breaking news
Mahabubabad
-
ఆపన్నహస్తం అందించరూ..
వర్ధన్నపేట: చదువుల తల్లికి లక్ష్మీకటాక్షం కరువైంది. కడు పేదరికంలో జన్మించి ప్రభుత్వ గురుకులంలో కష్టపడి చదివి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో ర్యాంకు సాధించింది. అయితే ఆ విద్యార్థిని ఉన్నత విద్యనభ్యసించడానికి చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి. తల్లిదండ్రులది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. దీంతో ఆ విద్యార్థినితోపాటు తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు చేయూత ఇవ్వాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. వివరాల్లో వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆనపర్తి యాకాంత, సామ్యూల్ నిరుపేదలు. వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. సామ్యూల్ దివ్యాంగుడు కాగా, యాకాంత ఇళ్లలో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల కూతురు శ్రుతి నీట్ పరీక్షలో ర్యాంకు సాధించి భధ్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. అయితే ఆర్థిక కారణాలతో శ్రుతి ఉన్నత చదువు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై దాతలు స్పందించి తమ కూతురు ఉన్నత చదువుకు చేయూనందించాలని వేడుకుంటున్నారు. దాతలు 8977280508 నంబర్లో శ్రుతిని సంప్రదించి ఆర్థిక సాయం అందజేయాలని వారు కోరుతున్నారు. మెడికల్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని అయితే ప్రవేశానికి చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి దాతలు చేయూతనివ్వాలని వేడుకోలు -
ఎమ్మెల్యే ‘దొంతి’కి మాతృవియోగం
నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాతృ వియోగం కలిగింది. చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ(88) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. రాత్రి 9 గంటల నుంచి ఎమ్మెల్యే నివాసంలో కాంతమ్మ పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం హనుమకొండలోని పద్మాక్ష్మి గుట్ట పక్కన గల శివముక్తి ధామ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు హనుమకొండలోని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నివాసానికి చేరుకుని కాంతమ్మ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
చిరునవ్వుతో జీవిద్దాం!
ఖిలా వరంగల్: చిరునవ్వు.. వ్యక్తిత్వానికి ప్రతిబింబం. కొందరి చిరునవ్వు శత్రువునైనా సమ్మోహన పరుస్తుంది. అందుకే నవ్వులోని ఆప్యాయత, అనురాగం మరెందులోనూ ఉండదు. అయితే ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవనంలో చాలా మంది మనస్ఫూర్తిగా నవ్వడమే మరచిపోతున్నారు. తీవ్ర ఒత్తిడి, వివిధ సమస్యలతో నవ్వుకు దూరమవుతున్నారు. అయితే చిన్న చిరునవ్వుతో బాధలన్నీ మరచిపోవచ్చని చెబుతున్నారు వైద్యులు. చర్మం మెరుగులు దిద్దుకుంటుందని, ఆయుష్షు పెరుగుతుందని, మనుషుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయని స్పష్టం చేస్తున్నారు. నేటి జీవితంలో నవ్వకపోవడం రోగమేనని వారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక జీవనంలో వేదనలు.. రోదనలు.. చింతనలు.. ఆలోచనల నడుమ హాయిగా నవ్వుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివారం ప్రపంచ చిరునవ్వుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నేటి నానుడి నవ్వు నాలుగు విధాలా స్వీట్.. నాటి నానుడి.. నవ్వు నాలుగు విధాలా చేటు. నేటి నానుడి.. నవ్వు నాలుగు విధాలా స్వీట్. నవ్వు ప్రకృతి ప్రసాదించిన వరం. ముఖానికి ఎన్ని సౌందర్య సాధనాలద్దినా.. చిరునవ్వుకు సరి తూగవు. మనసారా నవ్వితే శరీరంలో కొన్ని ప్రత్యేక రసాయనాలు విడుదలవుతాయి. కొండంత కోపాన్ని హరించి ఎలాంటి వాతావరణాన్నైనా చల్లబరిచేది చిరునవ్వే. ప్రస్తుత సమజంలో మనుషుల యాంత్రిక జీవనం.. ప్రస్తుత సమజంలో మనుషులు యాంత్రిక జీవనం గడుపుతున్నారు. ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే సెల్‌ఫోన్ చూస్తూనో.. కంప్యూటర్ పనిలో ఉన్నప్పుడో కాస్త చిరునవ్వుతో పలకరిస్తున్నారు. ఇది కూడా కనీసం ఐదు సెకండ్లకు మించి ఉండడం లేదు. అంటే మనిషిని సాంకేతికత ఎంతగా అపహరించిందో అర్థం చేసుకోవచ్చు. చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబమంతా సరదాగా నవ్వుకుని కాలం గడిపే రోజులు ఎప్పుడోపోయాయి. ఎదుటి మనిషితో మాటలు కరువయ్యాయి. మనిషికి చిరునవ్వు దివ్య ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోజులో ఎక్కువ సార్లు నవ్వితే 15 నిమిషాలు వ్యాయామంతో సమానమని చెబుతున్నారు. నవ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వైద్యశాస్త్రం చెబుతుంది. అందుకే లాఫింగ్ క్లబ్లో బిగ్గరగా నవ్వుతూ వ్యాయామం చేస్తుంటారు. ఇటీవల నవ్వుతో యోగా, వ్యాయామం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నవ్వకపోతే మనిషిలో మానసిక రుగ్మతలు పెరిగిపోతాయి. మనసును ప్రశాంతంగా ఉంచి జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచే మార్గం నవ్వు మాత్రమేనని చెప్పక తప్పదు. అందుకే మనస్ఫూర్తిగా చిరునవ్వుతో పలకరిద్దాం.. చిరకాలం జీవిద్దాం.మానవ శరీంలో దెబ్బతిన్న కణాలు బాగు చేసే శక్తి కూడా నవ్వుకు ఉంది. నవ్వితే కోపం, భయం, అసూయ, ఆందోళన, ద్వేషం, ఒత్తిడి మాయమవుతాయి. కడుపుబ్బ నవ్వితే 20 నిమిషాలు వ్యాయామంతో సమానం. సుమారు మూడున్నర కేలరీలు ఖర్చు అవుతాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండేవారి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం తగ్గుతుంది. గుండె జబ్బులు దూరమవుతాయి. చిరునవ్వు ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఒక్కసారి గట్టిగా నవ్వితే శరీరంలోని 108 కండరాలకు శక్తి వస్తుంది. నవ్వు ఒత్తిడి తగ్గించి ఆనందాన్ని పెంచే హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ పెంపొందిస్తుంది.చిరునవ్వే మనిషికి చెరగని ఆభరణం స్మైల్‌తో అనేక మానసిక రుగ్మతలు దూరం నవ్వడం యోగం.. నవ్వకపోవడం రోగం.. నేడు ప్రపంచ చిరునవ్వుల దినోత్సవం -
అంబేడ్కర్ వర్సిటీలో ప్రవేశాలకు 10వ తేదీ గడువు
విద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025–2026 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 10వరకు గడువు ఉందని, ఇదే చివరి అవకాశమని ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ సర్వీస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, 10ప్లస్ 2 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశాలు పొందొచ్చని తెలిపారు. అలాగే, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చని తెలిపారు. బీఏ, బీఎస్సీ, బీటెక్, బీబీఏ విద్యార్థులు ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, చరిత్ర, ఎకనామిక్స్, సోషియాలజీ, ఎంఏ జర్నలిజం కోర్సులు కూడా చదువుకునే అవకాశం ఉందన్నారు. బీఎస్సీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఎమ్మెస్సీ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్‌లో ప్రవేశాలు పొందొచ్చనని తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీలో చేరే విద్యార్థులకు రిటైల్ రంగంలో ఉపాధి కల్పించేందుకుగాను ఆర్‌ఏఎస్‌సీఐ సంస్థతో కూడా యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. విద్యార్థులకు ఒకేషనల్ ట్రైనింగ్‌లో ఆసక్తి ఉంటే రామనందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ కూడా శిక్షణ ఇవ్వనుందని ఆయన తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్‌ఏవోయూ ఆన్లైన్ వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ ఖిలా వరంగల్: ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3,200 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. వరంగల్ శివనగర్‌లోని మసీదు వీధి సమీపంలో ఓ ఇంట్లో ఒక పురుషుడు, ఐదుగురు ట్రాన్స్జెండర్లు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శనివారం ఉదయం ఆ ఇంటిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఈసారపు సైదులు, గుగులోత్ రమ, పండిబోతు ప్రత్యూష, గుగులోత్ వంశీక, గుగులోత్ వినజ, గుగులోత్ స్వప్న ఉన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. యువకుల మధ్య ఘర్షణ రామన్నపేట: వరంగల్ మండిబజార్‌లో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఖుర్షీద్ హోటల్లో బిర్యానీ తినేందుకు గిర్మాజీపేటకు చెందిన నీలారపు రణవీర్ తన తమ్ముడు సూర్యతో వచ్చాడు. ఆ సమయంలో నితీశ్, తరుణ్, చందుతో పాటు మరికొంత మంది వ్యక్తులు రణవీర్పైదాడికి పాల్పడ్డా రు. ఈ దాడిలో రణవీర్‌కు తీవ్ర గాయాలు కాగా ఎంజీఎంలో చికిత్స పొందాడు. ఈ ఘటనలో ఖుర్షీద్‌తోపాటు దాడికి పాల్పడిన యువకులపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. -
ప్రజల ముంగిట్లోకి న్యాయసేవలు
● అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్ ● కంబాలపల్లిలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభంమహబూబాబాద్ రూరల్ : ప్రజలకు అందుబాటులోకి న్యాయసేవలు వచ్చినప్పుడే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని మానుకోట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని కంబాలపల్లి గ్రామంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ శనివారం ఏర్పాటు చేశారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు గ్రామాల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు న్యాయాన్ని పొందలేనప్పుడు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయిస్తే ఖర్చులేకుండానే ప్రతివాదులకు నోటీసులు పంపించి తద్వారా న్యాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. ఎవరైనా న్యాయవాదిని నియమించుకోలేని వారు సంప్రదిస్తే సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదిని నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం లీగల్ ఎయిడ్ క్లినిక్‌లో పారా లీగల్ వలంటీర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఎస్సై దీపిక, కంబాలపల్లి పంచాయతీ సెక్రటరీ మయూరి, పారాలీగల్ వలంటీర్లు దొంతు శ్రావణ్ కుమార్, కొత్తపల్లి సిద్ధార్థ, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. -
కాపాస్ కిసాన్ యాప్‌పై శిక్షణ
హన్మకొండ: కాపాస్ కిసాన్ యాప్‌పై శనివారం ఉ మ్మడి వరంగల్ జిల్లాలోని వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు శిక్షణ ఇచ్చారు. వరంగల్ ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకుడు వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యాప్‌పై శిక్షణ ఇచ్చారు. రైతులు పత్తి అమ్ముకునేందుకు తప్పని సరిగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నా రు. అన్నదాతలు తమ స్మార్ట్ ఫోన్లో కాపాస్ కిసా న్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. పత్తి కొనుగోలు సంబంధిత సేవలకు రైతులు టోల్ ఫ్రీ నంబర్ 18005995 779, వాట్సాప్ సేవలకు 8897281111 నంబర్‌ను సంప్రదించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారులు, ఏడీఈలు, ఎంఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యాయత్నం..
● చికిత్స పొందుతూ మృతి మహబూబాబాద్ రూరల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనగపురం శివారు పాత తండాలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై దీపిక శనివారం కేసు వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన ధరావత్ కృష్ణ (45), భారతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి 30 గుంటల వ్యవసాయ భూమి ఉండగా దానితోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలు, వ్యవసాయానికి రూ.5 లక్షల మేర అప్పు అయ్యింది. ఎలా తీర్చాలని కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్న కృష్ణ.. ఈ నెల 01వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వరంగల్ ఎంజీఎం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దీపిక తెలిపారు. -
నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్
జనగామ: ఓ నకిలీ కానిస్టేబుల్‌ను జనగామ పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి ఫోన్, పోలీస్ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సత్యనారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. జనగామకు చెందిన కిరణ్ నాలుగేళ్ల క్రితం పట్టణ పోలీసు వెహికిల్‌పై ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఇదే సమయంలో మూడేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించిన విషయంలో కేసు నమోదు కావడంతో జైలుకెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన బంధువు కానిస్టే బుల్ కుమారస్వామి ఐడీని తస్కరించి పెంబర్తి, నెల్లుట్ల ప్రధాన రహదారిపై పోలీసు వేషంలో అర్ధరాత్రి సమయంలో వాహనాల తనిఖీ పేరిట డబ్బులు వసూలు చేశాడు. ఇదిలా ఉండగా కిరణ్ బావ బంధువుపై జనగామకు చెందిన వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేయొద్దంటే రూ.2.50లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనపై ఎండీ అన్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు బి.కరుణాకర్, ఎన్.సాగర్, బి.కృష్ణ, పి.చరణ్, ఇ.రాజేశ్, ఎం.మధుసూదన్‌ను ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. వివరాలు వెల్లడించిన పోలీసులు -
– ఎస్‌ఎస్‌తాడ్వాయి
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్‌ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. వనదేవతల గద్దెల ప్రాంగణం నమూనా చిత్రంతిరుగు ప్రయాణం ● ముగిసిన పండుగ సెలవులు ● రద్దీగా రైల్వే స్టేషన్ డోర్నకల్: బతుకమ్మ, దసరా సెలవులు ముగియడంతో సొంత ఊర్లకు వచ్చివారు తిరుగుపయణమయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లి స్థిరపడినవారు విధుల్లో పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపించే ఆలోచనతో శనివారం ఒక్కసారిగా బయల్దేరారు. దీంతో రైల్వే స్టేషన్లో రద్దీ వాతావరణం నెలకొంది. ఘనంగా గ్యార్మీ షరీఫ్ వేడుకలు మహబూబాబాద్ రూరల్ : గ్యార్మీ షరీఫ్ పర్వదిన వేడుకలను జిల్లా కేంద్రంలో ముస్లింలు శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంకర బోర్డు ప్రాంతం నుంచి ముస్లింలు ప్రత్యేకంగా భారీ జెండా, నైవేద్యం తీసుకెళ్లి రైల్వేస్టేషన్ ఎదుటఉన్న గౌసియే పాక్ జిల్లా జెండా గద్దెల వద్ద సమర్పించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు గౌసియే పాక్ చిల్లా జెండాల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాక మహాఅన్నదానం ఏర్పాటు చేశారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడొద్దు మహబూబాబాద్ రూరల్ : ప్రతి రైతు విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కలిగి ఉండాలని, విద్యుత్ చౌర్యానికి పాల్పడకూడదని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ పెరుమాళ్లపల్లి విజయ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో విద్యుత్ సమస్యలు, భద్రత సూత్రాలు, విద్యుత్ ప్రమాదాల నివారణపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ విజయ్ మాట్లాడుతూ.. ప్రతీ రైతు విద్యుత్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యవసాయ పంపుసెట్టు మోటార్లకు ఎర్తింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఇంటిలో నాణ్యతతో కూడిన సర్వీస్ వైరు, విద్యుత్ పరికరాలు ఉపయోగించాలని, ప్రతీ ఒక్కరు భద్రత సూత్రాలు పాటించాలని చెప్పారు. పొదుపుగా విద్యుత్ వాడుకునే అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. రైతులకు పొలంబాట చేపట్టి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రూరల్ ఏఈ పీక వెంకటేశ్వర్లు, ఎస్ఎల్ఐ రవీందర్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ సంపత్ పాల్గొన్నారు. 9 నుంచి లా సప్లిమెంటరీ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లా కోర్సు మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసింఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.ప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకొచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. ఆదివాసీల గొట్టుగోత్రాల చిత్రాలుతాబేలుపై కోయరాజుల బొమ్మలుఅమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లర్లు ఫీటున్నర వెడల్పు, 8 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేస్తారు. వీటిపై 340 బొమ్మలు వేయనున్నారు. పూర్తిగా సమ్మక్క వంశం సిద్ధబోయినవారి పవిత్ర బొమ్మలతోపాటు పూజావిధానం, వారి వంశ వృక్షం ఉంటుంది. సారలమ్మ గద్దె పక్కన పిల్లర్లపై కూడా ఇదే పద్ధతిలో 342 బొమ్మలు వేస్తారు. సారలమ్మ వంశం, 3వ గొట్టు పవిత్ర బొమ్మల చిత్రాలు వేస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై 172 చొప్పున 344 బొమ్మలు, వారి వంశవృక్షం పవిత్ర బొమ్మలు వేస్తారు. పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాసీ్త్రయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ● ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ● ఆలయంలోని తూర్పు ఈశాన్య ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ● ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్ మేడారం గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు 3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు -
కోర్టు ఆదేశాలు అమలు చేయాలి
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడంతో కొంత మంది విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఎనిమిది వారాల్లో విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ క్లియర్ చేసి వారి ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. అయినా కార్యరూపం దాల్చడం లేదు. విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరి సరికాదు. వెంటనే కోర్టు ఆదేశాల ప్రకారం బెనిఫిట్స్ జమచేయాలి. –కడారి భోగేశ్వర్, కన్వీనర్, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన సమితి, వరంగల్ -
డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
● ఆక్రమణకు గురైన డ్రెయినేజీలు ● పేరుకుపోయిన మురుగు, వ్యర్థాలు ● దుర్వాసనతో ప్రజల అవస్థలు డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన వీధులతోపాటు పలు వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రెయినేజీలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో మురుగును తొలగించే అవకాశం లేకుండాపోయింది. దీంతో వ్యర్థాలు, మురుగు పేరుకుపోయి తీవ్ర దర్గంధం వెదజల్లుతోంది. ఆక్రమణలతో కానరాని డ్రెయినేజీలు మెయిన్ రోడ్డు, సెకండ్ మెయిన్ రోడ్డు, బ్యాంక్ స్ట్రీట్, ఇందిరానగర్, పాతడోర్నకల్తోపాటు వార్డుల్లో సైడు కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, డబ్బా కొట్లు, తోపుడు బండ్లు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేయడంతో కాల్వలు కనుమరుగయ్యాయి. కాల్వలను మూస్తూ సిమెంట్ కవర్లు ఏర్పాటు చేసి వాటిపై దుకాణాలు ఏర్పాటు చేయడంతో కాల్వల్లో వ్యర్థాలు తొలగించే అవకాశాలు లేకపోయింది. అప్పుడప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కాల్వల్లోని వ్యర్థాలను తొలగించేందుకు శ్రమిస్తున్నా సాధ్యపడటం లేదు. దోమలు, దుర్గంధంతో ఇబ్బంది.. డోర్నకల్ మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.1.2 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు జరుగుతుండగా తమ ఇళ్ల ముందు కాల్వ నిర్మించవద్దంటూ కొంతమంది కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో నిర్మాణ పనులు పూర్థిస్థాయిలో జరగలేదు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంతో డ్రెయినేజీ ద్వారా మురుగునీరు సక్రమంగా ప్రవహించడం లేదు. మెయిన్ రోడ్డు, బ్యాంక్ స్ట్రీట్, ఇందిరానగర్, పాతడోర్నకల్లో మురుగునీరు, వ్యస్థాలు డ్రెయినేజీలో నిలిచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. కొన్ని చోట్ల డ్రెయినేజీను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతో మురుగు, వ్యర్థాలు తొలగించలేకపోతున్నారు. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారడంతో దుర్గంధం, దోమలు, ఈగలతో స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి కాల్వలపై ఆక్రమణలను తొలగించి డ్రెయినేజీ, సైడు కాల్వలను శుభ్రపర్చాలని ప్రజలు కోరుతున్నారు. -
విశ్రాంత ఉద్యోగుల పోరుబాట..
కాళోజీ సెంటర్ : రెండు, మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారి ఆర్థిక పరిస్థితి కడు దయనీయంగా మారింది. సర్వీస్‌లో ఉన్నంత కాలం జీపీఎఫ్, పీఎఫ్ రూపంలో పైసాపైసా కూడగట్టుకున్న సొమ్ముతో సొంతిల్లు కట్టుకోవాలని, కూతురు పెళ్లి చేయాలని, ఇతర అవసరాలు తీర్చుకోవాలనుకుంటున్న పలువురి ఆశలు అడియాశలవుతున్నాయి. ఉద్యోగ విరమణ చేసి రెండు సంవత్సరాలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన డబ్బులు ఇంత వరకూ చేతికి రాలేదు. దీంతో కుటుంబ అవసరాలు గడవకపోవడంతోపాటు ఆరోగ్య ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంవత్సరం సమయం ఇస్తే విశ్రాంత ఉద్యోగులందరి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడం వారిలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. కనుచూపుమేరలో బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ ఫింఛన్ డబ్బులు ఖాతాల్లో జయచేయాలని వేడుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేయాలి.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలలో ప్ర భుత్వం జాప్యం చేయడంతో కొంత మంది విశ్రాంత ఉద్యోగులు కోర్టు ఆశ్రయించారు. స్పందించి కోర్టు.. విశ్రాంత ఉద్యోగులకు ఎనిమిది వారాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకూ తమకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే కోర్టు ఆదేశాలు అమలు చేసి బెనిఫిట్స్ విడదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న విశ్రాంత ఉద్యోగులు.. సుమారు రెండు సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈనెల 1వ తేదీన పోరుబాటకు సంబంధించి సన్నాహక సమావేశం కూడా జరిగింది. ఇందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులతో చర్చించి నేడు (ఆదివారం) హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం బాధ్యులు వెల్లడించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన సమితి పేరుతో పోరుబాట పట్టనున్నట్లు కన్వీనర్స్ కందుకూరి దేవదాస్, కడారి భోగేశ్వర్ తెలిపారు. బెనిఫిట్స్ సాధన కోసం ఆదివారం ఉద్యమ కార్యాచరణ ప్రకటించనునట్లు వారు తెలిపారు. కుటుంబ ఖర్చులు, వైద్య అవసరాలకు ఇబ్బందులు కోర్టు ఆదేశాలు అమలు చేయాలని డిమాండ్ -
కారు ఢీకొని మహిళ మృతి
వర్ధన్నపేట : బస్సు కోసం వేచి చూస్తున్న మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన శనివారం మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. వర్ధన్నపే ట ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పరపల్లికి చెందిన గ్రా మ పంచాయతీ స్వీపర్ జిల్లా హైమ (38) శనివారం ఉద యం ఉప్పరపల్లి క్రాస్ వద్ద వర్ధన్నపేటకు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఈక్రమంలో వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు అదుపు తప్పి హైమను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె ఎగిరి పడగా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం అదే కారు ఉప్పరపల్లి వైపు వెళ్తున్న మరో కారును కూడా ఢీకొనడంతో ఆ కారు దెబ్బతింది. మృతురాలి కుమార్తె శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు. హైమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. చెట్టుపై నుంచి పడి వ్యక్తి.. ములుగు రూరల్ : మండలంలోని దేవగిరిపట్నానికి చెందిన ఓ వ్యక్తి చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. దేవగిరిపట్నం గ్రామం బోటిమీది తండాకు చెందిన భూక్య శ్రీనివాస్ (42) రోజువారీ కూలీతోపాటు మిషన్ కొనుగోలు చేసుకుని చెట్లు కోస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం గ్రామంలో పనికి వెళ్లి చెట్టుపై నుంచి రాయిపై పడ్డాడు. దీంతో తీవ్ర గాయం కావడంతో యజమాని గమనించి 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య జమున, కుమార్తెలు పూజ, తేజ ఉన్నారు. శ్రీనివాస్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుంటలో పడి యువకుడు.. పెద్దవంగర: కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు కుంటలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారం గ్రామ పరిధిలోని భద్రు తండాకు చెందిన బానోత్ మల్సూర్ (26)కు మతిస్థిమితం లేదు. పదేళ్ల క్రితం విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు. అప్పటి నుంచి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సమీపంలోని కుంటలోకి బహిర్భూమికి వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వస్తున్న క్రమంలో కుంటలో పడి మునిగిపోయాడు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులకు నీటిలో మల్సూర్ మృతదేహం కనిపించింది. కాగా, ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
భార్యను చంపిన భర్త ..
నెల్లికుదురు : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు శనివారం నెల్లికుదురు పీఎస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లికుదురు మండలం ఆలేరులో ఈ నెల 3న కుమారుడి మీద కోపంతో క్షణికావేశానికి గురైన చీకటి నరేశ్ తన భార్య స్వప్న (38)ను గొడ్డలితో నరికి చంపి పరారైన విషయం విదితమే. ఈ ఘటనపై మృతురాలు సోదరి మాచర్ల ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నెల్లికుదురు నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పెద్ద కుమారుడు విక్రం జులాయిగా తిరుగుతుంటే మందలిస్తున్న ప్రతీసారి తల్లి అడ్డు పడుతుందని, దీంతో తన భార్యను చంపితేనే కుమారుడు మారుతాడనే ఉద్దేశంతో ఆమెను గొడ్డలితో నరికి చంపినట్లు నరేశ్ ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై చిర్ర రమేశ్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
పండుగ వేళ.. మృత్యు హేల
● రోడ్డు ప్రమాదాల్లో పలువురు దుర్మరణం జనగామ: దసరా పండుగ వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో గురు, శుక్ర వారాల్లో పలువురు దుర్మరణం చెందారు. జనగామ జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అతి వేగం, ప్రమాదవ శాత్తు జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి 16 మంది క్షతగాత్రులను తరలించగా, మరో 50 మంది వరకు స్వల్ప గాయాలయ్యాయి. బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో 17 ఏళ్ల యువకుడు, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధి రాయగిరి రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయా ప్రమాదాల్లో పలు గ్రామాలకు చెందిన వారికి తీవ్ర గాయాలు కాగా, జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. బచ్చన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుల స్వప్న – గోపి దంపతులకు ముగ్గురు సంతానం కాగా, వారిలో చిన్నవాడు అర్జున్ (17) ట్రిఫుల్ ఈ చదువుతున్నాడు. దసరా పండుగకు స్వగ్రామం వచ్చి రాత్రివేళ తన స్నేహితుడు శివప్రసాద్‌తో కలిసి బైక్‌పై గ్రామం బయటకు వెళ్తుండగా ఆలేరు నుంచి బచ్చన్నపేట వైపు వేగంతో వెళ్తున్న కారు.. ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి కిందపడ్డారు. తలకు గాయమైన అర్జున్ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. శివప్రసాద్‌కు కాలు విరిగి గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ కాశిబుగ్గకు చెందిన బొచ్చ క్రాంతికుమార్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి బంధువుల రాస్తారోకో మృతుడు కందుల అర్జున్ బంధువులు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట జనగామ – సిద్దిపేట రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. అర్జున్ మృతికి కారణమైన డ్రైవర్ క్రాంతికుమార్‌ను అదుపులోకి తీసుకోకుండా ఎందుకు వదిలేశారంటూ ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి జనగామ ఏసీపీ పండేరి చేతన్‌నితిన్ వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు చెన్నకేశవులు, నరేష్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. యశ్వంతాపూర్‌లో ఒకరు.. జనగామ రూరల్: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా యశ్వంతాపూర్ గ్రామ శివారు ఉడుముల ఆస్పత్రి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్కు చెందిన బండ వీరస్వామి (36) జనగామ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టగా వీరస్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య స్రవంతి, కుమారుడు కూతురు ఉన్నారు. ఆటోకింద పడి చిన్నారి.. గూడూరు: ట్రాలీ ఆటో టైర్‌కింద పడి చిన్నారి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో దసరా వేడుకల సందర్భంగా డీజే ట్రాలీ ఆటోను ఓ మలుపు వద్ద వెనక్కి తీస్తుండగా, ఆటో వెనుక సోలం రాజు, రమ్య దంపతుల కుమారుడు సోలం జశ్వంత్ (4) ఉన్నాడు. డ్రైవర్ గమనించకపోవడంతో ట్రాలీ వెనుక టైర్‌కింద పడి బాలుడి మృతిచెందాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు.. మానుకోట ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలుడు కన్నుమూశాడు. ట్రాలీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే తన కుమారుడు మృతిచెందాడని, బాలుడి తండ్రి సోలం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. పండుగపూట అత్తగారింటికి వెళ్తూ.. స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కత్తుల సంపత్ (29) యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సంపత్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, భార్య సౌమ్య, మూడేళ్ల కుమారుడితో అక్కడే నివాసముంటున్నాడు. దసరా పండుగకు అత్తగారి ఊరైన దేవరుప్పుల మండలం కోలుకొండకు భార్య, కుమారుడు, బావమరిదితో కలిసి బైక్‌పై హైదరాబాద్ నుంచి గురువారం సాయంత్రం బయలుదేరాడు. ఈ క్రమంలో రాయగిరి వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ధరావత్ తండా వద్ద మహిళ.. మరిపెడ రూరల్: కారు ఢీకొని మహిళ దుర్మరణం చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధరావత్‌తండా వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నగూడూరు మండలం బావోజీ తండాకు చెందిన బానోతు బుల్లి (45) మరిపెడ మండలంలోని ధరావత్ తండాకు బంధువుల ఇంటికి పండుగకు వెళ్లింది. ఈ క్రమంలో రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కారు వేగంగా వెళ్తూ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కొత్తపల్లి వద్ద వృద్ధుడు.. ఎల్కతుర్తి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ చెరువు కట్ట సమీపంలో ముల్కనూర్ – ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కోమటిపల్లికి చెందిన వేల్పుల పోచయ్య (60) దసరా పండుగ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో ఉంటున్న తన తమ్ముడు ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా, అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సైక్లిస్ట్ దుర్మరణం..నర్సంపేట రూరల్: సైకిలిస్ట్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఉప్పరపల్లి – కోనాపురం ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన మరాఠీ బీరయ్య (45) గొర్రెలను సాదుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన వృత్తిలో భాగంగా గొర్రెలను మేతకు తీసుకెళ్లి సాయంత్రం షెడ్లో వాటిని వదిలి సైకిల్‌పై చెన్నారావుపేటకు వెళ్తుండగా, ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దాంతో బీరయ్యకు తీవ్రగాయాలు కాగా, 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బీరయ్య మృతిచెందాడు. దుర్గంపేటలో ఒకరు..ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన సంఘటన హనుమకొండ జిల్లా దామెర మండలంలోని దుర్గంపేటలో ఆత్మకూరు పీఎస్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సంతోష్, స్థానికుల కథనం ప్రకారం కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన అరూరి అశోక్ (28) తన బంధువు దామెర మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజ్‌కుమార్ బైక్‌పై ఊరుగొండలో బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి హనుమకొండ వైపు వస్తుండగా సెల్‌ఫోన్ కిందపడిపోయింది. దాన్ని తీసుకోవడానికి బైక్‌ను వెనుకకు తిప్పుతున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న తక్కల్ల చరణ్ ఢీకొట్టాడు. దాంతో అరూరి అశోక్ అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న రాజ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. చరణ్‌కు కూడా తీవ్రగాయాలు కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. మృతుడి అన్న రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ వివరించారు. -
మానేరులో వ్యక్తి గల్లంతు
టేకుమట్ల: మానేరు వాగు దాటుతూ వ్యక్తి గల్లంతైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కలికోట శివారు మానేరులో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామానికి చెందిన అజ్మీరా రాజేందర్ (45) గురువారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్తూ మానేరు దాటుతున్న క్రమంలో లోయలో పడి గల్లంతయ్యాడు. అతడితో పాటు వాగు దాటుతున్న పంచిక తిరుపతి, రాజేందర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. నల్ల బెల్లం, పటిక పట్టివేతనర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలోని రామన్నగూడెం శివారు బొడ్కతండా సమీపంలో అక్రమంగా నిల్వగా ఉంచిన 16.5 క్వింటాళ్ల నల్ల బెల్లం, 50 కిలోల పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బాదావత్ చోక్లా, గుగులోతు రాజేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలోతు సురేష్ తెలిపారు. -
పలువురి బలవన్మరణం
ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురు, శుక్ర వారాల్లో వివిధ కారణాలతో పలువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ అబ్బనికుంట మైసమ్మ దేవాలయం సమీపంలో రైల్వే ట్రాక్‌పై గురువారం చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామానికి చెందిన దాసరి అజిత్‌కుమార్ (30) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య దాసరి నవ్యకు అజిత్ మృతదేహాన్ని అప్పగించినట్లు రాజు తెలిపారు. వివాహిత ఆత్మహత్య బచ్చన్నపేట: భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్ చర్ల గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త రమ్య (28) భర్త రాజు జీవనోపాధి కోసం ముంబాయికి వెళ్లి ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. వారికి ఇద్దరు కుమారులు. ఈ క్రమంలో ఇంట్లో గొడవ కారణంగా రమ్య తమ ఇంటిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న ఏసీపీ పండేరి చేతన్‌నితిన్, ఎస్సై అబ్దుల్ హమీద్.. ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉరేసుకొని కూలీ.. మడికొండ: ఉరి వేసుకొని కూలీ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దెల హరీష్ (32) కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొద్ది రోజులుగా తాగుడుకు బానిసయ్యాడు. దసరా పండుగకు అతడి భార్య తన తల్లిగారింటికి వెళ్లింది. శుక్రవారం ఉదయం తల్లి శారదను మందు తాగడానికి డబ్బులు అడగగా, ఆమె తన వద్ద లేవని చెప్పడంతో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో హరీష్ ఉరేసుకున్నాడు. తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్ వివరించారు. -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ఖిలా వరంగల్: ద్విచక్ర వాహనం అందరికీ నిత్యవసరంగా మారింది. వాహనం నడపడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆరోగ్యపరంగా నష్టపోక తప్పదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, ఇతర పనుల రీత్యా బైక్‌లు నడిపేవారు అధికంగా మెడ, కండరాలు, మణికట్టు, వెన్నెముక నొప్పులతో ఎక్కువగా బాధపడుతున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలతో సేఫ్.. బైక్ నడిపేటప్పుడు ప్రధానంగా గేర్లు, బ్రేకుల విషయంలో ఒక ప్రణాళిక ఉండాలి. చాలా మంది ఇష్టానుసారంగా బ్రేకులు, క్లచ్‌లు వేయడం చేస్తుంటారు. ఒక్కోసారి బ్రేకులు, గేర్లు పడకపోతే బలవంతంగా కాలిమడమలతో అదుముతారు. దీనివల్ల కాలిమడమలో ఉండే కండరాలు, చేతివేళ్లలో ఉండే కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కండరాల సమస్య వస్తుంది. అందుకే గేర్లు, క్లచ్, బ్రేకులు ఒక నిర్దిష్టంగా వేస్తే ఈసమస్య తలెత్తదు. కిక్‌తో జాగ్రత్త .. ● వాహనాన్ని కిక్‌తో స్టార్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నిర్లక్ష్యంగా. మొరటుగా కాలితో స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల మోకాళ్లపై ప్రభావం పడి నొప్పులు బారినపడతారు. అందుకే జాగ్రత్తగా కిక్ కొడితే ఎటువంటి సమస్య తలెత్తదు. వెనక్కి చూడడం తగ్గించాలి.. ● చాలా వాహనాలకు సైడ్ మిర్రర్లు ఉండవు. ఏ వాహనం వస్తుందో అని చాలా సార్లు పక్కకు, వెనక్కు చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కండరాలు తీవ్ర మైన ఒత్తిడికి గురవుతాయి. తద్వారా మెడ, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల బైక్‌కు సైడ్ మిర్రర్లు అమర్చుకోవడం మంచిది. అదేపనిగా యాక్సిలేటర్ ఇవ్వొద్దు.. ● ట్రాఫిక్‌లో వాహనం నిలిపినప్పుడు, జంక్షన్లో సిగ్నల్ పడిన వెంటనే వెళ్లిపోవాలని ఇంజన్ ఆపకుండా యాక్సిలేటర్‌ను పదేపదే ఇవ్వడం సరికాదు. ఇలా చేయడం వల్ల మణికట్టుపై ప్రభావం పడుతుంది. అదేపనిగా క్లచ్ నొక్కడం వల్ల బొటన వేలు, చూపుడు వేలు మధ్య భాగంలోని కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. మేలు చేసే వ్యాయామం ఇలా.. ● ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ చిన్నపాటి వ్యాయామాలు చేయడం ఉత్తమం. దీని వల్ల శరీర భాగాలను బలంగా మార్చుకోవచ్చు. ఉదయం పూట వాకింగ్, చిన్నపాటి కండరాల వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. నడుముకు సంబంధించిన వ్యాయామాలు కూడా చేయాలి. అంతేకాకుండా వీలైనంత వరకు 40 నుంచి 30 కిలో మీటర్ల స్పీడ్‌తో వాహనం నడపాలి. ప్రతి అరగంట నుంచి గంట మధ్యలో బైక్‌ను ఆపి ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. సామగ్రి వాహనం వెనుక కట్టుకుంటే మేలు. పక్కకు కట్టుకుంటే వాహనం నడిపేటప్పడు శరీరంపై భారం పడుతుంది.వరంగల్ నగరానికి చెందిన ఓ యువకుడు ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాడు. పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో వైద్యుడిని సంప్రదించాడు. ఇంకేముంది వెన్నెముక నొప్పికి ద్విచక్రవాహనమే కారణమని డాక్టర్ తేల్చిచెప్పారు. అవాక్కయిన ఆ యువకుడు వేల రూపాయలు ఖర్చుచేసి ఫిజియోథెరపీ ద్వారా చికిత్స పొందాడు. ఇలా ఆ వ్యక్తే కాదు.. నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది వాహనదారులు ఈ అవస్థలు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం బైక్ నడపడంలో నిర్లక్ష్యమేనని వైద్యులు చెబుతున్నారు. ద్విచక్రవాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వెన్నెముక, నడుము దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాహనం ఎప్పుడూ కండిషనల్లో ఉంచుకోవాలి. చాలా మంది యువకులు బైక్ హ్యాండిల్స్ మార్చేస్తుంటారు. దీనివల్ల వాహనం పడిపేటప్పుడు చేతులు, భుజాల మధ్య కోణం తగ్గిపోతుంది. దీని ప్రభావం వెన్నెముకపై పడుతుంది. వాహనం నడిపేటప్పుడు స్పీడ్‌బ్రేకర్ల వద్ద జాగ్రత్తగా వెళ్లాలి. లేకుంటే వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. 40 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ బ్రేక్ దాటిస్తే వెన్నెముక, నడుంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. గుంతల్లో జాగ్రత్తగా బండి దింపినా బ్యాక్‌పెయిన్ వచ్చే ప్రమాదం ఉంది. బైక్ పార్కింగ్ సమయంలో వివిధ కారణాలతో వాహనాన్ని వెనక్కి ముందుకు అధికంగా లాగకూడదు. దీనివల్ల వెన్ను నొప్పి వచ్చే ఆవకాశం ఉంది. రాత్రి పూట ఇంటి వద్ద బండి పార్కింగ్ చేసేటప్పుడు మెయిన్ స్టాండ్ వేసుకోవాలి. మిగతా సమయాల్లో చాలా వరకు సైడ్ స్టాండ్ వేస్తే వెన్నెముకపై భారం తగ్గుతుంది. బైక్ వేగం తగ్గిస్తేనే క్షేమంగా గమ్యం గేర్లు, క్లచ్, బ్రేకులు నిర్దిష్టంగా వేయాలి జాగ్రత్తలు పాటించకుంటే అనారోగ్య సమస్యలు -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
మామునూరు: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, హనుమకొండ జూనియర్ సివిల్ జడ్జి చంద్రప్రసన్న అన్నారు. గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వరంగల్ మామునూరులోని సెంట్రల్ జైల్ ప్రాంగణంలో ఇన్చార్జ్ జైల్ పర్యవేక్షణ అధికారి పరావస్తు వెంకటేశ్వర స్వామి, జైలర్ ఎం.పూర్ణచందర్ ఆధ్వర్యంలో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్జి హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాపోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. ఖైదీలు శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలతో బయటి సమాజంలో ఉపాధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో జైల్ అధికారులు సుధాకర్ రెడ్డి, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి చంద్రప్రసన్న సెంట్రల్ జైల్ ప్రాంగణంలో గాంధీజయంతి -
రైతులపై అడవి జంతువు దాడి
కాళేశ్వరం: జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం, బెగ్లూర్ గ్రామశివారు పంట పొలాల్లో పలువురు రైతులపై గుర్తుతెలియని అడవి జంతువు దాడి చేసింది. గురువారం ఉదయం పంటపొలాలకు వెళ్తున్న రైతులు గోల్కొండ రాజయ్య, సూరం స్వరూప, రత్న పోతిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డితోపాటు మరో ఏడుగురుపై నక్క, తోడేలును పోలిన బూడిద వర్ణంలో ఉన్న జంతువు దాడి చేసింది. క్షతగాత్రులు భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, వారం రోజులుగా ఆయా ప్రాంతాల్లో ఆ జంతువు మాటువేసి దాడి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై అటవీశాఖ రేంజర్ రవికుమార్‌ను ఫోన్లో సంప్రదించగా తమ సిబ్బంది ఎంత వెతికినా వర్షం కారణంగా ఆ జంతువు పాదముద్రలు లభించలేదని అన్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
వేగాన్ని తగ్గించి వాహనం నడపాలి
వేగాన్ని తగ్గించి వాహనం నడపడం అందరి క్షేమదాయకం. ప్రమాదం జరిగిన క్షణాలు అమూల్యమైనవి. క్షతగాత్రుడి తక్షణమే ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలను నిలిపే అవకాశం ఉంది. ఎప్పుడైన వాహనాలను కండీషన్లో ఉంచుకోవాలి. టైర్లలో గాలిని సరైన పరిమాణంలో నింపుకోవాలి. గుంతలు, స్పీడ్ బ్రేకర్లను గమనిస్తూ గంటలకు 40 కిలోమీటర్ల వేగానికి మించి స్పీడ్‌గా వెళ్లకపోవడం మంచిది. నడుం వెన్నునొప్పితో బాధపడేవారు బెల్ట్పెట్టుకోవాలి. – బందెలశెట్టి మోహన్‌రావు, ఎంజీఎం రిటైర్డ్ ఆర్ఎంఓ, వరంగల్ నిబంధనలు పాటించాలివాహనదారులు ఆర్టీఏ నిబంధనలు పాటించాలి. వేగాన్ని తగ్గించి ద్విచక్రవాహనాన్ని సక్రమంగా నడపాలి. నిర్లక్ష్యంగా నడిపితే శరీర భాగాలపై ప్రభావం పడుతుంది. రోడ్డు ప్రమాదాలకు గురికావడంతోపాటు వివిధ రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. వాహనం నడపడంలో యువత, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే గమ్యానికి క్షేమంగా చేరుకోవచ్చు. – జి.సురేశ్‌రెడ్డి, డీటీసీ, హనుమకొండ, వరంగల్● -
కనుమరుగవుతున్న నువ్వుల పంట!
దంతాలపల్లి: ప్రజలకు ఆరోగ్యకరమైన వంట నూనె అందించే నువ్వుల పంట సాగు కనుమరుగవుతోంది. దీంతో మార్కెట్లోకి కల్తీ వంట నూనెలు వస్తున్నాయి. ఆ నూనె వాడిన ప్రజలు రకరకాల జబ్బులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే నువ్వుల పంటను రైతులు సాగు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సాగుతో లాభాలు.. నువ్వుల పంటసాగుతో ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయి. రైతులు తాము పండించిన నువ్వులతో పాటు వేరుశనగలను కలిపి గానుగ పట్టించుకొని కల్తీలేని నూనెను ఆహారపదార్థాల్లో వాడేవారు. అలాగే నువ్వుల విక్రయం ద్వారా లాభాలు గడించేవారు. నువ్వులు విరివిగా పండిన సమయంలో సామాన్య ప్రజలకు కూడా కల్తీ లేని వంట నూనెలు చౌక ధరల్లో అందుబాటులో ఉండేవి. నువ్వుల నూనె వాడిన ప్రజలు పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉండేవారు. అధికారుల పర్యవేక్షణ కరువు.. నువ్వుల పంటసాగుపై వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణ కరువైంది. అన్ని పంటలకు సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు నువ్వుల పంటసాగుకు మాత్రం ఇవ్వడం లేదు. రైతులకు పంట ఉపయోగం, వచ్చే ఆదాయంపై అధికారులు కనీస అవగాహన కల్పించడం లేదు. దీంతో పంట సాగుపై రైతులు మక్కువ చూపడం లేదు. అధునాతన పద్ధతుల్లో వంగడాలను అభివృద్ధి చేసి సబ్సిడీలో విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు నువ్వుల సాగుపై దృష్టిసారించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, రైతులు పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికై నా నువ్వుల పంట సాగుపై అవగాహనతో పాటు రైతులను ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన వంట నూనెను అందించే నువ్వుల పంటసాగు విస్తీర్ణం పెరిగేలా ప్రభుత్వాలు, వ్యవసాయశాఖ అధికారులు చొరవ చూపాలి. ఇతర పంటల వంగడాలను అభివృద్ధి చేసిన విధంగా నువ్వుల వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచాలి. – గుర్రాల వీరారెడ్డి, రైతు, బొడ్లాడ ప్రజలకు దొరకని స్వచ్ఛమైన వంటనూనె పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించని వ్యవసాయ శాఖ అధికారులునువ్వుల పంట సాగులో ప్రధానంగా మూడు రకాల విత్తనాలు ఉంటాయి. వాటిలో నల్లనువ్వులు, తెల్లనువ్వులు, రాగినువ్వులను రైతులు పండించేవారు. కాగా 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. -
నిజ రూపంలో భ్రమరాంబిక
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలోని భ్రమరాంబిక ఉపాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. భ్రమరాంబిక అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి నవకలశ స్నపనం, సుగంధ పరిమళ ద్రవ్యములచే విశేష అభిషేకం, నవశక్త్యార్చన, ఆయుధపూజ (వాహనపూజ), కలశోద్వాసన త్రిశూల స్నానం, సామ్రాజ్య పట్టాభిషేకం, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారిని గాజులతో ప్రత్యేక అలంకరించారు. గురువారం విజయ దశమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సాయంత్రం జమ్మి చెట్టుకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్‌శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్‌జోషి, అర్చకులు నందనం భానుప్రసాద్, మధు శర్మ, శ్రీనివాస్, నరేశ్‌శర్మ, దేవేందర్, సీనియర్ అసిస్టెంట్ అద్దంకి కిరణ్‌కుమార్, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఐనవోలులో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు -
పురుగుమందుల స్ప్రేలో అవగాహన తప్పనిసరి
ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలిమహబూబాబాద్ రూరల్: ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు సకాలంలో దొరక్కపోవడం, కూలి రేట్లు అధికంగా ఉండడం వల్ల రైతులు ఎక్కువగా కలుపు నిర్మూలన మందులు వాడుతున్నారని మల్యాల కేవీకే శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ అన్నారు. ఈక్రమంలో కలుపు మందుల వాడకంపై అవగాహన లేకపోవడం వల్ల కలుపు నివారణ సరిగా జరగక పోగా, పంట దెబ్బతినడం, కొన్ని సందర్భాల్లో పక్కనున్న పంట పొలాల్లో నష్టం వాటిల్లడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కలుపు మందులు ఏ పైరుకు, ఏ సమయంలో, ఎంత మోతాదులో వినియోగించాలనే విషయాన్ని తెలుసుకున్న అనంతరమే వాడాలి. కొన్ని రకాల కలుపు మందులు నేలలో తగినంత తేమ ఉంటేనే పనిచేస్తాయి. సాగు నీటిలో కలుపు మందులు కలుపరాదు. ఏ పైరుకు ఏ కలుపు మందు సిఫార్సు చేస్తే దాన్ని మాత్రమే ఆ పైరులో వాడాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడరాదు. మోతాదు మించితే పైరు కూడా నష్టపోవచ్చు. మందు చల్లిన తరువాత కనీసం ఏడు లేదా ఎనిమిది గంటల లోపు వర్షం కురిస్తే మందు ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. కాల పరిమితి దాటిన మందులను వాడరాదు. కలుపు నాళినులు వాడేందుకు ప్రత్యేకంగా ఒక స్ప్రేయర్ వాడడం మంచిది. అది వీలు కానప్పుడు చల్లిన తరువాత ఎప్పటికప్పుడు స్ప్రేయర్‌ను సబ్బు నీటితో శుభ్రం చేయాలి. కలుపు నాళిని అవశేషాలు లేకుండా చేయాలి. సాధ్యమైనంత వరకు కలుపు మందులను హ్యాండ్ స్ప్రేయర్‌తోనే స్ప్రే చేయాలి. స్పష్టమైన సూచన లేనిదే కలుపు మందును పురుగు, తెగుళ్ల మందులతో కలపరాదు. గాలి వేగంగా వీచేటప్పుడు కలుపు మందులు చల్లితే పక్క పొల్లాలో పైరు నష్టపోయే అవకాశం ఉంటుంది. గాలి లేనప్పుడు మాత్రమే చల్లాలి. -
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి
పరకాల : పరకాలలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం నుంచి రాముడి రథాన్ని రాజకీయ నాయకులు, భక్తులు పోటీపడి లాగారు. అయితే కొద్ది దూరంలోని ఆలయ అర్చకుడు రాము ఇంటి ఎదుటకు రాగానే రథాన్ని లాగుతున్న కొందరు రాజకీయ నాయకులు సెల్ఫీలు దిగుతూ.. నానా హడావుడి చేశారు. అదే సమయంలో మూర్తి అనే వ్యక్తి రథాన్ని నెడుతూ వెనుక చక్రం కింద పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న పూజారి కుటుంబ సభ్యులు మహిళలు కేకలు వేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే హడావుడిలో అతనిపై నుంచి రథం దూసుకెళ్లేది. అప్పటికే అతడి కాలుపై నుంచి రథం వెనుక చక్రం వెళ్లింది. కొందరు భక్తులు చక్రం కింది నుంచి లాగడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రథం చుట్టూ బందోబస్తుతో తీసుకెళ్లారు. రోడ్డు పైనే క్షతగాత్రుడు.. రథం కింద పడి గాయపడిన మూర్తి రోడ్డుపై తల్లడిల్లుతున్న రాజకీయ నాయకులు, పోలీసులు పట్టించుకోలేదు.. కనీసం 108 వాహనానికి సమాచారం ఇవ్వకపోవడంతో స్థానికులు, పూజారి కుటుంబ సభ్యులు స్పందించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ద్విచక్ర వాహనంపై పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరకాలలో రథం కిందపడి ఒకరికి గాయాలు -
వయ్యారిభామతో జాగ్రత్త
● వయ్యారిభామను పూత పూయకముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కేయాలి. లేదా పూతరాకముందే పీకి తగులబెట్టాలి. ● తంగేడు చెట్లు ఉన్నచోట ఇది మొదలవదు. పూతరాక ముందే పది నుంచి 15 లీటర్ల నీటికి 6 కిలోల ఉప్పు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. అలా చేస్తే కలుపు మొక్కలు మొలవవు.బతుకమ్మలను తీసుకొస్తున్న మహిళలుములుగు జల్లా వాజేడు మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో దసరా రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గ్రామంలో రెండు వీధులు ఉన్నాయి. ఒకవీధిలో మాత్రం బతుకమ్మలను 13 రోజులు ఆడి దసరా నాడు సద్దులు జరుపుకున్నారు. అందులో భాగంగానే గురువారం రాత్రి సద్దుల బతుకమ్మ ఆడి శుక్రవారం ఉదయం బొగత వాగులో నిమజ్జనం చేశారు. అనంతరం దసరా వేడుకలు జరుపుకున్నారు. – వాజేడుబొగత వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న మహిళలుమహబూబాబాద్ రూరల్: వయ్యారిభామ కలుపు మొక్కతో రైతులకు నష్టం వాటిల్లుతుందని మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ అన్నారు. వయ్యారిభామ అనేది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క అని, అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతిత్వరగా, ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వయ్యారిభామతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుందని, అమెరికా నుంచి దిగుమతి అయిన ఆహార ధాన్యాలతో 1956లో మనదేశంలో చేరిందని తెలిపారు. ఆ తర్వాత మహారాష్ట్ర, బిహార్ నుంచి ఇతర రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాపించిందని పేర్కొన్నారు. పంటలు, జంతువులు, మనుషులపైన తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, గోధుమ, వరి పంట పొలాలు, మామిడి, కూరగాయల తోటల్లో ఎక్కువగా వయ్యారిభామ పెరుగుతుందన్నారు. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని పీల్చివేస్తుందని, 40 శాతం పంట దిగుబడిని తగ్గిస్తుందని సూచించారు నత్రజని, పోషక విలువలు, సూక్ష్మధాతువుల శాతాన్ని తగ్గిస్తుందని, వయ్యారి భామ పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి రేణువులతో టమాట, వంకాయ, మిరప మొక్కలపైపడి పిందెలు, పూలు రాలిపోతాయన్నారు. చాలా వైరస్ తెగుళ్లు వీటి వలన వ్యాపిస్తాయని, వీటి విత్తనాలు గాలి ద్వారా సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. వయ్యారిభామ వల్ల మనుషులకు ఎగ్జిమా, హైఫివర్, ఉబ్బసం, బ్రాంకై టీస్ వ్యాధులు వస్తాయని తెలిపారు. ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వస్తుందని, అలాగే జలుబు, కండ్లు, కనురెప్పలు వాపువస్తాయని, పశువులు, జంతువులకు వెంట్రుకలు ఊడిపోవడం, హైపర్ టెన్షన్ వస్తుందన్నారు. వయ్యారిభామను తిన్న పశువుల పాలుతాగితే వారికి జ్ఞాపకశక్తి తగ్గుతుందని, పశువుల జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, అన్నవాహిక, శ్వాసక్రియ దెబ్బతింటుందని తెలిపారు. వయ్యారిభామకు క్యారెట్ గడ్డి, ముక్క పుల్లాకు గడ్డి, నక్షత్ర గడ్డి పేర్లు కూడా ఉన్నాయి. ప్రమాదకరమైన కలుపు మొక్క పంటల్లో తగ్గనున్న దిగుబడి -
రైతువేదికకు రంగు పడింది!
కాజీపేట అర్బన్: కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని రైతు వేదికకు రంగు పడింది అంటూ రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. 2021లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక నిర్మించారు. క్లస్టర్పాయింట్ రైతులను సంఘటితం చేసేందుకు, సమావేశాలు, పంటల్లో మెళకువలను నేర్పించేందుకు రైతువేదికను కొద్ది రోజులు ఉపయోగించారు. ఫొటోలపై రంగు.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రభావితం కాకుండా రైతు వేదికలో ఏర్పాటు చేసిన నాటి సీఎం, ప్రజాప్రతినిధుల ఫొటోలపై అధికారులు తెల్లటి రంగు వేసి చేతులు దులుపుకున్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఫొటోలను మార్చలేదు. అధికారంలో ఎవరు ఉన్నారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. నిర్వహణకు నిధులు లేవు.. కడిపికొండ రైతు వేదికను 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ తరుణంలో నాటి ప్రభుత్వం ప్రతి నెల నిర్వహణ కింద ప్రతి నెల 9వేల రూపాయలను కేటాయించేందుకు నిర్ణయించింది. కాగా, ఒక ఆరు నెలల మాత్రమే రైతు వేదిక నిర్వహణకు నిధులు కేటాయించి తర్వాత నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ ఊసే ఎత్తకపోవడంతో రైతు వేదికలో ఎన్నికల సమయంలో వేసిన ప్రజాప్రతినిధుల ఫొటోలపై తెల్లటి రంగు అలాగే ఉంది. అదేవిధంగా రైతు వేదికలోని ఫర్నిచర్, ఫ్యాన్లు సైతం పాడైపోయాయి. పట్టించుకునే నాథుడే లేక రైతువేదిక నిర్వహణ అధ్వానంగా మారుతోంది. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని రైతు వేదిక నిర్వహణ చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. -
చినుకుపడితే చిత్తడి
● ఆర్అండ్బీ రోడ్డుపై గుంతల్లో నిలిచిన నీరు ● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు వెంకటాపురం(కె): చినుకుపడితే మండల కేంద్రంలోని ఆర్అండ్బీ రహదారి చిత్తడిగా మారుతోంది. గుంతల్లో వరదనీరు నిల్వ ఉండి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఉన్న ఈ రోడ్డు గుంతలుగా మారింది. వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారింది. కాగా, ఈ రోడ్డుపై వాహనదారులు వెళ్లేందుకు పాట్లు పడుతున్నారు. ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతూ రోడ్డు దాటి బస్టాండ్ వెళ్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆర్అండ్బీ రోడ్డుపై గుంతలు పూడ్చాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. -
పూల మొక్కలు చెట్లుగా మారి..
● డోర్నకల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఇబ్బందులు డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలపై చాలా కాలం క్రితం నాటిన పూల మొక్కలు చెట్లుగా మారి విస్తరించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్‌లోని ఒకటి, రెండో నంబర్ ప్లాట్‌ఫారాలపై పూల మొక్కలు చెట్లుగా మారాయి. ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై నాటిన మొక్కలు చెట్లుగా మారి సిమెంట్ బెంచీలను ఆక్రమించాయి. తాగునీటి నల్లాలను కమ్మేశాయి. పూలమొక్కలతో పాటు ఇతర పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగి దోమలు, దుర్వాసనతో పాటు పాముల భయంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
వైభవంగా విజయదశమి
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, జమ్మిచెట్లకు పూజలు చేసి తమను, తమ కుటుంబ సభ్యులను అనుగ్రహించాలని వేడుకున్నారు. శమీ మంత్రాన్ని జపించారు. జమ్మి ఆకులను తమవెంట తీసుకువెళ్లి ఇళ్లలో పెద్దలకు ఇచ్చి వారికి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలు, తండాల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవార్ల సన్నిధుల్లో భక్తులు విజయదశమి పూజలు నిర్వహించారు. శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన విజయ దశమి, శమీ పూజల్లో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డాక్టర్ భూక్య ఉమ దంపతులు, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి పాల్గొని గుమ్మడి కాయ, సోరకాయ నరికి అమ్మవారి దర్శనం ప్రారంభించారు. హన్మంతుని గడ్డలో వేడుకలు.. మహబూబాబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో హన్మంతునిగడ్డ దసరా ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపి ఆలిగనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ.. సమాజంలో చెడుపై మంచి విజయం సాధించినప్పుడే నిజమైన విజయదశమి పండుగ అని అన్నారు. ప్రజలు ప్రతీ పండుగను సుఖఃసంతోషాలతో జరుపుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. మానుకోట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని, జిల్లా పోలీసు యంత్రాంగం యువత చెడు మార్గంలో వెళ్లకుండా మాదకద్రవ్యాలను నివారించాలన్నారు. అనంతరం రావణ వధ కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో దాసరి ప్రసాద్ అధ్యక్షతన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమా, నాయకులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, రమేష్, ఖలీల్, రాజు, ప్రవీణ్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ఆరెంపుల విజయ, పోతురాజు రాజు, మార్నేని వెంకన్న, డీఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయాల్లో పూజలు, వేడుకలు వైభవంగా రావణ వధ కార్యక్రమం -
కలెక్టరేట్లో గాంధీ జయంతి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో గురువారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి మరియన్న, ఇన్చార్జ్ సీపీఓ అశోక్, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రూ.2,50,002 ధర పలికిన దుర్గామాత పట్టుచీరమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు అలంకరించిన పట్టుచీరను రూ.2,50,002 కు కాంగ్రెస్ నాయకుడు పద్మం ప్రవీణ్ కుమార్–ధనలక్ష్మి దంపతులు శుక్రవారం దక్కించుకున్నారు. దుర్గామాత భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చిన సందర్భంలో అలంకరించిన పట్టుచీరను వారు కై వసం చేసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవార్లకు అలంకరించిన చీరల్లో అధిక మొత్తంలో ధర పలకడం ఇదే ప్రథమమని ఉత్సవ కమిటీ బాధ్యులు తెలిపారు. రామప్ప శిల్పకళాసంపద అద్భుతం వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రైతులకు రెండు రూ.లక్షల రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి ఉన్నారు. -
వసతులకు బంక్ కొడుతున్నారు!
తొర్రూరు: జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలు అమలు కావడం లేదు. వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాలు మరిచి ధనార్జనే ధ్యేయంగా ఇంధన వ్యాపారం చేపడుతున్నారు. జిల్లా పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖల అధికారులు, రెవెన్యూ యంత్రాంగం వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాలపై నిఘా పెట్టడం లేదు. సిబ్బంది కొరత, పని భారాన్ని సాకుగా చూపుతూ వాటిని పట్టించుకోవడం లేదు. నామమాత్రంగా ధరల పట్టికలు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ఇంధన ధరలను రోజు వారీగా ప్రకటించి, అన్ని పెట్రోల్ బంకుల్లో ప్రదర్శించాలన్నది దాని సారాంశం. ఈ విధానం జిల్లాలో అమలు కావడం లేదు. ధరల పట్టికను ఎక్కడా ప్రదర్శించడం లేదు. ఏళ్లనాటి మీటర్లతో మాయ చేస్తూ వినియోగదారులను నట్టేటా ముంచుతున్నారు. కొన్ని బంకుల్లోని యంత్రాల్లోని మీటర్లను తప్పగా అమర్చి తక్కువ యూనిట్లు పెట్రోల్, డీజిల్‌ను పోస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. 50ఎంఎల్, 100 ఎంఎల్ తేడా వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. రూ. 100 పెట్రోల్ కొట్టిస్తే రూ. 99.45 వస్తుంది. ఈ విధంగా లక్షల్లో పక్కదారి పడుతోంది. సౌకర్యాలు సంగతి సరేసరి.. నిబంధనల ప్రకారం పెట్రోలు బంకుల్లో వినియోగదారులకు తాగునీరు, మరుగుదొడ్లు, టైర్లకు గాలి నింపుకునే యంత్రాలు, ఎండ, వానల నుంచి రక్షణ కోసం షెడ్లను ఆయా బంకుల యాజమాన్యాలే కల్పించాలి. అగ్ని ప్రమాదాలను నివారించేలా నీటి తొట్లు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదాల నివారణకు అవసరమైన నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తేవాలి. అలాగే ఇంధన కల్తీలను చెక్ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించాలి. ఈ మేరకు లిట్మస్ పేపర్‌ను అందుబాటులో ఉంచాలి. ఇంధన కల్తీ నివారణ, కొలతల్లో మోసాలను అరికట్టేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులు నెలవారీ తనిఖీలు చేపట్టాలి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లు, గాలినింపే యంత్రాల ఏర్పాటు కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నా అవి సరిగా పని చేయవు. కేవలం చిన్న చిన్న ఆరోపణలు వచ్చిన కొన్ని బంకుల్లో తనిఖీలు చేసి వదిలేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇంధన నమూనాలను సేకరించి వాటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలి. ఇది కూడా ఎక్కడా అమలు కావడం లేదు. పరిశీలనలో తేలిన నిజాలు.. ● స్టాకు బోర్డుల్ని సరిగ్గా నిర్వహించడం లేదు. ● అగ్ని ప్రమాద నివారణకు సరైన ఏర్పాట్లు లేవు. ● కల్తీ జరిగితే వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి డీలరు, డీఎస్ఓ, జేసీల పేర్లు, వివరాలు, మొబైల్ నంబర్లు, అధికారిక వెబ్సైట్లు, టోల్ ఫ్రీ నంబర్లను బహిరంగంగా ప్రదర్శించాలి. ఈ నిబంధనలు అత్యధిక పెట్రోల్ బంకుల్లో అమలు కావడం లేదు. ● వినియోగదారుడు ఇంధన కల్తీని, కొలతల్లో తేడాను తెలుసుకునేందుకు హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, 5లీటర్ల పెట్రోల్ డబ్బాను అందుబాటులో ఉంచాలి. ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం నిబంధనలకు విరుద్ధంగా బంకులు నిర్వహిస్తే వినియోగదారులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. కనీస సౌకర్యాలు కల్పించని యాజమాన్యాలపై చట్టపరంగా చర్యలు ఉంటాయి. కల్తీ పెట్రోల్, డీజిల్ విక్రయించవద్దు. జిల్లాలో పెట్రోల్ బంకుల నిర్వహణ సక్రమంగా ఉండేలా అన్ని చర్యలు చేపడుతాం. – వింజమూరి సుధాకర్, జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్ పెట్రోల్ బంకుల్లో తనిఖీలు కరువు నాణ్యత పరిశీలించేందుకు లిట్మస్ పేపర్ కరువు గాలి నింపే యంత్రాల విస్మరణ సిబ్బంది కొరత సాకుతో నిర్వాహకులపై కేసులు పెట్టని వైనం -
బ్రహ్మోత్సవాలకు వేళాయె..
రేపటి నుంచి మర్రిగూడెంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలుగార్ల: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గార్ల వేట వేంటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 5నుంచి 12వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈమేరకు దేవాలయం ఈఓ గూడూరు సంజీవరెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గార్లకు 3 కిలోమీటర్ల దూరంలోని మర్రిగూడెం గ్రామం వద్ద వెలిసిన వేట వేంకటేశ్వరస్వామికి ఏటా ఆశ్వయుజ మాసంలో వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా బ్రహోత్సవాలకు ఆలయం ముస్తాబు కాగా.. అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్తాబైన వెంకన్న ఆలయం వారం పాటు జరగనున్న వేడుకలు -
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అదీ నేటికి కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు. -
ఆయుధ పూజ
సాక్షి, మహబూబాబాద్: మహాభారతంలో పాండవులు జమ్మిచెట్టు మీదపెట్టిన ఆయుధాలను కిందికి దింపి యుద్ధానికి వెళ్లారని.. ఈమేరకు విజయం సాధించారని పురాణాలు చెబుతాయి. కాగా, దసరా(విజయ దశమి) రోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుందనే నమ్మకం నేటికీ ఉంది. కాగా మద్యం దరఖాస్తులు ప్రక్రియ మొదలైంది.. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. దీంతో పలువురు దసరా రోజు పూజలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పనులకు శ్రీకారం చుడుతున్నారు. మద్యం దరఖాస్తులకు శ్రీకారం మద్యం వ్యాపారులకు ఇది కీలకమైన సమయం. గత నెల 26 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.అయితే షాపుల కేటాయింపు ప్రక్రియ అంతా అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో దరఖాస్తుకు రూ. 2లక్షల రుసుము ఉండగా.. ఇప్పుడు రూ.3లక్షలకు పెంచారు. మద్యం వ్యాపారమే సర్వంగా భావించే వారు షాపులను దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు పెట్టి దరఖాస్తు చేసుకుంటారు. అదృష్టం బాగాలేకపోతే ఒక్క షాపు దక్కని వారు ఉంటారు. అదృష్టం ఉంటే ఒక్క దరఖాస్తు వేసిన వారికి షాపు దక్కిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే అదృష్టం కలిసి రావాలని దసరారోజు పూజలు చేసి డీడీలకు డబ్బులు చెల్లించడం.. డీడీలను పూజలో పెట్టి పూజించడం, జమ్మి పూజలో చీటీలపై మద్యం షాపులు దక్కాలని కోరుతూ.. కాల్చి వేయడం వంటి పనులకు వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. ఒకవైపు మద్యం టెండర్లు.. మరోవైపు స్థానిక ఎన్నికలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహుల సన్నద్ధం దసరా పూజతో మొదలు పెట్టనున్న పనులు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో.. పలువురు నాయకులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు పోటీకి సిద్ధమవుతున్నారు. దసరా రోజు శమీ పూజతో పనులు మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ కు అనుకూలమైన స్థానాలను ఎన్నుకున్నవారు.. గాడ్‌ఫాదర్స్, రాజకీయ పెద్దలను కలిసి.. టికెట్ ఇప్పించడం.. గెలిపించేందుకు కృషి చేయాలని ఆశీస్సులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లు పండుగకు సొంతూళ్లకు రావడంతో వారిని కలిసి ఓట్లు వేసేందుకు తప్పకుండా రావాలని కోరడం.. వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు తీసుకునే పనిలో ఉన్నారు. ఇలా ఒక వైపు మద్యం షాపులను దక్కించుకునేందుకు కొందరు.. పోటీలో నిలబడి గెలిచేందుకు రాజకీయ నాయకులు దసరా ముహూర్తం ఎన్నుకొని తమ పనులకు శ్రీకారం చుడుతున్నారు. -
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు. నిష్టగా ఉంటారు.. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది. – వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు -
చెడును పారదోలేందుకు కృషి
● జిల్లా సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ మహబూబాబాద్ రూరల్ : సమాజంలోని చెడును పారదోలేందుకు పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోందని ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, మానుకోట డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లా సాయుధ దళ కార్యాలయంలో బుధవారం ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలో ప్రతీ సంవత్సరం దసరా పండుగ ముందు ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం జరుగుతుందని, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తరఫున పోలీసు అధి కార్లు, సిబ్బంది ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రూరల్ సీఐ సరవయ్య, ఆర్ఐలు అ నిల్, సోములు, భాస్కర్, నాగేశ్వరరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ● ఎంపీ రఘువీర్‌రెడ్డి దంతాలపల్లి: పార్లమెంట్లో తెలంగాణ వాటా నిధుల కోసం పోరాడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. మండలంలోని దాట్ల గ్రామాన్ని బుధవారం సందర్శింంచి మొక్కలు నాటా రు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగా ణపై సవతిప్రేమ చూపుతుందని ఆరో పించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా వివక్ష చూపుతుందన్నారు. రాష్ట్రంలోని ఎంపీలందరూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాంసం విక్రయాలు చేయొద్దు
మహబూబాబాద్: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గురువారం ఎట్టి పరిస్థితుల్లో మాంసం, చికెన్, చేపల విక్రయాలు జరపవద్దని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేశ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మాంసం, చికెన్ విక్రయ షాపుల యజమానులకు బుధవారం ఆయన నోటీస్‌లు అందజేశారు. రాజేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీస్‌లు అందజేశామన్నారు. కర్రీ పాయింట్, రెస్టారెంట్లలో కూడా మాంసం వంటకాలు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జరిమానావిధించడంతో పాటు షాపు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని గ్రామాల్లో ప్రజలు బీజేపీకే మొగ్గుచూపుతున్నారని, మోదీ అందించిన ఎన్నో గొప్ప పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర నాయకులు యాప సీతయ్య, క్యాచ్యువల్ శ్యాంసుందర్ శర్మ, ధర్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు చీకటి మహేశ్, గడ్డం అశోక్ కుమార్, మదన్ నాయక్, జిల్లా నాయకులు చేలుపురి వెంకన్న, పొదిలా నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శీను, పద్మ, మోదిన్ నాయక్, సింగారపు సతీష్, పల్లె సందీప్ కుమార్, వెన్నమల్ల సందీప్ కుమార్, కృష్ణమోహన్, మండల అధ్యక్షులు కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, శుంభహాదుర్గార్చన జరిపారు. నవరాత్రి మహోత్సవాల చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి–నీలిమ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలకు గోవా రాష్ట్ర వై ద్య, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే, గోవా ఎమ్మెల్యేలు దేవ్యారాణే, ఐశ్వర్యరాణే, అరుంధతి రాణే ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం పుష్పరథసేవ నిర్వహించారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్‌కు చెందిన పర్యాటకుడు నికోలస్ సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ శిల్పకళ విశిష్టతను గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం నికోలస్ లక్ష్మీదేవిపేటలో దసరా క్రీడల్లో భాగంగా కబడ్డీ పోటీలను వీక్షించారు. అమరావతి విద్యాలయం మైదానంలో జరిగిన ఫైనల్ పోటీల్లో పట్వారిపల్లి, నర్సింగాపూర్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో లక్ష్మీపురం ప్రథమ బహుమతి, నర్సింగాపూర్ ద్వితీయ బహుమతి, బూర్గుపేట తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. కబడ్డీ పోటీలు అద్భుతంగా జరిగాయని, క్రీడాకారులు బాగా రాణించారని నికోలస్ ప్రశసించారు. నర్సింగాపూర్‌కు చెందిన తన మిత్రుడి ఇంటికి వచ్చిన సందర్భంలో నికోలస్‌తో పలువురు గ్రామస్తులు, క్రీడాకారులు ఫొటోలు దిగారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
నర్సంపేట రూరల్ : మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్య రమేశ్ (48) కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఏం పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుధవారం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి మృతి చెందాడు. ఈ ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి ఛాగల్లులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఛాగల్లుకు చెందిన కత్తెరశాల రమేశ్(44) స్టేషన్‌ఘన్‌పూర్ శివారు కొత్తపల్లి క్రాస్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి పని ముగించుకుని స్వగ్రామం వెళ్లాడు. ఛాగల్లులో కాలి నడకన జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపునకు వె ళ్తున్న కారు ఢీకొనడంతో రమేశ్‌కు తీవ్ర గా యాలయ్యాయి. స్థాని కులు గమనించి క్షతగాత్రుడిని చికిత్స నిమి త్తం వరంగల్ ఎంజీఎం తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య రాజశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. -
దసరాకు సర్వం సిద్ధం
మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా గురువారం విజయ దశమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈమేరకు అధి కారులు ఏర్పాట్లు చేశారు. పలు ఆలయాల్లో శమీ పూజ, జమ్మి ఆకు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని పాత బజారు హన్మంతునిగడ్డ శివాలయం స్థలంలో దసరా ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో భాగంగా రావణాసుర వధ కార్యక్రమం కోసం పూర్తి స్థాయిలో లైటింగ్, అంబులెన్స్, అగ్నిమాపక యంత్రం, తాగునీరు ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ సంబురాల్లో అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొనాలని, దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని విధాలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బస్టాండ్ ప్రాంతం నుంచి, ముంకుంద థియేటర్, బైపాస్ నుంచి ప్రజలు దసరా వేడుకలకు హాజరై శాంతియుతంగా సంబురాలు నిర్వహించుకో వాలని కోరారు. ప్రజలు దసరా మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, విలీన గ్రామాల్లో కూడా దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నేడు హన్మంతునిగడ్డలో రావణాసుర వధ -
కోట్లు దోచిన ముఠా..
అధిక లాభం ఆశ చూపి .. వరంగల్ క్రైం : పెట్టుబడికి అధిక మొత్తంలో లా భం ఇస్తామని ఆశ చూపిస్తూ ప్రజల నుంచి కోట్లా ది రూపాయలు దండుకున్న నలుగురు సభ్యుల గల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. బుధవారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించి వారి నుంచి రూ.5.92 లక్షల నగదు, 684.5 గ్రాముల బంగారు నాణెలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, 4 సెల్ఫోన్లు, లాప్టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, స్టాంప్స్‌తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులు వీరే.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన తెప్పాలి సైదులు, పొడిల సురేశ్ కుమార్, పొడిల శ్రీధర్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన మనుబోతుల రామకృష్ణ స్నేహితులు. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద 2023లో హెబ్సిబా పేరుతో అనధికారికంగా ఓ సంస్థను ఏర్పాటు చేసి చిట్టీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ చిట్టీలో చేరే వారు ముందు రూ. 6 వేలు చెల్లించాలి. ఇందులో 4 వేలు తన వద్దే డిపాజిట్ చేసుకుని మిగతా రూ. 2 వేలు సభ్యులకు ఈ సంస్థపై నమ్మకం కలిగేందుకు అంతే విలువైన వస్తువులను అందజేసేవాడు. కానీ వాస్తవంగా ఈ వస్తువుల విలువ కేవలం రూ. 3 వందలు మాత్రమే ఉంటుంది. ఈ సంస్థలో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైనా పొందొచ్చు. ఇందులో చేరిన ప్రతీ సభ్యుడికి నెలకు రూ. వెయ్యి చొప్పున 20 నెలలపాటు డబ్బును తిరిగి అందజేశాడు. ప్రధాన నిందితుడు మిగతా నిందితులతో కలిసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సుమారు 28, 493 సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతోపాటు వీరి నుంచి రూ. 4 వేల చొప్పున మొత్తం రూ.11.39 కోట్లు తన వద్దనే భద్రపరుచుకున్నాడు. సభ్యులకు కేవలం రూ. 3 వందల విలువైన వస్తువులను రూ. 2 వేలకు అమ్మడం ద్వారా మరో రూ. 4. 84 మిగిల్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ సంస్థపై ఫిర్యాదులు రావడంతోపాటు ముఠా సభ్యులు ప్రజల సొమ్ముతో పరారయ్యే ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మోసం వెలుగు చూసింది. ముఠా సభ్యులు వసూలు చేసిన డబ్బును 17 బ్యాంకుల్లో జమ చేయగా రూ. 5.48 కోట్లకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు సీపీ పేర్కొన్నారు. కాగా, ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, వర్ధన్నపేట, టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు నర్సయ్య, మధుసూదన్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ పవన్, పాలకుర్తి సీఐ జానకీరాం రెడ్డి, పాలకుర్తి, టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు వంశీ కృష్ణ, దిలీప్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు. ఈ ఘటనలో నలుగురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీపీ సన్‌ప్రీత్ సింగ్ -
ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
కాజీపేట: కాజీపేటలోని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఆన్లైన్లో పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ నమోదు కార్యక్రమాన్ని ఎస్బీఐ మేనేజర్ రఘునాథ్ ప్రారంభించారు. అక్టోబర్ 30వ తేదీ వరకు పెన్షనర్లు జీవించి ఉన్నట్లు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, లేనిపక్షంలో పింఛన్ ఆగిపోతుందన్నారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కె.సంగమయ్య, మారపాక కట్టస్వామి, సాధినేని సూర్య నారయణ, నవ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ వర్సిటీ కబడీ టోర్నమెంట్‌కు కేయూ జట్టు కేయూ క్యాంపస్ : కర్నాటక రాష్ట్రం బెల్గావిలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో అక్టోబర్ 4నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై. వెంకయ్య బుధవారం తెలిపారు. జి. నాగరాజు, ఆర్. సోమేశ్వర్, జి. రమేశ్, జి. గోపి, వి. కృష్ణకుమార్. పి. ప్రణయ్, బి. సుమన్, కె. బన్నీ, సి.హెచ్. శివాజీ, బి. రేవంత్, యు. శ్రావణ్, బి. ఆజాద్, బి. కౌశిక్, సి.హెచ్. రాము జట్టులో ఉన్నారు. కోచ్‌గా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కుమారస్వామి, మేనేజర్‌గా హనుమకొండ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు. -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్‌రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్‌రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మైసంపల్లిలో హోమం నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్) ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు -
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్‌చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
అధిక వడ్డీ ఆశచూపి మోసం..
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రైవేట్ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక డబ్బులు వస్తాయని ఓ వ్యక్తి నమ్మించగా పలువురు ఆ సంస్థలో పెట్టుబడిపెట్టారు. ఏడాది కావొస్తున్న నిర్వాహకుడు పెట్టుబడి డబ్బులు ఇవ్వకుండా కాలం వెల్లదీయడంతోపాటు చంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో పలువురు బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు భావనారుషి మౌనిక, అలేఖ్య, సుజాత కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బత్తుల రవికిరణ్ ‘అమ్మానాన్న ట్రస్ట్’ పేరిట కార్యాలయం ఏర్పాటు చేశాడు. సదరు వ్యక్తి తన సంస్థలో పెట్టుబడిపెడితే డబ్బులు అధికంగా వస్తాయని నమ్మించాడు. దీనిని నమ్మిన పలువురు మొత్తం సుమారు రూ.12 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే పెట్టుబడిపెట్టి ఏడాది కావొస్తున్నా డబ్బులు ఇవ్వమని అడిగితే సదరు సంస్థ నిర్వాహకుడు మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తూ మోసం చేస్తున్నాడు. బంగారం తాకట్టుపెట్టి మరి డబ్బులు తీసుకొచ్చి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టామని, తమ డబ్బులు ఇవాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబాబాద్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై టౌన్ సీఐ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా బాధిత మహిళలు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ‘అమ్మానాన్న ట్రస్ట్’ నిర్వాహకుడు బత్తుల రవికిరణ్‌ను వివరణ కోరగా తాను ఎవరిని మోసం చేయలేదని, మహిళల ఆరోపణలు అవాస్తవమన్నారు. -
ఆహారం.. ఆరోగ్యం
ఖిలా వరంగల్ : ఆధునిక జీవన శైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సహజ సిద్ధంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలను తగ్గించి పాశ్చాత్య ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. ఫలితంగా కడుపు నిండుతున్నా శరీరానికి మాత్రం నష్టం జరిగి యుక్త వయసులోనే వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటోంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం వెళ్లివిరుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత రోజుల్లో మానవుడు ఆరోగ్యంగా ఉండానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. సంప్రదాయ వంటలతోనే ఆరోగ్యం పదిలం పాశ్చాత్య అలవాట్లతో శరీరానికి నష్టం ఆకుకూరలు అన్నింటికీ ప్రయోజనం సేంద్రియ పంటలైతే మరీ మంచిదిరోజు వారీ తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా సహజ సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలతోపాటు పప్పుదినుసులు ఉండేలా తీసుకోవాలి. సజ్జలు, రాగులు, జొన్నలు, తోటకూర ఎక్కువ తీసుకోకపోవడం వల్ల గర్భిణులు, బాలింతలు అధిక శాతం మందులు వాడాల్సి వస్తుంది. గుడ్డు, పాలు రోజూ పరిమితంగా తీసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. –అచ్చ వరుణ్, జనరల్ సర్జన్, వరంగల్ -
పంటకు ప్రమాదకారి..
మహబూబాబాద్ రూరల్ : తెల్లదోమ మిర్చి పంటకు ప్రధాన శత్రువు. ఇది ఆకుల రసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా చిల్లి లీఫ్ కర్ల్ వైరస్ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పంటలో తెల్లదోమ నియంత్రణ చర్యలు, నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రతలపై మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానం ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్త ఎ.ప్రశాంత్ కుమార్.. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 30 నుంచి 40 రోజులు అత్యంత కీలకం.. మిర్చి పంటను నాటిన తర్వాత మొదటి 30 నుంచి 40 రోజులు అత్యంత కీలకం. ఈ సమయంలో తెల్లదోమల సంఖ్య పెరిగితే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే రైతులు పొలంలో నాటిన మొదటి రోజునుంచే పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టాలి. ప్రారంభ వృద్ధి దశ (10 నుంచి 30 రోజులు) : నీమాయిల్ 1500 పీపీఎం 5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో పిచికారీ చేయాలి. వర్టిసిలియం లెకానీ/ బ్యావేరియా బాసియానా 5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ట్రాప్ క్లోఫ్స్ పై తెల్లదోమలు చేరితే అక్కడే ప్రత్యేకంగా స్ప్రే చేయాలి. మధ్య వృద్ధి దశ (30 నుంచి 50 రోజులు) : పొలాన్ని ప్రతీ 3 నుంచి 4 రోజులకు పర్యవేక్షించాలి. తెల్లదోమల సంఖ్య పెరిగితే మారుస్తూ వాడాలి. ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.3 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. లేదా థియామెథాక్సామ్ 25 డబ్ల్యూజీ 0.25 గ్రాములను లీటర్ నీటితో స్ప్రే చేయాలి. ఒకే ఔషధాన్ని పునరావృతం చేయకుండా మారుస్తూ వాడాలి. నియంత్రణ కొనసాగించాలి (50 రోజులుపైగా) : తెల్ల దోమల నివారణకు ఎర పంటలపై దృష్టి పెట్టి నియంత్రణ కొనసాగించాలి. వర్షాభావం / పొడిగాలి సమయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి. రసాయనాలను అవసరమైతే మాత్రమే వాడాలి.పర్యావరణం, పొలం నిర్వహణ : ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, తేమ 60 నుంచి 80 శాతం ఉన్నప్పుడు తెల్లదోమలు ఎక్కువ పెరుగుతాయి. ఈ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి ప్రసరణకు అనుకూలంగా మొక్కల మధ్య దూరం పెట్టాలి. పొలంలో నీరు నిల్వ లేకుండా చూడాలి. నాటిన వెంటనే (0 నుంచి 10 రోజులు) ఎకరానికి 10 నుంచి 12 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తొలగించాలి. పత్తి, పొద్దు తిరుగుడు, ఆముదం మొక్కలను పొలం అంచుల్లో నాటాలి.తెల్లదోమ.. మిర్చి పంటకు ప్రధాన శత్రువు ఆకుల రసాన్ని పీల్చి మొక్కలను బలహీనం చేస్తుంది పంటలో నియంత్రణ చర్యలు చేపట్టాలి నాటిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి రైతులకు శాస్త్రవేత్త ఎ.ప్రశాంత్ కుమార్ సలహాలు -
వివాహిత ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ని శివునిపల్లిలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. శివునిపల్లికి చెందిన అర్చకుడు తొరివి మోహన్‌శర్మ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య అశ్విని(40), ఒక కుమారుడు ఉన్నారు. రోజూ మాదిరిగానే మంగళవారం గుడిలో పూజలు ముగించుకుని ఇంటికెళ్లగా అశ్విని బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. గమనించిన మోహన్‌శర్మ కేకలు వేస్తూ ఆమెను కిందికి దింపి చుట్టుపక్కల వారిని పిలువగా అప్పటికే మృతిచెంది ఉంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎస్సై వినయ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అశ్విని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి తరఫున నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మద్యంమత్తులో భార్యను హతమార్చిన భర్త● తిర్మలాపూర్‌లో విషాదం.. చిట్యాల: మద్యం మత్తులో భర్త తన భార్యను రోకలిబండతో హతమార్చాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిర్మలాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కనుకుంట్ల లింగయ్య, ప్రమీల(50) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మేర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో దంపతులకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మద్యం తాగిన లింగయ్య.. మరోసారి తాగడానికి డబ్బులు ఇవ్వాలని తన భార్య ప్రమీలతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె లేవని బదులివ్వడంతో కోపోద్రిక్తుడైన లింగ య్య.. ప్రమీల తలపై రోకలి బండతో బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ మల్లేశ్, ఎస్సై శ్రవణ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతురాలి చిన్న కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గొర్రెలను తప్పించబోయి లారీ బోల్తా
పరకాల : మండలంలోని కామారెడ్డిపల్లి వద్ద గొర్రెల మందను తప్పించబోయి కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి హెడ్ కానిస్టేబుల్ ద్విచక్రవాహనంతో పాటు గొర్రెల కాపరిని ఢీకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలపాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్ మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాందారిపేట నుంచి పరకాల వైపునకు కంకర లోడ్‌తో లారీ వేగంగా వస్తోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ గొర్రెల మందను తప్పించే క్రమంలో పరకాల పోలీస్‌స్టేషన్‌లో విధులు ముగించుకొని స్వగ్రామం పత్తిపాకకు బైక్‌పై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్‌ను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా గొర్రెల కాపరి పాలకుర్తి సాంబయ్యను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ విషయం తెలియగానే స్థానికులు 108కు సమాచారం అందజేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సాయంత్రం వరకు తమతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో పోలీసు అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా విషాదంలో మునిగారు. గొర్రెల కాపరి సాంబయ్య వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనపై పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు. అదుపు తప్పి బైక్‌ను ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి మరొకరికి తీవ్రగాయాలు -
చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
● గణపురంలో ఘటనగణపురం: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం గ్రామానికి చెందిన దొంత రమేశ్ (32) తన స్నేహితుడితో కలిసి గణపసముద్రం చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఊపిరాడక చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. ఈ ఘటనతో గణపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఘన్పూర్ అభివృద్ధికి రూ.50 కోట్లు
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అ భివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈఏడాది జనవరిలో స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీగా చేశామని, సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు తీసుకొచ్చానన్నారు. మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్‌హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, డ్రెయినేజీ లు, రోడ్డు వెడల్పు, తదితర పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. సదరు పనులన్నీంటినీ ఏడా ది లోపు పూర్తి చేస్తానని, వీటితో పాటు వంద పడక ల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర పనులు పూర్తయితే స్టేషన్‌ఘన్‌పూర్ రూపురేఖలు మారుతాయన్నారు. అలా గే, దేవాదుల మూడో దశ పనులకు రూ.1,001 కో ట్లు కోట్లు మంజూరు చేశారని తెలిపారు. బీసీల రిజ ర్వేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నా రు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదని, బీసీలపై ప్రేమ వల్లించే పార్టీలు బీసీ రిజర్వేషన్‌కు మద్దతు తెలపాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీశ్‌రెడ్డి, గ్రంథలయ సంస్థ జిల్లా చైర్మన్ మారుడోజు రాంబాబు, మార్కెట్ వైస్ చైర్మన్ ఐలయ్య, చిల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
గోదావరి వరదతో మునిగిన మిర్చి పంటలు
● 20 ఎకరాల్లో నష్టం.. ● లబోదిబోమంటున్న రైతులుఏటూరునాగారం: గోదావరి రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చుతోంది. మండలంలోని రామన్నగూడెం వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికకు చేరింది. దీంతో ఏటూరునాగారంలోని మానసపల్లి, ఓడవాడ శివారు ప్రాంతాల్లోని మిర్చి పంటలు వరదతో మునిగాయి. మొక్కలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. అంతేకాకుండా వరద రెండు రోజుల నుంచి నిలిచి ఉండడంతో మిర్చి నారు కుళ్లి మొక్క చనిపోయే ప్రమాదం ఉందని రైతులు లబో ది బోమంటున్నారు. కందకట్ల రమేశ్, గండెపల్లి ఈశ్వ దరయ్య, గంప శ్రీను, వంగరి రామయ్య, పడాల మల్లికార్జున్, సాయిరి అశోక్, ఐయినాల రాములు, నామని సాంబశివరావుకు చెందిన సుమారు 20 ఎకరాల్లో మిర్చితోట మొత్తం మునిగింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేస్తుంటే వరద నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పరిహారం ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. గోదావరి కాస్త తగ్గుముఖం కాళేశ్వరం: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కరఘాట్లను తాకుతూ ప్రవహించింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 10.37లక్షల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. కాగా, సోమవారం 13.290 మీటర్లకు వరద నీటిమట్టం చేరగా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద 11.37లక్షల క్యూసెక్కులు తరలిపోయాయి. కాగా, సాయంత్రం వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. -
రాజకీయ పార్టీలు సహకరించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మహబూబాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల విభాగం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని విధాలా సహకరించాలన్నారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, నామినేషన్ల ప్రక్రియ, స్క్రూట్ని, ఖర్చుల వివరాలు అన్ని క్లియర్‌గా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్, పార్టీల నాయకులు నీరుటి సురేశ్, మార్నేని వెంకన్న, శ్యాంసుందర్, బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మక్కలతో మార్కెట్ కళకళ
మహబూబాబాద్ రూరల్: మొక్కజొన్న కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు రైతులు అధిక మొత్తంలో మక్కలను విక్రయించేందుకు తీసుకువస్తున్నారు. పండుగ నేపథ్యంలో మార్కెట్‌కు సెలవులు ప్రకటించినప్పటికీ ముందస్తుగానే రైతులు మక్కలు తీసుకువచ్చి యార్డు ఆవరణలోని షెడ్లలో ఆరబోకుంటున్నారు. ప్రాంగణం మొ త్తం మక్కలతో కళకళలాడుతూ కనిపిస్తోంది. రైల్వే స్టేషన్‌కు ఎస్కలేటర్ పరికరాలు మహబూబాబాద్ రూరల్ : అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఎస్కలేటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈమేరకు దానికి సంబంధించిన పరికరాలు మంగళవారం స్టేషన్‌కు చేరుకున్నాయి. ఒకటి, రెండో నంబర్ ప్లాట్‌ఫారాలపై నిర్మిస్తున్న ఎస్కలేటర్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ప్రత్యేక వాహనంలో రైల్వే స్టేషన్‌కు సంబంధిత అధికారులు తీసుకువచ్చారు. పోడుభూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి గూడూరు : రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో పోడు రైతుల సమావేశం వీరస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులు ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారన్నారు. అలాంటి వారికి ఇప్పటి వరకు హక్కు పత్రాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతులు హక్కు పత్రాలు లేక రైతుబంధు, రైతు బీమా, ప్రభుత్వ రాయితీలు అందడం లేదన్నారు. ఇప్పటికై నా పాలకులు వెంటనే పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, లేనియెడల పోడు రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, నక్క సైదులు, పోడు భూములు సాదన సమితి కన్వీనర్ జనగం వీరస్వామి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సీపీఐనెహ్రూసెంటర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ ఆఽభ్యర్థులు బరిలో ఉంటారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వీరభవన్‌లో మంగళవారం పార్టీ మండల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదం చేశామని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి గెలిచేందుకు సీపీఐ కృషి చేస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, మూడు ఎంపీటీసీ, ఎనిమిది పంచాయతీల్లో బరిలో నిలిచేందుకు సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థు గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బి.అజయ్‌సారథిరెడ్డి, పాండురంగాచారి, సందీప్, నారాయణ, కుమార్, వెంకన్న, లింగ్యా, సతీష్, శ్రీను, శేఖర్, వినయ్, గురుస్వామి పాల్గొన్నారు. -
తండాల్లో బీసీ రిజర్వేషన్లు తొలగించాలి
కురవి: మాతండాలో మా రాజ్యం పేరిట తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని, మా తండాలో మేమే పాలించుకుంటున్నామని, ఇప్పుడు తండాల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టడం అన్యాయమని, వెంటనే తొలగించాలని సేవాలాల్‌సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్ననాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని బలపాల శివారు లింగ్యా తండా గ్రామంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ నందులాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997 నుంచి 2014 వరకు మా తండాలో మా రాజ్యం కోసం చేసిన పోరాటం వల్ల 500 జనాభా కలిగిన గూడేలు, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుట్రపూరితంగా తండాల్లో స్థానికంగా లేకుండా వేరే గ్రామాల్లో నివాసం ఉంటున్న బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం అన్యాయమని తెలిపారు. రిజర్వేషన్లు తొలగించి లంబాడీ బిడ్డలకు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలోత్ లలితా బాయి, మాలోత్ మంజ్యాజీనాయక్, గుగులోత్ రాంలాల్‌నాయక్, సాములు నాయక్, బిక్కు నాయక్, హరినాయక్, సుధాకర్, సుభాష్ నాయక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా దాండియా, జాగరణ
మహబూబాబాద్ రూరల్: జగన్మాత దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని మహేశ్వరీ భవన్లో మంగళవారం రాత్రి దాండియా నృత్యాలు, జాగరణ పూజా కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్–డాక్టర్ ఉమా దంపతులు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు, మాజీ ఎమ్మెల్యే మార్వాడీలతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మార్వాడీ సమాజ్, మార్వాడీ యువ మంచ్, సఖీ మండలి సభ్యులు పాల్గొన్నారు. -
కేసముద్రం పోలీస్ సర్కిల్ ఏర్పాటు
● ఇనుగుర్తిలో పోలీస్‌స్టేషన్, ఏటీసీ సెంటర్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీకేసముద్రం: జిల్లాలోని కేసముద్రం పట్టణంలో నూతన సర్కిల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేసముద్రం పోలీస్‌సర్కిల్ పరిధిలోకి మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న కేసముద్రం పోలీస్‌స్టేషన్‌తోపాటు, కొత్తగా ఏర్పాటు చేసిన ఇనుగుర్తి పోలీస్‌స్టేషన్, తొర్రూరు సర్కిల్ పరిధిలోని నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌ను చేరుస్తూ జీఓ జారీ చేశారు. కాగా నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండల కేంద్రానికి పోలీస్‌స్టేషన్, ఏటీసీ సెంటర్ మంజూరైంది. ఈమేరకు కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా పేలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ బలరాంనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రెండు మండలాల అధ్యక్షులు అల్లం నాగేశ్వర్రావు, కూరెల్లి సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి, గుగులోతు దస్రూనాయక్, రావుల మురళి, దయాకర్, వేముల శ్రీనివాస్‌రెడ్డి, చిదురాల వసంతరావు, వోలం రమేష్, ఎండి.అయూబ్‌ఖాన్, భూలోక్రెడ్డి, కొండ సురేష్, పోకల శ్రీను, చిన్నాల కట్టయ్య, రావుల మల్లేషం, అల్లం గణేష్ ఉన్నారు. -
బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి ఒత్తిడి తేవాలి
తొర్రూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసన సభ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించేలా రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలని కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ కోరారు. డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో మంగళవారం బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ...42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపి నెలరోజులు గడిచినా ఇంకా చట్టం కాలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా 52 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ బీసీలకు చేసిన న్యాయం ఏమీ లేదని, అగ్రవర్ణాలకు మాత్రం అడగకుండానే 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేన్ అమలు చేస్తున్నాడన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వ్యతిరేకత ప్రదర్శిస్తోందని, 1989లో వీపీసింగ్ ప్రభుత్వం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే బీజేపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. బహుజన కులాల ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ చందా మల్లయ్య, బీసీ మేధావుల ఫోరం కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్, నాయకులు కంచర్ల వెంకటాచారి, బాతుక బుచ్చిరామయ్య, అంజయ్యలు పాల్గొన్నారు. -
అయోమయం!
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఒకే ఒక్క ఓటు.. రిజర్వేషన్ మార్పు● ఒకటి రెండు కుటుంబాలున్న చోట రిజర్వేషన్ ● అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ ● సొంత కుటుంబాల నుంచే పోటీ ● ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఓటర్లుసాక్షి, మహబూబాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నగారా మోగించింది. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తాయని భావించిన వారికి చుక్కెదురు కాగా.. అసలు రాజకీయాలే తెలియని వారు పోటీలో దిగే పరిస్థితి నెలకొంది. కాగా రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే పనిలో ఉన్నాయి. అంతా తారు మారు.. జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో గంగారం, కొత్తగూడ, గార్ల, బయ్యారం, గూడూరు మండలాల్లోని పలు గ్రామాలు ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నాయి. ఇందులో 103 గ్రామ పంచాయతీలు ఎస్టీలకే కేటాయించారు. అదే విధంగా తండాలు గ్రామ పంచాయతీగా రూపాంతరం చెందిన నేపథ్యంలో 133 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఎస్జీ జనాభా ఉంది. కావునా ఇవి ఎస్టీలకే కేటాయిస్తారు. ఇక మిగిలిన 246 మైదాన ప్రాంతం గ్రామాల్లో జనరల్ రిజర్వేషన్ కేటాయింపులు జరిగాయి. అయితే ఇందులో కొన్ని గ్రామాల్లో రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్ తీయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో కొత్త పంచాయతీలు కాకుండా.. పాత పంచాయతీలుగా ఉన్న పలు తండాల్లో ఒకటి రెండు కుటుంబాలు ఉన్నవారు.. నాలుగైదు ఓట్లే ఉన్న బీసీలకు, కొన్ని గ్రామాల్లో ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వు అయ్యింది. అభ్యర్థుల వేటలో పార్టీలు.. గ్రామాల్లో బలం పెంచుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. రిజర్వేషన్ ద్వారా కేటాయించిన సీట్లను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. ఒకటి రెండు కుటుంబాలు ఉన్నచోట రిజర్వేషన్ రాగా వారు ఎక్కడ ఉంటున్నారు. వారిలో రాజకీయ పరిజ్ఞానం, క్యారెక్టర్ ఉన్నవారు ఎవరనేది చూస్తున్నారు. మంచి అభ్యర్థులు అయితే అన్ని పార్టీల వారు పోటీకి ఆహ్వానిస్తున్నారు. అదే విధంగా పోటీకి సిద్ధమై రిజర్వేషన్ అనుకూలించక భంగపడిన నాయకులు తమకు అనుకూలమైన వారిని బరిలో దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశా రు. తాను చెప్పినట్లు వినే నాయకుడిని బరిలో దింపి గెలిపిస్తే తన పెత్తనమే సాగుతుందనే ఆలోచనతో పెద్ద నాయకులను ఒప్పించి టికెట్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. టికెట్ ఇవ్వండి ప్లీజ్.. అనుకూల రిజర్వేషన్లు వచ్చిన పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీల స్థానాల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వండి అని గాడ్ ఫాదర్స్ వద్దకు తిరుగుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోని కొత్త, పాత నాయకులు తమ వర్గీయులకే టికెట్ ఇవ్వాలని నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. తమ అనుకూల నాయకులను వెంట తీసుకొని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్తున్నారు. కులం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులను వివరిస్తున్నారు. తమకు అనుకూలమైన వ్యక్తికి టికెట్ ఇస్తే ముందుగానే రూ.20లక్షలు ఖర్చుపెడుతామని ఒకరు అంటే.. కాదు రూ.40లక్షలు ఖర్చు పెడతామని మరొకరు పోటీపడుతున్నారు. -
‘డబుల్’ ఇళ్లలోకి వెళ్లేందుకు యత్నం
● అడ్డుకున్న పోలీసులు, అధికారులు తొర్రూరు: డబుల్ బెడ్రూం ఇళ్లు తమకు కేటాయిస్తారో లేదోనని ఆందోళనకు గురైన కొందరు ఆ ఇళ్లలోకి వెళ్లేందుకు యత్నించారు. డివిజన్ కేంద్రంలోని గోపాలగిరి రోడ్డులోని డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లేందుకు మంగళవారం స్థానికులు యత్నించగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొందరు స్థానికులు డబుల్ బెడ్రూం ఇళ్లలోకి ప్రవేశించగా.. మరికొందరు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని, అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయింపునకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో వారు ఇళ్లు ఖాళీ చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్, యాకూబ్ మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో 240 ఇళ్లు నిర్మించి పేదలకు కేటాయించకుండా వదిలేశారని తెలిపారు. నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకయ్య, నాయకులు డొనుక దర్గయ్య, శోభ, వరలక్ష్మి, షమీనా, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
కేబుళ్లు క్రమపద్ధతిలో ఏర్పాటు చేయాలి
హన్మకొండ: విద్యుత్ స్తంభాలకు కేబుళ్లును క్రమ పద్ధతిలో అమర్చాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 16 సర్కిళ్ల (జిల్లా) కేబుల్ అపరేటర్లు, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్ల పైనుంచి బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లు ఏర్పాటు చేయొద్దన్నారు. భూమి నుంచి 18–20 ఫీట్ల ఎత్తులో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్ క్రాస్సింగ్స్ లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపయోగంలో లేని కేబుల్ వైర్లను 3 నెలలలోపు తొలగించాలని ఆదేశించారు. ప్రతీ బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లను జీఐఎస్ మ్యాపింగ్ చేసుకుని వాటి కోఆర్డి నెట్స్ ఎన్పీడీసీఎల్కు అందజేయాలన్నారు. ఆరునెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, అశోక్, సి.జి.ఎం ఆర్. చరణ్ దాస్, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, జీఎంలు సురేందర్, డివిజనల్ ఇంజనీర్లు జి.సాంబరెడ్డి, ఎస్.మల్లికార్జున్, అనిల్ కుమార్, బీఎస్ఎన్ఎల్ డీజీఎం కిషన్, అజయ్, ఎయిర్ టెల్, జియో, యాక్ట్ ఫైబర్ నెట్, ఐ రీచ్ ప్రతినిధులు, స్థానిక కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
భద్రకాళి అమ్మవారికి భద్రపీఠసేవ, అశ్వవాహన సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని కాళరాత్రి క్రమంలో దుర్గార్చన జరిపి భద్రపీఠ సేవ నిర్వహించారు. సాయంత్రం అశ్వవాహనసేవ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్‌రెడ్డి, అంజేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, మూగ శ్రీనివాస్‌రావు పర్యవేక్షించారు. -
పండుగకు స్వగ్రామానికి వస్తూ మృత్యుఒడికి..
ఆలేరురూరల్/చిల్పూరు: దసరా పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కుమారుడితో కలిసి బైక్‌పై వస్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన సాదం కోమలి(42) తన భర్త రవి, కుమారుడు రాజుతో కలిసి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కోమలి, ఆమె భర్త రవి కలిసి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దసరా పండుగకు కోమలి, ఆమె కుమారుడు రాజు కలిసి సోమవారం బైక్‌పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులోని ఛత్రపతి శివాజీ దాబా వద్దకు రాగానే అదే మార్గంలో మరో బైక్‌పై వస్తున్న అందె భాస్కర్ వీరి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కోమలి ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుమారుడి ఎలాంటి గాయాలు కాలేదు. కోమలిని వెంటనే ఆమె కుమారుడు ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు సీఐ యాలాద్రి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కోమలి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం -
తోటకూర..
రక్తహీనతతో బాధపడేవారికి దీనిని మించిన పోషకాహారం లేదు. ఎందుకంటే రిటోప్లేవిన్, పోలేట్, విటమిన్–ఏ, కే, బీ,సీలతోపాటు కాల్షియం, పోటాషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. విత్తనాల నుంచి తీసిన నూనె గుండె వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగకరం. బీపీని నియంత్రిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రజలు ఎక్కువ తినేది ఇదే. పోషక విలువలు ఇందులో ఎక్కువ ఉంటాయి. శరీరానికి చలు వ. దగ్గు, ఆస్తమా, ఇతత్రా రుగ్మతలను నివారిస్తుంది. ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్–‘ఏ’ తోపాటు కీలకమైన ఆమైనో అమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పోటాషియం, సల్పర్, సిలికాన్, మాంగనీస్, సోడియం వంటివి సమపాళ్లలో లభిస్తాయి. కడుపులో మంట తగ్గిస్తుంది. దీని జ్యూస్ కాలేయ రుగ్మతలను తొలగిస్తుంది. అద్భుత ఔషధ ఆహారం. రోజు తింటే ఆరోగ్యానికి మంచిది. కాల్షియం, ఇనుము, పాస్పరస్తోపాటు ప్రొటీన్లు ఎక్కువే. ఆకలి పుట్టిస్తుంది. అంతేగాకుండా దగ్గు, వాంతులు, కీళ్ల వ్యాధులు, నులిపురుగులను నివారిస్తుంది. జీర్ణక్రియను పెంచుతోంది. ఆకలి పుట్టిస్తుంది. చల్లదనం ఇస్తుంది. కళ్లకు మంచిది. అందుకే దీనిని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ –ఏ, సీలు ఎక్కువ ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇతర కూరలతో కలిపి వండినా మంచి వాసన ఇస్తుంది. ఆవకాయ తర్వాత తెలుగు వారు గోంగూర పచ్చడికే ప్రాధాన్యం ఇస్తారు. పచ్చడి పెట్టినా.. పప్పు చేసినా.. మాంసంలో కలిపి వండినా ఇలా ఏ విధంగా చేసినా దీని రుచి అమోఘం. దీని పుంటి కూర అని కూడా పిలుస్తారు. ఐరన్ నిల్వలకు గోంగూర పెట్టింది పేరు. ఇతర విటమిన్లు ఎక్కువ. తెల్లది, ఎర్ర, పుల్ల గోంగూర పేర్లతో ఇది లభిస్తుంది. -
పూలతో ప్రకృతిని పూజించే గొప్ప పండుగ..
సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. అక్టోబర్ 2న దసరా పండుగ జిల్లా కేంద్రంలోని హనమంతుని గడ్డలో నిర్వహిస్తామని, కుటుంబ సభ్యులతో మహిళలు, చిన్నారులు తరలిరావాలన్నారు. బతుకమ్మ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగన్నారు. మహిళలు దుర్గాదేవి, పార్వతీ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ఎక్కువ శక్తిని ఇచ్చే దేవతలను మహిళలు ఆరాధిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. పేద, ధనిక తేడా లేకుండా మహిళలందరూ సుఖఃసంతోషాలతో సద్దుల బతుకమ్మను జరుపుకుంటారన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుందన్నారు. అనంతరం బతుకమ్మ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎడ్ల రమేష్, ఖలీల్, పోతురాజురాజు, బొల్లు రాజు, మంగళపల్లి కన్న, నిమ్మల శ్రీనివాస్, శ్యామ్, ప్రవీణ్, డీఎస్పీ తిరుపతిరావు, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కురవి పెద్ద చెరువు కట్టపైకి బతుకమ్మలతో వెళ్తున్న మహిళలు -
కీటకం.. కీలకం
హన్మకొండ: ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడికి పరాగ సంపర్కం కీలకం. పరాగ సంపర్కం జరగడానికి కీటకాలు అవసరం. ఇందులో ఎలాయిడోబియస్ కామెరూనికస్ కీటకాలు ఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్కం జరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆయిల్ పామ్ పుష్పాలను పరాగ సంపర్కం చేయడంలో కీటకాలు కీలకంగా పని చేస్తాయి. కాత కోసం రైతులు, అధికారులు పరగా సంపర్కానికి కీటకాలను తోటల్లో వదులుతున్నారు. ఇవి పూతను పిందెగా మార్చి దిగుబడిని పెంచుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. 2022 ఆగష్టులో ముందుగా హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలో సాగు చేశారు. అప్పుడు దాదాపు 5,500 ఎకరాల్లో సాగు చేశారు. మూడేళ్ల క్రితం సాగు చేసిన తోటలు కొన్ని దిగుబడి ఇస్తుండగా మరికొన్ని తోటలు కాతకు వచ్చాయి. కాతకు వచ్చిన తోటల్లో పరాగ సంపర్కం కోసం రైతులు, అధికారులు ఆఫ్రికన్ పురుగులను తోటల్లో వదులుతున్నాయి. ఆయిల్ పామ్ తోటల్లో పురుగుల యాజమాన్యం.. ఎలాయిబోడియస్ కామెరూనికస్ పురుగు క్యూర్క్యులియోనిడే కుటుంబానికి చెందింది. ఆఫ్రికా ప్రాంతానికి చెందిన కీటకం. ఆడ కీటకం పుష్పాల లోపల గుడ్లు పెడుతుంది. లార్వా పుష్పంలోని కణజాలంలో పెరిగి ఆహారం తీసుకుంటుంది. ప్యూపా దశలో పుష్పం లేదా ఇన్ఫ్లోరెన్స్ లోపల రూపాంతరం చెందుతుంది. ఈ కీటకం చిన్న పరిణామంలో దాదాపు 4 మిల్లీ మీటర్ల పొడవు ఉండి నల్లని గోధుమ రంగులో ఉంటుంది. వీటి ఆయుష్షు 1 నుంచి 2 నెలలు. ఒక్క సారి వదిలితే సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ తోటల్లోనే ఉంటుంది. ఇది ఆయిల్ పామ్ పరాగ సంపర్కంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పురుగులను పరాగ సంపర్కానికి ఉపయోగించడం ద్వారా దిగుబడిని పెంచొచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. మగ పుష్పాల నుంచి ఆడ పుష్పాలకు పుప్పొడి తరలిస్తూ సహజ పరాగ సంపర్కం చేస్తాయి. దీంతో ఆయిల్ పామ్‌లో ఫలసాధన శాతం పెరుగుతుంది. ఆయిల్‌పామ్ సాగు చేసిన 30 నెలలకు కాతకు వస్తుంది. అంతకు ముందు గెలలు వేసినా వాటిని తొలగించాలి. మొక్కలు నాటిన 26, 27 నెలలకు ఈ పరాగ సంపర్క కీటకాలను తోటల్లో వదిలిపెట్టాలి. 30 నెలలకు గెలలు వదిలిపెట్టాలి. గెల వేసిన 4 నుంచి 5 నెలలకు పక్వానికి వచ్చి కోతకు వస్తాయి. ఈ కీటకాలతో మానవ శ్రమ లేకుండా పుప్పొడి బదిలీ జరిగి సహజ పరాగ సంపర్కం జరుగుతుంది. ఫలగుచ్ఛంలో గింజల నింపుదల బాగా పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది. రసాయనాల అవసరం లేకుండా సహజంగా పనిచేస్తుంది. నిరంతర పుప్పొడి వ్యాప్తి జరుగుతుంది. పుష్పించే కాలమంతా వీటివల్ల ఫలసాధన కొనసాగుతుంది. ఆయిల్ పామ్ సాగులో ఎలాయిబోడియస్ కామెరూనికస్ ప్రవేశపెట్టిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఆ పంటలో దిగుబడులు గణనీయంగా పెరిగాయని ఉద్యాన అధికారులు తెలిపారు. ఈ కీటకాలు సహజంగానే నిరంతరం పని చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా పని చేయడం వల్ల ఖర్చు తగ్గి, నూనె ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా అధిక ఆదాయం వస్తుంది. ఎలాయిడోబియస్ కామెరూనికస్ కీటకం ఈ ప్రక్రియ జరగ డంలో పురుగుల పాత్ర ప్రధానంఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్క కీటకాల పాత్ర కీలకం. మానవ అవసరం లేకుండా పుప్పొడిని చేరవేస్తాయి. పూతను పిందె, కాయగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. రైతులు లాభసాటి అయిన ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి. శ్రీనివాస్ రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి, వరంగల్ -
మైసూర్ ఉత్సవాలను తలపించేలా దసరా వేడుకలు
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో ప్రభుత్వ యంత్రాంగం, ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2న నిర్వహించనున్న దసరా ఉత్సవాలను మైసూర్ ఉత్సవాలను తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు గౌడ్ అన్నారు. వరంగల్ కరీమాబాద్‌లోని ఆదర్శ పరపతి సంఘం భవనంలో ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో సంజయ్‌బాబు మాట్లాడుతూ పూర్వీకుల నుంచి రంగలీల మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు. ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు శివమూర్తి, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, రంజిత్‌గౌడ్, సందీప్, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, అఖిల్‌గౌడ్, పూజారి అజయ్, సంజీవ్, వాసు, అశోక్, బిట్ల క్రాంతి, మహేశ్, శ్రీను, గోవర్ధన్, చిరంజీవి, రంజిత్, వంశీ, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తేలిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విభజన జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు రెండు విడతలు, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు మండలాల విభజన చేసినట్లు తెలిసింది. ప్రధానంగా మొత్తం పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల నిర్వహన ఉద్యోగులు, సిబ్బంది లభ్యత, శాంతి భద్రతల పరిరక్షణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు అధి కారులు చెబుతున్నారు. కాగా, ఒక వైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోలాహలం.. మరోవైపు సర్పంచ్ ఎన్నికల సందడి.. ఇలా ఎవరి గోల వారిది అన్నట్లు ఉంటుంది. జిల్లా వివరాలు మండలాలు : 18జెడ్పీటీసీ స్థానాలు : 18ఎంపీపీ స్థానాలు : 18ఎంపీటీసీ స్థానాలు : 193పోలింగ్ స్టేషన్లు : 1,066 సర్పంచ్ స్థానాలు 482 వార్డులు 4,110సాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. నాలుగైదు రోజుల నుంచి రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చలు, రిజర్వేషన్ల ప్రకటనలకు ఫుల్స్టాప్ పెడుతూ అధికారులు ఎట్టకేలకు సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రిజర్వేషన్లు అనుకూలించని వారు నిరుత్సాహంతో ఉండగా అనుకూలించిన వారు పోటీకి సిద్ధం అవుతున్నారు. షెడ్యూల్ విడుదల జెడ్పీటీసీ, ఎంపీటీసీతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ సోమవారం వచ్చింది. మొదటి విడత అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్, ఓటరు జాబితా ప్రకటనతో మొదలై అక్టోబర్ 23న పోలింగ్ జరుగుతుంది. రెండో విడత అక్టోబర్ 13న నోటిఫికేషన్, ఓటరు జాబితాతో మొదలై అక్టోబర్ 27న పోలింగ్ జరుగుతుంది. రెండు విడతల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరిపి ఫలితాలు విడుదల చేస్తారు. అదే విధంగా సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 17న నోటిఫికేషన్, ఓటరు జాబితా ప్రకటనతో మొదలై అక్టోబర్ 31న పోలింగ్, అదే రోజు లెక్కింపు ఉంటుంది. రెండో విడత అక్టోబర్ 21న నోటిఫికేషన్‌తో మొదలై నవంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల విడదల చేస్తారు. మూడో విడత అక్టోబర్ 25న నోటిఫికేషన్‌తో మొదలై.. నవంబర్ 8వ తేదీన పోలింగ్ అదే రోజు లెక్కింపు ఉంటుంది. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 మండలాల్లో ఉన్న జెడ్పీటీసీలతోపాటు 193 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాలాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిసింది. అలాగే రెండో విడతలో డోర్నకల్, గంగారం, ఇనుగుర్తి, కేసముద్రం, కొత్తగూడ, కురవి, మరిపెడ, నెల్లికుదురు, సీరోలు మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జిల్లాలోని 482 గ్రామ పంచాయితీలకు సర్పంచ్‌లు, 4,110 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. కాగా మొదటి విడత అక్టోబర్ 31న బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని సమాచారం. నవంబర్ 4న డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగనున్నట్లు తెలిసింది. నవంబర్ 8న గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో సర్పంచ్, వార్డుల సభ్యుల ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికల రోజే ఫలితాలు నవంబర్ 11న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు -
ఆకుకూరలతో ఆరోగ్యం..!
ఖిలా వరంగల్ : ఆధునిక యుగంలో అందరిలోనూ అనారోగ్య సమస్యలు. చిన్న వయసులోనే పలు రోగాలు. అందుకు వైద్యులు చెప్పే సమాధానం ఆహారపు అలవాట్ల మార్చుకోవాలని. ఈ మాట మాంసాహార ప్రియులకు మింగుడు పడకపోయినా.. ఆరోగ్యం కోసం శాఖాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా వరంగల్ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చాలా మంది ఆహారపు అలవాట్లు మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజా ఆకుకూరలపై దృష్టిసారిస్తున్నారు. ఆకుకూరల్లో కేలరీలు తక్కువ ఉండడంతో బరువు నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లను ఆకుకూరల ద్వారా పొందొచ్చు. కొవ్వు తక్కువ ఉండడంతోపాటు ఆహారాన్ని రుచిగా చేయడం ఆకుకూరల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ప్రతీ రోజు ఆహారంలో ఆకుకూరను తప్పని సరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలతో ఎన్నో ప్రయోజనాలు.. ఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు ధరిచేరవని పలువురు వైద్యులు వెల్లడిస్తున్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే పిల్ల లకు చిన్నప్పటి నుంచే శాఖాహారం అలవాటు చేయాలని వైద్యులతోపాటు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకుకూరలో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శారీరక పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఖనిజ పోషకాలు, ఇనుము, కాల్షియం, కెరోటిన్, విటమిన్ ‘సీ’ పుష్కలంగా లభిస్తాయి. ఇనుములోపంతో బాధపడే గర్భిణులు, బాలింతలకు ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ‘ఏ’ ఉంటుంది. ఇది కంటి చూపును పరిరక్షిస్తుంది. ఐదేళ్లలోపు చిన్నారులు కంటిచూపు ఎక్కువ కోల్పోతున్న తరుణంలో ఆకుకూరలు మేలు చేసి అంధత్వం రాకుండా తోడ్పడతాయి. చిన్న వయసులోనే జబ్బులు.. నేటి పోటీ ప్రపంచంలో ఆరేళ్ల చిన్నారి నుంచి.. 60 ఏళ్ల వృద్ధుల వరకు పరుగులు పెడుతున్నారు. తద్వారా అతి చిన్న వయసు నుంచే వివిధ రోగాల బారిన పడుతున్నారు. దీనిని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న ప్రజలు మాంసాహారానికి బదులు ఆకుకూరలు, కూరగాయలపై ఆసక్తి చూపుతున్నారు. కాగా, కూరగాయలు తోడుంటే ఆరోగ్యం మీ వెంటే అంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరటి కూరలే ఆకుకూరలు.. ఆకు కూరల కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్ వెంట పరుగులు తీసి కొనుగోలు చేయాల్సిన అవసరమూ లేదు. శ్రద్ధ వహించి ఇంటి ఆవరణలో కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్నా ఎంచక్కా పెంచుకోవచ్చు. రక్తహీనత నివారణ, కండరాల పటిష్టతకు దివ్య ఔషధం కంటి చూపుకు మేలు ఆకుకూరలు తినాలంటున్న వైద్యులుఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు ధరిచేరవు. పిల్లలకు వ్యాధులు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే శాఖాహారం అలవాటు చేయాలి. నిత్యం మనం తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి రోగ నిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు, విటమిన్లు ఆకుకూరల్లో ఉంటాయి. ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. -
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట వర్కర్ల భిక్షాటన
మరిపెడ: డైలీవేజ్ వర్కర్లకు టైంస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరిపెడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు డైలీవేజ్, కాంటినెంట్, పార్ట్‌టైం వర్కర్లు మోకాళ్లపై నిల్చొని భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే పండుగపూట పస్తులు ఉండేలా చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి మా ఓట్లు దండుకున్నారన్నారు. ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారందరనీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ఇస్తున్న విధంగా టైం స్కేల్ ఇవ్వాలన్నారు. పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డైలీ వర్కర్స్ యూనియన్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గుగులోతు రవీందర్‌నాయక్, కార్యదర్శి తాజుద్దీన్, జితేందర్, ముత్తయ్య, లింగన్న, శోభ, మంగమ్మ, సురేష్, సోమన్న, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ వేడుకల్లో పాల్గొని..
● గుండెపోటుతో యువకుడి మృతి కురవి: బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సోమవారం రాత్రి మండలంలోని నేరడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొలిపాక నర్సయ్య, పద్మ దంపతుల చిన్న కుమారుడు సుమన్(28) సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. వేడుక ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి మంచంపై కూర్చున్నాడు. గుండె వద్ద నొప్పి రావడంతోనే హఠాత్తుగా మంచంపై నుంచి కిందపడ్డాడు. దీంతో వెంటనే కుటుంబీకులు మానుకోట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. -
గోదావరి ఉగ్రరూపం..
కాళేశ్వరం : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల్లోకి వరద నీరు చేరుతోంది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కరఘాట్లను తాకుతూ 13.240 మీటర్ల ఎత్తులో తరలిపోతుంది. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం తీరంపైగల చిరు దుకాణాల్లోకి వరదనీరు చేరడంతో అధికారులు ఖాళీచేయించారు. ఇప్పటికే నీటిమట్టం 12.210మీటర్ల ఎత్తు దాటగా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. చివరి ప్రమాదహెచ్చరిక 13.460 మీటర్లు దాటితే జారీ చేస్తారు. రాత్రి వరకు దాటే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలిసింది. దీంతో అధికార యంత్రాంగం దిగువ లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు వరద సమాచారం సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గోదావరి వరదనీరు కమ్మేయడంతో చండ్రుపల్లి, మద్దులపల్లి వాగులు ఉప్పొంగాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మేడిగడ్డకు.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 11.37 లక్షల క్యూసెక్కుల వరద తరలివస్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తినీటిని దిగువకు తరలిస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ఇంత వరద రావడం ఇదే మొదటిసారని ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు. నీటమునిగిన పంటలు.. మహదేవపూర్ మండలం అన్నారం, చండ్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి, పలుగుల, బల్జాపూర్, పూస్కుపల్లి, కాళేశ్వరం, మహదేవపూర్, బొమ్మాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఈ సీజన్లో నాలుగో సారి పంటలు మునిగి నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పలిమెలలో.. పలిమెల: గోదావరి వరద ప్రవాహానికి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలు, చేలు నీట మునిగాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేస్తే గోదావరి వరదతో తీరని నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాళేశ్వరం వద్ద 13.240 మీటర్ల ఎత్తున నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు వందలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునక ఆందోళనలో రైతులు -
‘గెస్ట్’ పోలీస్ స్టేషన్!
గీసుకొండ: గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు ‘గెస్ట్’ పోలీస్ స్టేషన్ అనే పేరుంది (నిక్‌నేమ్). పోలీసు అధికారులు ఈ స్టేషన్‌కు అలా గెస్ట్‌లా వచ్చి కొన్ని రోజులు పని చేసి బదిలీపై వెళ్లిపోతుంటారు. సీఐలు అయితే మహా అంటే ఏడాది లోపు.. ఎస్సైల విషయం చెప్పాల్సిన పనే లేదు. బదిలీపై వచ్చిన ఎస్సైలు ఇక్కడ ఎన్ని నెలలు ఉంటారో లేదో తెలియదు. కొందరైతే పోస్టింగ్‌పై వచ్చి రెండు, మూడు నెలల లోపే బదిలీ అవుతున్నారు. గతంలో అయితే బదిలీపై వచ్చిన పోలీసు అధికారులు కనీసం ఏడాది, రెండేళ్ల వరకు విధులు నిర్వర్తించేవారు. దీంతో వారికి స్థానిక పరిస్థితులపై, ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అవగాహన కోసం అవసరమైన సమయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. వచ్చిన అధికారికి మండలంలోని గ్రామాల పేర్లు, రూట్లు, స్థానిక స్థితిగతులు తెలుసుకునే లోపే బదిలీ అవుతుండడం విశేషం. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకత ఉంది. ఈ పోలీస్ సేషన్ పరిధిలోని గీసుకొండ రూరల్ మండలంలోని గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్ నగరంలోని 15,16,17 డివిజన్లు ఉన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉండే మండలంలో ప్రశాంతంగా ఉన్నట్లే కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయని ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన పలువురు పోలీసు అధికారులే చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో డ్యూటీలో చేరిన నెలలోపే బదిలీ చేస్తుండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గీసుకొండ సీఐ మహేందర్‌ను ఇక్కడి నుంచి పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ఇక్కడికి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆయన స్థానంలో పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న డి. విశ్వేశ్వర్‌ను గీసుకొండకు బదిలీ చేశారు. విశ్వేశ్వర్ ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్సైగా 2012 జూలై నుంచి 2013 ఆగస్టు వరకు పని చేశారు. అప్పట్లో ఆయన పనితీరును చూసి మండల వాసులు గబ్బర్‌సింగ్ అని పిలిచేవారు. అలా వస్తారు.. ఇలా వెళ్తారు.. ప్రహసనంలా సీఐ, ఎస్సైల బదిలీలు -
బతుకమ్మ అంటేనే పూల పండుగ
ఖిలా వరంగల్: బతుకమ్మ అంటేనే పూల పండుగ అని, బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం మనందరిపై ఉందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చారిత్రక మధ్యకోట ఖుషిమహాల్ మైదానంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ కేవలం పూల పండుగ కాదని, ఇది ఆడబిడ్డల ఆశయాల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ, భూదేవికి సమర్పించే నైవేద్యమని చెప్పారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. నగర ప్రజల కోసం 29,30 తేదీల్లో సద్దుల బతుకమ్మ ఆట స్థలాల్లో ఏర్పాట్లు చేశామని, 16 ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, ముస్కమల్ల అరుణ, పోశాల పద్మ, పల్లం పద్మ, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఖుష్‌మహల్ మైదానంలో అంబరాన్నంటిన సంబురాలు -
పద్మశాలీలు ఉన్నత శిఖరాలకు చేరాలి
హన్మకొండ: పద్మశాలి కులస్తులు ఉన్నత శిఖరాలకు చేరాలని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి అన్నారు. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో హనుమకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు ఆదివారం ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కందకట్ల స్వామి ము ఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదలతో ముందుకు పోతే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. గ్రూప్స్, సివిల్స్‌లో పద్మశాలీలు ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారన్నా రు. రాజకీయాల్లోనూ రాణించాలని సూచించారు. పోపా రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదివితే సాధించలేనిదంటూ ఉండదన్నా రు. నిరుపేద విద్యార్థులకు చేయూతనివ్వాలని కోరారు. పోపా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండు కామేశ్వర్ మాట్లాడు తూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే తమ సంఘం లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందించి సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి రమేశ్, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, పాము శ్రీనివాస్, గోషికొండ సుధాకర్, బైరి శ్యాంసుందర్, మాటేటి అశోక్, సంతోష్, ధర్మపురి రాజగోవింద్, దిడ్డి అనిల్, బత్తుల సత్యం, వంగరి వేణు, గుండేటి సతీశ్, కందకట్ల రాకేశ్, వడ్నాల సత్యనారాయణ, గుండు రవి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, వైద్యం రాజగోపాల్, డాక్టర్ కూరపాటి రాధిక, డాక్టర్ అంబటి అజయ్, మోతె రాజకుమార్, శ్రీరాముల శ్రీనివాస్, డాక్టర్ చింతకింది శ్రీనివాస్, విటోభా పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి -
సారథి.. వాహనదారులకు వారధి
ఖిలా వరంగల్ : రవాణా శాఖలో సంస్కరణల శకం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ వెబ్‌సైట్‌లోని డేటాబేస్‌తో రవాణాశాఖ అనుసంధానమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో తీసుకొచ్చిన సారథి పోర్టల్ విధానాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందిస్తోంది. వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో సారథి పోర్టల్ అమలుకు ఆగస్ట్ 18 తేదీన శ్రీకారం చుట్టారు. పోర్టల్‌లో తలెత్తుతున్న స్వల్ప సాంకేతిక ఇబ్బందులను దశల వారీగా సవరణ చేశారు. ప్రస్తుతం పోర్టల్‌లో నమోదు ప్రక్రియ విజయవంతమవుతోంది. ఇప్పటి వరకు సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ ఇన్ ట్రాన్స్‌ఫోర్ట్ డిపార్ట్మెంట్(సీఎఫ్ఎస్టీ) పోర్టల్ పనిచేయగా ఇకపై దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తున్న పరివాహన్ ద్వారా సేవలు అందనున్నాయి. ఆయా ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు పారదర్శకంగా అందుతున్నాయి. విదేశాల నుంచైనా అవకాశం.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సారథి పోర్టల్ ద్వారా దేశ, విదేశాల నుంచైనా ఆన్లైన్లోనే ఇంటి నుంచి లైసెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. రోడ్డు భధ్రతపై పరిజ్ఞానం ఉంటే సులభంగా పరీక్ష ఉత్తీర్ణత కావొచ్చూ. కాగా, సారథి పోర్టల్‌తో ఇంటి నుంచే లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందడం, రెన్యువల్, చిరునామా మార్పు వంటి అంశాలకు వీలు కల్పించనున్నారు. ప్రస్తుతం పోర్టల్ ద్వారా లెసెన్స్ తీసుకునే అవకాశం మాత్రమే కల్పించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకొని విదేశాలకు వెళ్లిన వారి వివరాలు ఆన్లైన్లో కనిపించక అక్కడి అధికారులు వాటిని తిరస్కరించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చని ఎంవీఐలు భావిస్తున్నారు. కొత్త విధానంలో సాంకేతిక సమస్యల కారణంగా స్లాట్ బుకింగ్, వా హనదారులు ఆర్టీఏ కార్యాలయం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం అవుతోంది. కొన్నాళ్లకు త్వరిగతిన సేవలు అందుతాయని అధికారులు అంటున్నారు. వాహనదారులు rarathiparivahan.gov.in / rarathirervicerలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో ఒకే విధానం.. పరివాహన్ సారథి పోర్టల్ ద్వారా పొందిన లైసెన్స్ ఇండియాలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. రెన్యువల్ టైంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంది. ఈకార్డు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెల్లుబాటు అవుతుంది. ఇంతకాలం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పరిధిలోనే లైసెన్స్ ఉండేది. వివరాలు మరో రాష్ట్రంలో కనిపించేవి కాదు. అంతా గోప్యంగా ఉండేది. కానీ ప్రస్తుతం నూతనంగా వచ్చిన పరివాహన్ సారథి పోర్టల్ ద్వారా క్షణాల్లో వాహనదారుడి వివరాలు చేతికి వస్తాయి.ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉమ్మడి జిల్లాలో అందుబాటులోకి పోర్టల్ దేశవ్యాప్తంగా ఒకే పోర్టల్.. ఒకే లైసెన్స్ విధానం అమలు రోడ్డు భద్రతపై అవగాహన ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ త్వరలోనే ఆర్టీఏలో దళారుల వ్యవస్థ కనుమరుగుఉమ్మడి వరంగల్ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇంతకాలం ఆర్టీఏలో డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు లర్నింగ్ లైసెన్స్ కావాలన్నా ఎంతో కొంత ముట్టచెప్పాల్సి వచ్చేది. సారథి పోర్టల్ అందుబాటులోకి రావడంతో నిదానంగా ఈ అవినీతి తగ్గుముఖం పడుతోంది. ఆర్టీఏ సేవలు ఇక సులభంగా పొందే అవకాశం ఉన్నా.. చదువుకున్న వ్యక్తికే డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా వాహనదారులు రవాణా సేవలు పొందే వెసులు బాటు వచ్చింది. ఆన్లైన్లో పరిజ్ఞానం ఉంటే లర్నింగ్ లైసెన్స్ పరీక్ష సులభతరంగా ఉంటుందని రవాణాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం లైసెన్స్‌లకు ధ్రువీకరణ పత్రాల హార్డ్ కాపీ జత చేయాల్సి వస్తోంది. కొత్త విధానంలో సాఫ్ట్ కాపీతో సరిపోతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆగస్ట్ 18 నుంచి పరివాహన్ సారథి ద్వారా సేవలు అందిస్తున్నారు. రోజుకు 430 మందికి ఆన్లైన్లో వివిధ లైసెన్స్‌లకు స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. -
సంపూర్ణ ఆరోగ్యం
పోషకాహారం..● అంగన్వాడీల ఆధ్వర్యంలో పోషణ మాసం ● గర్భిణులు, చిన్నారుల పౌష్టికాహారంపై అవగాహనగూడూరు: మాతా, శిశు మరణాలను తగ్గించడంతోపాటు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వం పోషణ మాసం కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తూ.. పోషణ స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో గర్భి ణులు, బాలింతలతో సమావేశాలు ఏర్పాటు చేసి పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. స్వయంగా అంగన్వాడీలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని ఈ మాసంలో వారికి అందిస్తారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులు.. అంగన్వాడీలు జిల్లాలో డోర్నకల్, గూడూరు, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు మండల కేంద్రాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొత్తం 1,437 అంగన్వాడీ కేంద్రాలు, 4355 మంది గర్భిణులు, 2,895 మంది బాలింతలు, 0 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 38,029 మంది ఉన్నారు. పౌష్టికాహారం పంపిణీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు మూడేళ్లలోపు పిల్లలకు పాలు, గుడ్లు, బాలాంమృతంతో పాటు పలు రకాల పౌష్టికాహా రాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా పిల్లల ఎత్తు, బరువు తీసుకొని వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యతోపాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజు ఒక్కొక్కరికి 200 మిల్లీలీటర్ల పాలు, నెలకు 30 గుడ్లు ఇస్తూ మాతా, శిశు ఆరోగ్యాలను కాపాడుతున్నారు. పోషణ మాసం కార్యక్రమాలు.. ● స్థానిక ఉత్పత్తులు, బొమ్మలు, పౌష్టికాహారం పదార్థాల వినియోగంపై అవగాహన ● గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల పోషణపై సలహాలు, సూచనలు ఇస్తారు. అనుంబంధ ఆహార పదార్థాల తయారీ, పోటీలు ● కిషోర బాలికల వైద్య పరీక్షలతోపాటు పిల్లల బరువు, ఎత్తు కొలతలు తీయడం, ఆహారంలో చక్కెర, నూనె వినియోగం తగ్గించడంపై అవగాహన ● చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులకు అనుబంధ ఆహారంపై పోటీలు, తల్లిదండ్రులతో పోషకాహారంపై ప్రతిజ్ఞ. అంగన్వాడీ కేంద్రాల్లో కథలు చెప్పడం, బొమ్మల ప్రదర్శన, వాటి ద్వారా ఈసీసీఈ సెషన్, 0–3 ఏళ్లలోపు పిల్లల ఆరంభ అభివృద్ధి, ప్రేరణ కోసం దృష్టి సారించాల్సిన కార్యక్రమాలు తల్లిదండ్రులతో చేయించడం ● పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, ఆకలి పరీక్షలు, గ్రోత్ మానిటరింగ్ ● బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాపడం, పిల్లల అనుబంధ ఆహారంపై అవగాహన ● ఆరోగ్యకరమైన అహార అలవాట్లు, జీవనశైలిపై అవగాహన ● స్థానిక వంటకాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, స్వదేశీ బొమ్మల తయారీ ● పోషణ మిషన్ వంద రోజుల ప్రచారం, గ్రామ వార్డు సభలు, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ, గృహ సందర్శన, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రత, పలు అంశాలపై అవగాహన కల్పించడం పోషణ స్థాయిని పెంపొందిస్తాం.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల పోషణ స్థాయిని పెంపొందించడమే లక్ష్యం. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తాం. మాతా, శిశు మరణాల తగ్గింపునకు కృషి చేయిస్తాం. పోషక విలువలు కల్గిన అహారాన్ని తీసుకునేలా సూచిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో అన్నప్రాసన, సీమంతాలు, జన్మదిన వేడుకలను కూడా నిర్వహిస్తున్నాం. – సబిత, జిల్లా సంక్షేమ అధికారి -
బాధితులకు భరోసా కల్పించాలి
వరంగల్ క్రైం: పదోన్నతులతో బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఎం.సాంబరెడ్డి, పి.జైపాల్, పి.లక్ష్మారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఎం.సాంబయ్య, కె.వెంకన్న, డి.సమ్మిరెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, పి.శ్రీనివాస్ రాజు, ఎస్.సదయ్య ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా, నమ్మకాన్ని కలిగించాలని, నిరుపేద ప్రజలకు పోలీసు అధికారులు అండగా నిలవాలని పదోన్నతి పొందిన ఎస్సైలకు సూచించారు. -
875 చెరువుల మత్తడి!
● ఇటీవల కురుస్తున్న వర్షాలతో నిండిన చెరువులు ● అధికార యంత్రాంగం అప్రమత్తం ● ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటల వద్ద బందోబస్తు మహబూబాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 875 చెరువులు మత్తడి పోస్తున్నాయి. జిల్లాలో 1,590 చెరువులు ఉండగా.. ఆగస్టులో కొన్ని చెరువులు నిండి మత్తడిపోశాయి. కాగా ఇటీవల కు రుస్తున్న వర్షాలతో మరిన్ని చెరువులు మత్తడి పోస్తు ండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీని లో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువులను పరిశీలించి నివేదిక అందజేశారు. అలాగే జిల్లాలో ప్రధానంగా ఉన్న పాకాల, మున్నేరు, ఆకేరు వాగులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో 1590 చెరువులు.. జిల్లాలోని 18 మండలాల్లో 1,590 చెరువులు ఉన్నాయి. వాటిలో 25 నుంచి 50 శాతం నిండిన చెరువులు 12 ఉన్నాయి. అలాగే 50నుంచి 75 శాతం నిండిన 30 చెరువులు ఉన్నాయి. 75నుంచి 100 శాతం నిండినవి 667 ఉండగా మత్తడి పోస్తున్నవి 875 చెరువులు ఉన్నాయని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారుల సూచనల ప్రకారం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఈనెల 26న జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. యంత్రాంగం అప్రమత్తం.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలతో పాటు ఆకేరు, పాకాల, మున్నేరు వాగులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటి వద్దకు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖ అధికారుల కలెక్టర్ అప్రమత్తం చేశారు. దీంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. చేపల వేటకు మత్స్యకార్మికులు వెళ్లకుండా వారికి సమాచారం ఇచ్చారు. దెబ్బతిన్న చెరువులపై ప్రత్యేక దృష్టి.. ఈమధ్య కాలంలో భారీ వర్షాలతో పలు చెరువులు దెబ్బతిన్నాయి. జిల్లాలో 63 చెరువులు ఎక్కువ దెబ్బతినగా.. 74 చెరువులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రెండు కాల్వలు కూడా దెబ్బతినగా.. మొత్తం 139 జలవనరులకు సంబంధించిన నివేదిక పంపారు. కాగా 86 చెరువులు తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. 14 చెరువుల పనులు జరుగుతున్నాయి. 16 చెరువుల పనులు పూర్తి కాలేదు. 23 చెరువుల మర్మతుల పనులు మంజూరు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో దెబ్బతిన్న చెరువుల పరిస్థితిపై ఆరా తీసి వివరాలు నమోదు చేసుకున్నారు. చెరువుల వద్ద తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మండలం చెరువులు 75–100 మత్తడి శాతం నిండినవి పోస్తున్నవి మానుకోట 87 03 84 గూడూరు 122 87 35 చిన్నగూడూరు 24 13 07 దంతాలపల్లి 29 21 07 డోర్నకల్ 69 – 69 మరిపెడ 67 30 37 నర్సింహులపేట 46 28 18 సీరోలు 48 – 48 కురవి 76 – 76 నెల్లికుదురు 58 19 19 కేసముద్రం 53 03 48 ఇనుగుర్తి 28 07 15 గార్ల 96 29 67 బయ్యారం 98 60 38 తొర్రూరు 58 18 26 పెద్దవంగర 37 8 28 కొత్తగూడ 380 251 129 గంగారం 214 90 124 మొత్తం 1,590 667 875 -
విద్యా రంగంలో కొత్త అధ్యాయం
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు: సమ్మక్క, సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయని, విద్యారంగంలో ఈ యూ నివర్సిటీ కొత్త అధ్యాయం సృష్టిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పరిధిలోని సాయిబాబా టెంపుల్ రోడ్ శివారులో సమ్మక్క, సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ విశ్వవిద్యాలయ ప్రహరీ నిర్మాణ పనులను మహబూబాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు పోరిక బలరాం నాయక్, జి.నాగేశ్, కలెక్టర్ దివాకర టి.ఎస్, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వైఎల్.శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లాకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని, గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఇది బలమైన వేదిక అవుతుందని తెలిపారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని, యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు సమకూర్చుతామని పేర్కొన్నారు. స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, యూనివర్సిటీ ఏర్పాటుతో విద్యా రంగం, జిల్లా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. 8 నుంచి మూడేళ్ల ‘లా’ ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల ‘లా కోర్సు ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్,14న మూడో పేపర్, 16న నాలుగో పేపర్, 18న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. హన్మకొండ చౌరస్తా: చారిత్రక వేయిస్తంభాల ఆలయ చరిత్రను తెలుసుకునేందుకు ఇక గైడ్ అవసరం లేదు. ఆలయ చిత్రాలు, చరిత్రను క్షుణ్ణంగా వివరించేలా పురావస్తుశాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో క్యూఆర్ స్కానర్లను ఏర్పాటు చేశారు. గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి స్కాన్ చేస్తే చాలు చరిత్ర తెలియజేస్తుంది. -
పెరుగుతూ.. తగ్గుతూ..
● గోదావరి వరద ఉధృతి వాజేడు: గోదావరి దోబూచులాడుతోంది. శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఉధృతంగా పెరిగిన గోదావరి వరద 2 గంటల పాటు నెమ్మదించింది. సాయంత్రం 4 నుంచి మళ్లీ పెరుగుతూ రహదారులను ముంచెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 15.890 మీటర్ల మేర పెరిగింది. టేకులగూడెం గ్రామ చివరిలోని జాతీయ రహదారి మళ్లీ ముంపునకు గురి కావడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాల నుంచి గోదావరి ప్రవహిస్తుండటంతో మిర్చి పంటలు ఇంకా నీటిలో మునిగి ఉన్నాయి. సమ్మక్కసాగర్‌లోకి భారీగా వరద నీరు కన్నాయిగూడెం: నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువన ఉన్న బ్యారేజీల నుంచి గోదావరిలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది. ఈ మేరకు బ్యారేజీలోకి ఆదివారం 7,78,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీకి ఉన్న 59గేట్లను ఎత్తి అదే మోతాదులో నీటిని దిగువకు వదులుతున్నారు. -
సద్దులకు సిద్ధం
● బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు ● కొత్త బజారులో బంధం చెరువు, పాత బజారులో నిజాం చెరువులో నిమజ్జనంమహబూబాబాద్ అర్బన్: సద్దుల బతుమక్మ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం మానుకోట పట్టణంలో బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్టీఆర్ స్టేడియం, పాత బజారులోని నిజాం చెరువు, కొత్త బజారులోని బంధం చెరువును పరిశీలించారు. బతుకమ్మ నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ కంట్రోల్‌కు జిల్లా పోలీస్ యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. చెరువుల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారు. కాగా జిల్లాలో పలు చోట్ల సోమవారం, కొన్నిచోట్ల మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించుకునే అవకాశం ఉంది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డీఈ ఉపేందర్, నాయకులు, మున్సిపల్ ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా బతుకమ్మ సంబురాలు
● జిల్లా పోలీసు కార్యాలయంలో సందడిగా వేడుకలు మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. జిల్లా పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది బతుకమ్మలను సర్వాంగసుందరంగా తయారుచేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకువచ్చి, బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడిగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, మానుకోట, తొర్రూరు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వేడివేడి.. టేస్టీ టేస్టీగా
కాజీపేట : ట్రై సిటీలోని అనేక ప్రాంతాల్లో ఉడక బెట్టిన, కాల్చిన కంకులు తినడానికి ప్రజలు మక్కువ చూపుతున్నారు. ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో తోపుడుబండ్లపై కాల్చిన, ఉడకబెట్టిన మొక్క జొన్న కంకులను విక్రయిస్తూ చిరు వ్యాపారులు, కొందరు రైతులు, మరికొందరు అడ్డా కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ సీజన్లో మక్క కంకుల విక్రయం జోరుగా సాగుతోంది. కంకులకు భలే డిమాండ్.. నగరంలో దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో చిన్న బొగ్గుల పొయ్యి ఏర్పాటు చేసుకొని కాల్చిన మొక్కజొన్న కంకులు విక్రయిస్తున్నారు. ప్రతీ ఏటా వేడివేడి మొక్కజొన్న కంకులకు ఆదరణ పెరగడంతో కాల్చి విక్రయించే కేంద్రాలు పెరిగిపోతున్నాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో మొక్కజొన్న కంకుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే, ఉడకబెట్టి కంకులను విక్రయిస్తున్నారు. రూ.15నుంచి రూ.20లకు ఒక కంకి చొప్పున అమ్ముతున్నారు. బస్తీబస్తీ తిరుగుతూ... రెండేళ్ల నుంచి తోపుడు బండ్లపై మొక్కజొన్న కంకుల విక్రయాలు పెరుగుతున్నాయి. సాధారణంగా పొట్టు తీసి కాల్చడం కంటే పొట్టుతో సహా కాలిస్తే గింజలు మరింత రుచిగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది జూలై నుంచే మక్క కంకులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులే నేరుగా.. కొన్ని ప్రాంతాల్లో రైతులే నేరుగా మొక్కజొన్న కంకులను విక్రయిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల రైతులు పండించిన మొక్కజొన్న కంకులను వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ నగరంలోని ప్రత్యేక అడ్డాల్లో కంకులను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించడం వల్ల కొంత లాభం వస్తున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పడంలేదని వారు ఆవేదన చెందుతున్నారు.వానాకాలం, చలి కాలాల్లో ఎక్కువగా మొక్కజొన్న కంకులకు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మండల కేంద్రాలు, రహదారుల పక్కన విక్రయిస్తు ఉంటారు. రోడ్లకు ఇరువైపులా కాల్చిన, ఉడకబెట్టిన మొక్కజొన్న కంకులను ప్రయాణికులు కొనుగోలు చేసి తింటుంటారు. అడ్డా కూలీలు, కొందరు రైతులు మొక్కజొన్న పొత్తులను నగరానికి తీసుకొచ్చి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. కాల్చిన, ఉడకబెట్టిన మొక్కజొన్న కంకులకు భలే డిమాండ్ -
పట్టుదలతో ప్రభుత్వ కొలువు సాధించారు..
● గ్రూప్–2 ఉద్యోగం సాధించిన పలువురు జిల్లా వాసులు ఏఎస్ఓగా ఎంపికై న ప్రణీత్ కుమార్ పెద్దవంగర: మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన చెన్న ప్రణీత్ కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో 138 ర్యాంక్ సాధించి ఏఎస్ఓగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు చెన్న సోమనారాయణ–నాగలక్ష్మి వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయం చేస్తూ తమ కుమారుడికి ఉన్నత విద్యను అందించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు.జిల్లాకు చెందిన పలువురు గ్రూప్–2 ఉద్యోగం సాధించారు. ఆదివారం టీజీపీ ఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో సత్తా చాటా రు. పట్టుదలతో చదివి లక్ష్యాన్ని ముద్దాడారు. ఒకే వ్యక్తికి మూడు ఉద్యోగాలు దంతాలపల్లి: మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన దిగోజ్ శిరీష్ గ్రూప్–2 ఫలితాల్లో ఆబ్కారీ ఎస్సైగా కొలువు సాధించాడు. కాగా ఆయన పంచాయతీ కార్యాదర్శిగా విధులు నిర్వహిస్తూనే.. గ్రూప్–4 లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం హనుమకొండ కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆబ్కారీ ఎస్సైగా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నరేందర్ కొత్తగూడ: మండలంలోని పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన కొమ్మనబోయిన నరేందర్ గ్రూప్–2లో ప్రతిభ కనపరిచి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నరేందర్ ఇప్పటికే సంజ్రాయిగూడెం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సబ్ రిజిస్ట్రార్‌గా ముల్కలపల్లి వాసిడోర్నకల్: మండలంలోని ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. గ్రూప్–2లో ఫలితాల్లో సబ్ రిజిస్ట్రార్‌గా కొలువు సాధించాడు. ఇప్పటికే ఆయన మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
వలసవాదులం కాదు.. మూలవాసులం
నెహ్రూసెంటర్: లంబాడీలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలసవాదులుగా చిత్రీకరించేందుకు కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని, మేము వలసవాదులం కాదు.. మూలవాసులమని గిరిజన నేతలు పేర్కొన్నారు. లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడూ.. ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆదివాసీల భుజాలపై తుపాకీ పెట్టి లంబాడీలను కాల్చేలా పతకం వేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ, లంబాడీల హక్కుల కోసం కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. కొంత మంది జాతి కోసం పోరాటం చేస్తే ఫలాలు పొందుతున్నాం. లంబాడీలను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టేలా ఎవరు చేసినా.. కాలగర్భంలో కలిపేలా కలిసికట్టుగా ఉండాలి. రాజకీయ అవకాశాలు వస్తే ఒక్కతాటిపై ఉండి జాతి కోసం నిలబడాలని, ఈ ఉద్యమంలో మీతో ఉంటానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. జాతి కోసం జరుగుతున్న పోరాటంలో లంబాడీ ప్రజాప్రతినిధులు కలిసి రావాలన్నారు. రిజర్వేషన్ల కోసం, తండాలను గ్రామ పంచాయతీల కోసం పోరాటాలు చేసి సాధించుకున్నాం. పాలకులు రెచ్చగొట్టి కలిసి ఉన్న ఆదివాసీ, లంబాడీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారన్నారు. జాతికోసం అందరూ ఐక్యమవుదాం, పార్టీలకు అతీతంగా కలిసివచ్చి రాజ్యాధికార సాధనలో ముందుండాలన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకోవాలే తప్ప లంబాడీలను రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తే వారిని రాజకీయ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. సేవాలాల్‌సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్‌నాయక్ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనబెట్టి జాతి మనుగడ సాధించేలా, రాజ్యాధికారం కోసం లంబాడీలంతా ఏకం కావాలన్నారు. హక్కులు, చట్టాలు సాధించుకునేలా పోరాటాలు సాగించాలని, రిజర్వేషన్ కాపాడుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఎస్టీ జా బితా నుంచి తప్పించే కుట్రలను తిప్పికొట్టేలా ప్రతి ఒక్కరూ పోరాటాల్లో కలిసి రావాలని పిలుపుని చ్చా రు. జేఏసీ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్, వైస్ చైర్మన్ గుగులోత్ కిషన్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో దారావత్ వెంకన్ననాయక్, బోడ లక్ష్మణ్‌నాయక్, గుగులోత్ భీమానాయక్, బోడ రమేష్‌నాయక్, డాక్టర్ రాజ్కుమార్జాదవ్, హఠ్యానాయక్, డాక్టర్ వివేక్, హరినాయక్, మంగీలాల్, గుగులోత్ రవి, చందులాల్, సిద్దునాయక్, కర్నావత్ వెంకన్న, మాలోత్ రవీందర్, లింగ్యానాయక్ ఉన్నారు. లంబాడీలు ఐకమత్యంతో రాజ్యాధికారం సాధించాలి ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు లంబాడీల ఆత్మగౌరవ సభలో నేతలు -
బాలికలు, మహిళలకు జిల్లా స్థాయి చెస్‌పోటీలు
విద్యారణ్యపురి : ఽదర్మసాగర్ చెస్ నెట్వర్క్ క్లబ్, దండేపల్లి క్లబ్, ముప్పారం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ సంబురాల్లో భాగంగా హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో బాలికలు, మహిళలకు వరంగల్ జిల్లా స్థాయి చెస్‌పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సీని యర్ కాంగ్రెస్ నాయకురాలు గుంటి స్వప్న ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీలు బా లబాలికలు, మహిళల్లోని ప్రతిభ వెలు గులోకి రావడానికి దోహదపడుతాయన్నారు. అనంతరం న్యూరోౖ సెకియాట్రిస్ట్ జగదీశ్‌బాబు మాట్లాడుతూ చదరంగం జీవన నైపుణ్యాలు నేర్పిస్తూ మానసిక శక్తిని వ్యూహాత్మక ఆలోచనలను ప్రో త్సహిస్తుందన్నారు. చీఫ్ ఆర్బటర్ రజనీకాంత్, ఆర్బిటర్ శివ , ధర్మసాగర్ చెస్క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్ ఈపోటీలను సమన్వయం చేశారు. సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల అధినేత నారాయణరెడ్డి, విశ్రాంత ఇంజనీర్ పొన్నాల రామయ్య, వరంగల్ నిట్ ఆచార్యులు ఆనంద కిశోర్, విశ్రాంత ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, విశ్రాంత ఎంపీడీఓ జైపాల్‌రెడ్డి, చెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీహరిరామోజీ,హెచ్ఎం ధర్మ పాల్గొన్నారు. -
పట్టుబట్టి.. కొలువు కొట్టి..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు పట్టుబట్టి.. కొలువు కొట్టారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మెరిసి అత్యుత్తమ ఉద్యోగాలు సాధించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు.పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కుడికాల వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె కుడికాల భవ్య సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో శనివారం నియామక పత్రం అందుకున్నారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ –1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో భవ్య తొమ్మిదో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామస్తులు, బంధువులు అభినందనలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్‌గా మహ్మద్ అహ్మద్ .. దామెర : మండలంలోని ఊరుగొండకు చెందిన మహ్మద్ అహ్మద్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. మహ్మద్ చోటె–చాంద్‌బీ దంపతుల కుమారుడు మహ్మద్ అహ్మద్ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ప్రస్తుతం హైదరాబాద్ వాటర్ సప్లయీ వర్క్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్–1 సాధించాలనే పట్టుదలతో కష్టపడి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై నట్లు మహ్మద్ అహ్మద్ పేర్కొన్నారు. డీఎస్పీగా జశ్వంత్‌రాజ్.. మహబూబాబాద్ అర్బన్: గ్రూప్–1లో జిల్లా కేంద్రానికి చెందిన సంఘాల రవికుమార్, ప్రసన్న దంపతుల కుమారుడు జశ్వంత్‌రాజ్ గ్రూప్–1లో 900మార్కులకు గాను 465మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 323ర్యాంక్, మల్టీజోన్–1లో 139వ ర్యాంక్ సాధించాడు. ఈక్రమంలో హైదరాబాద్‌లో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా, రాష్ట్ర అధికారులతో డీఎస్పీగా నియాకమ పత్రం జశ్వంత్‌రాజ్ అందుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా అజ్మీ.. గూడూరు: మండల కేంద్రంలో ఐసీడీఎస్ సీడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న నీలోఫర్ అజ్మీ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2018 నుంచి గూడూరు సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న నీలోఫర్ అజ్మీ, గ్రూప్–1 ఫలితాల్లో 136ర్యాంకు సాధించి ఎకై ్సజ్ ఏఈఎస్‌గా నియమితులైనట్లు తెలిపారు. ఆమె ఎంపిక విషయం తెల్సుకున్న అంగన్వాడీ టీచర్లు శనివారం అభినందనలు తెలిపారు. -
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘననివాళి
మహబూబాబాద్: వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ తదితరులు.. లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, హార్టీకల్చర్ జిల్లా అధికారి మరియన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి మహబూబాబాద్ రూరల్ : ఖైదీలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శాలిని అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి శాలిని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షపడి.. లేదా.. బెయిల్ రానందున జైలు శిక్ష అనుభవిస్తున్న సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చదువు రానివారు చదువు నేర్చుకోవాలని చెప్పారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ఒకసారి నేరం చేసి జైలుకు వస్తే మరోసారి జైలుకు రాకుండా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని తెలిపారు. సబ్ జైలు సూపరింటెండెంట్ మల్లెల శ్రీనివాస్ జైల్లో ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల ఏరు గార్ల: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు గార్ల సమీపంలోని పాకాల ఏరు చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ పంచాయతీలకు చెందిన 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు నిత్యావసరాలకోసం బయ్యారం, డోర్నకల్‌కు ఆటోల్లో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. రామప్పలో సిరియా దేశస్తులు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని సిరియాకు చెందిన రావద్, అమీన్లు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని వారు కొనియాడారు. గోదావరి దోబూచులాట వాజేడు: గోదావరి వరద పెరుగుతూ.. తగ్గుతూ దోబూచులాడుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు ఉధృతంగా పెరిగిన గోదావరి వరద శని వారం మధ్యాహ్నం వరకు క్రమంగా తగ్గింది. 16.410 మీటర్ల వరకు పెరిగిన గోదావరి తగ్గుముఖం పట్టి 14.920 మీటర్ల వరకు తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి మళ్లీ వస్తున్న నీటి ప్రవాహంతో గోదావరి వరద శనివారం సాయంత్రం 6 గంటలకు 15.140 మీటర్ల మేర పెరిగింది. దీనికి తోడు మండలంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది ఎకరాల్లోని మిర్చి పంట నీటిలోనే మునిగి ఉంది. మండల పరిధిలోని పూసూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. -
రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా పోరాడిన లక్ష్మణ్ బాపూజీ
హన్మకొండ/వరంగల్ క్రైం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా పోరాడిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం, వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కొండా లక్ష్మ ణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర ఉద్యమం, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. నిజాం కాలంలో తెలంగాణ విముక్తికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసి మచ్చలేని నేతగా కీర్తి గడించారన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ విశిష్ట సేవలందించారన్నారు. కార్యక్రమంలో టీజీ ఎన్పీ డీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్ లాల్, కె.మాధవరావు, సీజీఎం చరణ్ దాస్, క్రైం డీసీపీ గుణశేఖర్, అడిషనల్ డీసీపీలు రవి, సురేశ్ కుమార్, ప్రభాకర్‌రావు, బాలస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ -
చెట్లు తగ్గి ధరలు పెరిగాయి..
ఏటేటా సీతాఫలాల చెట్లు తగ్గిపోతున్నాయి. దీంతో దిగుబడి పడిపోయి పండ్ల ధరలు పెరుగుతున్నాయి. 25 ఏళ్ల నుంచి ఈ పండ్లు అమ్ముతున్నా. మా తాత, తండ్రి కాయలు, పండ్లను పబ్లిక్‌గార్డెన్ వద్ద అమ్మేటోళ్లు.. మేము బావుల దగ్గర, గుట్టల్లో కాయలను సేకరించి పండబెట్టి అమ్ముతున్నాం. ఈ సంపాదన మాకు ఆసరాగా ఉంటుంది. – భూక్య శ్రీను, తరిగొప్పుల మూడు నెలల పాటు ఉపాధి..సీతాఫలాల విక్రయాలతో ఏటా మూడు నెలల పాటు ఉపాధి లభిస్తుంది. దిగుబడి తగ్గి ధర పెరిగి మాకు గిట్టు బాటు కావడం లేదు. తండాల్లో ఉన్న చెట్లకు కాసిన కాయలను సేకరించి హనుమకొండకు వచ్చి అమ్ముకుంటా. రాత్రి వరకు ఇల్లు చేరుతా. మార్కెట్లో అమ్మేటోళ్లు పెరిగారు. నగరం నుంచి హోల్‌సేల్ వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో ధరలు భారీగా పెరిగాయి. బి. రాధ, పర్వతగిరి పండు లభించడం అదృష్టం..కూలీలు, రైతుల నుంచి నేను సీతాఫలాల కాయలను కొని విక్రయిస్తున్నా. ధర పెరిగి గిరాకీ తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి చెట్లను తొలగించి పాట్లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. దీంతో చెట్లు అంతరిస్తున్నాయి. కొనుగోలు దారులకు ధర ఎక్కువ అనిపించినా నగరంలో పండు లభించడం అదృష్టంగా భావించాలి దేవి, మాదాపురం, జనగామ జిల్లా -
ఎఫ్‌పీఐ పనులు వేగవంతం చేయాలి
హన్మకొండ: విద్యుత్ లైన్లలో తలెత్తే సమస్యలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల (ఎఫ్‌పీఐ) బిగింపు పనులు వేగవంతం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటి ద్వారా సమస్య ఎక్కడ ఉందో త్వరగా గుర్తించి వెంటనే పునరుద్ధరించొచ్చన్నారు. వినియోగదారులకు విద్యుత్ అంతరాయం సమయం తగ్గుతుందన్నారు. 11 కేవీ కలిపి ఉన్న ఫీడర్లను వేరు చేయడం ద్వారా ఆ ఫీడర్లో అంతరాయాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్‌తో ఎంత లోడ్ ఉందో సులువుగా తెలుసుకోవచ్చని తెలిపారు. హెచ్‌టీ సర్వీస్‌లో ఆటోమేటిక్ రీడింగ్ మోడెం అమర్చే పనులు వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న వర్క్ఆర్డర్లు పూర్తి చేయాలని సూచించారు. సబ్ స్టేషన్లను స్కాడాకు అనుసంధానించడం వలన విద్యుత్‌కు సంబంధించిన పూర్తి సమాచారం వేగంగా తెలుసుకోవచ్చని వివరించారు. రెవెన్యూ కలెక్షన్లు వంద శాతం వసూలు చేయాలని, వ్యవసాయ సర్వీసుల మంజూరు వేగవంతం చేయాలని, డోర్‌లాక్ ఉన్న మీటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎండీ ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్లాల్, అశోక్, వెంకటరమణ, సీజీఎంలు ఆర్.చరణ్‌దాస్, జీఎంలు వెంకటకృష్ణ, అన్నపూర్ణ, నాగప్రసాద్, వేణుబాబు, కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
ఏటీసీలతో అధునాతన సాంకేతిక విద్య
● ఎమ్మెల్యే మురళీనాయక్ మహబూబాబాద్ అర్బన్: అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)తో నిరుద్యోగ యువతకు అధునాత సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే మురళీనాయక్ అ న్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను వర్చువల్ విధానంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం ఎమ్మెల్యే మురళీనాయక్, అడిషనల్ కలెక్ట ర్ లెనిన్ వత్సల్ టొప్పొతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువత విద్య ఉపాధి కోసం వలసబాట పట్టారని అన్నారు. ప్రజాపాలనలో రూ.63 కోట్లతో మానుకోటలో టాటా గ్రూప్ సహకారంతో ఏటీసీ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్టొప్పొ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభు త్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. బాబు, ట్రైనింగ్ ఆఫీసర్ ఉప్పలయ్య, సూపరింటెండెంట్ రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ శనివారం ఖరారైంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ విడుదల చేసిన బీసీ గణన నివేదిక, ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలను రిజర్వేషన్ల కేటాయింపునకు ప్రామాణికంగా తీసుకున్నారు. వీటి ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను కేటాయించారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లోని నాలుగు మండలాల్లో మాత్రం ఎంపీపీలు గిరిజనులకే కేటాయించి తుది జాబితా విడుదల చేశారు. బీసీలకు 42 శాతం త్వరలో ఎన్నికలు జరగబోయే స్థానాలకు బీసీలకు 42 శాతం కేటాయించారు. జిల్లాలో మొత్తం 18 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ స్థానాల్లో గంగారం జనరల్, గూడూరు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. బీసీలకు ఏడు స్థానాలు కేటాయించగా ఇందులో మూడు మహిళలకు, నాలుగు జనరల్ కేటగిరీకి వచ్చాయి. ఎస్టీల్లో నాలుగు జనరల్, మూడు మహిళలకు మొత్తం ఏడు స్థానాలు, ఎస్సీ విభాగంలో ఒకటి జనరల్, మరొక స్థానం మహిళకు కేటాయించారు. అదే విధంగా 18 ఎంపీపీ స్థానాల్లో గంగారం, కొత్తగూడ, గార్ల, బయ్యారం నాలుగు మండలాల్లో ఏజెన్సీ నిబంధనల ప్రకారం ఎస్టీలకు కేటాంచారు. వీటితోపాటు మైదాన ప్రాంతాల్లోని ఐదు మండలాలు ఎస్టీలకు, ఆరు మండలాలు బీసీలకు, రెండు మండలాలు బీసీలకు కేటాయించారు. నీరుగారిన నాయకుల ఆశలు రెండు, మూడేళ్లుగా మండల, గ్రామ జనాభాను లెక్కించుకుంటూ.. తమకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తుందని భావించిన పలువురు నా యకుల ఆశలు గల్లంతైనట్లు తెలుస్తుంది. తాము అనుకున్న రిజర్వేషన్ రాకపోవడంతో ఏం చేయాలోతోచక సందిగ్ధంలో పడ్డారు. జెడ్పీ పీఠం జనరల్ కే.. అనుకున్నట్లుగానే జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తమ మండలాలు అనుకూల రిజర్వేషన్ వస్తే చైర్మన్ పీఠం దక్కించుకోవచ్చని భావించిన పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. రిజర్వేషన్ కోసం ఎదురుచూసినా.. అనుకూలంగా రాని నాయకుల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా.. మండలం జెడ్పీటీసీ స్థానం ఎంపీపీ స్థానం బయ్యారం బీసీ(మహిళ) ఎస్టీ(మహిళ) చిన్నగూడూరు ఎస్టీ(జనరల్) ఎస్టీ(జనరల్) దంతాలపల్లి ఎస్సీ(మహిళ) ఎస్సీ(జనరల్) డోర్నకల్ ఎస్టీ(జనరల్) బీసీ(మహిళ) గంగారం జనరల్ ఎస్టీ(జనరల్) గార్ల జనరల్(మహిళ) ఎస్టీ(మహిళ) గూడూరు బీసీ(జనరల్) జనరల్ ఇనుగుర్తి ఎస్టీ(మహిళ) ఎస్టీ(మహిళ) కేసముద్రం ఎస్టీ(మహిళ) ఎస్టీ(జనరల్) కొత్తగూడ బీసీ(జనరల్) ఎస్టీ(జనరల్) కురవి ఎస్టీ(మహిళ) బీసీ(మహిళ) మహబూబాబాద్ బీసీ(జనరల్) బీసీ(జనరల్) మరిపెడ బీసీ(మహిళ) బీసీ(జనరల్) నర్సింహులపేట ఎస్టీ(జనరల్) ఎస్టీ(జనరల్) నెల్లికుదురు బీసీ(జనరల్) ఎస్సీ(మహిళ) పెద్దవంగర ఎస్సీ(జనరల్) బీసీ(జనరల్) సీరోలు ఎస్టీ(జనరల్) ఎస్టీ(మహిళ) తొర్రూరు బీసీ(మహిళ) బీసీ(మహిళ) స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన అధికారులు 42శాతం బీసీలకు కేటాయింపు ఏజెన్సీ నాలుగు మండలాల ఎంపీపీ స్థానాలు వారికే.. అనూహ్యంగా మారిన రిజర్వేషన్లు పలువురు నాయకుల ఆశలు గల్లంతు -
వృద్ధురాలి మెడ నుంచి గొలుసు అపహరణ
వరంగల్ క్రైం: సుబేదారి పీఎస్ పరిధిలోని ఎకై ్సజ్ కాలనీలో వృద్ధురాలి ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించిన ఓ దుండగుడు ఇంట్లోకి వచ్చి కాలనీకి చెందిన కొంరయ్య పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఇవ్వమన్నాడని చెప్పి ఓ టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్లినట్లు సుబేదారి సీఐ రంజిత్‌కుమార్ తెలిపారు. ఆ తర్వాత అదే వ్యక్తి ఇంటి వెనుక నుంచి డోర్ పగులగొట్టుకొని వచ్చి వృద్ధురాలు సరస్వతి మెడ నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్లినట్లు తెలిపారు. దొంగ తెల టీ షర్ట్, హెల్మెట్ ధరించినట్లు వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నట్లు సీఐ రంజిత్‌కుమార్ పేర్కొన్నారు. -
8 నుంచి ఎల్ఎల్బీ మూడేళ్ల మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ మూడేళ్ల ‘లా’ కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ శనివారం తెలిపారు. అక్టోబర్ 8న మొదటిపేపర్, 10న రెండో పేపర్, 14న మూడో పేపర్, 16న నాలుగో పేపర్, 18న ఐదో పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని వారు తెలిపారు. 9 నుంచి మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ.. కేయూ ఎల్ఎల్బీ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 9వతేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం అధికారులు రాజేందర్, ఆసిం ఇక్బాల్ తెలిపారు. 9 మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్, 22న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు రామన్నపేట : ఆభరణాలు తయారు చేయడానికి బిస్కెట్ బంగారం తీసుకున్న వేదామృత జ్యువెల్లర్ నిర్వాహకుడు దుబాసి మహేశ్.. తిరిగి 75 గ్రాములు ఇవ్వకుండా మోసం చేసిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ శనివారం తెలిపారు. విజయవాడ మంగళగిరికి చెందిన మంచాల రామకృష్ణ ఆభరణాలు తయారుచేసేందుకు 2024, ఆగస్టు 14న 117 గ్రాములు బిస్కెట్ బంగా రాన్ని మహేశ్‌కు అప్పగించారు. ఈక్రమంలో మధ్యలో ఒక్కసారి 15.7 గ్రాములు, మరోసారి 20.53 గ్రాముల బంగారాన్ని ఆభరణాలుగా తయారు చేసి అప్పగించారు. మిగతా 78 గ్రాముల బంగారం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న మహేశ్‌పై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్కరుణాకర్ తెలిపారు. -
బీసీల పోరాటంతోనే రిజర్వేషన్ల పెంపు
● బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్హన్మకొండ: బీసీల రిజర్వేషన్ల పెంపు సంఘటిత పోరాటం విజయమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. శనివారం హనుమకొండ ఇందిరానగర్‌లో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తేళ్ల సుగుణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తేళ్ల కిశోర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శా తం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ09 విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వ చ్చిన అనంతరం కులగణన చేసి అసెంబ్లీలో చట్టం చేసిందన్నారు. తర్వాత బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ జీఓ జారీ చేసిందన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను కోర్టు ద్వారా అడ్డుకోవాలని దయచేసి ఎవరూ ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, నాయకులు తమ్మేలా శోభారాణి, మాడిశెట్టి అరుంధతి, సౌమ్య, కవిత, గొట్టే మహేందర్, రవికిరణ్, దుస్సా నవీన్, మండల సమ్మయ్య ముదిరాజ్, చెప్పాల మణికంఠ, అమిత్ పాల్గొన్నారు. -
వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి
● జడ్జి అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్ : పారా లీగల్ వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా న్యా య సేవా సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటీర్ల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మా ట్లాడుతూ.. చట్టాలపై సామాన్య ప్రజలకు అవగా హన లేకపోవడంతోనే మోసపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉన్న ప్రజలకి చట్టాల గురించి అవగాహన కల్పించడం న్యాయమూర్తులు లేదా న్యాయవాదులతో సాధ్యమయ్యే పనికాదని పేర్కొన్నారు. ఆయా గ్రామాల నుంచి ఆసక్తి ఉన్న వ్యక్తులను ఎంపిక చేసి పారా లీగల్ వలంటీర్లుగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.షాలిని, న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణతేజ్, న్యాయవాదులు యాసాడి చెన్నమల్లారెడ్డి, చిన్నమహేందర్, షేర్ స్వచ్ఛంద సంస్థ జిల్లా సమన్వయకర్త వసుంధర పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీ యమని జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నా రు. రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన సోమేశ్వరరెడ్డికి చక్రాల కుర్చీని జడ్జి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పీవీ.ప్రసాద్ మాట్లాడుతూ.. సోమేశ్వరరెడ్డికి చక్రాల కుర్చీ అందజేయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధ్యులు రెడ్ క్రాస్ సొసైటీని కోరినట్లు తెలిపారు. దీంతో కుర్చీని సోమేశ్వరరెడ్డికి జిల్లా కో ర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, సీనియర్ సివిల్ జడ్జి శాలిని అందజేశారని తెలిపా రు. మాధవపెద్ది వెంకటరెడ్డి, రావుల రవిచందర్ రెడ్డి, కొండపల్లి కేశవరావు పాల్గొన్నారు. -
పేదల ఆపిల్.. సీతాఫలం
హన్మకొండ కల్చరల్: పేదల ఆపిల్ సీతాఫలం. అ మృతంలా తియ్యగా ఉండే ఈ పండును ఇష్టపడని వారుండరు.. పిల్లల నుంచి పెద్దల వరకు.. సామాన్యల నుంచి సంపన్నుల వరకు ఇష్టంగా తినే పండు సీతాఫలం. వర్షాకాలంలో లభించే సీతా ఫలానికి పోషకగనిగా పేరుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో లభించే సీతాఫలాల విక్రయాలు నగర, పట్టణాల్లో జోరందుకున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ ప్రభావంతో కొంత మేర సీతాఫల చెట్లు అంతరించిపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ అయినా సీతాఫలాల దిగుబడి తగ్గి ధరలు పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, తరిగొప్పుల, తొర్రూరు, మహబూబాబాద్, మరిపెడ, ఏటూరునాగరం, కొత్తగూడ, నర్సంపేట, గూడూరు, పాకాల, వర్ధన్నపేట, పర్వతగిరి, స్టేషన్‌ఘన్‌పూర్, మరిపెడ, న ర్సింహులపేట, ములుగు, భూపాలపల్లి, పరకాల, ములుగు గణపురం తదితర మండలాల్లో ఎక్కువగా లభిస్తుండగా.. వీటిని కూలీలు గుట్టలు, పొలాల గట్లు, అటవీ ప్రాంతాల నుంచి సేకరించి ఎడ్ల బండ్లు, వాహనాల్లో నగరానికి తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. జోరుగా సీతాఫలాలు విక్రయాలు సీతాఫలాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వరంగల్ ట్రైసిటీలో పబ్లిక్ గార్డెన్ సెంటర్, వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్, పండ్ల మార్కెట్, ఇతర నగర రహదారులపై సీతాఫలాల విక్రయాలు సాగుతున్నాయి. ఎక్కువ శాతం మహిళలే అమ్మడం కనిపిస్తోంది. గతంలో 100 పండ్లు రూ. 150 నుంచి రూ. 200 వరకు విక్రయించేది. ప్రస్తుతం ఈఏడాది ఒక పండు రూ. 10 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. పెద్ద పరిమాణమైతే రూ.100కు నా లు గు చొప్పున విక్రయిస్తున్నారు. మరికొంత మంది సేకరించిన వారి నుంచి గుత్తగా తీసుకుని దుకాణా ల ద్వారా అమ్ముతున్నారు. ఈ విక్రయాల ద్వారా రోజుకు సేకరించిన కాయలను బట్టి సుమారు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు ఆదాయం వ స్తుంది. సీతాఫలాల విక్రయాలు, సేకరణతో ఏటా పేదలకు మూడునెలల పాటు ఉపాధి లభిస్తుంది. తెల్లవారుజామునే నగరానికి చేరుకుని విక్రయాలు పూర్తయిన అనంతరం సాయంత్రానికి తమ గ్రామానికి వెళ్తున్నారు. కొన్ని కుటుంబాలు పబ్లిక్‌గార్డెన్ వద్ద రోడ్డు పక్కన షెడ్డు వేసుకుని సేకరించిన కాయలను మాగబెట్టి అమ్ముతున్నారు. సీజన్ అయిపోయినా తర్వాత తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోతారు. ఏటేటా అంతరిస్తున్న సీతాఫలం చెట్లు రియల్ స్టేట్ వ్యాపారం, కరువు ప్రభావంతో సీతా ఫలాల చెట్లు ఏటేటా అంతరించిపోతున్నాయి. బా వులు, పొలగట్లు, గుట్టలు వెంట ఉన్న సీతా ఫలాల చెట్లను కూడా యంత్రాలతో తొలగించి భూములను చదును చేసి విక్రయిస్తున్నారు. ఫలితంగా సీతాఫలం చెట్లు అంతరిస్తున్నాయి. నాణ్యత, పరిమాణాన్ని బట్టి రూ.10 నుంచి రూ. 20, 30 వరకు పండ్లు విక్రయిస్తున్నారు. కోతుల బెడదతో కాయలు కరువు.. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు ఉన్నా కోతులు పూత, కా య దశలో తెంపుతున్నాయి. ఫలితంగా అక్కడ సీ తాఫలాల కనిపించని పరిస్థితి నెలకొంది. కాగా, కొంత మంది వ్యాపారులు తమ పంట పొలాలు, గట్ల వెంట పెంచిన సీతాఫలాల చెట్లకు పగలు, రా త్రి నిఘా ఉంటూ కోతుల బెడద నుంచి రక్షించుకుంటున్నారు. దీంతో 2 వేల నుంచి 5వేల వరకు కా యలు దిగుబడికి వస్తున్నాయి. అనంతం వీటిని నగరానికి తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నామని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. పోషకాలు మెండు.. ఈ పండు కంటి, గుండె, జీర్ణ సంబంధం సమస్యలు దూరం ఆపిల్‌తో పోటీ పడుతున్న సీతాఫలాల ధరలు మూడు నెలల పాటు విక్రయాలు.. పేదలకు ఉపాధి రియల్ ఎస్టేట్ విస్తరణలో అంతరిస్తున్న చెట్లు -
వ్యాపారులు సహకరించాలి
మహబూబాబాద్: వ్యాపారులు అన్ని విధాలా సహకరించాలని, వ్యాపారుల కోసమే మోడల్ కూరగాయల మార్కెట్ అని మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం గాంధీ పార్క్‌లో కూరగాయలు విక్రయిస్తున్న 64మందికి గానూ 60 మందికి డ్రాపద్ధతిలో మోడల్ మార్కెట్లో షాపులు కేటాయించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మోడల్ మార్కెట్లో అన్ని వసతులు ఉన్నాయని దానిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కూరగాయలు విక్రయించే వారికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. వ్యాపారులు అందరూ సమన్వయంతో కలిసి వ్యాపారం చేసుకోవాలన్నారు. వ్యాపారులకు మున్సిపాలిటీ పరంగా సహకారం ఉంటుందన్నారు. నలుగురు కోడిగుడ్లు విక్రయించే వ్యాపారులకు నాన్ వెజ్ మార్కెట్లో అవకాశం కల్పిస్తామన్నారు. వెజ్, నాన్ వెజ్ విక్రయించే వారంతా ఆ మోడల్ మార్కెట్లో ఉండడం వల్ల ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందన్నారు. అడ్డగోలుగా గుమ్చీలను ఏర్పాటు చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో డీఈ సీహెచ్. ఉపేందర్, ఏఈ కుమార్,టీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, మేనేజర్ శ్రీధర్, సిబ్బంది రాజేష్, అమర్, మామ్ముటి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు
మహబూబాబాద్ రూరల్ : బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా మబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఈ నెల 27నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు బంద్ ఉంటుందని, సెలవు రోజుల్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ శుక్రవారం తెలిపారు. మార్కెట్ యార్డు వచ్చే నెల 6వ తేదీన పునఃపారంభం అవుతుందన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్నెహ్రూసెంటర్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్హెచ్ఎం పరిధిలో నిలిచిపోయిన ఎన్హెచ్ఎం స్టాఫ్‌నర్సు 2, ఎన్సీడీ స్టాఫ్‌నర్సు 10, ఎంఎల్‌హెచ్‌పీ 10 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగ 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కాగా, వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులకు రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రజిత అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పరిశీలించారు. ప్రయాణికులకు ఆర్టీసీ దసరా బహుమతులునెహ్రూసెంటర్: బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణిలు లక్కీడ్రా ద్వారా నగదు బహుమతులు పొందవచ్చని ఆర్టీసీ డీఎం వి.కల్యాణి శుక్రవారం తెలిపారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు సెమి డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ వెనుకాల పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి మహబూబాబాద్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన లక్కీడిప్ బాక్సులో వేయాలన్నారు. అక్టోబర్ 8న హనమకొండ రీజనల్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో లక్కీడ్రా తీయబడుతుందన్నారు. ముగ్గురు విజేతలకు మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000, మూడో బహుమతి రూ. 10,000 నగదు అందజేస్తామన్నారు. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు దసరా స్పెషల్ 10 బస్సులను నడుపుతున్నామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు. మద్యం షాపుల నిర్వహణకు గెజిట్ విడుదలదరఖాస్తుల స్వీకరణ ప్రారంభం మహబూబాబాద్ రూరల్: మద్యం షాపుల ఏర్పాటునకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా పరిధిలో 2025–2027కు గానూ మద్యం షాపుల ఏర్పాటు కోసం ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ తెలిపారు. జిల్లాలో 59 మద్యం షాపులు ఉండగా ప్రభుత్వం అదనంగా రెండు షాపులను ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేయడంతో సంఖ్య 61కి చేరిందన్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీల వారికి నిర్ణయించిన షాపుల రిజర్వేషన్ల ఆధారంగా దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి భారీ వర్షాలపై అన్ని విభాగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, వాగులు, వంకలు, కుంటలు, జలపాతాలు ప్రమాదస్థాయిలో ఉన్నందున అటువైపు ప్రజలు వెళ్లకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. జిల్లాలో ప్రవహించే పాకాల, మున్నేరు, ఆకేరు తదితర వాగులను నిత్యం పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని వర్షాలు, వరదల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగితే వెంటనే కంట్రోల్‌రూం 7995074803 నంబర్లో సంప్రదించాలన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు నిబద్ధతతో పనులు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై మాస్టర్స్ ట్రైనర్స్‌తో అధికారులకు శిక్షణ తరగుతులు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్ట మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా మాస్టర్ ట్రైనర్స్‌తో నివృత్తి చేసుకోవాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ చేసిన తక్షణమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వాటిని పూర్తిగా పరి శీలించి ఆమోదించాలా.. తిరస్కరించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్, కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం పాల్గొన్నారు. -
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
తొర్రూరు: రక్తదానం మరొకరికి ప్రాణదానంగా నిలుస్తోందని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రక్తదానం శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన పలువురికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వైద్యాధికారి నందనాదేవితో కలిసి డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడారు. రక్తాన్ని కృత్రిమంగా సృష్టించలేమని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలన్నారు. రక్తహీనతతో బాధపడే మహిళలు, చిన్నారులకు దాతలు అందించే రక్తం వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు మీరాజ్, ప్రియాంక, మానస, శంకర్, కిరణ్‌కుమార్, సీహెచ్ఓ విద్యాసాగర్, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మా.. మేమేం పాపం చేశాం
సాక్షి మహబూబాబాద్: ‘అమ్మానాన్న.. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మేం కడుపున పడ్డామని తెల్వగానే సంబురపడ్డారు. అంగరంగ వైభవంగా బారసాలలు చేశారు. బోసి నవ్వులతో, బుడిబుడి అడుగులు వేస్తుంటే మురిసిపోయారు. అల్లారుముద్దుగా పెంచిన మాపై కనికరంలేకుండా కర్కశంగా మారావెందుకమ్మా.. నీవు నీటిలో ముంచి ఊపిరాడకుండా చేస్తే తమ్ముడి ప్రాణం ఎలా కొట్టుకుందో, చీకట్లో కత్తితో నా మెడ కోస్తే నేను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఎవరో కోసి వెళ్లారని నమ్మించావు. ప్రాణాలతో బయటపడ్డ నన్ను చూసి సంబురపడ్డటూ నటించావు. తర్వాత తాడు మెడకు చుట్టి ఉరితీస్తుంటే కొట్టుకుంటున్న నన్ను చూస్తే నీకు ఏమి అనిపించలేదా అమ్మా.. మమ్ముల్ని చంపడానికి నీ మనసెలా ఒప్పిందమ్మా’ అంటూ పిల్లలు మనోవేదన చెంది ఉంటారు. కేసముద్రం మండలం నారాయణపురంలో శిరీష తన ఇద్దరు కుమారులను హత్యచేసింది. ఇది తెలిసిన గ్రామస్తులు, బంధువులు కంటతడి పెట్టారు. చంపడానికే నిర్ణయం.. ప్రేమగా చూసుకునే భర్త ఒక్కసారిగా మారినట్లు భావించడం, పిల్లలు తన ప్రేమకు దూరమవుతున్నారని ఆందోళన చెందడం మొదలైన సంఘటనలతో తల్లి శిరీష ముగ్గురు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిని అమలు చేసేందుకు పకడ్బందీగా వ్యూహం రచించింది. ఇందులో భాగంగా చిన్నకుమారుడు నిహాల్(2)ని సంపులో పడేసి చంపాలని చూడగా, ఆ సమయంలో అత్త రావడంతో ప్రమాదవశాత్తు పడినట్లు చిత్రీకరించింది. ప్రాణాలతో బయటపడ్డ.. మరోసారి ఇంట్లో ఎవరూలేని సమయంలో సంపులో పడేసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. కొద్దిరోజుల తర్వాత రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పెద్దకుమారుడు మనీష్‌కుమార్ మెడపై కత్తితో కోసి హత్య చేసేందుకు ప్రయత్నించింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ మనీష్‌కుమార్‌ను ఈనెల 24న ఇంట్లో ఎవరూలేనిది చూసి ఉరివేసి చంపేసింది. దీనిని కూడా జ్వరంతో చనిపోయినట్లుగా చిత్రీకరించాలనుకుంది. అది సఫలమైతే రెండో కుమారుడు మోక్షిత్‌ను కూడా చంపి, తాను ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ముందే గమనిస్తే ప్రాణాలు దక్కేవి.. తల్లి తన కుమారులను చంపేందుకు పన్నిన వ్యూహాన్ని ముందే గమనిస్తే ఆ ఇద్దరు పసిప్రాణాలు దక్కేవని, కుటుంబ సభ్యులు, బంధువులు ఏడుస్తూ చెప్పడం అందర్ని కంటతడి పెట్టించింది. ఇద్దరు పిల్లలు మొదటిసారి మృత్యువు దగ్గరకు వెళ్లి, రెండో సారి మృత్యువు ఒడిలోకి చేరాల్సి వచ్చింది. చిన్నకుమారుడు సంపులో పడి ప్రాణాలతో బయటపడడం, మరోసారి అదే సంపులోపడి చనిపోయినా అనుమానం రాలేదు. పెద్దకుమారుడిని మెడపై కత్తితో కోసి హత్యాయత్నం చేసిన సంఘటన కుటుంబ సభ్యులు పసిగట్టలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణలో తెలుసుకోకపోవడం, కన్నతల్లే కర్కశంగా మారి ఇద్దరు కొడుకుల్ని పొట్టనబెట్టుకున్న విషయం పసిగట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. అటు అత్తామామలు కాని, భర్తకు కాని, విచారణ చేపట్టిన పోలీసులకు కాని శిరీషపై అనుమానం రాకపోవడం ఏంటని జిల్లాలో చర్చానీయాంశంగా మారింది.తల్లడిల్లుతున్నా మాపై జాలి కలగలేదా.. ముందే అనుమానిస్తే మా ప్రాణాలు దక్కేవి ఇద్దరు పిల్లలను చంపిన తల్లి ఘటనతో నారాయణపురంలో విషాదం -
మహాలక్ష్మి అలంకరణలో దుర్గాదేవి
మానుకోటలో కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ మహబూబాబాద్ రూరల్/కురవి/మరిపెడ రూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గామాతను శుక్రవారం రూ.12,121,21 కరెన్సీ నోట్లతో అలంకరించి మహాలక్ష్మి అవతారంలో పూజలు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా రూ.లక్ష కాయిన్ నిలువగా అమ్మవారి సన్నిధిలో స్వదేశీ, విదేశీ నగదు ఏర్పా టు చేసి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అలాగే మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో కొలువైన దుర్గాదేవి అమ్మవారిని రూ. 8లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. అదేవిధంగా కురవి మండలంలోని సూదనపల్లి గ్రామంలో మన ఊరు–మన అమ్మవారు కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు రూ.50,11,16 కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని, మండపాన్ని అలంకరించారు. మరిపెడ: గుండెపూడి లక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారుకురవి: సూదనపల్లిలో కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ -
ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ
మహబూబాబాద్ రూరల్ : సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎస్పీ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయప్రతాప్, ఎస్బీ, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు వెంకన్న, జితేందర్, ఆర్ఎస్సై శేఖర్, డీపీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ జయంతిమహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీఏఓ విజయనిర్మల, హార్టికల్చర్ జిల్లా అధికారి మరియన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆగిన పెన్షన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్‌టీచింగ్, ఫ్యామిలీ పెన్షన్‌దారులకు జూలై, ఆగస్టు నెలల పెన్షన్ గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో జూలైకి సంబంధించిన పెన్షన్‌ను ఆగస్టులో, ఆగస్టు పెన్షన్ సెప్టెంబర్‌లో యూనివర్సిటీ అంతర్గత నిధులనుంచి యూనివర్సిటీ అధికారులు లబ్ధిదారులకు చెల్లించారు. 795 మంది రూ.5.60 కోట్లు కేయూ పరిధిలో టీచింగ్ సర్వీస్ పెన్షనర్లు 210 మంది, టీచింగ్ ఫ్యామిలీపెన్షనర్లు 57 మంది, నాన్‌టీచింగ్ సర్వీస్ పెన్షనర్లు 296 మంది, నాన్‌టీచింగ్ ఫ్యామిలీ పెన్షనర్లు 232 మంది మొత్తంగా 795 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.5.60 కోట్ల పెన్షన్ చెల్లించాల్సి ఉంటుంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి పెన్షన్ గ్రాంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వర్సిటీ నిధుల నుంచి రూ.11.20 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. యథావిధిగా బిల్లులు గతంలో మాదిరిగానే సర్వీస్‌లో ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు వేతానా లు, పెన్షనర్ల పెన్షన్ బిల్లులు ప్రతినెలా జిల్లా ట్రెజరీకి పంపుతున్నారు. గతంలో అందరికీ వేతనాలు, పెన్షన్ విడుదల చేయగా.. రెండు నెలలుగా పెన్షన్ నిధులు ఆపేశారు. దీనిపై వర్సిటీ అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఐఎంఎఫ్ఎస్లో ఉద్యోగుల వివరాలు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంట్రిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎంఎఫ్ఎస్) నిర్వహిస్తుంది. ఇందులో కాకతీయ యూనివర్సిటీ టీచింగ్, నాన్‌టీచింగ్, అన్నికేటగిరీల ఉద్యోగులకు సంబంధించి వేతనాలతో కూడిన వివరాలు సమర్పిస్తేనే వేతనాల చెల్లింపునకు బ్లాక్ గ్రాంట్ విడుదల చేస్తారని సమాచారం. సెప్టెంబర్ వేతనాలు అక్టోబర్‌లో పొందాలంటే ఆయా ఉద్యోగుల వివరాలు ఐఎంఎఫ్ఎస్లో నమోదు చేయాల్సిందేనని యూనివర్సిటీకి ఆర్థిక శాఖ సూచించినట్లు తెలిసింది. దీంతో ఆయా ఉద్యోగుల వివరాలు నమోదు చేశారు. ఇందులో పెన్షన్‌దారుల వివరాల నమోదుకు అవకాశ ంలేకపోవడంతో యూనివర్సిటీ అధికారులు మా న్యువల్‌గా పంపించబోతున్నారని సమాచారం. ఈనేపథ్యంలో పెన్షన్ గ్రాంట్ అక్టోబర్‌లోనైనా రిలీ జ్ అవుతుందా.. లేదా.. అనేది సందిగ్ధంగానే ఉంది. వీసీని కలిసిన కుర్తా బాధ్యులు రెండు నెలల పెన్షన్ నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో యూనివర్సిటీ నిధుల నుంచి చెల్లించారు. సెప్టెంబర్ నెల పెన్షన్ దసరా పండుగకు అందుతు ందా.. లేదా.. అనే అంశంపై కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) బాధ్యులు రెండురోజుల క్రితం వీసీ ప్రతాప్‌రెడ్డిని కలిసినట్లు సమాచారం. దసరా నేపథ్యంలో అక్టోబర్ 1నాటికి పెన్షన్ వచ్చేలా చూడాలని వీసీకి విన్నవించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని రెగ్యులర్ అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు కలిిపి నిధుల కోసం యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. దీంతో బ్లాక్ గ్రాంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈఏడాది జూన్ వరకు ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేసి చెల్లించింది. కానీ, గత రెండు నెలల నుంచే గ్రాంట్ రిలీజ్ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి వేతనాలు, పెన్షన్ల కోసం యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వం బడ్జెట్లోనూ రూ.149కోట్లకుపైగా నిధులను కేటాయించిన విషయం విధితమే. కానీ, ప్రస్తుతం నిధులు విడుదల చేయకపోవడంలో ఆంతర్యమేంటనేది సందిగ్ధంగా మారింది. నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఆందోళనలో కేయూలోని వివిధ రకాల పెన్షన్ లబ్ధిదారులు జూలై, ఆగస్టు నెలల్లో సర్దుబాటు చేసిన వర్సిటీ పెన్షన్‌దారులు 795 మంది ప్రతినెలా రూ.5.60కోట్లు అవసరంగత రెండునెలలు పెన్షన్ నిలిపివేయడంతో కేయూ అంతర్గత నిధులనుంచి చెల్లిండం ద్వారా వర్సిటీపై భారం పడుతుంది. అక్టోబర్‌లో సైతం పెన్షన్ చెల్లించాలంటే ఇబ్బందులు తప్పవని తెలిసిన వీసీ ప్రతాప్‌రెడ్డి.. ఈనెల 27న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సందీప్ సుల్తానీయాను కలిసేందుకు వెళ్లినట్లు తెలిసింది. అయితే అక్టోబర్ 1న పెన్షన్ విడుదల చేయకుంటే పెన్షన్ సంఘాలు కార్యచరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా ఇస్తారి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా జూవాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారిని నియమిస్తూ వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇస్తారి గతంలో జూవాలజీ విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, హాస్టళ్ల డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్వర్తించారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 52 జాతీయ, నాలుగు అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనాపత్రాలు సమర్పించారు. ఆయన పర్యవేక్షణలో 13మంది పీహెచ్డీ పూర్తి చేశారు. యూనివర్సిటీలోని విద్యార్థి వ్యవహారాల విభాగంలో సమర్థవంతమైన పాలన, పరిశోధనల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత బలోపేతానికి స్టూడెంట్స్ అఫైర్స్ డీన్‌గా ఇస్తారి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీసీ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ఇస్తారికి ఉత్తర్వులు అందజేశారు. సంవత్సరంపాటు ఇస్తారి ఈ పదవిలో కొనసాగనున్నారు. కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, ఫార్మసీ డీన్ గాదె సమ్మయ్య తదితరులు ఇస్తారిని అభినందించారు. ఉత్తర్వులు జారీ చేసిన కేయూ రిజిస్ట్రార్ -
తోటి తెగ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
గీసుకొండ: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరంగా ఉంటున్న ఆదివాసీ తోటి తెగ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదివాసీ తోటి తెగ సేవా సంఘం(ఏటీటీఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం కమలమనోహ ర్ డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్‌పాకలోని తోటి తెగ జిల్లా సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల్లో 9 తెగలు ఉండగా అందులో చెంచు, కొలం, తోటి, కొండరెడ్డి తెగలు అన్ని రకాలుగా అవకాశాలు లేక వెనుకపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు తెగలతో ఆదివాసీ తెగల ఐక్య వేదికను ఏర్పాటు చేసి రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్డు ద్వారా చేస్తున్న పోరాటానికి తమ సంఘం మద్దతుగా నిలుస్తుందన్నారు. తోటి తెగ విద్యార్థులు, యువత బాగా చదవి జీవితంలో ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. ఏటీటీఎస్ రాష్ట్ర కమిటీ ఎన్నిక ఆదివాసీ తోటి తెగ సేవా సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా షెడ్మాకి సంజీవ్ (హైదరాబాద్), అధ్యక్షుడిగా ఆత్రం కమలమనోహర్ (కరీంనగర్), ప్రధాన కార్యదర్శిగా గుర్రం రఘు (వరంగల్), ఉపాధ్యక్షుడిగా ఆత్రం జగన్ (నిజామాబాద్), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుర్రెంగ వేణు(జగిత్యాల), కోశాధికారిగా షెడ్మాకి భిక్షపతి (కరీంనగర్), వర్కింగ్ కార్యదర్శిగా సోయం రమేశ్ (సిద్దిపేట), సహాయ కార్యదర్శిగా గుర్రాల సమ్మయ్య (పెద్దపల్లి), సంయుక్త కార్యదర్శిగా సోయం శరత్‌బాబు (భూపాలపల్లి)తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి ఏటీటీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం కమలమనోహర్ -
డెంగీతో బాలుడి మృతి
మడికొండ: హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన బాలుడు డెంగీ వ్యాధితో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం మడికొండకు చెందిన పెనుకుల రాధిక– కుమార్ దంపతులు గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్‌లో కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు పెనుకుల మనీష్ (14) సంతా నం కలిగారు. ఈక్రమంలో మనీష్ నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం మడికొండలో అంత్యక్రియలు నిర్వహించారు. -
29న సద్దుల బతుకమ్మ
ఐనవోలు: ఈ నెల 29న సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాలని ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయ ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను సంప్రదాయ, ఆచారాల ప్రకారమే ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నట్లు తెలిపా రు. తొమ్మిది రోజుల్లో చివరిరోజున సద్దుల బతుకమ్మను నిర్వహించే సంప్రదాయాన్నే కొనసాగించాలని సూచించారు. గతంలో పండుగ నిర్ణయంలో సందేహం కలిగినపుడు కొడకండ్లకు చెందిన పాలకుర్తి నరసింహరామ సిద్ధాంతి సూచించిన విధంగానే సద్దుల బతుకమ్మ జరుపుకున్నట్లు గుర్తుచేశారు. వారి మార్గదర్శకంగా బ్రాహ్మణ సంఘం పెద్దల నిర్ణయం మేరకు 29నే ప్రజలు సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని మధుకర్ శర్మ ప్రకటనలో స్పష్టం చేశారు. కొలంబో మెడికల్ కళాశాల కౌన్సెలింగ్‌కు అనుమతి కాజీపేట రూరల్: వరంగల్ హంటర్‌రోడ్‌లోని కొలంబొ వైద్యకళాశాల రెండోదశ కౌన్సెలింగ్‌కు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనుమతి లభించిందని ఆ కళాశాల నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి రెండో దశ కౌన్సెలింగ్ కోసం వెబ్ ఆప్షన్లను ఉపయోగించుకోవడానికి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా.. ఇందుకు చివరి తేదీని నేటి(శనివారం) మధ్యాహ్నం 2 గటల నుంచి 29వ తేదీ ఉదయం 11 గంటల వరకు పొడిగించినట్లు తెలంగాణ కేఎన్ఆర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వారు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. అమ్మవారిపేటలో గంజాయి దహనం వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ సందర్భాల్లో పట్టుకున్న గంజాయిని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం దహనం చేసినట్లు డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 18 కేసుల్లో పట్టుబడిన రూ.3.63 కోట్ల విలువ గల 856 కిలోల గంజా యిని అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద దహనం (ఇన్సిరేషన్ పద్ధతిలో) చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్‌రాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటర్‌విద్య ఆర్జేడీ బాధ్యతల స్వీకరణ విద్యారణ్యపురి: ఇంటర్‌విద్య ఇన్చార్జ్ ఆర్జేడీగా గోపాల్ హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ఆర్జేడీ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివా స్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ తదితరులు ఆర్జేడీ గోపాల్‌ను సన్మానించారు. పూలబొకే అందించి అభినందించారు. కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ల సంఘం బాధ్యులు రేవతి, జ్యోతిర్మయి, జాన్పాషా, శోభ, పెన్షనర్ల సంఘం బాధ్యులు బా బురావు, ధర్మేంద్ర, వెంకటేశ్వ ర్లు, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అపురూప శిల ్పకళ @ రామప్ప
వెంకటాపురం(ఎం) మండలంలోని పాలంపేట పరిధిలో ఉన్న రామప్ప దేవాలయం శిల్పకళాసంపదకు పెట్టింది పేరు. 1213 సంవత్సరంలో కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి 2021లో యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో గుర్తింపు లభించడంతో దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పర్యాటకుల సంఖ్య సైతం పెరిగింది. ఇసుకనే పునాదిగా చేసి, నీటిలో తేలాడే ఇటుకలతో ఆలయ గోపురాన్ని నిర్మించడం, సరిగమలు పలికే పొన్నచెట్టు, సహజసిద్ధమైన వెలుతురులో కాంతివంతంగా దర్శనమిచ్చే రామలింగేశ్వస్వామి రామప్పకే సొంతం. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.62 కోట్లతో ప్రసాద్ ప్రాజెక్ట్ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. రామప్ప ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న రామప్ప సరస్సును రెండు గుట్టల మధ్య ఆనకట్ట నిర్మించి నిర్మించడం ఇక్కడ మరో ప్రత్యేకత. -
పర్యాటక స్వర్గం
టూరిజం స్పాట్‌గా విరాజిల్లుతున్న ములుగు నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం ● పర్యాటకులను ఆకర్షిస్తున్న బొగత ● యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ● ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం ● కనువిందు చేస్తున్న లక్నవరం ● స్వయంభుగా వెలసిన హేమాచల లక్ష్మీ నరసింహస్వామి చదువులు.. ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలతో నిత్యం సతమతమయ్యే జీవనానికి కాస్త ఉపశమనం కలిగించేది పర్యాటకం.. అయితే ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలు తప్పవు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సమీపంలో ఉండి నిత్యం ఆకర్షిస్తున్న ప్రస్తుత ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల వివరాలతో నేడు(శనివారం) ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – ములుగులక్నవరం సరస్సుగోవిందరావుపేట మండలం బుస్సాపూర్ పరిధిలోని లక్నవరం సరస్సు పర్యాటకులకు వినోద కేంద్రంగా మారింది. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ సరస్సు ఐదు వేల ఎకరాల విస్తీర్ణంతో 65 చిన్న కొండల మధ్య 13 ద్వీపాలతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. సరస్సులోని ద్వీపాలను కలిపే సస్పెన్షన్ బ్రిడ్జిలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకుల వినోదం కోసం సరస్సులో బోటింగ్, బోట్ రైడింగ్, ఐలాండ్‌లోని రిసార్ట్స్, గెస్ట్‌హౌజ్‌లు, క్యాంపు ఫైర్ ఉండడంతో కుటుంబ సమేతంగా వారాంతపు రోజుల్లో ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. -
స్వయంభుగా వెలసిన హేమాచలుడు
మంగపేట మండలం మల్లూరు గుట్టపై స్వయంభుగా వెలసిన హేమచల లక్ష్మీ నరసింహస్వామి కొరినవారి కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల పూజలందుకుంటున్నాడు. మానవ శరీరాన్ని పోలి మెత్తగా ఉన్న నాభి స్వామివారి సొంతమని అర్చకులు పేర్కొంటున్నారు. గుట్టపై బండరాళ్లతో కూడిన గుహలో స్వామి కొలువయ్యాడని, భక్తుల దర్శనార్ధం గుహను తొలగిస్తున్న క్రమంలో స్వామి వారి నాభి వద్ద గాయం ఏర్పడిందని పురాణాల్లో ఉంది. ఈ గాయం నుంచి వచ్చే ద్రవాన్ని గంధంతో కలిపి భక్తులకు నాభి చందన ప్రసాదంగా నేటికీ అర్చకులు అందిస్తుండడం గమనార్హం. నాభి చందన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అర్ధ చంద్రకారంలో ఉన్న హేమచలకొండ చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఆలయ సమీపంలో సహజసిద్దంగా వెలిసిన చింతామణి జలపాతం సంవత్సరం పొడవునా జలధార పారుతూనే ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన చెట్ల వేర్ల నుంచి వచ్చే నీటిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. తెలంగాణతో పాటు సుమారు ఐదు రాష్ట్రాల నుంచి వందలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. -
దేశ సమగ్రతకు ఐకమత్యమే చిహ్నం
● ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పర్వతగిరి: దేశ సమగ్రతకు ఐకమత్యమే మహాబలమని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కవుల అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మన దేశంలో కులాలు, మతాలకు అతీతంగా ఎందరో మతగురువులు, సూఫీలు సహజీవన సంస్కృతిని చాటి చెప్పారని అన్నారు. కలిసి కట్టుగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ గోరటి వెంకన్నకు డాక్టరేట్ ప్రకటించిన సందర్భంగా కవులు ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ జిలుకల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రతీక అన్నారం యాకుబ్‌బాబా దర్గా అన్నారు. అలయ్ బలయ్ కల్చర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బుద్దిజీవులుగా ఆ గంగా జమున సంస్కతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కవి యాకుబ్, కవి విమర్శకుడు లక్ష్మీనర్సయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కవి ప్రసేన్, స్కైలాబ్, జిలుకర శ్రీనివాస్, తాళ్లపల్లి యాకమ్మ, బండారి రాజ్‌కుమార్, వడ్లకొండ దయాకర్, రాపాక శ్రీనివాస్, కేతిరెడ్డి యాకుబ్‌రెడ్డి, చిట్ల ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర.. మేడారం
తాడ్వాయి మండలం మేడారంలో గిరిజనుల కొంగు బంగారమైన సమ్మక్క– సారలమ్మ దేవతలు కొలువై ఉన్నారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. జాతీయ పండుగగా గుర్తించి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. 2026లో జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతర కోసం ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులు కేటాయించగా పనులు ప్రారంభమవుతున్నాయి. మేడారం జాతరకు ఈసారి 150 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. మేడారం అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్‌ను ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించగా, మేడారం గద్దెల ప్రాంతాన్ని సరికొత్తగా రాతితో నిర్మించేందుకు జిల్లాకు చెందిన మంత్రి సీతక్క చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నదికి ఉపనదిగా జంపన్నవాగు మేడారం ప్రాంతం నుంచే ప్రవహిస్తుండడంతో జాతర సమయంలో కోట్లాదిమంది భక్తులు అందులోనే పుణ్యస్నానాలచరించడం ఆనవాయితీ. -
గోదావరి పరవళ్లు
● మేడిగడ్డ బ్యారేజీకి 8.35లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కాళేశ్వరం: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.410 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కర ఘాట్‌ను తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 8.35లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుంది. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఇంజనీర్లు తరలిస్తున్నారు. కాగా, రాత్రి వరకు తగ్గుముఖంపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
జనవరిలో చిన్నోడిని.. నేడు పెద్దోడిని..
కేసముద్రం: కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే.. తొమ్మిది నెలల్లో ఇద్దరు కొడుకులను హత్య చేసింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన శిరీషను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు మనీష్ కుమార్, మోక్షిత్, నిహాల్ ఉన్నారు.లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న ఉపేందర్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని, ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శిరీష మనస్తాపా నికి గురైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. తాను ఆత్మ హత్య చేసుకుంటే పిల్లలు అనాథలు అవుతారని శిరీష భావించింది. ముందుగా బిడ్డలను చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ ఏడాది జనవరి 15న రెండేళ్ల చిన్నకుమారుడు నిహాల్‌ను నీటిసంపులో పడేసి, ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ప్రమాదవశాత్తు సంపులో పడి చనిపోయినట్లు చిత్రీకరించింది. ఆ తర్వాత గత జూలై 31న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పెద్దకుమారుడు మనీష్ మెడపై కత్తితో దాడి చేసింది.గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేశారని అందరూ భావించారు. ఈనెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి మనీష్ (6) మెడకు నైలాన్‌దారం చుట్టి హత్య చేసింది. ఏమీ తెలియనట్లుగా బతుకమ్మ ఆడేందుకు వెళ్లింది. శిరీష అత్త మంగమ్మ పనికి వెళ్లి వచి్చంది. మనీష్ ఎక్కడున్నాడని శిరీషను అడగ్గా, జ్వరంగా ఉంటే ఇంట్లో పడుకోబెట్టానని చెప్పింది. అన్నం తినిపిద్దామని మనుమడి వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా, మనీష్ చనిపోయి ఉండటంతో కేకలు పెడు తూ బోరున విలపించింది. శిరీషపై అనుమానం వచి్చన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇద్దరు కుమారులను తానే చంపినట్లు ఒప్పుకుంది. శిరీషను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సర్వయ్య తెలిపారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ● ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీనెహ్రూసెంటర్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని, ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరుగుతూ ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, పేషెంట్ల రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వెంట వెంటనే పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలని సూచించారు. ప్రతీ వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి వద్ద అవుట్‌పోస్టు సిబ్బంది ఉండాలని, తదితర భద్రతా చర్యలపై సీఐ మహేందర్‌రెడ్డికి ఎస్పీ పలు సూచనలు చేశారు. తనిఖీల్లో ఇన్చార్జ్ సూపరిండెంటెంట్ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాటకాలు ఇతిహాసాల్ని తెలియజేస్తాయి
హన్మకొండ కల్చరల్: నాటకాలు ఇతిహాసాలను తెలియజేస్తాయని, నాటకాలను చూసే రామాయణ మహాభారత ఇతివృత్తాలను తెలుసుకునేవాళ్లమని తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఎఫ్డీసీ వారి ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న పందిళ్ల శేఖర్ బాబు స్మారక నాటకోత్సవం–2025 ముగిశాయి. ఈమేరకు గురువారం సాయంత్రం నాటక సమాజాల రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, వనం లక్ష్మీకాంతారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మధుసూదనాచారి, వీనస్ ఐటీఐ అధినేత శ్రీరామోజు సుందరమూర్తి, అడిషనల్ డీసీపీ నల్ల మల రవి, ఆర్యవైశ్య నాయకులు గట్టు మహేశ్‌బాబు ముఖ్య అతిఽథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజంలో చైతన్యం కలిగించడం అనేది నాటకాలు, పాటల వల్లనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన మమ్మల్ని బతకనివ్వండి నాటకం, కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారు ప్రదర్శించిన జగదేకసుందరి సామా పద్యనాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా నటులు, దర్శకులు బీఎం రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పందిళ్ల రమేశ్‌బాబు, ఆకుల శ్రీకాంత్, మారేడోజు సదానందాచారి, జూలూరు నాగరాజు, డా.వొడపల్లి చక్రపాణి, పందిళ్ల అశోక్‌బాబు, కార్యవర్గ సభ్యులు దేవరరాజు రవీంద్రరావు, మాడిశెట్టి రమేశ్, గూడూరు బాలాజీ, కళాకారులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆకట్టుకున్న‘మమ్మల్ని బతకనివ్వండి’, ‘జగదేకసుందరి సామా’ నాటక ప్రదర్శనలు ముగిసిన నాటకోత్సవాలు -
ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్ రమేశ్
● రూ. 8వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులువిద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్ల్యూ ఐడీసీ)జనగామ సబ్ డివిజన్ సైట్ ఇంజనీర్ (ఔట్ సోర్సింగ్ ) సామల రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలోని జనగామ సబ్ సబ్ డివిజన్ ఆఫీస్‌లో గురువారం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 8వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారుల(ఏసీబీ)కు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా కొడకండ్ల జెడ్పీహెచ్‌ఎస్‌కు పీఎం శ్రీ పథకం కింద సైన్స్ల్యాబ్కు రూ. 13లక్షల 50వేలు మంజూరు కాగా గది నిర్మించారు. ఆ నిర్మాణం చేయించినవారికి ఇప్పటికే కొంత బిల్లు ముట్టింది. ఫైనల్ బిల్లు కింద రూ. 3లక్షల 50వేలు చెల్లించాల్సిండగా ఆ బిల్లు ప్రాసెస్ చేసేందుకు ఫార్వర్డ్ చేయడానికి సైట్ఇంజనీర్ సామల రమేశ్.. ఆ సైన్స్‌ల్యాబ్ గదిని నిర్మించిన వ్యక్తిని రూ. 18వేల లంచం డిమాండ్‌చేశారు.ఆ వ్యక్తి తొలుత రూ. 10వేలు ఫోన్ పే ద్వారా సైట్ ఇంజనీర్ రమేశ్‌కు కొద్దిరోజుల క్రితం చెల్లింపు చేశారు. మిగతా రూ. 8వేలు చెల్లిస్తేనే ఫైనల్ బిల్లు చెల్లింపునకు సంబంఽధించి ప్రక్రియ పూర్తవుతందని రమేశ్ చెప్పడంంతో అతను (ఫిర్యాదుదారుడు) ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలోని టీజీఈడబ్ల్యూ ఐడీసీ జనగామ సబ్‌డివిజన్ ఆఫీస్‌లోనే సైన్స్ ల్యాబ్ ను నిర్మాణం చేయించిన వ్యక్తి నుంచి రూ.8వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎల్ రాజు, ఎస్‌రాజు.. రమేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం జనగామ సబ్‌డివిజన్ టీజీఈడబ్ల్యూ ఐడీసీ కార్యాలయంలో సోదాలు కొనసాగించారు. పలు రికార్డులు పరిశీలించారు. రమేశ్ వరంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తని, అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, రమేశ్ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఆ ఇంజనీరింగ్ విభాగంలోని వివిధ జిల్లాల అఽధికారుల్లో గుబులు రేపుతోంది. -
అవసరాల మేరకు యూరియా పంపిణీ
మహబూబాబాద్ రూరల్: రైతుల పంటల సాగు అవసరాల మేరకు యూరియా పంపిణీ జరుగుతుందని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా పంపిణీ ప్రక్రియను గురువారం డీఎస్పీ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను పరిశీలించి, వారు సాగు చేస్తున్న పంటల వివరాల ఆధారంగా వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారన్నారు. రైతులకు ఇచ్చిన టోకెన్లను తీసుకుని వచ్చి వారికి కేటాయించిన రైతు వేదికలు, సొసైటీ కేంద్రాల వద్ద యూరియా బస్తాలు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై ప్రశాంత్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రైతుల బారులు.. కురవి: మండల కేంద్రంతోపాటు నేరడ, గుండ్రాతిమడుగు(విలేజి), బలపాల, సీరోలు మండలం కాంపల్లి, కొత్తూరు(సీ) స్టేజీ వద్ద యూరియా పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. యూరియా టోకెన్ల కోసం రైతులు రైతు వేదికల వద్ద బారులుదీరారు. పోలీసుల బందోబస్తు నడుమ రైతులకు యూరియా పంపిణీ జరిగింది. కొత్తూరు(సీ) స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన సేల్ పాయింట్‌ను డీఏఓ విజయనిర్మల పరిశీలించారు. ఆమె వెంట సీరోలు ఏఓ చాయారాజ్ తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలో.. బయ్యారం: మండలంలోని బయ్యారం, కొత్తపేట, ఉప్పలపాడు, రామచంద్రాపురంలో గురువారం యూరియా పంపిణీ నిర్వహించగా రైతులు అధికసంఖ్యలో పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చారు. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా ప్రకటించిన పేర్లకే యూరియా ఇస్తామని తెలుపుతుండగా.. అదును తీరిన తర్వాత తమకు యూరియా ఇస్తే ప్రయోజనం ఉండదని, ఇప్పుడే ఇవ్వాలని మిగతా రైతులు అధికారులతో వాదనకు దిగుతున్నారు. -
దివ్యాంగ విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలి
విద్యారణ్యపురి: దివ్యాంగ విద్యార్థుల ప్రగతికి తోడ్పడేలా ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొ బిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి కోరా రు. బీఎస్ఐ ఆటిజం అండ్ మల్టీస్పెషాలిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో రిహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్సీఐ) సౌజన్యంతో కా జీపేట బాల వికాసలో శిక్షణ నిర్వహించారు. ఫండమెంటల్ ఆఫ్ హియరింగ్ డెఫ్నెస్ అండ్ ఆడియోలాజికల్ మేనేజ్మెంట్ శిక్షణలో భాగంగా స్పెషల్ ఎడ్యుకేటర్లకు, ఐఈఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. మూడు రోజులపాటు శిక్షణ పొందాక ఇందులో నేర్చుకున్న అంశాలను దివ్యాంగ వి ద్యార్థులకు అమలు చేయాలని సూచించారు. రిసో ర్స్ పర్సన్లుగా బీఎన్వై ఆటిజం, మల్టీ స్పెషాలిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి.నాగరాజు, వరంగల్ సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ కట్ల శ్రీనివాస్, కిరణ్‌కుమార్, న రేశ్, కపిల్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, వరలక్ష్మి, ప్రియాంక, భరత్‌రెడ్డి పాల్గొన్నారు. శిక్షణలో వివిధ జిల్లాల స్పెషల్ ఎడ్యుకేటర్లు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు. -
లక్ష్య సాధకులు..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఆషామాషీ కాదు. దీనికి కఠోర తపస్సు చేయాలి. క్షేత్ర స్థాయి నుంచి మొదలు.. ఉన్నత స్థాయి వరకు పోస్టులు వందల్లో ఉంటే దరఖాస్తులు లక్షల్లో ఉంటున్నాయి. ఈ తరుణంలో అర మార్కు కూడా అత్యంత విలువైంది. అందుకే విజయం వరించాలంటే పుస్తకాలతో నిత్యం కుస్తీ పట్టాలి.. దోస్తీ కట్టాలి. క్షణం కూడా వృథా చేయకుండా లక్ష్యం వైపు సాగాలి. అప్పుడే విజేతలుగా నిలుస్తాం. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. పలు ఉన్నతస్థాయి కొలువులను దక్కించుకున్నారు. వారి విజయగాథలపై ప్రత్యేక కథనం.. ఎంపీడీఓగా ఎదుళ్లపల్లి వాసి.. కొత్తగూడ: మండలంలోని ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన కూస రవికుమార్ గ్రూప్–1లో సత్తా చాటి ఎంపీడీఓగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన కూస కొమురయ్య, రమాదేవి దంపతుల కుమారుడు రవికుమార్ ఎంపీడీఓగా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్త చేస్తున్నారు.అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా పవన్‌కల్యాణ్.. గార్ల: మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గంగా వత్ పవన్‌కల్యాణ్ గ్రూప్–1లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. కాగా, పవన్‌కల్యాణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు, ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–1లో 454 మార్కులు సాధించి ఎస్టీ విభాగంలో 527వ ర్యాంకు పొంది ట్రెజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌లో ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమన్నారు.స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా తేజస్వినిరెడ్డి.. గార్ల/శాయంపేట: గార్ల ఎంపీఓ జె. తేజస్వినిరెడ్డి గ్రూప్–1లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. 532.5 మార్కులు సాధించి స్టేట్ 4వ ర్యాంకు సాధించారు. దీంతో తేజస్వినిరెడ్డిని ఎంపీడీఓ మంగమ్మ, తహసీల్దార్ శారద, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్, సూపరింటెండెంట్ ఉదయశ్రీ, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా వైష్ణవి.. రాయపర్తి: మండలంలోని పెర్కవేడు గ్రామానికి చెందిన పుల్లూరి రఘుబాబు, నాగరాణి దంపతుల పెద్ద కుమార్తె వైష్ణవి గ్రూప్–1లో 120 ర్యాంకు సాధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. వైష్ణవి.. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమీలో, డిగ్రీ మెరండ హౌజ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివారు. కాగా, వైష్ణవికి తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. వీరు ప్రస్తుతం వరంగల్ కాశిబుగ్గ లక్ష్మీపురంలో నివాసం ఉంటున్నారు. -
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
భూపాలపల్లి అర్బన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గురువారం భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్టు –2,3 ప్రాజెక్టుల్లో మూడు షిప్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లోని పని స్థలాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. గని ఆవరణలో రోడ్లు బురదగా మారాయి. దీంతో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్‌కాస్టులో చేరిన వర్షపు నీటిని భారీ మోటార్లు ఏర్పాటు చేసి బయటకు ఎత్తిపోస్తున్నారు. కరాటేతోనే హీరో అయ్యాను..● ప్రముఖ సినీ నటుడు సుమన్ పాలకుర్తి టౌన్: కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం, గుణాన్ని మెరుగుపరుస్తాయని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్లో కరాటే శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై కరాటేలో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటేతో తాను హీరో అయ్యానని, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 48 ఏళ్లు అవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు వివిధ భాషల్లో 800 చిత్రాల్లో నటించానని, తెలుగులో 100 సినిమాల్లో హీరో రోల్ చేశానని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటేలో శిక్షణ ఇప్పించాలని సూచించారు. వరంగల్‌కు చెందిన కరాటే మాస్టర్ యాకూబ్ మృతి చెందడం బాధాకరం అన్నారు. డబ్ల్యూఎఫ్ చీఫ్ హసన్ మాట్లాడుతూ సుమన్ లాంటి గొప్ప నటుడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా రావడం సంతోషంగా ఉందన్నారు. కరాటే ముఖ్యంగా బాలికలకు అత్యవసరమన్నారు. తెలంగాణ అధ్యక్షుడు చంద్రశేఖర్, మాస్టర్లు అన్వర్, షీటీం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతితొర్రూరు రూరల్: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని అరిపిరాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి వీరయ్య(56) పశుగ్రాసం కోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు సర్వీస్ వైరుకు కొడవలి తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. ప్రభుత్వం వీరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలి
నెహ్రూసెంటర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ కె.రాజుచౌహాన్ సూచించారు. సంస్థ కార్యాలంలో గురువారం విద్యుత్‌శాఖ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటూ సమస్య తలెత్తిన వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని పరిష్కరించాలన్నారు. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా, సరఫరాలో మెళకువలు పాటించాలన్నారు. ఓవర్‌లోడ్ సమస్యలను ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలన్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారిస్తూ ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు, రైతులకు విద్యుత్ వినియోగం, ప్రమాదాలు, భద్రతా అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సాంకేతిక అంశాలను జోడిస్తూ విద్యుత్ అంతరాయాలను తగ్గిస్తూ లో ఓల్టేజీ సమస్యలను అధిగమించాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ సూపరింటెండెంట్ పి.విజయేందర్‌రెడ్డి, డీఈలు విజయ్, సునీతాదేవి, హీరాలాల్, ఏడీలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్‌గా రాజశేఖర్‌రెడ్డి..
బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–1లో మున్సిపల్ కమిషనర్ పోస్టుకు ఎంపికయ్యారు. రాజశేఖర్‌రెడ్డి పదో తరగతి బచ్చన్నపేట ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ ఏపీఆర్జేసీ నిమ్మకూర్లో, బీటెక్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పూర్తి చేశారు. 2014లో ఏపీపీఎస్సీలో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై న రాజశేఖర్‌రెడ్డి 2024లో గ్రూప్–4లో 279 ర్యాంకు సాధించారు. గ్రూప్–2లో 424 మార్కులు సాధించి రాష్ట్ర 8వ ర్యాంకర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు చిమ్ముల అరుణ, మల్లారెడ్డితోపాటు గ్రామస్తులు రాజశేఖర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. -
ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డీడీ బాధ్యతల స్వీకరణ
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్‌గా దబ్బకట్ల జనార్దన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీడీగా పనిచేసిన పోచం కమిషనరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. మంచిర్యాలలో డీటీడీఓగా పనిచేసిన జనార్దన్ పదోన్నతిపై ఏటూరునాగారం బదిలీ కావడంతో విధుల్లో చేరారు. అనంతరం పీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జీసీడీఓ పెనక సుగుణ, పీసా కోఆర్డినేటర్ ప్రభాకర్, కాక భాస్కర్, మైనర్‌బాబు, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
మహబూబాబాద్/కురవి/తొర్రూరు/నెహ్రూసెంటర్: జిల్లాలో బతుకమ్మ వేడుకలు కొనసాగుతున్నాయి. ఐదురోజు గురువారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ, విద్యుత్‌శాఖ, మెప్మా ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా అధికారులు, సిబ్బంది బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆట ఆడారు. అలాగే తొర్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఉత్తమ బతుకమ్మలు పేర్చిన సిబ్బందికి డీఎంహెచ్ఓ రవిరాథోడ్, డీసీహెచ్ఎస్ చింత రమేశ్, ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్ సుగుణాకర్‌రాజు బహుమతులు అందించారు. కురవి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, బీఆర్ఎస్ నాయకురాలు హరిత పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో ఆరేళ్ల బాలుడి మృతి
కేసముద్రం: అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణ పురం గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్‌రాజు తె లిపిన వివరాల ప్రకారం.. పందుల ఉపేందర్, శిరీ ష దంపతులకు ఇద్దరు కుమారులు మనీష్‌కుమార్(6), మోక్షిత్ ఉన్నారు. ఉపేందర్ తన తల్లిదండ్రులు ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎల్లయ్య మేకలు మేపేందుకు ఊరి బయటకు వెళ్లగా, మంగమ్మ పత్తి ఏరడానికి కూలి పనికి వెల్లింది. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉ పేందర్ పని నిమిత్తం వెళ్లాడు. శిరీష తన ఇద్దరు కుమారులతో ఇంటివద్దే ఉంది. సాయంత్రం ఇంట్లో పెద్దకుమారుడు మనీష్‌కుమార్‌ను పడుకోబెట్టి, ఇంటికి కొంతదూరంలో బతుకమ్మ ఆడేందుకు తన చిన్నకుమారుడితో వెళ్లింది. సాయంత్రం కూలి పని కి వెళ్లి వచ్చిన మంగమ్మ తన కోడలు వద్దకు వెళ్లి మ నీష్కుమార్ ఎక్కడున్నాడని అడిగింది. జ్వరం వస్తే ఇంట్లో పడుకోబెట్టానని ఆమె తెలిపింది. రాత్రి అ యినా మనీష్‌కుమార్ అలాగే పడుకుని ఉన్నాడు. అన్నం తినిపించడానికి మంగమ్మ మనుమడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా అప్పటికే మనీష్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. దీంతో ఆమె కేకలు పెట్టగా చుట్టుపక్కల వారు వచ్చారు. స్థానిక ఆర్ఎంపీ కూడా బాలుడు మృతి చెందినట్లు తెలిపాడు. బాలుడి మెడ కమిలి ఉండడంతో ఉరివేసి గుర్తుతెలియని వ్యక్తులు చంపి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత జూలై 31న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మనీష్‌కుమార్ మెడపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న మనీష్‌కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కాగా, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి నానమ్మ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నారాయణపురంలో విషాదఛాయలు ఇటీవల మెడపై కత్తితో దాడిపందుల ఉపేందర్, శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు మనీష్‌కుమార్, మోక్షిత్, నిహాల్ ఉన్నారు. 2025 జనవరి నెలలో ఇంటి ఆవరణంలో ఉన్న నీటిసంపులో పడి చిన్నకుమారుడు నిహాల్ మృతి చెందాడు. ఇప్పుడు పెద్దకుమారుడు మనీష్‌కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇలా ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. -
సీసీఎస్ సభ్యులకు కొత్త పథకాలు
● ఎస్సీఆర్ఈ సీసీఎస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి కాజీపేట రూరల్: సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఎస్సీఆర్ఈ సీసీఎస్) లిమిటెడ్ సభ్యులకు కొత్త పథకాలకు రూపకల్పన చేసినట్లు ప్రెసిడెంట్ డాక్టర్ చిలుకు స్వామి అన్నారు. కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్లో గురువారం నామినేటెడ్ డైరెక్టర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షతన ఈసీసీఎస్ 11వ నియోజకవర్గ కాజీపేట డెలిగేట్స్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా చిలుకు స్వామి హాజరై మాట్లాడుతూ కాజీపేటలోని సుమారు 2,900 మంది సీసీఎస్ సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న సికింద్రాబాద్ హెడ్ఆఫీస్లో జరిగే డైరెక్టర్ల సమావేశంలొ కొత్త పథకాలకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్స్‌రెన్స్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, ఒకే లోను సిస్టంలో రూ.20 లక్షలు ఇచ్చేందుకు, దీపావళి కానుకగా సభ్యుల ఖాతాలో డివిడెంట్ జమ, నాన్ రికవరీ కేసులకు లీగల్ నోటీసులు పంపించి చట్టపరంగా రికవరీ చేయుట, మరణించిన సొసైటీ సభ్యుడికి ఫెనరల్ కోసం ఇచ్చే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఈసీసీఎస్ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్‌యాదవ్, 10వ నియోజకర్గ డైరెక్టర్ ఓవై స్వామి, డెలిగేట్స్ పాక వేదప్రకాశ్, బి.శ్రీనివాస్, ఇ.రాజేందర్, జి.రాజు, సునీల్, నల్ల రమేశ్, ఎల్కే యాదవ్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు
హన్మకొండ: దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించనుంది. ఆర్టీసీ సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీతోపాటు అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఈ లక్కీ డ్రాకు అర్హులు. వరంగల్ రీజియన్ పరిధిలో డ్రా తీసి ముగ్గురికి బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలుగా ప్రకటించింది. ప్రయాణికులు టికెట్ వెనుక వైపు పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి బస్ స్టేషన్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్‌ల్లో వేయాలి. వరంగల్ రీజియన్‌లోని హనుమకొండ, వరంగల్, ములుగు, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ, పరకాల, భూపాలపల్లి, ఉప్పల్ బస్టాండ్‌లో ప్రత్యేక బాక్స్‌లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బాక్స్‌ల్లో వేసిన టికెట్లను ఒక చోటుకు చేర్చి వరంగల్ రీజియన్ స్థాయిలో డ్రా తీసి విజేతలను ప్రకటించి నగదు బహుమతి అందిస్తారు. -
గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా ఉదయ్‌కుమార్
రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన కొయ్యడ ఉదయ్‌కుమార్ గ్రూప్–1 ఫలితాల్లో గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొయ్యడ ప్రభాకర్– లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్‌కుమార్ రఘునాథపల్లి తేజస్వి స్కూల్లో పదో తరగతి వరకు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాలిటెక్నిక్ , ఘట్కేసర్ విజ్ఞాన భారతిలో బీటెక్, నిజాంకాలేజీలో ఎంబీఏ పూర్తి చేశారు. కాగా, గతేడాది డిసెంబర్లో సింగరేణిలో పర్సనల్ మేనేజర్ ఉద్యోగం సాధించి విధులు నిర్వర్తిస్తున్నారు. నయీంనగర్/కేయూ క్యాంపస్: గ్రేటర్ వరంగ ల్ 54వ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన రావుల జగదీశ్వర్ ప్రసాద్, శ్రీదే వి దంపతుల కుమారుడు తరుణ్‌ప్రసాద్ ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యా రు. తరుణ్‌ప్రసాద్ కిట్స్ వరంగల్‌లో బీటెక్ పూర్తిచేసి గ్రూప్–1 కు ప్రిపేర్ అవు తూ మొ దటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఈ సందర్భంగా తల్లిందడ్రులు, బంధుమిత్రులు తరుణ్ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీగా దైనంపల్లి ప్రవీణ్.. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో 105 ర్యాంకు సాధించారు. మల్టీజోన్–1లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పోస్టుకు ఎంపికయ్యారు. కాగా, ప్రవీణ్ ప్రస్తుతం యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాసి ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. -
ఎంజీఎంలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
ఎంజీఎం: విషజ్వరాలతో చిన్నారులు విలవిల్లాడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పిల్లల ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సిద్దిపేట, కరీంనగర్, హుజూరాబాద్ వంటి ప్రాంతాల నుంచి చిన్నారులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడ అన్ని విభాగాల కంటే పిడియాట్రిక్ విభాగం పనితీరు భేష్‌గా ఉండేదని చెప్పేవారు. కాగా, ప్రస్తుతం ఈ విభాగం పనితీరు అధ్వానంగా మారుతోంది. విషజ్వరాలు, డెంగీ తదితర వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చిన్నారులు అరకొర వసతుల నడుమ చికిత్స పొందుతున్నారు. 120 మందికి డెంగీ.. సీజన్ వ్యాధుల్లో భాగంగా చిన్నారులపై విషజ్వరాలు, డెంగీ పంజా విసురుతున్నాయి. ఈనాలుగు నెలల కాలంలో 500 మంది చిన్నారులు విషజ్వరాలతో ఎంజీఎంలో చికిత్స పొందారు. 120 మందికిపైగా డెంగీతో చికిత్స పొందుతున్నారు. అలాగే, 30కి పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. వీటన్నింటికీ తోడు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్‌కు పరుగులు ఎంజీఎం ఆస్పత్రిలో రక్త పరీక్షలకు రీ ఏజెంట్స్ కొరత రోగులకు పెద్ద తలనొప్పిగా మారింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సమయానికి రీ ఏజెంట్స్ రాకపోవడం.. కాంట్రాక్టర్ల నుంచి కొనుగోలు చేద్దామంటే బిల్లుల చెల్లింపులు లేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో కాంట్రాక్టర్లు సరఫరా చేయక చేతులెత్తేయడంతో పలు రక్త పరీక్షలకు రో గులు ప్రైవేట్‌కు పరుగులు తీయక తప్పడం లేదు. ప్రొఫెసర్లు గైర్హాజరు పిల్లల విభాగంలో పలువురు ప్రొఫెసర్లతోపాటు అసోసియేట్ వైద్యులు సైతం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పిల్ల ల విభాగంపై వైద్యాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. వారంలో రెండు రోజులకోసారి విధులకు వచ్చే వైద్యులు ఇక్కడ నాలుగు గంటలు సైతం విధులు నిర్వర్తించకపోవడం పరిపాటిగా మారింది. పీజీ వైద్యులే సేవలందిస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆస్పత్రిలో పలు విభాగాల వైద్యసేవలు మెరుగుపర్చాలని రోగులు కోరుతున్నారు. రద్దీకి తగిన సౌకర్యాలు కల్పించాలని చిన్నారుల తల్లిదండ్రుల మొర వైద్యాధికారుల గైర్హాజరు.. క్షీణిస్తున్న వైద్యసేవలు రీ ఏజెంట్స్ కొరత.. రక్త పరీక్షల కోసం ప్రైవేట్‌కు పరుగులు -
వయోవృద్ధుల సంక్షేమమే లక్ష్యం!
మహబూబాబాద్: వయోవృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వయోవృద్ధుల మల్టీ సర్వీస్ డే కేర్‌సెంటర్ మంజూరు చేసింది. సెంటర్ ఏర్పాటు కోసం జిల్లా సంక్షేమశాఖ అధికారులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. సెంటర్ నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూ ద్వారా నిర్వాహకుడిని ఎంపిక చేయనున్నారు. కాగా, సెంటర్ మంజూరుపై వయోవృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాలక్షేపం కోసం..అరవై ఏళ్లు దాటిన వయోవృద్ధుల కాలక్షేపం కోసం జిల్లాకు ఒక సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. సెంటర్ నిర్వహణకు ఖాళీ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు జిల్లా సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో సీడీపీఓ శిరీష, డీఈఓ దక్షిణామూర్తి ఎంఈఓ వెంకటేశ్వర్లుతో కలిసి పాత డీఈఓ కార్యాలయం భవనాన్ని పరిశీలించారు. దీంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలించినప్పటికీ.. పాత డీఈఓ కార్యాలయ భవనమే అనుకూలంగా ఉందని, అదే ఖరారు కానున్నట్లు పేర్కొన్నారు.పలు ఏర్పాట్లతో పాటు స్నాక్స్..సెంటర్లో క్యారంబోర్డుతో పాటు చెస్, న్యూస్ పేపర్లు, ఇతర పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు సెంటర్ తెరిచి ఉంచుతారు. వయోవృద్ధులకు స్నాక్స్ సైతం ఇవ్వనున్నారు. సెంటర్లో సూపరింటెండెంట్‌కు నెలకు రూ.10,000, సోషల్ వర్కర్‌కు రూ.5,000, వంట మనిషికి రూ.5,000 ఇతర వర్కర్‌కు రూ.8,000 చొప్పున కేంద్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది. ప్రభుత్వ భవనాలు అనుకూలంగా లేకుంటే, అద్దె భవనం కోసం నెలకు రూ,5,000 అద్దె చెల్లిస్తుంది. వారంలో ఒక రోజు ప్రభుత్వ వైద్యుడు సెంటర్‌కు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తాడు.బ్లాక్ లిస్టులో ఉంటే తిరస్కరణ..సీనియర్ సిటిజన్, ఎన్జీఓలు బ్లాక్ లిస్టులో ఉన్నా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో ఉంటే వారి దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా నిబంధనలన్నీ పరిశీలించి డీడబ్ల్యూఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగా జిల్లా జనాభాలో వయోవృద్ధులు 20శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌లో 900 మంది వయోవృద్ధులు సభ్యులుగా ఉండగా పదవీ విరమణ పొంది పెన్షన్ తీసుకునే వారు వందల సంఖ్యలో ఉన్నారు.ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీ..నిర్వాహకుడి ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా డీఆర్డీఏ, డీఎంహెచ్ఓ, ఒకరు సీనియర్ సిటిజన్, కన్వీనర్‌గా డీడబ్ల్యూఓ ఉంటారు. కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూ నిర్వహించి నిర్వాహకుడిని ఎంపిక చేస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ అంతా వేగవంతం చేశారు.సెంటర్ నిర్వహణ బాధ్యతలను ఎన్జీఓ(నాన్ గవర్నమెంట్ ఆర్గనేజేషన్), సీనియర్ సిటిజన్లకు అప్పగిస్తారు. అందుకు ఈనెల 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఈనెల 25(గురువారం)వరకు మాత్రమే గడువు ఇచ్చింది. డీడబ్ల్యూఓ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. దరఖాస్తు చేసుకునే వారు తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ 2001 కంపెనీ యాక్టు 1956, ఇండియన్ ట్రస్ట్ యాక్టు 1882 ద్వారా రిజిస్ట్రేషన్ అయి ఉండాలని అధికారులు తెలిపారు. ఎన్జీఓ, సీనియర్ సిటిజన్ అసోసియేషన్, ఓల్డేజ్ హోం, చిల్డ్రన్స్ హోం నిర్వహణలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అర్హతలు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. -
బతుకమ్మ సంబురాలు విజయవంతం చేయాలి
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్వార్డులు, జిల్లాని ఆస్ప త్రులు, అంగన్వాడీ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఈనెల 25నుంచి బతుకమ్మ సంబురాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27న కలెక్టర్ కార్యాలయాన్ని పూలతో అలంకరించాలన్నారు. రోజు సాయంత్రం 4గంటలకు కలెక్టర్ ప్రాంగణంలో అన్ని విభాగాల మహిళా సిబ్బందితో బతుకమ్మ సంబురాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 27న సాయంత్రం బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం సూచించిన విధంగా తమ సిబ్బందికి ప్రొటోకాల్ ప్రకారం తగు సూచనలు చేసి, పండుగ వాతావరణం ఉట్టిపడేలా కార్యాలయాలను పూలతో అలంకరించుకొని బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలన్నారు. ఆదివాసీల అభివృద్ధికి ‘ఆదివాసీ కర్మయోగి’ మహబూబాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆదివాసీ కర్మయోగి పథకం ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గిరిజనశాఖ ఆధ్వర్యంలో బుధవారం మండలస్థాయి ఆదివాసీ కర్మయోగి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. తండాలు, గూడేల్లో ప్రజల స్థితి గతులు పరిశీలించి, వారి సమస్యలను వారే పరిష్కరించుకొనే దిశగా సూచనలు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల్లో పథకంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శంకర్, డాక్టర్ మౌనిక, ట్రైబల్ హెచ్‌డబ్ల్యూఓ అనిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి, మిషన్ భగీరథ ఏఈ శ్రీకాంత్, ఎఫ్ఆర్ఓ జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారిగా శ్రీనివాసరావు మహబూబాబాద్ అర్బన్: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారిగా శ్రీనివాసరా వు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన అధికారి ఎం.నరసింహస్వామి హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా, కార్యాలయ అధికారులు, సిబ్బంది జిల్లా అధికారి శ్రీనివాసరావును మ ర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అదనపు బాధ్యతలుమహబూబాబాద్ అర్బన్: జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమశాఖ అధికారిగా బి.శ్రీనివాస్ బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన జిల్లా అధికారి ఎం.నర్సింహస్వామి హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా జిల్లా మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. రైతులు జాగ్రత్తలు పాటించాలి మహబూబాబాద్ రూరల్ : రైతులు మిరప నారు కొనుగోలులో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల మంగళవారం తెలిపారు. జిల్లా అధికారులు ధ్రువీకరించిన నర్సరీల నుంచి మాత్రమే మిరప నారు కొనుగోలు చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మిరప నారును ఎలాంటి ధ్రువీకరణ బిల్లులు లేకుండా రైతులు కొనుగోలు చేయవద్దని తెలిపారు. పేరొందిన కంపెనీల నారు మొక్కలను కొనుగోలు చేయాలన్నారు. గుర్తు తెలియని, అడ్రస్ లేని వారి నుంచి మిరప నారు కొనుగోలు చేసి రైతులు ఇబ్బందులు పడొద్దని సూచించారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత ఉద్యాన, వ్యవసాయ అధికారులను సంప్రదించాలని వారు పేర్కొన్నారు. -
వేతన వెతలు!
● వేతనాలు రాక సీఆర్టీల ఇబ్బందులు ● ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు ● పట్టించుకోని అధికారులుమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం అదనంగా సీఆర్టీలను నియమించింది. కాగా, ఈ విద్యా సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 326 ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2,102 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వారికి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 116 మంది సీఆర్టీలు.. జిల్లాలోని 19 ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 116 మంది సీఆర్టీలు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబర్ నెల వేతనం కూడా పడుతుందో లేదో తెలియదు. కాగా బయట అప్పులు చేసి తమ కుటుంబాలను వెళ్లదీసుకుంటున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి నిర్వహణ ఇబ్బందిగా మారిందని వారు వాపోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చేందుకు రవాణా ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా మొత్తం వేతనాలు విడుదల చేయకపోతే ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరిస్తున్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 95శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కాగా సీఆర్టీలు ఇటు విద్యాబోధన, అటు క్రీడల్లో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. -
స్వదేశీ విధానంతోనే దేశం ముందడుగు
● కేయూ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి విద్యారణ్యపురి/ గీసుకొండ : స్వదేశీ విధానంతోనే దేశం ముందుకెళ్తుందని కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏర్ప డి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొనసాగుతున్న శతాబ్ది కార్యక్రమంలో భాగంగా ఈ విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో ప్రధానవక్తగా మామిడాల ఇస్తారి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ స్థాపకుడు హెడ్గేవార్ జీవిత విశేషాలను వివరించారు.స్వాతంత్య్రానికి ముందే ఆయన కాంగ్రెస్, హిందుమహసభల్లో పాల్గొని దేశానికి సేవచేశారన్నారు. అనేక సార్లు జైలుకెళ్లారన్నారు. కేవలం స్వాతంత్య్రం సంపాదించుకోవడమేగాకుండా దానిని నిలబెట్టుకునేందుకు మళ్లీ దేశం పరాయి పాలనలోకి వెళ్లకుండా నిరోధించేందుకు స్వయంసేవకులను తీర్చిదిద్దే వేదికగా ఆర్ఎస్ఎస్ను ప్రారంభించారని తెలిపారు. సంఘ్ జాతీయ సమైక్యత, సాంస్కృతిక పరిరక్షణ, దేశభక్తి కోసం పోరాడి చారిత్రక విజయాలు సాధించిందన్నారు. విదేశీ వస్తువుల వినియోగంతో దేశ ఆర్థిక వ్యవస్ధ దెబ్బతింటుందన్నారు. రూపాయి విలువ పడిపోతుందన్నారు. అందుకే స్వదేశీ విధానం అనుసరించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. కాశిబు గ్గు నగర్ సంఘ్సంచాలక్ చామర్తి ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ దేశసేవలో ముందుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి రాజు, కోటిలింగాల బస్త్తీకి చెందిన ఆర్ఎస్ఎస్ బాధ్యులు శ్రీనాథ్, వేణు, గణేశ్, నాగరాజు పాల్గొన్నారు. -
డీజేను నిషేధిద్దాం!
ఖిలా వరంగల్: ప్రస్తుతకాలంలో ఊరేగింపులు.. పెళ్లిళ్లు.. జన్మదినాలు.. చావులు.. రాజకీయ పార్టీల సభలు.. ర్యాలీలు.. ఇలా వేడుక ఏదైనా డీజేను విరివిగా వినియోగిస్తున్నారు. ఆయా సందర్భాల్లో కచ్చితంగా డీజే శబ్దాల మోత మార్మోగుతోంది. నిన్న, మొన్నటి వరకు ఎక్కడో హైదరాబాద్ లాంటి మహానగరాలు, పబ్‌లకు పరిమితమైన ఆ సంస్కృతి నేడు నగర, పట్టణాలు, పల్లెలకు చేరింది. ఫలితంగా ఇప్పటికే వాయు కాలుష్యంతో అల్లాడితున్న జనం.. ప్రస్తుతం ఈ డీజే శబ్ద కాలుష్యం బారిన పడి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కాగా, సుప్రీం కోర్టు మార్గదర్శకాల్ని ఉల్లంఘించేలా డీజే శబ్దాలు ఉంటున్నా నియంత్రణకు చర్యలు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. నిబంధనలు బేఖాతర్.. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రివెన్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సౌండ్ పొల్యూషన్ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దం చేసే డీజేలు, బాణాసంచా పేల్చడం లాంటి చర్యలపై నిషేధం ఉంది. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. రాత్రి 10 తర్వాతే పెళ్లిళ్లు, జన్మదిన వేడుకలు, రాజకీయ పార్టీల ఊరేగింపుల్లో శబ్దాల మోత దద్దరిల్లుతోంది. ఆ మోతలు చెవులకు చిల్లులు పడుతున్నాయి. ముప్పు గుర్తిద్దాం.. సాధారణంగా మానవుడి చెవులు 120 నుంచి 130 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని భరిస్తాయి. 150 డెసిబుల్స్ వరకు వెళ్తే వినికిడి సమస్యలు వస్తాయి. కర్ణబేరి దెబ్బతినే అవకాశం ఉంది. రక్తపోటు పెరుగుతోంది. డీజే నుంచి వెలువడే వైబ్రేషన్స్‌తో శరీరంలో నాడి వ్యవస్థ దెబ్బతిని మొదడుకు రక్తం సరఫరా తగ్గుతుంది. గుండెకు రక్తం అందించే నాళాలు మూసుకుపోతాయి. ఫలితంగా గుండెకు రక్తం సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పదేపదే చెబుతున్నారు. గర్భిణులు డీజే శబ్దం వింటే గర్భస్థ శిశువు నిద్రకు విఘాతం కలుగుతుంది. తద్వారా పిండం పెరుగుదల, శిశువు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బాలింత, నవజాత శిశువు చెవులకు అధిక శబ్ధం చేరితే వినికిడి సమస్యలతో పాటు శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రసవం తర్వాత తల్లి, బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం నిబంధనలు పట్టించుకోని నిర్వాహకులు కనిపించని డీజే నియంత్రణ చర్యలు ప్రమాదంలో ప్రజారోగ్యండీజే శబ్దంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఈఎన్టీ వైద్యులు చెబుతున్నారు. 85 డెసిబుల్స్ శబ్దం దాటితే వినికిడి, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. రక్తపోటు(బీపీ) పెరుగుతుంది. నిద్రలేమితోపాటు ఒత్తిడి పెరిగి మైగ్రేన్ సమస్యలు వస్తాయి. అలర్జీతోపాటు శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. తలనొప్పి చికాకుతోపాటు నిద్రలేమి, అలసట ఏర్పడుతుంది. ఎక్కువ కాలం అధిక శబ్దం వినడంతో గుండె జబ్బులు, చెవుడు రావొచ్చు. మానసిక, శారీర కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ శబ్దంతో పెరుగుతున్న గుండె జబ్బులు.. శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలి డీజే శబ్ద కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. గుండె జబ్బులు, నిద్రలేమి, రక్తపోటు(బీపీ)వినికిడి సమస్యలు అధికంగా వస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలి. డాక్టర్ ఎండీ సలీం జనరల్ ఫిజీషియన్, వరంగల్ -
రైతుకు భరోసా.. కిసాన్ మాన్‌ధన్
కాజీపేట : అన్నదాతల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులు వ్యవసాయం చేస్తున్న సమయంలోనే చాలా పథకాలు ఉపయోగపడుతున్నాయి. వృద్ధాప్యంలో రైతులు ఆదాయ మార్గాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకు వయస్సులో ఉండగానే కొంత ప్రీమియం చెల్లిస్తే వృద్ధాప్యంలో ప్రతీ నెల పింఛన్ రూపంలో ఆదాయం అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్లు నిండిన రైతులకు ప్రతీ నెలా రూ.3వేల పింఛన్ అందించడం ఈ పథకం లక్ష్యం. నెలకు రూ.55 మాత్రమే.. 18–40 ఏళ్లున్న రైతులు ప్రతీ నెలా వారి వయస్సుల ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18నుంచి 20ఏళ్ల వరకు రూ.55లు చెల్లించాల్సి ఉంటుంది. రైతు రూ.55 చెల్లిస్తే కేంద్రం తన వాటాగా రూ.55 చెల్లించి మొత్తం రూ.110 ప్రీమియం చెల్లిస్తుంది. ఇలా 40 ఏళ్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత సంబంధిత రైతుకు నెలకు రూ.3వేల పింఛన్ అందుతుంది. ఒకవేళ రైతు మరణిస్తే వారి నామినికి రూ.1,500 పింఛన్ అందజేస్తారు. ఎవరు అర్హులు.. 18–40 ఏళ్లు ఉండి.. ఐదెకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. సొంత భూమి కలిగి పట్టా పాసుపుస్తకం ఉండాలి. జాతీయ పింఛన్ పథకం (ఎన్పీఎస్), ఈపీఎఫ్ పరిధితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు అనర్హులు. దరఖాస్తు సులువే.. పీఎం కిసాన్ మాన్‌ధన్ పింఛన్ కోసం ఆసక్తి, అర్హత ఉన్న రైతులు సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని రైతు నామిని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి. అనంతరం పింఛన్ కార్డు వస్తుంది. పీఎం కిసాన్ పథకానికి అనుసంధానమైన బ్యాంకు నుంచి ప్రీమియం నగదు చెల్లించాలి. ఆధార్ కార్డు, భూమి రికార్డు, బ్యాంకు ఖాతా పత్రాలు ఉండాలి.అవగాహన కల్పిస్తున్నాం కిసాన్ మాన్‌ధన్ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లో జరిగే సమావేశాలతో పాటు వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాం. ఈ పథకం వృద్ధాప్యంలో ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో సంప్రదించాలి. – సంతోష్, ఏఓ, కాజీపేట వృద్ధాప్యంలో అన్నదాతకు పింఛన్ ప్రయోజనం -
డోర్నకల్ వాసికి అరుదైన గౌరవం
డోర్నకల్ : డోర్నకల్‌కు చెందిన ఉప్పరి పృథ్వీకి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2023వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా తెలుగు సినిమా ‘హనుమాన్’కు సంబంధించి బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఉప్పరి శేఖర్, రూపావతి దంపతుల కుమారుడు పృథ్వీ సినీరంగంలోకి ప్రవేశించి సుమారు 50 సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ‘క్లూ’ అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. పృథ్వీ తండ్రి శేఖర్ కూడా పలు సినిమాల్లో నటించడంతో పాటు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసి పలు అవార్డులు అందుకున్నారు. చాలా కాలంగా శేఖర్, పృథ్వీ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా వీరి కుటుంబ సభ్యులు డోర్నకల్‌లో ఉంటున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న పృథ్వీ -
గ్యాస్ లీకై ందా.. డయల్ 1906
కాజీపేట : వంట గ్యాస్ సిలిండర్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలకు ఆస్కారం ఉంది. మహిళలు ఎప్పటికప్పుడు సిలిండర్‌ను కదపడం, ప్రతీసారి రెగ్యులేటర్ సరిచేయడం వంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. గ్యాస్ లీకేజీకి కారణాలు.. రెగ్యులేటర్‌ను సిలిండర్‌కు అనుసంధానం చేసేటప్పుడు రబ్బర్ వాషర్ (ఓరింగ్) కొన్నిసార్లు సరిగా అమర్చి ఉండదు. దీంతో రెగ్యులేటర్‌ను బిగించగానే సిలిండర్ నుంచి గ్యాస్ బయటకు వచ్చే చాన్స్ ఉంది. ఇది ఏజెన్సీ ప్రతినిధి మాత్రమే సరిగా వేయగలరు. ఇక రెగ్యులేటర్ నుంచి స్టవ్‌కు సురక్ష ట్యూబ్ ఉంటుంది. దాని కాల పరిమితి ఐదేళ్లు..పరిమితి దాటిన తర్వాత కచ్చితంగా కొత్త ట్యూబ్ తీసుకోవాలి. లేకపోతే దాని ద్వారా కూడా గ్యాస్ లీకయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రదేశంలోనైనా గ్యాస్ లీక్ అయితే వెంటనే సంబంధిత ఏజెన్సీల అత్యవసర నంబర్‌కు గాని, టోల్‌ఫ్రీ నంబరు 1906 కాని ఫోన్‌చేయాలి. వెంటనే అక్కడి నుంచి మెకానిక్ వచ్చి సమస్య పరిష్కరిస్తారు. అందుకు వినియోగదారుడు ఎటువంటి నగదు ఇవ్వాల్సిన అవసరం లేదు. పీడీసీ చెక్ చేసుకోవాలి.. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి సిలిండర్ ఇచ్చిన వెంటనే వినియోగదారుడు పీడీసీ (ప్రీ డెలివరీ చెక్) చేయించుకోవాలి. ‘మా కర్తవ్యం..మీ బాధ్యత’ అనే నినాదంతో ఉన్న వాచర్ చెక్ చేసుకోవాలి. అనంతరం ఇంట్లో రెగ్యులేటర్‌ను అమర్చి చూసుకోవాలి.గ్యాస్ వాసన గుర్తించిన వెంటనే ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి పెట్టాలి. ఎలక్ట్రికల్ స్విచ్‌లు వేయడం, అర్పడం కాని చేయకూడదు. వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. చిన్నారులు, వృద్ధులను దూరంగా ఉంచాలి. గదిలో ఎల్లప్పుడు గాలి బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. -
భద్రకాళికి సింహవాహన, గజవాహన సేవలు
చంద్రఘంటా అలంకరణలో పద్మాక్షి అమ్మవారురోహిణినిత్యగా శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారురోహిణినిత్యగా శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు హన్మకొండ కల్చరల్ : వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో బుధవారం దేవీశర్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని రోహిణినిత్యగా అలంకరించి నిత్యాక్లిన్న క్రమంలో పూజలు జరిపారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.చంద్రఘంటా అలంకరణలో పద్మాక్షీ దేవి హన్మకొండ అర్బన్ : పద్మాక్షీ దేవి చంద్రఘంటా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని తెలిపారు. అమ్మవారికి షో డశ కలశాలతో మహోనారాయణోపనిషత్తుతో అభిషేకం నిర్వహించి అలంకరించినట్లు తెలిపారు. అనంతరం హోమాన్ని నిర్వహించిన ట్లు పేర్కొన్నారు. దాతలు కీర్తి ఉమెన్ చిల్డ్రన్ హా స్పిటల్ ముక్కా దిలీప్–అర్చన, మాధవరావు–మాధవి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం జరిపి అమ్మవారి మూలమూర్తిని గాయత్రీమాతగా అలంకరించారు. ఉదయం చంద్రఘంటా క్రమంలో దుర్గార్చన జరిపి సింహవాహనంపై, సాయంత్రం మహిషాసురమర్ధిని క్రమంలో దుర్గార్చన జరిపి గజవాహనంపై ఊరేగించారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం, రాత్రి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. -
29న సద్దుల బతుకమ్మ
హన్మకొండ కల్చరల్: సద్దుల బతుకమ్మ వేడుకలు ఈ నెల 29న నిర్వహించుకోవాలని వరంగల్ శ్రీరాజరాజేశ్వరి దేవాలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 21న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైందని, 9వరోజు సద్దుల బతుకమ్మతో ఉత్సవం ముగుస్తుందని పేర్కొన్నారు.ఫార్మసీ యాక్ట్ అమలు చేయాలి● రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పు భాస్కర్రావుఎంజీఎం: ఫార్మసీ వృత్తిని ప్రభుత్వాలు గుర్తించాలని రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పు భాస్కర్‌రావు అన్నారు. గురువారం ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడారు. తెలంగాణలో 17 డిప్లొమా, 136 డిగ్రీ, బీఫార్మసీ, 42 ఫార్మ్‌డీ (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) కళాశాలలు ఉన్నాయన్నారు. ఫార్మసీ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఫార్మసీ కళాశాలలో బోధన సిబ్బందిగా, డ్రగ్ కంట్రోల్ శాఖలో డ్రగ్ ఇన్స్పెక్టర్గా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీ ఆఫీసర్లుగా, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌ల్లో అనలిస్ట్‌లుగా, ప్రైవేట్ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఫార్మసీ యాక్ట్ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆయన కోరారు. -
పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి
కాజీపేట : ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపితే.. హెల్మెట్, లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)తో పాటు పొల్యూషన్ సర్టిఫికెట్‌ను కూడా అడుగుతారు. పొల్యూషన్ సర్టిఫికెట్ మినహా అన్ని ఉన్నాయని, వదిలేయమని వాహనదారులు చాలా సార్లు అడిగిన సందర్భాలు చూస్తుంటాం. నిజానికి పొల్యూషన్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాల్సిందే. ద్విచక్ర వాహనం, కారు, లారీ ఇలా ఏ వాహనమైనా రోడ్డెక్కాలంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ (పీయూసీ) అవసరం. చాలా మంది పొల్యూషన్ సర్టిఫికెట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం ఇది నేరం. దీనికి జరిమానా చెల్లించాల్సిందే. అసలు ఈ పొల్యూషన్ సర్టిఫికెట్ ఎందుకు అవసరం? ఇది ఎంత కాలం చెల్లుబాటు అవుతుంది? ఈ సర్టిఫికెట్లో ఏ వివరాలు ఉంటాయి? ఎంత చెల్లించాలో తెలుసుకుందాం.. పీయూసీ అంటే? పీయూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ అని అర్థం. రోడ్డుపై వాహనం వెళ్లడం వల్ల అందులోనుంచి వచ్చే పొగలో కార్బన్ మోనాకై ్సడ్ ఎంత ఉంది.. దాని వల్ల పర్యావరణానికి ఏ మేరకు హాని కలిగే అవకాశం ఉంది.. గాలి ఎంత శాతం కలుషితమవుతుంది తదితర వివరాలతో సరిచూసి వాహనాన్ని నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం ఇది. దేశ, రాష్ట్ర రోడ్డు రవాణా విభాగం నిర్దేశించిన యూనిట్లలోపు ఉంటేనే పొల్యూషన్ సర్టిఫికెట్ (పీయూసీ) ఇస్తారు. వాహనం ఇంజన్ నుంచి వెదజల్లే పొగ ద్వారా కాలుష్యం ఏ మేరకు వస్తుందో ఈ సర్టిఫికెట్లో నమోదు చేస్తారు. కేంద్ర మోటారు వాహన చట్టం–1989 ప్రకారం ప్రతి వాహనానికి సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే. పీయూసీ ఎప్పుడిస్తారు.. వాహనం కొనుగోలు చేసిన ఏడాది తర్వాత పీయూసీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాహనం పీయూసీ పరీక్ష చేసి సంవత్సరం పాటు ఎలాంటి సమస్య లేదని తేలితేనే ఆ వాహనాన్ని సదరు కంపెనీ విక్రయిస్తుంది. పీయూసీ ఆరునెలలు చెల్లుబాటు అవుతుంది. ఈ తర్వాత మళ్లీ తీసుకోవాలి. ఈ పరీక్షకు రూ.60నుంచి రూ.100 వరకూ చెల్లించాలి. నమోదు చేసే వివరాలు.. పొల్యూషన్ సర్టిఫికెట్ సీరియల్ నంబర్, టెస్టు చేసిన తేదీతోపాటు ఎప్పటి వరకు పీయూసీ చెల్లుబాటు అవుతుందో తేదీ, పొల్యూషన్ రీడింగ్ వివరాలు ఈ సర్టిఫికెట్లో పొందుపరుస్తారు. ఈ పీయూసీ పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లోనూ మొబైల్ వాహనాల్లో నిర్వహించి సర్టిఫికెట్ ఇస్తారు. నిర్లక్ష్యం వహిస్తే కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం వాహనదారులకు జరిమానా -
కోటీశ్వరులను చేస్తామని కొల్లగొట్టారు..
పాలకుర్తి టౌన్: పాలకుర్తిలో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం వెలుగుచూసింది. నిర్వాహకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన తెప్పలి సైదులు రెండు సంవత్సరాల క్రితం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గుడివాడ చౌరస్తాలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. మొదట రియాల్టీ బిజినెస్ ఫెయిర్ హెల్ప్ సిస్టం (ఆర్బీఎఫ్) సంస్థను స్థాపించాడు. నెల రోజుల క్రితం హెప్సిబా మార్కెటింగ్ సంస్థ ఏర్పాటు చేశాడు. కోటీశ్వరులను చేస్తామని ప్రజలను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించాడు. వీటిలో సభ్యుడిగా చేరే వ్యక్తి మొదట రూ.6 వేలు చెల్లించగానే రూ.2వేల విలువైన నిత్యావసర సరుకుల కిట్ అందించాడు. రెండో నెలలో రూ.వెయ్యి చొప్పున 20 నెలలు ఇస్తామని ప్రజలను నమ్మబలికాడు. దీంతో 10 నెలల కాలంలో ఆ సంస్థల్లో నాలుగు వేల మందిని చేర్పించి రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టించాడు. పెట్డుబడి పెట్టిన వారికి ప్రతినెల అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. అఽత్యాశతో పేద ప్రజలు అప్పు చేసి ఈ సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. ఆర్బీఎఫ్లో పెట్టుబడుల కోసం రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో బాధితులు బంగారం తాకట్టు పెట్టారు. బంగారం తాకట్టులో రాష్ట్రంలోనే పాలకుర్తిలోని ఓ ప్రైవేట్ సంస్థ ప్రథమ స్థానం సాధించింది. దినసరి కూలీల నుంచి మధ్యతరగతి కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగుల వరకు భారీగా బంగారం తాకట్టు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజలను నమ్మించేందుకు పాలకుర్తి ఆర్టీసీ బస్టాండ్ పక్కన రూ.కోటితో స్థలం కొనుగోలు చేసి రూ.2 కోట్లతో భవన నిర్మాణ పనులు ప్రారంభించాడు. అనధికారికంగా ఈ సంస్థను నిర్వహించడంతోపాటు మనీలాండరింగ్‌కు పాల్పడినందుకు సైదులుతోపాటు మరో ముగ్గురిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పెట్టుబడి పెట్టినవారు తమ డబ్బులు వసాయోరావోనని ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పాలకుర్తిలో హెప్సిబా, ఆర్జీఎఫ్ కార్యాలయంమల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పాలకుర్తి కేంద్రంగా మల్టీలెవల్ మార్కెటింగ్ దందా పేరుతో ప్రజలను మోసం చేసిన సంస్థలు అనేకం ఉన్నాయి. విశ్వజ్యోతి, గురుదేవ, లక్ష్య లాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు. అధిక శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికి కొన్ని నెలలపాటు సక్రమంగా చెల్లింపులు చేయడంతో వారిని జనాలు గుడ్డిగా నమ్మారు. ఒకరిని చూసి ఒకరు ఇలా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఉన్నదంతా ఊడ్చుకొచ్చి సదరు సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆరు నెలలు తిరిగేలోపే ఆ సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేసి ఎవరికి కనిపించకుండా పారిపోతుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రూ.కోట్లు పెట్టుబడిపెట్టి నష్టపోయిన పాలకుర్తి వాసులు టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో హెప్సిబా, ఆర్జీఎఫ్ నిర్వాహకులు రెండు సంవత్సరాలుగా పాలకుర్తి కేంద్రంగా అక్రమంగా నడుస్తున్న ఈ సంస్థల్లో నిర్వాహకులు రూ.కోట్లలో పెట్టుడులు పెట్టిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. అత్యాశకు పోయి నిరుద్యోగులు, అమాయకులు ఇందులో చేరి డబ్బులు పోగొట్టుకున్నా నోరు మెదపడం లేదు. ఈ విషయంపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థపై ప్రారంభంలోనే చర్యలు తీసుకుంటే చాలా మంది ప్రజలు మోసపోయేవారు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పాపం.. ఆశలు ఆవిరి
పెద్దవంగర: పాపం.. ఆ కుటుంబీకుల ఆశలు ఆవిరయ్యాయి. తమ ఇంటి పెద్ద బతికొస్తాడని భావించిన వారి కల విషాదమైంది. కుంటలోని స్తంభానికి ఏర్పాటు చేసిన డిష్ కేబుల్ వైర్ మరమ్మతుకు వెళ్లి గల్లంతైన యువకుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన కమ్మగాని అశోక్ (35), కనకతార దంపతులకు శ్రావణి, జశ్వంత్ ఇద్దరు సంతానం. అశోక్ కేబుల్ ఆపరేటర్‌గా, ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఐదుగురితో కలిసి మండలంలోని గంట్లకుంట పరిధిలోని చింతకుంటలో ఉన్న కరెంట్ స్తంభానికి ఏర్పాటు చేసిన డిష్ కేబుల్ వైర్ మరమ్మతుకు వెళ్లాడు. ముందుగా ఇద్దరు వ్యక్తులు తెప్పసాయంతో స్తంభం వద్దకు వెళ్లి మరమ్మతు చేస్తున్నారు. వారికి సహకరించడానికి అశోక్ ఈదుకుంటూ వెళ్లి నీటిలో మునిగాడు. వెంటనే వారు రక్షించే ప్రయత్నం చేసినా అశోక్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్సై క్రాంతి కిరణ్, తహసీల్దార్ ఘటనాస్థలికి చేరుకుని రాత్రి వరకు రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం అశోక్ మృతదేహం లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుంటలో గల్లంతైన యువకుడి మృతి శోకసంద్రంలో కుటుంబీకులు -
అద్దె బస్సులకు పార్కింగ్ స్థలం కేటాయించాలి
హన్మకొండ : ఆర్టీసీ అద్దె బస్సులకు పార్కింగ్ స్థలం కేటాయించాలని ఆర్టీసీ ఆద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్, వరంగల్ రీజి యన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి కోరారు. హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని అద్దె బస్సుల య జమానుల సంక్షేమ సంఘం నాయకులు బుధవారం కలిశారు. హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ కూడలి, సర్క్యూట్ హౌజ్ రోడ్, కాకాజీ కాలనీ ప్రాంతంలో రోడ్డుకిరువైపులా బస్సులను నిలపడం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని, బాలసముద్రంలోని ‘కుడా’ స్థలా న్ని కేటాయించాలని చైర్మన్‌ను కోరారు. స్పందించిన చైర్మన్.. వైస్ చైర్మన్, వరంగల్ ము న్సిపల్ కమిషనర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని యజ మానుల సంఘం నాయకులు తెలిపారు. ‘కుడా’ చైర్మన్‌ను కలిసిన వారిలో వెంకటేశ్వర్లు, ఫర్వేజ్, రాజ లింగారెడ్డి, సదానందం ఉన్నారు. -
ఉత్సాహంగా ‘ఉషూ’ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అండర్–17,19 బాలబాలికల ఉ మ్మడి జిల్లా స్థాయి ఉషూ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. హనుమకొండ కాపువాడలోని లవ్లీడాల్స్ హై స్కూల్ నిర్వహించిన ఎంపికలో ములు గు, భూపాలపల్లి, జనగామ, మహబూ బాబాద్, వరంగల్, హనుమకొండ జి ల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్‌కుమార్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 35 మంది క్రీ డాకారులు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో క్రీడల నిర్వహణ కన్వీనర్ రాయకంటి సుభాశ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం పార్ధసారథి, రెఫరీ సంతోష్, కోచ్ ధన్‌రాజ్, ఉషూ సంఘం బాధ్యులు యాకూబ్, రమేశ్, ఆదినారాయణ, రాజు, తిరుపతి, రామకృష్ణ, విజయ్‌కుమార్, సంజీవ, స్నేహిత్, రెబెక్క, కవిత, పీడీ సంతోష, పీఈటీలు పాల్గొన్నారు.