ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు! | Sakshi
Sakshi News home page

ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!

Published Fri, May 10 2024 10:02 AM

Ramojirao's False Statements On Crop Damage Compensation Sakshi Amaravathi

జగన్‌ ప్రభుత్వంలోనే కౌలు రైతులకు అండ..

3.68 లక్షల మందికి రూ.424 కోట్ల పంట నష్టపరిహారం

చేసిన సాయాన్ని తక్కువ చేసే ఈనాడు దుష్టతలంపు..

సాక్షి, అమరావతి: ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...పదే పదే ఆ తప్పులనే పునరుక్తం చేస్తుంటే అది అలవాటు...గ్రహపాటు...దురలవాటు..అలాంటి దురలవాటును ఈనాడు ఆనవాయితీగా మార్చుకుంది..అబద్ధాలనే రాయడానికే కంకణం కట్టుకున్నానన్నట్లుగా ఉంది ఆ పత్రిక వక్రీకరణల ధోరణి...గతంలో కౌలురైతుల సాయంపై అడ్డగోలుగా వక్రీకరిస్తే అది తప్పని ...వాస్తవమేంటని గణాంకాలతో రుజువు చేసినా... మూర్ఖపు రాతలతో మళ్లీ రాసిన తప్పులనే రాస్తూ... తన అజ్ఞానాన్ని, తానేం చేసినా చెల్లిపోతుందన్న అహంకారాన్ని రామోజీ నిరూపించుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే ఈనాడు దుష్టరాతల తలంపును పాఠకులు అర్థం చేసుకున్నారు..

ఒక నిజాన్ని ఎన్నిసార్లు అబద్ధంగా చూపాలనుకున్నా అది అవాస్తవంగా మారదన్న వాస్తవం రామోజీకి బోధపడినట్లు లేదు... రైతులకు ఆపన్నహస్తమందిస్తున్నదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం... ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు కొండంత ఊతంగా నిలుస్తూ... వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్నదే జగన్‌ ప్రభుత్వం... రైతులే కాదు...వారితో సమానంగా కౌలు రైతుల భుజంపైనా భరోసా చెయ్యేసి... వారిని అక్కున చేర్చుకుంటున్నదే ఈ ప్రభుత్వం...ఆ నిజాన్ని అబద్ధం చేయాలని రామోజీ తహతహలాడిపోతూ..  గురువారం ఈనాడులో ..‘ధీమా లేదు...బీమా రాదు’... శీర్షికన ప్రచురించిన కథనం ఒక బోగస్‌. నిజాలేమిటో సవివరంగా గణాంక సహితంగా చెప్పడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్‌...


గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచనే చేయని పంట సాగు హక్కు దారుల చట్టం–2019ను  తీసుకురావడమే కాదు..సీసీఆర్సీల ఆధారంగా భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తోంది. పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా రైతులు మద్దతు ధరకు సులువుగా అమ్ముకోగలుగుతున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు దురదృష్టవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఈ ప్రభుత్వం అందిస్తోంది.

అబద్ధం: పెట్టుబడి సాయానికి అర్హులు కారట..
వాస్తవం: బాబు హయాంలో కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకు పైసా విదల్చ లేదు. తద్భిన్నంగా ...నేడు దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే కౌలు రైతులకు జగన్‌ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకూ రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది.

మెజార్టీ కౌలుదారులు సొంత భూమినీ కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన సెంటు భూమిలేని కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇలా గత ఐదేళ్లలో 5.57 లక్షల మంది కౌలు రైతులకు రూ.751.42 కోట్లు, 4.01 లక్షల  అటవీ భూములు (ఆర్‌వో ఎఫ్‌ఆర్‌) సాగు చేసే గిరిజనులకు రూ.541.58 కోట్లు కలిపి మొత్తం 9.58 లక్షల మందికి రూ.1293 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి సహాయంగా అందించింది. అంటే ఏటా సగటున 1.92 లక్షల మందికి రూ.259 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఈనాడుకు మాత్రం 1.07 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించినట్టుగా కని్పంచింది.

అబద్ధం: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..
వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్‌ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకూ ఈ ప్రభు­త్వం వర్తింప చేస్తోంది.  సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా ఈ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈనాడుకు మాత్రం సున్నా వడ్డీ రాయితీ పొందిన వారే కని్ప­ంచలేదు. ఈ ఐదేళ్లలో 3,54,878 మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 3,67,903 మందికి  రూ.424 కోట్ల పంట నష్ట పరిహా­రం (ఇన్‌పుట్‌సబ్సిడీ) పంపిణీ చేస్తే, ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో పెట్టుబడి రాయితీ పొందిన వారు 48,290 మంది, పంటల బీమా పరిహారం పొందిన వారు 88,619 మంది మాత్రమే కని్పస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని తక్కువ చేయాలన్న దుష్టతలంపేనని ఇట్టే అర్థమవుతోంది.

అబద్ధం: కౌలు రైతులకు పంట రుణాల్లేవు..వడ్డీ రాయితీకి సున్నా..
వాస్తవం: వాస్తవ  సాగు దారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌­లను ఆర్బీకేలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణా­లు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్‌ లయబలిటీ గ్రూపు (జేఎల్‌జీ)­లను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్ద ఎత్తున రుణా­లు అందేలా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 14.75 లక్షల మంది కౌలుదారు­లకు రూ.8,642.40 కోట్ల రుణాలను ఈ ప్రభు­త్వం అందించింది. ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో రుణాలు పొందిన వారు 1.68 లక్షల మందే కని్పంచారు. ఈ –క్రాప్‌ ఆధారంగా లక్ష లోపు పంట రుణాలు పొందిన 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని జగన్‌ ప్రభుత్వం అందించింది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement