breaking news
Wanaparthy
-
పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
వనపర్తి: జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్లో మండల స్థాయి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ లాగిన్‌కు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఫిజికల్ ఫైళ్లను రెండు రోజుల్లో పంపించాలని తహసీల్దార్లకు సూచించారు. వాటికి సంవత్సరం వారీగా పహాణీలను కూడా జత చేయాలన్నారు. కొత్త మండలాల్లో కార్యాలయాల భవనాల నిర్మాణంపై ఆరా తీశారు. జనవరి 26న ప్రభుత్వ భవనాల్లోనే జెండా ఎగురవేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో ప్రకటించిన ఓటరు ముసాయిదాపై ఫిర్యాదులు వస్తున్నాయని, తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లను సమన్వయం చేసుకొని వాటిని పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్యానాయక్, ఏఓ భానుప్రకాష్ పాల్గొన్నారు. వక్ఫ్ భూములు కాపాడాలి జిల్లాలో గెజిట్ ప్రకారం వక్ఫ్ భూములు 898.36 ఎకరాలు ఉండగా.. అక్కడక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని, వాటిని కాపాడాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదర్శ్‌సురభి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్ఫ్ భూముల ఆక్రమణలపై కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వివరించగా.. వాటికి సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసానిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాలాజీనాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
వనపర్తిటౌన్: ఈ నెల 21 నుంచి జరగబోయే ఇంట ర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రైవేట్ కళాశాలలు సర్వం సిద్ధం చేసుకోవాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం డీఐఈఓ కార్యాలయంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న మొదటి సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు, 23న నైతికత – మానవ విలువల పరీక్ష, 24న పర్యావరణ విద్య పరీక్ష జరగనుందన్నారు. సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రాక్టికల్స్ నిర్వహణకు సీసీ కెమెరాలు, ల్యాబ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇంటర్ బోర్డ్ కొత్తగా ప్రవేశపెట్టిన హాల్ టికెట్ల ప్రివ్యూను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలు సరి చూసుకునేలా అవగాహన కల్పించాలని, అభ్యంతరాలు ఉంటే ప్రిన్సిపాల్స్ వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పారు. నామినల్ రోల్స్ చెక్ చేయడం, స్టాఫ్ డేటా మొదలైన వాటిపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘ఉపాధి’ని యథావిధిగా కొనసాగించాలి
పాన్‌గల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని రేమద్దులలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలో సీపీఎం ఒత్తిడి యూపీఏ ప్రభుత్వం సంవత్సరానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఈ పథకం కొనసాగిందన్నారు. ప్రజలందరూ 200 పని దినాలకు పెంచి రోజు, వారి వేతనం రూ.600 ఇవ్వాలని పోరాటాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడగులు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. వెనిజులాపై అమెరికా దాడులను పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అమెరికా కస్టడీలో ఉన్న వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మధుర దంపతులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, నాయకులు వెంకటయ్య, భగత్, భాస్కర్, చంద్రశేఖర్, ఎండీ ఖాజా, మల్లేష్, కె.వెంకటయ్య, శివరాజు, రేవతిరెడ్డి, అంజనేయరెడ్డి, చిన్ననిరంజన్ పాల్గొన్నారు. -
వ్యూహరచన..!
‘పుర’ పోరుపై ముమ్మర కసరత్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామంశ్రీలో బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. వెలిసిన ఫ్లెక్సీలు.. విందులు పురపాలిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన క్రమంలో ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఆశావహ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. యువతను ఆకట్టుకునేందుకు విందులకు తెర లేపారు. తాము బరిలో నిలుస్తామనే సంకేతాలను వార్డు ప్రజలకు తెలిసేలా ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తమకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయాలతో పాటు వార్డుల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన మహబూబ్‌నగర్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు పార్టీల నాయకుల మధ్య కూడా పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్: పట్టు నిలుపుకొనేలా.. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల క్రమంలో పట్టు నిలుపుకునేలా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇప్పటివరకు ఎలాంటి సన్నాహక సమావేశాలు నిర్వహించకున్నా.. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు తమ తమ అనుచరుల ద్వారా గెలుపు గుర్రాలపై జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వార్డుల్లో ఆశావహులను ప్రోత్సహిస్తూ రంగం సిద్ధం చేసుకోవాలని.. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నిర్ణయం మేరకు నడుచుకునేలా వారిని సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలను పరిశీలిస్తూ.. పై ఎత్తులతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలసన్నాహకాలు షురూ అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగంలోకి.. ఎత్తులకు పైఎత్తులతో ముందుకు.. -
భరోసా ఏది?
ఉపాధి కల్పించాలి మున్సిపాలిటీగా మారితే తమ బతుకులు మారుతాయని ఆశపడ్డాం. కానీ ఉన్న ఉపాధి పనులు తీసేస్తారని అనుకోలేదు. ఆరేళ్ల నుంచి ఉపాధి పనులు లేక ఇంట్లో బీడీలు చుడుతూ కాలం వెళ్లదీస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి పనులు చేపట్టి తమలాంటి పేదలకు ఉపాధి చూపాలి. లేదా ఏడాదికి ఇస్తామన్నా రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆదుకోవాలి. – ఎస్.నర్సింహులు, అమరచింత పనులు లేక ఇబ్బంది వంద రోజుల పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడు చేసిన పనికి తగ్గ కూలి వచ్చేది. ఇప్పుడు వ్యవసాయం కూలీ పనులు దొరకడం లేదు. వయస్సు భారమవ్వడంతో నాటు వేసే పనులు చేయలేకపోతున్నా. దీనికి తోడు కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసా అందడం లేదు. దీంతో ఉపాధి లేక బతుకు భారంగా మారింది. – వెంకటమ్మ, అమరచింత ఆందోళన ఉధృతం చేస్తాం మున్సిపాలిటీల్లో తొలగించిన ఉపాధి హామీ పనులను యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ భరోసాను వర్తింపచేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు ప్రవేశ పెట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నాం. – అజయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. పట్టణ ప్రాంతాలకు వర్తించదు 2023–24 సంవత్సరంలో ఏర్పడిన మున్సిపాలిటీ ప్రాంతాల్లోని కూలీలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తిస్తుందని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అంతకు ముందు ఏర్పడిన మున్సిపాలిటీలో ఇది వర్తించదు. వీటిపై పట్టణ కూలీలకు అవగాహన కల్పించాం. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేసే వారిని గుర్తించే వీలుంది. – రఘపతిరెడ్డి, ఏపీఓ, అమరచింత మున్సిపాలిటీల్లో పేదలకు దూరంగానే ఉపాధి హామీ పథకం అమరచింత: నిరుపేద వ్యవసాయ కూలీలతో పాటు పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2006 ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లోనే పేదలకు 100 రోజులు పని కల్పిస్తూ.. అందుకు తగ్గ కూలి చెల్లించేది. అనంతరం ఏడాదికి 150 రోజుల పనిదినాలకు పెంచారు. దీంతో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు వేసవిలో పనులు దొరకడంతో కుటుంబ పోషణ సాఫీగా సాగేది. ప్రస్తుతం పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఉపాధి పనులను తొలగించడంతో ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండి కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పడిన పట్టణాలోల పేదలకు ఉపాధికి దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి రూ.12 వేలు చెల్లిస్తుండడంతో ఉపాధి కోల్పోయిన పట్టణ ప్రాంత కూలీలు సైతం తమకు పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిలో కనీసం 20 రోజుల పనిదినాలు చేసిన కూలీలు అర్హులంటూ నిబంధనలు ఉండడంతో.. మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకమే అమలులో లేని కారణంగా వీరు ఆత్మీయ భరోసా అనర్హులుగా మిగిలారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో 13,242 మంది జాబ్ కార్డు ఉండగా.. వారికి ఉపాధి హామీ, ఆత్మీయ భరోసా రెండు పథకాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తుంది. జిల్లాలో ఇలా.. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2018 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే మున్సిపాలిటీగా ఉన్న వనపర్తితో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత పట్టణాలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో ఉపాధి పనులపై ఆధారపడి జీవిస్తున్న 13,242 మంది కూలీలు పనులు కోల్పోయారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో రాజనగరంలో 479, నాగవరంలో 643 శ్రీనివాసపురంలో 1,020, నర్సింగాపురంలో 70 మంది ఉపాధి పనులకు దూరమయ్యారు. పెబ్బేరు మున్సిపాలిటీలో పెబ్బేరు పట్టణంలో 2,245, చెలిమిలలో 872 మంది, కొత్తకోట మున్సిపాలిటీలో 1,915 మంది, ఆత్మకూర్ మున్సిపాలిటీలో 1,975 విలీన గ్రామమైన ఖానాపురంలో 568 మంది, అమరచింత మున్సిపాలిటీలో 4,093 మంది కూలీలు జాబ్‌కార్డులు కలిగి ఉన్నా ఉపాధి పనులు చేసేందుకు అనర్హులుగా మిగిలారు. దీంతో అప్పటి నుంచి తమకు ఉపాధి పనులు కల్పించాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరుగుతున్నా తమను పట్టించుకునే వారే కరువయ్యారని కూలీలు వాపోతున్నారు. పట్టణ కూలీలకు అందని ‘ఆత్మీయ భరోసా’ భారమవుతున్న దినసరి జీవనం ఇందిరమ్మ రాజ్యంలోనూ ఉపాధి కలే.. మున్సిపాలిటీల ఏర్పాటుతో పేదల బతుకుల్లో చీకటి -
జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
వనపర్తిటౌన్: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 69వ అండర్–19 పోటీల్లో స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న కార్తీక్ జాతీయస్థాయికి ఎంపికయ్యాడని ఎస్జీఎఫ్ సెక్రటరీ కుమార్ తెలిపారు. జయసూర్య ఉత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. ఈ మేరకు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, వనపర్తికి గౌరవం దక్కేలా ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. గతేడాది జయసూర్య జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడన్నారు. కార్యక్రమంలో పీడీలు నవీన్ నందన్, నరేందర్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. 616 ఫిర్యాదులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్‌కర్నూల్‌లో 121, కొల్లాపూర్‌లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6, అమరచింత 4, ఆత్మకూర్‌లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మున్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. రామన్‌పాడులో 1,020 అడుగుల నీటి మట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం నాటికి సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,020 అడుగుల వద్ద నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 875 క్యూసెక్కులు, కుడి ఎడమ కాల్వ ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
● ‘పాలమూరు’ వేదికగా ఎన్నికల శంఖారావం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం మహబూబ్‌నగర్‌నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
‘మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు’
కొత్తకోట రూరల్: మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. సోమవారం కొత్తకోటలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల (వీపనగండ్ల)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటార్ వెహికల్ యాక్ట్, డ్రగ్స్ నివారణ, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు చేసినా, సహకరించినా శిక్షార్హులు అవుతారని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వాహనాలు నడుపుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. సువర్ణ సారథ్యంలోని కళాబృందం ప్రదర్శన ఇచ్చారు. డిపో నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ రఘు, డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సైదులు, జి.సురేందర్ ఉన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
వనపర్తి: పోలీస్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహిరించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీతరెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎస్పీ సునీతారెడ్డి హాజరై వివిధ ప్రాంతాల నుంచి 10 మందితో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఆయా పోలీస్స్టేషన్లకు బదిలీ చేశామని తెలిపారు. అక్కడి సిబ్బంది ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఉండాలి
ఖిల్లాఘనపురం: ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేలా చూడాలని హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ మహబూబ్‌నగర్ జోనల్ అధికారి కృష్ణారావు, వనపర్తి, గద్వాల జోనల్ అధికారి లలిత కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమం, 500 మీటర్లు, కిలోమీటర్, రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించగా.. వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ధ్యానం చేయడంతో ఉత్తేజం, జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. 500 మీటర్ల పరుగు పందెం బాలికల విభాగంలో నందు, స్రవంతి, నవ్య.. బాలుర విభాగంలో మహేష్, కార్తీక్, జగన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. అదేవిధంగా కిలోమీటర్ పరుగు పందెంలో బాలుర విభాగంలో శివ, ప్రవీణ్, శ్రీరాం.. బాలికల విభాగంలో చందన, శిరీష, నందిని, రెండు కిలోమీటర్ల పరుగుపందెంలో శివ, రాజేష్, శ్రీనునాయక్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. అనంతరం సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లను శాలువాలతో సన్మానించడంతో పాటు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. -
అంతటా అంతేగా..!
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో ఇతర జిల్లాల ఓటర్లు ● ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం ● ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో 98 ● అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ వార్డులు ఫిర్యాదులు మ.నగర్ (కా) 60 98 భూత్పూర్ 10 20 దేవరకద్ర 12 03 నాగర్‌కర్నూల్ 24 51 కొల్లాపూర్ 19 05 కల్వకుర్తి 22 32 నారాయణపేట 24 – మక్తల్ 16 07 కోస్గి 16 03 మద్దూర్ 16 03 గద్వాల 37 06 అలంపూర్ 10 – అయిజ 20 06 వడ్డేపల్లి 10 01 వనపర్తి 33 18 కొత్తకోట 15 01 అమరచింత 10 – ఆత్మకూర్ 10 06 పెబ్బేరు 12 31 మొత్తం 376 291 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జడ్చర్ల, అచ్చంపేట మినహా ఎన్నికలు జరిగే మహబూబ్‌నగర్ కార్పొరేషన్.. మిగిలిన 18 మున్సిపాలిటీలు అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు నివ్వెరపరుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రఽదానంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ● ఒకే జిల్లా ఒక మున్సిపాలిటీలోని వార్డుల్లో వేరే పురపాలిక పరిధిలోని ఓటర్లు చేరిక ● మున్సిపాలిటీల్లో గ్రామాలకు సంబంధించిన ఓటర్ల పేర్లు దర్శనమివ్వడం.. ● జాబితాలో ఇంటి నంబర్లు వరుసగా లేకపోవడం.. తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా -
మత్స్యబీజ సంబురం
● లక్ష్యం 1.60 కోట్లు.. ఇప్పటి వరకు వదిలినవి 60 లక్షలు ● 10వ తేదీలోపు పూర్తి చేస్తామంటున్న అధికారులు జిల్లాలో కొనసాగుతున్న రాయితీ చేప పిల్లల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను త్వరగా పంపిణీ చేస్తే లబ్ధి చేకూరుతుంది. పెద్ద చెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో చేప పిల్లలు ఎదిగే అవకాశం ఉంది. ఈ చెరువుపై ఆధారపడి 300 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. – గోపి, మత్స్యకారుడు, అమరచింత ప్రభుత్వం ఈసారి రాయితీ చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేస్తోంది. వానాకాలంలో వదలాల్సిన చేప పిల్లలు చలికాలం మధ్యలో చెరువులకు చేరుతున్నాయి. చేప పిల్లల ఎదుగుదలకు వాతావరణం సహకరించక కొన్ని చనిపోయినా.. మిగిలినవి పెరిగే అవకాశం ఉంది. అధికారులు త్వరితగతిన పంపిణీ ప్రక్రియ పూర్తి చేసి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. – తెలుగు రాములు, పాన్‌గల్ రాయితీ చేప పిల్లల సరఫరాకు టెండరింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మరోమారు రీటెండరింగ్ నిర్వహించాం. ప్రస్తుతం నలుగురు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. జిల్లావ్యాప్తంగా 1.60 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 60 లక్షలు అందించాం. జనవరి 10 లోగా లక్ష్యం మేర పంపిణీ చేస్తాం. నీరు సమృద్ధిగా ఉన్న చెరువులు, కుంటలు గుర్తించి సొసైటీల అభ్యర్థన మేరకు చేప పిల్లలు వదులుతాం. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ అమరచింత: జిల్లాలో వారం రోజులుగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుండగా.. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి చేప పిల్లలు చేరనున్నాయని మత్స్యకారులు సంబురపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1.60 లక్షల చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. ఇప్పటి వరకు 60 లక్షలు పంపిణీ చేశారు. ఈ నెల 10లోగా పంపిణీ పూర్తి చేస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. వారం వ్యవధిలో రీటెండర్ ప్రక్రియ పూర్తిచేసి సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా కేటాయించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఉచిత చేప పిల్లలు వదిలేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇది వరకే సొసైటీల్లో నిల్వ ఉన్న డబ్బులతో మత్స్యకారులు చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో వదులుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ చేప పిల్లలు సైతం వదిలితే మరింత లాభం చేకూరనుందని సంబురపడుతున్నారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే పెరుగుదల నిలిచి బరువు తగ్గుతాయనే సందేహాలను సైతం వ్యక్తమవుతున్నాయి. గతేడాది 1.50 కోట్ల చేప పిల్లలను అందించాలనే లక్ష్యం ఉన్నా అనుకున్న మేర నిధులు మంజూరు కాకపోవడంతో కేవలం 54.84 లక్షలు మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేయగలిగారు. ప్రస్తుత సంవత్సరం 1.60 కోట్ల మేర ఉచిత చేప పిల్లలను అందించేందుకు సిద్ధమయ్యారు. నీరున్న చెరువులకే ప్రాధాన్యం.. ప్రస్తుతం రాయితీ చేప పిల్లలను ఆయా గ్రామాల్లోని మత్స్యకార సొసైటీల విన్నపం మేరకు చేప పిల్లలను అందించనున్నారు. చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉంటేనే రాయితీ చేప పిల్లలు అందిస్తామని మత్స్యశాఖ ఏడీ వెల్లడించారు. వానాకాలం ప్రారంభంలో నీటితో నిండి ఉంటాయని.. ప్రస్తుతం కాస్తా తగ్గుముఖం పట్టడంతో ఎదుగుదల ఉండదని, దీంతో నీరు సమృద్ధిగా ఉన్న చెరువులను గుర్తించి చేప పిల్లలను అందిస్తున్నామని చెబుతున్నారు. మత్స్య సహకార సంఘాలు 143 మత్స్యకారులు 13,600 గతేడాది పంపిణీ చేసిన చేప పిల్లలు 54.84 లక్షలు -
క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యం
వనపర్తిటౌన్: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ఎంతో ముఖ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన రామన్ ఐఐటీ టాలెంట్ టెస్ట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ లేకుండా ఎంత చదువు చదివినా ఉపయోగం ఉండదని తెలిపారు. కేవలం కలలుగని కూర్చుంటే విజయం వరించదని.. సాకారానికి అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. రానున్న తరానికి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం, విద్య అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని, కన్న నేలకు సేవలందించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం మరవొద్దని కోరారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ప్రజా వైద్యశాల డైరెక్టర్ డా. మురళీధర్, సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నతస్థాయికి ఎదుగుతారని, చదువు, ఆటలు, పాటలు ఏ రంగంపై ఆసక్తి ఉంటే వాటినే ఎంచుకొని సత్తా చూపాలని కోరారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ఆశయాలకు అనుగుణంగా దారి చూపాలన్నారు. అనంతరం విజేతలకు చిన్నారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రతినిధి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కళావేదిక సభ్యులు, కవులు, ప్రజా ప్రతినిధులు రాములు, బైరోజు చంద్రశేఖర్, సత్తార్, గంధం నాగరాజు, రమాదేవి, ప్రవీణ్, భాస్కర్, రాజేంద్రప్రసాద్చారి, మద్దిలేటి, షఫీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘రైతుభరోసా’ అందేనా..?
● పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు ● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు మదనాపురం: జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగు చేయనుండగా.. కొన్నిచోట్ల రైతులు నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుభరోసా కోసం కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు భూములకే.. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.10 వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని రైతులకు హామీ ఇచ్చింది. ఈ మేరకు మొదట యాసంగి సీజన్లో రైతు భరోసా పథకాన్ని పాతపద్ధతిలోనే అమలు చేసి తర్వాత వానాకాలంలో ఎకరాకు రూ.6 వేల చొ ప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. గుట ్టలు, రహదారులు, వెంచర్లు తదితర సాగుకు యోగ్యం కాని భూములకు రైతుభరోసాను నిలిపివేసింది. వానాకాలంలో అధిక వర్షాలు, యూరియా కొరతతో జిల్లాలో సాగుచేసిన పంటలు సరైన దిగుబడి రాక రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా అందడం లేదు. చివరకు పంటలకు కనీస మద్దతు ధరలు కూడా లేకపోవడంతో అప్పులతో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడికి చేసిన అప్పు తీరకపోవడంతో ఆర్థికంగా కుదేలయ్యారు. యాసంగి సాగుకై నా వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందించాలని కోరుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో సుమారు 1.75 లక్షల మంది రైతులు రైతుభరోసా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వానాకాలంలో సుమారు రూ.205 కోట్ల నిధులు విడుదల కాగా.. యాసంగి సాగుకు రూపాయి కూడా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఏడాదికి రెండుసార్లు పంటసాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. యాసంగిలో పంటలు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నామని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులను సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6 వేలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. పండుగ ముగిసిన వెంటనే నిధులు జమయ్యే అవకాశం ఉంది. – దామోదర్, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి -
భోజనం సరిగ్గా చేయలేదని తల్లి మందలించడంతో..
మహబూబ్ నగర్ జిల్లా: తల్లి మందలించిదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్, తండావాసుల కథనం ప్రకారం.. వాల్యాతండాకు చెందిన డేగావత్ వసురాం, భార్య శారద, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. కొన్నిరోజులుగా డేగావత్పూజ(రెండో కుమార్తె) భోజనం సరిగ్గా చేయడంలేదని తల్లి మందిలించింది. శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాకు (నాయనమ్మ) వద్దకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వచ్చింది.శివరాంపల్లి నుంచి వాహనంలో వచ్చి వాల్యాతండా స్టేజీ వద్ద దిగి తండా సమీపంలోనే వ్యవసాయ పొలం వద్ద ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొద్ది దూరంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద తండాకు చెందినవారు వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా పొగ రావడం గమనించిన వెళ్లి చూడగా యువతి మంటల్లో ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108వాహనంలో జనరల్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పూజ డీఆర్డీఏలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తుందని, పూజ తండ్రి వసురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
400 ఏళ్ల చరిత్ర
జడ్చర్ల టౌన్: పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఈదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు. కాలక్రమేణా గచ్చుబావి చెత్తాచెదారంతో నిండిపోగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జయపాల్ అనే యూట్యూబర్, వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్ స్పందించి పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అలాగే జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోనేరుకు ఎంతో విశిష్టత ఉంది. కోనేరుకు ఒకవైపు శివాలయం, మరోవైపు ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. కోనేరులోంచి నేరుగా పైఆలయాలకు వెళ్లేలా సొరంగ మెట్ల మార్గాలు నిర్మించారు. ఒకవైపు మాత్రమే మెట్లు ఉండగా.. రెండు వైపులా గోడలున్నాయి. ప్రస్తుతం కోనేరు పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కావేరమ్మపేటలోని గచ్చుబావి -
ప్రారంభమైన పీఎంశ్రీ క్రీడాపోటీలు
గోపాల్పేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పీఎంశ్రీ క్రీడాపోటీలను శనివారం జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, సర్పంచ్ స్వప్నభాస్కర్ ప్రారంభించారు. విద్యార్థులకు క్రీడలపై మక్కువ పెంచేందుకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పీడీ సురేందర్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాద్యాయుడు రంగస్వామి, సీఆర్పీ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా
వనపర్తి టౌన్: పురపాలికల వార్డుల వారీగా ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పుర కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను ఆయన పరిశీలించి మాట్లాడారు. అక్టోబర్ 1, 2025 నాడు ప్రచురించిన అసెంబ్లీ తుది ఓటరు జాబితా ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు, మృతిచెందిన ఓటర్లను పరిగణలోకి తీసుకోమని తెలిపారు. తుది ఓటరు జాబితా పార్ట్‌ల వారీగా వార్డుల మ్యాపింగ్ చేపట్టాలని, ఇంటి చిరునామా ఆధారంగా వార్డు ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా చూడాలని, అదేవిధంగా కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల పేర్లు వారి సొంత వార్డులోనే ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం పుర కార్యాలయంలో ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి మార్పుచేర్పులు ఉంటే 5వ తేదీలోగా ఫిర్యాదు చేయాలని కోరారు. తుది ఓటరు జాబితా జనవరి 10న అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. వార్డుల వారీగా తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేసుకుంటే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, పుర సిబ్బంది పాల్గొన్నారు. -
ఇన్‌స్ట్రాగాంలో వచ్చి.. వాట్సప్‌లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్‌నగర్‌లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్‌స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అమరచింత/ఆత్మకూర్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. అమరచింత మండలం చంద్రానాయక్‌తండాలో హైమాస్ట్ లైట్లతో పాటు అయ్యప్ప ఆలయంలో రూ.ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రం, ఆత్మకూర్ మండలం మూలమళ్లలో అరబిందో ఫార్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తోందని.. కేంద్ర నిధులను తమవంటూ ప్రచారం చేసుకోవడం అవివేకమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలమూర్–రంగారెడ్డి ఎప్పుడు పూర్తి చేస్తారో జిల్లా రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ మద్దతుతో గెలిచిన చంద్రనాయక్‌తండా సర్పంచ్ కృష్ణానాయక్‌తో పాటు కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డిని సన్మానించారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, మేర్వరాజు, క్యామ భాస్కర్, మరాఠి అశోక్, మంగ లావణ్య, మూలమళ్లలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు దేశాయి పద్మజారెడ్డి, కాంతారెడ్డి, రతంగ్‌పాండురెడ్డి, అశ్విన్‌కుమార్, అశోక్, లావణ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’కు పెద్దపీట హాస్యాస్పదం
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్దపీట వేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. అంత ప్రాధాన్యమిస్తే పనులు ఎందుకు పూర్తి కాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.74 వేల కోట్లు వ్యయం కానుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి 90 పనులు పూర్తి చేశామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ఇరుపార్టీల నాయకులు ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని.. పాలమూరు బీడు భూములకు సాగునీరు ఇవ్వడానికి యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు వంటి వలసల జిల్లా ఆకలి తీర్చే ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రం నీరుగార్చేందుకు వీబీజీ రాంజి పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని.. ఈ బిల్లు ద్వారా చేసిన పనులకు 40 శాతం నిధులు పంచాయతీలే భరించేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చలకే పరిమితం కాకుండా కేంద్రంపై పోరాటానికి అఖిలపక్షాన్ని పిలవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, ఎండీ జబ్బార్, లక్ష్మి, జీఎన్ గోపి, పరమేశ్వరాచారి, మేకల ఆంజనేయులు, మహబూబ్ పాషా, బాల్యానాయక్, ఆర్ఎన్ రమేష్, కృష్ణయ్య, వెంకట్రాములు తదితరలు పాల్గొన్నారు. -
శిథిలం నుంచి సుందరీకరణ
మక్తల్: మక్తల్‌లో ప్రసిద్ధిగాంచిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో శిథిలాస్థకు చేరిన కోనేరు సుందరీకరణ దిశగా పయనిస్తోంది. గతంలో ఇదే కోనేరు నుంచి తీసుకెళ్లి ఆంజనేయస్వామికి పుష్కర స్నానం చేయించి పూజలు చేసేవారు. కాలక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి.. చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ క్రమంలో కోనేరు దుస్థితిని గమనించిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి.. మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం కోనేరు పూర్వవైభవం సంతరించుకోగా.. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సౌకర్యాలు కల్పించారు. -
మహిళల భద్రత, భరోసా షీటీం లక్ష్యం
వనపర్తి: మహిళలు షీటీం సేవలను వినియోగించుకోవాలని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ సూచించారు. మహిళలు, బాలికలకు భద్రత, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఎస్పీ సునీతరెడ్డి ఆదేశాల మేరకు షీటీం, భరోసా కేంద్రం, ఏహెచ్‌టీయూ సంయుక్తంగా జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు భయంతో మౌనంగా ఉండకూడదని, బాలికలు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాకూడదని కోరారు. ఈవ్‌టీజింగ్, వేధింపులు, ఆన్లైన్ బెదిరింపులు ఎదురైతే సంప్రదించాలని సూచించారు. ఫేక్ ఐడీలు, మోసపూరిత లింకులు, బ్లాక్మెయిల్, మార్ఫింగ్ వంటి సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. భరోసా కేంద్రంలో న్యాయం, కౌన్సెలింగ్, వైద్య సాయం, అవసరమైతే ఆశ్రయం కూడా లభిస్తుందని చెప్పారు. ఏహెచ్‌టీయూ, భరోసా కేంద్రం కలిసి మహిళల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో షీటీం ఎస్ఐ అంజద్, సిబ్బంది శ్రీనివాసులు, శ్రీశైలం చారి, యాదిరెడ్డి, భవిత, సతీష్, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తాలు పేరిట.. నిలువు దోపిడీ
ఖరీఫ్‌లో రైస్ మిల్లర్ల అక్రమార్జన రూ.45 కోట్లు ● క్వింటాల్‌కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ ● ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు ● తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో.. ● అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే.. ● మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు ●నాలుగు క్వింటాళ్ల ధాన్యం ఏమైందని డ్రైవర్‌ను నిలదీస్తే నాకేమీ తెలియదంటూ రైస్ మిల్లు యజమాని ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేయగా.. వేబ్రిడ్జి తూకం అంతే వచ్చిందని చెప్పి.. దురుసుగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేశాడు. కొనుగోలు కేంద్రంలో బస్తాకు కిలోన్నర పైన అదనంగా తూకం వేశారు. ఇప్పుడు మళ్లీ పది బస్తాల కోత పెట్టారు. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. – ఆంజనేయరెడ్డి, శివాజీ, అప్పంపల్లి గ్రామం, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది. రైతులకు ఫోన్లు చేసి మరీ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్‌కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్‌కు 4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒప్పుకోకుంటే.. అన్లోడ్ చేయకుండా ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా క్వింటాల్ ధాన్యంలో సుమారు 4 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తూ దందాకు తెగబడ్డారు. రైతులు ఒప్పుకుంటేనే ట్రక్షీట్లు తిరిగి ఇస్తున్నారు. ట్రక్ షీట్లు తిరిగి ఇస్తేనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసే అవకాశం ఉండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని కోతకు అంగీకరించని రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా తిరిగి సెంటర్లకు పంపిస్తున్నారు. ఇలా ఇబ్బందులకు గురిచేయడం ద్వారా వారికి విధి లేని పరిస్థితులు కల్పిస్తూ.. దారిలోకి తెచ్చుకుంటున్నారు. కిలోకు రూ.24 చొప్పున నష్టం.. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్‌కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ధాన్యం కొనుగోళ్ల వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా కేంద్రాలు కొనుగోళ్ల లక్ష్యం కొన్నది మహబూబ్‌నగర్ 195 2,00,000 1,25,219 నాగర్‌కర్నూల్ 236 2,57,145 71,779 జోగుళాంబ గద్వాల 87 1,25,000 83,933 నారాయణపేట 117 3,12,000 1,29,467 వనపర్తి 414 4,30,000 2,06,000 తాలు పేరిట దోపిడీకి సంబంధించి ఇటు సెంటర్లు, అటు మిల్లుల నిర్వాహకులు కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. లేకుంటే తమకేం మిగులుతుందని పలు సెంటర్ల నిర్వాహకులు రైతులతో బాహాటంగానే మాట్లాడుతున్నారు. మరోవైపు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ కోత పెట్టడంపై పలువురు మార్కెటింగ్ అధికారులను ప్రశ్నిస్తే.. తాలు ఉంటే ఏంచేస్తారని మిల్లర్లను వెనుకేసుకురావడం అనుమానాలకు తావిస్తోంది. రైతుల కష్టాన్ని దోచుకుంటుంటే.. అధికారులు చూస్తూ మిన్నంకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రక్‌షీట్ చూపిస్తూ ఆందోళన చేస్తున్న ఈ రైతులు నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందినవారు. గతేడాది నవంబర్ 25న ఈ గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో తూకం చేశారు. మొత్తం 796 ధాన్యం బస్తాలకు 318.40 క్వింటాళ్లుగా లెక్క తేలింది. ధన్వాడ సొసైటీ నుంచి లారీ రాగా లోడ్ చేశారు. సొసైటీ కార్యదర్శి వెంకట్రాములు లోడ్ చేసిన లారీని నారాయణపేట మండలం కొల్లంపల్లి మిల్లుకు తీసుకెళ్లాలని డ్రైవర్‌కు ట్రక్‌షీట్ రాసిచ్చాడు. లారీ డ్రైవర్ ఒప్పుకోకుండా కోస్గి మహాలక్ష్మి రైస్ మిల్లుకు రాయించుకుని తీసుకెళ్లాడు. అక్కడ అన్లోడ్ అయిన తర్వాత లారీ డ్రైవర్ 29న తిరిగి వచ్చి ట్రక్‌షీట్ రైతులకు ఇచ్చాడు. దాన్ని చూసి వారు కంగుతిన్నారు. 796 బస్తాలకు 786 బస్తాలు వచ్చినట్లు ఉంది. పది బస్తాలు.. సుమారు 4 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపడంతో రైతులు ఆందోళనకు దిగారు. -
స్వచ్ఛతకు పెద్దపీట : డీపీఓ
వనపర్తి రూరల్: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని డీపీఓ తరుణ్ చక్రవర్తి సర్పంచ్‌లకు సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామపంచాయతీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా పెద్దగూడెంలో సర్పంచ్ పుష్పలత, ఉపసర్పంచ్ భారతయ్య, వార్డుసభ్యులు డీపీఓను శాలువాతో సన్మానించారు. కడుకుంట్లలో సర్పంచ్ తిరుపతయ్యతో కలిసి పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. మొక్కలు వాడుముఖం పట్టకుండా నిత్యం నీరందించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం గ్రామసభలు నిర్వహించి సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధికి బాటలు కోరారు. ఆయన వెంట కార్యదర్శులు మల్లికార్జున్, చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కురుమూర్తి, ఆయా గ్రామస్తులు శివకుమార్, కొండన్న, విష్ణు, బుచ్చిబాబు, రవిశెట్టి, నహీం పాషా, గ్రామ పెద్దలు ఉన్నారు. వ్యవసాయ కళాశాలకు పక్కా భవనం కరువు వనపర్తి రూరల్: ఎంజేపీ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలకు పక్కా భవనం లేక జిల్లా నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పెద్దగూడెం శివారులోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. 2022లో జిల్లాకు కళాశాల మంజూరుకాగా ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో జిల్లా నుంచి తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. కోళ్ల షెడ్డులో కొనసాగుతున్న కళాశాలలో విద్యార్థులు విషపు పురుగులకు భయపడుతూ చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో 336 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని.. కలెక్టర్, ఎమ్మెల్యే తక్షణమే కళాశాలను సందర్శించి పక్కా భవనం నిర్మించాలని కోరారు. లేనిపక్షంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దేవర శివ, అంజన్నయాదవ్, ధరేంద్రసాగర్, రాఘవేందర్‌గౌడ్, అస్కని రమేష్, రామన్‌గౌడ్, రమేష్‌గౌడ్, కురుమూర్తి, గౌతమ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ మైనింగ్ నియంత్రణకు చర్యలు
వనపర్తి: జిల్లాలోని పోలీసు, ఇరిగేషన్, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో అక్రమ మైనింగ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సూచన మేరకు సీసీ కెమెరాలతో పర్యవేక్షణకు కీలక మార్గాలు గుర్తించాలని.. కీలక ప్రాంతాల నివేదిక ప్రభుత్వానికి అందించిన తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మైనింగ్ ఏడీ గోవిందరాజులు, ఆర్డీఓ సుబ్రమణ్యం, సీఐ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. రోవర్స్ పనితీరుపై శిక్షణ.. భూమి కొలతలు అత్యంత కచ్చితత్వంగా గుర్తించే రోవర్స్ పరికర పనితీరుపై శిక్షణ పొందాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. భూ భారతి చట్టం ప్రకారం భూదార్ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 70 గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించేందుకు మూడు రోవర్స్ యంత్రాలు పంపించినట్లు తెలిపారు. గురు, శుక్రవారం జిల్లాలోని 10 మంది సర్వేయర్లకు పోలీస్ పరేడ్ మైదానంలో శిక్షకుడు చంద్రకాంత్ శిక్షణ ఇవ్వగా శుక్రవారం అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోవర్స్ ఉపయోగించి భూ కొలతలు ఏ విధంగా చేపట్టాలి.. ఎలాంటి ప్రామాణికలు తీసుకోవాలనే అంశాలను బాగా నేర్చుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. తర్వాతి కాలంలో యంత్రాల వినియోగంపై లైసెన్స్డ్ సర్వేయర్లకు సైతం శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేసి భూదార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏడీ సర్వే ల్యాండ్ పి.శ్రీనివాస్, ఎస్డీఎం శిల్ప, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘తప్పుల తడకగా ఓటరు జాబితా’
అమరచింత: పురపాలిక ఎన్నికల సందర్భంగా గురువారం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పట్టణవాసులు , సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. పుర, తహసీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై పది వార్డులకు సంబంధించిన ఓటరు జాబితాలను గురువారం ప్రదర్శించారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు వార్డుల వారీగా పరిశీలించగా జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదని.. ఇప్పుడు ఓటర్ల పేర్లు ఏకంగా వార్డుల వారీగా తారుమారు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో పురుష ఓటర్లు 4,404, మహిళా ఓటర్లు 4,813, మొత్తం ఓటర్లు 9,217 మంది ఉన్నారని.. వీరంతా తమ తమ వార్డుల్లో ఓటు వేసేలా ఓటరు జాబితాను సవరించాలని కోరుతున్నారు. పుర కమిషనర్‌తో పాటు మేనేజర్, సిబ్బంది మద్య సఖ్యత లేక ఓటరు జాబితాలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. -
వేరుశనగకు డిమాండ్
● ప్రస్తుత యాసంగిలో సాగు విస్తీర్ణం 24,738 ఎకరాలే.. ● మినుము సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు ● మార్కెట్లో జోరుగా సాగుతున్న పల్లి విక్రయాలు ●వనపర్తి: జిల్లాలో వరుసగా రెండేళ్లు వేరుశనగ ధరలు ఆశాజనకంగా లేకపోవడం.. పంట సాగుకు రాత్రి, పగలు శ్రమించాల్సి రావడంతో రైతులు ప్రస్తుత యాసంగిలో మినుము సాగుకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్‌కు వేరుశనగ పంట ఉత్పత్తుల రాక తగ్గడంతో ప్రస్తుతం క్వింటా రూ.9,269కు చేరింది. కనిష్ట మద్దతు ధర రూ.7,263 ఉండగా.. జిల్లాకేంద్రంలోని మార్కెట్లో గరిష్టంగా 9,269.. కనిష్టంగా రూ.4,444 ధర పలుకుతోంది. నాణ్యమైన వేరుశనగకు గరిష్ట, సాధారణ ధరలు సైతం కనిష్ట మద్దతు ధర కంటే అధికంగా రూ.7,699 పలుకుతుండటంతో పంట సాగు చేయని రైతులు నిరాశకు గురవుతున్నారు. పెరిగిన మినుము సాగు.. జిల్లా రైతులు ప్రస్తుత యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరి తర్వాత అత్యధికంగా మినుము సాగునే ఎంచుకున్నారు. మార్కెట్లో ధరలు మాత్రం గతంతో పోలిస్తే ఆశాజనకంగా లేవనే వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో క్వింటా రూ.9 వేలకు పైగా ఉండగా.. ప్రస్తుతం రూ.7,600లకు మించడం లేదు. దీంతో రైతులు చేసేది లేక రవాణా ఖర్చులు మిగులుతాయని పొలం వద్దే దళారులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏమిటీ మార్కెటింగ్ మాయ..? రాత్రింబవళ్లు కష్టపడే రైతులను మార్కెట్లో ఎప్పటికప్పుడు చిన్నబుచ్చుతూనే ఉన్నారు. ప్రతిసారి మార్కెట్లో ఎక్కువగా పండించిన పంటలకు ధర లభించకోవడం.. తక్కువగా సాగు చేసిన మెట్ట పంటల ధరలు పెరగడం మార్కెటింగ్ మాయనా, లేక వాస్తవంగా ధరలు అలాగే ఉంటాయా? అనే విషయం తేలాల్సి ఉంది. 8,500 క్వింటాళ్ల విక్రయాలు.. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో 40 రోజుల వ్యవధిలో 8,500 క్వింటాళ్ల వేరుశనగ విక్రయాలు జరిగాయి. క్వింటా గరిష్టంగా రూ.9,269, కనిష్టంగా రూ.4,444.. సాధారణ ధర రూ.7,499 పలికినట్లు అధికారుల రికార్డులతో స్పష్టమవుతోంది. జిల్లాలో క్వింటా గరిష్టంగా రూ.9,269 -
పుర ఎన్నికల్లో సత్తా చాటుదాం : బీజేపీ
ఆత్మకూర్: స్థానిక పురపాలికలోని 10 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మేర్వ రాజు, పుర మాజీ ఫ్లోర్‌లీడర్ అశ్విన్‌కుమార్ కోరారు. శుక్రవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పుర ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీచేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పొత్తు పెట్టుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పుర ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ప్రజలకు నమ్మకం లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరి, ఆంజనేయులు, తమ్మలి విజయ్, ఆనంద్, తమ్మలి వెంకటేష్, రాము, విష్ణువర్ధన్‌రెడ్డి, శివశంకర్, శ్యామ్, సమద్, అనీల్‌గౌడ్, కొండాపురం రాము తదితరులు పాల్గొన్నారు. రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 975 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
హరిత సంరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకం
వనపర్తిటౌన్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నేషనల్ గ్రీన్ క్రాప్స్ డైరెక్టర్, హైదరాబాద్ ఆదేశాలనుసారం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లోని 8, 9వ తరగతి విద్యార్థుల కోసం వేస్ట్ టూ వెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపితే పచ్చదనం పదిలంగా ఉంటుందన్నారు. ఇందులో విద్యార్థులు భాగస్వాములవడంతో వారి కుటుంబం మొత్తం భాగమవుతారని, దీంతో పచ్చదనం పెరిగి ఉష్ణోగ్రతలు యధాస్థితికి వస్తాయని చెప్పారు. పరిసరాల్లోని వ్యర్థాలను అర్థవంతమైన వస్తువులుగా మార్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, ఆకర్షణీయమైన కళారూపంగా తీర్చిదిద్దవచ్చని ప్రదర్శన ద్వారా విద్యార్థులు రుజువు చేశారని అభినందించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. బాలికల ఉన్నత పాఠశాలకు మొదటి బహుమతిగా రూ.3 వేలు, కేతేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.2 వేలు, బాలుర ఉన్నత పాఠశాలకు మూడో బహుమతిగా రూ.వెయ్యి అందజేసినట్లు ఎన్జీసీ జిల్లా కో–ఆర్డినేటర్ ఐ.సుదర్శన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి రాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది కృతనిశ్చయంతో పనిచేయాలి
వనపర్తిటౌన్: అధికారులు, సిబ్బంది నూతన సంవత్సర లక్ష్యాలను నిర్దేశించుకొని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృత నిశ్చయంతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఆయన చాంబర్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి మొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల వనపర్తిటౌన్: పుర ఎన్నికల కసరత్తులో భాగంగా గురువారం రాత్రి పుర కార్యాలయం ఎదుట అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను విడుదల చేసినట్లు పుర కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉందని, ఓటరు జాబితాను వార్డు ప్రజలకు అందుబాటులో ఉంచమన్నారు. 10వ తేదీన ఫొటోలతో కూడిన తుది జాబితాను విడుదల చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ శంకర్, డీఈ యూనుస్, ఆర్వో సాయిలు, ఆర్ఐ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు
వనపర్తిటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో 2025 సంవత్సరంలో అతి తక్కువ సెలవులు తీసుకున్న ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని ఆయన శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి మాట్లాడారు. సెలవులు ఉన్నా.. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యున్నతి కోసం తక్కువ వినియోగించుకొని తోటి వారికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉత్తమ సిబ్బందిని సన్మానించడంతో తోటివారు నూతనోత్తేజంతో పని చేస్తారని, తద్వారా ప్రభుత్వ కళాశాలలు మరింత మెరుగుపడి విద్యార్థులకు లాభం చేకూరుతుందని తెలిపారు. వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున అధ్యాపకులు విద్యార్థులకు అందుబాటులో ఉండి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అతి తక్కువ సెలవులు తీసుకున్న వారిలో ప్రిన్సిపాల్స్ హైమావతి, భీమసేన, అధ్యాపకులు రాజి, కవిత, శిరీష, శ్రీనివాస్, రవీందర్, బోధనేతర సిబ్బంది శ్రీరాములు, మహబూబున్నీసా బేగం ఉన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటు చోరీ..!
సవాయిగూడెంలో ● విచారణకు స్వీకరించిన వనపర్తి జిల్లా కోర్టు ● జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వోలకు నోటీసుల జారీ ● 8వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ● బ్యాలెట్ బాక్స్, సామగ్రి సమర్పించాలని సూచన సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో ఓటు చోరీకి సంబంధించిన ఓ కేసును జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఓటర్ లిస్టులో చనిపోయిన వారు ఉన్నారని.. వలస వెళ్లిన వారు డబుల్ ఓటర్లుగా ఉన్నారని పలువురు గ్రామస్తులు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌తో పాటు రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని తొలగించాలని రెండేళ్ల నుంచి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు గ్రామంలోని 65 మంది పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలను పాత ఓటర్ లిస్టు ప్రకారమే నిర్వహించారు. దీనిపై గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా కోర్టులో పిల్ వేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వో తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్, సామగ్రి అంతా కోర్టుకు సమర్పించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వెల్లడించిన జాబితా ప్రకారం గ్రామంలో మొత్తం 2,201 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు యామిని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలత బరిలో నిలిచారు. శ్రీలతకు 913 ఓట్లు రాగా.. యామినికి 918 ఓట్లు వచ్చాయి. దీంతో యామిని ఐదు ఓట్లు తేడాతో గెలుపొందారు. మొత్తంగా 1,882 ఓట్లు పోల్ కాగా.. యామినికి 918, శ్రీలతకు 913, నోటాకు 12 రాగా.. 39 ఓట్ల చెల్లలేదు. గ్రామంలో వందకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని.. పోలింగ్ రోజు పేర్లు తొలగించిన వారి స్థానంలో పలువురు ఓటు వేసేందుకు రాగా అభ్యంతరం తెలిపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అయినా అధికార కాంగ్రెస్ నేతల అండదండలతో పోలీసులు బందోబస్తు మధ్య వారితో ఓటు వేయించారని చెబుతున్నారు. ఈ దొంగ ఓట్లతోనే తాము ఓటమి పాలైనట్లు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన పలువురు తెలిపారు. ఇది ముమ్మాటికీ ఓటు చోరేనని.. ఓటు చోరీ గురించి గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నేతలు దీనిపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని.. సవాయిగూడెం ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఓటు చోరీకి సంబంధించి ఇది రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు అని చెబుతున్నారు. -
పక్కాగా రహదారి భద్రత మాసోత్సవాలు
వనపర్తి: జిల్లాలో గురువారం నుంచి ప్రారంభించిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో జిల్లా రోడ్డు రవాణాశాఖ అధికారులతో కలిసి జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల వాల్‌పోస్టర్లు, కరదీపికలు, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రోజుకు ఒకటి చొప్పున నెల రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సవ్యంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు, యువత, వాహనదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 8వ తేదీన కలెక్టరేట్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి లఘు నాటికలు ప్రదర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 9వ తేదీన జిల్లాలోని లారీడ్రైవర్లు, 13న ఆటోడ్రైవర్లు, 19న తుఫాన్, ఇతర లైట్ గూడ్స్ వెహికిల్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలపై ఒకరోజు కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా రోడ్డు రవాణా అధికారి మానస, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, వెహికిల్ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త’ సంబురం..
● నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన జిల్లా ప్రజలు ● ఇళ్ల ముంగిట కనిపించిన రంగురంగుల రంగవల్లులు ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు వనపర్తి టౌన్: జిల్లా ప్రజలు నూతన సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇళ్లతో పాటు కాలనీలలో కేక్‌లు కట్ చేయడంతో పాటు ఒకరికొకరు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. యువత ‘విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. గురువారం ఉదయం మహిళలు, యువతులు ఇళ్ల ముంగిళ్లను రంగురంగుల రంగవల్లులతో అలంకరించారు. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలంటూ ప్రజలు ఉదయాన్నే ఆలయాలకు చేరడంతో కిక్కిరిశాయి. శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంతో పాటు జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, పాండురంగ విఠలేశ్వరస్వామి, చింతల హనుమాన్, బ్రహ్మంగారి ఆలయాలతో పాటు రామాలయం, కన్యకాపరమేశ్వరి ఆలయాలు, ఆత్మకూర్‌లోని సాయిబాబా, అయప్పస్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. అలాగే జిల్లాకేంద్రంతో పాటు ఆత్మకూర్‌లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి రూరల్: ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎంవీఐ వాసుదేవారావు కోరారు. గురువారం పెబ్బేరులోని ఎంవీఐ కార్యాలయంలో రెండో ఎస్ఐ దివ్యారెడ్డితో కలిసి రోడ్డు భద్రతా మహోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. అతి వేగంగా, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, ఊశన్న, సిబ్బంది ఉమారాణి, వెంకటేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రూ.279.29 కోట్ల మద్యం అమ్మకాలు తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని మద్యం డిపో నుంచి డిసెంబర్లో రూ. 279.29 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసినట్లు డిపో అధికారులు గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట టీజీఎస్బీసీఎల్ స్టాక్ పాయింట్ పరిధిలో 158 వైన్స్, 25 బార్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క నెలలోనే రూ. 279.29 కోట్ల విలువైన 2.70.400 ఐఎంఎల్ (లిక్కర్) కాటన్లు, 2.29.400 బీర్ల కేసులను తిమ్మాజిపేట డిపో నుంచి సరఫరా చేశారు. సాధారణంగా స్టాక్ పాయింట్ నుంచి ప్రతినెలా రూ. 150కోట్ల విలువైన మద్యం సరఫరా చేస్తారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 31న రూ. 10కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలి వనపర్తిటౌన్: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత విద్య బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్‌గౌడ్, ప్రధానకార్యదర్శి డి.కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కె.జ్యోతి, బి.వెంకటేష్, కోశాధికారి తిమ్మప్ప, డీఎస్ఓ శ్రీనివాసులు, ఆనంద్, జిల్లా కార్యదర్శులు హమీద్, పి.శ్రీనివాస్‌గౌడ్, జి.మురళి, వెంకటేష్, నాయకులు ఎన్.చంద్రయ్య, మల్లేష్, కృష్ణ, లక్ష్మణ్‌గౌడ్, నాగరాజు, రాము, నర్సింహ, మధు తదితరులు పాల్గొన్నారు. రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫ రా లేదన్నారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 975 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు గోపాల్పేట: నూతన సంవత్సరం మొదటిరోజు గురువారం మండలంలోని బుద్దారం గండి ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం ఏడు నుంచే వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం బయటి వరకు క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. -
ఆశయాలు.. ఆకాంక్షలు నెరవేరాలి
ఉన్నత చదువులతోనే అత్యున్నత శిఖరాలకు.. ‘కాలచక్రంలో మరో ఏడాది గడిచిపోయింది. నిర్దేశించుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని 2025కు గుడ్‌బై చెబుతూ.. 2026కు స్వాగతం పలికేందుకు అన్నివర్గాల వారు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరంలో విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు తెలుసుకొనేందుకు బుధవారం జిల్లాలోని పెద్దగూడెం శివారు మహాత్మా జ్యోతిబా పూలే వ్యవసాయ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో చర్చాగోష్టి నిర్వహించారు. మరికొన్ని నెలల్లో పీజీలోకి అడుగుపెట్టే విద్యార్థుల భవిష్యత్ ప్రణాళిక, సాగులో మార్పులు.. అందుకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, సమాజం.. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సేంద్రియ సాగు ప్రోత్సాహం, పద్ధతులపై వారితో చర్చించగా.. తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2026 సంవత్సరంలో అందరూ బాగుండాలి.. విద్య, ఉద్యోగ అవకాశాలు ఆశించిన మేర లభించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంతితో కలిసి విద్యార్థులు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. – వనపర్తి/వనపర్తి రూరల్ నేను అగ్రికల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నా. మా అధ్యాపకుల సూచనల మేరకు ఎమ్మెస్సీ ఎంటమాలజీ, పీహెచ్డీ చేయాలని ఉంది. లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదువుతూ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నా. లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నా. – పద్మజ, విద్యార్థిని, మహబూబ్‌నగర్ నేను వనపర్తి ఎంజేపీ బాలికల అగ్రికల్చర్ కళాశాలలో బీఎసీ (అగ్రికల్చర్) చివరి సంవత్సరం చదువుతున్నా. తర్వాత ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) చదవాలని ఉంది. సొంత కాళ్లపై నిలబడి జీవించాలనే లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగేందుకు ప్రణాళిక రూపొందించుకున్నా. – నవ్యశ్రీ, విద్యార్థిని, నారాయణపేట గడిచిన ఏడాది మధుర స్మృతులను గుర్తు చేసుకొని, కొత్త సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను నోట్ పుస్తకంలో రాసుకున్నా. మంచిగా చదివి ఉత్తమ మార్కులు సాధించి ఎమ్మెస్సీ ఎంటమాలజి చేయాలని ఉంది. ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్‌పై పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు అందించాలనేదే లక్ష్యం. – లావణ్య, విద్యార్థిని, వికారాబాద్ అగ్రికల్చర్ బీఎస్సీలో ఉత్తమ మార్కులు సాధించి ఎమ్మెస్సీ (ఆర్గానిక్ అగ్రికల్చర్) చదవాలని ఉంది. ప్రజలకు కల్తీలేని ఆహారం అందించేందుకు సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తా. అలాగే ఆర్గానిక్ ఫర్టిలైజర్‌పై రైతులకు కల్తీలేని ఎరువులు అందించేందుకు కృషి చేస్తా. ఇందుకోసం 2026 సంవత్సరంలో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతా. – అలేఖ్య, నిజామాబాద్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది నా లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో నిరంతరం చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ప్రస్తుత వార్షిక పరీక్షల్లోనూ ఉత్తమ మార్కులు సాధించేందుకు కష్టపడి చదువుతున్నా. ఐపీఎస్ కావాలన్నది నా లక్ష్యం. – ఉషాశ్రీ, జనగామ ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) చదివి స్వశక్తితో జీవించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా. మంచి వ్యాపారం ప్రారంభించి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉంది. వ్యాపారరంగంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే కోరిక ఉంది. – శివాని, విద్యార్థిని, నల్గొండ జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వ్యవసాయ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ చర్చాగోష్టి కొత్త సంవత్సరంలో తమ ఆశయాలు, అభిప్రాయాలు పంచుకున్న పలువురు విద్యార్థులు -
మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మదనాపురం: కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తూ వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని సరళాసాగర్ జలాశయంలో ఉచిత చేప పిల్లలను సంఘం నాయకులు, పార్టీ నేతలతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ప్రతి పేదోడి ముఖంలో చిరునవ్వు చూడాలనేదే ఆయన ఆశయమని.. కులవృత్తులపై ఆధారపడిన వారికి భరోసా కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా వందశాతం సబ్సిడీతో నాణ్యమైన చేప పిల్లలను అందిస్తున్నారని వివరించారు. చేపల విక్రయాల కోసం సంచార విక్రయ కేంద్రాలు, ఆధునిక మార్కెట్లను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు చెప్పారు. సరళాసాగర్ జలాశయంపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాసరావు, నాగరాజుగౌడ్, మత్స్యశాఖ ఏడీ లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, మండల కో–ఆర్డినేటర్ చుక్క మహేష్, మార్కెట్ డైరెక్టర్ పావని, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
పురపోరు.. కసరత్తు జోరు
● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు ● అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం ● మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి ● ఓటర్ల జాబితా సైతం.. నేడు ముసాయిదా విడుదల ● రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. తొలిసారిగా కార్పొరేషన్లో.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్‌గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు. కొత్తగా దేవరకద్ర.. మద్దూరు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన రోజే మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమయంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామాలను కలుపుకుని 16 వార్డులుగా విభజించారు. అదేవిధంగా దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకుని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. 2 మినహా మిగిలిన 19 మున్సిపాలిటీల్లో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్‌లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత: డీఎస్పీ
ఖిల్లాఘనపురం: శాంతిభద్రతల పరిరక్షణ సమష్టి బాధ్యతని.. విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాలు, స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎస్ఐతో పాటు సిబ్బంది నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ అంటే భయపడేలా కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసేలా ఉ ండాలన్నారు. అందుకు స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు. అదేవిధంగా సిబ్బందికి పలు సూచన లు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట ఎస్ ఐ వెంకటేశ్‌తో పాటు సిబ్బంది ఉన్నారు. అమరచింతకు బస్సులు నడపండి వనపర్తిటౌన్: జిల్లాకేంద్రం నుంచి అమరచింతకు ఉదయం సమయంలో బస్సులు నడపాలని పలువురు ప్రయాణికులు కోరారు. బుధవారం వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు పలువురు ప్రయాణికులు ఫోన్లు చేసి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు చేయగా నమోదు చేసుకొని సమాధానం ఇచ్చారు. శ్రీరంగాపురం పుణ్య క్షేత్రానికి పెబ్బేరు మీదుగా, కేతేపల్లి, కల్వరాల మీదుగా వీపనగండ్లకు బస్సులు నడపాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. ప్రయాణికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలను పరిగణలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నూతనోత్సాహం..
● వాడవాడలా యువత, చిన్నారుల సందడి ● కిటకిటలాడిన బేకరీలు.. మద్యం దుకాణాలు ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2025 సంవత్సరం గడిచిపోగా.. కోటి ఆశలతో 2026 సంవత్సరానికి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి పట్టణాల్లోని మిఠాయి దుకాణాలు, బేకరీలు, మద్యం దుకాణా వద్ద రద్దీ కనిపించింది. అర్ధరాత్రి 12 దాటగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఇళ్లు, రహదారులపై కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. యువత ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. ఇదిలా ఉండగా నూతన సంవత్సరం వేళ భక్తుల దర్శనార్థం గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలు, చర్చిలను ముస్తాబు చేశారు. – వనపర్తి టౌన్/ఆత్మకూర్ -
స్థానికం.. సంస్థాగతం!
వనపర్తిపాలమూరులో కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 20253 జిల్లాల్లో ‘ఢీ’సీసీ.. ఈ ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్ 22న ఐదు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్ కుమార్‌రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్‌నగర్‌లో సంజీవ్ ముదిరాజ్, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్‌రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు. కాంగ్రెస్: పై‘చేయి’.. అయినా డీలా.. మూడు విడతలుగా డిసెంబర్ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది. పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట -
శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో..
వనపర్తి రూరల్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రసిద్ధిగాంచిన శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు తెల్లవారుజామున 4.30 గంటలకు వైకుంఠద్వారం దగ్గర ద్వార పూజ నిర్వహించి రంగనాయకస్వామి, గోదాదేవి ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీపై ఉత్తరద్వారం దాటించారు. మహా విష్ణువు అవతారంలో స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబంతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నేడు డయల్ యువర్ డీఎం
వనపర్తిటౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని గ్రామస్తులు, ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను సెల్‌నంబర్ 99592 26289కు ఫోన్‌చేసి తెలియజేయాలని పేర్కొన్నారు. డిపో అభివృద్ధి, కండక్టర్లు, డ్రైవర్ల పనితీరుపై సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. గొల్లపల్లి రిజర్వాయర్ వద్దంటూ ధర్నా గోపాల్పేట: ఏదుల రిజర్వాయర్ ఉండగా మళ్లీ గొల్లపల్లి రిజర్వాయర్ ఎందుకని.. రైతులు భూములు కోల్పోయే అవకాశం ఉందని, వెంటనే పనులు నిలిపివేయాలని గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామాల రైతులు, గ్రామస్తులు మంగళవారం గొల్లపల్లి గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిలోమీటర్ దూరంలోనే ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ ఎవరి ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కేఎల్ఐ చేపట్టి నీటినిల్వకు రిజర్వాయర్ నిర్మించకపోవడంతో చివరి ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మిగిలిన కేఎల్ఐ పనులు పూర్తిచేసి ఐదు మండలాల్లోని 75 వేల ఎకరాలకు సాగునీరు అందించారని వివరించారు. గతంలో కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందించేందుకు గొల్లపల్లి రిజర్వాయర్ ప్రస్తావన తెచ్చారని.. తర్వాత రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విరమించుకున్నారని చెప్పారు. కొల్లాపూర్, వనపర్తి ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ఏదుల రిజర్వాయర్‌కు తూము ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం అవసరం లేకున్నా గొల్లపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టి రైతుల భూములు లాక్కోవద్దని కోరారు. పనులు చేపడితే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామనిహెచ్చరించారు. -
పకడ్బందీగా వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ
వనపర్తి: త్వరలో నిర్వహించే పుర ఎన్నికలకుగాను వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పుర కమిషనర్లు, మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 1న వార్డుల వారీగా ముసాయిదా ఎలక్ట్రోరల్ జాబితా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితా, వార్డులో అసెంబ్లీ ఉప విభాగాల వివరాల ఆధారంగా ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను జనవరి 5 నుంచి స్వీకరించి పరిష్కరించిన, తప్పులు లేని తుది ఓటరు జాబితాను 10వ తేదీన ప్రకటించాలని ఆదేశించారు. 5వ తేదీన పుర కమిషనర్లు ప్రముఖ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారికి వార్డుల వివరాలు తెలిపి అభ్యంతరాలు తీసుకోవాలని, జనవరి 6న కలెక్టరేట్లో కలెక్టర్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. వార్డుల మ్యాపింగ్ తప్పులు లేకుండా పకడ్బందీగా సిద్ధం చేస్తే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పుర కమిషనర్లు, మేనేజర్లు, సి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో యూరియా
● యాసంగిలో రైతులకు కావాల్సినంత యూరియా అందిస్తాం ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: యాసంగి 2025–26 సీజన్‌కు సంబంధించి జిల్లా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని.. ప్రతి రైతుకు కావాల్సినంత యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. యూరియా సరఫరాపై సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. వీసీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా, నేరుగా రైతులకు అవసరమైన యూరియా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రైవేటుతో పాటు ప్రభుత్వ, పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ యూరియా విక్రయ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోజు ఉదయం 6 గంటల నుంచే యూరియా పంపిణీ ప్రారంభం కావాలన్నారు. అదే విధంగా సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రైతులు దొడ్డురకం వైపు దృష్టిసారించకుండా సన్నరకాలే వేసే విధంగా మండల వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వీసీలో ఇన్చార్జి డీఏఓ దామోదర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, డీసీఓ రాణి పాల్గొన్నారు. వైకల్యం శరీరానికే.. లక్ష్యసాధనకు కాదు వైకల్యం అనేది శరీరానికి మాత్రమే అని.. లక్ష్యసాధనకు కాదని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన దివ్యాంగులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో మంది దివ్యాంగులు పట్టుదలతో సకలాంగులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. దివ్యాంగులందరూ తమ వైకల్యాన్ని అధిగమించి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వచ్చే నెలలో ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం బాలానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అశ్విన్‌ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కేవలం రెండో తరగతి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థి అశ్విన్.. రాష్ట్రం పేరు చెబితే రాజధాని పేరు, రాజధాని పేరు చెబితే రాష్ట్రం పేరు వెంటనే చెప్పేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా జిల్లా సమాఖ్య సభ్యులతో పాటు క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన దివ్యాంగులను కలెక్టర్ శాలువా, మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, మానసిక వైద్యురాలు పుష్ప, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడు మీసాల మోహన్, మధు పాల్గొన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి ప్రజావాణికి వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 30 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు. -
సాగులో నూతన ఒరవడి
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంతటా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్‌పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇతర పంటలకే ప్రాధాన్యం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు అధికంగా వరి, పత్తి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి నాగర్‌కర్నూల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పత్తి పంట సాగు తగ్గించి వరి వైపు రైతులు మొగ్గుచూపారు. మహబూబ్‌నగర్‌లో ఈసారి వరి 10 వేల విస్తీర్ణం పెరగగా.. పత్తి 2 వేల ఎకరాలు తగ్గింది. నాగర్‌కర్నూల్‌లో వరి విస్తీర్ణం ఏకంగా 66 వేల ఎకరాలు పెరిగింది. అలాగే పత్తి విస్తీర్ణం సైతం గతేడాది కన్నా 4 వేలు అధికంగా సాగైంది. నారాయణపేటలో వరి గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో రైతులు అధికంగా సాగుచేశారు. ఇక్కడ అధికంగా 50 వేల ఎకరాల్లో కందిపంట సాగవుతోంది. వనపర్తి జిల్లాలో వరి 8 వేల ఎకరాలు పెరగగా.. పత్తి విస్తీర్ణం 5 వేల ఎకరాలు తగ్గింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈసారి పత్తి సాగు 70 వేల ఎకరాల వరకు తగ్గగా.. వరి పంట విస్తీర్ణం 7 వేల ఎకరాలు తక్కువగా నమోదైంది. పాలమూరులో వినూత్నపంటల వైపు రైతుల మొగ్గు పలుచోట్ల ఆయిల్‌పాం, వాణిజ్య తోటల పెంపకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు యూరియా కోసం పాట్లు.. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి రైతులను యూరియా కష్టాలు వెంటాడాయి. పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం రోజుల తరబడి పంపిణీ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. తెల్లవారుజామునే పీఏసీఎస్‌ల వద్దకు వచ్చి క్యూలో నిల్చోవడం, రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు చేయడం కనిపించింది. సరిపడా యూరియా తెప్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. -
‘పాలమూరు’ పనుల్లో కదలిక..
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ ఏడాది ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రాజెక్టు కింద సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయినిగా నిలిచే ఈ ప్రాజెక్టు పనుల్లో కదలికతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు పూర్తయితేనే సాగునీరు అందనుంది. అలాగే రిజర్వాయర్ల నుంచి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణం చేపడితేనే రైతులకు మేలు చేకూరుతుంది. -
వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
విద్యుత్ దీపాల అలంకరణలో శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయంవనపర్తి రూరల్: జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినానికి ముస్తాబయ్యాయి. వైష్ణవాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులకు ఉత్తరద్వార దర్శనాలు కల్పించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేశారు. శ్రీరంగాపురం శ్రీరంగనాయక స్వామి ఆలయంలో తెల్లవారుజామున 4:30 గంటలకు ఉత్తర ద్వారం వద్ద ద్వారపూజ, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఈఓ శేఖర్‌గౌడ్ తెలిపారు. -
పోలీసు ప్రజావాణికి10 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 10 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆయన సూచించారు. జాప్యం లేకుండాఅత్యవసర సేవలు పాన్‌గల్: అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ కోసం సంప్రదించే వారికి జాప్యం లేకుండా సేవలు అందించాలని 108 అంబులెన్స్‌ల ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి సిబ్బందికి సూచించారు. సోమవారం పాన్‌గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జీవీకేఎంఆర్‌ఐ 108 వాహనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లోని వివిధ రకాల పరికరాలు, వాటి పనితీరు, మందులు, రికార్డులను పరిశీలించారు. 108 అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రజలు అత్యవసర వైద్యం కోసం ఏ సమయంలోనైనా 108ను సంప్రదించవచ్చని.. తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ఆయన వెంట జిల్లా ఈఎంఈ మహబూబ్, అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విష్ణు, పైలెట్ మురళి ఉన్నారు. ప్రతి కూలీకి ‘ఉపాధి’ కల్పించాలి అమరచింత: ఉపాధి హామీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో అధికారుల అలసత్వం కారణంగానే అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని.. ఇప్పటికై నా బాధ్యతగా పనిచేయాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అమరచింత మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ఉపాధి హమీ 4వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామాల వారీగా చేపట్టిన పనులు, కూలీలకు డబ్బుల చెల్లింపులను పరిశీలించారు. మండలంలో రూ. 5.50కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారని.. ఏపీఓ రఘుపతిరెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి డీఆర్పీలు సేకరించిన వివరాలను ఒక్కొక్క పంచాయతీ వారీగా వివరాలను వెల్లడించారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పని కావా లని అడిగితే ప్రతి కూలీకి ఉపాధి హామీ పను లు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పనులు చేసిన కూలీలకు క్రమం తప్పకుండా కూలి డబ్బులు చెల్లించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని.. రోజు మస్టర్లో కూ లీల వివరాలు నమోదు చేయాలన్నారు. కాగా, పక్కదారి పట్టిన రూ. 15,010 రికవరీ చేయా లని ఏపీఓను ఆదేశించారు. సమావేశంలో అంబుర్స్మెంట్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ రహీం, మల్లికార్జున, బాలరాజు పాల్గొన్నారు. రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో సోమవారం సముద్రమట్టానికి పైన 1,021 అడుగులకు గాను 1,020 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 600, కుడి, ఎడమ కాల్వలకు 35, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 94400 56770, 90102 04032
సోమవారం, సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు వనపర్తి: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ డా. సాయినాథ్‌రెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు డీఎంహెచ్ఓను ఫోన్లో సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
రాబంధుల పాలన వచ్చే
రైతుబంధు పాలన పోయి.. ● బీఆర్ఎస్ హయాంలో ఆగిన వలసలు మళ్లీ మొదలయ్యాయి ● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ● సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరులో ఆగిన వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. ఈ ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఎప్పుడూ పండబెట్టి తొక్కుతా అంటూ మాట్లాడే రేవంత్‌రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేపట్టే పోరాటానికి పాలమూరు బిడ్డలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రెతులు యూరియా బస్తాల కోసం గోస పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చలిలో చెప్పులు క్యూలో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్‌రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబితే రేవంత్‌కు సోయి వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని పేర్కొన్నారు. -
దుకాణాల కేటాయింపులపై..
నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్‌టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా.. ఇందులో దుకాణానికి ఒక్కో రేటు చొప్పున ఫిక్స్ చేసి కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కొందరు ఉద్యోగులు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ముఖ్య నేత ఆదేశాలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
ఖిల్లాఘనపురం: ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి లలిత, పీఈటీ చిట్టి తెలిపారు. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో జరిగిన అండర్ 14 ఉమ్మడి జిల్లాస్థాయి 5 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలో శశిప్రియ, మీనాక్షి, అండర్ 17 విభాగంలో కె.పూజ, మేఘన చక్కటి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. సోమవారం మల్కాజ్‌గిరిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయా విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను ఎస్ఓ, పీఈటీతో పాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. రామన్‌పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి జలాశయానికి నీటి సరఫరా నిలిచిపోగా.. ఎన్టీఆర్ కాల్వకు 600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూ సెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. యువత సేవా కార్యక్రమాలు నిర్వహించాలి ఖిల్లాఘనపురం: యువత ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నారాయణపేట జిల్లా మెడికల్ కళాశాల ఆర్ఎంఓ డా. శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఖిల్లా సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా ఆయనతో పాటు సేవాసమితి వ్యవస్థాపకుడు, ఏఎస్ఐ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సేవాసమితి ఏర్పాటుచేసి వైద్య శిబిరాలతో ప్రజలకు ఉచితంగా సేవలు అందించడం సంతోషించదగిన విషయమన్నారు. ఇలాంటిి కార్యక్రమాల నిర్వహణతో సమాజంలో యువతపై సదాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిబిరంలో డా. కృష్ణమూర్తి, డా. రవిరాజు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 210 మందిని పరీక్షించగా.. కంటిచూపుతో బాధపడుతున్న 162 మందికి కంటి అద్దాలు తయారు చేయించి వచ్చే వారం అందిస్తామని సమితి వ్యవస్థాపకులు కొరిగెల గోపి, రాగిరి పెద్దరాజు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆగారం ప్రకాష్, గోనెల నాగేష్, గోవిందు, లింగస్వామి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గోపాల్, బీజేపీ నాయకులు బెన్నూరు ఆశన్న, రామచంద్రయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పోషకాల ఆహారం అందించాలి వనపర్తిటౌన్: విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ పాటిస్తూ పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందించాలని కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి ఒక బృందం పాల్గొని వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు. వీటిని జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతి ఏదుల మండల సిబ్బంది మంజుల, శైలజ.. ద్వితీయ బహుమతి గోపాల్పేట సిబ్బంది పద్మ, ఎల్లమ్మ.. తృతీయ బహుమతి పెద్దమందడి మండలం మోజర్ల సిబ్బంది అందుకున్నారు. కార్యక్రమంలో ఏఎంఓ మహానంది, జీసీడీఓ శుభలక్ష్మి, డీఎస్ఓ శ్రీనివాసులు, ఎంఈఓలు జయరాములు, మంజుల, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ, మౌనిక, ఏపీఓ శ్రీధర్‌రెడ్డి, వరప్రసాదరావు, శాంతన్న తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే పేదల అభ్యున్నతి
వనపర్తిటౌన్: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన కాంగ్రెస్‌పార్టీ దేశ ప్రజల మన్ననలు చిరకాలం పొందుతూనే ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో 140 ఏళ్ల చరిత్ర ఉన్న ఏకై క పార్టీ కాంగ్రెస్ అని.. స్వాతంత్య్ర తొలినాళ్లలో తినడానికి సరైన తిండి లేని పరిస్థితుల నుంచి దేశ గౌరవాన్ని కాపాడుతూ అభివృద్ధి చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. టీపీ సీసీ కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, పీసీసీ కమిటీ సభ్యుడు డెలిగేట్ శంకర్‌ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, టీఎస్ మీడియా కన్వీనర్ నందిమళ్ల చంద్రమౌళి, జిల్లా నాయకులు కదిరె రాములు, కోళ్ల వెంకటేష్, మధుగౌడ్, ఎండీబాబా, గణేష్‌గౌడ్, నాగరాజు, వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటమిని సమానంగా చూడటమే క్రీడాతత్వమని.. గెలిచినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, ఓడినప్పుడు నిరుత్సాహపడొద్దని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కోరారు.. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ప్రీమియం లీగ్ సీజన్–6 క్రికెట్ పోటీల చివరి మ్యాచ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బ్యాటింగ్ చేసి పోటీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది ఉండదని.. క్రీడాకారులు తమ నైపుణ్యాలతో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, లీగ్ నిర్వాహకులు మధు, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. -
కూల్‌పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం ● మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్ ● నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు ● వైన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ ● ‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ ● పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు ● ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా? సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్శ్రీగా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్‌లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 94400 56770, 90102 04032
తేదీ : 29–12–2025 సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు వనపర్తి: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ డా. సాయినాథ్‌రెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు డీఎంహెచ్ఓను ఫోన్లో సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
నిర్వాహకులు నిర్లక్ష్యం వీడాలి : డీఆర్డీఓ
వీపనగండ్ల: వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం వీడి బాధ్యతాయుతంగా పని చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి హెచ్చరించారు. శనివారం మండలంలోని కల్వరాలలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని.. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, వీఓఏలు, మహిళా సంఘం సభ్యులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆమె వెంట సర్పంచ్ బండారు రాములు, ఏపీఎం మద్దిలేటి, వీఓఏలు నాగయ్య, ప్రసాద్, పలువురు రైతులు, గ్రామస్తులు ఉన్నారు. -
స్పందించిన జిల్లా యంత్రాంగం
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం వై శాఖాపూర్ సర్పంచ్ నిఖిత ఈ నెల 23న జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలెక్టరేట్లో కలిసి గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఎంపీఓ రోజ శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను పాలకులు, గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు చెప్పారు. -
విధేయులకే కార్యవర్గంలో చోటు
వనపర్తి: డీసీసీ కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఇప్పటి వరకు ఉన్న జిల్లా, నియోజకవర్గ, మండల కార్యవర్గాలన్నీ రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మత్స కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకుడు మెట్టు సాయికుమార్ తెలిపారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులతో కలిసి మాట్లాడారు. త్వరలో అత్యవసర సమావేశం నిర్వహించి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి సమక్షంలో స్క్రీనింగ్ చేసి జిల్లా, మండల, గ్రామ కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ విధేయులు, పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి, అక్రమ కేసులతో ఇబ్బందులు పడిన వారి తర్వాతే మిగతా వారిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని.. పైరవీలకు ఎలాంటి ఆస్కారం లేకుండా పార్టీ బలోపేతం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కార్యవర్గాల ఎన్నిక ఉంటుందని వివరించారు. పార్టీ ఎస్సీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పని చేస్తుందని.. స్వ లాభాలు ఆశించదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, పీసీసీ డేలిగేట్ శంకర్‌ప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మహిళా నాయకురాలు ధనలక్ష్మి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల చంద్రమౌళి, నాయకులు పసుపుల తిరుపతయ్య, నాయకులు కదిరె రాములు, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, బి.కృష్ణ, బాబా, దివాకర్, గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకుడు మెట్టు సాయికుమార్ -
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
కొత్తకోట/కొత్తకోట రూరల్: నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థ పాలన అందించాలని, గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని, అందుకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో కొత్తకోట, మదనాపురం మండలాల్లో కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వారిని శాలువాలతో సన్మానించి మాట్లాడారు. పాలమూరు జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం తర్వాత దేవరకద్రలో అత్యధిక సంఖ్యలో పార్టీ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పుర ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితాలు పునరావృతం అవుతాయని, రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీ చేసి ఓడిన సర్పంచులు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించి తిప్పికొట్టాలన్నారు. రానున్న ఏప్రిల్ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ఎల్–1, ఎల్–2 అర్హత పొందిన 37 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. కొత్తకోట పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం పుర కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా సంతబజార్ అభివృద్ధి, పురపాలక భవనం, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, ఆడిటోరియం, బస్తీ దవాఖానా ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమన్వయంతో పనిచేస్తూ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, ఎన్జే బోయేజ్, శ్రీనివాస్‌రెడ్డి, రావుల కరుణాకర్‌రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, డా. పీజే బాబు, నరేందర్‌రెడ్డి, పెంటన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ఆశాల ఆందోళన
వనపర్తి రూరల్: పల్స్‌పోలియో, కుష్టు సర్వే, ఎన్నికల విధుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని జిల్లా ఆశా కార్యకర్తల సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని మర్రికుంట నుంచి కలెక్టరేట్ వరకు ఆశా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం కార్యదర్శి బుచ్చమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేష్, జిల్లా కార్యదర్శి మండ్ల రాజు తదితరులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎన్నికల సమయం ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని కోరారు. జిల్లా వైద్యాధికారి రెండువారాల్లో కుష్టు సర్వే డబ్బులు చెల్లిస్తామని చెప్పారని.. వెంటనే విడుదల చేయాలన్నారు. ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం జిల్లా నాయకులు గిరిజ, ఇందిర, లత, అలివేలు, శ్యామల, చెన్నమ్మ, భాగ్యమ్మ, లక్ష్మి, మహేశ్వరమ్మ పాల్గొన్నారు. -
సైబర్.. టెర్రర్
–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలే వేదికగా వల పన్ని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆయా వర్గాల వ్యక్తుల బలహీనత అయిన అత్యాశను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల పేర్లతో ఏపీకే లింక్‌లు పంపించి నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట యువత నుంచి భారీగా డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. వారి మాయలో చిక్కుకున్న వారిలో అమాయకులే కాకుండా.. రైతులు మొదలుకొని విద్యాధికులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరుపై ‘సాక్షి’ క్రైం రౌండప్.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి గతేడాది (2024)లో మొత్తం 3,003 ఫిర్యాదులు రాగా.. 236 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2025 సంవత్సరంలో 3,625 ఫిర్యాదులు అందగా.. 454 కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 622 ఫిర్యాదులు.. 218 కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సైబర్ నేరాల సంఖ్య అధికంగా ఉంది. జిల్లాలో గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు ఉమ్మడి పాలమూరులోని 4 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఈసారి మొత్తం 3,625 ఫిర్యాదులు.. 454 కేసులు నమోదు అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో.. అత్యల్పంగా వనపర్తిలో.. ఈ ఏడాది కేటుగాళ్లు కొల్లగొట్టింది రూ.9.29 కోట్లు గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిన రికవరీ -
రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
వనపర్తి: జిల్లాకేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో సోమవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని.. జిల్లా లోని దివ్యాంగులు, వారి సంక్షేమానికి పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, సంఘ నాయకులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం తగదు వనపర్తి రూరల్: రైతులు కేంద్రాలకు వరి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెబ్బేరు, మండలంలోని కంచిరావుపల్లి, శ్రీరంగాపురం మండలం నాగరాలలో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. పెబ్బేరులో సింగిల్‌విండో కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, సింగిల్‌విండో అధికారులతో ధాన్యం సేకరణపై చర్చించారు. కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం లేకపోవడంపై సిబ్బందిని నిలదీశారు. కలెక్టర్ స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వీవీ గౌడ్, ధర్మేంద్రసాగర్, దేవర శివ, అస్కాని రమేష్, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామన్‌పాడుకు నిలిచిన నీటి సరఫరా మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి శనివారం జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉందని.. ఎన్టీఆర్ కాల్వకు 620 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ‘ఉపాధిహామీ’ కొనసాగించాలి గోపాల్పేట: కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వీబీజీ రాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజివికా మిషన్ గ్రామీణ్) పథకాన్ని వెంటనే రద్దుచేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలీలతో కలిసి పట్టణంలోని రావిచెట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపి పలు డిమాండ్ల వినతిపత్రాన్ని తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉత్సాహంగా హ్యాండ్‌బాల్ ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14 విభాగం హ్యాండ్‌బాల్ బాల, బాలికల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపికై న జట్లు నారాయణపేటలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రాష్ట్రస్థాయి టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్, ప్రదీప్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరులో 18,446 కేసులు పెండింగ్
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 18,446 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మౌళిక సదుపాయాల కల్పనతో కోర్టులలో పెండింగ్ కేసులు తగ్గించే విధంగా న్యాయవాదులు కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ అన్నారు. నగరంలోని బండమీదిపల్లి సమీపంలో రూ.81 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ నర్సింగ్‌రావులతో కలిసి జస్టిస్ శ్రావణ్‌కుమార్ శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నగరంలో 16, జడ్చర్లలో 3 మొత్తం 19 కోర్టులు ఉండగా.. 293 మంది సిబ్బందికి గాను 252 మంది ఉన్నారని వెల్లడించారు. 504 మంది న్యాయవాదులు ఉండగా 35 మంది మహిళా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం 2.5 ఎకరాల స్థలంలో సరిపోని విధంగా ఉందని, నూతన కోర్టు భవన సముదాయం విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం 2024 నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో కొనసాగిన ఎస్జీఎఫ్ అండర్–14 బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై నిజామాబాద్ జట్టు 1–0 గోల్స్‌తో విజయం సాధించింది. ప్రథమ స్థానంలో నిజామాబాద్, ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్, మూడో స్థానంలో హైదరాబాద్ జట్లు నిలిచాయని ఎస్జీఎప్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.నిరంజన్‌గౌడ్ తెలిపారు. గ్రామంలో హాకీ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, ఎంఈఓ మద్దిలేటి బహుమతులు అందజేసి మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బోలమోని కుమార్, పీడీ మన్యం, దాతలు తిరుమల్‌రెడ్డి, చీర్ల వెంకటసాగర్, మధుగౌడ్, చిన్నారెడ్డి, భాస్కర్, ,గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆద్యంతం.. అయ్యప్ప నామం
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని రాజనగరంలో ఉన్న వీరశాస్త్ర అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప మండలపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున మొదలైన పూజా కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగగా భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్ సిద్ధాంతశర్మ, గురుస్వాములు అన్నంతో అయ్యప్పను తయారుచేసి ఆవాహించి వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలవిగ్రహాన్ని అభిషేకించి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పల్లకీసేవ మేళతాళాల నడుమ భక్తిశ్రద్ధలతో జరిపించారు. మాలాధారులు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. రాత్రి 7 గంటలకు గురుస్వాములు అయ్యప్ప ఆల యం ఎదుట గల ఏకశిల పదునెట్టాంబడి పడి పూజ వైభవంగా నిర్వహించారు. రాత్రి 11.30 వరకు పూజ లు అల్పాహారం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఏటా మండల పూజ నిర్వహించే భాగ్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆభరణాలతో దర్శనమిచ్చిన స్వామివారు మార్మోగిన అయ్యప్ప నామస్మరణ -
సమస్యల సాధనకు పోరాటం : సీపీఐ
ఆత్మకూర్: దేశం, రాష్ట్రంలోని సమస్యల సాధనకు ప్రజలు, రైతులు సమష్టిగా మరో పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు నర్సింహయ్యశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణశెట్టి అధ్యక్షతన పట్టణంతో పాటు మండలంలోని మూలమళ్ల, పిన్నంచర్లలో నిర్వహించిన శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. 1925, డిసెంబర్ 26న సీపీఐ ఆవిర్భవించిందని, నాటి నుంచి నేటి వరకు దేశ ప్రజలకు అండగా నిలుస్తూ వలసవాదులైన బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమేయడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాబర్ట్, మోషా, లింగన్న, బాలకృష్ణ, ఆంజనేయులు, భాస్కర్, కుతుబ్, నాగరాజు, కురుమన్న, భీమన్న, చంద్రశేఖర్, లక్ష్మన్న, దాసు, బాలస్వామి, మల్లేష్, గోవర్దన్, చెన్నప్ప, ఆదాం, హనుమంతు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
కలెక్టర్ ప్రత్యేక చొరవతో రూపొందించిన దృష్టి కార్యక్రమాన్ని మధమేహ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకొని సమస్య ఉన్న వారు జాప్యం చేయకుండా వైద్యుడితో మరోమారు పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలి. – డా. సాయినాథ్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఒకేసారి మూడురకాల కంటి సమస్యలను గుర్తించే ఏఐ సాంకేతికతో రూపొందించిన ఆధునిక యంత్రాలను కలెక్టర్ కొనుగోలు చేశారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో నిర్వహిస్తున్న శిబిరాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఒకే నిమిషంలో పరీక్ష పూర్తవుతుంది. సమస్య ఉంటేనే.. రెండోసారి వైద్యుడితో పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. – డా. రాంచందర్‌రావు, కార్యక్రమ అధికారి, వనపర్తి ● -
రాష్ట్రంలోనే ప్రత్యేకంగా జిల్లాలో అమలు
● ప్రజారోగ్యంపై కలెక్టర్ చొరవ ● అభినందించిన డబ్ల్యూహెచ్ఓ బృందం, గవర్నర్ ● కంటిచూపు నివారణకు ముందస్తు చర్యలు వనపర్తి: విద్య, వైద్యంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజారోగ్యంలో భాగంగా 2025లో రెండు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టారు. ఆయా కార్యక్రమాలు విజయవంతం కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం, గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 1న కొత్తకోట పీహెచ్‌సీని సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ బృందం జిల్లాలో కొనసాగుతున్న మిషన్ మధుమేహ, దృష్టి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్న వారు కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గుర్తించిన కలెక్టర్ ముందస్తు చర్యల్లో భాగంగా దృష్టి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం ఇతర ప్రాంతాలకు ఆదర్శమని డబ్ల్యూహెచ్ఓ బృందం ప్రతినిధులు కితాబునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమం అమలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖకు సిఫారస్ చేయనున్నట్లు వారు రాష్ట్ర పర్యటనలో వెల్లడించారు. ఇటీవల జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పర్యటించిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఆయా కార్యక్రమాలపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లు, నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, ముందుజాగ్రత్త చర్యలు, శస్త్రచికిత్సల సిఫారస్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని కలెక్టర్, వైద్యబృందాన్ని అభినందించారు. ఆయా కార్యక్రమాలు త్రిపురలోనూ అమలు చేసేందుకు ఓసారి రాజ్‌భవన్‌కు రావాలంటూ గవర్నర్ స్వయంగా కలెక్టర్‌కు ఆహ్వానించడం గమనార్హం. కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం.. జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారు కంటిచూపు కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, సూచనలు చేయడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శుక్లం (కాంటాక్) ఆపరేషన్‌తో పాటు కళ్లద్దాలు ఇవ్వడం, తీవ్రతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం, ప్రతినెల వారికి అవసరమైన మాత్రలు, మందులు అందిస్తున్నారు. మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా పలు దఫాల్లో 40 ఏళ్లు నిండిన 3.06 లక్షల మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించి.. 19,643 మంది వ్యాధిగ్రస్తులుగా గుర్తించారు. వీరికి భవిష్యత్‌లో తలెత్తే కంటిచూపు సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా దృష్టి కార్యక్రమాన్ని రూపొందించారు. పీహెచ్‌సీల వారీగా మధుమేహ వ్యాధిగ్రస్తులు జిల్లాలోని 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో నవంబర్ 14 నుంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రెండు యంత్రాలను కొనుగోలు చేసి ఇప్పటి వరకు 2,904 మందిని పరీక్షించి 225 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఆప్తమాలజిస్ట్లు మరోమారు పరీక్షలు చేయాలనే నిబంధన ఉండటంతో ఇప్పటి వరకు 116 మందిని వైద్యుడు పరీక్షించి 20 మందిని శస్త్రచికిత్సలకు సిఫారస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర కారణాలతో మరో 109 మంది పరీక్షలు వాయిదా పడ్డాయి. -
అలివిలవిల..
కృష్ణానది తీరం వెంట తనిఖీలను ముమ్మరం చేస్తాం. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేటను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రధానంగా స్థానిక మత్స్యకారులు అధికారులకు సహకరించాలి. – నర్సింహారావు, ఏడీ, మత్స్యశాఖ కొల్లాపూర్: అలివి వలలతో చేపల వేట నిషేధం. అయినప్పటికీ కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం కృష్ణానదిలో అలివి వలలతో వేట సాగిస్తూ.. చిన్న చేప పిల్లలను యథేచ్ఛగా పట్టేస్తున్నారు. ఫలితంగా సంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అలివి వలలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామని.. అవసరమైతే ఏపీ అధికారుల సమన్వయంతో అలివి వలలతో చేపల వేటను కట్టడి చేస్తామని ఇటీవల కొల్లాపూర్‌లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చాలాకాలంగా అలివి వలల వినియోగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార యంత్రాంగంలో మాత్రం స్పందన కనిపించడం లేదు. కృష్ణానదిలో విచ్చలవిడిగా అలివి వలల వినియోగం జరుగుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు, అధికారులు చేతలకు పొంతన లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కృష్ణానదిలో వదులుతున్న చేప పిల్లలను కొన్ని రోజుల్లోనే అలివి వలలతో పట్టేస్తుండటంతో క్రమేణా మత్స్య సంపద తగ్గుతూ వస్తోంది. కృష్ణాతీరంలోనే గుడారాలు.. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్న కృష్ణానది తీరం వెంట పదుల సంఖ్యలో అలివి వలలతో చేపల వేట సాగించే వారి గుడారాలు ఉన్నాయి. చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల్లోని నది తీర ప్రాంతాల్లో విస్తృతంగా అలివి వలలతో చేపల వేట సాగుతోంది. వైజాగ్, కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నదీ తీరంలోని పట్లు (చేపలు అధికంగా లభించే ప్రాంతాలు) కొనుగోలు చేసి దందా సాగిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల చెంతనే.. పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం.. కృష్ణానదిలో బోట్ల ద్వారా విహరించడం కనిపిస్తుంది. అయితే సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి కనుచూపు మేరలోనే అలివి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలు ఉన్నాయి. నదీ తీరానికి రెండు వైపులా గుడారాలు, ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలివి వలల గుడారాలే కనిపిస్తాయి. అలివి వ్యాపారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందుకే అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల నిర్బంధం.. అలివి వలలు లాగేందుకు చాలామంది కార్మికులు అవసరం పడతారు. దీంతో వ్యాపారులు బలవంతంగా కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధిస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల జోక్యంతో 100 మందికిపైగా బాండెడ్ లేబర్‌కు విముక్తి కల్పించారు. అయినప్పటికీ కార్మికశాఖ అధికారులు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హాకీ ఆడుతున్న క్రీడాకారులు జిల్లాలోని నీటి వనరుల్లో ఈ ఏడాది 2.50 కోట్ల చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో చేపపిల్లల విడుదలను లాంచనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 23 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. సోమశిల వద్ద కృష్ణానదిలో మంత్రి జూపల్లి కృష్ణారావు 58 వేల చేపపిల్లలను వదిలారు. నదిలో 30 లక్షల చేపపిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్నసైజు చేపల వేట ఇలా వదిలితే.. అలా పట్టేస్తున్న అక్రమార్కులు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు స్వయంగా మంత్రులు హెచ్చరించినా కనిపించని స్పందన క్రమంగా తగ్గిపోతున్న మత్స్య సంపద కృష్ణానది తెలంగాణ, ఏపీ సరిహద్దులో ప్రవహిస్తోంది. తాము తనిఖీలకు వెళ్లే సమయానికి అలివి గుడారాలను ఏపీ సరిహద్దులోకి మారుస్తున్నారంటూ తెలంగాణ అధికారులు చెబుతూ.. తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, వేంకల్, జటప్రోల్, అమరగిరి ప్రాంతాల్లో నెలల తరబడి గుడారాలు తెలంగాణ సరిహద్దులోనే ఉంటాయి. అధికారులు అనుకుంటే ఏ క్షణమైనా వారిని పట్టుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వనపర్తి: అహంకారపూరిత అధికారం, మద్యం, డబ్బు ఏవీ నిబద్ధత ఎదుట నిలబడలేవని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిరూపించాయని.. బీఆర్ఎస్ మద్దతుదారులు అధికార పార్టీకి ధీటుగా విజయం సాధించడం గర్వంగా ఉందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాపార్టీ కార్యాలయంలో కృష్ణానది జలాల హక్కుల సాధన, పార్టీ గ్రామపంచాయతీ పాలకవర్గాల సన్మాన కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా మాజీ మంత్రి నివాసం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు గులాబీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు రెండేళ్లకే విరక్తి వచ్చిందని పంచాయతీ ఫలితాలతో స్పష్టమవుతోందన్నారు. రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 45 రోజుల పాటు వచ్చిన జూరాల జలాలను సముద్రానికి వదిలేశారని.. వరద జలాలను ఒడిసి పట్టుకునే చేతగాని పాలకులని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడలేక యాసంగి సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారని విమర్శించారు. ఖిల్లాఘనపురం మండలం సోళీపురం, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామపంచాయతీ ఫలితాలపై అనుమానం ఉందని.. రీ కౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రధాన గ్రామాల్లో పార్టీ మద్దతుదారులు విజయఢంకా మోగించారని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన గోపాల్‌పేటలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు బీఆర్ఎస్కు మద్దతునిచ్చారని గుర్తుచేశారు. అభివృద్ధి చేసి చూపండి.. విమర్శలు కాదు.. ఇచ్చిన హామీలు అమలుచేసి, అభివృద్ధి పనులు చేసి చూపించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి అధికార పార్టీకి సవాల్ విసిరారు. కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఊరూరా ట్యాప్‌లు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి సారించిందని ఆరోపించారు. గ్రామ పాలకులకు విశేష అధికారాలు ఉంటాయని, చట్టం తెలుసుకొని ప్రజలకు మంచి పాలన అందించాలని సర్పంచులు, వార్డు సభ్యులకు సూచించారు. 2018లో అప్పటి ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందని, కేంద్రం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు వస్తాయని వివరించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, వైద్యంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేష్‌గౌడ్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు మాణిక్యం, విజయ్, కురుమూర్తి యాదవ్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు గురువారం క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాలోని చర్చిల్లో క్రైస్తవుల ప్రార్థనలు, గీతాలతో మార్మోగాయి. జిల్లాకేంద్రంలోని ఒలివా ఎంబీ చర్చిలో జరిగిన వేడుకలకు శంషాబాద్‌కు చెందిన ప్రముఖ దైవ ప్రసంగీకుడు డా. జయకర్ హాజరై సందేశమిచ్చారు. సర్వమానవాళిపై ప్రేమ, కరుణ, క్షమాగుణం కలిగి ఉండాలని యేసు ఆచరణలో చూపారని, అలాంటి దేవుడిపై విశ్వాసంతో జీవించాలని కోరారు. సర్వ మానవాళి క్షేమానికి ప్రార్థఽనలు చేశారు. అదేవిధంగా మిగతా చర్చిల్లో కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో కల్వరి టౌన్ చర్చి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా న్యూయోరిషలేమ్ గాస్పాల్, బేతస్థ ప్రార్థన మందిరిం, హెబ్రోన్, సీయోనుకొండ, క్రీస్తు సాక్షుల సవాస మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో కల్వరి టౌన్ చర్చి నిర్వాహకులు గంధం రంగస్వామి, డి.యాకోబు, పరంజ్యోతి, ఎంబీ వోలీవా చర్చి పాస్టర్ జానప్ప, కల్వరి టౌన్ చర్చి పాస్టర్ జాన్‌రాజ్, వోలీవా చర్చి చైర్మన్ సుకన్య, యేసయ్య, రోనాల్డ్, కోశాధికారి అమృత సాగర్, సభ్యులు విద్యాసాగర్, కళానందం, పీడీ కమలమ్మ, వనజాశ్రీ, ఎర్నాల్డ్, స్వామిదాస్, జయనందం తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు, నాటికలు.. జిల్లాకేంద్రంలోని పలు చర్చిల్లో బుధవారం రాత్రి చిన్నారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏసు పుట్టుక, ఇతివృత్తం తెలిపే నాటికలు, ఏసు ప్రభువు ప్రజలపై చూపే జాలి, కరుణ, దయ, క్షమాగుణాలు తెలియజేసే పలు నాటికలు అధ్యంతం అలరించాయి. -
రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు జిల్లా జట్టు
వనపర్తి విద్యావిభాగం: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 2న జరగనున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు జిల్లా జట్టును గురువారం ఎంపిక చేసినట్లు డీవైఎస్ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా జట్టు ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. పోటీల్లో వివిధ పాఠశాలలు, కళాశాలల అథ్లెట్లు పాల్గొని ప్రతిభ చాటారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని.. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు వనపర్తి టౌన్: శబరిమలలో అయ్యప్పస్వామికి మండలపూజ సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో అయ్యప్ప మాలధారులు గురువారం స్వామివారి ఆభరణాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. రాజనగరంలోని అయ్యప్ప ఆలయం నుంచి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. మండలదీక్ష పూజలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని అయ్యప్ప సేవాసమితి నిర్వాహకులు కోరారు. మాలధారులు ముత్తుకృష్ణ, కృష్ణసాగర్, స్వామి, పాపిరెడ్డి, నరేందర్శెట్టి పాల్గొన్నారు. ఆదిశిలా క్షేత్రంలో జడ్జీల ప్రత్యేక పూజలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జీ లక్ష్మి, వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ సబ్‌కోర్టు జడ్జీ కళార్చన వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు అరవిందరావు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతలను వివరించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటో అందజేశారు. వారి వెంట ఆలయ నిర్వాహకులు చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ విధేయులకు తగిన ప్రాధాన్యం
వనపర్తి: పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికై నా సముచిత స్థానం, ప్రాధాన్యం దక్కుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ చాలా బలంగా ఉందని.. పార్టీ కన్నతల్లి లాంటిదని శ్రేణులు గుర్తించాలని కోరారు. చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలను సంయుక్తంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారని గుర్తు చేశారు. ఉనికి కోల్పోతున్నామనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి తోలు తీస్తామని స్టేట్మెంట్ ఇచ్చి తిరిగి అక్కడికే చేరుకున్నారని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ తోలు తీశారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను త్వరలో ఎత్తివేస్తామని క్యాడర్లో ధైర్యాన్ని నింపారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ప్రభుత్వానికి రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. రాబోయేది కూడా కాంగ్రెస్ హయాంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. వలసల పాలమూరు అభివృద్ధికి ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే.. రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ కలిసి ఉండేందుకు నాలుగు మెట్లు దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన లోపాలను గుర్తించేందుకు కమిటీ వేయాలని.. నిజాలను వెలికితీసి భవిష్యత్‌లో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుందామన్నారు. పాత.. కొత్త అనే తేడాలు లేకుండా ఒక్కటే అన్న పేరును తీసుకొద్దామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ ముగిసిన తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి డీసీసీ అధ్యక్షుడిని సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూతన కార్యాలయంలో పూజలు చేశారు. పని చేయకుంటే పక్కనబెట్టుడే.. పార్టీ పదవులు పొంది పని చేయకుండా సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైతే పక్కన పెడతామని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు సిఫారస్ చేసినా ఉపేక్షించేది లేదని డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొత్తకాపు శివసేనారెడ్డి తెలిపారు. పార్టీ బాగుంటేనే పదవులు పొంది ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. అత్యాధునిక హంగులతో జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేస్తామని, మనస్పర్థలను చర్చలతో రూపుమాపి ఎదురులేని శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులు సంధ్య, మల్లయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శంకర్‌ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్‌గౌడ్, ధనలక్ష్మి, యాదగిరి, బాబా తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడి పదవీ బాధ్యతల స్వీకారంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి -
ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన
వనపర్తి రూరల్: మండలంలోని అంకూరులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సేకరించిన వరి ధాన్యాన్ని వెంటనే తరలించాలంటూ రైతులు గురువారం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి ధాన్యం కేంద్రంలో రెండు నెలలుగా ఆరబోసుకున్నామని, తూకం చేసిన సంచులను తరలించకపోవడంతో వరాహాల దాడి ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 లారీల ధాన్యం కేంద్రంలో నిల్వ ఉందని.. వెంటనే తరలించాలని వారు కోరారు. ఆందోళనతో రహదారిపై రాకపోకలు నలిచి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ జలంధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని అధికారులు, రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
క్రీడలతో శారీరక దారుఢ్యం
వనపర్తి రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని డీవైఎస్ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ తిరుపతయ్య అన్నారు. గురువారం మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–14 బాలికల హాకీ పోటీలను వారితో పాటు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బోలమోని కుమార్, పరిశీలకుడు పాండురంగారెడ్డి, మద్దిలేటి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 200 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారని, శుక్రవారం చివరి పోటీలు ఉంటాయని వివరించారు. రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మొదటిరోజు విజేతలు వీరే.. మొదటి మ్యాచ్ మెదక్, ఖమ్మం జట్లు, రెండో మ్యాచ్ రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య జరగగా డ్రాగా ముగిశాయి. 3వ మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై నల్లగొండ జట్టు 2–0 గోల్స్‌తో.. 4వ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 4–0 గోల్స్‌తో.. 5వ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టుపై నిజమాబాద్ జట్టు 5–0 గోల్స్‌తో.. 6వ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై మెదక్ జట్టు 1–0 గోల్స్‌తో.. 7వ మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై హైదరాబాద్ జట్టు 2–0 గోల్స్‌తో 8వ మ్యాచ్ ఖమ్మం జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 2–0 గోల్స్‌తో విజయం సాధించాయి. 9వ మ్యాచ్‌లో హైదరాబాద్, నల్లగొండ జట్టుతో తలపడగా డ్రాగా ముగిసింది. 10వ మ్యాచ్‌లో ఖమ్మం జట్టుపై కరీంనగర్ జట్టు 1–0 గోల్స్‌తో.. 11వ మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై నిజామాబాద్ జట్టు 4–0 గోల్స్‌తో.. 12వ మ్యాచ్‌లో మెదక్ జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 2–0 గోల్స్‌తో.. 13వ మ్యాచ్ వరంగల్ జట్టుపై రంగారెడ్డి జట్టు 2–0గోల్స్‌తో.. 14 మ్యాచ్ నల్గొండ జట్టుపై నిజమాబాద్ జట్టు 4–0 గోల్స్‌తో విజయం సాధించిందని టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నిరంజన్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పీడీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమస్యల ప్రాంగణం
జిల్లాకేంద్రంలో పునః ప్రారంభమైన పాత బస్టాండ్ ● కనీస సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్లు లేని దుస్థితి ● వెలగని విద్యుద్దీపాలు.. అరకొరగా కుర్చీలు ● తిరుగు ప్రయాణంలో లోనికి రాని బస్సులు –8లో u●పాత బస్టాండ్‌లో ప్రయాణికులు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోరింగ్ లేకపోవడంతో పాటు ప్రాంగణమంతా కనిపించేలా లైట్లు లేవు. పెద్దమందడి బస్సులు యధావిధిగా బస్టాండ్‌లోకి రాకుండా వెళ్తున్నాయి. విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలి. – పవన్ కుమార్, వ్యాపారి పాత బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురావాలని భావించి పునరుద్ధరించాం. ప్రహరీ, మూత్రశాలలు, ఫ్లోరింగ్ నిర్మాణాలకు రూ.28 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం లభిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – దేవేందర్‌గౌడ్, డిపో మేనేజర్, వనపర్తి ఆర్టీసీ వననపర్తిటౌన్: దశబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న పాత బస్టాండ్‌ను ఆర్టీసీ అధికారులు ఎట్టకేలకు వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రాంగణమంతా దుమ్ము, ధూళితో నిండటంతో లోనికి వచ్చే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు లోనికి, బయటకు వెళ్లేందుకు ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో బస్సుల రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. ఆత్మకూర్, కొత్తకోట మీదుగా మహబూబ్‌నగర్, హైదరాబాద్ వెళ్లే కొన్ని బస్సులు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుండగా.. తిరుగు ప్రయాణంలో లోనికి రాకుండా బయటే ప్రధాన రహదారిపైనే ప్రయాణికులను దించేస్తున్నారు. పాత బస్టాండ్‌కు అతి సమీపంలోనే ఉన్న రాజీవ్‌చౌక్ మినీ బస్టాండ్‌గా మారడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మార్గంలో వెళ్లే పెద్దమందడి బస్సు అవతలి రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం. 33 ఏళ్ల తర్వాత నెల కిందట ఆగమేఘాల మీద హడావుడిగా పాత బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఏడాది కిందట రూ.9.50 లక్షలతో టెండర్ పిలిచి బేస్మెంట్, 15 గీ30 సైజులో రేకుల షెడ్ నిర్మించి కొన్ని కుర్చీలు ఏర్పాటుచేశారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మట్టిని చదునుచేసి ప్రారంభించారు. బస్సుల రాకపోకల సమయంలో దుమ్ము, ధూళితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
‘మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం’
అమరచింత: పూటకో పార్టీ మార్చిన మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడంగల్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో ధూషించడం, అవహేళన చేస్తూ నోటి దురుసును ప్రదర్శించడం సరికాదన్నారు. పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడితే ఎందుకంత కడుపుమంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో వచ్చిన రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు కాంగ్రెస్ వారు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ముదిరాజ్ బిడ్డ అని చెప్పుకొనే మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ చెరువుల్లో 12 లక్షల చేప పిల్లలు వదిలానని.. ప్రస్తుత మంత్రి కేవలం 2 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసిన విషయం మత్స్యకారులకు తెలుసని చెప్పారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్, ప్రజారాజ్యం పార్టీలో చేరిన మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాదని.. తమ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుతో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొన్నది నిజం కాదా అంటూ ఫొటోను చూపించారు. జూరాలకు సమృద్ధిగా వరద వస్తే రెండో పంటకు క్రాప్ హాలీడే ప్రకటించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, క్రాప్ హాలిడే విషయాన్ని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. జూరాల ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షులు రవికుమార్ యాదవ్, రమేష్ ముదిరాజ్, బీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్ఏ రాజు, మస్తీపురం సర్పంచ్ సాంబశివుడు, మాజీ వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, జింక రవి తదితరులు పాల్గొన్నారు. -
‘సైబర్’దే జోరు..!
వనపర్తి: జిల్లాలో సాధారణ చోరీలు గతేడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టగా.. సైబర్ నేరాల సంఖ్య రెండింతలు పెరిగింది. అధికారులు నిత్యం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా.. నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారనేందుకు ఎస్పీ డి.సునీతరెడ్డి బుధవారం వెల్లడించిన వార్షిక నేర నివేదికతో స్పష్టమవుతోంది. 2024లో సైబర్ నేరాలు 64 నమోదు కాగా.. 2025 నవంబర్ వరకే 122కు చేరడం గమనార్హం. అఽధికారిక లెక్కల ప్రకారం.. జిల్లాలో సైబర్ నేరాలను తగ్గించేందుకు 596 అవగాహన సదస్సులు నిర్వహించినా.. ప్రయోజనం ఆశాజనకంగా లేకపోవడం శోచనీయం. ఇకపోతే.. ఆర్థిక ప్రయోజనాల కోసం చేసిన హత్యలు గతేడాది ఒకటి నమోదుకాగా.. 2025లోనూ అదే సంఖ్య పునరావృతమైంది. స్వల్పంగా పెరిగిన రికవరీ.. జిల్లాలోని 15 పోలీస్స్టేషన్ల పరిధిలో గతేడాది 264 కేసులు.. 2025లో 211 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఛేదించిన కేసుల సంఖ్య తగ్గువగా ఉన్నా.. సొమ్ము రికవరీ మాత్రం గతేడాది కంటే స్వల్పంగా పెరిగింది. 2024లో 158 కేసులు ఛేదించి చోరీ సొమ్ములో 43.51 శాతం రికవరీ చేయగా.. 2025లో 148 కేసులు ఛేదించి 52 శాతం సొమ్ము రికవరీ చేసినట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. పోక్సో కేసులు రెండింతలు.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పోక్సో కేసుల సంఖ్య అసాధారణంగా పెరిగినట్లు అధికారిక లెక్కలతో స్పష్టమవుతోంది. 2024లో 44 కేసులు నమోదు కాగా.. 2025లో ఇప్పటి వరకు ఆ సంఖ్య 80కి చేరడం గమనార్హం. వీటితోపాటు బలవన్మరణాలు సైతం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అత్యాచారం కేసులు గణనీయంగా తగ్గాయి. గతేడాది 10 నమోదు కాగా.. 2025 ఇప్పటి వరకు 4 కేసులు మాత్రమే ఉన్నాయి. 2,049 సీసీ కెమెరాలతో నిఘా.. జిల్లాలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,049 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వీటిలో కొన్ని సాంకేతిక సమస్యతో నిరుపయోగంగా మారగా మరమ్మతు చేయిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి శ్రీధర్‌రెడ్డి హత్య కేసు, జిల్లాకేంద్రంలో ఏటీఎం చోరీ కేసుపై ఎస్పీ మునుపటి పాత సమాధానం పరిశీలిస్తామని చెప్పడం కొసమెరుపు. కీలక కేసుల్లో జీవితఖైదు.. గోపాల్పేట, ఆత్మకూర్ పీఎస్‌ల పరిధిలోని హత్య కేసుల్లో నేరస్తులకు జీవిత ఖైదు, కొత్తకోట పీఎస్ పరిధిలోని అత్యాచారం కేసులో నేరస్తుడికి 20 ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించింది. దీంతోపాటు లోక్ అదాలత్‌లో 708 సాధారణ కేసులకు పరిష్కారం లభించింది. పెరిగిన సైబర్ నేరాలు, పోక్సో కేసులు, బలవన్మరణాలు తగ్గిన చోరీలు.. 52 శాతం రికవరీ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. 2024తో పోలిస్తే 2025లో అధికారులు కొంత వెనుకబడినట్లు స్పష్టమవుతోంది. గతేడాది 701 అర్జీలు దాఖలు కాగా.. 663 పరిష్కరించారు. 38 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 460 అర్జీలు దాఖలు కాగా.. వాటిలో 324 మాత్రమే పరిష్కరించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీల సంఖ్య 136గా పేర్కొన్నారు. దాఖలైన అర్జీల్లో 25 శాతం పరిష్కారానికి నోచుకోలేదు. -
నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
ఆత్మకూర్: నియోజకవర్గంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో జరిగిన పుర ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మద్దతుదారులను 90 శాతం గెలిపించి తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారని, పుర ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరారు. ఇప్పటి వరకు స్థానిక పురపాలికకు రూ.15 కోట్లు, మండలానికి రూ.250 కోట్లు మంజూరయ్యాయని.. రానున్న మూడేళ్లలో మరో రూ.300 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మండలానికి ఇప్పటి వరకు 500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని.. మరో 500 ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. అలాగే జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హైలేవల్ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. క్రాప్ హాలిడే అంటూ పుకార్లు.. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు చూసి ప్రతిపక్ష నేతలు లేనిపోని పుకార్లు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని.. జూరాలకు క్రాప్ హాలిడే, వారబందీ అంటూ వదంతులు సృష్టిస్తున్నారని మంత్రి వాకిటి అసహనం వ్యక్తం చేశారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించారని, జూరాల కూలుతుందని గతంలో పుకార్లు సృష్టించారని.. అదేమీ కాళేశ్వరం కాదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని.. ప్రస్తుతం వేల ఇళ్లు నిర్మించుకుంటుంటే తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు చైతన్యవంతులని.. అన్నీ గమనిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గాడి కృష్ణమూర్తి, పరమేశ్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, భాస్కర్, సుదర్శన్‌శెట్టి, షబ్బీర్, కలీం, రవికాంత్, రవీందర్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
అభివృద్ధి చేసుకుందాం
పార్టీలు, పంతాలు వద్దు.. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్‌లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్‌లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్‌లను కలుపుకొని గ్రామాల అభివృద్ధే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు.. పాలమూరు జిల్లాలో ఇల్లు లేకపోయినా ఇక్కడి ప్రజలు నమ్మి చంద్రశేఖర్‌రావును ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు చేసింది శూన్యమని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతోనే గత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. 2014లో తెచ్చిన జీఓ 69ను మంజూరు చేయిస్తే గత ప్రభుత్వం తొక్కి పెట్టిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే కమీషన్లు దండుకుందన్నారు. పాలమూరుపై చిన్నచూపుతోనే పదేళ్లలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, డిండి, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీతో పాటు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదన్నారు. నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించుకుంటుంటే కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఎకరాకు 14 లక్షలు సరిపోవడం లేదని మంత్రి శ్రీహరి వచ్చి అడిగి ఎకరాకు రూ.18 లక్షలు ఆశిస్తున్నారని చెబితే.. ముఖ్యమంత్రిగా నేను ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించగా కేబినెట్ ఆమోదం పొందిందన్నారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 96 శాతం మంది రైతులు భూములు ఇస్తున్నారన్నారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుతా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ అందించే బాధ్యత సర్పంచులదే నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, అలాగే పదేళ్లు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధియే లక్ష్యంగా నేడు రేవంతన్న అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రేవంతన్న హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్‌రెడ్డి, వార్ల విజయ్‌కుమార్, రఘువర్ధన్‌రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్‌రెడ్డి, యూసూఫ్, శేఖర్, మద్దప్ప దేశ్‌ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
‘పోరాటాలకు సిద్ధం కావాలి’
వనపర్తిటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్‌గౌడ్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరగగా.. ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ముఖ్యఅతిథులుగా హాజరై టీఎఫ్ఐ, టీఎస్టీయూఎఫ్ జెండాలను ఆవిష్కరించారు. జంగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కె.జ్యోతి, బి.వెంకటేష్, తిమ్మప్ప, శ్రీనివాస్‌గౌడ్, అరుణ, ఆర్.రామన్‌గౌడ్, మురళి, రాముడు, అగ్రిప్ప, రియాజ్, చెన్నకేశవులు, జి. కృష్ణ, అనసూయా, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నరేందర్ పాల్గొన్నారు. నేటినుంచి రాష్ట్రస్థాయి హాకీ పోటీలు వనపర్తి రూరల్: కడుకుంట్లలో గురువారం నుంచి రెండ్రోజుల పాటు ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ నిరంజన్‌గౌడ్ తెలిపారు. క్రీడల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
చేనేత మగ్గం నేసి..
గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్‌ను జ్ఞాపికగా అందజేశారు. -
జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు
● కృష్ణానది తీరాన 108 ఎకరాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పలేదని.. ఆధారాలు ఉంటే చూపించాలని రాష్ట పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. 1.50 లక్షల క్యూసెక్కుల వరద జలాశయానికి చేరితే కూలుతుందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కూలేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించిందని.. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేశామన్నారు. కృష్ణానది సమీపంలో 108 ఎకరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే అమరచింతలోని దుంపాయికుంటలో ఉన్న 14 ఎకరాల్లో పేదలకు ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామని వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ చైర్మన్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ నాగరాజుగౌడ్, నాయకులు అయ్యూబ్‌ఖాన్, పట్టణ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు తిరుమల్లేష్, మహంకాళి, మార్కెట్ డైరెక్టర్ విష్ణు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ● అమరచింత పురపాలికలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఎం మండల నాయకులు జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రమేష్ మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. -
అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం..
జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు. వీరిలో విశ్రాంత ఐఏఎస్ దినకర్‌బాబుతోపాటు పద్యకవులు ఆకుల శివరాజ లింగం, సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగీపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న పెరవల్లి గాయత్రి, శిల్పి బైరోజు చంద్రశేఖర్, సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి రాళ్ల నవత, బాక్సింగ్ క్రీడాకారుడు నున్సావత్ వెంకటేష్, పోచ రవీందర్‌రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్ గవర్నర్‌తో పరిచయం చేసుకున్నారు. -
రహదారి భద్రతపై విస్తృత అవగాహన
● టోల్‌ఫ్రీ నంబర్ 1033కి సమాచారం ఇవ్వాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: రహదారి భద్రత వారోత్సవాలు జనవరిలో కొనసాగనున్నాయని.. గ్రామాల్లో రహదారి ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. పోలీస్, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో సర్వే చేసి జాతీయ రహదారి, ఆర్అండ్బీ రహదారులపై ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనే విషయాలపై నివేదిక అందజేయాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగితే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1033కి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అంబులెనన్స్ సిబ్బంది క్షతగాత్రులను దగ్గర్లోని ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాలనే విషయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకొని ఉండాలన్నారు. జిల్లాలోని జాతీయ రహదారిపై గుర్తించిన వెల్టూరు, పాలెం, మదర్ థెరిస్సా కూడలి, అమడబాకుల, రంగాపూర్, ఆనందభవన్ తదితర బ్లాక్స్పాట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ కొనసాగడానికి కారణాలు ఏమిటనే విషయాలు అన్వేషించాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, వేగం కొలిచే యంత్రాలు వంటివి సిద్ధం చేయాలన్నారు. -
క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరి : ఎస్పీ
వనపర్తి: నేర రికార్డులను తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాన్ని ఆమె సందర్శించగా డీఎస్పీ వెంకటేశ్వరరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. కార్యాలయంలో వివిధ రికార్డులతో పాటు షీ టీం పనితీరు రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో అలసత్వం ఉండరాదని, ప్రతి నమోదు న్యాయ ప్రక్రియకు ఆధారంగా నిలుస్తుందని అధికారులను అప్రమత్తం చేశారు. తర్వాత డీఎస్పీతో సమావేశమై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, గ్రేవ్ కేసుల పురోగతి, విచారణ స్థితిగతులపై ఆరా తీశారు. ప్రతి కేసు చట్టబద్ధంగా, బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు సాగాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని.. ప్రతి కేసు చట్టబద్ధంగా, నిర్దిష్ట గడువులోగా పక్కా ఆధారాలతో ముందుకు సాగాలన్నారు. రికార్డుల నిర్వహణలో పొరపాట్లు ఉంటే న్యాయస్థానాల్లో కేసులు బలహీనపడతాయని బాధ్యతతో మెలగాలని, బాధితులకు భద్రత, గౌరవం, న్యాయం కల్పించడమే పోలీసుశాఖ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ప్రతి విభాగంలో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆమె వెంట సీఐ కృష్ణయ్య, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్ఐ జలంధర్‌రెడ్డి, గోపాల్పేట ఎస్ఐ నరేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. నేడు కోస్గికి సీఎం రాక కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్‌తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్హల్తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘ఉపాధి కల్పన’ను వినియోగించుకోవాలి పాన్‌గల్: గ్రామీణ ప్రాంత యువత, మహిళలు, రైతులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి మహబూబ్‌నగర్ ప్రాంతీయ అధికారి సైదా, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అబ్బాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి కోరారు. సోమవారం మండలంలోని మల్లాయిపల్లిలో సర్పంచ్ నాగిరెడ్డి అధ్యక్షతన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ద్వారా అందే రుణాలకు 25 శాతం, 35 శాతం రాయితీ అందుతుందని వివరించారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
వనపర్తి: పోలీసు బాధ్యతను మానవీయ విలువలతో మేళవిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 11 ఫిర్యాదులు అందగా.. సంబంధిత అధికారులతో ఎస్పీ మాట్లాడి బాధితుల సమస్యలు త్వరగా పరిష్కించేలా కృషిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగే వరకు పోలీసుశాఖ బాధ్యతగా పనిచేస్తుందని బాధితులకు భరోసానిచ్చారు. ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజల నమ్మకమే పోలీసు శాఖ బలమని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని అన్నారు. దివంగత పార్లమెంట్ సభ్యుడు, సామాజిక కార్యకర్త జి.వెంకటస్వామి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్ వేదికపై ధైర్యంగా ప్రస్తావించిన ప్రజాప్రతినిధి వెంకటస్మామి అని.. ఆయన సేవలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసు కార్యాలయ ఏఓ సునంద, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, రిజర్వు ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పల్లెల్లో నవశకం..
●అమరచింత/మదనాపురం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించిన అభ్యర్థులు సోమవారం సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో మొత్తం 268 గ్రామ పంచాయతీలకు గాను 267 జీపీల్లో పాలకవర్గాల ప్రమాణస్వీకార కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులచే అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సర్పంచులు తమ పేర్లను ప్రస్తావిస్తూ.. అందరి భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతామని, రాజకీయాలు, వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరినీ సమాన దృష్టితో సంక్షేమ పథకాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాకుండా అక్షరాస్యతలో సైతం తమ గ్రామాలను ముందుంచుతామన్నారు. కాగా, మదనాపురం మండలం కొత్తపల్లిలో సర్పంచ్ బంధువు ఒకరు మృతిచెందడంతో ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు. పెబ్బేరు మండలం వై శాగాపూర్, తోమాలపల్లె, కంచిరావుపల్లి గ్రామాల్లో కొలువుదీరిన పాలకవర్గాలను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శాలువాలతో సత్కరించారు. పండుగ వాతావరణంలో.. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు పంచాయతీ కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. కొన్ని భవనాలకు పెయింటింగ్ వేయించడంతో పాటు మామిడాకులు, బంతిపూల తోరణాలతో అలంకరించారు. పంచాయతీ కార్యాలయ ఆవరణల్లో టెంట్లు వేయడంతో పండుగ వాతావరణం కనిపించింది. కొన్ని జీపీలకు రంగే లేదు.. జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను నామమాత్రపు ముస్తాబు చేయడంతోనే సరిపెట్టారు. భవనాలకు కొత్తగా పెయింటింగ్ వేయకపోవడంతో పాలకవర్గాలు అసంతృప్తికి గురయ్యాయి. కొందరు ఇదేం పద్ధతని పంచాయతీ కార్యదర్శులను అడిగితే డబ్బులు లేవని సమాధానం ఇచ్చినట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. జిల్లాలో పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలను పండుగ వాతావరణంలో పూర్తిచేశాం. అన్ని మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు ఆయా గ్రామ పంచాయతీలకు హాజరై సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులచే ప్రమాణం చేయించారు. ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తిచేశాం. – రఘనాథ్‌రెడ్డి, ఇన్చార్జి డీపీఓ రెండేళ్ల తర్వాత పంచాయతీల్లో కొలువుదీరిన పాలక వర్గాలు అట్టహాసంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు జిల్లాలో 268 గ్రామ పంచాయతీలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారోత్సవం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా అధికారులు సమన్వయంతో పూర్తిచేశారు. చిన్నచిన్న పొరపాట్లకు సైతం తావివ్వకుండా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి
గద్వాల టౌన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు. -
రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా క్రాప్‌హాలిడేనా?
● చేతకాని పాలనకు ఇదే నిదర్శనం ● మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఈసారి రికార్డు స్థాయిలో వరదలు వస్తే అవగాహన లేకుండా సముద్రంపాలు చేసి.. ఇప్పుడు క్రాప్‌హాలిడే ప్రకటించడం దురదృష్టకరమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్‌లో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణానదికి వచ్చిన వరదను ప్రణాళికా బద్ధంగా వాడుకోకుండా యాసంగిలో క్రాప్‌హాలిడే ప్రకటించడం చేతకాని పాలనకు నిదర్శనమన్నారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య 17.8 టీఎంసీల డిజైన్‌తో ప్రారంభించిన జూరాల ప్రాజెక్టును 11 టీఎంసీలకు కుదించారని.. ఆ తర్వాత 6.5 టీఎంసీలకే ప్రాజెక్టు పరిమితమైందన్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 33 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ప్రస్తుత పాలకులు ఏకంగా క్రాప్‌హాలిడే ప్రకటించడం బాధాకరమన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించతలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్కు కేటాయించిన 15.9 టీఎంసీలు, జూరాలకు కేటాయించిన 17.8 టీఎంసీల నీటిని వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. కొడంగల్–నారాయణపేటకు ఎత్తిపోతలకు పాలమూరు–రంగారెడ్డి నుంచే నీటిని పంపింగ్ చేసే విధంగా తక్కువ ఖర్చుతో డిజైన్ చేస్తే.. ప్రస్తుతం ఎక్కువ ఖర్చుతో కొడంగల్–పేట ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చడం సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహి త్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటని.. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నీరు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారని.. ఇందుకు సంబంధించి ఆధిత్యనాధ్ ఏపీ తరఫున, తెలంగాణ తరఫున ఎస్కే జ్యోషి చేసిన సంతకాల పత్రాలను చూయించారు. కేసీఆర్ మరణశాసనం చేశారని పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి సలహదారుగా ఉన్న ఆధిత్యనాఽథ్ను సంతకం ఎందుకు చేశారో అడగాలని సవాల్ విసిరారు. షాపుల్లో యూరియా ఇవ్వలేని వారు యాప్ ద్వారా ఇస్తామని చెబుతున్నారని.. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవియాదవ్ ఉన్నారు. -
గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
వనపర్తి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పోలీసు గౌరవ వందనం సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలపై రూపొందించిన స్టాళ్ల సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమం, ఫొటో సెషన్లో గవర్నర్ పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రశంసలు పొందిన కవులు, కళాకారులతో గవర్నర్ పరిచయ కార్యక్రమం ఉంటుందని.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాశ్ ఉన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 20 అర్జీలు అందగా.. సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా 2025 ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్‌రెడ్డి వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటివరకు 48.96 శాతమే పూర్తి చేశారని.. మరింత వేగవంతం చేసి వందశాతం లక్ష్యం సాధించాలన్నారు. రోజు ప్రతి మండలంలో 100 మందిని మ్యాపింగ్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విషయంపై బూత్‌స్థాయి అధికారులకు సూచనలు చేయాలని.. 10 శాతం కన్నా తక్కువ ఉన్నవారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలన్నారు. అదే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో బ్లర్‌గా ఉన్న ఫొటోలను పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించి.. ఫాం–8 ద్వారా ఫొటోలను బీఎల్ఓలతో అప్డేట్ చేయించే ప్రక్రియను కూడా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
మదనపురం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని.. వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సరళాసాగర్ ఆయకట్టుకు యాసంగి సాగు నిమిత్తం శనివారం సాయంత్రం జలాశయం ఎడమ కాల్వ గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పంటకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రైతులకు అందుతున్న సంక్షేమ ఫలాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో లిఫ్ట్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచులు నాగరాజుగౌడ్, శ్రీనివాసాచారి, డైరెక్టర్ పావని, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, జగదీశ్, అక్కల మహదేవన్‌గౌడ్, రాజవర్ధన్‌రెడ్డి, సాయిబాబా, శ్రీధర్‌రెడ్డి, డీలర్ లక్ష్మయ్య, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
గోపాల్పేట: గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని ఎస్ఈ వెంకట్రామన్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆయనతో పాటు శాఖ అధికారులు పర్యటించి నీటి సరఫరాపై ఆరా తీశారు. మిషన్ భగీరథ మంచినీరు సరిగా రావడం లేదని, బోరు నీటినే పైప్‌లైన్ ద్వారా వదులుతున్నారని రేవల్లిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అందరికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జీ రామ్‌జీ బిల్లు రద్దు చేయాలి : సీపీఎం కొత్తకోట: లోక్‌సభలో బలవంతంగా ఆమోదించిన జీ రామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కొనసాగించాలని సీపీఎం జిల్లా ప్రధానకార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం కొత్తకోట చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఏ పాలనలో వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా, అధికార దురహంకారంతో పేర్లు మార్చి కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు రోజువారి వేతనం రూ.600కు పెంచాలని, పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, నాయకులు వెంకటయ్య, గొల్ల రాములు, యాదయ్య, మల్లేష్, నాగన్న, కురుమయ్య, వెంకటేష్, గోపాల్, శ్రీను, రాములు, గోవర్దన్, మహేష్ పాల్గొన్నారు. ఎన్నికలను డబ్బు, మద్యం శాసిస్తున్నాయి : సీపీఐ అమరచింత: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను ప్రస్తుతం డబ్బు, మద్యం, కులమతాలు ప్రధానపాత్ర పోషిస్తూ శాసిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి రాజకీయ నాయకులు తిలోదకాలు ఇచ్చారని.. యథేచ్ఛగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడే వామపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే జంకే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోందని.. నల్ల చట్టాలు, ఉపాధిహామీ పథకం పేరు మార్పు ఇందులో ఉన్నాయన్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని సత్కరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి రవీందర్, కళావతమ్మ, లక్ష్మీనారాయణశెట్టి, శ్రీహరి, శ్యాంసుందర్, కుతుబ్, నర్సింహశెట్టి పాల్గొన్నారు. రామన్‌పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ ద్వారా 975 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 60 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ నెల 23న జిల్లా పర్యటనకు రానున్నారని.. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గవర్నర్ పర్యటనకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23వ తేదీన 3.30 గంటలకు గవర్నర్ జిల్లాకేంద్రానికి చేరుకొని జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖుల ముఖాముఖిలో పాల్గొంటారని, వారందనీ ఆహ్వానించాలని ఆర్డీఓ సుబ్రమణ్యంకు సూచించారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, వేదిక, సౌండ్ సిస్టం, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వ హణకు తగిన ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీని ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా విద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.వాహనదారులు రహదారి భద్రత నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని.. విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపార. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు రహదారి నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తోందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి మాసోత్సవాలను విజయవంతం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, డీటీఓ మానస, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, పంచాయత్‌రాజ్‌శాఖ ఈఈ మల్లయ్య, ఐఆర్‌ఏడీ డీఆర్ఎం మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చెరుకు తరలింపునకు సహకరించాలని వినతి
ఆత్మకూర్: చెరుకు తరలింపునకు పోలీసుల ఆంక్షలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఎత్తివేసి సహకరించాలని కృష్ణవేణి చెరకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో రైతులు శనివారం ఎస్ఐ జయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరచింత, ఆత్మకూర్ మండలాల నుంచి కృష్ణవేణి చెక్కర ఫ్యాక్టరీకి నిత్యం వందల సంఖ్యలో చెరుకు ట్రాక్టర్లు, లారీలు వెళ్తుంటాయన్నారు. ఆయా వాహనాల రాకపోకలతో మదనాపురం, ఆత్మకూర్‌లో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని పోలీసులు రాత్రి వరకు నిలుపుతున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమయపాలన ఆంక్షలు ఎత్తివేసి నిరంతరం రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, సంజీవరెడ్డి, నారాయణ, వెంకటేష్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో పంచాయితీ..!
పేలుతున్న నేతల మాటల తూటాలు ● వనపర్తిలో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు ● మంత్రి వాకిటి ఇలాకాలోనూ మంటలు ● సామాజిక మాధ్యమాల్లోనూ ఇరువర్గాల పోరు ● వైరల్‌గా మారిన పలు పోస్టులు.. ● జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. అధికార కాంగ్రెస్‌లో సం‘గ్రామం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘రెబల్స్’తో రాజుకున్న సెగ దావానలంలా ఎగిసిపడుతోంది. గెలుపును ప్రభావితం చేసిన తిరుగుబాటుదారులు.. ఓడిపోయిన వర్గాల మధ్య పోరు ఆ పార్టీ ముఖ్య నేతలను రచ్చకీడుస్తోంది. మరోవైపు కీలక బాధ్యతల్లో ఉన్న పెద్దలు సంయమనం కోల్పోయి అసహనం వ్యక్తం చేస్తుండడం.. స్వపక్షంలోని నాయకులపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండడం రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ప్రధానంగా వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పేలుతున్న మాటాల తూటాలు ఉమ్మడి పాలమూరులో హాట్ టాపిక్‌గా మారాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గెలపొందిన కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా మాట్లాడుతూ చేపలు గ్రామాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయిన పలు గ్రామాల ప్రజలను బాహాటంగా తూర్పారబట్టడం విమర్శలకు దారితీసింది. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఇదంతా జరగగా.. కనీసం ఆయన వారించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ క్రమంలో తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ మద్దతుదారు గెలుపొందడం.. సొంత మండలం రాజాపూర్‌లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో ఆయనలో అసహనం.. ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు, వర్గాలు సామాజిక మాధ్యమాలు వేదికగా పోరు సాగిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం వారివారి వర్గాల మధ్య పోరు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేగా నాపై, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవిపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలి. కాంగ్రెస్ విధేయులుగా, జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటి?’ అని చిన్నారెడ్డిపై ప్రెస్మీట్లో పరోక్షంగా విమర్శలు చేయడం దుమారం రేపాయి. ప్రతిగా చిన్నారెడ్డి వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వైరల్‌గా మారగా.. నియోజకవర్గం అట్టడుకుతోంది. వనపర్తి పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఉన్నా.. సర్పంచ్ స్థానాల్లో గెలవకపోవడంపై ఉమ్మడి పాలమూరులోని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపాన్ని సైతం వారికి ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువులు, అనుచరులకు పార్టీ తరఫున మద్దతిచ్చి నిలబెట్టడం ‘రెబల్స్’ బరిలో ఉండేందుకు ఆస్కారమిచ్చిందని.. దీంతో ఓట్లు చీలిపోయి ప్రతిపక్షానికి కలిసి వచ్చిందంటూ ఉదాహరణలతో వారిని ఎండగట్టినట్లు సమాచారం. వచ్చేవి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు.. జాగ్రత్తగా వ్యవహరించాలని.. డీసీసీలు సైతం పక్కా కార్యాచరణతో విజయం సాధించేలా శ్రమించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఎవరెవరికి చీవాట్లు పెట్టారు.. ఇప్పటికై నా కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మార్పు వచ్చేనా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. -
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం యాసంగి సాగుకు ఆయకట్టును కుదించింది. ఎడమకాల్వ పరిధిలో రామన్‌పాడు రిజర్వాయర్ వరకు మాత్రమే 15 వేల ఎకరాలకు వారబందీ విధానంలో సాగునీరు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో యాసంగి సాగుకు నీరు ఇవ్వమంటూ ముందస్తుగా టాంటాం వేయించాం. పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే వదులుతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం ● -
రాజీమార్గం.. రాజమార్గం
వనపర్తిటౌన్: కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో 9,969 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇందులో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 1,701, ప్రీ లిటిగేషన్ కేసులు 8,268 ఉన్నాయన్నారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్‌రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, డీఎస్పీ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. 84 కేసులు పరిష్కారం.. ఆత్మకూర్: పట్టణంలోని మున్సి్ఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శిరీష మాట్లాడుతూ.. క్షణికావేశంలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరగడంతో విలువైన సమయం వృథా అవుతుందన్నారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం 46 క్రిమినల్, 3 ఎకై ్సజ్, 2 ఎస్టీసీ, 10 సీసీ అడ్మీషన్ కేసులకుగాను రూ.43,500.. 23 డ్రంకెన్ డ్రైవ్ కేసులకు రూ. 22,500 జరిమానా విధించారు. మొత్తం 84 కేసులు పరిష్కరించి కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, సిబ్బంది, ఆయా మండలాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి నాగర్‌కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామన్నారు. పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింస, అభద్రత భావం, నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ పాల్గొన్నారు. -
గాంధీజీ ఆశయ సాధనకు కృషి
● దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ ● డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ● గాంధీచౌక్‌లో కాంగ్రెస్ నిరసన వనపర్తిటౌన్: గాంధీజీ ఆశయ సాధనకు దేశ ప్రజలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధిహామీ పథకం నుంచి మహాత్ముడి పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి గాంధీ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 2005లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు చేశారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం అభాగ్యులకు ఎంతగానో ఉపయోగపడుతోందని, గ్రామీణ ప్రజలు ఉద్యమించేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు సామాన్య ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పేదల సంక్షేమానికి యత్నిస్తుండగా.. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధనవంతులను పెంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశ సంపదంతా అదానీ, అంబానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సత్యం, అహింసతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని.. ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇటీవల జరిగిన అక్రమ కేసులను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నందిమళ్ల యాదయ్య, శంకర్‌ప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, నాయకులు కదిరె రాములు, బి.కృష్ణ, తిరుపతయ్య, బాబా, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టు కుదింపు
యాసంగిలో చంద్రగఢ్ ఎత్తిపోతల ఆయకట్టుకు సాగునీరు అందించాలని మంత్రి వాకిటి శ్రీహరికి విన్నవిస్తాం. 15 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మతుకు గురికావడంతో వానాకాలంలో కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే నీటిని అందించా రు. ప్రస్తుతం యాసంగికి సైతం అందించాలి. – సర్వారెడ్డి, అధ్యక్షుడు, చంద్రగఢ్ ఎత్తిపోతల సంఘం, మిట్టనందిమళ్ల మండలంలో జూరాల నీటిపై ఆధారపడి సుమారు 6 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగిలో కేవలం రామన్‌పాడు వరకే సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించడం శోచనీయం. గతంలో సైతం యాసంగి సాగునీటిని కుదించిన ఆయకట్టుకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆరుతడి పంటల సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పడం దారుణం. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి వరకు సాగునీటిని అందించాలి. – ఎండీ నడిపి ఖాజా, మామిడి రైతు, గోవర్ధనగిరి, వీపనగండ్ల అమరచింత: జూరాల ఆయకట్టులో యాసంగి సాగుకు వారబందీ విధానంలో నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు సమీపంలోని రామన్‌పాడు రిజర్వాయర్ వరకు అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 10 వేల నుంచి 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించనున్నట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించడం, గురువారం జరిగిన ఐఏబీ సమావేశంలో వారబందీని అమలు చేస్తూ తక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకోవడంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రెండేళ్ల కిందట ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో నాటి యాసంగి సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించిన అధికారులు.. ప్రస్తుతం జలాశయంలో సమృద్ధిగా నీరున్నా ఎందుకు నీటిని వదలడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎడమ కాల్వ కింద 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రస్తుతం కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించడం ఏమిటని అంటున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో విస్తరించి ఉండగా కేవలం అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాల రైతులకే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రకటించడం సరికాదని అంటున్నారు. యాసంగి విస్తీర్ణం ఖరారు.. ప్రస్తుతం జలాశయం నుంచి 4.690 టీఎంసీల నీటిని వినియోగించేందుకు అవకాశం ఉంది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద రామన్‌పాడ్ జలాశయం వరకు మాత్రమే సాగునీటి సరఫరాకు ప్రణాళిక ఖరారు చేశారు. సాగు, తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకున్న క్రమంలో ముందస్తుగా వారబందీ విధానం అమలు చేస్తున్నారు. గత గురువారం నుంచే వారబందీ అమలు చేస్తూ కాల్వలకు నీటి సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో టాంటాం.. ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని పెబ్బేరు, వీపనగండ్ల, కొత్తకోట, చిన్నంబావి, శ్రీరంగాపురం మండలాల ఆయకట్టు గ్రామాల్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు యాసంగిలో సాగునీరు అందదని, దీనిని దృష్టిలో ఉంచుకొని నారుమడులు వేసుకోవాలని దండోరా వేయిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ పరిధిలో 15 వేల ఎకరాలకే సాగునీరు యాసంగిలో వారబందీ విధానం అమలు చివరి ఆయకట్టు గ్రామాల్లో చాటింపు ఆందోళనలో అన్నదాతలు -
లోక్ అదాలత్‌లో సత్వర న్యాయం : ఎస్పీ
వనపర్తి: జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో ఈ నెల 21న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని.. కక్షిదారులకు పోలీసులు అందుబాటులో ఉంటారని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు, చిన్న చిన్న దొంగతనాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్, బ్యాంకు, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్‌బౌన్స్ తదితర కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలన్నారు. రాజీయే రాజ మార్గమని.. చిన్న చిన్న తగాదాలతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయస్థానం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది రాజీ పడే కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని అవగాహన కల్పించాలన్నారు. వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయని.. ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఓ నిర్ణయానికొస్తే అప్పుడే సమసిపోతాయని అన్నారు. లోక్ అదాలత్‌తో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి వనపర్తి: జిల్లాలోని రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో కోరారు. మొత్తం 1,80,294 కార్డులు, 6,09,645 మంది లబ్ధిదారులుండగా.. ఇప్పటి వరకు 4,23,466 లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన 1,86,179 మంది లబ్ధిదారులు సమీపంలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి పూర్తి చేసుకోవాలని కోరారు. 5 ఏళ్లలోపు వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. రేషన్ డీలర్లు దుకాణాల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు 100 ఈకేవైసీకి సహకరించాలని సూచించారు. తప్పుడు కేసులను సహించం : కాంగ్రెస్ వనపర్తి: ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి కొత్తకోట రోడ్‌లోని బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్య్ర పోరాటం కోసం స్థాపించబడిందని, స్వాతంత్య్రం అనంతరం ఆ పత్రికను ‘యంగ్ ఇండియా’ పేరుతో కొనసాగించారన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకపోయినా గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసిందని.. ఈ కుట్రను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, ఆమె కుటుంబాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక నెహ్రూ సొంత నిధులతో స్థాపించారని, నేడు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఇల్లు కూడా లేదన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారని, రాజీవ్‌గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. అంతటి విషాదంలోనూ దేశాభివృద్ధి కోసమే సోనియాగాంధీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రధానమంత్రి పదవికి అవకాశం ఉన్నప్పటికీ దేశ హితం కోసం దివంగత నాయకుడు డా. మన్మోహన్సింగ్ను ప్రధానమంత్రిగా నియమించారని తెలిపారు. -
కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్‌నగర్ జిల్లా పరిధి కోయిల్‌కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్‌కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్‌గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో రెబల్స్‌తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అంటే.. నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్‌కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్దపోకలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది. నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. నా కొంప ఆర్సిండురోయ్..! కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో.. మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్.. మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్ఎస్కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను దెబ్బతీసింది వీరే.. పలు చోట్ల షాడోల తీరు సైతం.. నారాయణపేట, వనపర్తి, జడ్చర్లలో అధిక ప్రభావం మంత్రి జూపల్లి ఇలాకా కొల్లాపూర్‌లో అత్తెసరు ఫలితాలే.. మరో అమాత్యుడి సెగ్మెంట్ మక్తల్‌లో మెజార్టీపై ఎఫెక్ట్ గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం -
ఆఽధిక్యం ఉన్నా.. అసంతృప్తి
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. ముందస్తు ప్రణాళికలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయనే చర్చ పల్లెసీమల్లో వినిపిస్తోంది. ఇందుకు కారణం 90 శాతం స్థానాలు తమవే అనుకున్న అఽధికార పార్టీ 54.85 శాతం స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్తో బీజేపీ లోపాయికారిగా జతకట్టి అవసరమైన వారికి మద్దతిస్తూ మరికొన్నిచోట్ల మద్దతు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కోల్పోలేదనే అంశాన్ని చాటుకుంది. వనపర్తితో పాటు ఖిల్లాఘనపురం, గోపాల్పేట, దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మండలాల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే తక్కువ స్థానాల్లో గెలుపొందడం శోచనీయం. ఇందుకు నేతల ప్రసంగాలే కారణంగా అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పట్టు కోల్పోయిన అధికారపార్టీ.. జిల్లాలోని గోపాల్పేట, పాన్‌గల్, చిన్నంబావి మండల కేంద్రాల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలు మినహా.. మిగతా ప్రాంతాల్లోని ప్రధాన గ్రామాల్లో అఽధికార పార్టీ పట్టు సడలినట్లు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోంది. 12 మండలాల్లో కాంగ్రెస్.. మూడింటిలో బీఆర్ఎస్ ఆధిక్యం 3 మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో పట్టుకోల్పోయిన అధికార పక్షం -
ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించాలి
వనపర్తి: వరి ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో డబ్బులు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి, జిల్లా సహకార సంఘం, పౌరసరఫరాలశాఖ అధికారులతో వరి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నారు.. ఇంకా ఎంత కేంద్రాలకు రావాల్సి ఉంది.. ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 1.87 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 50 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో ఇంకా 21 వేల మెట్రిక్ టన్నుల ట్యాబ్ ఎంట్రీలు పెండింగ్‌లో ఉందని, మిల్లర్లు దించుకున్న ధాన్యానికి సంబంధించి వెంటనే రసీదులు ఇవ్వకపోవడంతో రైతులకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని కలెక్టర్ తెలిపారు. మిల్లర్ల నుంచి రసీదు త్వరగా వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం చేసిన ధాన్యాన్ని తమకు ఇష్టం వచ్చిన మిల్లుకు పంపించడానికి వీలు లేదని, అధికారి సూచించిన మిల్లుకు మాత్రమే పంపించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సహకార సంఘం అధికారి ఇందిరా, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథం, పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు ఉన్నారు. జిల్లాలో అసైన్డ్ భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాలు, గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను సర్వేనంబర్ల వారీగా గుర్తించి డేటాను అప్లోడ్ చేయాలన్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు సుమారు 5 వేల ఎకరాలు, అసైన్డ్ భూములు 7 వేల ఎకరాలు గుర్తించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, హెచ్‌హెచ్‌ఓ శంకర్ తదితరులు ఉన్నారు. -
అన్నపై తమ్ముడి పై‘చేయి’
అడ్డాకుల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అతడి తమ్ముడు దశరథ్‌రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో తిరుపతిరెడ్డి 758 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా.. దశరథ్‌రెడ్డి 888 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి ఖాజామైనొద్దీన్ (840)పై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 3,142 ఓట్లకు గాను 2,829 ఓట్లు పోలయ్యాయి. – అడ్డాకుల -
తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్‌గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల -
పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ
● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి/వనపర్తి రూరల్: జిల్లావ్యాప్తంగా ఉన్న 15 మండలాల పరిధిలోని 268 గ్రామపంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. బుధవారం మూడోవిడత ఎన్నికల ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌లో జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాసులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి పరిశీలించారు. ఉదయం శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రం, శ్రీరంగాపూర్ మండల కేంద్రం, పెబ్బేరు మండలం కంచిరావుపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు, భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకే ఓటువేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మూడోవిడతలో ఎన్నికలు జరిగిన ఐదు మండలాల పరిధిలో మొత్తం 1,11,357 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. -
హస్తగతం..
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు పెబ్బేరు మండలం వై.శాఖాపురంలో విజయోత్సవ ఊరేగింపు జిల్లాల వారీగా పోలింగ్, ఫలితాలు ఇలా.. మహబూబ్‌నగర్: జిల్లాలో మూడో విడతలో 133 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్.. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్, జడ్చర్ల మండలాల పరిధిలో నిర్వహించిన ఎన్నికల్లో 67 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. 52 జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీజేపీకి చెందిన నలుగురు, తొమ్మిది చోట్ల ఇతరులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్: జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లోని 158 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 102 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 37 చోట్ల బీఆర్ఎస్కు చెందిన వారు గెలుపొందారు. ఇతరులు 12, బీజేపీకి చెందిన ఒకరు సర్పంచ్‌గా విజయం సాధించారు. నారాయణపేట: జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, మక్తల్, మాగనూర్, కృష్ణ, ఊట్కూరు మండలాల్లో 110 జీపీలకు పోలింగ్ నిర్వహించారు. 59 గ్రామాల్లో హస్తం.. 25 చోట్ల బీఆర్ఎస్, 17 జీపీల్లో బీజేపీకి చెందిన వారు గెలుపొందారు. తొమ్మిది గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. వనపర్తి: జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో 87 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 46 పంచాయతీల్లో హస్తం, 26 జీపీల్లో బీఆర్ఎస్, మూడు చోట్ల బీజేపీ మద్దతుదారులు, 12 మంది స్వతంత్రులు సర్పంచ్‌లుగా విజయబావుటా ఎగురవేశారు. జోగుళాంబ గద్వాల: జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి, మానవపాడు, అలంపూర్, ఎర్రవెల్లి, ఇటిక్యాల మండలాల్లో మొత్తం 75 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 25 జీపీల్లో కాంగ్రెస్, 31 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, 19 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. అక్కడక్కడ.. ● వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాళ్లూరు గ్రామంలో ఆరో వార్డులో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఫలితాలు తారుమారు చేస్తున్నారని రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీస్‌లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారు గెలవడంతో వారు ఆందోళనను విరమించారు. ● నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారు మెట్ల తిరుపతమ్మ గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మం అనే వ్యక్తిపై ‘కారు’ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తుది విడత: 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్ ఉమ్మడి జిల్లాల్లో 27 మండలాల పరిధిలో తుది విడత ఎన్నికలు జరిగాయి. 563 జీపీల్లో ఏడు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 52 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 504 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. 5,016 వార్డు స్థానాలకు గాను 58 వార్డుల్లో నామినేషన్లు పడలేదు. 942 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరిగింది. పలు చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులను విజయం వరించగా.. రీకౌంటింగ్లతో ఉత్కంఠ నెలకొంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తుది విడతలోనూ కాంగ్రెస్‌కే ఆధిక్యం సత్తా చాటిన బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రభావం చూపలేక వాడిపోయిన ‘కమలం’ ఉమ్మడి జిల్లాలో సర్పంచ్‌లకు సన్మానాల పర్వం షురూ ‘హస్తం’ శ్రేణుల్లో జోష్.. ‘కారు’ కార్యకర్తల్లోనూ ఉత్సాహం -
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి నామినేషన్ల స్వీకరణ, మూడు విడతల్లో ఎన్నికలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని.. ఎన్నికల విధులు నిర్వర్తించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీతరెడ్డి అభినందనలు తెలిపారు. చివరి విడత ఎన్నికల సందర్భంగా ఆమె శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడంలో యంత్రాంగం పాత్ర విశేషమన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, రాత్రి గస్తీ, ముందస్తు చర్యలు, నిరంతర నిఘా వంటి చర్యలతో ఏ చిన్న ఘర్షణ కూడా పెద్ద సమస్యగా మారకుండా నియంత్రించగలిగామని తెలిపారు. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి పోలింగ్ కేంద్రంలో బందోబస్తును పరిశీలించిన ఓటర్లతో మాట్లాడారు. -
కోడలిపై అత్త విజయం
జడ్చర్ల మండలం మాటుబండతండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించింది. తండా ఎస్టీ మహిళకు రిజర్వు కాగా నేనావత్ లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దీపక్‌రాథోడ్ సర్పంచ్‌గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్ బరిలో దింపాడు. వీరితోపాటు ఆంగోతు రూప్లి అనే మహిళ సైతం బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 228 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లికి 56 ఓట్లు వచ్చాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. – జడ్చర్ల టౌన్ -
‘తుది’ పోరుకు సై..
నేడు చివరి విడత సం‘గ్రామం’ ● 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాల్లో ఎన్నికలు ● ఏకగ్రీవం పోనూ 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్ ● 5 జిల్లాలు, 27 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తుది విడత సంగ్రామం క్లైమాక్స్‌కు చేరింది. ఉమ్మడి పాలమూరులోని 27 మండలాల పరిధిలో బుధవారం చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐదు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఏర్పాటు చేసిన సెంటర్లలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసింది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు. రెండు విడతల్లో పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యం అయిన నేపథ్యంలో చివరి దఫాలో ఎక్కడా జాప్యం జరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికార యంత్రాంగానికి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు పలు సూచనలు చేశారు. -
చివరి విడతకు పటిష్ట భద్రత : ఎస్పీ
వనపర్తి: జిల్లాలో మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిర్భయంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసుశాఖ పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మూడోవిడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, శ్రీరంగాపురం మండలాల్లో 87 గ్రామపంచాయతీలు ఉండగా.. 6 ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన పంచాయతీల్లో 1,300 మంది అధికారులు, సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి వరకు విధుల్లో ఉన్న సిబ్బంది సమయస్ఫూర్తి, అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి నిమిషం పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బీఎన్ఎస్ 163 చట్టం అమలులో ఉంటుందని, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు, మొబైల్ పెట్రోలింగ్, చెక్‌పోస్టులు నిరంతరం పని చేస్తాయని వివరించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డీజేలు, బాణసంచాకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ఆవిష్కరణలకు ప్రోత్సాహం : కలెక్టర్ వనపర్తి: గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారం గుర్తించడమే ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణస్థాయి ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఐటీ టవర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా స్టార్టప్స్, ఇన్నోవేటర్లు, యువ ఔత్సాహికులకు వినూత్న ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆవిష్కరణలకు ఆన్ ది స్పాట్ వాలిడేషన్, మెంటర్షిప్, టెక్నికల్ సపోర్ట్ అందిస్తారన్నారు. రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టంను బలోపేతం చేయడం, యువతలో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మరిన్ని వివరాలకు pr&tsic@telangana.gov.in సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో టీజీఐసీ ప్రోగ్రాం లీడ్ రమేష్‌గౌడ్, ఐడీసీ మేనేజర్ శ్రీకాంత్, ఈడీఎం వెంకటేష్, డీఎస్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక గోపాల్పేట: మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి ని స్వరూప ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై ందని పాఠశాల పీడీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగే ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. నవంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్‌కీపర్‌గా అత్యంత ప్రతిభ కనబర్చినందుకుగాను ఎంపిక చేసినట్లు వివరించారు. గతంలో ఎస్జీఎఫ్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొని ప్రతిభ కనబర్చిందని, కల్వకుర్తిలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీ, మధ్యప్రదేశ్‌లో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్‌కీపర్‌గా అవార్డు సాధించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. -
‘జూపల్లి’ ఇలాకాలో ఉత్కంఠ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు రెండు విడతలు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన ఆయా ఎమ్మెల్యేల సొంతూళ్లలో విపక్ష పార్టీల మద్దతుదారులు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుది విడతలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంపై అందరూ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం చిన్నంబావి మండలంలోని పెద్ద దగడ గ్రామానికి బుధవారం పోలింగ్ జరగనుండగా.. ఫలితం ఏ విధంగా ఉంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్ స్థానం కాగా.. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్‌రెడ్డి తలపడుతున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గ పరిధిలో చివరి దఫాలో ఎన్నికలు జరిగే మండలాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. చిత్రవిచిత్ర పొత్తులే ఇందుకు కారణం. 2వ విడతలో నువ్వా.. నేనా.. రెండో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో 71 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ పోటాపోటీగా సర్పంచ్ స్థానాలను సాధించింది. హస్తం బలపరిచిన అభ్యర్థులు 36 మంది.. బీఆర్ఎస్ మద్దతుదారులు 29 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు. బీజేపీకి చెందిన ఇద్దరు.. స్వతంత్రులు మరో నలుగురు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఇందులో మండల కేంద్రాలైన పెద్దకొత్తపల్లి, పెంటవెల్లి జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా.. కోడేరులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పోలింగ్ జరుగుతున్న రోజు ఆ స్వతంత్ర అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం పెద్ద దగడఫలితంపై సర్వత్రా ఆసక్తి కొల్లాపూర్‌లోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్లో తుదివిడత ఎన్నికలు ఆయా మండలాల్లో పొడిచిన పొత్తులతో రసవత్తరంగా పోరు ఒక్క ‘చిన్నంబావి’లోనే 12 జీపీల్లో కారుకు కమలం మద్దతు.. మిగిలిన 4 పంచాయతీల్లో బీజేపీకి బీఆర్ఎస్ తోడ్పాటు మిగతా మండలాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి.. -
సజావుగా ఎన్నికల నిర్వహణ
పాన్‌గల్: గ్రామపంచాయతీ మూడోవిడత ఎన్నికలు సజావుగా జరిగే విధంగా మండలంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సంద ర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూ చనలు, సలహాలిచ్చారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ గోవిందరావు, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
తుది ఘట్టానికి ఏర్పాట్లు పూర్తి
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల తుది ఘట్టానికి అఽధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపురంలో చివరి విడత ఎన్నికలు జరగనుండగా.. మంగళవారం మండల కేంద్రాల నుంచి పీఓలు, ఓపీఓలు ఎన్నికల సామగ్రితో ఐదు మండలాల పరిధిలోని 702 పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ ఉదయం ఏడుకు ప్రారంభమై.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం స్టేజ్–2 ఆర్ఓ ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. తుది విడతలో 87 సర్పంచ్ స్థానాలకుగాను ఏడు ఏకగ్రీవం కాగా.. 80 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 806 వార్డులకు గాను 104 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 702 స్థానాలు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 702 పోలింగ్ కేంద్రాలకు 2,239 మంది పీఓలు, ఓపీఓలను కేటాయించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు 1,300 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. నేడు జిల్లాలోని ఐదు మండలాల్లో స్థానిక ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సామగ్రి, సిబ్బంది విధుల్లో 2,239 మంది సిబ్బంది బందోబస్తుకు 1,300 మంది పోలీసులు -
పారదర్శకంగా, పకడ్బందీగా పోలింగ్
● సామగ్రి పంపిణీ కేంద్రాలనుపరిశీలించిన కలెక్టర్ ● పాన్గల్లో ఏర్పాట్లు సరిగాలేవని మండలస్థాయి అధికారులపై ఆగ్రహం పాన్‌గల్/వీపనగండ్ల/వనపర్తి రూరల్: మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం పాన్‌గల్, వీపనగండ్ల, పెబ్బేరులో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రజలు తమ ఓటు హక్కును తమకు నచ్చిన అభ్యర్థికి నిర్భయంగా వేసుకోవచ్చన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ సామగ్రి తీసుకున్న సిబ్బంది ఫారం–9 ప్రకారం బ్యాలెట్ పేపర్లు సరిచూసుకొని పీఓలకు అప్పగించాలన్నారు. సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి వారి వద్ద ఉన్న బ్యాలెట్ పేపర్లలో సర్పంచ్, వార్డు సభ్యుల వారీగా పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. ● పాన్‌గల్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో కౌంటర్ల ఏర్పాట్లపై ఎంపీడీఓ గోవిందరావు, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూట్లవారీగా సిబ్బందిని కూర్చోబెట్టాల్సింది పోయి ఒకే దగ్గర గుంపులు, గుంపులుగా కూర్చోబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా అధికారులు సూచించిన విధంగా కాకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. సామగ్రి పంపిణీ, తరలింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. వీపనగండ్ల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు ఉన్నారు. -
మూడో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: మూడో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, రిటర్నింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న జరిగే పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తం అయిందన్నారు. ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు ఏ ఒక్కరు ఇంటింటి ప్రచారం లేదా మీడియాలో ప్రచారం చేయడానికి వీలులేదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి మొదలుకొని పోలింగ్, ఓట్ల కౌంటింగ్, ఫలితాల వెల్లడి వరకు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు చేయాల్సిన విధులు, బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మూడో విడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పానగల్, వీపనగండ్ల మండలాల్లో 87 జీపీల్లో సర్పంచ్ స్థానాలు, 806 వార్డులకు గాను ఇప్పటికే చిన్నంబావి మండలంలో గడ్డబస్వాపూర్, పాన్‌గల్ మండలంలో దేవాజిపల్లి, బహదూర్గూడెం, పెబ్బేర్ మండలంలో పెంచికలపాడు, రామమ్మపేట, రాంపూర్ గ్రామాల సర్పంచులు, 104 వార్డు మెంబర్లు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 81 సర్పంచ్, 702 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీసీలో ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య భట్టు, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, డీపీఓ రఘుపతిరెడ్డి, తరుణ్ చక్రవర్తి, సీపీఓ హరికృష్ణ పాల్గొన్నారు. -
మూడో విడత.. రసవత్తరం
● పంచాయతీల్లో పాగా కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు ● రెబల్స్‌తో అధికార పార్టీకి తగ్గుతున్న స్థానాలు ● పొత్తులతో ఢీ అంటున్న బీఆర్ఎస్ ● రాజకీయ వేడిని రాజేస్తున్న నేతల మాటలు వనపర్తి: పంచాయతీ ఫైనల్ పోరుపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తొలి, మలి విడతలో చోటు చేసుకున్న పొరపాట్లతో ఆధిక్యం సాధించినా అసంతృప్తిలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మూడో విడత వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తు వేసే ప్రయత్నంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం ముగియడంతో వలస ఓటర్లు, ప్రత్యర్థుల తరుఫున ఉన్న ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం గడిచిన రెండు విడతల్లో ఆశించిన కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందడంతో క్యాడర్లో మరింత జోష్ నింపుతూ.. ఆయా ప్రాంతాల్లో అనుకూలత మేరకు పొత్తులతో అఽధికార పార్టీకి చుక్కలు చూపించే ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో అధికార పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైందనే అసహనం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ కారణంగానే చాలా గ్రామాల్లో ఫలితాలు తారుమారయ్యాయని పార్టీ పెద్దలకు చెబుతున్నట్లు తెలిసింది. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ఢీ.. జిల్లాలోని పలు జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీలు ఏకం కావడం.. అధికార కాంగ్రెస్‌లో రెబల్స్ సమస్య ప్రతిపక్ష పార్టీలకు కలిసొచ్చే అంశాలని చెప్పవచ్చు. ఈ కారణంగా జిల్లాలోని మదనాపురం, వనపర్తి, ఖిల్లాఘనపురం, గోపాల్పేట మండలాల్లో అఽధికార పార్టీకి జీర్ణించుకోలేని ఫలితాలు వెలువడ్డాయి. వాటిని పూడ్చుకునేందుకు పలువురు సర్పంచులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నిమగ్నమైనట్లు తాజా చేరికలతో స్పష్టమవుతోంది. మాటలు తెచ్చిన పొలిటికల్ హీట్.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాయకుల ప్రసంగాలు తెచ్చిన పొలిటికల్ హీట్ కొన్ని ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నేతల వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ.. ఎన్నికల్లో ఆధిక్యం సాధించే ఎత్తుగడలు వేస్తున్నాయి. ముఖ్యంగా దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లో నేతలు, వారి కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికాార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గ్రామస్థాయి నాయకులు సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలు గుప్పిస్తూ.. చేస్తున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి రూరల్: వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీయడంతో పాటు ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. నిబంధనల మేరకు ఉన్న ధాన్యాన్ని జాప్యం లేకుండా సేకరించాలని.. ట్యాగ్ చేసిన మిల్లులకు వెంటనే తరలించి, ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని కేంద్రం ఇన్చార్జికి సూచించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ డీఎం జగన్మోహన్ ఉన్నారు. నేడు ఎస్జీఎఫ్బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో నేడు (మంగళవారం) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ ఒరిజినల్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఉదయం 9 గంటలకు పీడీ సాదత్ఖాన్కు రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం 89198 71829 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు. 18న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక కందనూలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు కోసం క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టు ఎంపికను ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌లోని నల్లవెల్లి రోడ్డులో గల క్రికెట్ మైదానంలో ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 10 గంటల వరకు క్రీడా మైదానానికి చేరుకోవాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 26 వరకు 4 లీగ్ మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఆసక్తిగల క్రీడాకారులు పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 89193 86105, 98854 01701లను సంప్రదించాలని సూచించారు. -
ఇంటికే ‘పోల్ చీటీ’
● ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ● బీఎల్ఓల ద్వారా నేరుగా ఓటర్లకు అందజేత వనపర్తి: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఓటర్లకు పోలింగ్ సిప్ల్‌లను అందజేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నేరుగా పోల్ చీటీలు అందజేస్తున్నారు. ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్న పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో మరో రెండు రోజుల్లో పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగం ఈ దిశగా ముందుకు సాగుతోంది. నిరక్షరాస్యులు.. వృద్ధులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోల్ చీటీలు దోహదపడుతాయి. వీటిని గతంలో రాజకీయ పార్టీలే ముంద్రించి ఎన్నికలకు ముందు రోజున ప్రచారం చేసుకుంటూ ఓటర్లకు అందించేవారు. అయితే వీరు ఓటర్లు అందరికీ ఇచ్చేవారు కాదు. దీంతో తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక ఓటర్లు పోలింగ్ రోజున ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు ఎక్కువగా సతమతమయ్యేవారు. ఈ క్రమంలో ఓటర్లు సులువుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘమే పోల్ చీటీలను అందజేస్తోంది. ఓటర్లు ఇళ్లలో లేకుంటే.. సిబ్బంది ఇళ్లకు వెళ్లిన సమయంలో లేనివారి పోల్ స్లిప్‌లు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతారు. వారితోపాటు చిరునామాలో లేనివారివి, డూప్లికేట్లుగా భావించిన వారివి అందుబాటులో ఉంటాయి. అక్కడ తగిన ఆధారం చూపి పోల్ చీటీ తీసుకోవచ్చు. పోల్ చీటీ లేకపోయినా ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటరు జాబితాలో పేరుంటే ఓటరు వేయవచ్చు. -
ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు
చిన్నంబావి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం చిన్నంబావిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండో విడత 78 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేశాయన్నారు. మూడో వంతు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు అంతర్గతంగా సహకారం అందించుకుంటున్నాయని పంచాయతీ ఎన్నికలతో బహిర్గతం అయిందన్నారు. మూడో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. అనంతరం కొప్పునూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమావేశంలో నాయకులు కల్యాణ్‌రావు, బీచుపల్లి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పెరుమాల శ్రీనివాసులు, నర్సింహ, వడ్డెమాన్ బిచ్చన్న ఉన్నారు. -
ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 2026 జనవరి 14 న ముగుస్తుందని, దీంతో ధనుర్మాసంలో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తునట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రాతః కాల మహా మంగళ హారతి ఉదయం 6.30 గంటలకు ఉందని.. ఆ సమయాన్ని 5.30 గంటలకు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోనూ ప్రాతఃకాల మహా మంగళహారతిని ఉదయం 6 గంటల నుంచి 5.45గా మార్పు చేసినట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రలోభాల పర్వం షురూ
వనపర్తి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుండగా.. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. జిల్లాలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో పల్లెల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి ఓటు కీలకం కావడంతో కొందరు అభ్యర్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. తమ వారు హైదరాబాద్ నుంచి రావాలని.. బస్సులో వస్తే మధ్యాహ్నం 1గంట దాటుతుందని.. వారు కారు తీసుకొని వస్తారని.. కారు కిరాయి, టీ, టిఫిన్, భోజనం, డ్రైవర్ బత్తా కలిసి రూ. 10వేల వరకు అవుతుందని.. వారిని రమ్మంటావా.. వద్దంటావా అని అభ్యర్థులకు చెబుతుండటంతో పరేషాన్లో పడుతున్నారు. ఎవరూ ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తే.. కొందరు ముంబాయి, హైదరాబాద్ ఇతర పట్టణాల్లో ఉన్నా రని చెబుతుండటంతో ఖంగుతింటున్నారు. ● పోలింగ్‌కు 48 గంటల ముందుగానే ప్రచార కార్యక్రమాల నిషేధం అమలులోకి వచ్చింది. సభలు, సమావేశాల నిర్వహణ, స్పీకర్ల వినియోగం, ప్రచారం, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఐదుగురు వ్యక్తులు లేదా గుంపులుగా ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు. కాగా, మద్యం దుకాణాలు శనివారం సాయంత్రం నుంచే మూతపడ్డాయి. -
ప్రశాంతంగా రెండోవిడత ఎన్నికలు
వనపర్తి: జిల్లాలో ఆదివారం జరిగిన రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. నాచహళ్లిలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఉదయం కలెక్టర్ సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకుందామని ఓటర్లకు సూచించారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. తర్వాత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ను జిల్లా ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టుతో కలిసి పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లో నిలిచిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేసినట్లు వివరించారు. రెండోవిడత పోలింగ్ జరిగిన వనపర్తి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో మొత్తం 1,03,406 ఓట్లు.. 87 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్ ఉన్నారు. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి..
కొత్తకోట రూరల్: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, అమరచింత మండలాల్లో పర్యటించి సమస్యాత్మక గ్రామాలైన చిట్యాల, రాజపేట, కానాయిపల్లి, మదనాపురం, జూరాల పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో సర్పంచ్ ఎన్నికలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, క్యూలైన్లో ఉండేలా చూడాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ విభాగం హైఅలర్ట్‌లో కొనసాగాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు. 5 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట వికారాబాద్ రీజినల్ ఇంటలిజెన్స్ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, స్పెషల్ బ్రాంచ్ సీఐ న రేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వనపర్తి రూరల్, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్ ఎస్ఐలు జలంధర్‌రెడ్డి, ఆనంద్, శేఖర్‌రెడ్డి, జయన్న ఉన్నారు. -
జిల్లాల వారీగా పోలింగ్ ఇలా..
జిల్లా మొత్తం ఓట్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్‌నగర్ 91,496 93,540 04 1,85,040 80,075 80,209 00 1,60,284 నాగర్‌కర్నూల్ 1,25,402 1,24,832 05 2,50,239 1,05,980 1,04,170 01 2,10,151 జోగుళాంబ గద్వాల 55,710 57,094 03 1,12,807 49,086 49,145 03 98,234 వనపర్తి 58,900 59,890 02 1,18,792 51,803 51,603 00 1,03,406 నారాయణపేట 73,674 76,642 02 1,50,318 62,703 64,065 01 1,26,769 మొత్తం 4,05,182 4,11,998 16 8,17,196 3,49,647 3,49,192 05 6,98,844 అమడబాకులలో.. -
పల్లెలు పోటెత్తాయి!
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్ ● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్ ● అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో 84 శాతం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్‌లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 84 శాతం.. ఆపైనే.. ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్‌నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. -
చెయ్యెత్తిన పల్లెలు..
2వ విడతలోనూ కాంగ్రెస్ హవా ● 565 జీపీల్లో 327 మంది సర్పంచ్‌లుగా గెలుపు ● 169 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్.. 30 చోట్ల బీజేపీ మద్దతుదారులు.. ● ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటున 85.80 శాతం పోలింగ్ ● చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ● 17న చివరి దశ ఎన్నికలు.. నేటితో ప్రచారం సమాప్తం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. 565 జీపీల్లో 46 ఏకగ్రీవం పోను మిగిలిన 519 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డు స్థానాలకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఇందులో మొత్తంగా 327 పంచాయతీల్లో ‘హస్తం’ మద్దతుదారులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 169 చోట్ల ‘కారు’ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీకి చెందిన 30 మంది, మరో 39మంది ఇతరులు/స్వతంత్రులు గెలుపొందారు. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంది. పలు చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులను విజయం వరించగా.. రీకౌంటింగ్లతో ఉత్కంఠ నెలకొంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో అభ్యంతరాలతో రాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. చెదురుముదురు ఘటనలు మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ సర్పంచ్‌గా ‘దోశబండి’ వెంకటేష్ నవాబుపేటలో దోశబండి నడుపుతూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ సర్పంచ్‌గా గెలుపొందారు. మండలంలోని కామారం గ్రామానికి చెందిన ఈయన కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచారు. ఈ క్రమంలో వెంకటేష్‌కు 471 ఓట్లు రాగా.. ప్రత్యర్థి బీఆర్ఎస్ మద్దతుదారు లింగంకు 388 ఓట్లు రావడంతో వెంకటే్‌ష్ 83 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో స్థానికులు దోశబండి వెంకటేష్ ఇకనుంచి సర్పంచ్ వెంకటేష్ అయ్యాడంటూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో కనీస సౌకర్యాల కల్పన, పాఠశాల అభివృద్ధే లక్ష్యమన్నారు. – నవాబుపేట తమ్ముడిపై అన్న గెలుపు కొల్లాపూర్ మండలం రామాపురంలో సర్పంచ్ స్థానానికి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొమ్మ నాగరాజు, బీఆర్ఎస్ మద్దతుతో కొమ్మ గోపాల్ సర్పంచ్ బరిలో నిలిచారు. గోపాల్‌కు 876 ఓట్లు రాగా, నాగరాజుకు 570 ఓట్లు వచ్చాయి. దీంతో తమ్ముడిపై అన్న గోపాల్ 306 మెజార్టీతో విజయం సాధించారు. – కొల్లాపూర్ రూరల్ ఓటు కోసం దుబాయి నుంచి ఓటు విలువను గుర్తించిన ఓ వ్యక్తి సర్పంచ్ ఎన్నికల్లో వినియోగించుకోవడానికి ఏకంగా దుబాయ్ నుంచి వచ్చాడు. మరికల్‌కు చెందిన భాస్కర్ దుబాయ్‌లో స్థిరపడగా మరికల్ సర్పంచ్ అభ్యర్థిగా బంధువులు పోటీ చేశారనే విషయాన్ని తమవారు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో భాస్కర్ రెండు రోజుల క్రితమే దుబాయ్ నుంచి మరికల్‌కు వచ్చి.. గురువారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. – మరికల్ బ్యాలెట్లో కనిపించని గుర్తు.. బవనపర్తి మండలం చిమనగుంటపల్లి 8వ వార్డు పోలింగ్ కేంద్రంలో వార్డు అభ్యర్థికి కేటాయించిన సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్లో ముద్రించలేదు. వార్డులో 260 ఓట్లుండగా అప్పటికే 50 మంది ఓటు వేశారు. తర్వాత ఓటు వేయడానికి వెళ్లిన ఒకరు సిలిండర్ గుర్తు లేదని చెప్పడంతో బాధిత అభ్యర్థి ఆందోళనకు దిగడంతో గంటపాటు పోలింగ్ నిలిచింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని అప్పటికే ఓట్లు వేసిన బాక్సును సీజ్ చేసి కొత్త బాక్సు ఏర్పాటుచేసి పోలింగ్ ప్రారంభించారు. అప్పటికే ఓటు వేసిన 50 మంది ఓటర్లను తిరిగి ఓటు వేయించడంతో గొడవ సద్దుమణిగింది. కాగా.. సిలిండర్ గుర్తుకు కేవలం 33 ఓట్లు రావడంతో ఆ అభ్యర్థి ఓడిపోయారు. – వనపర్తి రూరల్ 17న చివరి విడత పోలింగ్.. రెండో విడతలో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఉప సర్పంచ్ అభ్యర్థులను సైతం ఎన్నుకున్నారు. తుది విడతకు సంబంధించి సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా.. 17న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు.. ● నారాయణపేట జిల్లా ధన్వాడలో ఎన్టీఆర్ కాలనీ వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరగగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పంపించారు. ● నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో బీఆర్ఎస్ మద్దతుదారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అదే పార్టీకి చెందిన రెబల్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్పంచ్ మద్దతుదారు చంద్రకళ, రెబల్‌గా పోటీలో ఉన్న సౌమ్య వర్గీయులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే బాహాబాహీకి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మహబూబ్‌నగర్: 98 కాంగ్రెస్.. 39 బీఆర్ఎస్ జిల్లాలోని 151 జీపీల్లో రెండో విడతలో పోలింగ్ జరిగింది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హన్వాడ, దేవరకద్రలోని సీసీకుంట, కౌకుంట్ల దేవరకద్ర.. జడ్చర్లలోని మిడ్జిల్.. నారాయణపేటలోని కోయిల్‌కొండ మండలాల పరిధిలో 98 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 39 జీపీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది, ఆరు చోట్ల ఇతరులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. నాగర్‌కర్నూల్: పోటాపోటీ.. జిల్లాలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజీపేట.. కొల్లాపూర్ సెగ్మెంట్లోని పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని 151 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 78 జీపీల్లో కాంగ్రెస్ బలపరిచిన వారు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 60 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇతరులు ఏడుగురు, బీజేపీకి చెందిన ఆరుగురు గెలుపొందారు. నారాయణపేట : కాంగ్రెస్‌దే పైచేయి.. జిల్లాలోని ఈ నియోజకవర్గ పరిధిలో దామరగిద్ద, ధన్వాడా, నారాయణపేట, మరికల్ మండలాల్లో 95 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 52 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు.. 18 పంచాయతీల్లో బీఆర్ఎస్, 13 జీపీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 12 గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. వనపర్తి: సగం.. సగం జిల్లాలోని వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట, మదనాపురం, మక్తల్‌లోని ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలో 94 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 55 పంచాయతీల్లో హస్తం, 28 జీపీల్లో బీఆర్ఎస్, రెండింట బీజేపీ మద్దతుదారులు, తొమ్మిది మంది స్వతంత్రులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. జోగుళాంబ గద్వాల: కాంగ్రెస్ 44.. బీఆర్ఎస్ 24 జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో మల్దకల్, అలంపూర్‌లో అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో మొత్తం 74 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 44 జీపీల్లో కాంగ్రెస్, 24 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఒక బీజేపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌లుగా గెలుపొందారు. 6,98,844 మంది ఓటేశారు.. ఉమ్మడి పాలమూరులో రెండో విడతలో ఎన్నికల్లో మొత్తంగా 8,17,196 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 4,05.182, మహిళలు 4,11,998, ఇతరులు 16 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,49,192 మంది, మహిళలు 3,49,192 మంది, ఇతరులు ఐదుగురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 6,98,844 మంది ఓటు వేశారు. మొత్తంగా 85.80 శాతం పోలింగ్ నమోదైంది. అమెరికా టు సంకిరెడ్డిపల్లి కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అమర్‌రెడ్డి గత కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చి గురువారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో జరిగే ప్రతి ఎన్నికలోనూ తాను వచ్చి ఓటు వేస్తానని ఆయన పేర్కొన్నారు. – కొత్తకోట రూరల్ -
పెద్దదగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..
ప్రభావిత వర్గాలు.. పురుషులు 1,071 మహిళలు 1,021 మొత్తం ఓటర్లు 2,092యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్ రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భాస్కర్ యాదవ్ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్‌రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్ యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు. -
1,150 మంది సిబ్బందితో బందోబస్తు : ఎస్పీ
వనపర్తి: జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో పోలీసు అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసిస్తూ.. రెండోవిడత విధులు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. రెండోవిడతలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, అమరచింత మండలాల్లోని 94 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని, 1,150 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, నిబంధనలు ఉల్లంఘించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవైనా ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటిస్తూ కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీసుశాఖ నిషిత పరిశీలన ఉందని.. ఎవరైనా ఎన్నికల నిర్వహణకు అటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచా రం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్పులు, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. సజావుగా రెండోవిడత ఎన్నికలు మదనాపురం: మండలంలో ఆదివారం జరిగే రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ ప్రసన్నకుమారి, రూట్ అధికారులు ఉన్నారు. అమరచింతలో ఝార్ఖండ్ బృందం అమరచింత: స్థానిక చేనేత ఉత్పత్తుల సంఘం పనితీరు అద్భుతంగా ఉందని ఝార్ఖండ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ప్రతినిధులు కొనియాడారు. అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘంలో తయారవుతున్న జరీ చీరలు, రెడీమెట్ వస్త్రాల తయారీపై అధ్యయనం చేయడానికి ప్రతినిధుల బృందం రెండ్రోజుల పర్యటనకు వచ్చిందని సంఘం సీఈఓ చంద్రశేఖర్ వెల్లడించారు. సంఘం ఏర్పాటును వారికి వివరించామన్నారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు హ్యండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు తమ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో ఇక్కడి క్లస్టర్‌ను సందర్శించామని నోడల్ ఏజెన్సీ కంపెనీ సీఈఓ శ్యాంసుందర్, టెక్నికల్ అడ్వయిజర్ బిష్యుప్రసాద్, మహిళా ప్రతినిధులు తెలిపారు. ఇక్కడి నేత కార్మికుల పనితీరును పరిశీలించామని త్వరలోనే తమ రాష్ట్రంలో ఇలాంటి కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు. నిండుకుండలా రామన్‌పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని.. ఎన్టీఆర్ కాల్వకు 925 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
రెండో పోరుకు రెడీ
నేడు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు. 520 సర్పంచ్‌లకు 1,709 మంది పోటీ.. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడతలో ఇలా.. జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్‌లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది.. మహబూబ్‌గర్ 151 9 142 474 1,334 267 1,065 2,811 నాగర్‌కర్నూల్ 151 4 147 473 1,412 143 1,269 3,228 నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755 వనపర్తి 94 5 89 294 850 148 702 1,769 జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263 మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826 2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు.. 2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా.. జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్‌నగర్ 94,975 96,998 4 1,91,977 నాగర్‌కర్నూల్ 1,27,142 1,26,602 5 2,53,749 జో.గద్వాల 55,710 57,094 3 1,12,807 వనపర్తి 61,553 62,726 2 1,24,281 నారాయణపేట 73,674 76,642 2 1,50,318 మహబూబ్‌గర్: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్, హన్వాడ, కోయిల్‌కొండ) నాగర్‌కర్నూల్: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజీపేట)నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్) వనపర్తి: 5 (వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత) జోగుళాంబగద్వాల: 4 (మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి) నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్ నిర్వహించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 45 మంది సర్పంచ్‌లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం 520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రెండో విడతలో పోలింగ్ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. -
స్వగ్రామాలే సవాల్..!
దమగ్నాపూర్: ఇద్దరూ.. ఇద్దరే ● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు ● స్వీయ పర్యవేక్షణతో పాటు వేగుల ద్వారా పావులు ● జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం ● ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్ఎస్ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపొందారు. ..ఇలా తొలి విడత సం‘గ్రామంశ్రీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్‌గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ సర్పంచ్ అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్ఎస్ బలపరిచిన ఇ.పావని సర్పంచ్‌గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభావిత వర్గాలు.. బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, ఉప్పరి మహిళలు 2,706 పురుషులు 2,658 మొత్తం ఓటర్లు 5,364 ధన్వాడ పంచాయతీ కార్యాలయం ప్రభావిత వర్గాలు.. పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి పురుషులు 4,034 మహిళలు 4,293 మొత్తం ఓటర్లు 8,327 ప్రభావిత వర్గాలు.. పురుషులు 1,369 మహిళలు 1,416 మొత్తం ఓటర్లు 2,785 ఎస్సీ, వాల్మీకి, ముస్లిం, కురువ, ముదిరాజ్ పుల్లూరు: ఎవరి ధీమా వారిది తూడుకుర్తి: నువ్వా.. నేనా.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్వగ్రామం తూడుకుర్తి. నాగర్‌కర్నూల్ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్ పదవి అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ, బీఆర్ఎస్ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్‌రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. దామోదర్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్‌లుగా కాంగ్రెస్ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్ఎస్కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్‌రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ సర్పంచ్ స్థానానికి మొత్తం నలుగురు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ మద్దతుదారు సునీత, కాంగ్రెస్ బలపరిచిన సువర్ణతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఉమామహేశ్వరి, కవిత పోటీలో నిలిచారు. ప్రధానంగా సునీత, సువర్ణ మధ్యే పోటీ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బీఆర్ఎస్కు చెందిన వారు కావడం.. చల్లా స్కెచ్‌తో తన గెలుపు ఖాయమని సునీత ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం తనకు కలిసి వస్తుందని సువర్ణ భావిస్తున్నారు. -
ఈసీ మార్గదర్శకాలు విధిగా పాటించాలి
కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్/అమరచింత/ఆత్మకూర్: పీఓ, ఓపీఓలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా పాటించి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ ఎంపీడీఓ కార్యాలయాలు, అమరచింత ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి ఆయా కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఎదుట ఫారం–9లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తు పోస్టర్ అతికించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్నిరకాల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తీసుకొని కేటాయించిన గ్రామపంచాయతీకి రూట్ వారీ బస్సులో తరలివెళ్లారు. కలెక్టర్ వెంట ఎన్నికల సాధారణ జిల్లా పరిశీలకుడు మల్లయ్య బట్టు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఉన్నారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
వనపర్తిటౌన్: గెలిచిన అభ్యర్థులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో మొదటి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డుసభ్యులను ఆయన శాలువాలు, పూలమాలలతో సత్కరించి మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులని.. గెలిచిన తర్వాత అందరూ తమవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అధికారం లేదన్న దిగులు వీడి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, రాబోయేది బీఆర్ఎస్ పాలనేనని భరోసా కల్పించారు. మొదటి విడతలో 34 మంది బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచులు కావడం కాంగ్రెస్ ధౌర్జన్యాలు, అన్యాయానికి నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనర్సింహస్వామి హుండీ లెక్కింపు కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో భక్తులు కానుకలుగా సమర్పించిన 5 నెలల హుండీ డబ్బులను శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సమక్షంలో లెక్కించారు. ఈ ఏడాది జూన్ 24 నుంచి ఈ నెల 12 వరకు సంబంధించిన డబ్బులను లెక్కించగా.. రూ.10,75,733 ఆదాయం వచ్చింది. అలాగే మిశ్రమ వెండి 1.25 కిలోలు వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మదన్‌కుమార్, ఈఓ రంగారావు, జూనియర్ అసిస్టెంట్ జయపాల్‌రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి..
ఆత్మకూర్: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని ఆయనతో పాటు జెడ్పీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ పరిశీలించారు. ఎన్నికల నియమావళి పాటిస్తూ విధుల్లో పాల్గొనాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న 37 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రవాహం.. ప్రమాదం
● ఈత సరదా, దుస్తులు శుభ్రం చేసేందుకు వెళ్లి గల్లంతు ● అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు ●ప్రాజెక్టు అధికారులు తమ సిబ్బంది ద్వారా కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని సమీప గ్రామాల ప్రజలు, రైతులకు తెలియపర్చాలి. వారబందీ విధానంలో వారంలో ఎన్ని రోజులు నీటిని వదులుతారు.. ఎన్ని రోజులు నిలిపివేస్తారన్న విషయాలను తెలియజేస్తే ప్రాణహానిని నివారించవచ్చు. – హన్మంతు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, నందిమళ్ల జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట లష్కర్లను నియమించాలి. రోజు కాల్వ గట్లపై తిరుగుతూ అటుగా తిరిగే వారిని హెచ్చరించాలి. వేసవిలో చిన్నారులు, యువత ఈత సరదా కోసం కాల్వలోకి దిగే ప్రయత్నం చేస్తుంటారు. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – వెంకటేష్, విద్యార్థి సంఘం నాయకుడు నందిమళ్ల నందిమళ్లలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించాం. ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులను కాల్వ వద్దకు తీసుకెళ్లరాదని తల్లిదండ్రులకు సూచించాం. తీర గ్రామాల్లోని ప్రజలు కాల్వలోకి దిగరాదని.. అత్యుత్సాహం చూపుతే ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు శోకం మిగిల్చిన వారవుతారని అవగాహన కల్పించేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూర్ అమరచింత: ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీరు అందిస్తున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విలువైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వలో నీటి ప్రవాహ తీవ్రత, ప్రవహించే నీటితో కలిగే నష్టాల గురించి అవగాహన లేక అమాయక ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు ఈత సరదాతో ప్రాణాలు కోల్పోతున్నారు. నందిమళ్ల సమీప కాల్వలో ఇలాంటి మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రామన్‌పాడు వరకు.. జూరాల ఎడమ కాల్వ ద్వారా రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని క్రమం తప్పకుండా వదులుతుంటారు. కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల, మూలమళ్ల, జూరాల గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగి తమ అవసరాలను తీర్చుకుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోయి రామన్‌పాడు రిజర్వాయర్‌లో మృతదేహాలు కనిపించడం సర్వసాధారణంగా మారింది. ఐదేళ్లుగా జూరాల కాల్వలకు ప్రతి సీజన్లో వారబందీ విధానంలో నీటిని వదులుతున్న విషయం రైతులకు తప్ప ఇతరులకు తెలియకపోవడమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. జూరాల గ్రామ సమీపంలోని ప్రధాన ఎడమ కాల్వ లోతుగా భయంకరంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనన్న ఆందోళనలో ఇక్కడి ప్రజలు కాలం గడుపుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, వీపనగండ్ల మండలాల వరకు ప్రధాన ఎడమ కాల్వ ప్రవహిస్తుండటంతో ప్రజలు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్క నందిమళ్లలోనే.. పదేళ్లలో నందిమళ్ల గ్రామంలోనే 17 మంది సమీపంలోని జూరాల ఎడమ కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందారు. మూడేళ్లలో పెబ్బేరు సమీపంలోని కాల్వలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రాణాలు హరిస్తున్న జూరాల ఎడమకాల్వ కృష్ణానది అందాలు తిలకించడానికి వస్తున్న పర్యాటకుల్లో అధికంగా విద్యార్థులు, యువత కాల్వలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. కాల్వ పక్కనే చేప వంటకాలు వండి వడ్డించే గుడారాలు ఉండటం, అక్కడే మద్యం దొరకడంతో మత్తులో సరదా కోసం దూకుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం విక్రయాలను అరికట్టాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా అటు పోలీసులు, ఇటు అబ్కారీశాఖ వారు పట్టించుకోకపోవడంతో జోరుగా సాగుతోంది. -
విపత్తులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి
వనపర్తి: అకస్మాత్తుగా వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఇచ్చే శిక్షణ, సూచనలు, సలహాలు అమలు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. ఆయనతో పాటు జిల్లా లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యవస్థ ఉండాలి, ముందస్తు ఏర్పాట్లు, బాధ్యతలు ఎలా ఉండాలి అనే విషయాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రిటైర్డ్ మేజర్ జనరల్ సుధీర్బాల్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక అధికారులతో ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహించి మాక్ వ్యాయామం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో అధికారుల బాధ్యత, నిర్వర్తించాల్సిన పనులపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ మధ్యకాలంలో తరచూ భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీలు వస్తున్నాయని.. ఆకస్మికంగా వచ్చినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. ఇందుకు మౌలిక సౌకర్యాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం, అధికారులకు వారి బాధ్యతలపై స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరమని తెలిపారు. అందుకే సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాక్‌డ్రిల్ నిర్వహించాలనుకున్నట్లు తెలియజేశారు. -
రెండోవిడత సజావుగా సాగేలా చూడాలి
వనపర్తి: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఆదివారం రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించి మాట్లాడారు. పోలింగ్ సిబ్బంది గందరగోళానికి గురికాకుండా అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక గ్రామపంచాయతీలో ఎన్ని పోలింగ్ కేంద్రాలుంటే కౌంటర్లో అన్ని టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా పంపిణీ సులభం అవుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది సామగ్రి తీసుకొని తమ కేంద్రాలకు చేరుకునే వరకు రిజర్వ్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు చేపట్టే సమయంలో అభ్యర్థి లేదా ఏజెంట్‌ను మాత్రమే అనుమతించాలని చెప్పారు. మొబైల్ ఫోన్‌కు అనుమతి లేదని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తుతో పాటు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలింగ్ సమయంలో ఉదయం 9, 11, మధ్యాహ్నం ఒంటిగంట వరకు పక్కాగా ఓటింగ్ రిపోర్టులు పంపించేలా ఆపరేటర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెద్ద గ్రామపంచాయతీల్లో కౌంటింగ్ కోసం ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జనరల్‌లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని 24 మండలాల్లో తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి 237 అన్రిజర్వ్డ్ (జనరల్, మహిళ కలిపి) సర్పంచ్ స్థానాల్లో 116 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు 114 బీసీ రిజర్వ్ (బీసీ జనరల్, బీసీ మహిళ కలిపి) స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 550 సర్పంచ్‌లకు గాను 230 మంది (41.82 శాతం) బీసీలు ఎన్నికయ్యారు. తొలివిడతలోసర్పంచ్లుగా విజయం 237 అన్రిజర్వ్డ్ స్థానాల్లో 116 మంది జయకేతనం మొత్తంగా 550 పంచాయతీల్లో 230 మంది గెలుపు బీసీలు పోటీలో ఉన్న జనరల్ స్థానాలపై సంఘాల ప్రత్యేక నజర్ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
‘విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం’
వనపర్తి: మూడువిడతల గ్రామపంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులోనే ఉంటుందని.. గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, ఊరేగింపులు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల తొలివిడత ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎంసీసీ అమలులో ఉన్నంతకాలం ఈ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమించే ఏ చర్యనైనా సహించమని, ఉల్లంఘనలు జరిగితే వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యతని.. శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని కోరారు. చిన్నారెడ్డి మద్దతుదారు విజయం గోపాల్పేట: మండలంలోని జయన్న తిరుమలాపురంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి జ్యోతి ఎమ్మెల్యే మేఘారెడ్డి బలపర్చిన అభ్యర్థి జానమ్మపై 270 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పుట్టపాకల రాజును ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని, గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఒక్క ఓటుతో విజయం.. ఖిల్లాఘనపురం: మండలంలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సోళీపురం సర్పంచ్‌గా సింధూజ ఒకేఒక్క ఓటుతో విజయం సాధించారు. సింధూజకు 1,006 ఓట్లు రాగా, తన సమీప అభ్యర్థి పద్మశ్రీకి 1,005, మరో అభ్యర్థి నవీన్‌కు 42 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా అత్యధికంగా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మద్దతుదారు ఆగారం పద్మశ్రీ తన సమీప అభ్యర్థి బీజేపీ మద్దతుదారు కృష్ణవేణిపై 1,476 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెద్దమందడిలో...కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మద్దతుదారు సూర గంగమ్మ 640 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అత్యల్పంగా మోజర్లలో కాంగ్రెస్ మద్దతుదారు కానాయపల్లి శేఖర్ 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ రూరల్‌లో బీఆర్ఎస్ గెలుపు సంబురం వనపర్తి: జిల్లాలోని 5 మండలాల్లో గురువారం జరిగిన తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పోలింగ్ సరళిని ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి ఆయనతో పాటు ఎస్పీ సునీతరెడ్డి, సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సకాలంలో ఎన్నికలు పూర్తికాగా.. ఖిల్లాఘనపురం గ్రామపంచాయతీలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లందరినీ ఓటు వేయించినట్లు చెప్పారు. నిర్దేశిత సమయానికి పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని, పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన శాంతిభద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. తొలివిడతలో ఎన్నికలు జరిగిన ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లో మొత్తం 1,03,225 ఓట్లు, 84.9 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. వెబ్‌కాస్టింగ్‌లో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఖీమ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఓటెత్తారు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్‌లో వెనుకపడ్డారు. జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 83.04 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 83.37 శాతం, మహిళలు 82.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా 86.32 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 87.13 శాతం, మహిళలు 85.53 శాతం మంది ఓటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో తొలి విడత జీపీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తంగా 86.77 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 87.79 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 85.79 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 84.90 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 85.91 శాతం, మహిళలు 83.99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో జరిగిన జీపీ ఎన్నికల్లో మొత్తంగా 84.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 85.55 శాతం, మహిళలు 83.66 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దమందడి పోలింగ్‌కేంద్రం వద్ద వృద్ధురాలిని వీల్‌చైర్‌లో తీసుకొస్తున్న సిబ్బంది జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 86.77 శాతం మహబూబ్‌నగర్‌లో అత్యల్పంగా 83.04 శాతం అన్ని జిల్లాల్లోనూ పురుషుల ఓటింగ్ శాతమే ఎక్కువ -
స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగాలి
గోపాల్పేట: ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారికి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం మండల కేంద్రం, ఏదుల తహసీల్దార్ కార్యాలయాలను ఆయన సందర్శించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఎదుట ఫారం–9లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తుల పోస్టర్ అతికించాలని సూచించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల అధికారులు అయేషా అంజుం, ఎంపీఓ భవాని, తిలక్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
ఖర్చు లెక్క పక్కాగా నమోదు చేయాలి
పాన్‌గల్: గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు చేస్తున్న ఖర్చును పక్కాగా నమోదు చేసి రికార్డులను అందించాలని, లేనిచో బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల వ్యయ నిబంధనలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఖర్చుల వివరాలు, బిల్లులు, ఓచర్లతో సహా ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లో సమర్పించాలని, అందించకుంటే భవిష్యత్‌లో ఏ ఇతర ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదని హెచ్చరించారు. సమావేశంలో సీనియర్ ఆడిటర్ లాలయ్య, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
21న జాతీయ లోక్ అదాలత్
● కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత వనపర్తిటౌన్: జిల్లా కోర్టు ప్రాంగణంలోఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. బుధవారం జిల్లా కోర్టు మందిరంలో న్యాయవాదులు, బ్యాంకు, బీమాసంస్థల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమనే విషయాన్ని కక్షిదారులు గుర్తించాలన్నారు. సివిల్, వివాహ సంబంధిత, మోటారు ప్రమాద, చెక్ బౌన్స్, రాజీ కుదుర్చుకోగల క్రిమినల్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రాజీయే రాజమార్గమని.. చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. ఏళ్ల తరబడి కొనసాగే కేసులు ఇరువర్గాల రాజీ, ఒప్పందంతో పరిష్కారమవుతాయని చెప్పారు. లోక్ అదాలత్‌లో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్ ఉండదని, దావా వేయడానికి కోర్టులో చెల్లించిన ఫీజు తిరిగి చెల్లిస్తారని వివరించారు. సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, న్యాయమూర్తులు జి.కళార్చన , కె.కవిత, కార్తీక్‌రెడ్డి, నోముల అశ్విని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కిరణ్‌కుమార్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికలు జరిగే మండలాల్లో సెలవులు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరిగే రోజున ఆయా మండలాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో భాగంగా గురువారం ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాలపేట, ఏదుల, రేవల్లి మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. ముగిసిన మూడోవిడత ప్రక్రియ వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మూడోవిడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి ముగిసింది. పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్ మండలాల్లోని మొత్తం 87 సర్పంచ్, 806 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించగా.. 7 సర్పంచ్, 104 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 80 సర్పంచ్ స్థానాలకు 248 మంది, 702 వార్డులకు 1,734 మంది బరిలో ఉండగా.. ఈ నెల 17న ఎన్నిక జరగనుంది. సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి పాన్‌గల్: దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీపీఎం ప్రభాకర్ కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకులు కూడా అనేక రకాల రుణాలు అందిస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో దివ్యాంగులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే ఆదర్శంగా నిలిచిన దివ్యాంగుల తల్లిదండ్రులను శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జిల్లా ఏపీఎం రాంబాబు, మండల ఏపీఎం వెంకటేష్‌యాదవ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, సీసీలు, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి రూరల్: జిల్లాలోని పెద్దగూడెం శివారు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ బీఎస్సీ (హాన్స్) వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ ఇన్ హార్టికల్చర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. పీహెచ్డీ, నెట్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత అసలు ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీ, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, పూర్తి బయోడేటాతో ఈ నెల 15న కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. మానవ హక్కులపై అవగాహన వనపర్తిటౌన్: ప్రాథమిక హక్కులు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని బుడగజంగాలకాలనీ, నాగవరం, మెట్టుపల్లిలోని పాఠశాల, జూనియర్ కళాశాల, పెబ్బేరులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మావన హక్కులపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతగా మెలగాలన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని పట్టణ, రూరల్ పోలీస్స్టేషన్లను సందర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, ప్యానెల్ అడ్వొకేట్లు నిరంజన్ బాబా, శిరీష్ చంద్రప్రసాద్, పారా లీగల్ వలంటీర్లు, ప్రిన్సిపాల్ నరేశ్‌కుమార్, న్యాయ కళాశాల విద్యార్థులు, మహిళాసంఘ సభ్యులు, న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత
● 1050 మంది సిబ్బందితో మూడంచెల భద్రత ● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● ఎస్పీ సునీతరెడ్డి వనపర్తి: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని ఎస్పీ డి.సునీతరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని దిశా నిర్దేశం చేశారు. గురువారం పెద్దమందడి, ఖిలాఘనపురం, గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లోని 87 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అందులో 5 ఏకగ్రీవం కావడంతో 82 గ్రామాల్లోఎన్నికలు జరగనున్నాయని, 1,050 మందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయమే విధుల్లో చేరి ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు జనం గుమిగూడటం పూర్తిగా నిషేదమని, అనుమానాస్పద వ్యక్తులు, చర్యలు గమనిస్తే వెంటనే స్పందించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పికెటింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు, వీడియో రికార్డింగ్ ఉంటాయన్నారు. కేంద్రాల్లోకి పార్టీ చిహ్నాలు, మొబైల్ ఫోన్లు అనుమతించబడవని స్పష్టం చేశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించడం, ఓటర్లపై ఒత్తిడి తీసుకురావడం, మద్యం, డబ్బుల పంపిణీ చేసినా, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి ప్రకారం విజయోత్సవ ర్యాలీలు నిషేధమని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తులుగాని, రాజకీయ పార్టీలనుగాని కించపర్చేలా ప్రచారం చేయొద్దన్నారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ అశోక్‌కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
1,650
సర్పంచ్ స్థానాలు పోటీలో ఉన్నవారు ● ఉమ్మడి జిల్లాలో ‘తొలి’ పోరు ఇలా.. ● వార్డులు 3,691.. బరిలో నిలిచిన వారు 9,127 ● మొత్తంగా 58 సర్పంచ్, 1,147 వార్డులు ఏకగ్రీవం ● 2 వార్డు స్థానాల్లో దాఖలు కాని నామినేషన్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 గ్రామాలు, 15,077 వార్డులు ఉన్నాయి. తొలి విడత షెడ్యూల్ ప్రకారం 550 గ్రామాలు, 4,840 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 58 జీపీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 492 సర్పంచ్ పదవులకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు 1,650 మంది బరిలో నిలిచారు. అదేవిధంగా మొదటి విడతలో పోలింగ్ జరగనున్న వార్డు స్థానాల్లో 1,147 ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోనూ 3,691 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. 9,127 మంది పోటీలో నిలిచారు. గద్వాల, వనపర్తిలో పోటాపోటీ.. తొలి దశ జీపీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున ముగ్గురు పోటీపడుతున్నారు. పాలమూరులోని ఐదు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండగా.. ప్రధానంగా గద్వాల, వనపర్తిలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన బలమైన నాయకులు సైతం పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ● తొలి విడత ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో వాల్యానాయక్ తండాలో ఆరో వార్డుకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఆ అభ్యర్థి సర్పంచ్ స్థానానికి కూడా నామినేషన్ వేశారు. ఆయన సర్పంచ్‌గా ఏకగ్రీవం కాగా.. ఆరో వార్డు కు వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అదేవిధంగా వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో ఏడో వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. తొలి విడతలో ఎన్నికల వివరాలు.. జిల్లా జీపీలు ఏకగ్రీవం పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్ జరిగేవి ఉన్నవారు జరిగేవి ఉన్నవారు మహబూబ్‌నగర్ 139 10 129 425 1,188 264 924 2,195 నాగర్‌కర్నూల్ 151 14 137 447 1,326 208 1,118 2,774 జోగుళాంబ గద్వాల 106 15 91 321 974 361 613 1,425 నారాయణపేట 67 14 53 170 572 210 361 1,017 వనపర్తి 87 05 82 287 780 104 675 1,716 మొత్తం 550 58 492 1,650 4,840 1,147 3,691 9,127


