భారత్‌ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్‌ ముద్దుగుమ్మ..! | Brazilian Woman Married To Indian Man Shares Her Love Story Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

భారత్‌ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్‌ ముద్దుగుమ్మ..!

Aug 17 2025 2:32 PM | Updated on Aug 17 2025 5:41 PM

Brazilian Woman Married To Indian Man Shares Her Love Story Goes Viral

ప్రేమ అంటే ఇదేరా అనేలా ఉండేలా ఎన్నో లవ్‌ స్టోరీలను చూశాం. వాటన్నింటిలో ప్రేమ ప్రేమే. దాని కోసం ఏం చేయడానికైనా రెడీ అన​‍ట్లుగా సిద్ధపడుతున్న ప్రేమికులు గాథల వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లలు, సరిహద్దు దాటి ఎన్నో ప్రయాసలు పడి ఒక్కటైన జంటలెందరినో చూశాం. కానీ ఇక్కడ ఈ జంట అంత కష్టాలు చవి చూడకపోయినా..వీరిద్దరూ ఒక్కటైనా విధం చూస్తే..ఎక్కడైన లవ్వు..లవ్వే కథ అనిపిస్తుంది. మరి ఆ జంట అందమైన కథేంటో చకచక్క చదివేయండి మరి..

బ్రెజిలియన్‌ మహిళ తైనాషా భారతీయ వ్యక్తిని పెళ్లాడింది. ఎలా తమ ప్రేమ చిగురించి పెళ్లిపీటలక్కెందో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. తామిద్దరం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వాళ్లం. కానీ తాను ఆ గుజరాతి వ్యక్తితో ఆశ్చర్యకరంగా ప్రేమలో పడిపోయానని అంటోంది. 2020 కోవడిడ్‌ 19 సమంయంలో ఇద్దరు ఆన్‌లైన్‌ కలుసుకున్నారు. 

ఇంకా అప్పటికీ టీకాలు వేయించుకోని క్రిటికల్‌ టైంలో ఆమెను కలవాలని గుజరాతీ భర్త పడిన ప్రయాసను చూసి..ఫస్ట్‌ మీట్‌లోనే అతని ప్రేమకు ఫిదా అయి లవ్‌లో పడిపోయిందట. ప్రేమలో పడిన ఐదునెలలకే ఇద్దరు పెళ్లిచేసుకున్నాం అని పేర్కొంది. తమ వివాహం బ్రెజిల్‌లోనే జరిగిందని, తమ పెళ్లిని తన భర్త తరుఫు భారతీయ కుటుంబం కూడా అంగీకరించిందని చెప్పుకొచ్చింది తైనా. 

తామిద్దరిది వేర్వేరు నేపథ్యమే అయినా..మా మధ్య ఉన్న అభిమానం, ప్రేమ రోజు రోజుకి మరింతగా బలపడుతుందని, ఇంతవరకు తమ దాంపత్య జీవితాన్ని విజయవంతంగా లీడ్‌ చేయగలిగేలా చేసినా ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు అని చెబుతోంది తైనా. ఆ దంపతుల ప్రేమ కథ నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక, ఎక్కడైన ప్రేమ.. ప్రేమే..దానికున్న శక్తి అనంతం, అజేయం అంటూ ఆ జంటని ప్రశంసిస్తూ ఆశీర్వదించారు.

 

(చదవండి: ‘రాక్‌స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement