భర్తను చంపేసి ఇంట్లో టైల్స్‌ కింద పాతిపెట్టి..! | Wife Hides Husbands Body Under Tiles In Mumbai | Sakshi
Sakshi News home page

భర్తను చంపేసి ఇంట్లో టైల్స్‌ కింద పాతిపెట్టి..!

Jul 21 2025 8:56 PM | Updated on Jul 22 2025 12:00 PM

Wife Hides Husbands Body Under Tiles In Mumbai

మనకు దృశ్యం సినిమా అనగానే ఠక్కున గుర్తొచ్చేది మాత్రం అందులో  మర్డర్‌ సీన్‌ చుట్టూ తిరిగిన ఓవరాల్‌ ఎపిసోడ్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.  ఈ సినిమా వచ్చి సుమారు దశాబ్దకాలం పూర్తి కావొస్తున్నా.. ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోయి మరీ చూసేస్తూ ఉంటాం. అందులో హీరో చేసిన హత్య.. ఆపై ఆ శవాన్ని కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ కిందే పాతిపెట్టడం సినిమాకే హైలైట్‌.  

అక్కడ తన కూతుర్ని వేధిస్తున్న వ్యక్తిని తండ్రి చంపి మొత్తం కేసునే తప్పుదోవ పట్టిస్తూ సీన్‌లు అల్లిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఇది సినిమా కాబట్టి ఆసక్తికరం అనిపిస్తోంది. మరి నిజ జీవితంతో జరిగితే వామ్మో అనే పరిస్థితి.

మరి, ఇదే దృశ్యం సినిమాను ఫాలో అయినట్లుంది  ఓ మహిళ. భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్‌ కింద పూడ్చిపెట్టేసింది. లవర్‌తో కలిసి మరీ భర్తను హత్య చేసి టైల్స్‌ కింద పూడ్చిపెట్టేసింది. ఇది మహారాష్ట్రలోని పల్ఘర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 

35 ఏళ్ల విజయ్‌ చావన్‌, 28 ఏళ్ల కోమల చావన్‌లు భార్యా భర్తలు. ముంబైకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వీరి జీవితంలోకి ఒక ‘ లవర్‌’ వచ్చాడు. కోమలకు ప్రియుడు.. విజయ్‌కు యముడు మాదిరి వారి జీవితంలోకి ప్రవేశించాడు. అతని పేరు మోను.  కోమల, మోను కలిసి విజయ్‌ను చంపేశారు. అంటే కోమల తన భర్త విజయ్‌ను మోనుతో కలిసి అంతమొందించింది. 

మరీ ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచన చేస్తే.. ఇంట్లోనే టైల్స్‌ కిందే శవాన్ని పూడ్చిపెట్టేందని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే చేసేశారు. ఆ తర్వాత కోమల, మోనులు కలిసి ‘లాంగ్‌ టర్మ్‌ హనీమూన్‌’( వేరే చోటకి పరార్‌) వెళ్లిపోయారు. అయితే విజయ్‌ సోదరునికి అనుమానం వచ్చి ఇంటికి రాగా, అక్కడ తాళం వేసి ఉంది.  ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అన్నను చంపేసిన వదిన..  ఆ ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టందనే విషయాన్ని తెలుసుకుని షాక్‌ తిన్నాడు. దీనిపై  దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement