mumbai
-
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్.. 152 బంతుల్లో 419 నాటౌట్
ముంబైలో జరిగే హ్యారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైంది. 15 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుశ్ షిండే చరిత్ర సృష్టించాడు. కేవలం 152 బంతుల్లో 43 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 419 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హ్యారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ జట్టు తరఫున ఆడిన ఆయుశ్.. పార్లే తిలక్ విద్యామందిర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆయుశ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్ణీత 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 648 పరుగులు చేసింది. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇన్నింగ్స్‌లో ఆర్య కార్లే 78, ఇషాన్ పాథక్ 62 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన తిలక్ విద్యామందిర్ 39.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ 464 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ విద్యామందిర్ తరఫున ఆధేశ్ తవడే (41), దేవరాయ సావంత్ (34) టప్ స్కోరర్లుగా నిలిచారు. మ్యాచ్ అనంతరం క్వాడ్రాపుల్ సెంచరీ హీరో ఆయుశ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాను 500 పరుగులు స్కోర్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అయితే ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదని తెలిపాడు. ముంబై తరఫున ఆడాలంటే తాను ఇలానే భారీ స్కోర్లు చేస్తూ ఉండాలని పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడటమే తన కల అని తెలిపాడు. ఆయుశ్ క్రికెటింగ్ జర్నీ ధృడ నిశ్చయం మరియు త్యాగాల మధ్య సాగింది. ఆయుశ్ తండ్రి సునీల్ షిండే తన కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ చూసి తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబైకి మార్చాడు. ప్రస్తుతం సునీల్ నవీ ముంబైలో ఓ చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఆయుశ్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. ఆయుశ్ ఆరేళ్ల వయసు నుంచి బ్యాట్ పట్టినట్లు సునీల్ గుర్తు చేసుకున్నాడు. -
సెలబ్రిటీలు కూడా కొనలేకపోతున్న ఇల్లు ఇది!
సాధారణంగా వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ముంబైలోని ఒక పెంట్‌హౌస్ వార్తల్లో నిలిచింది. రూ.120 కోట్లకు అమ్మకానికి పెట్టిన ఈ ఇంటికి ‘అర్హులైన’ కొనుగోలుదారు దొరకడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రూ.కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు.వన్ అవిఘ్నా పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల ఈ పెంట్ హౌస్ గ్లాస్-వాల్డ్ ఎలివేటర్, రూఫ్‌టాప్ పూల్, జిమ్, ఆరు బెడ్రూమ్లు, ఎనిమిది వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన ఆఫర్లు ఉన్నప్పటికీ, యజమాని కఠినమైన ఎంపిక ప్రమాణాల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు.డబ్బుకు మించి..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. “ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు. కొనుగోలుదారు సరైన వ్యక్తి అని మేము నిర్ధారించుకోవాలి" అని అగర్వాల్ వివరించారు.సేల్‌ను పర్యవేక్షించేందుకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవి కేవల్రమణితో సహా ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతోపాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందు కోసం కొనుగోలుదారుల ఆఫీస్‌లను సైతం సందర్శించాలని ఏజెంట్లకు సూచనలు ఉండటం గమనార్హం.స్క్రీనింగ్‌లో ఫెయిల్బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్దీ ప్రముఖులు పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, యజమాని నిర్ణయించిన కఠినమైన అర్హతలను ఎవరూ అందుకోలేకపోతున్నారు. పరిశ్రమలోని కొన్ని పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్ ప్రక్రియలో అర్హత సాధించలేదని కేవల్రమణి తెలిపారు. "మేము పొరుగువారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతోపాటు తమ సంపదను చాటుకోని గుణం ఉన్నవారు కావాలి" అని ఆయన చెప్పారు.ఒకవేళ తాము కోరుకుంటున్న సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు రూ.40 లక్షలకు ఈ పెంట్‌హౌస్‌ను అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. అయితే అద్దెకు వచ్చేవారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ వర్తిస్తుంది. View this post on Instagram A post shared by Ravi Kewalramani (@rk.ravikewalramani) -
నా ఇల్లు.. నా భారతీయత
‘నా ఇల్లంతా భారతీయత కనిపించాలి. ఆ కళతో నేను అనుభూతి చెందాలి’ అంటోంది నటి తాప్సీపన్ను. ముంబైలోని తాప్సీ పన్ను ఇల్లు ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. ఇందుకు సోదరి షగున్ తన కలకు సహాయం చేసిందని మరీ మరీ చెబుతుంది తాప్సీ.ఇంటి లోపలి అలంకరణలో ఎర్ర ఇటుక గోడలు, జూట్ చార్పైస్, గోడకు అమర్చిన ఝరోఖాలు ఉన్నాయి. ఇది పంజాబ్ ఇంటీరియర్లలో ఒక అద్భుతమైనప్రాచీన ఇంటిని గుర్తు చేస్తుంది. ‘నా సోదరి వెడ్డింగ్ ప్లానర్,ప్రొఫెషనల్ కూడా. దీంతో ప్రత్యేకమైన డిజైనర్ అవసరం లేకపోయింది. ఆమె మా ఇంటిని చాలా అర్ధవంతంగా మార్చడానికి సహాయం చేసింది. మేం దేశంలోని పంజాబ్, రాజస్థాన్, కచ్ వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడల్లా కొన్ని వస్తువులు సేకరించి, తీసుకొచ్చాం. అలా తీసుకొచ్చిన వాటితోనే మా ఇంటి అలంకరణ చేశాం.ప్రాచీన కళ‘నేనెప్పుడూ విలాసవంతమైన ఇల్లు కావాలనుకోలేదు. భారతీయత కనిపించాలని, అనుభూతి చెందాలని కోరుకుంటాను. అందుకు ఇది ఫ్యాన్సీదా, ఖరీదైనదా అనుకోను. ఇల్లు మన ఆత్మీయులందరినీ స్వాగతించేలా ఉండాలి.దేశీ – విదేశీ మా ఇల్లు అపార్ట్మెంట్లోని డ్యూప్లెక్స్ స్టైల్. ఒక అంతస్తు మొత్తం దేశీ అనుభూతిని పంచుతుంది. నా అభిరుచికి ఈ అంతస్తు అద్దం పడుతుంది. మరొక అంతస్తు నా వ్యక్తిగత స్థలం. అక్కడ, నా మానసిక స్థితిని బట్టి, మార్చుకోవడానికి అనువైనది ఉండేలా చూసుకుంటాను. నా స్నేహితులు దేశీ ఫ్లోర్‌పైనే సందడి చేస్తారు.ఇక నా గదిని చూసి మాత్రం పింటరెస్ట్ హౌస్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇంట్లోని ప్రతి మూలన ఏదో ఒక ఫొటో ఫ్రేమ్ ఉంటుంది. నాకెందుకో ఏ మూలన ఖాళీగా అనిపించినా, అక్కడ ఫొటో ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫొటో ఆల్బమ్‌లో అన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి, నచ్చిన చోటల్లా పెట్టేస్తుంటాను. మా నాన్నకు ఇంటీరియర్స్‌లో చాలా మంచి అభిరుచిని ఉంది. అందుకు ఉపయుక్తంగా, వైద్యపరంగా ఉండటానికి ఇష్టపడతాడు. మాస్టర్ బెడ్రూమ్ క్లాసిక్ వైట్‌తో ఉంటుంది. నలుగురు పడుకునేంత పెద్ద బెడ్, వుడెన్ ఫ్రేమ్స్, కార్వింగ్‌తో చేయించాం. వానిటీ ఏరియాలో పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ ఏర్పాటు చేయించాం. మిర్రర్ చుట్టూ ఎల్లో లైట్స్ డిజైన్ చేయించాం. మంచి రంగున్న కర్టెయిన్స్, బెడ్ కు ముందు కిటికీ, ఫ్లోరింగ్ కూడా ఉడ్‌తో తయారుచేసిందే. బాల్కనీ ఏరియాలో వుడెన్ ఫ్లోరింగ్, ముదురు గోధుమ రంగు కుషన్స్, ప్రింటె ప్యాబ్రిక్స్ ఉంటాయి. కొన్ని మొక్కలతో బాల్కనీ ఏరియాను డిజైన్ చేసుకున్నాం. యోగా చేసుకోవడానికి వీలుగా ప్లేస్ ఉంటుంది. కుండీలలో మొక్కలు, కలర్‌ఫుల్ ఫ్రేమ్స్, బుద్ద విగ్రహం, వాల్ హ్యాంగింగ్స్... అన్నీ కలిసి ఓ మినీ ఫారెస్ట్‌ని తలపించేలా డిజైన్ చేయించాం. ఇంటిని డిజైన్ చేయించం అంటే మనలోని కళకు అద్దం పట్టినట్టే’’ అంటోంది తాప్సీ. -
SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజా సీజన్లో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్ కోటియాన్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, సిద్ధేశ్ లాడ్, యువ ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్ లాడ్, సూర్యాన్ష్ షెడ్గె, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్ కోటియాన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, రోస్టన్ డియాస్, జునేద్ ఖాన్.చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి! -
IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రేపై కన్నేసినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్కే మేనేజ్మెంట్ అతి త్వరలోనే మాత్రేను సెలెక్షన్ ట్రయిల్ రమ్మని పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే మాత్రే వచ్చే సీజన్లో సీఎస్కే తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మాత్రే బ్యాటింగ్ స్కిల్స్‌పై సీఎస్కే స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. సీఎస్కే మేనేజ్మెంట్ వేలంలో మాత్రేను సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని భావిస్తుందట.సీఎస్కే దృష్టిలో పడ్డ తర్వాత మాత్రే రంజీ ట్రోఫీలో ఓ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే అద్భుతమై సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రే 127 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బ్యాటర్లు అజింక్య రహానే (19), శ్రేయస్ అయ్యర్ (47) తక్కువ స్కోర్లకే ఔటైన వేళ మాత్రే మెరుపు సెంచరీతో అలరించాడు. రెండో రోజు టీ విరామం సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మాత్రేతో పాటు ఆకాశ్ ఆనంద్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 52 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 240 పరుగులకు ఆలౌటైంది. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (76), రోహిల్లా (56) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో రెండు వికెట్లు, జునెద్ ఖాన్, హిమాన్షు సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఇరానీ కప్‌తో అరంగేట్రం..17 ఏళ్ల మాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మాత్రే ముంబై తరఫున ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడి రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పైచిలుకు పరుగులు చేశాడు. -
వందేళ్ల శివాజీ పార్క్: ఎన్నికల ప్రచారానికి నిబంధనల షాక్!
వందేళ్ల చరిత్ర: శివాజీపార్క్ మైదానానికి సుమారు వందేళ్ల చరిత్ర ఉంది. ముంబై నడిరోడ్డున దాదర్ ప్రాంతంలో ఉన్న శివాజీపార్క్ మైదానం 1925లో బీఎంసీ ప్రజల కోసం అందుబాటులోకి తెచి్చంది. అప్పట్లో ఈ మైదానాన్ని మాహిం పార్క్‌గా పిలిచేవారు.సుమారు లక్షా మందికిపైగా కూర్చునేందుకు వీలుంది. దీంతో వివిధ పారీ్టల రాజకీయ నాయకులు తమ ప్రచార సభలు, ర్యాలీలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా అనేక మంది ఆటగాళ్లు క్రికెట్ నేర్చుకున్నది, ప్రాక్టీస్ చేసింది ఇక్కడే. భారత్‌కు పేరు తెచ్చిన అనేక మంది క్రికెటర్లకు ఈ మైదానమే వేదికగా నిలిచింది. అంతేగాకుండా సుమారు ఆరు దశాబ్దాల కిందట దివంగత బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్ధాపించింది ఇక్కడే. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఏటా ఇక్కడే విజయ దశమి రోజున ‘దసరా మేళావ’పేరుతో బహిరంగ సభ నిర్వహించేవారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే దీన్ని కొనసాగిస్తున్నారు. బాల్ ఠాక్రే అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. అదేవిధంగా ఏటా డిసెంబరు ఆరో తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది అభిమానులకు ఇక్కడే బస ఏర్పాట్లు చేస్తారు. ఇలా శివాజీపార్క్ మైదానానికి ఎంతో చరిత్ర ఉంది. మైదానంలో ఒకపక్క అశ్వాన్ని అదిరోహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని 1956లో ఏర్పాటు చేశారు. దీనిపక్కనే సావర్కర్ స్మారకం, గణేశ్ మందిరం, శివాజీపార్క్ జింఖాన, మాహిం స్పోర్ట్స్ క్లబ్, సమర్థ్ వ్యాయామ శాల, బాల్మోహన్ విద్యా మందిర్ తదితర కట్టడాలు, సంస్ధలు ఉన్నాయి. దాదర్: ప్రముఖ శివాజీపార్క్ మైదానంలో శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఇరువురికీ బహిరంగ సభలకు ప్రధాన వేదికైన శివాజీపార్క్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ రెండు పారీ్టలు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పారీ్టల ప్రచార సభలు శివాజీపార్క్ మైదానంలో నిర్వహించే అవకాశం ఇరు పార్టీలకు లభించకుండా పోవడంతో ఆ పార్టీల పదాధికారులు, నాయకులు అయోమయంలో పడిపోయారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నందువల్లే... శివాజీపార్క్ మైదానాన్ని సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే వినియోగించాలనే బీఎంసీ నియమ నిబంధనలు తెలియజేస్తున్నాయి. మిగతా రోజుల్లో ఈ మైదానంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని బీఎంసీ కఠిన నిబంధనలు విధించింది. కాగా అనుమతినిచ్చిన 45 రోజుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఇప్పటికే పలు సభలు, ధార్మిక జాతీయ కార్యక్రమాలు, ఉత్సవాలు జరిగాయి. అదేవిధంగా గత నెలలో ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే వివిధ రాజకీయ పార్టీలు మైదానాన్ని బుకింగ్ చేసుకున్నాయి. దీంతో వరుసగా రాజకీయ ప్రచార సభలు జరుగుతున్నాయి. మరికొన్ని జరగనున్నాయి. దీంతో బీఎంసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేసిన 45 రోజులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న యూబీటీ–శివసేనకు, ఎమ్మెన్నెస్‌కు శివాజీపార్క్ మైదానాన్ని అద్దెకు ఇచ్చేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిరాకరించింది. కఠిన నిబంధనలు ఇందుకేఒకప్పుడు శివాజీపార్క్ మైదానం ర్యాలీలు, సాధా రణ సభలతోపాటు వివిధ ధార్మిక, ప్రవచన కార్యక్రమాలకు, రాజకీయ పార్టీల ప్రచార సభలకు వేదికగా ఉండేది. ఎలాంటి ధార్మిక, రాజకీయ ప్రచార కార్యక్రమాలైన నిర్వాహకులు ముందుగా శివాజీపార్క్ మైదానాన్ని ఎంపిక చేసుకుంటారు. దీంతో ఈ మైదానం సంవత్సర కాలంలో దాదాపు 200 రోజులకుపైగా సభలు, సమావేశాలు, ర్యాలీలతో సందడిగా ఉండేది. ఈ కారణంగా మైదానం పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రమయ్యేది. ఇదికాక ర్యాలీలు, సభల్లో ప్రజలు, కార్యకర్తల నినాదాలు లౌడ్స్పీకర్లలో ప్రముఖులు, ఇతర వక్తల ప్రసంగాల హోరుతో స్ధానికులకు కంటినిండా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో తమకు ట్రాఫిక్ జామ్, శబ్ద కాలుష్య సమస్యల నుంచి విముక్తి కలి్పంచాలని స్ధానిక రహివాసి సంఘటన దాదాపు రెండు దశాబ్దాల కింద హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సంవత్సర కాలంలో కేవలం 45 రోజులు ఈ మైదానా న్ని రిజర్వు చేసి ఉంచాలని ఆదేశించింది. అలాగే ఈ మైదానం పరిసరాలను సైలెన్స్ జోన్‌గా ప్రకటించింది. రిజర్వు చేసిన 45 రోజుల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం (జనవరి–26), ఉగాది, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్–14), మహారాష్ట్ర అవతరణ దినోత్సవం (మే–1), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు–15), గణేశోత్సవాలు, నవరాత్రి, దసరా, ఛట్‌పూజ, దీపావళి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (డిసెంబరు–6), డిసెంబరు 31, నూతన సంవత్సరం తదితర పండుగలు, ఉత్సవాలు, జాతీయ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ పోగా మిగిలిన రోజులను రాజకీయ పార్టీల ప్రచార సభలు, ఇతర ధార్మిక, ప్రవచన, ప్రచార కార్యక్రమాలకు కేటాయించారు. ఇలా మొత్తం 45 రోజుల రిజర్వేషన్లో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ మేరకు ఈ నెల 17వ తేదీన ప్రచార సభ నిర్వహించేందుకు అనుమతివ్వాలని అక్టోబరు 14వ తేదీన ఎమ్మెన్నెస్ దరఖాస్తు చేసుకుంది. అదే రోజున తమకూ అనుమతివ్వాలని యూబీటీ శివసేన కూడా దరఖాస్తు చేసుకుంది. కాని ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ శిందేలు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు తమ సొంత ప్రచార సభలు నిర్వహించేందుకు ఈ మైదానాన్ని బుకింగ్ చేసుకున్నారు. ముఖ్యంగా శివాజీపార్క్ మైదానం మాహిం నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే మొదటిసారి పోటీ చేస్తున్నారు. దీంతో అమిత్‌తోపాటు రాజ్ ఠాక్రే కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో భారీ ప్రచార సభ నిర్వహించాలని ఇటు యూబీటీ, అటు ఎమ్మెన్నెస్ భావించాయి. కాని 45 రోజుల రిజర్వేషన్ కోటా పూర్తికావడంతో నిరాశే మిగిలింది. ఇంత తక్కువ సమయంలో మరోచోట ప్రచార సభకు ఏర్పాట్లు చేయడం, జనాన్ని సమీకరించడం, వాహనాలు బుకింగ్ చేయడం సాధ్యం కాదు. దీంతో ఈ సారి శివాజీపార్క్ మైదానంలో ప్రచార సభలు లేకుండానే ఈ పారీ్టలు ఎన్నికల ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి వచ్చింది. -
‘ఆమె రీల్స్ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’
ముంబై: విభజన పేరుతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తప్పడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మండిపడ్డారు. డీప్యూటీ సీఎం భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు.. మతాన్ని రక్షించే బాధ్యత ప్రజలెందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని కన్హయ్య కుమార్ మాట్లాడారు. రాజకీయ నాయకులకు అహంకారం పెరిగినప్పుడు ప్రజలు సరైన విధంగా వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. పేరు ప్రస్తావించకుండా శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా ఫడ్నవిస్ (దేవేంద్ర ఫడ్నవిస్ భార్య) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని విమర్శలు చేశారు.‘‘ఇది ధర్మయుద్ధం.. మతాన్ని రక్షించడం గురించి ప్రసంగాలు చేసే ఏ నాయకులను మీరు (ప్రజలు) ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా? అని నిలదీయండి. అలా సాధ్యమవుతుందా? నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని ఎందుకు కాపాడాలి? ..ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటే.. ప్రజలెందుకు మతాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి?. అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడటానికి భాగస్వామి అవుతారా? ఆయన బీసీసీఐలో ఐపీఎల్ జట్లను ఏర్పాటు చేస్తున్నారు. డ్రీమ్ 11లో టీమ్‌లను తయారు చేయమని మనకు చెబుతున్నారు. వాళ్లు మాత్రం క్రికెటర్లు కావాలని కలలు కంటారు. మనం జూదగాళ్లుగా మిగిలిపోవాలా?’’ అని అన్నారు.చదవండి: యోగి ఆదిత్యనాథ్ విమర్శలపై మండిపడ్డ ప్రియాంక్ ఖర్గే -
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎయిర్‌పోర్టును బాంబులో పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తెలిపాడు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఆ వ్యక్తి.. ముంబయి నుంచి అజర్‌బైజాన్‌కు వెళ్తున్న విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పాడు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే సహార్ పోలీసులను అప్రమత్తం చేసింది. ప్రయాణికుల భద్రత కోసం.. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవటం గమనార్హం. మరోవైపు.. నాగ్‌పూర్-కోల్‌కతా విమానానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రాయ్‌పూర్ విమానాశ్రయంలో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి చేశారు. ఇక.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
సిద్ధిఖీ కేసు: మృతి నిర్ధారణయ్యే వరకు ఆస్పత్రి దగ్గరే..
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ కేసు విషయంలో రోజుకో కొత్త వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు(షూటర్)ను విచారణ చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెల్లుడిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ్ కుమార్ గౌతమ్.. సిద్ధిఖీపై కాల్పుల జరిపిన అనంతరం ఆయన మరణించారా? లేదా? అని ఆస్పత్రి బయట ఉండి నిర్ధారించుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. కాల్పులు జరిగిన తర్వాత సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఆస్పత్రి బయట ఆయన మృతి నిర్థారణ కోసం సుమారు 30 నిమిషాల పాటు నిలబడి వేచి చూశానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ‘‘సిద్ధిఖీపై కాల్పులు జరిగిన వెంటనే చొక్కా మార్చుకొని.. ఆసుపత్రి బయట 30 నిమిషాల పాటు జనం మధ్య నిలబడి ఉన్నా. సిద్ధిఖీ పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసిన వెంటనే వెళ్లిపోయా’’ అని నిందితుడు శివ కుమార్ పోలీసులకు తెలిపాడు.అక్టోబర్ 12 రాత్రి 9:11 గంటలకు ముంబైలోని బాంద్రాలో సిద్ధిఖీపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఆయన ఛాతీపై రెండు బుల్లెట్ గాయాలు తగలడంతో వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుల ప్రాథమిక ప్రణాళిక ప్రకారం.. ప్రధాన నిందితుడు శివకుమార్, అతని సహాయకులు ధర్మరాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్‌లను ఉజ్జయిని రైల్వే స్టేషన్లో కలవాల్సి ఉంది. అక్కడ బిష్ణోయ్ గ్రూప్ సభ్యుడు వారిని వైష్ణో దేవి వద్దకు తీసుకెళ్లాలి. అయితే.. కశ్యప్, సింగ్‌లు పోలీసులకు చిక్కడంతో వారి ప్లాన్ విఫలమైందని పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ కేసు: ‘కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ’ -
వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పండి
ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేకు ఏక్నాథ్ శిందే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అజిత్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి మిలింద్ దేవ్రా వెన్నుపోటు పొడిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ)కూటమిని గెలిపించాలని కోరారు. రేవంత్ బుధవారం సాయంత్రం ముంబైలో తెలుగు ప్రజలు నివసించే వర్లీ, ధారావి, సైన్ కోలివాడల్లో ఎంవీఏ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార మహాయుతి కూటమిపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ కోడలైన వర్షా గైక్వాడ్‌ను ధారావి నుంచి భారీ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యలన్నింటినీ ఎంవీఏ ప్రభుత్వం పరిష్కరించేలా తాను హామీగా ఉంటానని తెలిపారు. కాగా వర్లీ బీడీడీ చాల్స్‌లో నివసించే స్థానిక తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి రోడ్డు షోకు బ్రహ్మరథం పట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా తాను ముంబైలో కాకుండా నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. రోడ్డు షోకు ముందు రేవంత్‌రెడ్డి వర్లీ బీడీడీ చాల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతిపత్రాలు సమరి్పంచారు. -
బ్యాగుల తనిఖీ: ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ కౌంటర్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్యాగులు తనిఖీ చేయటం మహారాష్ట్రలో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. సోమవారం యావత్మాల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారలు సోదా చేయటం వివాదం రేపింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల లగేజీని ఎన్నికల అధికారులు ఇలాగే తనిఖీ చేస్తారా? అని నిలదీశారు. అయితే దీనిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లను కూడా విమానాశ్రయ అధికారులు అదే విధంగా తనిఖీ చేసిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. కొందరు నాయకులకు ప్రదర్శనలు ఇవ్వడం అలవాటని పేర్కొంది. ‘‘రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకువెళ్లడం మాత్రమే సరిపోదు. రాజ్యాంగ ప్రక్రియలను కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరూ గౌరవ భావాన్ని కలిగి ఉండాలని మేం కోరుతున్నాం’’ అని బీజేపీ తెలిపింది. ఇక.. నవంబర్ 5న కొల్హాపూర్ విమానాశ్రయంలో ఫడ్నవీస్ బ్యాగ్‌ని అధికారులు తనిఖీ చేశారు.जाऊ द्या, काही नेत्यांना तमाशा करण्याची सवयच असते! हा व्हीडिओ पहा, 7 नोव्हेंबरला यवतमाळ जिल्ह्यात आमचे नेते मा. देवेंद्रजी फडणवीस यांच्या बॅगची तपासणी झाली. पण, त्यांनी ना कोणता व्हीडिओ काढला, ना कोणती आगपाखड केली. तत्पूर्वी, 5 नोव्हेंबर रोजी कोल्हापूर विमानतळावर सुद्धा मा.… pic.twitter.com/ebkuigJE2E— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) November 13, 2024మరోవైపు.. ఉద్ధవ్ ఠాక్రే బ్యాగు తనికీ చేయటంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికలవేళ ప్రామాణిక నియమావళి(ఎస్ఓపీ) మేరకే వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లలో తనిఖీలు చేపడుతున్నట్లు ఈసీ వివరించింది. -
ముంబయి: రాహుల్‌గాంధీపై అమిత్ షా ఫైర్
ముంబయి: రాహుల్‌గాంధీ నాలుగు తరాలొచ్చినా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(నవంబర్ 11) ముంబయిలో నిర్వహించిన ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు.‘ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం నిర్మూలించారు.మీ నాలుగు తరాలొచ్చినా కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యం కాదని రాహుల్‌కు చెబుతున్నా.బీజేపీకి రాజకీయ అధికారం కన్నా కశ్మీర్ సమస్యే హృదయానికి దగ్గరగా ఉంటుంది’అని అమిత్ షా అన్నారు. కాగా, ఇటీవలే మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు.వృద్ధులకు పెన్షన్ పెంపు, మహిళలకు నగదు బదిలీ వంటి హామీలను బీజేపీ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహాయుతి(ఎన్డీఏ), మహావికాస్ అఘూడీ(ఎంవీఏ) కూటములు ఎన్నికల్లో పోటీపడుతున్నాయి.ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.. కన్నెత్తి చూడని సెలబ్రిటీలు -
17 ఏళ్ల యువ సంచలనంపై కన్నేసిన సీఎస్కే.. రుతురాజ్ జోడీగా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సమయం అసన్నమవుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో ముంబై యువ ఆటగాడు ఆయుష్ మహాత్రేపై 5 సార్లు ఛాపింయన్ చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసినట్లు తెలుస్తోంది.మెగా వేలానికి ముందు మహాత్రేని సెలక్షన్ ట్రయల్ కోసం సీఎస్కే పిలిచినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. మహాత్రే సీఎస్కే టాలెంట్ స్కౌట్‌లతో పాటు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని దృష్టిని కూడా ఆకర్షించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే అతడికి ఈ నెలఖారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో సెలక్షన్ ట్రయల్‌కు హాజరు అవ్వమని సీఎస్కే పిలుపునిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ల మహాత్రే ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై తరపున ఆడుతున్నాడు.ఈ టోర్నీలో భాగంగా ముంబై బుధవారం ప్రారంభం కానున్న తమ ఐదవ-రౌండ్ మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే మహాత్రేని సీఎస్కే సెలక్షన్ ట్రయల్‌కు హాజరు కానున్నాడు. ఆ తర్వాత నవంబర్ 23న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు ఈ యువ ఓపెనర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.ఇరానీ కప్‌తో అరంగేట్రం..మహాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరానీ కప్‌లో లక్నో వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు (తొమ్మిది ఇన్నింగ్స్‌లు) ఆడిన అతను 35.66 సగటుతో 321 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే మహాత్రేకి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడిని వేలంలో సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని సీఎస్కే యోచిస్తుందంట.చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే ‘కొత్త రాజు’ అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
‘మహా’ ఎన్నికలు: బీజేపీపై నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఓబీసీ కమ్యూనిటీ విషయంలో బీజేపీ పార్టీ నేతలు కుక్కలా వ్యవహరిస్తారని మండిమండ్డారు. ఓబీసీలంతా తామేంటో బీజేపీకి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆయన అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘బీజేపీ నేతుతు తమను తాము ‘దేవుళ్లుగా’గా భావిస్తున్నారు. మిమ్మల్నీ కుక్కలుగా భావించే.. బీజేపీకి అకోలా జిల్లా ఓబీసీ ప్రజలు ఓటేస్తారా?. ఇప్పుడు బీజేపీని మీరు(ప్రజులు) కుక్కలా చేసే సమయం వచ్చింది. మహారాష్ట్ర నుంచి బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. బీజేపీ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ నేతలు తమను తాము దేవుళ్లుగా విశ్వగురువుగా భావించుకుంటారు. బీజేపీ నేత ఫడ్నవీస్ తనను తాను దేవుడిగా భావిస్తున్నారు’’ అని మండిపడ్డారు. -
సోనమ్ కపూర్ డ్రీమ్ హౌస్, అది మరో ప్రపంచం
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇల్లుభారతీయ హస్తకళ, రాచరికపు వారసత్వ కళతో ఆకట్టుకుంటుంది. ముంబైలో ఉన్న ఆమె ఇల్లు తంజోర్ పెయింటింగ్స్, నాగా ప్యానెల్స్, రాజస్థానీ జాలీస్, జర్దోజీ ఎంబ్రాయిడరీలతో.. రాజ సౌధాలకు మించిన అద్భుతంతో అలరారుతుంటుంది. సోనమ్ ఆంటీ ఎడి 100 ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ సోనమ్ ఇంటి డిజైనింగ్‌లో పాలుపంచుకుంది.మనం అత్యంత ఇష్టపడే తారల్లో సోనమ్ కపూర్ ఒకరు. ఆమెకు ఇష్టమైనది మాత్రం భారతీయ వారసత్వ కళ అని ఆమె ఇంటిని చూసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది. ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ ఈ హంగులను ప్రస్తావిస్తూ –‘‘సోనమ్ ఆసక్తిని లోతుగా పరిశోధించడానికి ఆమెతో కలిసి కొంత కాలం ప్రయాణించాను. సెప్టెంబర్ 2021లో ఆమె నాటింగ్ హిల్ పైడ్ – ఎ – టెర్రే, కెన్సింగ్టన్ స్టూడియోలు రెండింటినీ చూశాను. వాటి పునరుద్ధరణలో ఆమె ప్రతిభ, కళల పట్ల ఉన్న అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నాతో మాట్లాడుతూ ‘నేను నా భర్త ఆనంద్, కొడుకు వాయుతో పంచుకునే ఈ ఇంటిని ఒక మహిళగా, నిర్వాహకురాలిగా, తల్లిగా నాకు ఓ కొత్త అనుభూతిని అందించాలి‘ అని తెలిపింది. ఈ సందర్భంగా సోనమ్ చెప్పిన విషయాలు కూడా ప్రస్తావించాలి. ప్రాచీన వస్తువుల సేకరణ‘సినిమా చిత్రీకరణలో భాగంగా చాలా చోట్లకు వెళుతుంటాం. ఆ విధంగా సంవత్సరాలుగా నేను సేకరించిన అన్ని వస్తువులను అలంకరించడానికి ఒక స్థావరం కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాను. భారతదేశం అంతటా మురికి హవేలీలు, పురాతన వస్తువుల దుకాణాలు గుండా తిరిగాను. నేను దేనినైనా ప్రేమిస్తే, అది నా ఇంటికి చేరకుండా ఉండదు. లక్ష్మీ నివాస్ ప్యాలెస్‌లో చిత్రీకరణ సమయంలో దొరికిన విశాలమైన బికనీర్ డ్యూరీని మోసుకొచ్చేశాను’ అని ఆనందంతో వివరిస్తుంది. ఓ వైపు ప్రాచీన చైనీస్ గ్లాస్ పెయింటింగ్‌లు, మరో ప్రపంచంలా అనిపించే పియరీ ప్యారీ వాల్‌పేపర్‌తో రూపొందించిన గదులు, పాదాల క్రింద హృదయాన్ని మెత్తగా హత్తుకుపోయే ఎరుపు, నారింజల రంగుల తివాచీలు మనల్ని అబ్బురపరుస్తాయి.అమ్మమ్మ ప్రభావంకపూర్ సౌందర్య అభిరుచులను ్ర΄ోత్సహించింది ఆమె అమ్మమ్మ. ‘మా ఆమ్మమ్మ ఒక సామాన్యమైన మహిళ, కానీ చాలా చురుకుదనంతో ఉంటుంది’ అని గుర్తు చేస్తుకుంటుంది కపూర్. ‘అమ్మమ్మ తన మారుతి సుజుకీలో దాదర్ పూల మార్కెట్‌కు ఉదయం 5 గంటలకు తన ఇంటిని సువాసనలతో నింపడానికి స్పీడ్‌గా వెళ్లేది. శాస్త్రీయ సంగీతం, కళలు, తివాచీలను ఆరాధించేది. కరాచీలో విభజనకు ముందు సింధీ కుటుంబం నుండి వచ్చినందున, మా అమ్మమ్మకి తన అభిరుచులపై మంచి ఆసక్తి ఉంది. నాపై ఆమె ప్రభావాన్ని తగ్గించడం కష్టం’ అంటుంది. ఇలా సోనమ్ ఇష్టాయిష్టాలను కనుక్కుంటూ ఒక్కో వస్తువును అలంకరణలో భాగం చేసుకుంటూ ఆమె ఇంటిని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం. -
ట్రంప్ విజయంపై భారత్ ఆందోళన?.. జైశంకర్ రిప్లై ఇదే..
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి.. అధ్యక్షుడిగా ఎన్నికవటంపై భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయని, కానీ వాటిలో భారత్ లేదని స్పష్టం చేశారు. ముంబైలో ఆదిత్య బిర్లా 25వ సిల్వర్ జూబ్లీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు అధ్యక్షులుగా పని చేసిన పలువురితో సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు. మోదీ.. మొదట వాషింగ్టన్ డీసీని సందర్శించినప్పుడు.. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్, ఆయన అనంతరం జో బిడెన్ అధ్యక్షులుగా ఉన్నారు. మోదీ అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారితో సంబంధాలను సహజంగానే ఏర్పరుచుకుంటారు. అయితే.. ప్రస్తుత పరిస్థితులల్లో అనేక దేశాలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గురించి ఆందోళన చెందుతున్నాయి. అయితే వాటిలో భారత్ లేదు’’ అని స్పష్టం చేశారు.#WATCH | Mumbai: At Aditya Birla 25th Silver Jubilee Scholarship Program, EAM Dr S Jaishankar says "...The Prime Minister was among the first three calls President Trump took. PM Modi has built rapport across multiple Presidents. When he first came to DC, Obama was the President,… pic.twitter.com/hSLDK8sKKF— ANI (@ANI) November 10, 2024ఇక.. నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన అనంతరం భారత ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఫోన్ సంభాషణ సమయంలో.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని అన్నారు.చదవండి: ట్రంప్ ‘2.0’ విదేశీ విధానంపై సర్వత్రా ఉత్కంఠ చదవండి: కెనడాలో ఆలయంపై దాడి.. స్పందించిన భారత విదేశాంగ శాఖ -
సిద్ధిఖీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ ( అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. బాబా సిద్ధిఖీ హత్య చేసినప్పటి నుంచి నిందితుడు శివకుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతను నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.శివకుమార్ బాబా సిద్ధిఖీపై కాల్పలు జరపడానికి 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించినటట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 12న బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయ భవనం బయట ఉన్న సమయంలో సిద్ధిఖీపై మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. శివకుమార్ అరెస్ట్‌తో.. సిద్ధిఖీ హత్యలో ప్రమేయమున్న ముగ్గురు షూటర్లు అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇక.. శివకుమార్ అరెస్టుతో సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా శివకుమార్‌కు ఆశ్రయం కల్పించి.. నేపాల్‌కు పారిపోవడానికి సహకరించినందుకు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.ఇక..విచారణలో శివ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివ కుమార్ వెల్లడించారు. అన్మోల్ బిష్ణోయ్‌తో తన పరిచయాన్ని లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడుగా భావిస్తున్న శుభమ్ లోంకర్ పలుసార్లు సులభతరం చేశాడని పేర్కొన్నాడు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు తనతోపాటు మిగితా షూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని తెలిపాడు. నిందితులతో కమ్యూనికేట్ చేయడానికి అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియా అప్లికేషన్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించినట్లు ఇప్పటికే ముంబై పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్ ఫొటోను కూడా షూటర్లతో పంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ‘భాను’ అని కూడా పిలువబడే అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. గత సంవత్సరం కెన్యాలో, ఈ ఏడాది కెనడాలో కనిపించటం గమనార్హం.మరోవైపు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పుల ఘటన, 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు సంబంధించి అన్మోల్ బిష్ణోయ్‌ను పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్ణోయ్ పేరును చేర్చింది. అతన్ని అరెస్టు చేయడానికి ఏదైనా సమాచారం ఇస్తే రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.చదవండి: సిద్ధిఖీ కేసులో నిందితులెవరినీ వదలం: సీఎం షిండేచదవండి: ‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’ -
నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఓ తెగకు చెందిన గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న సూర్య తన భార్య జ్యోతిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సూర్య.. తనకంటే జ్యోతికనే పెద్ద స్టార్ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. నేను ఆమెను కలిసే సమయానికి నాకంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేదని వెల్లడించారు. హిందీలో డోలీ సజా కే రఖ్నా మూవీ తర్వాత జ్యోతిక తన మొదటి తమిళ చిత్రంలో నాతో కలిసి నటించిందని తెలిపారు. తన రెండో చిత్రం కూడా నాతో చేసిందని.. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యామని సూర్య అన్నారు.సూర్య మాట్లాడుతూ..' నారు తమిళ చిత్ర పరిశ్రమలో మార్కెట్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అప్పటికే జ్యోతిక సక్సెస్ఫుల్ యాక్టర్‌గా పేరు సంపాదించుకుంది. నేను హీరోగా ఎదిగేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అప్పటికే తన జీతం నా కంటే మూడు రెట్లు ఎక్కువ. ఆ సమయంలో నేను ఎక్కడ ఉన్నానో గ్రహించా. కానీ తను నా జీవితంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంది. మా ప్రేమను తన తల్లిదండ్రులు కూడా అంగీకరించారు" అని అన్నారు.ముంబైలో జ్యోతిక, సూర్యకాగా.. జ్యోతిక, సూర్య ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. తమ పిల్లల చదువుల కోసమే షిఫ్ట్ అయినట్లు చాలాసార్లు వెల్లడించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి ముంబయికి మారినట్లు సూర్య అన్నారు. ప్రస్తుతం జ్యోతిక కుటుంబం ముంబయిలో ఉందని..తన తల్లిదండ్రులకు కూడా సమయం కేటాయించినట్లు ఉంటుందని సూర్య తెలిపారు. -
Maharashtra Assembly elections 2024: కులగణన, రుణమాఫీ
ముంబై: మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే కులగణన ప్రారంభిస్తామని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) హామీ ఇచి్చంది. 9 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో రెండు ఐచి్ఛక సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ‘మహారాష్ట్రనామ’ పేరిట ఎంవీఏ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం విడుదల చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యేకంగా సాధికారత విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిశు సంక్షేమం కోసం డెడికేటెడ్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన మహిళలకు రూ.500 చొప్పున ధరతో ప్రతిఏటా ఆరు వంట గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంవీఏ మేనిఫెస్టోలోని కీలక అంశాలు...→ రూ.3 లక్షల దాకా రైతు రుణమాఫీ. రుణాలు సక్రమంగా చెల్లించేవారికి రూ.50 వేల ప్రోత్సాహకం → 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ → బాలికలకు ఏటా రూ.లక్ష నగదు→ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లోని వితంతువులు, చిన్నారులకు ఆర్థిక సాయం → యువత సంక్షేమానికి కమిషన్. డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి → నూతన ఇండ్రస్టియల్ పాలసీ. ఎంఎస్ఎంఈ శాఖ.→ అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కార్పొరేషన్ → నిత్యావసరాల ధరల నియంత్రణ→ నెలకు 300 యూనిట్ల దాకా విద్యుత్‌పై 100 యూనిట్ల రుసుం మాఫీ → ప్రభుత్వోద్యోగులకు మళ్లీ పాత పెన్షన్ విధానంకుల గణనపై బీజేపీ నేతలది తప్పుడు ప్రచారం: ఖర్గేపలు సామాజికవర్గాల స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవడానికే కులగణన తప్ప సమాజాన్ని కులాలవారీగా విభజించడానికి కాదని ఖర్గే చెప్పారు. ఆ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అమలు చేయాల్సిన విధానాల రూపకల్పనకు ఆ డేటా తోడ్పడుతుందన్నారు. కులగణనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాదని, అర్బన్ నక్సలైట్లకు ప్రతీక అని మోదీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేని మోదీని మళ్లీ ప్రాథమిక పాఠశాలలో చేర్చాలని ఎద్దేవా చేశారు. 2017 జూలై 16న ఇలాంటి రాజ్యాంగ ప్రతినే అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ అందజేశారన్నారు. చదవండి: మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలివే.. -
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సంచలన విమర్శలు
ముంబై: కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అకోలాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో గురువారం మోదీ పాల్గొని ప్రసంగించారు. పాకిస్తాన్ అజెండాను కాంగ్రెస్ అమలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘ఆర్టికల్ 370 పునరుద్దరణ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించం. ఇటీవల హర్యానా ప్రజలు మూడోసారి బీజేపీకీ పట్టం కట్టారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీయే అభివృద్ధి అజెండాను మాత్రమే నమ్ముతారు. మహారాష్ట్రలో ఎన్డీయేకు అనుకూలంగా హవా కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గాంధీ కుటుంబానికి ఏటీఎంలు.#WATCH | Nanded, Maharashtra: Prime Minister Narendra Modi says "Today, there is a wave in favour of Mahayuti and BJP in the entire Maharashtra. Today, the country is moving forward with the aim of 'Viksit Bharat' and the people of the country know that BJP and its allies are… pic.twitter.com/mgzhExOHkn— ANI (@ANI) November 9, 2024 తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ నుంచి వేల కోట్లు మహా రాష్ట్రకు తరలిస్తున్నారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ రాజ కుటుంబానికి కప్పం కడుతున్నారు.తెలంగాణ, కర్ణాటకలో వసూలు చేసన డబ్బును మహారాష్ట్ర ఎన్నికల్లో పంచుతున్నారు. ప్రస్తుతం దేశం ‘విక్షిత్ భారత్’ లక్ష్యంతో ముందుకు సాగుతోందని దేశ ప్రజలకు తెలుసు. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అదే లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందుకే ప్రజలు బీజేపీ, ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని పదేపదే ఎన్నుకుంటున్నారు. ...మొదట నేను.. మోదీకి సహాయం చేయమని అడుగుతున్నా. రెండోది.. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అడుగుతున్నా. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గత రెండు రోజులుగా నేను మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్లినా మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమిని గెలిస్తారని వినిపిస్తోంది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మహాయుత ప్రభుత్వం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారు ’’అని అన్నారు.చదవండి: ప్రధాని మోదీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్ -
మోదీ పర్యటనలు.. మహారాష్ట్రకు సురక్షితం కాదు: సంజయ్ రౌత్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ఏక్ హై తో సేఫ్ హై’(మనం ఐక్యంగా ఉంటే సురక్షితం) నినాదంపై శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఇప్పటికే చాలా సురక్షితమైన రాష్ట్రమని అన్నారు. కానీ, ప్రధాని మోదీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా అస్థిరతకు గురువుతుందని మండిపడ్డారు. విభజనలు సృష్టించి అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలతోనే ప్రధాని మోదీ పర్యటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారో అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో ప్రజలు ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. కానీ మోదీ ఎప్పుడు పర్యటించినా.. విభజన, అశాంతిని రెచ్చగొట్టడం వల్ల రాష్ట్రం అభద్రతకు గురవుతోంది. రాష్ట్రానికి నిజంగా భద్రత కావాలంటే.. మేం బీజేపీని ఓడించాలి’’ అని అన్నారు.కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒక కులానికి మరొక కులాన్ని వ్యతిరేకంగా ఉంచుతున్నాయని శుక్రవారం ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. ‘ఏక్ హై, తో సేఫ్ హై’(ఐక్యంగా ఉంటేనే సురక్షింతంగా ఉంటాం) అని ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా ఉంచటం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చేందటం.వారికి తగిన గుర్తింపు రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి’’ అని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ మోదీ అన్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ప్రధాని ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్
సాక్షి,ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 9)రేవంత్‌రెడ్డి ముంబైలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ‘ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు.మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే..మేం నిజాలు చెబుతూనే ఉంటాం..అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా.దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత ప్రధాని తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు.వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి మా ప్రభుత్వం అందించింది.సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం.ఎంతో ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారు.మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి’అని రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం -
కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కేరళలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ముంబయిలో సందడి చేశారు. ఓ ఈవెంట్‌కు హాజరైన విజయ్ అనుకోకుండా స్టెప్స్‌పై కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే విజయ్‌కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. విజయ్ కిందపడ్డ వెంటనే పక్కనే ఉన్నవాళ్లంతా అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత విజయ్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లారు.తొలిసారి మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్‌అయితే విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. తన కెరీర్లో మొదటిసారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో విజయ్ కనిపించనున్నారు. ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ నటిస్తోంది సాహిబా పేరుతో హిందీ వీడియో సాంగ్‌కు ఫేమస్ బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తుండగా..త్వరలోనే ఈ పాటను విడుదల కానుంది. ఈ ఈవెంట్ కోసమే విజయ్ ప్రస్తుతం ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
మహా ఎన్నికలు: ‘నన్ను గెలిపిస్తే.. బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు జరిపిస్తా’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పోటీలో నిలబడిన అభ్యర్థుల విచిత్ర హామీలు ఇస్తున్నారు. అయితే.. ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తానను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలోని పర్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పర్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘‘యువతకు పని కల్పిస్తాం. పెళ్లి సమయంలో యువకులకు ఉద్యోగం లేదా వ్యాపారం ఉందా? అడుగుతారు. జిల్లా మంత్రి ధనంజయ్ ముండేకే వ్యాపారం లేనప్పుడు, మీరు ఏవిధంగా ఉద్యోగాలు పొందుతారు. ధనుంజయ్ ముండే.. నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. అందువల్ల ఉద్యోగాలు లేక.. స్థానిక బ్యాచిలర్లు వివాహం చేసుకోవడం కష్టంగా మారింది. నన్ను గెలిపిస్తే.. ఉద్యోగాలు కల్పించి బ్యాచిలర్స్‌కు పెళ్లిలు చేస్తా’ అని అన్నారు.Unique poll promise@NCPspeaks candidate #RajasahebDeshmukh says on getting elected from Beed district's #Parli assembly constituency, he will get all the bachelors married#Maharashtra #PoliticsToday #MaharashtraAssembly pic.twitter.com/TfRm7kRtO8— Mohammed Akhef TOI (@MohammedAkhef) November 6, 2024 దేశ్‌ముఖ్ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత ధనుంజయ్ ముండే పరిశ్రమలు తేకపోవడంతో ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు జరగక యువత ఇబ్బంది పడుతున్నారని ర రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆరోపణలు చేశారు.చదవండి: నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ -
సెలెక్టర్లకు సవాలు విసిరిన శ్రేయస్ అయ్యర్.. వరుసగా రెండు సెంచరీలు
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో తొలుత మహారాష్ట్రపై శతక్కొట్టిన శ్రేయస్.. తాజాగా ఒడిషాపై సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఒడిషాపై శ్రేయస్ 101 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 14 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ శ్రేయస్‌కు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 15వ సెంచరీ. శ్రేయస్ అటాకింగ్ సెంచరీతో సత్తా చాటడంతో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పటిష్ట స్థితికి చేరింది. 72 ఓవర్ల అనంతరం ముంబై 3 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. శ్రేయస్‌కు జతగా సిద్దేశ్ లాడ్ (91) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రఘువంశీ 124 బంతుల్లో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 18 పరుగులకు వెనుదిరగగా.. కెప్టెన్ అజింక్య రహానే డకౌటయ్యాడు. ఒడిషా బౌలర్లలో బిప్లబ్ సమంత్రే రెండు వికెట్లు పడగొట్టగా.. సూర్యకాంత్ ప్రధాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, శ్రేయస్ అయ్యర్ తిరిగి టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. ఆతర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో రీ ఎంట్రీనే లక్ష్యంగా శ్రేయస్ రంజీట్రోఫీలో ఆడుతున్నాడు. శ్రేయస్ వరుస సెంచరీలు చేసి సెలెక్టర్లకు సవాలు విసిరాడు. టీమిండియా మిడిలార్డర్ బలహీనంగా కనబడుతున్న తరుణంలో శ్రేయస్ సెలెక్టర్ల పాలిట ఆశాకిరణంగా కనిపిస్తుంటాడు.మరోవైపు శ్రేయస్‌ను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ ఇటీవలే వదిలించుకున్న విషయం తెలిసిందే. శ్రేయస్ కేకేఆర్‌ను గత సీజన్లో ఛాంపియన్‌గా నిలిబెట్టినా అతన్ని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. నవంబర్ 24, 25 తేదీల్లో జెద్దా వేదికగా జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ పాల్గొంటాడు. శ్రేయస్ రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. శ్రేయస్‌తో పాటు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సిరాజ్ లాంటి 48 మంది భారతీయ స్టార్ క్యాప్డ్ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొననున్నారు.