Fact Check
-
సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్లలో ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.అయితే ఇది ఫేక్ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck✔️This message is #fake pic.twitter.com/kFVbGje5FB— PIB Fact Check (@PIBFactCheck) December 29, 2024 -
ఎలాన్ మస్క్‌కు ట్రంప్ స్వీట్ వార్నింగ్?
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు?. ‘‘ఇదేం ప్రశ్న!. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ మీద నెగ్గిన డొనాల్డ్ ట్రంప్‌దే’’ అని మీరు అనొచ్చు. కానీ, గత వారం పదిరోజులుగా అమెరికాలో సోషల్ మీడియాలో మరో తరహా చర్చ నడుస్తోంది. ట్రంప్ పేరుకే వైట్‌హౌజ్‌లో అధ్యక్ష స్థానంలో ఉంటారని.. కానీ ఎలాన్ మస్క్ మొత్తం నడిపిస్తారనే ప్రచారం నడిచింది. అయితే..మస్క్ అధ్యక్షుడని.. ట్రంప్ ఉపాధ్యక్షుడంటూ ప్రచారం తారాస్థాయికి చేరడం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఏమాత్రం భరించలేకపోతున్నారట!. అందుకే ఎలాన్ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారట!.ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఓ సందేశం వైరల్ అయ్యింది. దాని సారాంశం పరిశీలిస్తే..‘‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడ్ని నేనే. ఇంకెవరో కాదు. మీడియాగానీ, ఇంకెవరైనాగానీ ఎలాన్ మస్క్ అంతా తానై నడిపిస్తారని ప్రచారం చేయొచ్చు. కానీ, ఇది నా విజన్.. నా నాయకత్వం.. నా అమెరికా. ఎలాన్ మస్క్ నా ఎన్నికల ప్రచారం కోసం సాయం చేసి ఉండొచ్చు.అతను గొప్ప మేధావే కావొచ్చు. కానీ, రాజకీయాలకొచ్చేసరికి నా ఇష్టప్రకారమే నడుస్తుంది. ఎలాన్.. నీ మద్దతుకు కృతజ్ఞతలు. కానీ, అదే సమయంలో నువ్వు గీత దాటొద్దు. అమెరికాను మరింత గొప్పగా తీర్చిదిద్దడమే ఇప్పుడు నా ముందున్న ఆశయం. ఇది అమెరికన్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అంతేగానీ మస్క్ ఇగోకు సంబంధించిన అంశం కాదు’’ అంటూ ఓ సందేశం గత ఐదు రోజులుగా చక్కర్లు కొడుతోంది.అయితే.. ఆ సందేశానికి డొనాల్డ్ ట్రంప్‌నకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అలాంటి సందేశమూ ఒకటి వైరల్ కాలేదు. ఆ ఇమేజ్ను వెరిఫై చేయగా.. ఉత్తదేనని ఫ్యాక్ట్ చెక్(Fact Check)లో తేలింది. అయితే ప్రస్తుత పరిణామాల ఆధారంగానే ఆ సందేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరో వైరల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.అసలు విషయం ఏంటంటే.. సాధారణంగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎవరినీ లెక్కచేయరు. గతంలో అది చూశాం. కానీ, ఈసారి అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్‌కు ప్రపంచదేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్‌తోనూ మాట్లాడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై స్వయంగా మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా హాజరై వీక్షించారు ట్రంప్. ఇక.. కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)కు సహ సారథిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలగజేసుకుంటున్నారనేది ఆ ఆరోపణల సారాంశం. సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే ఓ టెక్ బిలియనీర్ ఆలోచనలే.. జనవరి 20వ తేదీ నుంచి ప్రభుత్వ నిర్ణయాలుగా అమలుకాబోతున్నాయని డెమొక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ వాదనకు బలం చేకూరేలా.. డోజ్తో మొదలుపెట్టి ఆపై వేలుపెట్టి.. అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని ట్రంప్ తన భుజాలకెత్తుకున్నారు. ఇది అంతటితో ఆగలేదు. అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. బిల్లు తెచ్చిన దిగువసభ స్పీకర్ మైక్ జాన్సన్‌పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేశారు. అమెరికా తలపై షట్‌డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్ తెగేసి చెప్పారు. ట్రంప్ సైతం మస్క్ అభిప్రాయంతో ఏకీభవించడంతో రిపబ్లికన్లు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. ద్రవ్య బిల్లులో ఏముందో ఆ పార్టీ సెనేటర్లు మస్క్‌కు చెందిన ఎక్స్(ట్విటర్) ద్వారానే తెలుసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.ట్రంప్ ఏన్నారంటే..ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ సిటీలో ట్రంప్ పాల్గొన్న అమెరికాఫీస్ట్ కార్యక్రమంలో ప్రేక్షకులు ‘అధ్యక్షుడు మస్క్’అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్ స్పందించారు. పీఎం కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారని డెమొక్రాట్ల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్ మాట్లాడారు. ‘‘మస్క్(Musk) ఏనాటికీ అధ్యక్షుడు కాలేడు. నా సీటు భద్రం. ఆయన అమెరికాలో పుట్టలేదుగా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుంది’’అని ట్రంప్ అన్నారు. మస్క్ మనసులో..ఎలాన్ మస్క్(Elon Musk) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ ప్రకటించలేదు. అలాగే.. ట్రంప్‌నకు తన మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. కానీ, దేశ ప్రయోజనాలకంటే మస్క్ సొంత వ్యాపారాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలను మాత్రం ఎందుకనో ఖండించడం లేదు. పైగా ‘అధ్యక్షుడు’ అనే ట్యాగ్ మీద కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా.. ఆర్థిక వ్యవస్థ మస్క్ చేతుల్లోకి వెళ్తుందని ఇటు డెమోక్రాట్లు.. అటు రిపబ్లికన్లు కూడా గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో కొలువుతీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే.. రిపబ్లికన్ పార్టీలో కలకలం రేగడం, వాళ్లిద్దరి మధ్య స్నేహ బంధానికి బీటలు వారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!.చదవండి👉పంజాబ్ పోలీస్ వర్సెస్ బ్రిటన్ ఆర్మీ! -
ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందా?
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయంపై ‘ఈనాడు’ తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్లగక్కింది. 150 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఏటా రూ.3,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జిస్తున్న కంపెనీ రూ.494 కోట్లు సమకూర్చుకోవడం కూడా పెద్ద వింత అయినట్లు ఒక విషపూరిత కథనాన్ని వండివార్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు అంతా ఈనాడుకు చెవిలో చెబుతున్నట్లుగా ‘‘రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అంటూ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ లాంటి సంస్థ దర్యాప్తు చేస్తున్న విషయాలే కాకుండా ఎవర్ని, ఎప్పుడు, ఎలా విచారిస్తారు...? వారిని ఏ ప్రశ్నలు అడుగుతారు? అనే వాటిని కథనంలో ప్రచురించడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగానే విషయాలను ఇలా బయటకు చెబుతుంటే ఆ దర్యాప్తు ఎంత పక్షపాతంతో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు! లేదంటే ఈనాడు తన అజెండాకు అనుగుణంగా ఈడీ పేరుతో ఈ కథనాలను వండివార్చి ఉండాలి. ఈ రెండింటిలో ఏది నిజమైనా ఈనాడు ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి అజెండాకు డప్పు కొడుతుందో ఊహించవచ్చు!!అది వ్యూహాత్మక పెట్టుబడిఅరో ఇన్ఫ్రా వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగా కాకినాడ డీప్ వాటర్‌పోర్టులో వాటాలు కొనుగోలు చేసింది. పోర్టులో 41 శాతం వాటాలను కేవీ రావు పూర్తి సమ్మతితోనే 2020లో విక్రయించడంతో పాటు ఆ వాటాల విలువ రూ.494 కోట్లను స్వీకరించారు. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు దగ్గరలోనే కాకినాడ సెజ్‌ను రూ.1,700 కోట్లకు కొనుగోలు చేయడంతో పాటు ఆ సెజ్‌లో రూ.2,400 కోట్లతో మరో పోర్టును కూడా అరో ఇన్ఫ్రా నిర్మిస్తోంది. ఇదంతా వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికలో భాగంగా జరిగింది.సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన ( రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. ఒకవేళ బెదిరించి ఉంటే మొత్తం పోర్టునే స్వాధీనం చేసుకుని ఉంటారు కదా! 41 శాతం వాటా కొనుగోలు తర్వాత కూడా పోర్టు యాజమాన్య హక్కులు కేవీరావు చేతిలోనే ఉన్నాయి కదా. ఆయన్ను నిజంగానే బెదిరించి ఉంటే అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్సŠచ్ంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ), నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(ఎన్ఏఎల్ఎస్ఏ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు.న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కేవీ రావుకు అభ్యంతరం ఉంటే వాటాల బదిలీ పూర్తయ్యేలోగా వివిధ దశల్లో ఎప్పుడైనా సరే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన ఏ దశలో కూడా ఫిర్యాదు చేయలేదు. అంటే ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలను విక్రయించారన్నది స్పష్టమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేశారంటే దీని వెనుక కుట్రను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆడిట్ సంస్థను ఎంపిక చేసేది ఆ శాఖ కార్యదర్శిప్రభుత్వాలు వివిధ విభాగాల్లో ఆడిటింగ్ నిర్వహించడం సాధారణం. ఏదైనా విభాగంలో ఆడిటింగ్ నిర్వహించాలంటే ఆ శాఖకు చెందిన కార్యదర్శి ఆడిటింగ్ సంస్థను ఎంపిక చేస్తారు. ఇక్కడ కూడా అదే విధంగా పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ అనే ఆడిటింగ్ సంస్థను ఎంపిక చేశారు. ఆ ఆడిటింగ్ సంస్థకు, విజయసాయిరెడ్డికి ఏమిటి సంబంధం? లేని సంబంధాలను అంటగట్టి మసిబూసి మారేడు కాయ చేయాలని, తద్వారా ఎల్లో గ్యాంగ్‌కు ప్రయోజనం కలిగించేందుకు ఈనాడు పడరానిపాట్లు పడుతోంది.తప్పుడు ఫిర్యాదు... వెంటనే కేసుఅనంతరం అసలు పాత్రధారి తెరపైకి వచ్చారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన అరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన నాలుగేళ్ల తరువాత ఫిర్యాదు చేయడం చంద్రబాబు పక్కా కుట్రను స్పష్టం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే... కేవీ రావు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు చేసిన ఈ నెల 2నే సీఐడీ కేసు నమోదు చేసేయడం గమనార్హం ప్రైవేట్ ఒప్పందంతో ప్రభుత్వానికి ఏం సంబంధం?అరబిందో సంస్థ 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందింది. ఏటా రూ.72 వేల కోట్ల టర్నోవర్, రూ.3 వేల కోట్ల నికర లాభం నమోదు చేస్తోంది. ఆ వ్యాపార లావాదేవీ పూర్తిగా అరబిందో సంస్థ, కేవీ రావు మధ్య జరిగిన ప్రైవేట్ ఒప్పందం. అందులో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికిగానీ, ఇతరులకుగానీ ఎలాంటి సంబంధం లేదు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో తల దూర్చడం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దందా సాగిస్తుండటం విభ్రాంతికరం. రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జోక్యం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతకుముందు జరిగిన ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ?ప్రభుత్వ పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది బాబేకాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నది అసలు వాస్తవం. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా కట్టబెట్టేశారు. కానీ తరువాత అసలు విషయం వెలుగు చూసింది. మలేషియా కంపెనీ ముసుగులో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు ఆ పోర్టును దక్కించుకున్నట్లు బయటపడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.అంతా బాబు కుట్ర స్క్రిప్టే...కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాను తెరపైకి తెచ్చి జనసేనలోని తన కోవర్ట్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కాకినాడ పర్యటనకు పంపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు చేరుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో డ్రామా పండించారు. యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే వారు ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబునే కదా!! -
డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే..
ఈరోజుల్లో జేబులో కరెన్సీ లేకున్నా.. ధైర్యంగా అడుగు బయటపెట్టొచ్చు!. బ్యాంక్ బ్యాలెన్స్, ఓ స్మార్ట్‌ఫోన్.. దానికి ఇంటర్నెట్ ఉంటే చాలూ!. మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా సెకన్లలో పేమెంట్లు చకచకా చేసేయొచ్చు. రూపాయి దగ్గరి నుంచి మొదలుపెడితే.. పెద్ద పెద్ద అమౌంట్ల చెల్లింపులకు రకరకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నాం. అంతగా డిజిటల్ చెల్లింపులు మన జీవనంలో భాగమయ్యాయి. అయితే ఈ చెల్లింపులపై ట్యాక్స్ విధింపు సబబేనా?.. ప్రస్తుతం దేశంలో చాలావరకు జనం డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లె నుంచి పట్నం దాకా అందరికీ ఇది అలవాటైంది. మార్కెట్లలోనే కాదు, గ్యాస్, కరెంట్.. అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ, కేంద్రం ఇప్పుడు వీటిపై ట్యాక్స్ విధించబోతోందట. ప్రత్యేకించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) యాప్‌ల ద్వారా చెల్లింపులపైనే ఈ పన్ను విధింపు ఉండనుందట!. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్‌పే, మరేయిత యూపీఐ యాప్ ద్వారాగానీ పేమెంట్ చేశారనుకోండి.. దానిపై ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతోంది. మీరూ వాటితోనే చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా 2 వేల రూపాయలకు పైన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 1.1 శాతం టాక్స్ పడుతుందట. ఎవరికైనా 10 వేల రూపాయలు పంపిస్తే, ట్యాక్స్ రూపంలో 110 రూపాయలు కట్ అవుతుందని.. కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ,ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త మాత్రమే. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. వీటిని అదనంగా.. కొందరు వీడియోలను యాడ్ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ప్రచారంపై మీకు స్పష్టత ఇవ్వబోతున్నాం.అదొక ఫేక్ వార్త. పైగా ఇలాంటి వార్తే 2023-24 బడ్జెట్ టైంలోనూ వైరల్ అయ్యింది. ఆ టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ వాలెట్లు, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్.. PPIని ఉపయోగించి చేసే లావాదేవీలకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది. ‘కొత్త ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు PPI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు’ అని స్పష్టం చేసింది. .@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck➡️There is no charge on normal UPI transactions. ➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023సాధారణ UPI పేమెంట్లకు, PPI పేమెంట్లకు మధ్య తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గందరగోళం నెలకొంటోంది. పైగా కొన్ని ప్రముఖ ఛానెల్స్, వెబ్సైట్లు ఎలాంటి ధృవీకరణ లేకుండా గుడ్డిగా.. డిజిటల్ పేమెంట్లపై బాదుడే బాదుడు అంటూ కథనాలు ఇచ్చేయడం గమనార్హం. -
‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ చక్కర్లు
జయశంకర్, సాక్షి: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్.. వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్ జోన్‌గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్ జోన్ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్ చేయండి -
డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్..
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పదును పెడుతున్నారు. ఓవైపు ఎన్నికల హామీలు గాలికి వదిలేసి మరోవైపు యథేచ్ఛగా దోపిడీకి తెర తీసిన ప్రభుత్వ పెద్దలు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుతంత్రాలు పన్నుతున్నారు. అందులో తాజా అంకమే ‘కాకినాడ పోర్ట్ వద్ద బియ్యం రాద్ధాంతం’! చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలో తన కోవర్టు, మంత్రి నాదెండ్లను ముందుపెట్టి పక్కా పన్నాగంతో సాగించిన డైవర్షన్ రాజకీయ కుట్ర ఇది. మోకాలికి, బోడుగుండుకూ ముడిపెడుతూ చంద్రబాబు డైరెక్షన్లో పవన్, నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం కూటమి పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. పూర్తిగా అవాస్తవాలు, దుష్ప్రచారంతో సాగిన ఈ హైడ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్ట్ నుంచే ఎగుమతి కాకినాడ సీవాటర్ పోర్ట్‌పై నిరాధార ఆరోపణలతో డ్రామా రేషన్‌బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కాకినాడ హైడ్రామా ఎపిసోడ్ తేల్చి చెబుతోంది. ఎందుకంటే.. కాకినాడ డీప్‌వాటర్ పోర్ట్ వేరు... కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వేరు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఆ పోర్ట్ నుంచే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఆ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీయాలి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తమను తాము నిలదీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రం కాకినాడ సీ పోర్ట్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కన్షార్షియాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉంది. అదికూడా కేవలం 41 శాతం వాటా మాత్రమే ఉన్న మైనారిటీ షేర్ హోల్డర్ అరబిందో సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం మరో విచిత్రం. సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి లోడింగ్ దేశంలో అన్ని పోర్టుల నుంచి బియ్యం సహా వివిధ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. షిప్పుల్లోకి లోడింగ్ చేసేముందు సమగ్రంగా తనిఖీలు చేసే వ్యవస్థ ఉంది. కేంద్రానికి చెందిన కస్టమ్స్, పోర్ట్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. అందుకోసం నిర్దిష్ట కస్టమ్స్ ప్రోటోకాల్ ఉంది. ఎగుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు ఎగుమతి చేసే సరుకును కూడా పరీక్షిస్తారు. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించిన తరువాతే ఎగుమతి కోసం షిప్పుల్లోకి లోడ్ చేసేందుకు అనుమతిస్తారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసేందుకు యత్నిస్తే వారు ముందుగానే పోర్టుల వద్దే నిలిపివేస్తారు కదా! అటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. అన్ని వ్యవస్థలు చంద్రబాబు చేతిలోనే..రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు, పౌర సరఫరాల శాఖ, వివిధ చెక్ పోస్టులు... అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాయి. ఇక స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోర్టుల వద్ద కేంద్రీకృతమైన కస్టమ్స్, షిప్పింగ్ శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది కూడా టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే కదా! మరి రాష్ట్రం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదీ... టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదీ అవుతుంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది ఎవరిని? ముందుగా తన పారీ్టకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను... తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును...! ఇంకా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్దకు వెళ్లి హైడ్రామా చేయడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకేనన్నది సుస్పష్టం. కూటమి నేతలే రేషన్ మాఫియా లీడర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కనీసం తనిఖీలు చేయకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు రాచబాట పరుస్తున్నారు. అలా అక్రమంగా భారీస్థాయిలో తరలించిన రేషన్ బియ్యాన్ని పయ్యావుల కేశవ్ వియ్యంకుడు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులకు చెందిన సంస్థల ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద రాజకీయ డ్రామాతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నించారు. పౌరసరఫరాలు, రవాణా, రెవెన్యూ, హోం, విజిలెన్స్ శాఖలే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి. మరి అక్రమ రవాణా సాగుతోందంటే పవన్ కళ్యాణ్ ముందుగా నిలదీయాల్సింది తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌నే! ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కుట్రే హామీల అమల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పాల్పడుతోంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ధాన్యం కొనుగోలులో వైఫల్యంపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారానే ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్బీకేల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 75 కిలోల బస్తాను రూ.400 తక్కువకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ–క్రాప్ అమలు చేయడం లేదు. మరోవైపు మిల్లర్ల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భారీ కమీషన్ల డీల్ కుదుర్చుకుంది. మిల్లర్లకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు 8 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు బేరం పెట్టారు. అనంతరమే మొదట విడతగా ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేశారని మిల్లర్లే చెబుతున్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ‘బియ్యం’ డ్రామను మొదలెట్టారు.మద్యం.. ఇసుకలో దోపిడీ ఇతరులెవరూ మద్యం టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో బెదిరించి అడ్డుకుని మరీ టీడీపీ పెద్దలు దోపిడీకి రాచబాట పరిచారు. వేలం పాటలు నిర్వహిస్తూ మరీ బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ పెద్దలు ఇసుక రీచ్‌లను ఏకపక్షంగా దక్కించుకుని భారీ దోపిడీకి తెగించారు. ఓ వైపు ప్రభుత్వం ఏటా రూ.750 కోట్ల ఆదాయం కోల్పోతోంది. మరోవైపు ఇసుక రేట్లు భారీగా పెంచేసి సాగిస్తున్న దోపిడీతో టీడీపీ కూటమి పెద్దల సొంత ఖజానా నిండుతోంది. వలంటీర్ల జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అసలు వలంటీర్ల వ్యవస్థే లేదని ప్రకటించి వారిని రోడ్డున పడేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో నీటినిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయాలన్న నిర్ణయంతో కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర ద్రోహానికి పాల్పడ్డాయి. ఈ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడలో సాగించిన రాజకీయ డ్రామా అందులో భాగమేనన్నది తేటతెల్లమవుతోంది. పయ్యావుల కేశవ్ వియ్యంకుడి సంస్థ బియ్యం తరలిస్తున్న షిప్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు? కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్ద లంగరు వేసి ఉన్న స్టెల్లా షిప్ వద్ద హైడ్రామా చేసిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్... ఆ సమీపంలోనే లంగరు వేసి ఉన్న ఎంవీ కెన్స్టర్ అనే షిప్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన సంస్థ ఆ షిప్ ద్వారానే బియ్యాన్ని నైజీరియాకు ఎగుమతి చేస్తోంది. ఆయనకు చెందిన పట్టాభి ఆగ్రో సంస్థ కాకినాడ పోర్ట్ నుంచి నైజీరియాకు 42,500 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఆ షిప్‌ను మాత్రం పవన్ కళ్యాణ్, నాదెండ్ల తనిఖీ చేయలేదు. కేవీ రావు సంస్థ చేతిలోనే కాకినాడ పోర్ట్ యాజమాన్యంఅరబిందో బెదిరించి ఉంటే ఏకంగా 51శాతం వాటా తీసుకునేవారు కదాబెదిరిస్తే ఫ్రీగానే వాటాలు తీసుకునేవారు కదాకాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో వాటాల అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా ప్రైవ్రేటు వ్యవహారం. పోర్ట్ ప్రమోటర్ కేవీ రావు నుంచి 41శాతం వాటాను మాత్రమే అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. మిగిలిన 59 శాతం వాటా కేవీ రావు సంస్థ వద్దే ఉన్నాయి. అంటే కాకినాడ డీప్‌వాటర్ పోర్ట్‌పై యాజమాన్య హక్కులు ఇప్పటికీ కేవీ రావు సంస్థ చేతిలోనే ఉన్నాయి. పోర్ట్ వ్యవహరాల్లో నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకే ఉంది. పోర్ట్ ఎండీగా కేవీ రావే ఉండగా... సీఈవో, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. అలాంటిది అరబిందో సంస్థ బెదిరించి పోర్ట్‌లో వాటాలు కొనుగోలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అసత్య ఆరోపణలు చేయడం మరీ విడ్డూరంగా ఉంది. అంతగా బెదిరించి వాటాలు కొనుగోలు చేసి ఉంటే... డబ్బులు ఇచ్చి ఎందుకు వాటాలు కొంటారు..? ఫ్రీగానే తీసేసుకునేవారు కదా. కనీసం మెజార్టీ వాటాలు అంటే 51శాతం వాటాను దక్కించుకునేవారు కూడా. దాంతో పోర్ట్ వ్యవహారాల్లో నిర్ణయాధికారం కూడా అరబిందో సంస్థకే దక్కేది. అంతేగానీ పోర్టుపై నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకు ఎందుకు విడిచిపెడతారు...! కానీ అరబిందో సంస్థ 41శాతం వాటానే కొనుగోలు చేసి పోర్టులో మైనార్టీ పార్టనర్‌గానే ఉంది. మిగిలిన 59శాతం వాటా కలిగిన కేవీ రావు సంస్థే పోర్ట్‌పై నిర్ణయాధికారాన్ని అట్టిపెట్టుకుంది. వాస్తవాలు ఇవీ...కానీ వాటిని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని మభ్యపెట్టేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు లావాదేవీల్లో చంద్రబాబు ప్రభుత్వ జోక్యం ఎందుకో...! కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో నిర్వర్తించాల్సి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి... కానీ వాటిని విస్మరించి రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతుకుముందు ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ? ఐదేళ్ల తరువాత మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి గతంలో తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది చంద్రబాబే అసలు కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసిందే గతంలో చంద్రబాబు ప్రభుత్వమేననే వాస్తవాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ప్రస్తుతం కూడా చంద్రబాబు అదే కుట్రతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తన బినామీలపరం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా ప్రభుత్వ పోర్టులను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు గతంలో ధారాదత్తం చేసిన... ప్రస్తుతం మరో మూడు పోర్టులను కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు అసలు కుంభకోణానికి పాల్పడినట్టు అవుతుంది కదా..! నిలదీయాల్సింది చంద్రబాబునే కదా...! -
ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(EVM)ల పనితీరుపై రాజకీయ వర్గాల్లోనే కాదు.. జనాల్లోనూ చాలా అనుమానాలే ఉన్నాయి. ఊహించని రీతిలో వెలువడే ఫలితాలే.. ఆ అనుమానాల్ని బలపరుస్తుంటాయి. అలాంటప్పుడే గో బ్యాక్ టూ బ్యాలెట్ పేపర్ అనే వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే లోపాల సంగతిని పక్కనపెట్టి.. అవకతవకలకు ఆస్కారం లేదంటూ ఎన్నిక సంఘం, కేంద్రం వాటి వినియోగాన్ని సమర్థిస్తుంటాయి. తాజాగా.. ఇవాళ సుప్రీం కోర్టు సైతం బ్యాలెట్ పేపర్లను వెనక్కి తేలేమంటూ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే..మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాఢి ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 16 స్థానాల్లో గెలిచింది. ఓడినవాళ్లలో.. దూలే రూరల్ నుంచి పోటీ చేసిన కునాల్ పాటిల్ కూడా ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర పాటిల్ చేతిలో ఓటమి చెందారు. అయితే..కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో జనం ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ గ్రామంలో.. కునాల్‌కు జీరో ఓట్లు వచ్చాయని, అందుకే ఈవీఎంలకు వ్యతిరేకంగా వాళ్లు నిరసన తెలుపుతున్నారనేది ఆ వీడియో సారాంశం. అయితే..ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ.. ఈవీఎంల పని తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీళ్లలో యూపీ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పాన్ఖురి పాథక్ కూడా ఉన్నారు. గ్రామంలోని 70 శాతం జనాభా కునాల్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలను బీజేపీ తప్పుడుగా ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. కానీ..In Maharashtra people are out on the streets protesting against EVM manipulation... Will any Godi Media channel dare to show this ?NO. https://t.co/yTtAyoqav0— Pankhuri Pathak पंखुड़ी पाठक پنکھڑی (@pankhuripathak) November 25, 2024ఎన్నికల సంఘం ఆ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. అవధాన్లో కునాల్ పాటిల్‌కు 1,057 ఓట్లు పోలయ్యాయని ధూలే జిల్లా ఎన్నికల కార్యాలయం ప్రకటించింది. అలాగే.. రాఘవేంద్ర పాటిల్‌కు ఇక్కడ 1,741 ఓట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో.. ఆ వీడియో ఫేక్ అనేది స్పష్టమైంది.నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. నవంబర్ 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ధూలే రూరల్ నియోజకవర్గంలో రాఘవేంద్ర పాటిల్‌కు 1,70,398 ఓట్లు, కునాల్ పాటిల్‌కు 1,04,078 ఓట్లు పడ్డాయి. -
ఏది నిజం?: సౌర విద్యుత్ మేమే ఇస్తాం
‘‘చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక ధరలకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పటికి మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేశారు. ఒకపక్క మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దాన్ని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకోవడంలో ఆంతర్యమేమిటి? అది కదా అసలు సిసలైన కుంభకోణం..! దీన్ని ప్రశ్నించే సాహసం ఈనాడు ఏనాడైనా చేసిందా?’’‘‘అసలు అదానీతో ఒప్పందం చేసుకోవాలనిగానీ, భారీగా లంచాలు పొందాలనిగానీ అప్పటి ప్రభుత్వం అనుకుంటే సంస్థలతోనే నేరుగా చేసుకునేవారు గానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఎందుకు చేసుకుంటారు? ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేట్ సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా?’’రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే టెండర్లు పిలిచినా వాటిపై చట్టపరంగా సమస్యలు వచ్చాయి. ఆ తరుణంలో కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని లేఖ రాసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌పై ముందుచూపు, రైతులకు 25 ఏళ్ల పాటు మంచి చేయాలనే జగన్ సర్కారు సంకల్పాన్ని అభినందిస్తూ నాడు సెకీ లేఖ రాసింది. డిస్కమ్‌లపై ఆర్థిక భారం పడకుండా, రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. అదే సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి. అప్పుడు ఇదే ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తక్కువకు ఇస్తామన్నా సెకీ విద్యుత్‌ను ఎందుకు తీసుకోలేదని బురద చల్లేవి కాదా?సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ తామే పాతికేళ్లపాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానే ముందుగా ప్రతిపాదించింది. అందుకు 2021 సెపె్టంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్‌ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెపె్టంబర్లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్‌కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది. కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! చంద్రబాబు కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల డిస్కమ్‌లపై తీవ్ర ఆర్ధిక భారం పడింది. దీనివల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో సోలార్ పార్క్‌లను అభివృద్ధి చేయాలని 2020లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో 2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) టెండర్లు పిలిచింది. చదవండి: నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!యూనిట్ రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలు అయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అదే సమయంలో అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆరి్థకంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా?తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి. ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. చదవండి: చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీతో ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల ఆమోదం కూడా లభించింది. ఈ ఒప్పందాల్లో ఎక్కడా అదానీ గ్రూపునకు చెందిన సంస్థలతోగానీ అనుబంధ కంపెనీలతోగానీ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇక అవినీతి ఎక్కడుంది? అసలు లంచాలకు ఆస్కారం ఏముంది? -
నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!
‘‘రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా?’’సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై గత సర్కారు దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అంతేకాకుండా అప్పటికి యూనిట్ రూ.5.10 చొప్పున కొంటున్నారు. సెకీ విద్యుత్ తీసుకోకపోతే ఏటా రూ.3,750 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ తీసుకోకుంటే ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసేది? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? అదానీతో దీనికి ఏం సంబంధం? ఇక సెకీ రాసిన లేఖకు కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి సైతం ఆమోదం తెలిపాయి. ఇవి రెండూ కేంద్ర సంస్థలే. ఆ ఒప్పందంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టే అనుమతిచ్చాయి. ఇంత గగ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా చంద్రబాబు అత్యధిక ధరలతో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటే ఏనాడైనా కనీసం ఒక్క కథనమైనా రాసిందా? అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దాన్ని జగన్‌కు ముడిపెట్టి విషప్రచారం చేస్తూ.. టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు పుంఖాను పుంఖాలుగా అసత్యాలను వండి వార్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న అశేష జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని బెంబేలెత్తుతున్న ఈనాడు ఎక్కడో అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థ..సెకీ ‘ట్రిపుల్ ఏ’ రేటింగ్ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి నేరుగా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునేలా ఒప్పందం చేసుకుంటేనే ఇన్ని నిందలేస్తున్న ఈనాడు ఇక చంద్రబాబులా ఏ ప్రైవేట్ కంపెనీలతోనో డీల్ కుదుర్చుకుంటే ఇంకెంత శివాలెత్తిపోయేదో! గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. నేరుగా సెకీతో ఒప్పందం చేసుకుంది. దీంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టిన ఈనాడు... గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానీతో కుదుర్చుకున్నట్లు, అందుకోసమే ఆ కంపెనీ జగన్‌కు లంచాలిచ్చినట్లు దిగజారుడు రాతలకు తెగబడింది. ఇంతకన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా? దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా పరిగణిస్తూ.. దానికి అహర్నిశం పాటుపడిన జగన్‌పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా విషపూరిత కథనాలను ఏమనుకోవాలి? తప్పయితే ‘సీఈఆర్సీ, ఏపీఈఆర్సీ’ ఎందుకు అనుమతిస్తాయి?2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీతో ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విద్యుత్ కొనుగోలు మొదలు కావాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. సెకీ విద్యుత్‌కు అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు ఉండవని ఈ ఏడాది ఆగస్టు 13న ఏపీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంతకు ముందే అంటే 2021 జనవరి 15నే వెల్లడించింది. మరి ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ సంస్థలు అనుమతించిన ఒప్పందం తప్పంటారా? ఏదైనా అవినీతి జరిగి ఉంటే అక్కడే తేలిపోయేది కదా?చదవండి: సౌర విద్యుత్ ఇస్తామని చెప్పింది సెకీనేఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంటే నష్టమంటారా? ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 చొప్పున అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్ రూ.2.49కే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్‌కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్ల మేరకు ఆదా అవుతోంది. కానీ ఈనాడు మాత్రం పాతికేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు నష్టమంటూ నోటికొచ్చిన లెక్కలు రాసుకొచ్చింది. ఆ తప్పుడు లెక్కల వెనుక అసలు ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించలేరనుకుంటోంది.ప్రయోజనాలు ఎక్కువ గనుకే ఒప్పందం..సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలను చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులను నెలకొల్పితే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువ వ్యయం అవుతోంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత సెకీ ప్రతిపాదనకు గత మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెకీ ధర కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయంటూ ఈనాడు రాసుకొచ్చింది. రాజస్థాన్‌లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. కానీ అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 23.5 శాతం. ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా?యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదిటీడీపీ హయాంలో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ ఛార్జీలతో కలిసి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది! అయినా సరే ఈనాడుకు అది ఏనాడూ కనపడకపోవడం విచిత్రం! ఇక పవన విద్యుత్తుకైతే యూనిట్‌కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో పీపీఏలు చేసుకున్నారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 17,731 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. అందులో 12,190 మెగావాట్లు థర్మల్, 275.78 మెగావాట్లు ఇతర విద్యుత్ కాగా మిగిలింది పునరుత్పాదక విద్యుత్. 2014 జూన్‌లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి మొత్తం గరిష్ట డిమాండ్ 13,404 మెగావాట్లు మాత్రమే. అయినా సరే టీడీపీ ప్రభుత్వం నాడు హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకుంది. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటం చిత్రమే! చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అది కూడా దశాబ్దాల పాటు భరించాలి. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కంలు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ప్రత్యక్షంగా, ప్రజలపై పరోక్షంగా ఇంత పెద్ద భారాన్ని మోపడానికి చంద్రబాబు సిద్ధపడ్డారంటే దాన్ని మించిన కుంభకోణం ఇంకేముంటుంది? -
యెల్లో జ్యోతి... ఇదేం పైత్యం?
చంద్రబాబు భజన చేస్తూ... వార్తలను, వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తనవంకర బుద్ధిని బయటపెట్టుకుంది. టీడీపీ సేవలో తరిస్తూ సాక్షి మీడియాపై పడి ఏడ్చే ఆ పత్రిక, టీవీ యాజమాన్యం డిజిటల్ మీడియాపై కనీస అవగాహన లేకుండా ‘సాక్షి’కి వ్యతిరేకంగా వార్తలను వండి వార్చుతోంది. వ్యూస్‌ను, ట్రాఫిక్‌ను పెంచుకొనేందుకు ‘సాక్షి’ కుట్ర పన్నిందనీ... సాక్షి వెబ్సైట్ వార్తల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌లైన్ వాడుతున్నారనీ ఎల్లో పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించడమే కాకుండా... రెండు రోజులపాటు ఏబీఎన్ చానల్లో అర్థంపర్థం లేని చర్చలను నడిపించింది. డిజిటల్ జర్నలి జంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు? ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు? అసలు గూగుల్ ఎనలటిక్స్, వెబ్సైట్ మెట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్న పరిజ్ఞానం లేకుండా ‘సాక్షి’పై విషం చిమ్మే ప్రయత్నం మొదలుపెట్టింది.ఎవరైనా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కనిపించేలా సాక్షి డాట్ కామ్‌లో ఏర్పాటు చేసుకున్నారంటూ బుర్ర తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా. ఇలా చేయడం ద్వారా ఏబీఎన్ ట్రాఫిక్ మొత్తం ‘సాక్షి’కి వచ్చేస్తుందట. ఇంతకంటే అవగాహనా రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా? వినేవాళ్లు ఉంటే పచ్చ పత్రికలు, చానళ్లు ఏదైనా చెబుతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాస్తవానికి సాక్షి డాట్ కామ్ వెబ్ ట్రాఫిక్ ఎప్పుడూ ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో ఉంటుంది. ప్రజల ముందు వార్తలతోపాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి డాట్ కామ్‌కు ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ లేదు. వెబ్సైట్ ఎనలటిక్స్‌ను బేరీజు వేసుకుంటే ఆ అంకెలే చెబుతాయి సాక్షి స్థాయి ఏమిటో. అలాంటిది పచ్చ పత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసుకొనేందుకు కుట్రలు చేయాల్సిన ఖర్మ సాక్షి మీడియాకు లేనేలేదు. అసలు టెక్నికల్‌గా, లాజికల్‌గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్‌గా జత చేస్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసే రాజకీయ విష ప్రచారానికి కౌంటర్‌గా సాక్షి డాట్ కామ్‌లో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం అనైతికం, కుట్ర అని ఏబీఎన్ ఆంధ్ర జ్యోతికి అనిపిస్తే... డిజిటల్ మీడియా గురించి వాళ్లకు ఓనమాలు కూడా తెలియవనే అనుకోవాలి. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు చెందిన పేర్లు, ట్యాగ్‌లను సహజంగా ఉప యోగించదు అన్నది నిజమేగానీ... ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తను ప్రజలకు చేర్చాలనుకున్నప్పుడు ఆ పేర్లు లేకుండా... వాటిని ట్యాగ్ లైన్స్‌లో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబీఎన్ మేధావులకే తెలియాలి.ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తు న్నాయో పాఠకులకు, వీక్షకులకు తెలియనిది కాదు. ఎల్లో మీడియా చేస్తున్న రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచుతోంది. అందులో భాగంగా ఏబీఎన్ మాత్రమే కాదు... ఏ ఇతర మీడియా సంస్థ అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు, వీక్షకులకు నిజం చెప్పడంలో ‘సాక్షి’ ముందుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టే ఆంధ్ర జ్యోతి కంటే సాక్షి డాట్ కామ్ డిజిటల్ రేటింగ్స్‌లో ముందుంది. కేవలం సాక్షి మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఆంధ్ర జ్యోతి చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించరు.– వర్ధెల్లి మురళి ఎడిటర్, సాక్షి -
ప్రతి పేద కుటుంబానికీ రూ.46,715.. నిజమేనా?
‘దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ ఇదీ వాట్సాప్‌లో విస్తృతంగా చలామణి అవుతోన్న ఓ సందేశం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. నిజమా.. ఫేకా అన్నది తేల్చేసింది.దేశంలో రోజుకో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చిన వార్తలను కొందరు అవగాహనలేని వాళ్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వార్త ఒకటి వాట్సాప్‌లో హల్ చల్ చేస్తోంది. దేశంలోని ప్రతి పేద కుంటుంబానికీ కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,715 ఆర్థికసాయం అందిస్తోందనేది దాని సారాంశం. అంతటితో ఆగకుండా వ్యక్తిగత వివరాలను కోరుతూ ఓ లింక్ సైతం అందులో ఉంది.ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనేది చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికార లింక్‌లలో వ్యక్తగత వివరాలను అందిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.A #WhatsApp message with a link claims to offer financial aid of ₹46, 715 to the poor class in the name of the Ministry of Finance and, is further seeking the recipient's personal details#PIBFactCheck✔️This message is #FAKE✔️@FinMinIndia has announced no such aid! pic.twitter.com/rFrYeBsbfd— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2024 -
కాకి దేశభక్తి.. అసలు సంగతి ఇది!
తిరువనంతపురం: కేరళలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు అద్భుతం జరిగిందట. ఓ స్కూల్లో పిల్లలు, టీచర్లు కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అయితే జెండా పైకి వెళ్లిన తర్వాత కూడా తెరచుకోకుండా ముడుచుకునే ఉంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందోగాని ఓ కాకి సూపర్ హీరోలా వచ్చి ముడుచుకున్న జెండాను ముక్కుతో పూర్తిగా విప్పి తుర్రుమని ఎగిరిపోయింది. Kerala - National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK— Shilpa (@shilpa_cn) August 16, 2024దీంతో జెండా రెపరెపలాడి అక్కడున్నవారిపై పూల వర్షం కురిసింది. అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్ సీన్‌ను తలపించిన ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ పోస్టు చేయగా వైరల్‌గా మారింది అంటూ ఓ వీడియో చక్కర్లు కొట్టింది. పక్షి జెండాను రెపరెపలాడించిన ఈ వీడియో చూసిన వారు ఆసక్తికర కామెంట్లు పెట్టారు. గాడ్స్‌ఓన్ కంట్రీ కదా అలాగే జరుగుతుందని ఒకరు, గత జన్మలో ఆ పక్షి దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుడేమో అని మరొకరు ఇది నిజంగా అద్భుతమని ఇంకొకరు కామెంట్ చేశారు. Fact Check: అయితే అసలు విషయం ఏంటంటే.. ఆ కాకి వెనకాల ఉన్న చెట్టు మీద వాలింది. జాతీయ జెండాను ఎగరేసిన వ్యక్తి ఎవరో.. దాన్ని బలంగా లాగడం వల్లే తెరుచుకుంది. ఈలోపు ఆ అలికిడికి చెట్టు మీద కాకి జడుసుకుని ఎగిరిపోయింది. జెండా కర్రను డిఫరెంట్యాంగిల్లో చూపించడంతోనే అలా పక్షి ఎగరేసిన జెండా కథనం వైరల్ అయ్యింది.Is that the bird unfurling the flag? No.It's the camera angle. pic.twitter.com/on3BlxJs6U— Mohammed Zubair (@zoo_bear) August 17, 2024 -
పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ఏమేరకు ప్రామాణికమైందో ప్రశ్నార్థకంగా మారింది. సరైన సమాచారం ఇవ్వకపోయినా ఫర్వాలేదు..కానీ తప్పుడు సమాచారంతో మరింత ప్రమాదం చేకూరుతుంది. విద్యార్థి దశలోనే దానిపై సరైన అవగాహన పెంపొందించుకుంటే మేలని కేరళ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థుల సాధికారత కోసం కేరళ జనరల్ ఎడ్యుకేషన్ విభాగం ఐదు, ఏడో తరగతుల్లోని ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ‘ఫ్యాక్ట్ చెకింగ్’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇది నకిలీ వార్తలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో నిజాలను నిర్ధారించుకోవడానికి ఎంతో సహాయపడుతుందని చెప్పాయి.ఈ సందర్భంగా కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) సీఈఓ కె.అన్వర్‌సాదత్ మాట్లాడుతూ..‘ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి ఐదు, ఏడో తరగతి విద్యార్థుల ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఆన్లైన్ ‘ఫ్యాక్ట్ చెకింగ్’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టాం. గతంలో ఏర్పాటు చేసిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం స్ఫూర్తితో దీన్ని ప్రారంభించాం. నకిలీ వార్తలు, హానికరమైన కంటెంట్‌ను గుర్తించేందుకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. చదువుకునే దశలోనే నకిలీ సమాచారంపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఆరు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు సంబంధించి ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు సాగుతున్నాయి. ఇందుకోసం అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సహాయం తీసుకుంటున్నాం. ఏడో తరగతికి సంబంధించిన కొత్త ఐసీటీ పుస్తకంలో దేశంలోనే తొలిసారిగా నాలుగు లక్షల మంది విద్యార్థులు ఏఐ నేర్చుకునే అవకాశం ఉంది. ఈ పుస్తకాలు మలయాళం, ఇంగ్లీష్, కన్నడ, తమిళ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.2022లో కేరళ జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) ‘డిజిటల్ మీడియా లిటరసీ కార్యక్రమం’ను చేపట్టింది. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న దాదాపు 19.72 లక్షల మంది విద్యార్థులకు నకిలీ వార్తలపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. ఇందులో 9.48 లక్షల మంది అప్పర్ ప్రైమరీ, 10.24 లక్షల మంది హైస్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంత భారీ శిక్షణ ఇవ్వడం దేశంలో అదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో 5920 మంది శిక్షకుల పాల్గొన్నారు. ‘సత్యమేవే జయతే’ పేరుతో 2.5 గంటలపాటు సాగిన ఈ శిక్షణలో ‘రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ వినియోగం’, ‘సోషల్ మీడియా అవసరం’, ‘సోషల్ మీడియాలో హక్కులు-తప్పులు’ అనే నాలుగు విభాగాలపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: ‘లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’విద్యార్థి దశలో సమాచారాన్ని విపులంగా అర్థం చేసుకోవాలి. అందులో నకిలీ వివరాలు ఎలా గుర్తించాలో అవగాహన పెంపొందించుకుంటే ‘క్రిటికల్ థింకింగ్’ వృద్ధి చెందుతుంది. దానివల్ల చదువుల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో మేలు జరుగుతుంది. ఇది కేవలం నకిలీ వివరాలు గుర్తించడానికి మాత్రమే కాకుండా పాఠ్యాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది. -
ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ పెనాల్టీ! నిజమేనా?
ప్రస్తుతం దేశంలో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ న్యూస్‌కు సంబంధించిన అసలు నిజాన్ని చెప్పింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేసింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారంటూ కొన్ని వార్తల ద్వారా అపోహ వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్న పీఐబీ ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా తప్పుదారి పట్టించే వార్తలు మీ దృష్టికి వస్తే నిజం తెలుసుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. అటాంటి వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్బుక్ పోస్ట్ లేదా URLని వాట్సాప్ నంబర్ 8799711259లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి మెయిల్ చేయవచ్చు. -
కమలా హారిస్ ‘అబద్ధం’పై మస్క్ సెటైర్
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్‌పై ప్రపంచ టాప్ బిలీయనీర్ ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ట్రంప్ గనుక అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా అబార్షన్లపై నిషేధం విధిస్తారంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే అది అబద్ధం కావడం.. ఎక్స్ సైతం కమ్యూనిటీ నోట్ ఇవ్వడంతో మస్క్ సెటైర్ సంధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గర్భవిచ్ఛిత్తి(అబార్షన్) కీలకాంశంగా మారింది. బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్లు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. అయితే అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థి ట్రంప్ గనుక గెలిస్తే.. అమెరికా వ్యాప్తంగా అబార్షన్ రద్దు చేస్తారు అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా హారిస్ పోస్ట్ చేశారు. Donald Trump would ban abortion nationwide.President @JoeBiden and I will do everything in our power to stop him and restore women's reproductive freedom.— Kamala Harris (@KamalaHarris) June 30, 2024 అయితే ఆమె పోస్టుకి వెంటనే ఎక్స్ ‘కమ్యూనిటీ నోట్’ ఇచ్చింది(ఫ్యాక్ట్ చెక్ టైప్ ఫీచర్). అబార్షన్ చట్టంపై తాను సంతకం చేయబోనని ట్రంప్ పదే పదే చెప్పారు అని ఆ నోట్ పేర్కొంది. దీంతో వెంటనే ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. రాజకీయ నాయకులైతేనేం.. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను నడిపేవాళ్లు అయితేనేం.. ఇలాంటి మాధ్యమాల్లో అబద్ధాలు ఇక మీదట పని చేయవని ఎప్పటికి గుర్తిస్తారో అంటూ పోస్ట్ చేశాడు. అంతేకాదు.. కమ్యూనిటీ నోట్ వచ్చిన హారిస్ పోస్టును స్క్రీన్ షాట్ ఉంచారాయన. అక్కడితో ఆగకుండా ఆమె పోస్టుకు సైతం ఆయన కామెంట్ చేశాడు.When will politicians, or at least the intern who runs their account, learn that lying on this platform doesn’t work anymore? pic.twitter.com/wP7H4AJFwG— Elon Musk (@elonmusk) July 1, 2024 ఇదిలా ఉంటే.. అబార్షన్‌ను నిషేధించే ఉద్దేశం తనకు లేదంటూ గత వారం అట్లాంటాలో బైడెన్‌తో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల బిగ్ డిబేట్లోనూ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఎక్స్ కమ్యూనిటీ ఫీచర్‌ను గత కొంతకాలంగా మస్క్ పొడుగుతూ వస్తుండడం చూస్తున్నాం. కమ్యూనిటీ నోట్ ఫీచర్ అనేది.. పరోక్షంగా ఇది తప్పుదోవ పట్టించే పోస్ట్ కావొచ్చని.. నిజనిర్ధారణ చేసుకోవాలని యూజర్‌కు సూచిస్తుంది. అలాగే.. యూజర్లు ఆ పోస్టులో ఆ నోట్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తంచేసి తప్పేంటో చెప్పే అవకాశమూ ఉంటుంది. -
Fact Check: భద్రతపైనా తప్పుడు రాతలా?
సాక్షి, అమరావతి: అవాస్తవాలు, అభూత కల్పనలే ఆసరాగా బతికేస్తున్న పచ్చ మీడియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై ఈనాడు పత్రిక అభూత కల్పనలతో అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆయనకు 983 మందితో భారీ భద్రత కల్పించినట్లు అబద్ధాలతో కథనాన్ని వండింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లకు ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని, ఆ కమిటీ నిర్ణయం మేరకే ఏర్పాట్లు జరుగుతాయన్న కనీస జ్ఞానం ఆ పత్రికకు లేకపోయింది. వాస్తవంగా వైఎస్ జగన్‌కు ఉన్న భద్రతా సిబ్బంది ఎందరు అన్న విషయాన్ని పరిశీలించాలన్న నైతిక విలువలకూ తిలోదకాలిచ్చి నోటికొచ్చిన సంఖ్యలతో ఉద్దేశపూర్వకంగా దు్రష్పచారం చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద ఈనాడు చెప్పినట్లుగా 983 మంది భద్రతా సిబ్బంది లేరు. కాన్వాయ్ కాంపొనెంట్‌తో కలిపి కేవలం 196 మందే విధుల్లో ఉన్నారు. అదీ షిఫ్ట్లులవారీగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశం కాకుండానే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లను ఉన్నత స్థాయిలోని సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ కమిటీ సూచనల మేరకే భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రీ తనకు ఇంత భద్రత కావాలని అడగరు. సెక్యూరిటీ రివిజన్ కమిటీయే అన్ని అంశాలను విశ్లేíÙంచి ఎంత మేర భద్రత కల్పించాలన్నది ఖరారు చేస్తుంది. ముఖ్యమంత్రి నివాసం, పరిసర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు తదితర అంశాలను కూడా ఈ కమిటీ ఆదేశాల మేరకే చేపడతారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం మేరకే చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇంకా సమావేశమవ్వనే లేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లపై సమీక్షించనే లేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమే. నాడు బాబు మనవడికి కూడా భద్రత2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మనవడు దేవాన్‡్షకు కూడా ప్రత్యేకంగా భద్రత కల్పించారనే వాస్తవాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్‡్షకు ప్రత్యేకంగా భద్రత కల్పించారు.ఉండవల్లిలోని చంద్రబాబు కరకట్ట నివాసంతోపాటు హైదరాబాద్‌లోని వారి నివాసం, చివరకు ఫామ్ హౌస్ వద్ద కూడా భారీ భద్రత కల్పించడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కల్పించిన భద్రతకంటే ఎన్నో రెట్లు అధికంగా భద్రత కల్పించారు. ఈ అధికార దురి్వనియోగంపై ఏనాడూ పట్టించుకోని ఈనాడు.. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు నిబంధనల ప్రకారం వైఎస్ జగన్‌కు కల్పించిన భద్రతపై అభూత కల్పనలు ప్రచురించింది. వివిధ విభాగాల నుంచి విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలు సివిల్ పోలీసులు: సీఐ–1, ఎస్సైలు–4, హెడ్ కానిస్టేబుల్–1, కానిస్టేబుళ్లు –12 , మహిళా కానిస్టేబుల్ –1. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు: ఆర్ఎస్సైలు – 2, ఏఆర్ఎస్సై –1, కానిస్టేబుళ్లు – 28 ఏపీఎస్పీ: డీఎస్పీ –1, ఆర్ఎస్సై – 3, ఏఆర్ఎస్సై–2, హెడ్ కానిస్టేబుళ్లు – 14, కానిస్టేబుళ్లు – 69 ఆక్టోపస్: ఆర్ఐ –1, ఆర్ఎస్సైలు –2, కానిస్టేబుళ్లు–10 మొత్తం: 152 మంది ఐసోలేషన్‌లో: అదనపు ఎస్సీ – 1, ఆర్ఐ – 2, ఆర్ఎస్సై – 3, కానిస్టేబుళ్లు – 17 మొత్తం: 23 మంది కాన్వాయ్ విభాగంలో: సీఐ – 1, ఎస్సై – 3, హెడ్ కానిస్టేబుల్ – 1, కానిస్టేబుళ్లు – 16 మొత్తం: 21 మంది. -
ఫేక్ రీల్ వైరల్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ కోసం ప్రాణాలకు తెగించి మరీ, ఫ్యామస్ అయిపోవాలనే తాపత్రయంతో కొంతమంది ప్రాణాలు మీదికి తెచ్చు కుంటోంటే.. మరికొందరు బూటకపు వేషాలు, తప్పుడు వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. మరోవైపు ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా… pic.twitter.com/Eia1GCSxyr— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024బస్సు కిందకి యువకుడు, పిచ్చి రీల్హైదరాబాద్లోని ఓ రోడ్డుపై ఆర్టీసీ బస్సు కింద ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సు కింద పడుకోవడం, బస్సు వెళ్లిపోయాక, ఎలాంటి గాయాలు లేకుండానే, తీరిగ్గా షర్ట్‌కి అంటిన దుమ్ము దులుపుకుంటూ వెళ్లిపోయినట్టుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇది ఎడిటెడ్ వీడియో అని ఇట్టే తెలిసిపోతుందని నెటిజన్లు కమెంట్స్ చేశారు. ఇది ఫేక్ అంటూ తీవ్ర చర్చ సాగింది కూడా. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిట్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను తెలంగాణా ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుంది అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. కాగా ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలను కానీ, ఇమేజెస్‌ను గానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమో, కాదో. ఇట్టే అర్థమవుతుంది. లేదంటే గూగుల్స్ లెన్స్ ద్వారా ఇమేజ్ను ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. వీడియో అయితే ‘ఇన్విడ్’ అనే టూల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
గూగుల్‌పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్‌లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్‌లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్‌గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
చిత్తూరులో పులి హల్చల్.. అసలు కథ ఇదీ!
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్‌గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. 👉 చిత్తూరు రూరల్ మండలం బీఎన్‌ఆర్‌పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. 👉గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్‌ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌లో తీసినట్లుగా గుర్తించారు. 👉గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్‌రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కారి్మకులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. 👉పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. 👉వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్‌స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్‌లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
TGSRTC ఫేక్ ప్రచారంపై సజ్జనార్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా మార్చేసింది ప్రభుత్వం. అధికారికంగా బుధవారమే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సాక్షి సహా పలు మీడియా చానెల్స్ సైతం కథనాలిచ్చాయి. అయితే TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్లో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ‘‘అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. .. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. #TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024 అత్యుత్సాహంతో కొన్ని వెబ్సైట్లు అలా లోగోను డిజైన్ చేసి కథనాలిచ్చాయి. దీంతో అదే నిజమైన లోగో అంటూ వైరల్ అయ్యింది. టీజీఎస్సార్టీసీ తాజా ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. -
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్‌లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?) -
గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అంటూ అడుగడుగునా బీసీలకు వెన్నంటి నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడం దగ్గర ఆగిపోకుండా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు పంపించిన చరిత్ర సీఎం జగన్‌ది. యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గుర్తింపును తీసుకొచ్చారు.ఆర్బీకేల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా డీ వారి్మంగ్, వ్యాక్సినేషన్ చేస్తోంది. వైఎస్సార్ పశు బీమా పథకాన్ని సన్న జీవాలకు వర్తింప చేయడమే కాదు..మూగ, సన్నజీవాల కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను తీసుకొచ్చింది.సుమారు 400 ఏళ్లపాటు కలగా ఉన్న మాచర్ల, నాగావళి గొర్రె జాతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపును సాధించడం ద్వారా వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇలా ఐదేళ్లుగా యాదవుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే రామోజీరావుకు మాత్రం కనిపించడం లేదు. యాదవులను తప్పుదారి పట్టించేవిధంగా ‘షెడ్డు దక్కలేదు..పొట్టేలు చిక్కలేదు’ అంటూ అచ్చేసిన బురద కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.. ఆరోపణ: యాదవుల సంక్షేమం పట్టని జగన్ వాస్తవం: రాష్ట్రంలో 55.22 లక్షల మేకలు, 1.77 లక్షల గొర్రెలు పెంచుకుంటూ లక్షన్నర కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరిలో 75 శాతం యాదవులు కాగా, మిగిలిన 25 శాతం ఇతర సామాజిక వర్గాల వారున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంకంటే మెరుగైన రీతిలో ఆర్థిక చేయూతనందించారు. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలాలతోపాటు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకరించారు. ఆరోపణ: గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన జగన్ సర్కార్ వాస్తవం: కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించే స్కీమ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో 2029 సొసైటీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 2735కు పెరిగింది. అంటే కొత్తగా 706 సొసైటీలను ఏర్పాటు చేయడమే కాదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎన్సీడీసీ ద్వారా 2423 మందికి రూ.62.49 లక్షల ఆర్థిక సాయం అందించారు. గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై ఆర్బీకేల ద్వారా నిరంతరాయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా 1159 యూనిట్లకు డీ వారి్మంగ్తోపాటు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆరోపణ: వైఎస్సార్సీపీ హయాంలో అందని రుణాలు వాస్తవం: జగన్ ప్రభుత్వంలో యాదవులకు రుణాలే అందలేదని రాసుకొచ్చారు. ఎన్సీడీసీ పథకం కింద ఇప్పటి వరకు 2150 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.లక్ష చొప్పున 1,416 యూనిట్ల (20 గొర్రెలు. ఒక పొట్టేలు), రూ.5 లక్షల చొప్పున 675 యూనిట్లు (50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు), రూ.10 లక్షల చొప్పున 57 యూనిట్లు (100 గొర్రెలు, ఐదు పొట్టేళ్లు), రూ.50 లక్షల చొప్పున 2 యూనిట్లు (500 గొర్రెలు 25 పొట్టేళ్లు) మంజూరు చేశారు. వీటికోసం రూ.43.77 కోట్లు ఖర్చు చేశారు. ఇవే కాదు..ఎన్ఎల్ఎం స్కీమ్ కింద 12 మందికి 50 లక్షల సబ్సిడీతో రూ.కోటి చొప్పున రుణాలు అందించారు. ఇంకా 60 అప్లికేషన్లు బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. లక్ష మందికి జారీ చేసిన కేసీసీ కార్డుల ద్వారా రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారు. ఆరోపణ: అటెకెక్కించిన బీమా పథకం వాస్తవం: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగేళ్లలో 77 వేల మంది పశు పోషకులకు వైఎస్సార్ పశునష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇలా రూ.176.68 కోట్లు జమ చేస్తే అత్యధికంగా లబ్ధి పొందింది మేకలు, గొర్రెల పెంపకందారులే. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూర్చాలని సంకల్పంతో 2022–23లో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారితోపాటు ఎస్సీ, ఎస్టీలకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితితో నిర్దేశించిన ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇప్పటికే 1.75 లక్షల మంది ఈ స్కీమ్‌లో నమోదు కాగా, ఇప్పటి వరకు మృత్యువాతపడిన జీవాలకు సంబంధించి రూ.2.50 కోట్ల పరిహారాన్ని అందించారు. ఆరోపణ: కార్పొరేషన్‌తో పైసా మేలు జరగలేదు. వాస్తవం: యాదవుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘతన వైఎస్ జగన్‌కే దక్కుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు..నవరత్నాల ద్వారా యాదవులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే అందిస్తున్నారు. చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాదు..జగనన్న విద్యాదీవెన, వసతి వంటి పథకాల ద్వారా వారి పిల్లల చదువులకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల ద్వారా సన్న జీవాలకు నాణ్యమైన వైద్యం వారి ముంగిటకే తీసుకొచ్చారు. ఆరోపణ: జగన్ హయాంలో ఏదీ పెద్దపీట? వాస్తవం: యాదవుల సంక్షేమానికి చంద్రబాబు అన్ని విధాలుగా తూట్లు పొడిచారు. యాదవులకు గుర్తింపు కాదు కదా..కనీసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అమలు చేసిన పథకాలు తప్ప సొంతంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక చేయూతనివ్వలేదు.మంజూరు చేసిన రూ.250 కోట్లలో చెల్లించిన మొత్తం కేవలం రూ.80 కోట్లే. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్న జీవాల కోసం అమలు చేసిన బీమా పథకంలో నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులే భరించాల్సి వచ్చేది. మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేయడంతో బాబు హయాంలో బీమా పథకాన్నే అటకెక్కించేశారు. ఆ రెండు జాతుల గుర్తింపు కనిపించలేదా మాచర్ల, నాగావళి జాతి గొర్రెలకు అరుదైన గొర్రె జాతులుగా ఐసీఏఆర్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకూ నెల్లూరు జాతి గొర్రెలకే అధికారిక గుర్తింపు ఉంది. ఐసీఏఆర్ గుర్తింపు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగింది. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధరలు రెట్టింపు పలకనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల కింద వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుకానున్నాయి. -
మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!
సాక్షి,అమరావతి: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనే చందంగా పచ్చ పత్రికాధినేత రామోజీరావు తీరు ఉంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు తీసిపారేస్తే.. వ్యవసాయం పండుగ అని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరూపించింది. అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు, అక్కడే విత్తు నుంచి విక్రయం వరకు అన్ని ఏర్పాట్లు, కనీస మద్దతు ధర దక్కని పంటలను ప్రభుత్వమే కొనుగోలు, మార్కెట్లో ధరలు పడిపోయిన ప్రతిసారి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ జోక్యం, ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఆరు పంటలకు కనీస మద్దతు ధర, సీఎం యాప్ ద్వారా ధరల పర్యవేక్షణ, ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు గోనె సంచులతోపాటు కూలీల భారం, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే పెట్టుకుంటున్నా.. ఇంకా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చేస్తున్నా రామోజీ విషం జిమ్ముతున్నారంటే ఏం అనుకోవాలి? ఈ ఏడుపుకు, కడుపుమంటకు అసలు మందు ఉందా? బుధవారం తన పచ్చ పత్రిక ‘ఈనాడు’లో ‘కనీస మద్దతు ధర.. గరిష్ట మోసం దొర’ అంటూ ఒక తప్పుడు కథనాన్ని అచ్చేశారు. దీనికి సంబంధించి అసలు వాస్తవాలివిగో..ఆరోపణ: ధరల స్థిరీకరణ నిధి ఒక దగావాస్తవం: మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ 57 నెలల్లో 1–2 సీజన్లలో 2–3 పంట ఉత్పత్తులకు మినహా మిగిలిన పంటల మార్కెట్ ధరలు మద్దతు ధరకు మించి పలికాయి. ఈ ఏడాది కూడా మద్దతు ధరలు ప్రకటించిన పంట ఉత్పత్తులతో సహా పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న మాట వాస్తవం కాదా? అలాంటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందో ‘ఈనాడు’కే తెలియాలి. ఆరోపణ: సీఎం యాప్ సిగ్గు..సిగ్గువాస్తవం: దేశంలోనే తొలిసారిగా గ్రామాల వారీగా మార్కెట్లో ధరలను సేకరించి ఎప్పటికప్పుడు వాటి హెచ్చుతగ్గులను సమీక్షించేందుకు సీఎం యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీసమద్దతు ధర దక్కేలా కృషి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల పంటల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే... రెట్టింపు కన్నా అధికం. అలాగే చంద్రబాబు ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65 వేల కోట్లు చెల్లించింది. బాబు హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు మాత్రమే వెచ్చిస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది అంటే.. సగటున చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. ఆరోపణ: గిట్టుబాటు ధర కల్పనలో చేతులెత్తేశారువాస్తవం: గిట్టుబాటు ధరలు పడిపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా ప్రభుత్వ భరోసా వల్లే మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. అలాగే 2021–22లో ఉల్లి ధరలు పతనమైనప్పుడు మద్దతు ధరకు, 2022–23లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించింది. 2022–23లో రూ.22.94 కోట్ల విలువైన 2,541 టన్నులు, 2023–24లో రూ.43.46 కోట్ల విలువైన 5,517 టన్నుల పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. మిరప ఎమ్మెస్పీ రూ.7వేలు కాగా మూడేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.15వేల నుంచి రూ.30వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. నాలుగేళ్లుగా చిరుధాన్యాల మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగానే ప్రస్తుత ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మార్కెట్లో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఆరోపణ: వ్యవసాయ ఖర్చులు పెరిగాయివాస్తవం: సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలు వేసే రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సొంతంగా వాటికి మద్దతు ధరలను ప్రకటించింది. మద్దతు ధరకు మించి పలికితే మార్కెట్లోనే రైతులు విక్రయించుకుంటారు. మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు బాసటగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న రైతు భరోసా సాయాన్ని మాటమాత్రం ప్రస్తావించలేదు. ఈ 57 నెలల్లో ప్రతి రైతుకు రూ.65,500 చొప్పున 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించినా రామోజీ పచ్చ కళ్లకు కనిపించలేదు. జీఎల్టీ ఖర్చులను కూడా భరిస్తూ.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్‌లు, కూలీలు, రవాణా)ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. -
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
సాక్షి, అమరావతి: ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...పదే పదే ఆ తప్పులనే పునరుక్తం చేస్తుంటే అది అలవాటు...గ్రహపాటు...దురలవాటు..అలాంటి దురలవాటును ఈనాడు ఆనవాయితీగా మార్చుకుంది..అబద్ధాలనే రాయడానికే కంకణం కట్టుకున్నానన్నట్లుగా ఉంది ఆ పత్రిక వక్రీకరణల ధోరణి...గతంలో కౌలురైతుల సాయంపై అడ్డగోలుగా వక్రీకరిస్తే అది తప్పని ...వాస్తవమేంటని గణాంకాలతో రుజువు చేసినా... మూర్ఖపు రాతలతో మళ్లీ రాసిన తప్పులనే రాస్తూ... తన అజ్ఞానాన్ని, తానేం చేసినా చెల్లిపోతుందన్న అహంకారాన్ని రామోజీ నిరూపించుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే ఈనాడు దుష్టరాతల తలంపును పాఠకులు అర్థం చేసుకున్నారు..ఒక నిజాన్ని ఎన్నిసార్లు అబద్ధంగా చూపాలనుకున్నా అది అవాస్తవంగా మారదన్న వాస్తవం రామోజీకి బోధపడినట్లు లేదు... రైతులకు ఆపన్నహస్తమందిస్తున్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం... ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు కొండంత ఊతంగా నిలుస్తూ... వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్నదే జగన్ ప్రభుత్వం... రైతులే కాదు...వారితో సమానంగా కౌలు రైతుల భుజంపైనా భరోసా చెయ్యేసి... వారిని అక్కున చేర్చుకుంటున్నదే ఈ ప్రభుత్వం...ఆ నిజాన్ని అబద్ధం చేయాలని రామోజీ తహతహలాడిపోతూ.. గురువారం ఈనాడులో ..‘ధీమా లేదు...బీమా రాదు’... శీర్షికన ప్రచురించిన కథనం ఒక బోగస్. నిజాలేమిటో సవివరంగా గణాంక సహితంగా చెప్పడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్...గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచనే చేయని పంట సాగు హక్కు దారుల చట్టం–2019ను తీసుకురావడమే కాదు..సీసీఆర్సీల ఆధారంగా భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తోంది. పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా రైతులు మద్దతు ధరకు సులువుగా అమ్ముకోగలుగుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు దురదృష్టవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఈ ప్రభుత్వం అందిస్తోంది.అబద్ధం: పెట్టుబడి సాయానికి అర్హులు కారట..వాస్తవం: బాబు హయాంలో కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకు పైసా విదల్చ లేదు. తద్భిన్నంగా ...నేడు దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకూ రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది.మెజార్టీ కౌలుదారులు సొంత భూమినీ కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన సెంటు భూమిలేని కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇలా గత ఐదేళ్లలో 5.57 లక్షల మంది కౌలు రైతులకు రూ.751.42 కోట్లు, 4.01 లక్షల అటవీ భూములు (ఆర్వో ఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ.541.58 కోట్లు కలిపి మొత్తం 9.58 లక్షల మందికి రూ.1293 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి సహాయంగా అందించింది. అంటే ఏటా సగటున 1.92 లక్షల మందికి రూ.259 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఈనాడుకు మాత్రం 1.07 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించినట్టుగా కని్పంచింది.అబద్ధం: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకూ ఈ ప్రభుత్వం వర్తింప చేస్తోంది. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా ఈ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈనాడుకు మాత్రం సున్నా వడ్డీ రాయితీ పొందిన వారే కని్పంచలేదు. ఈ ఐదేళ్లలో 3,54,878 మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 3,67,903 మందికి రూ.424 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌సబ్సిడీ) పంపిణీ చేస్తే, ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో పెట్టుబడి రాయితీ పొందిన వారు 48,290 మంది, పంటల బీమా పరిహారం పొందిన వారు 88,619 మంది మాత్రమే కని్పస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని తక్కువ చేయాలన్న దుష్టతలంపేనని ఇట్టే అర్థమవుతోంది.అబద్ధం: కౌలు రైతులకు పంట రుణాల్లేవు..వడ్డీ రాయితీకి సున్నా..వాస్తవం: వాస్తవ సాగు దారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్ద ఎత్తున రుణాలు అందేలా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 14.75 లక్షల మంది కౌలుదారులకు రూ.8,642.40 కోట్ల రుణాలను ఈ ప్రభుత్వం అందించింది. ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో రుణాలు పొందిన వారు 1.68 లక్షల మందే కని్పంచారు. ఈ –క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంట రుణాలు పొందిన 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని జగన్ ప్రభుత్వం అందించింది. -
సౌదీ యువరాజుపై హత్యాయత్నం అంటూ కథనాలు
రియాద్: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని పలు అరబ్ మీడియా సంస్థలు సైతం ప్రచురించాయన్నది సదరు సోషల్ మీడియా పోస్టుల సారాంశం. అయితే ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మరోవైపు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో.. ఆయన పేరు ఎక్స్ ఖాతాలోట్రెండింగ్లో కొనసాగుతోంది.కారు బాంబు ఉపయోగించి మహ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్యానికి ప్రయత్నించగా ఆయన సురక్షితంగా బయటపడ్డారన్నది ఆ వైరల్ కథనాల సారాంశం. ఇక ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ కథనాలకు కాసేపట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.