Business
-
శాంతి చర్చలు.. క్రూడ్ ధరలే దిక్సూచి!
పశ్చిమాసియాలో శాంతి పవనాలు... క్రూడ్ మంటలు చల్లారడంతో స్టాక్ మార్కెట్లలో మళ్లీ కాస్త జోష్ కనిపిస్తోంది. అయితే, అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పురోగతితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రూపాయి కదలికలు, రుతుపవనాల విస్తరణపైనా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు. మరోపక్క, మొహర్రం సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. పశ్చిమాసియాలో ఒకపక్క ఉద్రిక్తతలు కుదుటపడుతున్న తరుణంలో తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మళ్లీ అనిశ్చితికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని అమెరికా–ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో ఆదివారం తొలి విడత శాంతి చర్చలు మొదలయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనికి హాజరు కాగా, ఇరాన్ ప్రతినిధుల బృందానికి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వం వహించారు. ఈ కీలక చర్చల్లో ఎలాంటి పురోగతి ఉంటుందనేది ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశీయంగా స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘ఈ వారం ఇన్వెస్టర్ల ఫోకస్ అంతా యూఎస్–ఇరాన్ శాంతి చర్చలపైనే ఉంటుంది. మరోపక్క క్రూడ్ ఆయిల్ ధరల కదలికలను కూడా నిశితంగా గమనిస్తారు. చమురు ధరల సెగ తగ్గడం రానున్న రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు గనుక తలెత్తితే క్రూడ్ మంటతో మార్కెట్లతో పాటు ఎకానమీకి కూడా షాక్ తగులుతుంది’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. వరుణుడు కరుణిస్తాడా... ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ ఏడాది వర్షాలకు గండి పడుతుందన్న అంచనాలు బలడుతున్నాయి. జూన్ నెల దాదాపు చివరికి చేరుకుంటున్నప్పటికీ ఇంకా రుతుపవనాలు విస్తరించకపోవడం.. నైరుతి రుతుపవన సీజన్లో ఇప్పటిదాకా 41 శాతం లోటు వర్షపాతం ఉండన్న వాతావరణ శాఖ (ఐఎండీ) గణంకాలతో మార్కెట్ల ఫోకస్ వరుణుడి వైపు మళ్లింది. వర్షాలు సరిగ్గా పడకపోతే గ్రామీణ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్లకు ఇది చాలా ప్రతికూలాంశంగా మారుతుందనేది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రుతుపవనాల విస్తరణపై ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని వారు అంటున్నారు.గతవారమిలా...పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడం, క్రూడ్ చల్లారడం, రూపాయి కోలుకోవడంతో గతవారం దేశీ మార్కెట్లు భారీగా బౌన్స్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,274 పాయింట్లు (1.65%) పుంజుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 390 పాయింట్లు (1.65%) ఎగబాకి 24,000 పాయింట్ల పైన స్థిరపడింది.సాంకేతికంగా చూస్తే...గతవారం బుల్లిష్ ధోరణి ఈ వారం కూడా కొనసాగితే.. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీకి 24,080–24,120 పాయింట్ల వద్ద తొలి నిరోధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 24,200 పాయింట్ల పైన నిలదొక్కుకుంటే.. తదుపరి 24,400 వరకూ ఎగబాకే అవకాశం ఉంటుంది. ఇక సూచీ గనుక వెనకడుగు వేస్తే.. 23,900 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. దాన్ని కోల్పోతే 23,800 వద్ద రెండో మద్దతు దొరుకుతుంది. దీని దిగువున 23,700 స్థాయిని మళ్లీ పరీక్షించే అవకాశం ఉంటుంది.రూపాయిపై ఫోకస్..పశ్చిమాసియా యుద్ధం.. క్రూడ్ సెగతో బక్కచిక్కిన రూపాయి.. ఆర్బీఐ, ప్రభుత్వ చర్యలతో గత రెండు వారాల్లో భారీగా కోలుకుంది. మే నెలాఖర్లో డాలరుతో రూపాయి మారకం విలువ 96.96 ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. చమురు ధరలు శాంతించడం (బ్రెంట్ క్రూడ్ 80 డాలర్ల దిగువకు చేరింది) డాలర్ల ప్రవాహానికి చేపట్టిన చర్యల ప్రభావంతో తాజాగా 94.20 స్థాయికి పుంజుకుంది. అయితే, అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ఆధారంగా క్రూడ్ ధరల్లో చోటు చేసుకునే హెచ్చుతగ్గులు రానున్న రోజుల్లో రూపాయి విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘మార్కెట్లు క్రమంగా రెండు ప్రధాన అడ్డంకులను అధిగమిస్తున్నాయి. టారిఫ్ అనిశ్చితితో పాటు పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు సద్దుమణిగేలా కనబడుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న స్థిరీకరణ తర్వాత ఈ సానుకూలతలు మార్కెట్ రికవరీకి దన్నుగా నిలుస్తాయి. అయితే, వాటి ఫలితాలపైనే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈ–20... మనకేంటి?
ఇథనాల్!!. దీనిచుట్టూ ముఖ్యమైన ఆర్థికాంశాలున్నాయి. దాన్ని మించిన రాజకీయాలున్నాయి. వీటన్నిటినీ మించిన ప్రచార హోరు ఉంది. సరే! మరి వాస్తవాలేంటి? ఈ–20, ఈ–30 నుంచి మనమిప్పుడు ఈ–85కు వచ్చేశామని కేంద్రం ఘనంగా ప్రకటిస్తోంది. అంటే... 85 శాతం ఇథనాల్, మిగిలిన 15 శాతం పెట్రోల్ కలిపి వాహనాల్లో ఇంధనంగా వాడతారన్న మాట. మరి ఇలా వాడటం వల్ల ఎవరికెంత లాభం? ఎవరికెంత నష్టం? మన వాహనాలు వీటన్నిటికీ రెడీయేనా? ఇదంతా కేవలం ప్రభుత్వ దిగుమతి బిల్లు తగ్గించుకోవటానికేనా? పర్యావరణ హితమని చెబుతున్నదాంట్లో నిజమెంత? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం..రూపాయి పతనాన్ని అడ్డుకోవాలన్నా... డాలర్ కాస్త దిగిరావాలన్నా మొదట మనం చమురు, బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపేసి విక్రయించటం మొదలుపెట్టింది కూడా అందుకే. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లో మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై... రకరకాల దశలు దాటుతూ చివరకు 2014 నాటికి బ్లెండింగ్ 2 శాతానికి చేరింది. అప్పట్లో ఇథనాల్ ఉత్పత్తి భారీగా లేకపోవటమూ దీనిక్కారణమే. కానీ తరవాత కేంద్రం వేగంగా కదిలి.. ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవటంతో ఇపుడు పెట్రోల్‌లో ఇథనాల్ 20 శాతానికి చేరిపోయింది. ఇపుడు దేశంలో ఏకంగా రోజుకు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతోంది. దీనిలో 12 బిలియన్ లీటర్లను మాత్రమే ఈ–20 రూపంలో కలపగలుగుతున్నారు. మిగిలిన ఇథనాల్‌ను కూడా వాడకంలోకి తెచ్చేందుకే ఇపుడు ఏకంగా ఈ–85 అంటూ ఫ్లెక్స్ ఇంధనాన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం పలు కంపెనీలు ఫ్లెక్స్ వాహనాలను కూడా తయారు చేయటం మొదలెట్టాయి. జనం ఆందోళనేంటి? అందులో నిజమెంత? ఈ–85 ఫ్లెక్స్ ఇంధనాన్ని దానికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ వాహనాల్లో వాడతారు కనక ఇబ్బందులుండవు. కానీ ఈ–20 అనేది చాలా వేగంగా సాధించిన బ్లెండింగ్. ఈ బ్లెండింగ్ పెరిగినంత వేగంగా దాన్ని తట్టుకునే వాహనాలను కంపెనీలు తయారు చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచీ ఈ–20 మిశ్రమాన్ని తట్టుకునే వాహనాలనే తయారు చేయాలని కేంద్రం నిబంధనలు తెచ్చింది. 2025 నుంచి ఈ–20ని మరింత సమర్థంగా మార్చే వాహనాల్ని తయారు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇదంతా బాగానే ఉంది. కానీ 2023కు ముందు రోడ్లపైకి వచ్చిన వాహనాల సంగతేంటి? అవి ఈ–20ని తట్టుకోగలవా? వాహనాలు పాడైపోవా? జవాబుదారీ ఎవరిది? ఇదే జనం ఆందోళన. వాటిలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... ఈ–10 వరకూ ఫర్వాలేదు... ఈ–10 వరకూ ఏ వాహనమైనా ఓకే. ప్రపంచవ్యాప్తంగా వాహనాలన్నీ ఈ–10తో పెద్ద సమస్యలు లేకుండానే నడుస్తున్నాయి. వాహనాల జీవితకాలం పెద్దగా తగ్గటమంటూ ఉండదు. ఈ–20.. ఆధునిక వాహనాలైతే ఓకే... వీటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలైతే (2023 ఏప్రిల్ తర్వాత వచ్చినవి) ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎందుకంటే వాహనాల ఫ్యూయల్ పంప్‌లను, ఇంజెక్టర్లను, ఫ్యూయల్ లైన్స్‌ను, ఇంజిన్ కాలిబరేషన్ను కంపెనీలు మార్చాయి. కానీ ఇలా మార్చని వాహనాల్లో ఈ–20 వాడితే కొంత ఇబ్బందేనన్నది నిపుణుల మాట. ట్యాంకు, పంపు, పైపులు, ఇంజెక్టర్లు, రబ్బర్ సీల్స్‌తో కూడిన ఇంజిన్ సిస్టమ్ దీర్ఘకాలంలో అరిగి దెబ్బతినే అవకాశాలు ఎక్కువన్నది వారి వారి్నంగ్. ఈ–85, ఈ–100... ఫ్లెక్స్ వాహనాలకే ఈ ఇంధనాన్ని వాడాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు కావాలి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనం వాడలేం. దీనికి విభిన్నమైన ఫ్యూయల్ మ్యాపింగ్, సెన్సర్లు, భిన్నమైన భాగాలుంటాయి కనక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ రకం వాహనాలను ఇప్పటికే బ్రెజిల్లో లక్షల కొద్దీ వాడుతున్నారు. మన దేశంలోనూ పలు కంపెనీలు ప్రత్యేక ఫ్లెక్స్ వాహనాలను తయారు చేసి ఇప్పటికే విడుదల చేశాయి.పికప్, మైలేజీ సంగతేంటి?ఇథనాల్‌ను పెట్రోల్‌తో పోలిస్తే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. దీంతో ఇంజిన్ న్యాకింగ్ను బాగా తట్టుకుంటుంది. సామర్థ్యం ఎక్కువ. పికప్ బాగుంటుంది. కాకపోతే మైలేజీ మాత్రం పెట్రోల్‌తో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో 30– 35 శాతం ఎనర్జీ తక్కువ. దీనివల్ల ఈ–20 అయితే 3–8 శాతం... ఈ–85 అయితే 20–30 శాతం, ఈ–100 అయితే 25–35 శాతం మైలేజీ పడిపోయే అవకాశం ఎక్కువ. అంటే ఇథనాల్‌తో మైలేజీ తగ్గటమన్నది వాస్తవం. ఇక ఇంజిన్ విషయానికొస్తే కొత్త వాహనాలకైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 2023కు ముందు వాహనాలైతే కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. పైపెచ్చు ఇథనాల్ గాలి నుంచి ఎక్కువ తేమను లాక్కుంటుంది. దీనివల్ల దీర్ఘకాలం వాడకుండా ఉంచితే పనిచేయటం మానేయొచ్చు. బోట్లు, జనరేటర్లలోనూ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి.లాభమెవరికి... నష్టమెవరికి?దిగుమతుల కోసం భారీగా డాలర్లు వెచ్చిస్తున్న మన కేంద్ర ప్రభుత్వానికి ఇథనాల్ కాస్త ఊరటనే చెప్పాలి. దీనివల్ల కొంతయినా దిగుమతుల బిల్లు తగ్గుతోంది. చెరకు రైతులకూ కొంతవరకూ లాభమే. గ్రామాల్లో డిస్టిలరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. లాజిస్టిక్స్ అవసరాలు పెరుగుతాయి. కాకపోతే... భారీగా చెరకు, జొన్న, ఆహారధాన్యాలు అవసరమవుతాయి. పైపెచ్చు చెరకు పంటకు విపరీతమైన నీటి వనరులు కావాలి. భారీగా పండించాలంటే భారీగా జలవనరులూ కావాలి. ఇదే పలువురి ఆందోళనకు కారణమవుతోంది. పంటలను ఆహారానికి ఖర్చు చేయాలా? ఇంధనానికి ఖర్చు చేయాలా? అన్న చర్చ కూడా మొదలైంది. వీటన్నిటికీ కేంద్రం సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఇథనాల్ ఎకానమీ ప్రశాంతంగా ముందుకెళుతుంది.ఇదీ... ఫ్లెక్స్ ఎకానమీ ఈ–85 ఇంధనాన్ని ఈ–20 కన్నా లీటరుకు రూ.20 తగ్గించి విక్రయిస్తున్నారు. దీన్నో ఆకర్షణీయ డిస్కౌంట్‌గా ప్రభుత్వం చెబుతున్నా... తగ్గుతున్న మైలేజీతో పోలిస్తే ఈ డిస్కౌంట్ వల్ల ఏమాత్రం లాభం లేదన్నది సామాన్యుల మాట. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది చివరి నాటికి ఈ–85 ఇథనాల్ స్టేషన్లను 500 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 5వేలకు చేర్చాలనేది లక్ష్యం. ఇక వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు తెచ్చేశాయి. మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్, హీరో సంస్థ స్ప్లెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌లో ఫ్లెక్స్ మోడళ్లు తెచ్చాయి. మిగిలిన కంపెనీలూ పలు మోడళ్ల తయారీలో ఉన్నాయి.ఏంటీ ఇథనాల్? ఎలా వస్తుంది?ఇథనాల్ అంటే... చక్కెరలు, పిండిపదార్థాలు పులియబెట్టడం ద్వారా తయారయ్యే ఆల్కహాల్. సాధారణంగా చెరకురసం, చక్కెర పరిశ్రమలో వచ్చే మొలాసిస్, జొన్న, పాడైన ఆహారధాన్యాలు, వరి, గోధుమ, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తుంటారు.స్టాక్ మార్కెట్లో లబ్ధిదారులు ఎవరు?భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల (ఈ20, ఈ85, ఈ100) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఇథనాల్ సంబంధిత కంపెనీలు సమానంగా లాభపడవు. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.ఇథనాల్ ఉత్పత్తి కంపెనీలుబల్రామ్పూర్ చినీ మిల్స్ దేశంలోని అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. భారీ స్థాయిలో డిస్టిలరీల విస్తరణ. చక్కెర, ఇథనాల్ వ్యాపారాల సమీకరణ చేస్తుంది. ఇథనాల్ డిమాండ్ పెరిగితే అత్యధికంగా లాభపడే కంపెనీల్లో ఇది ముందుంటుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ ఇథనాల్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణంలో నైపుణ్యం. ఏ కంపెనీ కొత్త ప్లాంటు నిర్మించినా ఆర్డర్లు పొందే అవకాశం.రెండో తరం (2జీ) ఇథనాల్ టెక్నాలజీలో కూడా కీలక పాత్ర. దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 20 బిలియన్ లీటర్ల నుంచి 30 బిలియన్ లీటర్లకు పెరిగితే ప్రజ్కు భారీ అవకాశాలు ఉండొచ్చు. త్రివేణి ఇంజినీరింగ్చక్కెర. డిస్టిలరీలు, ఇథనాల్ ఈ మూడు రంగాల్లోనూ ఉనికి ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. దాల్మియా భారత్ షుగర్ లిస్టెడ్ షుగర్ కంపెనీల్లో ఇథనాల్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన సంస్థల్లో ఒకటి. శ్రీ రేణుక షుగర్స్ చక్కెర, ఇథనాల్ రంగాల్లో బలమైన స్థానం కలిగిన కంపెనీ.మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కంపెనీలు నీటి కొరత కారణంగా భవిష్యత్తులో చెరకు కంటే మొక్కజొన్న (మైజ్) ఆధారిత ఇథనాల్‌కు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. → గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ – మొక్కజొన్న ప్రాసెసింగ్‌లో బలమైన ఉనికి. → సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్చమురు మార్కెటింగ్ కంపెనీలు: → ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ → భారత్ పెట్రోలియం కార్పొరేషన్→ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ఇవి ఈ 85, ఈ100 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి. ఇథనాల్ నిల్వలు, రవాణా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాయి. అయితే వీటి మొత్తం ఆదయాంలో ఇథనాల్ వాటా తక్కువే కావడం వల్ల ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశముంది.ఆటో మొబైల్ కంపెనీలు → మారుతీ సుజుకీ దేశంలో తొలి ఫ్లెక్స్–ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుగానే సన్నద్ధమవుతోంది. → హీరో మోటోకార్ప్ భారత్ ప్రధానంగా ద్విచక్ర వాహనాల మార్కెట్ కావడంతో మంచి అవకాశాలు ఉన్నాయి. → బజాజ్ ఆటో భవిష్యత్తులో ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన ఎంపికలే..ఇంకా ఇథనాల్ తయారీదారులతో పాటు డిస్టిలేషన్ పరికరాల తయారీ, నిల్వ ట్యాంకులు, ఇన్ఫ్రా, బయోఫ్యూయెల్, ధాన్యం ప్రాసెసింగ్ కంపెనీలకూ లాభమే. → భారత్‌లో ఈ–20 అమల్లో ఉంది. అంటే మనకు వస్తున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. → బెజిల్ ఎప్పటి నుంచో ఈ–85. ఈ–100ని విక్రయిస్తోంది. (రమణమూర్తి మంథా) -
జీఎస్టీ ఎఫెక్ట్.. పెరుగనున్న కార్ల అమ్మకాలు!
స్థిరంగా కొనసాగుతున్న డిమాండ్, జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పెరిగిన కొనుగోలు సామర్థ్యం, యుటిలిటీ వాహనాలకు లభిస్తున్న ఆదరణ తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు 4–6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ తన నివేదికలో తెలిపింది.గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 27 శాతం వృద్ధితో 4.4 లక్షల యూనిట్లకు చేరాయి. అదే సమయంలో వినియోగదారుల నుంచి లభించిన భారీ డిమాండ్, కొత్త మోడళ్ల విడుదల, సుదీర్ఘ వివాహాల సీజన్ కారణంగా రిటైల్ విక్రయాలు 33 శాతం పెరిగాయి. అయితే, పెరుగుతున్న ఇంధన, కమొడిటీ ధరలతో పాటు బలహీనమైన రుతుపవనాలపై ఆందోళనలు రాబోయే కాలంలో నిశితంగా గమనించాల్సిన కీలక అంశాలుగా ఉన్నాయని ఇక్రా పేర్కొంది.యుటిలిటీ వాహనాల ఆధిపత్యం ‘‘ప్యాసింజర్ వాహనాల విభాగంలో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఇవి దాదాపు 68 శాతం వాటాను దక్కించుకున్నాయి. అలాగే, గత ఏడాది సెపె్టంబర్లో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో మినీ, కాంపాక్ట్ కార్ల విభాగాల్లోనూ డిమాండ్ పుంజుకుంది’’ అని ఇక్రా నివేదిక స్పష్టం చేసింది.పెరిగిన ఎగుమతులు.. ఈవీల జోరుదేశీయ వాహన తయారీ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో తమ సరఫరాను ముమ్మరం చేయడంతో, ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధిని సాధించాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం కూడా పుంజుకుంది. 2027 ఆర్థిక సంవత్సర ఆరంభంలో ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఈవీల వాటా దాదాపు 6 శాతానికి చేరినట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. -
ఎప్రిలియా కొత్త బైక్: ధర ఎంతంటే?
ఎప్రిలియా ఇండియా.. టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కోసం ఎంపిక చేసిన షోరూమ్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.కొత్త ఎప్రిలియా టుయోనో 457 స్పెషల్ ఎడిషన్ 2006 ట్యూనో 1000R నుంచి తీసుకున్న రెండు కొత్త లివరీలను పొందింది. అంతేకాకుండా.. ఈ మోటార్‌సైకిల్‌లో కొన్ని ఎర్గోనామిక్ మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది.స్పెషల్ ఎడిషన్ టుయోనో 457, కొత్త గ్రాఫిక్స్ డిజైన్, లోగోలతో పాటు, మాంబా బ్లాక్ అండ్ పూమా గ్రే అనే రెండు కొత్త రంగులలో లభిస్తుంది. కొత్త స్మోక్డ్ ఫినిష్ ఏరోడైనమిక్ ఫ్లైస్క్రీన్, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ కోసం ఎత్తుగా అమర్చిన హ్యాండిల్బార్లు ఉన్నాయి. సుదూర ప్రయాణాలలో మరింత సౌకర్యం కోసం ఈ స్పెషల్ ఎడిషన్ సీటులో మార్పులు చేశారని, అలాగే భారతీయ రోడ్లపై మెరుగ్గా పనిచేసేలా సస్పెన్షన్‌ను కూడా మెరుగుపరిచినట్లు ఎప్రిలియా చెబుతోంది.ఇంజిన్ విషయానికి వస్తే.. ఎప్రిలియా పవర్‌ప్లాంట్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. కాబట్టి టుయోనో 457 బైక్ 46.9 bhp పవర్, 43.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో కొనసాగుతోంది. -
ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!
టికెట్ లేకుండా లేదా చెల్లుబాటు కాని టికెట్‌తో ప్రయాణించే ప్రయాణికులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇండియన్ రైల్వే సిద్ధమైంది. జన్ విశ్వాస్ చట్టం ప్రకారం కొత్త రూల్స్ జులై 1నుంచి అమల్లోకి రానున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్‌తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది.అంతేకాకుండా.. టికెట్లో పేర్కొన్న కోచ్ లేదా క్లాస్ కాకుండా ఇతర కోచ్‌లో ప్రయాణిస్తే కూడా జరిమానా విధించడం జరుగుతుంది. ఉదాహరణకు, జనరల్ టికెట్‌తో స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లో ప్రయాణించడం, లేదా అనుమతించిన దూరం (దిగాల్సిన స్టేషన్) కంటే ఎక్కువ ప్రయాణించడం వంటి వాటిపై కూడా అదనపు చార్జీలు విధిస్తారు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇతరుల టికెట్‌ను ఉపయోగించి ప్రయాణించడం కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఇలా ప్రయాణిస్తే.. టికెట్ రద్దు చేయడమే కాకుండా, రూ.500 జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ ప్రయాణికుడు ఈ జరిమానాలు చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే అధికారులు కోర్టులో కేసు వేయవచ్చు. అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలు వసూలు చేయడం జరుగుతుంది.ఇదీ చదవండి: అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే వంటి విభాగాలు సోషల్ మీడియా, ఇతర ప్రకటనల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. సరైన టికెట్‌తో మాత్రమే ప్రయాణించాలని, రైల్వే నియమాలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నాయి. -
రక్షణ రంగంలోకి సింహ 4x4
భారత్ ఫోర్జ్ లిమిటెడ్‌కు చెందిన రక్షణ రంగ అనుబంధ సంస్థ ‘కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్’ (కేఎస్‌ఎస్‌ఎల్), అంతర్జాతీయ రక్షణ సంస్థ ‘పారామౌంట్’తో కలిసి సరికొత్త నెక్ట్స్ – జనరేషన్ లైట్ ఆర్మర్డ్ మల్టీ–పర్పస్ వాహనం ‘సింహ 4x4’ ను మార్కెట్లోకి తెచ్చాయి.నాటో ప్రమాణాలకు అనుగుణంగా సాయుధ దళాల ఆధునిక అవసరాలతో పాటు, అంతర్జాతీయ రక్షణ డిమాండ్లను తీర్చేలా ఈ వాహనాన్ని సరికొత్త డిజైన్‌తో రూపొందించారు. పట్టణ ప్రాంతాల్లో రక్షణ ఆపరేషన్లు, రోడ్లపై, కఠిన భూభాగాల్లో నిఘా పెట్టడానికి ఈ ‘సింహ 4x4’ అనుకూలంగా ఉంటుంది. దీనిలోని మోడ్యులర్ ఆర్కిటెక్చర్ కారణంగా అవసరానికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు (అప్గ్రేడ్లు) చేసుకోవడం సులువవుతుంది. -
అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!
అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో ఒక పెద్ద మార్పును తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మార్పు అమల్లోకి వస్తే.. యూఎస్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థుల జీవితంపై, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికాలో F-1 వీసాతో చదువుతున్న విద్యార్థులు 'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్' అనే విధానంలో ఉంటారు. ఈ విధానం ప్రకారం.. విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండవచ్చు. అంటే చదువు కొనసాగుతున్నంత కాలం వారు వీసా పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కోర్సు మార్చుకోవడం, యూనివర్సిటీ మారడం లేదా ఉన్నత చదువులకు వెళ్లడం కూడా సులభంగా జరుగుతుంది.కానీ.. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఈ సౌలభ్యం తగ్గే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు ముందుగా నిర్ణయించిన గడువుతో మాత్రమే ప్రవేశ అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. సాధారణంగా ఇది నాలుగు సంవత్సరాల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఆ గడువు పూర్తయిన తర్వాత అమెరికాలో కొనసాగాలంటే విద్యార్థులు తప్పనిసరిగా USCIS ద్వారా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.అమెరికా ప్రభుత్వం ఈ మార్పును తీసుకురావడానికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కారణం అని చెబుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న విధానంలో కొంతమంది విద్యార్థులు వీసా గడువు దాటినా దేశంలోనే కొనసాగుతున్నారని, వారిని ట్రాక్ చేయడం కష్టమవుతోందని అధికారులు భావిస్తున్నారు. అందుకే మరింత కఠినమైన, స్పష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని ప్రభుత్వం అంటోంది.అయితే ఈ నిర్ణయంపై.. విద్యా రంగం, ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం వల్ల విద్యార్థులు తరచూ పొడిగింపుల కోసం దరఖాస్తు చేయాల్సి వస్తుంది. దీనివల్ల పేపర్‌వర్క్ పెరగడం, ఆలస్యం జరగడం, చదువులో అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఈ మార్పు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం నుంచి అమెరికాకు ఎక్కువమంది చదువుకోవడానికి వెళ్తున్నారు. కొందరు భారతీయ విద్యార్థులు పీహెచ్డీ, రీసెర్చ్ కోర్సులు ఇక్కడే చేస్తారు. దీనికోసం ఐదు నుంచి ఏడేళ్లు అక్కడే ఉండాల్సి వస్తుంది. వీరంతా కొత్త నిబంధనల ప్రకారం.. మధ్యలో తప్పనిసరిగా పొడిగింపులు తీసుకోవాల్సి వస్తుంది.అదనంగా.. చదువు పూర్తైన తర్వాత ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. ఇది అమల్లోకి వస్తే.. అమెరికాలో చదువు పూర్తయిన వారు ఉద్యోగాలు వెతకడానికి సమయం సరిపోదు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: భారత్ - ఈయూ ఒప్పందం: పీయూష్ గోయల్ కీలక ప్రకటన! -
సంపదలో సగం సమాజానికే ఇవ్వండి: మెలిండా గేట్స్
ఇటీవల స్పేస్ఎక్స్ ఐపీఓ విజయవంతంగా పూర్తికావడంతో ఎందోమంది కోటీశ్వరులు, బిలియనీర్లుగా మారారు. భవిష్యత్తులో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు కూడా ఐపీఓకు వచ్చే అవకాశాలు ఉండటంతో మరింత మంది ధనవంతులు అవుతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రపంచ ప్రఖ్యాత దాతృత్వవేత్త 'మెలిండా ఫ్రెంచ్ గేట్స్' (Melinda French Gates) ఓ కీలక సందేశాన్ని ఇచ్చారు.మెలిండా ఫ్రెంచ్ గేట్స్ అభిప్రాయం ప్రకారం.. పెద్ద మొత్తంలో సంపద సంపాదించే అవకాశం లభించినవారు తమ సంపదలో కనీసం సగం భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలని ఇప్పటి నుంచే నిర్ణయించుకోవాలి. ఐపీఓల ద్వారా కోట్లాది డాలర్ల సంపద పొందగలిగే స్థితిలో ఉన్నవారికి, అదే స్థాయిలో దానం చేసే సామర్థ్యం కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సంపద అనేది కేవలం వ్యక్తిగత విజయానికి గుర్తు మాత్రమే కాదు, సమాజం పట్ల ఉన్న బాధ్యతకు కూడా ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.అమెరికాలో బిలియనీర్లుగా ఎదిగిన వారు దేశం అందించిన అవకాశాలను గుర్తుంచుకోవాలని మెలిండా సూచించారు. మంచి విద్యా వ్యవస్థ, ఆరోగ్య సేవలు, రహదారులు, సమాచార మౌలిక వసతులు వంటి ప్రజా వనరుల వల్లే పెద్ద కంపెనీలు అభివృద్ధి చెందగలిగాయని ఆమె వివరించారు. అందువల్ల సమాజం నుంచి లభించిన అవకాశాలను తిరిగి సమాజ అభివృద్ధికే ఉపయోగించాల్సిన బాధ్యత ధనవంతులపై ఉందని ఆమె చెప్పారు.మెలిండా ఫ్రెంచ్ గేట్స్ వ్యక్తిగత సంపద సుమారు 19 బిలియన్ డాలర్లుగా అంచనా. ఆమె 2010లో వారెన్ బఫెట్, ఆమె మాజీ భర్త బిల్ గేట్స్‌తో కలిసి గివింగ్ ప్లెడ్జ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని జీవితకాలంలో గానీ, మరణానంతరం గానీ దానం చేయాలని ప్రతిజ్ఞ చేస్తారు.ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రముఖ దాతలు ఈ కార్యక్రమంలో చేరారు. వీరిలో మెకెంజీ స్కాట్, కాన్వా సహ వ్యవస్థాపకులు మెలానీ పెర్కిన్స్, క్లిఫ్ ఓబ్రెచ్ట్, ఎయిర్‌బీఎన్‌బీ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ చెస్కీ వంటి ప్రముఖులు ఉన్నారు.గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలిగిన తరువాత, మెలిండా తన స్వతంత్ర సంస్థ పివోటల్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మహిళల మధ్యవయస్సు ఆరోగ్యం, మెనోపాజ్ సంబంధిత సమస్యల కోసం 215 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించారు.ధనవంతుల ప్రవర్తన గురించి అడిగినప్పుడు, సంపదను ఆడంబరంగా ప్రదర్శించడం తనకు నచ్చదని మెలిండా స్పష్టం చేశారు. అవసరమైన మంచి వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పేమీ లేదు, కానీ సంపదను ప్రదర్శిస్తూ ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేయడం సమాజానికి ఎలాంటి మేలు చేయదని ఆమె అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: భారత్ - ఈయూ ఒప్పందం: పీయూష్ గోయల్ కీలక ప్రకటన! -
భారత్ - ఈయూ ఒప్పందం: పీయూష్ గోయల్ కీలక ప్రకటన!
భారత్ - 27 దేశాల యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థికాభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా మారనుంది. ఈ ఒప్పందంపై 2026 డిసెంబర్ నాటికి సంతకం చేసే అవకాశం ఉందని, ఆ తరువాత 2027 ఫిబ్రవరి - మార్చి నెలలలో అమలులోకి రానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.ఈ ఒప్పందాన్ని 'అన్ని ఒప్పందాలకు మాతృక' (Mother of All Deals) లాంటిదని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలవనుంది. భారత్ - ఈయూ కలిసి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సుమారు 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా.. ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు మూడవ వంతు వాటా ఈ రెండు భాగస్వామ్యాలదే.ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, భారతదేశం నుంచి ఈయూ దేశాలకు ఎగుమతి చేసే సుమారు 93 శాతం వస్తువులకు సుంకం లేకుండా మార్కెట్ ప్రవేశం లభిస్తుంది. దీని వలన భారతీయ వస్త్రాలు, ఔషధాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి అనేక రంగాలకు భారీ అవకాశాలు ఏర్పడతాయి.మరోవైపు, ఈయూ దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, వైన్ వంటి వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల భారత వినియోగదారులు ఈ ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. అయితే దేశీయ పరిశ్రమలపై ప్రభావం పడకుండా తగిన రక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారతదేశంపై ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అనేక దేశాలు ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికాతో కూడా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే కెనడా కూడా భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: జాబ్ కోసం పోతే.. షాకింగ్ అనుభవం! -
‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్’
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండి, క్రిప్టో ఆస్తులపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పడిపోతున్నప్పటికీ తాను విక్రయించడం లేదని, సరైన సమయంలో కొనుగోలు చేసేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. ధరల ఆధారంగా కాకుండా ఆస్తులు ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి, అమెరికాతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను రాజకీయ, బ్యాంకింగ్ నాయకత్వం సమర్థంగా పరిష్కరించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నానని, బంగారం, వెండి ధరలు భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని కియోసాకి చెప్పారు. అయితే తన అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ స్వయంగా పరిస్థితులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే కాలం ఆసక్తికరంగా ఉండబోతోందని, తెలివిగా వ్యవహరించే ఇన్వెస్టర్లు మరింత సంపద సృష్టించుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు.Gold and silver prices are falling. Q: Am I buying or selling?A: One mistake I have made (and I’ve made many) is letting price determine reasons to buy or sell any asset.I have learned to understand the “context” or the environment the asset is in….not the price.For…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 20, 2026 -
టెకీలు.. AI వాడితే సేఫ్.. లేకుంటే లేఆఫ్!
కృత్రిమ మేధస్సు (AI) కార్యాలయాల్లో కేవలం ఉత్పాదకతను పెంచే సాధనంగా మాత్రమే కాకుండా, ఉద్యోగ భద్రతను ప్రభావితం చేసే కీలక నైపుణ్యంగా మారుతున్నట్లు తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ గాలప్ ( Gallup Study ) నిర్వహించిన సర్వే ప్రకారం, ఏఐ సాధనాలను క్రమం తప్పకుండా ఉపయోగించే టెక్నాలజీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.మూడు రెట్లు అధిక ముప్పుగత ఫిబ్రవరిలో 23 వేల మందికి పైగా అమెరికన్ ఉద్యోగులపై నిర్వహించిన అధ్యయనంలో, ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన 660 మంది అభిప్రాయాలను కూడా పరిశీలించారు. ఈ విశ్లేషణ ప్రకారం.. కనీసం నెలకు ఒకసారి అయినా ఏఐ టూల్స్ ఉపయోగించే టెక్ ఉద్యోగులకు లేఆఫ్ అయ్యే అంచనా ప్రమాదం 6 శాతం మాత్రమే ఉండగా, ఏఐని అరుదుగా ఉపయోగించే లేదా పూర్తిగా దూరంగా ఉంచే ఉద్యోగుల్లో అది 18 శాతానికి చేరింది. అంటే ఏఐ వినియోగం లేని టెకీలకు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం దాదాపు మూడు రెట్లు అధికంగా ఉందని గాలప్ పేర్కొంది.అధ్యయనం ప్రకారం.. కంపెనీలు ఇప్పుడు నియామకాల సమయంలో కేవలం డిగ్రీలు, అనుభవం మాత్రమే కాకుండా ఏఐ అక్షరాస్యత (AI Literacy), ఆటోమేషన్ టూల్స్‌పై అవగాహన, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి నైపుణ్యాలను కూడా పరిశీలిస్తున్నాయి. సంస్థల్లో పునర్వ్యవస్థీకరణ లేదా ఖర్చు తగ్గింపు చర్యల సమయంలో కూడా ఏఐ సామర్థ్యం ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం లభించే అవకాశాలు పెరుగుతున్నాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కేవలం 1 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగ నష్టానికి ఏఐ ప్రత్యక్ష కారణమని భావించారు. ఎక్కువ మంది ఆర్థిక పరిస్థితులు, పునర్వ్యవస్థీకరణలు, వ్యయ నియంత్రణ చర్యలను కారణాలుగా పేర్కొన్నారు. అయితే సంస్థల నిర్ణయ ప్రక్రియలో ఏఐ నైపుణ్యం పరోక్ష ప్రభావం చూపుతున్నట్లు గాలప్ శాస్త్రవేత్త జిమ్ హార్టర్ అభిప్రాయపడ్డారు.సగం మంది వాడేస్తున్నారు..ఇదిలా ఉండగా, అమెరికాలో కార్యాలయాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2023లో 21 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఏఐ ఉపయోగిస్తున్నట్లు చెప్పగా, 2026 నాటికి ఆ సంఖ్య 50 శాతానికి చేరుకుంది. రోజువారీగా ఏఐ ఉపయోగించే ఉద్యోగుల వాటా కూడా నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లో ఈ వినియోగం అత్యధికంగా నమోదైంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో ఏఐ పూర్తిగా ఉద్యోగాలను భర్తీ చేస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేకపోయినా, ఏఐతో కలిసి పనిచేయగల సామర్థ్యం మాత్రం ఉద్యోగ మార్కెట్లో కీలక అర్హతగా మారుతోంది. ఒకప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం ఎలా తప్పనిసరి నైపుణ్యంగా మారిందో, ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యం కూడా అదే దిశగా పయనిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఈ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ టార్గెట్ రూ.3 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ సీఈవో చంద్రశేఖర్ ముద్రగణం వెల్లడించారు. ఇతర సంస్థల కొనుగోళ్లు, వ్యాపార విస్తరణ ఇందుకు దోహదపడనున్నట్లు ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 26 శాతం వృద్ధి చెంది రూ. 1,002 కోట్లుగా నమోదైంది.ఒరిస్సాలో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై మూడు దశల్లో 350 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఆధారిత యాక్సెస్జినీ ప్లాట్‌ఫాం, బ్లూహెల్త్, బ్లూబయో మొదలైన వాటిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. క్యాన్సర్ సంబంధ పరిశోధనలకు తోడ్పడేలా దాదాపు రూ. 400 కోట్లతో గుంటూరులో బయోబ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.ఆఫ్రికాలోని వర్ధమాన దేశాల్లో విస్తరణపై ఫోకస్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ ఉత్పత్తుల కోసం నాలుగు దేశాలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్యను 2,000కు పెంచుకోనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. అప్పటికల్లా బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. -
అమెరికాకు భారీ షాక్.. ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ!
యుద్ధాలు కేవలం యుద్ధభూములకే పరిమితం కావు. అవి దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రజల జీవన ప్రమాణాలను, అంతర్జాతీయ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీనికి తాజా ఉదాహరణ అమెరికా-ఇరాన్ ఘర్షణ. కేవలం కొన్ని వారాల పాటు సాగిన ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటికే 132 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 లక్షల కోట్లకు పైగా) ఆర్థిక భారం మోపినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థ మూడీస్ అనలిస్టిక్స్ ‘Moody’s Analytics’ అంచనా వేసింది. అయితే ఇది కేవలం అమెరికా నష్టమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు మద్దతు, ఇజ్రాయెల్ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. పరిస్థితి మరింత దిగజారడంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు, ప్రాంతీయ సైనిక చర్యలతో స్పందించింది. యుద్ధం పూర్తిస్థాయి ప్రాంతీయ సంక్షోభంగా మారుతుందేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ప్రపంచ మార్కెట్లను వణికించింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ..ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు హార్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయవచ్చనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరుకునే పరిస్థితి ఏర్పడింది. చమురు ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ఖరీదు పెరగడమే కాదు. విమాన ప్రయాణాలు, సరుకు రవాణా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల ఖర్చులు, ఆహార ధరలు ఇలా ప్రతి రంగంపైనా ప్రభావం పడింది. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లింది.అమెరికాపై ఎఫెక్ట్ ఎలా?Moody’s Analytics లెక్కల ప్రకారం యుద్ధం వల్ల అమెరికాలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గ్యాలన్ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. ట్రక్కింగ్, విమానయాన, తయారీ రంగాలపై అదనపు భారం పడింది. ఫలితంగా వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఇలా ప్రతి అమెరికా కుటుంబం సగటున వందల డాలర్ల అదనపు ఖర్చును భరించాల్సి వచ్చినట్లు అంచనా. మరోవైపు ప్రభుత్వం సైనిక చర్యలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నౌకాదళ మోహరింపు, మధ్యప్రాచ్యంలోని సైనిక స్థావరాల నిర్వహణ కోసం భారీ మొత్తాలను ఖర్చు చేసింది. మరోవైపు.. అమెరికా ఇప్పటికే 40 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉన్న జాతీయ రుణంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మరో భారీ సైనిక ఘర్షణ ఫెడరల్ బడ్జెట్‌పై అదనపు ఒత్తిడిని పెంచిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడం రాజకీయంగా కూడా పెద్ద అంశం. సాధారణంగా గ్యాస్ ధరలు పెరిగితే అధికార ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అందుకే యుద్ధం ప్రభావం అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధభూమిలోనే కాదు.. మార్కెట్లలో కూడా నష్టంఈ యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి వెనక్కి తగ్గడంతో ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపించాయి. బంగారం, డాలర్ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. యూరప్‌లో ఇప్పటికే మందగమనం ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఇంధన ఖర్చుల పెరుగుదల మరింత దెబ్బతీసింది. ఆసియా దేశాల్లో దిగుమతి ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరిగింది.భారత్‌పై ప్రభావం?భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి భారత్‌కు ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల పరిస్థితులు కొంత సద్దుమణగడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయినప్పటికీ జలసంధి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే ప్రభావం భారత్‌పైనా గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.యుద్ధం ముగిసినా..ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ఘర్షణలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఆర్థిక ప్రభావం మాత్రం వెంటనే తగ్గే పరిస్థితి లేదు. చమురు సరఫరా గొలుసులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా కొన్ని నెలల పాటు కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ఈ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2 నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం సంభవించే అవకాశం ఉండేదని అంచనా.కాగా, యుద్ధాలు గెలుపు-ఓటముల గురించి మాత్రమే కావు. వాటి అసలు ఖరీదు ఆర్థిక వ్యవస్థలు, సాధారణ ప్రజలు, ప్రపంచ మార్కెట్లు చెల్లిస్తాయి. అమెరికా-ఇరాన్ ఘర్షణ కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధం కొన్ని వారాల్లో ముగిసినా, దాని ఆర్థిక ప్రతిధ్వనులు మాత్రం నెలలు, సంవత్సరాల పాటు వినిపించే అవకాశముంది. మిసైళ్లు కొన్ని నిమిషాల్లో పేలిపోతాయి... కానీ వాటి ఆర్థిక ప్రభావం మాత్రం ఏళ్ల తరబడి దేశాలను వెంటాడుతుంది. అమెరికాకు 132 డాలర్ల బిలియన్ల బిల్లు, ప్రపంచానికి ట్రిలియన్ల డాలర్ల భయం మిగిల్చిన ఘర్షణగా ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోనుంది. -
స్టాక్ మార్కెట్ అలర్ట్: ట్రేడింగ్ 4 రోజులే..
భారత స్టాక్ మార్కెట్లకు వచ్చే వారం ఒక అదనపు సెలవు రానుంది. దీంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు జూన్ 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ చేసే అవకాశం ఉంటుంది. భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) శుక్రవారం అంటే జూన్ 26న మొహర్రం సందర్భంగా పూర్తిగా మూతపడనున్నాయి.ఈ సెలవు కారణంగా ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) వంటి ప్రధాన విభాగాల్లో ట్రేడింగ్ జరగదు.శుక్రవారం మొహర్రం సెలవుతో పాటు జూన్ 27, 28 తేదీల్లో శని, ఆదివారాల వారాంతపు విరామం ఉండటంతో మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. తిరిగి జూన్ 29, సోమవారం నుంచి సాధారణ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.స్టాక్ మార్కెట్ సమయాలు ఇలా..మార్కెట్ సాధారణ సమయాల ప్రకారం.. ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై 9:08 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు రెగ్యులర్ ట్రేడింగ్ జరుగుతుంది. ముగింపు (క్లోజింగ్) సెషన్ 3:40 నుంచి 4 గంటల వరకు ఉంటుంది.ఇదిలా ఉండగా, సెలవుతో కూడిన ఈ వారంలో డివిడెండ్లు, బోనస్ షేర్లు తదితర కార్పొరేట్ చర్యల కారణంగా పలు ప్రముఖ కంపెనీల షేర్లు ఎక్స్-డేట్‌కు వెళ్లనున్నాయి. ఇక్కడ ఎక్స్-డేట్ (Ex-Date) అంటే కంపెనీ ప్రకటించిన డివిడెండ్, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ లేదా రైట్స్ ఇష్యూ వంటి కార్పొరేట్ బెనిఫిట్లకు అర్హత నిర్ణయించే కీలక తేదీ. అందువల్ల ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పొజిషన్లు, మార్జిన్ అవసరాలు, సెటిల్మెంట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నాయి. -
సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ @ రూ.3.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో సౌందర్య ఉత్పత్తుల వినియోగం విస్తృతమవుతోంది. ఈ మార్కెట్ ఏటేటా మరింత బలపడుతుండడంతో అంతర్జాతీయ కంపెనీలు సైతం భారత్‌కు ప్రయాణం కడుతున్నాయి. 2030 నాటికి 45 శాతం వృద్ధితో 39 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.70 లక్షల కోట్లు) ఈ మార్కెట్ చేరుకుంటుందని ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నివేదిక అంచనా వేసింది.సౌందర్య ఉత్పత్తుల విషయమై వినియోగదారుల వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు పేర్కొంది. గతంలో ప్రత్యేక సందర్భాల్లోనే సౌందర్య ఉత్పత్తులను వినియోగించే ధోరణి కాస్తా.. ఇప్పుడు సౌందర్య రక్షణకు నిత్యావసరంగా, ఆత్మ విశ్వాసం, గుర్తింపునకు చిహ్నంగా మారిపోయినట్టు తెలిపింది. ఈ మేరకు ‘ఫ్లిప్‌కార్ట్ గ్లామ్అప్ యాన్యువల్ బ్యూటీ ట్రెండ్స్ నివేదిక, 2026’ విడుదలైంది. ప్రస్తుతం భారత సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 27 బిలియన్ డాలర్లుగా ఉంది. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చి క్రితం రోజున పెరుగుదలబాట పట్టిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: వరుస సెలవులు
వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకు వినియోగదారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహర్రం సందర్భంగా జూన్ 25, 26 తేదీల్లో రాష్ట్రాలవారీగా బ్యాంకులకు సెలవులు ఉండగా, అనంతరం నాలుగో శనివారం (జూన్ 27), ఆదివారం (జూన్ 28) రావడంతో అనేక ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మోహర్రం సందర్భంగా సెలవుల తేదీలు రాష్ట్రానికోలా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఆర్బీఐ పరిధిలోని బ్యాంకులకు జూన్ 25న సెలవు ఉండగా, తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో జూన్ 26న మోహర్రం సెలవు వర్తించనుంది.జూన్ 26న హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, భోపాల్, లక్నో, పాట్నా, రాంచీ తదితర నగరాల్లో బ్యాంకు శాఖలు పనిచేయవు. జూన్ 27 నాలుగో శనివారం, జూన్ 28 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి.బ్యాంకు శాఖలు మూసివున్నప్పటికీ డిజిటల్ సేవలకు అంతరాయం ఉండదు. యూపీఐ, ఐఎంపీఎస్, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ, నిధుల బదిలీ, బిల్లు చెల్లింపులు వంటి సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ సేవలు కూడా సెలవు రోజుల్లో కొనసాగుతాయి. అయితే నిర్వహణ పనుల కారణంగా కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వినియోగదారులు ముందుగానే ముఖ్యమైన లావాదేవీలు పూర్తి చేసుకోవడం మంచిది. -
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం కొత్త ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడర్ల కోసం బ్రోకరేజ్ సంస్థ ‘5పైసా క్యాపిటల్’ శనివారం కొత్త ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘అల్గోస్పేస్’ పేరుతో ప్రారంభించిన ఈ అల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా.. సాధారణ ఇన్వెస్టర్లు కూడా సులువుగా అల్గో–ఆధారిత ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.సాధారణంగా ఆటోమేటెడ్ వ్యూహాలను రూపొందించడం, వాటిని అమలు చేయడం కష్టంగా ఉంటుంది. ఇప్పటివరకు అల్గోరిథమిక్ ట్రేడింగ్ రంగంలో కేవలం పెద్ద పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లు, సాంకేతికంగా లోతైన అవగాహన ఉన్నవారే ఎక్కువగా రాణిస్తున్నారు. అయితే, ఈ సాంకేతిక అడ్డంకులను తొలగిస్తూ కోడింగ్ నైపుణ్యాలు, సంక్లిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండానే నేరుగా వాడుకునేందుకు సిద్ధంగా ఉన్న ట్రేడింగ్ వ్యూహాలను ఈ ‘అల్గోస్పేస్’ ద్వారా మార్కెట్లోకి తెచ్చినట్లు ‘5పైసా’ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ ఛార్జీలు మినహా, ఈ ‘అల్గోస్పేస్’ను వాడుకునేందుకు ఇన్వెస్టర్ల నుండి ఎలాంటి అదనపు ప్లాట్‌ఫామ్ ఫీజులు, కమీషన్లు వసూలు చేయమని స్పష్టం చేసింది. -
హైదరాబాద్‌లో అతి పెద్ద ‘పోర్షే ’ కార్ షోరూమ్
హైదరాబాద్: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల దిగ్గజం పోర్షే ఇండియా తాజాగా భారత్‌లో 911 జీటీ3ని ప్రవేశపెట్టింది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గంటకు 311 కి.మీ.దూరం ప్రయాణించగలదు. దీని ఎక్స్ షోరూం ధర రూ.3.32 కోట్లుగా ఉంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఇక, కంపెనీ దేశంలోనే అతిపెద్ద షోరూమ్ ‘పోర్షే సెంటర్’ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈవీఎమ్ ప్రీమియం కార్స్ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేసింది. దాదాపు 2,800 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో ఉండే ఈ లగ్జరీ సెంటర్లో సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ (3ఎస్) సేవలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. ‘డెస్టినేషన్ పోర్షే’ అనే వినూత్న డిజైన్ కాన్సెప్ట్‌తో ఈ షోరూమ్‌ను తీర్చిదిద్దారు. -
కంపెనీల ఆదాయాలపై పశ్చిమాసియా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీ కార్పొరేట్ల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపనున్నాయి. వీటికి ఎల్‌నినో ఎఫెక్ట్ కూడా తోడు కావడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉంది. సుమారు 100–150 బీపీఎస్ మేర తగ్గొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎల్ నినో పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతినవచ్చు. అలాగే కార్పొరేట్ రంగంలో పలు సంస్థల ఆదాయాలపైనా ప్రభావం పడొచ్చు. ‘క్రూడాయిల్ రేట్లు భగ్గుమనడం, రూపాయి క్షీణత వల్ల దిగుమతుల వ్యయాలు పెరిగిపోవడం కారణంగా 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) నిర్వహణ లాభాల మార్జిన్ (ఓపీఎం) 100–150 బేసిస్ పాయింట్ల (ఒకటి–ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉంది‘ అని ఇక్రా వెల్లడించింది. సమీప భవిష్యత్తులో కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎల్నినోపరంగా డిమాండ్‌కి రిసు్కలు పొంచి ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తోడై కార్పొరేట్ల ఆదాయాల మీద ప్రభావం పడొచ్చని వివరించింది. 2026–27లో కార్పొరేట్ ఇండియా ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్‌కి పరిమితం కావొచ్చని తెలిపింది. 2025–26 క్యూ4లో వార్షిక ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 13.2 శాతంగా నమోదైంది.ధరల పెంపుతో కాస్త ఊరట..పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధనాలు, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. అలాగే రూపాయి పతనంతో దిగుమతి చేసుకునే ముడి వస్తువుల ధరలూ పెరిగాయి. ఇవన్నీ వెరసి సమీప భవిష్యత్తులో లాభాల మార్జిన్లపై ప్రభావం చూపవచ్చు. అయితే, పాక్షికంగానే అయినప్పటికీ ధరలను పెంచడం వల్ల మార్జిన్లపై ఒత్తిడిని కంపెనీలు కొంత మేర అధిగమించవచ్చు. కాకపోతే, హఠాత్తుగా ధరలను పెంచేస్తే డిమాండ్ దెబ్బతిని, పోటీ సంస్థలతో పోలిస్తే వెనుకబడిపోయే అవకాశాలూ ఉన్నాయి. వేతన జీవుల ఆదాయాలు స్థిరంగా ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో వినియోగం కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా ఓవరాల్ డిమాండ్‌కి మాత్రం సవాళ్లు తప్పేలా లేవు. క్రూడాయిల్ ధరలు ఎగియడం, రూపాయి క్షీణించడంలాంటి అంశాల వల్ల వినియోగ ఆధారిత రంగాల్లో అమ్మకాల పరిమాణం.. ఆశించినంత స్థాయిలో పెరగకపోవచ్చు. ‘బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పశ్చిమాసియా సంక్షోభం వల్ల నిర్వహణ పరిస్థితులనేవి పెట్టుబడులకు అనువైనవిగా ఉండటం లేదు. తయారీ (డిఫెన్స్, ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇతరత్రా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వర్తించే సెగ్మెంట్లు), పవర్ పరికరాలు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లలాంటి కొన్ని నిర్దిష్ట రంగాల్లో మాత్రమే ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి‘ అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ (కార్పొరేట్ రేటింగ్స్) కింజల్ షా తెలిపారు. మధ్యకాలికంగా చూస్తే, అంతర్జాతీయ వాణిజ్యం, కమోడిటీల ధరలపరమైన హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ రిసు్కలు మొదలైన అనిశ్చితులను ఎదుర్కొనేందుకు రంగాలవారీ పరిణామాలు, విధానపరమైన చర్యలు ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నాయనే దానిపై దేశీ కార్పొరేట్ల రుణ పరపతి ఆధారపడి ఉంటుందని షా చెప్పారు. -
టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్ ..!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై 2027) లో 3–5 శాతం పరిమిత హోల్‌సేల్ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడే సూచనలు, ద్రవ్యోల్బణంతో వాహనాల ధరలు పెరగడం, గత ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన అత్యధిక విక్రయాల ప్రభావం (హై బేస్ ఎఫెక్ట్) వంటి అంశాలు ఈ రంగానికి సవాళ్లుగా మారొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. సానుకూలతలున్నా.. అంతర్జాతీయ సవాళ్లు పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగైన రిటైల్ విక్రయాల జోరు, నిలకడైన ఎగుమతుల మద్దతుతో ద్విచక్ర వాహన రంగం తన నిలకడైన ప్రదర్శనను చాటుకుంటోందని ఇక్రా పేర్కొంది. ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలతో వాహనాలు అందుబాటు ధరల్లోకి రావడం, పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణి మార్కెట్ వృద్ధికి సానుకూలంగా మారనున్నాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సప్లై చైన్‌ను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఆ పరిణామాలను క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుందని తెలిపింది. మేలో విక్రయాల జోరు దేశీయ హోల్‌సేల్ విక్రయాలు 2026 మే నెలలో వార్షిక ప్రాతిపదికన 15.7 శాతం బలమైన వృద్ధితో 19 లక్షల యూనిట్లకు చేరాయని ఇక్రా నివేదిక తెలిపింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాహన తయారీ కంపెనీలు ధరలు పెంచుతారనే ముందస్తు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైంది. ఇక రిటైల్ విక్రయాలు కూడా మే నెలలో ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్, ఎంట్రీ–లెవెల్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అయితే, దేశంలో నమోదైన విపరీతమైన ఎండల కారణంగా షోరూమ్‌లకు కస్టమర్ల రాక తగ్గడం, కొన్ని మోడళ్ల సరఫరాలో అంతరాయాలు వృద్ధి వేగాన్ని కొంతమేర నియంత్రించాయి. ఈ–టూ వీలర్స్ దూకుడు ఇక్రా నివేదికలో ఎలక్ట్రిక్ వాహన విభాగ ప్రదర్శన ఆకట్టుకుంది. 2026 మే నెలలో రిటైల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 71.7 శాతం వార్షిక వృద్ధితో 1,72,148 యూనిట్లకు చేరాయి. మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఈవీల వాటా ప్రస్తుతం 8.9 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మారుతున్న పర్యావరణ వ్యవస్థకు ఇది నిదర్శనమని ఇక్రా స్పష్టం చేసింది. -
జాబ్ కోసం పోతే.. షాకింగ్ అనుభవం!
జాబ్ మార్కెట్ కరోనా మహమ్మారి తర్వాత ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు వరుస తిరస్కరణలు, ఇంటర్వ్యూల తర్వాత స్పందన లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పూణేకు చెందిన ప్రణవ్ అనే యువకుడు ఎదుర్కొన్న అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఉద్యోగం కోసం నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరైన ప్రణవ్‌కు అక్కడ అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ఇంటర్వ్యూల్లో అభ్యర్థి నైపుణ్యాలు, ప్రాజెక్టులు, అనుభవం గురించి ప్రశ్నలు అడుగుతారు. కానీ ఈ సంస్థలో హెచ్ఆర్ ప్రతినిధి మొదట అడిగిన ప్రశ్న మాత్రం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. ''మీరు వచ్చే 6 నుంచి 8 నెలల వరకు జీతం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ తర్వాత మీ పనితీరు బాగుంటే జీతం ఇవ్వాలా వద్దా నిర్ణయిస్తాం'' అని అడిగినట్లు ప్రణవ్ వెల్లడించాడు.ఈ మాటలు విన్నప్పుడు వారు సరదాగా మాట్లాడుతున్నారని మొదట భావించినట్లు ప్రణవ్ చెప్పాడు. ఎన్నో సంవత్సరాలు చదివి, సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకుని, ప్రాజెక్టులు చేసి, ఇంటర్వ్యూలకు సిద్ధమై వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఉద్యోగాన్ని జీతం లేకుండా చేయమని చెప్పడం తనకు షాక్‌గా అనిపించిందని పేర్కొన్నాడు.ప్రణవ్ అభిప్రాయం ప్రకారం.. ఇది సాధారణ ఇంటర్న్‌షిప్ లేదా ట్రైనింగ్ లాంటిది కాదు. ఇంటర్న్‌షిప్‌లలో కొన్నిసార్లు స్టైపెండ్ లేకపోవచ్చు లేదా తక్కువ మొత్తంలో చెల్లించవచ్చు. కానీ ఇక్కడ కంపెనీ పూర్తి స్థాయి ఉద్యోగం కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తూ జీతం లేకుండా పనిచేయాలని అడగడం అన్యాయమని అతను భావించాడు.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ సంస్థలో సీఈఓ, హెచ్ఆర్ ప్రతినిధి మాత్రమే పనిచేస్తున్నట్లు తనకు కనిపించిందని, అయినప్పటికీ భారీ స్థాయిలో వాక్-ఇన్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారని తెలిపాడు. ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న యువత పరిస్థితిని కొన్ని సంస్థలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. పుణేలో ఇలాంటి అనేక స్టార్టప్‌లు ఉచిత శ్రమను పొందేందుకు ఉద్యోగాల పేరుతో అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు, ఒక సంస్థ ఉద్యోగికి జీతం చెల్లించలేకపోతే అతడిని ఉద్యోగిగా కాకుండా భాగస్వామిగా పరిగణించి కంపెనీలో వాటా ఇవ్వాలని సూచించారు.went for a walk-in interview today. safe to say, it was my first and probably my last.like most job seekers, i reached the venue with some hope. the market is already tough, so you try every opportunity that comes your way.the first round wasn’t even technical. it was with… pic.twitter.com/gdwOluRRgb— Pranavvv (@pranvv27) June 18, 2026 -
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
బంగారం ధరల భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల్లో ఏకంగా రూ.5670 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏడురోజుల్లో పసిడి ధరలలో జరిగిన మార్పులు, తాజా ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో జూన్ 14(ఆదివారం)న రూ.1,49,080 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు జూన్ 20(శనివారం) నాటికి రూ.1,46,080 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే కేవలం ఏడు రోజుల్లో రూ.3000 తగ్గినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల రేటు 1,36,650 రూపాయల నుంచి 1,33,900 రూపాయల (రూ.2750 తగ్గింది) వద్దకు చేరింది.వారం ప్రారంభంలో స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు.. ఆ తరువాత వరుసగా తగ్గడం మొదలైంది. వారాంతంలో ధరలు కొంత పెరిగాయి. దీంతో బంగారం ధరలలో ఊహకందని మార్పులు జరిగాయి.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలలో మార్పులు కనిపించాయి. దేశ రాజధాని నగరంలో గత ఆదివారం (జూన్ 14) రోజు 1,49,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం (జూన్ 20) నాటికి రూ.1,46,230 వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 1,36,800 రూపాయల నుంచి 1,34,050 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ జూన్ 14న రూ.1,51,200 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర జూన్ 20 నాటికి 1,48,370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,38,600 రూపాయల నుంచి రూ.1,36,000 వద్దకు చేరింది.ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. 16 రకాల మందులు బ్యాన్! -
అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు!
సాంకేతికాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అభయ్ కరందికర్ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్‌ను ఇతర దేశాల వారికి నిలిపివేసిన సందర్భంలో ఆయన ఈ సూచన చేశారు.ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు ఫ్యాబిల్ 5, మైథోస్ 5ను అమెరికాయేతర సంస్థలు, వ్యక్తులు పొందకుండా ట్రంప్ సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఫ్యాబిల్‌ను గత వారమే ఆంథ్రోపిక్ విడుదల చేయడం గమనార్హం. ‘‘స్థానిక ఏఐ సదుపాయాలు, హార్డ్‌వేర్ అభివృద్ధిలో భారత్ వెనుకబడి ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర సెమీకండక్టర్ చిప్‌లు లేదా ప్లాట్‌ఫామ్‌ల్లేవు.అమెరికా ప్రభుత్వం సరికొత్త ఎగుమతి నియంత్రణల ఆదేశాల నేపథ్యంలో టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ స్వావలంబన సాధించాలి’’అని కరందికర్ పేర్కొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఏఐ అప్లికేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పౌర సేవల్లో ఏఐ అమలు దిశగా నీతి ఆయోగ్ కృషి సాగిస్తుందన్నారు. డిజిటల్ ప్రజా సదుపాయాల అభివృద్ధిలో భారత్ ముందున్నట్టు చెప్పారు. ఫౌండేషన్ ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం 12 స్టార్టప్‌లకు ప్రభుత్వం సాయమందించినట్టు తెలిపారు. -
ఇండిగో కొత్త సర్వీస్.. రూ. 49తో క్యాబ్ బుకింగ్!
ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో తన సేవలను కేవలం విమాన ప్రయాణాలకే పరిమితం చేయకుండా, ప్రయాణికుల మొత్తం ట్రావెల్ అనుభవాన్ని సులభతరం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఇందులో భాగంగా 'క్యాబ్స్ విత్ ఇండిగో' (Cabs with IndiGo) అనే కొత్త ఎయిర్పోర్ట్ క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించింది.ఈ సర్వీస్ ప్రధాన ఉద్దేశ్యం ప్రయాణికులకు విమానాశ్రయానికి తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఇంటికి లేదా ఇతర గమ్యస్థానాలకు చేర్చడం. చాలా మంది ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలు.. చివరి నిమిషంలో క్యాబ్ క్యాన్సిలేషన్, సర్జ్ ప్రైసింగ్, లేదా క్యాబ్ అందుబాటులో లేకపోవడం. వీటన్నింటిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసింది.ఈ సర్వీసును మోజోబాక్స్ అనే టెక్ భాగస్వామ్యంతో అందిస్తోంది. ఇది భారతదేశంలోని అనేక నగరాల్లో.. ఎయిర్ ట్రావెల్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.ఈ సర్వీస్‌లో ముఖ్యమైన ఫీచర్స్కేవలం రూ.49 నుంచే క్యాబ్ బుకింగ్ అవకాశం100 శాతం కన్ఫర్మేషన్‌తో గ్యారంటీడ్ పికప్ముందుగా బుక్ చేస్తే స్పష్టమైన ధరలుసర్జ్ ఛార్జీలు లేకపోవడంపికప్ టైమ్ వరకు ఫ్రీ క్యాన్సిలేషన్30 నిమిషాల ఫ్రీ వెయిటింగ్ టైమ్ఈ సౌకర్యాల వల్ల ప్రయాణికులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్వీసును ఇండిగో బ్లూచిప్ లాయల్టీ ప్రోగ్రామ్‌తో కూడా అనుసంధానం చేసింది. కాబట్టి దీని ద్వారా వినియోగదారులు ప్రతి రూ.100 ఖర్చుపై 5 బ్లూచిప్ రివార్డ్స్ సంపాదించవచ్చు. అంటే విమాన ప్రయాణాలతో పాటు క్యాబ్ బుకింగ్‌లో కూడా రివార్డ్స్ పొందే అవకాశం ఉంటుంది.ఇటీవలి కాలంలో ఇండిగో తన సేవలను విస్తరిస్తూ.. హోటల్ బుకింగ్స్, ట్రావెల్ ఎక్స్పీరియెన్సెస్ వంటి అనేక సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందిస్తోంది. ఇప్పుడు క్యాబ్ సర్వీస్ కూడా చేరడంతో, ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా మారింది. -
2026 పల్సర్ 220ఎఫ్: రూ.1.36 లక్షలు!
బజాజ్ ఆటో తన పల్సర్ 220ఎఫ్ బైకును అప్డేటెడ్ ఫీచర్‌తో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ మోడల్ ధర రూ.1.36 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ బైక్ రేటు కంటే రూ.8000 ఎక్కువ.పల్సర్ 220ఎఫ్ బైకులో అప్డేటెడ్ ఫీచర్ ఎల్ఈడీ హెడ్లైట. గతంలో కంపెనీ దీనిని కొత్త గ్రాఫిక్స్, ఎల్ఈడీ ఇండికేటర్లు, కొత్త కలర్ స్కీమ్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హాలోజన్ సెటప్ స్థానంలో, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs)తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌ను అమర్చింది.లైటింగ్ అప్‌గ్రేడ్ మినహా, మోటార్‌సైకిల్ మెకానికల్‌గా ఎలాంటి మార్పు పొందలేదు. కాబట్టి ఇది 20.9 హార్స్ పవర్, 18.6 న్యూటన్ మీటర్ టార్క్ అందించే అదే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.బజాజ్ పోర్ట్‌ఫోలియోలోని అత్యంత పురాతన మోటార్‌సైకిళ్లలో పల్సర్ 220F ఒకటి. అయితే కంపెనీ తన కస్టమర్ల అభిరుచి మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. కాగా కంపెనీ కొత్త జనరేషన్ పల్సర్ 125ను టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. బహుశా ఇది రానున్న రోజుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ! -
కేంద్రం కీలక ప్రకటన.. 16 రకాల మందులు బ్యాన్!
ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ఈ మందులకు సరైన వైద్యపరమైన ఆధారాలు లేకపోవడంతో పాటు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణుల కమిటీ తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులు అంటే.. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను ఒకే మాత్ర లేదా ఔషధ రూపంలో నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి తయారు చేసేవి. కొన్ని సందర్భాల్లో ఇవి రోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంటుంది.ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ ఔషధ కలయికలను సమీక్షించి, వైద్యపరంగా సమర్థించలేని, చికిత్సాపరంగా ప్రయోజనం లేని లేదా హానికరంగా మారే అవకాశమున్న మందులను గుర్తించింది.కంపెనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A కింద నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గుర్తించిన 16 రకాల ఎఫ్డీసీ మందుల తయారీ, విక్రయం, పంపిణీ, సరఫరాను దేశవ్యాప్తంగా వెంటనే బ్యాన్ చేసింది.కేంద్రం నిషేదించిన మందుల జాబితాలో యాంటీబయాటిక్ మిశ్రమాలు, నొప్పి నివారణ ఫార్ములేషన్లు, యాంటిస్పాస్మోడిక్ మందులు, కొన్ని చర్మ సంబంధిత తయారీలు ఉన్నాయి.ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ విత్ ఇథోహెప్టాజైన్; డైసైక్లోమైన్, పారాసెటమాల్ అండ్ క్లిడినియం బ్రోమైడ్; డైసైక్లోమైన్, పారాసెటమాల్, క్లిడినియం బ్రోమైడ్ అండ్ క్లోర్డియాజెపాక్సైడ్; గ్లిక్లాజైడ్ అండ్ క్రోమియం పికోలినేట్; అండ్ పారాసెటమాల్ అండ్ లిగ్నోకైన్ వంటి కాంబినేషన్లు నిషేధానికి గురయ్యాయి.అమోక్సిసిలిన్ విత్ సెరాటియోపెప్టిడేస్, అమోక్సిసిలిన్ విత్ సెరాటియోపెప్టిడేస్ అండ్ లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్, అమోక్సిసిలిన్ విత్ క్లోక్సాసిలిన్, లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ అండ్ సెరాటియోపెప్టిడేస్, సెఫాడ్రాక్సిల్తో ప్రోబెనెసిడ్, అండ్ సెఫ్యూరాక్సిమ్ విత్ సెరాటియోపెప్టిడేస్ వంటి యాంటీబయాటిక్స్‌ను కూడా నిషేధించారు. వీటికి తగిన చికిత్సా ప్రయోజనం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.చర్మ సంరక్షణ ఉత్పత్తుల విభాగంలో.. అలోవేరా లేదా అలోవేరా ఎక్స్‌ట్రాక్, విటమిన్ ఈ, జోజోబా ఆయిల్, ఆరంజ్ ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, అల్లంటోయిన్, డి-పాంథెనాల్ వంటివి ఉన్నాయి.సురక్షితమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడానికి కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఇలాంటి ఎఫ్డీసీ మందులను ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు, నియంత్రణ సంస్థలు, అమలు విభాగాలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర సంబంధిత సంస్థలు చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. -
సంపదకు అసలైన మార్గం.. కియోసాకి మూడు సూత్రాలు!
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి 'రిచ్ డాడ్ పూర్ డాడ్'. దీని రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఆర్థిక ఆలోచనలతో ఎంతో మంది పెట్టుబడిదారులను ప్రభావితం చేశారు. ఆయన చెప్పిన కొన్ని విషయాలు సాధారణంగా ప్రజలు నమ్మే ఆర్థిక సూత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన మూడు వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి.మీ ఇల్లు ఒక ఆస్తి కాదుసాధారణంగా చాలామంది తమ ఇంటిని జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా భావిస్తారు. కానీ కియోసాకి అభిప్రాయం ప్రకారం.. ఒక ఆస్తి అంటే మీ జేబులోకి డబ్బు తీసుకురావాలి. మీరు నివసిస్తున్న ఇంటి వల్ల ఆదాయం రాకపోగా, హౌస్ లోన్ EMIలు, పన్నులు, నిర్వహణ ఖర్చులు వంటి వ్యయాలు పెరుగుతాయి. అందువల్ల అది నిజమైన ఆస్తి కాదని ఆయన చెబుతారు. అయితే అద్దెకు ఇచ్చి ఆదాయం వచ్చే ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీ మాత్రం ఆస్తిగా పరిగణించవచ్చని ఆయన అభిప్రాయం.పొదుపు చేసేవారు నష్టపోతారుసాధారణంగా డబ్బు పొదుపు చేయడం మంచి అలవాటుగా భావిస్తారు. కానీ కియోసాకి దృష్టిలో కేవలం బ్యాంకులో డబ్బు నిల్వ ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం కారణంగా దాని కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఉదాహరణకు.. ఈరోజు రూ.100తో కొనగలిగే వస్తువు కొన్నేళ్ల తర్వాత రూ.120 లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. అందువల్ల డబ్బును కేవలం సేవింగ్స్ ఖాతాలో ఉంచడం కంటే పెట్టుబడుల రూపంలో పెంచుకోవాలని ఆయన సూచిస్తారు.ధనవంతులు డబ్బు కోసం పని చేయరుచాలామంది ఉద్యోగం చేసి జీతం సంపాదించడం ద్వారా ఆర్థిక భద్రత పొందాలని భావిస్తారు. అయితే.. కియోసాకి ప్రకారం ధనవంతులు తమ సమయాన్ని డబ్బుకు అమ్ముకోరు. వారు.. వ్యాపారాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ లేదా ఇతర ఆదాయ వనరులను సృష్టించి డబ్బు తమ కోసం పనిచేసేలా చేస్తారు. అంటే, వారు ఒకసారి నిర్మించిన ఆస్తులు నిరంతరం ఆదాయం తెచ్చిపెడతాయి. అందుకే సంపన్నులు సంపాదన కోసం మాత్రమే పనిచేయకుండా, ఆదాయాన్ని సృష్టించే వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెడతారని ఆయన వివరిస్తారు.నిజానికి రాబర్ట్ కియోసాకి అభిప్రాయాలు అందరూ అంగీకరించకపోయినా, డబ్బు, పెట్టుబడులు, సంపద గురించి కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తాయి. కేవలం సంపాదించడం లేదా పొదుపు చేయడం కాకుండా, ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను నిర్మించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్వాతంత్య్రం సాధించవచ్చని ఆయన అభిప్రాయం.Robert Kiyosaki reveals his 3 most controversial statements…-Your house is not an asset-Savers are losers-The rich don't work for money pic.twitter.com/ayJVrWZBwR— The Iced Coffee Hour (@TheICHpodcast) June 19, 2026 -
RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ!
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫ్లయింగ్ ఫ్లీ C6 డెలివరీలు (బెంగళూరులో) ప్రారభించింది. కేవలం వాహనాన్ని విక్రయించడం మాత్రమే కాకుండా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు స్పెషల్ సపోర్ట్ నెట్‌వర్క్‌ను కూడా సంస్థ ఏర్పాటు చేసింది.రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే ఉన్న షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో షాప్-ఇన్-షాప్ విధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా ప్రత్యేకంగా కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయకుండా.. ఇప్పటికే ఉన్న డీలర్ నెట్వర్క్ ద్వారా ఫ్లయింగ్ ఫ్లీ బైకును విస్తరించనున్నారు. అంతే కాకుండా.. వినియోగదారులకు 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ప్రయాణ సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే సహాయం అందించేలా ఉంటుంది.ఫ్లయింగ్ ఫ్లీ C6 ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే.. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) స్కీమ్ ద్వారా ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 1.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాలి. దీని వల్ల ప్రారంభ పెట్టుబడి తగ్గి, మరింత మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని సులభంగా కొనుగోలు చేసే అవకాశం పొందుతారు.ఈ మోటార్‌సైకిల్‌లో 3.91 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 154 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఉన్న పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 15.4 కిలోవాట్ల పవర్, 60 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 0 నుంచి 60 కిమీ వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.ఫ్లయింగ్ ఫ్లీ C6 బరువు కేవలం 124 కిలోలు మాత్రమే ఉండటం వల్ల ఇది తేలికగా ఉంటుంది. అయితే 19 అంగుళాల పెద్ద చక్రాలు, సన్నని 90 సెక్షన్ టైర్లు నగర రహదారులపై సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి.ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 3.5 అంగుళాల రౌండ్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, అడ్జస్టబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐదు రైడింగ్ మోడ్లు, లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి. ఇవి రైడింగ్‌ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి. -
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీవోకి ఓకే..
న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద ఫండ్ హౌస్ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఇష్యూ పరిమాణం సుమారు రూ. 13,000 కోట్లుగా ఉండొచ్చని, వచ్చే నెలలో ప్రారంభం కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. మార్చి నెలలో కంపెనీ సమర్పించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రమోటర్లు 20.37 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ఉండదు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్యారిస్‌కి చెందిన ఆమండి మధ్య జాయింట్ వెంచర్‌గా 1987లో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇందులో ఎస్బీఐకి 61.98 శాతం, ఆమండికి 36.40 శాతం వాటాలు ఉన్నాయి. త్రైమాసిక సగటు ప్రాతిపదికన ఎస్బీఐ ఎంఎఫ్ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం దాదాపు రూ. 12.5 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇప్పటికే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, శ్రీరామ్ ఏఎంసీ, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ మొదలైనవి మ్యుచువల్ ఫండ్ విభాగం నుంచి లిస్టయిన సంస్థల్లో ఉన్నాయి.లిస్టులో మరో 4 కంపెనీలుమార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో నాలుగు కంపెనీల ఐపీవోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏజీఎస్ హెల్త్, పీజీపీ గ్లాస్, శ్రేణి షేర్స్, ఎస్ఆర్ఐటీ ఇండియా ఈ జాబితాలో ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చ్ మధ్యలో ఈ కంపెనీలు ముసాయిదా పత్రాలను దాఖలు చేయగా, జూన్ 16–19 మధ్య సెబీ.. అబ్జర్వేషన్లు ఇచ్చింది. సెబీ పరిభాషలో వీటిని నియంత్రణ సంస్థ ఆమోదంగా పరిగణిస్తారు. ఏజీఎస్ హెల్త్, పీజీపీ గ్లాస్ మార్చి నెలలో తమ ముసాయిదా పత్రాలను గోప్యతా విధానంలో సెబీకి సమర్పించాయి. స్టాక్ బ్రోకింగ్ సంస్థ శ్రేణి షేర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో 69 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రస్తుత షేర్హోల్డర్లు 82 లక్షల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నారు.తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్.. సాధారణ కార్పొరేట్ అవసరాలు, నిర్దిష్ట రుణాల చెల్లింపు మొదలైన వాటి కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది. ఇక ఎస్ఆర్ఐటీ ఇండియా ఐపీవోలో భాగంగా మొత్తం 1.68 కోట్ల షేర్లను తాజా ఇష్యూ కింద కంపెనీ విక్రయించనుంది. ఐపీవో నిధులను ప్రస్తుత ఉత్పత్తుల ఆధునీకరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర సంస్థల కొనుగోళ్లు మొదలైన వాటి కోసం కంపెనీ విక్రయించనుంది. -
ఈపీఎఫ్ సభ్యులకు త్వరలో డబుల్ ధమాకా!
దేశంలోని 7 కోట్లకు పైగా ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) సభ్యులకు త్వరలో రెండు కీలక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ జమ, రెండోది ఈపీఎఫ్ సభ్యులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం.8.25 శాతం వడ్డీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫారసు చేయగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశముందని సమాచారం. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా సభ్యులకు 8.25 శాతం వడ్డీ లభించనుంది.ఈపీఎఫ్ ఏటీఎం/యూపీఐ విత్డ్రాఇదే సమయంలో ఈపీఎఫ్ఓ తన సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చే ‘ఈపీఎఫ్ఓ 3.0’ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సభ్యులు పేపర్‌లెస్ విధానంలో పీఎఫ్ క్లెయిమ్‌లు దాఖలు చేయడం, ఖాతాల బదిలీలు చేయడం, అలాగే అర్హత ఉన్న మొత్తాన్ని యూపీఐ లేదా యూపీఐ-సపోర్టెడ్ ఏటీఎంల ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ సదుపాయం కోసం అవసరమైన సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.ప్రతిపాదిత విధానాల ప్రకారం సభ్యుల పీఎఫ్ నిధుల్లో కొంత భాగాన్ని రిటైర్మెంట్ భద్రత కోసం కొనసాగిస్తూ, అర్హత ఉన్న మొత్తంలో 50 నుంచి 75 శాతం వరకు యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పించే దిశగా ఈపీఎఫ్ఓ పనిచేస్తోంది. అయితే ఈ నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని, అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే తుది వివరాలు స్పష్టమవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇక సభ్యుల సౌకర్యార్థం ఆటో-సెటిల్మెంట్ క్లెయిమ్ పరిమితిని ఇప్పటికే రూ.5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్ఓ, వైద్యం, విద్య, గృహ నిర్మాణం, వివాహం వంటి అవసరాలకు సంబంధించిన క్లెయిమ్‌లను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఉమాంగ్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్, వాట్సాప్ ఆధారిత సేవలు, తక్షణ పాస్‌బుక్ యాక్సెస్, ఆన్లైన్ వివరాల సవరణ వంటి సదుపాయాలు కూడా మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. -
ప్రపంచ స్టీల్ డిమాండ్‌ను శాసించేది భారత్
న్యూఢిల్లీ: భారత్‌లో స్టీల్ వినియోగం రానున్న దశాబ్దాల్లో భారీగా పెరగనుందని ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తెలిపారు. దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ మౌలిక వసతుల విస్తరణ, వేగవంతమైన పట్టణీకరణ, గృహ నిర్మాణ రంగ వృద్ధి, హరిత ఇంధన ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు స్టీల్‌కు బలమైన డిమాండ్‌ను సృష్టిస్తాయని పేర్కొన్నారు. తద్వారా ప్రపంచ స్టీల్ డిమాండ్ పెరుగుదలకు భారత్ కీలక మార్కెట్‌గా, ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా అవతరించనుందని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లో జరిగిన ‘గ్లోబల్ స్టీల్ డైనమిక్స్ ఫోరమ్ 2026’ సదస్సులో వీడియో సందేశం ద్వారా మిట్టల్ మాట్లాడారు.ఇకపై భారత్ వంతు.. వచ్చే జూలై 31 నాటికి ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లక్ష్మీ మిట్టల్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘చైనా అసాధారణ వృద్ధికి గడిచిన 20 ఏళ్లు సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు భారత్ వంతు వచి్చంది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతుల విస్తరణ, పట్టణ గృహ నిర్మాణ రంగంలో వృద్ధి, ఇంధన పరివర్తనకు అవసరమైన ప్రాజెక్టుల కల్పన తదితర అంశాలు ఉక్కు రంగంలో భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి’’ అని మిట్టల్ పేర్కొన్నారు. విలీనంతో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నాం 2006లో మిట్టల్ స్టీల్, ఆర్సెలర్ సంస్థల విలీనంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా ఆర్సెలర్‌మిట్టల్ ఆవిర్భవించిందని లక్ష్మీ మిట్టల్ తెలిపారు. ఈ విలీనం సంస్థకు పరిమాణం (స్కేల్), వ్యాపార వైవిధ్యం, స్థిరత్వం, వ్యూహాత్మక విస్తరణ పరంగా గణనీయ బలాన్ని చేకూర్చిందన్నారు. ‘‘20 ఏళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఈ విలీనం మరింత బలమైన సంస్థను నిర్మించిందనే నమ్మకం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, కోవిడ్–19 మహమ్మారి వంటి ఊహించని ‘బ్లాక్ స్వాన్’ పరిణామాల ప్రభావాలు ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ, ఈ సవాళ్లను విలీన సంస్థగా మరింత సమర్థంగా ఎదుర్కోగలిగాం. భారీ వ్యాపార పరిమాణం, విభిన్న మార్కెట్లలో ఉనికి, సంక్షోభాలను తట్టుకునే సామర్థ్యం మాకు బలంగా నిలిచాయి’’ అని మిట్టల్ వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో మారుతున్న రంగం.. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం స్టీల్ పరిశ్రమ పూర్తిగా గ్లోబలైజ్ అయిందని, సాంకేతికత, డేటా ఆధారితంగా రూపాంతరం చెందిందని మిట్టల్ అభిప్రాయపడ్డారు. ఉక్కు మార్కెట్లను రూపొందించడంలో ఆయా దేశాల ’స్థానిక పారిశ్రామిక విధానాలు’ కూడా ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. పర్యావరణ, నియంత్రణ సంస్థల ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో డిమాండ్, కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసం జరుగుతున్న పెట్టుబడుల వల్ల స్టీల్ రంగానికి దీర్ఘకాలంలో తిరుగుండదన్నారు. ‘‘స్టీల్ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా నేను ఉండాలనుకునే రంగం ఇదే. భవిష్యత్తులోనూ అనూహ్య సవాళ్లు ఎదురైనా, ఈ రంగం దీర్ఘకాలిక ఫండమెంటల్స్ మాత్రం బలంగానే ఉన్నాయి’’ అని మిట్టల్ అన్నారు. -
తగ్గుతున్న బంగారం ధరల్లో మార్పు..
దేశంలో వరుసగా తగ్గుతున్న బంగారం ధరల్లో మార్పు వచ్చింది. గత నాలుగు రోజులుగా పతనమైన పసిడి ధరలు(Today Gold Rate) నేడు పుంజుకున్నాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఒక్క ఫ్లాట్ రూ .121 కోట్లు.. రికార్డ్ ‘రియల్’ డీల్!
భారత లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో కళ్లు చెదిరే ఖరీదైన డీల్ నమోదైంది. ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ మురళీధర్ కేలా.. డీఎల్ఎఫ్ అత్యంత విలాసవంతమైన నివాస ప్రాజెక్ట్ ‘ది దహ్లియాస్’లో ఒక అపార్ట్‌మెంట్‌ను రూ.120.71 కోట్లకు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ పరిశీలించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ ఒప్పందం ఏప్రిల్ 15, 2026న నమోదైంది. అపార్ట్మెంట్ విస్తీర్ణం 6,233 చదరపు అడుగులు కాగా, ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.హర్యానాలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్లో ఉన్న సెక్టార్–54 ప్రాంతం దేశంలోనే అత్యంత ప్రీమియం నివాస కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతోంది. డీఎల్ఎఫ్ సిటీ ఫేజ్–5లో అభివృద్ధి చేస్తున్న ‘ది దహ్లియాస్’ ప్రాజెక్ట్ ఇప్పటికే దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, అధిక సంపన్నుల దృష్టిని ఆకర్షిస్తోంది. చదరపు అడుగుకు దాదాపు రూ.1.9 లక్షలకుపైగా విలువతో జరిగిన ఈ డీల్ గురుగ్రామ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త రికార్డుగా నిలిచింది.స్టాక్ మార్కెట్లో కింగ్.. కేలాస్టాక్ మార్కెట్లో ప్రముఖ ఇన్వెస్టర్‌గా పేరుగాంచిన కేలా (Madhusudan Kela) , ప్రస్తుతం పలు లిస్టెడ్ కంపెనీల్లో గణనీయమైన వాటాలు కలిగి ఉన్నారు. తాజా షేర్‌హోల్డింగ్ వివరాల ప్రకారం, ఆయన పెట్టుబడుల మార్కెట్ విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఆయన లగ్జరీ రియల్ ఎస్టేట్‌లో చేసిన భారీ పెట్టుబడి, సంపన్న వర్గాలు నివాస ఆస్తులను కేవలం విలాసానికి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా కూడా చూస్తున్నాయనే ధోరణిని మరోసారి స్పష్టం చేసింది.డీఎల్ఎఫ్ 2024 అక్టోబర్‌లో ప్రారంభించిన 17 ఎకరాల ‘ది దహ్లియాస్’ ప్రాజెక్ట్‌లో మొత్తం 420 అపార్ట్మెంట్లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. కంపెనీ తాజా వివరాల ప్రకారం, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌లో దాదాపు 60 శాతం యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.18,500 కోట్లకుపైగా అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్ ఆదాయ సామర్థ్యం రూ.40,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.విస్తరిస్తున్న అల్ట్రా-లగ్జరీ హౌసింగ్భారత్లో అల్ట్రా-లగ్జరీ హౌసింగ్ విభాగం గత రెండేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.10 కోట్లకు పైబడిన గృహాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. పరిమిత సరఫరా, ప్రీమియం లొకేషన్లు, అధిక సంపన్నుల పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇటువంటి ప్రాజెక్ట్‌ల ధరలు వేగంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మధుసూదన్ కేలా తాజా కొనుగోలు కూడా అదే ధోరణికి నిదర్శనంగా నిలిచింది. -
జెనరేటివ్ ఏఐతో రియల్ ఎస్టేట్‌కి మహర్దశ
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఏఐతో భారత రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ సాంకేతికత రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని, తద్వారా రాబోయే ఏడేళ్లలో 14 నుంచి 17 బిలియన్ డాలర్ల వరకు (రూ. 1.33–1.61 లక్షల కోట్ల) అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఈవై పార్థెనాన్, క్రెడాయ్ సంయుక్త నివేదిక అంచనా వేసింది. జెనరేటివ్ ఏఐతో నిర్మాణ రంగం పనితీరు మెరుగుపడటమే కాకుండా, అమ్మకాల వేగం 30 – 50 శాతం వరకు పెరుగుతుందని స్పష్టం చేసింది.నివేదికలోని ముఖ్యాంశాలు..జెనరేటివ్ ఏఐ వినియోగంతో ఇళ్ల అమ్మకాల వేగం పెరగడమే కాకుండా, కొత్త ప్రాజెక్టులను మార్కెట్లోకి ప్రవేశపెట్టే సమయం 30 శాతం వరకు తగ్గుతుంది.వచ్చే ఏడేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం నమోదు చేసే మొత్తం స్థూల విలువ జోడింపులో జెనరేటివ్ ఏఐ రూపంలో 3–4 శాతంగా ఉంటుంది. భూమి కొనుగోలు నుంచి ప్రాజెక్ట్ ప్రారంభించే మధ్య కాలవ్యవధి 20–30 శాతం వరకు తగ్గుతుంది. అలాగే నిర్మాణ వ్యయం, కాలపరిమితిలోనూ 5 నుంచి 20 శాతం వరకు ఆదా అవుతుంది.ప్రస్తుత డేటా ఆధారంగా కొత్త ఐడియాలు, డిజైన్ల సృష్టిలో సాయపడుతుంది. రంగం ముఖచిత్రానే మార్చేస్తుంది..రియల్ ఎస్టేట్ రంగంలో తదుపరి వృద్ధి కేవలం వ్యాపార విస్తరణ పైనే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సరైన నిర్ణయాలను వేగంగా తీసుకోవడం పైనే ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక విడుదల సందర్భంగా క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ జి పటేల్ చెప్పారు. ‘‘నిర్వహణ సామర్థ్యంతోపాటు ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, విక్రయాలు, కస్టమర్లతో సంబంధాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్పందించంలోనూ జెనరేటివ్ ఏఐ కీలక పాత్ర పోషించనుంది’’అని వివరించారు. -
భారత్‌లో ‘వాటర్ పాజిటివ్’గా అమెజాన్
కృత్రిమ మేధస్సు (AI) విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి నీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ భారత్‌లో నీటి సంరక్షణ రంగంలో కీలక మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. కంపెనీ భారత కార్యకలాపాలు 2026లో “వాటర్ పాజిటివ్” హోదాను సాధించాయని తెలిపింది. అంటే డేటా సెంటర్లు, కార్పొరేట్ కార్యాలయాలు, గిడ్డంగులు కలిపి వినియోగించే నీటి కంటే ఎక్కువ పరిమాణాన్ని వివిధ పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా సమాజానికి తిరిగి అందిస్తున్నట్లు అర్థం.అమెజాన్ తన కేంద్రాల్లో నీటి వినియోగాన్ని తగ్గించడం, వాటర్‌షెడ్ పునరుద్ధరణ, సమర్థవంతమైన నీటిపారుదల ప్రాజెక్టులు, సరస్సుల పునరుద్ధరణ వంటి చర్యల వల్ల ఈ లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించిన గడువుకంటే ఏడాది ముందే చేరుకుంది. బెంగళూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఏటా సుమారు 32.5 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేసే కార్యక్రమాలను కూడా సంస్థ అమలు చేస్తోంది.ఏఐ సేవల విస్తరణతో డేటా సెంటర్ల విద్యుత్, నీటి అవసరాలు పెరుగుతున్నాయని పర్యావరణ సంస్థలు, వాటాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు తమ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే చర్యలను వేగవంతం చేస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన డేటా సెంటర్ కార్యకలాపాలను వాటర్ పాజిటివ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లోని తమ డేటా సెంటర్లలో శీతలీకరణ కోసం నీటిని ఉపయోగించడం లేదని సంస్థ స్పష్టం చేసింది.భారత్‌లో నీటి సంక్షోభం మరింత తీవ్రంగా మారుతున్న తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచినీటి వనరుల్లో దేశం వాటా కేవలం 4 శాతమే. ఇటీవల బలహీన రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నీటి కొరత తీవ్రమైంది. ముంబై వంటి మహానగరాల్లో కూడా నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి.ఇదిలా ఉండగా, అమెజాన్ 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇందులో క్లౌడ్ విభాగమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మహారాష్ట్రలోనే సుమారు 8.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా భారత డేటా సెంటర్ రంగంలో భారీ పెట్టుబడులను ప్రకటించడంతో దేశంలో డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ మరింత వేగం పుంజుకుంటోంది. -
మళ్లీ ఓపెన్ మార్కెట్లో షేర్ల బైబ్యాక్
ముంబై: ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్ల బైబ్యాక్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తరహా బైబ్యాక్‌లను ప్రకటించిన 66 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కేటాయించిన మొత్తంలో కనీసం 40 శాతం నిధులను ప్రథమార్ధంలో వెచి్చంచాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం విడిగా ట్రేడింగ్ విండోను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సెబీ తెలిపింది.నిబంధనల్లో మార్పుల కారణంగా 2025 ఏప్రిల్ 1 నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా బైబ్యాక్ విధానాన్ని నిలిపివేశారు. సెబీ ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌ల గురించిన వివరాలను పత్రికల ద్వారా బహిరంగ ప్రకటనలతో పాటు ఎల్రక్టానిక్ పద్ధతిలో షేర్హోల్డర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. మర్చంట్ బ్యాంకరును నియమించుకోవడమనేది కంపెనీ విచక్షణ మేరకు ఉంటుంది.పబ్లిక్ వాటాదారులు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సాధారణంగా విక్రయించినప్పుడు వర్తించే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సే.. ఈ బైబ్యాక్‌లో విక్రయించే షేర్లకు కూడా వర్తిస్తుంది. ఈ వ్యవధిలో ప్రమోటర్లు, వారికి సంబంధమున్న వారి షేర్లను ఫ్రీజ్ చేస్తారు. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) నిబంధనల పరిమితికి మించి బైబ్యాక్‌లను చేపట్టడానికి ఉండదు. ఏఐఎఫ్‌లు వేగవంతం .. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) మరింత వేగవంతంగా స్కీములను ప్రవేశపెట్టేందుకు వీలుగా కొత్త గ్రీన్ చానల్ విధానం ’గరుడ’కి సెబీ బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనితో మెమొరాండంలను సమరి్పంచిన 10 రోజుల వ్యవధిలోనే ఫండ్స్ నిధులను సమీకరించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇందుకు 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. నాన్–అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ స్కీములు, అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ – ఓన్లీ పథకాలు, ఏంజెల్ ఫండ్స్ (రెగ్యులర్ స్కీములు)కి ఇది వర్తిస్తుంది.ఏఐ స్కీములు, ఏంజెల్ ఫండ్లు .. ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమొరాండంలను (పీపీఎం) మర్చంట్ బ్యాంకర్ల అవసరం లేకుండా ఫండ్ మేనేజర్ల ద్వారా నేరుగా సమర్పించవచ్చు. పీపీఎంని సమర్పించాక సమీక్ష వ్యవధి పూర్తయ్యేంత వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తక్షణమే స్కీములను ప్రారంభించవచ్చు. అటు సోషల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎస్ఎస్ఈ)కి సంబంధించిన కెపాసిటీ బిల్డింగ్ ఫండ్ (సీబీఎఫ్) నిధులు, నిర్వహణ బాధ్యతలను నాబార్డ్ నుంచి తప్పించి కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఈ–సీబీఎఫ్కి బదలాయించే ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. రిజిస్టర్డ్ ఏఐఎఫ్‌లు 1,849 ..సెబీ డేటా ప్రకారం అయిదేళ్ల క్రితం రిజిస్టర్డ్ ఏఐఎఫ్‌ల సంఖ్య 732గా ఉండగా 2026 మార్చి 31 నాటికి 135 శాతం వృద్ధి చెంది 1,849కి చేరింది. 2025 డిసెంబర్ 31 నాటికి స్థూల పెట్టుబడుల ప్రతిపాదనలు రూ. 15.74 లక్షల కోట్లుగా ఉండగా, నికర పెట్టుబడులు రూ. 6.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది 649గా ఉన్న అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ల సంఖ్య 2026 ఏప్రిల్ 30 నాటికి 2,773కి ఎగిసింది. 2025 డిసెంబర్ 31 నాటికి వీరి చేతుల్లో రూ. 1.91 లక్షల కోట్ల విలువ చేసే ఏఐఎఫ్ యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఏఐఎఫ్ పెట్టుబడుల్లో ఇది సుమారు 30 శాతం. -
పసిడి వరుస పతనం
న్యూఢిల్లీ: పసిడి, వెండి వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.8,040 నష్టపోయి రూ.2,40,700 వద్ద స్థిరపడింది. తద్వారా రెండున్నర నెలల కనిష్టానికి (ఏప్రిల్ 7 తర్వాత) చేరుకుంది. బంగారం 10 గ్రాములకు రూ.2,840 నష్టంతో రూ.1,50,600 స్థాయికి దిగొచ్చింది. డాలర్ బలపడడం అమ్మకాలకు ప్రేరణనిచ్చింది.అమెరికా వడ్డీ రేట్లు అధిక స్థాయిలోనే మరికొన్నాళ్లు కొనసాగుతాయన్న స్పష్టత నేపథ్యంలో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపడం బులియన్ మార్కెట్‌పై ఒత్తిడికి దారితీసినట్టు విశ్లేషకుల అభిప్రాయం. డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టానికి చేరినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 1.5% నష్టంతో 4,180 డాలర్లు, వెండి 2% నష్టపోయి 65 డాలర్ల స్థాయికి వచ్చాయి. -
జియో మెగా ఐపీఓకు సై!
టెలిక, డిజిటల్ సేవల్లో సంచలనాలు సృష్టిస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీఓకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. 49వ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ పబ్లిక్ ఆఫర్‌ను ప్రకటించారు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి జియో అడుగుపెడుతుండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లీన్ ఎనర్జీ, కన్జూమర్ వ్యాపారాల్లో భారీ ప్రణాళికలకు రిలయన్స్ తెరతీసింది.ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దిశగా కీలక అడుగుపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్ల బోర్డు ఐపీఓకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచినట్లు ఏజీఎంలో ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డులకెక్కనున్న ఈ ఇష్యూ ద్వారా జియో రూ.10 ముఖ విలువ గల 27 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా జియో రూ.37,700 కోట్ల (4 బిలియన్ డాలర్లు) కోట్లు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ మార్కెట్ విలువను 137 బిలియన్ డాలర్లు దాదాపు (రూ.13 లక్షల కోట్లు)గా లెక్కగడుతున్నారు. జియో టాప్... దేశంలో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా రూ.27,870 కోట్ల ఇష్యూతో హ్యుందాయ్ నిలుస్తోంది. తాజాగా ఎన్ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. ఇప్పుడు జియో ఇష్యూ పూర్తయితే ఈ రికార్డులన్నీ చెరిపేసి ‘టాప్’లేపనుంది. కాగా, 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓగా కూడా ఇది నిలుస్తుంది.టెలికం టు డిజిటల్ టెక్నాలజీ దిగ్గజం 2016లో సేవలు ప్రారంభించిన జియో.. దశాబ్దకాలంలో దేశ టెలికం స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. భారత్‌లో మొబైల్ డేటా విప్లవాన్ని తీసుకొచి్చంది. ముఖ్యంగా టెలికం నుంచి.. క్లౌడ్ సరీ్వసులు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లు, ఏఐ ఇలా వివిధ రంగాల్లోకి విస్తరించి.. పూర్తి స్థాయి డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. ఏఐ ఇన్ఫ్రాతో పాటు ప్రత్యేకంగా భారత్ కోసం ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ది చేసేందుకు ఎని్వడియాతో 2023లో జియో జట్టుకట్టడం తెలిసిందే. 2026 నుంచి ఏడేళ్లలో ఏఐ కార్యకలాపాల కోసం రూ. 10 లక్షల కోట్లను వెచి్చంచనున్నట్లు కూడా అంబానీ ప్రకటించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే మెటా, గూగుల్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, వంటి దిగ్గజ సంస్థలు 20 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఆర్ఐఎల్కు 66.43 శాతం వాటా మెజారిటీ వాటా ఉండగా.. మెటా 9.99%, గూగుల్ 7.73% వాటాలను దక్కించుకున్నాయి.ఇక జియో శాటిలైట్ ఇంటర్నెట్...శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్‌కామ్)లో సరికొత్త విప్లవానికి జియో శ్రీకారం చుడుతోంది. స్వదేశీ సమాచార ఉపగ్రహాలతో ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ‘భారత్‌ను జియో నేలపై అనుసంధానించింది. ఇక అంతరిక్షం నుంచి కూడా కనెక్ట్ చేయాల్సిన తరుణం వచ్చింది. దేశంలో ఇంకా మారుమూల పల్లెల్లో, ద్వీపాల్లో ప్రజలకు టెలికం సేవలు అందుబాటులో లేవు. అలాంటి వారికి శాటిలైట్ కనెక్టివిటీ వారధిగా నిలుస్తుంది. భారత్ కోసం తక్కువ భూకక్ష్యలో తిరిగే స్వేదేశీ ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని జియో పరిశీలిస్తోంది’ అని ఆకాశ్ చెప్పారు. శాటిలైట్ టెలికం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుగా ప్రపంచ దిగ్గజ ఉపగ్రహ నెట్వర్క్ ప్రొవైడర్లతో జట్టుకడతామని, తద్వారా శాటిలైట్ సామర్థ్యాన్ని లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ‘సొంతంగా గ్రౌండ్ స్టేషన్ ఇన్ఫ్రాను నెలకొల్పుతాం. స్పేస్ నుంచి గ్రౌండ్ దాకా పూర్తి స్థాయి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఎకోసిస్టమ్ ఏర్పాటే మా లక్ష్యం. ఈ చర్యలతో అంతరిక్ష రంగంలోనూ భారత స్వావలంభనను జియో బలోపేతం చేస్తుంది’ అని ఆకాశ్ పేర్కొన్నారు. కంపెనీ మొబైల్ యూజర్లందరినీ 2030 నాటికి పూర్తిగా 5జీ నెట్‌వర్క్‌లోకి తీసుకురానున్నట్లు చెప్పారు.రిలయన్స్ భవిత భద్రం.. వారసులకు వ్యాపారాల అప్పగింత ప్రణాళిక దాదాపు పూర్తయిందని ముకేశ్ చెప్పారు. ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు ప్రస్తుతం గ్రూప్‌లోని కీలక వ్యాపారాలకు సారథ్యం వహిస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలను వారే చూసుకుంటున్నారు. టెలికం, రిటైల్, డిజిటల్ సర్వీసులు, న్యూ ఎనర్జీల్లో ప్రధాన బిజినెస్‌లతో పాటు గ్రూప్ భవిష్యత్తు వృద్ధిని వారే నడిపిస్తారని ముకేశ్ పేర్కొన్నారు. ‘మీ కంపెనీ భవిష్యత్తు.. రిలయన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే వారి చేతుల్లో భద్రంగా ఉంది’ అని వాటాదారులతో ముకేశ్ చెప్పారు. ప్రస్తుతం ఆకాశ్ టెలికం.. ఇషా రిటైల్ విభాగాలను నడిపిస్తుండగా.. అనంత్‌ను గతేడాది రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడం ద్వారా ఇంధన బిజినెస్‌లను అప్పగించారు.2030కల్లా అత్యంత చౌకగా ఏఐ ప్రతి భారతీయునికి ఏఐని అత్యంత చౌకగా అందించడమే లక్ష్యమని ఆకాశ్ పేర్కొన్నారు. మొబైల్ డేటా విప్లవం మాదిరే ఏఐలోనూ విజయం సాధిస్తామన్నారు. ‘భారత్ కోసం, భారత్ ద్వారా రిలయన్స్ రూపొందిస్తున్న ఏఐతో భవిష్యత్తులో ప్రపంచానికి కూడా సేవలందిస్తాం. ఇందుకోసం జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ సొంత ఏఐ బ్యాక్‌బోన్‌ను నెలకొల్పుతోంది. ఈ ఏడాది చివరికల్లా తొలి దశలో 120 మెగావాట్ల ఏఐ ఇన్ఫ్రా ప్రాజెక్టు సిద్ధమవుతుంది’ అని ఆకాశ్ చెప్పారు. ఇప్పటికే ఏఐ కోసం గూగుల్, మెటాలతో జట్టుకట్టామన్నారు. హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయ రంగాల కోసం ‘జియోభారత్ఐక్యూ’, ‘ఏఐ వ్యాపార్’ వంటి ప్రత్యేక టూల్స్‌ను ప్రవేశపెడతామని వివరించారు. కాగా, భారత్ కోసం రూపొందించే ఏఐ ప్రాజెక్టుల్లో మన యువ ఇంజినీర్లు పాలుపంచుకోవాలని ముకేశ్ పిలుపునిచ్చారు. ‘ఎక్కడో రూపొందించిన ఏఐని వాడే దేశంగా మనం మిగిలిపోకూడదు. ఏఐ క్రియేటర్‌గా, దాన్ని అదిపుచ్చుకునే శక్తిగా, ప్రపంచ లీడర్‌గా ఎదగాలి’ అని పేర్కొన్నారు.ఏజీఎంలో ఇతర ముఖ్యాంశాలు...→ సోలార్ పవర్, బ్యాటరీలు, పవన విద్యుత్, హైడ్రోజన్, కంప్రెస్డ్ బయో గ్యాస్, బయో ఎనర్జీ, కోల్ గ్యాసిఫికేషన్ వంటి రంగాలపై ఫోకస్ చేయడం ద్వారా భారత ఇంధన భద్రతకు దన్నుగా నిలవడంతో పాటు దేశాన్ని గ్రీన్–క్లీన్ ఎనర్జీ దిశగా నడిపిస్తున్నామని ముకేశ్ చెప్పారు. రానున్న కాలంలో ఆయా రంగాల్లో 2 లక్షల కొలువులు లభిస్తాయనేది కంపెనీ అంచనా. → 2025–26లో రిలయన్స్ మీడియా వ్యాపారం రూ.34,917 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జియోహాట్‌స్టార్ దేశంలోనే అతిపెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించింది. బిలియన్ డౌన్లోడ్ల మార్కును దాటిన తొలి భారతీయ ఓటీటీ సరీ్వసుగా కూడా నిలిచినట్లు ఆకాశ్ చెప్పారు. ఏఐ ఆధారిత కంటెంట్ ప్రొడక్షన్ ప్లాట్‌ఫామ్... జియోస్టార్ జెన్ఏఐ మీడియా స్టూడియో (జామ్స్)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. → ఎఫ్ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 2029–30 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయ మైలురాయి చేరుతుందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. అతిపెద్ద దేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్నదే తమ లక్షమని చెప్పారు.‘రిలయన్స్ వాటాదారులకు విలువను చేకూర్చడంలో జియో ఐపీఓ ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. జియోకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కొత్త ఇన్వెస్టర్లందరికీ భరోసా ఇస్తున్నా’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
ప్రభుదేవా కొత్త లగ్జరీ కారు: ధర ఎంతో తెలుసా?
నటులు, కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత అయిన ప్రభుదేవా తన గ్యారేజీకి సరికొత్త ఎంజీ ఎం9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని చేర్చారు. దీంతో భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన సెలబ్రిటీల జాబితాలో ఒకరిగా నిలిచారు. ఈ కారు ధర రూ. 75.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు అనేది లిమోసిన్ లాంటి సౌకర్యం, విశాలమైన క్యాబిన్, అధునాతన సాంకేతికతతో మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఇది కియా కార్నివాల్, టయోటా వెల్ఫైర్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది.ఎంజీ ఎం9 సొగసైన ఎల్ఈడీ లైటింగ్, క్రోమ్ డీటైలింగ్, పెద్ద విండోస్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. క్యాబిన్ కాగ్నాక్ బ్రౌన్ అండ్ బ్లాక్ అనే డ్యూయల్ టోన్ థీమ్‌ను కలిగి ఉంటుంది. దీనికి ప్రీమియం ట్రిమ్ ఇన్సర్ట్లు, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ తోడవుతాయి. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెనుక ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు, ఎలక్ట్రికల్‌గా పనిచేసే స్లైడింగ్ డోర్లు, మెమరీ సీట్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు 90 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు ఒక సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ పొందుతుంది. ఈ సెటప్ 245 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో 548 కిమీ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. కాబట్టి నగర ప్రయాణాలకు, సుదూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
రూ.3.70 లక్షల కోట్ల టర్నోవర్.. దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్!
రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న సంస్థల్లో.. ఒకటైన రిలయన్స్ రిటైల్ FY26లో కూడా తన వృద్ధిని కొనసాగించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 'ఇషా అంబానీ' దీనికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.కంపెనీ FY26లో రూ.3,70,026 కోట్ల గ్రాస్ రెవెన్యూ నమోదు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ. లాభాల పరంగా కూడా కంపెనీ బలమైన ప్రదర్శన కనబరిచింది. నికర లాభం 12 శాతం పెరిగి రూ.13,838 కోట్లకు చేరింది. ఈ గణాంకాలు కంపెనీ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నట్లు సూచిస్తున్నాయని ఇషా అంబానీ వెల్లడించించారు.ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌కు 38.7 కోట్ల రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. అంతే కాకుండా.. కంపెనీ ఈ ఏడాది సుమారు 1.93 బిలియన్ ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేసింది, ఇది 39 శాతం వృద్ధిని సూచిస్తుంది. వినియోగదారుల నమ్మకం, వినియోగం రెండూ పెరుగుతున్నాయని ఇది స్పష్టం చేస్తోంది.రిలయన్స్ రిటైల్‌లో భాగమైన స్మార్ట్ బజార్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా 1,000 స్టోర్ల మైలురాయిని దాటింది. ముఖ్యంగా టైర్-2, చిన్న పట్టణాలపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీ తన మార్కెట్‌ను గ్రామీణ, అర్బన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది.వ్యవసాయ రంగంలో కూడా రిలయన్స్ రిటైల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది కంపెనీ సుమారు 5.7 లక్షల మెట్రిక్ టన్నుల తాజా పండ్లు, కూరగాయలను 40,000కు పైగా రైతుల నుంచి సేకరించింది. ఇది 110 సేకరణ కేంద్రాల ద్వారా జరిగింది. ఈ వ్యవస్థ వల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడమే కాకుండా.. వినియోగదారులకు కూడా తక్కువ ధరల్లో ఉత్పత్తులు అందుతున్నాయి.In Consumer Electronics, we sold over 2,500 phones every hour, along with more than 4,000 televisions, 8,000 large appliances, and 1,600 laptops every single day. JioMart Digital is now India’s largest mobile distributor with 1.2 lakh active retail partners: Isha M. Ambani… pic.twitter.com/Dql8gF3Uii— Reliance Industries Limited (@RIL_Updates) June 19, 2026ఇక డిజిటల్ కామర్స్ రంగంలో జియోమార్ట్ వేగంగా ఎదుగుతోంది. ఇది ప్రస్తుతం 3,100కు పైగా స్టోర్ల ద్వారా సేవలు అందిస్తోంది. 1,200కు పైగా నగరాలు, 5,100 పిన్కోడ్లకు విస్తరించడం ద్వారా దేశవ్యాప్తంగా తన పరిధిని పెంచుకుంది. రోజువారీ ఆర్డర్లు 3.6 రెట్లు పెరగగా, రిపీట్ ఆర్డర్లు 6 రెట్లు పెరగడం వినియోగదారుల నమ్మకాన్ని సూచిస్తోంది.కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో కూడా రిలయన్స్ రిటైల్ బలమైన స్థానం సంపాదించింది. రోజుకు సగటున 2,500 మొబైల్ ఫోన్లు, 4,000 టీవీలు, 8,000 గృహోపకరణాలు, 1,600 ల్యాప్‌టాప్‌లు విక్రయిస్తున్నట్లు ఇషా అంబానీ తెలిపారు.రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) FY26లో రూ.22,000 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెండింతల వృద్ధిని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ ఉత్పత్తులు 40కుపైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీని ద్వారా రిలయన్స్ రిటైల్ కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ఉనికిని పెంచుతోంది. మొత్తం మీద.. రిలయన్స్ రిటైల్ FY26లో అన్ని విభాగాల్లో బలమైన వృద్ధిని నమోదు చేసిందని తెలుస్తోంది.Reliance Retail’s FY26 Gross revenue Rs 3,70,026 crore, grew 11.8% YoY. EBITDA at Rs 27,033 crore – 3.4 times that of our nearest competitor. Profit after tax was Rs 13,838 crore, up 12%. Registered customer base reached 387 million, up 11% YoY: Isha M. Ambani#RILAGM pic.twitter.com/03nTI3seeZ— Reliance Industries Limited (@RIL_Updates) June 19, 2026 -
పేపర్ ఖర్చులు రూ.986.4 కోట్లు.. అగ్రస్థానంలో SBI
మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ స్టేట్మెంట్లు ఇలా అన్నీ వేగంగా పెరుగుతున్నాయి, దీంతో బ్యాంకింగ్ రంగం పూర్తిగా డిజిటల్ అయిపోయిందని భావిస్తాం. కానీ.. వాస్తవానికి బ్యాంకుల లోపల ఇంకా భారీగా పేపర్ ఆధారిత వ్యవస్థ కొనసాగుతోంది. ఈ విషయం FY25 గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది.భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు ప్రింటింగ్, స్టేషనరీ, చెక్‌బుక్స్, పాస్‌బుక్స్, ఫార్మ్స్ వంటి అవసరాల కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రింటింగ్ అండ్ స్టేషనరీపై గ్రోవ్ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. డిజిటల్ సేవలు పెరిగినా, సంప్రదాయ పేపర్ వర్క్ పూర్తిగా తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. FY25లో ఈ బ్యాంక్ సుమారు రూ.986.4 కోట్లు ప్రింటింగ్, స్టేషనరీ కోసం ఖర్చు చేసింది. ఇదే సమయంలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా దాదాపు రూ.922.5 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.ఇతర ప్రధాన బ్యాంకుల విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ సుమారు రూ.318.5 కోట్లు ఖర్చు చేసింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ దాదాపు రూ.373.8 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా 1 శాతం పరిధిలోనే ఈ ఖర్చులను కొనసాగిస్తున్నాయి.అయితే నిజమైన భారం కొన్ని మధ్యస్థాయి బ్యాంకులపై ఎక్కువగా పడుతోంది. ఉదాహరణకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన లాభాల్లో దాదాపు 8 శాతం కంటే ఎక్కువ స్టేషనరీ ఖర్చులకే వెచ్చించడం గమనార్హం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో కూడా ఈ ఖర్చు శాతం గణనీయంగా కనిపిస్తోంది.భారత బ్యాంకింగ్ రంగం డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ, పాత పద్ధతులైన పేపర్ వర్క్ ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్లలేదు. భవిష్యత్తులో డిజిటలైజేషన్ మరింత పెరిగితే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం ''డిజిటల్ బ్యాంకింగ్ + పేపర్ బ్యాంకింగ్'' కలిసి నడుస్తున్న వాస్తవాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.How much do Banks spend on Pen & Paper?(Costs for FY25) pic.twitter.com/OViC5vd8Bl— Groww (@_groww) June 17, 2026 -
మళ్లీ పెరగనున్న ధరలు.. కియా కార్లు ప్రియం!
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా, దేశవ్యాప్తంగా తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు 2026 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.భారతదేశంలో విక్రయించే అన్ని కియా కార్ల ధరలు 2 శాతం వరకు పెరగనున్నాయి. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఈ ధరల పెంపునకు కారణమని ఈ కొరియన్ సంస్థ చెబుతోంది. ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ధరల పెరుగుదల మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతాయి.ప్రస్తుతం, కియా ఇండియా దేశంలో ఎనిమిది విభిన్న మోడళ్లను విక్రయిస్తోంది. కార్నివాల్,ఈవీ6, ఈవీ9 కార్లు కంపెనీ కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా మన దేశానికి వస్తాయి. స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న మోడళ్లలో సోనెట్, సైరోస్, సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ ఉన్నాయి.ప్రస్తుతం, ఈ మోడళ్ల ధరలు ఎంట్రీ-లెవల్ సోనెట్ కోసం రూ. 7.33 లక్షల నుంచి, టాప్-స్పెక్ క్లావిస్ ఈవీ కోసం రూ. 25 లక్షల వరకు ఉన్నాయి. కార్నివాల్, ఈవీ6, ఈవీ9 ధరలు వరుసగా రూ. 59.45 లక్షలు, రూ. 67.98 లక్షలు, రూ. 1.3 కోట్లుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). -
'హే జియో' అంటే చాలు.. మీ పనులన్నీ చేసే ఏఐ అసిస్టెంట్!
సాంకేతిక రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా.. భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకురానుంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ‘జియో కాల్ ఏజెంట్’ అనే కొత్త వాయిస్ అసిస్టెంట్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.ఫోన్ కాల్లో మాట్లాడుతూనే.. క్యాబ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, మీటింగ్‌లను షెడ్యూల్ చేయడం వంటి పనులను ఈ ఏఐ అసిస్టెంట్ చేస్తుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆకాష్ అంబానీ వెల్లడించారు.జియో కాల్ ఏజెంట్‌ను ప్రత్యేక యాప్‌గా కాకుండా నేరుగా జియో టెలికాం నెట్‌వర్క్‌లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దీంతో వినియోగదారులు వేరే యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సర్వీస్ జియోకు చెందిన 50 కోట్లకు పైగా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది భారతీయ భాషలకు కూడా మద్దతు ఇస్తుంది. దీంతో కేవలం ఇంగ్లిష్ తెలిసిన వారు మాత్రమే కాకుండా, ఇతరులు కూడా ఉపయోగించవచ్చు.జియో కాల్ ఏజెంట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కాల్ మాట్లాడుతున్న 'హే జియో' అని చెప్పగానే.. ఏఐ అసిస్టెంట్ కాల్లో చేరుతుంది. సాధారణ చాట్‌బాట్‌లా కాకుండా, వ్యక్తిగత సహాయకుడిలా పని చేస్తూ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సహకరిస్తుంది.ఈ ఏఐ అసిస్టెంట్ కాల్లో జరిగే సంభాషణను రియల్ టైమ్‌లో టెక్స్ట్ రూపంలోకి మార్చగలదు. కాన్ఫరెన్స్ కాల్లలో ఒకేసారి 10 మంది వరకు మాట్లాడినా వారి గొంతులను గుర్తించి, ఎవరు ఏమి మాట్లాడారో వేరు చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అంతేకాకుండా కాల్ ముగిసిన తర్వాత ముఖ్యాంశాలను సారాంశంగా తయారు చేయడం, చేయాల్సిన పనుల జాబితాను రూపొందించడం, రిమైండర్లు సృష్టించడం వంటి పనులను కూడా నిర్వహిస్తుంది.అంతేకాదు.. కాల్ మధ్యలోనే కొన్ని లావాదేవీలను కూడా పూర్తి చేయగలదు. ఉదాహరణకు, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, క్యాబ్ బుక్ చేయడం లేదా మీటింగ్ షెడ్యూల్ చేయడం వంటి పనులను కాల్‌ను నిలిపివేయకుండా ఈ ఏఐ అసిస్టెంట్ ద్వారా చేయవచ్చు. దీంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.జియో కాల్ ఏజెంట్ ప్రారంభం.. వెనుక రిలయన్స్ సంస్థ పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతోంది. జనరేటివ్ ఏఐ సాంకేతికతను నేరుగా కోట్లాది వినియోగదారుల రోజువారీ జీవితాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సంస్థ ఈ సేవను రూపొందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక ఏఐ సేవలు ప్రత్యేక యాప్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. కానీ జియో కాల్ ఏజెంట్ మాత్రం.. నెట్వర్క్ స్థాయిలోనే పనిచేస్తుంది.ఏఐ మౌలిక వసతులుఇదే సమయంలో.. రిలయన్స్ కంపెనీ దేశంలో స్వదేశీ ఏఐ మౌలిక వసతుల నిర్మాణంపైనా దృష్టి సారిస్తోంది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో జామ్‌నగర్‌లో భారీ స్థాయి ఏఐ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో తొలి 120 మెగావాట్ల దశను 2026 చివరి నాటికి ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది.అంతే కాకుండా.. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్వీడియా రూపొందించిన జీబీ300 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఈ మౌలిక వసతుల్లో వినియోగించనున్నారు. దీని ద్వారా భారతదేశంలోనే ఏఐ మోడళ్లను హోస్ట్ చేయడం, డేటాపై పూర్తి నియంత్రణ కల్పించడం, సంస్థల మేధో సంపత్తిని రక్షించడం వంటి ప్రయోజనాలు లభించనున్నాయి.ఇదీ చదవండి: రిలయన్స్ జియో ఐపీఓ.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన! -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 607 పాయింట్లు డౌన్!
శుక్రవారం ఉదయం నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 607.08 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో 76,802.90 వద్ద, నిఫ్టీ 154.90 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 24,013.10 వద్ద నిలిచాయి.రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్, రాణే (మద్రాస్) లిమిటెడ్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఆర్ఆర్ఐఎల్ లిమిటెడ్, మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రిలయన్స్ జియో ఐపీఓ.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన!
భారత టెలికాం, డిజిటల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన జియో ఇప్పుడు మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. చాన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలు, పెట్టుబడిదారుల అంచనాలకు తెరదించుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు, డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను ఆమోదించిందని, దానిని సెబీకి సమర్పించనున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు.ఈ ప్రకటనతో భారత పెట్టుబడి మార్కెట్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జియో ఐపీఓకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టైంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జియో ఐపీఓ అనేది కేవలం ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదని, ఇది తనకు, రిలయన్స్ కుటుంబానికి, లక్షలాది వాటాదారులకు ఎంతో భావోద్వేగమైన క్షణమని ముకేశ్ అంబానీ అన్నారు.ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కలలుగన్న ''అందరి అభివృద్ధి'' అనే లక్ష్యాన్ని తాను ముందుకు తీసుకువచ్చానని, ఇప్పుడు అదే బాధ్యతను తదుపరి తరం స్వీకరిస్తోందని చెప్పారు. తన పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు జియో ఐపీఓ ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారని వెల్లడించారు. భవిష్యత్తులో విలువ సృష్టించే కొత్త అవకాశాలను కూడా వారే ముందుండి నడిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.పదేళ్ల క్రితం జియో ప్రారంభమైనప్పుడు భారతదేశంలో డిజిటల్ అసమానతలను తొలగించడమే తమ లక్ష్యమని అంబానీ గుర్తుచేశారు. ఆ సమయంలో కాల్ ఛార్జీలు అధికంగా ఉండేవని, డేటా ఖరీదైనదిగా ఉండేదని, ఇంటర్నెట్ వేగం కూడా తక్కువగా ఉండేదని చెప్పారు. జియో వచ్చాక వాయిస్ కాల్స్, తక్కువ ధరలకు అధిక వేగం కలిగిన డేటా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఫలితంగా కోట్లాది భారతీయులకు డిజిటల్ జీవనశైలి చేరువైందని పేర్కొన్నారు.The Board of Jio Platforms has approved its DRHP, and it will be filed with SEBI today. This is a deeply emotional moment for me, for the entire Reliance Family, and millions of its shareholders. The relationship Reliance shares with its shareholders is a deep and sacred… pic.twitter.com/osVRfVQstP— Reliance Industries Limited (@RIL_Updates) June 19, 2026ప్రస్తుతం జియో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. 52.4 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఈ సంస్థ, భారత టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉంది. జియో 5జీ సేవలకు 26.8 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా 1.3 కోట్ల ఇళ్లకు కనెక్టివిటీ అందుతోంది. ఈ గణాంకాలే జియో ఎంత వేగంగా విస్తరించిందో తెలియజేస్తున్నాయి.జియో లిస్టింగ్ కేవలం ఒక వ్యాపార ప్రక్రియ మాత్రమే కాదని, భారతదేశం ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలను నిర్మించగలదని ప్రపంచానికి చూపించే అవకాశం అని ముకేశ్ అంబానీ అన్నారు. ప్రపంచ స్థాయి సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, విలువ కలిగిన సంస్థలను భారత్ సృష్టించగలదని జియో నిరూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.మార్కెట్ అంచనాల ప్రకారం, జియో ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది. గతంలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫరీస్ జియో విలువను సుమారు 180 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ఈ అంచనాలు నిజమైతే, జియో ఐపీఓ భారత చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశముంది.ఇప్పటివరకు భారతదేశంలో అతిపెద్ద ఐపీఓగా హ్యుందాయ్ మోటార్ ఇండియా నిలిచింది. 2024 అక్టోబర్‌లో ఆ సంస్థ సుమారు రూ.27,870 కోట్లను సమీకరించింది. అయితే జియో ఐపీఓ ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే!
గత ఐదు రోజులు వరుస లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం ఒక్కసారిగా బ్రేక్ పడింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 23,950 స్థాయి కంటే దిగువకు చేరుకుంది. ఈ పతనంతో కేవలం రెండు గంటల్లోనే అన్ని బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం విలువ సుమారు రూ. 1.3 లక్షల కోట్లు తగ్గింది.స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడానికి ఐటీ షేర్ల అమ్మకాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, లాభాల స్వీకరణ, ప్రపంచ మార్కెట్ల బలహీనత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.ఐటీ రంగంమార్కెట్ పతనానికి ప్రధాన కారణం ఐటీ రంగం అని తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ తన 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై ఆందోళనలు పెరిగాయి.దీంతో భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్ వంటి దిగ్గజ షేర్లు 5 నుంచి 8 శాతం మధ్య పడిపోయాయి. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో పెద్ద భాగం ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే వస్తుంది. కాబట్టి అక్కడ టెక్నాలజీ ఖర్చులు తగ్గే అవకాశం ఉందనే భయం.. పెట్టుబడిదారులను అమ్మకాల వైపు మళ్లించింది.విదేశీ పెట్టుబడిదారులుఇటీవల మూడు రోజుల పాటు కొనుగోళ్లు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ అమ్మకాల వైపు మొగ్గు చూపారు. గురువారం ఒక్కరోజే వారు సుమారు రూ.1,025 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది మార్కెట్లో ఆందోళనను పెంచింది. ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ దిశను ప్రభావితం చేసే ముఖ్యమైన వర్గం. వారు అమ్మకాలు పెంచితే మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతుంది.లాభాల స్వీకరణస్టాక్ మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవు. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 5% పెరిగింది. నిఫ్టీ 4% కంటే ఎక్కువ లాభపడింది. ఇంత వేగంగా మార్కెట్ పెరిగిన తర్వాత కొంతమంది పెట్టుబడిదారులు తమ లాభాలను బుక్ చేసుకోవడం సహజం. దీనినే లాభాల స్వీకరణ (Profit Booking) అంటారు. ఈ అమ్మకాలు మొదట చిన్న స్థాయిలో ప్రారంభమైనా, తరువాత మరింత విస్తరించి మొత్తం మార్కెట్‌పై ప్రభావం చూపాయి.ప్రపంచ మార్కెట్లుభారత మార్కెట్‌కు ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా చాలా ముఖ్యమైనది. ఆసియా మార్కెట్లు భారీగా పడిపోయాయి, దక్షిణ కొరియా కోస్పి, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల భారత మార్కెట్‌కు సానుకూల సంకేతాలు లభించలేదు. దీంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ మరింత ఒత్తిడికి గురైంది.మధ్యప్రాచ్య ఉద్రిక్తతలుఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, మధ్యప్రాచ్యంలో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. దక్షిణ లెబనాన్‌లో కొత్త దాడుల వార్తలు, ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు మళ్లీ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. భారతదేశానికి ముఖ్యంగా ముడి చమురు (Crude Oil) ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.స్టాక్ మార్కెట్ పతనం అనేది సర్వ సాధారణమే అని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ కోలుకునే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు రాబోయే రోజుల్లో ప్రపంచ పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, చమురు ధరల కదలికలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందని చెబుతున్నారు. -
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడంతే.. రూ.5 కోట్లు జాక్‌పాట్!
సాధారణంగా అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. ఒకటో తారీఖున అలా జీతం పడగానే మొత్తం ఖర్చయిపోతుంది.. నెలాఖరుకు వచ్చేసరికి ఖాతా ఖాళీ అవుతుంది. ఇదీ సగటు జీవుడి బ్యాంక్ ఖాతా చిత్రం. నెల చివర్లో తమ ఆర్థిక దుస్థితిని తెలియజేసేందుకు కొందరు ఖాళీ అయిన తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను స్క్రీన్ షాట్లు తీసి సరదాగా స్టేటస్లు కూడా పెట్టుకుంటుంటారు. అయితే ఇలా బ్యాంక్ అకౌంట్‌తోనే జాక్‌పాట్ కొట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా?అబుదాబిలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన 34 ఏళ్ల షాజీర్ వెంగా అనూహ్యంగా రూ.5 కోట్లకు పైగా నగదు బహుమతిని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. యూఏఈకి చెందిన షార్జా ఇస్లామిక్ బ్యాంక్ (Sharjah Islamic Bank) నిర్వహిస్తున్న ‘ఎస్ఐబీ మిలియనీర్’ సేవింగ్స్ రివార్డ్స్ ప్రచారంలో ఆయనకు 20 లక్షల దిర్హమ్లు (సుమారు రూ.5.15 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌గా లభించింది. షాజీర్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచి ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ భారీ బహుమతి అతని ఖాతాలో పడటం విశేషం.బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజీర్ ఎస్ఐబీ డిజిటల్ యాప్ ద్వారా సేవింగ్స్ ఖాతా ప్రారంభించాడు. అనంతరం జూన్ 2026 డ్రాలో అతని పేరు గ్రాండ్ ప్రైజ్‌కు ఎంపికైంది. అదే డ్రాలో యూఏఈకి చెందిన మోజా అల్‌షంసీ లగ్జరీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారును గెలుచుకోగా, మరో 40 మంది నగదు బహుమతులు అందుకున్నారు.దీనిపై స్పందించిన షాజీర్.. “ఎస్ఐబీ మిలియనీర్ ప్రచారం గురించి ముందే తెలుసు. ఏదో ఒకరోజు నేను కూడా విజేతగా నిలుస్తానని ఆశించేవాడిని. కానీ ఇంత త్వరగా అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. ఈ 20 లక్షల దిర్హమ్లు నా జీవితాన్నే మార్చేస్తాయి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడమే కాకుండా, భారత్‌లో ఉన్న నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలనే కలను సాకారం చేస్తాయి” అని పేర్కొన్నాడు.కస్టమర్లలో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు షార్జా ఇస్లామిక్ బ్యాంక్ 2025లో ‘ఎస్ఐబీ మిలియనీర్’ ప్రచారాన్ని ప్రారంభించింది. అర్హత కలిగిన సేవింగ్స్ లేదా డిపాజిట్ ఖాతాల్లో ప్రతి 10,000 దిర్హమ్ల బ్యాలెన్స్‌కు ఒక డ్రా ఎంట్రీ లభిస్తుంది. ఏడాది పొడవునా కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతులు, లగ్జరీ వాహనాలు ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. బ్యాంకు అధికారుల ప్రకారం, రాబోయే డ్రాల్లో కూడా ఒక్కోటి 10 లక్షల దిర్హమ్ల విలువైన రెండు ప్రధాన నగదు బహుమతులు ప్రకటించనున్నారు.Congratulations to the winners of SIB Millionaire Draw!Mr. Shajeer Venga won the Grand Cash Prize of AED 2 Million, and Mrs. Moza Butti won a BMW XM.We also congratulate forty other winners who received valuable cash prizes.Start your journey towards achieving a million… pic.twitter.com/osCjwVraHs— Sharjah Islamic Bank (@shjislamicbank) June 16, 2026 -
ఆ షేర్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికారిక ఎల్రక్టానిక్ ప్లాట్‌ఫాంలు, వెబ్సైట్ల ద్వారా అన్‌లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, విక్రయ లావాదేవీలు జరపరాదని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. అటువంటి ప్లాట్‌ఫాంలకు గుర్తింపు ఉండదని, వాటిపై నియంత్రణ సంస్థ పర్యవేక్షణ ఉండదని పేర్కొంది.కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు అన్‌లిస్టెడ్ కంపెనీల్లో లావాదేవీలకు వీలు కల్పిస్తున్నాయని సెబీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో 2016 ఆగస్టు, 2024 డిసెంబర్లో కూడా ఇటువంటి అడ్వైజరీలను జారీ చేసినట్లు సెబీ పేర్కొంది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు మాత్రమే సెక్యూరిటీల ట్రేడింగ్, నిధుల సమీకరణకు వేదికలుగా వ్యవహరించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. -
త్వరలో ‘ఇంధన అత్యవసర’ ఆంక్షల ఎత్తివేత!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్ రక్షణ కోసం అమలు చేసిన ‘ఇంధన అత్యవసర’ ఆంక్షలను అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత దశలవారీగా ఉపసంహరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య 111 రోజుల యుద్ధానికి ముగింపు పలికే మధ్యంతర ఒప్పందం కుదిరింది. దీంతో వ్యూహాత్మకంగా కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి ద్వారా నౌకాయాన కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి రానుండటం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారతదేశానికి భారీ ఊరటనిచ్చే అంశం.ముందస్తు రక్షణ చర్యలుగా ఆంక్షలు ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ముడి చమురు ధరలు, షిప్పింగ్ భీమా ప్రీమియంలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పలు అత్యవసర ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేసింది. అందులో భాగంగా... ఎల్పీజీ సరఫరాలపై నిఘా పెంచింది. సిలిండర్ల అక్రమ రవాణా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన నిబంధనలు తెచ్చింది. ఇందులో భాగంగానే పెట్రోకెమికల్స్ ఉత్పత్తికి వాడే గ్యాస్‌ను ఎల్పీజీ వైపు మళ్లించాలని రిఫైనరీలను ఆదేశించింది.హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను తగ్గించడంతో పాటు, గృహ వినియోగదారుల సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచి నిల్వలను నియంత్రించింది. గృహ అవసరాలు, రవాణా (సీఎన్జీ), ఎరువుల రంగానికి ప్రాధాన్యత ఇస్తూ దేశీయ సహజ వాయువు కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేసింది.‘‘ఈ ఆంక్షలన్నీ కేవలం ముందస్తు నివారణా చర్యలే. అంతర్జాతీయంగా చమురు మార్కెట్ స్థిరపడి, సరఫరా ముప్పు తొలగిపోగానే ఈ ఆంక్షలను దశలవారీగా ఉపసంహరిస్తాం’’ అని అధికారి స్పష్టం చేశారు.చమురు కంపెనీలకు రోజూ రూ.550 కోట్ల నష్టం యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 70–72 ডy్థయి నుంచి గరిష్టంగా 119 డాలర్లకు చేరుకున్నాయి. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు పెరగకుండా నియంత్రించింది. మార్చి 27న పశి్చమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.7.50 చొప్పున, సీఎన్జీ ధరలను కిలోకు రూ.6 మేర పెంచింది.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రెండు విడతల్లో మొత్తం రూ.89 పెంపు అమలు చేసింది. ఈ ధరల పెంపు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయ రిటైల్ ఇంధన ధరలు ఇంకా తక్కువగానే ఉండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికీ రోజుకు సుమారు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని అధికారి వెల్లడించారు. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మూడు నెలల కనిష్టానికి పతనమమయ్యాయి. గురువారం బ్యారెల్ ధర సుమారు 78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తగ్గుదల బాట పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మరింత భారీగా పతనమయ్యాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఉత్సాహం కలుగుతోంది. ఇక వెండి ధరలు(Today Silver Rate) కూడా పెద్ద మొత్తంలో క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. -
ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ 17 నాటికి నికర ఆదాయపన్ను (ప్రత్యక్షపన్ను) వసూళ్లు 15 శాతం వరకు పెరిగి రూ.5.21 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా స్పష్టం చేసింది. నికర కార్పొరేట్ పన్నుల వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం వృద్ధితో రూ.2.08 లక్షల కోట్లకు చేరాయి.నికర నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయం 8 శాతం పెరిగి రూ.2.94 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, వాణిజ్య సంస్థల పన్నులు నాన్ కార్పొరేట్ కిందకు వస్తాయి. రిఫండ్లు మే 17 నాటికి రూ.89,026 కోట్లుగా ఉన్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో ఆదాయం 45 శాతం పెరిగి రూ.18,856 కోట్లకు చేరింది. ముందస్తు పన్ను చెల్లింపులు 15.30 శాతం అధికమై రూ.1.78 లక్షల కోట్లు వసూలయ్యాయి.స్థూల పన్ను వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు జూన్ 17 నాటికి 12.46 శాతం పెరిగి రూ.6.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.26.97 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లక్ష్యంగా ఉంది. -
ఐటీ షేర్లు ఢమాల్.. స్టాక్ మార్కెట్ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఈరోజు ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 197.60 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 23,970.40 వద్ద, సెన్సెక్స్(Sensex) 721.13 పాయింట్లు 0.93 పతనంతో 76,688.84 వద్ద ట్రేడవుతోంది.ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.55 శాతం, 0.19 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ దాదాపు 6 శాతం క్షీణతతో అత్యధికంగా నష్టపోయింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా భారీగానే నష్టాలనే నమోదు చేశాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
బంగారం రూ.2 లక్షలు దాటుతుందా.. ఎప్పుడు?
బంగారం ధరలు మరోసారి భారీ ఎత్తున పెరిగే అవకాశాలపై అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రముఖ పెట్టుబడి బ్యాంక్ జేపీ మోర్గాన్ చేస్ (JPMorgan Chase) తాజాగా విడుదల చేసిన నివేదికలో 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్స్‌కు 6,000 డాలర్లకు, 2027 నాటికి 6,300 డాలర్లకు చేరే అవకాశముందని పేర్కొంది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయిల కంటే తక్కువగా ట్రేడవుతున్నప్పటికీ, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, అమెరికా ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి దీర్ఘకాలంలో బంగారానికి మద్దతుగా నిలుస్తాయని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది.ఈ అంచనాలు నిజమైతే భారతీయ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రాత్మక స్థాయికి చేరే అవకాశం ఉంది. డాలర్ మారకపు విలువ, దిగుమతి సుంకాలు, సెస్సులు, జీఎస్టీ వంటి పన్నులను పరిగణనలోకి తీసుకుంటే 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల మార్కును దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇది సుమారు 30–40 శాతం వరకు పెరుగుదల అవుతుంది.5,000 డాలర్లే ఎక్కువఅయితే అందరు విశ్లేషకులు ఇదే అభిప్రాయంలో లేరు. ఇటీవల బంగారం ధరలు కొంత బలహీనత చూపుతున్నాయని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, డాలర్ బలం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపవచ్చని మరికొన్ని సంస్థలు సూచిస్తున్నాయి. కొందరు విశ్లేషకులైతే 5,000 డాలర్ల పరిధినే మరింత వాస్తవిక లక్ష్యంగా భావిస్తున్నారు.అందువల్ల బంగారం రూ.2 లక్షలకు చేరుతుందనే అంచనా ప్రస్తుతం ఒక అవకాశంగా మాత్రమే చూడాలి. అంతర్జాతీయ మార్కెట్ల దిశ, కేంద్ర బ్యాంకుల కొనుగోలు ధోరణి, వడ్డీ రేట్ల మార్పులు, రూపాయి-డాలర్ మారకపు విలువలు వచ్చే రెండేళ్లలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం మాత్రం బంగారం ధరల భవిష్యత్తుపై ఆశావహ అంచనాలు మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డబ్బులు
న్యూఢిల్లీ/జ్యురిక్: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 2025లో 3.25 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు (రూ. 36,793 కోట్లు) తగ్గాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. లోకల్ శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలు ద్వారా వచ్చే నిధులు తగ్గడం ఇందుకు కారణం. అయితే, స్విట్టర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులు నేరుగా తమ ఖాతాల్లో వ్యక్తిగతంగా, సంస్థలపరంగా జమ చేసిన డిపాజిట్లు మాత్రం 50 శాతం పెరిగి 524 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు (సీహెచ్ఎఫ్) (సుమారు రూ. 6,000 కోట్లు) చేరాయి.స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ)కి వివిధ బ్యాంకులు సమర్పించిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే, ఇందులో ’నల్ల ధనం’, మరో దేశం ద్వారా భారతీయులు, ప్రవాస భారతీయులు.. స్విస్ బ్యాంకుల్లో ఎంత దాచుకుని ఉండొచ్చనే వివరాలు తెలియరాలేదు. 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మొత్తం నిధులు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ సీహెచ్ఎఫ్కి చేరాయి. అంతకు ముందు 2021లో అత్యధికంగా 14 ఏళ్ల గరిష్ట స్థాయి 3.83 బిలియన్ సీహెచ్ఎఫ్కి పెరిగాయి. -
యూకే–భారత్ వాణిజ్యానికి రెక్కలు
న్యూఢిల్లీ: యూకే, భారత్ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా) ఎట్టకేలకు వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. స్వేచ్ఛాయుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో 2025 జూలై 25న, లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రెండు దేశాల ప్రధానులు ఒప్పందంపై సంతకాలు చేయడం గమనార్హం. దశలవారీగా అమలయ్యే ఈ ఒప్పందంతో వస్తు, సేవల పరంగా భారత ఎగుమతిదారులకు టారిఫ్ అనుకూల ప్రయోజనాలు లభిస్తాయి. 99 శాతం వస్తువులపై సుంకాలు తొలగిపోనున్నాయి.రెండు దేశాల మధ్య వస్తు, సేవలకు మార్కెట్ అవకాశాలు పెంచుకోవడం, టారిఫ్‌ల భారం తగ్గించుకోవడం ఒప్పందం లక్ష్యం. ముఖ్యంగా కొన్ని ఉత్పత్తులకు కోటా ఆధారిత మార్కెట్ ప్రవేశం అమలు కానుంది. భారత వ్యవసాయం, డైరీ, నూనె గింజలు, కూరగాయలు, ధాన్యాలకు ఈ ఒప్పందంలో రక్షణ కల్పించారు. బ్రిటన్ అంచనా ప్రకారం.. సెటాతో ఏటా భారత్ జీడీపీకి 5.1 బిలియన్ పౌండ్లు, యూకే జీడీపీకి 4.8 బిలియన్ పౌండ్ల మేర అదనపు ప్రయోజనం లభించనుంది. దీర్ఘకాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం 25.5 బిలియన్ పౌండ్లకు చేరుకుంటుందని అంచనా. గణనీయమైన అవకాశాలు.. ‘‘సెటాతోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (సామాజిక భద్రతకు సంబంధించి) జూలై 15 నుంచి ఏకకాలంలో అమల్లోకి రావడంతో భారత్ ఎగుమతిదారులకు గణనీయమైన అవకాశాలు లభించనున్నాయి. తక్షణమే 99 శాతం మన ఎగుమతులకు సుంకాల్లేని ప్రవేశం దక్కనుంది. టెక్స్టైల్స్, లెదర్, మెరైన్, ఇంజనీరింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ రంగాలు ఎలాంటి ప్రతికూలతల్లేకుండా తమ ఉత్పత్తులతో పోటీపడనున్నాయి. సున్నితమైన మన వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలకు దిగుమతుల నుంచి రక్షణ కల్పించాం. భారతీయ నిపుణుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ద్వంద బీమా చెల్లింపుల నుంచి కూడా మినహాయింపు ఉంటుంది’’అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ రంగాలకు సానుకూలం.. 🔹 భారత్ నుంచి యూకేకి వెళ్లే ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తులపై 70 శాతం, మెరైన్ ఉత్పత్తులపై 21.5 శాతం, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలపై 18 శాతం, లెదర్, పాదరక్షలపై 16 శాతం, టెక్స్టైల్స్, వ్రస్తాలపై 12 శాతం మేర సుంకాలు సున్నాకి తగ్గిపోనున్నాయి. 🔹 డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకేలో భారత ఉద్యోగులు, కారి్మకులకు మూడేళ్ల పాటు సామాజిక భద్రత కోసం చందాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలా ఆదా అయ్యే మొత్తం రూ.4,000 కోట్లుగా ఉంటుంది. 🔹 భారత్ సైతం యూకే నుంచి వచ్చే దిగుమతులపై దశలవారీ (2036 నాటికి) 90 శాతం మేర టారిఫ్‌లను ఎత్తేయనుంది. 🔹 భారత్‌కు చెందిన 85 శాతం స్టీల్ ఎగుమతులకు యూకేలో నియంత్రణ చర్యల నుంచి మినహాయింపు ఉంటుంది. యూకేకి చెందిన విస్కీ, జిన్ ఉత్పత్తులపై 150 శాతంగా ఉన్న సుంకాలు తొలుత 75 శాతానికి, పదో ఏడాదికి 40 శాతానికి తగ్గిపోనున్నాయి. దీంతో భారత్ మార్కెట్లో వాటి అమ్మకాలు పెరగనున్నాయి. చౌకగా యూకే కార్లు 🔹 ఒప్పందం మొదటి 15 ఏళ్లలో యూకే నుంచి 3.78 లక్షల యూనిట్ల సంప్రదాయ కంబస్టన్ ఇంజన్ ప్యాసింజర్ కార్లను రాయితీ సుంకాలపై భారత్ అనుమతించనుంది. ఇందులో లగ్జరీతోపాటు మాస్ మార్కెట్ కార్లు కూడా ఉంటాయి. 🔹 ఆటో విడిభాగాలపై 110 శాతంగా ఉన్న సుంకాలు 10 శాతానికి తగ్గుతాయి. ఇందుకు సంబంధించి రెండు దేశాలు కోటా విధానాన్ని అనుసరించనున్నాయి. 🔹 ఒప్పందం ఆరో ఏడాది నుంచి యూకేకి ఎలక్ట్రిక్/హైడ్రోజన్ ప్యాసింజర్ కార్లను (20,000–80,000 పౌండ్ల ధరలోని) పరిమిత కోటా మేరకు భారత్ సుంకాల్లేకుండా ఎగుమతి చేయొచ్చు. ఇది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఎంఅండ్ఎం, మారుతి సుజుకీ తదితర కంపెనీలకు ప్రయోజనం కల్పించనుంది. -
ఈ నెల్లోనే ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల నిరీక్షణకు తెరపడనుంది. తమ భవిష్యనిధి ఖాతాల్లోని బ్యాలెన్స్‌లపై గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ ఈ నెల్లోనే జమ కానుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం కూడా లభించింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ ఏడాది మార్చి 2న జరిగిన సమావేశంలో, ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2025–26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేయడం తెలిసిందే.కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తుంటారు. ఈపీఎఫ్‌వో సీబీటీ ఖరారు చేసిన 8.25 శాతం రేటుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కార్మిక శాఖ సూచనల మేరకు ఈ నెలలోనే సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేయనున్నట్టు తెలిపాయి. కొత్త విధానంలో వడ్డీ జమ వెంటనే పూర్తి కానుందని పేర్కొన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023–24 సంవత్సరంలో 8.25 శాతానికి పెంచడం గమనార్హం. ఆ తర్వాత నుంచి ఇదే రేటు స్థిరంగా కొనసాగుతోంది. 2018–19లో అత్యధికంగా 8.65 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. -
‘కియా’ కార్లు ఇక ఖరీదే
న్యూఢిల్లీ: కియా ఇండియా కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే జూలై 1, 2026 నుంచి తమ వాహనాల ధరలను మోడళ్ల వారీగా 2% వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ధరల పెంపు అనేది వేరియంట్లను బట్టి మారుతుందని స్పష్టం చేసింది. ‘పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, నిర్వహణ వ్యయాల ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, కస్టమర్లపై పూర్తి భారం పడకుండా ఉండేందుకు పెరిగిన వ్యయంలో చాలా వరకు కంపెనీయే భరిస్తోంది. వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులను, యాజమాన్య అనుభవాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని కియా ఇండియా వివరించింది. టాటా వాణిజ్య వాహనాలూ ప్రియం టాటా మోటార్స్ సైతం తమ వాణిజ్య వాహనాల (కమర్షియల్ వెహికల్స్) ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. జూలై 1 నుంచి తమ వాహన శ్రేణిపై 2.5 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని సంస్థ తెలిపింది. ముడిసరుకుల ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో, ఆ ప్రభావాన్ని కొంతవరకు అధిగమించేందుకు ఈ పెంపు తప్పడం లేదని టాటా మోటార్స్ పేర్కొంది. -
వాటాదారులకు ఎన్ఎస్ఈ బొనాంజా!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూతో సంస్థలోని వాటాదారులకు వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐతో పాటు దిగ్గజ ఇన్వెస్టరు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ, హీరో ఎంటర్ప్రైజ్ చైర్మన్ సునీల్ కాంత్ ముంజల్ మొదలైన వారు గణనీయంగా లాభపడనున్నారు. అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఎన్ఎస్ఈ షేరు సుమారు రూ. 2,000 పలుకుతోంది. దీని ప్రకారం చూస్తే దమానీకి ఉన్న 3.91 కోట్ల షేర్ల (ఎన్ఎస్ఈలో 1.58 శాతం వాటా) విలువ సుమారు రూ. 7,817 కోట్లుగా ఉంటుంది.తద్వారా ప్రతిపాదిత లిస్టింగ్‌తో అత్యధికంగా లాభపడే వ్యక్తిగత ఇన్వెస్టరుగా ఆయన నిలువనున్నారు. ఇక హీరో ఎంటర్ప్రైజ్ చైర్మన్ సునీల్ కాంత్ ముంజల్‌కి ఎన్ఎస్ఈలో 1.02 కోట్ల షేర్ల (0.41 శాతం వాటా) విలువ రూ. 2,040 కోట్లుగా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్ గోపాలకృష్ణన్‌కి చెందిన 94.29 లక్షల షేర్ల (0.38 శాతం) విలువ దాదాపు రూ. 1,886 కోట్లుగా ఉండనుంది. ఇక ఇండివిడ్యువల్ ఇన్వెస్టరు సిద్ధార్థ్ బాలచంద్రన్కి గల 0.38 శాతం వాటా విలువ రూ. 1,863 కోట్లుగా ఉంటుందని అంచనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.47 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో ఉంది. వీటి విలువ దాదాపు రూ. 4,950 కోట్లు ఉంటుంది. గణాంకాల ప్రకారం ఒక్కో షేరు కొనుగోలు కోసం సగటున 0.80 పైసలు మాత్రమే వెచి్చంచిన ఎస్బీఐకి అత్యధికంగా లబ్ధి చేకూరనుంది. రూ. 800 – రూ. 1,050 సరైన ధర.. అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఎన్ఎస్ఈ షేర్ల ధరకి సంబంధించి పీఈ ప్రస్తుతం 50 రెట్లు ఉంటోందని, ఇది చాలా అధికమని ఆల్ఫా ఏఎంసీ సీఈవో రాజేశ్ సింగ్లా తెలిపారు. రూ. 800–1,050 శ్రేణి సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు రూ. 30,000 కోట్ల మెగా ఐపీవోకి సంబంధించి సెబీకి ఎన్ఎస్ఈ ప్రాస్పెక్టస్ సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశీయంగా అతి పెద్ద ఇష్యూగా ఉన్న రూ. 27,870 కోట్ల హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవోని మించిన స్థాయిలో ఇది ఉండనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉండే ఈ ఐపీవోలో భాగంగా ప్రస్తుత షేర్హోల్డర్లు 14.89 కోట్ల షేర్లను (6 శాతం వాటా) విక్రయించనున్నారు. రిస్క్ లున్నాయ్.. రెగ్యులేటరీ మార్పులు, టెక్నాలజీ వైఫల్యాలు, సైబర్‌దాడులు, ఏఐ నుంచి తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుకి గణనీయంగా రిసు్కలు ఉండొచ్చని సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల్లో ఎన్ఎస్ఈ పేర్కొంది. ఇటీవల ఈక్విటీ డెరివేటివ్స్ నిబంధనలను సెబీ కఠినతరం చేయడంతో క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లలో లావాదేవీలు ఇప్పటికే నెమ్మదించాయని, గత ఆర్థిక సంవత్సరం ట్రేడింగ్ ఆదాయం తగ్గిందని పేర్కొంది. ఒకవేళ నిబంధనలను మరింత కఠినతరం చేసినా, లావాదేవీలపై పన్నులు పెంచినా, ఇన్వెస్టర్ల తీరు మారి ఇతర అసెట్స్ వైపు మళ్లినా.. ట్రేడింగ్ పరిమాణం, లాభదాయకతపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని ఎన్ఎస్ఈ తెలిపింది.ఎవరెవరికి... ఎంతెంత.. ⇒ మారిషస్‌కి చెందిన ఎంఎస్ స్ట్రాటెజిక్ 1.6 కోట్ల షేర్ల విక్రయం ద్వారా సుమారు రూ. 3,200 కోట్లు సమకూర్చుకోనుంది. అలాగే, కెనడియన్ పెన్షన్ ఫండ్ సీపీపీఐబీ రూ. 2,375 కోట్లు, ఆరాండా ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు రూ. 2,250 కోట్లు సమీకరించనుంది. ⇒ షేర్లను విక్రయిస్తున్న ఇతరత్రా దిగ్గజాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి సుమారు రూ. 2,197 కోట్లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూ. 2,178 కోట్లు), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూ. 2,131 కోట్లు), ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి రూ. 2,100 కోట్లు లభించనున్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెరి రూ. 1,200 కోట్లు లభించనున్నాయి. -
వెండి ఢమాల్
న్యూఢిల్లీ: వెండి వరుసగా రెండో రోజూ భారీ నష్టాన్ని ఎదుర్కొన్నది. కిలోకి రూ.6,660 నష్టపోయి రూ.2,48,740 వద్ద స్థిరపడింది. అటు పసిడి వరుసగా మూడో రోజూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. 10 గ్రాములకు రూ.960 నష్టంతో రూ.1,53,440 స్థాయికి దిగొచ్చింది. డాలర్‌తో రూపాయి బలపడడం, ఈక్విటీలు ఆకర్షణీయంగా మారడం పసిడి, వెండిలో నష్టాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోయినా, వచ్చే ఏడాది కాలానికి ద్రవ్యోల్బణం, పాలసీ పరంగా కఠిన స్వరాన్ని వినిపించడం ప్రతికూల సెంటిమెంట్‌కు కారణంగా పేర్కొంటున్నారు.‘‘ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో బంగారం ధరలు బలహీనపడ్డాయి. ఫెడ్ వ్యాఖ్యల ఆధారంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు కొనసాగిస్తే, 2026లో ఒక విడత వడ్డీ రేటు పెంపు ఉంటుందన్న అంచనా ఏర్పడింది’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. స్థిరమైన ఆర్థిక వృద్ధికితోడు, పటిష్టమైన లేబర్ మార్కెట్ (ఉపాధి కల్పన)తో డాలర్ బలపడడం బులియన్ ధరలపై ప్రభావం చూపించిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర ఔన్స్‌కు 3 శాతం నష్టంతో 4,252 డాలర్లు, వెండి ధర 6 శాతం పతనంతో 66.35 డాలర్లకు దిగొచ్చాయి. -
2026లో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్?: కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్స్ గురించి సంచనల ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఏడాది (2026) అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతోందని కియోసాకి హెచ్చరించారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక సంక్షోభం దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో S&P 500 కూడా దాదాపు 50% వరకు పడిపోయింది. దీనివల్ల అనేక మంది పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనను కొందరు 'గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్' అని కూడా పిలుస్తారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా రిస్క్‌లో ఉందని, అప్పులు, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ సమస్యల కారణంగా మరో పెద్ద క్రాష్ వచ్చే అవకాశం ఉందని కియోసాకి భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పెట్టుబడులపై మాత్రమే ఆధారపడకుండా.. బంగారం, వెండి లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన సూచిస్తారు.అయితే.. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే?, కియోసాకి చెప్పినది కేవలం ఒక అంచనా మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ ఎకానమీ, కంపెనీల పనితీరు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఎవరు చెప్పినా మార్కెట్ క్రాష్ ఖచ్చితంగా జరుగుతుందని ముందే చెప్పడం సాధ్యం కాదు.మార్కెట్ క్రాష్ అంటే?స్టాక్ మార్కెట్ క్రాష్ అంటే షేర్ల ధరలు చాలా తక్కువ సమయంలో భారీగా పడిపోవడం. ఇది ఆర్థిక మాంద్యం, కంపెనీల లాభాలు తగ్గడం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వల్ల జరుగుతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో షేర్లు అమ్మేయడం వల్ల మార్కెట్ మరింత పడిపోతుంది.🚨 BREAKING:RICH DAD POOR DAD AUTHOR ROBERT KIYOSAKI SAID:"THE BIGGEST STOCK MARKET CRASH IS COMING IN 2026."HE PREDICTED THE 2008 CRASH, WHEN S&P 500 CRASHED -50%HE BELIEVES SOMETHING BAD IS COMING... pic.twitter.com/a6Gw0qrXxW— ᴛʀᴀᴄᴇʀ (@DeFiTracer) June 17, 2026 -
పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల!
గురువారం ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో గోల్డ్ రేటు ఒక్కసారిగా పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,500 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర, సాయంత్రానికి 1450 రూపాయలు తగ్గి, రూ.1,37,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,51,100 నుంచి 1590 రూపాయలు తగ్గి రూ.1,49,510 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు 1,38,650 రూపాయల నుంచి 1,37,200 రూపాయల (రూ.1,450 తగ్గింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 1,51,250 రూపాయల నుంచి 1,49,660 రూపాయల (రూ.1590 తగ్గింది) వద్దకు చేరింది.చెన్నైలో ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గిన బంగారం రేటు, సాయంత్రానికి మరింత తగ్గింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,40,600 వద్ద నుంచి రూ.1,39,500 వద్దకు (రూ.1100 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు 1,53,380 రూపాయల నుంచి 1,52,180 రూపాయలకు (రూ.1200 తగ్గింది) చేరింది. -
ఇన్‌స్టా, ఫేస్బుక్లో కొత్త రూల్స్!
డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్)లలో కొత్త భద్రతా అప్డేట్స్ను ప్రకటించింది. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం టీనేజర్లకు సురక్షితమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించడం, తల్లిదండ్రులకు మరింత నియంత్రణ, అవగాహన కల్పించడం.మెటా తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి 13+ వయస్సుకు అనుగుణమైన కంటెంట్ సెట్టింగ్స్. దీని ద్వారా టీనేజర్లు తమ వయస్సుకు సరిపోని కంటెంట్‌ను చూడకుండా పరిమితం చేయడం జరుగుతుంది. ఫీడ్, రీల్స్, గ్రూప్స్ వంటి విభాగాల్లో అనుచిత కంటెంట్‌ను తగ్గించడం ద్వారా వారికి 'వయసుకు తగిన డిజిటల్ ప్రపంచం' అందించాలనే లక్ష్యం ఉంది.మెటా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా ఖాతా వయస్సును గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది. కేవలం యూజర్ ఇచ్చిన పుట్టిన తేదీపై ఆధారపడకుండా, ప్రొఫైల్ సమాచారం, పోస్టులు, కామెంట్లు, బయోలు వంటి డేటాను విశ్లేషించి అది మైనర్ ఖాతానా? కాదా? అని అంచనా వేస్తుంది. అంతే కాకుండా, ఫోటోలు.. వీడియోల ఆధారంగా వయస్సును అంచనా వేసే టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఇది వ్యక్తిని గుర్తించడానికి కాదు, కేవలం సాధారణ వయస్సు అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తామని మెటా స్పష్టం చేసింది.టీనేజర్ల భద్రత కోసం మరో కీలక అప్డేట్ తల్లిదండ్రులకు ఇచ్చే అలర్ట్స్. ఒక టీనేజర్ తక్కువ సమయంలో పదేపదే ఆత్మహత్య లేదా స్వీయహాని సంబంధిత విషయాలు సెర్చ్ చేస్తే, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం పంపబడుతుంది. దీని ద్వారా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది.తల్లిదండ్రులు ఇప్పుడు ఒకే చోట తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను చూడగలుగుతారు. దీనిని 'ఫామిలీ సెంటర్' అంటారు. ఇందులో స్క్రీన్ టైమ్, యాప్ వినియోగం వంటి వివరాలను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఇవన్నీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం జరుగుతోంది.ఇదీ చదవండి: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! -
ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్డేట్ వచ్చేసింది
ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త. త్వరలోనే ఏటీఎం సెంటర్ల ద్వారా, అలాగే యూపీఐ యాప్‌ల ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ సౌకర్యం అమలు కానుంది. ఇటీవల కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ఈపీఎఫ్‌వో 3.0లో సభ్యులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తక్షణ ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా రోజుకు రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా మూడు రోజుల్లో ఆమోదం పొందుతాయి. ఇంతకు ముందు ఈ ప్రక్రియకు 7నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఏఐ ఆధారిత సిస్టమ్ ద్వారా వేగంగా క్లెయిమ్‌లు సెటిల్ అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ మొత్తాన్ని కొత్త ఖాతాకు మార్చుకోవడానికి ఇంతకు ముందు ఫారమ్ 13 నింపాల్సి వచ్చేది. ఇకపై ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే పీఎఫ్ ఖాతా ఆటోమేటిక్‌గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే విధంగా, సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలను ఆధార్ ఆధారంగా స్వయంగా సరిచేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ మార్పులకు ఉద్యోగి,యజమాని ఇద్దరూ కలిసి జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది.ఈ కొత్త సౌకర్యాలతో ఉద్యోగులకు పేపర్‌వర్క్ తగ్గుతుంది, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతమవుతుంది, పీఎఫ్ ట్రాన్స్ఫర్ సులభతరం అవుతుంది. పెన్షన్ చెల్లింపుల్లో కూడా పారదర్శకత పెరుగుతుంది. అయితే, అన్ని ఫీచర్లు దశలవారీగా అమలు అవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ ఆధారిత ఉపసంహరణలు కొంతమంది సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.పెన్షన్ ఉపసంహరణకు సంబంధించి కొత్త నియమాలు కూడా అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు, 36 నెలల నిరుద్యోగం తర్వాత మాత్రమే పెన్షన్ ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో 3.0తో ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సహాయం, వేగవంతమైన సేవలు, మరింత పారదర్శకత లభించనున్నాయి. -
అత్యుత్తమ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ.. డిజిటల్ మోజో సక్సెస్!
భారతదేశంలోని ప్రతి రియల్ ఎస్టేట్ డెవలపర్ చివరకు ఒక ప్రశ్న అడుగుతారు: నా ప్రాజెక్ట్ అనుకున్న వేగంతో ఎందుకు అమ్ముడు పోవడం లేదు? చాలాసార్లు సమాధానం ప్రాజెక్ట్‌తో సంబంధం ఉండదు. లొకేషన్ అద్భుతంగా ఉండవచ్చు. స్పెసిఫికేషన్లు అత్యుత్తమంగా ఉండవచ్చు. ధర పోటీగా ఉండవచ్చు. అయినప్పటికీ విచారణలు నిదానంగా వస్తాయి, సైట్ విజిట్లు అరుదుగా ఉంటాయి, సేల్స్ టీమ్ అసంతృప్తి ఉంటుంది. కీలకమైన లోటు, దాదాపు ఎల్లప్పుడూ, ప్రాజెక్ట్ వెనుక ఉన్న డిజిటల్ మార్కెటింగ్ నాణ్యత.హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగి, దశాబ్దానికి పైగా పనిచేస్తున్న డిజిటల్ మోజో, ఈ సమస్యను పరిష్కరించడమే తన సంపూర్ణ గుర్తింపుగా నిర్మించుకుంది. నేడు, ఇది హైదరాబాద్‌లో అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా నిలబడింది మరియు భారతదేశంలో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా పేరు సంపాదించింది. తమ గురించి తామే చెప్పుకోవడం ద్వారా కాదు, వ్యాపార ప్రపంచంలో నిజమైన విలువ కలిగిన ఏకైక కరెన్సీ అయిన ఫలితాల ద్వారా నిరూపితమైన పనితీరు ఆధారంగా వారు తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు.మొదటి రోజు నుండి భిన్నమైన తత్వశాస్త్రంచాలా ఏజెన్సీలు లైక్‌లు, ఇంప్రెషన్లు మరియు రీచ్‌లో తమ విజయాన్ని కొలుస్తాయి. డిజిటల్ మోజో ఎల్లప్పుడూ విజయాన్ని భిన్నంగా కొలుస్తుంది. సంస్థాపకుడు మరియు సీఈఓ ధీరజ్ మేరానీ స్పష్టంగా వ్యక్తీకరించిన ఏజెన్సీ వ్యవస్థాపక తత్వం ఏమిటంటే, మార్కెటింగ్ P&L లో కనిపించాలి. మూడ్ బోర్డ్‌లో మాత్రమే కాదు. ఒక క్యాంపెయిన్‌ను ఆదాయానికి, అర్హత కలిగిన లీడ్‌లకు, వాస్తవ సైట్ విజిట్లకు మరియు బుకింగ్‌లకు ట్రేస్ చేయలేకపోతే, అది తన పనిని చేయలేదు.ధీరజ్ మేరానీ ఇరవై సంవత్సరాలకు పైగా డిజిటల్ మార్కెటింగ్ అనుభవం, IIM నేపథ్యం మరియు US మాస్టర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్‌ను ఈ తత్వశాస్త్రానికి అందిస్తారు. ఆయన విధానం విక్రేత కంటే వ్యాపార భాగస్వామిగా ఆలోచించే ఏజెన్సీని రూపొందించింది. ఒక వ్యవస్థాపకుడు చేసే అదే తీవ్రతతో క్లయింట్ సేల్స్ పైప్‌లైన్‌పై నిమగ్నమవుతుంది.రియల్ ఎస్టేట్ ఎందుకు? డిజిటల్ మోజో ఎందుకు?రియల్ ఎస్టేట్ డిజిటల్‌గా మార్కెట్ చేయడానికి అత్యంత సంక్లిష్టమైన రంగాలలో ఒకటి. టికెట్ పరిమాణాలు ఎక్కువగా ఉంటుంది. కొనుగోలుదారులు సందేహాస్పదంగా ఉంటారు, మరియు ఇంట్లో లేదా వాణిజ్య ఆస్తిలో పెట్టుబడి పెట్టే నిర్ణయం భావోద్వేగ మరియు హేతుబద్ధ లెక్కల పొరలను కలిగి ఉంటుంది, వాటిని చాలా డిజిటల్ క్యాంపెయిన్లు పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవుతాయి.డిజిటల్ మోజో సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కొనుగోలుదారు యాత్రపై స్వయంగా అభివృద్ధి చేసిన అవగాహనను మరియు ఇప్పుడు AI సహాయంతో ఇన్-హౌస్ ప్రొడక్ట్ Mojo Cortex ను అభివృద్ధి చేసింది — Google లో మొదటి సెర్చ్ నుండి చివరి సైట్ విజిట్ వరకు. ఏజెన్సీ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, సోషల్ మీడియా స్ట్రాటజీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వీడియో మార్కెటింగ్ మరియు డేటా అనలిటిక్స్ అంతటా పని చేస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లు, బిల్డర్లు మరియు బ్రాండ్ల కోసం, ఈ విభాగాలన్నింటినీ ఫలితాల ఆధారిత సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుతుంది.దేశవ్యాప్తంగా 50కి పైగా యాక్టివ్ క్లయింట్లు మరియు 70 మంది నిపుణుల బృందంతో, ఏజెన్సీ హైదరాబాద్‌లో బూటిక్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నుండి ముంబై, ఢిల్లీ మరియు టైర్ 2 నగరాలలో మార్కెట్ చేయబడిన పెద్ద-స్థాయి మిక్స్డ్ వ్యూస్ అభివృద్ధి వరకు ప్రతిదాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, పుణే మరియు ఇతర నగరాలలో ప్రముఖ బిల్డర్లు క్లయింట్లుగా ఉన్నారు, వీరి క్యాంపెయిన్లు కాస్ట్ పర్ లీడ్, లీడ్ నాణ్యత మరియు కన్వర్షన్ రేట్లపై పరిశ్రమ బెంచ్‌మార్క్‌లను నిరంతరం అధిగమించాయి.హైదరాబాద్ యొక్క అత్యుత్తమ రహస్యం — ఇప్పుడు బహిర్గతమవుతోందిహైదరాబాద్ యొక్క పోటీ మార్కెటింగ్ ల్యాండ్‌స్కేప్‌లో, డిజిటల్ మోజో నెమ్మదిగా సీరియస్ బ్రాండ్లు మొదట పిలిచే ఏజెన్సీగా మారింది. 233 Google రివ్యూలలో 4.7 స్టార్ రేటింగ్ మరియు రియల్ ఎస్టేట్, రిటైల్ మరియు హాస్పిటాలిటీ విస్తరించిన క్లయింట్ పోర్ట్‌ఫోలియోతో, ఏజెన్సీ దూకుడు స్వయం ప్రమోషన్ కంటే నిరంతర డెలివరీ ద్వారా హైదరాబాద్‌లో అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా తన స్థానాన్ని సంపాదించింది. వారు Google సెర్చ్ మరియు AI ఫలితాలలో నంబర్ 1 గా నిరంతరం ర్యాంక్ చేస్తున్నారు.నగరంలో డిజిటల్ మోజోను ప్రత్యేకతను చాటేది దాని పాడ్ మోడల్. ప్రతి క్లయింట్‌కు అంకితమైన నిపుణులను నియమించే నిర్మాణం, పెద్ద ఏజెన్సీలలో సాధారణంగా ఉండే రివాల్వింగ్-డోర్ అకౌంట్ మేనేజ్మెంట్ కంటే జవాబుదారీతనం మరియు కొనసాగింపును నిర్ధారిస్తుంది. క్లయింట్లు ప్రతి కొన్ని నెలలకు కొత్త బృందానికి రీ-బ్రీఫ్ చేయాల్సిన అవసరం లేదు. వారి బ్రాండ్‌ను అర్థం చేసుకున్న వారు వారితోనే ఉంటారు.జాతీయ లక్ష్యండిజిటల్ మోజో ఆశయాలు ఎప్పుడూ హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. భారతీయ రియల్ ఎస్టేట్ రంగం నిరంతరం వృద్ధి దిశగా పయనిస్తున్న నేపథ్యంలో, మెట్రో నగరాలు, టియర్-1 మరియు టియర్-2 నగరాల్లోని డెవలపర్లు డిజిటల్ అవగాహన కలిగిన కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందుకు తీవ్ర పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో, రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యేకతలను లోతుగా అర్థం చేసుకుని, ఫలితాలను అందించగల నిపుణుల ఏజెన్సీ అవసరం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.ఈ దశను చేరుకోవడానికి డిజిటల్ మోజో ఎంతో ప్రణాళికాబద్ధంగా, లక్ష్యపూర్వకంగా తన ప్రయాణాన్ని నిర్మించుకుంది. నేడు సంస్థ యొక్క విజయగాథలు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, అఫోర్డబుల్ హౌసింగ్, కమర్షియల్ ప్రాపర్టీలు, ప్లాటెడ్ డెవలప్మెంట్స్ మరియు మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టులు వంటి విభిన్న రియల్ ఎస్టేట్ విభాగాలకు విస్తరించాయి.అదేవిధంగా, సంస్థ యొక్క అనలిటిక్స్ సామర్థ్యాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. అధునాతన అట్రిబ్యూషన్ మోడల్స్‌ను వినియోగించడం ద్వారా, డెవలపర్లు పెట్టుబడి పెట్టిన ప్రతి మార్కెటింగ్ రూపాయి ఏ ఫలితాన్ని తీసుకువస్తుందో స్పష్టంగా అర్థం చేసుకునేలా ఖచ్చితమైన విశ్లేషణలను అందిస్తోంది.భారతదేశంలో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా, డిజిటల్ మోజో ధరపై పోటీ పడటం లేదు. ఇది ఫలితాలపై పోటీ పడుతోంది.క్లయింట్లు నిజంగా ఏమి చెప్తున్నారుఒక ఏజెన్సీ విలువకు అత్యంత నమ్మదగిన సూచిక దాని క్లయింట్ సంబంధాల వ్యవధి. డిజిటల్ మోజోలో, అనేక క్లయింట్లు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏజెన్సీతో ఉన్నారు. అసంతృప్తి మరియు మారడం సాధారణంగా జరిగే పరిశ్రమలో ఇది అరుదు. సంఖ్యలు అర్థమవుతూనే ఉన్నందున వారు ఉంటున్నారు.క్లయింట్ల నుండి పదే పదే వచ్చే అభిప్రాయం ఏమిటంటే, డిజిటల్ మోజో క్లయింట్ అకౌంట్లకు వ్యవస్థాపకుని మనస్తత్వాన్ని తీసుకువస్తుంది. బ్రీఫ్ బలహీనంగా ఉన్నప్పుడు ఏజెన్సీ వెనక్కి నెట్టుతుంది. క్లయింట్ గమనించే ముందే క్యాంపెయిన్ తక్కువ పనితీరు చేస్తున్నప్పుడు ఫ్లాగ్ చేస్తుంది. అడగకుండానే కొత్త ఆలోచనలను తెస్తుంది. సంక్షిప్తంగా, ఇది స్కిన్ ఇన్ ది గేమ్ ఉన్న భాగస్వామిలా వ్యవహరిస్తుంది.ముందున్న మార్గంభారత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన వృద్ధి కాలంలోకి ప్రవేశిస్తోంది. పట్టణీకరణ వేగవంతమవుతూ, గృహావసరాలు పెరుగుతూ, కొనుగోలుదారుల కొత్త తరం తమ మొత్తం ఆస్తి పరిశోధన యాత్రను ఆన్లైన్లో నిర్వహిస్తూ,రియల్ ఎస్టేట్ రంగంలో డిజిటల్ మార్కెటింగ్ ఇక సహాయక పాత్రలో కాకుండా, వ్యాపార వ్యూహంలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది.డిజిటల్ మోజో ఈ తరంగంతో పెరగడానికి సిద్ధంగా ఉంది — మరియు దాని క్లయింట్లు దాని కంటే వేగంగా పెరగడానికి సహాయం చేయడానికి. వ్యర్థ మెట్రిక్స్‌తో నిండిన డెక్స్లను డెలివరీ చేసే మరియు వాస్తవ సేల్స్ ప్రభావంపై తక్కువగా ఉండే ఏజెన్సీలతో అలసిన డెవలపర్లకు, డిజిటల్ మోజో ఒక భిన్నమైన సంభాషణను అందిస్తుంది: మీ ఆదాయ లక్ష్యంతో మొదలై మిమ్మల్ని అక్కడికి చేర్చే క్యాంపెయిన్ స్ట్రాటజీ వరకు వెనక్కు పనిచేసేది.చాలా ఏజెన్సీలు చేయగలవని మరియు నిరూపించగలవని వాగ్దానం చేయలేవు. డిజిటల్ మోజో చేయగలిగే కొద్ది సంస్థలలో ఒకటి.— డిజిటల్ మోజో | digitalmojo.in | హైదరాబాద్గమనిక: పైన పేర్కొన్న అంశాలు, సమాచారం పూర్తిగా ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి సాక్షి మీడియా గ్రూప్ ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
ఉద్యోగం పోయాక బంపరాఫర్.. డబుల్ శాలరీతో కొత్త జాబ్!
ఉద్యోగం కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు, సదరు వ్యక్తి ఆర్ధిక పరిస్థితి దెబ్బ తింటుంది. చాలా మందికి జీవితంలో ఒక పెద్ద షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అదే పరిస్థితి కొత్త అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తుంది. అలాంటి అనుభవాన్నే ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకుని నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు.దాదాపు నాలుగున్నరేళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి, తక్కువ జీతంతో కొనసాగుతున్నప్పటికీ.. సంస్థ పట్ల చాలా విధేయతతో వ్యవహరించాడు. అయితే కంపెనీ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ (Restructuring) ప్రక్రియలో భాగంగా అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయాల ప్రకారం.. అతను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తూ నెలకు సుమారు రూ.70 వేల జీతం పొందేవాడు. నాలుగున్నరేళ్ల సేవ చేసినప్పటికీ సరైన వేతన పెంపులు లేకపోవడంతో అదే జీతం వద్ద కొనసాగాడు. ఉద్యోగం కోల్పోయిన సమయంలో ఉద్యోగ విరమణ పరిహారం చెల్లింపు విషయంలో హెచ్ఆర్తో వాగ్వాదం కూడా జరిగిందని వెల్లడించాడు.అయితే ఆశ్చర్యకరంగా, తన చివరి పని రోజునే మరో కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అది కూడా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్. జీతం కూడా నెలకు రూ.1.58 లక్షలు అని వెల్లడించాడు. దీంతో అతని ఆదాయం ఒక్కసారిగా రెండింతలకు పైగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా తగ్గినట్లు పేర్కొన్నాడు. జీతం ఒక్కసారిగా అంత పెరుగుతుందని ఊహించలేదని ఉద్యోగి చెప్పాడు. ఇది కలలా అనిపిస్తోందని అన్నాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వేలాది మంది దీనిపై స్పందిస్తూ ఉద్యోగికి శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది 'ఉద్యోగంలో విధేయత కంటే నైపుణ్యానికి సరైన విలువ దక్కే చోటుకు మారడం మంచిది' అని సూచించారు. ఒక నెటిజన్ 'ప్రతి రెండు లేదా రెండున్నరేళ్లకు ఉద్యోగం మార్చడం మంచిది. విధేయతకు ఈ రోజుల్లో పెద్దగా విలువ లేదు' అని వ్యాఖ్యానించగా, మరొకరు 'నేను కూడా రూ.50 వేల జీతం నుంచి ఉద్యోగం మారి ఇప్పుడు రూ.1.1 లక్షలు పొందుతున్నాను' అని తెలిపారు.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
UAE: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం, దాని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేయడం, ఉపయోగించడాన్ని నిషేధిస్తూ.. ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూఏఈ, ఇప్పటికే ఇలాంటి చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాల జాబితాలో చేరింది.యూఏఈ మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం ప్రకారం, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను తెరవడం పూర్తిగా నిషేధం. అంతేకాకుండా.. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని పూర్తి ఫీచర్లను కూడా ఉపయోగించకూడదు. పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, కంటెంట్ షేర్ చేయడం, పబ్లిక్ గ్రూపులు లేదా ఓపెన్ ఛానళ్లలో చేరడం వంటి కార్యకలాపాలకు కూడా అనుమతి ఉండదు.ఈ నిబంధనలను అమలు చేయడంలో సోషల్ మీడియా సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించారు. 15 ఏళ్లలోపు పిల్లలు సృష్టించిన ఖాతాలను గుర్తించి, వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం కంపెనీలకు 12 నెలల గడువు ఇచ్చారు. ఒకవేళా నిబంధనలను పాటించకపోతే.. సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లపై హెచ్చరికలు, పరిమితులు లేదా పూర్తిస్థాయి నిషేధం వంటి చర్యలు తీసుకునే అధికారం యూఏఈ ప్రభుత్వ సంస్థలకు ఉంటుంది.సోషల్ మీడియా ద్వారా పిల్లలు అనుచిత కంటెంట్, సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతను పెంచడం, ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవల సోషల్ మీడియా వినియోగంపై పలు దేశాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు యూఏఈ కూడా అదే దారిలో అడుగులు వేయడంతో, భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక ప్రత్యేక అనుభవం కూడా. సందడిగా ఉండే రైల్వే స్టేషన్లు, ప్రకృతి అందాలను చూపించే మార్గాలు, ప్రయాణంలో కలిసే కొత్త వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే.. టికెట్ బుకింగ్ సమయంలో లేదా రిజర్వేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో కనిపించే కొన్ని రైల్వే పదాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ పదాల అర్థం తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభంగా.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగుతుంది.ఆర్ఏసీ (RAC)RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్. ఈ స్టేటస్ ఉన్న ప్రయాణికుడికి ఫుల్ బెర్త్ లభించదు. కానీ రైలులో ప్రయాణించవచ్చు. అయితే.. ఒక సీటును ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళా ఇతర ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకుంటే, అలాంటి సందర్భంలో ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటానికి బదులుగా ఆర్ఏసీ మంచి ఎంపికగా భావిస్తారు.జీఎన్డబ్ల్యుఎల్ (GNWL)GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇది రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే వెయిటింగ్ లిస్ట్ రకం. ఇతర వెయిటింగ్ లిస్ట్‌లతో పోలిస్తే GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా టికెట్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.టీక్యూడబ్ల్యుఎల్ (TQWL)TQWL అంటే తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్. తత్కాల్ పద్ధతిలో టికెట్ బుక్ చేసినప్పుడు సీటు దొరకకపోతే ఈ స్టేటస్ వస్తుంది. తత్కాల్ కోటాలో సీట్లు పరిమితంగా ఉండటంతో, TQWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు GNWL కంటే తక్కువగా ఉంటాయి. ప్రయాణం ప్రారంభమయ్యే వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అయితే మీ డబ్బు రీఫండ్ అవుతుంది.యూటీఎస్ (UTS)UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. ఇది రిజర్వేషన్ అవసరం లేని ప్రయాణాల కోసం ఉపయోగించే టికెట్ విధానం. సాధారణంగా చిన్న దూర ప్రయాణాలు లేదా రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. UTS టికెట్లను కౌంటర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రద్దీ సమయాల్లో ఈ కోచ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి, కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.ఈ-క్యాటరింగ్ఈ-క్యాటరింగ్ అనేది ప్రయాణికులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి, ప్రయాణ సమయంలో దానిని తమ సీటు వద్దకే తెప్పించుకునేందుకు వీలు కల్పించే ఒక సర్వీస్. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వివిధ రెస్టారెంట్ల నుంచి భోజనాన్ని సెలక్ట్ చేసుకుని, రైలు ప్రయాణ సమయంలో స్టేషన్ వద్ద మీరున్న చోటుకే డెలివరీ పొందవచ్చు. లాంగ్ జర్నీ సమయంలో తాజా, రుచికరమైన ఆహారం (ప్రాంతీయ వంటకాలు) రుచి చూడవచ్చు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుLHB అంటే లింకే హోఫ్మాన్ బుష్. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రైల్వే కోచ్‌లు. పాత ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవి. ప్రయాణ సమయంలో తక్కువ కుదుపులు ఉండటం వల్ల ప్రయాణికులకు మెరుగైన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రధానంగా LHB కోచ్‌లను ఉపయోగిస్తున్నారు.వికల్ప్ పథకంవికల్ప్ పథకం అనేది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించే ప్రత్యేక సదుపాయం. మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అదే మార్గంలో వెళ్లే మరో రైలులో సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అధిక రద్దీ ఉన్న రోజుల్లో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది.భారతీయ రైల్వేలో ఉపయోగించే ఈ ముఖ్యమైన పదాల అర్థం తెలుసుకోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. RAC, GNWL, TQWL వంటి స్టేటస్‌ల అర్థం తెలిసి ఉంటే మీ టికెట్ పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే UTS, E-Catering, LHB కోచ్‌లు, వికల్ప్ పథకం వంటి సదుపాయాల గురించి అవగాహన ఉండటం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కాబట్టి ప్రతి రైలు ప్రయాణికుడు ఈ పదాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ.. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 254.36 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 77,409.98 వద్ద, నిఫ్టీ 82.30 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 24,168.00 వద్ద నిలిచాయి.ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బాటా ఇండియా లిమిటెడ్, కేపీఆర్ మిల్ లిమిటెడ్, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ లిమిటెడ్, డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ఐఎఫ్సీఐ లిమిటెడ్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, డిబి (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పోర్షే కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
పోర్షే భారతదేశంలో కొత్త తరం 911 GT3ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.32 కోట్లు (ఎక్స్-షోరూమ్). కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.పోర్షే 911 జీటీ3 కారులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 503 బీహెచ్పీ పవర్, 470 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ కారు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కానీ ఇండియన్ మార్కెట్లో స్టాండర్డ్‌గా పీడీకే గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు.10 రంగులలో లభించే ఈ కారు 21 ఇంచెస్ అల్యూమినియం వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ సిల్వర్ థీమ్ పొందుతుంది. ప్రత్యేకమైన సీట్లు, రూఫ్ ఫినిష్, సీట్ బెల్ట్‌లు, వీల్స్ నుంచి కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్లు మొదలైనవి ఉన్నాయి. పనితీరు అద్భుతంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. -
బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్: కియోసాకి
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అప్పులు, ఫెడరల్ రిజర్వ్ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 37 ట్రిలియన్ డాలర్ల అప్పు భారంతో ఉంది. కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ద్రవ్యోల్బణాన్ని మరింత వేడెక్కనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, సీడీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే "పూర్ సేవర్స్" తమ డబ్బు విలువను నిశ్శబ్దంగా కోల్పోతారని ఆయన హెచ్చరించారు. "గోల్డ్ ఒక మంచి రక్షణ. 1970లలో అది విలువను నిలబెట్టుకుంది. కానీ అది కేవలం నీటిని నిల్వ చేసే సీసా లాంటిది. లీక్ కాకుండా కాపాడుతుంది. కానీ నిజమైన ధనవంతులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడే ఆస్తులను ఎంచుకుంటారు" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, గోల్డ్ మాత్రమే కాదు, చరిత్రలో ద్రవ్యోల్బణం వల్ల మరింత పెరిగిన మూడు ప్రత్యేక ఆస్తులు ఉన్నాయని, వాటిని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. -
ఎన్నారైల బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను పెంచే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైలు (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs) నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎంపిక చేసిన నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (NRE), ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ [FCNR(B)] డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేటు పరిమితులను తాత్కాలికంగా తొలగించింది. ఈ సడలింపు 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల తాజా ఎన్ఆర్ఈ డిపాజిట్లపై బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా అధిక వడ్డీ రేట్లు ప్రకటించవచ్చు. అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా ఇప్పటివరకు ఉన్న వడ్డీ పరిమితులు వర్తించవు. ఈ సడలింపు కొత్తగా సమీకరించే డిపాజిట్లకే కాకుండా, మెచ్యూరిటీ అనంతరం పునరుద్ధరించే అర్హత గల డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.ఇప్పటి వరకు ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సమాన కాలపరిమితి గల దేశీయ రూపాయి టర్మ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబంధన అమల్లో ఉండేది. అలాగే ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా నిర్దిష్ట పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిమితులు తొలగించడంతో బ్యాంకులు ఎన్నారై డిపాజిట్ల కోసం మరింత పోటీగా వడ్డీ రేట్లు ప్రకటించే అవకాశం ఏర్పడింది.ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల ప్రారంభంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల తాజా ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి హెడ్జింగ్ వ్యయాన్ని తానే భరిస్తామని కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ డిపాజిట్లను సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ నిబంధనల నుంచి కూడా తాత్కాలికంగా మినహాయించింది.మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే పలు బ్యాంకులు అమెరికన్ డాలర్ ఆధారిత ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై 6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లను ప్రకటించాయి. చిన్న, మధ్య తరహా బ్యాంకులు డిపాజిట్ల కోసం మరింత ఆకర్షణీయమైన రేట్లు ప్రకటించే అవకాశముందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్ఆర్వో ఖాతాల నుంచి ఎన్ఆర్ఈ ఖాతాలకు బదిలీ చేసిన నిధులకు ఈ ప్రత్యేక మినహాయింపు వర్తించదని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
ఏకంగా 80 శాతం మందిని తొలగించిన టెక్ సీఈవో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు దాదాపు ఉద్యోగులందరి వృత్తిగత జీవితంలో భాగమైపోయింది. కంపెనీలు రెండు మూడేళ్ల క్రితం నుంచే ఏఐ వెంట పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి అయిపోయాయి. ఏఐ స్కిల్స్ లేని, నేర్చుకోని ఉద్యోగులను కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఇగ్నైట్‌టెక్’ (IgniteTech) సీఈవో ఎరిక్ వాఘన్ (Eric Vaughan) తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఐ వినియోగాన్ని స్వీకరించడానికి నిరాకరించిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించి, దాదాపు 80 శాతం మంది సిబ్బందిని కొత్త వారితో భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల నిర్వహించిన ఫార్చ్యూన్ బ్రెయిన్‌స్టార్మ్ టెక్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చాయి.జనరేటివ్ ఏఐ వ్యాపార ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుందని భావించి 2023లో తమ సంస్థను “ఏఐ-ఫస్ట్” మోడల్లోకి మార్చే కార్యక్రమాన్ని ఇగ్నైట్‌టెక్ సీఈవో ఎరిక్ వాఘన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి వారం “ఏఐ మండేస్” పేరుతో ఒక రోజంతా ఉద్యోగులు ఏఐ ప్రాజెక్టులపైనే పనిచేయాలని నిబంధన పెట్టారు. ఏఐ టూల్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సులు నేర్పించడానికి కంపెనీనే ఖర్చు భరించేది. బయటి నుంచి నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించేది. ఇందు కోసం కంపెనీ తన మొత్తం పేరోల్‌లో సుమారు 20 శాతం వరకు వెచ్చించినట్లు వాఘన్ తెలిపారు.అయితే ఈ మార్పును ఉద్యోగులంతా సమానంగా స్వీకరించలేదని, ముఖ్యంగా సాంకేతిక విభాగాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని వాఘన్ చెప్పారు. శిక్షణ, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ కొందరు ఏఐ వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడంతో 2023 నుంచి 2024 తొలి త్రైమాసికం మధ్య వందలాది మంది ఉద్యోగులను తొలగించి కొత్త వారితో భర్తీ చేయాల్సి వచ్చిందన్నారు. “ఇది మా లక్ష్యం కాదు. కానీ కొత్త నైపుణ్యాలు నేర్పడం కంటే మనస్తత్వాన్ని మార్చడం కష్టమైంది” అని ఆయన వ్యాఖ్యానించారు.వివాదాస్పదమైన ఈ నిర్ణయాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్న వాఘన్, అదే పరిస్థితి మళ్లీ వస్తే ఇదే నిర్ణయం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు. అయితే ఇతర సంస్థలూ విధానాన్ని అనుసరించాలని తాను సిఫార్సు చేయనని స్పష్టం చేశారు. ఏఐ స్వీకరణ కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాకుండా సంస్థ సంస్కృతిలో కూడా మార్పు అనేది ఆయన అభిప్రాయం. “ఉద్యోగులు సంస్థ లక్ష్యాలతో ఏకీభవించకపోతే శిక్షణ లేదా వ్యూహాలు మాత్రమే సరిపోవు” అని అన్నారు. -
ఒక్కసారిగా పడిన వెండి.. పదిలంగా పసిడి
దేశంలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఒక్కసారిగా క్షీణించాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. -
రూ .1,260 కోట్లకు బంగ్లాను అమ్మేసిన మీడియా అధినేత
మీడియా రంగ దిగ్గజం, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లుటియన్స్ బంగ్లా జోన్ (LBZ)లో ఉన్న తన విలాసవంతమైన బంగ్లాను రూ.1,260 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ లావాదేవీ ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అత్యంత విలువైన నివాస ఆస్తి ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది.భగవాన్ దాస్ రోడ్లో కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ సమీపంలో ఉన్న దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆస్తిని ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ వ్యాపార కుటుంబం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొనుగోలుదారుడి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. డీల్‌కు సంబంధించిన తుది ప్రక్రియలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుభాష్ చంద్ర ఈ బంగ్లాను 2015లో సుమారు రూ.304 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు రూ.1,260 కోట్లకు విక్రయించడం ద్వారా దాదాపు పదేళ్లలో ఆస్తి విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.లుటియన్స్ ఢిల్లీ దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నివాస ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ రూపకల్పన చేసిన ఈ ప్రాంతంలో సుమారు 3,000 బంగ్లాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, విదేశీ దౌత్యవేత్తలు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు నివసించే ఈ ప్రాంతంలో భూమి లభ్యత చాలా పరిమితంగా ఉండటంతో ఆస్తుల ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.కోవిడ్ అనంతరం ఢిల్లీ లుటియన్స్ జోన్లో, గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్ పరిసరాల్లో భారీ విలువ కలిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందాలు పెరిగాయి. ఇటీవలే భగవాన్ దాస్ రోడ్‌లోని మరో 3.2 ఎకరాల రాజభవనం సుమారు రూ.1,000 కోట్లకు విక్రయమయ్యే దశకు చేరడం, అలాగే లుటియన్స్ ప్రాంతంలోని ఇతర చారిత్రక బంగ్లాలు కూడా వెయ్యి కోట్లకు పైగా ధరలు పలకడం ఈ మార్కెట్లో డిమాండ్ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. -
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హాకిష్ విరామం తరువాత గ్లోబల్ ఈక్విటీల క్షీణత మధ్య దేశీయ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ కొద్దిగా పడిపోయాయి. ఈరోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 29 పాయింట్లు ఎగబాకి 24,115 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 పాయింట్లు పెరిగి 77,220 వద్ద ట్రేడవుతోంది.ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.17 శాతం, 0.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ మెరుగైన పనితీరు కనబరిచాయి.యూఎస్, ఇరాన్ మధ్యంతర శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాత బ్రెంట్ ముడి చమురు ధరలు దిగివచ్చాయి. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లో జూన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ కు 1.48 శాతం తగ్గి 78.37 డాలర్లుగా ఉంది. ఇక బంగారం, వెండి ఫ్యూచర్స్ వరుసగా 0.93 శాతం, 1.9 శాతం నష్టపోయాయి. -
ఈవీల కోసం కేంద్రం మరో కొత్త స్కీమ్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన ఖనిజాలను డెడ్ అయిపోయిన బ్యాటరీలు, ఈ-వ్యర్థాలు, జీవితకాలం ముగిసిన వాహనాల నుంచి రీసైకిల్ చేసేందుకు రూ.1,500 కోట్ల విలువైన ‘క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్’ను అమలు చేయనున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన బ్యాటరీ సమ్మెట్ 2026 సదస్సులో ఈ ప్రకటన చేశారు. ఈ పథకం జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)లో భాగంగా అమలవుతుంది.ప్రస్తుతం భారత్‌లో ఈవీలు, పవర్ స్టోరేజ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా విస్తరిస్తుండటంతో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2022లో సుమారు 20 గిగావాట్-గంటల (GWh) స్థాయిలో ఉన్న డిమాండ్ 2030 నాటికి 220 GWhకు చేరే అవకాశం ఉంది. దీంతో దిగుమతి బ్యాటరీ పదార్థాలపై ఆధారపడటం కూడా గణనీయంగా పెరిగింది.ఈ నేపథ్యంలో పాత బ్యాటరీల నుంచి విలువైన ఖనిజాలను రీసైకిల్ చేయడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రీసైక్లింగ్ యూనిట్లకు మూలధన (Capex), కార్యకలాపాల (Opex) సబ్సిడీలు అందించేలా పథకాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఖనిజాలను నిజంగా వెలికితీసే రీసైక్లింగ్ సంస్థలకే ప్రోత్సాహకాలు లభిస్తాయి.ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకం ద్వారా కనీసం 270 కిలోటన్నుల వార్షిక రీసైక్లింగ్ సామర్థ్యం ఏర్పడి, దాదాపు 40 కిలోటన్నుల కీలక ఖనిజాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. అలాగే సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు దాదాపు 70 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.ఇదే సమయంలో కీలక ఖనిజాల రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంచేందుకు నాలుగు క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పార్కులు, తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు అర్జెంటీనా సహా విదేశాల్లో లిథియం నిక్షేపాల కొనుగోలు, దేశీయ అన్వేషణ ప్రాజెక్టులు, ఖనిజ బ్లాకుల వేలం వంటి చర్యల ద్వారా దీర్ఘకాలిక సరఫరా భద్రతపై దృష్టి సారిస్తోంది.ఈ చర్యలు భారత ఈవీ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల భద్రతను పెంచడమే కాకుండా, చైనా వంటి దేశాలపై ఉన్న ఆధారాన్ని క్రమంగా తగ్గించి ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి తోడ్పడతాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌కు స్థిరమైన, తక్కువ వ్యయంతో కూడిన బ్యాటరీ సరఫరా వ్యవస్థను నిర్మించడంలో ఈ పథకం కీలక మైలురాయిగా భావిస్తున్నారు. -
ఎన్ఎస్ఈ మెగా ఐపీవో రెడీ
ముంబై: ఎన్ఎస్ఈ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) సెబీ వద్ద ఎన్ఎస్ఈ బుధవారం దాఖలు చేసింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో మొత్తం 14.89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.ఇష్యూ పరిమాణం రూ.30,000 కోట్లుగా అంచనా. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనుంది. 2024లో రూ.27,870 కోట్లను సమీకరించిన హ్యుందాయ్ ఐపీవో రికార్డును బ్రేక్ చేయనుంది. ఎస్బీఐ ఒక్కటే 24.75 మిలియన్ షేర్లను విక్రయించనుంది. కాగా, ఎన్ఎస్ఈ 2016లో తొలిసారి ఐపీవో కోసం దరఖాస్తు చేయగా.. కో–లొకేషన్ కేసు, పాలపనాపరమైన అంశాలతో ఉపసంహరించుకుంది. -
పసిడి రూ.4,800 పతనం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన పవనాలు, బలమైన రూపాయి వెరసి పసిడి, వెండి బుధవారం భారీగా నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.4,800 తగ్గి రూ.1,54,400 స్థాయికి దిగొచ్చింది. వెండి సైతం కిలోకి రూ.5,300 నష్టపోయి రూ.2,55,400 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన పనితీరు నేపథ్యంలో వరుసగా రెండో రోజు దేశీ బులియన్ మార్కెట్లో బలహీన ధోరణి నెలకొన్నట్టు విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ముఖ్యంగా కొత్త చైర్మన్ కెవిన్ వార్‡్ష సారథ్యంలో యూఎస్ ఫెడ్ తొలి సమావేశం వివరాలు బుధవారం విడుదల కానున్నాయి.వడ్డీ రేట్లపై కొత్త చైర్మన్ వ్యాఖ్యలు ఎలా ఉంటాయన్నది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. బుధవారం రాత్రి (భారత కాలమానం) యూఎస్ ఫెడ్ నిర్ణయాలు వెల్లడి కానుండడంతో బంగారం ధర స్పాట్ మార్కెట్లో స్థిరీకరణను చూసినట్టు మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్‌సింగ్ తెలిపారు. ముఖ్యంగా యూఎస్–ఇరాన్ ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్న విషయం గమనార్హం.వచ్చే శుక్రవారం ఇది చోటు చేసుకుంటుందని అంచనా. ఈలోపు ఎలాంటి పరిణామాలు ఉంటాయేమోనన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 4,396 డాలర్లు, వెండి ధర 71.5 డాలర్ల వద్ద ఉన్నాయి. -
హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తమ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. డెలివరీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ కోసం బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. నగరంలో సూపర్ చార్జర్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు వివరించాయి. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలంటే పబ్లిక్ చార్జింగ్ సదుపాయాలతో పాటు ప్రధానంగా హోమ్ చార్జర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. హైదరాబాద్‌తో కలిపి దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంస్థకు ఐదు సెంటర్లు ఉన్నాయని తెలిపాయి. టెస్లా భారత్‌లో రెండు మోడల్స్‌ని విక్రయిస్తోంది. ఇందులో మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 50,89,000 నుంచి, మోడల్ వై ఎల్ ఆల్ వీల్ డ్రైవ్ వాహనం ధర రూ. 61,99,000 నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతుంది. వీటిని కంపెనీ చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తోంది.సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు 6 నుంచి 10 వారాల వరకు ఉంటోందని సంస్థ వర్గాలు వివరించాయి. మోడల్ని బట్టి ఫైనాన్సింగ్ కింద నెలకు రూ. 39,990 నుంచి ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాయి. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా తదితర బ్యాంకులతో చేతులు కలిపినట్లు వివరించాయి. జూన్ 30లోగా బుక్ చేసుకునే వారికి కాంప్లిమెంటరీ వాల్ కనెక్టర్ పొందవచ్చని పేర్కొన్నాయి. -
బీఎండబ్ల్యూ ‘మినీ కంట్రీమ్యాన్ సీ’
చెన్నై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా’ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం కారును ప్రవేశపెట్టింది. తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ.. సరికొత్త ‘మినీ కంట్రీమ్యాన్ సీ’ క్రాస్ఓవర్ కారును బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 47.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్). దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభం కాగా, డెలివరీలను సైతం తక్షణమే చేపట్టనున్నారు. ఇంజిన్ సామర్థ్యం ఈ కారులో 1.5–లీటర్, 3–సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. బీఎమ్‌డబ్ల్యూ ‘ఎక్స్1’లో వాడిన ‘ఫ్రంట్–వీల్–డ్రైవ్ యూకేఎల్2’ ప్లాట్‌ఫారమ్‌పైనే దీనిని కూడా రూపొందించారు. 7–స్పీడ్ డ్యూయల్–క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేసే ఈ ఇంజిన్.. గరిష్టంగా 156 హార్స్ పవర్‌ను, 240 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు.. ఆక్టాగోనల్ ఫ్రంట్ గ్రిల్, రీ–ప్రొఫైల్డ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ప్రత్యేకమైన షాంపేన్–కలర్ ఎక్స్టీరియర్ ట్రిమ్‌తో ఈ కారు ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది. పాత మోడల్స్ కంటే ఇందులో క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్–1 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), 360–డిగ్రీల కెమెరాతో కూడిన పార్క్ అసిస్టెంట్ ప్లస్, 12–స్పీకర్ల ప్రీమియం ‘హార్మన్ కార్డన్’ మ్యూజిక్ సిస్టమ్‌ను ఇందులో జోడించారు. స్థానిక అసెంబ్లింగ్... ‘ఈ సరికొత్త వేరియంట్‌ను చెన్నై ప్లాంట్‌లో స్థానికంగా అసెంబుల్ చేయడం మా బ్రాండ్‌కు పెద్ద మైలురాయి. దీని వల్లే కస్టమర్లకు ఇదొక అద్భుతమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయంగా మారింది’ అని బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్ ఎండీ థామస్ డోస్ తెలిపారు. -
జూలై 15 నుంచి భారత్-బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమలు
భారత్–బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాటు సామాజిక భద్రతకు సంబంధించిన డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) కూడా అదే రోజు అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ పరిణామాన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించింది.ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో 99 శాతం ట్యాక్స్ ఫ్రీ ప్రవేశం లభించనుంది. దీంతో వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి రంగాలకు విశేష ప్రయోజనం చేకూరనుంది.ఈ డీల్ కుదిరిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. బ్రిటన్‌తో వాణిజ్య సంబంధాల్లో ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలు కల్పించడమే కాకుండా ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని తెలిపారు.కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుశ్ గోయెల్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉన్న సుంక అవరోధాలను ఈ ఒప్పందం తొలగిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులకు సమాన పోటీ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.2021లో ప్రారంభమైన ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్, ఇండియా–యూకే రోడ్‌మ్యాప్ 2030 ఆధారంగా ఈ ఒప్పందానికి పునాది పడింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి.మొత్తం 30 అధ్యాయాలతో రూపొందిన ఈ ఒప్పందంలో డిజిటల్ ట్రేడ్, టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, మేధో సంపత్తి హక్కులు, ప్రభుత్వ కొనుగోళ్లు వంటి ఆధునిక అంశాలను కూడా చేర్చారు. అయితే పాల ఉత్పత్తులు, ధాన్యాలు, చిరుధాన్యాలు, వంట నూనెలు, ఆయిల్‌సీడ్స్, ఆపిల్స్ తదితర సున్నిత రంగాల ప్రయోజనాలను భారత్ రక్షించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. -
2026 కవాసకి నింజా 500 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో కొత్త '2026 నింజా 500' బైక్ లాంచ్ చేసింది. దీని ధర మునుపటి మోడల్ కంటే రూ.1000 ఎక్కువ. దీంతో ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.76 లక్షలు.కొత్త నింజా 500లో పెద్దగా యాంత్రిక మార్పులు చేయలేదు. అయితే 2026 మోడల్‌ను E20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేశారు. దీంతో భవిష్యత్ ఇంధన విధానాలకు అనుగుణంగా ఈ బైక్ సిద్ధంగా ఉంది. అలాగే కవాసాకి ప్రత్యేకమైన లైమ్ గ్రీన్ కలర్ స్కీమ్‌లో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది.ఈ బైక్‌ను 2024లో విడుదల చేసిన నింజా 400కు వారసుడిగా కంపెనీ పరిచయం చేసింది. ఇందులో 451 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 44.38 బీహెచ్పీ పవర్, 42.6 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఇందులో ఉంది. దీంతో రైడింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.సస్పెన్షన్ వ్యవస్థలో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ను కొనసాగించారు. బ్రేకింగ్ కోసం ముందు 310 మిమీ డిస్క్, వెనుక 220 మిమీ డిస్క్ బ్రేక్‌లను అందించారు. ఇవి మెరుగైన నియంత్రణ, భద్రతను అందిస్తాయి.డిజైన్ విషయానికి వస్తే, నింజా సిరీస్‌కు ప్రత్యేకమైన స్పోర్టీ లుక్ పొందుతుంది. ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, షార్ప్ ఫెయిరింగ్ లైన్స్, ఆకర్షణీయమైన ఫ్రంట్ డిజైన్ బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. అలాగే ఫుల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది.ఈ బైక్‌లో 785 మిమీ సీటు ఎత్తు, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 171 కిలోల కర్బ్ వెయిట్ వంటి అంశాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద 2026 కవాసాకి నింజా 500లో పెద్ద మార్పులు లేకపోయినా, E20 అనుకూలతతో పాటు కొత్త రంగు ఎంపికలను జోడించడం ద్వారా కంపెనీ ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. -
రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ..
జీవితంలో కొన్ని అవకాశాలు కోల్పోతే.. ఎప్పటికీ తిరిగి రావు. అలాంటి ఒక సంఘటనను భారతదేశానికి చెందిన అమెరికాలోని ఒక పాఠశాల వ్యవస్థాపకురాలు, సీఈఓ స్నేహా బిస్వాస్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆమెకు.. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాను వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని పరిస్థితుల కారణంగా కలుసుకోలేక పోయారు. ఈ విషయం ఇప్పటికీ తన జీవితంలో పెద్ద లోటుగా మిగిలిపోయిందని ఆమె వెల్లడించారు.స్నేహా బిస్వాస్ 2020 జనవరిలో టాటా స్టీల్‌లో ఇంటర్న్‌గా పనిచేస్తున్న సమయంలో రతన్ టాటాకు ఒక ఈమెయిల్ పంపారు. సాధారణంగా ఇలాంటి ప్రముఖులకు రోజూ వందలాది మెయిల్స్ వస్తుంటాయి. అయితే ఆశ్చర్యకరంగా రతన్ టాటా స్వయంగా ఆమె మెయిల్‌ను చదివి సమాధానం పంపారు. 'మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నిస్తాను. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని ఆయన రాసిన సందేశం స్నేహాను ఎంతో ఆశ్చర్యపరిచింది.ఆమెను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం రతన్ టాటా వినయం. 82 ఏళ్ల వయస్సులో కూడా ఒక ఇంటర్న్ పంపిన మెయిల్‌ను చదివి స్పందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. చాలా మంది నాయకులు తమకంటే చిన్నవారిని పట్టించుకోకపోయినా, రతన్ టాటా మాత్రం ప్రతి వ్యక్తిని గౌరవంగా చూసేవారని ఆమె అన్నారు.ఈ సంఘటన తర్వాత రతన్ టాటా ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ కూడా వచ్చింది. టాటా ఆమెను కలవాలనుకుంటున్నారని, సమావేశానికి అనువైన తేదీ చెప్పాలని కోరారు. అయితే అదే రోజున స్నేహా అమెరికాకు తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. 'తర్వాత కలుసుకోవచ్చు' అని అనుకున్నప్పటికీ, ఆ అవకాశం మళ్లీ రాలేదు.తర్వాతి సంవత్సరాల్లో అమెరికాలోనే ఉండి తన వ్యాపార కార్యకలాపాల్లో స్నేహా బిజీ అయిపోయారు. ఇదే సమయంలో 2024 అక్టోబర్ 9న 86 ఏళ్ల వయస్సులో రతన్ టాటా కన్నుమూశారు. దీంతో ఆయనను ప్రత్యక్షంగా కలవాలనే కోరిక శాశ్వతంగా నెరవేరకుండా పోయింది.అయితే ఈ అనుభవం తనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని స్నేహా చెప్పారు. నిజమైన నాయకత్వం అంటే కేవలం వ్యాపార విజయాలు కాదు, వినయం, దయ, ప్రతి వ్యక్తిని గౌరవించే మనస్తత్వం కూడా కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. రతన్ టాటా నుంచి వచ్చిన ఆ ఈమెయిల్‌ను ఇప్పటికీ చదువుతుంటానని, అది తనకు స్ఫూర్తినిస్తుందని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: 80 గంటల పని.. అమెజాన్ అనుభవాలు చెప్పిన సీఈవో! -
సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట
అమీన్పూర్ (సంగారెడ్డి జిల్లా)లోని ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) డీ-నోటిఫికేషన్‌కు సంబంధించిన వివాదంలో ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో కీలక ఉపశమనం లభించింది. తెలంగాణ హైకోర్టు గతంలో మంజూరు చేసిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వం సహా ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.న్యాయమూర్తులు జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం, ఓమిక్స్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)పై విచారణ జరిపి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో కొనసాగాలని ఆదేశించింది.ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు, 2025 జూలై 18న జరిగిన స్పెషల్ ఎకనామిక్ జోన్ల బోర్డ్ ఆఫ్ అప్రూవల్ 130వ సమావేశపు నిమిషాల్లోని అజెండా అంశం నం. 130.13 అమలును నిలిపివేసింది. ఈ అజెండా అంశం ప్రకారం.. అమీన్పూర్ గ్రామం, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్న 4.05 హెక్టార్ల ఎస్ఈజెడ్ ప్రాంతాన్ని పూర్తిగా డీ-నోటిఫై చేయాలని ప్రతిపాదించబడింది.ఈ నిర్ణయాన్ని ఓమిక్స్ ఇంటర్నేషనల్ సవాలు చేస్తూ, తమకు ఇప్పటికే మంజూరైన అనుమతులకు విరుద్ధంగా ఈ చర్య ఉందని, అలాగే ఎస్ఈజెడ్ అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాదించింది. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతుల మేరకు తాము ఎస్ఈజెడ్ డెవలపర్‌గా గుర్తింపు పొందే హక్కు కలిగి ఉన్నామని కంపెనీ పేర్కొంది.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగించడం ద్వారా, వివాదంపై తుది నిర్ణయం వెలువడే వరకు ఎస్ఈజెడ్కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి యథాతథంగా కొనసాగుతుందని స్పష్టమైంది.సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, ఎస్ఈజెడ్ విధానాల లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. తమ వాదనలను సుప్రీంకోర్టు ముందు సమగ్రంగా వినిపించే అవకాశాన్ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతివాదులు తమ కౌంటర్లు దాఖలు చేసిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణకు రానుంది. -
రైలు ఆలస్యమైతే.. ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్!
రైలు ప్రయాణాలు ఆలస్యమైతే ప్రయాణికులకు అసహనం కలుగుతుంది. గంటల తరబడి స్టేషన్లో వేచి ఉండడం, అనౌన్స్మెంట్లు వినడం, టైమ్ చూసుకుంటూ ఆందోళన చెందడం చాలా మందికి సాధారణ అనుభవమే. ఇలాంటి పరిస్థితుల్లో భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు ఊరట కలిగించే ఒక సదుపాయాన్ని అందిస్తోంది.నియమాల ప్రకారం.. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు నిర్ణీత సమయానికి.. రెండు గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచిత భోజనం అందించడం జరుగుతుంది. ఉదయం అయితే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం అయితే లంచ్, సాయంత్రం లేదా రాత్రి అయితే డిన్నర్ అందిస్తారు.ఫుడ్ మెనూ ప్రకారం..టీ / కాఫీ➤టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు➤మిల్క్ క్రీమర్, షుగర్ లేదా షుగర్-ఫ్రీ సాచెట్లుబ్రేక్ఫాస్ట్ / సాయంత్రం స్నాక్స్➤4 బ్రెడ్ స్లైసులు (వైట్ లేదా బ్రౌన్)➤బటర్➤ఫ్రూట్ జ్యూస్ లేదా డ్రింక్➤టీ లేదా కాఫీలంచ్ / డిన్నర్➤అన్నం + పప్పు (దాల్)➤రాజ్మా లేదా చోలే➤పచ్చడి ప్యాకెట్➤లేదా 7 పూరీలు + మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ➤ఉప్పు, మిరియాల ప్యాకెట్లు కూడా ఉంటాయిఇది ప్రయాణికులు కొంత సౌకర్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా.. రైలు మూడు గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దు చేసుకుని పూర్తి రీఫండ్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ రీఫండ్ ప్రక్రియను కూడా ఆన్లైన్ బుకింగ్ చేసిన అదే ప్లాట్ఫార్మ్ ద్వారా సులభంగా పొందవచ్చు.దీర్ఘకాలిక ఆలస్యాల సమయంలో వెయిటింగ్ హాల్స్‌ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కొన్ని స్టేషన్లలో ఫుడ్ కౌంటర్లు కూడా ఎక్కువ సమయం వరకు తెరిచి ఉంటాయి, తద్వారా ప్రయాణికులకు అవసరమైన ఆహారం అందుబాటులో ఉంటుంది. -
సిట్రోయెన్ కొత్త కారు: ధర రూ.6.89 లక్షలు!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ భారత మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ కార్ ఈసీ3ఎక్స్ (eC3X) 2026ను లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ధరలు రూ.6.89 లక్షల నుంచి (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ స్కీమ్) ప్రారంభమవుతాయి. సాధారణ ధర రూ.10.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ డిజైన్ పరంగా కూడా అనేక మార్పులు పొందింది. ముందుభాగంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్ప్లిట్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ లైట్స్ వంటివి ఉన్నాయి. 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. ఈ కారు పోలార్ వైట్, స్టీల్ గ్రే, కోస్మో బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్ వంటి ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త డ్యాష్‌బోర్డ్‌తో పాటు వైట్ అండ్ బ్లూ డ్యూయల్ టోన్ థీమ్‌ను అందించారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ 2.0 వంటివాటితో పాటు.. 6 ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉన్నాయి.కొత్త eC3Xలో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో సుమారు 320 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. -
80 గంటల పని.. అమెజాన్ అనుభవాలు చెప్పిన సీఈవో!
విజయవంతమైన వ్యాపారవేత్తల జీవితంలో ఎన్నో కఠినమైన అనుభవాలు, కష్టపడి పనిచేసిన రోజులు ఉంటాయి. అమెరికాకు చెందిన ఏఐ భద్రతా సంస్థ డీప్ సెంటినెల్ సీఈవో డేవిడ్ సెలింగర్ కూడా అలాంటి అనుభవాలనే గుర్తు చేసుకున్నారు. ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో అమెజాన్‌లో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నాయకత్వం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు.డేవిడ్ సెలింగర్ 2002లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అమెజాన్‌లో ఉద్యోగం పొందారు. 2003 జనవరిలో కంపెనీలో చేరి.. కస్టమర్ కస్టమర్ బిహేవియర్ రోల్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో అమెజాన్ ఇప్పటిలా లక్షలాది ఉద్యోగులతో కూడిన దిగ్గజ సంస్థ కాదు. కొద్దిమంది ఉద్యోగులతో పనిచేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో డేటాను విశ్లేషించే అవకాశాలు అక్కడ ఉండేవని ఆయన తెలిపారు.అమెజాన్‌లో పనిచేసే సమయంలో జెఫ్ బెజోస్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు కలిసేవాడినని సెలింగర్ చెప్పారు. బెజోస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో శక్తివంతమైన, లక్ష్యసాధనపై పూర్తిగా దృష్టి పెట్టే నాయకుడని పేర్కొన్నారు. “ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం” అని సెలింగర్ అన్నారు.అమెజాన్‌లోని పని సంస్కృతి కూడా అంతే కఠినంగా ఉండేదని ఆయన వివరించారు. వారానికి సుమారు 80 గంటలు పనిచేసేవాళ్లమని చెప్పారు. ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టే వాతావరణం ఉండేదని, అక్కడ పనులు కూడా వేగంగా పూర్తయ్యేవని తెలిపారు. సంప్రదాయ సంస్థల్లో ఉండే అనవసర ప్రక్రియలు, సమస్యలు తక్కువగా ఉండటంతో పనిలో వేగం పెరిగేదని చెప్పారు.ఆ కఠినమైన అనుభవమే.. తనను మరింత మెరుగైన నాయకుడిగా తీర్చిదిద్దిందని సెలింగర్ అభిప్రాయపడ్డారు. అమెజాన్‌ను విడిచిన తర్వాత ఆయన డీప్ సెంటినెల్ అనే ఏఐ బేస్డ్ హోం సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. పెద్ద స్థాయి డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై అమెజాన్‌లో పొందిన అనుభవం తన వ్యాపార విజయానికి బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు. -
ఆ రాత్రంతా ఏడ్చాను.. చివరకు కాగ్నిజెంట్‌లో జాబ్!
ప్రతి విజయం వెనుక ఎన్నో కష్టాలు, నిరాశలు, తిరస్కరణలు దాగి ఉంటాయి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అంటారు చెన్నైకు చెందిన మహేశ్వరి మోహన్. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సక్సెస్ జర్నీ ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మహేశ్వరి మోహన్ చదువుకునే రోజుల్లోనే కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేయాలని కలలు కనింది. 2022లో తన కాలేజీ క్యాంపస్ డ్రైవ్ సమయంలో కాగ్నిజెంట్ తనను మొదటిసారి తిరస్కరించింది. కలలు కన్న కంపెనీ రిజెక్ట్ చేయడంతో 'ఆ రాత్రంతా నేను ఏడ్చాను' అని ఆమె తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.కాగ్నిజెంట్ కంపెనీ రిజెక్ట్ చేసిందని, మహేశ్వరి అక్కడితో ఆగిపోలేదు. మరోసారి 2023 జూన్‌లో జరిగిన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరై మళ్లీ చివరి రౌండ్ వరకు చేరుకున్నారు. కానీ మరోసారి తిరస్కరణ ఎదురైంది. దీంతో ఆమె తనను తాను ప్రశ్నించుకుంది, తనకు కాగ్నిజెంట్‌లో పనిచేయడానికి కావాల్సిన సామర్థ్యం లేదని భావించింది.అలాంటి సమయంలో.. 2023 నవంబర్‌లో హెచ్‌సీఎల్‌టెక్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్కడ పనిచేయడమే తన కెరీర్లో ఒక కీలక మలుపుగా మారిందని మహేశ్వరి చెప్పారు. సంస్థలో కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నారు, అనుభవం సంపాదించారు, వృత్తిపరంగా ఎంతో ఎదిగారు. అయినప్పటికీ కాగ్నిజెంట్‌లో చేరాలనే కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.ఇదిలా ఉండగా.. 2026 ఏప్రిల్‌లో అనుకోకుండా కాగ్నిజెంట్ రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. రియల్ టైమ్ అనలిస్ట్ (RTA) పోస్టుకు అవకాశం ఉందని తెలియజేశారు. ఈసారి మహేశ్వరి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. అన్ని ఇంటర్వ్యూ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి ఎంపికయ్యారు. చివరకు 2026 జూన్‌లో కాగ్నిజెంట్‌లో చేరి తన నాలుగేళ్ల కలను సాకారం చేసుకున్నారు.తన విజయాన్ని వివరిస్తూ ఆమె ''2022లో ఫ్రెషర్‌గా ఉన్నప్పటికంటే.. ఇప్పుడు నేను పది రెట్లు ఎక్కువగా సిద్ధంగా ఉన్నాను'' అని చెప్పారు. జీవితంలో కొన్ని అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, అవి మన ఎదుగుదలకు అనుకూలంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.ఒకసారి లేదా రెండుసార్లు విఫలమైనా ప్రయత్నాన్ని ఆపకూడదు. ప్రతి తిరస్కరణ మనల్ని మరింత బలంగా, అనుభవజ్ఞులుగా తయారు చేస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు విజయం తప్పకుండా లభిస్తుందని మహేశ్వరి కథ కళ్ళకు కట్టినట్లు చెబుతుంది.ఇదీ చదవండి: డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో.. -
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
బుధవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 347.14 పాయింట్లు లేదా 0.45 శాతం లాభంతో 77,155.62 వద్ద, నిఫ్టీ 96.55 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 24,085.70 వద్ద నిలిచాయి.బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్, హైబ్రిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, అమాగి మీడియా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీమెక్ లిమిటెడ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మస్క్ ఎంత ధనవంతుండంటే.. వందేళ్లు తరగని సంపద!
కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనేది సామెత. కానీ ప్రపంచ అపర కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్‌కు మాత్రం ఈ సామెత సరిపోదేమో! ఎందుకంటే ఆయన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ స్టాక్మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్లకు అధిపతి) అవతరించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు రాయిటర్స్, ఏపీ, బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం, ఇది ఆధునిక ఆర్థిక చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ క్రమంలో మస్క్ సంపద గురించి విస్తృత చర్చ సాగుతోంది.జూన్ 12, 2026న నాస్డాక్లో "SPCX" టిక్కర్‌తో స్పేస్ఎక్స్ షేర్లు లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధర 135 డాలర్లుగా నిర్ణయించగా, ట్రేడింగ్ ప్రారంభంలోనే 150 డాలర్లకు చేరుకుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా నమోదైంది. లిస్టింగ్ అనంతరం స్పేస్ఎక్స్ మార్కెట్ విలువ తొలుత 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ట్రేడింగ్‌లో పెరుగుదలతో 2 ట్రిలియన్ డాలర్లను కూడా అధిగమించింది.స్పేస్ఎక్స్లో మస్క్‌కు ఉన్న భారీ వాటా, అలాగే టెస్లాలోని ఆయన పెట్టుబడులను కలిపి చూస్తే ఆయన నికర విలువ సుమారు 1.1 నుంచి 1.3 ట్రిలియన్ డాలర్ల మధ్యకు చేరిందని అంచనాలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే ఈ సంపద ఎక్కువ భాగం కంపెనీ షేర్ల రూపంలో ఉండే "పేపర్ వెల్త్" మాత్రమే; అది నగదు రూపంలో అందుబాటులో ఉండదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కంపెనీల మార్కెట్ విలువలు మారితే ఈ సంపద కూడా మారే అవకాశం ఉంది.శతాబ్దమైనా చాలదు!ఒక ట్రిలియన్ డాలర్ల పరిమాణాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. గంటకు 10 లక్షల డాలర్లు అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.4 కోట్లు ఖర్చు పెడుతూ వచ్చినా 1 ట్రిలియన్ డాలర్లను పూర్తిగా ఖర్చు చేయడానికి శతాబ్దానికి పైగా సమయం పడుతుంది. అంతటి ఆర్థిక శక్తి ఇప్పుడు ఎలాన్ మస్క్ సొంతం.దేశాల జీడీపీలను మించి..మస్క్ సంపదను దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే దాని విస్తృతి మరింత స్పష్టమవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని చాలా కొన్ని దేశాల జీడీపీ మాత్రమే ట్రిలియన్ డాలర్లకు మించి ఉంటుంది. అంటే ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మస్క్ వ్యక్తిగత సంపద అధికంగా ఉంటుందన్న మాట.అయితే ఈ అసాధారణ సంపదపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం అసమానతలను పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మస్క్ అభిమానులు మాత్రం అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధస్సు, విద్యుత్ వాహనాల్లో ఆయన చూపిన దూరదృష్టే ఈ విజయానికి కారణమని పేర్కొంటున్నారు.టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విటర్), ఎక్స్ఏఐ వంటి సంస్థల ద్వారా ఆటోమొబైల్, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రభావం చూపుతున్న ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్‌లు
సాధారణంగా ప్రైవేటు సంస్థల్లో ముఖ్యంగా టెక్ కంపెనీల్లో కొందరు యజమానులు ఉద్యోగులతో గొడ్డు చాకరీ చేయించుకుంటారు. ఆఫీసులో ఉన్నంత సేపూ వారి నుంచి శ్రమను పిండేసుకుంటారు. ఈ క్రమంలో ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోరు. దీంతో అలాంటి బాస్‌లు ఉద్యోగులను కనీసం పడుకోనివ్వకుండా నిద్రలోనూ కలలోకి వస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా, రోజంతా కష్టపడిన తమ ఉద్యోగులు సుఖంగా నిద్రపోవాలని ఓ కంపెనీ సీఈవో ఏం చేశారో చూద్దం ఈ కథనంలో..కార్యాలయాల్లో ఉచిత భోజనం, గేమింగ్ జోన్లు, వినోద సదుపాయాలు ఇవ్వడం టెక్ కంపెనీల్లో సాధారణమే. అయితే అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ ‘ఫ్యాక్టరీ’ (Factory) సీఈఓ మాతన్ గ్రిన్బర్గ్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచాలంటే ముందుగా వారి నిద్ర నాణ్యత మెరుగుపడాలని భావించి, కంపెనీలో ఉన్న ప్రతి ఉద్యోగికి దాదాపు 3,000 డాలర్లు (సుమారు రూ.2.6 లక్షలు) విలువైన ఎయిట్ స్లీప్ (Eight Sleep) స్మార్ట్ మ్యాట్రెస్ కవర్‌ను బహుమతిగా అందించారు. ఈ నిర్ణయం అప్పట్లో కంపెనీలో సుమారు 30 మంది ఉద్యోగులు ఉన్న సమయంలో తీసుకున్నదని ఆయన వెల్లడించారు.2023లో స్థాపించిన ‘ఫ్యాక్టరీ’ ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది. కంపెనీకి ప్రస్తుతం సుమారు 120 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 150 మిలియన్ డాలర్ల సిరీస్-సీ నిధులను సమీకరించగా, ఈ రౌండ్‌కు ఖోస్లా వెంచర్స్ నాయకత్వం వహించింది. సీక్వోయా క్యాపిటల్, బ్లాక్‌స్టోన్, ఇన్సైట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. తాజా నిధుల సమీకరణతో కంపెనీ విలువ 1.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది.ఇటీవల “20VC” పోడ్కాస్ట్లో మాట్లాడిన గ్రిన్బర్గ్, తన ఇంజనీర్లను ప్రొఫెషనల్ అథ్లెట్లతో పోల్చారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే సరైన విశ్రాంతి ఎంత అవసరమో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా నాణ్యమైన నిద్ర అంతే కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. “మనుషులు తమ మెదడు సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలంటే ముందుగా బాగా నిద్రపోవాలి” అని ఆయన పేర్కొన్నారు.ఎయిట్ స్లీప్ మ్యాట్రెస్ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ద్రవ ఆధారిత శీతలీకరణ, తాపన సాంకేతికత ద్వారా మంచం ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దంపతులు మంచం రెండు వైపులా వేర్వేరు ఉష్ణోగ్రతలను ఎంచుకునే వీలుంది. తాజా మోడళ్లలో మంచం కోణాన్ని సర్దుబాటు చేసే సదుపాయం కూడా ఉంది.అయితే ఉద్యోగుల నిద్ర అలవాట్లను కంపెనీ ట్రాక్ చేయదని, పనితీరును కొలవడానికి ఈ సాంకేతికతను ఉపయోగించబోమని గ్రిన్బర్గ్ స్పష్టం చేశారు. “ఎవరైనా బాగా నిద్రపోలేదని చెప్పి వారి కోడ్‌ను నమ్మకూడదని మేము చెప్పం” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై కంపెనీలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. మహమ్మారి తర్వాత “స్లీప్ మాక్సింగ్” అనే ధోరణి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. స్లీప్ ట్రాకర్లు, స్మార్ట్ వేరబుల్స్, నిద్ర సాంకేతిక ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతోంది. మంచి నిద్ర నిర్ణయ సామర్థ్యం, ఏకాగ్రత, సృజనాత్మకతను మెరుగుపరుస్తుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫ్యాక్టరీ తీసుకున్న ఈ వినూత్న చర్య భవిష్యత్తులో ఉద్యోగి సంక్షేమానికి కొత్త ప్రమాణాలను సృష్టించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
పసిడి ధరలు.. కొనుగోలుదారులవైపే..
దేశంలో పసిడి ధరల తగ్గుదల కొనసాగుతోంది. భారీ పెరుగుదల నుంచి క్రితం రోజున రివర్స్ అయి తగ్గుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) కూడా స్వల్పంగా తగ్గి కొనుగోలుదారుల వైపు మొగ్గాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. -
తక్కువ ధరకు విమాన టికెట్లు.. ఎయిర్ ఇండియాలో కొత్త కేటగిరీ
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశీయ ప్రయాణికుల కోసం కొత్తగా ‘బేసిక్’ ఛార్జీల కేటగిరీని ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కొత్త ఫేర్ ద్వారా తక్కువ ధరలో టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేటగిరీలో ప్రయాణించే వారికి ఉచిత భోజనం అందుబాటులో ఉండదు. అయితే 15 కిలోల చెక్డ్ బ్యాగేజ్, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజ్ అనుమతి యథాతథంగా కొనసాగుతుంది. టీ లేదా కాఫీ వంటి పానీయ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ‘వాల్యూ’, ‘క్లాసిక్’, ‘ఫ్లెక్స్’ అనే ఫేర్ కేటగిరీలు అందుబాటులో ఉండగా, వాటితో పాటు ‘బేసిక్’ను కూడా చేర్చింది. ధరకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయాణికులు అవసరమైన సేవలను మాత్రమే ఎంచుకునేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రయాణానికి 24 గంటల ముందువరకు ప్రయాణికులు అదనపు చెల్లింపుతో భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ మార్పులు జరిగితే ముందుగా బుక్ చేసిన భోజనాన్ని కొత్త విమానానికి బదిలీ చేయడం లేదా అందుబాటులో లేకపోతే పూర్తి రీఫండ్ ఇవ్వడం జరుగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది.దేశీయ మార్కెట్లో తక్కువ ధరల విమానయాన సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ, నిర్వహణ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ‘అన్‌బండిల్డ్’ మోడల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎంపిక చేసిన మార్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ సేవపై ప్రయాణికుల స్పందనను పరిశీలించిన తర్వాత భవిష్యత్ విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. 2024లో ప్రవేశపెట్టిన స్మార్ట్ ఫేర్ వ్యవస్థను మరింత సరళీకృతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిర్ ఇండియా ఈ కొత్త ఫేర్‌ను ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ధరలను తగ్గించేందుకు భోజనాన్ని ఐచ్ఛికంగా మార్చే ప్రయత్నం గత కొన్ని నెలలుగా చర్చల్లో ఉండగా, ఇప్పుడు అధికారికంగా అమలులోకి తీసుకొచ్చింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ మార్పుతో టికెట్ ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉంది.‘బేసిక్’ ఫేర్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్, కాంటాక్ట్ సెంటర్ మరియు ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా అందుబాటులో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు మిశ్రమ ప్రపంచ సంకేతాలను ట్రాక్ చేస్తూ నిఫ్టీ 50, సెన్సెక్స్ పెరిగాయి. ఉదయం 9:47 గంటల సమయానికి, నిఫ్టీ 73.50 పాయింట్లు లేదా 0.31 శాతం పెరిగి 24,062.65 వద్ద, సెన్సెక్స్ 259.43 పాయింట్లు లేదా 0.34 శాతం ఎగిసి 77,067.91 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.ఈ రోజు విడుదలవుతున్న యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ రేటు నిర్ణయం ఫలితం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. రేట్-సెట్టింగ్ ప్యానెల్ ఫెడరల్ ఫండ్ టార్గెట్ రేటును 3.5–3.75 శాతం వద్ద స్థిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు.హిందాల్కో ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ షేర్ ధర 22.7 శాతం తగ్గి రూ .555.50 కు పడిపోయింది. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.26 శాతం, 0.36 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ టాప్ అండర్ పెర్ఫార్మర్ గా ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ పెర్ఫార్మర్ గా ఉన్నాయి. -
యువతకు ఆర్బీఐ బంపర్ ఆఫర్!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) యువ ప్రతిభను ఆకర్షించేందుకు ‘యంగ్ ప్రొఫెషనల్స్ (YP)’ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, డేటా విశ్లేషణ, సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.5 లక్షల స్థిర స్టైఫండ్ లభించనుండగా, నియామకం ఒప్పంద ప్రాతిపదికన ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ముంబైలోని ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.ఆర్బీఐ ప్రణాళిక ప్రకారం ప్రారంభంలో మూడేళ్ల కాలానికి నియామకం చేపడతారు. పనితీరు, పరస్పర అంగీకారం ఆధారంగా ఈ గడువును గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఈ నియామకం శాశ్వత ఉద్యోగానికి హామీ కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ, ఎంపికైన అభ్యర్థులు ఫుల్ టైమ్ ఉద్యోగులుగా పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అనుమతి లేకుండా ఇతర ఉద్యోగాలు లేదా కన్సల్టెన్సీ పనులు చేపట్టరాదు.ఎంపికైన యంగ్ ప్రొఫెషనల్స్‌కు నెలకు రూ.1,50,000 స్థిర స్టైఫండ్ చెల్లిస్తారు. దీనిపై వర్తించే ఆదాయపన్ను మినహాయింపులు అమల్లో ఉంటాయి. స్టైఫండ్‌కు అదనంగా ఇతర అలవెన్సులు, హెచ్ఆర్ఏ లేదా ప్రోత్సాహకాలు ఉండవని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో జరుగుతుంది. ముందుగా దరఖాస్తుల పరిశీలన, షార్ట్‌లిస్టింగ్ నిర్వహించి, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపడతారు. ఖాళీల సంఖ్య, దరఖాస్తుల నాణ్యత ఆధారంగా ఇంటర్వ్యూకు పిలిచే అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, సీవీ, విద్యార్హత సర్టిఫికెట్లు, స్టేట్మెంట్ ఆఫ్ ఇంటరెస్ట్, రైటింగ్ శాంపిల్, రిఫరెన్స్ లెటర్‌తో కలిసి ఈ-మెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. “YP Application – Post Code – Candidate Name” అనే సబ్జెక్ట్ లైన్‌తో [yphrmdco@rbi.org.in](mailto:yphrmdco@rbi.org.in) కు దరఖాస్తులు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ప్రతి పోస్టుకు ప్రత్యేక ఈ-మెయిల్ పంపాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం దరఖాస్తుల చివరి తేదీ జూలై 6, 2026గా అధికారిక ప్రకటనల్లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది. -
టాటా ఐఫోన్ ప్లాంట్‌కు క్లీన్ చిట్
యాపిల్ ఐఫోన్లకు కీలక భాగాలను తయారు చేసే టాటా ఎలక్ట్రానిక్స్ హోసూర్ ప్లాంట్‌కు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (TNPCB) ఊరటనిచ్చింది. ప్లాంట్ నుంచి మురుగునీటి విడుదల కారణంగా భూగర్భజలాలు కలుషితమయ్యాయన్న ఆరోపణలపై జరిగిన పరిశీలన అనంతరం, సంస్థ నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగానే పనిచేస్తోందని మండలి గుర్తించింది. ఈ అంశంపై ఇకపై తదుపరి చర్యలు తీసుకోబోమని నిర్ణయించినట్లు టాటా ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది.ఇటీవల అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం వెలువరించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హోసూర్‌లోని టాటా ప్లాంట్ నుంచి విడుదలయ్యే మురుగునీరు సమీప వ్యవసాయ భూములు, బావులపై ప్రభావం చూపుతోందని స్థానిక రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా యంత్రాంగం, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పలుమార్లు తనిఖీలు నిర్వహించాయి. గత నెలలో జారీ చేసిన షోకాజ్ నోటీసులో కూడా పలు అంశాలపై వివరణ కోరింది.అయితే, నోటీసు అందుకున్న వెంటనే గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా స్వతంత్ర పరీక్షలు నిర్వహించామని టాటా ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఈ పరీక్షల్లో టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (TDS), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (COD), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) వంటి కీలక పర్యావరణ సూచికలు అనుమతించిన పరిమితుల్లోనే ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఆ ఫలితాలను అధికారికంగా తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కి సమర్పించినట్లు వెల్లడించింది.అదేవిధంగా, ఇటీవల సేకరించిన నీటి నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా స్వయంగా పరీక్షించగా ఎటువంటి కాలుష్య ఆనవాళ్లు కనిపించలేదని కంపెనీ తెలిపింది. దీంతో షోకాజ్ నోటీసులో ప్రస్తావించిన అన్ని అంశాలను సంతృప్తికరంగా పరిష్కరించినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ధ్రువీకరించిందని పేర్కొంది.కాగా, ఈ హోసూర్ ప్లాంట్ యాపిల్ ‘చైనా ప్లస్ వన్’ వ్యూహంలో అత్యంత కీలక కేంద్రంగా మారింది. ఐఫోన్ బ్యాక్ప్యానెల్స్తో పాటు పలు కీలక భాగాలను ఈ యూనిట్లో తయారు చేస్తున్నారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఉత్పత్తిని భారత్‌కు మళ్లిస్తున్న యాపిల్‌కు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రధాన భాగస్వామిగా ఎదిగింది. పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్ అంచనాల ప్రకారం 2026 నాటికి ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో భారత వాటా 26 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే, పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధత కొనసాగుతుందని టాటా ఎలక్ట్రానిక్స్ స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ పర్యావరణ నిబంధనలకు పూర్తిస్థాయిలో అనుగుణంగా ఉండేందుకు ప్రక్రియలు, మౌలిక సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొంది. -
సిటీలో గృహప్రవేశాలు ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రజలను ఇళ్లకు పరిమితం చేస్తే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఏకంగా ‘ఇళ్ల’పైనే పిడుగు వేసింది. పశ్చిమాసియా ద్వారా చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడటం వల్ల ఇంధన ధరలతోపాటు రవాణా ఖర్చులు పెరిగి ఉక్కు, అల్యూమినియం, టైల్స్, రంగులు, విద్యుత్ ఉపకరణాల వంటి భవన నిర్మాణ సామగ్రి ధరలు ఎగబాకాయి. దీని ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడం బిల్డర్లకు సవాల్‌గా మారింది. కరోనా కంటే డేంజర్.. కరోనా కాలంలో 2020లో 4.66 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యానికిగాను 2.14 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. లాక్డౌన్లు, వలస కార్మీకులు సొంతూళ్లకు వెళ్లిపోవడం, రవాణా వ్యవస్థలో సవాళ్ల కారణంగా కేవలం 46 శాతమే ఇళ్ల డెలివరీ సాధ్యమైంది. మరోవైపు హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 5,40,400 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గడువులోగా కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉండగా అందులో 87 శాతం యూనిట్ల డెలివరీలో బిల్డర్లు సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో 70 శాతం గృహాలు ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లోనే ఉన్నాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 5.19 లక్షల ఇళ్లు డెలివరీ అవగా 2017 నుంచి 2025 మధ్య ఈ సంఖ్య దాదాపు 30.5 లక్షల యూనిట్లుగా ఉంది. హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి... రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనల ప్రకారం గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఏడాది దక్షిణాది నగరాల్లో మొత్తం 1,68,300 యూనిట్లు డెలివరీ చేయాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా బెంగళూరులో 69 వేలు, హైదరాబాద్‌లో 63,700, చెన్నైలో 35,600 యూనిట్లు కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంది. నిర్మాణ సామగ్రి కొరత, ధరల పెరుగుదల కారణంగా హైదరాబాద్‌లో ఆయా యూనిట్ల డెలివరీ ఈ ఏడాది ఆలస్యం కానుంది. రెరా గడువును పొడిగించాలి కరోనా కాలంలో ఎలాగైతే రెరా గడువులో మినహాయింపులు ఇచ్చారో అదే తరహాలో పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రెరా గడువును ఏడాదిపాటు పొడిగించాలి. – ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
గొంతు విప్పకముందే నొక్కేస్తుంది!
ప్రభుత్వంలో జరుగుతున్నఅవినీతి మీద ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారా? వానలతో దెబ్బతిన్న నగర రోడ్ల గురించిఅధికారులను విమర్శిస్తూ ‘ఎక్స్’లో కోపంతోఏదైనా కామెంట్ చేశారా?వాట్సాప్ గ్రూపులో దేశ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారా?అయితే జాగ్రత్త..మీ కామెంట్లు, పోస్టుల ఆధారంగా రేపు మీరు ఏమనుకుంటారో, ఎవరిని విమర్శిస్తారో, ఏ నిరసనలో పాల్గొంటారో కూడా కృత్రిమ మేధ (ఏఐ) ముందే ఊహించి మీ పేరుతో ఒక ’రిస్క్ స్కోర్’ను రూపొందించే రోజులు వస్తున్నాయి. చైనాలో వెలుగులోకి వచ్చిన ఏఐ ఆధారిత నిఘా ప్రాజెక్టు, సాంకేతికత వివరాలు బయటకు పొక్కడంతో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, భవిష్యత్తుపై కొత్త ఆందోళనతలెత్తుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ముందే గుర్తించి నియంత్రణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు.. భవిష్యత్తులో వారు పూర్తిస్థాయిలో ప్రభుత్వ విమర్శకులుగా మారే అవకాశముందేమో ముందుగానే గుర్తించి నిషేధించే ఏఐ వ్యవస్థ చైనాలో తయారవుతోంది. చైనాకు చెందిన జీఎడ్జ్ నెట్వర్క్స్ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ డేటా, లొకేషన్ ఆధారంగా పౌరుల ప్రవర్తనను విశ్లేషించి వారిపై నిఘా పెట్టే ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతున్నట్లు వెల్లడైంది. భవిష్యత్తులో ప్రభుత్వ విమర్శకులుగా మారే వారిని ముందుగానే గుర్తించి నియంత్రించడానికి ఈ వ్యవస్థను తయారు చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అమెరికా విధించిన చిప్ ఆంక్షలతో ఈ ప్రాజెక్టుకు కొంత బ్రేకులు పడినా.. పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలు అసమ్మతి వ్యక్తం చేయకముందే వారి గొంతు నొక్కేసే చర్యలకు ప్రభుత్వాలు దిగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్ల రూపకల్పనలో జీఎడ్జ్అమెరికాకు చెందిన వాండర్బిల్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీకి చెందిన పరిశోధకులు.. జీఎడ్జ్ సంస్థ తన ప్రభుత్వ మద్దతు ఉన్న పరిశోధనా విభాగం మెసా ల్యాబ్‌తో కలిసి చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్లు రూపొందించే పనిలో ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రొఫైళ్ల ఆధారంగా రాజకీయంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వ్యక్తులను ఏఐ సహాయంతో ముందే గుర్తించే టెక్నాలజీని కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడైంది. అయితే అధునాతన చిప్‌ల ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలు ఈ ప్రాజెక్టు పురోగతిని కొంతవరకు దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో విధించిన ఆంక్షలు కొంత అడ్డుకున్నాయని అంటున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం కొన్ని పరిమితులను సడలించినప్పటికీ, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఏఐ చిప్‌లను రూపొందించే ఎన్విడియా తయారీ అత్యాధునిక ప్రాసెసర్లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా చిప్‌లపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు స్వదేశీ ఏఐ చిప్‌ల అభివృద్ధిపై చైనా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం జీఎడ్జ్ వద్ద ఉన్న గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) ప్రస్తుత ఉత్పత్తులకు సరిపోతున్నప్పటికీ, మరింత శక్తివంతమైన అంచనా వ్యవస్థను రూపొందించాలంటే చైనాకు అత్యాధునిక చిప్‌లు అవసరమవుతాయని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షకు పైగా పత్రాల లీక్ చైనా అమలు చేస్తున్న గ్రేట్ ఫైర్‌వాల్ తరహా ఇంటర్నెట్ పర్యవేక్షణ, సెన్సార్షిప్ సాఫ్ట్‌వేర్‌ను జీఎడ్జ్ నెట్వర్క్స్ అనేక దేశాలకు వాణిజ్యపరంగా విక్రయిస్తోంది. ఈ సాంకేతికత ద్వారా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, సెన్సార్షిప్ను తప్పించుకునేందుకు పౌరులు చేసే ప్రయత్నాలను గుర్తించడం, ప్రజల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జీఎడ్జ్ కు సంబంధించిన లక్షకు పైగా పత్రాలు లీక్ కావడంతో ఈ నిఘా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రాలను విశ్లేషించిన వైర్డ్ సహా పలు మీడియా సంస్థలు, జీఎడ్జ్ తన నెట్వర్క్ భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇథియోపియా, కజకిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ వంటి దేశాలకు ఎగుమతి చేసి అక్కడ మొబైల్ నెట్‌వర్క్‌లపై భారీ స్థాయి నిఘా నిర్వహించేందుకు సహకరించినట్లు వెల్లడించాయి. తాజాగా జీఎడ్జ్ ఇంజనీర్లు ప్రజల మొబైల్ సమాచారం, సోషల్ మీడియా కార్యకలాపాలు, లొకేషన్ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తనా నమూనాలను రూపొందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకం? కృత్రిమ మేధ సహాయంతో పౌరుల రాజకీయ అభిప్రాయాలను ముందుగానే అంచనా వేసే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై కొత్త చర్చకు తెరలేపాయి. ఈ రోజు మీ మొబైల్లో చేసిన సెర్చ్, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్, వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ కేవలం డేటానే కావచ్చు. కానీ రేపు అదే డేటా ఆధారంగా మీరు ముందు ముందు ఒక నిరసనకారుడు, ప్రభుత్వ విమర్శకుడు అయ్యే అవకాశముందని ఏఐ ముద్ర వేస్తే? చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త తరం నిఘా సాంకేతికత ప్రస్తుతం భారత్ సహా ఇతర దేశాలకు అందుబాటులో లేదనుకున్నా, డిజిటల్ పాలన వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అది పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం చైనా కథ కాదని, డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడి భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక అని అంటున్నారు.మాస్ సర్వైలెన్స్ (భారీ స్థాయి నిఘా వ్యవస్థ)కు కృత్రిమ మేధ జత అయితే జరిగేది ఇదే. ఒక వ్యక్తి ప్రభుత్వం వ్యతిరేకిగా మారకముందే అతడిని గుర్తించి పర్యవేక్షించే స్థాయికి ఈ టెక్నాలజీ తీసుకెళ్లే ప్రమాదం ఉంది. – బ్రెట్ జే. గోల్డ్‌స్టీన్, వికెడ్ ప్రాబ్లమ్స్ ల్యాబ్ డైరెక్టర్ ప్రజలు ఏం చేస్తున్నారన్నది మాత్రమే కాదు.. భవిష్యత్తులో వారు ఏం చేయచ్చో ముందే అంచనా వేసే వ్యవస్థలను నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇది నిఘా వ్యవస్థల్లో కొత్త దశ. – అమెరికా భద్రతా వర్గాల విశ్లేషణ -
మళ్లీ ఐపీవోల జోరు
న్యూఢిల్లీ: మార్కెట్లలో అనిశ్చితి, ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ ఐపీవో మార్కెట్ నెమ్మదిగా పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈక్విరస్ క్యాపిటల్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 27,000 కోట్ల సమీకరణ కోసం 23 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల బాట పట్టాయి. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, హెక్సాగాన్ న్యూట్రిషన్ జూన్‌లోనే ఐపీవోకి వచ్చాయి. ఇన్సూర్టెక్ సంస్థ టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్, అద్విత్ జ్యుయెల్స్ ఐపీవోలు జూన్ 19, 23 తేదీల్లో మొదలవుతున్నాయి. కార్డీలియా క్రూయిజెస్ని నిర్వహించే వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఇష్యూ కూడా ఇదే నెలలో రానుంది. ఇక, దేశీయంగా అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ ఎన్ఎస్ఈ ఈ వారంలో ముసాయిదా పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. అటు క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వచ్చే నెలలో పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సన్నాహాల్లో మరో 236 సంస్థలు .. ఈ ఏడాది మే నాటికి 236 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో 163 సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగా, మరో 73 కంపెనీలు ఆమోదముద్ర కోసం ఎదురుచూస్తున్నాయి. 2025లో 103 ఇష్యూల ద్వారా కంపెనీలు రికార్డు స్థాయిలో రూ. 1.76 లక్షల కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది 2024లో 90 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు, 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు దక్కించుకున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 2,422 కోట్లు సమీకరించాయి. తొలి త్రైమాసికంలో 19 సంస్థలు రూ. 24,772 కోట్లు సమకూర్చుకున్నాయి. 2025 నాలుగో త్రైమాసికంలో 30 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 91,058 కోట్లు దక్కించుకున్నాయి. ఈక్విరస్ రిపోర్ట్ ప్రకారం మార్కెట్లో పరిస్థితులు కఠినతరం కావడం, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో గతేడాది సెప్టెంబర్ తర్వాత నుంచి ఐపీవో కార్యకలాపాలు గణనీయంగా నెమ్మదించాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నప్పటికీ, దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం సిప్ల విధానంలో మార్కెట్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో నెలవారీ సిప్ల ద్వారా రూ. 30,000 కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లోకి వస్తున్నాయి.19న టర్టిల్‌మింట్ ఇష్యూ.. ఇన్సూర్టెక్ సంస్థ టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్ ఐపీవో జూన్ 19న ప్రారంభమై 23న ముగియనుంది. జూన్ 29న లిస్ట్ అవుతుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 883 కోట్లు సమీకరిస్తోంది. షేరు ధర శ్రేణి రూ. 144–152గా ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ. 660.72 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రస్తుత షేర్హోల్డర్లు రూ. 221.95 కోట్ల విలువైన విక్రయించనున్నారు. -
బొండాడ ఇంజనీరింగ్‌కి రూ. 1,338 కోట్ల ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి భారీ కాంట్రాక్టు లభించినట్లు బొండాడ ఇంజినీరింగ్ వెల్లడించింది. దీని విలువ సుమారు రూ. 1,338 కోట్లని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 250 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టు, 50 మెగావాట్ల/200 మెగావాట్‌హవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) ఏర్పాటుకు సంబంధించి ఇది ఈపీసీ ప్యాకేజీ రూపంలో ఉంటుంది. నోటిఫికేషన్ ఆఫ్ అవార్డు (ఎన్‌వోఏ) లభించినప్పటి నుంచి 18 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ వివరించింది. మంగళవారం బీఎస్ఈలో బొండాడ ఇంజనీరింగ్ షేరు 4% పెరిగి రూ. 343.50 వద్ద క్లోజయ్యింది. -
అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లను దాటేసిన స్పేస్ఎక్స్
న్యూయార్క్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ షేరు వాల్‌స్ట్రీట్‌లో రోజుకో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. అమెరికా నాస్డాక్ ఎక్సే్చంజీలో మంగళవారం ఇంట్రాడేలో ఈ షేరు ఏకంగా 17 శాతానికి పైగా లాభపడి 226 డాలర్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. షేరు భారీ ర్యాలీతో స్పేస్ఎక్స్ సంస్థ మార్కెట్ విలువ 2.95 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలో 2.64 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ ‘అమెజాన్’ను వెనక్కి నెట్టింది. అలాగే, ఒక దశలో 2.92 ట్రిలియన్ డాలర్ల విలువ గల ‘మైక్రోసాఫ్ట్’ను సైతం అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్–5 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక ఎలాన్ మస్క్ సంపద కూడా రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. స్పేస్ఎక్స్ లిస్టింగ్‌తో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించిన ఎలాన్ వెల్త్ తాజాగా 1.3 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. -
5జీ యూజర్లు @ 110 కోట్లు!
న్యూఢిల్లీ: వచ్చే ఆరేళ్లలో 2031 నాటికి భారత్‌లో 5జీ యూజర్ల సంఖ్య 110 కోట్లకు చేరనుంది. మొత్తం కనెక్షన్లలో 5జీ వాటా 81 శాతానికి చేరనుంది. స్వీడన్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2025 ఆఖరు నాటికి దేశీయంగా 5జీ యూజర్ల సంఖ్య 43 కోట్లకు, మొత్తం మొబైల్ సబ్ స్క్రిప్షన్లలో వాటా 35 శాతానికి చేరిందని రిపోర్టు పేర్కొంది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ మెరుగుపడటంతో 5జీ వినియోగం గణనీయంగా పెరుగుతోందని ఎరిక్సన్ ఇండియా ఎండీ నితిన్ బన్సల్ తెలిపారు. భారీ స్థాయిలో సమ్మిళితత్వం, గవర్నెన్స్, ఆవిష్కరణలకు పటిష్టమైన, సురక్షితమైన 5జీ మౌలిక సదుపాయాలు తోడ్పడుతున్నాయని, డిజిటల్ ఇండియాకి శక్తివంతమైన పునాది వేస్తున్నాయని వివరించారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు వైవిధ్యమైన సర్వీసులను కూడా ప్రవేశపెడుతున్నాయని నివేదిక పేర్కొంది. నేరుగా ఎయిర్‌టెల్‌ని ప్రస్తావించకుండా, పోస్ట్‌పెయిడ్ 5జీ కస్టమర్లకు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లోనూ మెరుగైన సేవలు అందేలా ఓ టెలికం కంపెనీ .. నెట్వర్క్ స్లైసింగ్ ఇటీవలే వైవిధ్యమైన కనెక్టివిటీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డివైజ్‌లు చౌకగా లభిస్తుండటం, నెట్వర్క్ కవరేజీ విస్తృతంగా ఉండటం, ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) సేవలు అందుబాటులోకి వస్తుండటంతో 5జీ వినియోగం భారీగా పెరుగుతోంది. చాలా మటుకు సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి డౌన్‌లింక్ కన్నా అప్‌లింక్ ట్రాఫిక్ వేగంగా పెరుగుతోంది. → ప్రతి స్మార్ట్‌ఫోన్‌పై మొబైల్ డేటా వినియోగం విషయంలో గ్లోబల్‌గా భారత్ అగ్రస్థానంలో ఉంటోంది. నెలవారీ యూసేజీ సగటున 37 జీబీగా ఉండగా, 2031 నాటికి 70 జీబీకి చేరనుంది. → 46 శాతం వాటాతో 4జీ ఇప్పటికీ ప్రధాన టెక్నాలజీగానే కొనసాగుతున్నప్పటికీ దాని వినియోగం క్రమంగా తగ్గుతోంది. 2025లో 57 కోట్లుగా ఉన్న యూజర్ల సంఖ్య 2031 నాటికి 16 కోట్లకు పడిపోనుంది. → అంతర్జాతీయంగా 5జీ మొబైల్ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 2026 తొలి త్రైమాసికంలో తొలిసారిగా మూడు వందల కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో గ్లోబల్‌గా 16.2 కోట్ల కొత్త 5జీ కనెక్షన్లు జత కావడంతో మొత్తం సబ్స్క్రిప్షన్ల సంఖ్య 310 కోట్లకు చేరింది. ఇది 2031 నాటికి రెట్టింపు కన్నా అధిక స్థాయికి (640 కోట్లు) చేరనుంది. → ఇప్పటివరకు 390 సర్వీస్ ప్రొవైడర్లు కమర్షియల్ 5జీ సర్వీసులు ప్రారంభించాయి. 90కి పైగా సంస్థలు 5జీ సేవలను స్టాండెలోన్ ప్రాతిపదికన ప్రవేశపెట్టాయి. → 2025 ఆఖరు నాటికి మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 48 శాతం వాటా 5జీ నెట్‌వర్క్‌లదే ఉంది. 2031 ఆఖరు నాటికి ఇది 85 శాతానికి చేరొచ్చని అంచనా. → పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా, గల్ఫ్ దేశాల్లో 5జీ సేవల వినియోగం 2031 నాటికి 90 శాతానికి చేరవచ్చు. → ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ)కి సంబంధించి వేగం ఆధారిత టారిఫ్ ప్లాన్ల ద్వారా వివిధ మార్కెట్ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలను టెల్కోలు కొనసాగిస్తాయి. → మొత్తం ఎఫ్‌డబ్ల్యూఏ సర్వీస్ ప్రొవైడర్లలో 5జీ ద్వారా సేవలందించే సంస్థల వాటా 71 శాతానికి చేరింది. 2025 జూన్‌లో ఇది 57 శాతంగా ఉంది. స్పీడ్ ఆధారిత టారిఫ్ ప్లాన్లను అందించే ఎఫ్‌డబ్ల్యూఏ సర్వీస్ ప్రొవైడర్ల సంఖ్య గతేడాది 51 శాతంగా ఉండగా ప్రస్తుతం 57 శాతానికి చేరింది. -
బ్లాక్ కలర్ సాక్స్.. విమానంలో ప్రమాదమా?
విమాన ప్రయాణం చేసే సమయంలో.. దాదాపు అందరూ సౌకర్యవంతమైన దుస్తులు, సులభంగా తొలగించడానికి వీలయ్యే షూస్, చలిని తట్టుకునేందుకు జాకెట్లు లేదా హుడీలు ధరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే చాలామంది గమనించని ఒక చిన్న విషయం ఏమిటంటే? సాక్స్ రంగు. ముఖ్యంగా బ్లాక్ కలర్ సాక్స్ ధరించడం విమాన ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలకు కారణమవుతుందని విమాన సిబ్బంది చెబుతున్నారు. దీనికి గల కారణాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విమానాల్లో.. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల సమయంలో, క్యాబిన్ లైటింగ్ సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో నల్ల రంగు సాక్స్ విమానంలోని పరిసరాలతో (కింది భాగం) కలిసిపోతాయి. ప్రయాణికులు షూస్ తీసేసి కాళ్లను ముందుకు చాచినప్పుడు లేదా నడిచే మార్గంలో ఉంచినప్పుడు, అవి సిబ్బందికి లేదా ఇతర ప్రయాణికులకు సులభంగా కనిపించకపోవచ్చు.విమానాల్లో నడిచే మార్గాలు చాలా ఇరుకుగా ఉంటాయి. క్యాబిన్ సిబ్బంది ఆహారం, పానీయాలు లేదా ఇతర సర్వీసులను అందించేందుకు తరచుగా ఆ మార్గాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో కాళ్లు స్పష్టంగా కనిపించకపోతే సిబ్బంది వాటిని తొక్కే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సర్వీస్ ట్రాలీలు కూడా కాళ్లను ఢీకొట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఇది చిన్న విషయం లాగా కనిపించినప్పటికీ భద్రత పరంగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.ఇంకో ముఖ్యమైన అంశం పరిశుభ్రత. విమానాల నేలపై వివిధ రకాల సూక్ష్మక్రిములు, వైరస్లు కొంతకాలం జీవించి ఉంటాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి షూస్ తీసేసి కేవలం సాక్స్‌తోనే నేలపై నడవడం ఆరోగ్యపరమైన ప్రమాదాలను కూడా పెంచే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో.. నిపుణులు లేత రంగుల సాక్స్ ధరించడం మంచిదని సూచిస్తున్నారు. తెలుపు, బూడిద లేదా ఇతర లేత రంగుల సాక్స్ తక్కువ వెలుతురులో కూడా సులభంగా కనిపిస్తాయి. దీంతో సిబ్బంది, ఇతర ప్రయాణికులు వాటిని గుర్తించి ప్రమాదాలను నివారించగలరు. -
డబ్బు నిజంగా సంతోషాన్ని ఇస్తుందా?: బిల్ గేట్స్ ఏమన్నారంటే..
డబ్బు నిజంగా మనిషికి సంతోషాన్ని ఇస్తుందా? అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. కొందరి అభిప్రాయం ప్రకారం.. సంతోషం అనేది ప్రేమ, సంబంధాలు, ఆరోగ్యం, జీవిత లక్ష్యం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. మరికొందరు మాత్రం ఆర్థిక భద్రత ఉంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలడని చెబుతారు. ఈ అంశంపై ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ (Bill Gates) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.2019లో జరిగిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే సెషన్లో ఒక రెడ్డిట్.. అపారమైన సంపద (డబ్బు) జీవితంలో నిజంగా సంతోషాన్ని పెంచిందా అని గేట్స్‌ను అడిగారు. దానికి ఆయన సమాధానంగా, ''అవును, నేను ఆరోగ్య ఖర్చులు, విద్య ఖర్చులు, ఆర్థిక సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. అది నాకు చాలా పెద్ద ఉపశమనం'' అని చెప్పారు. అంటే డబ్బు వల్ల ఆయనకు లగ్జరీ కంటే ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిలేని జీవితం లభించిందని స్పష్టమవుతోంది.సంతోషంగా ఉండటానికి బిలియనీర్ కావాల్సిన అవసరం లేదని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్థిరత్వం ఉంటే సరిపోతుంది, అది మనిషి జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా మారుస్తుందని చెప్పారు.అయితే నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త డేనియల్ కాహ్నెమాన్, ఆర్థికవేత్త ఆంగస్ డీటన్ చేసిన పరిశోధనల్లో.. ఆదాయం పెరిగే కొద్దీ మనిషి జీవితంలో ఒత్తిడి తగ్గి సంతోషం పెరుగుతుంది. కానీ ఒక స్థాయికి చేరిన తర్వాత అదనపు సంపద సంతోషాన్ని పెద్దగా పెంచదని తెలిపారు.ఇదీ చదవండి: డబ్బు అవసరం ఉండదు!: ఎలాన్ మస్క్ -
డబ్ల్యూపీఐకి గుడ్‌బై.. పీపీఐకి మారనున్న కేంద్రం!
ధరల తీరును మరింత ప్రతిఫలించే విధంగా వస్తు, సేవలకు ఉత్పత్తిదారుల ధరల సూచీ (పీపీఐ)ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి నెలా విడుదల చేస్తున్న టోకు ధరల ఆధారిత సూచీ స్థానంలో వచ్చే ఐదేళ్లలోపు దీన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనుంది.దేశవ్యాప్తంగా మే నెలకు అన్ని కమోడిటీలకు సంబంధించి అవుట్‌పుట్ పీపీఐ 109.6 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో ఇది 108.6 శాతంగా ఉంది. తయారీ రంగానికి సంబంధించి ప్రయోగాత్మక ఇన్పుట్ పీపీఐ మే నెలకు 104.9గా ఉంది. ప్రయోగాత్మక విధానంలో విడుదల చేస్తున్న ఈ డేటా నాణ్యతను పరిశీలించి, భాగస్వాముల అభిప్రాయాలను తెలుసుకుని అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం ఇదే విధానం అమల్లో ఉంది. దీంతో భారత్ సైతం డబ్ల్యూపీఐ నుంచి పీపీఐకి మారాలంటూ ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చాన్నాళ్లుగా కోరుతోంది. దీనికితోడు నీతిఆయోగ్ వర్కింగ్ గ్రూప్ ఇటీవలే చేసిన సిఫారసుల మేరకు పీపీఐకి మారాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఉత్పత్తి తయారీ లేదా సేవను అందించేందుకు కంపెనీకి అయ్యే వ్యయాన్ని ఇన్పుట్ ప్రైస్ రూపంలో, తయారీ అనంతరం ఆయా సంస్థలు విక్రయించే ధరను అవుట్‌పుట్ ప్రైస్ రూపంలో డేటాను విడుదల చేయనున్నారు.ఇన్పుట్ ధరలు పెరుగుతుంటే (కంపెనీలు వినియోగించే ముడి సరుకులు, విడిభాగాలు, మైక్రోచిప్‌లు తదితర), అంతిమంగా కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తుంటాయి. దాంతో రిటైల్ ధరలు పెరుగుతాయి. ఈ డేటాకు అనుగుణంగా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. పీపీఐ అవుట్‌పుట్ ప్రైస్‌కు రవాణా, పన్నులు, వర్తకుల మార్జిన్లు కలసి రిటైల్ ధరలు నిర్ణయమవుతాయి. -
డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో..
స్పేస్ఎక్స్ ఐపీఓ విజయవంతం కావడంతో ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనీర్ అయ్యారు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆయన, డబ్బు చివరికి పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి.ఇటీవల ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ 'పీటర్ డయామాండిస్'తో మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని మస్క్ పేర్కొన్నారు. ఏఐ, రోబోట్లు నిరంతరం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలవు. తద్వారా వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి. చివరికి మనుషులు చేయడానికి పనులు లేకుండా పోతాయని అన్నారు.మనుషుల అవసరం ఎప్పుడైతే తగ్గిపోతుందో.. ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కార్మికుల అవసరం ఉండదు, వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒక దశలో డబ్బు అవసరం ఉండదని మస్క్ స్పష్టం చేశారు.ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన్ మీరు, డబ్బు అవసరం ఉండదని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని మస్క్‌ను ఇంటర్వ్యూ చేసే పీటర్ డయామాండిస్ అన్నారు. భవిష్యత్తులో ఇది నిజం అవుతుందని టెస్లా బాస్ జవాబిచ్చారు.భవిష్యత్తులో ప్రజలు ఉద్యోగాల ద్వారా సంపాదించకపోయినా.. జీవించగలిగేలా 'యూనివర్సల్ హై ఇన్కమ్' (సార్వత్రిక ఆదాయం) అనే వ్యవస్థ వస్తుందని మస్క్ గతంలో సూచించారు. ఈ విధానంలో ప్రతి ఒక్కరికీ కనీస జీవనానికి సరిపడే ఆదాయం లభిస్తుంది. అవసరమైనవారికి ప్రభుత్వాలే డబ్బులు ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. తద్వారా ఆటోమేషన్ వల్ల వచ్చే మార్పులను సమాజం ఎదుర్కోగలుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! -
15 ఎయిర్‌బ్యాగ్‌లతో.. తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారు!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లోకి తమ ప్రతిష్టాత్మక ఎస్–క్లాస్ శ్రేణిలో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. దేశీయంగా తమ మొదటి ప్లగ్–ఇన్–హైబ్రిడ్ వాహనం (పీహెచ్ఈవీ) ‘ఎస్ 450ఈ’ లాంచ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్లో 2,700 కి పైగా పరికరాలను సరికొత్తగా తీర్చిదిద్దడం లేదా రివైజ్ చేయడం విశేషం.భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశంలోనే మొదటిసారిగా ఈ కారులో 15 ఎయిర్‌బ్యాగ్‌లను సంస్థ ప్రవేశపెట్టింది. ఎస్ 450ఈ లాంచ్ ఎడిషన్ ధర రూ. 2.20 కోట్లుగా నిర్ణయించగా, మ్యానుఫ్యాక్చర్ ఎడిషన్ ధరను రూ. 2.38 కోట్లుగా (ఎక్స్ షోరూమ్) ఖరారు చేసింది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, 2026 క్యూ4 నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది.ఈ లగ్జరీ కారులో 22 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తోనే పట్టణ ప్రయాణాలకు సరిపడేలా 115 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ని అందిస్తుంది. సుదీర్ఘ ప్రయాణాల్లో చార్జింగ్ అయిపోతుందనే ఆందోళన లేకుండా, అవసరాన్ని బట్టి వాడుకునేందుకు పెట్రోల్ ఇంజిన్ లభ్యతను కూడా కల్పించారు. ఈ వాహనం మొత్తం మీద 320 కిలోవాట్ (435 హెచ్‌పీ) సామర్థ్యంతో పాటు 680 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5.7 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే ఎలక్ట్రానిక్‌గా దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లుగా నిర్దేశించారు.ప్రీమియం కస్టమర్ల నుంచి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లకు వస్తున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ ఎస్ 450ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చాము. కస్టమర్ల అంచనాలకు మించి, భారత్‌లో ఎస్ క్లాస్ వారసత్వాన్ని ఇది మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాము. ఈ వాహనం ద్వారా ఐసీఈ, బీఈవీ, పీహెచ్ఐవీ పవర్ట్రైన్ల నుంచి కస్టమర్లు తమకు అనువైన ఆప్షన్‌ను ఎంచుకునేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది’’ అని మెర్సిడెస్–బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. -
స్టాక్ మార్కెట్ జోష్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 544.15 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 76,826.78 వద్ద, నిఫ్టీ 135.25 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 23,989.15 వద్ద నిలిచాయి.ఎక్స్‌ప్రో ఇండియా లిమిటెడ్, భారత్ గేర్స్ లిమిటెడ్, ఆర్టెక్ సోలనిక్స్ లిమిటెడ్, రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్, టార్సన్స్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మోటిసన్స్ జ్యువెలర్స్ లిమిటెడ్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కమర్షియల్ సిన్ బ్యాగ్స్ లిమిటెడ్, రైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టెస్లా బాస్‌పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఎలాన్ మస్క్'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మస్క్ విజయాన్ని కేవలం సంపదతో కొలవలేమని, అసలు విజయ రహస్యం ఆయన ఆత్మవిశ్వాసం, పట్టుదలలోనే ఉందని పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ లిస్టింగ్‌తో మస్క్ సంపద భారీగా పెరిగి ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈరోజు అందరూ ట్రిలియన్ డాలర్ల మైలురాయి గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు కథ ఏమిటంటే.. ఈ రోజు అసాధ్యం అనుకున్నది రేపు సాధ్యమవుతుందని మస్క్ గట్టిగా విశ్వసిస్తారని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.మస్క్ ప్రస్తుతం టెస్లా, స్టార్‌లింక్ వంటి సంస్థల ద్వారా ప్రపంచ సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టకాలాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా 2018లో మస్క్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని వెల్లడించారు. ఆ సమయంలో చాలామంది విమర్శించినప్పటికీ, ఆనంద్ మహీంద్ర మాత్రం ఆయనకు మద్దతు ప్రకటించారు.అప్పట్లో సోషల్ మీడియా వేదికగా మస్క్‌ను ఉద్దేశించి 'ధైర్యంగా ముందుకు సాగండి. ప్రపంచానికి మీలాంటి స్ఫూర్తిదాయక ఆవిష్కర్తలు అవసరం' అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆ సమయంలో మస్క్ చూపిన సహనం, సంకల్పమే తనను ఎక్కువగా ఆకట్టుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు.ఆనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. నిజమైన ఆవిష్కర్తలను వారి విజయ సమయాల్లో కాకుండా కష్టకాలంలో వారు ఎలా నిలబడతారనే అంశం ఆధారంగా అంచనా వేయాలి. ఎలాన్ మస్క్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాలపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగడం వల్లే నేడు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! -
ఇథనాల్‌తో నడిచే కొత్త బైక్‌లు.. రూ.4,000 తక్కువ ధరకే!
భారతదేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే దిశగా.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇటీవల రెండు కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేసింది. అవి ఒకటి స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, రెండు హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్. కంపెనీ ఈ రెండు బైకులపై రూ.4,000 ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉంటుంది.ధరల తగ్గింపు కారణంగా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ధర రూ.82,710 నుంచి రూ.78,710కు తగ్గింది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.72,792 నుంచి రూ.68,792కు చేరింది. దీంతో ఈ రెండు బైకులు సాధారణ వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చాయి.ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ల ప్రత్యేకతహీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు E85 ఇంధనంతో పనిచేస్తాయి. E85 అంటే.. 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలయిక. సాధారణ పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే ఈ విధమైన ఇంధనం పర్యావరణానికి కొంత తక్కువ హానికరం. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.E85 ఇంధనాన్ని ఉపయోగించేందుకు హీరో మోటోకార్ప్ ఈ బైక్‌లలో కొన్ని సాంకేతిక మార్పులు చేసింది. వాటిలో ప్రత్యేక ఫ్యూయల్ పంప్, అదనపు ఫ్యూయల్ ఫిల్టర్, ఇంధన మిశ్రమాన్ని గుర్తించి తగిన విధంగా ఇంధన సరఫరాను నియంత్రించే రీక్యాలిబ్రేటెడ్ ECU (ఇంజిన్ కంట్రోల్ యూనిట్) వంటివి ఉన్నాయి.ఇంజిన్ పనితీరుఈ రెండు బైక్‌లలో 97.2 సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. E85 మోడ్‌లో ఈ ఇంజిన్ 8.4 బిహెచ్పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం.. E85 ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే పవర్ 7 శాతం, టార్క్ 3 శాతం పెరుగుతాయి. అంటే.. ఈ బైక్‌లు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, కొంత మెరుగైన పనితీరును కూడా అందిస్తాయి.హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు జూలై 2026 నుంచి ముందుగా ఢిల్లీ, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలు, రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నారు. -
డీజిల్, జెట్ ఇంధనంపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు!
పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ముడిచమురు సమీకరణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు, ఎగుమతిదారులు అనవసర లబ్ధి పొందకుండా అడ్డుకట్ట వేసేందుకు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. సవరించిన కొత్త ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే, సామాన్యుడిపై భారం పడకుండా దేశీయ వినియోగం కోసం సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి సుంకాలు పెంచకపోవడం గమనార్హం.విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే..ఏదైనా ఒక పరిశ్రమ లేదా కంపెనీ తమ సొంత కష్టం లేదా అదనపు పెట్టుబడి లేకుండా అనుకోకుండా మారిన అంతర్జాతీయ పరిస్థితులు లేదా బాహ్య కారణాల వల్ల భారీగా లాభ పడినప్పుడు (విండ్‌పాల్ గెయిన్స్) ఆ అదనపు లాభాలపై ప్రభుత్వం విధించే ప్రత్యేక పన్నునే విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటారు.సవరించిన పన్నుల వివరాలు..ఎగుమతులను నిరుత్సాహపరిచి, దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ పన్నును సవరించింది.ఇంధనం రకంపాత సుంకం (లీటరుకు)సవరించిన కొత్త సుంకం (లీటరుకు)మార్పుడీజిల్రూ. 13.5రూ. 14.0రూ. 0.50 పెంపుజెట్ ఇంధనంరూ. 9.5రూ.12.5రూ.3 పెంపు -
సాఫ్ట్వేర్, ఎంబీఏ శకానికి చరమగీతం?
భారతదేశ జాబ్ మార్కెట్లో దశాబ్దాలుగా నడుస్తున్న ‘వైట్ కాలర్’ ఉద్యోగాల బూమ్ ఇకపై సాగకపోవచ్చని, సాఫ్ట్వేర్, ఎంబీఏ డిగ్రీల హవా ముగింపు దశకు చేరుకుందని దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో.. వెల్డింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వడ్రంగి వంటి భౌతిక, వాణిజ్య నైపుణ్యాలకే (ట్రేడ్ స్కిల్స్) రాబోయే రోజుల్లో విపరీతమైన గిరాకీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని స్వభావం, ఉద్యోగ నష్టాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపాయి.శ్రమకు దక్కని గౌరవం‘స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు, వృత్తి నిపుణులకు సమాజంలో అత్యున్నత గౌరవం లభిస్తుంది. కానీ భారతదేశంలో అది కరవైంది. వెల్డర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వడ్రంగి వంటి వారిని మనం తక్కువ చేసి చూస్తాం. వారి వృత్తులను అగౌరవంగా, ఫ్యాషన్ కానిదిగా మార్చేశాం. ఈ ఆలోచనా విధానం తక్షణమే మారాల్సిన అవసరం ఉంది’ అని అనంత నాగేశ్వరన్ అన్నారు.సాంకేతిక పురోగతి అనేది ఉపాధిని పూర్తిగా హరించబోదని, అయితే అది ఉద్యోగాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందని నాగేశ్వరన్ విశ్లేషించారు. గతంలో ప్రపంచీకరణ వల్ల భారత సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ విద్యార్థులకు భారీగా ప్రయోజనం చేకూరిన మాట వాస్తవమే అయినా ఆ శకం ఇప్పుడు ముగిసిందని పేర్కొన్నారు.ఏఐ భర్తీ చేయలేని రంగాలు‘మనుషుల ప్రత్యక్ష అవసరం ఉండే, ఆటోమేషన్‌కు గురికావడానికి తక్కువ అవకాశం ఉన్న రంగాలపై యువత దృష్టి పెట్టాలి. భారతదేశంలో నిరుద్యోగిత, తక్కువ ఉపాధి సమస్యలను ఒకేసారి పరిష్కరించాలంటే శ్రమశక్తి ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి’ అన్నారు. ఉత్పాదక రంగంతో పాటు మానవ సంబంధాలు, సేవలతో ముడిపడి ఉన్న కొన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా అవకాశాలు సృష్టించవచ్చని నాగేశ్వరన్ వెల్లడించారు.ఇదీ చదవండి: బంగారం ధరలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. -
బంగారం ధరలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు ఎగబాకి 23,925 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు పెరిగి 76,532 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.7బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.65 శాతం పెరిగింది.నాస్డాక్ 3.07 శాతం పుంజుకుంది.Today Nifty position 16-06-2026(time: 09:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్‌పై వేటు!
ఐటీ రంగంలో కొన్ని స్టార్టప్‌ల పనితీరు, ఇంటర్న్‌ల పట్ల యాజమాన్యాల ధోరణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఒక చర్చ వైరల్ అవుతుంది. కేవలం అర్హతకు తగ్గ వేతనం (స్టైపెండ్) పెంచాలని వాట్సాప్‌లో మెసేజ్ పంపినందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్‌ను తొలగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో నా ఇంటర్న్‌షిప్‌ను రద్దు చేశారు.. అంటూ సదరు టెక్కీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.కంపెనీ భారాన్ని మోసి.. చివరకు..బాధిత టెక్కీ కథనం ప్రకారం.. ఆమె ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో ఏఐ ఇంజినీర్ ఇంటర్న్‌గా చేరారు. ఆరు నెలల కాలపరిమితి గల ఈ ఇంటర్న్‌షిప్‌లో ఆమెకు అత్యంత స్వల్ప మొత్తాన్ని స్టైపెండ్‌గా నిర్ణయించారు. ఆ స్టార్టప్ సాంకేతిక విభాగంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆమే కావడం గమనార్హం. ఒక ఇంటర్న్ అయినప్పటికీ, సంస్థ కోసం ఆమె నిత్యం శ్రమిస్తున్నారు.కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి స్మాల్ లాంగ్వేజ్ మోడల్ (ఎస్ఎల్ఎం)ను ఆమే స్వయంగా అభివృద్ధి చేశారు. సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి జాప్యం (Latency) తగ్గించేలా కోడింగ్‌ను ఆప్టిమైజ్ చేశారు. ఆమె ప్రతిభ కారణంగా సదరు స్టార్టప్‌కు ఏకంగా ఏడుగురు కొత్త క్లయింట్లు వచ్చారు. మూడు నెలల విజయవంతమైన పనితీరు తర్వాత ఆన్‌బోర్డింగ్ సమయంలో యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం స్టైపెండ్ రివిజన్ కోసం ఆమె మేనేజర్‌కు వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపారు.వాట్సాప్ సందేశంలో ఏముందంటే..‘హలో మేడమ్, నేను ఇక్కడ మూడు నెలలు పూర్తి చేసుకున్నాను. ఆన్‌బోర్డింగ్ సమయంలో మాట్లాడినట్లుగా నా స్టైపెండ్ రివిజన్ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. గత 3 నెలల్లో నేను ఎస్ఎల్ఎం ఏజెంట్లను నిర్మించాను. వాటిని పరీక్షించాను. డెప్లాయ్ చేశాను. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా స్టైపెండ్‌ను కొంత మేర(XXXX) పెంచుతారని ఆశిస్తున్నాను. దీనిపై మరింత చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని రాశారు.కానీ, ఈ సాధారణ మెసేజ్‌ను మేనేజర్ జీర్ణించుకోలేకపోయారు. ‘ఒక విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో పెంపు ఇవ్వడం అసాధ్యం’ అని కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా ఆమె రాత్రింబవళ్లు కష్టపడి చేసిన పనిని కేవలం ‘టెస్టింగ్ క్యాంపెయిన్లు, టెస్ట్ క్లయింట్లు’ అంటూ తక్కువ చేసి మాట్లాడారు. స్వతంత్రంగా పనిచేయడాన్ని కూడా ఒక తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు.తర్వాత కొన్ని రోజులకు..ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే సదరు ఇంటర్న్‌కు కంపెనీ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. అంచనాలకు తగిన పని లేదనే (Mismatch in expectations) నెపంతో ఆమె ఇంటర్న్‌షిప్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా కంపెనీ సీఈఓ ఆమెకు దాదాపు 30 నిమిషాల పాటు స్టార్టప్ సంస్కృతిపై ఉచిత ఉపన్యాసం ఇచ్చి ఆమెను ‘మనీ-మైండెడ్’ అని సంబోధించారు.‘‘నాలుగు నెలల పాటు కష్టపడి రాసిన కోడ్‌ను పూర్తిగా విస్మరించారు. ‘మేము ఇంత మొత్తమే ఇవ్వగలం’ అని వారు నేరుగా చెప్పి ఉంటే నేను సంతోషంగా అంగీకరించేదాన్ని. కానీ కేవలం చర్చలు జరిపినందుకు నన్ను తీసేశారు’ అని టెక్కీ వాపోయారు. ‘ప్రామాణిక వ్యాపార చర్చలను వ్యక్తిగత ద్రోహంగా భావించే నిర్వాహకుల కింద వేతనం కోసం నేను భిక్షం ఎత్తాలనుకోవడం లేదు. అందుకే నా ఎక్స్పీరియన్స్ లెటర్ కోసం డిమాండ్ చేస్తూ మెయిల్ పెడుతున్నాను’ అని ఆమె చెప్పారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో ఐటీ నిపుణులు, నెటిజన్లు సదరు టెక్కీకి మద్దతుగా నిలుస్తున్నారు. కంపెనీల దోపిడీని ఎండగడుతూ పలువురు వ్యాఖ్యానించారు. ‘కూల్‌గా ఉండండి.. మీ ప్రమాణాలను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మిమ్మల్ని కోల్పోవడం ఆ కంపెనీకే నష్టం’ అని ఒకరన్నారు. ‘నాకు కూడా ఇలాగే జరిగింది. కంపెనీ అవసరాలకు మించి ఎక్కువ పనులు చేయకూడదని దీని ద్వారా నేర్చుకున్నాను’ అని మరొకరు చెప్పారు.ఇదీ చదవండి: బంగారు పంట పండింది! -
ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం!
బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ల ప్రయోజనాలే పరమావధిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే ప్రక్రియపై నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినతరం చేసింది. రుణదాతలు, బ్యాంకింగ్ సిబ్బంది కస్టమర్లను తప్పుదారి పట్టించి ఉత్పత్తులను అంటగట్టే ‘మిస్ సెల్లింగ్’ పద్ధతులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే?సవరించిన నూతన మార్గదర్శకాలు తొలుత జులై 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక, కార్యాచరణ మార్పులు చేసుకోవడానికి వీలుగా సెంట్రల్ బ్యాంక్ గడువును పొడిగించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.నూతన మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుబ్యాంకులు ఏ రకమైన ఆర్థిక ఉత్పత్తి లేదా సేవను విక్రయించాలన్నా సదరు కస్టమర్ స్పష్టమైన ఆమోదం తీసుకోవాలి. అలాగే ఆ ఉత్పత్తి కస్టమర్‌కు ఎంతవరకు అనుకూలమైనదో ముందే నిర్ధారించుకోవాలి.సంతకం చేసిన డిక్లరేషన్లు, ఓటీపీ-ఆధారిత ఆమోదాలు, డిజిటల్ ధ్రువీకరణలు లేదా ఒప్పంద పత్రాలలో స్పష్టంగా పేర్కొన్న సమ్మతి నిబంధనల ద్వారా మాత్రమే ఈ అనుమతిని సేకరించాల్సి ఉంటుంది.డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లలో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా లేదా మోసగించేలా రూపొందించే వినియోగదారు-అనుభవ పద్ధతులు లేదా డార్క్ ప్యాటర్న్స్(డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను మోసగించడానికి లేదా వారి ప్రమేయం లేకుండా కొన్ని పనులు చేయించడానికి ఉపయోగించే వ్యూహాలు) వాడకాన్ని ఆర్బీఐ పూర్తిగా నిషేధించింది.తప్పుగా విక్రయిస్తే.. పూర్తి రీఫండ్!బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిబంధనను ఆర్బీఐ ఈసారి తీసుకొచ్చింది. ఆర్థిక ఉత్పత్తులను కస్టమర్లకు తప్పుగా విక్రయించినట్లు రుజువైతే బ్యాంకులు ఆ విక్రయాన్ని రద్దు చేయడమే కాకుండా.. కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రద్దు, రీఫండ్ గురించిన సమాచారాన్ని కస్టమర్‌కు అధికారికంగా తెలియజేయడం తప్పనిసరి.ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏజెంట్లే..సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆర్థిక ఉత్పత్తులను ప్రమోట్ చేసే వారిపై కూడా ఆర్బీఐ నిఘా పెంచింది. ప్రమోషన్లు లేదా కస్టమర్లను ఆకర్షించే ప్రక్రియలో పాల్గొనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సన్లు, అనుబంధ సంస్థలు, ఇతర డిజిటల్ మార్కెటింగ్ మధ్యవర్తులను ఇకపై డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లుగానే పరిగణిస్తారు. తద్వారా వారికి కూడా బ్యాంకింగ్ నిబంధనలు, బాధ్యతలు వర్తిస్తాయి.ఉద్యోగుల ఇన్సెంటివ్లపై స్పష్టతబ్యాంక్ సిబ్బంది కస్టమర్లపై ఒత్తిడి తెచ్చి ఉత్పత్తులను విక్రయించకుండా చూసేందుకు ఆర్బీఐ ప్రోత్సాహకాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. థర్డ్ పార్టీ సంస్థలు (ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి) నియంత్రిత సంస్థల/బ్యాంకుల ఉద్యోగులకు నేరుగా ప్రోత్సాహకాలు అందించడాన్ని పూర్తిగా నిషేధించారు. బ్యాంకులు లేదా నియంత్రిత సంస్థలు తమ సొంత సిబ్బందికి అంతర్గతంగా ప్రోత్సాహకాలను అందించుకోవచ్చు.గమనిక: అయితే, ఈ అంతర్గత ప్రోత్సాహక నిర్మాణాలు ఉద్యోగులను దూకుడుగా అమ్మకాలు జరిపేలా ప్రోత్సహించకూడదని, అది మిస్ సెల్లింగ్‌కు దారితీయకూడదని ఆర్బీఐ హెచ్చరించింది.ఈ నూతన నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు తమ సొంత ప్రకటనలు, మార్కెటింగ్, అమ్మకాల ప్రక్రియల కోసం ఒక సమగ్రమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో మిస్ సెల్లింగ్ మోసాలకు అడ్డుకట్ట పడటంతోపాటు కస్టమర్లలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం మరింత బలపడనుంది.ఇదీ చదవండి: బంగారు పంట పండింది! -
డీల్‌తో ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్ నిర్ణయంతో భారత్‌కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు. జూన్ 19 స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్‌కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అనిశ్చితికి తెర.. శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. హార్మూజ్ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు. -
ఎగుమతులు భేష్..!
న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు మేలో పటిష్ట పనితీరు చూపించాయి. ఆరు నెలల గరిష్ట స్థాయిలో 45.2 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 10 శాతం పెరిగి 73.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు (ఎగుమతులను మించి దిగుమతుల విలువ పెరగడం కారణంగా ఏర్పడేది) 28.21 బిలియన్ డాలర్లకు ఎగిసింది. గతేడాది మే నెలలో వాణిజ్యలోటు 21.88 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ముడి చమురు, ఎరువుల కోసం అధికంగా వెచ్చించాల్సి రావడం దిగుమతుల బిల్లు పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లోనూ దేశ ఎగుమతులు మెరుగైన వృద్ధిని చూసినట్టు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. మరోవైపు మేలో సేవల ఎగుమతులు 36.76 బిలియన్ డాలర్లు, సేవల దిగుమతులు 19.06 బి. డాలర్లుగా ఉండొచ్చన్నది ప్రభుత్వం అంచనా. మొదటి రెండు నెలల్లో మంచి పనితీరు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 16.09 శాతం పెరిగి 88.91 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 15.14 శాతం జంప్ చేసి 145.35 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 56.44 బిలియన్ డాలర్లుగా ఉంది. పసిడి దిగుమతులు ఎక్కువే.. ఏప్రిల్, మే నెలలో 9.40 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు దేశంలోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 60 శాతం పెరిగాయి. పసిడి, వెండి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం ఇటీవలే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. ముడిచమురు దిగుమతుల విలువ సైతం 16.5 శాతం పెరిగి 41.3 బిలియన్ డాలర్లకు చేరింది. పశ్చిమాసియాకు మెరుగైన ఎగుమతులు పశ్చిమాసియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రాంతానికి మే నెలలో ఎగుమతులు గతేడాది మే స్థాయికి చేరినట్టు రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. 2025 మేలో 5.38 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈ ఏడాది అదే నెలలో 5.30 బిలియన్ డాలర్ల మేర ఆ ప్రాంతానికి ఎగుమతయ్యాయి. ఒమన్‌కు చెందిన దుక్్మ, సోహార్, సలాలా పోర్టుల ద్వారా భారత్ తన ఎగుమతులను పెంచుకుంది. -
కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్!
బంగారం ధరలు పెరుగుతాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' మరోసారి హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మొత్తానికి బంగారం తన కదలికను ప్రారంభించింది. ఒక్క రోజులోనే 100 డాలర్లు దాటింది. మీరు దీనిని గమనించారా?. ఒకవేళా గమనించకపోతే, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పసిడి ధర పెరుగుదల ఇప్పుడే మొదలైంది. ఈ రోజు బంగారం ఔన్సుకు 4300 డాలర్ల వద్ద ఉంది. అయితే 2035 నాటికి ఇది 35,000 డాలర్లకు చేరుకోవచ్చని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుంది. అందుకే "క్యాష్ ఈజ్ ట్రాష్'' అని వ్యాఖ్యానిస్తూ, కేవలం డబ్బును పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నగదు రూపంలో డబ్బును నిల్వ ఉంచడం కంటే.. విలువను నిలబెట్టుకునే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని అంటున్నారు.బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం, చమురు వంటి ఆస్తులను కొనుగోలు చేయడం మంచిదని కియోసాకి సలహా ఇస్తున్నారు. తాను కూడా గత కొన్ని సంవత్సరాలుగా నగదును ఈ ఆస్తులుగా మార్చుకుంటూ వచ్చానని, వాటినే 'నిజమైన డబ్బు'గా భావిస్తున్నానని చెప్పారు.అయితే ఇది కియోసాకి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పెట్టుబడుల విషయంలో మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రిస్క్‌లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పూర్తి పరిశీలన చేయడం, ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఈ విషయంలో పెట్టుబడిదారులు తప్పకుండా జాగ్రత్త వహించాలి.GOLD began its move…finally.Over &100 in a day.Did you catch the move?If you did not. Do not worry. The ascent of gold has just begun.Today gold is at $4300 an ounce.I am confident it will be $35,000 an ounce by 2035. Nice dates and numbers that start and end…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 15, 2026 -
కారులో స్టెప్నీ టైర్.. చిన్నగా ఉండటానికి ఇదే అసలు కారణం!
కార్లలో ఉండే స్టెప్నీ (Spare Tyre) సాధారణంగా.. మిగతా టైర్ల కంటే కొద్దిగా చిన్నగా ఉండటం చాలా మంది గమనించి ఉంటారు. కొందరు దీనిని తయారీ లోపంగా భావించినప్పటికీ, వాస్తవానికి ఇది ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో భాగంగా తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయం. ఈ చిన్న స్టెప్నీని సాధారణంగా 'స్పేస్ సేవర్' లేదా 'డోనట్ టైర్' అని పిలుస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉపయోగించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తారు.బరువును తగ్గించడంస్టెప్నీ టైర్ చిన్నగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాహనం బరువును తగ్గించడం. కారు ఎంత తక్కువ బరువు ఉంటే అంత తక్కువ ఇంధనం వినియోగిస్తుంది. దీంతో మైలేజ్ మెరుగుపడటమే కాకుండా పర్యావరణానికి హానికరమైన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ప్రతి కారులో పూర్తి పరిమాణం గల అదనపు టైర్‌ను ఉంచితే వాహనం బరువు పెరిగి ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది.స్థలాన్ని ఆదా చేయడంమరో ముఖ్యమైన కారణం స్థలాన్ని ఆదా చేయడం. చిన్న పరిమాణంలోని స్టెప్నీ కారు డిక్కీలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతో ప్రయాణికులు తమ లగేజ్ ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కార్లలో డిక్కీ స్థలం పరిమితంగా ఉండటం వల్ల ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఖర్చు తగ్గించడంఖర్చును తగ్గించడం కూడా మరో కారణం. చిన్న టైర్, రిమ్ తయారీకి తక్కువ ముడిసరుకు అవసరం అవుతుంది. ఫలితంగా తయారీ ఖర్చు తగ్గుతుంది. స్టెప్నీని రోజువారీ వినియోగం కోసం కాకుండా కేవలం అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి ఖరీదైన పూర్తి పరిమాణం గల టైర్‌ను అందించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల వాహన ధర కూడా కొంత వరకు నియంత్రణలో ఉంటుంది.తాత్కాలిక ఉపయోగం కోసంఅయితే ఈ చిన్న స్టెప్నీని ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగించకూడదు. సాధారణంగా 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తారు. అలాగే గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు. దీని ప్రధాన ఉద్దేశం సమీపంలోని టైర్ రిపేర్ సెంటర్ లేదా సర్వీస్ స్టేషన్ వరకు సురక్షితంగా చేరుకోవడమే.సులభ వినియోగంచిన్న స్టెప్నీ తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల దానిని మార్చడం కూడా సులభం. రోడ్డుపై టైర్ పంక్చర్ అయినప్పుడు డ్రైవర్లు లేదా ప్రయాణికులు పెద్దగా శ్రమ లేకుండా స్టెప్నీని అమర్చగలుగుతారు. పూర్తి పరిమాణం గల టైర్‌తో పోలిస్తే దీనిని ఎత్తడం, అమర్చడం చాలా సులభంగా ఉంటుంది.అయితే.. చిన్న స్టెప్నీ వాడుతున్నప్పుడు వాహనం గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాండ్లింగ్‌లో స్వల్ప మార్పులు రావచ్చు. అందువల్ల జాగ్రత్తగా తక్కువ వేగంతో ప్రయాణించడం మంచిది. స్టెప్నీ అనేది స్వల్ప దూరం ప్రయాణించడానికి మాత్రమే అనే విషయం మర్చిపోకూడదు. -
బంగారు పంట పండింది!
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి అక్షరాలా కాసుల వర్షం కురిసింది. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) 2020-21 సిరీస్-3 ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో భారీ లాభాలను అందుకోబోతున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా ప్రిమెచ్యూర్ రిడంప్షన్ ధరను ప్రకటించింది. జూన్ 16, 2026 నుంచి ఈ బాండ్లను ముందస్తుగా రీడీమ్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. గడచిన మూడు ట్రేడింగ్ రోజుల్లోని బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా.. ఈ విడత ప్రిమెచ్యూర్ రిడంప్షన్ ధరను గ్రాముకు రూ.14,774 గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తయిన తర్వాత, వడ్డీ చెల్లింపు తేదీల్లో ప్రిమెచ్యూర్ రిడంప్షన్‌కు అవకాశం ఉంటుంది.ధర ఎలా లెక్కిస్తారంటే..ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన రేట్ల ప్రకారం... రిడంప్షన్ తేదీకి ముందు ఉన్న మూడు వ్యాపార రోజుల్లో 999 స్వచ్ఛత (24 క్యారెట్ల) బంగారం ముగింపు ధరల సాధారణ సగటును పరిగణనలోకి తీసుకొని ఈ ధరను ఖరారు చేశారు.పెట్టుబడిదారులకు ఎంత రాబడి వస్తుంది?ఈ సిరీస్ జారీ చేసిన సమయంలో ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.50 తగ్గింపుతో రూ.4,627 లభించగా, ఆఫ్-లైన్ ఇన్వెస్టర్లకు రూ.4,677 గా ఉంది. ప్రస్తుత రిడంప్షన్ ధర రూ.14,774గా ఉంది. దాంతో నికరంగా 215.88% శాతం లాభం చేకూరినట్లయింది.గమనిక: ఈ లాభం బాండ్లపై లభించిన 2.5% వార్షిక వడ్డీ భాగం కాకుండా కేవలం బంగారం ధరల పెరుగుదల ద్వారా వచ్చిన నికర లాభం మాత్రమే.రూ.లక్ష పెట్టుబడి.. రూ.3.19 లక్షలు!ఈ లెక్కన 2020 జూన్‌లో ఈ బాండ్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఆన్లైన్ ఇన్వెస్టర్ ప్రస్తుత పెట్టుబడి విలువ ఏకంగా రూ.3.19 లక్షలకు పైగా పెరిగింది. దీనికి అదనంగా గడచిన ఐదేళ్లలో ఏటా లభించిన 2.5 శాతం వడ్డీ ఆదాయం అదనం.పన్ను నిబంధనల్లో మార్పులుఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను నిబంధనలను సవరించినందున ఇన్వెస్టర్లు కొన్ని కీలక విషయాలను గుర్తుంచుకోవాలి.ప్రైమరీ ఇష్యూ (మొదటగా ఆర్బీఐ వద్ద కొనుగోలు చేసిన) చందాదారులు కూడా ఐదేళ్ల తర్వాత ప్రిమెచ్యూర్ రిడంప్షన్ చేసుకుంటే వచ్చే లాభాలపై మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.ఎస్జీబీ నిబంధనల ప్రకారం లభించే పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనం.. కేవలం 8 ఏళ్ల కాలపరిమితి ముగిసే వరకు బాండ్లను ఉంచుకునే అసలు చందాదారులకు మాత్రమే పరిమితం చేశారు.స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసిన వారు ఆ బాండ్లను మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు హోల్డ్ చేసినప్పటికీ.. సవరించిన నిబంధనల ప్రకారం వారికి ఇకపై పన్ను రహిత విముక్తి (Tax-free Redemption) లభించదు. వారు కూడా పన్ను చెల్లించాల్సిందే.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
జూన్ 30 డెడ్‌లైన్.. ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్!
భారతదేశంలో ఎల్పీజీ సబ్సిడీలను పారదర్శకంగా.. సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లక్షలాది ఎల్పీజీ వినియోగదారులు, ముఖ్యంగా 'ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన' (PMUY) లబ్ధిదారులు, తమ eKYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియను 2026 జూన్ 30లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులు ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులకు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ వంటి సంస్థల ద్వారా వచ్చే సబ్సిడీలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.ఈకేవైసీ ప్రక్రియ సులభంగా ఉంటుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారులు తమ మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇండేన్ వినియోగదారులు ఇండియన్ఆయిల్ వన్ యాప్ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్ ద్వారా, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు హెచ్‌పీ పే యాప్ లేదా ఆధార్ ఫేస్ఆర్డీ యాప్ ద్వారా ఈకవైసీ పూర్తి చేయవచ్చు. ఇందులో ఓటీపీ ధృవీకరణ, ఆధార్ లింకింగ్, ఫేస్ అథెంటికేషన్ వంటి దశలు ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. కాగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పరిధిలో లేని వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి కాదు. అయితే అయితే అర్హులైన వారు సమయానికి పూర్తి చేయకపోతే సబ్సిడీ ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి గడువు (జూన్ 30)లోపు ఈ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసుకోవడం ఉత్తమం.एलपीजी सब्सिडी का लाभ बिना किसी रुकावट के प्राप्त करते रहें।30 जून 2026 से पहले अपना eKYC पूरा करें। यह प्रक्रिया सरल, सुरक्षित और पूर्णतः निःशुल्क है। आप इसे इंडियनऑयल ONE ऐप, अपने इंडेन वितरक या एलपीजी डिलीवरी कर्मी के माध्यम से आसानी से पूरा कर सकते हैं।आज ही eKYC करवाएँ… pic.twitter.com/E7bukytXWA— Indian Oil Corp Ltd (@IndianOilcl) June 12, 2026 -
అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ నియామకం
ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తమ సరికొత్త హెల్త్ టెక్ స్పిన్-ఆఫ్ (నూతన విభాగం) పునర్నిర్మాణంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి ఈ ప్రతిపాదిత పథకానికి తుది ఆమోదం లభించిన అనంతరం అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభన కామినేనిని నియమించనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. కంపెనీ ప్రతిపాదిత విభజన, అపోలో హెల్త్ టెక్ లిస్టింగ్ (స్టాక్ మార్కెట్లో నమోదు), కార్పొరేట్ గవర్నెన్స్ (పాలనా ఫ్రేమ్ వర్క్)కు సంబంధించిన అదనపు వివరాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.12 మందితో బోర్డు ఏర్పాటుదీర్ఘకాలిక విలువ సృష్టి, పారదర్శకమైన పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ పునర్నిర్మాణ పథకంలో బలమైన అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లు అపోలో తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో హెల్త్ టెక్ బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉంటారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బోర్డులో సగం మంది (ఆరుగురు) స్వతంత్ర డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డులోని ప్రతి డైరెక్టర్ తమ విశ్వసనీయ విధులకు కట్టుబడి ఉంటారని, స్వతంత్ర డైరెక్టర్లు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ సమతుల్య నిర్ణయాలు తీసుకునేలా చూస్తారని కంపెనీ పేర్కొంది. నిబంధనలను పర్యవేక్షించేందుకు ఒక లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ను నియమించనున్నట్లు, బోర్డు వ్యవహారాలను క్రమానుగతంగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది.శోభన కామినేని నియామక నిబంధనలు, పదవీకాలం, వేతన ప్యాకేజీకి సంబంధించి వాటాదారుల అనుమతిని త్వరలోనే కోరనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, పాలనాపరమైన పారదర్శకత కోసం పెట్టుబడిదారు లేదా ప్రమోటర్ గ్రూప్ వాటా 10 శాతం కంటే తగ్గితే వారి నామినేషన్ హక్కులు ముగుస్తాయి.అప్‌సైడ్ అగ్రిమెంట్ వివరాలుఈ విలీన పథకంలో భాగమైన ‘అప్‌సైడ్ అగ్రిమెంట్’ గురించి వస్తున్న ఊహాగానాలకు అపోలో తెరదించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిధులను వ్యూహాత్మక పెట్టుబడిదారు రాస్మేలి (Rasmeley) మాత్రమే సమకూరుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల అపోలో హెల్త్ టెక్ నుంచి గానీ, దాని ప్రస్తుత వాటాదారుల నుంచి గానీ ఎటువంటి నగదు బయటకు వెళ్లదు.వ్యూహాత్మక పునర్నిర్మాణం లక్ష్యం ఇదే..అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చేపట్టిన ఈ భారీ విభజన, పునర్నిర్మాణ పథకం వెనుక స్పష్టమైన వ్యాపార వ్యూహం ఉంది. కంపెనీకి చెందిన సేవలను విడివిడిగా విభజించి (స్పిన్ ఆఫ్), విలీనం చేయడం ద్వారా స్వతంత్రంగా మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఓమ్నిఛానల్ రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పంపిణీ వ్యాపారం, డిజిటల్ హెల్త్ వ్యాపారం (Apollo 24/7 వంటి డిజిటల్ సేవలు) వంటి విభాగాలన్నింటినీ ‘అపోలో హెల్త్ టెక్’ గొడుగు కిందికి తెచ్చి ప్రత్యేకంగా వృద్ధి పథంలో నడిపించనున్నారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
భారత్‌లో మరో టెస్లా కారు.. డెలివరీ షురూ!
టెస్లా భారతదేశంలో లాంచ్ చేసిన మోడల్ వైఎల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. 6-సీటర్ ఎలక్ట్రిక్ SUV రూపంలో లాంచ్ అయిన ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ మోడల్ కంటే కూడా విశాలమైన క్యాబిన్ పొందుతుంది. ఇది 2+2+2 సీట్ల అమరికలో ఉంటుంది.మోడల్ YLలో 16-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం 8-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్, 2వ వరుస సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, 19-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.మోడల్ YL డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఇది 5.0 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని. ఇది ఒక ఫుల్ ఛార్జితో 681 కి.మీ రేంజ్ అందిస్తుందని టెస్లా పేర్కొంది. ఇది 250 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 15 నిమిషాల్లో 288 కి.మీ వరకు ప్రయాణించగల ఛార్జింగ్ పొందగలరు. -
బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాల వృద్ధికి రూ.10 కోట్ల విరాళం
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ క్షేత్రాల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. శతాబ్దాల నాటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.కట్టుదిట్టమైన భద్రతఉదయం 10:00 గంటలకు ముఖేష్ అంబానీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బద్రీనాథ్ హెలిప్యాడ్‌కు చేరుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న అంబానీ దాదాపు 20 నిమిషాల పాటు బద్రి విశాల్ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 10 నిమిషాల పాటు సాంప్రదాయ ఆచారాలను నిర్వహించారు.కమిటీతో భేటీ - విరాళంపూజా కార్యక్రమాల అనంతరం బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు పుణ్యక్షేత్రాల మౌలిక వసతులు, అభివృద్ధి, నిర్వహణ పనుల నిమిత్తం రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఉదయం 10:40 గంటలకు బద్రీనాథ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:15 గంటలకు కేదార్నాథ్ చేరుకున్నారు. అక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.జై శ్రీరామ్ నినాదాలతో..కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో అంబానీని చూసిన భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అంబానీ చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తులను పలకరించారు. పర్యటన ముగిసిన అనంతరం ఆయన మధ్యాహ్నం తిరుగుపయనమయ్యారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశాల ఆర్థిక, సామాజిక భవిష్యత్తును శాసించే జనన రేట్లు ఊహించని విధంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆసియా, ఐరోపా ఖండాల్లోని ప్రభుత్వాలు ఈ ధోరణిని మార్చడానికి పడే తపన అంతా ఇంతా కాదు. ఎక్కువ మంది పిల్లలను కనాలని పౌరులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అపర కుబేరులలాగా నగదు పంపిణీలు, పన్ను మినహాయింపులు, ఉచిత గృహ వసతి, భారీ కుటుంబ ప్రయోజనాలతో పాటు భావోద్వేగ విజ్ఞప్తులు కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ, ఫలితం శూన్యం. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు నానాటికీ దిగజారుతూనే ఉంది.ఈ నేపథ్యంలో.. ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ఒప్పించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రపంచ అనుభవాల నుంచి రేపటి మేటి శక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఎలాంటి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవాలి? అనే అంశాలపై నిపుణులు చర్చిస్తున్నారు.బేబీ బోనస్ ప్రయోగం: చేతులెత్తేసిన దేశాలుపడిపోతున్న జనన రేట్లను తిప్పికొట్టడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి దక్షిణ కొరియా ఒక ఉదాహరణ. 2006లో తక్కువ సంతానోత్పత్తి నివారణకు ఒక సమగ్ర ప్రణాళికను ప్రారంభించినప్పటి నుంచి ఆ దేశం నగదు ప్రోత్సాహకాలు, ఉచిత పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి చికిత్స రాయితీలు, తల్లిదండ్రుల సెలవులు, గృహ సహాయం వంటివాటి కోసం ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అయినా ఫలితం ఏంటి? 2023లో ఆ దేశ సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయి 0.72 కి పడిపోయింది. 2024లో 0.75, 2025లో 0.8 గా ఇది స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా స్థిరమైన జనాభాకు అవసరమైన భర్తీ రేటు అయిన 2.1 కంటే ఇది ఎంతో దూరంలో ఉంది.ఇతర దేశాలు ఇలా..ఇదే బాటలో నడిచిన సింగపూర్ 2001లో ‘బేబీ బోనస్’ పథకాన్ని తెచ్చింది. పదేపదే రాయితీలు పెంచినా అక్కడా జననాల రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయిలోనే ఉంది. జపాన్, చైనా, హంగేరీ, రష్యా, పోలాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత మార్పును సాధించలేకపోయాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు కేవలం కొంతవరకు మాత్రమే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని, పిల్లలను కనడం అనేది కేవలం డబ్బుతో ముడిపడిన అంశం కాదని ఈ దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి.డబ్బు మాత్రమే ఎందుకు సరిపోవట్లేదు?ప్రభుత్వాల ఆలోచన ప్రకారం.. పిల్లల పెంపకం ఖరీదైనది, కాబట్టి నగదు ఇస్తే ప్రజలు పిల్లలను కంటారు. కానీ నిజ జీవితంలో ఈ తర్కం పనిచేయడం లేదు. ‘సంతానోత్పత్తి నిర్ణయాలు అనేవి వన్-టైమ్ ఫైనాన్షియల్ లావాదేవీలు కావు. పిల్లలను కలిగి ఉండటం అనేది గృహనిర్మాణం, ఉపాధి భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రుల మానసిక, ఆర్థిక సామర్థ్యాలతో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రభుత్వాలు ఇచ్చే తాత్కాలిక బేబీ బోనస్‌లు తల్లిదండ్రులు ఎదుర్కొనే వ్యవస్థాగత ఒత్తిళ్లను దూరం చేయలేవు’ అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా అన్నారు.నిజమైన ఖర్చులు ఇవే..పరిశోధకుల ప్రకారం.. సమస్య ప్రసవానికి అయ్యే ఖర్చు కాదు, ఒక కుటుంబాన్ని సగర్వంగా సమాజంలో నిలబెట్టడానికి అయ్యే విస్తృత సామాజిక-ఆర్థిక ఖర్చులు.పెరుగుతున్న గృహాల ధరలుకుటుంబం ఏర్పడటానికి ప్రధాన అడ్డంకి గృహ స్థోమత. UNFPA (ఐక్యరాజ్యసమితి జనాభా నిధి) 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 19% మంది తమకు కావలసిన సంఖ్యలో పిల్లలు లేకపోవడానికి గృహ సంబంధిత సమస్యలే కారణమని తేల్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) మార్చి 2025 నివేదిక సైతం దక్షిణ కొరియా, చైనా (బీజింగ్, షాంఘై), సింగపూర్‌ల్లో విపరీతంగా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు యువత పెళ్లిళ్లను వాయిదా వేయడానికి, తక్కువ సంతానోత్పత్తికి దారితీస్తున్నాయని స్పష్టం చేసింది.ఆలస్యమవుతున్న వివాహాలుఆసియా సంస్కృతిలో ప్రసవం అనేది వివాహ బంధంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం యువత ఉన్నత విద్య, స్థిరమైన కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా వివాహ వయస్సు పెరుగుతోంది. వివాహ రేట్లు పడిపోతున్నాయి. తక్కువ వివాహాలు అంటే తక్కువ జననాలే కదా!ఆధునిక మహిళ - పని వాతావరణంనేటి మహిళలు విద్యావంతులు, ఆర్థిక స్వతంత్రులు. వారు తమ ఆకాంక్షలను త్యాగం చేయాల్సి వచ్చే కుటుంబ ఏర్పాట్లకు దూరంగా ఉంటున్నారు. ‘కార్యాలయాల్లో ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు పిల్లల పెంపకం భారం మహిళలపైనే పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని, చాలామంది మహిళలు పిల్లలను వద్దు అనుకుంటున్నారు’ అని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సీఈఓ శోభిత్ అగర్వాల్ అన్నారు.ఇంటెన్సివ్ పేరెంటింగ్నేటి కాలంలో పిల్లల సంఖ్య కంటే, ఉన్న ఒక్క బిడ్డకు బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే ధోరణి పెరిగింది. విద్యా ఖర్చులు పెరగడం, పోటీ ప్రపంచంలో సీట్ల కోసం పడే పాట్లు చూసి ఇద్దరు పిల్లల కంటే ఒకరికే పరిమితమవుతున్నారు లేదా పేరెంట్‌హుడ్‌ను పూర్తిగా వాయిదా వేస్తున్నారు.గ్లోబల్ సర్వే ఏం చెబుతోంది? (UNFPA 2025 డేటా)యంగ్ జనరేషన్ కేవలం పిల్లల కోసం కాకుండా కెరీర్ గ్రోత్, వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తోంది. వారు ఆశించే కుటుంబ పరిమాణాన్ని అడ్డుకుంటున్న కారకాలను కింది పట్టిక వివరిస్తుంది.అడ్డంకులు/కారణాలుశాతం (%)ఆర్థిక పరిమితులు39%ఉద్యోగ అభద్రత21%గృహ సమస్యలు19%సరిపోని పిల్లల సంరక్షణ సదుపాయాలు12%మనం నేర్చుకోవాల్సిన పాఠాలుభారతదేశం ప్రస్తుతం తూర్పు ఆసియా తరహా తీవ్ర జనాభా క్షీణతను ఎదుర్కోవడం లేదు కానీ, మన దేశ సంతానోత్పత్తి సరళి వేగంగా మారుతోంది. ఎన్ఎఫ్హెచ్ఎస్-6 (2023-24) నివేదిక ప్రకారం..భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) 2.0 గా నమోదైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 సర్వే ప్రకారం.. దేశ జాతీయ టీఎఫ్ఆర్ 1.9 కు పడిపోయింది.1960లలో ఒక భారతీయ మహిళకు సగటున ఆరుగురు పిల్లలు ఉండగా నేడు విద్యా ప్రమాణాలు పెరగడం, గర్భనిరోధక సాధనాల లభ్యత వల్ల కుటుంబాలు చిన్నవయ్యాయి. అయితే ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో జననాల రేటు పడిపోయి వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుంటే, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా జనన రేట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్ ఏం చేయాలి?సంతానోత్పత్తి తగ్గడాన్ని ఒక సంక్షోభంగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం కంటే సరసమైన చైల్డ్ కేర్, మెరుగైన ప్రసూతి/పితృత్వ సెలవులు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంపై పాలకులు దృష్టి పెట్టాలి. భారతదేశంలో ఇంకా వివాహ బంధ వ్యవస్థ బలంగానే ఉంది. అయితే వంధ్యత్వం (Infertility), గృహాల ధరలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సవాలుగా మారుతున్నాయి. సంతానోత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి పడిపోయే వరకు వేచి ఉండకుండా ఇప్పుడే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విధానాలు రూపొందించాలి.ఇదీ చదవండి: మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం -
కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!
డిజిటల్ యుగంలో.. సోషల్ మీడియా పిల్లల జీవితాల్లో కీలక భాగంగా మారింది. అయితే, దీని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్ స్టార్మర్ (Keir Starmer) నేతృత్వంలోని యూకే ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా సైట్లను నిషేధిస్తానని, గేమింగ్, లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై పరిమితులు విధిస్తానని నిర్ణయించింది. పిల్లల సంక్షేమాన్ని కాపాడటానికి కఠిన చర్యలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల సంవత్సరాలలో టెక్నాలజీ కంపెనీలపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వయస్సు నిర్ధారణ వ్యవస్థలు, అల్గారిథమ్‌లలో మార్పులు, అనుచిత చిత్రాలను పంచుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కంపెనీలను ఆదేశించింది. అయితే.. ఇప్పుడు కేవలం నియంత్రణలతో సరిపోదని భావించిన ప్రభుత్వం, పూర్తి నిషేధం వైపు అడుగులు వేస్తోంది.బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రేలియాను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే.. గత ఏడాది ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్) వినియోగాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచింది.పిల్లలకు సోషల్ మీడియా నిషేధం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, బ్రిటన్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువతతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. సోషల్ మీడియాపై నిషేధంతో పాటు.. రాత్రి సమయాల్లో వినియోగ పరిమితులు, యాప్‌లకు సమయ పరిమితులు, పిల్లలను ఎక్కువసేపు ఆకర్షించే డిజైన్ ఫీచర్లపై ఆంక్షలు వంటి అంశాలను పరిశీలించింది.ఈ సంప్రదింపుల్లో లక్షకు పైగా స్పందనలు వచ్చాయి. అందులో 83 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు.. ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే 90 శాతం మంది సోషల్ మీడియా వాడేందుకు కనీస వయస్సు 16 సంవత్సరాలు ఉండాలని మద్దతు తెలిపారు.అయితే.. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు కేవలం నిషేధం విధించడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని అంటున్నారు. పిల్లలకు డిజిటల్ అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగంపై విద్య అందించడం కూడా అంతే ముఖ్యమని వారు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరిన్ని దేశాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.ఇదీ చదవండి: క్యాష్ ఈజ్ ట్రాష్.. పెట్టుబడిదారులకు కియోసాకి హెచ్చరిక! -
మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం
గ్లోబల్ మార్కెట్లో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశీయంగా విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంయుక్తంగా కీలక చర్యలు ప్రారంభించాయి. విదేశీ నిధులను తిరిగి భారత మార్కెట్ వైపు ఆకర్షించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో ఇది మొదటి అడుగని, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘మైండ్ మైన్ సమ్మిట్ 2026’లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.ముడి చమురు, ఎరువులు, కీలక ముడి పదార్థాల దిగుమతుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మన బాండ్ మార్కెట్ ‘మంచి అయస్కాంతం’లా పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్త విశ్లేషణలో తేలిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు.ఎఫ్ఏఆర్ పరిధి విస్తరణప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ ఇన్వెస్టర్లకు సమ్మతి భారాన్ని తగ్గించేందుకు గానూ, ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్ఏఆర్) కింద నిర్దిష్ట సెక్యూరిటీల జాబితాను జూన్ 5న ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆర్జించే వడ్డీ, మూలధన లాభాల ఆదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.‘ప్రస్తుతానికి ఈ సంస్కరణలు బాండ్ మార్కెట్‌కే పరిమితమైనప్పటికీ దీని పరిధి విస్తరించనుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం’ అని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.బ్యాంకులకు ఊరటవిదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచడంతో పాటు కరెన్సీ హెడ్జింగ్ రిస్క్‌ను తగ్గించడానికి ఆర్బీఐ జూన్ 5న బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 3 నుంచి 5 సంవత్సరాల మెచ్యూరిటీ గల ‘విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్’ (ఎఫ్సీఎన్ఆర్-బీ) డిపాజిట్ల కోసం ఆర్బీఐ స్వాప్ సదుపాయాన్ని యాక్సెస్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీని ద్వారా బ్యాంకులు తమ యూఎస్ డాలర్ డిపాజిట్లను ఆర్బీఐతో మార్చుకోవచ్చు. తద్వారా మారకపు విలువల్లో వచ్చే కరెన్సీ ప్రమాదాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే, విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచడానికి, సెప్టెంబర్ 30 వరకు బాహ్య వాణిజ్య రుణాలను (ఈసీబీ) పెంచుకునేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఇదీ చదవండి: మల్టీప్లెక్స్‌ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్! -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 736.38 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 76,264.33 వద్దఎం నిఫ్టీ 231.00 పాయింట్లు లేదా 0.98 శాతం లాభంతో 23,853.90 వద్ద నిలిచాయి.మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఏబీ కాట్స్పిన్ ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్, ఎక్సీకామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్, గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శార్దూల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎక్సారో టైల్స్ లిమిటెడ్, హెచ్బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, రవీందర్ హైట్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇథనాల్‌తో నడిచే వ్యాగన్ ఆర్: ధర ఎంతంటే?
భారతదేశంలో పర్యావరణ హిత ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఇది ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.కంపెనీ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన సమయంలో ధరలను ప్రకటించలేదు. అయితే తాజాగా సంస్థ ఈ వాహనం ధరను రూ.7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది.వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.. స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ ZXi+ వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో 1.2 లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్ ఉంది. అయితే ధర మాత్రం జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ కంటే రూ. 86,000 ఎక్కువ.వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ E20 నుంచి E85 వరకు ఉన్న ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో నడుస్తుంది. అంటే ఇంధనంలో 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ ఉన్నప్పటికీ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇథనాల్ వినియోగం వల్ల పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది. అంతేకాకుండా.. చెరకు వంటి పంటల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌కు డిమాండ్ పెరగడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్లుఅయితే.. ఈ వాహనం ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు కాకుండా కేవలం వాణిజ్య అవసరాల కోసం మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం. కమర్షియల్ విభాగంలో ఇప్పటికే ఉన్న వ్యాగన్ ఆర్ టూర్ H3తో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ఉన్న 1.2 లీటర్ ఇంజిన్ మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. టూర్ H3లో 1.0 లీటర్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.పనితీరు విషయానికి వస్తే.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లో పవర్ లేదా టార్క్ పరంగా ఎటువంటి పెరుగుదల లేదు. ఈ 1.2 లీటర్ ఇంజిన్ గరిష్టంగా 90.9 హార్స్పవర్, 113.7 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. -
భారీగా క్రెడిట్ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్
ప్రపంచ ప్రసిద్ధ పర్సనల్ పైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్ కార్డులపై 1.28 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్గ్రేడ్లు, వివిధ సబ్స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో ఉపయోగించిన “డూడాడ్స్ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సగటు అమెరికన్ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు. -
Income Tax: ‘ఇన్‌కం స్టేట్మెంట్’ ఇలా తయారు చేయండి..
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. అంటే.. వచ్చే నెలాఖరులోపలే. ఈ రోజు నాటికి ఫారం 1,2 అలాగే ఫారం 4 దాఖలు చేయడానికి అన్ని యుటిలిటీలు రెడీగా ఉన్నాయి. రిటర్నులు దాఖలు అవుతున్నాయి. అయితే, 1 గానీ 2 గానీ 4 గానీ ముందుగా మీరు ‘ఇన్‌కం స్టేట్మెంట్’ చేసుకోవాలి. ఈ స్టేట్మెంట్ తయారు చేసుకోవడం చాలా సులువైన పని. ఇంకేం.. రంగంలోకి దూకండి. ఆదాయంపరంగా ఆలోచిస్తే, మీరు మీ ఆదాయం ఏయే ‘సోర్స్’ ద్వారా వస్తుందో ఒక పట్టిక/జాబితా చేయండి. ఉదాహరణకి 🔸 జీతం/వేతనం 🔸 పెన్షన్ 🔸 కొన్ని నెలలు జీతం, మిగతా నెలలు పెన్షన్ 🔸 యాన్యుటీలు 🔸 ప్రతి నెలా వచ్చే ఇంటద్దెలు. మీ సౌలభ్యం కోసం మీరు మీరు అద్దెకిచ్చిన ప్రాపర్టీల జాబితా తయారు చేసుకోండి. క్రమసంఖ్య, ఇంటి నంబరు, ప్లాట్ నంబరు, లొకేషన్, ఊరి పేరు, పట్నం పేరు మొదలైన వివరాలు ఉండాలి. ఈ ప్రాపర్టీలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించి చూడండి. ఓనర్షిప్.. సింగిలా/జాయింటా? వాడుకలో మాది మాది అని అంటాం, ఎప్పుడు కొన్న ప్రాపర్టీ అనేది వివరాలు గుర్తుండవు. అప్పట్లో బ్యాంకర్లు (ఇప్పుడూ అనుకోండి) అప్పు ఎక్కువ రావడానికి మీ జీవిత భాగస్వామిని/కుటుంబ సభ్యులను కో–అప్లికెంటుగా ఇరికిస్తారు లేక మీరే ట్యాక్స్ ప్లానింగ్కని ఇద్దరూ కలిసి జాయింటుగా రాస్తారు. ఇవన్నీ ఓనర్షిప్కి పనికి వస్తాయి. తర్వాత చెల్లించిన మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు, బ్యాంకులు, జమలు, నగదు వసూళ్లు, అద్దెలోకి వస్తాయి. 🔸ప్రతినెల మీ బ్యాంకు ఖాతాలో జమయ్యే వడ్డీలు. 🔸 మీ చేతికి నెల నెలా రాకపోయినా మీ ఎఫ్డీఆర్కి క్రెడిట్ అయ్యేవి, మెచ్యూరిటీ రోజు నాటికి మొత్తం అసలు, వడ్డీ జమ అవుతాయి. కానీ మీరు సంవత్సరానికి వచ్చిన వడ్డీనే తీసుకోవచ్చు. 🔸 జమ అయ్యే వడ్డీలు, అలాగే జమ కానివి, నగదు రూపేణా వచ్చేవి. 🔸 డివిడెండ్లు, బ్యాంకులో జమ అవుతాయి. 🔸 ఇతర ఆదాయాలు 🔸 వ్యవసాయ ఆదాయాలు. బ్యాంకు అకౌంట్ స్టేట్మెంటు/పాస్‌బుక్‌లో ప్రతి జమ, ఎందుకొచి్చందో విశ్లేషించండి. వివరించండి. 🔸 ముందుగా విత్‌డ్రా చేసి, ఖర్చులు పోను, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి.. అది మీ ఆదాయం కాదు. 🔸 మీకు ఎవరైనా అప్పు తీర్చి ఉంటే, ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తే, అది ‘ఆదాయం’ కాదు. కానీ ఇలాంటి వ్యవహారాలు ‘శల్యపరీక్ష’కు గురవుతాయి. 🔸 ఆస్తులు, షేర్లు, సెక్యూరిటీలు, బంగారం, ఆభరణాల్లాంటి విలువైన వస్తువులను అమ్మగా వచి్చన డిపాజిట్లు. వీటి మీద క్యాపిటల్ గెయిన్స్ పడే అవకాశం ఉంది. విశ్లేషణ, వివరణ చేసుకోండి. 🔸 పీఎఫ్ విత్‌డ్రాయల్స్, ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ మొత్తం, ఎన్ఎస్సీల మెచ్యూరిటీ, చిట్‌ఫండ్‌లో చేరి పాట పాడగా వచ్చిన మొత్తం, పూర్తి విశ్లేషణ, సమగ్రంగా వివరణ అవసరం 🔸 మీరు వ్యాపారస్తులైతే ప్రత్యేకంగా అకౌంట్స్ నిర్వహించండి. వ్యాపారపు కరెంటు ఖాతా నుంచి మీ ఎస్బీ అకౌంటుకు చేసిన జమలు.. అవి సొంత వాడకాలా... జీతమా లేక అప్పు తీర్చడమా.. విశ్లేషించుకోండి. 🔸 వీలున్నంత వరకు కరెంటు ఖాతా, మరియు ఎస్బీ అకౌంటును విడివిడిగా నిర్వహిస్తూ, రెండింటి మధ్య వ్యవహారాలు, తక్కువగా ఉండేలా చూసుకోండి. అనివార్యమైతే, సరిగ్గా విశ్లేషణ, వివరణ రెడీగా పెట్టుకోండి. 🔸 ఏ జమ పడినా వివరణ ఉంచుకోండి. చివరిగా, మీ అన్ని బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి. వివరాలు పొందుపర్చండి. జీతం నిమిత్తం 12 జమలు ఉండాలి. తక్కువ, ఎక్కువ అయితే, ఆరా తీయండి. అద్దె జమలు 12 రసీదులకు తగ్గినా, ఎక్కువయినా ఆరా తీయండి. అద్దె విషయంలో అడ్వాన్స్‌లను జాగ్రత్తగా సర్దుబాటు చేయండి. 2026 మార్చి 31 తర్వాత కూడా 2025–26కి సంబంధించిన వ్యవహారాలు జమ కావొచ్చు. అలాగే, ఏప్రిల్ 2025లో 2024–25కి సంబంధించినవి జమ కావొ చ్చు. ఇప్పుడు మీ చేతిలో ‘జమలు’ ఉన్నాయి. వాటి సాయంతో ‘స్టేట్మెంట్’ చేయడానికి ఉపక్రమించండి. -
పీఎఫ్ డబ్బులు రూ.2.5 కోట్లు వెనక్కివ్వాలని నోటీసు..
రిటైర్మెంట్ అనంతరం మెరుగైన జీవనం కోసం ఉద్యోగులు తమ సర్వీసు కాలమంతా పీఎఫ్ సొమ్మును పొదుపు చేసుకుంటారు. పదవీ విరమణ తర్వాత వచ్చే భారీ మొత్తంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగుతుందని భావిస్తారు. అయితే ఇలాగే పొదుపు చేసుకున్న పీఎఫ్ సొమ్మును అందుకున్న ఓ ఉద్యోగిని ఆ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని ఈపీఎఫ్‌వో నోటీసు ఇచ్చింది. దీనికిపై ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లగా ఏం జరిగిందంటే..పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఈపీఎఫ్‌వో (EPFO) కోరడం చట్టబద్ధం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్‌లో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగి ఉంటే, వాటికి బాధ్యత యజమాని సంస్థ లేదా దాని పీఎఫ్ ట్రస్ట్‌దేనని, ఉద్యోగిదికాదని కోర్టు తేల్చిచెప్పింది.జస్టిస్ నగేష్ భీమాపాక 2025లో దాఖలైన రిట్ పిటిషన్ నెం. 6276పై ఈ తీర్పు ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగి జె.వి. నృపేందర్ రావుకు ఈపీఎఫ్‌వో జారీ చేసిన రికవరీ నోటీసును కోర్టు రద్దు చేసింది. అయితే సదురు కంపెనీపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ఈపీఎఫ్‌వోకు ఇచ్చింది.రూ.2.5 కోట్ల చెల్లింపుతో మొదలైన వివాదంజె.వి. నృపేందర్ రావు పనిచేసిన సంస్థకు సొంత పీఎఫ్ ట్రస్ట్ ఉండేది. ఈ ట్రస్ట్‌కు 1981 నుంచే ‘ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్’ హోదా ఉండేది. అయితే సంస్థ 2023 మార్చి 1 నుంచి ఆ హోదాను సరెండర్ చేసింది. అనంతరం 2023 జూలై 21న రావుకు రూ.2.50 కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించింది. మరో రూ.70 లక్షలు యెస్ బ్యాంక్ బాండ్లలో నిలిచిపోవడంతో తర్వాత చెల్లిస్తామని తెలిపింది.సంస్థ పీఎఫ్ ట్రస్ట్ నిధుల్లో భాగంగా యెస్ బ్యాంక్ బాండ్లలో పెట్టుబడులు పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, సుప్రీంకోర్టు చర్యల కారణంగా ఆ బాండ్లు నిలిచిపోవడంతో కొంత మొత్తం విడుదల కాలేదు. దీంతో ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపులు జరిగాయి.ఈపీఎఫ్‌వో రికవరీ నోటీసుఎగ్జెంప్షన్ హోదా సరెండర్ చేసిన తర్వాత పీఎఫ్ ట్రస్ట్ ఉద్యోగికి నేరుగా చెల్లింపులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఈపీఎఫ్‌వో అభిప్రాయపడింది. ఉద్యోగి అందుకున్న రూ.2.5 కోట్లను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని దీంతో 2025 ఫిబ్రవరి 17న నోటీసు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.కోర్టు ఏమంది?ఈపీఎఫ్ చట్టం ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన సామాజిక భద్రత చట్టమని హైకోర్టు పేర్కొంది. ఎగ్జెంప్షన్ సరెండర్ తర్వాత పీఎఫ్ నిధులను ఈపీఎఫ్‌వోకు బదిలీ చేసే బాధ్యత పూర్తిగా యజమాన్య సంస్థ, దాని ట్రస్ట్‌పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగి తనకు చట్టబద్ధంగా రావలసిన మొత్తాన్ని స్వీకరించినందుకు అతనిపై రికవరీ చర్యలు తీసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.అంతేకాకుండా ఉద్యోగిపై మోసం, తప్పుడు సమాచారం లేదా కుమ్మక్కు ఆరోపణలు ఏవీ లేవని కోర్టు గమనించింది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి నుంచి డబ్బు వసూలు చేయడానికి చట్టంలో స్పష్టమైన నిబంధన లేదని పేర్కొంది. రికవరీ నోటీసు జారీ చేసే ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వకపోవడం, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈపీఎఫ్‌వో జారీ చేసిన నోటీసును రద్దు చేసింది.అయితే పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందా? లేదా? అన్న అంశంపై హైకోర్టు ఎలాంటి తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అవసరమైతే ఈపీఎఫ్ చట్టం ప్రకారం సంస్థ లేదా దాని ట్రస్ట్‌పై తగిన చర్యలు తీసుకోవచ్చని ఈపీఎఫ్‌వోకు స్వేచ్ఛ ఇచ్చింది.సొంత పీఎఫ్ ట్రస్ట్ అంటే ఏమిటి?సాధారణంగా ఉద్యోగుల పీఎఫ్ చందాలు నేరుగా ఈపీఎఫ్‌వోకు వెళ్తాయి. కానీ కొన్ని సంస్థలు అనుమతి తీసుకుని తమ సొంత పీఎఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాయి. ఉద్యోగుల, యజమాని చందాలను ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంది. -
వెల్డర్‌గా చేరాడు.. జాక్పాట్తో కోటీశ్వరుడిగా..
ఉద్యోగంలో భాగంగా కంపెనీ ఇచ్చిన కొన్ని షేర్లు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని చెప్పే ఉదాహరణలు కార్పొరేట్ ప్రపంచంలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. తాజాగా అమెరికాలో అలాంటి కథే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు గంటకు 28 డాలర్ల వేతనంతో పనిచేసిన స్పేస్ఎక్స్ మాజీ వెల్డర్ జువాన్ హెర్నాండెజ్.. కంపెనీ ఇచ్చిన సుమారు 10,000 డాలర్ల (దాదాపు ₹9.5 లక్షలు) స్టాక్ గ్రాంట్ కారణంగా ఇప్పుడు దాదాపు 1.1 మిలియన్ డాలర్ల (సుమారు ₹10 కోట్లు) సంపదకు యజమానిగా మారాడు.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్ ఎక్స్’ ఇటీవల చరిత్రాత్మక ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ ఐపీఓకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. సంస్థ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రోజే గణనీయంగా పెరగడంతో ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల వద్ద ఉన్న షేర్ల విలువలు అమాంతం ఎగబాకాయి. దీంతో, కొందరి పంట పండినట్టు అయ్యింది.సాధారణ ఉద్యోగమే అనుకున్నా..మెక్సికోకు చెందిన జువాన్ హెర్నాండెజ్ 2015లో స్పేస్ఎక్స్లో వెల్డర్‌గా చేరాడు. అప్పట్లో అతను గంటకు 28 డాలర్ల వేతనం పొందేవాడు. స్పేస్ఎక్స్ భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటిగా ఎదుగుతుందని తాను ఊహించలేదని జువాన్ మీడియాకు తెలిపాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత కంపెనీ ఇతర ఉద్యోగుల మాదిరిగానే అతనికి కూడా స్టాక్ ఆప్షన్లు, షేర్ గ్రాంట్లు ఇచ్చింది. అయితే, ఆ సమయంలో వాటి విలువ కేవలం 10,000 డాలర్ల వరకే ఉండేది. సాధారణంగా చాలామంది ఉద్యోగులు చేసేలా వాటిని పట్టించుకోకుండా ఉంచేశానని ఆయన చెప్పారు.From $28/hr welder to MILLIONAIRE thanks to SpaceX! 😳Mexican immigrant Juan Hernandez joined in 2015 knowing NOTHING about the company. Got $10k in stock as a full-time worker... now his shares are worth over $1M after the IPO! 💰 pic.twitter.com/37Y0IyAJwy— Arthur🇳🇬🇬🇧🇸🇳 (@AjMachalaa) June 14, 2026పదేళ్లలో మారిన పరిస్థితి..గత పదేళ్లలో స్పేస్ఎక్స్ అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలు సాధించింది. పునర్వినియోగ రాకెట్లు, ఉపగ్రహ ప్రయోగాలు, స్టార్‌షిప్ ప్రాజెక్టు, స్టార్‌లింక్ సేవలు వంటి కార్యక్రమాలతో సంస్థ విలువ వేగంగా పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. తాజాగా జరిగిన ఐపీఓలో పెట్టుబడిదారుల నుంచి అపూర్వ స్పందన రావడంతో షేర్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో జువాన్ వద్ద ఉన్న వేలాది షేర్ల విలువ ఒక్కసారిగా 1 మిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది.వెల్డర్ నుంచి కోటీశ్వరుడిగా..స్పేస్ఎక్స్లో వెల్డర్‌గా ప్రారంభమైన జువాన్ కెరీర్ తర్వాత సూపర్వైజర్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆయన మరో ఏరోస్పేస్ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ, స్పేస్ఎక్స్లో సంపాదించిన షేర్లే అతనికి జీవితకాల ఆర్థిక భద్రతను కల్పించాయి. ఈ సంపద వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం మానేయాలనే ఆలోచన లేదని జువాన్ పేర్కొన్నాడు. డబ్బు వచ్చినంత మాత్రాన జీవితం మారిపోదని, కష్టపడి పనిచేయడం కొనసాగిస్తానని చెప్పాడు. తన పిల్లలకు పెట్టుబడులు, పొదుపు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విలువను నేర్పించాలనుకుంటున్నానని వెల్లడించాడు.వేలాది మంది ఉద్యోగులకు జాక్పాట్జువాన్ ఒక్కరే కాదు. స్పేస్ఎక్స్ ఐపీఓ వల్ల వేలాది మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు భారీగా లాభపడ్డారని అంచనా. నివేదికల ప్రకారం.. 4,000 మందికిపైగా ఉద్యోగులు మిలియనీర్లుగా మారినట్లు తెలుస్తోంది. వెల్డర్లు, మెకానిక్‌లు, టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు వంటి వివిధ స్థాయిల ఉద్యోగులు కంపెనీ షేర్ల ద్వారా గణనీయమైన సంపదను సొంతం చేసుకున్నారు. -
అమాంతం దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు (Today Gold Rate) అమాంతం దూసుకెళ్లాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ భారం తప్పలేదు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు ఒక్కసారిగా ఎగిశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ అమాంతం ఎగిశాయి. ఉదయం 9:41 గంటల సమయానికి నిఫ్టీ 326.10 పాయింట్లు లేదా 1.38 శాతం పెరిగి 23,949.00 వద్ద, సెన్సెక్స్ 1,063.64 పాయింట్లు లేదా 1.41 శాతం పెరిగి 76,591.59 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో నాలుగు నెలల పాటు జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి వాషింగ్టన్, టెహ్రాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా, ఇరాన్ రెండూ అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లో బ్రెంట్ క్రూడ్ జూన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 3.5 శాతం తగ్గి బ్యారెల్ కు 83.79 డాలర్లుగా ఉంది. యూఎస్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కీలకమైన ఇంధన సరఫరా జలమార్గం హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నందున పెట్టుబడిదారుల ఆందోళలు సడలాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.4 శాతం, 1.7 శాతం పెరిగాయి.సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హోండా కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ .2.15 లక్షలు డిస్కౌంట్!
దేశీయ కార్ల మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా జూన్ నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎస్యూవీ, సెడాన్ విభాగాల్లో అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కంపెనీ తన ప్రముఖ మోడళ్లైన ఎలివేట్, అమేజ్, సిటీ కార్లపై భారీ తగ్గింపులు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్లు, పొడిగించిన వారంటీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ వెల్లడించింది. అయితే నగరం, డీలర్షిప్, స్టాక్ లభ్యత ఆధారంగా ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది.ఎక్కువ తగ్గింపు ఎలివేట్కే..హోండా లైనప్‌లో ఈ నెల అత్యధిక ప్రయోజనాలు ఎలివేట్ ఎస్‌యూవీపై అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్ఎక్స్ ఎంటీ, జెడ్ఎక్స్ సీవీటీ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలు, 360 డిగ్రీ కెమెరా, ప్రీమియం డ్యాష్‌క్యామ్ వంటి యాక్సెసరీ ప్యాకేజీలను కూడా కంపెనీ అందిస్తోంది. మిడ్ వేరియంట్లైన వి అపెక్స్, వీఎక్స్ మోడళ్లపై కూడా రూ.1.5 లక్షలకు పైగా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎలివేట్ హోండాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలుస్తోంది.కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్‌పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొత్త తరం అమేజ్ జెడ్ఎక్స్ ఎంటీ వేరియంట్‌పై రూ.67,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, వీఎక్స్, వి వేరియంట్లపై వరుసగా రూ.48,000, రూ.28,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఎంపిక చేసిన వేరియంట్లకు ఆమోదిత సీఎన్జీ కిట్ అమర్చించుకునే వినియోగదారులకు రూ.20,000 వరకు రీయింబర్స్‌మెంట్‌ను హోండా కొనసాగిస్తోంది.ప్రీమియం సెడాన్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు హోండా సిటీపై కూడా భారీ తగ్గింపులు ప్రకటించింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ సిటీ పెట్రోల్ వేరియంట్లపై రూ.1.56 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, సిటీ e:HEV హైబ్రిడ్ మోడల్ MY25 స్టాక్‌పై గరిష్ఠంగా రూ.1.97 లక్షల వరకు తగ్గింపులు అందిస్తున్నట్లు సమాచారం. తాజా ఫేస్‌లిఫ్ట్ సిటీ మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో పాత స్టాక్ క్లియరెన్స్ కోసం ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న వేళ, హోండా ఆఫర్లు వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇప్పటికే టాటా మోటర్స్, హ్యూందాయ్ వంటి కంపెనీలు కూడా భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్యూవీ లేదా ప్రీమియం సెడాన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల మంచి అవకాశంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి
ఒకప్పుడు భారతీయ మహిళల ఆర్థిక ప్రపంచం.. బంగారు నగలు,పోస్టాఫీస్ సేవింగ్స్, చిట్ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వరకే పరిమితమై ఉండేది. కుటుంబ భవిష్యత్తు కోసం భాగస్వామితో కలిసి అంతో ఇంతో పొదుపు చేసేవారు, సంపద పెంచాలి, పెంచుకోవాలి అనే తపన తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దృశ్యం పూర్తిగా మారుతోంది. భర్త సంపాదించి ఇచ్చినా, తాను స్వయంగా కష్టపడి సంపాదించినా వచ్చే ప్రతి రూపాయిలో రిటైర్మెంట్ కలలు, విదేశీ యాత్రల లక్ష్యాలు, ఆర్థిక స్వాతంత్య్రఆశయాలు కూడా చేరుతున్నాయి. భారత మహిళలు సేవింగ్స్ నుంచి ఇన్వెస్టింగ్‌కి మారడం లేదు... సేవింగ్స్‌కే కొత్త అర్థం చెబుతున్నారు. – సాక్షి, వెల్త్ డెస్క్అమ్మమ్మ తరం బంగారం దాచింది. అమ్మ తరం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసింది.ఇప్పుడు కూతురు తరం షేర్లు, ఈక్విటీలు, సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్)లలో పెట్టుబడులు పెడుతోంది. మూడు తరాలు... మూడు ఆర్థిక తత్వాలు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే ... భవిష్యత్తు భద్రత. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే కొత్త తరం మహిళలు డబ్బును కేవలం దాచడం కాదు... దాచిన దానితో తిరిగి డబ్బు సంపాదించడం కూడా నేర్చుకుంటున్నారు. అందుకే భారత మహిళల చేతుల్లో ఇప్పుడు కేవలం నగల పెట్టెలు కాదు, మొబైల్ ఫోన్లలో మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలు కూడా కనిపిస్తున్నాయి. మహిళలు కేవలం పొదుపుదారులుగానే కాకుండా, సమర్థవంతమైన ఇన్వెస్టర్లుగా ఎదుగుతున్నారు. సంప్రదాయ బంగారంతో పాటు మ్యూచువల్ ఫండ్లు,సిప్‌లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు, రిటైర్మెంట్ కార్పస్ నిర్మాణం దిశగా దూసుకెళ్తున్నారు.ఈ మార్పు కేవలం వ్యక్తిగత పెట్టుబడి ధోరణి కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని తిరిగి నిర్వచిస్తున్న నిశ్శబ్ద విప్లవం.సంఖ్యల్లో మహిళల ఆర్థిక దూకుడు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వెలువరించిన గణాంకాలు మహిళల భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. 🔸 దేశీ పెట్టుబడుల్లో మహిళా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల వాటా 25 శాతం దాటింది. 🔸 వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో వాటా 33 శాతం పైగా ఉంది. 🔸 మహిళల నిర్వహణలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ.11.3 లక్షల కోట్లు 🔸 మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోలలో వాటా 35 శాతం 🔸 35 ఏళ్లలోపు పెట్టుబడులు ప్రారంభించిన మహిళలు 80శాతం ఈ గణాంకాలు ఒక కీలక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.నేటి తరం మహిళలు ఇప్పుడు కేవలం డబ్బు దాచడం కాదు... డబ్బుతో పని చేయించడం నేర్చుకుంటున్నారు.బంగారం నుంచి సిప్ లకు కాదు... బంగారంతో పాటు సిప్‌లకు మహిళలు బంగారాన్ని కొనడం పూర్తిగా మానేశారా అంటే లేదనే చెప్పాలి. వాస్తవానికి వారు సంప్రదాయ పెట్టుబడులను ఆధునిక ఆరి్ధక సాధనాలతో కలిపి సరికొత్త సమతుల్య పోర్ట్‌ఫోలియోలను నిర్మిస్తున్నారు. బంగారం అంతో ఇంతో తరచూ కొనడం ఇప్పటికీ వారికి కుటుంబ సంప్రదాయమే. ఆనందం కలిగించే విషయమే. బంగారం అత్యవసర సమయాల్లో లిక్విడిటీ అందిస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు, అనారోగ్య పరమైన ఖర్చుల విషయంలో భద్రతనిస్తుంది. అయితే దీర్ఘకాలిక సంపద పెరగాలంటే కాంపౌండింగ్ శక్తి అవసరమని కొత్త తరం మహిళలు గ్రహిస్తున్నారు. అందుకే ప్రతి నెలా సిప్ల రూపంలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెడుతున్నారు.నేటి మహిళల కొత్త పెట్టుబడి సూత్రం..భద్రతకు బంగారం... సంపదకు సిప్ అనే మార్పునకు మూడు కారణాలున్నాయి.🔸 పెరిగిన ఆదాయాలు. కుటుంబంలో పెరుగుతున్న నిర్ణయాధికారం. ఐటీ, బ్యాంకింగ్, ఆతిథ్యం, ఆరోగ్యరంగం, కార్పొరేట్ సేవలు, స్టార్టప్‌లు, ఫ్రీలాన్సింగ్ రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కుటుంబ ఆదాయం పెరుగుతోంది. మహిళలు కూడా కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి లేదా భర్త తీసుకునే పెట్టుబడి నిర్ణయాలను ఇప్పుడు మహిళలే చొరవచూపి స్వయంగా తీసుకుంటున్నారు.🔸 డిజిటల్ విప్లవం షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు బ్రోకర్లు,బ్యాంక్ శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక దరఖాస్తు ఫారాలు నింపాల్సి ఉండేది.నేడు స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంకుఖాతా, ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ ద్వారా డీమ్యాట్ అకౌంట్లు తెరిచే అవకాశం పెరిగింది. కేవలం పది నిమిషాల్లో సిప్ ఖాతాలు ప్రారంభించగలుగుతున్నారు. ఈ సాంకేతిక విప్లవమే లక్షలాది మహిళలను ఆర్థిక మార్కెట్లకు దగ్గర చేసింది.🔸 లక్ష్యాల కోసం పెట్టుబడులు గత తరాలు పిల్లల చదువు,పెళ్లిళ్ల అవసరాల కోసం మాత్రమే పొదుపు గురించి ఆలోచించేవి. కానీ నేటి ఆధునిక తరం మహిళలు మాత్రం వ్యక్తిగత రిటైర్మెంట్, విదేశీ విహార యాత్రలు, సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఎమెర్జన్సీ అవసరాలకు ఇలా అనేక ప్రత్యేక లక్ష్యాలతో పెట్టుబడుల వైపు దూసుకెళుతున్నారు.మెరుగైన ఇన్వెస్టర్లుగా మహిళలు?గణాంకాలను పరిశీలిస్తే పెట్టుబడుల ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన వాస్తవం వెలుగులోకి వస్తోంది. పురుషుల్లాగా మహిళలు వెంటవెంటనే కొనుగోలుఅమ్మకాలు జరపడంలేదు. ఏదో కారణంతో తరచూ పడిపోయే స్టాక్ మార్కెట్లో భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలేదు. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కొనసాగుతున్నారు.మహిళా ఇన్వెస్టర్ల ప్రత్యేకత🔸 సిప్‌లను నిరంతరంగా కొనసాగించడం 🔸 దీర్ఘకాలిక దృష్టి 🔸 తక్కువ రిస్‌్కతో సమతుల్య పెట్టుబడులు 🔸 భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండటం 🔸 లక్ష్యంతో పెట్టుబడి ప్రణాళికలు వేయడం ఈ కారణాల వల్ల మహిళల పోర్ట్‌ఫోలియోలు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.చిన్న పట్టణాల్లోనూ పెద్ద మార్పుమహిళల పెట్టుబడుల విప్లవం కేవలం దేశంలోని మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి టైర్2 (ద్వితీయ శ్రేణి) , టైర్3 తృతీయ శ్రేణి నగరాల్లో కూడా మహిళలు భారీగా సిప్ పెట్టుబడులు ప్రారంభిస్తున్నారు.ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచి్చన ఫైనాన్షియల్ కంటెంట్, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ఫిన్‌టెక్ యాప్‌లు కూడా ఈ పెట్టుబడి విప్లవానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.ఆర్థిక స్వాతంత్య్రం అంటే జీతం కాదు... ఆస్తులుఆర్థిక స్వాతంత్య్రమంటే జీతం సంపాదించడం మాత్రమే కాదు.దాన్ని సంపదగా మార్చడమని నేటి మహిళలు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఆమె దృష్టిలో నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే 🔸 తన పేరుమీద ఆస్తులు ఉండటం ళీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం 🔸 తన రిటైర్మెంట్ కోసం ప్రత్యేక కార్పస్ నిర్మించుకోవడం 🔸 జీవితంలోని అనిశ్చిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం 🔸 ప్రతి మహిళ పర్సనల్ ఫైనాన్స్ చెక్‌లిస్ట్ తయారుచేసుకోవాలితనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి 🔸 నా పేరుమీద పెట్టుబడులు ఉన్నాయా? 🔸 బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లకు మించి ఈక్విటీ లు, మ్యూచువల్ ఫండ్సులో ఇన్వెస్ట్చేస్తున్నానా? 🔸 రిటైర్మెంట్కు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఉందా? 🔸 ప్రతి ఏడాది సిప్ మొత్తాన్ని పెంచుతున్నానా? 🔸 ఏదైనా కారణంతో ఒక సంవత్సరం ఆదాయం ఆగిపోతే ఆర్థికంగా నిలబడగలనా? చివరగా... భారత మహిళలు బంగారాన్ని వదిలేయడం లేదు. కానీ బంగారం ఒక్కటే భవిష్యత్తు కాదని అర్థం చేసుకుంటున్నారు. భద్రత కోసం బంగారం, స్థిరత్వం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్లు అనే సమతుల్య పెట్టుబడి విధానాన్ని అవలంబిస్తున్నారు. నేటి మహిళల పెట్టుబడి నిర్ణయాలు రేపటి భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేయబోతున్నాయి. కుటుంబ పొదుపులను సంపదగా, సంపదను ఆర్థిక స్వాతంత్య్రంగా మార్చుతున్న ఈ నిశ్శబ్ద విప్లవమే రాబోయే దశాబ్దంలో భారత వృద్ధికి కొత్త ఇంధనంగా మారనుంది. ఇంటి బడ్జెట్‌ను చూసుకునే మహిళ.. ఇప్పుడు దేశ సంపద నిర్మాణంలోనూ కీలక భాగస్వామి అవుతోంది. -
ఫెడ్ సమీక్షే మార్కెట్‌కు దిక్సూచి
పలు దేశ, విదేశీ గణాంకాలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. యూఎస్, ఇరాన్ మధ్య డీల్పైనా భారీ అంచనాలున్నాయి. వెరసి ఈ అంశాల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య ఒప్పందం కోసం ప్రపంచవ్యాప్తంగా అటు ఇన్వెస్టర్లు, ఇటు ఆర్థికవేత్తలు ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా పలు అంశాలలో అనిశ్చితికి కారణమవుతున్న పశి్చమాసియా యుద్ధం ముగింపుపై గత వారాంతాన ఆశలు చెలరేగాయి. యుద్ధం ముగిసే ఒప్పందం కుదరనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో గత వారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కె ట్లు జోరందుకున్నాయి. హార్ముజ్, న్యూక్లియర్ అంశాలు ఒక కొలిక్కి వచ్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం ఇరాన్, యూఎస్ మధ్య కుదిరే వీలున్న శాంతి ఒప్పందానికి విశ్వవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలిపారు. ద్రవ్యోల్బణంపై ఫోకస్ నేడు(సోమవారం) దేశీయంగా మే నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ ఏకంగా 3.88 శాతం నుంచి 8.3 శాతానికి ఎగసింది. ఇది 42 నెలల గరిష్టంకాగా.. పశి్చమాసియా సంక్షోభం ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. గత వారం విడుదలైన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) సైతం ఆహార ధరల కారణంగా 3.93 శాతానికి పెరిగింది. ఇవి ఆర్బీఐ పరపతి విధానాలను ప్రభావం చేయగలవని ఆర్థికవేత్తలు తెలియజేశారు. మే నెలకు రేపు(16న) వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 28.4 బిలియన్ డాలర్లకు చేరింది. యథాతథంగా 5.25 శాతం వద్దే రెపో రేటు కొనసాగించిన ఆర్బీఐ గత వారం పాలసీ వివరాలు(మినిట్స్) వారాంతాన(19న) వెల్లడి కానున్నాయి. విదేశీ అంశాలు మే నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలను మించుతూ 1,72,000గా నమోదైంది. దీంతో నిరుద్యోగ రేటు 4.3% వద్దే ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ రేట్ల స్టేటస్ కో నిర్ణయాలను సమరి్థస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. గత పాలసీ సమావేశంలో ఫెడ్ 3.5–3.75% వద్ద ఫండ్స్ రేట్లను నిలిపి ఉంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం(17న) ఫెడ్ పరపతి సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి.సాంకేతికంగా చూస్తే.. గత వారం ప్రధాన ఇండెక్సులు బలాన్ని పుంజుకోవడం ద్వారా పరిమిత కన్సాలిడేషన్ నుంచి సాంకేతికంగా బయటపడ్డాయి. దీంతో ఈ వారం నిఫ్టీ వెనువెంటనే 23,800 పాయింట్లను తాకవచ్చు. ఈ స్థాయిలో ఎదురయ్యే రెసిస్టెన్స్‌ని అధిగమిస్తే 24,000–24,200వరకూ పుంజుకునే వీలుంది. మరోపక్క 23,450– 23,350 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించవచ్చు.గత వారమిలా ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,285 పాయింట్లు(1.75 శాతం) ఎగసి 75,528 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 256 పాయింట్లు(1.1 శాతం) పుంజుకుని 23,623 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.3% నీరసించగా.. , స్మాల్ క్యాప్ 0.2% లాభపడింది.ఎఫ్‌పీఐ అమ్మకాల స్పీడ్ ఈ నెల 15 రోజుల్లో రూ. 62,853 కోట్లు దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెల తొలి రెండు వారాల్లో రూ. 62,853 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. పశి్చమాసియా సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, డాలరుతో మారకంలో రూపాయి క్షీణత తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్ఎస్డీఎల్ వివరాల ప్రకారం దేశీ స్టాక్స్ నుంచి ఎఫ్‌పీఐలు 2026లో ఇప్పటివరకూ రూ. 2.87 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. తద్వారా 2025 కేలండర్ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను దాటేశాయి. 2026లో ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తూ వస్తున్నారు. -
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అన్మోల్ అక్షయ ప్లాన్
ముంబై: జీవిత బీమా రక్షణతోపాటు, భవిష్యత్ లక్ష్యాల కోసం పొదుపు ప్రయోజనాలతో ‘ఏబీఎస్ఎల్ఐ అన్మోల్ అక్షయ’ ప్లాన్‌ను ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఏబీఎస్ఎల్ఐ) ప్రారంభించింది. తమ పిల్లల విద్యావసరాలకు ఉపయోగపడే విధంగా జీవితంలోని వివిధ దశల్లో చెల్లింపులు చేసే ‘మై చైల్డ్’ను ఎంపిక చేసుకోవచ్చు.కుమార్తె వివాహం, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్ తదితర జీవిత లక్ష్యాలకు సంబంధించి మధ్య, దీర్ఘకాలంలో కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు వీలుగా ‘మై సేవింగ్స్’ ఆప్షన్ కూడా ఈ ప్లాన్‌లో ఉంది. మహిళా పాలసీదారులకు ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ‘హర్ బెనిఫిట్స్’ కింద.. భవిష్యత్తు లక్ష్యాలకు పొదుపు చేసుకోవచ్చు. డాక్టర్ కన్సల్టేషన్లు, ఆరోగ్యంపై కోచింగ్, రెండో మెడికల్ (డాక్టర్) ఒపీనియన్ తదితర సేవలను పొందొచ్చు.తమ అవసరాలకు అనుగుణంగా బీమా కవరేజీని పెంచుకునే ‘ఎక్స్టెండెడ్ లైఫ్ కవర్ (ఈఎల్స్)’ను కావాల్సిన వారు ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా 75 లేదా 85 ఏళ్ల వరకు బీమా రక్షణ కొనసాగుతుంది. ఒకవేళ పాలసీదారుడు కాల వ్యవధిలోపు మరణించినట్టయితే, ఒకే విడత పరిహారం అందించి.. మెచ్యూరిటీ అయిన తర్వాత మిగిలిన పాలసీ ప్రయోజనాలు అందించే ఆప్షన్ కూడా ఉంది. -
మెరుస్తూనే ఉంటాయి... కానీ!
సాక్షి, వెల్త్: ఈక్విటీలు, బంగారం, వెండి.. ఏ అసెట్ ర్యాలీ చేస్తున్నా ఇన్వెస్టర్లకు సందడే. స్టాక్స్ ర్యాలీలో బుల్స్ వెంట పరుగులు తీస్తారు. అనిశ్చితులు, సంక్షోభాలతో ఈక్విటీలు బేల చూపులు చూస్తుంటే.. బంగారం, వెండిని ఎత్తుకుంటారు. ఏ ర్యాలీ అయినా రివర్స్ గేర్ తీసుకుంటే మాత్రం కంగారు పడిపోతుంటారు. 2020లో కరోనా విపత్తు, 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, 2025లో ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్ష బాధ్యతల అనంతరం ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాల యుద్ధాన్ని ప్రకటించడం, 2026లో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం.. ఈ అనిశ్చితి, అయోమయ పరిస్థితులతో రెండేళ్లుగా పసిడి, వెండి జిగేల్మన్నాయి.ఏ దశలో పెట్టుబడి పెట్టినా ఇన్వెస్టర్లకు కాసులు కురిపించాయి. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి బంగారం 25 శాతం, వెండి 45 శాతం వరకు పతనమయ్యాయి. ఎందుకని? ఎందుకంటే యుద్ధాలు, సంక్షోభాలు, ధరల మంటలు, ఆర్థిక మాంద్యాలు వంటి సందర్భాల్లో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు (హెడ్జింగ్ కోసం) ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి కొంత పెట్టుబడులను పసిడి, వెండిలోకి మళ్లిస్తారు.సంక్షోభం కుదుటపడుతోందని సంకేతాలొచ్చినా... లేదా అప్పటికే భారీగా పెరిగి ఉన్నా కొంత విక్రయించి లాభాలు స్వీకరిద్దామన్న ధోరణి నెలకొన్నా.. పసిడి, వెండి రివర్స్ గేర్ తీసుకుంటాయి. 2026 జనవరిలో జీవితకాల గరిష్ట స్థాయికి చేరాక పసిడి, వెండిలో కనిపించిన దిద్దుబాటు ఒక రకంగా ఇలాంటిదే. ఒక్క ఈ నెలలోనే 12 శాతం మేర వీటి ధరలు పతనమయ్యాయి. మరి ఈ కరెక్షన్ బుల్ మార్కెట్ ముగింపు కార్డా? ఇన్వెస్టర్ల ముందున్న మార్గం ఏంటి? ఏం చేయాలిపుడు?ఎందుకు ఈ పతనం?⇒ ఏ ప్రయాణం మధ్యలో అయినా ఎక్కడో ఒక చోట బ్రేక్ తీసుకుంటాం. పసిడి, వెండిలోనూ ఇప్పుడదే చూస్తున్నాం. ⇒ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలతో అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు గత రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లను గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లకు చేరువ చేశాయి. ఇప్పుడు అనిశ్చితి పరిస్థితులు కొంత తెరిపిన పడుతున్నాయి. ⇒ ఇంతకాలం దేశీ ఈక్విటీలు బలహీనంగా కదలాడాయి. ఆకర్షణీయ వేల్యుయేషన్ల వద్ద ఉండడంతో సమీప కాలంలో ఈక్విటీలు ర్యాలీ చేయొచ్చన్న విశ్వాసం పెరుగుతోంది. ⇒ బంగారాన్ని కేవలం విలువను కాపాడే వస్తువుగానే చూస్తుంటారు. అంతేకానీ దీనిపై పెట్టుబడి పెడితే స్థిరమైన ఆదాయమేదీ రాదు. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణంతో గరిష్టాల్లో వడ్డీ రేట్లు ఉండడం, మన దగ్గరా సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితులతో వడ్డీ రాబడినిచ్చే బాండ్లు, డిపాజిట్లు ఇప్పుడు ఆకర్షణీయంగా మారుతున్నాయి. కనుక ఎలాంటి రాబడి లేని పసిడి, వెండి నుంచి పెట్టుబడులు బాండ్లు, ఈక్విటీల వైపు యూటర్న్ తీసుకుంటాయి. ⇒ అంతర్జాతీయంగా పసిడి ధరలు డాలర్‌లోనే ట్రేడవుతుంటాయి. డాలర్ బలపడడం బంగారం, వెండి ధరలపై ఒత్తిడికి దారితీస్తోంది. ⇒ బంగారం, వెండి గత 18– 24 నెలల్లో అసాధారణ రాబడులనిచ్చాయి. ఏదో ఒక దశలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం సహజమే. ఒక విధంగా ఇది పోర్ట్‌ఫోలియోకి మంచిది కూడా. అప్పుడే తాజా పెట్టుబడిదారులకు ధరలు అందుబాటులోకి వస్తాయి. ఏంటి మార్గం..?⇒ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పె ట్టిన వారు ప్రస్తుత దిద్దుబాటును చూసి ఎ లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ⇒ బంగారం, వెండిలో 10–12 శాతం దిద్దుబాటు అసాధారణమేమీ కాదు. చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ర్యాలీ తర్వాత బంగారం, వెండి ర్యాలీ దిద్దుబాటుకు చవిచూశాయి. ⇒ ధరలను చూసి నిర్ణయం తీసుకోవద్దు. అస లు మీ పెట్టుబడి లక్ష్యం ఏంటో తెలుసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించండి. ⇒ కేవలం ధరలు పెరుగుతున్నాయి కదా అని, ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజుల్లో విక్రయించడం ద్వారా లాభాలు సంపాదించొచ్చని అ డుగు పెట్టినట్టయితే.. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వల్పకాలంలో ధరల తీరును ఎవరూ అంచనా వేయలేరు. ⇒ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారు ఒకే విడత కాకుండా, క్రమానుగతంగా, నెలవారీ కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మంచిది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ⇒ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి ప్రస్తుత దిద్దుబాటు అనుకూలం. వెండికి అదనపు అనుకూలత⇒ ఆభరణాలతోపాటు పెట్టుబడికి హెడ్జింగ్ సాధనంగా పసిడికి గుర్తింపు ఎక్కువ. వెండికి పెట్టుబడితోపాటు పరిశ్రమల నుంచి ముడి పదార్థంగానూ బలమైన డిమాండ్ నెలకొంది. ⇒ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్వాహనాలు, సోలార్ ప్యానెళ్లు ఇలా ఎన్నో అత్యాధునిక పరిశ్రమల్లో వెండి అవసరం. ⇒ బంగారంతోపాటు వెండికి సైతం పెట్టుబడుల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కానీ పసిడితో పోలి్చతే వెండిలో అస్థిరతలు ఎక్కువన్నది గుర్తు పెట్టుకోవాలి. కథ ముగిసినట్టేనా?బంగారం కథ ఇంతటితో సమాప్తం అని అనుకోవడానికి లేదు. ⇒ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు తమ రిజర్వ్ అసెట్స్‌లో బంగారానికీ పెద్ద పీట వేస్తున్నాయి. గతంలో యూఎస్ డాలర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు డాలర్ వెయిటేజీ తగ్గించి, గోల్డ్‌కు వెయిటేజీని పెంచడం ద్వారా వైవిధ్యంపై దృష్టి పెట్టాయి. ⇒ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల అప్పుల భారం గరిష్ట స్థాయిల్లోనే ఉంది. ⇒ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఇక ముందు పెరగవని, మళ్లీ ఏర్పడవని కూడా చెప్పలేం. ⇒ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ కనుక స్వల్పకాలంలో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా.. దీర్ఘకాలానికి పెట్టుబడుల పరంగా వాటి ప్రాధాన్యంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎంత కేటాయించొచ్చు?⇒ రిటైల్ ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పెట్టుబడుల కేటాయింపుల్లో పసిడికి 10–15 శాతం కేటాయించుకోవచ్చు. పెట్టుబడి పరంగా వెండి కంటే పసిడిలో స్థిరత్వం ఎక్కువ. చారిత్రకంగా చూస్తే బంగారం కంటే ఈక్విటీలే అధిక రాబడినిచ్చాయి. రూ.10 లక్షల మోడల్ పోర్ట్‌ఫోలియో వేటికి ఎంత చోటు అసెట్ క్లాస్ కేటాయింపులు (రూ.లలో) ఈక్విటీలు - 6,00,000 డెట్‌ఫండ్స్/ఎఫ్డీలు/ బాండ్లు తదితర స్థిరదాయ సాధనాలు - 2,00,000 బంగారం - 1,00,000 వెండి - 50,000 నగదు/లిక్విడ్ ఫండ్స్ - 50,000ఒక్కటి గుర్తు పెట్టుకోండిప్రస్తుత దిద్దుబాటు విలువైన లోహాల ర్యాలీ లో కేవలం విరామమే. ర్యాలీ వెంట పరుగెత్తడం, పతనంలో ఆందోళన చెందడానికి దూరంగా ఉండాలి. బంగారం ఇన్వెస్టర్లను రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతులను చేసేయదు. ఇతర పెట్టుబడి సాధనాల్లో అల్లకల్లలాలు నెలకొన్నప్పుడు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్నిచ్చి, కొనుగోలు శక్తిని కాపాడే సాధనం. తాత్కాలిక దిద్దుబాట్లను సహనంతో ఎదుర్కొన్న వారికే విలువైన లోహాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని చరిత్ర చెబుతోంది.పడుట పెరుగుట కొరకే⇒ బంగారం, వెండిలో దిద్దుబాట్లు ఎన్నో సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రతీ దిద్దుబాటు అనంతరం తిరిగి పుంజుకున్నాయి. ⇒ అందుకే ఈక్విటీలు, పసిడిని దీర్ఘకాల పెట్టుబడి ఆస్తులుగానే చూడాలి. ⇒ స్వల్పకాల అవసరాల కోసం ఉద్దేశించిన వాటిని స్థిరాదాయ పథకాలకే కేటాయించుకోవాలి. ⇒ పోర్ట్‌ఫోలియోకి బీమాగా బంగారం, వెండినిచూడొచ్చు. ఇవీ... వాస్తవాలుబంగారం వెండి 10–20శాతం 20–30శాతం కరెక్షన్లు సాధారణం కరెక్షన్లు సాధారణం 25–35శాతం 40–60శాతం కరెక్షన్లు అరుదు కరెక్షన్లు అరుదు -
పేటెంట్లలో టాప్‌కి దూసుకెళ్లిన జియో ప్లాట్ఫార్మ్స్
ముంబై: భారతీయ టెక్నాలజీ రంగానికి మరో కీలక మైలురాయిగా, రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) 2025 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20 ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. గ్లోబల్ టాప్-20లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ టెక్నాలజీ సంస్థగా జియో నిలిచింది. 2025లో జియో ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.జియో పేటెంట్ పోర్ట్‌ఫోలియో ప్రధానంగా 5G, 6G, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్-నేటివ్ ప్లాట్ఫార్మ్స్, ఎడ్జ్ ఇంటెలిజెన్స్, నెట్వర్క్ స్లైసింగ్ వంటి భవిష్యత్ డిజిటల్ సాంకేతికతలపై కేంద్రీకృతమైంది. సంస్థ ఇప్పటివరకు మొత్తం 6,817 పేటెంట్లను దాఖలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 1,009 పేటెంట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌కు మంజూరయ్యాయి. మార్చి 31, 2026 నాటికి భారత్‌లో 538, విదేశాల్లో 471 పేటెంట్లు జియోకు లభించాయి.ఈ సందర్భంగా జియో ప్లాట్ఫార్మ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) మాట్లాడుతూ, భారత్‌ను సాంకేతికతను సృష్టించే, ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా PCT దాఖలాలు 2025లో కేవలం 0.7% మాత్రమే పెరిగినప్పటికీ జియో టాప్-20లోకి ప్రవేశించడం విశేషమని డబ్ల్యూఐపీవో వెల్లడించింది. హువావే, శాంసంగ్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజాల సరసన జియో చేరడం భారత డీప్‌టెక్ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. -
టూవీలర్లు.. ఆన్లైన్లోనే కొనేస్తున్నారు!
భారతదేశంలో టూవీలర్ కొనడమంటే.. అదో పెద్ద కార్యక్రమం. ఇంకా చెప్పాలంటే ఓ వేడుక లాంటిది. ఓ మంచి రోజు చూసి కుటుంబ సభ్యులంతా షోరూంకి వెళ్లి పదుల సంఖ్యలో వాహనాలను పరిశీలించి, రంగులు, హంగులూ అన్నీ చూసి ఓ బండిని కొనుక్కుంటారు. దీనికి ఓ పూటంతా పడుతుందంటే ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడంతా మారిపోయింది. బట్టలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొంటున్నట్టుగా టూవీలర్లను కూడా ఆన్లైన్లో కొనేవాళ్లు ఎక్కవయ్యారు.ఆన్లైన్ టూవీలర్ అమ్మకాలు రెట్టింపుఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, తమ వేదికపై ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగాయి. ముఖ్యంగా మెట్రో నగరాల కంటే టయర్-2, టయర్-3 పట్టణాల నుంచే ఎక్కువ డిమాండ్ నమోదవుతోంది. కంపెనీ ప్రకారం, ప్రతి ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు చిన్న నగరాలు, పట్టణాల నుంచే వస్తున్నారు.ఎలక్ట్రిక్, ప్రీమియం బైక్‌లకు భారీ డిమాండ్రోజువారీ ప్రయాణాల కోసం కమ్యూటర్ బైక్‌లతో పాటు ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో 20కిపైగా బ్రాండ్లకు చెందిన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ట్రయంఫ్, కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో ఆన్లైన్ కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి.తెలుగు నగరాల్లో బుకింగ్స్ జోరుదక్షిణ భారతదేశంలో కాకినాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ద్విచక్ర వాహన బుకింగ్స్ 12 రెట్లు పెరిగినట్లు అమెజాన్ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని నాగౌర్, జింద్, అలాగే పశ్చిమ ప్రాంతంలోని రాజ్‌కోట్, జామ్‌నగర్ వంటి నగరాల్లో కూడా బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి. చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులు, ఇంటర్నెట్ విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.తొలిసారి ఆన్లైన్లో కొనేవాళ్లూ ఎక్కువే..గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా టయర్-3 పట్టణాలకు చెందిన 2,300కు పైగా వినియోగదారులు అమెజాన్ ద్వారా తొలిసారిగా టూవీలర్ కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. షోరూంకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ధరలు పోల్చుకోవడం, ఫైనాన్స్ ఆప్షన్లు చూడటం, డిజిటల్ పేమెంట్లతో బుకింగ్ చేయడం వినియోగదారులను ఆకర్షిస్తోంది.భారత టూవీలర్ మార్కెట్లో కొత్త ధోరణిదేశీయ టూవీలర్ మార్కెట్లో కూడా ప్రీమియం, ఎలక్ట్రిక్ వాహనాల వాటా క్రమంగా పెరుగుతోంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం, 2025లో భారత టూవీలర్ విక్రయాలు రెండు కోట్ల యూనిట్లను దాటగా, 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ అమ్మకాలు 2.14 కోట్ల యూనిట్లకు చేరి 13%కు పైగా వృద్ధి నమోదు చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం మోటార్‌సైకిళ్లు ఈ వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా నిలిచాయి.భవిష్యత్తులో మరింత విస్తరణప్రస్తుతం ఆన్లైన్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు మొత్తం మార్కెట్లో చిన్న వాటానే కలిగి ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిన్న పట్టణాల్లో డిజిటల్ అవగాహన పెరగడం, విస్తృత బ్రాండ్ ఎంపికలు, ధరల్లో పారదర్శకత కారణంగా భవిష్యత్తులో టూవీలర్ కొనుగోలు అనుభవం పూర్తిగా ఆన్లైన్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. -
సహారా కేసులో సుప్రీం కోర్టుకు సెబీ
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ సంస్థ రూ.14,106 కోట్ల అక్రమ నిధుల సేకరణ కేసులో ‘సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కంపెనీ అక్రమాలకు డైరెక్టర్లు మాత్రమే బాధ్యులని, అక్కడ పనిచేసే కంపెనీ సెక్రటరీ, నలుగురు మేనేజర్లు కేవలం ‘ఉద్యోగులు’ మాత్రమేనని పేర్కొంటూ వారికి ‘శాట్’ మినహాయింపునిచ్చింది.అయితే, సంస్థ అక్రమ పత్రాలపై సంతకాలు చేసినందుకు ఉద్యోగులనూ బాధ్యులను చేయాలని సెబీ వాదిస్తోంది. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జవాబుదారీతనంపై కీలకమైన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూన్ 18న విచారించనుంది. -
అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్ రేపే..
పన్ను చెల్లింపుదారులకు కీలక గడువు సమీపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY 2026-27) సంబంధించిన తొలి అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) వాయిదాను (advance tax deadline 2026) జూన్ 15లోగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం తొలి అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదా ఇదే.అడ్వాన్స్ ట్యాక్స్ విధానం ద్వారా ప్రభుత్వం "సంపాదించిన కొద్దీ పన్ను చెల్లింపు" (Pay-as-you-earn) వ్యవస్థను అమలు చేస్తోంది. ఏడాది చివర్లో ఒకేసారి పన్ను చెల్లించకుండా, అంచనా పన్నును నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం ఉంటుంది.అడ్వాన్స్ ట్యాక్స్ తప్పనిసరి ఎవరికి?టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) మినహాయింపుల తర్వాత కూడా వార్షిక పన్ను బాధ్యత రూ.10,000 దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కింది వర్గాలకు వర్తిస్తుంది:🔹 జీతభత్యాలు పొందే ఉద్యోగులు🔹 ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు🔹 స్వయం ఉపాధి నిపుణులు🔹 వ్యాపారులు🔹 అద్దె ఆదాయం పొందేవారు🔹 వడ్డీ ఆదాయం లేదా పెట్టుబడి లాభాలు పొందేవారుఅంటే జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నప్పటికీ, అదనంగా అద్దె, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తే అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడే అవకాశం ఉంది.సీనియర్ సిటిజన్లకు మినహాయింపు60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వ్యాపార ఆదాయం ఉంటే ఈ మినహాయింపు వర్తించదు.తొలి వాయిదాలో ఎంత చెల్లించాలి?సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ అంచనా వార్షిక పన్ను బాధ్యతలో కనీసం 15 శాతం మొత్తాన్ని జూన్ 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల షెడ్యూల్ ఇలా ఉంటుంది:🔹జూన్ 15: మొత్తం పన్నులో 15%🔹సెప్టెంబర్ 15: మొత్తం పన్నులో 45%🔹డిసెంబర్ 15: మొత్తం పన్నులో 75%🔹మార్చి 15: మొత్తం పన్నులో 100%ఆన్లైన్లో ఎలా చెల్లించాలి?ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అడ్వాన్స్ ట్యాక్స్ సులభంగా చెల్లించవచ్చు. ప్రక్రియ ఇలా ఉంటుంది:🔹ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.🔹e-File → e-Pay Tax ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.🔹New Payment ఎంచుకోవాలి.🔹Income Tax కేటగిరీలో Advance Tax ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.🔹సంబంధిత అసెస్మెంట్ ఇయర్ (AY) ఎంచుకోవాలి.🔹Minor Head 100 (Advance Tax) ఎంపిక చేయాలి.🔹చెల్లించాల్సిన మొత్తం నమోదు చేసి పేమెంట్ పూర్తి చేయాలి.గడువు దాటితే జరిమానా తప్పదుఅడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే వడ్డీ భారం పడుతుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో సెక్షన్ నంబర్లు మారినప్పటికీ, నిబంధనల సారాంశం దాదాపు యథాతథంగా ఉంది. పాత చట్టంలోని సెక్షన్లు 234B, 234Cలకు సమానమైన నిబంధనలు కొత్త చట్టంలో వర్తిస్తున్నాయి.🔹 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం పన్నులో 90% కన్నా తక్కువ చెల్లిస్తే నెలకు 1% వడ్డీ విధిస్తారు.🔹 వాయిదా వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని గడువులోపు చెల్లించకపోయినా నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది. -
సముద్రంపై AI సామ్రాజ్యం! శామ్సంగ్ కొత్త ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం మరింతగా పెరుగుతోంది. అయితే భూమిపై స్థలం కొరత, భారీ విద్యుత్ అవసరాలు, శీతలీకరణ సమస్యలు టెక్ దిగ్గజాలకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ (Samsung Heavy Industries) సముద్రంపై తేలియాడే ఏఐ డేటా సెంటర్ల (Floating Data Centers) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.మూడు సంస్థలు కలిసి..తేలియాడే డేటా సెంటర్ల అభివృద్ధి కోసం శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, గ్రీకు షిప్పింగ్ సంస్థ క్యాపిటల్ క్లీన్ ఎనర్జీ క్యారియర్స్, సముద్ర భద్రతా ప్రమాణాల సంస్థ లాయిడ్స్ రెజిస్టర్ కలిసి సంయుక్త అభివృద్ధి ఒప్పందం (JDP) కుదుర్చుకున్నాయి. ఇటీవల గ్రీస్‌లో జరిగిన ప్రముఖ అంతర్జాతీయ షిప్పింగ్ ఎగ్జిబిషన్ ‘పోసిడోనియా 2026’ సందర్భంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందు లో శామ్సంగ్ సాంకేతిక రూపకల్పన, నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, క్యాపిటల్ పెట్టుబడులు, ప్రాజెక్టు అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. లాయిడ్స్ రిజిస్టర్ భద్రతా ధ్రువీకరణలు, నియంత్రణ అంశాలను చూసుకుంటుంది.డేటా సెంటర్లు సముద్రంపై ఎందుకు?భారీ ఏఐ డేటా సెంటర్లకు విస్తారమైన స్థలం, అపారమైన విద్యుత్ సరఫరా, అధిక శీతలీకరణ వ్యవస్థలు అవసరం. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో భూమి లభ్యత తగ్గిపోవడం, విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ల ఆలస్యం కారణంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో లేదా నదులపై తేలియాడే డేటా సెంటర్లు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. సముద్రపు నీటినే నేరుగా శీతలీకరణ కోసం వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది.50 మెగావాట్ల సామర్థ్యం.. వేలాది ఏఐ సర్వర్లుశామ్సంగ్ అభివృద్ధి చేస్తున్న తొలి ఫ్లోటింగ్ డేటా సెంటర్ (Samsung floating AI data center) సామర్థ్యం 50 మెగావాట్లు (MW)గా ఉంటుంది. ఇది వేల సంఖ్యలో ఏఐ సర్వర్లను నడిపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కేంద్రం రెండు విధాలుగా విద్యుత్తును పొందగలదు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు సముద్ర అడుగు కేబుళ్ల ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానమవుతుంది. అవసరమైతే ద్రవీకృత సహజ వాయువు (LNG) ఆధారిత సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా స్వయంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.సర్వర్లకు సముద్రం సవాలే!అయితే సముద్రంలో ఏఐ సర్వర్లను దీర్ఘకాలం నిర్వహించడం అంత సులభం కాదు. ఓడల కదలికలు, కంపనాలు, ఉప్పునీటి ప్రభావం, తేమ వంటి అంశాలు సున్నితమైన హార్డ్వేర్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, సూపర్‌మైక్రో సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్ర వాతావరణంలో సర్వర్ల పనితీరును పరీక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.షిప్పింగ్ పరిశ్రమకు కొత్త వ్యాపార అవకాశాలుఫ్లోటింగ్ డేటా సెంటర్లు షిప్పింగ్ పరిశ్రమకు కూడా కొత్త ఆదాయ మార్గాలను తెరవవచ్చు. ఇప్పటివరకు సరుకు రవాణాపైనే ఆధారపడిన ఓడ యజమానులు, భవిష్యత్తులో టెక్ కంపెనీలు, క్లౌడ్ సేవల సంస్థలకు డేటా సెంటర్ సామర్థ్యాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.మరిన్ని సముద్ర డేటా సెంటర్లుఈ రంగంలో శామ్సంగ్ ఒక్కటే కాదు. జపాన్‌కు చెందిన మిత్సుయి ఒ.ఎస్.కె. లైన్స్ (MOL), టర్కీకి చెందిన కర్పవర్‌షిప్ కలిసి 73 మెగావాట్ల తేలియాడే డేటా సెంటర్‌ను 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చైనాలో షాంఘై సమీపంలో 24 మెగావాట్ల నీటి అడుగున డేటా సెంటర్ ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నాటిలస్ డేటా టెక్నాలజీస్ 6.5 మెగావాట్ల బార్జ్ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: ‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’ -
మార్కెట్లోకి ఎల్జీ ‘ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్’
హైదరాబాద్: గృహోపకరణాల తయారీ సంస్థ ‘ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా’ మార్కెట్లోకి సరికొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. భారతీయ కుటుంబాల జీవన విధానం, అవసరాలకు అనుగుణంగా 83.82 సెం.మీ (33 అంగుళాల) వెడల్పు విభాగంలో ‘ఆటో ఐస్ మేకర్’ సదుపాయంతో వీటిని రూపొందించారు. 574 లీటర్ల నుండి 610 లీటర్ల సామర్థ్యంతో లభించే ఈ రిఫ్రిజిరేటర్లు దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్లెట్లలో లభిస్తాయి. ప్రారంభ ధర రూ.1.18 లక్షలతో అందుబాటులో ఉన్నాయి.ఈ సరికొత్త ఫోర్–డోర్ నిర్మాణంలో ‘రిఫ్రిజిరేటర్’ పై భాగంలో, ‘ఫ్రీజర్’ దిగువ భాగంలో ఉన్నాయి. ఇందులో అమర్చిన ఎల్జీ ‘ఇన్‌స్టా వ్యూ’ ఫీచర్ ద్వారా కేవలం రెండుసార్లు తట్టడంతోనే లోపల ఉన్న వస్తువులను చూడవచ్చు. ఆహార పదార్థాల తాజాదనం కోసం ‘ఫ్రెష్ కన్వర్టర్ ప్లస్’, నిరంతర ఐస్ ఉత్పత్తి కోసం రీఫిల్ చేయగల వాటర్ ట్యాంక్ సిస్టమ్ గల ‘ఆటో ఐస్ మేకర్’ ఉన్నాయి. వీటితో పాటు ఇన్‌బిల్ట్ వాటర్ డిస్పెన్సర్, డోర్ కూలింగ్, హైజీన్ ఫ్రెష్ ప్లస్, స్మార్ట్ లెర్నర్ కూలింగ్ టెక్నాలజీ, ఎల్జీ థింక్ వై–ఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోమ్ సొల్యూషన్స్ డైరెక్టర్ యంగ్ మిస్ హ్వాంగ్ మాట్లాడుతూ ‘‘భారతీయ వినియోగదారుల రోజువారీ జీవితాన్ని మెరుగుపరిచే ఆవిష్కరణలను తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తాం. మా కొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ శ్రేణి ప్రీమియం డిజైన్, సౌలభ్యం, స్మార్ట్ టెక్నాలజీ పట్ల మాకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అన్నారు. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
మోటోరోలా సరికొత్త ‘5జీ’ స్మార్ట్ఫోన్లు!
న్యూఢిల్లీ: భారత్‌లో లీడింగ్ కృత్రిమ మేధ (ఏఐ) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘మోటోరోలా’ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో రెండు 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. ‘మోటో జీ37’, ‘మోటో జీ37 పవర్’ పేర్లతో వస్తున్న మోడళ్లపై పరిమిత కాల ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ, భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్లుగా అత్యంత తక్కువ ధరకే ప్రీమియం తరహా ఫీచర్లు, అత్యుత్తమ బ్యాటరీ పర్ఫార్మెన్స్, మిలిటరీ గ్రేడ్ ల్యాబ్ సర్టిఫైడ్ రక్షణతో ఈ ఫోన్లను తీసుకొచి్చనట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు ఆకర్షణీయమైన పాంటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఫీచర్లు ఇవే మోటో జీ37, మోటో జీ37 పవర్.. ఈ రెండు ఫోన్లలోనూ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన భారీ 6.7 అంగుళాల డిస్ప్లేను అందించారు. సినిమాటిక్ ఆడియో అనుభూతిని అందించే వినూత్నమైన ‘డాల్బీ అట్మోస్’ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం గూగుల్ ఏఐ ఎడిటింగ్ టూల్స్ సపోర్ట్ చేసే ‘50ఎంపీ క్వాడ్ పిక్సెల్ ఏఐ కెమెరా’ను ఈ రెండు మోడళ్లలోనూ అమర్చారు. ముఖ్యంగా ‘మోటో జీ37 పవర్’ ఫోన్లో మూడు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నాయి. అలాగే ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 128జీబీ స్టోరేజ్, గరిష్టంగా 24జీబీ వరకు ర్యామ్ బూస్ట్ చేసుకునే ఆప్షన్ అందించారు. దీనికి రక్షణగా స్క్రీన్ పై గొరిల్లా గ్లాస్ 7ఐ, ఎంఐఎల్–ఎస్టీడీ–810 హెచ్ మిలిటరీ గ్రేడ్ సరి్టఫికేషన్, ఐపీ64 వాటర్–రెసిస్టెంట్ డిజైన్ ఉన్నాయి. స్మార్ట్ యూజర్ అనుభూతి కోసం గూగుల్ ‘జెమిని’, ‘సర్కిల్ టు సెర్చ్’ వంటి ఏఐ ఫీచర్లు ఇందులో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి.ధరల విషయానికొస్తే: మోటో జీ37 బేసిక్ మోడల్ ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ ధర రూ.13,999 గా ఉంది (దీని అసలు ధర రూ.14,999). ఇక ‘మోటో జీ37 పవర్’ మోడల్ 4జీబీ+128జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.15,999 గా ఉండగా , దీని టాప్ వేరియంట్ (8జీబీ+128జీబీ) అసలు ధర రూ.21,999 కాగా.. రూ.2,000 బ్యాంక్ ఆఫర్‌తో రూ.19,999 కే లభిస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్లను ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.


