breaking news
Nandyala
-
ఆళ్లగడ్డ డీఈ రవికాంత్ చౌదరి అరెస్ట్
నంద్యాల: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆళ్లగడ్డ ఎలక్ట్రికల్ డీఈ రవికాంత్ చౌదరిని కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న బుధవారం అరెస్ట్ చేశారు. నంద్యాల పట్టణంలోని రైతునగరంలో ఉన్న రవికాంత్ చౌదరి ఇంటితో పాటు వారి బంధువుల ఇళ్లు, హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో ఏకంగా 17 చోట్ల ఏసీబీ అధికారులు టీంలుగా ఏర్పడి సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ.. ఈ ఏడాది మే 16వ తేదీన రుద్రవరం మండలం చిన్నకంబలూరుకు చెందిన రామకృష్ణాచారి నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటున్న విషయంలో విద్యుత్ డీఈ రవికాంత్ చౌదరి, అతని ప్రైవేటు అసిస్టెంట్ ప్రతాప్‌లను అరెస్ట్ చేశామన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఇతనిపేరుపై ఉన్న లాకర్ నుంచి 2 కేజీల 820 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కోర్టుకు జమ చేశామన్నారు. ఆ సమయంలో అతని ఇంట్లో సోదాలు చేయగా డాక్యుమెంట్లు కొన్ని లభించాయని, వాటిని పరిశీలించగా రవికాంత్ చౌదరికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. దీంతో రవికాంత్ చౌదరిపై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదు చేసి అతని ఇల్లు, వారి బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడి చేశామన్నారు. ఈ దాడిలో అనేక స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయన్నారు. డీఈ జీతం, ఇతడు సంపాదించిన ఆస్తులు పరిగణలోకి తీసుకొని ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అరెస్ట్ చేశామన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు సోదాలు భారీగా స్థిరాస్తి పత్రాలు స్వాధీనం -
ఒకే గదిలో మూడు తరగతులు
సంజామల: బెంచ్‌లు లేవు.. పాఠ్యపుస్తకాలు రాలేదు.. బ్యాగులు కూడా ఇవ్వలేదు.. పాత యూనిఫాంలు ధరించి కొందరు.. సాధారణ దుస్తులతో మరికొందరు.. ఒకే గదిలో ఇరుకు స్థలంలో కూర్చోవాల్సి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు మూడు తరగతుల విద్యార్థులకు ఒకే టీచర్ పాఠాలు చెప్పాల్సి ఉంది. సంజామల మండలం ఆకుమల్ల మోడల్ స్కూల్లో దుస్థితి ఇది. ఇక్కడ ఒకలో తరగతిలో12, రెండవ తరగతిలో 19, మూడో తరగతిలో 23, నాలుగవ తరగతిలో 24, ఐదో తదరగతిలో 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒక ఉపాధ్యాయురాలు ఒకటో, రెండవ, మూడవ తరగతి విద్యార్థులకు బోధిస్తుంటే మరో ఉపాధ్యాయురాలు నాలుగు, ఐదు తరగతులను బోధిస్తున్నారు. బుధవారం ఒకే గదిలో 1,2,3 తరగతులకు చెందిన విద్యార్థులు 44 మంది విద్యార్థులకు టీచర్ బోధించాల్సి వచ్చింది. -
సమస్యల ‘తొలిఅడుగు’
కొత్తపల్లి: తొలిఅడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా గువ్వలకుంట్ల, జి.వీరాపురం గ్రామాలకు వెళ్లిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు సమస్యలు ఎదురయ్యాయి. పక్కా గృహాల్లేక కొట్టాల్లోనే నివాసం ఉంటున్నామని, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడం లేదని పలు సమస్యలను ప్రజలు చెప్పారు. గువ్వలకుంట్ల ఎస్సీకాలనీలో రోడ్డు వెంట వర్షం నీరు నిలుస్తోందని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాలెంచెరువు గూడెంకు వెళ్లేందుకు రోడ్డు అధ్వానంగా ఉందని చూపించారు. బ్రహ్మంగారి నగర్లో విద్యుత్ స్తంభాలులేక ఇబ్బందులు పడుతున్నామని, జి.వీరాపురం గ్రామంలో ఎస్సీకాలనీ మొత్తం రోడ్లవెంట వర్షం నీరు నిలుస్తోందని.. సమస్యలను పరిష్కరించాలని కోరారు. నందికొట్కూరు ఎమ్మెల్యేకు ప్రజల నుంచి సమస్యల వెల్లువ -
పల్లె విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో సరైన విద్య అందడం లేదు. కొన్ని పాఠశాలల్లో తరగతులను మరొక స్కూల్లో విలీనం చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్న పిల్లలు అంతదూరం వెళ్లలేక ధర్నాలు సైతం చేస్తున్నారు. ఐదు తరగతులకు ఒకరు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంతో బోధన కష్
శిరివెళ్ల: ఒకటికాదు.. రెండు కాదు.. యాభై ఏళ్లుగా ప్రాథమిక విద్యను అందిస్తున్న పాఠశాల మూతబడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిరివెళ్ల మండలం మోత్కలపల్లెలో 435 ఇళ్లు ఉండా..1,200 మంది నివాసం ఉంటున్నారు. అందులో ఎస్సీ, బీసీలే అధికం. గ్రామంలో 50 ఏళ్ల క్రితం ఆర్సీఎం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ప్రారంభం కాగా ..అందులో ఐదో తరగతి వరకు చదివి చాలా మంది ఉన్నత ఉద్యోగాలు పొందారు. పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా వారిలో ఒకరు రెండేళ్ల క్రితం, మరొకరు ఈ ఏడాడి మే నెలలో పదవీ విరమణ పొందారు. మొత్తం 45 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలను మూతవేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మహానంది మండలం మసీదుపురం, గోస్పాడు మండలం దీబగుంట్ల ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించారు. ప్రతి రోజు విద్యార్థులు ఆటోల్లో పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రెండు నుంచి మూడు పాఠశాలు ఉన్నాయి. ఒక పాఠశాల మూత పడితే మరో పాఠశాలలో విద్యార్థులు చేరుతారు. మోత్కలపల్లె గ్రామంలో ఉన్న ఒక పాఠశాల మూతపడితే విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని సర్పంచ్ భూమా వేణుగోపాలరెడ్డి తెలిపారు. -
విలీనం వద్దు.. మా బడే ముద్దు
ఆళ్లగడ్డ: ‘విలీనం వద్దు.. మా బడే ముద్దు’ అంటూ విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటన బుధవారం జి.జమ్ములదిన్నెలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం ఎస్సీకాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో 30 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మోడల్ స్కూల్ పేరుతో కూటమి ప్రభుత్వం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 30 మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులను గ్రామంలోని మెయిన్ ప్రథమిక పాఠశాలకు తరలించారు. దీనిపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. పాఠశాలను విలీనం చేయవద్దని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాలనీలోని ప్రధాన రోడ్డు నుంచి పాఠశాల వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ‘మా బడి మాకు కావాలి’ అని విద్యార్థులు పలకలపై రాసుకుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ రోజు వారి కూలి పనులు చేసుకునే తాము ఉదయాన్నే వెళ్లాలని, పిల్లలను దూరంగా ఉండే మరో పాఠశాలకు పంపాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లి రావాలంటే మెయిన్ రోడ్డు దాటుకుని వెళ్లాలని, ఈ ఇరుకు దారిలో ప్రమాదకరమైన పాడుబడ్డ బావి కూడా ఉందని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను యథావిథిగా కొనసాగించకుంటే తమ పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలను యథవిథిగా కొనసాగించాలని హెచ్ఎంకు వితని పత్రం సమర్పించారు. విద్యార్థుల ఆందోళన -
స్టాంపుల కొరత.. క్రయవిక్రయాలకు అవస్థ
కర్నూలు(సెంట్రల్: జిల్లాలో స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదే క్రమంలో ఈ–స్టాంపులకు డిమాండ్ ఉండడంతో వెండర్లు వాటిని మూడు, నాలుగు రెట్లు పెంచి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయినా రిజిస్ట్రేషన్ శాఖాధికారులు తమకేమి సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలకు వస్తున్నాయి. అధిక ధరలకు విక్రయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో రిజిస్ట్రేషన్లకు వినియోగించే నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులోలేవు. ఇందుకు ప్రధాన కారణం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కావాల్సినన్నీ అందుబాటులో ఉంచకపోవడమే. దీంతో పూర్తిగా ఈస్టాంపులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వెండర్లు రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 స్టాంపును రూ.40లకు, రూ.20 స్టాంపును రూ.50 లకు, రూ.50 స్టాంపును రూ.100, స్టాంపు రూ.160 వరకు అధికంగా అమ్ముకుంటున్నారు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎవరైనా ఎక్కువ రేట్లకు ఎందుకు అమ్ముతున్నారంటే వారికి స్టాంపులు ఇవ్వడంలేదు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే జిల్లా రిజిస్ట్రార్ అందుబాటులో ఉండడంలేదు. ప్రస్తుతం రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్ లేకపోవడంతో నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ జానకీదేవి విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయించే బుకింగ్ పాయింట్ నాలుగైదు నెలల నుంచి మూత పడింది. ఇటీవల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని ఏసీబీ అక్రమ కేసులో ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉన్నా ఎవరినీ నియమించకపోవడంతో ఏకంగా స్టాంపుల విక్రయ స్టాల్‌నే మూసివేశారు. మూతపడిన స్టాంపుల కౌంటర్ జిల్లాలో అన్ని రకాల స్టాంపుల కొరత నెలకొంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అస్సలు అందుబాటులో లేకపోవడంతో ఈస్టాంపులతో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అయితే బ్యాంకులు వినియోగించే ఫ్రాంక్లిన్ స్టాంపులు, రెవెన్యూ, కోర్టు, స్పెషల్ అదెసివ్ స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. ఇందులో రెవెన్యూ స్టాంపులు పోస్టాఫీసుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. మిగిలిన అన్ని రకాల స్టాంపులను జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయమే ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంది. అయితే వారు పట్టించుకోకపోవడంతో ఉన్న వాటిని వెండర్లు అధిక ధరలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ స్టాంపుల విక్రయాలకు సంబంధించిన కౌంటర్‌ను మూసి వేశారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అడిగితే మాత్రం తమ దృష్టి రాలేదని, పరిశీలన చేసి విక్రయదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెప్పడం విశేషం. కృత్రిమ కొరతకర్నూలు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం జిల్లాల(మార్కాపురం నియోజకవర్గం) కు సంబంధించిన ఈ–స్టాంపింగ్ స్టాక్ హోల్డర్ ఈస్టాంపులను సక్రమంగా సరఫరా చేయకుండా అప్పుడప్పుడు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. క్రయ, విక్రయాదారులకు అవసరమైన ఈ–స్టాంపులను గుర్తింపు పొందిన వెండర్లకు సరఫరా చేయాల్సి ఉన్నా చేయడంలేదు. ఇందుకు ఆయన వెండర్లకు ఓ షరతు పెడుతున్నారు. తన ఖాతాలో రిజిస్ట్రేషన్లకు వినియోగించే చలాన్లను వినియోగదారుల ద్వారా చెల్లించేలా చేస్తేనే ఈ స్టాంపులను ఇస్తానని చెబుతున్నట్లు వెండర్లు వాపోతున్నారు. ఫలితంగా ఆయన సమయానికి ఈస్టాంపులను ఇవ్వకపోవడంతో అనుకోకుండా కొన్ని సార్లు కొరత నెలకొంటోంది. ఆ సమయంలో స్టాంపులు ఉన్న వెండర్లు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అందుబాటులో లేని నాన్ జ్యుడీషియల్, రెవెన్యూ, బ్యాంకు, కోర్టు స్టాంపులు ఈ–స్టాంపులను రేటు పెంచి అమ్ముతున్న వెండర్లు మూడు నెలలుగా స్టాంపుల విక్రయ కౌంటర్ మూసివేత పట్టించుకోని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు -
ఖాళీ జాగా.. టీడీపీ నాయకుల పాగా!
రుద్రవరం: ఎక్కడైన ఖాళీ జాగా కన్పిస్తే చాలు టీడీపీ నాయకులు పాగా వేస్తున్నారు. అది లే అవుట్ అయినా.. డీకేటీ భూములైనా.. వదలడం లేదు. రెవెన్యూ అధికారులు వారించినా.. వెనకడుగు వేయడం లేదు. రుద్రవరం మండలం చందలూరు, హరినగరం సమీపంలోని నవ అహోబిల వద్ద ఉన్న ఖాళీ భూములను టీడీపీ నాయకులు ఆక్రమించారు. దర్జాగా ట్రాక్టర్లతో సేద్యాలు చేసి పాగా వేశారు. చందలూరు గ్రామానికి చెందిన ఓ దాత దాదాపు 40 ఏళ్ల క్రితం గ్రామస్తులకు ఇళ్ల స్థలాల కోసం 7.75 ఎకరాలు కేటాయించారు. అప్పట్లోనే ఆ పొలాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వాలు మారాయి కానీ.. ఆ స్థలంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేక ఖాళీగా వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ స్థలాన్ని లే అవుట్‌గా మార్చి పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ వాసులకు కొంత మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. కాలనీ లో మట్టి రోడ్లు వేశారు. అలాగే మల్టీ పర్పస్ గోదాము నిర్మించారు. అలాగే అదే స్థలంలో ఓ వైపు వాగు పక్కన కొత్తగా బోరు వేసి మోటార్ అమర్చి రజకులకు కేటాయించారు. అయితే ఎస్సీలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యే సమయంలో ప్రభుత్వం మారింది. దీంతో ఇళ్లు కట్టుకుంటే బిల్లులు వస్తాయో రావో అన్న భయంతో నిర్మాణాలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ లేఅవుట్ స్థలం ఖాళీగా ఉండటంతో గ్రామ టీడీపీ నాయకుడు చౌరెడ్డి ఇటీవల ట్రాక్టరుతో దున్నేసి ఆ స్థలం తమదే అంటూ పాగా వేశాడు. అలాగే నవ అహోబిలానికి సంబంధించి అప్పటి ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి దాదాపు వంద ఎకరాల డీకేటీ భూమిని కేటాయించారు. అయితే అహోబిల ఆలయ నిర్వాహకులు 12 ఎకరాల్లో పలు నిర్మాణాలు చేపట్టి మిగిలిన పొలాన్ని ఖాళీగా వదిలేశారు. గతంలో కొందరు టీడీపీ నాయకులే ఆ పొలాలను ఎక్కడ బడితే అక్కడ ఆక్రమించుకున్నారు. ఇంకా కొంత పొలం మిగిలి ఉండగా మూడు రోజుల క్రితం ఆలమూరుకు టీడీపీ నాయకుడు ఆ ఖాళీ పొలాన్ని దున్నేసి ఆక్రమించేశాడు. ఆ ఆక్రమణలపై ఆయా గ్రామాల వీఆర్వోలు చంద్రమోహన్, పుల్లయ్యలను అడగ్గా విచారణ చేసి అక్కడ జరిగిన ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ -
భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యం
● దేవదాయశాఖ డీసీ గురుప్రసాద్ మహానంది: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు సంతృప్తికర, సులభతర దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవదాయశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ అన్నారు. మహానంది ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రసాదాల తయారీ, ఇతర విభాగాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠరాజు, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్యలతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీ గురుప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈఓ హోదా నుంచి ఆర్జేసీ హోదా కలిగిన ఆలయాల్లో సౌకర్యాలపై దృష్టి సారించారని చెప్పారు. ఆర్జిత సేవలతో పాటు ప్రసాదం తయారీ, అన్నప్రసాదం పంపిణీ, క్యూలైన్ల నిర్వహణపై దృష్టి సారించారన్నారు. ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య లోపం లేకుండా చూ డాలన్నారు. మాడవీధుల్లో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. స్పౌజ్ పింఛన్ల పంపిణీలో చేతులెత్తేసిన ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): స్పౌజ్ పింఛన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం వితంతు మహిళలను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తోంది. ముందుగా జూన్ 12న పంపిణీ చేస్తున్నామంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచా రం చేసుకుంది. నిధులు కూడా బ్యాంకులకు విడుదల చేసినట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు పింఛన్లు పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. జూలై నెల పింఛన్లతో పాటు స్పౌజ్ పింఛన్లను కూడా పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించారు. అయితే మంగళవారం పింఛన్ల పంపిణీ సమయానికి స్పౌజ్ పింఛన్ల పంపిణీని నిలిపేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. దాదాపు నెల రోజుల క్రితం నుంచి వేలాది మంది మహిళలను కూటమి ప్రభుత్వం ఊరిస్తోంది. కర్నూలు జిల్లాలో 2,319, నంద్యాల జిల్లాలో 2,463 ప్రకారం స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినా, పంపిణీలో మొండిచేయి చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. పింఛన్ల పంపిణీలో 19వ స్థానం పింఛన్ల పంపిణీలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లా రాష్ట్రంలో 19వ స్థానం, నంద్యాల జిల్లా 16వ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లాలో 2,12,985 పింఛన్లకు గాను 1,99,705 పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. -
అత్యాధునిక సాంకేతికతతో కేసుల దర్యాప్తు
● ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా నంద్యాల: కేసుల దర్యాప్తులో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల పెండింగ్‌కు కారణాలను, కేసుల దర్యాప్తులో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎస్పీ సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ప్రతి కేసు వివరాలను క్షుణ్ణంగా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాల న్నారు. గ్రేవ్, యూఐ, పీటీ, మర్డర్, సైబర్ క్రైమ్, పోక్సో, మిస్సింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, సాయుధ బలగాల అదనపు ఎస్పీ చంద్రబాబు, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్, ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో రూ.35 లక్షల మోసం
కర్నూలు: ‘ ప్రేమించినట్లు నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. గోల్డ్ కాయిన్స్ తీసుకుని.. రూ.35 లక్షలు నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేయించుకుని ఒక మహిళ మోసం చేసింది’ అని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కర్నూలు కొత్తపేటకు చెందిన మునీర్ అహ్మద్ ఖురేషి ఫిర్యాదు చేశారు. తాను లండన్‌లో హోటల్ మేనేజర్‌గా పనిచేస్తుండగా కడప జిల్లాకు చెందిన ఓ మహిళ ఇన్‌స్ట్రాగామ్‌లో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తూ రెండున్నర సంవత్సరాల క్రితం పరిచయమై, చైన్నెలోని ఇన్ఫోటెక్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిందన్నారు. తాను లండన్ నుంచి జూన్ 4వ తేదీన కర్నూలుకు వచ్చానని, 5వ తేదీ నుంచి తన మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసి ఆ మహిళ మోసం చేసిందని మునీర్ అహ్మద్ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 135 ఫిర్యాదులు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 135 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● కర్నూలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశారని మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజు, మునిస్వామి ఫిర్యాదు చేశారు. ● పూణెలోని జీకే వర్క్స్ అసోసియేషన్ ఇంజనీరింగ్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని, సంవత్సరానికి రూ.5 లక్షలు ప్యాకేజీ ఉంటుందని కడప పట్టణానికి చెందిన అశోక్ కుమార్ రూ.1.50 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మోసం చేశాడని కర్నూలు మాధవీ నగర్‌కు చెందిన చంద్రకళ ఫిర్యాదు చేశారు. ● ఇద్దరి పిల్లలకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జిషిత్ రాణి, శ్రేయస్ రూ.4.30 లక్షలు తీసుకుని బోగస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి మోసం చేశారని కర్నూలు ఉద్యోగనగర్‌కు చెందిన ఆర్.ప్రకాష్ రాజు ఫిర్యాదు చేశారు. ● పత్తికొండ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ తన పొలంలోకి అక్రమంగా చొరబడి కొందరు ఆటంకాలు కలిగిస్తున్నారని తుగ్గలి గ్రామానికి చెందిన మంగలి రంగమ్మ ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు పీజీఆర్ఎస్కు 135 ఫిర్యాదులు -
ధరణిలో దేవుళ్లు
పోయే చూపును తెప్పించాం కోడుమూరు మండలం వలుకూరుకు చెందిన హనుమన్న (48) 2009లో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చింది. ఒక కన్ను పూర్తిగా దెబ్బతినగా మరో కంటికి గాయం కారణంగా శుక్లం వచ్చి చూపు మందగించింది. అతనికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యవసర చికిత్స అందించి ప్రాణం పోశాం. ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు 13 సార్లు దశల వారీగా ఆపరేషన్ చేసి ఛిద్రమైన ముఖాన్ని బాగు చేశారు. తర్వాత ఒక కన్ను కోల్పోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ భిక్షాటన చేస్తూ బతుకుతున్న అతన్ని ఆసుపత్రికి తీసుకురాగా శస్త్రచికిత్స చేసి చూపు తెప్పించాం. దీంతో అతడు భిక్షాటన మానేసి పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. – డాక్టర్ పి.సుధాకర్‌రావు, కంటి వైద్యనిపుణులు, కర్నూలు ఆమె ధైర్యం, స్థైర్యానికి హ్యాట్సాఫ్ వైద్యులుగా ఎంతో మందికి చికిత్స చేస్తూనే రోగులు చేసే ప్రయాణంలో సహచరులుగా నిలుస్తున్నాం. ఒక రోగి క్లిష్టమైన దశలను దాటి కోలుకున్నప్పుడు వారి ముఖంలో కనిపించే చిరునవ్వు మాకు అత్యంత సంతృప్తినిస్తుంది. ఆశలు లేవనుకుంటున్న ఓ వితంతువు స్ల్కెరోడెర్మా అనే వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతోంది. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం, జీవించాలనే తపన ఆమెను ముందుకు నడిపించాయి. ఆమెకు మేము అందించిన చికిత్సతో పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం స్వతంత్రంగా పనిచేసుకుంటూ పిల్లలకు, కుటుంబానికి ఆసరాగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. – డాక్టర్ శ్రీహరిరెడ్డి, కీళ్లవాత వ్యాధి నిపుణులు, కర్నూలు ● నమ్మకమే వైద్యులకు పునాది ● పెద్దాసుపత్రిలో అన్ని రకాల ఆధునిక సేవలు ● కార్పొరేట్ ఆసుపత్రుల రాకతో మెరుగైన వైద్య సేవలు ● హైదరాబాద్‌కు ధీటుగా సేవలందిస్తున్న కర్నూలు వైద్యులు ● నేడు జాతీయ వైద్యుల దినోత్సవంకర్నూలు(హాస్పిటల్): వైద్యో నారాయణ హరీః. అంటే వైద్యుడు దేవునితో సమానమని అర్థం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ముందుగా గుర్తొచ్చేది వీరే. రోగుల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా ఎంతో మంది వైద్యులు పడుతున్న కష్టం వర్ణణాతీతం. ఇంజినీర్లు పెద్ద పెద్ద పరికరాలతో కుస్తీ పడుతుండగా వైద్యులు మాత్రం అతి సూక్ష్మంగా కనిపించే అవయవాలు, కణాలు, రక్తనాళాలను సైతం ఒడిసిపట్టి చికిత్స చేస్తూ ప్రాణాలను నిలుపుతున్నారు. ఇటీవల ఆత్యాధునిక వైద్య పరికరాలు, వసతులు, సౌకర్యాల వల్ల ఎంతో క్లిష్టమైన చికిత్సలు కూడా సులభంగా మారుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో సమానంగా కర్నూలులోనూ వైద్యులు అరుదైన చికిత్సలతో సత్తా చూపుతున్నారు. పెద్దాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 36కు పైగా విభాగాలున్నాయి. 1956లో 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైన ఈ బోధనాసుపత్రి ఇప్పుడు 250 సీట్లతో కొనసాగుతోంది. రాష్ట్రంలోనే ఏకై క సువిశాలమైన ఈ ఆసుపత్రికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే గాక అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, రాయచోటి, ప్రకాశం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు అధిక సంఖ్యలో చికిత్స కోసం వస్తుంటారు. ప్రైవేటుగా ఎన్ని ఆసుపత్రులు వచ్చినా ఓపీ రోగుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ 2 వేలకు పైగా రోగులు ఓపీ చికిత్స పొందుతున్నారు. నిత్యం అడ్మిషన్లో ఉన్న వెయ్యి నుంచి 1200 వరకు రోగులకు సేవలు అందుతున్నాయి. -
సైకిల్‌పై నుంచి కింద పడి విద్యార్థి మృతి
కోవెలకుంట్ల: స్థానిక సంతపేటకు చెందిన ఓ విద్యార్థి సోమవారం రాత్రి సైకిల్‌పై నుంచి కింద పడి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన చాకలి మధుసూదన్, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. రజకవృత్తి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్నకుమారుడు చరణ్(11) పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రాత్రి ఇంటి వద్ద సైకిల్ తొక్కుతూ కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన చుట్టుపక్కలి వారు చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్య సిబ్బంది నంద్యాలకు తీసుకెళ్లాలని సూచించారు. మెరుగైన వైద్యం కోసం తరలించే లోపే మృతి చెందటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సైకిల్ తొక్కుతూ కింద పడి తలకు బలమైన గాయమై మృతి చెందాడా, కింద పడటంతో భయానికి గురై మృత్యువాత పడ్డాడా అని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వెల్దుర్తి: బైక్‌ను కారు ఢీకొనడంతో వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన బోయ మనోహర్(19) మృతి చెందాడు. ఈ దుర్ఘటన కల్లూరు మండలం కొంగనపాడు వద్ద హైవే 44 ఓవర్ బ్రిడ్జ్‌పై సోమవారం జరిగింది. ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. చెరుకులపాడుకు చెందిన గౌండ, కూలీలైన రామకృష్ణ, బోయ మనోహర్ కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్లో ఇంటి పని చేస్తున్నారు. స్వగ్రామం నుంచి ఉదయం 7 గంటలకు బైక్‌పై బయలుదేరారు. ఉలిందకొండ సమీపంలోని హైవేలోని కొంగనపాడు బ్రిడ్జ్ దిగంగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి కింద పడిన ఇద్దరూ గాయపడ్డారు. ఉలిందకొండ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక బోయ మనోహర్ మృతి చెందాడు. మృతుడు బోయ మనోహర్ తండ్రి నాగమద్దయ్య సైతం రెండేళ్ల క్రితం వెల్దుర్తి హనుమాన్ జంక్షన్లో లూనా మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి శివలింగమ్మ కన్నీటి పర్యంతమైంది. విషయం తెలుసుకున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కర్నూలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చికిత్స పొందుతున్న రామకృష్ణకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కాగా..సీసీ కెమెరాలు, ఇతర మార్గాల ద్వారా ఢీకొన్న కారు నంబరును పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. -
ఆనందంతో గ్రామస్తులు సన్మానం చేశారు
తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌కు చెందిన శ్రీనివాసులు (65) గత మార్చిలో గుండె సమస్యతో మా వద్దకు వచ్చారు. అతనికి పరీక్షలు నిర్వహించగా గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన నాళం 70 శాతం మూసుకుపోయిందని గుర్తించాం. ఎల్ఎన్సీఏ నుంచి ఎల్ఏడీకి స్టంట్ వేయడం కష్టంతో కూడుకున్న పని. దీంతో వెంటనే రోగిని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని, ఇలాంటి ఆపరేషన్లు అక్కడు చేస్తారని సూచించాం. కానీ మాపై ఉన్న నమ్మకంతో ఇక్కడే చికిత్స చేయాలని కుటుంబసభ్యులు కోరారు. రిస్క్ తీసుకుని అతనికి స్టంట్ వేశాం. అన్ని జాగ్రత్తలతో చికిత్స అందించడంతో ఆయన పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అలంపూర్ గ్రామస్తులు పెద్దఎత్తున వచ్చి నన్ను ఘనంగా సన్మానించి పొగిడారు. భావోద్వేగంతో ఆనందబాష్పాలు వచ్చాయి. –డాక్టర్ ఎన్.చైతన్యకుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, కర్నూలు -
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసం
కర్నూలు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసం చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన పోతురాజు రతన్ కుమార్, పాలకీర్తి జశ్వంత్, పోతురాజు శాంతి పవన్‌కుమార్, కట్ట శ్రీకాంత్ అలియాస్ విశ్వనాథ్‌లను కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పట్టణం సూర్యరావుపేట భద్ర హైట్స్ ఫ్లాట్ నెం.105లో నివాసముంటున్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ కర్నూలులోని పావని లాడ్జిలో ఉండగా తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పి రూ.7.32 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఈ మేరకు ఇచ్చిన ఫిర్యాదుతో మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. సీఐలు శేషయ్య, నాగశేఖర్, ఎస్ఐ బాలనరసింహులుతో కలసి డీఎస్పీ బాబు ప్రసాద్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. వీరి నుంచి రూ.6.40 లక్షల నగదు, నాలుగు కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, పోలీసులు వాడే సామగ్రితో పాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముఠాకు ప్రధాన సూత్రధారులైన దేవరకొండ సుధీర్, పీటర్ పాల్, శివకుమార్‌రెడ్డిలు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు -
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
శిరివెళ్ల: నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌కు చెందిన బచ్చు రాఘవేందర్ (36) మృతి చెందాడు. ప్రకాఽశం జిల్లా గిద్దలూరులో ఉన్న తన బంధువులను చూడడానికి కారులో వెళ్తూ మార్గమధ్యలో పచ్చర్ల వద్ద మూత్ర విసర్జన కోసం కారు దిగాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రాఘవేందర్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండంగా మృతి చెందాడు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యను చంపిన భర్త అరెస్ట్ మంత్రాలయం: అనుమానం పేరుతో తాగిన మైకంలో భార్యను హతమార్చిన భర్త హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ శివాంజల్ మాట్లాడుతూ.. సూగూరు గ్రామానికి చెందిన బోయ హనుమంతు ఆయన భార్య లక్ష్మిదేవి నిద్రిస్తున్న సమయంలో మేడిగుంజతో తలపై బాది హత్య చేశారని, అనుమానం పేరుతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నారన్నారు. చెట్నెహళ్లి గ్రామ మార్గంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో హనుమంతును అరెస్టు చేశామన్నారు. -
‘ఉపాధి’లో అక్రమాలు
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని, విచారణ చేపట్టాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో జెడ్పీటీసీలు మౌలాలి, రామకృష్ణ, ఎంపీపీ వెంకటేశ్వరమ్మ తదితరులు జేసీ డాక్టర్ బి.నవ్యను కలసి వినతితపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని ఆరోపించారు. సర్పంచ్‌లకు తల్లికివందనం ఇవ్వాలని, ఆర్టికల్స్ 73,74 ప్రకారం పంచాయతీరాజ్ విభాగాలకు అధికారాలను బదలాయించాలని కోరారు. స్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నులను ఆయా సంస్థల ఖాతాల్లో జమచేయాలని, ఉపాధి హామీ పనులను పంచాయతీల ద్వారానే జరిపించాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలు ఇవీ.. ● కర్నూలులోని వైన్ షాపుల్లో సిట్టింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసి బహిరంగ విక్రయాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ● శరీన్‌నగర్ గట్టయ్యనగర్ ప్రాథమిక పాఠశాలలో మూడు, నాలుగు, ఐదు తరగతులను అక్కడే కొనసాగించాలని జేసీకి వినతిపత్రం అందజేశారు. ● వెల్దుర్తి మండలం పుల్లగుమ్మిలో ఐరన్ ఓర్‌తో పంటపొలాలను నాశనం చేస్తున్న సీతారామయ్యపై చర్యలు తీసుకోవాలని రైతులు అర్జీ ఇచ్చారు. ● రీడిప్లాయ్మెంట్ పేరుతో ఎంపీహేచ్ఏ ఫిమేల్, సెకండ్ ఏఎన్ఎంలను దూర ప్రాంతాలకు కేటాయించడం అన్యాయమని, పూర్వ స్థానాలకు కేటాంచాలని కోరుతూ జేసీకి వినతిపత్రం ఇచ్చారు. ● ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కేజీబీవీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకందరికీ కేటాయించాలని అర్జీ ఇచ్చారు. ● నందవరం మండలం హలహర్వి గ్రామంలో వేలంపాటలతో 5.71 లక్షలకు దక్కించుకున్నామని, జూలై 2వ తేదీన మళ్లీ వేలం వేయడానికి నిర్ణయించారని, దానిని తమకే అప్పగించాలని యాపిలయ్య అర్జీ ఇచ్చారు. విచారణ చేయాలని కోరిన జెడ్పీటీసీలు -
అఖండ సౌభాగ్యం.. వారాహి అమ్మవారి దర్శనం
కర్నూలు కల్చరల్: ఓల్డ్‌సిటీలోని లలితా పీఠంలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సోమవారం పురస్కరించుకొని వారాహి అమ్మవారికి అభిషేకం చేశారు. ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం కలగాలని పసుపు కొమ్ములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు. సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులను ఉద్ధేశించి మాట్లాడారు. లలితా పీఠం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆలయ భూమిలో టీడీపీ నేత అక్రమ బోరు
ప్యాపిలి: టీడీపీ నాయకుల బరితెగింపునకు మరో నిదర్శనం ఇది. ఏకంగా ఆలయ భూమిలో బోరు వేసి తన ఫ్యాక్టరీకి నీటిని తరలిస్తున్న వైనమిది. గొల్లపల్లి బుగ్గలోని స్థానిక శివాలయం ఆవరణలో డోన్ పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు మహేశ్ ఖన్నా అక్రమంగా బోర్ వేసి శివాలయం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సుద్ద ఫ్యాక్టరీకి పైప్‌లైన్ సౌకర్యం కల్పించుకున్నాడు. అధికారుల అనుమతి లేకుండా ఏకంగా శివాలయం ఆవరణలో బోర్ వేసుకోవడం స్థానికంగా విమర్శలకు దారి తీస్తోంది. అయితే ఈ బోర్ నుంచి పైప్‌లైన్ వేసుకుని తన ఫ్యాక్టరీకి నీటి సౌకర్యం కల్పించుకోవడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదుకూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ నాయకులు ఈ సంఘటనపై కొద్దిరోజుల క్రితమే తహసీల్దార్ భారతికి ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కేసీ మద్దిలేటి, ప్యాపిలి మండల బీజేపీ నాయకులు దామోదర్ నాయుడు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ తహసీల్దార్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ మానసిక రోగి నేడు అమెరికాలో ఐటీ ఉద్యోగి
నేను కర్నూలులో 1992 నుంచి మానసిక రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాను. 25 ఏళ్ల క్రితం ఓ డాక్టర్ ఇంటర్ పూర్తయిన తన కుమారుడిని డిప్రెషన్, ప్రవర్తనా రాహిత్య రుగ్మతలతో నన్ను సంప్రదించారు. ఆ అబ్బాయికి నేనిచ్చిన ఔషధాలు, కౌన్సెలింగ్ వల్ల మానసిక రుగ్మతల నుంచి బయటపడి ప్రస్తుతం అమెరికాలో ఐటీ ఉద్యోగిగా స్థిరపడి సంతోషంగా జీవిస్తున్నాడు. అలాగే ఒక బ్రాహ్మణ వేద పండిత విద్యార్థి మంత్రోచ్ఛారణ సరిగ్గా చేయలేకపోతున్నానని, తీవ్రమైన డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య ఆలోచనలతో నన్ను సంప్రదించాడు. అతనికి అందించిన చికిత్స వల్ల ప్రస్తుతం కర్నూలులో ప్రముఖ బ్రాహ్మణోత్తముడిగా సేవలందిస్తున్నారు. – డాక్టర్ బి.రమేష్‌బాబు, మానసిక వ్యాధుల వైద్యనిపుణులు, కర్నూలు -
బాధ్యతగా వినతులు పరిష్కరించండి
నంద్యాల: ప్రజా వినతులను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్‌లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత కాల పరిమితి లోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్‌మెంట్‌ను కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్, ర్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా అధికారులు జరిపే ఉత్తర, ప్రత్యుత్తరాలు కేవలం ఈ ఆఫీస్ ద్వారానే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గుర్తించిన 42 వేల మంది బంగారు కుటుంబాలు, 2800 చెంచు కుటుంబాలు ఉన్నాయని వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బాత్రూమ్స్, మరుగుదొడ్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో 284 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. డెంగీ మాసోత్సవాలను విజయవంతం చేయండి జిల్లాలో జూలై 1 నుంచి నిర్వహించే డెంగీ మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో డెంగీ మాసోత్సవాలకు సంబంధించిన ప్రచార పత్రాలను జేసీ విష్ణుచరణ్, వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
జడ్జి ఆకస్మిక తనిఖీ
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని సబ్‌జైల్‌ను సోమవారం మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలు, వంట, స్నానపు, తదితర గదులు పరిశీలించి సూచనలు చేశారు. ఖైదీల ఆరోగ్య వివరాలను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను వలన కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను కోల్పోతామని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఘర్షణలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఖైదీలకు సూచించారు. ఆయన వెంట జైలర్ గురు ప్రసాద్ రెడ్డి, న్యాయవాది నాయక్, లోక్‌అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.సుబ్రమణ్యేశ్వరుడి హుండీ ఆదాయం రూ. 25 లక్షలుపాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ. 25 లక్షలు వచ్చింది. సోమవారం భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా..రూ. 25,03,320 నగదు, 8.600 గ్రాముల బంగారం, 830 గ్రాముల వెండి వచ్చింది. మార్చి 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు భక్తుల సమర్పించిన కానుకలను లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. అలాగే భక్తులు సమర్పించిన బియ్యానికి వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనిఖీ అధికారి హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు.అన్నప్రసాద వితరణకు విరాళంశ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి సోమవారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన దురుదుండప్ప మనూరు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు దేవికకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన బి.కృష్ణారెడ్డి రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు రవికుమార్‌కు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతలను దేవస్థానం తరుపున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని...
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా 5 కళాశాలలను ప్రారంభించారు. 2024లో మరో ఐదు కాలేజీలను ప్రారంభించాల్సి ఉండగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాలేజీలపై కక్ష కట్టింది. నిధులు కూడా మంజూరు చేయడం లేదు. తెలంగాణలో ప్రభుత్వం మారినా విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది. ఏపీలో అందుకు విరుద్ధంగా సీఎం చంద్రబాబు ఆలోచనధోరణి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే దుర్దేశంతో వైద్య విద్యను పూర్తిగా పక్కన పెట్టారు. – డాక్టర్ శశికళ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ, నంద్యాల వైద్య విద్యను ప్రైవేటు పరం చేసే కుట్ర కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తోంది. 2024లో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తయినా ప్రారంభించ లేదు. దీంతో విద్యార్థులు 750 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరంలో మిగిలిన కాలేజీలను కూడా పక్కన పడేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్క కళాశాలను నిర్మించలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఉన్నతంగా ఆలోచించి 17 కళాశాలల నిర్మాణం చేపడితే వాటిని కూడా అడ్డుకోవడం హేయం. – ఎంఆర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల -
అభ్యంతరాలు.. ఆందోళనలు
కర్నూలు(హాస్పిటల్): అభ్యంతరాలు, ఆందోళనల మధ్య గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–3 ఏఎన్ఎంలకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ ఆడిటోరియంలో ఉదయం 7.30 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 750 మందికి పైగా ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.శాంతికళ, ఏవో అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వచ్చాయి. వందకు పైగా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు రావడం, అందులోనూ కొన్ని సచివాలయాలకు ఎక్కువ మందికి లేఖలు ఇవ్వడంతో అధికారులు అయోమయానికి గురయ్యారు. ఈ లేఖలతో పలు సంఘాల లేఖలను సైతం పక్కన బెట్టి ర్యాంకు ఆధారంగా సాయంత్రం 200 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగించి, మిగిలిన వారికి మంగళవారం కూడా కౌన్సెలింగ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు ఏఎన్ఎంలు ఇతర పీహెచ్‌సీలకు గాకుండా పక్క పీహెచ్‌సీలోని సచివాలయాలకు బదిలీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో అధికారులు భోజన విరామాన్ని ప్రకటించి ఉన్నతాధికారుల వివరణ తీసుకుని పక్క పీహెచ్‌సీలకు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసేందుకు అంగీకరించారు. గందరగోళంగా ఏఎన్ఎంల బదిలీల ప్రక్రియ -
చట్ట పరిధిలో ఫిర్యాదులకు సత్వర న్యాయం
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన చట్ట పరిధిలో ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పీఆర్ఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో 160 వినతులు వచ్చాయని, వీటిని పరిష్కరించేందుకు ఆయా స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వినతులు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. వినతుల్లో కొన్ని.. ● పాణ్యం మండలం తమ్మరాజులపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య, గురువయ్య, తదితర రైతులు 2024లో బేయర్ కంపెనీకి చెందిన మొక్కజొన్న సీడ్ విత్తనాలు సాగు చేశారు. క్వింటాల్‌కు రూ.3,500 ప్రకారం కొనుగోలు చేస్తామని, నష్టం వస్తే రూ.80 వేల వరకు పరిహారం ఇస్తామని ఏజెంట్లు నమ్మించారు. పంట నష్టం జరగడంతో కంపెనీ యాజమాన్యాన్ని నష్టపరిహారం ఇవ్వమని అడగగా కొన్ని నెలలుగా తిప్పుకుంటున్నారని, నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ● అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చిన్న రవి రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.14 లక్షలు తీసుకొని మోసం చేశాడని, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల మండలం కంబవారిపల్లె గ్రామానికి చెందిన శంకర్‌నారాయణ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ● గత 60 సంవత్సరాలుగా చంద్రపాల్ పొలం మీదుగా ఉన్న రస్తాలో మా పొలానికి వెళ్తున్నానని, ఈ ఏడాది నుంచి అతని పొలం మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని శిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన బండిస్వామిదాసు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ -
పెట్టుబడి ‘మట్టి’పాలు
రుద్రవరం: ముందస్తు వర్షాలు మిరప రైతులను నట్టేట ముంచాయి. ఊరించిన వరుణుడు మొహం చాటేయడంతో పెట్టుబడి నేలపాలైంది. మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, తిప్పారెడ్డిపల్లె, ఆలమూరు, చిత్రేనిపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 800 ఎకరాల్లో పచ్చి మిర్చి పంటను సాగు చేశారు. ఒక్కో ఎకరానికి రూ. లక్ష చొప్పున పెట్టుబడి పెట్టారు. నారు వేసిన నాటి నుంచి 40 రోజులకు పూత, పిందె రావాల్సి ఉంది. అయితే 60 రోజులు దాటినా పూత, పిందె రాక ఎదుగుదల లేక పోవడంతో కొందరు రైతులు మిర్చి పంటను దున్నేసి తిరిగి మొక్క జొన్న పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్. నాగులవరం గ్రామానికి చెందిన సుబ్బ నర్సయ్య ఐదు ఎకరాల్లో మిరప సాగు చేయగా.. వర్షాలు లేక పంట పూత లేకపోవడంతో ఆదివారం తొలగించాడు. -
సెలవు రోజూ తప్పని తిప్పలు
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవు అయినా సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్ ) బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్‌ను నిర్వహించారు. కర్నూలు జిల్లాలో మొత్తం డిజిటల్ అసిసెంట్లు 375 మంది ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో సర్వీసును పూర్తి చేసుకున్న వారు 207 మంది, రిక్వెస్ట్ బదిలీలు కోరుతు 71 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, కర్నూలు డీఎల్పీఓ టీ లక్ష్మి, కార్యాలయ ఏఓ ప్రతిమ కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగుల ఆప్షన్స్ తీసుకున్నారు. అలాగే నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్లు ) మొత్తం 404 మంది ఉండగా, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 258, రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నా వారు 30 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో జరిగిన నంద్యాల జిల్లా ఉద్యోగుల కౌన్సిలింగ్ డీపీఓ లలితాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ స్థానిక జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం హాల్లో నిర్వహించారు. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి జిల్లాలోని ఒకే ప్రాంతంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు 570 మంది, రిక్వెస్ట్ బదిలీలను కోరుతు 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కే తులసీదేవి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సహాయ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పింఛన్లు తప్పించి ఏ పథకం పూర్తిగా అమలు చేయకపోయినా అన్ని చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఈ మోసాన్ని ప్రజలు ఏడాది లోపే గమనించారన్నారు. -
ఒకటి మంత్రికి.. రెండోది ఎమ్మెల్యేకు!
కర్నూలు(సెంట్రల్): సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలకు పాతరేసి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉన్న వారికి అనువైన స్థానాలు ఇస్తున్నారు. ఎవరైనా ఆ స్థానాలను కోరుకుంటే వాటిలో మంత్రి చెప్పిన వ్యక్తి ఉన్నారని, ఎమ్మెల్యే సూచించిన వారికి ఇవ్వాల్సి ఉందని, మరో స్థానం కోరుకోవాలని నేరుగా చెబుతున్నారు. దీంతో ఆదివారం చేపట్టిన వీఆర్వోలు, సర్వేయర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇందులో కొందరు అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడంతోనే జరుగుతోందని చెబుతున్నారు. అధికారుల తీరుపై సర్వేరయర్ల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు, నంద్యాల డీఆర్వోలు సి.వెంకటనారాయణమ్మ, రామునాయక్ ఆధ్వర్యంలో వీఆర్వోలకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. సునయన ఆడిటోరియంలో కర్నూలు, నంద్యాల సర్వే ఏడీలు మునికన్నన్, జయరాముడు ఆధ్వర్యంలో సర్వేయర్లకు బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ముందుగా స్పౌజ్, అరోగ్యం, ఒంటరి మహిళ, మ్యూచ్‌వల్ విభాగాల్లో ర్యాంకుల ఆధారంగా వీఆర్వోలు, సర్వేయర్లను కౌన్సెలింగ్ పిలిచారు. వచ్చిన వారిలో ర్యాంకుల ఆధారంగా పిలిచి...మూడు ఆప్షన్లు ఇచ్చిన అధికారులు.. ‘మూడింటిలో ఒక స్థానం మంత్రి సిఫారసు ఉంది.. మరొక స్థానం ఎమ్మెల్యే మనిషికి ఇవ్వాలి.. ఇంకో స్థానం కోరుకో’ అని చెబుతుండడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఫార్సు లేఖల పేరిట ఫోకల్ స్థానాలను రిజర్వ్ చేసినట్లు చేయడం అన్యాయమని వాపోయారు. సిఫార్సు అంటే ఒకటో..రెండో ఉండాలి తప్ప.. ఎక్కువ స్థానాలను వారికే కేటాయించేలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులు లేని వారికి నాన్‌ఫోకల్ పోస్టులను ఇస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించారు. ఎవరికీ కావాల్సిన స్థానాలు వారికి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు.. సర్వేయర్లలో బదిలీల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. 800 మందిలో 294 మందికి ఐదేళ్ల సర్వీ సు పూర్తి కాగా...మిగిలిన వారు రిక్వెస్టు జాబితాలో దరఖాస్తు చేసుకున్నారు.అలాగే వీఆర్వోల్లో గ్రేడు–2లో మొత్తం 77 మంది దరఖాస్తు చేసుకొగా ఇద్దరు హాజరు కాలేదు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తైన వారు 30మంది ఉన్నారు. గ్రేడు–1 వీఆర్వోలో 14 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది మాత్రమే హాజరయ్యారు. కాగా, వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగిసింది. అయితే సర్వేయర్లు భారీ సంఖ్యలో ఉండడంతో రాత్రి వరకు కొనసాగింది. కాగా, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిఫార్సు లేఖల నేపథ్యంలో సర్వేయర్లు కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. దీంతో అధికారులు వారికి సర్దిచెప్పి నిబంధనలకు మేరకు ఖాళీలను చూపుతామని చెప్పి అర్ధరాత్రి వరకు కొనసాగించారు. ముగిసిన కౌన్సెలింగ్ కర్నూలు (టౌన్): ఉమ్మడి జిల్లాకు సంబంధించి సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం ముగిసింది. ప్లానింగ్ కార్యదర్శులు 155 మంది, ఎమినీటీస్ కార్యదర్శులు 170 మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు, సొంత వార్డు మినహా ఇతర వార్డులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చి వీఆర్వో, సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్ లేఖలు లేని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసిన అధికారులు అర్ధరాత్రి వరకు కొనసాగిన సర్వేయర్ల బదిలీల ప్రక్రియ -
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో సండే సందడి నెలకొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. రేపటి నుంచి ఇష్టకామేశ్వరీ దర్శనం నిలిపివేత శ్రీశైలంప్రాజెక్ట్: నల్లమలలో వెలసిన ఇష్టకామేశ్వరీ అమ్మవారి దర్శనం మంగళవారం నుంచి నిలిపేస్తున్నారు. పెద్దపులుల సంయోగ సమయంగా కావడంతో జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు మూడు నెలల పాటు అమ్మవారి దర్శనానికి అనుమతి లేదని నెక్కంటి అటవీక్షేత్రాధికారి ఆరీఫ్‌ఖాన్ ఆదివారం తెలిపారు. శ్రీశైలం శిఖరేశ్వరం నుంచి ఇష్టకామేశ్వరి గూడెం వరకు ఎటువంటి వాహనాల రాకపోకలు ఉండవన్నారు. నెక్కంటి జంగిల్ రైడ్‌గా పేర్కొనే ఇష్టకామేశ్వరీ మాత ఆలయ దర్శనాన్ని నిలిపివేస్తున్న విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. తిరిగి అక్టోబర్ నెల ప్రారంభంలో అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ పెద్దపులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో ఉండే జంగిల్ రైడ్లు, పుణ్యక్షేత్రాల దర్శనాలను నిలిపి వేశారు. 67 మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): డీఎస్సీ పరీక్షల్లో భాగంగా ఆదివారం రాజీవ్‌గాంఽధీ మెమోరియల్ కాలేజీలోని పరీక్ష కేంద్రంలో జరిగిన పరీక్షకు 67 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 85 మంది అభ్యర్థులకు గాను 53 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన డీఎీస్సీ పరీక్ష ఐదు కేంద్రాల్లో జరిగిందన్నారు. 790 మంది అభ్యర్థులకు గాను 755 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 35 మంది గైర్హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఈఓ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దర ఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశ లో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. -
మొక్కజొన్న రైతుకు ఆదిలోనే హంసపాదు
పాములపాడు: ‘ముందస్తు వర్షాలు’ అంచనాలను నమ్మిన మొక్కజొన్న రైతు మోసపోయాడు. వర్షం జాడ లేకపోవడం, వేసిన పైరులో ఎదుగుదల లోపించడం, ప్రభుత్వం ఆదుకోకపోవడం రైతులను కలచివేస్తోంది. ఎంతో ఆశతో ఖరీఫ్‌ను ఆరంభించిన అన్నదాత ఆదిలోనే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చింది. వరుణుడు ముఖం చాటేయడం కళ్లెదుటే పైరు ఎండుదశకు చేరడంతో చేసేది లేక మొక్కజొన్న పైరును రైతన్నలు దున్నేస్తున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో మొక్కజొన్న ప్రధాన పంట. ఖరీఫ్‌లో సుమారు 8వేల హెక్టార్లలో సాగవుతుంది. ఈ సంవత్సరం ముందస్తు వర్షాలు కురుస్తాయని, రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం విదితమే. మే నెల చివరి వారంలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు ఎంతో ఆశతో మొక్కజొన్న, పత్తి సాగుకు సిద్ధమయ్యారు. అయితే జూన్ నెలాఖరు వరకు కూడా వర్షాల జాడలేకపోవడంతో రైతులు నిండా మునిగిపోయారు. ఎండలు తీవ్రంగా ఉండటం, గాలి విపరీతంగా వీస్తుండటంతో భూముల్లో తేమ శాతం తగ్గిపోయింది. విత్తనాలు మొలకెత్తినా పంటలో ఎదుగుదల లేక పైర్లు వాడుపడుతున్నాయి. ఎకరా మొక్కజొన్న సాగుకు రైతులు రూ.15వేల వరకు ఖర్చు చేశారు. చేసేది లేక ఇప్పటికే సుమారు 50 శాతం పైగా రైతులు పొలాలను దున్నేస్తుండటం గమనార్హం. దీనిపై రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 8 ఎకరాల్లో మొక్కజొన్న దున్నేశాం నేను మా అన్న విజేయుడు 8 ఎకరాల్లో మొక్కజొన్న పైరును దున్నేశాం. విత్తనాలు బాగా మొలిశాయి. పైరు బాగుందనుకున్నాం. ఈ సంవత్సరమైనా కష్టాలు తీరుతాయనుకున్నాం. తీరా చూస్తే వర్షాలు కురవకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. పంట ఉంచినా లాభం ఉండదు. అందుకే పైరును దున్నేశాం. వర్షం పడితే మరోసారి విత్తనం వేస్తాం. – గడ్డం కాంతయ్య, రైతు, బానుముక్కల 40 ఎకరాలు సిద్ధం చేసి ఉంచాం మొక్కజొన్న విత్తనం వేయడానికి 40 ఎకరాల పొలం సిద్ధం చేసి ఉంచాం. వర్షం కురిస్తే విత్తనం వేయడమే. ఆకాశంలో మబ్బులు వస్తున్నాయి కానీ.. వర్షం పడటం లేదు. విత్తనాలు, ఎరువులు అన్నీ తెచి్చపెట్టుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం బోర్లలో ఉన్న నీరు ఎంతకూ సరిపోవు. ఇప్పటికే విత్తనం వేసిన వారు తీవ్రంగా నష్టపోయారు. – కోట్ల నాగేశ్వరరెడ్డి, రైతు, పాములపాడు బాబు హయాంలో కరువే చంద్రబాబు, కరువు కవలలు అంటే ఏమో అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే నిజమే అనిపిస్తుంది. ముందస్తు వర్షాలు మురిపించినా విత్తనం వేసిన తరువాత వరుణుడి జాడ లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. ఆరుగాలం కష్టపడే అన్నదాతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. – రాములు నాయక్, రైతు, క్రిష్ణానగర్ -
అహోబిలం క్షేత్రంలోనూ ‘బి’ ట్యాక్స్
సాక్షి టాస్క్ ఫోర్స్ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన ప్రసిద్ధ క్షేత్రంలో గ్రామ పంచాయతీ ప్రధాన ఆదాయ వనరు అయిన టోల్గేట్ వేలంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ జోక్యం మితిమీరింది. దీనివల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోగా.. భూమా ట్యాక్స్ (‘బి’ ట్యాక్స్) భారీగా పెరిగింది. పంచాయతీకి, అహోబిలం క్షేత్ర అభివృద్ధికి చేరాల్సిన ఆదాయం అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి చేరుతోందనే చర్చ జరుగుతోంది. డీఎల్పీఓ రాంబాబు అధ్యక్షతన అహోబిలం టోల్గేట్ (అహోబిలం క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల నుంచి రుసుము వసూలుకు) శనివారం వేలం నిర్వహించారు. వేలంలో పాల్గొనేందుకు ఇతరులెవరూ రాకుండా చక్రం తిప్పిన టీడీపీ నేత రూ.20.31 లక్షలకే దక్కించుకున్నారు. రూ.కోటి వస్తుందనుకుంటే.. వేలం సమయంలో పాటదారులంతా ఎంత రింగ్ అయినా టీడీపీలోని మూడు వర్గాలతో పాటు వైఎస్సార్సీపీ వర్గీయులు పోటాపోటీగా పాడుతారనే చర్చ జరిగింది. గత ఏడాది ‘బి’ ట్యాక్స్ రూ.40 లక్షలు, అధికారులకు రూ.10 లక్షలు, పంచాయతీకి రూ.19.30 లక్షలు చెల్లించినా రూ.కోటి వరకు కాంట్రాక్టర్‌కు మిగిలిందని అంచనా. దీంతో ఈ ఏడాది టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా ఏర్పడి వేలంలో పాల్గొనేందుకు పోటీపడ్డారు. ఇది చూసిన గ్రామస్తులు ఈ ఏడాది రూ.కోటి వరకు ఆదాయం వస్తుందని భావించారు. అయితే వేలంలో పాల్గొనేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు, అక్కడి అధికారులకు ఫోన్లు రావడంతో ‘అన్న ఎంత చెబితే అంతే’ అని నిమిషాల్లో వేలం ముగించారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. దశాబ్దాలుగా అహోబిలం టోల్గేట్ వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారంతా వేలంలో బహిరంగంగా పాల్గొనడం ఆనవాయితీ. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించిన వేలంలో సుమారు రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఏటా వచ్చే ఆదాయం కంటే కనీసం 20 శాతం అదనంగా పెంచి పాట పెట్టడం ఆనవాయితీ. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.40 లక్షలు ఉన్న వేలం పాటను రూ.19 లక్షల పైగా తగ్గించి.. అధికారులు టీడీపీ నాయకులకు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాదైనా ఆదాయం పెరుగుతుందనుకుంటే రూ.లక్ష పెంచి మమ అనిపించారు. ‘బి’ ట్యాక్స్ రూ.60 లక్షలకు పైనే! పంచాయతీకి వచ్చే ఆదాయం ఎంత వీలైతే అంత తగ్గించాలని అధికారులకు హుకుం జారీ చేయడంతో రూ.20 లక్షలతో మొదలు పెట్టి రూ.21 లక్షలకు వేలం ముగించారు. ఇందుకు వేలంలో పెద్దఎత్తున పాటదారులు పాల్గొంటున్నట్టు షో చేసి మొత్తం మీద గత ఏడాది కంటే రూ.లక్ష వరకు పెంచి మమ అనిపించారు. కాగా.. వేలంలో పాల్గొన్న మూడు గ్రూపులకు చెందిన నాయకులను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకుని ‘ఇప్పుడు చెప్పండి. ఎవరు ఎంతిస్తారో’ అని ఇంటివద్దే వేలం పెట్టడంతో ‘బి’ ట్యాక్స్ కింద రూ.62 లక్షలు ఇచ్చేందుకు ఓ వర్గం ఒప్పందం చేసుకోగా.. మరో వర్గం ఒక రోజు అవకాశం ఇస్తే ఆలోచించుకుని అంతకంటే ఎక్కువే ఇస్తామని చెప్పుకుని ఇంటికి వచి్చనట్టు సమాచారం. కాగా.. ఇదంతా సంబంధిత అధికారులతో పాటు పోలీసులకు అందరికీ తెలిసినా చేష్టలుడిగి చూడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయం రాకుండా అడ్డుకున్నారు గ్రామ పంచాయతీకి ఆదాయం రాకుండా అధికారుల సాక్షిగా అడ్డుకున్నారు. అధికార పార్టీ కి చెందిన వారిని 15 మందిని వేలం కేంద్రానికి పంపించారు. వేరే వారిని ఇద్దరినే లోపలకు పంపించారు. వేలంలో పోటాపోటీగా పాల్గొనేందుకు వచ్చిన వారిని మాత్రం లోనికి అనుమతించకుండా వెనక్కి పంపడం ఎంతవరకు సబబు. ఈ ఏడాదిలో జరిగిన రెండు వేలం పాటల్లో సుమారు రూ.80 లక్షలు పంచాయతీకి చెందిన ఆదాయాన్ని దోచుకోవడం జరిగింది. సంబంధిత అధికారులు, పోలీసులు ఆలోచించాలి. – గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ -
ఏఎన్ఎంల జాబితాపై గందరగోళం
కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంలకు బదిలీలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల్లో అన్ని కేటగిరిలకు బదిలీలను ర్యాంకు ఆధారంగా చేస్తుండగా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్‌ను ఎలా తీసుకుంటారని దాదాపు 30 మందికి పైగా ఏఎన్ఎంలు శనివారం వారి అభ్యంతరాలను కార్యాలయ అధికారులకు అందజేశారు. తాజా జాబితాలోనూ ర్యాంకు ఎక్కువగా ఉన్న వారు పై భాగాన ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఏఎన్ఎంలకు 2019 అక్టోబర్ 2న జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని, ఆ రోజున గాంధీ జయంతి ఉండటం వల్ల సెలవు అని, ఆ తేదీని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు విడుదల చేసిన జాబితాలోనూ పలు తప్పులు ఉన్నాయని, అధికారులు వీటిని సరిచేసి ర్యాంకు ఆధారంగా జాబితా తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించాలినంద్యాల(న్యూటౌన్): ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలని ఫుట్సేఫ్టీ అధికారి వెంకటరాముడు హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లు, బజ్జీల బండ్ల నిర్వాహకులకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ కాచిన నూనెను మరలా కాయడం, కాలం చెల్లి న ఆహార పదార్థాలు వాడటం వంటి 8 కేసులకు సంబంధించి రూ.1.80 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. హోటల్, డాబాలలో కలర్స్, టేస్టింగ్ సాల్ట్ వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చిన్నారిపై కుక్కదాడికొత్తపల్లి: ఇంటి బయట ఉన్న 9 నెలల చిన్నారి పై కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన ముసలిమడుగు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు, చిన్నారి దంపతులు తమ తొమ్మిది నెలల కూతురిని ఇంటి బయట ఉన్న అరుగు వద్ద కూర్చోబెట్టి తల్లి ఇంట్లోకి వెళ్లిది. అంతలోనే ఓ కుక్క చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసింది. చెవికి, ముక్కుకు రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. -
దర్శనం దందా!
అమాయక భక్తులు దొరికితే చాలు.. ఇక్కడి దళారులకు పండగే. అడ్డదారుల్లో దర్శనాలు చేయించి అందినకాడికి దోచుకోవడం వీరికి అలవాటే. ఏకంగా శ్రీ మఠం అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తుండటం ఆశ్చర్యకరం. ఇంతటి అపచారం రాఘవేంద్రుని సన్నిధిలో కొంతకాలంగా జరుగుతుండటం మహా అపచారం. – మంత్రాలయం ● దర్శనం పేరుతో భక్తులకు గాలం ● అడ్డదారుల్లో జేబులు నింపుకుంటున్న దళారులు ● ఆలస్యంగా మేలుకున్న శ్రీ మఠం అధికారులు మంత్రాలయం ఆధ్యాత్మిక క్షేత్రం ఎంతో పేరెన్నిక గన్నది. ఇక్కడ కొలువుదీరిన శ్రీరాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మలను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దీనినే ఆసరాగా చేసుకున్న కొంత మంది దళారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో కొంత మంది ప్రైవేటు వసతి గృహాలను లీజుకు నడుపుతున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో గదులు కేటాయించే సమయంలో గదుల అద్దెతో పాటు దర్శన సౌకర్యం, పరిమళ ప్రసాదం ప్యాకేజీగా మాట్లాడుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే బుధ, గురు, శని, ఆది వారాల్లో లక్షకు పైగా భక్తులు మంత్రాలయం దర్శన నిమిత్తం వస్తుంటారు. తమ వసతి గృహాల్లో బస చేసిన వారు శ్రీ మఠం చేరుకోగానే 6, 7 గేటు నెంబర్ల వద్దకు వెళ్లి మన వారే అంటే చాలు క్షణాల్లో దర్శనం అయిపోతుంది. సాధారణ భక్తులకు మాత్రం గంటల కొద్ది సమయం పడుతుంది. అంతేగాకుండా ఇక్కడ లభించే పరిమళ ప్రసాదం తరహాలోనే కొంత మంది వ్యాపారులు కొన్ని రకాల మిఠాయిలను తయారు చేసి ప్రసాదం పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. ఈ తంతు ఇటీవల కాలంలో శ్రీ మఠం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఆలస్యంగా స్పందించిన అధికారులు శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వామి వారి దర్శన దందా బాగోతంపై శ్రీ మఠం అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, శ్రీపతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక క్యూలైన్లో ఏర్పాటు చేశామని, ఎవ్వరూ కూడా డబ్బు కట్టి మోసపోవద్దని మైకుల ద్వా రా సూచనలు చేయించినట్లు తెలిపారు. ఎవరైనా డబ్బు వసూలు చేసినట్లైతే తమ దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిమళ ప్రసాదం తరహాలోనే ప్రసాద విక్రయాలు జరుగుతున్నాయని తమ దృష్టికి రాగానే విజిలెన్స్ విభాగం వారు తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇక మీదట ఎవరైనా నకిలీ పరిమళ ప్రసాదం విక్రయిస్తే షాపు లీజు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
839 మంది మహిళా పోలీసులకు స్థానచలనం
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 839 మంది గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులకు స్థానచలనం కలిగింది. ర్యాంకింగ్ ఆధారంగా మహిళా పోలీసులను బదిలీ చేశారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం 839 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. ర్యాంకింగ్ ఆధారంగా ఖాళీ ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ తెరపై చూపి కోరుకున్న స్థానానికి బదిలీ చేశారు. దృష్టి లోపం, అంధత్వం ఉన్నవారికి (విజువల్ ఛాలెంజ్), మేధో వైకల్యం (మెంటల్లీ డిసేబుల్డ్), ట్రైబ్స్ దివ్యాంగులు, మెడికల్, స్పౌజ్, జనరల్ కేటగిరీల కింద ఉన్నవారిని వరుస క్రమంలో వ్యాస్ ఆడిటోరియంలోకి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కంప్యూటర్ తెరపై ప్రదర్శించిన ఆప్షన్లకు అనుగుణంగా కోరుకున్న స్థానానికి నియమించారు. బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ జులై 1న పింఛన్ల పంపిణీ ఉన్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలని పోలీసు అధికారులు తెలిపారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యేవరకు అక్కడే కొనసాగి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బదిలీ ప్రొసీడింగ్స్ విడుదల చేస్తామన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి, పోలీస్ వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి, సీఐలు తేజమూర్తి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. ‘కౌన్సెలింగ్’ పాట్లు! ఆదోనికి చెందిన లక్ష్మీదేవి మహిళా పోలీస్‌గా పనిచేస్తోంది. ఆరు నెలలుగా మెటర్నిటీ లీవ్‌లో ఉంది. మూడు రోజుల కిందట శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇదే సమయంలో శనివారం సచివాలయ ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండటంతో ఏకంగా తన చంటిబిడ్డను తీసుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు హాజరైంది. అలాగే మరికొంత మంది కడుపుతో ఉన్న ఉద్యోగినులు, ఇంకొందరు చంటిబిడ్డలతో వచ్చి అక్కడే ఊయలలు కట్టిన దృశ్యాలు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద చర్చనీయాంశమయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాఫీగా సాగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో ఉద్యోగులకు అవస్థలు తప్పడంలేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
బదిలీల కౌన్సెలింగ్ గందరగోళం
● సచివాలయాల ఉద్యోగుల్లో ఆందోళన ● టీడీపీ నేతల సిఫార్సులకే అధికారుల మొగ్గుకర్నూలు (టౌన్): సచివాలయాల ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ‘టిక్ పెట్టండి.. వెళ్లిపోండి’ అంటూ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగులు అవాక్కుయ్యారు. ‘ఇదేం కౌన్సెలింగ్ తీరు’ అంటూ వాగ్వావాదానికి దిగారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేసే సచివాలయాల ఉద్యోగులకు రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హడావుడిగా కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు శనివారం సుంకేసుల రోడ్డులో ఉన్న నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఉమ్మడి జిల్లాలో 308 సచివాలయాలు ఉన్నాయి. ఒకే చోట పనిచేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిలో 173 ఆడ్మిన్ కార్యదర్శలు, 235 ఎడ్యుకేషన్ కార్యదర్శులు, 248 వెల్ఫేర్ కార్యదర్శులు, 208 మంది శానిటేషన్ కార్యదర్శులు ఉన్నారు. వీరందరికీ రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. మొదటి రోజు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు వార్డు శానిటేషన్ కార్యదర్శులకు, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శులకు, సాయంత్రం 5 నుండి 7.30 గంటల వరకు వెల్ఫేర్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వచ్చిన వారు మూడు ఆప్షన్లు ఎంచుకొని వెళ్లాలని కమిషనర్ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీల కౌన్సెలింగ్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్లానింగ్ కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ బహిష్కరణ ఈనెల 29వ తేదీ ఆదివారం వార్డు ప్లానింగ్, ఎమినిటీ స్ కార్యదర్శులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఈ కౌన్సెలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు సచివాలయాల ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాద్, ఆలీ, భాస్కర్, జ్యోత్న్స, తారకేశ్వర్ రెడ్డి, అమర్ నాథ్, ప్రసాద్ తెలిపారు. కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు అన్యాయంగా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళన కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారంటూ సచివాలయాల ఉద్యోగులు శనివారం రాత్రి భారీగా కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన చేశారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్ఓవెంకట నారాయణమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అయితే జర్నలిస్టులు రావడంతో ‘మీడియాకు ఎందుకు చెప్పారు’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల సిఫార్సులకే మొగ్గు..ఎక్కడా లేని విధంగా కర్నూలులో బదిలీల కౌన్సెలింగ్ గుట్టుగా చేయడం ఏంటని కొందరు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారు మాత్రమే కర్నూలు అర్బన్, పాణ్యం అర్బన్, కోడుమూరు అర్బన్‌లో కొనసాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టారన్న విమర్శలు వచ్చాయి. సిఫార్సు లేని వారికి ఎక్కడ పడితే అక్కడ బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరం
● న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల(న్యూటౌన్): జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరమని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫ రూక్ అన్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన పారా స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం క్రీడా కోటలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పించిందన్నారు.అనంతరం జాతీయ స్థాయి పథకం సాధించిన దివ్యాంగ క్రీడాకారుడు వెంకట్‌ను అసోసియేషన్ నాయకులతోపాటు మంత్రి ఫరూక్ అభినందించారు. పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు రవికృష్ణ, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు పీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
విధి ‘పరీక్ష’లో విగత జీవిగా..
● బైక్ చక్రంలో బురక ఇరుక్కుని కింద పడిన మహిళ ● వెనక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో దుర్మరణం పాణ్యం: టీచర్ ఉద్యోగం సాధించాలన్నది ఆమె కల. ప్రభుత్వ కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కల సాకారం చేసుకునేందుకు పరీక్షకు సైతం హాజరైంది. విధి ఆ కలతో పాటు ఆమెను ఛిద్రం చేసింది. పాణ్యం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన షబానా (30) పాణ్యం సమీపంలో ఆర్జీఎం కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన డీఎస్సీ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన తర్వాత భర్త ఇద్రూస్బాషాతో కలసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పాణ్యం వద్ద ఎస్సార్బీసీ కాల్వ దాటగానే షబానా ధరించిన బురక బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమె కింద పడింది. అదే సమయంలో వారి వెనుక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ట్యాంకర్ వెళ్లడంతో షబానా శరీరం ఛిద్రమైంది. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం కాగా.. ఇద్రూస్ బాషా పాలిష్ కటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముందుగా కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికై న వారిని జెడ్పీ స్థాయీ సంఘ కమిటీల్లో సభ్యునిగా నియమించేందుకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అనంతరం వ్యవసాయం – అనుబంధ శాఖలు, వైద్యం – ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సమావేశాని కంటే ముందు ఉదయం 9 గంటలకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సీఈఓ తెలిపారు. -
చెత్త రహిత జిల్లాగా మార్చాలి
నంద్యాల: అధికారులు నిబద్ధతతో పని చేసి చెత్త రహిత జిల్లా మార్చాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ 2025పై ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శిలకు ఒకరోజు జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను పారిశుద్ధ్యపరంగా పరిశుభ్రంగా ఉండేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ టీమ్స్ రావడం జరుగుతోందన్నారు. అకడ మిక్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న గ్రామాలను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ర్యాంకులు కేటాయిస్తారని చెప్పారు. వైద్య సహాయం, ఆర్థిక సహాయం కోసం ప్రజలు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే జిల్లా యంత్రాంగానికి పంపాలన్నారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్‌లో అమలు చేయాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ అవగాహన కల్పించారు. సమావేశంలో డీపీఓ లలితా బాయి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి డీఎల్పీఓ మంజుల వాణి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
కూటమి పాలనలో శాంతి లేదు.. భద్రత లేదు
● రామసుబ్బారెడ్డిది ముమ్మాటికీ హత్యే ● కేసు నీరుగారిస్తే ఆందోళన చేస్తాం ● ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు ● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం టీడీపీ బాండ్లతో త్వరలో ఇంటింటికీ.. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీల బాండ్లతో త్వరలో ఇంటింటికీ తిరగను న్నామని శిల్పా స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ నిర్వహించిన వెన్నుపోటు, యువతపోరు కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని, ప్రజలు, యువకులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా హాజరు కావడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కూటమి నేతలు ఇచ్చిన బాండ్లు తీసుకుని వెళ్లి ఎవరికి ఏ ప్రయోజనం చేకూరిందో తెలుసుకుని కూటమి ప్రభుత్వం దుర్మార్గాన్ని ఎండగడతామన్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ వాహనం కింద పడి ఒకరు మృతి చెందిన విషయంపై విలేకరులు ప్రస్తావించగా.. కూటమి నేతలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మహానంది: కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజలకు శాంతి, భద్రత లేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. మసీదుపురం గ్రామానికి చేరుకుని రామసుబ్బారెడ్డి మృతి సమాచారం తెలుసుకున్న ఆయన శుక్రవారం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. మృతుడి భార్య తులశమ్మ, సోదరుడు బుగ్గారెడ్డి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో శిల్పా మాట్లాడుతూ.. రామసుబ్బారెడ్డి పార్టీలకు అతీతుడని, సౌమ్యుడైన ఆయనను కూటమి నేతలు చంపేశారని, ఈత వచ్చినోడు ఎలా చస్తాడు, శరీరంపై గాయాలెందుకు ఉంటాయని, ఇది ముమ్మాటికీ హత్యేనన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి హత్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును తప్పుదారి పట్టించాలని చూస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో శ్రీశైలం నియోజకవర్గంలో బండిత్మకూరు మండలం లింగాపురంలో ఒకటి, మహానంది మండలం సీతారామపురంలో మరొకటి, ఇప్పుడు మసీదుపురంలో ఇది మూడో హత్య అన్నారు. మద్యం డోర్ డెలివరీ కూటమి నేతలు కమీషన్ల కోసం గ్రామాల్లో మద్యం సీసాలను డోర్ డెలివరీ చేస్తున్నారని శిల్పా విమర్శించారు. పాల ప్యాకెట్లు దొరకని పల్లెల్లో 24 గంటలూ మద్యం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొమ్మా పాలమహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, మసీదుపురం సర్పంచ్ కాకనూరు లక్ష్మీరెడ్డి, ఎంపీటీసీ మునగాల నాగమల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యనందించాలి
గోస్పాడు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పార్వతీపురం హైస్కూల్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడి పాఠశాల యూపీ వరకు కొనసాగుతుండేదని, ప్రస్తుతం హైస్కూల్‌గా మార్పు చేసి 9వ తరగతి కొనసాగుతుందని, ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అదనంగా ఉపాధ్యాయులు పెంచేలా చూడాలన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని, విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. 54,784 మందికిఇంటి వద్దనే రేషన్ పంపిణీ నంద్యాల(అర్బన్): జిల్లాలోని వృద్ధులు, దివ్యాంగులు, నిస్సాహాయ స్థితిలో ఉన్న 54,784 మందికి జూలై నెలకు సంబంధించి ఇళ్ల వద్దనే రేషన్ పంపిణీ జరుగుతోంది. కార్డు కలిగిన వయస్సు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నిస్సాహాయ స్థితిలో ఉన్న వారు జిల్లాలో దాదాపు 54,784 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు డీలర్లు, వీఆర్ఓల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేయనున్నారు. రేషన్ పంపిణీ ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని ముందుగానే తెలియజేస్తారు. జాబితా ప్రకారం డీలర్ వారి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ పంపిణీ అందించాలని, అలా ఇవ్వని డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 26, 27వ తేదీల్లో 7,604 మందికి 13.88 శాతంతో రేషన్ పంపిణీ జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డీఏఓ బాధ్యతల స్వీకరణ నంద్యాల(అర్బన్): జిల్లా వ్యవసాయాధికారిగా వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డీఏఓగా ఉన్న మురళీకృష్ణ విజయవాడ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గుంటూరు డీడీఏగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును నంద్యాల జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లును వ్యవసాయాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అలాగే నంద్యాల ఏడీఏగా ఆంజనేయ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఏడీఏగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ కర్నూలుకు బదిలీ కాగా ఆత్మకూరు ఏడీఏగా పని చేస్తున్న ఆంజనేయ బదిలీపై నంద్యాల ఏడీఏగా బాధ్యతలు స్వీకరించారు. ఆశా కార్యకర్తల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం గోస్పాడు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల ఉద్యోగ భర్తీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 24, పట్టణ ప్రాంతాల్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత దరఖాస్తు నమూనాలను https://nandyal.ap.gov.in వెబ్సైట్లో పొందు పరిచారన్నారు. దరఖాస్తులను ఈనెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ లోపు పట్టణాల్లో వారు వార్డు సచివాలయాల పరిధిలోని యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు, గ్రామీణ ప్రాంతాల వారు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు అభ్యర్థులు స్వయంగా తమ దరఖాస్తులను అందజేయాలన్నారు. నిత్యాన్నదానానికి కూరగాయల వితరణ మహానంది: మహానందిలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద పథకానికి అవసరమైన మేరకు కూరగాయలను ఉచితంగా పంపించేందుకు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ మార్కెట్‌కు చెందిన వ్యాపారులు ముందుకు వచ్చారని ఏఈఓ ఎరమల మధు, ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు వేదపండితులు రవిశంకర అవధాని, హనుమంతుశర్మ, అన్నప్రసాద పథకం ఇన్చార్జ్ రామశివలు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి మార్కెట్లోని వ్యాపారులను కలిశారు. మార్కెట్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్రారెడ్డి, జయప్రకాష్రెడ్డిలతో పాటు సభ్యులైన బుచ్చయ్య, శ్రీశైలం నరసింహులు, భాస్కర్‌రెడ్డి, రాకేష్ రెడ్డి, తదితరులను కలిసి విన్నవించగా వారు ఒప్పుకున్నారని వివరించారు. -
తొలగని
‘దారి’ద్య్రంగ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్లు పూర్తి స్థాయిలో ఛిద్రం అయ్యాయి. పల్లె ప్రజలు అవస్థల మధ్య ప్రయాణాలను సాగిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆరోపణలు చేసిన కూటమి నేతలు నేడు పల్లె రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. పల్లెలకు సంబంధించిన రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో పలు బస్సు సర్వీసులు కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. కోడుమూరు నుంచి గూడురు వరకు (వయా చనుగొండ్ల ) రోడ్డు పూర్తి అయినా నేటికీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరు, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు తదితర మండలాల్లోని గ్రామాలకు చెందిన రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. ● ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం – శిరివెళ్ల రోడ్డు పూర్తి స్థాయిలో ఛిద్రమైంది. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై 15 గ్రామాలకు చెందిన ప్రజలు అవస్థల ప్రయాణం చేస్తున్నారు. ● గ్రామాల్లో డ్రైనేజీలను ఏర్పాటు చేయకుండా సీసీ రోడ్లను నిర్మించడంతో అనేక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. జూపాడుబంగ్లాతో పాటు తంగడంచె ఎస్సీ, బీసీ కాలనీలు, పారుమంచాల ఎస్సీ కాలనీతో అంతర్గత రహదారులు నిర్మించినా డ్రైనేజీలను ఏర్పాటు చేయలేదు. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
మండలాల వారీగా సమస్యలు ఇవీ..
● మండల కేంద్రమైన వెల్దుర్తి ప్రజలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో రూ.3.5 కోట్లు ఖర్చు చేసి కృష్ణగిరి రిజర్వాయర్ ద్వారా రోజుకు 9 లక్షల లీటర్ల నీటిని మూడు సంపుల ద్వారా వెల్దుర్తికి నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ గురించి పట్టించుకోకపోవడంతో చుక్క నీరు రావడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట, గోవర్ధనగిరి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు అయ్యాయి. సొంత భవనాలు లేకపోవడంతో వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాలను నిర్మిస్తే దాదాపు 39 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందే అవకాశాలు ఉంటాయి. ● కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలో 40 వేల ఎకరాలు ఎల్లెల్సీ ఆయకట్టు ఉన్నా, ప్రస్తుతం 400 ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి నెలకొనింది. అలాగే కోడుమూరు నుంచి పులకుర్తి, కల్లపరి మీదుగా సీ బెళగల్ వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సు రద్దు కావడంతో ప్రజలు, ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ● గాజులదిన్నె డ్యాం పక్కనే ఉన్నా మండల కేంద్రమైన గోనెగండ్లను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తుంగభద్ర కెనాల్లో నీటిని ఎస్ఎస్ ట్యాంకకు లిఫ్ట్ చేసి కుళాయిల ద్వారా నీటిని అందించాల్సి ఉంది. అయితే కెనాల్లో నీరు తగ్గిపోవడంతో రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ● పెద్దకడుబూరు మండలంలోని బసలదొడ్డి, గవిగట్టు, పీకలబెట్ట, కంబదహాల్ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనింది. పులికనుమ రిజర్వాయర్ నుంచి నీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు బోర్లపైనే అధారపడి ఇబ్బందులు పడుతున్నారు. నెదర్ల్యాండ్ స్కీం ఉన్నా కోసిగి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కూడా తాగునీరు అందని పరిస్థితి నెల కొనింది. ఈ స్కీం నుంచి 16 గ్రామాలకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగైదు గ్రా మాలకు మించి నీరు అందని పరిస్థితి నెలకొంది. ● మద్దికెర మండలం బరుజుల గ్రామ ప్రజలకు తాగునీరు అందడం లేదు. గ్రామంలోని బోర్లే వీరికి దిక్కవుతున్నాయి. తాగునీటిని 10 కిలోమీటర్ల దూరంలోని పత్తికొండ నుంచి తెచ్చుకుంటున్నారు. గుంతకల్ నుంచి పెరవలి మీదుగా ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత అనుమానాస్పద మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్సీపీ నేత మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. మహానంది మండలం మసీదుపురం గ్రామ శివారులోని బావిలో రామసుబ్బారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆయన తల, శరీరంపై దెబ్బలను పోలీసులు గుర్తించారు. ఇది ముమ్మాటికీ హత్యేనని మృతుని కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ నేత వంటెద్దు ప్రవీణ్‌కుమార్ రెడ్డి హత్య చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.రామసుబ్బారెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే శ్రీశైలం నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండడమే ఈహత్యలకు కారణమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి హత్యకు కారకులను శిక్షించాలని శిల్పా డిమాండ్ చేశారు. మహానంది పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
కౌలు రైతులకు విరివిగా రుణాలు
కర్నూలు(సెంట్రల్): కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..గతేడాది హౌసింగ్, విద్యకు లోన్లను ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ ఏడాది రుణాల మంజూరులో మరింత చొరవ చూపాలన్నారు. గతేడాది నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలను అందజేశారని, అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. రెన్యువల్ ఎనర్జీ కేంద్రంగా కర్నూలు రానున్నకాలంలో కర్నూలు జిల్లా పునరుత్పాదకశక్తికి(రెన్యువల్ ఎనర్జీ)కేంద్రంగా మారునుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఓర్వకల్లో 1000 మెగా వాట్ల సోలార్ ప్రాజెక్టు, గ్రీన్కో ద్వారా 1,680 మెగా వాట్లా సామార్థ్యంతో పంప్డ్ స్టోరేజే హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటితో ఆలూరు, ఆస్పరి, పత్తికొండ ప్రాంతాల్లో పలుసోలార్, విండ్ ప్రాజెక్టులు ఏర్పాటు అవుతుండడంతో రుణాలు ఇవ్వాలని సూచించారు. డ్రోన్ల మంజూరు వేగవంతంచేయాలి ● ఎస్ఎల్బీసీ నిబంధనల మేరకు డ్రోన్ల మంజూరుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ● పీఎం సూర్య ఘర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే రుణాలు ఇవ్వాలన్నారు. ● స్టాండ్ అఫ్ ఇండియా, పీఎం విశ్వకర్మయోజన రుణాల లక్ష్యాలను సాధించాలని సూచించారు. ● మత్స్యశాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు. ● రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ శిక్షణ కేంద్రం ద్వారా 35 మంది 4 వీలర్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పేదల కోసం ‘సోషల్’ నిధి పేదల కోసం జిల్లాలోఉన్న అన్ని బ్యాంకులు కలసి కొంత మొత్తంతో సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ)నిధిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని బ్యాంకుల నుంచి సీఎస్ఆర్ కింద కొంత మొత్తాన్ని జమ చేసి లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నారు. ఆ మొత్తం మీద వచ్చేవడ్డీతో నిజంగా డబ్బు అవసరం ఉన్నటువంటి రైతులు, పేదలకు సాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు ఉండాలని ఎల్డీఎం రామచంద్రరావును జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.17,402.86 కోట్లు2025–26 వార్షికరుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ ఏడాది లక్ష్యంరూ.17402.86 కోట్లు అని, ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 15.49 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. మొత్తం వ్యవసాయరుణాలు రూ.6162.06 కోట్లు కాగా, అందులో ఖరీఫ్ వ్యవసాయ రుణాలు రూ.3635.62 కోట్లు, రబీ వ్యవసాయ రుణాలురూ.2526.44కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలుకు రూ,39.24 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలపాలకు రూ.560.38కోట్లు కేటాయించినట్లు చెప్పారు.మొత్తంగా వ్యవసాయరంగానికి రుణ లక్ష్యంరూ.8964.22 కోట్లు అని, ఇది మొత్తం రుణ లక్ష్యంలో 51.51 శాతంగా ఉన్నట్లు చెప్పారు. మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.3570.63 కోట్లు, విద్యారుణాలు కోసం రూ.80.26 కోట్లు, హౌసింగ్ రుణాలు రూ.200.81 కోట్లు,పునరుత్పాదక శక్తి రూ.94.33కోట్లు, ఇతర రంగాల రుణాల క్ష్యం రూ.13601.72 కోట్ల రుణ లక్ష్యాన్ని కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ సుశాంత్‌కుమార్, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, మెప్మా పీడీ నాగశివలీల, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.17,402.86 కోట్లు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పి.రంజిత్‌బాషా -
చిట్టడవి కాదు ఆయకట్టు భూమి
ఇది తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ సమీపంలోని చెరువు కింద ఉన్న ఆయకట్టు భూమి. చెరువు నీరు అందక ముళ్ల కంపలతో చిట్టడవిని తలపిస్తోంది. జొన్నగిరి చెరువు కింద 160 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. వరి పంటతో కళకళలాతూ ఉండేది. సరైన వర్షాలు లేక చెరువు నిండకపోవడంతో నీరు రాక ఆయకట్టు భూమిలో ముళ్ల కంపలు దట్టంగా పెరిగాయి. ముళ్ల కంపలు తొలగించి వరిపంట సాగు చేసే స్థోమత రైతులకు లేదు. హంద్రీ– నీవా నీటిని చెరువుకు ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చినా ఇంత వరకు సాధ్యం కాలేదు. చెరువులో నీళ్లు లేకపోతే ఏటా వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటోంది. ఆకట్టు సాగు మాట అటుంచితే కనీసం తాగునీటి ఎద్దడి నివారణకై నా ప్రభుత్వం స్పందించాలని జొన్నగిరి గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. – తుగ్గలి -
నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పద్మావతి
కర్నూలు(హాస్పిటల్): గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీగా ప్రిన్సిపాల్‌గా ఆర్.పద్మావతి నియమితులయ్యారు. గుంటూరులో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆమె కర్నూలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం కర్నూలులో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా ఎన్.మంజుల విధులు నిర్వహిస్తున్నారు. మసీదుపురంలో వ్యక్తి అనుమానాస్పద మృతి మహానంది: మసీదుపురం గ్రామానికి ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...గ్రామానికి చెందిన మునగాల రామసుబ్బారెడ్డి(53)కి అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒంటెద్దు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వడ్డె సంపంగి నారాయణ, పెరుమాళ్ల చెన్నరాయుడు, నులకచందనం రాముడులతో రామసుబ్బారెడ్డి కలిసి ఈశ్వర్‌రెడ్డి బావి వద్ద బుధవారం రాత్రి మద్యం సేవించారు. రాత్రి 10.30 గంటలకు భర్త ఇంటికి రాకపోవడంతో భార్య తులశమ్మ ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అయితే రామసుబ్బారెడ్డి గురువారం ఉదయం బావిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు బావి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా అతని శరీరమంతా గాయాలున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి, సిబ్బంది గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిని భార్య తులశమ్మ నలుగురిపై అనుమానం వ్యక్తం చేయడంతో, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నెల వంక దర్శనం.. మొహర్రం ప్రారంభం
చాగలమర్రి: ఇస్లాం క్యాలెండర్ ప్రకారం గురువారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనంతో నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి నెల మొహర్రం కావడంతో హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం పది రోజుల పాటు సంతాప కార్యక్రమాలు జరుపుకుంటారు. మొహర్రం నెలలోనే ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ రసూలల్లా సొల్లేల్లాహు అలైహి వసల్లం మనువళ్లు ఇస్లాం మత వ్యాప్తి కోసం కర్బాలా మైదానంలో (సౌదీలో) 10 రోజుల పాటు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వారి వంశానికి చెందిన 72 మంది అశువులు బాసి వీరమరణం పొందారు. వారిని స్మరించటానికి ఏటా మొహర్రం నెలలో పది రోజులపాటు కార్యక్రమాలు చేస్తారు. ఈ మేరకు ఊరూరా పీర్ల చావిడ్లలో పీర్లను కొలువుదీర్చి పూజలు చేయనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పీర్ల దేవుళ్లను భద్రపరిచిన పెట్టెలను సంప్రదాయ మేళతాళాలలతో ఊరేగింపుగా తీసుకొచ్చి చావిడ్లకు చేర్చారు. చాగలమర్రిలో మత సామరస్యానికి ప్రతీకగా.. చాగలమర్రిలో నిర్వహించే పండగల్లో పీర్ల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడంతో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గ్రామంలోని లాల్‌స్వామి, హజ్రత్ ఇమాం హస్సేన్, హజ్రత్ ఇమాం హుసేన్, హజ్రత్ ఇమామే ఖాశీం, హజ్రత్ హురేషహీద్, హజ్రత్ ఆలీ అక్బర్ (గుర్రం మీద పీరు)లను కొలువు దీర్చి 10 రోజుల పాటు పూజలు చేయనున్నారు. భక్తులు ప్రత్యేక చదివింపులు, ముడుపులు చెల్లించునున్నారు. వెండి గొడుగులు, ఉయ్యాలలు, విలువైన చాదర్లు సమర్పించనున్నారు. గ్రామానికి చెందిన వారు వృత్తి రీత్యా సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన మొహర్రం వేడుకలకు తప్పకుండా హాజరవుతారు. ప్రతి ఇల్లు బంధువులు, స్నేహితులతో కళకళలాడనున్నాయి. ఊరూరా కొలువుదీరనున్న పీర్లు -
వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా వెంకటేశ్వర్ రెడ్డి
ప్యాపిలి: వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మెట్టు వెంకటేశ్వర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. వైఎస్సార్సీపీ హయాంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడిగా పని చేసిన వెంకటేశ్వర్ రెడ్డికి రైతు సమస్యలపై మంచి అవగాహన ఉంది. దీన్ని గుర్తించిన అధిష్టానం రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పై మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. బాల్య మిత్రునికి ఆర్థిక సాయం మద్దికెర: బాల్య మిత్రుడు కుంకునూరు వెంకటేష్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో మద్దికెరకు వెళ్లి 2003–04 బ్యాచ్ విద్యార్థులు గురువారం రూ.42,650 ఆర్థికసాయం అందజేశారు. అలాగే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి రూ.10 వేలు ఆర్థిక సాయం ఇచ్చారు. మిత్రుడు ఆపదలో ఉంటే ఆదుకోవడం మానవత్వం అని రాజు, కృష్ణారెడ్డి, నల్లగుట్ల తెలిపారు. 6న బ్రాహ్మణ విద్యార్థులకు సన్మానం కర్నూలు(అర్బన్): పదో తరగతి, ఇంటర్మీడియట్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులను జూలై 6వ తేదీన సన్మానించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. కర్నూలులోని కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరంతో పాటు కల్లూరు మండలంలోని బ్రాహ్మణ విద్యార్థులను సన్మానిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థులు తమ మార్కుల జాబితాల జిరాక్స్ కాపీలను జతచేసి జూలై 3వ తేదిలోగా స్థానిక సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మేనేజర్‌కు అందించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9393605937, 9440224878 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఆదోని ఎమ్మెల్యేకు చుక్కెదురు ఆదోని సెంట్రల్: ఆదోని రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి చుక్కెదురైయింది. పనులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఏడీఈని కోరగా డీఅర్ఎం అనుమతులు కావాలని చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా అవాక్కయ్యాడు. రూ. 9 కోట్లతో పనులు జరుగుతున్నప్పుడు కనీసం ప్రణాళిక నమూనాలు కూడా లేవా అంటూ ప్రశ్నించారు. అధికారులు స్పందించి నమూనాలు అయితే ఉన్నాయని చూపించారు. ఒకసారి లేవు అంటారు మరి చూపిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లలో నాణ్యతతో పనులు చేపట్టాలని అధికారులు సూచించారు. -
కొలువుదీరిన హజరత్ అబ్బాస్ పీర్లు
బనగానపల్లె రూరల్: మొహర్రం సందర్భంగా పట్టణంలోని ఆస్థానంలో హజరత్ అబ్బాస్ పీర్లు కొలువు దీరాయి. బనగానపల్లె నవాబు వంశీయులు నవాబు మీర్ ఫజల్ అలీఖాన్ ఆధ్వర్యంలో నవాబు ఇంటి నుంచి భక్తి గీతాలు అలపిస్తూ ఆస్థానం వద్దకు పీర్లను తీసుకొచ్చారు. పీర్లను ముస్తాబు చేసి, పూలదట్టిలు సమర్పించారు. అనంతరం షియా మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహర్రం వేడుకల్లో భాగంగా జూలై 3వ తేదీన చిన్న సరిగెత్తు, 4న మధ్య సరిగెత్తు, 6న జుర్రేరువాగులో పీర్ల నిమజ్జనంతో మొహర్రం వేడుకలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి హజరత్ అబ్బాస్ పీర్లను దర్శించుకుని ప్రత్యేక ఫాతెహాలు సమరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొహర్రం వేడుకలు ముంబాయి తరువాత బనగానపల్లె పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో హిందూ, ముస్లిం సోదరులు ఐకమత్యంగా నిర్వహస్తారన్నారు. ఈ వేడుకలకు మొట్టమొదటి సారిగా ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆస్థానాన్ని ప్రత్యేక విద్యుత్‌దీపాలంకరణ చేశారు. బనగానపల్లె సీఐలు ప్రవీణ్‌కుమార్, మంజునాథ్రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వ్యక్తి ఆత్మహత్య
గోస్పాడు: కానాలపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నా ఇతను పలు చోట్ల వైద్యం పొందినా నయం కాకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ మేరకు ఇంటి ముందు అలంకరణకు ఉపయోగించే రసాయన పౌడర్‌ను నీళ్లలో కలిపి తాగి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు గుర్తించి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కారు ఢీకొని జింక మృతి మంత్రాలయం రూరల్: కల్లుదేవకుంట– మంత్రాలయం మధ్యలో 167వ జాతీయ రహదారిలో కారు ఢీకొని జింక మృతి చెందింది. కల్లుదేవకుంట గ్రామ సమీపంలో పొలంలో నుంచి జింక రోడ్డు దాటుతుండగా గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫారెస్టు అధికారిణి అనురాధ ఘటన స్థలానికి వచ్చి మృతి చెందిన జింకను తుంగభద్ర రిజ్వర్ ఫారెస్టుకి తీసుకెళ్లారు. వెటర్నరీ డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చే శారు. ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి జూపాడుబంగ్లా: ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు నుంచి గూడెం శ్రీనివాసులు అనే ఆటో డ్రైవర్ జూపాడుబంగ్లాకు బయలుదేరాడు. మార్గమధ్యంలో మండ్లెం గ్రామం వద్ద భవన నిర్మాణ కార్మికులు షేక్ ఇస్మాయిల్(50) అబ్దుల్లా, రఫీ ఎక్కారు. తంగడంచ చెక్‌పోస్ట్ మలుపు వద్దకు రాగానే వేగాన్ని డ్రైవర్ శ్రీనివాసులు అదుపు చేయలేకపోవడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మండ్లెం గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోడ్రైవర్ శ్రీనివాసులుకు రెండు కాళ్లు విరిగాయి. అబ్దుల్లా, రఫీకు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలు సుకున్న ఎస్ఐ ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. 29న స్వేచ్ఛ సాంఘిక నాటక ప్రదర్శన కర్నూలు (కల్చరల్): టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఈనెల 29న సాయంత్రం 7 గంటలకు సి.క్యాంప్ కళాక్షేత్రంలో స్వేచ్ఛ సాంఘిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ నాటక దర్శకుడు బీఎం రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంఘిక నాటక ప్రదర్శన ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా పరిషత్తు నాటక పోటీల్లో సంచలనం సృష్టించిందన్నారు. ఇందులో బలగం సినిమా ఫేమ్ సురభి లలిత ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందని తెలిపారు. -
మత్తు పదార్థాలతో జీవితం నాశనం
కర్నూలు కల్చరల్: మత్తు పదార్థాలతో యువత జీవితం నాశనం చేసుకోవద్దని రాయలసీమ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు. గురువారం వర్సిటీలోని కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ వర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్‌కు స్థానం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. యువత బంగారు భవితకు బాటలు వేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్ మాట్లాడుతూ బాధ్యత గలిగిన పౌరులుగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. వాటి బారిన పడిన వారికి పునరావాస కేంద్రాల ద్వారా సరైన చికిత్స అందేలా చూడాలన్నారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బోయ విజయ్‌కుమార్ నాయుడు, సీడీసీ డీన్ ఆచార్య పీవీ సుందరాననంద్, డీన్ ఆఫ్ అకడమిక్స్ అఫైర్స్ ఆచార్య ఆర్.భరత్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వీసీ ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీని ఆర్యూ వద్ద వీసీ జెండా ఊపి ప్రారంభించారు. రాజ్‌విహార్ నుంచి కల్టెరేట్ వరకు జరిగిన ర్యాలీలో వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
అవుకు: అతివేగానికి ఓ నిండు ప్రాణం బలైంది. అవుకు – బనగానపల్లె రహదారిలో గురువారం కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గో స్పాడు మండలం తేళ్లపురి గ్రామానికి చెందిన కాటంరెడ్డి నాగేంద్ర రెడ్డి(55) అవుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సొంత పనుల నిమిత్తం వచ్చాడు. పని పూర్తయిన అనంతరం స్వగ్రామానికి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో కోనాపురం మెట్ట సమీపంలోకి రాగానే బనగానపల్లె వైపు నుంచి వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టడంతో నాగేంద్రరెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు అతి వేగంతో బైక్ నుజ్జునుజ్జు అయింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న వ్యక్తి క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అవుకు సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి కుమారుడు నాగార్జునరెడ్డి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లింగమయ్య తెలిపారు. మృతుడు నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన అవుకు సీహెచ్‌సీకి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అవుకు ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి కూడా ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
అవ్వకు ‘వంద’నం
ప్రస్తుత కాలంలో 75 సంవత్సరాలు జీవించడమే కష్టం. అయితే మద్దికెర మండలం బురుజుల గ్రామానికి చెందిన అవ్వ హనుమంతమ్మ అనారోగ్య సమస్యలు లేకుండా వందేళ్లకు పైగా జీవనం సాగిస్తోంది. దీంతో కుటుంబసభ్యులు గురువారం అవ్వను సన్మానించారు. హనుమంతమ్మకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మొత్తం 89 మంది మనువళ్లు, మనవరాళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమంతమ్మ చిన్న తనంలో 1926లో పెరవలి గ్రామానికి మహాత్మాగాంధీ వచ్చినప్పుడు ఇంట్లో పెద్ద వాళ్లతో కలిసి వెళ్లి చూశారని, ఈ విషయాన్ని తమకు చెప్పే వారని చిన్న కుమారుడు రామాంజనేయులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారం తినాలో, ఎలాంటి పనులు చేయాలో తన తల్లికి బాగా తెలుసని చెప్పారు. – మద్దికెర -
మొబైల్ ‘మాల్’
ఈ చిత్రం చూస్తే ఏదో దుకాణం వద్ద ఇద్దరు నిల్చున్నట్లుగా అనిపిస్తోంది కదూ.. కాస్తా పరిశీలనగా చూస్తే అది మొబైల్‘మాల్’ అని అర్థమవుతుంది. జీవన పోరాటంలో ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి నాగేంద్ర కూడా ఉపాధి కోసం వినూత్నంగా ఆలోచించాడు. బేతంచెర్ల పట్టణం హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన ఇతను ఆటోను మొబైల్మాల్గా మార్చేశాడు. ప్లాస్టిక్ వస్తువులు, గాజులు, ఫ్యాన్సీ ఐటమ్స్, చట్నీలను ఊరూరా తిరుగుతూ విక్రయిస్తున్నాడు. ఇతనికి అతని తల్లి ఈరమ్మ కూడా తోడు నిలిచింది. దాదాపు ఆరేళ్లుగా గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే దుకాణం ఉందా అన్నట్లుగా ఉంటుంది. దగ్గరకు వెళ్లి చూస్తే తప్ప ఆటో కనిపించదు. ఖర్చులు పోను వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని నాగేంద్ర చెబుతున్నాడు. – బేతంచెర్ల -
డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
నంద్యాల(న్యూటౌన్): ప్రజలు, యువత సహకారంతో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్పీజీ మైదానంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్థాయిలో మాదకద్రవ్యాలను నియంత్రించడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కలిగిస్తున్నామన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేకంగా సూచనలు, వీడియోలు ప్రదర్శించాలన్నారు. అదే విధంగా నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ● ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన యువత వివిధ రకాల నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందన్నారు. గతంలో కూడా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో‘ అనే నినాదాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశామన్నారు. ముఖ్యంగా జిల్లాలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామన్నారు. వీరి సహకారంతో 39 కేజీల గంజాయి సీజ్ చేయడంతో పాటు 53 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నారని తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనపరులకు ప్రభుత్వ ఆసుపత్రిలో రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ● అనంతరం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్పీజీ మైదానం నుండి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీని కలెక్టర్, ఎస్పీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పీజీ మైదానం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్లి తిరిగి ఎస్పీజీ మైదానం చేరుకుంది. అక్కడే మానవహారాన్ని నిర్వహించి పాల్గొన్న అందరితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మున్సిపల్ కమీషనర్ శేషన్న, పోలీస్ శాఖ డిఎస్పీలు, ఎస్సైలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రవాణాపై 1972కు సమాచారం ఇవ్వండి జిల్లా కలెక్టర్ రాజకుమారి -
స్వర్ణరథంపై ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం గురువారం ఆది దంపతులకు స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించింది. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజల అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. వర్షం కారణంగా స్వర్ణరథోత్సవం నిలుపుదల చేశారు. స్వర్ణరథం వద్ద కళా బృందాల కోలాటం, తప్పెట చిందు మొదలైన కళారూపాలు ఏర్పాటు చేశారు. సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, స్వామివారి ప్రధానార్చకులు, అర్చకస్వాములు, వేదపండితులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరిగిన టీజీటీ ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు జరిగాయి. ఉదయం న్విహించిన పరీక్షకు 871 మందికి గాను 800 మంది హాజరు కాగా 70 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 110 మందికి గాను 91 మంది హాజరు కాగా 19 మంది గైర్జారైనట్లు డీఈఓ తెలిపారు. -
ఉచిత పంటల బీమాకు మంగళం
● ఈ ఖరీఫ్ నుంచి ప్రీమియం చెల్లిస్తేనే వర్తింపు ● కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 13 పంటలకు బీమా ● రెండు జిల్లాల్లో వరికి గ్రామం యూనిట్‌గా అమలు ● ఉమ్మడి జిల్లాలో పత్తి 2,53,236 హెక్టార్లలో సాగు ● రైతులపై రూ.126.61 కోట్ల భారంనంద్యాల జిల్లా రైతులపైనే అధిక భారం ● ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతు వాటా ప్రీమియం మొత్తాన్ని తగ్గించడం కాస్త ఊరట కలిగించే విషయం. ● కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఎండుమిర్చికి 0.40 శాతం ఉండగా.. మిగిలిన 8 పంటలకు 0.20 శాతం ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ● నంద్యాల జిల్లాలో రైతుల వాటా ప్రీమియం ఎక్కువగా ఉంటోంది. ● వరి, మొక్కజొన్న, కంది పంటలకు 2 శాతం, మినుము, జొన్న, సజ్జ, కొర్ర, ఆముదం, ఉల్లి పంటలకు 1 శాతం, ఎండుమిర్చికి 3.20 శాతం, పత్తికి 4 శాతం ప్రకారం ప్రీమియం చెల్లించాలి. ● నంద్యాల జిల్లాలో అరటికి వాతావరణ ఆధారిత బీమా ఉంది. బీమా రూ.1,37,500 మొత్తానికి 5 శాతం ప్రకారం రూ.6,875 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ● ప్రదానమంత్రి ఫసల్ బీమా(దిగుబడి ఆధారిత బీమా) కింద గ్రామం యూనిట్‌గా వరి, మండలం యూనిట్‌గా మిగిలిన పంటలు నోటిఫై అయ్యాయి.కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2024–25 రబీ నుంచి ఉచిత పంటల బీమాకు మంగళం పిలికింది. సూపర్–6లో భాగంగా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఆ ఊసే మరిచారు. తాజాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులవుతున్నా ఇప్పటికీ కాలయాపన చేస్తున్నారు. తాజాగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తింపును అమలు చేస్తున్నారు. 2024 ఖరీఫ్ సీజన్ వరకు ఉచిత పంటల బీమాను అమలైనా.. అధిక వర్షాలు, వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నప్పటికీ ఒక్క రూపాయి పరిహారం అందివ్వని పరిస్థితి. 2024–25 రబీ నుంచి ప్రీమియం చెలించడం ద్వారా ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆదారిత బీమాను అమలు చేసింది. అయితే పరిహారం వస్తుందో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తింపు విధానం అమలు చేస్తుండటం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పత్తికి బీమా చేసుకోవాలంటే హెక్టారుకు రూ.5వేలు కర్నూలు జిల్లాలో పత్తి 2,34,409 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 18,827 హెక్టార్లలో సాగవుతుంది. రూ.లక్షకు బీమా చేస్తారు. వాతావరణ ఆధారిత బీమా కింద 5 శాతం ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అంటే హెక్టారుకు రూ.5వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో పత్తి 2,53,236 హెక్టార్లలో సాగు చేస్తారు. మొత్తం పత్తికి బీమా చేయాలంటే ప్రీమియం రూపంలో రూ.126.61 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం జూలై 15లోపు, ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద జూలై 31లోపు ప్రీమియం చెల్లించాలి. వరికి మాత్రం ఆగస్టు 15 వరకు గడువు ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కర్నూలు జిల్లాలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నంద్యాల జిల్లాలో ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, వాతావరణ ఆధారిత బీమాను కర్నూలు జిల్లాలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, నంద్యాల జిల్లాలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అమలు చేస్తున్నాయి. నంద్యాల జిల్లాలో బీమా చేయించుకోవాలంటే ప్రీమియం ఇలా.. పంట బీమా యూనిట్ బీమా చేసే మొత్తం రైతు వాటా (హెక్టారుకు రూశ్రీశ్రీల్లో) (హెక్టారుకు రూశ్రీశ్రీల్లో) పత్తి మండలం యూనిట్ 1,00,000 4,000(4 శాతం) వేరుశనగ మండలం యూనిట్ 70,000 1,400(2 శాతం) అరటి మండలం యూనిట్ 1,37,500 6,875(5 శాతం) వరి గ్రామం యూనిట్ 1,00,000 2,000(2 శాతం) మొక్కజొన్న మండలం యూనిట్ 82,500 1,650(2 శాతం) కంది మండలం యూనిట్ 50,000 1,000(2శాతం) మినుము మండలం యూనిట్ 47,500 475(1 శాతం) ఎండుమిరప మండలం యూనిట్ 2,25,000 7,200(3.20శాతం) జొన్న జిల్లా యూనిట్ 47,500 475( 1 శాతం) ఆముదం జిల్లా యూనిట్ 40,000 400(1 శాతం) కొర్ర జిల్లా యూనిట్ 40,000 400(1 శాతం) సజ్జ జిల్లా యూనిట్ 40,000 400(1 శాతం) ఉల్లి జిల్లా యూనిట్ 1,12,500 1125(1 శాతం) వైఎస్సార్సీపీ పాలనలో రూ.1065.61 కోట్ల పరిహారంగత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాది అంటే 2019–20లో కేవలం ఒక్క రూపాయి ప్రీమియంతో నోటిఫై చేసిన పంటలకు బీమా సదుపాయం కల్పించింది. 2020–21 నుంచి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు పంటల బీమా సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడం విశేషం. 2019–20 నుంచి 2022–23 వరకు ఉచిత పంటల బీమా కింద రైతన్నలకు చెల్లించిన పరిహారం రూ.1065.61 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయింది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే బీమా పరిహారం విడుదల చేయడం వల్ల రైతులకు ఊరట లభించింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శం కావడం విశేషం. 15లోపు పంటల బీమా చెల్లించండి కర్నూలు(సెంట్రల్): 2025–26 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా ప్రీమియం జూలై 15లోపు చెల్లించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా రైతులకు సూచించారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల పోస్టర్లను ఆవిష్కరించారు. పత్తి, వేరుశనగ పంటలను మండలం యూనిట్‌గా ఖరీఫ్ పంటకాలనికి నోటిఫై చేయగా, జూలై 15లోపు బీమాను చెల్లించాల్సి ఉందన్నారు. పత్తికి హెక్టారుకు రూ.5వేలు, వేరుశనగకు హెక్టారుకు రూ.1,400 చెల్లించాలని సూచించారు. కాగా, పంటలు నష్టపోతే పత్తికి సంబంధించి హెక్టారుకు రూ.లక్ష, వేరుశనగకు రూ.70 వేల వరకు చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీ, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద నోటిఫై పంటలు: 9 ( వరి, జొన్న, ఎండుమిర్చి, మొక్కజొన్న, ఆముదం, కంది, ఉల్లి, కొర్ర, సజ్జ ) వాతావరణ ఆధారిత బీమా కింద నోటిఫై పంటలు: 2 ( పత్తి, వేరుశనగ ) నంద్యాల జిల్లాకు అదనంగా మినుము, అరటికి వాతావరణ ఆధారిత బీమా వర్తిస్తుంది -
భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి
ఉయ్యాలవాడ: నంద్యాల, జమ్మలమడుగు జాతీయ రహదారి–167 నిర్మాణం కోసం భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రహదారికి మండల పరిధిలోని అల్లూరు, నర్సిపల్లె, మాయలూరు, రూపనగుడి, బోడెమ్మనూరు గ్రామాలకు చెందిన రైతుల నుంచి 30.93 ఎకరాల భూమి అవసరం కాగా భూ సేకరణ కూడా పూర్తయిందన్నారు. అయితే రైతులకు అందా ల్సిన పరిహారం, నగదు బదిలీ వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సువర్ణాదేవికి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్‌బాబు, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. ఆషాఢమాసం ఎఫెక్ట్ మహానంది: ఆషాఢమాసం ప్రారంభం కావడంతో మహానందికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవిసెలవులతో పాటు శుభముహూర్తాలు ఉన్నందున గత నెలరోజులుగా నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడిన మహానందీశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం భక్తులు లేక వెలవెలబోతూ కనిపించింది. భవిత కేంద్రాలతో మెరుగైన ఫలితాలు శిరివెళ్ల: భవిత కేంద్రాలతో ప్రత్యేక అవసరాల పిల్లల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఐఈ జిల్లా కో–ఆర్టినేటర్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక భవిత కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఫిజియోథెరిపీని పరిశీలించి పిల్లల శారీరక మార్పులను డాక్టర్ అరుణేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. చెవిటి, మూగ, శారీక ఎదుగుల లోపం, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు చదువు, వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానంగా కేంద్రాలున్నాయని చెప్పారు. అనంతరం ఎంఈఓ నాగార్జునరెడ్డితో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య మిత్ర కిట్లను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఏడీఏల బదిలీలు కొలిక్కి కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ఎట్టకేలకు ఏడీఏల బదిలీలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికి డోన్ ఏడీఏ అశోక్‌వర్ధన్‌రెడ్డి, శైలకుమారీలను నియమించారు. తాజాగా అశోక్‌వర్ధన్‌రెడ్డిని భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా నియమించారు. శైలకుమారికి పోస్టింగ్ ఇవ్వలేదు. మొదట పలమనేరులో ఏడీఏగా పనిచేస్తున్న అన్నపూర్ణను ఎమ్మిగనూరు సీడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏడీఏగా నియమించారు. తాజా ఉత్తర్వుల్లో ఈమె పేరు లేదు. కర్నూలు డీఆర్సీలో ఏడీఏగా పనిచేస్తున్న గిరీష్ ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. అయినప్పటికీ నందికొట్కూరు ఏడీఏగా బదిలీ చేశారు. అయితే ఈ పోస్టులో ఎవ్వరినీ నియమించలేదు. ఈ పోస్టు కోసం అన్నపూర్ణ కూటమి పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రారంభించిన పది రోజులకే పగుళ్లు
పగిడ్యాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండుగ పేరుతో నిర్మించిన రహదారులు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఈ నెల 11వ తేదీన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పడమర ప్రాతకోటలోని సీసీ రోడ్లకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అయితే పది రోజులు కాక ముందే ముస్లిం కాలనీలోని సీసీ రోడ్డులో పగుళ్లు కనిపిస్తున్నాయి. అంతర్గత రోడ్ల అభివృద్ధి అంటూ హడావుడి చేసి కూటమి నేతలు సీసీ రోడ్లు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి జేబులు నింపుకున్నారనే విమర్శ లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కమీషన్లకు కక్కుర్తిపడిన ఇంజినీరింగ్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలకు ఇచ్చారు. దీంతో దాదాపు 50 ఏళ్లు మన్నిక రావాల్సిన సీసీ రోడ్డు వారం రోజులకే పగిలిపోవడం చూసిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు మహేశ్వరరెడ్డి సిఫారసు మేరకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు మహేంద్రరెడ్డి అనే కాంట్రాక్టర్ గ్రామంలోని 15 పనులు చేపట్టి పూర్తి చేసినట్లు మండల ఇంజనీర్ జావేద్ తెలిపారు. దాదాపు రూ. 91 లక్షల పనులు ఈయననే పూర్తి చేశారన్నారు. సీసీ రోడ్లు పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్ ఏ రోడ్డుకు సైడ్ బర్మ్‌కు గ్రావెల్ వేయకుండా అలాగే వదిలేశారు. దీంతో వాహనాలు, ఎడ్ల బండ్లు, పాదాచారులు ఎక్కి, దిగేందుకు అవస్థలు పడుతు న్నారు. అలాగే డ్రైయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు ఇళ్ల ముందు నిలిచి పారిశుద్ధ్యం లోపిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ఈ విషయమై పంచాయతీ రాజ్ శాఖ మండల ఇంజనీర్ జావేద్‌ను వివరణ కోరగా.. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు పగిలిపోయే ఆస్కారమే లేదని.. త్వరలో గ్రామానికి చేరుకుని పరిశీలిస్తామన్నారు. -
ప్రాధాన్య భవనాలకు చంద్ర గ్రహణం
● గ్రామ సచివాలయాల నిర్మాణాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● అందుబాటులోకి రాని హెల్త్‌క్లినిక్ భవనాలు ● నిర్మాణాలు పూర్తికాక ప్రజల అవస్థలు గోస్పాడు: ప్రాధాన్యత భవనాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామస్థాయిలోనే సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. రేషన్‌తో సహా అన్ని సేవలు ఇంటి వద్దకే అందుబాటులోకి తీసుకొచ్చింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలుకొని అన్ని రకాల సేవలను గ్రామంలో అందించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత భవనాలను వినియోగంలోకి తీసుకురాలేకపోతోంది. ఏడాది అవుతున్నా.. నంద్యాల జిల్లాలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లన్నింటికీ కలిపి 1,077 భవనాలు మంజూరయ్యాయి. వాటిలో 644 భవనాలు ఆయా శాఖల అధికారులకు అప్పజెప్పారు. మొత్తం 369 భవనాల నిర్మాణాల వివిధ దశల్లో నిలిచిపోయాయి. వివిధ కారణాలతో మరో 64 భవనాల పనులు మొదలు కాలేదు. భవనాల నిర్మాణాలకు రూ.308.91 కోట్ల అంచనా కాగా అందులో రూ. 200 కోట్ల నిధులను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ. 15.45 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పనులు పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం ముగుస్తున్నా సచివాలయ, ఆర్బీకే, హెల్త్‌క్లినిక్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయలేకపోయింది. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. భవనాల పనులు ఎక్కడిక్కడ నిలిచినా వాటిని పట్టించుకోవడం లేదు. భవనాలు ప్రారంభం కాకపోవడంతో గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో గతంలో 411 సచివాలయ భవనాలు మంజూరు కాగా, 288 భవనాలు పూర్తి చేశారు. రూ. 164.31 కోట్లకు గాను రూ.121.78 కోట్లతో పూర్తి చేశారు. మిగిలిన113 భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పది చోట్ల భవన నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఇదీ దుస్థితి.. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 393 రైతుభరోసా కేంద్రాలు మంజూరు కాగా 228 భవనాలు పూర్తి చేశారు. మిగిలిన 139 భవనాల పనులు ప్రారంభమైనా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే 26 భవనాలు ప్రారంభం కాకుండానే నిలిచిపోయాయి. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 273 హెల్త్ క్లినిక్‌లు మంజూరు కాగా రూ.52.94 కోట్లతో ప్రారంభించారు. మొత్తం 128 హెల్త్ క్లినిక్‌లకు రూ. 33.60 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశారు. వీటిలో 117భవనాలు వివిధ దశల్లో పనులు జరుగుతూ నిలిచి పోయాయి. అలాగే 28 భవనాల పనులు ప్రారంభం కాలేదు. నేటికీ పలు కారణాలతో నిర్మాణాలను పట్టించుకోని పరిస్థితి నెలకొంది. భవనాలు వివిధ దశల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చుచేసినా ప్రస్తుత కూటమిప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఒక్కొక్క గ్రామ సచివాలయం ద్వారా దాదాపుగా 545 రకాల సేవలను అందించేలా అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేవారు. 2019 ముందు వరకు వాటి కోసం మండల కేంద్రాలకు వెళ్తూ , రైతులు బారులు తీరడం, వేచిచూడాల్సిన పరిస్థితితో పాటు ఎన్నో వ్యయప్రయాసలు పడుతుండేవారు. వాటన్నింటికి రైతుభరోసా కేంద్రాల ద్వారా పరిష్కారం లభించింది. ధాన్యం కొనుగొలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే నిర్వహించారు. గ్రామస్థాయిలోనే ప్రజలకు పనులు జరిగేలా చేసిన కార్యక్రమాలన్నింటినీ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. -
గడప దాటని దిగుబడి
ఇతని పేరు పుల్లయ్య. ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సన్నకారు రైతు. నాలుగు ఎకరాల సొంతపొలంతో పాటు రెండు ఎకరాల కౌలు భూమిలో పొగాకు సాగు చేశాడు. అలయన్స్ ఓన్ కంపెనీకి చెందిన పొగాకు నాటాడు. ఒప్పందాలతోనే సాగు చేసిన పొగాకు కొనుగోళ్ల సమయానికి కంపెనీ చెతులెత్తేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంటి వద్దనే తొక్కిన బేళ్లను ఉంచుకుని ఆశగా బేల చూపులు చూస్తున్నాడు. ● పొగాకు రైతులను నట్టేట ముంచిన కంపెనీలు ● మూడు నెలల్లో 45 శాతం మాత్రమే కొనుగోళ్లు ● బయ్యర్లు సిండికేట్‌తో లభించని గిట్టుబాటు ధర ● కార్యరూపం దాల్చని ప్రభుత్వ పెద్దల ప్రకటననంద్యాల(అర్బన్): పొగాకు సాగుపై పలు కంపెనీలు రైతులను ప్రోత్సహించాయి. దిగుబడి అంతా కొంటామంటూ ఆశ పెట్టాయి. చివరకు పంట చేతికొచ్చే సమయంలో అదిగో ఇదిగో అంటూ మోసం చేశాయి. నాణ్యత పేరుతో దగా చేస్తున్నాయి. అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పొగాకు బోర్డు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఓ వైపు పెట్టుబడి ఖర్చులు పెరగడం.. మరో వైపు మార్కెట్లో ధరలు లేకపోవడంతో పొగాకు రైతు నిలువునా మోసపోయాడు. గత ఏడాది ఖరీఫ్ సాగు కింద జిల్లాలో 19 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. దాదాపు 1,200 మంది రైతులు వివిధ కంపెనీలకు చెందిన పొగాకు పండించారు. హెక్టారుకు 31 బేళ్ల చొప్పున 19 వేల హెక్టార్లకు 5.89 లక్షల బేళ్లు సాగు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు 45 శాతం మాత్రమే కొనుగోలు చేయగా మిగిలిన 55 శాతం కొనుగోలు చేయాల్సి ఉంది. ఎకరాకు 10 నుంచి 15 బేళ్ల దాకా దిగుబడి వచ్చింది. దిగుబడులు ఆశాజనకంగా వచ్చినా కొనుగోళ్ల సమయానికి బయ్యర్లు చేతులెత్తేయడంతో పొగాకు బేళ్లను ఇళ్ల వద్ద, ఏసీ గోడౌన్లలో ఉంచాల్సి వచ్చింది. జిల్లాలో 12 ప్రైవేట్ పొగాకు కంపెనీల ద్వారా ఇప్పటి వరకు కేవలం 35 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. కంపెనీల ఒప్పందం చేసుకున్న సాగు విస్తీర్ణం కంటే దాదాపు 1,800 హెక్టార్లలో సాగు పెరిగింది. దీంతో కంపెనీలకు కొనుగోళ్లు భారంగా మారినట్లు తెలుస్తోంది. అలయన్స్వన్, జీపీఏ, ఐటీసీ, ఎంఎల్, విఎస్జీటీ, తదితర కంపెనీల ద్వారా కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం ఎంఎల్, వీఎస్టీ కంపెనీలు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశాయి. నిండిపోతున్న కోల్డ్ స్టోరేజీలు.. మార్చి నెలలో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు ఇప్పటి వరకు 45 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మార్కెట్లో ఆశించిన ధరలు రాకపోవడంతో రైతులు కొందరు తమ సరుకును తిరిగి కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తుండగా మరికొందరు ఇళ్ల వద్ద షెడ్లలో ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీలు దాదాపు పొగాకు బేళ్లతో నిండిపోయాయి. సరుకును వేలం కేంద్రానికి తెచ్చి ధర రాక వెనక్కి తీసుకెళ్తుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. అసలే ధర రాక అల్లాడుతుంటే ఇది తలకు మించిన భారంగా మారుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధర నేల చూపు.. జిల్లా పరిధిలో గత ఏడాది క్వింటా గరిష్ట ధర రూ.28,000 పలుకగా ఈ ఏడాది వేలం నాలుగు నెలలు దాటుతున్నా ఇంత వరకు కనిష్ట ధరలకు మించలేదు. బయ్యర్లు సిండికేట్ గా మారి రైతుల వద్ద కొనుగోలు చేసిన వాటిలో పది శాతం బేళ్లకు గరిష్ట ధర ఇవ్వడం లేదు. చాలా ప్రాంతాల్లో సరాసరి ధర రూ.10,000 నుంచి రూ.13,000 కి మించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా నాణ్యత పేరుతో ధరలు తగ్గించేస్తుండటంతో పెంచిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లలేక వచ్చిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. గ్రేడ్ పేరుతో గరిష్ట ధర రూ.130కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలో కేజీ మీద రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించేశారు. రోడ్లపై బైఠాయించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని రైతులు కోరుతున్నారు. జిల్లాలో పొగాకు సాగు వివరాలు ఇలా.. పొగాకు సాగు విస్తీర్ణం: 19 వేల హెక్టార్లు దిగుబడి: 5.89 లక్షల బేళ్లు దగా పడి నష్టపోయి ఈయన పేరు ఏసన్న. మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన రైతు. ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని జీపీఐ కంపెనీకి చెందిన పొగాకు నాటాడు. 70 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే ఇప్పటి వరకు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఎకరాకు రూ. 1.20 లక్షల ప్రకారం ఐదెకరాలకు దాదాపు రూ. 6 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేశాడు. పంట చేతికొచ్చిన సమయంలో సరైన ధర లేకపోవడం, ఒప్పందం చేసుకున్న కంపెనీ మోసం చేయడంతో నట్టేట మునిగాడు.మంత్రి హామీకి 20 రోజులు.. ఇటీవల టెక్కె మార్కెట్‌యార్డులో జరిగిన మినీ మహానాడు వేదికలో నాణ్యమైన పొగాకును మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. అయితే రైతులు దిగుబడిని మొత్తం కొనుగోలు చేయాలని రోడ్డెక్కారు. ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఆందోళనలకు స్పందించిన మంత్రి నాణ్యతను బట్టి పొగాకు కొనుగోలు జరిగేలా చర్యలు చేపడుతామని చెప్పారు. హామీ ఇచ్చి 20 రోజులు అవుతున్నా పొగాకు కొనుగోళ్లపై ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన కరమైన పరిస్థితుల్లో కొనుగోళ్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. -
దిగుబడి మొత్తం కొనుగోలు చేయాలి
ఎకరాకు రూ.1.50 లక్షలు వెచ్చించి మూడు ఎకరాల్లో పొగాకు సాగు చేశా. ఇప్పటి వరకు 12 బేళ్లు మాత్రమే కంపెనీలు కొనుగోలు చేశాయి. మిగిలిన 18 బేళ్లు ఇంటి వద్దనే ఉన్నాయి. సాగు చేసిన పొగాకును కొనుగోలు చేస్తామని మొదట కంపెనీలు హామీ ఇచ్చాయి. వారి సూచనలతోనే గత ఏడాది కంటే ఈ ఏడాది మరో ఎకరంలో అదనంగా సాగు చేశా. ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. – మాబాషా, మహదేవపురం, శిరివెళ్ల మండలం రైతులను ఆదుకోవాలి జిల్లా రైతులు సాగు చేసిన పొగాకు మొత్తాన్ని మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. దాదాపు 2వేల ఎకరాల్లో సాగు అయిన కేఎస్సీ పొగాకును ఇంత వరకు అమ్మకాలు జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి మొత్తం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ఉద్యమాలు చేపడతాం.– రామచంద్రుడు, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, నంద్యాల -
కర్నూలులో 30న ముస్లిం బహిరంగ సభ
నంద్యాల(వ్యవసాయం): వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 30న కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు మౌలానా జాకీర్‌హుసేన్ తెలిపారు. నంద్యాలలోని డబరాల మసీదులో బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జాకీర్‌హుసేన్ మాట్లాడుతూ.. ‘వక్ఫ్ బాచావో.. దస్తూర్ బచావో’అని కోరుతూ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముస్లింలు అందరూ పాల్గొనాలని కోరారు. జేఏసీ నాయకులు మౌలానా అబ్దుల్లా రషాదీ, అబ్దుల్‌సమ్మద్, బాషా, ఇద్రూస్, ఎజాజ్, ఇబ్రహీం, హుసేన్ తదితరులు పాల్గొన్నారు.శ్రీశైలానికి పెరుగుతున్న వరద శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర ప్రాజెక్ట్‌ల నుంచి దిగువకు వరదనీరు ప్రవహిస్తోంది. మంగళవారం నుంచి బుధవారం వరకు 58,411 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. డ్యాం పరిసర ప్రాంతాలలో 0.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 461 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో స్వల్పంగా 0.075 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 143 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అలాగే బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 318 క్యూసెక్కుల నీటని విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సమయానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 860.20 అడుగులకు చేరుకోగా, జలాశయంలో 106.6764 టిఎంసీల నీరు నిల్వ ఉంది.వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా శశికళారెడ్డినంద్యాల: వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పీబీ శశికళారెడ్డి(నంద్యాల)ని నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించిన పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నంద్యాల జిల్లాలోని పలువురికి పదవులు దక్కాయి. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుండి వెలువడిన ప్రకటన మేరకు రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శులుగా ఎం.శివరామిరెడ్డి(బనగానపల్లె), ఎం.వెంకటేశ్వరరెడ్డి(డోన్), రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా డి.మధుసూదన్‌రెడ్డి(డోన్)ని నియమించారు. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలకు, అలాగే 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీలా వెంకట శేషాద్రిలు తెలిపారు. నంద్యాలలోని జిల్లా ప్రత్యేక ఉపకారాగారాన్ని బుధవారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్‌తో ఉచిత న్యాయం పొందవచ్చన్నారు. ఆన్లైన్ 15100 ద్వారా సేవలు అభ్యర్థించవచ్చని తెలిపారు. జైల్ సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది నాయక్, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు. -
మెరుగైన సేవలు అందించాలి
గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లోనే సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసింది. పనుల నిమిత్తం ప్రజలు ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఉండేది. అధికారులే గ్రామాలకు వచ్చి సేవలు అందించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా పోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఆర్థర్సైమాన్, ఎంపీపీ, గోస్పాడు భవనాలను అందుబాటులోకి తేవాలి సచివాలయం, రైతుభరోసా కేంద్రం, హెల్త్‌క్లినిక్‌లకు నూతన భవనాల ఏర్పాటుకు గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసింది. అయితే ఆభవనాలు పూర్తయి ఏడాదికి పైగా కాలం గడుస్తున్నా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్లక్ష్యం చేస్నున్నారు. ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే నూతన భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. – గడ్డం ప్రసాద్‌యాదవ్, పసురపాడు -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణాతో కలిసి జిల్లా స్థాయి రహదారి భద్రతా సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్, రెండు నెలల్లో 98 రహదారి ప్రమాదాల జరగగా, అందులో 54 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నూనెపల్లి నుంచి బొమ్మలసత్రం వెళ్లే దారిలో లైటింగ్ పెంచాలని చెప్పారు. ఆళ్లగడ్డ బైపాస్ ఎంట్రీ, ఎగ్జిట్ దారుల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, వాటి వద్ద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. పట్టణంలో సీఎంఆర్ వస్త్ర దుకాణానికి సంబంధించి పార్కింగ్ స్థలం లేదని, టౌన్హాల్లో పార్కింగ్ చేసుకుని అందుకు తగిన రుసుంను మున్సిపల్ నిధిలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు అవసరమైన స్పీడ్ గన్స్ అందజేయాలని ఉన్నతాధికారులకు లేఖ సిద్ధం చేయాలన్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ.. హిట్ అండ్ రన్ 41 కేసులు నమోదు కాగా అందులో 29 కేసుల వివరాలు కలెక్టర్ కార్యాలయానికి పంపామన్నారు. నంద్యాల ఏఎస్పీ మందాజావళి ఆల్ఫోన్స్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా రవాణా అధికారి ఐశ్వర్య రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, నేషనల్ ప్రాజెక్టు డైరెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జీఓ నెం.5ను సవరించాలి
కొలిమిగుండ్ల: సచివాలయ ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 5ను తక్షణమే సవరించాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. మంగళవారం వివిధ గ్రామాల సచివాలయాల ఉద్యోగులు ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈఓఆర్డీ చంద్రమౌళీశ్వరగౌడ్, తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు వార్డు స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పించి, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎందుకు సడలింపు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇతర మండలాల్లో పోస్టింగ్ ఇస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. రేషనలైజేషన్‌లో మిగులు ఉద్యోగులును ఎలా ఉపయోగిస్తారు తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీనియార్టీ, రోస్టర్ జాబితా ప్రకారం పదోన్నతులు కల్పించిన అనంతరమే బదిలీలు చేపట్టాలని కోరారు. రికార్డు స్థాయి స్థాయి ఉద్యోగులకు గెజిటెడ్ ఉద్యోగుల స్థాయి నిబంధనలు విధించడం సరికాదన్నారు. సొంత మండలాల్లోనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం
● ఆకాశాన్నంటిన రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు ● యాంత్రికంగా మద్దతు ధరలను ప్రకటించిన కేంద్రం ● క్షేత్రస్థాయి వాస్థవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోని వైనం ● రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చల ఊసే కరువు 2025–26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు నిరాశజనకంగా ఉన్నాయి. మద్దతు ధరలను అశాసీ్త్రయంగా ప్రకటించినట్లు కనిపిస్తోంది. పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మినుము ఇలా అన్ని పంటల్లో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. వరికి హెక్టారుకు పెట్టుబడి వ్యయం రూ.1.30 లక్షల వరకు ఉంటోంది. మద్దతు ధరలపై కేంద్రం పునఃసమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది. – జి.రామకృష్ణ, జిల్లా ప్రదాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం, కర్నూలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. పత్తిలో హెక్టారుకు రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్య యం వస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందు లు, లేబర్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు, ట్రాక్టరు, ఇంప్లిమెంట్స్ బాడుగలతో పాటు అన్ని రకాల ఖర్చు లు పెరిగిపోయాయి. దిగుబడి 8–10 క్వింటాళ్ల వరకు మాత్రమే ఉంటోంది. క్వింటాకు మద్దతు ధర రూ.10 వేలు ఉంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది. – వేణుబాబు, అధ్యక్షుడు, ఏపీ విత్తన రైతు సంఘం నాకు 14 ఎకరాల సొంత భూమి ఉంది. మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. గతేడాది వరిసాగు చేసి నష్టపోయా. మద్దతు ధర ఆశాజనకంగా ఉంటే దళారీలు కూడా అదే ధర ఇవ్వడానికి ముందు కు వస్తారు. మేము కూడా డిమాండ్ చేస్తాం. మద్దతు ధర కనీసం రూ.2600 ఉంటే పెట్టుబడి చేతికొస్తుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్వర రెడ్డి, లింగాపురం, బండి ఆత్మకూరు మండలం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొక్కజొన్న ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో 5,101, నంద్యాల జిల్లాలో 50,155 హెక్టార్లలో సాగవుతోంది. భూమి చదును చేసుకోవడం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సేద్యం, లేబర్ చార్జీలు.. ఇలా అన్ని రకాల ఖర్చులు కలిపి వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు పెట్టుబడి వ్యయం రూ.66,642. హెక్టారుకు దిగుబడి 25 క్వింటాళ్లు వస్తుందని అంచనా. అంటే క్వింటా మొక్కజొన్న పండించడానికి రైతుకు అవుతున్న ఖర్చు రూ.2,665. అయితే కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి క్వింటా మొక్కజొన్నకు ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400 మాత్రమే. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని రైతులు వాపోతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి వివిధ పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వాప్తవ పరిస్థితులను గుర్తించి, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించిన తర్వాత మద్దతు ధరలను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇటీవల ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే యాంత్రికంగా ప్రకటించినట్లుగా స్పష్టమవుతోంది. రసాయన ఎరువుల ధరలను కేంద్రం అడ్డగోలుగా పెంచింది. పురుగు మందల ధరలు కొండెక్కాయి. సేద్యం, కూలీ ఖర్చులు భారీగా పెరిగాయి. ఫలితంగా సాగులో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను సవరించాల్సి ఉంది. అలాంటిది పెట్టుబడి వ్యయానికి, ఇటీవల ప్రకటించిన మద్దతు ధరలకు పొంతన లేకపోవడం గమనార్హం. మద్దతు ధరలు లేకపోతే దళారీలు చెప్పిందే ధర అయ్యే ప్రమాదం ఉంది. పెట్టుబడి వ్యయం కొండంత.. మద్దతు ధరలు అంతంతే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, మినుము, జొన్న సాగు చేస్తారు. ఏ పంటకు చూసిన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ భారీగా ఉంది. మద్దతు ధరలను ప్రకటించడంలో విధిగా పంటల వారీగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే 2025–26 ఏడాది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, దిగుబడులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలను ప్రకటించడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కేంద్రంలో కీలకంగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మద్దతు ధరల ప్రకటనలో రైతులకు అన్యాయం జరిగినప్పటికీ కనీస స్పందన లేకుండా పోయింది. గతంలో వ్యవసాయం దండగ అని మాట్లాడిన చంద్రబాబు నేడు మద్దతు ధరల్లో జరిగిన అన్యాయాన్ని ఎలా పట్టించుకుంటారనే చర్చ రైతుల్లో జరుగుతోంది. కనిష్టంగా రూ.69.. గరిష్టంగా రూ.596 కేంద్రం 2025–26 సంవత్సరానికి సవ రించిన మద్దతు ధరలు రైతులకు నిరాశ, ఆందోళన మిగిల్చాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి ప్రధాన ఆహార పంట. ఈ పంటలో పెట్టుబడి వ్యయం ఏడాదికేడాది పెరుగుతోంది. కానీ మద్దతు ధరలను కనిష్టంగా రూ.69, గరిష్టంగా రూ. 596 మాత్రమే పెంచడం పట్ల రైతుల్లో నిరుత్సా హం వ్యక్తమవుతోంది. 2024 –25 మద్ద తు ధరపై కేవలం రూ.69 మా త్రమే పెరి గింది. కనీస మద్దతు ధర రూ. 2,600 పైన ఉంటే ధాన్యం రైతుకు కొంతమేర న్యాయం జరుగుతుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. దాదాపుగా మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి.వివిధ పంటల్లో హెక్టారుకు పెట్టుబడి వ్యయం ఇలా.. పంట పెట్టుబడి వ్యయం క్వింటా ఉత్పత్తికి మద్దతు ధర (రూశ్రీశ్రీల్లో) అవుతున్న వ్యయం(రూశ్రీశ్రీల్లో) (రూశ్రీశ్రీల్లో) మొక్కజొన్న 66,641 2,666 2,400 సజ్జ 38,851 2,775 2,775 వరి 1,24,096 2,160 2,389 జొన్న 77,376 3,517 3,699 పత్తి 95,107 7,336 8,110 కంది 64,486 7,271 8,000 కొర్ర 31,382 2,617 2,500 వేరుశనగ 1,06,662 5,480 7,263 -
సీమ ప్రాజెక్టులకు తక్షణమే నీరు విడుదల చేయాలి
నంద్యాల(అర్బన్): శ్రీశైల రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. రిజర్వాయర్ నుంచి విడుదల చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర జల వనరుల శాఖకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరిన నేపథ్యంలో పోతిరెడ్డిపాడు, మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి సీమ ప్రాంతానికి నీరు విడుదల చేయాలన్నారు. ముందస్తు వర్షాలు కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ ఆయకట్టు కింద లక్ష ఎకరాలకు పైగా మొక్కజొన్న, సోయాబిన్, మినుము, తదితర ఆరు తడి పంటలను సాగు చేశారన్నారు. ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు రామసుబ్బారెడ్డి, బాలీశ్వరరెడ్డి, వైఎన్‌రెడ్డి, అసదుల్లా, మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు పాల్గొన్నారు. -
మల్లన్న క్షేత్రం.. అభివృద్ధికి దూరం
● ఏడాది పూర్తయినా ఒక్క అభివృద్ధి పని చేపట్టని కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభించిన రూ.125 కోట్ల పనులు నిలుపుదల ● భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలంరూ.125 కోట్ల పనులను ఆపేశారు.. శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం, భక్తుల రద్దీకి అనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిపైన కావస్తున్నా ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని ప్రారంభించలేదు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా.. కూటమి ప్రభుత్వం ఆయా పనులను తమకు నచ్చిన కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవాలని, కొన్ని డిజైన్లు సరిగా లేవని తదితర కారణాలు చూపుతూ నిలుపుదల చేశారు. కానీ ఇంతవరకు ఒక్క అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత హడావుడిగా సుమారు 109 పనులకు టెండర్ పిలిచారు. కానీ ఆయా పనులు తమ పార్టీ వారికి అనుకూలంగా ఇచ్చుకుంటున్నారని దేవదాయ కమిషనర్‌కు ఫిర్యాదు అందడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. అత్యవసర పనులకు, మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులకు మాత్రమే అనుమతించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని చేయలేదు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఉత్సవాలకు, కార్తీకమాసం, దసరా, సంక్రాంతి ఉత్సవాలకు చేసే ఏర్పాట్లు తప్పా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేపట్టలేదు. అడపాదడపా కొన్ని అత్యవసర పనులు తప్పా చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే చెప్పుకోవాలి. రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు.. కూటమి ప్రభుత్వం ఏడాది అనంతరం గత నాలుగు రోజుల క్రితం శ్రీశైల దేవస్థానం సుమారు రూ. 12 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించింది. సుమారు రూ.8కోట్లతో మేజర్ వర్క్‌లు, రూ.4 కోట్లతో మైనర్ పనులకు ఆ టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు అయినా సక్రమంగా జరుగుతాయో లేక గతంలో మాదిరి రద్దు చేస్తారో వేచి చూడాలి. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధిపై దృష్టిసారించి, క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి, క్షేత్రానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది.ఇందులో భాగంగానే దేవాదాయశాఖపై మాజీ సీఎం జగన్ పలుమార్లు సమీక్షలు నిర్వహించి శ్రీశైల క్షేత్రంలో సుమారు రూ.125కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూ.75 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన సదుపాయాలతో నూతన క్యూకాంప్లెక్స్, రూ.35 కోట్లతో సువిశాలమైన సాలు మండపాలు, రూ.5.5కోట్లతో శ్రీశైలక్షేత్రానికి సంబంధించిన 4,400 ఎకరాల భూమికి ఫారెస్ట్ బౌండరీ ఏర్పాటు, రూ.కోటితో పంచమఠాలన్నింటిని భక్తులు ఒకేసారి దర్శించేలా ఏకరూట్ ఏర్పాటు, రూ.2.6 కోట్లతో శ్రీశైలంలోని మల్లమ్మకన్నీరు వద్ద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకుల నిర్మాణం, రూ.1.6 కోట్లతో క్షేత్ర పరిధిలోని పలుచోట్ల 50 లక్షల వాటర్ ట్యాంకు నిర్మాణాలు, రూ.2 కోట్లతో ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద దేవస్థాన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, రూ.1.8 కోట్లతో ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద నూ తన కల్యాణమండపాన్ని నిర్మించేందుకు టెండర్లు పిలిచి 2023 డిసెంబరు 27న మాజీ దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తదితరు లు శంకుస్థాపన చేశారు. అనంతరం సాధారణ ఎన్ని కలు రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో వివిధ కారణాలతో ఆయా టెండర్లను రద్దు చేశారు. -
సోయాబీన్ విత్తనాల కోసం రైతుల ఆందోళన
పాములపాడు: మిట్టకందల గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద సోయాబీన్ విత్తనాల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మనవూరు నేస్తాలు అనే సంస్థ ద్వారా మండలంలో సోయాబీన్ విత్తనాల పంపిణీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతోంది. మండలానికి 112 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు మంజూరయ్యాయి. మంగళవారం సంస్థ సిబ్బంది వెంకటరాముడు సుమారు 50 ప్యాకెట్లు గ్రామంలోని ఆర్ఎస్కేలో నిల్వ చేశారు. కాగా మండలంలో అధికంగా సాగయ్యే వాడా ల, మద్దూరు గ్రామాల్లో ప్రధానంగా పంపిణీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ సిబ్బంది పేర్కొ న్నారు. దీంతో ఆ విత్తనాలను మరో గ్రామానికి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా మిట్టకందాల రైతు లు అడ్డుకున్నారు. తమ గ్రామానికి వచ్చిన విత్తనాలను పక్క గ్రామాలకు ఎలా తరలిస్తారని, స్థానిక రైతులకే పంపిణీ చేయాలని ఆందోళనకు దిగారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి మహేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా మిట్టకందాల గ్రామంలో కేవలం 40 ఎకరాల్లో మాత్రమే సోయాబీన్ సాగు చేస్తారని, దీంతో ఆ గ్రామానికి ఆరు క్వింటాళ్లు కేటాయిస్తామని రైతులకు చెప్పామని తెలిపారు. సాగు చేస్తున్న ప్రాంతాలను బట్టి పంపిణీ చేస్తామని చెప్పారు. గోదాములు లేకనే ఆ గ్రామంలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశామని, ప్రభుత్వం మంజూరు చేసిన మేరకు రైతులకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. -
మల్లన్న ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్ విధానం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనంలో పారదర్శకత కోసం కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, ఏరోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు. కంప్యూటరైజ్ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్, ఫోన్ నెంబరును నమోదు చేస్తామని, ఈ టోకెన్లను ఉచిత దర్శనం క్యూలైన్ ప్రవేశద్వారం వద్ద ఉన్న స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శదర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. అవకాశాన్ని బట్టి రోజుకు 1,000 నుంచి 1,200 టోకెన్లను జారీ చేస్తామని, ఉచిత టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. స్పర్శదర్శనానికి వచ్చే పురుషులు సంప్రదాయ దుస్తులు తెల్ల పంచె, మెడలో తెల్లకండువా, మహిళలు చీర, రవిక, చున్నీతో కూడిన సల్వార్ కమీజ్లను ధరించాల్సి ఉంటుందని సూచించారు. పడిపోయిన కందులు, వాము ధరలు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు, వాము ధరలు పడిపోయాయి. మంగళవారం మార్కెట్‌కు వాము 182 క్వింటాళ్లు, కందులు 457 క్వింటాళ్లు వచ్చాయి.వాము క్వింటాకు కనిష్టంగా రూ.1, 550,గరిష్టంగా రూ.21,412 లభించింది. సగటు ధర రూ.16,850 నమోదైంది. కందుల ధర రైతులను నిరాశకు గురి చేస్తోంది. కనిష్ట ధర రూ.4,089, గరిష్ట ధర రూ.6,769 మాత్రమే ల భించగా.. సగటు ధర రూ.6,629 పలికింది. వ్యాపారులు సిండికేట్ కావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిరాశజనకంగా లభిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాలులతో కూడిన తేలికపాటి వర్షాలే! కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో గాలుల తీవ్రతే కొనసాగనుంది. ఈ నెల 25న ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలు లు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 నుంచి గాలుల తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులను వర్షాలు నిరాశకు గురి చేస్తున్నాయి. కాగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏడు మండలా ల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వెల్దుర్తిలో 4.2 మి.మీ, హొళగుందలో 3.2, మద్దికెరలో 2.8, ఓ ర్వకల్లో 1.2, గోనెగండ్లలో 1.2, ఆదోనిలో 1.2, క్రిష్ణగిరిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 858.60 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 858.60 అడుగులకు చేరుకుంది. ఎగువ జూరాలలో స్పిల్‌వే ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం సోమవారం నుంచి మంగళవారం వరకు 46,495 క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలంకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 101.6785 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
తప్పుల్లేని ఓటర్ల జాబితాకు సహకరించండి
నంద్యాల: తప్పుల్లేని ఓటర్ల జాబితాకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్నారు. బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలోని మృతులు తొలగింపు, మార్పులు, చేర్పులను బూతు స్థాయి ఏజెంట్లతో పరిశీలించుకుని అభ్యంతరాలు ఉంటే సంబంధి త అధికారులకు తెలియజేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ.. హోమ్ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గిరిజనలు, చెంచు జనాభా ఎక్కువగా ప్రాంతాల్లో వారికి ఓటింగ్‌పై చైతన్యం కల్పించాలని కోరారు. సమావేశంలో ఎన్నిక విభాగ సూపరింటెండెంట్ జయప్రసాద్, ఇన్చార్జ్ ఏఓ సుభాకర్, వైఎస్సార్సీపీ ప్రతినిధి సాయిరాంరెడ్డి, బీఎస్పీ పార్టీ ప్రతినిధి కొట్టం శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సయ్యద్ రియాజ్ బాషా, టీడీపీ ప్రతినిధి కె.శివరాంరెడ్డి పాల్గొన్నారు. -
తడబడే వయస్సు.. పొరబడే మనస్సు!
నిన్నటి వరకు పాఠశాల చదువు.. ఒక్కసారిగా కళాశాల వాతావరణం.. ఇంటర్ విద్యార్థులకు ఇదో కొత్త అనుభవం. కొత్త వారితో పరిచయాలు, సరికొత్తగా అనిపించే ఆలోచనలు.. ఇప్పుడిప్పుడే కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థికి ఇలా అన్నీ కొత్తగా, వింతగా అనిపిస్తాయి. టీనేజ్‌లో ఇంటర్మిడియెట్ దశ అత్యంత కీలకం. జీవితాన్ని మలుపు తిప్పాలన్నా ఇదే ముఖ్యమైన కాలం. ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా.. జీవితం మళ్లీ మన చేతుల్లోకి రానంత వెనక్కి వెళ్తుంది. అందుకే ఇప్పుడిప్పుడే జూనియర్ కళాశాలల్లో చేరుతున్న వారు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే ఇంటర్ దశ కొత్త బంగారులోకమై భవిష్యత్ ఉజ్వలమయమవుతుంది. నంద్యాల(న్యూటౌన్): తొలిసారి ఎదుర్కొన్న పది పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలను చేరామన్న ఉత్సాహం.. కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కల్గించే ఆనందం.. ఇలా అన్నీ వెరసి విద్యార్థులకు ఇంటర్మిడియెట్ దశ ఓ కొత్త బంగారు లోకమే. అనువైన గ్రూపు, ఇష్టమైన సబ్జెక్టులు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇదని చెప్పవచ్చు. జీవితంలో కీలక అడుగులన్నీ ఇంటర్‌లోనే పడతాయనడంలో అతిశయోక్తి లేదు.ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించినా, గాడి తప్పి అధఃపాతాళానికి పడిపోయినా.. అంతా ఇంటర్‌లోనే బీజాలు పడతాయని చెప్పుకోవచ్చు. హైసూ్కల్ విద్యతో మొదలయ్యే కౌమార ప్రాయం ఇంటర్లో మరింత పురి విప్పుతుంది. అందుకే జాగ్రత్త పడాలి. సినిమాల ప్రభావంతో, స్నేహితుల ప్రోత్సాహంతో ప్రేమాయణమంటూ మనసు కలుషితం చేసుకోకూడదు. స్నేహితులే లోకంగా అని్పంచే వయస్సులో వారికి అతి ప్రాధాన్యం ఇస్తూ తల్లిదండ్రుల, ఆధ్యాపకులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛను దురి్వనియోగం చేస్తే భవిష్యత్ అంధకారమే. చదువుకే ప్రాధాన్యం.. ఇంటర్లో అందరికీ తొలి ప్రాధాన్యం చదువే కావాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులిచ్చే నోట్స్‌ను ఎప్పటికప్పుడు చక్కగా రాసుకోవడం, పోటీ పరీక్షలకు అనుగుణమైన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో ఉపయుక్తం.సమయం.. సద్వినియోగం ఇంటర్లో సెలవు రోజులు ఉంటే విద్యార్థులకు పండగే. అయితే వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే మంచి క్రీడలు, లైబ్రరీలో పుస్తక పఠనం, స్నేహితులతో సబ్జెక్టులపై చర్చ, శ్రుతిమించని వినోదం వంటివి ఆహ్లాదంతో పాటు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలి.. జీతితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యసనాలు ఈ దశలో అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి. సిగరెట్, గుట్కాలు, మద్యం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. సెల్‌ఫోన్ వైరస్ విద్యార్థుల ప్రగతికి అవరోధంగా మారుతుంది. అశ్లీలత వైపు మనసు మళ్లితే అంతే సంగతులు. పారీ్టలు, వేడుకల పేరుతో స్నేహితులు చెడుదారుల వైపు ప్రేరేపించే అవకాశం ఉంటుంది. స్నే‘హితులు’ ఇంటర్లో విద్యార్థులను ప్రభావితం చేసే తొలి అంశం స్నేహం. అదృష్టం కొద్దీ అది ఉన్నత భావాలున్న వారితో కుదిరితే జీవితానికి మంచి చుక్కాని లభించినట్లే. చదువుపై ఇష్టం, పెద్దలపై గౌరవం, సమాజం మీద అవగాహన, అధ్యాపకులపై సదాభిప్రాయం ఉన్న వారితో స్నేహం చేయాలి. లక్ష్యానికి తొలి అడుగులు.. భవిష్యత్‌లో లక్ష్యం సివిల్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఏ కోర్సుకైనా తొలి అడుగు పడాల్సింది ఇంటర్‌లోనే. కొత్త కొత్త స్నేహదనంతో నిండి కళాశాల జీవితం సక్రమంగా సాగితే ఒక బంగారు లోకమవుతుంది. తప్పటడుగులు వేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలి. -
పట్టపగలే భారీ చోరీ
● 60 తులాల బంగారం, రూ. 27 లక్షల నగదు అపహరణ ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్లో సోమవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్‌గా ఉన్న శరభారెడ్డి ఇంటిని దొంగలు లూటీ చేశారు. దాదాపు 60 తులాల బంగారు ఆభరణాలు, రూ. 27 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇటీవల శరభారెడ్డి కుమార్తె వివాహం జరిగింది. కాగా నల్లకాల్వ సమీపంలో ఉన్న వైఎస్సార్ స్మృతివనంలో పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఉదయం కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉంచిన నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోస్ట్ వెడ్డింగ్ ఫొటో సెషన్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న కుటుంబీకులు ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ రాము సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
తలుపులు తెరుచుకున్న వసతి గృహాలు
ఆలూరు: ఎట్టకేలకు బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ కళాశాల బాలుర విద్యార్థులకు కోసం ఏర్పాటు చేసిన వసతి గృహం తెరుచకున్నాయి. వసతి గృహాలు మూతబడి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాక్షి దినపత్రికలో వార్తా కథనం రావడంతో అధికారులు స్పందించారు. ఆలూరు–ఎల్లార్తి రోడ్డు సమీపంలో ఉన్న వసతి గృహాలను సోమవారం ఏఎస్బిడబ్ల్యూఓ శ్రీనివాసులు తనిఖీ చేశారు. వసతి గృహాలను తెరిపించి విద్యార్థులు అందులో చేర్చించి వారితో ఏఎస్బిడబ్ల్యూఓ మాట్లాడారు. హెచ్‌డబ్ల్యూఓలు బదిలీలతో వసతి గృహాల ప్రారంభం కాస్త ఆల్యమైయిందన్నారు. కళాశాల వసతి గృహానికి అనిమిరెడ్డి, బీసీ బాలు వసతి గృహానికి బదిలీపై వెళ్లిన సంపత్‌కుమార్ ఇన్ చార్జ్హెచ్ డబ్ల్యూఓగా విధులను నిర్వహిస్తారన్నారు. ఇక నుంచి విద్యార్థులకు అసౌకార్యలను కల్పించకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. -
పెద్దాసుపత్రిలో ముగ్గురికి అరుదైన ఆపరేషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని యురాలజి విభాగంలో ముగ్గురు రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. వివరాలను సోమవారం యురాలజి విభాగంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లుతో కలిసి ఆ విభాగం ఇన్‌ఛార్జి హెచ్‌వోడి డాక్టర్ పి.ముత్యశ్రీ వివరించారు. ● కోడుమూరుకు చెందిన బావన్న(75)కు మూత్ర సంచి, కుడి కిడ్నీకి క్యాన్సర్ ఉంది. ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఆయనకు ఈ నెల 12న కిడ్నీ, మూత్రసంచిని తొలగించారు. ● ఎమ్మిగనూరుకు చెందిన శ్రీనివాసులు(55)కు కుడి కిడ్నీలో క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ శరీరంలోని పెద్ద రక్తనాళాలైన అయోట్రా, ఐవీసీకి చుట్టుపక్కల ఉన్న లింప్ గ్రంధులకు పాకి, వాటికి అతుక్కుని ఉన్నాయి. ఈయనకు ల్యాప్రోస్కోపిక్ విధానంలో 13వ తేదిన కిడ్నీతో పాటు లింప్ గ్రంధిని తీసివేశారు. ● ఆత్మకూరుకు చెందిన అఫ్జల్‌బీ(59)కి అడ్రినల్ గ్రంధిలో 12 సెం.మీల క్యాన్సర్ కణితి ఉంది. ఆమె అధిక బరువు ఉండటం వల్ల పెద్దకోత లేకుండా ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఈ నెల 16న ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ ఆపరేషన్లు డాక్టర్ ముత్యశ్రీతో పాటు యూరో ఆంకాలజిస్టు డాక్టర్ సేపూరి బాలరవితేజ, యురాలజిస్టులు రాజశేఖర్, మహేష్, అరుణ, అనెస్టెటిస్ట్ డాక్టర్ మురళీప్రభాకర్ నిర్వహించారు. -
టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోండి
డోన్ టౌన్: ప్రభుత్వ స్థలాలు అక్రమించి ఇతరుల పేర్ల మీద రికార్డులు తయారు చేసి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న టీడీపీ నాయకుడు, వ్యవసాయ మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ౖపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు. సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ధర్మారం రంగనాయకులు ఆధ్వర్యంలో ఆర్డీఓ నరసింహులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ వద్ద ఉన్న ప్రభుత్వ భూములు, వంక పోరంబోకు స్థలాలను ఆక్రమించి, అదే స్థలాన్ని తన సొంత స్థలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చి దాతగా మార్కెట్‌యార్డు చైర్మన్ వ్యవహరించారన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చూస్తూ ఊరుకున్నారని వీరిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికార పార్టీ నేత కావడంతో చర్యలు తీసుకోవడంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆర్డీఓకు వివరించారు. వినతి పత్రం అందించిన వారిలో ఐఎఫ్టీయూ నాయకులు రేషు, రంగస్వామి, రాముడు, హరి, సుధాకర్, రామనాయుడు తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న పాలిసెట్ కౌన్సెలింగ్ కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు హెల్ప్ డెస్క్ సెంటర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతోంది. రెండో రోజు సోమవారం మొత్తం 200 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వెరిఫై చేసి, విద్యార్థులకు రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.ఎన్ ప్రసాద్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ రామకృష్ణయ్య కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని కో–ఆర్డినేటర్ తెలిపారు. నిరుపయోగం మద్దికెర: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడేళ్ల క్రితం ఆర్ఎంఎస్యూ ఫేస్ –3 నిధులతో అదనపు గదులు నిర్మించారు. ఇంతవరకు వాటిని ఉపయోగించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన గదులు ఎలాంటి ఉపయోగం లేకుండా శిథిలావస్థకు చేరుతుండడంతో ప్రజాధనం వృథా అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
విద్యార్థులకు ఉప్పు నీరే దిక్కు
పత్తికొండ: పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు ఉప్పు నీరు తాగి దాహం తీర్చుకుంటున్నారు. పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్ఆర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్లాంట్‌ను పట్టించుకోవడం లేదు. దీంతో బడిలో చదువుతున్న విద్యార్థులకు నీటి కష్టాలు తప్పడం లేదు. బాలుర ఉన్నత పాఠశాలలో 900 మంది చదువుకుంటున్నారు. మామూలు సమయంతో పాటు మధ్యాహ్నం భోజనం అనంతరం విద్యార్థులు ఉప్పునీరు తాగుతూ రోగాలు బారిన పడుతున్నారని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యార్థులకు మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గూటుపల్లె విజ య్, తెలుగు మహేష్ ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై ప్రధాన రహదారిపైకి వస్తుండగా మద్దిలేటి స్వామి ఆలయ ముఖ ద్వారం వద్ద అదే సమయంలో బేతంచెర్ల వైపు నుంచి డోన్ వైపు వెళ్తున్న బొలొరే వాహనం ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాల పాలైన గూటుపల్లె విజయ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తెలుగు మహేష్‌ను మెరు గైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు మహేష్‌కు భార్య పవిత్ర ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కాగా అదే ప్రాంతంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమా దాలు జరిగే అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పొలం రస్తా తగాదా.. రైతు ఆత్మహత్య ఆలూరు రూరల్: పొలం రస్తా విషయంలో పక్కన పొలానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో గొడవ పడి గోపాల్ (43) అనే రైతు పురుగుల మందుతాగి ఆత్మహ్యత చేసుకున్నాడు. మండలంలోని హులేబీడు గ్రామంలో ఆదివారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మహబూబ్ తెలిపిన వివరాలు.. పొలం రస్తా విషయంలో హులేబీడు గ్రామానికి చెందిన వెంకటేష్‌తో గోపాల్‌కు కొన్ని రోజుల నుంచి తగాదాలు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం వెంకటేష్‌తో గోపాల్ గొడవపడ్డాడు. రస్తా విషయం ఎప్పటికీ తెగదని మనస్తాపానికి గురైన గోపాల్ (43) ఆదివారం రాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. 108 అంబులెన్సులో తరలిస్తుండగా గోపాల్ కోలుకోలేక మృతిచెందాడు. మృతుడి భార్య తాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహబూబ్ బాషా విలేకరులకు తెలిపారు. -
12, 13 తేదీల్లో తెలుగు భాషా పరిరక్షణ సదస్సు
కర్నూలు కల్చరల్: రాష్ట్రస్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సును జులై 12, 13 తేదీల్లో కర్నూలు సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ పత్తి ఓబులయ్య తెలిపారు. సోమవారం కళాక్షేత్రంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు ఒక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సదస్సు అధ్యక్ష ఉపాధ్యక్షులు చంద్రశేఖర కల్కూర, జేఎస్ ఆర్కే శర్మ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మొదటి రోజు కొండారెడ్డి బురుజు సమీపంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి సదస్సు జరిగే వేదిక వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు. రెండో రోజు జరిగే సదస్సులో బోధనా భాషగా తెలుగు, మాతృ భాషగా తెలుగు, అధికార భాషగా తెలుగు, ప్రథమ భాషగా తెలుగు అనే అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ ముక్తేశ్వరరావు, తమిళనాడు రాష్ట్రం తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు తూమాటి సంజీవరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాజపాళెం చంద్రశేఖర రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని సందేశమిస్తారన్నారు. తెలుగు భాషాభివృద్ధిపై కవి సమ్మేళనం, పేపర్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. సాహిత్యాభిమానులు, తెలుగు భాషాభిమానులందరూ సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సదస్సు కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి, సభ్యులు సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతుకు కన్నీటి కష్టాలు
కుంటకు ట్రాక్టర్ సాయంతో ఇంజిన్లు అమర్చిన దృశ్యంకోవెలకుంట్ల: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు దాటినా వరణుడు పూర్తిస్థాయిలో కరుణించకపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాధారంగా మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులు అదునుకు వర్షం పడకపోవడంతో సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన రాముడు మండలంలోని గుంజలపాడు సమీపంలో ఎకరా రూ. 15 వేలు కౌలు చెల్లించి నాలుగు ఎకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. పైరు నెల రోజుల దశలో ఉండగా సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో సాగునీటి మళ్లింపుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. పైరుకు రెండు కి.మీ దూరంలో ఎస్సార్బీసీ 10వ బ్లాక్ కాల్వ పక్కన ఉన్న కుంటలో నీరు సంవృద్ధిగా ఉంది. ఆ కుంటకు ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో రెండు మోటార్లు అమర్చి నీటిని పక్కనే ఉన్న ఎస్సార్బీసీలోకి వదిలి అక్కడి నుంచి పొలానికి సమీపంలో కాల్వకు మరో డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి పైపుల ద్వారా పొలానికి సాగునీరు మళ్లించుకుంటున్నాడు. ట్రాక్టర్, డీజిల్ ఇంజిన్లు, పైపులు సొంతంగా ఉన్నప్పటికి డీజిల్, కూలీల రూపంలో ఒక్కో తడికి రూ. 10 వేలు వెచ్చించాల్సి వస్తోందని రైతు పేర్కొన్నాడు. ట్రాక్టర్, ఇంజిన్లు సొంతంగా లేకపోతే అదనంగా మరో రూ. 10 వేలు భారం పడేదన్నారు. ఎస్సార్బీసీకి సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వానలు లేక వాడు పడుతున్న పంట కుంటనీటిని మెటార్లసాయంతో పైరుకు మళ్లింపు -
ఘనంగా శివపార్వతుల కల్యాణం
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలోని ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రి సందర్భంగా స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన పుస్తకపాణిగా కొలనుభారతి దేవి కొత్తపల్లి: శివపురం గ్రామం సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి దేవి పుణ్యక్షేత్రంలో సరస్వతీ దేవి అమ్మవారు పుస్తకపాణిగా భక్తులకు దర్శమిచ్చారు. బహుళ త్రయోదశి సోమవారం అమ్మవారు భక్తుల ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన, బిల్వార్చన, అభిషేకం, మంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. సోమవారం కావడంతో భక్తులు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, వారి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. తప్పుడు సమాచారంతో ఆర్టీఐ చట్టానికి తూట్లు కర్నూలు(సెంట్రల్): తప్పుడు సమాచారంతో దేవనకొండ తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షుడు వీవీనాయుడు ఆరోపించారు. సోమవారం ఏక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవనకొండ తహశీల్దార్ కార్యాలయంలో ఏదైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు లేనిపోని ప్రశ్నలు సంధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇటీవల తాను గుండ్లకొండ రెవెన్యూపరిధిలోని సర్వే నంబర్ 772లోని భూములకు సంబంధించిన పత్రాల కోసం దరఖాస్తు చేశానని, ఆలస్యంగా సర్వే నంబర్ 777 సర్వే సమాచారం ఇచ్చారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
26 ఎకరాలైనా చూపించండి... తల్లికి వందనమైనా ఇప్పించండి!
కోడుమూరు రూరల్: ‘ నా ముగ్గురు పిల్లలకు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద డబ్బులు రాలేదు. కారణం అడిగితే 26 ఎకరాల పొలముందంటూ చెబుతున్నారు.. డబ్బులైనా ఇప్పించండి.. లేదా పొలమైనా చూపించండంటూ’ కోడుమూరుకు చెందిన గాయత్రి అనే మహిళ అధికారులను వేడుకుంటోంది. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ నాగరాజుకు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు నలుగురు సంతానం కాగా, ముగ్గురు కుమార్తెలు, రెండేళ్లలోపు ఒక బాలుడు ఉన్నారన్నారు. ఇందులో ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం 1, 4, 5వ తరగతులు చదువుతున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం డబ్బులు జమ కాలేదన్నారు. విషయం తెలుసుకోగా తమ కుటుంబం పేరు మీద 26 ఎకరాల భూమి ఉన్నట్లుగా చూపిస్తోందని, దీని వల్ల తమకు తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదని వాపోయారు. తమ పేరు మీద కేవలం ఎకరా 85 సెంట్ల భూమి మాత్రమే ఉందని, అధికారులు చర్యలు తీసుకుని తమకు తల్లికి వందనం పథ కం వర్తించేలా చూడాలని ఆమె తహసీల్దార్‌తో మొరపెట్టుకున్నారు. గాయత్రి ఇచ్చిన అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. -
ఇల్లు ఎట్లా గడిచేది?
కోవెలకుంట్ల: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలను వేతనాల సమస్య వెంటాడుతోంది. చేసిన పనులకు వారాల తరబడి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారటంతో అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 4.38 లక్షల జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 8.70 లక్షల మంది కూలీలు ఉన్నారు. 1.50 లక్షల కుటుంబాల్లోని 2.55 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా మండలాల్లో 78,23,780 పనిదినాలు లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందుకోసం రూ. 335 కోట్ల లేబర్ (కూలీల వేతనం, మెటీరియల్ కలిపి)బడ్జెట్ కేటాయించారు. గతంలో ప్రతి రెండు వారాలకొక సారి వేతనాలు అందేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో నెలల తరబడి వేతనాలు అందక, ప్రభుత్వం నిర్ణయించిన సగటు వేతనం రాక కూలీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు 10–12 వారాల నుంచి వేతనాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు సభ్యులున్న ఒక్కో కుటుంబానికి దాదాపు రూ. 30 వేల చొప్పున వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో రూ. 112 కోట్ల వేతనాలు విడుదల కావాల్సి ఉంది. వ్యవసాయ పనుల్లేక.. ఉపాధి వేతనం అందక ఈ ఏడాది జూన్ నెల నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పూర్తిస్థాయి వ్యవసాయ పనులు ప్రారంభం కాకపోవడంతో వ్యవసాయ పనులు లేక మరో వైపు ఉపాధి పనులకు వెళుతున్నా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు, తదితర సరుకులను అప్పులు చేసి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. రెండు నెలలకు పైబడి వేతనాలు ఇవ్వకపోవడంతో వ్యాపారులు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కూలీలు పేర్కొంటున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఉపాధి కూలీలకు మే 10వ తేదీ వరకు చేసిన పనులకు వేతనాలు చెల్లించగా ఎక్కువ శాతం గ్రామాల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వేతనాలు సక్రమంగా అందకపోవడంతో జిల్లాలో ఈ నెల నుంచి 50 వేల మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు వెళుతున్నారు. ఉపాధి కూలీలకు అందని వేతనాలు జిల్లాలో రూ. 112 కోట్లు పెండింగ్ వేతనాలందక భారంగా కుటుంబ పోషణ -
ఎల్లెల్సీ పనుల్లో టీడీపీ ‘పైసా’చికం!
ఆలూరు: నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వకుండా నాసిరకంగా తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ ) పనులు చేస్తున్నారు. టీడీపీ నేతలు కమీషన్లు ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేసి బిల్లులను దండుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంజినీర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఎల్లెల్సీ పనుల్లో నాణ్యత కొరవడింది. ఆలూరు నియోజకవర్గంలో 135 కి.మీ. వద్ద ఎల్లెల్సీ కనిపిస్తుంది. ప్రస్తుతం 135 కి.మీ. నుంచి 138 వరకు, హాలహర్వి మండలంలో 155 నుంచి 156 కి.మీ. వరకు, అలాగే 220 నుంచి 222 కి.మీ. వరకు ఎల్లెల్సీ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కాలువ పరిధిలో 155 నుంచి 156 కి.మీ. వరకు 950 మీటర్ల మేర లైనింగ్ సైడ్ వాల్ కడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 10 ఎంఎం కడ్డీలకు బదులు 8 ఎంఎం కడ్డీలు వాడుతున్నారు. అలాగే 20 ఎంఎం చిప్స్‌కు బదులు 15 ఎంఎం చిప్స్‌ను, నాణ్యతలేని ఇసుకను వినియోగిస్తున్నారు. ‘చిన్న’బోయిన పనులు కాలువ 155 నుంచి 156 కి.మీ. వరకు చిన్నగా ఉంది. అధిక క్యూసెక్కుల నీటిని తట్టుకోవాలంటే అందుకు కాలువ ఎత్తుతోపాటు డిజైనింగ్ కోసం రూ.6.5 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు రాళ్లపైనే కడ్డీలను కడుతున్నారు. దీంతో కాలువ నీటి ప్రవాహంలో అవి కొట్టుపోయే పరిస్థితి నెలకొంది. ● చింతకుంట పరిధిలో 136 నుంచి 138 కి.మీ. వరకు జరుగుతున్న పనులకు ముందుగా ఎర్రమట్టి వేయాలి. అలాకాకుండా పనులు కొనసాగిస్తున్నారు. ● హొళగుంద పరిధిలో 202 నుంచి 222 కి.మీ. వరకు లైనింగ్ పనులు చేయగా అప్పుడే పెచ్చులూడిపోయాయి. ఇదీ దుస్థితి.. ఖరీఫ్ సీజన్లో సాగు, తాగునీటి విడుదలపై ఈనెల 27న తుంగభద్ర బోర్డు అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే ఎల్లెల్సీ పనులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జరగలేదు. పనులు నాసిరకంగా ఉన్నాయి. ఈఈ, డీఈఈల పర్వేక్షణ అంతంతా మాత్రంగానే ఉంది. కాలువలో నీరు దిగువకు వచ్చేనా అని ఆదోని, ఎమ్మినూరు, కోడుమూరు డివిజన్లకు సంబంధించిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తూతూ మంత్రంగా తుంగభద్ర దిగువ కాలువ పనులు కొరవడిన ఇంజినీర్ల పర్యవేక్షణ కమీషన్లు ఇవ్వాలని టీడీపీ నేతల ఒత్తిళ్లు?ఫిర్యాదులు ఇవీ.. ఎల్లెల్సీ పనులు చేసే కాంట్రాక్టర్లు కచ్చితంగా కమీషన్లు ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పనులు చేయించబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంజినీర్లుపై కూడా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. టీడీపీ నేతలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవద్దంటూ టీడీపీ ప్రజాప్రతినిధులతో చెప్పించిట్లు తెలుస్తోంది. -
నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం
మహానంది: మహానందీశ్వరస్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వరస్వామికి సోమ వారం సాయంత్రం ప్రదోష కాలంలో విశేష ద్రవ్యాభిషేకం నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానందీశ్వర ఆలయ అర్చకులు మూలస్థానం సుబ్బయ్యశర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ముందుగా గణపతిపూజ, పంచామృతాలు, విశేష ద్రవ్యాలు, వట్టివేర్లతో పాటు క్షీరాభిషేకం చేశారు. పలు ప్రాంతాల భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవల ద్వారా నందీశ్వరాభిషేకం వీక్షించి స్వామివారి పూజలో పాల్గొన్నారు. శ్రీశైలానికి స్వల్పంగా తగ్గిన వరద శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. గత ఆదివారం ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 76,178 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చింది. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేసుల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో ఆదివారం నుంచి సోమవారం వరకు 60,336 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనను గత ఐదు రోజుల నుంచి నిలిపివేశారు. బ్యాక్ వాటర్ నుంచి కూడా దిగువ ప్రాంతాలకు నీటిి విడుదల నిలిలిచిపోయింది. సోమవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 97.1760 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 857 అడుగులకు చేరుకుంది. పంచమఠాల్లోవిశేష పూజలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోకకల్యాణార్థం పంచమఠాల్లో సోమవారం అభి షేకం, పుష్పార్చనలు చేపట్టారు. ఉదయం ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠాలలో పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లోక కల్యాణార్థం ప్రతి సోమవారం ఉదయం పంచమఠాలలోని దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. క్షేత్రన్ని సందర్శించే భక్తులు పంచమఠాలను కూడా దర్శించే విధంగా భక్తులలో అవగాహన కల్పించేందుకు చర్యల ను తీసుకుంటామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో స్వామివార్ల ప్రధానార్చకులు హెచ్.వీరయ్య స్వామి, ఆలయ విభాగం ఏఈవో ఎం.హరిదాసు, పర్యవేక్షకులు కె.శివప్రసాద్, ఆలయ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు. ఖాతాలకు ఎన్పీసీఐ లింకు తప్పనిసరి కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు తల్లికి వందనం నిధులు విడుదల కావాలంటే తల్లి పోస్టల్ లేదా బ్యాంకు ఆధార్ నెంబర్ ఖాతాలకు ఎన్పీసీఐ లింక్ చేయాలని ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికా రిణి కె.తులసీ దేవి తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఎంపీడీఓ, ఏఎస్డబ్ల్యూఓ, గ్రామ/వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు తమ పరిధిలోని అర్హత కలిగిన విద్యార్థులను గుర్తించి ఎన్పీసీఐ లింకు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు 9, 10 తరగతులకు చెందిన 164 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ పెండింగ్‌లో ఉందన్నారు. అలాగే 764 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాలకు కూడా ఎన్పీసీఐ లింక్ కాలేదన్నారు. ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల ఉద్యో గాల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.శాంతికళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 32, పట్టణ ప్రాంతాల్లో 12 ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థుల విద్యార్హత లు, జీతం మొదలైన వివరాలు, దర ఖాస్తు నమూనాలు https://kurnool.ap.gov.in వెబ్సైట్లో ఉంచామన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ‘బుల్లెట్ల’ కలకలం
నంద్యాల జిల్లా: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గన్‌లో ఉపయోగించే బుల్లెట్ల కలకలం రేగింది. శ్రీశైలంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్‌పై 13 బుల్లెట్లు లభించాయి. ఇందులో 9 పెద్ద సైజు బుల్లెట్లు ఉండగా, 4 చిన్న సైజూ బుల్లెట్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికులు కంట పడటంతో పోలీసులకు సమాచారం అందించారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఎల్ఆర్ గన్‌లో వాడే బుల్లెట్లగా అనుమానిస్తున్నారు పోలీసుల. అయితే ఈ బుల్లెట్లు శ్రీశైలం టెంపుల్ వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇంటర్లో గాడితప్పితే జీవితమే గందరగోళం
నిన్నటి వరకు పాఠశాల చదువు.. ఒక్కసారిగా కళాశాల వాతావరణం.. ఇంటర్ విద్యార్థులకు ఇదో కొత్త అనుభవం. కొత్త వారితో పరిచయాలు, సరికొత్తగా అనిపించే ఆలోచనలు.. ఇప్పుడిప్పుడే కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థికి ఇలా అన్నీ కొత్తగా, వింతగా అనిపిస్తాయి. టీనేజ్‌లో ఇంటర్మీడియెట్ దశ అత్యంత కీలకం. జీవితాన్ని మలుపు తిప్పాలన్నా ఇదే ముఖ్యమైన కాలం. ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా.. జీవితం మళ్లీ మన చేతుల్లోకి రానంత వెనక్కి వెళ్తుంది. అందుకే ఇప్పుడిప్పుడే జూనియర్ కళాశాలల్లో చేరుతున్న వారు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే ఇంటర్ దశ కొత్త బంగారులోకమై భవిష్యత్ ఉజ్వలమయమవుతుంది. నంద్యాల(న్యూటౌన్): తొలిసారి ఎదుర్కొన్న పది పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలను చేరామన్న ఉత్సాహం.. కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కల్గించే ఆనందం.. ఇలా అన్నీ వెరసి విద్యార్థులకు ఇంటరీ్మడియెట్ దశ ఓ కొత్త బంగారు లోకమే. అనువైన గ్రూపు, ఇష్టమైన సబ్జెక్టులు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇదని చెప్పవచ్చు. జీవితంలో కీలక అడుగులన్నీ ఇంటర్‌లోనే పడతాయనడంలో అతిశయోక్తి లేదు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించినా, గాడి తప్పి అధఃపాతాళానికి పడిపోయినా.. అంతా ఇంటర్‌లోనే బీజాలు పడతాయని చెప్పుకోవచ్చు. హైసూ్కల్ విద్యతో మొదలయ్యే కౌమార ప్రాయం ఇంటర్లో మరింత పురి విప్పుతుంది. అందుకే జాగ్రత్త పడాలి. సినిమాల ప్రభావంతో, స్నేహితుల ప్రోత్సాహంతో ప్రేమాయణమంటూ మనసు కలుషితం చేసుకోకూడదు. స్నేహితులే లోకంగా అనిపించే వయస్సులో వారికి అతి ప్రాధాన్యం ఇస్తూ తల్లిదండ్రుల, ఆధ్యాపకులను నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే భవిష్యత్ అంధకారమే. చదవండి: ‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలుచదువుకే ప్రాధాన్యం.. ఇంటర్లో అందరికీ తొలి ప్రాధాన్యం చదువే కావాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులిచ్చే నోట్స్‌ను ఎప్పటికప్పుడు చక్కగా రాసుకోవడం, పోటీ పరీక్షలకు అనుగుణమైన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో ఉపయుక్తం.సమయం.. సద్వినియోగం ఇంటర్లో సెలవు రోజులు ఉంటే విద్యార్థులకు పండగే. అయితే వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే మంచి క్రీడలు, లైబ్రరీలో పుస్తక పఠనం, స్నేహితులతో సబ్జెక్టులపై చర్చ, శ్రుతిమించని వినోదం వంటివి ఆహ్లాదంతో పాటు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలి.. జీతితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యసనాలు ఈ దశలో అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి. సిగరెట్, గుట్కాలు, మద్యం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. సెల్‌ఫోన్ వైరస్ విద్యార్థుల ప్రగతికి అవరోధంగా మారుతుంది. అశ్లీలత వైపు మనసు మళ్లితే అంతే సంగతులు. పారీ్టలు, వేడుకల పేరుతో స్నేహితులు చెడుదారుల వైపు ప్రేరేపించే అవకాశం ఉంటుంది. చదవండి: భారతీయ సంతతి ర్యాపర్ ఓవర్ యాక్షన్ : నెటిజన్ల తీవ్ర అగ్రహంస్నే‘హితులు’ ఇంటర్లో విద్యార్థులను ప్రభావితం చేసే తొలి అంశం స్నేహం. అదృష్టం కొద్దీ అది ఉన్నత భావాలున్న వారితో కుదిరితే జీవితానికి మంచి చుక్కాని లభించినట్లే. చదువుపై ఇష్టం, పెద్దలపై గౌరవం, సమాజం మీద అవగాహన, అధ్యాపకులపై సదాభిప్రాయం ఉన్న వారితో స్నేహం చేయాలి. లక్ష్యానికి తొలి అడుగులు.. భవిష్యత్‌లో లక్ష్యం సివిల్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఏ కోర్సుకైనా తొలి అడుగు పడాల్సింది ఇంటర్‌లోనే. కొత్త కొత్త స్నేహదనంతో నిండి కళాశాల జీవితం సక్రమంగా సాగితే ఒక బంగారు లోకమవుతుంది. తప్పటడుగులు వేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలి. తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి పదవ తరగతి వరకు చదివిన వారు ఇంటర్‌కు రాగానే ఏదో తెలియని లోకంలో విహరిస్తారు. స్వేచ్ఛాజీవిగా భావిస్తారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు తొందరగా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు గమనించి మంచి, చెడులను వివరించాలి. ఎలా చదువుతున్నాడు. ఏయే పరిసరాల్లో ఫ్రెండ్స్ ఉంటున్నారో గమనిస్తుండాలి. చెడు వ్యసనాలకు గురికాకుండా తల్లిదండ్రులు, అధ్యాపకులు శ్రద్ధ వహించాలి. – హారిఫాబాను, మానసిక వైద్యనిపుణురాలు, నంద్యాల మితిమీరిన విశ్వాసం తగదుపదవ తరగతి తర్వాత కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు. కొందరు చదువును పక్కన పెట్టి ప్రేమ, సినిమాలు, షికార్లు, స్నేహం వైపు దృష్టి మరలుతుంది. దీంతో భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశాలున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలి. పెడదారిలో వెళ్తున్నారని అనుమానమొస్తే వారికి మంచి నడవడకను అలవర్చాలి. –రోజమ్మ, సోషల్ వర్కర్, నంద్యాల కలలను సాకారం చేసుకోవాలి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు.. కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవాలి. ఇందుకు విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలి. అప్పుడే ఏదైనా సాధించుకోవచ్చు. మొదట చదవడం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత అలవాటు చేసుకుంటే పుస్తకాలతో కుస్తీ పట్టడం సులువే, తల్లి తండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు చేజారుతుంది. –శంకర్‌నాయక్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి, నంద్యాల -
కౌన్సెలింగ్ ఆలస్యం.. అస్తవ్యస్తం
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు ఇటీవలే కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి కావడంతో మిగిలిన ఖాళీల్లో 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీలకు చెందిన మినిమం టైం స్కేల్ టీచర్లను నియమించేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఎంటీఎస్ టీచర్లకు స్థానాలు కేటాయించేందుకు కర్నూలు సమగ్ర శిక్ష కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కాకుండా ఆలస్యంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల మధ్య సీనియారిటీ విషయంలో వాగ్వాదం జరిగింది. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహి స్తామని చెప్పినా వివాదం సమసిపోలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కౌన్సెలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి అధికారులు పిలిచిన వారిని మాత్రమే హాల్లో అనుమతించారు. మిగిలిన వారిని బయటకు పంపించారు. ఆ తరువాత కౌన్సెలింగ్ మొదలైంది. ముందుగా ఉర్దూ, కన్నడ మీడియం టీచర్లకు స్కూళ్లను కేటాయించారు. కౌన్సెలింగ్ ఆలస్యం కావడం..వర్షం రావడంతో ఎంటీఎస్ టీచర్లు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 3,296 ఖాళీలను చూపిన విద్యాశాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక మిగిలిన ఖాళీలలో ఎంటీఎస్ టీచర్లను నియమించేందుకు విద్యాశాఖ ఉమ్మడి జిల్లాలో 3296 టీచర్ పోస్టుల ఖాళీలను చూపించారు. అయితే ఇందులో పశ్చిమ ప్రాంతంలోని స్కూళ్లలోనే అధిక శాతం ఖాళీలు ఉన్నాయి. 1998, 2008 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్లు ఉమ్మడి జిల్లాలో 353 మంది ఉన్నారు. వీరందరికీ జాబితాలో ఉండే సీరియల్ నంబరు ఆధారంగా ఆయా మండలాల్లోని ఖాళీలను చూపించి స్కూళ్లను కేటాయించారు. ఎంటీఎస్ టీచర్లను నియమించినా కూడా ఇంకా జిల్లాలో 2, 943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. ఇందులో 2024 డీఎస్సీ ఎస్జీటీ తెలుగు మీడియం 1,671, కన్నడ మీడియం 28 పోస్టులు, ఉర్దూ మీడియం పోస్టులు 118 పోయినా 1,126 టీచర్ పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉండనున్నాయి. ఎంటీఎస్ టీచర్ల మధ్య వాగ్వాదం -
ఆర్‌యూలో అనధికార ఉద్యోగులు
జీతాలు చెల్లించడం లేదు వర్సిటీలో అనధికారికంగా కొందరు విధులు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. గతంలో నలుగురు డైలీ వేజ్ కింద వచ్చి విధులు నిర్వహించే వారు. మధ్యలో మానేసి మళ్లీ వస్తున్నారు. వారికి ఎలాంటి జీతం ఇవ్వడం లేదు. ఒక ఎలక్ట్రీషియన్‌ను గతంలో రెండు నెలలు వచ్చి విధు లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే రావొద్దమని చెప్పాం. ఒక నెల రాలేదు. ఈ మధ్యలో వస్తున్నట్లు తెలిసింది. జీతం కోసం ఇటీవల నాదగ్గరికి వచ్చాడు. జీతం చెల్లించలేమని చెప్పాం. – విజయకుమార్ నాయుడు, రిజిస్ట్రార్, ఆర్యూ సీఎంఓ చెప్పింది.. ఉద్యోగం చేపిస్తాం ● సీఎంఓలో విద్యా వ్యవహారాలు చూసే ప్రొఫెసర్ సిఫారసుతో ఒకరికి ఉద్యోగం ● ఎలాంటి ఉద్యోగ ప్రకటన, నియామకం లేకుండానే ఎలక్ట్రీషియన్‌గా విధులు ● కీలకమైన పరీక్షల విభాగంలో ప్రైవేటు కళాశాల ఉద్యోగికర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో అనధికారికంగా కొందరు వ్యక్తులు ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. వీరికి వర్సిటీ ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో రెగ్యులర్ వైస్‌ఛాన్సలర్‌గా విధులు నిర్వహించిన ప్రొఫెసర్ నలుగురికి డైలీ వేజ్ కింద విధులు నిర్వహించేలా ఒక సర్క్యులర్ జారీ చేశారు. దాని ప్రకారం వారు వర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. తరువాత వచ్చిన వీసీ గతంలో వీసీ జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టత లేకపోవడంతో వారిని విధులు నిర్వహించొద్దని ఆదేశించారు. దాంతో వారు కొన్ని రోజులు విధులకు హాజరు కాలేదు. ఇంజినీరింగ్ సెక్షన్‌లోని ఓ ఉద్యోగి జోక్యం చేసుకొని వారితో లోపాయికారీ ఒప్పందం చేసుకొని మళ్లీ విధులకు హాజరయ్యేలా వీసీతో మాట్లాడటంతో తిరిగి విధులు నిర్వహిస్తున్నారు. నెలల కొద్దీ విధులు నిర్వహిస్తున్నా వీరికి ఎలాంటి నియామక ప్రకటన, ఉత్తర్వులు లేకపోవడంతో వీరు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. ● సీఎంఓలో విద్యా వ్యవహారాలు చూసే ఓ సీనియర్ ప్రొఫెసర్ సిఫారసుతో ఎలాంటి ప్రకటన లేకుండా, ఉన్నత విద్యా మండలి, ఫైనాన్స్ అనుమతి లేకుండానే ఆర్యూ అధికారులు ఒకరికి ఉద్యోగం కల్పించారు. ఇతను తెలంగాణ రాష్ట్రం రాజోలికి చెందిన వ్యక్తిగా వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఇతను మూడు నెలలుగా ఎలాంటి నియామక పత్రం లేకుండానే అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదకరమైన ఎలక్ట్రీషియన్ పనులు ఇతనితో చేయిస్తున్నారు. విధులకు హాజరు అవుతున్న సదరు ఉద్యోగి జీతం ఇవ్వాలని వర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఎవరైనా ఎమైనా అడిగితే సీఎంవో నుంచి ఆదేశాలు ఉన్నాయి.. అవసరం ఉన్నప్పుడు పనిచేయించుకుంటున్నామని వర్సిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారని చర్చించుకుంటున్నారు. ● వర్సిటీలో కీలకమైన పరీక్షల విభాగంలో ఆ విభాగం అధికారి తన సొంత నిర్ణయంతో ప్రైవేట్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగితో పనిచేయించుకుంటున్నారని బహిరంగాంగానే చర్చించుకుంటున్నారు. ఇతను కేవలం కళాశాల ప్రిన్సిపాల్‌తో అనుమతి తీసుకొని పరీక్షల విభాగంగా విద్యార్థుల మార్క్స్మెమోస్, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫై చేయిస్తున్నట్లు చెబుతున్నారు. వర్సిటీ ఉన్నతాధికారులకు ఈ సమాచారం తెలియదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి కీలకమైన కాన్ఫిడెన్సియల్ అయిన పరీక్షల విభాగంలో అనధికారికంగా ఒక వ్యక్తితో పనిచేయించుకోవడంపై తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ● ఇలా వర్సిటీలో అనధికార ఉద్యోగులు కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వర్సిటీలో ఎంత మంది ఉద్యోగులు అధికారికంగా, ఎంత మంది అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారో అనే సరైన సమాచారం వర్సిటీ ఉన్నతాధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. అధికారంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకే వివిధ కారణాలతో సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా కాకుండా వర్సిటీ ఇంటర్నల్ ఫండ్స్ నుంచి జీతాలు చెల్లిస్తుండటంతో వర్సిటీ ఖజానా మొత్తం ఖాళీ అవుతుందని, వర్సిటీ అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడం ఇబ్బందికరమేని మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు రద్దీ కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నంద్యాల:స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దర ఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నేటి పీజీఆర్ఎస్ రద్దు బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా ఆది వారం ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని, ఈనెల 30న సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం తెలుగు, పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ జనార్ధన్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 790 మందికి గాను 748 మంది అభ్యర్థులు హాజరు కాగా, 42 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 742 మందికి గాను 565 మంది అభ్యర్థులు హాజరు కాగా 177 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉత్తమ జీవనానికి సోపానాలు ఇతిహాసాలు కర్నూలు కల్చరల్: ఉత్తమ జీవనానికి భారత, భాగవత, రామాయణ ఇతిహాసాలు సోపానా లుగా నిలుస్తాయని ఇస్కాన్ ధర్మ ప్రచారకులు గంగావతి హరిదాస్ అన్నారు. ఆదివారం స్థానిక భగీరథ కాంప్లెక్స్‌లోని పూరి జగన్నాథ మందిరంలో యోగిని ఏకాదశి వేడుకలు, భగవద్గీత తరగతులు, శీల ప్రభుపాదుల ప్రేమ విందు కార్యక్రమాలు జరిగాయి. జగన్నాథ్, సుభద్ర, బలదేవ్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం వైష్ణోకృప చైతన్య ప్రభు సందేశమిస్తూ భగవద్గీత పఠనం, శ్రవణంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. -
నేడు ‘యువత పోరు’
బొమ్మలసత్రం: నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సోమవారం యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టామని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్ తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్నామని హామీ ఇచ్చారని, అలాగే 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించారన్నారు. ప్రభుత్వం ఏర్పాటై నేటికి ఏడాది పూర్తయినా నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరవేర్చాలన్న డిమాండ్‌తోనే సోమవారం యువత పోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. స్థానిక ఉదయానంద రెసిడెన్సీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందిస్తున్నామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి, నిరుద్యోగ యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. -
వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరీక్షలు నిర్వహించి ఫలితాలను సకాలంలో రైతులకు ఇవ్వలేకపోతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు మట్టి నమూనాల సేకరణే పూర్తి కాలేదు. భూసార పరీక్షల నిర్వహణక
● ఖరీఫ్ మొదలైనా ఊసేలేని భూసార పరీక్షలు ● ఇష్టారాజ్యంగా మట్టి నమూనాల సేకరణ ● విద్యుత్ సరఫరా లేని ఎమ్మిగనూరు పరీక్ష కేంద్రం ● గతేడాది కెమికల్స్ నిధులు స్వాహా ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికి గత ఏడాది వచ్చిన మట్టి నమూనాలు (ఫైల్)కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు భూసార పరీక్ష వివరాలు అందితే సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 49 వేల భూసార పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కాని ఇంతవరకు మట్టి నమూనాల సేకరణ, రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం మినహా ఇతరత్రా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 20 రోజులు గడిచినప్పటికీ... భూసార పరీక్షల్లో ఉదజని సూచిక, స్థూల పోషకాలైన భాస్వరం, నత్రజని, పోటాష్‌తో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, కాల్షియం, క్లోరిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, సల్ఫర్, కాపర్, మాలిబ్డినం తదితర 15 పరీక్షలు నిర్వహిస్తారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికి భూసార పరీక్షల నిర్వహణలో చిత్తశద్ధి లోపించడం రైతుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 877 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో దాని నుంచి 55 మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. వాటి ఇన్‌చార్జ్‌లు మట్టి నమూనాలు సేకరించి.. వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత మట్టి నమూనాలను సంబందిత భూ సార పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఖరీఫ్ సీజన్ మొదలై 20 రోజులు గడచినప్పటికీ మట్టి నమూనాల సేకరణనే పూర్తి కాలేదు. భూసార పరీక్షల నిర్వహణ కు ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చలేదు. కెమికల్స్ లేవు.. ఇన్ని సమస్యల మధ్య భూసార పరీక్ష ఫలితాలు ఎప్పడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలకు ‘విద్యుత్’ షాక్ ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రంలో ఏడీఏ పోస్టుతో పాటు నాలుగు ఏవో పోస్టులు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వైరింగ్ మొత్తం కాలిపోయి ఈ కేంద్రానికి నాలుగు నెలల నుంచి కరెంటు లేదు. విద్యుత్ ప్రమాదానికి బిల్డింగ్ కూడా దెబ్బతినింది. భవనానికి పూర్తి స్థాయిలో వైరింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.4.60 లక్షలతో ప్రతిపాదనలు పంపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. కరెంట్ లేకపోవడంతో భూసార పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రహసనం మట్టి నమూనాల సేకరణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ ప్రకారమే సేకరించాల్సి ఉంది. గ్యాప్ పొలంబడి నిర్వహించే ప్రాంతాలు, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, ఆయిల్ సీడ్స్ ప్రదర్శనా క్షేత్రాలు..తదితర ప్రాంతాల్లోనే మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. 2024–25లో మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సేకరించి మమ అనిపించారు. దీంతో భూసార పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ ఏడాది ఆన్లైన్లోనే మట్టి నమనాలు సేకరించాల్సి ఉంది. ఈ సారి కూడా మట్టి నమూనాల సేకరణ ప్రహసనంగా మారింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా మట్టి నమూనాలు సేకరిస్తుండటంతో భూసార పరీక్షల్లో పారదర్శకత లేకుండా పోయింది. నిధులు స్వాహా భూసార పరీక్షల్లో నాణ్యత ఉండాలంటే తగిన మోతాదులో రసాయనాలు వినియోగించాల్సి ఉంది. గత ఏడాది భూసార పరీక్షలకు అవసరమైన రసాయనాల కొనుగోలు చేసేందుకు విడుదల చేసిన రూ.15 లక్షలు స్వాహా అయ్యాయి. ఈ ఏడాది ఒక్క రూపాయి విడుదల కాలేదు. రసాయనాలు లేవు. గతంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం భూసార పరీక్షలంటూ హంగామా చేసిందే తప్ప.. ఫలితాలను రైతులకు ఇవ్వలేదు. ఇదే పరిస్థితి 2024–25లో కూడా పునరావృతం అయ్యింది. 2025–26లో భూసార పరీక్షల నిర్వహణ మరింత అస్తవ్యస్తం అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇవీ సమస్యలు ● ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రంలో12,971 మట్టి నమూనాలను పరీక్షించాల్సి ఉంది. రైతుసేవా కేంద్రాల నుంచి ఒక్క మట్టి నమూనా కూడా ఇక్కడికి చేరలేదు. కరెంటు లేకపోవడంతో భూసార పరీక్షల నిర్వహణకు గ్రహణం పట్టింది. ● కర్నూలు మార్కెట్ యార్డులోని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌లో 12,971 మట్టి నమూనాలను పరీక్షించాల్సి ఉంది. ఈ ల్యాబ్‌కు రైతు సేవా కేంద్రాల నుంచి 1,430 మట్టి నమూనాలు చేరాయి. అయితే శాసీ్త్రయంగా పరీక్షించేందుకు కెమికల్స్ లేపోవడంతో ఇంతవరకు భూసార పరీక్షలు చేపట్టిన దాఖలాలు లేవు. ● నంద్యాల జిల్లాకు సంబంధించి ఇంతవరకు భూసార పరీక్షల నిర్వహణ అతీగతీ లేకుండా పోయింది. ఈ జిల్లాలో 411 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం నుంచి 55 మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రకారం 22,605 మట్టి నమూనాలు సేకరించి.. ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ల్యాబ్‌కు పంపాల్సి ఉంది. ఇంతవరకు నంద్యాల ల్యాబ్‌కు ఒక్క మట్టి నమూనా కూడా రాలేదు. చర్యలు తీసుకుంటున్నాం ఈ ఏడాది జిల్లాలో 25 వేలకుపైగా భూసార పరీక్షలు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో రైతుసేవా కేంద్రం పరిధిలో 55 మట్టి నమూనాలు సేకరించే విధంగా లక్ష్యాలు ఇచ్చాం. ప్రస్తుతం రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ చేసిన తర్వాత మట్టి నమూనాలు ల్యాబ్‌లకు వస్తాయి. కర్నూలులో సగం, ఎమ్మిగనూరు ల్యాబ్‌ల్లో సగం ప్రకారం మట్టి నమూనాలకు పరీక్షలు నిర్వహిస్తారు. రైతులకు త్వరగా భూసార పరీక్షల ఫలితాలు అందచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు ఇవీ భూసార పరీక్ష కేంద్రాలు.. కర్నూలు జిల్లాకు సంబందించి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో భూసార పరీక్ష కేంద్రం ఉంది. అలాగే ఎమ్మిగనూరులోని భూసార పరీక్ష కేంద్రాల్లో మట్టి నమూనాలను పరీక్షిస్తారు. నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాలలోని భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారు. -
సంగమేశ్వర శిఖరానికి పూజలు
కొత్తపల్లి: సప్తనది సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీ న సంగమేశ్వరాల యం జాలాధివాసం అవుతున్న తరుణంలో ఆలయ శిఖరానికి ప్రత్యేక పూజలను ఆదివారం చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 855 అడుగులకు చేరుకుంది. దీంతో ఆలయ గోపురానికి నీటిమట్టం చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటుంది. ఆలయపురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ మరబోటులో వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. శిఖర భాగంపై కృష్ణాజలాలతో అభిషేకం, క్షీరాభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, తదితర విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. -
శ్రీశైలం డ్యాంకు పెరుగుతున్న వరద ఉద్ధృతి
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి రోజురోజుకు వరద ఉద్ధృతి పెరుగుతుంది. జూరాల ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే ద్వారా, విద్యుత్ ఉత్పాదన అనంతరం, తుంగభద్ర నీరు సుంకేసుల ద్వారా వేలాది క్యూసెక్కులు విడుదలవుతోంది. అదే విధంగా లోకల్ క్యాచ్‌మెంట్‌లో కురుస్తున్న వర్షాలు కూడా వీటికి తోడు కావడంతో జలాశయం లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి 76,178 క్యూసెక్కుల వరదనీరు డ్యామ్‌కు చేరుకున్నాయి. డ్యామ్‌లో నీటినిల్వలు పెంచడం కోసం గత నాలుగు రోజులుగా విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయడమే కాకుండా, బ్యాక్ వాటర్ నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు నీటి విడుదలను నిలిపేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 92.4860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 855.20 అడుగులకు చేరుకుంది. -
పనివేళల్లో ‘ఉపాధి’ విందు
కొలిమిగుండ్ల: గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించాల్సిన ఉద్యోగులు పనివేళల్లోనే విందులో పాల్గొని..మద్యం సేవించి ఉపాధి పనుల్లో అక్రమాలను చర్చించుకుంటన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా టీడీపీ కార్యకర్త పనిచేస్తున్నాడు. ఇతడు గ్రామానికి దూరంగా ఉన్న ఓ తోటలో విందు ఏర్పాటు చేశాడు.ఇందులో టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు బెలుం శింగవరానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విందులో మద్యం కూడా ఉంచారు. పనివేళల్లో ఉద్యోగులు మధ్యాహ్నం విందులో పాల్గొన్నారనే విషయం అధికారుల దృష్టికి వెళ్లినా వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. విందులో మద్యం సేవించాక ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు పలువురు ఉద్యోగులు ఉపాధి పనుల్లో అక్రమాల గురించి బహిరంగంగా చర్చించుకున్నారు. అక్రమాలు అధికారుల దృష్టికి వెళితే ఎలా తప్పించుకోవాలో మాట్లాడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. యంత్రాలతో పనులు.. గ్రామ సమీపంలోని కొండలో చాలా రోజుల క్రితం రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో గ్రావెల్‌ను యంత్రాలతో తవ్వి తీసుకెళ్లారు. అవి గుంతలుగా ఏర్పడటంతో వాటిలో జేసీబీలతో చుట్టు కొలతలు వచ్చేలా చేసి ఉపాధి కూలీలతో పనులు చేయించినట్లు చిత్రీకరించారు. కొండలో చాలా చోట్ల ఇలాంటి పనులు చేశారు. జేసీబీలతో పనులు చేసి కూలీలు చేసినట్లుగా మస్టర్లలో హాజరు వేశారు.ఈ బోగస్ పనులన్నీ ఫీల్డ్ అసిస్టెంట్ కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. కూలీలతో పనులు చేయించినట్లు చూపించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ఇటీవలే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమాలు బయటపడకుండా కప్పిపుచ్చుకునేందుకు ఉపాధి ఉద్యోగులకు ఫీల్డ్ అసిస్టెంట్ విందు ఏర్పాటు చేశారనే చర్చ నడుస్తోంది.విచారణ చేస్తున్నాం ఉపాధి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన విందులో పాల్గొన్న విషయం మా దృష్టికి వచ్చింది. విందులో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై విచారణ చేస్తాం. యంత్రాలతో పనులు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో అలాంటి పనులు చేయరాదని హెచ్చరించాం. వీటిన్నింటిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.– ప్రసాదరెడ్డి, ఎంపీడీవో -
దినచర్యలో యోగా భాగం కావాలి
నంద్యాల(అర్బన్): దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ను చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డు ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విశాఖపట్నంలో పీఎం మోదీ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధు లు, ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ మున్సిపల్, మెడికల్, ఆయుష్ శాఖలు గత నెల రోజుల నుంచి యోగ విన్యాసాలలో అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు నిర్వహించే పనులు ఆన్లైన్లో నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ఫొటోలను అప్లోడ్ చేశారన్నారు. యోగా కార్యక్రమంపై జిల్లాస్థాయిలో వివిధ రకాల పోటీలను నిర్వహించామన్నారు. మన జిల్లాలో తయారు చేసిన వీడియోకు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. అలాగే బనగానపల్లె బృందం తయారు చేసిన స్క్రిప్టుకు రాష్ట్ర స్థాయిలో మూడవ బహుమతి వచ్చిందన్నారు. అనంతరం యోగా గురువులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ యశోధర, ఆర్డీఓ విశ్వనాథ్ పాల్గొన్నారు. కోర్టు ఆవరణంలో యోగా దినోత్సవం నంద్యాల(వ్యవసాయం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు హాల్లో జడ్జీలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాస నాలు వేశారు. ఈ సందర్భంగా మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్‌కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ఫస్ట్‌క్లాస్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మికర్రి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది యోగా చేసి పని ఒత్తిడిని దూరం చేసుకోవయచ్చన్నారు. అదే విధంగా ఆరోగ్యంగా, దీర్ఘకాలిక జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్‌బాషా, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, ముక్కెర కృష్ణారెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా యోగా వీడియోకు రాష్ట్ర స్థాయిలో ప్రథమం జిల్లా కలెక్టర్ రాజకుమారి -
ప్రత్యేక వైద్య శిబిరాలనుసద్వినియోగం చేసుకోండి
నంద్యాల(న్యూటౌన్): దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు రవికృష్ణ, అధ్యక్షుడు రమణయ్య, కార్యదర్శి రామలింగం సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన నంద్యాల పురపాలక టౌన్హాల్లో, జూన్ 28న నందికొట్కూరు, జూలై 1న ఆళ్లగడ్డ, 4న ఆత్మకూరు, 8న బనగానపల్లె, 11న డోన్, 15న పాణ్యంలో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల సహాయ పరికరాల ఉచిత పథకం, భారత కృత్రిమ అవయవాల తయారీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులను పరీక్షించి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, అంధుల చేతి కర్రలు ఉచితంగా అందించడానికి ఎంపిక చేస్తారన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం గడివేముల: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన అవసరమని నంద్యాల జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్‌బాబు అన్నారు. శనివారం స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి డాక్టర్లు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది వర్షాకాలం కావున అతిసార కేసులు ప్రబలే అవకాశం ఉన్నందున అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని, ప్రజల కు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం పెసరవాయిలో జరుగుతున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పోస్టర్లను విడుదల చేశారు. ఆయన వెంట డాక్టర్ కిరణ్‌కుమార్, ఎంపీహెచ్ఈఓలు జగదీశ్వరప్ప, మహేశ్వరరెడ్డి, సూపర్వైజర్ మనోహర్, ఎంఎల్‌హెచ్‌పీ అలీబాషా, ఎఎన్ఎం దేవకుమారి, ఆశాలు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి పాములపాడు: మూడేళ్ల పిల్లలను చేర్చుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్స్ ఎంఈఓ 2 సుభాషిణీ దేవికి ఫిర్యాదు చేశారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ భవనంలో అంగన్వాడీ టీచర్లు నాగమణి, నాగమ్మ, శివలక్ష్మి, చెన్నమ్మ, నాగమద్దమ్మలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల వయస్సు నిండని పిల్లలను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ చేర్చుకోవడం వల్ల తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుతున్నారనానరు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని, ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
విధేయుడా వందనం!
ఆత్మకూరురూరల్: నేటి సమాజంలో నీతి మంత రాజకీయాలు చేసేవారు అరుదుగా కనిపిస్తారు. రాజకీయ ఎదుగదల కాక్షించో.. పదవులు, డబ్బు కోసమో తెలియదు కానీ.. కొందరు నేతలు పొద్దున ఒక పార్టీలో ఉండి సాయంత్రం మరో పార్టీ వేదికపై కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ నిరుపేద గిరిజనుడు డబ్బుకు లొంగలేదు. తనను గెలిపించిన ప్రజల వెంటే ఉంటానని ఆఫర్‌ను తిరస్కరించాడు. అతనే వైఎస్సార్సీపీ నాయకుడు, కురుకుంద గ్రామ మాజీ సర్పంచ్ ఆర్థి కొండన్న(58). నీతివంతమైన రాజకీయాలకు చిరునామాగా నిలిచిన ఆయన శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పలువురు ఆయన రాజకీయ విలువల గురించి చర్చించుకోవడం కనిపించింది. 2014 ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి కొద్ది రోజుల్లోనే టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కురుకుంద సర్పంచ్‌గా ఉన్న చెంచు కొండన్నను కూడా టీడీపీలోకి ఆహ్వానించారు. గ్రామంలో టీడీపీ నాయకులకు అనుకూలంగా నడుచుకోమని చెప్పారు. అయితే చెంచు కొండన్న అందుకు నిరాకరిస్తూ తనకు ఓట్లు వేసి గెలిపించింది వైఎస్సార్సీపీ అభిమానులని, తాను ఆ పార్టీకి ద్రోహం చేయనని టీడీపీ నేతలకు తేల్చి చెప్పాడు. అలాగే ఎన్నికల ముందు కూడా టీడీపీకి చెందిన నాయకులు తనను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు కూడా పొలాలకు కాపలా ఉండి జీవనం సాగించే కొండన్న ఎలాంటి ప్రలోభాలకు లొంగని అంశాన్ని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం కనిపించింది. ఊరిలో ఇల్లు, అడవిలో చేను లేని ఆహార సేకరణ దశలోనే చెంచు జీవనం సాగించే గిరిజనుడు ఆనాడు ప్రలోభాలకు లొంగని విషయం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమేనని చెప్పవచ్చు. చిన్న స్థాయిలోనైనా విలువలకు కట్టుబడిన గిరిజన కొండన్నకు గ్రామస్తులు నీరాజనాలు అర్పించారు. కొండన్నకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కురుకుంద మాజీ సర్పంచ్ అర్తి కొండన్న మృతి రాజకీయాల్లో విలువలు చాటిన నిరుపేద గిరిజనుడు -
● ఆదోనిలో వైఎస్సార్సీపీ జెండా కట్ట ధ్వంసం ● త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
‘కూటమి’ నాయకుల ధ్వంస రచన ఆదోని టౌన్: ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ‘కూటమి’ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ధ్వంస రచన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి వైఎస్సార్సీపీ జెండా కట్టను ధ్వంసం చేశారు. జెండా, జెండాకు సంబంధించిన పైపును విరగొట్టారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు దేవ, పట్టణ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు అక్కడి వెళ్లి ధ్వంసమైన కట్టను పరిశీలించారు. అనంతరం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుండాన్ని చూస్తూ సహించలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. పార్టీ జెండాను ఇలా అవమానించడం తగదన్నారు. ఇలాంటి దుశ్చర్యలతో ఘర్షణలు, గొడవలు జరిగే ప్రమాదం ఉందన్నారు. దుండగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ పట్టణ సెక్రటరీ తాయన్న, ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు యేసేపు, కౌన్సిలర్ అశోక్, నాయకులు ప్రసాద్, బుడ్డేకల్ బాబు, కిషోర్, పట్టణ కార్యదర్శి బాబా, కౌన్సిలర్లు రఘునాథ్‌రెడ్డి, ఫయాజ్, అశోక్, నాయకులు దినేష్, ఉస్మాన్, చిన్నరామకృష్ణారెడ్డి, భీమ, వీరప్ప, నారాయణ, హరిశ్చంద్ర, కౌన్సిలర్ చలపతి తదితరులు పాల్గొన్నారు. -
అడుగు దూరంలో నీటి విడుదల
● పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను తాకిన కృష్ణాజలాలు జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం రోజుకు రోజుకు పెరిగి కృష్ణాజలాలు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను తగిలాయి. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 851.90 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసుకోవచ్చు. గతేడాది జులై 27న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువనున్న కాల్వలకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలవల్ల శ్రీశైలం డ్యాంలోకి వరదనీరు వచ్చి చేరుతుండటంతో క్రమేణా డ్యాంలో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గతేడాది కంటే నెలరోజులు ముందుగానే పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు నీటిని విడుదల చేసుకునే అవకాశాలున్నాయి. -
మెప్మా సీఆర్పీ రిమాండ్‌కు తరలింపు
బొమ్మలసత్రం: పొదుపు మహిళల రుణాలను కాజేసి మోసం చేసిన మెప్మా సీఆర్పీ షేక్ వహీదాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రాంతానికి చెందిన షేక్ వహీదా మెప్మా సీఆర్పీగా పని చేస్తున్నారు. ఆమె పరిధిలోని 30 పొదుపు గ్రూపులు ఉన్నాయి. కాగా ఆయా పొదుపు గ్రూపులకు మంజూరు చేసిన రుణాలను సగం తీసుకుని మిగిలిన సగం మాత్రమే పొదుపు సభ్యులకు ఇవ్వడం.. అలాగే వారు చెల్లించిన రుణ కంతులను బ్యాంకులో జమ చేయకుండా కాజేశారు. అయితే తీసుకున్న రుణాలు చెల్లించలేదని బ్యాంకు అధికారులు పొదుపు మహిళలకు నోటీసులు పంపడంతో సీఆర్పీ వహీదా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మోసపోయామని గ్రహించిన పొదుపు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఆర్పీ వహీదాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను రిమాండ్‌కు తరలించామన్నారు. దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు ... ● ఆటో బోల్తా పడి వృద్ధురాలి దుర్మరణం గోస్పాడు/మహానంది: ఎస్.నాగులవరం–పసురపాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం దైవదర్శనం నిమిత్తం రంగాపురం సమీపంలోని మద్దిలేటిస్వామి దర్శనానికి ఆటోలో వెళ్లారు. పూజలు నిర్వహించుకుని తిరిగి వస్తుండగా ఎస్.నాగులవరం సమీపంలో ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆవుల లక్ష్మీదేవి(65) అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటేశ్వర్లు, మౌనిక, చిన్న సరవయ్య, లక్ష్మిపతి, ఆవుల నరసమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆవుల నరసమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. మృతురాలు లక్ష్మీదేవి భర్త గత కొద్దినెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు బంధువులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పాణ్యం: పిన్నాపురం గ్రామ రస్తాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. శనివారం సాయంత్రం గొర్రెల కాపరులు గడ్డిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా వ్యక్తి మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. మృతదేహంపై దుస్తులు లేకపోవడం, కాళ్లకు బెల్ట్ చెప్పులు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి బాధ్యతల స్వీకరణ గోస్పాడు: జిల్లా ఔషధ నియంత్రణ అధికారిగా హనుమన్న శనివారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన దాదా ఖలందర్ చిత్తూరు జిల్లా మదనపల్లెకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురంలో పని చేస్తున్న హనుమన్నను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విధుల్లో చేరారు. నంద్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలతో పాటు కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. డోన్, డివిజన్‌కు డ్రగ్ ఇన్స్పెక్టర్గా కర్నూలు రూరల్ విభాగానికి జయరాంను నియమించారు. నల్లమలలో ట్రాఫిక్ జాం ఆత్మకూరురూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు నిలిచి ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. ఆత్మకూరు – దోర్నాల ప్రధాన రహదారిలోని నంద్యాల – ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో శనివారం భారీ వృక్షం నేల కూలడంతో రెండు గంటల సేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. పెద్ద పెంట రాస్తా ఏటిపాయ గేటు వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో దాదాపు 2 గంటల వరకు అడవిలో ప్రయాణికులు అల్లాడి పోయారు. అటవీ శాఖకు చెందిన ప్రొటక్షన్ వాచర్లు అక్కడికి చేరుకుని చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలు యథాతధంగా కొనసాగాయి. సచివాలయ ఉద్యోగుల సమాచారాన్ని పంపండి కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేది నాటికి పక్కాగా పంపించాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. శనివారం సా యంత్రం ఆయన తన చాంబర్ నుంచి జిల్లా లోని ఎంపీడీఓలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. అర్బ న్ ప్రాంతాల్లోని సచివాలయాలకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలను, ఇతరత్రా వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
వసతి మూత‘బడి’
ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పేద విద్యార్థులకు వసతి గృహాలు కూడా అందుబాటులోకి రాని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కాగా ఆలూరులోని సాంఘిక సంక్షేమ శాఖ బీసీ బాలురు వసతి గృహం ఇంత వరకు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇక్కడ ఉండలేక ఇంటి బాట పట్టారు. సొంత భవనం లేకపోవడంతో ఆలూరు సమీపంలోని ఎల్లార్తి రోడ్డు వద్ద ప్రగతి జూనియర్ కళాశాల, పాఠశాల ఆవరణలోనే గత ఏడాది నుంచి సాంఘిక సంక్షేమ శాఖ బీసీ బాలురు వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ బాలుర వసతి గృహంలో 120 మంది, కళాశాల వసతి గృహంలో 110 మంది ఉంటున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హెచ్‌డబ్ల్యూఓ సంపత్‌కుమార్‌ను ఈనెల 10న కర్నూలుకు బదిలీ చేశారు. ఆదోని డివిజన్ ఏఎస్డబ్యూఓగా విధులు నిర్వహిస్తున్న రాజా కుళ్లాయప్ప ఈనెల 1న పదవీ విరమణ పొందారు. ఆదోని, ఆలూరు సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఏఎస్డబ్ల్యూఓగా పత్తికొండలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఆలూరు బీసీ బాలుర వసతి సంక్షేమ కళాశాల వసతి గృహానికి అనిమిరెడ్డిని హెచ్‌డబ్ల్యూఓగా అధికారులు నియమించారు. అయితే ఆరోగ్య కారణాలతో ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు. వసతి గృహాల తలుపులకు మూతపడి ఆదివారం నాటికి 22 రోజులకు చేరుతుంది. వసతి గృహం తెరవకపోవడంతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ఒక ఫైల్ కూడా పంపామని ఏఎస్డబ్ల్యూఓ శ్రీనివాసులు తెలిపారు. తలుపులు తెరుచుకోని బీసీ బాలుర వసతి గృహం ఇంటి బాట పట్టిన విద్యార్థులు -
ఆత్మహత్యలే శరణ్యం
కోడుమూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని నగర పంచాయతీ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం గూడూరు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ఆరవింద్, మధు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో పనిచేస్తూ తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. 15 సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయడంతో పాటు నెలనెలా సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 46రోజుల నుంచి విధులు బహిష్కరించి నిరవధిక దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిరసనలో కార్మికులు డూకేశ్వరరావు, షబ్బీర్, ఆంజనేయులు, బసవరాజు, జయన్న, అల్లిబాషా, ఖాజా, ప్రభాకర్, ఉసేన్, పఠాన్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి పెరుగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలంలోని నీలంసంజీవరెడ్డి ప్రాజెక్ట్‌కు వరద తాకిడి పెరిగింది. జూరాలలో స్పిల్‌వే ద్వారా, విద్యుత్ ఉత్పాదన అనంతరం, సుంకేసుల బ్యారేజి నుంచి, సెల్ఫ్ క్చామెంట్ ఏరియాలో కురిసిన 40.60 మిల్లీమీటర్ల వర్షంతో శుక్రవారం నుంచి శనివారం వరకు డ్యాంలోకి 79,212 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. గత మూడు రోజులుగా శ్రీశైలం డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు నీటి విడుదలను నిలిపివేశారు. శనివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 86.4762 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 852.90 అడుగులకు చేరుకుంది. -
నేర నిరూపణతోనే బాధితులకు న్యాయం
బొమ్మలసత్రం: ప్రతి కేసును చిత్తశుద్ధితో దర్యాప్తు చేసి నేర నిరూపణకు సమర్ధవంతంతగా పనిచేసి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పోలీసు అధికారులకు సూచించారు. శనివారం స్ధానిక ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, నేరగణాంకాల సేకరణ విశ్లేషణ, నిర్వహణ సంస్థ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ముద్దాయిలను అరెస్ట్ చేయడం, చార్జిషీట్ వేయడంతో పాటు కోర్టు విధివిధానాలు సరిగా పాటించి కేసు నిరూపణ చేయాల్సిన బాధ్యత కోర్టు కానిస్టేబుళ్లదేనన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు, పాత పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కేసుల దర్యాప్తులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన వారికి రివార్డులు, చట్టాన్ని అతిక్రమించే వారికి క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. -
దళారుల పంట పండుతోంది!
దళారీ వ్యవస్థ.. ఉద్యాన పంటల మార్కెట్‌ను శాసిస్తోంది. వారు చెప్పిందే ధర. మార్కెట్‌ను తమ కనుసన్నల్లోనే నడుపుతున్నారు. గతంలో దళారీ అంటే రైతుకు, వ్యాపారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తూ ఇరువురిని ఒప్పించి పదో పరకో సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం సీను మారిపోయింది. బొప్పాయి, అరటి, మిరప, పసుపు, తమలపాకులు.. ఇలా ఉద్యాన పంట ఏదైనా వారు చెప్పినట్లు రైతులు, వ్యాపారులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కమీషన్ మీద ఆధారపడిన వీరు చివరకు వ్యాపారుల మాటున రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఆళ్లగడ్డ: అన్నదాతల అవసరాన్ని, అమాయకత్వాన్ని దళారులు ఆదాయ మార్గంగా మార్చుకుని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. పంట పండించడం వరకే రైతు హక్కు. మిగతాదంతా దళారుల దయపైనే ఆధారపడి ఉంటోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లాలో ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది. జిల్లా మొత్తం ఎటు చూసినా అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, దానిమ్మ, కర్బూజ, మామిడి, జామ, సపోట, దానిమ్మ, కలింగర (పుచ్చ).. వంటి పండ్ల తోటలతో పాటు పసుపు, మిరప వంటి ఉద్యాన పంటలు సైతం విపరీతంగా సాగవుతున్నాయి. ఎక్కువగా ఆళ్లగడ్డ, డోన్, నంద్యాల తదితర ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు.ప్రస్తుతం జిల్లాలో బొప్పాయి 20 వేల ఎకరాలు, అరటి 40 వేల ఎకరాలు, నిమ్మ 5 వేల ఎకరాల్లో ఉంది. అయితే ఇందులో ఆళ్లగడ్డ ప్రాంతంలోనే అత్యధికంగా అరటి పంట 20,224 ఎకరాలు, బొప్పాయి 10,428 ఎకరాలు, నిమ్మ 3,500 ఎకరాల్లో సాగులో ఉంది. ఈ పంటల సాగుకు పెట్టుబడి ఏటేటా రెట్టింపు అవుతోంది. ఉద్యాన పంట ఏదైనా దిగుబడులు విక్రయించే సరికి రైతులకు చివరకు మిగిలేది నష్టం.. దుఃఖమే. దళారులు అన్నదాతల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. మార్కెట్లో ధర లేదంటూ కథలు చెబుతూ మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు.ప్రభుత్వం జిల్లాలో ఎక్కడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించకపోవడంతో దిగుబడులు బాగున్నా ధర ఆశించిన మేర లభించకపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బొప్పాయి టన్ను రూ. 20 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 4 నుంచి రూ. 5 వేలకు ధర పడిపోయింది. అరటి టన్ను రూ .26 వేల ధర పలకగా దళారులంతా సిండికేట్‌గా మారి ప్రస్తుతం రూ. 4 వేలకు కొనుగోలు చేస్తున్నారు. గద్దల్లా వాలిపోతారు.. అరటి, బొప్పాయి పంటలు సాగు చేయాలంటే ఎక రాకు కనీసం రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వర కు పెట్టుబడి అవుతుంది. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్లు, ప్రకృతి వైపరిత్యాల నుంచి పంటను బతికించుకున్నా దిగుబడి విక్రయ సమయాని కి దళారులు గద్దల్లా వచ్చి వాలిపోతారు. వ్యాపారు లు అస్సలు గ్రామాల్లో కనిపించక పోయేసరికి దళరులు నిర్ణయించిన మేరకు పంటను విక్రయించాల్సి వస్తోంది.తమకు ఉపాధి కల్పిస్తూ తమ కుటుంబానికి కడుపునిండా అన్నం పెడుతున్నారన్న జాలి కూడా లేకుండా పుడమి పుత్రులను నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పనిచేసి పంట పండించిన వారికి దళారుల (కమీషను దారులు) కారణంగా పెట్టుబడులు కూడా దక్కని దయనీయ పరిస్థితి నెలకొంటుంది. రూ. కోట్లు దళారుల పాలు జిల్లాలో వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. అయితే ఏ పంటకు సంబంధించిన దిగుబడిని విక్రయించుకునేందుకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మార్కెటింగ్ సౌకర్యం లేదు. అరటి, బొప్పాయిలే 60 వేల ఎకరాల వరకు సాగులో ఉంది. ఎకరాకు 40 టన్నుల దిగుబడి వచ్చిన 24 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుంది. టన్నుకు రూ. 2 వేల వరకు కమీషన్ అనుకున్నా ఏకంగా రూ. 48 కోట్ల వరకు దళారులు చెమటచుక్క బయటకు రాకుండా దోచుకుంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మోసంపై దృష్టి సారించి స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.వ్యాపారులను రానివ్వకుండా.. గత పదేళ్ల క్రితం వరకు బొప్పాయి, అరటి సీజన్ ప్రారంభమవడానికి ఓ నెల ముందు నుంచే ఈ ప్రాంతం వ్యాపారులతో కళకళలాడేది. ముంబాయి, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా తదితర ప్రాంతాలకు చెందిన వారితో పాటు నేపాల్, చైనా వంటి ఇతర దేశాలకు చెందిన పెద్ద పెద్ద వ్యాపారులు సైతం చాగలమర్రి, ఆళ్లగడ్డ, ఆలమూరు, నంద్యాల ప్రాంతాల్లో నెలల తరబడి మకాం వేసి దళారుల మధ్య వరి్థత్వంతో దిగుబడి కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు దళారులే వ్యాపారుల అవతారమెత్తి అసలు వ్యాపారులను రైతుల వద్దకు వెళ్లనీయకుడా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దళారులంతా సిండికేట్‌గా మారి ధరను నిర్ణయించి రైతులను మోసం చేస్తున్నారు. కష్టం రైతులది.. సంపాదన దళారులది 5 ఎకరాలు బొప్పాయి సాగు చేయాలంటే సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పెట్టుబడి వస్తే చాలనీ అనుకుంటాం. కాని దళారులు నెల, రెండు నెలల్లో ఐదెకరాల సరుకుతో కనీసం రూ.3 లక్షలు సంపాదిస్తాడు. వారు అడిగిన ధరకు ఇవ్వాల్సిందే. లేకుంటే తోటలోనే మాగిపోతాయి. అధికారులు చర్యలు తీసుకుని దళారుల దందాను అరికట్టాలి. – రాంగుర్రెడ్డి, రైతు -
డోన్‌లో టీడీపీ నాయకుల భూ కబ్జాలు
నేడు● రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం ● చోద్యం చూస్తున్న మైనర్ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు డోన్: అధికారంలో ఉన్నామని టీడీపీ నాయకులు బరితెగించారు. ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. గతంలో తొలగించిన అక్రమ నిర్మాణాలు పునఃప్రారంభించారు. టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విముక్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాలను తిరిగి ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారు. మైనర్ ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల వ్యయం చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. డోన్ పట్టణంలో గరిష్టంగా సెంటు రూ.15లక్షలకుపైగా ధర పలుకుతోంది. కబ్జాలు ఇలా.. ● డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా స్కిల్ డెవలప్మెంట్ పక్కన సర్వే నంబర్ 327లో 50 సెంట్ల వంక పోరంబోకు స్థలం ఉంది. ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేశారు. అంతేకాకుండా ఉడుములపాడు చెరువుకు వర్షపు నీరు చేరకుండా అడ్డుగోడ కట్టారు. అప్పట్లో ఉడుములపాడు రైతులు కదిలివచ్చి అడ్డు గోడను పెకలించి వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఽపెకలించిన గోడను తిరిగి పునర్నిర్మించారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ● టీడీపీ నాయకునికి చెందిన ఎంకే టౌన్షిప్ పక్కన సాక్షి నివాస్ వారితో కలిసి 60 అడుగుల రోడ్డు కోసం స్థలాన్ని వదిలారు. ప్లాట్లన్నీ విక్రయించిన తర్వాత మధ్యలో గోడ కట్టి 30 అడుగుల రోడ్డును చూపించారు. తాము తమ హద్దు వరకు గోడ కట్టినట్లు టీడీపీ నాయకుడు వాదిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు 60 అడుగుల రోడ్డు మధ్యలో ఉన్న గోడను కూల్చివేశారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే గోడను సదరు టిడిపి నాయకుడు తిరిగి పునర్నిర్మించాడు. నాడుఇవీ ఆరోపణలు.. డోన్ పట్టణంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అధికారులు ప్రోత్సహిస్తున్నారని సర్వసభ్య సమావేశంలో టీడీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ ఆరోపించారు. అధికారుల అవినీతిపై ఒక తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు రూపంలో పంపాలని సర్వసభ్య సమావేశం నిర్ణయించారు. -
గ్రిల్లో ఇరుక్కుని నరకయాతన
ఎమ్మిగనూరురూరల్: వైద్యం కోసం వచ్చిన మహిళ కాలు ఆస్పత్రి గేటు వద్ద గ్రిల్లో ఇరుక్కోవడంతో అరగంట పాటు నరకయాతన అనుభవించింది. వివరాలు.. మండల పరిఽధిలోని కోటేకల్ గ్రామానికి చెందిన మునెమ్మ అనే మహిళ కాలికి దెబ్బతగడంతో చికిత్స కోసం శుక్రవారం ఎమ్మిగనూరు ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. కట్టు కట్టించుకొని బయటకు నడిచి వస్తుండగా ఆటో ఎదురుగా రావటంతో గ్రిల్ మీద నిల్చున్న మహిళ కాలు జారి ప్రమాదశాత్తు ఇరుక్కుపోయింది. దెబ్బతగిలిన కాలు గ్రిల్లో ఇరుక్కొని కేకలు వేయటంతో అక్కడి వారు వచ్చి ఎంతగా ప్రయత్నించినా బయటకు తీయలేకపోయారు. చివరకు ఇనుప కడ్డీలు కట్ చేసే కట్టర్‌ను తీసుకొచ్చి గ్రిల్ కడ్డీని కట్ చేసి మహిళను బయటకు తీశారు. ప్రభుత్వాసుపత్రిలోకి ఆటోలు, అంబులెన్స్‌లు ఇష్టానుసారంగా వస్తుండంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి గేటు వద్ద పాడైపోయిన గ్రిల్‌ను బాగు చేయించాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు. -
నీటి విడుదలపై 27న సమావేశం
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ, ఇతర కాలువలకు నీటి విడుదలపై ఈ నెల 27న బెంగళూరు విధాన సౌధలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి సలహా మండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో 124వ నీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు శుక్రవారం తెలిపారు. గతేడాది వరద నీటి ప్రవహానికి డ్యాం 19వ క్రస్టుగేటు కొట్టుకుపోవడంతో సాట్ప్లాక్ గేటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టాప్‌లాక్ గేటు స్థానంలో కొత్త గేటుతో పాటు మిగిలిన 32 క్రస్టుగేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు గాను పనులు మొదలు పెట్టేందుకు ఒక పంటకు (ఖరీఫ్) మాత్రమే నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. అయితే దీనిపై కర్ణాటకలోని తుంగభద్ర రైతు సంఘం నాయకులు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడ్తామని హెచ్చరికలు చేస్తున్నారు. డ్యాంలో కూడా 40 టీఎంసీల నీరు చేరడంతో కాలువలకు ముందుగానే నీటిని విడుదల చేయడం, రైతుల వ్యతిరేకత, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్యాంలో నిల్వ అయ్యే నీటితో ఆయా రాష్ట్రాల కాలువలకు నీటి విడుదుల, కేటాయింపులపై చర్చించనున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది టీబీ డ్యాం నీటిపై గందరగోళం నెలకొనడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1612 అడుగుల వద్ద 44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
మిర్చిలో పురుగుమందుల అవశేషాలు
● చీడపీడల నియంత్రణకు అడ్డగోలు వినియోగం ● ఎకరాకు రూ.54 వేల నుంచి రూ.60 వేల ఖర్చు ● అత్యంత ప్రమాదకర మందుల విక్రయాలు ● లాభాల కోసం ప్రోత్సహిస్తున్న డీలర్లు ● ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం ● ఈ కారణంగానే పతనమవుతున్న ధర రెడ్ లేబుల్: ఇవి అత్యంత విషపూరితమైనవి. మోనోక్రోటోఫాస్, జింక్ ఫాస్పేట్, ఇథైల్, మెర్కూరి అసిటేట్ వంటివి. బ్లూ లేబుల్: ఈ లేబుల్ కలిగిన పురుగుమందుల్లో విష ప్రభావం మధ్యస్తంగా ఉంటుంది. స్పైనోశాడ్, మలాథియాన్, ధిరామ్, గ్లైపోసేట్ తదితరాలు. గ్రీన్ లేబుల్(హెచ్చరిక): ఈ లేబుల్ పురుగుమందుల్లో విష ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆహార పంటలకు వీటినే వినియోగించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. మాంకోబెబ్, అక్సిప్లోర్పెస్, కొరాజిన్, వేపనూనే తదితరాలు. ఎల్లో లేబుల్(డేంజర్): ఇవి కూడా అత్యంత విషపూరితమైనవే. వీటి ఉత్పత్తిని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఓమైట్, అవాంట్, ఎండోసల్ఫాన్, కార్బరిల్, క్వినాల్ఫాస్, సైఫర్మెత్రిన్, ఫిప్రోనిల్, రోగార్ వంటివి పురుగు మందుల్లో విష తీవ్రత ఇలా.. -
రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలి
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, అప్పుడు ఆ ఉద్యోగానికి గుర్తింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ డేను పురస్కరించుకొని ఏపీఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్‌తో పాటు జేసీ డాక్టర్ బి.నవ్య, ఇన్చార్జి డీఆర్వో బీకే వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, లక్ష్మీరాజు ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఏపీఆర్ఎస్ఏ సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలకు రెవెన్యూ తల్లివంటిదన్నారు. రెవెన్యూలో అనేక సంస్కరణలు వచ్చాయని, వాటిపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. తాను కడపలో డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణలో ఉన్న సమయంలో(2007–08) అనేక సంస్కరణలను అమలుచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నట్లు చెప్పారు. గుడివాడ ఆర్డీఓగా ల్యాండ్ రికార్డ్స్’లో ఆధార్‌సీడింగ్ ప్రక్రియను రూపొందించానన్నారు. కడప ఆర్డీఓగా కొప్పర్తిలో 6 వేలు, ఇళ్ల నిర్మాణాల కోసం 3వేల ఎకరాలు, 14రోడ్ల విస్తరణ భూసేకరణకు ప్రత్యేక యాప్‌ను తయారు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ కడపకు వెళ్లినప్పుడు రోడ్ల విస్తరణ చూస్తే తనకు ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు. ● జేసీ డాక్టర్ బి.నవ్య మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అతిప్రాచీనమైనదని, ఇప్పుడున్న మిగిలిన శాఖలన్నీ రెవెన్యూ నుంచే ఉద్భవించినవేనన్నారు. ప్రజలకు ఏమి కష్టాలు వచ్చినా రెవెన్యూ అధికారులనే ఆశ్రయిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. ● అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు శశిదేవి, కిష్టోఫర్, జయన్న, విజయుడు, హుస్సేన్, రమణ, ఆదినారాయణ, రామన్న, ఎల్లరాముడు తదితరులను ఏపీఆర్ఎస్ఏ తరపున కలెక్టర్, జేసీలు సన్మానించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, అజయ్‌కుమార్, కొండయ్య, నాగప్రసన్న, సునీతాభాయ్, ఏఓ శివరాముడు పాల్గొన్నారు. -
పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణ పూర్తయినందున సంఘాల లావాదేవీలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించే అవకాశం ఏర్పడిందని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ పి.రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లాలోని 56 పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ పూర్తయిన నేపధ్యంలో సంఘాల సీఈఓలకు కర్నూలులో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది మార్చి 31 ఆడిట్ పైనల్ రిపోర్టులను, 2025 సంవత్సరానికి సంబంధించి ఇయర్ ఎండ్ ప్రాసెస్ మాడ్యుల్స్‌పై అవగాహన కల్పించారు. టెక్నికల్ సపోర్టు గురించి వివరించారు. ఎన్‌ఎల్‌పీఎస్‌వీ టెక్నికల్ సపోర్టర్ భువనేశ్వర్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు, ఆప్కాబ్ డీపీడీఎం నహిదా సుల్తాన, డీజీఎంలు సునీల్‌కుమార్, నాగిరెడ్డి, డిపార్టుమెంటల్ ఆడిటర్స్, సంఘాల సీఈఓలు పాల్గొన్నారు. పీఏసీఎస్‌ల పర్సన్ ఇన్‌చార్జ్‌ల పదవీ కాలం పొడిగింపు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 79 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్జ్ల పదవీ కాలన్ని ఈ ఏడాది జూలై 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 32, నంద్యాల జిల్లాలో 47 పీఏసీఎస్‌ల పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా సహకార శాఖ అధికారులు పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలం ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై 30 వరకు పదవీ కాలాన్ని పొడిగిస్తూ సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వచ్చే నెల 15వ తేదీలోపు www.iti.ap.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే నెల 17వ తేదీన జరుగనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు జూలై 21, 22, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు 23 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హోంగార్డుపై ఏఎస్ఐ దాడి కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణ విషయంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హోంగార్డు బాషా మధ్య గురువారం రాత్రి వివాదం చోటు చేసుకుంది. పైఅధికారిగా ఉన్న తన మాటలను హోంగార్డు బాషా లెక్క చేయడం లేదని ఏఎస్ఐ దాడికి పాల్పడ్డాడు. ముఖం మీద కొట్టడంతో హోంగార్డు బాషా పళ్లు రాలినట్లు తెలుస్తోంది. ఘటనపై హోంగార్డు బాషా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి ఏఎస్ఐ వెంకటేశ్వర్లుపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. -
ధర ‘ఎగ్’బారుతోంది!
● వంద కోడిగుడ్ల ధర హోల్‌సేల్‌లో రూ.600 పైమాటే గోస్పాడు: కోడి గుడ్డు ధరలు ఎగబాకుతున్నాయి. వాటిని సామాన్యులు కొనుగోలు చేయలేకపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఒకలా ఉంటే మారుమూల గ్రామాల్లో ధరలు అధికంగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నుంచి ధరలు పెరుగుతూ ఉన్నాయి. జనవరిలో 30 గుడ్ల ధర రూ. 120 నుంచి రూ. 130 వరకు ఉంది. నిలకడ లేకుండా ప్రతిరోజు 5 పైసల నుంచి 15 పైసల వరకు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం వంద గుడ్లు రూ. 600 నుంచి రూ.625 పలుకుతున్నాయి. ఇదీ దుస్థితి.. జిల్లాకు హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను, గుడ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పట్టణాల్లో వ్యాపారులు ఒక్కొక్క గడ్డు రూ.7 చొప్పున విక్రయిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఒక్కొక్క గుడ్డు ధర రూ.8వరకు పలుకుతోంది. -
విజయేంద్రతీర్థుల ఆరాధనోత్సవాలు
హొళగుంద: మండల కేంద్రంలోని కోట ఆంజనేయస్వామి ఆలయంలో వెలసిన విజయేంద్రతీర్థుల 411వ ఆరాధనోత్సవాలు శుక్రవారం నుంచి స్థానిక అర్చక బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారికి ధ్వజారోహణం, ప్రార్థనోత్సవం, గోపూజ, లక్ష్మీపూజ, శాఖా–ధాన్యోత్సవ పూజ, స్వస్తివాచన, మహామంగళారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు పూర్వరాధన, ఏకాదశి, మధ్యరాధన, ఉత్తరాధన తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. 24న ఉత్తరాధన రోజు స్వామి రథోత్సవం, ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శ్రీపురందరదాసర భజన మండళి, భక్తి భారతి కోటాల మండళి బృందాలతో భజనాలు, కోలాట కార్యక్రమంతో పాటు స్వామి వారికి స్వస్తివాచన, మహా నైవేద్యం తదితర కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని విజయీంద్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు పవనాచారి, రఘునాథాచారి, పాండురంగాచారి, మురళీధరాచారి, వెంకటేశాచారి, రాఘవేంద్రాచారి తెలిపారు. -
శరీరం, మనస్సును సమన్వయం చేస్తుంది
మనసు చెప్పిన మాట శరీరం వినదు. శరీరం చెప్పిన మాట మనసు వినదు. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే యోగా. నేను 14 ఏళ్లుగా ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శరీరం దృఢంగా, మనసు స్థిరంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంది. యోగా మనసుకు శాంతి, శరీరానికి ధృఢత్వం, చిత్తానికి ఓర్పు చేకూర్చే అద్భుత ప్రక్రియ. శరీరంలో మూసుకుపోతున్న ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. శరీరంలో ఎంజైమ్‌లు, హార్మోన్లు ఉత్తేజితం అవుతాయి. బరువును నియంత్రణలో ఉంచుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను, సయాటిక, థైరాయిడ్, కిడ్నీ, లివర్‌కు సంబంధించిన జబ్బులను నివారిస్తుంది. – ఎల్.నరేష్‌గౌడ్, యోగా శిక్షకులు, కర్నూలు -
30 ఏళ్లుగా యోగా శిక్షణ
1982లో నాకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. స్నేహితుల సలహాతో వారం రోజుల పాటు యోగా చేసి తగ్గించుకున్నాను. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో యోగా గురువు సూరిరాఘవ దీక్షితుల వద్ద, అనంతరం కర్ణాటకలోని శివమొగ్గలో ఉన్న రాఘవేంద్ర స్వామీజీ వద్ద 30 రోజుల శిక్షణ పొందాను. 1991లో గుజరాత్, గాంధీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, డిప్లామాలో యోగా చేశాను. కర్నూలులో శ్రీ వాల్మీకి యోగా కేంద్రం ద్వారా 30 ఏళ్లుగా ప్రజలకు యోగాను నేర్పిస్తున్నాను. ఇందులో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఉన్నారు. నా సేవలకు డాక్టరేట్లు, భారత యోగ శిరోమణి, గురుబ్రహ్మ వంటి అవార్డులు దక్కాయి. – బీటీ జయలక్ష్మి, యోగా శిక్షకురాలు, శ్రీ వాల్మీకి యోగా కేంద్రం, కర్నూలు -
పట్టపగలే చోరీ
● 6 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు అపహరణఓర్వకల్లు: మండలంలో గురువారం పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు అందినకాడికి దోచుకెళ్లిన సంఘటన మీదివేముల గ్రామంలో చోటుచేసుకొంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డి వ్యయసాయ పనులు చేస్తుండగా, భార్య కళావతి స్థానిక అంగన్వాడీ కేంద్రం టీచర్‌గా పనిచేస్తోంది. రోజులాగే ఇంటికి తాళం వేసి, వారి కూతురి పిల్లలను పక్కంటి వారి వద్ద వదిలి తమ పనుల నిమిత్తం వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపు పెకిలించి అందులోని 6 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటంతో పొరుగింటి వారితో చెప్పగా వారు ఇంటి యజమానులకు విషయం తెలియజేశారు. వారు ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సునీల్‌కుమార్ గ్రామానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
కూటమి పాలనలో ఒరిగిందేమీ లేదు
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీల అమల్లో ఘోరంగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ విమర్శించారు. శుక్రవారం సీపీఎం కార్యాలయంలో కూటమి ఏడాది పాలనపై సీపీఎం బుక్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అధికారంలోకి రావడం కోసమే రాష్ట్ర ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికే 143 వాగ్ధానాలు చేశారన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌కు కేంద్రం ఇచ్చిన నిధులు తప్పా ఒక్క రూపాయి కేటాయించలేదని, వేదవతి, గుండ్రేవుల రిజర్వాయర్ల ప్రస్తావనే లేదని, హంద్రీనీవా నత్తడనకన సాగుతోందన్నారు. జిల్లా ప్రాజెక్టులు పట్టించుకోకుండా బనకచర్లతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అంటున్నారని, ఇదంతా నాటకమేనని మండిపడ్డారు. రైతులు పండించిన పొగాకును కొనుగోలు చేయలేని, అప్పుడు స్మార్ట్ మీటర్లను వద్దని, ఇప్పుడు బలవంతంగా పెట్టిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.100 కోట్ల ఉపాధి బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. డీఎస్సీలో సగం పోస్టుల్లో కోత పెట్టారని విమర్శించారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇప్పటికై నా ప్రజలకు మేలు చేయాలని సూచించారు.సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. వైన్ షాపులు బార్లలా మారిపోయాయని, రోడ్లపైనే తాగుబోతులు తాగి తూళుతుండడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ, కేవీ నారాయణ, టి.రాముడు, ఓల్డ్ సిటీ కార్యదర్శిరాజశేఖర్ పాల్గొన్నారు. -
నేటి నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్
నంద్యాల(న్యూటౌన్): పాలిసెట్‌లో అర్హత పొందిన విద్యార్థులకు ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ పేర్కొన్నారు. కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలిసెట్ ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, పది మార్క్‌లిస్ట్, 4 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, టీసీ, ఇన్‌కం, మైనార్టీ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఇచ్చిన ఆప్షన్లు జూలై 01 తేదీన మార్చుకోవచ్చన్నారు. అభ్యర్థులకు సీట్ అలాట్మెంట్ 3వ తేదీ ప్రకటిస్తారన్నారు. మరింత సమాచారం కోసం 9912377723 నంబరును సంప్రదించాలన్నారు. ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదల నంద్యాల(న్యూటౌన్): జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను గతేడాది డిసెంబర్ 8వ తేదీన నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల మెరిట్కార్డును ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు వెంటనే బ్యాంక్ ఖాతా తెరిచి ఆధార్‌ను లింక్ చేయించుకొని డీబీటీ ద్వారా డబ్బులు జమ అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు బొమ్మలసత్రం: నేరాల కట్టడికి గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా తెలిపారు. ప్యాపిలిలో కోడి పందేలు నిర్వహిస్తున్నా గుర్తించి నలుగురిపై కేసు నమోదు చేశామని, వారి నుంచి రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే 116 మందిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. మద్యం విక్రయించే వారి నుంచి 94 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎంవీ యాక్ట్ నిభంధనలు పాటించిన 469 మందికి రూ. 2,99,810 జరిమానా విధించామని పేర్కొ న్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన 116 మందిపై కేసు నమోదు చేశామన్నారు. సున్నిపెంట శివారులో చిరుత కలకలం శ్రీశైలం ప్రాజెక్ట్: సున్నిపెంట గ్రామ శివారులోని శ్రీ నీలంపాటి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం చిరుత కలకలం రేపింది. ఆలయం వద్ద కొండముచ్చు కనిపించడంతో అటవీప్రాంతం నుంచి వేగంగా వచ్చిన పులి దాన్ని లాక్కెళ్లినట్లు ఆ ప్రాంతంలో అటవీ ఫలాలు అమ్ముకునే వాళ్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు మదన్, ఠాగూర్ తదితరులు ఆ ప్రాంతానికి చేరుకొని గాలించారు. డ్రోన్‌ను సైతం వినియోగించినా చిరుత జాడా తెలియరాలేదని సమాచారం. -
ఓట్లు అడిగినప్పుడు దళితులని తెలియదా?
ఆదోని టౌన్: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగిన కూటమి నేతలకు అప్పుడు దళితులనే విషయం తెలియలేదా అని దళిత, గిరిజన ఐక్యవేదిక హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక(జేఏసీ) నాయకులు ప్రశ్నించారు. ఢణాపురం సర్పంచ్ చంద్రశేఖర్‌ను కులం పేరుతో అవమానించిన ఎమ్మెల్యే బి.పార్థసారధి, టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు, అక్కడి నుంచి తిరిగి భీమాస్ సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు అజయ్‌బాబు, వీరేష్, దేవదాస్, వై.పి.గంగాధర్, కల్లుబావి నాగేంద్ర, ప్రసాద్, మహిళా నాయకురాళ్లు శ్రీలక్ష్మి, సుజ్ఞానమ్మ తదితరులు మాట్లాడారు. గ్రామ ప్రథమ పౌరుడిని జనం మధ్యలో కులం పేరుతో అవమానించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒకరు క్రిష్టియనా అంటే, మరొకరు ఎస్సీ అని నోరు పారేసుకోవడంతో దళిత సమాజాన్ని అగౌరవపరచడమేనన్నారు. ఓట్ల కోసం దళితుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి కులం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బాధిత సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కులాన్ని ఎత్తి చూపడంతో తాను వేదికపైకి వెళ్లలేకపోయానన్నారు. వందలాది మంది సమక్షంలో తనను కులం పేరుతో అవమానం చేసిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు, ఇస్వీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు అందజేశారు. ఎమ్మెల్యే బి.పార్థసారధి, టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఐక్య వేదిక నాయకులు, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. దళిత సర్పంచ్‌కు అవమానంపై ఆదోనిలో భారీ నిరసన ప్రదర్శన -
దేశంలోనే 5వ స్థానం
28 దఫాలుగా పురుగు మందుల పిచికారీ కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. పురుగు మందుల వినియోగం అధికమవడంతో రైతులకు పెట్టుబడి వ్యయం తడిసి మోపెడవుతోంది. ఇదే సమయంలో మిర్చిలో పురుగు మందుల అవశేషాల కారణంగా ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇకపోతే ఈ కారణంగానే ఎగుమతులు కూడా పడిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల గుంటూరు నుంచి వ్యాపారులు 60 కంటైనర్లలో 900 టన్నుల మిర్చి చైనాకు ఎగుమతి చేశారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో మిర్చిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించి వెనక్కు తీసుకెళ్లాలని చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన మిర్చి ప్రధానంగా గుంటూరు యార్డుకు తరలుతోంది. ధర లేకపోవడంతో 80 శాతం పంటను అక్కడి ఏసీ గోదాముల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో మిర్చి సాగు బాగా కలిసొచ్చింది. 2022–23లో ఉమ్మడి జిల్లాలో 1,29,575 ఎకరాల్లో మిర్చి సాగయింది. ఆ ఏడాది ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. బ్యాడిగ రకాలకు క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.56 వేల వరకు ధర పలికింది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 1,17,868 ఎకరాల్లో మిర్చి సాగయింది. సాగు తగ్గినప్పటికీ చీడపీడలు, వైరస్ తెగుళ్లు, నల్లతామర ప్రభావం తీవ్రంగా ఉండటంతో పురుగుమందుల వినియోగం భారీగా పెరిగింది. 20–25 దఫాలుగా పురుగుమందుల వినియోగం మిర్చి పంట నాట్లు మొదలుకొని చివరి కోత వరకు ఆరు నెలలు ఉంటుంది. ఈ మధ్య కాలంలో 20 నుంచి 25 దఫాలుగా పురుగుమందులు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మంత్రాలయం, పెద్దకడుబూరు, గోనెగండ్ల, కోడుమూరు, దేవనకొండ, హొళగుంద, ఆదోని, సి.బెళగల్, ఓర్వకల్, ఆలూరు, కౌతాళం, కోసిగి మండలాలు.. నంద్యాల జిల్లాలో రుద్రవరం, శిరువెళ్ల, ప్యాపిలి, అవుకు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు తదితర మండలాల్లో మిర్చి సాగవుతోంది. ఒక్కో దఫా పురుగు మందులు పిచికారీ చేయాలంటే ఎకరాకు రూ.3వేల పైనే ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎకరాకు కేవలం పురుగు మందులపైనే రూ.54 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తుండటం గమనార్హం. డీలర్ల ఇష్టారాజ్యం మిర్చి రైతులు పురుగుల నియంత్రణకు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. డీలర్లు అమ్మకాలను పెంచుకునేందుకు రెడ్, ఎల్లో లేబుల్ పురుగుమందులనే అధికంగా అంటగడుతున్నట్లు తెలుస్తొంది. గ్రీన్ లేబుల్ పురుగుమందులు వినియోగించేలా డీలర్లు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ ఆ దిశగా ప్రోత్సహించకపోవడం వల్లే పురుగుమందుల వినియోగం పెరిగిపోతోంది. మిర్చి సహా అన్ని పంటల్లో గ్రీన్ లేబుల్ పురుగుమందులను వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడుకునే వీలుంటుంది. అయితే గ్రీన్ లేబుల్ పురుగుమందుల వినియోగం అతి తక్కువగా అంటే 10–20 శాతం ఉండగా.. రెడ్, ఎల్లో, బ్లూ లేబుల్ పురుగుమందుల వినియోగం 80–90 శాతం వరకు ఉంటోంది. సేంద్రియ ఎరువులతోనే పంటల్లో నాణ్యత రసాయన ఎరువులు మితిమీరి వినియోగిస్తుండటంతో తెగుళ్లు, పురుగుల బెడద పెరుగుతోంది. సేంద్రియ ఎరువులు వినియోగిస్తే తెగుళ్లు, పురుగుల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు పురుగుమందుల వాడకం కూడా తగ్గించుకోవచ్చు. పురుగుమందులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకే వినియోగించాలి. గ్రీన్ లేబుల్ పురుగుమందులను సిఫారసులకు లోబడి వినియోగిస్తే మిర్చిలో నాణ్యత కూడా పెరుగుతుంది. – సుజాతమ్మ, ప్రదాన శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, కర్నూలు మిర్చి తోటలో పురుగుమందు పిచికారీ చేస్తున్న రైతుఉమ్మడి కర్నూలు జిల్లాలో 2023–24తో పోలిస్తే.. 2024–25లో పురుగుమందుల వినియోగం భారీగా పెరిగింది. 2023–24లో 2.92 లక్షల లీటర్ల పురుగుమందులు వినియోగించినట్లు తెలుస్తోంది. 2024–25లో ఏకంగా 3,61,355 లీటర్ల పురుగుమందులు వినియోగించడం గమనార్హం. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగంలో నంద్యాల జిల్లా దేశంలోనే 5వ స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.పెద్దకడుబూరు మండలం బసలదొడ్డి గ్రామం మిర్చి సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ మిర్చి సాగుకు మల్చింగ్ కూడా వినియోగిస్తారు. ఈ గ్రామానికి చెందిన ఒక రైతు గత ఏడాది 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అయితే నల్ల తామర తీవ్రత పెరిగిపోవడం, పంటకు నష్టం తీవ్రత ఎక్కువగా ఉండటంతో నాలుగు రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేశారు. ఒక సీజన్లోనే 28 దఫాలు పురుగు మందులు పిచికారీ చేయడం గమనార్హం. ఇందుకోసం ఎకరాకు రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. -
ఔదార్యం చాటుకున్న ‘తలి’్లకి వందనం
ఉయ్యాలవాడ: పేద కుటుంబమైనప్పటికీ తన బ్యాంకు ఖాతాలో జమైన మరో తల్లికి చెందిన ‘తల్లికి వందనం’ డబ్బును తిరిగిచ్చి ఓ మహిళ ఔదార్యం చాటుకుంది. వివరాలు.. ఉయ్యాలవాడ మండల ప్రజా పరిషత్ పాఠశాల(మెయిన్)లో గ్రామానికి చెందిన కుమారి కుమారుడు శివ సాత్విక్, పావని కుమారుడు పవన్ గౌతమ్ 2వ తరగతి చదువుతున్నారు. ఆ ఇద్దరు పిల్లలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ‘తల్లికి వందనం’ డబ్బులు కుమారి ఖాతాలో రూ.26 వేలు జమ అయ్యాయి. దీంతో తనకు సంబంధం లేని డబ్బులు తనకు వద్దని కుమారి శుక్రవారం పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి సమక్షంలో పావనికి నగదు అందజేశారు. రాజు, కుమారి దంపతుల నిజాయితీని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఆదామ్, మహబూబ్ బాషా, రాజు మెచ్చుకుని వారిని అభినందించారు. -
మా స్కూల్ మాకే ఉంచాలి
జూపాడు బంగ్లా: ‘మా కాలనీలోని స్కూల్‌ను మాకే ఉంచాలి... మరో పాఠశాలలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు...’ అంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండ్లెం గ్రామ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండ్లెం గ్రామ దళితకాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను రెండు కిలోమీటర్ల దూరంలో కేజీ రోడ్డు పక్కన ఉన్న మెయిన్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. దీన్ని రద్దు చేయాలని గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పిల్లలను ఆ బడికి ఎలా పంపాలి? రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
అప్పుడు మినరల్.. ఇప్పుడు జనరల్
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు పేరుతో పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించింది. నీటి సమస్య తలెత్తకుండా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. హెచ్ఎంల నిర్లక్ష్య కారణంగా కొన్ని పాఠశాలల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా వాటర్ ప్లాంట్ల ఏర్పాటుపై ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా విద్యార్థులకు రక్షిత మంచి నీరు అందక కుళాయి నీరే తాగాల్సి వస్తోంది. కే.కొత్తూరు, చిన్నయ్యస్వామి చెంచుగూడెంలలో మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో ఆయా పాఠశాలల విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి కుళాయి నీరు తెచుకుని దాహం తీర్చుకున్నారు. చిన్నయ్య స్వామి చెంచుగూడెంలో నిర్వాహకులు ఓ బిందెలో నీరు ఉంచి రెండు గ్లాసులను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం వాటర్ ప్లాంట్ల ద్వారా రక్షిత మంచి నీటిని సరఫరా చేసి విద్యార్థుల దాహం తీర్చాలని గ్రామస్తులు కోరారు. – రుద్రవరం ● విద్యార్థులకు అందని రక్షిత మంచి నీరు -
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇంతటి ప్రాధన్యం ఉన్న నేత్రాలకు సంబంధించి ఉచిత వైద్యం అందడం లేదు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా అక్కడికి వెళ్లిన రోగులకు నిరాశే మిగులుతోంది. పేద, మ
గత ప్రభుత్వ హయాంలో కంటి పరీక్షలు చేస్తున్న సిబ్బంది (ఫైల్)● ఈ–ఐ కేంద్రాలకు ‘చంద్ర’ గ్రహణం ● పేదలకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లాద్దాల పంపిణీకి మంగళం ● కంటి వెలుగు, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను చాపచుట్టిన కూటమి ప్రభుత్వం ● అప్తాల్మిక్ అసిస్టెంట్లు, డేటా ఆపరేటర్లకు ఉద్వాసన ● అవస్థలు పడుతున్న దృష్టిలోపం ఉన్న బాధితులు ● సమస్య వస్తే ప్రైవేటు వైద్యమే దొర్రిపాడు మండలం క్రిష్టిపాడుకు చెందిన దస్తగిరమ్మ అనే వృద్ధురాలు కళ్లు మసకబారటంతో కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలలోని సీఎం ఈ – ఐ కేంద్రానికి వెళ్లమని గ్రామస్తులు చెప్పారు. ఆమె వైద్యశాలకు చేరుకోగా అక్కడ ఈ–ఐ కేంద్రం మూతవేసి ఉండటంతో పక్కనున్న జనరల్ డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్య చెప్పారు. నంద్యాల వైద్యశాలకు వెళ్లమని సిఫారుసు చేశారు. ఇంటికి వచ్చి విచారించగా ప్రైవేటు వైద్యశాలకు వెళితే కనీసం రూ. 10 వేలకు పైగానే ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత స్థోమత లేక ఇంటి దగ్గరే మసమసక చూపుతో నెట్టుకొస్తున్నాని ఆవేదన చెందుతోంది. చాగలమర్రికి చెందిన సుబ్బమ్మ కూలి పనికి వెళ్లగా ప్రమాదవశాత్తు కంటికి గాయమైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆళ్లగడ్డ ఈ–ఐ కేంద్రానికి తీసుకు వచ్చారు. ఇక్కడ వైద్య సేవలు నిలిచి పోయాయని ప్రైవేటు ఆసుపత్రికి పోవాలని అక్కడున్న వారు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే వైద్య పరీక్షలు నిర్వహించి కొన్ని మందులు ఇచ్చి రూ. 1,600 తీసుకున్నారు. దీంతో పాటు కంటి అద్దాలు రాసి ఇవ్వగా రూ. 1,500 అయ్యింది. మొత్తం రూ. 3 వేలకు పైగా అయిందని మళ్లీ వారానికి ఒక రోజు వచ్చి చూపించుకుని వెళ్లాలని సూచించారు.గతంలో ఇలా.. 60 ఏళ్లులోపు వారికి రేషన్ కార్డు అవసరం లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఈ–ఐ కేంద్రాల్లో కంటి వైద్య పరీక్షలు చేసేవారు. దృష్టిలోపం ఉన్న వారికి ఖరీదైన ఫైబర్ కళ్ల అద్దాలు అందజేసేవారు. ఇందులో లబ్ధిదారుడు అతనికి ఇష్టమైన కలర్, సైజ్ ఎంచుకునే అవకాశం కూడా ఉండేది. ప్రభుత్వ సెలవు రోజుల్లో తప్ప అన్ని పనిదినాల్లో సేవలు కొనసాగించేవారు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సైతం పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలను అక్కడికే పంపించేవారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఎన్జీవోల ఆధ్వర్యంలో ఉచితంగా నాణ్యమైన ఆపరేషన్లు చేయించేవారు. ఇవే కాకుండా మల్టీ విటమిన్ మాత్రలు, చుక్కల మందు (ఐ–డ్రాప్స్)లు ఉచితంగా అందించేవారు. ఈ సేవలన్నిటినికీ కూటమి ప్రభుత్వం చాపచుట్టేసింది. ఈ రెండు ఉదాహరణలు మాత్రమే.. కంటి సమస్యలకు సంబంధించి సీఎం ఈ– ఐ కేంద్రాలకు జిల్లా వ్యాప్తంగా రోజూ వెళ్తున్న వేలాది మందికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఆళ్లగడ్డ: కంటి సమస్యలతో బాధపడే పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు గత వైఎస్సార్పీ ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసింది. ఆధునిక యంత్రాలతో ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్ల జోడు సైతం అందజేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘వైఎస్సార్ కంటి వెలుగు’ను ఆపేశారు. సీహెచ్‌సీల్లోని ఈ–ఐ కేంద్రాల కాంట్రాక్ట్ గడువు ముగిసి 10 నెలలుగా సేవలు నిలిచి పోయినా పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 10 ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ – ఐ కేంద్రాలను మూసేశారు. దీంతో పేదలు కంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. సీహెచ్‌సీల్లో ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాల నిర్వహణతో పాటు వృద్ధులు, వికలాంగులు, విద్యార్థుల కోసం గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్సార్ కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించారు. సేవలకు ఆటంకం కలుగకుండా కాంట్రాక్ట్ సంస్థతో ఎప్పటికప్పుడు ఎంఓయూ గడువు రెన్యువల్ చేస్తూ వచ్చారు. ఈ ఐ కేంద్రాలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మొత్తంగా 3.60 లక్షల మందికి రిఫ్రాక్షన్ చెక్స్, ఫండస్ చెక్స్, డీఆర్, గ్లకోమా, మాక్యులర్ డిజనరేషన్, కాటరాక్ట్, హైపర్టెన్సివ్ రెటినోపతి తదితర కంటి పరీక్షలు నిర్వహించింది. ఆయా రోగాలకు సంబంధిత వైద్యసేవలు, అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సుమారు 1,80,118 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 100 మందికి పైగా రోగులు చుట్టపక్కల గ్రామాల నుంచి వచ్చి కార్పోరేట్ కంటి వైద్యసేవలు ఉచితంగా పొందేవారు. అత్యాధునిక పరికరాలు ఈ–ఐ కేంద్రంలో అత్యాధునికమైన రూ. 8 లక్షల విలువ చేసే ఆటోరిఫ్లెక్షన్, రెటీన పరీక్షల యంత్రాలు, ఇతర పరికరాలతో కంటి రెటీన పరీక్షలు చేసేవారు. నివేదికలు అపోలో ఆసుపత్రి నిపుణులకు పంపించేవారు. వారి సూచనలు, సలహాలతో వైద్యం అందించేవారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా ముందుగానే గుర్తించడంతో పాటు నివారణ చర్యలను వైదయ నిపుణులు సూచించేవారు. 60 ఏళ్లలోపు వారందరికీ శుక్ల దృష్టి లోపం వంటి వివిధ కంటి వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసేవారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఖరీదైన పండఢస్ రెటినో పరీక్షలు చేసి ఫలితాలను ఆయా ఈ–ఐ కేంద్రాల్లో తెలియజేసేవారు. ప్రస్తుతం ఈ సేవలకు మంగళం పాడారు. ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలకు తాళాలు వేయడంతో వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయోమయంలో సిబ్బంది ఈ–ఐ కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు కేంద్రానికి ఇద్దరిని చొప్పున జిల్లాలోని 10 కేంద్రాల్లో 20 మంది ప్రైవేటు ఏజెన్సీ ద్వార నియమించారు. అయితే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ–ఐ కేంద్రాలను మూసి వేయడంతో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఎక్విప్మెంట్ అసిస్టెంట్లు పరిస్థితి అయోమయంగా మారింది. ‘ఇంతకు మనం విధుల్లో ఉన్నామా లేక తొలగించారా’ అని వారికి వారే ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఇదీ దుస్థితికంటి సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వచ్చే వారికి ఆధార్ కార్డు ఆధారంగా ఓపీ రాసేవారు. అందులో ఒక ఐడీని క్రియేట్ చేసి ఉచితంగా కంటి పరీక్షలు చేసేవారు. పరీక్షల ఆధారంగా అవసరమైన మందులు ఉచితంగా అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సేవలను నిలిపివేసింది. దీంతో ఇదే పరీక్షలు ప్రైవేటు వైద్యశాల్లో అయితే రూ. 10 నుంచి రూ. 20 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అదీ నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు తదితర పట్టణాల్లో ఉండే ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. -
ఆదోని ఎమ్మెల్యేపై ఫిర్యాదు
ఆస్పరి: ఆదోని మండలం ఢణాపురం గ్రామానికి చెందిన దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ, మరి కొందరు అగ్రవర్ణాల వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆస్పరి గ్రామానికి చెందిన మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రాన్ని మహిళా కానిస్టేబుల్ లావణ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మూలింటి చంద్రశేఖర్ మాట్లాడతూ ఈనెల 17వ తేదీన ఢణాపురం గ్రామానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ వెళ్లి గ్రామంలోని ఆంజినేయ స్వామి గుడి కట్టపై సమావేశం నిర్వహించారు. అయితే సర్పంచ్ చంద్రశేఖర్ దళితుడని తెలుసుకున్న ఎమ్మెల్యే కట్టపైకి పిలవకుండా అమానించారని అవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సమక్షంలోనే దళిత ప్రజాప్రతినిధులకు అన్యాయం జరిగిందన్నారు. దళిత సర్పంచ్‌ను అమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆస్పరి, చిగిళి, తొగలుగల్లు, బిల్లేకల్లు, అట్టెకల్లు , తంగరడోణ గ్రామాలకు చెందిన దళితులు పాల్గొన్నారు. -
నాటుసారా స్థావరంపై ఎకై ్సజ్ దాడులు
కర్నూలు: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎకై ్సజ్ పోలీసులు కల్లూరు మండలం కొల్లంపల్లి తండా శివారులోని నాటుసారా స్థావరంపై దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేశారు. కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్ తన సిబ్బంది చంద్రపాల్, రాజు, రామలింగయ్య, మధు, ఈరన్న తదితరులతో కలసి బుధవారం ఉదయం నాటుసారా స్థావరంపై దాడి చేసి సుమారు సారా తయారీకి ఉపయోగించే వెయ్యి లీటర్ల బెల్లం ఊటతో పాటు 30 లీటర్ల నాటుసారాను నేలపాలు చేశారు. అదే గ్రామానికి చెందిన లోకేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు సారా బట్టీలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని, వారిపై కేసు నమోదు చేసి త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో అవగాహన సభ నిర్వహించారు. నాటుసారా తయారీ, రవాణా విక్రయాలు జరపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నాటుసారా తయారీ మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధి ద్వారా జీవనం సాగించాలన్నారు. నాటుసారాను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. -
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి
మంత్రాలయం: యోగాతోనే ఆరోగ్యం సాధ్యమని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం రాఘవేంద్రస్వామి మఠం ముంగిట మధ్వ కారిడార్‌లో యోగా చేపట్టారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలో యోగాంధ్రను నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ యోగా ప్రతి మానవుడి జీవితంలో భాగం కావాలని కోరారు. యోగాతో ఆరోగ్య రీత్యా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ యోగా పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా భరతనాట్య ప్రదర్శన, యోగా ఆసనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
సికిల్‌సెల్‌తో చిక్కిశల్యం
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్ర రక్త కణాలు గుండ్రటి ఆకారంలో ఉంటాయి. కానీ సికిల్‌సెల్ వ్యాధి వచ్చిన వారిలో మాత్రం ఇవి కొడవలి ఆకారంలో ఉంటాయి. ఇవి శరీరమంతా వ్యాపించి పలు అనారోగ్యాలకు దారి తీసేలా చేస్తుంటాయి. పుట్టుకతోనే సోకే ఈ వ్యాధి జీవితాంతం వారిని వేధిస్తుంది. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్నారులు ఈ వ్యాధి కారణంగా ఏ పనీ చేతగాక నిస్సత్తువతో ఒకేచోట కుప్పకూలిపోతుంటారు. సమాజంలో అరుదైన ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 19న జాతీయ సికిల్‌సెల్ వ్యాధి అవగాహన దినం నిర్వహిస్తున్నారు. ఎర్ర రక్తకణాలు గుండ్రంగా ఉండి మనిషి శరీరమంతా ప్రయాణించి వివిధ అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. కాగా కొంత మందిలో ఈ కణాలు కొడవలి ఆకారంలోకి మార్పు చెంది ఉంటాయి. దీనినే సికిల్‌సెల్ వ్యాధిగా వైద్యులు పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్న వారి రక్త కణంలోని ఒక జన్యువు సికిల్సెల్గా, మరొకటి మామూలుగా ఉంటే అలాంటి వారిని సికిల్‌సెల్ క్యారియర్లు ఉంటారు. వీరికి మామూలుగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతులు ఇద్దరికీ ఇలాంటి లక్షణాలు ఉంటే వారికి జన్మించే పిల్లలకు రక్త కణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. అలాంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణ రక్తకణాల జీవిత కాలం 120 రోజులైతే సికిల్‌సెల్ రక్తకణాల జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. ఇవి నశించి పోయేంత వేగంగా కొత్త ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. అంతేగాక సికిల్ రక్తకణాలు వంపు తిరిగి ఉండటం వల్ల సన్నటి రక్తనాళాల్లో సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్ అందడం తగ్గిపోతుంది. ఈ కారణంగా ఈ వ్యాధిగ్రస్తులు తగిన చికిత్స తీసుకోకపోతే 15 ఏళ్లలోపే మరణించే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు 40 మందికి పైగా ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన వ్యాధి ఉన్న వారికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి నెలా రూ.10 వేల ప్రత్యేక పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష ఈ వ్యాధి నిర్ధారణకు ప్రాథమిక రక్త పరీక్ష ఖరీదు తక్కువలోనే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటాబైసల్ఫేట్‌లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు గుండ్రంగా ఉన్నాయా? వంపు తిరిగి ఉన్నాయా తెలుసుకోవచ్చు. తద్వారా ఆ వ్యక్తికి సికిల్‌సెల్ వ్యాధి ఉందో లేదో నిర్ధారిస్తారు. జన్యుపరమైన ఈ వ్యాధికి ఇప్పటివరకు మందు లేదు. సికిల్‌సెల్ క్యారియర్లుగా గుర్తించి, వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగకుండా నియంత్రించవచ్చు. గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రుల్లో ఇద్దరికీ సికిల్‌సెల్ వ్యాధి ఉంటే వారికి పుట్టబోయే శిశువుకు సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గర్భం దాల్చక ముందే పుట్టబోయే శిశువుకు ఈ వ్యాధి రాకుండా తల్లికి ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తాం. గర్భం దాల్చిన తర్వాత వస్తే బిడ్డకు వచ్చే అవకాశం ఉందా, లేదా అని తెలుసుకోవడానికి ఉమ్మనీరును పరీక్షకు పంపిస్తాం. ప్రసవం తర్వాత అయితే బిడ్డ కు పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తాం. ఈ వ్యాధి ఉంటే అవసరమైన చికిత్స అందిస్తాం. గర్భిణిగా ఉన్నప్పుడు సికిల్‌సెల్ ఉంటే నెలలు నిండకుముందే బిడ్డ జన్మించే అవకాశం ఉంది. దీనివల్ల శిశువు బరువు తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. –డాక్టర్ టి.జ్యోత్స్న, గైనకాలజిస్టు, కర్నూలు చిన్నారుల్లో అరుదైన రక్తవ్యాధి పలు రకాల అనారోగ్య ఇబ్బందులు పెన్షన్‌తో ఆదుకున్న గత ప్రభుత్వం నేడు జాతీయ సికిల్‌సెల్ వ్యాధి అవగాహన దినం వ్యాధి లక్షణాలు †దీర్ఘకాలం పాటు కామెర్లు ఉంటాయి †రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం, కాళ్లు, చేతి వేళ్లు వాపుతో వంపు తిరిగి ఉండటం, ప్లీహం వాచిపోయి ఉండటం, నీరసం, తిమ్మిర్లు, డార్క్ ఐస్, చర్మం ముడ తలు పడటం వంటి లక్షణాలు ఉంటాయి † శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. వయస్సు పెరిగే కొద్దీ లక్షణాలు కనిపిస్తాయి. † ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడంతో శరీరంలో ఏదైనా ఒక భాగంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. † కౌమార దశలో ఉన్నవారు, పెద్దవారు దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతూ ఉంటారు. -
హామీల అమలులో ‘కూటమి’ విఫలం
కొలిమిగుండ్ల: సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులతో కలిసి బుధవారం ‘జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ అనే వెన్నుపోటు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి సేవలు అందించాల్సింది పోయి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం, ఆస్తులను ధ్వంసం చేయడం పనిగా పెట్టుకున్నారన్నారు. ఏడాది పాలనలోనే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిందన్నారు. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రజలకు ఏదైనా చెప్పాడంటే చేస్తాడనే చేస్తాడనే నమ్మకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుపుకున్నారన్నారు. చంద్రబాబు మాత్రం చెప్పింది చేయడని మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. విద్య, వైద్యరంగాలతో పాటు వ్యవసాయం పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఏడాది కూటమి పాలనను ప్రజలు చాలా స్పష్టంగా గమనించారన్నారు. నాయకులు పేరం సత్యనారాయణరెడ్డి,రామసుబ్బయ్య,కామిని గోపాల్‌రెడ్డి, కంబయ్య, గోపాల్‌రెడ్డి, సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి -
తరగతుల విలీనంపై తల్లుల ఆందోళన
మంత్రాలయం రూరల్: ‘నిన్నటి వరకు మా పిల్లలు అక్కడే అక్షరాలు దిద్దారు. ఇప్పుడేమో ఆ పాఠశాలకు రావొద్దు అంటూ తిప్పి పంపుతున్నారు. దూరంగా ఉన్న పాఠశాలకు ఎలా పంపేది. కూలీ పనులకు చేసుకునే మేము పిల్లలను ఎలా చదివించుకోవాలి’ అంటూ విద్యార్థుల తల్లులు ఆందోళనకు దిగారు. పాఠశాల విలీనాన్ని రద్దు చేయాలని స్థానిక రామచంద్ర నగర్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లులు బుధవారం నిరసన తెలిపారు. ఈ పాఠశాలలో 80 మంది వరకు చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. టీచర్లను నియమించాల్సిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కేవలం ఒక్క టీచర్ మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాఠశాలలోని 3 నుంచి 5 తరగతులను పాతూరులోని పాఠశాలకు మార్చారు. రోజూ తల్లిదండ్రులు రామచంద్ర నగర్ పాఠశాలకు పిల్లలను పంపుతున్నారు. అయితే ఇక్కడకు వచ్చిన విద్యార్థులను ఆ పాఠశాలకు తరలించడంపై పిల్లల తల్లులు బుధవారం రోడ్డెక్కారు. పాతూరు పాఠశాలకు తమ పిల్లలను పంపమంటూ ఆందోళనకు దిగారు. తమ పిల్లలను దూరంలో ఉన్న పాతూరు పాఠశాలకు పంపాలంటే రోడ్ల రద్దీతోపాటు, వాహనాల బెడద ఎక్కువగా ఉంటుందని వారు వాపోయారు. తమ పిల్లలకు 5వ తరగతి వరకు ఇక్కడే చదువులు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా కూటమి నేతలు సైతం ఆందోళనలో దర్శనమివ్వడం విశేషం. -
రేపటి నుంచి విజయీంద్రతీర్థుల ఆరాధనోత్సవాలు
హొళగుంద: స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీ విజయీంద్ర తీర్థుల 411వ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 20వ తేదీన గురువారం ధ్వజారోహణ, ప్రార్థనోత్సవం, గోపూజ, లక్ష్మపూజ, 21న పూర్వరాధన, 22న ఏకాదశి పూ జలు, 23న మధ్యారాధన, 24న ఉత్తరాధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేరోజు శ్రీపురందరదాసర భజన మండలి, భక్తి భారతి కోలాటా ల మండలి బృందాలతో భజనలతో రథోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శ్రీమఠం పీఠాధిపతికి ఆహ్వానం విజయీంద్ర తీర్థుల 411వ ఆరాధన మహోత్సవాలకు మంత్రాలయంలోని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులను బుధవారం ఆహ్వానించారు. ఉత్సవ నిర్వాహకులు, విజయీంద్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు పవనాచారి, రఘునాథాచారి, పాండురంగాచారి, మురళిధరాచారి, వెంకటేశాచారి, రాఘవేంద్రాచారి ఆహ్వాన పత్రికను అందించారు. -
బైక్‌ల దొంగ దొరికాడు
● జల్సాలకు అలవాటు పడి అడ్డదారి ● ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ ● సీసీ ఫుటేజీ ద్వారా కేసును ఛేదించిన గోనెగండ్ల పోలీసులు ● 30 బైక్‌లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. కూలీ పనుల వల్ల వచ్చే ఆదాయం సరిపోలేదు. దీంతో సులువుగా డబ్బు సంపాదించే మార్గంగా బైక్‌ల చోరీని ఎంచుకున్నాడు. బైక్‌లను అపహరించడం రూ. నాలుగైదు వేలకు అమ్మేయడం వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తూ వచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా వేసి దొంగను పట్టుకుని కటకటాలకు పంపారు. గోనెగండ్ల మండలం చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ఇళ్లముందు, బస్టాండ్లలో పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను అపహరించాడు. నకిలీ తాళాల సహాయంతో అపహరించి స్వగ్రామంలోని పాత ఇంట్లో దాచిపెట్టి కొన్నాళ్ల తర్వాత వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. కర్నూలు, ఎమ్మిగనూరు, గోనెగండ్ల ప్రాంతాల్లో వాహనదారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసుకున్న గోనెగండ్ల పోలీసులు సీఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడు కురువ వెంకటేష్‌గా గుర్తించారు. పెద్దమర్రివీడు గ్రామ రోడ్డులోని సుంకులమ్మ గుడి వద్ద ఉన్నట్లు గుర్తించి బుధవారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రం కర్నూలుకు తీసుకువచ్చి ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ ఉపేంద్ర బాబు, గోనెగండ్ల సీఐ విజయభాస్కర్‌తో కలసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బస్టాండ్లు, ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్‌గా చేసుకుని కురువ వెంకటేష్ చోరీలకు పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. కర్నూలు, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, దేవనకొండ, కోడుమూ రు, ఓర్వకల్లు ప్రాంతాల్లో ఇతను 30 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు విచారణలో అంగీకరించాడన్నారు. బైక్ చాసీ నెంబర్ ద్వారా గుర్తించి వాటిని యజమానులకు అప్పగించనున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు బైక్ దొంగలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నా రు. చోరీ చేసిన బైకులను జొన్నగిరి ప్రాంతాల్లో పొలాల పనులు చేసుకునే రైతులకు ఒక్కొక్కటి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అమ్మేశాడని ఎస్పీ వెల్లడించారు. వాహన తనిఖీల్లో కూడా దొంగలించిన వాహనాలు బయటపడ్డాయని వెల్లడించారు. సిబ్బందికి నగదు రివార్డులు... ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడంతో ప్రతిభను కనపరచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ నగదు రివార్డులతో అభినందించారు. గోనెగండ్ల సీఐ విజయభాస్కర్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు తేజేశ్వర్ కుమార్, దేవరాజు, కానిస్టేబుళ్లు లక్ష్మీకాంత్, వై.రాజు, వీరేష్ గౌడు, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, రమేష్ తదితరులను ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు.జిల్లాలో 5 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు... కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్), ఎంపీ నిధుల నుంచి జిల్లా వ్యాప్తంగా 5 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాల్లో కూడా సీఎస్ఆర్, ఎంపీ, మున్సిపల్ నిధులతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నిరోధించడమే కాక వాటిని ఛేదించేందుకు కూడా ఉపయోగపడతాయన్నారు. మూడున్నర నెలల వ్యవధిలోనే 5 వేల సీసీ కెమెరాలు ప్రజల సహకారంతోనే ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల సహాయంతోనే ద్విచక్ర వాహన దొంగను గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లలో ఏపీకే ఫైల్స్ వస్తే వాటిని క్లిక్ చేయకూడదని, ఓపెన్ చేయకూడదన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కూడా తన పాత్ర పోషించాలన్నారు. -
నల్లమలలో వజ్రాల వేట
శిరివెళ్ల: తొలకరి పలకరించడంతో ప్రజలు పొలం బాట పట్టకుండా వజ్రాల వేట కోసం నల్లమల అడవికి వెళ్తున్నారు. నంద్యాల–గిద్దలూరు రహదారి మధ్య గాజులపల్లె సమీప ప్రాంతంలో సర్వ నారసింహస్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా తొలకరి చినుకుల అనంతరం వజ్రాల వేట సాగుతుంది. ఈ ఏడాడి కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇక్కడికి వచ్చారు. సర్వ నారసింహస్వామి ఆలయ సమీపంలోని వక్కిలేరు వాగు వెంట గుంతలు తీసి వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఎక్కువగా చెకుముకి రాయి తరహాలో తెల్లగా ఉండే చిన్న చిన్న రాళ్లు దొరుకుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. స్థానికులే కాకుండా ప్రకాశం జిల్లా వాసులు ఇక్కడికి వస్తున్నారు. రోజంతా వెదికి రాత్రికి తెలుగు గంగ కాల్వ వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద నిద్రిస్తున్నారు. రైతులు చెల్లించిన రుణాలు స్వాహా ● నాగంపల్లి సొసైటీ సీఈఓ సస్పెన్షన్! కొత్తపల్లి: రైతులు చెల్లించిన రుణాలు రూ.40 లక్షల వరకు స్వాహా చేసినట్లు నాగంపల్లి సొసైటీలో పనిచేస్తున్న సీఈఓ కుమ్మరి కోటేశ్వరయ్యపై ఆరోపణలు వచ్చాయి. వసూలు చేసిన రుణాల మొత్తానికి మాన్యువల్‌గా రశీదులు ఇచ్చి ఆన్లైన్ పేమెంట్‌లో మాత్రం కొంత డబ్బు చెల్లించి తనచేతివాటం చూపించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు మార్చినెల నుంచి అతను విధులకు హాజరు కావడం లేదు. అధికారులు ఫోన్లు చేస్తే స్పందించడం లేదు. దీంతో ఆత్మకూరు పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ రసూల్.. ఈనెల 10న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు ఈనెల 11న విచారణ చేయగా ఆ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. విచారణ జరుగుతుండగానే సీఈఓ కోటేశ్వరయ్య నుంచి అధికారులు రూ.10 లక్షలు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అతనిపై కొత్తపల్లి, ఆత్మకూరు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మేనేజర్ మహమ్మద్ రసూల్ మాట్లాడుతూ.. నాగంపల్లి సొసైటీ సీఈఓ కొటేశ్వరయ్యపై విచారణ జరుగుతోందన్నారు. అతనని 12న విధుల నుంచి సస్పెండ్ చేశామని, పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు కసరత్తు కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఈ నెల 9తో పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు కసరత్తు ప్రారంభమైంది. ఈ నెల 30లోగా ఈ పక్రియను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు, ఎంపీడీఓలు కార్యాచరణను రూపొందిస్తున్నారు. కాగా కర్నూలు జిల్లాలో 672 గ్రామ/వార్డు సచివాలయాల్లో 4,256 మంది, నంద్యాల జిల్లాలో 516 గ్రామ/వార్డు సచివాలయాల్లో 3,810 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన బదిలీల్లో ఆయా కేటగిరీలకు చెందిన మెజారిటీ ఉద్యోగులు బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందిన సమాచారం మేరకు గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు 194, గ్రేడ్–6 కార్యదర్శులు(డిజిటల్ అసిస్టెంట్లు ) 371 మంది ఉన్నారు. వీరిలో గ్రేడ్ –5 కార్యదర్శులు 153 మంది, గ్రేడ్ –6 కార్యదర్శులు 102 మంది గత ఏడాది బదిలీ అయ్యారు. ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిలో గ్రేడ్–5 కార్యదర్శులు 27 మంది, గ్రేడ్–6 కార్యదర్శులు 206 మంది ఉన్నారు. రేషనలైజేషన్‌లో భాగంగా మండలాల పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఖాళీల వివరాలను సంబంధిత ఎంపీడీఓలు హెచ్ఆర్ఎంఎస్ లాగిన్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే బదిలీలకు అర్హత ఉన్న వారు ఈ నెల 22వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోనున్నారు. కేజీబీవీల్లో బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఆవుట్ సోర్సింగ్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు రిక్వెస్ట్, మ్యుచువల్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చునని డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ ఎస్.శామ్యూల్ పాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(సెంట్రల్): అన్ని కోర్టుల్లో జూలై 5న జాతీయలోక్ అదాలత్ నిర్వహించాలని, అందులో ఎక్కువ కేసులు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మర్/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్‌లో జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌పై ఇన్సూరెన్స్, న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు, మునిసిపల్, భూసేకరణాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్ ఉన్న రాజీ కాదగిన కంపౌండబుల్ క్రిమినల్, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాదాలు, సివిల్, భూసేకరణ కేసులను త్వరగా పరిష్కరించేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులను పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ అజయ్‌కుమార్, కర్నూలు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
శభాష్... ప్రవల్లిక..!
నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలిమెట్టలోని ఏపీ మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. పదోతరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలో ‘రైతు.. పోస్టుమాన్’ పాఠం చెప్పారు. అనంతరం పలు ప్రశ్నలు సంధించగా, విద్యార్థుల నుంచి మౌనమే సమాధానమైంది. అయితే కొండజుటూరు గ్రామానికి చెందిన సిద్ధం ప్రవల్లిక కలెక్టర్ ప్రశ్నలకు చకచకా జవాబు చెప్పింది. ఇలా పాఠం పూర్తయ్యేంత వరకు పదేపదే కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు ప్రవల్లిక సమాధానం చెబుతూ శభాష్ అనిపించుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో ప్రవల్లికను కలెక్టర్ ప్రత్యేకంగా పిలిచి స్వయంగా భోజనం తినిపించడం విశేషం. దీంతో ప్రవల్లికను ఉపాధ్యాయులు, సిబ్బంది, సాటి విద్యార్థులు అభినందించారు. -
వైద్య శాఖలో బదిలీలు షురూ!
● జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి క్యాడర్ల వారీగా కొనసాగుతున్న బదిలీలు ● జూమ్ ద్వారా నిర్వహించడంతో సాంకేతిక లోపాలు గోస్పాడు: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి క్యాడర్ల వారీగా బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పక్రియ ఈనెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. జూమ్ మీటింగ్ ద్వారా ఉన్నతాధికారులు వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రి య ప్రారంభించారు. అయితే జూమ్ ద్వారా బదిలీ ప్రక్రియ నిర్వహిస్తుండడంతో పలుచోట్ల సిగ్నల్స్ అందక పోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికి అక్కడ ఆన్లైన్లో జూమ్ ద్వారా వైద్య ఉద్యోగులు బదిలీలను చూసుకోవాల్సి ఉన్నా జిల్లా కేంద్రానికి పరుగులు తీశారు. జిల్లా క్యాడర్లో జూనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎల్డీ కంప్యూటర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, క్లాస్ –4 తో పాటు పలువురు ఆ విభాగంలో 57 మంది, జోనల్ విభాగంలో వీడియో గ్రాఫర్, హెల్త్ ఎడ్యుకేటర్, స్టాఫ్ నర్స్, ఫార్మసీ ఆఫీసర్‌తో పాటు పలు విభాగాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న 19 మందితో పాటు మరో 42 మంది రిక్వెస్ట్‌పై బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఇదిలా ఉండగా 18న జరిగే బదిలీలకు జోనల్ విభాగంలో ఎంపీహెచ్ఈఓ, ఎంపీహెచ్ఎస్ (ఫిమేల్), పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్ (ఎం), సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లతో పాటు పలువురు ఐదేళ్లు పూర్తి చేసుకున్న 58 మంది, రిక్వెస్ట్‌పై మరో 16 మంది బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రస్థాయి క్యాడర్లో వైద్యులు ఐదేళ్లు పూర్తయిన వారు ఆరుగురు, రిక్వెస్ట్‌పై మరో 12 మంది డాక్టర్లు, సీహెచ్ఓ (ఎం)2, సీహెచ్ఓ (ఫిమేల్) రిక్వెస్ట్‌పై ఒకరు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. -
కోటా కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్నప్పుడు కోతలు విధిస్తున్నారంటే అర్థం ఉంది. అలాంటిది కోటా కంటే తక్కువగానే విద్యుత్ వినియోగం ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం 4 గంటల పాటు అనధికార కోతలు విధిస్తుండటం గమనార్హం.
వ్యవసాయ విద్యుత్ అస్తవ్యస్తం బోరు కింద మూడు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ అస్తవ్యస్తంగా ఉంది. త్రీఫేజ్ విద్యుత్ ఇచ్చినట్లే ఇచ్చి తరచూ నిలిపేస్తున్నారు. ఇలా నిలిపేస్తుండటంతో 2 గంటల వరకు విద్యుత్ వృథా అవుతోంది. తొమ్మిది గంటలు ఇస్తున్నామని చెబుతున్నా రెండు, మూడుసార్లు నిలిపేస్తుండటంతో వ్యవసాయ పనులు సాగని పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే కొత్తది పెట్టడానికి ఐదారు రోజులవుతోంది. – ఊలూరు మల్లయ్య, హొళగుంద అనధికార విద్యుత్ కోతలతో అవస్థలు ప్రతిరోజూ రెండు మూడు గంటల చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గాలులు వీచినా, వర్షాలు కురుస్తాయనుకున్న సమయంలో విద్యుత్ కోతలు మరింత అధికం. పవర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆఫీసులకు ఫోన్ కాల్స్ చేసి విసిగిపోవాల్సిందే. అసలే వర్షాకాలం, ఆపై విద్యుత్ కోతలతో చిన్న పిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతం. – బషీర్, మూలసాగరం, నంద్యాల -
సాంకేతిక విద్యపై దృష్టి సారించాలి
పాణ్యం: సాంకేతిక విద్యపై దృష్టి సారిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా విద్యార్థులకు సూచించారు. మంగళవారం పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఏపీ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, నెలకొన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అర గంట పాటు ఉపాధ్యాయురాలిగా మారిపోయి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించారు. చాక్‌పీస్ చేతబట్టి బోర్డు రాసి క్లుప్తంగా వివరించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి ఉత్సాహ పరిచారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. భోజనం రుచి చూసి విద్యార్థుల అభి ప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివి పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రహరీ నిర్మాణం, రోడ్డు సౌకర్యం, బస్సు పాఠశాల వద్దకు చేరుకునేలా చొరవ చూపుతానని హామీ ఇచ్చా రు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ దినేష్‌కుమార్, వైస్ ప్రిన్సిపా ల్ భారతి, ఎంఈఓ కోటయ్యను ఆదేశించారు. -
కూటమి మోసం.. కార్మికులకు ఎగనామం
● పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ● గత వైఎస్సార్సీపీ హయాంలో అమ్మఒడి వర్తింపు ● కూటమి ప్రభుత్వ తీరుపై కార్మికుల ఆగ్రహం ● సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ నంద్యాల(న్యూటౌన్): ఎన్నికలకు ముందు అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తాం.. సూపర్ సిక్స్‌తో ఆర్థిక స్థితిగతులను మెరుగు పరుస్తామంటూ చెప్పిన కూటమి నేతలు చివరకు పేదలను మోసం చేశారు. పారిశుధ్ధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదట్లో మున్సిపల్ కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు కాలేదు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్‌రెడ్డి రేషన్ కార్డులను మంజూరు చేయించడంతో పాటు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీ కార్మికులకు పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకున్నారు. ఏటా అమ్మఒడితో పాటు వివిధ పథకాలకు కార్మికులు అర్హత సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వంలో మొదటి ఏడాది తల్లికి వందనం అమలు చేయలేదు. ఏడాది దాటిన తర్వాత ఒక్కొక్కరికి రూ. 2వేలు కోత పెట్టి రూ.13 వేలు జమ చేసింది. అయితే అందులో నగరపాలక సంస్థ కార్మికులను పక్కన పెట్టింది. నంద్యాల మున్సిపాటీలో మొత్తం 500 మంది (అప్కాస్)కార్మికులు ఉన్నారు. కాగా వీరికి తల్లికి వందనం వర్తింపజేయలేదు. దీంతో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో పథకాలు అందేవని గుర్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.సంక్షేమ పథకాలకు అర్హత కల్పించండి ప్రజారోగ్యం కోసం పాటుపడే కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు గౌస్, లక్ష్మణ్, భాస్కరాచారి, మల్లికార్జున, తదితరులు కమిషనర్ శేషన్నకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కలెక్టర్ రాజకుమారిని కలసి సమస్యను విన్నవించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కార్మికులు పని చేశారని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తల్లికి వందనం వర్తింపజేశారన్నారు. సూపర్ సిక్స్‌తో జీవితాలను మార్చేస్తామని చెప్పి ఈరోజు పారిశుధ్ధ్య కార్మికులకు కోత విధించడం సరికాదన్నారు. తక్షణం అన్ని పథకాలకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అనర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. -
మా పాఠశాలను రద్దు చేయొద్దు
చాగలమర్రి: దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పెద్దవంగలి ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుండటంతో కాలనీ వాసులు ఆందోళన బాటపట్టారు. పాఠశాలలో 10 మంది విద్యార్థులుండగా వారిలో నలుగురిని ప్రధాన పాఠశాలకు బదిలీ చేయగా, మరో నలుగురు ఇతర ప్రైవేటు పాఠశాలలో చేరారు. దీంతో ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాఠశాలలో మిగిలారు. పాఠశాల రద్దు చేస్తున్నారని తెలుసుకున్న ఎస్ఎంసీ చైర్మన్ సతీష్, కాలనీవాసులు స్టిఫెన్బాబు, అనిల్ కుమార్, దాన మ్మ తదితరులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడు సుబ్బయ్యను అడిగి ఆరా తీశారు. పాఠశాలను రద్దు చేస్తే ఆందోళన చేస్తామన్నారు. కాగా ఈ విషయంప ఎంఈఓ అనురాధను వివరణ కోరగా.. అంగన్వాడీ పాఠశాలతో కలిపి ఫౌండేషన్ పాఠశాల మార్పు చేసి 1, 2 తరుగతులు కొనసాగుతాయన్నారు. ఓటరు జాబితా తయారీలో భాగస్వాములుకండి ఆళ్లగడ్డ: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కీలకమని నంద్యాల ఆర్డీఓ విశ్వనాఽథ్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఓటరు నమోదు, మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్‌స్థాయి అధికారులు, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు, బీఎల్ఓలకు సహకరించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ రత్నకుమారి, బీఎల్ఓలు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్ బొమ్మలసత్రం: నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ తెలిపారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుమానితులు, నేరచరిత్ర ఉన్నవారి ఇళ్లలో ప్రత్యేకంగా సోదాలు చేపడుతున్నామని వివరించారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా సరైన ధ్రువపత్రాలు లేని 83 బైక్‌లు, 3 ఆటోలను స్వా ధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసులు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి నిలాపారన్నారు. రౌడీషీటర్లు వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సమాజంలో గౌర వంగా జీవించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అనవసరంగా రహదారులపై బైక్‌లపై తిరగవద్దని యువతకు సూచించారు. -
ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి
తుగ్గలి: ట్రాక్టర్ ప్రమాదంలో ఓ రైతు మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని అమినాబాద్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు మోటుపల్లి శ్రీనివాసులు తన పొలంలో ట్రాక్టర్‌తో గుంటెక పాస్తుండగా టైరు రాయి ఎక్కడంతో కింద పడ్డాడు. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ టైరు మీద ఎక్కింది. వెంటనే అతను ఇంటికి ఫోన్ చేసి ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో జి.ఎర్రగుడి సమీపంలోకి వెళ్లగానే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తుగ్గలి పోలీసులు తెలిపారు. -
‘వందనం’ కొందరికే!
● 485 మంది తల్లులకు కోత ● సచివాలయాల చుట్టూ తల్లుల ప్రదక్షిణలు ఉయ్యాలవాడ: తల్లికి వందనం పథకం అభాసుపాలైంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బు జమ చేస్తామని చెప్పిన కూటమి నాయకులు అధికారం లోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. మండలంలో 2,502 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులు కాగా 485 మంది విద్యార్థులకు కోత విధించారు. వారందరికీ నగదు జమ కాలేదు. ఉయ్యాలవాడకు చెందిన మద్దిరాల మరియమ్మ, మారిగాళ్ల భాగ్యమ్మ, గుల్లకుంట మరియమ్మ, మల్లేశ్వరితోపాటు మరి కొందరు తల్లులు మంగళవారం ఉయ్యాలవాడ గ్రామ సచివాలయానికి చేరుకుని తమకు తల్లికి వందనం డబ్బు పడలేదని, జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని, మరి కొందరు తల్లులు ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరికి మాత్రమే డబ్బు పడిందని, మిగతా ఇద్దరికి ఎందుకు జమ కాలేదని సచివాలయ సిబ్బందితో మొరపెట్టుకున్నారు. జమ అయిన వారికి కూడా రూ.15 వేలకు బదులు రూ.2 వేలు కోత విధించడంతో కూటమి ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉందని, కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, భూమి ఆన్లైన్లో 10 ఎకరాల మెట్ట కంటే ఎక్కువగా చూపుతుందని తదితర సాకులతో అర్హుల జాబితాలో తమ పేర్లు లేకుండా చేశారని తల్లులు ఆందోళన వ్యక్తం చేశారు. మాకుండేది 3.20 ఎకరాలే.. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి పెళ్లి చేశాను. రెండో కూతురు వర్షిత ఉయ్యాలవాడ మోడల్స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి వచ్చింది. ఈఏడాది రాలేదు. సచివాలయంలో అధికారులను అడిగితే 12 ఎకరాల మెట్టభూమి ఉందని అనర్హుల జాబితాలో చేర్చారంట. మాకుండేది 3.40 ఎకరాలే. – మారిగాళ్ల భాగ్యమ్మ, ఉయ్యాలవాడ -
కన్నీటి కష్టాలు
● కౌతాళంలో 15 రోజులకోసారి తాగునీటి సరఫరా ● నిండుకుండలా ఎస్ఎస్ ట్యాంక్ ఉన్నా తీరని దాహం ● చేష్టలుడిగిన అధికారులు కౌతాళం: మండల కేంద్రంలో 1988 సంవత్సరంలో 6 వేల జనాభా ఉండేది. అప్పట్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ఓహెచ్‌ఆర్ ట్యాంకును నిర్మించారు. 10 ఏళ్ల క్రితం కామవరం రస్తాలో 40 వేల లీటర్ల మరో చిన్న ట్యాంకును నిర్మించారు. ప్రస్తుతం మండల కేంద్రం జనాభా 20 లక్షలు. ఇంత జనాభాకు మరో రెండు లక్షల లీటర్ల సామర్థ్యం ట్యాంకులు అవసరం ఉన్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా తాగునీటి సమస్య మండల కేంద్రాన్ని వేధిస్తోంది. 15 రోజులకోసారి కుళాయిలకు నీరు సరఫరా అవుతుండటంతో ఆ రోజు ఒకవైపు పండగను తలపిస్తుండగా.. మరోవైపు నీళ్లు పట్టుకునే సమయంలో అక్కడక్కడా ఘర్షణ సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. చెడిపోయిన మోటార్లు అధికారుల లెక్కల ప్రకారం పదిహేను రోజులకోసారి అంటే రెండు రోజుల క్రితం నీరు కుళాయిలకు సరఫరా కావాల్సి ఉంది. అయితే మోటార్లు చెడిపోవడంతో ఆ రోజు కూడా సరఫరా కాలేదు. దీంతో తాగునీటి సమస్య తీవ్రమైంది. పనులు మానుకుని మండల కేంద్రం వాసులు బిందెలు చేతపట్టుకుని ఓహెచ్‌ఆర్ ట్యాంక్ వద్దకు క్యూ కడుతున్నారు. అక్కడ కూడా గంటల తరబడి వేచి ఉంటే తప్ప బిందె నీరు దొరకడం గగనమైంది. ఏ మారుమూల పల్లెనో కాదు.. ఎడారి ప్రాంతం అంతకన్నా కాదు.. తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్న చోట.. ఎస్ఎస్ ట్యాంక్ నిండుకుండను తలపిస్తున్న కౌతాళం మండల కేంద్రంలో.. అదికూడా వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు గొంతు తడవక అల్లాడిపోతున్నారు. పదిహేను రోజులకోసారి సరఫరా అవుతున్న నీటిని ఎంత పొదుపు చేసుకున్నా చాలడం లేదని మండల కేంద్రం వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పనులు మానుకుని ఓహెచ్‌ఆర్ ట్యాంక్ వద్దకు వచ్చి బిందె నీటి కోసం గంటల తరబడి వేచి ఉంటున్న ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. నిర్లక్ష్యంతోనే నీటి సమస్య నీటి సమస్య పరిష్కారానికి 2009లో రాజనగర్ వద్ద ఎస్ఎస్ ట్యాంకును నిర్మించిన అధికారులు.. అక్కడి నుంచి 20 వేల జనాభా ఉన్న కౌతాళంతోపాటు రాజనగర్ క్యాంపు, లక్ష్మినగర్, బాపురం, వీరాలదిన్నె, డంబలదిన్నె గ్రామాలకు తాగునీరు అందించేందుకు కేవలం 10 హెచ్‌పీ మోటార్(ఎస్ఎస్ ట్యాంక్ వద్ద)ను మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక మరమ్మతులకు గురైతే ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరో 10హెచ్‌పీ మోటార్‌ను ఏర్పాటు చేశారు. అయితే చిన్నపాటి ఉరుకుంద, చిరుతపలి కామవరం, ఓబుళపురం గ్రామాలకు తాగునీరు అందించేందుకు 30 హెచ్‌పీ మోటార్‌ను ఏర్పాటు చేసిన అధికారులు 20 వేల జనాభాకు సరఫరా చేసే మోటారుకు 10 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు చేయడంతో దాని సామర్థ్యం సరిపోవడం లేదు. నిరంతరాయంగా మోటార్ పనిచేస్తున్నా.. వారానికోసారి సరఫరా చేసేందుకు సరిపడా నీటిని కూడా పంప్ కావడం లేదు. 30 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ఇప్పటి వరకు అతీగతీ లేదు.నిండుకుండలా ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ -
చిన్నటేకూరు విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ
నీట్లో 13 మందికి ఎంబీబీఎస్ సీట్లు ● మరో ఏడుగురికి బీడీఎస్ అవకాశం కర్నూలు(అర్బన్): జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు బీఆర్ అంబేద్కర్ ఐఐటీ/మెడికల్ అకాడమీ విద్యార్థులు ఇటీవల విడుదలైన నీట్ 2025, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నీట్ ఫలితాల్లో 20 మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయని, వీరిలో 13 మందికి ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందనున్నారన్నారు. మిగిలిన వారికి బీడీఎస్‌లో సీట్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మొత్తం 46 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. వీరిలో 31 మంది దేశంలోని ఐఐటీ పాట్నా, భువనేశ్వర్, పాల్కాడ్, గాంధీనగర్, ఎన్ఐటీ కాలికట్, పాట్నా, అగర్తాలా, శిబుపూర్, జైపూర్, రాయపూర్, ఏపీ, దుర్గాపూర్, నాగపూర్, కుండ్లి, జబల్పూర్, సీయు బిలాస్పూర్, ఢిల్లీ, తేజ్‌పూర్, శ్రీసిటీ(ఐఐఐటీ ) ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందుతున్నారన్నారు. మిగిలిన వారికి ప్రముఖ 10 కళాశాలల్లో ప్రవేశం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అకాడమీలో కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులే అధిక శాతం ఉన్నారన్నారు. అకాడమీలోని అధ్యాపక బృందం నిరంతర కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయన్నారు. -
ఎవరికి చెప్పుకోవాలో..!
● అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు పత్తికొండ: కూటమి ప్రభుత్వంలో అధికారు ల పర్యవేక్షణ లేకపోవడతో సచివాలయ సిబ్బంది ఆడిందే ఆట పాడిండే పాటలా తయారైంది. వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియడం లేదు. దీంతో వివిధ సమస్యలపై వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెనుదిరుగుతున్నారు. పత్తికొండ మండలంలో 14 జిల్లా పరిషత్, బేసిక్ ఫ్రైమరీ, ప్రైమరీ పాఠశాలలు మొత్తం 45 దాకా ఉన్నాయి. దాదాపు 14వేలు మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. అందులో ఈసారి 12,468 విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి అర్హులుగా ప్రకటించి 546 మంది విద్యార్థులను అనర్హుల జాబితాలో చేర్చారు. వీరికి ఈనెల 20వ తేదీలోపు సచివాలయాల్లో గ్రివెన్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో అనర్హుల జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లులు మంగళవారం సచివాలయాలకు తరలి రాగా అక్కడ ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సచివాలయాలు తెరిచి ఉంచిన సిబ్బంది అందుబాటులో లేకుండాపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి వస్తున్నా సచివాలయాల్లో ఎవరూ ఉండటం లేదని పలువురు ఆరోపించారు.