breaking news
Suryapet
-
‘మేం పార్టీ మారలేదని నోటీసుకు సమాధానం ఇవ్వడమేంటి?’
సూర్యాపేట జిల్లా: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు పోతామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం అనేది ఎలా ఉంటుందో తమకు తెలుసన్నారు. ఒకవేళ ఆ నిర్ణయం సరిగా లేకపోతే దానికి సంబంధించిన అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని, ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు హాస్యాస్పదంగా ఉంది. మేం పార్టీ మారలేదని నోటీసుకు సమాధానం ఇవ్వడమేంటి?, పార్టీ మారకపోతే సీఎం రేవంత్ వద్దకు తాజాగా ఎందుకు వెళ్లినట్లు? అని ప్రశ్నించారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం సరైన పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌పై అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం ఉందని అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి తనిఖీలు చేయడం మంచి పద్ధతికాదు. సాక్షి ఎడిటర్‌పై నమోదు చేసిన పోలీస్ కేసులను ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – వజ్జె వీరయ్య యాదవ్, టీయూడబ్ల్యూజే(హెచ్ 143) జిల్లా అధ్యక్షుడు పత్రికలు అనేవి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తాయి. అలాంటి పత్రికలను ప్రభుత్వాలు అణచివేసే కుట్ర చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. పత్రికా విలేకరులను గౌరవించాలి, వారికి స్వేచ్ఛనివ్వాలి. – బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు -
అమ్మ పేరుతో మొక్క
గుర్రంపోడు : అమ్మ.. మొక్క.. భూమాత.. మూడింటి మధ్య సారుప్యత ఉంటుంది. అమ్మ కుటుంబానికి బాధ్యత వహిస్తే, మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయి. భూమాత జీవ రాశులను, పర్యావరణాన్ని కాపాడుతుంది. ఈ మూడింటికి ముడి పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి పేరుతో మొక్క నాటితే శ్రద్ధ చూపుతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం చేపట్టింది. పర్యావరణ దినోత్సవమైన జూన్ 5, 2024లో ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రతిఒక్కరూ తల్లి పేరుతో మొక్క నాటాలని విస్త్రృత ప్రచారం చేసి భారీ సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారు. ఇటీవల ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినుల భాగస్వాములను చేసి, ప్రతి విద్యార్థి తన తల్లితో కలిసి మొక్కను నాటాలని నిర్ధేశించారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కను పాఠశాల ఆవరణలోగాని, పరిసరాల్లోగాని నాటి నాటి ఏకో క్లబ్ మిషన్ లైఫ్ అనే పోర్టల్‌లో ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ విడుదల చేసిన లింక్‌లో విద్యార్థిని పేరు, తల్లి పేరు, పాఠశాల డైస్ కోడ్ వివరాలు నమోదు చేసి ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోను తీసుకుని అప్లోడ్ చేయగానే వారి పేరిట ఆన్లైన్లోనే ప్రశంసాపత్రం లభిస్తుంది. నాటిన ప్రతి మొక్కకు ప్రశంసాపత్రం లభిస్తుంది. ప్రశంసాపత్రాన్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశంసాపత్రం ఫోన్లో డౌన్లోడ్లోగాని మరెక్కడా కనిపించదు. వెబ్ పోర్టల్‌కు సంబంధించి లింక్‌ను కూడా విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేసింది. మండలానికి 4 వేల మొక్కల చొప్పున.. ఒక విద్యార్థిని ఎన్ని మొక్కలైనా, ఎక్కడైనా తల్లితో కలిసిగానీ, పాఠశాలలో అయితే మహిళా టీచర్‌తో కలిసి గానీ నాటాలి. జిల్లాకు లక్ష మొక్కలు నాటేలా లక్ష్యం నిర్ధేశించగా మండలానికి 4 వేల మొక్కలు నాటి ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలకు 70 ఫొటోలు లక్ష్యం నిర్ధేశించారు. వన మహోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నందున ఇందులోనే తల్లిలో కలిసి విద్యార్థిని ఫొటోలు తీయాల్సి ఉంటుంది. నాటిన ప్రతి మొక్కకు విద్యార్థినికి ప్రశంసాపత్రం లభిస్తుండడంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థినులు తమ ఇంటి పరిసరాల్లో మొక్కను నాటి పాఠశాల యూడైస్ కోడ్, ఇతర వివరాలు నమోదు చేసి సొంతంగా అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు.విద్యార్థినులు తమ తల్లితో కలిసి మొక్కలు నాటి ఫొటోలు అప్లోడ్ చేసేలా అన్ని పాఠశాల హెచ్ఎంలకు దిశానిర్ధేశం చేశాం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే అవసరాన్ని వివరించి విరివిగా మొక్కలు నాటిస్తాం. గ్రామస్థాయిలో వన నర్సరీల నుంచి మొక్కలు పొంది నాటాలని సూచిస్తున్నాం. పాఠశాలలో సరిపడా స్థలం లేని చోట విద్యార్థిని ఇంటి వద్దగాని, పరిసరాల్లో గాని మొక్కను నాటి సంరక్షించాలని వివరిస్తున్నాం. –నోముల యాదగిరి, గుర్రంపోడు మండల విద్యాధికారి ఫ నాటిన ప్రతి విద్యార్థినికి ప్రశంసాపత్రం ఫ మొక్కల పెంపకంలో భాగస్వామ్యం ఫ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వం -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
దేవరకొండ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.2.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు దేవరకొండ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన పిట్ల గంగాధర(అలియాస్) సాంబ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చదువు మధ్యలో ఆపేసి కూలి పనులు చేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గంగాధర జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న దేవరకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాపోతు రమేష్ ఇంట్లో ప్రవేశించి రూ.6 లక్షల నగదు, 2.2 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ చేసిన నగదులో సగం డబ్బు దేవరకొండ పట్టణంలోని ఖిలా పార్క్ వద్ద గంగాధర దాచిపెట్టాడు. ఆ నగదును తిరిగి తీసుకునేందుకు గురువారం పట్టణానికి వచ్చిన గంగాధరను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చోరీ చేసిన విషయం ఒప్పుకున్నాడు. కాగా గంగాధరపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో సుమారు 100 పైచిలుకు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు చేధించిన దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు నారాయణరెడ్డి, మౌనికలతోపాటు సిబ్బంది సతీష్, అంజయ్య, సింహాద్రిలను ఏఎస్పీ అభినందించారు. ఫ రూ.2.5లక్షల నగదు స్వాధీనం -
చోరీకి గురైన మొబైల్ ఫోన్లు అప్పగింత
సూర్యాపేటటౌన్ : మొబైల్ పోయినా, చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లాలో సెల్ఫోన్లను వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 100 మందికి, రికవరీ చేసి గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.నరసింహ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైందని, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫొటోలు ఫోనన్‌లో నిక్షిప్తం చేసుకుంటున్నామన్నారు. మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందన్నారు.ే నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్‌ను అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మొబైల్స్ ను రికవరీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ మొబైల్ పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ -
మీడియా గొంతు నొక్కుతున్న ప్రభుత్వం
ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడేది మీడియా. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ లబ్ధి కోసం అక్కడి ప్రభుత్వం మీడియా సంస్థల గొంతు నొక్కుతోంది. మీడియా ప్రతినిధులకే రక్షణ కరువు అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను తుంగలోతొక్కి నిరంకుశత్వాన్ని ప్రదర్శించడం చట్టవిరుద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మీడియా సంస్థలను, ప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది. అక్కడి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.–మల్లు నాగార్జున రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి -
కక్షసాధింపు సిగ్గుచేటు
ప్రభుత్వాలు హుందాతనంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించడం మంచిది కాదు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ప్రభుత్వాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవు. ఆంధ్రప్రదేశ్‌లోని సాక్షి కార్యాలయాల్లో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం జర్నలిజం గొంతునొక్కే ప్రయత్నమే. ప్రజా సమస్యలను లెవనెత్తిన సాక్షి యాజమాన్యంపై కక్ష సాధింపు సిగ్గుచేటు. – చెవిటి వెంకన్నయాదవ్, డీసీసీ అధ్యక్షుడు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు -
సమస్యలను పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కోరారు. గురువారం ఈ మేరకు సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు 11 సమస్యలపై సమగ్రమైన సమాచారంతో వినతిపత్రం అందిస్తున్నామని, వీటన్నింటినీ పరిష్కరించాలని కోరారు. హుజూర్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుక్కాని మన్మథరెడ్డి, వంగవీటి శ్రీనివాసరావు, దండా మురళీధర్‌రెడ్డి, తాళ్ల నరేందర్‌రెడ్డి, జల్లా జనా ర్దన్, వెంకటేశ్వర్లు, మహేష్, ఫణినాయు డు, ఉ ప్పలచారి, గురవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. 13న జాతీయ లోక్ అదాలత్సూర్యాపేటటౌన్ : ఈనెల 13న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె. నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీ మార్గమే రాజమార్గమని , రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు సానుకూలంగా ఉండాలని సూచించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్‌అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. అనవసర గొడవలకు, పట్టింపులకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని హితవు పలికారు. అర్హతలేకున్నా వైద్యం చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం హుజూర్నగర్ : అర్హత లేకున్నా వైద్యం చేస్తే క్లినిక్‌ను సీజ్ చేయడమే కాకుండా కఠినచర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో క్లినిక్‌ను తనిఖీ చేశారు. ఎలాంటి వైద్యవిద్య, అర్హతలు లేకుండా వట్టికూటి రాంబాబు ఆ గ్రామంలో నిర్వహిస్తున్న క్లినిక్‌ను డీఎంహెచ్ఓ తనిఖీ చేసిన అంతరం సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అన్ని రకాల విద్యార్హతలు కలిగి ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతనే అల్లోపతి ప్రాక్టీస్‌కు అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. తనిఖీ బృందంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ జయమనోహరి, డాక్టర్ జి. చంద్రశేఖర్, వైద్యాధికారులు డాక్టర్ నాజియా తబస్సుమ్, డాక్టర్ వేణుగోపాల్, డిప్యూటీ డెమొ వి. సంజీవ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో మీడియా ప్రధాన భూమిక పోషించింది. ప్రస్తుతం బీజేపీ, సంబంధిత పొత్తుల పార్టీలు కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ మీడియా వాళ్ల గొంతు నొక్కుతున్నారు. నాలుగో స్తంభమైన మీడియాను కాపాడే పోలీసులే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయి. దీనిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది. – బెజవాడ వెంకటేశ్వర్లు , సీపీఐ జిల్లా కార్యదర్శి -
విద్యార్థులు చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత సూచించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని నారాయణ ఇంటర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్విహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సెల్‌ఫోన్ వినియోగం తగ్గించుకోవాలని, విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలని, దానిని సాధించే వరకు కృషి చేయాలని సూచించారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండాలని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, భావిపౌరులుగా ఎదగాలని సూచించారు. ఈకార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.ఫ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత -
చోరీకి గురైన వినికిడి యంత్రాలు
చౌటుప్పల్ : కన్న కూతురికి పుట్టుకతో చెవులు వినిపించవు. మాటలు కూడా రావు. ప్రస్తుతం ఐదేళ్ల వయస్సు ఉన్న ఆ చిన్నారి అవస్థలకు తల్లడిల్లిన తల్లిదండ్రులు గతేడాది ఆగస్టులో ఆపరేషన్ చేయించారు. అదేఏడాది అక్టోబర్ నెలలో చెవులకు ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. దాంతో వినికిడి సమస్యకు పరిష్కారం దొరికింది. అదేవిధంగా నోటి మాటలను రప్పించేందుకు కూడా పడరానిపాట్లు పడుతున్నారు. స్వగ్రామం నుంచి నిత్యం హైదరాబాద్‌కు కూతురును తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ చిన్నారికి చెందిన వినికిడి యంత్రాలు బస్సులో చోరీకి గురయ్యాయి. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన ఏరుకొండ నాగమణి తన కూతురు హాద్వికకు బుధవారం హైదరాబాద్‌లో థెరపీ చేయించి తిరిగి మధ్యాహ్నం 12.40కి దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన బస్సులో చౌటుప్పల్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి నల్లగొండ డిపో బస్సు పల్లెవెలుగు ద్వారా 2.00గంటల ప్రాంతంలో మునుగోడులో దిగింది. అటు నుంచి నేరుగా ఇంటికి వెళ్లి తన వెంట తీసుకెళ్లిన బ్యాగును పక్కన పెట్టింది. మరుసటి రోజు ఉదయం సమయంలో తనకు వినికిడి ఇబ్బంది అవుతోందని కూతురు చెప్పడంతో కూతురు చెవికి ఉన్న పరికరానికి చార్జింగ్ పెట్టేందుకుగాను బ్యాగులో ఉన్న బాక్స్‌ను తెచ్చేందుకు వెళ్లింది. బ్యాగులో బాక్స్ కన్పించకపోవడంతో ఇళ్లంతా వెతికినా ఎక్కడా లభ్యమవ్వలేదు. తాను ప్రయాణం చేసే క్రమంలో బ్యాగు నుంచి ఆ బ్యాక్స్ చోరీకి గురైందని ఆమె ఆలస్యంగా గుర్తించింది. దీంతో రెండు రోజులుగా కనిపించిన వారినందరినీ ఆరా తీస్తోంది. రూ.1.50లక్షల విలువ చేసే వినికిడి పరికరాలు ఎవరికై నా దొరికితే ఇవ్వాలని వేడుకుంటోంది. ఫ రూ.1.50 లక్షల విలువ ఉంటుందన్న బాధితురాలు -
కేసు నమోదు
మోతె : వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, పోలీసుల అనుమతి లేకుండా డీజే వినియోగించిన నిర్వాహకులపై కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో పోలీసుల అనుమతి లేకుండా సోమవారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే వినియోగించారు. దీంతో వేడుకల నిర్వాహకుడు పులగుజ్జు కార్తీక్, ఆర్గనైజర్ కోడి మహేష్‌పై కేసు నమోదు చేసి డీజే, వాహ నం సీజ్ చేసినట్లు మోతె ఎస్ఐ టి.అజయ్‌కుమార్ గురువారం తెలిపారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యంచిలుకూరు : చిలుకూరు మండలం రామచంద్రానగర్ వద్ద ఉన్న ఆర్కె మేజర్ కాల్వలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి 50 నుంచి 55 సంవత్సరాలు ఉండవచ్చని, రెండు చేతులకు పచ్చబొట్లు, ముక్కుకు రెండు పుడకలు, రెండు చెవులకు మాటీలు ఉన్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్ర వాహనం చోరీమునగాల: మునగాల మండలంలోని కృష్ణానగర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. వివరాలు.. గ్రామానికి చెందిన గుండ్లపల్లి నర్సిరెడ్డి తన బైక్‌కు తాళం వేసి ఇంటి ఆవరణలో ఉంచి నిద్రకు ఉపక్రమించాడు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి గోడ దూకి లోపలికి వచ్చి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసినట్లు బాధితుడు నర్సిరెడ్డి తెలిపారు. ఈ మేరకు తాను గురువారం మునగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నర్సిరెడ్డి పేర్కొన్నారు. -
మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మహిళల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదల వంటి అంశాలను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, న్యాయవాదులు అనంతుల సందీప్ కుమార్, కట్ట సుధాకర్ పాల్గొన్నారు. -
రైతుల యూరియా కష్టాలు తీరుస్తాం
నిడమనూరు : కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు నిడమనూరు మండలంలోని వెనిగండ్ల గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి దృష్టికి పలువురు రైతులు, కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత విషయం తీసుకువచ్చారు. మిర్యాలగూడ ర్యాక్ పాయింట్‌కు ఒకటి, రెండు రోజుల్లో యూరియా రానుందని, సాగర్ ఆయకట్టు రైతుల అవసరాలు తీర్చేవిధంగా యూరియా అందించి కష్టాలు తీరుస్తానని ఈ సందర్భంగా జానారెడ్డి వారికి చెప్పారు. వెనిగండ్ల గ్రామ సీలింగ్ భూ వివాదాలు కూడా జానారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఊట్కూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ నాయకుడు విజయ్‌కుమార్.. జానారెడ్డిని కోరారు. ఊట్కూరులో ప్రభుత్వ భూమి 12 ఎకరాలు ఉందని, మరో 8 ఎకరాలు సేకరిస్తే చాలని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమికోసం సర్వే చేసినట్టు జానారెడ్డికి తహసీల్దారు జంగాల కృష్ణయ్య వివరించారు. వెనిగండ్ల గ్రామానికి చెందిన కొప్పోలు మట్టపల్లిరావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులను జానారెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకతి సత్యం, నర్సింగ్ విజయ్‌కుమార్, ముంగి శివమారయ్య, నందికొండ మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జానారెడ్డి -
యూరియా పాట్లు
ఫ వేకువజాము నుంచే పీఏసీఎస్‌లు, మనగ్రోమోర్ సెంటర్ల బాట ఫ క్యూకట్టి రోజంతా రైతుల నిరీక్షణ ఫ అయినా అందరికీ అందని యూరియా ఫ అర్వపల్లిలో రాస్తారోకో తిరుమలగిరి (తుంగతుర్తి) : యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారిందంటే చాలు పీఏసీఎస్‌లు, మనగ్రోమోర్ కేంద్రాల వద్దకు పరుగెపెడుతున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్‌కార్డులు క్యూలైన్లలో పెట్టి పొద్దస్తమానం నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల చెప్పులు పెట్టి ఎదురుచూస్తున్నారు. తిరుమలగిరి పీఏసీఎస్ కార్యాలయానికి గురువారం 440 బస్తాల యూరియా రావడంతో ఉదయం 6 గంటల నుంచే రైతులు కార్యాలయం ఎదుట బారులుదీరారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఒక్కొక్కరిని లోనికి అనుమతించారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో రైతులు కార్యాలయానికి వచ్చారు. ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియాను ఇచ్చారు. వచ్చిన రైతులకు యూరియా దొరకక పోవడంతో సాయంత్రం వరకు కార్యాలయం ఎదుట నిరీక్షించారు. లైన్లో ఉన్న రైతులను కూర్చోబెట్టి వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ కార్యాలయ సిబ్బంది పోలీస్పహారా టోకెన్లను అందజేశారు. చాలా మంది రైతులకు యూరియా దొరకక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ పాల్గొన్నారు. పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలోని నారాయణగూడెం పీఏసీఎస్ కార్యాలయం వద్దకు రైతులు పెద్దసంఖ్యలో వచ్చారు. పట్టాదారుపాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు జిరాక్స్‌లు క్యూలెన్లలో పెట్టి ఎదురుచూస్తున్నారు. అనంతారంలో 277 బస్తాలను రైతులకు అందించగా, నారాయణగూడెం పీఏసీఎస్ కార్యాలయానికి 277 బస్తాలను తరలించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేచి ఉన్నా కొందరికే దొరకడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లో ముందు వరుసలో ఉన్నవారికి ఒకరికి ఒక బస్తా చొప్పున మాత్రమే ఇచ్చారు. ఎస్ఐ గోపికృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. అర్వపల్లి: యూరియా కోసం జాజిరెడ్డిగూడెం మండల రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. అర్వపల్లి, తిమ్మాపురం పీఏసీఎస్‌ల వద్ద గురువారం తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కొరతను వెంటనే తీర్చాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్వపల్లి పీఏసీఎస్ వద్ద కార్యాలయ షట్టర్లను కొద్దిసేపు కొట్టారు. యూరియా కోసం చెప్పులను క్యూలైన్లో పెట్టి రోజంతా నిరీక్షించారు. యూరియా రాకపోవడంతో రాస్తారోకో చేశారు. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. నాగారం సీఐ నాగేశ్వరరావు తన సిబ్బందితో రెండు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మీడియా స్వేచ్ఛను హరించే అధికారం ప్రభుత్వానికి లేదు
ప్రజలు, ఉద్యోగుల తరఫున ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంటుంది. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. అక్రమ కేసులు, భౌతికదాడులు, బెదిరింపులతో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. తమకు అనుకూలంగా వార్తలు రాయలేదనే కారణంతో నచ్చని మీడియా కార్యాలయాలపై దాడులకు దిగడాన్ని, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ తీరు మార్చుకోకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళన చేస్తాం. తప్పుడు కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – గార్లపాటి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
అనంతగిరి: తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారం చోరీ జరిగిన సంఘటన అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం అమీనాబాద్ గ్రామానికి చెందిన గరిడేపల్లి రాధయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గోడకు తగిలించి ఉన్న తాళం చెవి తీసుకుని ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడు రాధయ్య కూతురు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తండ్రిపై మమకారం.. వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరూపంఆత్మకూర్ (ఎస్) : కనిపెంచిన తండ్రి విలువను వారు వదులుకోలేదు. తమ నుంచి తండ్రి దూరమై ఏడాదైనా ఆ జ్ఞాపకాలను అలాగే నెమరవేసుకున్నారు. తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని తమ వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించుకుని ప్రేమను చాటుకున్నారు ఆ కుమారులు. ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గుండు అబ్బయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా తమ తండ్రి జ్ఞాపకార్థం ఆయన కుమారులు గుండు లింగయ్య, గుండు రమేష్.. అబ్బయ్య విగ్రహాన్ని తయారు చేయించారు. గురువారం అబ్బయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో స్థానిక సీపీఎం నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుండు చిన్న లింగయ్య, రాచకొండ రమేష్, మడ్డి రమేష్, బుర్ర సోమయ్య పాల్గొన్నారు. ఎరువుల డీలర్లపై కేసుగుర్రంపోడు : గుర్రంపోడు మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి తన సిబ్బందితో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అధిక ధరలకు యూరియా విక్రయించిన ముగ్గురు డీలర్లపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పసుపులేటి మధు తెలిపారు. యూరియా బస్తా ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా రూ.266 లకు విక్రయించాల్సి ఉండగా కొంతమంది రైతుల వద్ద రూ.300 తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో శరవణ ఫర్టిలైజర్ యజమాని ఎర్ర శ్రీనివాసరావు, శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్ యజమాని బొమ్ము ఆనంద్, సాయిరాం ఏజెన్సీ యజమాని చందా గోవింద్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. -
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న మతోన్మాదులు
ఫ సీపీఐ జిల్లా కార్యదర్శివెంకటేశ్వర్లు సూర్యాపేట : దేశంలో కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత లోపించి ఉద్యమాలు చేపట్టకపోవడంతో భూమి, బుక్తి, విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటాన్ని మతోన్మాదులు వక్రీవరిస్తూ రాజ్యమేలుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆరోపించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ధర్మభిక్షం విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం 4,000 మంది బలిదానాలతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. ఈ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా మతోన్మాద బీజేపీ ప్రచారం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేందుకు సీపీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ సాయుధ పోరాటం కారణంగా 500 సంస్థానాలు విలీనం చేయడంతో పాటు పది లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచినట్లు గుర్తు చేశాన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఎందుకు సంకోచిస్తుందో తెలియజేయాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ సహకారంతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా హైదరాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యుడు యాదగిరి, పట్టణ కార్యవర్గ సభ్యులు బొమ్మగాని శ్రీనివాస్, రాంబాబు, అశోక్ కుమార్, నాయకులు అంతయ్య, బుర్ర శ్రీరాములు, రాము, రాజారాం, శ్రీకాంత్, శివరాం, ఇతర ప్రముఖులు డేగల జనార్దన్, నాతి సవేందర్, తల్లమల్ల హసేన్, కృష్ణ పాల్గొన్నారు. -
డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ శివారులో కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ ఆర్టీసీ డిపోనకు చెందిన టీజీ 05 జెడ్ 0045 నంబర్ గల బస్సు గురువారం చండూరు నుంచి జనగాం మీదుగా చౌటుప్పల్‌కు వెళుతోంది. ఈ క్రమంలో జనగాం నుంచి సంస్థాన్ నారాయణపురం వెళ్లే దారిలో కారు ఒకేసారి రోడ్డుపైకి వచ్చింది. కారును తప్పించే క్రమంలో బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. బస్సు టైర్లు, ఇంజన్ భూమిలోకి దిగబడ్డాయి. బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ పక్కనే బొంగోల కుంట ఉంది. కొంత అజాగ్రత్తగా వ్యవహరించినట్లయితే బస్సు కుంటలోకి దూసుకెళ్లేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తర్వాత వచ్చిన బస్సులో ప్రయాణికులను తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని సంఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఫ బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఫ అందరూ సురక్షితం -
ఎత్తిపోతల పనులు వేగవంతం చేయాలి
మేళ్లచెరువు : ఎత్తి పోతల పథకాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం చింతలపాలెం మండలం దొండపాడు పరిధిలోని బుగ్గమాధవరంలో నిర్మిస్తున్న రాజీవ్లిఫ్ట్ ఇరిగేషన్ ,వె వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు పనుల పురోగతి పరిశీలించానన్నారు. వెల్లటూరు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ భూసేకరణలో సరిహద్దులు ,టైటిల్ తో పాటు ఫారెస్టు భూముల వివాదాలు ఉన్నాయని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు భూసేకరణకు రూ.30 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. సరిపడా యూరియా ఉంది జిల్లాలోయూరియా సరిపడా ఉందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్పష్ట ం చేశారు. రైతులు అవసరం మేరకు తీసుకోవాలని ముందస్తుగా నిల్వ చేసుకోవద్దన్నారు. వ్యాగన్ యూరియా జిల్లాకు వచ్చిందని దానిని వ్యవసాయాధికారులు, పీఏసీఎస్‌లు, ఆగ్రోసెంటర్లకు సరఫరా చేసి రైతులకు అందిస్తున్నారన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సురేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈలు అశోక్, సత్యనారాయణ, డీఈ స్వామి, ఏఈ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఆదిత్య ఉన్నారు.ఫ కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ -
సారూ.. ఒక్క బస్తా ఇవ్వండి
ఫ పీఏసీఎస్‌లు, మనగ్రోమోర్ సెంటర్ల వద్ద రోజంతా నిరీక్షించినా చాలామందికి నిరాశే అర్వపల్లి: యూరియా కోసం రైతులు నానాపాట్లు పడుతున్నారు. తెల్లవారిందంటే చాలు పీఏసీఎస్‌లు, మన గ్రోమోర్ సెంటర్ల వద్ద క్యూకడుతున్నారు. ఒక్క బస్తా అయినా దొరుకకపోతదా అంటూ చాంతాడంత లైన్లో ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నారు. చివరికి యూరియా దొరకక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అర్వపల్లిలోని పీఏసీఎస్‌కు బుధవారం 450 బస్తాల యూరియా రాగా రైతులు 365బీ హైవేపై క్యూలైన్లో ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండే ఎండలో రోడ్డుపై నిల్చొని యూరియా తీసుకున్నారు. క్యూలైన్లలో ముందు వరుసలో ఉన్న రైతులకు మాత్రమే ఒక్కో బస్తా చొప్పున దొరికింది. స్థానిక ఏఎస్ఐ రామకోటి పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేయించారు. టోకెన్ల కోసం ఎగబడిన రైతులుమునగాల: మునగాలలోని మన గ్రోమోర్ కేంద్రానికి 1,100బస్తాల యూరియా వచ్చింది. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఉదయం నుంచే కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో జాతీయరహదారి పక్కన మన గ్రోమోర్ కేంద్రం ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే ప్రమాదముందని మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి, ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు రైతాంగానికి ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గణపవరం రోడ్డులో గల రైతువేదిక కార్యాలయంలో టోకెన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి బి.రాజు, ఏఈఓ రమ్యతేజ చేపట్టారు. దీంతో రైతులు రైతువేదిక కార్యాలయం వద్ద టోకెన్ల కోసం ఎగబడ్డారు. మన గ్రోమోరు సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పోలీసుల సహకారంతో 550టోకెన్లను రైతులకు అందజేశారు. టోకెన్లు అందుకున్న రైతులు తిరిగి మన గ్రోమోరు కేంద్రం వద్ద యూరియా కోసం అర కి.మీ మేర క్యూ కట్టారు. వీరికి పంపిణీ చేయగా 100 మంది వరకు యూరియా అందక వెనుదిరిగారు. మఠంపల్లి: మఠంపల్లి లోని మన గ్రోమోర్ కార్యాలయం వద్ద బుధవారం వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం బారులుదీరారు. 700 మంది రైతులు రాగా 500 మందికి పంపిణీ చేశారు. ఎకరం ఉన్న రైతులకు ఒకబస్తా, రెండు ఎకరాలుఆపైన ఉన్నవారికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మిగతా 200 మంది రైతులు వెనుదిరిగి వెళ్లిపోయారు. -
మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్లు కీలకం
సూర్యాపేటటౌన్ : సమాజంలో గురు – శిష్యుల బంధం ఎంతో పవిత్రమైనదని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన గురుపూజోత్సవంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 40 మందికి అవార్డులు అందజేశారు. అంతకు ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ప్రయాణం మొదలుపెట్టి రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఎన్నో గొప్ప పదవులు పొందారన్నారు. సర్వేపల్లిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లను ఎంతగానో పెంచారని, అలాగే నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఫలితాల్లో కూడా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వారి సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. నూతన బోధన పద్ధతులు నేర్చుకొని విద్యార్థులను నవీన సాంకేతిక వైపు ఆలోచించేలా తయారు చేయాలన్నారు. విద్యార్థులు నిజజీవితంలో సైన్‌న్స్ ఉపయోగాలు తెలుసుకొని ఆవిష్కరణాత్మక ఆలోచనల వైపు ముందడుగు వేసేలా చూడాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని ముందంజలోకి తీసుకొని రావాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో చాలా గొప్పదని జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు టీచర్లు అహర్నిశలు కష్టపడుతున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు శ్రవణ్‌కుమార్, వై.రాంబాబు, పూలమ్మ, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర, రాష్ట్ర అవార్డు గ్రహీతలు చత్రు నాయక్, యల్లయ్య, ఎంఈఓలు, హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం -
మొక్కలను సంరక్షించాలి
అర్వపల్లి: వన మహోత్సవంలో భాగంగా నాటే మొక్కలను సంరక్షించాలని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి, మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా ఇన్చార్జి అధికారి శ్రీనివాస్ కోరారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అర్వపల్లి శివారులోని దర్గా సమీపంలో 2,500 మొక్కలు నాటించే పనులను బుధవారం ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 7,500మొక్కలు పెంచనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి, టీఏ దీపిక, పంచాయతీ కార్యదర్శి నవీన్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలను ఎదుర్కొని నిలబడాలి
చివ్వెంల(సూర్యాపేట) : జీవితంలో సమస్యలను ఎదుర్కొని నిలబడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. మనిషి పుట్టినపప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటాడని, వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలిసి ఉండాలన్నారు. చిన్న విషయాలకు ఆత్మహత్యల వరకు వెళ్లి నిండు ప్రాణాలను తీసుకోవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ప్రిన్సిపల్ శ్రీవాణి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పి.వాణి, న్యాయవాదులు గుంటూరు మధు, కాసం సరిత, కట్ట సుధాకర్, జుస్మిత, అనంతుల సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
పాఠశాలల్లో ఎన్సీఈఆర్టీ బృందం సర్వే
సూర్యాపేట : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలవుతున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) ప్రోగ్రాంపై పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి ఎన్సీఈఆర్టీ బృందం బుధవారం సర్వే చేసింది. జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడ ప్రాథమిక పాఠశాల, రాజీవ్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాలను బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాల స్థాయిలో జరుగుతున్న బోధన – అభ్యసన ప్రక్రియను పరిశీలించడమే కాకుండా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడింది. ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అమలు విధానం, విద్యార్థుల ప్రాథమిక పఠన–గణన నైపుణ్యాలు – స్థాయి అంచనా, ఉపాధ్యాయుల అనుభవాలు – బోధనలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార సూచనలు, తల్లిదండ్రుల భాగస్వామ్యం – పిల్లల విద్యలో వారి పాత్ర, టీఎల్ఎం వినియోగం సంబంధిత రికార్డుల తనిఖీ చేసింది. తనిఖీల్లో అకడమిక్ కన్సల్ల్టెంట్లు భావన మలోత్రా, డాక్ర్ ప్రంజలి దేవ్, ఎస్ఈఆర్టీ ప్రతినిధి జె.శ్రీనివాసులు, సూర్యాపేట ఎంఈఓ శేషగాని శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్ఎంలు యాకయ్య, పద్మ, రీసోర్స్ పర్సన్ నరసింహారావు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
సమాజ మార్పునకు కృషి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతాంగ పోరాటంలో భాగంగా అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆమె త్యాగాలు, పోరాట స్ఫూర్తి భావితరానికి దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ నరసింహారావు, డీపీఓ యాదగిరి, డీఎస్డీడబ్ల్యూఓ దయానందరాణి, బీసీ సంఘం నాయకులు నాయకులు చల్లమల్ల నరసింహ, బంటు కృష్ణ, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, పద్మ, శ్రీదేవి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్‌గా సీతారామారావుభానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కొలనుపాక సీతారామారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన రాంబాబు ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. సీతారామారావు ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్(ఐ– క్యాడ్)గా విధులు నిర్వహిస్తున్నారు. మట్టపల్లి క్షేత్రంలో విశేష పూజలుమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిత్యపూజలు, ఆర్జితసేవలు చేపట్టారు. ఈసందర్భంగా శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో అర్చకులు, భక్తులు ఊరేగించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
తిండీ తిప్పలు మాని పడిగాపులు
అర్వపల్లి: యూరియా కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. తిండీతిప్పలు మాని తెల్లవారు జామునుంచే పీఏసీఎస్‌లు, మన గ్రోమోర్ బాట పడుతున్నారు. పట్టాదారుపాస్ పుస్తకాలు, ఆధార్‌కార్డులు, వీటి జిరాక్స్ కాపీలు, చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురుచూస్తున్నారు. పొద్దస్తమానం నిరీక్షించినా అందరికీ యూరియా దొరకని దుస్థితి నెలకొంది. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని పీఏసీఎస్‌కు యూరియా వస్తుందని తెలిసి వివిధ గ్రామాల రైతులు మంగళవారం ఉదయం నుంచే కేంద్రానికి చేరుకున్నారు. రాత్రి అయ్యాక 250 బస్తాల యూరియా రాగా క్యూలైన్ కట్టారు. సూర్యాపేట–జనగామ 365బీ హైవే వెంటే పీఏసీఎస్ కార్యాలయం ఉండటంతో రహదారిపైనే యూరియా కోసం బారులుదీరారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేచిఉన్నా కొందరికే దొరకడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లో ముందు వరుసలో ఉన్నవారికి ఒకరికి ఒక బస్తా చొప్పున మాత్రమే ఇచ్చారు. స్థానిక ఏఎస్ఐ రామకోటి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. చిలుకూరు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు క్యూలో పెట్టిన చెప్పులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఫ యూరియా కోసం రైతుల అరిగోస ఫ వేకువజాము నుంచే పీఏసీఎస్‌లు, మన గ్రోమోర్ కేంద్రాల వద్ద బారులు ఫ అయినా అందరికీ అందని యూరియా బస్తా -
రైతులు 600 మంది.. బస్తాలు 400
మోతె: మోతె మండల కేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా ఇస్తున్నారని సమాచారం తెలుసుకున్న స్థానిక మండల రైతులతో పాటు చివ్వెంల, మునగాల మండలాల నుంచి సుమారు 600 మంది తరలివచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. 400 యూరియా బస్తాలు రాగా ఒక్కో రైతుకు ఒకబస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా అందని మిగతా రైతులు వెనుదిరిగి పోయారు. ఉదయం నుంచి ఎదురుచూసినా యూరియా రాక.. యూరియా లోడు వస్తుందని సమాచార తెలుసుకొని మామిళ్లగూడెం పీఏసీఎస్ వద్దకు మంగళవారం ఉదయం నుంచే క్యూ కట్టారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా యూరియా లారీ రాకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. -
ఉదయం నుంచే బారులు
నడిగూడెం : ఈ నెల 8న నడిగూడెం పీఏసీఎస్‌కు 444 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలిసిన రైతులు మంగళవారం తెల్లవారుజాము నుంచే రైతు వేదిక వద్ద చిట్టీల కోసం బారులుదీరారు. రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఒకటి చొప్పున, ఐదు ఎకరాల రైతులకు రెండు చొప్పున బస్తాలు పంపిణీ చేశారు. మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. కాగా నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు ఉలవల పద్మ ఉదయం ఏడు గంటలకే రైతు వేదిక వద్దకు వచ్చారు. మధ్యాహ్న భోజనం రైతు వేదిక వద్ద బయట తింటుండడంతో అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు. -
తెరుచుకున్న మట్టపల్లి ఆలయం
క్రీడాపోటీలు ప్రారంభం ఎంజీ యూనివర్సిటీలో అంతర్ కళాశాలల క్రీడాపోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025- 8లోమఠంపల్లి: చంద్రగ్రహణం నేపథ్యంలో ద్వారబంధనం చేసిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అర్చకులు సోమవారం ఉదయమే తెరిచారు. పవిత్ర కృష్ణా జలాలతో గర్భాలయంలో శ్రీమూల విరాట్‌కు ఇతర దేవతా విగ్రహాలకు సంప్రోక్షణ చేశారు. అనంతరం ఆలయంలో యథావిధిగా నిత్య పూజలు ప్రారంభించారు. మధ్యాహ్నం మహానివేదన, నీరాజన మంత్రపుష్పాలతో భక్తులకు తీర్థ ప్రపాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చెన్నూరు మట్టపల్లిరావు మాట్లాడుతూ ఈనెల 9 వరకు ఆలయంలో ఆర్జితసేవలు, నిత్యకల్యాణం నిలివేయనున్నట్టు, ఈవిషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. పూజల్లో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లి ఆలయ ద్వారాలు తెరుస్తున్న అర్చకులు -
అవే బారులు.. అదే గోస
తిరుమలగిరి (తుంగతుర్తి): యూరియా కష్టాలు రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. యూరియా కోసం తెల్లవారు జామునుంచే పీఏసీ ఎస్ కేంద్రాలు, మనగ్రోమోర్ కేంద్రాల వద్ద రైతులు బారులుదీరుతున్నారు. సోమవారం ఉదయం తిరుమలగిరి పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు టోకెన్ల కోసం క్యూ కట్టాతరు. 11 గంటలైనా సిబ్బంది రాక పోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక మహిళా రైతులు అసహనానికి గురయ్యారు. పోలీస్ పహారా నడుమ టోకెన్లు అందజేశారు. ఒక్కో రైతుకు ఒక్కబస్తా మాత్రమే ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది రైతులకు యూరియా దొరకక ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల తోపులాటఅర్వపల్లి: యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. అర్వపల్లి, తిమ్మాపురం పీఏసీఎస్‌లకు 500బస్తాల యూరియా రాగా వందల సంఖ్యలో రైతులు తరలివచ్చి క్యూ లైన్లలో ఉన్నారు. అయితే ఈ యూరియా చాలక రైతుల మధ్య తోపులాట జరిగింది. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా అమ్మకాలు జరిపారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనపాలకవీడు: యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాలకవీడు మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేవారు. సకాలంలో ఎరువులు అందకపోతే మా కష్టం అంతా వృథా అవుతుందని వాపోయారు. కాసేపట్లోనే రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు. 150 మంది రైతులకు యూరియా అందక..పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని చీదెళ్ల పీఏసీఎస్ కార్యాలయం వద్దకు రైతులు సోమవారం తెల్లవారు జాము నుంచే బారులు దీరారు. 440 బస్తాల యూరియా రాగా 440మంది రైతులకు అందించారు. సుమారు 150మంది రైతులు యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్తాతోనే సరిచిలుకూరు: చిలుకూరు మండలంలోని నారాయణపురం పీఏసీఎస్‌కు సోమవారం యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్యూలో పెట్టారు. గంటల తరబడి రైతులు నిలబడితే ఒక్కొక్కరికి బస్తా యూరియా మాత్రమే లభించింది. పోలీస్ స్టేషన్లో టోకెన్ల పంపిణీనూతనకల్: యూరియా కోసం రైతులు నూతనకల్ మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారం రోజుల నుంచి ఉదయం 4గంటల నుంచి షాపుల ముందు పడిగాపులు కాసినా వచ్చిన యూరియాను అధికారులు సక్రమంగా పంపిణీ చేయడం లేదన్నారు. మనగ్రోమోర్ కేంద్రంలో వచ్చిన యూరియా రైతులకు అందించడం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగరాజు సమక్షంలో ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున టోకెన్ అందించారు. గ్రోమోర్‌కు వచ్చిన 800బస్తాలను రైతులకు అందించడంతో రైతులు రాత్రి 8గంటల వరకు కూడా లైన్లో నిల్చొని యూరియా తీసుకున్నారు.గొడవకు దిగిన రైతులుమోతె : మోతె మండల కేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం సోమవారం ఉదయం 6 గంటల నుంచే రైతులు బారులుదీరారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున 400 బస్తాల యూరియా మధ్యాహ్నం 12 గంటల వరకు అందించారు. యూరియా దొరకని రైతులు గొడవకు దిగారు. పోలీసులు వచ్చి చెప్పినా వినకుండా మన గ్రోమోర్ కేంద్రంపై ఎగబడ్డారు. కేంద్రం నిర్వాహకులు చేసేదేమీ లేక మంగళవారం యూరియా ఇస్తామని షెట్టర్ మూసివేశారు. ఫ యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు ఫ తెల్లవారు జామునుంచే పీఏసీఎస్‌ల బాట -
10న ఓటరు తుది జాబితా
భానుపురి (సూర్యాపేట ): వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఈనెల 10వ తేదీన ఓటరు తుది జాబితా ప్రకటించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెల్లడించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 23 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 235 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలలో మొత్తం 6,94,815 మంది ఓటర్లు ఉన్నారని,1272 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. చనిపోయిన ఓటర్ల వివరాలను మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు, కుటుంబ సభ్యుల ఆమోదం తీసుకొని ఫారం–7 ద్వారా తొలగిస్తామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ వి.వి అప్పారావు, డీపీఓ యాదగిరి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, డీఎల్పీఓ నారాయణరెడ్డి, నాయకులు రాజేశ్వరరావు, నర్సింహ, ఆబిద్, గోపి, భిక్షం, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, రమేష్, డేవిడ్ కుమార్, సైదులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలుజిల్లాలో సరిపోను యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులెవరూ అధైర్య పడవద్దని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సోమవారం 640 మెట్రిక్ టన్నులకు గాను 520 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని, ఇంకా 120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం అదనంగా 420 మెట్రిక్ టన్నుల యూరియా అన్ని పీఏసీఎస్, డీలర్ కేంద్రాల్లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దీంతో కలుపుకొని మొత్తం 540 మెట్రిక్ టన్నుల యూరియా నిలువలు జిల్లాలో ఉంటాయని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో జిల్లాకు మరో 860 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా అవుతున్నదని తెలిపారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలను సమీక్షించారు. ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటే వాటిపై దృష్టిపెట్టి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవ్, డీఆర్డీఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీసీఓ పద్మ, డి ఈఓ అశోక్, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డీఎస్ఓ మోహన్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. -
ధాన్యం ఇచ్చిందెంత? సీఎంఆర్ వచ్చిందెంత? రావాల్సిందెంత?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యం ఏయే మిల్లుల్లో ఎంత మేరకు ఉంది? సీఎంఆర్ కింద ఆయా మిల్లులు ఎంత బియ్యం ఇచ్చాయి? ఇంకా ఎంత బియ్యం ఇవ్వాల్సి ఉంది? అన్న లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల శాఖ అధికారులతో కూడిన బృందాలతో జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ (జేపీవీ) నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో మిల్లుల్లో ఈ తనిఖీలు చేపట్టేందుకు ఎఫ్‌సీఐ ఆదేశాలు జారీ చేసింది. 2024–25 వానాకాలం, యాసంగి సీజన్లలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం, ఎఫ్‌సీఐకి వచ్చిన సీఎంఆర్, ఇంకా రావాల్సి ఉన్న సీఎంఆర్‌కు సంబంధించిన ధాన్యం ఆయా మిల్లుల్లో ఉందా? లేదా? అన్న లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ తనిఖీలు ప్రారంభం కానున్నాయి.కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే రంగంలోకి..గత ఆర్థిక సంవత్సరంలోని సీజన్లకు సంబంధించిన ధాన్యం, సీఎంఆర్ లెక్కలు పక్కాగా తేల్చాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రా సింది. ఎఫ్‌సీఐ నేతృత్వంలోనే ఈ తనిఖీలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎఫ్‌సీఐ త నిఖీ బృందాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.30 రోజుల్లో సీఎంఆర్ ఇవ్వాలని నిబంధనసాధారణంగా మిల్లులకు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి నెల రోజుల్లోగా ఎఫ్‌సీఐకి బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. అయితే మిల్లుల వద్దే ధాన్యం నెలల తరబడి ఉంటోంది. సకాలంలో ఎఫ్‌సీఐకి సీఎంఆర్ ఇవ్వడం లేదు. ఒక సీజన్లో ఇచ్చిన ధాన్యం మరో సీజన్ ధాన్యం వచ్చే నాటికి కూడా మిల్లర్లు బియ్యాన్ని ఇవ్వడం లేదు. కొందరు మిల్లర్లు సంవత్సరాలు అవుతున్నా సీఎంఆర్ ఇవ్వడం లేదు. ఇలా జిల్లాలో పలువురు మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.మామూళ్ల మత్తులో కొందరు అధికారులుసీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు మరాడించి బియ్యం అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయట పడింది. సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యం ఆయా మిల్లుల్లో లేదని తేలింది. ఒక సీజన్ ధాన్యాన్ని అమ్ముకుంట్నున మిల్లర్లు మరో సీజన్లో ధాన్యం వచ్చే వరకు ఆగి, అప్పుడు సీఎంఆర్ ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడమే కాకుండా తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్‌కు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పౌరసరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు మిల్లర్లతో కుమ్మకై ్క మామూళ్లు తీసుకుని కఠినంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ధాన్యం తీసుకొని సీఎంఆర్ బియ్యం ఇవ్వకున్నా నామమాత్రపు కేసులతో మమ అనిపిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిల్లుల్లో ధాన్యం నిల్వలు, సీఎంఆర్‌కు సంబంధించిన లెక్కలను తేల్చేందుకు ఎఫ్‌సీఐ చర్యలు చేపట్టింది.● సూర్యాపేట జిల్లాలో వానాకాలం సీజన్ మిల్లులకు 1,65,353 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా, ఇప్పటివరకు 64,062 మెట్రిక్ టన్నుల బియ్యమే ఇచ్చారు. ఇంకా 48,197 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. యాసంగి సీజన్లో 2,89,690 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా, 31,686 మెట్రిక్ టన్నుల బియ్యమే సీఎంఆర్ కింద మిల్లర్లు ఇచ్చారు. ఇంఆక 1,62,373 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.● యాదాద్రి భువనగిరి జిల్లాలో వానాకాలం సీజన్‌కు 1,50,600 మెట్రిక్ బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,16,000 మెట్రిక్ టన్నుల బియ్యమే వచ్చింది. ఇంకా 34,600 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. యాసంగి సీజన్లో 2.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఇప్పటివరకు 90 వేల మెట్రిక్ టన్నుల బియ్యమే వచ్చింది. ఇంకా 1,64,000 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది.● నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్లో 2,75,840 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు కేటాయించగా, 1,86,218 మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారు. ఇంకా 6,143 మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు. యాసంగి సీజన్లో 6,03,305 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు ఇవ్వగా, అందులో 4,07,671 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా, 2,02,277 మెట్రిక్ టన్నులే ఇచ్చాయి. ఇంకా 2,05,394 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. రావాల్సి ఉన్న సీఎంఆర్ (మెట్రిక్ టన్నుల్లో)జిల్లా వానాకాలం యాసంగి మొత్తంనల్లగొండ 6,143 2,05,394 2,11,537సూర్యాపేట 48,197 1,62,373 2,10,570యాదాద్రి 34,600 1,65,000 1,99,600 -
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు
● సీనియర్ నేత గంగిడి మనోహర్‌రెడ్డికి దక్కని స్థానం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నలుగురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. ముగ్గురికి ఉపాధ్యక్ష పదవులు దక్కగా, మరొకరికి రాష్ట్ర కార్యదర్శి పదవి లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆమోదంతో రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, జరుప్లావత్ గోపి (కళ్యాణ్‌నాయక్)లను నియమించారు. రాష్ట్ర కార్యదర్శిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించారు. ఆయన గతంలో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సంజయ్ అనుచరుడిగా ముద్ర పడినందుకేనా...ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు గంగిడి మనోహర్‌రెడ్డికి ఈసారి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కలేదు. బండి సంజయ్ ప్రధాన అనుచరుడిగా మనోహర్‌రెడ్డి వ్యవహరించారని, రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పించకుండా కొందరు ఎంపీలే నడ్డాపై ఒత్తిడి చేశారని అనుచరులు మండిపడుతున్నారు. దీనిపై మనోహర్‌రెడ్డి స్పందిస్తూ.. కార్యవర్గంలో తన పేరు లేకపోవడం వాస్తవమేనని, పార్టీ తన సేవలను మరో రకంగా ఉపయోగించుకుంటుందేమోనని పేర్కొన్నారు. క్రియాశీల కార్యకర్తగా ఎప్పుడూ పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా శ్రీనివాస్రెడ్డిఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా ఆత్మకూర్(ఎస్)కు చెందిన కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కోదాడ పట్టణంలో నిర్వహించిన అసోసియేషన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కబడ్డీ సీనియర్ క్రీడాకారులు గుణగంటి వెంకన్న, బోళ్ల వెంకటరెడ్డి, బొల్లికొండ భిక్షం తదితరులు పాల్గొన్నారు. ‘సారథి’ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్తిరుమలగిరి (తుంగ తుర్తి) : తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా తిరుమలగిరి మండలం గుండెపురికి చెందిన పాలకుర్తి శ్రీకాంత్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లెల రాములు, ఉపాధ్యక్షుడిగా ప్రియాంక, సహాయ కార్యదర్శిగా గడ్డం ఉదయ్, కోశాధికారిగా పాక ఉపేందర్, గౌరవ సలహాదారులుగా శంకర్, సైదులు ఎన్నికయ్యారు. -
వేగంగా ప్రాథమిక విచారణ చేపట్టాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఫిర్యాదులపై వేగంగా ప్రాథమిక విచారణ చేపట్టి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం ఆత్మకూర్(ఎస్) పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రిసెప్షన్లో బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, కేస్ ఫైళ్లు, గ్రామాల హద్దులు, కోర్టు వ్యవహారాలు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసులు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధి లో తనిఖీలు ముమ్మరం చేసి కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, యాకూబ్, అశోక్ పాల్గొన్నారు. బాధితులకు అండగా ఉంటాంసూర్యాపేటటౌన్ :పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా ఉంటాని ఎస్పీ కె.నరసింహ భరోసా ఇచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదుదారులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. సూర్యాపేట రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. ఎస్పీ నరసింహ -
ప్రాజెక్టులు కట్టింది.. నీళ్లిచ్చింది కాంగ్రెస్సే
తిరుమలగిరి (తుంగతుర్తి): ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రాజెక్టులు కట్టింది.. అవి ఇప్పటికీ నాణ్యతగా ఉన్నాయి.. వాటి ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే’ అని తుంగతుర్తి శాసన సభ్యుడు మందుల సామేల్ పేర్కొన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలోని బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను సూర్యాపేట జిల్లాకు విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నీటి ప్రాధాన్యతను గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, పోచంపాడు వంటి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి వందల ఎకరాలకు సాగు నీరు అందించారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, వారి హయాంలోనే అది కూలి పోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. గోదావరి జలాల ద్వారా సూర్యాపేట జిల్లాలోని 500 చెరువులు, కుంటలు నిండుతాయని తెలిపారు. ఈ జలాల ద్వారా 2.13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. యూరియా విషయంలో కేంద్రంలో నిబీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జిల్లాకు గోదావరి జలాలు రాక బయ్యన్న వాగు నుంచి 500 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే మందుల సామేల్ విడుదల చేశారు. వెలిశాల వద్ద గోదావరి జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి. 69, 71డీబీఎంలకు నీళ్లు అందాయి. రెండు రోజుల్లో 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు వై.నరేష్, నాగం సుధాకర్‌రెడ్డి, సత్యం,లింగయ్య, పేరాల వీరేష్, జమ్మిలాల్, నర్సింహారెడ్డి, వీరమల్లు, వెంకట్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ బయ్యన్నవాగు నుంచి గోదావరి జలాలు విడుదల -
పంచాయతీలు బలోపేతమయ్యేలా..
నాగారం : గ్రామ పంచాయతీల బలోపేతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పాలక వర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో నిధుల కొరత ఏర్పడి సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతోపాటు పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలో పంచాయతీలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీసమర్థ్ వెబ్ పోర్టల్శ్రీను ప్రారంభించింది. దీని ద్వారా పంచాయతీ పాలనతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలను కేంద్రం పర్యవేక్షించనుంది. గ్రామ పంచాయతీలకు పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా సాధారణ నిధి సమకూరుతోంది. జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులపై పర్యవేక్షణ లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి ఈ పోర్టల్‌ను వినియోగించుకుని పల్లెలను బలోపేతం చేయాలని భావిస్తోంది. నిధులు మళ్లించకుండా నిఘా.. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకే పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరేలా పర్యవేక్షించనుంది. ఇతర రాష్ట్రాల్లో ఇదివరకే ఈ పోర్టల్‌ను ఏర్పాటు చేసి సమర్థవంతంగా పంచాయతీల పనితీరును మెరుగుపర్చింది. తాజాగా ఏర్పాటు చేసిన ఈ పోర్టల్ ద్వారా నిధుల వెచ్చింపుతోపాటు పంచాయతీలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా చర్యలు తీసుకోనుంది. పోర్టల్ ద్వారా సలహాలు, సూచనలు.. గ్రామ పంచాయతీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కొత్తగా రూపొందించిన పోర్టల్ ద్వారా కేంద్రం సలహాలు సూచనలు అందించనుంది. డిజిటల్ వేదిక ద్వారా నేరుగా పంచాయతీలను పర్యవేక్షించడంతో పాటు మరింత బలోపేతం చేసేందుకు పంచాయతీరాజ్ నిపుణులతో అధ్యయన కమిటీని నియమించింది. సొంత ఆదాయ వనరులు పెరుగుదలకు ఆచరణీయమైన నమూనాను రూపొందించనుంది. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీల్లో త్వరలోనే కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఫ పల్లెల ఆర్థిక పరిపుష్టే లక్ష్యంగా కేంద్రం ప్రత్యేక పర్యవేక్షణ ఫ కొత్తగా సమర్థ్ వెబ్ పోర్టల్‌కు రూపకల్పన ఫ కేంద్రం నిధులు ఇతర పనులకు మళ్లింకుండా కార్యాచరణ ఫ త్వరలోనే అందుబాటులోకి రానున్న పోర్టల్ కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చే సమర్థ్ వెబ్ పోర్టల్‌తో గ్రామ పంచాయతీల పనితీరు మెరుగుపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా పంచాయతీల పాలనతోపాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలను కేంద్రం పర్యవేక్షించనుంది. ఈ పోర్టల్ అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. – కె.యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి -
విద్యాభివృద్ధికి మరింత కృషి
హుజూర్నగర్ : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) మరింత కృషిచేయాలని ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని వాసవీ భవన్లో నిర్వహించిన ఆవోపా హుజూర్నగర్ కమిటీ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. చదువుతోనే జీవితాల్లో వెలుగులు నిండి సమగ్రాభివృద్ధి సాధించగలుగుతామన్నారు. అనంతరం పేద ఆర్యవైశ్య విద్యార్థులకు రూ 5.05 లక్షల ఉపకార వేతనాలతో పాటు 35 మంది మహిళలకు పింఛన్లు అందజేశారు. ఐఐటీ చైన్నెలో సీటు సంపాదించిన ఆర్యవైశ్య పేదవిద్యార్థిని చల్లా హర్షితకు అప్పటికప్పుడు రూ 1.10లక్షల నగదు అందజేశారు. అంతకు మందు వాసవీ మాత, గాంధీజీ, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆవోపా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ కందికొండ శ్రీనివాస్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నందనపు శిల్ప, ఆవోపా హుజూర్నగర్ అధ్యక్ష కార్యదర్శులు వంగవీటి సతీష్, పెనుగొండ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు, ఆవోపా నాయకులు ఇమ్మంజి రమేష్, ఇరుకుళ్ల చెన్నకేశవరావు, పేరూరి అశోక్, నాగేశ్వర రావు, అప్పయ్య, వెంకయ్య, నరసింహారావు, రామారావు, గుండా రమేష్, రామారావు పాల్గొన్నారు. ఫ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ -
11 నుంచి సాయుధ పోరాట వారోత్సవాలు
సూర్యాపేట అర్బన్ : ఈనెల 11 నుంచి 17 వరకు జరగనున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొమ్మగాని ధర్మభిక్షం భవన్లో జరిగిన ఆ పార్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసమే తమ జీవితాలను అంకితం చేసిన నాటి తెలంగాణ సాయుధ పోరాట అవరవీరుల జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజెప్పాలన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు పెంచి పేదల జీవితాలను నాశనం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించామని గొప్పులు చెప్పుకుంటోందని విమర్శించారు. మోడల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలలుగా జీతం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యల్లావుల రాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల శ్రీనివాసరావు, యల్లంల యాదగిరి, బద్దం కృష్ణారెడ్డి, బూర వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, మండవ వెంకటేశ్వర్లు, ఎస్కే లతీఫ్, దేవరం మల్లీశ్వరి, ఎస్కే.సాయబల్లి, రెమిడాల రాజు తదితరులు పాల్గొన్నారు.ఫ సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు -
రూ.48.10 కోట్లు
6,168 పనులకురెండో విడత ఉపాధి జాతరకు నిధులు కేటాయింపు నాగారం : రెండో విడత ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 23 మండలాల్లోని 486 గ్రామ పంచాయతీలకు పశువుల కొట్టాలు, నాడెప్ కంపోస్ట్ గుంతలు, గొర్రెల షెడ్లు, వంద కోళ్లకు సరిపడే పదేసి కోళ్లఫారాలు, సామూహిక ఇంకుడు గుంతలు, అజొల్లా (పశువులు మేత గడ్డి పెంపకం) మంజూరయ్యాయి. వీటితోపాటు అంగన్వాడీ భవనాలు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాల వంటి 14 రకాలైన 6,168 పనులు మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.48.10 కోట్ల నిధులు కేటాయించింది. ఈ పనులు చేసుకుంటే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. పశువులకు రక్షణగా.. ప్రస్తుతం పశువులు కొట్టాలు లేక పెంపకందారులైన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల వద్ద రక్షణ లేకుండా ఉంటున్న పశువులపై క్రూరమృగాలు దాడులు చేస్తున్నాయి. పశువులను పోగొట్టుకొని రైతులు ఉపాధి కోల్పోతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రెండో విడత పనుల జాతరలో భాగంగా పనులు, నిధులు మంజూరు చేసింది. అత్యధికంగా ఒక్కొక్క మండలానికి 40 చొప్పున పశువుల కొట్టాలు మంజూరయ్యాయి. సన్న, చిన్నకారు రైతులకు పూర్తిస్థాయి రాయితీతో వీటిని కేటాయిస్తారు. ముందుగా నిర్మాణ ఖర్చు రైతే భరించాల్సి ఉంది. పూర్తయిన తర్వాత అధికారులు ఖర్చు చేసిన డ బ్బులు బిల్లు రూపంలో చెల్లి స్తారు. ఇవేకాకుండా మిగతా పనులన్నింటినీ పూర్తిస్థాయి రాయితీతోనే చేసుకోవచ్చు. ఉపాధి హామీలో భాగంగా రెండో విడత జిల్లాకు మొత్తం 6,168 పనులు మంజూరయ్యాయి. అన్ని పనులకు కలిపి ప్రభుత్వం మొత్తం రూ.48.10 కోట్ల నిధులు కేటాయించింది. ప్రతి పనిని నాణ్యతాప్రమాణాలతో పూర్తిచేయిస్తాం. – వీవీ.అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట ఫ 14 రకాల పనులు చేపట్టే అవకాశం ఫ పశువుల కొట్టాలు, ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రాధాన్యం ఫ అంగన్వాడీ, పంచాయతీ భవనాలకూ చాన్స్ పనుల పేర్లు మంజూరైన నిధులు పనులు (రూ.లక్షల్లో..) గ్రామపంచాయతీ భవనాలు 49 980.00 అంగన్వాడీ భవనాలు 54 648.00 మురుగుకాల్వల చివర సోక్పిట్స్ 349 323.68 పాఠశాల మరుగుదొడ్లు 29 58.00 ఇంకుడు గుంతలు (సోక్ పిట్స్) 2,651 185.57 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 4 160.00 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ 18 54.00 పండ్ల తోటలు 308 ఎకరాలు 1.30 పశువుల కొట్టాలు 2,327 2,257.19 కోళ్ల ఫారాలు 45 45.00 గొర్రెల షెడ్లు 25 25.00 అజొల్లా ఇన్ప్రాస్ట్రక్చర్ 93 16.54 సెగ్రిగేషన్ షెడ్లు 11 19.50 నాడెం కంపోస్ట్ పిట్స్ 205 36.74 -
రక్తదానం ప్రాణదానంతో సమానం
కోదాడరూరల్ : రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని కోదాడ యునైటెడ్ ముస్లిం యూత్ ప్రతినిధులు అన్నారు. ఆదివారం మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకొని కోదాడలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 సభ్యులు రక్తాన్ని దానం చేసి ఖమ్మం నోవా కేర్ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. అనంతరం యూత్ ప్రతినిధులు మాట్లాడు తు యువత సమాజ సేవలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ముస్లిం యూత్ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు
ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవం ఏదైనా ప్రజలంతా సంతోషంగా నిర్వహించుకోవాలని, జిల్లా పోలీస్ శాఖ తరఫున పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి, పోలీస్‌లకు సహకరించిన ప్రజలు, ఉత్సవ కమిటీలు, భక్తులు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన అన్ని శాఖల అధికారులకు, బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాంకోదాడ: గ్రామీణ ప్రాంతాల్లోని కబడ్డీ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామా నరసింహారావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాలలో జరిగిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. క్రీడాకారుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ యువతను రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రో కబడ్డీ క్రీడాకారులను అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెండ్ కర్తయ్య, క్రిష్టాఫర్‌బాబు, మార్కెట్ వైస్ చైర్మన్ ఎస్.కె.బషీర్, వేనేపల్లి శ్రీనివాసరావు, పందిరి నాగిరెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రామకోటి, మంగయ్య, వెంకట్‌రెడ్డి, కోటయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలిసూర్యాపేట అర్బన్ : వికలాంగులకు రూ.6 వేలు, చేయూత పెన్షన్‌దారులకు రూ.4 వేలు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 17, 18, 19 వార్డుల పరిధిలోని చింతలచెరువు, సుందరయ్య నగర్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. చేయూత పింఛన్ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు బొజ్జ వెంకన్న మాదిగ, కళానేత గంట భిక్షపతి, వల్దాస్ పాండు, వేల్పుల దేవయ్య, నవీన్, కనుక దేవదనం, ఇరుగు జానయ్య, మెరుగు మదన్, మెరుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం
భూదాన్‌పోచంపల్లి: స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ఆర్టీఆర్ఐ)లో నిర్వహించే వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించుకొని, అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించి ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఎస్ఆర్టీఆర్ఐ చైర్మన్ డాక్టర్ కిషోర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, ఎస్ఆర్టీఆర్ఐ చైర్మన్ కిషోర్‌రెడ్డి సమక్షంలో అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, ఎస్ఆర్టీఆర్ఐ డైరెక్టర్ హరికృష్ణ అవగాహన పత్రాలపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్యయోజన పథకం ద్వారా అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి, స్కిల్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, ఈఎంఆర్‌ఆర్‌సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు. -
మట్టపల్లి ఆలయం మూసివేత
మట్టపల్లి దేవాలయాన్ని మూసివేస్తున్న అర్చకులు శివాలయం తలుపు మూసివేస్తున్న అర్చకుడు మఠంపల్లి: చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంతోపాటు క్షేత్రంలోని శివాలయాన్ని అర్చకులు మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్ మాట్లాడారు. సోమవారం తెల్లవారుజామునే ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయాన్ని తెరిచి యథావిధిగా పూజలు కొనసాగిస్తామన్నారు. ఫ చంద్రగ్రహణం నేపథ్యంలో ద్వారబంధనం -
జీపీఓలు విధులు సక్రమంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో గ్రామ పాలన అధికారులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. అభ్యర్థి సొంత నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో పోస్టింగ్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యూరియా కొరత తీర్చాలిహుజూర్నగర్ : రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చేసి రైతుల ఇబ్బందులు తీర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హుజూర్నగర్ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సీజన్కంటే ముందే రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వాలు ప్రకటనలు చేసి ఆచరణలో విఫలమైందన్నారు. యూరియా కోసం రైతుల కుటుంబ సభ్యులంతా సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెండింగ్‌లో ఉన్న సన్నధాన్యం అమ్మిన బోనస్ డబ్బులను అందించాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టేపు సైదులు, నాయకులు మురళి, యోన, వెంకన్న, మల్లయ్య, వెంకటి, శంభయ్య పాల్గొన్నారు. గోండ్రియాల పీఏసీఎస్ చైర్‌పర్సన్‌పై అనర్హత వేటుఅనంతగిరి: మండల కేంద్రంలోని గోండ్రియాల సహకార సంఘ చైర్పర్సన్ నెలకూర్తి ఉషారాణిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీఓ పద్మ శనివారం అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సహకార సంఘ నూతన చైర్మన్‌గా బుర్ర నర్సింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం సంఘంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో చైర్పర్సన్ నెలకూర్తి ఉషారాణి అవకతవకలకు పాల్పడినట్లు డీసీఓకు ఫిర్యాదు అందడంతో విచారణకు ఆదేశించారు. విచారణ జరుగుతున్న క్రమంలో సంఘంలో సదరు చైర్పర్సన్, సొసైటీ కార్యవర్గ, బైలా నిబంధనలకు విరుద్ధంగా 85శాతానికి మించి గోల్డ్ లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు 21ఏఏ చట్టం ప్రకారం సొసైటీ చైర్‌పర్సన్‌పై అనర్హత వేటు వేసినట్లు డీసీఓ తెలిపారు. మట్టపల్లిలో విశేష పూజలుమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి విశేష పూజలు కొనసాగాయి. శుక్రవారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయంలో బసచేసి తెల్లవారుజాముననే కృష్ణానదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు. -
అదే బారులు.. అవే తిప్పలు
అనంతగిరి: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సీజన్ ప్రారంభం నుంచి రైతులు పీఏసీఎస్, గోదాములు, ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేథప్యంలో శనివారం అనంతగిరిలోని పీఏసీఎస్ వద్ద రైతలు యూరియా కోసం వచ్చిన ఘర్షణపడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకు యూరియా లారీ వచ్చి బస్తాలు దిగుమతి చేస్తుండగానే కొందరు రైతులు వచ్చి సీరియల్ రాయించుకుని క్యూలైన్లో నిలబడ్డారు. మధ్యలో కొందరు రైతులు వచ్చి చేరడంతో పరస్పర ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడికి దిగారు. పోలీసులు రావడంతో ఘర్షణ సద్దుమణిగింది. అనంతరం అధికారులు రైతులకు ఒక్కో బస్తా చొప్పున యూరియా అందించారు. యూరియా అందని వందమందికిపైగా రైతులు వెనుదిరిగారు. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు మేళ్లచెరువు : యూరియా కోసం వచ్చిన మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఘటన మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని కందిబండ, మేళ్లచెరువు పీఏసీఎస్‌ల వద్ద శనివారం తెల్లవారు జామునుంచే రైతులు యూరియా కోసం క్యూకట్టారు. అయితే మేళ్లచెరువు మండల కేంద్రంలో లైన్లో నిలుచున్న కప్పలకుంటతండాకు చెందిన గిరిజన మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో పక్కనే ఉన్న రైతులు ఆమె మొఖం కడిగి మంచినీరు తాగించి పక్కన కూర్చోబెట్టారు. రైతులు ఎండలో నిలబడడంతో మధ్యాహ్నం తరువాత టెంట్ వేసి నీడ కల్పించారు. రెండు లారీల యూరియా మాత్రమే రావడంతో మొత్తంగా రైతులకు పంపిణీ చేశారు. ఫ యూరియా కోసం రైతుల అవస్థలు ఫ పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు ఫ అనంతగిరిలో రైతుల మధ్య ఘర్షణ ఫ మేళ్లచెరువు సహకార సంఘం వద్ద మహిళా రైతుకు అస్వస్థత -
జిల్లా ఉత్తమ గురువులుగా 40 మంది ఎంపిక
సూర్యాపేటటౌన్ : జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 40 మందిని ఎంపిక చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టరేట్లో అవార్డులు ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఫ ఎంపికైన జీహెచ్ఎంలు కె.ప్రభాకర్(జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపురం, అర్వపల్లి మండలం), కాకుమాను వెంకట్‌రెడ్డి(జెడ్పీహెచ్ఎస్ మేళ్లచెర్వు), బి.విష్ణుమూర్తి(జెడ్పీహెచ్ఎస్ పసునూరు, నాగారం), చీరాల వెంకటరంగకృష్ణ(జెడ్పీహెచ్ఎస్ శాంతినగర్, అనంతగిరి మండలం) ఉన్నారు. ఫ స్కూల్ అసిస్టెంట్లు : ముక్కాముల జానకిరాములు(పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ కోదాడ), ఆరే వీరారెడ్డి(జెడ్పీహెచ్ఎస్ పాలవరం, అనంతగిరి), బయ్యారపు శ్రీదేవి(జీహెచ్ఎస్ హుజూర్నగర్), బుడిగ వీరబాబు(టీజీఎంఎస్ మఠంపల్లి), జిల్లేపల్లి జానయ్య(జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి), శ్రీపాది ఉపేంద్ర(జెడ్పీహెచ్ఎస్ పెన్‌పహాడ్), బూర సైదయ్యగౌడ్(టీజీఎంఎస్ మునగాల), రాజుల లక్ష్మీనారాయణ(టీఎస్ఎంఎస్ మఠంపల్లి), కాటమల్లు సోమసుందర్(టీజీఎంఎస్ పసునూరు, నాగారం), షామేబేగం(ఎస్టీ జోసెఫ్ సీసీఆర్ విద్యానిలయం, కోదాడ), బోళ్ల కవిత(జెడ్పీహెచ్ఎస్ అమరవరం, హుజూర్నగర్), సోమయాజుల సూర్యనారాయణ(జెడ్పీహెచ్ఎస్ మఠంపల్లి), కె.కృష్ణవేణి(జెడ్పీహెచ్ఎస్ రత్నవరం, నడిగూడెం), కె.శ్రీనివాసరావు(జెడ్పీహెచ్ఎస్ చిమిర్యాల, కోదాడ), సపావత్ స్వప్న(జెడ్పీహెచ్ఎస్ పాలకవీడు), షేక్ రెహనబేగం(జెడ్పీహెచ్ఎస్ రామాపురం, మేళ్లచెర్వు), రువ్వ శ్రవణ్‌కుమార్(ఎంపీయూపీఎస్ రెడ్లకుంట, కోదాడ), ముక్కపాటి స్వరూపారాణి(పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ కోదాడ), జి.రాంరెడ్డి(జెడ్పీహెచ్ఎస్ గరిడేపల్లి), మహ్మద్‌అబ్దుల్ ముబీన్(పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ కాపుగల్, కోదాడ) ఉన్నారు. ఫ ఎస్జీటీలు : మేకల సందీప్‌కుమార్(ఎంపీపీఎస్ పొనుగోడు, గరిడేపల్లి), ఎన్.అనసూర్యమ్మ(ఎంపీపీఎస్ చింతలపాలెం), షేక్ పీర్ సాహెబ్టీజీటీ(టీజీఎంఎస్ కర్విరాల, నడిగూడెం), పల్లేటి అభినవ్(ఎంపీపీఎస్ హెచ్‌డబ్ల్యూ గోరెంట్ల, మద్దిరాల), పొన్నాల వనజ(ఎంపీపీఎస్ ఆత్మకూర్.ఎస్), గౌలికర్ ఇందిర(ఎంపీపీఎస్ జాజిరెడ్డిగూడెం), బి.స్వరూపరాణి(ఎంపీపీఎస్ అర్వపల్లి), డి.సుజాత(ఎంపీపీఎస్ తమ్మవరం, చింతలపాలెం), వలవోజు సులోచన(ఎంపీపీఎస్ పాత సూర్యాపేట, ఆత్మకూర్.ఎస్), ఇందిరాల జ్యోతి(ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ లింగగిరి, హుజూర్నగర్), రణబోతు నర్సిరెడ్డి(ఎంపీపీఎస్ బరాఖత్‌గూడెం, మునగాల), రణపంగు కనకతార(ఎంపీపీఎస్ మూసీఒడ్డు సింగారం, పాలకవీడు), పి.శ్రీధర్(ఎంపీపీఎస్ పుల్జబండతండా, నేరేడుచర్ల), బి.భరత్‌బాబు(ఎంపీయూపీఎస్ జగన్నాథపురం, మునగాల), బోళ్ల గోవిందరెడ్డి(సీఐ, జెడ్పీహెచ్ఎస్ గరిడేపల్లి), షాహిన్ షేక్(కేజీబీవీ సూర్యాపేట) ఉన్నారు. ఫ జాబితా ప్రకటించిన డీఈఓ ఫ 9న అవార్డుల ప్రదానం -
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చివ్వెంల : విద్యార్థుల ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి అన్నారు. శనివారం ప్రపంచ డెఫ్ డే సందర్భంగా సూర్యాపేట మండలం కాసరబాద గ్రామ శివారులోని బధిరుల పాఠశాలను సందర్శించారు. సూర్యాపేట జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానసిక వైకల్యం గల విద్యార్థులకు ప్రతిఒక్కరూ చేయూతనందించాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ నామినేటెడ్ సభ్యురాలు నల్లపాటి మమత విద్యార్థులకు టవల్స్ పంచారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, భట్టిపల్లి ప్రవీణ్ కుమార్, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, న్యాయవాదులు కె.సుధాకర్, జి.నవీన్ పాల్గొన్నారు. ఫ జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి -
కలగానే టా్యంక్‌బండ్!
కోదాడ: కోదాడ పట్టణ ప్రజలు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న పెద్దచెరువు ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు కలగానే మిగిలాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే ఈ పనులకు హడావుడిగా శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించలేదు. ఎన్నికల అనంతరం 2024 ఫిబ్రవరి 23న ప్రస్తుత ఎమ్మెల్యే ఇవే పనులకు శిలాఫలకాలు నిర్మించి మరోసారి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర కాలం దాటినా పనులు ప్రారంభం కాలేదు. అంతకుముందు 2015లో మిషన్ కాకతీయ పథకం కింద ఇదే ట్యాంక్‌బండ్ నిర్మాణానికి రూ.4 కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఇలా మూడు విడతలుగా చేపట్టిన పనులు పదేళ్లవుతున్నా అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో కోదాడ పెద్దచెరువు ట్యాంక్‌బండ్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. రివిట్మెంట్ పనులతోనే సరి.. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చిన తరువాత కోదాడ పెద్దచెరువులో పూడిక తీయడంతోపాటు చెరువు కట్టను అభివృద్ధి చేసి దానిపై వాకింగ్‌ట్రాక్ ఏర్పాటుకు పూనుకుంది. దీంతోపాటు పెద్దచెరువు ఉత్తరం వైపు 10 ఎకరాల స్థలంలో గార్డెన్ ఏర్పాటు చేస్తామని రూ.4 కోట్లతో 2015లో పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ కట్టమట్టి పనులతో పాటు లోపలివైపు రివిట్మెంట్ పనులు చేసి బిల్లులు రావడం లేదని మధ్యలోనే వదిలి వెళ్లాడు. ఆ తరువాత కోదాడ మున్సిపాలిటీ నిధుల నుంచి అసంపూర్తిగా ఉన్న కట్టపై రూ.30 లక్షలతో లైట్లు, కట్ట ఎక్కడానికి అనువుగా అనంతగిరి రోడ్డు నుంచి చెరువు కట్టవరకు రోడ్డు నిర్మించారు. ఇది మూణ్నాళ్ల ముచ్చటేగానే మిగిలింది. నిర్వహణ సక్రమంగా లేక లైట్లు వెలగడం లేదు. చెరువు కట్ట మొత్తం కంపచెట్లతో నిండి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. చెరువు కట్టపై వేసిన సిమెంట్ బెంచీలను ఆకతాయిలు విరగ్గొట్టారు. రూ.6 కోట్లతో అభివృద్ధి చేస్తామని.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోదాడ పెద్ద చెరువు ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేస్తామని, దీనికి తెలంగాణ అర్బన్ పైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.6 కోట్లు మంజూరయ్యాయని ప్రకటించారు. ఈ పనులకు అప్పటి మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి 2023 అక్టోబర్ 6న శంకుస్థాపన చేశారు. కానీ, పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈలోగా ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పెద్ద చెరువు ట్యాంక్‌బండ్ ముచ్చట అటకెక్కింది. ఈ పనులతో పాటు మరో రూ.12 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి కూడా చేస్తామని నాడు శంకుస్థాపన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం కోదాడ పెద్దచెరువు కట్టను పూర్తిగా కంపచెట్లు కమ్మేశాయి. ఇక చెరువు ఉత్తరం వైపున ఏర్పాటు చేస్తామని చెప్పిన పార్కు అతీగతి లేకుండా పోయింది. పదేళ్లుగా కోదాడ పెద్ద చెరువుకు కలగని మోక్షం ఫ పనులకు రెండుసార్లు శంకుస్థాపన చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఫ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలే.. ఫ కంపచెట్లతో నిండిన చెరువు కట్ట ఫ బిల్లులందక మధ్యలోనే నిలిచిన మిషన్ కాకతీయ పనులు -
గంగ ఒడికి గణనాథుడు
సూర్యాపేట : నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరిగాయి. వెళ్లిరావయ్య గణపయ్య అంటూ జిల్లాలో పలుచోట్ల అర్ధరాత్రి వరకు భక్తులు గణనాథుడి విగ్రహాల నిమజ్జనం చేశారు. ఉదయం నుంచే మహిళల కోలాటాలు, యువత తీన్మార్ స్టెప్పులతో గణనాథుడి శోభా యాత్ర అట్టహాసంగా కొనసాగింది. మొదట లడ్డూలకు వేలం పాటలు నిర్వహించారు. వేలం పాటల్లో భక్తులు పలువురు పాల్గొని రూ.లక్షల్లో వేలం పాట పాడి లడ్డూలను దక్కించుకొని తమ భక్తిభా వాన్ని చాటుకున్నారు. అలాగే గణేష్ మండపాల వద్ద లడ్డూలు, స్కూటీలు లక్కీ డ్రా ఏర్పాటు చేసి చివరి రోజు కావడంతో లక్కీ డ్రా తీసి డ్రాలో వచ్చిన టోకెన్ ఆధారంగా విజేతలకు లడ్డూలు, స్కూటీలను అందజేశారు. భానుపురిలో ఘనంగా.. జిల్లా కేంద్రంలో మొదట పూలసెంటర్ వద్ద శ్రీ వేదాంత భజన మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలో గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. పూల సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డిలు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, భానుపురి ఉత్సవ సమితి సభ్యులు పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు. రూ.2.20లక్షల ధర పలికిన లడ్డూ జిల్లా కేంద్రంలోని పూల సెంటర్ వద్ద భానుపురి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వేదిక వద్ద వేదాంత భజన మందిరం 74వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక లడ్డూకు వేలం పాట నిర్వహించగా బొడ్రాయి బజార్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తి రూ.2.20లక్షలకు పాటపాడి లడ్డూను దక్కించుకున్నారు. 2వేలకుపైగా విగ్రహాల నిమజ్జనం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,250 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే అందులో శుక్రవారం ఆయా ప్రాంతాల్లో జరిగిన నిమజ్జన వేడుకల్లో సుమారు 2వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు అధికారులు అంచనా వేశారు. శుక్రవారం కావడంతో గ్రామాల్లో కొంత మంది శనివారం కూడా నిమజ్జనం చేయనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువుతో పాటు సూర్యాపేట మండలం రత్నపురం వద్ద గల మూసీ రిజర్వాయర్, కోదాడ పెద్ద చెరువు వద్ద, మట్టపల్లి బ్రిడ్జి వద్ద, పాలకవీడు మండలం కృష్ణానది మహంకాళిగూడెం వద్ద, నేరేడుచర్ల పరిధిలోని చిల్లేపల్లి మూసీ బ్రిడ్జి వద్ద నిమజ్జనం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు నిమజ్జనం ప్రక్రియ కొనసాగింది. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్‌పై, రత్నపురం సమీపంలోని మూసీ రివర్ వద్ద జరిగే వినాయక నిమజ్జన ప్రక్రియనుకు సంబంధించి బందోబస్తును, నిమజ్జన తీరును జిల్లా ఎస్పీ కె.నరసింహ పరిశీలించారు. సద్దుల చెరువు (మినీ ట్యాంక్‌బండ్) వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలో జరుగుతున్న శోభాయాత్రను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, తదితరులు ఉన్నారు. కనుల పండువగా గణేష్ శోభాయాత్ర ఫ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు ఫ తీన్మార్ స్టెప్పులతో అలరించిన యువత ఫ అర్ధరాత్రి వరకు కొనసాగిన నిమజ్జన కార్యక్రమం -
యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాత
ఫ పెన్‌పహాడ్‌లో రైతుల రాస్తారోకో ఫ సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ పెన్‌పహాడ్ : సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని చీదెళ్ల పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా రావడంతో రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో ఎస్ఐ గోపికృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి రైతుకు ఒక్క బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. తమకు సకాలంలో సరిపోను యూరియా సరఫరా చేయడం లేదని, అదికూడా సిబ్బంది ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ.. రైతుల వద్దకు వెళ్లి సక్రమంగా పంపిణీ చేసేలా చూస్తామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. దీంతో ఒక్కో రైతుకు ఒక్క బస్తా చొప్పున 550 బస్తాలను పంపిణీ చేయగా సుమారు 200మంది రైతులకు యూరియా దొరకక వెనుదిరిగారు. తిరుమలగిరిలో బారులు తిరుమలగిరి : తిరుమలగిరి మండలానికి రెండు రోజులకు ఒకసారి ఒక లోడ్ యూరియా మాత్రమే వస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం యూరియా రావడంతో రైతులు పీఏసీఎస్ బారులుదీరారు. ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా ఇచ్చారు. చాలా మంది రైతులకు యూరియా దొరకక నిరుత్సాహంగా వెనుదిరిగారు. అర్వపల్లి : అర్వపల్లి, తిమ్మాపురం పీఏసీఎస్ లకు కలిపి శుక్రవారం ఒకే ఒక్క లారీ యూరియా వచ్చింది. దీంతో యూరియాను సగం లారీ చొప్పున పంచుకున్నారు. రెండు పీఏసీఎస్‌ల వద్ద యూరియా చాలక రైతులు ఘర్షణకు దిగారు. యూరియా చాలక అనేక మంది రైతులు వెనుదిరిగారు. ఎస్ఐ ఈట సైదులు ఆధ్వర్యంలో రెండు కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
సూర్యాపేటటౌన్ : సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరమని సూర్యాపేట జిల్లా పోలీస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు సైబర్ వారియర్స్‌లా పని చేయాలన్నారు. సైబర్ మోసాల పట్ల చుట్టుపక్కల ఉన్న పెద్దలకు విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు సాంకేతికతను ఉపయోగించి వినియోగదారులకు బహుమతుల రూపంలో, లోన్ల రూపంలో ఆశ చూపుతూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని వారిని గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాలరాజు, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది మహేష్, సైదులు పాల్గొన్నారు. రేపు గణేష్ నిమజ్జనంభానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించాలని భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అనంతుల కృపాకర్, ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు వెల్లడించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలో దాదాపు 450 విగ్రహాలు ఏర్పాటు చేశారని, నవరాత్రుల పూజలు ఈనెల 4వ తేదీతో ముగుస్తున్నందున 5న గణేష్ నిమజ్జన శోభాయాత్రను నిర్వహించాలని సూచించారు. సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్లో విగ్రహాల నిమజ్జనం చేయాలని కోరారు. నిమజ్జన కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ సహకారంతో 14 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేదాంత భజన మందిరం మట్టి గణపతి పూజలు ముగిసిన తర్వాత ఊరేగింపుగా పూల సెంటర్ వద్ద శోభాయాత్ర మొదలవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, దంతాల రాంబాబు, బైరు వెంకన్న, కార్యదర్శి గండూరి రమేష్, భువనగిరి సృజన్, కారింగుల ఉపేందర్, చేకూరి కృష్ణ, కోడి లింగయ్య, గుండా వెంకన్న, మహంకాళి సోమయ్య, బైరు విజయకృష్ణ పాల్గొన్నారు. ఈఓగా జయరామయ్య బాధ్యతల స్వీకరణఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయ నూతన కార్యనిర్వహణ అధికారిగా జిల్లేపల్లి జయరామయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పదేళ్లుగా ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న కుశలయ్య బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జయరామయ్య వచ్చారు. జయరామయ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఇద్దరు అధికారులను ఆలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. మట్టపల్లిలో విశేష పూజలుమఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో బుధవారం విశేష పూజలు చేశారు. ఈసందర్భంగా అర్చకులు ఆలయ ముఖమండపంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం,గర్భాలయంలో శ్రీ మూలవిరాట్‌కు పంచామృతా భిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేశారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ ,మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
భూ భారతి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో వెబెక్స్ ద్వారా భూ భారతి, ప్రజావాణి అర్జీలు, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, మీసేవ సర్టిఫికెట్ల పెండింగ్‌పై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఒకవేళ తిరస్కరణకు గురైన అర్జీలకు సరైన కారణాలను వివరించాలన్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణిల్లో వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. స్లాట్ బుక్ చేసిన లబ్ధిదారులకు ఆ రోజే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, ఒకవేళ తహసీల్దార్ అందుబాటులో లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ కు ఇన్చార్జి ఇవ్వాలన్నారు. పలు ప్రభుత్వ అభివృద్ధి పనులకు కావాల్సిన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, హైకోర్టు, సివిల్ కోర్టు, లోకాయుక్త, హెచ్ఆర్సీలకు సంబంధించిన కోర్టు కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మీసేవ ద్వారా చేసుకున్న ఆదాయ, కుల ధ్రువీకరణ, రెసిడెన్స్లాంటి సర్టిఫికెట్లను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు ఆమోదం తెలపాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. పంచాయతీ సెక్రటరీల ద్వారా గ్రామాల వారీగా సమాచారం తీసుకొని ప్రతి ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పూర్వ ప్రాథమిక విద్యకు ఆదరణ
మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక విద్య అందుతోంది. చిన్నారులకు ఆట, పాటలతో పాఠాలు బోధిస్తున్నారు. – అశోక్, జిల్లా విద్యాధికారి. తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చిన పూర్వ ప్రాథమిక విద్యకు ఆదరణ లభిస్తోంది. ఆట పాటలతో ఆహ్లాదకర వాతావరణంలో పాఠాలు బోధిస్తుండడంతో వీటిలో చేరడానికి పిల్లలు ఆసక్తి కనబరిచారు. జిల్లా వ్యాప్తంగా తొలివిడత ఏర్పాటు చేసిన 30 పాఠశాలల్లో సుమారు 600 మందికిపైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఒక్కో పాఠశాలలో రూ.1.70లక్షలతో వసతులు కల్పించారు. దీని కోసం ప్రత్యేకంగా బోధకులు, ఆయాలను నియమించారు. ప్రవేశాలు పెరిగేలా చర్యలు అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి విద్య అమలవుతోంది. చాలా మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో విద్య పూర్తయిన తరువాత పాఠశాలలో ప్రవేశాలు తీసుకోకుండా ప్రైవేట్‌కు వెళుతున్నారు. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇక ప్రాథమిక పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 30 పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. వసతులు ఇలా.. ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షల చొప్పున మంజూరు చేశారు. వీటి నుంచి రూ.50వేలతో ఫర్నిచర్, రూ.50వేలతో ఇండోర్, ఔట్‌డోర్ సామగ్రి, రూ.70వేలతో తరగతి గదులను ప్రత్యేకంగా అలంకరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్నారులను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకున్నారు.ఫ తొలి విడత ఎంపిక చేసిన 30 పాఠశాలల్లో 600 మంది చిన్నారులు ఫ ఒక్కో పాఠశాలలో రూ.1.70లక్షలతో వసతులు ఫ నాలుగు నెలలుగా ఆటపాటలతో బోధన -
పనులు వదిలేసి
రాత్రింబవళ్లు పడిగాపులుఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని పీఏసీఎస్‌ల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాల వద్దే చెప్పులు, ఆధార్‌కార్డులు లైన్లో పెట్టి నిద్రపోయినా ఫలితం దక్కడంలేదు. మూడు రోజులుగా ఆధార్‌కార్డులు, పాస్‌బుక్‌లు లైన్లో పెట్టి.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్, ఆత్మకూర్ పీఏసీఎస్‌లకు నాలుగు రోజుల క్రితం యూరియా రాగా అందరు రైతులకు అందలేదు. దీంతో మళ్లీ యూరియా వస్తే తాము ముందు వరుసలో ఉండాలని మూడు రోజులుగా రైతులు తమ ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలను లైన్లో ఉంచి అక్కడే రాత్రింబవళ్లు ఎదురు చూస్తున్నారు. రాత్రిపూట సైతం మహిళలతో పాటు అక్కడే నిద్రపోతున్నారు. వీరికి ఆ గ్రామాల నుంచి కుటుంబ సభ్యులు భోజనాన్ని, మంచినీటిని పంపిస్తున్నారు. అసలే వ్యవసాయ పనులు బిజీగా ఉన్న సమయంలో పనులు వదులుకొని మహిళా రైతులతో సహా పడిగాపులు కాస్తున్నారు. నేడు మండలానికి 35 టన్నుల యూరియా ఆత్మకూర్(ఎస్) మండలంలోని ప్రాథమిక సహకార సొసైటీకి గురువారం 35 టన్నుల యూరియా రానున్నట్లు వ్యవసాయ అధికారి దివ్య తెలిపారు. మండలంలోని ఆత్మకూరుకు 13 టన్నులు, ఏపూరుకు 12 టన్నులు, నెమ్మికల్‌కు 10 టన్నుల చొప్పున యూరియా వస్తుందని, రైతులు సకాలంలో వచ్చి యూరియా కొనుగోలు చేయాలని కోరారు.ఫ యూరియా కోసం రైతులకు తప్పని అగచాట్లు ఫ కేంద్రాల వద్దనే నిద్రపోతున్న దుస్థితి ఫ నెమ్మికల్ పీఏసీఎస్ వద్ద మూడు రోజులుగా నిరీక్షణ ఫ బస్తాలు ఎప్పుడు వస్తాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపు నాలుగు ఎకరాల్లో నాటుపెట్టాం. 10 కట్టలు యురియా కావాలి. నాలుగు రోజుల క్రితం యూరియా దొరకకపోవడంతో ఇక్కడే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఉంటున్నాం. – బానోత్ రవి, బోరింగ్‌తండా యూరియా దొరకక పోవడంతో మూడు రోజుల నుంచి రాత్రిపూట సైతం ఇక్కడే పడుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నాం. ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పడం లేదు. – తండు వెంకటమ్మ, పాతర్ల పహాడ్ -
సాహసంతో జీవిద్దాం..
భానుపురి (సూర్యాపేట): నేటి సమాజంలో బాలికలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టడానికి బాలికా చైతన్యం పేరిట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రత్యేక చొరవతో జిల్లాలో పక్షం రోజుల క్రితం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చదువుతోనే బాలిక ప్రకాశిస్తుందన్న ఆలోచనతో ‘సవాళ్లను అధిగమిద్దాం.. సాహసంతో జీవిద్దాం’ అనే నినాదంతో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈకార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నెలలో నాలుగు వారాలు.. నాలుగు శాఖల ఆధ్వర్యంలో వివిధ అంశాలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో వారం.. ఒక్కోశాఖ.. ఒక్కో కాన్సెప్ట్ జిల్లాలోని ఐసీడీఎస్, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో పాఠశాలల్లో బాలికలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒక్కో శాఖ ఒక్కో వారం ఒక్కో ఆలోచనతో ముందుకు వస్తోంది. ● మొదటి వారం: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో.. పౌష్టికాహారం, బాలికల ఆరోగ్య సమస్యలు, న్యూట్రిషన్ ఫుడ్, హార్మోనల్ బ్యాలెన్స్ తదితర విషయాలపై శిక్షణ ఇస్తున్నారు. ● రెండోవారం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తారు. హెల్ప్ లైన్ నంబర్లు, సెల్ఫ్ డిఫెన్స్, అనుకోని సమస్య ఎదురైతే ఎలా స్పందించి.. ఎలా రక్షించుకోవాలని..? ఆన్లైన్లో మోసపోకుండా ఎలా అడ్డుకోవాలి..? అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ● మూడోవారం: విద్యాశాఖ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ఇవ్వనున్నారు. ● నాలుగో వారం: మహిళా శిశు సంక్షేమశాఖ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో.. పోక్సో చట్టాలు, సఖి కేసులు, తల్లిదండ్రులు, గురువులను గౌరవించడంపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ‘బాలికా చైతన్యం’ ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ చొరవతో శ్రీకారం ఫ ‘సవాళ్లను అధిగమిద్దాం– సాహసంతో జీవిద్దాం’ అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమం ఫ ఒక్కో వారం ఒక్కో థీమ్‌తో బాలికలకు అవగాహన ప్రస్తుత సమాజంలో బాలికలు లైంగిక దాడులు, చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు, ప్రేమ పేరిట మోసాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో వీరికి చదువు ఒక్కటే కాకుండా సమాజంపై పూర్తి అవగాహన కల్పించేలా కలెక్టర్ సరికొత్త ఆలోచన చేశారు. సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో వారం ఒక్కో కాన్సెప్ట్‌తో జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను గత నెల 19న ప్రారంభించారు. మొదటగా టీచర్లకు వారం రోజుల పాటు శిక్షణ సైతం ఇచ్చారు. అనంతరం ఆయా పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. -
తెల్లవారు జాము నుంచే..
అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారు జాము నుంచే క్యూలైన్లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. బుధవారం సుమారు 260 మంది రైతులు వచ్చారు. వీరు క్యూలైన్లో నిలబడి అలసిపోయిన చివరికి చెప్పులను ఉంచారు. సుమారు 220 బస్తాల యూరియా రాగా పోలీసుల సహకారంతో అధికారులు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున అందజేశారు. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. అమీనాబాద్ పీఏసీఎస్ గోదాము ఎదుట రైతులు క్యూలైన్లో పెట్టిన చెప్పులు -
ఏసీ, రిఫ్రిజ్రేటర్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ
భానుపురి (సూర్యాపేట) : నల్లగొండ శివారులోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు ఏసీ, రిఫ్రిజ్రేటర్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు రఘుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని పేర్కొన్నారు. పదవ తరగతి పాసైన 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు గల నల్లగొండ, సూర్యాపేట, యదాద్రి భువనగిరి జిల్లాల వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు సంస్థ ఆఫీ సులో సెప్టెంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఇతర వివరాల కోసం 970 1009265 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం ఫ జెడ్పీ సీఈఓ వి.వి.అప్పారావు పెన్‌పహాడ్ : పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేసుకోవచ్చని జెడ్పీ సీఈఓ వి.వి.అప్పారావు సూచించారు. బుధవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, అనంతారం గ్రామాలను సందర్శించారు. సింగారెడ్డిపాలెంలో పూర్తయిన పశువుల కొట్టాలతో పాటు నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. అనంతారంను ఇంకుడు గుంతల నిర్మాణానికి పైలట్ గ్రామంగా ఎంపిక చేయగా సందర్శించారు. గ్రామంలో బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతల పనులు, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంపులు, నీటి తొట్లలో మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ వెంట ఏపీఓ రవి, ఈసీ మహేష్, టీఏలు ఏకస్వామి, రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు అఖిల్, సోమయ్య, ఎఫ్‌ఏలు జ్యోతి, బేగం ఉన్నారు. -
కేసుల పరిష్కారంలో మొదటిస్థానంలో నిలుపుదాం
చివ్వెంల(సూర్యాపేట) : ఈనెల 13 న నిర్వహించే జాతీయ మెగాలోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదామని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పిలుపునిచ్చారు. లోక్ అదాలత్‌పై బుధవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో చిట్ ఫండ్కంపెనీలు, బ్యాంకులు, బీమా కంపెనీ, ఆర్టీసీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆయా సంస్థల అధికారులు ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. తద్వారా జిల్లా మొదటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. సంవత్సరాల తరబడి పరిష్కారం కాని రాజీపడే కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. దీని వల్ల రెండు వర్గాల వారు గెలిచిన వారు అవుతారని, సమయం, ధనం వృథాకాకుండా ఉంటుందన్నారు. రాజీమార్గమే రాజా మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జీ ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, జూనియర్ సివిల్ జడ్జి నాగ అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధా న కార్యదర్శి సుంకరబోయిన రాజు పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
మఠంపల్లిలో రాస్తారోకో
మఠంపల్లి: యూరియా కోసం మఠంపల్లి మండల కేంద్రంలోని మట్టపల్లి –హుజూర్నగర్ ప్రధాన రహదారిపై సీపీఎం,సీపీఐ ఆధ్వర్యంలో రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా పలువురు నాయకులు, రైతులు మాట్లాడుతూ మండలంలో ఆయకట్టు, చివరి ఆయకట్టు పరిధిలో నెలరోజులుగా వరినాట్లు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో నాట్లు ఎదుగుదలకు నోచుకోవడం లేదన్నారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పాండునాయక్, మండల కార్యదర్శి బాలునాయక్, సీపీఐ మండలకార్యదర్శి అమరారపు పున్నయ్య, నాయకులు కోటయ్య, లక్ష్మణ్‌నాయక్ , బద్రునాయక్, నాగునాయక్, సురేష్, మగతా, మాంగూ, జెత్రామ్ నాయక్, సైదా తదితరులు ఉన్నారు. -
సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి
సూర్యాపేట అర్బన్ : జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణం పై అంచనా వేసి సరిపడా యూరియా అందుబాటులో ఉంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అధికారులు యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత, సంఘం జిల్లా నాయకులు షేక్ సైదా, మందాడి రామ్ రెడ్డి, నారాయణ, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భర్తీ జాప్యం.. పని భారం!
నాగారం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకం. అలాంటి అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగేళ్లుగా ఖాళీ పోస్టులు భర్తీకావడం లేదు. టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీలు ఉన్నచోట ఇద్దరి పని ఒక్కరే చేస్తుండడంతో వారిపై పనిభారం పెరిగింది. పైగా గ్రామీణులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడం ఇబ్బందిగా మారుతోందని టీచర్లు, ఆయాలు వాపోతున్నారు. జిల్లాలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 83 టీచర్లు, 287 ఆయాలతో కలిపి మొత్తం 370 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో టీచర్‌తోపాటు ఆయా ఇద్దరూ లేకపోవడంతో సమీప కేంద్రాల్లోని వారు సేవలు అందిస్తున్నారు. దీంతో పిల్లల శారీరక వికాసం వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. ఆయాలు లేని కేంద్రాల్లో భోజనం తయారు చేయడం ఇబ్బందిగా ఉంటే టీచర్లు లేనిచోట పిల్ల లకు ఆయాలు అక్షరాలు నేర్పించలేని పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి మూడు నెలల క్రితం ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఆశావహుల ఎదురుచూపు..అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీచేస్తారని గ్రామీణ నిరుద్యోగ మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైతే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఖాళీల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చింది. ఆయాలు, టీచర్ల పోస్టులకు ఇంటర్ పూర్తిచేసి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉన్న మహిళలు దరఖాస్తులు చేసుకునే విధంగా నిబంధన తెచ్చింది. కానీ జిల్లాలో ఖాళీ పోస్టులను ఎప్పుడు భర్తీచేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయాల పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయగానే ఖాళీలను భర్తీ చేస్తాం. – దయానందరాణి, జిల్లా సంక్షేమశాఖ అధికారి అంగన్వాడీల్లో 370 పోస్టులు ఖాళీ భర్తీ కోసం మూడునెలల క్రితం మార్గదర్శకాలు జారీ నేటికీ అధికారికంగావెలువడని ప్రకటన -
నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులూ కలగవద్దు
భానుపురి (సూర్యాపేట) : వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. వినాయక నిమజ్జనంపై జిల్లా, డివిజన్ అధికారులతో మంగళవారం వెబెక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినాయక నిమజ్జనాలు జరిగే సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో ఆర్డీఓల కార్యాచరణ ప్రణాళికలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరూ నీళ్లలో పడిపోకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైనంత వెలుతురు ఉండేలా లైటింగ్, హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్కులు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రూట్ మ్యాప్ తయారు చేయాలి సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు, రత్నాపురం, కోదాడలో పెద్ద చెరువు, మఠంపల్లి, చింతలపాలెం ఘాట్లు, నేరేడుచర్ల, పాలకవీడు ఘాట్ల వద్ద నిమజ్జనం జరిగే అవకాశం ఉందని ఆర్డీఓలు కలెక్టర్‌కు చెప్పారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో నిమజ్జనానికి వినాయక విగ్రహాలు వస్తాయని వారు వివరించారు. ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఆయా శాఖలు జాగ్రత్తగా ఉండాలని, తక్షణమే రూట్ మ్యాప్ తయారుచేసి తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమన్వయంతో పనిచేయాలి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎస్పీ నరసింహ కోరారు. రహదారులపై గుంతలను పూడ్చివేయాలని ఆదేశించారు. అనంతరం సద్దల చెరువును మున్సిపల్, పోలీస్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, భానుపురి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అనంతుల కృపాకర్, ప్రధాన కార్యదర్శి రుక్మారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లమల్ల నర్సింహ, బైరు వెంకన్న, కారింగుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత
నాగార్జునసాగర్ : ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో సాగర్ క్రస్ట్ గేట్లను మంగళవారం రాత్రి మూసివేశారు. ఎగువన గల శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనతో కేవలం 51,635 క్యూసెక్కులు మాత్రమే సాగర్‌లోకి నీరు వస్తోంది. దీంతో అంతే నీటిని నాగార్జునసాగర్ నుంచి విద్యుత్ ఉత్పాదన, ఆయకట్టు అవసరాలకు విడుదల చేస్తున్నారు. పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిదిభానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిదని తెలంగాణ క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో దీపక్‌జాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు, రుణ సౌకర్యాలు, శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్, పాస్టర్స్, క్రైస్తవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం రూ. 20వేలు ఇవ్వాలిసూర్యాపేట : ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.20వేలు ఇవ్వాలని బీఆర్టీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంపటి గురూజీ కోరారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ హాస్పిటల్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు రూ.18వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయలేదన్నారు. అనంతరం వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ సూర్యాపేట పట్టణ అధ్యక్షురాలు జి. సక్కుబాయి, నాగలక్ష్మి, వెంకటరమణ, ఉమ, విజయలక్ష్మి, రెహానా, పర్వీన్, మరియమ్మ, బైనాబాయి, నవ్య, వసంత, కవిత, బుజ్జి, నాగపూర్ణిమ, ఉమా, నాగమణి, సైదమ్మ, రజిత, సునీత, శైలజ, పారిజాత, భవాని పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం విశేష పూజలు చేశారు. ఈసందర్భంగా అర్చకులు ఆలయ ముఖమండపంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలో శ్రీ మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామా చార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
పల్లె ఓటర్లు
లక్షలుపంచాయతీ తుది ఓటరు జాబితా విడుదల 6.94భానుపురి (సూర్యాపేట) : పల్లె ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీల్లో 6.94లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. వీరిలో పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది ఉన్నారు. అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 46,796 మంది ఓటర్లు, అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. 486 పంచాయతీలు.. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 475 గ్రామపంచాయతీలు ఉండగా మరో 11 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. 23 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు, 213 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ గతేడాది ఫ్రిబవరిలో గ్రామపంచాయతీల పదవీకాలం, జూలైలో జిల్లా, మండల పరిషత్‌ల పదవీ కాలం ముగిసింది. వీటికి ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఒక్కో ప్రక్రియను జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పూర్తి చేస్తూవస్తోంది. ఇందులో భాగంగా 2024 అక్టోబర్ మాసంలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖత చూపడంతో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను అప్పట్లో ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 6,82,882 మంది ఓటర్లు నమోదయ్యారు. చేర్పులు, మార్పులు.. కొత్తగా జిల్లాలో నమోదైన ఓటర్లు, మార్పులు, చేర్పులతో ఈనెల 28వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్లిస్ట్ను ప్రకటించారు. 29న రాజకీయ పార్టీలతో జిల్లా స్థాయిలో, 30వ తేదీన మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి ఈనెల 31వ తేదీ నాటికి తొలగింపు ప్రక్రియ చేపట్టారు. 13,307 మంది మహిళా ఓటర్లు అధికం తుదిజాబితా ప్రకారం జిల్లాలో 6,94,815 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది, 22 మంది ఇతరులు ఉన్నారు. అయితే పురుషుల కంటే మహిళా ఓటర్లు 13,307 మంది అధికంగా ఉన్నారు. ఇదిలా ఉండగా 23 మండలాలకు గాను తిరుమలగిరి మండలం మినహా మిగతా 22 మండలాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో పంచాయతీ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా 6,10,486 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కొత్తగా 11 గ్రామ పంచాయతీలుగా ఏర్పడగా ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా ప్రకారం 6,94,815 మంది ఓటర్లు నమోదయ్యారు. ఈ లెక్కన ఐదేళ్లలో 84,329 మంది ఓటర్లు పెరిగారు. దాదాపు ఈ ఓటరు జాబితాతో జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఫ గరిడేపల్లి మండలంలో అత్యధికం.. తిరుమలగిరిలో అత్యల్పం ఫ ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 84,329 మంది ఫ 22 మండలాల్లోనూ మహిళా ఓటర్లే అధికంమండలాల వారీగా ఓటర్లు మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం అనంతగిరి 12,545 13,343 01 25,889 ఆత్మకూర్ 21,800 22,252 01 44,053 చిలుకూరు 15,915 16,984 00 32,899 చింతలపాలెం 13,132 13,700 00 26,832 చివ్వెంల 14,328 14,882 00 29,211 గరిడేపల్లి 22,654 24,135 07 46,796 హుజూర్నగర్ 10,287 10,744 00 21,031 జాజిరెడ్డిగూడెం 12,157 12,458 00 24,615 కోదాడ 15,462 16,418 00 31,881 మద్దిరాల 12,569 12,738 01 25,307 మఠంపల్లి 18,314 19,349 01 37,663 మేళ్లచెరువు 16,740 17,546 01 34,287 మోతె 18,731 19,087 04 37,823 మునగాల 17,695 18,699 00 36,394 నడిగూడెం 12,089 12,481 01 24,571 నాగారం 12,227 12,545 03 24,775 నేరేడుచర్ల 10,720 11,422 00 22,142 నూతనకల్ 14,503 14,563 00 29,066 పాలకవీడు 10,358 11,110 00 21,468 పెన్‌పహాడ్ 16,632 17,445 00 34,077 సూర్యాపేట 15,652 15,967 01 31,620 తిరుమలగిరి 8,925 8,874 00 17,799 తుంగతుర్తి 17,308 17,308 00 34,616 మొత్తం 3,40,743 3,54,050 22 6,94,815 -
రైతులకు మెరుగైన సేవలందించాలి
కోదాడ: నీటిపారుదలశాఖ అధికారులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని అధికారులు రైతులకు మెరుగైన సేవలందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కోదాడ ఎన్ఎస్పీ క్యాంప్ ఆవరణలో రూ. 5 కోట్లతో నిర్మించనున్న నీటిపారుదలశాఖ డివిజన్ కార్యాలయానికి , రూ. 54 కోట్లతో అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద నిర్మించనున్న రాజీవ్శాంతినగర్ ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ డివిజన్లో 2.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అధికారులకు నాలుగు అంతస్తుల్లో నూతన కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని, సంవత్సరంలోపే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు.. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకం గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు చేరుకుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకం స్థానంలో రూ.54 కోట్లతో అనంతగిరి మండలంలోని 8 గ్రామాలలో 3,219 ఎకరాలు, కోదాడ మండలంలోని 1,781 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా 2,138 రైతు కుటుంబాలకు మేలు కలుగుతుందన్నారు. మోతె మండలంలోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఎడమ కాలువ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్ఈ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
ఉత్తమ ఫలితాల సాధనకు..
అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 9,10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. దీనికి సంబంధించిన టైం టేబుల్‌ను అన్ని పాఠశాలలకు పంపించాం. ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్నాం. –అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి చిలుకూరు: సాధారణంగా ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించేవారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కలెక్టర్ చొరవతో 9,10 తరగతుల విద్యార్థులకు సిలబస్ త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం మాత్రమే నిర్వహించే ఈ ప్రత్యేక తరగతులు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 229 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 9,10 తరగతులు చదువుతున్న 17వేల మంది విద్యార్థులకు ఈ ప్రత్యేక తరగతుల వల్ల ప్రయోజనం కలగనుంది. సాయంత్రం వేళల్లో.. ఈ నెల 1 నుంచి డిసెంబర్ వరకు 120 రోజుల పాటు 9,10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక తరగుతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. రోజూ సాయంత్రం 4.20 నుంచి 5.20 వరకు గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ ఒక సబ్జెక్టు చొప్పున సబ్జెక్టు టీచర్ ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటాడు. డిసెంబర్ చివరి నాటికి పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేసి, ఆ తరువాత మళ్లీ ఫైనల్ పరీక్షల వరకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించనున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మధ్యాహ్నం ఒంటి గంట లోపే మధ్యాహ్న భోజనం చేస్తుడండం.. సాయంత్రం లేటుగా వెళ్లడంతో ఆ సమయంలో విద్యార్థులు కొంత ఆకలికి గురి అవుతారు. అందువల్ల ఆ సమయంలో అల్పాహారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. ఫ 9,10 తరగతులకు ప్రారంభమైన ప్రత్యేక తరగతులు ఫ 120 రోజుల ప్రణాళిక ఫ డిసెంబర్ వరకు క్లాసుల నిర్వహణ ఫ 17వేల మంది విద్యార్థులకు ప్రయోజనం -
దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం
చిలుకూరు: కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలను అన్నిరంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతానని మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. చిలుకూరు మండలం సీతరాంపురం గుట్టలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ స్కూల్ కు కోదాడ– జడ్చర్ల హైవే నుంచి రూ. 10 కోట్లలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈరెండు నియోజకవర్గాల్లో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కోదాడ, హుజూర్‌నగర్‌కు ఐటీఐ కాలేజీలు, కోదాడలో నూతనంగా నవోదయ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీలు బజ్జూరి వెంకట్‌రెడ్డి, బొలిశెట్టి నాగేంద్రబాబు, బండ్ల కోటయ్య, కాంగ్రెస్ పార్టీ చిలుకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాత వెంకటేశ్వర్లు, పిండ్రాతి హనుంతరావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రతోనే సీబీఐ విచారణ
తుంగతుర్తి : కాంగ్రెస్, బీజేపీ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను తెరమీదికు తెచ్చారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలను నిరసిస్తూ సోమవారం తుంగతుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని దానిపై కమిటీ వేసి నివేదిక తెచ్చి అసెంబ్లీలో పెట్టామని కాంగ్రెస్ వారు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారని వారికి మాజీ మంత్రి హరీష్ రావు ఘాటైన సమాధానం ఇచ్చారన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచనిస్థితిలో సీబీఐ విచారణ అంటూ కేంద్రంలోని బీజేపీతో కుమ్మకై ్క రాజకీయం చేస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు ఆరోపణలు, కుట్ర కేసులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏనాడూ భయపడలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లవుతుందని పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం.. గొంతు నొక్కే ప్రయత్నం చేసిందన్నారు. కాళేశ్వరం జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం అయిందన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రస్థాధన కోసం ఏనాడూ జైలుకు వెళ్లలేదని జై తెలంగాణ అని కూడా నినాదం చేయలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం ఎస్సీ కాలనీలో వినాయకుని వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోబీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, తాటికొండ సీతయ్య, సంకిపల్లి రఘునందన్‌రెడ్డి, శోభన్‌బాబు, రాములు గౌడ్, ఎస్ఏ రజాక్, పులుసు యాదగిరి, సోమేష్, ఉపేందర్, శ్రీనివాస్, తునికి సాయిలు, రమేష్ ,శ్రీనివాస్, వెంకన్న, రవి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ -
యూరియా ఏది?
అదును దాటుతోంది..సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యూరియా కోసం రైతులు తంటాలు పడుతున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవడంతో పత్తి, వరి, పండ్ల తోటలకు యూరియా పెట్టుకునేందుకు ఇదే సరైన అదును. నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరితోపాటు పత్తికి యూరియా వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం వరి నాట్లు వేస్తుండటంతో యూరియా అవసరం అధికంగా ఉంది. అందరికీ ఒకేసారి యూరియా అవసరం రావడం.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. చివరకు అర్ధరాత్రులు యూరియా కోసం పీఏసీఎస్ కేంద్రాల వద్దే పడుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆందోళన, ధర్నాలు.. ప్రస్తుతం పంటలకు అవసరమైన యూరియా కోసం రైతులు పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులు దీరుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిత్యం ఏదో ఒక మండలంలో రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. సోమవారం నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు చివరకు నార్కట్‌పల్లి–అద్దంకి జాతీయ రహదారిపై రస్తారోకో చేపట్టారు. ఇక పెద్దవూర, నిడమనూరు మండల కేంద్రాల్లోనూ రైతులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. తిప్పర్తి, శాలిగౌరారం, హాలియా మండలంలోనూ యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర, హాలియాలోలోని కొత్తపల్లి పీఏసీఎస్‌ల వద్ద యూరియా కోసం రాత్రి వేళల్లోనూ అక్కడే నిద్రిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా నడిగూడెంలో, ఆత్మకూరు(ఎస్) మండలాల్లో యూరియా కోసం ఆందోళన నిర్వహించగా, మద్దిరాల తదితర మండలాల్లో పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులుదీరారు. అవసరానికి సరిపడా అందని యూరియా.. ● నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 10.73 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. ప్రధానంగా 5,64,585 ఎకరాల్లో పత్తి, 5,05,160 ఎకరాల్లో వరి, 156 ఎకరాల్లో జొన్న, 2951 కంది, 310 పెసర, ఇతర పంటలను సాగు చేశారు. జిల్లాలొ వానాకాలం సీజన్ పంటలకు సెప్టెంబర్ వరకు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 53 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ● సూర్యాపేట జిల్లాలో 5,73,006 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. అందులో వరి 4.82 లక్షల ఎకరాల్లో, 84 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆయా పంటలకు జిల్లాలకు 60,734 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. అయితే ఇప్పటివరకు 42 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. మరోవైపు ప్రభుత్వం ప్రతి ట్రిప్‌లో జిల్లాకు కేవలం 2 నుంచి 3 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో వచ్చిన యూరియా వచ్చినట్లు అయిపోతోంది. మరోవైపు రైతులకు కేవలం ఒకటి, రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు పీఏసీఎస్, ఆగ్రోస్ సేవా కేంద్రాలు, ఎన్డీసీఎంఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి.. పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు పెంటబోయిన వెంకటేశ్వర్లు. ఈయనది తిరుమలగిరి(సాగర్) మండలంలోని రాజవరం. నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేసి 15 రోజులు కావస్తో్ంది. ఇప్పటి వరకు యూరియా లభించకపోవడంతో చల్లలేదు. మూడు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా ఒక్కటీ లభించలేదు. దీంతో యూరియా లేక, పంట ఎదుగుదుల తగ్గిపోయి, దిగుబడి కోల్పోయే ప్రమాదం ఉందని, పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న రైతు పేరు వడ్లపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి. ఇతనిది పెద్దవూర మండలం ఏనేమీదిగూడెం. వానాకాలం సీజన్లో 25 ఎకరాలలో వరి సాగు చేశాడు. ఎకరాలకు బస్తా చొప్పున ప్రస్తుతం 25 బస్తాల యూరియా కావాలి. తొలి విడతలో ఫర్టిలైజర్‌లో ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా దొరకడం లేదు. దీంతో వ్యవసాయ పనులను వదులుకుని మూడు రోజులుగా పెద్దవూర పీఏసీఎస్‌కు తెల్లవారక ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నాడు. రెండు రోజులు రెండు బస్తాల చొప్పున నాలుగు బస్తాలు, సోమవారం ఒక బస్తా మాత్రమే లభించింది. ఇంకా 20 వస్తాలు కావాలంటే.. ఇలా ఎన్ని రోజులు వేచి ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మాకున్న ఏడెకరాలతోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశా. రెండు వారాలుగా సహకార సొసైటీ చుట్టూ తిరుగుతున్నా 5 బస్తాల యూరియా మాత్రమే దొరికింది. మరో 7 బస్తాల యూరియా కావాలి. కూలీల కొరతతో కలుపు నివారణకు రసాయన మందుల వాడకం పెరిగింది. దీంతో మొక్క ఎండు బారి, పెరుగుదల లోపిస్తోంది. దీంతో యూరియా వేయడం తప్పనిసరి అవుతోంది. యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గుతుంది. – బుసిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నిడమనూరు మాది సోమవారిగూడెం చెరువు, ఏఎమ్మార్పీ సాగు నీటితో మూడు ఎకరాలు వరి సాగు చేశాను. నాటేసి నెలరోజులవుతోంది. ఒక్క దఫా కూడా యూరియా వేయలేదు. పంటను చూస్తే దుఃఖం వస్తోంది. సకాలంలో యూరియా వేస్తేనే వరి దుబ్బు, పిలకలు వచ్చి, దిగుబడి వస్తుంది. – సింగం రామలింగయ్య, సోమవారిగూడెం, నిడమనూరు మండలం నేను 11ఎకరాల్లో వరి సాగు చేశా. యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నా. అయినా దొరకడం లేదు. అదును దాటిపోతోంది. యూరియా వేయపోవడంతో పొలం ఎదుగుదల లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – ఎం.సత్తయ్య, రైతు, రాయినిగూడం, తిప్పర్తి వానాకాలం సీజన్లో తన భూమితో పాటు కౌలుకు తీసుకుని 14 ఎకరాలలో వరి నాట్లు వేశాను. ప్రస్తుతం యూరియా అవసరం ఏర్పడింది. ఒక్కరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. సోమవారం రెండు లారీల యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో ఇంట్లోని ముగ్గురం తెల్లవారక ముందే పీఏసీఎస్‌కు వచ్చాం. క్యూలో నిల్చుంటే ఒకొక్కరికి ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. రోజు ఒక బస్తా ఇస్తే ఎన్నిరోజులు తిరగాలి. – కొలుపుల సంతు, పోతునూరు, పెద్దవూర మండలం ఫ వరి, పత్తి, పండ్ల తోటలకు ఒకేసారి ఎరువులు అవసరం ఫ ఈ సమయంలోనే దొరకని యూరియా ఫ దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతుల ఆందోళనఫ రోజుల తరబడి తప్పని ఎదురుచూపులు ఫ అర్ధరాత్రి కూడా పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు -
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి అర్జీలను జిల్లా అధికారులు చొరవ తీసుకొని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని శాఖల్లో చాలా రోజుల నుంచి ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా శాఖల అధికారులు వీటి పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీసీఓ పద్మ, డీఈఓ అశోక్, డీఎంహెచ్ ఓ చంద్రశేఖర్, డీఎస్ఓ మోహన్ బాబు, ఎస్ సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, సంక్షేమ అధికారులు శంకర్, దయానందరాణి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయి గౌడ్, సంతోష్ కిరణ్, శ్రీనివాసరాజ్, శ్రీలత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నష్టం అంచనాలు రూపొందించాలిఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం అంచనాలను రూపొందించి సమర్పించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి భారీ వర్షాలు, వరద నష్టాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లాలో కలెక్టర్ పాల్గొన్న అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు ఆర్అండ్బీ రోడ్లు, లో లెవల్ కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయన్నారు. అలాగే పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలకు సంబంధించి నష్టం అంచనా వివరాలను, వరదలతో పొలాల్లో ఇసుక మేటలు వేయడం, పంట నష్టం, మిషన్ భగీరథ పైప్ లైనింగ్, మున్సిపాలిటీల్లో జరిగిన నష్టాలపై నివేదికలు సమర్పించాలన్నారు. పునరావాస కేంద్రాలకు సంబంధించిన వివరాలు, ఇరిగేషన్ అధికారులు కాల్వలు, చెరువులు, మైనర్,మేజర్ ప్రాజెక్టులకు చెందిన నష్టం వివరాలని క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ కె. .నరసింహ, ఆర్డీఓ వేణుమాధవ్, జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, పీఆర్ ఈఈ వెంకటయ్య, టీజీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రాంక్లిన్, సీపీఓ కిషన్, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసరావు, డీపీఓ యాదగిరి, డీఎఫ్ఓ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ అధికారి నవికాంత్, పశు సంవర్థకశాఖ అధికారి శ్రీనివాస రావు, హార్టికల్చర్ అధికారి నాగయ్య, ఫిషరీస్ అధికారి నాగులు, మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
‘పరిషత్’ జాబితాకు నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణతో పాటు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తుది ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అందుకు అవసరమైన ఏర్పాట్లపై ఆయా జిల్లా ల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు దృష్టి సారించారు. 6న ముసాయిదా ఓటరు, పోలింగ్ స్టేషన్ల జాబితా ఈ నెల 6వ తేదీన ఎంపీడీఓ, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రచురించనున్నారు. 8వ తేదీన జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల, పోలింగ్ కేంద్రాల జాబితాపై సమావేశం నిర్వహించి వారి నుంచి సూచనలు తీసుకోనున్నారు. అదే రోజు మండల స్థాయిలో కూడా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలను ఇతర సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చిన ఫిర్యాదులను 9వ తేదీన పరిష్కరిస్తారు. 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. ఎన్నికలకు సిద్ధంగా..ఉమ్మడి జిల్లాలో 716 ఎంపీటీసీ, 73 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఈ ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టనుంది. నల్లగొండ జిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జెడ్పీటీసీ స్థానాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 178 ఎంపీటీసీ స్థానాలు, 17 జెడ్పీటీసీ స్థానాలు, సూర్యాపేట జిల్లాలో 186 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను, పోలింగ్ స్టేషన్లను జిల్లాల అధికారులు ఖరారు చేయనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండేలా ఈ చర్యలు చేపడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ ఓటరు జాబితాతో పాటు పోల్చింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ ఉమ్మడి జిల్లాలో 716 ఎంపీటీసీ, 73 జెడ్పీటీసీ స్థానాలు -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం
భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మరింతవేగం పెరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. మొదట్లో లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత అవగాహన పెరిగి బిల్లులు సరిగా రావడంతో ఇంటి నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క ఆగస్టులోనే 1,034 ఇళ్లకు భూమి పూజలు జరగడం విశేషం. జిల్లాకు 8,744 ఇళ్లు మంజూరుఅసెంబ్లీ ఎన్నిలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. రూ.5లక్షలతో ప్రభుత్వం రూపొందించిన నమునాలో ఇంటిని లబ్ధిదారుడే నిర్మించుకోవాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలకు 3,500 చొప్పున ఇళ్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,744 ఇళ్లు మంజూరయ్యాయి. మొదటగా ఎంపిక చేసిన మండలానికో గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేపట్టగా లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. వేగంగా శంకుస్థాపనలు.. పనులు..!మొదట మంచి రోజులు లేకపోవడం, ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా ఇందిరమ్మ లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. క్రమంగా ప్రజల్లో అవగాహన రావడం, ఇంటి నిర్మాణాలు బాగానే ఉండడంతో ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. అలాగే బిల్లులు సైతం ఎప్పటికప్పుడు చెల్లిస్తుండడంతో ఇంటి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు దాదాపు రూ.25 కోట్లను వారి అకౌంట్లలో జమ చేశారు. శ్రావణ మాసం రావడంతో ఆగస్టులో భూమి పూజలు ఊపందుకున్నాయి. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా 1,034 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటిని మంజూరు చేస్తోంది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకునేందుకు ముందుకురావాలి. బిల్లులను సైతం వెను వెంటనే ప్రభుత్వం చెల్లిస్తోంది. – సిద్ధార్థ, హౌసింగ్ పీడీతిరుమలగిరి మండలం కోక్యానాయక్ తండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు గత ఒక్కనెలలోనే 1,034 ఇళ్లకు శంకుస్థాపన పనులు ప్రారంభమైన చోట చకచకా నిర్మాణాలు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్న లబ్ధిదారులు జిల్లాకు మొత్తం 8,744 ఇళ్లు మంజూరు -
మహిళలకు భద్రత కల్పిస్తాం
సూర్యాపేటటౌన్ : మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని ఎస్పీ కె.నరసింహ భరోసా ఇచ్చారు. పని ప్రదేశాల్లో అత్యాచార, వేధింపుల నిరోధక చట్టం–2013పై సోమవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీసు అధికారులు, మహిళా రక్షణ విభాగం సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ అధికారులతో కలిసి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, సమస్యలపై పోలీసు మహిళా సిబ్బంది స్పందించి సహాయ సహకారాలు అందించాలన్నారు. వేధింపులపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా సాధికారత, మహిళా శక్తి, చట్టాల అమలులో మహిళల పాత్ర, పని ప్రదేశంలో వేధింపులను నిరోధించడంలో బాగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ చట్టం ప్రకారం జిల్లా పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి ఆధ్వర్యంలో ఒక ఇంటర్నల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఆఫీస్ ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేశారమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి దయానందరాణి, బేటి బచావో బేటి పడావో నిర్వాహుకురాలు చైతన్య, పోలీసు కార్యాలయం ఏవో మంజు భార్గవి, జిల్లా మహిళా భరోసా సెంటర్ ఎస్ఐ మౌనిక, జిల్లా షీ టీమ్స్ ఎస్ఐ నీలిమ, భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ జ్యోతి, కరుణశ్రీ పాల్గొన్నారు. -
1.63 లక్షల కుటుంబాలకు ధీమా
2025–26 సంవత్సరానికి గాను రైతుబీమా పథకంలో జిల్లావ్యాప్తంగా 1,63,480 మంది నమోదయ్యారు. 2024–25 సంవత్సరానికి గాను జిల్లాలో మృతిచెందిన కొంత మంది రైతులకు బీమా డబ్బులు రావాల్సి ఉంది. – శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగారం : రైతుబీమా పథకానికి ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,63,480 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల కాలంలో పట్టాదారు పాస్‌పుస్తకం పొందిన వారు, గతంలో పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నా పథకంలో చేరని వారు, 19 సంవత్సరాల వయస్సు నిండినవారు, సవరణల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గతనెల 13 వరకు అవకాశం కల్పించారు. రైతులు సమర్పించిన దరఖాస్తులను ఏఈఓలు గతనెల 14 వరకు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు 59 ఏళ్లు నిండిన వారిని పథకం నుంచి తొలగించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏడాది పాటు రైతులకు బీమా రక్షణ కొనసాగనుంది. 65 ఏళ్లకు పెంచితే ప్రయోజనం పథకంలో నమోదైన వారికి సంబంధించిన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే జీవిత బీమా సంస్థకు చెల్లిస్తుంది. పథకంలో నమోదై ఉండి, ఏ కారణంతో అయినా రైతు మృతి చెందితే కుటుంబానికి రూ.5లక్షల బీమా పరిహారం అందుతుంది. పథకం మొదలైన 2018వ సంవత్సరం నుంచి జిల్లాలో 5,369 మంది రైతులు మృతిచెందగా వీరికి రూ.262.60 కోట్ల పరిహారం చెల్లించారు. ఇటీవల కాలంలో మృతిచెందిన జిల్లాలోని కొందరు రైతుల కుటుంబాలకు పరిహారం రావాల్సింది ఉంది. 2024–25లో 839 మంది రైతులు మృతి చెందగా 730 మందికి మాత్రమే రైతు బీమా పరిహారం అందింది. మిగతా వారికి బీమా పరిహారం అందాల్సి ఉంది. ఫ రైతు బీమా పథకానికి ముగిసిన దరఖాస్తుల గడువు ఫ జిల్లా వ్యాప్తంగా 1,63,480 మంది నమోదు ఫ వచ్చే ఏడాది ఆగస్టు 14 వరకు బీమా వర్తింపు సంవత్సరం నమోదు మృతులు పరిహారం (రూ.కోట్లలో) 2018–19 1,27,486 608 30.40 2019–20 1,30,524 639 31.95 2020–21 1,31,571 981 49.05 2021–22 1,41,925 772 38.60 2022–23 1,51,135 726 36.20 2023–24 1,58,860 804 39.90 2024–25 1,63,549 839 36.50 2005–26 1,63,480 – – -
మరమ్మతులు సగమే!
నడిగూడెం : నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం గ్రామ పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్టకు 132.500 కిలోమీటర్ వద్ద గతేడాది సెప్టెంబర్ 1న గండిపడిసోమవారంతో ఏడాది పూర్తి అవుతున్నా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కాల్వకట్టకు మళ్లీ ఎక్కడ గండ్లు పడతాయోనని మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మట్టిపోశారు.. ఇసుక బస్తాలు పేర్చారు.. గతేడాది ఇదేనెలలో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అదే సమయంలో భారీ వర్షాలకు పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కాల్వలోకి వెదురెక్కి వచ్చింది. ఈ క్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు ఖమ్మం జిల్లా పరిధిలో రంగుల వంతన వద్ద ఉన్న ఎస్కేప్ గేట్లు ఎత్తక పోవడంతో కాగితరామచంద్రాపురం గ్రామ సమీపంలో కాల్వ కట్టకు భారీగా గండి పడింది. దీంతో రామచంద్రాపురం రైతుల పొలాలు నీటమునిగి, వరద ప్రవాహంలో విద్యుత్ మోటార్లు కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కాల్వకట్ట అత్యవసర మరమ్మతలకు నీటి పారుదల శాఖ నుంచి నుంచి రూ.2.10 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో గండి పడిన ప్రాంతంలో 5.2 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల పొడవునా కేవలం మట్టిపోసి ఇసుక బస్తాల వేసి కట్టకు అత్యవసర మరమ్మతులు చేయించారు. అయినప్పటికీ నేటికీ కాల్వకట్ట పూర్తి స్థాయి మరమ్మతులకు నోచుకోలేదు. గత వేసవిలోనూ లైనింగ్, సిమెంట్ కాంక్రీటు, ఫ్లోరింగ్ పనులు చేపట్టలేదు. ఇంకా ఆ ప్రాంతంతో పాటు, రామాపురం, చాకిరాల, సిరిపురం వద్ద ప్రధాన కాల్వ కట్ట అక్కడక్కడా బలహీనంగా ఉన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఫలితంగా మళ్లీ పలుచోట్ల గండ్లు పడే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనసాగుతున్న ఆధునీకరణ పనులు నీటి పారుదల శాఖ పున:వ్యవస్థీకరణలో భాగంగా సాగర్ ఎడమ కాల్వ 74వ కిలోమీటర్ నుంచి 132.500 కిలోమీటర్ వరకు సూర్యాపేట జిల్లా పరిధిలోకి వచ్చింది. పైభాగంలో ఇప్పటికే 74 కిలోమీటర్ నుంచి 115 కిలోమీటర్ మునగాల వరకు రూ.29 కోట్లతో మేఘా సంస్థ ఆధ్వర్యంలో కాల్వ కట్ట ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.కాగితరామచంద్రాపురం వద్ద ఎడమ కాల్వ కట్టకు గండిపడి నేటికి ఏడాది ఫ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేపట్టని మరమ్మతులు ఫ మట్టిపోసి మమ అనిపించిన అధికారులు ఫ అక్కడక్కడా అధ్వానంగా కాల్వకట్ట ఫ మళ్లీ గండ్లు పడే ప్రమాదం ఉందని రైతుల ఆందోళనగతేడాది మా గ్రామ సమీపాన సాగర్ ఎడమ కాల్వ కట్టకు గండి పడి వందల ఎకరాల్లో వరిపంట నష్టపోయాం. నేటికీ మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. కాల్వ కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలి. – చక్రాల వెంకన్న, రైతు, కాగితరామచంద్రాపురం మునగాలలోని 115 కిలోమీటర్ నుంచి నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం రంగుల వంతెన 132.500 కిలోమీటర్ వరకు పూర్తి స్థాయిలో శాశ్వత మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే మరోసారి సాగర్ ఎడమ కాల్వ కట్టకు గండ్లు పడకుండా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతాం. – రఘు, డీఈ, సాగర్ ఎడమ కాల్వ -
ఎన్ఆర్ఐ శరత్చంద్ర సేవలు ప్రశంసనీయం
మద్దిరాల : జన్మభూమిపై మమకారంతో గ్రామస్తుల కోసం ఎన్ఆర్ఐ వేముగంటి శరత్చంద్ర అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ నరసింహ, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో గ్రామానికి చెందిన వేముగంటి సుధాకర్‌రావు కుమారుడు ఎన్ఆర్ఐ వేముగంటి శరత్చంద్ర తన కుమారుడు ఆద్య కోరిక మేరకు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌తో కలిసి వారు ప్రారంభించి మాట్లాడారు. అమెరికాలో స్థిరపడినా సొంత ఊరి ప్రజల కోసం తన వంతుగా శరత్చంద్ర చేస్తున్న సేవలను కొనియాడారు. ఇప్పుడే కాదు కరోనా సమయంలో కూడా జిల్లాకు చెందిన డాక్టర్లతో మాట్లాడి అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందించారని, కుక్కడం గ్రామంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు నిత్యావసర సరకులు సమకూరుస్తూనే వైద్యసేవలు అందించేందుకు ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. చిన్న వయస్సులోనే గొప్పగా ఆలోచించి వైద్యశిబిరం ఏర్పాటు చేయించిన శరత్చంద్ర కుమారుడు ఆద్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ నరసింహ, కుక్కడం గ్రామ మాజీ సర్పంచ్ ముక్కాల వాసుదేవరెడ్డి, నాయకులు ముక్కాల భూపాల్‌రెడ్డి, నాగెల్లి అరుణ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కాల అవిలుమల్ల యాదవ్, మాజీ జెడ్పీటీసీ బానోత్ మంజుల మాన్సింగ్, పులుసు రామనర్సు, మద్దెల భిక్షపతి, మద్దెల రాములు, బానోత్ శ్రీనివాస్, వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తంరెడ్డి -
సీపీఎస్ రద్దు ధర్నాకు సంపూర్ణ మద్దతు
సూర్యాపేటటౌన్ : సీపీఎస్ రద్దు కోసం సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాకు మోడల్ స్కూల్ పీఎంటీఏ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగాని రాజయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జిలాని, రాష్ట్ర బాధ్యుడు గుర్రాల సోమయ్యగౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి సీపీఎస్‌కు బదులు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు సరికావునేరేడుచర్ల : దేశ ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం నేరేడుచర్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టిడించేందుకు వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన తల్లిని అవమానించే విధంగా రాహుల్‌గాంధీ వాఖ్యాలు చేయడం భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అరెస్ట్ అయిన వారిలో నేరేడుచర్ల, పాలకవీడు మండలాల అధ్యక్షుడు నాగిరెడ్డి, నర్రినాయక్, నాయకులు సత్యనారాయణ, రమేష్, నరేందర్‌రెడ్డి, ఏమి రెడ్డి శంకర్‌రెడ్డి, కాలం నాగయ్య ఉన్నారు. పాలన వైఫల్యంతోనే మార్వాడీ గో బ్యాక్ నినాదంసూర్యాపేట అర్బన్ : పాలన వైఫల్యంతోనే మార్వాడీ గో బ్యాక్ నినాదం వచ్చిందని సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మార్జున్, సీపీఐ సీనియర్ నాయకుడు దంతాల రాంబాబు ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి ఎస్కే.నజీర్ ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగిన ఘటనను పోలీసులు సకాలంలో పట్టించుకుంటే మార్వాడీ గోబ్యాక్ నినాదం వచ్చేంది కాదన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గంట నాగయ్య, అనంతల మధు, కునుకుంట్ల సైదులు, జనార్దన్ యాదవ్, కరీం, వెంకట్ యాదవ్, చామకూర నరసయ్య, నాగయ్య, నారబోయిన కిరణ్, తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఇంటర్‌లోనూ ముఖగుర్తింపు హాజరు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తోంది. కాలేజీలకు ఉదయం వచ్చిన విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లి తిరిగి రావడం లేదు. మరికొందరు ఇంటి వద్ద కళాశాలకు వెళుతున్నామని చెప్పి సరిగా హాజరు కావడం లేదు. దీనిని అరికట్టి హాజరు శాతం పెంచి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ముఖ గుర్తింపు హాజరు కోసం ప్రభుత్వం యాప్‌ను సిద్ధం చేసింది. ఈ హాజరు విధానం జిల్లాలో గతనెల 23నుంచి అమలు చేస్తున్నారు. రోజుకు రెండు సార్లు జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా తీసుకుంటున్నారు. యాప్ ద్వారా రోజూ ఉదయం, మధ్యాహ్నం హాజరు తీసుకుంటారు. ఒక వేళ విద్యార్థి హాజరు కాకుంటే వారి తల్లిదండ్రుల సెల్ఫోన్లకు మెసేజ్ వెళుతుంది. ఈ హాజరును కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు పర్యవేక్షించనున్నారు. 3,003 మంది ఇంటర్ విద్యార్థులు జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,003 విద్యార్థులు విద్యభ్యసిస్తున్నారు. వీరిలో ఫస్టియర్ 1,559 మంది, సెకండియర్ 1,444 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరు నమోదు విధానంపై ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. అధ్యాపకులు ప్లే స్టోర్ నుంచి పీజీ బీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అధ్యాపకులు యాప్‌ను ఓపెన్ చేయగానే వారు ప్రతిరోజు ఉదయం బోధించే తరగతి, విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. విద్యార్థి పేరుపై క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. వెంటనే విద్యార్థి ముఖంపై క్లిక్ చేయగానే విద్యార్థి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఫ విద్యార్థుల హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా కొత్త విధానం ఫ రోజుకు రెండు సార్లు హాజరు ఫ గైర్హాజరైతే తల్లిదండ్రుల ఫోన్లకు సమాచారం ఫ అన్ని జూనియర్ కళాశాలల్లో అమలు -
సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా..
సూర్యాపేటటౌన్ : సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. పాఠశాలలు అందుబాటులో లేక, ఇతర కారణాలతో చదువుకు దూరంగా ఉన్న 15 ఏళ్లు దాటిన నిరక్షరాస్యులను గుర్తించి సామాజిక చైతన్య కేంద్రాల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా నిరక్షరాస్యుల వివరాలను ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశారు. నిరక్షరాస్యుల గుర్తింపు.. వలంటీర్ల ఎంపిక పూర్తి జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 41,117 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వీరికి చదువు చెప్పడానికి 4,075 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు (రిసోర్స్ పర్సన్లు) శిక్షణ ఇచ్చారు. వీరు మండల స్థాయిలో త్వరలోనే ప్రతి పంచాయతీ నుంచి ఒక ఉపాధ్యాయుడు, ఒక వీఓఏకు శిక్షణ ఇస్తారు. వీరు వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వలంటీర్లు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిద్దినున్నారు. 46 వేల పుస్తకాలొచ్చాయ్.. గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న సామాజిక చైతన్య కేంద్రాల్లో చదువుకునేవారికి పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచారు. నిరక్షరాస్యుడితో పాటు ప్రతి వలంటీర్‌కు ఒక పుస్తకం చొప్పున 46 వేల పుస్తకాలు వచ్చాయి. వలంటీర్‌కు మార్గదర్శి, నిరక్షరాస్యులకు అక్షర వికాసం పుస్తకాలు ఉన్నాయి. ఇందులో పరిసరాలు, ఆర్థిక విషయాలు, నిత్య జీవన చిత్రాలతో కూడిన పాఠాలు ఉంటాయి. చిత్రాల ద్వారా చదువు నేర్పుతారు. నిరక్షరాస్యులను ఇప్పటికే గుర్తించి వారికి బోధించేందుకు వలంటీర్లను సైతం నియమించాం. త్వరలో గ్రామాల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ప్రారంభిస్తాం. – వై.రాంబాబు, జిల్లా సెక్టోరియల్ అధికారి 15 ఏళ్లు దాటిన నిరక్షరాస్యుల కోసం ‘ఉల్లాస్’ ఫ జిల్లాలో 41,117 మంది గుర్తింపు ఫ 4,075 మంది వలంటీర్ల నియామకం ఫ చదువు చెప్పేందుకు త్వరలోనే సామాజిక చైతన్య కేంద్రాలు -
కోదాడలో నకిలీ వైద్యుల బెడద
కోదాడ: కోదాడలో నకిలీ వైద్యుల బెడద రోజురోజుకు ఎక్కువ అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, ఒక వేళ నకిలీలను గుర్తించినా చర్యలు తీసుకోకపోవడంతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో పోలీసు కేసులు నమోదు చేసినా వీరు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా శుక్రవారం అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడి ఆస్పత్రిని జిల్లా వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ హాస్పిటల్‌కు మూడునాలుగేళ్ల నుంచి అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్పా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఇలాంటి వైద్యశాలలు కోదాడలోనే మరో మూడు నాలుగు వరకు ఉన్నట్లు సమాచారం. వైద్యుడి పేరుతో అనుమతి.. వైద్యం చేసేది మాత్రం నకిలీయే.. ఇతర దేశాలలో వైద్య విద్యను అభ్యసించిన వారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ తప్పని సరిగా పాస్ కావాలి. ఆ తరువాతే వారికి వైద్యం చేసే అర్హత వస్తుంది. కానీ పలువురు కఠినంగా ఉండే ఈ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ కావడం లేదు. వీరు తెలివిగా ఇండియాలో చదివిన వైద్యుడి సర్టిఫికెట్లతో వైద్యశాలలకు అనుమతులు తీసుకుంటున్నారు. ఆ తరువాత వీరు రంగంలోకి దిగి అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన సమయంలో జిల్లా వైద్యశాఖ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్పా చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో మరో ముగ్గురు నకిలీ వైద్యులు క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడికల్ షాపులే క్లినిక్‌లుగా..కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో ఉన్న పలు మెడికల్ షాపుల యజమానులు వారంలో రెండు మూడు రోజులు తమ దుకాణాలను క్లినిక్‌లుగా మారుస్తున్నారు. టెంట్లు వేసి జాతరను తలపించే విధంగా ఈ దందా సాగుతోంది. స్పెషలిస్ట్ డాక్టర్ పేర్లతో ఇక్కడ జరిగే దోపిడీకి అంతే లేదు. వచ్చిన వైద్యుడు అసలా.. నకిలీయా.. అతనా.. కాదా అన్నది చూడడంలేదు. సీనియర్ డాక్టర్ల పేరు చెప్పి జూనియర్లతో వైద్యం చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. మూడు సంవత్సరాల క్రితం హుజూర్నగర్ రోడ్డులో ఓ మెడికల్ షాపు యజమాని స్కిన్ స్పెషలిస్ట్ స్థానంలో కోదాడకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని కూర్చోబెట్టి వైద్యం చేయిస్తుండగా ఓ పేషంట్ గుర్తుపట్టి నిలదీయగా అతను పారిపోయాడు. నాడు ఈ షాపును అధికారులు సీజ్ చేశారు. నెల తిరగక ముందే మళ్లీ అనుమతులు ఇచ్చారు. తాజాగా మళ్లీ అక్కడ ఈ దందా సాగుతూనే ఉంది. అర్హత లేకుండా వైద్యశాలలు నిర్వహించినా, వైద్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. ఫిర్యాదులు రావడంలో శుక్రవారం కోదాడలో ఓ వైద్యశాలను సీజ్ చేశాం. నకిలీ వైద్యులపై సరైన సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చినవారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. –చంద్రశేఖర్, జిల్లా వైద్యశాఖాధికారి కేసులు నమోదు చేస్తున్నా బెదరని నకిలీలు ఫ ఇప్పటికే మూడు క్లినిక్‌లు సీజ్ ఫ వైద్యుడి పేర అనుమతులు.. అనర్హుడితో వైద్య సేవలు ఫ రోగుల ప్రాణాలతో చెలగాటం ఫ అధికారుల పర్యవేక్షణలోపంఇది.. కోదాడలో శ్రీహృదయ వైద్యశాల. దీన్ని నిర్వహిస్తున్నది వన్నా యశ్వంత్ కుమార్. ఎం.బి.బిఎస్. డీఎన్బీ చేసినట్లు బోర్డుపై రాసుకొని కోదాడలో వైద్యం చేస్తున్నాడు. ఇతను ఒక దగ్గర అనుమతి తీసుకొని వేరొక చోట వైద్యం చేస్తున్నాడని అధికారులు నోటీసులు ఇచ్చారు. అతనిపై ఫిర్యాదులు తరచూ రావడంతో వైద్యశాలను తనిఖీ చేయడంతో పాటు అతని వైద్యడిగ్రీపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా నకిలీదని తేలింది. ఇతడు తన పేరును పోలిన ఒక వైద్యుడి సర్టిఫికెట్లను ఎంసీఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అవి తన సర్టిఫికెట్లగా నమ్మిస్తూ వైద్యశాలకు అనుమతులు పొంది వైద్యం చేస్తున్నాడు. అతను చూపుతున్న సర్టిఫికెట్లు కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో గల శ్రీదేవరాజ్ మెడికల్ కళాశాలకు చెందిన యశ్వంత్‌కుమార్ తండ్రి రవికుమార్విగా అధికారులు గుర్తించారు. కోదాడలో వైద్యం చేస్తున్న యశ్వంత్‌కుమార్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసి ఇండియాలో మెడికల్ కౌన్సిల్ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ పాస్ కాలేదు. కానీ నకిలీ సర్టిఫికెట్లతో మూడేళ్లుగా కోదాడలో వైద్యశాల నిర్వహించాడు. ఇతనిపై అధికారులు కేసులు నమోదు చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే బెయిల్‌పై వచ్చి ప్రస్తుతం మరోచోట వైద్యం చేస్తున్నట్లు సమాచారం. -
యువతను సన్మార్గంలో నడిపించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిది
సూర్యాపేటటౌన్ : యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. పాత నేరస్తులు, హిస్టరీ షీట్స్ కలిగిన వ్యక్తులు, గంజాయి కేసులో ఉన్న నిందితులకు చట్టాలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం అవగాహన కల్పించారు. సమస్యలు సృష్టించే వారిని, నేరాలకు పాల్పడే వారిని, గంజాయి రవాణా, వినియోగం చేసే వారిని హెచ్చరించారు. అనంతరం మాట్లాడారు. అలవాటుగా అదే రకమైన నేరానికి పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ఇలాంటి వ్యక్తులకు ముందస్తుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ఆ తర్వాత బైండోవర్ చేస్తామన్నారు. పాతనేరస్తులు బైండోవర్ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, నాగేశ్వర్రావు, నరసింహారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
పథకాల అమలులో ఉద్యోగుల బాధ్యత కీలకం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల బాధ్యత అతి కీలకమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.అదనపు కలెక్టర్ రాంబాబు 1995లో డిప్యూటీ తహసీల్దార్ గా ప్రయాణం మొదలు పెట్టారన్నారు. ఏడేళ్లుగా అదనపు కలెక్టర్ గా నిబద్ధత తో విధులు నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రజలకు సేవ చేయటం చాలా అభినందనీయమన్నారు. హుజూర్ నగర్ నుంచి సన్న బియ్యం పంపిణీ, తిరుమలగిరి నుంచి రేషన్ కార్డుల పంపిణీలాంటి సంక్షేమ పథకాలు అదనపు కలెక్టర్ సహకారంతో జిల్లాలో విజయవంతం చేశామన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి లో పర్యటనలు చేసి భూ సమస్యలు పరిష్కరించటంలో ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, జెడ్పీసీఈఓ వివి అప్పారావు, జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఏ పంట.. ఎన్ని ఎకరాలు
నాగారం : పంటల సర్వేకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చేనెల 1 నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశాడో వివరాలు నమోదు చేయనున్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో రెండు వేల ఎకరాల చొప్పున డిజిటల్ విధానం, మిగితాది సాధారణ పద్ధతిలో సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించారు. నవంబర్ 5న సర్వే వివరాలన్నీ పంచాయతీల్లో ప్రదర్శించనున్నారు. కొన్ని గ్రామాల్లో డిజిటల్.. మరికొన్నింటిలో సాధారణ పద్ధతి.. జిల్లాలో సీజన్ల వారీగా ఏటా ప్రభుత్వం పంటల సమగ్ర సర్వే చేస్తుంది. వ్యవసాయ సిబ్బంది పంట పొలాలను సందర్శించకుండా, రైతులను అడిగి వివరాలు సేకరిస్తుండటంతో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. గతేడాది కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సర్వే చేశారు. డిజిటల్ సర్వే చేయాలంటే వ్యవసాయ విస్తరణాధికారులు తప్పనిసరిగా పంట పొలాన్ని సందర్శించాల్సి ఉంటుంది. రైతుల వారీగా ప్రతి సర్వే నంబర్‌ను సందర్శించడం కష్టం అవుతుందని నిరాకరించారు. చివరికి గతేడాది మాదిరిగానే ఈ సీజన్లోనూ ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో డిజిటల్ క్రాప్, మిగిలిన గ్రామాల్లో పాత పద్ధతి లోనే సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి. ప్రతి క్లస్టర్లో 2 వేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలి. క్లస్టర్ పరిధిలో పురుష ఏఈఓలు 2 వేల ఎకరాలు, మహిళా ఏఈఓలు 1,800 ఎకరాల్లో సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 25నాటికి పూర్తి అధికారులు సర్వే నంబర్ వారీగా పంట పొలాన్ని సందర్శించి, వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఎన్ని ఎకరాల్లో పంట వేశారనే సమాచారం రైతుల మొబైల్‌కు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పంట లేకుంటే నో క్రాప్ అని నమోదు చేయాలి. ఈ ఏడాది అక్టోబరు25 నాటికి క్రాప్ సర్వే పూర్తి చేసి, 27న గ్రామ పంచాయతీల్లో వివరాలు ప్రదర్శించాల్సి ఉంది. పంటల నమోదులో తప్పులుంటే రైతులు.. ఏఈఓల దృష్టికి తీసుకెళ్లాలి. మార్పులు, చేర్పుల అనంతరం నవంబర్ 5వ తేదీన తుది జాబితాను ప్రదర్శిస్తారు. రేపటి నుంచి పంటల సర్వే ఫ సర్వే నంబర్ల వారీగా వివరాల నమోదు ఫ ప్రతి క్లస్టర్లో 2వేల ఎకరాల చొప్పున డిజిటల్.. మిగిలింది సాధారణ సర్వే చేసేలా ప్రణాళిక ఫ నవంబర్ 5న గ్రామ పంచాయతీల్లో తుది వివరాల ప్రదర్శన రైతుల సంఖ్య 2.81 లక్షలు క్లస్టర్లు 82పంటల సాగు 6.17 లక్షల ఎకరాలు -
మట్టి గణపతి మేలు
సూర్యాపేటలోని బొడ్రాయి బజార్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహానికి బదులుగా గత రెండేళ్లుగా మట్టి గణ పయ్యను నెలకొల్పుతున్నారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపయ్య ను ప్రతిష్ఠించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పుణ్యం.. బహుమతి భాగ్యంసూర్యాపేటలోని పీఎస్ఆర్ సెంటర్లో పీఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం వద్ద లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం రోజున లక్కీ డ్రా ను వెల్లడించనున్నట్లు నిర్వాహకులు తెలి పారు. డ్రాలో గెలుపొందిన వారికి లక్షా 30 వేల రూపాయల విలువైన స్కూటీతో పా టు 21 కేజీల స్వామి వారి ప్రసాద లడ్డూ ను బహూకరిస్తున్నట్లు పేర్కొన్నారు. – సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట -
సుదీర్ఘకాలం సేవలు అభినందనీయం
సూర్యాపేట టౌన్ : పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించడం అభినందనీయమని ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన కోదాడ పట్టణ 2వ ఎస్ఐ లింగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ భిక్షం, తిరుమలగిరి ఏఎస్ఐ నర్సయ్య, తుంగతుర్తి హెడ్ కానిస్టేబుల్ గోపి నాయక్ ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఏఓ మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ -
నెరవేరుతున్న పేద ప్రజల సొంతింటి కల
పెన్‌పహాడ్ : పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల నెరవేరుతోందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శనివారం లింగాల, దూపహాడ్, న్యూబంజారాహిల్స్ తండా, జల్మాలకుంట తండా, యల్లప్పకుంట, గూడెపుకుంట తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3500 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ అందిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికి రేషన్‌కార్డు అందించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ రేషన్‌కార్డులు అందించిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు, జిల్లా యూత్ అధ్యక్షు డు ఎలిమినేటి అభినయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిడిమేలపు దామోదర్‌రెడ్డి, అర్తి కేశవులు, తంగెళ్ల కరుణాకర్‌రెడ్డి, పిన్నాని కోటేశ్వర్రావు, నారాయణ ప్రవీణ్‌రెడ్డి, గాంధీ, భూక్య సందీప్‌రాథోడ్, శివనాయక్, సైదిరెడ్డి, దొంగరి సైదులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాపై రాజకీయ నాయకులతో సమీక్ష
నాగారం : ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని మండల ప్రత్యేక అధికారి, డీఈఓ అశోక్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ముసాయిదా ఓటరు జాబితా సవరణకు సహకరించాలని కోరారు. సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరి కిషోర్‌శర్మ, ఎంపీడీఓ మారయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతనకల్ : ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నాయకులకు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ఎం. బాలు మాట్లాడారు. ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునీత, ఎంపీఓ శశికళ, పంచాయతీ కార్యదర్శులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తిరుమలగిరి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాను సరిచూసుకోవాలని మండల ప్రత్యేక అధికారి రమేష్ రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీడీఓ లాజరస్, మండల పంచాయతీ అధికారి భీమ్‌సింగ్, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పెన్‌పహాడ్ : ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని మండల ప్రత్యేక అధికారి రాము అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదాలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అనంతరం ఓటరు జాబితాలో తప్పులను సరిచేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాలు, ఎంపీడీఓ జానయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అర్వపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశమయ్యారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఓటరు ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, మార్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఏఓ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ టి.గోపి, సూపరింటెండెంట్ రామకృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఆత్మకూర్ (ఎస్) : ఓటరు జాబితాలో అభ్యంతరాలపై శనివారం మండల స్థాయి అఖిలపక్ష నాయకులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ నాయక్ మాట్లాడారు. ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆమీన్సింగ్, ఎంపీడీఓ హాసిం, వివిధ పార్టీల నాయకులు తూడి నరసింహారావు, తంగెళ్ల వీరారెడ్డి, డేగల వెంకటకృష్ణ, బత్తుల ప్రసాద్, శిగ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. మద్దిరాల : ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల మండల అధ్యక్షులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపుదాస్ సాయికుమార్ విమర్శించారు. శనివారం సీపీఎం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఏడో వార్డులో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటా యించాలని కోరారు. అలాగే వన్ టౌన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు సీపీఎం శాఖ కార్యదర్శి రాచూరి జానకి రాములు, సహాయ కార్యదర్శి దున్న ప్రమోద్, నాయకులు రాచూరి భవాని, గోపాల్ రావు, చౌగాని లక్ష్మయ్య, సోమగాని బాలాజీ, కావలి శ్రీను, రాచూరి నర్సయ్య, లక్ష్మి పాల్గొన్నారు. సుందరయ్య నగర్‌పై నిర్లక్ష్యంపట్టణంలోని సుందరయ్య నగర్ అభివృద్ధి పట్ల ము న్సిపల్ అధికారులకు చిత్తశుద్ధి లేదని, ప్రజా సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకునే వారే లేరని సీపీఎం టూ టౌన్ కార్యదర్శి పిండికి నాగమణి అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 18వ వార్డు సుందరయ్య నగర్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. సుందరయ్య కాలనీలో అనేకమంది పేదలు పక్కా ఇళ్లు లేక గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం టూ టౌన్ కమిటీ సభ్యులు బత్తుల వెంకన్న, ముక్కెర్ల వెంకన్న, కంచుగట్ల శ్రీనివాస్, శీరంశెట్టి శ్రీనివాస్, శాఖ సభ్యులు లింగమ్మ, వెంకటమ్మ, రేణుక, జానకమ్మ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కొరవడిన పారదర్శకతమద్దిరాల : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట గోపి అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ముకుందాపురంలో ప్రజాసమస్యలపై సర్వే నిర్వహించి మాట్లాడారు. గ్రామాలలో సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నా పట్టించుకునే వారే లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పోలోజు సైదులు, జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్‌రెడ్డి, మద్దెల కోటయ్య, కల్లెపల్లి భాస్కర్, దీకొండ ఉపేందర్, బ్రహ్మం, శివరాత్రి మల్లయ్య, ఆలకుంట్ల ఇద్దయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు. -
యూరియా అందజేయాలని రైతుల ధర్నా
తుంగతుర్తి : యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో శని వారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. గత 15 రోజుల నుంచి తిరుగుతున్నా ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. అవసరంలేని ఎరువులను, మందులను అంటగట్టి తమ ఇష్టానుసారం రేట్లు వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రైతులకు సరిపోను యూరియా అందేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ తహసీల్దార్ దయానందంకు వినతిపత్రం అందజేశారు. వచ్చేనెల 3వ తేదీ వరకు యూరియా వస్తుందని, అప్పటివరకు రైతులు ఓపిక పట్టాలని తహసీల్దార్ సూచించారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తాటికొండ సీతయ్య, గుండగాని రాములు, గాజుల మహేందర్, కోటా రామస్వామి పాల్గొన్నారు. -
ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు గోనె విజయ, ఖమ్మంపాటి లక్ష్మమ్మ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది అమరులయ్యారని తెలిపారు. అనేకమంది కేసులకు భయపడకుండా ఉద్యమ సాధనలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షురాలు పుట్టా సోవమ్మ, కార్యదర్శి నోముల ఉమ, పట్టణ అధ్యక్షురాలు బంటు ఎల్లమ్మ, కార్యదర్శి కొమ్మాండ్లపల్లి సుజాత, పట్టణ కమిటీ సభ్యులు మాచర్ల రామలక్ష్మి, సాయని సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు అధ్వానం.. ప్రయాణం నరకం
పెన్‌పహాడ్ : సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం కావడంతో ఈ గుంతలు నీటితో నిండి, రోడ్డు పరిస్థితిని అర్థం చేసుకోలేని విధంగా తయారయ్యాయి. దీని వల్ల వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. పెన్‌పహాడ్ మండలంలోని మాచారం, సింగారెడ్డిపాలెం, దూపహాడ్ వంటి గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రహదారి పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతోంది. మాచారంలోని ఒక పెద్ద గుంత వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో, గ్రామస్తులే స్వయంగా ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. వారు ఆ గుంత చుట్టూ బారికేడ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే మండల కేంద్రంలోని మరో గుంత వద్ద జెండా కట్టి వాహనదారులను హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన గుంతలను పూడ్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రోడ్డు మరమ్మతులు లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సూర్యాపేట – గరిడేపల్లి ప్రధాన రహదారిపై భారీ గుంతలు వర్షాలకు నీరు నిలిచి చోటుచేసుకుంటున్న ప్రమాదాలు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికుల వేడుకోలురహదారి మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే రోడ్డుపై గుంతలను పూడ్చి, మరమ్మతులు చేయిస్తాం. సమస్యను పరిష్కరిస్తాం. వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. – యుగేందర్, ఆర్అండ్బీ ఏఈ రహదారిపై భారీ గుంతలతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్డుపై ప్ర యాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలి. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి. – జానయ్య, మాచారం -
గణనాథుడి విగ్రహాల వద్ద పూజలు, అన్నదానం
సూర్యాపేట : గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. జిల్లా కేంద్రంలోని నల్లాల బావి వద్ద మార్గదర్శి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుడి విగ్రహం వద్ద శనివారం అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి యూత్ గౌరవ అధ్యక్షుడు నేరెళ్ల మధు గౌడ్, అధ్యక్షుడు సలిగంటి శ్రీనివాస్, గోపగాని గిరి, సూరయ్య, నేరెళ్ల నరేష్, మిథున్, తదితరులు పాల్గొన్నారు. అన్నదానం.. మహాదానంహిందూ ధర్మంలో అన్నదానం మహాదానమని బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంతటి విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజేన్ జాడ్ మహాగణపతి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షుడు రాంబాబుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో రెబల్ శ్రీనివాస్, గాజుల రాంబాయమ్మ, శివ, సాయి, రాజీవ్, సన్ని పాల్గొన్నారు. చివ్వెంల : వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని వివి ధ గ్రామాల్లో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి, వీరారెడ్డి, జానయ్య, మార్క్, దిలీప్ పాల్గొన్నారు. అర్వపల్లి : అర్వపల్లిలోని సాయిబాబా ఆలయం వద్ద ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరబోయిన మహరాజు, కె.అవిలయ్య, దాసరి సోమయ్య, నాగరాజు, నిరంజన్, నిర్వాహకులు పాల్గొన్నారు. నాగారం : అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడుసు లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పసునూర్‌లో మెగా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద తొడుసు సోమక్క జ్ఞాపకార్థం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఓటరు జాబితా, ప్రచురణ, పోలింగ్ స్టేషన్ల జాబితా అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఎంపీడీఓలకు తెలపాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓ నారాయణరెడ్డి, నాయకులు కొప్పుల వేణారెడ్ది, రాజేశ్వరరావు, ఆజాద్, హబీద్, క్రాంతి, కోట గోపి, బడుగుల లింగయ్యయాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రమేష్, వెంకటేశ్వర్లు, డేవిడ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలతో ఇళ్లు నిర్మించుకోవాలి
భానుపురి (సూర్యాపేట): ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 318 మంది లబ్ధిదారులకు శుక్రవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు. సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ ఇళ్లు రానివారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, హౌసింగ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా, అధికారులు పాల్గొన్నారు. కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలి కొత్త పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక, టీజీ ఐపాస్ కమిటీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సీతారాం నాయక్, విద్యుత్ శాఖ ఏడీఈ అశోక్, జిల్లా టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి మాధవి, ఫాక్టరీస్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎల్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
15న ఎంజీ యూనివర్సిటీ స్నాతకోత్సవం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించి శుక్రవారం యూనివర్సిటీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై పలు సూచనలు చేశారు. ముఖ్య అతిథులుగా ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరవుతారని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో పీజీ విద్యార్థులకు 57 గోల్డ్ మెడల్స్, 22 మందికి పీహెచ్డీ పట్టాలను అందించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఈఓ ఉపేందర్‌రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వానిది దుష్ప్రచారం
రామగిరి(నల్లగొండ): కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల కింద వచ్చిన కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు. అబద్దాలు మాట్లాడి ప్రతిపక్షాలపై దుష్ప్రచారాలు చేయొద్దని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన వైనాన్ని ఎండగతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మూడు నెలల గడువు ఇస్తే రెండు నెలలుగా ప్రభుత్వం నిద్రపోయిందన్నారు. ఒక వైపు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎన్నికల సంఘం హడావుడిగా ఓటరు లిస్టు ప్రదర్శించడం దుర్మార్గమన్నారు. ఓటర్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని ప్రజలంతా లిస్టును చూసుకునేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాపై ఇక్కడి మంత్రులకు పట్టింపు లేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి -
యువ న్యాయవాదులు వృత్తిలో రాణించాలి
చివ్వెంల: యువ న్యాయమూర్తులు, న్యాయవాదులు వృత్తిలో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ హాల్లో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన మంచాల మమత పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న వయస్సులో జడ్డిగా ఎంపికై న మమతను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
తుంగతుర్తి ఏఓ సస్పెన్షన్
తుంగతుర్తి : తుంగతుర్తి వ్యవసాయ అధికారి (ఏఓ) బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. తన కింద పనిచేసే మహిళా ఏఈఓ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఏఓను శుక్రవారం విధుల నుంచి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సస్పెండ్ చేశారు. ఈ విషయంపై విచారణ నిర్వహించి వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో మహిళా ఉద్యోగుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. డిప్యూటీ పోస్ట్ మాస్టర్‌కు ఉత్తమ అవార్డుసూర్యాపేట : జిల్లా డిప్యూటీ పోస్ట్ మాస్టర్ బొజ్జ సునీల్ కుమార్‌కు ఉత్తమ అవార్డు దక్కింది. తెలంగాణ సర్కిల్ విభాగంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో జిల్లా నుంచి అత్యధికంగా పాలసీలు సేకరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపినందుకు ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్ భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రంతోపాటు షీల్డ్ బహుమానం స్వీకరించారు. పాలసీల సేకరణలో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన ఉత్తమ అవార్డు పొందిన సునీల్ కుమార్‌ను జిల్లా సూపరిటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లతో పాటు ఈస్ట్, వెస్ట్ ఇన్స్పెక్టర్లు, పోస్ట్‌మాస్టర్ ఇతర పోస్టల్ సిబ్బంది అభినందించారు. సీపీఎస్ విధానం రద్దుచేయాలిసూర్యాపేటటౌన్ : కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలని ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1న తలపెట్టిన పాత పెన్షన్ సాధన పోరాట సభను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, సెక్రటరీ జనరల్ భూపాల్ రెడ్డి, అదనపు సెక్రటరీ జనరల్ తంగెళ్ల జితేందర్‌రెడ్డి, కోచైర్మన్ సోంబాబు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ దున్నా శ్యామ్, లక్కపాక ప్రవీణ్, పాండు నాయక్, గులాం జహంగీర్, బషీర్, ధరావత్ స్వప్న, పి.రజిత, పి.సంతోష తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతిమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద జీవనదిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి శుక్రవారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక హారతి పూజలు నిర్వహించారు. శ్రీస్వామి, అమ్మవార్లను ప్రత్యేక పల్లకీలో ఆలయం నుంచి సన్నాయి వాయిద్యాల నడుమ కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్‌కు తరలించారు. అనంతరం పసుపు కుంకుమ, చీర సారెతో ప్రత్యేకంగా హారతి పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిపి నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలుచెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణపై ఆశలు
భానుపురి (సూర్యాపేట) : సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ధరణితో పాటు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా ఏళ్ల తరబడి ఈ దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి వీలు కలగలేదు. సాదాబైనామా దరఖాస్తులపై ఉన్న స్టేను ఇటీవల హైకోర్టు ఎత్తివేసింది. దీంతో వీటి క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. జిల్లాలో సాదాబైనామా కింద దాదాపు 29,814 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కబ్జాలో ఉండి.. పట్టాలు లేకపోవడంతో.. గతంలో భూముల క్రమవిక్రయాలు తెల్లకాగితాలపైనే జరిగేవి. ఇలా కొనుగోలు చేసి భూములను సాగు చేసుకునే వారు. బ్యాంకు రుణాలు కావాల్సిన వారు పట్టాలు చేసుకున్నా చాలావరకు ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండానే సాగింది. అయితే రుణమాఫీ లాంటి పథకాలను ప్రభుత్వాలు అమలు చేయడంతో కొంత మార్పు వచ్చింది. అయినా చాలామంది భూములను పట్టాలు చేయించుకోలేదు. దీంతో ప్రభుత్వ రికార్డులో భూములు అమ్మినా వారి పేర్లే కొనసాగాయి. రైతుబంధు, రుణమాఫీ పథకాలను అమలు చేయడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఈ ధరణిలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న పేర్లనే నమోదు చేయగా సాధారణ పేపర్లతో భూములను కొనుగోలు చేసి.. కబ్జాలో ఉన్న వారికి హక్కులు లేకుండా పోయాయి. చాలాచోట్ల భూములు అమ్మిన వారికే పట్టాదారు పాస్‌బుక్‌లు రావడంతో కొత్త సమస్యలు తలెత్తాయి. ఫ సాదాబైనామా దరఖాస్తులపై హైకోర్టులో స్టే ఎత్తివేత ఫ ఏళ్ల తరబడి ఎదురు చూపులకు కలగనున్న మోక్షం ఫ జిల్లా వ్యాప్తంగా 29,814 దరఖాస్తులు పెండింగ్ రైతుల భూసమస్యలకు ప్రధానంగా ధరణి పోర్టలే కారణమని, దీని స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల భూ సమస్యలే కాకుండా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పి అమలు చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాదాబైనామాలకు అవకాశం కల్పించడంతో పాటు ఆర్డీఓలకు బాధ్యతలు అప్పగించింది. 90 రోజుల్లో ఈ దరఖాస్తులకు పరిష్కారం చూపాలని ఈ కొత్త చట్టంలో పేర్కొన్నారు. అయితే సాదాబైనామా రెగ్యులైజేషన్ కోసం 2020లో ప్రభుత్వం ఇచ్చిన జీఓపై హైక్టోర్టు ఇచ్చిన స్టే అడ్డంకిగా మారింది. ఈ స్టేను ఎత్తివేతకోసం ప్రభుత్వం ప్రయత్నించగా అనుకూలంగా తీర్పు రావడంతో సాదాబైనామా దరఖాస్తు దారుల్లో ఆశలు రెకేత్తాయి. -
ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు రాయితీలు
మునగాల: జిల్లా వ్యాప్తంగా ఉద్యానపంటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి తీగల నాగయ్య తెలిపారు. మునగాల మండలం మొద్దులచెరువు స్టేజీ వద్ద సాగుచేసిన బంతి, మిర్చి తోటలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అధిక ఆదాయం ఇచ్చే పండ్లు, కూరగాయలు, పూలతోటలు, ఇతర వాణిజ్య పంటల సాగుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఆయిల్‌పామ్ విస్తరణ పథకం, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మనీటి పారుదల పథకం, వెదురు మిషన్ పథకాలకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాత మామిడి తోటల పునరుద్ధరణ పథకం కింద రైతులకు ఎకరానికి రూ.9,600రాయితీ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం మాధవరం గ్రామంలో ఉన్న ఆయిల్‌పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఉద్యాన వన డివిజన్ విస్తరణాధికారులు రంగు ముత్యంరాజు, యానాల సుధాకర్‌రెడ్డి, వంగూరి అనిల్, రైతు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నానో యూరియాతో రైతులకు ప్రయోజనం
నేరేడుచర్ల: నానో యూరియాతో రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. శ్రీధఽర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నేరేడుచర్ల ప్రాథమిక సహకార సంఘంలో యూరియా పంపిణీని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియాలో తయారయ్యే నానో యూరియా వినియోగిస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. నానో యూరియా వాడటం వల్ల భూసారం దెబ్బతినదని, పురుగులు, తెగుళ్ల బాధ తగ్గుతుందన్నారు. గత ఏడాది ఆగస్టులో 29 వేల మెట్రిక్ టన్నులు, ఈ ఏడాది ఆగస్టులో 31వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. సెప్టెంబర్‌లో జిల్లాకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా అదనంగా మరో 116 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉందన్నారు. గత ఏడాది సూర్యాపేట జిల్లాలో 4.82 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది 4.40 లక్షల ఎకరాల్లో ఇప్పటి వరకు నాట్లు వేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి జావెద్, నేరేడుచర్ల క్లస్టర్ ఈఏఓ స్నేహలత, సహకార సంఘం సీఈఓ శ్రీనివాస్, సిబ్బంది రామచంద్రారెడ్డి ఉన్నారు. ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి -
నీట మునిగిన పంట పొలాలు
మునగాల: రెండు మూడు రోజుల పాటు కురిసిన కురుస్తున్న వర్షాలకు లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. మునగాల, చిలుకూరు, నడిగూడెం, మండలాల్లో పంటపొలాలు నీటమునిగాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. మునగాల మండలంలోని మొద్దులచెరువు, కలకోవ ఊరచెరువు, రేపాల, నర్సింహులగూడెం, ముకుందాపురం తిప్పాయికుంట, ఆకుపాముల నాగులకుంట చెరువులు గరువారం నుంచి తిరిగి అలుగుపోస్తున్నాయి. మునగాల మండల వ్యాప్తంగా ఉన్న 34చెరువులు మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షం కురిస్తే అలుగులు పోసే అవకాశాలు కన్పిస్తున్నాయని ఇరిగేషన్ ఏఈఈలు శ్రీనివాస్, వినయ్ తెలిపారు. ప్రవహిస్తున్న వాగులు చిలుకూరు: చిలుకూరు మండల పరిధిలోని చిలుకూరు, బేతవోలు, నారాయణపురం, చెన్నారిగూడెం , చిలుకూరు చెరువులు అలుగుపోస్తున్నాయి. వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిలుకూరు మండల వ్యాప్తంగా చెరువులు, వాగుల కింద దాదాపు 350 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వరి పొలాల్లో గండ్లు పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం ఫ అలుగుపోస్తున్న చెరువులు, కుంటలు -
సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం
భానుపురి (సూర్యాపేట) : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు దారి తప్పకుండా క్రమశిక్షణతో చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యయులదే అని గుర్తు చేశారు. ప్రతి పాఠశాలలో అత్యవసర సందర్భాలలో తప్పించి సోమ, మంగళవారాలు ఉపాధ్యాయులు విధిగా నూరు శాతం హాజరు కావాలని, అదేవిధంగా మిగతా రోజుల్లో టీచర్ల హాజరు శాతం పెంచాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రతి రోజు 9,10 తరగతుల విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. 6,7,8 తరగతుల విద్యార్థులకు ప్రగతి గ్రూప్స్ పేరిట అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోఆర్డినేటర్లు జనార్దన్, శ్రావణ్ కుమార్, రాంబాబు, పూలమ్మ, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేసేలా ఒత్తిడి తేవాలి
భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఆగస్టు 30 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగ సంతోష్ రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదీష్‌రెడ్డిని తెలంగాణ యువజన సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు భాషా పొంగు సునీల్ జిల్లా అధ్యక్షులు విప్లవ కుమార్, ధరావత్ శివ, చేరుకు నగేష్, తుమ్మల క్రాంతి కుమార్, బంటు సందీప్, శివ, నవీన్ పాల్గొన్నారు. -
‘మా మేడమ్ మాకే కావాలి.. ’
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ ఆ పాఠశాలలో ఏడేళ్లుగా పనిచేస్తూ విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆమె ఇప్పుడు బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ మీద మోతె మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. వనజ మంగళవారం పాఠశాల నుంచి రిలీవ్ అవుతుండగా.. విద్యార్థులు ఆమెను చుట్టుముట్టి ‘మా మేడమ్ మాకే కావాలి. మేడమ్ మీరు వెళ్లొద్దు’ అంటూ రోదించారు. విద్యార్థులు రోదించడంతో టీచర్ (Teacher) వనజ వారిని చూసి కన్నీరుపెట్టుకున్నారు. ‘వలస కూలీ’పై ప్రత్యేక బోధన మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కొత్తపల్లి ప్రభాకర్ వినూత్నంగా పాఠాలు బోధిస్తుంటారు. పాఠ్యాంశంలోని పాత్రలను స్వయంగా జరిగే ప్రాంతానికి గానీ, లేదా స్వయంగా విద్యార్థులకు వేషధారణ చేసి వారు స్వీయ అవగాహన చేసుకునేలా బోధిస్తారు. అందులో భాగంగా మంగళవారం పాఠశాలలో 9వ తరగతి తెలుగు సబ్జెక్టులోని ‘వలస కూలీ’ పాఠాన్ని.. విద్యార్థికి వలస కూలీ వేషం వేసి పాత్ర సన్నివేశాల ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులు (Students) ఇలా నేర్చుకోవడం వల్ల ఆ పాఠాన్ని ఎప్పటికీ మరిచిపోరని ఉపాధ్యాయుడు ప్రభాకర్ చెప్పారు. బాల్యం ఆటలోనే బందీవారిది పలకాబలపం పట్టుకొని బడి బాట పట్టాల్సిన బాల్యం. కానీ.. తల్లిదండ్రుల పేదరికమో.. విద్యా అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆటపాటలతోనే భవిష్యత్‌ను బందీ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పని చేసే ఫ్యాక్టరీ ఎదుట కొందరు బోరింగ్ పంపునకు ఊయల కట్టుకొని, మరికొందరు మట్టిలోనే గడుపుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన బడిబాట, చదువుకు దూరంగా ఉన్న పిల్లలకోసం ముస్కాన్ (Muskaan) లాంటి కార్యక్రమాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అవి ప్రకటనలకే పరిమితమయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటచదవండి: మంచిర్యాల యువకుడికి 4 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 లక్షల ప్యాకేజీతో మరో జాబ్ -
ముగిసిన పదోన్నతుల ప్రక్రియ
సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈనెల 21న పదోన్నతుల ప్రక్రియ ప్రారంభంకాగా మొదటగా అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను జీహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. ఆ తర్వాత ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించేందుకు ఈ నెల 25న రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్జీటీల నుంచి ప్రమోషన్లు పొందిన పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. వెంటనే ప్రమోషన్ పొందిన పాఠశాలలో జాయిన్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. 24 మందికి జీహెచ్ఎంలుగా ప్రమోషన్ జిల్లాలో మొత్తం 24 జీహెచ్‌ఎంల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు గుర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా ప్రక్రియ కొనసాగించారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా ప్రమోషన్లు కల్పించారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు 24 మందికి ప్రమోషన్లు రాగా అందులో నలుగురు ఇతర జిల్లాలకు వెళ్లగా మరో నలుగురు సూర్యాపేట జిల్లాకు వచ్చారు. గెజిటెడ్ హెచ్ఎంలుగా గత గురువారం రాత్రి ఉత్తర్వులు అందుకున్నారు. వీరు వెంటనే ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరారు. 111 మంది పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి... గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారి ఖాళీ స్థానాలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)తో భర్తీ చేసేందుకు పదోన్నతుల ప్రక్రియ గత శుక్రవారం ప్రారంభించారు. సీనియారిటీ జాబితాను డీఈఓ వెబ్సైట్లో పొందుపరిచి ప్రక్రియ కొనసాగించారు. ఈ నెల 23న ఎస్జీటీల నుంచి వివిధ కేటగిరీలలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన వారి జాబితాను ప్రదర్శించగా, ఈ నెల 24, 25, 26 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులకు కసరత్తు కొనసాగింది. జిల్లాలో మొత్తం 111 మంది ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంలు 24 పీఎస్ హెచ్ఎంలు 28 ఎస్ఏ(బయోసైన్స్) 17 ఎస్ఏ(ఇంగ్లిష్) 13 ఎస్ఏ(మ్యాథ్స్) 13 ఎస్ఏ(ఫిజికల్ ఎడ్యుకేషన్) 05 ఎస్ఏ(ఫిజికల్ సైన్స్) 05 ఎస్ఏ(సోషల్) 30ఫ జిల్లాలో 24 మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా ప్రమోషన్ ఫ 111 మంది ఎస్జీటీలకు ఎస్ఏలు, పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతి ఫ వెంటనే జాయిన్ కావాలని ఆర్డర్లు ఇచ్చిన డీఈఓ -
చెరువుకు చేప
జిల్లాలోని మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లల అందించేలా ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెలలో చెరువుల్లోకి చేపపిల్లలను వదలేలా చూస్తాం. చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు మేలు జరగనుంది. – నాగులునాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి భానుపురి (సూర్యాపేట) : చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 3,41,18,033 చేపపిల్లలను జిల్లాలోని జలాశయాల్లో వదలాలని నిర్ణయించింది. ఈ మేరకు చేప పిల్లల సరఫరాకు గాను ఏజెన్సీ ఎంపిక కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ నెలాఖరునాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదలనున్నారు. అయితే గతంలో టెండర్ల నుంచి పంపిణీ వరకు అన్నీ అక్రమాలే జరిగినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టెండర్లు, పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సాఫీగా జరిగేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు. టెండర్ల దశలో ప్రక్రియ సూర్యాపేట జిల్లాలో 165 మత్స్య సొసైటీలు ఉన్నాయి. ఇందులో 15,540 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు వెయ్యికి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించనుంది. ఈనేపథ్యంలో ఈ సారి 621 చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదలాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ ఈనెలాఖరు నాటి వరకు కొనసాగనుంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు చేపపిల్లలను సరఫరా చేసే ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికకు క్షేత్రస్తాయి పరిశీలనను సైతం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. మూడు రకాలుగా.. జిల్లాలో కాలానుగుణంగా సీజనల్, శాశ్వతంగా నీరు ఉండే చెరువులు కుంటలే కాకుండా జలాశయాలు ఉన్నాయి. వీటిలో ఎంపిక చేసిన చెరువులు, కుంటల్లోనే ఈ ఏడాది చేపపిల్లలను వదలన్నారు. శాశ్వతంగా నీరు ఉండే 188 చెరువులు, కుంటల్లో 80 –100 ఎంఎం సైజ్ ఉన్న చేపపిల్లలు 2,05,51,248 , అదే సైజ్‌లో ఉండేవి రెండు జలశయాల్లో 37,98,902 చేపపిల్లలను అధికారులు వదలనున్నారు. సీజనల్‌గా నీరు ఉండే జిల్లాలోని 431 చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజ్ గల 97,67,883 చేపపిల్లలను సరఫరా చేసేందుకు ఈ టెండర్లను పిలిచారు. ఈ ఏడాది 3.41కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యం ఫ టెండర్లు ఆహ్వానించిన అధికారులు ఫ ఈనెలాఖరుకు ప్రక్రియ పూర్తి ఫ వచ్చేనెలలో పంపిణీకి సన్నాహాలు -
‘స్థానిక’ ఎన్నికల కసరత్తు ముమ్మరం
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ క్రమంలో నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది. జిల్లాలో 6,92,511 మంది ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే పంచాయతీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలోని 486 గ్రామ పంచాయతీల్లో 6,92,511 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,39,857 మంది, మహిళలు 3,52,633 మంది ఉన్నారు. మరో 21 మంది ఇతరులు నమోదయ్యారు. 4388 వార్డులు ఉండగా 4,403 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం వచ్చేనెల 2 నాటికి తుది జాబితా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తుది జాబితాలు రూపొందించాలని ఎన్నికల సంఘం డీపీఓలను ఆదేశించింది. ఈ మేరకు 28వ తేదీలోపు గ్రామపంచాయతీల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటించాల్సి ఉంది. అలాగే 29న జిల్లాస్థాయిలో ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 30న మండల స్థాయిలో పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈనెల 31 నాటికి తొలగించి, వచ్చే నెల 2వ తేదీన గ్రామ పంచాయతీల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ జాబితాను ప్రకటించనుంది. ఫ తుది ఓటరు జాబితా విడుదలకు నోటిఫికేషన్ ఫ 29న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఫ వచ్చే నెల 2న ఫొటో ఓటరు జాబితా ప్రకటన -
బోధన, అభ్యసన మేళాతో విద్యార్థులకు మేలు
చివ్వెంల(సూర్యాపేట) : బోధన, అభ్యసన మేళాతో విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం చివ్వెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి బోధన అభ్యసన పరికరాల ప్రదర్శనను సందర్శించారు. మండల వ్యాప్తంగా ఉన్న 37 పాఠశాలల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. బోధన పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండల స్థాయి ప్రదర్శనలో 1నుంచి 5 వతరగతి వరకు ప్రాధమిక స్ఠాయి బోధన కోసం తయారు చేసిన పరికరాల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి జిల్లా స్థాయి మేళాకు పంపించనున్నట్లు ఎంఈఓ కళారాణి కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్ ప్రకాశ్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఫ పర్యావరణ హితం.. మా అభిమతం
సీపీఎస్‌ను రద్దు చేయాలిఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల దేవరాజ్ డిమాండ్ చేశారు. వచ్చేనెల 1న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించే సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధు కుమార్, రవీందర్ , చౌదర్ రెడ్డి, రాజశేఖర్, లింగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మోతె: మోతె మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల నుంచి 1.200 కేజీ గంజాయిని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల కేంద్రానికి చెందిన యువకుడు, తన స్నేహితులతో కలిసి భద్రాచలం, ఒరిస్సా ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి మోతె మండలానికి తీసుకొస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ అజయ్‌కుమార్ తన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని రత్నాలకుంట ఇద్దరిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 1.200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి
కొండమల్లేపల్లి: బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి చెందింది. ఈ ఘటన కొండమల్ల్లేపల్లి మండలం కొల్ముంతల్పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్‌ముంతలపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్‌కి చెందిన పీట్ల రాజు, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రాజు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం బాపూజీనగర్‌కు వచ్చారు. మంగళవారం ఉదయం రాజు కుమార్తె అక్షర(4) తన నానయమ్మ సుగుణమ్మతో కలిసి బాపూజీనగర్‌లో రోడ్డు దాటుతుండగా.. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వేగంగా వస్తున్న బొలేరో వాహనం అక్షరను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్షరను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
విహారం కావొద్దు విషాదం
● సాగర్ సందర్శనకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని సూచన ● జలాశయంలోకి దిగొద్దని హెచ్చరిక ● సూచిక బోర్డులు, ట్రంచ్‌ల ఏర్పాటునాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు, యువత భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సాగర్ పరిసర ప్రాంతాల్లో, దయ్యాలగండి పుష్కర ఘాట్ వద్ద జలాశయంలోకి దిగడం వంటివి చేస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా కాలు జారి నీటిలో పడితే బయటకు రావడం కష్టమని రక్షణ సిబ్బంది చెబుతున్నారు. గతంలో పలువురు యువకులు నీటిలో ఈత కొడుతూ, ఫొటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, సెల్ఫీలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో యువత జలాశయం నీటిలో దూకుతూ, లోతైన ప్రదేశాల్లో ఈత కొడుతూ వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్‌గా మారింది. అనుకోని ఘటన జరిగితే ప్రాణాలనే ప్రమాదమని గుర్తించాలని స్థానికులు, అధికారులు సూచిస్తున్నారు. అధికారుల ఏర్పాట్లు.. పర్యాటకుల భద్రత కోసం సాగర్ తీరం వెంట అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దయ్యాలగండి వద్ద గల పుష్కర ఘాట్ వద్దకు వెళ్లకుండా రోడ్డు వెంట లోతైన ట్రంచ్ కొట్టారు. కొన్ని చోట్ల పోలీసులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆ సూచనలను పట్టించుకోవడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
గుండాల: వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుండాల మండలం అంబాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రగూడేనికి చెందిన చిర్ర బాలరాజు(55) హైదరాబాద్‌లోని నేరేడ్మెట్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే మృతిచెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాలరాజు తన అత్తగారి ఊరైన ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో మైసమ్మ పండుగకు హాజరయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి మోత్కూరులో దిగాడు. అక్కడి నుంచి పారుపల్లి గ్రామంలోని తన అత్తగారి వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడెం, గుండాల మండలం అంబాల గ్రామ శివారులోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వాగులో జారిపడి కొట్టుకుపోయాడు. మంగళవారం అంబాల గ్రామ శివారులో బిక్కేరు వాగు ఒడ్డున బాలరాజు మృతదేహాన్ని స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తేజమ్‌రెడ్డి తెలిపారు. కుక్కల దాడిలో ఇద్దరికి గాయాలునాగారం: కుక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మంగళవారం జరిగింది. ఫణిగిరి గ్రామానికి చెందిన షేక్ షఫీ స్థానిక మేరీ మదర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అటెండర్‌గా, తుంగతుర్తికి చెందిన జటంగి సతీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం షఫీ పాఠశాల వెనుక గదిలోకి వెళ్లగా.. అక్కడ కుక్కలు ఉండడంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో కుక్కలు అతడిపై దాడి చేశాయి. అతడు కేకలు వేయగా సమీపంలో ఉన్న ఉపాధ్యాయుడు సతీష్ వచ్చి షఫీని విడిపించే ప్రయత్నం చేయగా.. అతడిపై కూడా కుక్కలు దాడి చేసి ఛాతి భాగంలో గాయపరిచాయి. -
మేకలు అపహరిస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: రాత్రి వేళ కార్లలో మేకలు అపహరిస్తున్న 16 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి శాలిగౌరారం సమీపంలోని బైరవోని బండ ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా కారులో వచ్చిన వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో అనుముల మండలం అలీనగర్‌కు చెందిన సంపంగి వెంకటేష్, సంపంగి శారద, మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్‌కుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగా వారిపై గతంలో మేకలు చోరీ చేసిన కేసు ఉన్నట్లు తేలింది. పట్టుబడిన నలుగురిని విచారించి.. వారితో పాటు మేకలు చోరీ చేస్తున్న మర్రిగూడ మండలం శివన్నగూడేనికి చెందిన వరికుప్పల రవి, రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన గండికోట శివకుమార్, ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం ఎస్సీ కాలనీకి చెందిన అమ్ములూరి విజయ్, హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన లింగాల అశోక్, ఉండం కళ్యాణి, భువనగిరి హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన వల్లెపు ప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దాయిపల్లికి చెందిన మద్యాల సహదేవ్, సూర్యాపేట జిల్లా మోతెకు చెందిన కోడిసె వంశీకృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్‌కుమార్, మట్టి సురేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరంతా కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడి కార్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళ మేకలను కార్లలో వేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. వీరు నల్లగొండ జిల్లాలో 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌ర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకలు అపహరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దొంగలించిన మేకలను సంతలలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఎస్పీ వివరించారు. వారి నుంచి రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలోని కోటేష్, కనుకుల బేబీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆద్వర్యంలో నిందితులను పట్టుకున్న నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్‌రెడ్డి, ఎం. నాగభూషణ్, కె. కొండల్‌రెడ్డి, శాలిగౌరారం ఎస్ఐ, నార్కట్‌పల్లి సీఐ, పోలీస్ సిబ్బంది, సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి రివార్డు ప్రకటించారు. రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాం
నల్లగొండ టూటౌన్: ఎన్సీసీ శిక్షణ తరగతుల్లో క్రమశిక్షణ, దేశభక్తి సమ్మిళితమైన ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తామని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడేట్ల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీలో ప్రవేశానికి 60 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వారిలో ఎత్తు, బరువు, ఆరోగ్యం, రాత పరీక్షల ఆధారంగా ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థులకు ఎన్సీసీ ద్వారా నేషనల్ డిపెన్స్ అకాడమీ, అగ్నివీర్ లాంటి పథకాల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఇన్చార్జి డాక్టర్ మశ్చేందర్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్.సుధారాణి, కొమ్ము మల్లయ్య, చంద్రవీర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణచివ్వెంల(సూర్యాపేట): కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీకాంత్‌పై కొందరు దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
మట్టపల్లిలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, రుత్విగ్వరణం , పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కాగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, కంబాల మురళినాయుడు పాల్గొన్నారు. -
పవిత్ర మేడమ్ స్ఫూర్తితో..
బోధన తీరుతో స్ఫూర్తి పొందా.. సూర్యాపేటలోని ఎంఎస్ఆర్ బీఈడీ కళాశాలలో చదువుతున్నప్పుడు పవిత్ర మేడమ్ ప్రైవేట్ లెక్చరర్‌గా మాకు పాఠాలు బోధించేది. ఆమె బోధనా తీరు, ప్రేరణతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ఉద్యోగం టీచర్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం చండూరు మండలం దానుపాముల జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – రాసమళ్ల సికిందర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, దానుపాముల, చండూరు పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. మారం పవిత్ర స్ఫూర్తితో ఆమె చదువు చెప్పిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆమె కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. తమలోని భయాలను తొలగించించేందుకు కృషిచేసేదని, చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు వారిలోని ఇతర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేదని విద్యార్థులు చెబుతున్నారు.స్కాలర్షిప్కు ఎంపికయ్యా.. నేను గరిడేపల్లి మండలం గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదువుతున్నాను. పవిత్ర టీచర్ ఇచ్చిన శిక్షణతోనే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రతి సంవత్సరం అకౌంట్లో రూ.12వేలు జమవుతున్నాయి. విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ ఎంతగానో దోహదపడుతుంది. – ఎ. వైష్ణవి, 10వ తరగతి, గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ టీచర్లు, లెక్చరర్లుగా పలువురి ఎంపిక జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లలో పాల్గొని సత్తాచాటుతున్న విద్యార్థులుసంతోషంగా ఉంది ఆంధ్ర, తెలంగాణ అగస్త్య జిజ్ఞాస పోటీల్లో మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో పాటు రూ.1500 ప్రైజ్‌మనీ పొందాను. జీవశాస్త్ర టీచర్ పవిత్ర మేడమ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. – ఎం. మేఘన 10వ తరగతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ ప్రాక్టికల్ విధానంలో బోధన చూసి.. మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ఎస్లో ఉన్నప్పుడు పవిత్ర టీచర్ ప్రాక్టికల్ విధానంలో సైన్స్ బోధించడం చూసి.. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కులీ కుతుబ్‌షా పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. విద్యార్థులతో ఎలా ఉండాలనే విషయాన్ని పవిత్ర టీచర్ నుంచే నేర్చుకున్నాను. – ప్రవీణ్‌కుమార్, పాలిటెక్నికల్ లెక్చరర్జిల్లాస్థాయిలో గుర్తింపు లభించింది పవిత్ర గైడెన్స్‌లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో వీడర్ అండ్ సీడర్ ప్రాజెక్టు ప్రదర్శించడంతో జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. – బి. శ్రీశాంత్, 10వ తరగతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా సైన్స్ ఫెయిర్‌లో అవార్డు దక్కింది నేను తయారు చేసిన క్రాప్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆన్సీజనల్ రెయిన్స్ ప్రాజెక్టుకు జిల్లా సైన్స్‌ఫెయిర్‌లో అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. – శ్వేత 10వ తరగతి, పెన్‌పహాడ్ జెడ్పీహెచ్ఎస్ -
కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలి
కోదాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పకొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు కోరారు. మంగళవారం కోదాడలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్కోడ్లను తీసుకొచ్చిందని, వీటి వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, రాధాకృష్ణ, శ్రీలం శ్రీను, చెరుకు ఏకలక్ష్మి, సోమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు -
నేషనల్ బెస్ట్.. పవిత్ర టీచర్
పెన్‌పహాడ్ (సూర్యాపేట): జీవ శాస్త్రంలో ఆమె బోధన వినూత్నంగా ఉంటుంది. ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థుల కళ్లకు కట్టినట్టుగా వివరిస్తారు. వారితో ప్రయోగాలు చేయిస్తారు. ఇందుకోసం సాంకేతికతను విని యోగిస్తారు. విద్యార్థులు తాను చెప్పే విషయంలో లీనమయ్యేలా చేస్తారు. సూర్యా పేట జిల్లా పెన్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర అనుసరిస్తున్న బోధన పద్ధతులు, విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరు ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చాయి. జాతీయ స్థాయిలో ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం మారం పవిత్రను ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఈ అవార్డు కోసం ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి మారం పవిత్రను ఈ అవార్డు వరించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెపె్టంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు స్వీకరిస్తారు. మారం పవిత్రకు జాతీయ ఉపాధ్యాయ అవార్డు–2025 లభించడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికొలస్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది దరఖాస్తురాష్ట్ర వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యా యులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర జ్యూరీ కమిటీ 15 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఢిల్లీ స్థాయిలో పలు అంశాలపై ఇంటర్వ్యూ చేసిన తర్వాత.. అందులో టాప్ ఆరుగురిని నలుగురు సభ్యులతో కూడిన నేషనల్ జ్యూరీ ఆగస్టు 13న ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. అనంతరం ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 10 నిమిషాల చొప్పున సమయం ఇచ్చి వారు చేసిన ప్రయోగాల ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు. ఆ టాప్ 6 ఉపాధ్యాయుల్లో ఒకరిని (మారం పవిత్ర) అవార్డుకు ఎంపిక చేశారు. భర్త ప్రోత్సాహంతో.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మారం పవిత్ర పదో తరగతి వరకు వేములపల్లి, తడకమళ్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. ఇంటర్, డిగ్రీ మిర్యాలగూడలోని ప్రైవేట్ కళాశాలలో చదివారు. కాగా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన టీచర్ నాతాల మన్మథరెడ్డితో ఆమెకు వివాహమైంది. భర్త ప్రోత్సాహంతో బీఈడీ, డీఈడీ పూర్తి చేసి 2008 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. 2009లో మొదటగా ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం యూపీఎస్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయురా లిగా విధులు చేపట్టారు. 2012 నుంచి 2015 వరకు గోరెంట్ల జెడ్పీహెచ్‌లో, ఆ తర్వాత గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో ప్రస్తు తం పెన్‌పహాడ్‌లో పనిచేస్తున్నారు.విద్యార్థులను సైంటిస్టుల్ని చేయడమే లక్ష్యం –మారం పవిత్రనా ఉద్యోగ జీవితంలో కనీసం ఒకరిద్దరు విద్యార్థులనైనా శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. విద్యార్థులు సిద్ధాంతపరంగా నేర్చుకున్న విషయాలు ప్రయోగపూర్వకంగా నిర్ధారణ చేసుకునే అవకాశం, పరిస్థితులను ఉపాధ్యాయులు కలి్పంచాలి. సైన్స్ అభ్యసనంలో ప్రయోగాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే విద్యార్థులకు నేర్చుకోవడం సులువు అవుతుంది.ఎన్నో వినూత్న బోధనలు.. జాతీయ స్థాయిలో సీఐఈటీ, ఎన్‌ఐసీఆర్‌టీ యూట్యూబ్ చానల్ ద్వారా 2020–21లో ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఐసీటీ టూల్స్‌పై పవిత్ర అవగాహన తరగతులు అందించారు. 2019లో విద్యా విధానంపై జాతీయ స్థాయి సెమినార్లో ‘సైన్స్ టీచింగ్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్’అనే అంశంపై ప్రసంగించారు. 2017 నుంచి ఇప్పటివరకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎస్ఐఈటీ) ద్వారా జీవశాస్త్రంలో 14 డిజిటల్ పాఠాలను బోధించారు. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో 6, 7 తరగతులు, సామాన్య శాస్త్రం 8, 9, 10 తరగతుల జీవశాస్త్రం పాఠ్యపుస్తకాలలో ఉన్న క్యూ ఆర్ కోడ్లలో కంటెంట్ తయారీకి ఎస్సీఈఆర్టీ దీక్ష ఆధ్వర్యంలో 60 వీడియోలు, 16 క్వశ్చన్ సెట్లను తయారు చేశారు. వాటిని ఎస్సీఆర్టీ క్యూ ఆర్ కోడ్‌లో పబ్లిష్ చేశారు. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు వర్క్షీట్ల తయారీ, పదోతరగతి విద్యార్థులకు పరీక్షలపై ఒత్తిడి తగ్గించడానికి ఎస్సీఈఆర్టీ రూపొందించిన జీవశాస్త్ర అభ్యసన దీపికల్లో పాల్గొన్నారు. జీవశాస్త్ర శిక్షణ, అభ్యసనఫలితాలకు సంబంధించి 2016–19, 2020–21 సంవత్సరాల్లో రాష్ట్రస్థాయి సెమినార్లలో పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో యూట్యూబ్ చానల్ ద్వారా 50 వీడియోలు రూపొందించి వాట్సాప్ ద్వారా విద్యార్థులకు అందించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ యూట్యూబ్ చానల్ ద్వారా పదో తరగతి విద్యార్థుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ, హోమ్‌సైన్స్ పాఠాలు బోధించారు. అందుకున్న అవార్డులు ఇవే... 2019లో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు. ఠి 2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు. ఠి టెక్ మహీంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయ పోటీల్లో ట్రాన్స్‌ఫారి్మంగ్ అవార్డు. ఠి 2023లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా సారాబాయి టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డును జమ్మూకాశీ్మర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రవిశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఠి 2023–24లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ఠి ప్రస్తుతం (2025) జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. -
ఇన్‌సై్పర్ మనక్‌పై అనాసక్తి!
తిరుమలగిరి( తుంగతుర్తి ): విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాల వైపు మళ్లించి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని శాస్త్ర, సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతియేటా ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తోంది. దీనికి జిల్లాలో ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. గతనెల 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతేడాది 676 దరఖాస్తులొస్తే ఈసారి ఇప్పటి వరకు 126 మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సెప్టెంబరు 15వ తేదీ లోగా ప్రాజెక్టులను ఆన్లైన్లో నామినేట్ చేయడానికి అవకాశముంది. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు ఇన్స్పైర్ మనక్‌కు సంబంధించి గత నెలలో అప్లోడ్ ఎలా చేయాలో సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. దరఖాస్తు చేయించేందుకు మండల స్థాయిలో సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. దరఖాస్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేసినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఆన్లైన్లో నమోదు ఇలా.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించేందుకు గడువు ఉంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ఉన్నత పాఠశాల నుంచి ఐదు, యూపీఎస్ నుంచి మూడు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో భాగంగా విద్యాలయాల వివరాలు పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి వాటికి ఆమోదం లభించిన తర్వాత ఈమెయిల్ ఐడీ, లింకు లభిస్తాయి. వాటి సాయంతో పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. అనంతరం ప్రాజెక్టు నమూనాకు సంబంధించి పూర్తి వివరాలు అప్ లోడ్ చేయాలి. ఫ ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించింది 126 మంది మాత్రమే ఫ గతనెల 1న ప్రక్రియ ప్రారంభం కాగా.. వచ్చేనెల 15న ముగియనున్న గడువు ఫ ఇప్పటికే మండల స్థాయిలో సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు ఫ దరఖాస్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేసినా కనిపించని ఫలితం ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భావిశాస్త్రవేత్తలు ఎదగడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – దేవరాజ్, జిల్లా సైన్స్ అధికారి ఉన్నత పాఠశాలలు: 184 ప్రాథమికోన్నత పాఠశాలలు : 84జూనియర్ కళాశాలలు : 08 డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, సమా జాభివృద్ధి– క్లీన్ ఇండియా తదితర అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాలి. జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికై న నమూనాను ప్రదర్శించడానికి రూ.10 వేలను ప్రోత్సాహకంగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపికై తే వాటిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడి నుంచి జాతీయస్థాయికి ఎంపికై న నమూనాల రూపకర్తలకు ప్రభుత్వం పేటెంట్ హక్కు కల్పిస్తుంది. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులను మరింత మెరుగైన విధంగా తయారు చేయడానికి కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మరో రూ.25 వేలు ఇస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్లో అభినందనలు, అతిథ్యంతోపాటు పేరొందిన శాస్త్రవేత్తలతో కలిసి పాల్గొనే అవకాశం కల్పిస్తారు. జపాన్ వరకు వెళ్లి నోబెల్ శాస్త్రవేత్తలను కలుసుకునే సువర్ణావకాశం లభిస్తుంది. -
పట్టణాల్లో దోమల మోత
సూర్యాపేట అర్బన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నిర్వహించిన వందరోజుల ప్రణాళిక తర్వాత కూడా పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీరు నిలువ ఉండడంతో దోమల బెడదతో స్థానికులు నరకయాతన పడుతున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహించాలని ఆదేశాలున్నా పట్టణాల్లో పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దోమలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ● సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో 1,53000 జనాభా ఉంది. అంతర్గత రహదారుల్లో ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు బురద పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమల బెడద ఎక్కువైంది. ఖాసీంపేట, దురాజ్‌పల్లి, పిల్లలమర్రి, ఇందిరమ్మ కాలనీ, అంజరాపురి కాలనీల్లోని ఖాళీ ప్లాట్లలో నీరు నిలవడంతో దోమలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 15 రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం మూడు యంత్రాలు 48 వార్డుల్లో ఫాగింగ్ చేయడానికి సరిపోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ● కోదాడ మున్సిపాలిటీలోని నయా నగర్, అనంతగిరి రోడ్డు, భవాని నగర్, షిరిడీ సాయి కాలనీ, శ్రీమన్నారాయణ కాలనీ, 41వ వార్డులోని ఖాళీ స్థలాల్లో వర్షం నీరు నిల్వ ఉండి దోమల వృద్ధి చెంది స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మున్సిపాలిటీలో నాలుగు ఫాగింగ్ మిషన్లు ఉన్నా ఒకటే పని చేస్తోంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఒక్కసారి కూడా ఫాగింగ్ చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ● తిరుమలగిరి మున్సిపాలిటీలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. నాలుగు ఫాగింగ్ యంత్రాలు పనిచేస్తున్నా అధికారులు పట్టణంలో ఫాగింగ్ చేయడంలో ఆలస్యం వహిస్తున్నారని పేర్కొంటున్నారు. ● హుజూర్నగర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ కాలనీ, గోవిందాపురం, మట్టపల్లి బైపాస్ రోడ్డు, చెరువు కాలనీలో పలు చోట్ల ఖాళీ ప్లాట్లలో మురుగు నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో రెండు ఫాగింగ్ మిషన్లు ఉన్నా సమయానికి ఫాగింగ్ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ● వర్షం వచ్చినప్పుడు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ని ఎన్టీఆర్ నగర్, నర్సయ్య గూడెంలో వరద నీరు నిలిచి ఆయా ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెంది స్థానికుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేరేడుచర్ల మున్సిపాలిటీలో రెండు ఫాగింగ్ యంత్రాలు ఉన్నా.. సరైన సమయంలో ఫాగింగ్ చేయడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఫ ఐదు మున్సిపాలిటీల్లో వందరోజుల ప్రణాళిక తర్వాత కూడా పారిశుద్ధ్య నిర్వహణ అంతంతే ఫ ఫాగింగ్ను విస్మరించిన అధికారులు ఫ ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహించాలని ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు సూర్యాపేట పట్టణంలో మురుగు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. మురుగునీరు నిలిచే ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమల లార్వా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. – హనుమంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట -
అనుమతులు రద్దు చేయడం అప్రజాస్వామికం
సూర్యాపేట అర్బన్ : వరంగల్‌లో ఆదివాసీల హక్కుల వేదిక, ప్రజా సంఘాల వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు రద్దు చేయడం అప్రజా స్వామికమని ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ భద్రయ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగే సభకు అనుమతులు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో వెంకటయాదవ్, మాధవరెడ్డి, లింగయ్య, సత్యనారాయణ, నరసయ్య, నాగయ్య, పిడమర్తి భరత్, దేశోజు మధు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదు అపహరణ కోదాడరూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీ ఎల్ఐసీ ఆఫీస్ వీధిలో నివాసముంటున్న చిన్నపిల్లల వైద్యుడు చింతలపాటి శ్రావణ్‌కుమార్ కోదాడ పట్టణంలో ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. శనివారం హాస్పిటల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో రాత్రి శ్రావణ్‌కుమార్ అక్కడే ఉండిపోగా.. అతడి భార్య పిల్లలను తీసుకుని సూర్యాపేటలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వారి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 12 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.2లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రావణ్‌కుమార్ తాళం పగులగొట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ శివశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంనల్లగొండ: నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో మార్బుల్ షాపు వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 60 ఏళ్లు) మృతదేహం లభ్యమైనట్లు నల్లగొండ వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుడు నలుపు రంగు చొక్కా, గళ్ల లుంగీ ధరించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70141 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చేస్తే చర్యలు
సూర్యాపేటటౌన్ : విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చేసే విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి బహిష్కరణకు గురవుతారని పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు నమోదై వారి విద్య, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రతి ఉన్నత విద్యాసంస్థలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వార్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిరంతరంగా నిర్వహించాలని తెలిపారు. ర్యాగింగ్ ఘటనలు ఎదురైతే బాధితులు తక్షణమే ప్రిన్సిపాల్, కళాశాల యాజమాన్యం లేదా పోలీసులను సంప్రదించాలని కోరారు. ర్యాగింగ్ సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ర్యాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించడానికి విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని కోరారు. సూర్యక్షేత్రంలో పూజలు అర్వపల్లి : తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో కాకులారపు రజిత, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్రావు, బాలమురళీకృష్ణ, బీరవోలు ఇంద్రారెడ్డి, రత్నం లక్ష్మాజి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సుల వేళల్లో మార్పు అర్వపల్లి : సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై నడుస్తున్న ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సుల వేళల్లో ఆర్టీసీ అధికారులు మార్పులు చేశారు. ఉదయం 5గంటలకు సూర్యాపేట డిపో నుంచి మొదటి ఎలక్ట్రికల్ బస్సు మొదలవుతుంది. ఆతర్వాత ఉదయం 6.30, 7.30, 10.50, 11.50, మధ్యాహ్నం 12.50 గంటలకు బస్సులు బయలుదేరి అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కూర్, భువనగిరి, ఉప్పల్ల మీదుగా హైదరాబాద్‌కు వెళ్తాయని ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ సైదులు తెలిపారు. ఇవే బస్సులు ప్రతి రోజు హైదరాబాద్‌లోని జేబీఎస్ నుంచి ఉదయం 5గంటలకు, 6.00, 7.00 గంటలకు, సాయంత్రం 3.15 గంటలకు, 4.30, 5.30 గంటలకు బయలుదేరి ఇదే రూట్లో తిరిగి సూర్యాపేట డిపోకు చేరుతాయని చెప్పారు. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. -
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు
నకిరేకల్: గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న ఆరుగురిని నకిరేకల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నకిరేకల్ సీఐ వెంకటేష్ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణ శివారులోని తాటికల్ రోడ్డులో కుమ్మరిబావి దగ్గరలోని చెట్ల పొదల్లో శనివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలు చేసి సేవిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ గంజాయి దందాలో మొత్తం ఎనిమిది ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి రూ.32,500 విలువ చేసే 1.290 కిలోల గంజాయి, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురిలో నకిరేకల్‌లోని తాటికల్ రోడ్డు వాసి యన్నమల్ల సాయిరాం, నల్లగొండలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన బోరిగం సంపత్‌కుమార్, నకిరేకల్‌లోని ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన ముక్కాముల అఖిల్, నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన పల్లెబోయిన శివ, శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన బండారి వినయ్, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంటకు చెందిన కుంచం నవీన్‌తో పాటు ఓ బాల నేరస్తుడు ఉన్నారు. నల్లగొండకు చెందిన సమీర్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. వీరాంతా కలిసి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో ఈ కేసు విచారణ చేస్తున్నామని సీఐ వెల్లడించారు. స్థానిక ఎస్ఐలు లచ్చిరెడ్డి, క్రిష్ణాచారి, పోలీస్ సిబ్బంది వై. వెంకటేశ్వర్లు, కె. జనార్దన్, బి. మధుకర్, వి. సురేష్, డి. శ్రీకాంత్, ఎం. నాగర్జున్‌ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించినట్లు తెలిపారు. 1.290 కిలో గంజాయి, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం -
అసలేం జరిగింది..!
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామ పరిధిలోని ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే కారణమని చెప్పిన అధికారులు.. ఆదివారం మాత్రం రియాక్టర్ లీకై మంటలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలోని ద్వారకామయి ప్రొడక్షన్ బ్లాక్‌లో వారం రోజుల క్రితం పాత రియాక్టర్‌ను తీసి దాని స్థానంలో కొత్తది బిగించినట్లు కార్మికులు చెబుతున్నారు. దీనితో పాటు మరో రియాక్టర్ మార్చాల్సి ఉండగా.. దానిని మార్చలేదు. మార్చని రియాక్టర్ నుంచే రసాయనాలు లీక్ కావడంతో మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. మంటలు వచ్చిన సమయంలో ప్రొడక్షన్ ఇన్చార్జిగా ఉన్న మధుసూదన్‌చారి అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను అప్రమత్తం చేయగా.. వారు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల దాటికి రియాక్టర్లకు ఉన్న దూది కోటింగ్ కాలిపోయింది. ఓ రియాక్టర్ కిందపడిపోయింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో రియాక్టర్లు పేలలేదు. లేదంటే ప్రమాదం తీవ్రత భారీగా ఉండేది. ఆదివారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రొడక్షన్ బ్లాక్‌ను ఉమ్మడి జిల్లా పరిశ్రమల ఇన్స్పెక్టర్ ఎస్. జంగయ్య సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ప్రొడక్షన్ ఇన్చార్జిగా ఉన్న మధుసూదన్చారిని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ లేదు.. శనివారం రాత్రి ఎస్ఆర్ ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్‌లోని రసాయనాలు లీకై చిన్నగా మంటలు వస్తున్నాయని సమాచారం రావడంతో చౌటుప్పల్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేసినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్‌రావు తెలిపారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ పూర్తిస్ధాయిలో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని గతంలోనే యాజమాన్యాలకు సూచించామని, కానీ ఎస్ఆర్ ల్యాబొరేటరీస్‌లో ఇంతవరకు పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. సరైన ఫైర్ సేఫ్టీ లేక ఫైరింజన్‌తో పాటు దివీస్ పరిశ్రమ నుంచి మంటలను అదుపుచేసే రసాయనాలను తీసుకొచ్చి త్వరగా మంటలను అదుపు చేయగల్గినట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి కారణాన్ని అంచనా వేయలేకపోతున్నాం.. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇప్పటికిప్పుడే అంచనా వేయలేకపోతున్నామని పరిశ్రమల ఇన్స్పెక్టర్ ఎస్. జంగయ్య తెలిపారు. పరిశ్రమ అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నా.. అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నుంచి నివేదిక వచ్చిన తర్వాత నిర్ధారణకు వస్తామని పేర్కొన్నారు. ఎస్ఆర్ ల్యాబొరేటరీస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు రియాక్టర్ లీకై ప్రమాదం జరిగిందని సమాచారం అందిందంటున్న అగ్నిమాపక అధికారులు షార్ట్ సర్క్యూటే కారణమంటున్న కంపెనీ సిబ్బంది మంటల వల్ల వెలువడిన రసాయనాలతో వాడిపోయిన పంట పొలాలు ఎస్ఆర్ ల్యాబొరేటరీస్‌ను సందర్శించిన ఉమ్మడి జిల్లా పరిశ్రమల ఇన్స్పెక్టర్ పరిశ్రమలో పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ లేదంటున్న జిల్లా అగ్నిమాపక అధికారివాడిపోయిన పంట పొలాలు.. మంటల ధాటికి రియాక్టర్లలోని రసాయనాలు ఎగిసిపడడంతో పరిశ్రమ చుట్టుపక్కల గల జైకేసారం గ్రామానికి చెందిన పలువురు రైతులు వరి, జొన్న పంటలు వాడిపోయాయి. దీంతో పాటు రామన్నపేట వెళ్లే రోడ్డుపై కెమికల్ పడి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని పంట నష్టపోయిన రైతులు పరిశ్రమ యాజమాన్యాన్ని కోరినట్లు సమాచారం. -
కనువిందు చేస్తున్న రాచకొండ వాటర్ ఫాల్స్
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయపురం మండల పరిధిలోని రాచకొండ అటవీ ప్రాంతంలో పల్లగట్టుతండా, గంగమూలతండా పరిధిలో వాటర్ ఫాల్స్ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలకు రాచకొండ గుట్టల్లో నుంచి జాలువారుతున్న నీరు మల్కాచెర్వు, గంగకుంటలోకి వస్తున్నాయి. గుట్టలు, చెట్ల మధ్యలో నుంచి జాలువారే నీటిని చూసేందుకు ఆదివారం పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. యువకులు నీటిలో ఈత కొడుతూ ఆనందంగా గడిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు పర్యాటకులను హెచ్చరిస్తూ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
‘నవోదయ’ పనులు త్వరగా పూర్తిచేయాలి
సూర్యాపేట, కోదాడ : కోదాడలో ఏర్పాటు చేయనున్న జవహర్ నవోదయ విద్యాలయం భవన నిర్మాణ పనులు సంవత్సరంలోపే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. భవన నిర్మాణం, పురోగతిపై ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికే టెండర్లు ఖరారైనట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానుండగా పనులు సంవత్సరం లోపు పూర్తి చేసేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. క్యాంపస్ వాతావరణం ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు కోసం కేటాయించిన 19 ఎకరాల స్థలాన్ని విద్యా భవనాలు, హాస్టళ్లు, సిబ్బంది క్వార్టర్ల కోసం సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. ప్రతి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, ఎన్వీఎస్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరా, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎన్బీసీసీ హైదరాబాద్ డీజీఎం అబ్దుల్ రహీం పాల్గొన్నారు. ఫ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
కాటేపల్లిలో టైర్ల కంపెనీ తొలగించే వరకు పోరాటం
పంజగుట్ట: ప్రపంచంలో అత్యంత వేగంగా కాలుష్యం పెరుగుతున్న దేశం భారతదేశమని, ఇప్పటికే ఢిల్లీ నాశనమైందని, కాలుష్యం వచ్చే పరిశ్రమలకు పాలకులు అనుమతులు ఇస్తూ హైదరాబాద్‌ను ఏం చేద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాటేపల్లిలోని టైర్ల కంపెనీల కాలుష్యంపై అఖిలపక్ష సమావేశం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించారు. తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు డాక్టర్ పృథ్విరాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సమాజం కోసం దేశంకోసం పాటుపడేవారు, త్యాగాలు చేసే వారు నాయకులుగా ఉండేవారని, కానీ ఇప్పుడు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తూ, రాజకీయాన్ని వ్యాపారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులకు ఏదైనా తెలియనప్పుడు సమాజంలో నిస్వార్థంగా ఆలోచించే మేధావులు ఎంతో మంది ఉన్నారని, వారి సలహాల ప్రకారం చేయాలి కానీ వారి సలహాలు తీసుకోవడం ఇష్టం ఉండదన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు కాలుష్యం వచ్చే పరిశ్రమలు మాకు వద్దు అంటుంటే ఆ సంస్థలను భారత్‌కు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటేపల్లి గ్రామం మొత్తం ఐక్యం కావాలని, వారికి తాము అండగా ఉంటామని ప్రజా ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ప్రొఫెసర్ బాబూరావు మాట్లాడుతూ.. కాటేపల్లి పారిశ్రామిక ప్రాంతం కాదని, కానీ అక్కడ టైర్ల కంపెనీకి అనుమతులు ఇచ్చారంటేనే మన కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో అర్థం అవుతుందన్నారు. సదరు కంపెనీ ముందు బోర్డు కూడా లేదని, ఇటీవల సియాచీన్ కంపెనీలో 50 మంది చనిపోయారని, ఏదైనా ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ మాట్లాడుతూ.. కాటేపల్లి గ్రామంలో వ్యవసాయ భూముల మధ్య ఊరికి దగ్గరగా రెండు టైర్ల రీసైక్లింగ్ కంపెనీలకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. దాని యజమాని మార్వాడీ, కానీ మన వారిని కొంతమందిని పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. సమావేశంలో విఠల్, రఘు, సుభాష్, జలంధర్, శ్రీనివాస్, వెంకట్, అరుణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ -
అట్టపెట్టెల మాటున మూగజీవాల రవాణా
చౌటుప్పల్ రూరల్: అట్టపెట్టెల మాటున మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంత నుంచి 12 ఆవు దూడలు, 21 ఎద్దు దూడలను కొనుగోలు చేసి గూడ్స్ వాహనంలో హైదరాబాద్‌లోని బహదూర్‌పురా కబేళాకు తరలిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ పెద్దపూడి అప్పలకుమారస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఐదు ఎద్దులు.. నాలుగు ఆవులుచౌటుప్పల్: కోదాడ సంతలో కొనుగోలు చేసిన ఐదు ఎద్దులు, నాలుగు ఆవులను గూడ్స్ ఆటోలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. కోదాడ ప్రాంతంలోని జగన్నాయక్ తండాకు చెందిన వాహనం డ్రైవర్ బానోతు సురేందర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు -
రాత్రి అయితే దోమలతో జాగారమే..
సూర్యాపేటలోని స్నేహనగర్ కాలనీలో ఖాళీ ప్లాట్లలో వర్షం నీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలు చుట్టుపక్కల ఇళ్లలోని వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు దోమలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే కాలనీలో పలువురు జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరారు. – కనకటి రవి, స్నేహనగర్ కాలనీవర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల బెడద అధికమైంది. ఇప్పటి వరకు కోదాడలో దోమల నివారణకు మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇళ్ల మధ్య మురుగునీరు నిలవడం ప్రధాన సమస్యగా ఉంది. ఫాగింగ్ చేసి దోమల బెడదను నివారించాలి. – ఈదుల కృష్ణయ్య, కోదాడ -
నేడు, రేపు ఎన్జీ కాలేజీలో జాతీయ సదస్సు
రామగిరి (నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ కాలేజీ)లో సోమవారం, మంగళవారం శ్రీసుస్థిర అభివృద్ధి లక్ష్యాలు జీవశాస్త్రాల పాత్రశ్రీ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు ఎం. అనిల్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆచార్యులు రామాచారి పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు సదస్సుకు హాజరుకావాలని కోరారు. కెనడాలో యాదగిరీశుడి కల్యాణం యాదగిరిగుట్ట: కెనడా దేశంలోని విండ్సర్ నగరంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానంతో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు విండ్సర్ నగరంలో సంప్రదాయ పద్ధతిలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ రిటైర్డ్ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ అధికారి గజవెల్లి రఘు ఆధ్వర్యంలో జరిపించారు. ఈ వేడుకకు విండ్సర్ నగరం ఎంపీ అండ్ర డోవి, ఎంపీపీ అర్బెగిల్తో పాటు స్థానిక ఎన్ఆర్ఐలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదగిరీశుడి సేవలో అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ జనరల్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ జనరల్ రఘునందన్, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈఓ వెంకట్రావ్‌లు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూలను, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ వెంకట్రావ్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఆత్మహత్య దేవరకొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనోవేదనకు గురై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో ఆదివారం జరిగింది. దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాటికోల్ గ్రామానికి చెందిన నాయిని భాస్కర్(55) గ్రామంలో ఫర్టిలైజర్, కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా భాస్కర్ నిర్వహిస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తెల్ల వారుజామున ఫర్టిలైజర్ దుకాణంలో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
డెంగీ పంజా..
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025పార్వతి తనయ.. ముస్తాబు చేస్తుంటిమయాసూర్యాపేటటౌన్ : డెంగీ పంజా విసురుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెలలోనే 15 డెంగీ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు కురిసి దోమలు వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరంతో ఆస్పత్రుల బాట జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. అపరిశుభ్ర పరిసరాలతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో విష జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓపీ(ఔట్పేషెంట్ల) సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో ఆగస్టు(ఈ నెల)లోనే 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇవి వైద్యాధికారులు గుర్తించినవి మాత్రమే. ఇంకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకునే వారిలో కేసులు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు హైదరాబాద్, ఖమ్మం లాంటి నగరాల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. కిట్లు అందుబాటులో ఉన్నా.. డెంగీని నిర్ధారించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిట్లు అందుబాటులో ఉన్నా పరీక్షలు మాత్రం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో అత్యధికంగా ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 50కి పైగా డెంగీ కేసులు ఫ ఈ నెలలోనే అత్యధికంగా 15 కేసులు ఫ డెంగీతో పాటు వైరల్ ఫీవర్ ఫ ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం ఫ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచననమోదైన డెంగీ కేసులు జనవరి నుంచి జూన్ వరకు 30 జూలై 05 ఆగస్టు 15 ఈ ఫొటోలో కన్పిస్తున్న విద్యార్థి పేరు ధరావత్ హర్ష. సొంతూరు చివ్వెంల మండలం మున్యానాయక్ తండా. ఇతడు ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. వారం రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులు చికిత్స చేయించారు. జ్వరం తగ్గిందనుకొని ఈనెల 21న స్కూల్‌కు వెళ్లాడు. మధ్యాహ్నానికి జ్వరం తీవ్రత పెరగడంతో మళ్లీ ఇంటికి వెళ్లిపోయాడు. హర్షను చివ్వెంల పీహెచ్సీలో శనివారం పరీక్షలు చేయించగా డెంగీ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రజలు ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆ పరిసరాల్లోని 50 ఇళ్ల కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తాం. చుట్టు పక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాం. గ్రామాల్లో ప్రతి శుక్రవారం ఆశా వర్కర్లు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన నిర్వహిస్తున్నారు. – డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ -
పరిష్కారం అరకొరే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో సమస్యలు అరకొరగానే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు.. పరిష్కారానికి పొంతన లేదు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థాయిలో పరిష్కారానికి అనుకూలంగా లేనివే అధికంగా ఉండటంతో వాటి పరిష్కారానికి తహసీల్దార్లు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అధిక దరఖాస్తులు పరిష్కరించిన జిల్లాల్లో నల్లగొండ ముందు స్థానంలో ఉండటం గమనార్హం. పరిష్కారానికి సిద్ధంగా 8,384 దరఖాస్తులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల్లో పావలావంతు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,02,768 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 3,996 దరఖాస్తులను మాత్రమే ఇప్పటి వరకు అధికారులు పరిష్కరించగలిగారు. పరిష్కారానికి సిద్ధంగా మరో 8,384 దరఖాస్తులు ఉన్నాయి. వాటిని తహసీల్దార్లు వారి స్థాయిలో పరిశీలించి.. ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ లాగిన్లకు పంపించారు. వారి లాగిన్ నుంచి అప్లోడ్ చేస్తే ఆయా దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. సమస్యల పరిష్కారంలో ఎన్నో అడ్డంకులు భూ సమస్యలు పరిష్కరించే విషయంలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లకు తంటాలు తప్పడం లేదు. సాదాబైనామా విషయం కోర్టులో ఉండటంతో ఆ దరఖాస్తులను పక్కన పెట్టారు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (పీఓటీ) పరిధిలో ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన టీఎం 33 భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు. ఇందులో పౌతిల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా పరిష్కారం కానివి చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం తహిసీల్దార్లు నానా తంటాలు పడాల్సి వస్తోంది. కోర్టు కేసులు, ఇతర భూ సమస్యలకు సంబంధించి మొండి కేసులే అధికంగా ఉండటంతో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కొందరికి భూమి ఉండి కాగితాలు లేవు. అలాంటి వాటి విషయంలో పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూ భారతి దరఖాస్తులకు కలగని మోక్షం ఫ క్షేత్రస్థాయిలో కుస్తీలు పడుతున్న తహసీల్దార్లు ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 1,02,768 ఫ వాటిలో 3,996 అప్లికేషన్లకే మోక్షం ఫ అయినా పరిష్కారంలో నల్లగొండ జిల్లానే ముందంజ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. భూ భారతిలో వాటిని పరిష్కరించే క్రమంలో అధికంగా నల్లగొండ జిలాల్లోనే 2,633 దరఖాస్తులు పరిష్కరించారు. తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం దరఖాస్తులు 61,145 వచ్చాయి. వాటిల్లో పరిష్కారమైంది 99 మాత్రమే. నల్లగొండ జిల్లాలో 43,545 దరఖాస్తులు వస్తే అందులో 2,633 దరఖాస్తులు పరిష్కరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా దరఖాస్తులు పరిష్కరించినవి నల్లగొండ 43,545 2,633సూర్యాపేట 44,741 551యాదాద్రి 14,482 812 మొత్తం 1,02,768 3,996 -
చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల(సూర్యాపేట): విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం అని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గండూరి జానకమ్మ మెమోరియల్ (జీజేఎమ్) పాఠశాలలో విలేజ్ లీగల్ కేర్, సపోర్ట్ సెంటర్ (వీలేజ్ లీగల్ సర్వీస్ క్లినిక్)ను ప్రారంభించి మాట్లాడారు. దీని ద్వారా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని, తద్వారా వారు గ్రామాల్లోని వారి తల్లిదండ్రులకు చట్టాల గురించి తెలియజేస్తారన్నారు. సెంటర్ నిర్వహణకు న్యాయవాదితో పాటు, పారాలీగల్ వలీంటర్, నలుగురు విద్యార్థులతో టీమ్ ఏర్పాటు చేస్తామన్నారు. చట్టాలు అందరికీ చుట్టాలు అని, చుట్టాలు మనకు రక్షణతో పాటు, అధికారాన్ని ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, బార్ అసోసియేషన్ ఈసీ సభ్యులు పాల్గొన్నారు. 13న జాతీయ లోక్‌అదాలత్ వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్‌అదాలత్‌లో క్రిమినల్, సివిల్, మోటర్ వెహికల్, విద్యుత్, బ్యాంకు, గృహహింస, ఎకై ్సజ్ వంటి కేసులను పరిష్కరించుకోవచ్చున్నారు. దీని ద్వారా ఇరు పక్షాలవారు గెలుపొందిన వారవుతారన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
విజయానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముఖ్యం
సూర్యాపేటటౌన్ : జీవితంలో విజయం సాధించడానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముఖ్యమనికలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా చదువు, ఇతర అంశాలపై వారి అభిప్రాయాలు, తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని గమ్యం చేరేవరకు కష్టపడి చదువుకోవాలన్నారు. తరగతి గదుల్లో లైటింగ్స్, ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్, బాత్ రూమ్ లు వేరు వేరుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ నాయక్, ఆర్సీఓ స్వప్న, డీసీఓ స్వప్న, హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనపై ఆశావర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్య వివాహల నిర్మూలనకు ఏవిధంగా కృషి చేస్తున్నారని వారికి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూఓ రమణారావు, డీసీపీఓ రవికుమార్, ఆశావర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ‘అగ్రి’ కళాశాలకు భూములు ఇవ్వంహుజూర్నగర్ : వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు తాము సాగుచేసుకుంటున్న భూములు ఇవ్వబోమని పలువురు రైతులు స్పష్టం చేశారు. హుజూర్నగర్ పట్టణ శివారులోని మగ్దూం నగర్ వద్ద 1041 సర్వేనంబర్‌లో గల వ్యవసాయ భూమి వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సర్వే చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుమందుల డబ్బాలతో పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇన్చార్జి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మగ్దూం నగర్ వద్ద 1041 సర్వేనంబర్‌లో గల వ్యవసాయ భూమిలో అగ్రికల్చరల్ కాలేజీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం అని తెలిపారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో 1041 సర్వే నంబర్ భూమిని సాగుచేసుకుంటున్న రైతులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీప్ కౌసర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు గిరిజన హక్కులు– అమలుపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు, రాజ్యాంగం గిరిజనులకు కల్పిస్తున్న హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ప్రిన్సిపాల్ శ్రీవాణి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, న్యాయవాదులు తల్లమల్ల హస్సేన్, ఎడిండ్ల అశోక్, దావుల వీర ప్రసాద్, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలిభానుపురి (సూర్యాపేట) : 2025 – 26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ చాంబర్లో ఐకేపీ, సహకార, మార్కెటింగ్ మెప్మా శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ శాఖల పరిధిలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎస్ఓ మోహన్‌బాబు, డీసీఓ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పులిచింతలకు 3,70,063 క్యూసెక్కుల ఇన్ఫ్లోమేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. ప్రాజెక్టుకు 3,70,063 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. 11గేట్లను నాలుగున్నర మీటర్ల మేర ఎత్తి 3,58,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయంనాగారం : ఉద్యాన పంటలను సాగుచేసి రైతులు అధిక ఆదాయం పొందాలని తుంగతుర్తి డివిజన్ ప్రాంతీయ ఉద్యాన శాఖ అధికారిణి ప్రమిత అన్నారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలో ఉద్యాన పంటలను ఆమె సందర్శించి మాట్లాడారు. అధిక ఆదాయాన్ని ఇచ్చే పండ్లు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన శాఖలో వివిధ పథకాలకు సంబంధించి 2025–26 వార్షిక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. ఆయిల్ పామ్ విస్తరణ, సమగ్ర ఉద్యాన అభివృద్ధి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మ నీటి పారుదల పథకం, వెదురు మిషన్ వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునే రైతులు ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ ఏరియా మేనేజర్ శశికుమార్, ఉద్యాన విస్తరణ అధికారి ముత్యంరాజు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలు మురిసేలా..
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పనుల జాతర – 2025 కార్యక్రమం ప్రారంభమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కూలీల జీవనోపాధి మెరుగుపరచడానికి, ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పించడానికి వివిధ రకాల పనులు చేపట్టారు. జిల్లాలో రెండో విడతగా ఈ పనులు ప్రారంభించడమే కాకుండా కొత్త పనులకు భూమి పూజ చేశారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. రూ.391 కోట్లు.. 356 పనులు పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రూ.391 కోట్లతో చేపట్టిన 356 పనులను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ పనులు ప్రారంభం కాగా చివ్వెంల మండలంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, మునగాల మండలంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, తుంగతుర్తి మండలంలో మందుల సామెల్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవే కాకుండా కొత్తగా రూ.1.54 కోట్లతో 187 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పనుల జాతరలో మరిన్ని పనులు చేపట్టి పూర్తి చేయాలన్న కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. పశువులు, గొర్ల షెడ్లు, కోళ్ల ఫామ్‌లు, కొత్తగా వ్యవసాయ బావుల నిర్మాణం, వన మహోత్సవం ద్వారా ఈత, తాటి, పండ్ల తోటల పెంపకం, నూతన అంగన్వాడీ, గ్రామపంచాయతీ, సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మెరుగవనున్న పాలన గ్రామపంచాయతీలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన అనంతరం పల్లె పాలన పడకేసింది. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నా.. అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం శుక్రవారం చేపట్టిన పనుల జాతరతో పల్లెల్లో నూతన పనులు ప్రారంభమై పాలన మెరుగుపడనుంది. ఓవైపు అభివృద్ధి పనులే కాకుండా వ్యక్తిగతంగా ఉపాధి హామీ కూలీలకు ఉపాధి దొరకనుంది. ఫ పనుల జాతర – 2025 రెండో విడత ప్రారంభం ఫ వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం ఫ ఆయా ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యేలు చివ్వెంల(సూర్యాపేట) : గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. చివ్వెంల మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామానికి చెందిన వడ్డెపల్లి రాములు నిర్మించుకున్న పశువుల పాకను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. పశువుల వివరాలు, పాడి ద్వారా వస్తున్న ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన యల్కపల్లి ప్రమీల నిర్మించుకుంటున్న పశువుల పాక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జెడ్పీహెచ్ఎస్లో వాన నీటి సంరక్షణ కట్టడం పనులు ప్రారంభించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వీవీ అప్పారావు, పంచాయతీ అధికారి నారాయణరెడ్డి, తహసీల్దార్ ప్రకాశ్‌రావు, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులున్నారు. -
నానో యూరియాతో ప్రయోజనాలు
ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సూర్యాపేట : నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో రైతు బీరెల్లి రామచంద్ర రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నానో యూరియా, నానో డీఏఓ మందును డ్రోన్ ద్వారా పిచికారీ చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, ఏఈఓ సుష్మా, డ్రోన్ ఆపరేటర్ మధుసూదన్, రైతులు పాల్గొన్నారు. నానో యూరియాపై అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి -
నేరాల కట్టడికి సాంకేతికతను వినియోగించాలి
సూర్యాపేటటౌన్ : నేరాలు కట్టడికి సాంకేతికతను వినియోగించాలని, ప్రజల భాగస్వామ్యంతో పటిష్టంగా పని చేయాలని ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమ రవాణా నిరోధంలో క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాలన్నారు. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని రికార్డ్స్‌లో నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో బాగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు. అదనపు ఎస్పీలు రవీందర్, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీధర్‌రెడ్డి, నరసింహచారి, మంజుభార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎస్పీ నరసింహ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో సామూహికంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహ చారి, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అస్తమించిన ఎర్ర సూరీడు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా సీపీఐ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సురవరం సుధాకర్‌రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సురవరం పుట్టిపెరిగింది నాగర్‌కర్నూల్ జిల్లా అయినా.. ఆయన ఉద్యమ ప్రస్తానం నల్లగొండ జిల్లాతో ముడిపడి ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో, పార్టీ విస్తరణకు ఆయన కృషిచేశారు. నల్లగొండ జిల్లా నుంచే రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. రైతు, కూలీల సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ, బానిసత్వం అంశాలపై సీపీఐ తరఫున ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు జరిగిన కార్యక్రమాల్లో ఆయన ముందున్నారు. ఆయన నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి 1998, 2004లో గెలుపొందారు. ఎంపీగా పనిచేసిన కాలంలో జిల్లా సమస్యలు, ముఖ్యంగా సాగునీటి సమస్యలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించారు. కాగా, సురవరం సుధాకర్‌రెడ్డి మృతికి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంతో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఫ అనారోగ్యంతో సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత ఫ రెండుసార్లు నల్లగొండ ఎంపీగా సేవలు ఫ కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి -
నానో ఎరువు.. దిగుబడి మెరుగు
రామగిరి(నల్లగొండ), త్రిపురారం : వ్యవసాయ రంగంలో నానో ఎరువు మెరుగైన ఫలితాలనిస్తూ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుంది. ఇది ద్రవరూపంలో ఉండే ఎరువు. మార్కెట్లో నానో యూరియా, డీఏపీ అందుబాటులోకి వచ్చాయి. ఇది సంప్రదాయ గుళికల యూరియాకు బదులుగా వాడే ద్రవరూప ఎరువు. మొక్కలకు నానో యూరియా అధిక నత్రజనిని అందిస్తుంది. నానో టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ఈ ఎరువు 20 నుంచి 50 మిల్లీ మైక్రాన్ల పరిమాణంలో నత్రజని కణాలు ఉంటాయి. దీన్ని మొక్కలు సులభంగా గ్రహిస్తాయి. ద్రవ రూపంలోని నానో యూరియా తక్కువ మోతాదులో వాడినా మొక్కలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది. నానో యూరియా లక్షణాలు ఇది నానో టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన యూరియా. దీనిలో నత్రజని కణాలు చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. సంప్రదాయంగా వాడే యూరియాతో పోల్చితే దీని ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉండి మొక్కలు నత్రజనిని త్వరగా గ్రహిస్తాయి. ఒక బస్తా యూరియాకు సమానమైన ఫలితాన్ని అర లీడర్ నానో యూరియా అందిస్తుంది. ద్రవ రూపంలో ఉండటం వల్ల మొక్కలకు ఎక్కువగా ప్రయోజనం కలిగిస్తుంది. సాధారణంగా వాడే యూరియా నేలలోకి వెళ్లడం వల్ల భూమికి కాలుష్యం కలుగుతుంది. ద్రవ రూపంలోఉంటే నానో యూరియా నేరుగా మొక్క ఉపరితలాన్ని చేరుతుంది తద్వారా భూగర్భజల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. సాంకేతిక వ్యవసాయానికి సూచిక.. నానో యూరియా పంటల దిగుబడితో పాటు రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది. నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే కాకుండా దీంతో రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. నానో యూరియాను సులభంగా నిల్వ, రవాణా చేయవచ్చు. ధరలు ఇలా.. నానో యూరియాను అన్ని రకాల పంటలకు వాడవచ్చు. నానో యూరియా ఒక్క బాటిల్ (500 మి.లీ.) వినియోగిస్తే 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.220, డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా, అర లీటర్ నానో డీఏపీ రూ.600కు లభిస్తుంది. నానో యూరియా వినియోగించే పద్ధతులు ఫ 500 ఎంఎల్ ద్రవరూప నానో యూరియాను ఎకరం పొలానికి వినియోగించుకోవచ్చు. ఫ 125 నుంచి 130 లీటర్ల నీటిలో 500 ఎంఎల్ నానో యూరియాను బాగా కలిపి పంటలకు పిచికారీ చేసుకోవాలి. ఫ ఇతర పురుగు మందుల కలిపి పిచికారీ చేసుకోవద్దు. అవసరమైతే వ్యవసాయ అధికారులు, శాస్త్రవ్తేతల సూచనలు పాటించాలి. ఫ గుళికల రూపంలో ఉండే యూరియాతో పోల్చుకుంటే నానో యూరియా ఉపయోగించడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫ సాధారణ యూరియతో పోల్చితే నానో యూరియా ప్రభావం మొక్కలపై ఎక్కువ రోజులు ఉంటుంది. ఫ పంటలపై 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు నానో యూరియాను పిచికారీ చేయడంతో దిగుబడులు పెరుగుతాయి. ఫ యూరియా వేసే ప్రతి పంటలకు నానో యూరియాను వినియోగించుకోవచ్చు. ఫ మార్కెట్లోకి నానో యూరియా, డీఏపీ ఫ సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా.. ఫ పంటలకు అధిక నత్రజనిని అందిస్తున్న ‘నానో’ ఫ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి ఫ రవాణా, నిల్వ చేయడం తేలిక అంటున్న వ్యవసాయాధికారులు -
సూర్యాపేట జిల్లాలో ముగ్గురిపై హత్యాయత్నం
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మరో సుపారీ మర్డర్‌కు ప్లాన్ చేసిన ఘటన స్థానకంగా కలకలం రేపింది. ఓ బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని హత్య చేసేందుకు ఒక సుపారీ గ్యాంగ్ కారులో వెంబడించింది. దాంతో అప్రమత్తమైన ఆ ముగ్గురు బైక్ దిగి వైన్స్‌లోకి పరిగెత్తడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ ముగ్గురు. సుపారీ గ్యాంగ్‌ను వైన్స్‌లో ఉన్నవాళ్లు వెంబడించడంతో వారు వచ్చిన కారులోనే పరారయ్యారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా, తాజాగా మరోసారి హత్యాయత్నం పథకం జరగడంతో సూర్యాపేటలో కలకలం రేగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అనే ప్రశ్న స్థానికంగా జీవిస్తున్న వారిలో మొదలైంది. -
అమెరికా నుంచి వచ్చి.. ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేసిన ఎన్నారై
కోదాడరూరల్: తన మిత్రుడు మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను సోషల్ మీడియాలో చూసి అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కోదాడకు వచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు ఓ ఎన్నారై. వివరాలు.. సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పి. పెంటయ్య, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ చప్పిడి సుధాకర్ 30 ఏళ్ల కిందట హైదరాబాద్‌లోని పశువైద్య కళాశాలలో కలిసి చదువుకున్నారు.చదువు పూర్తయిన తర్వాత పెంటయ్య కోదాడ (Kodad) ప్రాంతంలో పశువైద్యాధికారిగా పనిచేస్తుండగా.. సుధాకర్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. డాక్టర్ పెంటయ్య కోదాడ పశువైద్యాశాలలో రైతులకు ఉపయోగపడేలా పశుఔషధ బ్యాంకును ఏర్పాటు చేసి మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను కాలిఫోర్నియాలో ఉంటున్న అతడి స్నేహితుడు సుధాకర్ సోషల్ మీడియాలో చూశాడు. పెంటయ్య ఫోన్ నంబర్ తీసుకున్న సుధాకర్ త్వరలో కలుస్తానని అడ్రస్, లోకేషన్ షేర్ చేయమని చెప్పాడు.కాలిఫోర్నియా (california) నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సుధాకర్ బుధవారం కోదాడకు వచ్చి తన మిత్రుడు పెంటయ్యను కలిసి సర్ప్రైజ్ ఇచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు స్నేహితులు ఆనందంలో మునిపోయారు. అనంతరం పశుఔషధ బ్యాంక్‌కు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌తో పలు రకాల పండ్ల మొక్కలను నాటించారు.చదవండి: తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేసిన భారతీయ యువతి -
సీనియర్ సిటిజన్స్‌ను గౌరవించాలి
చివ్వెంల : సీనియర్ సిటిజన్స్‌ను ప్రతిఒక్కరూ గౌరవించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్‌కౌసర్ అన్నారు. ప్రపంచ సీనియ ర్ సిటిజన్స్ డే సందర్భంగా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని శ్రీఅన్నపూర్ణ చాటిటబుల్ ట్రస్ట్‌లో వృద్ధులను కలిసివారి సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. వృద్ధుల సమస్యలతోపాటు ఆశ్రమానికి దారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.రాజు, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎస్పీ కె.నరసింహతో కలిసి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మండపాల్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ శాంతిభద్రలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని తగినట్లుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కృపాకర్, రుక్మారావు, రాజేశ్వరరావు, రమేష్, నరసింహారావు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కారింగుల ఉపేందర్, కార్యకర్తలు, షేక్ ఫారూక్ పాల్గొన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు భానుపురి (సూర్యాపేట) : విధి నిర్వహణలో తప్పు చేసే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ భూమికి సంబంధించి పహాణీలో ఇతరుల పేరు రాసి అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఇదేవరకే అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఈ విషయమై తాను రెండు రోజుల క్రితమే గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్‌ను ఆదేశించామని పేర్కొన్నారు. సూర్యాపేట : సద్దల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు పక్కన ఖాళీ ప్రదేశంలో పిచ్చిమొక్కలను తొలగించి అందమైన పూల మొక్కలు పెంచాలన్నారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం సద్దల చెరువు పరిధి ఎక్కడ వరకు ఉందో మున్సిపల్ కమిషనర్‌ను, చెరువు ఎఫ్టీఎల్ ఎక్కడకు ఉందో ఇరిగేషన్ అధికారులు, ఖాళీ ప్రదేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో పర్యాటక శాఖ ఏఈని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, ఇరిగేషన్ డీఈ పాండునాయక్, టూరిజం ఏఈ మణికంఠ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్