breaking news
YS Jagan Mohan Reddy
-
సత్వర విచారణ షాకా?
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మోపిన కేసుల్లో రోజువారీగా విచారణ జరిపేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. కేసులు సత్వరం ముగిసేలా సీబీఐతో పాటు ఈడీ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తూ ఉండగా, అందుకు న్యాయమూర్తి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఈడీ పీపీకి ఆదేశాలు జారీచేసి విచారణ ప్రారంభించారు. సీబీఐ కోర్టులో పదేళ్లుగా 9 ఈడీ చార్జిషీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీలైనంత త్వరగా కేసులను ముగించాలని వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. మరోవైపు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతున్న జగన్‌ను ప్రజాక్షేత్రానికి దూరం చేసి కోర్టుల చుట్టూ తిప్పాలన్న చంద్రబాబు అండ్ కో కుట్రలు ఫలించలేదు. జగన్ వ్యక్తిగత హాజరు కోరుతూ బాబు డైరెక్షన్లో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ, ఎల్లో మీడియా మాత్రం వ్యక్తిగత హాజరుకు ఆదేశాలంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అక్కసును వెళ్లగక్కింది. జగన్ న్యాయవాది విజ్ఞప్తికే న్యాయమూర్తి అంగీకరించగా.. జగన్‌కు షాక్ అంటూ విషం చిమ్మడం ప్రారంభించింది. సీబీఐ, ఈడీతో కలసి చంద్రబాబు.. వైఎస్ జగన్ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. బాబు మెప్పుకోసం పచ్చ మీడియా రోజంతా శివాలెత్తిపోయింది. ఆర్డర్ లేదు.. కాపీ కూడా లేదు.. బుధవారం ఉదయమంతా స్క్రోలింగ్‌లతో హడావుడి సృష్టించి పచ్చ మీడియా పైత్యాన్ని వెళ్లగక్కింది. కోర్టులో జరిగే పరిణామాలకూ వక్రీకరణలా? న్యాయస్థానాల్లో జరిగే పరిణామాలను ఎల్లోమీడియా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన ఈడీ కేసుల విచారణ విషయంలోనూ ఇదే ధోరణి స్పష్టమవుతోంది. ఈ కేసుల్లో సత్వర విచారణ చేపట్టాలని ఆయన న్యాయవాది చేసిన విజ్ఞప్తిని, జగన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు చిత్రీకరించడం వెనుక రా>జకీయ దురుద్దేశం తేటతెల్లమవుతోంది. సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈడీ కేసులను రోజువారీగా విచారించాలన్న జగన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తికి న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు రోజువారీ విచారణకు హాజరుకావాలని ఈడీ న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసి.. విచారణ ప్రారంభిస్తున్నామని తెలిపారు. జగన్ వ్యక్తిగత హాజరుకు న్యాయమూర్తి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయలేదు. అయినా, వ్యక్తిగత హాజరుపై ఆదేశాలిచ్చినట్లుగా ప్రచారం చేస్తూ కోర్టు పరిణామాలను వక్రీకరించడమే కాకుండా ప్రజలను కూడా ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తోంది. సత్వర విచారణ కోరితే షాకా? నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారు. నిజానికి కేసుల విచారణ త్వరగా పూర్తికావాలని కోరడం న్యాయపరమైన ప్రక్రియలో భాగం. దశాబ్దకాలంగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా తేల్చాలని జగన్ కోరుతున్న నేపథ్యంలో రోజువారీ విచారణకు న్యాయస్థానం అంగీకరించడం ఆయనకు అనుకూల న్యాయపరమైన పరిణామం. కానీ.. బాబు, భజన మీడియా మాత్రం జగన్‌కు షాక్ అంటూ ప్రచారం చేసింది. కోర్టు ఉత్తర్వుల్లో లేని అంశాలను జోడించి సంచలనాత్మక కథనాల పేర పచ్చ మీడియా బాబు బాకా ఊదుతోంది. ప్రజలను కలవడం కోసం జగన్ ప్రారంభించనున్న మహా పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని కొన్నాళ్లుగా చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. దీని కోసం సీబీఐ, ఈడీ కేసులను వినియోగించుకోవాలని తెర వెనుక అక్రమ రాజకీయం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈడీతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఉన్నత న్యాయస్థానం.. ఈడీ తీరును తప్పుబట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు తాము ఎప్పటికప్పుడు సీబీఐ, ఈడీ కేసులను పర్యవేక్షిస్తున్నామని తేల్చిచెప్పింది. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పచ్చ మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా జగన్ చేస్తున్న విజ్ఞప్తిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. దీనికి కూడా పచ్చ మీడియా వక్రభాష్యాలు చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఆయన విజ్ఞప్తిని ఎక్కడా ప్రస్తావన చేయకుండా సీబీఐ కోర్టు ఆదేశాలంటూ విషం చిమ్మింది. తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే.. నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ? -
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మొదలు సన్‌రే రిసార్ట్ వరకు రోడ్డుకు ఇరు వైపులా భారీ జనసందోహం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికింది. బుధవారం సన్‌రే రిసార్ట్‌లో జరిగిన వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి, తనూజాల వివాహానికి విచ్చేసిన జననేత వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు విమానాశ్రయం ముఖ ద్వారం నుంచే వైఎస్ జగన్‌కు దారిపొడవునా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సన్‌రే రిసార్ట్‌కు వెళ్లేంత వరకు దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. గూడపువలస కూడలి, రాయివలస లేఅవుట్, సన్‌రే ముఖద్వారం వద్ద వేలాది మంది అభిమానులు రహదారిపైకి వచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సన్‌రే రిసార్టు పరిసరాలు జనసందోహంతో కిక్కిరిశాయి. సన్‌రే రిసార్ట్‌లో 500 మంది మహిళలు కోలాటం చేస్తూ.. పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స ఝాన్సీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, కరణం ధర్మశ్రీ, గొర్లె కిరణ్‌కుమార్, వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయకర్త గదల సన్యాసినాయుడు, పార్టీ నేతలు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, కె.కె.రాజు,పతివాడ అప్పలనాయుడు, పిన్నింటి తమ్మునాయుడు, బొత్స చైతన్యబాబు, పతివాడ సత్యనారాయణ, మహంతి జనార్దనరావు, రేగాని శ్రీనివాసరావు, సుందర హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
ముత్యాల నాయుడు మాతృమూర్తి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాతృమూర్తి బూడి సింహాచలమ్మ (88) వయోభారంతో కన్నుమూయడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సింహాచలమ్మ మృతి బూడి ముత్యాల నాయుడు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మాతృ వియోగం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని బూడి ముత్యాల నాయుడికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఇదీ చదవండి: లే కన్నా.. ఇంటికెళ్దాం! -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం
సాక్షి, విజయనగరం జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(బుధవారం) విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించారు. భోగాపురంలోని సన్ రే విలేజ్ రిసార్ట్‌లో జరిగిన వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులు తనూజ–శివారెడ్డిలను ఆశీర్వదించి.. వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.ఇదీ చదవండి: పదవి కోసమే టీడీపీ నేత పరిణయమా..? -
YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్
-
ఇవాళ ఏపీలో పెద్ద డ్రామా నడిచింది!
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉదయం పెద్ద డ్రామా నడిచిందని.. జిల్లాల నుంచి పూర్తి సమాచారం రాకుండానే ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని ఎందుకు ప్రకటించిందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తాయని.. మంగళగిరి, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ఎన్నికల విషయంలో కూటమి పార్టీల మధ్య ఏం జరుగుతుందో చెప్పాలి’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘మంగళగిరిలో ఎస్టీలకు వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా ఆలస్యం చేయటం అన్యాయం కాదా?. చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంత ఆత్రం ఎందుకు?. నెలా రెండు నెలలు ఆగితే వచ్చే నష్టమేంటి?. అక్టోబర్ 16న సవరించిన ఓటర్ల జాబితా వస్తుంటే పాత జాబితాలతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటి?. ఓటర్ల జాబితాలో 44 లక్షల మృతులు, డబుల్ ఓట్లు, వలస వెళ్లినవారి పేర్లు ఉన్నాయని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. మరో 11 లక్షల కొత్త ఓట్లు చేర్చాల్సి ఉండగా పాత జాబితాలతో ఎన్నికలకు వెళ్లడం వెనుక ఉద్దేశమేంటి?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘చనిపోయినవారి పేర్లతో ఓట్లు వేయించాలనుకుంటున్నారా?. డబుల్ ఓట్లను కొనసాగించాలనుకుంటున్నారా?. దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది?. అక్టోబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చి పండుగ రోజుల్లో నామినేషన్లు వేయమనడం ఎంతవరకు సమంజసం?. హిందూ ధర్మం గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబుకు హిందువుల ప్రధాన పండుగలు కనిపించడం లేదా?. రూ.14 వేల కోట్ల నిధుల కోసమే ఎన్నికలంటున్న చంద్రబాబు, డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో కేంద్రంతో మాట్లాడి గడువు ఎందుకు పొందలేరు?. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?..ఒక వైపు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తూ, మరోవైపు నామినేషన్లకు తొందరపెట్టడం ఏం న్యాయం?. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బైండోవర్లు, రౌడీషీట్లు, పాత కేసులతో ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు, సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్‌పై ఎన్నికల కమిషన్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?. ప్రజల సమస్యలపై లేని ఆత్రం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల విషయంలోనే ఎందుకు వస్తోంది?. సవరించిన ఓటర్ల జాబితాతో, ప్రతిపక్షాలకు తగిన సమయం ఇచ్చి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది’’ అని శైలజానాథ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల -
వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా పైత్యం ప్రదర్శిస్తోంది. అక్రమ కేసుల్లో వ్యక్తిగత హాజరుపై ఎలాంటి కొత్త ఆదేశాలు వెలువడకపోయినా.. సీబీఐ కోర్టులో జగన్‌కు షాక్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగింది. అసలేం జరిగిందంటే.. జగన్‌పై దాఖలైన అక్రమ కేసుల్లో ఇప్పటికే రోజూవారీ విచారణలు జరుగుతున్నాయి. అయితే మళ్లీ రోజూవారీ విచారణలు చేయాలంటూ ఈడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిన్న ఈ పిటిషన్కోర్టు ముందుకు రాలేదు. రోజూవారీ విచారణ జరుగుతున్నా.. హైకోర్టుకు ఈడీ వెళ్లిందని నిన్ననే జగన్ తరపు లాయర్లు సీబీఐ కోర్టుకు గుర్తు చేశారు. ఈ కేసులను తామే త్వరగా తేల్చాలని కోరుకుంటున్నామని వైఎస్ జగన్ తరఫు లాయర్లు పునరుద్ఘాటించారు. ఇప్పటికే రోజూవారీ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. ఈ తరుణంలో.. సీబీఐ కోర్టు ఈడీ తరఫు న్యాయవాదుల్ని పిలిచింది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. సీబీఐ సహా ఈడీ చార్జిషీట్లపై వింటామని తెలిపింది. అయితే సీబీఐ కోర్టులో జగన్‌కు షాక్.. వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు అంటూ ఎల్లో మీడియా వక్రీకరించి తప్పుడు కథనాలతో పైత్యం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తరఫు లాయర్లు అసలు విషయాన్ని వెల్లడించారు. ఈడీ కేంద్రంగా కొంత కాలంగా చంద్రబాబు కుట్రా రాజకీయాలకు తెర తీశారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: నోటిఫికేషన్ ముందర ఏపీ సర్కార్‌కు సుప్రీం నోటీసులు -
బాబు నయా ప్లాన్ ... అయితే పొత్తులు కాకపోతే దొంగ ఓట్లు..
-
చంద్రబాబువి పిట్టలదొర మాటలేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గత కొద్ది రోజులలో లక్షల కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలను ప్రకటించింది. వాటన్నిటిని అమలు చేసేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎల్లో మీడియాను ఫాలో అయ్యేవారికి సైతం ఆశ్చర్యం కలిగించేలా ఇందుకు సంబంధించిన కథనాలు కనిపిస్తాయి. ఏడు రోజుల్లో తొమ్మిది కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ మీడియా ఊదరగొట్టింది. సుమారు రెండున్నర లక్షల కోట్లు వ్యయం చేయబోతున్నట్లు ఇవి ప్రచారం చేశాయి. చంద్రబాబు ప్రచారాన్ని, స్పీచ్‌లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిట్టలదొరల మాటలుగా ఎద్దేవ చేశారు. రైతులకు చంద్రబాబు లక్ష మోసాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బహుశా పిట్టల దొరల మాటలు అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఒక బొమ్మ తుపాకి పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ గప్పాలు కొట్టడం అన్నమాట. వారు భుక్తి కోసం అలా చేస్తుంటారు. ఓట్ల కోసం చంద్రబాబు అలా పిట్టల దొరలా ప్రసంగాలు చేస్తుంటారని జగన్ విమర్శ. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గాని, లేదా ఇటీవలికాలంలో ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించి, వారిని మభ్య పెట్టడం కోసం గాని చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇటీవలికాలంలో చంద్రబాబు దాదాపు ప్రతిరోజు హెలికాఫ్టర్‌లో ఏదో ఒక ఊరు వెళుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా ఆయా కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. ఉదాహరణకు పల్లెకు పట్టాభిషేకం, పేదలకు పట్టాభిషేకం, రాయలసీమకు లక్ష కోట్ల ఉద్యాన హబ్, అమరజీవి జలధార, 2029నాటికి పేదలందరికి ఇళ్లు.. ఇలాంటి ఆకర్షణీయమైన పేర్లతో వేల కోట్ల ప్రోగ్రాంలను ప్రకటించారు. ఇవన్ని కలిపితే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంటాయి. ప్రభుత్వం ఇంత ఆర్ధిక వెసులుబాటుతో ఉందా అన్న సంశయం అందరికి వస్తుంటుంది. ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా ఈ నెలలో తొమ్మిదివేల కోట్ల అప్పునకు ప్రణాళిక సిద్దం చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త, కొత్త నినాదాలు, డైలాగులతో ప్రజలను ఏమార్చే పనిలో చంద్రబాబు తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు. 2029 నాటికి పేదలందరికి ఇళ్లు అంటూ చంద్రబాబు బుర్రిపాలెం సభలో చెప్పారు. చిత్రమేమిటంటే పల్లెలలో పేదలకు మూడు సెంట్లు, పట్టణాలలో పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆ ఊసే ఎత్తరు. స్థలాల కోసం సుమారు నాలుగన్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. పైగా విజయవాడ,విశాఖలలో సుమారు అరవైవేల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినట్లు సభలు పెట్టేశారు. ఒక్క సెంటు స్థలం సేకరించకుండా, ఈ పట్టాభిషేకం ఏమిటా అని విస్తుపోతున్నారు. తీరా చూస్తే అవన్ని ఇప్పటికే పేదలు నివసిస్తున్న ఇళ్లకే ఇచ్చిన పట్టాలట. మరి వీరు కొత్తగా ఇచ్చిన పట్టాలేమిటి అని విపక్షం ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆ సభలో ఏకంగా పేదలకు 52వేల కోట్ల ఆస్తి ఇచ్చినట్లు చెప్పేసుకున్నారు. అదెలాగా అని అంతా బిత్తరపోవాల్సిందే. కాకపోతే ఎల్లో మీడియా పత్రికలలో పతాక శీర్షికలలో ఆ వార్త వచ్చింది కనుక ఆ రోజుకు అది ఉపయోగం అని పాలకులు సంతృప్తి పడుతుంటారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ఏకంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీ కాని, ఎల్లో మీడియాకాని నానా యాగి చేశాయి. ఇదీ చదవండి: సీకే కుటుంబానికి సీటిస్తే ఊరుకోంఇంటి స్థలం పొందిన ఆనందంలో తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి ఒక వీడియో చేస్తే, టీడీపీ సోషల్ మీడియా నీచమైన ప్రచారం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది. అమరావతిలో పేదలు ఏభైవేల మందికి ఇళ్ల స్థలాలను జగన్ ప్రభుత్వం ఇస్తే వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.ఆ పేదల స్థలాలవల్ల అమరావతి పాడవుతుందని కూడా చంద్రబాబు అన్నారు. వీరికి పేదలపై ఉన్న శ్రద్ద ఇదన్నమాట అని వైఎస్సార్సీపీ వ్యాఖ్యానించింది. జగన్ టైమ్ లో 20 లక్షల ఇళ్ళు మంజూరు చేయగా, తొమ్మిది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. మిగిలినవాటిలో అత్యధిక భాగం నిర్మాణదశలో ఉన్నాయి. ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంకాని, ఇళ్లు నిర్మించడం కాని చేసిన ఏకైక నేత జగన్ అని ఇండిపెండెంట్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయినా ఆ ఘనత జగన్ కు దక్కకూడదన్న అక్కసుతో ఆ ఇళ్లపై దుష్ప్రచారం చేస్తుంటారు. మరోవైపు వాటిలో పూర్తయిన వాటికి ప్రారంభోత్సవం చేస్తూ తామే చేశామని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు.చిత్రమేమిటంటే రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారంటే రాజకీయం కోసం అలా చేస్తున్నారులే అనుకోవచ్చు. కాని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం అసత్యాలు వల్లె వేశారు. పేదల సొంతింటి కలను జగన్ చెరిపేశారని ఆయన అన్నారట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. కేంద్రమే ఇరవై లక్షల ఇళ్లను నిర్మించడానికి జగన్ ప్రభుత్వానికి అనుమతి ఇస్తే, అందులో దాదాపు సగం పూర్తిఅయి ఎదురుగా కనబడుతుంటే చౌహాన్ ఈ మాట అనడం ఏమిటి? అంటే టీడీపీ వారు ఇచ్చిన స్క్రిప్టు చదివి తన పరువు పోగొట్టుకున్నారన్నమాట. ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార పేరుతో 30వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారట. అయితే గత ప్రభుత్వం చేపట్టిన వివిధ స్కీములను రద్దు చేశారట. రెండేళ్లుగా ఈ పనులు ఎందుకు చేయలేదన్నది కొందరి ప్రశ్న. స్థానిక ఎన్నికలకోసం ఈ హడావుడి అన్నది అర్ధం అవుతూనే ఉంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పధకంలో భాగమే.గత ప్రభుత్వం 27వేల కోట్లతో జల్ జీవన్ స్కీమును అమలు చేసింది. వాటిలో కొన్ని దాదాపు పూర్తి అయ్యాయి. ఇదేదో కొత్త పథకం అన్నట్లు పిక్చర్ ఇవ్వడానికి ప్రభుత్వం పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ విమర్శ. పట్టణాలలో మౌలిక వసతులకు 11 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారు. కాని వర్చువల్ గా చేసిన కార్యక్రమంలో మాత్రం ఏభైవేల కోట్ల పనులు చేస్తామని చెప్పారు. అయితే మున్సిపాల్టీలలో పనులను పిపిపి కింద ప్రైవేటుకు అప్పగించి రుసుములు వసూలు చేసే పద్దతిని తీసుకు వస్తున్నారని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మదనపల్లెలో ఒక భారీ సభ పెట్టి లక్ష కోట్ల ప్రపంచ ఉద్యాన కేంద్రం,ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్ అంటూ ఊదరగొట్టారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇస్తుందని చెప్పినా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఆ సంగతి వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఈసీ ఇలాగేనా వ్యవహరించేది!మిగిలింది ప్రైవేటువారు వ్యయం చేస్తారట. ఇది నమ్మదగిందేనా? ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో ఉద్యానతోటలు ఉన్నాయి. కరువు కారణంగా పలు చోట్ల అవి ఎండుతున్నాయి. ఆ విషయం పై ఆలోచించకుండా కొత్తగా తొమ్మిది లక్షల ఎకరాల పండ్ల తోటలకు లక్ష కోట్లు పెడతామంటే నమ్మశక్యం అనిపిస్తుందా! పల్లెకు పట్టాభిషేకం అంటూ ఇంకో 11వేల కోట్ల పనులు ఆరంభిస్తున్నట్లు మరో సభలో హంగామా చేశారు. ఈ సభలోనే రోడ్డకు కూడా డాక్టర్ లను పెట్టామని, ఎక్కడ రోడ్డుపై గొయ్యి పడినా వెంటనే ఆ డాక్టర్ వెళ్లి పూడ్చుతారని చంద్రబాబు చిత్రమైన ప్రకటన చేశారు.అది విన్న పలువురు తమ గ్రామం వద్ద రోడ్ల దుస్థితిని వివరించి వెంటనే డాక్టర్ లను పంపాలని కోరుతుండడం విశేషం. ఒకసారి ఆర్ధిక పరిస్థితి గట్టెక్కించామని ఆయనే అంటారు. అదే మీటింగ్ లో ఆస్తులు తాకట్టు పెట్టి నిధులు సమీకరిస్తున్నామని చెబుతారు. అంటే అప్పులు చేయడం అన్నమాట. సూపర్ సిక్స్ అమలు చేసేశామని అంటారు. అదెక్కడ! ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు నెరవేర్చారా అని ఎవరైనా అడిగినా ఇచ్చేశామని అనుకో అని డబాయిస్తుంటారు. అందుకే జగన్ వ్యాఖ్యానించినట్లు చంద్రబాబువి పిట్టల దొర మాటలుగానే చూడాలా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్థానిక ఎన్నికలపై YS జగన్ మాస్టర్ ప్లాన్
-
NCC వ్యవస్థాపకుడు కన్నుమూత.. YS జగన్ దిగ్భ్రాంతి
-
నేడే నోటిఫికేషన్.. స్థానిక పోరుపై వైఎస్ జగన్ కీలక భేటీ
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో ఆయన నేడు తాడేపల్లిలో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఛైర్మన్ల అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు.నిన్న పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, ఎన్నికల పరిశీలకులతో జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మేయర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఛైర్మన్ల అభ్యర్థులపై కసరత్తు సాగనుంది.అభ్యర్థుల ఖరారుపై ఫోకస్!నేటి సమావేశంలో మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక, స్థానికంగా పార్టీ పరిస్థితులు, ఎన్నికల ప్రచార ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉంది. గెలుపు అవకాశాలు, స్థానిక నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కసరత్తు జరగనుంది.మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల నిర్వహణలో నేతలకు బాధ్యతలు అప్పగించడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి అంశాలపైనా చర్చించనున్నారు. ఇవాళ షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో వరుస సమావేశాలతో జగన్ అభ్యర్థుల ఖరారు, వ్యూహరచనపై దృష్టి సారించారు.నేడు మున్సిపల్, పరిషత్ ఎన్నికల షెడ్యూల్మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ బుధవారం ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు 661 జెడ్పీటీసీ, 9,983 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరో విడతలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ జరిగే అవకాశముందని సమాచారం. అన్ని జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు బుధవారం తెల్లవారుజాముకల్లా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మంగళవారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. మూడో దశలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి; స్థానిక ఎన్నికల ఓట్లను ఒకేసారి లెక్కించాలి -
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తాడేపల్లిలో కలిశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన విరూపాక్షి.. వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జగన్ ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం తనపై అక్రమ కేసు నమోదు చేసి 68 రోజులపాటు జైలులో ఉంచిందని విరూపాక్షి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జనసేనలో కలకలం.. ముష్టి వేస్తున్నారా? -
బరితెగించి బైండోవర్
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలమై ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు సర్కారు అధికారం అండతో అరాచకాలకు పదును పెట్టింది. సర్వత్రా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహంతో రెడ్‌బుక్ బరితెగింపు చర్యలకు తెగబడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆశావహులను పోటీ నుంచి తప్పించేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని బైండోవర్ వేధింపులకు దిగింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే బైండోవర్ కుట్రలకు తెర తీసింది. వైఎస్సార్సీపీని నిలువరించేందుకు పోలీసులను పురిగొల్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆశావహులకు బైండోవర్ పేరుతో పోలీసుల బెదిరింపులు మొదలయ్యాయి. గుంటూరు, పల్నాడు..చిత్తూరు, అనంతపురం, కృష్ణా తదితర జిల్లాల్లో బైండోవర్ల పేరుతో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను సైతం టార్గెట్ చేసి బైండోవర్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పాలక పక్షానికి ఎదురు నిలవకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయకుండా కక్షపూరితంగా పోలీసులను ప్రయోగించటాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్ఓసీ కోసం మున్సిపాలిటీకి వెళితే.. పోలీసులకు ఫోన్ కాల్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న వారిని సైతం పోలీసులు వదలడంలేదు. మున్సిపాలిటీలు, రెవెన్యూ కార్యాలయాలకు అధికారపక్ష నేతలు ఇచ్చిన డైరెక్షన్‌తో వారు పోలీసులకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వారు ఎవరైనా ఎన్ఓసీ కోసం మున్సిపాలిటీకి, కుల ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తే చాలు.. వెంటనే పోలీసులకు ఫోన్ వెళుతోంది. దీంతో ఆశావహులకు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలంటూ బైండోవర్ చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో పోలీసులు మరింతగా బరి తెగించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటున్న వారికి సీఐలు ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్లకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. మీరు పోటీ చేస్తే ఎన్నికల్లో గొడవలు జరిగితే మీదే బాధ్యత అంటూ హెచ్చరిస్తున్నారు. గొడవలకు మీపై కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారు. నామినేషన్ కూడా వేయకముందే బైండోవర్, ఆ తర్వాత ఏదైనా జరిగితే కేసులు పెడతామని పోలీసుల ద్వారా బెదిరిస్తూ చంద్రబాబు సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది. సోషల్ మీడియానూ వదలని పోలీస్ జులుం.. స్థానిక ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పోలీసులు మరింత జులుం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని బైండోవర్ పేరుతో వేధిస్తున్నారు. పోలీసులు పల్నాడు జిల్లాలోని ఒక్క గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోనే వీడియోలు పెట్టారనే సాకుతో ఏకంగా 600 మందికిపైగా బైండోవర్ చేయడం గమనార్హం. గురజాల మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు ‘సెల్ఫీ చాలెంజ్’ విసిరారు. కనీసం నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలు అమలు చేసి స్థానిక ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సెల్ఫీ చాలెంజ్ విసిరి సామాన్య ప్రజల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ వీడియోలు పోస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్‌కు రప్పించి బైండోవర్ పేరుతో వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, బాగా పనిచేస్తోందని కొందరిని భయపెట్టి కౌంటర్ వీడియోలు చేయిస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోనూ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా జిల్లా కార్యదర్శి వాళ్ల సురేష్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. వైఎస్సార్సీపీ తిరుపూరు నియోజకవర్గ మైనారిటీ కన్వీనర్ జాకీర్‌తోపాటు పలువురు నేతలపై బైండోవర్ పేరుతో కక్ష సాధింపులకు దిగారు. గ్రామాల్లోనూ బైండోవర్లు.. పట్టణాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దశలో గ్రామాల్లో సైతం పోలీసులు బైండోవర్ల ప్రక్రియకు తెర తీయడం గమనార్హం. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇదే దారుణ పరిస్థితి నెలకొంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 15 నుంచి 20 మంది వరకు బైండోవర్లు చేసినట్టు సమాచారం. మాచర్ల, గురజాల, నరసరావుపేటలో ఇప్పటికే బైండోవర్ కేసులు పెట్టారు. చిత్తూరు జిల్లా రూరల్ మండలంలో తుమ్మింద, గువ్వకల్లు, మురకంబట్టు, నాయని చెరువు, చెర్లోపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీకి చెందిన వారిని పథకం ప్రకారం పోలీసులు బైండోవర్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెల రోజుల ముందు నుంచే ప్రభుత్వం బైండోవర్ కుట్రలకు పదును పెట్టింది. పోలీసులు చేయాల్సింది ఇదీ..! ఎన్నికలు, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ/బీఎన్ఎస్ఎస్) ప్రకారం అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడతారు. పాత నేరస్తులను, షీట్స్ ఉన్న వారిని, గొడవలకు సంబంధించిన ఎక్కువ కేసుల్లో నిందితులను రప్పించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బైండోవర్ చేస్తారు. ఎటువంటి గొడవలకు పాల్పడబోమని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సొంత హామీ (పూచీకత్తు)తో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తారు. పోలీసులు చేస్తోంది ఇదీ..! బైండోవర్ ముసుగులో వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులను ప్రయోగించి వైఎస్సార్సీపీ ఆశావహులను కేసుల పేరుతో బెదిరించి పోటీ నుంచి తప్పించేందుకు చంద్రబాబు సర్కారు పథకం వేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కీలక కార్యకర్తల నుంచి మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలకు పోలీసులు వరుసగా బైండోవర్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఎలాంటి రాజకీయ నిరసనలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని హెచ్చరిస్తున్నారు. బాండ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇలా విపక్షాన్ని టార్గెట్ చేసి కనీసం నామినేషన్ కూడా వేయకుండా చంద్రబాబు ప్రభుత్వం బైండోవర్, కేసుల పేరుతో పోలీసులను ప్రయోగించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. బాబుకు ఓటమి భయం.. చతుర్ముఖ కుతంత్రం!స్థానిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతుండటంతో పోలీసులను పావులుగా వాడుకునేందుకు చంద్రబాబు చతుర్ముఖ కుతంత్రం పన్నారు. యాక్టివ్‌గా ఉండే వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించడం.. బైండోవర్ పేరుతో వేధింపులకు పాల్పడటం.. శాంతి భద్రతల పేరుతో స్థానికంగా లేకుండా చేయడం... మలిదశ పోలింగ్ జరిగేలా చేసి అనుకూల పోలీసులు, అధికారులతో లబ్ది పొందే ఎత్తుగడ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై రెండున్నరేళ్లుగా అనేక అక్రమ కేసులను చంద్రబాబు సర్కారు బనాయించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీటిని తెరపైకి తెచ్చి బైండోవర్ పేరుతో బెదిరిస్తోంది. కీలకమైన నామినేషన్ల దశలో విపక్ష నాయకులు, కార్యకర్తలు స్థానికంగా లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. పోటీ చేయబోతున్న అభ్యర్థులపై అక్రమ కేసులు మోపి నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తోంది. కొన్నిచోట్ల మలి దశ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కల్పించి పోలీసులను మోహరించి బూత్‌లను క్యాప్చర్ చేసి ఏకపక్ష ఎన్నికలకు కుటిల వ్యూహం పన్నింది. చట్టానికి లోబడి పనిచేసే అధికారులను గుర్తించి స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఫిర్యాదులు చేయించడం, తమకు అనుకూలమైన వారిని అక్కడకు రప్పించుకోవడం లాంటి అనైతిక చర్యలకు అధికార పక్షం ప్రణాళిక రచించింది. -
బరిలో బలమైన అభ్యర్థులు
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన, అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో... రెండున్నరేళ్లగా కొనసాగుతున్న దుర్మార్గ పాలన, వాటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ మరోమారు పార్టీ సీనియర్ నేతలతో మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక, సమర్థంగా ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లతో చర్చించారు. జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరిగాయి. సంబంధిత రీజినల్ కో–ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ అబ్జర్వర్లతో వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలు జరిపారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చ జరిగింది. బాబు అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలిరాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని పార్టీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదిత అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్ విషయంలో అధికారుల ద్వారా అక్రమాలు చేయిస్తున్నారన్నారు. విశాఖలో శశికళ అనే తాజా మాజీ కార్పొరేటర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఆమెకు ఓసీ కాపుగా సర్టిఫికెట్ ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. దీనిపై పోరాడి పరిష్కారం దక్కించుకునేలోగా ఎన్నికల సమయం ముగుస్తుందని, చంద్రబాబు ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని అంశాలపై రీజినల్ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. అసెంబ్లీ అబ్జర్వర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలని, వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకు రావాలని, లీగల్ టీమ్‌ను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎన్నికల కమిషన్‌తో పాటు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలపై బైండోవర్లు పేరిట పోలీసులు వేధింపులకు దిగుతున్న ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. -
ఎన్సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి: ఎన్సీసీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఏవీఎస్ రాజు మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాణ, మౌలిక వసతుల రంగాల్లో సుదీర్ఘకాలం విశేష సేవలందించిన ఆయన.. ఎన్సీసీ సంస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.ఏవీఎస్ రాజు చేసిన సేవలు చిరస్మరణీయమని జగన్ అన్నారు. ఆయన ప్రతిభ, కృషికి గుర్తింపుగానే పద్మశ్రీ పురస్కారం లభించిందని తెలిపారు. అలాంటి వ్యక్తి మరణం నిర్మాణ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.ఏవీఎస్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏవీఎస్ రాజు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, ఎన్సీసీ సంస్థ ప్రతినిధులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
స్థానిక ఎన్నికల అభ్యర్థులపై వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు
తాడేపల్లి: రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేశారు. రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు పరిశీలకులతో వన్ టు వన్ చర్చలు జరిపారు వైఎస్ జగన్. సగం కార్పొరేషన్లలో అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయింది. రేపు కూడా ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. మున్సిపల్ సీట్లపై కూడా ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక, సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీకి చెందిన రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లతో వైఎస్ జగన్ చర్చించారు. జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరిగాయి. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై ఆయన వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చ జరిగింది. బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలి రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన, అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇంకా రెండున్నరేళ్లగా రాష్ట్రంలో సాగుతున్న దుర్మార్గపాలన, వాటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదిత అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నోడ్యూ సర్టిఫికెట్ విషయంలో అధికారులతో అక్రమాలు చేయిస్తున్నారన్నారు.విశాఖపట్నంలో శశికళ అనే తాజా మాజీ కార్పొరేటర్ ఎస్సీ కులస్తురాలు అయితే, ఆమెకు ఓసీ కాపుగా సర్టిఫికెట్ ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. దీనిపై పోరాడి పరిష్కారం దక్కించుకునేలోగా ఎన్నికల సమయం ముగుస్తుందని, చంద్రబాబు ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరిస్తున్నాడని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని అంశాలపై రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు స్పందించాలని కోరారు. అసెంబ్లీ అబ్జర్వర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలని, వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకు రావాలని, లీగల్ టీంను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా విషయాన్ని వెంటనే ఎన్నికల కమిషన్‌తో పాటు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని నిర్దేశించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బైండోవర్ల పేరిట పోలీసులు వేధింపులకు దిగుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టాన్ని ధిక్కరిస్తూ వ్యవహరించే వారిపై న్యాయపోరాటం తప్పదనే సందేశం ఇవ్వాలన్నారు. పార్టీ పట్ల అత్యంత విశ్వసనీయత, విధేయత ఉన్న వారికి అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్ జగన్ చెప్పారు.ఇదీ చదవండి: ‘ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మేలు కనిపించదా?’ -
రేపు వైఎస్ జగన్ విజయనగరం పర్యటన అందుకే.. పూర్తి షెడ్యూల్
-
వైఎస్ జగన్‌ను కలిసిన కడప అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కడప అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివానంలో కడప అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు కలిసి ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానం అందించారు. ఈ నెల 24 నుండి జరుగనున్న ఉర్సు ఉత్సవాలకు రావాల్సిందింగా వైఎస్ జగన్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో దర్గా పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ, చీఫ్ ముజావర్ అమీరుద్దిన్, ఇతర ప్రతినిధులు ఉన్నారు. దీనిలో భాగంగా వారికి ఉర్సు ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని వైఎస్ జగన్ సూచించారు. ‘మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలం కడప అమీన్ పీర్ దర్గా. అన్ని వర్గాల ప్రజలు భక్తిశ్రద్ధలతో దర్గాను దర్శించుకుంటారు. హిందూ–ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావమే మన సమాజ బలం. మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా ఉర్సు ఉత్సవాలు నిలవాలి. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనాలి. సామరస్య సందేశాన్ని చాటాలి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్ జగన్ -
దీనా పాపా ఆపరేషన్ కోసం 40 లక్షలు.. జగనన్న మాకు ఇచ్చిన భరోసా
-
నేడు రీజనల్ కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ కీలక సమావేశం
-
రీజినల్ కో ఆర్డినేటర్లతో YS జగన్ సమావేశం
-
ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్ జగన్
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ దుస్థితిని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఓ కుటుంబం.. ఆయన దృష్టికి తీసుకొచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్‌ను ముసునూరు మండలం వేల్పుచర్లకు చెందిన మహిళ జంగం మాధవి కలిశారు. తన18 నెలల పాప వినికిడి లోపంతో బాధపడుతుందని వైఎఎస్ జగన్ దృష్టికి తల్లి మాధవి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ వర్తించదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లి ఆవేదనకు వైఎస్ జగన్ చలించిపోయారు.రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కారు చేతులెత్తేస్తోంది. 2019–24 మధ్య పేద ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయి భరోసానిస్తూ అన్ని రకాల క్యాన్సర్లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత పెద్ద జబ్బులకు ఉచిత చికిత్సలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ సర్కార్ బలోపేతం చేసిన సంగతి తెలిసిందూ. అంతకు ముందు చంద్రబాబు పాలనలో 1059 ప్రొసీజర్లు ఉండగా, 2019 తర్వాత ఏకంగా 3,257కు ప్రొసీజర్ల సంఖ్యను పెంచింది. దీంతో కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో లేనన్ని ప్రొసీజర్లు ఒక్క ఏపీలోనే అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: దుబారా బాబు.. డిజిటల్ డాబు -
వైఎస్ జగన్‌తో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ల భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. జిల్లాల వారీగా వైఎస్ జగన్.. ముఖాముఖి నిర్వహిస్తున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులపై వైఎస్సార్సీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి ఖరారయ్యారు. మిగతా అభ్యర్థులపై వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులంతా ఖరారయ్యే ఛాన్స్ ఉంది.కాగా, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న (సోమవారం) పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలే అజెండాగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి విచ్చేసి దిశానిర్దేశం చేశారు. పార్టీకి ప్రతి అనుబంధ విభాగం కీలకమన్నారు. అన్ని విభాగాలు సమర్థంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు.ఇదీ చదవండి: మున్సిపోల్స్‌కు రె'ఢీ' -
విజయవాడ రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేసిన వైఎస్ జగన్.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు మృతుల కుటుంబాలకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు.కాగా, విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ కారు (ఈవీ) రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన మరుక్షణమే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.ఇదీ చదవండి: విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం -
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించిన విషయాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజారంజక పాలన అందించారని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, అలాగే రైతన్నలకు అండగా నిలిచారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. సీఎంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందినప్పటికీ, ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి చవిచూడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అన్ని సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్ ఎందుకు ఓడిపోయారు? ఏపీలో అసలు ఏం జరిగిందనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.ఎన్నికల సంఘం పాత్రపై చర్చగత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం వ్యవహారశైలేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలైనప్పటికీ, ఎన్నికల సరళి, ఫలితాల మధ్య పొంతన లేకపోవడం వెనుక వ్యవస్థల ప్రభావం ఉందనే కోణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చేశారు. -
Komatireddy: ఏపీలో జగన్ ఓటమికి కారణం ఇదే..
-
స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తాం.. వల్లభనేని వంశీ
ఆంధ్రప్రదేశ్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గన్నవరం మండలం దావాజీగూడెంలోని ఎస్వీఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.గన్నవరం నియోజకవర్గంలో గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 30 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిందని వంశీ గుర్తుచేశారు. అయితే, గత ఎన్నికలకు ముందు జగన్‌పై దుష్ప్రచారం చేశారని, భూములు లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం సాగించారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో 4,500 ఇళ్ల పట్టాలు నిలిచిపోయాయని తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ పట్టాలను పంపిణీ చేయలేదని విమర్శించారు.పేద ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఎన్టీఆర్, వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారని వంశీ పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు నిరంతరం పనిచేశారని అన్నారు. అలాగే, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్ ప్రజలకు సేవలందించారని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అనేక కేసులు నమోదు చేశారని వంశీ ఆరోపించారు. దీంతో కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. అయితే, ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోందని వంశీ ఆరోపించారు. అలాగే, బడులు, గుళ్ల పక్కన కూడా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తే ప్రజలకు మరింత మంచి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దీంతో స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఇదీ చదవండి: ‘లోక్‌భవన్ ముట్టడి’పై పోలీసు ప్రతాపం -
శరన్నవరాత్రుల వేళ.. రాష్ట్ర ప్రజలకు YS జగన్ శుభాకాంక్షలు
-
శరన్నవరాత్రి వేడుకలు.. రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు భక్తులకు వివిధ అలంకారాలలో దర్శన మివ్వనున్నారు.ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, భక్తులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 11, 2026 -
సంక్షోభంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగం సంక్షోభంలో పడుతోంది. 2030 నాటికి 1.11 కోట్ల మంది వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. హెల్త్ వర్క్‌ఫోర్స్ లెవెల్స్, ట్రెండ్స్–2026 నివేదికను డబ్ల్యూహెచ్ఓ తాజాగా ప్రచురించింది. భారత్ సహా 122 దేశాల వైద్యుల డేటాను విశ్లేషించింది. ఈ నేపథ్యంలో వైద్యుల్లో 25 శాతం మంది 55 ఏళ్లు, ఆ పైన వయసులో ఉన్నట్లు తెలిపింది. వీరంతా వచ్చే దశాబ్ద కాలంలో రిటైరైతే వైద్యుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇలా ప్రపంచానికే వైద్యుల కొరత గండం పొంచి ఉన్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించకుండా రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కల్పన, ఎక్కువమంది వైద్యులను తయారుచేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. వీటిలో 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు అక్కడ తరగతులు ప్రారంభించకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది. ఫలితంగా మన పేద విద్యార్థుల వైద్యవిద్య కల చెదిరిపోవడమే కాకుండా, రాష్ట్రానికి కొత్తగా వైద్యులు సమకూరే అవకాశాలు లేకుండాపోతున్నాయి. అనుమతులు వచ్చినా ప్రారంభించకుండా..ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతీ 10 వేల జనాభాకు 45 మంది వైద్యులు, నర్సులు ఉండాలి. కానీ, మన దేశంలో వీరు ఈ అవసరాలకు తగ్గట్లుగా లేరు. దీన్ని అధిగమించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2014 నుంచి దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అయితే, 2014–19 మధ్య కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేయకుండా చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం తలపెట్టారు. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేయడంతో పాటు, ప్రతీ జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒకేసారి 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చేపట్టడమే కాకుండా వందేళ్ల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2023–24లో ఏకంగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా సార్వత్రిక ఎన్నికల నాటికే అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే, ఆ ఏడాది అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలన్నీ ప్రైవేట్‌కు ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పులివెందుల వైద్య కళాశాలను ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అనుమతులిచ్చినా మాకు కళాశాల వద్దని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా లేఖ రాసి అనుమతులు రద్దుచేయించింది. ఇలా 2024–25లో నాలుగు, 2025–26లో ఆరు వైద్య కళాశాలలు చొప్పున 10 వైద్య కళాశాలలు ప్రారంభించకుండా చంద్రబాబు గాలికొదిలేశారు. తీవ్రంగా నష్టపోతున్న పేద విద్యార్థులుప్రైవేట్ మోజులో చంద్రబాబు కుట్రల కారణంగా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులు పెద్దఎత్తున ఎంబీబీఎస్, పీజీ సీట్లను కోల్పోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 చొప్పున రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలోనూ కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కాకపోవడంతో మరో వెయ్యి సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు. ఈ లెక్కన మూడేళ్లలో ఏకంగా 3,500 మంది విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రచించిన ప్రణాళిక ప్రకారం 10 వైద్య కళాశాలలు ప్రారంభమై ఉంటే.. మొదటి బ్యాచ్ విద్యార్థులందరూ 2030 నుంచి వైద్య పట్టభద్రులుగా బయటకు వచ్చేవారు. 2030లో 700 మంది, ఆ తర్వాతి ఏడాది నుంచి ఏటా 1,750 మంది వైద్య పట్టభద్రులు రాష్ట్రానికి సమకూరేవారు. అంతేకాక.. ప్రతీ కాలేజీలో 20 వరకూ పీజీ సీట్లు సమకూరి భవిష్యత్తులో ఏటా 200 మంది కొత్త స్పెషలిస్ట్ వైద్యులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. -
బీసీలకు వెన్నుపోటు అడ్డంగా దొరికినా బుకాయింపే
సాక్షి, అమరావతి : పార్లమెంట్ చట్టం ద్వారా తప్ప కేవలం జీవోలతో సాధ్యం కాని బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు సగం జనాభా ఉండే వెనుకబడిన తరగతి ప్రజలను మభ్యపెడుతోంది. ఈ క్రమంలో ఆడిన రాజకీయ డ్రామాలో అడ్డంగా దొరికి పోయినా, సీఎం చంద్రబాబు.. మంత్రులు మాత్రం ఇంకా బుకాయించడం మానుకోలేదు. బీసీలకు వెన్నుపోటు పొడవడం అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నా, దాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పైకి నెట్టేసి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ పిటీషన్ దాఖలు చేయకపోయినా, నింద మోపాలని చూస్తున్నారు. మరో వైపు 2020–21లో జరిగిన గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అప్పటి జగన్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో అధికారుల స్థాయిలో ఏ స్థానంలో, ఏ సామాజిక వర్గ అభ్యర్థి పోటీ చేయాలనే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టులో నిలబడదని తెలిసీ కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ జీవో ఇచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాక కేబినేట్ తీర్మానం పేరుతో మరో డ్రామాకు తెరతీసింది. టీడీపీ నేత ద్వారా కోర్టుకు వెళ్లి అడ్డగింత2020–21లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ బిర్రు ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఈ నేతను ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్ (ఎపీఎస్ఈజీసీ)లో సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 96 జారీ చేసింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నా, మంత్రులు మాత్రం తాజాగా శనివారం (అక్టోబరు 10న) కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలేయడం దారుణం అని సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆ రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు 2020 జనవరిలో రాష్ట్ర హైకోర్టు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అప్పట్లో జనవరి 17వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకోగా, అప్పటి జగన్ ప్రభుత్వం తీసుకున్న 59 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత బిర్రు పత్రాప్‌రెడ్డి 2020 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చి.. తిరిగి ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా 2020 జనవరి–ఫిబ్రవరి నెలల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఐదేళ్ల కిత్రం ఎన్నికల్లోనే బీసీలకు 34 శాతం పదవులు 2020–21లో జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు రాష్ట్ర హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని ఆదేశాల అనంతరం కూడా అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు దాదాపు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పటికి రాష్ట్రంలో మొత్తం 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా, వాటిలో 34 మున్సిపల్ చైర్మన్ పదవులను బీసీలకే కేటాయిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు 2020 మార్చి 7వ తేదీన గెజిట్ నెంబరు 4 జారీ చేసింది. అప్పటికి ఉన్న 16 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు 5 పదవులు కట్టబెట్టింది. అయితే ప్రస్తుత వెన్నుపోటు ప్రభుత్వం.. ఇదివరకెన్నడూ లేని విధంగా బీసీలకు 34 శాతం పార్టీ పరంగా ఇవ్వనున్నామని చెప్పుకోవడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
ఈడీ.. ఎల్లో కేడీ!
సాక్షి, అమరావతి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలో పనిచేసే దర్యాప్తు సంస్థ. ప్రధానంగా మనీలాండరింగ్, విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేయడం దీని బాధ్యత. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్తా ‘ఎల్లో ఫోర్స్ డైరెక్టరేట్’గా రూపాంతరం చెందింది. బాధ్యతలను గాలికొదిలేసింది. చట్టాలను, కోర్టులను చట్టుబండలను చేసేసింది. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఆడమన్నట్టల్లా ఆడడం. ఏది చెబితే అది చేయడం... ఈడీ ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అనుకుంటే చంద్రబాబు జేబు సంస్థ అయిపోయిందని విమర్శకులంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతరులపై నమోదైన మనీలాండరింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని, వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సంధించిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్ధమౌతుంది. ఇప్పటికే రెగ్యులర్ విచారణ జరుగుతూ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న వ్యవహారంపై మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది, ఆర్థికల్ 21 ప్రస్తావనపై సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు, వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు, వాటిపై ముందుగానే ఎల్లో మీడియా లో కథనాలు, ఈడీ ప్రెస్‌నోట్, పొలిటికల్ పార్టీ తరహాలో చేసిన ట్వీట్ చూస్తే ఈడీ ఏ స్థాయికి ‘ఎల్లో ఫోర్స్’గా దిగజారిందో తేటతెల్లమవుతుంది. పలు కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు, దిగువ కోర్టులు పలు మార్లు మొట్టికాయలు వేసినా ఈడీ తీరు మారడం లేదు.అవినాష్‌కు నోటీసు.. ముందే ఎల్లో మీడియాలో..వివేకా హత్య కేసుతో ఎలాంటి సంబంధమూ లేని అవినాష్ రెడ్డిపై ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు, చార్జిషీట్లు, అనుబంధ చార్జిషీట్లు అన్నీ ముగిసి కోర్టులో విచారణ కూడా కొలిక్కి వచ్చిన తర్వాత చంద్రబాబుకు మళ్లీ ఏడేళ్ల తర్వాత అవినాష్ అవసరమొచ్చాడు. వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. చంద్రబాబు చెప్పినట్టుగానే.. చెప్పిన సమయంలోనే ఓ నోటీసు ఇచ్చేసింది. ఇక్కడ విశేషమేమిటంటే.. అవినాష్ కు అక్టోబర్ 3న నోటీసు ఇస్తే.. నోటీసు ఇవ్వబోతున్న విషయం చంద్రబాబుకు సన్నిహితులైన ఎల్లో మీడియా అధినేతలకు మూడు రోజులు ముందే తెలిసిపోయింది. అక్టోబర్ 1నే ఈ నోటీసు విషయాన్ని ఎల్లో పత్రికలు, చానళ్లు ప్రముఖంగా ప్రచురించేసాయి.. ప్రసారం చేసేశాయి.అంటే అర్ధం కావడం లేదూ ఈడీ ఏం చేస్తుందో.. ఎవరి తరఫున పనిచేస్తుందో... ఒక్క అవినాషే కాదు.. చంద్రబాబు వేలు ఎవరివైపు తిరిగితే వాళ్లను వేధించడం ఈడీ ప్రధాన బాధ్యత అన్నట్టు అయిపోయింది. మిధున్‌రెడ్డి అయినా, కారుమూరి నాగేశ్వరరావైనా, సునీలైనా, అంబటి రాంబాబైనా.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అయినా.. విక్రాంత్‌రెడ్డి అయినా.. నోటీసులు, అరెస్టులు, వేధింపులు మామూలే. చంద్రబాబుకు అవసరమొచ్చినపుడు వెంటనే ఈడీ వాలిపోతోంది. బాబు ప్రత్యర్థులకు.. అంటే వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు.. జనం దృష్టిని మళ్లించడం మామూలైపోయింది. అంటే చంద్రబాబు రాజకీయ అవసరాలను తీర్చే ఒక పనిముట్టులా ఈడీ మారిపోయింది. టార్గెట్ జగన్... ఈడీ కొత్త మిషన్..ఈడీకి చంద్రబాబు ఇప్పుడు ఓ కొత్త మిషన్ అప్పగించారు. అదే టార్గెట్ జగన్. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ తమ వాణి వినిపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రజాక్షేత్రం నుంచి తప్పించి కోర్టుల చుట్టూ తిప్పాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందులో భాగంగానే వేగవంతమైన విచారణ పేరుతో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ హైకోర్టును అభ్యర్థించడం. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం తప్ప ఇందులో ఈడీ చట్టబద్ధంగా చేస్తున్న డ్యూటీ ఏదీ లేదు. ఎందుకంటే సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై ఇప్పటికే రోజువారీ ట్రయల్ నడుస్తోంది. జగన్ తరఫున న్యాయవాదులు హాజరై తమ వాదనలను కూడా వినిపిస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా వ్యక్తిగతంగా జగన్ హాజరు కావాలంటూ ఈడీ పిటిషన్ వేయడం కచ్చితంగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం జరుగుతున్న దురుద్దేశ చర్య మాత్రమేనని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. చంద్రబాబు వేస్తున్న సొంత సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)లు ఆయన క్షేమం కోసం, ఆయన చెప్పినట్లు దర్యాప్తు చేయడం కోసం పరుగులు పెడుతుంటాయి. ఇపుడు ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ అనే గౌరవాన్ని కోల్పోయిందని, చంద్రబాబు సిట్‌కు ఎక్స్టెన్షన్ ఆఫీసులా మారిపోయిందని న్యాయవర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా..ఆల్రెడీ సీబీఐ కోర్టులో రెగ్యులర్‌గా విచారణ జరగడం, హైకోర్టుకు ఎప్పటికప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేయడం జరుగుతున్నాయి. అయినా తుత్తర ఆగక ఈడీ అడిగినట్టుగానే కొద్దికాలం క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు వేగవంతమైన విచారణ జరగాలంటూ కేసు వేస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెల్సిందే. అలాగే మరో రెండు కేసుల విచారణ సందర్భంగానూ కోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయి. తెలంగాణ హైకోర్టులో జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ 2022 సెప్టెంబర్8న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అతి ముఖ్యమైన తీర్పునిచ్చింది. ఈడీ కేసులో తుది తీర్పును సీబీఐ ప్రధాన కేసులో తీర్పు వెలువడే వరకు వాయిదా వేయాలని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ కేసులో తీర్పు ముందుగా రావడం న్యాయ ప్రయోజనాలకు అనుకూలమని పేర్కొంది. నేరం ద్వారా ఆదాయం వచ్చిందని నిర్ధారించే ముందు, అసలు ఆ వ్యక్తి సంబంధిత నేరానికి పాల్పడ్డాడా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అలాగే విజయ్ మదన్‌లాల్ చౌదరి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో 2022 జులై 27న సుప్రీంకోర్టు కూడా ఇదే విధమైన తీర్పు ఇచ్చింది. అసలు నేరం జరిగిందా? ఎవరి పాత్ర ఎంత అనే విషయాలను సీబీఐ తేల్చాల్సి ఉందని, ఆ తర్వాతే నేరం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే విషయాలను ఈడీ తేల్చ వచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. మరి జగన్ కేసుల విషయంలో ఈడీ ఎందుకు తొందర పడుతోంది? వాస్తవమేమిటో తేలకుండా తొందరపాటులో ఔచిత్యమేమిటి? ఎవరు చెబితే ఇలా నిబంధనలకు, న్యాయస్థానాలకు విరుద్ధంగా ఈడీ తొందరపడుతోంది...?తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే..నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ? పొలిటికల్ ప్రెస్‌నోట్.. ట్వీట్..కొత్తగా కేసులు నమోదైనప్పుడో, లేదా ఒక కేసుకు సంబంధించి రికవరీలు ఉన్నప్పుడో ఈడీ ప్రెస్నోట్లు విడుదలచేయడం సహజంగా జరుగుతుంటుంది. కాని, అకస్మాత్తుగా ఏ పరిణామం లేకుండానే, కొనసాగుతున్న కేసులగురించి, అందులోనూ కోర్టుల్లో ట్రయల్ నడుస్తున్న కేసులగురించి ఈడీ ప్రెస్‌నోట్ రిలీజ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈడీ ప్రెస్ నోట్ చూస్తే అందులో అది దర్యాప్తు సంస్థ ప్రెస్‌నోట్ మాదిరిగా కాకుండా, పూర్తిగా రాజకీయ అంశాలతో ముడిపడినట్టుగా స్పష్టంగా ఉంది. ఈడీ ప్రకటన వెలువడిన వెంటనే ఎల్లో మీడియా మరింత శివాలెత్తిపోయింది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని అర్ధం కావడం లేదూ? అయినా ఓ రాజకీయ పార్టీ ట్వీట్ చేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ ట్వీట్ చేయడం చూస్తే ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర దాగి ఉందో తెలుస్తూనే ఉంది.ఈడీ బరితెగింపును బట్టబయలు చేసిన హైకోర్టు..జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా మోపిన కేసుల విచారణకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఈడీపై కీలక ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా ఇచ్చినప్పుడు మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంలో ఈడీ ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. సంబంధిత కేసుల విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు తమకు తెలుసని వ్యాఖ్యానించింది. జగన్‌తో పాటు ఇతరులపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసుల్లో రోజువారీ విచారణ జరిపించి, త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషి, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసినప్పుడు, మరో పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణ కొనసాగుతున్నప్పుడు, మళ్లీ ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటన్న అంశాన్ని ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని గుర్తుచేస్తూ, ఈడీ తన పిటిషన్లో ఆ నిబంధనను ఎలా ప్రస్తావిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, తాజా పిటిషన్ విచారణార్హతపైనా సందేహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్), సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నమోదైన సుమోటో కేసులతో కలిపి ప్రస్తుత పిటిషన్‌ను విచారణకు జాబితా చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. -
పాకాల బీచ్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: పాకాల బీచ్ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. ‘‘గల్లంతైన వారి ఆచూకీ కోసం అవసరమైన సహాయక, గాలింపు చర్యలకు వేగవంతం చేయాలి. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని బాధిత కుటుంబాలకు భగవంతుడు ప్రసాదించాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు.కాగా, ప్రకాశం జిల్లా సింగరాయ కొండ మండలం పాకల బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏడుగురు యువకులు సముద్రంలో స్నానానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు వారిలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఇదీ చదవండి: అందుకే జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు: నితిన్ నబీన్ -
సీపీఎం నేత గఫూర్ కుమారుడి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఎం నేత గఫూర్ కుమారుడు కిరణ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి.. కాలిఫోర్నియాలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ.. మంచి భవిష్యత్తు కలిగిన కిరణ్ అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు.కన్నకొడుకును కోల్పోయిన ఎం.ఎ. అబ్దుల్ గఫూర్, పి. నిర్మల గార్ల దుఃఖం వర్ణనాతీతం. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలన్న వైఎస్ జగన్.. కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కిరణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఇదీ చదవండి: ఈసీకి వైఎస్సార్సీపీ 3 కీలక లేఖలు -
జగన్ కీలక నిర్ణయం.. YSRCP అమెరికా కన్వీనర్ గా శివ మేక
-
బీసీలకు బాబు ద్రోహం? 34% రిజర్వేషన్లు ఏమయ్యాయి? బాబుకు జగన్ సవాల్
-
చంద్రబాబూ... మీరు మిస్టర్ 420... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
చంద్రబాబూ.. బీసీలకు క్షమాపణ చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు పచ్చి బూటకమని, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన నయవంచన పూర్తిగా బట్టబయలైందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో ఆయన 420 అని మరోమారు స్పష్టమైందన్నారు. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారి అని మరోసారి తేలిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దు చేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9 వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. -
చంద్రబాబు పెద్ద మోసకారి.. మరోసారి తేలిపోయింది
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలన్న ఆయన.. రిజర్వేషన్ల పేరుతో మోసం చేయటంపై మండిపడ్డారు. ‘‘స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయింది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దుచేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే. చంద్రబాబూ.. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?.@ncbn గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి! https://t.co/vbSjVEa2zf https://t.co/qA2PPsi4ga— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2026 -
నీకు నిజంగా BCలపై ప్రేమ ఉంటే... బాబుని ఇచ్చిపడేసిన గోరంట్ల మాధవ్
-
రతన్ టాటాకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. రతన్ టాటా విలువలు, సేవలు, మానవతా దృక్పథం తరతరాలకు స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘వినయం, సేవాభావం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా జీవితం. భారత పారిశ్రామిక రంగానికి కొత్త దిశానిర్దేశం చేసిన మహనీయుడు రతన్ టాటా. వ్యాపార విజయాలతో పాటు, సామాజిక సేవకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. రతన్ టాటా విలువలు, సేవలు, మానవతా దృక్పథం తరతరాలకు స్ఫూర్తిదాయకం. రతన్ టాటా గారి వర్ధంతి సందర్భంగా ఆయన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు’ అని పోస్టు చేశారు. Remembering the titan of Indian industry and a true pioneer, Shri Ratan Tata Ji, on his death anniversary. A life defined by humility, service and compassion that inspires generations. https://t.co/u1Z3CBqp13— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2026ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ -
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ కసరత్తు
-
YS జగన్ ను కలిసిన BRS నేత పిల్లుట్ల రఘు
-
నాడు 243.. నేడు 29 పోస్టులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌష్టికాహార లోపం నివారణ, మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీపై తీవ్ర గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన 243 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం కేవలం 29 పోస్టులకే పరిమితం చేస్తూ జీవో జారీ చేయడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకంగా 214 పోస్టులను గాల్లో కలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేయడమేనని అభ్యర్థులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీల పర్యవేక్షణ, బాలింతలు, గర్భిణులకు పోషకాహార పంపిణీ బాధ్యతలను చూసే పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 243 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 61 సీడీపీవో/ఏసీడీపీవో, 161 గ్రేడ్–1 సూపర్వైజర్, 21 చి్రల్డన్స్ హోమ్స్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. 2023లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీఎస్) సాధనకు 243 పోస్టులు అవసరమైతే, 2026 నాటికి ఆ ఉద్యోగాల సంఖ్య 450కిపైగా ఉన్నట్టు సమాచారం. ఆ మేరకు పోస్టులు పెంచాల్సింది పోయి ఉన్నవాటిని కుదించడమేంటని అభ్యర్థులు బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వయోపరిమితి దాటిపోతున్న అభ్యర్థులు హోంసైన్స్, సోషల్ వర్క్, న్యూట్రిషన్ వంటి ప్రత్యేక కోర్సులు పూర్తిచేసి, నోటిఫికేషన్ వస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటి తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఉద్యోగాల కల్పనపై పెద్దఎత్తున హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక ఉన్న పోస్టులకే కోత పెట్టడం వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆమోదం పొందిన మొత్తం 243 పోస్టులతో పాటు ఇప్పటి వరకు ఉన్న ఖాళీల భర్తీకి తక్షణమే పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు. -
ఫీడ్.. దోపిడీ!
సాక్షి, అమరావతి: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేదు.. రొయ్య రైతుల ఏకాభిప్రాయం లేదు.. అసలు రైతుల అభిప్రాయాన్ని అడిగినవాడే లేడు. అయినా రొయ్య ఫీడ్ ధరలను టన్నుకు మరో రూ.11వేలకు పెంచడానికి రంగం సిద్ధమయ్యింది. నేడో రేపో పెంచిన ధరలను అమలు చేయబోతున్నారు. ఫీడ్ కంపెనీలు ఇప్పటికే రెండు విడతల్లో టన్నుకు రూ. 16వేలు పెంచాయి. ఇప్పుడు మరో రూ.11 వేలు. ఇలా 8 నెలల వ్యవధిలో టన్నుకు ఏకంగా రూ.27వేల మేర ఫీడ్ ధరలు పెరగడమంటే మాటలా.. తమ జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలే కాదు, సీడ్ ధరలదీ అదే దారి. ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాలదీ అదే దారి. ఎడాపెడా పెరుగుతున్న ధరలు రొయ్యరైతులను నిలువునా ముంచుతున్నాయి. ఆక్వాఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు అనుయాయులవే. అందుకే వాళ్లు ఎలా కావాలంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్, ఫీడ్ ధరలను వాళ్లే నిర్ణయిస్తున్నారు. అష్టకష్టాలు పడి, అధికధరలను భరించి ఆక్వా సాగు చేసి రొయ్యపంట చేతికొచ్చేసరికి వ్యాపారులంతా సిండికేట్‌గా తయారయ్యి రేట్లు పడిపోయేలా చేస్తున్నారు. రైతులను ఆదుకోవలసిన చంద్రబాబు సర్కార్ ఈ సిండికేట్‌కు వంతపాడుతుండడాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా పెంపుఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్సడా చట్టంతో పాటు ఫీడ్, సీడ్ «చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతుల పక్షాన నిలవాల్సిన రాష్ట్రప్రభుత్వం ఫీడ్కంపెనీల అడుగులకు మడుగులొత్తడంతో అవి ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నాయి. రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా ఫిబ్రవరిలో రూ.4వేలు, జూన్‌లో రూ.12వేల చొప్పున పెంచేశాయి. రైతుల ఆందోళనలతో రూ.2వేలు తగ్గించినట్టు నాటకాలాడిన కంపెనీలు 15 రోజులు తిరక్కుండానే దొడ్డిదారిన రూ.2వేలు పెంచి ఆ మేరకు రైతులపై భారం మోపాయి. 45 రోజులకోసారి ధరలపెంపును సమీక్షించుకునేందుకు కంపెనీలకు అవకాశం కల్పించారు.ప్రత్యేకంగా ఫీడ్ ధరల సమీక్ష కోసం రైతులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కమిటీలో ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులు సిఫార్సు చేసిన ప్రభుత్వ అనుకూల రైతులకే చోటు కల్పించారు. వీరు ఫీడ్ కంపెనీలకు వంతపాడడం మొదలు పెట్టారు. ఈ దశలో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలను సాకుగా చూపి టన్నుకు రూ.37 వేలు తక్కువకాకుండా పెంచితే కానీ తమకు గిట్టుబాటు కాదని చెబుతూ కనీసం రూ.15 వేలు తక్కువకాకుండా పెంచేందుకు అనుమతినివ్వాలని ప్రతిపాదించాయి. ఈ మేరకు సబ్ కమిటీ ఆమోదం తెలపడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పెంపును అమలులోకి తీసుకొచ్చాయి. కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వతీరును నిరసిస్తూ ఆక్వారైతులు హైకోర్టును ఆశ్రయించారు.రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని హైకోర్టు సైతం తప్పుబట్టింది. రైతులతో చర్చించి, వారి ఆమోదంతోనే ధరలను సవరించాలని సూచించింది. అప్పటివరకు పెంపును నిలిపి వేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. తాజాగా సబ్ కమిటీ ఆమోదంతో దొడ్డిదారిన టన్నుకు రూ.11వేలు పెంచేందుకు సిద్ధపడ్డాయి. ఈ పెంపును ఒకటి రెండు రోజుల్లో అమలులోకి తీసుకువచ్చేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫీడ్ ధరల సబ్ కమిటీలో సభ్యులైన రైతుప్రతినిధులు కంపెనీలు ప్రతిపాదించిన ధరల పెంపు విషయమై ఆక్వా సాగయ్యే జిల్లా సంఘాల నేతలతో కానీ, రాష్ట్ర రైతు సంఘాలతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మేత ధరల భారమిలా2024 ఏప్రిల్‌లో టన్నుకు వెనామీ రొయ్యల మేత ధర రూ.82 వేలు, టైగర్ రొయ్యల మేత రూ.92 వేల మధ్య ఉండగా ప్రస్తుతం వెనామీ మేత రూ.1.18 లక్షలకు, టైగర్ మేత రూ.1.34 లక్షలకు చేరింది. అంటే రెండున్నరేళ్లలో టన్నుకు వెనామీ రైతులపై రూ.36 వేలు, టైగర్ రైతులపై రూ.42 వేల మేర భారం పడినట్టవుతుంది. మేత ధరల భారంతో కిలో రొయ్యల ఉత్పత్తికి వెనామీకి రూ.300కు, టైగర్‌కు రూ.450 ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలను తరచూ పెంచే విధానాన్ని నిలిపివేయాలని ఆక్వా రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీలు ఏడాది లేదా ఆరు నెలలకు సరిపడా ముడిసరుకులను ఒకేసారి ఇండెంట్ పెట్టి దిగుమతి చేసుకుంటాయే తప్ప నెలకోసారి దిగుమతి చేసుకోవని రైతు సంఘాలు చెబుతున్నాయి. ప్రతీ ఏటా నవంబర్ లేదా డిసెంబర్లో ధరల సమీక్ష చేయాలే తప్ప ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రైతుల అంగీకారంలేకుండా, వారి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం ధరలు పెంచుకుంటూ పోతే తాము ఎలా సాగు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా ధరల పెంపుపై నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోతోందని, అదేసమయంలో కౌంట్ ధరలు మాత్రం ఇష్టానుసారంగా కోతలు పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు. నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలు, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోకుండా వారికి ప్రభుత్వం వంతపాడడం సరికాదంటున్నారు.ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద రొయ్యల కొనుగోలు ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టుబడి ఆధారంగా కౌంట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ దోపిడికి గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. మరొక వైపు ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాల ధరలు కంపెనీలు ఇటీవలే భారీగా పెంచేశాయి. ఒక్కో ఏరియేటర్ సెట్‌పై రూ.3 వేలు, సాధారణ, ప్రీమియం మోటార్లపై రూ.1000కు పైగా పెంచారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది.మేత ధరల పెంపును నిరసిస్తున్నాంతాజాగా టన్నుకు రూ.11వేల మేర మేత ధరలు పెంచాలన్న ప్రతిపాదనలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.16వేల మేర భారం మోపారు. మేత కంపెనీలు, ప్రాసెసింగ్ నిర్వాహకులకు సిఫార్సులతో కూటమి ప్రభుత్వం నియమించిన ఫీడ్ ధరల రైతుల సబ్ కమిటీ సభ్యులతీరు వల్లే మాకీ పరిస్థితి ఏర్పడింది. 45 రోజుల కోసారి ఫీడ్ ధరలు సమీక్షించే విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వతీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. – దుగ్గినేని గోపీనాథ్, కన్వీనర్, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య జగన్ హయాం.. ఆక్వా రైతుకు స్వర్ణయుగం.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.309.95 కోట్ల బకాయిలను సైతం చెల్లించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆక్వా జోన్స్‌ను చక్కదిద్దింది. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీని వర్తింపచేసింది. ఆక్వాకు సంబందించిన విద్యుత్ సర్వీసుల్లో దాదాపు 90 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా, దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు. పాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. పైగా ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడు సార్లు కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఉపసంహరింపచేయడంతో టన్నుపై రూ.8,600 మేర ఆదా అయ్యింది. పైగా 15 రోజులకోసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేశారు.దొంగల్లా మేత కంపెనీలు200 ఎకరాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆక్వా సాగు చేస్తున్నాం. మేత కంపెనీలు దొంగల్లా తయారయ్యారు. తాజా పెంపుదలతో 8 నెలల వ్యవధిలో ఏకంగా రూ.27వేలు పెంచినట్టవుతోంది. మరొక వైపు కౌంట్ ధరలకు సైతం ఎడాపెడా కోతలేస్తూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు రైతులను దోచుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ వర్తించడం లేదు. ఓవర్ లోడ్ పేరిట ప్రతి నెలా రూ.12వేల వరకు అదనపు భారం పడుతోంది. జనరేటర్లతోనే ఆక్వా సాగు చేస్తే మేలన్నట్టుగా కన్పిస్తోంది. వైరస్లు, తెగుళ్ల కంటే చంద్రబాబు (సీబీ) వైరస్ వలనే ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. – వేగేశ్న వెంకటరాజు, చిన్నకాపురం, పశ్చిమగోదావరి జిల్లాఎకరాకు రూ.72వేల అదనపు భారంనేను 35 ఎకరాలు సాగు చేస్తున్నా. ఇప్పటికే టన్నుకు రూ.16వేల మేర పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.11వేల మేర పెంచనుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పెంపుతో ఎకరాకు రూ.72వేల మేర అదనంగా భారం పడుతోంది. కౌంట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.30–50 నుంచి రూ.10–30కు తగ్గించేశారు. విద్యుత్ సబ్సిడీ వస్తుందని ఎదురు చూసాం. కానీ అమలుకు నోచుకోవడంలేదు. సర్దుబాటు చార్జీల పేరిట అదనపు భారం మోపుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆక్వా రైతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. – అల్లూరి కృష్ణంరాజు, ఖాతాల మెరక, పశ్చిమగోదావరి జిల్లావిద్యుత్ సబ్సిడీకీ ఎగనామంజోన్, నాన్‌జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ çసరఫరా చేస్తామంటూ ఇచ్చిన హామీని రెండున్నరేళ్లుగా అటకెక్కించేశారు. మరొక వైపు సర్‌చార్జీ, సర్దుబాటు చార్జీలంటూ ఎడాపెడా బాదడంతో యూనిట్ రూ.1.50కే విద్యుత్ పొందే రైతు భూతద్దం పెట్టి వెతికినా కన్పించని పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో సబ్సిడీకి అర్హత పొందిన రైతులు తప్ప ఈ రెండున్నరేళ్లలో కొత్తగా ఏ ఒక్క రైతు ఈ రెండేళ్లలో విద్యుత్ సబ్సిడీ పొందలేని దుస్థితి నెలకొంది. సబ్సిడీ పొందే రైతులు సైతం అదనపు చార్జీల పేరిట యూనిట్ రూ.2.50కుపైగా చెల్లిస్తున్నారు. అదే సబ్సిడీ వర్తించని రైతులకు వాస్తవంగా యూనిట్ రూ.3.85 పైసలకే విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, యూనిట్‌కు రూ.5కు తక్కువ కాకుండా బిల్లులొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ లోడ్, అదనపు ఛార్జీల పేరిట ఒక్కో సర్వీసుకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్
-
ఈనెల 16న విశాఖలో వైఎస్సార్సీపీ బీసీ గర్జన సభ
సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో బీసీల గొంతుకను వినిపించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీన విశాఖలో ప్రతి ష్టాత్మకంగా ‘ఉత్తరాంధ్ర బీసీ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా ప్రధానంగా రెండు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు.రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీ వర్గాలను చేస్తున్న మోసాలు, వంచనలను ప్రజల ముందుంచనున్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు, భౌతిక దాడులపై ఈ వేదిక ద్వారా తీవ్రంగా గళమెత్తనున్నారు. ఈ గర్జన సభ ద్వారా బీసీ వర్గాలకు అండగా నిలుస్తూ, వారి హక్కుల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణను వైఎస్సార్సీపీ ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి : ‘స్థితప్రజ్ఞుడు’ వైఎస్ జగన్ -
నానా పటేకర్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ తాజాగా ఎక్స్ వేదికగా..‘నానా పటేకర్ మరణవార్త తీవ్రంగా కలచివేసింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. విభిన్న పాత్రల్లో, విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నానాపటేకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని పోస్టు చేశారు. Deeply saddened by the passing of Nana Patekar Ji. His remarkable contribution to Indian cinema and his versatile performances will always be remembered. My heartfelt condolences to his family, friends, and countless admirers. May his soul rest in peace. https://t.co/Z72B1PTrka— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2026ఇదీ చదవండి: కార్గిల్‌వార్‌లో 60 రోజులు.. రైతులకోసం నామ్ ఫౌండేషన్ -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కర్నూలు, నంద్యాల జిల్లాల కో-ఆర్డినేటరుగా భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్.వెంకటగౌడ, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయరెడ్డి నియమితులయ్యారు.పార్టీ సీఈసీ సభ్యునిగా రంగాలి జగన్నాథం (విశాఖపట్నం నార్త్), ఎస్ఈసీ సభ్యులుగా పరిస వెంకటనారాయణ (విశాఖపట్నం ఈస్ట్), గుండుబోగుల నాగేశ్వరరావు(తాడేపల్లిగూడెం), సమంతలపూడి బాలసూర్యనారాయణ రాజు (పోలవరం), ఓ.ఎం.పి మధుసూదన్ రావు (చిత్తూరు) నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ -
స్థానిక ఎన్నికల్లో YSRCP దూకుడు నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన జగన్
-
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూకుడు.. తొలి అభ్యర్థి ప్రకటన
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ దూకుడు పెంచింది. ఎన్నికల కసరత్తు వేగం పుంజుకుంటున్న వేళ.. తొలి మేయర్ అభ్యర్థిని బుధవారం ప్రకటించింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో నెల్లూరు నగర రాజకీయాల్లో ఎన్నికల వేడి మరింత పెరగనుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, నగర స్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయడం కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. పార్టీ కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు మేయర్ అభ్యర్థి ప్రకటనతో మిగిలిన నగరాలు, పట్టణాల్లోనూ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది.నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని విజయ్‌కుమార్‌రెడ్డిని బరిలోకి దింపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో వైఎస్సార్సీపీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నెల్లూరు మేయర్ పదవి కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారయ్యే ప్రక్రియతో పాటు కార్పొరేషన్‌లోని డివిజన్లకు అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తొలి అభ్యర్థిని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: అబద్ధాల్లో బాబు, పవన్‌ల పోటాపోటీ -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: భారత ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘ఇది చారిత్రాత్మక మైలురాయి.. గుర్తుండిపోయే సందర్భం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ప్రయాణం.. దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతోంది. గత 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. భవిష్యత్తులోనూ ఆయనకు అన్ని విధాలా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు.A historic milestone in public service that should not go unnoticed. Heartiest greetings to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji on completing 25 years of continuous public service, first as Chief Minister of Gujarat and then as Prime Minister of India. Wishing you the very best. @narendramodi— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2026ఇదీ చదవండి: తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదు -
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ కసరత్తు
-
సచివాలయాల సేవలకు కోత
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై కక్షగట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాటి ద్వారా ప్రజలకందే సేవల్లో కోతలు మొదలుపెట్టింది. విద్యార్థులు, రైతులకు ఎక్కువ అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పట్టదారు పాస్‌పుస్తకాలు, నీటితీరువా చెల్లింపు సేవల్ని సచివాలయాల నుంచి దూరం చేసింది. రెవెన్యూశాఖకు సంబంధించి కీలకమైన ఈ నాలుగు సేవలు ప్రజలకు ఎంతో అవసరం. గతంలో ప్రభుత్వాఫీసుల్లో చిన్నపని పడినా గ్రామీణ ప్రాంత ప్రజలు తమ రోజువారీ పనులన్నీ మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రజలకు ఈ ఇబ్బందుల్ని తప్పించి వారి గ్రామాల్లోనే, ఇళ్లవద్దే సేవలు అందించేందుకు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 540కి పైగా ప్రభుత్వ సేవల్ని ఈ సచివాలయాల్లో అందుబాటులో తీసుకొచ్చింది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు దాదాపు 10 కోట్ల సేవలను పొందారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రజలకు ప్రతి సందర్భంలోను ఎక్కువ అవసరం పడే కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పునఃజారీ (రీ ఇష్యూ), పట్టాదారు పాస్‌బుక్ పునఃముద్రణ (రీ ప్రింట్), రైతుల నీటితీరువా పన్ను చెల్లింపు సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా నిలిపేసింది. సచివాలయాలతోపాటు మీ–సేవ కేంద్రాల్లోను ఆ సేవలు లేకుండా చేసింది. విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు చదువులకు, ఉద్యోగాలకు, పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు.. గతంలో తమకు మంజూరైన కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పునఃజారీకి సచివాలయాల్లో దరఖాస్తు చేసి మళ్లీ తీసుకుంటారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఆ సేవల్ని దూరం చేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఊళ్లోనే ప్రజలకు సేవలందించే వ్యవస్థను కనుమరుగు చేసేందుకేనా? ప్రజలకు సొంత ఊళ్లలోనే ఆయా సేవలను అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను క్రమంగా కనుమరుగు చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. అందుకే రెండేళ్లుగా సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, మంత్రులు విషం చిమ్ముతున్నారన్న విమర్శలున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం గత ప్రభుత్వం ఒకేసారి 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడాన్ని అనవసరంగా చేసినట్లు చంద్రబాబు, మంత్రులు నిందలు వేస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రేషనలైజేషన్ పేరిట ఒక్కో సచివాలయంలో ఉండే ఉద్యోగుల సంఖ్యను కుదించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందే ప్రభుత్వ సేవలను కూడా దూరం చేస్తున్నారు. ఇలా ఒక్కో సేవను దూరం చేస్తూ.. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. చివరికి ఈ వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించేదిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న విమర్శలున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సచివాలయాల్లో అందే ప్రభుత్వ సేవల్లో కోతలు విధించిందన్న చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు సచివాలయ ఉద్యోగులను ఇంటింటి ప్రభుత్వ సర్వేలకు, అధికార పార్టీలకు ఉపయోగపడే ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే రాజకీయ ప్రచార కార్యక్రమాలకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్న తీరును ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతూ ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదు
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడినే వాడుకొని, తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు అండ్ కో చేసిన కుట్రలు మరోసారి పటాపంచలయ్యాయి. చంద్రబాబు నీచ రాజకీయాల కోసం తిరుమల శ్రీవారినీ వాడుకోవాలన్న కుతంత్రాలకు తెరపడింది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయంటూ నానా రాద్ధాంతం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేసిన చంద్రబాబు, ఆయన బృందం ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి తేటతెల్లం చేసింది. చంద్రబాబు అండ్ కో ఆరోపించిన విధంగా శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు, ఇతర జంతువుల కొవ్వులు లేవని నెల్లూరు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ప్రధాన ఛార్జిషీట్లో చెప్పిన సీబీఐ.. ఇదే కోర్టుకు తాజాగా సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్‌లోనూ ఇదే విషయం మరోమారు విస్పష్టంగా చెప్పింది. చంద్రబాబు అండ్ కో వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన బురద జల్లేందుకు గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నివేదిక ఆధారమంటూ చేసిన ప్రచారమంతా అబద్ధమని మరొకసారి సిట్ తేల్చింది. నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ నివేదిక తేటతెల్లం చేసినట్లు అనుబంధ ఛార్జిషీట్లో తేల్చి చెప్పింది.ఏఆర్ డెయిరీకి చెందిన నాలుగు నెయ్యి ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలపై హరియాణాలోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో కూడా జంతు కొవ్వులేవీ లేవని తేలిందని నివేదించింది. అంతే కాక మైసూర్ సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్‌లో పరీక్షించిన బోలే బాబా డెయిరీ నెయ్యి నమూనాల్లో కూడా జంతు కొవ్వులు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ సేకరించిన వివరాలతో నెల్లూరు ఏసీబీ కోర్టులో అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో పేర్కొన్న ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు జంతువుల కొవ్వు లేదని మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు ప్రధాన చార్జిషీట్లోనూ ఇదే మాట... గతంలో కూడా సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రధాన ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో కూడా లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వులు లేవని తేల్చింది. ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులేవి కలవలేదని స్పష్టంగా చెప్పింది.ఎన్డీబీబీ నివేదిక అంటూ చంద్రబాబు రాద్దాంతంచంద్రబాబు, ఆయన గణం.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బురద జల్లేందుకు తిరుమల శ్రీవారినే వాడుకొన్నారు. చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూలో పంది, ఇతర జంతువుల కొవ్వు కలిపారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ఇందుకోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నివేదిక ఆధారం అంటూ ప్రజలను మభ్య పెట్టారు. అయితే అదే ఎన్డీడీబీ 2025లో ఇచ్చిన నివేదికలో లడ్డూ నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని విస్పష్టంగా చెప్పింది. ఈ నివేదికను కూడా సిట్ తన తాజా అనుబంధ ఛార్జిషీట్లో జత చేసి కోర్టు ముందుంచింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు చేసిన ఆరోపణలన్నీ తప్పుడువేనని, వారంతా చేసింది దుష్ప్రచారమేనని తేలిపోయింది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని స్పష్టమైంది. -
వైఎస్ జగన్‌కు ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకం బహుకరణ
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రచయిత కొత్తపల్లి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని బహుకరించారు.వైఎస్ జగన్ రాజకీయ జీవనయానం, ఆయన ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా వివరిస్తూ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో రచయితతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ రాధ, ఎంవీఎస్ నాగిరెడ్డి, రమేష్, కొవ్వూరి త్రినాథరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ -
స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ దూకుడు
-
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోకస్ పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఇవాళ(మంగళవారం) సమీక్ష చేపట్టారు. వాటి పరిధిలోని నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు హాజరయ్యారు.ఇదీ చదవండి: నాడు గెలిచింది బాబు కాదు.. జగనే -
సీఎం అవ్వాల్సింది జగనే... సీపీఎం నేత వీరభద్రం సంచలన కామెంట్స్
-
నాడు గెలిచింది బాబు కాదు.. జగనే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగానికి సంబంధించి అక్రమాలు జరిగినట్లు ప్రము ఖ సామాజికవేత్త పరకాల ప్రభాకర్ చేసిన సర్వే, విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇదంతా పరిశీలిస్తే నాడు గెలిచింది చంద్రబాబు నాయుడు కాదు.. జగన్మోహన్రెడ్డి అనేది ఒక అనాలసిస్. దీనిపై విశ్లేషకులు ఎన్నికల కమిషన్‌కు కూడా లేఖ రాశారు’అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఖమ్మంలో సోమవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అక్రమాలు పెరిగాయి.. ఈవీఎంల నిర్వహణలో అక్రమాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. పరకాల ప్రభాకర్ ఏపీలో ఎన్నికల తీరుపై చేసిన సర్వేలో పలు అంశాలు బయటపడ్డాయన్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలోని 1,400 పోలింగ్ బూత్‌లలో నమోదైన ఓట్ల వివరాలను పరిశీలిస్తే కొన్నింట 500 ఓట్లు అదనంగా పడ్డాయని స్పష్టమైందని చెప్పారు. 1,500 ఓట్ల సామర్థ్యం ఉన్న బూత్‌లలో 2 వేల వరకు ఓట్లు లెక్కింపులోకి రావడం దారుణమైన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. సర్వేలో వెల్లడైన గణాంకాల ఆధారంగా విశ్లేíÙస్తే గెలవాల్సిన అభ్యర్థులు ఓడిపోవడం, ఓడాల్సిన వారు గెలవడం జరుగుతోందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై డేటా సైంటిస్టులు, నిపుణులు సమగ్ర పరిశీలన జరిపి, పర్సంటేజీ లెక్కల్లో లేదా లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని.. ఇవన్నీ అవకతవకలేనని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదించినట్లు తెలిపారు. కేంద్రంలోనూ ఇదే తీరు.. 2024 సార్వత్రిక ఎన్నికల సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 79 పార్లమెంట్ స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయని వీరభద్రం తెలిపారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈ అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ చేపట్టడమే కాకుండా తగిన చర్యలు అత్యవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రాజకీయ, ఆర్థిక మార్పులపై ప్రస్తావిసూ అమెరికా సామ్రాజ్యవాదానికి సవాళ్లు ఎదురవుతున్నాయని.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా పెనుమార్పులు సంభవించబోతున్నాయని తెలిపారు. మీట్ ది ప్రెస్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఆధారంగా చేసుకుని సీనియర్ రచయిత కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ‘స్థితప్రజ్ఞుడు’ పేరుతో వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో అభినందనీయం. రాజకీయ నాయకుడిగా ఆయన ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రజలతో ఏర్పరచుకున్న విడదీయరాని అనుబంధాన్ని భావితరాలకు అందించేందుకు ఈ పుస్తకం దోహదపడుతుంది.రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటన్నింటిని ఎదుర్కొంటూ వైఎస్ జగన్ స్థిర చిత్తంతో ముందుకు సాగిన తీరు అద్భుతం. ఆయన రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఒకేచోట చేర్చి పాఠకులకు అందించిన రచయిత ప్రయత్నం ప్రశంసనీయమని సజ్జల కొనియాడారు. ఇదీ చదవండి: పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్సార్సీపీ నేతలు -
జగన్ హయాంలో కట్టిన ఇళ్లు.. బాబు సర్కార్ ఖాతాలోకి?
-
'బుర్రిపాలెం'లో బాబు బుర్రకథలు!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేశారు. సూపర్ సిక్స్‌లు, ఇతర హామీలు అమలు చేయకుండా తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పచ్చి అబద్ధాలను నిత్యం ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా బుర్రిపాలెం వేదికగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ పథకాన్ని భ్రషు్టపట్టించారంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓసారి పరిశీలిస్తే చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని స్పష్టం అవుతుంది. బాబు: వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య గృహ నిర్మాణ పథకాన్ని భ్రష్టుపట్టించారు. వాస్తవం: రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడం కోసం వైఎస్సార్సీపీ హయాంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఏకంగా 31 లక్షల మందికిపైగా మహిళల పేరిట ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. నాడు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువే రూ.76 వేల కోట్లకు పైగా ఉంటుంది. ఇలా రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా గృహ నిర్మాణ పథకంలో నూతన శకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. బాబు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 5.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. వాస్తవం: గత ప్రభుత్వంలో పేదలకు 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు 21 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశారు. 2024 ఎన్నికల నాటికే 9 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కాగా, ఆ ఇళ్లనే తాను నిర్మించి పేదలకు ఇచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. బాబు: 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు సమకూరుస్తాం వాస్తవం: పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇచ్చి, ఇళ్లు కూడా నిర్మిస్తామని చంద్రబాబు 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు కావస్తున్నా నేటికీ పేదలకు గజం స్థలం కూడా మంజూరు చేయలేదు. గజం స్థలం సేకరించి పేదలకు పంపిణీ చేయకుండానే ఏకంగా రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు ఇచ్చేశామంటూ చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. విశాఖ, విజయవాడ, మంగళగిరి మరికొన్ని ప్రాంతాలలో కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించి దాన్నే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. -
‘గూడు’ పుఠాణి!
సాక్షి, అమరావతి: ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం’ వంటి సూపర్ సిక్స్‌తోపాటు ఇతర హామీలకు దిక్కు మొక్కు లేకున్నా.. హామీలన్ని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా గూడు కల్పనలోనూ దొంగ లెక్కలతో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం బురిడీ కొట్టించేస్తోంది. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం మంజూరు, పక్కా ఇళ్ల నిర్మాణం అంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు హామీలు ఇచ్చారు. గద్దెనెక్కి రెండేళ్లయినా పేదలకు గజం స్థలం మంజూరు చేసిన పాపాన పోలేదు. పక్కా గృహాల మంజూరు తూతూ మంత్రంగా ఉంది. తానిచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం విషయంలోనూ పేదలను నిలువునా దగా చేసేస్తున్నారు. ఏకంగా 1.70 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే చేసేసినట్టు దొంగ లెక్కలు చూపిస్తూ ఏకంగా ప్రభుత్వమే 420 వేషాలు వేస్తోంది. ఈ అంశం గత కొద్ది నెలలుగా గృహ నిర్మాణ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాకి లెక్కలతో షో చంద్రబాబు ప్రభుత్వం గతేడాది నవంబర్, ఈ ఏడాది మార్చిలో రెండు పర్యాయాలు సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం పేరిట హడావుడి చేసింది. రెండు విడతల్లో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించినట్టు డబ్బా కొట్టుకుంది. ఈ క్రమంలో వాస్తవాలు పరిశీలిస్తే ఆ ఇళ్లన్నీ కూడా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించినవే. సీఎం చంద్రబాబు పేదలకు పంపిణీ చేసిన ఇంటి ధ్రువీకరణ పత్రాల్లోనూ 2019–24 మధ్య ఆ ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో బాబు సర్కార్ నవ్వులపాలైంది. ఇదిలా ఉండగా, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లను తన ఖాతాలో వేసుకునే క్రమంలో వాస్తవ లెక్కలను సైతం చంద్రబాబు సర్కారు కప్పెట్టేసినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు రెండేళ్లలో నిరి్మంచినట్టు ప్రచారం చేసుకున్న 5.50 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో వైఎస్సార్, జగనన్న కాలనీల్లో మంజూరు చేసినవే. వీటిలో 1.70 లక్షలకు పైగా ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అరకొర నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం పూర్తి చేసినట్టు కాకి లెక్కలు చూపి సామూహిక గృహ ప్రవేశాల పేరిట చంద్రబాబు రాష్ట్రంలో పెద్ద షో చేశారు. బాబు చేసింది శూన్యం రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు కల్పనే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబి్ధదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలి కొదిలేశారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం నిర్మాణం పూర్తవ్వని ఇళ్లను సైతం పూర్తి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. -
తాగునీటిపై నీటి మూటలు
సాక్షి, అమరావతి: ఒకవైపు వ్యవసాయానికి సాగునీటిపై రైతులను మభ్యపుచ్చి నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారు స్థానిక ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిపైనా మరో డ్రామాకు సిద్ధమైంది! రెండున్నరేళ్లుగా రక్షిత మంచినీటి సరఫరా పథకాల ఊసెత్తకుండా హడావుడిగా సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో ‘జేజేఎం–అమరజీవి జలధార’ పనుల శంకుస్థాపనకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2019–24 మధ్య మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రంలో 39,34,701 ఇళ్లకు కొత్తగా తాగునీటి కొళాయిలు ఏర్పాటుచేయగా చంద్రబాబు సర్కారు కేవలం 2,69,735 ఇళ్లకు మాత్రమే అందించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దానం లాంటి తీవ్ర సమస్యాత్మక ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేస్తే చంద్రబాబు సర్కారు అలాంటిది ఒక్కటంటే ఒక్క పథకాన్ని ఇప్పటివరకు పూర్తిచేయలేదు. పులివెందుల పరిధిలోని ఏడు మండలాల్లో గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ. 480 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం నిర్మాణ పనులు వైఎస్సార్సీపీ హయాంలోనే 80 శాతానికి పైగా పూర్తవగా మిగిలిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ప్రొద్దుటూరు వేదికగా ‘జేజేఎం–అమరజీవి జలధార’ పనుల శంకుస్థాపన పేరుతో మరో నాటకానికి తెర తీసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కారు వాటిలో కొన్నింటిని ఇప్పుడు తిరిగి తెరపైకి తేవడం మినహా కొత్తగా చేసిందేమీ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్రం జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు దేశమంతటా పొడిగించగా దానినీ సీఎం చంద్రబాబు తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు.గత ప్రభుత్వంలోనే దాదాపుగా పూర్తి.. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా జల జీవన్ మిషన్‌లో భాగంగా రూ. 26,823 కోట్లతో రక్షిత సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణాలతో పాటు మరో 77,917 గ్రామ స్థాయి రక్షిత మంచినీటి పథకాలు, తాగునీటి కొళాయిల ఏర్పాటు పనులను మంజూరు చేసింది. ఉద్దానం లాంటి పథకాలు పూర్తికాగా పులివెందుల, డోన్ వంటి సమగ్ర రక్షిత పథక నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడో వంతుకు పైగా ఇళ్లకు గత ప్రభుత్వంలోనే తాగునీటి కొళాయిల ఏర్పాటు పూర్తవగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ‘ఇంటింటికీ రక్షిత తాగునీరు– ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్’ ఏర్పాటు చేస్తామంటూ సూపర్ సిక్స్ 2.0 హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక 25 శాతానికి లోపే పనులు జరిగాయనే సాకుతో రూ.10.680.50 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిన 44,194 చిన్న పనులతో పాటు రూ. 750 కోట్ల సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులను సైతం రద్దు చేశారు. రెండేళ్లకుపైగా కాలయాపన చేసి గతంలో రద్దు చేసిన పనుల స్థానంలో జల జీవన్ మిషన్ కార్యక్రమాలను మంజూరు చేసింది. వీటిని ఇప్పడే కొత్తగా మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు హడావుడి చేస్తోంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన తాగునీటి పథకాల పనులను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసి.. కేంద్రం చుట్టూ ప్రదక్షిణ2024 డిసెంబరు 21న రద్దు చేసిన 44 వేల పనుల నిధులతో కేవలం బడా కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టే ఏడు సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్మాణ పనులకు చంద్రబాబు సర్కారు పచ్చ జెండా ఊపింది. మొత్తం రూ. 9,355 కోట్లతో ఏడు సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు ఈ ఏడాది మార్చి 26న ఆదేశాలిచ్చింది. తర్వాత వీటినే పది మంచి నీటి పథకాలుగా మార్పు చేస్తూ 2026 జులై 22న మరో జీవో జారీ చేసింది. వీటి టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఒకసారి రద్దు చేసి మళ్లీ మంజూరు చేసిన పనులకు 50 శాతం వాటా నిధులు పొందాలంటే వాటికి కేంద్రం ఆమోదం తీసుకోవాలి. ఈ అనుమతులు ఇప్పటికి కేంద్రం మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం రాలేదు. కేంద్రం నుంచి అనుమతి రాకుండానే శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రభుత్వం సిద్ధమైందని అధికారులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్ పేరుతో రుణాలు..జల్ జీవన్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు సర్కారు రూ.13,650 కోట్ల రుణ సమీకరణకు అనుమతి ఇచ్చింది . ఇప్పటికి రూ. 1,600 కోట్లు అప్పులు చేసినా గ్రామాల్లో మంచినీటి నిర్మాణ పనుల పురోగతి లేదు. కోవిడ్‌లోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాల కోసం రుణాలు తీసుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల బాధిత ప్రాంతం ఉద్దానంలో రూ. 700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం మొదలు పెట్టి పూర్తి చేయడం గమనార్హం. మరో రూ. 750 కోట్లతో పులివెందుల, డోన్ నియోజకవర్గాల్లో పనులను దాదాపు పూర్తి చేసింది. పైగా 2014–19 మధ్య టీడీపీ హయాంలో మంచినీటి పథకాల పేరిట తెచ్చిన అప్పుల్లో రూ. 300 కోట్ల మేర వైఎస్ జగన్ ప్రభుత్వం వడ్డీతో సహా తీర్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు మంచినీటి పథకాల పేరిట ఇటీవల తెచ్చిన అప్పులో దాదాపు రూ. 200 కోట్లు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో చెల్లించారనే విమర్శలున్నాయి. -
సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
నీ పిట్టలదొర మాటలు ఆపు.. చంద్రబాబు లక్ష కోట్ల ప్రకటనపై జగన్ ఫైర్
-
సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ దర్శకుడు, లెజెండరీ ఫిలింమేకర్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దక్షిణ భారత సినీ రంగంలో సింగీతం శ్రీనివాసరావు తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞ చిరస్మరణీయం. ఎన్నో విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలిపారు. మూస ధోరణులకు భిన్నంగా కొత్త కథలు, కొత్త సాంకేతికత, వినూత్నమైన ఆలోచనలతో తరతరాల సినీ ప్రేక్షకులను అలరించారు.తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. 94 ఏళ్ల వయసులోనూ సినిమాపై అదే అంకితభావంతో పనిచేయడం ఆయనలోని కళాతపనకు నిదర్శనం. సింగీతం శ్రీనివాసరావు మృతి భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Indian cinema has lost a true pioneer and pathbreaker, who continued making movies even at the age of 94. Singeetham Srinivasa Rao garu’s unmatched creativity, from silent marvels to sci-fi epics, inspires generations. Heartfelt condolences to his family and loved ones. May he rest in peace!— YS Jagan Mohan Reddy (@ysjagan) October 4, 2026 -
రైతులకు బాబు లక్ష మోసాలు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి ప్రతి హామీ నెరవేరుస్తానని ఇంటింటికీ బాండ్లు పంచిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాలన మూడో ఏడాది నడుస్తోంది... ఇప్పుడు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ పిట్టలదొర మాటలు చెబుతూ మరోవైపు రైతులను లక్ష మోసాలకు గురి చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నారా?రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు చెబుతూ, మరోవైపు రైతులను లక్ష మోసాలకు గురి చేస్తున్నారు. రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ చంద్రబాబు చేస్తున్నవి డ్రామాలు, అంకెల గారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. రైతులమీద ప్రేమ మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే, రోజూ ధర్నాలు చేస్తే చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటల బీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచిన మాట వాస్తవం కాదా?. సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యం చేసి రైతుల నడ్డివిరిచారు. చంద్రబాబు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు గానీ రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి.. కరువు నివారణా చర్యలు మొదలు పెట్టాలితీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే... చంద్రబాబు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డుతగులుతున్నారు. మరోపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 78 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000 ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబు ఇప్పటికైనా డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టాలి. -
చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టండి: వైఎస్ జగన్
తాడేపల్లి: హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్లంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిట్టలదొర మాటలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబు డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టాలని అన్నారు. రూ. లక్ష కోట్లు కాదని, రైతులకు లక్ష మోసాలు అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్లు అంటూ మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు మాత్రమే సాధ్యం. రైతుల మీద మీ ప్రేమ, మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల మీ పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే రోజూ ధర్నాలు చేస్తే మీరు ఏరోజైనా పట్టించుకున్నారా?’’ అని వైఎస్ జగన్ అన్నారు.రైతుల వెన్ను విరిచారు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటల బీమాను తీసివేసి రైతుల వెన్ను విరిచిన మాట వాస్తవం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యంచేసి, రైతుల నడ్డివిరిచారు. మీరు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప, రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే, మీరు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.ఇదీ చదవండి: నయవంచన రాజకీయాలు ఇంకెన్నాళ్లు?ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మీరే అడ్డుతగులుతున్నారు. మరొపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000లు ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా, రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబూ.. మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలు పెట్టండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు, మరోవైపు రైతులకు లక్ష మోసాలు @ncbn గారూ... రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ, మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 3, 2026 -
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: టీమిండియాకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏషియన్ గేమ్స్ ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలబడి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఫైనల్లో తిలక్ వర్మ ప్రదర్శించిన పోరాట పటిమ అభినందనీయమన్నారు. తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఏషియన్ గేమ్స్ విజయంతో దేశానికి మరో చిరస్మరణీయ విజయాన్ని అందించిన టీమిండియాకు అభినందనలు చెప్పారు వైఎస్ జగన్.Heartiest congratulations to Team India on a magnificent victory over Pakistan in the Asian Games final!Special congratulations to our Telugu star Tilak Varma for his brilliant match-winning 51*. A proud moment for all of us!Congratulations, Team India, on winning the Asian… pic.twitter.com/ONLBdljdjf— YS Jagan Mohan Reddy (@ysjagan) October 3, 2026 -
శ్రీసిటీ పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు సానుభూతి
-
ఆసియా క్రీడల్లో గోల్డ్.. భారత మహిళా హాకీ జట్టుకు జగన్ అభినందనలు
-
తిరుపతి శ్రీ సిటీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: తిరుపతి శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారు త్వరగా కోలుకునేలా చర్యలు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలన్నారు. ఇదిలా ఉండగా.. శ్రీ సిటీలో ఉన్న భారీ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు కార్మికులు గాయపడినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. -
భారత మహిళా హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత మహిళా హాకీ జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వకారణమని ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా.. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత మహిళా హాకీ జట్టుకు అభినందనలు. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1–0తో ఓడించి.. 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వకారణం. ఆద్యంతం అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించిన భారత జట్టు.. ముఖ్యంగా డిఫెన్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచింది. కీలక సమయంలో కెప్టెన్ సవితా పునియా పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు భారత్ నేరుగా అర్హత సాధించడం మరింత ఆనందదాయకం. దేశం గర్వించేలా చేసిన భారత క్రీడాకారిణులందరికీ అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పోస్టు చేశారు.Heartiest congratulations to our Indian women’s hockey team on a historic Asian Games triumph. Defeating defending champions China 1–0 ending a 44-year wait for gold is a moment of immense pride for the country. The team’s resilience in defence, crowned by Savita Punia’s crucial… pic.twitter.com/xoox2dEHhO— YS Jagan Mohan Reddy (@ysjagan) October 3, 2026 -
తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా.. ఆ రోజు వైఎస్ జగన్ ని పొగిడిన పొగడ్తలు..
-
క్రీడాకారిణి బొల్లు లిఖితకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: క్రీడాకారిణి బొల్లు లిఖితకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవటంపై హర్షం వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన లిఖిత అంతర్జాతీయ వేదికపై సత్తా చాటటం.. దేశానికి బంగారు పతకం అందించడం గర్వకారణం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.లిఖిత విజయానికి అండగా నిలిచిన ఆమె కుటుంబ సభ్యులు, కోచ్‌ల ప్రోత్సాహం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి.. దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: చికిత ‘గోల్డెన్’ ధమాకా.. తెర వెనక సైలెంట్ హీరో!Congratulations to Bollu Likhitha on winning the gold medal in the 76 kg category at the Commonwealth Powerlifting Championships in Winnipeg, Canada! It’s a proud moment to see a young woman from Guntur win gold for India. The encouragement and support of your family and coaches are truly appreciable. Wishing you continued success, Likhitha!— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2026 -
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి వైఎస్ జగన్ ఘన నివాళి
-
YS జగన్ ను కలిసిన వేమూరు విద్యార్థులు
-
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఇద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్, ఎంపీ మిథున్‌రెడ్డి, పూనూరి గౌతమ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ. ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో దేశానికి స్ఫూర్తినిచ్చిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. వారిద్దరి పోరాటం, త్యాగం తరతరాలకు ఆదర్శనీయం. ఈ మహనీయుల జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ గారు, ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో దేశానికి స్ఫూర్తినిచ్చిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల పోరాటం, త్యాగం తరతరాలకు ఆదర్శనీయం. ఈ మహనీయుల జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/2eB3bKNygg— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2026 -
స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
బాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు పాలనపై ఆగ్రహంతో ఉండటంతో స్థానిక ఎన్నికలను సజావుగా జరిపించే ఉద్దేశం ఆయనకు లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ నేతలు, శ్రేణులు ధైర్యంగా నిలబడాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్తృత కసరత్తు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దౌర్జన్యాలను ఎదుర్కోవడంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. జిల్లాలవారీగా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సుదీర్ఘంగా, సమగ్రంగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం, ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నేతలతో విస్తృతంగా చర్చించారు. ఉత్సాహంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమీక్షించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తగిన అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉందని పార్టీ నేతలు వైఎస్ జగన్‌కు వివరించారు. వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పాలన, స్థానిక సమస్యలు తదితర అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పలువురు నేతలు వివరించారు. ప్రజల మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే పార్టీదే విజయమని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులు స్థానిక ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అధికార పార్టీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని పలువురు నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కొనసాగుతోందని, ఎన్నికల్లో పోటీకి అవసరమైన సర్టిఫికెట్ల జారీలో కూడా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంపై నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక విపక్షంపై దౌర్జన్యాలకు దిగుతున్నారని వివరించారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొందాంనేతల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్న వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను సాఫీగా జరిపించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని చెప్పారు. చంద్రబాబు మోసాలు, దౌర్జన్యాలు, స్కామ్‌లు, అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రతి వర్గం కూడా చంద్రబాబు పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉందని, అందుకే స్థానిక ఎన్నికలను సజావుగా జరిపే ఆలోచన చంద్రబాబుకు లేదని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు ధైర్యంగా నిలబడాలని వైఎస్ జగన్ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు, ప్రజాదరణ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరగాలని నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
ఐయ్యారే.. రూ.20,898 కోట్లు ఎగ్గొట్టారే!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు ప్రభుత్వం భారీ వెన్నుపోటు పొడిచింది. 2024 ఎన్నికల మేనిఫేస్టోలో ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వేతన సవరణ కమిషనర్ డాక్టర్ మన్మోహన్‌సింగ్‌తో ఆ పదవికి రాజీనామా చేయించారు. ఆ తరువాత వేతన సవరణ కోసం మరో కమిషనర్‌ను నియమించలేదు. తద్వారా 27 నెలలుగా ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుండా వారికి చెందాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు చంద్రబాబు గండికొట్టారు. రెండేళ్లకు పైగా కాలయాపన చేసి తాజాగా వేతన సవరణ కమిషనర్‌గా దినేష్‌కుమార్‌ను నియమించారు. 27 నెలలుగా ఐఆర్ ప్రకటించకపోవడంతో ఉద్యోగులకు రూ.20,898 కోట్ల ఆర్థిక ప్రయోజనాలకు చంద్రబాబు ప్రభుత్వం గండికొట్టింది.నెలకు రూ.774 కోట్ల మేర గండి..వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల ఐఆర్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019 జూలై 1వ తేదీ నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే వైఎస్ జగన్ హయాంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టు 1వ తేదీ వేతనంతో ఐఆర్ చెల్లించారు. అప్పట్లో నెలకు రూ.774 కోట్ల మేర ఐఆర్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం కల్పించారు. జగన్ మాటిచ్చి నెరవేర్చారు.. చంద్రబాబు మాట మార్చారు2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించి అమలు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇవ్వడమే తప్ప ఇప్పటికీ అమలు చేయలేదు. ఇదే వైఎస్ జగన్‌కు చంద్రబాబుకు విశ్వసనీయతలో ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఇచ్చినట్టు 27 శాతం ఐఆర్ ఇచ్చి ఉంటే ఉద్యోగులకు రూ.20,898 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరేది. 27 నెలల తరువాత వేతన సవరణ కమిషనర్‌ను నియమించారు.కమిషన్ నివేదిక ఇచ్చేందుకు మరో ఏడాది గడువు విధించారు. కమిషనర్ నివేదిక సమర్పించి.. అమలు చేయడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంటే ప్రస్తుత వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పించేందుకు 2027 అక్టోబర్ వరకు గడువు ఉంది. 13వ వేతన సవరణ కమిషన్‌ను 2028లో నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుత కమిషన్ నివేదిక వచ్చి.. అది అమలయ్యే వరకు ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
నయవంచన రాజకీయాలు ఇంకెన్నాళ్లు ?
సాక్షి,అమరావతి: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరిట సీఎం చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు, నయవంచనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామాఆడుతున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు ఆడుతోంది కపట నాటకం కాదా? అంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబును వైఎస్ జగన్ కడిగిపారేశారు. ఇవాళ మీరిచ్చిన జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండని హితవు పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే... కేంద్రాన్ని ఒప్పించండి.. చంద్రబాబు గారూ.. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే.. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం, బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా? బీసీలపై ప్రేమను చేతల్లో చూపండి బీసీలపై ప్రేమ మాటల్లో కాదు చంద్రబాబు గారూ చేతల్లో చూపించాలి. మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీల సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు.ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు? కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి. సంక్షేమ పథకాలతో బీసీలకు బాసట అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34శాతం రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయంగా బీసీలకు మంచి అవకాశాలు కల్పించాంఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్ స్థానాల్లో బీసీలకే టిక్కెట్లు ఇచ్చాం. 13 జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఆరు, 13 మేయర్ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్ చైర్పర్సన్ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం, చంద్రబాబు గారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా?వైఎస్ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులునేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో యూకేలో ఉన్నతవిద్యకు వెళుతున్నట్లు వెల్లడి ఉన్నత పౌరులుగా ఎదగాలని వైఎస్ జగన్ ఆకాంక్షసాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన విద్యార్థులు వేమూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు వెళుతున్నట్టు వైఎస్ జగన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ప్రతిభ కనబరిచి, భవిష్యత్తులో సమాజానికి మేలుచేసే ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వారి ఉన్నత విద్యాభ్యాసం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యావ్యవస్థలో చేపట్టిన కార్యక్రమాలు మాలాంటి అనేకమంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించాయి. ఆ సమయంలో విద్యారంగంలో మీరు తీసుకున్న చర్యలు మా ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడ్డాయి’ అని విద్యార్థులు వైఎస్ జగన్‌తో పేర్కొన్నారు. వరికూటి అశోక్‌బాబు కుమారుడు గౌతమ్ గైడ్ చేయడంతో తాము ఈ సీట్లు సాధించామని చెప్పారు. పేద విద్యార్థులకు ఉన్నతవిద్య అందేలా సహాయం చేసిన గౌతమ్‌ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్‌ను కలిసిన విద్యార్థుల్లో నడకుర్తి అలెగ్జాండర్, వేణు వాసుమల్ల, మూల్పూరు ప్రసన్నకుమారి, నీరజా భూపతి, రోహిత్ వాసుమల్ల ఉన్నారు. -
స్థానిక ఎన్నికల వ్యూహాలపై వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశం దాదాపు తొమ్మిది గంటల పాటు కొనసాగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలను ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేసే అంశాలపై నేతలతో చర్చించారు.ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే వైఎస్సార్ సీపీదే విజయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వేమూరు విద్యార్థులు
తాడేపల్లి :నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఉన్నత విద్యకు వెళ్లబోతున్న బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన విద్యార్థులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.తాము నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళుతున్న విషయాన్ని వైఎస్ జగన్‌కు తెలిపారు దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యనభ్యసించి.. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. దీనిలో బాగంగా విద్యార్థులు స్పందిసతూ.. ‘మీ హయాంలో విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాలు తమలాంటి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాయని’ సంతోషం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్ -
డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్
తాడేపల్లి: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల పేరుతో చేసిన మోసాన్ని ఖండిస్తూ ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారని చంద్రబాబుని ప్రశ్నించారు.‘‘ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు. సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు చేసింది కపట నాటకం కాదా? ఇవాళ మీరిచ్చిన జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండి చంద్రబాబూ. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం.. బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా?’’ అని వైఎస్ జగన్ అన్నారు. చేతల్లో చూపించాలిబీసీలపై ప్రేమ మాటల్లో కాదని, చేతల్లో చూపించాలని చంద్రబాబుకు వైఎస్ జగన్ చెప్పారు. ‘‘మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీలు సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగాపైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించాం.పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు?’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి. అంతేకాదు, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్ స్థానాల్లో టిక్కెట్లు బీసీలకే ఇచ్చాం. 13 జడ్పీ ఛైర్పర్సన్ పదవుల్లో ఆరు, 13 మేయర్ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం. చంద్రబాబూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అంతేకాదు.. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు. చంద్రబాబూ.. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34% రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు..@ncbn గారూ… మీరు బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు చేసింది కపట నాటకం కాదా? ఇవాళ మీరిచ్చిన జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండి చంద్రబాబుగారూ.. చంద్రబాబుగారూ.. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే.. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం, బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా? బీసీలపై ప్రేమ మాటల్లో కాదు చంద్రబాబుగారూ… చేతల్లో చూపించాలి. మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీల సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో BC, SC, ST, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించాం. పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైయస్సార్సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు? కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి. అంతేకాదు, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్ స్థానాల్లో టిక్కెట్లు బీసీలకే ఇచ్చాం. 13 జడ్పీ ఛైర్పర్సన్ పదవుల్లో ఆరు, 13 మేయర్ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం, చంద్రబాబుగారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అంతేకాదు.. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు. చంద్రబాబుగారూ.. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34% రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2026 -
హ్యాట్సాఫ్ కెప్టెన్.. స్మిట్ మచ్చార్ పై YS జగన్ ప్రశంసలు
-
రూ.300 కోట్ల భూముల వ్యవహారం? జగన్ ను కలిసిన లంక రైతులు
-
కెప్టెన్ స్మిట్ మచ్చార్‌కు సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు కురిపించారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు.ఫ్లైదుబాయ్ విమాన ఘటన విషయమై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా.. ‘ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కెప్టెన్ స్మిట్ మచ్చార్ ధైర్యంగా నిలిచారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన ధైర్యం, త్యాగం, నిస్వార్థ సేవ ప్రశంసనీయమని అన్నారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. స్మిట్ మచ్చార్ దేశం గర్వించదగ్గ నిజమైన హీరో అని కొనియాడారు. అలాగే, కెప్టెన్ స్మిట్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.Hats off to Captain Smit Machchhar for his extraordinary courage in saving the lives of the passengers and crew. Despite being seriously injured, he remained steadfast in his commitment to passenger safety.A pride of India, he showed the world the meaning of courage and… pic.twitter.com/rXIOK1iIWS— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2026ఇదీ చదవండి: ‘భారత్ గర్విస్తోంది’.. స్మిట్ మచ్చార్ ధైర్యానికి మోదీ ఫిదా! -
లంకపల్లి రైతులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
కొత్తవి లేవు.. ఉన్న వాటిలోనూ కోత!
ఎప్పుడో మంజూరై, ఏళ్ల తరబడి ప్రతీనెలా వృద్ధాప్య పింఛను డబ్బులు తీసుకుంటున్న గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాల వారి పాలెం గ్రామానికి చెందిన కుర్రా రుక్మిణమ్మ పింఛన్‌ను కూటమి ప్రభుత్వం 2025 జూన్‌లో అర్ధంతరంగా నిలిపివేసింది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పింఛన్లు రద్దు చేశారంటూ భర్త పద్మారావుతో కలిసి ఆమె ఏడాదిన్నరగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో గుంటూరు జిల్లా కలెక్టర్.. రుక్మిణమ్మ వృద్ధాప్య పింఛను పునరుద్ధరించాలంటూ సిఫార్సు చేయడంతో ఈమె గత 11 నెలల బకాయిలు పొందేందుకు అర్హురాలని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇది జరిగి నాలుగు నెలలైనా వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం అక్టోబర్‌లో కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. పైగా పాత పింఛన్లకు గత నెలలో విడుదల చేసిన నిధుల కంటే తక్కువగా మంజూరు చేస్తూ.. అంటే కోత పెడుతూ అక్టోబర్ 1 (గురువారం)న పంపిణీ చేసేందుకు సచివాలయాల వారీగా నిధులు విడుదల చేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించే ఆన్లైన్ పోర్టల్‌ను పూర్తిగా మూసేసిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో కేవలం తొమ్మిది రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణకు వీలు కల్పించింది. మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్నట్టు అర్హులు ఆపసోపాలు పడుతూ ఆఫీసులు చూట్టూ తిరిగి ఆ తక్కువ సమయంలోనే ఏకంగా 13.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో అక్టోబర్ 1వ తేదీ నాటికే కొత్త పింఛన్లు మంజూరు చేసి.. డబ్బులు కూడా పంపిణీ చేస్తారని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేశారు. అయితే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టడానికే రెండేళ్ల నాలుగు (28) నెలలు గడువు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆయా దరఖాస్తుల పరిశీలన అంటూ మరికొంత కాలం కాలయాపన చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నెలనెలా పింఛన్ల నిధుల్లో కోతకొత్త పింఛన్ల సంగతి అలా ఉంచితే, పాత పింఛన్లకూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతి నెలా కోతలు పెడుతూనే ఉంది. నెలనెలా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం మంజూరు చేసే నిధుల మొత్తం తగ్గిపోతూనే ఉంది. గత సెప్టెంబర్ 1న పంపిణీకి విడుదల చేసిన నిధుల కన్నా, ఈ అక్టోబర్ 1న పంపిణీ చేసే నిధులు తగ్గిపోయాయి. గత 28 నెలలుగా ప్రతి నెలా నాలుగైదు కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి విడుదల చేసిన మొత్తం తగ్గిపోతూనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాది క్రితం 2025 ఆగస్టులో పింఛన్ల పంపిణీకి విడుదల చేసిన నిధులు మొత్తం కన్నా, అక్టోబర్‌లో పంపిణీకి విడుదల చేసిన మొత్తం దాదాపు రూ.58 కోట్లు తక్కువగా ఉండడం గమనార్హం.పింఛన్ల సంఖ్యలో 6.42 లక్షలు తగ్గుదలగత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో (ఇప్పుడు మన రాష్ట్రంలో ఇస్తున్న సంఖ్య కంటే చాలా ఎక్కువ) లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల రెండు నెలల తర్వాత కూడా ఈ సంఖ్య చాలా తక్కువగానే ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ మధ్య రాష్ట్రంలో జరిగిన పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కేవలం 59,91,857 మంది లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు పంపిణీ చేసింది. అంటే దాదాపు గత ప్రభుత్వంలో గరిష్ట పింఛన్ల సంఖ్య కన్నా ప్రస్తుతం 6.42 లక్షల పింఛన్ల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. మరో వైపు 2019–24 మధ్య ఆ ఐదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అప్పట్లో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
సైనిక లాంఛనాలతో హవల్దార్ కిషన్ అంత్యక్రియలు
బేస్తవారిపేట: దేశ సేవలో ప్రాణాలు అర్పించిన ఆర్మీ హవల్దార్ కువ్వరపు కిషన్‌కు కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రు నివాళుల నడుమ సైనిక లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లెకు చెందిన ఆర్మీ హవల్దార్ కిషన్ అరుణాచల్ ప్రదేశ్‌లోని నగుల ఆపరేషనల్ ఏరియా వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కిషన్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం స్వగ్రామమైన పందిళ్లపల్లె ఎస్సీ కాలనీకి తీసుకొచ్చారు. మాజీ సైనికులు, గ్రామస్తులు, యువకులు పందిళ్లపల్లె బస్టాండ్ నుంచి గ్రామంలోకి ర్యాలీగా భౌతికకాయాన్ని తరలించారు. కిషన్ భౌతికకాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ 268 మీడియం రెజిమెంట్ కెప్టెన్ పునిత్ కుమార్, సుబేదార్ రాజ్వీర్ సింగ్, ఒంగోలు 34వ బెటాలియన్ ఎన్సీసీ యూనిట్ నాయక్ సుబేదార్ సుకేందర్ సింగ్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ నుంచి ఊరేగింపుగా కిషన్ మృతదేహాన్ని పొలం వద్దకు తరలించారు. అక్కడ అధికార సైనిక లాంఛనాలు నిర్వహించారు. అనంతరం కిషన్ భార్య సంధ్యకు జాతీయ జెండాను అందజేశారు. సైనికులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు గృహం వద్ద కిషన్ భౌతిక కాయానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి కిషన్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి అబ్దుల్ రహీమ్, అధికారులు నివాళులర్పించారు. కుటుంబాన్ని ఆదుకోవాలి దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు. ఆయన కుటుంబానికి పొలం, స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి అండగా ఉన్న కిషన్ మృతితో తమ కుటుంబం అనాథగా మారిందని, మూడేళ్ల చిన్న కుమారుడు ఉన్నాడని కలెక్టర్ విజయ సునీత వద్ద కిషన్ భార్య సంధ్య కన్నీరుమున్నీరైంది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నానని, ఆదుకోవాలని వేడుకుంది. కిషన్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఆర్మీ జవాన్ కిషన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: ఆర్మీ జవాన్ కిషన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన హవల్దార్ కువ్వరపు కిషన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. భారత్ –చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు.‘దేశం కోసం ఆయన చేసిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను. హవల్దార్ కువ్వరపు కిషన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’అంటూ వైఎస్ జగన్ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
‘న్యాయవాదుల ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరిస్తోంది’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం న్యాయవాదుల ఆంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ కర్నూలు లీలగ్సెల్ న్యాయవాదులు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను లీగల్ సెల్ నేతలు మనోహర్ రెడ్డి, స్వాములు, సువర్ణరెడ్డి తదితరులు కలిశారు.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. రాయలసీమ ప్రజలు, న్యాయవాదుల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. వైఎస్ జగన్ హయాంలో రాయలసీమ అభివృద్ధి, న్యాయవాదులకు కలిగిన ప్రయోజనాలను న్యాయవాదులు వివరించారు. కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ హెచ్ఆర్సీ, లోకాయుక్త, ఏపీఈఆర్సీ తరలింపు, నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపలను ప్రస్తావించారు.అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు రూ.100 కోట్లు.. ‘లా నేస్తం’ ద్వారా జూనియర్ న్యాయవాదులకు రూ.49.51 కోట్ల సాయం అందించారని వెల్లడించారు. కానీ ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవటం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: వైఎస్ జగన్‌ను కలిసిన లంకపల్లి రైతులు -
ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
వైఎస్ జగన్‌ను కలిసిన కర్నూలు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్నూలు పార్టీ లీగల్ సెల్ నేతలు బుధవారం కలిశారు. న్యాయవాదుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, ఆ దిశగా చర్యలు తీఈసుకోవడం లేదని చెప్పారు. రాయలసీమ ప్రజలు, న్యాయవాదుల ఆకాంక్షలను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్ హయాంలో రాయలసీమ అభివృద్ధిని, న్యాయవాదులకు కలిసిగిన ప్రయోజనాలను లాయర్లు వివరించారు. కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్, హెచ్ఆర్సీ, లోకాయుక్త, ఏపీఈఆర్సీ నేషనల్ లా వర్సిటీ శంకుస్థాపనలను న్యాయవాదులు ప్రస్తావించారు. అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు రూ.100 కోట్లు లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు రూ.49.51 కోట్ల సాయం అందించారని వెల్లడించారు. కూటమి సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో లీగల్ సెల్ నేతలు మనోహర్ రెడ్డి, స్వాములు, సువర్ణరెడ్డి, తదితరులు ఉన్నారు. -
ఆర్మీ జవాన్ కిషన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ఆర్మీ జవాన్ కిషన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన హవల్దార్ కువ్వరపు కిషన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమంటూ ట్వీట్ చేశారు.‘‘దేశం కోసం ఆయన చేసిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను. హవల్దార్ కిషన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ సంగతి: ఇండి కూటమి భేటీలో దేశ వ్యాప్తంగా నిరసనలకు నిర్ణయంDeeply saddened by the loss of Havildar Kuvvarapu Kishan of Prakasam district, who died while performing operational duties along the India-China border. I salute his service to the nation. My heartfelt condolences to his family. May they find strength in this hour of grief. https://t.co/sYGDWSlnmx— YS Jagan Mohan Reddy (@ysjagan) September 30, 2026 -
భారత ఆర్చరీ క్రీడాకారులకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి : ఆసియా క్రీడల్లో సత్తాచాటిన భారత ఆర్చరీ క్రీడాకారులను వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఆసియా క్రీడల్లో ఆర్చరీ విభాగంలో స్వర్ణపతకాలు సాధించడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ చూపారనీ, భారతదేశ కీర్తిని మరింత పెంచారని వైఎస్ జగన్ కొనియాడారు. ఆర్చరీ ఈవెంట్లో భాగంగా పురుషులు కాంపౌండ్ టీమ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ రాజేశ్ జాధవ్, గణేశ్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. ప్రత్యర్థి చైనాను 238-237 తేడాతో ఓడించిన భారత్.. పసిడిని అందుకుంది. వీరి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని యువ క్రీడాకారులు ముందుకు సాగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. గణేష్ మణిరత్నం ఏపీకి చెందిన క్రీడాకారుడు కావటం మనందరికీ గర్వకారణమన్నారు వైఎస్ జగన్. ఇదీ చదవండి: ఆర్చరీలో హ్యాట్రిక్.. భారత్ ఖాతాలో 10వ స్వర్ణం -
వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన లంకపల్లి రైతులు
తాడేపల్లి : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తమ గ్రామ పరిధిలోని సుమారు 600 ఎకరాల లంక భూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు రైతులు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కనపెట్టి, స్థానిక టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై టీడీపీ నాయకులు, వారి బినామీల పేర్లతో అనధికారికంగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ హక్కులను కాదని, రాజకీయ ప్రాబల్యంతో భూములను ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు సదురు రైతులు.లంక భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని వైఎస్ జగన్‌ను కోరారు రైతులు.రైతుల సమస్యలను, వారి ఆవేదనను విన్న వైఎస్ జగన్.. వారికి అవసరమైన న్యాయం సహాయం పార్టీ తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు. బాధిత రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: ‘కోర్టు తీర్పు.. చంద్రబాబు సర్కార్‌కు చెంపపెట్టు’ -
Gudivada: అలాంటి వాళ్లను దగ్గరకు రానివ్వకండి.. ఆనాడు జగన్ చెప్పిన మాట..
-
జనసంద్రంగా మారిన ఒంగోలు
-
ఒంగోలు జన సంద్రం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అశేష జన వాహిని మధ్య మంగళవారం ఒంగోలులో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఒంగోలుకు వస్తున్నట్లు తెలుసుకుని భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ఉదయం 10 గంటలకే ఏబీఎం కాలేజీ వద్దకు వచ్చారు. కాలేజీ ప్రాంగణంతో పాటు ఆ ప్రాంతంలో రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. తమ అభిమాన నేతను చూడగానే జనాలు కేరింతలు కొట్టారు. వైఎస్ జగన్ అభివాదం చేయగానే.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఒంగోలులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు భారీగా వచ్చిన జనసందోహంలో ఓ భాగం రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసి పోవడంతో కాన్వాయ్ ముందుకు కదలడం కష్టంగా మారింది. భారీ జన సందోహం మధ్య తహసీల్దార్ కార్యాలయం, జాయ్ ఆస్పత్రి మీదుగా వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ ఇంటికి చేరుకున్నారు. కాలేజీ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న రాజశేఖర్ ఇంటి వద్దకు చేరుకునేందుకు అరగంటకు పైగా పట్టింది. మిద్దెలపైకెక్కి జగన్‌ను చూస్తూ సెల్ ఫోన్లతో ఫొటోలు తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో సైతం అంతే ఉత్సాహంతో యువత జేజేలు పలికారు. జై జగన్ నినాదాలు మిన్నంటాయి. జగన్‌ను చూసేందుకు మహిళలు సైతం భారీగా తరలి వచ్చారు.ఒంగోలులో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమాన నాయకుడితో మాట్లాడాలని, కరచాలనం చేయాలని పెద్ద సంఖ్యలో యువత ఎగబడ్డారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా అభిమానులను ఆపటం వాళ్ల తరం కాలేదు. జగన్ పర్యటనలో అధిక సంఖ్యలో యువత తరలి రావడం కనిపించింది. వైఎస్ జగన్ ఒంగోలులో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అడుగడుగునా అదే ఉత్సాహంతో జగన్‌ను అనుసరించారు. కాకుమాను ఇంటి వద్ద గుమిగూడిన యువకులు జగన్‌తో సెల్ఫీ దిగడానికి పోటీపడ్డారు. జగన్ అక్కడ ఉన్నంత సేపు 45 నిమిషాల పాటు ఆయన కోసం ఎదురు చూస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కాకుమాను రాజశేఖర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్ ధైర్యంగా ఉండండి డీఎస్సీ స్కామ్‌పై నిరసన వ్యక్తం చేస్తుండగా జరిగిన పోలీసుల తోపులాటలో గాయపడి, ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. కాకుమాను మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కాకుమాను రాజశేఖర్.. పార్టీకి అందించిన సేవలను వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో, అంకిత భావంతో ఆయన పని చేశారన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. రాజశేఖర్ కుటుంబం ఒంటరిది కాదని, వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకుమాను కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్ హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ఒంగోలు ఏబీఎం కాలేజీ గ్రౌండ్లో భారీ జనసందోహం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్న యువత కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాజశేఖర్ సతీమణి కాకుమాను షర్మీలా రాజశేఖర్, కుమారులు శశిరాజ్, అమల్‌రాజ్, సోదరుడు రాజ్ శిఖామణి, ప్రశాంతి దంపతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, నేతలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, తలశిల రఘురాం, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి వెంకాయమ్మ, జూపూడి ప్రభాకర్, నందిగం సురేష్, టీజేఆర్ సుధాకర్ బాబు, కేపీ నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, చుండూరు రవిబాబు, కరణం వెంకటేశ్, చింతలపూడి అశోక్‌కుమార్, దద్దాల నారాయణ యాదవ్, జంకె వెంకటరెడ్డి, కనకరావు మాదిగ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కేవీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
YS జగన్ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)
-
జగన్ సెక్యూరిటీ..! చేతులెత్తేసిన రెడ్ బుక్ పోలీసులు
-
కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి YS జగన్ పరామర్శ
-
LIVE: కాకుమాను కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
-
ఒంగోలు బయలుదేరిన వైఎస్ జగన్
-
కాకుమాను కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి ఒంగోలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ జగన్ రాకతో భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఇటీవల మరణించిన వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ నివాసానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. కాగా, ఇటీవల డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా శాప్ ఆఫీసు ఎదుట జరిగిన పోలీసుల తోపులాట కారణంగా రాజశేఖర్ అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు.. వైఎస్ జగన్ ఒంగోలు వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. జననేత వైఎస్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారీ జనసందోహం మధ్య వైఎస్ జగన్.. రాజశేఖర్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
నేడు వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు చేరుకుంటారు. అక్కడ ఇటీవల మరణించిన వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు. -
YS జగన్ కృషి.. అతిపెద్ద బస్ టెర్మినల్ పులివెందుల బస్టాండ్
-
పులివెందుల బస్టాండ్‌కు అరుదైన గుర్తింపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని పులివెందుల బస్టాండ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. పర్యాటకులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ బస్టాండ్‌గా అవార్డు దక్కింది. రాజమండ్రిలో నిర్వహించిన పర్యాటక అవార్డుల కార్యక్రమంలో పులివెందుల బస్ టెర్మినల్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు.స్టేట్ ఆఫ్ ఆర్ట్ సదుపాయాలతో ఆదర్శవంతమైన బస్టాండ్‌గా దీన్ని నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు, భద్రత, మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుని టెర్మినల్‌ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. పర్యాటకుల రాకపోకలకు అనువుగా ఉండటంతో పాటు.. ఆధునిక సదుపాయాలు ఉండటం ఈ గుర్తింపుకు కారణమని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో.. ఆయన సీఎంగా ఉన్నప్పుడే దీనిని నిర్మించడం గమనార్హం.జగన్ హయాంలోనే నిర్మాణంపులివెందుల బస్ టెర్మినల్‌ను రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2022 డిసెంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిని ప్రజలకు అంకితం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్‌గా దీనిని నిర్మించారు. బస్టాండ్‌లో ఒకేసారి 225 మంది కూర్చునేలా సీటింగ్ సదుపాయం కల్పించారు. మొత్తం 95 బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 13 మరుగుదొడ్లు నిర్మించారు. వికలాంగులు కూడా సులభంగా రాకపోకలు సాగించేలా సదుపాయాలు కల్పించారు.55 సీసీ కెమెరాలతో నిఘాప్రయాణికుల భద్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. బస్టాండ్ పరిసరాల్లో 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 24 గంటల పాటు నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణంతో పాటు భద్రత కల్పించేలా టెర్మినల్‌ను రూపొందించారు. పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమంలో పులివెందుల బస్టాండ్‌కు అవార్డు రావడంతో స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ టెర్మినల్‌కు లభించిన గుర్తింపు పులివెందుల ప్రత్యేకతను మరోసారి చాటిందని పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: కాకుమాను కుటుంబానికి పరామర్శ.. ఒంగోలుకు వైఎస్ జగన్ -
భగత్ సింగ్ జయంతి.. YS జగన్ ఘన నివాళి..
-
రేపు ఒంగోలుకు YS జగన్
-
రేపు ఒంగోలుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(మంగళవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ నేత కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, ఇటీవలి డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా శాప్ ఆఫీసు ఎదుట జరిగిన పోలీసుల తోపులాట కారణంగా రాజశేఖర్ అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. -
భగత్ సింగ్ జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు భగత్ సింగ్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. భగత్ సింగ్‌కు నివాళి అర్పించారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ఆయన పోరాట స్ఫూర్తి, దేశభక్తి తరతరాలకు మార్గదర్శకమని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘దేశం కోసం జీవించడం అంటే ఏమిటో.. మాతృభూమి స్వేచ్ఛ కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడం ఎంత గొప్పదో.. తన జీవితంతో చాటిన అమరవీరుడు భగత్ సింగ్. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ఆయన పోరాట స్ఫూర్తి, దేశభక్తి తరతరాలకు మార్గదర్శకం. ఆ మహావీరుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. దేశం కోసం జీవించడం అంటే ఏమిటో, మాతృభూమి స్వేచ్ఛ కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడం ఎంత గొప్పదో తన జీవితంతో చాటిన అమరవీరుడు భగత్ సింగ్ గారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ఆయన పోరాట స్ఫూర్తి, దేశభక్తి తరతరాలకు మార్గదర్శకం. ఆ మహావీరుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా… pic.twitter.com/aZVzUhZarA— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2026 ఇదీ చదవండి: చంద్రబాబు సర్కార్ మరో దుర్మార్గం.. -
ఇది ప్రజాస్వామ్యమేనా ? బాబుకు జగన్ సీరియస్ వార్నింగ్
-
పాశవిక దాడి అమానుషం... ఉద్యోగుల పట్ల కూటమి సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
హామీలు అమలు చేయాలంటే కొడతారా?
సాక్షి, అమరావతి : ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవికంగా దాడి చేయడం అమానుష చర్య అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ చైర్మన్‌ను నియమిస్తే మీరు వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే.. అప్పుడు అందులో రెండు డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు. ఇవి ఇవ్వాలని అడిగిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం అత్యంత తీవ్రమైన విషయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‘ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నా కోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్బంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబూ.. ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? ఉద్యోగులకు వెన్నుపోటు పొడవడమే మీ లక్ష్యం. అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?’ అని నిలదీశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు.. ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే అన్నారు. మీరు అధికారంలోకి వస్తానే ఐఆర్ అన్నారు. పీఆర్సీ అన్నారు. తీరా చూస్తే ఏవీ లేవని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలో మహిళా ఉద్యోగిని పోలీసులు ఈడ్చుకెళ్తున్న ఫొటోను ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ వ్యవస్థపై కక్ష మీరు సీఎం సీట్లోకి వచ్చిన తొలి రోజు నుంచే.. మేం దేశంలో ఎక్కడా లేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్షగట్టారు. గ్రామ స్థాయిలోనే 540కి పైగా సేవలందించిన, మా మానస పుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా.. ఆ వ్యవస్థలపై నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలన కోసం మేం సృష్టించాం. హేతు బద్ధీకరణ పేరుతో మీరు శాశ్వతంగా 30 వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాకుండా, వలంటీర్లకు మేం ఇచ్చే రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పని భారాన్ని మోపారు. పారదర్శకతకూ, ఇంటి వద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు.. ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది? ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.గ్రామ–వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే గ్రామ–వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటి కంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు – ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మళ్లీ అందేలా, దేశం అంతా మన వైపు చూసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లు మూసుకుంటే ఆ కాలం కూడా ఇట్టే గడిచి పోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. -
ఆందోళన చేస్తే లాఠీలతో కొడతారా?: వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసనకు దిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి చేసిందని, ఇది ఒక అమానుష చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయమని, వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ప్రశ్నించారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం అమానుష చర్యలను ఖండించారు వైఎస్ జగన్.చంద్రబాబు… ఇది ప్రజాస్వామ్యమేనా?‘ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా?, మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా?, శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు?, ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా?, ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా?, చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా?, రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది?, అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?, చంద్రబాబూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు. ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే.ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు..మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు.ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు. వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడిచేస్తూనే ఉన్నారు.గ్రామ స్వరాజ్యం కనబడకుండా కుట్రలుగ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు.. వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?,ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి..చంద్రబాబూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి. ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. . తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ అందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లు మూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: సచివాలయ ఉద్యోగులపై ఉక్కుపాదం -
బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ : వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి,తూర్పుగోదావరి : వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, బొత్స సత్యనారాయణ, విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు.ఈ సందర్భంగా రాజ్యాధికారం ఉంటేనే సమాజం ముందుకెళ్లే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారంతోనే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బలంగా ఉండగలమని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత బీసీలను ఏ ప్రభుత్వాలు గుర్తించాయి. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనే అంశాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను బ్యాక్వర్డ్ కాదు బ్యాక్‌బోన్ అని చెప్పిన ఏకైక నాయకుడు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రమేష్ యాదవ్ కొనియాడారు. యాదవ సమాజంలో ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీ వర్గానికి కేటాయించాలని సభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తాము కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లమేనని పేర్కొన్న మాజీ మంత్రి విడదల రజిని.. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలకు ఎక్కడెక్కడ గుర్తింపు లోపించిందనే దానిపై అధ్యయనం జరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం ఇప్పటిదాకా రాలేదని, మహిళలకు అందిస్తామన్న సహాయం అందలేదని, లబ్ధిదారులకు పింఛన్లు కూడా తగ్గిపోయాయని మండిపడ్డారు. -
ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?
-
ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ
-
NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం
-
మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
ఏషియన్ గేమ్స్ 2026లో స్వర్ణ పతకం గెలిచిన మహిళల కబడ్డీ జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఫైనల్లో ఇరాన్‌పై ఉత్కంఠభరిత విజయంతో స్వర్ణం గెలిచి దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు. Heartiest congratulations to India’s women’s kabaddi team on winning gold at the #AsianGames2026! Your thrilling victory over Iran has made the entire nation proud. From Sanju Devi’s outstanding contribution to the team’s composure in the closing minutes, every player showed… pic.twitter.com/9uRPo94w0h— YS Jagan Mohan Reddy (@ysjagan) September 26, 2026సంజు దేవి అద్భుత ప్రదర్శనతో పాటు చివరి నిమిషాల్లో జట్టు ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఆకట్టుకుందని కొనియాడారు. దేశంలోని మరింత మంది యువతులు క్రీడల వైపు అడుగులు వేయడానికి ఈ విజయం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.కాగా, హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ ఇరాన్‌ను 37-34తో ఓడించి, వరుసగా రెండో ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం.మరోవైపు ఇవాళే పురుషుల కబడ్డీ జట్టు కూడా ఇరాన్‌తో స్వర్ణం కోసం పోటీపడనుంది.మహిళల కబడ్డీలో పతకంతో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం, మొత్తంగా 27వ పతకం చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. చైనా 169 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్ -
ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం బలోపేతం కావాలి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన
-
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై YS జగన్ ఆందోళన
-
ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం బలోపేతం కావాలి
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సీఈసీ నియామక చట్టాన్ని పునఃసమీక్షించాలన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలుమార్లు నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఈసీఐనెట్ (ఎలక్షన్ కమిషన్ ఇంటర్నెట్)నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం ప్రజల్లో తీవ్రమైన ప్రశ్నలు, సందేహాలకు దారితీస్తోందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆరోపణల కంటే వాస్తవాలపై స్పష్టత పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కంటే.. ఏ అభ్యంతరాలు నమోదు అయ్యాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం, తిరిగి చేర్చడం వంటి ప్రక్రియలు ఎంత పారదర్శకంగా జరిగాయి? అనే అంశాలపై ప్రజలకు స్పష్టత అవసరం. ఈ అంశాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలి. అంతిమంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలి. ఎలాంటి భయం లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. పారదర్శకతతో పాటు నమ్మకమూ అవసరం ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటం మాత్రమే కాకుండా.. పారదర్శకత ఉన్నదనే నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. గతంలో తమ మద్దతు పొందిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీ కాల చట్టం–2023ను ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ముగ్గురు సభ్యుల కమిటీతో నియామకాలు కేంద్ర ప్రభుత్వం (అధికార పార్టీ) ముందుకు వచ్చి, ప్రస్తుతం నెలకొన్న భయాలు, అనుమానాలను తొలగించే విధంగా ఒక సాధారణ విశ్వసనీయమైన విధానాన్ని పునరుద్ధరించాలి. ఎన్నికల కమిషనర్ నియామకాన్ని మళ్లీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ద్వారా చేపట్టేలా చట్ట సవరణ తీసుకురావాలి. ఈ కమిటీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి ఉండాలి. తనకు పరీక్ష నిర్వహించే పరీక్షకుడిని విద్యార్థి తానే నియమించుకోవడం అనేది.. పరీక్షకుడు ఎంత నిజాయితీపరుడైనా ఆరోపణలకు అవకాశం కల్పిస్తుంది. అందుకు బదులుగా తటస్థమైన వ్యక్తి లేదా వ్యవస్థ ద్వారా నియామకం జరగడం మరింత సముచితం. ఇలాంటి మార్పు ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఉన్న గౌరవం, విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేందుకు దోహద పడుతుంది. ఏపీలో ఎస్ఐఆర్ పైనా అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ సందర్భంగా అధికారంలో ఉన్న పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినందున ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. అనేక సందర్భాల్లో తాము చేసిన అనేక విజ్ఞప్తులను పట్టించుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నియోజకవర్గాలు, డివిజన్ల పునర్విభజన జరిగిన తీరుపైనా ప్రతిపక్ష పార్టీగా వ్యక్తం చేసిన అభ్యంతరాలను పక్కన పెట్టారు. ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని బలహీన పరుస్తాయి. ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ ఎలా పని చేస్తుందో అంచనా వేయడానికి పారదర్శకత, జవాబుదారీతనం నిజమైన ప్రమాణాలు. వీటిని కాపాడటం ఆ సంస్థ ప్రాథమిక బాధ్యత’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సార్ మీ సాయం మరువలేంవైఎస్ జగన్‌కు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్దిపొందిన కుటుంబం కృతజ్ఞతలు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘సార్.. మీరు చేసిన సాయం ఎప్పటికీ మరువలేం..’ అని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్‌ను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతులు తమ కుమార్తె ధన్సికతో సహా శుక్రవారం కలిశారు. ధన్సిక 2019లో రెండు నెలల పాపగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైందని తెలిపారు. అప్పటికి కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. చిన్నారి ధన్సికతో ఆప్యాయంగా మాట్లాడుతున్న వైఎస్ జగన్ ఆ సమయంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రిలో మెదడుకి సంబంధించి అత్యంత క్లిష్టమైన న్యూరో సర్జరీ ఉచితంగా చేశారని, తమ కుమార్తె కోలుకుందని వైఎస్ జగన్‌కు వివరించారు. ఆపరేషన్ తర్వాత తమ కుమార్తె ఆరోగ్యంగా ఉందని చెప్పారు. అత్యంత క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి పాపకు సకాలంలో వైద్య సాయం అందించేలా చేసిన వైఎస్ జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని మహేష్, వినీల దంపతులు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి ధన్సికను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని చిన్నారిని వైఎస్ జగన్ ఆశీర్వదించారు. చిన్నారి, ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు వారితో కలిసి సెల్ఫీ దిగారు. -
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తటంపై ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ‘‘ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి.. అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుంది. ఎన్నికల సంఘంలోనే ఇద్దరు ఎన్నికల కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ముఖ్యంగా ఓటర్ల జాబితాల నిర్వహణ సహా అనేక అంశాల్లో బేధాభిప్రాయాలు వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవి ప్రజల్లో అనేక ప్రశ్నలకు దారితీశాయి. ఆ మీడియా కథనాల ప్రకారం గత పది నెలల్లోనే 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇవన్నీ సహజమే అంటోంది. బేధాభిప్రాయాలు ఉన్నా తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెప్తోంది. కానీ ప్రజల్లో నెలకొన్న సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలి..ఆరోపణలు–ప్రత్యారోపణలకు పరిమితం కాకుండా ఏయే అంశాలపై అభ్యంతరాలు నమోదయ్యాయి?. వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగింది?. ఓటర్ల జాబితాల నిర్వహణలో క్షేత్రస్థాయి అధికారులకు ఎంత స్వతంత్రత ఉంది?. అనే అంశాలపై స్పష్టత అవసరం. ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించటం అత్యంత ముఖ్యం. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాదు. పారదర్శకత ఉందనే నమ్మకం కూడా ప్రజలకు కలగాలి. 2023లో తీసుకొచ్చిన నూతన చట్టానికి మేము మద్దతు ఇచ్చాం. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ చట్టాన్ని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది..ఎన్నికల సంఘంపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చూడాలి. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల కమిటీ విధానాన్ని తిరిగి తీసుకు రావాలి. ఆ మేరకు చట్ట సవరణపై ఆలోచించాలి. విద్యార్థే పరీక్ష పెట్టే వారిని నియమించే పరిస్థితి ఉంటే.. ఆ వ్యక్తి ఎంత నిజాయితీపరుడైనా అనుమానాలకు తావిస్తుంది. అందుకే నియామకాలు పారదర్శకంగా ఉండేలా వ్యవస్థ ఉండాలిఇదీ చదవండి: సాయం అంటే ఇది.. థాంక్యూ జగన్ మామయ్య..అలాంటి మార్పు ఎన్నికల సంఘం ప్రతిష్ఠను, దానిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ సందర్భంగా ప్రతిపక్షంగా మేము అనేక అభ్యంతరాలను చెప్పాం. కానీ వాటికి సరైన స్పందన ఎన్నికల సంఘం నుండి రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియలోనూ.. వార్డులు, డివిజన్ల పునర్విభజనపై ప్రతిపక్షంగా మేము అనేక అభ్యంతరాలను తెలిపాం. కానీ వేటినీ పరిగణనలోకి తీసుకోకపోవటం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితులే ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలకు కారణమవుతాయి..అందుకే పారదర్శకత, జవాబుదారీతనం ఎన్నికల వ్యవస్థకు ప్రాథమిక ప్రమాణాలుగా ఉండాలి. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడటం.. ఎలాంటి భయం లేదా అనుమానం లేకుండా ఆ హక్కును వినియోగించుకునేలాబుండాలి. ఆ వ్యవస్థను బలోపేతం చేయడం ఎన్నికల వ్యవస్థ ముందున్న అత్యంత ముఖ్యమైన బాధ్యత’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Democracy can stand only when people have complete confidence in constitutional institutions such as the Election Commission. National media reports that two Election Commissioners raised objections on several occasions to decisions, electoral rolls and the management of ECINet…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2026 -
సాయం అంటే ఇది.. థాంక్యూ జగన్ మామయ్య
సాక్షి, విజయవాడ: సాయం పేరుతో ప్రకటనలు.. కెమెరా ముందు హామీలు.. ఆ తర్వాత పట్టించుకోని పరిస్థితులు చాలానే చూస్తుంటాం. కానీ ఓ చిన్నారికి అత్యంత ఖరీదైన వైద్యం అవసరమైనప్పుడు.. కుటుంబం ఆ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్న వేళ జగనన్న సాయం ఆదుకుంది. ఇప్పుడు అదే చిన్నారి ఆరోగ్యంగా ఎదుగుతుండగా.. సాయం మరువని ఆమె తల్లిదండ్రులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఆ భావోద్వేగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నూజివీడు నియోజకవర్గంలోని కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతుల కుమార్తె ధన్సిక. చిన్నతనంలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో 2019లో న్యూరో సర్జన్ పర్యవేక్షణలో అత్యంత క్లిష్టమైన, ఖరీదైన శస్త్రచికిత్స అవసరమైంది. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం అమలు చేసిన ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా ఆ వైద్యాన్ని కుటుంబానికి ఉచితంగా అందించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఖరీదైన ఆపరేషన్ ఖర్చును భరించే పరిస్థితి తమకు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ తమకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు.వైఎస్ జగన్‌ను కలిసిన దంపతులుప్రస్తుతం ధన్సిక పూర్తిగా కోలుకుని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉందని మహేష్, వినీల తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలసి.. తమ కుమార్తెకు అందిన వైద్య సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారితో ముచ్చటించిన జగన్ధన్సికను చూసిన వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో ఆ చిన్నారి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. ఓదార్చిన ఆయన ఆమెతో కొద్దిసేపు ముచ్చటించి.. బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం స్వయంగా సెల్ఫీ కూడా తీశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను, ఆరోగ్యశ్రీ ద్వారా అందిన వైద్యాన్ని గుర్తుచేసుకున్నారు.చిన్నతనంలోనే తీవ్రమైన అనారోగ్య సమస్యను ఎదుర్కొన్న ధన్సిక.. ఖరీదైన శస్త్రచికిత్స అనంతరం ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉండటం కుటుంబానికి ఊరటనిచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. ఒకప్పుడు చికిత్స కోసం ఆందోళన చెందిన కుటుంబం.. ఇప్పుడు అదే చిన్నారి ఆరోగ్యంగా ఉండటాన్ని చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా అందిన చికిత్సకు కృతజ్ఞతగా జగన్‌ను కలిసిన ఈ కుటుంబం భేటీకి సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఎస్పీ బాలుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఎస్పీ బాలుకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో.. చిరస్థాయిగా నిలిచిన మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి, భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఆయన మన తెలుగు జాతికి గర్వకారణం. నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు.ఇదీ చదవండి: రెడ్‌బుక్ పాలనలో మరో అంకం.. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందిన గుంటూరి పెద్ది రాజును రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్)గా, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన అంగూరి లక్ష్మీశివకుమారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. -
బాబు కుట్రలు తిప్పికొట్టాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల బలాన్ని ఉపయోగించుకుని అడ్డదారుల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తారని, వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని, వీలైనంత వేగంగా ఆ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. అందరి అభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలి. వీలైనంత వేగంగా ఆ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావాలి. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడాలి. పార్టీలో అందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోండి. పలు దఫాలుగా వారితో చర్చించి అభ్యర్థుల జాబితా రూపొందించండి. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి. ఎప్పటికప్పుడు స్థానిక నాయకత్వాన్ని పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలి. అవన్నీ ప్రజల్లో గట్టిగా ఎండగట్టాలి ‘రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పోలీసుల బలాన్ని ఉపయోగించుకోవడంతో పాటు అడ్డదారులతో సీఎం చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తారు. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. అందుకోసం ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయాలు ఉంచుకోవాలి. అలాగే ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలు, మోసాలు, వెన్నుపోట్లను ప్రజలకు గట్టిగా వివరించాలి.వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలనూ ప్రస్తావించాలి. వీటన్నింటితో పాటు, చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను సమగ్రంగా చెప్పాలి’ అని వైఎస్ జగన్ నిర్దేశించారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, పీవీ మిథున్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
జీవితాంతం YS జగన్ కు రుణపడి ఉంటా
-
వైఎస్ జగన్‌ను కలిసాక CPI ఈశ్వరయ్య రియాక్షన్
-
వైఎస్ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు
తాడేపల్లి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రముఖ సీపీఐ నేతలు కలిశారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 24వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌తో సీపీఐ ప్రముఖ నేతలు సమావేశమయ్యారు. వీరికి వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌తో సమావేశమైన వారిలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డిలు ఉన్నారు.ప్రజా సంబంధిత అంశాలపై ఇరువురి నేతల మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్సీపీని ఆహ్వానించారు. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందించారు.సమావేశం అనంతరం ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26వ తేదీన రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని, దానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానించినట్లు ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ప్రజా పోరాటాలకు వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేశారని, ఎస్ఎల్ఆర్ గురించి సైతం ఆయన మద్దతు కోరినట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో భారీగా ఓట్లు తొలగించారన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, సమాధానం చెప్పలేక దాడులు చేయడం సరికాదన్నారు ఈశ్వరయ్య.ఇదీ చదవండి: బాబు కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: వైఎస్ జగన్ -
రౌడీ షీట్లకు బ్రేక్.. బాబు యూ టర్న్
-
పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో YS జగన్ సమావేశం
-
బాబు కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున బలమైన, మంచి అభ్యర్థులను వేగంగా గుర్తించాలని పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి.. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోలీసుల బలంతో, అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారు. వాటిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు . ప్రజా పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు సహా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్థంగా ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను గుర్తించాలి. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడాలి. పార్టీలో అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోండి. పలు దఫాలుగా వారితో చర్చించి అభ్యర్థుల జాబితాను తయారు చేయండి. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలి.రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, ప్రజలకు జరిగిన వెన్నుపోట్లను ప్రజలకు వివరించాలి. ప్రతి గడప వద్దకూ వెళ్లి, మన పాలనలో మంచి జరిగిన విషయాలను చెప్పాలి. అలాగే, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వెన్నుపోటు, దారుణాలను వివరించాలి. ఈ రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను సమగ్రంగా చెప్పాలి. పోలీసు బలంతో, అడ్డదారుల్లో స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారు. వాటిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధం కావాలి. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయాలు ఉంచుకోవాలి’ అని సూచించారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ రాజశేఖర్ మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి -
కాకుమాను రాజశేఖర్ మృతి YS జగన్ ఎమోషనల్ రియాక్షన్
-
వైఎస్సార్సీపీ రాజశేఖర్ మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.కాగా, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజశేఖర్ వైఎస్సార్సీపీకి అంకితభావంతో పనిచేశారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు.మా పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గారి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన లేని లోటు పార్టీకి, వ్యక్తిగతంగా నాకు ఎప్పటికీ పూడ్చలేనిది. రాజశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ తీరని శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ… pic.twitter.com/WU401YZvz0— YS Jagan Mohan Reddy (@ysjagan) September 24, 2026 రాజశేఖర్ ఆకస్మిక మరణం బాధాకరమని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అయితే, గతంలో లిడ్‌క్యాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజశేఖర్, ప్రస్తుతం పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: ఏపీలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం -
ఇదిగో సాక్ష్యం.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. పక్కా ఆధారాలతో గవర్నర్ వద్దకు జగన్
-
డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే రౌడీషీట్ తెరుస్తారా?... చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
‘స్థానికం’గా గట్టిగా నిలబడదాం
ఎన్నికల హామీలతో వెన్నుపోటు పార్టీ నేతలు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫొటోలు, సంతకాలతో బాండ్లు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీల వర్షం కురిపించారు. ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి కుటుంబ సభ్యుడికీ విడివిడిగా లెక్కలు చెప్పి హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ బాండ్ల విలువ ఏమిటి? రాజకీయాల్లో విశ్వసనీయత అంటే ఇదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా గురించి ఇంటింటా చర్చించుకుంటున్నారు. డీఎస్సీ నియామకాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టారు. ఈ స్కామ్‌పై ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఎల్లో మీడియా వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తోంది. హామీలన్నీ అమలై పోయాయని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. మన ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. ప్రజలకు మంచి చేయాలని తపన పడ్డాం. తాపత్రయంతో పని చేశాం. బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో సంక్షేమ సొమ్ము జమ చేశాం. కోవిడ్ సమయంలోనూ సాకులు చెప్పకుండా ప్రజలకు అండగా నిలిచాం. అదే చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టి, మొత్తం పోలీసులపై ఆధారపడుతున్నారు. మన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, గ్రామ స్థాయి పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలి. ఇదే సమయంలో ఈ ప్రభుత్వ ఎన్నికల హామీల అమలు, భూముల కేటాయింపులు, డీఎస్సీ నియామకాలు, తాగునీటి సమస్య, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరును కూడా తెలియజెప్పాలి. - వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలంతా మన వైపే ఉన్నారని.. స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడి పోరాడాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనంతా అరాచక పర్వమని.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయని, వాటన్నింటినీ ప్రజల్లో గట్టిగా ఎండగట్టాలని సూచించారు. విశాఖలో చంద్రబాబు వచ్చాకే సమస్యలు మొదలయ్యాయని.. నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, చెప్పారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయని.. పోలీసులు గతి తప్పి వ్యవహరిస్తున్నారని, దారుణంగా వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ డైరీతో అన్ని లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. ఇకనైనా వారు పద్ధతి మార్చుకోవాలని.. లేని పక్షంలో తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం గ్రేటర్ విశాఖ పరిధిలోని పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను.. నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రతి ఇంట్లో అదే చర్చ మన ఐదేళ్ల పాలనకు, ప్రస్తుతం రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ఈరోజు ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు. మన హయాంలో ప్రజలకు అందిన పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య వ్యత్యాసం ప్రతి కుటుంబానికీ స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో గతంలో ఎన్నడూ జరగని మార్పులు తీసుకొచ్చాం. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను మార్చాలన్న చిత్తశుద్ధితో పని చేశాం. రాజకీయాల్లో నాయకుడి మీద, పార్టీ మీద విశ్వసనీయతను పెంచేందుకు కృషి చేశాం. గతంలో మేనిఫెస్టో అంటే ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం, ఎన్నికలు ముగిసిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేయడం అనే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని మార్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మేనిఫెస్టోను కేవలం రెండు పేజీల్లో, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తీసుకొచ్చాం. దాన్ని ఒక భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి 99 శాతం హామీలను అమలు చేశాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అంతటి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం మనది.విద్య, వైద్య–ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులునాడు మనం కేవలం మేనిఫెస్టో అమలుతోనే సరిపెట్టుకోలేదు. గతంలో సాధ్యం కావనుకున్న ఎన్నో కార్యక్రమాలను సాధ్యం చేసి చూపించాం. విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడగలవా.. అనే సందేహం గతంలో ఉండేది. మన ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. నాడు–నేడు (మనబడి) కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. మూడో తరగతి నుంచే టోఫెల్‌ను ఒక పీరియడ్‌గా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక పేజీ ఇంగ్లిష్, మరో పేజీ తెలుగు ఉండేలా ద్విభాషా (బైలింగ్వువల్) పాఠ్య పుస్తకాలను అందించాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించాం. పిల్లలు ఏం తింటున్నారు, వారికి ఎలాంటి పౌష్టికాహారం అందుతోంది అనే విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఈ మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఖాళీ లేవని బోర్డులు పెట్టే స్థాయికి తీసుకెళ్లగలిగాం. ఒక వ్యవస్థలో చిత్తశుద్ధితో పనిచేస్తే ఎంతటి మార్పులైనా తీసుకురావొచ్చని మన ప్రభుత్వం నిరూపించింది. వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని మార్పులు తీసుకొచ్చాం. మన ప్రభుత్వం రాక ముందు ఆరోగ్యశ్రీ కేవలం 1,000 ప్రొసీజర్లకే పరిమితమై ఉండేది. దాన్ని 3,300 ప్రొసీజర్లకు విస్తరించాం. ఈ పథకంలో పేద వారికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేశాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మార్చాం. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దేందుకు కృషి చేశాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండని పరిస్థితి. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు వైద్యుల కొరత 61 శాతం ఉంటే, మన ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆ కొరతను కేవలం నాలుగు శాతానికి పరిమితం చేయగలిగాం. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. మందులు దొరకని పరిస్థితిని మార్చేసి.. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చేశాం. గ్రామ స్థాయి వరకు విలేజ్ క్లినిక్‌లను తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా వ్యవస్థను రూపొందించాం. మండలానికి నలుగురు వైద్యులు, రెండు 104 వాహనాలను అందుబాటులో ఉంచాం. ఒక వైద్యుడు పీహెచ్సీలో సేవలు అందిస్తుంటే, మరో వైద్యుడు 104 వాహనంలో తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించేలా చేశాం. దీంతో ప్రజలకు గ్రామ స్థాయిలోనే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడమే కాకుండా, ముందుగానే గుర్తించి నివారించే ప్రివెంటివ్ కేర్లోనూ కీలక మార్పులు తీసుకొచ్చాం. ఇవన్నీ సాధ్యమవుతాయా అని గతంలో ఎవరైనా అడిగితే సాధ్యం కావనే సమాధానం వచ్చేది. కానీ వాటిని సాధ్యం చేసి చూపించింది మన ప్రభుత్వం.గ్రామ స్వరాజ్యం గ్రామ స్థాయిలోనే పరిపాలనను ప్రజలకు చేరువ చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే చేర్చాం. లంచం లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పేదవారికి సేవలు అందించగలమని నిరూపించాం. సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి ఇంటికీ ప్రభుత్వ సాయం అందేలా వ్యవస్థను రూపొందించాం. కుల ధ్రువీకరణ పత్రం వంటి సేవలను కూడా వలంటీర్లు ప్రజల ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితి కల్పించాం.వ్యవసాయం పండగ గ్రామ స్థాయిలో రైతులకు అండగా ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చాం. వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ నమోదు చేసి, ఉచిత పంటల బీమా అమలు చేశాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలోనే రైతులకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి ఆర్బీకేలో ఒక వ్యవసాయ గ్రాడ్యుయేట్‌ను నియమించాం. ప్రతి పంటకు ప్రకటించిన గిట్టుబాటు ధరలను రైతులకు తెలిసేలా ఆర్బీకేల్లో ప్రదర్శించాం. ఎక్కడైనా రైతులకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఉంటే, ఆర్బీకే సిబ్బంది సీఎం యాప్ ద్వారా వివరాలను నమోదు చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేశాం.వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించే విధానాన్ని తీసుకొచ్చాం. అవసరమైన చోట జాయింట్ కలెక్టర్, మార్క్‌ఫెడ్ అధికారులు జోక్యం చేసుకొని కొనుగోళ్లకు చర్యలు చేపట్టేలా చేశాం. రైతులకు సరైన ధర దక్కేలా కొనుగోలు వ్యవస్థలో పోటీని పెంచేందుకు కృషి చేశాం. మన ఐదేళ్ల పాలనలో రెండున్నరేళ్లపాటు కోవిడ్ పరిస్థితులు ఎదురైనా, ఏనాడూ సాకులు చెప్పలేదు. కోవిడ్ కారణంగా హామీలు అమలు చేయలేకపోతున్నామని చేతులెత్తేయలేదు. ఒకవైపు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, మరోవైపు వ్యవస్థల్లో గతంలో ఎన్నడూ లేని మార్పులు తీసుకొచ్చాం.ఇప్పుడు అంతా రివర్స్ మన హయాంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసు అందుబాటులో ఉండేవారు. మహిళల భద్రత కోసం దిశ యాప్‌ను తీసుకొచ్చాం. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేసినా, ఫోన్‌ను షేక్ చేసినా పోలీసులు వెంటనే స్పందించి సహాయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశాం. కానీ, ఇప్పుడు పరిస్థితులన్నీ రివర్స్ గేర్‌లోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ, విశాఖపట్నంలో మాత్రం చంద్రబాబు తనకు కావాల్సిన వారికి 99 పైసలకే భూములు ఇస్తున్నారు. ఒకవైపు భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. మరో వైపు గ్రామాలు, పట్టణాల్లో గంజాయి, మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి. గుడి పక్కన, బడి పక్కన, వీధి చివర ఎక్కడపడితే అక్కడ మద్యం, గంజాయి అందుబాటులోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో గ్రామ స్థాయిలో మహిళా పోలీసులు ఉండటంతో ఇలాంటి ఘటనలపై వెంటనే సమాచారం అందేది. వాటిని అరికట్టేందుకు ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి, అక్రమ కార్యకలాపాలకు మరింత అవకాశం ఇస్తున్నారు. గతంలో సచివాలయానికి వెళ్తే లంచం లేకుండా పనులు జరిగేవి. వలంటీర్లు ఇంటికి వచ్చి ప్రజలకు అవసరమైన సేవలు అందించేవారు. ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రం కావాలన్నా, జనన ధ్రువీకరణ పత్రం కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు.హామీలతో ప్రతి కుటుంబానికి మోసం ఎన్నికల హామీలతో ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫొటోలు, సంతకాలతో బాండ్లు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీల వర్షం కురిపించారు. జగన్ ఇచ్చే పథకాలన్నీ కొనసాగించడమే కాకుండా, వాటికి మూడింతలు అదనంగా ఇస్తామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పారు. 2024 జూన్ నుంచే తమ హామీల అమలు ప్రారంభమవుతుందని ప్రచారం చేశారు. అమ్మ ఒడి కింద జగన్ ఒక కుటుంబానికి రూ.15 వేలు ఇస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తలా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికీ, నలుగురు పిల్లలుంటే నలుగురికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో మహిళ కనిపిస్తే నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంత మంది అర్హులైన మహిళలు ఉంటే అంత మందికీ ఈ సాయం అందుతుందని ప్రచారం చేశారు. నిరుద్యోగ యువకుడు కనిపిస్తే నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు నిరుద్యోగులు ఉన్నా, అందరికీ ఈ సాయం అందుతుందని హామీ ఇచ్చారు. రైతుల దగ్గరకు వెళ్లి, జగన్ రైతు భరోసా కింద పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 ఇస్తుంటే, తాము అన్నదాత సుఖీభవ పేరుతో పీఎం కిసాన్తో కలిపి రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. మన ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద మహిళలకు రూ.18,750 చొప్పున సాయం అందిస్తే, చంద్రబాబు మాత్రం 50 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రూ.48 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి కుటుంబ సభ్యుడికీ విడివిడిగా లెక్కలు చెప్పి హామీలు ఇచ్చారు. వాటిపై బాండ్లు రాసిచ్చారు. సంతకాలు పెట్టారు. ప్రమాణాలు చేశారు. ఇప్పుడు ఆ బాండ్లకు విలువ ఏమిటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలకు విలువ ఏమిటి? రాజకీయాల్లో విశ్వసనీయత అంటే ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.డీఎస్సీలో అక్రమాలు.. ప్రశ్నిస్తే వేధింపులు డీఎస్సీ నియామకాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు నిరంతరం ప్రయతి్నస్తున్నాయి. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, బాండ్ల పేరుతో ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా ప్రచారం చేస్తున్నారు. హామీలన్నీ అమలై పోయాయని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధికి మన ప్రభుత్వం చేసిన కృషి అందరికీ తెలిసిందే. దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన హయాంలో ఏం చేశామో మీరే ప్రజలకు వివరించగలరు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మూలపేట పోర్టు వరకు, అదానీ డేటా సెంటర్ నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాల వరకు ఉత్తరాంధ్రలో మన ప్రభుత్వం చేపట్టిన పనులు కనిపిస్తాయి. విశాఖపట్నంలో ఏకంగా 1.30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశాం. కేజీహెచ్ అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను మెరుగు పరిచేందుకు నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేశాం. ఎన్నో ఏళ్లుగా ఉద్దానం ప్రాంత ప్రజలను వేధిస్తున్న కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను తీసుకొచ్చాం. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో హీర మండలం నుంచి గ్రావిటీ ద్వారా ఉద్దానం వరకు నీరు తీసుకొచ్చాం. ఇందుకోసం రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ఇంకా గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, వైద్య కళాశాలలు వంటి విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశాం. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైద్య కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు.. ఇలా ఏ రంగాన్ని చూసినా మన ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తాయి. అందుకే మన హయాంలో చేసిన మంచి మనకు శ్రీరామరక్షగా ఉంటుంది. దేవుడి దయ, ఆశీస్సులు ఎప్పుడూ మనకు అండగా ఉంటాయి.సక్రమంగా ఎన్నికల నిర్వహణ అనుమానమే విశాఖపట్నంలో మేయర్, కార్పొరేషన్ వ్యవహారాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలను తమ అ«దీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదు. అయితే ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే తాత్కాలికంగా ఏదైనా ప్రయోజనం కలగవచ్చేమో కానీ, అది శాశ్వతంగా నిలబడదు. 2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికను గుర్తు చేసుకోండి. నా పాదయాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆ ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అందరం చూశాం. ఆ ఉప ఎన్నికలో మన పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నంద్యాలలో 36 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ ఘన విజయం సాధించింది. ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగం, పోలీసుల సహాయంతో దౌర్జన్యాలు చేయడం ద్వారా తాత్కాలిక ఫలితాలు సాధించవచ్చేమో కానీ, ప్రజల తీర్పును శాశ్వతంగా అడ్డుకోలేరు.విశాఖను దోచి పెడుతున్నారు 55 ఎకరాల భూమిని గీతం వర్సిటీ వారు కబ్జా చేశారు. దాని విలువ కనీసం రూ.5 వేల కోట్లు. దాన్ని అడ్డగోలుగా నచ్చిన వారికి, లోకేశ్ తోడల్లుడికి ఇచ్చేశారు. ఆ స్థాయిలో బరి తెగించారు. విశాఖపట్నంలో 99 పైసలకే భూములు కేటాయించడం, గీతం భూముల వ్యవహారం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంత అవినీతి ప్రభుత్వం ఇది. అయితే ఇవన్నీ ఊరకే పోవు. తప్పకుండా చుట్టుకుంటాయి. చేసిన పాపాలు, అక్రమాలు ఎక్కడికీ పోవు. కచ్చితంగా అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.విశాఖలో నీటి ఎద్దడి ప్రభుత్వ వైఫల్యమే విశాఖపట్నంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రోజులకు ఒకసారి నీరు సరఫరా అయ్యే పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తే అదనంగా 75 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ నీటిని గ్రావిటీ ద్వారా విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అందించే వెసులుబాటు కలుగుతుంది. కానీ ప్రాజెక్టు ఎత్తు తగ్గించే నిర్ణయంతో ఆ 75 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అలా ఒకవైపు పోలవరంలో అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతుంటే, మరోవైపు విశాఖపట్నంలో ప్రజలకు మూడు రోజులకోసారి తాగునీరు అందించే పరిస్థితి నెలకొంది.కార్యకర్తలకు పార్టీ అండస్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. వైఎస్సార్సీపీ మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి పార్టీ అగ్ర నాయకత్వం వరకు.. నా వరకు ప్రతి ఒక్కరూ కార్యకర్తలకు తోడుగా ఉంటాం. ఎన్నికల సమయంలో ఎవరైనా అన్యాయానికి పాల్పడితే, ఆ ఘటనల వివరాలను వెంటనే నమోదు చేయండి. ఏ అధికారి, ఏ పోలీసు అధికారి ఏ విధంగా వ్యవహరించారు? ఎలాంటి అన్యాయం జరిగింది? అనే వివరాలను మర్చిపోకముందే డిజిటల్ డైరీలో నమోదు చేయండి. భవిష్యత్తులో వాటిని పరిశీలించి చట్ట ప్రకారం బాధ్యతను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటాం. పోలీసు అధికారులకు ముందుగా విజ్ఞప్తి చేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ తీర్పును స్వేచ్ఛగా ఇచ్చేలా సహకరించాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు తమ ధర్మాన్ని నిర్వర్తించాలి. వారి టోపీపై ఉన్న సింహాలకు మాత్రమే తలవంచాలి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అన్యాయం చేయకూడదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఎవరైనా అన్యాయానికి పాల్పడితే, వారి చర్యలను డిజిటల్ డైరీలో నమోదు చేయాలి. మన ప్రభుత్వం వచ్చాక ఆ డిజిటల్ డైరీలో నమోదైన అంశాలను పరిశీలించి, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. జగన్ 2.0లో కార్యకర్తకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. కార్యకర్తల ప్రయోజనాలకు అండగా పార్టీ నిలుస్తుంది.మనం చేసిన మంచిని ప్రజలకు వివరించాలిమన ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. పోలీసులను ఉపయోగించుకోలేదు. పోలీసుల మీద ఆధారపడి ఎన్నికలు నిర్వహించలేదు. ప్రజలకు మంచి చేయడంపైనే ఆధారపడ్డాం. బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో సంక్షేమ సొమ్ము జమ చేశాం. కోవిడ్ సమయంలోనూ సాకులు చెప్పకుండా ప్రజలకు అండగా నిలిచాం. అదే చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టి, మొత్తం పోలీసులపై ఆధారపడుతున్నారు. మన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, గ్రామ స్థాయి పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మనం లేవనెత్తుతున్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఎన్నికల హామీల అమలు, భూముల కేటాయింపులు, డీఎస్సీ నియామకాలు, తాగునీటి సమస్య, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరు వంటి అంశాలపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఆ దిశలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలందరూ సమన్వయంతో పని చేయాలి. పార్టీలో ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి పార్టీ అగ్రనాయకత్వం వరకు అందరూ అండగా ఉంటారు. అలాగే కార్యకర్తల ప్రయోజనాలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వరుదు కళ్యాణి, గొల్ల బాబూరావు, అదీప్‌రాజు, పి.నాగిరెడ్డి, మల్లా విజయ్‌ప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్‌కుమార్, బొత్స అనూష, మాజీ మేయర్ జి.హరివెంకటకుమారి పాల్గొన్నారు. -
రైలు ఢీకొని నలుగురు విద్యార్థుల దుర్మరణం
టెక్కలి/సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో నౌపడ–గుణుపూర్ రైలు మార్గంలో బుధవారం రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన జన్నీ దిలీప్‌కుమార్ (17), గంగువాడ విశాఖరావు (17), భీంపురం గ్రామానికి చెందిన జన్నీ శరత్‌కుమార్ (17), మెళియాపుట్టికి చెందిన సవర శివ (17)తో పాటు డమర గ్రామానికి చెందిన గంగువాడ సాల్మన్‌రాజు టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. తుపాను నేపథ్యంలో బుధవారం కళాశాలకు సెలవు ప్రకటించడంతోఅందరూ బయటకు వెళ్లారు. రావివలస సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా నౌపడ నుంచి గుణుపూర్ వైపు వస్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్‌కుమార్, శరత్‌కుమార్, విశాఖరావు, శివ అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ఉన్న మరో విద్యార్థి సాల్మన్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన వారంతా గిరిజన కుటుంబాలకు చెందిన వారే. టెక్కలిలో గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటున్నారు. సమాచారం అందుకున్న టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహశీల్దార్ రాంబాబు, సీఐ విజయకుమార్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ప్రమాద ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన సాల్మన్ రాజును టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతినలుగురు విద్యార్థుల మృతి అత్యంత విషాదకరంశ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావివలస సమీపంలో రైలు ఢీకొనడంతో గిరిజన విద్యార్థులు విశాఖరావు, దిలీప్‌కుమార్, శివ, శరత్‌కుమార్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతమని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి సాల్మన్‌రాజుకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అతను త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయం అందించాలని కోరారు. -
డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 స్కామ్‌పై సీబీఐతో విచారించాలని, ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ సంబంధిత విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసనలు, ర్యాలీలు చేసే హక్కు లేదా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే.. రౌడీషీట్లు తెరుస్తారా? శాంతియుతంగా ర్యాలీలు చేస్తే అక్రమ కేసులు పెడతారా?’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన శాప్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించిన వారిపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్సీ–2025 పేరిట జరిగిన స్కామ్ గురించి సాక్ష్యాలు, ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏ విధంగా డీఎస్సీ స్కామ్‌లో యువత నష్టపోయిందో వివరించారు. ఈ వ్యవస్థలో ఒక మార్పు రావాలన్నా, ఈ వ్యవ స్థపై ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, ఈ వ్యవస్థలో లోపాలు సవరించాలన్నా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. డీఎస్సీ కుంభకోణం, టీడీపీ నేతల గూండాగిరీ, దౌర్జన్యాల గురించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వివరిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇది దేశ చరిత్రలో ఎన్నడూ జరగని స్కామ్ ‘ఇప్పటికే డీఎస్సీ–2025 అక్రమాలకు సంబంధించి పార్ట్–1, పార్ట్–2 అంటూ ప్రెస్మీట్లు పెట్టి.. జరిగిన ప్రతి తప్పును సాక్ష్యాలు, ఆధారాలతో ఇప్పటికే ప్రజల ముందు పెట్టాం. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, నాలుగు పాయింట్ల ఆధారంగా డీఎస్సీ–2025లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 1.ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించడంతో ఈ స్కామ్ ప్రారంభమైంది. 2. ఈ ప్రక్రియ మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారు. అవుట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. అతని పేరు తొలుత మెరిట్ లిస్ట్‌లో చూపి, ఆ తర్వాత తొలగించారు. అతడి లాగిన్ ఐడీ బ్లాక్ చేశారు. కాల్ లెటర్ కూడా పంప లేదు. దీంతో అతడు ప్రభుత్వానికి లేఖలు రాయడమే కాకుండా, కోర్టుకు కూడా వెళ్లాడు. అంటే ఒక స్కామ్‌ను కప్పిపుచ్చేందుకు (కవరప్) ఈ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అగచాట్లు పడిందో తేట తెల్లమైంది. లీకేజీ వ్యవహారం బట్టబయలైంది. 3. స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డగోలుగా జీవోలు ఇవ్వడం చూశాం. గతంలో ఉన్న జీవోలు రద్దు చేసి కొత్తగా జీవో నంబర్ 4, 47 అని చెప్పి రెండు కొత్త జీవోలు తెచ్చి, వాటి ద్వారా పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా 372 ఉద్యోగాలు ఇచ్చేశారు. నియామక ప్రక్రియ పూర్తి కాగానే జీవో నంబర్ 23, 25, 56 అంటూ మరో 3 జీవోలు తెచ్చారు. దాని ప్రకారం మళ్లీ పరీక్ష ఉండాలని నిబంధన పెట్టారు. మరి పరీక్ష రాయకుండా 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. 4. ఫేక్ సర్టిఫికెట్లు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ ఏరకంగా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడో చూశాం. జరగని గేమ్స్ జరిగినట్లు చూపారు. ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడైన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. దాదాపు 38 ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇచ్చారనేది కూడా చెప్పాం. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాల్లో సెక్రటరీలకు, వారి భార్యలకు, కుటుంబ సభ్యులకు ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విషయాన్ని కూడా చెప్పాం. అసలు జరగని క్రీడా పోటీలకు సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? పోటీలు జరగలేదని సంబంధిత క్రీడా సంఘాలే చెప్పినప్పుడు శాప్ వాటిని ఎలా ఆమోదించింది? ఆ నకిలీ, అనుమానాస్పద సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు? టెట్ అర్హత లేని వారికి టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు? ఒక కేటగిరీలో పొందిన టెట్ మార్కులను మరో కేటగిరీ నియామకానికి ఎలా ఉపయోగించారు? గతంలో వేరే సామాజికవర్గంలో నమోదు చేసుకున్నవారికి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎలా ఉద్యోగాలు ఇచ్చారు? ప్రభుత్వం ‘ఏడుసార్లు వెరిఫికేషన్ చేశాం’ అంటుంటే, ఇన్ని తీవ్రమైన అక్రమాలు ఏడు దశల్లోనూ ఎలా కనిపించలేదు? అసెంబ్లీలో నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి బేరసారాలపై ఆడియో, వీడియో బయటకు వచ్చింది. ఈ ఫోన్ సంభాషణపై పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో చూశాం. అందులో స్పష్టంగా (క్లియర్‌గా) ఫోన్ నెంబర్ కనిపిస్తున్నా, ఆ వ్యక్తి గురించి ఎఫ్ఐఆర్లో రాయలేదు. కేవలం అనుమానాస్పదం (సస్పెక్ట్) అని మాత్రమే రాశారు. అరెస్టు కూడా చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయినా సీఎం చంద్రబాబు మాత్రం ఆ వ్యక్తిని అరెస్ట్ చేశాం.. రిమాండ్‌కు పంపించాం.. అంటూ అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం చూశాం. శాప్ ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల దాడి డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతూ సెప్టెంబర్ 21న శాప్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామని మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముందుగానే సమాచారం ఇచ్చారు. అనుమతి కోరుతూ కమిషనర్‌కు లెటర్ కూడా రాశాడు. కానీ, ఆరోజు ఏం జరిగింది? అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎలా కుట్ర చేశారో చూశాం. టీచర్లు కాని టీచర్లను పిలిపించి, శాంతియుత ర్యాలీకి సమాంతరంగా ధర్నా చేయించారు. నిజానికి వారు చదువు చెప్పే గురువులు కాదు. దొంగ సర్టిఫికెట్లతో, ఏ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు పొందిన ఈ టీచర్లు కానీ టీచర్లను పిలిపించి, శాప్ కార్యాలయం ఎదుట కావాలనే గొడవ చేయించారు. అంతే కాకుండా టీడీపీ గూండాలను అక్కడికి రప్పించారు. వారంతా కలిసి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై దారుణంగా దాడి చేశారు. అసలు వారంతా ఎవరో చూడండి. వీరు గతంలో సాక్షి కార్యాలయంపై దాడి చేసిన వారే. (ఫొటోలు మీడియాకు చూపారు). దాడి చేసిన వారిని వదిలేసి రివర్స్ కేసులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై టీడీపీ గూండాలు దారుణంగా దాడి చేసినా, వారిపై ఎలాంటి చర్యలు లేవు. వారిపై కేసులు నమోదు చేయలేదు. అందుకు పూర్తి భిన్నంగా, రివర్స్‌లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై కేసు పెట్టారు. ఎంత దారుణంగా ఆ కేసులు పెట్టారంటే.. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు పెట్టారు. ఇప్పటికే 350 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ జాబితా ఇంకా పెరుగుతోందని చెప్పారు. ఇలా కేసులు పెట్టడం, రాత్రి పూట వారి ఇళ్లల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేయడం.. ఆపై రాత్రి వేళల్లో అరెస్టులు చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు.. కోర్టులు వాటిని తప్పు పడుతున్నాయి. మేజిస్ట్రేట్.. వీళ్లు చేస్తున్న అన్యాయాలను తిట్టి ఇలా చేయడం ధర్మం కాదంటూ వాళ్లకు బెయిల్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో మనిషి అనే వాడు బతకగలిగే అవకాశం కోర్టుల పుణ్యమాని కలుగుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమనేది ఏ స్థాయిలో అమలవుతుందో.. ఏ రకంగా విధ్వంసం జరుగుతున్నదో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. గవర్నర్‌ను కలిసిన అనంతరం లోక్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్లు తెరిచి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తారా? శాప్ కార్యాలయం ఎదుటæ శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు. వాటిపైనా కోర్టులు స్పందించాయి. శాంతియుత నిరసన వ్యక్తం చేస్తుంటే, రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారని నిలదీశాయి. ప్రశ్నిస్తే రౌడీషీట్లు ఓపెన్‌చేసి వాళ్ల భవిష్యత్ (కెరియర్)ను నాశనం చేస్తారా? తప్పు చేసింది మీరు. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా ర్యాలీలు, నిరసనలు చేసే హక్కు లేదా? ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తారా? ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? మా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇందులో న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుంది. ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాల్సిందే. తప్పు ఒప్పుకొని విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. కనీసం అప్పుడైనా మన రాష్ట్రంలో పిల్లలకు, నిరుద్యోగులకు పరీక్షల మీద విశ్వాసం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశలో మా డిమాండ్ కొనసాగుతోంది. ఈ యుద్ధం కచ్చితంగా కొనసాగుతుంది. ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉషశ్రీ చరణ్, పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తాటిపర్తి చంద్రశేఖర్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాజగొల్ల్ల రమేష్ యాదవ్, వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, కొరముట్ల శ్రీనివాసులు, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ గవర్నర్‌ను కలిసి డీఎస్సీ స్కామ్ గురించి వివరించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపదెబ్బ విజయవాడలో సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటివని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. డీఎస్సీ స్కామ్‌పై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏ రకంగా చంద్రబాబు ప్రభుత్వం పిల్లలను వాడుకుంటూ, వారితో గంజాయి అమ్మిస్తూ, వారితో చట్ట విరుద్ధమైన పనులు చేయించిందో.. ఇందులో పోలీసులు ఎలా పని చేశారు.. ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగం చేస్తోంది అనే దానికి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నిదర్శనం. ఈ కేసులో బుధవారం సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా మందలిస్తూ.. సీపీ, డీజీపీ పేర్లను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని నిలదీయడం చూస్తుంటే.. ఇది నిజంగా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే. వీళ్లే ఆ పిల్లాడిని అరెస్టు చేసి తీసుకొస్తారు. వీళ్లే కొట్టి చంపేస్తారు. చివరకు శవం కూడా మాయం చేస్తారు. మాయం చేయడమే కాకుండా ఆ పిల్లాడ్ని రౌడీగా చిత్రీకరిస్తూ బ్రాండింగ్ చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో ఈ ఘటన ద్వారా తేటతెల్లం అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో నగరం నడి»ొడ్డున ఏ విధంగా దారుణాలు జరుగుతున్నాయో స్పష్టం అవుతోంది’ అని వైఎస్ జగన్ అన్నారు. -
దాడికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందించాం: వైఎస్ జగన్
తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాము ఏ అంశాలపై ఫిర్యాదు చేసిందీ వివరించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశానని తెలిపారు.‘‘శాప్ కార్యాలయం వద్ద జరిగిన దాడి వివరాలను గవర్నర్‌కు అందించాం. శాంతియుతంగా నిరసన చేపట్టిన మా పార్టీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలను కూడా అందించాం. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, భారీ స్కాం గురించి గవర్నర్‌కు వివరించాం. మా పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు, అక్రమ అరెస్టులు.. చట్టపరంగా నిలబడలేని కేసుల నమోదు అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఈ పోలీసు చర్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని.. డీఎస్సీ స్కాంపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని కోరాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో రాజీనామా చేయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాము’’ అని వైఎస్ జగన్ తెలిపారు. Today, along with senior YSRCP leaders, I met Hon’ble Governor Justice S. Abdul Nazeer Ji at Lok Bhavan. We submitted a detailed representation, along with evidence, regarding the attack on our party leaders, workers, and unemployed youth during the peaceful protest at the SAAP… pic.twitter.com/CRQyLs8aLr— YS Jagan Mohan Reddy (@ysjagan) September 23, 2026 -
లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం


