Mumbai: తెగిపడిన హైటెన్షన్‌ వైరు.. ఒకరు మృతి.. ప్రాణాపాయంలో ఐదుగురు | High Tension Wire Falls on Devotees During Ganesh Nimajjanam In Mumbai, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Mumbai: తెగిపడిన హైటెన్షన్‌ వైరు.. ఒకరు మృతి.. ప్రాణాపాయంలో ఐదుగురు

Sep 7 2025 8:20 AM | Updated on Sep 7 2025 12:49 PM

Mumbai Ganesh Visarjan High Tension Wire Falls on Devotees

ముంబై: ముంబైలోని ఒక ప్రాంతంలో జరిగిన గణేశ్‌ నిమజ్జనం విషాదకరంగా మారింది. సకినాకాలో ఆనందంగా ప్రారంభమైన గణపతి విమజ్జనంలో  అవశృతి చోటుచేసుకుంది.  ఆరుగురు భక్తులపై హై-టెన్షన్ విద్యుత్ లైన్‌ వైరు తెగిపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.  మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 

ముంబైలో గణేశుని వీడ్కోలు ఉత్సవం శనివారం అత్యంత ఘనంగా జరిగింది. అయితే కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖైరానీ రోడ్డులోని ఎస్‌జే స్టూడియో సమీపంలో  భక్త బృందం నిమజ్జనం కోసం వినాయక విగ్రహాన్ని తీసుకెళుతుండగా అందులోని ఆరుగురిపై టాటా పవర్ హై-వోల్టేజ్ వైర్ తెగిపడింది. దీంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరించారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు.
 

గాయడినవారు ప్రస్తుతం పారామౌంట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా శనివారం ముంబైలో 18 వేలకుపైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ, బాంబు బెదిరింపుల మధ్య వేడుకలు జరిగాయి. ఐకానిక్ లాల్‌బాగ్చా రాజా నిమజ్జన వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. లాల్‌బాగ్చా రాజా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. నగరంలోని రద్దీగా  మారే నిమజ్జన ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 21 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది పహారాగాగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement