Politics
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. రేవంత్ ప్లానేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ, నీటి కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది.వివరాల మేరకు.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు వారికి ఆహ్వానం అందింది.ఈ సమావేశంలో కృష్ణ-గోదావరి నదీజలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే, నీటి కేటాయింపులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2014 నుంచి నేటి వరకు కృష్ణా-గోదావరి నదిలో నీటి కేటాయింపులు , బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ అవగాహన కల్పించనున్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశంలో అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.
‘మిమ్మల్ని ఓటర్ల జాబితా ఆయుధంగా మార్చారు’
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మరోసారి ధ్వజమెత్తింది. కొత్త ఏర్పాటైన ‘సర్’తో ఓటర్ల జాబితాలో తారుమారు జరుగుతుందంటూ మండిపడింది. ఈరోజు(బుధవారం, డిసెంబర్ 31) సీఈసీని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ.. కలిసి పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించారు. అనంతరం సీఈసీతో చర్చించారు. అయితే ఆపై బయటకొచ్చిన అభిషేక్ బెనర్జీ.. సీఈసీ టార్గెట్ తీవ్ర విమర్శలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న జ్ఞానేష్ కుమార్‌ను.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇష్టమొచ్చినట్లు వాడుకుంటుందని ఘాటు వ్యాఖ్యలుచేశారు. దేశాన్ని విచ్చిన్నం శక్తిగా జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం ఉపయోగించుకుంటుందన్నారు. తమకు ఈవీఎంల ఓటింగ్‌తో ఎటువంటి సమస్యా లేదని, కానీ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారనే అనుమానం మాత్రం ఉందన్నారు. ‘ మా ప్రశ్నలకు దేనికి కూడా సీఈసీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. సుమారు 20 ప్రశ్నల వరకూ సీఈసీని అడిగాం. కానీ వాటిలో స్పష్టత లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌ను ఓటర్ల జాబితా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. మీరు తయారు చేస్తున్న ఓటర్ల జాబితాను ప్రజల ముందు బహిర్గతం చేయండి. కనీసం అది కుదరకపోతే.. దాన్ని లాజికల్‌గానైనా నిరూపించండి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదనేది మా అనుమానం’ అని విమర్శించారు.
రక్షించాల్సిన పాలకులు.. భక్షిస్తున్నారు: వరుదు కల్యాణి
సాక్షి, తాడేపల్లి: ఈ ఏడాది (2025)లో కూటమి ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. మహిళలు, చిన్నారుల పాలిట చీకటి సంవత్సరంగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్షించాల్సిన పాలకులే భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బెల్టు షాపులు నెలకొల్పి మహిళల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ పనితీరు అట్టడుగుకు పడిపోయింది.‘‘కేంద్ర హోంశాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మారలేదు. డీజీపీ స్థాయి వ్యక్తి మాటలు వింటుంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో 213 శాతం గంజాయి, డ్రగ్స్ కేసులు పెరిగాయి. నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా పని చేస్తున్న కమ్యూనిస్టు నాయకుడు పెంచలయ్యను హత్య చేశారు. 1,450 మందిపై లైంగిక దాడులు జరిగాయి. 5 వేల మందిపై వేధింపులు జరిగాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేదు’’ అంటూ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మహిళలకు ఇచ్చిన ఏ హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మూడు పార్టీలు కలిసి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. ఏ వర్గానికీ ప్రభుత్వం మేలు చేయలేదు. దోపిడీలో బంగ్లాదేశ్‌కు బాబుగా, శ్రీలంకకు చెల్లిగా మార్చారు. ఆవకాయ ఫెస్టివల్‌కి డబ్బులు ఉంటాయిగానీ, ఆడబిడ్డ పథకం అమలు చేయడానికి డబ్బుల్లేవా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.‘‘మహిళలంటే సామాన్య మహిళలే కాదు, దేవతలను కూడా అవమానం చేశారు. దుర్గమ్మ ఆలయానికి కరెంటు కట్ చేసి అవమానం చేశారు. అనిత, సంధ్య, సవిత.. ఈ ముగ్గురికే న్యాయం జరిగింది. పేరుకే మంత్రులు, కానీ జగన్‌ని దూషించటానికే పని చేస్తున్నారు. హోంమంత్రి అనిత రౌడీలకు పెరోల్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. సంధ్యారాణి పీఏ ఒక మహిళను వేధిస్తే తిరిగి బాధితురాలి మీదనే కేసు పెట్టించారు. మంత్రి సవిత కుట్టు మిషన్ల స్కాం చేసి సంపద సృష్టించుకునే పనిలో ఉన్నారు. తప్పులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వం లోనే చూస్తున్నాం..సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే వారిపైనే కేసులు పెట్టటం అన్యాయం. జల్సా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో జనసేన, టీడీపీ కార్యకర్తలు అవాంఛనీయ శక్తులుగా వ్యవహరించారు. జగన్, అల్లు అర్జున్‌లను కించపరిచే మాస్కులు వేసుకుని వ్యవహరించారు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.
‘ఆలయాలపై కూడా రెడ్‌బుక్ రాజ్యాంగమా?’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పటం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడు, ఆలయాల మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా?. ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.‘‘ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించడు. ఆలయాల పవిత్రతను దెబ్బ తీయవద్దు. సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావటం ఆందోళనకు గురి చేసింది. ఇదే ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించారు. ఇప్పుడు ప్రసాదంలో నత్త వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, బెదిరించారు. ఆ దంపతులు ఒక వీడియో పోస్టు చేస్తే వారిని టార్గెట్ చేశారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం..ప్రసాదంలో నత్త రావటానికి కారణాలపై విచారణ జరపకుండా భక్తులపై కేసులు పెడతారా?. చివరికి దేవుడి మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనిని దేవుడు కూడా క్షమించరు. నీచ రాజకీయాలకు దేవుడ్ని వాడుకోవద్దు. చంద్రబాబుకు దైవ భక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు.
Sports
8 నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్-న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్లు
భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 11న వడోదరలోని కొటంబి స్టేడయంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో అమ్మకం ప్రారంభించిన 8 నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్ ఔటయ్యాయి. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారిని ఈ విషయం బాధిస్తున్నప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు మాత్రం సంతృప్తినిస్తుంది.తమ ఆరాధ్య ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్లే, ఇలా తక్కువ సమయంలో టికెట్లు అమ్ముడుపోయాయని వారు సంబరపడిపోతున్నారు. ఇది కదా రో-కో క్రేజ్ అంటే అంటూ సోషల్‌మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. రాజ్‌కోట్, ఇండోర్‌లో జరిగే మిగతా రెండు వన్డేల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ హడావుడి చేస్తున్నారు. కాగా, రోహిత్-విరాట్ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో రో-కో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్ సిరీస్ తొలి వన్డేకు హైప్ మరింత పెరిగింది. కోహ్లి ఆటను ప్రత్యక్షంగా చూడటమే లక్ష్యంగా అభిమానులు టికెట్ల కోసం ఎగబాడ్డారు. సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించాడు. ఇదే ఫామ్‌ను విరాట్ వడోదర వన్డేలోనూ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్ వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్, రాయ్‌పూర్, గౌహతి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.
ఎట్టకేలకు గాడిలో పడిన బాబర్ ఆజమ్
గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఆడుతూ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.వాస్తవానికి బాబర్ నుంచి ఇంకా చాలా రావాల్సి ఉన్నా.. ఇటీవలికాలంలో అతని పరిస్థితిని బట్టి చూస్తే ఇది కాస్త బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతగాడు రెండేళ్లకు పైగా అంతర్జాతీయ కెరీర్లో (మూడు ఫార్మాట్లు) శతకం లేకుండా గడిపాడు. అప్పుడెప్పుడో 2023లో పసికూన నేపాల్‌పై సెంచరీ చేసిన బాబర్.. ఇటీవలే (ఈ ఏడాది నవంబర్) శ్రీలంకపై మళ్లీ సెంచరీ చేశాడు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాబర్ నుంచి అర్ద సెంచరీ కూడా గొప్పగా అనిపిస్తుంది. తాజాగా బిగ్ బాష్ లీగ్‌లో బాబర్ చేసిన అర్ద సెంచరీలకు ఇంత ప్రాధాన్యత లభించడానికి మరో కారణం ఉంది.టీ20 ఫార్మాట్లో ఇటీవలికాలంలో అతడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే.. ప్రపంచకప్ జట్టులో అతని స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. పాక్ సెలెక్టర్లు బాబర్ ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో కూడా పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు అర్ద సెంచరీలు అతని ప్రపంచకప్ బెర్త్ ఆశలను సజీవంగా ఉంచాయి.ఇదే ఫామ్‌ను బాబర్ మరో ఐదారు మ్యాచ్‌ల్లో కొనసాగిస్తే ప్రపంచకప్ బెర్త్‌కు ఢోకా ఉండదు. ఇక్కడ బాబర్‌కు మరో సమస్య కూడా ఉంది. తాజాగా అతను రెండు అర్ద సెంచరీలు చేసినా, అవి పొట్టి ఫార్మాట్‌కు కావాల్సిన వేగంతో చేసినవి కావు. సిడ్నీ థండర్‌పై 42 బంతులు ఆడి 58 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌పై 46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. రెనెగేడ్స్‌పై బాధ్యతాయుత అర్ద సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించినా, బాబర్లో మునుపటి వేగం లేదని స్పష్టంగా తెలిసింది.కాగా, బాబర్ హాఫ్ సెంచరీ, సీన్ అబాట్ (4-0-16-3) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కారణంగా రెనెగేడ్స్‌పై సిడ్నీ సిక్సర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరగులు చేసింది. జోష్ బ్రౌన్ (43), మెక్‌గుర్క్ (38), హసన్ ఖాన్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. సిక్సర్స్ బౌలర్లలో అబాట్‌తో పాటు జాక్ ఎడ్వర్డ్స్, డ్వార్షుయిస్, హేడెన్ కెర్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం ఛేదనలో సిక్సర్స్ సైతం ఆదిలోన తడబడినప్పటికీ.. బాబర్-జోయెల్ డేవిడ్ (34 నాటౌట్) జోడీ సిక్సర్స్‌ను గెలిపించింది. 19.1 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.
యూఎస్ఏ ప్రపంచకప్ జట్టులో వివాదాస్పద ఎంపికలు..?
యూఎస్ఏ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో వివాదాస్పద ఎంపికలు జరిగినట్లు తెలుస్తుంది. సెలక్షన్ కమిటీ పాత్ర లేకుండా కోచ్ పుబుడు దసనాయకే, కెప్టెన్ మోనాంక్ పటేల్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం జట్టును అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పలువురు ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ప్రమేయం లేకుండానే ఎంపిక చేశారని ఓ అమెరికా సీనియర్ జర్నలిస్ట్ తెలిపారు.స్థానికంగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే శ్రీలంక బ్యాటర్ షేహాన్ జయసూర్యకు నేరుగా ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించారని తెలుస్తుంది. పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఎహ్సాన్ అదిల్‌ను కూడా అర్హత ప్రామాణాలు చూడకుండా జట్టులోకి తీసుకున్నారని సమాచారం.యూఎస్ఏ హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్ పుబుడు దసనాయకే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారని స్థానిక మీడియా అంటుంది. జట్టు ఎంపికలో కోచ్ పాత్రను పరిమితం చేయాలని జర్నలిస్ట్‌లు యూఎస్ఏ క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నారు.ప్రస్తుతం అందుతున్న లీకుల ప్రకారం.. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్ (ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8) కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యుల యూఎస్ఏ జట్టు ఇలా ఉంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మోనాంక్ పటేల్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా జెస్సీ సింగ్ ఎంపికయ్యాడు.మాజీ పాకిస్తాన్ ఆటగాడు ఎహ్సాన్ అదిల్, మాజీ శ్రీలంక బ్యాటర్ షేహాన్ జయసూర్య, లెగ్ స్పిన్నర్ మహ్మద్ మొహ్సిన్, మహారాష్ట్రలో (భారత్) జన్మించిన MLC స్టార్ శుభమ్ రంజనేమ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ మరియు అసిస్టెంట్ కోచ్‌ను నియమించినట్లు తెలుస్తుంది.కోచ్ పుబుడు దసనాయకే ప్రోద్బలంతో మాజీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దమ్మిక ప్రసాద్‌కు ఆ పదవి కట్టబెట్టారని సమాచారం.టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన యూఎస్ఏ జట్టు (లీకుల ప్రకారం)..మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్ (వైస్ కెప్టెన్), ఎహ్సాన్ అదిల్, ఆండ్రీస్ గౌస్, షయాన్ జహంగీర్, షేహాన్ జయసూర్య, ఆరోన్ జోన్స్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్, సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్, మహ్మద్ మొహ్సిన్, సాయి ముక్కమల్లా, సౌరభ్ నేత్రవల్కర్, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, రుషిల్ ఉగర్కర్, షాడ్లీ వాన్ స్కాల్క్విక్. కాగా, 2026 టీ20 ప్రపంచకప్‌లో యూఎస్ఏ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో యూఎస్ఏతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో యూఎస్ఏ తమ తొలి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 7) భారత్‌ను ఢీకొంటుంది. అనంతం ఫిబ్రవరి 10న పాకిస్తాన్, 13న నెదర్లాండ్స్, 15న నమీబియాతో పోటీపడనుంది.
టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..
టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు. పంజాబ్ తరఫున ఓపెనర్‌గా గిల్ బరిలోకి దిగనున్నాడు.జైపూర్ వేదికగా సిక్కిం, గోవా జట్లతో పంజాబ్ శని (జనవరి 3), మంగళవారాల్లో (జనవరి 6) ఆడే మ్యాచ్‌లో గిల్ భాగం కానున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. కాగా సౌతాఫ్రికా (IND vs SA)తో ఇటీవల జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్‌లో గిల్‌కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.అనూహ్య రీతిలో వేటుతొలి టెస్టు సందర్భంగా గాయపడిన గిల్ (Shubman Gill).. సఫారీలతో రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చి వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో నాలుగు, ఐదో టీ20ల నుంచి యాజమాన్యం అతడిని తప్పించింది.అంతేకాదు.. అనూహ్య రీతిలో ప్రపంచకప్-2026 జట్టులోనూ గిల్‌కు చోటివ్వలేదు. వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై వేటు వేసి.. టీ20ల నుంచి పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో గిల్ సత్తా చాటి తిరిగి ఫామ్‌లోకి రావాలని గిల్ భావిస్తున్నాడు.ఇప్పటికే ఆడేశారుఇదిలా ఉంటే.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇప్పటికే ఢిల్లీ, ముంబై తరఫున ఈ టోర్నీలో రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. టీమిండియా స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ సారథిగా, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర, సర్ఫరాజ్ ఖాన్ ముంబై, దేవదత్ పడిక్కల్ కర్ణాటక తరఫున దుమ్ములేపుతున్నారు. ఇక అభిషేక్ శర్మ సైతం పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు.టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..ఈ జాబితాలో ఇప్పుడు గిల్‌తో పాటు వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరనున్నాడు. సర్వీసెస్, గుజరాత్ జట్లతో జనవరి 6,8వ తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్రకు జడ్డూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం కర్ణాటక తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.త్రిపుర, రాజస్తాన్‌లతో జనవరి 3, 6 తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఇక గిల్‌తో పాటు.. జడేజా, కేఎల్ రాహుల్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. కోహ్లి, రోహిత్‌లతో కలిసి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నారు. సొంతగడ్డపై కివీస్‌తో టీమిండియా మూడు వన్డే, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్ చేయరు?
National
ఆకాశ ఎయిర్‌పై మహిళ సంచలన ఆరోపణలు
ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్ ఝన్‌ఝన్ వాలా తీసుకొచ్చిన విమానయాన సంస్థ ఆకాశా ఎయిర్‌పై ఒక మహిళ ఆరోపణలు సంచలనం రేపాయి. ఆకాసా ఎయిర్ విమానంలో పరిశుభ్రత లేక తనకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఒక మహిళ ఆరోపించింది. దీనిపై సంస్థ ఆకాశ ఎయిర్ స్పందించింది.జాహ్నవి త్రిపాఠి అనే మహిళ లింక్డిన్ ద్వారా తన అనుభవాన్ని పంచుకుంది. విమానంలోని అపరిశుభ్ర వాతావరణం తనను తీవ్ర అనారోగ్యం పాలుచేసిందినీ, తనతోపాటు ప్రయాణిస్తున్న తన స్నేహితులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆమె ఆరోపించించింది. తన స్నేహితులతో కలిసి జాహ్నవి బెంగళూరు-అహ్మదాబాద్‌కు డిసెంబర్ 26న రాత్రి 10:25 గంటలకు ఆకాశఎయిర్ విమానంలో బయలుదేరారు. విమానంలోని క్యాబిన్, సీట్ల పరిస్థితి చూసి షాక్ అయ్యామని, ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే కాళ్లపై తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, అది కాలక్రమేణా మరింత తీవ్రమైందని త్రిపాఠి ఆరోపించింది. దీంతో నడవలేక, నిద్రపట్టక, రోజువారీ పనులు చేసుకోలేక ఇబ్బందు లుపడ్డానని చెప్పుకొచ్చింది. మొత్తం ప్రయాణమంతా దుర్బరమని పేర్కొంది. తనతోపాటు తన స్నేహితులు కూడా బాధలు పడ్డారని తన పోస్ట్‌లో పేర్కొంది.ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, ఈ ప్రయాణం తనను శారీరకంగా, మానసికంగా కృంగదీసిందని తెలిపింది. ప్రయాణీకుల ఆరోగ్యం, భద్రత అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని వ్యాఖ్యానించింది.ఆకాశ ఎయిర్ స్పందనఈ ఆరోపణలపై స్పందించిన ఆకాశ ఎయిర్ ఆమె ఇబ్బందులపై విచారం ప్రకటించింది. అత్యున్నత పరిశుభ్రత, కస్టమర్ శ్రేయస్సే తమ లక్ష్యమని, ఫిర్యాదును పరిశీలించి, వీలైనంత త్వరగా సంప్రదిస్తామని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ పేలుడు
సోలన్ జిల్లా: హిమాచల్ ప్రదేశ్‌లో పేలుడు సంభవించింది. సోలన్ జిల్లాలోని నాలాగఢ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి భవనాలు దెబ్బతిన్నాయి. పీఎస్‌లో ఇన్వెస్టిగేషన్ రూమ్ కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. 40 నుండి 50 మీటర్ల వరకు ఈ పేలుడు ప్రభావం చూపించింది. పేలుడు తీవ్రతకు రంధ్రం ఏర్పడింది. సమీపంలోని కొన్ని చెట్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.బద్ది ఎస్పీ వినోద్ దీమాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పేలుడు పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో జరిగిందని.. అది పోలీస్ శాఖకు చెందిన స్థలం కాదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరు గాయలేదని ఎస్పీ తెలిపారు.
డ్రంక్ & డ్రైవ్‌లో భర్త, భార్య ప్రెగ్నెంట్ : ఆ పోలీసు ఏ చేశాడంటే!
మద్యం మత్తులో ఉన్న వాహనదారుడిని నిలువరించిన పోలీసు ఆఫీసర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. అయితే పరిస్థితిని అర్థం చేసుకుని, ఆయన చేసిన పని నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పోలీసు అధికారి ప్రస్తుతం సోషల్‌మీడియాలో హీరోగా నిలిచారు.ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని తన విధుల్లో భాగంగా అడ్డుకున్నారో పోలీసు అధికారి. అయితే "నేను కొంచెం తాగి ఉన్నాను. నా భార్య గర్భవతి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు రాత్రి 10:30 అయింది.. ఇంకో రెండు కి.మీ దూరంలోనే ఆసుపత్రి. సార్, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి " అని ఆ వ్యక్తి పోలీసు అధికారిని వేడుకున్నాడు. ఈ సమయంలో పోలీసు అధికారి స్పందించిన తీరు విశేషంగా నిలిచింది. కారులో ఉన్న మహిళ పరిస్థితిని గమనించి, భర్తను బయటకు రమ్మని చెప్పి, కారు స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. భర్తను కారు వెనుక కూర్చోమని మర్యాదగా చెప్పారు. “మీ భద్రత కోసమే ఇక్కడ ఉన్నాము. మిమ్మల్ని ఆసుపత్రికి సురక్షితంగా తీసుకెళ్లడం మా విధి” అని గర్భిణీకి ధైర్యం చెప్పి ముంబై పోలీసు అధికారి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అంతేకాదు ఈ దృశ్యాలను వీడియో తీస్తోంటే.. ఈ విధంగా కూడా పోలీసులు సహాయం చేస్తారని ప్రజలకు తెలియజేసేలా చిత్రీకరణ కొనసాగించమని కోరడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.He creates such videos on Instagram, his video has gone viral before also. pic.twitter.com/rklSuh9iFk— Dinesh Choudhary (@DineshJaiHind7) January 1, 2026నెటిజన్లు ప్రశంసలుపోలీసు అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “బిగ్ సెల్యూట్” అంటూ కామెంట్ చేశారు. మరోవైపు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, అందులోనూ ప్రసవానికి దగ్గరపడ్డపుడు తాగడం అవసరమా అని కొంత మంది ఆగ్రహించారు. కొన్ని మంచు ప్రాంతాల్లో పరిమితులతో, మద్యపానాన్ని శాశ్వతంగా నిషేధించాలి అంటూ వ్యాఖ్యానించారు.
కొత్త సంవత్సరం వేళ : ఎల్వోసీ వద్ద పాక్ డ్రోన్ కలకలం
భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని చాటుకుంది. గురువారం పాకిస్తాన్ డ్రోన్ జారవిడిచిన ప్రమాదకరమైన పదార్థాలతో నిండిన బ్యాగ్‌ను భారత సైన్యం చ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానవరహిత వైమానిక వాహనం భారత గగనతలంలోకి ప్రవేశించి ఐదు నిమిషాలకు పైగా ఉండి, చక్కన్ దా బాగ్ ప్రాంతంలోని రంగర్ నల్లా, పూంచ్ నది సమీపంలో దాని పేలోడ్‌ను పడవేసిందని అధికారులు తెలిపారు. ఇందులోఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి), మందుగుండు సామగ్రి, మాదక ద్రవ్యాలున్నాయని తెలిపారు.జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఖాదీ కర్మదా ప్రాంతంలో భారత భూభాగంలోకి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్ కొన్ని అనుమానిత పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను జారవిడిచింది. ఇవి ఈ ప్రాంతంలోని ఉగ్రవాద గ్రూపులకు సహాయం చేయడానికి ఉద్దేశించినవిగా అధికారులు భావిస్తున్నారు. దీంతో సరిహద్దు జిల్లాలో భద్రతా సమస్యలను లేవనెత్తింది. ఇదీ చదవండి: స్మోకింగ్ కంటే దారుణం ఉద్యోగం? ఏం చేయాలి? A Pakistani drone crossed into Indian territory along the Line of Control (LoC) in Jammu and Kashmir’s Poonch, and dropped suspected explosive material, ammunition and narcotics, prompting massive search operations by security forces.Details.https://t.co/7eLEMRzdVp pic.twitter.com/EWCYJSedMm— Vani Mehrotra (@vani_mehrotra) January 1, 2026ify"> డ్రోన్ కదలికను గుర్తించిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఖాదీ కర్మదా , పరిసర ప్రాంతాలలో విస్తృతమైన కార్డన్ సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించారు. అదనంగా, భద్రతా దళాలు పఠాన్‌కోట్-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంట కథువా, సాంబా, జమ్మూ, ఉధంపూర్ జిల్లాల్లోని వాహన తనిఖీలను ముమ్మరం చేశాయి. నూతన సంవత్సర వేడుకలకు ముందు జమ్మూ ప్రాంతం అంతటా భద్రతను పెంచిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.ఇదీ చదవండి: ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు
International
NRI
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యశ్వంత్ కుమార్ గోషిక (33) శనివారం డల్లాస్‌లో గుండెపోటుతో మరణించారు. యశ్వంత్ ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. స్నేహితులను, తెలుగు ఎన్నారై సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.యశ్వంత్ కుమార్ తెలంగాణలోని చౌటప్పల్ గ్రామంలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అమెరికాలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత టాప్ MNCలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. స్లీప్ అప్నియాకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఆకస్మిక గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించాడని సన్నిహితులు వెల్లడించారు. తోటి తెలుగువారితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు యశ్వంత్ మృతదేహాన్నిఅంతిమ సంస్కారాల కోసం భారతదేశానికి తిరిగి పంపడానికి NRI సంఘం ప్రయత్నాలు చేస్తోంది.విషాదం ఏమిటంటేయశ్వంత్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికోసం స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో, పెళ్లికొడుకుగా చూడాలనుకున్న యశ్వంత్ అకాలమరణం వారిని తీరని విషాదంలోకి నెట్టేసింది.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‌కు కొత్త కార్యవర్గం ఎన్నిక
కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల ప్రత్యేక సంస్థ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF - CANADA) రానున్న రెండేళ్ల కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జితేందర్ రెడ్డి గార్లపాటి అధ్యక్షుడిగా, వెంకట్ రెడ్డి పోలు ప్రధాన కార్యదర్శిగా పనిచేయనున్నారు. 2026-27 రెండేళ్ల పాటు ఈ కొత్త కార్యవర్గం పనిచేయనుంది.కొత్త కార్యవర్గంలో ఫౌండేషన్ కమిటీ చైర్ పర్సన్‌గా అమిత పినికేశి, ఉపాధ్యక్షుడిగా మహేందర్ కీస్రా, సంయుక్త కార్యదర్శిగా అనికేత్ రెడ్డి శామీర్ పేట, ట్రెజరర్‌గా కృష్ణా రెడ్డి చాడ, జాయింట్ ట్రెజరర్‌గా రవీందర్ రెడ్డి కొండం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్‌గా అర్షద్ ఘోరి, కమిటీ చైర్మన్లుగా బిజినెస్ కౌన్సిల్ చైర్ పర్సన్‌గా ఇందు రెడ్డి, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్‌గా కె. మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల కోసం 2005లో టీడీఎఫ్ కెనడా సంస్థ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు రాష్ట్రం ఏర్పటయ్యాక కూడా ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రతీ ఏటా తెలంగాణ నైట్‌ను నిర్వహిస్తూ అక్కడి తెలుగువారిని ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. తంగేడు అనే అనుబంధ సాంస్కృతిక సంస్థ ద్వారా బతుకమ్మ పండగతో పాటు వివిధ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కెనడాలో స్థిరపడిన వందలాది మంది తెలుగువారు తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తమ పిల్లలకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన అన్ని సమయాల్లో సమాజ సేవ కార్యక్రమాలను కూడా విసృతంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది. టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రికెట్ క్లబ్లో వందలాది మంది తెలుగు విద్యార్థులు భాగస్వామ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్య కోసం వెళ్లిన విద్యార్థులకు కూడా ఈ సంస్థ తగిన సహాయం అందిస్తోంది.(చదవండి: విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు)
భారతీయులు సహ వలసదారుల్లో సరికొత్త భయం!
H-1B వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులు గుబులు.. గుబులుగా కనిపిస్తారు. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇంకా ఏం మెలికలు పెడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు.. విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్‌గా ప్రయాణాలు రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. వలసదారులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలకు భయపడుతున్నారట. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF)-న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన 2025 సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని వలసదారులలో 27% మంది జర్నీలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. ఈ క్రమంలో.. చట్టబద్ధంగా ఉన్నవారు కూడా భయాందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సరైన H-1B వీసాలు కలిగినవారు (32 శాతం), పౌరసత్వం పొందినవారు (15 శాతం) కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక.. అక్రమ వలసదారులలో ఈ సంఖ్య 63% గా ఉంది. ఇటు దేశీయంగానూ ప్రయాణాలపై వలసదారుల్లో భయం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.. ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (TSA) దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE)కు షేర్ చేస్తోంది. దీంతో వలస దారులు తమపై దృష్టి పడకుండా ఉండేందుకు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. టెక్సాస్‌లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా ఎస్.. తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కి రావాలనుకుంటోంది. అయితే.. H-1B వీసా దారులపై పెరుగుతున్న పరిశీలన, ఆలస్యమవుతున్న ఇంటర్వ్యూల కారణంగా తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.ఈ ఏడాది జూలైలో H-1B వీసా రీన్యువల్స్‌ను స్వదేశంలోనే చేయాలని నిబంధన విధించగా.. సెప్టెంబర్‌లో కొత్త H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు విధించారు. అటుపై ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్లో సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను కూడా కఠినతరం చేసింది.ఇక.. వీసా ఇంటర్వ్యూలు 2026–2027 వరకు వాయిదా పడటంతో.. వందలాది మంది ఉద్యోగాలు, కుటుంబాల నుండి దూరమయ్యారు. దీనితో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వలసదారులు అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణం చేయవద్దని సూచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ అమెరికాలో వలసదారులలో భయాన్ని పెంచి.. వారి రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, చట్టబద్ధ స్థితి కాపాడుకోవడానికి, వలసదారులు ప్రయాణం పూర్తిగా నివారించడం సురక్షిత మార్గంగా భావిస్తున్నారని సర్వేలతో స్పష్టమవుతోంది.
ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్‌లో శని, ఆదివారం పలు కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కాన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జిటీఎ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, యూఎస్ఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, యూఎస్ఎ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి, తదితరులు GTA లో కీలక పాత్ర పోషిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తోడ్పాడ్డారు.తెలంగాణలో జిల్లాల వారిగా GTA చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని ఈ వేదికపై పరిచయం చేశారు. కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ షో నిర్వహించారు.రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద - రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, జిటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌తో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Sakshi Originals
2025 మండిపోయింది..
అనుకున్నట్టుగానే 2025 పర్యావరణపరంగా మరో అవాంఛనీయ రికార్డు మూటగట్టుకుని ని్రష్కమించింది. చరిత్రలో అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన మూడో ఏడాదిగా నిలిచింది. నంబర్లపరంగా మూడో స్థానమే అయినా, ప్రపంచవ్యాప్తంగా 2025 పొడవునా అత్యంత తీవ్రతతో కూడిన వాతావరణ మార్పులు పదేపదే చోటుచేసుకుని వణికించాయి. ముఖ్యంగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితుల ఉదంతాలు ఏకంగా 157 నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ‘‘ఇవన్నీ పర్యావరణ మార్పుల విపరిణామాలే. ఈ విపత్తును దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలను తక్షణం ముమ్మరం చేయాలి. ఇందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి రావాలి. లేదంటే అంతే సంగతులు. మరో రెండు మూడేళ్ల తర్వాత తత్వం బోధపడ్డా, దిద్దుబాటు చర్యలకు అప్పటికి బాగా ఆలస్యమవుతుంది. అప్పుడిక ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే కాగలదు’’అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమితిని దాటేశాం! 2025 అత్యంత భారీ ఉష్ణోగ్రతలు చవిచూసిన సంవత్సరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిందంటే మనిషి అత్యాశ వల్ల పుట్టుకొచ్చిన పర్యావరణ విపరిణామాల వల్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, గత మూడేళ్ల భూ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2015 నాటి పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటేసింది. ఇలా జరగడం ఇదే తొలిసారి!. ఇది కచ్చితమైన ప్రమాద సంకేతమేనని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025లో కేవలం అత్యుష్ణ ప్రతాపాలే కాదు, భయానక తుఫాన్లు, వరదల వంటివి కూడా బెంబేలెత్తించడం గమనార్హం. నిజానికి 2025లో వాతావరణాన్ని సాధారణంగా చల్లబరిచే లా నినా ఆధిపత్యమే కొనసాగింది. అయినా యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎండలు మండిపోయాయంటే ఆలోచించాల్సిన విషయమేనన్నది నిపుణుల మాట. ‘‘ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకానికి మనం తక్షణం గుడ్‌బై చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే అతి త్వరలో పరిస్థితులు చేయి దాటిపోవచ్చు’’అని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సహ వ్యవస్థాపకుడు, లండన్ ఇంపీరియల్ కాలేజీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో స్పష్టం చేశారు. ‘‘2025లో వచ్చిన పలు వడగాడ్పులు 2015తో పోలిస్తే ఏకంగా 10 రెట్లు శక్తిమంతమైనవి. పైగా ఏడాది పొడవునా అవి పదేపదే సంభవించాయి. ఇదంతా మనిషి కోరి తెచ్చుకుంటున్న విపత్తే’’ అని ఆయన అన్నారు. ప్రమాదంలో కోట్ల మంది 2025లో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వాతావరణ పరిస్థితులు అతి వేడిమి నుంచి తీవ్ర వరదలదాక చూస్తుండగానే మారుతూ వచ్చాయి. ‘‘గ్రీస్, టర్కీ మొదలుకుని అమెరికా, ఆ్రస్టేలియా దాకా పలు దేశాల్లో ఎటు చూసినా కార్చిచ్చులు, మెక్సికోను వణికించిన వరదలు, ఫిలిప్పీన్స్‌ను కుండపోత వానలతో ముంచెత్తిన ఫుంగ్ వాంగ్ తుఫాను, భారత్‌లో వానాకాలమంతా ఏదో ఒక ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన వరదలు... ఇవన్నీ వాతావరణ మార్పుల విపరిణామాల సంకేతాలే’’ అని ఫ్రెడరిక్ స్పష్టం చేశారు. ‘‘జమైకా, క్యూబా, హైతీ వంటి దేశాలను హరికేన్ మెలిస్సా రెప్పపాటులో అతలాకుతలం చేసింది. కనీసం హెచ్చరికల జారీకి వ్యవధి ఇవ్వకుండా మెరుపు వేగంతో వచ్చి పడింది. ఆ తర్వాత వెంటనే ఆయా దేశాలను ఉష్ణోగ్రతలు అల్లాడించాయి. ఇలాంటి వెంటవెంట మార్పులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితులవుతున్నారు. వారి జీవనోపాధి దెబ్బతింటోంది. ఇది లక్షలాది కుటుంబాలను దారిద్య్రం దిశగా నెడుతోంది. తద్వారా పలు దేశాల్లో నిశ్శబ్దంగా అతి పెద్ద సంక్షోభాలు పురుడు పోసుకునేందుకు కారణంగా మారుతోంది’’ అని ఆయన అన్నారు.‘శిలాజ’ ముప్పుపై చర్యలేవీ? ఇటీవల బ్రెజిల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ చర్చలు ఈ ప్రమాదకర పరిణామాన్నే హైలైట్ చేశాయి. ముఖ్యంగా గ్లోబల్ వారి్మంగ్‌కు ప్రధాన కారకాల్లో ఒకటైన శిలాజ ఇంధనాల వాడకాన్ని శరవేగంగా తగ్గించి, వీలైనంత త్వరగా సున్నాకు తేవాలని తీర్మానించాయి. ‘‘కానీ దేశాలన్నీ ఇలాంటి ప్రమాణాలు ఏటా చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తీరిగ్గా విస్మరిస్తూనే ఉన్నాయి. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు మాత్రం ఎక్కడా పెద్దగా జరగడం లేదు. చైనాయే ఇందుకు ఉదాహరణ. ఒకవైపు సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూనే, మరోవైపు బొగ్గు గనుల తవ్వకాన్ని కూడా విపరీతంగా విస్తరిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు కొనసాగినంతకాలం పర్యావరణ మార్పులపై సమర్థంగా యుద్ధం చేయడం అసాధ్యమే’’ అని ఫ్రెడరిక్ కుండబద్దలు కొట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఇలా ఉంటే చాలు
2026 జనవరి 1.. కొత్త ఏడాది వచ్చేసింది. ‘న్యూ’ ఇయర్లో మనకు నిజంగా కిక్ ఇచ్చేదేమిటి? ‘‘జన వరి 1 నుండి ఇలా ఉండాలి’’ అని గట్టిగా ఒట్టేసు కోవటమే కదా! కానీ ఏమౌతుంది? ఫిబ్రవరి రాగానే.. మాట మీద నిలబడలేక నీరసించి పోతాం. అలాంటి నీరసాలు రాకుండా ఉండాలంటే.. కాస్తంటే కాస్తంత ప్రాక్టికల్‌గా ఉండే చాలు. మీ జీవితంలో ఇది నిజంగానే ‘న్యూ ఇయర్’ అవుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవితం సినిమా కాదుజనవరి 1 నుంచి.. ఎవ్వరూ పూర్తిగా వేరే మనిషి అయిపోరు. లైఫ్ అంటే సినిమా కాదు, స్క్రీన్ ప్లే ప్రకారం మొదలవ్వడానికి! ఒక్క అడుగు ముందుకు పడినా అది విజయమే. సౌండ్ స్లీప్నిద్ర అంటే కష్టపడి పనిచేశాక, అలసిపోయి తీసుకునే విశ్రాంతి కాదు. బాడీ, మైండ్ అన్నింటికీ అదే ఆధారం. ఉదయం లేవగానే.. ఒక చాట్‌జీపీటీ లేదా జెమినై పనిచేసినట్టు చురుగ్గా పనిచేయాలంటే సౌండ్ స్లీప్ అవసరం. రాత్రి ప్రశాంతంగా పడుకోండి.. ఉదయాన్నే ఫ్రెష్‌గా నిద్ర లేవండి. ‘జలయజ్ఞం’ ఎందుకు?యాప్‌లతో కొలుచుకుంటూ, అదో ‘జలయజ్ఞం’లా నీళ్లు తాగకండి. స్విచ్చేస్తేనే పని చేస్తాం అన్నట్టు మనం మరీ యంత్రాల్లా తయారైపోతే ఎలా? పక్కనే ఒక వాటర్ బాటిల్లో ఉంచుకొని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక సిప్ వేయండి చాలు.కదలిక సరిపోతుందిమిమ్మల్ని జిమ్‌కి వెళ్లి బరువులు ఎత్తమని ఎవరన్నారు? ఎవరో జిమ్ చేసేస్తున్నారని మీరు ఫీలైతే ఎవరిది తప్పు? కాసేపు నడవండి. కాస్త ఒళ్లు విరుచుకోండి. ఓ 10 నిమిషాలు ఏదో ఒక పని చేయండి. నిన్నటి కంటే ఈరోజు కాస్త ఎక్కువ కదిలినా అదే పెద్ద సక్సెస్!వివరణల పురాణంఎవరికైనా, ఎందుకైనా ‘నో’ చెప్పటానికి వెయ్యి పురాణాల వివరణ ఇవ్వక్కర్లేదు. సోషల్ మీడియాలో లైకో షేరో కొట్టినంత ఈజీగా ‘నో’ చెప్పేయండి. మొదట ‘గిల్టీ’గా అనిపించినా, ఒకసారి ‘నో’ చెప్పేశాక చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఆన్లైన్ యుద్ధాలేల?!సోషల్ మీడియా యుద్ధాలను ఆపేయండి. ట్రెండింగ్ పోస్టు వైరల్ అయినంత వేగంగా బీపీ పెరగటం తప్ప, అక్కడ గెలిస్తే మీకేమీ ‘ఆస్కార్’ రాదు. కనిపించే ప్రతి పోస్ట్‌కీ, కామెంట్‌కీ సమాధానం చెప్పి మీ టైమ్‌నీ, ఎనర్జీనీ వేస్ట్ చేసుకోకండి.బండి ‘స్టార్ట్’ చేయండికాన్ఫిడెన్స్ వచ్చాకే మొదలుపెడదాం అని వెయిట్ చేయకండి! ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాతే ధైర్యం వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాకే అడుగు వేస్తాను అనుకుంటే, ఉన్నచోటే ఉండిపోతారు.‘క్యాష్’ ఫీలింగ్మీరు సంపాదించే ప్రతి రూపాయీ జాగ్రత్త. అలాగని.. తినే తిండిని, ఎంజాయ్మెంట్నీ కట్ చేయకండి. మీ జేబులోంచి రూపాయి ఎక్కడికి, ఎందుకు వెళ్తుందో గమనించండి. ఆ మాత్రం ‘క్యాష్’ ఫీలింగ్ ఉండాలి.ఒకటైనా ఫర్ఫెక్ట్గా..ఏ పనైనా స్టార్ట్ చేసిన తర్వాత వర్కవుట్ అవ్వట్లేదనిపిస్తే, దాన్ని అక్కడితో వదిలేసి ప్రశాంతంగా ఉండండి. సగం సగం వదిలేసిన పది పనుల కంటే, పర్ఫెక్ట్గా పూర్తి చేసిన ఒక్క పని మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.రక్త పిశాచులకు దూరం!మీ ఎనర్జీని పీల్చేసే రక్త పిశాచులకు కాస్త దూరంగా ఉండండి! మీ మనశ్శాంతిని మీరు కాపాడుకోవడం స్వార్థం ఏమీ కాదు, అది ఒక ‘లైఫ్ సేవింగ్’ టెక్నిక్. వారానికో ఆశమన సంతోషాన్ని మనమే షెడ్యూల్ చేసుకోవాలి. ఒక ప్లాన్ ఉందంటే, ‘ఆహా, ఈ సండే ఎంజాయ్ చేయొచ్చు’ అనే ఆశ ఉంటుంది. ఆ అనుభవం మధురానుభూతిగా మిగులుతుంది. లేదంటే ప్రతి వారం ఒకేలా చప్పగా ఉంటుంది.వదిలేసి చూద్దురూ..!పాత పగల్ని, కక్షల్ని, కోపాల్ని పట్టుకుని వేలాడకండి. అవి అనవసర రోగాలు తీసుకొచ్చి ఆసుపత్రులను పోషించడానికి తప్ప ఎందుకూ పనికిరావు. ఒకసారి పగలూ, కోపాలూ ప్రతీకారాలూ వదిలేసి చూడండి, సోషల్ మీడియా కాసేపు స్తంభించిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది.మీకు మీరే సపోర్ట్ఎప్పుడూ మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ, తక్కువ చేసుకుంటూ ఉంటే.. మీ పతనానికి బయట శత్రువులు అవసరమే లేదు. మీకు మీరే సపోర్టింగ్ పిల్లర్. ప్రాంప్ట్ ఇస్తేనే పనిచేసే ఏఐ చాట్‌బాట్‌లా ఉండకండి.కొత్తగా ఏదైనా..కొత్త లాంగ్వేజ్ లేదా ఒక కొత్త సాఫ్ట్వేర్ లేదా మ్యూజిక్.. ఇలా మీకు నచ్చింది, కొత్తది ఏదో ఒకటి నేర్చుకోండి. టార్గెట్లు అవీ పెట్టేసుకుని.. ఒక్కరోజులోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాల్సిన టాస్క్‌లా ఫీల వకండి. మెల్లగా నేర్చుకున్నా సరే, అది నేర్చుకోవడమే.చెప్పుకొంటే తప్పేంటిమీకు సలహా కావాలన్నా, కాస్త సపోర్ట్ కావాలన్నా, లేదంటే మీ గోడు వినే మనిషి కావాలన్నా.. మీ సర్కిల్లో ఎవరో ఒకర్ని ఎంచుకోండి. మీ బాధలు చెప్పే క్రమంలో.. తనను హింసించకండి. తను కూడా మీలాంటి మనిషే అని గుర్తుంచుకోండి.మారటం మంచిదేఈ ఏడాది మీ ఇష్టాలు మారొచ్చు, కొన్ని లక్ష్యాలు మీకు పనికిరావు అనిపించవచ్చు. అది ఫెయిల్యూర్ కాదు, మీ ఎదుగుదల! పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్స్ మార్చుకోవడం కూడా అప్డేట్ అవటమే.ఇల్లు ‘షోరూమ్’ కాదుమీ ఇల్లేమీ షోరూమ్ కాదు.. తళతళలాడుతూ ఉండాల్సిన అవసరమే లేదు. ఒకే రోజు ఇల్లంతా ఊడ్చి, తుడిచి, సర్ది నడుము విరగ్గొట్టుకోవడం కంటే.. రోజుకి కొంచెంగా క్లీన్ చేసుకోండి. అలాగే మెంటెయిన్ చేయండి చాలు!క్యాచ్ ద సిగ్నల్స్మీ బాడీ ఇచ్చే ‘సిగ్నల్స్’ని గమనించండి. అలసట, నొప్పులు.. ఊరికే రావు. అలాగని అన్నింటికీ భయాలూ పెంచుకోకండి. ఓ వయసు దాటాక అవసరమైన టెస్టులు చేయించుకోవ డం.. అత్యవ సరమైతే డాక్టర్లని సంప్రదించడం సర్వ సాధారణం అన్న విషయాన్ని మనసుకు సర్దిచెప్పండి.సిలబస్ ‘బుక్’ కాదుమంచి పుస్తకాల్ని చదవడం మంచిదే. కానీ అదేదో ఎగ్జామ్లానో సిలబస్ లానో ఫీల్ అవ్వకండి! ఎవరో చదువుతున్నారని మీరు కూడా ఏదో పుస్తకాన్ని కొని.. పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.అంతిమంగా..2026లో మీరు ఒక ‘పర్ఫెక్ట్ బొమ్మ’లా ఉండక్కర్లేదు. తప్పులు జరిగితే సరిచేసుకునే.. అలసిపోతే రెస్ట్ తీసుకునే.. మళ్లీ మళ్లీ ప్రయత్నించే ఒక ‘నిజమైన’ మనిషిగా ఉంటే చాలు. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా తడబడినా.. సో వాట్? తిరిగి కొత్తగా మొదలుపెట్టండి. దాని కోసం మళ్లీ జనవరి 1 దాకా ఆగక్కర్లేదు. ఏదో ఒక మామూలు గురువారం (ఇది మీ ఇష్టం) మధ్యాహ్నం (ఇది కూడా..) 3 గంటలకు (ఇది.. కూడా) మీ లైఫ్‌ని మీరు రీస్టార్ట్ చేయొచ్చు!మీ లైఫ్.. మీ ఇష్టం.. దాన్ని బాగుచేసుకునేందుకు అది మీరు పడే కష్టం. ఆ కష్టం ఎవ్వరూ పడరు.. మీకు కష్టమొస్తే ఎవ్వరూ తీర్చరు. మైండిట్!హ్యాపీ న్యూ ఇయర్..
2025 ఏ టు జెడ్
2025 ప్రపంచమంతటికీ తీపి, చేదుల మిశ్రమంగా గడిచింది. ప్రాకృతిక విపత్తులు, ఘోర ప్రమాదాలు, రాజకీయపుటెత్తులు, యుద్ధక్రీడలు, నేతల నోటి దురుసులు, ఎన్నికల సమరాంగణాలు... ఇలా మొత్తమ్మీద మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలావరకు ఖేదమే మిగిలించాయి. ఆంగ్ల అక్షరక్రమంలో అలాంటి ఘటనల సమాహారం...ఎ - ఎయిరిండియా ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా–171 విమానం టేకాఫైన 32 సెకన్లకే రన్‌వే ఎదురుగా ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. విమానంలోని 242 మంది, కింద ఉన్న మరో 19 మంది నిర్భాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపింది. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ప్రయాణికుడు మృత్యుంజయునిగా చిన్నపాటి గాయాలతో బయటపడటం విశేషం.బి - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ, ఆర్జేడీ సారథ్యంలోని విపక్ష మహాఘట్బంధన్ కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కూటమి 243 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 202 చోట్ల విజయదుందుభి మోగించి ఆశ్చర్యపరిచింది. ఘట్బంధన్ కేవలం 35 స్థానాలతో ఘోర పరాభవం మూటగట్టుకుంది. నితీశ్‌కుమార్ సీఎంగా ఏకంగా పదోసారి ప్రమాణస్వీకారం చేశారు. సి - క్యాస్ట్ సెన్సెస్ కరోనా కారణంగా 2020లో వాయిదాపడ్డ జనగణనను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇది 2027 మార్చి నుంచి మొదలవనుంది. అందులో భాగంగా కులగణన సైతం చేపడుతున్నట్టు వెల్లడించడం విశేషం. బ్రిటిష్ హయాంలో మన దేశంలో 1881 నుంచి 1931 దాకా కులగణన జరిగింది. కుల విభజనను పెంచరాదనే ఉద్దేశంతో స్వాతంత్య్రానంతరం ఆ ప్రక్రియను నిలిపేశారు. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేసినా దాన్ని పూర్తిస్థాయి కులగణనగా పరిగణించడం లేదు. డి - డీప్‌సీక్ ఈ చైనా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. డౌన్లోడ్ చార్టుల్లో చూస్తుండగానే అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్రత్యర్థి ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీని తోసిరాజంది. దాంతో పోలిస్తే కారుచౌకగా సేవలందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా డీప్‌సీక్–ఆర్1ను విడుదల చేసింది. దీని దెబ్బకు ఓపెన్ఏఐ మార్కెట్ విలువ 600 బిలియన్ల మేరకు తగ్గిపోయింది. ఇ - ఎప్స్టీన్ ఫైల్స్ 20 ఏళ్లనాటి ఈ కామ భూతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వారి లైంగికానందం కోసం బాలికలను ఎరవేసిన వ్యాపారి ఎప్స్టీన్ చివరికి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఉదంతం ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. ఈ కేసు విచారణ ఫైళ్లను బయటపెట్టాలన్న కాంగ్రెస్ ఉత్తర్వులపై ట్రంప్ అయిష్టంగానే సంతకం చేసినా, తనకు నష్టం లేనివాటిని మాత్రమే, అదీ విడతలవారీగా వదులుతూ సాగదీస్తున్నారు. ఎఫ్ - ఫ్లడ్స్ ఇన్ ఆసియా నానాటికీ తీవ్రమవుతున్న పర్యావరణ మార్పుల సమస్యకు ఈ ఏడాది ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వరదలు అద్దంపట్టాయి. శ్రీలంక, ఇండొనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాం తుఫాన్ల దెబ్బకు కుదేలయ్యాయి. ఈ విపత్తు భారత్‌ను కూడా తీవ్రంగానే నష్టపరిచింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆకస్మిక వరదలు, తుపాన్లు వేలాది నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జెన్–జెడ్ ఆందోళనలు ప్రభుత్వాల, పాలకుల కర్రపెత్తనంపై ఆన్లైన్ వీరులు ఆఫ్‌లైన్‌లో ఆందోళనలకు దిగితే ఎలా ఉంటుందో నవతరం రుచిచూపింది. ఈ నవయువత నిరసన గళాల ధాటికి నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దె దిగాల్సి వచ్చింది. జెన్–జెడ్ ఆందోళనలు నేపాల్‌కే పరిమితం కాలేదు. ఇండొనేసియా మొదలుకుని మడగాస్కర్, బల్గేరియా మీదుగా పెరు, మెక్సికో దాకా విస్తరించాయి.జి - హాంకాంగ్ అగ్ని ప్రమాదంఅగ్నిగోళంలా మండిపోతున్న ఆకాశహర్మ్యం. దానికేసి వేలెత్తి చూపుతూ, తన భార్య అందులో చిక్కుబడిందంటూ విలపిస్తున్న వృద్ధుని ఫొటో. ఇటీవల ఆన్లైన్లో వారాల తరబడి వైరల్‌గా మారిన చిత్రమిది. అందుకు కారణమైన హాంకాంగ్‌లోని వాంగ్‌ఫుక్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం 160 మందిని పొట్టనపెట్టుకుంది. 40 గంటలకు పైగా శ్రమిస్తేనే గానీ మంటలు అదుపులోకి రాలేదు.హెచ్ - ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్12 రోజుల యుద్ధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ పోరు ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, క్షిపణి దాడులు ఇరాన్ సైనిక వ్యవస్థలతో పాటు అణు వ్యవస్థలనూ తీవ్రంగా నష్టపరిచాయి. ఇరాన్‌పై బంకర్ బస్టర్ బాంబులేసి అమెరికా యుద్ధజ్వాలల్లో చలికాచుకుంది. తర్వాత తీరిగ్గా తానే సంధి చేసి జబ్బలు చరుచుకుంది.జె జగ్దీప్ ధన్ఖడ్మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ధన్‌ఖడ్. ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్‌గా సభలో చురుగ్గా వ్యవహరిస్తూ, అధికార పక్షానికి పెట్టని కోటగా నిలుస్తూ వచ్చిన ఆయన రాజీనామా సంచలనమే సృష్టించింది. ఇలా తప్పుకున్న తొలి ఉపరాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. పలు అంశాలపై కేంద్రంతో ఆయనకు కొంతకాలంగా అంతరం పెరుగుతూ వచ్చిందంటారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రాజ్యసభలో విపక్షాలిచ్చిన నోటీసును ధన్‌ఖడ్ స్వీకరించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టడం రాజీనామాకు తక్షణ కారణంగా నిలిచిందని అంటారు.కె కర్ణాటకలో సిద్ధూ వర్సెస్ డీకే కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత పవర్ పాలిటిక్స్ కుస్తీ పోటీలను తలపిస్తున్నాయి. గద్దె దిగేందుకు సీఎం సిద్ధరామయ్య ససేమిరా అంటుండటం, ఒప్పందం ప్రకారం కురీ్చని తనకు అప్పగించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పట్టుబడుతుండటం అధిష్టానానికి తీరని తలనొప్పిగా మారింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగేలా హైకమాండే ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో ఇప్పుడు తన వంతు వచ్చిందన్నది డీకే వాదన.ఎల్ - లౌరే దోపిడీ ఈ శతాబ్దంలోనే అతి పెద్ద దోపిడీగా సంచలనం సృష్టించింది. పారిస్‌లోని లౌరే ఆర్ట్స్ గ్యాలరీలోకి అక్టోబర్ 19న ఆదివారం వేళ నలుగురు దోపిడీ దొంగలు చొరబడ్డారు. అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యమున్న 8 అమూల్య ఆభరణాలను కాజేశారు. వాటి విలువ ఏకంగా 10 కోట్ల డాలర్లుగా తేలింది. ఇంతటి దోపిడీని దొంగలు కేవలం ఏడంటే 7 నిమిషాల్లో పని ముగించి జారుకోవడం విశేషం. ఎం - మోదీ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ మరింత పెరిగింది. నిజానికి గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీని నిలబెట్టుకోకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. జేడీ (యూ) వంటి పారీ్టల మద్దతు కీలకంగా మారడంతో మోదీకి ఇక కష్టకాలమేనన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ కీలకమైన ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాలతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపైనా మోదీ పేరుప్రఖ్యాతులు మరింతగా పెరిగాయి. జీ7తో పాటు ఏ శిఖరాగ్ర సదస్సులోనైనా ఆయనే ప్రధాన ఆకర్షణగా మారుతున్న పరిస్థితి!ఎన్ - నెట్‌ఫ్లిక్స్–వార్నర్ బ్రదర్స్ డీల్ ప్రపంచవ్యాప్తంగా వినోదపు తీరుతెన్నులనే సమూలంగా మార్చేయగల పరిణామంగా అంతా పేర్కొంటున్న ఒప్పందమిది. వార్నర్ బ్రదర్స్ టీవీ స్టూడియోలతో పాటు కీలకమైన స్ట్రీమింగ్ విభాగాన్ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 6.47 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది! హ్యారీపోటర్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, గేమ్ ఆఫ్ థోర్న్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ సిరీస్‌లతో పాటు స్కూబీ డూ, టామ్ అండ్ జెర్రీ కామిక్స్, హెచ్‌బీఓ మాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫాం, డిస్కవరీ చానల్ వంటివన్నీ వార్నర్ నుంచి నెట్‌ఫ్లిక్స్ సొంతమవుతాయి. ఈ దెబ్బకు చాలా దేశాల్లో సినిమా థియేటర్లు మూతబడటం ఖాయమన్న అంచనాలున్నాయి. ఓ - ఆపరేషన్ సిందూర్ మే 7 తెల్లవారుజాము. బైసారన్ లోయలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన సైన్యం కొట్టిన దెబ్బకు దాయాది గింగిరాలు తిరిగిన రోజు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వందలాది ముష్కరులను హతమార్చి భరతమాతకు రక్తసిందూరం దిద్దిన రోజు. సరిహద్దుల వెంబడి చిన్నాచితకా దాడులతో ఒకట్రెండు రోజులు ప్రతిఘటిస్తున్నట్టు నటించినా, మన దెబ్బకు కీలక వైమానిక స్థావరాలన్నీ వరుసబెట్టి ధ్వంసం కావడంతో మూడో నాటికే పాక్ కాళ్లబేరానికి వచ్చి సంధి చేసుకుంది. పి - పహల్గాం ఉగ్ర దాడి ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్‌లోని పహల్గాం ప్రాంతం అమాయక పర్యాటకుల రక్తంతో ఎరుపెక్కింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందువులనే లక్ష్యం చేసుకుంటూ ఉన్మాదులు హత్యాకాండకు తెగబడ్డారు. వారిని పేర్లడిగి మరీ కాల్చి చంపారు. దేశమంతటినీ ఆగ్రహావేశాలకు లోను చేసిన ఈ దారుణం ఆపరేషన్ సిందూర్‌కు దారితీసింది.క్యూ - క్వైట్, పిగ్గీ! మహిళా జర్నలిస్టులను అవమానించే దుర్లక్షణం ట్రంప్‌ను ఓ పట్టాన వదిలేలా లేదు. ఎప్స్టీన్ వివాదానికి సంబంధించి ప్రశ్నించిన బ్లూంబర్గ్ న్యూస్ జర్నలిస్టు కేథరిన్ లూసీపై ఆయన దారుణంగా నోరు పారేసుకున్నారు. అదే అంశంపై ఆమె రెట్టించడంతో ఉక్రోషానికి లోనై ‘క్వైట్, క్వైట్, పిగ్గీ!’అంటూ అవమానకర పదజాలం వాడుతూ అరుపులకు దిగారు. సదరు వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ట్రంప్ తీరును అంతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘క్వైట్, పిగ్గీ’ హా‹Ùట్యాగ్‌తో నెటిజన్లు హోరెత్తించారు. ట్రంప్‌ను గేలి చేస్తూ దీనిపై మీమ్లూ ఇంటర్నెట్ను ముంచెత్తాయి. ఆర్ - రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాం«దీకి 2025 కష్టకాలంగానే సాగింది. విపక్ష నేత పదవికి న్యాయం చేయడంలో ఆయన విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఢిల్లీతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ సోదిలో కూడా లేకుండాపోవడం రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలకు తావిచ్చింది. వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన సోదరి ప్రియాంకా పారీ్టలో ఇక మరింత ‘క్రియాశీలక’ పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పలువురు కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్న పరిస్థితి! ఎస్ - సెంగర్ అత్యాచార కేసు తీర్పు సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్ తాజాగా మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. అతని జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి ఒడిగట్టడమే గాక న్యాయ పోరాటానికి దిగిన తన తండ్రిని కూడా చంపించిన సెంగర్‌కు ఉరిశిక్ష పడేదాకా వదిలేది లేదని బాధితురాలు అన్నారు.ఎక్స్ - షీ జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ ఏడాది చాలారకాలుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ టారిఫ్‌లకు బెదరకుండా అమెరికాపై అంతకుమించిన స్థాయిలో టారిఫ్‌లు బాదారు. ఎన్నడూ లేనట్టుగా మోదీతో సాన్నిహిత్యం పెంచుకుని భారత్‌నూ ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నవ్వులు చిందిస్తున్న ఫొటో అయితే ట్రంప్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. వై - యమున ప్రక్షాళన నానాటికీ కాలుష్య కాసారంగా మారుతున్న యమునా నదిని తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఏకంగా రూ.57 వేల కోట్లతో మాస్టర్ ప్లానే ప్రకటించింది. దేశ రాజధానిలో మురుగునీటి శుద్ధి సామర్థ్యం పెంపు కోసం 9 ప్రాజెక్టులను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ పరిధిలోని కేవలం 22 కిలోమీటర్ల నిడివే యమున కాలుష్యంలో ఏకంగా 80 శాతానికి కారణంగా మారుతోంది! జెడ్ - జొహ్రాన్ మమ్దానీ ఒక మేయర్ ఎన్నికకు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా క్రేజ్ వచ్చిన సందర్భం బహుశా ఇదొక్కటేనేమో! న్యూయార్క్ మేయర్‌గా 34 ఏళ్ల ముస్లిం విద్యాధికుడు జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక పలు రకాలుగా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఆయన్ను ఓడించేందుకు ట్రంప్ అపార శక్తియుక్తులన్నీ వినియోగించినా లాభం లేకపోయింది. మమ్దానీ ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.టి - టారిఫ్‌లు ఈ ఏడాదంతా దేశదేశాలను వణికించిన పదమిది. ట్రంప్ ఎడాపెడా పెంచిన టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తొలుత బెంబేలెత్తిపోయాయి. కానీ చైనా ప్రతీకార టారిఫ్‌ల దెబ్బకు ట్రంపే చివరికి కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది. తర్వాత ఒక్కొక్క దేశంపైనా టారిఫ్‌లను ఇష్టానికి పెంచుతూ, తగ్గిస్తూ తన స్థాయినీ, అమెరికా స్థాయినీ పలుచన చేసుకున్నారాయన. భారత్‌పైనా ఒక దశలో 50 శాతం దాకా భారీ టారిఫ్‌లు విధించినా, వాటిని వెనక్కు తీసుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారు.యు - ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రపంచానికి ఈ ఏడాది కాస్త ఉపశమనం ఇచ్చిన ఉదంతమిది. మూడున్నరేళ్ల పై చిలుకు యుద్ధానికి తెర దించేందుకు రష్యా సుముఖత వెలిబుచ్చడంతో ఇరు దేశాలతో అమెరికా అత్యున్నత స్థాయిలో శాంతి చర్చలు జరుపుతోంది. ఈ శాంతి వీచికల కారణంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ధాటి బాగా తగ్గింది.వి - వెనెజులా ధిక్కారం వెనెజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన తెంపరి ట్రంప్, వాటిని సొంతం చేసుకునేందుకు అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెనకాడబోనని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చారు. ఆ దేశపు చమురు నౌకలను నానా సాకులతో దిగ్బంధిస్తూ, పేల్చేస్తూ కల్లోలం సృష్టిస్తున్నారు. ఏదేమైనా అమెరికాకు తలొగ్గేదే లేదని అధ్యక్షుడు మదురో ధిక్కార స్వరం వినిపించడంతో ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.డబ్ల్యూ - వక్ఫ్ సవరణ చట్టం మోదీ సర్కారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వివాదాలు చుట్టుముట్టాయి. వక్ఫ్ ఆస్తులపై కర్రపెత్తనమే దీని లక్ష్యమని ముస్లిం బోర్డులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పుంఖానుపుంఖాలుగా పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (దానం) ఇవ్వొచ్చు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిళ్లలో ఇద్దరు ముస్లిమేతర సభ్యుల వంటి నిబంధనలన్నీ వక్ఫ్ ఆస్తుల స్వా«దీనం కోసం పెట్టినవేనని దుయ్యబడుతున్నాయి. సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెట్టగా మరికొన్నింటిపై పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ కేసులో తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్
2025..1.22 లక్షలు ఉద్యోగాలు ఔట్..
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికరంగ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ చిచ్చు ప్రధానంగా ఐటీ రంగంపైనే ప్రభావం చూపుతోంది. కంపె నీలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పునర్ వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో ఉద్యోగుల తీసివేతలు తప్పడం లేదన్నది పరిశ్రమ వర్గాల మాట. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొంత కాలంపాటు టెక్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా నియామ కాలు చేపట్టాయి. అయితే స్థూల ఆర్థిక ఒత్తిళ్లతోకొన్నాళ్లుగా మార్కెట్ దిద్దుబాటుకు గురవుతోంది. ఇటీవలి కాలంలో ఏఐ, ఆటోమేషన్ వైపు పరిశ్రమ మళ్లుతోంది. దీని ఫలితంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 257 టెక్ సంస్థలు 1.22 లక్షల మందికి ఉద్వాసన పలికాయని ఉద్యోగుల తొలగింపులను ట్రాక్ చేస్తున్న లేఆఫ్స్. ఎఫ్‌వైఐ వెబ్సైట్ వెల్లడించింది. సిబ్బందిని ఇంటికి సాగనంపిన సంస్థల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజాలూ ఉన్నాయి. కానీ 2023తో పోలిస్తే ఈ తీసివేతలు సగానికంటే తక్కువే కావ డం గమనార్హం. మరో సాంకేతిక దిగ్గజం యాపిల్ సైతం డజన్లకొద్దీ సేల్స్ సిబ్బందిని కుదించింది. ద్రవ్యోల్బణం, సుంకాల కారణంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వే షిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలా పాలను నిర్వహించడం, ఏఐపై ఆధారపడటం కంపెనీలకు ఆకర్షణీయమైన స్వల్పకాలిక పరిష్కారంగా కనిపిస్తోంది.లేఆఫ్స్‌కు ప్రధాన కారణాలు ఇవీ..1. ఓవర్ హైరింగ్–మార్కెట్ కరెక్షన్ కోవిడ్–19 సమయంలో ఈ–కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రిమోట్ వర్క్ టూల్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో టెక్ పరిశ్రమలో భారీ నియామకాలకు దారితీసింది. ప్రస్తుతం మార్కెట్ యథాతథ స్థితికి చేరుకోవడం, డిమాండ్ వృద్ధి సాధారణం కావడంతో కంపెనీలు తాము అధిక సిబ్బందితో ఉన్నట్లు గుర్తించాయి. ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా శ్రామిక శక్తిని సరైన పరిమాణంలో ఉపయోగిస్తున్నాయి.2. పెట్టుబడిదారుల డిమాండ్స్ అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాలు వంటి ప్రపంచ ఆర్థిక ఎదురుగాలులు నిర్వహణ ఖర్చులను పెంచడంతోపాటు లాభాలను తగ్గించాయి. పెట్టుబడి దారులు ఇప్పుడు లాభదాయకత, ఆర్థిక క్రమశిక్ష ణను కోరుతున్నారు. ఖర్చులను తగ్గించడానికి, లాభాలను మెరుగుపరచడానికి తొలగింపులను కంపెనీలు తక్షణ మార్గంగా భావిస్తున్నాయి.3. ఏఐ, ఆటోమేషన్ వైపు పయనం ఏఐ, ఆటోమేషన్ విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి, స్వీకరణ ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణం. కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలు, పరిశోధనలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. నిధులు సమకూర్చ డానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో రోజువారీ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తోంది. కార్మికుల అవసరాన్ని తగ్గిస్తోంది. ఐటీ పరిశ్రమలో నైపుణ్యాల పునఃసమీక్షకు దారితీస్తోంది.4. సమర్థతకు పెద్దపీట అనేక టెక్ దిగ్గజాలు నిర్వహణ సామర్థ్యం, వేగంపై దృష్టిసారించాయి. భవిష్యత్ వృద్ధి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా అప్రాధాన్య ప్రాజెక్టులు, పేలవమైన పనితీరుగల యూనిట్లను తగ్గించుకుంటున్నాయి.5. నిర్దిష్ట రంగాల్లో తగ్గుతున్న డిమాండ్ వ్యక్తిగత కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, సంప్రదాయ నెట్వర్కింగ్ హార్డ్‌వేర్ వంటి కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాటితో ముడిపడి ఉన్న నిర్దిష్ట వ్యాపార యూనిట్లలో ఉద్యోగాల కోతలు ఏర్పడుతున్నాయి.
జనవరిలోనూ గజగజే
'పాలమూరు'పై విచారణ
టాప్స్‌లో జ్యోతి సురేఖ
అసలు మనం ఇప్పటివరకూ తేడాలు లేకుండా జాబితానే తయారు చేయలేద్సార్!
మెరుగయ్యామా?
జోరుగా జీఎస్టీ వసూళ్లు
పెన్షన్ ఫండ్ ఏర్పాటుకు బ్యాంక్‌లకు అనుమతి
బిలియన్ల బిడ్ వార్
ట్రంప్ అడుగుజాడల్లో చైనా
పొగాకు మీద పన్నుల మోత
తవ్వకాల్లో 500 ఏళ్ల ఓడ.. బంగారం ఎంతుందంటే..!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంటే.. ఇంకా ఏమీ చేయడం లేదని అంటారేంటయ్యా!
అమ్మనాన్న విడాకులు.. రాధికనే కారణమని తిట్టుకున్నా: వరలక్ష్మి
‘హ్యాపీ న్యూ ఇయర్’
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
ఈ రాశి వారికి వృత్తులు, వ్యాపారాలలో పురోగతి
వారి కలయికతో చిక్కుల్లో ఆర్మీ చీఫ్ మునీర్..!
అసలు మన పార్టీని గుర్తిస్తే కదా వివరాలు చెప్పడానికి..!
కట్టల కొద్దీ నగదు... సూట్‌కేస్ నిండా నగలు
యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
రెండు లక్షలమంది కొన్న కారు ఇది
రోడ్డునపడ్డ బతుకులు
బ్యాంక్‌కు కన్నమేసి భారీ చోరీ
దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’!
రెండు హైవే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
సంవత్సరాంతంలోనూ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్
వెండి మెరుపులు
క్రైమ్
మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గత కొంతకాలంగా విచ్చలవిడిగా సాగుతున్న హనీ ట్రాప్ దందాకు పోలీసులు బ్రేక్ వేశారు. ధనవంతులు, వ్యాపారులను టార్గెట్ చేసి ఉచ్చులో పడేసి నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ప్రధాన సూత్రధారి రాజుకుమార్, స్వప్నతో పాటు కొందరు రౌడీ షీటర్ల సహకారంతో ఈ దందాను నిర్వహిస్తున్నాడు. పట్టణంలో ఉన్న ధనవంతులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, పరిచయాలు పెంచి వారిని ఓ ఇంటికి లేదా లాడ్జ్‌కు రప్పించి హనీ ట్రాప్‌లోకి దించేవారు. అనంతరం రహస్యంగా నగ్న వీడియోలు తీసేవారు. వాటిని బయటపెడతామంటూ బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.ఇటీవల ఈ ముఠా మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. కాగా వీరి బెదిరింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుగా దర్యాప్తు చేపట్టారు. ముఠా కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు అయిన వారి నుంచి మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డులు సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఈ తరహా బ్లాక్మెయిల్ ఘటనలపై ప్రజలు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మెట్పల్లి పట్టణంలో కలకలం రేపిన ఈ హనీ ట్రాప్ కేసు, ఇలాంటి నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని ఇచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ!
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ప్రియుడు ఆకాష్ మోసం చేశాడంటూ ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె రికార్డు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.హాత్రాస్లోని ఆవాస్ వికాస్ కాలనీలో నివసించే కామిని శర్మ, ప్రియుడు ఆకాష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ‘‘నేను ఎపుడూ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. కానీ నాకు చావు మరో ఆప్షన్ మిగలకుండా చేశావ్. బలహీను రాల్నిచేసి ఆడుకున్నావ్...ఎవరి జీవితంతో ఆడుకోవడ్డం మీ ఇంట్లో వాళ్లు ఎపుడూ చెప్పలేదా.. కానీ మానవత్వం అనేది బతికి ఉంటే నీకు కూడా నాలాంటి గతే పడుతుంది. ఎందుకంటే నేను ఎవర్నీ మోసం చేయలేదు.. నిన్ను చాలా ప్రేమించాను’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. అంతేకాదు అమ్మా నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ తల్లివి. నా సూసైడ్‌కి బిహార్ వాలా ఆకాష్ కారణం అని తన వీడియోలో పేర్కొంది. అలాగే తన అత్తకు కూడా క్షమాపణలు చెప్పింది. నీలాంటి అత్త యూనివర్స్‌లో ఎక్కడా దొరకదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.Tragic incident in Hathras, UP: Girl records emotional video blaming her Ex-Boyfriend Aakash for forcing her ("You've forced me so much... I AM SORRY MUMMA. You are the BEST Mumma..."), then d!es by suicide. Heartbreaking. 💔pic.twitter.com/7f29omeO3i— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2025 కామినీ సోమవారం మధ్యాహ్నం విషం సేవించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంత్యక్రియల తర్వాత, కుటుంబ సభ్యులకు కామిని వీడియో గురించి తెలిసింది. దీంతో కామిని తల్లి రష్మి శర్మ కొత్వాలి సదర్‌లో ఫిర్యాదు చేసింది. కుమార్తె మరణానికి కారణమైన తన కుమార్తె ప్రియుడు ఆకాష్‌పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..!
బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..!
ముంబైలో జరిగిన ఒక ఘోర బస్సు ప్రమాదం ఒక బాలనటి కుటుంబంలోనూ, ఆ చిన్నారి జీవితంలో మర్చిపోలేని విషాదాన్ని నింపింది. ఒక మూవీ ఆడిషన్కోసం వెళ్లిన 13 ఏళ్ల మరాఠీ బాలనటి చాలా ఉత్సాహంగా తిరిగి ఇంటికి బయలుదేరింది. కానీ అదే తన జీవితంలో అంతులేని శోకాన్ని మిగులుస్తుందని ఊహించలేదు. కళ్లముందే కన్న తల్లి ప్రాణాలు పోతోంటే.. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోయింది. పదే పదే ఆ దృశ్యాల్ని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.పోలీసులు అందించిన వివరాల ప్రకారం ముంబైలోని భాండుప్‌లో బెస్ట్ రూట్ 606లో ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అదుపు తప్పి బస్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. 35 ఏళ్ల ప్రణీత సందీప్ రసం, తన కుమార్తెను ఆడిషన్ కోసం దాదార్ వెళ్లి తిరిగి వస్తూ, భాండుప్ రైల్వే స్టేషన్ సమీపంలో దిగి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో బస్సు అదుపు తప్పిన బెస్ట్ ఎలక్ట్రిక్ బస్ తమవైపు దూసుకు రావడాన్ని గ్రహించిన తల్లి ప్రణిత, కుమార్తెను శక్తి కొలదీ పక్కకు తోసేసింది.క్షణాల్లో అంతా జరిగిపోయింది.తల్లి పక్కకు నెట్టివేయడంతో బాలనటి ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకుంది. కానీ ప్రణీత మాత్రం బస్సు చక్రాల కింద నలిగి పోయింది. తన కళ్లముందు తల్లి విగతజీవిగా మారిపోవడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఎలాగోలా తేరుకుని, వేరే వారి ఫోన్ ద్వారా తండ్రి సందీప్‌కు ఫోన్ చేసింది. ఆయన సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ప్రణీత గాయాలతో మరణించింది. తల్లి తనను కాపాడుతూ చనిపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాలనటిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. చికిత్స , కౌన్సెలింగ్ కోసం ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రణీత కుమార్తె మరాఠీ టీవీ సీరియల్స్‌లో చిన్న సహాయక పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హోంవర్క్, షూటింగ్‌లను మేనేజ్ చేస్తూ నటించి పేరు తెచ్చుకున్న ఆమె ప్రతిభ వెనుక ప్రణిత కృషిచాలా ఉందని పొరుగు వారు గుర్తు చేసుకున్నారు. పాపను ఆడిషన్స్, సెట్స్‌కు తీసుకెళుతూ ఇంటిని చక్కబెట్టుకొనేదని చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రణీతతోపాటు, మాన్సి మేఘశ్యాం గురవ్, 49, వర్ష సావంత్, 25, మరియు ప్రశాంత్ దత్తు షిండే, 45. మరో పదకొండు మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్, 52 ఏళ్ల సంతోష్ రమేష్ సావంత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.చదవండి: 2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలురూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనం విఖ్రోలి డిపోకు అనుబంధంగా ఉన్న రూట్ A-606 (సీనియర్ 34)లో నడుస్తున్న వెట్-లీజ్ ఒలెక్ట్రా బస్సు. సంఘటన జరిగిన సమయంలో డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ (52), కండక్టర్ భగవాన్ భావు ఘరే (47) విధుల్లో ఉన్నారని, ఇద్దరూ బెస్ట్ సిబ్బంది గా భావిస్తున్నారు. మరోవైపుమృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
మోసం చేశారు.. వేధిస్తున్నారు!
నంద్యాల: తమను మోసం చేశారని, అంతేకాకుండా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఎస్పీ సునీల్ షెరాన్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. తన భర్త బాలుగ్రం అనే వ్యక్తి వేరే అమ్మాయిలతో తిరుగుతూ మోసం చేస్తున్నాడని, ఈఎంఐ చెల్లించాని వేధిస్తున్నాడని ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేశారు. తాను నంద్యాలలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో పనిచేయగా జీతం ఇవ్వకుండా మోసం చేశారని మల్లికార్జునయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు. మొత్తం 75 ఫిర్యాదులు రాగా వాటికి చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
వీడియోలు
31st నైట్ బిర్యానీ తిని వ్యక్తి మృతి.. ఆసుపత్రిలో 16 మంది !
గదిలోకి పిలిచి.. నగ్నంగా వీడియోలతో బ్లాక్ మెయిల్
2026 కొత్త ఏడాది.. కొత్త జోష్.. మందుబాబుల వీరంగం
కిక్కిరిసిన పెద్దమ్మ తల్లి ఆలయం
కానిస్టేబుల్ చెంప మీద కొట్టిండు.. రోడ్డుపై పడుకుని యువకుడి రచ్చ రచ్చ
న్యూ ఇయర్.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ
ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..
ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు
