High tension wire
-
ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘాజీపూర్ విషాద ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిజేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, గాయపడిన వారందరికీ ఉచిత వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. यूपी के गाजीपुर में हाइटेंशन तार की चपेट में आने से बस में आग लग गई! बस में करीब 50 बाराती सवार थे , कई लोगों के जिंदा जलने की खबर है! ग्रामीणों ने दो थाने की पुलिस को भगा दिया है! एक महिला के अनुसार पुलिस ने रूट डायवर्ट किया था!#Ghazipur #accident pic.twitter.com/FsCDegtzdw — ShivRaj Yadav (@shivayadav87_) March 11, 2024 -
బస్సులో మంటలు : ముగ్గురు సజీవ దహనం
జైపూర్: ఢిల్లీ-జైపూర్ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హై టెన్సన్ విద్యుత్తు తీగల కారణంగా మంటలు అంటుకున్నాయని స్థానిక పొలీసు అధికారి అనితా మీనా తెలిపారు. మీనా అందించిన సమాచారం ప్రకారం లాబానా గ్రామ సమీపంలో ట్రక్కు బోల్తా పడటంతో డ్రైవర్ వాహనాన్ని రాంగ్రూట్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే భగవాన్ సింగ్, నూర్ మొహమ్మద్, శుభానా అనే ముగ్గురు ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోగా, ఇతర ప్రయాణికులు సురక్షితం ఉన్నారని మీనా వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
హైటెన్షన్ వైర్లు తగలడంతో.. గగుర్పోడిచే దృశ్యాలు
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శుక్రవారం రాత్రి హైటెన్షన్ వైర్లు బీభత్సాన్ని సృష్టించాయి. ఓ ఫార్మ్‌హౌస్‌లో పార్టీ జరుగుతుండగా హైటెన్షన్ వైర్ల వల్ల షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు సంఘటనాస్థలంలోనే కాలిబూడిదయ్యారు. ఫార్మ్‌హౌస్ నుంచి ఐదుగురు వెయిటర్లు తందూరి పొయ్యిని బయటకు తెస్తుండగా.. దాని ఇనుపచువ్వ హైవోల్టేజ్ విద్యుత్ ప్రవహించే వైర్లకు తాకింది. దీంతో తీవ్రస్థాయి షాక్ గురైన ఆ ఐదుగురు కనీసం అవశేషాలు కూడా మిగలకుండా అత్యంత భయానకంగా ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలంలో వారు ప్రాణాలు విడిచిన చోట.. కేవలం వారి ఆకారాల్లో భస్మమైన బూడిద మాత్రమే మిగిలి ఉండటం.. ఈ ఘటనను చూసిన వారిని దిగ్భ్రాంతపరుస్తున్నది. సంఘటనాస్థలంలో ఐదుగురి మృతికి సంబంధించి గగుర్పొడిచే ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఐదుగురు వెయిటర్లు చనిపోగా.. ముగ్గురి మృతదేహాలను మాత్రమే అవశేషాల ఆధారంగా ఇప్పటివరకు గుర్తించారు. -
18మంది చిన్నారులకు కరెంట్ షాక్
జైపూర్: రాజస్తాన్ థోల్పూర్లో శుక్రవారం ఓ స్కూలు బస్సుపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి పడిన ప్రమాదంలో 18మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో నలుగురి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదంలో విద్యార్థులతో పాటు టీచర్, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటిపై తెగిపడ్డ హైటెన్షన్ వైరు, ముగ్గురి మృతి
విజయవాడ: నగరంలోని బంటుమిల్లి మండలం ముంజులూరులో సోమవారం విషాదం చోటుచేసుకుంది. విద్యుద్ఘాతంతో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. మంజులూరులో భారీగా వీసిన ఈదురుగాలులకు హైటెన్షన్ వైరు ఇంటిపై తెగిపడింది. హైటెన్షన్ వైరు నుంచి ఇంటికి విద్యుత్ ప్రవహించడంతో ఇంట్లో వారంతా విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైటెన్షన్ వైర్లు తగిలి గొర్రెల కాపర్లు మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సి సిగడాం మండలం ఎస్పీఆర్ పురం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. గొర్రెలను చేనులోకి తీసుకువెళ్తున్న ముగ్గురు గొర్రెల కాపర్లు హైటెన్షన్ వైర్లు తగిలి మృతి చెందారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతులు చంద్రరావు, రమణ, బాలప్పుడుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. -
హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి ఐదుగురికి తీవ్రగాయాలు
అతి ప్రమాదకరమైన ఓ హైటెన్షన్ విద్యుత్ వైర్ తగలడంతో ఐదుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నొ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. మొహరం పండుగను పురస్కరించుకుని 'టాజియా' (పీర్ల పండుగ) ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఈ ఘటన సంభవించినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ఊరేగింపులో పాల్గొన్న చిన్నారులు పీర్ల జెండాను పట్టుకుని వెళుతుడంగా గంగా రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ సమీపంలో లోహాపు స్తంభానికి ఆ జెండా చిక్కుకుంది. అదే స్తంభానికి ఉన్న హైటెన్షన్ వైర్‌కు జెండా తగలడంతో విద్యుత్ ప్రసరించి విద్యుద్ఘాతం ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ తీగలు నుంచి ఎక్కువ మొత్తంలో విద్యుత్ ప్రసరిస్తుంటోంది. విద్యుత్ తాకిడికి ఆ ఐదుగురి శరీరం బాగా కాలిపోయింది. వారి పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం కాన్పూర్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
తెగిపడ్డ హైటెన్షన్ వైరు
పెద్దశంకరంపేట : మండలకేంద్రంలోని ప్రియాంక కాలనీలో మంగళవారం అర్ధరాత్రి హైటెన్షన్ వైరు తెగిపడింది. అయితే ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. కాలనీ మీదుగా ఏర్పాటు చేసిన హైటెన్షన్ వైరు మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు తెగి 11 కేవీ వైరుపై పడింది. దీంతో కాలనీలోని పలు ఇళ్లలో గల టీవీలు, గృహోపకరణాలు కాలిపోయాయి. దీంతో ఆందోళన చెందిన కాలనీ వాసులు విషయాన్ని విద్యుత్ సిబ్బందికి తెలియజేశారు. వారు వచ్చి సరఫరాను నిలిపివేశారు. బుధవారం ఉదయం వచ్చి విద్యుత్ తీగలను సరిజేసి సరఫరాను పునరుద్ధరించారు.