International
-
73వేలకు చేరిన గాజా మరణాలు
డెయిర్ అల్ బాలాహ్: గతేడాది అక్టోబర్‌లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నాసరే గాజాపై ఇజ్రాయెల్ దాడుల దమనకాండ ఆగట్లేదు. దీంతో 2023 అక్టోబర్‌లో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా గాజాలో మరణాల సంఖ్య 73,000కు చేరుకుందని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారని గాజా మంత్రిత్వ శాఖలోని రికార్డ్ల విభాగం సారథి జహీర్ అల్ వహేదీ, ప్రజా సంబంధాల విభాగ సారథి హమ్జా సలీం తెలిపారు.ఖాన్ యూనిస్‌లో ఇద్దరు, సెంట్రల్ గాజాలో ఒక్కరు, గత గాయాలతో మరో ఇద్దరు ఆదివారం చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 1,73,200 మందికిపైగా గాయాలపాలయ్యారు. 2023 అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ సాయుధులు మెరుపుదాడి చేసి అక్కడ స్థానికులు, పర్యాటకులు, విదేశీయులుసహా మొత్తంగా 1,200 మందిని చంపేశారు.251 మందిని బంధించి గాజాకు తీసుకొచ్చి సొరంగాల్లో దాచిపెట్టడం తెల్సిందే. ప్రతీకారంగా గాజా నగరాలపై ఇజ్రాయెల్ మొదలెట్టిన భీకరదాడుల్లో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది పిల్లలు, మహిళలేనని గాజా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొనసాగిన పరస్పర కాల్పుల ఘటనల్లో కేవలం ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులే చనిపోయారు. -
ఇకపై దాడులొద్దు
జెరూసలేం: ఇకపై ఎలాంటి దాడులు చేసుకున్నా సహించేది లేదని ఇజ్రాయెల్, ఇరాన్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా దాడులపై ఆయన ఆదివారం స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో దాడులు, ప్రతిదాడులకు దిగితే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని, శాంతి యత్నాలకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేశారు.అందుకే సంయమనం పాటించాలని ఇజ్రాయెల్, ఇరాన్‌లకు తేల్చిచెప్పారు. ఇలాంటి ఉద్రిక్తతల వల్ల శాంతి ఒప్పందంపై సంతకాలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. బీరూట్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో పలువురు మరణించారు. శిథిలాల నుంచి ఇప్పటిదాకా మూడు మృతదేహాలను, ఆరుగురు క్షతగాత్రులను వెలికితీసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రతీకార దాడులు తప్పవని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి సాధనే లక్ష్యంగా ఒప్పందానికి అత్యంత చేరువలోకి వచ్చామని పేర్కొన్నారు. ఇకపై ఎవరూ ఎలాంటి దాడులు చేసుకోవద్దని స్పష్టంచేశారు. ఒప్పందంపై నెతన్యాహు అసంతృప్తి! శాంతి ఒప్పందంపై ఆదివారం సంతకాలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒప్పందంలోని అంశాలు ఆయనకు తీవ్ర నిరాశను కలిగించినట్లు తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా బీరూట్‌పై దాడికి దిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర ఇజ్రాయెల్ హెజ్బొల్లా మిలిటెంట్లు దాడికి దిగారని, అందుకే ప్రతిస్పందనగానే తాము బీరూట్‌పై దాడులు చేసినట్లు నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.ఇజ్రాయెల్ దుశ్చర్యపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమాసియాలో శాంతిని స్థాపించాలన్న సంకల్పం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు లేదన్నారు. హెజ్బొల్లాకు ఇరాన్ మద్దతిస్తోంది. ఆయుధాలు, ఆర్థిక సాయం అందజేస్తోంది. అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలన్న అంశాన్ని కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. -
బ్రెజిల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు
రియో డీ జనీరియో: బ్రెజిల్లో ఆదివారం ఉదయం రెండు హెలికాప్టర్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అనూహ్యంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాటిలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రియో డీ జనీరియో నగరం పశ్చిమం వైపు గగనతలంలో ఈ ఘటన జరిగింది.కూలిన హెలికాప్టర్ ఒకటి నేరుగా ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్‌పై పడింది. దీంతో వాహనాలు దిగ్ధమయ్యాయి. విషయం తెల్సి అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. హెలికాప్టర్లు ఢీకొనడానికి సాంకేతిక లోపమా? లేదా పైలట్ల తప్పిదమా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ ఘటనపై బ్రెజిల్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. -
తాడు కట్టకుండా తోసేశారు
సావో పావ్లో(బ్రెజిల్): అంతెత్తు నుంచి స్వేచ్ఛగా కిందకు పడిపోతూ ఆఖరి నిమిషంలో మళ్లీ తాడు సాయంతో పైకి ఎగసిపడే సాహసక్రీడ ‘బంగీ జంప్’అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడతారు. తానూ ఓసారి బంగీ జంప్ చేసి సాహసం పూర్తిచేద్దామనుకున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. బంగీ జంప్ నిర్వాహకుల దారుణమైన నిర్లక్ష్యం కారణంగా ఆమె నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జంప్ చేసే వాళ్లకు ఏకైక ప్రాణాధారమైన తాడును ఆమెకు కట్టడం మర్చిపోయి అలాగే తోసేసి చివరకు ప్రాణాలుతోడేశారు.బ్రెజిల్‌లోని సావో పావ్లో రాష్ట్రంలోని లైమేరియా నగర పరిధిలోని ప్రఖ్యాత స్కెలెటన్ వంతెన మీద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మారియా ఎడ్యువార్డా రోడ్రిగిస్ డీ ఫ్రిటాస్ అనే 21 ఏళ్ల అమ్మాయి శనివారం స్కెలెటన్ వంతెన వద్దకు బంగీజంప్ చేసేందుకు వచ్చింది. టికెట్ కొని సంబంధిత మణికట్టు బ్యాండ్ ఫొటోలను తన ‘ఇన్‌స్టా గ్రామ్’ఖాతాలో పోస్ట్చేసింది. ‘‘130 అడుగుల లోతున్న లోయలోకి అందరూ దూకుతున్నారు. నువ్వు కూడా దూకాలా ? అని ఒకరు అడిగారు. అయినా సరే దూకేస్తా’’అని ఘటనకు కొన్ని సెకన్ల ముందు తన ఖాతాలో ఆమె ఒక పోస్ట్‌చేశారు.తర్వాత బంగీజంప్ సాహసక్రీడను నిర్వహించే ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈమెను తమ చేతులతో పైకెత్తి వంతెన మీద నుంచి అమాంతం లోయలోకి పడేశారు. అయితే ఇదంతా దూరం నుంచి చూస్తున్న కొందరు హఠాత్తుగా అరవడం మొదలెట్టారు. ‘‘ఆమెకు సేఫ్టీ తాడును కట్టలేదు. కాపాడండి’’అని అరవడం మొదలెట్టారు. దీంతో నిర్వాహకులు హతాశులయ్యారు.వెంటనే సహాయక సిబ్బంది వంతెన కిందకు దిగి అప్పటికే కిందపడిపోయిన అమ్మాయిని హుటాహుటిన సమీప లీగల్ మెడికల్ ఇన్స్టిట్యూట్కు తరలించారు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పుడు ఆ యువతి ప్రియుడు సైతం అక్కడే ఉన్నాడు. ఆమె ఎలాంటి రక్షణలేకుండా పడిపోవడం చూసి అతను స్పృహతప్పాడు. సేఫ్టీ తాడును ఆమెకు కట్టని ఘటనలో ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగీజంప్ క్రీడ నిర్వహణలో ఏమేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారో తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనతో నగర మేయర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు
పారిస్: వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ నిశ్చయించుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 16 మిలియన్ డాలర్లుగా ఉంది. కృత్రిమ మేధ(ఏఐ), స్టార్టప్‌లు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆరోగ్యం సహా కీలక రంగాలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయానికి వచ్చారు.ఆదివారం వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–ఫ్రాన్స్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు. ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరత, భద్రత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాలపై చర్చించారు. కాన్పూర్‌లో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో సంబంధాలను పటిష్టం చేసుకోవడంపై ఇరువురు మోదీ, మేక్రాన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే సైన్స్, అంతరిక్షం, స్టార్టప్‌లు, ఫిన్‌టెక్, పౌర అణుశక్తి, మౌలిక సదుపాయాల రంగాలపైనా చర్చ జరిగింది. మొత్తం 13 అంశాలపై అంగీకారం కుదిరింది. ఆవిష్కరణల(ఇన్నోవేషన్) కోసం ఉమ్మడిగా రోడ్‌మ్యాప్ ఏర్పాటు చేసుకోవాలని, రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని, ఉమ్మడి ఏఐ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.అలాగే హైస్పీడ్ రైల్వే రంగంలో సహకారం కోసం డిక్లరేషన్, వర్గీకృత డేటాను పరిరక్షించే భద్రతా ఒప్పందాన్ని కూడా ఇరుపక్షాలు ఖరారు చేశాయి. ఇండియాకు చెందిన యూపీఐ చెల్లింపుల సేవలను ఫ్రాన్స్‌కు సైతం విస్తరింపజేయనున్నారు. ఫ్రెంచ్ రక్షణ రంగ దిగ్గజం దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న భారతదేశ ప్రణాళిక కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.మోదీ–మేక్రాన్ భేటీ అనంతరం.. ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కాన్పూర్‌లో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు. -
సవాళ్లకు పరిష్కారాల భారత్
పారిస్: భారత్ ఇకపై ప్రపంచ దేశాల పరిష్కారాలను వినియోగించుకునే దేశం మాత్రమే కాదని.. సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించే దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. మోదీ ఆదివారం ఫ్రాన్స్‌లోని నైస్ సిటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియా, ఫ్రాన్స్ సహా వివిధ దేశాల స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నాయి.నూతన ఆవిష్కరణలు, సమ్మిళితత్వం వేర్వేరు కాదని... అవి పరస్పర ఆధారితమని తాము నిరూపించిట్లు మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఏ ఆవిష్కరణ గొప్పతనమైనా కేవలం దాని విలువలో కాకుండా, మానవ జీవితాలపై అది చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు.దశాబ్దం క్రితం వరకు ప్రపంచం భారతదేశాన్ని సాంకేతికతను స్వీకరించే దేశంగా చూసేదని, నేడు దేశం సాంకేతికతను అందించే దేశంగా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. అంతేకాకుండా తమ దేశం సృష్టించే ఆవిష్కరణలు, అందించే పరిష్కార మార్గాలు మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయని వెల్లడించారు. ‘భారత్ ఇన్నోవేట్స్’లక్ష్యం ఇదేనని అన్నారు. సమ్మిళిత, మానవ–కేంద్రీకృత సాంకేతికత, నూ తన ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. సాంకేతిక విప్లవంతో కొత్త అవకాశాలు అత్యాధునిక సాంకేతికత, అణు శక్తి, రక్షణ, ఆవిష్కరణలతో సహా పలు కీలక రంగాల్లో తన ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్లు ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సంస్కరణల పరంపర ఇక్కడితో ఆగదని, ఇది కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఇండియా నుంచి వెలువడే స్టార్టప్‌ల సంఖ్య అనేక రెట్లు పెరుగుతూనే ఉంటుందన్నారు. వివిధ దేశాల మధ్య సంఘర్షణలు, తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని మోదీ గుర్తుచేశారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ అవకాశాలు సైతం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికతలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని వెల్లడించారు. ఇవి మానవ నాగరికతలో తదుపరి అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తాయని అన్నారు. ప్రతి సాంకేతిక విప్లవం మానవాళికి ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తుందని వివరించారు.ప్రపంచం కోసం, సుస్థిర భవిష్యత్తు కోసం భారత్ అనేక ఆవిష్కరణలు చేస్తోందని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణ అనేది దేశం డీఎన్ఏలోనే ఉందని స్పష్టంచేశారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక ప్రత్యేక భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. ఇందులో అనుబంధం, దృఢ విశ్వాసం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ పునాది ఆధారంగానే గత కొన్నేళ్లుగా ఉమ్మడిగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించామని మోదీ చెప్పారు. ఆవిష్కరణల దేశం భారత్: మేక్రాన్ కృత్రిమ మేధ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి కీలక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చెప్పారు. భారత్ ఒక ఆవిష్కరణల దేశమని ప్రశంసించారు. ‘భారత్ ఇన్నోవేట్స్’ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. ‘మేక్–ఇన్–ఇండియా’ను గౌరవిస్తున్నామని తెలిపారు. ఇందులో వివిధ రంగాల్లో ఫ్రాన్స్ ఇందులో భాగస్వామిగా ఉందని వివరించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రంగంతో సహా పౌర అణు ఇంధన రంగంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.‘భారత్ ఇన్నోవేట్స్’లో స్టార్టప్‌ల ఎగ్జిబిషన్‌ను మోదీ, మేక్రాన్ తిలకించారు. నూతన ఆవిష్కర్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, క్లీన్ ఎనర్జీ తదితర రంగాలకు చెందిన స్టార్టప్‌లు ఇందులో పాల్గొన్నాయి. గతంలో ఇండియాలోని జైపూర్‌లో జరిగిన ఆర్ట్ రెసిడెన్సీకి హాజరై, భారతీయ సంస్కృతి, కళల నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు ఫ్రెంచ్ కళాకారులు తయారు చేసిన కళాకృతులను ‘భారత్ ఇన్నోవేట్స్’లో ప్రదర్శించగా మోదీ, మేక్రాన్ తిలకించారు. -
‘మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది’
గల్ఫ్ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని ఇరాన్లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఒమన్ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృత్యువాత పడగా, ఆ భయానక వాతావరణం ఇంకా కొనసాగుతుందని పలువురు భారత నౌకాదళ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.భారతీయ నావికులను తీసుకువెళ్తున్న నౌకలపై పదేపదే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కొనసాగుతున్న దాడుల మధ్య తాము ఆ ప్రాంతంలో చిక్కుకుపోయామని, అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఆపదలో ఉన్న భారతీయ నావికుల పరిస్థితిని వివరించారు. ‘ మేము ఇరాన్లో ఉన్నాము, ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయి. మమ్మల్ని మాకు సంబంధంలేని యుద్ధంలోకి ఎందుకు లాగుతున్నారు? మేము సైనిక సిబ్బంది కాదు. మేము కాంట్రాక్టులపై పనిచేస్తున్న నావికులం. మేము చమురును తీసుకువస్తూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాం’ అని వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. ‘ మేము సైనికులం కాదు. మేము కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి వస్తాం. అలాంటప్పుడు మాపై ఎందుకు దాడి చేస్తున్నారు? మా తప్పేంటి?" అని ప్రశ్నించారు. ఇటీవల దాడికి గురైన ఒక నౌకలో తాను గతంలో పనిచేశానని, ఆ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా ఆ నౌకాదళంలోని మరో కాంట్రాక్ట్ కార్మికుడు ప్రస్తావించాడు. We are in Iran. Only Indian ships are being attacked by the US . We are not military personnel . Why are you dragging us into your conflict ?Distress call from Indian seafarers in Iran .pic.twitter.com/yBI8BjvV4w— Surbhi (@SurrbhiM) June 14, 2026 -
లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించి దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది. బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పేలుడు సంభవించడంతో భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.లెబనాన్ అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. హెజ్బొల్లాకు బలమైన కేంద్రంగా ఉన్న దక్షిణ బీరూట్ శివార్లలోని దాహియేలోని ఘోబెయరీ పరిసరాల్లోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అపార్ట్మెంట్ పక్కన ఉన్న రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ దాడిలో ఏవైనా వాహనాలు దెబ్బతిన్నాయా అనేదానిపై స్పష్టత లేదు.ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే.. తాము దక్షిణ బీరూట్‌పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా పలువురు అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి వాషింగ్టన్ మద్దతు కూడా ఉందని వారు పేర్కొన్నారు. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న మూడు డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై వేర్వేరు ఘటనల్లో దాడి చేశాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ తెల్లవారుజామున తెలిపిందిבתקיפה מדויקת בדאחייה שבביירות: חיל-האוויר תקף מפקדה של ארגון הטרור חיזבאללההמפקדה שהותקפה שימשה את מחבלי ארגון הטרור חיזבאללה לקידום מתווי טרור נגד אזרחי מדינת ישראל וכוחות צה"ל הפועלים בדרום לבנון.התקיפה בוצעה לאחר שמוקדם יותר היום (א'), ארגון הטרור חיזבאללה שיגר מטרות… pic.twitter.com/BA94YwS57m— Israeli Air Force (@IAFsite) June 14, 2026ఇజ్రాయెల్ భద్రతకు, ఐడీఎఫ్ దళాలకు ముప్పుగా ఉన్న ఏ లక్ష్యాన్నైనా నిర్వీర్యం చేసేందుకు మేము చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టం చేసింది. హిజ్బుల్లా మాత్రం దక్షిణ లెబనాన్‌లోకి చొరబడ్డ ఇజ్రాయెల్ దళాలపై పలు దాడులు జరిపినట్లు ప్రకటించినప్పటికీ.. ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదు. -
ఈ రోబో ఏం చేస్తుందో తెలిస్తే.. షాక్ అవాల్సిందే!
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మనుషుల ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగేసుకుంటుందనే భయాందోళనలు ఒకవైపు ఉంటే.. ఇప్పుడు రోబోలు ఏకంగా రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేయడం మొదలుపెట్టాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల చైనాకు సంబంధించిన ఓ హ్యూమనాయిడ్ రోబో రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చుని.. అటుగా వెళ్తున్న బాటసారులను డబ్బులు కోసం యాచన చేస్తూ.. కనిపిస్తోంది.ఈ రోబోకు ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ చేశారు. దారినపోయే నేరుగా నగదు ఇవ్వక్కర్లేదు.. రోబో ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ రూపంలో నగదు పంపేలా డిజైన్ చేశారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక ఏ ఉద్యోగమూ సేఫ్ కాదు బాబోయ్.. హ్యూమనాయిడ్ రోబోలు అప్పుడే రోడ్లెక్కి మరీ అడుక్కోవడం మొదలుపెట్టేశాయి అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.ఈ రోబో ప్రవర్తన సాధారణంగా పరిశ్రమలు, సేవారంగం, గృహ సహాయకులుగా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్ల పాత్రలకు భిన్నంగా ఉంది. ఇప్పుడు రోబోలు కూడా అడుక్కుంటున్నాయా? ఇలాంటి పనులు యంత్రాలు అనుకరించే దిశగా సాంకేతికత అభివృద్ధి చెందుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో ఓ గృహిణి ఇంటి పనులను వీడియోల రూపంలో చిత్రీకరించి.. రోబోల శిక్షణకు సహకరించడం కూడా ఇదే తరహా చర్చకు దారితీసింది.Poor beggar, he is begging for the cost of charging.😅😅Buy a robot to make money. pic.twitter.com/7jBKZJG12b— Sharing Travel (@TripInChina) June 13, 2026సాంకేతికత సాయంతో మనుషుల శ్రమను తగ్గించాల్సింది పోయి.. ఇలాంటి పనులకు కూడా రోబోలను వాడుతుండటం ఐటీ రంగంతో పాటు సాధారణ పౌరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే, ఈ ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ ప్రదర్శన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉత్పాదకత, లాజిస్టిక్స్, రీటైల్, ప్రజా సేవల కోసం తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాలను తయారు చేయడంతో.. హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఎదిగింది.తయారీ, లాజిస్టిక్స్, రిటైల్, ప్రజా సేవలు వంటి రంగాల్లో రోబోట్ల వినియోగం విస్తరిస్తోంది. కొన్ని సందర్భాల్లో రోబోట్లు యుద్ధకళలు ప్రదర్శించడం, కస్టమర్ సేవలు అందించడం వంటి పనులు కూడా చేస్తున్నాయి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో హ్యూమనాయిడ్ రోబోట్ల వినియోగం పెరిగితే భద్రత, నైతికత, సామాజిక ప్రభావాలపై కొత్త నియమావళి అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఈ ఎక్స్‌ప్రెస్ ఆగేదేలేదు: ఫ్రాన్స్‌లో మోదీ
పారిస్: ఫ్రాన్స్‌లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. రెండు దేశాలు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం భద్రత నుంచి స్థిరమైన అభివృద్ధి వరకు విస్తరించిందని ప్రధాని మోదీ అన్నారు. “ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌దే. ఈ ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ ఆగదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. భారత్‌తో కలిసి పనిచేయండి. ప్రపంచం కోసం సాంకేతికను అభివృద్ధి చేయండి. భారత్ వేగంగా, విస్తృత స్థాయిలో ఆవిష్కరణలు చేస్తోంది. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణలు చేస్తోంది. ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తోంది.సాంకేతికత, ఆవిష్కరణలు, విధానాలు అన్నీ మనుషుల అవసరాలు, సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరచడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నాం. ఆవిష్కరణ భారత్ డీఎన్ఏలో ఉంది. గత 12 ఏళ్లలో భారత్ బలమైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించింది.భారత్-ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ఇందులో నమ్మకం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయి. భారత్ యువ ఆవిష్కర్తలు మానవాళి మొత్తానికి ఉపయోగపడే వాటిని కనుగొంటున్నారు” అని ప్రధాని మోదీ చెప్పారు.భారత్‌పై మెక్రాన్ ప్రశంసల జల్లుఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్ ఆవిష్కరణ వ్యవస్థను ప్రశంసించారు. భారత్ తమ దేశంలో నిర్వహించిన తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.“భారత్ ఆవిష్కరణలు చేస్తోందా లేదా అన్నది ప్రశ్న కాదు. భారత్‌తో కలిసి ఎవరు ఆవిష్కరణలు చేస్తారు అన్నదే అసలు ప్రశ్న” అని మాక్రాన్ అన్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు ఆతిథ్యం ఇవ్వడం ఫ్రాన్స్‌కు గర్వకారణమని చెప్పారు.భారత్ సాంకేతిక విజయాలను ప్రస్తావిస్తూ చంద్రయాన్ - 3 ల్యాండింగ్ విజయాన్ని ఉదాహరణగా చూపించారు. ఆ మిషన్ భారత్ ఆవిష్కరణ శక్తి, అమలు సామర్థ్యం, పారిశ్రామిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిందని అన్నారు. “పరిశోధన, ఆవిష్కరణ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా ముందుకెళ్తోంది. ప్రపంచ ఆవిష్కరణ నాయక దేశంగా అవతరిస్తోంది” అని మాక్రాన్ చెప్పారు.కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు వంటి కీలక రంగాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర అణుశక్తి రంగంలో, ముఖ్యంగా చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల విషయంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. -
ఇరాన్ శాంతి ఒప్పందంలో మరో ట్విస్ట్
టెహ్రాన్: అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోని అతివాదుల వర్గం చర్చలు అవసరం లేదంటూ ధర్నాలు చేపడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని అక్రమ చొరబాటుదారుడిగా అభివర్ణిస్తూ వాషింగ్టన్‌తో ఆయన రాజీ పడుతున్నారని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టంతా ఇరాన్- అమెరికా చర్చలపైనే.. ఈ భేటీలో శాంతి ఒప్పందం కుదురుతుందా ఈ యుద్ధానికి శాశ్వతంగా తెరపడుతుందా అనే అంతా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని అతివాద వర్గం మాత్రం చర్చలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం వల్ల 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' పై టెహ్రాన్ నియంత్రణ, ప్రభావం తగ్గుతుందని వాదిస్తున్నారు.ఈ మేరకు ( శనివారం) ఆ దేశంలోని అతివాద గ్రూపులకు చెందిన మద్దతు దారులు రాజధాని టెహ్రాన్‌తో పాటు మషహాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అబ్బాస్ అరాగ్చీ నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గౌరవం లేని, రాజీపడే అరాగ్చీ నశించాలి, అరాగ్చీ, సిగ్గు తెచ్చుకో... లొంగిపోవడం ఆపు, దేశద్రోహి, చొరబాటుదారుడైన అరాగ్చీ నశించాలి" అంటూ తీవ్ర పదజాలంతో అరాగ్చీపై మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే ఏ ఒప్పందం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పూర్తి అంగీకారం లేకుండా జరగదని స్పష్టం చేశారు.అయితే ఈ నిరసనల నేపథ్యంలో అరాగ్చీ స్పందించారు. హర్ముజ్ అనేది ఇరాన్ యొక్క ప్రధాన రక్షణ ఆయుధాలలో ఒకటని ఆయన స్పష్టం చేశారు. ఈ రాబోయే ఒప్పందం వల్ల ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం తొలగిపోతుందని పేర్కొన్నారు.కాగా అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌లోని అతివాదులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇరాన్ మరింత దూకుడుగా అణు విధానాన్ని అవలంబించాలని 'అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం' నుండి ఇరాన్ వైదొలగాలని, నేరుగా అణుబాంబు తయారీ వైపు అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు 🚨🇮🇷 Footage reportedly shows demonstrators on the streets of Iran turning on their own negotiators, chanting for revenge and demanding the talks be scrapped. One chant is aimed straight at the foreign minister: "Araghchi, have some shame, put the negotiations aside."… pic.twitter.com/GXOtPIg1ug— Mario Nawfal (@MarioNawfal) June 13, 2026 -
కువైట్, బహ్రెయిన్లలో అమెరికా రాడార్లు ధ్వంసం..
టెహ్రాన్: మిడిల్ ఈస్ట్‌లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, రాబోయే 24 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. అయితే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే.. కువైట్, బహ్రెయిన్‌లలోని కీలక అమెరికా క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థలను తాము ధ్వంసం చేశామంటూ ఇరాన్ కొన్ని ఉపగ్రహ చిత్రాలను విడుదల చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.అమెరికా వ్యవస్థల ధ్వంసం.. ఇరాన్ ఆధారాలు!యుద్ధ రంగంలో ఇరాన్ పైచేయి సాధించినట్లు ప్రకటించుకుంది. అమెరికాకు చెందిన క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థలపై తాము జరిపిన దాడుల తాలూకు ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ అధికారికంగా విడుదల చేసింది. కువైట్, బహ్రెయిన్లలో మోహరించిన రెండు అత్యంత కీలకమైన అమెరికా రాడార్ వ్యవస్థలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు ఇరాన్ పేర్కొంది. ఈ పరిణామాల మధ్యనే జోర్డాన్‌లో ఆకస్మికంగా సైరన్లు మోగడం, లెబనాన్ సరిహద్దులోని హులా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బుల్లా డ్రోన్ దాడికి పాల్పడటం లాంటి ఘటనలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం క్షణక్షణం మారుతోంది. BREAKING: Iran has released satellite images showing the Destruction of two Key U.S. radar systems in Kuwait and Bahrain that were used to detect Incoming missiles. The bases are now useless. pic.twitter.com/02IvZoaekG— Daily Iran News (@DailyIranNews) June 14, 2026ట్రంప్ కీలక ప్రకటన.. ఒప్పందానికి రంగం సిద్ధంమరోవైపు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని, శాంతి ఒప్పందం తుది దశకు చేరుకుందని ప్రకటించారు. ఇరాన్ అణు సంపత్తిని నియంత్రించడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఒప్పందాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు యూరప్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ట్రంప్ తెలిపారు. ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి దేశాల నేతలతో తాము చర్చలు జరిపినట్లు ఆయన స్పష్టం చేశారు.సంతకం ఎప్పుడు? ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ ముసాయిదాపై ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాది.. రష్యా, చైనా రాయబారులతో కీలక చర్చలు జరిపారు. అయితే ఈ ఒప్పందంపై సంతకాల ప్రక్రియ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై కొంత గందరగోళం నెలకొంది. ఇరు దేశాల ప్రతినిధులు నేరుగా హాజరయ్యే కార్యక్రమం రద్దయిందని, వర్చువల్ విధానంలో సంతకాలు జరుగుతాయని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నప్పటికీ, ఆదివారం నాటి ప్రెసిడెంట్ ట్రంప్ అధికారిక షెడ్యూల్లో దీనికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేదని అంతర్జాతీయ మీడియా నివేదించింది. కాగా, ఈ ఒప్పందం కుదిరితే అది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యూహాత్మక ఎదురుదెబ్బ అవుతుందని అక్కడి ప్రతిపక్ష నేత యాయీర్ లాపిడ్ విమర్శించారు. -
లండన్‌లో దారుణం.. భారత సంతతి వ్యక్తి హత్య
సాక్షి, లండన్: బ్రిటన్‌లో దారుణం జరిగింది. 26 సంవత్సరాలున్న గుర్బేజ్ సింగ్ అనే ఓ భారతీయ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. అయితే అతనిని చంపడానికి గల కారణాలేంటో ఇంకా తెలియలేదు. కాగా అతని మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి అక్కడి భారతీయులు విరాళల సేకరణ చేపడుతున్నారు.పశ్చిమ లండన్‌లోని సౌత్ఆల్ ప్రాంతంలో తీవ్రమైన కత్తిపోట్ల దాడిలో 26 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో మరణించిన యువకుడిని గురభేజ్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. డార్మర్స్ వెల్స్ లేన్ జంక్షన్ సమీపంలోని నార్త్ రోడ్డుపై ఆయనపై ఈ దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో 30 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నారని అతనని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.ఈ హత్యకు సంబంధించి ఘటనా స్థలంలోనే 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురు పురుషులను పోలీసులు అనుమానితులుగా అరెస్ట్ చేశారు. అయితే, తదుపరి విచారణ తర్వాత వారిలో ఆరుగురిని ఎలాంటి కేసు లేకుండా విడుదల చేయగా, ఒకరికి మాత్రం బెయిల్ మంజూరు చేశారు. అతను తదుపరి తేదీలో విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.ఈ దారుణ ఘటన తర్వాత, గురభేజ్ సింగ్ భౌతికకాయాన్ని తిరిగి స్వదేశానికి రప్పించడానికి డాక్యుమెంటేషన్, రవాణా, అంత్యక్రియల ఏర్పాట్లు మరియు ఇతర ఖర్చుల కోసం Go Fund Me వెబ్సైట్లో ఒక విరాళాల ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం 16,000 యూరోల లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 737 మంది దాతల నుండి 11,114 యూరోల నిధులు సేకరించారు. -
ఆనందంగా దూకింది.. సాహస యాత్రే చివరి యాత్ర..
అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువతి(21) నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. 40 మీటర్ల ఎత్తున్న రోప్ జంప్ (Rope Jump) ఈవెంట్లో పాల్గొన్న యువతికి భద్రతా తాడును కట్టకుండానే వంతెన పైనుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.వివరాల మేరకు.. ఈ ఘటనలో మృతురాలిని మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రైటాస్ (21)గా గుర్తించారు. ఆమె బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని లిమీరా ప్రాంతంలో నిర్వహించిన అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లింది. స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన మరియా, రోప్ జంప్ అనుభవాన్ని ఆస్వాదించాలని అనుకుంది. ఈ క్రమంలో రోప్ జంప్‌కు ముందు యువతికి హార్నెస్, ఇతర భద్రతా పరికరాలు అమర్చారు. అయితే అత్యంత కీలకమైన ప్రధాన సేఫ్టీ తాడును హార్నెస్‌కు అనుసంధానం చేయడం నిర్వాహకులు మర్చిపోయినట్లు తెలుస్తోంది.JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/ceqniPJkUs— Rapid Report (@RapidReport2025) June 13, 2026జంప్‌నకు సిద్ధమైన మరియాను ఇద్దరు సిబ్బంది వంతెన అంచుకు తీసుకెళ్లారు. కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత ఆమెను దూకించారు. అయితే ఆమె గాల్లోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే అక్కడ ఉన్న కొందరు సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు "తాడు లేదు... తాడు లేదు..." అంటూ అరవడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. అప్పటికే యువతి నేరుగా కిందపడిపోయింది. సుమారు 40 మీటర్ల (130 అడుగులకు పైగా) ఎత్తు నుంచి కిందపడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. ఘటనాస్థలంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.వైరల్‌గా మారిన వీడియో..ఈ ప్రమాదం మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డయింది. అనంతరం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో యువతి ఉత్సాహంగా జంప్‌కు సిద్ధమవడం, దూకిన తర్వాత సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురవడం కనిపిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా తనిఖీ చేసి ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ నిర్వాహకులు, భద్రతా సిబ్బందిని విచారిస్తున్నారు. భద్రతా నిబంధనలు పాటించారా? జంప్‌కు ముందు తప్పనిసరి చెక్‌లిస్ట్ అమలు చేశారా? అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది.JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/LPLfXyZ5qc— Pense (@creatorhouseinx) June 14, 2026 -
ట్రంప్‌నకు షాకిచ్చిన నెతన్యాహు
జెరూసలేం: అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించకుండా కుదిరే ఏ ఒప్పందమైనా మధ్యప్రాచ్య భద్రతకు ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌పై కఠినమైన ఒత్తిడి కొనసాగించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ డిమాండ్లకు ట్రంప్ తలొగ్గిందంటూ విమర్శలు చేస్తున్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమంపై పరిమితులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఆర్థిక ఉపశమనం కల్పించే ఒప్పందం కుదిరితే, ఆ దేశం తన ప్రాంతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళన..ఇజ్రాయెల్ భద్రతా వర్గాల అభిప్రాయం ప్రకారం.. ఆంక్షల సడలింపుతో ఇరాన్‌కు భారీగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అందుబాటులోకి వస్తాయి. ఆ నిధులను ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకోవడానికి, అలాగే ప్రాంతంలోని తన మిత్ర వర్గాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించవచ్చని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్‌లోని హెజ్బొల్లా, గాజాలోని హమాస్, యెమెన్‌లోని అన్సర్ అల్లాహ్ వంటి ఇరాన్ అనుకూల శక్తులకు మరింత బలం చేకూరే ప్రమాదం ఉందని పేర్కొంటోంది. ఇదే సమయంలో ఇరాన్‌కు అమెరికా లొంగిపోయిదంటూ ఇజ్రాయెల్ తాజాగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి.చర్చలే ముఖ్యం.. ఇక అమెరికా మాత్రం దౌత్య చర్చల ద్వారానే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించవచ్చని నమ్ముతోంది. యుద్ధం లేదా ప్రత్యక్ష ఘర్షణల కంటే చర్చల ద్వారా అణు విస్తరణను అడ్డుకోవడం అంతర్జాతీయ భద్రతకు మేలు చేస్తుందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అణు ఆయుధాల అభివృద్ధికి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధి చేయకుండా నిరోధించడం, అంతర్జాతీయ తనిఖీలను పునరుద్ధరించడం చర్చల ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ హామీలతో సంతృప్తి చెందడం లేదు. గతంలో కుదిరిన అణు ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ఆగలేదని, కేవలం ఆలస్యమైందే తప్ప మూల సమస్య పరిష్కారం కాలేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అందువల్ల ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేసే కఠినమైన ఒప్పందం తప్ప మరో మార్గం లేదని భావిస్తోంది.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఘర్షణలు, సిరియా మరియు ఇరాక్‌లో ఇరాన్ అనుకూల బలగాల కార్యకలాపాలు, ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీల దాడులు వంటి పరిణామాలు ఇప్పటికే ప్రాంతీయ భద్రతా పరిస్థితిని సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ ఒప్పందం కుదిరితే అది మొత్తం మధ్యప్రాచ్య శక్తి సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా లెక్కలు వేరుఅమెరికా మాత్రం పరిస్థితిని మరో కోణంలో చూస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే అనేక ఘర్షణలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్‌తో ప్రత్యక్ష సైనిక సంఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాషింగ్టన్ భావిస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణాపై దాని ప్రభావం భారీగా ఉండవచ్చు. అందుకే దౌత్య చర్చల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, పరిమితం చేయడం యుద్ధం కంటే మెరుగైన మార్గమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ తనిఖీల ద్వారా ఇరాన్ కార్యకలాపాలపై నిఘా కొనసాగించవచ్చని వారి అభిప్రాయం.ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావంఈ ఒప్పందం కుదిరితే మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు కూడా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ ఆర్థికంగా బలపడితే ప్రాంతీయ శక్తి సమతుల్యత మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినట్లుగా, తన జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని భావిస్తే అంతర్జాతీయ ఒప్పందాలకు అతీతంగా స్వతంత్ర చర్యలు తీసుకునే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. -
భూమిపై ఆఖరి చెట్టు.. గగుర్పాటు కలిగించే రెస్క్యూ ఆపరేషన్!
భూమిపై ఒక అరుదైన వృక్ష జాతి శాశ్వతంగా అంతరించిపోయేందుకు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. దక్షిణ అమెరికా దేశమైన చిలీ తీరానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నిర్జన ద్వీపంలో, ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘డెండ్రోసెరిస్ నెరిఫోలియా’ జాతికి చెందిన చివరి వృక్షం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ జాతిలోని మిగిలిన చెట్లన్నీ ఇప్పటికే తుడిచిపెట్టుకుపోగా, ప్రకృతిలో మిగిలిన ఈ ఏకైక వృక్షాన్ని కాపాడేందుకు శాస్త్రవేత్తలు అత్యంత ప్రమాదకరమైన, ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ ఆఖరి వృక్షం నుండి విత్తనాలను సేకరించి, ఆ జాతికి పునర్జన్మ ప్రసాదించేందుకు అంతర్జాతీయ పరిశోధకులు నడుం బిగించారు.అంతరిస్తున్న అద్భుతంచిలీ దేశ ప్రధాన భూభాగానికి సుమారు 673 కిలోమీటర్ల (420 మైళ్లు) దూరంలో, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జువాన్ ఫెర్నాండెజ్ అగ్నిపర్వత దీవుల్లో ఈ విచిత్ర వృక్ష జాతి పెరుగుతుంది. ఒకప్పుడు రాబిన్సన్ క్రూసో ద్వీపమంతటా దట్టంగా విస్తరించిన డెండ్రోసెరిస్ నెరిఫోలియా మొక్కలు, కాలక్రమేణా తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అడవుల నరికివేత, కార్చిచ్చులు, భూసార క్షీణత, విదేశీ జంతువుల మేత కారణంగా ఈ జాతి వినాశనానికి గురైంది. ప్రస్తుతం ఈ భూగోళంపై అడవిలో సహజసిద్ధంగా పెరుగుతున్న వృక్షం కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే మిగిలి ఉండటం పర్యావరణవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.ప్రాణాలకు తెగించి సాగిన వేటఈ చివరి చెట్టు నుండి విత్తనాలను సేకరించడం శాస్త్రవేత్తలకు అంత సులువైన పనేమీ కాలేదు. రాబిన్సన్ క్రూసో ద్వీపంలోని అత్యంత నిటారుగా, ప్రమాదకరంగా ఉన్న ఒక కొండ అంచున ఈ వృక్షం శతాబ్దాలుగా తలదాచుకుంది. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి పరిశోధక బృందం మొదట నాలుగు గంటలపాటు కఠినమైన ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, నిటారైన కొండలపై రెండు గంటలపాటు ట్రెಕ್ಕింగ్ చేయాల్సి వచ్చింది. చిలీ దేశానికి చెందిన ప్రత్యేక పార్క్ రేంజర్లు కొండలపై తాళ్ల సహాయంతో వేలాడుతూ, అత్యంత జాగ్రత్తగా ఆ చెట్టు కొమ్మల నుండి విత్తనాలను సేకరించారు.లండన్ చేరిన అమూల్య నిధితీవ్ర శ్రమకోర్చి సేకరించిన ఈ విత్తనాలను శాస్త్రవేత్తలు వెంటనే ఇంగ్లాండ్‌లోని వేక్హర్స్ట్లో ఉన్న ప్రతిష్టాత్మక ‘మిలీనియం సీడ్ బ్యాంక్’కు తరలించారు. అంతరించిపోతున్న వృక్ష జాతులను భవిష్యత్ తరాల కోసం భద్రపరిచే ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రం ఇది. క్యూ గార్డెన్స్ పర్యవేక్షణలో ఉన్న ఈ ల్యాబ్‌లో, సేకరించిన విత్తనాలపై శాస్త్రవేత్తలు అత్యాధునిక ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో శాస్త్రవేత్తలకు ఒక భారీ ఊరట లభించింది. సేకరించిన మొత్తం 29 విత్తనాలలో 25 విత్తనాలు అత్యంత ఆరోగ్యకరమైనవని, మొలకెత్తే సామర్థ్యం కలిగినవిగా నిర్ధారణ అయ్యింది.చిగురించిన కొత్త ఆశలువిత్తనాల నాణ్యతను పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో జెర్మినేషన్ (మొలకెత్తే) ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. రాయల్ బొటానిక్ గార్డెన్స్ శాస్త్రవేత్తల సంరక్షణలో ఇప్పటికే ఏడు చిన్న మొక్కలు విజయవంతంగా చిగురించాయి. భూమిపై నశించిపోతుందనుకున్న ఒక అరుదైన వృక్ష జాతి, ల్యాబ్ రూముల్లో మళ్లీ ప్రాణం పోసుకోవడం పర్యావరణ చరిత్రలోనే ఒక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ చిన్న చిగుళ్లు పర్యావరణ ప్రేమికుల్లో సరికొత్త ఆశలను రేకెత్తించాయి.జన్యు లోపాల సవాలుమిగిలిన విత్తనాలను భవిష్యత్తు అవసరాల కోసం శాస్త్రవేత్తలు లాంగ్ టర్మ్ స్టోరేజ్ (దీర్ఘకాలిక భద్రత)లో ఉంచారు. అయితే ఈ జాతి మనుగడపై ఇంకా కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. అడవిలో కేవలం ఒకే ఒక్క చెట్టు మిగిలి ఉండటం వల్ల, దాని నుండి వచ్చిన విత్తనాలలో ‘జెనెటిక్ డైవర్సిటీ’ (జన్యు వైవిధ్యం) చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇన్-బ్రీడింగ్ (సంతానోత్పత్తి లోపాలు) జరిగే ప్రమాదం ఉందని, తద్వారా మొక్కల రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, ఈ సీడ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆ జాతికి ఒక బలమైన రక్షణ కవచంలా నిలిచింది.పునరుజ్జీవం వైపు అడుగులుప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పెరుగుతున్న ఈ మొక్కలు పెద్దవై, పూలు పూసే దశకు చేరుకున్నప్పుడు వాటి నుండి మరిన్ని విత్తనాలను సేకరించవచ్చని మిలీనియం సీడ్ బ్యాంక్ భాగస్వామ్య అధికారి ఆలిస్ హడ్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ మొక్కలను తిరిగి వాటి స్వస్థలమైన చిలీ అడవుల్లో నాటడం ద్వారా, ఈ అరుదైన జాతిని పూర్వ వైభవానికి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒక వృక్షం భూమి నుండి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోకుండా కాపాడగలిగారు.ఇది కూడా చదవండి: భారత్‌లో మళ్లీ ‘కుష్టు’ బీభత్సం.. 91 వేలు దాటిన కొత్త కేసులు! -
అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు!
అదృష్టం ఒక్కసారి తలుపు తట్టడమే చాలా మందికి జీవితంలో మరపురాని అనుభవం. కానీ కెనడాకు చెందిన ఓ మహిళకు మాత్రం వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు అదృష్టం వరించింది. రెండు వేర్వేరు లాటరీల్లో భారీ మొత్తాలను గెలుచుకుని ఆమె వార్తల్లో నిలిచారు.కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో ఉన్న మిస్సిసాగా నగరానికి చెందిన ట్రాంగ్ ఫామ్ తన నలుగురు సహోద్యోగులతో కలిసి గత ఏడాది ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆ టికెట్‌కు ఏకంగా 60 మిలియన్ కెనడియన్ డాలర్ల జాక్‌పాట్ తగిలింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.407 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ భారీ ప్రైజ్ మొత్తాన్ని ఐదుగురు సభ్యులు సమానంగా పంచుకోవడంతో ట్రాంగ్కు కూడా గణనీయమైన మొత్తం లభించింది.అయితే ఆమె అదృష్టం అక్కడితో ఆగలేదు. తొలి లాటరీ గెలిచిన కేవలం వారం రోజులకే ట్రాంగ్ మరోసారి స్క్రాచ్ కార్డ్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆశ్చర్యకరంగా ఈ టికెట్‌కు కూడా జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆమెకు మరో 2,50,000 కెనడియన్ డాలర్లు లభించాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.60 కోట్లకు సమానం.ఈ రెండో లాటరీని ఆమె వ్యక్తిగతంగా కొనుగోలు చేశారా, లేక మరెవరితోనైనా కలిసి తీసుకున్నారా అనే వివరాలు వెల్లడికాలేదు. అయితే వారం వ్యవధిలోనే రెండు భారీ లాటరీలు గెలుచుకోవడం అత్యంత అరుదైన ఘటనగా నిలిచింది. సాధారణంగా జీవితకాలంలో ఒక్కసారి కూడా లాటరీ గెలవడం కష్టమని భావించే పరిస్థితుల్లో, ట్రాంగ్ వరుసగా రెండుసార్లు జాక్‌పాట్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఘటన కెనడా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాటరీ నిపుణులు కూడా ఇలాంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతాయని పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను 'లక్కీ లేడీ'గా అభివర్ణిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తంగా ట్రాంగ్ ఫామ్ కథ అదృష్టం ఎప్పుడు, ఎలా వరుస్తుందో చెప్పలేమనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. -
17న ట్రంప్, మోదీ భేటీ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. వారిద్దరూ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్‌హౌస్ శనివారం వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల పట్ల వారు అభిప్రాయాలు పంచుకొనే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కాబోతుండడం ఇదే మొదటిసారి. అప్పట్లో మోదీ వాషింగ్టన్లో పర్యటించారు. తర్వాత వారు పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు.టారిఫ్‌ల యుద్ధంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పదేపదే ప్రకటించగా, భారత్ కొట్టిపారేసింది. అలాగే ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. అమెరికా చర్యను భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్, మోదీ సమావేశం కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత ప్రధాని మోదీ శనివారం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగర ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న మోదీని ఫ్రాన్స్ విద్యా మంత్రి ఎడోగార్డ్ గిఫ్రే, పరిశోధనా మంత్రి ఫిలిఫే బాప్టిస్టే, భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియెరీ మాథ్యూ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నైస్తోపాటు ఎవియాన్, పారిస్‌లోనూ మోదీ పర్యటించనున్నారు. మేక్రాన్‌తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ను ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో ఇరుదేశాలతోపాటు ఇతర దేశాలకు చెందిన అత్యుత్తమ నవ్య అంకుర సంస్థలు, పెట్టుబడుల సంస్థలు పాల్గొననున్నాయి. ఫ్రాన్స్ నుంచి మోదీ తర్వాత స్లోవేకియాకు వెళ్లనున్నారు. 14–15 తేదీల్లో అక్కడ బ్రాటిస్లావాలో అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వ్యాపారరంగ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. తిరిగి ఫ్రాన్స్ చేరుకుని 16, 17 తేదీల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ గళం వినిపిస్తానని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. -
యూఎస్ అటార్నీగా జేమ్స్ మెక్‌డొనాల్డ్!: ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనలో, న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా జేమ్స్ ఎం. మెక్‌డొనాల్డ్‌ను నియమించాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పదవి అమెరికా న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైనది, ముఖ్యంగా ఆర్థిక నేరాలు, అవినీతి కేసులు, ఫెడరల్ స్థాయి క్రిమినల్ కేసులను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.జేమ్స్ మెక్‌డొనాల్డ్ ఒక అనుభవజ్ఞుడైన న్యాయవాది. ఈయన గతంలో అదే న్యూయార్క్ దక్షిణ జిల్లాలో అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా పనిచేశారు. అమెరికా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సల్లివన్ & క్రోమ్‌వెల్ న్యాయ సంస్థలో సీనియర్ పార్ట్నర్గా పనిచేస్తున్నారు.వర్జీనియా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లా, హార్వర్డ్ కాలేజీలలో చదువుకున్న మెక్‌డొనాల్డ్ అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ జి. రాబర్ట్స్, జూనియర్ వద్ద లా క్లర్క్‌గా కూడా పనిచేశారు. కాబట్టి దేశానికి శక్తివంతమైన ఫలితాలు అందించగల సామర్థ్యం ఆయనకు ఉందని ట్రంప్ పేర్కొన్నారు. -
ఇరాన్‌తో ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలను తరిమేస్తూ శాంతికపోతాలకు స్వాగతం పలుకుతూ శాశ్వత శాంతి ఒప్పందం ఇరాన్‌తో ఆదివారం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు. ఒప్పందం సంతకాలు పూర్తవగానే హార్మూజ్‌ను అందరికీ తెరుస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు.ఇరాన్ విషయంలో ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎత్తిపొడుస్తూ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘బరాన్ హుస్సేన్ ఒబామా ఇరాన్‌తో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ(జేసీపీఓఏ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇరాన్ అణ్వాయుధం తయారీకి ఒక రకంగా బాటలుపరిచింది. ఇది ఇలాగే అమల్లో ఉండి ఉంటే ఇరాన్ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాన్ని తయారుచేసి ఉండేది. ఇప్పటికే దానిని ఉపయోగించేవారు. ఇరాన్‌తో నేను కుదుర్చుకుంటున్న ఒప్పందం దీనిని పూర్తి విరుద్ధం.ఇరాన్ అణ్వాయుధ కలను కల్లను చేసే ఒప్పందం ఇది. కొనుగోలు, సమీకరణ, అభివృద్ధి ద్వారా కూడా వాళ్ల లక్ష్యం నెరవేరకుండా నా ఒప్పందం చేస్తుంది. ఇంతటి గొప్ప ఒప్పందం ఆదివారం జరగబోతోంది. ఒప్పందంపై సంతకాలు పూర్తవగానే హార్మూజ్‌ను అందరి కోసం తెరుస్తాం. ఇరాన్‌తో మా బంధం గతం కంటే భిన్నంగా, గత ప్రభుత్వాల కంటే ఎంతో మెరుగ్గా ఉండనుంది. ఒబామా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడులు, ఒప్పందాలు, నగదు రూపంలో ఇరాన్ కోసం ఖర్చుచేశారు. కానీ మేం అదనుచూసి గుట్టుచప్పుడుకాకుండా ఇరాన్‌లోని అణుధూళిని పట్టుకొచ్చేస్తాం.అద్భుతమైన పైలట్లు బీ–2 బాంబర్ విమానాలతో ఇరాన్ పర్వతాల్లో రేడియోధార్మిక పదార్థాన్ని భూస్థాపితం చేశారు. ఇప్పుడు మేం ఇరాన్‌తో, యావత్ పశి్చమాసియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భవిష్యత్‌లోనూ కలిసి పనిచేస్తాం. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది ఒకవేళ ఆచరణసాధ్యంకాకపోతే మాకు భయంకరమైన ప్రత్యామ్నాయం ఉంది. ఇది ఎప్పటికీ ఉపయోగించకూడదనే కోరుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.]24 గంటల్లోనే: షెహబాజ్ షరీఫ్యుద్దం ముసిగి శాంతి ఒప్పందం రాబోయే 24 గంటల్లో ఖరారు కావొచ్చని అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలను ట్యాగ్ చేశారు. ‘‘శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చేశాం. రాబోయే 24 గంటల్లో దీనికి తుదిరూపం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే ఒప్పందంపై ఎల్రక్టానిక్ విధానంలో అమెరికా, ఇరాన్‌లు సంతకాలు పెట్టేందుకు పాకిస్తాన్ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చేవారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగనున్నాయి. శాంతి చర్చల సమయంలో అమెరికా, ఇరాన్‌లు చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు’’అని షరీఫ్ తెలిపారు.వచ్చే నెల 4న ఖమేనీ అంత్యక్రియలు!ఇస్లామాబాద్: ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4వ తేదీన జరుగుతాయని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. పశి్చమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా అమెరికా, ఇరాన్‌ల మధ్య అతిత్వరలో ఒప్పందం కుదరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం: ఇరాన్ ఒమన్ తీరంలో భారతీయులున్న మూడు నౌకలపై ఇరాన్ సైన్యమే డ్రోన్లతో దాడి చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను భారత్‌లోని ఇరాన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన ఘటన నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇరాన్‌పై అసంబద్ధ ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
నరకానికి పంపించేశాం.. ట్రంప్ సంచలన ప్రకటన
డ్రగ్స్ ముఠా ట్రెన్ డి అరాగువా (Tren de Aragua)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ముఠా లీడర్ హెక్టర్ రుస్తెన్‌ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ నినో గెర్రెరో హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగ్‌పై అమెరికా కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో పచ్చటి పైకప్పు ఉన్న భవనం పేల్చివేయబడి.. ముక్కలు ముక్కలుగా అవ్వడం కనిపించింది."ట్రెన్ డి అరాగువా ఉగ్రవాదులకు ఇకపై వెనిజులాలో కానీ.. మరెక్కడా కానీ సురక్షితమైన స్థావరం ఉండదు. నా నాయకత్వంలో ఈ ఘోరమైన హంతకులను, డ్రగ్ మాఫియా నాయకులను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వెతికి పట్టుకుంటాం. వారు ఉండాల్సిన నరకానికి వారిని పంపుతాం’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌ను తాము ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వెనిజులాలోని తమ స్నేహితులతో కలిసి సమన్వయంతో చేపట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు.“నా ఆదేశాల మేరకు అమెరికా సదర్న్ కమాండ్ వేగవంతమైన, అత్యంత కచ్చితమైన దాడి నిర్వహించి ట్రెన్ డి అరాగువా నాయకుడు నినో గెర్రెరోను హతమార్చింది. ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి ఉగ్ర సంస్థల్లో ఇది ఒకటి” అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.గెర్రెరో తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. పదేళ్ల క్రితం ఓ జైల్లో ఏర్పాటైన ట్రెన్ డి అరాగువా.. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కన్నుసన్నల్లోనే ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
హర్ముజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంపై శాంతి చర్చల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచితంగా ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ అంశమై ఇరు దేశాలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.పశ్చిమాసియా యుద్ధంలో ప్రధానంగా చర్చంతే హర్ముజ్‌పైనే యుద్దం ప్రారంభంలోనే ఇరాన్ హర్ముజ్‌ని దిగ్భందించడంతో ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ జలసంధిని తెరవాలని ఎన్ని సార్లు కోరినా ఇరాన్ ససేమిరా అంది. తాజాగా శాంతి చర్చల ప్రస్థావన నేపథ్యంలో అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు.అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ" జలసంధి నిర్వహణ మునుపటిలా ఉండదు. ఇందులో అంతర్జాతీయ జలమార్గం ఏది లేదు. ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సౌర్వభౌమాధికారం కిందకి వస్తుంది. ఈ జలసంధి గుండా పయణించే నౌకలకు అందించే సేవలు ఇకపై ఉచితంగా ఉండవు. ఇందులో నుంచి ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది." అని అన్నారు.ఈ విషయమై ఒమన్‌తో చర్చలు పూర్తయ్యాయి. హర్ముజ్ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి అని అన్నారు. కాగా ఇదివరకూ హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇరుదేశాలు మునుపటి కార్యాచరణనను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం
"యెమెన్ స్పైడర్ మ్యాన్" గా గుర్తింపు పొందిన యువ అక్రోబాట్ అల్-ఖకా బిన్ అన్తార్ (Al-Qa'qa' bin Antar) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండానే అచ్చం స్పైడర్ మ్యాన్‌లా నిటారైన కొండలను చకచకా ఎక్కేస్తూ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో భారీ గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖాఖా మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. యెమెన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన కొండలు, పర్వతాలను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒక అగ్నిపర్వత క్రేటర్ (కుహరం) ఎక్కుతూ, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను పణంగా పెట్టి, అద్భుతమైన సాహసాలతో ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ ఇక లేడన్న వార్త అటు యెమెన్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర విచారాన్ని నింపింది. ధమార్ (Dhamar) ప్రాంతంలోని ప్రసిద్ధ 'హరదత్ దమ్త్' (Haradhat Damt) అగ్నిపర్వత క్రేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 120 మీటర్ల లోతున్న నిటారైన అగ్నిపర్వత లోయ గోడలను అన్తార్ ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేదా రోప్‌లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన నేరుగా వందల అడుగుల లోతున్న క్రేటర్ అడుగుభాగానికి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టం కావడంతో ఫలితం దక్కలేదు. ఆ లోయ అడుగు భాగంలో గంధకపు వేడి నీటిలో పడిపోయాడు. అక్కడికి చేరుకునే మార్గం లేక రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు యువ క్లైంబర్ నిర్జీవ దేహాన్ని బయటకు తీశారు.من المواقف الذي تحبس الانفاس لحظة محاول العثور على جثة القعقاع رحمة الله عليه هل الذين كانوا يشجعوه يتحملوا المسؤلية؟ pic.twitter.com/y1ow1fWIPo— نوادر ومواقف (@Nawader_X) June 12, 2026 అన్తార్ యెమెన్‌లోని నిటారైన కొండలు, పురాతన కట్టడాలు,అగ్నిపర్వత శిలలపై రక్షణ లేకుండా ఎక్కుతూ సాహసాలకు నెటిజన్లు ఫిదా అయ్యేవారు. దీనికి సంబంధించిన వీడియోలు చాలా పాపులర్ కావడంతో "యెమెన్ స్పైడర్ మ్యాన్" అనే పేరు వచ్చింది. అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన చేసిన ప్రమాదకరమైన క్లైంబింగ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి.అన్తార్ అకాల మరణంపై యెమెన్‌లోని సోషల్ మీడియా వినియోగదారులు, ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధైర్యాన్ని కొనియాడుతూనే, కేవలం సోషల్ మీడియా లైక్‌లు, వ్యూస్ కోసం ఎలాంటి భద్రత లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఎంత ప్రాణాంతకమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అయిదేళ్ల బాలికను రక్షించిన ‘హీరో’ అరుదైన గౌరవం
రొమేనియాలోని క్రైయోవా నగరంలో చాకచక్యంగా వ్యవహరించి అనూహ్యంగా 5 ఏళ్ల బాలికను కాపాడిన భారతీయ సంతతికి చెందిన 47 ఏళ్ల నిర్మాణ కార్మికుడు విపన్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అతని సాహసానికిగాను అక్కడి ప్రభుత్వం గౌరవ పౌరసత్వం (Honorary Citizenship) ఇచ్చి సత్కరించింది. ఈ ఏడాది జనవరిలో రొమేనియాలోని క్రాయోవా (Craiova) నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్డకట్టిన సరస్సులో పడిపోయి ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఐదేళ్ల బాలికను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాడు విపన్ కుమార్. గడ్డకట్టిన సరస్సులోకి దూకి అత్యంత సాహసంగా బాలిక నురక్షించాడు. అప్పటి ఈ రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఏం జరిగిందంటే..పార్క్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఆ చిన్నారి, స్లెడ్జ్ పై నుంచి దూకి గడ్డకట్టిన సరస్సు వైపు పరుగెత్తింది. ఆమె బరువుకు మంచు పలక కరిగి, ఆమె నీటిలో పడిపోయింది. కూతురిని కాపాడటానికి తండ్రి కూడా నీటిలోకి వెళ్లాడు కానీ, అతను కూడా మంచు మధ్య చిక్కుకుపోయాడు. ఇది చూసిన విపన్ కుమార్ ఒక స్లెడ్జ్ సహాయంతో మంచుపై పాకుకుంటూ బాలిక వైపు వెళ్లారు. ఈ సమయంలో అతని కింద ఉన్న మంచు పొర కూడా కరిగిపోయింది. అయినా సమయస్ఫూర్తితో బాలిక చేతిని పట్టుకుని, అత్యవసర రెస్క్యూ బృందాలు వచ్చే వరకు ఆమె తల నీటిపైనే ఉండేలా గట్టిగా పట్టుకున్నాడు. చివరకు రెస్క్యూ టీమ్ ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన చలి కారణంగా ఇద్దరూ 'హైపోథెర్మిక్ షాక్'కు గురైనప్పటికీ, ప్రాణాపాయం తప్పింది. విపన్ కుమార్ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు.ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంటే విపన్ ఇలా చెప్పారు : "నేను నా స్నేహితుడితో కలిసి నడుస్తూ వెళ్తున్నాను. అప్పుడు ఆ చిన్నారి నీటిలో మునిగిపోవడం చూసి, వెంటనే సరస్సులోకి దూకాను. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అసలు ఆ సమయంలో ఆలోచించడానికి అస్సలు సమయం లేదు. ఎలాగైనా ఆ అమ్మాయిని బయటకు తీయాలనేదే నా మనసులో ఉంది. కానీ ఆ చిన్నారి చాలా ధైర్యవంతురాలు’’ అని చెప్పుకొచ్చాడు.In Romania, an Indian construction worker, Vipan Kumar, jumped into an icy lake in the city of Craiova to save a 5-year-old girl from drowning. He kept her above water until firefighters arrived. The city’s mayor plans to grant him the title of Honorary Citizen 🇷🇴🇮🇳 pic.twitter.com/YBFqQO3tlv— 🇪🇺 (@ChristianEUR0PE) January 18, 2026గౌరవ పౌరసత్వంతో సత్కారంవిపన్ కుమార్ చేసిన ఈ మానవతా ప్రయత్నానికి మరియు సాహసానికి గుర్తింపుగా ఆయనకు క్రాయోవా నగర గౌరవ పౌరసత్వం (Honorary Citizen) ఇవ్వనున్నట్లు మేయర్ లియా ఓల్గుటా వాసిలెస్కు ప్రకటించారు. ఆయన నిస్వార్థ గుణం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నామని మేయర్ తెలిపారు. గౌరవ పౌరసత్వం ఇవ్వాలన్న ప్రతిపాదనను స్థానిక కౌన్సిల్ దీనిని అధికారికంగా మంజూరు చేసిందన్నారు. దీని ద్వారా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. త్వరలోనే రెసిడెన్స్ పర్మిట్ (నివాస అనుమతి) పొందనున్నారు.మరోవైపు విపన్ కుమార్ సాహసాన్ని ఆయన కంపెనీ యజమాని కూడా అభినందించారు. భారతదేశంలో ఉన్న ఆయన కుటుంబాన్ని, ఎనిమిదేళ్ల కుమార్తెను కలుసుకునేందుకు వీలుగా కంపెనీ తరపున విమాన టికెట్లు/ప్రయాణ ఖర్చులు బహుమతిగా ఇవ్వాలని యజమాని యోచిస్తున్నారు. కాగా 2025 జూన్‌లో విపన్ కుమార్ రొమేనియా వెళ్లారు. డోల్జ్ కౌంటీలోని మాలు మారే అనే ప్రాంతంలో ఒక నిర్మాణ సంస్థలో అన్‌స్కిల్డ్ లేబర్‌గా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: మొన్న ప్రణీత్, ఇపుడు మధుర్ విర్లీ : వీడియో వైరల్ -
ప్రపంచ యుద్ధాన్ని దాటేసి..1,569 రోజులుగా ఆగని మారణహోమం
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం సరికొత్త రికార్డులకు దారితీసింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దళాలు ఉక్రెయిన్‌పైకి దూసుకెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఘర్షణ 1,569 రోజులకు చేరుకుంది. ఇది 1914 నుండి 1918 వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మొదటి ప్రపంచ యుద్ధం (ది గ్రేట్ వార్) కాల వ్యవధిని కూడా దాటేసింది. కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్ను లొంగదీసుకోవచ్చన్న క్రెమ్లిన్ ఆశలు అడియాసలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో అత్యంత సుదీర్ఘమైన, అత్యంత ఘోరమైన రక్తపాతంగా ఈ యుద్ధం చరిత్రకెక్కింది.ఆధునిక సాంకేతికత.. సరికొత్త వ్యూహాలుమొదటి ప్రపంచ యుద్ధంలో అనేక ప్రపంచ అగ్రరాజ్యాలు నేరుగా పాల్గొనగా, ప్రస్తుత యుద్ధం ప్రధానంగా రెండు దేశాల మధ్యే సాగుతోంది. అయినప్పటికీ డ్రోన్లు, లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల వంటి అత్యాధునిక సైనిక సాంకేతికత వాడకం ఈ యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రెడ్ కార్పెట్ పరిచి, దశాబ్ద కాలంలో మొదటిసారి అమెరికా గడ్డపై ద్వైపాక్షిక చర్చలు జరిపినప్పటికీ, శాంతి ప్రయత్నాలు ఒకపట్టాన ఫలించలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల నుంచి నిధులు, ఆయుధాల కోసం నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉన్నారు.మొదటి ప్రపంచ యుద్ధ ఛాయలుప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటి ట్రెంచ్ వార్ఫేర్ (బంకర్ల యుద్ధం), భారీ ప్రాణనష్టం, భూభాగాల కోసం సాగుతున్న హోరాహోరీ పోరు ఇందుకు నిదర్శనం. నాడు మెషిన్ గన్లు, ట్యాంకులు రణరంగాన్ని శాసిస్తే.. నేడు డిజిటల్ నిఘా, డ్రోన్ దాడులు వ్యూహాలను మారుస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రజల దృష్టిలో ఈ యుద్ధం 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచే మొదలై, ఒక దశాబ్ద కాలంగా సాగుతోంది. నాటోలో సభ్యత్వం లేకపోయినా, అణ్వాయుధాలు లేకపోయినా ఉక్రెయిన్ ఇంతకాలం రష్యాను ప్రతిఘటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.వర్సాలీస్ పాఠాలు.. అస్పష్టంగానే శాంతి ప్రక్రియప్రస్తుతం ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతూ తమ బలాన్ని నిరూపించుకుంటున్నాయి. అయినప్పటికీ పుతిన్ చర్చలకు సిద్ధంగా లేరని ‘ది ఎకనామిస్ట్’ పేర్కొంది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిన 1919 నాటి ‘వర్సాలీస్ సంధి’ సృష్టించిన అసంతృప్తులే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇప్పుడు కూడా కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం కాకుండా, భవిష్యత్తులో శాంతి భద్రతలకు గ్యారెంటీ ఇచ్చేలా ఒప్పందాలు జరగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల సైనిక అంచనాలను తలకిందులు చేస్తూ, యుద్ధాలు ఎప్పుడూ వాటి గడువుల ప్రకారం ముగియవని ఈ సుదీర్ఘ పోరు నిరూపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘ఇండియాలో నరకం’.. అమెరికా రిటర్న్ టెక్కీ రచ్చ! -
ట్రిలియనీర్ మస్క్ వెనుక.. ఆ లేడీబాస్!
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచి మరో చరిత్ర సృష్టించారు ఎలాన్ మస్క్. ఐపీవో విజయవంతం కావడంతో ఆయన ‘స్పేస్ఎక్స్’ కంపెనీ విలువ రికార్డులు బద్ధలు కొట్టింది. అలా.. మస్క్ సంపద అమాంతం పెరిగిపోయింది. అయితే వివిధ కంపెనీలతో వ్యాపార రంగాన్ని శాసిస్తున్న మస్క్ ‘స్పేస్ఎక్స్’ సక్సెస్ వెనుక.. ఓ మహిళ పాత్ర ఉందని తెలుసా?. స్పేస్ఎక్స్ పని అయిపోయిందనుకున్న టైంలో ఆమె అడుగు సీన్ మొత్తాన్ని మార్చేసింది.మస్క్ కలలకు వ్యాపార రూపం ఇచ్చి, సంక్షోభాల్లో సంస్థను గట్టెక్కించి, స్పేస్‌ఎక్స్‌ను ప్రపంచ అగ్రశ్రేణి అంతరిక్ష సంస్థగా తీర్చిదిద్దిన ఆ మహిళే గ్విన్ షాట్వెల్. స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న షాట్‌వెల్‌ను చాలామంది "మస్క్ విజన్‌కు ఎగ్జిక్యూషన్ ఇంజిన్"గా అభివర్ణిస్తారు. మస్క్ అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను ప్రకటిస్తే.. వాటిని సాధ్యమైన వ్యాపార ప్రణాళికలుగా మార్చి అమలు చేయడంలో షాట్వెల్ కీలక పాత్ర పోషించారని అంటారు. అందుకే తాజాగా మస్క్ ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన వేళ.. ఆయన వెనుక నిలిచిన ఈ లేడీబాస్ పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది.సంక్షోభ సమయంలో అండగా..స్పేస్ఎక్స్ ప్రారంభ దశలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా 2006 నుంచి 2008 మధ్య జరిగిన తొలి మూడు ఫాల్కన్-1 రాకెట్ ప్రయోగాలు వరుసగా విఫలమవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. కంపెనీ వద్ద నగదు నిల్వలు దాదాపు ఖాళీ అయ్యాయని, మరో ప్రయోగం కూడా విఫలమైతే స్పేస్ఎక్స్ మూతపడే పరిస్థితి ఏర్పడిందని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలోనే గ్విన్ షాట్వెల్ తన వ్యాపార నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నాసా చేపట్టిన కమర్షియల్ రీసప్లై సర్వీసెస్ (CRS) కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరకు రవాణా చేసే 1.6 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని ఆమె కుదుర్చగలిగారు. అప్పటివరకు అంతరిక్ష రంగంలో పెద్దగా గుర్తింపు లేని ప్రైవేట్ సంస్థకు నాసా ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం సంచలనంగా మారింది. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన నిధులు స్పేస్ఎక్స్కు ఆర్థిక ఊపిరి పోయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంస్థపై విశ్వాసాన్ని పెంచాయి. చాలామంది విశ్లేషకులు ఈ డీల్‌ను స్పేస్ఎక్స్ చరిత్రను మలుపుతిప్పిన ఘట్టంగా, గ్విన్ షాట్వెల్ కెరీర్లో అత్యంత కీలక విజయంగా పేర్కొంటారు.స్పేస్ఎక్స్కు అసలు బలమే ఆమె2002లో సంస్థ ప్రారంభమైనప్పుడు.. అందులో 11వ ఉద్యోగిగా చేరారు షాట్వెల్. ప్రభుత్వ సంస్థలు, ఉపగ్రహ కంపెనీలు, వాణిజ్య భాగస్వాములతో సంబంధాలు పెంచుతూ స్పేస్ఎక్స్కు విశ్వసనీయత తీసుకొచ్చారు. బిలియన్ డాలర్ల ఒప్పందాలు సాధించడంతో పాటు స్టార్‌లింక్ విస్తరణ, వేలాది మంది ఉద్యోగుల నిర్వహణ, సంస్థ రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఆమెను స్పేస్ఎక్స్కు ‘వెన్నెముక’గా అభివర్ణిస్తుంటారు.మస్క్ కలలకు వ్యాపార రూపంచిన్నతనంలో రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ.. ఒకరోజు మనుషులను అంగారక గ్రహానికి పంపాలనే కలలు కనేవాడట ఎలాన్ మస్క్. ఆ స్ఫూర్తితోనే.. స్పేస్‌ఎక్స్‌ను స్థాపించి మార్స్ కాలనీలు, పునర్వినియోగ రాకెట్లు, స్టార్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టగలిగారు. అయితే మస్క్ ఊహించిన ఆ భారీ లక్ష్యాలకు ఆర్థిక బలం చేకూర్చడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యాపార ఒప్పందాలు కుదుర్చడం, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలను గ్విన్ షాట్వెల్ భుజాన వేసుకున్నారు. తొలి ట్రిలియనీర్‌గా మస్క్స్పేస్ఎక్స్ షేర్లు నాస్డాక్లో చరిత్రాత్మకంగా లిస్ట్ కావడంతో సంస్థ విలువ భారీగా పెరిగింది. దీంతో ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ప్రపంచ చరిత్రలో ట్రిలియనీర్‌గా గుర్తింపు పొందిన తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు. టెస్లా, స్పేస్ఎక్స్, స్టార్‌లింక్, న్యూరాలింక్ వంటి సంస్థల్లోని వాటాలు ఆయన సంపదను ఈ స్థాయికి చేర్చాయి.గ్విన్ షాట్వెల్ వ్యక్తిగత జీవితం..1963 నవంబర్ 23న అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఎవాన్‌స్టన్‌లో జన్మించిన గ్విన్ షాట్వెల్.. చికాగో సమీపంలోని లిబర్టీవిల్లో పెరిగారు. ఆమె తండ్రి మెదడు శస్త్రచికిత్స నిపుణుడు (బ్రెయిన్ సర్జన్) కాగా, తల్లి కళాకారిణి. చిన్నతనంలో అంతరిక్ష రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, టీనేజ్‌లో మహిళా ఇంజినీర్ల సమావేశానికి హాజరైన తర్వాత ఇంజినీరింగ్ వైపు ఆమె ఆకర్షితులయ్యారు. అనంతరం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL)లో ఇంజినీర్‌గా పనిచేసిన రాబర్ట్ షాట్‌వెల్‌ను ఆమె వివాహం చేసుకుని జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లైన గ్విన్.. కుటుంబ జీవితం, స్పేస్ఎక్స్ బాధ్యతలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్ ప్రాంతంలో స్పేస్ఎక్స్ రాకెట్ పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల పశువుల ఫారాన్ని కూడా కుటుంబంతో కలిసి నిర్వహిస్తున్నారు.స్పేస్ఎక్స్-అలా.. స్పేస్ఎక్స్ (Space Exploration Technologies Corp.)ను ఎలాన్ మస్క్ 2002లో స్థాపించారు. అంతరిక్ష ప్రయాణ వ్యయాన్ని తగ్గించడం, భవిష్యత్‌లో మనుషులను అంగారక గ్రహానికి పంపడం సంస్థ ప్రధాన లక్ష్యాలు. ఫాల్కన్-9, ఫాల్కన్ హెవీ రాకెట్లు, డ్రాగన్ వ్యోమనౌకలు, స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌తో స్పేస్ఎక్స్ అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాసాకు మానవ, సరకు రవాణా సేవలు అందిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా గుర్తింపు పొందింది. -
పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్‌డిఎ (NDA) ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశం'లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్యాల భాష అర్థం కాని వారికి ఎలా సమాధానం చెప్పాలో తమ ప్రభుత్వానికి బాగా తెలుసని 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ప్రపంచానికి నిరూపించామని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అండగా నిలిచే వారికి సింధు నదీ జలాలు అంద కుండా చేస్తామని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన రక్తం, నీరు కలిసి ప్రవహించవు అన్న హెచ్చరికను రక్షణ మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ, బాధితుల పట్ల కరుణ చూపనివారికి తమ నుంచి నీటిని ఆశించకూడదని చెప్పామన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలిచేవారికి, మానవాళికే ముప్పుగా ఉన్నవారికి ఈ జలాలు అందకుండా చేస్తామన్నారు.కాగా సింధు నదీ వ్యవస్థకు చెందిన నదుల జలాల వినియోగానికి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం (IWT) కుదిరింది. అయితే గత ఏడాది జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, అంతర్జాతీయ చట్టం ప్రకారం సార్వభౌమ దేశంగా తనకున్న హక్కులను వినియోగించుకుంటూ, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నమ్మదగిన, తిరుగులేని రీతిలో మద్దతు ఉపసంహరించుకునే వరకు భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది.అలాగే గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ, రక్షణ మంత్రి ఆర్టికల్ 370 రద్దు, దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడంలో పురోగతి, జీఎస్టీ (GST) అమలు, దేశవ్యాప్త విద్యుదీకరణ మరియు న్యాయ వ్యవస్థలో సంస్కరణలను ప్రస్తావించారు. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న కాశ్మీర్, ఇప్పుడు పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో దూసుకుపోతోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది, అక్కడ తొలిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి, మొహర్రం ఊరేగింపులు ప్రశాంతంగా సాగుతున్నాయి, దశాబ్దాలుగా మూతపడి ఉన్న సినిమా హాళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. -
క్రికెట్ క్యాచ్‌తో చిన్నారి ప్రాణాలు కాపాడాడు!
కిటికీ అంచున వేలాడుతూ ఓ పసిప్రాణం.. తొమ్మిది నిమిషాల పాటు కొనసాగిన ఉత్కంఠ.. ఇక కిందపడిపోతుందనుకుని అంతా కళ్లు మూసుకున్న టైంలో.. అనూహ్యంగా ఓ భారతీయుడు ఆమె ప్రాణం కాపాడాడు. లండన్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తూర్పు లండన్‌లోని ఇల్ఫోర్డ్ హైరోడ్ ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నా సమయంలో.. ఓ భవనం కిటికీ అంచుపై మూడేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది. ఆమె ఎప్పుడు కిందపడిపోతుందోనన్న భయంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి, స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మొహమ్మద్ జెసిల్ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు.చిన్నారి పట్టును కోల్పోతున్న సమయంలో ఓ వ్యక్తి నిచ్చెన తీసుకొచ్చి సహాయం చేశాడు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో చిన్నారి కిందకు జారిపోయింది. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న జెసిల్ అనే భారతీయ వ్యక్తి.. ఆమెను అద్భుతంగా అందుకుని ప్రాణాలు కాపాడాడు. పక్కనే ఉన్న పోలీసు అధికారి కూడా అతడికి సహకరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై స్పందించిన జెసిల్.. తాను భారతదేశంలో క్రికెట్ ఆడిన అనుభవమే ఆ సమయంలో ఉపయోగపడిందని చెప్పారు. "ఆ క్షణంలో ఎక్కువగా ఆలోచించలేదు. ఓ తండ్రిగా అలా ముందుకు వెళ్లాను. క్రికెట్ ఆడిన అనుభవం వల్ల క్యాచ్‌పై దృష్టి పెట్టగలిగాను" అని తెలిపారు. ఇక చిన్నారి తండ్రి స్పందిస్తూ.. తన కుమార్తెను కాపాడిన జెసిల్, పోలీసు అధికారిని నిజమైన హీరోలుగా అభివర్ణించారు. ప్రమాదంలో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని.. ఆమె తిరిగి పాఠశాలకు కూడా వెళ్లిందని తెలిపారు.లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తక్కువ టైంలోనే రెస్క్యూ ఆపరేషన్ ముగిందని ప్రకటించారు. మనోడు పాల్గొన్న ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.. A tense situation in Ilford today ended safely after a young child was found in danger at a window and was quickly rescued through the combined efforts of a police officer and a member of the public. pic.twitter.com/4fmasluJj3— Harry Sawyer (@HSawyer11526) June 11, 2026 -
ట్రంప్ వేట.. వెనిజువెలా డ్రగ్ లార్డ్ హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ లీడర్ హెక్టార్ ‘నినో’ గెరెరోను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. వెనిజువెలాకు చెందిన ‘ట్రెన్ డి అరాగువా’ ట్రాన్స్‌నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హెడ్ గెరెరోను సైనిక దాడిలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ - సంచలన వీడియోఅమెరికా సదరన్ కమాండ్ మెరుపు వేగంతో నిర్వహించిన ఈ ‘కైనెటిక్ స్ట్రైక్’లో గెరెరో హతమయ్యాడని ట్రంప్ పేర్కొన్నారు. ‘మా నాయకత్వంలో, ఈ క్రూరమైన హంతకులను, డ్రగ్ లార్డ్‌లను ఎక్కడైనా, ఎప్పుడైనా సరే వేటాడి పట్టుకుంటాం’ అని ట్రంప్ హెచ్చరించారు. వెనిజువెలా అధికారులతో సంపూర్ణ సమన్వయంతోనే ఈ వ్యూహాత్మక ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం వెనిజువెలా ప్రభుత్వంతో అమెరికా కలిసికట్టుగా పనిచేస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు.𝗗𝗼𝗻𝗮𝗹𝗱 𝗝. 𝗧𝗿𝘂𝗺𝗽 𝗣𝗼𝘀𝘁𝘀 𝗩𝗶𝗱𝗲𝗼 𝗼𝗻 𝗧𝗿𝘂𝘁𝗵 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 - 𝟬𝟮:𝟬𝟯 𝗣𝗠 𝗘𝗦𝗧 𝟬𝟲.𝟭𝟮.𝟮𝟲At my direction, the United States Southern Command delivered a swift and lethal kinetic strike to successfully execute Niño Guerrero, the infamous leader of… pic.twitter.com/IMj9iZzTYM— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) June 13, 2026బైడెన్ సరిహద్దు విధానాలపై తీవ్ర విమర్శలుఈ అద్భుతమైన విజయాన్ని ప్రకటిస్తూనే, ట్రంప్ తన పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన సరిహద్దు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ హయాంలో సరిహద్దులను అదుపులేకుండా వదిలేయడం వల్లే ‘ట్రెన్ డి అరాగువా’ వంటి విదేశీ క్రిమినల్ ముఠాలు అమెరికాలోకి చొరబడ్డాయని ఆరోపించారు. గతంలో అమెరికాలో కలకలం రేపిన 12 ఏళ్ల జోస్లిన్ నుంగారే, 22 ఏళ్ల లాకెన్ రైలీల హత్యలను ప్రస్తావిస్తూ, ఈ సైనిక చర్య ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరిందని, అమెరికా సైన్యం వారి తరఫున ప్రతీకారం తీర్చుకుందని ట్రంప్ ఉద్ఘాటించారు. ‘ట్రెన్ డి అరాగువా’ నేరచరిత్రవెనిజువెలాలో పుట్టిన ఈ ‘ట్రెన్ డి అరాగువా’ గ్యాంగ్ ప్రస్తుతం లాటిన్ అమెరికా అంతటా విస్తరించి ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ ముఠా దోపిడీలు, మానవ అక్రమ రవాణా, వలసదారుల స్మగ్లింగ్, డ్రగ్స్ మాఫియా, అనేక క్రూరమైన హింసాత్మక నేరాలకు పాల్పడుతున్నట్లు పలు దేశాల అధికారులు గుర్తించారు. ట్రంప్ ప్రభుత్వం తమ వలస విధానాలు, జాతీయ భద్రతా ఎజెండాలో భాగంగా ఈ గ్యాంగ్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన -
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కలిసి ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు అదే యుద్ధం ముగింపుపై ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఒకే వ్యూహంతో ముందుకెళ్లిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం తమ తమ దేశీయ రాజకీయ అవసరాల కారణంగా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధం ఎలా మొదలైంది?ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్‌పై భారీ సైనిక చర్య ప్రారంభమైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతా ముప్పులను తగ్గించడం, టెహ్రాన్ ప్రభావాన్ని కట్టడి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రారంభ దశలో ట్రంప్, నెతన్యాహు ఒకే వైఖరితో ముందుకు సాగారు.ఇప్పుడు ఎందుకు విభేదాలు?ప్రస్తుతం ట్రంప్ ప్రధానంగా యుద్ధాన్ని ముగించి ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) దాదాపు సిద్ధమైందని, త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, నెతన్యాహు మాత్రం ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి కార్యక్రమం, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై మరింత కఠిన చర్యలు అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.ట్రంప్ రాజకీయ లెక్కలునవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) ట్రంప్‌కు కీలకం. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం, చమురు ధరల అస్థిరత, ప్రజల్లో యుద్ధ వ్యతిరేక భావన పెరగడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే యుద్ధాన్ని ముగించిన నాయకుడు అనే గుర్తింపుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.నెతన్యాహు లక్ష్యం వేరుఇక నెతన్యాహు కూడా దేశీయ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌లో భద్రతా అంశం అత్యంత కీలకమైన రాజకీయ అంశం కావడంతో, ఇరాన్‌పై పూర్తి స్థాయి వ్యూహాత్మక ఆధిపత్యం సాధించకుండానే యుద్ధాన్ని ముగించడం ఆయనకు రాజకీయంగా ప్రమాదకరంగా మారవచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఆయన మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.బయటపడుతున్న ఉద్రిక్తతఇటీవల ట్రంప్ ఇరాన్‌పై ప్రణాళికాబద్ధమైన దాడులను రద్దు చేసి, చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయం నెతన్యాహును ఆశ్చర్యానికి గురి చేసిందని వార్తలు వెలువడ్డాయి. ఆ నిర్ణయం గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఇరాన్‌పై మరోసారి యుద్ధాన్ని ప్రారంభించవద్దని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించినట్లు కూడా రాయిటర్స్ వెల్లడించింది. "మరింత జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారు" అని ట్రంప్ హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.శాంతి చర్చలపై విభేదాలుప్రస్తుతం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర పరిమితంగా ఉండటం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా కొంత సడలింపు చూపుతుందనే అనుమానాలు నెతన్యాహు వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తంగా ట్రంప్‌నకు యుద్ధం ముగింపు రాజకీయ లాభం అయితే, నెతన్యాహుకు ఇరాన్‌పై మరింత ఒత్తిడి కొనసాగించడం రాజకీయ అవసరంగా మారింది. ఈ విభిన్న లక్ష్యాలే ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తున్న చీలికకు ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, ఆధునిక వంతెనలు ఉన్నాయి. కానీ కేవలం ఇనుప తీగలు, సరిగ్గా అమర్చని చెక్క పలకలతో నిర్మించిన ఒక వంతెనను చూస్తే మాత్రం ఎవరికైనా వణుకు పుట్టడం ఖాయం. పాకిస్తాన్‌లోని ఉత్తర పర్వత ప్రాంతంలో ఉన్న ‘హుస్సేనీ సస్పెన్షన్ బ్రిడ్జ్’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెనగా గుర్తింపు పొందింది. గిల్గిట్-బాల్టిస్తాన్ రీజియన్‌లో ఉధృతంగా ప్రవహించే హుంజా నదిపై నిర్మించిన ఈ వంతెన పర్యాటకులకు వింత అనుభూతిని ఇస్తూనే, ప్రతి అడుగులోనూ మృత్యువును పరిచయం చేస్తుంది. అసలు ఈ వంతెన అంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.భీకర గాలులను తట్టుకునే ప్రత్యేక వింత డిజైన్ఈ వంతెనను చూడగానే ఎవరికైనా భయం వేయడం సహజం. వంతెనపై ఉన్న చెక్క పలకల మధ్య చాలా ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. అయితే, ఇది పాలకుల నిర్లక్ష్యం కాదు. ఇదొక వ్యూహాత్మక ఇంజనీరింగ్ డిజైన్. గోజల్ లోయలో వీచే అత్యంత వేగవంతమైన, భీకర గాలులు వంతెనను పడగొట్టకుండా ఉండటానికే ఈ ఖాళీలను ఉంచారు. ఒకవేళ ఈ చెక్కలను దగ్గర దగ్గరగా అమరిస్తే, బలమైన గాలులను తట్టుకోలేక మధ్యలోకి విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఖాళీల గుండా గాలులు అడ్డులేకుండా సాగిపోతాయి. అయితే ఈ ఖాళీలపై అడుగు వేస్తూ కింద ఉన్న నీటిని చూస్తూ నడవడం పర్యాటకులకు ఒక అగ్నిపరీక్షే.ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలిచిన వంతెనహుస్సేనీ వంతెనకు భారీ విధ్వంసం, పునర్నిర్మాణాల చరిత్ర ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న వంతెన అసలైనది కాదు. గతంలో ఇక్కడ నిర్మించిన వంతెనలు ఈ ప్రాంతంలో వచ్చే తీవ్రమైన వాతావరణ మార్పులు, రుతుపవనాల వరదలు, నదీ ప్రవాహాల ఉధృతికి కొట్టుకుపోయాయి. ప్రకృతి ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ.. ప్రస్తుత వంతెన పక్కనే పాత వంతెనకు సంబంధించిన తుప్పు పట్టిన, విరిగిపోయిన ఇనుప కేబుళ్లు ఇప్పటికీ వేలాడుతూ కనిపిస్తాయి. స్థానికులు నిరంతరం ఈ వంతెనను పర్యవేక్షిస్తూ, విరిగిపోయిన చెక్కల స్థానంలో కొత్తవాటిని మారుస్తూ పునరుద్ధరిస్తుంటారు.సాహసికులకు స్వర్గధామంప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహస ప్రియులకు ఈ వంతెన ఒక స్వర్గధామం. తమ ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రతి ఏటా వందలాది మంది అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వంతెనపై నడుస్తున్నప్పుడు వచ్చే బలమైన గాలులకు అది ఇరువైపులా ఊగులాడుతూ ఉంటే గుండె ఆగినంత పనవుతుంది. ఎటువంటి ఆధునిక రక్షణ ఏర్పాట్లు, పటిష్టమైన రైలింగ్‌లు లేని ఈ వంతెనపై ప్రయాణం ఒక అద్భుతమైన, అత్యంత ప్రమాదకరమైన ప్రయాణ అనుభూతిని మిగుల్చుతుంది.స్థానికుల జీవననాడి..అంతర్జాతీయ పర్యాటకులకు ఇది కేవలం ఒక సాహస వినోదం మాత్రమే కావచ్చు. కానీ స్థానికులకు మాత్రం ఇది నిత్య జీవితంలో ఒక భాగం. హుస్సేనీ గ్రామాన్ని, నది అవతల ఉన్న జరాబాద్ వ్యవసాయ భూములతో అనుసంధానించే ఏకైక మార్గం ఇదే. స్థానికులు ప్రతిరోజూ భారీ బరువులను, నిత్యావసర సరుకులను నెత్తిన పెట్టుకుని ఈ ఊగిసలాడే చెక్కలపై ఎంతో సునాయాసంగా నడుచుకుంటూ వెళ్తుంటారు. వారి దైనందిన జీవన గమనానికి ఈ వంతెనే ఏకైక ఆధారం.నిర్వహణ ఖర్చులు.. పర్యాటక రుసుముఈ ప్రమాదకరమైన వంతెనను సజీవంగా ఉంచడానికి స్థానికులు ఎంతో పాటుపడుతున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి సుమారు 200 రూపాయల (స్థానిక కరెన్సీ) నిర్వహణ రుసుమును వసూలు చేస్తారు. ఈ నిధులన్నింటినీ నేరుగా స్థానిక కమ్యూనిటీ నిధికి బదిలీ చేస్తారు. అత్యంత కఠినమైన శీతాకాలం ప్రారంభం కావడానికి ముందే వంతెనకు అవసరమైన కొత్త చెక్కలను కొనుగోలు చేయడానికి, ఇనుప తీగలను మరమ్మతు చేయడానికి ఈ డబ్బును వినియోగిస్తారు.ఇది కూడా చదవండి: ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం -
మొరాయించిన స్టీరింగ్.. లోయలో పడ్డ బస్సు
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వందల అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయాలు కాగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.కవ్రేపలాంచోక్ జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. బనేపా నుంచి రోషి గ్రామీణ మున్సిపాలిటీ వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు నమోబుద్ధ మున్సిపాలిటీ పరిధిలోని సెల్ఫీ డాండా ప్రాంతంలో అదుపుతప్పి సుమారు 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే.. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.జిల్లా పోలీసు కార్యాలయం వివరాల ప్రకారం.. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొందరిని గుర్తించగా.. మరికొందరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన 16 మందిని ధులిఖేల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. #Nepal | Eight dead and 15 injured in bus accident in KavreThe bus fell some 200 m off the road in Namobudhha municipality. The 15 injured are undergoing treatment at the Dhulikhel hospital.A passenger bus heading to Sungure of Roshi Rural Municipality from Banepa had met… pic.twitter.com/aWrSS4U1Wu— DD News (@DDNewslive) June 12, 2026ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు స్టీరింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు.. బస్సు సాధారణ వేగంతోనే ప్రయాణిస్తోందని చెప్పాడు. అయితే ఓ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన వాహనానికి దారి ఇవ్వడానికి ప్రయత్నించే సమయంలో బస్సు రోడ్డు నుంచి జారి లోయలోకి దూసుకెళ్లిందని చెప్పాడు.దీంతో స్టీరింగ్ జామ్ కావడం వల్లే.. డ్రైవర్ వాహనంపై కంట్రోల్ తప్పి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది దర్యాప్తు అనంతరమే వెల్లడించనున్నారు. మరోవైపు.. నిన్న నేపాల్‌లోని ధన్కుటా జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై బస్సు బోల్తాపడటంతో 12 మందికి గాయాలయ్యాయి. -
యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అదే కీలకంఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్‌పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అణు ఒప్పందం.. ఆగాల్సిందే!అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్బ్లెండింగ్) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.ఇది ఇంకో ట్విస్ట్ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఇరాన్ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?.. -
కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వీసా స్టేటస్ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్ పత్రాలు అప్డేట్ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.ఈ తరహా కాల్స్‌లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, లేదా డిపోర్టేషన్ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్సైట్ లేదంటే నేరుగా కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించారు.కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్‌గా భావించాలని సూచించారు.అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్‌కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు. -
యుద్ధం ముగిసింది
వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. శాంతి ఒప్పందం ఖరారు చేసుకోవడానికి అత్యంత చేరువలోకి వచ్చామని అన్నారు. ఒప్పందంపై ఈ వారాంతంలోనే సంతకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. యూరప్‌లో సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. గురువారం మధ్యాహ్నం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇరాన్‌తో తాజా చర్చలకు సంబంధించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్లతో సహా మధ్యప్రాచ్య దేశాల నాయకులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఇరాన్‌తో ఒప్పందాన్ని స్టాక్ మార్కెట్ కూడా అనుకూలంగా భావిస్తోందని చెప్పారు. ఒప్పందం ఖరారైన తర్వాత హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వివరించారు. ఇది చాలా బలమైన, సమగ్రమైన అవగాహన ఒప్పందమని, కచ్చితంగా కార్యరూపం దాల్చబోయే విషయమని వ్యాఖ్యానించారు. ‘‘చాలా తక్కువ మంది మాత్రమే తట్టుకోగలిగే తీవ్రమైన దెబ్బలను వారు(ఇరాన్) ఎదుర్కొన్నారు. అందుకే శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నాకంటే వారే ఎక్కువగా కోరుకుంటున్నారు’’అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మా డిమాండ్‌కు ఇరాన్ అంగీకారం అనంతరం.. గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న జార్జియా లెఫ్టినెంట్ గవర్నర్ బర్ట్ జోన్స్‌కు మద్దతుగా నిర్వహించిన ఆన్లైన్ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ రోజు (గురువారం) ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించామని ప్రకటించారు. ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న తమ డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించిందని ఉద్ఘాటించారు. ఇరాన్ వద్ద ప్రాణాంతక ఆయుధాలు ఉండకూడదని, అదే తమ అసలు ఉద్దేశమని వివరించారు. ‘‘వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేయరు లేదా ఏ విధంగానూ దానిని అభివృద్ధి చేయరు. వారి వద్ద అణ్వాయుధం ఉండదు’’అని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై దాడులు ఆపాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందంపై జెనీవాలో సంతకాలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. అలాంటిదేమీ లేదు: ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరినట్లేనని, ఈ వారాంతంలో సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరిందన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. -
అది ఇరాన్ ఘాతుకమే
వాషింగ్టన్: ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్ ఘాతుకమేనని అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టుచేశారు. అలాగే శాంతి ఒప్పందంలోని పలు అంశాలను మీడియాకు ఇరాన్ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మూడు నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ట్రంప్ ఇరాన్ వైపు వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రాణాంతక దాడులు ఆపాల్సిందే: భారత్ భారతీయ సిబ్బందితో కూడిన మూడు వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని అంతకుముందు భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఇలాంటి ప్రాణాంతకమైన, ఘోరమైన దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని ఆపాల్సిందేనని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్‌లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త(ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్‌కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. తమ విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది. జాసన్ మీక్స్‌కు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. నౌకపై భీకర దాడి గురించి తెలిసిన తర్వాత తొలుత బుధవారం రాత్రి సమన్లు ఇచ్చారు. ముగ్గురు మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో మరోసారి సమన్లు జారీ చేశారు. ‘‘భారతీయ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం కొనసాగిస్తున్న దాడుల పట్ల జాసన్ మీక్స్‌కు ఇప్పటికే ఒకసారి తీవ్ర నిరసన తెలియజేశాం. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించడం బాధాకరం’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకాయానంపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి దుందుడుకు చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని, క్లిష్ట సమయంలో ఒక సున్నితమైన ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని తేల్చిచెప్పింది. భారతదేశం తీవ్ర ఆందోళనలను అమెరికా ప్రభుత్వ వర్గాలకు తెలియజేయాలని, అలాగే పశ్చిమాసియాలో పనిచేస్తున్న అమెరికా సైనిక బలగాలు పౌరుల ప్రాణనష్టం జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అమె రికా దౌత్యవేత్తకు సూచించినట్లు తెలియజేసింది. భరతమాత బిడ్డలను మోదీ కాపాడలేరు: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: అమెరికా మిలటరీ కాల్పుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాతో రాజీపడ్డ ప్రధాని భరతమాత బిడ్డలను కాపాడలేకపోయారని, వారి ప్రాణా లను తీసుకున్న వారిని ప్రశ్నించే శక్తి కూడా ఆయనకు లేకపోయిందని శుక్రవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లో అంతర్జాతీయ సముద్ర జలాల్లో మూడు నౌకలపై అమెరికా దాడుల చేసి ముగ్గురు భారతీయులను చంపితే ఇప్పటివరకూ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వచ్చే వారం జరగనున్న జీ–7 సమావేశాల్లోనూ ఆయన నోరు మెదపరని, నవ్వుతూ కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసి వస్తారని, మరణించిన ముగ్గురు నావికుల గురించి ఏమీ మాట్లారని విమర్శించారు.ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు: ఇరాన్ భారత సిబ్బందితో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ శుక్రవారం ఖండించారు. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తాయని తేల్చిచెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అమెరికా చర్యలు నౌకాయాన స్వేచ్ఛకు ప్రమాదం కలిగిస్తున్నాయని ఆరోపించారు. అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని ప్రభుత్వ సాయుధ దోపిడీ, సముద్రపు దొంగతనంగా ఇస్మాయిల్ బఖాయీ అభివర్ణించారు. -
ఎల్‌నినో ప్రభావం మొదలైంది..!
న్యూఢిల్లీ: ఎల్‌నినో ముప్పు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవన కాలంలో ఈ ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు 2026 జూన్‌కు సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడాన్ని ఎల్నినోగా పరిగణిస్తారు. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిస్థితులకు అవసరమైన పరిమితిని దాటిపోయినట్లు ఐఎండీ పేర్కొంది. సముద్రం వేడెక్కడంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. సముద్ర–వాతావరణ అనుసంధాన వ్యవస్థ ఇప్పుడు ఎల్‌నినో స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్(ఎంఎంసీఎఫ్ఎఫ్) అంచనాల ప్రకారం.. రుతుపవన కాలం గడుస్తున్న కొద్దీ ఎల్‌నినో తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. మధ్య ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిమితిని దాటాయి. ఉపరితలం కింద బలమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎల్‌నినో పరిస్థితిని గణించడానికి ఉపయోగించే ‘నియో 3.4’సూచీకి సంబంధించిన తాజా మూడు నెలల సగటు విలువ +0.5 సెంటీగ్రేడ్ స్థాయిని దాటింది. ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని దీన్నిబట్టి చెప్పొచ్చు. పసిఫిక్ మహాసముద్రంలోని చాలా భాగాల్లో ఉపరితలం కింద కూడా బలమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే రోజుల్లో కిందిభాగంలోని వేడి నీరు ఉపరితలానికి చేరుకోవడం కొనసాగుతుందని, దాంతో ఎల్‌నినో ఉధృతి మరింత పెరుగుతుందని స్పష్టంచేసింది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. జూన్–ఆగస్టు నెలల్లో మధ్య పసిఫిక్ అంతటా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కొనసాగుతాయి. జూలై నుంచి మధ్య, తూర్పు పసిఫిక్ ఎల్‌నినో పరిస్థితులు విస్తరించి, మరింత బలపడతాయి. నైరుతి రుతుపవనాల కాలంలో ఎక్కువ భాగం మితమైన, బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. సానుకూల ఐఓడీతో.. ఎల్‌నినో కారణంగా భారతదేశంలో బలహీనమైన రుతుపవన వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, సుదీర్ఘ పొడి వాతావరణ పరిస్థితులు, కరువు ముప్పు పెరగడం వంటివి తలెత్తే అవకాశం ఉంది. అయితే, దేశంలో రుతుపవనాలను ప్రభావితం చేసే అంశం కేవలం ఎల్‌నినో మాత్రమే కాదని ఐఎండీ స్పష్టంచేసింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంపై తటస్థ ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐఓడీ) పరిస్థితులు నెలకొని ఉన్నాయని, రుతుపవన కాలమంతటా ఇవి కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. తటస్థ ఐఓడీ అంటే, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావాలను ఇది గణనీయంగా తీవ్రతరం చేయడం లేదా సమతుల్యం చేయడానికి జరిగే అవకాశం తక్కువ అని అర్థం. జూన్ 11న ఎల్‌నినో ఆరంభమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇండియా విషయంలో ఒక సానుకూల అంశాన్ని కూడా ప్రస్తావించింది. జూలైలో సానుకూల ఐఓడీ ఏర్పడే అవకాశం ఉందని, ఇది దేశంలోని రుతుపవన వర్షపాతంపై ‘సూపర్ ఎల్‌నినో’చూపే ప్రతికూల ప్రభావాలను కొంతవరకు తగ్గించడంలో సహాయపడవచ్చని పేర్కొంది. రుతుపవన కాలం కొనసాగుతున్న కొద్దీ, పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తూ, నెలవారీ తాజా సమాచారాన్ని జారీ చేస్తామని ఐఎండీ తెలిపింది. -
మందుల్లేకుండా కేన్సర్ చికిత్స!
మందుల్లేకుండా కేన్సర్‌ను నయం చేస్తానని ఎవరైనా చెప్పారనుకోండి.. అస్సలు నమ్మబుద్ధి కాదు. అయితే ఇప్పటికిప్పుడు కాదు కానీ.. భవిష్యత్తులో ఈ అద్భుతం సాధ్యమే అంటోంది టెక్నియాన్ విశ్వవిద్యాలయం. ఇజ్రాయెల్‌లోని ఈ సంస్థ ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిచ్చాయి. నానో స్థాయి గుళికలతో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కఠినమైన ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ కణితి పెరుగుదల మందగించినట్లు స్పష్టమైంది. కేన్సర్ బారిన పడితే మరణం తథ్యమన్న కాలం ఎప్పుడో పోయింది. కానీ.. పూర్తిస్థాయి చికిత్స కూడా ఇప్పటివరకూ అందుబాటులో లేదు. కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్ వంటి సంప్రదాయ పద్ధతులతో మనిషి జీవితకాలాన్ని గణనీయంగా పెంచుకునే వీలైతే ఉంది. కానీ.. వీటితో దు్రష్పభావాలు చాలా ఎక్కువ. టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయగల సామర్థ్యమున్నవి. అత్యాధునిక నానో కణాలను తయారు చేసిన వీరు చుక్క మందు కూడా ఇవ్వకుండానే ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ కణితి పెరుగుదలను నిలిపివేయగలిగారు. ఇదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే కేన్సర్ కణాలు మన రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చేందుకు వేసే ఎత్తుల గురించి అర్థం చేసుకోవాలి. శరీరంలోకి చేరే హానికారక సూక్ష్మజీవులతోపాటు అదుపు తప్పిన కణాలను కూడా ఏరి వేసేందుకు రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని రకాల కణాలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. వీటిని టీ–సెల్స్ అంటారు. కేన్సర్ కణాలు రోగ నిరోధక వ్యవస్థ కళ్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల వ్యూహాలను అనుసరిస్తూంటుంది. ఇందులో భాగంగా కొన్ని రకాల తెల్ల రక్త కణాలను హైజాక్ చేసి కణితి పెరిగేందుకు ఉపయోగించుకుంటాయి. అంతేకాకుండా... రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్ కణాలను గుర్తించకుండా చేస్తుంటాయి. టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ హైజాకింగ్‌ను లక్ష్యంగా చేసుకుని తమ చికిత్స పద్ధతిని అభివృద్ధి చేశారు. కణితి చుట్టూ రక్షణ కవచంగా... టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసిన నానో కణాలను ఎంపీసోమ్స్ అని పిలుస్తున్నారు. కణితిని అతుక్కునేందుకు ఇవి కేన్సర్ కణాలు హైజాక్ చేసిన తెల్ల రక్త కణాలతో పోటీపడతాయి. తద్వారా కణితికి ఒక రక్షణ కవచంగా ఏర్పడి అది మరింత పెరగకుండా నిరోధిస్తాయి. కేన్సర్ కణాలపై, ప్రీ క్లినికల్ మౌస్ మోడళ్లలోనూ ఈ నానో కణాలను వాడినప్పుడు అవి కణితి చుట్టూ అసాధారణ స్థాయిలో గుమికూడినట్లు, పెరుగుదలను నిరోధించినట్లు స్పష్టమైంది. ఈ ఎంపీసోమ్స్ను సులువుగా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. నిమిషానికి 20 మిల్లీలీటర్ల నానో కణాలను అంటే గంటకు సుమారు 1.2 లీటర్లు తయారు చేయగలమని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఓఫ్రీ విజెన్బ్లిట్ తెలిపారు. పైగా వీటి తయారీకి వాడిన పదార్థాలు సురక్షితమైనవని ఎఫ్‌డీఏ సైతం ‘జనరలీ రికగ్నైజ్డ్ యాస్ సేఫ్’గా గుర్తించినవి కావడం గమనార్హం. ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ సంప్రదాయ చికత్స పద్ధతులకు సులువుగా లొంగదని, ఎంపీసోమ్స్తో తాము కణితి పెరుగుదలను నిరోధించడం కేన్సర్ చికిత్సలో చాలా పెద్ద మార్పు అని చెప్పారు. పరిశోధన ఫలితాలు ఏసీఎస్ నానో జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
30 దేశాలు.. 120 బయోల్యాబ్స్ - అమెరికా ఫండింగ్?
అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా 30కిపైగా దేశాల్లో ఉన్న 120కు పైగా బయోలాజికల్ ల్యాబొరేటరీలకు ఆర్థిక సహాయం అందించిందని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ఈ సమాచారం తాజాగా డీక్లాసిఫై చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా బయటకు వచ్చింది. ఈ ప్రకటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.ఈ బయోల్యాబ్స్లో అనేక ప్రమాదకరమైన, అత్యంత సంక్రమణ వ్యాధులు కలిగించే వైరస్లు, బ్యాక్టీరియాలపై పరిశోధనలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'గైన్-ఆఫ్-ఫంక్షన్' అనే రకం పరిశోధనలు తక్కువ పర్యవేక్షణలో జరిగాయని DNI కార్యాలయం పేర్కొంది. ఈ రకమైన పరిశోధనలు వైరస్‌లను మరింత శక్తివంతంగా లేదా ప్రమాదకరంగా మార్చే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.తులసి గబ్బార్డ్ ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ఈ ల్యాబ్స్ ఉన్న ప్రదేశాలు, అక్కడ ఉన్న రోగకారకాలు, అలాగే జరుగుతున్న పరిశోధనలను గుర్తించి వాటిపై కఠిన నియంత్రణ తీసుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే పరిశోధనలను ఆపేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.డీక్లాసిఫై చేసిన పత్రాల్లో ఉక్రెయిన్‌లో ఉన్న 40కు పైగా ల్యాబ్స్ సోవియట్ కాలం నాటి బయోలాజికల్ వెపన్స్‌కు సంబంధించిన రోగకారకాలపై పని చేశాయని పేర్కొన్నారు. వీటిలో ఆంథ్రాక్స్, ఈబోలా, MERS, SARS, ప్లేగ్ వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వాలు, కొంతమంది ఆరోగ్య నిపుణులు ఈ బయోల్యాబ్స్ గురించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వలేదని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఈ అంశాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసిన వారిని కూడా అడ్డుకున్నారని ఆమె పేర్కొన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గైన్-ఆఫ్-ఫంక్షన్ పరిశోధనలకు ఇచ్చే ఫెడరల్ నిధులను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర పరిశోధనలను నియంత్రించడానికి కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. -
టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి!
అమెరికాలోని టెక్సాస్‌లోని మిడ్‌ల్యాండ్‌లో ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కాల్పులు ఉదయం సుమారు 8 గంటల సమయంలో నగరంలోని ఒక ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. తరువాత ఘటన మరింత విస్తరించి ఒక వెటర్నరీ హాస్పిటల్ సమీపానికి చేరుకుంది. పరిస్థితి తీవ్రమవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వెంటనే చర్యలు ప్రారంభించారు.🚨 UPDATE: Midland Texas shooter contained. 11 Injured, 1 killed. pic.twitter.com/U0sjuiyFPJ— Juanita Broaddrick (@atensnut) June 12, 2026ఈ ఘటన సమయంలో కనీసం 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని సమీపంలోని ఒక ఆటోమొబైల్ బాడీ షాప్‌లో పనిచేసే ఆండ్రియా మెండియాస్ తెలిపారు. ఆమె తీసిన వీడియోల్లో ఆర్మర్డ్ పోలీస్ వాహనాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే డ్రోన్లు, రోబోట్లు కూడా ఘటన స్థలంలో ప్రవేశపెట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.మిడ్‌ల్యాండ్ మెమోరియల్ హాస్పిటల్ ప్రకారం, గాయపడిన తొమ్మిది మందిలో నలుగురు ఆపరేషన్ థియేటర్లో చికిత్స పొందుతుండగా, మిగతా ఐదుగురు స్థిరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటనతో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
తుది దశలో కీలక ఒప్పందం.. ఇరాన్ విదేశాంగ మంత్రి పోస్ట్!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా - ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Abbas Araghchi) ప్రకటించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.అరాఘ్చీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' గతంలో ఎప్పుడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఊహించి చెప్పవద్దని పేర్కొన్నారు.The Islamabad Memorandum of Understanding has never been closer. Pending its finalization, the media should refrain from entering speculation about its content. In line with our responsible and transparent approach, all details will be shared with the public in due course.— Seyed Abbas Araghchi (@araghchi) June 12, 2026ఇటీవల కొన్ని ఇరానియన్ మీడియా సంస్థలు ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రచురించాయి. దీనిపై స్పందించిన అరాఘ్చీ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఒప్పందం ఖరారైన తర్వాత అన్ని వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందించారు. అరాఘ్చీ చేసిన పోస్టును తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ.. మీడియాలో వస్తున్న లీకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ మీడియాలో ప్రచురితమైన వివరాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ, ఇరు దేశాలు ఒక ఒప్పందం దిశగా ముందుకు సాగడం ప్రపంచ శాంతి, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు. -
ముగ్గురు భారతీయులు మృతి.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదన్నారు. నౌకలపై దాడి చేస్తుంది ఇరాన్ అని వాటిని అమెరికా అడ్డుకుంటుందన్నారు. హర్ముజ్‌లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల హర్ముజ్‌లో భారతీయ నౌకలపై జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే.ఇటీవల తరచుగా హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా దాడులు జరిపింది. బుధవారం ఒమన్ సమీప ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. ఒకరోజు తర్వాత మరోసారి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేసింది. ఒమన్‌లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. గత నాలుగురోజుల్లో భారతీయన నౌకలపై దాడి చేయడం ఇది మూడోసారి.ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్‌డిఅఫైర్స్ జేసన్‌ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయనకు మూడురోజుల వ్యవధిలో రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందించారు. -
ఉత్తర కొరియాపైకి డ్రోన్లు.. సియోల్ కోర్టు సంచలన తీర్పు
సియోల్: ఉత్తర కొరియాపైకి డ్రోన్లు పంపినందుకు గాను దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సియోల్ కోర్టు ఇవాళ(శుక్రవారం) ఆయనకు మరో 30 ఏళ్ల భారీ జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే, ఆయన ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్లో విఫలమైన మార్షల్ లా విధింపునకు దారితీసిన పరిణామాలపై విచారణ జరిపిన కోర్టు.. దేశద్రోహం, అధికార దుర్వినియోగం ఆరోపణల కింద ఆయనను దోషిగా తేల్చింది.సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు తన తీర్పులో.. 2024 అక్టోబర్‌లో ఉత్తర కొరియాలోకి డ్రోన్లను పంపడం వెనుక యూన్ సుక్ యోల్ స్పష్టమైన వ్యూహం ఉందని పేర్కొంది. ఉత్తర కొరియాను రెచ్చగొట్టడం ద్వారా దేశంలో తీవ్ర భద్రతా సంక్షోభాన్ని సృష్టించి.. ఆ నెపంతో డిసెంబర్ 3, 2024న మార్షల్ లా విధించాలనేది ఆయన ప్రణాళిక అని కోర్టు నిర్ధారించింది.ఈ సైనిక ఆపరేషన్‌లో భాగస్వాములైన మరికొందరు కీలక అధికారులపై కూడా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యూన్.. ప్రత్యేక కౌన్సిల్ 25 ఏళ్ల శిక్షను కోరగా.. కోర్టు అంతకంటే ఎక్కువగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మాజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కమాండ్ చీఫ్ యో ఇన్-హ్యుంగ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. డ్రోన్ ఆపరేషన్స్ మాజీ చీఫ్ కిమ్ యాంగ్ డేకు కూడా శిక్ష విధించింది.సైనిక పాలన విధించేందుకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం కోసమే నిందితులు ఈ కుట్రకు పాల్పడ్డారు. ఉత్తర కొరియాను రెచ్చగొట్టి, సరిహద్దుల్లో ఘర్షణలు లేదా జాతీయ భద్రతా సంక్షోభాన్ని సృష్టించేందుకు మానసిక యుద్ధతంత్రాన్ని సైనిక వ్యూహంగా ఉపయోగించుకున్నారంటూ సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రక్షణ కోసం.. చట్టబద్ధమైన అవసరాల కోసం మాత్రమే సైనిక శక్తిని ఉపయోగించాలనే ప్రజల నమ్మకాన్ని అధ్యక్షుడు, రక్షణ మంత్రి పూర్తిగా వమ్ము చేశారని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇదంతా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరిగిందని వ్యాఖ్యానించింది.అయితే, 2024లో ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాపైకి పంపిన చెత్త బుడగలకు ప్రతిస్పందనగానే డ్రోన్లను పంపామని ఇది చట్టబద్ధమైన సైనిక చర్యేనని యూన్ తరఫు న్యాయవాదులు వాదించారు. కానీ కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. ఈ ఆపరేషన్ వల్ల దక్షిణ కొరియా సైనిక రహస్యాలు ఉత్తర కొరియాకు తెలిసిపోయాయని.. తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడిందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే యూన్ సుక్ యోల్ న్యాయ బృందం ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేసింది. -
ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌ను లైట్ తీసుకున్న నెతన్యాహు?
జెరూసేలం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ముందే సమాచారం లేకపోవడం, ఆయనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న తిరుగులేని శక్తి పరిమితులను బహిర్గతం చేస్తున్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్‌తో తాము జరుపుతున్న అణు చర్చలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రతీకార దాడులకు వెళ్లవద్దని ఆయన ఇజ్రాయెల్‌ను కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని లైట్ తీసుకుంది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ట్రంప్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా అగ్రరాజ్య హోదాకు, దాని శక్తికి అవమానకరం. దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా నెతన్యాహును కోరినప్పటికీ, ఇజ్రాయెల్ వెనుకాడకుండా దాడికి తెగబడింది. ఇది పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం ఎంతలా తగ్గిపోయిందో స్పష్టం చేస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ఇరాన్‌తో త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లేదా మంగళవారంలోగా సంతకాలు జరుగుతాయి అని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడు చర్చలకి రండి’ అని పిలుపునిచ్చారు. కానీ, ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులు ఈ చర్చల ప్రక్రియను మరింత సంక్లిష్టం చేశాయి.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉంది.ఇరాన్ అణు ప్రణాళికలు,క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతు..వీటన్నింటినీ ఇజ్రాయెల్ తన దేశ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తోంది. అమెరికా కుదుర్చుకునే తాత్కాలిక దౌత్య ఒప్పందాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేవని నెతన్యాహు నమ్ముతున్నారు.ఈ పరిణామాలు సాంప్రదాయ మిత్రదేశాలైన అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక ‘ప్రపంచ శాంతి దూత’గా నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ఇమేజ్‌కు భంగం కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్‌తో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ దానిని అంగీకరించేలా లేదనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో బలంగా వ్యక్తమవుతోంది. -
ఓ డాక్టరమ్మా… ఈ ఎముకల గూడు చెప్పిన పాఠం వింటావా?
పోయినోళ్లందరూ మంచోళ్లే... ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు అన్నారో సినీకవి. బతికి ఉన్నప్పుడు దక్కని గౌరవం.. మనిషికి చనిపోయాకైనా దక్కుతుందని చెబుతుంటారు. కానీ, ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో ఆ నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేసింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి.. మృతదేహాలపై చేసిన ఓ డాక్టర్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చివరకు తన మాటల తీవ్రత గ్రహించిన ఆమె క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో.. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన మరణానంతరం కూడా మనిషికి దక్కాల్సిన గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.ఒక కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యురాలు సీజల్ పవార్.. మెడికల్ కాలేజీ రోజుల్లో శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్ పార్ట్‌ల గురించి తాను, తన తోటి డాక్టర్లు జోకులు వేసుకునేవాళ్లమని ఆమె మాట్లాడారు. ఆ సమయంలో కమెడియన్ ప్రణీత్ మోర్తో సహా అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాట్లాడింది అమ్మాయి కావడంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అయితే..Sejal pawar doctor by profession talking about how she and her friends make fun of dead bodies about their dick size and made several nasty comments about male reproductive organ pic.twitter.com/q7rfQoi6DJ— Aarohi (@hamlakroo) June 10, 2026మృతదేహాల శరీర భాగాలపై వల్గర్ కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. వైద్య విద్య కోసం తమ శరీరాలను దానం చేసే వారి పట్ల ఇది అవమానకరమని పలువురు అభిప్రాయపడ్డారు. సరిగ్గా.. ఇదే సమయంలో జర్మనీలో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావించారు..ష్లైడ్ అనే చిన్న పట్టణంలో ఉన్న జోహానెస్-స్టుర్మియస్ జిమ్నాసియం స్కూల్ విద్యార్థులు.. కొన్ని దశాబ్దాలుగా తమకు అనాటమీ పాఠాలు అర్థం కావడంలో సహకరించిన అస్థిపంజరానికి అత్యంత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అది భారత్‌కు చెందిన ఓ మహిళ అస్థిపంజరం కావడం.అప్పటిదాకా అదొక ప్రతీకాత్మక నమునా(ప్లాస్టిక్)గా భావించిన విద్యార్థులు.. అసలు విషయం అర్థమయ్యాక తెగ బాధపడిపోయారు. దశాబ్దాలుగా ప్రయోగశాలలో వేలాడుతున్న ఆ అస్థిపంజరం బ్రిటిష్ పాలనా కాలంలో యూరప్‌కు తరలించిన వేలాది భారతీయ మృతదేహాల్లో ఒకటిగా గుర్తించారు. ఆ మహిళ అస్థిపంజరానికి "నిరాన్" అని పేరు పెట్టారు. అక్కడితో వాళ్లు ఆగలేదు..ఆ మృతదేహం కేవలం బోధనా సామాగ్రి కాదని.. ఒకప్పుడు ప్రాణం ఉన్న మనిషే కదా అనుకున్నారు. స్కూల్ నిర్వాహకుల్ని ఒప్పించి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిబ్బంది సహకారంతో ఓ శవపేటికలో ఆ అస్తికలు ఉంచి గౌరవప్రదంగా సమాధి ఏర్పాటు చేశారు. 2022లో జరిగిందీ ఘటన.అయితే ఒకే సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఘటనలు.. "మరణించిన వారికి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం?" అనే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చాయి.అదొక చీకటి వ్యాపారంజర్మనీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరో చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేసింది. బ్రిటిష్ పాలనలో భారతదేశం నుంచి వేలాది అస్థిపంజరాలు, మృతదేహాలు యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి అయ్యాయి. పేదలు, అనాథలు, గుర్తింపు లేని వ్యక్తుల మృతదేహాలు ఎక్కువగా ఈ వ్యాపారంలో భాగమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వైద్య విద్య, పరిశోధనల పేరుతో సాగిన ఈ వ్యాపారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొనసాగి, 1985లోనే పూర్తిగా నిషేధించబడింది.ఆ గౌరవం ఎక్కడ?..ఈ చర్చ మధ్య మరో విషాద ఘటనను కూడా చాలామంది గుర్తుచేస్తున్నారు. ఒడిశాలో తన సోదరి మరణాన్ని నిరూపించడానికి బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో.. ఓ వ్యక్తి సమాధి తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన దేశాన్ని కలచివేసింది. అలాగే.. ఆస్పత్రి మార్చురీల్లో నెలల తరబడి గుర్తింపు లేకుండా ఉండిపోయే మృతదేహాలు, అంబులెన్స్ లేక భుజాలపై మృతదేహాలను మోసుకెళ్లే పేద కుటుంబాలు, శరీరదానంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు.. ఈ ఘటనలు అన్నీ ఒకే ప్రశ్నను మిగులుస్తున్నాయి. మనం నిజంగా మరణించిన వారిని గౌరవిస్తున్నామా? లేక వారి గుర్తింపును, మానవత్వాన్ని కేవలం అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నామా?.. జీవించి ఉన్న సమాజం, మరణించినవారికి ఇచ్చే గౌరవంలోనే తన నాగరికతను ప్రతిబింబిస్తుంది. ఆ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అక్కడ మానవత్వం కూడా మెల్లగా మాయమవుతుంది. -
రాజకుమారి మరణం.. థాయ్ సింహాసనంపై బిగ్ సస్పెన్స్
థాయ్‌లాండ్ రాజకుమారి యువరాణి బజ్రకితియాభా(47) మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆమె మరణం కేవలం రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత నష్టం మాత్రమే కాకుండా దేశ రాజ్యాంగ రాజరిక వ్యవస్థ భవిష్యత్తు, సింహాసన వారసత్వం మరియు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే కీలక పరిణామంగా మారింది. దాదాపు మూడున్నరేళ్లకు పైగా కోమాలో చికిత్స పొందిన అనంతరం ఆమె కన్నుమూయడంతో థాయ్ రాజవంశ భవిష్యత్తుపై కొత్త చర్చలు మొదలయ్యాయి.డిసెంబర్ 2022లో సైనిక శునకాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆమె అకస్మాత్తుగా కుప్పకూలారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం మెదడు, గుండె మరియు ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆమె కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో చికిత్స కొనసాగించినప్పటికీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. గత కొన్ని నెలలుగా పరిస్థితి మరింత విషమించడంతో చివరకు ఆమె మరణించినట్లు రాజభవనం అధికారికంగా ప్రకటించింది.1978 డిసెంబర్ 7న జన్మించిన బజ్రకితియాభా.. ‘ప్రిన్సెస్ భా’గా పేరొందారు. థాయిలాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ (Maha Vajiralongkorn)మొదటి భార్య సోమ్‌సావాలి పెద్ద కుమార్తె బజ్రకితియాభా. ఆమె కేవలం రాజకుమారిగా మాత్రమే కాకుండా, ఉన్నత విద్యావంతురాలు, న్యాయవాది, దౌత్యవేత్తగా కూడా గుర్తింపు పొందారు. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న ఆమె.. బ్రిటన్, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించడమే కాకుండా, ఆస్ట్రియా, స్లోవేకియా, స్లోవేనియాలకు థాయ్ రాయబారిగా కూడా పనిచేశారు. మహిళా ఖైదీల హక్కులు, న్యాయ సంస్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐక్యరాజ్యసమితి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అందుకే థాయ్ ప్రజల్లో ఆమెకు ప్రత్యేక ఆదరణ ఉండేది.రాజవంశానికి పెద్ద దెబ్బ..యువరాణి బజ్రకితియాభా మరణం థాయ్ రాజవంశానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న House of Chakri రాజవంశంలో అత్యంత సమర్థురాలిగా, ప్రజాదరణ కలిగిన సభ్యురాలిగా ఆమె గుర్తింపు పొందారు. భవిష్యత్తులో రాజ ప్రతినిధిగా లేదా రాజకుటుంబ పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించేవారు. ప్రస్తుతం థాయ్ సింహాసన వారసత్వ వ్యవస్థలో ప్రధానంగా రాజు దీపాంగ్కోరన్ రాష్మిజోటి(Prince Dipangkorn Rasmijoti) పేరు వినిపిస్తున్నప్పటికీ, ఆయన ప్రజా జీవితంలో పెద్దగా చురుకుగా లేకపోవడం వల్ల భవిష్యత్తు నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బజ్రకితియాభా జీవించి ఉంటే రాజవంశ స్థిరత్వానికి కీలక ఆధారంగా నిలిచేవారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బజ్రకితియాభా మరణం తర్వాత రాజకుటుంబంలో భవిష్యత్తులో ఎవరు కీలక పాత్ర పోషిస్తారనే అంశం మళ్లీ చర్చకు వచ్చింది.244 ఏళ్ల చరిత్ర..కాగా, థాయ్‌లాండ్‌లో రాజరిక వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. రాజును కేవలం దేశాధినేతగా కాకుండా జాతీయ ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. దాదాపు 244 ఏళ్ల చరిత్ర కలిగిన రాజ కుటుంబానికి సంబంధించిన అంశాలు దేశ రాజకీయాలు, సామాజిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంటాయి. రాజకుటుంబాన్ని అవమానించే చర్యలపై కఠినమైన "లెజ్ మజెస్టే" చట్టాలు అమలులో ఉన్నాయి. అందువల్ల రాజవంశ వారసత్వానికి సంబంధించిన ప్రతి పరిణామం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.ఈ నేపథ్యంలో బజ్రకితియాభా మరణం థాయ్‌లాండ్‌కు ఒక చారిత్రక మలుపుగా భావిస్తున్నారు. ఒకవైపు ప్రజాదరణ పొందిన రాజకుమారిని దేశం కోల్పోగా, మరోవైపు రాజవంశ భవిష్యత్తు నాయకత్వం, వారసత్వ రాజకీయాలపై కొత్త చర్చలకు తెరలేచింది. థాయ్ రాజకీయాలు, రాజరిక వ్యవస్థ భవిష్యత్తుపై ఈ పరిణామం దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!
ఫిఫా ప్రపంచకప్ 2026 (fifa world cup 2026) ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఫుట్ బాల్ క్రీడకు వన్నె తెచ్చి, ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్ కాబోతోంది. లియోనెల్ మెస్సీ, రొనాల్డో, లూకా మోద్రిచ్, థామస్ ముల్లర్, నెయ్మార్ వీరిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. ఆతని సంపాదన తీరుతెన్నులపై చర్చ నడుస్తోంది.పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు నిజానికి జీతం ఏమీ సంపాదించడం లేదు. కానీ ఆయన సంపాదన ఒక యుగ కాలంతో సమానం. ఆయన ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. 41 ఏళ్ల పోర్చుగీస్ ఫుట్‌బాలర్, కేవలం తన సౌదీ క్లబ్ డీల్ ద్వారానే ఏడాదికి సుమారు 20 కోట్ల డాలర్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఒకే ఏడాదిలో దాదాపు రూ. 1,600 నుండి 1,700 కోట్ల వరకు ఉంటుంది. క్లబ్, దేశం తరఫున ఆయన ఒక సీజన్లో సాధారణంగా 55 మ్యాచ్‌లు ఆడుతారని అనుకుందాం. ఆ వార్షిక సంపాదనను 55తో భాగిస్తే వచ్చే అంకె అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆడే ప్రతి మ్యాచ్‌కు దాదాపు రూ. 30 కోట్లు. మరోలా చెప్పాలంటే, 90 నిమిషాల ఫుట్‌బాల్ ఆట (అదనపు సమయంతో కలిపి), అనేక భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ కలిపి ఏడాది మొత్తానికి కేటాయించే జీతాల బడ్జెట్‌తో సమానమైన డబ్బును ఆయనకు అందిస్తుంది.కళ్లు చెదిరే నెట్‌వర్త్ రొనాల్డో నికర ఆస్తి విలువ ప్రస్తుతం 120 కోట్ల డాలర్లు (సుమారు రూ. 10,000 కోట్లు). ఈ అపారమైన సంపద అనేది కేవలం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. రెండు దశాబ్దాలకు పైగా టాప్-క్లాస్ జీతాలు, ఛాంపియన్స్ లీగ్ బోనస్‌లు, ఇమేజ్ రైట్స్, స్పాన్సర్షిప్ డీల్స్, వ్యాపార పెట్టుబడులు, అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను డబ్బుగా మార్చుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం సాధ్యమైంది.ఒక మ్యాచ్‌కు రొనాల్డో సంపాదన దాదాపు రూ.30 కోట్లు. వార్షిక జీతం రూ. 12 లక్షలు సంపాదించే భారతీయ ఉద్యోగి 40 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించినా ఈ ఆస్తిలో ఒక చిన్న భాగానికి కూడా సరిపోలదు.. రొనాల్డో నికర ఆస్తికి సమానంగా సంపాదించాలంటే రూ. 12 లక్షల వార్షిక జీతం ఆర్జించే సుమారు 2 వేలమందికి సమానం. ఏడాదికి సుమారు 2,000 ఆఫీసు పని గంటల చొప్పున లెక్కిస్తే, ఇది దాదాపు 16 నుండి 17 కోట్ల గంటల శ్రమతో సమానం. దీనికి బదులు రొనాల్డో మైదానంలో గడిపే ప్రతి మ్యాచ్ గంటకు రూ. 20 కోట్లు సంపాదిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యున్నత శిఖరం 90 నిమిషాల ఫుట్‌బాల్. -
ఇరాన్ కోసం మెట్టు దిగిన ట్రంప్.. భారీ ఆఫర్!
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన తాజా శాంతి ఒప్పంద ముసాయిదాలో, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల అంశంపై కొంత సడలింపు చూపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని, పూర్తి వివరాలు రెండో దశ చర్చల్లో ఖరారు కావాల్సి ఉందని సమాచారం.ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం వెలుపలికి తరలించాలని, లేదా పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేసింది. అయితే తాజా చర్చల్లో ఇరాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని కొనసాగించబోమని హామీ ఇవ్వడం, అలాగే అణు నిల్వల భవిష్యత్‌పై ప్రత్యేక చర్చలకు అంగీకరించడం వల్ల చర్చల్లో పురోగతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక, ట్రంప్ గతంలో పలుమార్లు ఇరాన్ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, వాటిని ఇరాన్ వద్ద ఉంచబోమని ప్రకటించారు. కానీ తాజా అవగాహన ఒప్పందంలో యురేనియం నిల్వల నిర్వహణపై మరింత సౌలభ్యవంతమైన విధానం అవలంబిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో తుది నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఐరాస ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ యురేనియం నిల్వలపై సంతకాల కార్యక్రమం జెనీవాలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జేడీ వాన్స్ పర్యటనకు అవసరమైన పరికరాలతో నాలుగు సీ-17 విమానాలు ఐరాపాకు ప్రయాణం అయ్యాయి.ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం తమ శుద్ధి చేసిన యురేనియం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, దాన్ని విదేశాలకు తరలించే ఒప్పందం ఇప్పటివరకు కుదరలేదని స్పష్టం చేసింది. ఇరాన్ అధికారులు యురేనియం నిల్వలపై తుది నిర్ణయం భవిష్యత్ అణు చర్చల్లోనే తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళిక అమల్లోకి వస్తే, హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం, ఆంక్షల సడలింపు, అణు చర్చల కొనసాగింపు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యురేనియం నిల్వల భవితవ్యమే ఈ ఒప్పంద విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది. -
డొనాల్డ్ ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న అమెరికా 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ సుంకాలను నిలిపివేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే విధించిన స్టేను అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తాజాగా పొడిగించింది. దీంతో కేసుపై తుది విచారణ పూర్తయ్యే వరకు ఈ టారిఫ్‌లు అమల్లోనే ఉండనున్నాయి.అమెరికాలోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వం ముగ్గురు దిగుమతిదారుల నుంచి 10 శాతం సుంకాలను వసూలు చేయడం కొనసాగించవచ్చు. ఈ ముగ్గురిలో రెండు చిన్న వ్యాపార సంస్థలతో పాటు, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కొనుగోళ్లపై సుంకాలు చెల్లించిన వాషింగ్టన్ రాష్ట్రం కూడా ఉంది.వాస్తవానికి మే 7న అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు (U.S. Court of International Trade) ఈ టారిఫ్‌లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా సుంకాల వసూళ్లను నిలిపివేయకుండా, కేసు దాఖలు చేసిన ముగ్గురు పిటిషనర్లకే పరిమిత ఉపశమనం కల్పించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లగా.. మే 12న అప్పీళ్ల కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చి టారిఫ్‌ల వసూళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అదే స్టేను మరింత కాలం కొనసాగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.అమెరికా సుప్రీంకోర్టు 2025లో ట్రంప్ విధించిన పలు టారిఫ్‌లను రద్దు చేసిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ప్రభుత్వం ‘ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 122’ కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి లేకుండానే పరిమిత కాలానికి దిగుమతులపై సుంకాలు విధించే అధికారం కలిగి ఉంటారు.ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్ జూలైలో ముగియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ గడువు పొడిగిస్తే మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, టారిఫ్‌ల చట్టబద్ధతపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది. కేసు పూర్తయిన తర్వాత కోర్టు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే.. ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.మొత్తంగా చూస్తే.. ట్రంప్ టారిఫ్ విధానానికి ఇది తాత్కాలిక న్యాయ విజయం. అయితే ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్‌లు భవిష్యత్తులో కొనసాగుతాయా? లేక కోర్టు వాటికి బ్రేక్ వేస్తుందా? అన్నది తుది తీర్పుపైనే ఆధారపడి ఉంది. -
ట్రంప్ హామీ.. డీల్ కుదిరిందా? లేదంటే మరో ట్విస్ట్ తప్పదా??
మూడునెలలుగా యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న పశ్చిమాసియా ఒక్కసారిగా ఆశల వైపు చూస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన ఘర్షణకు ముగింపు దగ్గరపడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే అదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన స్పందన కొత్త సందేహాలకు తావిచ్చింది. నిజంగానే శాంతి ఒప్పందం కుదిరిందా? లేదంటే ఇంకా చివరి అడ్డంకులు మిగిలే ఉన్నాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వారాంతంలోనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "ఇరాన్‌తో యుద్ధానికి అద్భుతమైన పరిష్కారం దొరికింది. కొన్ని పత్రాలపై తుది సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని చెప్పారు.ఒప్పందంపై సంతకాలు యూరప్‌లో జరగవచ్చని, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని కూడా ఆయన ప్రకటించారు.అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. చర్చల ముసాయిదాలో చాలా భాగం పూర్తయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పంద ప్రతిపాదన ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాధికార సంస్థల పరిశీలనలో ఉందన్నారు. అమెరికా చర్చల మధ్యలో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోందని ఆరోపించిన ఆయన.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన "రెడ్‌లైన్స్"ను దాటదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల మర్మం ఏంటన్నదానిపై కుతూహలం నెలకొంది.ఇక ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమమే. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని, కొనుగోలు చేయబోదని అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఇదే మొత్తం చర్చల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని గతంలాగే పునరుద్ఘాటిస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై సంయుక్త దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారంనుంచి ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్‌లో భారీ నష్టం సంభవించింది. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. పరస్పర దాడులు కొనసాగించాయి. అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటన తర్వాత హర్ముజ్ ప్రాంతంలో అమెరికా కొత్త దాడులు జరిపింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.ఇదిలా ఉండగా, ఒప్పందానికి ఇరాన్ అత్యున్నత నాయకత్వం కూడా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆమోదం తెలిపారని తనకు సమాచారం ఉందన్నారు. అలాగే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం మాత్రం ఈ అవగాహన ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఒప్పందం ఉండాలని ట్రంప్‌కు నెతన్యాహూ సూచించినట్లు వెల్లడించింది.మొత్తంగా చూస్తే.. ట్రంప్ "డీల్ దాదాపు ఖరారైంది" అంటుండగా, ఇరాన్ "ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు" అంటోంది. నిజంగానే ఈ వారాంతంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి తెరపడుతుందా? లేదంటే చివరి క్షణంలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటాయా? అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
సూడాన్‌లో డ్రోన్ దాడి.. 15 మంది మృత్యువాత
కైరో: సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీ(ఆర్ఎస్ఎఫ్) మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్య పోరులో సామాన్యులు సమిధలవుతున్నారు. బుధవారం రాత్రి ఎల్ ఒబెయిద్ నగరంలోని వివిధ ప్రాంతాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల మంది గాయాలపాలయ్యారు. అక్కడి సైనిక స్థావరంతోపాటు ఆహార పదార్థాలతో వస్తున్న ట్రక్కుపైన, గ్యాస్ స్టేషన్ వద్ద శ్మశాన వాటిక వద్ద చేరిన జనంపైనా దాడులు జరిగాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎల్ ఒబెయిద్ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. నగరంపై డ్రోన్ సంచరిస్తూనే ఉన్నాయన్నారు. దాడుల భయంతో స్కూళ్లు మూసివేశారని, మార్కెట్లను పాక్షికంగా మాత్రమే తెరుస్తున్నారన్నారు. మూడేళ్లలో కనీసం 60 వేల మంది చనిపోగా, 1.30కోట్ల మంది నిరాశ్రయులుగా మారినట్లు ఐరాస అంచనా. -
16 ఏళ్లలోపు వారికి నో సోషల్ మీడియా
ఒట్టావా: దేశంలోని 16 ఏళ్ల బాలబాలికలకు సోషల్ మీడియా వేదికలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్ సేఫ్టీ బిల్లును కెనడా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. సామాజిక వేదికల నిర్వాహకులు తగు కారణాలను చూపిన పక్షంలో కొన్ని వెసులుబాట్లను కల్పిస్తామని మాత్రం తెలిపింది. సామాజిక మాధ్యమాల కారణంగా బాలలకు హాని వాటిల్లరాదన్నదే లక్ష్యమని కెనడా మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ చాట్‌బాట్ సేవలను వినియోగించే విషయంలో 16 ఏళ్లలోపు వారికి పరిమితులను ఈ బిల్లులో ప్రతిపాదించారు. సామాజిక వేదికలను సురక్షితంగా వాడుకునేందుకు అవసరమైన నిబంధనలను కూడా పొందుపరిచారు. ప్రతిపాదిత సేఫ్ సోషల్ మీడియా చట్టం ద్వారా సోషల్ మీడియా సేవలు, ఏఐ చాట్‌బాట్ నిర్వాహకులు.. ఏదైనా నష్టం, హాని జరిగితే అరికట్టేలా, పూర్తి బాధ్యత వహించేలా చేస్తామని మంత్రి తెలిపారు. యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్, మలేసియా తదితర దేశాలు సైతం ఇలాంటి ప్రతిపాదనలను రూపొందించే పనిలో ఉన్నాయి. -
భారత్, పాక్, బంగ్లాదేశ్‌ల నుంచి గల్ఫ్‌కు 1.90 కోట్ల మంది వలస
న్యూఢిల్లీ: 2010వ సంవత్సరం తర్వాత భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి సుమారు 1.90 కోట్ల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు ఓ అధ్యయనం గుర్తించింది. ఏడాదికి సరాసరిన 13.5 లక్షల మంది చొప్పున సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈలకు బతుకుదెరువు కోసం వెళ్లారని ఈ సర్వే తేల్చింది. పశ్చిమాసియా దేశాలకు ప్రధానంగా వలసలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దక్షిణాసియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారే ఈ ప్రాంతానికి ఎక్కువగా వలస వెళ్లినట్లు గుర్తించామని సర్వే చేపట్టిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలిసిస్, పాపులేషన్ అండ్ జస్ట్ సొసైటీస్ ప్రోగ్రామ్‌కు చెందిన గై అబెల్ తెలిపారు. ముఖ్యంగా బంగ్లాదేశీయులు 2010 తర్వాత ఏడాదికి 3 లక్షల మంది చొప్పున సౌదీ వెళ్లినట్లు ఇటీవల జర్నల్ నేచర్‌లో ప్రచురితమైన ఇందుకు సంబంధించిన కథనం పేర్కొంది. అకస్మాత్తుగా తలెత్తిన సంక్షోభం వంటి పరిస్థితుల వల్ల కాకుండా ఈ వలసలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయని వివరించింది. -
పీవోకేలో మళ్లీ కాల్పులు.. 16 మంది మృతి
రావల్కోట్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) లో నిరాయుధులైన ఆందోళనకారులపై భ ద్రతా బలాలు మరోసారి తుపాకులు ఎక్కు వపెట్టాయి. గురువారం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోగా, 37 మంది గాయాల పాలయ్యారు. పెరుగుతున్న ధర లను నిరసి స్తూ సుమారు 70 వేల మంది రావల్కోట్ లోని ఈద్గా మైదానంలో జరి గిన ర్యాలీకి తరలివచ్చారు. పాక్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. తక్కువ ధరలకే నిత్యావసరల వస్తువులను పంపిణీ చేయాలని, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నిరసనకా రులపై జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పో యిన 30 మందికి, క్షతగాత్రులుగా మారిన మరో 200 మందికి న్యాయం చేయాలని వారు గర్జించారు. బందోబస్తు విధుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ వారిపైకి యథేచ్ఛగా కాల్పు లు జరిపింది. దీంతో, జనం భయభ్రాంతు లకు గురై పరుగులు తీశారు. కాల్పులపర్వం అనంతరం ఈద్గా మైదానం రక్తమోడగా, రోడ్లనిండా రక్తపు మరకలే కనిపించాయి.సైనిక హెలికాప్టర్ కూలి 22 మంది మృతి: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ సమీపంలో బుధవారం ఎంఐ–17 రకం ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు అధికారులు సహా 22 మంది సైనికులు చనిపోయారు. సాంకేతిక లోపం తలె త్తడంతోనే ఈ ప్రమాదం చోటుచేసు కున్నట్లు ఆర్మీ తెలిపింది. -
ఏఐతో కరోనా టీకా డిజైన్
లండన్: కృత్రిమ మేధ(ఏఐ) మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కొత్త రకం టీకాను డిజైన్ చేసింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ టీకాను మానవులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం లక్షల మంది ప్రాణాలు తీసిన కోవిడ్ మహమ్మారి తదనంతర కాలంలో పలు రకాలుగా రూపాంతరం చెందింది. గబ్బిలాలలో నిద్రాణంగా ఉన్న అనేకానేక కరోనా జాతి వైరస్లు భవిష్యత్తులో ఎప్పుడైనా మానవుల్లోకి చేరి భారీ ప్రాణ నష్టం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకే టీకాతో అన్ని రకాల కరోనా వైరస్ల వ్యాప్తి అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు హానికారక వైరస్‌లను మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించేలా శిక్షణ ఇస్తాయి. వైరస్ రూపాంతరం చెందితే టీకా పనిచేయదు. కొత్త టీకా తయారు చేయాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు ఏఐ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. కరోనా జాతికి చెందిన వేలాది వైరస్ల జన్యుక్రమాలను అన్వేషించింది. అన్నింటిలోనూ మార్పుల్లేకుండా ఉండే, మున్ముందు మారకుండా ఉండే డీఎన్ఏ భాగాలను గుర్తించింది. వీటిని లక్ష్యాలుగా చేసుకుంది. ఫలితంగా కరోనా జాతి వైరస్‌లన్నింటికీ విరుగుడైన టీకా డిజైన్ సిద్ధమైంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనల కోసం సార్స్, కోవిడ్ వ్యాధులకు కారణమైన సార్బికో వైరస్‌లను ఏఐ ద్వారా స్కాన్ చేసింది. దీంతోపాటు పలు జంతువుల్లోని కరోనా వైరస్‌లను పరిశీలించింది. డీఎన్ఏ టీకా కోవిడ్‌కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ టీకా గురించి మనకు తెలిసే ఉంటుంది. ఇది డీఎన్ఏలో ఒక పోగు అయిన ఎంఆర్ఎన్ఏ ఆధారంగా పనిచేస్తే ఏఐ డిజైన్ చేసిన టీకా మొత్తం డీఎన్ఏ ఆధారంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ తయారీ, నిల్వ చాలా సులువు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా ప్రపంచం నలుమూలల్లోనూ సులువుగా పంపిణీ చేయవచ్చు. రిఫ్రిజరేటర్ల వంటి మౌలిక సదుపాయాల అవసరమూ ఉండదు. సూదితో పని లేకుండా ఈ కొత్త తరహా టీకాను అందించవచ్చు కాబట్టి వినియోగం చాలా సులువు అవుతుంది. ఈ సానుకూల అంశాలన్ని భవిష్యత్తులో ఏదైనా కొత్త రకం కరోనా వైరస్ దాడి చేసినా తట్టుకునేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.పరీక్షల వేళ తేలిందేమిటి?మెషీన్ లెర్నింగ్ సాయంతో ఏఐ డిజైన్ చేసిన టీకాతో మానవులపై చేపట్టిన ప్రయోగాల్లో రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేయగలుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ యాంటీబాడీలు సార్బికోవైరస్ రకాలను సమర్థంగా గుర్తిస్తున్నట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ మానవ వినియోగానికి అర్హమైందని, ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ టీకాను అందరికీ అందుబాటులోకి తెచ్చే ముందు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందని అంటున్నారు. ఈ కొత్త రకం టీకా ఎంతకాలం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది? బూస్టర్ డోస్‌లు అవసరమవుతాయా? వంటివి నిర్ధారించుకోవడమే కాకుండా వాస్తవిక పరిస్థితుల్లో ఇవి వైరస్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయా? లేదా? అన్నది తెలుసుకోవాల్సి ఉంది. ఇందుకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌కు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని వాణిజ్యవిభాగ పరిశోధనా సంస్థ ‘డియోసిన్వ్యాక్స్’ పర్యవేక్షణలో పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు జరిగాయి. -
యూకే రక్షణ మంత్రి జాన్ హీలే రాజీనామా
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రక్షణ మంత్రి జాన్ హీలే గురువారం పదవికి రాజీనామా చేశారు. రక్షణ బడ్జెట్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరో దారి లేకనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్‌లో ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత రక్షణ బడ్జెట్‌తో భద్రతా బలగాల అవసరాలు ఏమాత్రం తీరవని, ఫలితంగా దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని జాన్ హీలే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని స్టార్మర్ గానీ, ఆర్థిక మంత్రి గానీ దేశ భద్రతకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి వద్ద మిలటరీ మిషన్, నాటో ఆర్కిటిక్ సెంట్రీ మిషన్, యూకేతోపాటు నాటోపై ఎక్కువైన రష్యా దూకుడు వంటి వాటి నేపథ్యంలో రక్షణ బడ్జెట్ అవసరాలు పెరిగాయని జాన్ హీలే వివరించారు. -
అమెరికా దుశ్చర్య!
దుబాయ్/న్యూఢిల్లీ/విశాఖపట్నం/ఐరాస: ఇరాన్‌పై ముమ్మర దాడులకు తెగించిన అమెరికా బుధవారం ఒమన్ సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లోని ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. వరసబెట్టి భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్యనౌకలపై అమెరికా దాడులు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛావాణిజ్యానికి భంగం కల్గించేలా కాల్పులు జరపడం చట్టవ్యతిరేకమని భారత్ పునరుద్ఘాటించింది. తక్షణం కాల్పుల పర్వానికి ఫుల్స్టాప్ పెట్టాలని భారత్ సూచించింది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్‌డిఅఫైర్స్ జేసన్‌ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మృతదేహాల స్వా«దీనం ఎంటీ సెటెబె నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతైనట్లు బుధవారం వార్తలొచ్చాయి. అయితే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని, వాళ్ల మృతదేహాలను స్వా«దీనంచేసుకున్నామని భారత నౌకాయాన మంత్రి శర్బానంద సోనోవాల్ గురువారం ప్రకటించారు. వాళ్ల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ అన్నివేళలా అండగా ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు. సెటెబెపై దాడిలో మిగతా 21 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ తీరగస్తీ బలగాలు కాపాడాయని మంత్రి వెల్లడించారు. 24 మంది భారతీయ సిబ్బంది ఉన్న మరో చమురు రవాణా నౌక మారీవెక్స్‌పై అమెరికా దాడిలో మొత్తం 24 మందినీ కాపాడటం తెల్సిందే. మూడో నౌక మీదా దాడి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడులపర్వం గురువారమూ కొనసాగింది. ఒమన్‌లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి నౌక ఇంజిన్ రూమ్‌ను నాశనం చేశాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. ఒమన్ రాయల్ నేవీ దళాల సాయంతో నౌకలోని 22 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తీసుకొస్తున్నామని మస్కట్ నగరంలోని భారతీయ రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో స్పష్టంచేసింది. గత నాలుగు రోజుల వ్యవధిలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ తెలిపారు. భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిసీ దాడిచేశామని అమెరికా గురువారం తొలిసారిగా ఒప్పుకుంది. ‘‘ఎంటీ జల్వీర్ ఇరాన్ చమురును అనుమతిలేకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా తరలిస్తోంది. దిశ మార్చుకోవాలని పదేపదే హెచ్చరించినా బేఖాతరు చేశారు. అందుకే నౌకపై దాడిచేశాం’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ తన చర్యను సమర్థించుకుంది. 2 వారాల్లో 15వ వివాహ వార్షికోత్సవం అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వ్యక్తి 44 ఏళ్ల పటా్నల సురేశ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని ఢిల్లీలోని ఆంధ్రభవన్ గురువారం ప్రకటించింది. భార్య భార్గవితో కలిసి జూన్ 24వ తేదీన 15వ వివాహ వార్షికోత్సంకోసం స్వస్థలానికి వచ్చేందుకు సురేశ్ అధికారుల అనుమతి తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో సురేశ్ మృతి వార్త తెలిసి అతని కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. ఆయనకు 12, 10 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మరణించాడన్న వార్త తెలిసి పిల్లలిద్దరూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘గత ఐదు నెలలుగా సముద్రంలో విధినిర్వహణలో ఉండిపోయారు. మ్యారేజ్‌డే కోసం త్వరలో ఇంటికొస్తున్నా అని చెప్పారు. కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మెరైన్ ఇంజనీరింగ్‌ను ఆయన వృత్తిలా భావించరు. ఎంతో తపనతో పనిచేస్తారు’’అని భార్య భార్గవి వాపోయారు.ఐరాస వేదికగా భారత్ నిరసన అమెరికా దాడి సంస్కృతిపై భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా ధ్వజమెత్తింది. ఏకపక్ష దాడులను తక్షణం నిలిపేయాలని డిమాండ్చేసింది. ఐరాస భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి,భద్రత: మధ్యవర్తిత్వం ద్వారా పశ్చిమాసియా సమస్యకు పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారతరాయబార శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ‘‘పశ్చిమాసియా దేశాలపై దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరుగుతున్నాయి. సముద్రగర్భ కేబుళ్లూ ధ్వంసమవుతున్నాయి. పశ్చిమాసియాలో సుస్థిరత కొనసాగాలంటే వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసులు అస్సలు తెగిపోకూడదు. అగ్రరాజ్యం(అమెరికా) దాడులు ఆపాల్సిందే’’అని హరీశ్ గట్టిగా డిమాండ్‌చేశారు. -
ఒప్పందానికి మిత్రపక్షాల గ్రీన్‌సిగ్నల్
వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఒప్పందంలోని అంశాలపై మిత్ర దేశాలు సానుకూలత తెలిపాయన్నారు. మరికొద్ది గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులుంటాయంటూ తీవ్ర హెచ్చరికలు చేసిన ట్రంప్ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. ‘ఇప్పటిదాకా ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల ప్రతిపాదనలు చివరకు ఇరాన్ అత్యున్నత నేతల దాకా వెళ్లాయి. వాళ్లు వాటిని ఆమోదించారు. అందుకే కొన్ని గంటల క్రితం ఇరాన్‌పై రాత్రి వేళ భీకర బాంబు దాడులు చేయాలనుకున్న నా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. చర్చల్లో ప్రస్తావించిన కీలక అంశాలపై మధ్యవర్తిత్వ, భాగస్వామ్య దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, తుర్కియే, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ తదితర దేశాలు సమ్మతి తెలపడం శుభపరిణామం. ఈ శాంతి ఒప్పందం కుదిరి, అమల్లోకి వచ్చేదాకా హార్మూజ్ జలసంధి దిగ్బంధం యథాతథంగా కొనసాగుతుంది. శాంతి ఒప్పందం ఏరోజు, ఎక్కడ కుదుర్చు కోబోతు న్నామో త్వరలోనే వెల్లడిస్తా’అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. అంతకుముందు ఇరాన్ చమురు పరిశ్రమను మొత్తం గుప్పిటపట్టేలా భీకర స్థాయిలో దాడులతో దురాక్రమణ చేస్తామని, అందుకు గురువారం రాత్రే ముహూర్తం ఖరారుచేశామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘నావికాదళం, వైమానిక దళం, సైన్యం, రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలు, అన్ని రకాల వ్యవస్థలను కోల్పోయిన ఇరాన్‌పై ఇక బీభత్సంగా బాంబులేస్తాం. అందుకు ఈరోజు రాత్రే ముహూర్తం పెట్టా. ఇరాన్ కీలక ఖర్గ్ ద్వీపంలోని అతిపెద్ద ఆయిల్ టర్మినల్‌ను త్వరలోనే వశపర్చుకుంటాం. ముడి చమురు పరిశ్రమ మొత్తాన్నీ మా పరం చేసుకుంటాం. అన్నింటినీ ఆక్రమిస్తాం. చమురు, సహజవాయు రంగాలన్నింటిపై ఆధిపత్యం సాధిస్తాం. అచ్చం వెనెజువెలాలో మెరుపుదాడులు చేసినట్లుగా అనూహ్యరీతిలో దాడులతో తెగబడతాం. మా దాడుల తర్వాత వెనెజువెలాపై అమెరికా ఆధిపత్యం మొదలైంది. దీంతో వెనెజువెలా, అమెరికా రెండింటికీ లాభం చేకూరింది. ఇప్పుడు దానినే ఇరాన్లో పునరావృతం చేస్తాం’’అని ట్రంప్ ప్రకటించారు. బుధవారం దాడులకు కొనసాగింపుగా గురువారం తెల్లవారుజామున సైతం దాడులుచేశాక ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. ఖర్గ్ ద్వీపం అనేది ఇరాన్ చమురు పరిశ్రమకు గుండెకాయ. ఇక్కడి నుంచి 90 శాతం చమురు ఎగుమతులు జరుగుతాయి. అయితే ఖర్గ్ దీవిని స్వా«దీనంచేసుకోవడం అమెరికాకు అంత తేలికైన విషయం కాదు. దీవి నుంచి కేవలం 33 కిలోమీటర్ల దూరంలోనే ఇరాన్ ప్రధానభూభాగం, సైన్యం ఉంది. అక్కడి నుంచి దూసుకొచ్చే ఇరాన్ క్షిపణులను, ఆత్మాహుతి డ్రోన్లు, శతఘ్ని ఫిరంగులను అమెరికా పూర్తిస్థాయిలో నిలువరించడం కష్టమని నిపుణులు తేల్చేశారు. అయినాసరే ఖర్గ్ ద్వీపాన్ని స్వాదీనం చేసుకునేందుకు తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘‘ద్వీపంలోకి అమెరికా బలగాలను దించుతా. సైనికులను రంగంలోకి దింపాల్సిందే. నిజానికి ఆర్మీని తీసుకురావడం నాకు ఇష్టంలేదు. కానీ మొత్తం దీవిని స్వా«దీనం చేసుకోవాలంటే సైన్యం రాక తప్పదు. స్వా«దీనం చేసుకున్నాక ఎంతకాలంపాటు దానిపై పట్టు నిలుపుకోగలం అనేది నాకైతే తెలీదు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొనసాగిన అమెరికా దాడులు.. బుధవారం అర్ధరాత్రి దాటాక చాలా పొద్దుపోయాక అమెరికా ఇరాన్‌పై దాడులు చేసింది. ఇరాన్ సైనిక నిఘా సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. బందర్ అబ్బాస్ తీర పట్టణం సహా హార్మూజ్ సమీప దక్షిణ ప్రాంతాలపై అమెరికా దాడులుచేసింది. టెహ్రాన్‌లోని తయారీ కర్మాగారం, సైనిక బ్యారెక్‌లు, స్థానిక పోలీసుల కేంద్రాలపైనా దాడులు జరిగాయని ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ సైతం వెల్లడించింది. దాడులు మొదలెట్టి అమెరికా చర్చలకు అర్థంలేకుండా చేసిందంటూ ఇరాన్ విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటనలో తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాలకు ఇరాన్ కారణంగా జరిగిన ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు విదేశాల్లో మేం జప్తుచేసుకున్న ఇరాన్ బ్యాంక్, ఆర్థిక ఖాతాల నుంచి రాబట్టుకుంటామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు. -
ట్రంప్ క్యాబినెట్లోకి కీలక వ్యక్తి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై దాడులకు బ్రేక్ ఇచ్చిన తరువాత, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.'జే క్లేటన్'ను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) పదవికి ఎంపిక చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ పదవి అమెరికా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన భద్రతా బాధ్యతలలో ఒకటి. దేశంలోని అన్ని గూఢచార సంస్థల పనిని సమన్వయం చేయడం ఈ పదవి ప్రధాన బాధ్యత.జే క్లేటన్‌ను అమెరికా అధ్యక్షుడు అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా పేర్కొన్నారు. ఈయన గతంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) చైర్మన్‌గా పని చేశారు. అంతే కాకుండా ఈయన సులివన్ & క్రామ్వెల్ మాజీ హెడ్, ప్రస్తుతం న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా పనిచేస్తున్నారని కూడా వెల్లడించారు.నా మంత్రివర్గంలో పనిచేయడానికి క్లేటన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఈయన నియామకాన్ని వీలైనంత త్వరగా ధృవీకరించాలని నేను యునైటెడ్ స్టేట్స్ సెనేట్ను కోరుతున్నాను ట్రంప్ పేర్కొన్నారు. -
పుట్టింటి గుట్టు అమ్మకు ఎరుక..
ఇంటికెళ్లే దారిని ఎవరైనా మర్చిపోతారా? ఈ పక్షులు మరిచిపోయాయి. అందుకే వాటి పుట్టింటికి వెళ్లే దారిని వాటికి గుర్తు చేసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఈ ఫొటోలో వాళ్లు చేస్తున్నది అదే..’నార్తర్న్ బాల్డ్ ఐబిస్’ అనే ఈ అరుదైన పక్షులు మధ్య ఐరోపాలో 400 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. దీంతో రెండు దశాబ్దాలు కష్టపడి.. జర్మనీ, ఆస్ట్రియాల్లోని సంరక్షణ శాలల్లో వీటిని పెంచారు. పెంచడం అయితే పెంచారు గానీ.. కాలానుగుణంగా ఇవి వలస వెళ్లి.. తిరిగి పుట్టింటికి తిరిగి రావడం ఎలా? ఎందుకంటే.. ఇవి ఎప్పుడూ వలస వెళ్లలేదు కదా.. దీంతో శాస్త్రవేత్తలే స్వయంగా రంగంలోకి దిగారు. ఆకాశంలో వాటికి ‘మార్గ’దర్శకులుగా మారారు. సాధారణంగా పక్షి పిల్లలు గుడ్డు నుంచి బయటకు రాగానే మొదట చూసే మనుషులను తమ తల్లిగా భావిస్తాయి. దీనిని ఇంప్రింటింగ్ అంటారు. ఇందుకోసం ఆస్ట్రియాకు చెందిన హెలెనా వెహ్నర్, జోహన్నెస్ ఫ్రిట్జ్ అనే ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఆ పక్షులకు పెంపుడు తల్లులుగా మారారు. వాటిని ప్రేమగా పెంచి, తమను అనుసరించేలా శిక్షణ ఇచ్చారు. పక్షులు ఎగిరే వయసుకు రాగానే ఫ్రిట్జ్ ఒక చిన్న ’అల్ట్రాలైట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (పారాగ్లైడర్ లాంటి చిన్న విమానం)లో పైలట్‌గా మారగా, హెలెనా వెనుక సీట్లో కూర్చుని పక్షులను పిలిచారు. అంతే.. వారిని చూసి.. పక్షులు ఆ విమానాన్ని అనుసరిస్తూ ఎగరడం ప్రారంభించాయి. ఇలా జర్మనీ, ఆస్ట్రియా నుంచి స్పెయిన్ వరకు దాదాపు 2,600 కిలోమీటర్ల మేర సాగిన ఈ వినూత్న ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. తమ ప్రయత్నంతో వాటికి సురక్షితమైన వలస మార్గం తెలిసిందని.. వచ్చే ఏడాది ఇవి ఎవరి సహాయం లేకుండానే సొంతంగా తిరిగి రాగలవని.. అంతేకాకుండా తమ పిల్లలకు కూడా ఈ మార్గాన్ని నేర్పుతాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ జోహన్నెస్ ఫ్రిట్జ్ సంతోషం వ్యక్తం చేశారు. 2024లో ఫొటోగ్రాఫర్ గున్నార్ హార్ట్‌మాన్ ఈ అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించగా, ఈ ఫొటోకు ‘నేచర్ 2026 సైంటిస్ట్ అట్ వర్క్’ ఫొటోగ్రఫీ పోటీలో మొదటి బహుమతి కూడా లభించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా మధ్య జరిగిన యుద్ధం చమురు ధరలు భారీ పెరుగుదలకు కారణమైంది. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి ప్రణాళికలను రద్దు చేసినట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఊహకందని మార్పులు జరిగాయి.ట్రంప్ ప్రకటన అనంతరం చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 3.6 శాతం తగ్గి బ్యారెల్‌కు 89.73 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ కూడా అదే స్థాయిలో తగ్గి 86.83 డాలర్లకు పడిపోయాయి. ఈ తగ్గుదల పెట్టుబడిదారులలో తాత్కాలిక ఊరటను కలిగించింది.ఇరాన్‌పై అమెరికా “కఠిన చర్యలు” తీసుకుంటుందనే హెచ్చరికలు, అలాగే మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యాయి. చమురు సరఫరా మార్గాలపై ప్రభావం పడవచ్చన్న భయంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పరిస్థితులు మారడంతో మార్కెట్ దిశ కూడా వెంటనే మారిపోయింది.ట్రంప్ ప్రకారం.. ఇరాన్ నాయకత్వంతో అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. తుది అంశాలపై అన్ని పక్షాల అంగీకారం లభించింది. ఈ కారణంగానే సైనిక దాడులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. చర్చలు పరోక్షంగా కొనసాగుతున్నాయని, శాంతి ఒప్పందం దిశగా కొన్ని కీలక అంశాలు ముందుకు సాగుతున్నాయని సమాచారం.అయితే.. ఈ ప్రకటనలో తుది ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఒప్పందం పూర్తయ్యే వరకు పరిస్థితులు పూర్తిగా స్థిరపడినట్లు చెప్పలేమని స్పష్టమవుతోంది. అయినప్పటికీ, సైనిక చర్యల భయం తగ్గడంతో ప్రపంచ చమురు మార్కెట్లు తాత్కాలికంగా స్థిరత్వం దిశగా కదులుతున్నాయి. -
తూచ్.. మేము బాంబులెయ్యం!
ఈ రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాజాగా.. డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇందులో ''ఈ సాయంత్రం ఇరాన్‌పై జరగాల్సిన వైమానిక దాడులను, బాంబు దాడులను రద్దు చేశాను'' అని పేర్కొన్నారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో చర్చలు ఇరాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయికి చేరి, ఆమోదం పొందాయి. కాబట్టి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా, ఈ సాయంత్రం ఇరాన్‌పై జరగాల్సిన దాడులను రద్దు చేశాను. తుది ఒప్పందానికి అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్, ఇతరులతో సహా ఇందులో పాలుపంచుకున్న అన్ని పక్షాలు, ఈ చర్చలకు ఆమోదం తెలిపాయి.ఒప్పందం ఖరారయ్యే వరకు.. నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉంటుంది. తుది ఒప్పందానికి సంబంధించిన సమయం, ప్రదేశం వంటి విషయాలను తాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
గంట తరువాత బిడ్డ చావు కబురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి!
గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో.. జరిగిన ఒక విషాదకర ఘటన భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలావు (Palau) దేశ జెండా కింద ప్రయాణిస్తున్న ఏంటీ సెట్టెబెల్లో (MT Settebello) అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి చేయడంతో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 23 ఏళ్ల యువకుడు ఆదిత్య శర్మ (Aditya Sharma) కూడా ఉన్నాడు. ఈ సంఘటన అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రత, యుద్ధ నిబంధనలు & భారతీయ నావికుల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.అమెరికా ఆరోపణలుఅమెరికా ఆరోపణల ప్రకారం.. ఏంటీ సెట్టెబెల్లో నౌక ఇరాన్ నుంచి చమురును తరలిస్తూ అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించింది. ఈ కారణంగా నౌకపై దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. అయితే.. నౌక యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండిస్తూ అంతర్జాతీయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి తర్వాత ఒమాన్ అధికారులు 21 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే.. ముగ్గురు భారతీయ నావికులు కనిపించకుండా పోయారు. అనంతరం వారి మృతదేహాలను గుర్తించి మరణించినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. మరణించిన వారిలో డెక్ కేడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ఉన్నారు.క్షేమంగా ఉన్నా అని మెసేజ్.. అంతలోనేఆదిత్య శర్మ మరణం హృదయ విదారకంగా మారింది. దాడికి ఒక గంట ముందు మాత్రమే ఆయన తన తండ్రికి వాట్సాప్‌లో ''నేను క్షేమంగా ఉన్నాను'' అని సందేశం పంపారు. ఆ తరువాత జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మరణంతో తీవ్ర వేదనకు గురైన ఆయన తండ్రి, వాణిజ్య నౌకపై క్షిపణులతో దాడి చేయడం యుద్ధ నేరంగా పరిగణించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే.. ఏంటీ మారివెక్స్ నౌకపై కూడా అమెరికా దాడికి గురైంది. అందులోని 24 మంది భారతీయ నావికులను ఒమాన్ అధికారులు రక్షించారు. అదేవిధంగా ఏంటీ జాల్వేర్ ఏంటీ జావీర్ అనే మరో నౌక ప్రమాదంలో చిక్కుకోవడంతో భారత రాయబార కార్యాలయం, ఒమాన్ నౌకాదళం సహాయంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ అమెరికా ప్రతినిధిని పిలిపించి అధికారిక నిరసన తెలిపింది. భారత ప్రభుత్వం సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది.ప్రమాదకర పరిస్థితుల్లో నావికులుప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం. ప్రపంచంలోని రోజువారీ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల వేలాది మంది నావికులు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.Three Indian Seafarers killed in US attack on a Vessel off the coast of Oman. 3 attacks in last 4 days. Family of Indian seafarer Aditya Sharma calls it a war crime, demanding investigation. Several Indian crew rescued. India summons top American diplomat, lodges strong protest. pic.twitter.com/fhw4kqTm84— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 11, 2026 -
ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ స్ట్రాంగ్ రియాక్షన్.. ఆయన భరించలేని..
టెహ్రాన్: ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ పార్లమెంట్‌లోని జాతీయ భద్రతా కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం అజీజీ స్పందించారు. ట్రంప్‌నకు మరింత శక్తిమంతమైన, మరింత బాధాకరమైన ప్రతిస్పందన ఎదురవుతుందని అజీజీ వార్నింగ్ ఇచ్చారు."ట్రంప్‌నకు సరైన అవకాశాలు లేవు కాబట్టి అతని చర్యలను ముందుగానే ఊహించవచ్చు. ట్రంప్ దాదాపు ఎలాంటి విజయాలు సాధించలేదు. అమెరికా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు ఏమీ అందని విధంగా ఆయన భారీ మూల్యం చెల్లించాడు. ఏదైనా తప్పుడు అంచనాతో అడుగు వేస్తే గతం కంటే మరింత బాధాకరమైన ప్రతిస్పందన వస్తుంది. ట్రంప్ హెచ్చరికలు భ్రమలు మాత్రమే. ఇరాన్ నుంచి వచ్చే ఏ ప్రతిస్పందనైనా ట్రంప్‌నకు భరించలేని పరిణామాలు తెచ్చిపెట్టవచ్చని ఆయనకు తెలుసు" అని ఆయన చెప్పారు. కాగా, యూఎస్ హెచ్చరికలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం అంతర్జాతీయంగా నెలకొంది. -
హాట్ కేకుల్లా బీటీఎస్ టికెట్ల అమ్మకాలు
జకర్తా: ఈ తరం యువతను ఉర్రూతలూగించే కొరియన్ పాప్ బృందం నిర్వహించనున్న ఈవెంట్ పాస్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కేవలం 20 నిమిషాల్లోనే ఐదు లక్షల పాసులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కొరియన్ పాప్ బృందం బీటీఎస్ వరల్డ్ టూర్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 26, 27 తేదీలలో జకార్తాలోని గెలోరా బుంగ్ కర్నో క్రీడా మైదానంలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించనుంది. తొమ్మిదేళ్ల తర్వాత బీటీఎస్ సంపూర్ణ బృందంగా ఇండోనేషియాలో తొలిసారి ప్రదర్శన ఇవ్వనుంది.ఈ కార్యక్రమం కోసం జూన్ 9న బీటీఎస్ బృందం టికెట్స్‌ను ప్రీసేల్ నిర్వహించింది. ప్రీసేల్‌లో పాస్‌లను సొంతం చేసుకునేందుకు ఐదు లక్షలకు పైగా అభిమానులు ఆన్లైన్లో పోటెత్తారు. అయితే ఈ టికెట్లు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. జూన్ 11న మధ్యాహ్నం 12 గంటలకు సాధారణ సేల్ ప్రారంభమైనమూడు గంటల్లోపే ముగిశాయి. ఒక నివేదిక ప్రకారం, ఇవి 12 నిమిషాల ముందే పూర్తయ్యాయి.బీటీఎస్ ఈవెంట్ టికెట్లు టికెట్.కామ్‌లో విక్రయించారు. వీఐపీ ఎంట్రన్స్ పాస్ ధర రూ.4.5 లక్షల ఇండోనేషియా రూపాయల వరకు ఉంది. బీటీఎస్ ఈవెంట్ టికెట్లు అధికారికంగా నిర్ణయించిన ధరకు అమ్ముడైన వెంటనే, కొంతమంది వాటిని రీసేల్ మార్కెట్లో అసలు ధర కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు మళ్లీ విక్రయించడం ప్రారంభించారు. రీసేల్ మార్కెట్లో టికెట్ ధరలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. ఈ రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి.ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన ఇప్పటికే ఇరాన్ మిలటరీ శక్తి, సామర్థ్యాలను తుత్తునీయుల్ని చేశామని, తదుపరి సైనిక చర్య ఆసన్నమైందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రాత్రి ఇరాన్ ప్రభుత్వానికి నిద్ర కరువవుతుంది. ఆ దేశానికి చెందిన నేవి, ఎయిర్‌ఫోర్స్, రాడార్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పాటు మిగిలిన రక్షణ వ్యవస్థలను సర్వనాశనం చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో వెనిజువెలా తరహాలో ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని, ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం వెనిజువెలా, అమెరికాకు అద్భుతంగా కలిసివస్తుందని అన్నారు. ఇరాన్-అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరువవుతున్న తరుణంలో, దౌత్యపరమైన అంశాలపై మరింత అనిశ్చితి నెలకొంది.ఓవైపు బెదిరింపులు.. మరోవైపు చర్చలు ఓవైపు ఇరాన్‌ను బెదిరిస్తున్నప్పటికీ అమెరికా-ఇరాన్‌ల మధ్య ప్రాథమిక ఒప్పందంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, యూరోపియన్ దేశాల వర్గాల సమాచారం ప్రకారం, సుదీర్ఘ చర్చల్లో పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకిగా మారింది.ఇరాన్ ఆయిల్ అమ్మకాల ద్వారా సంపాదించిన బిలియన్ల డాలర్లు దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ వంటి దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. అమెరికా ఆంక్షల చట్టాల ప్రకారం, డాలర్ ఆధారిత లావాదేవీలను నియంత్రించే అధికారం అమెరికాకు ఉంది. అందువల్ల అమెరికా ఒత్తిడి కారణంగా ఆ దేశాల బ్యాంకులు ఇరాన్ నిధులను ఫ్రీజ్ చేశాయి. అమెరికా మార్కెట్ యాక్సెస్ కోల్పోకుండా ఉండటానికి ఆ బ్యాంకులు ఆంక్షలను పాటించాయి.ఇరాన్ నిలిపివేసిన 6 బిలియన్ల నుంచి 12 బిలియన్ల వరకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ అమెరికా మాత్రం మానవతా సాయం కింద షరతులతో కొద్దికొద్దిగా మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ కారణంగా ఇరాన్‌తో అమెరికా మధ్య సంఘర్షణ మరింత తీవ్రతరమవుతోందని వర్గాలు వెల్లడించాయి. సైనిక దృష్ట్యా ఈ యుద్ధం అంతులేని మార్గమని, ఇరాన్‌పై దాడి చేసి అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోయిందని విశ్లేషకులు పేర్కొన్నారు.చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ, చివరికి అమెరికా-ఇరాన్ సంఘర్షణకు ముగింపు రావాలంటే విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన నిధులను తిరిగి ఇరాన్ పొందడమే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మరోసారి బరితెగించిన పాక్ ఆర్మీ.. 16 మంది మృతి
రావల్కోట్: మరోసారి పాకిస్థాన్ ఆర్మీ బరితెగించింది. పీవోకే రావల్కోట్లో నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. మరో 37 మంది గాయపడ్డారు. రెండు రోజుల కిందట పీఓకేలో ఘర్షణలు చెలరేగగా.. రెండు రోజుల క్రితం కాల్పుల్లో 30 మందికిపైగా మృతిచెందారు. పాక్ నుంచి విముక్తి కల్పించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపడుతుండగా.. వారిపై పాక్ ఆర్మీ కాల్పులతో విరుచుకుపడుతోంది. గత మూడు రోజులుగా పీవోకే ఘర్షణ వాతావరణం నెలకొంది.సాధారణ పౌరులు తమకు అందుబాటు ధరల్లో పిండి, బియ్యం, విద్యుత్‌తో పాటు ప్రాథమిక హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ప్రారంభించిన ఈ నిరసన ర్యాలీపై పాకిస్తాన్ సైన్యం ఒక్కసారిగా కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారింది. పాకిస్థాన్ విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. రెండు రోజుల క్రితం (మంగళవారం) పీవోకేలో నిరసనకారులపై పాక్ సైన్యం కాల్పులు జరపగా.. మరణించిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా ఈ నిరసనకారులు డిమాండ్ చేశారు.కాగా, పీవోకేలో ఇటీవల ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, విద్యుత్ బిల్లుల భారం, పాలనాపరమైన సమస్యలపై ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కాల్పులు జరిగినట్లు కూడా నివేదికలు వెల్లడించాయి. -
తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత
ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్ కాల్పుల మోతతో అట్టుడికింది. బుధవారం ఉదయం హెరాత్‌లోని జిబ్రిల్ ప్రాంతంలో, సరైన బురఖా ధరించలేదనే ఆరోపణలతో మహిళలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులపై తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, దాదాపు ముప్పై మంది గాయపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హెరాత్‌లోని జిబ్రిల్ వాసులు మహిళల అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వీరిని అణచి వేసేందుకు తాలిబాన్ ఫైటర్లు తూపాకీలను నేరుగా ఛాతీపై గురిపెట్టి కాల్పులు జరిపారని, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మానవ హక్కుల సంఘాలు, తాలిబాన్ వ్యతిరేక రాజకీయ నేతలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నగరంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మహిళల రాకపోకలపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ మహిళలను బయటకు వెళ్లనివ్వవద్దని, ఒకవేళ వారిని బంధిస్తే విడిపించడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేమని హెరాత్‌లోని కొందరు మసీదు ఇమామ్‌లు నిన్న ప్రజలను హెచ్చరించారు.తాలిబాన్లు నిరసనకారుల ఛాతీపై కూడా కాల్పులు జరిపారనీ, కొందరు యువకులు కిందపడి రక్తం ఓడుతుండటం చూశానని స్థానికులు ఒకరు తెలిపారు. మహిళలు నినాదాలు చేస్తుండగా, తాలిబాన్లు కాల్పులు జరుపుతున్నారు. తాలిబాన్ల నిబంధనల ప్రకారం బురఖా/హిజాబ్ ధరించని మహిళలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారు భారీగా కాల్పులు జరుపుతున్నప్పటికీ, ప్రజలు "విద్య, ఉపాధి, స్వేచ్ఛ" అంటూ నినాదాలు చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది.మరోవైపు తాలిబాన్ల అరెస్టులు, అణచివేతకు భయపడి చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు కాకుండా ఇళ్లకే తరలించారని నిరసనకారులు చెబుతున్నారు. దీనివల్ల గాయపడిన వారికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందలేదు. తాలిబాన్లు ఆసుపత్రుల్లో కూడా నిఘా ఉంచి, గాయపడిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారని కొందరు ధృవీకరించారు.🇦🇫 Taliban opens fire on civilians protesting morality police in Herat, Afghanistan, residents hit streets demanding end to burqa and chador rules @visegrad24 pic.twitter.com/34ik8JLDAq— U.S.A.I. 🇺🇸 (@researchUSAI) June 9, 2026 జిబ్రిల్కు అదనపు బలగాల తరలింపుజిబ్రిల్లో ప్రజా నిరసనలను అణచివేసిన తర్వాత, తాలిబాన్లు వందలాది మంది కొత్త ఫైటర్లను ఆ ప్రాంతానికి పంపారు. నగరంలోని అన్ని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విడుదలైన వీడియోల ప్రకారం, హెరాత్ నగరం పూర్తిగా సైనిక జోన్లా మారిపోయింది. రోడ్లపై, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫైటర్లను మోహరించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న తాలిబాన్లు కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.అయితే షల్ మీడియాలో ఈ నిరసనల గురించి సోషల్ మీడియా ద్వారా ఉప్పందడంతో ఉదయం నుంచే వారు సాధారణ దుస్తుల్లో భారీగా మోహరించారు. ప్రజలు గుమిగూడటం ప్రారంభించగానే అన్ని వైపుల నుండి ఆయుధాలతో దాడి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి కూడా నిఘాపెట్టి క్షతగాత్రులకు చికిత్స అందకుండా అడ్డుకున్నారు.మానవ హక్కుల సంఘాల స్పందనదీనిపై అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హెరాత్‌లో ప్రజా నిరసనల అణచివేతపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాలిబాన్ల ఆంక్షలు అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై కాల్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలిపే నిరసనకారులపై చట్టవిరుద్ధంగా బలాన్ని ఉపయోగించడాన్ని వెంటనే నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని కోరింది. మహిళలు, బాలికల హక్కులైన స్వేచ్ఛగా తిరిగే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేసింది,హెరాత్‌లో ప్రజా నిరసనలపై తాలిబాన్ల అణచివేతకు ప్రతిస్పందిస్తూ, మాజీ ఆఫ్ఘన్ ప్రభుత్వ విదేశాంగ సలహాదారు రంగిన్ దాద్ఫర్ స్పాంటా ఎక్స్‌లో స్పందించారు. "ఈ అణచివేత, చరిత్రలో సాగుతున్న ఈ పాలనను ప్రజలే స్వయంగా ముగించాలి" అని పిలుపునిచ్చారు.మరోవైపు, హ్యూమన్ రైట్స్ వాచ్‌కి చెందిన ఆఫ్ఘనిస్తాన్ పరిశోధకురాలు ఫెరెష్తే అబ్బాసి స్పందిస్తూ, హెరాత్ ప్రావిన్స్ నుండి తమకు "ఆందోళన కరమైన నివేదికలు" అందాయని చెప్పారు. తాలిబాన్లు నిరసనకారులపై ఎలాంటి బలాన్ని ప్రయోగించకుండా వెంటనే వైదొలగాలని, శాంతియుత నిరసనల కోసం నిర్బంధించిన వారిని విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. హింస లేదా బెదిరింపులు లేకుండా శాంతియుత నిరసనలు జరుపుకోవడానికి నిరసనకారులను అనుమతించాలని ఆమె పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్, ఈ అణచివేతను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. నిరసనకారులపై జరిగిన హింసకు పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా 2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, తాలిబన్లు మహిళలు, బాలికలపై విస్తృతమైన ఆంక్షలు విధించారు. వీటిలో సెకండరీ, విశ్వవిద్యాలయ విద్యపై నిషేధం, ఉపాధిపై పరిమితులు, దుస్తులు, కదలికలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.Today, Afghan human rights defenders protested outside the UN office in Tehran in solidarity with the women of Herat and across Afghanistan. They called on the UN and the international community to end their silence and take action for Afghan women’s rights.#HeratAfghanProtest pic.twitter.com/DJcjvDNBUi— Jahanzib Wesa (@jahanzibwesa) June 11, 2026 -
ఉడుత మలంలో మామత్ల డీఎన్ఏ
కెనడాలో పరిశోధకులు గడ్డకట్టిన మలంలో మామత్ల డీఎన్ఏను గుర్తించారు. ఉడుత బిలం (ఉడుత నేలలో తొవ్వితే ఏర్పడిన చిన్న గుహలాంటి నివాస స్థలం) దానిని వేల ఏళ్ల పాటు కాపాడింది. అంతరించిపోయిన రోమాలతో కూడిన మామత్లతో పాటు ఇతర జంతువుల ప్రాచీన డీఎన్ఏ రూపంలో అత్యంత విలువైన శాస్త్రీయ సమాచారాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడా శాశ్వత మంచు నేలలో భద్రంగా ఉన్న ఉడుతల విసర్జనలో దానిని కనుగొన్నారు. ఆర్కిటిక్ గ్రౌండ్ స్క్విరెల్ అనే ఉడుత జాతి అత్యంత చల్లని ప్రాంతాల్లో, మంచుతో కప్పిన ప్రదేశాల్లో జీవిస్తుంది. ఈ ఉడుత సాధారణంగా మనం చెట్లపై చూసే ఉడుత కాదు. ఇది కెనడా, అలాస్కా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో నివసిస్తుంది. బిలాలు తవ్వుకుని జీవిస్తుంది. ఏడాదిలో సుమారు 7 నుంచి 8 నెలలు శీతనిద్రలో ఉంటుంది. బయట ఉష్ణోగ్రత -30°C కంటే తక్కువగా ఉన్నా బతికే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆహారాన్ని బిలాల్లో నిల్వ చేస్తుంది. మంచు నేల (పర్మాఫ్రాస్ట్) ఆ బిలాన్ని వేల ఏళ్ల పాటు భద్రపరచింది.గాలి చొరబడని విధంగా మూసివేసిన బిలాల్లో ఉన్న ప్రాచీన మామత్ డీఎన్ఏ కొన్ని వేళ ఏళ్ల నాటి కాలానికి చెందినది. కెనడా వాయవ్య ప్రాంతంలోని విశాల అరణ్య ప్రాంతం యూకాన్లో వేల ఏళ్ల పరిణామ క్రమంపై అవగాహనను దీని ద్వారా పొందవచ్చు. రోమాలతో కూడిన మామత్ డీఎన్ఏతో పాటు తోడేళ్లు, అడవి ఎద్దులు, గుర్రాలు, చిరుతలు, వందలాది మొక్కలకు చెందిన జన్యు పదార్థాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘‘సాధారణంగా ప్రజలు మామత్ దంతం వంటి పెద్ద శిలాజాలను కనుగొనడాన్ని గొప్ప విషయంగా భావిస్తారు. కానీ, ఉడుతల మలాన్ని పరిశీలించడం సాధారణంగా అంత ప్రాముఖ్యంగా కనిపించదు. అయినప్పటికీ, ఆ మలం నుంచే శాస్త్రవేత్తలకు అమూల్యమైన డీఎన్ఏ సమాచారం లభించింది’’ అని అధ్యయన ప్రధాన రచయిత, కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పాలియోజీనోమిక్స్ శాస్త్రవేత్త టైలర్ మర్చీ తెలిపారు. పాలియోజీనోమిక్స్ అంటే ప్రాచీన జీవుల జన్యు సమాచారాన్ని అధ్యయనం చేసే శాస్త్ర విభాగం.అధ్యయనం ప్రకారం.. మొదట ఉడుత సూక్ష్మజీవ సముదాయాన్ని మాత్రమే అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. అనంతరం నిజంగా ఆశ్చర్యపరిచే జీవ వైవిధ్యాన్ని గుర్తించారని మర్చీ చెప్పారు. ఈ ఎలుక జాతి జీవులకు ఆహారం, గింజలు, ఆకులు, ఎముకలు వంటి వస్తువులను బిలాల్లో నిల్వ చేసుకునే అలవాటు ఉండడమే ఇందుకు కారణమని తెలిపారు.బిలాలను మంచు నేల మూసేయడంతోఆర్కిటిక్ ఉడుతలు ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే చురుకుగా ఉంటాయి. మిగతా సమయం శీతనిద్రలో గడుపుతాయి. అంటే తమ శరీర కార్యకలాపాలను చాలా వరకు తగ్గించుకుని, దీర్ఘకాలం నిద్రలాంటి స్థితిలో ఉంటాయి.అందుకే ఉడుతలు తమ బిలాలను కాయలు, గింజలు, ఆకులు, ఎముకలు, దొరికిన ఇతర వస్తువులతో నింపుతాయి. కాలక్రమంలో కొన్ని బిలాలను శాశ్వత మంచు నేల మూసివేసింది. ఆ ఉడుతల బిలాలు వేల ఏళ్ల క్రితం ఉన్న వస్తువులు, మలం, మొక్కల అవశేషాలు, జంతువుల డీఎన్ఏ వంటి వాటిని యథాతథంగా భద్రపరిచాయి. అందువల్ల అవి గత కాలానికి చెందిన సమాచారాన్ని మనకు అందించే నిల్వ కేంద్రాలుగా మారాయి.శాస్త్రవేత్తలు పూర్తిగా గడ్డకట్టిన చిన్న గ్రౌండ్ స్క్విరెల్ నమూనాను కూడా గుర్తించారు. “అది ఒక కాలం పాటు నిద్రపోయి మళ్లీ ఎప్పుడూ మేల్కోలేదు... అటు వెళ్తున్న ఒక శాస్త్రవేత్త దానిని గుర్తించాడు” అని శాస్త్రవేత్త టైలర్ మర్చీ చెప్పారు.మామత్ను తిరిగి జీవంలోకి..! అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కొలోసల్ బయోసైన్సెస్ 4,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన రోమాలతో కూడిన మామత్ను తిరిగి జీవంలోకి తీసుకురావాలనే ఉద్దేశాన్ని ఇటీవల ప్రకటించింది.అయితే నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఏర్పడే జంతువు మామత్ కంటే, మామత్ను పోలి ఉండేలా జన్యు మార్పులు చేసిన ఆసియా ఏనుగును ఎక్కువగా పోలి ఉంటుందని వారు భావిస్తున్నారు.మర్చీ బృందం ప్రస్తుతం మరో అధ్యయనంపై పని చేస్తోంది. ఉడుతల మలంలో లభించిన డీఎన్ఏ రోమాలతో కూడిన మామత్ పరిణామ క్రమంపై ఏమి వెల్లడిస్తుందో ఆ అధ్యయనం వివరిస్తుంది. -
నా జీవితంలో అదో ఘోర తప్పిదం : నా ఎఫైర్స్‌తో బెదిరించాడు : బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రముఖ దాత బిల్ గేట్స్, దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంలో యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు హాజరయ్యారు.తన జీవితంలో అతడిని కలవడం ఘోర తప్పిదమనీ, గ్లోబల్‌గా తన సేవలను ప్రమాదంలో పడేసిందంటూ సాక్ష్యమిచ్చారు. అంతేకాదు తన వివాహేతర సంబంధాల ఆదారంగా ఎప్స్టీన్ తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడంటూ సంచలన విషయాలను వెల్లడించారు.అమెరికా పార్లమెంటరీ కమిటీ విచారణలో ఎప్స్టీన్తో ఉన్న సంబంధాలు, వారి సమావేశాల ఉద్దేశం, ఎప్స్టీన్ నేరపూరిత కార్యకలాపాల గురించి ఏమైనా సమాచారం ఉందా అనే విషయాలపై చట్టసభ సభ్యులు గేట్స్‌ను ప్రశ్నించారు. చట్టసభ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ రహస్య విచారణలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ ఎప్స్టీన్తో పరిచయం తన ప్రతిష్టకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా తాను చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు దెబ్బతినే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందన్నారు. అసలు ఆయన్ని కలవడం తాను చేసిన అతి పెద్ద తప్పిదమని బిల్ గేట్స్ అంగీకరించారు. నిజానికి అతని పరిచయం ప్రపంచ ఆరోగ్య, అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న సంపన్న దాతలను అనుసంధానించడంలో సహాయపడు తుందని తాన నమ్మానని గేట్స్ తెలిపారు. ఈ ఉద్దేశంతోనే 2011 నుంచి 2014 మధ్య కొన్నిసార్లు మీట్ అయ్యాననీ, అయితే ఆ చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు రాలేదన్నారు. దీంతో 2014 చివరి నాటికే వారి మధ్య చర్చలు, సంబంధాలు ముగిసిపోయాయని తెలిపారు. అంతేకాకుండా, తాను ఎలాంటి నేరపూరిత చర్యలలో పాలుపంచుకోలేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. అలాగే ప్స్టీన్ ప్రైవేట్ దీవులు ప్రైవేట్ దీవి (ఐలాండ్), రాంచ్ లేదా ఫ్లోరిడాలోని నివాసాన్ని సందర్శించాననే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మెలిందాతో వివాహ జీవితంపై బిల్ గేట్స్‌ను ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ చేశాడా?మరోవైపు బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. తన వివాహ జీవితం వెలుపల ఉన్న సంబంధాల (Extramarital affairs) గురించి ఎప్స్టీన్కు తెలిసిందని, ఆ సమాచారాన్ని ఉపయోగించి తనతో సంబంధాలు కొనసాగించేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడని గేట్స్ అంగీకరించారు. ఈ విషయాలను ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలని చూశాడన్నారు. ఇవి తన కుటుంబానికి బాధను కలిగించాయని చెప్పారు. తనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తానెప్పుడూ సుముఖత చూపలేదని గేట్స్ పదే పదే నొక్కి చెప్పారు.తమ మధ్య చర్చలు కేవలం స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణ అవకాశాలపై మాత్రమే జరిగాయని గేట్స్ స్పష్టం చేశారు. తాను ఆశించిన ఆర్థిక సహాయాన్ని ఎప్స్టీన్ అందించలేడని అర్థమైన తర్వాత, అతనితో సంబంధాలను పూర్తిగా కట్ చేసుకున్నట్లు గేట్స్ తెలిపారు. ఎప్స్టీన్ నెట్‌వర్క్‌పై కాంగ్రెస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి, ఈ కేసులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్లు పెరుగుతుండటంతో, దర్యాప్తు అధికారులు మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే విచారణ కమిటీ ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, రిటైల్ దిగ్గజం లెస్లీ వెక్స్‌నర్‌తో సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులను కూడా విచారించింది. -
క్షిపణి దాడుల బీభత్సం: కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేత
కువైట్ సిటీ: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న శత్రుత్వం గల్ఫ్ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో కువైట్ దేశం తన గగనతలాన్ని అత్యవసరంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున 4:50 గంటల నుండి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ వైమానిక దాడులు, పౌర విమానయాన రక్షణను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.క్షిపణులను అడ్డుకున్న కువైట్ ఎయిర్ డిఫెన్స్గగనతలంలో ముంచుకొస్తున్న ముప్పును కువైట్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. తమ దేశ రక్షణ వ్యవస్థలు గగనతలంలో శత్రు లక్ష్యాలను గుర్తించి, వాటిని విజయవంతంగా తిప్పికొడుతున్నాయని కువైట్ జనరల్ స్టాఫ్ ఆఫ్ ది ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగి, ప్రమాదం తప్పిందని నిర్ధారించుకున్నాకే మళ్లీ విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని కువైట్ సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటించింది. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది.బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగత మూడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలను ఇరాన్ కావాలనే ఆలస్యం చేస్తోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిచర్యగా అమెరికా దళాలు ఇరాన్‌పై సరికొత్త దాడులకు దిగాయి. దీంతో ఆగ్రహించిన ఇరాన్.. కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులకు తెగబడింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధిని’ పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో గల్ఫ్‌లో యుద్ధ వాతావరణం ముదిరింది.అంతర్జాతీయంగా చమురు సెగరెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ ప్రతీకార దాడుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్ తమతో మైండ్ గేమ్ ఆడుతోందని, దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అటు అమెరికా సెంట్రల్ కమాండ్ సైతం ఇరాన్ దుశ్చర్యలకు దీటుగా ఆత్మరక్షణ దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరు దేశాల దూకుడుతో గల్ఫ్ రీజియన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. -
అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి
మస్కట్: ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. మొత్తం 24 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ వాణిజ్య నౌకపై జరిగిన దాడితో ఒక్కసారిగా సముద్ర తీరం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది.అమెరికా దాడి.. భారతీయుల బలిఈ వారంలో ఒమన్ తీరానికి సమీపంలో ఉన్న హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా దళాలు ఈ చమురు ట్యాంకర్‌పై దాడి చేశాయి. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 24 మంది భారతీయులలో 21 మందిని రక్షించగా, ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. అయితే, గురువారం నాటి తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు నావికులు మరణించారని ప్రకటించారు.స్వదేశానికి మృతదేహాల తరలింపుఈ విషాద సమయంలో నౌకాదళ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బాధితుల కుటుంబాలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మిగిలిన 21 మంది భారతీయ సిబ్బందిని వెంటనే స్వదేశానికి రప్పించడానికి, అలాగే మరణించిన నావికుల భౌతిక కాయాలను వేగంగా భారతదేశానికి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను కేంద్రం ఆదేశించింది.అమెరికా రాయబారికి భారత్ సమన్లుఈ దాడిని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు జరపడం, భారతీయ నావికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని సీనియర్ అమెరికా రాయబారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసి, తన నిరసనను బలంగా నమోదు చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణించే భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
రూ. 954 కోట్ల స్కాం :భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్
సుమారు రూ. 954 కోట్లకు పైగా కుంభకోణ ఆరోపణలతో 44 ఏళ్ల భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అమెరికాలో అరెస్టు చేశారు. బుధవారం ఉదయం న్యూపోర్ట్ బీచ్‌లోని అతని విలాసవంతమైన భవనంలో అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే అతనికి గరిష్టంగా 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మఖిజాని తన కంపెనీ (క్యాంటర్ గ్రూప్ V LLC) ద్వారా రియల్ ఎస్టేట్ లోన్ల కోసం తాకట్టు పెట్టిన ఆస్తుల విలువను పెంచి చూపారు. టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఫోర్జరీ చేసి, మెటాడేటాను మార్చడం ద్వారా అసలు అప్పులను దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.కరోనా డెల్ మార్లో నివసిస్తున్నగ్రీన్ కార్డ్ హోల్డర్ మహేందర్ మఖిజానిని, ఒక బ్యాంకును దాదాపు 100 మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు వచ్చిన ఫెడరల్ క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా బుధవారం ఉదయం అరెస్ట్ చేశామని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా ఫస్ట్ అసిస్టెంట్ యూఎస్ అటార్నీ బిలాల్ ఎస్సాయిలీ తెలిపారు. తమ స్పెషల్ ఏజెంట్లు వివిధ ఖాతాల ద్వారా జరిగిన నిధుల బదిలీలను నిశితంగా పరిశీలించి, ఈ భారీ కుంభకోణాన్ని ఛేదించారు. సొంత లాభం కోసం పత్రాలను తారుమారు చేసి, ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిని వదిలిపెట్టేది లేదు. నిజాలను వెలికితీసి, చట్టానికి అప్పగిస్తామన్నారు.Mahender Makhijani, 44, a lawful permanent resident from India living in Corona del Mar, was arrested this morning on a federal criminal complaint charging him with defrauding a bank out of nearly $100 million.Makhijani controlled Cantor Group V LLC, a Newport Beach-based… pic.twitter.com/wEcSe5mQpW— F.A. United States Attorney Bill Essayli (@USAttyEssayli) June 10, 2026ఐఆర్ఎస్ ప్రకారం మఖిజాని టైటిల్ ఇన్సూరెన్స్ రికార్డులను తప్పుగా సృష్టించాడు,నిజమైన తాకట్టు స్థానాలను దాచిపెట్టాడు. ఫెడరల్ ఇన్సూరెన్స్ ఉన్న ఒక బ్యాంకును తప్పుదోవ పట్టించడానికి షెల్ కంపెనీల నెట్‌వర్క్‌ను ఉపయోగించాడు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక సంపన్న ప్రాంతంలో హోటళ్లు, ఒక రెస్టారెంట్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి సాయుధ గుండాలను పంపడం, డ్రగ్స్ , సెక్స్ పార్టీలను నిర్వహించడం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. 2024 సెప్టెంబర్- 2025 ఏప్రిల్ 2025 వరకు, మఖిజాని భీమా పత్రాలను ఫోర్జరీ చేసి, తాకట్టు పెట్టిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులపై కాంటర్ సంస్థకే మొదటి హక్కు (First Lien Position) ఉన్నట్లు చూపించాడు. ఈ నకిలీ పత్రాలను తన ఉద్యోగి ద్వారా బ్యాంకుకు సమర్పించేలా చేశాడు. అంతేకాకుండా, బ్యాంకు ప్రతినిధులతో ఫోన్ కాల్స్‌లో మాట్లాడుతూ, బ్యాంకు గుర్తించిన పత్రాల లోపాల గురించి అబద్ధాలు చెప్పి నమ్మించాడు.సెక్స్ వర్కర్లతో ప్రైవేట్ పార్టీలను నిర్వహించేవాడని, ఈ పార్టీలకు కొంతమంది బ్యాంకు ఉద్యోగులు కూడా హాజరయ్యారని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. ఆ పార్టీలలో జరిగిన ఉదంతాల ఆధారంగా అతను బ్యాంకు సిబ్బందిని, తన భాగస్వాములను బ్లాక్మెయిల్ చేస్తూ తన నియంత్రణలో ఉంచుకున్నాడు. అంతేకాదు తన కింద పనిచేసే సిబ్బందిని బెదిరిస్తూ, తనకు వ్యతిరేకంగా పనిచేస్తే, చంపేస్తామని, కుటుంబాలను, పిల్లల్ని రోడ్డు పడేస్తానని బెదిరించేవాడు.అలాగే గత నెలలో జరిగిన ఒక మధ్యవర్తిత్వ విచారణలో వ్యాపారవేత్త మొహమ్మద్ హోనార్కర్తో జరిపిన రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మఖిజాని అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీనికిగాను సుమారు రూ. 12,391.6 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. -
అందం కూడా నేరమా?.. మేకప్ వేస్తే జైలే!!
ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే ముందు.. ఏం దుస్తులు వేసుకోవాలి? అనే ఆత్రుత సహజమే!. కళ్లకు అద్దుకునే కాటుక దగ్గరి నుంచి కాలికి వేసుకుని చెప్పుదాకా.. అన్నీ పక్కాగా ఉండాలని మహిళల్లో కొందరు అనుకుంటారు. కానీ, వాళ్లు ఏం వేసుకోవాలి? ఎలా ఉండాలి?.. ఇలా అన్నింటినీ ప్రభుత్వం నిర్ణయించే పరిస్థితి ఊహించగలరా?.. ఇప్పుడు ఆ దేశంలో అదే జరుగుతోంది. కాదంటే.. బలవంతంగా బేడీలు వేసి జైలుకు పంపిస్తున్నారు..మహిళలపై ఇప్పటికే ఎన్నో పరిమితులు అమలు చేస్తున్న అఫ్గనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం తాజాగా మరోసారి కఠిన చర్యలకు దిగింది. ముఖం పూర్తిగా కప్పుకోకుండా బయటకు రావడంపై నిషేధం విధించింది. అలాగే.. బిగుతైన దుస్తులు ధరించడం, మేకప్ వేసుకోవడం నేరమని ప్రకటించింది. తాము నిర్దేశించిన రీతిలో హిజాబ్ నిబంధనలు పాటించకపోతే కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలో.. పలువురిని అదుపులోకి తీసుకుని నిర్బంధ కేంద్రాలకు తరలించే అధికారం పోలీసులకు సైతం కల్పించారు.మహిళలు మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులపైనా బాధ్యత మోపారు. ఇంట్లోని మహిళలు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆ ఇంట్లోని మగవాళ్లదేనని స్పష్టం చేసింది తాలిబాన్ ప్రభుత్వం. ఉల్లంఘనలు కొనసాగితే పురుషుల మీద కూడా కేసులు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్‌లో ప్రస్తుతం ఈ ఆదేశాలు అమలవుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.ఇక.. కొత్త నిబంధనల అమలులో భాగంగా హెరాత్‌లోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. రహదారులపై వెళ్తున్న వాహనాలు, ట్యాక్సీలను ఆపి మహిళల దుస్తులు, హిజాబ్ విధానాన్ని తనిఖీ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం 21 మంది మహిళలు, బాలికలను ఈ నిబంధనల ఉల్లంఘన పేరుతో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.అరెస్టైన వారిలో ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు కూడా ఉన్నట్లు సమాచారం. భర్తతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారని స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో గడ్డం నిబంధనలు పాటించలేదనే కారణంతో కొందరు వైద్యులు, నర్సులను కూడా తాలిబాన్ అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై వరుస ఆంక్షలు విధిస్తోంది. బాలికల ఉన్నత విద్యపై నిషేధం, ఉద్యోగ అవకాశాల పరిమితి, ప్రజా ప్రదేశాల్లో సంచారంపై ఆంక్షలు వంటి వందకు పైగా ఆదేశాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తాజాగా వచ్చిన ఈ నిర్ణయాలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను మరింత కుదించే చర్యలుగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. -
‘ఏం చేద్దామనుకున్నాడో’.. కెనడాను ఊపేస్తున్న పైలట్ మోసం!
ఒట్టావా: ఏకంగా 17 సంవత్సరాల పాటు, కనీసం లైసెన్స్ కూడా లేకుండానే వందలాది ప్రయాణికులతో విమానాలను నడిపాడు ఓ ఎయిర్ కెనడా కెప్టెన్. హాలీవుడ్ సినిమా కథను తలపించే ఈ షాకింగ్ ఉదంతాన్ని కెనడా పోలీసులు బయటపెట్టారు. జెఫ్రీ వాల్ అనే మాజీ పైలట్, కెప్టెన్‌కు ఉండాల్సిన ‘ఎయిర్‌లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ ఫర్ ఏరోప్లేన్స్’ లేకుండానే 2009 నుండి 2025 వరకు ఏకంగా 900 కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడిపినట్లు విచారణలో తేలింది. జూన్ ఒకటిన అతడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన పోలీసులు, ఈ కేసు పూర్తిగా ఒక సినిమా స్క్రిప్ట్లా ఉందని వ్యాఖ్యానించారు.సినిమాను మించిన విమాన మోసంఈ సుదీర్ఘ కాలంలో జెఫ్రీ వాల్ బోయింగ్ 767, 777, 787 తదితర భారీ ప్రయాణికుల విమానాలను నడిపాడు. పదివేల మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను గాల్లో ఉంచిన ఈయన, కెప్టెన్‌గా దాదాపు మూడు మిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు రూ. 25 కోట్లకు పైగా) జీతాన్ని కూడా అందుకున్నాడు. 2002 నాటి ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ తరహాలోనే ఈ ఉదంతం సాగిందని పీల్ రీజినల్ పోలీస్ డిప్యూటీ చీఫ్ మిలినోవిచ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.సర్జరీ చేసిన జనరల్ డాక్టర్లా..అయితే, జెఫ్రీ వాల్ పూర్తిగా విమానయాన పరిజ్ఞానం లేనివాడేమీ కాదు. ఎయిర్ కెనడాలో అతని 27 ఏళ్ల కెరీర్లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది. కానీ 2009లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందినప్పుడు కావాల్సిన ఉన్నత స్థాయి లైసెన్స్ మాత్రం అతనికి లేదు. ‘ఇది ఫ్యామిలీ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే అర్హత ఉన్న డాక్టర్, ఏకంగా బ్రెయిన్ సర్జరీ చేసినట్లుంది’ అని మిలినోవిచ్ ఉదహరించారు. నిందితుడు తన నకిలీ పత్రాలతో అటు ఎయిర్‌లైన్స్‌ను, ఇటు రెగ్యులేటర్లను మోసం చేశాడని స్పష్టం చేశారు.ఇలా దొరికిపోయాడు..2025లో జరిగిన సాధారణ సర్టిఫికేట్ తనిఖీల్లో ఈ లైసెన్స్ అవకతవకలు బయటపడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ‘ప్రాజెక్ట్ ఇకారస్’ పేరుతో విచారణ ప్రారంభించక ముందే ఈ ఏడాది ప్రారంభంలో వాల్ రిటైర్ అయ్యాడు. కాగా పైలట్లకు ప్రతి ఆరు నెలలకు కఠిన శిక్షణ, తనిఖీలు ఉంటాయని, అందువల్ల ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఎయిర్ కెనడా తెలిపింది. ప్రస్తుతం నిందితుడిపై మోసం, నకిలీ పత్రాల సృష్టితో సహా 7 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 29, 2026 న అతడు కోర్టుకు హాజరుకానున్నాడు.ఇది కూడా చదవండి: ఎత్తయిన ఏనుగుపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు! -
పాక్ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్ అక్కడే!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి.. చాలామందికి ఓ సందేహం రావొచ్చు. పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతమే అయితే అక్కడ ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి, శాసనసభ, రాజ్యాంగం, జెండా ఎందుకు ఉన్నాయి? పీవోకే నిజంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమా? కాదా?.. ఇటీవల పీవోకేలో చెలరేగిన ఆందోళనలు, పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత చర్యల నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.పాకిస్థాన్ అధికారికంగా పీవోకేను "ఆజాద్ జమ్మూ అండ్ కశ్మీర్"గా పిలుస్తుంది. పేరు వింటే అది స్వతంత్రమో.. స్వయం ప్రతిపత్తితో నడిచే ప్రాంతంలా అనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక శాసనసభ ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, న్యాయవ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం కూడా ఉన్నాయి. పైకి చూస్తే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉన్న ప్రాంతంలా కనిపిస్తుంది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.ఈ వ్యవస్థ వెనుక ఉన్న కథ 1947 విభజన కాలానికి వెళ్తుంది. జమ్మూ కశ్మీర్ సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో మొదటి భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసే సమయానికి కశ్మీర్‌లోని కొంత భూభాగం పాకిస్థాన్ ఆక్రమణలో మిగిలిపోయింది. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో అధికారిక ప్రావిన్స్‌గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కశ్మీర్‌పై తమ హక్కు బలహీనపడుతుందని ఇస్లామాబాద్ భావించింది. అందుకే ఒకవైపు కశ్మీర్ వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే, మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది.దీంట్లో భాగంగానే 1949 కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగం, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్థాన్ తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రపతి, ప్రధాని, శాసనసభ, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీవోకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ రాజ్యాంగం ప్రకారం పీవోకేలో ఆ దేశ అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతి కాగా.. ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. కానీ అలా ఏనాడూ జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు, కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్ అనుమతితోనే అమలవుతాయి. పీవోకే పరిపాలనలో కూడా పాకిస్థాన్ నుంచి పంపిన అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.అంతేకాదు, పీవోకేలో రాజకీయ వ్యవస్థపై పాకిస్థాన్ ప్రభావం ఎంత బలంగా ఉందో అక్కడి ఎన్నికల విధానం కూడా చూపిస్తుంది. శాసనసభలో కొన్ని స్థానాలు పీవోకేలో నివసించే ప్రజల కోసం కాకుండా, పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్‌కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.మరో వివాదాస్పద అంశం విధేయత ప్రమాణం. పీవోకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కశ్మీర్ పాకిస్థాన్‌లో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. భిన్నాభిప్రాయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అక్కడ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని విమర్శలు ఉన్నాయి. అలా.. ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ సృష్టించిన నామ మాత్రపు రాజకీయ వ్యవస్థేనని స్పష్టమవుతోంది. ఇక భారత్ మాత్రం పీవోకేను ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా పీవోకే భారత భూభాగమేనని అధికారికంగా పేర్కొంటోంది. అందుకే పీవోకేకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు, జెండా వంటి వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో అది స్వతంత్ర ప్రాంతమో, ప్రత్యేక దేశమో అయిపోదని భారత్ వాదిస్తోంది. దశాబ్దాలుగా ‘ఆజాద్ కశ్మీర్’ అనే పేరుతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వాస్తవానికి పీవోకే రాజకీయ, పరిపాలనా, భద్రతా వ్యవస్థలన్నీ ఇస్లామాబాద్ నియంత్రణలోనే కొనసాగుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే పీవోకేలో కనిపించేది ఒక ప్రభుత్వం అయితే.. పనిచేసేది మాత్రం పాకిస్థాన్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థేనని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ట్రంప్ వ్యాఖ్యలు వైరల్! ప్రత్యర్థులకు ఫుల్ జోష్
అమెరికాలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం (సీపీఐ) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంపై ఆందోళనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. పైగా ‘ఆర్థిక గణాంకాలు చాలా బాగున్నాయి... నేను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ విలేకరులతో ట్రంప్ అనడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నవంబర్‌లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో ఈ ధరల పెరుగుదలనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న డెమొక్రాట్లకు ట్రంప్ వ్యాఖ్యలు వరంగా మారుతాయని కొందరు చెబుతున్నారు.డెమొక్రాట్ల ఎదురుదాడిట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా యూఎస్ సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ నేత చక్ షూమర్ మాట్లాడుతూ.. ‘అమెరికన్ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ట్రంప్‌నకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. తాను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు. అమెరికా ప్రజల పట్ల ఆయనకున్న ధిక్కారానికి హద్దులు లేవు’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.డెమొక్రాటిక్ పార్టీ వ్యూహంట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను జోడిస్తూ డెమొక్రాటిక్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచార ప్రకటనను విడుదల చేసింది. ‘ట్రంప్ తన మనసులోని నిశ్శబ్దాన్ని బయటపెట్టేశారు. ఆయనకు ద్రవ్యోల్బణం అంటే ఇష్టం. ప్రతి అమెరికన్ దీనిని గమనించాలి’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు హౌస్ రిపబ్లికన్ స్పీకర్ మైక్ జాన్సన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ట్రంప్ అన్న మాటలను అంసందర్భంగా మారుస్తూ రాజకీయం చేస్తున్నారని వాదించారు.మూడేళ్ల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణంతాజా గణాంకాల ప్రకారం, మే నెలలో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతానికి పెరిగింది. ఇది ఏప్రిల్ నెలలోని 3.8 శాతం కంటే ఎక్కువ మాత్రమే కాకుండా, ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కిరాణా సామగ్రి, ఇంధనంతో పాటు వైద్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ సేవల ఖర్చులు, విమాన ప్రయాణ ఛార్జీలు, వినోద రంగాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.ధరల పెరుగుదలకు కారణంకొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి కోలుకోకముందే.. వరుస అంతర్జాతీయ పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలు ఇప్పటికే ఆర్థికవ్యవస్థను దెబ్బతీయగా ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన యూఎస్-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం చమురు మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది.ప్రపంచ చమురు, వాయువు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా తగ్గుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. కానీ, ఆర్థికవేత్తలు మాత్రం యుద్ధం ముగిసినా చమురు ధరలు పూర్వస్థితికి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.ఆశాజనకమైన సంకేతాలుకొంతకాలంగా గ్యాసోలిన్ ధరలు స్వల్పంగా స్థిరపడుతుండటం మార్కెట్ విశ్లేషకులలో ఆశలు రేకెత్తిస్తోంది. ‘అధిక ఇంధన ధరలు గత నెలలో ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచిన మాట వాస్తవమే. కానీ, ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని మా అంచనా. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది తగ్గుముఖం పడుతుంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’ అని నేషన్ వైడ్ చీఫ్ ఎకనామిస్ట్ కాథీ బోస్ట్జోన్సిక్ అన్నారు.వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనా?అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే వారం ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణాయక కమిటీ సమావేశం కానుంది. గత నెలలోనే పగ్గాలు చేపట్టిన కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరగబోయే మొదటి సమావేశం ఇది కావడం విశేషం. వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచేందుకే మొగ్గు చూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ట్రంప్ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కళ్లుగప్పి హర్ముజ్ జలసంధిలో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్ ద్వారా భారీ పరిమాణంలో చమురును అంతర్జాతీయ మార్కెట్‌కు చేరవేశామని ప్రకటించారు. అంతేకాదు, గత నెల రోజులుగా అలానే 200కు పైగా వాణిజ్య నౌకలను హర్ముజ్ దాటించామని వెల్లడించారు.ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. గత నెలలోనే అమెరికా సైన్యానికి ఓ రహస్య ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు రహస్యంగా రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మిషన్ ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్‌కు చేరిందని, 200కుపైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని పేర్కొన్నారు.అమెరికా కారణంగానే హర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. "హర్ముజ్‌ను నియంత్రించేది ఇరాన్ కాదు.. అమెరికానే" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఒకే రాత్రిలో 22 నౌకలను ఎలాంటి లైట్లు లేకుండా, రాడార్ ట్రాకింగ్‌కు చిక్కకుండా హర్ముజ్ జలసంధి దాటించినట్లు చెప్పారు. రాత్రి చీకటిని ఉపయోగించుకుని ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురును బయటకు తీసుకువస్తున్నామని, అందువల్లే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉన్నాయని వ్యాఖ్యానించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై తర్వాత అమెరికా సైనిక, ఇంధన శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ నుంచి చమురును "తీసుకురావడం" లేదా "స్వాధీనం చేసుకోవడం" జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవానికి హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల భయంతో నిలిచిపోయే పరిస్థితి వచ్చిన వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పించిందని తెలిపారు.అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఒమన్ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. గత కొన్ని వారాల్లో 200కుపైగా నౌకలు ఈ భద్రతా వ్యవస్థ ద్వారా హర్ముజ్‌ను సురక్షితంగా దాటాయని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తరచూ అంతర్జాతీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఒకసారి ఇరాన్ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయితే ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హర్ముజ్ జలసంధిలో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును రహస్య ఆపరేషన్ ద్వారా సురక్షితంగా తరలించామన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా కొత్త సందేహాలకు తావిచ్చాయి. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హర్ముజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై ఆధిపత్యం ప్రకటించుకున్న ఇరాన్ తన నిఘా కొనసాగిస్తోంది. అమెరికా గస్తీలో ఉన్న నౌకలను అస్సలు వదలడం లేదు. మరి ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా నిజంగానే ఇరాన్ కళ్లు గప్పి భారీ ఆపరేషన్ నిర్వహించిందా? సొంత సరిహద్దుల్లోనే ఇరాన్ బకరా అయ్యిందా? లేదంటే తన రాజకీయ, దౌత్య బలాన్ని చాటిచెప్పేందుకు ట్రంప్ మరోసారి అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారా? చర్చ రాజకీయ, దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
గల్ప్ దేశాలకు కొత్త టెన్షన్
ప్రపంచానికి హెచ్చరిక.. ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం మళ్లీ ప్రారంభం.. -
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
ప్రపంచదేశాలకు ఇరాన్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకూ హర్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఇరాన్ హెచ్చరికలు ఇంతటితో ఆగలేదు.నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే క్షిపణులు, నౌకాదళ బలగాలతో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన నెలకొంది.హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే గమ్యస్థానాలకు చేరుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అందుకే హర్ముజ్ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్‌గా మారింది.ఇరాన్ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు రెండు డాలర్లకుపైగా పెరిగాయి. సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైతే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు, అమెరికా మాత్రం పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని చెబుతోంది. కొన్ని వాణిజ్య నౌకలు ఇప్పటికీ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాయని, తమ యుద్ధనౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఇరాన్ హెచ్చరికలతో అనేక నౌకా సంస్థలు ఇప్పటికే తమ ప్రయాణాలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా–ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే హర్ముజ్ జలసంధి అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే కీలక సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్‌పై అమెరికా భీకర దాడులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ నామమాత్రంగానే మిగిలి.. పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక హర్ముజ్ జలసంధి నుంచి గల్ఫ్ దేశాల వరకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ప్రపంచం ఉత్కంఠగా పరిణామాలను గమనిస్తోంది.అమెరికా బలగాలు తాజాగా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై వరుసగా రెండో రోజు భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నాయి. ఈ దాడుల్ని అమెరికా స్వీయ రక్షణ దాడులుగా అభివర్ణించడం గమనార్హం. తాజా దాడుల్లో హర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని సిరిక్, మినాబ్, ఖేష్మ్ (Qeshm) దీవి, జాస్క్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. బందర్ అబ్బాస్ సమీపంలో కూడా వైమానిక హెచ్చరిక వ్యవస్థలు చురుగ్గా పనిచేసినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది. పలు రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.అంతేకాకుండా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే అసలుయె ప్రాంతంలోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై కూడా అమెరికా దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంధన, పెట్రోకెమికల్ రంగాలపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్ పశ్చిమ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పహారా పెంచాయి. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.సంచలన వ్యాఖ్యలుఅమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. "ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడాల్సి వస్తుంది" అంటూ ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా దాడులు ఇరాన్ సామర్థ్యాలను దెబ్బతీసేలా, తమ సైనిక కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు సృష్టించేలా కొనసాగుతాయని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్ స్పందనఅమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతోందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆరోపించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా ఈ దాడులను ఖండిస్తూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హైఅలర్ట్‌లోకి వెళ్లింది. తాజా పరిణామాలు చూస్తే అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం పరిమిత ప్రతీకార దాడుల దశ దాటి.. మరింత విస్తృత ఘర్షణ వైపు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్ దేశాల స్థిరత్వంపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
మరో వాణిజ్యనౌకపై అమెరికా దాడి
న్యూఢిల్లీ: ఒమన్‌లోని సోహర్ నగరానికి సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లో వాణిజ్య నౌక ‘ఎంటీ సెటెబెల్లో’పై బుధవారం అమెరికా సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. అంతే సంఖ్యలో భారతీయులున్న మరో చమురు రవాణా నౌక ‘ఎంటీ మ్యారీవెక్స్’పై అమెరికా రెండ్రోజుల క్రితం దాడి చేయడంపై భారత్ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వేళ ‘ఎంటీ సెటెబెల్లో’ నౌకపై దాడి జరగడం గమనార్హం. దాడి ఘటనపై భారత్ బుధవారం ఘాటుగా స్పందించింది. ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డి అఫైర్స్ జేసన్ మీక్స్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్ అధికారిక ప్రకటన వెలువర్చింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని మోదీ సర్కార్ తప్పుబట్టింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇకనైనా ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలమార్గాలల్లో స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పేర్కొంది. సెటెబెల్లో నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో ఇప్పటివరకు 21 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోందని వార్తలొచ్చాయి. -
డాక్టర్ రోబో.. ఫైవ్ ఇన్ వన్!
కాలం మారిపోతోంది. ఒకప్పుడు కత్తులతో శరీరాన్ని కోసి చేసిన శస్త్రచికిత్సలు ఇప్పుడు చిన్న కోతలతో పూర్తవుతున్నాయి. మెరుగైన ఫలితాలిస్తున్నాయి. రోగులకు ఆ చిన్న కోతల బాధ కూడా లేకుండా చేసేందుకు సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన రోబోను ఆవిష్కరించారు. శనగ గింజంత సైజుండే ఈ బుల్లి రోబో చేసే అద్భుతాలు అన్ని ఇన్నీ కావు.. పక్క ఫొటో చూశారా? అందులో శాస్త్రవేత్త చేతిలో కనిపిస్తున్న నల్లటి వస్తువే మన బుల్లి రోబో. దీని పొడవు 4.4 మిల్లీమీటర్లు. వైర్లూ, ఎల్రక్టానిక్స్, బ్యాటరీల్లాంటివి ఏవీ దీంట్లో ఉండవు. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్సలు చేసేస్తుంది. కణజాలాన్ని కోయడంతోపాటు శరీరంలో అవసరమైన చోటికి మందులు తీసుకెళ్లి వదిలిపెడుతుంది. కణజాలం లోపలి నుంచి సులభంగా ప్రయాణించగలదు. కేన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి బయాప్సీ చేయాలనుకోండి.. ఈ రోబోను వదిలితే చాలు.. ఎంచక్కా కావాల్సిన కణజాలాన్ని కత్తిరించి పట్టుకొచ్చేస్తుంది. అవసరమైనప్పుడు శరీరం లోపల వేడి పుట్టించి కొన్ని రకాల చికిత్సలకు సాయంగా నిలుస్తుంది కూడా. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సెకన్ కాలంలో ఒక పని నుంచి ఇంకోరకమైన పనికి మారగలగడం దీని ప్రత్యేకత. అయస్కాంత శక్తి మహిమ వైర్లూ, బ్యాటరీల్లాంటివి లేకుండానే ఈ రోబో కేవలం అయస్కాంత శక్తితో పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ ‘మ్యాగ్నెటిక్ మెడికల్ రోబోటిక్స్’కు ప్రాచుర్యం పెరుగుతోంది. రోబో శరీరం లోపల ఉంటే బయటి నుంచి వైద్యులు అయస్కాంతాల సాయంతో వాటిని కదలిస్తారు. ఇతర పనులు చేయిస్తారన్నమాట. అతి తక్కువ గాట్లూ, కోతలతో శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు ఈ రకమైన రోబోలు బాగా ఉపయోగపడతాయని అంచనా. వీటితో సంప్రదాయ పద్ధతుల్లో చేరుకోలేని శరీరం లోపలి భాగాల్లోనూ సర్జరీలు చేయడం సులువు అవుతుంది. ఈ రకమైన రోబోలు ఇప్పటివరకూ ఏదో ఒక పని మాత్రమే చేయగలిగేవి. మందులు తీసుకెళ్లేందుకు ఒకటి.. కత్తిరించేందుకు ఒకటి ఇలా.. దేనికదే అన్నమాట. అయస్కాంత క్షేత్ర ప్రభావం రోబో మొత్తమ్మీద ఒకేరకంగా పడుతూండటం వల్ల ఒక రోబోతో వేర్వేరు పనులు చేయించలేకపోయే వారు. ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ పరిమితిని అధిగమించగలిగారు. ఏడేళ్ల పరిశోధనలురోబోతో ఐదు రకాల పనులు చేయించేందుకు ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఏడేళ్లుగా కృషి చేస్తున్నారు. వేర్వేరు కోణాల్లోంచి రోబోను అయస్కాంతీకరించడం, సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా గత అవరోధాలను విజయవంతంగా అధిగమించామని శాస్త్రవేత్త లుమ్ గుయో ఝాన్ తెలిపారు. ఒక్కో కోణంలో ఈ మార్పులు చేయడం ద్వారా ఒక్కో రకమైన పని చేయించేలా తాము రోబోలో ఒక మాగ్నెటిక్ రీప్రోగ్రామబుల్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ బుల్లి రోబోలోని వేర్వేరు ప్రాంతాలు అయస్కాంతానికి భిన్న రీతుల్లో స్పందించేలా చేశామని, అయస్కాంత క్షేత్ర ప్రభావం ఈ ప్రాంతాలపై వేర్వేరుగా ఉంటుందని లుమ్ గుయో వివరించారు. సాఫ్ట్ రోబోటిక్స్‌లో విరివిగా వాడే పీడీఎంఎస్, ఎకోఫ్లెక్స్ వంటి పదార్థాలతో ఈ రోబోను తయారుచేశారు. పీడీఎంఎస్, ఎకోఫ్లెక్స్ అనేవి సిలికోన్ ఆధారిత పదార్థాలు. ఈ పదార్థంలోనే అక్కడక్కడ ఐదు మైక్రోమీటర్ల సైజున్న అయస్కాంత కణాలను ఏర్పాటు చేశారు. ఈ కణాల అమరిక, అయస్కాంతీకరణల ఆధారంగా రోబో కదలిక, పనులు ఆధారపడి ఉంటాయి. ఫైవ్ ఇన్ వన్ ఎలాగంటే... బయాప్సీ కోసం ఇందులో చిన్న బ్లేడ్ ఉంటుంది. రోబో గట్టిగా పట్టుకుంటే ఈ బ్లేడ్ కణజాలాన్ని కత్తిరించి తనలో దాచుకుంటుంది. బయటకు తీసుకొచి్చన తరువాత కణజాలాన్ని విశ్లేషించడం ద్వారా కేన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ జరుగుతుంది. మందులు పెట్టి రోబోను శరీరం లోపలికి పంపిస్తే ఆ రోబోనే ఔషధాన్ని శరీరంలోకి జొప్పిస్తుంది. ప్రత్యేకమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించడం ద్వారా దీన్ని వేడెక్కించవచ్చు. అల్సర్ల వంటి వాటిని మాడ్చి మాన్పేందుకు ఉపయోగించవచ్చు. కేన్సర్‌కూ ఈ హైపర్ థెర్మియా పద్దతిని వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కణజాలం మధ్య కదిలేందుకు ఈ రోబోకు దొర్లుకుంటూ వెళ్లే సామర్థ్యాన్ని కల్పించారు. దీంతో రోబో ఎటు కావాలంటే అటు వెళ్లిపోగలదు. కోడి లివర్‌లో, కృత్రిమ కణజాలం నమూనాల్లో ఈ రోబోను ఇప్పటికే పరిశీలించి సత్ఫలితాలు సాధించామని, మానవ చర్మకణాలతో ప్రయోగాలు జరిపి ఈ రోబో ద్వారా శరీరానికి హాని ఏదీ జరగదని నిర్ధారించుకున్నామని లుమ్ గుయో ఝాన్ తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కార్గో నౌకపై దాడి ఘటన.. ముగ్గురు భారతీయుల గల్లంతు
ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 21 మంది భారతీయులను రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ (బుధవారం) ధృవీకరించింది. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఒమన్ అధికారులతో కలిసి గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఒమన్ గల్ఫ్‌లోని సోహార్ తీరంలో పలావు (Palau) జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఇంజన్ రూమ్‌ను మిస్సైల్ తాకింది. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ నౌక ఒమాన్‌లోని సోహార్ పోర్టుకు ఈశాన్య దిశలో సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దాడికి గురైన వెంటనే ప్రమాద సంకేతం (distress call) పంపింది. ఈ దాడి కారణంగా నౌకలో అగ్ని ప్రమాదం కూడా సంభవించినట్లు సమాచారం.కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. -
మూల్యం చెల్లించుకోవాల్సిందే : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమతో ఒప్పందానికి రాకుండా, గ్రేట్ డీల్‌ను మిస్ చేసుకుంది అంటూ ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పదే పదే ప్రకటించే ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది, అన్నీ ఉత్తమాటలే, చేతలేమీ లేవు అంటూ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ప్లాట్ఫామ్లో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సైనిక సామర్థ్యం దారుణంగా క్షీణించిందని, మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాన్ని ఇరాన్ నాయకత్వం చేజేతులా వృధా చేసుకుందన్నారు. ఇరాన్ సైన్యం పూర్తిగా అతలాకుతలమైంది. అసలు నౌకాదళం, వాయుసేన వంటి చాలా విభాగాలు ఉనికిలోనే లేవు, పూర్తి ఓటమి పాలయ్యారంటూ అని ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు అంతా మాటలే.. చేతల్లో ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్ పెత్తందారు కథ ముగిసింది!!! అంటూ ఇరాన్‌పై ధ్వజమెత్తారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన గడువును ప్రస్తావిస్తూ చర్చలను తెగనీయకుండా సాగదీశారని ఇరాన్ నేతలను విమర్శించారు. ఎంతో మేలు చేకూర్చే ఒప్పందంపై చర్చలకు చాలా సమయం తీసుకున్నారు,ఇప్పుడు దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!!!" అని ఆయన హెచ్చరించారు. > ఇదీ చదవండి: భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్ వీడియోఇరాన్ లక్ష్యాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో వాషింగ్టన్‌తో చర్చల భవిష్యత్తుపై తాము పునఃసమీక్షిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. అమెరికా పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబిస్తూ, కాల్పుల విరమణ అవగాహనలను పదేపదే ఉల్లంఘిస్తూ దౌత్య ప్రక్రియను దెబ్బతీస్తోందని ఆరోపించారు.అయితే మధ్యప్రాచ్యంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ఇరాన్‌తో గ్రీట్ డీల్‌కి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నప్పటికీ, దీన్ని ఇరాన్ ఖండిస్తూ వస్తోంది. సైనిక దాడులు కొనసాగుతున్నంత కాలం దౌత్యం విజయవంతం కాలేదని స్పష్టం చేస్తూ మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తకాగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో అమెరికాకు చెందిన 'అపాచీ' దాడి హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నిఘా కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ తాజా ఘర్షణల తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఇది మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనలను పెంచింది.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ -
పీవోకేలో కుప్పకూలిన హెలికాప్టర్.. 21 మంది మృతి
పీవోకేలో ఘోర విషాదం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన Mi-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో కుప్పకూలింది.దీంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది సైనికులు మృతిచెందారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం పీవోకోలో తీవ్ర నిరసనలు తలెత్తిన నేపథ్యంలో నీలమ్ వ్యాలీ సెక్టార్‌కు అదనపు బలగాలను తరలిస్తుండగా టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పటికీ అది విఫలమై కూలిపోయిందని పాక్ మీడియా తెలిపింది.పీఓకే ప్రాంతాల్లో నిరసనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ భారీ ప్రమాదం సంభవించడంతో హెలికాప్టర్‌పై దాడులు జరిగాయా అనే అనుమానం తలెత్తింది. బలూచ్ ఆర్మీ దాడులు చేసిందని వార్తలు రావడంతో తీవ్ర ఆందోళనలు రేకేత్తాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని ఆర్మీ నిర్ధారించింది. -
రెండు వారాల్లో కీలక ప్రకటన: ట్రంప్
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడిు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు.అమెరికా హెలికాప్టర్ అపాచీపై దాడి చేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. అమెరికా స్థావరాలపై మొత్తం 21పైగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో జరిపిందని దానికి ప్రతిచర్యగా ఈ అటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.అయితే డొనాల్ట్ ట్రంప్ సైతం ఈ దాడులపై గుర్రుగా ఉన్నారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. ఇరాన్ అని దానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు. యుద్ధంలో అమెరికా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోందని మరో రెండు వారాల్లో ఇరాన్‌పై సంపూర్ణ విజయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ ప్రకటనతో చమురు ధరలు సైతం దిగొస్తాయని ప్రకటించారు.అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సైతం ఘూటుగానే బదులిచ్చింది. ఎలాంటి దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిదాడి తీవ్రంగా జరుగుతుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహు సైతం ఇరాన్‌పై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. -
‘డ్రాగన్ మిలిటరీతో వీటికి సంబంధం ఉంది’
ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్న చైనా కంపెనీలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. చైనా సైన్యానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహకరిస్తున్నాయనే అనుమానంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ, బ్యాటరీ తయారీ సంస్థలతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తన ‘మిలిటరీ లింక్డ్ కంపెనీ’ల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ తాజా జాబితా అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది.బ్లాక్‌లిస్ట్‌లోకి చేరిన ప్రముఖ కంపెనీలుఅమెరికా రక్షణ శాఖ ఆంక్షల పరిధిలోకి తెచ్చిన చైనా కంపెనీల్లో గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న టాప్ బ్రాండ్లు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ విభాగంలో.. అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీదారులైన ట్రినా సోలార్, జేఏ సోలార్ టెక్నాలజీ ఉన్నాయి. ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో గ్లోబల్ లీడర్లుగా ఉన్న ఈవ్ ఎనర్జీ, సీఏఎల్‌బీ గ్రూప్ సంస్థలున్నాయి. చైనా ఈ-కామర్స్‌లో కీలకంగా ఉన్న అలీబాబా, ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ప్రొవైడర్ బైడు, బయోటెక్నాలజీ సంస్థ వుజి యాప్ టెక్ ఉన్నాయి.అమెరికా చట్టం ఏం చెబుతోంది?పెంటగాన్ నిబంధనల ప్రకారం, ఈ మిలిటరీ లింక్డ్ జాబితాలో చేరిన కంపెనీలపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తుంది. అమెరికా రక్షణ శాఖ ఈ కంపెనీలతో నేరుగా ఎలాంటి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. 2027 నాటికి థర్డ్ పార్టీల ద్వారా కూడా ఈ కంపెనీల ఉత్పత్తులను లేదా సేవలను కొనుగోలు చేయకుండా పూర్తిస్థాయిలో పరిమితులు అమల్లోకి వస్తాయి.కంపెనీలు ఏం చేయబోతున్నాయి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా కంపెనీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీనిపై ట్రినా సోలార్ స్పందిస్తూ.. తాము ఎలాంటి సైనిక సంబంధిత కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని ట్రినా సోలార్ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయం పూర్తిగా నిరాధారమైనదని కొట్టిపారేసింది. ‘అమెరికా ప్రభుత్వం వెంటనే ఈ పొరపాటు నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలి. అంతర్జాతీయంగా న్యాయమైన, సమానమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించాలి. దీన్ని సవాలు చేస్తూ ఇప్పటికే చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాం’ అని ట్రినా సోలార్ ఒక అధికారిక ప్రకటనలో డిమాండ్ చేసింది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
పాక్ దాడులు.. 11 మంది చిన్నారులు మృతి
కాబూల్: పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నిన్న ( మంగళవారం) రాత్రి తాలిబన్ల భూభాగంపై పాక్ వైమానిక దాడులతో విరుచుకపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో అధికంగా చిన్నారులే ఉన్నట్లు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. చిన్నారులు నిద్రపోతున్న సమయంలో దాడులు చేయడంతో వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ దేశ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.గత కొద్ది కాలంగా అఫ్గానిస్థాన్- పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి ని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకున్నాయని పాక్ వైమానిక దళం విరుచుకపడింది. అయితే ఈ దాడిపై అఫ్గాన్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.ఆయన మాట్లాడుతూ "నిన్న రాత్రి, పాకిస్తానీ సైన్యం మరోసారి ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించి, కునార్, ఖోస్ట్ మరియు పక్తికా ప్రావిన్సులలోని పౌరుల ఇళ్లపై బాంబులు వేసింది. దీని ఫలితంగా 11 మంది పిల్లలు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మరణించారు.మరో 14 మంది మహిళలు, పిల్లలు గాయపడ్డారు.బాధితులు నిద్రిస్తున్న సమయంలో రాత్రిపూట దాడులు జరిగాయి., దీంతో బాంబు దాడుల నుండి తప్పించుకోవడానికి వారికి ఏమాత్రం అవకాశం లభించలేదు. ఇది పూర్తిగా అమానవీయం" అని అన్నారుఅదే విధంగా గత కొద్దికాలంగా పాక్ దాడుల్లో మృతిచెందిన చిన్నారులతో కూడిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. కాగా పాక్ జరిగిన దాడుల్లో మెుత్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక దాడితో అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త
భార్య వైద్య అవసరాల కోసం నానా పాట్లు డుతోంటే భర్త ఏకంగా రూ. 19 కోట్లను దాచిపెట్టి, తనకు కనీసం 35 వేలు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టాడని ఒక మహిళ వాపోయిన వైనం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం,తన భర్త తనకు తెలియకుండా ఇన్నాళ్లుగా సుమారు 14 మిలియన్ యువాన్లను (దాదాపు రూ.19 కోట్లు) రహస్యంగా ఉంచాడని చైనాకు చెందిన 53 ఏళ్ల మహిళ గుర్తించింది. ఒక పక్క తాను దాదాపు రూ. 95వేల వైద్య బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, ఆయన మాత్రం విలాసంగా జీవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఆస్తులన్నింటినీ రహస్యంగా ఉంచాడనిఆరోపించింది. విడాకుల ప్రక్రియ సమయంలో ఆర్థిక రికార్డులను పరిశీలించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. తన ఆదాయాన్నిగానీ, ఆస్తులను గానీ ఎపుడూ వెల్లడించలేదని వాపోయింది. ఇంతకాలం అవగాహన లేక అతని ఆస్తిపాస్తులపై పట్టించుకోలేదని వాపోయింది.వైద్య ఖర్చులకు ఇబ్బందులుఇంత సంపద దాచిపెట్టినప్పటికీ, తన భర్త కనీస ఆర్థిక సాయం చేయడానికి కూడా నిరాకరించాడని వాంగ్ ఆరోపించింది. తనకు నెలకు ఇవ్వాల్సిన 2,500 యువాన్ల (సుమారు రూ.35,000) అలవెన్స్‌ను ఇచ్చేందుకు నిరాకరించాడని, అలాగే తన వైద్య చికిత్సకు ఒక్క రూపాయికూడా సహాయం చేయలేదని ఆమె పేర్కొంది. బీజింగ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో చాలా పొదుపుగా జీవించాల్సి వచ్చిందని. అద్దె తక్కువ ఇంట్లో ఉంటూ, చౌక ధరల బట్టలు ధరిస్తూ , వైద్య ఖర్చులు భరించే స్తోమత లేక ఇబ్బందులు పడ్డాడని వెల్లడించింది. ఈ సమయంలో తన భర్త మాత్రం బ్రాండెడ్ వస్తువులు, కాస్మెటిక్ ట్రీట్మెంట్ల కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడని ఆమె ఆరోపించింది.గృహహింస, శారీరక దాడి ఈ కేసులో తీవ్రమైన గృహహింస ఆరోపణలు మరో ముఖ్యమైన అంశం. భర్త చేతిలో పదేళ్ల పాటు శారీరక హింసను భరించింది. ఆమె కొట్టిన దెబ్బలు పక్కటెముకలు విరగడమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన 100 కి పైగా ఫోటోలను ఆమె ఆధారాలుగా చూపించింది. ఈ శారీరక హింస , ఆర్థిక నియంత్రణ వల్లే తాను తీవ్రమైన డిప్రెషన్‌కు, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలపై కుక్కలను ఉసిగొల్పి..
జెరూసలెం: అక్టోబర్ 2023 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకున్న పాలస్తీనా ఖైదీలపై జరుపుతున్న అమానుష విచారణ పర్వం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇజ్రాయెల్ జైళ్లు పాలస్తీనియన్లకు నరకంగా మారాయంటూ అల్ జజీరా దర్యాప్తులో వెల్లడైన బాధితుల వాంగ్మూలాలు కలకలం రేపుతున్నాయి. తమకు హమాస్ దాడులతో ఎలాంటి సంబంధం లేదని మొత్తుకుంటున్నా వినకుండా, ఖైదీలను జంతువుల కంటే హీనంగా చూస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నారు.కుక్కలతో లైంగిక దాడి.. సైనికుల పైశాచిక నవ్వులుఒక మాజీ ఖైదీ అందించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2024లో రంజాన్ ముగిసే సమయంలో సుమారు 12 మంది సైనికులు తమపైకి శిక్షణ పొందిన కుక్కలను వదిలారు. బట్టలు విప్పేసి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, సైనికుల ఆదేశాల మేరకు కుక్కలను కూడా ఈ అకృత్యానికి ఉపయోగించారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తాము కేకలు వేస్తున్నా, సైనికులు నవ్వుకుంటూ ఆ దృశ్యాలను మొబైల్లో రికార్డ్ చేశారని ఆ గాజా నివాసి పేర్కొన్నాడు. ఖైదీల పేర్లను తొలగించి నంబర్లను కేటాయించారని, బోర్లా పడుకోబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి, వారిపై కుక్కలను నడిపించారని వెల్లడైంది.మహిళా అధికారుల అకృత్యాలు.. బూట్లతో తొక్కుతూ అరాచకంగాజాకు చెందిన మరో కార్మికుడు తనకు ఎదురైన నరకాన్ని వివరిస్తూ.. ఇజ్రాయెల్ జైళ్లలో మహిళా అధికారులు సైతం కృత్రిమ వస్తువులతో తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చేతులను వెనక్కి విరిచి ఇనుప సంకెళ్లు వేసి, బట్టలు ఊడదీసి హింసించారని తెలిపాడు. సైనికులు తన వీపుపై, మెడపై బూట్లతో తొక్కి పట్టి ఉంచగా, చుట్టూ ఉన్న మిగతా సైనికులు చప్పట్లు కొడుతూ వీడియోలు తీశారని వివరించాడు. తాము ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి దాడులు చేశామనే కోపంతోనే ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ గార్డులు అన్నారని బాధితుడు పేర్కొన్నాడు.తప్పేం కాదు: ఇజ్రాయెల్ నేతల సమర్థనగతంలో దక్షిణ ఇజ్రాయెల్ నిర్బంధ కేంద్రంలో ఒక ఖైదీపై జరిగిన లైంగిక దాడి వీడియో లీకై తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై కొందరు ఐడీఎఫ్ సైనికులను అరెస్ట్ చేయగా, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్టీకి చెందిన ఎంపీ హనోచ్ మిల్విడ్స్కీ వింత వాదనను వినిపించారు. ఖైదీలపై ఇటువంటి చర్యలు చట్టబద్ధమేనా అని ప్రశ్నించగా, ‘అతడు హమాస్ ఉగ్రవాది అయితే.. ఏం చేసినా చట్టబద్ధమే.. ఏదైనా చేయవచ్చు’ అని సమర్థించారు. దేశ జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్ గ్విర్ సైతం ఆ సైనికులకు మద్దతు ప్రకటించడం గమనార్హం.ఇది కూడా చదవండి: జోహన్నెస్‌బర్గ్‌లో మారణహోమం.. 12 మంది మృతి -
జోహన్నెస్‌బర్గ్‌లో మారణహోమం.. 12 మంది మృతి
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో మంగళవారం అర్ధరాత్రి వేళ కాల్పుల కలకలం చేటుచేసుకుంది. ఈస్ట్ జోహన్నెస్‌బర్గ్‌లోని క్లీవ్‌ల్యాండ్ పరిధిలో ఉన్న జంపర్స్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్పై గుర్తు తెలియని దుండగులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ దారుణ సాయుధ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:10 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సౌత్ ఆఫ్రికన్ పోలీస్ సర్వీస్ బుధవారం తెలిపింది.అర్ధరాత్రి వేళ మారణకాండజంపర్స్ సెటిల్మెంట్లో కాల్పులు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే అక్కడ ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతడు మరణించాడు. గాయపడిన మరో తొమ్మిది మంది బాధితులకు ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.పక్కా స్కెచ్‌తో విరుచుకుపడ్డ దుండగులుఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పక్కా ప్లాన్‌తో వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒక తెల్లటి టయోటా క్వాంటం వాహనంలో 10 మందికి పైగా సాయుధ దుండగులు క్లీవ్‌ల్యాండ్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరుకున్నారు. అనంతరం వారు ఆ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్కు ఉన్న రెండు ప్రవేశ మార్గాల గుండా లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న స్థానికులపై ఏకపక్షంగా, విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగారు. అనంతరం అదే వాహనంలో అక్కడి నుండి పరారయ్యారు.ముమ్మరంగా సాగుతున్న గాలింపు చర్యలుఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుల లక్ష్యం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాగా, ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటిగా ఉంది, ఇక్కడ సగటున రోజుకు 60 హత్యలు జరుగుతుండటం గమనార్హం. -
తాలిబన్ కమాండర్‌కు అమెరికాలో 42 ఏళ్ల శిక్ష!
వాషింగ్టన్: అమెరికా సైనికుల మరణాలకు కారకుడు, అంతర్జాతీయ జర్నలిస్ట్‌ను బందీ చేసిన తాలిబన్ మాజీ కమాండర్ హాజీ నజీబుల్లాకు అమెరికా ఫెడరల్ కోర్టు 42 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్షను ఖరారు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ కాలంలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన ఈ 50 ఏళ్ల నిందితుడు, అమెరికా కోర్టులో తన నేరాలను అంగీకరించాడు. ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వడం, విదేశీయులను బందీలుగా మార్చడం వంటి అభియోగాలపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ సంచలన తీర్పును వెల్లడించింది.అమెరికా సైనికులపై ఘాతుకం2007 నుండి 2009 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్లోని వర్దక్ ప్రావిన్స్‌లో తాలిబన్ కమాండర్‌గా నజీబుల్లా నెత్తుటి ఏరులు పారించాడు. నాటో దళాలు, అమెరికా సైనికులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, ఐఈడీ పేలుళ్లను ఇతని నాయకత్వంలోనే ఉగ్రవాదులు అమలు చేశారు. ముఖ్యంగా 2008 జూన్ 26న అమెరికా మిలిటరీ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులతో పాటు ఒక ఆఫ్ఘన్ అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఉగ్రదాడికి తానే బాధ్యుడినంటూ నజీబుల్లా అప్పట్లో బాహాటంగానే చెప్పుకున్నాడు.జర్నలిస్ట్ కిడ్నాప్.. తుపాకీ నీడలో 7 నెలలుసైనికులపై దాడుల అనంతరం 2008 నవంబర్‌లో ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ డేవిడ్ రోడ్, అతని డ్రైవర్, అనువాదకుడిని నజీబుల్లా బృందం కిడ్నాప్ చేసింది. వారిని పాకిస్తాన్‌లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతాలకు తరలించి, దాదాపు ఏడు నెలల పాటు బందీలుగా ఉంచారు. అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, తుపాకీ గురిపెట్టి జర్నలిస్ట్‌తో ప్రాధేయపడేలా వీడియోలు రికార్డు చేయించారు. అయితే ఆ జర్నలిస్ట్ 2009 జూన్‌లో ఉగ్రవాదుల నుండి తప్పించుకున్నారు.చాకచక్యంగా అరెస్ట్.. న్యాయం గెలిచిందిదాదాపు దశాబ్ద కాలం పాటు తప్పించుకు తిరిగిన నజీబుల్లాను 2020లో ఉక్రెయిన్‌లో అంతర్జాతీయ దళాలు పట్టుకుని అమెరికాకు అప్పగించాయి. అమెరికా పౌరులను, సైనికులను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు ఎంతకాలం తప్పించుకున్నా వదిలిపెట్టేది లేదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అన్నారు.ఇది కూడా చదవండి: ఐర్లాండ్‌లో చెలరేగిన అల్లర్లు: కత్తిపోట్ల ఘటనతో.. -
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయా?. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న సంచలన నిర్ణయం అవుననే అంటోంది. ఇకపై అమెరికా మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నామని అమెరికా ముందుగానే ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.పశ్చిమాసియా సంక్షోభంపై జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని.. కానీ అవసరమైతే అందుకు వెనుకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో.. అమెరికా-ఇరాన్ డీల్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ఇరాన్ ఒప్పందమైనా.. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం నేపథ్యంతో శాంతి చర్చలకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఇరాన్, అటు లెబనాన్‌లో యుద్దానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్(దక్షిణ ప్రాంతాల్లో)పై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే వస్తోంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లెబనాన్‌పై సైనిక చర్య ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెతన్యాహుని ట్రంప్ మందలిస్తున్నారని కొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ, నెతన్యాహు మాత్రం అదేం పట్టించుకోకుండా ‘పరిమిత దాడులకు’ ఆదేశాలిస్తూనే వస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య డీల్ కుదిరితే.. తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే యోచనలో ఇజ్రాయెల్ ఉంది, అందుకే ఇరాన్ ఒప్పందంలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని నెతన్యాహు ట్రంప్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చి మరీ దాడులు?ఇటు హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించాయి. జాస్క్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా(ఇరాన్ దాడికి ప్రతీకారంగానే!) తమ దాడులు పూర్తయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇటు.. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై జరిగిన ప్రతి దాడికి సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చిరించిన కాసేపటికే దాడులు జరిగాయి. అమెరికా స్థావరాలు, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ఐదో నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులకు దిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇటు అమెరికా సైనిక దూకుడు కొనసాగితే మరింత తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే..మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నామని ఇజ్రాయెల్‌కు అమెరికా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తాజా దాడులు ఆ సమాచారం అనుగుణంగానే జరిగాయా? లేదంటే అమెరికా ఇరాన్‌పై మరేదైనా కొత్త దాడులకు వ్యూహ రచన చేస్తోందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
ఐర్లాండ్‌లో చెలరేగిన అల్లర్లు: కత్తిపోట్ల ఘటనతో..
బెల్ఫాస్ట్: ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒక స్థానిక వ్యక్తిపై సుడాన్ దేశానికి చెందిన శరణార్థి జరిపిన కత్తిపోట్ల దాడి.. నగరంలో భారీ ఎత్తున వలస వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు వీధుల్లోకి వచ్చి, వలసదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి, దీనిని ఒక ‘తీవ్రమైన సంక్షోభ పరిస్థితి’గా ప్రకటించారు.అర్ధరాత్రి ఘోరం.. కత్తితో విచక్షణారహితంగా దాడిబెల్ఫాస్ట్లోని కిన్నైర్డ్ ఎవెన్యూలో సోమవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. స్టీఫెన్ ఓగిల్వీ (44) అనే స్థానిక వ్యక్తిపై 30 ఏళ్ల సుడాన్ శరణార్థి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఓగిల్వీ ముఖం, మెడ, వీపు, కళ్ల భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.సోషల్ మీడియాలో వైరల్ వీడియోతో..నడిరోడ్డుపై జరిగిన ఈ భీభత్సానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం కావడంతో ప్రపంచవ్యాప్త రైట్-వింగ్ నేతలు తీవ్రంగా స్పందించారు. బ్రిటీష్ నేత జేమ్స్ రాబిన్సన్ ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ నిరసనలకు పిలుపునిచ్చారు. ఎలాన్ మస్క్ సైతం ఈ వీడియోను రీపోస్ట్ చేస్తూ, నిరసనలు జరగబోయే ప్రాంతాల వివరాలను పంచుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ముసుగులు ధరించిన నిరసనకారులు శరణార్థుల ఇళ్లపై రాళ్లు, ఇటుకలతో దాడులు చేస్తూ ‘స్థానిక ఇళ్లు స్థానికులకే’ అంటూ గోడలపై నినాదాలు రాశారు.తగలబడుతున్న వీధులు.. ఈ వలస వ్యతిరేక ప్రదర్శనలు కాస్తా హింసాత్మకంగా మారడంతో బెల్ఫాస్ట్ వీధులు రణరంగాన్ని తలపించాయి. నిరసనకారులు వలసదారుల ఇళ్లను, వాహనాలను తగులబెట్టారు. ఒక మిడిల్ ఈస్టర్న్ సూపర్‌మార్కెట్‌కు కూడా నిప్పు పెట్టారు. ప్రాణభయంతో వలసదారులు తమ ఇళ్లను వదిలి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి లాంగ్ ఈ హింసాకాండను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజలంతా సంయమనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: అఫ్గాన్‌పై పాక్ భీకర వైమానిక దాడులు.. 13 మంది దుర్మరణం -
అఫ్గాన్‌పై పాక్ భీకర వైమానిక దాడులు.. 13 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: సరిహద్దు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. అఫ్గానిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక దాడితో అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అఫ్గాన్ ఆరోపణలు.. పాక్ దాడులుఅఫ్గానిస్తాన్ భూభాగమే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం ఈ వైమానిక దాడులకు తెగబడిందని అఫ్గాన్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక పాక్ సైనిక వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.భారీగా ప్రాణనష్టం.. ఆందోళనలో ప్రజలుఈ తాజా వైమానిక దాడులలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందింది. గాయపడిన 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడులు ఏయే నిర్దిష్ట ప్రాంతాలలో జరిగాయి? మరణించిన వారి పూర్తి వివరాలు, వారి గుర్తింపును అఫ్గాన్ అధికార యంత్రాంగం ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతఈ దాడుల అనంతరం ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత కొంతకాలంగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో ఈ వైమానిక దాడులు జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది.ఇది కూడా చదవండి: అమెరికా పౌరసత్వం రద్దు.. ఎవరీ నీరజ్ శర్మ? -
అమెరికా పౌరసత్వం రద్దు.. ఎవరీ నీరజ్ శర్మ?
న్యూఢిల్లీ: ట్రంప్ ప్రభుత్వం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పౌరసత్వాల రద్దు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మోసపూరిత పద్ధతుల్లో, తప్పుడు సమాచారంతో అమెరికా పౌరసత్వం పొందిన 17 మంది పౌరులను లక్ష్యంగా చేసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. ఈ జాబితాలో న్యూజెర్సీకి చెందిన భారతీయ సంతతి వ్యాపారవేత్త, మాజీ సీఈఓ నీరజ్ శర్మ (50) పేరు ఉండటం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.వీసా మోసం.. ఫోర్జరీ భారత్‌లో జన్మించిన నీరజ్ శర్మ, ‘మాగ్నానివిజన్ ఎల్ఎల్సీ’ అనే ఐటీ స్టాఫింగ్ కంపెనీని నిర్వహిస్తూ విదేశీ ఉద్యోగుల తరపున హెచ్-1బీ వీసా పిటిషన్లను దాఖలు చేసేవారు. ఒక ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలో ఈ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు చూపుతూ.. ఆయన 11 నకిలీ హెచ్-1బీ పిటిషన్లను సమర్పించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ దరఖాస్తుల కోసం సదరు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ పత్రాలను కూడా సృష్టించినట్లు తేలింది. ఈ మోసం 2015 నుండి 2017 మధ్య కాలంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు.పౌరసత్వం రద్దుకు దారితీసిన అబద్ధం నీరజ్ శర్మ డిసెంబర్ 2017లో అమెరికా పౌరసత్వం పొందారు. అయితే పౌరసత్వ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆయన .. తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన వీసా మోసం కేసులో దోషిగా తేలారు. తాజా కోర్టు ఫైలింగ్స్ ప్రకారం.. పౌరసత్వ అర్హతను దెబ్బతీసే తన నేరపూరిత ప్రవర్తనను శర్మ ఉద్దేశపూర్వకంగా దాచారని న్యాయ శాఖ వాదిస్తోంది. మోసపూరిత సమాచారంతో పొందిన పౌరసత్వాన్ని చట్టప్రకారం రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం పట్టుబడుతోంది.ట్రంప్ సర్కార్ వేటలో మరికొందరు అమెరికా ప్రభుత్వం కేవలం వలసల మోసాలకే పరిమితం కాకుండా.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని కూడా ఏరివేస్తోంది. ఈ 17 మంది జాబితాలో చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, మనీలాండరింగ్, వైర్ ఫ్రాడ్, డ్రగ్స్ వంటి ఘోరమైన నేరాలకు పాల్పడి పౌరసత్వం పొందిన వారు ఉన్నారు. వీరిలో ఒక హైతీ వలసదారుడు, కొలంబియాకు చెందిన మాజీ క్యాథలిక్ ప్రీస్ట్, మెక్సికోకు చెందిన వ్యక్తితో పాటు మాజీ యుగోస్లావ్ పౌరుడు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇది కూడా చదవండి: సైనికులకు ఘోర అవమానం: సాయంత్రం ఐదుకు బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా.. -
ఆశలన్నీ ఇంక ఆ నలుగురి మీదే!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో ముందడుగు వేసింది. దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి మనుషుల్ని దింపాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆర్టిమిస్ మిషన్‌కు సంబంధించిన ఓ ప్రకటన చేసింది. ఆర్టెమిస్-3 మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించింది. భవిష్యత్‌లో చంద్రుడిపై మానవుల శాశ్వత ఉనికికి బాటలు వేసే కీలక మిషన్ ఇది. అలాంటప్పుడు ఈ నలుగురినే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. నాసా ఎంపిక చేసిన ఈ బృందంలో కమాండర్ రాండీ బ్రెస్నిక్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పైలట్ లూకా పార్మిటానో, నాసా వ్యోమగాములు ఫ్రాంక్ రూబియో, ఆండ్రే డగ్లస్ ఉన్నారు. ఇందులో ఆండ్రే డగ్లస్‌ను మినహాయిస్తే మిగతా ముగ్గురు అంతరిక్షయానం చేసి ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన అనుభవం, టెస్ట్ పైలటింగ్ నైపుణ్యాలు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు నాసా వెల్లడించింది. అలాగని వాళ్ల బ్యాక్గ్రౌండ్లు ఆషామాషీగా లేవు.. రాండీ బ్రెస్నిక్: మిషన్‌కు సారథిఆర్టెమిస్-3 కమాండర్‌గా ఎంపికైన రాండీ బ్రెస్నిక్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాముల్లో ఒకరు. అమెరికా మెరైన్ కార్ప్స్ మాజీ పైలట్ అయిన ఆయన వేల గంటలపాటు యుద్ధ విమానాలను, టెస్టింగ్ ఫ్లైట్స్ నడిపారు. ఇప్పటికే రెండు అంతరిక్ష ప్రయాణాలు పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమాండర్‌గా కూడా సేవలందించారు. పలు స్పేస్‌వాక్‌లలో పాల్గొని అంతరిక్షంలో క్లిష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. దీర్ఘకాలిక మిషన్ల నిర్వహణలో ఆయన అనుభవమే ఆర్టెమిస్-3లో ప్రధాన బలంగా భావిస్తున్నారు.లూకా పార్మిటానో: యూరప్ అంతరిక్ష వీరుడుఇటలీకి చెందిన లూకా పార్మిటానో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తరఫున ఈ బృందంలో చోటు దక్కించుకున్నారు. మాజీ ఫైటర్ పైలట్ అయిన ఆయన ఇప్పటికే రెండు అంతరిక్ష యాత్రలు పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇటాలియన్గా రికార్డు సృష్టించారు. స్పేస్‌వాక్‌లలో విశేష అనుభవం ఉన్న ఆయన అంతరిక్షంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్టెమిస్-3లో ఆయన ఎంపిక నాసా-యూరప్ అంతరిక్ష సహకారానికి ప్రతీకగా నిలుస్తోంది.ఫ్రాంక్ రూబియో: రికార్డు సృష్టించిన వ్యోమగామినాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం ఆయన అంతరిక్షంలో గడిపిన సమయం. అమెరికన్ వ్యోమగాముల్లో అత్యధిక కాలం నిరవధికంగా అంతరిక్షంలో ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. వైద్యుడిగా, సైనిక అధికారిగా సేవలందించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మానవ శరీరంపై అంతరిక్ష ప్రభావాలను అధ్యయనం చేయడంలో ఆయన అనుభవం ఆర్టెమిస్-3 మిషన్‌కు ఎంతో ఉపయోగపడనుంది.ఆండ్రే డగ్లస్: ఇంట్రెస్టింగ్ఈ బృందంలో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక ఆండ్రే డగ్లస్. ఇంజినీరింగ్, రోబోటిక్స్, మానవ-యంత్ర వ్యవస్థలపై నైపుణ్యం కలిగిన ఆయన చంద్రుడిపై భవిష్యత్ కార్యకలాపాల కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష ప్రయాణ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్ చంద్రయాత్రల సాంకేతిక రూపకల్పనలో ఆయన చేసిన కృషిని గుర్తించి నాసా ఈ బృందంలో చోటు కల్పించింది.అమెరికా-యూరప్ కలయికఆర్టెమిస్-3 బృందంలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక యూరోపియన్ వ్యోమగామికి చోటు కల్పించడం యాదృచ్ఛికం కాదు. చంద్రుడిపై భవిష్యత్ అన్వేషణలు ఒక్క దేశం ఆధిపత్యంలో కాకుండా అంతర్జాతీయ భాగస్వామ్యంతో సాగుతాయనే సందేశాన్ని నాసా ఇవ్వాలనుకుంటోంది. ఆర్టెమిస్ కార్యక్రమంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అందుకే లూకా పార్మిటానో ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.ఇది ట్రయల్ మాత్రమే!ఈ నలుగురి బాధ్యత చంద్రుడిపై అడుగుపెట్టడం మాత్రమే కాదు. భవిష్యత్‌లో చంద్రుడిపై మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం వంటి మహత్తర లక్ష్యాలకు అవసరమైన సాంకేతికతను పరీక్షించడం. అందుకే ఆర్టెమిస్-3 బృందాన్ని నాసా సాధారణ వ్యోమగాముల బృందంగా కాకుండా, మానవ అంతరిక్ష అన్వేషణ తదుపరి అధ్యాయాన్ని రాసే బృందంగా అభివర్ణిస్తోంది.ఇప్పటికే ఆర్టెమిస్-1 ద్వారా మానవరహిత పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాసా, ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి భూమికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్టెమిస్-3తో మరింత కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కానీ, ఇక్కడో క్లారిటీ అవసరం. ఆర్టెమిస్-3 మనుషుల్ని చంద్రుడి మీదకు దించే యాత్ర కాదు. భవిష్యత్‌లో చంద్రుడిపై వ్యోమగాములను సురక్షితంగా దించేందుకు అవసరమైన అత్యంత కీలక సాంకేతిక ప్రక్రియలను పరీక్షించడమే దీని ప్రధాన లక్ష్యం. సుమారు రెండు వారాల పాటు కొనసాగే ఈ మిషన్‌లో వ్యోమగాములు భూమి కక్ష్యలోనే ఉండి చంద్రుడిపై దిగే ల్యాండర్లతో డాకింగ్ ప్రక్రియను సాధన చేస్తారు. భవిష్యత్ చంద్రయాత్రల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మిషన్‌లో మరో ఆసక్తికర అంశం.. ప్రైవేట్ కంపెనీల పాత్ర. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ అభివృద్ధి చేస్తున్న ‘బ్లూ మూన్’ ల్యాండర్, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ రూపొందిస్తున్న ‘స్టార్‌షిప్’ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్‌లతో ఈ వ్యోమగాములు డాకింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. భవిష్యత్ అంతరిక్ష యుగంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి ఎలా పనిచేయబోతున్నాయో ఈ మిషన్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాబట్టి.. నాసా "మూన్ ల్యాండింగ్‌కు ముందు ఫైనల్ రిహార్సల్"గా అభివర్ణిస్తోంది.అందుకే కీలకంఅంటే ఆర్టెమిస్-3 అనేది చంద్రయాత్రకు ముందు చివరి పరీక్ష. భవిష్యత్‌లో చంద్రుడిపై దిగే వ్యోమగాముల భద్రతకు అవసరమైన సాంకేతిక, శాస్త్రీయ సమాచారాన్ని నాసా సేకరిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్టెమిస్-3 బృందం ప్రకటన ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇప్పటివరకు డిజైన్, ఇంజినీరింగ్ దశలో ఉన్న మిషన్ ఇప్పుడు మానవ ప్రయాణానికి సిద్ధమవుతోందనే సంకేతం. 1972లో అపోలో-17 మిషన్ అనంతరం మానవుడు మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టలేదు. దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత మానవులను తిరిగి చంద్రుడిపై దించాలన్న లక్ష్యంతో నాసా ఆర్టెమిస్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీర్ఘకాలికంగా చంద్రుడిపై స్థిరమైన మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం నాసా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆర్టెమిస్-3 కీలక మలుపుగా మారనుంది. ఈ మిషన్ విజయవంతమైతే 2028లో చేపట్టే ఆర్టెమిస్-4 ద్వారా మానవులు చంద్రుడిపై అడుగుపెట్టే మార్గం మరింత సుగమం కానుంది. అయితే.. ఈ నలుగురు ఆర్టెమిస్-3లో పాల్గొనే నలుగురే కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ, నాసా ఆశలన్నీ ఇప్పుడు వీళ్లపైనే ఉన్నాయి.ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్టెమిస్-4లో నలుగురు వ్యోమగాములు చంద్ర కక్ష్యకు వెళ్తారు. వారిలో ఇద్దరు మాత్రమే ల్యాండర్లో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి దిగుతారు. అక్కడ వారం రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి తిరిగి ఓరియన్ వ్యోమనౌకలో చేరతారు.:::సాక్షి వెబ్ ప్రత్యేకం -
భారత్‌పై కన్నేసిన పాక్.. అసలు లక్ష్యమేంటి?
భారత్ టార్గెట్‌గా దాయాది దేశం పాకిస్తాన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ గత 16 నెలల కాలంలో వరుసగా ఆరు భూ పరిశీలన (Earth Observation) ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కాగా, పాక్ చర్యలు దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, భూవినియోగ మ్యాపింగ్ వంటి పౌర అవసరాల కోసం అని పాకిస్తాన్ ప్రకటిస్తున్నప్పటికీ, రక్షణ నిపుణులు ఇవి సైనిక నిఘా సామర్థ్యాన్ని కూడా పెంచగలవని విశ్లేషిస్తున్నారు.వేగంగా పాకిస్తాన్ అంతరిక్ష విస్తరణ.. గతంలో పరిమిత స్థాయిలో ఉన్న పాకిస్తాన్ అంతరిక్ష కార్యక్రమం ఇప్పుడు గణనీయంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా చైనా సాంకేతిక సహకారంతో భూ పరిశీలన, రిమోట్ సెన్సింగ్ రంగాల్లో పాకిస్తాన్ కొత్త ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాల్లో PRSC-EO1, PRSC-EO2, PRSC-EO3 వంటి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి భూమి ఉపరితల చిత్రాలను సేకరించి విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే, భూ పరిశీలన ఉపగ్రహాలు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉపరితల చిత్రాలు, భౌగోళిక సమాచారం, వాతావరణ మార్పులు, వ్యవసాయ పరిస్థితులు వంటి అంశాలను నమోదు చేస్తాయి. భద్రతా మరియు సరిహద్దు పర్యవేక్షణ కూడా చేయనున్నాయి. ఇక, అధునాతన సెన్సర్లు కలిగిన ఉపగ్రహాలు సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, వాహనాల కదలికలు వంటి అంశాలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి.భారత్‌ను గమనించే సామర్థ్యం ఎంత?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఉపగ్రహాలు భారత భూభాగం మీదుగా ప్రయాణించే సమయంలో చిత్రాలను సేకరించగలవు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, వాయుసేన కేంద్రాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను గుర్తించే అవకాశం ఉంది. ఇలా ఆయా ప్రాంతాలపై సమాచారం పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఉపగ్రహాలు 24 గంటలూ ఒకే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా గమనించవు. అవి కక్ష్యలో తిరుగుతాయి. కాబట్టి ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట వ్యవధుల్లో మాత్రమే చిత్రీకరించగలవు. అంతేకాకుండా.. భారత్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. దేశ విస్తీర్ణం సుమారు 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆరు ఉపగ్రహాలు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలిగినా, మొత్తం దేశాన్ని ప్రతి క్షణం పర్యవేక్షించడం అసాధ్యం.సన్-సింక్రోనస్ కక్ష్య ప్రయోజనంపాకిస్తాన్ తాజా ఉపగ్రహాల్లో చాలా వరకు సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కక్ష్య ప్రత్యేకతలు ఏంటంటే.. ప్రతిరోజూ ఒకే ప్రాంతాన్ని దాదాపు ఒకే సమయానికి చిత్రీకరించగలదు. భూమిపై మార్పులను పోల్చి చూడటం సులభం. సైనిక నిఘా, మ్యాపింగ్, పర్యావరణ అధ్యయనాలకు అనుకూలంగా ఉంటుంది.భారత్, పాక్ మధ్యలో చైనా..పాకిస్తాన్, చైనా మధ్య అంతరిక్ష సహకారం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. పాకిస్తాన్‌కు చైనా ఉపగ్రహ సాంకేతికత, శిక్షణ, డేటా ప్రాసెసింగ్ మద్దతు ఇస్తోంది. దీంతో పాకిస్తాన్ సొంత అంతరిక్ష సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. మరోవైపు. అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కంటే ఎంతో ముందుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థలు, వ్యూహాత్మక నిఘా ఉపగ్రహాలు వంటి విస్తృత సామర్థ్యాలను అభివృద్ధి చేసింది. అదనంగా భారత్ తన సరిహద్దుల పర్యవేక్షణ కోసం మరింత పెద్ద ఉపగ్రహ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తోంది. కాగా, భారత్, పాకిస్తాన్ రెండూ తమ భద్రతా అవసరాల కోసం ఉపగ్రహ నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయి.భవిష్యత్తు యుద్ధాల్లో ఉపగ్రహాల పాత్రప్రస్తుతం యుద్ధాలు కేవలం సైనికులపై ఆధారపడటం లేదు. టెక్నాలజీపై ఆధారపడి దాడులు జరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఉపగ్రహ సమాచారానికి అత్యంత ప్రాధాన్యం లభించింది.ఉపగ్రహాలతో ఇలా..క్షిపణుల మార్గదర్శనండ్రోన్ కార్యకలాపాలుకమ్యూనికేషన్నావిగేషన్లక్ష్యం గుర్తింపుగూఢచారి సమాచారం వంటి పనుల్లో కీలకం. -
అపాచీ ఎఫెక్ట్.. ఇరాన్‌పై అమెరికా రివెంజ్ ఎటాక్స్!
పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతల వైపు అడుగులేస్తోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్మీ హెలికాప్టర్ ‘అపాచీ’ కూలిపోవడం.. దానిని ఇరాన్ కూల్చివేసిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా సైన్యం వైమానిక దాడులు ప్రారంభించింది. హర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో, అలాగే బందర్ అబ్బాస్, సిరిక్తో పాటు దక్షిణ ఇరాన్ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. ఇరాన్ గనుక మళ్లీ దాడులకు దిగితే.. ఈసారి గట్టిగా స్పందిస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇది ఆత్మరక్షణ కోసమేనని అంటోంది. ఇక ఈ దాడులకు ఇరాన్ కూడా స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ సైనిక బలగాలే ప్రమాదంలో ఉన్నాయంటూ ఓ ప్రకటన వెలువరించింది.ఒమన్ తీరంలో అమెరికా ఆర్మీకి చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం.. తొలిసారిగా సముద్రంలో డ్రోన్ బోట్ సహాయంతో వారిని రక్షించారు. ‘కోర్సెయిర్’ పేరుతో పనిచేసే ఈ డ్రోన్ నౌక ఇద్దరు సైనికులను సురక్షిత ప్రాంతానికి తరలించగా, అక్కడి నుంచి మరో హెలికాప్టర్ వారిని తీసుకెళ్లింది.ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మా అత్యాధునిక అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. మా సిబ్బంది క్షేమంగానే ఉన్నప్పటికీ, ఈ దాడికి అమెరికా తప్పనిసరిగా స్పందించాల్సిందే’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘ఇరాన్ అన్యాయమైన దాడికి ఇది ప్రతిస్పందన. అమెరికా సైనికుల రక్షణ, ప్రాంతీయ భద్రత కోసం చర్యలు చేపట్టాం’ అని పేర్కొంది. ఇదే సమయంలో హర్మజ్ జలసంధిలోని ఇరాన్ ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరానియన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే నష్టంపై అధికారిక వివరాలు వెలువడలేదు.అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, ‘హర్ముజ్ జలసంధి అమెరికా తీరాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మా భూభాగానికి సమీపంలో మోహరించిన విదేశీ బలగాలు తమ తప్పిదాలు, ప్రమాదాలు లేదంటే కాల్పుల మధ్య చిక్కుకోవడం వల్లే ప్రమాదాలకు గురవుతాయి. ప్రమాదాలను తగ్గించుకోవాలంటే వారు ఈ ప్రాంతం విడిచిపోవడం ఉత్తమ మార్గం’ అని వ్యాఖ్యానించారు.ఈ పరిణామాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రెండు నెలల క్రితం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మారలేదు. ఇదే సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ కాల్పులు చోటుచేసుకోవడం, లెబనాన్‌లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రెండు లేదా మూడు రోజుల్లో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించిన ఆయన.. హెలికాప్టర్ ఘటన తర్వాత మాత్రం కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా.. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి.హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గం కావడంతో తాజా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా ఘర్షణలు మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎబోలా విలయ తాండవం
బునియా: ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ విలయ తాండవం చేస్తోంది. తూర్పు కాంగోలో ఎబోలా వ్యాప్తిని అధికారికంగా ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే 101 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. ఇప్పటిదాకా 550 ఎబోలా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 101 మంది మరణించారు. తూర్పు కాంగోలోని ఇటూరీ ప్రావిన్స్‌లో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. 90 శాతం కేసులు ఇక్కడే నమోదయ్యాయి. నార్త్ కివూ, సౌత్ కివూ ప్రావిన్స్‌ల్లోనూ ఎబోలా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఉగాండా సరిహద్దు వరకూ వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. వైరస్ నియంత్రణకు సరైన టీకా గానీ, చికిత్స గానీ లేకపోవడం, ప్రతిస్పందన సవాలుగా మారడం వల్ల కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కాంగో అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఎబోలా వ్యాధి వ్యాప్తికి అరుదైన ‘బుండిబుగ్యో’వైరస్ కారణం. దీనికి ఆమోదిత టీకా, చికిత్స విధానాలు లేవు. రోగ నిర్ధారణ పరీక్షలను పెంచామని ప్రభుత్వం తెలియజేసింది. గత 24 గంటల్లో 137 నమూనాలను పరీక్షించగా, వాటిలో 35 పాజిటివ్‌గా తేలాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం తెలియజేసింది. ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందించేందుకు సరైన ఏర్పాట్లు లేవని ప్రజలు వైద్య సిబ్బందిపై దాడులకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల వేర్పాటువాద సాయుధ మిలిటెంట్ గ్రూప్‌ల ప్రాబల్యం ఉంది. అలాంటి ప్రాంతాలకు వైద్య సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. -
750 డాలర్లతో 10 రోజుల్లో ‘వీసా’ అపాయింట్మెంట్
వాషింగ్టన్: వ్యాపార లేదా పర్యాటక వీసాలపై అమెరికాకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. అమెరికా ప్రభుత్వం ప్రీమియం సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీనిప్రకారం దరఖాస్తు ప్రాథమిక రుసుము 185 డాలర్లతోపాటు 750 డాలర్లు అదనంగా చెల్లిస్తే వీసా ప్రక్రియను చాలా వేగంగా పూర్తిచేస్తారు. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో త్వరలో నోటీసు ప్రచురించబోతున్నారు. ఎంపిక చేసిన యూఎస్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో దరఖాస్తుదారులు 750 డాలర్లు చెల్లించి 10 రోజుల్లోగా ఇంటర్వ్యూ కోసం అపాయింట్మెంట్ పొందవచ్చు. మొదట దీన్ని పైలట్ కార్యక్రమంగా ఈ ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 31 దాకా అమలు చేయబోతున్నారు. అమెరికాలో అడుగుపెట్టడాన్ని కష్టతరం చేసేలా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల విదేశీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కఠిన వీసా ప్రక్రియను సులభతరం చేయడానికే అదనపు ఫీజు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. -
లక్ష డాలర్ల హెచ్1బీ ఫీజు రద్దు!
వాషింగ్టన్: అమెరికా కలల్ని పండించే హెచ్1–బీ వీసా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ సర్కారు విధించిన లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టి వేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఇంత భారీ మొత్తం వీసా ఫీజు వసూలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి లియో సోరోకిన్ తీర్పు వెలువరించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ‘‘అమెరికా కాంగ్రెస్ అనుమతిలేకుండా ప్రభుత్వం ఇలా భారీ స్థాయిలో పన్నులను మోపేందుకు అధికారంలేదు. ఇమ్మిగ్రేషన్ విధానాలు, పన్నులపై నిర్ణయాలు తీసుకునే అధికారం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. ఫీజు, పేమెంట్ అని చెబుతున్నప్పటికీ వీసా పిటిషన్‌దారులపై ట్రంప్ పన్ను భారం మోపారు’’ అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సంతతి సంఘాలు ఈ తీర్పును స్వాగతించాయి. ఉద్యోగ ఆధారిత వీసాల విషయంలో ఇది మెరుగైన నిర్ణయమని కొనియాడాయి. అమెరికన్ కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్1–బీ వీసా అవసరం. భారతీయ ఐటీ ఉద్యోగులతోపాటు వివిధ దేశాల నుంచి పరిశోధకులు, అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో పని చేసేవారు హెచ్1–బీ వీసా కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వీసా జారీ ప్రక్రియలో పలు మార్పులు చేయడమే కాకుండా ఒక్కో హెచ్1–బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై 20 రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేస్తూ బోస్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా జడ్జి దీనిపై విచారణ జరిపి భారీ ఫీజు సరికాదని తేల్చి చెప్పారు. ఇకపై మరిన్ని ఇబ్బందులు! ‘‘హెచ్1–బీ వీసాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపశమనం ఇచ్చిన తీర్పిది. అయితే ఈ విషయం ఇక్కడితో సమసిపోతుందా? అన్నది ప్రశ్నార్థకం’’ అని ఇండియాస్పోరా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషీపుర వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో అమెరికన్ ప్రభుత్వం హెచ్1–బీ వీసాదారులను ఇకపై కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. అమెరికా టెక్నాలజీ, ఆరోగ్య, తయారీ రంగాల పురోభివృద్ధికి అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ చీఫ్ ఆఫ్ పాలసీ అండ్ స్ట్రాటజీ ఖండేరావ్ కాండ్ చెప్పారు. ఆర్థికపరమైన వాస్తవిక పరిస్థితులతోపాటు చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే కీలకమైన విధానపర అంశాల్లో మార్పులు చేయాలన్న ప్రాథమిక విషయాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని వివరించారు. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తాంలక్ష డాలర్ల హెచ్1–బీ వీసా ఫీజును రద్దు చేస్తూ మసాచుసెట్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అప్పీల్స్ కోర్టులో సవాలు చేయనున్నట్లు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. హెచ్1–బీ వీసా పథకాన్ని దశాబ్దాలుగా దురి్వనియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికే అధ్యక్షుడు ట్రంప్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. కొంతమంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు కూడా లక్ష డాలర్ల వీసా ఫీజును న్యాయస్థానం కొట్టివేయడాన్ని స్వాగతిస్తుండడం గమనార్హం. భారీ వీసా ఫీజు కారణంగా వైద్య సిబ్బందితోపాటు ఉపాధ్యాయులను అమెరికాకు రప్పించడం చాలా కష్టమైపోయిందని, ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన టీచర్లు లేకుండా పోతున్నారని అలాస్కా రిపబ్లికన్ సెనేటర్ లీజా ముర్కోస్కీ చెప్పారు. అమెరికా ఆరోగ్య రంగంలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉండగా.. లక్ష డాలర్ల వీసా ఫీజు అదనపు భారం మోపిందని, కోర్టు తీర్పుతో భారీ ఊరట లభించినట్లేనని నార్త్ వర్జీనియా డెమోక్రాట్ ప్రతినిధి డాన్ బేయర్ హర్షం వ్యక్తంచేశారు. రిపబ్లికన్ ప్రతినిధి మైక్ లాలర్, జార్జియా డెమోక్రాట్ ప్రతినిధి సాన్ఫర్డ్ డి.బిషప్, కాలిఫోర్నీయా, న్యూజెర్సీ అటార్నీ జనరళ్లు రాబ్ బోంటా, జెన్నిఫర్ డావెన్పోర్టు తదితరులు కోర్టు తీర్పును స్వాగతించారు. దేశానికి తీవ్ర హాని హెచ్–1బీ వీసా ఫీజు విషయంలో మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు ఉత్తర్వును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. అలాంటి చర్యలు దేశానికి తీవ్ర హాని కలిగిస్తాయని మంగళవారం ఆక్షేపించారు. ‘‘ఈ న్యాయమూర్తులు నిజంగా మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇది చాలా విపరీతమైన పరిస్థితి. వారు మా దేశానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నారు’’అంటూ ట్రంప్ విమర్శించారు. -
పీవోకేలో కలకలం.. 30 మందికి పైగా మృతి, 200 మందికి గాయాలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ పౌర సమాజ కూటమి ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ)పై అధికారులు నిషేధం విధించిన తర్వాత అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మృతి చెందగా, దాదాపు 200 మంది గాయపడ్డారు.శాంతి భద్రతలపై ఆందోళనల కారణంగా గత వారం జేఏఏసీని చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఒక వ్యాపారిని కాల్చి చంపినట్లు ఆరోపణలు రావడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆదివారం రావలకోట్ నగరంలో ఘర్షణలు చెలరేగాయి.రావలకోట్‌లో అత్యున్నత పౌర అధికారి కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కాల్పుల్లో మృతి చెందిన వ్యాపారి మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి మార్చురీ బయట జేఏఏసీ మద్దతుదారులు గుమిగూడారని చెప్పారు.నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించగా, జేఏఏసీ కార్యకర్తలు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో దాడి చేశారని ఆయన తెలిపారు. "భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఆరుగురు నిరసనకారులు మృతి చెందారు" అని ఖాన్ చెప్పారు. ఈ చర్యలో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఆయన ధ్రువీకరించారు.అయితే, స్థానిక నివాసితులు, జేఏఏసీ మద్దతుదారులు అధికారుల వాదనను ఖండిస్తూ, పౌరుల మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.జూలై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో 45 స్థానాల్లో 12 స్థానాలను శరణార్థులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జేఏఏసీ పిలుపునిచ్చిన నిరసనలకు ఒక రోజు ముందు ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు జరిగిన హింసాత్మక ఘటనలు, ఇంటర్నెట్ నిలిపివేత, సంస్థపై నిషేధం, విద్యుత్ కొరత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వనరుల దోపిడీ ఆరోపణలు, రాజకీయ పక్కనపెట్టివేత వంటి అంశాలపై కూడా ఈ నిరసనలు జరిగాయి.జేఏఏసీ సభ్యులు తమను "ఉగ్రవాద" సంస్థగా జాబితాలో చేర్చడాన్ని "అణచివేత"గా పేర్కొన్నారు. తాము చట్టబద్ధమైన ఆర్థిక, రాజకీయ హక్కుల సాధన కోసమే నిరసనలు చేస్తున్నామని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల్లో ఈ సంస్థ హింసాత్మక నిరసనలు నిర్వహించింది.పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీపీ) కూడా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)పై నిషేధం విధించిన ప్రాంతీయ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది."చర్చలు అవసరమే. అయితే, ప్రాంత ప్రజలు రాజకీయ హక్కుల నుంచి దూరంగా ఉంచబడుతున్న పరిస్థితుల్లో అవి అర్థవంతంగా ఉండవు. శాంతియుత నిరసన హక్కును పరిరక్షించాలి. ప్రజల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలి" అని పేర్కొంది.పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా చూడాలని, ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవించాలని, నిజమైన సమగ్ర చర్చలకు కట్టుబడి ఉండాలని సమాఖ్య ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాన్ని హెచ్ఆర్సీపీ కోరింది. పరిస్థితిని పరిశీలించేందుకు వీలైనంత త్వరగా నిజ నిర్ధారణ బృందాన్ని పంపనున్నట్లు కూడా ప్రకటించింది. -
ట్రంప్‌ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్‌నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది. ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది పరిశీలిస్తే..ఇరాన్‌పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్‌ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్‌లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్‌పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్‌పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్‌తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్‌కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్‌పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇది ప్రేమికుల గొడవ లాంటిదే!
నలభై ఏళ్ల స్నేహం.. ఒకరి విజయాలను మరొకరు బహిరంగంగా కొనియాడుకునే అనుబంధం.. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాల మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న నెతన్యాహూను ట్రంప్ పదేపదే అప్రమత్తం(వార్నింగ్) చేస్తున్నారన్న వార్తలు వెలువడగా.. దీనిని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ మాత్రం ‘ప్రేమికుల మధ్య వచ్చే చిన్నపాటి గొడవ’గా అభివర్ణించడం ఆసక్తి రేపుతోంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరాన్.. ఇజ్రాయెల్‌పై తాము చేపట్టిన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకూ చేసిన శాంతి విజ్ఞప్తిపై స్పందించిన ఇరాన్.. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తే వాషింగ్టన్ మద్దతును కోల్పోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆప్తమిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించిన తర్వాతే ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.అయితే, యెచియెల్ లీటర్ ఈ కథనాలను తోసిపుచ్చారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు పరస్పర సహకారంతో జరిగాయని.. మీడియా.. తప్పుదోవ పట్టించేలా కథనాలను అల్లుతుందంటూ ఆరోపించారు. ‘‘వారి మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి లోతైన స్నేహం ఉంది. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య చిన్నపాటి ఘర్షణలు (lovers' spat) జరుగుతుంటాయి, అలాగే కొన్నిసార్లు వారి సంభాషణల్లో వాతావరణం కాస్త వేడెక్కుతుందని ఫాక్స్ న్యూస్‌తో లీటర్ వ్యాఖ్యానించారు.ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్ ప్రధాని నిర్ణయించుకున్నప్పటికీ, తమ దేశంపైకి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను స్పందించకుండా ఇజ్రాయెల్ ఊరికే భరించలేదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకున్నారని ఇజ్రాయెల్ దౌత్యవేత్త పేర్కొన్నారు. చాలా వరకు మేము అమెరికా-ఇజ్రాయెల్ మధ్య చాలా సన్నిహిత, ఉమ్మడి సహకారంతో ముందుకు సాగుతున్నాము. మా మధ్య అద్భుతమైన అవగాహన ఉందన్నారు. మరోవైపు, నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు ఇజ్రాయెల్-ఇరాన్ రెండు దేశాలూ దాడులు ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. అజ్ఞానం, మూర్ఖత్వం అడ్డురాకపోతే శాంతి దిశగా తుది చర్చలు ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని.. అవసరమైన విధంగానే చర్యలు తీసుకుంటున్నామంటూ తాను ట్రంప్‌నకు స్పష్టం చేసినట్లు తెలిపారు. -
సెల్‌ఫోన్ కోసం 262 అడుగుల ఎత్తులో..
పట్టు తప్పిందా ఇక అంతే!. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అందుకే ఆ యువకుడి సాహసం.. అక్కడున్నవాళ్లను షాక్‌కు గురి చేసింది. ఉత్కంఠతో చివరి నిమిషం దాకా ఏం జరుగుతుందా? అని ఊపిరి బిగబట్టేలా చేసింది. పోనీ అదంతా ఎందుకు చేశాడా? అని కారణం తెలిశాక.. కంగుతినడం అక్కడున్నవాళ్ల వంతు అయ్యింది. ఒక సాధారణ పర్యాటక విహారం క్షణాల్లోనే ఉత్కంఠభరిత ఘటనగా మారింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇగ్వాజు జలపాతం (Iguazu Falls) వద్ద ఓ టూరిస్ట్ ప్రాణాలను లెక్కచేయకుండా వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకాడు. కాసేపు అలాగే గనుక ఉండి ఉంటే.. ప్రవాహం ధాటికి కచ్చితంగా వందల అడుగుల కిందకి పడిపోయేవాడే!. ఈ సంఘటన బ్రెజిల్ వైపు ఉన్న జలపాతం ప్రాంతంలో శనివారం (జూన్ 6) చోటుచేసుకుంది.ఇగ్వాజు జలపాతం అర్జెంటీనా–బ్రెజిల్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జలపాత వ్యవస్థల్లో ఒకటి. సుమారు 262 అడుగుల లోతు ఉంటుందది. రెండు దేశాల మధ్య ప్రాంతం కావడంతో పర్యాటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. అదే సమయంలో ఇక్కడి భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉండడం తరచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. "Loco total"Porque un turista que estaba visitando las Cataratas de Iguazú se tiro al agua para recuperar su teléfono celular, lo recuperó, se subió a la pasarela y siguió recorriendo el lugar. pic.twitter.com/pWpmgsMLVV— Tendencias en Argentina (@porqueTTarg) June 8, 2026అలా.. ఓ పర్యాటకుడు ఈ వాటర్‌ఫాల్ అంచుల్లో దిగడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉన్నట్లుడి.. ఓ టూరిస్ట్ రాళ్లపై నుంచి దూకి ప్రవాహంలోకి వెళ్లి ఏదో వెతకబోయాడు. జలపాతం ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. బలమైన నీటి ప్రవాహం, జారిపోయే రాళ్లు, కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ప్రాణాంతకమైన ఎత్తు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అధికారులు కఠినంగా నియంత్రిస్తారు. అయినప్పటికీ ఆ వ్యక్తి చేసిన చర్య అక్కడున్న పర్యాటకులను తీవ్రంగా షాక్‌కు గురిచేసింది. కాసేపు ఏదో వెతికి.. ఆలస్యం చేయకుండా వెంటనే బయటకు వచ్చేశాడు. అతగాడి చేష్టలను ఇతర పర్యాటకులు వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే చావు నోట్లో తలపెట్టి రావడానికి సెల్‌ఫోన్ కారణమంట!. చేజారి అది పడిపోయిందని.. అందుకే అతను అలా సాహసం చేశాడని తెలుస్తోంది. మరి సెల్‌పోన్ దొరికిందా? లేదా? అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. Se tiró en la Garganta del Diablo para recuperar su celularUn hecho insólito generó indignación en las Cataratas del Iguazú, del lado brasileño.Un hombre se arrojó desde la pasarela del circuito Garganta del Diablo para buscar su celular tras caerse, sin poder regresar por… pic.twitter.com/7G4tGj7aRR— mavica (@mavica7) June 8, 2026అదృష్టవశాత్తూ అతనికేం కాలేదు. సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే ఈ సంఘటన భద్రతా నియమాలపై మరోసారి చర్చకు దారితీసింది.ఇది మొదటిసారి జరిగిన ఘటన కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ పర్యాటకుడు తన టోపీ కోసం ఇలాగే చేశాడు. ఆ టైంలో అధికారులు సకాలంలో స్పందించడంతో బతికి బట్టకట్టాడు. -
హర్మూజ్ జలసంధి దగ్గర టెన్షన్ టెన్షన్..
హర్మూజ్ జలసంధి దగ్గర యూఎస్ ఆర్మీ అపాచీ హెలికాప్టర్ కూలిపోయిందని.. అందులో ఇద్దరు సిబ్బందిని దళాలు సురక్షితంగా కాపాడినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అయితే, హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. హెలికాప్టర్‌పై ఇరాన్ దళాలు దాడి చేశాయా? ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను ఇరాన్ సమర్థవంతంగా అడ్డుకోవడాన్ని నిరోధించేందుకు అమెరికా దళాలు సాగిస్తున్న కార్యకలాపాల సమయంలోనే ఈ అపాచీ ప్రమాదం జరిగింది. ఈ ఆపరేషన్లలో భాగంగా యూఎస్ మిలిటరీ అపాచీ హెలికాప్టర్లతో పాటు MQ-9 రీపర్ డ్రోన్లు, F/A-18, F-35 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను రంగంలోకి దించింది.ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ దాదాపు 30 MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసిందని, అలాగే శత్రువుల దాడి లేక పొరపాటున జరిగిన కాల్పుల వల్ల పలు యుఎస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. ఈ ఘటన కూడా నిజమని తేలితే.. ఈ ఘర్షణల్లో యుఎస్ కోల్పోయిన మొదటి అపాచీ హెలికాప్టర్ ఇదే అవుతుంది.'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ఆపరేషన్ కింద హార్ముజ్ జలసంధి, పరిసర జలాల్లో వాణిజ్య నౌకలకు రక్షణగా యూఎస్ నేవీ వెళ్లేందుకు ముందు... సెంట్రల్ కమాండ్ ఫోర్స్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అక్కడ వైమానిక పర్యటన నిర్వహించిన ఫోటోలను గత నెలలో సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. AH-64 అపాచీ హెలికాప్టర్.. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటి. వ్యూహాత్మక రవాణా మార్గాలను పర్యవేక్షించడానికి, చిన్న బోట్ల ద్వారా జరిగే దాడులను అడ్డుకోవడానికి, శత్రు డ్రోన్లను కూల్చివేయడానికి ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తారు.హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాను పునరుద్ధరించడానికి వాషింగ్టన్, టెహ్రాన్ దేశాల మధ్య పలుసార్లు చర్చలు జరుగుతున్నప్పటికీ... ఆ ప్రాంతంలో యూఎస్ సైన్యం తన దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే హార్మూజ్ జలసంధి.. పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్ నియంత్రణలో ఉన్న దీవులకు అత్యంత సమీపంలో అపాచీ హెలికాప్టర్లు ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.ఇరాన్ దిగ్బంధనానికి ప్రతిస్పందనగా అమెరికా.. ఏప్రిల్ నెలలో ఇరాన్ ఓడరేవులకు ప్రవేశ పరిమితులను విధించిందని కూడా ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అప్పటి నుంచి హెచ్చరికలను బేఖాతరు చేసిన 130 కి పైగా నౌకలను యూఎస్ నౌకాదళాలు వెనక్కి పంపడమే కాకుండా.. మార్గాన్ని మార్చుకోని కొన్ని నౌకలను నిలిపివేశాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇరాన్ కూల్చివేసిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం నుండి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వారు శత్రు భూభాగంలో పడినప్పటికీ.. యుఎస్ దళాలు వారిని విజయవంతంగా రక్షించి వెనక్కి తీసుకొచ్చాయి. -
ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత!
ఉత్సునోమియా: జపాన్‌లోని ఒక ప్రముఖ నగరంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను వణకిస్తోంది. గత మూడు రోజులుగా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక అడవి ఎలుగుబంటి, తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఈ అత్యవసర పరిస్థితి కారణంగా అధికారులు రంగంలోకి దిగి, నగరంలోని దాదాపు 100 పాఠశాలలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. వందలాది మంది పోలీసులు, వేటగాళ్లు ఆ వన్యప్రాణిని పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నారు.జపాన్ నగరంలో హై అలర్ట్ టోక్యోకు ఉత్తరాన ఉన్న ఉత్సునోమియా (Utsunomiya) నగరంలో శనివారం నుండి ఎలుగుబంటి సంచారానికి సంబంధించి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సోమవారం నాడు 94 ప్రభుత్వ ప్రాథమిక, జూనియర్ హైస్కూళ్లను మూసివేసింది. ఎలుగుబంటి తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.మార్కెట్లు, పాఠశాలల్లో కలకలం పట్టణ కేంద్రానికి ఉత్తరాన శనివారం ఉదయం ఎలుగుబంటి మొదటిసారిగా కనిపించింది. ఆ తర్వాత అది నివాస ప్రాంతాలు, ఒక షాపింగ్ ఆర్కేడ్, ఆపై ఒక పార్క్, హైస్కూల్ పరిసరాల్లో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. చివరిగా సోమవారం ఉదయం ఒక హోల్‌సేల్ మార్కెట్ సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో నగరవ్యాప్తంగా ఆందోళన మరింత పెరిగింది. అయితే ఇవన్నీ ఒకే ఎలుగుబంటికి సంబంధించిన ఆనవాళ్లా లేదా ఇంకా ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.పెరుగుతున్న ఎలుగుబంట్ల దాడులు జపాన్‌లో ఇటీవలి కాలంలో అడవి ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం, దాడులకు తెగబడటం గణనీయంగా పెరిగింది. గత ఏడాది దేశవ్యాప్తంగా ఎలుగుబంట్ల దాడుల కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకలితో ఇవి నగరాలపై పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది మార్చి నాటికి జపాన్ వ్యాప్తంగా 50 వేలకుపైగా ఎలుగుబంట్ల సంచార కేసులు నమోదయ్యాయి. 5.1 లక్షల జనాభా ఉన్న ఉత్సునోమియా నగరం ఎలుగుబంట్లు తిరుగుతుంటం స్థానికులకు ఆందోళనకు గురిచేస్తోంది.ఇది కూడా చదవండి: టిఫిన్ బాక్స్‌లో గొడ్డు మాంసం.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం -
రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు
రష్యా చమురు టార్గెట్‌గా ఉక్రెయిన్ దాడులు చేసింది. క్రాస్నోడార్ క్రాయ్, క్రిమియాలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపారు. ఈ కాంప్లెక్స్ దక్షిణ రష్యాలో చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు సంబంధించిన అతిపెద్ద కేంద్రాలలో ఒకటి. మరో వైపు రష్యాతో పాటు, రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపైనా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మాస్కో ప్రాంతం, పశ్చిమ, నైరుతి రష్యా, రష్యా ఆక్రమిత క్రిమియా, నల్లసముద్రం, అజోవ్ సముద్రాలపై వచ్చిన 310 ఉక్రెయిన్ డ్రోన్లను తమ దళాలు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో రష్యా 155 డ్రోన్లతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకోగా.. వాటిలో 124 డ్రోన్లను ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసాయని ఆ దేశ వైమానిక దళం పేర్కొంది. -
బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్మెంట్!
మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే బాధితులకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఒక వినూత్న చికిత్స అందుతోంది. మందులు, ఇంజెక్షన్లతో మాత్రమే కాకుండా, గాడిదల సహాయంతో రోగులను కోలుకునేలా చేస్తున్నారు. వినడానికి కాస్త వింతగా అనిపించినా, ఈ ‘డాంకీ థెరపీ’ మానసిక రోగుల్లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తోంది. ప్యారిస్ సమీపంలోని ఒక మానసిక వైద్యశాలలో ప్రారంభమైన ఈ సరికొత్త ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిశ్శబ్ద వాతావరణం, పచ్చని ప్రకృతి మధ్య బాధితులు గాడిదలతో గడుపుతూ, తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ప్యారిస్‌లో వినూత్న ప్రయోగంఫ్రాన్స్లో మొదటిసారిగా ఈ తరహా వినూత్న చికిత్సను ఇక్కడ ప్రవేశపెట్టారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు సాధారణ మందులతో పాటు ఈ డాంకీ థెరపీని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగా రోగులు స్వయంగా గాడిదలను బయటకు నడిపించడం, వాటికి ఆహారం తినిపించడం, వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం వంటి పనులు చేస్తారు. ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన ఈ జంతువులతో సమయం గడపడం వల్ల రోగులలో ఆత్మవిశ్వాసం, సామాజిక అనుబంధం, మానసిక ప్రశాంతత పెరుగుతాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు.మందుల కంటే మిన్నగా..ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల నాథాలీ అనే రోగి తన అనుభవాన్ని పంచుకుంటూ, గాడిదలతో గడపడం వల్ల తనకు మానసిక ఒత్తిడిని తగ్గించే మందుల కంటే ఎక్కువ ఉపశమనం లభిస్తోందని తెలిపారు. ‘నేను ఆ గాడిదల పక్కన ఉన్నప్పుడు, నా ఆందోళనలన్నీ ఇట్టే మాయమైపోతాయి. ఇది ఒక సహజమైన ఔషధంలా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. గాడిదలు అటు రోగులకు ఇటు వైద్యులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తున్నాయని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.ఒంటరితనాన్ని దూరం చేస్తూ..జెరోమ్ అనే 52 ఏళ్ల మరో బాధితుడు మాట్లాడుతూ, ఈ వినూత్నమైన పని తన జీవితంలోని ఒంటరితనాన్ని పూర్తిగా దూరం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. కొత్త కొత్త యాక్టివిటీస్‌లో పాల్గొనడం, తోటివారితో మాట్లాడే అవకాశం లభించడంతో తన దైనందిన జీవితంలో ఎంతో సానుకూల మార్పు వచ్చిందని చెప్పారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని 2016 లో ఎర్మెలిండా హెడే అనే సైకియాట్రిక్ నర్స్, ఆమె భర్త ఫ్రాంకోయిస్ హెడే కలిసి ప్రారంభించారు. గాడిదల శాంత స్వభావం, వాటి సామాజిక ప్రవర్తన మనుషలోని మానసిక రోగాలను నయం చేసేందుకు దోహదపడతాయని వారు గుర్తించారు. ఇందుకోసం కొన్ని గాడిదలను యానిమల్ షెల్టర్ల నుండి రక్షించి ఇక్కడికి తీసుకువచ్చారు.ఎమోషనల్ స్పాంజ్గాడిదలు చాలా సున్నితమైనవని, తెలివైనవని ఫ్రాంకోయిస్ హెడే వివరించారు. మానవుల భావోద్వేగాలను అవి చాలా త్వరగా అర్థం చేసుకోగలవని, అందుకే వాటిని ‘ఎమోషనల్ స్పాంజ్’ (భావోద్వేగాలను పీల్చుకునేవి) అని పిలుస్తారని ఆయన అన్నారు. తీవ్రమైన ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression), ఆటిజం (Autism), స్కిజోఫ్రెనియా (Schizophrenia) వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ థెరపీ అద్భుతంగా సహాయపడుతోంది. దీనివల్ల రోగుల్లో భావోద్వేగ సమతుల్యత, ఆత్మగౌరవం, కమ్యూనికేషన్ స్కిల్స్ గణనీయంగా మెరుగుపడుతున్నాయని వైద్యులు నిర్ధారించారు.ప్రత్యామ్నాయం కాదు.. కానీ సహాయకారిఅయితే ఈ డాంకీ థెరపీ అనేది సాధారణ వైద్య చికిత్సకు లేదా మందులకు ప్రత్యామ్నాయం కాదని వైద్యులు స్పష్టం చేశారు. ఇది ప్రధాన చికిత్సకు ఒక సమర్థవంతమైన సహాయక చికిత్సగా (Supplementary Treatment) అద్భుతంగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. మానసిక ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ థెరపీకి అధికారిక గుర్తింపు తీసుకురావడం కోసం హాస్పిటల్ యాజమాన్యం సిద్ధమవుతోంది. దీని ప్రభావాలపై త్వరలోనే పూర్తిస్థాయి శాస్త్రీయ పరిశోధనలు (Scientific Research) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇది కూడా చదవండి: ‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’ -
దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. "దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది.ప్రమాదానికి గల కారణాలను దుబాయ్ పోలీసు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ వివరిస్తూ.. సాంకేతిక లోపం కారణంగా ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో ట్రక్కు అకస్మాత్తుగా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రమాదానికి గురైన ట్రక్కు, బస్సులను రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం.. సరైన సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే వెనుక నుంచి వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిని భారత రాయబార కార్యాలయ అధికారులు పరామర్శించారు. -
ఆందోళనలో ట్రంప్.. నెతన్యాహూకు అల్టిమేటం?
ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా సాగుతున్న అమెరికా ప్రయత్నాలు మళ్లీ పట్టాలు తప్పుతాయేమోనన్న ఆందోళన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న వేళ.. ఇరాన్‌పై మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంకేతాలు పంపిస్తున్నారు. ఈ పరిణామం వాషింగ్టన్‌ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్ నెతన్యాహుకు పదే పదే ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. "బీబీ.. చాలా జాగ్రత్తగా ఉండు. లేదంటే తొందర్లోనే నువ్వు ఒంటరివాడివైపోతావు" అని నెతన్యాహూతో జరిగిన సంభాషణలో ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ (Axios) కథనం వెల్లడించింది.బీబీ అనేది నెతన్యాహు చిన్నప్పటి ముద్దు పేరు. ఇజ్రాయెల్ రాజకీయ నేతలు, అభిమానులతో పాటు పలు దేశాధినేతలు కూడా ఆయన్ని అలాగే పిలుస్తుంటారు. అందుకే ట్రంప్ ఆ పదం వాడారని తెలుస్తోంది. సాధారణంగా ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా అమెరికాను భావిస్తారు. ముఖ్యంగా ట్రంప్, నెతన్యాహూ ఇద్దరూ రైట్‌వింగ్ లీడర్లుగా గుర్తింపు పొందారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఇరాన్ అంశంలో ఇద్దరి మధ్య వ్యూహాత్మక విభేదాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌తో దీర్ఘకాలిక ఘర్షణ కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించాలన్నది ట్రంప్ వైఖరి. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత కఠిన వైఖరిని అవలంబించాలని నెతన్యాహూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమెరికా ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ చేపట్టే ఏకపక్ష సైనిక చర్యలు చర్చలను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైట్‌హౌస్ భావిస్తోంది. అందుకే గత కొన్ని వారాలుగా లెబనాన్, ఇరాన్ అంశాల్లో ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నెతన్యాహూను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.ఇక.. నెతన్యాహుకు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ అసలు సారాంశం.. అమెరికా మద్దతు గురించి. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ సమాచారం వంటి కీలక సహాయం అమెరికా నుంచే అందుతోంది. ఒకవేళ నెతన్యాహూ అమెరికా అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే.. వాషింగ్టన్ నుంచి అదే స్థాయి మద్దతు కొనసాగకపోవచ్చన్న సంకేతంగా విశ్లేషకులు ఈ హెచ్చరికను చూస్తున్నారు.ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా లేదు. ఇరాన్ మళ్లీ దాడి చేస్తే కఠినంగా స్పందిస్తామని నెతన్యాహూ చెబుతుండగా, యుద్ధం కంటే దౌత్యమే పరిష్కారమని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన "జాగ్రత్త బీబీ" హెచ్చరిక కేవలం ఇద్దరు నేతల మధ్య సంభాషణ మాత్రమే కాకుండా.. పశ్చిమాసియాలో భవిష్యత్తు పరిణామాలను ప్రభావితం చేసే కీలక రాజకీయ సంకేతంగా మారింది. -
భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మరోసారి పరస్పర దాడులకు దిగాయి. రెండు నెలల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఇదే మొదటిసారి. ఇరాన్ సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. మధ్య, పశ్చిమ ఇరాన్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి దిగింది. రాజధాని టెహ్రాన్‌తోపాటు చుట్టుపక్కల నగరాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికారిక టీవీ చానల్ వెల్లడించింది. రాజధానిలో ఇమామ్ ఖమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎయిర్‌స్పేస్‌ను ఇరాన్ మూసివేసింది. మాషహర్ సిటీలోని ఇరాన్ పెట్రోకెమికల్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ నిర్ధారించింది. బాలిస్టిక్ మిస్సైళ్ల పరికరాలు తయారుచేస్తున్న ఈ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మిస్సైల్ లాంచర్లను కూడా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగానే తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఉద్రిక్తతలకు అమెరికాయే కారణం: ఇరాన్ తొలుత లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేయగా, ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రతీకారం తప్పదని ఆదివారం హెచ్చరించింది. అనుకున్నట్లుగానే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ప్రధానంగా సెంట్రల్ ఇజ్రాయెల్‌లో దాడులు జరిగాయి. రెండు సైనిక స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ ఐఆర్జీసీ వెల్లడించింది. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజా ఉద్రిక్తతలకు ముమ్మాటికీ అమెరికా కారణమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే ఆరోపించారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని మండిపడ్డారు. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉన్నందున దాడులు నిలిపివేస్తున్నట్లు కొన్ని గంటల తర్వాత ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడులను నిలిపివేస్తే ఇజ్రాయెల్ సైతం వెనక్కి తగ్గుతుందని ఇరాన్‌కు అమెరికా సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ అండదండలున్న నౌకలపై దాడులు చేస్తామని యెమెన్ హౌతీ మిలిటెంట్లు హెచ్చరించారు. హౌతీలకు ఇరాన్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులను భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సోమవారం సూచించింది. స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది. అలాగే ఆ రెండు దేశాలకు వెళ్లే ప్రణాళిక ఉంటే వాయిదా వేసుకోవాలని పేర్కొంది. -
రావలకోట్‌లో రగడ.. 150 మంది మృతి?
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావలకోట్ (Rawalakot) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కార్యకర్తలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో జేఏఏసీకు చెందిన కొందరు వ్యక్తులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.అయితే.. నిరసనకారులు మాత్రం భద్రతా బలగాలే తమపై బలప్రయోగం చేశాయని ఆరోపిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల్లో ఏడుగురు పౌరులు మరణించినట్లు పేర్కొన్నారు.BIG NEWS - Reports claim that around 150 people were killed and hundreds injured in Rawalakot, PoK, after Pakistani forces allegedly opened fire.Pok residents want Independence from Pakistan.pic.twitter.com/ZvPo7zDA4o— News Algebra (@NewsAlgebraIND) June 8, 2026రావలకోట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం స్థానిక ప్రజలు, పాకిస్థాన్ పరిపాలన మధ్య పెరుగుతున్న అసంతృప్తి. ముఖ్యంగా విద్యుత్ చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, అభివృద్ధి లోపం, రాజకీయ హక్కులపై అసంతృప్తి వంటి అంశాలు ప్రజల్లో ఆగ్రహానికి దారితీసినట్లు సమాచారం.ఇంటర్నెట్ సేవలు కూడా పరిమితయ్యాయని, ఈ కారణంగానే సమాచార ప్రసారం కూడా పరిమితమైందనే వాదనలు వెలువడుతున్నాయి. అందుకే ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు అనే విషయాలు అధికారికంగా వెలువడలేదు. కానీ ఈ ఉద్రిక్తతల్లో ఏకంగా 150 మంది మరణించినట్లు, చాలామంది గాయపడ్డారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. -
డాక్టర్ గయానాలో పేషెంట్ ఇండోర్‌లో..
న్యూఢిల్లీ: భారతీయ వైద్యుడొకరు వైద్యరంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. సుమారు 20 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి రోబో సాయంతో గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత దూరంలో జరిగిన రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రముఖ రోబోటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గయానాలోని జార్జ్‌టౌన్ పబ్లిక్ హాస్పిటల్ కార్పొరేషన్ నుంచి ఆపరేషన్ చేయగా రోగి మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిలో ఉన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఎస్ఎస్ఐ మంత్ర’ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేషన్ చేశారు. శ్రీవాస్తవ గయానాలో కూర్చుని కన్సోల్ ద్వారా రోబోను నియంత్రిస్తుండగా, ఇండోర్‌లో ఉన్న రోబోటిక్ చేతులు ఆయన చేతుల కదలికలను కచ్చితత్వంతో అనుకరిస్తూ ఆపరేషన్ చేశాయి. భారత్‌లో ఈ ఆపరేషన్‌కు జైపూర్‌లోని మణిపాల్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ లలిత్ మాలిక్, భండారీ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ రామ్ శుక్లా, ఇండోర్‌లోని ఇర్కాడ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోహిత్ భండారీలు సహకరించారు. రికార్డు నమోదవడంపై గయానాæ అధ్యక్షుడుæ మహ్మద్ ఇర్ఫాన్ హర్షం వ్యక్తం చేశారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి గుండెకు శస్త్రచికిత్సతో ప్రపంచ రికార్డ్ -
డేటా సెంటర్లు..నీటి జలగలు!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏఐ డేటా సెంటర్లు ఎడాపెడా వెలుస్తున్నాయి. రకరకాల పనులు చాలా సులువుగా, వేగంగా చేసి పెట్టే టెక్నాలజీ మరింత పెరిగితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ.. నాణేనికి మరోవైపున దాగి ఉన్న నిజం మాత్రం చాలా భయంకరం. ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ (ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్) మేధో సంస్థ తాజా లెక్కల ప్రకారం 2030 నాటికల్లా భూమి మీద డేటా సెంటర్లు మొత్తం కలిపి ఎకాఎకిన 328 టీఎంసీల నీరు వాడేసుకుంటాయి. దీనర్థం ఎక్కడ డేటా సెంటర్ పుట్టుకొచి్చనా.. పెద్ద ఎత్తున నీళ్లు అవసరమవుతాయి. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుని వాడుకుంటే గొడవే లేదు కానీ.. నదులు, చెరువుల్లోంచి తోడుకుంటే మాత్రం ఏరికోరి కరువుకు బొట్టుపెట్టి పిలిచినట్లే. ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్ భూమ్మీది నీటి వనరుల పరిస్థితి, సమర్థ నిర్వహణలపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతూ ఉంటుంది. ఇటీవలే ఏఐ డేటా సెంటర్ల నీటి వాడకంపై కొన్ని లెక్కలు ప్రచురించింది. దాని ప్రకారం ఇంకో నాలుగేళ్లలో డేటా సెంటర్ల అవసరాలు తీర్చేందుకు సుమారు 9.3 లక్షల కోట్ల లీటర్ల నీళ్లు అవసరం. సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్తు ఖర్చు కానుంది. వెయ్యి గిగావాట్లు ఒక టెరావాట్కు సమానం. ఇంకోలా చెప్పాలంటే గిగావాట్ సామర్థ్యమున్న అణు విద్యుత్తు కేంద్రాలు 108 వరకూ కేవలం ఏఐ డేటా సెంటర్ల నీటి అవసరాలు తీర్చేందుకే సరిపోతాయి. ప్రపంచ విద్యుదుత్పత్తిలో మూడో శాతం అన్నమాట. డేటా సెంటర్ల ఏర్పాటుకు సుమారు 14,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నేల అవసరమవుతోంది. వీటి ద్వారా పుట్టే ఎల్రక్టానిక్ వ్యర్థాలు 25 లక్షల టన్నుల వరకూ ఉంటాయని ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్ తాజా అధ్యయనంలో స్పష్టమైంది. అంతటి అపార జలరాశితో పనేంటి? మీ కంప్యూటర్ను కొన్ని గంటలపాటు వాడితేనే వేడెక్కి పోతుంది కదా.. అలాంటిది దీనికి కొన్ని లక్షల పీసీలు ఒక దగ్గర పనిచేస్తూంటే ఎంత వేడి పుడుతుందో ఊహించుకోండి. డేటా సెంటర్ల పరిస్థితి ఇదే. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన డేటా సెంటర్‌గా అమెరికాలోని స్విచ్ సిటడెల్‌కు పేరుంది. పర్సనల్ కంప్యూటర్(పీసీల)ల లెక్కన ఈ డేటా సెంటర్‌ను గణిస్తే ఇందులో సుమారు 32 లక్షల యాభై వేల పీసీ ఒకేసారి పని చేస్తున్నట్లు లెక్క. అందుకే ఇక్కడ పుట్టే అత్యధిక వేడిని తగ్గించేందుకు డేటా సెంటర్లను నిత్యం నీటితో చల్లబరుస్తూ ఉండాలి. లేదంటే ఉష్ణోగ్రత పెరిగిపోయి డేటా సెంటర్ పనిచేయకుండా పోతుంది. వీటిపై ఆధారపడిన అనేకానేక అప్లికేషన్లు, వ్యవస్థలు కుప్పకూలుతాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల డేటా సెంటర్లు ఉండగా వీటిల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. ఒక్కొక్కటీ 100 నుంచి 600 మెగావాట్ల విద్యుత్తును వినియోగించుకుంటున్నాయి. మెట్రో నగరాలకు కావాల్సినంత విద్యుత్తు ఇది. ఫలితంగా డేటా సెంటర్ల పరిసరాల్లోని నీటి వనరులు శరవేగంగా ఖాళీ అవడం ఖాయం. కింకర్తవ్యం? ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. చైనా వంటి దేశాలు సముద్రం అడుగున డేటా సెంటర్లను ఏర్పాటు చేసి ఆ నీటితోనే చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాయి. గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నాయి. మరింత పర్యావరణ అనుకూల మార్గాల ద్వారా డేటా సెంటర్లను చల్లబరిచే ప్రయత్నం జరగాలని నిపుణులు ఆకాంక్షిస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని మదింపు చేసి తగు నియంత్రణ చర్యలు తీసుకోవడం అవసరమవుతుంది. లేదంటే డేటా సెంటర్లు మానవ జీవనాధారమైన కీలక జలరాశిని పీల్చేసే ప్రమాదం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్‌నకు షాక్.. H-1B వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో పరాభవం ఎదురైంది. తీసుకున్న H-1B వీసాలపై 1,00,000 డాలర్ల ఫీజు విధించాలన్న నిర్ణయం చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కే ఉందని, అధ్యక్షుడికి అలాంటి అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణం చేత ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ కేసు 20 మంది డెమోక్రటిక్ స్టేట్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసా దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని కూడా డేటా చూపించింది. బోస్టన్లోని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఈ ఫీజును 'కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన పన్ను'గా పేర్కొన్నారు.ప్రతి ఏటా ఇచ్చే వీసాలుసాధారణంగా H-1B ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం సుమారు 65,000 వీసాలను ఇస్తుంది. అదనంగా మాస్టర్స్ లేదా ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి మరో 20,000 వీసాలు లభిస్తాయి. ఇప్పటి వరకు ఈ వీసాలకు కంపెనీలు చెల్లించే ఫీజు సుమారు 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు మాత్రమే ఉండేది. కానీ.. కొత్తగా ప్రతిపాదించిన 1,00,000 ఫీజు కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసింది.ఈ భారీ ఫీజు కారణంగా అనేక సంస్థలు.. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనకడుగు వేసినట్లు కోర్టు రికార్డులు తెలిపాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H-1B రిజిస్ట్రేషన్లు గతంతో పోలిస్తే దాదాపు 38.5% తగ్గినట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది. ఇది విదేశీ నిపుణులపై ప్రభావం చూపింది.నిర్ణయాన్ని సమర్థించిన ట్రంప్ ప్రభుత్వంట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. అమెరికా ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యమని తెలిపింది. విదేశీ ఉద్యోగులు తక్కువ జీతాలతో అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో ఇది పెద్ద సమస్యగా మారిందని వాదించింది. కానీ కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. ఎంతోమందికి ఉపశమనంఇక భారతదేశంపై కూడా ఈ విధానం ప్రభావం చూపింది. H-1B వీసాలపై ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కఠిన నిబంధనల వల్ల దరఖాస్తులు తగ్గి, అనేక మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా అధికారులతో చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇది మార్పు దశలో ఉన్న విధానం అని, కొన్ని ఇబ్బందులు సహజమని వ్యాఖ్యానించారు. కానీ తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు అటు కంపెనీలకు, ఇటు యూఎస్ వెళ్లాలనుకునే ఎంతోమందికి ఉపశమనం కలిగించింది. -
భారతీయ నౌకపై దాడి.. 24 మంది నావికులు..!
టెహ్రాన్: హర్ముజ్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను రక్షించింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.ఒమన్ తీర సమీపంలో 'ఎంటి మారివెక్స్'అనే ఆయిల్ సరఫరా చేస్తున్న నౌకలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 24మంది నావికులు ఉన్నారు. దీంతో హుటాహుటీన స్పందించిన నావిక దళం వారందరినీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడి ఎవరూ చేశారని సమాచారం ఇంకా తెలియలేదు. కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్ఫరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ మాటలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.Helicopter rescue operation underway for 24 Indian seafarers after vessel Marivex was struck off the coast of OmanFootage from the scene show the crew being lifted from the damaged vessel after fighting for survival at sea pic.twitter.com/crlSDYaU6y— RT (@RT_com) June 8, 2026 -
మళ్లీ ఉద్రిక్తతలు.. ఆ దేశం విడిచి వెళ్లండి: భారత్
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు ఇరాన్‌కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాయం సూచించింది.గత 24 గంటల్లో పలు నగరాల్లో సైనిక చర్యలు, వ్యూహాత్మక కేంద్రాలపై వైమానిక దాడులు, భారీ క్షిపణి దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. “ఆ ప్రాంతంలో తాజా పరిణామాల దృష్ట్యా, ఇరాన్‌కు ప్రయాణించవద్దన్న మా గత సూచనను మరోసారి తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వెంటనే బయటకు రావాలి” అని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 100వ రోజుకు చేరుకున్న వేళ, సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రాంతీయ స్థాయిలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే భయం నెలకొంది.ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ బలగాలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక సముద్ర మార్గం. తాజా సైనిక చర్యల్లో ఇరాన్‌లోని ఒక పెట్రోకెమికల్ సముదాయంపై దాడి జరగగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాత్రం రెండు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌ను కోరిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దానికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేపట్టింది. అనంతరం సోమవారం ఇరు పక్షాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇజ్రాయెల్‌లోనూ.. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో చేసిన పోస్టులో.. భారతీయులు ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.“ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లోని భారతీయులు అన్ని వేళలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా అనుసరించాలి” అని తెలిపింది.అధికారిక మార్గాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న భద్రతా సూచనలను పరిశీలించాలని రాయబార కార్యాలయం సూచించింది.భారతీయులు తమ నివాసాలు, కార్యాలయాల సమీపంలోని ఆశ్రయ కేంద్రాల గురించి తెలుసుకుని, వాటికి దగ్గరగా ఉండాలని తెలిపింది. తమ నివాసం లేదా ఉద్యోగ ప్రాంతం వద్ద ఉన్న ఆశ్రయ ప్రదేశాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించింది.తదుపరి సమాచారం వచ్చే వరకు ఇజ్రాయెల్‌లో అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని భారతీయులకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని 24 గంటల సహాయ కేంద్రం ద్వారా సంప్రదించాలని తెలిపింది. -
32 మంది మృతి.. వందల మందికి గాయాలు
మనీలా: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం సమీపంలో ఈ రోజు సోమవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 32 మంది మరణించారు. 200కు పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు ప్రకటించారు.దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 17 మంది మరణించారని, గ్లాన్ అనే పర్వత ప్రాంత పట్టణంలో 13 మంది గ్రామస్థులు మరణించారని తెలిపారు. కాగా ఈ రోజు ఉదయం ఫిలిప్పీన్స్‌లో తీవ్ర స్థాయిలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం వచ్చిన వెంటనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల్లో సుమారు 3 అడుగుల (1 మీటరు) ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దీంతో వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.భయంతో పరుగులు తీసిన ప్రజలుభూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్ సాంటోస్ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.A powerful magnitude 7.8 offshore earthquake struck the southern Philippines region of Mindanao, causing widespread destruction and triggering tsunami warnings across parts of the Pacific.Authorities say at least 19 people have been confirmed dead and more than 200 others… pic.twitter.com/xJqbPqAeWA— Washington Eye (@washington_EY) June 8, 2026 -
190 vs 170.. పాక్‌పై భారత్ లీడ్
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరోసారి దక్షిణాసియా కేంద్రంగా చర్చ మొదలైంది. అణు శక్తి, ఆయుధ సామర్థ్యం, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య.. భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో.. పాకిస్థాన్‌పై ఆధిక్యం సాధించిందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక వెల్లడించింది. సిప్రి ఇయర్‌బుక్ 2026 ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్‌హెడ్స్ ఉండగా, పాకిస్థాన్ వద్ద సుమారు 170 మాత్రమే ఉన్నాయని అంచనా వేసింది. ఇరు దేశాలు 2025లో కూడా తమ అణు ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించడంపై దృష్టి పెట్టాయని.. ముఖ్యంగా భారత్ తన దీర్ఘశ్రేణి అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా వరకు చేరగలిగే డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా ఫిషైల్ మెటీరియల్ సేకరణ, కొత్త డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఆపరేషన్ సిందూర్ టైంలో.. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను సిప్రి “అసాధారణంగా తీవ్రమైన మిలిటరీ క్రైసిస్”గా అభివర్ణించింది. అయితే అణు ఘర్షణ దిశగా వెళ్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచ స్థాయిలో చూస్తే మొత్తం 9 అణు దేశాల వద్ద కలిపి సుమారు 12,241 వార్‌హెడ్స్ ఉన్నాయని సిప్రి తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా, రష్యా వద్దే అధిక భాగం ఉండగా, చైనా వేగంగా తన అణు సామర్థ్యాన్ని విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. చైనా వద్ద ఇప్పటికే సుమారు 620 వార్‌హెడ్స్ ఉన్నాయని అంచనా. భారత్ విషయానికి వస్తే.. కొత్త తరహా అణు ఆయుధ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు అభివృద్ధి చేయడం ద్వారా తన వ్యూహాత్మక స్థాయిని పెంచుకుంటోందని సిప్రి స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా తన అణు శక్తిని విస్తరించే ప్రయత్నాల్లో ఉందని, వచ్చే దశాబ్దంలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.డేంజర్ జోన్ ఎందుకంటే..సిప్రి నివేదికలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాలపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని, డిసార్మ్మెంట్ ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని స్పష్టం చేసింది. దేశాలు రక్షణ పేరుతో అణు ఆయుధాల వైపు మరింత మొగ్గు చూపుతున్నాయని, ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.అణు ఆయుధాలపై పారదర్శకత తగ్గడం, దేశాల మధ్య చర్చలు–ఒప్పందాలు బలహీనపడటం, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల.. భవిష్యత్తులో విపరీతాలు జరగొచ్చని సిప్రి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అవతలి దేశం దాడి చేయబోతుందనుకుని ఇవతలి దేశం పొరపడడం, చిన్న సంఘటనను పెద్ద ముప్పుగా భావించడం, అవసరం లేని సమయంలో సైనిక చర్యలకు వెళ్లడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా జరగొచ్చని అంటున్నారు. పెద్ద దేశాల మధ్య చిన్న పొరపాటు కూడా పెద్ద యుద్ధ ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ గతంలో భారత్–పాక్ మధ్య గతంలో చోటు చేసుకున్న సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తున్నారు. -
ఈ యూరప్ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్!
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటి. కనువిందు చేసే నీటి కాలువలు, చారిత్రక భవనాలు, మ్యూజియంలు, సాంస్కృతిక వైవిధ్యంతో ఏటా కోట్లాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న ఈ నగరం ఇప్పుడు ‘ఓవర్ టూరిజం’ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించడంతో పాటు నగర నిర్వహణకు అదనపు నిధులు సమకూర్చుకునేందుకు ఆమ్స్టర్డామ్ సిటీ ప్రభుత్వం పర్యాటక పన్నును భారీగా పెంచే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.12.5 శాతం నుంచి 20 శాతానికి..ప్రస్తుతం ఆమ్‌స్టర్‌డామ్‌లో హోటళ్లు, హాస్టళ్లు, ఇతర వసతి కేంద్రాల్లో బస చేసే పర్యాటకులపై గది అద్దెపై 12.5 శాతం పర్యాటక పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే క్రూయిజ్ నౌకల ద్వారా ఒక రోజు పర్యటనకు వచ్చే వారిపై ఒక్కొక్కరికి 15 యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1650 పన్ను విధిస్తున్నారు.కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం 2027 నుంచి ఈ పన్నును 16 శాతానికి పెంచి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక శాతం చొప్పున పెంచుతూ 2030 నాటికి 20 శాతానికి చేర్చనుంది. ఇది అమలైతే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటక పన్నులు విధించే నగరాల్లో ఆమ్స్టర్డామ్ ఒకటిగా నిలవనుంది.నగరంపై పెరుగుతున్న ఒత్తిడే కారణంపర్యాటకం నగర ఆర్థిక వ్యవస్థకు కీలక ఆదాయ వనరు అయినప్పటికీ, అదే సమయంలో జనసమ్మర్థ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు, స్థానికుల జీవన ప్రమాణాలపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోందని సిటీ ప్రభుత్వం పేర్కొంది. అందుకే నగర నిర్వహణ, పరిశుభ్రత, భద్రత, చట్ట అమలు, మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చుల్లో పర్యాటకులు కూడా తగిన వాటా భరించాలని భావిస్తోంది. పన్ను పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.క్రూయిజ్ టెర్మినల్‌కు కూడా గుడ్‌బై?పన్ను పెంపుతో పాటు మరికొన్ని కఠిన నిర్ణయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సముద్ర క్రూయిజ్ నౌకల ద్వారా వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన క్రూయిజ్ టెర్మినల్‌ను మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జాతీయ ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులతో చర్చల అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనుంది.అదనంగా, కాలువలపై బోటు టూర్లు, అద్దె పడవలు వంటి వినోద కార్యకలాపాలపై కూడా అధిక రుసుములు విధించే అవకాశాలు ఉన్నాయి. నగర కేంద్రంలోని కొన్ని భవనాలను కొనుగోలు చేసి, వాటి వినియోగాన్ని మార్చడం ద్వారా అధిక పర్యాటక ఒత్తిడిని తగ్గించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నారు.రెడ్ లైట్ ప్రాంతానికి ప్రత్యామ్నాయంప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్పై ఒత్తిడిని తగ్గించేందుకు నగర దక్షిణ ప్రాంతంలో ప్రత్యేక “ఎరోటిక్ సెంటర్” ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సెక్స్ వర్కర్లకు మరింత భద్రత కల్పించడం, నేర కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడం, నగర కేంద్రంలో రద్దీని నియంత్రించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.పర్యాటకులను ఆహ్వానిస్తూనే నియంత్రణగత కొన్నేళ్లుగా ఆమ్స్టర్డామ్ ‘టూరిజం ఇన్ బ్యాలెన్స్’ విధానాన్ని అమలు చేస్తోంది. పర్యాటకులను పూర్తిగా నిరోధించడం కాకుండా, నగర సామర్థ్యానికి మించి పెరుగుతున్న సందర్శకుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలు, యునెస్కో వారసత్వ హోదా పొందిన కాలువల వలయం, సైకిల్ సంస్కృతి కారణంగా ఆమ్స్టర్డామ్ ఇప్పటికీ ఐరోపాలో అత్యధికులు సందర్శించాలనుకునే పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు మరింత ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. -
చాగోస్ దీవులపై ట్రంప్ కన్ను.. యూకేకు బిగ్ షాక్?
వాషింగ్టన్: హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్ దీవులను కొనుగోలు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలంరేపుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన తరహాలోనే, ఇప్పుడు బ్రిటన్ను పూర్తిగా పక్కనపెట్టి, చాగోస్ దీవులపై సార్వభౌమాధికారం ఉన్న మారిషస్‌తో అమెరికా నేరుగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక ప్రత్యేక ప్రతిపాదనను ట్రంప్ ముందుకు తెచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘టెలిగ్రాఫ్’ వెల్లడించింది.ట్రంప్ వ్యూహం.. బ్రిటన్‌తో సంబంధంలేకుండా..అమెరికా రూపొందించిన ఈ సరికొత్త ప్రతిపాదన ప్రకారం.. బ్రిటన్‌తో సంబంధం లేకుండా చాగోస్ దీవులను నేరుగా మారిషస్ నుండి కొనుగోలు చేయాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే దీనికంటే ముందు ఆ దీవులకు పూర్తి సార్వభౌమాధికారం లభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు ఆప్షన్లలో ఇది ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, అమెరికా అధికారుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు మిత్రదేశంగా ఉన్న మారిషస్‌కు ఈ భూభాగాన్ని పూర్తిగా అప్పగిస్తే, అక్కడ గూఢచర్య ముప్పు పెరిగే అవకాశం ఉందని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డియెగో గార్సియా స్థావరం.. ఇరాన్ ముప్పుమధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ చాగోస్ దీవులలోని ‘డియెగో గార్సియా’ సైనిక స్థావరం అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. ప్రస్తుతం ఇరాన్‌తో నడుస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ నుండి సుమారు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బేస్ నుండి అమెరికా లాంగ్-రేంజ్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత మార్చిలో ఈ సంయుక్త సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించగా, అమెరికా యుద్ధనౌక దాన్ని తిప్పికొట్టింది. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసేందుకు యూకే ఆలస్యంగా అనుమతి ఇవ్వడంపై ట్రంప్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.యూకే హ్యాండ్ఓవర్ సస్పెన్స్.. శరణార్థుల ఆవేదనఈ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు బదిలీ చేసే ప్రక్రియకు అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంతో, గత ఏప్రిల్‌లోనే దీనికి సంబంధించిన చట్టం నిలిచిపోయింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ.. డియెగో గార్సియాపై నియంత్రణకు ముప్పు పొంచి ఉన్నందున, జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా మద్దతు లేకుండా బ్రిటన్ ఎలాంటి సార్వభౌమత్వ ఒప్పందానికి ముందుకు వెళ్లబోదని స్పష్టం చేశారు. మరోవైపు తమ జన్మభూమి భవిష్యత్తును బ్రిటన్ రాజకీయాలు హైజాక్ చేశాయని, స్వదేశానికి తిరిగి వెళ్లే హక్కు తమకు ఉందని చాగోస్ శరణార్థుల బృందం ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
అమెరికాలో కలకలం.. రద్దీ రైల్వే స్టేషన్లో రక్తపాతం
న్యూయార్క్: అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండే రవాణా కేంద్రాలలో ఒకటైన న్యూయార్క్ లోని పెన్ స్టేషన్ రక్తపాతానికి వేదికైంది. స్టేషన లోపల ఒక దుండగుడు విచక్షణారహితంగా కత్తులతో దాడికి తెగబడటంతో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఆమ్ట్రాక్ పోలీస్ డిపార్ట్మెంట్ నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు జరగనున్న తరుణంలో ఈ దాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.రక్తసిక్తంగా మారిన రైల్వే స్టేషన్పెన్ స్టేషన్‌లోని ట్రాక్ 5, 6 సమీపంలో ఈ ఘోర దాడి జరిగింది. ఘటన జరిగిన ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. న్యూయార్క్ ఫైర్ డిపార్ట్మెంట్, నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తే..ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలను, దాడికి గల కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే నిందితుడు మానసిక వికలాంగుడైన ఒక నిరాశ్రయుడని భావిస్తున్నట్లు న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ మార్క్ లెవిన్ తెలిపారు. ఈ దాడిని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తీవ్రంగా ఖండించారు. ఇదొక ‘భయంకరమైన హింసాత్మక చర్య’ అని అభివర్ణించిన ఆమె, ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పోలీసులు ఈ దాడి వెనుక గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.ప్రతిష్టాత్మక టోర్నీల వేళ భద్రత కట్టుదిట్టంమరో కొన్ని రోజుల్లో న్యూయార్క్ నగరం రెండు ప్రధాన క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వబోతున్న తరుణంలో ఈ ఘటన జరగడం భద్రతా సంస్థలను ఆందోళనలో పడేసింది. మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఎన్బీఏ ఫైనల్స్ (గేమ్స్ 3, 4), అలాగే పొరుగున ఉన్న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం నగరం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యవసర చర్యల దృష్ట్యా పెన్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఇదికూడా చదవండి: ‘దీదీ’కి మరో షాక్: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా -
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్‌కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్‌లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.. ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్లెస్ ట్రాన్స్‌మిటర్‌తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.WOW -- Trump crashes out and cuts his interview with Welker short as she presses him on his lack of evidence for claiming elections are rigged"You're either crooked or you're stupid. Let's call it quits. Because I've had enough. Thank you darling," he tells her.""I traveled… pic.twitter.com/qQaNIDnX4y— Aaron Rupar (@atrupar) June 7, 2026క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వార్తా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించారు. అనంతరం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని స్థానిక టెలివిజన్ ఛానళ్లలో రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్‌లో చూపిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్‌లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్‌హౌస్ కరస్పాండెంట్‌గా నియమితులైన ఆమె, అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే.. క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో. అప్పటి ట్రంప్–బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ, చర్చను నియంత్రించిన తీరు ఆమెకు విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చా కార్యక్రమాల్లో ఒకటైన “మీట్ ద ప్రెస్”కు 2023లో ఆమె హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా హోస్ట్‌గా, రెండో మహిళా యాంకర్‌గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు.. గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడన్.. ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్, రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రశ్నించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానాల్లోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ఘటనతో మరోసారి ఆమె పేరు.. తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. -
‘నువ్వు నమ్మక ద్రోహివి.. నీకసలు తెలివే లేదు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీవీ ఇంటర్వ్యూలో సహనం కోల్పోయారు. సదరు టీవీ ఛానెల్ యాంకర్‌పై నోరు పారేశుకున్నారు. ‘నువ్వు చేసేది మోసమైనా ఉండాలి. లేదంటే తెలివి తక్కువైనా ఉండాలి అంటూ కాలర్ మైక్‌ను పడేసి బయటకు వెళ్లిపోయారు.ఆదివారం ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ఎన్బీసీ తన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్, యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ల మధ్య చిన్న సైజు మినీ యుద్ధమే జరిగింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాలిఫోర్నియాలో జోబైడెన్ సుమారు 63శాతం ఓట్లు సాధించారు. డొనాల్డ్ ట్రంప్ 34శాతం ఓట్లు మాత్రమే పొందారు. ఈ ఎన్నికల ఫలితాల సరళిని ఎన్బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ మళ్లీ ప్రస్తావించారు. ఆయన కాలిఫోర్నియాలో రిగ్గింగ్ కారణంగా ఓట్ల లెక్కింపు ఆలసమైందని ఆరోపించారు. దీనికి యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ స్పందిస్తూ.. ‘కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఆలస్యానికి కారణం రిగ్గింగ్ కాదు. పోలైన ఓట్ల శాతం ఎక్కువ. వాటిని లెక్కించడానికి మరింత సమయం పట్టింది’ అని చెప్పారు. ఈ వివరణతో ట్రంప్ చిర్రెత్తుకొచ్చి ‘కౌంటింగ్‌లో చీటింగ్ జరిగింది’ అని మరోసారి ఆరోపించారు. వెల్కర్ ఆయనను నిలదీస్తూ.. మీ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ట్రంప్ ‘నేనే చూశాను.. అదే ఆధారం’ అని సమాధానమిచ్చారు. కానీ ఎన్బీసీ యాంకర్ ఎన్నికల్లో అవకతవకలకు ఎలాంటి ఆధారాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.తర్వాత సంభాషణ మీడియాపై విమర్శలకు దారి తీసింది. ట్రంప్ కాలిఫోర్నియా ఎన్నికల అధికారులను, మీడియా ప్రతినిధులను, మీడియా సంస్థలను ‘మోసగాళ్లు’గా అభివర్ణించారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని కూడా ‘మోసపూరితం’ అని అన్నారు. ట్రంప్ అమెరికా ఎన్నికల నిర్వహణను ‘అభివృద్ధి చెందని దేశం’ తరహాలో ఉందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా వెల్కర్ ‘నేను మోసపూరితమైనది కాదు’ అని బదులిచ్చారు. దానికి ట్రంప్ ‘నువ్వు మోసపూరితమైనదానివైనా అయి ఉండాలి.. లేదంటే తెలివితక్కువదానివైనా అయి ఉండాలి అని అన్నారు. కాలిఫోర్నియా ఎన్నికలపై జరిగిన చర్చ చివరికి రసాభాసగా ముగింది. JUST NOW: President Trump walked out of the interview with Kristen Welker. President Trump had enough!!Refusing to tolerate the biased framing, President Trump completely turned the tables on the Welker."Your elections are crooked, and you're crooked."pic.twitter.com/cxXTcYM6Fk— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) June 7, 2026 -
పాపం.. రన్‌వేపైనే కబళించిన మృత్యువు
ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం ఎందుకు ప్రయత్నించిందో తెలియదు. రన్‌వేపై ఘోరంగా తడబడింది. చూస్తుండగానే ప్రైవేట్ జెట్ అదుపుతప్పి కుప్పకూలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే విమానం అగ్నిగుండాన్ని తలిపించింది. పైలట్ చేసిన ప్రయత్నం చివరకు విషాదాంతంగా మారింది. ఆ మంటల్లో చిక్కుకుని పైలట్, కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు. డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ రన్‌వేపై సురక్షితంగా దిగకముందే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనాస్థలం అగ్నిగుండంలా మారిపోయింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.విమానం ఏ కారణంతో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిందన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక లోపమా? ఇంజిన్ సమస్యా? లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందికి దించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరి క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. దీంతో రన్‌వేకు చేరకముందే విమానం నేలపై కూలిపోయింది.Tragic development: A private jet has crashed during an emergency landing attempt at La Romana International Airport in the Dominican Republic.#aircraft pic.twitter.com/Q4nmtpn4ul— FL360aero (@fl360aero) June 7, 2026ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీ మంటలు ఎగసిపడ్డాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో విమానం శకలాలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, విమానం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.ఈ ఘటనపై విమానయాన అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. విమానం నిర్వహణ రికార్డులు, సాంకేతిక పరిస్థితి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో జరిగిన సంభాషణలు, ఫ్లైట్ డేటా తదితర అంశాలను పరిశీలించనున్నారు. అయితే ప్రమాదానికి దారితీసిన అసలు కారణం ఏంటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
తినే నూడుల్స్‌తో పేపర్.. జపాన్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
జపాన్‌లోని కగావా శాస్త్రవేత్తలు సరికొత్త విప్లవాత్మక సాంకేతికతకు తెరలేపారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్న ఆహార వ్యర్థాల సమస్యకు వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. హోటళ్లలో మిగిలిపోయి, పారేసే ‘ఉడాన్ నూడుల్స్’ తో పర్యావరణహిత, బయోడిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నం చెందే) కాగితాన్ని తయారు చేసి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, వ్యర్థాలను అద్భుతమైన వనరుగా మార్చిన ఈ పరిశోధన వివరాలు ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగంలో సంచలనంగా మారాయి.ప్రత్యేక నూడుల్స్.. పెరిగిపోతున్న వ్యర్థాలుజపాన్లోని కగావా ప్రిఫెక్చర్ ‘సానుకి ఉడాన్’ అనే ప్రాంతీయ నూడుల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అంతే స్థాయిలో ఇక్కడ ఆహార వృథా కూడా జరుగుతోంది. స్థానిక రెస్టారెంట్లలో అమ్ముడుపోని నూడుల్స్, అలాగే ఉడకబెట్టిన తర్వాత ఎక్కువ సమయం ఉంచడం వల్ల రుచి కోల్పోయిన నూడుల్స్‌ను భారీ మొత్తంలో పారేయాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన ఆహార వృథా సమస్యను అరికట్టాలనే లక్ష్యంతో పరిశోధకులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.ప్రొఫెసర్ తనకా వినూత్న ఆలోచనకగావా యూనివర్సిటీ అగ్రికల్చర్ ఫ్యాకల్టీకి చెందిన ప్రొఫెసర్ నవోటాకా తనకా నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. సూక్ష్మజీవులు, సెల్యులోజ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాపై ఆయన చేసిన సుదీర్ఘ పరిశోధనల ఆధారంగా ఈ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ‘మా ప్రాంతంలో భారీ మొత్తంలో ఉడాన్ నూడుల్స్ వృథాగా పారేయడం నన్ను ఆలోచింపజేసింది. వీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఆహార వ్యర్థాలను తగ్గించవచ్చని భావించాను’ అని ప్రొఫెసర్ తనకా తెలిపారు. నూడుల్స్‌ను చక్కెరగా మార్చే ప్రక్రియ చాలా సులభం కావడంతో ఆయన ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు.నూడుల్స్ నుండి కాగితం తయారీ ఇలా..సాధారణ కాగితం తయారీ పద్ధతులకు భిన్నంగా, ఈ ప్రక్రియలో అధునాతన జీవ సాంకేతికతను ఉపయోగించారు. మొదటగా మిగిలిపోయిన నూడుల్స్‌ను నీటితో కలిపి మిశ్రమంగా మారుస్తారు. ఆ తర్వాత, అందులోని పిండి పదార్ధాన్ని గ్లూకోజ్‌గా మార్చడానికి కొన్ని ప్రత్యేక ఎంజైమ్‌లను జోడిస్తారు. ఈ మిశ్రమానికి ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చేర్చిన కొద్ది రోజుల్లోనే, ఆ మిశ్రమం పైభాగంలో బ్యాక్టీరియా ఒక సెల్యులోజ్ పొరను ఏర్పరుస్తుంది. ఆ పొరను జాగ్రత్తగా ట్రేలలో ఉంచి, సహజ గాలిలోనే ఆరబెట్టడం ద్వారా జపాన్ సాంప్రదాయ ‘వాషి’ కాగితం లాంటి పలచని షీట్లు సిద్ధమవుతాయి.అద్భుతమైన మన్నిక.. పర్యావరణానికి మేలుఒక్క ప్లేట్ ఉడాన్ నూడుల్స్ వ్యర్థాల నుండి దాదాపు 5 నుండి 10 వరకు ఏ4 సైజు కాగితాలను తయారు చేయవచ్చు. ప్రొఫెసర్ తనకా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోబియల్ పేపర్ సాధారణ కాగితం కంటే చాలా తేలికగా ఉండటమే కాకుండా, నీటిని తట్టుకునే శక్తిని, మన్నికను కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, వాడేసిన తర్వాత మట్టిలో పడేసినా, సూక్ష్మజీవుల సహాయంతో ఇది చాలా వేగంగా, సహజంగా కలిసిపోతుంది. నిజానికి ఈ సాంకేతికతను ప్రొఫెసర్ సుమారు 16 ఏళ్ల క్రితమే విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా చూపించడానికి అభివృద్ధి చేయడం గమనార్హం.అడ్డంకులను అధిగమించి స్థిరమైన ఉత్పత్తి2020 సంవత్సరంలో, ఈ సాంకేతికతను స్థానిక సామాజిక సేవా సంస్థకు విశ్వవిద్యాలయం ఉచితంగా అందించింది. దీని ద్వారా వికలాంగులకు ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రారంభంలో బ్యాక్టీరియా కాలుష్యం, బూజు పట్టడం వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఉష్ణోగ్రత నియంత్రణ పెట్టెలను ఉపయోగించి నాణ్యమైన ఉత్పత్తిని సాధించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో నెలకు సుమారు 100 కాగితపు షీట్లను తయారు చేస్తున్నారు. వీటిని విశ్వవిద్యాలయమే కొనుగోలు చేస్తోంది. తద్వారా రెస్టారెంట్లు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలతో కూడిన ఒక బలమైన స్థానిక రీసైక్లింగ్ నెట్వర్క్ ఏర్పడింది.భవిష్యత్ ప్రణాళికలు.. పరస్పర సహకారంఈ పర్యావరణహిత కాగితాన్ని ఇప్పటికే ప్రచార సామగ్రి, కళాఖండాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు దీనిని నీటిలో కరిగిపోయే చేపల ఎరగా ఉపయోగించే అంశంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు, నూడుల్స్ వ్యర్థాలను అందించే రెస్టారెంట్లకు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సహాయం చేస్తోంది. వాతావరణ మార్పులు, ఆహార వినియోగ అంచనాలకు సంబంధించిన డేటాను వారికి అందిస్తూ, ముందస్తుగా ఆహార వృథాను అరికట్టేలా ప్రోత్సహిస్తోంది. ఈ వినూత్న ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యర్థాల నిర్మూలనకు ఒక గొప్ప రోల్ మోడల్‌గా మారుతుందని ప్రొఫెసర్ తనకా ఆశాభావం వ్యక్తం చేశారు. -
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు: గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా
బాగ్దాద్: పశ్చిమాసియాలో ముదురుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భద్రతా ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికలతో తమ దేశాల గగనతలాన్ని (ఎయిర్‌స్పేస్) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరు దేశాల పౌర విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడనుంది.ఇరాక్‌లో 72 గంటల ఆంక్షలుప్రాంతీయ ఉద్రిక్తతల తీవ్రత దృష్ట్యా ఇరాక్ విమానయాన సంస్థ ఆదివారం రాత్రి నుంచే కఠిన నిర్ణయాలు అమలులోకి తెచ్చింది. తమ దేశ వైమానిక పరిధిని మొత్తం 72 గంటల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే, ఇదే సమయంలో ఇరాక్ గగనతలంలో ఒక పౌర విమానం కూలిపోయిందంటూ వస్తున్న వార్తలను అధికారులు తీవ్రంగా ఖండించారు. తమ పరిధిలో అటువంటి ప్రమాదం ఏదీ నమోదు కాలేదని స్పష్టం చేస్తూ, వదంతులను నమ్మవద్దని కోరారు.సిరియాలో విమాన సర్వీసులు నిలిపివేతమరోవైపు సిరియా సైతం తమ రక్షణ చర్యలను వేగవంతం చేసింది. ఆదివారం రాత్రి 11:00 గంటల నుండి తమ దేశ దక్షిణ వాయు మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అక్కడి పౌర విమానయాన శాఖ పేర్కొంది. ఈ ఆంక్షలు సోమవారం ఉదయం 11:00 గంటల వరకు కొనసాగుతాయని, పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపింది. ఈ మూసివేత చర్యల్లో భాగంగానే డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా అన్ని రకాల విమాన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు.హై అలర్ట్‌లో ప్రత్యేక కమిటీప్రాంతీయంగా మారుతున్న తాజా పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఇరు దేశాల అధికారులు తెలిపారు. ప్రత్యేక రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ (ప్రమాద నిర్వహణ కమిటీ) సమర్పించిన సాంకేతిక నివేదికలు, భద్రతా అంచనాల ఆధారంగానే ఈ అత్యవసర నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాణికుల, విమానాల రక్షణే తమకు అత్యంత ప్రాధాన్యత అని, తదుపరి సమీక్షల అనంతరం గగనతలాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. -
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైళ్ల వర్షం
us israel iran war live updatesమరోసారి భగ్గుమన్న పశ్చిమాసియాఇరాన్పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్ ఎటాక్ఇరాక్పైనా గురిపెట్టిన ఇరాన్.. బాగ్ధాద్‌లో భారీ పేలుళ్లు ఇరాన్‌పై ఎదురు దాడికి దిగిన ఇజ్రాయెల్‌రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లుట్రంప్ వద్దని చెబుతున్నా లెక్క చేయని ఇజ్రాయెల్‌దాడులు చేయబోమని చెబుతూనే ఇరాన్‌పై మిసైళ్ల వర్షంమరోసారి నెతన్యాహూకు ఫోన్ చేసిన డొనాల్డ్ ట్రంప్ గగన తలం మూసివేతపశ్చిమాసియాలో మళ్లీ కమ్ముకున్న మేఘాలుప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు కీలక నిర్ణయం భద్రతా ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికలతో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటన ఆకస్మిక నిర్ణయంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావంతమ దేశ వైమానిక పరిధిని మొత్తం 72 గంటల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడిఆదివారం రాత్రి 11:00 గంటల నుండి తమ దేశ దక్షిణ వాయు మార్గాలను తాత్కాలికంగా మూసివేసిన సిరియాఈ ఆంక్షలు సోమవారం ఉదయం 11:00 గంటల వరకు కొనసాగుతాయని ప్రకటన మూసివేత చర్యల్లో భాగంగానే డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని రకాల విమాన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేత -
ట్రంప్‌ను కాదని ఇరాన్‌పై విరుచుకుపడ్డ నెతన్యాహు
టెహ్రాన్: పశ్చిమాసియాలో శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, దాడి చేయవద్దని గట్టిగా వారించినప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ మాటలను లెక్కచేయలేదు. ఆదివారం రాత్రి ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా, సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై భీకర దాడులు ప్రారంభించింది. ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు చెలరేగడం ఇదే మొదటిసారి.ట్రంప్ హెచ్చరికలను కాదన్న నెతన్యాహుఆదివారం రాత్రి ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్‌తో తుది శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని, దౌత్య రంగానికి సమయం ఇవ్వాలని కోరారు. ఫైనాన్షియల్ టైమ్స్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునేది నేనే (I call the shots). నెతన్యాహు కాదు’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనను తిరస్కరించిన ఇజ్రాయెల్, కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగింది.మూడు ఇరాన్ నగరాల్లో పేలుళ్ల మోతఇజ్రాయెల్ సైన్యం పశ్చిమ మరియు మధ్య ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక లక్ష్యాలపై విరుచుకుపడింది. ఇరాన్ స్టేట్ మీడియా నివేదికల ప్రకారం, టెహ్రాన్, తబ్రిజ్, ఇస్ఫహాన్ అనే మూడు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ దళాలు ఈ దాడుల కోసం ‘ఎయిర్-లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైళ్లను’ ఉపయోగించినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది. దాడి ముప్పును ముందే ఊహించిన ఇరాన్, తన పశ్చిమ వైమానిక రంగాన్ని తాత్కాలికంగా మూసివేసింది.తీవ్రతరమవుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలుఈ తాజా దాడులతో పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆదివారం నాడు అమెరికా అభ్యంతరాలను సైతం పక్కనబెట్టి ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరూట్‌పై ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడులు చేసింది. దీనికి ప్రతికారంగానే ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా, ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించాయి. ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందిస్తూ, తమపై దాడులు కొనసాగితే ఈ ప్రాంతంలోని అమెరికన్, జియోనిస్ట్ లక్ష్యాలపై మరింత తీవ్రమైన రీతిలో విరుచుకుపడతామని హెచ్చరించాయి. -
అన్నంత పని చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. లెబనాన్ బీరూట్ శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ రంగంలోకి దిగింది. నేరుగా బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో సైరన్లు మోగగా, క్షిపణి నిరోధక వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగాయి. ఆదివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) వెల్లడించింది. క్షిపణుల ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఉత్తర ఇజ్రాయెల్‌లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొంది. అయితే అదనపు క్షిపణుల ప్రయోగాలను కూడా గుర్తించినట్లు వెల్లడించింది.ప్రతీకారమే!ఈ క్షిపణి దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న దహియెహ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీరూట్‌పై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించిన టెహ్రాన్, తాజాగా రంగంలోకి దిగినట్లే స్పష్టమవుతోంది.10 క్షిపణులు అడ్డుకున్న ఇజ్రాయెల్అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన కనీసం 10 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ CNN తన నివేదికలో పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రతీకార హెచ్చరికఇరాన్ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ Effie Defrin, "ఇరాన్ తీవ్రమైన తప్పు చేసింది" అని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయల్ జమీర్ మాట్లాడుతూ.. అవసరమైతే శత్రువుపై గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఏప్రిల్ తర్వాత..ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సున్నితమైన శాంతి వాతావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా ఘర్షణల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, అదే రోజున రెండు పక్షాలు పరస్పరం దాడులు కొనసాగించడంతో ఆ ఒప్పందం నిలవలేదు.రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా..ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తమ ఏరోస్పేస్ దళాలు ఇజ్రాయెల్‌లోని రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్‌కు చెందిన ఖాతమ్ అల్-అన్బియా కమాండ్ అధికారి మాట్లాడుతూ, బీరూట్ దక్షిణ శివార్లపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ అన్ని "రెడ్లైన్లను" దాటిందని ఆరోపించారు.అన్నంత పని చేసిన ఇరాన్"బీరూట్ శివార్లపై దాడులు విస్తరిస్తే ఆక్రమిత భూభాగాల్లోని లక్ష్యాలపై దాడి చేస్తామని ముందే హెచ్చరించాం. ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు ఆపకపోతే మరింత తీవ్రమైన, విధ్వంసకర దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఇరాన్ సైనికాధికారులు హెచ్చరించారు.గగనతలం మూసివేతఇజ్రాయెల్పై క్షిపణి దాడుల అనంతరం ప్రతీకార చర్యలు ఉండొచ్చన్న అంచనాతో ఇరాన్ తన పశ్చిమ గగనతలాన్ని (Western Airspace) తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇరాక్, సిరియా కూడా భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలాన్ని మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ప్రాంతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.అమెరికా లక్ష్యాలకూ హెచ్చరికఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మరింత ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికా ప్రయోజనాలు, అమెరికా మద్దతు ఉన్న లక్ష్యాలపై కూడా దాడులు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావించింది.ట్రంప్ భిన్నాభిప్రాయంఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ మరింత ప్రతీకార చర్యలకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రసార సంస్థ నివేదించింది. ఇది ఇజ్రాయెల్ సైన్యం వ్యక్తం చేస్తున్న కఠిన వైఖరికి భిన్నంగా కనిపిస్తోంది.మళ్లీ యుద్ధ భయాలుఇరాన్-ఇజ్రాయెల్ తాజా ఘర్షణతో మిడిల్ఈస్ట్ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గాజా, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులకు ఈ పరిణామం మరింత మంటలు రాజేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భూకంప బీభత్సం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్!
ఒక్కసారిగా భూమి కంపించింది. క్షణాల్లో భవనాలు ఊగిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతాన్ని 8.2 తీవ్రత భూకంపం వణికించగా.. ఇప్పుడు అందరి దృష్టి సముద్రంపైనే ఉంది. ఎందుకంటే భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో తీరప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం సమీపంలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఉపరితలానికి అత్యంత సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా నమోదైంది.మొదట భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేసిన అధికారులు.. ఆ తర్వాత 7.8గా, అనంతరం 8.2గా సవరించారు. దీంతో ఇది ఇటీవలి కాలంలో పసిఫిక్ ప్రాంతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా మారింది.కూలిన భవనాలు.. పరుగులు తీసిన ప్రజలుభూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్ సాంటోస్ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.ఒకరు మృతి.. పలువురికి గాయాలుతాజా సమాచారం ప్రకారం కనీసం ఒకరు మృతి చెందగా, నలుగురికి పైగా గాయపడ్డారు. సరంగాని ప్రావిన్స్‌లోని అలాబెల్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. "ఇటీవలి సంవత్సరాల్లో మేము అనుభవించిన అత్యంత బలమైన భూకంపం ఇదే" అని స్థానిక అధికారులు తెలిపారు.సునామీ భయంభూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్ జారీ చేసింది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (PHIVOLCS) కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్‌కు పైగా ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వేలాది మందిని తీరప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇండోనేషియా కూడా తన ఈశాన్య తీరప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.రింగ్ ఆఫ్ ఫైర్లోనే ప్రమాదంఫిలిప్పీన్స్ "పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్"గా పిలిచే అత్యంత భూకంప ప్రబల ప్రాంతంలో ఉంది. భూమి టెక్టానిక్ ఫలకాలు కలిసే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి.ఇప్పుడు అందరి చూపు సముద్రంపైనేభూకంపం వల్ల జరిగిన నష్టం కంటే ఇప్పుడు సునామీ ముప్పే అధికారులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. సముద్ర మట్టంలో మార్పులను నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సునామీ ప్రమాదం పూర్తిగా తొలగే వరకు తీరప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. (8 มิ.ย. 69) เวลา 06:37 น. ตามเวลาประเทศไทย เกิดแผ่นดินไหว จุดศูนย์กลางอบู่บริเวณ Mindanao, Philippines ขนาด 8.2 ลึก 10 กม. ญี่ปุ่นประกาศเตือนสึนามิ ขอให้ทุกคนปลอดภัยนะ ภัยธรรมชาติน่ากลัวมาก#earthquake #Philippines #tsinami pic.twitter.com/Zi5mIOsGBy— เลิฟบูววววว (@Lali_M17) June 8, 2026 UPDATE: At least one dead, 4 injured after the earthquake in southern Philippines. The police chief of Alabel town in Sarangani told Reuters the police building cracked during the quake, which hit while officers were mid-flag-raising ceremony.Magnitude still being confirmed.… pic.twitter.com/ncqtqHTGBX— Global Report (@Global_ReportHQ) June 8, 2026Another video captures the Jollibee building collapse in General Santos, Philippines following powerful earthquake. No word on casualties. https://t.co/LJEVl0qTjC pic.twitter.com/DgixNijwoY— AZ Intel (@AZ_Intel_) June 8, 2026 -
బాలిక హత్యాచారం కేసులో దంపతులకు ఉరి
ఢాకా: బంగ్లాదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన దంపతులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. కేవలం ఐదు రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని న్యాయవాదులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న 19 రోజుల్లోనే ఢాకా మెట్రోపాలిటన్ చైల్డ్ రిప్రెషన్ ప్రివెన్షన్ ట్రిబ్యునల్ ఈ ఘనత సాధించిందన్నారు. మే 18వ తేదీన ఢాకాలోని పల్లబి ప్రాంతంలోని ఓ 8 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమెను అక్కడే ఓ అపార్టుమెంట్లో ఉండే సోహెల్ రాణా కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అతడికి భార్య స్వప్నా ఖాతూన్ సహకరించింది. అనంతరం ఆ బాలికను ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే దాచేసి సోహెల్ పరారయ్యాడు. పోలీసులు 19వ తేదీన సోహెల్, స్వప్నలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. జడ్జి మస్రూర్ సలెకిన్ ఆదివారం తీర్పు వెలువరించారు. నిందితులు ఇద్దరికీ ఉరి శిక్షతోపాటు, రూ.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులను వేలం వేసి, వసూలు చేయాలని ఆదేశించారు. -
ఐరాస అవార్డు అందుకున్న అభిలాష
ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మేజర్ అభిలాష బారక్ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నుంచి యూఎన్ మిలటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’అందుకున్నారు. భారత ఆర్మీలో మొట్టమొదటి మహిళా హెలికాప్టర్ పైలట్‌గాను అభిలాష గతంలో చరిత్ర సృష్టించారు. ఈమె లెబనాన్‌లో శాంతిపరిరక్షక విధులు నిర్వహించే భారత బెటాలియన్‌లో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్‌గా మేజర్ అభిలాష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి పరిరక్షక దళంలో పనిచేసే మహిళల పాత్ర ఎంత కీలకమైందో నిరూపించేందుకు గాను ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ‘మీరు సేవ చేసే వారికి, మీతో కలిసి సేవలందించే వారికి ఆదర్శంగా నిలిచారంటూ పురస్కారం ప్రదానం సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ వ్యాఖ్యానించారు. కలలకు, నాయకత్వానికి, ధైర్యానికి, మానవాళికి సేవ చేయాలనే సంకల్పానికి లింగబేధం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగో, దక్షిణ సూడాన్‌లలో విధుల్లో ప్రాణత్యాగం చేసిన భారత ఆర్మీకి చెందిన నాయిబ్ సుబేదార్ సుజీత్ కుమార్ ప్రధాన్, లాన్స్ హవల్దార్ హర్బజన్ సింగ్‌లకు గుటెర్రస్ ‘డ్యాగ్ హామర్‌షోల్డ్’ పురస్కా రాలను ప్రదానం చేశారు. వారి తరఫున ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి.హరీశ్ అందుకు న్నారు. శాశ్వత శాంతి నెలకొన్నప్పుడు మాత్రమే ప్రతి గొంతు వినిపిస్తుంది. ప్రతి వ్యక్తికి సాధికారత సాధ్యమవతుందని అవార్డు అందుకున్న మేజర్ అభిలాష పేర్కొన్నారు. మేజర్ గవానీ, మేజర్ రాధిక తర్వాత ఈ గౌరవం అందుకున్న మూడో భారత్ మహిళా అధికారి మేజర్ అభిలాష. అవార్డు అందుకున్న మేజర్ అభిలాష బరాక్‌ను ప్రధాని మోదీ అభినందించారు. మేజర్ అభిలాష అందించిన విశిష్ట సేవలకు, ఐరాస శాంతి పరిరక్షక దళాలకు భారత్ అందిస్తున్న చేయూతకు దక్కిన గౌరవంగా ఆయన ఎక్స్‌లో అభివర్ణించారు. -
ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో తాము విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయబోమని, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే, లెబనాన్‌ను ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం చేయాలనే ఆలోచన లేదన్నారు.ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్నారు. ఒప్పందంపై మాకు నమ్మకం కలగాలి. అప్పుడే ఆంక్షలపై చర్చలు ప్రారంభమవుతాయి. ఒప్పందం కుదిరే వరకు ఆస్తులను నిలిపివేస్తామని స్పష్టం చేస్తూ.. ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచారు. ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రస్తుతం లెబనాన్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాయి.ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు, దాడులు, రాజకీయ అస్థిరతలు ఈ చర్చలకు మరింత క్లిష్టతరం చేశాయి.ట్రంప్ వ్యాఖ్యలు ఒప్పందం విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. -
ట్రంప్ బృందం నుంచి తప్పుకున్న ఏఐ సలహాదారు
వైట్‌హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా చేశారు. ఈ నెలాఖరున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. 18 నెలల పాటు ఆయన సేవలందించారు. తాను కొంతకాలం విరామం తీసుకుని,.. ఆ తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన ఏఐ సంబంధిత సవాళ్లపై తిరిగి పని చేస్తానంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కృష్ణన్ ప్రభుత్వంలో తన సేవను జీవితకాలపు ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో సేవ చేయడం గౌరవం. ఆయన నాయకత్వం లేకపోతే మనం ఏఐ రేసులో ముందంజలో ఉండేవాళ్లం కాదంటూ ఆయన పేర్కొన్నారు.వైట్ హౌస్ ఏఐ, క్రిప్టో సలహాదారు డేవిడ్ సాక్స్‌కు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. ఏఐ రంగంలో అమెరికా విజయం సాధించాలనే ఆయన నిరంతర మద్దతు ఎంతో కీలకమైందని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. తన పదవీకాలంలో తాను అభివృద్ధి చేయడంలో సహాయపడిన పలు కార్యక్రమాలను కృష్ణన్ ప్రధానంగా ప్రస్తావించారు.వీటిలో అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్'ను రూపొందించడం, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఏఐ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఏఐ యాక్సిలరేషన్ పార్టనర్‌షిప్‌లను ముందుకు తీసుకెళ్లడం, 'నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్‌వర్క్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సహకారం అందించడం, అంతర్జాతీయంగా ఏఐ సదస్సులు, దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికన్ ఏఐ ప్రయోజనాలను ప్రోత్సహించడంలో తన పాత్రను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. కృత్రిమ మేధస్సు వేగవంతమైన పరిణామంగా కృష్ణన్ పేర్కొన్నారు.చెన్నైలో జన్మించిన కృష్ణన్.. ఎస్ఆర్ఎంఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2005లో అమెరికాకు వెళ్లారు. కృష్ణన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఇన్సూరెన్స్ రంగంలో పనిచేశారు. తల్లి గృహిణి. ఆయన 21 సంవత్సరాల వయస్సులో మైక్రోసాఫ్ట్ సంస్థతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ ఆయన విండోస్ అజూర్ వ్యవస్థకు ఫౌండింగ్ మేనేజర్‌గా పనిచేశారు.ట్రంప్ ప్రభుత్వంలో చేరడానికి ముందు, కృష్ణన్ 'ఆండ్రీసెన్ హోరోవిట్జ్' వెంచర్ క్యాపిటల్ సంస్థలో జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. అంతకుముందు ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ 'వార్ రూమ్'లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ నుండి 'ఎక్స్ గా మార్చే ప్రక్రియలో ఆయన సహాయం అందించారు. -
భారత్‌ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!
మన మాతృగడ్డని ఎందరో విదేశీయలు ప్రశంసించారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్క్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్న వాళ్లు కోకొల్లలు. అలాంటి ఈ భారత్ నేలను విడిచి వెళ్లడం అంటేనే కన్నీళ్లు వచ్చేస్తాయంటున్నాడు ఒక విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో యూకే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ డేవ్ ఫ్లూకు ప్రతి పర్యటలనో భారత్‌ని విడిచి వెళ్లడమే అత్యంత కష్టంగా ఉంటుందని చెబుతుండటం కనిపిస్తుంది. మంబై నుంచి బయలుదేరే ముందు రికార్డ్ చేసిన వీడియో అది. ఈ దేశంతో ఏర్పరచుకున్న అనుబంధం అలాంటిదని, ఇక్కడి స్నేహితులకు వీడ్కోలు చెప్పడం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోలో ముంబైలోని సాకినాకా వీధుల్లో నడుస్తూ.. భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చినప్పుడల్లా తాను అనుభవించే భావాలను ఫ్లూ గుర్తుచేసుకున్నారు. ఏళ్లుగా తాను గాఢంగా అనుబంధం పెంచుకున్న దేశాన్నివిడిచి వెళ్లడం అనే ఆలోచన తలుపుకు రాగానే..గుండ పగిలిపోతుందన్నారు. అలాగే భారతదేశంపై తనకున్న అభిమానం గురించి కూడా ప్రస్తవించారు. తాను మరే దేశాన్ని ప్రేమించనంతగా ఈ దేశాన్ని ప్రేమిస్తున్నానని, ప్రతిసారి దీన్ని విడిచి వెళ్లడం అంటే మానసికంగా చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. జీవితం అంటే ముందుకు సాగడం అని తెలిసినప్పటికీ..ఈ వీడ్కోలు వద్దకు వచ్చేటప్పటకీ హృదయం ద్రవించిపోతోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చివరగా మళ్లీ తిరిగి ఇక్కడకు వస్తానని చెబుతూ.."జై హింద్" అంటూ తన పోస్ట్‌ని ముగించారు. ఈ వీడియోకి ప్రసారి వెళ్లడం తన గుండెని పిండేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు. నెటిజన్లు అతడి పోస్ట్‌కి ఫిదా అవ్వుతూ బ్రో త్వరగా తిరిగి రండి, ఇది తాత్కాలికి వీడ్కోలే అని భరోసా ఇస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Dave Flew (@flewy86) (చదవండి: సినిమా సీన్‌ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
ఇరాన్ ఆస్తులపై అమెరికా షాకింగ్ నిర్ణయం..?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ ను రెచ్చగొడుతున్నారు. విదేశాల్లో ఫ్రీజైన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించే యోచన చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అసలే అమెరికా ఆంక్షలతో మండిపడుతున్న ఇరాన్ ఈ వ్యవహారంతో చర్చలకు పూర్తిగా ఫులిస్టాప్ పెట్టే అవకాశం ఉంది.పశ్చిమాసియా యుద్ధం తాలూకా విధ్వంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంతో ప్రపంచ దేశాలు ట్రంప్‌పై మండిపడ్డాయి. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరడంతో అమెరికా కొంత తగ్గి ఇరాన్‌తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరలేదు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంతో పరిస్థితులు కొంతమేర ప్రశాంతంగా ఉన్నాయి. ఇదంతా తెలిసిన కథేఅయితే మరోసారి అమెరికా ఇరాన్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది. ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనవి ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేసి యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌళిక స్థావరాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. దీంతో ఆదేశాలు ట్రంప్‌పై గుర్రుగా ఉన్నాయి. దీంతో వాటిని శాంతపరిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ ఆస్తులు విదేశాల్లో ఎందుకు ?ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు,సహజ వాయువు ఉత్పత్ చేసే దేశాలలో ఒకటి. అది ఇతర దేశాలకు చమురును విక్రయించినప్పుడు, ఆయా దేశాలు ఇరాన్‌కు చెల్లించాల్సిన కోట్లాది డాలర్ల డబ్బు అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ సొమ్మును అమెరికా లీగల్‌గా బ్లాక్ చేసింది. ఇవే కాకుండా ఆంక్షలు రాకముందు విదేశాలలో ఇరాన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన భవనాలు, భూములు లేదా ఇతర కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు.బంగారు నిల్వలను సైతం అమెరికా బ్లాక్ చేసింది.ఎంత డబ్బు ఫ్రీజ్ అయ్యింది.?ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 బిలియన్ డాలర్ల నుండి 123 బిలియన్ డాలర్లు సుమారుగా రూ. 8.3 లక్షల కోట్ల నుండి రూ. 10.2 లక్షల కోట్ల డబ్బు ఫ్రీజైనట్లు విశ్లేషకుల అంచనా అయితే, ఇందులో నేరుగా అమెరికా నియంత్రణలో నేరుగా అమెరికా నియంత్రణలో దాదాపు 24 బిలియన్ డాలర్లు ఉంది. ఆడబ్బుని వెంటనే చెల్చించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.మిగతా కరెన్సీ దక్షిణ కొరియా, జపాన్, యూరప్, మరియు కొన్ని గల్ఫ్ దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ఇరాన్ ఆయా దేశాలకు చమురు అమ్మగా వచ్చిన డబ్బు అది. కానీ అమెరికా విధించిన బ్యాంకింగ్ ఆంక్షల భయం వల్ల ఆ దేశాలు ఇరాన్‌కు ఆ డబ్బు ఇవ్వకుండా తమ వద్దే నిలిపివేశాయి. అయితే ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల పునర్నర్మాణం కోసం వాడాలని అమెరికా భావిస్తోంది. ఇదే జరిగితే ఇక యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది. -
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
న్యూయార్క్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. కోట్లలో జీతం అనగానే భారతదేశంలోని చాలామంది ఎంతో సంబరపడిపోతుంటాయి. అయితే ఆ సంపాదన వెనుక ఉన్న అసలు నిజాలు, ఖర్చుల గురించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న యశ్ శర్మ అనే భారతీయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ప్రవాస భారతీయుల వాస్తవ ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టింది. అమెరికాలో రూ. 1 కోటి ప్యాకేజీ వచ్చినా, అక్కడ ఉండే పన్నులు, అద్దెల భారంతో పోలిస్తే భారతదేశంలో తక్కువ జీతంతోనే ఎక్కువ సంతోషంగా ఉండవచ్చని అతను చేసిన విశ్లేషణ నెటిజన్లలో చర్చకు దారితీసింది.పన్నుల రూపంలో భారీ కోతయశ్ శర్మ తన వీడియోలో న్యూయార్క్‌లో లభించే రూ. కోటి ప్యాకేజీపై పడే పన్నుల భారాన్ని వివరంగా లెక్కగట్టారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివసించే వారికి ఫెడరల్ టాక్స్, స్టేట్ టాక్స్, న్యూయార్క్ సిటీ టాక్స్లతో పాటు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి రకరకాల పన్నులు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సంపాదనలో ఏకంగా 35 శాతం నుండి 40 శాతం వరకు కేవలం పన్నుల రూపంలోనే ప్రభుత్వం ఖాతాలోకి వెళ్లిపోతుందని, దీంతో చేతికి వచ్చే మొత్తం ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంటుందని తెలిపారుఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలుపన్నుల కోత తర్వాత మిగిలిన మొత్తంలో అధికభాగం ఇళ్ల అద్దెలకే సరిపోతుందని యశ్ వివరించారు. న్యూయార్క్ లాంటి నగరంలో ఒక మోస్తరు లేదా మంచి ప్రాంతంలో నివసించాలన్నా నెలకు సుమారు రూ. రెండు లక్షల నుండి రూ. మూడు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ భారీ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే, అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ సంపాదించే వ్యక్తి కంటే, భారతదేశంలో రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల వార్షిక ఆదాయం పొందే వ్యక్తి ఎంతో ప్రశాంతంగా, విలాసవంతంగా, సంతోషంగా జీవించగలడని ఆయన అభిప్రాయపడ్డారు.నెటిజన్ల భిన్న స్పందనలు‘ది డార్క్ సైడ్ ఆఫ్ ఎ ₹1 క్రోర్ ప్యాకేజీ ఇన్ న్యూయార్క్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, కేవలం డాలర్లను రూపాయిల్లోకి మార్చి చూసే వారికి అక్కడి ఖర్చులు అర్థం కావని కామెంట్లు పెడుతున్నారు. సంపాదన కంటే జీవన వ్యయం చాలా ముఖ్యమని కొందరు అంటుండగా, న్యూయార్క్ అమెరికాలోనే అత్యంత ఖరీదైన నగరం కాబట్టి అమెరికా అంతటా ఇలాగే ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ, విదేశాలకు వెళ్లే వారికి అక్కడి పన్నులు, అద్దెలు నిజంగానే పెద్ద షాక్ ఇస్తాయనేది వాస్తవమని మెజారిటీ నెటిజన్లు చెబుతున్నారు. -
అమెరికాలో కాల్పుల కలకలం: వేడుకల్లో బుల్లెట్ల వర్షం!
ఓహియో: అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. టోలెడో నగరంలోని ఒక ప్రాంతంలో వేడుకలు జరుగుతుండగా, గుర్తుతెలియని ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఉత్సాహంగా సాగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ శబ్దాలు..అక్కడి వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చివేశాయి. జనం ప్రాణభయంతో అటూఇటూ పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.పండుగ వేళ బుల్లెట్ల వర్షంఓహియోలో ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ జరుగుతుండగా కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులకు రక్తపు మడుగులో పలువురు క్షతగాత్రులు కనిపించారు. ఈ ఘటనపై నగర కౌన్సిల్ సభ్యురాలు థెరిసా మోరిస్ స్పందిస్తూ.. ఈ కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారని, రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఇలాంటి దారుణం జరగడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నౌకాదళంలో పనిచేసిన కెవిన్ బెర్రీ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల అనంతరం ఎవరో గన్ను కింద పడేసి వెళ్లడం తాను చూశానని, అర్బోరేటమ్ ప్రాంతంలో ఐదుగురు గాయపడి పడి ఉండటాన్ని గమనించానని పేర్కొన్నారు.నిందితుడి కోసం ముమ్మర గాలింపుఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన నిందితుని కోసం టోలెడో పోలీస్ డిపార్ట్మెంట్ ముమ్మరంగా గాలిస్తోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోలీసులు స్పందిస్తూ.. డెలావేర్ అవెన్యూ, రాబిన్‌వుడ్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు, దర్యాప్తుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానికులు, సందర్శకులు ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరిస్తున్నారు.‘బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ఈ ఉదంతంపై ఓహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి ఉత్సవాలు అనేవి సంతోషంగా గడపడానికి ఉద్దేశించినవని, ఇలాంటి చోట్ల హింస చోటుచేసుకోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కాల్పుల శబ్దాలు వినగానే జనం ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీయడం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్! -
‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్!
టెహ్రాన్: వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భవిష్యత్తులో సమావేశం కావచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి భేటీ ఆశించడం ముమ్మాటికీ అవాస్తవికమని, అమెరికా అధ్యక్షుడు ఇకనైనా ‘వాస్తవంలో బతకడం’ అలవాటు చేసుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ ఆశావాదం - ఇరాన్ తిరుగుబాటుఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ముందుకు సాగితే, ఇరాన్ అగ్ర నాయకత్వంతో నేరుగా చర్చలు జరపవచ్చని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత ఒప్పందాన్ని కుదుర్చుకునే వ్యూహంలో భాగంగా, మొజ్తబా ఖమేనీతో చారిత్రాత్మక భేటీకి తాను సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని లెబనాన్ ఛానల్ ‘అల్ మయాదీన్’ ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొట్టిపారేశారు.అసలు ఎవరీ మొజ్తబా ఖమేనీ?2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత రాజకీయ, మతపరమైన పదవిని చేపట్టారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ప్రజల్లో ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ, ఇరాన్ అంతర్గత, విదేశాంగ విధానాలను శాసించడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం నాల్గవ నెలలోకి ప్రవేశించిన ఈ తరుణంలో ఆయనతో భేటీ కావడం ట్రంప్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.కొనసాగుతున్న తీవ్ర విభేదాలుఅమెరికా ఎంతగా చర్చల ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నా, ఇరు దేశాల మధ్య నమ్మకరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు దౌత్యపరమైన పురోగతికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా, ఆచరణాత్మక రాజకీయ పరిణామాల ఆధారంగానే భవిష్యత్తు చర్చలు ఉంటాయని ఇరాన్ గట్టిగా చెప్తోంది. నానాటికీ క్షీణిస్తున్న ఈ సంబంధాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం ఇప్పట్లో సాధ్యం కాదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు! -
కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు!
ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోవడం, లాక్డౌన్లు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు మాత్రమే మనకు గుర్తున్నాయి. కానీ, ఈ విపత్తు వెనుక ఎవరికీ తెలియకుండా ఒక నిశ్శబ్ద సంక్షోభం దాగి ఉందనే దిగ్భ్రాంతికర నిజాన్ని పరిశోధకులు ఇప్పుడు బయటపెట్టారు. కరోనా విజృంభణ సమయంలో రొటీన్ హెల్త్‌కేర్ సేవలు నిలిచిపోవడంతో, వేలాది మంది క్యాన్సర్ రోగుల వ్యాధి నిర్ధారణ (డయాగ్నోసిస్) ఆలస్యమైంది. ఇది భవిష్యత్తులో వారి ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.‘ది లాన్సెట్ ఆంకాలజీ’ సంచలన అధ్యయనంప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్ ఆంకాలజీ’ ప్రచురించిన ఒక సంచలన అధ్యయనం ప్రకారం కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలోని ఏడు అభివృద్ధి చెందిన దేశాలలో సుమారు 55,000 క్యాన్సర్ నిర్ధారణ కేసులు రికార్డు కాలేదు. ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, నార్వే, బ్రిటన్ దేశాలకు చెందిన దాదాపు 26 లక్షల మంది రోగుల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో, కరోనాకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ నిర్ధారణలు ఏకంగా 16 శాతం తగ్గాయని వారు కనుగొన్నారు. సాధారణ పరిస్థితులు ఉంటే గుర్తించాల్సిన వేలాది కేసులు వ్యవస్థలోకి రాలేదంటే, ఆ క్యాన్సర్లు మాయమయ్యాయని కాదు, కేవలం నిర్ధారణ కాకుండా రోగుల శరీరాల్లోనే ఉండిపోయాయని అర్థం.కొంపముంచిన లాక్డౌన్ఈ అంతరాయం వల్ల అన్ని రకాల క్యాన్సర్ల కంటే కొన్ని నిర్దిష్ట క్యాన్సర్ల గుర్తింపు తీవ్రంగా ప్రభావితమైందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా పురుషులలో వచ్చే ‘ప్రోస్టేట్ క్యాన్సర్’ నిర్ధారణలు అత్యధికంగా 24 శాతం తగ్గాయి. అలాగే మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కేసులు 18 శాతం, చర్మ క్యాన్సర్‌కు సంబంధించిన మెలనోమా కేసులు కూడా 18 శాతం మేర పడిపోయాయి. అయితే, ఊపిరితిత్తుల క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ నిర్ధారణలపై ఈ ప్రభావం కొంత తక్కువగానే ఉంది. సాధారణ హెల్త్ స్క్రీనింగ్‌లు లేదా సాధారణ ఓపీ సంప్రదింపులపై ఆధారపడే క్యాన్సర్లే లాక్డౌన్ల వల్ల ఎక్కువగా వెలుగులోకి రాలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.నిర్ధారణలు తగ్గడానికి గల ప్రధాన కారణాలుకరోనా సమయంలో క్యాన్సర్ పరీక్షలు ఇంతలా క్షీణించడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. అప్పట్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించడానికి అనేక దేశాలు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లను తాత్కాలికంగా నిలిపివేసాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ముఖాముఖి అపాయింట్మెంట్లు దొరకడం గగనమైంది. మరోవైపు, ఆస్పత్రులకు వెళ్తే ఎక్కడ కోవిడ్ సోకుతుందోననే భయంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను వాయిదా వేసుకున్నారు. సాధారణంగా క్యాన్సర్ తొలిదశలో కనిపించే చిన్నపాటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, వ్యాధి తీవ్రత పెరిగే వరకు అది బయటపడకుండా ఉండిపోయింది.కొన్ని దేశాల ముందస్తు వ్యూహం ఈ విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని దేశాలు మెరుగైన పనితీరును కనబరిచాయి. బ్రిటన్, ఐర్లాండ్ దేశాలతో పోలిస్తే నార్వే, న్యూజిలాండ్ దేశాలలో క్యాన్సర్ నిర్ధారణల తగ్గుదల చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా ఆ దేశాలు చాలా వేగంగా కోలుకుని తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలను నిరంతరాయంగా కొనసాగించగల బలమైన ఆరోగ్య వ్యవస్థలు ఉండటమే దీనికి కారణమని తేలింది. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో , ఆరోగ్య సేవలు దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడానికి ఈ దేశాల వ్యూహాలు ఎంతో సహాయపడతాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రతినిధి ఇసాబెల్లె సోర్జోమతారమ్ పేర్కొన్నారు.భవిష్యత్తులో పొంచి ఉన్న దీర్ఘకాలిక ముప్పువైద్య సేవల్లో జరిగిన ఈ ఆలస్యం వల్ల రోగుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. 2020లో ఆలస్యంగా గుర్తించిన క్యాన్సర్లు వెంటనే తీవ్రమైన దశకు చేరుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ప్రస్తుత అధ్యయనంలో లభించనప్పటికీ, దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ అనేది శరీరంలో ఏళ్ల తరబడి పెరుగుతుంది. కాబట్టి ఈ ఆలస్యపు పరిణామాలు భవిష్యత్తు డేటాలో మాత్రమే స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పటికే ‘జామా ఆంకాలజీ’ ప్రచురించిన మరో అధ్యయనం ప్రకారం, అమెరికాలో 2020-21లో జరిగిన క్యాన్సర్ కేర్ అంతరాయాల వల్ల ఏడాదిలోనే దాదాపు 17,390 మంది అదనంగా మరణించారని అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.వైద్య రంగానికి ఈ పరిశోధన నేర్పిన పాఠాలుఏదైనా ఒక మహమ్మారి వచ్చినప్పుడు కేవలం ఆ ఒక్క వ్యాధిపైనే కాకుండా, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సపై కూడా దృష్టి పెట్టాలనే పఠాన్ని ఈ అధ్యయనం నేర్పుతోంది. భవిష్యత్తులో ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ పరీక్షలు, సాధారణ వైద్య సేవలను ప్రాధాన్యత క్రమంలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థల స్థితిస్థాపకత అనేది కేవలం అత్యవసర ముప్పును ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు అందాల్సిన అవసరమైన నివారణ, రోగనిర్ధారణ సేవలను నిరంతరాయంగా అందించడంలోనే ఉందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు -
చంపినా.. చావనంటోంది!
గోడ మీది బల్లి తోక తెగిపోతే... తోక మళ్లీ పెరుగుతుంది. ఇది మనకు తెలుసు. కానీ.. తెగిన తోకలోంచి సరికొత్త బల్లి పుట్టుకొస్తే? అట్లాంటిక్ మహా సముద్రం అట్టడుగున ఈ అద్భుతమే ఆవిష్కృతమైంది!! కెనడాలోని మెమోరియల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అ మధ్య అట్లాంటిక్ మహా సముద్రంలో కొన్ని అన్వేషణలు జరిపారు. మంచుముద్దల అడుగున చాలా లోతులో వారికి ఓ సముద్రపు దోస దొరికింది. దోస అంటే ముళ్ల దోసకాయ వంటి రూపమున్న జీవి. శాస్త్రీయ నామం సోలస్ ఫాబ్రిచీ. సరే... దీనిపై పరిశోధనలు చేద్దామనుకున్నారు వాళ్లు. ల్యాబ్‌కు తీసుకొచ్చి ఒక ముక్క కత్తిరించి సముద్రపు నీటిలోనే పాతి పెట్టారు. కుళ్లి, కృషించి పోవడానికి ఎంత టైమ్ పడుతుందో చూద్దామనుకున్న ఆ శాస్త్రవేత్తలకు భారీ షాకే తగిలింది. ఎందుకంటే.. రోజులు, వారాలు, గడుస్తున్నా ఆ ముక్క చావనంటోంది. పైగా గాయం మానిపోవడం మొదలైంది. కణాలు చురుకుగానే ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థ కూడా పని చేయడం మొదలైంది. కొన్ని నెలల తరువాత గమనిస్తే... కత్తిరించిన ముక్క కంటే పెద్దది అయిపోయింది. మూడేళ్లు గడిచాయి. ఆ ముక్కలో జీవం తొణికిసలాడుతూనే ఉంది. సముద్రపు నీటిలోంచి పోషకాలు పీల్చేసుకుని ఎంచక్కా బతికేస్తోంది. పునరుత్పత్తి జరగలేదు కానీ.. కత్తిరించినా అది ఇంకో జీవిలా బతికేసింది అన్నమాట! ఎందుకో.. ఏమో... ప్రకృతిలో ఎన్నో వింతలు ఉంటాయి కానీ ఇలాంటిది మాత్రం ఇదే మొదటిది అంటున్నారు రేచల్ సైప్లర్ అనే మెరీన్ బయోజియోకెమిస్ట్. బల్లి తోకలు మళ్లీ పెరిగినట్లే కొన్ని ఇతర జీవజాతుల్లోనూ అవయవాల పునరుత్పత్తి జరుగుతూంటుంది. సాల్మాండర్స్లో కీళ్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూంటాయి. అలాగే జెల్లీఫిష్ వృద్ధాప్యం నుంచి యవ్వన స్థితికి వెళ్లిపోగలదు. ఒక కీటకం రెండుగా విడిపోయి కూడా బతకగలదు. కానీ ఇలా అస్సలు చావని శరీర భాగాన్ని మాత్రం గతంలో ఎక్కడ చూడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. తెగిపోయిన ఒక భాగం ఇలా చావకుండా ఏళ్లపాటు ఉంటే మనకేంటి ప్రయోజనం? చాలానే అంటున్నారు శాస్త్రవేత్తలు. కణజాలాన్ని పెంచడం, సూక్ష్మజీవుల సాయంతో గాయాలు మాన్పడం వంటివి ఈ సముద్రపు దోసపై పరిశోధనలు చేయడం ద్వారా సాధ్యం కావచ్చునని అంచనా. సుదూర భవిష్యత్తులోనైనా తెగిన చేతులను మళ్లీ మొలిపించవచ్చునేమో??? వెన్నెముక లేని జీవజాతి అకశేరుకాలకు చెందిన ఈ సముద్రపు దోసపై ఎలాంటి నైతిక, న్యాయపరమైన నియంత్రణలు లేకుండా పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంది. తద్వారా జీవం విషయంలో సరికొత్త విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెమోరియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడేళ్ల తరువాత తమ పరిశోధనలు నిలిపివేశారు. ఇటీవలే సైన్స్ అడ్వాన్స్‌లో వివరాలు ప్రచురితమయ్యాయి. కొసమెరుపు ఏమిటంటే.. ఆ ముక్క ఇప్పటికీ చురుకుగానే అంటే జీవంతోనే ఉండటం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిజ్జా డెలివరీ కోసం వెళ్తే కాల్చిచంపారు
మేడ్చల్ రూరల్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శుక్రవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో మేడ్చల్ జిల్లాకు చెందిన అన్షుల్ (28) మృతిచెందారు. ఆయన కుటుంబం గుండ్లపోచంపల్లి డివిజన్లో ఎప్సిలాన్లో ఉంటోంది. శనివారం ఉదయం కుమారుడి మరణవార్త తెలియగానే అన్షుల్ తల్లిదండ్రులు శ్రీనివాస్ గౌడ్, నీలిమ దంపతులు కుప్పకూలిపోయారు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన అన్షుల్ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేశాక కేడబ్ల్యూసీ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదన కోసం ఖాళీ సమయాల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ విధుల్లో భాగంగా భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ అపార్ట్మెంట్లో పిజ్జా డెలివరీ చేసి తిరిగి వెళ్తుండగా మాస్క్ వేసుకున్న ఇద్దరు దుండగులు వెనుక నుంచి అన్షుల్‌ను కాల్చి చంపారు. అతని తలతోపాటు మరో రెండు చోట్ల తూటా గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో ఎలాంటి దొంగతనం జరగలేదని.. అన్షుల్ మృతిపై తమకు అనుమానం ఉన్నట్లు చెప్పారు. ఎవరో కావాలని పిజ్జా డెలివరీ పేరుతో ఇంటి వద్దకు రప్పించి కాల్చి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. -
ఇరాన్ రాడార్లను ధ్వంసం చేసిన అమెరికా
బ్రిడ్జివాటర్: అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. తమ రాడార్ స్టేషన్లను అమెరికా ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా కువాయిట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపైకి క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. అయితే, తమ గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా మిలటరీ తెలిపింది. శుక్రవారం రాత్రి కువైట్, బహ్రెయిన్ భూభాగాల్లోకి ప్రవేశించిన ఏడింటికిగాను ఆరు బాలిస్టిక్ మిస్సైళ్లను మధ్యలోనే కూల్చినట్లు తెలిపింది. మరో క్షిపణి దారి తప్పి, లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందని పేర్కొంది. వీటి కారణంగా అమెరికా బలగాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. హార్మూజ్ జలసంధిపైకి ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అంతకుముందు అమెరికా ఆర్మీ కూల్చివేసింది. ఆ ప్రాంతంలో నౌకల సంచారానికి ముప్పుగా పరిణమించినందునే ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. అదేవిధంగా, మరిన్ని దాడులకు పాల్పడకుండా ఇరాన్ రాడార్ కేంద్రాలను నిరీ్వర్యం చేసినట్లు పేర్కొంది. అదేవిధంగా, తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. క్షిపణుల దాడిని ముందుగానే పసిగట్టి సైరన్ల ద్వారా తమ పౌరులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించినట్లు బహ్రెయిన్ వివరించింది. కాగా, ఖెష్మ్ దీవి, ఆ సమీపంలోని సిరిక్‌లో ఏర్పాటు చేసుకున్న నిఘా వ్యవస్థల్ని అమెరికా ధ్వంసం చేసినందుకే తాము కువైట్‌లోని అమెరికా బలగాలున్న అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్‌ను, బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, మిస్సైళ్లు ప్రయోగించినట్లు అనంతరం ఇరాన్ ఆర్మీ తెలిపింది. ఇరాన్ హార్మూజ్‌ను మూసివేయడంతో, బదులుగా ఇరాన్ నౌకాశ్రయాల్లో అమెరికా ఆర్మీ దిగ్బంధనం అమలు చేస్తుండటం తెల్సిందే. ఇలా ఉండగా, అమెరికాలోని విస్కాన్సిన్లో శుక్రవారం అధ్యక్షుడు ట్రంప్ కొందరు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఇరాన్‌తో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరలో ముగించబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఎరువుల ధరలు నాలుగు నెలల క్రితం స్థాయికి దిగి వస్తాయని వారికి చెప్పారు. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు చాలామటుకు ధ్వంసం అయినప్పటికీ ఇంకా 22 శాతం వరకు భద్రంగానే ఉన్నట్లు సమాచారముందన్నారు. -
భారత్‌పై ఆంక్షలు విధిస్తే బూమరాంగే!
సెయింట్‌పీటర్స్‌బర్గ్: నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న భారతదేశంపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే మానుకోవాలని రష్యా అధినేత పుతిన్ హితవు పలికారు. ఆంక్షల బెదిరింపుల ద్వారా భారత సార్వభౌమతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే తక్షణమే పెద్ద ఎదురుదెబ్బ(బూమరాంగ్) తగులుతుందని తేల్చిచెప్పారు. శుక్రవారం సెంటర్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పుతిన్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఎల్లప్పుడూ ఒక సార్వభౌమ దేశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆంక్షల బెదిరింపులతో భారత్‌ను లొంగదీసుకోలేరని పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రధాని మోదీతో తాను చాలాకాలంగా సన్నిహితంగా చర్చలు జరుపుతున్నానని తెలిపారు. అమెరికాలోకి ప్రవేశించకుండా మోదీపై గతంలో నిషేధం విధించారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని మోదీ ఎప్పటికీ మర్చిపోలేరన్న సంగతి తనకు తెలుసని అన్నారు. మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఆయనపై అన్ని ఆంక్షలను తొలగించారని పేర్కొన్నారు. తనకు తెలిసినంతవరకు అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. పుతిన్ ఇంకా ఏం చెప్పారంటే.. ఆ స్వేచ్ఛ భారత్‌కు ఉంది ‘‘భారత్ ఒక సార్వభౌమ దేశం. అత్యంత ఆధునికమైనవి, అనువైనవి, ఉత్తమ ధరకు లభించే ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్‌కు ఉంది. అందించేవిగా భావించే ఉత్పత్తులను ఎంచుకోవడానికి దానికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏమనుకున్నప్పటికీ సొంత ప్రయోజనాల పరిరక్షణ విషయంలో భారత్ రాజీపడడం లేదు. ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. నచ్చిన దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం భారత్ హక్కు. భారత్–రష్యా బంధం ఇతర భాగస్వాముల బంధం లాంటిది కాదు. భారత్‌తో రష్యా సహకారం కూడా రాజకీయ వాతావరణానికి లోబడి ఉండదు. మమ్మల్ని ఎవరూ శాసించలేరు. మాకు ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరు. అలా చేయడానికి ఎవరూ ప్రయత్నించరు కూడా. మేము ఎల్లప్పుడూ సరైనదని భావించిన దానినే చేస్తాం. భారత్ వంటి విలువైన భాగస్వాములకు ఇచ్చిన హామీలకు ఎల్లప్పుడూ మేము కట్టుబడి ఉంటాం. భారత్, రష్యా స్నేహానికి పరస్పర విశ్వాసమే పునాది. భారతీయ మిత్రులతో మా సంబంధాలు ప్రత్యేకమైనవి. మేము కేవలం వాణిజ్యంపైనే దృష్టి పెట్టడం లేదు. కొనుగోలు, అమ్మకాలపైనే కాకుండా, ఉమ్మడి పరిశోధనలు, అభివృద్ధిపైనా దృష్టి పెట్టాం. బ్రహ్మోస్ మధ్యశ్రేణి క్షిపణి రూపకల్పనపై ఇరు దేశాల నిపుణులు కలిసి పని చేస్తున్నారు’’అని పుతిన్ స్పష్టంచేశారు. -
సడిలేని సూపర్‌సానిక్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అరుదైన ఘనత సృష్టించింది. విమానయాన రంగంలో ఒక నూతన శకంలోకి అడుగుపెట్టింది. తక్కువ శబ్దంతో వేగంగా దూసుకెళ్లే మొట్టమొదటి సూపర్‌సానిక్ విమానం ‘ఎక్స్–59’ని అభివృద్ధి చేసింది. జూన్ 5న జరిగిన ప్రయోగంలో ఈ విమానం తొలిసారిగా ధ్వని అవరోధాన్ని విజయవంతంగా అధిగమించింది. భవిష్యత్తులో విమాన ప్రయాణాల్లో ఒక చరిత్రాత్మక మార్పునకు నాంది పలికింది. సాంప్రదాయ సూపర్‌సానిక్ విమానాలు చెవులు చిల్లులు పడే భారీ శబ్దంతో దూసుకెళ్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సున్నితమైన శబ్దంతో ప్రయాణించే విమానాన్ని తయారు చేయడానికి నాసా ‘క్వెస్ట్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. విమానయానంలో ఇదొక గొప్ప ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 30 అడుగుల ముందు భాగం.. పైభాగంలో ఇంజిన్ గాలిలో ఒక వస్తువు నెమ్మదిగా కదులుతూ ఉంటే.. ఆ మార్గంలో దానికి ఎదురయ్యే గాలి అణువులకు పక్కకు తప్పుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అందుకే తక్కువ ధ్వని వెలువడుతుంది. ధ్వని వేగంతో దూసుకెళ్లే సూపర్‌సానిక్ విమానం విషయంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే దాని మార్గంలో అడ్డొచ్చే గాలి అణువులకు పక్కకు తప్పించుకోవడానికి తగినంత సమయం ఉండదు. అవి ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఇది అధిక పీడనాన్ని సృష్టిస్తుంది. శక్తివంతమైన షాక్వేవ్ కారణంగా భరించలేని శబ్దం వెలువడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నాసా ఇంజనీర్లు సూపర్‌సానిక్ ఫ్లైట్ డిజైన్‌ను మార్చారు. ఎక్స్–59 విమానాన్ని పొడవైన ఆకారంతో రూపొందించారు. దీని ముందు భాగం ముక్కు ఆకారంలో దాదాపు 30 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నిర్మాణం గాలి పీడన తరంగాలు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా నిరోధిస్తుంది. విమానం గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు భారీ ప్రకంపనకు బదులుగా విడివిడిగా ఉండే చిన్న, బలహీనమైన తరంగాల శ్రేణిని సృష్టిస్తుంది. అది ఒక మృదువైన ధ్వనిలా వినిపిస్తుంది. ఇంట్లో గాలికి కిటికీ కొట్టుకున్న శబ్దం లాంటిది వినొచ్చు. అంతేకాకుండా ఎక్స్–59లోని ఇంజిన్‌ను విమానం పైభాగంలో అమర్చారు. ఇది శబ్దాన్ని నేలపై మనుషుల నుంచి దూరంగా మళ్లిస్తుంది. ఈ పరిశోధన సత్ఫలితాలు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో విమానాన్ని మాక్ 1.4 వేగానికి.. అంటే గంటకు సుమారు 925 మైళ్ల (1,488 కిలోమీటర్ల) వేగానికి చేర్చడానికి నాసా సైంటిస్టుల బృందం సిద్ధమవుతోంది. వేగం, నిశ్శబ్దం రెండూ కలిసి ఉండే ప్రపంచానికి మనల్ని దగ్గర చేయడానికి కృషి చేస్తోంది. గంటకు 713 మైళ్ల వేగం ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాన్ని సూపర్‌సానిక్ ఫ్లైట్ అంటారు. వీటి నుంచి వెలువడే భారీ శబ్దమే ఈ విమానాలకు ప్రతికూలంగా మారింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటిపై నిషేధం విధించాయి. తమ గగనతలంపై ఇలాంటి విమానాల ప్రయాణానికి అనుమతి ఇవ్వడం లేదు. ఒక విమానం ధ్వని తరంగాల వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు.. అది ఒక పీడన తరంగాన్ని సృష్టిస్తుంది. అది ఉరుములాగా నేలను ఢీకొంటుంది. ఈ పరిస్థితిని మార్చడానికే ఎక్స్–59ని రూపొందించారు. పెద్ద శబ్దానికి బదులుగా, దూరంగా కారు తలుపు మూసుకునే శబ్దం కంటే తక్కువ శబ్దంతో కూడిన మృదువైన చప్పుడును సృష్టించడమే ఈ విమానం లక్ష్యం. కాలిఫోరి్నయాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఈ విమానాన్ని పరీక్షించారు. ఇది ‘మాక్ 1.1’గరిష్ట వేగాన్ని అందుకుంది. ధ్వని వేగం కంటే 1.1 రెట్ల వేగంతో ప్రయాణించడాన్ని మాక్ 1.1 అంటారు. అంటే గంటకు 713 మైళ్లు(1,147 కిలోమీటర్లు) అని చెప్పుకోవచ్చు. ఈ వేగాన్ని విజయవంతంగా అందుకోవడం ద్వారా ఎక్స్–59 విమానం ఉద్దేశించిన విధంగానే పనిచేస్తోందని తేలింది. అయితే శబ్దం మాత్రం ఎక్కువగా వెలువడలేదు. ఇందులోని రహస్యం అంతా విమానం డిజైన్లోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కారుపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పులు.. పసికందు మృతి
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని హెబ్రాన్‌లో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.బెత్లెహెమ్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న తండ్రి ఫహద్ అబు హైకల్ మీడియాతో మాట్లాడుతూ ఒక బుల్లెట్ మొదట తన చేతికి తగిలి.. ఆ తర్వాత వెనుక సీట్లో తల్లితో కలిసి కూర్చున్న తన కుమారుడికి తగిలిందని చెప్పారు. సైనికుడు నన్ను ఆగమని సైగ చేశారు. నేను కారును పూర్తిగా ఆపి, స్టీరింగ్ వీల్‌పై నా చేతులు పైకెత్తాను. ఆ వెంటనే వారు వాహనంపై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు.కాల్పులు జరిగిన సమయంలో తాము తమ 11 ఏళ్ల కుమారుడు, తల్లితో కలిసి ప్రయాణిస్తున్నట్లు అబు హైకల్ చెప్పారు. కారులో ఉన్నవారిని గుర్తించడంలో సైనికులు పొరపాటు పడి ఉంటారనే వాదనను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఆ సైనికుడు నాకు కేవలం 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతను నన్ను, నా భార్యను, పిల్లలను చూశాడు. కారు కిటికీలకు నల్లటి గ్లాసులు లేవు. అది పట్టపగలు కావడం వల్ల అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారులో కుటుంబం ప్రయాణం చేస్తుందని ఆవ్యక్తికి తెలియదా?’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకువస్తోందని భావించి సైనికులు కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపినట్లు 'ది గార్డియన్' పేర్కొంది. మిలిటరీ సమాచారం ప్రకారం.. సైనికులు ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకురావడాన్ని గమనించారు.. అందులోని ఓ సైనికుడు ఆ వాహనంపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు పాలస్తీనియన్లు గాయపడ్డారు.వారిని వైద్య చికిత్స కోసం తరలించామని ఐడీఎఫ్ తెలిపింది. ఏదైనా తప్పు జరిగి ఉంటే.. సంబంధం లేని వ్యక్తులకు జరిగిన నష్టానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ఐడీఎఫ్ పేర్కొంది. ప్రాథమిక మిలిటరీ విచారణలో గాయపడిన వారు ఎలాంటి శత్రుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోని సాధారణ పౌరులుగా తేలింది. బాధ్యులను శిక్షించాలని తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, సంబంధిత సైనికుడిని బాధ్యుడిని చేయాలని అబు హైకల్ డిమాండ్ చేశారు.


