breaking news
Nirmal
-
నాలుగు రోజులుగా నిత్యం వర్షాలు
జిల్లాను వరణుడు వీడడం లేదు. నాలుగు రోజులుగా నిత్యం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు దెబ్బతింటున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రాత్రి నిర్మల్, నర్సాపూర్, కుంటాల మండలాల్లో భారీ వర్షం కురిసింది. నర్సాపూర్(జి) మండలంలో ఈదురుగాలులతో వర్షం కురవడంతో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. సోయా, వరి పంటలు దెబ్బతిన్నాయి. నందన్ ఎక్స్‌రోడ్డు వద్ద బీటీరోడ్డు కోతకు గురైంది. కాళేశ్వరం ప్రాజె క్టు – 27వ ప్యాకేజీలో నిర్మించిన అక్విడెక్ట్ పిల్లర్ కుంగి బీటలు వారింది. నర్సాపూర్ (జి)శివారులో విద్యుత్ స్తంభం విరిగింది. మండలంలో 72.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏఎస్వో శ్రీరామ్ తెలిపారు. నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్, ముఠాపూర్, వెంకటాపూర్, చిట్యాల, ముజ్గి గ్రామాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై ఆరబెట్టిన మక్కలు, మొక్కజొన్న కంకులు తడిసిపోయా యి. సోయా పంట కూడా తడిసింది. వర్షాలకు ముధోల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పండిస్తున్న పత్తి పంట దెబ్బతింటోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాయలు ఎర్రబడి రాలిపోతున్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు.– నర్సాపూర్(జి)/ముధోల్/ సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
ఆశ వర్కర్లకు కంటి పరీక్షలు
నిర్మల్‌చైన్‌గేట్: వరల్డ్ ఐ సైట్ డే పురస్కరించుకుని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో మంగళవారం ఆశ కార్యకర్తలకు కంటి పరీక్షల శిబిరం ఏర్పా టు చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించడానికి కృషి చేస్తున్న ఆశా కార్యకర్తల కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ కంటి స్కీన్రింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైద్య విధాన పరిషత్ జిల్లా సూపరిండెంట్ డాక్టర్ సురేశ్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ లక్ష్మీకాంత్, ఎల్వీ ప్రసాద్ కోఆర్డినేటర్ సాయన్న , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పులకించిన పోరుగడ్డ
కెరమెరి(ఆసిఫాబాద్): జల్.. జంగల్.. జమీన్ కోసం పోరుసలిపి అసువులు బాసిన ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం స్మరణతో పోరుగడ్డ పులకించింది. రణభూమి జోడేఘాట్‌లో వీరుడి 85వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై భీం విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపైకి ఎవరూ వెళ్లలేదు. దర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. భీం ఆశయాలు నెరవేర్చుతాం: మంత్రులు కుమురం భీం ఆశయాలు నెరవేర్చుతామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివాసీలను సంఘటితం చేసి వారి హక్కు ల సాధనకు పోరాడిన వీరుడు కుమురంభీం అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. 1935 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి బలగాలను ఎదురించారని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి రూ.740 కోట్లతో రోడ్లు, గిరిజన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. విద్య, ఆశ్రమ పాఠశాలలను మరింత తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వేదికపై మాట్లాడలేకపోతున్నామని చెప్పారు. భీం స్ఫూర్తితో ముందుకు సాగుదాం: కలెక్టర్ ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుదామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. భీం వర్ధంతికి ఉచిత బస్సు సౌకర్యం, భోజనం తదితర వసతులు కల్పించామని చెప్పారు. అనంతరం భీం మనుమడు కుమురం సోనేరావు కుటుంబానికి కలెక్టర్ నూతన వస్త్రాలు అందించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పాటగూడ, జోడేఘాట్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుస్సాడీ నృత్యాలు కనువిందు చేశాయి. ఐసీడీఎస్, రెవెన్యూ, ఐటీడీఏ, సఖీ, వైద్యారోగ్యశాఖ, కొలాం అభివృద్ధి, ఇప్పుపూలు, విస్తరాకుల తయారీ తదితర స్టాళ్లు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. భీంకు సంప్రదాయపూజలు కుమురంభీంకు ఆయన వారసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ముందుగా ఆచార, వ్యవహారాలతో పాత జెండాలు తీసేసి కొత్త జెండాలు ఆవిష్కరించారు. అంతా వరుసక్రమంలో నిల్చుని జెండాలకు మొక్కారు. ధూప, దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కోడి, మేకలతో జాతకం చూశారు. నివాళులర్పించినవారిలో.. ‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు చేయగా భీం ఆరాధికులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. మంత్రులు, కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్‌పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, భీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్ తదితరులు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు. -
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
లక్ష్మణచాంద: తెల్లబంగారంగా పిలిచే పత్తి రైతు ఆరుగాలం శ్రమించిన మార్కెట్లో మాత్రం దళారుల చేతిలో చిత్తవుతున్నాడు. ఏటా పంట అమ్మే సమయంలో దళారుల చేతిలో మోసం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పత్తి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతంలో సరైన మద్దతు ధరలు లేకపోవడంతోపాటు దళారుల వ్యవస్థ కారణంగా నష్టపోయేవారు. దీనిని అరికట్టడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కపాస్ కిసాన్ యాప్.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో రూపొందించారు ఈ మొబైల్ యాప్, రైతులకు పత్తి దిగుమతి, అమ్మకాల ప్రక్రియలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. ఇది పారదర్శకతను పెంచి, కనీస మద్దతు ధర పొందాలనేది ఉద్దేశ్యం. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘కపాస్ కిసాన్ యాప్‘ అని సర్చ్ చేసి, డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత, పేరు, ఆధార్ నంబర్, భూమి వివరాలు, పత్తి సంబంధిత రికార్డులు అప్లోడ్ చేయాలి. నమోదు చేసుకున్న రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి విక్రయించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాన్ని ముందుగానే బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. రైతులకు అవగాహన.. జిల్లాలో ఈ సారి 1.50 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు చేశారు. ఈ క్రమంలో కొత్త యాప్‌తో రైతులు ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. ఈ యాప్‌పై ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వ్యవసాధికారులకు సోమవారం అవగాహన కల్పించారు. ముందుగా విద్యావంతులైన రైతులకు అవగాహన కల్పించి వారి ద్వారా మిగిలిన రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం లక్ష్మణచాంద రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు ఈ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా, రైతులకు మార్కెట్ లో తమ లావాదేవీలు పారదర్శకంగా, సులభంగా జరగనున్నాయి. రైతుల ఆదాయం పెరిగే దిశగా కేంద్రం తీసుకునే ఈ చర్యలు, గత నష్టాలపై పోరాటం చేస్తాయని భావిస్తున్నారు. ప్రయోజనాలు ఇవే... -
విట్టోలి చెరువుకు గండి
ముధోల్: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఈ క్రమంలో మండలంలోని విట్టోలి రాళ్ల చెరువులోకి సోమవారం రాత్రి భారీగా వరద రావడంతో కట్ట తెగిపోయింది. దీంతో కింద ఉన్న పత్తి, వరి పంటలు నీటమునిగాయి. చేతికి వచ్చిన సోయా పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అధికారులు రాళ్ల చెరువుకు యుద్ధ ప్రతిపాదికగా మరమ్మతులు చేపట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. చెరువుకు గండి పడే అవకాశం ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రణాళిక ప్రకారం చదవాలి
లక్ష్మణచాంద: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు సలహాలు, సూచనలు చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించా లన్నారు. ప్రతీ వారం స్లిప్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రాగి జావా వారంలో రెండు రోజులు విద్యార్థులకు అందించాలని కోరారు. పాఠశాలలోని పలు రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. ఫార్మేటివ్ 1, 2 మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆర్.అశోక్‌వర్మ, తహసీల్దార్ శ్రీలత, మండల అభివృద్ధి అధికారి రాధ, సీఆర్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
డీఅడిక్షన్ సెంటర్ ప్రారంభం
నిర్మల్‌టౌన్: జిల్లాఏరియా ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్‌ను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ సెక్రెటరీ రాధిక మంగళవారం ప్రారంభించారు. సెంట ర్ సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మద్యం, మత్తుపదార్థాలకు బానిసైనవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. డాక్టర్ కిరణ్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వొద్దు భైంసాటౌన్: పట్టణంలోని స్వామి వివేకానంద అనాథ పిల్లల ఆవాసాన్ని రాధిక మంగళవారం సందర్శించారు. పరిసరాలు, విద్యార్థుల గదులు, వంటగది, వసతులు పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఆవాసం అధ్యక్షుడు శైలేశ్, ప్రముఖ్ లింగారెడ్డి ఉన్నారు. -
ఘనంగా వాల్మీకి జయంతి
నిర్మల్‌చైన్‌గేట్: వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామాయణం రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. వాల్మీకి రచనల్లోని విలువలను అందరూ పాటించాలని పేర్కొన్నారు. వేడుకల్లో ఆర్డీవో రత్నకళ్యాణి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధి కారి శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, మత్స్యశాఖ ఏడీ రాజానర్సయ్య, పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహారెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్‌సింగ్, ఎల్డీఎం.రామ్‌గోపాల్, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ జానకీ షర్మిల వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. వేడుకల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు -
ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుమురంభీం
నిర్మల్‌టౌన్: ఆదివాసీల ఆత్మగౌర ప్రతీక కుమురంభీం అని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య అన్నారు. మంగళవారం కుమురంభీం 85వ వర్ధంతి సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా కమిటీ నాయకులు జిల్లా కేంద్రంలోని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భూమయ్య మాట్లాడుతూ.. జల్.. జంగల్.. జమీన్ నినాదంతో నిజాం పాలకులకు వ్యతిరేకంగా కుమురంభీం పోరాడారని తెలిపారు. ఆదివాసీల హక్కులు, అణగారిన వర్గాల స్వయంపాలన, స్వాభిమానం కోసం పోరాడని యోధుడు అని కొనియాడారు. నిర్మల్‌లో ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తొడసం గోవర్ధన్, ఆదివాసీ నాయకులు మల్లేశ్, సాయన్న, రాజేశ్వర్, నారాయణ, సాయినాథ్, అత్రం రాజు, తొడసం శంభు పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● డీఎఫ్‌వో నాగిని భాను నిర్మల్‌టౌన్: వన్యప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యత అని, దీంతో పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని జిల్లా అటవీశాఖ అధికారి నాగిని భాను అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో వన్యప్రాణి సప్తహ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అటవీ శాఖ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. అటవీ జంతువుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్ ఎఫ్ఆర్వో రామకృష్ణ, అధికారులు అరుణ్‌కుమార్, నజీర్‌ఖాన్, సంతోష్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు
నిర్మల్‌టౌన్: జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జుమ్మేరాత్‌పేట్ హైస్కూల్లో సోమవారం కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ గ్రేడింగ్ టెస్ట్‌లో జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు నేషనల్ బ్లాక్‌బెల్ట్ (3వ సాదన్)కు అర్హులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ ఎగ్జామినర్ రాపోలు సుదర్శన్ అర్హులైన విద్యార్థులకు బెల్ట్‌లు, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ జిల్లా చీఫ్ ఎగ్జామినర్ తేజందర్ సింగ్‌భాటియా, జిల్లా అధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్, టెక్నికల్ డైరెక్టర్ చందుల స్వామి, జిల్లా సెక్రెటరీ అమ్ముల భూషణ్, శిక్షకులు శ్రీకాంత్, కిరణ్, శేఖర్, చిరంజీవి, మనీషా, శివ, మేఘన, అమూల్య తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో గెలవాలి
● మంత్రి జూపల్లి కృష్ణారావు ● ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర్మల్‌టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకునేలా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం మంత్రిని నేతలు శాలువాతో సత్కరించారు. సమావేశంలో మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాలచారి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. -
మసల్గ తండాను సందర్శించిన ఉప వైద్యాధికారి
తానూరు: మండలంలోని మసల్గ తండాను జిల్లా ఉపవైద్యాధికారి ఆకాశ్ సోమవారం సందర్శించారు. గ్రామంలో ఇద్దరు మహిళలు, ఇద్ద రు పురుషులు కిడ్నీ వ్యాధితో బాదపడుతున్నా రు. విషయం తెలుసుకున్న జిల్లా ఉప వైద్యాధి కారి ఆకాశ్, ఆస్పత్రి సిబ్బందితో గ్రామానికి చే రుకుని వారి వివరాలను సేకరించారు. ఆస్పత్రి లో వైద్య పరీక్షలు చేయించుకున్న రిపోర్టులు ప రిశీలించారు. గ్రామంలో మరో నలుగురి రక్త న మూనాలను సేకరించారు. త్వరలో పరీక్షల వి వరాలు వెల్లడిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వ్య క్తిగత శుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత పా టించాలని సూచించారు. ఆయన వెంట సూపర్వైజర్ అబ్దుల్ ఖాసిం, సిబ్బంది ఉన్నారు. -
భీం త్యాగానికి గౌరవం
కెరమెరి(ఆసిఫాబాద్): నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలర్పించిన భీం త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జల్.. జంగల్.. జమీన్.. నినాదంతో పోరాడి అమరుడైన కుమురంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు సమాధి వద్ద పూజలు చేసి, 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. పదివేల మందికి పైగా హాజరు.. ప్రభుత్వం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంతో అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే భీం విగ్రహానికి మెరుగులు దిద్దారు. ట్రాక్టర్లతో పరిసరాలు, పార్కింగ్ స్థలాలు చదును చేయించి.. ప్రజలు కూర్చునేందుకు వీలుగా టెంట్లు వేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. 10వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తుండగా, 12 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్ సైతం సిద్ధం చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీతోపాటు సీఐ, ఆర్ఐలు 8 మంది, ఎస్సైలు 25, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 51 మంది, ఇతర సిబ్బంది 136, డబ్ల్యూపీసీలు 56, హోంగార్డులు 79 మంది, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌తో జోడేఘాట్‌కు చేరుకునే రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ముగ్గురు, సీఆర్టీలు, రెగ్యులర్ ఉపాధ్యాయులు 100 మంది, వంట మనుషులు 70 మంది, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు ఐదుగురు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించారు. ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్ శాఖకు చెందిన సిబ్బంది పది మందిని కేటాయించారు. ఆయా శాఖల సిబ్బంది సోమవారం రాత్రే జోడేఘాట్‌కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను జోడేఘాట్‌కు నడపనున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూ రి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు. అలాగే ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కేవలం భీం విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, పూజలకే పరిమితం కానున్నారు. ఆదివాసీలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు ఏటా నిర్వహించే దర్బారు కోడ్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. -
జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం జిల్లాస్థాయి అండర్–14 బా లురు, అండర్–17 బాల, బాలికలకు బాక్సింగ్ పో టీలను నిర్వహించారు. అండర్–17 బాలుర విభా గంలో ప్రవీణ్(46–48 కిలోలు), సౌర్యన్రెడ్డి(48– 50 కిలోలు ), శ్రీకాంత్(52–57 కిలోలు), అండర్–14 బాలురు విభాగంలో అవయుక్త(28–30 కిలోలు), ధ్రువ(42–44 కిలోల), అద్విత్(44–46 కిలోలు) రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అండర్–17 బాలికల విభాగంలో హారిక(42 కిలోలు), సుహాసిని(42–44 కిలోలు), నిఖిత(44–46 కిలోలు), ఆర్.అక్షయ(46–48 కిలోలు), కీర్తన(48–50 కిలోలు), అభినయ(52–54 కిలోలు), శ్రావణి(63–66 కిలోలు), కవిత(66–70 కిలోలు) ఎంపికయ్యారు. వీరిని ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్ అభినందించారు. -
కోతలకు వానలతో ఆటంకం
భైంసా/భైంసారూరల్: జిల్లాలో సోయా పంట చేతికి వచ్చింది. కోతలు మొదలయ్యాయి. ఈ సమయంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు చేలల్లో నీరు నిలిచి చిత్తడిగా మారుతున్నాయి. దీంతో యంత్రాలతో కోయలేని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాల్లో సాగు చేసిన సోయా పెద్ద ఎత్తున దెబ్బతింది. మొత్తం 72,300 మంది రైతులు ఈ సీజన్లో ఆశతో పంట వేసినా, గత నెల రోజులుగా కుండపోత వానలకు దిగుబడి ఆశలు తగ్గిపోయాయి. వానలే అడ్డంకి ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం సోమవారం వేకువజామున మరింత వేగం అందుకుంది. భైంసా డివిజన్‌తోపాటు పలు మండలాల్లో వర్షం.. సోయా కోతలకు అడ్డంకిగా మారింది. ఎండిపోయిన చేలు వర్షాలకు బురదమయమై పంట కోయడం చిక్కుగా మారింది. ఆకులు రాలిన మొ క్కలు తడిసి ఉబ్బిపోతుండటంతో గింజలు నల్ల బడుతున్నాయి. చైన్ మిషన్లే ఆధారం రైతులు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి చైన్ మిషన్లను అద్దెకు తెచ్చుకొని కో త కొనసాగిస్తున్నారు. గంటకు రూ.2,400 నుంచి రూ.2,800 చెల్లించి బురద నేలల్లోనూ పంట కోయిస్తున్నారు. సాధారణ హార్వెస్టర్లు బరువుతో బురదలో ఇరుక్కుపోతుండగా, తేలికై న చైన్ మిషన్లు పనిచేయడం సులభమవుతోంది. ఒక్కో ఎకరానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతోంది. ఇంకా 70% కోత మిగిలే ఉంది జిల్లాలో 70 శాతం భూముల్లో కోత ఇంకా పూర్తికాలేదు. కోసిన గింజల్లో తేమశాతం పెరిగిపోవడంతో రంగు మారిపోతుంది. వర్షాల కారణంగా కొద్దిసేపట్లోనే నల్లబడిన గింజలు మార్కెట్ విలువ కోల్పోతున్నాయి. వర్షం తగ్గితేనే రైతులు మిగిలిన పంట కోసి, ఆరబెట్టి, అమ్మకాలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. కుంటాలలో భారీ వర్షం.. కుంటాల: మండలంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. కోత దశకు వచ్చిన సోయా దెబ్బతింది. కల్లాల్లో ఉంచిన సోయా తడిసి ముద్దయింది. ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. ఏరాల్సిన పత్తి పంటలో వర్షపు నీరు నిలవడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 24 గంటల్లో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏఎస్వో సాయికృష్ణ తెలిపారు. పంట ఆరబెట్టే సమస్య కోత అనంతరం కల్లాలపై లేదా గ్రామ సమీప రహదారుల పక్కన సామూహికంగా సోయాను ఆరబెడుతున్న రైతులు వానలతో మళ్లీ ఇబ్బంది పడుతున్నారు. టర్పాలిన్లు ఉంచినా లోపలికి నీరు చేరి గింజలు నాని మొలకెత్తుతున్నాయి. దీంతో రైతులు రోజంతా జాగరణ చేసి వర్షం ఆగగానే టర్పాలిన్లు తొలగించి గింజలు ఆరబెడుతున్నారు. నీరు నిలవకుండా కల్లాల చుట్టూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజంతా కల్లాల వద్దే.. పంట కోతలకు వర్షం ఆటంకంగా మారింది. మరోవైపు కోసిన పంట ఆరబెట్టినా.. వర్షానికి తే మ పెరుగుతోంది. గింజ లు రంగు మారుతున్నా యి. దీంతో కుటుంబమంతా కల్లాల వద్దే ఉండి ఆరబెట్టాల్సి వస్తోంది. కొత్త టార్పాలిన్లు కొని కింద వేసి పంటను ఆరబెడుతున్నాం. ప్రతీరోజు సోయా కుప్పలను ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తున్నాం. – దత్త, రైతు మాంజ్రివర్షాలు తగ్గే వరకు ఆగాలి.. జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు ఏదో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది. వర్షంతో చేలన్నీ తేమగా ఉన్నాయి. ఎండలు కాస్తే తేమశాతం తగ్గుతుంది. వర్షాలు తగ్గే వరకూ పంట కోయకపోవడమే మంచిది. ఇప్పుడు పంట కోసినా.. కోసిన పంట ఎండాలన్న ఇబ్బందులు తప్పవు. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
అపార్ నమోదు ఆలస్యం
లక్ష్మణచాంద: విద్యార్థులకు ప్రత్యేక శాశ్వత గుర్తింపు నంబర్ ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ‘ఒకే దేశం–ఒకే విద్యార్థి గుర్తింపు నంబర్‘ అనే నినాదంపై రూపొందిన ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి జీవితాంతం ఒకే అకాడమిక్ నంబర్ ఇవ్వబడుతుంది. జిల్లాలో నమోదులో స్థితి జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రకారం, మొత్తం 1,42,872 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటివరకు 96,157 మంది వివరాలు నమోదు చేశారు. మొత్తం నమోదు శాతం 67.34గా ఉంది. ఇంకా 45,962 మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అధికారులు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. మండలాల ప్రగతి జిల్లాలో లక్ష్మణచాంద మండలం 79.45 శాతంతో ముందంజలో ఉంది. భైంసా మండలం 79.09 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. పెంబి మండలం 43.15 శాతం నమోదుతో చివరిస్థానంలో కొనసాగుతోంది. మిగతా మండలాల్లో నమోదు శాతం 60కు పైగా చేరిందని అధికారులు పేర్కొన్నారు. ఆలస్యానికి ప్రధాన కారణాలు జిల్లాలో అపార్ నమోదులో జాప్యానికి విద్యార్థుల వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఇవ్వనికారణంగానే జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు వివరించారు. అవగాహనతో వేగవంతం జిల్లాలో 1,42,872 మంది విద్యార్థుల్లో 96,157 మంది నమోదు పూర్తిచేశాం. మిగిలిన విద్యార్థులు కూడా త్వరగా నమోదు చేసుకునేలా ప్రధానో పాధ్యాయులు సమావేశాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించాం. తద్వారా జిల్లాలో శాతం 100 చేరుకునేలా చర్యలు తీసుకుంటాం. – భోజన్న, జిల్లా విద్యాధికారి -
రిజర్వేషన్.. టెన్షన్..!
నిర్మల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా.. ఉండవా..! అనే విషయం బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. ఈ తీర్పు ఎలావస్తుందో.. ఇవే రిజర్వేషన్లు ఉంటాయా.. లేక మారుతాయా..! అనే టెన్షన్ ఆశావహుల్లో నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తీర్పు ఎలావచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న వాదన అధికార పార్టీ వర్గాల్లో ఉంది. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు చేపడితే.. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులు ఎలా ఉంటాయోనని ఆశావహుల్లో ఆందోళన కనిపిస్తోంది. 8న హైకోర్టు తీర్పు? ఈనెల 9న రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేసేస్తోంది. కానీ.. అంతకు ఒక్కరోజు ముందు అంటే బుధవా రం హైకోర్టులో ఎన్నికల భవితవ్యం తేలిపోనుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లడంపై వేసిన కేసు కు సంబంధించిన తీర్పు ఈనెల 8న రానుంది. చట్ట బద్ధత లేని రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు అనుమ తి ఉండకపోవచ్చన్న వాదన బలంగా ఉంది. మరో వైపు మరో అవకాశం ఏదైనా ఇవ్వొచ్చు.. అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేనిపక్షంలో పాతరిజర్వేషన్ల కోటా ప్రకారమైనా ఎన్నికలను కొనసాగించవచ్చని అధికార పార్టీవర్గాలే వెల్లడిస్తున్నాయి. ఆశావహుల్లో ఆందోళన.. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్, అధికారులు వెల్ల డించిన రిజర్వేషన్ల ప్రకారం చాలామంది ఆశావహులు ఇప్పటికే మానసికంగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ.. బుధవారం కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, దానిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎన్నికలతోపాటు ప్రకటించిన రిజర్వేషన్లలోనూ మార్పులు ఉంటాయా.. అన్న టెన్షన్ చాలామందిలో కనిపిస్తోంది. ప్రస్తుతం పోటీకి అవకాశం ఉన్న ఆశావహులతోపాటు రిజర్వేషన్ కారణంగా పోటీకి దూరమవుతున్న నేతలూ ‘8న ఏమొస్తుందో చూద్దాం..’అంటూ ఆసక్తిగా వేచిచూస్తున్నారు. బడుగులకు పీఠం..! నిర్మల్ 2016లో జిల్లాగా ఏర్పడింది. ఆతర్వాత 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. తొలిసారి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో జెడ్పీచైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. ఈమేరకు అప్పుడు బీఆర్ఎస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొరిపెల్లి విజయలక్ష్మి నిర్మల్‌రూరల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈసారి ప్రకటించిన రిజర్వేషన్లలో జెడ్పీచైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు వచ్చింది. బడుగుల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలో తొలిసారి వెనుకబడిన కులాలకు చైర్మన్ స్థానం దక్కనుంది. ఈమేరకు బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు సీనియర్, జూనియర్ నేతలు తాము చైర్మన్ బరిలో ఉండాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలూ చేస్తున్నారు. -
దసరా సెలవుల్లో రెచ్చిపోయిన దొంగలు
నిర్మల్‌టౌన్: బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కళాశాలలకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో పెద్ద పండుగ కావడంతో అందరూ ఇళ్లకు తాళం వేసి సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదే అదనుగా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాలు, ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలే లక్ష్యంగా దొంగతనాలు చేశారు. తమ చోరకళను ప్రదర్శిస్తూ పోలీసులకు చెమటలు పట్టించారు. రోజుకో చోరీ వెలుగులోకి.. జిల్లాలో దసరా సెలవులు మొదలైన నాటి నుంచి రోజుకో పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు జరిగాయి నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో ఒకటికి మించి దొంగతనాలు జరిగాయి. నగదు, బంగారం, విలువైన వస్తువులు, బైక్‌లు, స్కూటర్లు వరకు ఎత్తుకెళ్లారు. పోలీసులకు చిక్కకుండా.. నిఘా వ్యవస్థ అభివృద్ధి చెందినా, దొంగలు చోరీ చేసిన ఇళ్లలో ఎలాంటి ఆనవాళ్లు వదలలేదు. రాత్రింబవళ్లు గస్తీ ఉన్నా, పోలీసుల కంట పడకుండా దొంగలు తమ పని కానిచ్చేశారు. కొన్ని నెలలుగా జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క రాష్ట్ర గ్యాంగులేనా? నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉండడం, 44, 61 జాతీయ రహదారుల ద్వారా తరచుగా రాకపోకలు సాగడంతో పక్క రాష్ట్రాల గ్యాంగులు వచ్చి దొంగతనాలు చేసి పారిపోతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు విచారణను ముమ్మరం చేస్తున్నారు. అయితే దొంగలు మాత్రం పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా.. ఇప్పటివరకు ఎక్కువగా రాత్రులే దొంగతనాలు జరిగినప్పటికీ, ఈసారి పగలు రాత్రి తేడా లేకుండా దొంగలు రెచ్చిపోయారు. పగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేశారు. ఇంటి బయట నిలిపిన వాహనాలూ ఎత్తుకెళ్లారు. -
వ్యక్తిత్వ నిర్మాణంతో సమగ్రత
నిర్మల్‌ఖిల్లా: వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరిగి సమగ్రత సిద్ధిస్తుందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్య నగర్ బస్తీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్.రెడ్డి కాలనీ క్లబ్ హౌస్‌లో ఆదివారం విజయదశమి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ పొద్దుటూరి గంగారెడ్డి, నిర్మల్ నగర సంఘ్ చాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి, స్వయం సేవకులు, దివ్యనగర్ బస్తీ వాసుల పాల్గొన్నారు. హిందువుల ఐక్యతకే పంచపరివర్తన్ హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని జిల్లా ధర్మజాగారణ టోలి సభ్యులు బ్రహ్మబట్ రాజేశ్‌సింగ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వివేక్ నగర్ బస్తీ ఆధ్వర్యంలో స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో విజయదశమి నిర్వహించారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాత న జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో చింతపండు రవి, నగర కార్యవాహ కిన్నెర్ల రవి, మల్లికార్జున్ రెడ్డి, కూనప్రవీణ్, రఘునందన్‌రెడ్డి, ధీరజ్, సైండ్ల శ్రీధర్, గోవర్ధన్, నరేశ్, శంకర్, టీఎన్.స్వామి పాల్గొన్నారు. -
ఆలస్యంతో అర్హత!
నిర్మల్‌చైన్‌గేట్: ‘ఆలస్యం అమృతం విషం‘ అంటారు పెద్దలు.. చేయవలసిన పనిని సరైన సమయంలో చేయకపోతే, అది అనర్థాలకు దారితీస్తుంది. మంచి ప్రయోజనాలు సైతం చెడుగా మారతాయి. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం చేసిన ఆలస్యం.. గత ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు వివరాలు వెల్లడించక అనర్హతకు గురైనవారికి అమృతంగా మారింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో అనర్హత వేటు పడిన అభ్యర్థులు పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వక.. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసిన కొందరు నిర్దేశిత గడువులోగా ఖర్చుల వివరాలు సమర్పించలేదు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై మూడేళ్లు నిషేధం విధించింది. ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా ఆ కాలపరిమితి ముగిసింది. దీంతో వారు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. మరోమారు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. మూడు దశల్లో ఎన్నికలు.. 2019 జనవరిలో జిల్లాలో 396 గ్రామ పంచా యతీలకు 3,368 వార్డులకు మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. వెంట నే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యే క అధికారులను నియమించింది. ఎంపీటీసీ, జె డ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా 2024 ఆగ స్టు మొదటి వారంలో ముగిసింది. పరిషత్‌లో నూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాలో అనర్హతకు గురైనవారు పోటీకి దూరమయ్యేవారు. 1,058 మందిపై వేటు జిల్లాలో మొత్తం 1,058 మందిపై ఈసీ మూడేళ్ల అనర్హత వేటు వేసింది. వీరు 2024 ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనకుండా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో నిషేధ కాలం ముగిసింది. తాజాగా ఎన్నికల సంఘం ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించింది. దీంతో నిషేధం ముగిసినవారు పోటీకి సిద్ధమవుతున్నారు. లెక్కలు చూపాల్సిందే.. నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం 2019 జనవరిలో 396 గ్రామ పంచాయతీలకు, మేలో 157 ఎంపీటీసీలు, 18 జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరిగాయి. పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా ప్రచార ఖర్చుల లెక్కలు నిర్దేశిత ఫార్మాట్లో ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలి. 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డు సభ్యులు రూ.30 వేల వరకు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. 5 వేలకు మించిన జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.50 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షల వరకు ప్రచారానికి వెచ్చించే వెసులుబాటు కల్పించారు. గెలిచినా, ఓడినా పోటీ చేసినవారంతా ఖర్చుల వివరాలు వెల్లడించాలి. కొందరు వార్డు సభ్యులు విజ యం సాధించినా నిర్లక్ష్యంతో సమర్పించలే దు. ఓడిపోయిన మరికొందరు నిబంధనల ను ఉల్లంఘించారు. ఈసీ పలుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో ఎంపీడీవోల నివేదికల ఆధారంగా 2021 నవంబర్‌లో అనర్హత ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచులు 125 వార్డు సభ్యులు 870 ఎంపీటీసీలు 59 జెడ్పీటీసీలు 4 -
నిలకడగా కడెం నీటిమట్టం
కడెం: కడెం ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695.500 అడుగులు ఉంది. ఆదివారం ప్రాజెక్టును చూసేందుకు సూదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు. ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఉల్లాసంగా గడిపారు.కరాటే గ్రేడింగ్ పరీక్షలో ప్రతిభ నిర్మల్‌ఖిల్లా: కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొట్టమొదటి మహిళా శిక్షకురాలు, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కిన్నెర్ల మృణాళిని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆ ఫ్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్స్పెక్టర్ రాపోలు సుదర్శన్ నేషనల్ బ్లాక్ బెల్ట్(4వ డాన్) తీసుకున్నారు. కార్యక్రమంలో జ పాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తె లంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తేజేందర్ సింగ్భా టియా, జిల్లా అధ్యక్షుడు కొండాజి శ్రీకాంత్, అ మ్ముల భూషణ్, చందుల స్వామి, శ్రీరాముల సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. బోటింగ్ చేస్తున్న పర్యాటకులు -
నిర్మల్
భీం ఆశయం నెరవేరేదెన్నడో! ఆదివాసీలకు హక్కులకోసం నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన గిరిజనుల ముద్దుబిడ్డ కుమురంభీం. ఆయన ఆశయం మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. నిండా మునిగినభైంసా: భారీ వర్షాలు జిల్లాలో సోయా రైతును నిండా ముంచాయి. భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు చవిచూశారు. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వర్షాలు అనుకూలంగా ఉంటాయని భావించారు. కానీ పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వానలు పంటను దెబ్బతీశాయి. ముధోల్ నియోజకవర్గంలో 80 శాతం మంది రైతులు సోయా సాగు చేశారు. తమకు పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో మొత్తం 1.05 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేశారు. విత్తనాలు వేసినప్పటి నుంచి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. గతంలో నీటి తడి ఇవ్వాల్సి వచ్చేది. ఈసారి అలాంటి అవసరం లేదు. ఫలితంగా పంట బాగా పెరిగింది. రైతులు సంతోషించారు. పూత దశలో మరోసారి వర్షం కురవడంతో దిగుబడి పెరుగుతుందని ఆశపడ్డారు. అయితే, అధిక వానలు పంటను దెబ్బతీశాయి. తేమకు ఆకులు, పూత రాలిపోయేలా చేశాయి. ఇప్పుడు కోత సమయంలో దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు రూ.23 వేల పెట్టుబడి.. ఒక్కో ఎకరానికి విత్తనాల నుంచి కోత వరకు రూ.23 వేలు ఖర్చయింది. ప్రస్తుత మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ.4,600 వరకు ధర ఉంది. భైంసాలోని గాంధీగంజ్‌లో సోయా విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ ఏడు క్వింటాల్‌కు రూ.5,328 మద్దతు ధరను ప్రకటించింది. అయినప్పటికీ, తక్కువ దిగుబడి కారణంగా పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు.ముధోల్ మండలం ముద్గల్‌లో సోయాపంటకష్టం వృథా.. మా కుటుంబమంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తాం. ఏటా సోయా పంటవేస్తాం. ఈయేడు కూడా సోయాపంట సాగుచేశాం. ఎకరానికి రూ.23 వేలు ఖర్చుఅయింది. ప్రస్తుతం పంట కోశాను. ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో రూ.15 వేలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. – మహమూద్, రైతు కోతలు ప్రారంభం జిల్లాలో సోయాపంట కోతలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలతో పంటకు తెగుళ్లు సోకాయి. ఈయేడు సోయాపంట కొంత దెబ్బతింది. పూర్తిస్థాయిలో పంటకోస్తే దిగుబడి తెలుస్తుంది. భారీ వర్షాలు కురిసిన వెంటనే కొంత మంది రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టారు. ఏఈఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు ఇచ్చారు. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిసోయా సాగు విస్తీర్ణం : 1.05 లక్షల ఎకరాలు రైతులు 72,300మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,328కోతలు షురూ.. నాలుగు రోజులుగా జిల్లాలో సోయా కోతలు మొదలయ్యాయి. హార్వెస్టర్ల సాయంతో పంటను కోస్తున్నారు. ఎకరానికి కేవలం రూ.2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. కాయల దశలో గింజలు పూర్తిగా నిండలేదు. విత్తన కంపెనీలతో చర్చించి, పరిస్థితిని వివరించి నష్టాన్ని భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు. సాధారణంగా సోయా పంటకు రెండు సార్లు మందులు పిచికారీ చేసేవారు. విత్తనాలు వేసిన తర్వాత గడ్డి మందు ఒకసారి, పూత, కాయల దశలో తెగుళ్ల నివారణకు మరోసారి. అయితే ఈ ఏడు 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాల్సి వచ్చింది. -
పంచాయతీ కథ.. కంచికే!
కడెం: పులుల మనుగడ కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. పునరావాస గ్రామానికి తరలించారు. ఇక ఏడాది గడిచినా, రెవెన్యూ పట్టాలు పూర్తిగా అందజేయకపోవడంతో గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పునరావాస ప్యాకేజీలో భాగంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు ఇటీవల పాత గ్రామాలకు తిరిగి వెళ్లి గుడిసెలు వేసుకుని నిరసన తెలిపారు. ఏడాదిగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం కలెక్టర్, డీపీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. 500లకుపైగా జనాభా.. ఈ రెండు గ్రామాల్లో జనాభా 500కు పైగా ఉండగా, ఓటర్ల సంఖ్య 300 దాటింది. రాంపూర్, మైసంపేట్ గ్రామాలు మండలంలోని ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ జరుగుతాయనేది అనిశ్చితంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పునరావాస కాలనీలోని కమ్యూనిటీ హాల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి నిర్వహించారు. ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తారో తెలియకుండా ఉంది. పునరావాస ప్రాంతంలో బూత్ లేకపోతే, 35 కిలోమీటర్ల దూరంలోని ఉడుంపూర్కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిష్కరించని హామీలు..2024 ఏప్రిల్‌లో అటవీ శాఖ ఈ గ్రామాలను ఖాళీ చేయించి, పాతమద్దిపడగ సమీపంలోని పునరావాస కాలనీకి తరలించారు. 142 కుటుంబాల్లో 94 కుటుంబాలకు ప్యాకేజీ–1 కింద రూ.11.80 కోట్లు, 5 హెక్టార్లలో విద్య, విద్యుత్ వంటి సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇళ్లు అందజేశారు. నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో వ్యవసాయ భూములు కేటాయించారు. మిగిలిన 48 కుటుంబాలకు ప్యాకేజీ–2 కింద రూ.15 లక్షల పరిహారం, వ్యవసాయ భూములకు త్రీఫేజ్ విద్యుత్, సాగునీటి సదుపాయాలు, 94 కుటుంబాలకు ఉపాధి కోసం రూ.3 లక్షల రుణం, ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వంటి హామీలు ఇంకా అమలు కాలేదు. ఈ అసంపూర్ణతలతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. -
హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్
నిర్మల్‌చైన్‌గేట్: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి వెంకటేశ్వర్రావు దేశ్‌పాండే అన్నా రు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంగల్పేట్ బస్తీ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ హాల్లో విజయదశమి ఉత్సవం శని వారం నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖ లతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందన్నారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందన్నారు. ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయన్నారు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కొర్తికంటి లింగన్న, నగర కార్యవాహ కిన్నెర్ల రవి, మైసర్ల రమణ, సాధం అరవింద్, పి.కృష్ణ, విలాస్, మంద పవన్, సుదర్శన్‌చారి, శ్రీను, సాయి, మురళి పాల్గొన్నారు. -
చిత్తూ చిత్తూల బొమ్మ..
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మార్గంలో బతుకమ్మలతో బయలుదేరుతున్న మహిళలుజిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. సంప్రదాయపాటలతోపాటు డీజే చప్పుళ్ల నడుమ కోలాటం వేస్తూ సందడిగా గడిపారు. పొద్దుపోయాక బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
వరి బోనస్‌కు బ్రేక్?
లక్ష్మణచాందకు చెందిన రైతు చిన్న రాజేశ్వర్ యాసంగిలో పది ఎకరాల్లో సన్న రకం వరి పండించాడు. 200 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాడు. కేంద్ర నిర్వాహకులు సన్న వడ్లుగా నమోదు చేశారు. అ యితే, ధాన్యం మద్దతు ధరకు సంబంధించిన డబ్బులు ఆయన ఖాతాలో జమయ్యాయి. ధాన్యం అమ్మి నాలుగు నెలలు కావస్తున్నా, బోనస్ డబ్బులు మాత్రం రాలేదు. నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో గత యాసంగిలో పండించిన సన్నవడ్లను రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. బోనస్ వస్తుందన్న ఆశతో అన్నదాతలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో కాపలా ఉన్నారు. అయితే ధాన్యం విక్రయించి నా లుగు నెలలు కావస్తున్నా బోనస్ జాడ లేదు. తాజా గా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో నవంబరు 11 తేదీ వరకు కోడ్ అమల్లో ఉండనుంది. నవంబరులో ఖరీఫ్ సీజన్ పంట అన్నదాత చేతికి అందనుంది. దీంతో యాసంగి బోనస్ ప్రభుత్వం ఇవ్వనట్లేనని రైతులు అంటున్నారు. రూ.12.81 కోట్లు బకాయి..జిల్లాలో గత యాసంగి సీజన్లో రైతులు వరి సాగు చేశారు. 60 వేలకుపైగా ఎకరాల్లో సన్న రకాలు వేశారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. మొత్తం 1,81,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు. ఇందులో 25,623 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం ఉంది. సేకరించిన ధాన్యానికి సంబంధించి సర్కా రు రైతుల ఖాతాలలో మద్దతు ధరను మాత్రమే జమ చేసింది. బోనస్‌ను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో, కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లను విక్రయించిన 4,483 మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి రూ.12.81 కోట్లు రావాల్సి ఉంది. ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు గడిచినా, బోనస్‌పై ఎలాంటి ప్రకటనా లేదు. స్థానికంలో కీలకం కానుందా..స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సాగు భూమి ఉన్న రైతులందరికీ గత నెలలో పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఎన్నికల నగారా మోగింది. అంతకుముందే బోనస్ సొమ్ము ఖాతా ల్లో జమచేసి ఉంటే రైతులకు మేలు జరిగి ప్రభుత్వంపై సదాభిప్రాయం ఉండేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం బోనస్ రాని అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంటుందని అధికార, విపక్ష నేతలు మధనపడుతున్నారు.దొడ్డు రకం ధాన్యం1,55,377 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం 25,623 మెట్రిక్ టన్నులు జిల్లా సమాచారం...సేకరించిన మొత్తం ధాన్యం 1,81,000 మెట్రిక్ టన్నులు రావాల్సిన బోనస్ డబ్బులు రూ.12.81 కోట్లు ఒక్క సీజన్‌కే పరిమితమా?సన్న రకాల సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న బోనస్.. ఒక్క సీజన్‌కే పరిమితమైంది. రబీలో సన్నవడ్లు పండించి విక్రయించిన రైతులకు ఇప్పటికీ ప్రోత్సాహకం అందలేదు. అన్నదాతలు నిరాశ చెందుతున్నా రు. జిల్లా రైతులు గతంలో రైతులు దొడ్డు రకా లనే ఎక్కువగా సాగు చేసేవారు. ప్రభుత్వం సన్నాల కు బోనస్ ఇస్తామనడంతో ఈ మధ్య సన్నాల వైపు మళ్లారు. సహజంగా సన్నాల కంటే దొడ్డు రకాలకే దిగుబడి ఎక్కువగా వస్తుంది. యాసంగి లో సన్నాల దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే, ప్రభుత్వం బోనస్ ఇస్తామనడంతో రైతులు ఆశతో సన్నాల సాగుపై దృష్టి పెట్టారు. గత ఖరీఫ్ సీజన్లో ప్ర భుత్వం ఎకరాకు రూ.500 చొప్పున బోనస్ అందించింది. రబీకి సంబంధించి ఇప్పటివరకు వి డుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలోనే బోనస్ ఇవ్వని సర్కా రు.. ఖరీఫ్‌లో ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే, రైతులు మళ్లీ దొడ్డు రకాల సాగుకు మళ్లే అవకాశాలున్నాయి. -
కొలువుదీరిన శారదమాత
భైంసాటౌన్: పట్టణంలో శారదమాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా దేవీ నవరాత్రి ఉత్సవాల అనంతరం శారదమాత విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు శనివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంతోపాటు బ్రాహ్మణగల్లిలోని రాధాకృష్ణ మందిర్‌లో శారదమాత విగ్రహాలు ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఐదురోజులపాటు అమ్మవారికి పూజలు చేసి, అనంతరం విగ్రహాలను గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నీటిలో నిమజ్జనం చేస్తారు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..ఖానాపూర్: మండలంలోని సుర్జాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా యజ్ఞచార్యులు చక్రపాణి నర్సింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు కోటపల్లి అనీశ్, అర్చకులు కోటపల్లి నితీశ్ ఆధ్వర్యంలో యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్టాపన, విష్ణుయాగం, ధ్వజారోహణం, అన్నసంతర్పణతోపాటు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నందీశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి జరిగిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్ రామునాయక్, బక్కి కృష్ణ, కోశాధికారి గాజుల శ్రీనివాస్, పండితులు, స్వాగతం పలికారు. . కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్ రామునాయక్, బక్కి కృష్ణ, కోశాధికారి గాజుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఆకుల రాజమణి, మాజీ ఎంపీటీసీ జంగిలి సరిత తదితరులు పాల్గొన్నారు. సుర్జాపూర్‌లో పూజలు చేస్తున్న పండితులు బ్రాహ్మణగల్లీలో పూజలో పాల్గొన్న మహిళలునేడు తుల్జాభవానీ జాతరనిర్మల్ రూరల్: మండలంలోని రాణాపూర్ గ్రామంలో తుల్జాభవానీ జాతర ఆదివారం జరగనుంది. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వ్యవస్థాపకులు రాథోడ్ మహేందర్ మహారాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
నిర్మల్
7బోధన.. ఆకట్టుకునేలా ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపునకు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనోపకరణాలతో సులభపద్ధతిలో బోధిస్తూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. 8లోuబండ్లబాట.. అధ్వానం తానూరు మండలంలోని పలు గ్రామాల్లో బండ్లబాటలు(మట్టి రోడ్లు) అధ్వానంగా మారాయి. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 9లోuఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. తుపాను ప్రభావంతో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది. -
‘స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలి’
ఖానాపూర్: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నా రు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మండలాలు, గ్రామాల వారీగా శనివారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటా వివరించాలన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎంఏ.మజీద్, దయానంద్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, నిమ్మల రమేశ్, గుగ్లావత్ రాజేందర్‌నాయక్, జంగిలి శంకర్, స్వప్నిల్రెడ్డి, పుప్పాల శంకర్, గుడిసె రమేశ్, తులాల శంకర్, బాశెట్టి నర్సయ్య, ఆత్రం రాజేశ్వర్, జాదవ్ సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అంబరాన్ని తాకిన దసరా సంబురాలు
నిర్మల్/ఖానాపూర్/భైంసాటౌన్: జిల్లాలో దసరా సంబురాలు అంబరాన్నితాకాయి. ఊరూరా వేడుకలు నిర్వహించారు. శమీ పూజ, ఆయుధ పూజలు చేశారు. రాంలీల కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయం వద్ద విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం దసరా ఉత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహేశ్వర్‌రెడ్డి హాజరై మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్‌మీనా, వీహెచ్‌పీ నాయకులతో కలిసి శమీపూజ, ఆయుధపూజ, దుర్గాపూజలను చేసి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం దసరా ఉత్సవ సభలో మాట్లాడుతూ అధర్మంపై ధర్మం గెలిచిన సందర్భంగా దసరా పండుగను చేసుకుంటామన్నారు. ప్రతీతల్లి జిజియాబాయిలా ఆలోచించాలని, తమ బిడ్డలను శివాజీ, భగత్‌సింగ్‌లా తయారు చేయాలన్నారు. దేశం, ధర్మం, సంస్కృతిపై ఆరాధన భావం పెరిగేలా ఇప్పటి తరాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సమరతా తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్, బీజేపీ సీనియర్‌నేత అయ్యన్నగారి భూమయ్య, విశ్వహిందూ పరిషత్ ముఖ్యులు పతికె రాజేందర్, ముప్పిడి రవి, పార్థసారధి, మూర్తి ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, ఆంజనేయ యువజన సంఘం అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్, మహాలక్ష్మీ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొడుకుల శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ విజయదశమి అందరికీ విజయాన్ని తెచ్చిపెట్టాలని అకాంక్షించారు. ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా శివకుమార్ మాట్లాడుతూ.. కుల, మతాలను గౌరవించి భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచంలోనే లౌకికదేశంగా భారతదేశం నిలిచిందన్నారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మంత్రరాజ్యం సురేశ్ ధ్వజారోహణ చేశారు. పది తలల రావణాసురుని ప్రతిమను దహనం చేశారు. జమ్మి ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భైంసాలో కిసాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడారు. రాంలీలా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు సురేశ్, శ్యామ్, నాయకులు వెంకటేశ్వర్లు, బీసీరాజన్న, శ్రీనివాస్, రాజు, కృష్ణస్వామి, సంతోష్, లక్ష్మణ్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
స్థానికం.. సందిగ్ధం
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉండటంతో ఆశావహుల్లో అనిశ్చితి నెలకొంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ, స్థానిక పదవుల కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నవారిలో ఉత్సాహం కనిపించడం లేదు. రాజ్యాంగపరమైన సమస్యలతో ముడిపడిన ఈ పరిస్థితిలో ఎన్నికలు జరుగుతాయా? లేదా?.. జరిగితే ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమా లేక పాత విధానంతోనా అన్న చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినప్పటికీ ఆశావహులు ధైర్యంగా అడుగులు వేయడం లేదు. కోర్టు తీర్పు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై స్పష్టత కోసం మరో నాలుగు రోజులు ఆగాల్సిందే. అనుకూల ఫలితాలు వచ్చినవారు కూడా తదుపరి అడుగులు ఎలా వేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. తీర్పు ప్రతికూలమైతే.. జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలు, 157 ఎంపీటీసీ స్థానాలు, 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులు ఉన్నాయి. పార్టీ గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీల నుంచి అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. వీరితోపాటు స్వతంత్రులు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక్కో స్థానానికి కనీసం పది మంది అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలకు 200 మంది, ఎంపీటీసీలకు 2 వేల మంది బరిలో దిగుతారని అంచనా. పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే సర్పంచ్ స్థానాలకు ముగ్గురు నుంచి నలుగురు చొప్పున సుమారు 2 వేల మంది, వార్డులకు ఇద్దరు ముగ్గురు చొప్పున పది వేల మంది పోటీ చేసే అకాశం ఉంది. 8న కోర్టు తీర్పు.. స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాది కాలంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు షెడ్యూల్ వచ్చేసింది. అన్నీ సవ్యంగా జరిగితే మొదటి దశ నామినేషన్లు మరో ఐదు రోజుల్లో ప్రారంభమవుతాయి. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఆశావహులు అక్టోబర్ 8 వరకు వేచి ఉండాలి.ఈ పరిస్థితిలో ముందుకు అడుగేయడమే సరైనదని కొందరు భావిస్తున్నారు. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటి నుంచి పెట్టుబడి పెడితే, పరిస్థితి ప్రతికూలమైతే నష్టపోతామని కొందరు భావిస్తున్నారు. -
మాజీ మంత్రి తులాభారం
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఎదుట ఉన్న తులాభారం వద్ద అభిమానులు ఆయన బరువుకు సరిపడా బెల్లంతో తులాభారం వేయించి భక్తులకు, ప్రజలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మాధవరావు, నాయకులు రాజేశ్వర్‌రావు, సుచరిత, అడెల్లి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
లోకేశ్వరం: గ్రామ గ్రామన రాష్ట్రీయ స్వయం సేవ క్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని గ్రామ వికాస్ తెలంగాణ ప్రాంత సహ సంయోజక్ వేంపల్లి ప్రతాప్ అన్నారు. మండల కేంద్రంలోని స్వాధ్యా కేంద్రం అవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విజయదశమి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ప్రతాప్ మాట్లాడుతూ వచ్చే విజయదశమి దసరా నాటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హిందుత్వ పరిరక్షణ ఆఖండ భారత నిర్మాణంవైపు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వయం సేవకులను తయారు చేస్తూ దేశ భక్తులుగా నిర్మాణం చేస్తుదన్నారు. నిర్మల్ జిల్లా టోలి సభ్యుడు సంటన్న, సభ్యులు నాగేశ్వర్, శ్రీనివాస్, భూమేష్ ఉన్నారు. -
మహాత్ముడికి ఘన నివాళి
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహా త్మాగాంధీ స్వాతంత్య్రం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశాన్ని స్వాతంత్య్ర సంగ్రామంలో సంఘటితం చేసి ముందుండి శాంతి, అహింస మార్గాలలో నడిపించారన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, కలెక్టరేట్ ఏవో సూర్యారావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాల పునర్నిర్మాణంలో పూర్వవిద్యార్థులు
నిర్మల్: తమకు విద్యాబుద్ధులు, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పిన సరస్వతీ శిశుమందిరానికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని జిల్లాకేంద్రంలోని బాగులవాడ శిశుమందిర్‌లో చదివిన పూర్వవిద్యార్థులు పేర్కొన్నారు. స్థానిక పాఠశాల ప్రాంగణంలో గురువారం ఉదయం బడి భవన పునర్నిర్మాణానికి సామూహికంగా భూమిపూజ నిర్వహించారు. సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, విద్యాభారతి దక్షిణమధ్య ప్రశిక్షణా ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు నార్లాపురం రవీందర్, పూర్వవిద్యార్థి పరిషత్ బాధ్యులు సాత్పుతే శ్రీనివాస్, అయ్యన్నగారి శ్రీకాంత్, శశిరాజ్, అంగ జగదీశ్, కిశోర్, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. -
17న రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
నిర్మల్‌చైన్‌గేట్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఎన్నికలు ఈనెల 17న నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ.లింగన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పెన్షనర్ల సంఘ భవ న సమావేశం మందిరంలో ఉదయం 10 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నుకున్న నిర్మల్, ఖానాపూర్, ౖభైంసా, ముధోల్ యూనిట్ల కార్యవర్గ సభ్యులు జిల్లా అవుట్ గోయింగ్ బాడీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని తెలిపారు. బీసీలు లేకున్నా రిజర్వేషన్ కుభీర్: మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావుజీ నాయక్ తండాలలో బీసీల ఓటర్లు ఒక్కరు కూడా లేరు. అయినా ప్రభుత్వ ఇటీవల ప్రకటించిన సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లలో ఈ రెండు గ్రామపంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ చేశారు. ఈ రెండు గ్రామపంచాయతీల రిజర్వేషన్ మార్చాలని అయా తండాల వాసులు కోరుతున్నారు. ఈ విషయమై వారు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనాభా పరంగా బీసీలు ఉన్నారని, ఓటర్ల పరంగా లేరని ఎంపీడీవో సాగర్‌రెడ్డి తెలిపారు. ఈ రెండు గ్రామపంచాయతీలలో బీసీ ఓటర్లు లేరని జిల్లా అధికారులకు రిపోర్టు ఇచ్చినట్లు తెలిపారు. 6న జిల్లా స్థాయి బాక్సింగ్ జట్ల ఎంపిక నిర్మల్ రూరల్: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం(ఈనెల 6న) జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అండర్ 14 ,17 బాక్సింగ్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న, ఎ స్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్ తెలిపారు. వివరాలకు సత్తయ్య 9849 668725, చందుల స్వామి 9966677105ని సంప్రదించాలని సూచించారు. ఎల్లమ్మ ఆలయంలో పూజలుభైంసారూరల్: మండలంలోని వానల్పహాడ్ ఎల్లమ్మ ఆలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏటా దసరా పండగ రోజు జాతర నిర్వహిస్తారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలేకాకుండా పక్క మండలాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
పోయిరా దుర్గమ్మ
నిర్మల్భైంసాటౌన్: శరన్నవరాత్రి వేడుల్లో భాగంగా కొలువుదీరిన దుర్గమ్మకు 11 రోజులపాటు భక్తులు పూజలు చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు నిర్వహించారు. డివిజన్ కేంద్రమైన భైంసా పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక భవానీచౌక్లో ప్రతిష్టించిన దుర్గామండలిలో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా దుర్గా మండళ్ల నిర్వాహకుల ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్రలు శోభాయమానంగా నిర్వహించారు. మహిళలు, యువతుల కోలాటాలు ఆడుతూ.. అమ్మవారి భక్తి గీతాలకు నృత్యాలు చేశారు. శోభాయాత్ర సందర్భంగా పోతరాజుల విన్యాసాలు అలరించాయి. భవానీచౌక్ అమ్మవారి విగ్రహం పంజేషచౌక్ వద్దకు చేరుకోగా, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు. శోభాయాత్ర పొడవునా పలుచోట్ల స్వచ్ఛందంగా పులిహోర, అన్నదానం చేశారు. శోభాయాత్ర సందర్భంగా భైంసా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా స్థానికంగానే ఉండి బందోబస్తు పర్యవేక్షించారు. ఎస్పీ జానకీషర్మిల సైతం బందోబస్తును పర్యవేక్షిస్తూ, సూచనలు చేశారు. శోభాయాత్ర తీరును డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. పంజేష చౌక్ వద్ద భారీగా బలగాలను మోహరించగా, పంజేషచౌక్ నుంచి కిసాన్‌గల్లి మార్గాన్ని మూసివేశారు. స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు -
పర్యాటకుల తాకిడి
అటవీశాఖ సఫారీ ప్రయాణానికి అనుమతి ఇవ్వడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హరిత రిసార్ట్‌కు పర్యాటకులు పెరుగుతున్నా సఫారీ లేకపోవడంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సఫారీ మొదలైంది. దీంతో పర్యాటకులు మరింతగా పెరుగుతారు. – వీరేందర్, హరిత మేనేజర్ ఉన్నతాధికారుల ఆదేశాలతో.. జన్నారం డివిజన్లో గత మూడు నెలలుగా వన్యప్రాణుల సంరక్షణ దృష్టిలో పెట్టుకుని సఫారీకి అనుమతి ఇవ్వలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టి, సఫారీ తిరిగే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభించాం. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. – రామ్మోహన్, ఎఫ్‌డీవో, జన్నారం -
దుబాయ్‌లో భైంసా వాసి మృతి
భైంసాటౌన్: ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన భైంసా వాసి అక్కడ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతోష్మాత నగర్‌కు చెందిన తుమ్మల శ్రీనివాస్(35) నెల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన కొద్దిరోజులకే మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరిగాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీని కుటుంబ సభ్యులు సంప్రదించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కడెం ప్రధాన కాలువలో ఒకరి గల్లంతు
దస్తురాబాద్: కడెం ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు ఒకరు గల్లంతైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రేవోజీపేట గ్రామానికి చెందిన మైదం సురేందర్ అనే వ్యక్తి ఉదయం 10 గంటలకు కడెం ఎడమ కాలువలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా వరద ఉధృతికి మునిగిపోవడంతో అతని ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ విశ్వంబర్ పరిశీలించారు. భార్య కళావతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
జెడ్పీటీసీ గరిష్ట ఖర్చు రూ.4 లక్షలు
కై లాస్‌నగర్: స్థానిక రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సై అంటున్నారు. ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా లక్షలను గుమ్మరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే సదరు అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం– 2018లోని సెక్షన్ 237 ప్రకారం ఏ ఎన్నికలో ఎంత ఖర్చు చేయాలనే వివరాలు వెల్లడించింది. జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడు (జెడ్పీటీసీ)గా పోటీచేసే వారు గరిష్టంగా రూ.4లక్షలు, మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ) అభ్యర్థులు రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి చేసే గరిష్ట ఎన్నికల ఖర్చుల వివరాలను సైతం నిర్దేశించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు రూ. 2.50 లక్షలు, 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వార్డు మెంబర్లు 5వేలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో రూ.50వేలు, అంత కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.30వేలను ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కడెం: మండలంలోని ధర్మాజీపేట్ సమీపంలో మూలమలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మాజీపేట్ గ్రామానికి చెందిన రొడ్డ చందు(35) కడెం వైపు నుంచి ధర్మాజీపేట్కు బైక్‌పై వెళ్తున్నాడు. ధర్మాజీపేట్ సమీపంలోని మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై సాయికిరణ్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కవ్వాల్ అందాలు చూసొద్దాం!
జన్నారం: పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, చెంగుచెంగున ఎగురుతూ పరిగెత్తే వన్యప్రాణులు, స్వచ్ఛమైన ప్రాణవాయువు.. వీటికి చిరునామా కవ్వాల్ అడవులు. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్లో సఫారీ ప్రయాణంతో పర్యాటకులు నేరుగా అటవీ అందాలను, వన్యప్రాణులను చూసి ఆహ్లాదం పొందుతున్నారు. అటవీశాఖ ప్రతీ సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీ ప్రయాణానికి అనుమతి నిలిపివేస్తుంది. తిరిగి అక్టోబర్ 1 నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది గత వారం రోజుల వరకు వర్షాలు ఎక్కువగా కురువడంతో సఫారీకి మరికొంత సమయం పడుతుందని అంతా భావించారు. కానీ మూడు రోజులుగా వర్షాలు పడకపోవడంతో బుధవారం నుంచి సఫారీ ప్రయాణానికి అటవీశాఖ అధికారులు అనుమతినిచ్చారు. అడవిలో రెండు గంటలు.. జన్నారం అటవీ రేంజ్‌లోని పలు ప్రాంతాలలో సఫారీ ప్రయాణానికి అనుమతి ఉంది. ఈ సఫారీ ప్రయాణం రెండు గంటలు ఉంటుంది. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు, ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడుసార్లు సఫారీ ప్రయాణం ఉంటుంది. ఈ రెండు గంటలు గేట్ నంబర్ 1 నుంచి గొండుగూడ బేస్ క్యాంపు, బైసన్‌కుంట, మైసమ్మ కుంట ప్రాంతాల వరకు తీసుకెళ్తారు. బైసన్‌కుంటలో సేద తీరడానికి, టిఫిన్ చేయడానికి సౌకర్యం కల్పించారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా కనిపిస్తాయి. పెరిగిన సఫారీ ధరలు పర్యాటకులను అడవుల్లోకి తీసుకెళ్లడానికి అటవీశాఖ అధికారులు ఐదు సఫారీలను, పర్యాటక శాఖ అధికారులు రెండు సఫారీలను ఏర్పాటు చేశారు. ఈసారి సఫారీ ధరలు గతం కంటే పెరిగాయి. సోమవారం నుంచి గురువారం వరకు ఆరుగురికి రూ. 3500, అదనపు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీకెండ్ రోజుల్లో (శుక్ర, శని, ఆదివారాల్లో) సఫారీ ఆరుగురికి రూ.4000, అదనపు సభ్యుడికి రూ. 500 చొప్పున చెల్లించాలి. కాగా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తగ్గిన హరిత గదుల ధరలు దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు బస చేయడానికి జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్ గదుల ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ధరలు తగ్గాయి. గతంలో సోమవారం నుంచి గురువారం వరకు ఏసీ గదులు రూ.2016, నాన్ ఏసీ గదులు రూ.1232, డార్మెంటరీ గది రూ.2500లుగా ఉండేవి. వీకెండ్ (శుక్ర, శని, ఆదివారాల్లో) ఏసీ గది రూ.2240, నాన్ ఏసీ రూ.1344, డార్మెంటరీ రూ. 3000 ఉండేవి. జీఎస్టీ తగ్గడంతో ఈ సంవత్సరం ప్రస్తుతం సోమవారం నుంచి గురువారం వరకు నాన్ ఏసీ రూ.1155, ఏసీ రూ.1890, డార్మెంటరీ రూ.2500, వీకెండ్లో నాన్ ఏసీ రూ.1260, ఏసీ గదులు రూ. 2100, డార్మెంటరీ రూ.3000గా ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముందుగా టీఎస్‌టీడీసీ అనే వెబ్సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసర: బాసరలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు పదో రోజు మహా సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులుతీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ వైదిక బృందం నవ చండీ హోమం, పూర్ణహుతి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు వేద మంత్రోఛ్ఛరణలతో మధ్య వైదిక బృందం మహాభిషేకము, విశేష అలంకరణ పూజలు చేశారు. సాయంత్రం అర్చకులు చతుషష్టి పూజలు నిర్వహించారు. నేటి పూజలు.. విజయదశమి గురువారం వేకువ జామున 4 గంటలకు అమ్మవార్లకు మహాభిషేకము, ప్రాతఃకాల చతుషష్టి, శమీపూజ, పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్ తెలిపారు. -
అమలులో ‘స్థానిక’ ఎన్నికల కోడ్
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించగా సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 4,49,302 మంది ఓటర్లు జిల్లాలో 4,49,302 మంది ఓటర్లుండగా, ఇందులో 2,13,805 మంది పురుషులు, 2,35,485 మంది మహిళలున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 3,368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 482 పోలింగ్ లొకేషన్లున్నాయి. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సిబ్బంది, స్టే జ్–1, స్టేజ్–2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆర్వో, పీవో శిక్షణ కార్యక్రమాలు మండలాలవారీగా చేపట్టారు. బ్యాలెట్లు ప్రచురించే విషయంలో ప్రింటింగ్ ప్రెస్‌లు పూర్తి వివరాలు ప్రదర్శించారని అధికారులు తెలిపారు. కొత్త పనులకు బ్రేక్ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో జిల్లాలో కొత్త పనులు అమలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి వీలులేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు, పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. రూ.50 వేలకు మించి తీసుకెళ్తే తప్పనిసరిగా సంబంధిత పత్రాలు చూపాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ సమావేశం, ర్యాలీకై నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, మీడియాలో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ సిబ్బంది ర్యాలీ
నిర్మల్ టౌన్: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరి యా డీఈ శర్మన్ మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా టెలికాం సేవల విస్తరణలో కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రభుత్వ మద్దతుతో 04జీ సాచ్యురేషన్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు నెట్వర్క్ చేయలేని ప్రాంతాలు, గ్రామాల్లోనూ అధునాతన 4జీ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన సంస్థగా ఎదిగిందని, ప్రైవేట్ కంపెనీలకు దీటుగా నిలుస్తోందని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ సిబ్బంది ప్రవీణ్‌కుమార్, అవినాష్‌రెడ్డి, రాకేశ్‌గౌడ్, సతీశ్‌కుమార్, శర్మ తదితరులున్నారు. -
దావత్ ఉందా..?
నిర్మల్: ‘ఏమే.. నర్సన్న ఎట్లన్న రిజర్వేషన్ నీదిక్కే అచ్చే. ఇంకేమున్నదే గెల్సుడు కూడా నువ్వే గెలుస్తవ్. సప్పుడుదాకా దసరా పండుక్కు మనోళ్లందరికీ దావతిచ్చెయ్యే..’ అని దగ్గరోళ్లు అడుగుతుంటే ఆశావహులు మాత్రం ఎటూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైనా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా.. ఇంకా డైలామాలోనే ఉన్నారు. ఈనెల 8న హైకోర్టు ఇచ్చే తీర్పు ఎట్లుంటదో, ఈ ఎన్నికలు కొనసాగుతాయా.. లేక వాయిదా వేస్తారా..? అన్న కోణంలో ఆశావహులు ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్ కలిసొచ్చినా.. పార్టీ తననే నిలబెడుతుందా.. లేక ఇంకొకరికి సీటిస్తుందా..? అన్న సందేహంతో ఉన్నవాళ్లూ పండుగ దావత్‌లకు ఇంకా పచ్చజెండా ఊపడం లేదు. ‘సర్పంచో, ఎంపీటీసో.. ఏదైతేమున్నది..! ముందైతే అందరినీ తనవైపు తిప్పుకుందాం..’ అనుకునే ఆశావహులు మా త్రమే దసరా దావత్ల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 8న ఏం తేలుతుందో! రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల రి జర్వేషన్లు ఖరారు చేసింది. షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను మాత్రం ఈనెల 9న ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉండటం, దీనిపై ఈనెల 8న తీర్పు వెలువడనుండమే కారణం. తీర్పు ఎలా ఉంటుందో.. ఏం వస్తుందో.. తెలియదు. బీసీ రిజర్వేషన్లకు తామంతా మద్దతిస్తున్నామని చెబుతున్న ప్రతిపక్షాలు రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్ల ప్రక్రియ తేలకుండా ఎలా ఎన్నికలకు వెళ్తారు? లాంటి ప్రశ్నలూ వే స్తున్నాయి. ఇవి కూడా ఆశావహులను గందరగోళంలో పెడుతున్నాయి. అడగడమా.. ఆగడమా..!? హైకోర్టు తీర్పు వచ్చే దాకా ఆగడమా.. లేక ఇప్పటి నుంచే తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ పార్టీలను అడగడమా.. అనే అంశాన్నీ ఆశావహులు తేల్చుకోలేకపోతున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినచోట ఇప్పటికే ఈసారి తమకే చాన్స్ అంటూ చాలామంది ప్రచారం చేసుకుంటున్నారు. తమ బలగం పెంచుకునేందుకు, అన్నివర్గాల మద్దతు ద క్కించుకునేందుకు ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దసరాకు చాలాచోట్ల దావత్‌లకూ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కానీ.. ఎక్కడో ఒకచోట కోర్టు తీర్పు ఎలా వస్తుందో.. ఇదే రిజర్వేషన్ ఉంటుందో, ఉండదో.. లేక ఎన్నికలే వాయిదా పడతాయేమో.. అన్న అనుమానాలు ఆశావహులను ఇబ్బంది పెడుతున్నాయి. దావతైతే ఇచ్చేద్దాం జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల కోసం పోటీ పడాలనుకునే ఆశావహులకు రిజర్వేషన్ల ఖరారు నుంచే తమ మద్దతుదారుల ఒత్తిడి పెరుగుతోంది. ‘అన్నా.. ఈసారి పండుగకు ఊళ్లె మనమే చూసుకోవాల్నె..’ అంటూ వెంటపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ‘పోయిపోయి.. ఈ ప్రకటన దసరా పండుగప్పుడే అచ్చే.. ఇగ ఊళ్లె ఆగుతరా..! పెద్దరికానికన్నా దావతియ్యవడతది..’ అంటూ చాలామంది నేతలు, నాయకులు, ఆశావహులు దసరాకు సిద్ధమవుతున్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో గోవింద్ సూచించారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణపై అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఆర్వోలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల విధులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిబంధనలు, ఎన్నికల సామగ్రి వినియోగం తదితర అంశాల గురించి వివరించారు. డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న తదితరులు పాల్గొన్నారు. -
భైంసాలో రావణ దహనం ప్రత్యేకం
భైంసాటౌన్: దసరా రోజు సాయంత్రం భైంసాలో పట్టణంలో రావణ దహనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. పట్టణంలోని కిసాన్గల్లిలోగల బాగుబాయి గుట్టపై సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు బాబన్న, ప్రవీణ్, శంకర్, విశాల్, ప్రకాశ్ ఆధ్వర్యంలో ఏటా దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు రూ.లక్షకుపైగా వెచ్చించి గుట్టపై రావణ ప్రతిమను ఏర్పాటు చేసి పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించి కార్యక్రమం ప్రారంభిస్తారు. భారీ టపాసుల పేలుళ్లతో జరిగే రావణ ద హనం కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు భారీసంఖ్యలో తరలివస్తారు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించి సంతోషంగా గడుపుతారు. -
వన్యప్రాణుల సంరక్షణ.. అందరి బాధ్యత
సారంగపూర్: వన్యప్రాణుల సంరక్షణ.. అందరి బాధ్యత అని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ సూచించారు. మండలంలోని చించోలి(బీ) గ్రామ సమీపంలోగల గండిరామన్న హరితవనంలో బుధవారం వన్యప్రాణి సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం హరితవనంలో విద్యార్థులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవి జంతులవులతోనే అటవీ రక్షణ సాధ్యపడుతుందని తెలిపారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అడవి జంతువులను వేటాడి తినడంతో జీవవైవిధ్యంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా వన్యప్రాణులు ఆహా రం కోసం గ్రామాల్లోకి చొరబడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తే ప్రకృతి విపత్తులనుంచి బయటపడే అవకాశముందని, మానవ మనుగడకు నష్టం జరగదని పేర్కొన్నారు. ఎఫ్‌డీవో నాగిణీభాను, ఎఫ్ఆర్వోలు రామకృష్ణ, వేణుగోపాల్, శ్రీనివాసరావు, రమేశ్ రాథోడ్, డీఆర్వోలు నజీర్‌ఖాన్, సంతోష్, రాజేశ్వర్, ఇర్ఫాన్, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. -
విజయానికి ప్రతీక
నిర్మల్ఘనంగా ఆయుధపూజ నిర్మల్‌టౌన్: దసరాను పురస్కరించుకుని జిల్లా సాయుధ కార్యాలయంలో బుధవారం ఎస్పీ జానకీ షర్మిల జమ్మి చెట్టు, పోలీస్ వాహనాల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజ లందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపా రు. దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు శాంతియుతంగా జరుపుకో వాలని సూచించారు. అనంతరం సిబ్బందికి వి జయదశమి బోనస్‌ను స్వయంగా అందజేశా రు. కార్యక్రమంలో ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేశ్ మీనా, సీఐలు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్‌టౌన్: తెలుగు ప్రజలు జరుపుకొనే పండుగల్లో అతిపెద్దది దసరా. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈ పండుగను మహా సంబురంగా జరుపుకొంటారు. హిందూ సంస్కృతిలో దీనికి ఎంతో ప్రా ముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, మహిషాసురుడిపై దుర్గామాత విజయం, రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా నిర్వహించుకుంటారు. ఈ రోజు ఆయుధ పూజ, పొలిమేర దాటడం, జమ్మి చెట్టు పూజ, పాలపిట్ట దర్శనం చేసుకునే ఆనవాయితీ అనాధిగా వస్తోంది. నేడు విజయదశమి దసరా సందర్భంగా ప్రత్యేక కథనం.. ఆయుధ పూజ: దసరా పండుగ రోజు నిర్వహించే ఆయుధ పూజ చాలా విశిష్టమైంది. ఉద్యోగలు, వ్యాపారాల్లో స్థిరపడ్డవారంతా ఈ పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రి, ముఖ్యమై న పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి ఆయు ధ పూజ నిర్వహిస్తారు. పాలపిట్ట దర్శనం: దసరా వేడుకలు నిర్వహించిన అనంతరం పాలపిట్టను చూస్తారు. పాలపిట్టను చూడడానికి గల ప్రత్యేకత ఏమిటంటే పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనబడిందని, అప్పటినుంచి వారికి విజయాలు కలి గాయని అందరూ నమ్ముతారు. అందుకే విజ యదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్ట చూడడం ఆనవాయితీగా వస్తోంది. జమ్మి చెట్టు పూజ: పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాత వాసానికి వెళ్తూ.. జమ్మి చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలు దాచి వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడని.. ఆ యుద్ధంలో శత్రువులను జయించి విజయం పొందాడని చెబుతారు. అందుకే ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మి చెట్టును అప్పటినుంచి పవిత్రంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. మహాలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాట్లు జిల్లా కేంద్రంలోని బంగాల్పేట్ మహాలక్ష్మి, నందిగుండం దుర్గామాత అమ్మవారి ఆలయాల ప్రాంగణాల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సుమారు రెండెకరాల ఖాళీ స్థలంలో రావణ వధ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్థలం చదును చేయించారు. ఉత్సవాల నిర్వహణకు మున్సిపల్ ఆధ్వర్యంలో వేదిక, లైటింగ్, టెంట్లు, బారికేడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. విశ్వహిందూ పరిషత్, బంగల్పేట్ ఆంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణమంతా మామిడి తోరణాలతో అలంకరించారు. రావణుని బొమ్మ దహన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు ప్రజలు అధికసంఖ్యలో హాజరవుతారు. మహాలక్ష్మి ఆల యం సమీపంలోని దసరా ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ ఆలయంతో పాటు నందిగుండం దుర్గామాత ఆలయం వద్ద దసరాను పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలు దసరా వేడుకలు గురువారం సాయంత్రం 5గంటలకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రారంభిస్తారు. కలెక్టర్ అభిలాష అభినవ్ శమీపూజ చేస్తారు. ఆయుధ పూజను ఎస్పీ జానకీ షర్మిల నిర్వహిస్తారు. అనంతరం ఎ మ్మెల్యే రావణుని బొమ్మను దహనం చేస్తారు. స భాధ్యక్షుడిగా ముప్పిడి రవి వ్యవహరిస్తారు. భరతమాత పూజను విశ్వహిందూ పరిషత్ ఇందూరు వి భాగ్ ధర్మచర్య సంపర్క్ ప్రముఖ్ పతికే రాజేందర్ నిర్వహిస్తారు. దీనికి ముందు వీరంతా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం దసరా పండగను పురస్కరించుకుని బంగాల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయనికి వచ్చే భక్తులకు మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు కల్పించాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆలయం పక్కన గల గ్రౌండ్ చదును చేశాం. వాటర్, కరెంట్ సౌకర్యం కల్పించాం. టెంట్లు, బారికేడ్లు, వేదిక సిద్ధం చేశాం. – జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ విజయవంతం చేయాలి బంగాల్పేట్ మహాలక్ష్మి ఆలయం నిర్మల్‌లోనే ప్రసిద్ధి గాంచింది. ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ఆలయాన్ని శోభాయామనంగా ముస్తాబు చేశాం. భక్తులకు వసతులు కల్పించాం. భక్తులు అధికసంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలి. – ముప్పిడి రవి, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు -
రిజర్వేషన్ల పంచాయితీ
నిర్మల్161బీబీ రహదారి పొడిగింపునకు చర్యలు భైంసాటౌన్: నియోజకవర్గంలో చేపడుతున్న 161బీబీ హైవేను మహారాష్ట్రలోని మాహోర్ వ రకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ తెలిపారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. 161బీబీ హైవే ను 161ఏ హైవేకు అనుసంధానించాలని గతంలో కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించినట్లు పేర్కొన్నారు. స్పందించిన ఆయన సంబంధిత అధి కారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రహదారి పొడిగింపునకు మార్గం సుగ మం అవుతుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశా రు. పొలంబాట కింద నియోజకవర్గంలో వ్యవసాయ క్షేత్రాలకు మొరం రోడ్ల నిర్మాణానికి రూ.7.97 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మార్గ సూచి.. ప్రయోజనకారి పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీ కి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. బోధన, పరీక్షలు, సెలవులు, వార్షిక కార్యక్రమాల షెడ్యూల్ పొందుపర్చింది. ఎందుకీ పరిస్థితి? 2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల ర్యాంకింగ్ ఇచ్చారు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జరుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్‌గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్‌గా ర్యాంకింగ్‌లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50శాతం, వంద శాతం ఎస్టీలు ఉన్న చోట్ల వారికే నోటిఫై చేయడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాకింగ్ ఇచ్చే క్రమంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయా చోట్ల రిజర్వేషన్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణంతో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుభవించని కారణంగా మరోసారి వారికే అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకున్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదాలు జరగడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆయా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రామాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుపై పునః పరిశీలన చేయాలని విన్నవిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. జనాభా లేకున్నా అవకాశాలు ఉప సర్పంచ్‌లకే పగ్గాలు సర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచ్‌లే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించే అవకాశం ఉంది. -
ఉపాధి కూలీలకు బీమా
లక్ష్మణచాంద: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ నిరుపేదలకు స్థిరమైన ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోది. ఈ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగిన కూలీలకు ఏడాదిలో 100 రోజుల పని దినాలను అందించడంతోపాటు, వారికి ఆర్థిక స్థిరత్వం కల్పిస్తోంది. ఇప్పుడు, ఈ కూలీలకు మరింత రక్షణ అందించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై)ను ఈ పథకంతో అనుసంధానం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.20తో బీమా సౌకర్యం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద, జాబ్‌కార్డు హోల్డర్లు కేవలం రూ.20 చెల్లించి బీమా పరిరక్షణ పొందవచ్చు. 18 నుంచి 70 ఏళ్లలోపువారు బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా ఉన్నవారు, సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి, నామమాత్రపు రుసుముతో ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. బీమా ప్రయోజనాలు.. ఈ బీమా యోజనలో చేరిన ఉపాధి కూలీలు పని సమయంలో ఊహించని దుర్ఘటనల నుంచి రక్షణ పొందుతారు. పనిలో ఉండగా మరణం సంభవించినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా, రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అదే విధంగా, పాక్షిక వైకల్యం జరిగిన సందర్భంలో రూ.లక్ష బీమా మొత్తం అందించబడుతుంది. ఈ ఆర్థిక సహాయం కూలీల కుటుంబాలకు క్లిష్ట సమయంలో ఆసరాగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇలా... జిల్లాలో 18 మండలాల్లో 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇక్కడ ఉపాధి హామీ కింద 1,76,575 కుటుంబాల నుంచి 3,34,726 మంది కూలీలు నమోదితులయ్యారు. వీరిలో 85,180 యాక్టివ్ జాబ్ కార్డులతో 1,35,209 మంది కూలీలుగా గుర్తించబడ్డారు. ఈ భారీ సంఖ్యలో కూలీలకు బీమా పథకం గురించి తగిన అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ జాబ్ కార్డు హోల్డర్ ఈ బీమా సౌకర్యాన్ని పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మండలాల వారీగా కుటుంబాలు, కూలీల వివరాలు.. మండలం కుటుంబాలు కూలీలు బాసర 1,832 2,818 భైంసా 5,558 8,791 దస్తురాబాద్ 2,906 4,056 దిలావార్పూర్ 2814 3868 కడెం 8,555 13,471 ఖానాపూర్ 7,695 11,663 కుభీర్ 7,779 14,742 కుంటాల 3,804 6357 లక్ష్మణచాంద 3,350 4791 లోకేశ్వరం 3,983 6,147 ముధోల్ 3,364 5,447 నర్సాపూర్(జి) 3,734 6,105 నిర్మల్ రూరల్ 3,917 5,368 పెంబి 3,681 5,905 సారంగాపూర్ 7,654 11,187 సోన్ 2,507 3185 తానూర్ 6,753 13,080 మొత్తం జాబు కార్డులు 85180 మొత్తం కూలీల సంఖ్య 1,35,209 -
కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ అంశాలపై అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతీ అధికారి కోడ్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో రాజకీయ ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్స్ ఉండకూడదన్నారు. రాజకీయ పా ర్టీల కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం వివరాలను పర్యవేక్షించాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పోస్టులను తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రి య సజావుగా జరిగేందుకు ఎఫ్ఎస్టీ, వీఎస్టీ, ఎస్ ఎస్టీ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, ఆయా మార్గాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూడాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, సీపీవో జీవరత్నం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హిందువుల ఐక్యతకే పంచ పరివర్తన్
నిర్మల్‌ఖిల్లా: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని ఇందూర్ విభాగ్ కార్యవాహ రాజులవార్ దిగంబర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ మంజులాపూర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయదశమి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని వివరించా రు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరి వర్తన కోసం పాటుపడాలని సూచించారు. ముఖ్యఅతిథిగా హాజనైన సద్గురు మహాదేవస్వామి మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు స్వాగతించాలని కోరారు. జిల్లా సహ కార్యవాహ మంచిరాల నాగభూషణం, కిన్నెర్ల రవి, నార్లపురం రవీందర్, వల్లెపు శివ, నారి విక్రమ్, అయిండ్ల సాత్విక్, తాండ్ర సుశాంత్, చిన్నయ్య, సుదర్శన్‌చారి పాల్గొన్నారు. -
భీమన్న ఆలయం ఆక్రమణపై ఎస్పీకి ఫిర్యాదు
నిర్మల్‌టౌన్: మామడ మండలం పోతారం గ్రామంలో ఆదివాసీ నాయక్‌పోడ్‌ల ఆరాధ్య దైవం భీమన్న ఆలయాన్ని గిరిజనేతరులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య తెలిపారు. ఈ విషయంపై ఎస్పీ జానకీ షర్మిలకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసుల కులదైవం భీమన్న ఆలయాన్ని ఆక్రమించడం తమ సంస్కృతి ,సంప్రదాయాలను ధ్వంసం చేయడమే అవుతుందని మండిపడ్డారు. ఈ దౌర్జన్యంపై అధికా రులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
స్థానిక సంస్థల నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పలు దశల్లో అధికారులందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నా రు. ఎస్పీ మాట్లాడుతూ రెవెన్యూ, ఇతర అధి కారుల సమన్వయంతో జిల్లాలో ఎన్నికలు ప్రశా ంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. కోడ్ అమలులో ఉన్నందువల్ల సరైన పత్రాలు లేకుండా రూ.50 వేల నగదును వెంట తీసుకు వెళ్లరాదన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం ఇటీవల నిర్మల్ జిల్లాకు జల్ సంచాయ్–జన భాగిధారి కార్యక్రమంలో అవార్డు లభించడంతో అధికారులను అభినందించారు. భవిష్యత్‌లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ మరిన్ని అవార్డులు సాధించి జిల్లా పేరును దేశవ్యాప్తంగా నిలపాలన్నారు. ప్రజావాణి తాత్కాలిక వాయిదా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలన్నారు. అధికారులంతా ఎన్నికల కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎలక్షన్ కోడ్ జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దుర్గాదేవి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలననిర్మల్చైన్గేట్: దుర్గాదేవి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేసే వినాయక సాగర్ చెరువు (బంగల్పేట్ చెరువు)ను ఆమె పరిశీలించారు. ప్రజలు చెరువులోకి దిగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంతకుముందు బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్‌కు అమ్మవారి ఫొటోను బహూకరించారు. పూజారులు ఆలయ చరిత్రను, విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. -
రైతుల కష్టం వరదపాలు
ఈచిత్రంలో కనిపిస్తున్న రైతు లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామానికి చెందిన భోజన్న. ఈ ఏడాది తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవలే పంట కోత దశకు వచ్చింది. కంకులను కోసి రోడ్డుపై ఆరబెట్టాడు. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న కంకులకు మొలకలు వచ్చాయి. దీంతో పంట దిగుబడి రావడం గగనంగా మారిందని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఈ ఒక్క రైతుదే కాదు జిల్లాలోని చాలామంది అన్నదాతలదీ ఇదే పరిస్థితి. లోకేశ్వరం: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేకుండా పోతోంది. విత్తనం విత్తింది మొదలు ప్రకృతి పగబట్టినట్లు వెంటాడుతూనే ఉంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జిల్లాలో సాగు చేసిన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం 4.30 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. మొదట్లో ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో పంటల్లో ఎదుగుదల లోపించింది. తీరా పంట దిగుబడి చేతికి వచ్చే సమయంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట చేలలోనే సోయా, పత్తి కాయలకు మొలకలు వస్తున్నాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న కంకులు తడిసిపోవడంతో మొలకలు వస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రధానరోడ్లపై ఆరబోసిన కంకులు సైతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తడారక మొలకలు వస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అంతర పంటగా మొక్కజొన్న .. పసుపులో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేస్తారు. వర్షాలకు పంటచేలలో నీరు నిలవడంతో తేమ ఆరిపోయేంత వరకు మొక్కజొన్నను కోయలేని పరిస్థితి. ఇదే జరిగితే మొక్కజొన్న పసుపు పై పడిపోయి పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. కోసిన కంకులను కుప్పగా పోస్తే వర్షానికి నాని మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్నా.. మొక్కజొన్న పంటకు మార్కెట్లో మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400లు ఉండగా ఓపెన్ మార్కెట్లో రూ.2,800 నుంచి రూ.3000ల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో తొలిదశ కత్తెర పురుగు, గింజదశలో కోతులు, రామచిలుకలు, అడవి పందులు దెబ్బతీశాయి. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 15 నుంచి 20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సాగు వివరాలు పంట ఎకరాల్లో మొక్కజొన్న 15,371 వరి 1.40 లక్షలు పత్తి 1.57 లక్షలు సోయా 40,000 -
మద్యం దుకాణాలకు 7 దరఖాస్తులు
నిర్మల్‌టౌన్: జిల్లాలోని మద్యం దుకాణాలకు సోమవారం ఏడు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తామన్నారు. ప్రతీ దరఖాస్తుకు రూ.3 లక్షలు రుసుముగా నిర్ణయించామని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా అందజేయవచ్చన్నారు. గౌడ కులస్తులకు 3, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 రిజర్వేషన్ కల్పించామన్నారు. డీడీలు, చలాన్లు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి నిర్మల్ పేరున తీయాలని, దరఖాస్తు ఫారం జిల్లా కార్యాలయంలో లేదా హైదరాబాద్ ఎకై ్సజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. -
సద్దుల సందడి
అమ్మ సన్నిధిలో భక్తజనం చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని అత్యంత ప్రీతిపాత్రమైన మూలనక్షత్ర శుభఘడియల్లో దర్శించుకునేందుకు రాష్టం నలుమూలల నుంచి భక్తులు సోమవారం అధికసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. ఈ సందర్భంగా సరస్వతీ అమ్మవారు మహాగౌరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, పట్టణ ప్రాంత మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మల వద్ద పూజలు చేశారు. అధికారులు, పట్టణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం స్థానిక ధర్మసాగర్ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. – నిర్మల్‌చైన్‌గేట్ -
పూలే స్ఫూర్తితో కులనిర్మూలనకు కృషి
నిర్మల్‌చైన్‌గేట్: జ్యోతిరావు పూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకు కృషి చేద్దామని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నందిరామయ్య పిలుపునిచ్చా రు. సోమవారం జిల్లా కేంద్రంలో గల ప్రభు త్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవన్లో కుల నిర్మూలన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధకు సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి దేశంలో అంటరానితనం, కుల నిర్మూలన జరగాలని పోరాడారన్నారు. జిల్లా కార్యదర్శి కే.రాజన్న మాట్లాడుతూ కులాలు, మతాలను ప్రోత్సహించి అధికారాన్ని కాపాడుకుంటున్నారని, ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ (ప్రజాపంథా) నాయకులు ఎం.బక్కన్న, ఆర్.రామలక్ష్మణ్, ఎస్.గంగన్న, గపూర్, గంగామణి, ఎస్.లక్ష్మి, దేవక్క, భీమవ్వ, ఫెరోజ్ పాల్గొన్నారు.మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి కే.రాజన్న -
● రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ● మూడు విడుతల్లో సర్పంచ్ ఎన్నికలు ● షెడ్యూలు విడుదల చేసిన ఎన్నికల సంఘం
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాలోని 18 మండలాల్లో 400 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 157 ఎంపీటీసీ, 18 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.. జిల్లాల్లోని 18 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నా రు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వి డుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల కమిషనర్ తెలిపారు. మొదటి విడత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీల మండలాలు మండలం ఎంపీటీసీల సంఖ్య ఓటర్లు ఖానాపూర్ 8 23,658 పెంబి 5 10,886 కడెం 10 29,159 దస్తూరాబాద్ 5 12,894 మామడ 9 26,072 లక్ష్మణచాంద 9 24,577 నిర్మల్ 7 22,751 సోన్ 8 21,801 సారంగాపూర్ 14 39,516 రెండవ విడత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీల మండలాలు మండలం ఎంపీటీసీల సంఖ్య ఓటర్లు దిలావర్పూర్ 6 18,744 నర్సాపూర్(జి) 7 20,238 లోకేశ్వరం 10 29,359 కుంటాల 7 19,055 భైంసా 11 33,970 కుభీర్ 14 40,625 తానూర్ 11 31,516 ముధోల్ 10 28,754 బాసర 6 15,728 -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్‌టౌన్: అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదు లు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలను తె లుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలి గించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూ చించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీ సుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. -
మస్తు ఆశలుండే
ఈసారి మొదటి నుంచి వర్షాలు విస్తారంగా కురియడంతో మొక్కజొన్న సాగుచేయాలని నిర్ణయించుకున్నా. కానీ ఆశించిన మేర పంట దిగుబడి వచ్చేలా కనిపించడంలేదు. మొక్కజొన్న కంకులకు ఎక్కడ చూసినా మొలకలే కనిపిస్తున్నాయి. – రాథోడ్ బలీరాం, నగర్‌తండా దిగుబడి కష్టమే అధిక వర్షాలు కురవడం వల్ల ఈ సారి సాగు చేసిన పంటలు చేతికి రావడం కష్టమే. పెట్టుబడులు సైతం మునగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీ కర్రకు మొలకలే కనిపిస్తున్నయ్. సోయా, పత్తి పంటలకు కూడా మొలకలు వస్తున్నయ్. – ప్రవీణ్, రాయాపూర్‌కాండ్లీ ఉన్నతాధికారులకు నివేదిస్తాం మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే చేతికి అందివస్తోంది. రైతులు చేలల్లో పంట ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులచేత సర్వే చేయించాం. ఉన్నతాధికారులకు నివేదిస్తాం – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఖానాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటే ల్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఊరూరా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో గ్రామాల్లో పనుల జాతర జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలే పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాంది అవుతాయని, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి అభ్యర్థుల గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రెండో విడతలో ఖానాపూర్‌లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
జిల్లా కవులకు పురస్కారాలు
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన పలువురు కవులు సాహితీరంగంలో పురస్కారాలు స్వీకరించారు. పత్తి శివప్రసాద్, తుమ్మల దేవరావ్, అంబటి నారాయణ, వెంకట్, జాదవ్ పుండలీక్‌రావు సాహితీ కిరీటి ప్రతిభా జాతీయ పురస్కారాలు, పోలీస్ భీమేశ్ యువ సాహితీ కిరీటి పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్‌లోని బిర్లా ప్లాంటోరియం, ఆడిటోరియంలో ఆదివా రం నిర్వహించిన శ్రీశ్రీకళావేదిక 155వ సాహి తీ పట్టాభిషేక మహోత్సవంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు జీ ఈశ్వరీభూషణం, జాతీయ యువజన అధ్యక్షుడు గరిమెళ్ల రాజేంద్రప్రసాద్ తదితరుల చేతులమీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరికి జ్ఞాపిక, శాలువా, ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు. వీరిని జిల్లాకు చెందిన పలువురు అభినందించారు. -
‘మన్ కీ బాత్’ వీక్షణ
నిర్మల్‌చైన్‌గేట్/కడెం: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఏలేటి మ హేశ్వర్‌రెడ్డి వీక్షించారు. నాయకులు రాంనాథ్, స త్యనారాయణగౌడ్, ముత్యంరెడ్డి, కార్తిక్, సాయి, అ రవింద్, నవీన్, నరేందర్, జమాల్, చంద్రకాంత్, కిషన్, రాజు, సాత్విక్ తదితరులున్నారు. కడెం మండలం పెద్దూర్లో ‘మన్ కీ బాత్’ను బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ వీక్షించారు. అనంతరం మండలంలోని లింగాపూర్, సారంగపూర్, మాసాయిపే ట్ గ్రామాల్లోని దుర్గామాత మండపాల్లో అమ్మవారి కి పూజలు చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, మోహన్‌నాయక్, కృష్ణ, రంజిత్, లక్ష్మణ్, రాజేందర్ పాల్గొన్నారు. పెద్దూర్లో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రితేశ్‌రాథోడ్ నిర్మల్ చైన్‌గేట్: కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎమ్మెల్యే -
వచ్చింది 12.. పోయింది 11
భైంసాటౌన్: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లో అంచనా వేస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈసారి జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఏకంగా 12టీఎంసీ లకు పైగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1.83 టీఎంసీలు (358.70 మీట ర్లు) కాగా, దాదాపు పదింతల నీరు చేరింది. ఇప్పటివరకు 11.461 టీఎంసీలను దిగువకు వదిలారు. ఈసారి భారీగా ఇన్‌ఫ్లో గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే వరదనీరు వచ్చి చేరుతోంది. ఈసారి జూన్ నుంచి ఆగస్టు 15వరకు సరైన వర్షాలు లేక ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకో లేదు. అనంతరం భారీ వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. భారీ ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వది లారు. ఈసారి ప్రాజెక్ట్‌కు అధికంగా 43వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అత్యధికంగా ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అలాగే, శనివారం ఒక్కరోజులోనే సగానికిపైగా టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌కు వచ్చి చేరడంతో, అధికారులు వచ్చిన మొత్తం నీటి ని దిగువకు వదిలారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమ ట్టం 1.83 టీఎంసీలు కాగా, ఇప్పటివరకు 12.499 టీఎంసీల వరదనీరు వచ్చి చేరింది. ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తూ ఇప్పటివరకు 11.461 టీఎంసీల నీటిని ప్రాజెక్ట్ నుంచి వదిలిపెట్టారు. ఇప్పటివరకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలుపూర్తిస్థాయి నీటిమట్టం 1.83 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 1.602 టీఎంసీలు మొత్తం ఇన్‌ఫ్లో 12.499 టీఎంసీలు వదిలిన నీరు 11.461 టీఎంసీలు -
శ్రమించారు.. సాధించారు
నిర్మల్‌ఖిల్లా: లక్ష్యం దిశగా శ్రమిస్తే స్వప్నం సాకారమవుతుంది. జిల్లా కేంద్రానికి చెందిన జసింత్ జో యల్ ఇందుకు నిదర్శనం. కరుణ–డేనియల్ దంపతుల పెద్ద కుమారుడు జసింత్ జోయల్ గ్రూప్–1 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బీసీ ‘సీ’ కేటగిరీలో రాష్ట్రస్థాయి తొలి ర్యాంక్ కై వసం చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆసిఫాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. జోయల్ ఎనిమిదో తరగతి వరకు స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో, 9–10 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలోగల కేకేఆర్ గౌతం స్కూల్లో, ఇంటర్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో, బీటెక్ తమిళనాడులోని వెల్లూరులో పూర్తి చేశారు. అనంతరం బీహెచ్ఈఎల్లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత నాలుగేళ్లుగా సివిల్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. నిత్యం 18గంటలకు పైగా పుస్తకాలతో కుస్తీపట్టి శ్రమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇతని తల్లి కరుణ సారంగపూర్ మండలం ధని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా, తండ్రి డేనియల్ జిల్లాకేంద్రంలోని గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తున్నట్లు జోయల్ తెలిపారు. జోయల్‌ను స్థానికులు అభినందిస్తున్నారు. మూడేళ్ల కష్టం.. ఎంపీవో ఉద్యోగం -
మళ్లీ ముంచిన గోదావరి
లక్ష్మణచాంద: మండలంలోని గోదావరి పరీ వాహక గ్రామాల్లో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు పంటలను గోదావరి వరద ముంచెత్తింది. గత ఆగస్టు చివరి వారంలో ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కుల నీటిని వదలగా పీచ ర, ధర్మారం, పార్పెల్లి, మునిపెల్లి, మాచాపూర్, చింతల్‌చాంద గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీటిమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు పంట నష్టంపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఇంతవరకు పరిహారం అందలేదు. ఆదివారం గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండగా పీచర, ధర్మారం, పార్పెల్లి, చింతల్‌చాంద, మునిపెల్లి గ్రామాల్లో పంటలు మళ్లీ నీట మునుగుతుండగా మొక్కజొన్న, సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఎకై ్సజ్ ఎస్సై నుంచి డీటీగా..
కుంటాల: మండల కేంద్రానికి చెందిన కార్గాం లక్ష్మి–భూమన్న దంపతుల కుమారుడు గోవర్ధన్ గ్రూప్–2లో ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. గోవర్ధన్ 2011లో ఎస్బీఐ మేనేజర్‌గా ఉద్యోగం సాధించి విధుల్లో చేరారు. 2020లో నిర్వహించిన గ్రూప్–2లో ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా భీంగల్ ఎకై ్సజ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)గా ఎంపికయ్యారు. గోవర్ధన్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. -
సహకార సంఘం పాలకవర్గం ఎన్నిక
నిర్మల్‌ఖిల్లా: లోకమాన్య పరస్పర సహాయ పరప తి, సహకార సంఘం లిమిటెడ్ నిర్మల్ జిల్లా పాలకవర్గ సభ్యులను ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లాకేంద్రంలోని స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రెండో వార్షిక మహాసభ సర్వసభ్య సమావే శం, అనంతరం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నూతన పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై న ట్లు ఎన్నికల పరిశీలకులు ప్రకటించారు. చైర్మన్‌గా భూసారపు గంగాధర్, వైస్ చైర్మన్‌గా శివరాం వెంకటేశ్, జనరల్ సెక్రటరీగా సతీశ్, క్యాషియర్‌గా అన్నం వసుదేవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా నరేందర్‌రెడ్డి, జాయింట్ ట్రెజరర్‌గా శ్రీనివాస్, డైరెక్టర్లుగా అనురాధ పంపట్వార్, ఓటారికారి విద్యాసాగర్, కుంచంవార్ మోరేశ్వర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికా రిగా ఉప్పులూటి రవికుమార్ తెలిపారు. సలహా క మిటీ సభ్యులుగా నూకల విజయ్‌కుమార్, నార్లపు రం రవీందర్, మంచిరాల నాగభూషణంను ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి, వక్తగా సహకార భారతి తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ సెల్ ప్రముఖ్ బాబుచంద్ హాజరయ్యారు. -
లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
నిర్మల్‌చైన్‌గేట్/ఖానాపూర్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో పలువురు అధికారులు కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రోద్యమం, నిజాం వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఖానాపూర్ పట్టణంలోని తిమ్మాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొని నివాళులర్పించారు. -
ప్రజలకు చేరువయ్యేలా కమ్యూనిటీ బతుకమ్మ
● ఏఎస్పీ రాజేశ్ మీనా ఖానాపూర్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమం చేపట్టామని ఏఎస్పీ రాజేశ్ మీనా అన్నారు. పట్టణంలోని శ్రీరాంనగర్ దుర్గామాత మండపం వద్ద శనివారం కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమంలో మాట్లాడారు. కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు మహిళల రక్షణపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. పోక్సో చట్టంతోపాటు ర్యాష్ డ్రైవింగ్, మైనర్డ్రైవింగ్, లైగింక దాడుల నుంచి రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ తదితర అంశాలను విషయాలు తెలియజేశారు. అంతకముందు దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళల బతుకమ్మ ఆటను వీక్షించారు. కార్యక్రమంలో సీఐ అజయ్, ఎస్సైలు రాహుల్ గైక్వాడ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో ఆయుధపూజ
బాసర: విజయదశమి వేడుకల్లో భాగంగా బాసర ఆర్జీయూకేటీలో వివిధ విభాగాల పరిశోధనలో శనివారం ఆయుధపూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా అర్చకులు కిశోర్ సరస్వతి, లక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాల ముందు ల్యాబ్ పరికరాలు, యంత్రాలపై పురోహితుడు పూజించి ఇచ్చిన అక్షతలను, జలాన్ని వాటిపై చల్లారు. ఇన్చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ఆయుధపూజ అనేది వ్యవసాయ ఉపకారణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడినదన్నారు. యూనివర్సిటీలో ఉన్న భారీ యంత్రాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయని, అందుకే శుభ్రం చేసి పూజ చేసినట్లు వెల్లడించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ సాధారణంగా ఆయుధపూజను నవమి నాడు జరుపుతారని, యూనివర్సిటీకి దసరా సెలవులు ప్రకటించినందున ముందస్తుగా నిర్వహించామని తెలిపారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లాలోని 18 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వాటాలను నిర్ణయించగా, బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం కేటాయించామన్నారు. మొత్తం ప్రక్రియ వీడియో రికార్డింగ్ మధ్యన, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని తెలిపారు. ఈ లక్కీడ్రా కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డిప్యూటీ సీఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ పీఠం బీసీలదేజిల్లాపరిషత్ పీఠాల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ రూరల్ ఎంపవర్మెంట్ శాఖ శనివారం విడుదల చేసింది. నిర్మల్ జెడ్పీ పీఠం ఈసారి బీసీలకే దక్కనుంది. బీసీ(పురుష/మహిళ)కు రిజర్వు చేస్తూ పంచాయతీరాజ్ రూరల్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ అండ్ స్టేట్ ఎలక్షన్ అథారిటీ జి.శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2024 వరకు నిర్మల్ జెడ్పీ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. ఈసారీ బీసీలకు అవకాశం దక్కనుంది. -
పండుగ చేసుకునేదెలా?
లక్ష్మణచాంద: బతుకమ్మ, దసరా తెలంగాణ ప్రజల కు పెద్ద పండుగ. ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటారు. అయితే పల్లె ప్రజలకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించి, వారు చేపట్టే పనుల ను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ, సకా లంలో వేతనాలు అందేలా చేయడంలో వివిధ స్థా యిల సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నా రు. అయితే, సిబ్బందికి మాత్రం రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో పండుగ వేళ ఇబ్బంది పడుతున్నారు. వివిధ స్థాయిలలో పని చేస్తున్న క్షేత్ర సహాయకుల(ఎఫ్‌ఏలు)కు జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు ఇంకా అందలేదు. టీఏలు, టీసీలు, ఏపీవోలకు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనం రావాల్సి ఉంది. మూడవ నెల చివరికి వచ్చినా నెలనెలా రావాల్సిన వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగకు పస్తులేనా? హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. దసరా పండుగ వచ్చేసరికి ధనిక, పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా, ఎవరి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు కొనుగోలు చేసుకుంటారు. కానీ, ఉపాధి హామీ పథకంలోని సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 373 మంది సిబ్బంది జిల్లాలోని 18 మండలాల పరిధిలో జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో 12 మంది ఏపీవోలు, 5 మంది ఈసీలు, 38 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 72 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 207 మంది క్షేత్ర సహాయకులు, 18 మంది ఆఫీస్ సబార్డినేట్లు, 21 మంది డీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది ఇలా మొత్తం 373 మంది విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్మికులదీ ఇదే పరిస్థితి.. గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర వెలకట్టలేనిది. జిల్లాలో పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు ఇప్పటి వరకు రాలేదని, దీంతో దసరా పండుగను ఎలా జరుపుకోవాలని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1,520 మంది కార్మికులు పని చేస్తున్నారు. వేతనాలు రాకపోతే పండుగకు పస్తులు ఉండాల్సి వస్తుందని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని పంచాయతీ కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల కార్మికులకు జూలై, ఆగస్టు నెలల వేతనాల కోసం ఇది వరకే ప్రభుత్వంకు నివేధించాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఖాతాల్లో జమ చేస్తాం. – శ్రీనివాస్, డీపీవో, నిర్మల్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేయగానే వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. – నాగవర్ధన్, ఏపీడీ ఉపాధిహామీ పథకం -
వేతనాల కోసం లేఖలు
నిర్మల్‌ఖిల్లా: డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీరియడ్ల వారీగా ప్రతీనెల రావాల్సిన కనీస వేతనం రూ.28 వేలు సైతం సమయానికి చెల్లించలేకపోవడంతో పండగలు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకులు వేతనాలు ఇప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలు రాశారు. మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 12 నెలల కాలానికి వేతనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో లేఖలు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించారు. అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్, జిల్లా అధ్యక్షుడు సురేందర్, జిల్లా కార్యవర్గపభ్యులు పాల్గొన్నారు. -
లైటింగ్‌తో కొత్తశోభ
సారంగపూర్: స్వర్ణ ప్రాజెక్టు వద్ద లైటింగ్ పునరుద్ధరణతో కొత్తశోభ సంతరించుకుందని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. స్వర్ణ ప్రాజెక్టుపై రూ.32.70 లక్షల వ్యయంతో చేపట్టిన లైటింగ్ పునరుద్ధరణ పనులను శనివారం ప్రారంభించారు. గతంలో ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తిన క్రమంలో జౌళి గ్రామ ప్రజలు తమ గ్రామానికి రాత్రివేళ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. కేవలం ప్రాజెక్టు వద్ద మాత్రమే లైట్లు ఉండేవని ఆనకట్ట పొడవునా, ఆనకట్టు కిందగల జౌళి రహదారి పక్కన మొత్తం చీకటి అలుముకునేదన్నారు. అందుకే లైట్ల పునరుద్ధరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి, నీటి విడుదల విషయంలో గేట్ల పరిస్థితిని గురించి ఈఈ అనిల్, ఎస్ఈ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీటి వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఇంకా వర్షాల ప్రభావం ఉండడంతో ఎప్పటికప్పుడు పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, బీజేపీ నాయకులు రావులరాంనాథ్, సత్యనారాయణగౌడ్, నాయకులు మంతెన గంగారెడ్డి, నరేశ్, చంద్రప్రకాశ్‌గౌడ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో కొనసాగుతున్న శరన్నవరాత్రి వేడుకలు
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం 6వ రోజు అమ్మవారు ‘కాత్యాయనీ దేవి’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు. నాలుగు భుజాలతో సింహ వాహిణియై ఎడమ చేతుల్లో ఖడ్గం/తాళపత్ర నిధి మరో చేతిలో పద్మం, కుడి చేతుల్లో అభయముద్ర వరదముద్ర కలిగి భక్తులను అనుగ్రహిస్తోంది. ఆలయ వైదికబృందం అ మ్మవారికి చతుషష్టి ఉపచార, మల్లెపుష్పార్చన పూ జలు నిర్వహించి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పిల్లలకు అక్షర శ్రీకారం చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు... ఉత్సవాల్లో భాగంగా కోటి గాజుల మండపంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని జిల్లాల కళాకారులు పాల్గొంటున్నారు. అమైర అనే చిన్నారి దాదాపు గంటపాటు ప్రదర్శించిన అద్భుతమైన కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
● ఎస్సీ జానకీ షర్మిల
జాతరకు పటిష్ట బందోబస్తు దిలావర్పూర్: అడెల్లి మహా పోచమ్మ (గంగనీళ్ల) జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల తెలిపారు. సాంగ్వి గ్రామంలోని పోచమ్మ ఆలయాన్ని శనివారం సందర్శించి పూజలు చేశారు. గోదావరి తీరాన్ని పరిశీలించారు. పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమై సూచనలు చేశారు. ఆదివారం అమ్మవారి ఆభరణాలు అడెల్లి ఆలయానికి వెళ్లేమార్గంలో ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నారు. అమ్మవారి ఆభరణాలు ఎత్తుకునేందుకు పోలీసులు ప్రయత్నించవద్దని సూచించారు. ఏఎస్పీ రాజేశ్ మీనా, సోన్ సీఐ గోర్ధన్రెడ్డి, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు. -
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
నిర్మల్‌చైన్‌గేట్: చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని స్థానిక అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐలమ్మ జయంతిని శుక్రవారం అధికారికంగా నిర్వహించారు. పలువురు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యయనాన్ని లిఖించిందన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు పాటుపడిన గొప్ప మహిళ అని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, రజక సంఘం అధ్యక్షుడు శంకర్, సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాసరలో వైభవంగా శారదీయ శరన్నవరాత్రులు
బాసర: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతీదేవి క్షేత్రంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం అమ్మవారు ‘స్కందమాత’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు నాలుగు చేతులతో సింహంపై కూర్చుని, చేతిలో కమలం, జలకలశం, ఘంటాతోపాటు, స్కందుడైన కార్తికేయుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని, ఒక చేయి అభయముద్రలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆలయ వైదికబృందం అమ్మవారికి చతుషష్టి ఉపచార విశేష పూజలు నిర్వహించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించారు. అమ్మవారి దర్శనానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భక్తులు తరలివచ్చారు. తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఇన్చార్జి ఈవో అంజనీదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం.. వేడుకల్లో భాగంగా శుక్రవారం ఆలయ కోటి గాజుల మండపంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని శాంకరి పాఠశాల విజయవల్లి భరద్వాజ్ వారిచే కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. భవానీ మాత అలంకరణలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఇవి భక్తులను అలరించాయి. పాదయాత్రగా వచ్చిన భక్తులు.... బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు కిరణ్ గురూజీ బడుల్కర్ ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నుంచి బాసర వరకు పాదయాత్రగా వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు.. వేడుకల కోసం బాసరకు వస్తున్న భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివాలయంలో పూజలు చేసి సరస్వతీ అమ్మవారికి మొక్కలను చెల్లించుకుంటున్నారు. -
చలో గంగనీళ్ల జాతర
సారంగపూర్: జిల్లాలోని అడెల్లి గ్రామానికి జాతర శోభ వచ్చింది. మహాపోచమ్మ గంగనీళ్ల జాతర శని, ఆదివారాల్లో(27, 28 తేదీల్లో) నిర్వహించనున్నా రు. మహాలయ అమావాస్య తర్వాత వచ్చే శని, ఆదివారాల్లో జాతర నిర్వహించడం సంప్రదాయం. జాతర కోసంఅధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆభరణాల మూటగట్టడంతో జాతర.. జాతర శనివారం ఉదయం అమ్మవారి ఆభరణాలను మూటగట్టడంతో ఆరంభమవుతుంది. కౌట్ల(బి), అడెల్లి, సారంగాపూర్ గ్రామాల భక్తులు, సేవాదారులు అడెల్లి పోచమ్మ ఆలయం నుంచి ఆభరణాలను తలపై ధరించి కాలినడకన దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో గోదావరి నదికి చేరుకుంటారు. ఈ యాత్రలో ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులు మేళతాళాలతో, సంప్రదాయ వాయిద్యాలతో సాగనంపుతారు. గోదావరి యాత్ర.. ఆభరణాలను సేవాదారులు తలపై ధరించి అడెల్లి, సారంగాపూర్, యాకర్పెల్లి, వంజర్, ప్యారమూర్, కదిలి, మాడెగాం, దిలావర్పూర్, బన్సపెల్లి, కంజర్, మల్లాపూర్ గ్రామాల మీదుగా సాంగ్వి చేరుకుంటారు. భక్తులు ‘‘గంగా నీకు శరణమే’’ అంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ యాత్రలో పాల్గొంటారు. సాంగ్విలోని పోచమ్మ ఆలయంలో ఆభరణాలను ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఆదివారం తెల్లవారుజామున ఆభరణాలను గోదావరి నదీతీరానికి తీసుకెళ్లి శుద్ధి చేసి, మూటగట్టి తిరిగి అడెల్లి ఆలయానికి చేరుకుంటారు. అడెల్లిలో మహోత్సవం.. ఆదివారం ఉదయం అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 10 గంటల వరకు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ జాతరకు భారీగా భక్తులు తరలిరావడంతో మహాజాతరగా పిలుస్తారు. ఆభరణాలను అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలతో జాతర ముగుస్తుంది. ప్రత్యేక ఏర్పాట్లు.. జాతర కోసం నిర్మల్, భైంసా నుంచి అడెల్లి ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నిర్మల్ రూరల్ సీఐ, స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహన పార్కింగ్ కోసం ఆలయానికి దూరంగా స్థలం కేటాయించారు. స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. బాలాలయంలోనే పూజలు..అడెల్లి మహాపోచమ్మ నూతన ఆలయ నిర్మాణం మూడు నెలల క్రితం పూర్తయింది. అయినా అధికారుల నిర్లక్ష్యం, పాలకుల సమన్వయ లోపంతో ప్రారంభోత్సవం జరగలేదు. చైన్నెలోని మహాబలిపురంలో 11.51 లక్షలతో విగ్రహాల తయారీ పూర్తయినా వాటి ప్రతిష్ఠాపనలో జాప్యం జరుగుతోంది. దసరా, దీపావళి మధ్య ప్రతిష్టాపన చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో జాతర, పూజలు ఈసారి కూడా బాలాలయంలోనే నిర్వహిస్తారు. సాంగ్విలో ఏర్పాట్లుదిలావర్పూర్: గంగనీళ్ల జాతరకు మండలంలోని సాంగ్వి గ్రామంలో ఏర్పాట్లు చేశారు. సారంగాపూర్, దిలావర్పూర్ మీదుగా అమ్మవారి నగలు శోభయాత్రగా సాంగ్వికి చేరుకుంటాయి. శనివారం సారంగాపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ ఆలయం నుంచి నగలను దిలావర్పూర్ మండలం కదిలి, మాటేగాం, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా సాంగ్వికి తీసుకురానున్నారు. శనివారం రాత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం గోదావరి నదీతీరంలో అమ్మవారి నగలను నదీజలాలతో శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అడెల్లికి తీసుకెళ్తారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తి.. జాతర నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టాం. వారం రోజుల ముందునుంచే ఆయా గ్రామాల్లో, మండలాల్లో ప్రచారం నిర్వహించాం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం, వైద్యసదుపాయం, తాగునీరు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. – భోజాగౌడ్, అడెల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు -
సాంగ్విలో 18వ శతాబ్దపు విగ్రహాలు
దిలావర్పూర్: మండలంలోని సాంగ్వి గ్రామ శివారు గోదావరి తీరాన చండిక, చాముండీ విగ్రహాలను గుర్తించినట్లు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఈ విగ్రహాల విశిష్టత వాటి స్వరూపాన్ని శుక్రవారం వివరించారు. చండిక పార్వతీదేవి రౌద్రరూపంగా, ఆది పరాశక్తిగా వర్ణింపబడుతుందన్నారు. చండా అంటే చేయించగల అని అర్థమన్నారు. శ్వేతాశ్వతరోపనిషత్లో చండికను ఆది పరాశక్తిగా వర్ణించారని తెలిపారు. మహిషాసుర మర్ధనం చేయడం ద్వారా దుర్గాదేవిగా చండికను భావిస్తారన్నారు. మెడలో పుర్రెలతో కూడిన హారం, కుడిచేతిలో ఆయుధం, ఎడమ చేతిలో బిందు, మోదకం, కర్ణాభరణాలు ఉన్నాయని వివరించారు. ఉగ్రరూపంలో ఉన్న చండిక దుష్ట సంహారణ చేసి భక్తులకు అభయమిచ్చిందని భావిస్తారని తెలిపారు. అలాగే మరో ప్రతిమ చాముండీ చాముండేశ్వరీ దేవిగా వివిధ పేర్లతో పిలిచే చాముండీ పార్వతీదేవి ఉగ్రరూపం అన్నారు. సప్త మాతృకలలో ఒకటిగా భావిస్తారన్నారు. దేవీ పురాణాల్లో దుర్గాదేవి సైన్యంలో 81 మంది తాంత్రిక దేవతలలో ఒక యోగినిగా చాముండిని ఆరాధిస్తారని పేర్కొన్నారు. చెండా, ముండా అనే ఇద్దరు రాక్షసులను సంహరించడం వల్ల చాముండేశ్వరీగా పిలుస్తారని తెలిపారు. చాంముడేశ్వరీ భయంకరమైన రూపం కలిగి మెడలో కపాల మాల, కుడిచేతిలో కత్తి, మరో చేతిలో ఆయుధం, గుడ్లగూబ వాహనంగా ఉంటుందని వివరించారు. ఈ రెండు విగ్రహాలు 18వ శతాబ్దపు కాలంలో ఆరాధనలు జరిగినట్లు తెలియజేస్తుందన్నారు. కర్ణాటక ప్రాంతంలో మధ్య భారతంలో చాముండీ, చండిక దేవతలను ఆరాధించారని తెలిపారు. క్షేత్ర పర్యటనలో భాగంగా తుమ్మల దేవరావుతోపాటు అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అరుదైన చండిక, చాముండి విగ్రహాలు -
జల సంరక్షణలో భేష్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాల పెంపు, సంరక్షణ చర్యలకుగాను మంచిర్యాల, ఆదిలా బాద్, నిర్మల్ జిల్లాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వ ‘జల్ సంచయ్ జన్ భాగీ ధారి’ అవార్డు వరించింది. ఇందుకు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు రూ.2కోట్ల చొప్పున, నిర్మల్ జిల్లాకు రూ.కోటి నగదు పురస్కారం అందనుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ‘నీటిని ఒడిసిపట్టు–వాన ఎప్పుడు, ఎక్కడ కురిసినా’ అనే నినాదంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది నుంచి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఆయా జిల్లాల్లో చేపట్టిన పనులపై అవార్డులతోపాటు నగదు పురస్కారంతోనూ సత్కరిస్తోంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం భూగర్భ జలాల లభ్యత, నీటి సంరక్షణ, నా ణ్యత పెంచుకోవడంతోపాటు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా కరువును ఎదుర్కొనేలా వాననీటిని ఒడిసిపట్టి భవిష్యత్ తరాలకు వాడుకోవాల్సి ఉంటుంది. సత్ఫలితాలు ఇస్తున్న నిర్మాణాలు ఉపాధి హామీ పథకంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పలు పథకాల కింద భూగర్భ జలాల పెంపునకు గ్రామీణ ప్రాంతాల్లో నీటికుంట లు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు, కందకాలు, పైకప్పు నీటి సేకరణ నిర్మాణాలు, వ్యక్తిగత, సామాజికపరంగా, బోర్ రీచార్జి కుంటలు నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా పట్టణాల్లో ఇంటింటికీ ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే వ్యవసాయ, తాగు, సాగు అవసరాలు, అటవీ ప్రాంతాల వృద్ధి కోసం ఆయా చోట్ల సామాజికపరంగా ఉపయోగపడేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు. దీంతో వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమిలో ఇంకేలా చేయడంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. నమోదు చేసిన వివరాల ప్రకారం గత మే నెలలో కేంద్ర అధికారులు, శాస్త్రవేత్తల బృందాలు భూగర్భ జలాల పరిరక్షణకు చేపట్టిన నిర్మాణాలతో భూమిలో నీటి లభ్యత పెరిగినట్లు గుర్తించారు. దీంతో వ్యవసాయానికి బావులు, బోర్ల నీటి ఊటలు పెరిగినట్లు గుర్తించారు. అలాగే ఇంకుడు గుంతలతోనూ జల వృద్ధి ఉన్నట్లుగా తేలింది. నీటిని సద్వినియోగంతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడనుంది. జిల్లా చేపట్టిన నిర్మాణాలు ఆదిలాబాద్ 98,693 మంచిర్యాల 84549 నిర్మల్ 60365 -
బతుకమ్మ వేడుక.. చైతన్య వేదిక
నిర్మల్: తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను సామాజిక చైతన్యం కోసం వినియోగిస్తూ జిల్లా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ బతుకమ్మ’ కార్యక్రమం ద్వారా మహిళలతో కలిసి పాటలు పాడుతూ, ఆడుతూ సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం గృహిణులను ఒకచోట చేర్చి, సామాజిక సమస్యలపై చైతన్య వేదికగా మారింది. గృహిణులే సైబర్ బాధితులు.. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల్లో గృహిణులు ప్రధాన బాధితులుగా మారుతున్నారు. భర్త, పిల్ల లు బయట ఉండగా ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలను సైబర్ నేరస్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘మీ భర్తను డిజిటల్ అరెస్ట్ చేశాం, ఓటీపీ ఎంటర్ చేయండి’ లేదా ‘పట్టుచీర గెలుచుకున్నారు, లింక్ క్లిక్ చేయండి’ వంటి ఆకర్షణీయమైన ఎత్తుగడలతో మోసం చేస్తున్నారు. ఇంటి బాధ్యతలు, సామాజిక జాగ్రత్తలు.. గృహిణులు కేవలం ఇంటి బాధ్యతలతోనే సరిపెట్టుకోకుండా, సామాజిక సమస్యలపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు సెల్ఫోన్లలో ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నారు వంటి అంశాలను పరి శీలించాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడంతో కొందరు యుక్తవయసు పిల్లలు మత్తుపదార్థాలకు బానిసలవుతూ, తప్పుదారి పడుతున్నారు. మహిళల సమైక్యత.. విద్యార్థులు, యువతను కలవడానికి స్కూళ్లు, కళాశాలలు లేదా సమావేశాలు సరిపోతాయి. కానీ, గృహిణులను ఒకచోట చేర్చడం సవాలుతో కూడుకున్న పని. బతుకమ్మ పండుగ మాత్రం ఈ సవాలును సులభతరం చేస్తుంది. గల్లీలోని మహిళలను ఒకచోటకు చేర్చి, ఆడుతూ పాడుతూ సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఎస్పీ జానకీషర్మిల నాయకత్వంలో పోలీసు శాఖ ‘కమ్యూనిటీ బతుకమ్మ’ ద్వారా మహిళలకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పిస్తోంది. నాయుడివాడ ఆర్యవైశ్య సంఘంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు పాల్గొనడం ఈ కార్యక్రమ విజయానికి నిదర్శనం. సైబర్ నేరాల నివారణకు చైతన్యం.. స్మార్ట్‌ఫోన్ యుగంలో రోజుకో కొత్త సైబర్ నేరం పుట్టుకొస్తోంది. ఈ నేరాలు మహిళలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ‘కమ్యూనిటీ బతుకమ్మ’ కార్యక్రమంలో పోలీసులు ఓటీపీ షేర్ చేయవద్దని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని, డిజిటల్ అరెస్ట్ వంటి భయపెట్టే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని సూచిస్తున్నారు. అలాగే, యుక్తవయసు పిల్లలను తప్పుదారి నుంచి కాపాడేందుకు తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మహిళా పోలీసులతో కూడిన ‘పోలీస్ అక్క’, ‘నారీశక్తి’, ‘శివంగి టీమ్’ వంటి కార్యక్రమాలను కూడా పరిచయం చేస్తూ, సమాజంలో సురక్షిత వాతావరణం కోసం కృషి చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకే.. బతుకమ్మ పండుగవేళ మహిళలతో కలిసి పోలీసుశాఖ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ‘కమ్యూనిటీ బతుకమ్మ’ పేరిట గృహిణులకు పలుఅంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా కమ్యూనిటీ బతుకమ్మకు మంచిస్పందన వస్తోంది. – డాక్టర్ జానకీషర్మిల, ఎస్పీ -
గిరి గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నేరడిగొండ: గిరిజన గ్రామాల అభివృద్ధే ఆదికర్మ అభియాన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు జితేంద్రసింగ్ అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో పర్యటించి కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా లింగట్ల గ్రామ పంచాయతీలోని గోండుగూడలో గుస్సాడీ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. లింగట్ల రాజురా, వెంకటపూర్ గ్రామపంచాయతీల్లో కార్యక్రమం అమలు, గ్రామాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక, గ్రామసభ, గ్రామ సోషల్ మ్యాపింగ్, నిరుద్యోగ యువత గుర్తింపు వంటి అంశాలను పరిశీలించి సంతృప్తి చెందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి వంటి అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. నేరడిగొండ మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. -
ముంబై ఎయిర్‌పోర్టులో ఆదిలాబాద్ వాసి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: టాంజానియా దేశంలో ఉంటూ మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. గురువారం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌రూరల్ పోలీసులు రౌడీషీటర్ కై ంచి సలీంను అరెస్ట్ చేసిన ఘటనపై నిందితుడు ఇర్ఫాన్ ‘సిల్సిలా ఆదిలాబాద్’ అనే వాట్సాప్ గ్రూపులో టాంజానియాలో ఉంటూ వివాదాస్పద వాయిస్, టెక్స్ ్ట మెసేజ్‌లు పోస్ట్ చేశాడు. దీంతో గత ఏప్రిల్ 15న ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడు విదేశాల్లో ఉండటంతో ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు ఇమిగ్రేషన్ అధికారులు అతనిపై లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ) జారీ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం టాంజానియా నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన షేక్ ఇర్ఫాన్‌ను ఇమిగ్రేషన్ అధికారులు డిటైన్ చేసి ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై పీర్సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ముంబైలో అతన్ని పట్టుకొని ఆదిలాబాద్‌కు తరలించినట్లు చెప్పారు. జడ్జి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. నిందితుడి వద్ద నుంచి పాస్‌పోర్ట్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఓరియంట్ కార్మికులకు బోనస్ పెంపు
కాసిపేట: దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీ పర్మినెంట్, లోడింగ్ కార్మికులకు బోనస్ పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్రావుతో యాజమాన్యం గురువారం నిర్వహించిన చర్చల్లో రూ.4 వేలు పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతంలో రూ.35,500 ఉండగా ప్రస్తుతం రూ.39,500కు పెంచారు. రాబోయే సంవత్సరానికి రూ.2వేలు పెంచుతూ రూ 41,500లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.16,800 ఇస్తుండగా రూ.వెయ్యి పెంచుతూ రూ.17,800 ఇవ్వనున్నట్లు తెలిపారు. చర్చల్లో కంపనీ హెచ్ఆర్ హెడ్ ఆనంద్ కులకర్ణి, గుర్తింపు సంఘం సెక్రటరీ భీమిని మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. అగ్రిమెంట్ పత్రాలతో సత్యపాల్‌రావు -
ఉయ్యాలో..
పాటపాడే అక్కాచెల్లెళ్లు బతుకమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చేవి.. తీరొక్క పువ్వులు.. బతుకమ్మ పాటలు. ప్రస్తుతం పూలకు ఎంత డిమాండ్ ఉందో.. పాటలకు అంతే ఉంది. ఏటా కొత్త కొత్త పాటల కోసం మహిళలు ఎదురు చూస్తుంటారు. అయితే ఒకప్పుడు బతుకమ్మ ఆట, పాటలు సంప్రదాయబద్ధంగా ఉండేవి. మహిళలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే పాటలు పాడేవారు. క్రమంగా ఆ పాటలు కనుమరుగవుతున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు పాత పాటలతో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుత తరం.. జానపద పాటలు, కోలాటాల నృత్యాలతో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పాటలు సద్దుల బతుకమ్మ వరకు ఊరూరా.. వాడవాడలా మార్మోగుతున్నాయి. పూల పండుగలో పాడే పాటల్లో సామాజిక అంశాలు, కుటుంబ బాంధవ్యాలు దాగి ఉన్నాయి. బతుకమ్మ పాటలపై నాటి, నేటి మహిళల అభిప్రాయాలు..పల్లెదనాన్ని ప్రతిబింబించేలా... నిర్మల్‌ఖిల్లా: బతుకమ్మ పాటలు అంటేనే పల్లె జీవనాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. మన సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం ఉట్టిపడే బతుకమ్మ పాటలు వారసత్వ సంపదగా కాపాడుకుంటూనే భావితరానికి తెలియజెప్పేందుకు ప్రయత్నం చేయాలి. నేటితరం అభిరుచికి అనుగుణంగా పాతకొత్తల మేలు కలయికగా పాటల్ని రూపొందించుకుంటే మంచిది. – ఎల్.నవ్య, సింగర్, నిర్మల్ ప్రోత్సహించాలి నిర్మల్‌ఖిల్లా: పాటలు పాడే వారిని గుర్తించి ప్రోత్సహిస్తేనే బతుకమ్మ సంప్రదాయం నిలుస్తుంది. ప్రభుత్వంతో పాటు సంఘాలు కూడా బతుకమ్మ పాటల పోటీలు నిర్వహిస్తే కొత్తతరానికి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటి తరానికి బతుకమ్మ పాటల్ని సొంతంగా పాడేవారన్న విషయమే తెలియదు. – పర్కిపండ్ల లక్ష్మి, తాండ్ర, సారంగపూర్ పాటల వెనుక నాటి జ్ఞాపకాలు నిర్మల్‌ఖిల్లా: మా చిన్నప్పటి నుంచి బతుకమ్మ పాటలు అంటే ప్రాణం. సాయంత్రం వేదికల వద్ద బతుకమ్మల చుట్టూ తిరుగతూ పాటలు పాడటం ఆనందంగా ఉండేది. బీడీ కంపనీలో తోటివారితో కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడుతూ స్వయంగా పాటలు పాడుకునే వాళ్లం. కానీ ఇప్పటి తరం మాత్రం మొబైల్, టీవీ, డీజే పాటలతో బతుకమ్మ ఆడుతున్నారు. – సంగెం భూదేవి, అనంతపేట, నిర్మల్ రూరల్ సంస్కృతిని పరిరక్షిస్తూనే... నిర్మల్‌ఖిల్లా: కాలానుగుణంగా పాటలరూపం మారినా, ఆత్మ మాత్రం అదే. ఈ తరం భాషలో, బీట్‌లో పాడినా బతుకమ్మ స్ఫూర్తి అందుతుంది. కొత్తగా సృజనాత్మకంగా పాటలను వెలుగులోకి తెస్తున్నారు. నవతరం యువతుల అభిరుచికనుగణంగా పాటలు రూపుదిద్దుకుంటున్నాయి. – శైలజ, జానపద గాయని, నిర్మల్ ఏడు దశాబ్దాలకు పైగా.. నాకు 80 సంవత్సరాలు. నా చిన్ననాటి నుంచి ఏడు దశాబ్దాలకు పైగా బతుకమ్మను చూస్తూ వస్తున్నా. ఇప్పటికీ బొడ్డెమ్మ పాటలు కై గట్టి పాడుతా. ఈతరం మహిళలు బతుకమ్మ ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా ఆ పాటలు నేర్చుకోవాలి. వారసత్వ సంపద లాంటి బతుకమ్మ పాటలు కనుమరుగు కాకుండా సంరక్షించుకోవాలి. – కట్కం రుక్మాబాయి, బోరిగాం, సారంగాపూర్ -
డిగ్రీ చేసిన డిపెండెంట్లకు క్లర్క్ పోస్టులు
శ్రీరాంపూర్: సింగరేణి గని ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో డిగ్రీ చదివిన డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ కింద గ్రేడ్ 3 క్లర్క్పోస్ట్ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 2009లో అప్పుడున్న గుర్తింపు సంఘం ఏఐటీయూసీకి, యజమాన్యానికి మధ్య జరిగిన చర్చల్లో గని ప్రమాదాల్లో ఉద్యోగులు చనిపోతే వారి పిల్లలకు విద్యార్హతను బట్టి సూటబుల్ జాబ్ కల్పించాలని ఒప్పందం జరిగింది. కానీ కేవలం ఐటీఐ, బీటెక్ వంటి టెక్నికల్ చదువులు చదివిన వారికి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టెక్నికల్ సూపర్వైజర్లుగా సూటబుల్ జాబ్ కల్పిస్తున్నారు. నాన్ టెక్నికల్ చదువులైన డిగ్రీ మరే ఇతర సత్సమాన డిగ్రీ విద్యార్హత ఉన్న డిపెండెంట్లకు మాత్రం అండర్‌గ్రౌండ్‌లో జనరల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పిస్తున్నారు. దీనిపై ప్రస్తుత గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు పలుమార్లు యజమాన్యంతో చర్చించారు. స్ట్రక్షరల్ సమావేశంలో కూడా ఈ డిమాండ్‌ను పెట్టారు. దీంతో గురువారం ఈ అంశంపై హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎల్సీ సమక్షంలో యజమాన్యానికి, గుర్తింపు సంఘానికి మధ్య ట్రైపార్టీయేట్ సమావేశం జరిగింది. ఇందులో సమస్యలను పరిష్కరిస్తూ రాత పూర్వక ఒప్పందం జరిగింది. ఉద్యోగి గని ప్రమాదంలో మృతి చెందితే డిగ్రీ అర్హత కలిగిన వారి పిల్లలకు గ్రేడ్ 3 క్లర్క్‌గా ఉద్యోగం కల్పించబోతున్నారని గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే 2009 నుంచి మైన్స్ యాక్సిడెంట్ కేసుల్లో డిపెండెంట్లు డిగ్రీ అర్హత ఉండి జనరల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేస్తున్న వారికి కూడా గ్రేడ్ 3 క్లర్క్ ఇప్పిస్తామని తెలిపారు. -
లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిస్తాం
తలమడుగు: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. గురువారం రాయి సెంటర్, 9 ఆదివాసీ తెగలు, తుడుందెబ్బ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో వేంకటేశ్వర ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకు దెరువు కోసం వలస వచ్చి ఆదివాసీలకు రావాల్సిన అభివృద్ధి ఫలాలను రాకుండా చేస్తున్న లంబాడీలను వెంటనే తొలగించాలన్నారు. అక్రమంగా వలస వచ్చిన వారికి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దన్నారు. అనంతరం తహసీల్దార్ రాజమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు జంగాల పోచన్న, డివిజన్ అధ్యక్షుడు కుముర జ్ఞానేశ్వర్, రాయి సెంటర్ అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు భుజంగరావు పాల్గొన్నారు. -
ఎలుగుబంట్ల దాడిలో రైతులకు గాయాలు
నెన్నెల: మండలంలోని మైలారం గ్రామ శివారులో గురువారం మూడు ఎలుగుబంట్లు దాడి చేయడంతో దుబ్బపల్లి గ్రామానికి చెందిన అర్శ మారయ్య, గావిడి మల్లేశ్ అనే గిరిజన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. సదరు రైతులు మధ్యాహ్నం గ్రామ శివారులోని పత్తి చేన్లకు వెళ్తుండగా మూడు ఎలుగుబంట్లు అకస్మాత్తుగా వచ్చి దాడి చేశాయి. తీవ్రగాయాలు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యంకోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాగజ్‌నగర్‌టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మూడు రోజులుగా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని సీతానగర్‌కు చెందిన మౌల్కార్ అమృత (40) గురువారం రాత్రి మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందించకపోవడంతోనే ఒక నిండు ప్రాణం బలైందని, దీనికి ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవహర్గర్కు చెందిన సింగరేణి కార్మికుడు రెక్కల గోవర్ధన్‌రెడ్డి (39) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆర్కేపీ సీహెచ్‌పీలో జనరల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోవర్ధన్‌రెడ్డికి అతని భార్యకు మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బ్రాండెడ్ పేరిట పీడీఎస్ బియ్యం విక్రయం
ఆదిలాబాద్‌టౌన్: బ్రాండెడ్ బియ్యం పేరిట పీడీఎస్ బియ్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ బీ.సునీల్‌కుమార్ తెలిపారు. గురువా రం వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన షేక్ అయూబ్ పట్టణంలోని శివాజీచౌక్‌లో ఆంధ్రా కిరా ణషాపు నడుపుతున్నాడన్నారు. బ్రాండెడ్ బియ్యం సంచుల్లో పీడీఎస్ బియ్యం నింపి ప్రజలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఆరు క్వింటాళ్ల రాయితీ బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు న మోదైనట్లు తెలిపారు. నిందితుడి దుకాణా న్ని జప్తు చేసేందుకు ఆదిలాబాద్ ఆర్డీవోకు సిఫార్సు చేసినట్లుగా వెల్లడించారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఏఎన్‌రెడ్డి కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం సారంగాపూర్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్ చందర్‌గౌడ్ ఈనెల 22న కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. విషయాన్ని రమేష్ చందర్గౌడ్కు ఫోన్ ద్వారా చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు ఐదున్నర కేజీల వెండి, తులం నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. క్లూస్‌టీం, ఫింగర్ ప్రింట్ టీం వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పీఎం జన్మన్ పనులు త్వరగా పూర్తి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్:పీఎం జన్మన్ కార్యక్రమంలోని చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని కేంద్ర గిరి జన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభూ నాయర్ కలెక్టర్లను ఆదేశించారు. పీఎం జన్మన్ కార్యక్రమం అమలుపై ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కలెక్టర్లతో సమీక్ష చేశారు. గిరిజన ప్రజల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పీఎం జన్మన్ కింద ఆధార్ కార్డుల నమోదు, ఆయుష్ కార్డులు, జన్‌ధన్ ఖాతాల వినియోగం, పక్కా గృహాల నిర్మాణం, పీఎం కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలన్నారు. ఆది కర్మయోగి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో మాట్లాడారు. పీఎం జుగా, దర్తిఅబా, ఆదికర్మయోగి కార్యక్రమాల్లోని పనులు గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులను గుర్తించేందుకు పంచాయతీ కార్యదర్శులు సర్వే చేసి వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలోని 24 హాబిటేషన్లలో 771 పక్కా గృహాలు నిర్మించనున్న ట్లు తెలిపారు. ఆది కర్మయోగి కింద 9 బ్లాకులు, 32 హాబిటేషన్లలో గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ఐదేళ్ల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. ఆది సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి గిరిజన సమాజానికి నూతన అంగన్వాడీలు, వసతి గృహాలు, మల్టీ పర్పస్ సెంటర్లు, ప్రైమరీ పాఠశాలలు, రోడ్డు కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్యాంకులు మెరుగైన సేవలు అందించాలినిర్మల్చైన్గేట్: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మొదటి త్రైమాసిక జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ప్రజలకు ఇప్పటివరకు అందజేసిన రుణాల వివరాలు, వివిధ అంశాలపై సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి బ్యాంకర్లు, అధికారులు కలిసి పనిచేయాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారులు, విద్యార్థులకు రుణ మంజూరులో ఆలస్యం చేయొద్దని కోరారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. మార్క్ అవుట్ పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతీ ఇంటికి సంబంధించిన మార్క్ అవుట్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పనులు నిరంతరంగా కొనసాగాలన్నారు. మార్క్ అవుట్, బేస్మెంట్ దశలు పూర్తయిన ఇళ్ల వివరా లు వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. అవసరమైన మ్యాన్‌పవర్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల ఎంపిక సర్వేను పూర్తి చేయాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సర్వేను ఎంపీడీవోలు పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
బతుకమ్మ ఆడిన న్యాయమూర్తులు
జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీవాణి, సివిల్ జడ్జి రాధిక, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవిష్య, కోర్టు మహిళా సిబ్బంది, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ముందుగా రంగురంగుల పూలతో బతుమ్మలు పేర్చారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండగ ఒక నిదర్శనమని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత కోర్టు ఆవరణలో బతుకమ్మలను ఉంచి పాటలు పాడుతూ.. ఆడారు. దీంతో కోర్టు ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. – నిర్మల్‌టౌన్ -
కోచింగ్ లేకుండానే..
భైంసాటౌన్: భైంసాకు చెందిన సుర్వే సాయికుమార్ ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్–1కు ఎంపికయ్యాడు. లోకేశ్వరం మండలం పొట్‌పల్లికి చెందిన సిద్దేశ్వర్, రత్నమాల దంపతులు ఉపాధి నిమిత్తం భైంసాలోని పిప్రికాలనీలో నివాసముంటున్నారు. వారి కుమారుడు సాయికుమార్ పదో తరగతి వరకు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. ఇంటర్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం తిరుచ్చిలోని ఎన్ఐటీలో ర్యాంకు రావడంతో బీటెక్ పూర్తి చేసి, ఢిల్లీలోని మారుతి సుజుకి మానుఫ్యాక్చర్ ప్లాంట్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలేసి సన్నద్ధమయ్యాడు. గతంలో గ్రూప్–3 పరీక్షకు ఎంపిక కాగా, తాజాగా గ్రూప్–1లోనూ 157 ర్యాంకు సాధించి బీసీ వెల్ఫేర్ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాయికుమార్ ఇదివరకే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి, మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యాడు. ప్రస్తుతం వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. -
సాహిత్యం ఓ మధురానుభూతి
నిర్మల్‌ఖిల్లా: సాహిత్యం ఓ మధురానుభూతి అని, ఈతరం చిన్నారుల్లో సాహిత్య అభిరుచిని పెంపొందించాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో కవి, రచయిత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొండూరి పోతన్న రచించిన నరశతకంతోపాటు వెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాసిన కథల సంపుటి ‘‘అంకురాలు–2’’ పుస్తకాలను గురువారం స్వీకరించారు. రచయిత కొండూరి పోతన్న ఈతరం విద్యార్థుల్లో సాహిత్యంపై మక్కువ పెంచేలా చేస్తున్న కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో నర్సయ్య, రాములు, రాజన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. -
పోటెత్తిన గోదావరి
భైంసా: ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గోదావరినది, భారీ వరదతో పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. వరుస వర్షాలతో నీరు నిలిచి, పంటలు మునిగిపోతున్నాయి. బాసర, లోకేశ్వరం, దిలావర్పూర్, భైంసా, కుంటాల మండలాల్లోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు పరిధిలో ముంపు సమస్య రైతులను వేధిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి, మంజీర నదుల్లో ప్రవాహం పెరిగి, జిల్లాలో వేలాది ఎకరాల పంటలు నీటిలో మునిగాయి. నెల రోజులుగా ఈ సమస్య కొనసాగుతోంది. సోయా, పత్తి పంటలకు నష్టం.. జిల్లాలో సోయాబీన్ పంట నీటిలో మునిగి దెబ్బతింటోంది. ఎడతెరిపి లేని వర్షాలతో పంట కోతకు అనువైన పరిస్థితి కనిపించడం లేదు. వర్షం తగ్గితే పంట కోసుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు, కానీ వాతావరణం సహకరించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పత్తి కాయలు నీటిలో మునిగి మురిగిపోతున్నాయి. భారీ వర్షాలతో పత్తి ఆకులు ఎరుపురంగుకు మారాయి. భూమిలో తేమ శాతం అధికంగా ఉండటంతో పంటను కాపాడటం రైతులకు కష్టసాధ్యంగా మారింది. సాధారణంగా దసరా నాటికి చేతికొచ్చే పత్తి పంట, ఈ ఏడాది వర్షాలతో నీటిలోనే కుళ్లిపోతోంది. జనజీవనం అస్తవ్యస్తం.. గోదావరి ఉప్పొంగడంతో జిల్లావ్యాప్తంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. బాసరలో నవరాత్రి ఉత్సవాలకు వచ్చిన భక్తులు రోడ్లపై నిలిచిన నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని దుర్గమ్మ మండపాల వద్ద కూడా వర్షం కారణంగా భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్షం తగ్గితేనే పరిస్థితి కొంత మెరుగవుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. జిల్లాకు ఎల్లో అలర్ట్.. గురువారం ఉదయం నుంచి నిర్మల్ జిల్లాలో వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశముంది. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. జిల్లాలోని వాగులు ఉప్పొంగుతున్నాయి. కలెక్టర్ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో నమోదైన వర్షపాతం.. గురువారం కుభీర్‌లో 3 మి.మీలు, బాసరలో 2.2, ముధోల్‌లో 3.4, భైంసాలో 3.6, కుంటాలలో 7.2, నర్సాపూర్(జి)లో 11.0, లోకేశ్వరంలో 4.2, దిలావర్పూర్లో 11.2, సారంగాపూర్‌లో 12.0, నిర్మల్‌లో 8.6, నిర్మల్ రూరల్‌లో 9.8, సోన్‌లో 9.4, లక్ష్మణచాందలో 8.2, మామడలో 14.2, పెంబిలో 8.6, ఖానాపూర్‌లో 12.6, కడెం పెద్దూర్లో 11.2, దస్తు రాబాద్‌లో 18.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామపంచాయతీ సిబ్బందికి నా లుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించా లని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ ప్రధాన కా ర్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ దసరా పండుగ రోజున గ్రామ పంచాయతీ సిబ్బందిని పస్తులుంచకుండా వేతనాలు చెల్లించాలన్నారు. పంచా యతీ సిబ్బంది వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కోరా రు. మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికులకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. జీవో51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీ లు 1,470 మంది కార్మికులు, గ్రామ పంచాయితీ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో శేఖర్, రవి, వెంకటేశ్, స్వామి, పోశెట్టి, నరసయ్య, నాగరాజు, రవి, లక్ష్మి, నర్సవ్వ పాల్గొన్నారు. -
మద్యం టెండర్ల ప్రక్రియ షురూ
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితి (2025–27)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. 47 మద్యం షాపులు.. జిల్లా వ్యాప్తంగా 47 మద్యం షాపులు ఉండగా వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతుంది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎకై ్సజ్ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతదంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా (నాన్ రిఫండబుల్), స్పెషల్ రీటెయిల్ ఎకై ్సజ్ ట్యాక్స్ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలుగా నిర్ణయించారు. జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఒక వ్యక్తి రాష్ట్రంలోని ఎక్కడైనా, ఎన్ని షాపులకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడ్ దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించి లైసెన్సులు జారీచేస్తారు. జిల్లాలో రిజర్వు షాపులు ఇలా.. గెజిట్ నంబర్ మండలం/ ఏడాది రెంటల్ రిజర్వు నిర్మల్ పరిధిలో.. వార్డు (రూ.లక్షల్లో) కేటగిరీ 006 నిర్మల్ 60 గౌడ్ 020 సోన్ 50 ఎస్సీ 021 సారంగాపూర్ 50 ఎస్సీ 026 పెంబి 50 గౌడ్ 027 కడెం. 50 ఎస్సీ భైంసా పరిధిలో... 034. భైంసా మున్సిపాలిటీ 60 ఎస్సీ 038 కుభీర్ 55 గౌడ్ 041 నర్సాపూర్(జి) 55 ఎస్టీ 047 తానూర్ 50 ఎస్సీ -
గ్రూప్–1లో మెరిసిన జిల్లా వాసులు
జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గ్రూప్–1 పరీక్షలో అసాధారణ విజయం సాధించి, కలల కొలువును సొంతం చేసుకున్నారు. ఏళ్ల తరబడి కఠిన శ్రమ, అనేక అడ్డంకులను అధిగమించి, లక్ష్యం వైపు అడుగులు వేశారు. వీరి పట్టుదల వారిని విజేతలుగా నిలిపింది. విశ్రాంతి లేకుండా కృషి చేసి, చివరకు తమ స్వప్నాన్ని నిజం చేసుకున్న ఈ యువకులు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు.భైంసారూరల్: చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించాడు భైంసా రూరల్ మండలం వానల్పాడ్ గ్రామానికి చెందిన కర్రం సంపత్‌రెడ్డి. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి–అమృత దంపతులకు ఇద్దరు సంతానం. శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ భార్య అమృత బీడీలు చుడుతూ ఇద్దరు పిల్లలను చదివించారు. సంపత్‌రెడ్డి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వానల్‌పాడ్‌లో చదువుకున్నాడు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన్, ఇంటర్మీడియెట్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయ్యాక 2022 నుంచి ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించాడు. గత ఏడాది గ్రూప్–4లో ప్రతిభ కనబర్చి విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 59వ ర్యాంకు సాధించాడు. డీఎస్పీగా కొలువు దక్కించుకున్నాడు. సివిల్స్ లక్ష్యం అని తెలిపాడు. -
‘గడ్డెన్నవాగు’కు భారీగా వరద
భైంసాటౌన్: ఎగువన కురుస్తున్న వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు గురువారం భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. 3,300 ఇన్‌ఫ్లో రాగా, ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు ఎత్తి 11,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358.40 మీటర్ల నీటిమట్టం కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు గేటు ఎత్తివేతసారంగపూర్: మండలంలో గురువారం తెల్లవారు జామునుంచి కురుస్తున్న జర్షాలకు స్వర్ణ ప్రాజెక్టులో కి వరద భారీగా వస్తోంది. అధికారులు ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రస్తుతం 1,980 క్యూసెక్కుల వరద వస్తోంది. 1,985 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ‘కడెం’ గేటు ఎత్తివేత..కడెం: కడెం ప్రాజెక్టుకు గురువారం 6,611 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు ఒక వరద గేటు ఎత్తి 4,099 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.350 అడుగులు నిలకడగా ఉంచుతున్నారు. -
విత్తనోత్పత్తితో నాణ్యమైన దిగుబడి
కుంటాల: విత్తనోత్పత్తితో నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని ముధోల్ ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ కార్తిక్ సూచించారు. నాణ్యమైన విత్తనం–రైతుకు నేస్తం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెంచికల్‌పాడ్ గ్రామ రైతు కదం మధుసూదన్‌కు ప్రభుత్వం డబ్ల్యూజీఎ ల్–1246 రకం వరి విత్తనాన్ని సరఫరా చేసింది. అతడు సాగు చేసిన వరి పొలాన్ని బుధవారం క్షేత్రస్థాయిలో ఆయన సందర్శించారు. రైతులకు సాగులో సలహాలు, సూచనలు చేశారు. ఏఈవో గణేశ్ తదితరులున్నారు.ఫిర్యాదుదారులకు భరోసా ఇవ్వాలిపెంబి: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా ఇవ్వాలని ఏఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రికా ర్డులు పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఖానాపూర్ సీఐ అజ య్, ఎస్సై హన్మాండ్లు, సిబ్బంది ఉన్నారు. -
తనిఖీలతో వ్యాపారుల బెంబేలు
పన్నులశాఖ అధికారుల పరిశీలన భైంసాటౌన్: పట్టణంలో బంగారు, వెండి వర్తకులు గుబులు చెందుతున్నారు. వాణిజ్య పన్నులశాఖ అ ధికారుల తనిఖీలతో బెంబేలెత్తుతున్నారు. మంగళవారం ఏసీటీవో ఆధ్వర్యంలో తనిఖీలకు రాగా, దా దాపు బంగారు, వెండి వరక్త దుకాణాదారులంతా భయంతో షాపులు మూసి ఉంచారు. అనంతరం దుకాణాదారులతో కలిసి అసోసియేషన్ హాల్లో స మావేశమైన అధికారులు అవగాహన కల్పించేందు కు వచ్చామని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, బుధవారం కూడా సీటీవో (కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్) గోదావరి ఆధ్వర్యంలో తనిఖీలకు రావడంతో విషయం తెలుసుకున్న దుకాణాదారులు రోజంతా షాపులు మూసి ఉంచారు. ముందుగా రెండు బృందాలు పట్టణంలోని బంగారు, వెండి వర్తక దుకాణాల్లో వా ణిజ్య పన్నులశాఖ అధికారులు తనిఖీలకు వచ్చి నట్లు తెలిసింది. స్థానిక కూరగాయల సంత సమీ పంలోని ఓ బంగారు, వెండి వర్తక దుకాణంలో సీటీవో గోదావరి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దా దాపు మూడున్నర గంటలకుపైగా అమ్మకాలు, కొ నుగోళ్లు, పన్ను చెల్లింపులు తదితర రికార్డులు పరి శీలించినట్లు సమాచారం. అలాగే, మున్సిపల్ కా ర్యాలయం ఎదురుగా గల మహాలక్ష్మి కాంప్లెక్స్‌లో ని ఓ దుకాణంలో మరో బృందానికి చెందిన అధికా రులు తనిఖీలు చేపట్టారు. అయితే, అధికారులు మాత్రం జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తనిఖీలు పూర్తి కాలేదని, మరోసారి పూర్తి రికార్డులు పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామంటున్నారు. వ్యాపారుల్లో హడల్ రెండురోజులుగా భైంసాలో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీలతో స్థానిక బంగా రు, వెండి వర్తకులు బెంబేలెత్తుతున్నారు. సదరు అధికారులు వ్యాపారుల జీఎస్టీ లైసె న్స్‌లు, ఐటీ రిటర్న్‌లు, క్రయవిక్రయాల రశీ దులు తదితర వివరాలు అడుగుతుండడంతో మిగతా దుకాణాదారులు ఎందుకొచ్చిన గొ డవ అనుకుని షాపులు మూసి ఉంచుతున్నా రు. మరుసటిరోజు కూడా అధికారులు తని ఖీలకు వస్తారని జంకుతున్నారు. ఈ విషయ మై సీటీవో గోదావరిని వివరణ కోరగా, శాఖ జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు వారు పేర్కొన్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఏసీటీవోలు విజయలక్ష్మి, సంతోష్‌తో కలిసి ఓ బంగారు, వెండి వరక్త దు కాణంలో క్రయవిక్రయాల లావాదేవీలు, ఐటీ రిటర్న్‌లు, బ్యాంక్ ఖాతాలు, ఇతర వివరాలు తనిఖీ చేశామని తెలిపారు. అయితే, సదరు దుకాణాదారుకు జరిమానా విధించినట్లు తెలిసిందని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని చెప్పారు. తనిఖీలు పూర్తి కాలేదని, మరోసా రి తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు. -
చిన్నారులకు ఇంటి పంట
నిర్మల్గోదారమ్మకు హారతి బాసర: బాసర సరస్వతీ ఆలయ అర్చక వైదిక బృందం బుధవారం గోదారమ్మకు హారతి నిర్వహించింది. ఉధృతి ఎక్కువగా ఉండగా శాంతించు తల్లీ.. అని భక్తులు వేడుకున్నారు.కొనసాగుతున్న రథోత్సవం లక్ష్మణచాంద: మండలకేంద్రంలో వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడోరోజైన బుధవారం శ్రీ అష్ట భుజ వేణుగోపాలస్వామి ప్రతిమను గజ వా హనంపై ఊరేగించారు. మహిళలు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవా లు వచ్చే నెల 2వరకు కొనసాగనున్నాయి. మామడ: మండలంలోని పొన్కల్ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం హనుమంతుడి వాహనంలో వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను వీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు, భజనపరులు దర్శించుకుని పూజలు చేశారు. నిర్మల్‌చైన్‌గేట్: చిన్నారులు, గర్భిణులకు పోషకా హారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కేంద్రాల్లో అందించే ఆహా రంలో వినియోగించే ఆకు కూరలు, కూరగాయలు అక్కడే పండించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఇక్కడే పండించిన తాజా కూరగా యలతో కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందనుంది. ఒక్కో సెంటర్‌కు రూ.10వేలు.. జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు ఒక్కో దానికి రూ.10వేల చొప్పున నిధులు కేటాయించగా ఆవరణల్లో తోటలు, కుండీల్లో కూరగాయలు, ఆకు కూరలు పెంచనున్నారు. బయటి మార్కెట్లపై ఆధారపడకుండా, రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ కూరగాయలు పండించడం ద్వారా ఆహార నాణ్యత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పౌష్టికాహార లోపం తీవ్ర సమస్యగా మారింది. ఆయా సెంటర్ల ఆవరణల్లో వంకాయ, బెండ, టమాటా, గోంగూర, తోటకూర, పాలకూర వంటివి సాగు చేయనుండగా.. వీటి ద్వారా పిల్లలకు అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అందనున్నాయి. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడనున్నాయి. సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి విత్తనాల ప్యాకెట్లను నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేశారు. ఇందుకు సంబంధించిన డబ్బులు సంవత్సరానికి రూ.500 చొప్పున చెల్లిస్తారు. సంవత్సరానికి రూ.వెయ్యి నిర్వహణ ఖర్చుల కోసం అందజేస్తారు. అయితే ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లు నిర్వహించాల్సి ఉంటుంది. కేటాయించిన రూ.10వేలలో నారు పెట్టేందుకు రూ.3వేలు, రవాణా ఖర్చులకు రూ.వెయ్యి, విత్తనాలు నాటేందుకు, దుక్కి సిద్ధం చేసే ఖర్చుల కోసం రూ.వెయ్యి, పంట నిర్వహణ, నీటి వసతుల కల్పన కోసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన రూ.10వేలతోనే ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది.పనులు త్వరగా పూర్తి చేయాలి జిల్లాలో ఎంపికై న కేంద్రాలు మండలం గ్రామం కేంద్రం మామడ పరిమండల్ పరిమండల్–2 మామడ కొరిటికల్ కొరటికల్–1 మామడ కొరిటికల్ కొరటికల్–2 మామడ పొన్కల్ పొన్కల్–2 భైంసా ఈలేగామ ఈలేగామ–1 భైంసా తిమ్మాపూర్ తిమ్మాపూర్–1 భైంసా ఎగ్గమ్ ఎగ్గమ్ భైంసా సిద్దూర్ సిద్దూర్ కుభీర్ కుభీర్ కుభీర్–2 నిధుల వినియోగంపై శిక్షణ ఒక్కో అంగన్వాడీ సెంటర్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10వేల నిధులు ఎలా వినియోగించాలి.. ఏ మొక్కలు నాటాలి.. తోటలను ఎలా నిర్వహించాలి? అనే విషయాలపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నిధులను విత్తనాలు, కుండీలు, మట్టి, ఇతర పనిముట్ల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పటిష్ట పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారులకూ అవగాహన కూరగాయలు, ఆకు కూరల తోటల పెంపకంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలది కీలకపాత్ర. తోటల నిర్వహణలో పిల్లలను కూడా భాగస్వాములను చేయడం ద్వారా వారికి వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పించే అవకాశముంటుంది. కూరగాయలు ఎలా పండుతాయి.. వాటిని ఎలా సంరక్షించాలి? అనే విషయాలు నేరుగా అనుభవం ద్వారా తెలుస్తాయి. ఇది ఒక రకంగా ప్రయోగాత్మక విద్యగా కూడా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. -
బాసరకు మళ్లీ బ్యాక్బాటర్
బాసర వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి బాసర: ఎగువనున్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా చేరుతుండగా బాసర వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ పెరిగింది. బుధవారం గంటగంటకూ ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాసర ఆలయం నుంచి గోదావరి పుష్కర ఘా ట్‌కు వెళ్లే రోడ్డు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌తో నిండి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవె న్యూ, పోలీస్‌శాఖల అధికారులు ఆయా గ్రామా ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా 15రోజులుగా బాసర, ఓని గ్రామాల మీదుగా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటికీ పరిహారం అందలేదు. డివైడర్ పైనుంచి ఆలయానికి వెళ్తున్న భక్తులు నీటితో నిండిన రోడ్డుపై వెళ్తున్న భక్తులుఎస్సారెస్పీ 40గేట్లు ఎత్తివేత మామడ: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో పెరి గింది. బుధవారం ఎస్సారెస్పీలోకి 2.54 లక్ష ల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అధికారులు ప్రాజెక్ట్ 40 గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కులను గోదావరి నదిలోకి వదులుతున్నారు. కాగా, పశువుల కాపరులు, రైతులు, మత్స్యకారులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
పెంబిలో పీపీఎల్–4 ప్రారంభం
పెంబి: దసరా సందర్భంగా మండల కేంద్రంలో పీపీఎల్–4 (పెంబి ప్రీమియర్ లీగ్)ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ బుధవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా రుమూల పెంబి ప్రాంతంలో పెద్ద ఎత్తున క్రికెట్ టో ర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని పే ర్కొన్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోటీలను విజయవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వెంకటేశ్, స్వప్నీల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, క్రీడాకా రులు, పీపీఎల్ నిర్వాహకులు నరేశ్, రాము, మతీ న్, మహేశ్, నాను శ్రీకాంత్, తదితరులున్నారు. -
స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
తానూరు: వ్యాపార అవసరాల కోసం సీ్త్రనిధి రుణాలు పొందిన మహిళలు ఆర్థికాభివృద్ధి సా ధించాలని అదనపు డీఆర్డీవో చరణ్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని సీ్త్రశక్తి భవనంలో నిర్వహించిన మండల సమాఖ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి తి రిగి మళ్లీ పొంది వ్యాపారాలు వృద్ధి చేసుకోవా లని సూచించారు. మరిన్ని కొత్త గ్రూపులు ఏ ర్పాటు చేసి వారికి రుణాలు అందించేలా చూ డాలని అధికారులకు తెలిపారు. వృద్ధులు, వికలాంగుల సంఘాలను సత్వరమే ఏర్పాటు చేసే లా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం మారుతి, ఐకేపీ ఏపీఎం సులోచనరెడ్డి, సీసీలు భోజన్న, సవిత, సరస్వతి, పోశెట్టి, దత్తు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా బతుకమ్మ సంబరాలు
నిర్మల్ చైన్‌గేట్/నిర్మల్‌టౌన్/బాసర: కలెక్టరేట్ ఆవ రణలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకూ హాజరయ్యారు. వివి ధ శాఖల అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుక మ్మ ఆడారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఫైజా న్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీ రా సంకేత్‌కుమార్, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ, నాయుడువాడలోని వాసవీ కన్యకా పరమేశ్వరి మందిరంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. వేడుకల్లో శివంగి టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమ్యూనిటీ బతుకమ్మలో భాగంగా మహిళలు, యువతకు పోలీసులు సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, గాంజా గస్తీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, ఎస్సైలు సంజీవ్, శ్రావణి, పోలీస్ అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో.. పోలీస్ అక్క నారిశక్తి ఆధ్వర్యంలో బాసర ఆర్జీయూకేటీ కళాశాల మైదానంలో విద్యార్థినులు, స్థానిక పోలీసుల బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ మహిళలు, విద్యార్థినులకు వీసీ గోవర్ధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
వరద నివారణ చర్యలు చేపట్టాలి
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ పట్టణానికి భవిష్యత్‌లో వరదలు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బు ధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లేక్ ప్రొటెక్షన్‌పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఇటీవల భారీ వర్షాలకు పలు కాలనీల్లో వరదనీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సమస్య పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను బలో పేతం చేయాలని సూచించారు. వరదల నియంత్రణలో సర్వే, రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శా ఖలు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పట్టణంలో వరదలు సంభవించడానికి గల ప్రధాన కారణాలు గుర్తించి, వాటి నివారణకు శాశ్వత పరిష్కారాలు చూపాలని ఆదేశించా రు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, కాలువలు, చెరువులు, నది, వాగుల ప్రవాహ మార్గాలపై ప్రత్యే క దృష్టి పెట్టాలని తెలిపారు. అవసరమైతే మాస్టర్ ప్లాన్ ఆధారంగా సవరణలు చేసి, శాశ్వత రీతిలో వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆర్.సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్లు రాజు, సంతోష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బతుకమ్మ వీడియోలకు ప్రోత్సాహకాలుజిల్లాలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలను మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, బతుకమ్మ గ్రూపులు తీసిన వీడియోలను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు పంపితే అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రోత్సాహకాలు అందజేస్తామ ని ప్రకటించారు. రెండు నిమిషాల నిడివి గల హై క్వాలిటీ వీడియోలను ఈ నెల 30లోపు పంపాలని సూచించారు. ఎంపికైన వీడియోలను జిల్లా అధికా రిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో పోస్టు చేస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు తమ వీడియోలను వాట్సాప్ నంబర్ 91005 77132కు పంపాలని కో రారు. వీడియో పంపేటప్పుడు వ్యక్తి పేరు లేదా బ తుకమ్మ గ్రూప్, సంఘం పేరు, చిరునామా, మొబై ల్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లకు కుస్తీ!
నిర్మల్‌చైన్‌గేట్:రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం వేగవంతమైన చర్యలు చేపట్టింది. కలెక్టర్ నేతృత్వంలో అధికారులు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా రిజర్వేషన్ల ఖరారు కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్డీవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యం జరుగుతున్న ప్రక్రియ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు కూడా పూర్తి కాలేదు. పంచాయతీలు, పరిషత్ స్థానాలు ఇలా.. జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులు ఉన్నాయి. 18 జెడ్పీటీసీ స్థానాలు, 17 ఎంపీపీ స్థానాలు, 157 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీలను, జెడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను పరోక్షంగా ఎన్నుకుంటారు. ఎన్నికల తేదీలు ఖరారైన వెంటనే నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఓటరు జాబితాలు సిద్ధం చేసిన అధికారులు రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. బుధవారం నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మండలాల వారీగా రిజర్వేషన్ లెక్కలు.. నిర్మల్ జిల్లాలో డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో గోవింద్ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారులు రిజర్వేషన్ల కసరత్తులో నిమగ్నమయ్యారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, 2024 కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించనున్నారు. మండలాల వారీగా జనాభా శాతాలను లెక్కించి జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. 2006, 2013, 2019 రిజర్వేషన్లను పరిశీలిస్తూ కొత్త జాబితాలను రూపొందిస్తున్నారు. జీవో కోసం ఎదురుచూపు.. రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వివరాలను మండలాల వారీగా తేల్చాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటరు జాబితాల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జీవో విడుదలైన తర్వాతే రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రిజర్వేషన్లలో మార్పు... ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించనుండటంతో గత రిజర్వేషన్లు పూర్తిగా మారనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లనే కొనసాగించారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రొటేషన్ పద్ధతిని అమలు చేస్తూ గత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతోపాటు బీసీలకు అధిక స్థానాలను కేటాయించనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తర్వాత మిగిలిన స్థానాలను జనరల్ కేటగిరీకి కేటాయిస్తారు. అందులో 50% మహిళలకు రిజర్వ్ చేయడానికి చర్యలు చేపడతారు.జిల్లా వివరాలు.. పంచాయతీ డివిజన్లు 02 జెడ్పీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ స్థానాలు 157 పోలింగ్ కేంద్రాలు 892 పంచాయతీలు 400 వార్డులు 3,368 మొత్తం ఓటర్లు 4,49,302 పురుషులు 2,13,805 మహిళలు 2,35,485 ఇతరులు 12 -
కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు
నిర్మల్‌చైన్‌గేట్: సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ బతుకమ్మలకు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. ఉద్యోగులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. అంతకుముందు పలువురు మహిళా ఉద్యోగులు వేసిన రంగవల్లులను పరిశీలించారు. సామాజిక అంశాలపై అవగాహన పెంపొందేలా ముగ్గులు వేసిన ఉద్యోగులను అభినందించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యావరణ అనుమతులు తప్పనిసరి
నిర్మల్‌చైన్‌గేట్: అభివృద్ధి పనులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ముందుగానే పర్యావరణ అనుమతులు తీసుకోవా లని సూచించారు. ప్రాజెక్టులు, రోడ్లు, గనులు, నీటిపారుదల పనులు, అటవీ అభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు–భవనాలు వంటి శాఖల్లో పనులకు అనుమతులు లభించిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని వివరించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే పనులు వేగవంతంగా పూర్తవుతాయన్నారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, జిల్లా సర్వే రిపోర్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
● భయంతో దుకాణాలు మూసేసిన వ్యాపారులు
భైంసాటౌన్:పట్టణంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలకు రావడంతో స్థానికంగా వ్యాపారుల్లో కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ అధికారులు విజయలక్ష్మి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి తనిఖీల కోసం వచ్చారు. ముందుగా బస్టాండ్ సమీపంలోని బంగారు, వెండి దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలియడంతో మిగిలిన దుకాణదారులతోపాటు మహాలక్ష్మి కాంప్లెక్స్‌లోని దుకాణాలను హడావుడిగా మూసివేశారు. అనంతరం బంగారు, వెండి వర్తకుల అసోసియేషన్ హాల్లో అధికారులు దుకాణదారులతో సమావేశమయ్యారు. ఇటీవల నిర్మల్లోనూ పలు బంగారు వెండి వర్తక దుకాణాల్లో, వ్యాపారుల ఇళ్లలో ఐటీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. భైంసాలో మాత్రం వర్తకులతో అసోసియేషన్ హాల్లో చర్చలు జరపడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై ఏసీటీవో విజయలక్ష్మిని వివరణ కోరగా, తాము తనిఖీలు, దాడులు చేసేందుకు రాలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యాపారులకు వాణిజ్య పన్నులపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతీ వ్యాపారి తప్పక జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. భైంసాలోని ఎందరి వద్ద లైసెన్సులు ఉన్నాయని ప్రశ్నించగా, తమ వద్ద వివరాలు లేవని సమాధానం దాటవేశారు. -
వేతనాల కోసం ప్రజావాణిలో వినతి
ఖానాపూర్: ఐటీడీఏ పరిధిలోని నాలుగో తరగతి ఉద్యోగులైన దినసరి కార్మికులు, పార్ట్ టైం, శానిటేషన్ కార్మికుల 7 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేబీసీ నారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజావాణితోపాటు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌కు మంగళవారం వేర్వేరుగా వినతిపత్రాలను అందించారు. 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రాలు ఇచ్చినవారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య వాలుసింహా, నాయకులు షౌకత్ హుస్సే న్, శ్రీనివాస్, రాంచందర్, వసంత్, రాజలింగు, దిలీప్, సోనేరావు, విఠల్, రమేశ్ ఉన్నారు. -
ఖానాపూర్‌కు ధాన్యం ఆరబెట్టే యంత్రం
ఖానాపూర్: మండలంలోని రైతుల కోసం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి వరి ధాన్యం ఆరబెట్టే యంత్రం మంజూరైంది. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే ఆరబెట్టేందుకు ఇది దోహదపడుతుందని సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, డీఎస్వో శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో యంత్రం ట్రయల్‌ను మంగళవారం పరిశీలించారు. యంత్రంలో తడిసిన ధాన్యాన్ని పోసి యంత్రం ఆరబెడుతున్న తీరును గమనించారు. రైతుల సౌకర్యార్థం జిల్లాకు ఒకే ఒక్క యంత్రం రాగా, దానిని ఖానాపూర్‌కు మంజూరు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీవో నర్సయ్య, మార్కెట్ కమిటీ కార్యదర్శి సయ్యద్ అజం అలీ, ఎంఎల్ఎస్ పాయింట్ డీటీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ కార్యదర్శి ఆశన్న పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
నిర్మల్‌టౌన్: టెలికాం వినియోగదారులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరికీ సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కాగ్ సభ్యుడు రావూరి ప్రభాకర్‌రావు అన్నారు. టెలికాం, సైబర్ నేరాలపై జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టెలికాం వినియోగదారుల హక్కుల కోసం భారత ప్రభుత్వం 1997లో ట్రాయ్ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. అవాంఛిత మొబైల్ కాల్స్ నియంత్రణ కోసం ట్రాయ్ 1909 నంబర్ కేటాయించిందని పేర్కొన్నారు. టెలి మార్కెటింగ్ కాల్స్ ని అడ్డుకోవడానికి డీఎన్డీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అందరూ బ్రాడ్ బాండ్ వినియోగించేలా దేశ వ్యాప్తంగా 7 లక్షల గ్రామాలకు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఎస్డీఈ గోవింద్, ఏఎఫ్‌వో రమణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అఖిలేశ్కుమార్సింగ్, టెలికాం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సోమవారం సమీక్ష చేశారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలన్నారు. ఈమేరకు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, కార్యక్రమం నిర్వహణ అధికారులు డాక్టర్ రాజా రమేశ్, నయనారెడ్డి, ఆశిష్‌రెడ్డి, సౌమ్య, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, డీపీవో రాంచందర్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న రవీంద్రనాయక్ -
అక్రమ పట్టా రద్దు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: భైంసా మండలం హంపోలి గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని, అదే స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేసి అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జె.రాజు మాట్లాడుతూ 1983లో వరదల కారణంగా 16/ఆ,16/ఈ సర్వే నంబర్లోని ఐదు ఎకరాల పట్టా భూమిని కొని ఎస్సీ ఎస్టీలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ భూమిలోని ఇళ్లను కూలగొట్టి, ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని తెలిపారు. అక్రమ పట్టా రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డీవోతోపాటు పై అధికారులకు నివేదికలు పంపినా రద్దు కాలేదన్నారు. అక్రమంగా పట్టా చేసిన అప్పటి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాలో గ్రామస్తులు విట్టల్, గంగారం, సాయినాథ్, బాబు, ఎల్లన్న, భోజన్న, నరసన్న పాల్గొన్నారు. -
మైనారిటీ మహిళలకు ఆర్థిక భరోసా
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ’రేవంతన్నకా సహారా మిస్కీన్ లే’ పేరుతో వచ్చిన పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన, ఆట్టడుగు సముదాయాల సామాజిక ఉద్ధరణకు దోహదపడతాయి. ఈ నెల 19న సెక్రటేరియేట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ.30 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసే ఈ పథకాలకు దరఖాస్తులు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 6 వరకు టీజీవోబీఎమ్ఎమ్ఎస్ పోర్టల్(tgobmms.cgg.gov.in) ద్వారా ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన.. ఈ పథకం మైనారిటీ మహిళలు(ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందినవారు) ఆర్థికంగా స్వతంత్రంగా మారేలా సహాయపడుతుంది. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహితలు, ఒంటరి మహిళలకు చిన్న వ్యాపారాల ప్రారంభానికి ఒక్కొక్కరికీ రూ.50 వేల గ్రాంట్ అందిస్తారు. ఇది రాష్ట్రంలో మైనారిటీ మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుంది. అర్హతలు: రేవంతన్నకా సహారా మిస్కీన్ లే.. ముస్లిం సముదాయాల అభ్యున్నతికి ఈ పథకం రూపొందించబడింది. ఫకీర్, దూదేకుల, ఇతర ఆట్టడుగు ముస్లిం వర్గాల సభ్యులకు మోపెడ్లు, బైక్‌లు లేదా ఈ–బైక్‌లు అందించడానికి రూ.లక్ష గ్రాంట్ (100% రాయితీ) మంజూరు చేస్తారు. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ద్వారా అమలు చేసే ఈ చర్య ఆర్థిక బలహీనతను తగ్గించి, రోజువారీ జీవనాన్ని మెరుగుపరుస్తుంది. అర్హతలు: అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.. జిల్లాలో అర్హులైన మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఎఫ్3 లో సంప్రదించాలి, – ఆర్.మోహన్‌సింగ్, జిల్లా అల్పసంఖ్యాకుల సంక్షేమ అధికారి -
యూరియా కొరత తీర్చండి
నిర్మల్‌చైన్‌గేట్: యూరియా కొరత తీర్చాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందిరామయ్య కోరారు. యూరియా కొరత, పత్తి పంటకు కనీసం మద్దతు ధర అమలు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కా ర్యాలయంలో ఏవోకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాయన్నారు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకా రం పత్తికి ఖర్చుల ప్రతిపాదికన రూ.10,075 కనీస మద్దతు ధర నిర్ణయించాలన్నా రు. పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు భయపెడుతున్నారన్నారు. ఆయన వెంట సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కె.రాజన్న, గోరెభాయ్, లక్ష్మీనారాయణవర్మ, గోనె లచ్చన్న పాల్గొన్నారు. -
నిర్మల్
ఉర్రూతలూగించే పాటలు రెండు దశాబ్దాలుగా బతుకమ్మ పాటలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పాటల రచనలు, చిత్రీకరణతో ఇప్పుడు బతుకమ్మ వేడుకల్లో ఊరూరా మార్మోగుతున్నాయి. IIలోuఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్‌టౌన్: ఆర్జీదారుల సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. భైంసాటౌన్: పట్టణంలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఉదయం నుంచే తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం ఆయా కాలనీల నుంచి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలకు కోలాటాలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రధాన రహదారి మీదుగా స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ మున్నూరుకాపు మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావుపటేల్ పాల్గొని బతుకమ్మ ఎత్తుకుని నృత్యం చేశారు. మహిళలు, యువతులు భారీగా తరలిరాగా, ప్రాజెక్టు వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు. పొద్దుపోయాక బతుకమ్మలను ప్రాజెక్టు నీటిలో నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మ పోయిరా అంటూ సాగనంపారు. సత్తుపిండి వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో సోమవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. అనంతరం ఆడిపాడారు. డీజే పాటలకు స్టెప్పులేశారు. అంతకుముందు ఇన్చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ బతుకమ్మను ఏవిధంగా అందంగా పేర్చుతామో విద్యార్థులు తమ జీవితాలను కూడా అంతే అందంగా నిర్మించుకోవాలని సూచించారు. బతుకమ్మ పేర్చిన అధ్యాపకులు, విద్యార్థులకు బహుమతులు అందించారు.ట్రిపుల్‌ఐటీలో వేడుకలు -
అమ్మకానికి దొడ్డు బియ్యం
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో మార్చి నాటికి గోదాంల ఉన్న దొడ్డు బియ్యం నిల్వలు పురుగులు, ఎలుకలకు ఆ హారంగా మారాయి. బఫర్ గోదాంలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న బియ్యం నా ణ్యత దెబ్బతింటుంది. దీంతో వివిధ గోదాముల్లో నిల్వ ఉన్న 4,535.551 మెట్రిక్ టన్నుల దొడ్డు బి య్యం ఈ–వేలం వేయాలని నిర్ణయించింది. కిలో బియ్యాన్ని రూ.24 బేస్ ధరగా నిర్ణయించి, పారదర్శకంగా విక్రయించేందుకు విధివిధానాలు రూపొందించింది. దీంతో కొత్త యాసంగి ధాన్యం, వా నాకాలం బియ్యం నిల్వకు స్థలం లభిస్తుంది. వేలం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక లాభం చేకూరుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జిల్లాలో మిగిలి ఉన్న దొడ్డు బియ్యానికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో నిల్వ ఉన్న 4535.551 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఆదేశానుసారం విక్రయించనున్నాం. – సుధాకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ జిల్లా వ్యాప్తంగా దొడ్డు బియ్యం నిల్వలు మెట్రిక్ టన్నుల్లో.. మాటెగాం బఫర్ గోదాం 537.698 మెట్రిక్ టన్నులు లోకేశ్వరం బఫర్ గోదాం : 1177.470 మెట్రిక్ టన్నులు మామడ బఫర్ గోదాం: 1988.168 మెట్రిక్ టన్నులు జామ్ బఫర్ గోదాం : 422.690 మెట్రిక్ టన్నులు ఎంఎల్ఎస్ పాయింట్లు (నిర్మల్, భైంసా, ముధోల్, ఖానాపూర్): 364.643 మెట్రిక్ టన్నులు 412 రేషన్ షాపులు: 409.525 మెట్రిక్ టన్నులు -
ఘనంగా నిర్వహించాలి
బతుకమ్మ ఉత్సవాలునిర్మల్చైన్గేట్: జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై సో మవారం సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధి కారులు తమతమ కార్యాలయాల్లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని సూ చించారు. సద్దుల బతుకమ్మ రోజున ఊరేగింపులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలన్నారు. చెరువుల వద్ద బతుకమ్మ నిమజ్జనం ప్రాంతాల్లో లైటింగ్, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సద్దుల బతుకమ్మ నిర్వహించేందుకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ మాసం’ పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీవైఎస్వో శ్రీ కాంత్‌రెడ్డి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీఈ హరి భువన్, సీడీపీవో సరిత, అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎంల గోదాంను కలెక్ట ర్ అభిలాష అభినవ్ సోమవారం పరిశీలించారు. గోదాంలో భద్రపరచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను తనిఖీ చేసి సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు మరింత బలో పేతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీ సు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్ఫరాజ్, సిబ్బంది రాజశ్రీ, పార్టీల నేతలు ఉన్నారు. -
అలరించిన గుస్సాడీ నృత్యం
బాసర: ఆర్జీయూకేటీలో ఆదివాసీ సంప్రదాయ గుస్సాడీ నృత్య ప్రదర్శన విద్యార్థులు, అధ్యాపకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్పిక్ మెకే హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన శ్రీ కనక సుదర్శన్ ఆదివాసీ బృందం ఈ నృత్య ప్రదర్శన చేశారు. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఆధునిక కాలంలోనూ వారసత్వ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు. డిసెంబర్ 2 నుంచి 5 వరకు తెలంగాణ రాష్ట్ర 4వ స్పిక్ మెకే సాంస్కృతిక సమ్మేళనం యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అసోసియేట్ డీన్లు డా. మహేశ్, డా. విఠల్, స్పిక్ మేకే కోఆర్డినేటర్ డా. రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు. -
పండుగల దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
కాగజ్‌నగర్‌టౌన్: దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రెయిన్ నం. 03253 పాట్నా– చర్లపల్లి, సోమ, బుధవారాల్లో, అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు, ట్రెయిన్ నం. 07255 చర్లపల్లి –పాట్నా, వారానికి ఒక్క రోజు (బుధవారం), అక్టోబర్ 3 నుంచి జనవరి 1 వరకు, ట్రెయిన్ నం. 07256 చర్లపల్లి –పాట్నా, శుక్రవారం, అక్టోబర్ 3 నుంచి జనవరి 2 వరకు నడుస్తాయని, ఈ రైళ్లకు కాజిపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. భక్తుల పాదయాత్రబాసర: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు ముందుగానే మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, ఔరంగాబాద్, నాసిక్ జిల్లాలకు చెందిన భక్తులు పాదయాత్రగా వచ్చి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఆలయ ముఖ్య అర్చకులు బాలకృష్ణ చేతుల మీదుగా అఖండజ్యోతిని వెలిగించుకుని బాసర నుంచి మహారాష్ట్రకు పాదయాత్రగా తరలివెళ్లారు. గత కొన్నేళ్లుగా జ్యోతితో పాదయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తోందని భక్తుడు గణేశ్ తెలిపారు. స్నూకర్ కేంద్రాలపై పోలీసుల దాడిఇంద్రవెల్లి: మండలకేంద్రంలో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న స్నూకర్ కేంద్రాలపై ఆదివారం రాత్రి ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మానిక్రావ్, రాజన్నలు నిర్వహిస్తున్న స్నూకర్ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి స్నూకర్ బాల్స్, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా స్నూకర్ కేంద్రాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీ ఆత్మహత్యాయత్నంబెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం సాయంత్రం గాజులవేణి శ్రావణి అనే గర్భిణీ ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబ సభ్యులు హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రావణి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
పిడుగుపాటుతో మహిళ మృతి
సాత్నాల: భోరజ్ మండలంలోని పెండల్వాడ గ్రా మంలో ఆదివారం పిడుగు పడి నాగుల నిర్మల (33) అనే మహిళ మృత్యువాత పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం చేనుకు వెళ్లి పనులు ముగించుకుని సాయంత్రం తిరిగివస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త సంతోష్ ఉన్నాడు. బండరేవు తండాలో ఆవు.. సారంగపూర్: మండలంలోని పొట్య గ్రామపంచాయతీ పరిధిలోని బండరేవు తండాలో పిడుగు పడి ఒక ఆవు మృతి చెందింది. బాధిత రైతు ఆడె క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఎప్పటిలాగే పశువులను మేతకు సమీప అటవీ ప్రాంతానికి తరలించాడు. అయితే ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పిడుగు పడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. మృతిచెందిన ఆవు విలువ సుమారు రూ.48వేల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. బూరుగుపల్లి (జి) తండాలో ఎద్దు.. నర్సాపూర్(జి): మండలంలోని బూరుగుపల్లి(జి) తండా గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. బూరుగుపల్లి (జి) తండా గ్రామానికి చెందిన జాదవ్ రవీందర్, జాదవ్ రాందాస్ అనే ఇద్దరు అన్నదమ్ములు పొలానికి వెళ్లి ఎడ్లబండిపై తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ రూ.60వేలు ఉంటుందని వారు తెలి పారు. ఘటనలో రాందా స్ అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ని లకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గంగాపూర్ శివారులో గేదె.. రెబ్బెన: మండలంలోని గంగాపూర్ శివారులో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు అదే గ్రామానికి చెందిన యాదగిరి శ్రీశైలంకు చెందిన గేదె మృతువాత పడింది. బాధితుడి కథనం ప్రకారం రోజు మాదిరిగానే యాదగిరి శ్రీశైలంకు సంబంధించిన బర్ల మంద గ్రామ శివారులో ఉన్న సమ్మక్కసారలమ్మ గద్దెల సమీపంలో మేత కోసం వెళ్లగా సాయంత్రం ఒక్కసారిగా పిడుగుపడి గేదె మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.30వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. -
అష్టభుజ స్వామికి పదకొండు వాహనాలు..
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని అత్యంత పురాతనమైన అష్టభుజ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అష్ట భుజాలు గల ఏకై క ఆలయం. శ్రీ వేణుగోపాలునికి ఎనిమిది చేతులు ఉంటాయి. ప్రతీ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. కత్తి, సుదర్శన చక్రం, విశ్వం, గదా, శంకు, పద్మం, రెండు పిల్లన గ్రోవీలు ఉన్నాయి. నవరాత్రుల్లో భాగంగా ప్రతీరోజు స్వామి వారు గ్రామంలోని రథంపై వివిధ వాహనాలపై ఊరేగుతారు. మొదటి రోజు సూర్య ప్రభ వాహనం, రెండో రోజు చంద్రప్రభ వాహనం, మూడో రోజు గజ వాహనం, నాలుగో రోజు అశ్వ వాహనం, ఐదో రోజు హంస వాహనం, ఆరో రోజు హనుమ వాహనం, ఏడో రోజు శేష వాహనం, ఎనిమిదో రోజు గరుడ వాహనం, తొమ్మిదో రోజు సింహ వాహనం, పదో రోజు పులి వాహనం, పదకొండో రోజు అశ్వం, గరుడ, హనుమ సహిత వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. -
అనుమానాస్పదంగా యువకుడి మృతి
ఇచ్చోడ: మండలంలోని ముఖ రా(బి) గ్రామంలో శనివారం సాయంత్రం తోఫిక్ (22) అనే యువకుడు అనుమానాస్పదంగా బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. తోఫిక్ అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులతో కలిసి శనివారం సాయంత్రం కామ్లే రాహుల్ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లారు. కొంతసేపటి తర్వాత స్నేహితులు బావిలో నుంచి పైకి రాగా తోఫిక్ మాత్రం బయటకు రాలేదు. వెంటనే గ్రామస్తులు బావి వద్దకు వెళ్లే సరికి తోఫిక్ బావిలో మృతి చెంది ఉన్నాడు. ఆదివారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి శవపంచానామా నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మృతుడి తండ్రి రఫీక్‌ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శరణు.. శరణు దేవీ!
ఆదిలాబాద్: అమ్మవారి ఆగమనానికి సర్వం సిద్ధమైంది. ఆది పరాశక్తిని నవరాత్రుల్లో కొలిచేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండపాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. దేవి శరన్నవరాత్రి వేడుకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి మూర్తులు తుదిరూపం దిద్దుకుంటున్నాయి. శరన్నవరాత్రులు పేరెలా..? ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు మహార్నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులుగా పిలుస్తారు. ఈ మాసం నుంచి వర్ష ఋతువు వెళ్లి, శరత్ ఋతువు ప్రారంభమవుతుంది. దీంతో శరన్నవరాత్రులుగా వ్యవహరిస్తారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభమవుతుంది. ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి అంటువ్యాధులు దరిచేరవని భక్తుల నమ్మకం. 11 రోజులు.. 11 రూపాలు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు ఒక్క రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. మొదటిరోజు ఈనెల 22న బాల త్రిపుర సుందరి దేవిగా, 23న శ్రీ గాయత్రి దేవిగా, 24న శ్రీ అన్నపూర్ణ మాతగా 25న కాత్యాయనీ దేవిగా, 26న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 27న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా, 28న శ్రీ మహా చండీ దేవిగా, 29న సరస్వతి దేవిగా, 30న దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 1న మహిషాసుర మర్దిని దేవి, 2న రాజరాజేశ్వర దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. -
దొంగల బీభత్సం..!
బాసర: బాసరలో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి పట్టణంలోని ఓ బేకరీతో పాటు రెండిళ్లలో దొంగతనం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసర బస్టాండ్ వద్ద ఉన్న శారదా బేకరీలో శనివారం అర్ధరాత్రి దొంగలు పడి షట్టర్ తాళాలు పగులగొట్టారు. లోపలికి చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం యజమాని దశరథ్ దుకాణం తీసేందుకు రాగా తాళం పగలగొట్టినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణంలోని సీసీ కెమెరా, డీవీఆర్‌ను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. పట్టణంలోని శారదనగర్, వెంకటేశ్వర కాలనీల్లోని రెండిళ్లలో తాళం వేసిన ఇండ్లలో చొరబడి విలువైన వస్తువులను, నగదు ఎత్తుకెళ్లారు. చోరీకి పాల్పడిన వారిని పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
రెబ్బెన: కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన మండలంలోని నారాయణపూర్‌లో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో సీఐ సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు. నారాయణపూర్‌కు చెందిన గజ్జల తిరుపతి టాటా ఏస్ వాహనం డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనికి చిన్నబుదెకు చెందిన స్రవంతి(38)తో 21 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన తిరుపతి తరుచూ భార్యతో గొడవపడేవాడు. అందులో భాగంగానే భార్యను ఎలాగైనా వదిలించుకో వాలని శనివారం తెల్లవారుజామున ఇంటి పనుల్లో నిమగ్నమైన స్రవంతిని గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. మృతురాలి తమ్ముడు సంజయ్ అందించిన సమాచారం మేరకు ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం ద్వారా శాసీ్త్రయకోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భార్యను నరికి చంపి పోలీసులకు దొరకకుండా పారిపోవడానికి శనివారం రాత్రి రెబ్బెన రైల్వేస్టేషన్‌కు రాగా తిరుపతిని పట్టుకుని విచారించినట్లు సీఐ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే భార్యను నరికి చంపినట్లు అంగీకరించాడని, ఆదివారం జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్సై వెంకట్‌కృష్ణ, సిబ్బంది సందీప్, దుర్గేందర్, ఎస్. శ్రీనివాస్, మహేశ్‌లు ఉన్నారు. -
అమ్మ కొలువుదీరే వేళాయె..!
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయం, హరిహర క్షేత్రం, బంగల్ పేట్ మహాలక్ష్మి, బాగులవాడ ఆంజనేయస్వామి తదితర ఆలయాల్లో ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మండపాలను ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలు, వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. నాలుగు దశాబ్దాలుగా బాగులవాడలో.. నిర్మల్‌లో నాలుగు దశాబ్దాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బాగులవాడ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయంలో 1981లో మొదటగా దుర్గామాత చిత్రపటం ఉంచి రెండేళ్లు పూజలు చేశారు. తర్వాత 1983లో రెండు ఫీట్ల కర్ర విగ్రహం, 1985 నుంచి ఇప్పటివరకు మట్టి విగ్రహాలు ప్రతిష్టించి చీరలు, ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. బాగులవాడ కాలనీలో సుమారు 500 కుటుంబాల వారు తొమ్మిది రోజులు ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రసిద్ధిగాంచిన నందిగుండం దుర్గామాత.. పట్టణంలో 19 ఏళ్ల కిందట నందిగుండం ప్రాంతంలోని మర్రిచెట్టు వద్ద దుర్గామాత వెలిసింది. భక్తులు అప్పటి నుంచి దుర్గామాతకు పూజలు చేస్తున్నారు. గత 14 ఏళ్లుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల క్రితం రూ.1.80 కోట్లతో ఆలయం కూడా నిర్మించారు. -
బ్యాటరీ దొంగలు అరెస్ట్
నిర్మల్‌టౌన్: బ్యాటరీ దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై లింబాద్రి ఆదివా రం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. నిర్మల్‌రూరల్ మండలం అక్కపూర్ గ్రా మానికి చెందిన తాండ్ర సాయన్న తన జేసీ బీని గ్రామ శివారులో ఉంచి వెళ్లారు. పట్టణంలోని మంజులాపూర్‌కు చెందిన అఖిల్, మహా లక్ష్మి వాడకు చెందిన నందకిషోర్లు జేసీబీలోని రెండు బ్యాటరీలను శనివారం రాత్రి దొంగిలించా రు. విషయం తెలుసుకున్న జేసీబీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ని అదుపులోకి తీసుకొని రెండు బ్యాటరీలను రికవరీ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మృతదేహాన్ని చేతులపై మోసుకుంటూ..
కెరమెరి: వర్షాలకు వాగులు ఉప్పొంగి జిల్లా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మృతదేహాన్ని అతికష్టం మీద వాగు దాటించిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కరంజీవాడలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మండాడి కోసు(60) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారకస్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఆరోగ్యం విషమించి ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో మృతదేహంతో స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలోని అనార్పల్లి వాగు ఉప్పొంగడంతో అంబులెన్స్ వాగు దాటే అవకాశం లేకపోవడంతో మానవహక్కుల సంఘం జిల్లా చైర్మన్ రమేశ్, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చేతులతో పట్టుకుని వాగుదాటారు. మృతుడికి భార్య రాజుబాయి, కుమారులు మారు, జంగు ఉన్నారు. -
నాటి మహిషాపురం.. నేటి భైంసా పట్టణం..
భైంసా: ఒకప్పటి మహిషాపురమే నేడు భైంసా పట్టణంగా పిలుస్తున్నారు. చరిత్రను తెలిపే రాతితో చెక్కిన మహిషాపాదాలు భైంసాలో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే మహిషాసుర రాక్షసుడిని దుర్గాదేవి మహిషా అవతారంలో వధించిందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు దుర్గాదేవే ప్రజలను ఆదుకున్నందుకు అప్పటి వారు రాతితో పాదాలను చెక్కించారు. ఇందుకు గుర్తుగా సమీపంలోని గుట్టపై మైసమ్మ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దుర్గాదేవి గట్టు మైసమ్మగా పూజలు అందుకుంటోంది. కాగా సోమవారం నుంచి భైంసా డివిజన్వ్యాప్తంగా భక్తులు దుర్గాదీక్షలు స్వీకరించనున్నారు. -
గంజాయి మొక్కలు పట్టివేత
తాంసి: మండలంలోని గిరిగాం గ్రామంలో అక్రమంగా ఇంటి వద్ద పెంచుతున్న గంజాయి మొక్కల ను ఎకై ్సజ్ జిల్లా టాస్క్ఫొర్స్, ఎన్ ఫోర్స్మెంట్ అ ధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన తో డసం గోపాల్ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న సమాచారం మేరకు సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇంటి ఆవరణలో పెంచుతున్న రెండు మొక్కలను గుర్తించారు. వీటి విలువ రూ.50 వేలు ఉంటుందని, స్వాధీనం చేసుకొని గోపాల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. దాడులలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్, సిబ్బంది అరవింద్, మోహన్, రవీందర్, శారద, జమీర్, సతీశ్, పంచాయతీ కార్యదర్శి రవికిరణ్ ఉన్నారు. ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి తక్కెలపల్లి రాకేశ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈనెల 19న కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాగా, ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. -
కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కడెం: కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 8,094 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు రెండు వరద గేట్లు ఎత్తి 8,234 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.500 అడుగులు ఉంది. స్వర్ణ ప్రాజెక్టు గేటు ఎత్తివేత.. సారంగపూర్: మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి స్వర్ణ ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరదనీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు వరదనీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రాజెక్టులోకి 1,980 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ఒక గేటు ఎత్తి 1,985 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1182.9 అడుగుల వద్ద స్థిరంగా ఉంది. -
పూలపండుగొచ్చింది
భైంసా: భైంసా పట్టణంలో సోమవారం బతుకమ్మ పండుగ ఘనంగా జరుగనుంది. మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని ఈ పట్టణంలో మహాలయ అమావాస్య తర్వాత వెంటనే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఈ పండుగ, ప్రకృతి ఆరాధన, ఆత్మీయ బంధాలు, సామాజిక సమైక్యతను సూచిస్తూ, గ్రామీణ సంప్రదాయాలను సజీవంగా ఉంచుతుంది. మున్నూరుకాపు మిత్రమండలి ఆధ్వర్యంలో గడ్డెన్నవాగు వద్ద జరిగే బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ మహిళల కోసం అల్పాహారం, తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తారు. సంప్రదాయ బతుకమ్మలను అందంగా పేర్చిన బృందాలకు జ్ఞాపికలు అందజేస్తూ, ఈ సంస్థ ఉత్సవ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. పూల సౌందర్యం.. బతుకమ్మలను రంగురంగుల పూలతో అలంకరించడం ఈ పండుగ ప్రధాన ఆకర్షణ. గ్రామీణ ప్రాంతాల్లో తంగేడు, గునుగు, చామంతి, బంతి పూలతో బతుకమ్మలను సౌందర్యవంతంగా తీర్చిదిద్దుతారు. పూల కొరత కారణంగా చాలామంది కాగితపు బతుకమ్మలు తయారు చేస్తున్నారు. ఇక బంతి పూల ధరలు ఈ సమయంలో రూ.60 నుంచి రూ.100 వరకు పెరుగుతున్నాయి. మహిళల సమైక్యత బతుకమ్మ పండుగ మహిళల సామాజిక బంధాలను బలపరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సామూహికంగా బతుకమ్మలను తయారు చేస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలతో ఆనందిస్తారు. ఈ వేడుకలు కేవలం ఆధ్యాత్మిక ఆచరణలను మాత్రమే కాకుండా, సామాజిక సమైక్యతను కూడా పెంపొందిస్తాయి. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
కుంటాల: వారు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత భర్త అసలు రూపం బయటపడింది. అప్పటికే భార్య గర్భం దాల్చింది. అయినా వరకట్నం వేధింపులు భరిస్తూ వచ్చింది. మూడు నెలల క్రితం వీరికి పాప పుట్టింది. అయినా వేధింపులు ఆగలేదు. శనివారం రాత్రి భర్త కట్నం కోసం వేధించడంతో మనస్తాపం చెందింది. చంటిపాప ఉన్నా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కుంటాలలో జరిగింది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. కుంటాల గ్రామానికి చెందిన షికారి పోశెట్టి, మామడ మండలం పోన్కల్ గ్రామానికి చెందిన స్రవంతి(18) ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం పెద్దలను ఒప్పింది పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడు నెలల క్రితం పాప జన్మించింది. పెళ్లయిన కొన్నాళ్ల నుంచే పోశెట్టి తనకు కట్నం కావాలని స్రవంతిని వేధిస్తున్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేసే పోశెట్టి పాప పుట్టిన తర్వాత కట్నం కోసం భార్యను మరింతగా వేధించసాగాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కట్నం కోసం తీవ్రంగా వేధించాడు. దీంతో మనస్తాపం చెందిన స్రవంతి.. గదిలో ఉరివేసుకుంది. ఆదివారం ఉదయం స్రవంతిని విగత జీవిగా చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, రూరల్ సీఐ నైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మూడు నెలలకే తల్లి ప్రేమకు దూరం.. పోశెట్టి–స్రవంతి దంపతుల కు మూడు నెలల కూతురు నితీక్ష ఉంది. తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టిన మూడు నెలలకే తల్లి ప్రేమకు దూరమైంది. ఏం జరిగిందో తెలియని చిన్నారి ఆకలికి గుక్కపెట్టి ఏడవడం చూసి స్థానికులు చలించిపోయారు. తహసీల్దార్ కమల్ సింగ్ పంచనామా చేశారు. క్లూస్ టీం సభ్యులు నమూనాలు సేకరించారు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మైనర్లకు వాహనాలిస్తే యజమానులపై కేసు
● ఏఎస్పీ రాజేశ్‌మీనా నిర్మల్ టౌన్: వాహనదారులు అన్ని ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని.. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసు నమోదు చేస్తామని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో మైనర్ డ్రైవింగ్‌పై ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టుబడ్డ మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్‌తో కలిగే ప్రమాదాలు ప్రాణ నష్టం కుటుంబాలపై పడే భారం, చట్టపరమైన పరిణామాల గురించి వివరించారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిద్దాం
నిర్మల్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక రమణ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిలుక రమణ మాట్లాడుతూ.. పద్మశాలి కుల సంక్షేమం, అభివృద్ధి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారన్నారు. ప్రభుత్వం పద్మశాలి కులానికి అన్నిరంగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. మార్కండేయ ఆలయాలు ప్రతీ గ్రామంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలన్నారు. పద్మశాలి యువతను ఆదుకునేందుకు స్వయం ఉపాధి పథకాల కోసం ప్రత్యేక ఆర్థిక కార్యాచరణ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఆడెపు సుధాకర్, జల్డ రాజేశ్వర్, మిట్టపల్లి నర్సయ్య, జల్డ గంగాధర్, గంగ సురేశ్, దత్తాద్రి, కిషన్, రాజేశ్వర్, బిట్లింగు నవీన్, పెండెం శీను, చిట్టన్న, భానుచందర్, నరహరి, మనోహర్, పండరి పాల్గొన్నారు. -
విద్యుత్ ఫీడర్ లైన్‌పై పిడుగు
లోకేశ్వరం: మండల కేంద్రంలోని భగీరథ చెరువు నీటిలో ఉన్న విద్యుత్ స్తంభం 33/11 కేవీ ఫీడర్ లైన్‌పై శనివారం రాత్రి పిడుగు పడింది. దీంతో లోకేశ్వరం సబ్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిచిలిపోయింది. గుర్తించిన విద్యుత్ ఏఈ శివకుమార్ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. భగీరథ చెరువులోకి వెళ్లి మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఆదివారం ఏఎల్ఎంలు గంగాధర్, శ్రీకాంత్, ఎల్ఎం గజానంద్రెడ్డి చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ముగ్గురు సిబ్బందిని లోకేశ్వరం విద్యుత్ సబ్ స్టేషన్లో అభినందించారు. వారి వెంట సురేశ్, శ్రీకాంత్, రవీందర్, సతీశ్, సవీన్, నజీర్ ఉన్నారు. -
నేటి నుంచి శరన్నవరాత్రులు
బాసర: బాసరలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. వేడుకల్లో భాగంగా శ్రీసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు. తెల్లవా రుజామున గణపతి పూజ, సుప్రభాత సేవ, మహాభిషేకం, అలంకరణ, మంగళహారతి, మంత్రపుష్పం వంటి వైదిక కార్యక్రమాలతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, క్షేత్రపూజ, స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశ స్థాపన (ఘటస్థాపన) శాస్త్రోక్తంగా జరిపిస్తారు. కార్యక్రమాల్లో ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు, అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అలంకారం సరస్వతి అమ్మవారి శక్తి, జ్ఞాన స్వరూపాన్ని సూచిస్తుంది. భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందిస్తుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.