
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలోనూ సీఎం చంద్రబాబు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. బాధితులకు పరిహారం సింహాచలం దేవస్థానం నుంచి చెల్లించారను. చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించగా, మొత్తంగా కోటి 78 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి చెల్లింపు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను బాధితులకు ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహార విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన పరిహారాన్ని సింహాచలం దేవస్థానం నుంచి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సింహాచలం ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. చివరికి సింహాచలం ప్రమాదంపై ఉద్యోగులే బలయ్యారు. కూటమి ప్రజా ప్రతినిధులందరూ సేఫ్‌గా బయటపడ్డారు.
ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. ఈవో సహా మరో ఆరుగురు ఇంజనీరింగ్ సిబ్బందిపై వేటు వేయడానికి నిర్ణియించింది. ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్ట్ ఉద్యోగిపైన చర్యలకు సిద్ధమైంది. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు కోవడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. కూటమి నాయకులను తప్పించి అధికారులను బలి పశువుల చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే కమిటీ నివేదిక ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
