Maharashtra
-
నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్‌తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్‌పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు సైఫ్‌పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్‌తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలేం జరిగింది? దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్‌ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్‌లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్‌పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. -
సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆయన అంతే ఘాటుగా బదులిచ్చారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు ఫడ్నవిస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు.. ఈ విమర్శలకు సినీ ప్రముఖుల గొంతు కూడా తోడైంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఎమర్జెన్సీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ చిత్ర నటి కంగనా రనౌత్‌తో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆయన్ని సైఫ్‌పై దాడి గురించి మీడియా ప్రశ్నించింది. దేశంలో ఉన్న మెగాసిటీ(Megacities)ల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం. నగరంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని అంతే తీవ్రంగా మేం వాటిని భావించి దర్యాప్తు జరిపిస్తున్నాం. అలాగని.. ఏదో ఒక ఘటనను పట్టుకుని ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అనడం సరికాదు. ఇది ముంబై ప్రతిష్టను దెబ్బ తీసే అంశం. ముంబైను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. మహారాష్ట్ర హోం శాఖ ప్రస్తుతం ఫడ్నవిస్ వద్దే ఉంది.#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis on the attack on actor Saif Ali Khan says, “Police have provided all the details. What kind of attack this was, the motive behind it, and the intention are all before you.”#SaifAliKhan #DevendraFadnavis #Mumbai pic.twitter.com/L7hGKE8XnE— Organiser Weekly (@eOrganiser) January 16, 2025ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా బాంద్రాకు ఓ పేరుంది. వీవీఐపీలు ఉండే ఈ ఏరియాలో కట్టుదిట్టమైన పోలీస్ పహారా కనిపిస్తుంటుంది కూడా. అలాంటి ప్రాంతంలో..గత అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. ఈ క్రమంలో జరిగిన సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు కత్తిపోట్లు లోతుగా దిగడం, వెన్నెముకకు దగ్గరగా కత్తికి దిగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆయనకు ప్రమాదం తప్పిందని, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో సైఫ్‌తో పాటు ఆయన ఇంట్లో పని చేసే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందించి వైద్యులు ఇంటింకి పంపించేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా(Bandra Police) పోలీసులు.. నిందితుడిని దాదాపుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపాయి.ఊహాజనిత కథనాలొద్దుఈ ఘటనపై మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య కరీనా కపూర్, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకుంటున్నారు. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది. -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
ద్విగుణీకృతమైన సాగర పాటవం
ముంబై: భారత్ తిరుగులేని సాగరశక్తిగా ఆవిర్భవిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా మారిందని అభిప్రాయపడ్డారు. రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ను బుధవారం ముంబై నావల్ డాక్ యార్డులో ఆయన జాతికి అంకితం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కింద చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రక్షణ ఉత్పత్తి, సముద్ర జలాల రక్షణ, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో భారత్ తిరుగులేని ప్రగతి సాధిస్తోందని ఈ సందర్భంగా అన్నారు. సాగర జలాలను డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదం వంటి జాఢ్యాల నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ మరింత చురుకైన భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. ‘‘మూడు యుద్ధనౌకలు ఒకేసారి అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. నౌకా నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేస్తుండటమే ఇందుకు కారణం. గత పదేళ్లలో మా హయాంలో 40 నౌకలు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఏకంగా 39 భారత్‌లోనే తయారవడం విశేషం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నావికా దళానికి దేశీయ చిహా్నలను రూపొందించుకున్నాం. రూ.1.5 లక్షల కోట్లతో మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతోంది. సాగరగర్భంలో దాగున్న అపారమైన అవకాశాలను ఒడిసిపట్టే ప్రయత్నమూ జోరుగా సాగుతోంది. మన పరిశోధకులు 6,000 మీటర్ల లోతు దాకా వెళ్లే సముద్రయాన్ ప్రాజెక్టు ఊపందుకుంది’’ అని వివరించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం భాగస్వామ్య దేశాలన్నింటికీ సమాన స్థాయిలో అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అధికారం నిలబెట్టుకున్నాక మోదీ మహారాష్ట్రలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మహాయుతి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు.ఐఎన్ఎస్ నీలగిరి → ప్రాజెక్ట్ 17ఏ స్టెల్త్ ఫ్రి గేట్ కల్వరీ శ్రేణిలో ప్రధాన యుద్ధనౌక.→ శత్రువును ఏమార్చే అత్యాధునిక స్టెల్త్ టె క్నాలజీ దీని సొంతం.→ గత యుద్ధ నౌకల కంటే అధునాతన రాడార్ టెక్నాలజీ ఉంది. → ఎండీఎల్, నావికా దళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని సంయుక్తంగా నిర్మించాయి. → ఐఎన్ఎస్ నీలగిరి 75 శాతం దేశీయంగా నిర్మితమైంది.→ ఎంహెచ్–60ఆర్ శ్రేణి హెలికాప్టర్లు కూడా దీన్నుంచి కార్యకలాపాలు సాగించగలిగేలా అధునాతన సౌకర్యాలు, పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు.ఐఎన్ఎస్ సూరత్ → ప్రాజెక్ట్ 15బి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ శ్రేణి ప్రాజెక్టులో నాలుగో, చివరి యుద్ధ నౌక. → ఇది నౌకాయాన చరిత్రలోనే అత్యంత భారీ, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక. → అత్యాధునిక ఆయుధ, సెన్సర్ వ్యవస్థలు, అధునాతన నెట్వర్క్ కేంద్రిత యుద్ధ పాటవం దీని సొంతం. → దీన్ని మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. → 80% దేశీయంగా∙తయారవడం విశేషం.ఐఎన్ఎస్ వాఘ్షీర్ → ప్రాజెక్ట్ 75 స్కార్పియన్ శ్రేణిలో ఆరో జలాంతర్గామి. → దీని నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ కూడా పాలుపంచుకుంది. → యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మరైన్ పోరాటాలు రెండింట్లోనూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించారు. → నిఘా సమాచార సేకరణలో కూడా ఇది చురుగ్గా పాలుపంచుకోనుంది. → అత్యాధునిక ఎయిర్–ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ దీని సొంతం. → డీజిల్, విద్యుత్‌తో నడిచే అత్యంత వైవిధ్యమైన, శక్తిమంతమైన, భారీ జలాంతర్గాముల్లో ఇదొకటి. → దీనిలో అధునాతన సోలార్ వ్యవస్థ, యాంటీ షిప్ మిసైళ్లు, వైర్ గైడెడ్ టార్పెడోలను మోహరించారు. → భావి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు.#WATCH | Mumbai: On the commissioning of three frontline naval combatants, PM Narendra Modi says, "...It is a matter of pride that all three frontline naval combatants are Made in India. Today's India is emerging as a major maritime power in the world." pic.twitter.com/DisB0t8oDY— ANI (@ANI) January 15, 2025 #WATCH | Mumbai, Maharashtra: Prime Minister Narendra Modi dedicates three frontline naval combatants INS Surat, INS Nilgiri and INS Vaghsheer to the nation(Source: ANI/DD) pic.twitter.com/0PI3kxlVT4— ANI (@ANI) January 15, 2025 -
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో 1978 నుంచి శరద్ పవార్.. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయంతో పవార్ రాజకీయాలకు ముగింపు పలికినట్టు అయ్యిందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం షిర్డీలో పర్యటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో 1978లో శరద్ పవార్ భిన్నమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ రాజకీయాలకు కూడా ప్రజలకు ముగింపు పలికారు. కుట్రపూరిత రాజకీయాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. వాళ్లిద్దర్నీ మహారాష్ట్ర ప్రజలు ఇంటికి సాగనంపారు. బీజేపీతో పాటు నిజమైన శివసేన, ఎన్సీపీలను గెలిపించారు. వారి ఓటమితో మహారాష్ట్రలో అస్థిర రాజకీయాలకు ముగింపు పడిందన్నారు.ఉద్ధవ్ థాక్రే మమ్మల్ని మోసం చేశాడు. 2019లో ఆయన బాలాసాహెబ్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరు ఆయనకు తన స్థానాన్ని మీరే చూపించారు. ఆయన ద్రోహం ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో బీజేపీ సాధించిన పెద్ద విజయానికి పార్టీ కార్యకర్తలే కారణం. అందరి శ్రమతోనే ఘన విజయం అందుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్.. అనేక సహకార సంస్థలకు నేతృత్వం వహించారు. కానీ, రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆయన ఆపలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది’ అంటూ కీలక కామెంట్స్ చేశారు.#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah says, "... The victory (of BJP) in Maharashtra ended the politics of instability and backstabbing started by Sharad Pawar in 1978. Uddhav Thackeray betrayed us, he left the ideology of Balasaheb in 2019. Today you have shown him… pic.twitter.com/BzACZ9bOSJ— ANI (@ANI) January 12, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
పండుగ వేళ భయానక రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి
ముంబై/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా 14 మంది మృతిచెందారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పౌరీ జిల్లాలోని దహల్చోరి ప్రాంతంలో బస్సు అదుపు తప్పి 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.VIDEO | Uttarakhand: Five people feared dead as bus meets with an accident in Pauri. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/F9RQzVuvpP— Press Trust of India (@PTI_News) January 12, 2025ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మరోవైపు.. మహారాష్ట్రలోని నాసిక్‌లోని ద్వారకా సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి టెంపో-ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనంఓ మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో టెంపో వాహనంలో 16 మంది ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా పుణ్యక్షేత్రాలు దర్శించుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. #WATCH | Maharashtra | Visuals from the Nashik Mumbai Highway flyover where 6 people lost their lives in an accident between a pickup and a mini truck.5 other people are injured out of which 2 are in critical condition. The injured are being treated at the district hospital:… pic.twitter.com/RIYbwNCxFd— ANI (@ANI) January 12, 2025 -
స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరు
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కూటమి నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంవీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ శివసేన(ఉద్ధవ్) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తే కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామన్నారు. ముంబై, థానె, నాగ్‌పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం సొంతంగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా ఉన్నట్లు రౌత్ వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) రూపంలోని మైత్రి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమని రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరు సరికాదు ఎంవీఏ, ఇండియా కూటమిలోనీ ముఖ్య భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సభ్య పార్టిలకు ఏమాత్రం సహకరించడం లేదని రౌత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ వడెట్టివార్ భాగస్వామ్య పక్షాలను నిందిస్తున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం, సర్దుకుపోవడం వంటి వాటిపై విశ్వాసం లేని వారికి కూటమిలో కొనసాగే అర్హత లేదని రౌత్ విమర్శించారు. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే..లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క దఫా కూడా సమావేశం కాలేకపోయిందన్నారు. ఇండియా కూటమికి కన్వినర్‌ను కూడా నియమించుకోలేకపోవడం మంచి విషయం కాదన్నారు. ఎవరికీ మంచిది కాదు: ఎన్సీపీ(శరద్) శివసేన (ఉద్ధవ్) పార్టీ నిర్ణయంపై ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ(శరద్) స్పందించింది. ‘ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది శివసేన(ఉద్ధవ్) పార్టీ ఇష్టం. మేం అడ్డుకోబోం. బలవంతంగా ఎవరినీ కలుపుకోం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మేం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సరైన నిర్ణయంగా మేం భావించడం లేదు. కానీ, ఈ నిర్ణయం ప్రభావం ఎంవీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలపైనా పడుతుంది’అని ఆ పార్టీ నేత జితేంద్ర ఔహద్ చెప్పారు. మేం పట్టించుకోం: సీఎం ఫడ్నవీస్ స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలన్న శివసేన(ఉద్ధవ్) నిర్ణయాన్ని బీజేపీకి చెందిన సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. ‘ఎంవీఏ కూటమి పోటీలో ఉన్నా లేకున్నా మేం పట్టించుకునేది లేదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మాకే మద్దతుగా ఉంటారనే నమ్మకం మాకుంది’అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో శివసేన(ఉద్ధవ్) వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ వ్యాఖ్యానించారు. -
శ్వాస సంబంధ వ్యాధులపై నిఘా
న్యూఢిల్లీ: శ్వాస సంబంధమైన అన్ని రకాల వ్యాధులపై ఓ కన్నేసి ఉంచాలని, హ్యూమన్ మెటా న్యుమోవైరస్(హెచ్ఎంపీవీ) వ్యాప్తిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దేశంలో ఇప్పటికే హెచ్ఎంపీవీ సంబంధిత ఐదు కేసులు బయటపడగా, మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రెండు హెచ్ఎంపీవీ అనుమానిత కేసులను వైద్యులు గుర్తించారు. సోమవారం కర్ణాటక, తమిళనాడు, గుజరా త్లలో ఐదుగురు చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తోందని, ఎలాంటి భయాందోళనలకు ప్రజలు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా భరోసా ఇచ్చారు.చైనాలో ఒక్కసారిగా హెచ్ఎంపీవీ కేసులు పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో వర్చువల్‌గా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం చూస్తే ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్(ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్(ఎస్ఏఆర్ఐ) సహా అన్ని రకాల శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపించలేదని ఆమె వివరించారు. అదీకాకుండా, ప్రపంచ దేశాల్లో 2021 నుంచే ఈ వ్యాధి ఉన్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ప్రస్తుత శ్వాసకోశ సంబంధ వ్యాధుల్లో నమోదైన పెరుగుదలపై ఆమె మాట్లాడుతూ.. ఏటా ఈ సీజన్లో ఇలా కేసులు పెరగడం మామూ లేనన్నారు. అయితే, శ్వాస సంబంధమైన అన్ని రకాల వ్యాధుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆమె రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులను కోరారు. నాగ్‌పూర్‌లో రెండు అనుమానాస్పద కేసులు..మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హెచ్ఎంపీవీ అనుమానాస్పద కేసులు రెండింటిని గుర్తించారు. 7, 14 ఏళ్ల బాధితులిద్దరికీ స్థానిక ప్రైవేట్ ఆస్ప త్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో చికిత్స చేసి, ఇంటికి పంపించివేశారు. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. అనుమానితుల నుంచి సేకరించిన నమూ నాలను నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని జిల్లా కలెక్టర్ విపిన్ ఇటంకర్ చెప్పారు. హెచ్ఎంపీవీ కేసులంటూ వచ్చిన వార్తలు అబద్ధమన్నారు. నాగ్‌పూర్‌లో హెచ్ఎంపీవీ కేసులు లేవని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. -
అలరించిన ‘సుస్వరాల హరివిల్లు’
దాదర్: ఆంధ్ర మహాసభ, స్వరమాధురి సంగీత సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దాదర్‌లోని ఈఎన్ వైద్య సభాగృహంలో ‘సుస్వరాల హరివిల్లు’పేరిట నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వరమాధురి సంగీత సంస్థ సహాకారంతో ఈ సుస్వరాల హరివిల్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, తెలుగు భాష, సంస్కృతుల వ్యాప్తిలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నామని ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముంబైలో ఉన్న తెలుగు సంఘాలన్నింటినీ ఏకం చేసి తెలుగు భాష, సంస్కృతులను మరింతగా వ్యాప్తిచేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. గత 13 ఏళ్లుగా తమ సంస్థ గుడ్ మ్యూజిక్, గుడ్ కల్చర్ అనే స్ఫూర్తితో ముందుకు సాగుతోందని..స్థానిక గాయనీ గాయకులకు సంగీత శిక్షణ సత్ఫలితాలను సాధిస్తున్నామని స్వరమాధురి సంగీత సంస్థ అధ్యక్షుడు అశ్వినీ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర మహాసభలో తొందర్లోనే ఏసీ ఆడిటోరియాన్ని నిరి్మస్తామని మహాసభ ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేష్ పేర్కొన్నారు. ఆకట్టుకున్న ‘ఆణిముత్యాలు’ ఈ సంగీత విభావరిలో నాటి నుంచి నేటి వరకు ముఖ్యంగా గత 65 ఏళ్లలో వచ్చిన తెలుగు సినిమాలలోని 20 ఆణిముత్యాల్లాంటి పాటలను గాయనీ గాయకులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సోని కొమాండూరి, స్వరమాధురి గాయనీగాయకులు శశికిరణ్, ప్రణవ్ శేషసాయి, వంశీ సౌరబ్, గిరిజా ద్విభాష్యం, డా స్రవంతి, మయాఖ, మాహి, సుజాత తమదైన శైలిలో పాటలుపాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. వీరికి ఆర్టి రాజన్, విక్కి ఆదవ్, ప్రణవ్ కుమార్, రోషన్ కాంబ్లే, రమేష్ కాలే, బాలా జాధవ్, వినీత్ వాద్యసహకారం అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ స్వాగతం పలకగా కల్పన గజ్జెల, తాండవకృష్ణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సంధ్య పోతురి వందన సమర్పన చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల చైర్మన్ మంతెన రమేష్ కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, సభ్యులు సంగం ఏక్నాథ్, భోగ సహాదేవ్, ద్యావరశెట్టి గంగాధర్, గాలి మురళి, ఆంధ్ర మహసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ఉపాధ్యక్షుడు తాళ్ల నరేష్, గాజెంగి వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కోశాధికారి వేముల మనోహర్, సంయుక్త కార్యదర్శులు కటుకం గణేష్ , అల్లె శ్రీనివాస్, మచ్చ సుజాత, కొక్కుల రమేష్, ప్రహ్లాద్, క్యాతం సువర్ణ, చిలివేరి గంగాదస్, పీచుక రత్నమాల, చిలుక వినాయక్, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, ఉపాధ్యక్షురాలు వి శ్యామల రామ్మోహన్, కార్యదర్శి పిల్లమారపు పద్మ, కార్యవర్గ సభ్యులు గాలి స్వర్ణ, తాళ్ల వనజ, భోగ జ్యోతిలక్షి్మ, బెహరా లలిత, స్వరమాధురి సంగీత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిరిజా ద్విభాష్యం, అ«ధ్యక్షుడు అశ్వనీ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్పన గజ్జల, తాండవకృష్ణ , రమణిరావు, ఈశ్వర్, జగన్నాధరావు, జికె మోహన్, హరీష్ , పోతురి సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గుల పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
సాక్షి, ముంబై: దాదర్ నాయ్‌గావ్‌లోని ‘పద్మశాలీ యువక సంఘం’మహిళా మండలి ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండలి కార్యదర్శి చెరిపల్లి పరమేశ్వరి, కోశాధికారి పేర్ల గీతాంజలి ప్రారంభించిన ఈ పోటీలకు రితిక దేశ్‌ముఖ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. మహిళలు, బాలికలు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్న అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. పోటీల విజేతలకు సంక్రాంతి ( జనవరి 14వ తేదీ) రోజున జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి ఉపాధ్యక్షురాలు జిల్ల శారద, కార్యదర్శి చెరిపల్లి పరమేశ్వరి, సహకార్యదర్శులు బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, ఏలే తేజశ్రీ అడ్డగట్ల ఐశ్వర్య, చెదురుపు పద్మ, దొంత ప్రభావతి, ఇదం పద్మ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, కస్తూరి సావిత్రి, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడి చంద్రమౌళి, ట్రస్టీ తిరందాసు సత్యనారాయణ, కార్యవర్గ అధ్యక్షులు గంజి సీతారాములు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, దోర్నాల మురళీధర్, పుట్ట గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు
న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ(HMPV)కేసులతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నప్పటికీ ఈ కేసుల సంఖ్య భారత్‌లో క్రమేపీ పెరగడం మాత్రం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. నిన్న(సోమవారం) ఒక్కరోజే నాలుగు కేసులు నమోదు కాగా, నేటి(మంగళవారం) ఉదయానికి ఆ సంఖ్య డబుల్ అయ్యింది. తాజాగా మరో నాలుగు కేసులు చేరడంతో అమ్మో హెచ్ఎంపీవీ ఏం చేస్తుందనే భయం మాత్రం జనాల గుండెల్లో భయం పుట్టిస్తోంది.తాజాగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో మరో రెండు కేసులు నమోదు కావడంతో ఈ కేసుల సంఖ్య భారత్‌లో ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కాగా, అది ఇప్పుడు మహారాష్ట్రకు పాకడంతో కాస్త కలవరం ఎక్కువైంది.హెచ్ఎంపీవీపై కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలుజనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలి.వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలిబహిరంగ స్థలాల్లో ఉమ్మివేయరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..హెచ్ఎంపీవీ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. గత యాభై, ఆరవై ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా(Corona Virus) తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు..మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని అంటున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.కేసుల నమోదుతో ఆందోళనచైనా(China)లో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.మహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్‌తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రి -
‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?!
మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా చర్చ జోరందుకుంటోంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమికి చేరువయ్యేందుకు విపక్ష శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పార్టీల నేతల తాజా వ్యాఖ్యలు ఈ దిశగా సంకేతాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి మహాయుతి ఘోర ఓటమి రుచి చూపించడం తెలిసిందే. శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం మహాయుతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటున్నాయి. తామే అసలైన పార్టీలమంటూ ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా షిండే, అజిత్ ఆయనకు డిప్యూటీలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్ సేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ భారీ ఓటమితో కుదేలయ్యాయి. ఒకరకంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. విడిపోయిన పార్టీలు మళ్లీ కలిసి పోవాలంటూ కొద్ది రోజులుగా వారు గట్టిగా కోరుతున్నారు! ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) అధికారిక పత్రిక ‘సామ్నా’ తమ ప్రత్యర్థి అయిన ఫడ్నవీస్‌ను ప్రశంసల్లో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్చిరోలీ జిల్లాలో నక్సలిజం అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొంది. ‘‘గడ్చిరోలీలో పలు అభివృద్ధి పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం చుట్టారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. గడ్చిరోలీకి నూతన గుర్తింపును ఇవ్వాలని ఫడ్నవీస్ భావిస్తే స్వాగతిస్తాం’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నక్సల్స్ ప్రభావిత జిల్లాలో నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిన ఫడ్నవీస్ నిజంగా ప్రశంసలకు అర్హుడు’’ అని పేర్కొంది! మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారకుడైన షిండేపై సంపాదకీయం విమర్శలు గుప్పించింది. ఆయన గతంలో ఇన్చార్జి మంత్రి హోదాలో గడ్చిరోలీలో మైనింగ్ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే పని చేశారని ఆరోపించింది. లోగుట్టు ఏమిటో?! ఉద్ధవ్ సేన ఉన్నట్టుండి బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత నెల 17న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా! ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్‌ను అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్ మోడ్‌లో పని చేస్తున్నారంటూ ప్రస్తుతించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎంను ఇలా ఆకాశానికెత్తుతుండటం యాదృచ్ఛికమేమీ కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అవి ఎన్డీఏ వైపు చూస్తున్నాయనేందుకు బహుశా ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వవాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చిన శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల కింద అనూహ్యంగా తన బద్ధ విరోధి కాంగ్రెస్‌తో జట్టుకట్టడం తెలిసిందే. అప్పటినుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందూత్వవాది అయిన బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్ధవ్ వర్గం నేతల్లో కొందరంటున్నారు. కానీ అది ఆత్మహత్యా సదృశమే కాగలదని, పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఎన్డీఏలో చేర్చుకుని ఉద్ధవ్ సేనకు చేజేతులారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని ప్రశి్నస్తున్నారు. మాది మనసున్న పార్టీ: రౌత్ సామ్నా సంపాదకీయాన్ని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ సమ రి్థంచుకున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పటికీ గడ్చిరోలీ జిల్లాకు సీఎం మంచి పనులు చేస్తున్నారు గనుక ప్రశంసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మాది చాలా పెద్ద మనసున్న పార్టీ. ప్రజలకు మంచి చేస్తే మా ప్రత్యర్థులనైనా ప్రశంసిస్తాం’’ అన్నారు.ఎన్సీపీల విలీనం! ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంటున్న బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ దగ్గరవుతున్న సంకేతాలు కొద్ది రోజులుగా ప్రస్ఫుటమవుతున్నాయి. విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరూ కలిసిపోవాలని అజిత్ తల్లి ఇటీవలే పిలుపునివ్వడం తెలిసిందే. వారిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 12న శరద్ జన్మదినం సందర్భంగా అజిత్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అది అతి త్వరలోనే జరగవచ్చని పవార్ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు. శరద్ తమకు దేవుడని, పవార్ కుటుంబం ఒక్కటైతే చాలా సంతోషిస్తామని అజిత్ వర్గం ఎంపీ ప్రఫుల్ పటేల్ అన్నారు. శరద్ తన వర్గాన్ని అజిత్ పార్టీలోనే కలిపేసి ఎన్డీయే గూటికి చేరినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఫడ్నవీస్‌కు శరద్ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని వారంటుండగా మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
దిగ్గజ శాస్త్రవేత్త చిదంబరం కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, భారత అణ్వస్త్ర పరీక్షల్లో కీలక భూమిక పోషించిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజగోపాల చిదంబరం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో కన్నుమూశారని అణు శక్తి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 88 ఏళ్ల చిదంబరం 1974లో, 1998లో భారత్ చేపట్టిన అణు పరీక్షల్లో ప్రధాన పాత్ర పోషించారు. చిదంబరం మృతి వార్త తెల్సి ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. ‘‘భారత అణు కార్యక్రమ పితామహుల్లో ఒకరైన చిదంబరం దేశ శాస్త్రసాంకేతికత, వ్యూహాత్మక శక్తిసామర్థ్యాల మెరుగు కోసం అవిశ్రాంతంగా కృషిచేశారు. ఆయన చేసిన సేవలను యావత్ భారతావని, భవిష్యత్ తరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయి’’అని మోదీ అన్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహదారుగా 17 సంవత్సరాలపాటు కీలక సేవలు అందించారని శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్మరించుకున్నారు. ఆయన అసాధారణ శాస్త్రీయ మేథస్సు భారతదేశానికి ఎంతో సాయపడిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. అణు భౌతిక శాస్త్రంలో కృషి 1936 నవంబర్ 12నలో తమిళనాడులోని చెన్నైలో జన్మించిన చిదంబరం మీరట్‌లోని సనాతన్ ధర్మ్ పాఠశాలలో, చెన్నైలోని మైలాపూర్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. బెంగళూరులో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీజీ చదివారు. అణుకార్యక్రమాల్లో పాల్గొంటూనే దాదాపు 60 సంవత్సరాలపాటు ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పనిచేసే అరుదైన వ్యక్తి చిదంబరం. 1962లో బాబా అణు పరిశోధనా కేంద్రం(బార్క్)లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత 1990లో బార్క్‌కు ఛైర్మన్ అయ్యారు. 1990–1993వరకు ఛైర్మన్‌గా ఉన్నారు. 1993–2000 కాలంలో కేంద్ర అణుఇంధన మంత్రితి్వశాఖకు కార్యదర్శిగా కొనసాగారు. 2001–2018 కాలంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. అంతర్జాతీయ అణుఇంధన సంస్థ(ఐఏఈఏ) గవర్నర్ల బోర్డ్‌కు 1994–95కాలంలో ఛైర్మన్‌గా సేవలందించారు. సొంతంగా ప్లుటోనియం తీసుకొచ్చి.. 1967 నుంచి భారత అణుపరీక్షలకు సంబంధించి ప్రాజెక్టుల్లో పనిచేయడం మొదలెట్టారు. 1974లో భారత్ తొలిసారిగా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ద పేరిట అణుపరీక్షలు చేపట్టింది. ఆ మిషన్‌లో అణుశాస్త్రవేత్తగా కీలక భూమిక పోషించారు. ముంబై నుంచి ఫ్లుటోనియంను ఈయనే స్వయంగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌కు తీసుకొచ్చారు. 1998లో ఆపరేషన్ శక్తిపేరిట పోఖ్రాన్–2 అణుపరీక్షల సమయంలోనూ చిదంబరం న్యూక్లియర్ ఎనర్జీ బృందానికి సారథ్యం వహించారు. నాటి రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) చైర్మన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్తో కలిసి పోఖ్రాన్ అణుపరీక్షను స్వయంగా పర్యవేక్షించారు. ఆనాడు 1998 మే 11 నుంచి మే 13వ తేదీ వరకు ఐదుసార్లు అణుపరీక్షలు జరిగాయి. దేశం కోసం అవిశ్రాంతంగా కృషిచేసినందుకు గుర్తింపుగా ఆయనకు భారత ప్రభుత్వం 1975లో పద్మ శ్రీతో, 1999లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లనూ పొందారు. జాతీయ, అంతర్జాతీయ సైన్స్ అకాడమీల్లో సభ్యునిగా ఉన్నారు. ఎందరో యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఈయన స్ఫూర్తిదాతగా నిలిచారు. చిదంబరంకు భార్య చెల్లా, కుమార్తెలు నిర్మల, నిత్య ఉన్నారు. Deeply saddened by the demise of Dr. Rajagopala Chidambaram. He was one of the key architects of India’s nuclear programme and made ground-breaking contributions in strengthening India’s scientific and strategic capabilities. He will be remembered with gratitude by the whole…— Narendra Modi (@narendramodi) January 4, 2025 -
ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో మాఫియా డాన్ హత్యకు ప్లాన్!
క్రికెట్ స్టేడియంలో వేలాది మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తుండగా ఒక మనిషిని చంపాలనుకోవడం సాధ్యమా? అదికూడా అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన మాఫియా డాన్‌ను మట్టుబెట్టాలంటే మామూలు విషయమా? కానీ అలాంటి సాహసం చేసిందో మహిళ. ఆమె ఎవరు?, ఆమె చంపాలనుకున్న మాఫియా డాన్ ఎవరు?, అందుకు అతడిని చంపాలకుందనే వివరాలు తెలియాలంటే జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ పుస్తకం చదవాల్సిందే.ఇంతకీ ఈ పుసక్తంలో ఏముంది?అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పేరు అందరూ వినేవుంటారు. భారతదేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో అత్యంత క్రూరుడిగా అతడు గుర్తింపు పొందాడు. 1993 బాంబే వరుస పేలుళ్లకు (Mumbai Serial Blasts) ప్రధాన సూత్రధారిగా దావూద్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపి భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో అతడు సాగించిన మారణహోమం ఎంతో మంది అమాయకులను బలిగొంది. అండర్‌వరల్డ్ కార్యకలాపాలు, మత్తుపదార్థాల రవాణా వంటి అరాచకాలతో చెలరేగిన అతడికి ఎంతో మంది శత్రువులయ్యారు. దావూద్ శత్రువుల్లో సప్నా దీదీ కూడా ఒకరు. అయితే ఈమె గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ (Mafia Queens of Mumbai) పుస్తకంలో సప్నా దీదీ గురించి రాశారు.ఎవరీ స్వప్నా దీదీ?ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన వచ్చిన దేవతగా సప్నా దీదీని జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ వర్ణించాడు. దావూద్ ఇబ్రహీం శత్రువైన ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సప్నా దీదీ గురించి రాశాడతను. ప్రతీకారం తీర్చుకోవడానికి నేరుగా ముంబై అండర్‌వరల్డ్ చీకటి ప్రపంచంలోకి మెరుపులా దూసుకొచ్చిన వీర వనితగా పేర్కొన్నాడు.సప్నా దీదీ (Sapna Didi) ముంబైలోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అష్రాఫ్. చాలా చిన్న వయస్సులోనే గ్యాంగ్‌స్టర్ మెహమూద్ ఖాన్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. తన భర్తకు అండర్ వరల్డ్‌తో ఉన్న లింకులు ఆమెకు తెలియవు. దుబాయ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన భర్తను ముంబై విమానాశ్రయంలో తన కళ్ల ముందే కాల్చి చంపడంతో ఆమె ప్రపంచం తలక్రిందులైంది. తన జీవితంలో ఎదురైన అతిపెద్ద షాక్ నుంచి బయటపడేందుకు సమాధానాల కోసం వెతుకుతుండగా ఆమెకు నిజం తెలిసింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకే అతడి గ్యాంగ్ తన భర్తను పొట్టనపెట్టుకుందని తెలుసుకుంది. దావూద్ మాట విననందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.డీ-కంపెనీ ఆగడాలకు చెక్ముంబైలో దావూద్ ఇబ్రహీంకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హుస్సేన్ జైదీని అష్రాఫ్ కలిసింది. దావూద్‌ను అంతమొందిచాలన్న తన లక్ష్యం గురించి చెప్పి, సహాయం చేయాలని అతడిని అర్థించింది. కొద్దిరోజుల్లోనే తుపాకీ కాల్చడం నేర్చుకుని రంగంలోకి దిగింది. దావూద్ పతనమే ధ్యేయంగా కొన్ని నెలల పాటు హుస్సేన్ జైదీతో కలిసి పనిచేసింది. నేపాల్ ద్వారా భారత్‌లోకి డీ-కంపెనీ పంపుతున్న అక్రమ ఆయుధాలను అడ్డుకున్నారు. పలు రకాలుగా డీ-కంపెనీ ఆగడాలకు చెక్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత తన పేరును స్వప్నా దీదీగా మార్చుకుంది. బురఖా తొలగించి జీన్స్, షర్ట్ ధరించింది. బైక్ నడపడం, సులువుగా గన్ హ్యాండిల్ చేయడం వంటివి సులువుగా చేసేది. ముంబై దావూద్ వ్యాపారాలకు దెబ్బకొడుతున్న వ్యక్తిగా స్వప్నా దీదీ మెల్లమెల్లగా గుర్తింపు పొందింది. దీంతో దావూద్ అనుచరుల్లో భయం మొదలైంది.దావూద్ హత్యకు ప్లాన్మరోవైపు హుస్సేన్ జైదీతో ఆమె సంబంధాలు క్షీణించినప్పటికీ దావూద్‌ను చంపాలన్న నిర్ణయాన్ని మాత్రం ఆమె మార్చుకోలేదు. 1990 ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో దావూద్‌ను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. దావూద్ తరచుగా వీఐపీ ఎన్‌క్లోజర్ నుంచి క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాడు. అతడు బహిరంగంగా కనిపించిన కొన్ని సందర్భాలలో ఇదీ ఒకటి. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య దావూద్ హత్యకు ప్లాన్ చేసింది స్వప్న. తన అనుచరులను స్టేడియంలోకి పంపించి గొడుగులు, సీసాలు పగులగొట్టి దావూద్‌ను మట్టుబెట్టాలని అనుకుంది. ముందుగా దావూద్ అనుచరులపై దాడి చేసి గొడవ సృష్టించాలని, సందట్లో సడేమియాలా డాన్‌ను చంపాలని పథక రచన చేసింది.చదవండి: పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"22 సార్లు కత్తితో పొడిచి హత్యదురదృష్టవశాత్తు ఆమె ప్లాన్ గురించి ముందే దావూద్ ఇబ్రహీంకు తెలిసిపోయింది. దీంతో దావూద్ తన అనుచరులతో ఆమెను దారుణంగా హత్య చేయించాడు. 1994లో ముంబైలోని తన నివాసంలో సప్నా దీదీని 22 సార్లు కత్తితో పొడిచి మర్డర్ చేశారు. దావూద్ ఇబ్రహీంకు భయపడి ఇరుగుపొరుగు వారెవరూ ఆమెను కాపాడటానికి ముందుకు రాలేదు. ఆస్పత్రికి తరలించే లోగా ఆమె ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఆమె పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పెద్ద మాఫియాడాన్‌కు వ్యతిరేకంగా తెగువ చూపిన సప్నా దీదీ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. -
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై కార్యకర్తల దాడి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్‌పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్ థాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్‌తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్ రౌత్‌పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్ రౌత్‌ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.ఇక, సంజయ్ రౌత్‌పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్ థాక్రే కానీ, సంజయ్ రౌత్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.There are multiple reports that Shiv Sena (UBT) workers have beaten Sanjay Raut by locking him in a room in Matoshree.Do you support this action of Shiv Sena workers ? pic.twitter.com/deVAEWRuCj— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025 -
ఐస్‌క్రీమ్ బిర్యానీ...!
మీరు సరిగ్గానే చదివారు. ఐస్ క్రీమ్ బిర్యానీనే. బిర్యానీ అంటేనే మసాలా. ఇక ఐస్‌క్రీమ్.. తీపి. ఈ రెండింటికీ అభిమానులు ఎంతో మంది. అలాంటిది ఆ రెండు డిషెస్‌ను కలిపితే.. రుచెలా ఉంటుంది? రుచి సంగతి తెలియదు కానీ.. ఈ బిర్యానీని ముంబైకి చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ హీనా కౌసర్ తయారు చేశారు. వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ఫొటోలో ఉన్న విధంగానే... హుండీలో బిర్యానీ... మధ్యలో స్ట్రాబెర్రీ ఐస్క్రీ స్కూప్. రెండు హుండీలను పట్టుకుని ఆమె వీడియోలో కనిపిస్తున్నారు. సాధారణంగా మసాలాలతో బంగారు వర్ణంలో ఘుమఘుమలాడే బిర్యానీ.. ఐస్‌క్రీమ్ రంగును పులుముకుని గులాబీ రంగులో మెరిసిపోతోంది. ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఆహార ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది. హీనా సృజనాత్మకత ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ఈ ప్రయోగం చాలా మంది ఆహార ప్రియులను అయోమయానికి గురిచేసింది. కంటెంట్ క్రియేటర్ హీనా బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు. తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్సు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో భాగంగా ఈ ఫ్యూజన్ డిష్‌ను తయారు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరెస్సెస్ చీఫ్‌పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందిర్-మసీద్ వివాదాలను ఉద్దేశించి భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భగవత్‌కు హిందువుల మనోభావాలపై పట్టింపు లేనట్లు ఉందని అన్నారాయన. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..‘‘అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. కానీ, సాధారణ హిందువులు అలా ఏనాడూ అనుకోరు. దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు(మోహన్ భగవత్‌కు) హిందువుల నొప్పేంటో పట్టన్నట్లు ఉంది. హిందువుల ప్రస్తుత దుస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మాటలతో ఆ విషయం స్పష్టమైంది’’ అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.భగవత్ ఏమన్నారంటే..ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పుణే(Pune)లో జరిగిన ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల కాలంలో మందిర్-మసీద్ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు?.. .. ఇది కొనసాగకూడదు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్ చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. దీనిలో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను వారే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. ఎవరి ఇష్టమైన భగవంతుడి ఆరాధనను వారు పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం. అలాగే.. కలుపుగోలు సమాజాన్ని మనకు మంచింది. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మేం హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్(Rama Krishna Mission) లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకొంటాం. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నాం. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు.👉ఇదిలా ఉంటే.. భగవత్ వ్యాఖ్యలపై జగద్గురు స్వామి రామభద్రచార్య సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్ తమ అనుచరుడి కాదని మండిపడ్డారు. ఆయన ఎంతోమంది భస్వాసురులను సృష్టించారని.. వాళ్లే ఆరెస్సెస్ నెత్తిన చెయ్యి పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 👉మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. సామరస్యం పాటించాలని భగవత్ బీజేపీనే కోరుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్‌కు ఆయన(మోహన్ భగవత్) గనుక సూచిస్తే.. ఏ సర్వేలు. వివాదాలు ఉండవని అఖిలేష్ అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ.. మోహన్ భగవత్‌ది ద్వంద్వ ధోరణి అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ఈ పుణ్య క్షేత్రాల నగరం గురించి తెలుసా? -
Shyam Benegal: శ్యామ్ బెనగళ్‌కు తుది వీడ్కోలు
ముంబై: సీనియర్ సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మంగళవారం ముగిశాయి. జాతీయ పతాకం, పూలమాలలతో కప్పిన ఆయన పారి్థవ దేహాన్ని మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. పోలీసులు త్రీ గన్ సెల్యూట్ అనంతరం విద్యుత్ దహన వాటికలో దహనం చేశారు. అనంతరం పూజారులు పూజలు చేశారు. బెనగళ్‌కు కడసారి వీడ్కోలు పలికిన వారిలో భార్య నీరా, కుమార్తె పియాతోపాటు సినీ రంగానికి చెందిన నసీరుద్దీన్ షా, రంజిత్ కపూర్, కుల్‌భూషణ్ కర్బందా, ఇలా అరుణ్, గుల్జార్, జావెద్ అక్తర్, బొమన్ ఇరానీ, కునాల్ కపూర్ ఉన్నారు. ఈ సందర్భంగా నటుడు నసీరుద్దీన్ షా..‘శ్యామ్ సాహబ్, నేను, నా సర్వస్వం మీవే. మీకు రుణపడి ఉన్నాను. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను’అంటూ ఉది్వగ్నం చెందారు. సినీ నిర్మాత గోవింద్ నిహలానీ కూడా తనేమీ మాట్లాడలేకపోతున్నానన్నారు. ‘14న 90వ బర్త్‌డేనాడు బెనగళ్ సార్ ఆఫీసుకు వెళ్లి బర్త్‌డే పాట పాడాం. గతంలో ఎప్పుడూ మేం ఆయనకు పుట్టిన రోజు వేడుక చేయకపోవడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. త్వరలోనే మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే ఆయన చివరి చూపవుతుందని అస్సలు ఊహించలేదు’అని దర్శకుడు శ్యామ్ కౌశల్ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ రంగంలో బెనగళ్ విప్లవం సృష్టించారు. మళ్లీ మరొకరు అలాంటిది చేయలేకపోయారు’అని సినీ రచయిత గుల్జార్ పేర్కొన్నారు. శ్యామ్ బెనగళ్ అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. -
పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్‌పాత్‌పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్‌పాత్‌పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
రోడ్డుకు రెండు దిక్కులా బారికేడ్లు ఎందుకు?
దాదర్: ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇరు దిక్కుల మార్గంపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను ఎందుకు అడ్డుకుంటున్నారని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. దీనివల్ల సామాన్య వాహన చోదకులు ఇబ్బందులు పడటమే కాకుండా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు, పోలీసు వ్యాన్లు తదితర అత్యవసర సేవలు అందించే వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటాయని పేర్కొంది. అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతే అందుకు బాధ్యులెవరని పోలీసులను నిలదీసింది. మరోసారి ఇలా బారికేడ్లు ఏర్పాటుచేసి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తే ఊరుకునేది లేదని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చుట్టూ తిరిగి వెళ్లాలి.. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రమాదం జరిగిన రోడ్డును మూసివేస్తారు. కానీ ఇటీవల కాలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బారికేడ్లు అడ్డంగా పెట్టి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వాహన చోదకులు చాలా చుట్టూ తిరిగి వెళ్తుంటారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు వెంటనే తరలించినప్పటికీ మృతుల పంచనామా పనులు పూర్తయ్యేంత వరకు రోడ్డును మూసి ఉంచుతారు. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్‌లు కూడా సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేక పోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రులు వెంటనే వైద్యం అందక ప్రాణాలు వదులుతారని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన రోడ్డును మూసి వేయాలి కానీ అనేక సందర్భాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి రెండు దిక్కుల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. వందల వాహనాలు వెనక్కి ఇటీవల పశ్చిమ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక దహిసర్ పోలీసులు రెండు దిక్కులా బారికేడ్లు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. మరో సంఘటనలో 2024, నవంబరు 8వ తేదీన పావస్కర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఇరు దిక్కులా బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను నిలిపివేశారు. ఫలితంగా వందలాది వాహనాలను వెనక్కి పంపించారు. ఫలితంగా అందులో ప్రయా ణిçస్తున్న వేలాది మంది సామాన్యులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కైలాస్ చోగ్లే బాంబే హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బి.పి.కులాభావాల, జస్టిస్ సోమశేఖర్ సుందర్సేన్ల ధర్మాసనం విచారణ జరిపింది. రోడ్డు ప్రమాదం జరిగిన చోట లేదా పంచనామా, దర్యాప్తు జరుగుతున్న చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్యాప్తు పనులు పూర్తికాగానే వాటిని వెంటనే తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని సూచించింది. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. -
ముంబై పడవ ప్రమాదం: అమ్మను కాపాడుకోలేక పోయా.. గౌతమ్ గుప్తా
సాక్షి, ముంబై: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో జరిగిన పడవ ప్రమాదం ఘటనలో అనేక మంది తమ ఆతీ్మయులను బంధుమిత్రులను కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులతో బయల్దేరిన నీల్కమల్ అనే పడవను నేవీ బోట్ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బయటపడ్డ కొందరు మీడియాకు తెలిపిన వివరాలు అక్కడి పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో చెబుతున్నాయి. చావు దగ్గరికి వెళ్లి బయటిపడిన వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రమాదంలో 14 నెలల చిన్నారి.. పడవ ప్రమాదంలో వైశాలి అడకణేతోపాటు వారి కుటుంబీకులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై కుర్లాలో నివసించే వైశాలి తన 14 నెలల కుమారుడిని రక్షించుకునేందుకు ప్రయతి్నంచింది. అనంతరం ఆమె సోదరుడు అంటే చిన్నారి మేనమామ తన భుజంపై ఆ పాపను సుమారు 30 నిమిషాలపాటు సముద్రం నీటిలో ఈదుతూ బయటపడ్డట్టు తెలిపింది. ‘నాతోపాటు మొత్తం ఎనిమిది మంది పడవలో ఎలిఫెంటా బయల్దేరాం. అయితే పడవలో బయల్దేరిన కొద్ది సేపటికి ఒక్కసారిగా ఓ నేవీ స్పీడ్ బోట్ వేగంగా చక్కర్లు కొడుతూ మా పడవను వేగంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత అసలేం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. పడవ నడిపేవారు వెంటనే వారి వద్ద ఉన్న లైవ్జాకెట్లను అందరికీ అందించారు. కానీ చాలామంది ఉండటంతో కొందరికి మాత్రమే జాకెట్లు అందాయి. ఇది జరిగిన కొంత సమయానికి ఒకవైపు పడవ సముద్రంలోకి ఒరగడం ప్రారంభమైంది. దీంతో పడవ క్రమంగా మునగసాగింది. అరుపులు పెడ»ొబ్బలతో పడవలోని పరిసరాలు భయాందోళనలు రేకేత్తించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మేమందరం సముద్రంలో పడిపోసాగాం. కొందరు పడవలోనే ఉండిపోయారు. అయితే తాము సముద్రంలో పడిపోగానే పడవను పట్టుకున్నాం. చావు ముందు ఉన్నాం. ఏం చేయాలో తెలియడంలేదు. నా చేతిలో 14 నెలల బాబు ఉన్నాడు. ఎలాగైనా బాబును బతికించుకోవాలని మనసులో అనుకున్నాను. అంతలోనే నా అన్న బాబుని తన భుజం పైకెత్తుకున్నారు. నీళ్లలో ఉండి ఒక చేత్తో పడవను మరో భుజంపై నా బాబును ఇలా సుమారు 30 నిమిషాలపాటు అలాగే ఉన్నాడు. ఇక మా మరణం తప్పదని అనుకునే సమయంలోనే రెండు మూడు పడవలు మావైపు వచ్చాయి. అనంతరం ఆ బోటులోని వారు మమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇంకా ఐదు నిమిషాలు ఆలస్యమై ఉంటే మేమంతా చనిపోయేవాళ్లం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఈ ఘటనలో ఓ ఇద్దరు విదేశీయులు కూడా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పలువురిని కాపాడినట్టు వైశాలి మీడియాకు తెలిపారు. అమ్మను కాపాడుకోలేక పోయా: గౌతమ్‌గుప్తా ఈ పడవ సంఘటన సమయంలో అసలేం జరిగిందనేది ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసిన గౌతమ్‌గుప్తా మీడియాకు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆయన తీసిన వీడియో ద్వారానే అందరికీ ప్రమాదం విషయం తెలిసింది. ముంబైలో నివసించే గౌతమ్ గుప్తా తన తల్లి రామాజీదేవి, చెల్లి రీతాలతో కలిసి ఎలిఫెంటా వెళ్లేందుకు నీల్కమల్ పడవలో బయల్దేరారు. పడవ పైభాగంలో కూర్చున్న గౌతమ్ పడవలో నుంచి సముద్ర ప్రయాణం దృశ్యాలని వీడియోతోపాటు ఫొటోలు తీశారు. అంతలోనే ఓ స్పీడ్ బోట్ సముద్రంలో చక్కర్లు కొట్టడం గమనించారు. ఆ స్పీడ్ బోటును వీడియో తీయసాగారు. ‘ఒక్కసారిగా వేగంగా ఆ పడవవైపు బోట్ రావడం చూశాను. కానీ అసలు ఊహించలేదు. ఆ స్పీడ్ బోటు వేగంగా మేమున్న పడవనే వేగంగా ఢీ కొడుతుందను కోలేదు. ఈ సంఘటన అనంతరం మేం ముగ్గురం నీటిలో పడిపోయాం. అనంతరం ఇతర బోటులోని కొందరు నన్ను మా చెల్లి రీతాను సురక్షితంగా బయటికి తీశారు. కానీ మా అమ్మ గురించి మాత్రం తెలియరాలేదు’ అంటూ బోరుమన్నారు. ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి పడవ ప్రమాదంలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారని తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అందించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన నేవీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ శర్మ (34) మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ శర్మ నేవీలో బోట్ మెకానిక్‌గా 14 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జీవితంలో పడవ ఎక్కను ఘటనలో పలువురు తెలుగువారు మరణం అంచుల దాకా వెళ్లొచ్చి..ఎలిఫెంటా గుహలకు వెళ్లడానికి బోట్ ఎక్కాను. కానీ అదృష్టవశాత్తు బయటపడ్డానని అనిల్‌కుమార్ (35) ఓ మరాఠీ పత్రికకు తెలిపారు. ముంబైలో ఓ పని ఉండటంతో వచ్చానని, ఈ సందర్భంగా ఎలిఫెంటా కేవ్స్ చూద్దామని బయల్దేరినట్లు చెప్పారు. పడవ బయల్దేరిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగిందని, అయితే అదృష్టం కొద్దీ బయటపడ్డానన్నారు. ఇక భవిష్యత్‌లో తానెప్పుడూ పడవ ఎక్కనని చెప్పారు.