అచ్యుతరావు పాల్గొన్నారు. -
మసీదులో గంధంచెట్లు నరికివేత
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సూర్యమహాల్ కూడలి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న జామియా మసీదులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు గంధం చెట్లు నరికి తరలించే యత్నం చేశారు. ఈ విషయమై ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కు మసీదు మౌజన్ (గురువు) ఎస్.కె.మహ్మద్ ఫిర్యాదు చేసినట్లు మత పెద్దలు కె.ఎస్.అమానుల్లా, మరికొందరు చెప్పారు. మసీదులో సుమారు 40 వరకు చిన్నవి, పెద్దవి గంధం చెట్లున్నాయని, శుక్రవారం ఉదయం చెట్లను వాచ్మెన్ నాయుడు దగ్గరుండి ట్రిమ్మింగ్ చేసినట్లు తెలిసిందన్నారు. సాయంత్రం 4 గంటలకు 30 అడుగుల పొడవుండే ఒక గంధం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు తరలించేశారని అదే వాచ్మెన్ మౌజన్‌కు చెప్పడంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఇంకా లోపల ఎన్ని చెట్లు కొట్టేశారో తెలియాల్సి ఉందన్నారు. గంధం చెట్టు కొమ్మ -
మళ్లీ బీచ్ ఫెస్టివల్
సోంపేట: బారువ తీరం మరోసారి బీచ్ ఫెస్టివల్‌కు సిద్ధమైంది. గత నెల 18, 19 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పర్యాటకులకు వసతుల కల్పనలో నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెలలో మరో రెండు రోజులు బీచ్ ఫెిస్టివల్ నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే బారువ తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకులు సేద తీరేందుకు టెంట్లు వేయాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తాగునీటి సరఫరా కూడా ఏర్పా టు చేయలేదని గుర్తు చేశారు. ట్రాఫిక్, విద్యుత్ కష్టాలు ఏప్రిల్‌లో బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకులను ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధించింది. బారువ ప్రధాన రహదారి వద్దకు చేరుకోవడానికి గంటల సమయం పట్టింది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాల్సి ఉంది. సాయంత్రం అయితే బారువ తీర ప్రాంతం నుంచి బారువ కొత్తూరు గ్రామం వరకు విద్యుత్ వీధి దీపాలు లేకపోవడంతో పర్యాటకులు చీకటిలో ఇబ్బందులు పడ్డారు. ఏర్పాట్ల పరిశీలన.. బీచ్ ఫెస్టివల్‌పై స్థానిక అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. శుక్రవారం సాయంత్రం బారువ తీరంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు, బోట్ రైడింగ్, బైక్ రైడింగ్, కిడ్స్ ప్లేజోన్, వాటర్ సర్ఫింగ్, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. బారువ తీరంలో నేటి నుంచి ప్రారంభం సమస్యలు పరిష్కరించాలని స్థానికుల విన్నపం -
ఉచిత శిక్షణతో ఉపాధి
నరసన్నపేట: సేవే పరమావధిగా సత్యసాయి సేవా సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా స్వల్పకాలిక ఉచిత నైపుణ్య శిక్షణలు అందిస్తున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులకు, గృహిణులకు వారి ఆసక్తి బట్టి శిక్షణలు ఇస్తూ ఉపాధి అవకాశాలపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, కంప్యూటర్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణలు ఇస్తున్నారు. నరసన్నపేట మండలంతో పాటు పరిసర మండలాలకు చెందిన వారూ వచ్చి ఉచిత శిక్షణలకు వినియోగించుకుంటున్నారు. నరసన్నపేటలోని మారుతీనగర్ –1 లో సత్యసాయి మందిరం, చిత్తిరి వీధిలోని సాయి పెద్ద మందిరంలో ఏడాది కాలంగా ఈ స్వల్ప కాలిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. మారుతీనగర్‌లో 510 మంది, పెద్దమందిరంలో 260 మంది శిక్షణ పొందారు. కంప్యూటర్ శిక్షణకు మంచి ఆదరణ లబిస్తుంద పెద్ద మందిరం కన్వినర్ నాగేశ్వరరావు చెబుతున్నారు. ఇప్పటికే రూ. 3.5 లక్షలు వెచ్చించి కంప్యూటర్లు, స్క్రీన్ సిద్ధం చేశామన్నారు. సత్యసాయి మందిరాల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ నరసన్నపేటలో ఇప్పటివరకు 770 మందికి తర్ఫీదు ఆసక్తి చూపుతున్న మహిళలు -
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ ఆస్పత్రుల్లో పనిచేసే మిడ్ లెవెల్ హెల్త్ అధికారులు సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్కెక్కారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో తొలుత సమావేశం నిర్వహించారు. అక్కడి జ్వోతిరావు పూలే పార్కు వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. చిన్నారులు, కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మిడ్వెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఎం.ఉషారాణి, పి.ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. -
చీడిపూడిలో రేషన్ సరుకుల పంపిణీలో కోత
● గిరిజనులకు అందని ఏప్రిల్ నెల రేషన్ సరుకులు ● స్పందించని అధికారులుసంపాదనలో సగం బియ్యానికే.. మా కుటుంబానికి బియ్యం ఇవ్వకపోవడంతో నా భర్త చేసిన కూలి డబ్బులతో సగం బియ్యం కొనాల్సి వస్తోంది. మా లాంటి వారికి రేషన్ బియ్యం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. – బెజ్జి అరుణ, బాధితురాలు ఊరివారే సాయం చేశారు నేను ఒక్క దాన్నే ఇంట్లో ఉంటాను. ఎలాంటి ఆధారం లేదు. రేషన్ బియ్యంతో నెల మొత్తం గడుస్తుంది. ఇప్పుడు బియ్యం ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను. ఊర్లో వాళ్లంతా పిడికెడు బియ్యం సాయం చేస్తున్నారు. – మంగపేట ఆదమ్మ, బాధితురాలు పక్కింటి నుంచి తెచ్చుకుంటున్నాం.. మాకు గత నెల రేషన్ బియ్యం ఇవ్వలేదు. రేషన్ బియ్యం కో సం వేలిముద్రలు తీసుకున్నా రు. అయినా సరుకులు ఇవ్వలేదు. పక్కింటి నుంచి బియ్యం అప్పు తెచ్చుకుని రోజులు గడుపుతున్నాం. – మంగపేట నారాయణరావు టెక్కలి: రేషన్ ఇచ్చేస్తామన్నారు.. అందరి దగ్గరా వేలి ముద్రలు తీసుకున్నారు.. అదిగో ఇదిగో అంటూ నెల గడిపేశారు. ఆఖరికి ఏప్రిల్‌నెల రేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సవరసొర్లిగాం గిరిజన గ్రామంలో సుమారు 200 మంది గిరిజనులకు గత నెల రేషన్ సరుకులు పంపిణీ చేయలేదు. వేలిముద్రలు సైతం తీసుకుని చివరకు రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఆయా కుటుంబాలు అనేక అవస్థలు పడుతున్నాయి. పంచాయతీ పరిధిలో డిపో నంబర్ 791 పరిధిలో సొర్లిగాం, సవరసొర్లిగాం, సన్యాసిపేట, హరిపురం, సతివాడ, బలరాంపు రం తదితర గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒక్క సవర సొర్లిగాం గ్రామంలో 62 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 200 మంది జనాభా ఉన్నారు. వారందరికీ ఏప్రిల్‌లో రేషన్ ఇవ్వలేదు. రెండు రోజుల కిందట ఎండీయూ సిబ్బంది రేషన్ పంపిణీ కోసం వెళ్తే ఏప్రిల్ నెల రేషన్ ఇస్తే తప్ప మే నెల రేషన్ తీసుకోబోమని వారు చెప్పడంతో, తమకేమీ సంబంధం లేనట్లుగా ఆ సిబ్బంది వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఏప్రిల్, మే నెలల రేషన్ అందించాలని గిరిజనులు కోరుతున్నారు. సారవకోట: మండలంలోని చీడిపూడి గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీలో కోత విధిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామ రేషన్ డీలర్‌ను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించారు. అప్పటి నుంచి రేషన్ సరుకులు వీఆర్వో అథంటికేషన్‌తో ఇస్తున్నారు. అయితే ఏప్రిల్‌లో లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వకుండానే లబ్ధిదారులతో బయోమెట్రిక్ వేయించుకున్నారు. మే నెల రేషన్ సరుకులు గురు వారం నుంచి సరఫరా చేస్తున్నారు. అయితే 5 కిలోలు, 10 కిలోలు ఉన్న లబ్ధిదారులకు మాత్రమే పూర్తిస్థాయి సరుకులు ఇస్తున్నారని మిగిలిన వారికి 3 కిలోలు చొప్పున కోత విధిన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని పై వీఆర్ఓ రాపాక లక్ష్మీనారాయణను వివరణ కోరగా అలాట్మెంట్ తక్కువగా వచ్చిందని, అందుకే కోత విధిస్తున్నామని తెలిపారు. -
ఉగ్ర చర్యలను ఖండించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఉగ్రవాదం దేశ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, అభివృద్ధికి ఆటంకమని డాక్టర్ కె.సుధీర్ అన్నారు. శ్రీకాకుళంలో నగరంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఏడురోడ్లు కూడలి నుంచి కోడిరామ్మూర్తి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు, లాయర్లు, కవులు, రచయితలు, పెన్షనర్లు, జేసీస్, మానవతా, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘం, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతం రంగు పులమకూడదన్నారు. విద్యావేత్తలు డాక్టర్ జామి భీమశంకరం, ప్రొఫెసర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉగ్రవాదం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో కేతవరపు శ్రీనివాస్, బి.కృష్ణమూర్తి, ఎం.ప్రభాకరరావు, ఎస్.కిషోర్‌కుమార్, కె.నాగమణి, ఉషారాణి, ఆర్.మల్లేశ్వరరావు, జోగినాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కష్టార్జితం కాలిపోయింది..
కొత్తూరు: కష్టార్జితం కాలిపోయింది. కుమార్తె పెళ్లి కోసం దాచిపెట్టిన నగదు, బంగారం బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం కొత్తూరులోని కొత్తపేట కాలనీలో శుక్రువారం కొగాన పద్మావతి శుక్రవారం ఉదయం దేవుడి పటం వద్ద దీపం వెలిగించి ఉపాధి పనికి వెళ్లిపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు గమనించి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే పద్మావతి కుమార్తె వివాహం కోసం ఇనుప పెట్టెలో దాచిన రూ. 2.80 లక్షల నోట్లు కాలిబూడిదయ్యాయి. తులంన్నర బంగారం, పిల్లల విలువైన పత్రాలు, దుస్తులు, నిత్యావసర సరుకులు కాలిపోయాయి. సర్వం కోల్పోయిన పద్మావతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొత్తూరుకు చెందిన గోగుల చిట్టిబాబు బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం కుమార్తె వివాహం కోసం దాచిన రూ.2.80 లక్షల నగదు బూడిద -
గారలో వైద్య శిబిరం
గార: మండల కేంద్రం గార గ్రామంలోని సెగిడివీధిలో పలువురికి విషజ్వరాలు సోకడంతో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘గార గ్రామంలో విష జ్వరాలు’ శీర్షికన సాక్షిలో వార్త ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గార పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమ్య, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రక్తనమూనాలు సేకరించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి డాక్టర్ సూర్యం గ్రామంలో పర్యటించారు. ప్రస్తుతానికి జ్వరాలు అదుపులోనే ఉన్నాయని, మలేరియా లార్వా ఎక్కడా లేవన్నారు. మరో రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. కొద్ది నెలల క్రితమే ఈ వీధిలో కొత్త పైపులైను వేసి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని సర్పంచ్ మార్పు దుర్గాపృథ్వీరాజ్ తెలిపారు. -
3806
● 23 ఐటీఐలు..సీట్లు ● ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● 24 వరకు దరఖాస్తుల స్వీకరణ ఎచ్చెర్ల క్యాంపస్ : పదో తరగతి పూర్తి చేసిన పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే కోర్సుల్లో ఐటీఐ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) ఒకటి. ఇందులో చేరిన విద్యార్థులకు అప్రెంటీస్ తర్వాత 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించే అవకాశాలు అధికంగా ఉంటాయి. నైపుణ్యాలు ఆధారంగా విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లమాలో నేరుగా రెండో ఏడాది లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు లభిస్తాయి. అందుకే ఐటీఐలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. జిల్లాలో మూడు ప్రభుత్వ ఐటీఐలు(శ్రీకాకుళం డీఎల్టీసీ, ఎచ్చెర్ల, పలాస)లలో 760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 20 ప్రైవేట్ ఐటీఐలలో 3056 సీట్లు కలిపి మొత్తం 23 ఐటీఐలలో 3806 సీట్లలో ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కోర్సులివే.. ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో రెండేళ్లు, సంవత్సరం వ్యవధి గల ట్రేడులు ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తి మేరకు ట్రేడ్లు ఎంచుకోవచ్చు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్టస్మ్యాన్ సివిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మోటార్ మెకానిక్ రెండేళ్ల ట్రేడులు కాగా, వెల్డర్, కోపా, డీజిల్ మెకానిక్, హార్టికల్చర్ ఏడాది చదవాల్సి ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా సూయింగ్ టెక్నాలజీ ట్రేడ్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.. ఐటీఐ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ‘ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ వెబ్సైట్లో ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ప్రభుత్వ ఐటీఐల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. జూన్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారు. కౌన్సెలింగ్ సమాచారాన్ని విద్యార్థుల ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్ రోస్టర్, ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అర్హులకు నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి 10వ తరగతి తర్వాత ఉపాధికి అవకాశం ఉన్న కోర్సు ఐఐటీ. ఈ కోర్సుల్లో ఎటువంటి ఒత్తిడి ఉండదు. ప్రయోగాలకు, నైపుణ్యాలకు ప్రాధాన్యముంటుంది. అప్రెంటీస్, నైపుణ్యం ఆధారంగా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ ఐటీఐలకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. – ఎల్.సుధాకరరావు, ప్రవేశాల కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ -
గాయపడిన వ్యక్తి మృతి
ఎచ్చెర్ల క్యాంపస్:కింతలి మిల్లు సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌పై వెళుతున్న బత్తిలి సత్యం (48) మార్చి 2న ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీ కొట్టడంతో గాయపడిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం రిమ్స్‌లో చేరి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం తోటపాలెం పంచాయతీ పెయిలవానిపేట. పోలీసులు కేసు నమోదు చేశారు. స్తంభించిన ఆర్టీఏ సేవలు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని తండేవలసలో ఉప రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం సేవలు స్తంభించాయి. గురువారం రాత్రి కురిసిన ఈదురుగాలులు, వర్షాలకు ఎక్కడికక్కడే విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లు తెగడంతో సేవలు నిలిచిపోయాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల ఆర్టీఏ సేవలు మొరాయించాయి. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన వాహనచోదకులకు నిరీక్షణ తప్పలేదు. -
కిడ్నీ సమస్యతో ఇంటర్ విద్యార్థి మృతి
పొందూరు: మండలంలోని కేసవదాసుపురం గ్రామానికి చెందిన లింగాల కిషోర్(16) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం ఎచ్చెర్లలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న కిషోర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పూర్తిగా పాడైనట్లు గుర్తించారు. పేద కుటుంబం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయింలేక కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిషోర్ పదో తరగతి లోలుగు హైస్కూల్లో చదివాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సుజాత, రాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్బీడబ్ల్యూ అమలు చేయాలి శ్రీకాకుళం క్రైమ్ : నిందితులపై పెండింగ్ ఉన్న నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) త్వరితగతిన అమలు చేయాలనిఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ప్రాపర్టీ కేసుల్లో పెండింగ్ ఎన్బీడబ్ల్యూ అమలు, చైన్‌స్నాచింగ్, వాహనాల చోరీ, ఆలయాల్లో దొంగతనాలు తదితర నేరాలపై జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో వంటి కేసుల్లో ఎన్బీడబ్ల్యూ ఉంటే గుర్తించి వారి చిరునామా, ఇతర ఆధారాలను బట్టి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు కోటేశ్వరరావు, నేతాజీ పాల్గొన్నారు. -
గత ప్రభుత్వంలోనే అనుమతులు
సోంపేట: మండలంలోని తీరప్రాంత మత్స్యకారుల ప్రయాణ సమస్యలు పరిష్కరించడానికి, సోంపేట మండల కేంద్రానికి వేగంగా చేరుకోవడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే చర్యలు తీసుకున్నట్లు ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొండిరేవు వంతెన, మహేంద్రతనయ నదిపై బ్రిడ్జిల నిర్మాణానికి జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, జిల్లా పార్టీ పెద్దలు చొరవతో గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద జీఓ నంబరు–788తో 2023 నంబర్ 23న అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. కొండి రేవు బ్రిడ్జికి రూ.3.45 కోట్లు, మహేంద్రతనయ నది బ్రిడ్జికి రూ.14.60 కోట్లు మంజూరయ్యాయని, టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అదే జీవోతో ప్రస్తుతం టెండర్లు ఖరారైనట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కరించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుంతుందని ఎంపీపీ స్పష్టం చేశారు. మా పార్టీకి అనుకూలంగా ఉంటేనే పింఛన్ ● ఒంటరి మహిళ పింఛన్ నిలిపివేసిన టీడీపీ నేతలు నరసన్నపేట: ‘మా పార్టీకి అనుకూలంగా ఉండటం లేదు. మాకు వ్యతిరేకంగా ఉంటున్నావు.. మా ప్రభుత్వంలో నీకు ఎందుకు పింఛన్ ఇస్తాం.. నువ్వు మా పార్టీకి అనుకూలంగా ఉంటేనే పింఛను ఇప్పిస్తాం’ అంటూ టీడీపీ నేతలు తన పింఛన్ ఆపేశారని నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన వెలమల శకుంతల అనే ఒంటరి మహిళ వాపోయింది. రెండు నెలలుగా పింఛన్ ఇవ్వలేదని, మే నెలలో ఇస్తామని అధికారులు హామీనిచ్చారని, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా స్థానిక ఎమ్మెల్యే ఆపమని చెప్పినందునే ఇవ్వలేదని అంటున్నారని కన్నీటిపర్యంతమైంది. ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలైనా టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పంపిణీ చేయకుండా నిలిపేశారని వాపోయింది. ఈ విషయమై ఎంపీడీఓ మధుసూదనరావు వద్ద ప్రస్తావించగా పింఛన్‌పై పిర్యాదు వచ్చినందున నోటీసు ఇచ్చి విచారణ చేయించామని, ఒక ఇంట్లోనే కుటుంబంతో నివాసముండటంతో పింఛన్ నిలుపుదల చేశామని చెప్పారు. వివాహిత అనుమానాస్పద మృతి కంచిలి: మండల కేంద్రం కంచిలిలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. గురువారం రాత్రి వరకు మెయిన్‌రోడ్డులో తమ కుటుంబానికి చెందిన కూరగాయల షాపులో చలాకీగా ఉన్న ఆమె శుక్రవారం ఉదయానికి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. ఈమె భర్త ఉపాధి కోసం వలస వెళ్లడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటోంది. ఆర్థిక వ్యవహారాలే మృతికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో గురువారం అర్ధరాత్రి వరకు ఇంట్లో ఘర్షణ చోటుచేసుకొందని, తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మృతురాలు కన్నవారు కూడా కంచిలిలోనే ఉంటున్నారు. కాగా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, భర్త రాకుండానే ఆదరాబాదరాగా అంత్యక్రియలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కంచిలిలో మాయం.. కోయంబత్తూరులో ప్రత్యక్షం కాశీబుగ్గ: కంచిలి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ బొడ్డేపల్లి ధనలక్ష్మి ఐదు రోజుల కిందట అనుకోకుండా తమిళనాడు వెళ్లే రైలు ఎక్కింది. కోయంబత్తూరులో దిగడంతో అక్కడి స్థానికులు, పోలీసులు చేరదీశారు. ఇంతలో ఆన్లైన్ పోలీసింగ్ వారికి ఆమె ఆచూకీ మ్యాచ్ అవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు కోయంబత్తూరు వెళ్లి శుక్రవారం స్వగ్రామం కంచిలికి తీసుకువచ్చారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం రణస్థలం: జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొట్టిన ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.40 గంటల సమయంలో జె.ఆర్.పురం బస్‌స్టేషన్ సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. లారీ డ్రైవర్ గమనించక 50 మీటర్ల వరకు కారును ఈడ్చుకెళ్లాడు. అదృష్టవశాత్తు కారులో ఉన్న నలుగురికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న నలుగురు విశాఖపట్నం నుంచి జలుమూరు వెళుతున్నారు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై ఉమామహేశ్వరరావు పరిశీలించి ట్రాఫిక్ చక్కదిద్దారు. -
అర్ధరాత్రి విధ్వంసం
ఊళ్లన్నీ ఆదమరిచి నిద్దరోతున్న వేళ.. గురువారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఓ వైపు ఉరుములు, మెరుపులతో ఆకాశం భయపెడుతుంటే.. బలంగా వీచిన గాలులు విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇళ్లపైకప్పులను నేల కూల్చాయి. అరటి, మామిడి వంటి పంటలను నాశనం చేశాయి.● అరటి తోటలు ధ్వంసం నరసన్నపేట: ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు ధ్వంసమైపోయాయి. కోమర్తి, మాకివలసల్లో రైతులు బాగా నష్టపోయారు. కోమర్తిలో లబ్బ రాము, లబ్బ శ్రీను, పంచిరెడ్డి సింహాచలం లతో పాటు పలువురు రైతుల అరటి తోటలు పడిపోయాయి. ● గాలి తీవ్రతతో విద్యుత్‌కు అంతరాయం అరసవల్లి: గురువారం అర్ధరాత్రి తీవ్రమైన గాలు లు జిల్లాపై విరుచుకుపడ్డాయి. ఈ ప్రభావం జిల్లా కేంద్రంతో పాటు డివిజన్లో పలు మండలాల్లో విద్యుత్ సరఫరాపై పడింది. దీంతో అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా పలు చోట్ల విద్యుత్ అంతరాయం వాటిల్లింది. శ్రీకాకుళం, గార, బూర్జ, నరసన్నపేట, ఆమదాలవలస తదితర మండలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి గాలుల తీవ్రత కొనసాగడంతో విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరించే వీలు లేకపోయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి విద్యుత్ శాఖ ఆపరేషన్స్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఈఈ పైడి యోగేశ్వరరావులు రంగంలోకి దిగి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లుగా పంపించి ఎక్కడికక్కడ విద్యుత్ పునరుద్ధరణ పనులను మొదలు పెట్టించారు. దీంతో మ ధ్యాహ్నం సమయానికి విద్యుత్ సరఫరాను పలు ప్రాంతాలకు అందించారు. అయినప్పటికీ శ్రీకాకు ళం రూరల్, గార తదితర మండలాల్లో శుక్రవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ శాఖ పరంగా నష్టాన్ని అంచనాగా రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి అవసరమైన చోట కొత్తగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించారు. ఇదిలావుంటే నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఈఈ యోగేశ్వరరావు స్వయంగా పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. ● వర్షం, గాలుల బీభత్సం ఎచ్చెర్ల క్యాంపస్: వర్షం, గాలులు గురువారం రాత్రి బీభత్సం సృష్టించాయి. పొన్నాడలో రాము, రవి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లపై విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. గ్రామస్తులు ఫిర్యాదు చేయగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కేశవ రావుపేట శివారులో చీడిఖాన్ చెరువు గట్టుపై ఉన్న అమ్మవారి వేప చెట్టు కూలిపోయింది. మండలంలో జీడి మామిడి, మామిడి పంటకు తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్ అంతరాయాలు కలగగా శుక్రవారం సాయంత్రం నాటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. శ్రీకాకుళం డివిజన్‌లోనే రూ.10 లక్షల వరకు విద్యుత్ నష్టం -
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న కెప్టెన్(డ్రైవర్లు)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, ఎం.దశరథరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సమయంతో నిమిత్తం లేకుండా సేవలందిస్తున్నామని, తమ సేవలను ప్రభుత్వాలు గుర్తించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. పదేళ్లుగా అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. వీరికి సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో కె.రాజేశ్వరరావు, కె.కృష్ణంనాయుడు, ఎల్.రాంబాబు, పి.వెంకటరావు, ఎం.మణికంఠ, పి.అనంత్, ఎస్.రాజశేఖర్, బి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
పలాస : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను ఆపి వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి శుక్రవారం పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దండకారణ్యంలో ఆదివాసీలు సుమారు 400 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమం చేపట్టడం అప్రజాస్వామ్యమన్నారు. కర్రెగుట్ట కొండలను జల్లెడ పడుతున్నారని, అన్నిరకాల భద్రతా బలగాలను ఈ ఆపరేషన్‌కు వినియోగించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, చాపర వేణు, కొర్రాయి నీలకంఠం, పోతనపల్లి అరుణ, లక్ష్మణరావు, పుచ్చ దుర్యోధనరావు, మద్దిల రామారావు, ఎం.వినోద్, గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, మామిడి భీమారావు, రాపాక మాధవరావు, జడ్డే అప్పయ్య, పోతనపల్లి కుసుమ, బర్ల గోపి, ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్.. ‘సాక్షి’ కదిలించెన్..!
టెక్కలి: వారంతా వృద్ధులు.. నెలనెలా అందే పింఛను వైద్య ఖర్చులకో, మందులకో పనికి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి రెండు నెలలుగా పింఛను పెండింగ్ పెట్టారు.. మే నెలలో అయినా వస్తుందేమోనని ఆశిస్తే నిరాశే ఎదురైంది. వారి బాధను వివరిస్తూ ‘సాక్షి’లో శుక్రవారం కథనం రావడంతో అధికారులు కదిలారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురంలో ఎనిమిది మంది వృద్ధులకు పింఛను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 8 మంది వృద్ధులు దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు ఎలాంటి కారణం లేకుండా మార్చి, ఏప్రిల్ నెలల పింఛన్ ఇవ్వలేదు. తాజాగా వీరికి అధికారులు ఒకేసారి మూడు నెలల పింఛన్ అందజేశారు. గ్రామ సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు సంపతిరావు హేమసుందర్‌రాజు, గ్రామస్థులు కొందరు బాధితుల తరఫున పోరాటం చేశారు. సమస్యను వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్‌తో కలిసి మండల అధికారులతో పాటు కలెక్టర్, డీఆర్డీఏ పీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించారు. పింఛన్ జాప్యంపై కమలనాభపురం పంచాయతీ కార్యదర్శి రమేష్, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్‌కు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు కోట»ొమ్మాళి ఈవోపీఆర్డీ ఆనందరావు వెల్లడించారు. ఆనందంగా ఉందివరుసగా మూడో నెల కూడా పింఛన్ రాదని భయాందోళన చెందాం. ఇప్పుడు ఒకేసారి డబ్బులు ఇచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. మా లాంటి వారి కోసం సర్పంచ్, నాయకులు, గ్రామస్థులు అండగా నిలిచారు. – నెయ్యిల లక్ష్మీనారాయణ పింఛన్ కోల్పోతామనే భయం ఉండేది రెండు నెలల పాటు పింఛన్ ఇవ్వలేదు. మూడో నెల కూడా ఇవ్వరేమోనని భయం ఉండేది. సాక్షి కథనానికి అధికారులు స్పందించి పింఛన్లు మంజూరు చేయడం మాకు ఎంతో సంతోషం. – బొడ్డేపల్లి ధర్మారావు సర్పంచ్, ఆమె భర్త పోరాడారు మా గ్రామంలో నాతో పాటు 8 మందికి పింఛన్ ఇవ్వడం ఆపేశారు. మా సర్పంచ్ ధనలక్ష్మిమ, ఆమె భర్త హేమసుందర్‌రాజు, మరికొంత మంది మా కోసం ఎంతగానో పోరాటం చేశారు. మా ఆవేదనని సాక్షి వెలుగులోకి తెచి్చంది. చివరకు మాకు పింఛన్ డబ్బులు అందాయి. – మొజ్జాడ సూర్యనారాయణ -
పింఛను కట్..
టెక్కలి, శావల్యాపురం: పింఛనో రామచంద్రా అంటూ రాష్ట్రంలో లబ్ధిదారులు వేడుకుంటున్నారు.. నెలవారీగా తమకు రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.. ఎప్పుడు ఇస్తారో తెలియక కలవరపడుతున్నారు.. కూటమి ప్రభుత్వం కట్ చేసేసిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడ్డాక నాలుగు లక్షల పింఛన్లను కట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, పల్నాడు జిల్లా శావల్యాపురంలో నిరసనలకు దిగారు.మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలోని కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురంలో వృద్ధులు దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ నిలిపేశారు. బాధితులు స్థానిక, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా మంజూరు చేయలేదు. గురువారం మే నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్థులు బాధితులకు అండగా నిలిచి అధికారులను నిలదీశారు. గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తే అందరికీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఏ కారణాలు లేకుండా ఆపేసిన 8 మందికి.. పింఛను తొలగిస్తున్నట్లుగా నోటీసులిచ్చి, మిగతావారికి ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పింఛన్ల పంపిణీ జరగలేదు. చివరకు సచివాలయ సిబ్బంది విషయాన్ని ఈవోపీఆర్డీ ఆనందరావు దృష్టికి తీసుకువెళ్లి వెనుదిరిగారు. గ్రామస్థులు, బాధితులు.. కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఈవోపీఆర్డీ చాంబర్లో బైఠాయించారు. ఆయన డీఆర్డీఏ అధికారులకు నివేదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తప్పించుకున్నారు. కాగా, రెండు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని, ఇప్పుడు మూడో నెల పింఛన్ కూడా ఇవ్వకపోతే శాశ్వతంగా పింఛన్లకు దూరమవుతారంటూ లబ్ధిదారులు వాపోయారు. కాగా, పింఛన్ల వ్యవహారం ప్రారంభమైనప్పటి నుంచి కోటబొమ్మాళి ఎంపీడీవో ఫణీంద్రకుమార్, ఇన్చార్జిగా వ్యవహరించిన సంతబొమ్మాళి ఎంపీడీవో జయంత్‌ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు మూకుమ్మడిగా సెలవులు పెట్టడం గమనార్హం. సంతబొమ్మాళి మండలం కోటపాడులో లింగూడు ఏకాశి అనే వృద్ధురాలికి పింఛను కట్ చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో పింఛను నిలిచిపోయింది.రెండు గ్రామాల్లో 31 మందికి పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పొట్లూరులో 22 మందికి, పిచికలపాలెం గ్రామంలో 9 మందికి పింఛను కోత పెట్టారు. దీంతో లబ్ధిదారులు గురువారం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేశారు. పొట్లూరు, పిచికలపాలెంలో పింఛనుదారుల నుంచి ఫిర్యాదు అందిందని, క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని శావల్యాపురం ఎంపీడీవో మీనా సీతారామయ్య తెలిపారు.ముగ్గురు ఆడపిల్లల కుటుంబానికి పింఛనే ఆధారంరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. మూడు ఆపరేషన్లు చేశారు. ఎలాంటి పనులు చేయలేను. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నెలవారీగా వచ్చే రూ.6 వేల పింఛనుతోనే కుటుంబ పోషణ ఆధారపడి ఉంది. అధికారులు స్పందించి పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాథేయపడుతున్నా. – అమృతపూడి అలెగ్జాండర్ (పిచికలపాలెం, పింఛనుదారుడు) -
స్టైఫండ్‌తో కూడిన శిక్షణ
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రి బొల్లినేని మెడిస్కిల్స్ నందు డిగ్రీ చదివిన విద్యార్థులకు స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సును నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుకు డిగ్రీ పాసైన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. 6 నెలలు శిక్షణ ఉంటుందన్నారు. ఎంపికై నవారికి శిక్షణలో స్టైఫండ్ అందిస్తామన్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించాలన్నారు. 8న సహకార సంఘ ఎన్నికలు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గొర్రెలు, మేకలు పెంపకందారుల సహకార యూనియన్ లిమిటెడ్ శ్రీకాకుళం ఎన్నికలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి డాక్టర్ పి.రామ్మోహన్రావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఎన్నికల రూల్ 22(బీ) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చేతు లు పైకెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామన్నా రు. ఎన్నికల అధికారి ప్రకటించిన నోటీసు, ఓటర్ల జాబితా సంయుక్త సంచాలవారి కార్యా లయంలో నోటీసు బోర్డులో పెట్టినట్లు పేర్కొన్నారు. అదేరోజు నామినేషన్ల అనంతరం ఎన్ని కలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎటువంటి సందేహాలున్నా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నాటుసారాతో పట్టుబడిన వ్యక్తి కవిటి: మండలంలోని బంజుపుట్టుగ తోటల్లో గురువారం మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన బంజు శ్యామరావు అనే వ్యక్తిని 100 నాటుసారా ప్యాకెట్లతో పట్టుకున్నామని మొబైల్ టీమ్ సీఐ జీవీ రమణ తెలిపారు. ఈ మేరకు స్వాధీనం చేసు కున్న నాటుసారా ప్యాకెట్లు, సదరు నిందితుడి ని ఎకై ్సజ్‌శాఖ సిబ్బందికి తదుపరి చర్యల నిమిత్తం అప్పగించినట్టు తెలిపారు. -
ట్రాక్టర్ ఢీకొనడంతో మహిళకు గాయాలు
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీలోని వీకేపేట రోడ్లో ఒక ట్రాక్టర్ స్కూటీని ఢీకొనడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం అత్యంత రద్దీగా ఉన్న వీకేపేట రోడ్లో రత్తకన్న వైపు నుంచి మార్కెట్ వైపు ఒక వ్యక్తి ట్రాక్టర్ని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న స్కూటీనీ తప్పించే క్రమంలో ఢీకొన్నాడు. దీంతో స్కూటీ నడుపుతున్న పెద్ద ఆకుల వీధికి చెందిన కిల్లంశెట్టి శరణ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండడం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ ముకుందరావు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సవరాశి దుదిష్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాగునీరు అందించేందుకు కృషి
మున్సిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను అధిగమించడానికి ఒడిశాలోని చీకటి ఎమ్మెల్యే మనోరంజన్ ధ్యానో సమంతరని కలిసి బగలట్టి డ్యామ్ నుంచి నీటిని విడిచిపెట్టాలని కోరాము. అదేవిధంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఉద్దానం వాటర్ ప్రాజెక్టుని మున్సిపాలిటీ వాటర్ హెడ్వర్క్స్కి అనుసంధానం చేస్తున్నాం. ఈ పనులు మూడు రోజుల్లో పూర్తి చేసి మున్సిపాలిటీ ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి కృషి చేస్తున్నాం. – ఎన్.రమేష్, మున్సిపల్ కమిషనర్, ఇచ్ఛాపురం -
పోస్టర్ ఆవిష్కరణ
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబర్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఎమర్జింగ్ మెటిరీయల్స్ ఫర్ టెక్నాలజికల్ అప్లికేషన్స్ అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం కళాశాలకు చెందిన ఎంబీఏ అధ్యాపకులు కె.వేణుగోపాల్, డి.విష్ణుమూర్తి తదితరులు రాసిన మార్కెటింగ్ స్మాల్ బిజినెస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎ.ఎస్.సంతోష్‌కుమార్, బి.వి.రమణ, డి.శ్రీరాములు, ఎం.వి.రత్నమణి, ఎం.రమణయ్య, బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.సత్తాచాటిన విద్యార్థినులుగార: జాతీయ టార్గెట్ బాల్ జూనియర్ క్రీడా విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జట్టు పాల్గొని గోల్డ్ మెడల్ సాధించగా, ఈ జట్టులో గార మండలం శాలిహుండం కేజీబీవీ విద్యార్థినులు ఆరుగురు ఉన్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆగ్రాలోని విద్యా ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రస్థాయి జట్టు పాల్గొంది. ఈ జట్టులో శాలిహుండం కేజీబీవీ విద్యార్థినులు పడపాన మాధవి (పదో తరగతి), బచ్చు కీర్తి (పదో తరగతి), నీలాపు సుస్మిత (పదో తరగతి), పరపతి లావణ్య (పదో తరగతి), కోనారి రజిని (పదో తరగతి), చుక్క గాయత్రి (ఇంటర్)లు పాల్గొన్నారు. పీడీ జె.నాగరత్నం శిక్షణలో వీరంతా క్రీడలో పాల్గొని విజయం సాధించడంపై ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారి అభినందించారు.గార గ్రామంలో విషజ్వరాలుగార: మండల కేంద్రం గార గ్రామంలో విష జ్వరాలతో పలువురు బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజలు జ్వరాలతో ఉన్నా ప్రభుత్వ వైద్య సిబ్బంది కనీసం రోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు ప్రైవేటుగా వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక సిబ్బందికి చెబుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే సమయంలో తాగునీటిని పరీక్ష చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చంద్రకళను కలిసి తెలియజేశామని, ఇంతవరకు పరీక్షలు కూడా జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీటి నమూనాలు సేకరించి విశ్లేషణ చేయాలని, రోగాల బారినపడిన ప్రజలకు వైద్యమందించేందుకు తక్షణమే మెడికల్ క్యాంపులు పెట్టాలని కోరుతున్నారు. -
దుకాణాలు సర్దేయండి!
● ఆమదాలవలస రైల్వేస్టేషన్ పరిధిలోని షాపుల నిర్వాహకులకు నోటీసులు ● 15 రోజుల్లో ఖాళీ చేయాలని రైల్వే అధికారుల ఆదేశం ● రోడ్డున పడతామంటున్న వ్యాపారులు ఆమదాలవలస రూరల్ : రైల్వే స్టేషన్ పరిధిలో పలు దుకాణాలు నిర్వహిస్తున్న వారికి రైల్వే అధికారులు షాకిచ్చారు. తక్షణమే ఖాళీ చేయాలంటూ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వ్యాపారాలు కోల్పోయి రోడ్డున పడతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైల్వే స్థలంలో సుమారు 40 సంవత్సరాలుగా రైల్వే అధికారులు గుర్తించిన స్థలంలోనే సుమారు 46 దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు. 1980 నుంచి ఈ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా 10 అడుగులు వెడల్పు, 10 అడుగు పొడవున విస్తీర్ణం గల స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి తొలుత రూ.200 చొప్పున ఆక్రమణ పన్ను రైల్వేశాఖకు చెల్లిస్తూ వచ్చేవారు. అయితే ప్రతి మూడు, నాలుగేళ్లకోసారి రైల్వేశాఖ ఆక్రమణ పన్ను పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఆక్రమణ పన్ను ఒక్కో దుకాణానికి రూ.12,000 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే ఏం జరిగిందో గానీ నోటీసు అందిన 15 రోజుల్లో దుకాణాలు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు ఆదేశించడంతో వ్యాపారులు దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయమేదీ..? నాలుగు దశాబ్దాలుగా ఇవే దుకాణాల్లో వివిధ వ్యాపారాలు చేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నఫలంగా దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసి తమ పొట్ట కొట్టవద్దని వాపోతున్నారు. అర్ధంతరంగా ఖాళీచేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన చెందుతున్నారు. గతంలో రైల్వే బుకింగ్ కార్యాలయం, ఇతర అభివృద్ధి పనుల కోసం కొన్ని షాపులు తొలగించినప్పటి వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట అవకాశం కల్పించారు. తమకు మాత్రం ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశించడంపై పలువురు మండిపడుతున్నారు. అభివృద్ధిపై ప్రభావం.. రైల్వేస్టేషన్ పరిధిలో ఉండే దుకాణాలు ఖాళీచేస్తే వ్యాపారాలు లేక ఆమదాలవలస అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం మూతపడటంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవటమే కాకుండా మున్సిపాలిటీ రావాల్సిన ఆదాయ వనరులు తగ్గిపోయాయని, ఇప్పుడు షాపులు కూడా తొలగిస్తే అనేక మంది జీవనోపాధి కోల్పోతారని చెబుతున్నారు. మరోవైపు, జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన ఈ స్టేషన్‌కు నిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటువంటి తరుణంలో దుకాణాలు తొలగించటం వల్ల ప్రయాణికులు అందక ఇబ్బందులు పడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టును ఆశ్రయించనున్న వ్యాపారులు.. అర్ధంతరంగా దుకాణాలు తొలగించటం వల్ల వ్యాపారులతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నందున కొందరు వ్యాపారు లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే రైల్వే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించక తప్పదని అంటున్నారు. -
నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలు
వజ్రపుకొత్తూరు రూరల్: యువతకు నైపుణ్యాలతోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని గరుడభద్రలో సైనింగ్ స్టార్ యువజన సంఘం 25వ వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్రస్థాయి డీఎస్సీ టాలెంట్ టెస్ట్‌ను గురువారం నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్‌లో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది అభ్యర్థులు పాల్గొని ఆన్లైన్లో ప్రతిభ పరీక్ష రాశారు. ఈ పోటీ పరీక్షలో కె.స్వప్న (శ్రీకాకుళం) ప్రతిభ కనబ ర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. కె.భారతి(శ్రీకాకుళం) ద్వితీయ స్థానం, ఎన్.శ్యామల(విజయనగరం) తృతీయ స్థానంతో పాటు మరో ఏడు స్థానాల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు నగదు బహుమతి తో పాటు జ్ఞాపికలను మాజీ మంత్రి చేతులమీదు గా అందజేశారు. కార్యక్రమంలో సైనింగ్ స్టార్ యువజన సంఘ అధ్యక్షుడు వై.సంతోష్‌కుమార్, సర్పంచ్ గూడ గిరిజ ఈశ్వరరావు, సైనింగ్ స్టార్ యువజన సంఘ కార్యదర్శి జి.నగేష్, గ్రామ సంఘ కార్యదర్శి చెల్లూరి పాపారావు, గాయిత్రి కళాశా ల ప్రిన్సిపాల్ షణ్ముఖరావు, జగన్ కోచింగ్ సెంటర్ అధినేత జగన్, గూడ భాస్కరరావు, వై.ధర్మారావు, వై.అప్పారావు, వై.అనందరావు, ఎ.దానేష్ పాల్గొన్నారు. -
క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
● జిల్లావ్యాప్తంగా 50 కేంద్రాల్లో శిక్షణ శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు (సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు) గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు శాప్ సూచనలతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 శిక్షణ శిబిరాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. 22 క్రీడాంశాల్లో జరుగుతున్న ఈ శిబిరాల వద్దకు క్రీడాకారులు, బాలబాలికలు తరలివస్తున్నారు. దీంతో క్రీడా మైదానాల్లో సందడి వాతావరణం నెలకొంది. క్రీడాకారులు శారీరక ఫిట్ నెస్‌తోపాటు నిర్దేశిత క్రీడలో సాధన చేపడుతున్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడి యం వేదికగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సీఈవో పి.సుందరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. చదువుతోపాటు క్రీడలు కూడా అవ సరమేనన్న విషయాన్ని విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు గుర్తించాలన్నారు. ఒలింపిక్ అసోసియేష న్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బీవీ రమణ మాట్లాడుతూ క్రీడాకారులు తయారయ్యేది,ఓనమా లు దిద్దుకునేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలతోనేనని తెలిపారు. డీఎస్డీవో డాక్టర్ కె.శ్రీధర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 50 కేంద్రాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, అత్యంత ఆదరణ కలిగిన క్రీడాంశాలకు పెద్దపీట వేశామన్నారు. కేంద్రాని కి రూ.7 వేలు చొప్పున శాప్ కేటాయించిందన్నారు. 8 ఏళ్లు పైబడిన బాలబాలికలు సద్వినియోగం చేసు కోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పర్యాటకాధికారి ఎన్.నారాయణరావు, టీటీ కోచ్ ఎం.మాధురీలత, పీడీలు చల్లా జగదీష్, ఎన్వీ రమణ, జి.అర్జున్‌రెడ్డి, రాజీవ్, పురుషోత్తం, క్రీడాసంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, సీనియ ర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి బీచ్ ఫెస్టివల్
శ్రీకాకుళం పాతబస్టాండ్: బారువ బీచ్ వేదికంగా ఈ నెల 3, 4 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం అన్ని శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి 70–80 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని చెప్పారు. గత వారం జరిగిన ఫెస్టివల్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్సిటీకి రెండు నెలలు సెలవులు ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి రెండు నెలలు సెలవులు ప్రకటిస్తూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు సెలవులు అమల్లో ఉంటాయని పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ విద్యార్థులకు సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి ఎచ్చెర్ల క్యాంపస్ : సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఎస్సై వి.సందీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు, ఘర్షణలు, కుట్రలకు పాల్పడే వారు, పాల్పడే అవకాశాలు ఉన్న వారిపై నిఘాపెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎచ్చెర్ల ఇన్చార్జి ఎంపీడీఓ సస్పెన్షన్ ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ఇన్చార్జి ఎంపీడీఓ బత్తుల మల్లేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లేశ్వరరావు 2023–24 ఆర్థిక సంవత్సరంలో టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా పనిచేస్తూనే, టెక్కలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో పంచాయతీ నిధులు దుర్వినియోగంలో పాత్ర ఉందంటూ మల్లేశ్వరరావును సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ఈవోపీఆర్డీగా పనిచేస్తున్న మల్లేశ్వరరావు మార్చి 10 నుంచి ఇన్చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ ఎంపీడీవో సీపాన హరిహరరావు రెండు నెలల దీర్ఘకాలిక సెలవుపెట్టారు. కర్రసాము పోటీల్లో ప్రతిభ నరసన్నపేట: ఏలూరులో రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 30న జరిగిన కర్ర సాము పోటీల్లో నరసన్నపేటలోని కృష్ణా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు సత్తాచాటారు. 38 మంది ప్రథమ స్థానం, 16 మంది ద్వితీయ స్థానం సాధించారు. ఆలిండియా కర్రసాము ఫెడరేషన్ గుర్తింపు పొందిన ఎస్వీఆర్కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. విజేతలతో పాటు కోచ్ ఆవల చిన్నను పలువురు అభినందించారు. -
విధి నిర్వహణలో అలసత్వం తగదు
జి.సిగడాం: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. గురువారం జి.సిగడాం మండలం వాండ్రంగి పింఛన్ల పంపిణీని పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. రహదారిపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా ఇంటి సామగ్రి వేస్తే వాహనాలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. ప్రతిఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించేలా చర్యలు తీసుకోవా లని ఏపీఓ చోళ్ల సత్యనారాయణకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌరీశంకరరావు, సర్పంచ్ సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యులు బూరాడ శ్రీదేవి, బూరాడ వెంకటరమణ, తహసీల్దార్ ఎం.శ్రీకాంత్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఈఈలు కుసుమ, సత్యనారాయణ, ఏపీఎం రెడ్డి రామకృష్ణంనాయుడు పాల్గొన్నారు. -
ఆస్తులు అప్పగింత..
శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, పొట్టి శ్రీరాముల మార్కెట్, బాపూజీ కళా మందిర్, పెద్దపాడు చెరువు లోపల స్థలంతో పాటు మరో రెండు కీలక ప్రదేశాల్లోని స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కూటమి సర్కార్ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ఉన్న వాటిని కూల్చి పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ ప్రైవేటు వ్యక్తులే పొందేలా ప్లాన్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్పారేషన్ అధికారుల ద్వారా ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా తీసుకుంది. దానిలో భాగంగానే పొట్టి శ్రీరాములు మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వ్యాపారులు ఖాళీ చేయాలని తాఖీదులిచ్చారు. వాస్తవంగా పొట్టి శ్రీరాముల మార్కెట్‌ను గత వైఎస్ జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసింది. మార్కెట్లో అడుగు పెట్టాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చింది. వరదనీరు, మురుగునీరు నిల్వలేకుండా, పక్కా సీసీ రోడ్లతో సుందరంగా తీర్చిదిద్దింది. కానీ, కూటమి ప్రభుత్వానికి అదేం కనిపించడం లేదు. తమ దారి తమదే అని ప్రైవేటు మోజులో పడింది. ● మున్సిపల్ కార్యాలయాన్ని కూలగొట్టి, ఆ స్థలంలో ప్రైవేటు వ్యక్తులతో నిర్మాణం చేపట్టి, అందులో కొన్ని ఫ్లోర్లను మున్సిపల్ కార్యాలయం కోసం, మిగతా ఫ్లోర్లను కమర్షియల్ కోసం వినియోగించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయం నిర్మాణం చేపట్టే వ్యక్తులే పొందేలా వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ కార్యాలయాన్ని కూలగొడితే...ఉన్న ఫలంగా ఇంటిగ్రేటేడ్ కలెక్టర్ కార్యాలయానికి మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ● ఎంతో చరిత్ర గల బాపూజీ కళామందిర్‌తో పాటు మరికొన్ని మున్సిపల్ ఆస్తులు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. చెప్పాలంటే ఆ ఆస్తులను వారికి ధారాదాత్తం చేసినట్టే. వాళ్లు చేసే నిర్మాణాలు చూసి మురిసిపోవడం తప్ప ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒరిగిందేమి ఉండదు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ‘ప్రైవేటు’ యాక్షన్ మొదలవుతుంది. తర్వాత ఏమవుతుందో నగర ప్రజలు వేచి చూడాల్సిందే. -
అమరావతి కోసం ఆపసోపాలు
● మోదీ సభకు జనాలు తరలించే బాధ్యత అధికారులకు అప్పగింత ● నియోజకవర్గానికి 500 మంది టార్గెట్ ● ప్రతి బస్సుకు వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి కేటాయింపు ● సభకు వెళ్లాక ఫొటోలు పెట్టాలని హుకుం సాక్షి ప్రతినిఽధి, శ్రీకాకుళం: అమరావతి సభ.. అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రధానమంత్రి మోదీ హాజరయ్యే సభకు ఇక్కడి నుంచి జనసమీకరణ చేసి తీసుకెళ్లారు. జనాల్ని ఒప్పించి తీసుకెళ్లడానికి అధికారులు ఆపసోపాలు పడ్డారు. డ్వాక్రా మహిళలకు, ఉపాధి మేట్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గానికి 500 మందిని సమీకరించాలని మంత్రులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో స్పందన లేకపోవడంతో అరకొరగా సమీకరణ చేసి తీసుకెళ్లారు. ఒక్కొక్క బస్సుకు వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శిని కేటాయించారు. బస్సు అమరావతికి చేరుకున్నాక ఫొటోలు తీసి పెట్టాలని హకుం జారీ చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా సంబంధిత వీఆర్ఓ, కార్యదర్శులే బాధ్యతని చెప్పారు. పెద్ద ఎత్తున బస్సుల సేకరణ.. అమరావతి సభకు జనాల్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులనే కాకుండా వివిధ విద్యా సంస్థల ప్రైవేటు బస్సులను వదల్లేదు. ఇప్పటికే జనాల తరలింపు కోసం జిల్లా నుంచి 55 ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. వాటిన్నింటిని అమరావతి చుట్టు పక్కల జిల్లాలకు పంపించేశారు. దీంతో ఆయా రూట్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంచనాలు తలకిందులు.. ఒక్కొక్క మండలం నుంచి మూడేసి బస్సుల్లో జనాల్ని తరలించాలని తొలుత ఆదేశించినా స్పందన కనిపించలేదు. బస్సు ఏర్పాటు చేసినా, భోజనాలు పెట్టినా, దారి ఖర్చులు ఇచ్చినా బయలుదేరలేమని చాలామంది చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. చివరి నిమిషంలో ఉపాధి మేట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా కొందరిని బయలుదేరించారు. సదుపాయాలపై స్పష్టతేదీ? జనాల్ని సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుందే తప్ప తీసుకెళ్లే వారికి భోజన, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జిల్లాకు కేటాయించలేదు. దీంతో తహశీల్దార్లు, ఎంపీడీఓలు తమ జేబుల్లో నుంచి కొంతపెట్టారు. మిగతాది బస్సుల్లో లైజనింగ్ అధికారులుగా వెళ్లిన కార్యదర్శి, వీఆర్ఓలు చూసుకోవాలని ఒప్పించారు. గురువారానికి సరిపడా భోజనం, రూ.10 వేలు చొప్పున తహశీల్దార్, ఎంపీడీవోలు ఇచ్చారు. శుక్రవారం పరిస్థితి ఏంటన్నదానిపై స్పష్టత లేదు. -
ఏడిపింఛెన్
● కక్షగట్టి..● పండుటాకులపై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ కక్షసాధింపు ● అకారణంగా పింఛన్ల పంపిణీ నిలిపివేత ● కమలనాభపురం, కోటపాడులో బాధితుల ఆవేదన టెక్కలి/సంతబొమ్మాళి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేసేవారు. కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమకు ఓటు వేయని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎటువంటి కారణాలు చూపకుండానే పింఛన్ల పంపిణీ అడ్డుకుంటోంది. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురంలో ఎనిమిది మంది వృద్ధులకు పింఛన్ల పంపిణీ నిలిపివేసింది. గ్రామానికి చెందిన దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణ అనే ఎనిమిది మంది వృద్ధులకు ఎటువంటి కారణాలు చూపకుండా రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ ఆపేశారు. క్యాన్సర్ బాధితురాలిపై పగ.. సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగుడు ఏకాశి అనే వృద్ధురాలికి ఓఏపీ కోటాలో పింఛన్ అందుతోంది. అయితే తన భర్త రామోజీకి మాజీ సైనిక ఉద్యోగి పేరిట పింఛన్ అందుతోందంటూ మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు చాట్ల అప్పలస్వామి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పింఛన్ ఆపేశారని బాధితురాలు గురువారం వాపోయింది. 1987లో తన భర్త స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారని, రూ.10 వేలు లోపు మాత్రమే పింఛను అందేదని, అధికారులకు లిఖిత పూర్వకంగా గత నెలలోనే సమాధానం చెప్పామని, దీంతో ఎంపీడీవో జయంతిప్రసాద్ ఫిబ్రవరి, మార్చి నెలల పింఛన్‌ను ఒకేసారి గత నెలలో ఇచ్చారని పేర్కొంది. ఇప్పుడు రాజకీయ కక్షతో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మే నెల పింఛన్ ఆపేశారని వాపోయింది. తన భర్త ఇటీవలే చనిపోయారని, ఈ పరిస్థితిలో పింఛన్ కూడా ఆపేయడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈవోపీఆర్డీ పద్మజ వద్ద ప్రస్తావించగా, ప్రభుత్వం నుంచి పింఛను ఇస్తున్నారని ఫిర్యాదు రావడంతో నిలుపుదల చేసినట్లు తెలిపారు. -
చీమలమందు తాగి మహిళ ఆత్మహత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామానికి చెందిన పినిమింటి లక్ష్మీ(37) చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ భర్త రామారావు రోజు మద్యం సేవించి భార్యాపిల్లలతో గొడవ పడేవాడు. ఇంట్లో దాచిపెట్టిన డబ్బులను ఈ నెల 27న తీసుకుపోయి రోజంతా పూటుగా తాగి సాయంత్రం ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. మనస్థాపానికి గురైన లక్ష్మీ ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలుపుకొని తాగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుశం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమార్తె జగదీశ్వరి, కుమారుడు శ్యాం ఉన్నారు. లారీని ఢీకొట్టిన కారు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు జాతీయ రహదారి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కోల్‌కతా నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ట్యాంకర్‌ను నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరిస్తాం శ్రీకాకుళం కల్చరల్: మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలంగాణ – ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా అన్నారు. జిల్లాలో బుధవారం పర్యటించిన ఆయన కొత్త రోడ్డు వద్ద ఆర్మీ క్యాంటీన్‌ని సందర్శించారు. మాజీ సైనికులకు, వీర నారీమణులకు ఉపయోగపడేలా ఈ–రిక్షా ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సింహద్వారం దగ్గర ఉన్న ఎక్స్ సర్వీసు మెన్ కంట్రిబ్యూటరి హెల్త్ స్కీమ్ పోలిక్లినిక్ని సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ సైనికులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ–ఆంధ్ర సబ్ ఏరియా ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామాంజలి మిశ్రా, కల్నల్ విక్రాంత్ పాండే, కల్నల్ ఆర్.ఎన్.ముతల్లిక్, డిస్ట్రిక్ట్ ఎక్స్‌సర్వీస్‌మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.శైలజ, ఇ.సి.ఎచ్.ఎస్. అధికారి, విశ్రాంత లెఫ్ట్‌నెంట్ కల్నల్ బి.చంద్రశేఖర్, శ్రీకాకుళం క్యాంటీన్ మేనేజర్ విశ్రాంత సుబెదార్ మేజర్ పి.గోవిందరావు, విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావు, శ్రీకాకుళం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, ఉపాధ్యక్షుడు వి.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి.మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు. బసవన్నకు నివాళులు శ్రీకాకుళం పాతబస్టాండ్: కుల, వర్ణ, లింగ భేదాలను వ్యతిరేకించిన మహాత్మ బసవేశ్వర తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో బసవన్న జయంతి వేడుకలు నిర్వహించారు. బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బసవన్న 12వ శతాబ్దపు తత్వవేత్తగా సమానత్వాన్ని బోధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వరరావు, టూరిజం అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటాడుకుందాం రా..!
అథ్లెటిక్స్: జీహెచ్ స్కూల్ పలాస– 9494379648, టెక్కలి– 9492417570, జెడ్పీహెచ్ స్కూల్ కేకే రాజపురం– 8464906752, టీపీఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళం– 8500271575, కేవీకే ఇచ్ఛాపురం– 9441024555, పాతపట్నం– 9100736583, జెడ్పీహెచ్ స్కూల్– 8688872304. వాలీబాల్: జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట– 9441011391, జెడ్పీహెచ్ స్కూల్ పైడి భీమవరం– 9849326018, జెడ్పీహెచ్ స్కూల్ ప్రగడపుట్టుగ– 9491569394, జెడ్పీహెచ్ స్కూల్ కొర్ని– 9440955034, జెడ్పీహెచ్ స్కూల్ మాకివలస– 9963753719, జెడ్పీహెచ్ స్కూల్ పాతపట్నం– 9440955034, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ– 9494814087. కబడ్డీ: బలగ శ్రీకాకుళం – 9010406706, జెడ్పీహెచ్ స్కూల్ సింగుపురం– 9642287746, ప్రభుత్వ డిగ్రీ కళాశాల టెక్కలి– 9441262515, జెడ్పీహెచ్ స్కూల్ పల్లెసారధి– 9502983175. ఖోఖో: జెడ్పీహెచ్ స్కూల్ పలాస– 9618583449, కేఆర్ స్టేడియం శ్రీకాకుళం– 9866288802, ఎంజీహెచ్ స్కూల్ ఇచ్ఛాపురం– 9177914135. హ్యాండ్‌బాల్: జెడ్పీహెచ్ స్కూల్ అల్లినగరం– 9493764447, జెడ్పీహెచ్ స్కూల్ పిల్లలవలస– 9966849462, జెడ్పీహెచ్ స్కూల్ పాతటెక్కలి– 7330831517. సాఫ్ట్‌బాల్: జెడ్పీహెచ్ స్కూల్ ఇప్పిలి– 9440436317, జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట– 9705302968, జెడ్పీహెచ్ స్కూల్ కురుడు– 9052500720. ఫుట్‌బాల్: కేఆర్ స్టేడియం శ్రీకాకుళం– 9533691018, కలెక్టరేట్ వద్ద ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ హెచ్–గ్రౌండ్ శ్రీకాకుళం– 9177564623, జెడ్పీహెచ్ స్కూల్ నరసన్నపేట– 8639629920. బాల్ బ్యాడ్మింటన్: జీహెచ్ స్కూల్ ఎచ్చెర్ల– 8074452351, ఎంజేపీ నరసన్నపేట– 7013473337. బాక్సింగ్: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్,శ్రీకాకుళం– 8977496979, పీఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళం– 9989364548. జూడో: జెడ్పీహెచ్ స్కూల్, వప్పంగి– 9440688828, జెడ్పీహెచ్ స్కూల్ పోలవరం– 9550743035. తైక్వాండో: ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం శ్రీకాకుళం– 9393178455, టౌన్ హాల్ శ్రీకాకుళం– 8919591487. వెయిట్ లిఫ్టింగ్: జీహెచ్ స్కూల్ నరసన్నపేట: 9492299769, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆమదాలవలస– 9390745150. బ్యాడ్మింటన్: టెక్కలి– 7799335725 బేస్‌బాల్: జెడ్పీహెచ్ స్కూల్ లావేరు– 8639000705. బాస్కెట్‌బాల్: టెక్కలి– 8986951096. చెస్: కోడిరామ్మూర్తి (కేఆర్) స్టేడియం శ్రీకాకుళం– 9908162634. క్రికెట్: పాతపట్నం– 9701454500. ఫెన్సింగ్: టౌన్‌హాల్ శ్రీకాకుళం– 7660874844. సెపక్తక్రా: ఎన్‌టీఆర్‌ఎం హెచ్‌స్కూల్ శ్రీకాకుళం– 8500828965. టేబుల్‌టెన్నిస్: బాలభాను విద్యాలయం – 9290577033. టెన్నీకాయిట్: జీహెచ్‌స్కూల్ పలాస– 9441089592. ఉషూ: ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం శ్రీకాకుళం– 9885734313. ● నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం ● జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో నెలరోజుల పాటు శిక్షణ ● 22 క్రీడాంశాలకు చోటు ● 8 ఏళ్లు పైబడిన బాలబాలికలకు అవకాశం శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో బాలబాలికలంతా మైదానబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులంతా మరో నెల రోజులపాటు ఆటల్లో ముగినితేలనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంప్)లను నిర్వహిస్తున్న విషయం విదితమే. జిల్లాలో గురువారం నుంచి శిక్షణా శిబిరాలు మొదలుకానున్నాయి. అరకొర నిధులతోనే.. మే ఒకటి నుంచి మొదలుకానున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు విధిల్చి చేతులు దులుపేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలలో మే నెలాఖరు వరకు ఈ శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. ఒక్కొక్క శిబిరానికి కేవలం రూ.7వేలు మాత్రమే కేటాయించారు. ఇందులో శిక్షకుడు/కోచ్‌కు రూ.1500, ఫ్లెక్సీకి రూ. 500, స్పోర్ట్స్ మెటీరియల్‌కు రూ.5వేలు వెచ్చించనున్నారు. శిక్షణ సమయంలో క్రీడాకారులకు పోటీ లను నిర్వహిస్తారు. ఆఖర్లో ఆన్లైన్లో సర్టిఫికెట్లు అందజేస్తారు. అరకొరగా నిధుల కేటాయింపు పట్ల క్రీడాసంఘాల ప్రతినిధులు పెదవివిరిస్తున్నారు. ఇవీ విధివిధానాలు.. ● సమ్మర్ కోచింగ్ క్యాంపులలో 8 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందిస్తారు. 16 ఏళ్లపైబడి ఆసక్తి కలినవారు కూడా హాజరుకావచ్చు. ● ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మరళా సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ● శాప్ కోచ్‌లతోపాటు పీడీలు/పీఈటీలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ అందించేందుకు అర్హులు. ● ప్రతిరోజు క్రీడాకారులకు హాజరు వేయాల్సి ఉంటుంది. ● వారంతాల్లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి. ● శిబిరాల సమయంలో గ్రామీణ, పాఠశాల స్థాయి స్పోర్ట్స్ క్లబ్‌లను క్రీడాంశాల వారీగా ఏర్పాటు చేయాలి. ● శిక్షణా శిబిరాల సమయంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రత్యేకంగా సానబెట్టి భవిష్యత్తులో జరిగే పోటీలకు సిద్ధంచేయాలి. ● దాతల సహకారం, చేయూతతో శిక్షణా శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలకు క్రీడాపరికరాలు, క్రీడాదుస్తులు, షూ, సాక్సులు, స్నాక్స్, మెడల్స్, బహుమతులు, అందించేలా ఆయా కేంద్రాల శిక్షకులు చొరవ తీసుకోవాలి. గ్రామీణ క్రీడలకు పెద్దపీట.. సమ్మర్ కోచింగ్ క్యాంప్ కేటాయింపులో గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారు. జిల్లా వ్యాప్తంగా 22 కేంద్రాలను కేటాయించారు. అత్యధికంగా అథ్లెటిక్స్‌కు, వాలీబాల్‌కు ఏడేసి చొప్పున కేంద్రాలను కేటాయించగా.. కబడ్డీ 4, ఫుట్‌బాల్ 3, హ్యాండ్‌బాల్ 3, సాఫ్ట్‌బాల్ 3, ఖోఖో 3, బాల్ బ్యాడ్మింటన్ 2, బాక్సింగ్ 2, జూడో 2, తైక్వాండో 2, వెయిట్‌లిఫ్టింగ్ 2, బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, చెస్, క్రికెట్, ఫెన్సింగ్, సెపక్తక్రా, టేబుల్‌టెన్నిస్, టెన్నికాయిట్, ఉషూ క్రీడాంశాల్లో చెరో కేంద్రం చొప్పున శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. అత్యంత ఆదరణ కలిగిన ఆయా ప్రాంతాల్లో పాఠశాలల మైదానాల్లోనే శిక్షణ అందించనున్నారు. శిబిరాలు ఎక్కడెక్కడంటే.. సద్వినియోగం చేసుకోవాలి.. బాలబాలికల ప్రతిభ బయటపడేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలలోనే. జాతీయస్థాయిలో తీర్చిదిద్దే శిక్షకులు జిల్లాలో ఉన్నారు. క్రమం తప్పుకుండా హాజరై శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ఒలింపిక్ అసోసియేషన్, క్రీడాసంఘాలు, పీఈటీ సంఘ నాయకులతో కలిసి శిక్షణా కేంద్రాలను కేటాయించాం. కేంద్రానికి రూ.7వేలు చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించిన విదివిధానాలను శాప్ ప్రకటించింది. – డాక్టర్ కె.శ్రీధర్‌రావు, డీఎస్డీఓ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, శ్రీకాకుళం -
చంద్రబాబు పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో ఇటీవల జరిగిన సీఎం చంద్రబాబునాయుడు పర్యటన పూర్తిగా తప్పుడు ప్రచారాల మీదే ఆధారపడిందని తప్ప జిల్లాకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేయాలని చూసిన చంద్రబాబు, నిజాలను పూర్తిగా మర్చిపోయారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వాస్తవాన్ని ఆయన గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ గుర్తించకపోవడం దారుణమన్నారు. భావనపాడు పోర్టు విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం అర్థరహితమన్నారు. పోర్టుకు భూముల సేకరణ, పునరావాస పనులు వంటి అన్ని పనులు వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, బీమా ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది జగన్మోహన్రెడ్డి సారథ్యంలోనే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయటానికి ముందు 14 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రజల కోసం ఏం చేసారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. హామీలిచ్చి విస్మరించడం సరికాదన్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తారా?
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. మున్సిపల్ కమిషనర్ రామారావు ప్రొటోకాల్ ఉల్లంఘించి తనను అవమానించారని చైర్మన్ బల్ల గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ వాయిదా వేసి వెళ్లిపోయారు. మున్సిపల్ సమావేశం ప్రారంభంలో చైర్మన్ తాగునీటి సమస్యపై ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం బోర్లు, పవర్ బోర్లు ఏర్పాటు అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో చైర్మన్ ఒక్కసారిగా కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న 26వ వార్డులో ఇటీవల పవర్ బోరును కమిషనర్, టీడీపీ కౌన్సిలర్ శంకుస్థాపన చేసుకున్నారని, కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని, కమిషనరే ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే ఇక తానెందుకని మండిపడ్డారు. ఇటీవల ప్రొటోకాల్ పాటించకుండా పలు కార్యక్రమాలు చేపడుతున్నారని, అలాంటప్పుడు 31 మంది కౌన్సిలర్లు, అధికారులతో సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం తమకేం ఉందని, కమిషనర్ ఏకచత్రాధిపతిగా పాలన సాగించుకోవాలంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ తీరుపై చైర్మన్ ఆగ్రహం ఏక చత్రాధిపత్యం వహిస్తున్నారంటూ సభ వాయిదా -
టెండర్ షెడ్యూల్లో మార్పులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పౌరసరఫరాల సంస్థకు చెందిన 14 మండల స్థాయి. గోదాములలో పి.డి.ఎస్.బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను రెండో దశ రవాణాకు వేసిన టెండరు షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్టు జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఒక ప్రకటనలో తెలపారు. వివరాలకు సహాయ మేనేజరు 7732098637 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. రిటైర్డ్ పోలీసులకు సత్కారం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి బుధవారం ఉద్యోగ విరమణ పొందినవారిని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీతలైన ట్రాిఫిక్ ఎస్ఐ వి.దేవదానం, ఆఫీస్ సూపరింటెండెంట్ పి.కోటేశ్వరరావు, వజ్రపుకొత్తూరు ఏఎస్ఐ ఎన్.అప్పలనాయుడు, ఏఆర్ హెచ్‌సీ ఎన్.చిన్నబాబులకు ఎస్పీ దుశ్శాలువ, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏవో సీహెచ్ గోపినాథ్, ఏఆర్ ఆర్ఐ నర్సింగరావు, కార్యాలయ సూపరింటెండెంట్లు బాలరాజు, లిల్లీభాయ్ తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏలకు వేతనాలు పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనాలు పెంచాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, వీఆర్ఎల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా విధించిన నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపులు, రైస్ మిల్లులు డ్యూటీలు రద్దుచేయాలని, డీఏను జీతంలో కలపాలని, వీఆర్వో, అటెండర్, రికార్డు అసిస్టెంట్, వాచ్‌మేన్, డ్రైవర్ ఖాళీ పోస్టుల్లో అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్అండ్బీ అతిథి గృహం రోడ్డు నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నా అనంతరం డీఆర్ఓ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర్ఏలు ఎన్.సీతప్పడు, బి.అప్పారావు, జి.రామ్మూర్తి, కె.లక్ష్మణ, ఎం.రాముడు, బి.రాములమ్మ, ఢిల్లీశ్వరరావు, రాంబాబు, పద్మ, మీనాక్షి, రాజులమ్మ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
వైశాఖం వచ్చినా.. మీనమేషాలేనా.?
అరసవల్లి: వైశాఖ మాసం వచ్చేసింది. ఈ మాసంలో అరసవల్లి ఆదిత్య క్షేత్రంలో ప్రత్యేక సందడి నెలకొంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. కానీ అందుకు తగ్గట్టు భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన రథసప్తమి మహోత్సవాలు సందర్భంగా ఆల యం ముందు భాగంలో ఉన్న నిర్మాణాలు, షెడ్లు అన్నింటినీ తొలగించేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఎండ తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో భక్తులకు ఎండ దెబ్బలు తప్పవని అర్థమవుతోంది. ఆలయంలో గత వైశాఖ మాసానికి వేలల్లో భక్తులు తరలి వచ్చినప్పటికీ అందుకు తగిన షె డ్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా వసతి ఏర్పాట్లు ఉండడంతో ఇబ్బందులు కలుగలేదు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఆలయం ముందు నిర్మాణాలు, షెడ్లు తొలగించేయడంతో పాటు అన్నదాన ప్రసాదం, ల డ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు కూడా తాత్కాలికంగా మారాయి. దీంతో భక్తులు గత మూడు నెలలుగా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎండ అవస్థలతో పాటు మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఆలయం ముందు మంచినీటి పంపిణీకి, భక్తులు సేద తీరడానికి చిన్నపాటి పందిళ్లతో సరిపెట్టిన ఆలయ అధికారుల తీరు రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. మూడు నెలల కిందట కూల్చేసిన షెడ్ల భాగాలతోనే ఇంద్రపుష్కరిణి ఒడ్డున అన్నదానం కోసం ఓ షెడ్డును వేసి మిన్నకుండిపోయారు. మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా తాత్కాలికంగానే ఏ ర్పాటు చేయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింకు రేకులతో మరుగుదొడ్లు వేయడంతో ఈ వేసవిలో వైశాఖ మాసంలో అవస్థలు తప్పే లా లేవు. దుకాణాలు కూల్చేసేటప్పుడు చెప్పిన హామీలను అధికార పార్టీ నేతలు పట్టించుకోవ డం లేదంటూ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నా రు. ఇప్పటికై నా న్యాయం చేయాలంటూ ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ బాధితులు కోరుతున్నారు. అరసవల్లిలో కానరాని ఏర్పాట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు -
కొందరికే కొత్త పింఛన్లు
● పాత ఐడీ ఉన్న వితంతువులకే పింఛన్లు ● ఐడీ లేని విడోలకు పింఛను లేదు ● కొత్త పింఛన్లకు నోచుకోని దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ● 50 ఏళ్ల పింఛన్ హామీ బూటకమే శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లలోనూ మెలికలు పెడుతోంది. ఎన్నికలు జరిగిన నాటి నుంచి దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు పింఛన్ల కోసం కళ్లు కాయ లు కాసేలా ఎదురు చూస్తుంటే కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు తప్ప కొత్తవారికి ఒక్క పింఛను ఇవ్వలేదు. కేవలం పింఛను పెంచామని కూటమి పాలకులు బాకాలు ఊదుతున్నారు తప్ప కొత్త వారి పరిస్థితిపై ఎవరూ మాట్లాడటం లేదు. 50 ఏళ్ల పింఛన్ ఊసే లేదు ● ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ ఇప్ప టివరకు దానిపై ఎలాంటి కసరత్తు చేయలేదు. ● దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మెడికల్ పింఛను దారులు వేల సంఖ్యలో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరినీ ప్రభుత్వం కరుణించలేదు. ● తాజాగా ప్రభుత్వం వితంతు పింఛను మంజూరుకు అనుమతులు ఇచ్చింది. దీంతో చాలా మంది వితంతువులకు పింఛను వస్తుందని ఆశ పడ్డారు. అయితే దీనిలో మెలిక పెట్టారు. గతంలో పింఛను పొంది, ఆ వ్యక్తి పింఛన్ ఐడీ కలిగి ఉండి, ఆయన మరణిస్తే అతని భార్యకు మా త్రమే వితంతువు పింఛను ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. భర్త పింఛను భార్యకు తప్ప ఇతర వితంతువులకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ● మే నెలకు గాను జిల్లాకు 3.10 లక్షల పింఛన్లు విడుదలయ్యాయి. ఈ పింఛన్లు గత ఏడాదిగా ప్రతి నెలా తగ్గుతూ వస్తున్నాయి. ● ఇవన్నీ పాత పింఛన్లే. కొత్తగా చనిపోయిన వారి స్థానంలో 4623 పింఛన్లు మంజూరు కావాల్సి ఉండగా.. వీటిలో కూడా కోత పెట్టేందుకు ప్రభుత్వం సాకులు వెతుకుతోంది. ● జిల్లాలో గత ఏడాదిన్నరగా 4623 మంది పింఛన్దారులుమరణించినట్టు చెబుతున్నారు. అయి తే వీరి ఐడీల ద్వారా వారి భార్యలకు (స్పౌజ్) లో 2911 పింఛన్లు మాత్రమే ఇవ్వనున్నారు. ● ఒక కుటుంబంలో భర్త పింఛను పొందుతూ 01.12.2023 నుంచి 31.10.2024 మధ్య మరణిస్తే.. అలాంటి పింఛనుదారు భార్యకు మాత్ర మే వితంతు పింఛను మంజూరు చేశారు. ఇతరులకు మొండి చేయిచూపారు. ● భర్త పింఛన్‌దారుడు కాకపోతే.. వితంతువైనా పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతులు లేవు. -
శ్రీకాకుళం
ఆటాడుకుందాం రా..!నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఏర్పాట్లు పూర్తయ్యాయి. –8లోతమ్ముళ్లకు వెన్నుపోటుగురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025● నరసన్నపేట నియోజకవర్గ కీలక నేత చేతిలో మోసపోయిన తెలుగు తమ్ముళ్లు ● మద్యం వ్యాపారంలో వాటాలిస్తామని రూ. 20కోట్లకు పైగా సేకరణ ● వసూలయ్యాక మాట మార్చిన కీలక నేత ● లబోదిబోమంటున్న తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రైవేటు మద్యం దుకాణాలు వస్తున్నాయనగానే తెలుగు తమ్ముళ్లు సంబరపడ్డారు. ఎవరికీ దక్కకుండా దుకాణాలు కొట్టేద్దామని భావించారు. నాయకులంతా సిండికేటై దుకాణాలన్నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కలలు కన్నారు. ఇంకేముంది నరసన్నపేట నియోజకవర్గ కీలక నేత సిండికేట్‌కు నాయకత్వం వహించారు. అంతా కలిసి వ్యాపారం చేసుకుందామని గ్రామాల వారీగా నాయకుల నుంచి పెట్టుబడి కింద రూ. 20కోట్లకు పైగా వసూలు చేశారు. కానీ అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి అయింది. డబ్బులిచ్చిన నాయకుల పేరున కాకుండా తన కుటుంబ సభ్యుల చేత నియోజకవర్గంలోని దుకాణాలకు దరఖాస్తు చేయించారు. వా టిలో కొన్ని దుకాణాలు లాటరీలో వారికే దక్కాయి. ఇతరులకు వచ్చిన మరికొన్ని దుకాణాలను భయపెట్టి తన సిండికేట్‌లో కలిపేసుకున్నారు. అంతా అయ్యాక సిండికేట్ వ్యాపారం కోసం గ్రామాల వారీగా భారీగా డబ్బులిచ్చిన నాయకులను విస్మరించారు. వ్యాపారంలో కలుపుకోకపోగా వారిచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం లేదు. పెట్టుబడి కోసం వివిధ వ్యక్తుల వద్ద వడ్డీలకు తీసుకొచ్చిన సొమ్ము ఆ కీలక నేత చేతిలో ఉండిపోయిందని లబోదిబోమంటున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీ.. నరసన్నపేట నియోజకవర్గంలో కీలక నేత పంట పండింది. అటు మద్యం, ఇటు ఇసుక ద్వారా రోజు కి రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఆ నేత రెండు చేతులా సంపాదిస్తున్నారు. కానీ, ఆయన్ని నమ్మి వెనుక నడిచిన నాయకులు మాత్రం చాలా వరకు మోసపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి నష్టపోతున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అక్కడి కీలక నేత ఒకరు అంతా తానై వ్యవహరించారు. మద్యం వ్యాపారం కలిసి చేసుకుందామని నమ్మబలికి నాయకుల దగ్గరి నుంచి రూ. 20కోట్లకు పైగా సొమ్ము సేకరించారు. డబ్బులిచ్చిన ప్రతి ఒక్కరికీ వ్యాపారంలో వాటా కావాల్సిన వారికి ఇసుకలో వాటా మద్యం వ్యాపారం కోసం డబ్బులిచ్చిన వారిలో తనకు కావాల్సిన కొందరికి మాత్రం ఇసుకలో వాటాలిచ్చారు. తప్పని పరిస్థితుల్లో అనధికారికంగా నడిపే ర్యాంపుల్లో కొంత పర్సంటేజీ ఇచ్చారు. పైసా పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో ఇసుక ర్యాంపులను కీలక నేత వదిలేశారు. ముఖ్యంగా నరసన్నపేట, పోలాకి, జలుమూరు తీర ప్రాంత గ్రామాలకు చెందిన నాయకుల్లో బలమైన వ్యక్తులకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చారు. మిగతా వారిని సముదాయిస్తూ వస్తున్నారు. ఒకే దుకాణానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వేయడం వల్ల ఆ ఫీజు కింద చాలా వరకు పోయిందని, అనుకున్నంతగా లాభాలు కూడా రావడం లేదని, ఇప్పుడిప్పుడే బెల్ట్ దుకాణాల ద్వారా ఆదా యం పెరిగిందని, త్వరలోనే వ్యాపారం కోసం ఇచ్చినదంతా వెనక్కి ఇచ్చేస్తానంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడా నేత తీరుపై మిగతా ప్రజలు పక్కన పెడితే సొంత నాయకులే కస్సుబుస్సులాడుతున్నారు. ఇస్తామని చెప్పారు. నాయకుల పేరునే దుకాణాల కోసం దరఖాస్తులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. కానీ, దరఖాస్తుల ప్రక్రియకు వచ్చేసరికి తన కు టుంబ సభ్యుల పేరున ఎక్కువగా దరఖాస్తులు చేశారు. ఒక్కో దుకాణానికి 30నుంచి 70వరకు దరఖాస్తులు చేసినప్పటికీ ఆ కుటుంబ సభ్యులకే లాటరీలో ఎక్కువగా దుకాణాలు వచ్చాయి. న్యూస్రీల్హ్యాండ్ ఇచ్చిన కీలక నేత దుకాణాలు దక్కాక ఆ నేత మొహం చాటేస్తున్నారు. వాటా సంగతేంటని అడిగితే దాట వేస్తున్నారే తప్ప లబ్ధి చేకూర్చడం లేదు. ఎప్పటికీ వాటాలు ఇవ్వడం లేదని కొందరు విసిగి పోయి అడుగుతుంటే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. తరచూ అడిగే వాళ్లకు వడ్డీతో కలిపి చెల్లించేస్తానని చెప్పడమే తప్ప వెనక్కి ఇచ్చిన దాఖాల్లేవు. ఒకవైపు వడ్డీలు పెరిగిపోతున్నాయి, మరోవైపు కీలక నేత వెనక్కి ఇవ్వడం లేదు. దీంతో నాయకులంతా కుమిలిపోతున్నారు. గట్టిగా అడిగితే అధికారం ఉండటంతో ఏం చేస్తారోనన్న భయంతో ప్రాధేయ పడుతూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సమావేశాలు పెట్టుకుని కీలక నేత తీరుపై ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఏం చేస్తే...ఆ డబ్బులు వెనక్కి వస్తాయో అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. -
● రోడ్డుపై కూలిన మర్రి చెట్టు
మందస: బుధవారం తెల్లవారు జామున వీచిన భారీ గాలులకు మందస మండలం సొండిపూడి–ముకుందపురం గ్రామాల మధ్య భారీ మర్రిచెట్టు కూలిపోయింది. దీంతో చాలాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు రోడ్డుపై కూలిన మర్రి చెట్టు ● ధాన్యం..దైన్యం నరసన్నపేట: అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షానికి తడిచిపోయింది. మండలంలో కరగాం, లింగాలపాడు, యారబాడు, కోమర్తి, మతలబుప్పేట, చిక్కాలవలస తదితర గ్రామా ల్లో ధాన్యం బాగా తడిచిపోయింది. -
‘ప్రజల భద్రత గాలికి’
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికి వదిలేసిందని, ఇటీవలే తిరుపతి తొక్కిసలాటలో కొందరు చనిపోయారని, ఇప్పుడు సింహాచలంలోనూ భక్తులు ప్రాణాలు కోల్పోయారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం విచారకరమన్నా రు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని, వాళ్లు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింహాచలం ఘటన బాధాకరం ఇచ్ఛాపురం రూరల్: సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి వచ్చిన భక్తులపై గోడ కూలి కొందరు భక్తులు చనిపోవడంపై ఎమ్మెల్సీ నర్తు రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. గోదావరి పుష్కరాలు, తిరుపతిలో తొక్కిసలాట, వందల సంఖ్యలో గోవుల మృతి, శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి, ఇప్పుడు సింహాచలంలో దుర్ఘటన అన్నీ టీడీపీ హయాంలోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. భక్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీ పాలిసెట్–2025 జిల్లాలో బుధవారం సజావుగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ల పరిధిలో 39 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. జిల్లా నుంచి 11373 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 10217 మంది హాజరయ్యారు. శ్రీకాకుళం డివిజన్లో 6973 మందికి 6183 మంది, టెక్కలి డివిజన్లో 4400 మందికి 4034 మంది హాజరయ్యారు. పరీక్ష నిర్వహణను ప్రవేశాల జిల్లా ఇన్చార్జి బి.జానకి రామయ్య, జిల్లా అబ్జర్వర్ కె.విజయలక్ష్మి, టెక్కలి అబ్జర్వర్ గోవిందరావు, శ్రీకాకుళం అబ్జర్వర్ కె.రత్న కుమార్ పరీక్షలు పర్యవేక్షించారు. పి–4 సర్వే ద్వారా 75,566 కుటుంబాల గుర్తింపుశ్రీకాకుళం పాతబస్టాండ్: పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి–4 విధానాన్ని జిల్లాలో ప్రభావవంతంగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పుండ్కర్ తెలిపారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 20 శాతం వెనుకబడిన కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా గుర్తించామని, జిల్లాలో మొత్తం 75,566 కుటుంబాలు ఈ దిశగా ఎంపికయ్యాయని వెల్లడించారు. వీరిని సమాజంలో ఉన్నత స్థితికి చేర్చేందుకు 10 శాతం మంది ‘మార్గదర్శులు’గా ముందుకు వచ్చి, ఒక్కో బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని వారికి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఇతర అవసరాల కోసం తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా ప్రభుత్వ–ప్రైవేట్–ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలనుకునే వారు zeropovertyp4. ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూలలలో ఉన్న శ్రీకాకుళం వాసులు ముందుకు రావాలని ఆయన కోరారు. ఎచ్చెర్లలో పరీక్ష కేంద్రం వద్ద అధికారులు -
వైఎస్ జగన్‌ను కలిసిన కృష్ణదాస్
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు బొడ్డేపల్లి పద్మజ కూడా ఉన్నారు. – శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) శ్రీకాకుళం పాతబస్టాండ్: నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు అన్ని శాఖల సమన్వయంతో చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మే 4న జరగనున్న నీట్ పరీక్షలపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు నీట్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్జేయూకేటీ–ఎచ్చెర్ల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ–గుజరాతీపేట, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల–శ్రీకాకుళం, కేంద్రీయ విద్యాలయం–శ్రీకాకుళం ఉన్నాయి. మే 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిరణ్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్, నీట్ సిటీ కోఆర్డినేటర్ సుహాయిబ్ ఆలం, చీఫ్ సూపరింటెండెంట్ పీవీ రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా నీట్ పరీక్షలు -
ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ల విలీనం
శ్రీకాకుళం అర్బన్: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామీణ ప్రాంతీయ బ్యాంక్‌ల విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు బ్యాంక్ రీజనల్ మేనేజర్ లావేటి అనంతరావు మంగళవారం తెలిపారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్(సీజీజీబీ), సప్తగిరి గ్రామీణ బ్యాంక్(ఎస్జీబీ) తదితర బ్యాంక్‌లన్నీ విలీనమై మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా ఏర్పడతాయని చెప్పారు. ఖాతాదారుల నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచి చిరునామాలలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు చేయడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న అన్ని సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ శ్రీకాకుళం అర్బన్: జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్లో ఉన్న సీనియారిటీ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మే 2వ తేదీ సాయంత్రం 5గంటలలోగా తెలియజేయవచ్చని డీఈవో ఎస్.తిరుమలచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకుడిగా
● పార్టీ విజయనగరం పార్లమెంటు పరిశీలకుడిగా కిల్లి సత్యనారాయణ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకునిగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు నియమితులవ్వగా, విజయనగరం పార్లమెంటు పరిశీలకునిగా కిల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు జిల్లా నాయకులందరికీ సుపరిచితులు. మంచి వాగ్ధాటి, సమస్యలపై అవగాహన ఉన్న నాయకునిగా గుర్తింపు ఉంది. కిల్లికి పెద్ద బాధ్యతలు.. పార్టీలో సీనియర్ నేతగా, రెండు పర్యాయాలు ఎంపీపీగా, సుదీర్ఘకాలం సర్పంచ్‌గా పనిచేసి ఆమదాలవలస నియోజకవర్గ నేతగా గుర్తింపు, అనుభవం ఉన్న కిల్లి సత్యనారాయణను విజయనగరం పార్లమెంటు పరిశీలకునిగా నియమించడం ఆయనకు దక్కిన గౌరవంగా కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న కిల్లి సత్యనారాయణకు ఇప్పుడు పార్లమెంటు పరిశీలకుడు అనే పెద్ద బాధ్యతను వైఎస్ జగన్ అప్పగించారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టి, ఇచ్చి న బాధ్యతను వందశాతం నిర్వర్తించి పార్టీ విజయానికి అహర్నిశలు పనిచేస్తానని చెబుతూనే, తనను గుర్తించిన అధినేతకు కిల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కుంభా రవిబాబు కిల్లి సత్యనారాయణ -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలోని దన్నానపేట సమీపంలో సోమవారం రాత్రి మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావుపేటకు చెందిన అమరాపు బ్రహ్మాజీరావు రణస్థలం నుంచి స్వగ్రామం బైక్‌పై వెళ్తుండగా, అతనే పక్కనే మరో ద్విచక్ర వాహనం ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన మరో ఒక ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొట్టుకున్నాయి. మూడు బైకులు కింద పడటంతో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రణస్థలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. బ్రహ్మజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఏఎస్ఐ సీహెచ్ లక్ష్మణరావు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి బండిపాలెం వద్ద సగం వేసి వదిలేసిన రోడ్డే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లింట విషాదం సరుబుజ్జిలి: మండలంలోని మూల సవలాపురం గ్రామానికి చెందిన గుడాల అప్పారావు(57) సోమవారం రాత్రి కొత్తకోట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఇతని కుమారుడి వివాహం మే 13న నిశ్చయించారు. భార్య కుమారితో కలిసి పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లి ఏబీ రోడ్డులో స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ జనార్దనరావు తెలిపారు. వీఆర్‌కు గార ఎస్ఐ గార : గార పోలీస్ స్టేషన్ ఎస్ఐ రెళ్ల జనార్దనరావును శాఖాపరమైన చర్యల్లో భాగంగా శ్రీకాకుళం వీఆర్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గార ఇన్చార్జి ఎస్ఐగా శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణకు బాధ్యతలు అప్పగిస్తారని విశ్వసనీయ సమాచారం. -
బాలికపై అఘాయిత్యం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం వేరే నగరంలో నివసిస్తున్న బాలిక సెలవుల్లో శ్రీకాకుళంలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలికకు తండ్రి లేరు. ఈ నెల 28న ఆ బాలిక ఎదురింటిలో ఉన్న 26 ఏళ్ల యువకుడు ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన మేనత్త వద్ద బాలిక ఈ విషయాన్ని చెప్పగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా తొమ్మిదిరోజులు రిమాండ్ విధించారని ఎస్ఐ హరికృష్ణ వెల్లడించారు. -
రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు
ఈ చిత్రం ఎచ్చెర్ల నుంచి చిలకపాలెం వెళ్లే దారిలో ఉన్న ఫ్లై ఓవర్ సమీపంలోనిది. పారబోసిన వ్యర్థాలు ఏమిటో తెలుసా.. కాలం చెల్లిన సిరప్లు. ఇలా ఎక్స్పైర్ అయిన మందుల్ని ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. ఇలా భూమిలో కలిపేయడం కూడా ప్రమాదమే. కానీ ఇలా మందుల్ని ఇష్టానుసారం పారవేయడం ఈ ప్రాంతంలో నిత్యకృత్యంగా మారింది. పొందూరు మండలం రాపాక జంక్షన్ నుంచి కృష్ణాపురం వచ్చే మార్గంలోని రహదారి ఇది. చిత్రంలో ఉన్నవేమిటో తెలుసా.. బాయిలర్ కోళ్లకు సంబంధించిన వెంట్రుకలు.. ఇతర పౌల్ట్రీ వ్యర్థాలు. అసలే బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఇలా పౌల్ట్రీ వ్యర్థాలను జాతీయ రహదారి పక్కనే పారవేయడం ఎంత వరకు సమంజసం. డంపింగ్ యార్డులుగా రహదారులు ● కుప్పలుతెప్పలుగా వ్యర్థాల పారబోత ● రహదారుల వెంబడి దుర్వాసన ● అధికారుల చోద్యం ● ఇబ్బందుల్లో ప్రజానీకం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రహదారుల పక్కన వ్యర్థాలు డంపింగ్ అవుతున్న విషయంపై ‘సాక్షి’కి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నుంచి పొందూరు మండలం రాపాక వరకు 25 కిలోమీటర్ల దూరాన్ని ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పరిశీలనలో భయంకరమైన వ్యర్థాలు ఎలా పారబోస్తున్నారో వెల్లడైంది. పర్యవేక్షణ లేదనే విషయం కూడా పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే చాలు.. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో చీకటి పడితే చాలు. వ్యర్థాల డంపింగ్ గుట్టుగా సాగిపోతోంది. భవన నిర్మాణ వ్యర్థాలు.. మెడికల్ వేస్టేజ్.. ఫౌల్ట్రీ వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక పాలిథిన్ మాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడైనా ఫంక్షన్ జరిగిందో అంతే సంగతులు.. ఆ ఊరి చివరి గుట్టలుగుట్టలుగా పాలిథిన్ వ్యర్థాలు దర్శనమివ్వడం పరిపాటిగా మారిపోయింది. వందలాది మంది రాకపోకలు.. ● ‘సాక్షి’ పరిశీలించిన ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు.. వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ● డంపింగ్ జరుగుతున్న ప్రదేశాలకు సమీపంలో కళాశాలలు.. వసతి గృహాలు ఉన్నాయి. ● అత్యధిక సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ● కూరగాయల విక్రయాలు కూడా వీటికి సమీపంలోనే సాగుతున్నాయి. ● మూగజీవాలు అత్యధికంగా సంచరించే ప్రదేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ● ఇవేమీ పట్టనట్టుగా వ్యర్థాలను పారబోస్తూ కొందరు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ● ఈ అంశంపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● ఈ వ్యర్థాల పారబోతకు అడ్డుకట్ట వేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు కోరుతున్నారు. ఇది కూడా పొందూరు మండలం రాపాక జంక్షన్ నుంచి కృష్ణాపురం వచ్చే మార్గమే. ఈ చిత్రంలో మూటలా ఉన్నవి ఏమిటో తెలుసా.. సోఫాలకు వినియోగించే లెదర్ షీట్ ముక్కలు. వీటిని ఇలా మూటలుగా కట్టి డంప్ చేస్తున్నారు. పౌల్ట్రీ వ్యర్థాలతో అనర్థాలు హైవే పక్కన దాదాపు వెయ్యి వరకు పౌల్ట్రీ ఫారాలు ఉన్నా యి. వీటి వ్యర్థాలను నిర్వీ ర్యం చేసే విషయంలో ఎవరికీ అవగాహన లేదు. వ్యర్థాలను రోడ్డు పక్కనే పడేస్తున్నారు. దీని వల్ల వెంట్రుకలు గాలిలోకి ఎగిరి వాహనదారుల కళ్లలో పడుతున్నాయి. అలాగే సింథటిక్, లెదర్, ప్లాస్టిక్ వంటి వాటిని గొయ్యి తీసి పూడ్చాలి. లేదంటే ప్రమాదకరం. ఎలక్ట్రానిక్ వేస్టు వల్ల కూడా ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. – కొమ్ము రమణమూర్తి, డైరెక్టర్, స్వీప్ స్వచ్ఛంద సేవా సంస్థ డంపింగ్ పెరిగింది జనావాసాల్లో విచ్చలవిడిగా చెత్త డంపింగ్ పెరుగుతోంది. మనం వినియోగించే వస్తువుల్లో ఎలక్ట్రికల్‌తో పాటు పాలిథిన్ వస్తువులు పర్యావరణానికి, ప్రజల జీవన మనుగడకు ఎంతో ప్రమాదకరం. సాగునీటి వనరుల సమీపంలో వ్యర్థాలు వేయడం వలన ఒక వైపు వ్యవసాయంతో పాటు మరో వైపు భూగర్భ జలాలు విష పూరితంగా మారుతున్నాయి. దీనిపై పంచాయతీ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. –కె.ధర్మారావు, ప్రజా సంఘాల నాయకుడు, టెక్కలి అత్యంత ప్రమాదకరంగా పర్యావరణం చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఊర్లను నదులను స ముద్రాలను చెత్తకుండీలుగా మార్చడం వల్ల నేల, నీరు, గా లి, భూగర్భ జలాలు కలుషితం కావడమే కాక అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. మనం వాడి పడేసే అనేక వ్యర్థ పదార్థాల్లో గంధకం ఒకటి. ఇది వాతావరణంలో సల్ఫర్ డైఆకై ్సడ్ విడుదల చేస్తుంది. ఇది విష వాయువు. వస్తువులను రీసైకిల్ చేసి వాటి నుంచి కొత్త వస్తువులు తయారు చేయడం అనేది చాలా కీలకం. దీనిపై అవగాహన కలిగి ఉండాలి. – ఎం.పద్మనాభరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, టెక్కలి ఈ ప్రాంతమూ రాపాక పరిసరమే. తెల్లగా ఉన్నదేమిటో తెలుసా.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్. భవన నిర్మాణాల్లో సీలింగ్ కోసం వినియోగించి ఆ వ్యర్థాలను ఇలా రహదారి పక్కనే పారవేస్తున్నారు. ఇవి గాజు పెంకులు కాదండోయ్. అత్యంత ప్రమాదకరమైన వాయువులుండే టీవీలకు సంబంధించిన పిక్చర్ ట్యూబ్‌లు. వీటిని పెద్ద ఎత్తున రాపాక సమీపంలో డంప్ చేసేస్తున్నారు. వాటిని పగలకొట్టి మరీ పారేస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదకర వాయు వులు పర్యావరణంలో కలుస్తున్నాయి. చిలకపాలెం నుంచి పొందూరు వెళ్లే రోడ్డు ఇది. చిలకపాలెం గ్రామ సరిహద్దుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా డంప్ అవుతున్నా అడిగే నాథుడే లేడు. చూడండి రోడ్డు పొడ వునా ఎలా స్వాగతం పలుకుతున్నాయో..! -
గురుకులాల సమస్యలపై వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, భవనాలకు మరమ్మతులు చేయించాలని, పారా మెడికల్ కోర్సులు ప్రవేశ పెట్టాలని, డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచాలని దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. 2024 డిసెంబర్లో అంబేడ్కర్ వర్థంతి నుంచి 2025 ఏప్రిల్‌లో అంబేడ్కర్ జయంతి వరకు చేపట్టిన గురుకులాల సర్వే వివరాలను సైతం కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పేడాడ కృష్ణారావు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామారావు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్‌గోపాల్, ఎస్సీ ఎస్టీ విజిలెనన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అర్జి కోటి, మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి నగర కార్యదర్శి కానుకుర్తి గోవింద్, మాలమహానాడు నాయకులు ముచ్చ శ్యామ్, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వన్నెలు లక్ష్మీనారాయణ, బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు చీర రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిషేధమేనా..?వేటకు వెళ్లేవారిపైనా ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. భృతి ఇవ్వకుండా వేధిస్తోంది. –8లో
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్తగా తమ్మినేని సీతారాం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. తాజాగా పార్టీ పరిశీలకుల నియామకాల నేపథ్యంలో తమ్మినేని సీతారాంను పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ్మినేని నియామక ఉత్తర్వులను పార్టీ కార్యాలయం మంగళవారం రాత్రి జారీ చేసింది. అపార అనుభవం ఉన్న నాయకుడిగా, పార్లమెంట్ పరిధిలో అందరికీ పరిచయం ఉన్న నేతగా, పార్టీలో సీనియర్ నేతగా గుర్తించి పార్లమెంట్ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే పార్టీ రాజకీయ సలహా కమిటీ(ిపీఏసీ) సభ్యులుగా ఉన్న తమ్మినేనికి తాజా గా పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
మూడు తులాల బంగారం చోరీ
ఎల్.ఎన్.పేట: మండలంలోని చింతలబడవంజ కాలనీలో రొంపివలస రమణ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. సోమవారం వర్షం పడిన తరువాత విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో బయట వరండాలో నిద్రపోయామని, మంగళవారం ఉదయం నిద్రలేచిన తరువాత ఇంట్లోకి వెళ్లేసరికి బీరువా తలుపులు తెరిచి ఉన్నాయని బాధితుడు రమణ తెలిపారు. బీరువాలో మూడు తులాల బంగారు నగలు, పది తులాల వెండి, రూ.9వేలు నగదు దొంగలు ఎత్తుకెల్లిపోయారని బాధితుడు మంగళవారం సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, ఎస్సై బాలరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రమణమూర్తికి ఈఓగా పదోన్నతి
అరసవల్లి: అరసవల్లి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుప్పన్నగారి రమణమూర్తికి గ్రేడ్–3 ఈవోగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి గతేడాది అరసవల్లి ఆలయానికి బదిలీపై రాగా.. తాజా పదోన్నతితో మళ్లీ విజయనగరంలో 6–సి ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా మరో రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం అరసవల్లి ఆలయంలో అన్నదాన ప్రసాదాల సెక్షన్ ఇన్చార్జిగా ఉన్న ఈయనకు పదోన్నతి రావడంపై ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ‘ఆదిత్య’లో జాతీయ స్థాయి పోటీలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్ ద్వారా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, ఆలిండియా స్టూడెంట్స్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో క్విజ్, డిజిటల్ పోస్టర్ మేకింగ్, వ్యాసరచన, స్లోగన్ రైటింగ్, అవేర్నెస్ రీల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. హోంగార్డు కుటుంబానికి సాయం శ్రీకాకుళం క్రైమ్ : హోంగార్డు పి.పైడిరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబానికి రూ.4.07 లక్షల నగదు చెక్కును మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అందజేశారు. సహచర హోంగార్డుల ఒక్కరోజు వేతనాన్ని ఈవిధంగా అందించారు. నీలమణి దుర్గ ఉత్సవాలు ప్రారంభం పాతపట్నం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి 50వ వార్షిక మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమపూజ, అష్టోత్తర శతనామ పూజ, హోమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సుదీష్ఠ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మే 7 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఈవో టి.వాసుదేవరావు చెప్పారు. పూజా కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సన్యాసిరావు, బాబ్జీ, సతీష్, మడ్డు రామారావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒడిశా గవర్నర్‌కు స్వాగతం కంచిలి: మండలంలోని దాలేశ్వరం గ్రామంలోని సోలార్ ప్లాంట్ వద్దకు మంగళవారం విచ్చేసిన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుకు మండల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను కలిసి రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, ఈఓపీఆర్డీ పి.ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే మద్యం వ్యాపారం
● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజం పాతపట్నం: మండల కేంద్రం పాతపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. మద్యం షాపు వద్ద స్థానికులు, పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రోత్సాహంతోనే ఇళ్ల మధ్య మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కాలనీకి చెందిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు వెంటనే మద్యం దుకాణం ఎత్తివేయించాలన్నారు. లేకపోతే ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. మద్యం దుకాణాలు దేవాలయాలు, పాఠశాలలు, హైవేకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఐటీ వింగ్ విభాగం ప్రతినిధి ఎనుగుతల సూర్యం, జిల్లా సెక్రటరీ అమర రమణ, నాయకులు గోకవలస రాము, వంశీ, ఫల్గుణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేటకు వెళ్లేవారిపైనా.. నిషేధమేనా?
ఈ చిత్రంలో ఉన్న మత్స్యకారుడి పేరు వారాధి ఎర్రయ్య. రణస్థలం మండలం ఎర్రముక్కాం గ్రామం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సార్లు వేట నిషేధ భృతి అందుకున్నాడు. ఈ ఏడాది కూడా వేటనిషేద భృతి తొలి జాబితాలో పేరుంది. చివర్లో రాజకీయ కారణాలతో పేరు తప్పించేశారు. అర్హత ఉన్నా తన పేరును తప్పించేసి కూటమి నాయకులు తమకు నచ్చినవాళ్లకు ఇప్పించుకున్నారని వాపోతున్నాడు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 11 మండలాల్లో మత్స్యకార కుటుంబాలు సముద్రపు వేటతో జీవనాధారంగా సాగిస్తున్నారు. ఇందులో వేటనిషేధ కాలంలో అందాల్సిన భృతికి అనర్హులుగా మత్స్యశాఖాధికారులు మొత్తం 511 మంది అని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్‌లో 31, గారలో 106, ఎచ్చెర్లలో 60, రణస్థలంలో 106, కవిటిలో 61, వజ్రపుకొత్తూరులో 35, పోలాకిలో 41, సోంపేటలో 32, సంతబొమ్మాళిలో 27, ఇచ్ఛాపురంలో 08, మందసలో నలుగురు చొప్పున మత్స్యకారులు అనర్హులుగా గుర్తించారు. వాస్తవానికి ఒక్క శ్రీకాకుళం రూరల్ మండలంలోనే వంద మందికి పైగా అర్హులకు కరెంట్ బిల్లు పెరుగుదల, ఇతర కారణాలు చెప్పి పథకాన్ని వర్తింపజేయలేదు. గార, సంతబొమ్మాళిలలో కూడా ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా మరో 1200 మంది వరకు అర్హులకు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉందనే మత్స్యకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.● వేట నిషేధ భృతి మంజూరులో వెలుగుచూస్తున్న ‘కూటమి’ నేతల లీలలు ● పథకం వర్తించక ఆవేదనలో సుమారు 1200 మంది మత్స్యకారులు ● సుమారు ఐదు వేల మందితో ‘సగం వాటా’ ఒప్పందం! ● గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకం వర్తింపు అరసవల్లి: గడిచిన ఐదేళ్లలో కనిపించని, వినిపించని మత్స్యకార జీవన కష్టాలు, అవస్థలు కూటమి ప్రభుత్వంలో మళ్లీ మొదలయ్యాయి. సముద్రంలో వేట నిషేధ కాలంలోనే ఉపాధి కోల్పోయిన వేట మత్స్యకారులకు రాష్ట్ర సర్కార్ పొట్టకొట్టింది. ఇప్పటికే గతేడాది వేట నిషేధ కాలంలో రావాల్సిన భృతిని ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల ఆంక్షల కారణంగా అర్హులైన వేట మత్య్సకారులకు భృతి రాకుండా అడ్డుపడింది. ఇదే సమయంలో అనేక మంది అనర్హులకు పథకం వర్తింపజేసి వారికి మంజూరైన సొమ్మును కూటమి నాయకులు సగం.. సగం పంచుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 మండలాల్లో 15548 మంది మాత్రమే మత్స్యకార చేయూత పథకానికి అర్హులంటూ అధికారికంగా ప్రకటించి ఇటీవల ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున లబ్దిదారుల ఖాతాల్లో ఇటీవల జమ చేసింది. ఇదిలావుంటే అన్ని అర్హతలుండి.. కేవలం కూటమి సర్కార్ ఆంక్షలు, రాజకీయ కుట్రల ఫలితంగా పథక లబ్ధికి దూరమైన సుమారు 12 వందల మంది వరకు మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, వాస్తవ సర్వేను క్షేత్ర స్థాయిలో మళ్లీ చేపట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అనర్హులంటూ జాబితాలో తప్పించేసి..! అనర్హుల విషయంలోనే లెక్కల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. మత్స్యశాఖ లెక్కలు ప్రకారం మొత్తం 511 మంది మాత్రమే ఈ పథకానికి అనర్హులుగా తేల్చారు. వీరంతా నిబంధనల ప్రకారం పథక లబ్ధికి అర్హులు కారని స్పష్టం చేశారు. వాస్తవానికి కూటమి అధికారిక జెండాలు పట్టుకున్న కార్యకర్తల చేతిలోనే చాలావరకు జాబితాలు గల్లంతయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలావరకు ఇవే కారణాలతో తుది జాబితాలో పేర్లను మార్చేశారని సమాచారం. దీంతో అనధికారికంగా ఈ అనర్హుల జాబితా 1200 మందికి పైగా ఉందనే లెక్కలున్నాయంటూ మత్స్యకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికీ కూటమి సర్కార్ మాత్రం సంఘ ప్రతినిధులు, వాస్తవ లెక్కలను బేఖాతరు చేస్తూ..తాము ప్రకటించిన వారికే పథకాల లబ్ధి అంటూ వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరగదని, ఇతర పథకాలకు అనర్హులంటూ కూటమి సర్కార్ మెలిక పెట్టడంపై ఇప్పటికే మత్య్సకారులు మండిపడుతున్నారు. సీఎం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు.. బుడగట్లపాలెంలో మత్స్యకారులకు భృతి అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చిన సందర్భంగా గత ఏడాది వేట నిషేధ భృతి అందని వారు, అలాగే తాజాగా భృతి అందాల్సిన జాబితాలో పేరులేని అర్హులు, బాధితులెవ్వరూ సీఎం సభకు వెళ్లకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పక్కాగా వ్యవహారం నడిపించారు. సీఎం వద్దకు ఎవ్వరి నినాదాల స్వరాలు వెళ్లకుండా, వినిపించకుండా అడ్డుకున్నారు. ఇతర సంక్షేమ పథకాలకు దూరమవుతారంటూ హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. వాటాల పంపకాల్లో పొరపచ్చాలు! జిల్లాలో 11 మండలాల్లో ఇప్పటికి 15548 మంది అర్హులకు మాత్రమే మత్స్యకార చేయూత కార్యక్రమాన్ని అందించారు. ఒక్కొక్కరికి రూ.20 వేలు కాగా, అందులో నీకు రూ.10 వేలు..నాకు 10 వేలు అంటూ...వారికి అందుబాటులో ఉన్న వారి పేర్లను (మత్స్యకార కుటుంబాలకు చెందిన వారు) జాబితాలో చేర్చుకుని.. ముందస్తు ఒప్పందం ద్వారా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాగానే సగం సగం సర్దుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఇలా సుమారు ఐదు వేల మంది వరకు ఉన్నారని సమాచారం. ఈ వాటాల పంపకాల్లో కూటమి నేతల్లో సైతం పొరపొచ్చాలు వచ్చేశాయని తెలుస్తోంది. -
మార్గాలు..దుర్మార్గాలు
టీడీపీ నేతల భూములకు ఉపాధి నిధులతో రోడ్లు సరుబుజ్జిలి మండలం దాకరవలస పంచాయతీలోని సూర్యనారాయణపురం రహదారి ఇది. ఏబీ రోడ్డు నుంచి టీడీపీ నాయకుడు అంబల్ల రాంబాబు పొలాల వరకు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు వేసేందుకు మంజూరు చేశారు. ఈ రోడ్డు వేస్తే టీడీపీ నాయకుడికి తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదు. చెరువు గర్భం మీదుగా రోడ్డు ప్రతిపాదించడంతో దిగువ ప్రాంతాలైన నక్కలపేట, పెద వెంకటాపురం, చిన వెంకటాపురం గ్రామాలకు సాగునీటి సమస్య కూడా ఉత్పన్నం కానుంది. ● మెటీరియల్ కాంపోనెంట్ నిధులు దుర్వినియోగం ● నాయకుల పొలాలు, కొబ్బరి తోటలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు సీసీ రోడ్లు ● టీడీపీ నాయకులు చెప్పినట్టుగా వ్యవహరించిన అధికారులు ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో కొత్తగా వేసిన సీసీ రోడ్డిది. ఇక్కడ అప్పటికే మంచి సీసీ రోడ్డు ఉంది. చెక్కు చెదరలేదు. కానీ, మళ్లీ అదే రోడ్డుపై కొత్తగా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సీసీ రోడ్డు వేశారు. కవిటి మండలం డి.గొనపుట్టుగలో కొత్తగా వేసిన సీసీ రోడ్డిది. ఇక్కడేమి జనసంచారం లేదు. కానీ, కొబ్బరి తోటలు ఉన్నాయి. ఆ తోటల మధ్య సీసీ రోడ్డు వేశారు. భవిష్యత్ లేఅవుట్ వేయాలన్న ఆలోచనలో భాగంగానే వ్యూహాత్మకంగా సీసీ రోడ్డు వేసినట్టు తెలుస్తోంది. రికార్డుల్లో ఆర్అండ్బీ రోడ్డు నుంచి హనుమాన్ విగ్రహం వరకు అంటూ శిలాఫలకంపై రాతలు రాశారు. కానీ, సగం వరకు(కొబ్బరి తోటలకు ఉపయోగపడే విధంగా) వేసి వదిలేశారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వగ్రామం పక్కనున్న పంచాయతీ ఇది. కవిటి మండలం సీహెచ్ జల్లుపుట్టుగలో వేసి రోడ్డు ఇది. ఇక్కడ కూడా జనసంచారం లేదు. కొబ్బరి తోటలకు విలువ పెరిగేలా వాటి మధ్య వేసిన రోడ్డు ఇది. భవిష్యత్ లేఅవుట్ వేసి లబ్ధి పొందాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగా ముందస్తుగా వేసిన రోడ్డుగా తెలుస్తోంది. మరిడమ్మ గుడి వరకు సీసీ రోడ్డు వేసినట్టు శిలాఫలకంలో రాసినప్పటికీ సగం వరకు మాత్రమే వేశారు. పొందూరు మండలం బాణాం పంచాయతీ తానేం గ్రామ శివారులో కొత్తగా వేసిన సీసీ రోడ్డు ఇది. వాస్తవానికి, ఈ రోడ్డు వేసిన వైపు ఒక్క ఇళ్లు లేదు. అలాగని మరో గ్రామం లేదు. కేవలం టీడీపీ నాయకుడి రియల్ ఎస్టేట్ వెంచర్‌కు ఉపయోగపడే విధంగా మాత్రమే రోడ్డు వేశారు. దానికోసం రూ.37లక్షలు ఖర్చు పెట్టారు. -
శ్రీకాకుళం
గ్రీవెన్స్‌కు 165 వినతులుకలెక్టర్ గ్రీవెన్స్‌కు 165 వినతులు వచ్చాయి. బాధితులు సమస్యలు ఏకరువు పెట్టారు. –8లో మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● రాణిస్తున్న సిక్కోలు నాట్యకారులు ● జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం బరంపురంలో డిగ్రీ చదువుతున్న మోనాలీదాస్ నృత్య ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. మోనాలీ తల్లి మనోజ్ మంజరీ త్రిపాఠీ ఇ చ్ఛాపురం మండలం తేలుకుంచి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒడియా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి లక్ష్మణదాస్ ఒడిశాలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి వద్దే నృత్యం నేర్చుకున్న మోనాలీ కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీలో ప్రావీణ్యం సంపాదించింది. పలు చానెళ్లలోనూ ప్రదర్శనలు ఇచ్చింది. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన మంగి మాధవరావు లారీ డ్రైవర్. తల్లి దాలమ్మ గృహిణి. వీరి కుమార్తె దివ్య పలు రాష్ట్రాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ప్రదర్శనలు ఇచ్చింది. స్వేచ్ఛా నృత్య తరంగణి నృత్య శిక్షణాలయంలో నృత్యం నేర్చుకున్న దివ్య గిన్నిస్ రికార్డు అందుకున్న సిలికానాంధ్ర కూచి పూడి ప్రదర్శనలోనూ పాల్గొంది. విజయవాడలో జరిగిన పోటీల్లో మూడు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. సుమారు 800 వరకు నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. న్యూస్రీల్జాతీయ స్థాయిలో రాణిస్తూ.. లారీ డ్రైవర్ కుమార్తె -
ఎమ్మెల్యే తండ్రి, సోదరులు..రౌడీలతో బెదిరిస్తున్నారు!
ఎమ్మెల్యే తండ్రి, సోదరుడు..రౌడీలతో బెదిరిస్తున్నారు! శ్రీకాకుళం క్రైమ్ : తాత వారసత్వంగా వచ్చిన తమ ఆస్తిని ఎమ్మెల్యే తండ్రి, సోదరుడు ఆక్రమించుకోవడమే కాక కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని.. అడ్డుకోవాల్సిన మున్సిపాలిటీ అధికారులు రాజకీయ పలుకుబడికి తలొగ్గుతున్నారని.. ఎమ్మెల్యేతో గొడవపడొద్దు.. ఆస్తి వదిలి వెళ్లిపోండని పోలీసులు కూడా అంటున్నారని ఓ మహిళ వాపోయింది. ఈ మేరకు కొత్తూరు మండల కేంద్రానికి చెందిన లోతుగెడ్డ కృష్ణవేణి తన భర్త శ్రీరామదూతం, కుటుంబీకులతో కలిసి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు హాజరై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సోదరుడు గొండు గంగాధర్, వారి తండ్రి, ఎంపీపీ గొండు జగన్నాథంలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 27న బలగ వార్డులో ఉన్న తమ ఆస్తి ఉన్న ప్రాంతానికి వెళ్తే గంగాధర్, జగన్నాథంలు రౌడీలతో వచ్చి బెదిరించి తోసేయడమే కాక మారణాయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేశారని, తమ ప్రాణానికి హాని ఉన్నందున రక్షణ కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్యాయం చేయడం తగదు.. అనంతరం బాధితురాలు విలేకరులతో మాట్లాడారు. బలగ వార్డులో డోల సూర్యానారాయణకు ఆస్తులండేవని.. అందులో 690/1లో 86 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల స్థలాన్ని తన తల్లి కాండవ జ్యోతికి రిజిస్ట్రేషన్ చేసి తాత ఇచ్చారన్నారు. తన తల్లి జ్యోతి తాత సూర్యనారాయణ ద్వారా దాఖలు పడిన స్థలాన్ని కుమార్తైనెన తనకు ఇచ్చారని కృష్ణవేణి చెప్పారు. ఈ మేరకు 1981 మార్చి 16న రిజిస్టర్ సెటిల్మెంట్ దస్తావేజు నెంబరు 837/1981 దఖలుపరిచారన్నారు. ఇదే స్థలంపై తమకి ఎటువంటి రక్తసంబంధీకురాలు కాని రౌతు జయలక్ష్మి అనే మహిళ గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యిందని తెరపైకి వచ్చిందన్నారు. వివాదాలు నడిచి కోర్టుకు వెళ్లగా జయలక్ష్మి పిటిషన్‌ను డిస్మిస్ చేశారన్నారు. ఇంతలో స్థలాన్ని జయలక్ష్మి తనకు విక్రయించిందని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సోదరుడు గంగాధర్ తెరపైకి తీసుకురావడం అన్యాయమన్నారు. ఇదే విషయమై ఎమ్మెల్యే గొండు శంకర్ వద్ద ‘సాక్షి’ ఫోన్లో ప్రస్తావించగా ల్యాండ్‌కు సంబంధించి డాక్యుమెంట్లు తమ సోదరుని వద్దనున్నాయని, అధికారులు నిర్మాణాలకు అనుమతులిచ్చారని, స్థలాన్ని తమ సోదరుడు గంగాధర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత రౌతు సీతారాంస్వామి కుమారుడు అమ్మారని.. వివాదంలో ఉన్నవి తామెందుకు కొంటామని అన్నారు. ఇవన్నీ ఓ వ్యక్తి వెనకుండి నడిపిస్తున్నారని, గతంలో నిర్మాణం చేపట్టినప్పుడు మున్సిపాలిటీ వారు కూల్చేశారో.. కృష్ణవేణికి సంబంధించిన రౌడీమూకలు కూల్చేశారో తెలియదని స్పష్టం చేశారు. ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి.. ఎస్పీ గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్న మహిళ -
శివానీ ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలేంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ అటానమస్ హోదా మంజూరు చేసిందని కళాశాల యాజమాన్య ప్రతినిధులు వెల్లడించారు. ఎచ్చెర్లలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరం నుంచి అటానమస్ అమల్లోకి వస్తుందని చెప్పారు. యూజీసీ బృందం ఫిబ్రవరి 16న కళాశాల సందర్శించి ఈ నెల 24న అటానమస్ హోదా ప్రకటించిందని తెలిపారు. నాక్, ఎన్బీఏ, జేఎన్టీయూ శాశ్వత గుర్తింపు వంటి ఆధారంగా అటానమస్ హోదా లభించిందని వివరించారు. ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఆరు ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు, ఎంటెక్ కోర్సులు, ఎంబీఏ కోర్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కరిక్యులమ్, సిలబస్‌లో మార్పులు, మెరుగైన ప్లేస్మెంట్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 80 శాతం కామన్ కోర్ సిలబస్, స్థానిక అవసరాలకు అనుగుణంగా 20 శాతం బీవోఎస్ ద్వారా మార్పు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ సభ్యులు డాక్టర్ సనపల శ్రీనివాసరావు, దుప్పల వెంకటరావు, పి.దుర్గాప్రసాద్‌రావు, కె.దుర్గా శ్రీనివాస్, ఎంఎం సాయినాథ్ రెడ్డి, హరీ ష్, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.టి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వలస కూలీ అనుమానాస్పద మృతి
టెక్కలి రూరల్: టెక్కలి మండలం అక్కవరం గ్రామానికి చెందిన నెయ్యిల జోగారావు(45) అనే వలస కూలీ విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగారావు జీవనోపాధి కోసం ఇటీవల ఆనందపురంలోని రైస్ మిల్లులో డ్రైవర్‌గా జాయినయ్యాడు. రెండు రోజుల క్రితం మిల్లు నిర్వాహకులు ఫోన్ చేసి జోగారావు నిత్యం మందు తాగుతున్నాడని, పనికి సైతం సరిగా రావడం లేదని భార్యకు విషయం తెలియజేశారు. ఇంతలో సోమవారం ఉదయం టాటా మ్యాజిక్ వ్యాన్‌లో ఐదుగురు కలాసీలు జోగారావు మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో భార్య, గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. మృతిపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఇలా ఇంటికి తీసుకురావడం వెనుక ఏదో కుట్ర ఉందంటూ టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అయితే ముందుగా పోలీసులు తమకు సంబంధం లేదని, ఏదైనా ఉంటే విశాఖ పోలీసులతో మాట్లాడుకోవాలని చెప్పారు. చివరకు జీరో ఎప్ఐఆర్ వేసి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జోగారావుకు భార్య నీలవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
30లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో ఫ్యాక్టరీల చట్టం, 1948 ప్రకారం రిజిస్టరైన రైస్ మిల్లులు, జీడిపిక్కల కర్మాగారాలు, గ్రానైట్ కర్మాగారాలు, స్టోన్ క్రషర్లు, షా మిల్లులు (కర్రల మిల్లులు), ఇతర పెద్ద కర్మాగారాలన్ని ఇంటిగ్రేటెడ్ మాన్యువల్ రిటర్న్‌లను సమర్పించాలని కర్మాగారాల ఉపముఖ్య తనిఖీ అధికారి రాంబాబు కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 30వ తేదీలోగా సింగిల్ డెస్క్ పోర్టల్ ఏపీ ఇండస్ట్రీస్.జీఓవి.ఇన్‌లో తప్పనిసరిగా సమర్పించాలని కోరారు. పాలిసెట్‌కు ముమ్మర ఏర్పాట్లు ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్–2025 నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ జె.సత్యనారాయణ మూర్తి తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష నిర్వహణపై అధికారులు, ఎగ్జామినర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తు చేసి హాల్ టిక్కెట్లు రాని విద్యార్థులు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రాన్ని సంప్రదిస్తే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. పరీక్ష 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షకు నిమిషం అలస్యమైనా అనుమతింబోచమని చెప్పారు. ఆధార్ జిరాక్స్, రెండు పా స్ పోర్టు సైజ్ ఫొటోలతో విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని అన్నారు. శ్రీకాకళం, టెక్కలి డివిజన్లలోని 39 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి 1152 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. షెడ్యూల్ మేరకు పరీక్ష నిర్వహణ, ఫలితాలు వెల్లడి, కౌన్సెలింగ్ నిర్వహణ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జి బి.జానకి రామయ్య, అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి నీలమణి దుర్గమ్మ మహోత్సవాలు పాతపట్నం: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పాతపట్నం నీలమణి దుర్గమ్మ ఆలయ సన్నిధిలో మంగళవారం నుంచి 50వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజు ల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి టి.వాసుదేవరావు తెలిపారు. సోమవారం ఆలయాన్ని విద్యుత్‌కాంతులతో అలంకరించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆలయంలో హోమాలు, వర్ధినీ కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, దేవ పుణ్యాహవచనం, కుంకుమ పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాలిన మామిడి కాయలు నరసన్నపేట: మండల పరిధిలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా రైతులు ఆందోళన చెందారు. పొలాల్లో నువ్వు, పెసర పంటలు ఉన్నాయి. పెసరకు ఇబ్బంది లేకపోయినా నువ్వు పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. అలాగే గాలులకు మామిడి కాయలు పలు చోట్ల రాలాయి. వీఎన్ పురం, యారబాడు, ఉర్లాం, బడ్డవానిపేట చిక్కాలవలస, తెలగవలస, కరగాం తదితర గ్రామాల్లో వరి ధాన్యం వర్షానికి కొంత నష్టం కలుగుతుందని రైతులు అంటున్నారు. అరటి చెట్లకు కొంత వరకూ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. నరసన్నపేటలో ఫ్లెక్సీలు గాలికి ఎగిరి పడ్డాయి. మెయిన్ రోడ్డుపై కాంప్లెక్స్ సమీపంలో ఒక ఫ్లెక్సీ గాలికి విద్యుత్ వైర్లపై పడింది. వెంటనే విద్యుత్ అధికారులు అప్రమత్తమై తొలగించారు. -
బొంతలకోడూరు సర్పంచ్ చెక్ పవర్ రద్దు
ఎచ్చెర్ల క్యాంపస్: స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లపై కక్ష సాధిస్తోంది. కారణం లేకుండా తప్పుడు నివేదికలతో చెక్ పవర్ రద్దు చేస్తోంది. తాజాగా బొంతలకోడూరు గ్రామ సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో కూటమి నాయకులు వ్య క్తిగత కక్షతో, ప్రజాప్రతినిధులు ఒత్తిడితో చెక్ పవర్ తొలగించారు. ఇటీవల కూటమి నా యకులు గ్రామంలోని మలిపెద్దివాని చెరువు ఆక్రమణలకు ప్రయత్నించారు. సర్పంచ్ అడ్డుకున్నారు. మరోపక్క పంచాయతీలో కూటమి నాయకులకు వేలు పెట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో వీరు చెక్ పవర్ రద్దుకు కారణాలు అన్వేషించారు. గ్రామానికి రూ. 40 లక్షలు గ్రామ సచివాలయం భవనం మంజూరైంది. ఈ సచివాలయ భవనం కాంట్రాక్టర్‌కు అప్పగించా రు. కాంట్రాక్టర్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణం ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ఇతర నిర్మాణాలు వద్దని హైకోర్టు తీర్పు మేరకు ఈ భవనం పనులు నిలిపివేశారు. ఇంజినీరింగ్ అధికారుల ఎం–బుక్ రికార్డు మేరకు కాంట్రాక్టర్‌కు పంచాయతీ నుంచి రూ.1.80 లక్షలు చెల్లించారు. ఇది సర్పంచ్ విధులు దుర్వినియోగంగా కూటమి నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ వ్యక్తిగత దుర్వినియోగం లేదని, పనికి చెల్లింపు మాత్రమే జరిగిందని ఇంజినీరింగ్ అధికారులు సైతం నివేదిక ఇచ్చారు. పంచాయతీ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చివరికి చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని సర్పంచ్ తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని గూడేం గ్రామంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడిన తల్లీకూతుళ్లు మోదు సావిత్రమ్మ, ఈదల వరలక్ష్మీ మృతదేహాలకు సోమవారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విషయం తెలుసుకున్న సావిత్రమ్మ తల్లి బిలాయి నుంచి గూడేం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కలెక్టర్ గ్రీవెన్స్‌కు 165 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల ఫిర్యాదులు ఆలస్యం కాకుండా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్(గ్రీవెన్స్) కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వివిధ సమస్యలపై 165 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నిర్ణీత గడువులోపే పరిష్కరించాలన్నారు. ఆలస్యం చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని.. ఆయా విభాగాల అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యపడని ఫిర్యాదులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పించాలి ● కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో అన్యాయంగా డీబారైన ఐదుగురు విద్యార్థులకు మే నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలు పరీక్ష రాయడానికి అనుమతి మంజూరు చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ● దివ్యాంగులకు, దీర్ఘకాలిక రోగులకు పింఛను మంజూరి చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే తమకు పింఛన్ మంజూరు చేయాలని ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన యతిరాజుల ఢిల్లేశ్వశ్వరరావు తదితరులు వినతిపత్రం అందించారు. -
డీసీఎంఎస్ చైర్మన్‌గా అవినాష్
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎస్ఎంపురం మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో ఎస్ఎంపురం సర్పంచ్‌గా వ్యవహరించారు. తల్లి చౌదరి ధనలక్ష్మి జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. తండ్రి నారాయణమూర్తి (బాబ్జి) గతంలో జిల్లా టీడీపీ అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. డీసీసీబీ చైర్మన్‌గా శివ్వాల సరుబుజ్జిలి: డీసీసీబీ చైర్మన్‌గా సరుబుజ్జిలి మండలం షళంత్రి గ్రామానికి చెందిన శివ్వాల సూర్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో జెడ్పీటీసీ, సర్పంచ్‌గా, ప్రస్తుతం షలంత్రి ఎంపీటీసీ సభ్యునిగా వ్యహరిస్తున్నారు. ఈయన భార్య శివ్వాల కృష్ణవేణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. -
వ్యక్తిపై గొడ్డలితో దాడి
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన దుక్క సంతోష్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన జీరు శంకర్ రెడ్డి సోమవారం రాత్రి గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుక్క రమేష్ అనే వ్యక్తి స్నానం చేస్తుండగా ఆ నీరు జీరు శంకర్‌రెడ్డి ఇంటి ముందునుంచి వెళ్తుండటంతో గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో రమేష్ అన్న కుమారుడు సంతోష్‌కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మద్యం మత్తులో ఉన్న శంకర్ రెడ్డి తన ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకువచ్చి సంతోష్‌కుమార్ తలపై దాడిచేశాడు. గాయపడిన సంతోష్‌కుమార్‌ను నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. నౌపడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొలం గొంతులో గరళం
● రాగోలు పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితి ● పట్టించుకోని అధికారులు శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రానికి సమీపంలోని రాగోలు ప్రధాన ఆస్పత్రి నుంచి సమీప పంట పొలాలకు మెడికల్ వ్యర్థాలతో కూడిన కలుషిత నీరు వెళ్తోంది. ఇది రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రి చుట్టూ ఉన్న పంట పొలాల్లోకి ఈ నీరు చిన్నచిన్న పైపుల ద్వారా చేరుకుంటోంది. అక్కడి నుంచి ప్రధాన కాలువలో కలిసి స్థానికంగా ఉన్న కొర్లగండం చెరువులోకి చేరుకుంటోంది. ఈ చెరువు నీటిని పశువులు తాగడానికి, వాటికి స్నానాలు చేయించడానికి రైతులు వినియోగిస్తున్నారు. దీంతో పశువులకు అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నట్లు రాగోలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యానికి చెప్పాం.. కలుషిత నీరు విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని పలు మార్లు ఆస్పత్రి యాజమాన్యానికి వివరించాం. వారి నుంచి స్పందన లేదు. – తిరుమలదేవి, పంచాయతీ సెక్రటరీ రీసైకిల్ప్లాంట్ ఏర్పాటు చేయాలి రాగోలు జెమ్స్ నుంచి బయటకు వస్తున్న కలుషితమైన మురికినీరు బయ టకు పంపకుండా ఆస్పత్రి ఆవరణంలోనే రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. దీంతో రీసైక్లింగ్ అయిన నీరు అక్కడే గల మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. – గేదెల శంగల్వరావు, రాగోలు సర్పంచ్ -
బధిరులకు టచ్ ఫోన్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీకోసం వినతుల స్వీకరణ కార్యాక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా ఐదుగురు బధిరులకు టచ్ ఫోన్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత తదితరులు ఉన్నారు. స్వాతీసోమనాథ్కు ఐకాన్ అవార్డు శ్రీకాకుళం కల్చరల్: హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కళాదర్బార్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సంప్రదాయ గురుకులం డైరెక్టర్ స్వాతీ సోమనాథ్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయం బృందం సభ్యులు యామిని, బలరామ్, లోకేశ్వరి, అంజలి, లిఖిత, తేజస్వి, హేమాంజలి, హేమవ ల్లి, జోషిత, శ్రీజ, భవ్య, భానులు చక్కటి ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. రెండు ఆవులు మృతి బూర్జ: మండలంలోని అన్నంపేటలో పేడాడ రంగారావుకు చెందిన రెండు పాడి ఆవులు మృతి చెందినట్లు కొల్లివలస పశువైద్యాధికారి డాక్టర్ జి.వెంకటరావు సోమవారం తెలిపారు. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పశువులు తినే దాణాలో విషం కలపడం వల్ల మృతిచెందినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.80 వేలు వరకు ఉంటుందని చెప్పారు. -
పట్టుబట్టి.. పూర్తి చేసి..
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గకు చెందిన హరిముకుందపండా అనే వ్యక్తి కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లగా అక్కడ దర్శన సమయంలో అవమానం జరిగిందని భావించి ఏకంగా రూ.పది కోట్లతో 12 ఎకరాల విస్తీర్ణంలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి పూను కున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆలయ నిర్మాణం పూర్తికావడంతో సోమవారం నుంచి ప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎవరి నుంచి చందాలు వసూలు చేయకుండా, ఏ ఇంజినీర్ల సలహాలు, సూచనలు లేకుండా 83 ఏళ్ల వయసులో హరి ముకుందపండా స్వీయ పర్యవేక్షణలో కోవెల పనులు పూర్తి చేయడం విశేషం. మూడు రోజులు పాటు ప్రతిష్టామహోత్సవాలు, సహస్ర చండీ మహాయజ్ఞం జరగనున్నాయి. కాశీబుగ్గలో నిర్మించిన వెంకన్న గుడి -
బోధనోపకరణాల కిట్లు పంపిణీ
శ్రీకాకుళం అర్బన్: కొత్తూరు , పాతపట్నం, మెళియాపుట్టి, సారవకోట, పొందూరు, సంతబొమ్మాళి మండలాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన బుద్ధి మాంద్యం గల విద్యార్థులకు బోధనోపకరణాలతో కూడిన కిట్లను డీఈఓ ఎస్.తిరుమల చైతన్య, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శశిభూషణ్ సమవారం అందజేశారు. జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ సుమారు రూ.12000 విలువైన ఒక్కో కిట్‌లో ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన, సులభతరమైన అభ్యసనకు దోహదం చేసే పరికరాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఆర్సీ (కాంపోజిట్ రీజినల్ సెంటర్) నెల్లూరు ద్వారా వీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా సమన్వయకర్త బుడుమూరు గోవిందరావు, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ వి.ఉమ, నెల్లూరు ప్రతినిధి ధర్మేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసిస్టెంట్ కలెక్టర్‌గా పృథ్వీ రాజ్‌కుమార్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణలో ఉన్న దొనక పృథ్వీ రాజ్‌కుమార్‌ను నియమితులయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 వరకు ఈ పదవిలో ఉంటారు. పృథ్వీకుమార్ వయసు 23 ఏళ్లు. ఈయన 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన పృథ్వీ తండ్రి విజయకుమార్ మండల విద్యాధికా రి (ఎంఈఓ)గా, తల్లి వెంకటరత్నం గృహిణిగా ఉన్నారు. సోదరి పూజిత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. పృథ్వీ ప్రాథమిక విద్య నుంచి పదో తరగతి వరకు పార్వతీపురంలోనే చదివారు. ఇంటర్ నారాయణ లో చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియాలజీ సబ్జెక్టులతో డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీ, ఢిల్లీ ద్వారా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ సాధించారు. తర్వాత సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం సేకరించేందుకు శిక్షణ పొందుతున్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ సేవలందించడమే తన లక్ష్యమని పృథ్వీ రాజ్ కుమార్ తెలిపారు. -
సీఎం మెప్పు కోసం సీఐటీయూను విమర్శిస్తారా?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబునాయుడు వద్ద గొప్పలు, మెప్పు కోసం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు సీఐటీయూపై అక్కసు వెళ్లగక్కడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కార్మిక సంఘాలను, సీఐటీయూను కంట్రోల్ చేస్తున్నానని సీఎం ముందు ఎన్ఈఆర్ ప్రసంగించారని, కార్మికోద్యమాలను అడ్డుకోవడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఇటువంటి ప్రగల్భాలు పలికిన వారు అనేకమంది కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. జిల్లాలో ట్రేడ్ యూనియన్లు చేసిన పోరాటాల ఫలితం ఏ పరిశ్రమ కుంటుపడలేదని, ప్రభుత్వ విధానాల వల్లేనని తెలుసుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎవరూ పరిశ్రమల్లో కాంట్రాక్టులు తీసుకోవడం లేదని, యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసి, యాజమాన్యాలను బెదిరించి కాంట్రాక్టులు తీసుకుంటున్న వారెవరో ప్రజలకు తెలుసునన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమల్లో కార్మికులు గాయపడుతున్నా, చనిపోతున్నా యాజమాన్యాలపై నోరెత్తని ఎమ్మెల్యే.. కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసే సీఐటీయూపై అనుచితంగా మాట్లాడటం శోచనీయమన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కార్మికుల ఓట్లతో గెలిచి కార్మిక వ్యతిరేక వైఖరిని అవలంబించడం తగదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తోందని దుయ్యబట్టారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.వి.రమణ, అల్లు.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంఎల్హెచ్ఓల సమ్మెబాట శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ల(ఎంఎల్‌హెచ్‌ఓ)ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇప్నటికే పలుమార్లు వినతిపత్రాలు, నిరసనల ద్వారా తెలియజేసినా పరిష్కరించకపోవడంతో ఈ నెల 28 నుంచి సమ్మెబాట పడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతీరావు పూలే పార్కులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 15 నుంచి చేస్తున్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోతో ఏప్రిల్ 28 నుంచి నిరవదిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి బి.సందీప్‌కుమార్, వినోద్‌కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో సీపీఎఫ్ శ్రీలక్ష్మి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని మహారాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ (సీపీఎఫ్) అధికారి శ్రీలక్ష్మి తన భర్త వెంకటకృష్ణారావుతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. తొలిసారి అరసవల్లి దర్శనానికి విచ్చేసిన వీరికి ఆలయ ఈవో వై.భద్రాజీ సాంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అర్చకులు వీరి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపారు. వీరితో పాటు స్థానిక ఫారెస్ట్ అధికారులు భాషా తదితరులు ఉన్నారు. ఆర్థిక సాయం అందజేత సోంపేట: మండలంలోని రామయ్యపట్నం గ్రామానికి చెందిన వాడ ధర్మరాజు వలస మత్స్యకారుడిగా చైన్నె వెళ్లి ప్రమాదవశాత్తు ఏడాది క్రితం మృతి చెందాడు. దీంతో చైన్నెలోని బోటు యజమానులు, బోట్లకు వెళ్లే మత్స్యకారులు కలిసి రూ.2,50,000లు సేకరించి ధర్మరాజు భార్య జానకమ్మకు గ్రామంలో ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో వలస కార్మికులు, రామయ్యపట్నం గ్రామస్తులు పాల్గొన్నారు. రీ అపోర్షన్కు గురవుతున్న ఉపాధ్యాయులు శ్రీకాకుళం: ప్రభుత్వం పాఠశాలల్లో ఒక్కసారిగా చేస్తున్న మార్పులు కారణంగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు రీఅపోర్షన్కు గురవుతున్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.రమణమూర్తి, జి.రమణలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను మోడల్ ప్రాథమిక పాఠశాలల కోసం వేరే పాఠశాలలకు తరలించడం, అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులను తొలగించి, ప్రైమరీగా డీ గ్రేడ్ చేయడం వంటి కారణాల వలన ఎక్కువమంది ఉపాధ్యాయులు మిగులుగా ఏర్పడే పరిస్థితులు దాపురిస్తాయన్నారు. వీరంతా బదిలీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లనున్నారన్నారు. అయితే ప్రతీ శుక్రవారం సమావేశాలు జరుగుతున్నా ఇంతవరకూ వీరికి బదిలీల్లో ప్రాధాన్యత ఉండేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరకంగా రీఅపోర్షన్కు గురయ్యే ఉపాధ్యాయులకు ప్రస్తుత స్టేషన్ పాయింట్లతో పాటుగా పాతస్టేషన్ పాయింట్లు కూడా వచ్చేలా చేసి బదిలీల్లో కొంతవరకు న్యాయం చేయాలని కోరారు. బాలుడిపై వీధి కుక్కల దాడి టెక్కలి రూరల్: వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం టెక్కలిలో చోటుచేసుకుంది. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన ఐదేళ్ల బాలుడు కె.తన్విక్ సాయి తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది గుర్తించిన స్థానికులు బాలుడిని కుక్క నుంచి రక్షించి, టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. -
నీటికుండీలో పడి కార్మికుడు మృతి
టెక్కలి: కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామ సమీపంలోని సాయిరాం గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రం బొంగైగో జిల్లా, గురునానక్ నగర్‌కు చెందిన కార్మికుడు కాళీరాయ్ (34) పరిశ్రమకు సంబంధించిన రీసైక్లింగ్ నీటి కుండిలో పడి మృతి చెందాడు. మృతుడు రాయ్ ఈ పరిసర ప్రాంతాల్లోని అనేక పరిశ్రమల్లో ఇదివరకు పనిచేశాడు. అయితే రాయ్ రెండు రోజులుగా పనికి రాకపోవడంతో తన స్వగ్రామానికి వెళ్లి ఉంటాడని భావించామని గ్రానైట్ యాజమాన్యం, తోటి కూలీలు చెబుతున్నారు. నిత్యం మద్యానికి అలవాటుపడిన రాయ్ ఆదివారం తెల్లవారేసరికి కంపెనీకి చెందిన 10 అడుగుల లోతు ఉన్నటువంటి రీసైక్లింగ్ నీటి కుండిలో శవమై తేలాడు. ఇది గమనించిన తోటి కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి రణస్థలం: ఈనెల 25వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌హెచ్–16 రహదారిపై యూబీ పరిశ్రమ దగ్గర రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మరణించినట్లు జేఆర్‌పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి ఆదివారం తెలిపారు. మృతుడికి 40–45 సంవత్సరాలు ఉంటాయని, తలకు బలమైన గాయమవ్వడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. గుండుతో ఉన్నాడని, కాఫీ కలర్ ప్యాంట్, ముదురు నీలిరంగు టీషర్టు ధరించినట్లు వెల్లడించారు. వ్యక్తి వివరాలు తెలిసినవారు 63099 90816, 63099 90850 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం యలమంచిలి గ్రామానికి చెందిన బందాపు ఆనందరావు(38) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు ఆనందరావు నిత్యం మద్యం సేవిస్తుంటాడు. అతని భార్య తేజావతి రెండు రోజులు క్రితం మద్యం తాగవద్దని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన అతడు పురుగుల మందు తాగేశాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహూటిన కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కోటబొమ్మాళి పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య తేజావతితో పాటు కుమార్తెలు నాగమణి, మీనా, కుమారుడు భవానీ ప్రసాద్‌లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యుత్‌కు వేసవి షాక్..!
పాతపట్నం: వేసవి వచ్చిందంటే ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి విద్యుత్ వినియోగాన్ని పెంచుకుంటాం. ఇంతవరకు బాగానే ఉన్నా కన్సీల్డ్ వైరింగా, గోడలపైనే గొట్టాల్లో వైరింగ్ ఏర్పాటు చేశారా, సరైన ప్రమాణాలతో తగిన మందం ఉన్న వైర్లు వైశారా అనేది అందరూ గుర్తించాల్సిన విషయం. వైరింగ్‌లో ఏవైనా లోపాలుంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తించాలి. రానున్న రోజుల్లో ఉష్ణాగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలతో పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిక లోడుతో అనర్థమే వేసవి కాలంలో విరివిగా విద్యుత్ ఉపకరణాల వినియోగం వల్ల ఒక్కొక్కసారి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటాయి. గృహాల్లో, కార్యాలయాల్లో వాడుతున్న విద్యుత్ వాడకాన్ని బట్టి లోడ్‌ను నిర్ధారించుకుని ఆమేరకు విద్యుత్‌శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి వినియోగదారునికి అవసరమైన లోడ్‌ను ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లో విద్యుత్ శాఖ అందుబాటులో ఉంచుతుంది. ఎవరైనా వినియోగదారుడు కేవలం 1కేవీ లోడుకు మాత్రమే అనుమతి పొంది. వేసవి తీవ్రత దష్ట్యా అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తే ఆ ప్రభావం సమీప ట్రాన్స్ఫార్మర్పై పడి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. వినియోగదారులందరూ విద్యుత్‌శాఖకు సహకరించి వాడుతున్న లోడ్‌కు అనుగుణంగా అనుమతి పొందితే భవిష్యత్‌లో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు ఇతరత్రా విద్యుత్ ఉపకరణాలు వాడే సమయంలో కచ్చితంగా స్టెబిలైజర్లను వినియోగించాలి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తుంటే సత్వరమే సంబంధిత విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి. ఇలా చేయవద్దు ● గృహాల్లో 15 యాంప్స్ విద్యుత్ ఉపయోగించేచోట, 30 యాంప్స్ విద్యుత్ భారంపడే పరికరాలు వినియోగిస్తే తీగలు కాలిపోయే ప్రమాదముంది. ● ఒకే స్విచ్ బోర్డుకు ఎక్కువ ప్లగ్‌లు ఉపయోగిస్తే ఒక్కసారిగా లోడ్ పెరిగి స్పార్క్ వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. ● ఎండలో విద్యుత్ తీగలు ఉంచితే భవిష్యత్తులో తీగలపై ఉన్న రబ్బర్ మెత్తబడి ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ● ఇంట్లో ఒకేసారి విద్యుత్ ఉపకరణాలన్నింటినీ ఆన్‌చేసి ఉంచవద్దు. ● కంప్యూటర్ పరికరాలు, టీవీల వద్ద విద్యుత్ తీగలను చిందరవందరగా ఉంచరాదు. ● రక్షణ పరికరాలైన ఎంసీబీ(మైక్రో సర్క్యూట్ బ్రేకర్), ఎంసీసీబీ(కరెంట్ కంట్రోలర్ బ్రేకర్) ఫ్యూజులను బైపాస్ చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● వేసవికాలం ప్రారంభమయ్యే ముందు ప్రతి ఒక్కరూ ఇళ్లు, కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో తీగల వ్యవస్థను తనిఖీ చేయించుకోవాలి ● విద్యుత్ వైరింగ్ చేయించేటప్పుడు పూర్తిగా ఐఎస్ఐ, బీఐఎస్ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి. ● ఇంట్లో విద్యుత్ వినియోగం ఆధారంగా విద్యుత్‌శాఖ నుంచి లోడ్‌ను తీసుకోవాలి. ● అందుకు తగినట్లు వైరింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏసీలు, కూలర్లు, వాటర్ హీటర్లు, మైక్రో ఒవెన్ ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించాలి. ● ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని బట్టి దానికనుగుణంగా నాణ్యత కలిగిన విద్యుత్ తీగలను వినియోగించాలి. ● నాసిరకం విద్యుత్ పరికరాలతో విద్యుత్ వృథా కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వైరింగ్ మరింత పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ● గృహాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా న్యూట్రల్ పరికరాల కోసం సరిపడినంత ఎర్త్ ఎలక్ట్రోడ్ ఏర్పాటు చేసుకోవాలని. ● ఎండాకాలంలో రక్షణ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే ఎర్తింగ్ సరైన పద్ధతిలో ఉంచేందుకు అవసరమైన ప్రదేశంలో నీరు, దొడ్డుఉప్పు ఉపయోగించాలి. ● విద్యుత్ వాడేందుకు మూడు పిన్నుల ప్లగ్‌లు, సాకెట్లు మాత్రమే ఉపయోగించాలి. ● విద్యుత్ స్తంభాల నుంచి మీటర్ వరకు ఉండే సర్వీస్ వైర్లు అతుకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. X లోడ్ ఎక్కువైతే వైర్లు కాలిపోయే ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలకు ముప్పు సరఫరాలో లోపాలుంటే సిబ్బందికి ఫిర్యాదు చేయాలి అప్రమత్తత అవసరం వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ తీగలు వ్యాకోచం చెందే అవకాశం ఉంది. షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. గృహాల్లో వినియోగించే విద్యుత్ ఉపకరణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వైరింగ్‌ను చేయించుకోవాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా సిబ్బందికి తెలియజేయాలి. – జి.ప్రసాదరావు, డీఈఈ, విద్యుత్‌శాఖ, పాతపట్నం -
ఇక నేరుగా చెల్లింపులు..!
● మున్సిపాలిటీ సాధారణ నిధులు ఖర్చుచేసే అవకాశం శ్రీకాకుళం: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సమకూరే సాధారణ నిధులు నేరుగా ఖర్చు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. మున్సిపాలిటీలకు పన్నుల ద్వారా, షాపు అద్దెలు ద్వారా, ఆశీలు తదితర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సాధారణ నిధులకు జమ చేస్తారు. ఇదివరకు ఇలా వసూలు చేసిన మొత్తాన్ని సీఎంఎఫ్ఎస్లో ఉండే ప్రత్యేక ఖాతాలకు జమచేసేవారు. మున్సిపాటీలు ఏవైనా బిల్లులు కానీ, ఖర్చులు కానీ చేయాలనుకుంటే ఆయా బిల్లులను సీఎంఎఫ్ఎస్కు పొందుపరిస్తే అక్కడ నుంచి నిధులు మంజూరు అయ్యేవి. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో నగరపాలక సంస్థ అధికారులే కాంట్రాక్టర్‌కు బిల్లులు, ఇతర ఖర్చులను నేరుగా చెల్లించే సౌలభ్యం ఉంటుంది. సంబంధిత అంశానికి సంబంధించిన విధివిధానాలను ఆర్థిక శాఖ ఆమోదించి సంబంధింత శాఖాధికారులకు నివేదించింది. రాష్ట్రాధికారులు దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఒకటి రెండ్రురోజుల్లో వెలువరించనున్నారు. అందరి మున్సిపల్ అధికారులకు కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో విషయం తెలియజేశారు. త్వరలోనే ఉత్తర్వులు సాధారణ నిధులు నేరుగా ఖర్చు చేసే సౌలభ్యానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం వాస్తవమే. దీనివలన బిల్లుల చెల్లింపులో జాప్యం లేకండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. – పీవీడీ ప్రసాదరావు, కమిషనర్, శ్రీకాకుళం -
ఆరోగ్యం భద్రం..!
వేసవికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి వేసవిలో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బయట ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండలో పనిచేయడం, తిరగడం వలన శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో క్రమం తప్పకుండా నీటిని తాగాలి. పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. – ఆర్.కాళీప్రసాద్, ఎంపీడీవో, హిరమండలం ● రోజురోజుకూ పెరుగుతున్న వేసవి తాపం ● వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ● అప్రమత్తంగా ఉండాలని సూచనలు హిరమండలం: వేసవితాపం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజంతా మండుటెండలో కష్టించి పనిచేసే వేతనదారులు, కార్మికులు తగు జాగ్రత్తలు పాటించాలని సంబంధిత శాఖాధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వడదెబ్బకు గురవ్వడంతో పాటు అనారోగ్య సమస్యల బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఎండల్లో ఇబ్బందులు పడకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలు ప్రస్తుతం ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటకి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. పని ప్రదేశాల్లో చల్లని నీరు, నీడ వసతి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఉపాధి వేతనదారులు, కార్మికులు, దుకాణాల్లో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు తదితర శ్రామికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో పనులు చేసుకోవాలి. వదులైన పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. తలకు టోపీ పెట్టుకోవడం మంచిది. మధ్యాహ్నం 12 గంటట నుంచి 4 గంటల మధ్య ఎండలో తిరగకూడదు నీటిని ఎక్కువగా తాగాలి, మజ్జిగ తీసుకోవాలి. గది ఉష్ణోగ్రతలను తగ్గించుకోవాలి. చక్కని వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పైకప్పు మీద గడ్డిలాంటివి ఉంచి చల్లటి నీరు పట్టించాలి. వడదెబ్బకు గురైన వ్యక్తికి చల్లని గాలి అందేలా చూడాలి. దుస్తులు వదులు చేయాలి. వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. బాధితుడిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలి. -
‘నా ప్రశ్నకు బదులేది’ పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం అర్బన్: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ కృష్ణారావు రచించిన నా ప్రశ్నకు బదులేది మినీ కవితా సంపుటిని ఆంధ్రప్రదేశ్ పెన్సనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. కవి, రచయత, జర్నలిస్ట్ అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ కృష్ణారావు పుస్తక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరామ్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ఐక్యతను ఈ కవితా సంపుటిలోని కవితలు ప్రతిబింబించేవిధంగా ఉన్నాయని కొనియాడారు. అరుణోదయ సాంస్కృతిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ వామపక్షాల ఐక్యత ప్రస్తుత భారతదేశంలోని సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ, కార్మిక ప్రజా ఉద్యమాలను గుర్తుచేసే కవితలు పేడాడ కృష్ణారావు రాయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పప్పల రాజశేఖర్, బమ్మిడి శ్రీరామ్మూర్తి, వి.సత్యనారాయణ, కూన రంగనాయకులు, శీర రమేష్, బలివాడ ధనుంజయరావు, బోనెల రమేష్, కనిమెట్ట పద్మావతి, గురుగుబెల్లి భాస్కరరావు, దుప్పల శివరాంప్రసాద్, వల్లభ మల్లయ్య పాల్గొన్నారు. -
నీలమణి దుర్గ సన్నిధిలో వార్షిక నవరాత్రి
పాతపట్నం: ఉత్కళాంధ్రుల కొంగుబంగారంలా విరాజిల్లుతున్న పాతపట్నం ఇలవేల్పు నీలమణి దుర్గమ్మ ఆలయ సన్నిధిలో 29వ తేదీ నుంచి అమ్మవారి వార్షిక నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ఆంధ్ర, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అమ్మవారి మహోత్సవాలు భారీగా నిర్వహించేందుకు ఆలయ ఈఓ టి.వాసుదేవరావు చర్యలు తీసుకుంటున్నా రు. తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు ఇలా.. ఈ నెల 29న వర్ధినీ కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, దేవ పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అఖండ దీపస్థాపనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 30న కుంకుమార్చన, ఆవరణ దేవతా హోమాలు, మహారాజ భోగములు, మే 1న అష్టోత్తర శతనామార్చనలు, మూలమంత్ర, మంటపస్త దేవతా హోమాలు, 2న శ్రీలలిత త్రిశతి నామార్చనలు, శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాలు, 3న శ్రీలక్ష్మీనారాయణ హోమాలు, 4న రుద్ర హోమాలు, 5న వర్ధనీ కలశోద్వాసనములు, అవభృద స్నానం, 6న వర్ధని ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. 7న బలిహరణలు, మహా పూర్ణాహుతితో పాటు ప్రతి రోజు రాత్రిళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు 29న సాయంత్రం తోట తులసి హరికథ, 30న సాయంత్రం ఉమామహేశ్వర భజన, మే 1 గురువారం సాయంత్రం రాగసుధ మ్యూజికల్ ఆర్కెస్ట్రా, 2న జైసంతోషిమాత కోలాటం, 3న హిమగిరి మాస్టారు ఆధ్వర్యంలో భరత నాట్యం, కూచిపూడి ప్రదర్శన, 4న ఆదివారం సాయంత్రం భజన, 5న బైరాగి నాయుడు సంగీత కచేరీ ఆ తర్వాతి రోజుల్లో పెద్దింటి మోహన్ దాస్ ఏకపాత్రాభినయం, సత్య హరిశ్చంద్ర నాటకాలు నిర్వహించనున్నారు. నీలమణి దుర్గమ్మ 29 నుంచి 50వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఆంధ్రా, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఏర్పాట్లు చేస్తున్నాం అమ్మవారి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయానికి రెండు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – టి.వాసుదేవరావు, కార్యనిర్వహణాధికారి, నీలమణి దుర్గ ఆలయం -
నా చేతిని చూస్తే భయపడతారు..
నా చేతిని చూసే ఎవరైనా భయపడతారు. డయాలసిస్ సేవలు అందుతున్నప్పటి నుంచి నా ఎడమ చేతిలో వాపులు భయంకరంగా మారాయి. నాకు కిడ్నీ సమస్య వచ్చిన అనంతరం ప్రాణాలు నిలుపుకోవడానికి రూ.1.50 లక్షల విలువైన గొర్రెపిల్లలను అమ్మి నేను చికిత్స చేయించుకున్నాను. ప్రైవేటులో ఫిస్టులా ఆపరేషన్ చేసుకుని ఇప్పుడు పలాస నెఫ్రోప్లస్‌లో ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నాను. ఇప్పుడు నా చేయి రూపురేఖలు మారిపోయాయి. మా లాంటి వారి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. – సవర లక్ష్మమ్మ, సవరలింగుపురం, మెళియాపుట్టి మండలం -
చందనోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈనెల 30వ తేదీన ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన ట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శ్రీకాకుళం కాంప్లె క్స్ నుంచి రణస్థలం, నాతవలస, విజయనగరం, పద్మనాభం, శొంఠ్యాం మీదుగా అడవివరం–రణస్థలం, తగరపువలస, ఆనందపురం, శొంఠ్యాం మీదుగా అడవివరం వరకు ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. అడివివరం గోశాల నుంచి కొండపైకి 13 సిటీ బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపో మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్ మేనేజర్లు వి.రమేష్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. – శ్రీకాకుళం అర్బన్ -
పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు
ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జి బి.జానకిరామ య్య ఆదివారం చెప్పారు. శ్రీకాకుళం, టెక్కలి రెండు డివిజన్లలో పరీక్ష నిర్వహణ ఈ నెల 30న ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం డివిజన్లో 25 పరీక్ష కేంద్రాల్లో 6952 మంది, టెక్కలి డివిజన్లో 14 పరీక్ష కేంద్రాల్లో 4500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నా రని చెప్పారు. జిల్లాలో మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 11,452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. రేపు జిల్లా స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు శ్రీకాకుళం అర్బన్: జిల్లాస్థాయి అండర్–23 బాలబాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు ఈనెల 29వ తేదీన జరుగుతాయని బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎంపికలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొ న్న బాల, బాలికలు 23 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బాస్కెట్‌బాల్ కోచ్ జి.అర్జున్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికలలో పాల్గొన్న క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9949291288 నంబర్‌ను సంప్రదించాలని వారు కోరారు. జోషితకు డీఈఓ అభినందనలు మందస: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించిన హరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కంచరాన జోషితను డీఈఓ ఎస్.తిరుమల చైతన్య ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి జిల్లా ఖ్యాతిని పెంచిందని అన్నారు. తల్లిదండ్రులు లేపాక్షి, మాధవరావులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ఆదర్శప్రాయమన్నారు. ఈ సందర్భంగా జోషితకు రూ.10వేలు నగదు బహుమతి అందజేశారు. విజయానికి కారణమైన హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నమోదైన అర్జీల గురించి దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. భావనపాడు తీరం సందర్శన సంతబొమ్మాళి: భావనపాడు తీర ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ట్రీ ఫౌండేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం 420 తాబే లు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. కార్యక్రమంలో భావనపాడు సర్పంచ్ బుడ్డ మోహన్‌రెడ్డి, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సోమేశ్వరరావు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి నరేంద్ర, బీట్ అధికారి జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మే 20న అఖిలభారత సమ్మె
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మిక హక్కులు కాల రాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మే 20న నిర్వహించనున్న అఖిలభారత సమ్మె జయప్రదం చేయాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రిటిష్ కా లం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల ను మోదీ ప్రభుత్వం మార్చివేసిందన్నారు. యజమానులు చేసే నేరపూరిత చర్యలను నేరాలుగా పరిగణించకుండా కార్మికులు చేసే పోరాటాలను, యాజమానులను ప్రశ్నించినా నేరాలుగా పరిగణించేలా యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవ హరించేలా చట్టాలు మారుస్తున్నారని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ప్రజల త్యాగాలతో జాతి నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచం కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తివంతంగా జరపాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ భారాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి, ఎన్.గణపతి, ఎన్వీ రమణ, కె.సూరయ్య, ఎం.ఆదినారాయణమూర్తి, హెచ్.ఈశ్వరరావు, బి.ఉత్తర, ఆర్.ప్రకాశ రావు, పి.లతాదేవి, పి.గోపి, ఆర్.సురేష్ బాబు, త్రినాధ్, సుశీల, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నా దృష్టికి రాలేదు
డయాలసిస్ సేవలు పొందుతున్నవారికి ఫిస్టులా చేసుకున్న ప్రాంతంలో ఇలాంటి కొత్త సమస్యలు వచ్చినట్లు నా దృష్టికి ఎవ్వరూ తీసుకురాలేదు. ఇప్పుడే ఈ సమస్యను చూస్తున్నాను. డయాలసిస్ అయిన తర్వాత ఒక చేతితో బాల్‌ను నొక్కుతూ ఉండాలి. అలాగే వారు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నా యి. వాటిపై అవగాహన కల్పించేందుకు నెఫ్రా లజీ వైద్యులతో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. ప్రస్తుతం కిడ్నీ రోగులుకు వచ్చిన ఇలాంటి వాపుల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస -
ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డు పరిశీలన
పాతపట్నం, మెళియాపుట్టి: మండలంలోని బడ్డుమర్రి, ఏఎస్ కవిటి గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రహదారిని శనివారం నేషనల్ లెవెల్ మానిటరింగ్ సభ్యులు కిరణ్ పాఢి బృందం పరిశీలించింది. రహదారి నాణ్యత, ఉపాధి హామీ పథకం పనితీరు, క్షేత్ర స్థాయిలో వేతనదారు లకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పథకాన్ని పారదర్శంగా అమలు చేయాలని సూచించారు. మెళియాపుట్టి మండలంలోని హడ్డివాడ గ్రామంలో ఉపాధి హామి పధకం ద్వారా చేపట్టిన రహదారి పనులను కూడా పరిశీలించారు. ఐటీడీఏ డీఈఈ బి.శిమ్మయ్య, హిరమండలం, టెక్కలి ఏపీడీలు రాధ, శైలజలు, ఎంపీ డీవో ప్రసాద్ పండా, జేఈలు ప్రసాద్, శ్రీకాంత్‌రెడ్డి, ఏపీఓలు సురేష్, రవి, ఈసీలు పాల్గొన్నారు. -
బెల్ట్ దుకాణాలపై పోలీసుల దాడి
పోలాకి: ‘మద్యం సిండికేట్ మాయాజాలం’ పేరుతో ఈ నెల 25వ తేదీన ‘సాక్షి’లో ప్రచరితమైన కథనానికి పోలీసులు స్పందించారు. పోలాకి మండలంలో పలుగ్రామాల్లో బెల్ట్ నిర్వాహకుల ఇళ్లలో సోదాలు చేశారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జడూరు జంక్షన్లో ఒక దాబాలో 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకు ని, దాబా యజమాని బాబిసాహుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. అయితే తూతూ మంత్రంగా కాకుండా ఎకై ్సజ్ అధికారులతో కలసి బెల్ట్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్పీటీఈఎల్ కోర్సు పరీక్షల నిర్వహణ ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులకు శనివా రం ఎన్పీటీఈఎల్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించారు. 2768 మంది విద్యార్థులకు విడత ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 65 మంది పరీక్ష రాశారు. ఆదివారం, మే 3, 4, 5 తేదీల్లో మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జామినేషన్, ఐటీ ఇన్ఫ్రా బృందాలు పరీక్షలు పర్యవేక్షించా యి. ఈ పరీక్షలు విద్యార్థుల వృత్తి నైపుణ్యాల కు దోహద పడతాయని శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ కొక్కిరాల వెంకటగోపాలధన బాలాజీ చెప్పారు. 28న మహిళా క్రికెట్ జట్ల ఎంపికలు శ్రీకాకుళం అర్బన్: మహిళా క్రికెట్ జట్ల ఎంపికలకు రంగం సిద్ధమైంది. జిల్లా స్థాయి అండర్ –15, అండర్–19, సీనియర్స్ వయో విభాగా ల్లో ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రికె ట్ సంఘం అధ్యక్షులు పీవైఎన్ శాస్త్రి, కార్యద ర్శి హసన్ రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంయుక్తంగా పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియను నిర్వహించనున్నారు. -
బాబు గారి షూటింగ్!
● ప్రైవేటు కార్యక్రమంలా మత్స్యకారుల సేవలో పథకం కార్యక్రమం ● ఎంపిక చేసిన టీడీపీ కార్యకర్తలకు 2వేల పాసులు జారీ ● సాధారణ మత్స్యకారులకు దక్కని ప్రవేశం గుడారాల్లో సమావేశాలేమిటి? రణస్థలం/ఎచ్చెర్ల క్యాంపస్: తమ ప్రాంతానికి వచ్చి తమ ఊర్లో సమావేశం పెట్టి పాసులున్నా వదలకపోవడం ఏమిటని బుడగట్లపాలెం, కుప్పిలి, కొవ్వాడ, కొచ్చెర్ల, పాతర్లపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతోనూ కాసేపు వాగ్వా దం చేశారు. సీఎం చంద్రబాబు సభకు వారి వ ద్ద పాసులు ఉన్నా పోలీసులు లోపలకు పంపించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుడారాల్లో సమావేశాలు నిర్వహించడమేంటని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తమ గ్రామాల్లోకి వచ్చినప్పుడు చెబుతామని అన్నారు. చాలాసేపు ఎండలో నిల్చుని వెనుతిరిగారు. విన్నపాలు వినలేదు ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి బుడగుట్లపాలెం పర్యటనకు వచ్చిన నేపథ్యంలో రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు వినతి ఇ చ్చేందుకు శనివారం వచ్చారు. సెక్యూరిటీ అనుమతించకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా వారు సైతం చేతులెత్తేశా రు. ఎస్సీ వర్గీకరణ వల్ల రెల్లి కులస్తులకు తీరని అన్యాయం జరగుతుందని ఈ సంఘ ప్రతినిధులు గొల్లపల్లి మోహనరావు, బెవర రమణారావు తదితరులు అన్నారు. -
శ్రీకాకుళం
ప్రైవేటులో పేదలకు..ప్రైవేటులో పేదలకు ఉచిత విద్య లభించ నుంది. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. –IIలోఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మత్స్యకారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మత్స్యకారులైతే సరిపోదు.. టీడీపీ నాయకు లు ఎంపిక చేసి ఉండాలి. జనసేన, బీజేపీ జెండాలు మోస్తే సరిపోదు.. జై టీడీపీ అని ఉండాలి. ఎన్నికల్లో పనిచేస్తే సరిపోదు.. పాస్ సంపాదించుకునేంత పలుకుబడి ఉండి తీరాలి. చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా రుజువైన నిజాలివి. ఓ డైరెక్టర్ సినిమా ఏ రకంగానైతే షాట్ రెడీ అన్నట్టుగా చిత్రీకరిస్తారో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో చంద్రబాబు పర్యటన కూడా అదే రకంగా జరిగింది. ఎక్కడా బయట వ్యక్తులకు అవకాశం ఇవ్వలేదు. నిలదీసే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగా అప్రమత్తమై పాసులున్న వారికే అనుమతి అని మెలిక పెట్టారు. నిలదీస్తారనే భయంతోనే.. మత్స్యకారుల వేట విరామ సమయంలో ఇచ్చే భృతిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది ఎగ్గొట్టేసిన విషయం తెలిసిందే. గత ఏడాది వేట భృతి ఇవ్వకుండా ఈ ఏడాదికి సంబంధించి మాత్ర మే ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మత్స్యకారు లు చాలా వరకు ఆవేదనతో ఉన్నారు. గత ఏడాది వేట భృతి సంగతేంటని నిలదీసేందుకు సిద్ధమ య్యారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ముందస్తు గా పసిగట్టినట్టు ఉంది. దానిలో భాగంగా శనివా రం చంద్రబాబు పర్యటనను విస్తృత ఆంక్షల మధ్య నిర్వహించారు. సభా ప్రాంగణానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆంక్షలు పెట్టారు. అటు కుప్పిలి ఇటు కొచ్చెర్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరికైతే పాసులిచ్చారో వారిని మాత్రమే లోపలికి వదిలా రు. పాసులు లేని వారిని వెనక్కి పంపించేశారు. ఇక, 2వేల వరకు పాసులు ఎంపిక చేసిన టీడీపీ సానుభూతి పరులకు మాత్రమే ఇచ్చారు. దీంతో వారు మాత్రమే సభా ప్రాంగణంలోకి వచ్చారు. సెట్టింగ్‌లతో షూటింగ్‌లా.. షూటింగ్ స్పాట్ అందరికీ కనిపించేలా సముద్రతీరంలో సెట్టింగ్స్ పెట్టి, ఎంపిక చేసిన మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఎంపిక చేసిన వారికి ట్రాన్స్‌మీటర్స్ పెట్టి, వారి సమస్యలేంటని అడిగించారు. అక్కడే సిద్ధంగా ఉంచిన ఎండుచేపలను పరిశీలించారు. వారు ఎంపిక చేసిన మహిళలతో చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకుని బోట్లు మరమ్మతులు చేసే వారితో సంభాషించారు. తర్వాత మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్ర జావేదికలో తమకు కావాల్సిన వ్యాపార, పారిశ్రామిక వేత్తలను వెంట బెట్టుకుని జీరో పావర్టీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎంపిక చేసిన మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారడిగిన ప్రతి దానికి ‘చేసేద్దాం’ అని అక్కడికక్కడే హామీలిచ్చారు. కానీ, ఎప్పటిలోగా చేస్తామన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. ఇది కూడా బహిరంగ సభ అనేదాని కంటే క్లోజ్డ్ మీటింగ్ హాల్‌గా చెప్పుకోవాలి. ఎంపిక చేసిన, పాసులిచ్చిన వ్యక్తులకే ప్రాంగణంలోకి ప్రవేశం ఉండటంతో అంతా పథకం ప్రకారం సాగింది. ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, నిలదీతలకు తావులేకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. వాస్తవంగా గత ఏ డాది వేట భృతి ఎగ్గొట్టడంపై ప్రశ్నించేందుకు చాలా మంది మత్స్యకారులు ఎదురు చూసినా వారికెవ్వరికీ లోపలికి ప్రవేశం లేకపోవడంతో అడిగేందుకు అవకాశం లేకుండా పోయింది. బహిరంగ సభ అనుకుని చాలామందిని ఆ పార్టీ నాయకులు తీసుకొచ్చినప్పటికీ స్క్రిప్ట్ ప్రకారం పాసులున్న వారికే అనుమతి ఇవ్వడంతో నేతల తరలింపులో వచ్చిన వారు కూడా అసంతృప్తితో వెనుదిరిగారు. జనసేన, బీజేపీ నేతలకు అవమానం బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటన సాగినా ఆ పార్టీ నేతలను గౌరవించలేదు. జనసేన నాయకులకు అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. 300మంది టీడీపీ నాయకులకు సరిపడేలా ఏసీ సౌకర్యంతో కూడిన టెంట్ ఏర్పాటు చేశారు. అక్కడే మంచినీటి బాటిళ్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. కానీ, బీజేపీ, జనసేన నాయకులకు ఏర్పాటు చేసిన టెంట్లో అలాంటి సౌకర్యం కల్పించ లేదు. మంచినీటి ప్యాకె ట్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో బీజేపీ, జనసేన నాయకులు అసంతృప్తితో వెనుదిరిగారు. ●సువిశాల తీర ప్రాంతం ఉన్న మన జిల్లాలో ఇంత వరకు ఒక్క పోర్టును నిర్మించుకోలేకపోయాము.. చంద్రబాబు ఆశీస్సులతో మూలపేట పోర్టు నిర్మించుకుంటున్నామని వేదికపై చెప్పి వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన మూలపేట పోర్టును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తమ ఖాతాలో వేసుకున్నారు. జగన్ సర్కారు హయాంలో చాలా వరకు నిర్మాణం జరిగిన మూలపేట పోర్టును తాము నిర్మిస్తున్నట్టుగా చెప్పుకోవడం సిగ్గు చేటుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ●ఫిష్ ఆంధ్రా షాపుల కోసం వెటకారంగా మాట్లాడిన చంద్రబాబు, అచ్చెన్నాయుడులు.. ఇప్పుడేమో రొయ్యలు మార్కెటింగ్ పెంచాలని.. అప్పుడే వ్యాపారులు నష్టాలబారిన పడకుండా ఉంటారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ●అధికార దాహంతో చంద్రబాబు లేనిపోని హామీలన్నీ ఇచ్చేసి ఇప్పుడేమో అప్పుల లెక్కలు చూపిస్తున్నారు. ●జిల్లాపై, మత్స్యకారులపై ప్రేమాభిమానాలుంటే వైఎస్సార్సీపీ హయాంలో శంకుస్థాపన చేసిన పోర్టులన్నీ పూర్తిచేసి వలసల నివారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించాలి. ●మత్స్యకారుల్ని ఓటు బ్యాంక్‌గా వాడుకుని వదిలేస్తామంటే మత్స్యకారుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికాక తప్పదు. ●జిల్లాలో సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడులు జిల్లా అభివృద్ధికి, మత్స్యకారుల వలసల నివారణకు ఏం చేశారో చెప్పాలి. ఈ ప్రశ్నలకు జవాబేది బాబూ..! శ్రీకాకుళంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు 30లోపు ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించాలి శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) 2025 మే నెలలో జరగబోయే ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 30వ తే దీలోపు పరీక్ష పీజు చెల్లించాలని డైరెక్టర్ ఓపెన్ స్కూల్ వారు తెలియజేశారని జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఎస్.తిరుమల చైతన్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు ఎస్ఎస్సీకు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.100, ఇంటర్ పరీక్ష ఫీజు ఒక్కో సబ్జెక్ట్ కు రూ.150 ఈ నెల 30వ తేదీలోపు కట్టాలన్నారు. రూ.50 అపరాధ రుసుంతో మే 4వ తేదీలోగా చెల్లించాలని, తత్కాల్ రుసుం కింద సబ్జెక్ట్‌కు రూ.1000 మే 5లోగా చెల్లించాలని డీఈఓ తెలిపారు. న్యూస్రీల్బుడగట్లపాలెం సెట్టింగులో -
ప్రభుత్వ పాఠశాల టాపర్‌కు సత్కారం
శ్రీకాకుళం అర్బన్: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుత ఫలితాలను సాధించాయని శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 586 మార్కులతో టాపర్‌గా నిలిచిన కృష్ణచైతన్యను ఉపాధ్యాయులతో కలిసి శనివారం అభినందించారు. సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమ బోధన అందుతోందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం గోవిందరావు, స్టాఫ్ సెక్రటరీ తేజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలపై కేంద్ర బృందం ఆరా
గార : గార ప్రాజెక్టు పరిధిలోని కొర్ని అంగన్వాడీ కేంద్రాన్ని నాగాలాండ్‌కు చెందిన జుబోమో జామి, ఒబెద్ మఘ శనివారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించిన ‘సుపోషణ పంచాయతీ’కి ఎంపిక చేసేందుకు జిల్లాలో ఈ బృందం పర్యటిస్తోంది. బాలామృతం పంపిణీ, రోజువారి అందించే ఆహారం, గుడ్లు వినియోగం, చిన్నారుల బరువు, ఎత్తు కొలవడం, ఆట వస్తువుల వినియోగం, చిన్నారులకు అందించే పుస్తకాలు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పోషణ వాటికలు నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో గార సీడీపీవో పి.నాగరాణి, రణస్థలం సీడీపీవో సీహెచ్.ఝాన్జీభాయి, అంగన్వాడీ కార్యకర్తలు వజ్జ అలివేలు మంగమ్మ, ఎన్ని గోపమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
జి.సిగడాం: సమస్యలు పరిష్కరించాలని కోరు తూ జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణల పేరిట విడుదల చేసిన జీఓలో ఈఓపీఆర్డీలకు, పరిపాలనాధికారులకు 30 శాతం కోటాను అమలు చేస్తూ ఎంపీడీఓలుగా నియమించాలని, ఎంపీడీఓల డైరెక్ట్ నియామకాలకు స్వస్తి పలకాలని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పరిపాలనాధికారి రామకృష్ణ, రాజశేఖర్, రత్నకుమారి, వెంకట్, దాలిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. చెన్నాపురంలో విషాదం నరసన్నపేట: మండలంలోని చెన్నాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన గంగు సోమేశ్వరరావు(28) తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నాపురం గ్రామానికి చెందిన సోమేశ్వరరావు భార్య శ్రావణితో కలిసి కోదాడలో టైల్స్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ట్రిప్పర్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమేశ్వరరావు మృతితో తల్లిదండ్రులు తవిటేసు, నీలవేణి, భార్య శ్రావణి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని చెన్నాపురం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుడు కొంక్యాన వేణుగోపాలరావు తెలిపారు. -
ఉపాధి వేతనదారుడు మృతి
సరుబుజ్జిలి: మండలంలోని ఇస్కలపాలెం గ్రామానికి చెందిన గుజ్జల గన్నెరాజు(67) ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న సమయంలో శనివారం ఆకస్మికంగా మృతిచెందాడు. తోటి వేతనదారులతో కలిసి కాలువలో మొక్కలు తొలగిస్తున్న సమయంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు. తోటి వేతనదారులు వచ్చి సపర్యలు చేసినా అప్పటికే చనిపోయాడు. టెక్నికల్ అసిస్టెంట్ లలితమ్మ, ఫీల్డ్అసిస్టెంట్ శ్రీరాములు ఇచ్చిన సమాచారం మేరుకు ఏపీఓ పార్వతి ఘటనా స్థలానికి వచ్చి విషయం తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గన్నెరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిచ్చికుక్క దాడిలో 10 మందికి గాయాలు కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు తిలక్‌నగర్ ప్రాంతంలో రెండు రోజులుగా పిచ్చికుక్క స్వైర విహారం చేస్తోంది. పది మందికిపైగా గాయాలపాలయ్యారు. బాధితులు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి చేరుకుని టీకాలు వేయించుకుంటున్నారు. మున్సిపాలిటీలో కుక్కల బెడద ఇటీవల కాలంలో ఎక్కువైంది. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు ఢీకొని వృద్ధుడు మృతి ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం–సుర్లా రైల్వేస్టేషన్ల మధ్య శనివారం గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి.హరినాథ్ తెలిపారు. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండవచ్చని, పసుపు లాల్చీ, నీలం రంగు పువ్వులు కలిగిన లుంగీ ధరించాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జీఆర్పీ ఎస్సై ఎస్కే షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిరక్షించాలి శ్రీకాకుళం అర్బన్: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి రాజ్యాంగ మౌలిక సూత్రాల రక్షణ అవసరమని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.గేయానంద్ అధ్యక్షతన సమావేశం వహించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవాడలోని ఎంబీవీ కేంద్రంలో ఏప్రిల్ 26, 27లలో జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరలిజంలపై జరుగుతున్న దాడిని ప్రజాసైన్స్ ఉద్యమం ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీడీఎఫ్ పూర్వ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్) కార్యవర్గ సభ్యులు జి.మురళీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.త్రిమూర్తులు రెడ్డి, వైస్ నాగేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, సమత రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.జయప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ ఖాలీషా బాషా, బి.మాణిక్యం శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన పౌరాణిక ప్రదర్శనలు
శ్రీకాకుళం కల్చరల్: పౌరాణిక కళాకారుడు మోహనరావు ప్రదర్శనలను 40 ఏళ్లుగా ఇప్పటికీ ఆదరిస్తుండటం గొప్ప విషయమని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో మహాలక్ష్మీ ఆధ్యాత్మిక సామాజిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో హార్మోనియం కళాకారుడు బి.ఎ.మోహనరావు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు పౌరాణిక ప్రదర్శనలు శనివారం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన పౌరాణిక నటులు ధూపం రామకృష్ణ దంపతులను సత్కరిస్తూ ‘గాన కిరీటి’ బిరుదు ప్రదానం చేసి వెండి కిరీటం, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు అలరించాయి. అర్ధరాత్రి వరకు ప్రదర్శనలు కొనసాగాయి. కార్యక్రమంలో పద్మశ్రీ యడ్ల గోపాలరావు, గండ్రెటి బలరాం, రిటైర్డ్ జడ్జి జి.వి.రమణ, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, నిక్కు అప్పన్న, సూర శ్రీనివాసరావు, గజల్ వాసుదేవాచారి, హైదరాబాద్‌కు చెందిన పౌరాణిక కళాకారులు కన్నేపల్లి సుబ్బారావు, ధర్మపురి గౌరీశంకర శాస్త్రి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య, పెదపెంకి శ్రీరామ్, సాయిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటులో పేదలకు ఉచిత విద్య
నరసన్నపేట: ప్రైవేటు విద్యా సంస్థల్లో నిరుపేదలు ఉచితంగా చదువుకునే సౌలభ్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించింది. విద్యా హక్కు చట్టం–2009, సెక్షన్ 12(1)(సీ) ప్రకారం ప్రైవేటు స్కూల్స్‌లో పేదల పిల్లలు కూడా చదువుకునేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 2023 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కు అడ్మిషన్లకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో భాగంగా ఈ నెల 28 నుంచి దరఖాస్తులు చేసుకోవ డానికి అవకాశం కల్పించారు. మే నెల 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉచిత పథకంలో 2023లో 1120 మంది, 2024 విద్యా సంవత్సరంలో 1127 మంది విద్యార్థులు జిల్లాలో అడ్మిషన్లు పొందారు. ఒకటో తరగతిలో చేరే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు 25 శాతం పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. ఏ వర్గానికి ఎంత శాతమంటే.. ● ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొటున్న వర్గాల(అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులు) విద్యార్థులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు. ● షెడ్యూల్ కులాలకు 10 శాతం, షెడ్యూల్ తెగలకు 4 శాతం సీట్లు ఇస్తారు. ● బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, గ్రామీణప్రాంతాల్లో కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ. 1.44 లక్షలకు మించకుండా ఉన్న పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తుదారులు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు.. ● ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్‌కార్డు/ ఓటు కార్డు/ రేషన్ కార్డు/ భూమి యాజమాన్య పత్రం/ఉపాధి హామీ జాబ్ కార్డు/పాస్‌పోర్టు/ డ్రైవింగ్ లైసెన్స్/విద్యుత్ బిల్లు/ రెంటల్ ఎగ్రిమెంట్(ఇంటి అద్దె) కాపీ మూడింటిని సమర్పించాలి. ● పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి ఆన్లైన్ వెబ్సైట్.. ● డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఇన్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. ● 28–04–2025 నుంచి 15–05–2025 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ● దరఖాస్తులు దగ్గర్లో ఉన్న సచివాలయాలు, మీ సవా కేంద్రాలు/ఇంటర్నెట్, మండల విద్యాశాఖధికారి కార్యాలయాల్లోనూ చేసుకోవచ్చు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి విద్యా హక్కు చట్టం అనుసరించి గత ప్రభుత్వం ఈ అవకాశాన్ని పేద విద్యార్థులకు కల్పించింది. దీన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. పేద వర్గాల పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – పి.దాలినాయుడు, ఎంఈఓ నరసన్నపేట ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులకు అవకాశం అనాథలు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులకు ప్రాధాన్యం అర్హత వయసు.. సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ/ఐబీ సిలబస్‌ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 2, 2019 నుంచి మార్చి 31, 2020 మధ్య జన్మించి ఐదేళ్ల వయసు నిండి ఉండాలి. స్టేట్ సిలబస్‌ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం జూన్ 2,2019 నుంచి మే 31, 2020 మధ్య జన్మించి 5 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్ కులాలు, ఫెడ్యూల్ తెగలు, బీసీ, మైనారిటిలతో పాటు అల్పాదాయ వర్గాల విద్యార్థులు అర్హులు. -
‘మత్స్యకారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇవాళ చంద్రబాబు.. మత్సకారుల సంక్షేమం కోసం ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని.. ఈ 44 ఏళ్ల కాలంలో వారి సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీశారు. టీడీపీ 44 ఏళ్ల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎన్ని హార్బర్లు కట్టారు?, ఎన్ని పోర్టులు కట్టారు? అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో మత్సకారుల కష్టాలను చూసి వారి సంక్షేమానికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారన్నారు.‘‘గత ప్రభుత్వంలో చేపట్టిన హార్బర్ల పనులు అన్ని అర్ధాంతరంగా ఆపేశారు. మీరు ఈ రోజు అదే ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో చంద్రబాబు మీటింగ్ పెట్టారు. రివైజ్ డీపీఆర్ పేరుతో అన్ని ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు ఆపేశారు. చంద్రబాబుకు ఎప్పుడూ మత్స్యకారులు అంటే చిన్న చూపే. వైఎస్ జగన్ హయాంలో ప్రతీ జిల్లాకు ఒక హార్బర్ ఉండాలని మొదలు పెట్టి నాలుగు హార్బర్ల నిర్మాణం పూర్తి చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఎన్ని పోర్టులు కట్టారు?. ఒక్క పోర్టు కూడా కట్టలేదు. వైఎస్ జగన్ హయాంలో నాలుగు పోర్టులు ప్రారంభమయ్యాయి.మత్స్యకార భరోసా 20 వేలు ఇచ్చామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. మరి గత సంవత్సరం మత్స్యకార భరోసా బకాయిల పరిస్థితి ఏంటి?. గత టీడీపీ హయాంలో 4 వేల మత్స్యకార భరోసా ఇస్తే.. వైఎస్ జగన్ పాలనలో రూ.10 వేలు రూపాయలు అందించాం. 2023-24 మధ్యలో మత్స్యకార భరోసా బకాయిలు కూడా చంద్రబాబు ఇవ్వాల్సిందే. ఐదేళ్ల కాలంలో ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా 3 ఏళ్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది...తక్షణమే ఆపేసిన బుడగట్లపాలెం హార్బర్ పనులు ప్రారంభించండి. నువ్వులరేవు హార్బర్ పనులకు అనుమతులు తీసుకురండి. చంద్రబాబుకు పరిపాలన చేతగాక లక్షా యాభై వేల కోట్లు రూపాయలు అప్పు చేశారు. అచ్చెన్నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకు రాలేదు. ఉర్సా ట్రస్టు భూములు ఎలా అప్పనంగా ప్రవేట్ కంపెనీలు కట్టబెడతారు?. 6 నెలల క్రితం అమెరికాలో పెట్టిన కంపెనిపై ఎందుకంత ఆసక్తి’’ అంటూ అప్పలరాజు ప్రశ్నించారు. -
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్‌స్టాల్‌మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చెరువునే ‘ముద్దాడ’!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తమ్ముడు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారి! అన్న.. అసలే టీడీపీ నాయకుడు.. ఆపై అండగా అధికారం! ఇక ఆగడాలకు అడ్డేముంది? అచ్చెప్ప చెరువు... శోభనాద్రి చెరువు.. ఉప్పరవానిబంద చెరువు.. పాపమ్మ కోనేరు.. భూసమ్మ చెరువు, మంగళివాని చెరువు.. గాది బంద..! చేంతాడు లాంటి ఈ చెరువుల జాబితా ఏమిటనుకుంటున్నారా..? ఇవేవో శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన చెరువుల పట్టిక కాదు!! సీఎం చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర సోదరుడు, టీడీపీ నేత శ్రీనివాసరావు వరుసబెట్టి చెరువులను కబ్జా చేసి కలిపేసుకోవటంపై గ్రామస్థులు గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సైరిగాంలో ముద్దాడ శ్రీనివాసరావు వరుసగా చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపారు. చెరువులను ఆక్రమించడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అక్రమంగా మట్టి తవ్వకాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా గ్రామం సమీపంలో ఉన్న భూసప్ప కోనేరు వద్ద పశువుల తొట్టెలు నిరి్మస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.రక్షించండి.. ప్రభుత్వ చెరువులను రక్షించాలని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా. ముద్దాడ శ్రీనివాసరావు సోదరుడు రవిచంద్ర ఉన్నతాధికారి కావడంతో యంత్రాంగం అడ్డు చెప్పలేక పోతోంది. చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. పేదలకో న్యాయం పెద్దలకో న్యాయం సరికాదు. – ధర్మాన అనిత, సర్పంచ్, సైరిగాంపేదలపై ఎందుకీ వివక్ష? నాకున్న 20 సెంట్లలో ఆక్రమణలు ఉన్నాయంటూ పొలంలో తవ్వకాలు జరిపి నా కడుపు కొట్టారు. అదే ముద్దాడ శ్రీనివాసరావు తన తమ్ముడి పేరు చెప్పి చాలా వరకూ చెరువులను ఆక్రమించాడు. పేదలపై ఎందుకీ వివక్ష? – ముద్దాడ సింహాచలం. రైతు, సైరిగాంనేనేం తప్పు చేయలేదు.. నేను తప్పు చేయలేదు. ఊరుగుండం చెరువులో ఆక్రమణలు తొలగించాం. ఆస్పత్రి ఎదురుగా అచ్చెప్ప కోనేరు అభివృద్ధి కోసం మట్టి వేశా. మా గ్రామస్తులు కొంత మంది నేను ఏదో చేస్తున్నానని ఊహించుకుని బురద జల్లుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే నిరూపించండి. – ముద్దాడ శ్రీనివాసరావు (రవిచంద్ర సోదరుడు), సైరిగాం గ్రామం నివేదిక ఇవ్వాలని ఆదేశించాం.. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించాం. ఇప్పటికే నేను వెళ్లి పరిశీలించా. నివేదిక వచ్చాక ఆక్రమణలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జె.రామారావు, తహసీల్దార్, జలుమూరు. -
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు మండలాలకు అనుకు ని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, శిరడా, గురిసింగి గూడ, నేరడి గూడ పరిసరాల్లో 1,120 లీటర్ల నాటు సారా, 10,600 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు తెలిపారు. మలేరియాపై అవగాహన ర్యాలీ అరసవల్లి: మలేరియాను జయించండి.. జీవితం నిలపండి అని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియాను సరైన జాగ్రత్తలు పాటించి నివారించుకోవచ్చునని, గత ఐదేళ్లలో మలేరియా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. అయితే ప్రతి ఇంట్లో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రథమ కర్తవ్యంగా మారుచకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్యశాఖ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అరసవల్లి ఇన్చార్జి ఈఓగా శోభారాణి అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఇన్చార్జి ఈఓగా కె.శో భారాణిని నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె విశాఖ కనక మహాలక్ష్మి ఆలయంలో ఈఓగా పనిచేస్తూ.. అరసవల్లి ఇన్చార్జి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈఓ వై.భద్రాజీ మెడికల్ లీవులో వెళ్లినందున జిల్లా దేవదాయ శాఖ అధికారి(ఏసీ) తో పాటు అరసవల్లి ఈఓ బాధ్యతలు కూడా శోభారాణి చూడనున్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
రణస్థలం: మండలంలోని యూబీ పరిశ్రమ సమీపంలోని శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖపట్నం నుంచి రణస్థలం వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఒక గుర్తు తెలియని వ్యక్తి ని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, బిచ్చగాడని స్థానికులు తెలిపారు. దీనిపై జేఆర్ పురం ఏఏస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 27న జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలు శ్రీకాకుళం అర్బన్: జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ అండర్ –13 బాల బాలికల జట్ల ఎంపికలు 27న జరగనున్నాయని శ్రీకాకుళం జిల్లా బాస్కె ట్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానం వేదికగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 13ఏళ్ల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను చిత్తూరు వేదికగా వచ్చే నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఏపీ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వెల్లడించారు. రేపు జరిగే ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కృష్ణమూర్తి కోరారు. మరిన్ని వివరాలకు డీఎస్ఏ బాస్కెట్ బాల్ కోచ్ జి.అర్జున్ రావురెడ్డి (9949291288)ని సంప్రదించాలని ఆయన కోరారు. పెన్షనర్లలో ఐక్యత అవసరం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పెన్షనర్ల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో పెన్షనర్ల ఐక్యత అవసరం పెరిగిందని ఐక్యవేదిక సదస్సు నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఎన్జీఓ హోమ్ లో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కన్వీనర్ మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వా త గౌరవప్రదమైన జీవితం కోసమే పెన్షన్ విధానం ప్రవేశపెట్టారని, ప్రభుత్వ విధానాలు పెన్షన్ భద్రత ను ప్రశ్నార్థకం చేస్తున్నాయని అన్నారు. ఇటీవల ఓల్డ్ పెన్షన్ స్కీం (ఒ.పి.ఎస్) పెన్షనర్లకు నష్టం కలిగించే రీతిలో ఉద్యోగ విరమణ తేదీ బట్టి విభజన చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం సరికాదన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సి.పి.ఎస్) విధానంలో చెల్లించే పెన్షన్ మొత్తానికి గ్యారెంటీ లేదని, యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యు.పి.ఎస్) విధానంలో అనేక లోపాలున్నాయని తెలిపారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం ఆశాజనకంగా లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు సంస్థల విశ్రాంత ఉద్యోగుల ఐక్య సదస్సు ఈ నెల 27వ తేదీ (ఆదివారం) ఉద యం 10 గంటలకు జరుగుతుందని జిల్లాలోగల వివిధ సంస్థలలో పని చేసిన పెన్షనర్లు పాల్గొని సద స్సు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డి.పార్వతీశం, కె.సోమ సుందర్రావు, ఎంఎస్ఆర్ఎస్ ప్రకాశరావు, ఎస్.భాస్కర్‌రావు, పి. సుధాకర్‌రావు, వి.చిన్నబాబు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలపై కక్ష సాధింపు
ఎచ్చెర్ల: లావేరు మండలం తాళ్లవలస గ్రామంలో అధికార పార్టీ మేట్లు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉపాధి కూలీలు వాపోయారు. గ్రామంలో 78 మంది వరకు ఉపాధి పనులు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొందరు అధికార పార్టీ వారిని మేట్లుగా వేశారు. అందులో భాగంగానే తాళ్లవలసలో రాధను నియమించారని కూలీలు తెలిపారు. ఈమె రాజకీయ కక్షతో కొందరి కి మస్టర్ వేయకుండా వేధిస్తోందని, కాసేపు బయటకు వెళ్లినా మస్టర్ వేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గురువారం ఫీల్డ్ అసిస్టెంట్ రాకపోవడంతో కొన్ని గ్రూపుల కూలీలకు మస్టర్లు వేయడానికి వేరే వాళ్లను పంపించారు. దీంతో మస్టర్లు చదివే సమయంలో గొడవ జరిగింది. శుక్రవారం పలువురిని పనిలోకి రావద్దని చెప్పడంతో వారంతా ఏపీఓ సత్యవతిని కలిసి మాట్లాడారు. ఏపీఓ మాట్లాడు తూ ప్రతి రోజు మీరు ఘర్షణ పడుతున్నారని అందువలన రెండురోజులు పనిని నిలుపుదల చేయాలని చెప్పారు. అందరికీ సమానంగా పనిని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాధ అనే మేట్ ఉంటే తాము పనిచేయలేమని, ఆమె తమను పనిచేయనివ్వరని వారు ఫిర్యాదు చేశారు. -
గిరిజన గురుకులాల్లో ఇంటర్మీయెట్ ప్రవేశాలు
● నోటిఫికేషన్ విడుదల చేసిన గురుకులం సొసైటీ ● ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ● పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 1200ల సీట్ల భర్తీ ● నేటి నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● మే 24న కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. దరఖాస్తులు ఆన్లైన్ చేయాల్సిన తేదీ ప్రారంభం: 26.04.2025 దరఖాస్తు చేసుకునే చివరి తేదీ: 18.05.2025 మెరిట్జాబితా ప్రకటన: 20.05.2025 మొదటి కౌన్సెలింగ్: 24.05.2025 రెండో విడత కౌన్సెలింగ్: 30.05.2025 తరగతులు ప్రారంభం: 02.06.2025 సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గిరిజన గురుకుల సొసైటీ ఆన్లైన్లో శనివారం నుంచి దర ఖాస్తులు స్వీకరిస్తోంది. గిరిజన గురుకులాల్లో చేరే విద్యార్థులకు అధికారులు ఉచిత, భోజన వసతి, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు సమకూరుస్తారు. కళాశాలల్లో సీటు లభించిందంటే కార్పొరేట్ కళాశాలల్లో సీటు లభించినట్టేనన్నది విద్యావేత్తల మాట. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో 8 కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీలతో పాటు ఒకేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, సీజీఏ గ్రూపులు బోధిస్తున్నారు. మొత్తం అన్ని గ్రూ పులు కలిపి 1270 సీట్లు ఉన్నాయి. వీటికోసం ఏటా 2 వేల మంది విద్యార్థులు పోటి పడుతున్నారు. మెరిట్ ఆధారంగానే... ఈ దఫా పదో తరగతిలో వచ్చే మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపునకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీలకు 36 సీట్లు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈలకు ఒక్కో సీటు చొప్పున కేటాయిస్తారు. ఒకేషన ల్ ఏఅండ్‌టీ–20, సీజీఏ గ్రూపు లో 30 చొప్పున సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించా రు. విద్యార్థులు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూఆర్.గవ్.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. -
సీఎం పర్యటనకు 1500 మంది పోలీసులతో బందోబస్తు
ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడగుట్లపాలెంలో శనివారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చెప్పారు. బుడగుట్లపాలెంలో పోలీస్ అధికారులతో శుక్రవారం భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ముఖ్యమంత్రి వచ్చిన నుంచి పర్యటన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు పార్కింగ్, తనిఖీ లు వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. నలుగురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలతో కూడిన అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తారని చెప్పారు. 17 రోప్, స్పెషల్, క్యూఆర్డీ టీంలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. హెలీప్యాడ్, సభావేదిక, ఆలయ దర్శనం, లబ్ధిదారులతో ముఖా ముఖి వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. -
గొట్టా.. ముప్పు ఆగేదెట్టా..?
● వరదల ధాటికి పాడైన గొట్టా బ్యారేజీ రాతి కట్టడాలు ● పనులు పూర్తి చేయకుంటే బ్యారేజీకే ముప్పు ● ఆందోళన చెందుతున్న రైతులు ● సీఈకి ప్రతిపాదనలు పంపించాం హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద ఏప్రాన్ పూర్తిగా పాడై ఉంది, పను లు చేసేయాలని ఇటీవల జిల్లాకు వచ్చిన జలవనరుల శాఖ మంత్రి చె ప్పారు. టెండర్లు పిలిచేందుకు కావాల్సిన దస్త్రాలను సీఈకి ప్రతిపాదనలు పంపించాం. త దుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం. ఈ సీజన్లో దాని వల్ల ఎలాంటి ముప్పు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. వచ్చే సీజన్‌కు తప్పనిసరిగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తాం. – పీవీ తిరుపతిరావు, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, ఎస్ఈ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కాలం గడుస్తున్న కొద్దీ గొట్టా బ్యారేజీ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతోంది. జిల్లాకు జీవనాడి వంటి బ్యారేజీ పరిరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. వంశధార స్టేజ్–1, ఫేజ్–2 పనులకు జలయజ్ఞంలో భాగంగా రూ.933కోట్లతో పనులు ప్రారంభించారు. అప్పట్లో వంశధార గట్లు పటిష్టం చేయడం, హిరమండలం రిజర్వాయర్ నిర్మాణం, ప్యాకేజీ–87, 88లకు శ్రీకారం చుట్టారు. వంశధార నదిలో నీటిని ఒడిసిపట్టి జిల్లాలో 2.55లక్షల హె క్టార్లలో రెండు పంటలకు నీరందించాలంటే అది ఒక్క వంశధార నదిలో నీరు వృధా కాకుండా అడ్డుకట్ట వేయడంతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి ధర్మాన ఇంజినీర్లతో కలిసి డిజైన్ చేశారు. నదిలో వచ్చే నీటిని నిల్వచేసేందుకు గొట్టాబ్యారేజీ వద్ద గేట్లు ఏర్పాటు చేసి కొంతమేర రైతుల అవసరాలను బట్టి నీటిని వదిలేవారు. నీరు నిత్యం పారుతుండడంతో గొట్టా బ్యారేజీకి దిగువ భాగాన ఉన్న రాతి కట్టడాలు వరదలకు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ తర్వాత వచ్చిన వర్షా లు, వరదలకు ఏటా కొంచెం, కొంచెంగా ఇసుక మేటలు వేసి రాళ్లు కొట్టుకుపోయి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాతి కట్టడాలు సరిగా లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. వాస్తవానికి వంశధార ఎడమ కాలువ పనులు చేసేందుకు టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పు డు రూ.380 కోట్లు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు దాని పని అంచనా దాదాపు మూడింతలైంది. వైఎస్సార్సీపీ హయాంలో రూ 12.91కోట్లు మంజూరు వైఎస్ జగన్ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో హిరమండలం గొట్టా బ్యారే జీ వద్ద ఏప్రాన్ (రాతికట్టడాల) పనులు చేసేందుకు గాను రూ.12.91కోట్లు నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే హిరమండ లం రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ 176.35 కోట్లు, ఉద్దానం ప్రాంతానికి తాగునీరు సౌకర్యం కల్పించడానికి రూ.700కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూ 852.45కోట్లు, వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేందుకు రూ.216.71కోట్లు, పాతపట్నం నియోజక వర్గంలో రెండు మండలాలకు మంచినీటి ప్రాజెక్టు కింద రూ.250కోట్లు మంజూరు చేశారు. ఏప్రాన్ పనులు ప్రారంభించేలోపే ఎన్నికల కోడ్ రావడంతో అర్ధంతరంగా టెండర్ల దశలోనే ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడం దారుణమని రైతులు, నదీపరివాహక ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల జలవనరుల శాఖమంత్రి రామానాయుడు జిల్లాకు వచ్చినా ఎమర్జెన్సీగా చేయాల్సిన పనులేవీ చూడకుండా అచ్చెన్న ఇలాకాలో పనులు మాత్రమే చూసి తూతూమంత్రంగా వెళ్లిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో పనులు చేసేందుకు టెండర్లు పిలిచేందుకు ఆదేశాలిస్తారో లేదో వేచి చూడాలి. -
దౌర్జన్యకాండ
● కూటమి పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలు ● భయాందోళనలో జిల్లా ప్రజలు రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? అత్యాచారాలు, దాడులు, హత్యలతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నేనొస్తే శాంతియుత పరిస్థితులు ఉంటాయి. హత్యలు, అత్యాచారాలకు ఆస్కారమివ్వను. తప్పు చేసినోడికి మళ్లీ తప్పు చేయకూడదనేలా ట్రీట్మెంట్ ఇస్తాను. – ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల కా లంలో 17 హత్యలు.. ఈ ఏడాదే 9 హత్యలు.. అంతకు రెట్టింపు దొంగతనాలు, ఊరూరా రాజకీయ దాడులు, చిరుద్యోగులపై వేధింపులు, అక్రమాల ను నిలదీస్తే దాడులు.. వెరసి సిక్కోలులో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి అనడానికి ఈ లెక్కలే సాక్ష్యం. గంజాయి మత్తులో యువ త నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లాకేంద్రంలో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేకే గంజాయి బాబులు పట్టుబడటం చూస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిపై ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 8 హత్యలు ● మంత్రి అచ్చెన్న సొంత పంచాయతీ నిమ్మాడలోని వెంకటాపురం గ్రామ అమ్మ వారి ఉత్సవాల్లో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా తోట మల్లేషు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి తర్వాత మరణించాడు. ● ఆగస్టు 18 అర్ధరాత్రి ఎచ్చెర్ల ఫరీద్‌పేటకు చెందిన వైఎస్సార్ సీపీ సాధారణ కార్యకర్త కూన ప్రసాద్‌ను దారి కాచి టీడీపీ కార్యకర్తలు కొట్టారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 24న మరణించాడు. ● జూన్ 5 రాత్రి సోంపేట కొర్లాం జాతీయ రహదారి సమీపంలో సంగీత దాబాలో సిబ్బంది మద్య జరిగిన గొడవలో మాదుగుల రాంబాబు (54)ను హత్య చేశారు. ● జూన్ 24న ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన కొండ్ర కుప్పయ్యను అతని భార్య హరమ్మ నిద్రలో ఉండగా కత్తితో దాడి చేసి చంపేసింది. ● జూన్ 30న ఇచ్ఛాపురం స్వర్ణపురం బీచ్‌లో ఆసి బాలు అనే యువకుని ఛాతీపై బలమైన ఆయుధంతో గాయపర్చి హత్య చేశారు. ● జూలై 2న పొందూరు మండలం తాడివలస సమీప బొడ్డేపల్లి గ్రామానికి చెందిన అమలాపురం రాజేశ్వరిని నరసన్నపేట మండలం ఉర్లాంకు చెందిన గోపాల్ హత్య చేసి మృతదేహాన్ని ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి లొంగిపోయాడు. ● డిసెంబరు 6న గార మండలం శ్రీకూర్మం ఆర్టీసీ కూడలిలో ఉప్పాడ రాజేష్ అనే యువకున్ని పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు దాడిచేసి హతమార్చారు. ● అక్టోబరు 22న నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం వనవిష్ణుపురం అమ్మవారి పత్రికొమ్మల విషయంలో ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకోవడంతో టీడీపీకి చెందిన పాలిన వీరాస్వామి మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి. ఈ ఏడాది 9 హత్యలు.. ● జనవరి 19న జిల్లాకేంద్రంలోని న్యూకాలనీలో పొందూరు మండలానికి చెందిన పూజారి లలితను బంగారం కోసం అతి కిరాతకంగా యువకుడు చంపేశాడు. ● జనవరి 25న ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో సొంత భర్త గరుగుబిల్లి చంద్రయ్య తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మరో పదిమందితో కలిసి భార్య ఈశ్వరమ్మ హత్య చేయించింది. ● ఫిబ్రవరి 10న సోంపేట సమీప జింకిభద్ర బీసీకాలనీలో మద్యం మత్తులో భార్యను భర్తే హత్య చేశాడు. ● ఫిబ్రవరి 24న జిల్లాకేంద్రంలో టి–ఏజెంట్కాలనీలో మజ్జి రమేష్‌నాయుడు (34)ను వేధింపులు తాళలేక, పిల్లలను సైతం కొట్టడంతో భార్య శశి హత్య చేసింది. ● మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42)ను ఆమె భర్త అప్పలరెడ్డి మద్యం మత్తులో దారుణంగా నరికి చంపేశాడు. ● మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ● మార్చి 28న కవిటి మండలం ఆర్.కరాపాడు గ్రామ శివారు రైల్వేగేటు వద్ద 5 నెలల గర్భిణి కొంతాల మీనాక్షిని భర్తే కర్కశంగా దాడి చేయించి చంపేశాడు. ● ఏప్రిల్ 15న జి.సిగడాం మండలం సంతపురిటిలో వివాహిత బి.భవానిని తన భర్త గొంతు నులిమి హత్య చేశాడు. ● ఏప్రిల్ 19న పైడిభీమవరంలో ఆవాల భవాని (25) అనే వివాహితను చంపేశారు. అక్టోబరు 16న జిల్లా నడిబొడ్డున బలగమెట్టు వద్ద వందలమంది జనాలు చూస్తుండగా సనపల సురేష్ అనే వ్యక్తిని కారును జీపు, బైకులతో కొంతమంది అడ్డగించి కొట్టారు. అక్టోబరు 27న కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో దళిత దంపతులైన చల్ల అప్పలరాజు, దమయంతిలపై టీడీపీ గూండాలు ధర్మాన శ్రీను, ధర్మాన ప్రసాద్, తంగి షణ్ముఖ, పల్లి వైకుంఠరావు, పగోటి సీమలు, పగోటి అప్పారావు, మరో 70 మంది ఇంటికొచ్చి మరీ దాడికి పాల్పడ్డారు. అదే రోజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సాక్షిగా మాజీమంత్రి సీదిరి అనుచరులు అల్లు రమణ, మన్మధలపై టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. అక్టోబరు 26న ఉత్సవాల్లో డ్యాన్స్ చేయనన్నందున తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక, ఆమె తల్లిపై పలాస మండలం తెలుగు యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు దాడికి పాల్పడ్డాడు. నవంబరు 16న వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు మహిళలపై దాడి చేశారు. రాజమండ్రికి చెందిన నకిలీ నోట్ల ప్రధాన నిందితున్ని మన జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులతో కలసి కారులో తెస్తుండగా సినీఫక్కీలో 20 మందికి పైగా కారులు, బైకుల్లో వచ్చి దాడికి ఎగబడి ప్రధాన నిందితున్ని ఎత్తుకుపోయారు. 2025 జనవరి 21న పలాస మండలం రామకృష్ణాపురం చిన్ననీలావతి గ్రామానికి చెందిన పౌరహక్కుల నేత తెప్పల ఢిల్లీరావు (57) అనుమానాస్పదరీతిలో పంటపొలంలోనే విద్యుత్ తీగలు తగిలి మృతిచెందాడు. ఇది హత్యేనని అనుమానాలు ఉన్నాయి. జనవరిలో పాతపట్నం దువ్వారివీధికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త పెద్దింటి తిరుపతిరావుపై వేకువఝామున గుర్తుతెలియని వ్యక్తులు మెడపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. మార్చి 30న రణస్థలం మండలంలోని బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి పిన్నింటి అప్పలసూరి బాత్రూమ్లో ఉరికి వేలాడుతూ అనుమానాస్పదంగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు పరిశ్రమ ముందు ఆందోళన చేశారు. ఇలాంటి ఘటనలు మరెన్నో జరిగాయి. -
బకాయి ఇక రానట్టే..!
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. ఈ ఏడాదికి వేటనిషేధ కాలం భృతిని అందించే ‘మత్స్యకార చేయూత’ పథకంలో భాగంగా అర్హుల జాబితా ప్రాప్తికి 15548 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున భృతిని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎచ్చెర్ల మండలంలో భారీ హంగామాతో మత్స్యకారుల సమక్షంలోనే కార్యక్రమాన్ని నిర్వహించేలా మత్స్యకార గ్రామమైన బుడగట్లపాలెంలోనే కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. అయితే జిల్లా మత్స్యకార సహకార సంక్షేమ సంఘాల అధ్యక్ష, కమిటీలకు ఎలాంటి ఆహ్వానాలు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండడంపై మత్య్సకార సంఘాలు తప్పుపడుతున్నాయి. అరసవల్లి: అనుకున్నదంతా అయ్యింది. గత ఏడాది మత్స్యకార భృతిపై మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు గంగ పాలయ్యాయి. 2024–25కు సంబంధించిన మత్స్యకార భృతిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో.. ఆ భృతికి ఇక చేతికి అందదని స్పష్టమైపోయింది. ఈ ఏడాదికి సంబంధించి మాత్రమే భృతి అందజేస్తుండడంతో బకాయి ఇచ్చేది లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చి చెప్పినట్టైంది. దీనికి తోడు ఈ ఏడాది కూడా వేటనిషేధ భృతి తీసుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. గత ఏడాది భృతి రానట్టే.. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు రెండు నెలల పాటు ఏపీ మైరెన్ ఫిషింగ్ యాక్ట్ 1994 ప్రకారం వేట నిషేధ కాలంగా రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014–19 మధ్యకాలంలో కూడా వేటనిషేధ సమయంలో కేవలం రూ.4 వేలు చొప్పున ఉపాధి భృతిగా ఇచ్చేవారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ, డీజిల్ సబ్సిడీని కూడా అందించింది. దీంతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా జగన్ సర్కార్ అడుగులు వేసింది. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో వేట నిషేధ కాలానికి భృతి ఇవ్వకుండా ఏడాది పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు మరోసారి నిషేధ కాలం రావడంతో గత ఏడాది భృతికి మంగళం పాడేసింది. ఇంతవరకు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లూ... గతంలో వైఎస్ జగన్ సర్కార్ అన్ని వర్గాల ప్రజల కు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చిన సంగతి విదితమే. అయితే ముఖ్యంగా మత్స్యకారులకు వరుసగా ఐదేళ్ల పాటు వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 70,611 మందికి ఐదు విడతల్లో రూ.70.61 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జమచేసింది. అలాగే ఈ ప్రకారం లబ్ధి పొందిన వారికి ప్రభుత్వం అందజేసిన ఇతర సంక్షేమ పథకాలను కూడా వర్తించేలా చర్యలు చేపట్టింది. కేవలం మత్స్యకారుల బాగు కోసం మూలపేటలో రూ.4,362 కోట్లతో పోర్టు, అలాగే ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో రూ.15 కోట్లతో షిఫ్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాలను చేపట్టారు. భృతి తీసుకుంటే..సంక్షేమం కట్ వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు భరోసాగా కూటమి సర్కార్ ‘మత్స్యకార చేయూత’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ భృతి పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించింది. 60 ఏళ్ల వయసు దాటిన వా రు, అలాగే గృహ వినియోగ విద్యుత్ నెలకు 300 యూనిట్లు వినియోగించిన వారు అనర్హులని నిబంధనలు విధించారు. అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగభృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతితో పాటు పెన్షన్ కూడా పొందేందుకు అనర్హులవుతారు. 2024–25 నాటి భృతి చెల్లింపుపై వెలువడని ఉత్తర్వులు ఈ ఏడాది 15548 మందికి రూ.20 వేలు చొప్పున భృతి అందజేయనున్న సీఎం చంద్రబాబు భృతి పొందితే.. ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులే పాత బకాయిలు ఇవ్వాల్సిందే.. జిల్లాలో మత్స్యకారులకు 2024–25 వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతిని కలుపుకుని రూ.40 వేల చొప్పున జమ చేయాలి. జిల్లా మత్స్యకార సంఘాల ప్రతినిధులకు ఎలాంటి ఆహ్వానాలు లేకుండా సమావేశాలు కార్యక్రమాలను నిర్వహించడం ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకే వస్తుంది. గత ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధి కోసం, జిల్లా ప్రగతి కోసం చేపట్టిన పోర్టులు, జెట్టీలు, హార్బర్ల నిర్మాణాలు యథావిధిగా కొనసాగించాలి. – కోనాడ నరిసింగరావు, జిల్లా మత్స్యకార సహకార సంక్షేమ సంఘ అధ్యక్షుడు 511 మంది అనర్హులుగా గుర్తించాం జిల్లాలో మత్స్యకార చేయూత కార్యక్రమంలో భాగంగా మొత్తం 11 మండలాల్లో 15548 మందిని అర్హులు గా గుర్తించాం. 511 మందిని మాత్రమే అనర్హులుగా గుర్తించాం. అలాగే మోటరైజ్డ్ బోట్లు 1565, నాన్ మోటరైజ్డ్ 2557 బోట్లు ఉన్నట్టుగా సర్వేలో గుర్తించాం. నిబంధనల ప్రకారం అర్హులకే రూ.20 వేల చొప్పున జమ చేయనున్నాం. – వై.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ -
హార్బర్ పనులు ప్రారంభిస్తారా?
ఎచ్చెర్ల క్యాంపస్: మత్స్యకారుల వలసల నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బుడగుట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసింది. 2023 ఏప్రిల్ 19న పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయి. ఇదే గ్రామంలో శనివారం రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నా రు. ఫిషింగ్ హార్బర్ పనుల పూర్తి కోసం కోటి ఆశలు, వేయి కళ్లతో మత్స్యకారులు ఎదురు చూ స్తున్నారు. కొన్నాళ్లు అటవీ శాఖ అభ్యంతరాలు అన్నారు. అటవీ భూములు విడిచి పెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించవచ్చు, అయినా పనులు ముందుకు సాగలేదు. దాదాపుగా 11 నెలల పాటు పనులు నిలిచి పోవటం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. పనులు కొనసాగితే దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యేవి. ఫిషింగ్ హార్బర్‌కు భూమి పూజకు ముందే రూ.366 కోట్లు టెండర్ పూర్తిచేశారు. ఈ టెండర్లను విశ్వ సముద్ర కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం బిల్లుల చెల్లింపులు లేక, పనులు మందుకు సాగని పరిస్థితి కొనసాగుతోంది. సర్వే నంబర్ 504–18 లో 42 ఎకరాలు ప్రభుత్వ స్థలం కేటాయించారు. రాతి కట్టడాలు, అంతర్గత రోడ్డు లు, కాంక్రీట్ ఫౌండేషన్ వంటి పనులు ప్రారంభించి అసంపూర్తిగా ప్రస్తుతం విడిచి పెట్టారు. స్థానిక మత్స్యకారులు ఈ ఫిషింగ్ హార్బర్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల పది గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వీరావల్, సూరత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వెలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. హార్బర్ పూర్తయితే వలసలు నిలిచే అవకాశం ఉంది. -
● తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం
ఎల్.ఎన్.పేట: మండే వేసవిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు అందివ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. మండలంలోని దబ్బపాడు గ్రామంలో మహిళలతో కలిసి తాగునీటి కోసం కుళాయిల వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు రూ.62 కోట్లు ఖర్చుతో 360 పనులు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగానే పాతపట్నం మండలంలో రూ.15.50 కోట్లు ఖర్చుతో 73 పనులు, మెళియాపుట్టిలో రూ.16 కోట్లు ఖర్చుతో 100 పనులు, ఎల్.ఎన్.పేట మండలంలో రూ.8కోట్లు ఖర్చుతో 46 పనులు, కొత్తూరు మండలంలో రూ.16.50 కోట్లు ఖర్చుతో 88 పనులు, హిరమండలం మండలంలో రూ.7కోట్లు ఖర్చుతో 54 పనులు మంజూరు చేశామన్నారు. వీటిలో 88 శాతానికి మించి పనులు పూర్తయ్యాయన్నారు. 1600 ఇళ్ల ముంగిటకే కుళాయిలు ఏర్పాటు చేయించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పాలన లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత ఇంటి వద్దకు తాగునీరు అందివ్వలేని దుస్థితి ఏర్పడింది ఆరోపించారు. దబ్బపాడు గ్రా మంలో గత కొన్ని నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాతపట్నం ఎమ్మెల్యే స్పందించక పోవటం బాధాకరమన్నారు. ఆమెతో పా టు ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు రెడ్డి రామారావు, వైఎస్సార్ సీపీ మండల ప్రెసిడెంట్ పెనుమజ్జి విష్ణుమూర్తి, మాజీ ఎంపీపీ శిమ్మ సాంబశివరావు, దబ్బపాడు సర్పంచ్ ముద్దాడ మోహిని, ఎంపీటీసీ పల్లి జయలక్ష్మి, పార్టీ నాయకులు కొల్ల కృష్ణ, ఈగల చిన్నారావు, గేదెల శ్రీనివాసరావు, ఎర్ర జనార్థన, కొల్ల లక్ష్మునాయుడు, పల్లి సంజీవ్, ముద్దాడ లక్ష్మణరావు, తలసముద్రం శోభన్‌బాబు పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ఆందోళన చేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి -
వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ హామీ ఏమైంది?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేర కు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కొత్తూరు మండల కేంద్రంలో నిర్వాసితుల ఉద్దేశించి మాట్లాడారని, టీడీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులందరికీ స్పెషల్ ప్యాకేజీ ఇప్పిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గతంలో మీ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ గంపెడు ఆశలతో మీ ప్రభుత్వాన్ని గెలిపించారని అధికారంలోకి వచ్చి సంవత్సర కా లం కావస్తున్నా నిర్వాసితులకు ఇచ్చిన హామీ ఏమైందో తెలియడం లేదన్నారు. సీఎం శ్రీకా కుళం వస్తున్న సందర్భంగా నిర్వాసితులకు ఇచ్చిన హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని బుడగుట్లపాలెంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుడగుట్లపాలెం తీరంలో ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పర్యవేక్షించారు. అధికారుల వెల్లడించిన షెడ్యూల్ మేరకు చంద్రబాబు 12.10 గంటలకు గ్రామ దేవత అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మత్స్యకారులతో ము ఖాముఖి, మత్స్యకార చేయూత పథకం ప్రా రంభం, పార్టీ నాయకులతో సమావేశం నిర్వ హిస్తారు. నిలిచిపోయిన డయాలసిస్ సేవలు కాశీబుగ్గ: పలాస కిడ్నీ ఆస్పత్రిలో నెఫ్రో ప్లస్ వారు నిర్వహిస్తున్న డయాలసిస్ సేవలు శుక్రవారం నిలిచిపోయాయి. మూడు షిఫ్ట్‌లలో జరుగుతున్న డయాలసిస్ సేవలు 10:30 గంటల నుంచి 02 గంటల వరకు సేవలు పునరుద్ధరణ కాలేదు. టెక్నికల్ సమస్య తలెత్తడంతో ఇంజనీరింగ్ అధికారులు వచ్చి మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే పలు మార్లు విద్యుత్, జనరేటర్ సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా తాజాగా మిషనరీలు టెక్నికల్ సమస్య తోడుకావడంతో డయాలసిస్‌కి హాజరైన కిడ్నీ రోగులు పాట్లు పడ్డారు. వారికి సహాయకులుగా వచ్చిన వారంతా రోజంతా నిరీక్షించారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మ జను వివరణ కోరగా డయాలసిస్ ఈ విషయం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని వారిని పిలిపించి మాట్లాడుతానని అన్నారు. ‘ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే’ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాకు ప్రత్యేకంగా ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలుచేయలేదని, ఇప్పుడైనా అమలు చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్య దర్శి వర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. జిల్లాలో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టాలని, కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి 50 ఏళ్లు పూర్తి కావస్తోందని ఆధునికీకరణకు రూ. 1600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2007లో ప్రారంభించిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలన్నారు. -
అసభ్యకర ప్రవర్తన.. హెచ్ఎంకు దేహశుద్ధి
గార: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే తప్పుడు పనులు చేశాడు. చాలాకాలం ఓపిక పట్టి న విద్యార్థినులు తాళలేక తల్లిదండ్రులకు సమాచా రం అందజేశారు. వారు వచ్చి హెచ్ఎంకు దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మండలంలోని వత్సవలస పంచాయతీ మొగదాలపాడు యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొన్ని రోజులుగా 6,7,8 తరగతులకు చెందిన పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ముద్దులు పెట్టడం, తాకకూడని చోట చేతులు వేయడం చేస్తున్నా డు. కొన్నాళ్లు భరించిన విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం పాఠశా లకు వెళ్లి హెచ్ఎం చింతాడ వెంకటేశ్వర్లును నిలదీశారు. ఆయన తల్లిదండ్రులతో వాదనకు దిగడంతో వారు హెచ్ఎంకు దేహశుద్ధి చేశారు. అనంతరం 1098కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో బుధవారం డిప్యూటీ డీఈఓ విజయకుమారి, చైల్డ్‌లైన్ సిబ్బంది పద్నాలుగు మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను విచారించారు. జరిగిన సంఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాఠశాలలోని మిగిలిన ఉపాధ్యాయులను కూడా విచారణ చేయగా, జరిగిన సంఘటన వాస్తవమేనని అధికారులకు తెలిపినట్టు సమాచారం. విచారణ చేశామని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి చర్యలుంటాయని ఎంఈఓ నక్క రామకృష్ణ తెలిపారు. అయితే గురువారం హెచ్ఎంతో పాటు మరికొందరు గ్రామానికి విచ్చేసి గ్రామస్తులను కలసి క్షమించమని వేడుకున్నారు. అయితే బాలికలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో పెద్దలు పిలిచినా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయారు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే రాజీ ప్రయత్నాలు హెచ్ఎం వెంకటేశ్వర్లు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అనుయాయుడు కావడంతో ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జరిగింది ఏదో జరిగిందని రాజీ చేసుకోవాలని సూచిస్తుండటం గ్రామంలో విస్తృతంగా చర్చ జరగుతోంది. -
వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: వక్ఫ్ సవరణ చట్టం– 2025కు వ్యతిరేకంగా గురువారం జిల్లా ముస్లింల ఐక్య సమాఖ్య జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు నివాళులు అర్పించారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం ఏడు రోడ్ల కూడలిలో బయలు దేరి కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటే శ్వరరావుకు జిల్లా ముస్లిం ఐక్య సమాఖ్య జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, సలీం, హాజీ అమీరుల్లా బేగ్, రఫీ, మహీబుల్లా ఖాన్, ముజీబ్, అక్బర్బా షా, మహిళా సోదరీమణులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త చట్టం ముస్లింల హక్కులను కాలరాస్తుందన్నా రు. భవిష్యత్తులో ముస్లింల మనుగడకే ఇబ్బందిగా మారే చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ముస్లింల ర్యాలీకి అన్ని రాజకీయా పక్షాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, సీఐటీయూసీ, ఏఐటీయూసీ నాయకులు సంఘీబావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతులు ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలి
నరసన్నపేట: రైతుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని, దీన్ని ప్రతి రైతూ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ సేవలు పొందాలని నరసన్నపేట వ్యవసాయ అధికారి కె.సునీత తెలిపారు. నేషనల్ టెస్ట్ సర్వేలెన్స్ సిస్టం అనే యాప్‌ను రైతులు డౌన్లోడ్ చేసుకుంటే, ఇందులో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలు ఆయా శాస్త్రవేత్తలు నుంచి పొందవచ్చని తెలిపారు. మడపాం రైతు సేవా కేంద్రంలో కొందరు రైతులతో యాప్ డౌన్లోడ్ చేయించి దీనిపై గురువారం అవగాహన కలిగించారు. ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో 40 మంది రైతులతో ఈ నెలాఖరుకల్లా యాప్ డౌన్లోడ్ చేయించాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు టార్గెట్ ఇచ్చామన్నారు. ఈ యాప్‌లో తమ పంట పొలాల్లో ఉన్న తెగుళ్లు, పురుగులు, భూమిలో లోపాలు వంటివి ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తే ఆయా విభాగాల శాస్త్రవేత్తలు వెంటనే స్పందించి తగు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. రైతులకు ఈ యాప్ ఎంతగాననో ఉపకరిస్తుందని ఆసక్తి గల రైతులు అందరూ తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
తమ్మినేనికి చింతాడ అభినందనలు
ఆమదాలవలస: మాజీ స్పీకర్, శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినే ని సీతారాంను ఇటీవల వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్‌గా పార్టీ అధిష్టానం నియమించిన సందర్భంగా ఆమదాలవలస పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గురువారం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, పార్టీ మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిల ర్లు సాధు కామేశ్వరరావు, నాయకులు ఎస్.రామారావు, పొన్నాడ చిన్నారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆధిపత్యం కోసమేనా..?
ప్రస్తుతం ఉన్న నగర కార్పొరేషన్ కార్యాలయం స్థానంలో కొత్తగా లీజుదారులతో నిర్మాణం చేపడతారని, కిమ్స్ రోడ్డు, రైతు బజారు కూడలి, కిన్నెర థియేటర్, జిల్లా పరిషత్ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చి, అక్కడ నిర్మా ణాలు చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టౌన్ వెండింగ్ కమిటీ వేయడం, అందులో ఎమ్మెల్యే సతీమణితో పాటు పలువురు కీలక వ్యక్తులను నియమించడం చూస్తుంటే కార్పొరేషన్లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా కేంద్రంపై ఆధిపత్యం కోసం స్థానికంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఎప్పుడో 2014–19లో జారీ చేసిన గెజిట్లు, రూపొందించిన చట్టాలను బయటకు తీసి టౌన్ వెండింగ్ కమిటీ పేరుతో ప్రత్యేక కమిటీని నియమించారు. 13 మంది సభ్యులు గల కమిటీలో ఐదుగురు టీడీపీ నాయకులకు చోటు కల్పించారు. వారిలో ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు బీజేపీ, జనసేన నాయకులకు మొండిచేయి చూపడం కూడా సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ కమిటీ వేసింది కమిషనరే అయినప్పటికీ ప్రతిపాదనలు మాత్రం ముమ్మాటికీ కీలక నేతల ద్వారానే జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే సతీమణి స్వాతికి చోటు కల్పించి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. నగర వెండింగ్ కమిటీలో రూరల్‌కు చెందిన స్వాతిని నియమించడం మరింత చర్చకు దారి తీసింది. వీరితో పాటు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన అంధవరపు ప్రసాద్, రెడ్డి గిరిజా శంకర్, ఉంగట రమణ, అల్లు నరససయ్యలకు కూడా కమిటీలో చోటిచ్చారు. టీడీ పీ నుంచి ఐదుగురిని సభ్యులుగా నియమించగా, చైర్మన్‌గా కమిషనర్, మిగతా హోదాల్లో వివిధ అధికారులను నియమించారు. ఈ నెల ఒకటో తేదీనే కమిటీ వేసినప్పటికీ ఇప్పుడిది తెరపైకి వచ్చింది. కమిటీ సభ్యులంతా ఇప్పటికే ఒకసారి సమావేశమై, వివిధ అంశాలపై చర్చించినట్టు కూడా తెలిసింది. చక్రం తిప్పేందుకేనా..? మొత్తానికి పాలకవర్గం లేని కార్పొరేషన్లో వెండింగ్ కమిటీ పేరుతో టీడీపీ నాయకులకు ప్లేస్ కల్పించారు. వారంతా ఏం చేస్తారో అన్నదానిపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా కార్పొరేషన్లో గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్ట్రీట్ వెండర్స్ కమి టీలను నియమించారు. ఇప్పుడా జీఓలను పట్టుకు ని టౌన్ వెండింగ్ కమిటీని నియమించినట్టు తెలుస్తోంది. కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెండర్స్ పేరు కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. వెండర్స్ అంటే సరఫరాదారులు. కానీ, ఇప్పుడు వెండర్స్ అంటే పనులు చేసే వాళ్లుగా చూ పిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు మాదిరిగా టీడీపీ నాయకులను వెండర్స్గా అవతారమెత్తించి, వారిని ప్రత్యేకంగా గుర్తించి, పనులు అప్పగించారు. వారిచేతే పనులు చేపట్టి, బిల్లులు వారికే వేసి లబ్ధి చేకూరుస్తున్నారు. పనుల్లో నాణ్య త, లోపాలు, అక్రమాలు పక్కన పెడితే వెండర్స్‌కు తాజాగా రూరల్ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పథకం పనులు కాసులు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో తాజాగా నియమించిన టౌన్ వెండింగ్ కమిటీ ఏ రకంగా ఉంటుందో అన్నదానిపై చర్చ జరుగుతోంది. స్ట్రీట్ వెండర్స్ కోసం పనిచేస్తుందా? లేదంటే కార్పొరేషన్లో చేపట్టే పనులు, ఇతరత్రా వ్యవహారాలను చూసుకుంటుందా? అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే సతీమణి, నగర కీలక నాయకులే ఉండటంతో కార్పొరేషన్ అంతా వారి కనుసన్నల్లో, డైరెక్షన్లో నడిచే అవకాశమైతే మాత్రం ఉంటుంది. వారిని దాటి అక్కడేమీ జరిగే అవకాశం ఉండదని చెప్పొచ్చు. కొత్త నిర్మాణాల కోసమేనా..? కార్పొరేషన్లో టౌన్ వెండింగ్ కమిటీ ఏర్పాటు సభ్యులుగా టీడీపీ నాయకుల నియామకం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతికి చోటు వీరితో పాటు నలుగురు నాయకులకు, అధికారులకు కమిటీలో స్థానం జనసేన, బీజేపీలకు మొండిచేయి -
● కల్యాణం..కమనీయం..
అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణ సేవ గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఛైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీవారి కల్యాణమూర్తులను అనివెట్టి మండపంలో కొలువుదీర్చి ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణం జరిపించారు. రూ.500 చెల్లించిన భక్త దంపతులకు ఆలయం తరఫున స్వామి వారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు. – అరసవల్లి