breaking news
Bapatla
-
ఇంద్రకీలాద్రిపై వారాంతంలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వారాంతం, రెండో శనివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపు అమ్మవారికి నిర్వహించిన పలు విశేష పూజల్లో ఉభయదాతలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంతో పాటు హోమాలలో ఉభయదాతలు పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్ల భక్తులు బారులు తీరి కనిపించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా యూరియా పంపిణీ
బాపట్ల: జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీగా యూరియాను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి శనివారం సాయంత్రం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి ఆదివారం వరకు ఎంత యూరియా అవసరముందో మండల వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. గత సంవత్సరంలో సాగు, ఈ ఏడాది సాగును అంచనా వేసుకుని, దానికనుగుణంగా తెప్పించుకోవాలని ఆయన తెలిపారు. మండలానికి వచ్చిన స్టాకు, రైతు కేంద్రాలకు పంపిణీని ప్రతిరోజు రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు ఏ మండలంలో వ్యవసాయం చేస్తున్నారో అక్కడే పంపిణీ చేయాల్సిన బాధ్యత మండల వ్యవసాయ అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. మండలాలలో ఇప్పటి వరకు చేసిన యూరియా పంపిణీ, ఇంకా ఎంత అవసరం ఉందో అంచనాలు వేసుకోవాలని తెలిపారు. మండలానికి ఎంత అవసరం ఉందో అంతే ఇస్తామని స్పష్టం చేశారు. ఎరువుల కొరత, అధిక ధరల వసూలుపై కంట్రోల్ రూం (82470 40131) నంబర్‌కు ఫోన్ చేసేలా రైతులకు అవగాహన కలిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి యూరియా పంపిణీ కేంద్రం వద్ద గ్రామ వ్యవసాయ అధికారి, వీఆర్వో, వీఆర్ఏ, ఒక పోలీస్ అధికారి ఉంటూ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎవరికై నా ఎక్కువ ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిరోజు రైతు కేంద్రాలను పరిశీలించాలని ఆయన చెప్పారు. రైతు కేంద్రాలకు వచ్చే రైతులకు ముందుగానే టోకెన్లు ఇవ్వాలని, అందరికీ ఉన్న యూరియా చాలకపోతే వారికి ముందుగానే సమాచారం తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ అన్నపూర్ణ, జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ పాల్గొన్నారు. యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టండి ! యూరియా సరఫరాపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గల మార్క్‌ఫెడ్ స్టాక్ స్టోర్ అవేజ్ గౌడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. జిల్లాకు వచ్చిన యూరియా, ప్రస్తుత నిల్వలు, రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, డీసీఎంఎస్‌లకు పంపిణీపై అధికారులను ఆరా తీశారు. యూరియా పంపిణీలో సమస్యల గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవేజ్ గౌడౌన్ నుంచి సక్రమంగా రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, డీసీఎంఎస్‌లకు యూరియాను పంపాలని ఆయన ఆదేశించారు. సీఎంఏఐడీ యాప్ ద్వారా రైతులకు యూరియాను అందజేయాలని చెప్పారు. యూరియా కొనుగోలులో సమస్యలు, అధిక ధరల అమ్మకాలకు సంబంధించి రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఎరువుల కోసం వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. -
తెనాలి నుంచి తీరాలు దాటిన ప్రతిభ
తెనాలి: ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేరిన పదేళ్లలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన సంస్థలో అతి పిన్నవయస్కుడైన సీనియర్ డైరెక్టర్‌గా అనుదీప్ ముత్తవరపు ఎదిగారు. క్లౌడ్, డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సాంకేతికతలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆరు దేశాల్లో విస్తరించిన రెండు వందలమంది సభ్యుల బృందాన్ని నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సేవల సిబ్బందికి సాధికారత కల్పించే పది బిలియన్ డాలర్ల పోర్టుఫోలియోకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘యూత్ ఐకాన్’ గౌరవాన్ని అందించింది. చదువుకునే దశ నుంచే.. అనుదీప్ ముత్తవరపు సొంతూరు తెనాలి సమీపంలోని వరహాపురం. తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణ కు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో అనుదీప్ ఇంజినీరింగ్ చదివారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో టెలీ కమ్యూనికేషన్స్‌లో మరో మాస్టర్స్ డిగ్రీ చేశారు. నార్త్ వెస్టర్న్ కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. విద్యార్థి దశలోనే పలు కార్యక్రమాలను చేపట్టి గుర్తింపు పొందారు. కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివేటప్పుడే స్టూడెంట్ ఆర్డినెన్స్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. కెల్లోగ్ స్కూలు ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసినప్పుడు చూపిన ప్రతిభకు ‘డీన్స్ లీడర్షిప్ అవార్డు’ను పొందారు. పిన్నవయస్కుడు ఆయనే... 2015లో టెక్సాస్‌లోని ప్లానోలో ఉన్న కోడియాక్ అనే చిన్న స్టార్టప్ టెక్నాలజీ సంస్థలో ఇంటర్న్‌గా అనుదీప్ కెరీర్ ప్రారంభించారు. 2017లో మోటరోలా సొల్యూషన్స్ కంపెనీ కోడియాక్‌ను టేకోవర్ చేసింది. కొద్ది సంవత్సరాల్లోనే ఇంజినీర్ నుంచి మేనేజర్, డైరెక్టర్ పదవుల నుంచి ఏకంగా సీనియర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. మోటరోలా కంపెనీ చరిత్రలోనే ఆ పదవిని పొందిన అతి పిన్న వయ స్కుడిగా అనుదీప్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆరు దేశాల్లో గల ఆయన బృందంలోని 200 మంది సభ్యుల్లో ఎక్కువమంది ఆయనతోపాటు ఉద్యోగాలు చేసినవారే ఉన్నారు. ప్రజా భద్రతా సాంకేతికతలకు అందించిన సేవలకుగాను అనుదీప్, గత జనవరిలో కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ‘యూత్ ఐకాన్–2025’ అవార్డు స్వీకరించారు. గుంటూరుకు చెందిన విశ్రాంత కాలేజీ ప్రిన్సిపాల్ కొల్లి కృష్ణప్రసాద్ కుమార్తె, డల్లాస్‌లోనే డేటా సైంటిస్ట్‌గా చేస్తున్న సుస్మితతో అనుదీప్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. -
అతివేగానికి రెండు ప్రాణాలు బలి
గూడూరు: అతివేగం రెండు ప్రాణాలు బలి తీసుకుంది. ఇటుకల లోడు ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరు దగ్గర జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీవనోపాధి కోసం విజయవాడ సమీపంలోని పెనమలూరు మండల పరిధిలో నివాసం ఉంటున్న పరిమి ఆదామ్ బాబు(19), కొమ్మవరపు షారీన్(19), కోట కౌషిక్(21) శనివారం ద్విచక్ర వాహనంపై మంగినపూడి బీచ్‌కు బయలుదేరారు. మధ్యాహ్న సమయంలో పామర్రు మండలం నిమ్మకూరు నుంచి ఇటుకల లోడుతో మచిలీపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చి బలంగా ఽఢీకొట్టారు. దీంతో వాహనం నడుపుతున్న ఆదామ్బాబుతోపాటు వెనుక కూర్చున్న, కొమ్మవరపు షరీన్, కోట కౌషిక్ తీవ్ర గాయాలపాలయ్యారు. తలకు బలమైన గాయమవడంతో ఆదామ్బాబు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా, షరీన్ 108లో మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. కౌషిక్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పెడన సీఐ నాగేంద్ర కుమార్, సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. గూడూరు ఎస్ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిమి ఆదామ్ బాబు(19), కోట కౌశిక్(21) స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పొన్నవల్లి గ్రామం కాగా, కొమ్మవరపు షారోన్(21) స్వస్థలం పల్నాడు జిల్లా అంబడిపూడి. సమీప బంధువులు అయ్యే వీరు ముగ్గురు జీవనోపాధి కోసం విజయవాడకు వచ్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. -
జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి
డీఎం అండ్ హెచ్ఓ విజయమ్మ కొల్లూరు : జ్వరాలు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డీఎం ఆండ్ హెచ్ఓ విజయమ్మ తెలిపారు. కొల్లూరు పీహెచ్‌సీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో డెంగీ, మలేరియా జ్వరాల జాడ లేదని, అయితే వైరల్ ఫీవర్స్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం ఇటీవల కృష్ణా నదికి వరదలు కావచ్చన్నారు. భూగర్భ జలాలు పెరిగిన పక్షంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉండొచ్చని వివరించారు. జ్వరాలు బారిన ప్రజలు పడకుండా తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమకాటు బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రతి గ్రామంలో తాగునీటి నమూనాలను సేకరించి రీజినల్ రీసెర్చ్ సెంటర్‌కు పంపించాలని వైద్యాధికారిణిని ఆదేశించారు. పంచాయతీ, మండల పరిషత్తు అధికారులతో సమన్వయం చేసుకొని పరిశుభ్రమైన తాగునీరు పంపిణీకి కృషి చేస్తామన్నారు. దోమల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టే విధంగా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా ఆర్ఎంపీలను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్యశాలలో లేదా నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందాలని ఆమె సూచించారు. ఆర్ఎంపీలు కూడా జ్వరంతో వచ్చిన వారికి ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, హైడోస్ ఇంజక్షన్లు, ఫ్లూయిడ్స్, స్టెరాయిడ్స్ వాడరాదని హెచ్చరించారు. హెవీ డోస్ ఇంజక్షన్లు, మందులు వినియోగంతో జ్వర తీవ్రత తాత్కాలికంగా తగ్గినప్పటికీ, కొద్ది రోజుల్లోనే తిరిగి తిరగపెట్టడం, రోగ నిరోధకశక్తి తగ్గిపోతుందని తెలిపారు. -
పాలకవర్గం నియామకానికి మల్లగుల్లాలు
మంగళగిరి: రాజధానిలో ప్రతిష్టాత్మకమైన మంగళాద్రిలో వేంచేసిఉన్న శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయ పాలకవర్గం నియామకంపై కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆగస్టు 26వ తేదీతోనే పాలక వర్గానికి దరఖాస్తుల దాఖలు ముగియగా, 36 మంది కూటమి నాయకులు చేశారు. ఆలయ అధికారులు వాటిని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపారు. రాజకీయ జోక్యం అధికం కావడం, పాలకవర్గ సభ్యులను నియమించేందుకు కూటమి నాయకులలో పోటీ, పదవులు విక్రయించుకున్నారనే విమర్శలతో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. భారీగా ఆదాయం వచ్చే ఆలయ కావడంతో పాలకవర్గం తమ చేతులలో ఉంచుకోవాలని కూటమి పార్టీలు పట్టుదలతో ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. పాలకవర్గంలో ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి 12 మంది సభ్యులకు అవకాశం ఉంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సహా ఇతర పదవులలో అధికంగా తమ వారిని నియమించాలని బీజేపీ పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఇదే స్థాయిలో జనసేన, టీడీపీ నుంచి కూడా పోటీ అత్యధికంగా ఉంది. పాలక వర్గం నియామకంపై ప్రభుత్వం, మంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాలకవర్గాన్ని వెంటనే నియమించి ఉత్కంఠకు తెరదించాలని కూటమి పార్టీల నాయకులు కోరుతున్నారు. -
22న చలో అసెంబ్లీ జయప్రదం చేయండి
ఏపీ కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు నరసరావుపేట: కౌలు రైతుల సంక్షేమం, హామీల అమలుకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 22న విజయవాడలో నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమంలో కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పిలుపునిచ్చారు. శనివారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో చలో అసెంబ్లీ ర్యాలీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 మంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆయా కుటుంబాలను పరామర్శించలేదని, పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. అసెంబ్లీ, మండలిలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కౌలు రైతు కొత్త చట్టం అమలుకు కృషి చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ విధానాలే కౌలు రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని విమర్శించారు. కౌలు రైతుల సంక్షేమం కోసం సంఘం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు చేస్తామని తెలిపారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, సంఘం నాయకులు టి.పెద్దిరాజు, కె.ఆంజనేయులు, అమరలింగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఎ.శాస్త్రి అధ్యక్షతన శనివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్యఅతిథి గోపిమూర్తి మాట్లాడుతూ.. ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో మూడు లక్షలుగా ఉన్న ఈపీఎస్ పెన్షనర్లకు సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి శాసనమండలిలో ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించి మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.మోహనన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెన్షనర్లు పీఆర్సీ లబ్ధి పొందకుండా పెన్షన్ రీవాల్యుడేషన్–2025 బిల్లును తీసుకురావడం అన్యాయమన్నారు. దీనికి వ్యతిరేకంగా పెన్షనర్లు అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు ఎం.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు తీర్మానాలను ప్రవేశపట్టి భవిష్యత్ కర్తవ్యాలను వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పెన్షనర్లు తరపున ఎమ్మెల్సీ గోపిమూర్తికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సదస్సులో బ్యాంకు పెన్షనర్స్ సంఘం నాయకుడు ఎం.రామారావు, రైల్వే పెన్షన్ సంఘం నాయకుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 643 కేసులకు పరిష్కారం
రేపల్లె(చెరుకుపల్లి): మండల న్యాయ సేవాధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జి రేపల్లె కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 643 కేసులు పరిష్కరించినట్లు రేపల్లె సబ్ కోర్టు, పీడీఎం కోర్టు జడ్జీలు వెన్నెల, శ్రీవాణి తెలిపారు. ఇందులో సివిల్ –44, క్రిమినల్–599 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేసులు పరిష్కారానికి రెండు బెంచ్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు. కేసుల పరిష్కారంలో ఇద్దరు జడ్జీలతో పాటు న్యాయవాదులు డి.ఎస్. హరికుమార్, యు.శ్రీనివాసరావులు లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో కక్షిదారులకు రూ. 1.13 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు. కార్యక్రమంలో పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
రైతుల ఖాతాల్లో బర్లీ పొగాకు సొమ్ము
మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ జె.పంగులూరు: అద్దంకి నియోజక వర్గంలో ఇప్పటివరకు 1,856 మంది రైతుల నుంచి 2,148 టన్నుల బర్లీ పొగాకు కొనుగోలు చేశామని మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ తెలిపారు. మండలంలోని బూదవాడలో శుక్రవారం ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 17 వేల టన్నుల పొగాకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు రూ. 127 కోట్లు ఇవ్వాలని, ఇప్పటికే రూ. 90 కోట్ల వరకు వారి ఖాతాలో జమయ్యాయని తెలిపారు. ఇంకా రూ. 37 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని ఆమె తెలిపారు. పంగులూరు మండలంలో 782 మంది రైతుల వద్ద 990 టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. సోమవారం నుంచి పంగులూరు మండలానికి చెందిన రైతుల పొగాకును గుంటూరులో కొనుగోలు చేస్తామని, వారంతా అక్కడకు తీసుకురావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి డి.సుబ్బారెడ్డి, నరసింహారావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
అద్దంకి సమన్వయకర్తగా డాక్టర్ అశోక్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్‌ను నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యుడైన అశోక్‌కుమార్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందినవారు. పిడుగురాళ్లలో పల్నాడు హాస్పిటల్స్ అధినేతగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీలో చేరారు. అప్పటినుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. సమన్వయకర్తగా తనను నియమించిన అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డిలకు అశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన్ను అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. బాపట్ల అర్బన్: బాపట్ల జిల్లా అంగన్వాడీల ద్వితీయ మహాసభ శనివారం చీరాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షురాలు వి.శైలశ్రీ తెలిపారు. బాపట్ల కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల్లో నాలుగువేల మంది పైగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారన్నారు. తమ సమస్యలపై గత ఎన్నికలకు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజులు పాటు సమ్మె చేసి అనేక జీవోలు సాధించుకున్నామని వివరించారు. ప్రధానంగా వేతనం పెంపు అలాగే ఉందని తెలిపారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మహాసభలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొంటారని, జిల్లాలోని అంగన్వాడీలంతా పెద్దఎత్తున హాజరుకావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.సీతామహాలక్ష్మి, ఎన్. హేమ పాల్గొన్నారు. -
రోడ్డుపై విరిగిపడిన శతాబ్ది మర్రి చెట్టు
ఇంకొల్లు(చినగంజాం): ఇంకొల్లు– పావులూరు రోడ్డులో నాగులు చెరువు కట్టపై ఉన్న 100 సంవత్సరాల నాటి భారీ మర్రి చెట్టు కొమ్మలు శుక్రవారం హఠాత్తుగా విరిగి పడ్డాయి. అయితే, ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై చెట్టు కొమ్మలు విరిగి పడటంతో పూర్తిగా మూసుకుపోయింది. సాయంత్రం మూడు గంటల నుంచి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారాన్ని అందుకున్న ఇంకొల్లు గ్రామ పంచాయతీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి అడ్డగడ వెంకటేశ్వర్లు చెట్టు కొమ్మలను తొలగింపజేసి జలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల తరువాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
క్రీడా స్ఫూర్తితో ఆటంకాలను అధిరోహించాలి
● ఇన్చార్జి వీసీ కె.గంగాధరరావు ● క్రీడాకారులకు క్యాష్ అవార్డుల ప్రదానం పెదకాకాని(ఏఎన్యు): క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిరోహించాలని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. వర్సిటీ పరిధిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శుక్రవారం వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్ అధ్యక్షత వహించారు. నగదు పురస్కారాలు అందజేత వర్సిటీ పరిధిలో 2024 –25 లో సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్సిటీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ 76 కేజీల విభాగంలో బంగారు పతకం, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన తెనాలి ఏఎస్ఎన్ కళాశాలకు చెందిన టి రేణుకకు రూ.40 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. 71 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన గుంటూరు మహిళా కళాశాలకు చెందిన బి. నానికి రూ.12,500, సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ 61 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించిన నిడుబ్రోలు పీబీఎన్ కళాశాలకు చెందిన డి. మౌలాలీకి రూ.32,500, సౌత్ వెస్ట్ జోన్ అంతర్ వర్సిటీ పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన నగరంలోని ఎస్వీఆర్ఎం కళాశాల విద్యార్థి ఎ.అరుణ్ బాబుకు రూ.10,000 నగదు అందజేశారు. -
ఎయిడ్స్‌పై అవగాహనకు మొబైల్ వాహనం
నరసరావుపేట: అవగాహన కోసం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాకు అందజేసిన మొబైల్ ఐఈసీ వాహనం ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ మొబైల్ వాహనం ద్వారా ప్రజలకు వ్యాధిపై అవగాహన పెంచుతామన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ వాహనాన్ని జిల్లాకు కేటాయించినందుకు సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం మేనేజర్ జానీబాషా, క్లస్టర్ ప్రెవెన్షన్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, ఐసీటీసీ కౌన్సిలర్ రవి, పీపీటీసీటీ కౌన్సిలర్ జ్యోతి సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లకు వినతి పత్రాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగించారు. నిరసన వారంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 60 మండలాల పరిధిలో తహసీల్దార్లకు మెమోరాండం సమర్పించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ తెలిపారు. ఆయా మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులతో కలిసి ఏపీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో బసవ లింగారావు, ఎండీ ఖాలీద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు రోడ్‌మ్యాప్ షెడ్యూల్ ప్రకటించాలని, లేని పక్షంలో ఈనెల 13,14వ తేదీల్లో ప్రజా ప్రతినిధులందరినీ కలిసి మెమోరాండంలను సమర్పిస్తామని తెలిపారు. నిరసన ప్రదర్శనల్లో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టా జనార్దనరావు, పి.పార్వతి, సత్యనారాయణమూర్తి, కార్యదర్శి జి.దాస్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్‌బాషా, నాయకులు గడ్డిపాటి శివరామకృష్ణ, బి.సాయిలక్ష్మీనారాయణ, సీహెచ్ లక్ష్మణ్‌కుమార్, చక్కా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
చందాల పేరిట దందా
బీచ్ ఫెస్టివల్ పేరుతో వసూళ్ల పర్వం రూ. 9 కోట్లు ఖర్చవుతుందంటున్న అధికారులు రూ. 4 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం మిగిలింది చందాల రూపంలో వసూలు చేయాలని కూటమి సర్కార్ ఆదేశం రంగంలోకి దిగిన పచ్చనేతలు, అధికారులు వెనకేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ రూ. 10 కోట్ల వసూళ్లకు ప్రణాళిక రిసార్ట్స్, రైస్ మిల్లర్స్, రేషన్ డీలర్స్, రియల్టర్ల నుంచి భారీగా వసూళ్లు ఒక్కొక్క విభాగం నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల దాకా వసూలు -
బాపట్ల
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న సాక్షిపై కూటమి సర్కారు అక్కసు వెళ్లగక్కుతోంది. ప్రతిపక్ష నేతలను, ప్రజల పక్షాన మాట్లాడే సాక్షిని నోరు మూయించే ఉద్దేశంతో వ్యవహరిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘ఇస్ ద ప్రెస్ ఇన్ ద హ్యాండ్.. ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ ద గ్రేట్ మాన్’ అనే మాటలు చంద్రబాబు, లోకేష్ విషయంలో నిజమయ్యాయి. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేకపోయినా ఏదో అద్భుతాలు జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ప్రజలకు ఇవన్నీ సరికాదని చెబుతున్నందుకు సాక్షిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం తప్పులు సరిచేసుకోకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. అక్రమ కేసులు, అరెస్టులు సాక్షిని ఏమీ చేయలేవు. – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ ప్రశ్నించే హక్కు, తప్పొప్పులను వెలికితీసే హక్కు సమాజంలో మీడియాకు ఉంది. వారి హక్కులను, స్వేచ్ఛను హరించేలా వ్యవహరిండం సిగ్గుచేటు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌తోపాటు పలువురు జర్నలిస్టులపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసులు బనాయించి విచారణ పేరుతో పిలుస్తుండటం మంచిది కాదు. ఏమైనా లోపాలుంటే వివరణ ఇస్తే సరిపోతుంది, కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాజకీయాలు చేయడం వలన ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ఆలోచించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్న ఇలాంటి చర్యలను మానుకుంటే మంచిది. – నందిగం సురేష్, మాజీ ఎంపీ, బాపట్ల 7తెనాలి రూరల్: తెనాలి సాలిపేటలో ఉన్న 39వ నంబర్ రేషన్ దుకాణాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ శుక్రవారం తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఫిర్యాదులు వాస్తవం అని తేలడంతో షాపు సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 68,340 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 89,306 క్యూసెక్కులు వదులుతున్నారు.గుంటూరు రూరల్: వరుస మరణాలతో హడలెత్తిపోతున్న తురకపాలెం గ్రామ ప్రజలు గ్రామంలోని బొడ్రాయికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచిస్తున్న ప్రభుత్వం
ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం సత్తెనపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం వంచిస్తోందని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణ ‘నిరసన వారం’ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏపీటీఎఫ్ సత్తెనపల్లి మండలశాఖ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్‌ఖాన్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించటం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందన్నారు. ఏపీ జేఏసీ నాయకుడు ఎస్.అంబేడ్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి కాల్వపల్లి శివారెడ్డి, అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్‌లు మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కేఎస్ చక్రవర్తికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ బాధ్యులు కె.ఉషారాణి, అక్తరున్నిసా, వంజ సునీల్‌కుమార్, భవనం సుబ్బారెడ్డి, లెనినారాణి, దామోదరం, రేపూడి చిన్నపిచ్చయ్య, ప్రభావతి, ధర్మారావు, నీలం చంద్రం, పి.మారుతిరమేష్, దాసరి రవికుమార్, షేక్ జిలాని, ఏపీ జేఏసీ సత్తెనపల్లి తాలూకా నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి !
బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు బల్లికురవ: పెండింగ్ కేసులపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు ఆదేశించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన పలు రికార్డులను పరిశీలించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల వారీగా రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టాలని ఎస్ఐ వై. నాగరాజును ఆదేశించారు. శాంతిభద్రతలను నిత్యం పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా యజమానులను అప్రమత్తం చేయాలని తెలిపారు. క్వారీలో నిబంధనలు, భద్రతా చర్యలతో పాటు, బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ చేసుకునేందుకు మ్యాగ్జైన్లు ఏర్పాటు చేసుకునేలా యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. రవాణా కోసం అనుభవం లేని, హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌లు లేని వారిని నియమించుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీపురం: ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గుంటూరు జిల్లా 10వ మహాసభలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలు చేసినట్లు ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి రమణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధనలక్ష్మి, ఏవీఎన్ కుమారి తెలిపారు. పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అంగన్వాడీలకు గత 42 రోజుల సమ్మె విరమణ సందర్భంగా చేసిన ఒప్పందంలో భాగంగా తక్షణమే జీతాలు పెంపుదల చేయాలని కోరారు. ధరల పెరుగుదల, కనీస వేతనాలను దృష్టిలో ఉంచుకొని రూ.26 వేలు జీతం ఇవ్వాలని తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆదాయ పరిమితి ఉన్నప్పటికీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు విడో పెన్షన్, తల్లికి వందనం, రేషన్ కార్డులు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం తీవ్ర అన్యాయమని తెలిపారు. జిల్లా కార్యవర్గం ఎన్నిక జిల్లా గౌరవాధ్యక్షులుగా జి. రమణ, అధ్యక్షులుగా ఎం.ధనలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జి. ప్రేమలత, ప్రధాన కార్యదర్శిగా ఏవీఎన్ కుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టి.శివపార్వతి, కోశాధికారిగా ఈ రత్నమంజుల, ఉపాధ్యక్షులుగా వి.విజయలక్ష్మి, రుక్మిణి, రజిని, టి పద్మావతి, ఓ రోజమ్మ కార్యదర్శులుగా కె ఎలిజబెత్, హేమలత, అస్మత్ తార, కే పద్మ, ఎస్ కే షాహిదా ఎన్నికయ్యారు. మరో 18 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు. -
డాక్టర్ అని బోర్డు పెట్టుకుంటే చర్యలు తప్పవు
● ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సకు మించి వైద్యం చేయరాదు ● ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరిరావు హెచ్చరిక గుంటూరు రూరల్: నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ అని బోర్డు పెట్టినా, అత్యవసర ప్రథమ చికిత్స తప్పా ఏ విధమైన వైద్యం చేసినా చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరిరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిశోర్‌తో కలసి తురకపాలెం గ్రామాన్ని సందర్శించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, వైద్యుల్ని నమోదవుతున్న కేసుల వివరాలు, అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, స్థానిక వైద్యాధికారులు వివరించారు. అనంతరం గ్రామంలో పలు వీధులను పరిశీలించిన ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారి డాక్టర్ ఆశాకిరణ్‌తో కలిసి ఆర్ఎంపీలు పీఎంపీల ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. పేరు ముందు డాక్టర్ అని పేరు పెట్టుకున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. వారు రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించారు. ప్రథమ చికిత్స కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్‌లను గుర్తించామన్నారు. తురకపాలెంలో చనిపోయిన వారిలో చాలామంది ఈ ప్రథమ చికిత్స కేంద్రాలలో సైలెన్లు, యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా వాడినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందరికీ అందుబాటులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్వాలిఫైడ్ వైద్యులు ఇతర పారామెడికల్ సిబ్బంది ఉండగా ప్రజలు నకిలీ వైద్యుల నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలకు వెళ్లడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. దీనివల్ల చిన్నచిన్న వ్యాధులే ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయకుండా అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిశోర్ మాట్లాడుతూ తురకపాలెం గ్రామ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తొలిదశలోనే క్వాలిఫైడ్ వైద్యుల్ని సంప్రదిస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. ఐఎంఏ వైద్యులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌తో పాటు తురకపాలెం సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పూర్వ ఉపాధ్యక్షులు, ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగేళ్ల కిశోర్, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవాకుమార్, ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వై సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు డాక్టర్ డి. అమరలింగేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ బి. సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
నెహ్రూనగర్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో శుక్రవారం మార్కెట్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలు వలే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినప్పటికీ రక్షణ చట్టం ఊసే లేదన్నారు. చట్టసభల్లో 33 శాతం, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మరో వాగ్దానం ఇచ్చినప్పటికీ ఇంతవరకు అతీగతి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందే నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెబుతుంటే.. మరోపక్క ఇంతవరకు కులగణన చేపట్టకపోవడం చూస్తుంటే బీసీలను అన్యాయం చేయడమే అన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, పారేపల్లి మహేష్, కోలా అశోక్, కొల్లూరు హనుమంతరావు, ముప్పన వెంకటేశ్వర్లు, తురక రమేష్, కోలా మణికంఠ, రామకృష్ణ పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా నియామకం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్‌గా 2013వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర కేడర్‌కు చెందిన కృతికా శుక్లా తన బ్యాచ్‌కే చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లాను వివాహం చేసుకొని ఏపీ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. కృతిక శుక్లా 2016 నవంబర్ 11వ తేదీ నుంచి 2018 ఆగస్టు 12వ తేదీ వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్, ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ విధులు నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్; దిశా స్పెషల్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ తదితర హోదాలలో పనిచేశారు. అరుణ్‌బాబుకు దక్కని పోస్టింగ్ గత ఏడాది కాలంగా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.అరుణ్‌బాబుకు తాజా బదిలీలలో పోస్టింగ్ ఇస్తున్నట్లు జీఓలో పేర్కొనలేదు. గతంలో నరసరావుపేట, గురజాల ఆర్డీఓగా పనిచేసిన అరుణ్‌బాబు 2024 ఆగస్టు 7వ తేదీన పల్నాడు జిల్లా మూడవ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల కోసం కలెక్టర్ ప్రాంగణంలో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయించారు. ఉచితంగా అర్జీలు రాసిచ్చే ప్రక్రియను చేపట్టారు. ప్రతి మూడో శనివారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తూ వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేశారు. కలెక్టరేట్‌కు దగ్గరలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలును దత్తత తీసుకున్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతి లాల్ దండే బాపట్ల: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతి లాల్ దండే పేర్కొన్నారు. గురువారం బాపట్ల మండలం నగరవనంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, అటవీ శాఖ సలహాదారులు మల్లికార్జున, ఎంపీ కృష్ణ ప్రసాద్‌లతో కలసి జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. కాంతి లాల్ దండే ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అటవీ శాఖలో సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయారని, వారి కుటుంబాలకు అటవీ శాఖ సపోర్టుగాఉండాలన్నారు. కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చూచించారు. అటవీ శాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుంగా పనిచేయాలన్నారు. అటవీ అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖపై ఉందన్నారు. అటవీ భూములను రక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు గ్రామాలలో చెట్లను నరికివేయడంతో పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. ఇలాంటి పనుల వలన విజయవాడలో వరదలు వచ్చాయని చెప్పారు. ప్రకృతిని కాపాడితే భవిష్యత్తు తరాలు బాగుంటాయని పేర్కొన్నారు. ఎనిమిది మంది అమరుల సేవలను కొనియాడారు. వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అంతకుముందు నగరవనంలోని జాతీయ అటవీ అమరవీరుల స్మారక స్తూపాన్ని అధికారులు ప్రారంభించారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పి.వి.చలపతి, రాహుల్ పాంటు, శాంతిప్రియ పాంటే, శరవణన్, ఐ.కె.వి. రాజు, చైతన్య కుమార్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
చీరాల అర్బన్: హత్య కేసులో నిందితుడిని గురువారం చీరాల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు టూటౌన్ సీఐ నాగభూషణం గురువారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. చీరాల హారిస్‌పేటకు చెందిన పేర్లి కోటేశ్వరరావు ఈనెల 4వ తేదీన అతని ఇంటి వద్ద అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై అతని భార్య పేర్లి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన సలగల విజయ్‌బాబు హారిస్పేట వీఆర్వో ద్వారా పోలీస్‌స్టేషన్‌లో గురువారం లొంగిపోయాడు. మృతుడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అలాగే తన భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి సహకరిస్తుండడంతో ఈనెల 3వ తేదీ రాత్రి పేర్లి కోటేశ్వరరావును హత్య చేసినట్లు అంగీకరించాడు. సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం -
ఈత కొట్టడానికి దిగి నీటి ప్రవాహంలో గల్లంతు
కారంచేడు: రోజూ మాదిరిగానే ఈత కొట్టేందుకు కాలువలో దిగిన వ్యక్తి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. ఉదయం నుంచి గజ ఈతగాళ్లు గాలించి సాయంత్రానికి మృతదేహాన్ని బయటకు తీశారు. కారంచేడు తహసీల్దార్ జి. నాగరాజు, ఎస్ఐ షేక్ ఽఖాదర్ బాషా పరిస్థితిని సమీక్షించారు. వివరాలు... కారంచేడు గ్రామానికి చెందిన దగ్గుబాటి హరిప్రసాద్ (68) చీరాల కొత్తపేటలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. రోజూ చీరాల నుంచి కారంచేడు వరకు సైకిల్‌పై వెళ్లి కొమ్మమూరు కాలువ కట్టపై కొద్దిసేపు గడిపి కాలువలో ఈత కొట్టేవాడు. గురువారం కూడా ఈత కొట్టే క్రమంలో గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించ లేదు. ఆయన భార్య కారంచేడులోని బంధువులకు ఫోన్లో సమాచారం అందించారు. వారు వచ్చి కాలువ దగ్గర పరిశీలించగా ఆయన సైకిల్, విడిచిన దుస్తులు కనిపించాయి. కాలువలో పడిపోయి ఉంటాడని భావించి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందించారు. తహసీల్దార్ జి. నాగరాజు, ఎస్ఐ షేక్ ఖాదర్‌బాషాలు గాలింపు చర్యలు చేపట్టారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు పరిస్థితిని సమీక్షించారు. ఆయన సూచనతో ఈపురుపాలెం నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు ముమ్మరం చేశారు. ఈతకు దిగిన కొద్ది దూరంలోనే మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. హరిప్రసాద్‌కు భార్య, వివాహితులైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయుల నిరసనగుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లలో ప్రభుత్వ సాచివేత ధోరణికి వ్యతిరేకంగా నిరసన వారం ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి, ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు. శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.తెనాలిలో డెంగీ కలకలంతెనాలి అర్బన్: తెనాలి పట్టణంలో అధికారికంగా డెంగీ కేసు నమోదైంది. ఈ విషయం బయటకు రావడంతో పట్టణంలో కలకలం మొదలైంది. తెనాలి 17వ వార్డుకు చెందిన 60 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం కొద్దిరోజుల కిందట వెళ్లాడు. అతడిలో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్యులు రక్త పరీక్షలు చేయించడంతో వ్యాధి నిర్ధారణ అయింది. విషయాన్ని ప్రభుత్వ వైద్యశాల అధికారులు తెనాలి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వ్యక్తి నివసించే ప్రాంతంలో మురుగు కాల్వలను బాగు చేయించి బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేయిస్తున్నారు. -
ఐదు కిలోల గంజాయి స్వాధీనం
మార్టూరు: బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పర్చూరు ఎకై ్సజ్ ఎస్ఐ శ్రీధర్ కథనం మేరకు... గంజాయి తరలిస్తున్నారనే ముందుస్తు సమాచారంతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ మధుబాబు, ఏఈఎస్ జనార్దన్, టాస్క్‌ఫోర్స్ సీఐ బాల నరసింహ, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ఆర్. నరహరిరావు, ఎస్. రామారావు, పర్చూరు ఎకై ్సజ్ ఎస్ఐ శ్రీధర్ తమ సిబ్బందితో కలిసి అర్ధరాత్రి బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సురేష్ మహాపాత్రో అనే వ్యక్తి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అధికారులు పర్చూరు ఎకై ్సజ్ కార్యాలయానికి నిందితుడిని తరలించి, విచారించారు. సురేష్ మహాపాత్రో తన సమీప బంధువైన విశాల్ బుట్కీ దగ్గర కేజీ రూ. 3 వేల చొప్పున 5 కిలోలు కొనుగోలు చేశాడు. చైన్నెలో కిలో రూ.10 వేల చొప్పున విక్రయించేందుకు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. ఇప్పటికే చైన్నెలో ఇతనిపై రెండు కేసులు నమోదు కాగా, గతంలో జైలు జీవితం గడిపి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోరాటాలతోనే ఐసీడీఎస్ పరిరక్షణ
లక్ష్మీపురం: సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) పరిరక్షణకు అంగన్వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా 10వ మహాసభను గురువారం పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతుందని, ఈ కాలంలో ప్రభుత్వాలు ఈ స్కీంను నిర్వీర్యం చేయటానికి అనేక ప్రయత్నాలు చేశాయని తెలిపారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నా ఐసీడీఎస్ బలోపేతం చేయటానికి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఏటా బడ్జెట్లో నిధులు తగ్గిస్తోందని, బిల్లులు సకాలంలో విడుదల చేయట్లేదని చెప్పారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని తెలిపారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాని మోదీ అంగన్వాడీల వేతనాలు పెంచుతామని, ఐసీడీఎస్‌ను బలోపేతం చేస్తామని వాగ్దానం చేశారని ఆమె గుర్తు చేశారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చినా చిల్లిగవ్వ పెంచలేదని, పథకానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. దేశంలో మాతా శిశు మరణాలు, ఆకలి చావులు, నిరుద్యోగం పెరుగుతుంటే అచ్చేదిన్ అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐసీడీఎస్ ద్వారా పేద గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఎంతో మేలు జరిగిందని అనేక నివేదికలు స్పష్టం చేశాయని తెలిపారు. ఇప్పటికై నా ఈ పథకం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రానున్న కాలంలో వేతనాల పెంపు, ఇతర సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో అక్టోబర్‌లో ఉద్యమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎ.వి.ఎన్.కుమారి, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పాల్గొన్నారు. -
కొరియన్ కంపెనీల్లో విస్తృత అవకాశాలు
చేబ్రోలు: కొరియన్ భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా భారత విద్యార్థులు, యువతకు కొరియన్ కంపెనీలలో విస్తృత అవకాశాలను పొందవచ్చని చైన్నెలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా చాంగ్–న్యూన్ కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో గురువారం కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చాంగ్ న్యూన్ కిమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న పోటీ పరిస్థితుల్లో ఆసియా ఖండంలో భారతదేశం, కొరియాలు కీలక భాగస్వాములని పేర్కొన్నారు. భద్రతా రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను విస్తరించడం అత్యవసరమని తెలిపారు. కొరి యా సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కొరియన్ సినిమా ప్రతిభను, సాంస్కృతిక వైవిధ్యాన్ని భారతదేశ ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారని తెలిపారు. భావోద్వేగ ప్రధానమైన డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు, హాస్య చిత్రాలు, కుటుంబమంతా చూసే వినోదాత్మక సినిమాలు మాత్రమే కాకుండా, కొరియా సమాజం, సంస్కృతి, జీవన శైలి, విలువలను కూడా ప్రతిబింబిస్తాయని వివరించారు. కొరియన్ సంస్కృతి ప్రత్యేకతలైన కే పాప్, కే డ్రామా, కే ఫుడ్, కే కాస్మటిక్ వంటి వాటిని విద్యార్థులతో పంచుకున్నారు. కొరియన్ సినిమాల వైశిష్ట్యాన్ని ఆస్వాదిస్తూ, రెండు సంస్కృతుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచడానికి ఈ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందని పేర్కొ న్నారు. ఈ ఫెస్టివల్లో కొరియా సంస్కృతి, సినిమాలు విద్యార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గ్రానైట్ లారీ ఢీ– కార్మికుడికి తీవ్ర గాయాలు
బల్లికురవ: బైక్‌పై వెళుతున్న గ్రానైట్ కార్మికుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్రానైట్ లారీ ఢీ కొట్టటంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన గురువారం రాత్రి బల్లికురవ–సంతమాగులూరు ఆర్అండ్బీ రోడ్డులోని మల్లాయపాలెం, కొప్పరపాలెం గ్రామాల మధ్య జరిగింది. అందిన సమాచారం ప్రకారం మల్లాయపాలెం గ్రామానికి చెందిన పల్లెపోగు పోతురాజు స్థానిక గ్రానైట్ క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని పని నిమిత్తం బైకుపై కొప్పరపాడు గ్రామం వెళుతున్నాడు. ఈర్లకొండ నుంచి గ్రాౖనైట్ రాళ్లతో సంతమాగులూరు వైపు వెళుతున్న లారీ పోతురాజు బైకును ఢీకొట్టటంతో రోడ్డు మార్జిన్లో పడిపోయాడు. కొందరు గమనించి రోడ్డు మీదకు చేర్చి 108కి సమాచారం ఇచ్చారు. బాధితుడిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. కాగా లారీ ఆగకుండానే వెళ్లిపోయింది. -
గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా కలెక్టర్‌గా 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తమీమ్ అన్సారియాను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లా కలెక్టర్‌గా ఇప్పటి వరకు పనిచేసిన ఎస్.నాగలక్ష్మిని జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్ వచ్చారు. 1987లో జన్నత్ హుస్సేన్ పనిచేయగా 2007 లో మొహమ్మద్ ఆలీ రఫత్‌ను జిల్లా కలెక్టర్‌గా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నియమించారు. మళ్లీ జిల్లాకు మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్ రావడం గమనార్హం. -
నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణింపు
పెదకాకాని(ఏఎన్‌యూ): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం వేడుకగా జరిగింది. అతిథులు, యూనివర్సిటీ అధికారుల జ్యోతి ప్రజ్వలన అనంతరం విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, దేశ ప్రగతికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి వృత్తి విద్య కళాశాలలు ఆర్థిక స్థిరత్వం తెచ్చిపెట్టాయని చెప్పారు. అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలను దీటుగా ఏఎన్‌యూ ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. రాబోయే పదేళ్లలో అమెరికా, చైనాను మించి భారత్ ప్రగతి సాధించే అవకాశం కనిపిస్తోందని, దీనికి విద్యార్థుల కృషి కూడా అవసరమని తెలిపారు. 1976లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల కంటే నాగార్జున యూనివర్సిటీ ఎంతో ప్రగతిని సాధించిందని చెప్పారు. అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన రెక్టర్ ఆచార్య రత్న షీలామణి మాట్లాడుతూ రాబోయే ఏడాది కాలం పాటు స్వర్ణోత్సవ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగో ప్రత్యేకతను వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ పూర్వ ఉప కులపతుల దూరదృష్టి విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహద పడిందని కొనియాడారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి ఫలాలు వారి కృషి, పట్టుదల, దార్శినికానికి నిదర్శనం అన్నారు. పండుగ వాతావరణం మేధావులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకుల సందడితో పండుగ వాతావరణంలో వర్సిటీ ప్రాంగణం నిలిచింది. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతులు గా విశిష్ట సేవలు అందించిన ప్రొఫెసర్ డి. రామకోటయ్య, ప్రొఫెసర్ సి.వి. రాఘవులు, ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ వి. బాలమోహన్‌దాస్, ప్రొఫెసర్ వై.ఆర్. హరగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ ఏ. రాజేంద్రప్రసాద్ లను ఘనంగా సత్కరించారు. ముందుగా ప్రొఫెసర్లు తమ అమూల్యమైన సందేశాలను అందించారు. ఉత్తమ అధ్యాపకులకు సన్మానం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డులు పొందిన విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ జి. చెన్నారెడ్డి, ప్రొఫెసర్ పి.పి.ఎస్. పాల్ కుమార్, ప్రొఫెసర్ వి. దివ్య తేజ మూర్తి, ప్రొఫెసర్ రమేష్ రాజు, డాక్టర్ పి. సుధాకర్‌లను సత్కరించారు.కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆచార్య వీరయ్య, ఆచార్య సురేష్ కుమార్, ప్రొఫెసర్ లింగరాజు, ప్రొఫెసర్ ప్రమీలారాణి, ప్రొఫెసర్ పాల్ కుమార్, పాలకమండల సభ్యులు ప్రొఫెసర్ సుమంత్ కుమార్, ప్రొఫెసర్ జగదీష్ నాయక్, ఓఎస్డీ ఆచార్య రవికుమార్, సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. వెంకటేశ్వర్లు, రూసా డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. మురళీమోహన్, సీడీసీ డీన్ ఆచార్య వి. రవికుమార్, సీడీఈ పరీక్షలు కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రామచంద్రన్, యూజీ పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.వి. కృష్ణారావు, నూట అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ బ్రహ్మాజీరావు, ప్రొఫెసర్ త్రిమూర్తిరావు, వికాస అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, శ్రీనివాసరావు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తురకపాలెం మరణాలపై జెడ్పీలో చర్చ
అంతుచిక్కని మరణాలపై వైద్యారోగ్యశాఖాధికారుల నుంచి చైర్పర్సన్ వివరాలు సేకరణ గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలపై జెడ్పీ స్థాయి సంఘ వేదికగా చర్చ జరిగింది. సమావేశ మందిరంలో గురువారం సంఘాలు భేటీ అయ్యాయి. మొత్తం ఏడు స్థాయి సంఘాలకు గానూ మూడు సంఘ సభ్యులు గైర్హాజరుతో కోరం లేక వాయిదా పడింది. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా అధ్యక్షతన 1,2,4,7వ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తురకపాలెంలో చోటు చేసుకున్న మరణాలపై వైద్యారోగ్యశాఖాధికారుల నుంచి వివరాలు సేకరించారు. పల్నాడు జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. తాగునీటి పంపిణీకి పంపిణీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారని రూరల్ వాటర్ వర్క్స్ ఎస్ఈ కల్యాణ్ చక్రవర్తిని హెనీ క్రిస్టినా ప్రశ్నించగా, తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అనంతరం ప్రణాళిక, ఆడిట్, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం, రహదారులు భవనాలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ట్రెజరీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ ,రవాణా శాఖ, గనులు భూగర్భ వనరుల శాఖ, భూగర్భ జల వనరుల శాఖ, గృహ నిర్మాణ సంస్థ, సహకార శాఖ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, గ్రామీణ పరిశ్రమల మండలి, పరిశ్రమల శాఖ, ప్రణాళిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల వారీగా వివిధ అంశాలపై చర్చించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో ముద్రించిన విద్యాజ్యోతి పుస్తకం వల్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని 599 మార్కులు సాధించిందని తెలిపారు. 577 మార్కులు సాధించిన విద్యార్థులు 100 మందికి పైగా ఉన్నారని వివరించారు. గుంటూరు జిల్లా డీఈఓ సీవీ రేణుక మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫాంతో పాటు మెరుగైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఓఎస్డీ పి.శివన్నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సెపక్తక్రా ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలు
సత్తెనపల్లి: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–14 , అండర్–17 బాల,బాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నిర్వహించారు. ఎంపికలకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి బాలబాలికల విభాగంలో 150 మంది క్రీడాకారులు హజరయ్యారు. క్రీడా ఎంపికలు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగాయి. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగబోయే 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని సురేష్ కుమార్ తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా పీఈటీలు లాకు పిచ్చయ్య, బి.అనిల్దత్తనాయక్, కోనంకి కిరణ్‌కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దాసరి కోటేశ్వరరావు, హెచ్ఎం కాకరపర్తి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబ శివరావు, కోనంకి కిరణ్‌కుమార్, జి.తులసీరామ్‌నాయక్, ఒ.రత్నాకర్, షేక్ మెహబూబి, కె.స్వాతి, సిహెచ్ అనూష, తదితరులు పాల్గొన్నారు. అండర్ –14 బాలబాలికల జట్లు అండర్–14 సెపక్తక్రా బాలుర జట్టుకు కె.రాము, టి.కళ్యాణ్‌బాబు, బి.రత్నాకర్, పి. సన్నీ, ఎస్.మహేష్, స్టాండ్‌బైలుగా షేక్.నాగుర్‌వలి, ఎస్.వేణు, జి.పవన్‌కుమార్ ఎంపికయ్యారు. అండర్–14 బాలికల జట్టుకు పి.శ్రీ జర్షిని, కె.తిరుమలభార్గవి, కె.స్వరూప, కె.ప్రశాంతి, పి.వర్షిని స్టాండ్‌బైలుగా ఎ.వేదవతి, ఆర్.సిరివెన్నెల, కె.మాళవిక. అండర్–17.. అండర్–17 సెపక్తక్రా బాలుర జట్టుకు కె.శామ్యూల్ రాజు,ఆర్.సంతోష్ కుమార్, ఎం.ప్రభుదాస్, ఎం.శ్రీశాంత్, బి.మనిధర్, స్టాండ్ బైలుగా వి.సురేంద్ర, బి.అనీల్ కుమార్, ఎ.కిషోర్‌లు ఎంపికయ్యారు. అండర్ –17 బాలికల జట్టుకు పి.గాయత్రి, కె.గీతిక, జి.చిన్మయి, డి.స్వరూప, షేక్.సమీర, స్టాండ్ బైలుగా ఎ.ప్రశాంతి, పి.దివ్యశ్రీ, జి.వర్ష. -
బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వి.వినోద్‌కుమార్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వి.వినోద్‌కుమార్ నియమితులయ్యారు. అనంతపురం కలెక్టర్‌గా ఉన్న ఆయనను బాపట్లకు బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015 ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన వినోద్‌కుమార్ ఏప్రిల్ 2024లో అనంతపురం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. కర్ణాటకు చెందిన వినోద్ కుమార్ డాక్టర్ చదువు పూర్తి చేసి 2015లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2016 – 17లో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2017– 19లో రంపచోడవరం సబ్ కలెక్టర్, 25 జూన్ 2019 నుంచి 17 సెప్టెంబరు 2019 వరకు ఐటీడీఏ పార్వతీపురం, 11 మే 2020 నుంచి 11 ఆగస్టు 2020 వరకు నెల్లూరు అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2020– 23లో ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతెనింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. 12 ఏప్రిల్ 2023 నుంచి 4 ఏప్రిల్ 2024 వరకు స్కిల్ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 9 జూలై 2024న బాపట్ల కలెక్టర్‌గా వచ్చిన జె.వెంకట మురళిని ఏడాది తర్వాత ప్రభుత్వం బదిలీ చేసింది. -
13న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్. సత్యశ్రీ కోరారు. గురువారం కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులు, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహస్తున్నట్లు తెలిపారు. అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ పడినట్లైతే సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు వాపస్ ఇస్తారని తెలిపారు. -
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే !
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025)లో అర్హత సాధించిన విద్యార్థులు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. బైపీసీ స్ట్రీమ్‌లో అర్హత సాధించిన విద్యార్థుల మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆన్లైన్ ఆధారిత కౌన్సెలింగ్ జరగనుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 16వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌తో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంది. ఆన్లైన్లో కళాశాలల జాబితా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 43 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు తమ ఇళ్లలోని పర్సనల్ కంప్యూటర్‌తో పాటు ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలు, ఫార్మసీ కళాశాలల నుంచి సహాయాన్ని పొందవచ్చు. అయితే, తమ ర్యాంకు, ఫీజు చెల్లించిన రసీదు వివరాలు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది. ఆన్లైన్లో పొందుపర్చిన జాబితా నుంచి తాము చేరదలచుకున్న కళాశాలలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుతో మొదలయ్యే ప్రక్రియ ఏపీ ఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎస్ఈటీఎస్.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల్లో చెల్లించాలి. ఏపీ ఈఏపీ సెట్ డిటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్లో పొందుపర్చారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో పరిశీలన చేసి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
కొంటాం అంటూనే.. కొర్రీ!
బాపట్ల జిల్లా రైతుల నిర్వేదంతెనాలి: ఆరుగాలం కష్టించి పండించిన పొగాకును అమ్ముకోవటానికి రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్ల కోసం నెలల తరబడి ఎదురుచూసి, తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక నాణ్యత లేదని తిరస్కరించటంతో దిక్కుతోచటం లేదంటున్నారు. పొగాకును వదిలేసి వెళ్లటం మినహా మరో మార్గం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కొనుగోళ్లు కొంతే.. రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. మార్క్‌ఫెడ్ బయ్యర్లను ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గౌడౌన్లు ఖాళీలేకపోవటంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్‌హౌసింగ్ గిడ్డంగిలో ఈనెల ఒకటో తేదీ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూళ్లనిచ్చి, విడతలవారీగా ఏయే కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకెళ్లాలనేది మెస్‌జ్‌లను పంపుతున్నారు. ఆ ప్రకారం సమాచారం అందుకున్న బాపట్ల జిల్లా కారంచేడు, చీరాల ప్రాంత రైతులు పలువురు మంగళవారం రాత్రికి తమ పొగాకు బేళ్లతో సహా తెనాలిలోని కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే బయ్యర్లు వచ్చి కొంత సరుకును మాత్రమే తీసుకుని మిగిలినది తిరస్కరించారు. ఎంతోకొంతకు తీసుకోమన్నా.. పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం మూడు గ్రేడ్లను నిర్ణయించింది. కిలో రూ.12, రూ.9, 6 చొప్పున నాణ్యత ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొందరు రైతులకు చెందిన పొగాకును కనిష్టమైన రూ.6లకు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని రైతులు చెప్పారు. పొగాకును ఇక్కడకు తరలించటానికే బోలెడు ఖర్చయిందనీ, మళ్లీ ఇప్పుడు దీనిని ఎక్కడికి తీసుకెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బయ్యర్లు నాణ్యత తనిఖీకని బేళ్లను విడదీశారనీ, ఇప్పుడా పొగాకు దేనికీ పనికిరాదని వాపోతున్నారు. కనిష్ట ధరకు కాకపోయినా ఎంతోకొంతకు తీసుకోమని ప్రాధేయపడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటున్నారు. -
జీవన నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ
విజయపురి సౌత్: స్థానిక ఏపీఆర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో జీవన నైపుణ్యాలపై రెండు రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా ఏపీఎస్సీఆర్టీ కరికులం కమిటీ మెంబర్ డాక్టర్ సీఏ ప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే పరిస్థితుల్లో స్థిరంగా ఉండాలని తెలిపారు. కళాశాలలోని గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాహిత్యాభిలాషులుగా ఉంటూ సమాజ హితానికి పాటుపడాలని చెప్పారు. స్ఫూర్తివంతమైన కథలతో విద్యార్థులకు సూచనలు అందించారు. రెండవ రోజు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు కె. ప్రభాకర్ మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలైన సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని ఉన్నత విద్యావంతులుగా తయారవ్వాలని తెలిపారు. చదువొక్కటే జీవితాలను మార్చగలదని చెప్పారు. తెలంగాణ జన విజ్ఞాన వేదిక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె. కొండల రెడ్డి విద్యార్థులకు ప్రత్యక్షంగా కొన్ని ప్రయోగాలను చూపించి సైన్స్‌పై అవగాహన కల్పించారు. కాళోజీ కవితను వినిపించి, ఆయన సాహిత్యాన్ని చదవాలని విద్యార్థులకు కిరణ్మయి సూచించారు. అందరితో రాజ్యాంగ పీఠికను పాండురంగారావు (మట్టి ప్రచురణలు) చదివించారు. కార్యక్రమం ప్రిన్సిపాల్ నయీం భాను పర్యవేక్షణలో జరిగింది. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.. -
రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగింది. బాపట్ల జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై సంస్థ జిల్లా చైర్మన్ బీఎస్ నారాయణ భట్టు స్పష్టమైన నివేదికలను సమర్పించారు. కమిటీ ఆమోదించిన తదుపరి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా విశేష సేవలు అందించిన 18 మంది సభ్యులకు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు, జ్ఞాపకాలను అందించారు. నూతన పాలక మండలి ఎన్నికలు జరగ్గా, 11 మంది పాలకవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. చైర్మన్‌గా బి.ఎస్.నారాయణ భట్టు మరోసారి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా బి.రామ సుబ్బారావు, కోశాధికారిగా టి.ప్రసాదరెడ్డి ఎన్నిక కాగా మరో తొమ్మిది మంది సభ్యులుగా ఎన్నికై నట్లు కలెక్టర్ ప్రకటించారు. నూతన పాలకవర్గం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. మంచి సేవలు అందిస్తున్న సంస్థ ప్రతినిధులను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అభినందించారు. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్రారాజు, సంస్థ చైర్మన్ బి.ఎస్.నారాయణ భట్టు మాట్లాడారు. కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ కరవు
నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎస్సీలపై దాడులు, వారి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతల ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నబాల శామ్యూల్, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖరరావు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేటలో ఈనెల 16న ఎస్సీ సెల్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ అధ్యక్షులు కొమ్మూరి కనకారావు, జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఎస్సీలు అంటే షెడ్యూలు క్యాస్ట్ కాదని, వైఎస్సార్ సీపీకి స్టాండర్డ్ కాస్ట్ అని గత ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లేసి నిరూపించారని తెలిపారు. పార్టీకి వచ్చిన ఓట్లలో ఎస్సీలవే అధికంగా ఉన్నాయని అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి స్వయంగా చెప్పారని వారు పేర్కొన్నారు. పార్టీకి కంచుకోటలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను తన వారిగా చెప్పుకొని వారికి జగన్మోహన్రెడ్డి సాధ్యమైనంత మేలు చేశారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాయకులు ఆయా వర్గాలపై దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు వైఎస్సార్ సీపీకి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తమ వర్గాలను వైఎస్సార్ సీపీ నుంచి విడదీయలేరని వారు స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలోని దళితులంతా పార్టీకి వెనుదన్నుగా ఉండాలని వారు కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు చావలి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పులివెల మాణిక్యం, జిల్లా కార్యదర్శులు కాలే మాణిక్యాలరావు, నెలటూరి సురేష్, ఎస్సీ సెల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కందుల ఎజ్రా, అచ్చంపేట, యడ్లపాడు, రొంపిచర్ల మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు శిఖా తిమోతి, వలేటి ఉదయకిరణ్, గుండాల వెంకటేష్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతల ధ్వజం 16న నరసరావుపేటలో విస్తృత స్థాయి సమావేశం -
కన్నతండ్రే కర్కోటకుడు
చినగంజాం: కట్టుకున్న భార్యను పిల్లలు కనే యంత్రంలా మార్చి ఆరుగురు పిల్లలను కని కుటుంబాన్ని పోషించే సత్తా లేక మద్యానికి బానిసై భార్యను తీవ్రమైన హింసకు గురి చేస్తూ కన్న బిడ్డలను సైతం అమ్మేసుకొని, తన వద్ద ఉన్న బిడ్డలను వదలించుకొని పరారయ్యాడు ఒక ప్రబుద్ధుడు. దీనికి సంబంధించి అతని భార్య చిన్నారి తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం చింతపల్లికి చెందిన పంగి రాజు, చిన్నారిలకు సుమారు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకొని జీవించే వారికి మొదటి సంతానం మగ పిల్లవాడు సాయి కలుగగా ప్రసవ సమయంలో వైద్యులను సంప్రదించకుండా ఆమెకు భర్త రాజు తనే స్వయంగా బొడ్డు కోసి ప్రసవం చేశాడు. అటు తరువాత చినగంజాం మండలంలో రొయ్యల చెరువుల్లో కూలి పనుల కోసం శంకర్ అనే మధ్యవర్తి ద్వారా ఇక్కడికి వచ్చారు. మండలంలోని పెదగంజాం ప్రాంతంలోను, కొత్తపట్నం మండలం ఈతముక్కల వద్ద రొయ్యల చెరువుల దగ్గర పనిచేస్తూ 12 ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వారికి మొదటి బిడ్డ సాయి తరువాత రెండో సంతానం ప్రవీణ్, మూడో సంతానంగా ఇంకా పేరు పెట్టని మరో ఆడ బిడ్డ, నాలుగో సంతానంగా మగపిల్లవాడు లడ్డు, ఐదో సంతానంగా ఆడపిల్ల లల్లి జన్మించారు. వీరిలో మొదటి బిడ్డ సాయిని చినగంజాం మండలంలోని గొల్లపాలెం వద్ద పనిలో కుదుర్చగా, రెండో వాడు ప్రవీణ్‌ను అడవీధిపాలెంలో పనికి కుదిర్చాడు. మూడో సంతానం ఆడపిల్లని నడిచే వయస్సులో ఈతముక్కల వద్ద వేరొకరికి అమ్మేశాడు. ఇదేమని ప్రశ్నించి అడ్డుకోబోయిన భార్య చిన్నారిని గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. భర్త పెట్టే బాధలను భరిస్తూ అతని వద్దే ఉంటూ సంతానం కనిపెట్టే యంత్రంలా తయారైంది. ప్రస్తుతం చినగంజాం మండలంలోని పెదగంజాం చెరువులు వద్ద కూలి పని చేసుకుంటూ భార్యభర్తలు, ఇద్దరు సంతానం జీవిస్తున్నారు. వారికి ఇటీవల మరో ఆడపిల్ల జన్మించింది. మద్యానికి బానిసై కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదని రాజు గ్రహించి 24 రోజుల పసి గుడ్డును రూ.30 వేలు నగదు తీసుకొని తల్లికి తెలియకుండా అమ్మేశాడు. ఆరుగురు సంతానానికి ఆస్పత్రి వెళ్లకుండా తనే స్వయంగా ప్రసవం చేయడం గమనార్హం. ఇద్దరు చిన్నారులను రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లి.. తన సంతానంలో తన దగ్గర మిగిలి ఉన్న ఇద్దరు చిన్నారులను వారం రోజుల క్రితం తను నివాసముంటున్న చెరువుల దగ్గర ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. భార్య అడ్డగిస్తుందేమోనని నిద్రిస్తున్న భార్యను మంచానికి కట్టేసి తన ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వచ్చేశాడు. మంగళవారం ఉదయం పిల్లలు లల్లి, లడ్డులను చినగంజాం రైల్వేస్టేషన్లో వదిలివేసి ఎటో పరారై వెళ్లిపోయాడు. రైలు పట్టాలను దాటుతూ రైల్వే ప్లాట్‌ఫాం ఎక్కే ప్రయత్నం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న చిన్నారులను రైల్వే కీమాన్ గుర్తించి స్థానికంగా నివాసముండే మల్లీశ్వరి అనే మహిళకు అప్పగించి వెళ్లిపోయాడు. సదరు మహిళ స్థానికుల సాయంతో ఆ ఇద్దరు చిన్నారులకు స్నానం చేయించి, మంచి దుస్తులు ఇచ్చి భోజనం పెట్టి అటు తరువాత స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారుల సమాచారాన్ని మండలంలోని పలు ప్రాంతాల్లో విచారించారు. తన ఇద్దరు సంతానం చినగంజాం రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారని సమాచారం అందుకున్న తల్లి చిన్నారి బుధవారం తెల్లవారు జామున వారి దగ్గరకు వచ్చి అక్కున చేర్చుకుంది. తల్లీబిడ్డలకు సాయమందించిన సర్పంచ్ సంఘటన కొత్తపాలెం పంచాయతీ పరిధిలో చోటు చేసుకోవడంతో గ్రామ సర్పంచ్ ఆసోది బ్రహ్మానందరెడ్డి వెంటనే స్పందించారు. తల్లి బిడ్డలను కలుసుకొని పూర్తిగా విషయాన్ని చిన్నారుల తల్లి చిన్నారి నుంచి తెలుసుకొని వారికి భోజనపు ఖర్చులు నిమిత్తం నగదు సాయమందించడమే కాకుండా అధికారులు దృష్టికి విషయం తీసుకొని వెళ్లి మిగిలిన సంతానాన్ని కూడా ఆమె చెంతకు చేర్చి వారందరికీ న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా చైల్డ్‌లైన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పురుషోత్తం మాట్లాడుతూ ఈ ఘటనపై బాధితులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చిన్నారులను వదిలిపెట్టి వెళ్లిన తండ్రి ఆచూకీ తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
విద్యాశాఖ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా శాఖలో పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్లు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల సమయంలో విద్యార్థుల స్కాలర్షిప్లు, కళాశాలల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోని వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ బకాయిలు పేరుకపోతున్నాయే తప్పా నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజు బకాయిల పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు జగదీష్, మధు, హేమంత్, ఆర్.అంజిరెడ్డి, యు.రాజు పాల్గొన్నారు. తొలుత అరండల్‌పేటలోని సీపీఐ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఏఐఎస్ఎఫ్ డిమాండ్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా -
అరకు కాఫీ తోటల పరిశీలన
బాపట్ల: కాఫీ పంటకు అత్యంత హానికరమైన కాఫీ బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి స్థితిని అంచనా వేయడానికి బాపట్ల వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన బృందం అరకులో పరిశోధన చేస్తున్నట్లు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి తెలిపారు. కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు, కీటక శాస్త్ర ఆచార్యులు డా. టి.మధుమతి, పేథాలజీ విభాగ ఆచార్యులు డా.జి.వంశీకృష్ణ, ఉద్యానవన విభాగ ఆచార్యులు డా.సిహెచ్. దుర్గా హేమంత్ కుమార్ మార్గదర్శకత్వంలో 25 మంది ఎమ్మెస్సీ వ్యవసాయ విద్యార్థులతో ఈ బృందం సర్వే చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఆఫ్రికాకు చెందిన ఈ చిన్న బీటిల్ పురుగు కాఫీకి అత్యంత హానికరమైనదని, ఇది కాఫీ ఉత్పత్తుల నాణ్యతలను, దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని కలగజేస్తుందని డా.ఎస్.ఆర్.కోటేశ్వరరావు తెలిపారు. కాఫీ గింజలో తన జీవిత చక్రాన్ని పూర్తి చేయగల ఏకై క కీటకమని, ఇది ప్రపంచంలో కాఫీని ఉత్పత్తి చేసే అనేక దేశాలను ఆక్రమించిందని, రైతులకు దీని నివారణకు తగిన శిక్షణ లేకపోవడం పొలాల పేలవమైన నిర్వహణ ఈ తెగులు వ్యాప్తికి కారణమన్నారు. పంటలో నష్టం కలిగిస్తున్న బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి స్థితిపై అంచనా -
పేదల కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ
నగరంపాలెం: భూమి, భుక్తితోపాటు వెట్టి నుంచి విముక్తి కోసం పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ అని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మహిళలపై చిన్నచూపు కనబరిచే ప్రతి ఒక్కరికి ఆమె పోరాటం కనువిప్పు కలిగించిందని పేర్కొన్నారు. పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిందన్నారు. పేదల విముక్తి కోసం పోరాడిన వీరనారి అని అన్నారు. అదే విధంగా భూమి కోసం సాహించిన తొలి మహిళని చెప్పారు. కార్యక్రమంలో అరవింద్, వసంత్, పోకల వెంకటేశ్వర్లు, కొల్లూరు శివప్రసాద్, సుబ్బు, దుర్గాదేవి, బద్రి, గౌరీశంకర్, కిషోర్, శంకర్ పాల్గొన్నారు. -
ప్రాణాపాయంలో చిన్నారి
పర్చూరు(చినగంజాం): బ్రెయిన్ ఫీవర్ సోకడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడో చిన్నారి. కొద్దిరోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ స్పృహలోకి రాకపోవడంతో మరికొన్ని రోజులు చికిత్స తప్పదంటున్నారు వైద్యులు. వివరాల్లోకి వెళితే.. పర్చూరు మండలంలోని చెన్నుంబొట్ల అగ్రహారానికి చెందిన పేర్లి సాత్విక్, సోదరి సంజనలు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. వారి తండ్రి పేర్లి సురేష్ వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. ఈక్రమంలో సెప్టెంబర్ 5న సాత్విక్‌కు తీవ్రమైన జ్వరం సోకి ఫిట్స్ రావడంతో చిలకలూరిపేటలోని వైద్యశాలలో చేర్పించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. రోజుకు రూ.25వేలు విలువైన ఇంజక్షన్ గుంటూరులోని ఓ ప్రైవేటు పిల్లల హాస్పిటల్లో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు బాలుడికి బ్రెయిన్ ఫీవర్ సోకిందని తెలిపారు. రోజుకు రూ. 25 వేలు విలువైన ఇంజక్షన్ చేస్తే నయం చేయవచ్చని వైద్యులు సలహా ఇచ్చారు. పేద కుటుంబం కావడంతో దిక్కుతోచని బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు నిలపాలని వేడుకోలు సాత్విక్ వైద్య ఖర్చుల కోసం అవసరమైన ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న విషయం పలువురు తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు గనిపిశెట్టి గోవిందరావు తమ విద్యార్థి సాత్విక్ పరిస్థితిని తెలుసుకొని గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని ఉపాధ్యాయ గ్రూపులను, ఉద్యోగులను, గ్రామస్తులను సంప్రదించి వారిని చైతన్యపరచి రూ. 1.91 లక్షలు నగదు వసూలు చేసి బాలుడి వైద్యఖర్చుల నిమిత్తం అందజేశారు. బాలుడు కోలుకునేందుకు ఇంకా నగదు అవసరం కావడంతో బాలుడి తల్లిదండ్రులు దాతలసాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం అందించేందుకు దాతలు పాఠశాల ఉపాధ్యాయుడు గనిపిశెట్టి గోవిందరావును సంప్రదించాలని కోరుతున్నారు. బ్రెయిన్ ఫీవర్‌తో మృత్యువుతో పోరాటం ఆర్థిక స్థోమత లేక నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు కొంతమేర సాయం చేసిన గ్రామస్తులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పూర్తిగా కోలుకునేందుకు మరికొన్ని రోజులు వైద్యం చేయాలంటున్న డాక్టర్లు దాతల సాయానికై ఎదురు చూపులు -
ఏపీఆర్ఎస్ఏ క్రీడా పోస్టర్ ఆవిష్కరణ
గుంటూరు వెస్ట్: ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర స్థాయి క్రీడా పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 7, 8, 9వ తేదీల్లో అనంతపురంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్–2025లో జరుగుతుందన్నారు. దీనిలో జిల్లా నుంచి 55 మంది పాల్గొంటారని తెలిపారు. జేసీకి పుష్పగుచ్ఛ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ప్రధాన కార్యదర్శి వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి దివ్య, షేక్ దరియా వలి ఈఖీ, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అనుపమ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయూబ్, ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యదర్శి రామారావు, బాబురావు, లీల, సంధ్యారాణి, త్రిలోక తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు ప్రతిష్ట దిగజార్చుకుంటున్నారు
చీరాల రూరల్: సామాన్యులపై, న్యాయవాదులపై పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ.. వారి ప్రతిష్టను వారే దిగజార్చుకుంటున్నారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. చీరాలకు చెందిన న్యాయవాది ఆకుల కొండయ్యపై జె. పంగులూరు పోలీసులు పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా బుధవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుటనున్న చీరాల–వాడరేవు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గౌరవ రమేష్‌బాబు, మేరుగ రవికుమార్, సీనియర్ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ మాట్లాడారు. చీరాల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాది కొండయ్యపై టీడీపీ నాయకుడు గుంటూరు మాధవరావు జె.పంగులూరు పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఎటువంటి విచారణ చేయకుండా న్యాయవాదిపై కేసు నమోదు చేశారని చెప్పారు. న్యాయవాది కొండయ్యపై మాధవరావు ఫిర్యాదు చేసిన రోజున కొండయ్య చీరాలలోనే ఉన్నాడని సీసీ ఫుటేజీలో కూడా ఉందన్నారు. అయినప్పటికీ పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండా తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయవాదిపై నమోదు చేసిన తప్పుడు కేసును తీసివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో న్యాయవాదుల పట్ల పోలీసులు ప్రదర్శిస్తున్న తీరు సక్రమంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కక్షిదారుల తరఫున పోలీసు స్టేషన్‌కు వెళుతూ న్యాయసహాయం అందిస్తున్న న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని న్యాయవాదులు వాపోయారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ్లమూడి విజయకుమార్, సీనియర్ న్యాయవాదులు కాకాని వెంకట్రావు, టీజే సాయిబాబు, పీఎన్ఎల్వీ ప్రసాద్, ఆకిశెట్టి పుల్లయ్యనాయుడు, సజ్జా శ్రీనివాసరావు, రాజు వెంకటేశ్వరెడ్డి, భానుప్రకాష్, గొడుగుల గంగరాజు, చల్లా సురేష్, కొటిక ఉదయభాస్కరరావు, నాశన రాము, షేక్ సిరాజ్, మహిళా న్యాయవాదులు స్నేహ, ఈశ్వరిరెడ్డి, పద్మ పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు వరం
యడ్లపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర మానవ వనరులశాఖ ఏటా జాతీయ ఉపకార వేతన పరీక్ష నిర్వ హిస్తోంది. ప్రతిభ ఉన్న వారికి పేదరికం అడ్డుకారాదని చెబుతూ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ. 12వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తోంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 30వ తేదీ కాగా, ఈ ఏడాది డిసెంబర్ 7న పరీక్ష జరగనుంది. దర ఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అర్హులు వీరే... ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, వసతి లేని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3.5 లక్షల లోపు ఉండాలి. 2024–25 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో బీసీ, ఓసీ విద్యార్థులు 55శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు ఇలా చేయాలి ఆసక్తి ఉన్న విద్యార్థులు www. bse. ap. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. ఓసీ, బీసీ విద్యార్థులకు పరీక్ష రుసుం రూ.100 కాగా, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50 చొప్పున ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో లభించే ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి. ఉపకార వేతనం ఈ పరీక్షలో ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతిలో 55శాతం మార్కులు, 10వ తరగతిలో 60శాతం, ఇంటర్ మొదటి సంవత్సరంలో 55శాతం మార్కులు సాధిస్తేనే ఉపకార వేతనం కొనసాగుతుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ. 12వేల చొప్పున నాలుగు సంవత్సరాలకు విద్యార్థికి ఉపకార వేతనం లభిస్తుంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల ఏటా రూ. 12వేల చొప్పున ఉపకార వేతనం -
ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ నిరసన
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ ఆగ్రహించారు. మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ వజీర్ మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు వాకింగ్ చేస్తున్న సమయంలో సిబ్బంది లైట్లు తీసేశారన్నారు. వర్షం కారణంగా స్టేడియం బురదగా ఉందన్నా పట్టించుకోలేదని తెలిపారు. ట్రాక్ పనులు పూర్తి చేయలేదన్నారు. మైక్ మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రౌండ్ మెన్స్ కూడా లేరన్నారు. జిమ్‌లోని కొన్ని పరికరాలు ఎంతో కాలంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేడియంలో ఆటలకు బదులు రాజకీయాలు నడుస్తున్నాయని సీనియర్ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇక్కడి సభ్యులను కలుపుకొని బాస్కెట్ బాల్ కోర్ట్, స్కేటింగ్ రింక్, అత్యాధునిక పరికరాలతో జిమ్, స్టేడియం సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. తర్వాత ఒక్క కొత్త పని కూడా పూర్తి చేయలేదు. ఇటీవల నూతన కమిటీ ఎన్నికలు కూడా టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే రద్దయ్యాయి. కమిటీ వస్తే స్టేడి యం అభివృద్ధి చెందుతుందని భావించిన సభ్యుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. స్టేడియం నగరపాలక సంస్థకు చెందిన ఆస్తి. అంటే ప్రభుత్వానికి సొంతం. కొందరు వ్యక్తులు మాత్రం స్టేడియం తమదే అన్నట్లు వ్యవహరించడాన్ని పలువురు సభ్యులతోపాటు క్రీడాకారులు తప్పుబడుతున్నారు. ఇప్పటికై నా రాజకీయాలు ఆపి క్రీడలను ప్రోత్సహిస్తే మేలని ప్రజలు పేర్కొంటున్నారు. -
రేపల్లెకు భారీ బైక్ ర్యాలీ
భట్టిప్రోలు: కూటమి ప్రభుత్వంలో రైతులకు ఆదినుంచి కష్టాలేనని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయ కర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. అశోక్‌బాబు ఆధ్వర్యంలో అన్నదాత పోరు సందర్భంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు భట్టిప్రోలు మండలం వేమవరం అడ్డరోడ్డు నుంచి పల్లెకోన మీదుగా రేపల్లె వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరు, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తలు అశోక్‌బాబు, ఈపూరు గణేష్‌బాబు మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధరలు, ఎరువులు బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రైతే రాష్ట్రానికి వెన్నుముక అని పొగిడిన కూటమి నేతలు.. ఎన్నికలయ్యాక రైతులకు వెన్నుపోటు పొడిచారన్నారు. అనంతరం ఆర్డీఓ నాగలక్ష్మికు వినతి పత్రం అందచేశారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గంలోని భట్టిప్రోలు, వేమూరు, చుండూరు, అమృతలూరు, కొల్లూరు, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పార్టీ మండల కన్వీనర్లు, అన్ని మండలాల్లోని రాష్ట్ర జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, రైతు సోదరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కర్షకలోకం
●అన్నదాత పోరు.. జన హోరు ●కూటమి ప్రభుత్వంపై అన్నదాతల ఆగ్రహం ●భారీగా కలెక్టరేట్‌కు చేరుకున్న రైతులు ●రైతన్నకు అండగా వైఎస్సార్ సీపీ బాపట్ల: రైతన్నకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి భారీగా రైతులు తరలి వచ్చారు. ట్రాక్టర్లతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు వచ్చి కనీసం యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బాపట్ల సమన్వయకర్త కోన రఘుపతిలు ర్యాలీలో పాల్గొని రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి పిలుపు మేరకు ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్లపై రైతులు బాపట్లకు చేరుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ వరకు రైతులు పాదయాత్రగా వెళ్ళారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రదర్శనలో పాల్గొన్ని తమ నిరసన తెలియజేశారు. భారీగా మోహరించిన పోలీసులు వైఎస్సార్ సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి భారీగా రైతులు చేరుకుంటున్నారని తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. డీఎస్పీ రామాంజనేయులు, సీఐ రాంబాబు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అడుగడుగునా పోలీసులు ప్రదర్శనను అడ్డుకున్నారు. రైతులు పోలీసులను సైతం లెక్క చేయకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు. కలెక్టరేట్‌లోకి పంపకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనంతరం ఆర్డీఓ గ్లోరియాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.ప్రసాద్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈద శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సు ధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, గవిని కృష్ణమూర్తి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, నక్కా వీరారెడ్డి, మండే విజయ్‌కుమార్, చల్లా రామయ్య, వడ్డిముక్కల డేవిడ్, చింతల రాజశేఖర్, ఇనగలూరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
బస్సుల రద్దుతో ఇక్కట్లు
● అనంతపురం సూపర్ సిక్స్ సభకు తరలిన బస్సులు ● మూడు రోజులపాటు సర్వీసులు అందుబాటులో లేనట్లే.. బల్లికురవ: సూపర్‌సిక్స్ సంబరాల పేరిట పల్లె వెలుగు బస్సులను అనంతపురం సభకు పంపటంతో మంగళవారం నుంచి బల్లికురవ – సంతమాగులూరు మండలాలో తిరిగే సింగల్ రూట్ బస్సు సర్వీసులకు బ్రేక్ పడింది. అద్దంకి డిపో నుంచి బల్లికురవ, సంతమాగులూరు మీదుగా నరసరావుపేట వెళ్లే బస్సు, గోవాడ మార్టూరు మీదుగా చిలకలూరిపేట వెళ్లే బస్సు, వైదన బల్లికురవ మీదుగా చిలకలూరిపేట వెళ్లే బస్సు, మైలవరం బస్సు, చిలకలూరిపేట డిపో నుంచి మర్టూరు, బల్లికురవ, కొమ్మాలపాడు మీదుగా కుందుర్రు వెళ్లే బస్సు, చిలకలూరి పేట నుంచి ఉప్పుమాగులూరు వెళ్లే బస్సులను రద్దు చేశారు. అద్దంకి నుంచి కొమ్మాలపాడు మీదుగా నరసరావుపేట, అద్దంకి నుంచి కూకట్లపల్లి మీదుగా వినుకొండ వెళ్లే బస్సులకు కోత విధించారు. బుధవారం అనంతపురం సమీపంలోని జీఎంఆర్, ఇంద్రప్రస్థ గ్రౌండ్స్‌లో జరగనున్న సూపర్‌సిక్స్ సంబరాలకు అద్దంకి, చిలకలూరిపేట, వినుకొండ డిపోలనుంచి పల్లె వెలుగు బస్సులు తరలించడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. గురువారం వరకు ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. మహిళలకు సీ్త్రశక్తి పేరిట ఉచిత ప్రయాణం అంటూ అరకొర బస్సులు కేటాయించగా.. వాటిని సైతం అనంతపురం పంపడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని 15 గ్రామాల ప్రయాణికులు కుందుర్రు బస్సును రద్దు చేయడంపై డిపో మేనేజర్‌తో మాట్లాడటంతో మంగళవారం సాయంత్రం పునరుద్ధరించారు. అయితే బుధ, గురువారాల్లో యథావిధిగా నడపాలని ప్రయాణిలు కోరుతున్నారు. -
చెన్నుపల్లికి విశ్వకర్మ ఐకాన్ జాతీయ పురస్కారం
అద్దంకి: పట్టణానికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసాచారి విశ్వకర్మ ఐకాన్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ మేరకు తనకు వారి నుంచి ఉత్తర్వులు అందాయని మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘంలోని వారు ఎవరూ వైద్యానికి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల నుంచి శ్రీనివాసాచారి వైద్యసేవలు అందేలా చూస్తున్నాడు. దీనికిగానూ 2025 విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కారం అందజేయనున్నారు. -
ఆర్థిక సేవల్లో నిపుణుడు డాక్టర్ నాగరాజు మద్దిరాల
తెనాలి: ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఈ పర్యాయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాలకు బహూకరించనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటయే సభకు ఫౌడేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా నాగరాజు మద్దిరాలకు అవార్డును ప్రదానం చేస్తారు. ఇదే వేదికపై నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేస్తారు. తెలుగుతేజం నాగరాజు మద్దిరాల ఆకివీడు దగ్గర్లోని ఆలపాడు గ్రామంలో 1966లో జన్మించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ కోర్సు చేశారు. 27 ఏళ్ల వయసులో త్రిపుర కేడర్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అదే రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆర్థిక, పరిశ్రమల, వాణిజ్యశాఖ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వంటి కీలక పదవులు నిర్వహించారు. ఆయన హయాంలోనే 2016లో త్రిపుర, ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ స్మాల్ స్టేట్ ఇన్ ఈ–గవర్నెన్స్’గా గుర్తింపును పొందింది. అదే సంవత్సరంలో రాష్ట్రంలో శిశు మరణాల రేటును 26 నుంచి 21కు తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్రిపురకు రెండో బహుమతి లభించింది. 2004–08లో ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగంలో జపాన్, ఉత్తర అమెరికా, ప్రపంచ బ్యాంక్ విభాగాల్లో డైరెక్టర్‌గానూ నాగరాజు చేశారు. 2008 – 12లో వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, సలహాదారుగానూ వ్యవహరించారు. బొగ్గు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అనే చారిత్రక మైలురాయిని చేరుకునేలా చేశారు. ప్రస్తుతం ఆర్థిక సేవలశాఖ కార్యదర్శిగా ఆ రంగ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నేడు తెనాలిలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డు స్వీకరణ -
అన్నదాతను దగా చేసిన ప్రభుత్వం
రేపల్లె: రాష్ట్రంలోని కూటమి సర్కారు రైతులను దగా చేసిందని శాసనమండలి సభ్యుడు, వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు తుమాటి మాధవరావు అన్నారు. వైఎస్సార్ సీపీ అధినాయకత్వం పిలుపు మేరకు రేపల్లె, వేమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ ఈవూరు గణేష్, వరికూటి అశోక్‌బాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇసుకపల్లి నుంచి రెండు నియోజకవర్గాల రైతులు, కౌలు రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలి వచ్చి రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ● అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాధవరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులకు విత్తుకునే విత్తనం నుంచి సకాలంలో ఎరువులు, పురుగుమందులను రైతుభరోసా కేంద్రాల ద్వారా అందించారన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నారని తెలిపారు. దానికి భిన్నంగా నేటి కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. నేడు ఒక్క కట్ట యూరియా కోసం ఎర్రటెండలో బారులు తీరి ఉండాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం కూడా పూర్తిగా ఇవ్వకుండా రైతాంగాన్ని దగా చేశారన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అందిస్తామని చెప్పి, ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారని, మహిళలకు ఉచిత బస్సు అని ప్రవేశపెట్టి నెల కావస్తున్నా.. తగినన్ని బస్సులు అందుబాటులో లేకుండా మోసం చేశారన్నారు. ● ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులకు సైతం వికలాంగత్వం పర్సంటేజ్ వ్యత్యాసం ఉందని లక్షలాది మందికి పింఛన్ ఎత్తేసే కుట్రకు తెర లేపిన దుర్మార్గ ప్రభుత్వమిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు, పింఛన్‌దారులు, మహిళలు, అన్నివర్గాల వారు ఇక్కట్లకు గురవుతుంటే.. కూటమి నేతలు విజయోత్సపు సభలు నిర్వహించడం విడ్డూరమన్నారు. రైతులు, నాయకులు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనీల్, దుండి వెంకటకామిరెడ్డి, యార్లగడ్డ రాంబాబు, చిత్రాల ఓబేదు, చిమటా బాలాజీ, వీసం నాగలక్ష్మి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు -
డాక్టర్ జగదీష్‌రెడ్డికి బంగారు పతకం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉయ్యూరు జగదీష్‌రెడ్డికి గోల్డ్‌మెడల్ లభించింది. మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రొఫెసర్ ఎం.ఆర్.సి.నాయుడు గోల్డ్‌మెడల్, ప్రశంసా పత్రాన్ని డాక్టర్ జగదీష్‌రెడ్డి స్వీకరించారు. డాక్టర్ జగదీష్‌రెడ్డి గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో న్యూరో సర్జరీలో సూపర్‌స్పెషాలిటీ పీజీ అభ్యసించారు. పీజీ కోర్సులో యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గోల్డ్ మెడల్ లభించింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, న్యూరో సర్జరీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణమూర్తి, పలువురు న్యూరో సర్జన్లు ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. -
దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
అమరావతి: పవిత్ర శైవక్షేత్రమైన అమరావతి శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరాలయంలో 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రేఖ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలలో తొమ్మిదిరోజులపాటు చండీహోమం నిర్వహిస్తామని చెప్పారు. 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేయనున్నట్లు తెలిపారు. బాలబాలికలకు ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. 29వ తేదీ రాత్రి 8.40 గంటలకు చండీ కల్యాణోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. శమీ వృక్షం కింద ప్రత్యేక వేదికపై అక్టోబరు 2 వ తేదీన రాత్రి స్వామి వారి గ్రామోత్సవం అనంతరం శమీపూజ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానాలలో కూడా దసరా నవరాత్రోత్సవాలకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీతా సమేత శ్రీకోదండరామస్వామి దేవస్థానంలో తొమ్మిది రోజులపాలు సాయంత్రం అమ్మవారి ప్రత్యేక పూజలు, బతుకమ్మ పూజ నిర్వహించనున్నారు. అమ్మవారికి అలంకరణలు ఇలా.. తొమ్మిది రోజులపాటు వేడుకల్లో అమరావతి బాల చాముండేశ్వరి దేవి ఆలయంలో 22 వ తేదీన రజత కవచాలంకృత అలంకరణ, 23న బాలా త్రిపుర సుందరీ దేవి, 24న గాయత్రీ దేవి, 25న అన్నపూర్ణా దేవి, 26న మహాలక్ష్మీ దేవి, 27న శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి, 28న మంగళగౌరీ దేవి, 29న సరస్వతీ దేవి, 30న దుర్గాదేవి, 01న మహిషాసుర మర్ధిని దేవి, అక్టోబర్ 2న రాజరాజేశ్వరీ దేవి అలంకారాలు ఉంటాయని ఈవో తెలిపారు. -
తక్కువ ధరకు బంగారమంటూ మోసం
● కర్ణాటక వ్యాపారికి ముఠా కుచ్చుటోపీ ● రూ.14 లక్షల నగదు దోచుకుని పరారీ ● నిందితులను అరెస్టు చేసిన చీరాల పోలీసులు చీరాల అర్బన్: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మాయ చేసే కర్ణాటకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను చీరాల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. ఆదివారం ఈపురుపాలెం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎండీ మొయిన్ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... చీరాలలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన ఏడుగురు ముఠాలోని ఒకరైన సాతుపాటి యువరాజు.. కర్ణాటక రాష్ట్రం దొడ్డపేటకు చెందిన స్వర్ణకారుడు నాగరాజును నమ్మించాడు. నాలుగు నెలల క్రితం ఫోన్ ద్వారా ఈ విషయం చెప్పాడు. చీరాలకు వస్తే తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని పేర్కొన్నాడు. నాగరాజుకు నమ్మకం కలిగించేందుకు ఒక బంగారు ఆభరణాన్ని చూపించాడు. ఈ క్రమంలో శనివారం నాగరాజును చీరాల ఆటోనగర్ దగ్గర గల బోయినవారి పాలెం రైల్వేట్రాక్ వద్దకు రమ్మని చెప్పడంతో రూ.14 లక్షల నగదుతో నాగరాజు, అతని సోదరుడు అక్కడకు వెళ్లారు. అక్కడ కలుసుకున్న నిందితుడు.. బంగారం తీసుకుని మా వాళ్లు అక్కడకు వస్తారని చెప్పి వెళ్లాడు. అనంతరం మరో ఆరుగురు వ్యక్తులు అక్కడకు వచ్చి డబ్బు చూపించాలని చెప్పడంతో వెంట తెచ్చిన నగదును బాధితులు వారికి చూపించారు. అనంతరం ముఠా సభ్యులు నాగరాజును, అతని సోదరుడిని కత్తితో గాయపరిచారు. వారి వద్ద ఉన్న నగదును, సెల్ఫోన్లను లాక్కొని కర్ణాటకకు చెందిన కారులో పరారయ్యారు. దీంతో బాధితుడు వెంటనే ఈపురుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మొయిన్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. రూరల్ సీఐ శేషగిరిరావు, ఈపూరుపాలెం ఎస్సై చంద్రశేఖర్, సిబ్బందిని అప్రమత్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల వైపు వెళుతున్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుల కారును అడ్డగించారు. ప్రకాశం జిల్లా పోలీసుల సహకారంతో నిందితులను పెదదోర్నాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14 లక్షల నగదుతోపాటు ఒక కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్, రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది, ట్రైనీ ఎస్సై ఎన్.అలేఖ్య, హెడ్ కానిస్టేబుల్ ఎం.వెంకటరామరాజు, కానిస్టేబుళ్లు బాలచంద్ర, మోహనరావు, రమేష్, మహిళా కానిస్టేబుల్ అనిత, ఆదిలక్ష్మి, హోంగార్డు రవిరెడ్డిలను ఎస్పీ అభినందించారు. -
పాలకుల తీరుతో రైతులకు ఇక్కట్లు
● వైఎస్సార్సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు భట్టిప్రోలు: కూటమి అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదని, యూరియా కోసం ఎండలో గంటల తరబడి బారులు తీరాల్సిన దుస్థితి వచ్చిందని వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు మార్కెట్ యార్డ్ ఆవరణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యాలయం వద్ద క్యూ లైనులో యూరియా కోసం వేచి చూస్తున్న రైతులతో ఆదివారం ఆయన మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ శాతం కౌలు రైతులే లైన్లో ఉన్నట్లు తేలింది. ఉన్నతాధికారులు సరిపడా యూరియాను రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. తెల్లవారుజాము నుంచి నిలబడినా ఒక్క బస్తా కూడా దొరకలేదని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇది కచ్చితంగా కూటమి ప్రభుత్వ వైఫల్యమని తెలిపారు. అరకొరగా యూరియా వచ్చినా అధికారులు వారికి కావాల్సిన వారికే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారని అన్నారు. ఎంత భూమి ఉన్నా ఒక్క బస్తా ఇవ్వడంతో ఏం చేయాలో రైతులకు అర్థం కాక కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. తగినన్ని ఎరువులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించి, రేపల్లె ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. -
బ్రాహ్మణ సేవా సమితి విద్యా పారితోషికం ప్రదానం
గుంటూరు మెడికల్: బ్రాడీపేటలో బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి విద్యా పారితోషిక ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు నందిరాజు పాండురంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పాల్గొన్నారు. 252 మంది విద్యార్థులకు రూ.21.50 లక్షలు అందించారు. పాండురంగారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థానం పొందిన తరువాత, సమితి వారికి సహాయ సహకారాలు అందజేయాలన్నారు. బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి ఎం.లక్ష్మీపతి పర్యవేక్షించారు. విద్యా పారితోషికాల చైర్మన్ ఎ.సంజీవరావు, కో చైర్మన్ కర్లపాలెం బాలకృష్ణ, కోశాధికారి తుళ్లూరు ప్రకాష్, ఉపాధ్యక్షుడు మాదల వెంకటకృష్ణ, సహాయ కార్యదర్శులు ఆదిరాజు శ్రీధర్, బొప్పూడి కృష్ణ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాతూరు శ్రీనాథ్, కోదండ రామారావు, మారుతీ రామ్ గోపాల్, పాంచజన్య శర్మ, కటక రాజు సాయిబాబా శర్మ, గండ్రకోట వెంకటేశ్వరరావు, మద్దూరు రామకృష్ణ పరమహంస, వింజనంపాటి సుబ్రహ్మణ్యం, వి.ఫణీంద్ర కుమార్, అవ్వారి మంగాదేవి పాల్గొన్నారు. -
ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించాలి
ఎస్టీయూ డిమాండ్ చిలకలూరిపేట: దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తగ్గించి, బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మూల్యాంకన పుస్తకాలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు భారంగా మారాయని, వాటిని పునఃపరిశీలించి, వెంటనే మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ప్రారంభించాలని కోరారు. సమావేశంలో వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, షేక్ మక్బూల్‌బాషా, దుర్గాప్రసాద్, బొంత రవి, జి కోటేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. -
అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన
అద్దంకి రూరల్: అద్దంకి వ్యవసాయశాఖ మార్కెట్ యార్డులో ప్రతి ఆదివారం సంత నిర్వహిస్తూ ఉంటారు. కూరగాయాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు ద్విచక్ర వాహనాలను ఎవరికీ అడ్డం లేకుండా అక్కడే ఉన్న అగ్నిమాపక శాఖ కార్యాలయానికి రెండు వైపులా పెడుతుంటారు. అయితే, ఈ మధ్యనే కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆ శాఖ కానిస్టేబుల్ ఆదివారం సంతకు వచ్చిన ప్రజలను ద్విచక్ర వాహనాలు పెట్టవద్దని హెచ్చరించ సాగాడు. ఆఫీస్‌కు అడ్డంలేకుండా పెట్టకుంటామన్న వినలేదు. సంతకు వచ్చిన ఓ వ్యక్తిని బండ బూతులు తిడుతూ ‘‘చొక్కా విప్పితే నీకంటే పెద్ద రౌడీనిరా’’ అంటూ రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న ఎస్ఐ వెంకట్రావు, తోటి సిబ్బంది వారించినా లెక్క చేయకుండా దూషిస్తూనే ఉన్నాడు. ఈ విషయంపై ఎస్ఐ వెంకటరావును వివరణ కోరగా కానిస్టేబుల్ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు తెలియజేనున్నట్లు తెలిపారు. -
టెండర్లలో తమ్ముళ్ల కాళ్లబేరం!
● టెండర్లు దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్ల పాట్లు ● ఇటీవల అడ్డదారిలో దక్కించుకున్న వైనంపై ‘సాక్షి’లో కథనం ● దాని ఆధారంగా పలువురిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అధికారులు ● వర్కులను ఎలాగైనా దక్కించుకోవాలని వెంపర్లాడుతున్న పచ్చ నేతలు ● టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ వాట్సాప్ మేసేజ్‌లు నెహ్రూనగర్: అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహార శైలిపై గత నెల 22న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశించారు. అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న వారి వివరాలు సేకరించి తనకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులకు చెప్పారు. కమిషనర్ ఆదేశంతో టెండర్లు రద్దు చేయడంతోపాటు పలువురిని ఇంజినీరింగ్ అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లాబోదిబోమని అంటున్నారు. సగంలో ఆగిపోయిన వర్కులు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ లాభాలు వచ్చే వాటిని తెలుగు తమ్ముళ్లు బ్లాక్ చేసుకున్నారు. టెండర్లలో పాల్గొనకుండానే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి పనుల్ని దక్కించుకున్నారు. లెస్సుల్లో కూడా మాయాజాలం చూపి రూ.కోట్లు విలువైన పనులను కైవసం చేసుకున్నారు. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో, అడ్డదారిలో దక్కించుకున్న టెండర్లు రద్దు చేశారు. ప్రస్తుతం పనులు సగం వరకు పూర్తయ్యాయి. తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించడంతో తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. చర్చనీయాంశంగా మారిన మెసేజ్ వర్కుకు ఎవరూ టెండర్ వేయవద్దంటూ టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ వాట్సాప్ గ్రూప్‌లో మేసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో ఓ డివిజన్లో రూ.1.14 కోట్ల పనులపై ఎవరూ టెండర్ వేయవద్దంటూ వేడుకున్నాడు. వ అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఇలాగే జరుగుతుందని తోటి కాంట్రాక్టర్లు చెప్పుకోవడం గమనార్హం. నేడు కలెక్టర్‌కు వినతి పత్రం నగరపాలక సంస్థ అధికారులు కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ వారికే బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై మిగిలిన కాంట్రాక్టర్లంతా సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు
నాలుగు ఎకరాల్లో సాగు చేశాను. వెద పద్ధతిలో నాటి ఇప్పటికే 35 రోజులు అయ్యింది. ఒక్కసారి కూడా యూరియా వేయలేదు. పైర్లు ఎదుగుదల లేక జిగటబారిపోయాయి. యూరియా కోసం బాపట్ల, చీరాలలోని ఎరువుల దుకాణాలకు తిరిగినా ప్రయోజనం లేదు. గ్రామానికి యూరియా వచ్చిందని తెలిసి ఇక్కడికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు. – మున్నం కొండలురెడ్డి, బసివిరెడ్డిపాలెం రైతులంటే ప్రభుత్వానికి చులకన ఆదివారం యూరియా ఇస్తున్నారని తెలుసుకొని పొలం పాసుబుక్ జిరాక్స్, ఆధార్‌కార్డు తీసుకొని ఉదయం 9 గంటలకే వచ్చా. అధికారులు 10 గంటలకు వచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉన్నాం. ఎండలు భగభగ మండిపోతున్నా కనీసం సమీపంలో తాగునీరు, నీడ వసతి కూడా లేదు. మండుటెండలో అల్లాడిపోయాం. రైతులను ఇంత చులకనగా చూడటం సరికాదు. అవసరమైన యూరియా అందరికీ సరిపడా అందజేయాలి. – బుర్ల కోటేశ్వరావు, దేవినూతల -
రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు
బాపట్ల: రైతులను చంద్రబాబు సర్కారు అన్నివిధాలుగా నట్టేట ముంచిందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ డివిజన్లలో నిరసన ప్రదర్శన, ఆర్డీఓలకు వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమ పోస్టరును ఆదివారం స్థానిక కోన చాంబర్లో ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ... చంద్రబాబు సర్కారు వచ్చాక పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ౖరైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఆయన మోసం చేశారని గుర్తు చేశారు. కనీస అవగాహన లేని అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చి రైతులను అయోమయానికి గురి చేశారన్నారు. రైతులను ఎరువుల కోసం క్యూలో నిలబెడితే తప్పేంటంటూ పేర్కొనడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు. వైఎస్ జగన్ హయాంలో మేలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతుల పట్ల ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటంతోపాటు శాశ్వత ఉద్యోగులను కూడా నియమించారన్నారు. రైతులను నేరుగా సేవలు అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ క్రాప్ బుకింగ్‌లు కూడా వెనువెంటనే చేయటంతోపాటు రూ.730 కోట్లు రైతులకు సంబంధించిన బీమా రుసుము కూడా చెల్లించారని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనం నుంచి దిగుబడి వరకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా ఆయన వ్యవహరించారన్నారు. నేడు రైతులు యూరియా కోసం బారులుతీరాల్సిన దుస్థితి నెలకొందన్నారు. యూరియా అవసరం లేని పర్చూరు నియోజకవర్గంలో టన్నుల కొద్ది యూరియా ఉంటే, అవసరమైన ప్రాంతాల్లో లేదన్నారు. అధికారులు కూడా యూరియా బ్లాక్‌లోకి వెళ్లినా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ‘అన్నదాత పోరు’ జయప్రదానికి పిలుపు ఈ నెల 9వ తేదీన రైతులకు అండగా అన్నదాత పోరు కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు ఉంటుందని కోన చెప్పారు. ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, జాలి రామిరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, రెడ్డింకయ్య, ఇనగలూరి మాల్యాద్రి, తన్నీరు అంకమ్మరావు, మండే విజయకుమార్, చెన్నకేశవులు, జోగి రాజా, శ్రీహరి ప్రకాశ్, అడే చందు తదితరులు పాల్గొన్నారు. -
సరిపడా యూరియా పంపిణీకి చర్యలు
చీరాల టౌన్: చీరాల డివిజన్ పరిధిలో పంటలు సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందించేందుకు కృషి చేస్తున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు తెలిపారు. ఆదివారం చీరాల మండలంలోని గవినివారిపాలెం, తోటవారిపాలెం, తదితర గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలను ఆర్డీవో చంద్రశేఖర నాయుడు, తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణలు వ్యవసాయాధికారులతో కలిసి పరిశీలించారు. ఫర్టిలైజర్ షాపుల్లో స్టాక్ నిల్వలను, రికార్డులను, యూరియా పంపిణీ విధానాన్ని తెలుసుకున్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. అధిక ధరలకు విక్రయించకుండా, అక్రమ నిల్వలు చేయకుండా కట్టడి చేశామన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిత్యాన్నదానానికి సామగ్రి వితరణమోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదానికి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామస్తుడు గండే కృష్ణమ నాయుడు, మౌనిక దంపతులు సామగ్రి వితరణ చేశారు. తమ చిన్నారులు త్రిషికదేవి, నిహిరదేవి పేరిట 200 కుర్చీలు, వెయ్యి గ్లాసులు, 15 ఐరన్ టేబుళ్లు బహూకరించారు. ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు వీటిని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.సజావుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎంపిక పరీక్షలుగుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం గుంటూరులోని వివిధ పరీక్ష కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. ఏసీ కళాశాల, టీజేపీఎస్, విజ్ఞాన్ నిరూల డిగ్రీ, పీజీ కళాశాలలోని పరీక్ష కేంద్రాల్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పరిశీలించారు.పశ్చిమ డెల్టాకు 8,216 క్యూసెక్కులు విడుదలదుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 8,216 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 340, బ్యాంక్ కెనాల్‌కు 1,930, తూర్పు కాలువకు 720, పశ్చిమ కాలువకు 241, నిజాపట్నం కాలువకు 454, కొమ్మూరు కాలువకు 3,420, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 53,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలిగుంటూరు ఎడ్యుకేషన్: 12వ వేతన సవరణకు సంబంధించిన సంఘాన్ని నియమించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత పోరును జయప్రదం చేయండి
భట్టిప్రోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. డాక్టర్ వైఎస్సార్ సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో ఎరువులు అందించడంతోపాటు పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైనట్లు విమర్శించారు. యూరియాను కూటమి నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9న రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో రైతులతో కలసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అన్నదాత పోరు కార్యక్రమంలో రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలోని రైతులు, కౌలు రైతులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు -
గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి
చిలకలూరిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందిన సంఘటన పట్టణ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోండ్రుపాడు గ్రామానికి చెందిన రైతు ఇంటూరి యాదగిరి(27) సరుకుల నిమిత్తం గ్రామం నుంచి బైక్‌పై చిలకలూరిపేటకు బయలుదేరాడు. కొత్త హైవే బైపాస్ వంతెన సమీపంలోని రైస్‌మిల్లు సమీపానికి వచ్చే సరికిగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసిన గుర్తు తెలియని వాహనం ఇతని బైక్‌ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ పేరుతో ఓ వ్యాపారికి రూ.62.25 లక్షలు టోకరా లక్ష్మీపురం: నగరంలోని ప్రముఖ వ్యాపారికి సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. ఈ ఘటనపై అరండల్‌పేట పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని భారత్‌పేట ప్రాంతానికి చెందిన ఓ కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి, టెలికాం డిపార్ట్మెంట్, సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు, అతని వద్ద మీ పూర్తి వివరాలు ఉన్నాయని ఇరువురి మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు. ఆ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే, కేసులో క్లియరెనన్స్ ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వాలంటూ వ్యాపారి నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.62.25 లక్షలు వసూలు చేశారు. అయినా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉన్నారు. దీంతో వ్యాపారి దిక్కుతోచక ఆదివారం రాత్రి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్ –19 స్కూల్ గేమ్స్ జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశాన్ని సోమవారం గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వృత్తి విద్యాధికారి జె.పద్మ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, హైస్కూల్ ప్లస్, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులందరూ హాజరై ప్రస్తుత విద్యా సంవత్సరంలో జరగబోవు ఉమ్మడి గుంటూరు జిల్లా సెలక్షన్‌న్స్ వేదికలతోపాటు తేదీలను ఖరారుపై చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు. ఫిజికల్ డైరెక్టర్‌ను రిలీవ్ చేసి సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశానికి పంపాలని ఆయా యాజమాన్యాల్లోని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. యోగాసన పోటీలలో జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ తాడికొండ: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన 50వ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ పోటీలలో తమ పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఐదుగురు ఎంపికయ్యారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ నెల 6–7 తేదీల్లో ద్వారకా తిరుమలలో నిర్వహించిన ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో మొక్కల అక్షయ ప్రథమ, ఆలా పూజిత తృతీయ, బొంత అనూష నాలుగో స్థానాలు సాధించగా సబ్ జూనియర్ విభాగంలో మొక్కల లక్ష్మీ ఆశ్రిత నాలుగో స్థానం సాధించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులతోపాటు యోగా అభ్యాసకుడు అన్నవరపు రాకేష్‌లను పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. త్వరలో వీరు జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. నెహ్రూనగర్: ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన బార్ పాలసీపై కొంత మంది తమ స్వార్థంతో, ఇతరులు కొత్తవారు బార్ బిజినెస్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు చెడు ప్రచారం చేస్తున్నారని అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్ తెలియజేశారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 53 మంది, పల్నాడు జిల్లాలో 24 మంది బార్ లైసెన్సులు తీసుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15న కలెక్టరేట్లో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పాల్గొన్నారు. -
చేనేత రంగానికి రూ 1000 కోట్లు కేటాయించాలి
మంగళగిరి : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి రూ.1000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రత్నాలచెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనంలో చేనేత కార్మిక సంఘం 9వ పట్టణ మహాసభ జంజనం శివ భవన్నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాల వల్ల చేనేత పరిశ్రమ సంక్షేభంలో కూరుకుపోయిందన్నారు. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక మరో వృత్తిలోకి వెళ్లలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని, 20 శాతం రిబేట్ సంవత్సరం కొనసాగించాలన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేసి, పనిచేస్తున్న సంఘాలను ప్రోత్సహించాలని కోరారు. మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ నూతన అధ్యక్షుడుగా డోకుపర్తి రామారావు, ఉపాధ్యక్షుడిగా గోలి దుర్గాప్రసాద్, కార్యదర్శిగా సాదు నరసింహారావు, సహాయ కార్యదర్శిగా ఎం. శివచంద్రరావు, కమిటీ సభ్యులుగా జె. చంద్రమౌలి, కే కుమారి, కె.మల్లికార్జునరావు, జె. శివభావన్నారాయణ, వై. నాగు, జె. రవి, టి. హేమసుందరరావు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాలకృష్ణ -
జాబ్ క్యాలెండర్‌పై మాట మార్చిన కూటమి ప్రభుత్వం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన మంగళగిరి టౌన్: కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌పై మాట మార్చిందని, తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ మంగళగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వలి మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి న తరువాత వారిని పూర్తి మోసం చేస్తు న్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కల్పిస్తా మని హామీ ఇచ్చి నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా నేటికీ నిరుద్యోగ భృతిపై ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకు లు సామ్యేలు, ఫిరోజ్, గోపిరాజు, నరేంద్ర, జాలా ది నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే ప్రైవేటుకు వైద్య కళాశాలలు
చెరుకుపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వైద్య కళాశాలలను కమీషన్ల కోసమే పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ ఆరోపించారు. ఆదివారం గుళ్లపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు వైద్యవిద్య అందించాలనే తపనతో నాటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఒకేసారి మంజూరు చేయించి, యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. జగనన్న పాలనలోనే ఏడు కళాశాలలకు ఎంసీఐ అనుమతులు అభించగా, మిగిలిన పదింటికి అనుమతులు రాకుండా అడ్డుకున్నారని, ఇది దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించటం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద విద్యార్థులు రిజర్వేషన్ కోల్పోయి వైద్య విద్యకు దూరమై, తీవ్రంగా నష్టపోతారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క మెడికల్ కళాశాల కూడా మంజూరు చెయ్యలేదంటే ఆయనకు పేద విద్యార్థులపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమౌతుందని గణేష్ దుయ్యబట్టారు. నాడు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తాం అంటే సరస్వతీ దేవిని నడిరోడ్డుపై అమ్మకానికి పెడతారా అని టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నిలదీశారన్నారు. ఆయన ఆ మెడికల్ కళాశాలను ప్రభుత్వ పరం చేశారని డాక్టర్ గణేష్ గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు వైద్యవిద్యను ప్రభుత్వ పరం చేస్తే, దానికి పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రైవేటు పరం చేస్తూ ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను మానుకోవాలని, లేనిపక్షంలో వైద్య విద్యార్థులతో కలసి వైఎస్సార్ సీపీ అధినేత ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని డాక్టర్ గణేష్ హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ -
ప్రభుత్వానికి రైతుల సమస్యలపై శ్రద్ధలేదు
నరసరావుపేట: కూటమి ప్రభుత్వానికి మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయటంలో ఉన్న శ్రద్ధ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లేదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అప్రమత్తం చేసి కళ్లు తెరిపించే ఉద్దేశంతో పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10గంటలకు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతులు యూరియా కోసం రోడ్డుమీద పడి కాపు కాయాల్సి వస్తుందన్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియా అధిక ధరకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ నిద్రపోతున్నట్లుగా ఉందని, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా, లేడా అనే అనుమానం ప్రజల్లో తలెత్తుతుందన్నారు. అధికారులు యూరి యాకు కొరత లేదని పదే పదే ప్రకటనలు ఇస్తున్నారని, యూరియా ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. వాస్తవానికి దళారుల చేతుల్లో యూరియా ఉందని, ప్రభుత్వం, అధికారులు దళారులకు బానిసలు అయ్యారని పేర్కొన్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం, నాయకులైన బాగుపడ్డ చరిత్ర లేదని అన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతు సమస్యలను పరిష్కరించాలని కోరారు. శాంతియుత నిరసన ర్యాలీ అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వటం జరుగుతుందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు, రైతు సంఘ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 9న అన్నదాత పోరు జయప్రదం చేయండి వైఎస్సార్ సీపీ రైతు విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షులు పున్నారెడ్డి -
టీడీపీ నేత ఫరీద్ సలీం వైఎస్పార్ సీపీలో చేరిక
మేడికొండూరు: మండలంలోని తురకపాలెం గ్రామానికి చెందిన మొదటి వార్డు మెంబర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ ఫరీద్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ లో చేరారు. ఆదివారం పేరిచర్లలో జరిగిన కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఫరీద్ సలీం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడైనట్లు చెప్పారు. భవిష్యత్తులో గ్రామ ప్రజల అభివృద్ధి కోసం వైఎస్సార్ సీపీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు. వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం రోజు రోజుకీ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఫరీద్ లాంటి యువ నాయకులు చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు. -
శాసీ్త్రయ సమాజం కోసం పనిచేయాలి
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మంగళగిరిటౌన్: శాసీ్త్రయ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. నగర పరిధిలోని ఎస్ఎల్ఎం చైతన్య హై స్కూల్లో ఆదివారం జనవిజ్ఞాన వేదిక జిల్లా 18వ మహాసభలు నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను కూడా మార్చివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సినిమాల్లో మతానికి సంబంధించిన అంశాలను మాట్లాడడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 80 శాతం పైగా చదువుకుంటున్నారని, అలాంటి పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు పాలకులు చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఉత్తమ అవార్డు పొందిన ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా కేఎస్ లక్ష్మణరావు, టి.రత్నారావు, డాక్టర్ ఏఎస్వీఎన్ ప్రసాద్, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా ఉదయ భాస్కర్, ఉపాధ్యక్షులుగా డి.ప్రసాద్, రమేష్, స్వాతి, అహమ్మద్ హుస్సేన్, కోశాధికారిగా రామారావు, ప్రధాన కార్యదర్శిగా జాన్‌బాబు, కార్యదర్శులుగా రాము, ప్రసాద్, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, అనీల్‌కుమార్, గోకుల్ చంద్ ఎన్నికయ్యారు. -
వెల్లల చెరువు బాలికకు బంగారు పతకం
సంతమాగులూరు (అద్దంకి రూరల్): మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన ధనుకృతి ఇన్విటేషనల్ షాడోకాన్ కరాటే చాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఆదివారం జరిగిన అండర్ 11 కేటగిరీ కడా ఈవెంట్లో బంగారు పతకం సాధించినట్లు కోచ్ అఖిల్ తెలిపారు. పోటీల్లో తెలంగాణ నుంచి 350 మంది పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.రూ.1.40 లక్షలు పలికిన లడ్డూసంతమాగులూరు (అద్దంకి రూరల్): మండలంలోని ఏల్చూరు పాటిమీద ఏర్పాటు చేసిన వినాయక పందిరిలోని శివ లింగాకారంలో ఉన్న లడ్డూకు అధిక ధర పలికింది. తొమ్మిది రోజులు నిత్యం పూజలందుకుని ఆదివారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తోట ఆంజనేయస్వామి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఏల్చూరుకు చెందిన నారదాసు వెంకయ్య కుమారుడు శ్రీనివాసరావు రూ.1.40,000కు పాట పాడి, లడ్డూను దక్కించుకున్నారు.ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్‌కు ఆహ్వానంగుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవిని కలసి ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూర్, మధురై, చైన్నె, తంజావూర్, సేలం, తిరుత్తణి, కంచి, చిదంబరం ప్రాంతాల నుంచి తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. జనవరి 3వ తేదీన ఉదయం 10గంటలకు జ రిగే మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ట అతిథిగా పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సు ముఖత చూపారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. -
యూరియా.. ఇవ్వండయ్యా..!
కూటమి పాలనలో అన్నదాతలకు తప్పని కష్టాలు రైతులకు యూరియా వ్యథలు తీరడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు మొదలైన నాటి నుంచి ఏదో ఒక సమస్య అన్నదాతలను వెంటాడుతూనే ఉంది. సాగు ప్రారంభంలో సకాలంలో నీరు లేక పైర్లు ఎండిపోయాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పైర్లు మొత్తం దెబ్బతిన్నాయి. వర్షపు నీరు బయటకు పంపి ఉన్న పైర్లకు తోడు బయట ప్రాంతాల నుంచి సెంటు నారు రూ. 2 వేల నుంచి రూ.2,500 చొప్పున తెచ్చి నాటారు. ఇప్పుడు కూటమి పాలకుల దెబ్బకు యూరియా కూడా దొరకడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. బాపట్ల టౌన్: మండలంలోని మరుప్రోలువారిపాలెం ఎరువుల గోదాము వద్ద రైతులు ఆదివారం యూరియా కోసం ఆగ్రహంతో రగిలిపోయారు. యూరియా గోడౌన్‌కు చేరిందన్న విషయం తెలుసుకున్న ఆ ప్రాంత పరిధిలోని మరుప్రోలువారిపాలెం, మద్దిబోయినవారిపాలెం, ఇమ్మడిశెట్టివారిపాలెం, దేవినూతల, బసివిరెడ్డిపాలెం, హనుమాన్‌నగర్, అసోదివారిపాలెం, పోతురాజుకొత్తపాలెం గ్రామాల్లోని రైతులు ఆదివారం ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. అధికారులు ఉదయం 10 గంటల నుంచే పంపిణీ ప్రారంభించారు. రైతులు ఒక్కసారిగా రావడంతో అదుపు చేసేందుకు వ్యవసాయశాఖ సిబ్బంది కష్టపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు వచ్చి రైతులు కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ చేసినా అందరికీ ఇవ్వలేకపోయారు. మిగతా రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. సరిపడా రాని యూరియా మరుప్రోలువారిపాలెం రెవెన్యూ గ్రామం పరిధిలోని మరుప్రోలువారిపాలెం, బసివిరెడ్డిపాలెం, పోతురాజుకోత్తపాలెం, అసోదివారిపాలెం, దేవినూతల, మద్దిబోయినవారిపాలెం, ఇమ్మడిశెట్టివారిపాలెం, హనుమాన్‌నగర్, మచ్చావారిపాలెం, చింతావారిపాలెం, కొత్తమద్దిబోయినవారిపాలెం, బొర్రావారిపాలెం, పల్లిపాలెం తదితర గ్రామాల్లో కలిపి మొత్తం 3,200 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని రైతులు వెద పద్ధతిలో సాగు చేసి నెల దాటిపోయింది. ఇలా సాగు చేసిన 20 రోజులకే ఎకరాకు అర బస్తా, 40 రోజులకు మరో అర బస్తా చొప్పున యూరియా వేయాలి. ఒక్క మరుప్రోలువారిపాలెం రైతు సేవా కేంద్రం పరిధిలోని అన్నదాతలకే కనీసం 3 వేల బస్తాల యూరియా అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ముత్తాయపాలెంకు 230, మరుప్రోలువారిపాలెంకు 220 బస్తాల చొప్పున అందజేశారు. యూరియా బయట షాపుల్లో కూడా దొరక్కపోవడంతో రైతులు ఆదివారం ఆయా గ్రామాల నుంచి వందల సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా గోడౌన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ యూరియా సరిపడా అందకపోవడం, పంపిణీ కేంద్రాల వద్ద కనీసం తాగునీరు, నీడ కూడా కల్పించకపోవడంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారుల పరిశీలన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి పరిస్థితి చక్కబెట్టాలంటూ జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో పి. గ్లోరియా, జిల్లా ఇన్చార్జి వ్యవసాయశాఖాధికారి కె.అన్నపూర్ణమ్మ, తహసీల్దార్ షేక్ సలీమా, ఏడీఏ, ఏవో కె. శారదలు గ్రామానికి చేరుకున్నారు. మరో లోడు తెప్పించి ఇస్తామని రైతులకు నచ్చచెప్పారు. -
ప్రజా సమస్యల పరిష్కారంపై బాధ్యత వహించాలి
బాపట్ల: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పాల్గొన్నారు. ప్రజా సమస్యల వినతి పత్రాలను కలెక్టర్ స్వయంగా స్వీకరించి, కొన్నింటికి తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించి ప్రతి వినతిని నాణ్యతతో తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించిన వాటికి ఆడిటింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఆడిటింగ్ చేయుటలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వార్తాపత్రికలలో ప్రచురితమైన ప్రతికూల వార్తలపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఆయా వార్తలపై జిల్లా వివరణ ఇచ్చారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో భూములు, పొలాలు, ఇండ్ల స్థలాల రీ సర్వే జరుగుతుందని, స్వామిత్వ సర్వే కూడా జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందరూ ఈ సర్వేలో సహకరించి వారి ఆస్తులను కొలతలు వేయించుకొని ప్రాపర్టీ కార్డులు పొందాలని అన్నారు. ఎవరి ఆస్తులను వారే పరిరక్షించుకోవాలని ఆయన తెలిపారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై అవగాహన కల్పించాలి ఈనెల 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఆత్మహత్యలు ఎక్కువైనాయని, 15 నుంచి 30 సంవత్సరాలలోపు వారు ఎక్కువగా ఆత్మహత్యలకు గురవుతున్నారని, ఈ ఆత్మహత్యల నుంచి ప్రజలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
గుంటూరువెస్ట్: ఎన్నికల సమయంలో మైనార్టీలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాధారుణంగా మోసం చేసిన కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ తెలిపారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇమామ్‌లు, మౌజన్లకు ప్రతినెలా క్రమంతప్పకుండా రూ.5000, రూ.10 వేలు చెల్లించారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరచిపోయిందని పేర్కొన్నారు. దీంతోపాటు మసీదుల మరమ్మతులకు ఇస్తామన్న రూ.లక్ష కూడా ఇవ్వలేదని తెలిపారు. నెల వారీ వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సైదాఖాన్ -
బకాయిల విడుదలకు ఏపీటీఎఫ్ ‘నిరసన వారం’
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘నిరసన వారం’ ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఎదుట ఉన్న సంఘ జిల్లా శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 15నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పటం లేదని, 30శాతం ఐఆర్‌పై కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని తెలిపారు. అనవసరమైన యాప్స్ రద్దు చేయక పోగా పనిభారం పెంచే అస్సెస్మెంట్ బుక్లెట్స్ పెట్టడం పుండు మీద కారం చల్లినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ఉపసంహరిచుకోవాలని మొర పెట్టుకునేందుకు విద్యాశాఖా మంత్రి అందుబాటులో లేకపోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. 15 నెలలు వేచి చూశామని, అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులు రోజుకొక ఉద్యమ కార్యాచరణ నిరసన వారం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పి.లక్ష్మీనారాయణ, సత్యనారాయణమూర్తి, జి.దాస్, ముని నాయక్, షుకూర్, గురుమూర్తి, కృష్ణారావు, సుబ్బారావు, రాజ్ పాల్గొన్నారు. -
మానవత్వం చెత్తలో కలిసిన వేళ
బాపట్ల అర్బన్: ఎక్కడ పుట్టాడో తెలియదు ఎక్కడ పెరిగాడో తెలియదు. నా అన్న వాళ్లు ఎవరో తెలియదు. రైలు రూపంలో దూసుకొచ్చిన మృత్యువుకు బలయ్యాడు. రైలు పట్టాలపై మృత్యువాతపడిన అనాథ శవాల జాబితాలో తాను ఒక అంకెగా మారాడు. అలాంటి అనాథ మృతదేహానికి మానవత్వం అనే దహన సంస్కారం చేయాల్సిన మున్సిపల్ అధికారులు.. అమానవీయంగా వ్యవహరించారు. చాపలో చుట్టిన శరీరాన్ని చెత్తకుప్పగా మార్చాలని చూశారు. అనాథ మృతదేహానికి ఇదేనా అంతిమ సంస్కారం అని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. బాపట్ల రైల్వేస్టేషన్లో ఈనెల 3వ తేదీన అనాథ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఎవరు రాకపోవడంతో స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇప్పటివరకు ఎదురుచూసినా మృతదేహానికి సంబంధించిన బంధువులు ఎవరు రాకపోవడంతో సోమవారం అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోస్టుమార్టం పూర్తయ్యాక ఏరియా ఆసుపత్రి వైద్యులు మున్సిపల్ సిబ్బందికి మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు స్థానిక మునిసిపల్ సిబ్బంది చెత్తను తరలించే వాహనంలో ఎక్కించబోయారు. ఆ సమయంలో సాక్షి రిపోర్టర్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా వెంటనే అంబులెన్స్ పిలిపించారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించగా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించే బాధ్యత ప్రభుత్వాసుపత్రిదేనిని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రి వారిని ప్రశ్నించగా తాము పోస్టుమార్టం చేయడం వరకేనని మునిసిపల్ సిబ్బంది శ్మశానవాటికకు తీసుకెళతారని తెలియజేశారు. అనాథ మృతదేహానికి అంతిమయాత్ర నిర్వహించాల్సిన అధికారులే ఒకరిపై ఒకరు చెప్పుకోవడం చెత్త ట్రాక్టర్లో తరలించేందుకు ప్రయత్నించడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ట్రాక్టర్లో తీసుకు వెళ్లేందుకు యత్నం -
రాష్ట్రస్థాయి పోటీల్లో జె.పంగులూరు విద్యార్థుల ప్రతిభ
బాపట్ల: జాతీయ సోర్డ్స్డే సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జె.పంగులూరు విద్యార్థులకు బంగారు పతకాలు రావటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. క్రీడాకారులను సోమవారం స్థానిక కలెక్టరేట్లో అభినందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జె.పంగులూరుకు చెందిన సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఖోఖోతోపాటు పలు క్రీడాల్లో విద్యార్థులకు బంగారు పతకాలు కై వసం చేసుకోవటం హర్షనీయమన్నారు. విద్యార్థులు మరెన్నో పతకాలు సాధించాలని సూచించారు. ఖోఖోలో గోల్డ్ మెడల్, మరో విభాగం వెయిట్ లిఫ్టింగ్ పురుషుల భాగంలో గోల్డ్, సిల్వర్ కై వసం చేసుకున్నారు. అథ్లెటిక్స్ లాంగ్ జంప్‌లో రెండో స్థానం సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నారు. జోనల్ విభాగంలో బాక్సింగ్ విభాగంలో మూడు గోల్డ్, బాలుర విభాగంలో ఒక గోల్డ్ సాధించి బాపట్ల జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు. -
భర్త వేధింపుల నుంచి రక్షించండి !
గుంటూరు: వారసత్వంగా రానున్న పొలం కాగితాలు రాయించుకుని తేవాలంటూ భర్త, బావ అయిన ఈనాడు విలేకరి (గుంటూరు జిల్లా ప్రత్తిపాడు)తో పాటు అత్త, మామల నుంచి రక్షణ కల్పించాలని ఓ మహిళ, తన కుమార్తెతో కలసి ప్రాథేయపడింది. నాలుగు రోజులుగా కనిపించకుండా బంధువుల ఇళ్లల్లో ఉంటున్నట్లు సోమవారం జిల్లా పోలీస్ కార్యాల య (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా ఫిర్యాదులు– పరిష్కార వేదికలో మొరపెట్టుకుంది. అనంతరం బాధితురాలైన కల్లూరి నాగేశ్వరి మీడియాతో మాట్లా డారు. 2009లో ప్రత్తిపాడుకి చెందిన కల్లూరి గురునాథంతో పెళ్లి అయ్యింది. ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దమ్మాయి ఇంటర్, రెండో కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. భర్త, నేను పొలం పనులకు వెళ్తాం. భర్తకు మద్యం అలవాటు ఉంది. నాగేశ్వరి అమ్మమ్మ చెవినేని ఈశ్వరమ్మ నుంచి తల్లి ఆదిలక్ష్మి వాటా కింద రావాల్సి న 70 సెంట్ల పొలం ప్రత్తిపాడులో ఉంది. ప్రస్తుతం దాని ధర రూ.20 లక్షలు ఉంది. అమ్మమ్మ ఈశ్వరమ్మ వద్దకెళ్లి 70 సెంట్ల పొలం రాయించుకుని కాగితాలు తేవాలంటూ భర్త, బావ అయిన ఈనాడు ప్రత్తిపాడు విలేకరి సురేష్, అత్త,మామలు బెదిరిస్తున్నారు. అమ్మమ్మ నుంచి కాగితాలు తీసుకురాకపోతే చంపుతామంటూ చితకబాదడం, గదిలో నిర్బంధిస్తున్నారు. ఈనెల ఐదున నన్ను కొట్టి, తెల్ల కాగితాలు, రూ.50 స్టాంప్ కాగితాలపై సంతకాలు పెట్టించాలని ప్రయత్నించగా అందుకు నిరాకరించాను. గతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, అతని పలుకబడితో కేసు నమోదు చేయలేదు. అదిగాక ఎమ్మెల్యే రామాంజనేయులు, రాజకీయ నాయకులు, పోలీసులు తెలుసంటూ బెదిరిస్తున్నారు. -
జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికలు
రొంపిచర్ల:స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ సోమవారం జరిగాయి. ఈ సెలక్షన్స్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గల వివిధ పాఠశాలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ పోటీ ల్లో ప్రతిభ కనబరిచిన 32మంది క్రీడాకారులను ఉమ్మడి గుంటూరు జిల్లా టీంకు ఎంపికచేశారు. వారిలో బాలుర నుంచి 16 మంది, బాలికల నుంచి 16మందిని ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో వైజాగ్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీసీ కమిటీ చైర్మన్ ఏడుకొండలు తెలిపారు. క్రీడాకారులను విశ్రాంత హెచ్ఎం ఎన్.రామకష్ణారెడ్డి, హెచ్ఎం బీఎం సుభాని అభినందించారు. ఎంపికై న బాలికల టీంతో వ్యాయామ ఉపాధ్యాయులు బాలుర టీంతో వ్యాయామ ఉపాధ్యాయులు -
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చీరాల అర్బన్: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చీరాల మండలం ఈపూరుపాలెం ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇందిరానగర్‌కు చెందిన శ్రీకౌసల్య (23) రెండేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి వెనుక కాలువలోని చిల్లచెట్లకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరుడు పల్లా లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ తెలిపారు. వృద్ధ మహిళను ఇంటి నుంచి గెంటేశారు నగరంపాలెం: ఇంట్లోంచి బయటకు పంపించడంతో ఓ వృద్ధురాలు ఆరుబయట చీకట్లోనే ఉండిపోయింది. ఆర్టీసీ కాలనీ వెంకట్రావుపేట రెండో వీధిలోని ఓ ఇంట్లో 62 ఏళ్ల సంగీత సుధ ఉంటోంది. పైన ఆమెకు తెలిసిన కుటుంబ సభ్యులు ఉంటున్నారు. సోమవారం రాత్రి ఆస్తి విషయంపై సుధతో వారు గొడవకు దిగారు. ఇంట్లోంచి బలవంతంగా ఆమెను బయటకు పంపేశారు. లోపలకు రాకుండా గేటుకు లోపల తాళాలు వేశారు. దీంతో చేసేది లేక సుధ ఇంటి ఎదుట ఓ కుర్చీలో కూర్చుండి పోయింది. ఇంటి ఆస్తికి సంబంధించి గొడవ కోర్టులో ఉందని, ఆస్తితో సంబంధం లేని వారు ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయింది. స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయినట్లు తెలిపింది. కొత్తరెడ్డిపాలెంలో విష జ్వరాలు చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో పది రోజుల్లో ఇద్దరు విష జ్వరాలతో మరణించటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రామాలయం సెంటర్ పరిధిలో కొద్ది రోజుల కిందట బడే రాము అనే వ్యక్తి విష జ్వరంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ కిడ్నీ, ఇతర సమస్యలతో మృతి చెందాడు. ఇదే ప్రాంతంలో గత నెలలో మరో వ్యక్తి జ్వరం బారిన పడి మృతి చెందటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో ఒకరికి గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మృతి చెందుతున్న వారి లక్షణాలు ఉన్నట్లు ప్రైవేటు వైద్యులు నివేదిక ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కొత్తరెడ్డిపాలెం సమీప ప్రాంతాల్లో జ్వర పీడితులు సంఖ్య అధికంగా ఉండటంతో పీహెచ్సీ వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మంగళవారం గ్రామంలో రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా సేవలు అందించనున్నట్లు చెప్పారు. -
రేపు నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం
తెనాలి: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సం ఈనెల 10న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు ఏర్పాటయే ప్రత్యేక సభకు సంస్థ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగ కార్యదర్శి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో చైన్నెలోని సీఎల్ఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వి.కాంత్, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొంటారు. తెనాలి ముద్దుబిడ్డ తెనాలికి చెందిన విలక్షణ మహనీయుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ ఒకరు. విదేశాల్లో ఉన్నతవిద్య చదువుకుని, అక్కడే ఉద్యోగావకాశం లభించినా, కాదనుకుని మాతృదేశం వచ్చారు. చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్ఆర్ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. తన కృషితో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తోలు పరిశ్రమ రంగంలో సాధించిన విజయాలతో 48 జాతీయ పరిశోధనాశాలలు, 30 వేల శాస్త్రవేత్తలు కలిగిన సీఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్‌గా చేశారు. శాస్త్ర విజ్ఞాన అధ్యయనాలు, పరిశోధనలపై ఎంతో నిబద్ధత కలిగిన డాక్టర్ నాయుడమ్మ, దేశమంతా శాసీ్త్రయ అభినివేశం లోతుగా విస్తరించాలని తపించారు. హేతుబద్ధ చింతన, శాసీ్త్రయ వివేచనా, నిరంతరం అధ్యయనం, నిత్య పరిశోధన ఆయన జీవ ధాతువులు. సామాజిక విషయాల్లోనూ శాసీ్త్రయ అభినివేశాన్ని ప్రదర్శించటం నాయుడమ్మ ఆశయం. మూఢ విశ్వాసాల్నీ ముహూర్త బలాల్నీ వీడి, మనిషి చైతన్యం, వ్యక్తిత్వం వికసించే మానవీయ సమత వైపు అడుగిడటం ఆయన కర్పించే నిజమైన నివాళి. అలాగే ఆయన పేరిట అవార్డులకూ శాస్త్రవేత్తలనే ఎంపిక చేస్తే సబబుగా ఉంటుంది. -
కృష్ణా నదిలో దూకి యువకుడు గల్లంతు
కొల్లూరు: కృష్ణా నదిలో దూకి ఓ యువకుడు గల్లంతైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని చింతర్లంకకు చెందిన తోడేటి హర్షవర్ధన్(22) తోటి మిత్రులతో కలసి రాత్రి సమయంలో మండలంలోని పెసర్లంక –పెదలంక అరవింద వారధి పైకి వచ్చాడు. కొంత సమయం గడిచిన అనంతరం ఓ మిత్రుడు ద్విచక్ర వాహనంపై కొల్లూరు వెళ్లాడు. అదే సమయంలో హర్షవర్ధన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన అతని వెంట ఉన్న మరో స్నేహితుడు నదిలో దూకబోతున్న హర్షవర్ధన్‌ను నిలువరించేందుకు ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుంటున్న స్నేహితుడి నుంచి విడిపించుకున్న యువకుడు వారధి రైయిలింగ్ పైకి ఎక్కి నదిలో దూకేశాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించి రాత్రి సమయంలో టార్చ్ లైట్లతో వెదికినప్పటికీ యువకుడి ఆచూకీ లభించలేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి గాజుల్లంకకు చెందిన మత్స్యకారులు నదిలో గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. నదిలో నీటిమట్టం పెరగడంతోపాటు, యువకుడు దూకిన ప్రదేశంలో సుడి గుండాలు ఉండడంతో గాలింపు ప్రయత్నాలను విరమించుకున్నారు. యువకుడు ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకున్న తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు పోలీసులు ఎస్డీఆర్ఎప్ బృందం కోసం ఉన్నతాధికారులకు నివేదించినప్పటికీ ఉన్నతాధికారుల అనుమతులలో జాప్యం కారణంగా సోమవారం రాత్రి వరకు వారు అందుబాటులోకి రాలేదు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లైప్ బోట్ సాయంతో యువకుడి ఆచూకీ కోసం వారధి పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు జరిపినా ఎటువంటి ప్రయోజనం లభించలేదు. యువకుడు ఆత్మహత్యాయత్నంపై గ్రామంలో భిన్న కథనాలు వెలువడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దర్యాప్తులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి కారణాలు వెలువడనున్నట్లు పోలీసులు వెల్లడించారు. యువకుడు గల్లంతుపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని కొల్లూరు పోలీసులు తెలిపారు. -
అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి
బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 52 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మొయిన్, పీజీఆర్ఎస్ సెల్ అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ తుషార్‌డూడీ -
వేధింపులపై ఐసీసీలో ఫిర్యాదు చేయండి
యడ్లపాడు: మహిళలపై జరిగే వేధింపుల నిర్మూలనకు ఐసీసీ(ఇంటర్నల్ కంప్లైట్స్ కమిటీ) ఏర్పాటు చేసినట్లు డీవీసీ(గృహహింస కేసుల) సోషల్ కౌన్సిలర్ ఎం.సంగీత తెలిపారు. మండలంలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ మిల్లులో సోమవారం మిషన్ సంకల్ప కార్యక్రమంలో భాగంగా బాలలు, మహిళలకు చట్టాలకు సంబంధించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ నాదెండ్ల ప్రాజెక్టు సీడీపీఓ జి.శాంతకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై జరిగే లైంగిక దాడుల నివారణ కోసం ఐసీసీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే గృహహింస నిరోధక చట్టంపై మహిళలకు వివరించారు. ఓఎస్సీ(ఒన్ స్టాప్ సెంటర్) లీగల్ కౌన్సెలర్ కె.వాణిశ్రీ మాట్లాడుతూ మహిళా సంరక్షణ, ఉచిత న్యాయాన్ని అందించేందుకు 2006లో వచ్చి గృహహింస చట్టంపై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో వన్‌స్టాప్ సెంటర్ ద్వారా గృహహింసకు సంబంధించిన కేసుల్లో నేరుగా పోలీస్స్టేషన్లకు వెళ్లకుండా ముందస్తుగా ఓఎస్సీలో మహిళలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఐదురోజులు వైద్యం, భోజన, వసతి కల్పించి వారికి కుటుంబ సభ్యులను కలిసి బాధిత మహిళకు న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. అక్కడ కూడా న్యాయం లభించకుంటే ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కోర్టుద్వారా న్యాయం పొందవచ్చన్నారు. సీడీపీఓ జి.శాంతకుమారి మాట్లాడుతూ బాల్యవివాహాలు, గర్భిణులు – బాలింతలు, పిల్లల ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఆర్.సామ్రాజ్యం, కె.వెంకటరమణ, మహిళా పోలీస్ నిర్మల, వలస కూలీలు, మహిళా కార్మికులు, అంగన్వాడీ తల్లులు పాల్గొన్నారు. -
చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన
లక్ష్మీపురం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద చెవిలో పూలు పెట్టుకుని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నడపడం వల్ల మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్‌కు దూరమవుతారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 14 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని, వాటిలోరాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో భాగంగా ప్రతి మెడికల్ కళాశాలను 100శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి ఈరోజు కళాశాలలను కార్పొరేట్లకు అప్పజెబుతున్నారని ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫణీంద్ర మాట్లాడుతూ ఈ విధానం వల్ల పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కలగానే మిగిలిపోతుందని తెలిపారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో మోసాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళ్లి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు . కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండు శివ, బందారపు యశ్వంత్, నగర కార్యదర్శి ప్రణీత్, నాయకులు అజయ్, దుర్గా ప్రసాద్, సాయి గణేష్, పవన్, వెంకీ పాల్గొన్నారు. -
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
మార్టూరు: అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులను ఎవరైనా వేటాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని కూకట్లపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ బాబు హెచ్చరించారు. మండలంలోని బబ్బేపల్లి, రాజుగారి పాలెం గ్రామాల పరిధిలోని స్థానికులతో ఆయన శనివారం మాట్లాడారు. ఈ రెండు గ్రామాల పరిధిలో వ్యాపించి ఉన్న కొండ అటవీ శాఖ ఆధీనంలో ఉన్నందున భూభాగంలో సంచరించే వన్య ప్రాణులను అభివృద్ధి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రామాల మధ్య అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీ ప్రారంభించామని అందులో టేకు, వేప, జామ, మద్ది, వెదురు తదితర 15 రకాల మొక్కలను ఈ సంవత్సరం పెంచుతున్నామని త్వరలో రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మొక్కలను కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటడం ద్వారా అడవిని అభివృద్ధి చేసి పర్యావరణానికి తోడ్పడడంతో పాటు వన్యప్రాణులను అభివృద్ధి చేయటం తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. అటవీ భూభాగంలో అడవి పందులను, కుందేళ్ళను, లేళ్ళు, జింకలు, ఇతర పక్షులను వేటాడటం నిషేధమని నిబంధనలు అతిక్రమించిన వారిపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కొండ భూభాగం గతంలో రెవెన్యూ పరిధిలో ఉన్నదన్న అపోహతో కొందరు ఇష్టా రాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహించారని ప్రస్తుతం అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఈ భూమిలో అలాంటి అరాచక చర్యలు పూర్తిగా నిషేధమని తెలిపారు. అటవీ భూమిని ఎవరైనా ఆక్రమించినా, నకిలీ పట్టాలు, ధ్రువపత్రాలు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన రెండు గ్రామాల పరిధిలోని వన్యప్రాణులను వేటాడే సంచార తెగలకు చెందిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. -
తురకపాలెం గ్రామస్తులను ఆదుకోవాలి
చీరాల రూరల్ : గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబూరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం తన హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తురకపాలెం గ్రామ సమీపంలో అనేకమంది భూమిలోకి వందల అడుగుల లోతులో బోర్లు దించి మంచినీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. అక్రమార్కుల చర్యలతో సమీపంలో నివాసముంటన్న తురకపాలెం గ్రామస్తులకు తమ ఇంటి బోర్లలో నీళ్లురాక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయితే వారంతా మంచినీటికి అలమటించి కుంటల్లోని కలుషితమైన నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా నెలల వ్యవధిలోనే 48 మంది ఎస్సీ కాలనీ వాసులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మంచి నీటిని అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కాలనీ వాసులకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని, వ్యాధుల బారినపడి మృతి చెందిన వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబూరావు -
నూటా నూతన కార్యవర్గం ఎన్నిక
పెదకాకాని (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (నూటా) నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఆచార్య పండు బ్రహ్మాజీరావు, ఆచార్య ఎం.త్రిమూర్తిరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఉత్తర్వులను ఎలక్షన్ అధికారి ఆచార్య ఎస్.మురళీమోహన్ శనివారం విడుదల చేశారు. పర్యావరణ విభాగానికి చెందిన ఆచార్య పండు బ్రహ్మాజీరావు అధ్యక్షుడిగా, సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగానికి చెందిన ఆచార్య ఎం.త్రిమూర్తి రావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఆచార్య ఎం.సుబ్బారావు, సహాయ కార్యదర్శిగా ఆచార్య డి.రామచంద్రన్, కోశాధికారిగా ఫిజిక్స్ విభాగానికి చెందిన ఆచార్య చేబ్రోలు లింగరాజు ఎన్నికయ్యారు. సైన్స్ రిప్రజెంటేటివ్‌గా టెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్ బి.సుధాకర్, కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన డాక్టర్ కె.లావణ్య, ఆర్ట్స్ రిప్రజెంటేటివ్‌గా సోషియాలజీ విభాగానికి చెందిన ఆచార్య వై.అశోక్ కుమార్, మానవ వనరుల విభాగానికి చెందిన ఆచార్య వి.తులసీదాస్‌లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
బాపట్ల టౌన్ : పోలీస్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందగా...మరో ముగ్గురికి గాయాలైన ఘటన పట్టణ శివారులోని హెరిటేజ్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా ఏఆర్ విభాగంలోని పోలీస్ వ్యాన్ డ్రైవర్ మనోజ్ అవుట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ వ్యాన్‌ను సర్వీసింగ్ నిమిత్తం బాపట్ల నుంచి గుంటూరు తీసుకెళ్తున్నాడు. ఫుల్లుగా మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పట్టణంలోని మూర్తి రక్షణ నగర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కె. తనూష్సాయి, లికిత్బాబు, సందీప్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో వీరి ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు కేకలు వేయడంతో వాహనాన్ని మరింత వేగంగా నడుపుతూ పొన్నూరు నుంచి బాపట్ల వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పొన్నూరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, 6వ లైనుకు చెందిన కన్నటి మురళి, అతని భార్య లక్ష్మీతిరుపతమ్మగా గుర్తించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన శబరీ ఎక్స్‌ప్రెస్
బాపట్ల: సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో బాపట్లలో అర గంటకు పైగా నిలిచిపోయింది. బాపట్ల స్టేషన్లో రైలు నిలిచిపోవటంతో ప్రయాణికులు కొద్దిసేపు కంగారుపడ్డారు. ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేసి అరగంట ఆలస్యంగా నడిపారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): సుమారు 120 రోజుల నిర్బంధం, జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, గ్రూప్–1 అధికారి కృష్ణమోహన్‌రెడ్డి, ప్రముఖ సీఏ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్మార్గమైన కేసు ఇదని అన్నారు. లిక్కర్లో అసలు స్కాం చేసే అవకాశం లేకపోయినా కావాలని క్రియేట్ చేశారని ఆరోపించారు. సిట్ అధికారులు రాజకీయ కక్ష తీర్చేందుకు పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో చాలా విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. వైఎస్ జగన్‌పై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. వేధింపులకు గురిచేసిన టీడీపీ ప్రభుత్వం.. తర్వాత బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
చైల్డ్ కేర్ లీవ్‌లను అమలు చేయాలి
బాపట్ల అర్బన్: మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన చైల్డ్ కేర్ లీవులను అమలు చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ సురేష్‌బాబు కోరారు. మహిళా విభాగం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో జేసీ గంగాధర్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ సురేష్‌బాబు మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం కేటాయించిన సెలవులను అమలు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలను ఇవ్వడంతో పాటు పీఆర్సీను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా విభాగం నాయకులు కె.రజని, హాజర బేగం పాల్గొన్నారు. -
యూరియా కోసం అగచాట్లు
కొల్లూరు: రాష్ట్రంలో యూరియాకు కొరత లేదు..రైతులు అధైర్య పడవద్దంటూ ప్రభుత్వం చెబుతున్నా మరోపక్క యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. శనివారం మండలంలోని ఆవులవారిపాలెంలో ఉన్న గాజుల్లంక పీఏసీఎస్‌కు 19.80 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. యూరియాను దక్కించుకునేందుకు రైతులు ఎగబడ్డారు. పీఏసీఎస్‌కు యూరియా వచ్చిన ప్రతిసారీ వచ్చి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడమే మినహా తమ వంతు వచ్చే సరికి యూరియా దక్కడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి రైతులకు ఇవ్వాల్చిన యూరియాను చాటుమాటుగా నాయకులకు, వారు సిఫార్సు చేసిన వారికి తరలించడం ఎంతవరకు సబబు అని వ్యవసాయశాఖ ఏఓ నరేంద్రబాబు, పీఏసీఎస్ సిబ్బందిని నిలదీశారు. చివరకు వ్యవసాయ శాఖాధికారులు, పీఏసీఎస్ సిబ్బంది పోలీసు సిబ్బంది సాయం కోరి అన్నదాతలను కట్టడి చేయించారు. అమర్తలూరు(వేమూరు): అమర్తలూరు మండలం మోపర్రు గ్రామంలోని రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. నాట్లు వేసి నెల రోజులు గడిచింది, యూరియా లేకపోవడంతో వరి పైరు పెరుగుదల నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద రైతులు ఇళ్లలో వందల బస్తాలు యూరియా నిల్వ చేసుకోవడం వల్ల కొరత ఏర్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం రైతులు, కౌలు రైతులకు యూరియా సకాలంగా అందించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం వల్ల ఈ సమస్య ఏర్పడిదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకొని అందరికి యూరియా అందించాలని రైతులు కోరారు. అదనపు వసూళ్లు యూరియా ప్రభుత్వ నిర్ణీత ధర రూ.266.50 కాగా గాజుల్లంక పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ సమయంలో రైతుల నుంచి అదనంగా రూ.33.50 వసూలు చేశారు. దీనిపై పలువురు రైతులు, కౌలు రైతు సంఘం నాయకులు అధికారులను నిలదీశారు. -
అనుయాయులకు కట్టబెట్టేందుకే మెడికల్ ప్రైవేటు పరం
బాపట్ల: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను చంద్రబాబునాయుడు తన అనుయాయులకు కట్టబెట్టేందుకే పీపీపీ విధానానికి కేబినెట్లో అనుమతి తీసుకున్నారని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. దాతల సహకారంతో సేకరించిన స్థలంలో ఇప్పటికే రూ.82 కోట్లు ఖర్చు పెట్టిన బాపట్ల మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో కేటాయిస్తామంటే చూస్తూ ఊరుకునేదిలేదని, అవసరమైతే అందరిన్ని కూడగట్టుకుని పార్టీలకతీతంతంగా న్యాయపోరాటానికై నా సిద్ధమని అన్నారు. తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కోన మాట్లాడారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మొదటి నుంచి విద్య, వైద్యాన్ని పేదవాడికి అందకుండా చేయాలనే కుట్రతోనే ముందుకుపోతుందని అన్నారు. 40 సంవత్సరాలు ఇండ్రస్టీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు 17 కళాశాలలను ప్రభుత్వ నిర్వహణలో నిర్వహించలేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేందుకు నిర్ణయం తీసుకోవటం బాధాకరమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని మొదటి నుంచి చెప్పటమే కాకుండా చేసి చూపించారని పేర్కొన్నారు. 17 మెడికల్ కళాశాలకు రూ.8వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉండటంతోపాటు 4,5 కళాశాల్లో ఈపాటికే అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. పేదవాడికి నేరుగా వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. మెడికల్ కళాశాలల విషయంలో 16నెలలపాటు మౌనంగా ఉన్న చంద్రబాబునాయుడు ఒక్కసారిగా పీపీపీ విధానంతో ముందుకు రావటం చూస్తుంటే ఈ 16 నెలలు తనకు సంబంధించిన వ్యక్తులు, వారితో బేరాలు కుదుర్చుకునేందుకే కాలయాపన చేశారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, మచ్చా శ్రీనివాసరెడ్డి, తన్నీరు అంకమ్మరావు, జోగి రాజా, అడే చందు, ఎన్.శ్రీహరిప్రసాద్, పెద్దపులుగువారిపాలెం శ్రీనివాసరావు, నక్కా వీరారెడ్డి, రెడ్డా రెంకయ్య, అడ్వకేట్ రవి తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ ఫెస్టివల్‌కు అందరు సహకరించాలి
బాపట్ల: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంక బీచ్‌లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో శనివారం రియల్ ఎస్టేట్, బంగారు నగల వ్యాపారులు, బీచ్ రిసార్ట్ యాజమాన్యం, రైస్ మిల్లర్స్, పెట్రోల్ బంక్, ఎరువులు, విత్తనాల వ్యాపార సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26, 27, 28 తేదీలలో సూర్యలంక, రామాపురం బీచ్‌లలో ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఫెస్టివల్‌కు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమాలు తిలకించే విధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సూర్యలంక బీచ్‌లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు ఆర్థిక సహాయం అందజేయాలని కలెక్టర్ సంస్థల సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మరాజు, ఎం.ఎం.కొండయ్య, ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీఎస్ఓ అమిర్ బాషా, బాపట్ల, చీరాల ఆర్డీఓలు గ్లోరియా చంద్రశేఖర్, బాపట్ల, చీరాల మున్సిపల్ కమిషనర్లు రఘునాథరెడ్డి, అబ్దుల్ రషీద్, బాపట్ల, చీరాల మండలాల తహసీల్దార్లు సలీమా, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. భూమి సామర్ధ్యం మేరకు యూరియా వాడాలి సాగు భూమి సామర్థ్యం మేరకు రైతులకు సూచించిన మోతాదులోనే యూరియా వాడాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. యూరియా వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గతేడాది జిల్లాలో 88 వేల హెక్టార్లలో వరి సాగు చేయగా, ప్రస్తుతం 90 వేల హెక్టార్లకు సాగు పెరిగిందన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో 2.24 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు ప్రారంభించినట్లు తెలిపారు. పంటల సాగును దృష్టిలో ఉంచుకుని 20వేల టన్నుల యూరియా అవసరం అని అంచనా వేశామన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు 21,609 టన్నుల యూరియా జిల్లాకు విడుదల అయిందన్నారు. వాటిని అన్ని గ్రామాలలోని రైతులకు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధీనంలో 230 టన్నుల యూరియా, డీసీఎంఎస్ వద్ద 500 టన్నులు, సహకార శాఖ వారి వద్ద 530 టన్నులు అందుబాటులో ఉందన్నారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులోనే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ చెప్పారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే యూరియా వాడాలన్నారు. అధిక మోతాదులో వేస్తే కలిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్‌గౌడ్, వ్యవసాయశాఖ అధికారి అన్నపూర్ణ, డీసీఓ శ్యాంసన్, మార్క్‌ఫెడ్ జీఎం కరుణశ్రీ, వ్యవసాయ శాఖ ఏడీలు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
చీరాల వాసికి అరుదైన అవకాశం
చీరాలటౌన్: దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 12 వరకు జరగనున్న ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంపునకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్లకు ఏఎన్‌ఓ మేడికొండ రాజేష్‌బాబు నాయకత్వం వహించనున్నారు. ఈయన చీరాల వాసి కావడంతో ఎన్సీసీ క్యాడెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23 ఆంధ్రా బెటాలియన్‌కు చెందిన అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న లెఫ్టినెంట్ మేడికొండ రాజేష్‌బాబు చీరాల ప్రసాద్‌నగర్ నివాసి. ఎంబీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోపాటు ఏఎన్వోగా నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న రాజేష్‌బాబు ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంపులో ఏపీ, టీజీ రాష్ట్రాల డైరెక్టరేట్ల తరఫున కాంటిజెంట్ కమాండర్‌గా ఎంపిక చేశారు. చీరాల వీఆర్ఎస్ అండ్వైఆర్ఎన్ కళాశాలలో ఎన్సీసీలో శిక్షణ పొంది పలు క్యాంపుల్లో పాల్గొనడంతోపాటు ఎన్సీసీ అధికారిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈనెల 12 వరకు న్యూ ఢిల్లీలో జరిగే ఏఐటీయూసీ క్యాంపునకు దేశంలోని 17 డైరెక్టరేట్లు పాల్గొననున్నాయి. జాతీయ వేదికపై రెండు రాష్ట్రాలకు కాంటిజెంట్ కమాండర్‌గా ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్సీసీ క్యాంపునకు నేతృత్వం వహించనున్న రాజేష్‌బాబు -
వైభవంగా నవ వినాయకుల నిమజ్జనం
అమరావతి: గుంటూరు, పల్నాడు జిల్లాల సత్యసాయి సేవా సమితుల ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన తొమ్మిది వినాయక విగ్రహాలను శనివారం ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో వైభవంగా నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజులుగా గణపతి నవరాత్రోత్సవాలను తొమ్మిది చోట్ల నిర్వహించుకుని అమరావతి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఇలా ప్రతి ఏటా నిర్వహిస్తామని అమరావతి సత్యసాయి సేవా సమితి కో–ఆర్డినేటర్ సీహెచ్ జాజిబాబు తెలిపా రు. గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాంగణంలోని సత్యసాయి శాంతిసుధ , గుంటూరు బైపాస్ రోడ్డులోని ఆధ్యాత్మిక సామ్రాజ్యం నుంచి దుగ్గిరాల, తెనాలి, మోదుకూరు, పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, అచ్చంపేట, అమరావతి సాయిబాబా మందిరంలో, త్రిశక్తిపీఠంలో తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న తొమ్మిది ప్రాంతాలలోని తొమ్మిది విగ్రహాలను తొలుత వైభవంగా ఊరేగించి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. -
దర్జాగా ప్రైవేట్ దందా !
పట్నంబజారు: ఆర్టీసీ బస్టాండ్ వెలుపల రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. నడి రోడ్డుపైనే బస్సుల్ని నిలిపి, ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఆర్టీఏ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా 100పైగా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్, చైన్నె, తిరుపతితో అనేక దూర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. ఈ సమయంలో నిబంధనలు పాటించాల్సిన బస్సు యజమానులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో రెండు కిలోమీటర్ల లోపు ఎటువంటి బస్సులు నిలపకూడదని మోటార్ వెహికల్ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. అయితే, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్టీఏ అధికారులపై ఉంది. తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత, ఫోర్స్‌ను రంగంలోకి దించి చర్యలు తీసుకోవాల్సిన కనీస విషయాన్ని వారు మరిచిపోయారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఒక రోజు విధుల్లో ఉంటే.. నాలుగు రోజులు సెలవులో ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం పట్టించుకుంటారని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది బాహటంగానే విమర్శిస్తున్నారు. పలుమార్లు విన్నవించినప్పటికీ కనీసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), సిబ్బందిని కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిలుపుదలపై ప్రత్యేక దృషి సారించి చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపడతాం. సిబ్బందిని ఏర్పాటు చేసి బస్సులు నిలువకుండా యాక్షన్ తీసుకుంటాం. –ఎ. అశోక్, సీఐ, ఈస్ట్ ట్రాఫిక్ -
పట్టు కోల్పోతున్న చేనేత
వేటపాలెం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేత కేంద్రాలైన చీరాల, జాండ్రపేట, వేటపాలెం, రేపల్మె, భట్టిప్రోలు, కనిగిరి, బేస్తవారిపేట, ఈతముక్కల, వలపర్ల తదితర ప్రాంతాల్లో 10 వేల వరకు చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికిపైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన చేనేత మగ్గాలకు పవర్‌లూమ్స్ శాపంగా మారాయి. చేనేత కార్మికుడు మగ్గంపై 5 లేదా 7 రోజులపాటు ఒక చీర బారు నేస్తే పవర్‌లూమ్స్‌లో రోజుకు రెండు చీరల బార్ తయారవుతున్నాయి. చేనేత మగ్గంలో తయారైన చీర కన్నా మరమగ్గంపై తయారైన పట్టు చీరను 30 నుంచి 40 శాతం తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో చేనేత మగ్గాల వైపు వ్యాపారులు కన్నెత్తి కూడా చూడటం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి.. కర్ణాటక, బెంగళూరు, చైన్నెతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పవర్‌లూమ్స్‌లో తయారు చేసిన పట్టు చీరలను తక్కువ ధరలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పవర్‌లూమ్స్‌లో చేనేత రిజర్వేషన్ చట్టం ప్రకారం వందశాతం పట్టు దారంతో, డిజైన్లను తయారు చేయకూడదు. పవర్ లూమ్స్‌లో తయారయ్యే పట్టు చీరలలో 52 శాతానికి మించి జరీ వాడకూడదు. బార్డర్, పల్లూ డిజైన్లు చేనేత మగ్గంలో తయారయ్యే వాటిని వాడకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 11 రకాల డిజైన్లను మరమగ్గాలలో తయారు చేయకూడదన్న నిబంధనలతో ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. ఈ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పట్టు చీరలు తయారు చేసి చేనేతలను దెబ్బతీస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు 11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాల్సిన హాండ్లూమ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పర్యవేక్షణ కరువైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్ చట్టానికి తూట్లు పొడుస్తూ మరమగ్గాలలో పట్టుచీరల తయారీకి అడ్డు చెప్పకుండా ఉండాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాస్టర్ వీవర్ ప్రతి నెలా మామూలు ఇవ్వాలని షరతుల పెట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అరకొరగా ఉన్న మరమగ్గాలు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. మూత పడుతున్న చేనేత మగ్గాలు.. మరమగ్గాల దెబ్బకు చేనేత మగ్గాలు నష్టాలను చవిచూస్తుండటంతో క్రమంగా మూతపడునత్నాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.24 వేలు సాయం అందించేది. కూటమి ప్రభుత్వం నేతన్న నేస్తం పథకానికి తొలి ఏడాది మంగళం పాడింది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని నేతన్నలు జీవనం సాగిస్తున్నారు. తీసుకొన్న వడ్డీ డబ్బులు చెల్లించడానికి, కుటుంబ జీవనం గడవడానికి నేత కార్మికులు వారి వృత్తిని వదిలి బేల్దారీ, రంగులు, ఇతర వ్యవసాయ పనులు, జీడిపరిశ్రమలో పనులకు వెళుతున్నారు. -
మరణాలపై వీడని మిస్టరీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు / గుంటూరు మెడికల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా మీడియాలో వార్తా కథనాలు రావడంతో నిద్రలేచిన అధికార యంత్రాంగం గ్రామానికి కదిలింది. రాష్ట్ర ప్రజ్రాప్రతినిధులు సైతం గ్రామ బాట పట్టారు. మూడు రోజులుగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నా.. ప్రజలకు ఆవగింజంత ఆత్మవిశ్వాసాన్ని కల్పించలేకపోతున్నారు. మేమున్నామంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రజల్లో ఉన్న భయాందోళనలు రవ్వంత కూడా తొలగిపోలేదు. మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి?ఎక్కడ లోపం జరిగింది ?అనే విషయాలు ఎవరూ తేల్చలేదు. కొన్ని నెలలుగా గ్రామ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా, అధికార యంత్రాంగం నిద్రమత్తులో తూలుతుండటంతో గ్రామం వల్లకాడును తలపిస్తోంది. భిన్న ప్రకటనలతో గందరగోళం మరణాలకు ఎప్పుడు ఫుల్స్టాప్ ? రెండు నెలలుగా గ్రామంలో మరణ మృదంగం మోగుతోంది. రెండు నెలల అనంతరం కళ్లు తెరిచిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మూడు రోజులుగా హడావుడి చేస్తున్నారు. గ్రామ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని, భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వ్యాధికి గల కారణాలు, అందుకు అందుబాటులో ఉన్న చికిత్సలు, సదరు చికిత్సలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయి. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు తేటతెల్లంగా కనిపించే వరకు తురకపాలెం గ్రామస్తులు నిద్రపోయే పరిస్థితి లేదు. ఒకేరోజు గ్రామంలో ముగ్గురు మూడు రకాల స్టేట్మెంట్లతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి అనేది తెలియక మరింత భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన జర్మనీ బృందం
పెదకాకాని: జర్మనీలోని అతి పెద్ద నైపుణ్య శిక్షణ సంస్థ డెక్రా అకాడమీ ప్రతినిధులు మండలంలోని నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయంలోని సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర యువతలో నైపుణ్య కార్యక్రమాలను మెరుగుపరచడానికి, ప్రపంచ ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు గాను నియమితులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (అంతర్జాతీయ నైపుణ్య, ఉద్యోగ కల్పన) సీతాశర్మతో కలసి శుక్రవారం యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థులకు అందించే శిక్షణ గురించి సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ రావెల నవీన్ బృందానికి వివరించారు. సీతాశర్మ మాట్లాడుతూ జర్మనీ ప్రస్తుతం నైపుణ్యం గల నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని తెలిపారు. నిర్మాణం, ఇంజినీరింగ్, సమాచార సాంకేతిక వంటి రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. ఇండో జర్మన్ సమష్టి కృషితో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు శిక్షణను అందించడం ద్వారా అంతర్జాతీయ నియామకాలు అందించవచ్చని సూచించారు. -
ఆటో డ్రైవర్లకు కష్టాలు
బాపట్ల అర్బన్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్ల జీవనానికి ముప్పుగా మారిందని కార్మికశక్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గొలపల పూర్ణచంద్రరావు అన్నారు. శుక్రవారం ఆటోల ర్యాలీ అనంతరం వర్కర్లు పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో మహిళ ఉచిత ప్రయాణం కొంతమేర మంచిదే అయినప్పటికీ ఆటోలనే నమ్ముకుని ఉపాధి పొందుతున్న వర్కర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆటో కార్మికులకు భారంగా మారిన బీమా, ఆర్టీఏ చలానాలు రద్దు చేయాలన్నారు. విపరీతంగా పెరిగిన ఆటో స్పేర్ పార్టుల ధరలపై రాయితీ ఇవ్వాలి. ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన ఆటో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి ఆర్.టి.సి.లో డ్రైవర్లు, కండక్టర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ మేరకు తహసీల్దార్ సలీమాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 589.00 అడుగులకు చేరింది. ఇది 309.0570 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 9,500, ఎడమకాలువకు 7,029, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32,886, ఎస్ఎల్బీసీకి 2,400, వరదకాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 52,115 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 52,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
కూటమి నాయకుల వల్లే యూరియా కొరత
వేమూరు: కూటమి నాయకుల నిల్వ చేసిన యూరియాను అదనపు ధరకు అమ్ముకునేందుకు కొరత సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అన్నారు. చెరుకపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజనలో రైతులకు అరకొర యూరియా ఇవ్వడంతో రైతులు యూరియా కోసం నానా బాధలు పడుతతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీలో పెద్ద రైతులు యూరియా నిల్వ చేసుకున్నారని విమర్శించారు. చిన్న రైతులు, కౌలు రైతులు యూరి యా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. యూరియా కొరత వల్ల పంటకు సకాలంలో వేయకపోవడంతో దిగుబడులు తగ్గుతాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు -
అప్పాపురం ఛానల్లో మునిగి యువకుడు మృతి
చేబ్రోలు: వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వచ్చి అప్పాపురం ఛానల్లో ఈత కోసం దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి యువకుడు మృతిచెందిన సంఘటన చేబ్రోలులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నల్లచెరువు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఎం. శైలేష్ (18) స్నేహితులతో కలిసి గురువారం రాత్రి గుంటూరు నుంచి చేబ్రోలు కొమ్మమూరు చానల్లో నిమిజ్జనం కోసం బయలుదేరారు. మార్గంమధ్యలో అప్పాపురం ఛానల్ వద్ద మృతుడు శైలేష్ అతనితోపాటు మరో ఇరువురు స్నేహితులు ఆగి ఛానల్లో ఈత కోసం దిగారు. కొంత సేపు తరువాత అతని స్నేహితులు వరుణ్, షన్నులు ౖైశెలేష్ అప్పాపురం ఛానల్లో గల్లంతైన విషయాన్ని గమనించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. రాత్రి సమయంలో గాలించినప్పటికి ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఛానల్ నీటి పరిమాణం తగ్గించి ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టడంతో మునిగిపోయిన కొంతదూరంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార వైఎస్సార్సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ -
కదిలిస్తే ఉబుకుతున్న క‘న్నీళ్లు’
గుంటూరు రూరల్: తురకపాలెం చుట్టూ అక్రమ నీటి విక్రయ కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నా గ్రామస్తులకు మాత్రం చుక్క నీరు దొరకడం లేదు. క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం నలువైపులా 20కి పైగా అక్రమ నీటి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 300 అడుగుల నుంచి 400 అడుగుల లోతు వరకూ బోర్లను ఏర్పాటు చేసి అక్రమార్కులు నీటి విక్రయాలను చేపడుతున్నారు. ప్రతి రోజు సుమారు 500 వందల ట్యాంక్‌ల నీటిని గుంటూరు నగరంలోని అపార్ట్మెంట్లు, పలు ప్రైవేటు కళాశాలలకు, హాస్టల్స్‌కు, నిర్మాణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం 40 లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌ను రూ. 1000 నుంచి రూ.1500 వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 24 గంటలు నీటి తోడకం బోర్లను 400 అడుగుల లోతు వరకూ ఏర్పాటు చేసి 24 గంటలు నీటిని తోడటంతో గ్రామస్తులు ఇళ్లలో వేసుకున్న బోర్లకు నీరు అందటం లేదు. గ్రామస్తులు 100 అడుగుల నుంచి 150 అడుగుల లోతు వరకూ మాత్రమే బోర్లను ఏర్పాటు చేసుకోవటంతో నీరందక అవస్థలు పడుతున్నారు. వేసవిలో నానా పాట్లు పడుతున్నారు. భూగర్బ జలాలు అడుగంటి బోర్లు మూగబోతున్నాయి. అనుమతులు లేకుండా భూగర్భ జలాలను విక్రయిస్తున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఐదు నెలల కిందట ఫిర్యాదు గ్రామానికి సరఫరా చేస్తున్న నీరు మురికిగా వస్తోందని ప్రజలు ఐదు నెలల కిందట ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.అయినా స్పందన లేదు. గత్యంతరం లేక క్వారీ గుంతల్లో నిల్వ చేసిన నీటిని వాడుకుంటున్నారు. క్వారీల్లో బ్లాష్టింగ్ వ్యర్థాలు, మురుగు నీరు కలిసి ప్రజలు చర్మవ్యాధులు, విషజ్వరాల బారిన పడుతున్నారు. నీటి కాలుష్యంపై గ్రామంలో చర్చలు గ్రామంలో ప్రస్తుతం ఉన్న బ్యాక్టీరియా నీటిని ట్యాంకుల ద్వారా నగర ప్రజలకు అమ్ముతున్నారని, ఆ నీటిని వినియోగిస్తున్నవారి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం నిర్వహిస్తున్న నీటి విక్రయాలను నిలిపి వేయాలని, తమకు మంచినీటిని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామంలోని నీటిని ప్రజలకు అందించకుండా విక్రయాలు చేపడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
యువత భుజస్కంధాలపై భారత్ భవిత
గుంటూరు ఎడ్యుకేషన్: భారత్ ఉజ్వల భవిత యువత భుజస్కంధాలపై ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం భాష్యం మెడెక్స్ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డులోని వివాహ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నలంద, తక్షశిల వంటి విశ్వ విద్యాలయాల ద్వారా ప్రపంచ మానవాళికి జ్ఞానమందించిన ఘనమైన మన భారత సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేవుడిపై ఎంత భక్తి, గౌరవం ఉంటాయో, జ్ఞానాన్ని అందించే గురువుపై కూడా అంతే శ్రద్ధాభక్తులు ఉండాలని చెప్పారు. రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ మనం నేర్చుకున్న జ్ఞానం, వైపుణ్యాలను సరైన మార్గంలో నడింపిచేవారే గురువని అన్నారు. జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ అంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నల్లబోతు మురళి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, ఏ వృత్తిలో రాణించాలన్న గురువుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకష్ణ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు జీవితంలో ఎంతో సాధించిన ప్రేరణాత్మకమైన వ్యక్తులను వారికి పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. వారి అనుభవసారాన్ని వినమ్రంగా గ్రహించి లక్ష్యసాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. సభకు భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ హరిబాబు అధ్యక్షత వహించారు. తొలుత అతిథుల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్, డాక్టర్ రమేష్, డాక్టర్ మురళీలను భాష్యం ఛైర్మన్ భాష్యం రామకృష్ణ సత్కరించారు. విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. అనంతరం అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ తదితరులు పాల్గొన్నారు. భాష్యం అన్ని శాఖల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
ఎన్జీవో సంఘం జిల్లా కొత్త కమిటీ ఏర్పాటుకు కృషి
బాపట్ల:బాపట్ల జిల్లా ఎన్జీవో సంఘం నూతన కమిటి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు. బాపట్లలోని ఎన్జీవో అసోసియేషన్ హాలులో శుక్రవారం సమావేశం నిర్వహించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి డి.వి.రమణ, గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఘంటసాల శ్రీనివాసరావు, శ్యామసుందర్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే శరత్‌బాబు, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అడహాక్ కమిటీ ఏర్పాటు ఏపీ ఎన్జీవో బాపట్ల జిల్లా అడహాక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా పి.నాగేశ్వరరావు, కన్వీనర్ గా బి.ప్రసాదరావు, ట్రెజరర్‌గా బి.రాజేష్, సభ్యులుగా డి.నాగేశ్వరరావు, సిహెచ్. శేషుబాబు, జి.కిరణ్ కుమార్, కే.సృజనకుమారిలను నియమించారు. వీరి ఆధ్వర్యంలో జిల్లాలో ఉద్యోగుల సభ్యత్వ నమోదు పూర్తి చేసి బాపట్ల జిల్లా పరిధిలోని ఏడు తాలూకాలు బాపట్ల, చెరుకుపల్లి, రేపల్లె, చీరాల, అద్దంకి, పర్చూరు, మార్టూరు తాలూకాల ఎన్నికలను పూర్తిచేసి తరువాత నవంబర్ నెల చివరిలోపు బాపట్ల జిల్లా శాఖ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ -
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం
పిడుగురాళ్ల: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చంద్ర గ్రహణం పట్టిందని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ విమర్శించారు. పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాయడం చంద్రబాబునాయుడు నైజం అని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబునాయుడు పాలన అంటేనే ప్రైవేటు వ్యవస్థకి కేంద్ర బిందువని అన్నారు. దాదాపు 15 సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగరా అని ప్రశ్నించారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలియజేశారు. వాటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీనిపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. అధికారపక్షంలో ఉండి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికై నా మెడికల్ కళాశాలల ప్రైవేటుపరం ఆలోచనకు స్వస్తి పలకాలని ఆయన కోరారు. శావల్యాపురం: మండలంలోని కారుమంచి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లేళ్ల లోకేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషనులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్‌ను వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్‌రావు పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు నిఘా ఉంచామని తెలిపారు. -
వైఎస్సార్సీపీ విద్యార్థి, ఎస్సీ విభాగాల కమిటీలు నియామకం
బాపట్ల టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం బాపట్ల జిల్లా విద్యార్థి, ఎస్సీ విభాగ కమిటీలను నియమించారు. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా గోసాల అశోక్ (చీరాల), మాతి శివకుమార్ (వేమూరు)తోపాటు ఆరుగురు జనరల్ సెక్రటరీలు, ఏడుగురు సెక్రటరీలు, 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు. ఎస్సీ విభాగ కమిటీని నియమించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా జడ విజయ్‌బాబు (అద్దంకి), దున్నా బాబు (వేమూరు)తోపాటు ఏడుగురు జనరల్ సెక్రటరీలు, 18 మంది సెక్రటరీలు, నలుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు. తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలకలూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనాస్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. మృతుడు లేత ఆకుపచ్చ చొక్కా, తెలుపు మీద ఎరుపు, నలుపు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద టర్కీ టవల్ ఉండడంతో రైతు అయి ఉంటాడని భావిస్తున్నారు. ఛిద్రమైన మృతదేహం భాగాలను తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసిన వారు 7207076614 నంబరులో సంప్రదించాలని ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు సూచించారు. గుండెపోటుతో వ్యక్తిమృతి బొల్లాపల్లి: వెల్లటూరులో శుక్రవారం జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌పార్టీ కార్యకర్త గంగనబోయిన గోవిందరాజులు (29) శుక్రవారం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు గోవిందరాజులుకు భార్య భూలక్ష్మితోపాటు ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని కుటుంబాన్ని స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు పరామర్శించారు. నరసరావుపేట: గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రూ.8,850 కోట్లతో 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలకు చర్యలు తీసుకోగా అందులో ఐదింటిని పూర్తిచేసి తరగతులు కూడా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదుపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందించడం ఇష్టంలేని ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కౌన్సిల్‌కు సీట్లు అవసరం లేదని లేఖ రాశారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తెలుగు రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే దుగ్ధతో చంద్రబాబు ఈ పాపానికి వడిగడుతున్నాడన్నారు. ఈ జీఓను వెనక్కి తీసుకోకపోతే పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోటపాటి మణికంఠారెడ్డి, బూదాల కల్యాణ్, ఉప్పతోళ్ల వేణుమాధవ్, బంటి, షోయబ్ పాల్గొన్నారు. -
రెండు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
చీరాల రూరల్: రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. రైల్వే ట్రాక్‌మెన్ అందించిన సమాచారంతో సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం మూడో నంబర్ లైన్ పక్కన ఉందని.. ఎటువంటి వివరాలు లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరో సంఘటనలో ... వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఎస్. సత్యన్నారాయణ (75) అనే వృద్ధుడు తన భార్యతో కలిసి గురువారం సాయంత్రం చినగంజాం రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫాం దాటుతున్నాడు. ఆ సమయంలో రైలు ఢీకొట్టడంతో మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వైభవంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహణ
బాపట్ల: బీచ్ ఫెస్టివల్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. నిర్వహణపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో సూర్యలంక, రామాపురంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఫెడ్ లైట్ల మధ్య వాలీబాల్, ఖోఖో, బాక్సింగ్, ఫెన్సింగ్ తదితర క్రీడా పోటీలు భారీ స్థాయిలో నిర్వహించాలని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలా జరపాలని ఆయన సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం 100 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం తెలుగు సినీ రంగం నుంచి కళాకారులను పిలిపిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యలో సరదాగా ఉండడానికి జబర్దస్త్ బృందాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రసిద్ధ గాయకులతో పాటు సినీ రంగ నటులు, ప్రముఖుల సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. డాన్సర్లు, మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయాలన్నారు. తీర ప్రాంతంలో బోట్ల ప్రదర్శన, స్పీడ్ బోట్లు, స్పోర్డ్స్ రైడర్స్, గుర్రాలు, ఒంటెలు ప్రదర్శన ఉంచాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. 350 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వేలాదిమంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డెప్యూటీ కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, జిల్లా పర్యటకశాఖ అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశం -
బాపట్లలో విషాదం.. అమెరికాలో లోకేశ్ మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. అమెరికాలో బాపట్లకు చెందిన లోకేష్(21) మృతిచెందారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయి పాటిబండ్ల లోకేష్ చనిపోయాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్‌ను గుర్తించారు. కాగా, ఉన్నత చదువుల కోసం లోకేశ్.. అమెరికా వెళ్లాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
జిల్లాలో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు
నరసరావుపేట రూరల్: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు చెప్పారు. నరసరావుపేటలోని పలు ఎరువుల దుకాణాలు, జీడీసీఎంఎస్ షాఫులను గురువారం ఆయన తనిఖీ చేశారు. జగ్గారావు మాట్లాడుతూ రైతులు అనవసరంగా రసాయనిక ఎరువులు, యూరియాను కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దని సూచించారు. అవసరం మేరకే కొనుగోలు చేయాలని తెలిపారు. రసాయనిక ఎరువులు కొన్న రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని తెలిపారు. బిల్లులు ఇవ్వని ఎరువుల డీలర్లపై రసాయనిక ఎరువుల చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులు అమ్మిన వెంటనే ఈ–పాస్ మిషన్ ద్వారా స్టాక్ అప్డేట్ చేయాలని డీలర్లను ఆదేశించారు. యూరియాను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కేవి శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఐ.శాంతి, వ్యవసాయ విస్తరణ అధికారి కే.బ్రహ్మయ్య పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు -
యూరియా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు
దాచేపల్లి: యూరియా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జి.శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో యూరియా కొరత అధికంగా ఉండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వ్యాపారులు ఏపీ నుంచి యూరియా బస్తాలను తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. దీంతో యూరియా ఇలా తరలిపోకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా బుధవారం రాత్రి పొందుగల, తాంగేడ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యూరియా తెలంగాణకు తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. పూర్తిస్థాయిలో ఏపీలోనే రైతులు వినియోగించాలని కోరారు. అక్రమంగా తెలంగాణకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ పిడుగురాళ్ల ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఏవో వెంకటేష్, ఆర్ఐ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తూట్లు
రేపల్లె: ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షురాలు షేక్ నసీరున్నీసా బేగ్ విమర్శించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందజేస్తామని, మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయింపు చేస్తామని, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం చేపడతామని ఎన్నికల ముందు ఊకదంపుడు హామీలు ఇచ్చిన కూటమి నాయకులు నేడు హామీల అమలులో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. ● నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ. 100 కోట్లు కేటాయింపు చేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారని, ఇమామ్‌లకు ప్రతి నెల రూ. 10,000 మౌజన్లకు రూ. 5000 గౌరవ వేతనం అందిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అర్హత ఉన్న ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించి మసీదుల నిర్వహణకు ప్రతినెల రూ. 5000 ఆర్థిక సాయం అందిస్తామని కల్లబొల్లి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల గడుస్తున్నా ఒక్క హామీని కూడా అమలు చెయ్యకుండా ముస్లిం మైనారిటీలను దగా చేశారన్నారు. ఇప్పటికై నా మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈనెల 8న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే నిరసన కార్యక్రమంలో జిల్లాలోని ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షురాలు షేక్ నసీరున్నీసా బేగ్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మేదరమెట్ల: రోడ్డు దాటుతున్న బైకును కారు ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. కొరిశపాడు మండలం పరిధిలోని వెంటాపురం క్రాస్‌రోడ్డు వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. పి.గుడిపాడు గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వరరెడ్డి (67) వెంకటాపురం వైపు నుంచి పి.గుడిపాడు వెళ్లేందుకు మోటారు బైకుపై రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు.. బైకును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వెంకటేశ్వరరెడ్డికి తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అదుపు తప్పిన కారు రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలు కాగా ప్రయివేటు వాహనంలో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
జీజీహెచ్ ఏడీగా పూసల శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా (ఏడీ) పూసల శ్రీనివాసరావు గురువారం విధుల్లో చేరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్ ఏడీగా పనిచేస్తున్న ఆయన్ను గుంటూరు జీజీహెచ్ ఏడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. గుంటూరు జీజీహెచ్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా, పరిపాలనా అధికారిగా, ఇన్చార్జి ఏడీగా శ్రీనివాసరావు పని చేశారు. 2024లో ఏడీగా పదోన్నతి పొంది, కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం జీజీహెచ్ ఏడీగా పనిచేస్తున్న చింతలపూడి నాగేశ్వరరావు ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. నూతనంగా విధుల్లో చేరిన ఏడీని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ శ్యామ్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నేతలు, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది బొకేలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌లో పెండింగ్‌లో ఉన్న రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులను మూడు నెలల్లో ఇస్తామని తెలిపారు. మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్ల టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి, ఆసుపత్రిలో రోగులకు అన్నీ అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, జాయింట్ డైరెక్టర్ సుధారాణి సహకారంతో పరిపాలన విభాగంలో మార్పులు తీసుకొచ్చి, మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
యడవల్లి దళితులకు న్యాయం చేయాలి
నరసరావుపేట: చిలకలూరిపేట మండలం యడవల్లి దళిత రైతుల నుంచి ప్రభుత్వం కారుచౌకగా తీసుకున్న విలువైన భూములపై హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి న్యాయమైన పరిహారం ఇవ్వాలని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేను కలిసి హైకోర్టు ఉత్తర్వు కాపీలను అందజేసి కోర్టు ఆదేశాల మేరకు యడవల్లి దళిత రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించాలని కోరారు. రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులు కలెక్టర్‌కు పెట్టుకున్న అర్జీపై మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. యడవల్లి గ్రామంలో 1975లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నాటి జిల్లా కలెక్టర్ చంద్రయ్య భూమిలేని 120 దళిత, గిరిజన కుటుంబాలకు 416 ఎకరాలు బీడు భూమిని అసైన్‌న్డ్ చేసి వీకర్స్ కాలనైజేషన్ సొసైటీ పేరిట రిజిస్టర్‌చేసి పంపిణీ చేశారన్నారు. వాటిని 50 ఏళ్ల నుంచి లిఫ్ట్ ద్వారా ఏడాదికి వరి, ఆరుతడి రెండు పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. భూములలో గ్రానైట్ నిక్షేపాల నెపంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. దళిత రైతులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి ఎకరాకు రూ.8.33లక్షల పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకుందన్నారు. భూమి స్వాధీనం చేసుకునే క్రమంలో 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా బలవంతపు భూ సేకరణ జరిపారన్నారు. అప్పటి 120 మంది లబ్ధిదారులకుగాను ప్రస్తుతం వారి వారసులు 244 మందిగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. నాటి నుంచి నేటివరకు పేద రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చట్టప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడంతో దీనిపై వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఎకరాకు రూ.40లక్షల పరిహారం ఇవ్వాలని పిటీషనర్ల తరుపు న్యాయవాది వి.రవీందర్ కోర్టులో వాదనలు వినిపించారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి.వెంకటస్వామి, పెద్దిరాజు, యడవల్లి రైతులు పాల్గొన్నారు. -
విశ్వ కర్మ పురస్కారానికి ‘ఏలూరి’ ఎంపిక
అద్దంకి: పట్టణానికి చెందిన ఏలూరి వీరబ్ర హ్మాచారి విశ్వకర్మ జాతీ య కళారత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు శ్రీవిరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధునిక జాతీయ సాహిహిత్య సాంస్కృతిక సంస్థ తెలుగు ఇండిియన్ కల్చరర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సంయుక్తాధ్వర్యంలో అవార్డులను ప్రకటించారు. పట్టణానికి చెందిన దారు శిల్పి(చెక్క బొమ్మలు) రంగంలో ప్రతిభ చూపుతున్న ఏలూరి వీరబ్రహ్మాచారిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని ఆయన ఈ నెల 14న తెలంగాణాలోని రాజ్యలక్ష్మి కన్వెక్షన్ హాలులో నిర్వహించనున్న ఆవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అందుకోనున్నారు. చినగంజాం: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా చినగంజాం మండలానికి చెందిన ఇరువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాజుబంగారుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిషు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రావిపాటి శివ వెంకట పోతురాజు, ఆవులదొడ్డి గొల్లపాలెంలోని పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కడలి సుజాతలు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. కోడూరు: స్వామిజీల వేషధారణలో భిక్షాటనకు వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాడ్డారు. వారిని కోడూరు పోలీసులు గురువారం చాకచక్యంగా అరెస్టు చేశారు. ఎస్ఐ చాణక్య కథనం మేరకు.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన బచ్చు వెంకట పున్నయ్య ఇంటికి నలుగురు వ్యక్తులు గురువారం స్వామిజీల వేషధారణ భిక్షాటనకు వచ్చారు. పున్నయ్య వరండాలో టేబుల్‌పై రూ.11 వేలు ఉంచి ఇంట్లోకి వెళ్లాడు. అదే సమయంలో భిక్షాటనకు వచ్చిన నలుగురు దొంగ స్వాములు ఆ రూ.11 వేల నగదును దొంగలించి అక్కడి నుంచి పరారయ్యారు. నగదు పోయిన విషయాన్ని గ్రహించిన పున్నయ్య వెంటనే కోడూరు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా బాపట్ల జిల్లా నగరం గ్రామానికి చెందిన గంధం శివయ్య, గంధం తోట స్వామిజీ, పాసం బాజీ, పాసం యేసును నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. రేపల్లె: రేపల్లె ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో అతిథి అధ్యాపకుల నియమకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టీసీ రవిచంద్ర కుమా ర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామ ర్స్, జంతుశాస్త్రం, కంప్యూటరు సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉన్న వారు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికేట్లతో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు. భట్టిప్రోలు(వేమూరు): కరెంట్ షాక్ వల్ల యువ కౌలు రైతు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. భట్టిప్రోలు మండలంలోని గుత్తావారి పాలెం గ్రామానికి చెందిన వాకా శరత్(26) గురువారం ఉదయం పొలంలో నీరు పెట్టేందుకు కరెంట్ మోటారు వేశాడు. కొద్దిసేపు తర్వాత ఇనుప గొట్టంపై చెయ్యి పెట్టి మంచినీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో పెద్దగా కేక వేసి కింద పడిపోయాడు. పక్క పొలంలో పని చేస్తున్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో, వారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా మృతి చెందాడని తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ శివయ్య తెలిపారు. కడలి సుజాత రావిపాటి పోతురాజు -
కుళాయిల ద్వారా మురుగు నీరు సరఫరా
రేపల్లె: రేపల్లె పట్టణంలోని 24వ వార్డు నేతాజీనగర్ వాసులు గురువారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మున్సిపల్ పైపుల ద్వారా తాగునీటి బదులు మురుగు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరఫరా అయిన నీటిలోనుంచి భరించలేని దుర్గంధం వెదజల్లుతుండటంతో తాగడానికి గానీ వాడుకోవడానికి గానీ పనికిరాకపోయిందని కాలనీవాసులు వాపోయారు. రోజుకు ఒకసారి ఇచ్చే నీరు కూడా ఇలా కలుషితమై వస్తే తమ కుటుంబ అవసరాలు ఎలా తీర్చుకోవాలంటూ ప్రజలు ప్రశ్నించారు. కనీసం వాడుకోవడానికి ఒక బిందె కూడా శుభ్రమైన నీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ నేతాజీనగర్ సమీపంలోని వాడ మురుగు డ్రైన్లో బుధవారం పొక్లెయిన్‌తో పూడికతీత పనులు జరుగుతున్న సమయంలో పైపులు దెబ్బతిన్నాయని, అందువల్లే మురుగు నీరు సరఫరా లైన్లలోకి చేరిందన్నారు. సమస్యను గుర్తించి పైపు లీకేజీని సరిచేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. -
మత్స్యకారులు నిబంధనలను పాటించాలి
సత్రశాల(రెంటచింతల): సత్రశాల వద్దనున్న కృష్ణానదిలో చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులు కచ్చితంగా నిబఽంధనలను పాటించాలని జిల్లా అధికారి ఎస్.సంజీవ్‌రావు అన్నారు. గురువారం సత్రశాలలో నాగార్జునసాగర్ (రైట్ బ్యాంక్) సత్రశాల మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ జలాశయానికి ప్రస్తుతం వరద ఉధృతంగా వచ్చి చేరుతుండటంతో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు. మత్స్యకారులు సత్రశాల ప్రాంతంలో వేట కొనసాగించడంతో స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. ఇటీవల వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జూన్ 30వ తేదీ నాటికి మత్స్యకారులకు ఇచ్చిన అనుమతుల గడువు పూర్తి అయిందని సంజీవ్‌రావు పేర్కొన్నారు. అనుమతి పొందిన ప్రాంతంలోనే ఎవరైనా చేపట వేటకు వెళ్లాలన్నారు. లేదంటే అనుమతులను రద్దుచేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కారంపూడి సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ దొప్పటపూడి మేరికనకం, ఎస్ఐ సీహెచ్ నాగార్జున, మాచర్ల మత్స్యశాకాధికారి శ్రీనివాసరావు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
రచ్చబండ పేరుతో ఎమ్మెల్యే హడావుడి
గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రచ్చబండ పేరుతో ప్రధాన వీధి చెట్టుకింద కూర్చుని ప్రజలతో ముచ్చటించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు అడిగారు. ప్రతి ఇంటికీ రూ. వెయ్యి చొప్పున కలెక్ట్ చేయించండని, దానికి తోడు మరికొంత తాను ఇస్తానని, దాన్ని బాధిత కుటుంబాలకు ఇద్దామని ఎమ్మెల్యే అన్నాడని ప్రజలు వాపోతున్నారు. ఒక పక్క అనారోగాలతో మృత్యువాతకు గురవుతున్న ప్రజలు ఇంటికి వెయ్యి రూపాయలు ఎలా ఇస్తారని మహిళలు, ప్రజలు చర్చించుకుటున్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రజా ప్రతినిధి ఈ విధంగా మాట్లాడటంపై కొందరు పెదవి విరుస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టండి: ఎమ్మెల్యే బూర్ల గుంటూరు రూరల్: తురకపాలెంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం పర్యటించారు. గత నాలుగు నెలలుగా గ్రామంలో ప్రజలు అకాల అనారోగ్య మృత్యువాతలకు గురవ్వడంతో గురువారం గ్రామంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యశాఖ, తాగునీటి శాఖ అధికారులతో మాట్లాడారు. గ్రామంలో పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సరిపోకపోతే ఇతర గ్రామాలనుంచి తెచ్చుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను వాకబు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
కుదేలైన ఇటుక పరిశ్రమ
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025● మైలవరం ఇటుక రాకతో పడిపోయిన ధరలు ● బట్టీల్లో మూలుగుతున్న కోట్లాది ఇటుకలు ● మూతపడే స్థితిలో బట్టీలు ● ఉపాధి కోల్పోనున్న వేలాది మంది కూలీలు ● గతంలో 250.. ప్రస్తుతం 65 బట్టీలు అద్దంకి: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో నాణ్యతతో గిరాకీ ఉన్న అద్దంకి ఇటుక పరిశ్రమ మూడపడే స్థితికి చేరుకుంది. మైలవరం ఇటుక తక్కువ ధరకే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు దిగుమతి అవుతోంది. దీంతో స్థానికంగా తయారయ్యే ఇటుక బట్టీల్లోనే మూలుగుతోంది. గతంలో వెయ్యి ఇటుక రూ.6,500 నుంచి రూ.7వేలు పలుకగా ప్రస్తుతం రూ.5,500 నుంచి రూ.6వేలకు పడిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలు లేకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. దీంతో ఈ సంవత్సరం పది బట్టీలు మూతపడే అవకాశం ఉందని చెబుతున్నారు. నాణ్యమైన ఇటుక ఇక్కడి ఇటుక నాణ్యతకు పెట్టింది పేరు. ఎంతంటే ఒకప్పుడు నాణ్యతకు పేరుగాంచిన కరవది ఇటుక కన్నా నాణ్యతగా తయారు చేస్తారు. తెల్ల మట్టి, నల్ల మట్టిని కలిపి, అందులో వరిపొట్టు, బూడిద కలిపి పాకం చేసిన ఇటుకలుగా కోస్తారు. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం ప్లైయాస్ను కూడా వినియోగిస్తున్నారు. దాంతో ఇటుక చాలా గట్టిగా ఉంటుంది. తక్కువ ధరకే మైలవరం ఇటుక విజయవాడ సమీపంలోని మైలవరంలో తయారయ్యే ఇటుక తక్కువ ధరకే లభిస్తుండడంతో ఇళ్ల నిర్మాణదారులు అటు వైపు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి ఇటుక వెయ్యి బాడుగుతో కలుపుకుని రూ.6 వేలకు లభిస్తోంది. స్థానిక బట్టీల్లో తయారయ్యే ఇటుక ప్రాంతాన్ని బట్టి వెయ్యి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. మైలవరం ఇటుకకు, స్థానిక బట్టీల్లో తయారయ్యే ఇటుక ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో నిర్మాణదారులు మైలవరం ఇటుక వైపు మొగ్గు చూపుతున్నారు. ఉపాధి కోల్పోనున్న వేలాది మంది కూలీలు స్థానికంగా తయారయ్యే ఇటుకకు ఆదరణ తగ్గడంతో పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా బట్టీల్లో పనిచేసే వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉభయగోదావరి, విశాఖపట్నంతో పాటు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది కూలీలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. –వీరరాఘవులు, బట్టీ యజమాని -
క్షయ వ్యాధి కేసులను వేగంగా గుర్తించాలి
చీరాల రూరల్ : క్షయ వ్యాధి బారినపడిన బాధితుల వివరాలను గుర్తించి గూగుల్ ఫాంలో పొందుపరచాలని క్షయవ్యాధి నివారణ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్‌కుమార్ అన్నారు. ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ) హాలులో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎం, నిక్షయ్‌మిత్ర, ఆశలకు క్షయవ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక్‌కుమార్ మాట్లాడారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నా, రాత్రి సమయంలో చెమటలు పడుతున్నా.. దగ్గితే నోట్లో నుంచి రక్తం పడినా, ఛాతీలో నొప్పిగా ఉన్నా, సక్రమంగా శ్వాస ఆడకపోయినా, బరువు కోల్పోతున్నా, ఆకలిగా లేకపోయినా, అలసటగా ఉన్నా, మెడలో వాపుగా ఉన్నా క్షయవ్యాధి లక్షణాలుగా గుర్తించాలని సూచించారు. ఆయా లక్షణాలు కలిగినవారు ప్రభుత్వ వైద్యశాలలో టీటీ యూనిట్లలో ఉచితంగా అందించే మందులను వాడుకో వాలని సూచించారు. హెచ్ఐవీ వ్యాధిగ్రమస్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ధూమపానం, మద్యపానం, పోషకాహార లోపాలున్నవారు, 60 ఏళ్లకు పైబడినవారు కూడా క్షయవ్యాధి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ యూనిట్ సిబ్బంది టి.నరేంద్రబాబు, పీఎస్.వర్షదార, కె.శ్రీలక్ష్మి, రియాజ్, నీలిమ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. క్షయవ్యాధి నివారణ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్‌కుమార్ -
రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇరువురు ఎంపిక
బాపట్ల: బాపట్ల వ్యవసాయ కళాశాలలో జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ లాల్ అహమ్మ ద్ మహమ్మద్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడి అవార్డుకు ఎంపికయ్యారు. బోధన, పరిశోధన, పరిపాలన విభాగాలలో 19 సంవత్సరాలుగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ లాల్ అహమ్మద్ మహమ్మద్ ఇప్పటివరకు 19 మంది ఎంఎస్సీ, నలుగురు పీహెచ్డీ పరిశోధకులకు అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా సహకరించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో వృత్తి శిక్షణను పొందడమే కాకుండా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలలో స్టడీ విజిట్ చేసిన ఘనతను పొందారు. స్టూడెంట్ యాక్టివిటీస్ ఇన్చార్జిగా, అకడమిక్ మ్యాటర్స్ ఇన్చార్జిగా అదనపు వార్డెన్‌గా, ఎన్.ఎస్.ఎస్.ప్రోగ్రాం ఆఫీసర్‌గా, ప్లేస్మెంట్ ఆఫీసర్‌గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కోచింగ్ సెల్ ఇన్చార్జిగా పలు కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. అనేక జాతీయ సెమినార్లు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పలు వ్యవసాయ పత్రికలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించడమే కాక 200 పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు సమర్పించారు. డాక్టర్ లాల్ అహ్మద్‌కు పుర స్కారం లభించడం పట్ల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రసూనరాణి, బోధన, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతి జయలలిత బాపట్ల వ్యవసాయ కళాశాలలో క్రాప్ ఫిజియాలజీ డిపార్టుమెంట్ ప్రొఫెసర్, విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ కే.జయలలితను రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు వరించింది. రెండు దశాబ్దాలపాటు బోధనలోనూ, ఆరున్నర సంవత్సరాలుగా పరిశోధనలోను అత్యుత్తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె జేఆర్ఎఫ్ఎస్ఆర్ఎఫ్ –ఐసీఏఆర్ శిక్షణ తరగతులను నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు. జాతీయ సెమినార్లు, వర్క్‌షాపులు, సదస్సులు అనేకం నిర్వహించారు. పదిమంది ఎంఎస్సీ, ఆరుగురు పీహెచ్డీ స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 100 పరిశోధన పత్రాలను వివిధ పత్రికలకు సమర్పించారు. బాలికల హాస్టల్‌కు వార్డెన్గాను, అకడమిక్ విభాగానికి ఇన్చార్జిగాను వ్యవహరించారు. సాంకేతిక సదస్సులు, ఎగ్జిబిషన్ల నిర్వహణలో పాలుపంచుకున్నారు. -
అంతుచిక్కని వ్యాధి.. బతుకులు సమాధి
● భయం గుప్పెట్లో తురకపాలెం ● బయటకు రావాలంటే భయపడుతున్న గ్రామస్తులు ● ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన ● చుట్టాలు కూడా రావడం లేదని ఆవేదనం ● ఇతర గ్రామాల్లో పనులకు వెళ్లాలన్నా రానివ్వడం లేదు ● హడావుడిగా కదిలిన యంత్రాంగం ● వైద్య శిబిరానికి రావాలన్నా భయపడుతున్న ప్రజలు గుంటూరు రూరల్: తురకపాలెం గ్రామస్తులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రతి వీధిలో నలుగురైదుగురు మృత్యువాతకు గురవ్వడంతో చిన్నపాటి అనారోగ్యం కలిగినా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నారే గానీ కారణాలు చెప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. తమను పక్క గ్రామాల వారు పనులకు పిలవడం లేదని, జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు గ్రామంలో అధికారులు మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు రావాలంటే భయపడుతున్నారు. పరీక్షలు చేసిన తరువాత ఏ రోగం బయటపడుతుందో.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాం కదా! అని కొందరు మిన్నకుండిపోతున్నారు. మరికొందరైతే ప్రభుత్వ వైద్యులను నమ్మలేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. చిన్నపాటి అనారోగ్యానికి పెద్ద మొత్తంలో ఖర్చుచేసి చికిత్సలు తీసుకుంటున్నారు. ఇదే అదనుగా చేసుకుని ప్రైవేటు వైద్యులు అందిన కాడికి బిల్లులు కట్టించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తురకపాలెం అని పేషెంట్ చెబితే చాలు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. హడావుడిగా పర్యటనలు గ్రామంలో మీడియా తిరుగుతుందని తెలిసి అధికారులు హడావుడిగా పర్యటనలు చేశారు. మండల స్థాయి అఽఽధికారుల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ గడిచిన నాలుగు నెలలుగా ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు హడావుడి పర్యటనలు చేస్తున్నారంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది హడావుడిగా గ్రామంలోని మురుగు కాల్వలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లుతున్నారు. వదంతులతో వణుకు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయంతో వణికి పోతున్నారు. అదేదో వైరస్.. బ్యాక్టీరియా అంట.. నీటి ద్వారా, మట్టి ద్వారా వస్తుందంట.. అది రావడంతోనే ఇన్ఫెక్షన్లకు గురై మృత్యువాతకు గురవుతున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రాత్రి 8 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయం కలుగుతుందని వాపోతున్నారు. ఇంటింటికీ రక్త నమూనాల సేకరణ జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా ప్రజారోగ్యశాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరిస్తున్నారు. తాగునీటి, మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అని పారిశుద్ధ్యం కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సరిహద్దురాయి సరిచేసిన పెద్దలు నాలుగు నెలల కిందట గ్రామంలో ఏర్పాటు చేసిన పొలిమేర రాయి ఒక పక్కకు ఒరగడంతో అనర్థాలు జరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామంలోని పెద్దలు శాస్త్రోక్తంగా గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సరిహద్దు రాయిని సరిచేశారు. ఇప్పటికై నా అకాల మరణాలు ఆగుతాయని గ్రామస్తులు భావిస్తున్నారు. -
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం
బాపట్ల: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం, డీఆర్డీఏ–వెలుగు శాఖల సమన్వయంతో ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. పురుగు మందు అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెలు అమ్మాలని తెలిపారు. గృహ వినియోగానికి అవసరమైన అన్ని ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి సేకరించి ఈ కేందాల్లో విక్రయించాలని ఆయన తెలిపారు. విత్తన దశ నుంచి పంట ఇంటికి వచ్చే వరకు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలకు రైతు సాధికార సంస్థ ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీరి నుంచి మాత్రమే ఉత్పత్తులను సేకరించాలని ఆయన సూచించారు. ప్రజలు కూడా ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్, మధుమేహం, రక్తహీనత, సంతానలేమి తదితర అనారోగ్యాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమాలపై ఆరా ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద గుర్తించిన 170 క్లస్టర్లలో అమలు చేయబోవుచున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల విధి విధానాలపై జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు వివరించారు. ప్రస్తుతం 174 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా 273 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త గ్రామ పంచాయతీల్లో పొదుపు సంఘాల ద్వారా గ్రామస్తులను కలసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల అమలుకు డీఆర్డీఏ, వెలుగు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంక్షిప్త మార్గదర్శిని, ప్రకృతి వ్యవసాయ విధానాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆవిష్కరించారు. ఉద్యాన శాఖ అధికారి షేక్ కలీం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ అక్తర్ హుస్సేన్, ప్రకృతి వ్యవసాయ విభాగం అడిషనల్ డీపీఎం జె. మోహన్, డీఆర్డీఏ డీపీఎం సరిత, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ జె.వెంకట మురళి -
పిడుగురాళ్లలో వందేభారత్‌ను ఆపాలి
పిడుగురాళ్ల: వందే భారత్‌కు స్టాపింగ్ కల్పించాలంటూ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ మెంబర్ జూలకంటి శ్రీనివాసరావు విన్నవించారు. సికింద్రాబాద్‌లో బుధవారం జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే 75వ జెడ్ఆర్యూసీసీ మీటింగ్‌లో రైల్వే అధికారులకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. పిడుగురాళ్ల స్టేషన్లో వందే భారత్, ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, భావ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లు ఆగే లా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలు మార్గంలో కొత్తగా రైళ్లు నడపాలని, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల రద్దీ ఎక్కుగా ఉందని బోగీల సంఖ్య పెంచాలని కోరానన్నారు. పిడుగురాళ్ల – నడికుడి రైల్వే స్టేషన్ల మధ్య గడిచిన నెలల్లో దోపిడీలు పలుమార్లు జరిగినందున ప్రయాణికులకు భద్రత పెంచాలని, రైల్వే పోలీసులతో రాత్రిళ్లు గస్తీ ఏర్పాటు చేయాలని సమావేశం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీ వత్సవ్కు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
పెదకాకాని(ఏఎన్‌యూ): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి 4వ స్పోర్ట్స్‌మీట్–2025 ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా మంత్రి సంధ్యారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ వైస్ చైర్మన్ ఎం. మల్లికార్జుననాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి, గురుకులం సెక్రటరీ గౌతమి, వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడాలని ఆలోచన వచ్చిందంటేనే పిల్లలు గెలిచినట్టన్నారు. రోజూ గంటకుపైగా ఆడుకోవడం ద్వారా శారీరక సామర్థ్యం పెరుగుతుందన్నారు. గురుకులం సెక్రటరీ గౌతమి మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 5వ తేది వరకు బాలికలు, 7 నుంచి 9వ తేదీ వరకూ బాలురకు 12 అంశాల్లో క్రీడలు ఉంటాయని చెప్పారు. 13 జిల్లాల నుంచి 656 మంది హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి విద్యార్థుల నుంచి క్రీడావందనం స్వీకరించారు. వసతులు కరువు 1500 మంది క్రీడాకారులతో నిర్వహించడానికి అనుకూలంగా వసతులు లేని కారణంగా బాలికలు, బాలురకు వేర్వేరు తేదీల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. వర్సిటీలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, టేబుల్‌టెన్నిస్, తైక్వాండో, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ ఆఫీసర్ శ్యాంసుందర్ వివరించారు. ముందుగా జాతీయ జెండా, స్పోర్ట్స్ జెండా, ఈఎంఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి 800 మీటర్లు పరుగుపందెం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు, రిజిస్ట్రార్ సింహాచలం, పలువురు స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచన ఘనంగా గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభం -
చేనేత సహకార సంఘం పల్నాడు అధ్యక్షుడిగా శివదుర్గారావు
ఏపీ చేనేత సహకార సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన కట్టా శివదుర్గారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఫణిదం చేనేత సహకార సంఘం భవన్ ఆవరణలో బుధవారం జరిగిన ఏపీ చేనేత సహకార సంఘం పల్నాడు జిల్లా మూడో మహసభలో 10 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులుగా బిట్రా పానకాలు, పంతంగి ప్రభాకర్, గడ్డం సుసులోవ్, గనికపూడి ఏసురత్నం, వలపర్ల దిబ్బయ్య, మోపపర్తి బాబురాజు, మల్లాల గురవయ్య, సాముల నాగలక్ష్మిలను ఎన్నుకున్నారు. -
శాంతించిన కృష్ణమ్మ
ఊపిరి పీల్చుకుంటున్న రైతులు కొల్లూరు: కృష్ణా నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులను భయాందోళనలకు గురి చేసిన కృష్ణమ్మ ఎట్టకేలకు శాంతించింది. నెల రోజుల నుంచి నదిలో నిండుగా నీరు ప్రవహించింది. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో బుధవారం నీటి మట్టం కూడా అడుగంటడం మొదలెట్టింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదలను ఆ శాఖాధికారులు తగ్గించడంతో రైతులను వరద భయం వీడింది. ఎగువనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా నీటి విడుదల నిలిచిపోయింది. మున్నేరు తదితర వాగుల నుంచి వస్తున్న స్వల్ప మొత్తంలో నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదలవుతోంది. బుధవారం ఉదయం 1.73 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవగా, క్రమంగా అధికారులు తగ్గించారు. సాయంత్రానికి 36 వేల క్యూసెక్కులకు పరిమితమైంది. యథావిధిగా రాకపోకలు వరద తీవ్రత తగ్గడంతో మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున పోతార్లంక మార్గంలో లోలెవల్ వంతెన పైనుంచి రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లు వరద భయంతో ఆందోళనకు గురైన పరీవాహక ప్రాంత రైతులు కృష్ణమ్మ శాంతించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. -
బడ్జెట్లో చేనేతకు మొండిచేయి
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ సత్తెనపల్లి: చేనేతకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిని ఫణిదం చేనేత సహకార సంఘం భవన ఆవరణలో బుధవారం జరిగిన చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా 3వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాసభకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చేనేతకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్‌లూమ్స్, జెట్లూమ్స్లను ప్రోత్సహిస్తూ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై అక్టోబర్ 6,7 తేదీల్లో సత్తెనపల్లిలో జరిగే చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభల్లో చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ముందుగా జెండాను చేనేత జాతీయ అవార్డు గ్రహీత కర్నాటి మురళి, సామాజిక సేవా కార్యకర్త గంజి వీరాస్వామి, పణిదం చేనేత సొసైటీ కార్మికురాలు మంచి మల్లేశ్వరి ఆవిష్కరించారు. మహాసభలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుములు వీరబ్రహ్మం కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం నివేదికపై మహాసభలో ప్రతినిధుల చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. భవిష్యత్ కర్తవ్యాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మహసభలో చేనేత కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
మహిళా కూలీ మృతి
బల్లికురవ – సంతమాగులూరు ఆర్ అండ్ బీ రోడ్డులో ఈర్ల కొండకు సమీపంలో రోడ్డు మార్జిన్లో సుబాబుల్ కర్ర లోడు చేసుకుంటున్న ట్రాక్టర్ ట్రక్కును గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళా కూలీ జొన్నలగడ్డ మేరమ్మ (53) తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కూలీలు కొత్తపల్లి ఏసమ్మ, గంధం మేరమ్మ, పందిరి చిన్న సుబ్బయ్య వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. లారీ యజమాని మాత్రం మృతి చెందిన కూలీకి రూ. 3.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందించి చేతులు దులుపుకున్నారు. -
టిష్యూ కల్చర్ అరటికి సబ్సిడీ
కొల్లూరు : టిష్యూ కల్చర్ అరటి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని మండల ఉద్యాన శాఖాధికారి కల్యాణ చక్రవర్తి తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగుకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. మండలంలోని జువ్వలపాలెం, కిష్కింధపాలెం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ పంటలకు చీడ, పీడలు ఆశించకుండా అధికారుల సూచనల మేరకు మందులు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఏఓ వి.నరేంద్రబాబు మాట్లాడుతూ సాగు చేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్రాల్లో ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి బి.ఎన్. వంశీ, వీహెచ్ఏ ఎం. నవీన్, వీఏఏలు కె. విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
దాతల సహకారం అభినందనీయం
కారంచేడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు అదృష్టవంతులని డీఈఓ ఎస్.పురుషోత్తం పేర్కొన్నారు. స్థానిక యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కారంచేడులోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామానికి చెందిన అనేక మంది ఎన్నారైలు, పాఠశాలల పూర్వ విద్కార్థులు చేతులు కలపడం మంచి పరిణామమని కొనియాడారు. గ్రామంలోని వైఎన్ ప్రభుత్వ పాఠశాలను దాతల సహకారంతో రూ. 12 లక్షలతో అభివృద్ధి చేశారని తెలిపారు. అమెరికాలోని డల్లాస్ పట్టణంలో స్థిరపడిన గ్రామానికి చెందిన రాయినీడి మురళీకృష్ణ సహకారంతో రూ. 33 లక్షలతో నూతనంగా బస్సును కొనుగోలు చేసి ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నుంచి ఉన్నత పాఠశాల వరకు ఉన్న 360 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులను గ్రామానికి చెందిన హైదరాబాద్‌లోని స్మైల్ ఫౌండేషన్ నిర్వాహకులు గౌర అనీల్‌కుమార్ సమకూర్చగా, వాటిని కూడా ఆయన చేతుల మీదుగా అందించారు. ఎన్నారై ఘంటా పద్మజ మాట్లాడుతూ తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థినేనని తెలిపారు. అవిభక్త పిల్లల వైద్యులు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో పేరు నమోదు చేసుకున్న డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ కూడా ఈ పాఠశాల విద్యార్థే అని గుర్తు చేశారు. వేసవి తరగతులు నిర్వహించిన పావులూరి శ్రీనివాసరావు, పొదిలి మురళీకృష్ణలను సత్కరించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ యార్లగడ్డ రాఘవయ్య, చుండూరి రామయ్య, పాఠశాల పూర్వ కరస్పాండెంట్ యార్లగడ్డ రఘుబాబు, ఎంఈఓ ఎం. వెంకటేశ్వర్లు, హెచ్ఎం సామ్రాజ్యం పాల్గొన్నారు. బాపట్ల డీఈఓ పురుషోత్తం -
సింగిల్ నంబర్ లాటరీ విక్రేతలు అరెస్ట్
నరసరావుపేట టౌన్: నిషేధిత సింగిల్ నంబర్ లాటరీ విక్రేతలు నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.51,480లు స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. చిత్రాలయ టాకీస్ సెంటర్లో సింగిల్ నంబర్ లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్నా సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు దాడులు నిర్వహించి ఇస్లాంపేటకు చెందిన షేక్ మస్తాన్‌వలి, ఉప్పలపాడు గ్రామానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6,580 నగదు, లాటరీ నంబర్లకు సంబందించి స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారన్నారు. అదే విధంగా ఏంజెల్ టాకీస్ సమీపంలో వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి నిమ్మతోటకు చెందిన గుడిపాటి వెంకటేశ్వరరావు, ఇస్లాంపేటకు చెందిన షేక్ నన్నూ బాజీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.44,900 నగదు, లాటరీ నంబర్ల స్లిప్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఇస్లాంపేటకు చెందిన షేక్ ఖాజాషరీఫ్ అలియాస్ బుజ్జి, రామిరెడ్డిపేటకు చెందిన షేక్ గౌస్పీరాలను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నిందితులను అరెస్ట్ చేయటంలో ప్రతిభ కనపరిచిన వన్‌టౌన్, టూటౌన్ సీఐలు ఎం.వి.చరణ్, ఎం.హైమారావు, ఎస్ఐలు టి.అశోక్ బాబు, అరుణలను అభినందించారు. నిషేదిత లాటరీ, మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నలుగురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు వెల్లడించిన డీఎస్పీ నాగేశ్వరరావు -
జన హృదయ నేత వైఎస్సార్
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఫీజు రీయింబర్స్‌తో పేద, మధ్యతరగతి బిడ్డలకు ఉన్నత చదువులు.. ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో ఖర్చయ్యే గుండె ఆపరేషన్లు... జలయజ్ఞంతో సాగునీటి పథకాల నిర్మాణం.. అన్నదాతలకు ఉచిత విద్యుత్... ఒకటా రెండా వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి జనం గుండెల్లో గుడికట్టుకున్న నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆయన విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఆస్పత్రుల్లో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. పేదలకు దుస్తులు పంచారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. దివంగత నేత పాలనలో జిల్లాలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి జనం మారోమారు గుర్తుచేసుకున్నారు.● వేమూరు నియోజకవర్గంలో సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేకరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత వేమూరు మండలం పెరవలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అమర్తలూరు మండలం ప్యాపర్రులో జరిగిన అన్నదాన కార్యక్రమంలో వరికూటి పాల్గొన్నారు. తర్వాత కొల్లూరు మండలంలో దివంగత నేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భట్టిప్రోలులో జరిగిన వర్ధంతి కార్యక్రమాలలో కూడా అశోక్‌బాబు పాల్గొన్నారు. ● రేపల్లె నియోజకవర్గంలో సమన్వయకర్త ఈవూరి గణేష్ ఆధ్వర్యంలో దివగంత నేత వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి గణేష్ పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బాపట్లలో సమన్వయకర్త కోన రఘుపతి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజెర్ల నారాయణరెడ్డి 23వ వార్డులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య కర్లపాలెం రోడ్డులో దివంగత నేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ● చీరాలలో సమన్వయకర్త కరణం వెంకటేశ్ ఆదేశాల మేరకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొనిగల జేషన్బాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబుల ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● అద్దంకి నియోజకవర్గంలో సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన సోదరుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 20వ వార్డులో దివంగత నేత విగ్రహానికి పూలమాల వేశారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దివంగత నేత వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు వాడవాడలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ● పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దివంగతనేత వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత పర్చూరు బొమ్మల సెంటర్, నెహ్రూనగర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చినగంజాంలోని మార్కెట్, రైల్వేస్టేషన్ సెంటర్లలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మార్టూరు మండలం చిమ్మిరిబండ, ఇంకొల్లు మండలం పావులూరులలో దివంగత నేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
బకాయిల వివరాలు తెలియజేయాలి
బాపట్ల అర్బన్: ఉద్యోగులు, పెన్షర్లకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు వెంటనే తెలియజేయాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ సురేష్‌బాబు పేర్కొన్నారు. స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా కనీసం పీఆర్సీ కమిషన్ నియమించలేకపోవటం బాధాకరమన్నారు. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేరవేసే ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడం విచారకరమన్నారు. ప్రతి ఉద్యోగి రెండు సంవత్సరాలుగా తన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలలో కనీసం రెండు డీఏలు అయినా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు ఐఆర్ ప్రకటించకపోవటం విచారకరమన్నారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఓంకార్, జిల్లా కమిటీ సభ్యు లు ఉపాధ్యక్షులు ఎస్.మాధవి, బి.వెంకటేశ్వర్లు, ఓ నెహ్రుబాబు, సిటీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు మహబూబ్‌బాషా, సుమంత్‌రాజ్, బాపట్ల రెవెన్యూ డివిజన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పి.బ్రహ్మ య్య, విష్ణు ప్రసాద్, చీరాల డివిజన్ కార్యదర్శి పి.సురేష్, రేపల్లె డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు టి.చంద్రశేఖర్, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు -
అర్ధరాత్రి కారు బీభత్సం
తాడేపల్లిరూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిలో ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించి పలుచోట్ల ద్విచక్ర వాహనదారులను, ఒక సైక్లిస్టును ఢీకొట్టి చివరకు ఒక చెట్టును ఢీకొని నిలిచిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి వెళుతున్న పోలీస్ స్టిక్కర్ కలిగి వున్న ఒక కారు సాయిబాబా గుడివద్ద విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తోపాటు భార్యాభర్తలకు స్వల్పగాయాలయ్యాయి. కారు ఆపినట్లు ఆపి మళ్లీ అతివేగంగా వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని, ద్విచక్రవాహనంపై వెళుతున్న మరో వ్యక్తికి ఢీకొట్టడంతో వారు కింద పడ్డారు. కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. కారులో బెలూన్స్ సైతం ఓపెన్ అయ్యా యి. పూటుగా మద్యం సేవించి ఉన్న ఓ వ్యక్తి కారులోంచి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కారుపై పోలీస్ అని స్టిక్కర్ ఉంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
డీజిల్ దొంగ అరెస్ట్
నరసరావుపేటటౌన్: ఆగి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసంజీవయ్య కాలనీకి చెందిన కాకాని యశ్వంత్ చిలకలూరిపేట రోడ్డు ముస్లిం శ్మశానవాటిక పక్కన గల పెట్రోల్ బంకు ఆవరణలో నిలిపి ఉన్న లారీలో తెల్లవారుజామున డీజిల్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది కేకలు వేయటంతో తన వెంట తెచ్చుకున్న ద్విచక్రవాహనం, 25 లీటర్ల రెండు క్యాన్లు వదిలి పరారయ్యాడు. రెండు గంటల తర్వాత మరో ద్విచక్ర వాహనంపై అతని స్నేహితుడితో కలిసి వచ్చి వదిలి వెళ్లిన వాహనాన్ని తీసుకెళ్లాడు. అప్పటికే యశ్వంత్ కోసం అక్కడ వేచి చూస్తున్న లారీ యజమానులు, పెట్రోల్ బంకు నిర్వాహకులు అతన్ని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ హైమారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని నెలలుగా లారీల్లో డీజిల్, బ్యాటరీలు అపహరణకు గురవుతున్నాయని లారీల నిర్వాహకులు పోలీసులకు వివరించారు. నిందితుడితోపాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకొని డీజిల్ దొంగతనం చేసేందుకు తెచ్చిన ప్లాస్టిక్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
జిల్లా కోర్టులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్పాహార విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పాల్గొని మహానేత చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సిడి భగవాన్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, మాజీ గవర్నమెంట్ ప్లీడర్లు పోకల వెంకటేశ్వర్లు, ఎంవీ సుబ్బారెడ్డి, మాజీ ఏజీపీ సౌభాగ్య లక్ష్మి, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, వాసం సూరిబాబు, వజ్రాల రాజశేఖర్ రెడ్డి, మాతంగి శ్రీకాంత్, కేవీ రమణారెడ్డి, సోమసాని ఝాన్సీ, బడి మంజుల, గేర వెంకట సుబ్బారావు, బొడ్డు కోటేశ్వరరావు, బూదాటి సాగర్, లీగల్ సెల్ అధికార ప్రతినిధి సయ్యద్ బాబు, మాజీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సుధాకర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణారెడ్డి, సుదర్శన క్రాంతి కుమార్ బొమ్మనబోయిన శ్రీనివాస్, నల్లక వెంకట వేణు, సురేష్, నగర యువజన విభాగం అధ్యక్షుడు ఏటి కోటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
చురుగ్గా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
మంత్రి నాదెండ్ల మనోహర్ అత్తోట(కొల్లిపర):రాష్ట్రంలో రేషన్ స్మార్ట్ కార్డు ల పంపిణీ చురుగ్గా కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా అత్తోటలో ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల మందికి స్మార్ట్ కార్డ్‌లు అందిస్తున్నట్లు చెప్పారు. చౌక దుకాణాల ద్వారా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకు లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. చౌక దుకాణాలను రానున్న రోజుల్లో మినీమార్ట్లుగా తీర్చిదిద్దుతామన్నారు. వీటి ద్వారా తక్కువ ధరకే ఆర్గానిక్, నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. త్వరలో సబ్సిడీపై టార్ఫలిన్ పట్టాలు అందిస్తామన్నారు. యూరియా అందడం లేదని రైతుల ఫిర్యాదు తమకు యూరియా అందడం లేదని అత్తోట గ్రామ రైతులు మంత్రి నాదెండ్లకు ఫిర్యాదు చేశారు. -
అభివృద్ధితో పట్టణ రూపురేఖల్ని మార్చుతాం
రేపల్లె: అభివృద్ధితో పట్టణ రూపురేఖల్ని మార్చటం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణంలో మంగళవారం నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కోట్ల రూపాయల నిధులతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 9, 13, 27, 28 వార్డులలో రూ.1.55 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించారు. 2వ వార్డులో రూ.14 లక్షలతో నూతనంగా నిర్మించిన పార్కును, చంద్రమౌళి పార్కులలో రూ.26 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆట పరికరాలను ప్రారంభించారు. ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. పట్టణం నుంచి పేటేరు రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న పైప్‌లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నేలపు రామలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, కమిషనర్ కాకర్ల సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, నాయకులు అనగాని శివప్రసాద్, గూడపాటి శ్రీనివాసరావు, పంతాని మురళీధరరావు, జీవీ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
ఆర్ఓబీకి ముందే ఆర్యూబీ నిర్మించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్‌విలాస్ నూతన ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టే ముందుగానే ప్రజా రవాణాకు వీలుగా రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని చేపట్టాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ సాధన జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరులోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ ఇటీవల జరిగిన నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశంలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి ముందే ఆర్యూబీ నిర్మించాలని చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపి ఆమోదింపచేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్యూబీ నిర్మాణానికి నిధులు తెచ్చిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్యూబీ నిర్మాణం దిశగా రైల్వేశాఖను ఒప్పించాలని కోరారు. శంకర్‌విలాస్ ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించే ఆర్నెల్ల పాటు బ్రిడ్జిపై వాహనాలు యధావిధిగా రాకపోకలు సాగించవచ్చని జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించిన రెండు నెలల వ్యవధిలోనే బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించేశారని చెప్పారు. – బ్రిడ్జికి రెండు వైపులా కూల్చివేసిన ఆర్అండ్బీ శాఖాధికారులు రైల్వే పరిధిలోని బ్రిడ్జి కూల్చివేత పనులకు అనుమతుల కోసం తీరిగ్గా రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లడం ముందుచూపు లోపించిన పనులకు నిదర్శనమన్నారు. అన్ని అనుమతులు తెచ్చిన తరువాతే బ్రిడ్జి కూల్చివేత, నిర్మాణ పనులు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం రైల్వేబోర్డు అనుమతి కోసం పంపడం ద్వారా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని మరింతగా జాప్యం చేయడమేనన్నారు. బ్రిడ్జి నిర్మాణం కారణంగా నష్టపోతున్న భవన యజమానులకు చట్ట ప్రకారం నష్ట పరిహారాన్ని చెల్లించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పడంతోపాటు స్టేటస్–కో విధించినప్పటికీ అధికార యంత్రాంగం ఖాతరు చేయకండా ఏకపక్షంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో స్టే ఉండగానే రెండు రోజుల్లో భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడమేంటని ప్రశ్నించారు. నగర ప్రజలపై గౌరవం లేని అధికారులు కనీసం హైకోర్టుపై గౌరవంతో ఆదేశాలను పాటించాలని కోరారు. – నగర ప్రజలతో పాటు నిర్మాణాలను కోల్పోతున్న యజమానుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అన్ని అనుమతులు తెచ్చుకుని బ్రిడ్జి కూల్చివేత, నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్మాణానికి నిధుల గురించి ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్యూబీ నిర్మాణాన్ని రైల్వేశాఖ చేపడుతుందని చెప్పారు. సమావేశంలో షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు, కమల్‌కాంత్, అవధానుల హరి, వల్లూరి సదాశివరావు పాల్గొన్నారు. -
కృష్ణా నదిలో పెరిగిన వరద ప్రవాహం
కొల్లూరు: కృష్ణా నదికి వరద నీటి విడుదల కొనసాగుతుండటంతో మంగళవారం ప్రవాహ ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళవారం 3.38 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. పెసర్లంక అరవింద వారధి, గాజుల్లంక చినరేవుల నుంచి వరద నీరు లోతట్టు ప్రాంతాలోకి చేరుతుంది. వరద నీరు గణనీయంగా పెరగడంతో మండలంలోని దోనేపూడి –పోతార్లంక మార్గంలో దోనేపూడి కరకట్ట దిగువన చినరేవుపై ఉన్న లోలెవల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా మండలంలోని పోతార్లంక, తోకలవారిపాలెం, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం పంచాయతీల పరిధిలోని ప్రజలు భట్టిప్రోలు మండలం వెల్లటూరు, కొల్లూరు మండలం గాజుల్లంక గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. గత నెల రోజుల పైబడి నదిలో నిండుగా వరద నీరు ప్రవహిస్తుండటంతోపాటు లోతట్టు ప్రాంతాలలోని పంటలు ముంపునకు గురవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వరద తీవ్రత తగ్గుముఖం పడితే పంటలు దక్కుతాయన్న ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతుంది. -
ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గండి
బాపట్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోలు, వ్యాన్లు, జీపు డ్రైవర్ల ఉపాధికి గండి పడిందని సీఐటీయూ బాపట్ల జిల్లా కార్యదర్శి సీహెచ్ మజుంధర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం డ్రైవర్లు ప్రదర్శన నిర్వహించారు. బాపట్ల జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. మజుంధర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంధనం, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. దీని తోడు పెంచిన జరిమానాలు ఆటో డ్రైవర్లకు కునుకులేకుండా చేస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయారని అని అన్నారు. వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకురూ.25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఆటో కార్మికుల రాష్ట్రవ్యాప్తంగా ఐక్యం చేస్తూ ఉద్యమించాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల పట్టణ నాయకులు కే శరత్, బాపట్ల పాత బస్టాండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.