Woman
-
జనసేన నేత లైంగిక వేధింపులు..
-
మాటలకందని విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే..
తాడిపత్రి రూరల్: నిశ్చితార్థం కోసం గోరింటాకు పెట్టించుకుని సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరెడ్డిపల్లికి చెందిన వీణాదేవి(24)కి ఆదివారం వివాహ నిశితార్థం జరగాల్సి ఉంది.ఇందు కోసం శనివారం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రికి వెళ్లి చేతికి గోరింటాకు పెట్టించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వీరి బైక్‌ను బుగ్గ నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణాదేవి అక్కడికక్కడే చనిపోయింది.తీవ్రంగా గాయపడిన తమ్ముడు నారాయణరెడ్డికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేసి, అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొన్ని గంటల్లో నిశితార్థం జరుగుతుందన్న అనందంలో ఉన్న వీణాదేవి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గ్రామస్తులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
హైవేపై సూట్‌కేసులో మహిళ మృతదేహాం.. ఒంటి నిండా గాయాలు
రోడ్డు మీద ఓ సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ- లక్నో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం ఉదయం రెడ్ కలర్ సూట్‌కేసు ఉండటాన్ని ప్రయాణికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సూట్‌కేసును తెరిచి చూడగా అందులో ఓ మహిళ మృతదేహం కనుగొన్నారు. ఆమె శరీరమంతా గాయాల గుర్తులు ఉ్నట్లు గుర్తించారు. మహిళ వయసు 25 నుంచి 30 ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పోలీసు బృందం విచారణ చేపట్టారు. సూట్‌కేస్ నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారులు సూట్‌కేస్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా అందులో కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. అయితే మహిళ ఒంటిపై ఉన్న గాయాలు గమనిస్తే ఆమె మరణించి ఒక రోజు అయి ఉండవచ్చని ఎస్సీపీ వినీత్ భట్నాగర్ తెలిపారు. మహిళ ఎవరు? ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి, ఇండియాలో రూ.120 కోట్ల కంపెనీ
సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలా అమెరికాలో ఐదెంకల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి తానేంటో నిరూపించుకుంది అహానా గౌతమ్. ముఖ్యంగా తల్లిపై ఉన్న నమ్మకంతో ముందడుగు వేసి, రూ. 120కోట్ల కంపెనీకి అధిపతిగా మారింది. అహానా గౌతమ్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా!రాజస్థాన్‌లోని ఒక చిన్న నగరానికి చెందిన అహానా గౌతమ్ ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ , హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో (2014-2016) ఎంబీఏ పట్టా పుంచుకుంది. ఆ తరువాత ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G)లో నాలుగేళ్లు ఉద్యోగం చేసింది. అక్కడే ఆరోగ్యకరమైన భారతీయ ఫుడ్‌ను పరిచయం చేయాలనే ఆలోచన వచ్చింది. అధిక బరువుతో ఉండే ఆమె హెల్దీ ఫుడ్ ప్రాముఖ్యతను గుర్తించింది. అంతే 30 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగులు, రుచులు ,శుద్ధి చేసిన చక్కెరలో అధికంగా ఉండే జంక్ ఫుడ్ నుంచిన బయటపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంతంగా ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించే వ్యాపారం ప్రారంభించాలని ఉద్యోగం వదిలి భారత్ కు తిరిగివచ్చింది. తల్లి ఇచ్చిన ఆర్థిక సాయంతో 2019లో ‘ఓపెన్ సీక్రెట్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించింది. కేవలం మూడేళ్లలోనే కంపెనీ ఆదాయాన్ని రూ. 120 కోట్లకు చేరేలా శ్రమించింది. ఓపెన్ సీక్రెట్ వ్యవస్థాపక సీఈవోగా విజయపథంలో దూసుకుపోతోంది. అనేక సవాళ్ల మద్య 2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 100కోట్లుగా ఉంది.అహానా గౌతమ్ ఏమంటారంటే.."ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే.. అది మా అమ్మ వల్లనే. ఆమె ఎప్పుడూ నాకు రెండు విషయాలు చెబుతుండేది: నంబర్ వన్ విద్య చాలా ముఖ్యం. మీరు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. విద్యే మన ప్రపంచంలో మార్పు తీసుకొస్తుంది, రెండోది ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం, ఒకసారి ఆర్థిక సాధికారత సాధిస్తే, జీవితంలో ఎలాంటి నిర్ణయాలైనా సంతోషంగా తీసుకోవచ్చు." అమ్మ చెప్పిన ఈ మాటలే తనలో స్ఫూర్తినింపాయని, ఐఐటి-బాంబే, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవడానికి ప్రేరణ నిచ్చాయని తెలిపింది అహానా. చివరికి ధైర్యంగా ఒక కంపెనీ స్థాపనకు నాంది పలికాయని వెల్లడించింది.అంతే కంపెనీని ప్రారంభించే ముందు వివాహం చేసుకోవాలని అందరూ పట్టుబడితే తనకు అండగా నిలబడి, ఆర్థిక సాయాన్ని అందించి వెన్నుదన్నుగా నిలబడ్డారంటూ తల్లి గర్వంగా చెబుతుంది. అహానా తల్లి కోవిడ్ రెండో వేవ్‌లో కరోనా కారణంగా చనిపోయారు. -
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘన తీవ్రంగా గాయపడింది. కాగా, మేఘనపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదు.మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్‌కు తరలించారు. -
‘కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదు’
గోపాలపురం(ప.గో.జిల్లా): గోపాలపురం మండలం హుకుంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆమెను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత.. సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని వనిత డిమాండ్ చేశారు. -
ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగితే.. కోటీశ్వరురాలు అయింది
ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఇటీవల ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగిన మహిళ, లాటరీ టికెట్ కొని కోటీశ్వరురాలు అయిపోయింది.నార్త్ కరోలినాకు చెందిన ఒక మహిళ ఆరెంజ్ జ్యూస్ కొనుక్కోవడం కోసం ఆగింది. అక్కడే కనిపించిన లాటరీ టిక్కెట్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.సరిగ్గా ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుకు లాటరీ తగిలింది. దీంతో 2,50,000 డాలర్ల విజేతగా నిలిచింది. అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ వారి జీవితాన్నే మార్చేసిందని ఆ మహిళ చాలా సంతోషపడింది.కొన్ని రోజులకు ముందు అమెరికాకు చెందిన ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు. ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు గెలుచుకున్నాడు. -
టపాసుల గొడవ... చిన్నారిపై మర్డర్ కేసు
-
ట్రంప్ గెలుపుతో ఊపందుకున్న ఫోర్ బీ ఉద్యమం..!భగ్గుమంటున్న మహిళలు
ట్రంప్ గెలుపుతో ఒక్కసారిగా..అమెరికా మహిళా లోకం భగ్గుమంటోంది. చూస్తుండగానే కార్చిచ్చులా మారనుంది. ఎందుకంటే మహిళలంతా ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వినూత్న ఉద్యమానికి తెరలేపారు. అప్పుడే అక్కడ కాపురాల్లో కల్లోలాలు మొదలయ్యాయి. ఈ ఊహించని పరిణమానికి అక్కడి మగవాళ్లంతా తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ గెలుపు మా కాపురాలకు ఎసరుపెట్టిందంటూ లబోదిబోమంటున్నారు. అమెరికాలో కలకలం రేపుతున్నా ఆ ఉద్యమం కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ తరుణంలో అక్కడ మహిళా లోకం ఆయనపై కోపంతో అట్టుడుకిపోతూ.. ఉత్తరకొరియాకి చెందిన ఉద్యమానికి తెరలేపింది. అదికూడా ట్రంప్ గెలిచిన కొద్ది గంటల్లోనే ఇది జరగడం విశేషం. అందుకు ప్రధాన కారణం ట్రంప్ గర్భస్రావాన్ని వ్యతిరేకించే వ్యక్తి కావడమే. గతంలో అయన అధ్యక్ష పదవీ కాలంలో (2017-2021) సుప్రీంకోర్టు గర్భస్రావం(అబార్షన్) చేయించుకోవడం చట్టవిరుద్ధం అంటూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. అదీగాక ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా అబార్షన్లకు వ్యతిరేకంగానే మాట్లాడారు. కానీ డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమాలా హారిస్ మాత్రం ప్రచారంలో మహిళా హక్కులకు రక్షణ కల్పిస్తానన్నారు. అబార్షన్లపై నిర్ణయాధికారాన్ని మహిళలకే ఇస్తానన్నారు. అంతేగాదు ముగిసిన ప్రజాస్వామిక పోల్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. మెజార్టీ శాతం మహిళా ఓటర్లలో 54% మంది హారిస్‌కి ఓటు వేయగా ట్రంప్‌కి మాత్రం 44% మాత్రమే పోలయ్యాయి. కానీ అధ్యక్షుడిగా ట్రంప్‌నే అత్యధిక మెజార్టీతో గెలిచారు. అక్కడి ప్రజలు ట్రంప్‌కే పట్టం కట్టడం నచ్చని మహిళలు దక్షిణకొరియాకి సంబంధించిన "ఫోర్‌బీ ఉద్యమం"కి మద్దుతిచ్చారు. అంతేగాదు ట్రంప్‌ని గెలిపించిన మగవాళ్లను బాయ్‌కాట్ చేస్తామంటున్నారు అక్కడి మహిళలు. అంతేగాదు వారితో కలిసి ఉండం, పిల్లల్ని కనం, వారితో శారీరక సంబంధం పెట్టుకోం, అని తెగేసి చెబుతున్నారు మహళలు. ఈ ట్రంప్ గెలుపు మా కాపురాల్లో చిచ్చురేపిందంటూ మగవాళ్లంతా తలలుపట్టుకుంటున్నారు. అమెరికాలో అంతలా హాట్‌టాపిక్‌గా మారిన ఫోర్ బీ ఉద్యమం అంటే ఏంటి..?.ఈ ఉద్యమం దక్షిణ కొరియా నుంచి వచ్చింది. 2019లో ప్రారంభమై కొరియన్ పదం "bi"తో ప్రారంభమయ్యే నాలుగు పదాలకు సంబంధించినది.Bihon: పెళ్లి చేసుకోరు లేదా నో డేటింగ్Bichulsan: : పిల్లల్ని కనరుBiyeonae: డేటింగ్ లేదుBisekseu: శారీరక సంబంధం ఉండదుదక్షిణ కొరియాలో లింగ అసమానతలు చాలా ఎక్కువ. అక్కడ కూడా మహిళలు పురుషుల కంటే 31% తక్కవ వేతనమే తీసుకుంటున్నారు. పైగా మహిళల మరణాలు ఎక్కువే. అందులో చాలావరకు భాగస్వామి గృహహింస కారణంగా చనిపోయిన కేసులే ఎక్కువ. ఆ నేపథ్యంలోనే పురుషాధిక్య పాలనపై విసుగుతో వచ్చిన వ్యతిరేకతకు నిదర్శనమే ఈ ఫోర్‌బీ ఉద్యమం. ప్రస్తుతం ఈ ఉద్యమానికి అమెరికా మహిళలు మద్దతుల ఇస్తున్నారు. ప్రధానంగా అబార్షన్ చట్టంపై ఉన్న వ్యతిరేకతోనే అక్కడ మహిళలు ఈ ఉద్యమానికి తీవ్ర స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. అదీగాక ట్రంప్ గర్భస్రావం వ్యతిరేక అభిప్రాయాలు తోడవ్వడంతో ఇలా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగుతోంది అక్కడ. ఈ ఉద్యమంలో భాగంగా స్త్రీద్వేషపూరిత ఉత్పత్తులను కొనుగోలు చేయరు. అలాగే కొన్ని సాంస్కృతిక పద్దతులను కూడా వారంతా వ్యతిరేకిస్తారు. జపాన్‌లోని మహిళలు కూడా ఈ ఉద్యమాన్నే ఎంచుకుని అమెరికా బాటనే పడుతోంది. మరీ భారత్‌లో అంటే..ఈ ఫోర్‌బీ ఉద్యమం విజయవంతం అవ్వడం అనేది పూర్తిగా మహిళ సాధికారతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న పరిమిత వనరుల దృష్ట్యా ఇప్పటికీ ఇక్కడ మహిళలు చాలా వరకు పురుషులపై ఆధారపడే జీవిస్తున్నారు. అలాగే కొన్ని కుటుంబ సంప్రదాయాలకు తలంచక తప్పని స్థితి అందువల్ల ఈ ఉద్యమంతో భారతీయ మహిళలు ప్రభావమయ్యే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.american women it's time to learn from the koreans and adopt the 4b movement as a matter of fact women from all over the world should adopt the 4b movementi'm so serious pic.twitter.com/WxfqxouAn1— coleni. (@jungsooyawning) November 6, 2024 (చదవండి: బ్రిటన్ రాణి సైతం చాక్లెట్ టేస్ట్‌కీ ఫిదా..!) -
మహిళ ప్రాణాలు కాపాడిన మంత్రి బండి సంజయ్
కరీంనగర్, సాక్షి: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం కెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్ లారీని ఆపాడు.ఈ క్రమంలో ములుగు వెళుతూ ఘటనా స్థలం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగారు. లారీ కింద చిక్కుకుని రక్తమోడుతున్న దివ్యశ్రీని బండి సంజయ్ కాపాడారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. కేంద్ర మంత్రి సూచనతో జుట్టు కత్తిరించి ఆమె మహిళ ప్రాణాలను స్థానికులు కాపాడారు. అనంతరం ఆ మహిళను చూసిన ఆమె పిల్లలు భోరున విలపించారు. గాయాలపాలైన మహిళను కరీంనగర్‌లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి బండి సంజయ్ పంపించారు. దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు మంత్రి సంజయ్ తెలిపారు. -
ఇద్దరు బిడ్డల తల్లి : ఒకే రోజు ఆరు బ్యూటీ సర్జరీలు.. చివరికి!
ఐశ్వర్య అంత అందంగా కనిపించాలి, ఎత్తుపెరగాలి.. ఆరడుగులు డార్లింగ్‌గా మారిపోవాలి...ఆధునిక యువతలో ఇదో పెద్ద క్రేజ్. ఈ పిచ్చినే కొంతమంది స్వార్థపరులు క్యాష్ చేసుకుంటున్నారు. అందంకోసం ఆరాటపడి ప్రాణాలనే పొగొట్టుకున్న షాకింగ్ సంఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. దీంతో ఉన్నదానితో సంతృప్తి పడే కాలం పోయింది. లేని దాని కోసం అర్రులు చాచడం ఒక వేలం వెర్రిగా మారిపోయిందంటన్న నెటిజన్లు కామెంట్లు వైరల్‌గా మారాయి.దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని గుయిగాంగ్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ 24 గంటల వ్యవధిలో ఆరు కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంది. కానీ తన అందాన్ని తనివి తీరా చూసుకోకముందే తనువు చాలించింది. సుమారు రూ. 4.7 లక్షలు ( 40వేల యువాన్లు) అప్పు చేసి మరీ నన్నింగ్‌లోని ఒక క్లినిక్‌లో చేరింది.. ఒకే రోజు కళ్లు, ముక్కు, ఉదరం కోసం సర్జరీలు చేయించుకుంది. తరువాత ఆమె తొడలలోని కొవ్వును తీసి ముఖం, రొమ్ములలోకి ఇంజెక్ట్ చేసే లైపోసక్షన్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఆ మహిళ డిశ్చార్జి కాగానే క్లినిక్‌లోని లిఫ్ట్ ముందేఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. లైపోసక్షన్ తర్వాత పల్మనరీ ఎంబోలిజం కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య రావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.మరోవైపు మహిళ మరణంపై కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలంటూ క్లినిక్‌పై కేసు వేశారు . అయితే 2 లక్షల యువాన్ల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే, అతను కనీసం 10 లక్షల యువాన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కోర్టు చివరికి సుమారు 70 లక్షల రూపాయలు (590,000 యువాన్ల ) నష్టపరిహారంచెల్లించాలని ఆసుపత్రిని ఆదేశించింది. పరిస్థితిని సరిగ్గా గమనించకుండా, కొన్ని వైద్యపరమైన తప్పులు చేసిందని న్యాయమూర్తి లి షాన్ వ్యాఖ్యానించారు. తపుడు వాగ్దానాలతో అప్పు చేసి మరీ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రేరేపించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.2020ల నాటి ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందంకోసం అతిగా పోతే అనర్థం తప్పదంటూ కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించగా , డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ క్లినిక్‌పై కొందరు, ఒకే రోజులో ఆరు సర్జరీలు? క్లినిక్‌కి ఇంగితజ్ఞానం లేదా? ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి దారితీసే లైపోసక్షన్‌తో సమస్యల ప్రమాదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైరల్ వీడియో: కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్)చైనాలో లైపోసక్షన్ ఆపరేషన్లు చాలా సాధారణంగా మారిపోతున్నాయి. అందంగా, స్లిమ్‌గా ఉండాలనే కోరికతో మహిళలు కాస్మొటిక్ సర్జరీలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. మరికొంతమంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలామంది 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఓ మహిళ ఈ ఏఐ వల్లనే ఉద్యోగం కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఉద్యోగం ఎలా పోయిందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ప్రస్తుతం చాలా దేశాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలను నిర్వహించడానికి ఏఐ డిటెక్టర్లను వాడుతున్నారు. ఈ ఏఐ డిటెక్టర్ల కారణంగానే జాబ్ ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురయ్యానని పాకిస్థానీ మహిళ 'దామిషా ఇర్ఫాన్' లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించింది. నేను సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ.. దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించినట్లుగా ఏఐ డిటెక్టర్ నిర్దారించింది.ఏఐ సాధనాలు మానవ సృజనాత్మకతను, ఏఐ రూపొందించిన టెక్స్ట్ మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించలేకపోవడం వల్లనే.. ఇంటర్వూలో రిజెక్ట్ అయ్యాను. ఈ సంఘటన జరిగిన తరువాత, లోపభూయిష్ట సాంకేతికత కారణంగా మనం ప్రతిభను కోల్పోతున్నామా? అనే ప్రశ్నను దామిషా ఇర్ఫాన్ లేవనెత్తింది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో.. మళ్ళీ పరీశీలించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించింది.సోషల్ మీడియాలో ఇర్ఫాన్ పోస్ట్ చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపైన వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కంటెంట్ రైటర్‌గా పని చేయడం మానేయడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. డిజిటల్ వ్యాపార దిగ్గజాలు కంటెంట్ క్రియేటింగ్, బిజినెస్ ప్రమోషన్ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించనివ్వండి అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధంఏఐ డిటెక్టర్లు.. దాదాపు 99 శాతం అసలు కంటెంట్‌ను కూడా ఏఐ క్రియేట్ చేసినట్లు ఫ్లాగ్ చేస్తున్నాయని మరొకరు పేర్కొన్నారు. కంటెంట్‌ను ఏఐ క్రియేట్ చేయడానికి, మానవులు క్రియేట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇంకొకరు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
మేరుగుపై తప్పుడు కేసు.. నిజం ఒప్పుకున్న మహిళ
సాక్షి, విజయవాడ: తనపైన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జున దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.విచారణ సందర్భంగా తనకు, మేరుగు నాగార్జునకి ఎటువంటి సంబంధం లేదంటూ ఆ మహిళ ప్రమాణ పత్రం దాఖలు చేసింది. తనను కొంతమంది భయపెట్టడం వల్లే మేరుగ నాగార్జునపైన తప్పుడు కేసు పెట్టానని పద్మావతి స్పష్టం చేసింది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని ఆమె పేర్కొంది.‘‘తాను ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది రాజకీయం కోసం నన్ను పావుగా వాడుకున్నారు. కొన్ని ఒత్తిళ్లు, అయోమయానికి గురై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సి వచ్చింది. మూడు రోజుల క్రితమే ఈ విషయాన్ని తాడేపల్లి పోలీసులు కూడా తెలిపానని ప్రమాణపత్రంలో పద్మావతి తెలిపింది. -
రూ. 15 కోసం మహిళ ముక్కును తెగనరికి..
అరారియా: ఒక్కోసారి చిన్నపాటి వివాదాలే దారుణాలకు దారి తీస్తుంటాయి. ఇటువంటి ఉందంతం బీహార్‌లోని అరారియాలో చోటుచేసుకుంది. కేవలం రూ. 15 కోసం ఒక ప్రబుద్ధుడు ఒక మహిళ ముక్కును తెగనరికాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం బాధితురాలి పిల్లలు ఏదో ఒక దుకాణానికి వెళ్లి అక్కడ చిప్స్ వగైరా కొనుగోలు చేశారు. అయితే ఆ మహిళ వద్ద చిల్లర డబ్బులు లేవని, బకాయి ఉన్న మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని దుకాణదారునికి హామీ ఇచ్చింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలై కొద్దిసేపటికే పెద్ద గొడవకు దారితీసింది. ఇంతలో ఆ దుకాణం యజమాని ఆ మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముక్కు కోసుకుపోయింది. ఈ ఘటన ఫోర్బ్స్గంజ్ బ్లాక్‌లోని వార్డు నంబర్ ఆరులో చోటుచేసుకుంది.హలీమా ఖాతూన్, రోష్ని, సోనీతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులు తన కుమార్తెపై దాడి చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తన కుమార్తె ముక్కుకు తీవ్ర గాయమయ్యిదని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరుతున్నారు. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
భర్తను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!
కొన్నిగంటలపాటు భర్తను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్పార్క్ అపార్ట్మెంట్లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్‌తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్‌ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్ తన ఫోన్లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్లో శిక్ష ఖరారు చేయనుంది. – వాషింగ్టన్ -
18 అడుగుల శానిటరీ ప్యాడ్ రూపొందించి..
నోయిడా: మహిళల రుతుక్రమానికి సంబంధించిన అపోహలను తొలగించేందుకు, దీనిపై మరింత అవగాహనం పెంపొందించేందుకు యూపీలోని నోయిడాలో గల ఛాలెంజర్స్ గ్రూప్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.దీనిలో భాగంగా మహిళా సాధికారతకు చిహ్నంగా 81 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు కలిగిన శానిటరీ ప్యాడ్‌ను రూపొందించారు. ఛాలెంజర్స్ గ్రూప్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1200 మంది బాలికలు పాల్గొన్నారు. ఆరు వేల శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. బహిష్టు సమయంలో పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి నిర్వాహకులు బాలికలకు అవగాహన కల్పించారు.వైద్య నిపుణురాలు శాలిని ఆధ్వర్యంలో పలు అవగాహనా కార్యక్రమాలు, క్విజ్ పోటీ, పోస్టర్ పోటీలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాలెంజర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రిన్స్ శర్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలకు రుతుక్రమంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ది పవర్ ఆఫ్ షీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఛాలెంజర్స్ గ్రూప్ మురికివాడలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ, అక్కడి బాలికలకు రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి తెలియజేస్తుందన్నారు.ఇది కూడా చదవండి: కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం -
మహిళపై సామూహిక అత్యాచారం.. ఏడుగురు అరెస్ట్
రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళపై ఎనిమిదిమంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారైన మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూఢ్ తహసీల్‌లోని ఒక పర్యాటక ప్రాంతంలో ఈ సామూహిక అత్యాచార ఘటన అక్టోబర్ 21న చోటుచేసుకుంది. రేవా హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హిమాలి పాఠక్ మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ.. బాధిత మహిళకు ఇటీవలే వివాహం జరిగిందని, ఆమె, ఆమె భర్త వయస్సు 19 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుందని, వీరిద్దరూ ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్నారని తెలిపారు.బాధితురాలిని పోలీసులు విచారించినప్పుడు.. ఆమె తనపై లైంగిక దాడికి పాల్పడిన ఎనిమిది మందిలో ఒకరికి చేతులు, ఛాతీపై టాటూలు ఉన్నాయని తెలిపింది. పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.బాధిత దంపతులు గూఢ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారన్నారు. వెంటనే తాము ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. గూఢ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌంటెన్ వద్ద ఆ మహిళ, ఆమె భర్త గొడవ పడ్డారని డీఎస్పీ తెలిపారు. అదే ఫౌంటెన్ దగ్గర ఐదుగురు వ్యక్తులు తనపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ కేసులో పోలీసులు గుర్హ్ నివాసి రామ్‌కిషన్ కోరి, దీపక్ కోరి, రవేష్ కుమార్ గుప్తా, రాంపూర్ బఘెలాన్ వాసి సుశీల్ కోరి, రాజేంద్ర కోరి, తరుణ్ కోరి, నైగర్హి వాసి లవకుష్ కోరిలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గూఢ్ నివాసి రజనీష్ కోరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.నిందితులు బాధితురాలి భర్తను బందించారని ఎస్పీ సింగ్ తెలిపారు. అలాగే వారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రికార్డు చేశారన్నారు. కాగా ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన రెండు రోజుల వరకూ ఎవరికీ తెలియజేదని, ఇది ఆటవిక రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హోంశాఖ పేరును జంగిల్ రాజ్ శాఖగా మార్చాలని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ 18 నుంచి 20 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
సాహసమే ఊపిరిగా..! ఏకంగా 14 పర్వతాలను ..!
అభిరుచి, అంకితభావం, పట్టుదల ఒక దగ్గర చేరితే ఏమవుతుంది? అపురూప విజయం అవుతుంది. ఆడ్రియానా బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం అవుతుంది. ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా 23 ఏళ్ల ఆడ్రియానా బ్రౌన్లీ రికార్డ్ సృష్టించింది. లండన్‌లో పుట్టి పెరిగిన బ్రౌన్లీకి చిన్నప్పటి నుంచి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వారి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. నాన్న పర్వతారోహకుడు. పర్వతారోహణకు సంబంధించి ఆయన చెప్పే ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వినడం అంటే ఇష్టం.ఎనిమిదేళ్ల వయసులో పర్వతారోహకుడైన తండ్రి నుంచి ప్రేరణ ΄పొందింది బ్రౌన్లీ. పెద్ద పర్వతాలు అధిరోహించి పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనేది. ఇరవై ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో ఆ కల సాకారం అయింది. ఆక్సిజన్ లేకుండా గాషెర్‌బ్రమ్ 1కు చేరుకున్న అతి పిన్న వయస్కురాలిగా, కే2 శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.చైనాలోని 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న పిషాపాంగ్మా పర్వతాన్ని అధిరోహించడం ద్వారా 14 శిఖరాల అధిరోహణను పూర్తి చేసింది. నిర్మలమైన ఆకాశం సాక్షిగా, సూర్యోదయం వెలుగులో పిషాపాంగ్మా పర్వతం దగ్గరకు చేరుకోగానే బ్రౌన్లీ భావోద్వేగానికి గురైంది. ‘శిఖరానికి చేరుకోకముందే నా లక్ష్యం నెరవేరబోతుంది అనే ఆనందంలో ఏడ్వడం మొదలు పెట్టాను’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం కేవలం సంఖ్యకు సంబంధించినది కాదు. అంకితభావాన్ని, నిబద్దతను ప్రతిఫలించే అపురూప విజయం అది. పర్వతారోహణ అనేది అభిరుచి మాత్రమే కాదు త్యాగాల సమాహారం. పర్వతారోహణపై దృష్టి పెట్టిన బ్రౌన్లీ టీనేజ్ సంతోషాలకు దూరమైంది. తన కలను సాకారం చేసుకోవడానికి యూనివర్శిటీకి దూరమైంది. వ్యక్తిగత విజయాలపై మాత్రమే బ్రౌన్లీ దృష్టి పెట్టలేదు. పర్వతారోహణ విషయంలో యువతను ప్రోత్సహించడానికి, వారు తమ కలలను సాకారం చేసుకునే విషయంలో సహకరించడానికి నడుం కట్టింది.‘సాహసం మంచిదేగానీ దుస్సాహాసం తగదు’ అంటున్న బ్రౌన్లీ ఎంతోమంది పర్వతారోహకులను దగ్గర నుంచి చూసింది. వారిలో ఉత్సాహమే కనిపిస్తుంది. శిక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సాహసాల పేరుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నాకు తెలుసు. పర్వతారోహణ పేరుతో సాహసాలకు దిగే కొద్దిమందికి ప్రాథమిక విషయాల్లో కూడా అవగాహన లేదని తెలుసుకున్నాను. ఉత్సాహమే కాదు శిక్షణ కూడా చాలా ముఖ్యం. అనుభవం లేని పర్వతారోహకులను ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అనుమతించరాదు. వారు తమ ప్రాణాల తోపాటు ఇతరులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించే పర్వతారోహకులు ముందుగా చిన్న పర్వతాలను అధిరోహించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటుంది బ్రౌన్లీ. ‘ఎప్పుడు పర్వతాల గోలేనా’ అని బ్రౌన్లీని స్నేహితులు వెక్కిరించేవారు. అయితే ఆమె అలాంటి వెక్కిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు.‘జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యం మీకు ప్రత్యేకమైనది కావచ్చు. ఇతరులకు వింతగా అనిపించవచ్చు’ అంటుంది బ్రౌన్లీ. ఒక పర్వతానికి మరో పర్వతానికి సంబంధం ఉండదు. ప్రతి పర్వతం తనదైన సవాళ్లు విసురుతుంటుంది. ‘ప్రతి సవాలు విలువైనదే’ అంటున్న ఆడ్రియానా బ్రౌన్లీ మరిన్ని సాహసాలకు సిద్ధం అవుతుంది.(చదవండి: తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..) -
ఊహకే అందని రైడ్..ఐతే అక్కడ మాత్రమే..!
ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నాం. క్షణాల్లో మనకు నచ్చిన ప్రదేశానికి చేరిపోతున్నాం. జేబు నిండా డబ్బులు ఉంటే చాలు పని ఈజీ. ఇంతవరకు కారు, బైక్ రైడ్లు చూసుంటారు. కానీ ఈ మహిళ బుక్ చేసిన రైడ్ లాంటిది దొరకడం మాత్రం కష్టం. ఔను ఇది కొంచెం కష్టం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఎడారిలో చిక్కుకుపోయి ఉంటారు. వారి వాహనం పాడవ్వడంతో ఉబర్ యాప్‌తో రైడ్ బుక్ చేద్దామని భావిస్తారు. అందులోని ఆప్షన్స్‌లో ఊహకందని రైడ్ కనిపించే సరికి షాకవ్వుతారు. సరే ఒంటె రైడ్ బుక్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని భావిస్తారు. ఇంతలో ఉబర్ ఒంటె రైడ్ రావడం జరుగుతుంది. అది చూసి ఒక మహిళ ఆశ్చర్యపోతూ..ఇది ఉబెర్ ఒంటె రైడేనా అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి తనను ఉబెర్ ఒంటె డ్రైవర్‌గా పరిచయం చేసుకోవడంతో నోట నుంచి మాట రాదు. సదరు వ్యక్తి తాము ఉబెర్ ఒంటెను నడుపుతున్నామని, ఇలా ఎడారిలో దారితప్పిన వ్యక్తులకు సహయం చేయడమే తమ డ్యూటీ అని చెప్పారు. తాము దారి తప్పడంతో ఒంటెని ఆర్డర్ చేసినట్లు తెలిపింది సదరు మహిళ. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి దుబాయ్‌లో మాత్రమే ఇలా ఒంటెని ఆర్డర్ చేయగలరు, ఇదేమి పెద్ద విషయం కాదని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by JETSET DUBAI (@jetset.dubai) (చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!) -
‘మకుటం’ లేని మహిళామణులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో చర్యలు తీసుకున్నారు. వీటిలో భాగంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగంలోని మహిళా ఐపీఎస్‌ల పరిస్థితి మకుటం లేని మహిళామణుల మాదిరిగా మారింది. ఇక్కడ పని చేస్తున్న ఉమెన్ ఐపీఎస్‌ల సంఖ్య దాదాపు 30 వరకు ఉంది. అయితే యూనిట్ ఆఫీసర్లుగా పిలిచే కీలకమైన ఫోకల్ పోస్టుల్లో ఉన్న వారు మాత్రం కేవలం ముగ్గురే. త్వరలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడైనా ఈ పరిస్థితులు మార్చే ప్రయత్నం చేస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫోకల్లోనూ రెండు రకాలైన పోస్టులు.. పోలీసు శాఖలో సాధారణంగా రెండు రకాలైన పోస్టులు ఉంటాయి. శాంతిభద్రతల విభాగం వంటి ప్రాధాన్యం గల వాటిని ఫోకల్ అని, సీఐడీ, ట్రాఫిక్ వంటి ప్రాధాన్యం లేని వాటిని నాన్–ఫోకల్ పోస్టులని వ్యవహరిస్తుంటారు. అయితే ఈ ఫోకల్ పోస్టుల్లోనూ రెండు రకాలైనవి ఉన్నాయి. ఏదైనా జిల్లా లేదా కమిషనరేట్‌కు నేతృత్వం వహించే అవకాశం ఉన్న ఎస్పీ ఆపై స్థాయి హోదాలోని పోస్టులను యూనిట్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఎస్పీ హోదాలోనే ఉన్నప్పటికీ... కమిషనరేట్లలోని జోన్లకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా (డీసీపీ) పని చేసే వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, అధికారం ఉండదు. ఈ నేపథ్యంలో ఇవీ ఫోకలే అయినప్పటికీ అక్కడి పని చేసే వారిని యూనిట్ ఆఫీసర్‌గా పరిగణించరు. ‘33’ కాదు కదా ‘10’ కూడా లేదు... పోలీసు విభాగంలో వివిధ స్థాయిల్లో జరిగే రిక్రూట్మెంట్లో సైతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే వీరికి పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే పోస్టింగ్స్లోనూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో భావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 9 కమిషనరేట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే మొత్తమ్మీద ఉన్న 39 యూనిట్లలో పదికి పైగా మహిళా ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో పని చేయాలి. అయితే వాస్తవానికి పది శాతం కూడా యూనిట్ ఆఫీసర్లుగా మహిళా ఐపీఎస్‌లు లేరు. నిర్మల్ జిల్లాకు జానకీ శర్మిల, కామారెడ్డి జిల్లాకు సీహెచ్ సింధు శర్మ ఎస్పీలుగా ఉండగా... సిద్ధిపేట కమిషనరేట్‌కు బి.అనురాధ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురూ మినహా మరే ఇతర యూనిట్‌కు మహిళా ఐపీఎస్ నేతృత్వంలో లేదు. కేవలం సీఐడీ, ఎస్ఐబీ వంటి విభాగాలు మాత్రమే ఉన్నాయి. ఈసారైనా ఈ సీన్ మారేనా..? ఈ ముగ్గురు మహిళా ఐపీఎస్ల్లోనూ కేవలం సింధు శర్మ మాత్రమే డైరెక్ట్ ఐపీఎస్ కావడం గమనార్హం. మిగిలిన ఇద్దరూ రాష్ట్ర పోలీసు విభాగంలో అడుగుపెట్టి, నిరీ్ణత కాలం పని చేసిన తర్వాత ఐపీఎస్ హోదా పొందిన వారే. సింధు శర్మ ప్రస్తుతం నిజామాబాద్ కమిషనరేట్‌కు సైతం ఇన్చార్జ్గా ఉన్నారు. రాజకీయపరంగా అత్యంత సున్నితమైన ఈ రెండు యూనిట్లను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారనే పేరు పొందారు. ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో పెద్ద స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి నేపథ్యంలో మహిళా ఐపీఎస్ అధికారులకు సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఆయా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈ కోణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
అప్పులు ఎగ్గొట్టేందుకు మహిళ హైడ్రామా
బల్లికురవ: అప్పులు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ రాష్ట్రీయ రహదారిపై కూర్చుని బెదిరింపులకు దిగిన ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడులో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సిమెంట్, ఇనుము వ్యాపారం చేసేవారు. వ్యాపార నిమిత్తం పలువురి వద్ద అప్పులు చేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన చనిపోయారు. తరువాత ఆయన భార్య అప్పులు తాను తీరుస్తానని చెప్తూ వస్తున్నారు. ఎన్నేళ్లయినా అప్పులు తీర్చకపోవడంతో విసిగిన బాధితులు శనివారం ఆమెను దుకాణం వద్ద నిలదీశారు. దీంతో ఆమె కుమార్తె అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై కూర్చుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది. దీంతో వారికి అప్పులు ఇచ్చిన వారు అవాక్కయ్యారు. మహిళ రోడ్డుకు అడ్డుగా బైఠాయించడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వారిద్దరినీ పక్కకు తీసుకొచ్చి ట్రాఫిక్ పునరుద్ధరించారు. -
లీలా సేథ్‌ను ‘మదర్ ఆఫ్ లా’ అని ఎందుకంటారంటే..
భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన మూడు ప్రధాన విభాగాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది న్యాయవ్యవస్థ, రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ మూడవది శాసనసభ. ఈ మూడు రంగాల్లోనూ మహిళల వాటా గణనీయంగా పెరిగింది. వీటిలో న్యాయవ్యవస్థ విషయానికి వస్తే ఈ రంగంలో మహిళల పాత్ర కీలకంగా మారింది.ప్రస్తుతం దేశంలో పలువురు మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నారు. అయితే దేశంలోని హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన లీలా సేథ్ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ఈరోజు (అక్టోబర్ 20)న ఆమె జన్మదినం. ఆమెను ‘మదర్ ఆఫ్ లా అని పిలుస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరకూ సాగిన ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు.1930, అక్టోబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో లీలా సేథ్ జన్మించారు. తన 11 ఏళ్ల వయసులోనే ఆమె తండ్రిని కోల్పోయారు. తల్లే ఆమెను పెంచి పెద్దచేసి, ఉన్నత చదువులు చదివించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే లీలా సేథ్ డార్జిలింగ్‌లో హైస్కూలు విద్య పూర్తి చేశారు. అనంతరం ప్రేమ్ సేథ్‌ను వివాహం చేసుకున్నాక, భర్తతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ గ్రాడ్యుయేషన్, తరువాత న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆమె లండన్ బార్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు.అనంతరం భారత్ తిరిగి వచ్చిన ఆమె తొలుత కోల్‌కతాలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత పట్నాలో, ఢిల్లీలో తన న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1978లో లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డులలోకి ఎక్కారు. ఈ నేపధ్యంలోనే ఆమెను ‘మదర్ ఆఫ్ లా’ అని అంటారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దరిమిలా కేసు విచారణకు ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీలో లీలా సేథ్ సభ్యురాలు. లీలా సేథ్ 2017లో తన 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు -
మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..
సిక్కింలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో కడుపు నొప్పితో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటే.. నొప్పి తగ్గకపోగా.. ఎక్కువైంది. మళ్లీ ఏ ఆసుపత్రిలో చూపించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అలా 12 ఏళ్ల పాటు నొప్పిని భరిస్తూనే ఉంది. తాజాగా ఈనెలలో మరోసారి ఆసుపత్రికి వెళ్లగా.. కడుపు నొప్పికి గల కారణం తెలిసి కుటుంబం షాక్‌కు గురైంది. సదరు మహిళ కడుపులో గత 12ఏళ్లుగా కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.అసలేం జరిగిదంటే.. 45 ఏళ్ల మహిళ 2012లో గాంగ్టక్లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మెమోరియల్ హాస్పిటల్లో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. ఈ తరువాత ఊడా ఆమెకు కడుపులో నొప్పి కొనసాగుతూనే ఉంది. చాలా మంది వైద్యులను సంప్రదించి మందులు ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గలేదు. తిరిగి వస్తూనే ఉంది. ఇలా పదేళ్లకుపైగా బాధపడుతూనే ఉంది. అక్టోబర్ 8న, ఆమె మళ్లీ ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రికి వెళ్లింది. ఎక్స్-రేలో ఆమె కడుపులో శస్త్రచికిత్స కత్తెర ఉన్నట్లు బయటపడింది. 12 క్రితం అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్న సమయంలో వైద్యులు ఆమె కడపులో ఓ కత్తెరను పెట్టి మర్చిపోయినట్లు తేలింది.అయితే ఇన్నేళ్లుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయం కనిపెట్టలేకపోవడం గమనార్హం. తాజాగా వైద్య నిపుణుల బృందం వెంటనే మళ్లీ ఆమెకు ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే విషయం బయటకు పొక్కడంతో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ.. హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్‌కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.