breaking news
Sangareddy
-
బీఆర్ఎస్ పనైపోయినట్టే!
జోగిపేట/వట్పల్లి(అందోల్): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. అందోలు మండలం అల్మాయిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం బీఎల్ఏలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సహకారంతో 2023లో అధికారంలోకి వచ్చి సీఎం రేవెంత్‌రెడ్డి నాయకత్వంలో 70 శాతం వాగ్దానాలను నెరవేర్చామని చెప్పారు. ఉచిత బస్సు పథకం నుంచి సన్న బియ్యం వరకు హామీలను అమలు చేశామని తెలిపారు. కానీ కేటీఆర్, హరీశ్‌రావు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన నీళ్లు, భూ దోపిడీలు, అక్రమాలు ప్రజలు మర్చిపోయి మళ్లీ మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే భ్రమే అవుతుందని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.23 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినట్టు గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో 70 శాతానికి పైగా కుటుంబాలు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందుతున్నారన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి సి.దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా భర్తీచేసి అందరూ అందజేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. వలస కూలీలు, వయో వృద్ధులు, నిరక్షరాస్యులు, రైతుల ఓట్లు తొలగించే అవకాశం ఉందని, బీఎల్ఏలు ఓట్లు పోకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావద్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, పీసీసీ ఉపాధ్యాక్షుడు సంఘమేశ్వర్, మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్లు ఎస్.కృష్ణారెడ్డి, ఎ.చిట్టిబాబు పాల్గొన్నారు. -
నెలలో నిధులు మంజూరు చేస్తా
పటాన్చెరు: బీరంగూడ డివిజన్ పరిధిలోని ఇక్రిసాట్ ఫేజ్ 1 కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా అంతర్గత సీసీ రోడ్లు, నూతన డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లోగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఈఈ సురేష్, జలమండలి జీఎం శ్రీనివాస్ రెడ్డి, డీఈ వెంకటరమణ, డీజీఎం శివకుమార్ పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
సంగారెడ్డి జోన్: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి డా. క్రిస్టినా జడ్ చోంగ్తు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు, పురోగతిపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు అవసరమా అనే అంశాలపై జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించి సేవలను మెరుగుపరచాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రజా పాలనలో వచ్చిన సమస్యలను మూడు విభాగాలుగా వర్గీకరించామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించే అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, మిగిలిన సమస్యల కోసం జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతితో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే ఎమ్మెల్యే మాణిక్‌రావు జహీరాబాద్: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి కలిశారు. 18, 21, 22వ వార్డుల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన నసీర్, సిఫాలియా, ముర్తుజలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తంజీం, బీఆర్ఎస్ నాయకులు మిథున్‌రాజ్ పాల్గొన్నారు. పీఏసీఎస్ ఎరువుల వివాదంపై విచారణపుల్కల్(అందోల్): పుల్కల్ వ్యవసాయ సహకార సంఘం డీఏపీ ఎరువుల పంపిణీలో జరిగిన వివాదంపై మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. సొసైటీలో 100 డీఏపీ ఎరువుల బస్తాలు చైర్మన్, అతని అనుయాయులే తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఎరువుల వివాదంపై జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. మంగళవారం దీంతో జోగిపేట వ్యవసాయశాఖ ఏడీఏ రమాదేవి, మండల వ్యవసాయశాఖ అధికారి చైతన్య పీఏసీఎస్ సొసైటీలో విచారణ చేసి రైతుల నుంచి చైర్మన్ అనంతరావు కులకర్ణి నుంచి వివరణ తీసుకున్నారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతామని ఏడీఏ రమాదేవి తెలిపారు. రేపటి నుంచి అమలు వర్గల్(గజ్వేల్): విశేషమైన భక్తజనాదరణ కలిగిన నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో ఆలయ వేళలు మారుతున్నాయి. భక్తులకు నిరీక్షణ లేకుండా ఇక రోజంతా శ్రీవారి దర్శనభాగ్యం లభించనుంది. అదేవిధంగా పూజాకార్యక్రమ వేళలోనూ మార్పులు చేశారు. భక్తుల దర్శనం కోసం ఆలయం ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు తెరిచిఉంటుంది. శని, ఆదివారాల్లో ఎలాంటి విరామం లేకుండా ఉదయం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంటుంది. పూజా కార్యక్రమాల్లోనూ మార్పు చేశారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం గురువారం నుంచి నూతన వేళలు అమలులోకి వస్తాయని ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు.. జిల్లా స్థాయిలో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు కలిసి సంయుక్త తనిఖీలు.. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు.. క్లస్టర్ స్థాయిలో ఏఈఓలు, మండల స్థాయిలో ఏఓల ప్రత్యక్ష పర్యవేక్షణలు.. ఇవేవీ.. డీఏపీ ఎరువు అధిక ధర దోపిడీ చెక్ పెట్టలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ఈ ఎరువు కొరతను ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు యథేచ్ఛగా అధిక ధరల దోపిడీకి పాల్పడుతున్నారు. ఎమ్మార్పీ కంటే రూ.300 వరకు ఎక్కువగా విక్రయిస్తుండటం గమనార్హం. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి డీఏపీ ఎరువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బస్తాపై ఎమ్మార్పీకంటే రూ.వంద నుంచి రూ.మూడు వందల వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఎరువు ఎమ్మార్పి రూ.1,350 ఉంటే.. ఏకంగా 1,550 వరకు విక్రయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే రైతులకు అసలు స్టాకే లేదని బుకాయిస్తున్నారు. మరికొందరు డీలర్లు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులు ఆయా డీలర్ల వద్దకు వెళితే డీఏపీ స్టాక్ లేదని చెబుతున్నారు. అధిక ధర అయి ఇస్తామని చెబితే మాత్రం ఈ ఎరువును విక్రయిస్తున్నారు. అసలే కొరత ఉన్న నేపథ్యంలో రైతులు బిల్లులు అడిగే పరిస్థితి లేదు. బిల్లులు (ప్రూఫ్) ఉంటేనే చర్యలు తీసుకుంటామని సంబందిత అధికారులు చెబుతున్నారు. బిల్లు అడిగిన రైతులకు ఈ ఎరువు స్టాక్ లేదని డీలర్లు దాటవేస్తుండటం పరిపాటైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలు చెల్లించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. వ్యవసాయశాఖ, పోలీసుశాఖలు సంయుక్తంగా ఎరువుల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలు చాలా చోట్ల మొక్కుబడిగా సాగుతున్నాయి. అధిక ధరలకు డీఏపీ విక్రయిస్తున్న ఒక్క డీలరుపై ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. అక్కడక్కడ 6 (ఏ) కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించిన కేసు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సాధారణంగా బస్తాపై ఎమ్మార్పీ కంటే రూ.పది, రూ.20 అంటే రైతులు మంచి మనసుతో పోనీలే అనుకుని చెల్లించేస్తారు. కానీ ఏకంగా రూ.వంద నుంచి రూ.మూడు వందల వరకు అధికంగా దోపిడీ జరుగుతుండటంతో జిల్లాలో ఈ వానాకాలం సీజనులో 7.62 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ సీజనుకు సంబందించి 18,395 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం అని వ్యవసాయశాఖ అంచాన వేసింది. రానున్న మూడు నెలలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఏ నెలలో ఎంత అవసరం అనే దానిపై ప్రణాళిక రూపొందించింది. బీఆర్ఎస్లో చేరికలు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది యువకు లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.ఎరువుల విక్రయాల్లో దోపిడీ చర్యలు తీసుకుంటాం డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. ఎక్కువ ధరకు విక్రయించినట్లు ప్రూఫ్ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మా శాఖ ఆధ్వర్యంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు ఎనిమిది మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. కొందరిపై 6(ఏ) కేసులు కూడా పెట్టాం. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
సాంకేతికతతో సత్వర న్యాయం
● మల్టీ జోన్ డీఐజీ –7 ఎల్ఎస్ చౌహన్ ● ఎస్పీ కార్యాలయం సందర్శన సంగారెడ్డి జోన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారానే కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయవచ్చని మల్టీజోన్ డీఐజీ 7 ఎల్ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి కేసు వివరాలను ఎప్పటికప్పుడు ’సీసీటీఎన్ఎస్’లో నమోదు చేస్తూ డేటా నాణ్యతను పెంచాలని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీసు సిబ్బంది పిల్లల పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు. స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా కల్పించాలి హత్నూర(సంగారెడ్డి): పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకొని వారికి భరోసా కల్పించేలా పోలీస్ అధికారులు పనిచేయాలని డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ అన్నారు. మంగళవారం హత్నూర పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని సూచించారు. మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తనిఖీల్లో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ రమణారెడ్డి ,ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
వర్షాకాలం.. పాముల భయం
హత్నూర (సంగారెడ్డి)/సంగారెడ్డి క్రైమ్: వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతం, గ్రామాల్లోని వ్యవసాయ పొలాలతో పాటు దట్టమైన పొదల సమీపంలో పాములు కనిపిస్తుంటాయి. కాగా కొన్ని రోజుల క్రితం హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో విద్యార్థిని పాముకాటుకు గురై చనిపోయింది. ప్రతి ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు పాములు, ఇతర విష కీటకాల సంచారం ఎక్కువగా ఉంటుంది. అలాగే పొలాల్లో పిచ్చి మొక్కలు పెరుగుతుండడంతో ఎక్కువ ఏ విషపురుగు ఉందో గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. అయితే జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. విష పాముల పట్ల నిర్లక్ష్యం వద్దు.. విషపూరిత పాములు పంట పొలాల్లో సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాములు ఎలుకలను, కప్పలను తినేందుకు బయట తిరుగుతూ చెట్లపొదల్లో ఉంటాయి. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉంటూ ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. ముఖ్యంగా పాము కాటు వేసినప్పుడు రెండు లేదా నాలుగు గుర్తులు పడతాయి. అరగంటలోపు పాము విషం శరీరంలో పూర్తిగా పాకిపోతుంది. కళ్లు మూతలు పడటం, చేతులు, కాళ్లకు తాత్కాలికంగా పక్షవాతం రావడం, మాట ఆగిపోవడం, నాలుకకు రుచి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రథమ చికిత్స తప్పనిసరి పాము కాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పాము కాటు వేసిన భాగాన్ని ఎక్కువగా కదిలించరాదు. ఆ భాగాన్ని బట్టతో లేదా టవల్‌తో గట్టిగా కట్టాలి. ఇలా చేయడం వల్ల విషం శరీరంలోకి వ్యాపించదు. సాధ్యమైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు విషానికి విరుగుడుగా యాంటీ వీనం ఇస్తారు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.అన్ని పాములు విషం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నాగుపాము, కట్లపాము , రక్తపింజర, వంటి పాములు వల్లే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా 50% పైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఏమరుపాటుగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం పాము కాటుకు గురైతే నాడీ వ్యవస్థపై ప్రభావం జాగ్రత్తలు తీసుకోవాలన్న వైద్యనిపుణులుఅప్రమత్తత అవసరం పాము నుంచి రక్షించుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. పాము కాటుకు గురైతే యాంటీ వీనం మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో పొలం వద్దకు వెళ్లే రైతులు కాళ్లకు చెప్పులు వేసుకొని, భారీ శబ్దాలు చేస్తూ టార్చ్‌లైట్ వెంట తీసుకెళ్లాలి. – వినోద్, వైద్యుడు, సంగారెడ్డి -
ఓటును రక్షించుకుంటేనే హక్కులు
వట్పల్లి(అందోల్): ఓటు హక్కు కోల్పోయినట్లయితే ఆ వ్యక్తి మానవ హక్కులను కోల్పోయినట్లేనని, పేదవాడు ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ అన్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని అల్మాయిపేట లక్ష్మిదేవి గార్డెన్లో మంగళవారం నిర్వహించిన ఎస్ఐఆర్ పై బీఎల్ఏలకు అవగాహన,శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయానికి తెరలేపిందని ఆరోపించారు. బెంగాల్లో 30 లక్షల ఓట్లను తొలగించారని, దీని వల్ల మమతా బెనర్జీ ఓటమికి బీజేపీ కారణమైందని విమర్శించారు. ఇప్పుడు ఓటు హక్కు కోల్పోతే ఐదేళ్ల వరకు పొందే అవకాశం లేదన్నారు. తెలంగాణను మరో బెంగాల్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రజలు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎస్ఐఆర్, ప్రక్రియ ద్వారా ఓటు హక్కును తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బూత్ లెవెల్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, ప్రతి ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని, అవసరమైన ఫారాలను నింపించి ఓటర్ల హక్కులను కాపాడాలని కోరారు. -
పట్టణ సమస్యలు పరిష్కరించండి
సంగారెడ్డి: పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వార్డు సభ్యులు మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన 16 అంశాలతో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాను న్న వర్షాకాలాన్ని అంచనా వేసుకొని పట్టణంలోని పలు వార్డులలో బురదమయం కాకుండా రూ.20 లక్షల నిధులు కేటాయించారు. అలాగే డంప్ యార్డ్ అభివృద్ధికి నిధులను కేటాయించి ఆమోదించారు. అలాగే పట్టణంలోని అన్ని సమస్యలను దశలవారీగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షఫీ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ రఘు, టీపీఓ విశాల్, ఆర్ఐ స్వాతి, అధికారులు పాల్గొన్నారు. -
కదిలేదేలే..
బదిలీ అయినా వెళ్లనంటున్న తాత్కాలిక ఉద్యోగి ● పటాన్చెరు ఎంఎల్ఎస్ పాయింట్లో అక్రమాలు ● ఆరోపణలపై విచారణ పటాన్చెరు: బదిలీ అయినా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అక్కడే విధులు నిర్వహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా ఆమె అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జులు మాత్రం రెండేళ్లకు ఒకరు మారుతున్నారు. కానీ ఆ ఉద్యోగి మాత్రం నెలవారీ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అందరికీ వాటాలు పంచుతున్నారు. కారణాలేమైనా ఆమెను కదిలించే సాహసం ఎవరూ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆమెకు బదిలీ ఉత్తర్వులు అందినా తాను ఇక్కడి నుంచి కదలనంటుండటంతో రేషన్ డీలర్ల సైతం విస్తుపోతున్నారు. 40 మంది డీలర్లకు బియ్యం సరఫరా ప్రతి నెల పటాన్చెరు (ఎంఎల్ఎస్ పాయింట్) గోదాం నుంచి రేషన్ డీలర్లకు బియ్యం ఇతర సరుకులను సరఫరా చేస్తుంటారు. అయితే అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిలు ఎంత సరుకు వచ్చింది, ఎంత డెలివరీ అయ్యిందనే వివరాలను నమోదు చేస్తుంటారు. పటాన్చెరు పట్టణంలో 17 మంది రేషన్ డీలర్లతో పాటు పటాన్చెరు మండల స్థాయి స్టాక్(ఎంఎల్ఎస్) పాయింట్ నుంచి దాదాపు 40 మంది డీలర్లకు బియ్యం ఇతర సరుకులు సరఫరా చేస్తుంటారు. తరుగు పేరుతో నల్లబజారుకు.. కాగా గోదాంలో వచ్చిన లారీల నుంచి బియ్యం బస్తాలు దించినట్లు లెక్కలు చూపుతారు. కానీ హమాలీకి ఒక్క రూపాయి ఇవ్వకుండానే లారీల్లో వచ్చిన బియ్యం తరలిపోతుంటుంది. ఎలాంటి తూకం లేకుండా సరఫరా జరుగుతుంది. రేషన్ డీలర్లకు ఖాళీ సంచులకు బదులుగా చూపాల్సిన బియ్యం లెక్కలు, తరుగు పేరుతో జరిగే దోపిడీతో సరాసరి ప్రతి నెల దాదాపు పది టన్నులు అంటే ఓ లారీ బియ్యం నల్ల బజారుకు తరలుతుంది. దాన్ని విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ఆ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నతాధికారులకు కూడా అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు.. మొత్తం మీద ఆమె తీరుతో ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు, ఆ డీఓను బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గోదాంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను బదిలీ చేయాలని డీలర్లు ఎమ్మెల్యేకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన స్వయంగా ఓ లేఖ కూడా ఇచ్చారు. ఆమైపె వచ్చిన ఆరోపణలతో బదిలీ చేశారని, అయినా ఆమె ఆ స్థానాన్ని వదలకుండా ఉండేందుకు తాజాగా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. బదిలీ చేశాం పటాన్చెరు ఎంఎల్ఎస్ డాటా ఎంట్రీ ఆపరేటర్‌పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్నాం. ఇదివరకే చర్యలు తీసుకున్నాం. ఆమెను బదిలీ చేశాం. రెండు రోజుల క్రితమే జిల్లా అదనపు కలెక్టర్ ఆమె బదిలీ ఉత్తర్వులను వెలువరించారు. ఆమె అక్కడి నుంచి బదిలీ అయిన స్థానంలోకి వెళ్లాల్సిందే. కాదని పైరవీలు చేస్తే చూస్తూ ఉపేక్షించేది లేదు. – జయశ్రీ, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ, సంగారెడ్డి -
వాట్సాప్‌లో పాఠశాల సేవలు
● ప్రతీ సమాచారం ఇక అరచేతిలోనే.. ● సేవలు ప్రారంభించిన విద్యాశాఖ ● త్వరలో పూర్తి స్థాయిలో విస్తరణ నారాయణఖేడ్: సర్టిఫికెట్లు, ఇతర సేవల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులు ముగిసిపోయాయి. సాంకేతికతను సామాన్యుడి ముంగిట్లోకి తెస్తూ రాష్ట్ర విద్యాశాఖ డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా సేవలు అందించనున్నారు. విద్యార్థులకు తమకు అవసరమైన సేవలను ఇక ఒక్క క్లిక్‌తో ఆన్లైన్లోనే పొందనున్నారు. ఈ సౌకర్యంతో వేలాది మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు ఈ విద్యాసంవత్సరం నుంచే సేవలను అమలులోకి తెస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే అమలు చేసింది. నాలుగు రోజుల క్రితం అధికారికంగా ప్రారంభించింది. కేవలం ఒక వాట్సాప్ సందేశంతో విద్యార్థులు తమ విద్యా పురోగతిని తెలుసుకోవడమే కాకుండా అవసరమైన ధ్రువపత్రాలను డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,265 ఉండగా, ఇందులో సుమారు 92 లక్షల మది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 10 మోడల్ స్కూల్స్‌లో 6,495 మంది, 22 కేజీబీవీల్లో 4,975, 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,596, 4 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 761, 7 గిరిజన సొసైటీ పరిధిలోని గురుకులాల్లో 3,387, 11 బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 5,456, 12 మైనార్టీ గురుకులాల్లో 4,916, 4 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 931 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. అందనున్న సేవలు.. విద్యార్థులకు ప్రస్తుతం కొన్ని రకాల సేవలు తక్షణం అందుతుండగా, మిగిత సేవలను అతి త్వరలో అందుబాటులోకి తసుకురానున్నారు. టెన్త్ మార్కుల మెమోలు, బోనాఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, విద్యార్థులు ప్రొగ్రెస్ కార్డులు, హాల్‌టికెట్ డౌన్లోడ్, ఫలితాల సమాచారం, మోమోల్లో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రెండో దశలో యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు శాతం, ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజనం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహ పాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమ వివరాలు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ వివరాలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను సేకరించి ఇప్పటికే యాక్టివేట్ చేశారు. పాలపిట్ట డిజిటల్ మస్కట్ విద్యాశాఖ, మీసేవ సహకారంతో వాట్సాప్ ఆధారిత పాఠశాల సేవలు పొందేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్‌గా ఎంపిక చేసింది. యానిమేషన్ రూపంలో ఉండే ఈ పాలపిట్ట విద్యార్థులకు సంక్లిష్టమైన సమాచారాన్ని సులభతరమైన వీడియోల ద్వారా వివరించనుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ఈ వాట్సాప్ సేవలు వారధిలా పనిచేయనున్నాయి. -
ముంగిట్లోకే విత్తనాలు
వానాకాలం పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం సూచించిన విత్తనాలను వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ప్రభుత్వం సబ్సిడీ అందించనున్న ఏడు ప్రాధాన్యత సన్న రకాల వడ్లు అయిన బీపీటీ–5204, తెలంగాణ సోన, పీఎన్ఆర్–15048, కేఎన్ఎం–1638, జైశ్రీరామ్ సెగ్మెంట్, హెచ్ఎంటీ సోన, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715తో పాటు పప్పుధాన్యాలు కంది, మినుము, పెసరతో పాటు సోయాబీన్, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాల నాణ్యమైన నిల్వలు అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా నానో యూరియా, డీఏపీని ప్రదర్శిస్తారు. వాటి గురించి రైతులకు డీలర్లు అవగాహన కల్పిస్తారు.వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న వేళ విత్తన మేళా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. మంగళవారం నుంచి వారం పాటు జిల్లాలోని 50 రైతు వేదికల్లో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పంటల మార్పిడిపై రైతులకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. – జహీరాబాద్ వారం రోజుల పాటు మేళా నిర్వహించి అవసరమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. రైతులు విత్తనాల కోసం పట్టణ కేంద్రాలకు పరుగులు పెట్టకుండా ఉండేందుకు డీలర్లనే గ్రామాలకు పంపించేలా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి మండలంలోని రెండు నుంచి మూడు రైతు వేదికల్లో డీలర్లు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతారు. రైతు వేదిక పరిసర గ్రామాల రైతులు అక్కడికు వెళ్లి తమకు కావాల్సిన విత్తనాలను కొనుగోలు చేసుకునే సౌలభ్యం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా 50 రైతు వేదికల్లో విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యతలను ఏడీఏలకు అప్పగించారు. కార్యక్రమం ప్రారంభం రోజున ప్రజా ప్రతినిధులు, సబంధిత శాఖల అధికారులు, ప్రగతి శీల రైతులను భాగస్వాములను చేస్తారు. విత్తన మేళా ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. రైతుల గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ఈ సందర్భంగా ఏఈఓలు రైతులకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు, పంట వైవిధ్యం, నాణమైన విత్తనాల లభ్యత, ఎల్‌నినో ప్రభావం కారణంగా వేసుకోవాల్సిన పంటలపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమం సమయంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతుల వివరాలను ఓఎల్‌ఎంఎస్ పోర్టర్లో తప్పని సరిగా నమోదు చేయాలి. నేటి నుంచే విత్తన మేళా సద్వినియోగం చేసుకోవాలి రైతుల సౌలభ్యం కోసం వారం రోజులు విత్తన మేళా నిర్వహించనున్నాం. జిల్లాలోని 50 రైతు వేదికల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. డీలర్లు విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అనుమానాలను వ్యవసాయ శాఖ అధికారులు నివృత్తి చేస్తారు. –శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, సంగారెడ్డి -
మా పిల్లలు సర్కారు బడిలోనే..
ఆదర్శంగా బూచినెల్లి సర్పంచ్ జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ బడులను బలోపే తం చేసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు విశేష కృషి చేస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పిస్తున్నారు. మండలంలోని బూచినెల్లి సర్పంచ్ అలిగే సునీత కూడా గ్రామంలోని సర్కారు బడిలో తన కూతురిని చేర్పించి ఆదర్శంగా నిలిచారు. సోమవారం పాఠశాలలో అక్షరాభాస్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు 15 మంది పిల్లలు పాఠశాలలో చేరారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యఅందుతుందని, అందరూ సర్కారు బడికి పంపాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ మాణయ్య, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొలకెత్తిన పత్తి మునిపల్లి(అందోల్): ఖరీఫ్ సీజన్లో పత్తివిత్తనాలు నాటిన రైతులకు అదపాదడపా కురిసిన వర్షాల వల్ల మొలకెత్తాయి. మరికొందరు రైతులు పత్తి విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సరైన సమయంలో వర్షం పడితెనే పత్తి మొలకెత్తి ఎదుగుదలకు వస్తుందని రైతులు చెప్తున్నారు. సమయానికి వర్షం కురవకపోతే నాటిన విత్తనాలు కూడా మొలకెత్తని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే జొన్నలు రాయికోడ్(అందోల్): మండలంలోని నల్లంపల్లి, ఇందూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలు ఇంకా కేంద్రాల్లోనే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి లారీల కొరత వల్ల సకాలంలో కేంద్రాల నుంచి ప్రభుత్వ గిడ్డంగులకు జొన్నలను పంపడంలో జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. నల్లంపల్లి సొసైటీ ద్వారా 8,600 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయగా ఇంకా 2 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉన్నాయి. ఇందూర్ సొసైటీ ద్వారా 10 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేయగా 1,200 క్వింటాళ్ల జొన్నలు కేంద్రంలోనే ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో గోడౌన్లకు పంపిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. జొన్నలు విక్రయించిన రైతులు మాత్రం డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొండాపూర్(సంగారెడ్డి): పుట్ట గొడుగుల్లా అక్రమ వెంచర్లు అనే కథనం సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పందించారు. ఈ మేరకు కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అక్రమంగా వెలిసిన వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ సర్వే నంబర్ 158లో వెలిసిన వెంచర్‌కి ఎలాంటి అనుమతులు లేకున్నా.. ప్లాట్లుగా విభజించారన్నారు. అలాగే ఇళ్లు నిర్మించి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అధికారులు మౌనంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించి తక్కువ ధరకే అంటూ ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వెంచర్‌కు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. యూరియా పంపిణీ కల్హేర్(నారాయణఖేడ్): బాచేపల్లి పీఏసీఎస్‌లో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. పర్సన్ ఇన్చార్జి సంగారెడ్డి మాట్లాడు తూ వానకాలం పంటల సాగు కోసం యూరియా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. బీఎల్ఓలకు అవగాహన కల్హేర్(నారాయణఖేడ్): కల్హేర్, సిర్గాపూర్‌లో సోమవారం బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. తహసీల్దార్లు శివశ్రీనివాస్, కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల పేర్లు మ్యాపింగ్ చేసే విధానంపై సూచనలు చేశారు. -
పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి
పటాన్చెరు: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో ఉన్న పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాల కల్పనలో తొలి ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశ్రమల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. సోమ వారం సుల్తాన్ పూర్ మెడికల్ డివైస్ పార్కులో గల ఐలా కార్యాలయంలో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు, ఐలా అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం 120 పరిశ్రమలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి పరిశ్రమ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రిక్రూట్మెంట్ సమయంలో స్థానికులకు సమాచారం అందించాలని కోరారు. దీంతో పాటు ప్రజా కార్యక్రమాలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలన్నారు. జులై మొదటి వారంలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సుధాకర్ రెడ్డి, ఐలా కమిషనర్ శ్రీనివాస్, డీఈ సురేందర్, విద్యుత్ శాఖ ఏడీ సంజయ్, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించాలి సంగారెడ్డి: సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్న్ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, రైతు సమస్యలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, విద్యా సంస్థలు, గ్రామీణ మౌలిక వసతులు తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రూ.5 కోట్లతో నియోజకవర్గ పరిధిలోని రెండు పట్టణాలు, నాలుగు మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కంది మండలం ఉత్తర్పల్లి గ్రామ పరిధిలో రోడ్డు నిర్మాణానికి రూ.23 లక్షల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గిర్మాపూర్ గ్రామంలో త్రిపుల్ ఆర్ భూ బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో బయోమెట్రిక్ విధానాన్ని సడలించాలని ఎమ్మెల్యే కోరారు. జహీరాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.గోదాంలో ‘వే బ్రిడ్జి’ ఏర్పాటు చేయండి సంగారెడ్డి: సివిల్ సప్లై గోదాంలో తక్షణమే వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గోదాంలో వే బ్రిడ్జి లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను రేషన్ డీలర్లు ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించారు. టీపీసీసీ ప్రధా న కార్యదర్శి తోపాజి అనంతకిషన్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల ప్రతినిధి బృందం కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి సివిల్ సప్లై గోదాంలో వే బ్రిడ్జి కావాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రేషన్ డీలర్ల సంఘం కంది మండల అధ్యక్షుడు శంకర్, ప్రతినిధులు శశికాంత్, యూసుఫ్ తదితరులు ఉన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026ఎస్పీ పరితోష్ పంకజ్సంగారెడ్డి జోన్: జిల్లాలోని యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల వాల్ పోస్టర్ ను సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. యాంటీ డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఎస్సై కావేరి, తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
నేడు అందోలుకు మీనాక్షి నటరాజన్ రాక
ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ప్రత్యేక శిక్షణజోగిపేట(అందోల్): పట్టణ సమీపంలోని లక్ష్మీదేవి గార్డెన్స్‌లో ఈనెల 23న ఉదయం 11 గంటలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ శిబిరం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందోల్ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తప్పనిసరిగా పాల్గొని అవగాహన పెంచుకోవాలని మంత్రి కార్యాలయం కోరింది. -
సేవాగుణాన్ని అలవర్చుకోవాలి
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మిన్యాల్కల్(జహీరాబాద్): మనం సంపాదించిన దాంట్లో కొంత సొమ్మును సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని చాల్కి ప్రాథమిక పాఠశాలలో సంస్థ అధ్వర్యంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లతో పాటు నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడిచినా ఇప్పటికీ పలు పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం విచాకరమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు తమ సంస్థ కూడా పలు సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తుందని వివరించారు. జిల్లాలోని 22 పాఠశాలల్లో పలు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకొని ఉన్నతా శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సుయోధ్య, ఎంఈఓ మారుతి రాథోడ్, సర్పంచ్ జనార్దన్‌రెడ్డి, హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రులకు సుస్తీ
జిన్నారం (పటాన్ చెరు): ఉమ్మడి జిన్నారం మండలంలో ప్రభుత్వాస్పత్రులు నిర్మించి మూడేళ్లు గడిచినా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పలు పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, స్థానిక ప్రజలు అనారోగ్యం పాలైతే వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. కాగా గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, కాజిపల్లి ప్రాంతాల పారిశ్రామిక వాడలోని పరిశ్రమల్లో ఉపాధి కోసం బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు రసాయన పరిశ్రమల్లో పని చేస్తూ సమీప ప్రాంతాల్లో నివాసముంటారు. కానీ వారికి సుస్తీ చేస్తే వైద్య సేవలు మాత్రం అందని ద్రాక్షగా మారాయి. ఉమ్మడి మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, బస్తీ దవాఖానలు ఉన్నా, గడ్డపోతారం పారిశ్రామికవాడలో అసలు వైద్య సేవలు అందించేందుకు దవాఖానలు ఇప్పటివరకు ఏర్పాటుకు నోచుకోలేదు. ప్రధానంగా పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో క్షతగాత్రులను వైద్యం కోసం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం పారిశ్రామికవాడలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడం శోచనీయం. దగ్గు, జ్వరం, జలుబు వంటివి వస్తే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్మికుల నెల వేతనంలో సగభాగం వైద్య ఖర్చులకే సరిపోతుంది. మంత్రికి వినతి.. కొంతకాలంగా పారిశ్రామికవాడలో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కార్మిక శాఖ మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హాజరయ్యారు. ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని మంత్రికి స్థానిక నాయకులు వినతిపత్రం అందజేయగా ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఆస్పత్రుల ప్రారంభమెప్పుడో?కార్మికులకు అందని వైద్య సేవలు అనారోగ్యం బారిన పడితే ప్రైవేటు ఆస్పత్రికే.. జిన్నారం, నల్తూరులో దవాఖానాల నిర్మాణం పూర్తి మూడేళ్లయినా ప్రారంభానికి నోచుకోని దైన్యంజిన్నారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నూతన భవనాన్ని నిర్మించింది. భవన నిర్మాణం పూర్తయి మూడేళ్లకు పైబడినా ప్రారంభానికి నోచుకోలేదు. అలాగే పట్టణ పరిధిలోని నల్తూరు గ్రామంలో పల్లె దవాఖానను నిర్మించి, ప్రారంభించడం మరిచారు. దీంతో స్థానిక ప్రజలు వైద్య సేవలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.నల్తూర్లో నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని బస్తీ దవాఖాన -
యువత మత్తు జోలికి వెళ్లొద్దు
తొగుట(దుబ్బాక): యువత మత్తు జోలికి వెళ్లొద్దని సీపీ సాధన రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గుడికందులలో మన పోలీస్–మన ఊరు కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలు, గ్రంథాలయాన్ని సర్పంచ్ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన గంజాయి, మత్తు పదార్థాలు నేడు పట్టణాలకు చేరాయన్నారు. యువత వాటి బారిన పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ క్రీడలను ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ పర్శరాములు, ఎంఈవో నర్సయ్య, బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి విభీషన్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, అదనపు సీపీలు వెంకట్‌రెడ్డి, సుభాష్ చంద్రబోస్, కుషాల్కర్, హెచ్ఎం అంజిరెడ్డి, ఐకేపీ ఏపీఎం బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.సీపీ రష్మీ పెరుమాళ్ -
క్రైమ్ కేసులపై ప్రత్యేక దృష్టి
మెదక్‌జోన్: క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ ట్రాకింగ్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్) 2.0పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల సిబ్బందికి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీటీఎన్న్ఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలంటే నిర్దేశిత సమయాన్ని పాటించడంతో పాటు డేటా నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎఫ్ఐఆర్లు, కేసు డైరీలు, దర్యాప్తు పురోగతి, చార్జిషీట్లు, తదితర వివరాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని ఆదేశించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అప్డేట్లు, కొత్త ఫీచర్లు, వాటి వినియోగ విధానం, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
మెదక్‌జోన్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసిన ఘటనలో భర్తకు న్యాయస్థానం సోమవారం జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కథనం ప్రకారం... మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు మండలం కమలాపురం గ్రామానికి చెందిన లక్ష్మికి 20 ఏళ్ల క్రితం రేగోడ్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన కూతూరి కేశయ్యతో వివాహం జరిగింది. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కాగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కేశయ్య ఎనిమిదేళ్ల క్రితం ఆమె నుంచి విడిపోయాడు. అనంతరం లక్ష్మి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను పోషించుకుంటూ జీవనం సాగించింది. ఈ నేపథ్యంలో 2023 జనవరి 16న మేనమామను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా, వాగు సమీపంలో కాపుకాసిన కేశయ్య ఆటోను అడ్డగించి, ఆటో డ్రైవర్‌ను కత్తితో బెదిరించి పంపించాడు. అనంతరం లక్ష్మిపై కత్తితో దాడి చేసి హత్య చేయడంతో పాటు, ఆమె అక్కపై కూడా దాడి చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.జేసీబీకి నిప్పు..చిన్నశంకరంపేట(మెదక్): తన కబ్జాలో ఉన్న భూమిలో వద్దన్నా వినకుండా చదును చేస్తున్నారని ఆగ్రహించిన రైతు జేసీబీకి నిప్పుపెట్టాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట గ్రామశివారులో ఓ రైతు స్వాధీనంలో ఉన్న భూమిని తాను కొనుగోలు చేశానని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి జేసీబీతో చదును చేసేందుకు పనులు మొదలు పెట్టాడు. రెండు రోజుల క్రితం పనులు నిలిపివేసిన రైతు సర్వే జరిగే వరకు పనులు చేయవద్దని కోరాడు. సోమవారం రైతు తనకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లి వచ్చేలోపు జేసీబీతో పనులు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతు జేసీబీకి నిప్పు పెట్టాడు. వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా, మెదక్ ఫైర్‌సిబ్బంది వచ్చి మంటలార్పారు. -
ఇరుకు గదుల్లో చదువు..ఎండలో భోజనం
సంగారెడ్డి సంజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు సరిపోకపోవటంతో కొత్త భవనానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. దీంతో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు రెండు గదుల్లోనేకూర్చుంటున్నారు. దీంతో అందరికీ ఇరుకుగా మారి ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎక్కడా నిలువనీడ లేకపోవటంతో ఎండలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వర్షాలు పడితే మాత్రం వారింకా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిర్మాణం త్వరగా అయ్యేలా చూడాలని విద్యార్థులుతల్లిదండ్రులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
సినీ ఫక్కీలో వ్యక్తి హత్య
చేగుంట(తూప్రాన్): సినీ ఫక్కీలో వ్యక్తిని ఆటోతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘటన మండలంలోని అనంతసాగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్(30) వ్యవసాయంతో పాటు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌కు పొలం లేకపోవడంతో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. కాగా వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా ఆటో కిస్తీ డబ్బులు చెల్లించే విషయంలో మనస్పర్దలు ఏర్పడ్డాయి. రెండు నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో ఇద్దరు ఒకరినొకరు చంపుకొనే స్థాయిలో గొడవపడ్డారు. గ్రామస్తులు జోక్యం చేసుకొని శాంతింప జేశారు. సోమవారం శ్రీధర్ చేగుంట నుంచి బైకుపై బోనాల రోడ్డు వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనంతసాగర్ శివాజీ విగ్రహం వద్ద శ్రీధర్ బైకుకు ఆటో అడ్డురాగా మరో ఆటో అతడ్ని ఢీకొట్టింది. కాగా ఆటోలో నుంచి దిగిన వ్యక్తులు కిందపడిపోయిన శ్రీధర్ తలపై కొట్టి, చనిపోయాడనుకున్న తరువాత దుండగులు వచ్చిన ఆటోలోనే పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీధర్‌ను ప్రభు(ప్రభాకర్) హత్య చేశాడని, అతడిని అరెస్టు చేసే వరకు మృతదేహం తరలించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. వినకపోవడంతో స్వల్ప లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.మృతుడి బంధువుల ఆందోళన -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నారాయణఖేడ్: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని భూమయ్య కాలనీకి చెందిన దుర్గయ్య ఆదివారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో సహా అక్కడికి వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండగా ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, 8 తులాల వెండినగలు, రూ.12 వేల నగదు చోరీ అయిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌టీంను రప్పించి ఇంట్లో ఆధారాలను సేకరించారు. స్థానిక సీఐ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. మోటార్ల కేబుల్ వై ర్లు.. కొమురవెల్లి(సిద్దిపేట): వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం మండలంలోని కిష్టంపేట, గౌరాయపల్లి, పోసాన్పల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది రైతుల బోరుబావుల మోటార్ కేబుల్ వైర్లను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. కాగా ఉదయం పొలా లకు వెళ్లిన రైతులు కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. సుమారు కేబుల్ వైరు విలువ రూ.లక్ష ఉంటుందని వాపోయారు. రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. జూదం ఆడుతున్న ఐదుగురి అరెస్ట్చిన్నశంకరంపేట(మెదక్): బొమ్మ–బొరుసు ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామ శివారులో బొమ్మ బొరుసు ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20,769 నగదు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో కుమ్మరి లింగం, శ్రీరామ్ సతీశ్, పెంజర్ల రాజేందర్, దేవసోత్ దశరథ్, చాకలి వెంకటేశ్ ఉన్నారు. కాగా నవీన్‌రెడ్డి, రాజునాయక్ తప్పించుకున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిసిద్దిపేటఅర్బన్: విద్యుదాఘాతానికి గురైన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వంగ రాంరెడ్డి (65) ఈ నెల 14న రోజు మాదిరిగానే తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం పశువులకు నీళ్లు తాగించి మరో చోటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ తీగ తగలడంతో కరంట్ షాకుకు గురయ్యాడు. గమనించిన పక్క పొలం రైతు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుమారులు కరుణాకర్‌రెడ్డి, లింగారెడ్డి అక్కడికి చేరుకొని గాయపడిన అతడ్ని 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత తిరిగి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంసిద్దిపేటకమాన్: కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ మురళి కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణం పశువుల అంగడి స్థలంలోని పాడుబడిన గదిలో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నీలం రంగులో ఉన్న ప్యాంటు, షర్ట్ ధరించి, సుమారు 5.6అంగుళాల ఎత్తు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐస్‌క్రీమ్ తిని యువకులకు వాంతులు
శివ్వంపేట(నర్సాపూర్): ఐస్‌క్రీమ్ తిని ఇద్దరు యువకులు వాంతులు చేసుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... ఎక్సెల్‌పై ఐస్‌క్రీమ్ విక్రయించే వ్యక్తి రావడంతో గ్రామానికి చెందిన యువకులు శివ, నాగరాజు కొనుగోలు చేసి తింటుండగా దుర్వాసన వచ్చింది. దీంతో ఐస్‌క్రీమ్ డబ్బాతో పాటు విక్రయదారుడిని పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి 100కు డయల్ చేశారు. యూపీకి చెందిన ఐస్‌క్రీమ్ అమ్మకం దారుడు వినోద్‌ని గ్రామస్తులు ప్రశ్నించగా తాను మియాపూర్‌లోని హన్స్ డెయిరీ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు చెప్పాడు. ఐస్‌క్రీమ్‌పై గడువు ముగిసే తేదీ లేదు. కాలం చెల్లిన ఐస్‌క్రీమ్ తినడం వల్ల వాంతులు చేసుకున్నామని యువకులు శివ, నాగరాజు వాపోయారు. పోలీసులు కల్పించుకొని సంబంధిత పుడ్ ఇన్స్పెక్టర్కు గ్రామస్తులచే ఫిర్యాదు చేయించారు. -
ఫ్లైఓవర్ పైనుంచి బోల్తాపడిన లారీ
జహీరాబాద్: జహీరాబాద్‌లోని పస్తాపూర్ వద్ద జాతీయ రహదారి ఫ్లైవర్ పైనుంచి అదుపుతప్పిన లారీ సర్వీసు రోడ్డుపై బోల్తా పడింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఎస్ఐ లవకుమార్ కథనం ప్రకారం... మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ లోడ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న లారీ ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి ఫ్లైఓవర్ పైనుంచి పిట్టగోడను ఢీకొట్టి కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు కాలు విరిగింది. లారీ బోల్తా పడిన సమయంలో సర్వీసు రోడ్డుపై ఎలాంటి వాహనాలు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా సర్వీసు రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.డ్రైవర్‌కు గాయాలు తప్పిన ప్రమాదం -
ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి
జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పార్టీ సానుభూతి పరుల ఓట్లు అక్రమంగా తొలగించే అవకాశం ఉందని, ఓటు చోరీ ప్రయత్నాలు జరిగితే ఎన్నికల అధికారుల దృష్టికి తేవాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ సూచించారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలో సర్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు అయ్యిందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా అక్రమంగా ఓట్లను తొలగించడం, నకిలీ ఓట్లను చేర్చడం లాంటి ప్రయత్నాలు జరిగితే వెంటనే స్పందించాలని చెప్పారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ యూనూస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్ అజ్మత్ ఉల్లా, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, సీడీసీ చైర్మన్ ముబీన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ -
కాలుష్య పరిశ్రమపై చర్యలు తీసుకోండి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నందికంది శివారులోని బ్లూ క్రాఫ్ట్ అగ్రో కాలుష్య పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం పరిశ్రమ వద్ద ధర్నా, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, నాయకులు మాట్లాడారు. పరిశ్రమ వదిలిన వ్యర్థాలతో జల, వాయు కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలుష్య జలాలతో పశువులు మృతి చెందుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. కాలుష్య కారక పరిశ్రమను తనిఖీలు చేయని పీసీబీ అధికారులపై కూడా చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, శివరాం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ధార్మిక సేవలకు కొండపాక నిలయం
లేఖిని రచయితల సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మికొండపాక(గజ్వేల్): విద్య, వైద్యం, సామాజిక , ధార్మిక సేవలకు కొండపాక నిలయమని హైదరా బాద్‌కు చెందిన లేఖిని రచయితల సంఘం అధ్యక్షురాలు అత్తులూరి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ఫాదర్స్ డేను పురస్కరించుకొని కొండపాక శివారులోని ఆనంద నిలయం, అష్టాదశ శక్తి పీఠం ఉమామహేశ్వర స్వామి దేవాలయం, బాలసదనం, గోశాలను లేఖిని రచయితల సంఘం సభ్యులు సందర్శించారు. మాజీ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ సలహాదారుడు కేవీ రమణాచారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, కామేశ్వరి, సరస్వతి, నళిని మాట్లాడుతూ.. ఆనంద నిలయం ట్రస్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వృద్ధులకు ఆశ్రయం కల్పించడం అద్భుతమన్నారు. అష్టాదశ శక్తి పీఠం ఉమామహేశ్వర స్వామి దేవాలయంతో ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరింతగా పెంచాయని చెప్పారు. ఆనంద నిలయం మేనేజర్ పార్థసారధి సేవా కార్యక్రమాల నిర్వహణ తీరును వారికి వివరించారు. అనంతరం అనాథలకు బట్టలు, పండ్లు, బిస్కట్లు తదితర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లేఖిని రచయితల సంఘం బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
యువ వికాసమేనా!
● పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష ● నిరుద్యోగుల్లో కదలిక ● ఏ కేటగిరీ వారీగా ఇస్తారోనన్న సందేహాలునారాయణఖేడ్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎంతో ఆర్భాటంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించడం..యువతలో ఆశలు మొగ్గలు తొడగడం..తర్వాతి కాలంలో పథకం మూలన పడిపోయింది. ఏళ్లుగా పథకం గూర్చి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురవుతూ వస్తోంది. కాగా, తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు గౌరవ్, సిక్తా పట్నాయక్ తదితరులతో సమీక్ష నిర్వహిస్తూ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించనున్నామని వెల్లడించారు. దీని అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం గూర్చి చర్యలు ప్రారంభం కావడంతో స్వయం ఉపాధి పొందాలన్న ఆశతో ఉన్న యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. పథకానికి జిల్లాలో ఊహించని విధంగా భారీస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 2025 మార్చి 17న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. భారీగా నిరుద్యోగులు స్పందించి 51,657మంది దరఖాస్తులను సమర్పించారు. అత్యధికంగా బీసీ వర్గాల నుంచి 6,546 యూనిట్లకుగాను 23,681 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ విభాగంలో 7,415 యూనిట్లకు 14,480 దరఖాస్తులు, మైనార్టీ విభాగంలో 2,456 యూనిట్లకు 8,378 దరఖాస్తులు, ఎస్టీ విభాగంలో 2,502 యూనిట్లకు 4,232 దరఖాస్తులు, ఈబీసీలో 1,654 యూనిట్లకు 817 దరఖాస్తులను సమర్పించారు. రూ.50వేల లోపు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కేటగిరీ 1లో చేర్చారు. రూ.50వేల నుంచి రూ.1లక్ష మధ్య ఉన్న దరఖాస్తులదారులను కేటగిరీ 2లో, రూ.1లక్ష నుంచి రూ.2లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ 3గా, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ 4లో చేర్చారు. -
మొన్న భార్య.. నేడు భర్త
వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్యతూప్రాన్: భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఇస్లాంపూర్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సాదుల వెంకటమ్మ ఈ నెల 17న కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుంది. కాగా అంత్యక్రియలు నిర్వహించినప్పటి నుంచి భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త భిక్షపతి(45) 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మండలంలోని బ్రాహ్మణపల్లి పమీపంలో భిక్షపతి ఓ చెట్టుకు ఉరివేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో.. సిద్దిపేటఅర్బన్: ఇంటర్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో ఆదివారం చోటుచేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నల్లముత్తి వైష్ణవి(18) ఇటీవల జరిగిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉండటం గమనించారు. పొరుగువారి సహాయంతో తలుపులు తెరిచి చూడగా గదిలోని కిటికీకి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి నిఖిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుల బాధతో వ్యాపారి.. దుబ్బాకటౌన్: చేసిన అప్పులు తీర్చే మార్గం లేక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ కె.కీర్తిరాజు కథనం ప్రకారం... మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఎండీ సమీర్ (26) వివిధ వారాంతపు సంతల్లో చెప్పుల వ్యాపారం నిర్వహిస్తూ, భార్య ఫరానా బేగం, ఐదేళ్లలోపు ఉన్న ముగ్గురు కుమార్తెలు, తల్లిదండ్రులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల వ్యాపార నిర్వహణలో రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. దీంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక కొంత కాలంగా తనలో తాను బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం దుబ్బాకలో జరిగే సంతలో చెప్పులు అమ్మేందుకు సమీర్ ఎక్స్ఎల్ వాహనంపై చెప్పుల లోడ్‌తో వచ్చాడు. సాయంత్రం ఫోన్ స్విచ్చాఫ్ చేసి, పట్టణ శివారులోని రామ సముద్రం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతకు వెళ్లిన కుమారుడు సాయంత్రమైనా తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ అవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి దుబ్బాకకు చేరుకొని గాలించారు. చెరువు కట్ట వద్ద ఎక్స్ఎల్, చెప్పులు, బండి తాళాలు ఉండడం చూసి, వెంటనే పోలీసులకు చెప్పారు. ఆదివారం ఉదయం పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందితో చెరువులో గాలించగా, సమీర్ మృతదేహం బయటపడింది. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ప్రశాంతంగా నీట్
2,597 మంది అభ్యర్థులు హాజరు ● నిమిషం ఆలస్యంతో విద్యార్థినికి నో ఎంట్రీసంగారెడ్డి ఎడ్యుకేషన్: వైద్య కళాశాలల్లోని పలు కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ రీ ఎగ్జామ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష రాసేందుకు సమయం 180 నిమిషాలు మాత్రమే ఉంటుండగా ప్రస్తుతం పరీక్ష రాసేందుకు 195 నిమిషాల సమయాన్ని కేటాయించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 నిమిషాల వరకు జరిగింది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందు నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 2,924 మంది అభ్యర్థులకు గాను 2,597 మంది హాజరు కాగా 327 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. తారా కళాశాలలో ఒక విద్యార్థి నిమిషం ఆలస్యం రావడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్, డీఎస్పీ సత్తయ్యగౌడ్ సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. డల్లాస్ నుంచి వచ్చి.. హిమనీష్ వెలువలి అనే విద్యార్థి కుటుంబం అమెరికాలోని డల్లాస్‌లో స్థిర పడింది. నీట్ రాసేందుకు సంగారెడ్డికి వచ్చాడు. హిమనీష్ బీరంగూడలోని అతడి పెదనాన్న ఇంటికి చేరుకుని అక్కడి నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. గత నెలలో జరిగిన పరీక్ష కు సైతం హాజరయ్యాడు. ఒకసారి వస్తే సుమారు రూ.2 లక్షల ఖర్చు అయ్యిందని, రెండు సార్లు పరీక్ష రాసేందుకు రావడంతో రూ.4 లక్షల ఖర్చు అయ్యిందని వాపోయాడు. -
ఆస్పత్రి నుంచి వెళ్లి.. నదిలో శవమై
జోగిపేట(అదోల్)/చిలప్‌చెడ్ (నర్సాపూర్): మానసిక పరిస్థితి బాగా లేని వ్యక్తి ఆస్పత్రి నుంచి వెళ్లి నదిలో శవమై తేలాడు. ఈ సంఘటన జోగిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలో నివాసం ఉంటున్న మేకల బసంత్(45) మానసికంగా ఇబ్బందులకు గురి అవుతుండటంతో గురువారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు భార్య టీ తాగించిన అనంతరం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య తుల్జమ్మ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా ఎలాంటి సమాచారం తెలియకపోగా ఆదివారం మధ్యాహ్నం చిలప్‌చెడ్ మంజీర నదిలో ఒడ్డుకు చేరిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా సర్పంచ్ అనీల్‌కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జోగిపేట పీఎస్‌లో మిస్సింగ్ కేసు ఉండటంతో మృతదేహాన్ని జోగిపేటకు తరలించారు. -
శివకుమార్‌కు హరీశ్‌రావు పరామర్శ
జహీరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్‌ను పరామర్శించారు. శివకుమార్ తండ్రి ఈశ్వరయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న హరీశ్‌రావు ఆదివారం జహీరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న శివకుమార్‌ను హరీశ్‌రావు ఓదార్చారు. ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, ఆయా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, వై.నరోత్తం, ఎం.డి.తన్వీర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, భిక్షపతిలతోపాటు ఆయా పార్టీల నాయకులు శివకుమార్‌ను పరామర్శించారు. -
‘బెస్ట్ అవైలబుల్’ సమస్యలు పరిష్కరించాలి
గజ్వేల్‌రూరల్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వివిధ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం గజ్వేల్‌లో మాల సంఘాల జేఏసీ వైస్‌చైర్మన్ తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న వారిలో కొంతమంది విద్యార్థుల జాబితా ఆన్లైన్లో నమోదు కాలేదన్నారు. దీంతో సదరు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలపై సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. చైర్మన్ బక్కి వెంకటయ్య సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ కమిషనర్‌తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎల్లేశ్, యాదగిరి, శివకుమార్, రాజేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి దుబ్బాకరూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం మండలంలోని హబ్సిపూర్‌లోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఓటు నమోదుపై అవగాహన కల్పించాలి
మంత్రిని కలిసిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ప్రతినిధులుహుస్నాబాద్: సర్ కార్యక్రమం సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటరు జాబితాలో కొనసాగింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధి సుతారి సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మంత్రిని కలిసి చర్చించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటును కొనసాగించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -
వేపకు ఏమైంది!
● కనిపించని పూత, కాత ● వేప గింజల కొరతజహీరాబాద్ టౌన్: ఆయుర్వేదంలో వేప చెట్టును సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. వేప ఆకు, పూత, కాత ఇలా చెట్టు నుంచి వచ్చే ప్రతిది ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌తో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతూ మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. మొన్నటి వరకు మునుపెన్నడూ లేని విధంగా ఒకటి రెండు కాదు..ఊర్లు, పట్టణాలు, పొలం గట్లపై ఎక్కడ చూసినా ఎండిపోయిన వేపచెట్లు దర్శనమిచ్చాయి. ఉగాది పర్వదినం నాటికి వేప చెట్లు మళ్లీ జీవం పోసుకున్నాయి. పచ్చని ఆకులతో చెట్లకు పూర్వ వైభవం వచ్చింది. కానీ జూన్ నెల వచ్చినా చెట్లకు కనిపించాల్సిన కాత రాలేదు. ఈ సారి వేప పువ్వు లేకుండానే ఉగాది పచ్చడిని చేసిన విషయం తెలిసిందే. వేప గింజల నుంచి కషాయాలు, పిండి, నూనె, సబ్బులు, పేస్టులతో పాటు చర్మ సంబంధిత ఔషధాలను తయారీ చేస్తారు. ఈ సారి చెట్లకు కాత లేకపోవడంతో గింజల కొరత నెలకొంది. -
ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు వేళాయె..
నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం కోసం సోమవారం నుంచి ఐదు రోజుల పాటు టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాకు ఒక సెంటర్ చొప్పున సిద్దిపేటలోని రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలకు కౌన్సెలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌలభ్యం కోసం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రస్తుతం హుస్నాబాద్‌లో కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. సోమవారం నుంచి స్థానిక శాతవాహన యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 19 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కావడంతో మొదటి రోజు కౌన్సెలింగ్‌కు రాజగోపాల్‌పేట కళాశాలకు 428 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా హుస్నాబాద్‌కు సెంటర్ కేటాయించిన విషయం తెలియకపోవడంతో 42 మంది విద్యార్థులు మాత్రమే స్లాట్‌బుక్ చేసుకున్నట్లు తెలిసింది.ముందుగా స్లాట్ బుకింగ్.. తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు విద్యార్థుల ఈఏపీసెట్ ర్యాంకుకార్డు, హాల్‌టికెట్, ఆధార్‌కార్డు, పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ బోనఫైడ్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఓసీ విద్యార్థులు 2026లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలి. అలాగే అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీ, ఓటీపీ కోసం మొబైల్ వెంట తీసుకెళ్లాలి.నేటి నుంచి ఐదు రోజులు ధ్రువపత్రాల పరిశీలన -
పుట్టగొడుగుల్లా అక్రమ వెంచరు!్ల
● అక్రమ లే ఔట్లకు అధికారులే అండ ● అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు ● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులుకొండాపూర్(సంగారెడ్డి): ప్రస్తుతం రియల్ ఎస్టేట్ తగ్గిపోవడంతో డబ్బులు సంపాదించుకోవడానికి రియల్ వ్యాపారులు మరో కొత్త పంథాను తెరమీదకు తీసుకువస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా వాటిని ప్లాట్లుగా మారుస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ అందినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి అధికారులతోపాటు అధికారపార్టీకి చెందిన నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామం ప్రస్తుతం హాట్ కేక్‌లా మారింది. ఈ గ్రామ శివారులో గల సర్వే నం 158లో ఒక ఎకరా 8 గుంటల వ్యవసాయ పట్టా భూమిని కొంతమంది వ్యక్తులు సిండికేట్‌గా మారి అభివృద్ధి చేస్తామని రైతు వద్ద పర్సెంటీజీలుగా మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ భూముల్లో ప్లాట్లు చేయాలంటే తప్పనిసరిగా ఆ భూమిని నాన్అగ్రికల్చర్గా మార్చాలి. కానీ, ఈ నిబంధనలేవీ లేకుండానే వెంచర్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ భూమిలో ప్లాట్లు ఏర్పాటు చేసి బోర్లను కూడా ఏర్పాటు చేశారు. వెంచర్లో ఇళ్లు నిర్మించి వాటిని తక్కువ ధరలకే అంటూ విక్రయించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాపూర్ శివారులో రూ.30 వేల నుంచి సుమారు రూ.50 వేల వరకు గజం ధర ఉంది. ఒక వంద గజాల స్థలం కొనాలంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అవుతుంది. అదే నిర్మించిన ఇల్లును మాత్రం రూ.50 లక్షలకే అంటూ వారిని మోసం చేసి వాటిని విక్రయించి అమాయక ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారు.ప్రభుత్వ ఆదాయానికి గండి గ్రామాల్లో గల వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలి అంటే ముందుగా నాలా కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఆన్లైన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వెంచర్ ఏర్పాటు చేస్తే నిబంధనలకు అనుగుణంగా 40 ఫీట్ల రహదారితోపాటు అండర్ డ్రైనేజీ వ్యవస్థ, ఆడుకునేందుకు ఆటస్థలంతోపాటు హెచ్ఎండీఏ పర్మిషన్ ఉండాలి. ఇలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. మామూళ్లకు అలవాటు పడి అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.అనుమతుల్లేని వెంచర్లపై చర్యలు కొండాపూర్ మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. ఈ మండలంలో వెంచర్లను ఏర్పాటు చేయాలంటే హెచ్ఎండీఏ పర్మిషన్ తీసుకోవాల్సింది. అక్రమ వెంచర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ముందుగా తక్కువ ధరకే ఇళ్లు అంటే కొని మోసపోవద్దు. – మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సంగారెడ్డి -
రైతుల మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
టీజీటీపీసీ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి వట్పల్లి(అందోల్): వానాకాలం సాగు పంటలు మొదలైనా రైతులకు రైతు భరోసా సాయం అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నోటి మాటలతో కాలం వెళ్లదీస్తూ రైతులను మోసం చేస్తోందని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి మండిపడ్డారు. స్థానిక విలేకరులతో ఆదివారం మాట్లాడుతూ..నాడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేసేవారన్నారు. ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎరువుల సరఫరా దారుణంగా తయారైందన్నారు. తక్షణమే అర్హులైన రైతులందరికీ ‘రైతు భరోసా’డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలిరాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య సంగారెడ్డి: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్‌భవన్‌లో గల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను త్వరగా విడుదల చేయాలన్నారు. 28వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని చెప్పడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను చదువులకు దూరం చేయడం ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వమే ప్రోత్సహించినట్లు అవుతుందని మండిపడ్డారు. బీసీ సంఘం తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రొఫెసర్ జయశంకర్ బాటలోనే టీఆర్ఎస్సంగారెడ్డి జిల్లా పార్టీ ఇన్చార్జి బాలయ్య జోగిపేట(అందోల్): ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలోనే మాజీ ఎమ్మెల్సీ కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ నడుస్తుందని సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాలయ్య తెలిపారు. ఆదివారం జోగిపేటలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం హనుమాన్ చౌరస్తాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆయన తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తు చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. -
అర్హులైన వారు ఓటరుగా నమోదవ్వాలి
జోగిపేట(అందోల్): అర్హులైన ప్రతీ ఒక్క పౌరుడు ఓటరుగా నమోదయ్యేలా బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఆందోల్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ఆందోల్, వట్పల్లి, పుల్కల్, చౌటకూరు మండలాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ (బీఎల్ఏ)లతో మంత్రి సంగారెడ్డిలోని తన నివాసంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సవరణలు చేపట్టేందుకు కృషి చేయాలని, అర్హులైన ఓటరు ఓటర్ల జాబితా నుంచి తొలగింపు లేకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమన్నారు. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కుపై అవగాహన పెంపొందించే దిశగా బూత్ లెవెల్ ఏజెంట్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆందోల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. జర్నలిస్ట్ భూమయ్యను పరామర్శించిన మంత్రి సికింద్రాబాద్–బోయినపల్లిలోని హెకా రిహబ్ సెంటర్లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చికిత్స పొందుతున్న ఆందోల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు కనకంటి భూమయ్యను ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భూమయ్యకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.బూత్ లెవెల్ ఏజెంట్లతో మంత్రి దామోదర రాజనర్సింహ -
దూసుకొచ్చిన మృత్యువు..
● రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బైక్ ● అక్కడికక్కడే గృహిణి దుర్మరణంవర్గల్(గజ్వేల్): బైక్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు గృహిణిని కబళించింది. ఈ దుర్ఘటన శనివారం రాత్రి మండలంలోని గౌరారం వద్ద రాజీవ్‌రహదారిపై చోటు చేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, స్థానికులు కథనం ప్రకారం... గౌరారం గ్రామానికి చెందిన పూదరి వెంకటేశ్‌గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య మంజుల(37), పద్మాలుగేళ్లలోపు అనీశ్‌గౌడ్, శ శాంక్‌గౌడ్ ఇద్దరు కుమారులున్నారు. శనివారం రాత్రి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి, నడుచుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నది. మామిడ్యాల కమాన్ వద్ద రోడ్డు దాటుతుండగా చేర్యాలకు చెందిన కాత అజయ్ బైక్‌పై హైదరాబాద్ వైపు నుంచి మితిమీరిన వేగంతో వెళ్తూ ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అప్పటివరకు బంధుగణంతో, కుటుంబీకులతో మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపిన మంజుల కొద్ది సేపట్లోనే మృతిచెందడంతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు. బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని తొనిగండ్ల గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... దంతేపల్లికి చెందిన దేవరాజు, రాజయ్య స్వగ్రామం నుంచి బైక్‌పై రామాయంపేట వస్తుండగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఎస్ఐ బాల్‌రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతన్న వర్షాతిరేకం
● వర్షంతో పంటలకు ప్రాణం ● విత్తనాలు విత్తుకోవడంలో రైతులు బిజీన్యాల్కల్(జహీరాబాద్): కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. సాగుకు సన్నద్ధమవుతున్న రైతులతోపాటు సాగు చేసుకున్న వారు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజులుగా వర్షాలజాడ లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. సాగు చేసుకున్న పంటలకు ప్రాణం పోసినట్లు కాగా, వేసే పంటలకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. 2.70లక్షలు ఎకరాల్లో పంటల సాగు అకాల వర్షాలతో పాటు జూన్ ప్రారంభంలో కురిసిన కొద్ది పాటి వర్షాలకు కొంత మంది రైతులు విత్తనాలను విత్తుకోగా మరి కొంత మంది రైతులు వేచి చూసే ధోరణిని అవలంబించారు. జిల్లాలో 2.70లక్షలు ఎకరాల్లో పంటలు సాగు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా 1.70 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసుకున్నారు. సాగు చేసుకున్న పంటల్లో కొన్ని మొలకెత్తగా మరి కొన్ని కుళ్లిపోయి మొలకెత్తలేదు. 14 మిల్లీ మీటర్ల వర్షం గత వారం రోజులుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవగా రాత్రి అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 14.1 మి.మీ వర్ష పాతం నమోదైంది. ఝరాసంగంలో 54.3, కొండాపూర్‌లో 35.2, న్యాల్కల్లో 30.0, కోహీర్‌లో 22.3, సిర్గాపూర్ మండలాల్లో 20.0 మిల్లీ మీటర్ల అధిక వర్షపాతం నమోదు కాగా నిజాంపేట్, అమీన్పూర్, నారాయణఖేడ్, హత్నూర, ఆర్సీపురం, జహీరాబాద్, మొగుడంపల్లి తదితర మండలాల్లో తక్కువ వర్ష పాతం నమోదైంది. పంటలు సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఒత్తిడిని తగ్గించే ఔషధం ‘యోగా’
సిద్దిపేటకమాన్: నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల ను నిర్వహించే పోలీసు సిబ్బందికి యోగా అద్భుతమైన ఔషధమని సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరు మాళ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీ, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన పోలీస్ బలగమే సురక్షితమైన సమాజానికి పునాది అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్ సుభాస్ చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు మహేందర్‌రెడ్డి, మురళి, లక్ష్మీబాబు, విద్యాసాగర్, వాసుదేవరావు, ముత్యంరాజు, దుర్గ, ఎస్ఐలు కరుణాకర్‌రెడ్డి, రాజేశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐబీ భవనం.. అధ్వానం
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో ఐబీ భవనం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. లక్షలు వెచ్చించి తూప్రాన్– నర్సాపూర్ హైవే పక్కన శివ్వంపేటలో నిర్మించిన ఐబీ భవనం నిరుపయోగంగా మారింది. సంబంధిత శాఖ భవనం వినియోగించకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి ప్రజా అవసరాల నిమిత్తం భవనంను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీకి వినతి నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి నిధులు విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావుకు వార్డు సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఆదివారం ఆయన ను కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో అత్యవసరంగా అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం మొత్తం రూ. 40 లక్షల నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని ప్రవీణ్ కుమార్, సంజీవులు, మల్లేశం, పురుషోత్తం పాల్గొన్నారు. ధాన్యం విషయంలో తప్పుడు ఆరోపణలు తూప్రాన్: కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇచ్చినా రేవంత్‌రెడ్డి సర్కారు బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం తూప్రాన్ మున్సిపల్ రెండవ కౌన్సిలర్ చందా అశోక్ యాదవ్ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధాన్యానికి, బియ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన ప్రభుత్వం అవగాహన లేమితో బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. స్క్రాప్ షాప్ యజమానికి జరిమానా మెదక్ కలెక్టరేట్: పట్టణంలోని 12వ వార్డులో రోడ్డుపై చెత్తవేసి తగులబెట్టినందుకు మున్సిపల్ శానిటేషన్ అధికారులు స్క్రాప్ షాపు నిర్వాహకుడికి ఆదివారం రూ.3వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా శానిటేషన్ అధికారులు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఎవరైనా చెత్తను రోడ్లపై గాని, ఖాళీ స్థలాల్లో గాని వేసి తగలబెట్టినట్టు మా దృష్టికి వస్తే వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రోడ్లపై, మురుగు కాల్వల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయొద్దని సూచించారు. ఇంటి వద్దకు వస్తున్న మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రజలు తమ వంతు బాధ్యత నిర్వహించాలని కోరారు. ఓవర్ లోడ్ వాహనాల సీజ్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు, జిల్లా రవాణాశాఖ అధికారి యోగేశ్వర్ జాదవ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అధిక లోడ్‌తో వెళ్తున్న 6 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ఫ్లైయాష్, డస్ట్, తదితర వాహనాల్లో మోతాదుకు మించి లోడ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. అందువల్ల వాహనదారులు పరిమితికి మించి లోడ్ వేయరాదన్నారు. ఈత చెట్ల దగ్ధంపై ఫిర్యాదు చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వేచరేణి గ్రామ శివారు ఈత వనానికి నిప్పుపెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామ గౌడ సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కొమురవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2004లో అప్పటి ప్రభుత్వం గౌడ సంఘం సొసైటీకి 4 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. ఆ భూమిలో 2006లో సుమారు 5వేల ఈత మొక్కలు నాటారన్నారు. ఈత చెట్లకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పు అంటించడంతో సుమారు 200 ఈత చెట్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. -
ఉప‘యోగా’లెన్నో !
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పలు చోట్ల యోగా కార్యక్రమాలను నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని యోగాభవన్తోపాటు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యోగా డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలను వేశారు. ఈ యోగాసనాలు వేయడం వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్థులకు కేవలం కంప్యూటర్లు, సెల్ఫోన్లు నిత్యావసర వస్తువులుగా మారిన తరుణంలో మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి నిత్య యోగా సాధనను మించిన ఔషధం మరొకటిలేదన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. యోగా శిక్షణ ద్వారా శారీరక, మానసిక రుగ్మతలైన బీపీ, షుగర్, నడుం, వెన్ను, మోకాళ్ల నొప్పులు తదితర అనారోగ్య సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని వివరించారు. -
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
సంగారెడ్డి : రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..కేంద్రం చెప్పిన కోట వరకు మాత్రమే పంటలు కొంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా ఒక్క గింజ కూడా కొనబోమని చెప్పడం రైతులకు మరణశాసనం లాంటిదన్నారు. అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాధలుగా మార్చే దుర్మార్గానికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందని విమర్శించారు. వ్యవసాయాన్ని ఇప్పటికే సంక్షోభంలోకి నెట్టి రైతుల బతుకును చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సొమ్మును ఢిల్లీకి పంపడమే చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లపాటు ధైర్యంగా బతికిన రైతును మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధువుగా రైతు కష్టాలు తెలిసిన నాయకుడిగా రాష్ట్రంలో అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేశానికే ఆదర్శంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. అన్ని రకాల పంటల ఉత్పత్తితో తెలంగాణ దేశానికే ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు. రాష్ట్రంలోని ప్రజల పక్షాన, రైతుల పక్షాన వారికి అండగా ఉంటూ బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, విఠల్, నాయకులు శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ నాయక్, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.జోగిపేట(అందోల్): రైతుల సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. అందోలు లక్ష్మినర్సింహగార్డెన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా చేతులెత్తేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. వరి ధాన్యాన్ని ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు ఇప్పుడు మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోకుండా అన్నీ పంటలను సీలింగ్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు పి.నారాయణ, పల్లే సంజీవయ్య, మాజీ ఎంపీపీ రామగౌడ్, చంద్రయ్య, నాయకులు లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
కలెక్టర్ హైమావతి కొండపాక(గజ్వేల్): పాఠశాలల్లో మెరుగైన చదువు తో పాటు రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాకలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం తీరు, వసతు లు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన బోధన అందుతు న్నాయన్న విషయాన్ని ఉపాధ్యాయులు విరివిగా ప్రచారం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. నాసిరకం కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే హెచ్‌ఎంలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తండ్రి కష్టం చూశా.. భవిష్యత్తులో ఎస్సై అవుతా..
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన రఘుపతి పోచయ్య, ఇందిర దంపతులకు కీర్తన, అశ్రుత, నవదీప్ సంతానం. పొద్దున్నే లేచి, నదికి వెళ్లి చేపలు పట్టుకొచ్చి అమ్మితే గానీ పూట గడవని పరిస్థితి. చిన్నప్పటి నుంచి సెలవు దినాల్లో తండ్రితో పాటు చేపల వేటకు వెళ్లేది అశ్రుత. అక్కడ చేపలు పట్టడంలో తండ్రి నుంచి మెలకువలు నేర్చుకుంది. వాటిని తన కిష్టమైన కబడ్డీ ఆటకు అన్వయించుకునేది. అలా కబడ్డీ విభాగంలో తదితర జిల్లా, జూనియర్స్, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడి సత్తా చాటింది. కాగా పాపన్నపేటలో బతుకు సాగక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తున్నారు. ఇటీవల పదో తరగతి పాస్ అయింది. కబడ్డీ తన శ్వాస అని, ఎస్సై కావాలన్నదే తన జీవిత ఆశయమని అశ్రుత తెలిపింది. – అశ్రుత. పాపన్నపేట -
ఎన్జీటీ ఆరా
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026అక్రమ మైనింగ్పైనివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)ఆరా తీసింది. మైనింగ్ చట్టాలను ఉల్లంఘించి, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి ఖనిజ సంపదను కొల్లగొడుతున్న తీరుపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని చైన్నెలోని ఎన్జీటీ దక్షిణ విభాగం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. నిజనిర్ధారణ కోసం సంయుక్త కమిటీని నియమించింది. కలెక్టర్ తరఫున నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమాహారతి, కాలుష్యనియంత్రణ మండలి తరఫున మరో అధికారిని నియమించారు. ఈ కమిటీ ఇటీవలే పటాన్చెరు మండలం లక్డారం, జిన్నారం మండలం ఖాజీపల్లిల్లోని మెటల్ క్వారీలను సందర్శించింది. ఈ కమిటీ సభ్యులు ప్రతీ క్వారీని సందర్శించి అక్కడ జరుగుతున్న ఉల్లంఘనలను పరిశీలించింది. పర్యావరణ నిబంధనలను తుంగలోతొక్కి, మైనింగ్ చట్టాల ఉల్లంఘనల తీరుపై ఈ కమిటీ ఎన్జీటీకి నివేదిక ఇవ్వనుంది. యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందా జిల్లాలో స్టోన్ అండ్ మెటల్ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. విలువైన ఖనిజ సంపదను లూఠీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌తోపాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వారి బినామీల పేర్లతో ఈ అక్రమ దందా సాగుతుండటంతో అడిగే నాథుడే లేకుండా పోయారు. ఈ మైనింగ్ మాఫియా గనులశాఖకు ఎగవేసిన సీనరేజీ ఏకంగా రూ.974 కోట్లు ఉందంటే..కొల్లగొట్టిన సహజ సంపద ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ మైనింగ్ మాఫియా పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కుతోంది. చెరువులు, కుంటలు తేడా లేకుండా క్రషర్లను నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ఆపాల్సిన భూగర్భ గనులశాఖతోపాటు, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులకు ప్రతీనెలా పెద్ద మొత్తంలో ముడుపులు ముడుతుండటంతో ఆయా శాఖల అధికారులు కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించడంతో ట్రిబ్యూనల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఈ క్వారీలను సందర్శించామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి ‘సాక్షి’ప్రతినిధితో తెలిపారు. నిజనిర్ధారణ కోసం సంయుక్తకమిటీ నియామకం లక్డారం, ఖాజీపల్లి క్వారీలు,క్రషర్లను సందర్శించిన కమిటీ -
కార్మికులకు మెరుగైన వైద్య సేవలు
పటాన్చెరు టౌన్/రామచంద్రాపురం(పటాన్చెరు): కార్మికులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రిని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వివిధ విభాగాల్లో వైద్యుల సంఖ్యతో పాటు మరింత మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. రామచంద్రాపురం జాతీయరహదారి నుంచి ఆస్పత్రి వరకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు. మల్లికార్జున స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని వివేక్ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర సుభిక్షం కోసం ప్రార్థించారు. అనంతరం ఆలయ ఈఓ దేవానందం, చైర్మన్ సుధాకర్ యాదవ్‌లు మంత్రి, ఎంపీ దంపతులతోపాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటు సుధా దంపతులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.హరిచందన తదితరులు పాల్గొన్నారు.మంత్రి వివేక్ -
ఆధునిక సాగుతో అధిక దిగుబడులు
న్యాల్కల్(జహీరాబాద్): ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చని శాస్త్రవేత్తలు(ఏజీ హబ్) వెంకటేశ్వర్లు, జెల్ల సత్యనారాయణ, రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గంగ్వార్ గ్రామ శివారులో రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం డిజిటల్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వ్యవసాయ రంగంలో ఖర్చులను తగ్గించి దిగుబడులు పెంచేందుకు డిజిటల్ వ్యవసాయం ఎంతగానో దోహద పడుతుందన్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే తెలుసుకుని నివారణ చర్యలు చేపట్ట వచ్చని సూచించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అడిగిన ప్రశ్నలను నివృతి చేశారు. కార్యక్రమంలో ఏజీ హబ్ శాస్త్రవేత్తలు శ్రీకాంత్‌రెడ్డి, బల్రాంరెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్‌తో పాటు రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.ఏజీ హబ్ శాస్త్రవేత్తలు -
చెరువుకు రూ.500 కోట్లు
మహబూబ్ సాగర్ సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ చెరువు (మహబూబ్ సాగర్)ను రూ.500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అన్ని హంగులతో మహబూబ్‌సాగర్ చెరువును అభివృద్ధి చేసేలా చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. కిలోమీటరున్నర పొడవున ఉన్న చెరువు కట్టను అభివృద్ధి చేయడంతోపాటు, నెక్లెస్‌రోడ్, పార్కులు ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు. సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలతోపాటు, హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ఆహ్లాదం పంచేలా కింది బజార్ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కింది బజార్ చెరువు కట్ట పనులకు శంకుస్థాపన చేసేలా పనుల్లో వేగం పెంచాలని, అవసరమైన అన్ని ప్రతిపాదనలు పూర్తి చేయాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. సర్వాంగ సుందరంగాతీర్చిదిద్దేలా ప్రణాళికలు త్వరలో పనులకు శంకుస్థాపనచేయనున్న సీఎం రేవంత్ అధికారులతో జగ్గారెడ్డి, నిర్మల సమీక్షచెరువును పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మల దంపతులు అఽదికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జగ్గారెడ్డి, నిర్మల సంబంధిత అధికారులతో కలిసి కింది బజార్ చెరువు కట్ట వద్దకు వెళ్లారు. అలుగు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. వారి వెంట నాయకులు అనంతకిషన్ ,కూన సంతోశ్, కిరణ్‌గౌడ్ తదితరులున్నారు. -
మురిపించి.. ముఖం చాటేసి
వర్షాల కోసం రైతన్న ఎదురుచూపులుసంగారెడ్డి జోన్: రోహిణి కార్తెలో మురిపించిన వర్షాలు నేడు ముఖం చాటేశాయి. వానాకాలం సీజన్ ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు కురుస్తాయేమోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగులుతుంది. ఎల్‌నినో ప్రభావంతో రోజురోజు వర్షాలు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు పలు రైతులు పత్తి విత్తనాలు విత్తుకోగా, మరి కొంతమంది విత్తుకొనేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్న క్రమంలో వర్షాలు సక్రమంగా కురువకపోవటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 7,62,580 ఎకరాల్లో పంటల సాగు ఈ వానాకాలం సీజన్లో 7,62,580 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేశారు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు భూమిలో పదను పోయినప్పటికి చాలామంది రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అధికంగా పత్తి, పంటతోపాటు వరి, చెరుకు, ఇతర పంటలు సాగు చేస్తుంటారు. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలకు అంతరాయం కలగటంతో వానాకాలంలో సైతం ఎండలు దంచి కొడుతూ వేసవిని తలపిస్తుంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనాలు వేసింది. జిల్లాలో జూన్ నెలలో 120.00 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 61.3 మి.మీలు కురిసింది. జులైలో 194.2 మి.మిల వర్షం కురవాల్సి ఉంది. రెండు నెలల్లో ఏ స్థాయిలో వర్షం కురుస్తుందో వేచి చూడాల్సి ఉంది. చాలా మండలాల్లో తక్కువ వర్ష పాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మరింత తక్కువగా వర్షాలు కురుస్తాయని అధికారుల అంచనా. అకాల వర్షాలకు విత్తుకున్న పత్తి విత్తనాలు రోహిణి కార్తెలో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో చాలాచోట్ల పత్తి విత్తనాలను ఇప్పటికే విత్తుకున్నారు. నేలలో తేమ శాతం లేకపోయినప్పటికీ రైతులు ముందడుగు వేశారు. మే నెలలో 27.8మి.మీల వర్షం కురువాల్సి ఉండగా 41.9మి.మీలు కురిసింది. దీంతో రైతులు జూన్ నెలలో కూడా వర్షాలు త్వరగా కురుస్తాయని ఆలోచనతో విత్తనాలు వేసేశారు. వర్షాలు కురువకపోవటంతో మొలకెత్తని విత్తనాలు భూమిలోనే పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు మొలకెత్తిన పత్తి మొక్కలు కాపాడుకునేందుకు బిందు సేద్యంతో నీటిని అందిస్తున్నారు. పంటల సాగుపై ప్రతికూల ప్రభావం ఎల్‌నినో ప్రభావం రైతులకు తీవ్రస్థాయిలో కలవర పెడుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వేడి గాలులు పెరిగి, భూగర్భ జలాలు తగ్గే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాల్సిన అవసరముందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు తట్టుకునే విధంగా సాగయ్యే సోయాబీన్, కంది, పెసర, మినుము పంటలతోపాటు స్వల్ప కాలిక పంటలు సాగు చేసుకోవాలి. వాణిజ్య పంటలలో తక్కువ సమయంలో పంట చేతికొచ్చే వైరెటీ రకాల విత్తనాలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వానకాలం సీజన్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్ రోహిణి కార్తె వర్షాలకే విత్తనాలువిత్తుకున్న రైతులు పంటల సాగుపై రైతుల అయోమయం -
నిధుల దుర్వినియోగం ఫిర్యాదుపై విచారణ
సిద్దిపేటరూరల్: పుల్లూరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గత ప్రజావాణి కార్యక్రమంలో గ్రామానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం డీఎల్పీఓ చందన విచారణలో భాగంగా రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ నుంచి సంబంధించిన సమాచారం, పూర్తి విచారణ కోసం రికార్డులను సేకరించామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నిధులను తప్పుదారి పట్టిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రజిత, పంచాయతీ కార్యదర్శి గౌస్, తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు శివ్వంపేట(నర్సాపూర్): బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. మండల పరిధి లోని టిక్య దేవమ్మగూడం తండాలో 16 ఏళ్ల బాలికకు ఆదివారం వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు, పోలీసులు శనివారం తండాకు చేరుకున్నారు. ముందుగానే అధికారుల రాకను గమనించిన కుటుంబ సభ్యులు బాలికను కనిపించకుండా మరోచోటికి తరలించారు. దీంతో అధికారులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ బాలికకు వివాహం చేస్తే చట్టప్రకారం కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆదివారం బాలికను అప్పగించాలని లేకపోతే కిడ్నాప్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం అధికారి శంకర్‌గౌడ్, కార్యదర్శి నరేశ్, అంగన్వాడీ టీచర్ సరిత, తదితరులు ఉన్నారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి పాపన్నపేట(మెదక్): చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... మండల పరిధిలోని యూసుఫ్‌పేటకు చెందిన నర్ర రాములు (48) చేపలు పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఈ నెల 18న చేపలు పట్టేందుకు వల తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో నీట మునిగి చనిపోయాడు. సాయంత్రం వరకు అతను ఇంటికి రాకపోయే సరికి కుటుంబీకులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం చెరువు కట్టపై అతని బట్టలు, చెప్పులు, ఫోన్ కనిపించే సరికి, అనుమానంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా రాములు మృతదేహం లభ్యమైంది. వ్యక్తి దారుణ హత్య సంగారెడ్డి క్రైమ్: యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లాకు చెందిన వడ్ల నగేశ్(25), కొన్నేళ్లుగా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. శనివారం ఉదయం మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడి వద్ద లభించిన ఆధారాలతో నగేశ్‌గా గుర్తించారు. మృతుడి శరీరంపై ఆయుధాలతో దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పట్టణ సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఖేడ్‌కు అంబేడ్కర్ స్టడీసర్కిల్
ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి నారాయణఖేడ్: ఖేడ్‌కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ మంజూరు కానుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను హైదరాబాద్‌లో కలిసినట్లు తెలిపారు. ఖేడ్‌కు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఆవశ్యకతను వివరిస్తూ నిధులను మంజూరు చేయాలని కోరగా మంత్రి లక్ష్మణ్ సానుకూలంగా స్పందిచినట్లు వివరించారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలోని పలు అభివృద్ధి పనులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించినట్లు తెలిపారు. మంజీరా నదిపై రోడ్‌కం డ్యామ్ నిర్మాణం గూర్చి ఇటీవల నిర్వహించిన సర్వే గూర్చి వివరించి నిధుల విడుదల కోసం కోరినట్లు చెప్పారు. పలు పనుల మంజూరుకు మంత్రి హామీనిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి ఉత్తమ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కను బహూకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజీయే రాజమార్గంజిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొ న్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్‌అదాలత్ ద్వారా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించుకోవచ్చని, ప్రజలకు సులభమైన, వేగవంతమైన న్యాయం అందించడం కోసం వీటిని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజీమార్గంతో ఇరువర్గాల మధ్య తగాదాలను, పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం లబ్ధి పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, కలెక్టర్ ప్రతీక్ జైన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. పెన్నార్ ఎన్నికల్లో బీఆర్టీయూ హ్యాట్రిక్46 ఓట్ల మెజార్టీతో గెలుపు పటాన్చెరు టౌన్: జీపీ కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడ పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్టీయూ వరుసగా మూడోసారి విజయం సాధించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 465 ఓట్లకు గాను 460 ఓట్లు పోలవగా, బీఆర్టీయూకు 253 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సీఐటీయూకు 207 ఓట్లు లభించాయి. దీంతో బీఆర్టీయూ 46 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయోత్సవ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ...ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నాయకత్వంపై కార్మికులు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారన్నారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రతి కార్మికుడికి బంగారు భవిష్యత్తు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
తండ్రి కలను కొడుకులు సాధించారు
అమీర్ జానీ.. కష్టపడితే కానీ నోటికి ముద్ద అందని పరిస్థితి. 40 ఏళ్ల క్రితం క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. మంచి క్రికెటర్ కావాలనే ఆయన ఆశయానికి పేదరికం అడ్డుగా నిలిచింది. దీంతో కుటుంబ పోషణ కోసం తన కలను చెరిపేసి టెంట్హౌస్పై ఆధారపడ్డాడు.. సిద్దిపేట పట్టణానికి చెందిన అమీర్ జానీ. ఆగిపోయిన తన కల సార్థకత అయ్యేందుకు కుమారులకు క్రికెట్లో తనకు ఉన్న నైపుణ్యం వారికి అందించారు. తండ్రి, కోచ్ తరహాలో ద్విపాత్ర పోషించి వారిని ఉత్తమ క్రికెటర్లగా తీర్చిద్దేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. తండ్రి లక్ష్యం కోసం ఇద్దరు కుమారులు అర్ఫాజ్, ఆఫ్రిదీ ఆటపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల టీజీ 20 వేలంలో మహ్మద్ అర్ఫాజ్ అహ్మద్(గోరు)ను అనురాగ్ నల్లగొండ నైట్ జట్టు రూ.11 లక్షలకు, మహ్మద్అఫ్రిదీని పాలమూరు స్టైకర్స్ జట్టు రూ 2.3లక్షలకు కొనుగోలు చేశాయి. ఇద్దరికి మొదటి క్రికెట్ కోచ్ నాన్న అమీర్ జానీనే అని అర్ఫాజ్, అఫ్రిదీ చెప్పారు. -
సీసీ కెమెరాలతోనే నేరాల నియంత్రణ
డీసీపీ చింతమనేని శ్రీనివాస్పటాన్చెరు టౌన్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహీధర లగ్జూరియా విల్లాస్ యాజమాన్యం మహీధర విల్లాస్ –3 జోన్స్‌లో 50 సీసీ కెమెరాలను స్వర్ణాక్షి డెవలపర్స్ అధినేత విజయ సాగర్, సాయి సహకారంతో ఏర్పాటు చేయగా వాటిని డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలు, విల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేరాలు జరిగిన సందర్భాల్లో నిందితులను వేగంగా గుర్తించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొనే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటుకు శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరమని, ఇంటికి తాళం కంటే సీసీ కెమెరా విలువ ఎక్కువ అని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వినాయక రెడ్డి, ఎస్ఐ ఆసిఫ్ అలీ, స్థానిక నాయకులు స్వాతి రెడ్డి, రమ్య, నవీన్, మురళీధర్ పాల్గొన్నారు. -
మోసం చేసిన యువకుడి రిమాండ్
● రూ. 6 లక్షల రికవరీ ● కేసు వివరాలు వెల్లడించిన సీఐ రేణుకా రెడ్డి టేక్మాల్(మెదక్): ఫేక్ ఇన్‌స్ట్రాగామ్ ఐడీలను క్రియేట్ చేసి ప్రేమ పేరుతో ఇద్దరి యువతులను మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేశ్ జల్సాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నాడు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో తన చదువులకు డబ్బులు కావాలని ఇద్దరి నుంచి బంగారు నగలతో పాటూ రూ.12లక్షలు కాజేశాడు. కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.6లక్షలు రికవరీ చేశారు. టేక్మాల్ ఎస్ఐ అరవింద్‌కుమార్, సిబ్బంది రామకృష్ణ తదితరులు ఉన్నారు. బాలికను పెళ్లి చేసుకున్న కేసులో ముగ్గురు.. పటాన్చెరు టౌన్: బాలికను పెళ్లి చేసుకున్న ఘటనలో ప్రమేయమున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అసోంకు చెందిన బాలిక(17)ను వివాహం చేసుకొని వదిలి పెట్టిన మధ్యప్రదేశ్‌కు చెందిన శివశంకర్‌ను, అనంతరం సహజీవనం చేసిన మహారాష్ట్రకు చెందిన దిగంబర్ను, అలాగే బాలిక తల్లి ఆయాన్ పిచాను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాపర్ వైర్ దొంగల ముఠా.. జహీరాబాద్ టౌన్: కాపర్ వైర్లను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటకలోని బసవకల్యాణ్, బీదర్ ప్రాంతాలకు చెందిన రఘుబాయి(48), సర్జబాయి(34), అమీర్ సాబ్(26)లతో పాటు మరో ఇద్దరు మైనర్ బాలురు పట్టణంలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో చోరీకి పాల్పపడ్డారు. మరమ్మతుల కేంద్రం స్టోర్ రూమ్‌కు రంధ్రం చేసి ఒక కిలో కాపర్, మూడున్నర కిలోల అల్యూమినియం తీగలను ఈ నెల 13న చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా శనివారం బీదర్ చౌరస్తాలో దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద చోరీ చేసిన తీగలను స్వాధీనం చేసుకున్నారు. -
రెండు లారీలు ఢీ..
● డ్రైవర్‌కు త్రీవ గాయాలు ● మూడు గంటలు స్తంభించిన రాకపోకలుశివ్వంపేట(నర్సాపూర్): తూప్రాన్– నర్సాపూర్ హైవేపై శుక్రవారం అర్ధరాత్రి రెండు కంటైనర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. చండీ గ్రామ శివారులో మహరాష్ట్రకుకు చెందిన రెండు లారీలు ఢీకొనడంతో ఓ లారీలోని డ్రెవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులు, ఇతర లారీ డ్రెవర్లు అతికష్టంపై బయటకు తీశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన డ్రెవర్ వీరేందర్కుమార్ని అంబులెన్స్‌లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఢీకొన్న కంటైనర్ లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఇరువైపులా మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు లారీలను పక్కకు తీసి రాకపోకలను పునరుద్ధరించారు. లారీని ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి కొండాపూర్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ సిద్ది ప్రాంతానికి చెందిన ప్రకాశ్ సాకేత కొన్ని నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం పటాన్చెరు మండలం లక్డారం గ్రామానికి వలసవచ్చాడు. డ్రైవర్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం వృత్తిలో భాగంగా కంకర లోడ్‌ను అన్లోడ్ చేసేందుకు మైతాబ్ఖాన్ గూడెం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్ శివారులో రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో డ్రైవర్ ప్రకాశ్ సాకేత అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మామ దాదులాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అల్లాదుర్గం(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో 161 జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ కథనం ప్రకారం... బొలెరో వాహనం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో రాంపూర్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ నయ్యుం పఠాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న అంజాద్ షేక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని అంబులెన్సులో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. లారీ డ్రైవర్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
తండ్రి నేర్పిన క్రమశిక్షణతోనే ఐపీఎస్..
మెదక్‌జోన్: నాన్న చిన్నతనంలో నేర్పిన క్రమశిక్షణ నన్ను ఇంతటివాడిని చేసిందని మెదక్ అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్(ఐపీఎస్) అన్నారు. ఫాదర్స్‌డే సందర్భంగా ఆయనను శనివారం సాక్షి పలుకరించగా ఆయన మాటల్లోనే... మాది ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా. తండ్రి మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ జడ్జి, తల్లి మంజూ సింగ్ గృహిణి. నేను రెండో వాణ్ణి. మా అన్నయ్య ప్రశాంత్‌సింగ్ వివాహమైంది. అన్నా–వదినలిద్దరూ న్యాయయూర్తులుగా పనిచేస్తున్నారు. మా తండ్రి న్యాయమూర్తి కావటంతో చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణగా పెంచాడు. ఆయన సంతోషించినా, బాధపడినా లోలోపలే తప్పా, ఏనాడు బయటకు చెప్పేవారు కాదు. నా ప్రాథమిక విద్య నుంచి బీటెక్ వరకు యూపీలోని ముజఫర్‌నగర్, ఆగ్రా, కాన్పూర్, మీరట్‌లో కొనసాగింది. మా అన్నయ్యతో పాటు నాన్న కోరిక మేరకు 2021లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 2022 బ్యాచ్‌లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. -
ఉద్యాన పంటల సాగును పెంచాలి
● ములుగు విశ్వవిద్యాలయ వీసీ రాజిరెడ్డి ● వర్సిటీలో రైతులతో చర్చా కార్యక్రమంములుగు(గజ్వేల్): రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యాన పంటల సాగును ఐదు లక్షల ఎకరాలకు విస్తరించాల్సిన అవసరముందని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. వర్సిటీలో శనివారం రైతులతో నిర్వహించిన పరస్పర చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వల్ప కాలంలోనే ప్రతి గ్రామం ఉద్యానవన నమూనా గ్రామాలుగా అభివృద్ధి చెందేలా రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యానశాఖల సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యాన పంటల ఉత్పాదకత పెంపు, నాణ్యమైన దిగుబడులు సాధించడం, ఆధునిక సాగు సాంకేతికతల ఆవలంబనలో రైతులకు పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఉద్యాన పంటల్లో తలెత్తే పురుగు, తెగుళ్ల నివారణ, నేల ఆరోగ్య నిర్వహణ, పోషక పదార్థాల సమతుల్య వినియోగం, సమగ్ర పంట నిర్వహణ తదితర అంశాలపై రైతులకు తగు సూచనలు అందజేశారు. రైతులు లేవనెత్తిన సమస్యలకు శాస్త్రవేత్తలు తగిన సాంకేతిక పరిష్కారాలను సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, బోధన సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
నాన్నే నా హీరో...
మెదక్‌జోన్: నా ప్రతి అడుగు, నా ఎదుగుదలలో మా నాన్న కొండల్రావు పాత్ర మరువలేనిది. నా తండ్రే నా హీరో అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఫాదర్స్‌డే సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా తల్లిదండ్రులకు ముగ్గురం సంతానం. తన తండ్రి స్వర్గీయ కొండల్రావు టీచర్ అని చెప్పారు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్నా, చదువే పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తిగా మా తండ్రి ఉన్నత చదువులు చదివించారు. ఆయన చూపిన మార్గాన్ని ఎంచుకుని ముగ్గురం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాం. నేను గ్రూప్–1 అధికారిగా ఎంపికై న రోజు మా నాన్న ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం నా జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం. నేను జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ప్రజలకు సేవ చేస్తున్న దృశ్యాన్ని మా తండ్రి కళ్లారా చూడలేకపోయారనే బాధ నన్ను వెంటాడుతుంది. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. -
తాగునీటి సమస్య పరిష్కరించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): భారతినగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని శుక్రవారం మాజీ కార్పొరేటర్ సింధు రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్‌నగర్ కాలనీ గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉండగా.. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనమైందన్నారు. కావున తాగునీటి సరఫరా వ్యవస్థను జలమండలికి అమీన్పూర్ సర్కిల్‌కు అప్పగించాలని కోరినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని వివరించారు. నీటి సంరక్షణపై అవగాహన మునిపల్లి(అందోల్): నీటి సంరక్షణపై మిషన్ భగీరథ ఏఈ స్వాతి ప్రజలకు అవగాహన కల్పించారు. శుక్రవారం మండలంలోని మగ్దుంపల్లి సర్పంచ్ సరళ ఆధ్వర్యంలో నీటి సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహిచారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకూడదని, మట్టి కుండలను వాడాలన్నారు. అనంతరం రాజకీయ పార్టీలకతీతంగా నాయకులు పాల్గొని మట్టి కుండల్లో నీటిని వాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రసూల్ పటేల్, వీరేశం, వీరన్న, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరికలు నారాయణఖేడ్: స్థానిక నియోజకవర్గంలోని బాణాపూర్, బోరంచ, బెల్లాపూర్, హంగిర్గా(కె), ఎనక్‌పల్లి, జగన్నాథ్‌పూర్, నాగాపూర్లకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఖేడ్ ఇన్చార్జి బాపుమల్‌శెట్టి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు పార్టీలో చేరిన శరణప్ప, నాగిరెడ్డి, కిషన్‌నాయక్, సంగమేష్, మోహన్, సురేష్ పాటిల్, రేఖానాయక్, బుల్లిబాయి, బాబునాయక్లకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలోనాయకులు బీమయ్య, మాణిక్యం, ప్రశాంత్, పండరి పాల్గొన్నారు. ఎస్ఐకు సన్మానం మునిపల్లి(అందోల్): బుదేరా ఎస్ఐ అరవింద్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని చిన్నచల్మెడకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రుద్ర కృష్ణ ఆయనను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.మల్లికార్జున స్వామి దేవస్థానం ఈఓగా దేవనాఽథం పటాన్చెరు టౌన్: అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నెలకొన్న భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈఓగా పనిచేసిన శశిధర్ గుప్తా బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో జిన్నారం పరిధిలోని పలుగుపోచమ్మ దేవస్థానం ఈఓగా విధులు నిర్వహిస్తున్న దేవనాథం శుక్రవారం నూతన ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాయికోడ్(అందోల్): రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ జి.అంజయ్య, రాయికోడ్ ఏఎంసీ చైర్మెన్ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లాపూర్ శివారులో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సిద్దప్పపాటిల్, నాయకులు బస్వరాజ్ పాటిల్, నర్సింహులు తదితరులతో కలిసి సుమారు రూ.2.92 కోట్ల నిధులతో నిర్మించనున్న మార్కెట్ యార్డు గోదాం భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం ఉండేలా గోదాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రాయికోడ్, మునిపల్లి మండలాల రైతులకు గోదాం నిర్మాణంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్‌కుమార్, నాయకులు కేధారినాథ్ పాటిల్, సంగమేశ్వర్ పాటిల్, తుకారామ్, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలి జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఉజ్వల్‌రెడ్డి జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ఆకాంక్ష పార్టీ శ్రేణుల్లో ఉందని, ఇందుకోసం ప్రతీ కార్యకర్త పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి పిలుపు నిచ్చారు. జహీరాబాద్‌లో శుక్రవారం రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ఐక్యత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం రాహూల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, మున్సిపల్ చైర్మన్ యూనూస్, కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, మంకాల్ సుభాష్, శ్రీకాంత్‌రెడ్డి, మోతిరాం, హర్షవర్ధన్‌రెడ్డి, జాఫర్, నాగిరెడ్డి, కౌన్సిలర్లు శ్రీధర్‌రెడ్డి, అరుణ్, జమీలుద్దీన్, జహంగీర్ నిజాం పాల్గొన్నారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించాలిప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకిదేవి సంగారెడ్డి టౌన్: విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకిదేవి పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏఐ డిజిటల్ లెర్నింగ్ అంశాలపై రెండు రోజుల శిక్షణ తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మారుతున్న విద్యా విధానాలకనుగుణంగా విద్యార్థులు ఏఐ డిజిటల్ సాంకేతికపై అవగాహన పెంపొందించుకుంటూ టెక్నాలజీలో ముందుండాలన్నారు. ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ సుగుణరావు, నోడల్ ఆఫీసర్ మంజుల, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి జహీరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని కోరుతూ స్థానిక డిపో వద్ద శుక్రవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వం విలీనానికి సుముఖత వ్యక్తం చేసిందని కార్మిక నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్, శశికుమార్, మోయిన్, యువరాజ్, అహ్మద్, శ్రవణ్, ఎంఎస్.రెడ్డి, ఐఎస్.రెడ్డి, తిప్పన్న, సమి, రత్నం, జీవన్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో విఫలం..
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానిక డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మయూరినగర్ కాలనీలో పటుచోట్ల డ్రైనేజీ రోడ్లపై పారుతుందని తెలిపారు. గత స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా కాలనీల్లో ఎక్కడ చూసిన సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
ఎస్ఐఆర్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
సంగారెడ్డి జోన్: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్‌కనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. సర్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. జిల్లా స్థాయిలో కూడా మరో రెండు రోజుల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
‘కంది’లో సస్యరక్షణ చర్యలు
జహీరాబాద్ టౌన్: కంది పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. శుక్రవారం మొగుడంపల్లి మండలంలోని గుడ్పల్లి, ఇప్పెపల్లి గ్రామాల్లోని కంది పండిస్తున్న రైతులకు ఇక్రిశాట్ ప్రతినిధులు జీవ నియంత్రణ కారకాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ ప్రతినిధులు రాజు, రాజేంద్రప్రసాద్, అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. విత్తన శుద్ధి గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, ఉప సర్పంచ్ అబ్దుల్ మన్నన్, ఏఈఓ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. -
బడి ఒడిలో ఆటాపాట
పుస్తకాలతో కుస్తీ పట్టించడం..పాఠాలు బట్టీ పట్టించే విధానానికి స్వస్తి చెప్పి బడి అంటే స్వతహాగా ఉండే భయం నుంచి చిన్నారులను దూరం చేస్తూ పాఠశాల పట్ల ఆకర్షితుల య్యేలా ప్రీప్రైమరీ తరగత్తుల్లో కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. నారాయణఖేడ్: ప్రభుత్వం కొత్తగా పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా జిల్లాలో మొదట నాలుగు పాఠశాలలు ఉండగా గతేడాది 59, ఈ ఏడాది 132 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించింది. అంగన్వాడీ చిన్నారులతోపాటు కొత్తగా చిన్నారులను ఈ ప్రీప్రైమరీలో చేర్చుకుంటున్నారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సులోపు వారు కావడంతో స్వతహాగా బడి అంటే భయం ఉంటుంది. దీన్ని నివారిచేందుకు వారికి ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన వాతావరణం కల్పిస్తున్నారు. ఆనందంగా..ఆటపాటలతో 12 వారాలు.. చిన్నారులకు చదువంటే భయం పోగొట్టి ఆడుతూ పాడుతూ పాఠశాలకు అలవాటు పడేలా విద్యాశాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యా ప్రవేశ్ అనే పేరుతో 12 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 28 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలి మూడు నెలలపాటు బట్టీ విధానం కాకుండా చిన్న, చిన్న కార్యక్రమాల ద్వారా బోధన చేస్తారు. ఈ 12 వారాలు, 60 పనిదినాల్లో పిల్లలపై పుస్తకాల భారం ఉండకుండా చూస్తారు. రోజుకు 4గంటల పాటు కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇండోర్, ఔట్‌డోర్ ఆటలు, బొమ్మలు గీయడం, మట్టితో వస్తువులు తయారు చేయించడం, చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా వారిలో ఆలోచనా శక్తిని పెంపొందిస్తారు. తరగతి గదిలో చిన్నారికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటలు, పాటలు, బొమ్మలు, కథల ద్వారా బోధిస్తారు. పిల్లల్లో ఆరోగ్యం, యోగక్షేమం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, చురుకై న అభ్యాసకులుగా తీర్చిదిద్దడం అనే మూడు లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కింద అక్షరాలు, రంగులు, ఆకారాలు, ప్రాథమిక గణిత భావనలను నేర్పిస్తారు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక ప్రవర్తనపై అవగాహన కల్పిస్తారు. ఇందుకుగాను పిల్లల కోసం తరగతి గదులను ఆకర్షిణీయంగా తీర్చిదిద్దడం, శిశు స్నేహపూర్వక మరుగుదొడ్లు, ఆట వస్తువుల ఏర్పాట్లకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించనుంది. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, పాఠశాల అంటే భయం తగ్గడం, ప్రాథమిక భాషా, గణిత నైపుణ్యాలకు బలమైన పునాది ఏర్పడటం, 1వ తరగతి బోధనను సులభంగా అర్థం చేసుకునే స్థాయికి చేరుకోగలరని భావిస్తున్నారు. ప్రీప్రైమరీ విద్యార్థులకువిద్యా ప్రవేశ్ కార్యక్రమాలు 12 వారాలు, 60 పనిదినాలు పుస్తకాలతో కుస్తీ, బట్టీ విధానానికి చెల్లుచీటీ ఆహ్లాదకర వాతావరణంలోబడిలో చిన్నారులు -
ఇక వినూత్నం
సహకారం..సాక్షి, సిద్దిపేట: వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్) ఇక సరికొత్త బాటలో పయనించనున్నాయి. సభ్యులకు రుణాలివ్వడం, వాటిని రాబట్టడం, కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం, ఫర్టిలైజర్, బయట నుంచి తెచ్చిన విత్తనాలు అమ్మడం మాత్రమే ఇప్పటివరకు చేశాయి. ఇక పీఏసీఎస్ పరిధిలో సభ్యులచే విత్తనాభివృద్ధి చేయించి వారి బ్రాండ్ మీదనే నాణ్యమైన వరి విత్తనాలు విక్రయించనున్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా నాబార్డు సహకారంతో సీడ్ ప్రొడక్షన్‌కు నడుం బిగించింది. 7 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా దాదాపు 7 లక్షలకు పైగా ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. కావాల్సినంత సీడ్ ఉత్పత్తి లేకపోవడంతో రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు సాగు చేయాలని రైతులకు సూచిస్తుండటంతో.. విత్తనాల కోసం ఇబ్బందులు తప్పేలా లేదు. అలాగే నాణ్యత లేని విత్తనాలతో దిగుబడి తక్కువగా రావడం వంటివి జరుగుతున్నాయి. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సర్టిఫైడ్ చేసిన విత్తనాలు కాకుండా ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు ట్రూత్‌ఫుల్ లెబుల్ సీడ్(టీ/ఎల్) వరి విత్తనాలు విక్రయిస్తున్నారు. దీంతో దిగుబడి తక్కువ రావడం ఇతరత్రా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామాలే సీడ్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించింది. 8 పీఏసీఎస్‌లలో విత్తనాభివృద్ధి పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాకు మూడు చొప్పున రాష్ట్రంలో 93 పీఏసీఎస్‌లలో సీడ్ ఉత్పత్తిని ఈ ఖరీఫ్ నుంచి ప్రారంభించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 పీఏసీఎస్‌లుండగా అందులో సిద్దిపేట–3, మెదక్–3, సంగారెడ్డి–2 పీఏసీఎస్‌లను ఎంపిక చేశారు. ఒక్కో పీఏఏసీఎస్ పరిధిలో 5 నుంచి 10 ఎకరాల వరకు సీడ్ ఉత్పత్తి్ చేయనున్నారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పలు సొసైటీలకు సీడ్ ప్రొడక్షన్ పై అవగాహన కల్పిస్తున్నారు. సొంత బ్రాండ్‌తో సీడ్ ఉత్పత్తి అయిన తర్వాత రైతుల నుంచి పీఏసీఎస్ కొనుగోలు చేస్తుంది. వాటిని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సర్టిఫైడ్ చేయించనున్నారు. బ్యాడ్జ్ నంబర్‌తో కూడిన ట్యాగ్‌లైన్ పొందనున్నారు. సొంత బ్రాండ్‌తో ఆ పీఏసీఎస్ పరిధిలోని రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించనున్నారు. ఇలా చేయడం ద్వారా సోసైటీకి లాభంతో పాటు నాణ్యమైన విత్తనాలు అంది పంట దిగుబడి పెరుగుతోంది. సరికొత్త బాటలో పీఏసీఎస్‌లు నాణ్యమైన విత్తన ఉత్పత్తి,అమ్మకాలే లక్ష్యం ప్రణాళిక రూపొందించినవ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామాలే నాణ్యమైన విత్తనాలు అందించాలన్న లక్ష్యంతో పీజేటీఎస్ఏయూ పర్యవేక్షణలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో సీడ్ ప్రొడక్షన్న్ చేయనున్నాం. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సర్టిఫైడ్ చేసిన తర్వాత సొసైటీ బ్రాండ్‌తో విత్తనాలు విక్రయించవచ్చు. పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 93 సొసైటీలలో ఈ వానాకాలం నుంచి సీడ్ ప్రొడక్షనన్్ను ప్రారంభిస్తున్నాం. – డాక్టర్ పల్లవి, శాస్త్రవేత్త, తొర్నాల పరిశోధన స్థానం -
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
పటాన్చెరు టౌన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా వినాయక బివరేజ్ కంపెనీని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నీటి వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ పనితీరును పరిశీలించి, వ్యర్థాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ అనిత, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, నందిగామ సర్పంచ్ విక్రమ్‌గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి రాజేందర్, ప్రజలు, పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి -
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
రామచంద్రాపురం(పటాన్చెరు): నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీసాయినగర్ కాలనీ, ఎస్‌వీఎస్‌బీ అవతార్ అపార్ట్మెంట్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీశైలం, నాగరాజు, నాయకులు మల్లారెడ్డి, శ్రీపాల్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
కాంగ్రెస్ కమిటీల ఊసేది?
జోగిపేట (అందోల్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మండల, గ్రామ, పట్టణ పార్టీ కమిటీల ఏర్పాటు ఊసే లేకపోవడంతో మండల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటికే కమిటీల ఏర్పాటు పూర్తవ్వగా.. పటాన్చెరువు, నారాయణఖేడ్లలో నాయకుల అభిప్రాయ సేకరణ తుది దశకు చేరింది. అయితే, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోలులో మాత్రం కమిటీలపై ఎలాంటి చర్చ జరగకపోవడం విశేషం. భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం! అందోలు నియోజకవర్గం పరిధిలో అందోలు, పుల్కల్, చౌటకూరు, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాలతో పాటు అందోలు–జోగిపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం పాత కమిటీలనే ఇక్కడ యథాతథంగా కొనసాగించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో, ఈసారి నియమించే కమిటీల్లో సమర్థులైన వారికి అవకాశం ఇవ్వాలని, అన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కార్యకర్తలు కోరుతున్నారు. అన్ని మండలాల్లోనూ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు బలమైన ఆశావహులు ఉన్నప్పటికీ, మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణయమే తుది నిర్ణయం కావడంతో ఎవరూ బహిరంగంగా నోరు మెదపడం లేదు. నామ్‌కే వాస్తేగా అనుబంధ సంఘాలు నియోజకవర్గంలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ’యువజన కాంగ్రెస్’ అసలు ఉందా లేదా అన్నట్లుగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు నిర్వహించలేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ప్రతిపక్షాలు పార్టీపై, మంత్రిపై చేస్తున్న ఆరోపణలను కనీసం ఖండించిన సందర్భాలు కూడా లేవని యువత వాపోతోంది. కొంతమంది కేవలం నామ్‌కే వాస్తేగా పోస్టులు దక్కించుకుని, మంత్రి పర్యటనల సమయంలో ఆయన కంటబడేందుకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో అనుబంధ సంస్థ ’ఎన్ఎస్యూఐ’ సైతం నియోజకవర్గంలో ఉనికి చాటుకోలేకపోతోంది. కనీసం విద్యార్థుల సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవని తెలుస్తోంది.ఆరేళ్లుగా ఖాళీగానే.. జోగిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గుర్రం సత్తయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పోస్టును భర్తీ చేయకపోవడం గమనార్హం. పట్టణ కమిటీ, అధ్యక్షుడు లేకుండానే గత అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికలు, రాహుల్ గాంధీ జోడో యాత్రతో పాటు పీసీసీ అధ్యక్షుల పాదయాత్రలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చినప్పటికీ... ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్నందున అధికారిక కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనల నిర్వహణకు కమిటీల అవసరం ఎంతో ఉంది. మంత్రి పర్యటనల సమాచారాన్ని స్థానిక శ్రేణులకు చేరవేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇప్పటికై నా మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుని పట్టణ, మండల కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక కేడర్ కోరుతోంది. ‘అందోలు’లో నేటికీ ఏర్పాటు కాని మండల పార్టీ కమిటీలు మంత్రి దామోదర సొంతనియోజకవర్గంలో కొనసాగుతున్న చర్చ ఆరేళ్లుగా ఖాళీగానే జోగిపేట పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి! పేరుకే పరిమితమైన యువజన, ఎన్ఎస్యూఐ అనుబంధ సంఘాలు -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): ఓ ప్రార్థనాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి యాంప్లిఫైయర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హద్నూర్ ఎస్ఐ సుజిత్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 14న మండల పరిధిలోని రాంతీర్థ్ గ్రామంలోని మసీద్‌లో రూ.16వేలు విలువ కలిగిన యాంప్లిఫైయర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మండల పరిధిలోని ముంగి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా దొంగతనానికి పాల్పడిన సఫాన్, నోమన్ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. విచారించగా రాంతీర్థ్లోని మసీదులో చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. నిందితులు బీదర్‌కు చెందిన వారుగా గుర్తించారు. -
మహిళా వనోత్సవం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ వర్షాకాలంలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఇంటి ఆవరణల్లో నాటే (హోంస్టిడ్) మొక్కలను మహిళలకు ఇవ్వనున్నారు. ఒక్కో సభ్యురాలికి మూడు, నుంచి నాలుగు మొక్కలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామ మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించి.. గ్రామంలో ఉన్న స్వయం సహాయక సంఘాలన్నింటినీ ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించింది. ప్రధానంగా దానిమ్మ, సపోట, కరివేపాకు, మునగ, జామ వంటి మొక్కలను మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. వర్షాకాలం ప్రారంభమైంది. అయితే అనుకున్న మేరకు వర్షాలు కురవకపోవడంతో మొక్కలు నాటే కార్యక్రమం ఊపందుకోవడం లేదు. ఈసారి 20 లక్షలు టార్గెట్.. ఈఏడాది వనమహోత్సవంలో 20 లక్షల మొక్కలను నాటాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు వనమహోత్సవ ప్రణాళికను రూపొందించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 10.50 లక్షల మొక్కలు నాటాలని భావిస్తోంది. జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 3.20 లక్షల మొక్కలు నాటేలా నిర్ణయించారు. అటవీశాఖ ద్వారా లక్షల మొక్కలు, హార్టికల్చర్ శాఖ ద్వారా 50 వేల మొక్కలు నాటేలా నిర్ణయించారు. టీజీఐఐసీ భూముల్లో.. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కి పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. పలుచోట్ల ఇండస్ట్రియల్ పార్కులున్నాయి. ఈ పార్కుల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం ద్వారా ఇటు పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యానికి కొంతమేరకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. ఇలా సుమారు 53 వేల మొక్కలను టీజీఐఐసీ భూముల్లో నాటేలా ప్రణాళికను సిద్ధం చేశారు. జాతీయ రహదారుల వెంట.. జిల్లాలో పలు జాతీయ రహదారులున్నాయి. ముంబై హైవేతోపాటు, నాందేడ్–అకోలా రహదారి, 765డి మెదక్–హైదరాబాద్ హైవే ఇలా పలు జాతీయ రహదారులున్నాయి. వీటి పక్కల ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం 52 వేల మొక్కలను కేటాయించారు. ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలను నాటాలని భావిస్తున్నారు. ఇలా మొత్తం 15 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈసారి 20 లక్షల మొక్కలను నాటడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఎస్‌హెచ్‌జీల ద్వారావనమహోత్సవ మొక్కలు పంపిణీ ఈసారి మొక్కలు నాటే లక్ష్యం20 లక్షలు వర్షాభావ పరిస్థితులతోఇంకా ఊపందుకోని వనమహోత్సవం613 నర్సరీల్లో పెంపకం జిల్లా వ్యాప్తంగా 613 నర్సరీలున్నాయి. ఉపాధి హామీ నిధులతో వీటిలో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం 36 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే గతేడాది నాటకుండా మిగిలిన మొక్కలు బాగా పెరిగాయి. మొదట ఈ పెద్ద మొక్కలను నాటనున్నారు. ఈసారి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు ప్రణాళికను అమలు చేస్తామని ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
నారాయణఖేడ్: మండలంలోని ఎంపీ సురేష్ షెట్కార్ నివాసంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాసంలో డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశారు. 200 కేజీల భారీ కేక్‌ని చిన్నారులతో కలిసి జగ్గారెడ్డి దంపతులు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తొపాజి అనంత కిషన్, కూన సంతోష్, నాయకులు పాల్గొన్నారు. జిన్నారంలో.. జిన్నారం (పటాన్చెరు): పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు మన్నే రఘు, సురేష్, శివరాజ్, నరేందర్ గౌడ్, రవి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నీట్‌కు సర్వం సిద్ధం
జిల్లాలో తొమ్మిది పరీక్ష కేంద్రాలు సంగారెడ్డి జోన్: వైద్య కళాశాలల్లోని పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఈ నెల 21న ఆదివారం జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే కేంద్రాలను గుర్తించి, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణపై కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. 9 కేంద్రాలు.. 2,924 మంది అభ్యర్థులు నీట్‌కు జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,924 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. అదేవిధంగా ఇన్చార్జులుగా తహసీల్దార్లను నియమించారు. ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాల–సంగారెడ్డి, జేఎన్్ టీయూ 2 కేంద్రాలు, కేంద్రీయ విద్యాలయం (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర), సంగారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోతిరెడ్డిపల్లి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళల జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) పటానన్‌చెరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహిస్తారు. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీలు చేస్తారు. హాజరు కానున్న 2,924 మంది అభ్యర్థులు ప్రతీ పరీక్ష కేంద్రానికి చీఫ్సూపరింటెండెంట్ల నియామకంఅభ్యర్థులు వెంట తీసుకురావాల్సినవి ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు ఆధార్‌కార్డు /పాన్ కార్డు/పాస్ పోర్ట్/స్టూడెంట్ ఐడీ వంటి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్ట్‌కార్డ్ సైజ్ ఫోటో పారదర్శక (ట్రాన్సపరెంట్) నీటి బాటిల్ మాత్రమే పాటించాల్సిన సూచనలు: అడ్మిట్ కార్డులో పేర్కొన్న గేట్ క్లోజింగ్ సమయం (మధ్యాహ్నం1.30 గంటలు) కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికిచేరుకోవాలి. ఇన్విజిలేటర్ సమక్షంలో ఓఎంఆర్ షీట్, హాజరు పట్టికపై సంతకాలు చేయాలి. పరీక్ష కేంద్రంలో ఎన్టీఏ అందించే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. -
ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి
జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ మెప్మా రిసోర్స్ పర్సన్లకు సూచించారు. స్థానిక మున్సిపల్ మీటింగ్ హాల్లో శుక్రవారం టీఎంసీ, డీఈఓ, మెస్మా రిసోర్స్ పర్సన్లతో సమీక్ష సమావేశం నిర్వహించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ఎస్‌హెచ్‌జీ సభ్యులతో కలిసి పనిచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మెప్మా ఆర్పీలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
నారాయణఖేడ్: మున్సిపల్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ వర్కర్లు, కార్మికులతో రెండురోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం దీక్షాదారులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రం మున్సిపల్ కమిషనర్ ప్రశాంతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరికీ రిటైర్డ్ బెనిఫిట్స్, హెల్త్ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లు, స్థలాలు, ఇతర మున్సిపాలిటీల తరహాలో ఇక్కడి మున్సిపల్ డ్రైవర్లకు 19,500 వేతనం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ ఏరియా కార్యదర్శి రమేష్, మున్సిపల్ యూనియన్ కార్మిక సిబ్బంది శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, కుమార్, రవి, శ్రావణ్, సురేష్, దిలీప్, అంబయ్య, రమేష్, దాస్, మదన్, కృష్ణ, ప్రవీణ్, ఏసు, రాజు, ప్రవీణ్, బాలప్ప, చంద్రకళ, శకుంతల, సాయమ్మ, సిద్దమ్మ, బేబీ, సునీత పాల్గొన్నారు. కార్మికుల రిలే దీక్షలు సంగారెడ్డి: మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, 11వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో థర్డ్ పార్టీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్, దహన సంస్కారాలకు రూ.30 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.5 లక్షలు అందించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సువర్ణ, నర్సమ్మ, సుగుణ, రాజు, లక్ష్మణ్, యాదయ్య, నర్సింలు, యాదగిరి, వేణుగోపాల్, కష్ణ,తదితరులు పాల్గొన్నారు. -
లంచం అడిగితే ఏసీబీకి పట్టిస్తా
● అధికారులు పద్ధతి మార్చుకోవాలి ● మెదక్ ఎంపీ రఘునందన్ రావు మిరుదొడ్డి(దుబ్బాక): రెవెన్యూ అధికారులు లంచాలకు కక్కుర్తి పడితే చర్యలు తప్పవని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ఘాటుగా హెచ్చరించారు. మండల పరిధిలోని మల్లుపల్లిలో గురువారం రూ.30 లక్షల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదంటూ గ్రామస్తులు ఎంపీ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట ఆర్డీఓకు ఫోన్ చేసి మాట్లాడారు. మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాయలంలో జరుగుతున్న లంచం తతంగంపై ఆర్డీఓకు చేరవేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యంతో పాటు, పౌతీ చేయడానికి ఇక్కడి అధికారులు లంచం అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారంపై అధికారులు పద్ధతి మార్చుకోవాలన్నారు. లేదంటే తానే రంగంలోకి దిగి ఏసీబీ అధికారులకు పట్టిస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కనకరాజు, బీజేపీ నాయకులు భిక్షపతి, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కొలువుల దారి ఏటీసీ
● 19 బ్రాంచ్‌ల్లో 580 సీట్లు ● 30వ తేదీ తుది గడువు ● ఐటీఐలను ఏటీసీలు మార్చిన ప్రభుత్వం సంగారెడ్డి క్రైమ్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్)లలో అడ్మిష్లన్లు జోరుగా సాగుతున్నాయి. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏటీసీల్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఈనెల 30 వరకు తుది గడువును విధించింది. పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు ఏటీసీల్లో అత్యాధునిక యంత్రాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. బోధన, శిక్షణకు అవసరమైన పరికరాలను టాటా కంపెనీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శిక్షకులను కూడా నియమించారు. ఇక సంగారెడ్డి ఏటీసీలో 19 బ్రాంచ్‌ల్లో మొత్తం 580 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోర్సులు.. సీఎసీ మెకానిక్ టెక్నీషియన్, ఇంజనీర్స్ టెస్టింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేటివ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనాలసిస్ వర్చువల్ అండ్ డిజైనర్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్. దరఖాస్తుకు జతచేయాల్సిన ధ్రువపత్రాలు ● పదో తరగతి మార్కుల జాబితా ● కుల, ఆదాయ నివాస ధ్రువీకరణ పత్రం ● ఆధార్ కార్డ్ ● నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ అండ్ కాండక్ట్సర్టిఫికెట్స్ ● విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ● మొబైల్ నంబర్ -
నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: ఈ నెల 21న నిర్వహించే నీట్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాల్లో 2,924 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నీట్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. పరీక్ష నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్రాల వద్ద ఎలాంటి సిగ్నల్స్ రాకుండా ఉండేందుకు జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.దోస్త్ ప్రక్రియ పొడిగింపు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దోస్త్ మూడో విడుత అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 21 వరకు పొడిగించినట్లు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సునీత తెలిపారు. గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ మాట్లా డుతూ మొదటి, రెండో విడతలో సీట్లు రాని విద్యార్థులు దోస్త్ వెబ్సైట్లో ఈ నెల 21 వరకు దరఖాస్తు, 22 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వవచ్చాన్నారు. జూన్ 25న సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. జూన్ 26 నుంచి జూలై 2 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, జూలై 4 వరకు కళాశాలలో ద్రువపత్రాలను సమర్పించి సీటును దృవీకరించుకోవాలన్నారు. వివరాలకు కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
తూప్రాన్: కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెందిన ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఇస్లాంపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సాదల వెంకటమ్మ (45), భిక్షపతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు కూతుళ్లకు వివాహం జరిపించారు. మూడో కూతురు మైనర్. అయితే, రెండో కూతురు భర్త విష్ణు, తన మరదలితో ప్రేమాయణం సాగించి, ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకొని, వారికి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. అయినప్పటికీ వారు వినకుండా తిరిగి పారిపోయారు. ఈ క్రమంలో మైనర్ అయిన ఆ మూడో కూతురు గర్భవతి అయి, ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మెదక్‌లోని సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సెంటర్లో వారికి కౌన్సిలింగ్ నిర్వహించగా, తాను బావతోనే ఉంటానని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి వెంకటమ్మ.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. తోటపల్లిలో వృద్ధుడు... బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని తోటపల్లికి చెందిన కోంపెల్లి చంద్రయ్య(65) అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో మనస్తాపం చెంది గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. కుమార్తె సుజాత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రెవెన్యూ ఇన్స్పెక్టర్పై దాడి
నంగునూరు(సిద్దిపేట): దరఖాస్తు పరిశీలన కోసం వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్పై ఇద్దరు యువకులు దాడి చేసిన సంఘటన గురువారం సీతారాంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుంగ అంకుశ్ నాల కన్వర్షన్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఆర్ఐ బాలకృష్ణమూర్తి, జీపీఓ రమేశ్ గ్రామానికి చెరుకొని భూమిని పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన జక్కుల మధు, కొంపల్లి శ్రీనివాస్ దుర్భాషలాడుతూ ఆర్‌పై దాడి చేశారు. విధులకు ఆటంకం కల్గిస్తూ అధికారులపై దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్ తెలిపారు. గజ్వేల్: షాద్‌నగర్‌లో ఈనెల 13, 14తేదీల్లో నిర్వహించిన అండర్–15 బాక్సింగ్ పోటీల్లో జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన విద్యార్థిని మోక్ష అత్యుత్తమ ప్రతిభతో కాంస్య పతకం సాధించారు. మేడ్చల్–మల్కాజిగిరి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువతున్న ఈ బాలిక.. పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడంతో గామస్తులు అభినందించారు. సంఘం రాష్ట్ర నేత భానుప్రసాద్ సిద్దిపేటజోన్: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం నాయ్యం చేయాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర నాయకుడు భానుప్రసాద్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. 21న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మలిదశ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎన్నికల హామీ మేరకు ఉద్యమకారులకు ప్రభుత్వం 250 గజాల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం, గుర్తింపు కార్డులు, ఫించన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కమిటీ చైర్మన్ కేశవరావు సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సూరయ్య, యాదగిరి, మహేందర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని మృత దేహాన్ని గ్రామస్తులు గమనించారు. ఎస్ఐ కీర్తిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామశివారులోని శ్మశానవాటిక వెనుకగల పొలాల్లో ఒకవ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గురువారం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని గుర్తించలేక పోయారు. పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 87126 67326 నంబర్‌కు సమాచారం తెలియజేయాలని ఎస్ఐ సూచించారు. మనుబోతుపై చిరుత దాడి రామాయంపేట(మెదక్): చిరుత దాడిలో మనుబోతు గాయపడింది. మండలంలోని తొనిగండ్ల అటవీ ప్రాంతంలోని చెరువు వద్దకు గురువారం రాగా, గ్రామస్తుల సమాచారం మేరకు అటవీ అధికారులు పట్టుకొని చికిత్స నిమిత్తం స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం మనుబోతును అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు. -
అమృత్ భారత్ పనులు వేగిరం చేయాలి
రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎం గోపాలకృష్ణన్ జహీరాబాద్: అమృత్ పథకం కింద రూ.24 కోట్లతో చేపట్టిన జహీరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దక్షిణమధ్య రైల్వే డీఆర్ఎం ఆర్.గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆయన గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులు ఏ మేరకు జరిగాయనే విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ను కలియదిరిగి నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారు. ఇప్పటివరకు 65%మేర పనులు పూర్తికాగా, మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. సర్కారు బడిలోనే నాణ్యమైన విద్యవాల్పోస్టర్ ఆవిష్కరణలో డీఈఓ రోహిణి సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను పొందాలని డీఈఓ రోహిణి సూచించారు. మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం రామకృష్ణ రూపొందించిన పాఠశాల వాల్‌పోస్టర్‌ను గురువారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం రోహిణి మాట్లాడుతూ..మానవ విలువలు కలిగి ఉండే చదువును పొందే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు,మధ్యాహ్న భోజనం, వీటితోపాటు బ్యాగు, టై బెల్టు,షూష్‌తో కూడిన 9 వస్తువుల కిట్‌ను కూడా అందజేస్తారని తెలిపారు. అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించి వారికి మంచి భవిష్యత్తును కల్పిద్దామని పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న హెచ్ఎం రామకృష్ణను ఈ సందర్భంగా అభినందించారు. ఎస్ఐఆర్తో కాంగ్రెస్, బీఆర్ఎస్ల్లో వణుకుఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉనికిని కోల్పోతామనే భయంతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శించారు. బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియతో ఈ రెండు పార్టీల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. గురు వారం సంగారెడ్డిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారదర్శకంగా చేస్తున్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతో రాష్ట్రంలో సుమారు 88 లక్షల బోగస్ ఓట్లకు చెక్ పడే అవకాశాలున్నాయన్నారు. బోగస్ ఓట్లను నమ్ముకుని అక్రమ మార్గాల్లో రాజకీయం చేయలేమనే భ యంతోనే ఈ రెండు పార్టీలు ఆందోళనకు గు రవుతున్నాయన్నారు. బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు రాములు రామచంద్రాపురం(పటాన్చెరు): కార్మికుల సమ స్యలను పరిష్కరించడంలో సీఐటీయూ ముందుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, పెన్నార్ పరిశ్రమ యూనియన్ అధ్యక్షుడు చుక్క రాము లు పేర్కొన్నారు. రామచంద్రాపురం మండల పరిధిలోని బండలగూడ పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ ఎన్నికల్లో సీఐటీయూను గెలిపించాలన్నారు. తమకు ఐఎన్టీయూసీ సైతం మద్ద తు ఇస్తుందని తెలిపారు. అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ కృషి చేస్తుందని తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
జిన్నారం (పటాన్చెరు): బొల్లారం డివిజన్లో బాధితుడి నుంచి ఓ విద్యుత్ శాఖ ఏఈ లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈగా రామకృష్ణారెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల స్థానిక వైఎస్సార్ కాలనీలోని విద్యుత్ స్తంభాన్ని వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో విద్యుత్ పోల్ ధ్వంసమైన ఘటనలో ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు డిమాండ్ చేయగా.. రూ.25 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గురువారం ఏసీబీ అధికారుల బృందం ఏఈ రోడ్డు పక్కన తన కారులో లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరైనా అధికారులు వేధించిన ఏసీబీకి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. -
కత్తిరింపులతో కొత్త చిగుళ్ల్లు
జహీరాబాద్: ముదురు మామిడి తోటల పునరుద్ధరణ చేపట్టడం ద్వారా రైతులకు తిరిగి నాణ్యవంతమైన దిగుబడులు సాధ్యపడతాయి. 30 నుంచి 35 ఏళ్ల వయసు పైబడి ఉన్న వాటిని ముదురు మామిడి తోటలుగా పేర్కొంటారు. ముదురు మామిడి తోటల్లో ప్రతీ ఏటా పంట క్షీణించి దిగుబడులు పడిపోతుంటాయి. దీంతో రైతులకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. ఇలాంటి మామిడి తోటలను కత్తిరించడం ద్వారా తిరిగి పంట దిగుబడులను పెంచుకోవచ్చని డీడీఎస్–కేవీకే శాస్త్రవేత్త జి.శైలజ చెబుతున్నారు. 1,500 ఎకరాల్లో మామిడి తోటలు సంగారెడ్డి జిల్లాలో సుమారు 1,500 ఎకరాల్లో మామిడి తోటలుసాగులో ఉన్నాయి. కానీ, ఎక్కువ తోటలు 30 నుంచి 40 సంవత్సరాల వయసుకు మించి ఉన్నాయి. దీంతో తోటలు గుబురుగా,ఎత్తుగా పెరగడం వల్ల ఒక చెట్టు కొమ్మలు మరో చెట్టులోకి వెళ్లి గాలి, వెలుతురు ప్రసరించకుండా, సూర్యరశ్మి లోపించడం, చెట్టు లోపలి భాగాలకు ఎండ తగలక పోవడం వల్ల దిగుబడులు రావడం లేదు. తద్వారా పురుగులు, తెగుళ్లు ఎక్కువ వ్యాపించడం, పూత సరిగ్గా రాక పోవడం, ఎండు పుల్లలు ఎక్కువ అవడం కారణంగా పంట కాపు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తోటలను తీసివేసి కొత్త తోటలను నాటుతున్నారు. చెట్లను పూర్తిగా తీసివేయకుండా పునరుద్ధరణ చేసుకోవచ్చు. చెట్లను కత్తిరించడం ద్వారా మళ్లీ చిగురింపజేయవచ్చు. ఇలా చేయడం వల్ల మరో 20 ఏళ్ల వరకు తోటలను ఉంచవచ్చు. కొత్త దిగుబడులు వచ్చే విధంగా తోటలను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను వర్షాకాలంలో జూలై మొదటి వారం నుంచి సెప్టెంబర్ చివరి వారం వరకు చేసుకోవచ్చు. చెట్ల కొమ్మలు మొత్తం కత్తిరించివేయాలి చెట్లను అడుగు భాగం నుంచి 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు మొత్తం కత్తిరించి వేయాలి. చెట్టులో ఉన్న ప్రథమ, ద్వితీయ శ్రేణి కొమ్మలు దెబ్బతినకుండా 1 నుంచి 2 అడుగుల వరకు ఉంచి మిగతా కొమ్మలను కత్తిరించి వేయాలి. గొడ్డలికి బదులు రంపం ఉపయోగించాలి. కొమ్మలను వాలుగా కత్తిరించుకోవాలి. దీని వలన వర్షం నీరు పడకుండా, బూజు తెగుళ్లు తగ్గుతాయి. మందులు పిచికారీ చేసే విధానం చెట్టు కొమ్మలు తీసివేసిన తర్వాత కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను 3 గ్రాములు, ఒక లీటరు నీటికి కలుపుకుని కొమ్మలకు పూయాలి. లేదా బోరోడాక్స్ మిశ్రమాన్ని 2 శాతం పిచికారీ చేసుకోవాలి. చెట్టు చుట్టూ పాదులు తయారు చేసి కిలో యూరియా, 800 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పాస్పరస్, 1.5 కిలోల పొటాష్‌ను సక్రమంగా వేసుకున్నట్లయితే రెండు నెలల్లో చిగురించి, కొత్త కొమ్మలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ముదురు మామిడి తోటలపునరుద్ధరణే మేలు మరో 20 ఏళ్ల వరకుమామిడి దిగుబడులు మూడు సంవత్సరాలకే చేతికి తిరిగి పంట మూడేళ్ల వరకు అంతర పంటల సాగుకు అవకాశంబలంగా ఉన్న చిగుళ్లను ఉంచాలి కొత్తగా చిగుళ్లు వచ్చినప్పుడు ఎక్కువ మోతాదులో వస్తాయి. బలంగా ఉన్న చిగుర్లను ఉంచి మిగతావి తిన్నింగ్ చేయాలి. ఒకొక్క దిశలో ఒకటి లేదా రెండు కొమ్మలను ఉంచి మిగతావి తీసివేయాలి. అలా ఈ తిన్నింగ్ అనే పద్ధతిని ఒకటి లేదా రెండేళ్లపాటు చేయాలి. ఇలా కత్తిరించిన చెట్టుకు కొత్త కొమ్మలు వచ్చి పంట రావడానికి 3 ఏళ్లు పడుతుంది. ఇలా రైతులు మరో 20 ఏళ్ల వరకు అధిక దిగుబడిని సాధించవచ్చు. రైతులు సమయం వృథా చేయకుండా కత్తిరించిన మామిడి చెట్ల మధ్యలో అంతర పంటలుగా కూరగాయలు, అపరాలు వేసుకోవచ్చు. -
మహిళల్లో ఉల్లాస్
సాక్షి, సిద్దిపేట: చదువుకు వయసు అడ్డుకాదని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు నిరూపిస్తున్నారు. ప్రతీ మహిళా అక్షరజ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఇన్ సొసైటీ)కు శ్రీకారం చూట్టింది. ఈ పథకాన్ని విద్యాశాఖ, సెర్ప్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమాన్ని గతేడాది సెప్టెంబర్‌లో ఆరు నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ శిక్షణ పూర్తయ్యాక మార్చి 29న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్(ఫ్లాంట్) పరీక్ష నిర్వహించింది. ఇందులో 56,431 మంది మహిళలు ఉత్తీర్ణత సాధించారు. 49 వేల ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49,850 ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లుండగా 5,11,624 సభ్యులున్నారు. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో 50శాతం మందికి మాత్రమే సంతకం చేయడం వచ్చని, మిగిలిన సగం వారు వేలిముద్రలు వేస్తున్నారని సెర్ప్ వారి దగ్గర ఉన్న సమాచారం. సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ప్రధాన లక్ష్యం. ఆరు నెలలు శిక్షణ వయోజన మహిళలకు చదవడం, రాయడం నేర్పించడమే కాకుండా మధ్యలో బడిమానేసిన వారిని సైతం గుర్తించి నేరుగా ఓపెన్ టెన్త్, ఆసక్తి ఉంటే ఓపెన్ డిగ్రీ చదివించనున్నారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా 63వేల మంది మహిళా సంఘాల సభ్యులకు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను అందించి నేర్పించారు. మహిళలు చదవడం, రాయడంతోపాటు బ్యాకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను నేర్పించారు. మొదటి అడుగు సక్సెస్ ఆరు నెలల పాటు శిక్షణ పొంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించి చదువులో మొదటి అడుగు వేశారు. మొత్తంగా 63,405 మంది పరీక్ష రాయగా 56,431(89 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 6,971 మంది ఫ్లాంట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్ష రాయించాలని సెర్ప్ నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నారు. జిల్లా పరీక్ష రాసిన వారు ఉత్తీర్ణులైన వారు సిద్దిపేట 21,112 17,514 సంగారెడ్డి 27,911 25.672 మెదక్ 14,382 13,245అమ్మకు అక్షరం.. అభ్యాసం వేగిరం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాసాయిపేట మండలం రామంతాపూర్ చౌరస్తా జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం ప్రకారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన శేకు ఎల్లం(35), రామంతాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన ఆంజనేయులు చేగుంట నుంచి బైకుపై తూప్రాన్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న లారీ బైకును రామంతాపూర్ చౌరస్తా వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎల్లం కడుపుపై నుంచి లారీ వెళ్లింది. స్థానికులు అంబులెన్స్‌లో ఇద్దరిని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఎల్లం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిర్లక్ష్యం వద్దు..అద్దె ముద్దు
మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ గురించి అధికారులు దృష్టి పెట్టడం లేదు. రూ.లక్షల ఆదాయం వచ్చే దుకాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారుల వైఖరి వల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి పక్కన భవానీ మందిరం రోడ్డులో 1990లో రూ.46 లక్షల ఖర్చుతో 52 మున్సిపల్ దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. నెలకు రూ.600 అద్దె ప్రాతిపాదికన షాపులను వ్యాపారులకు కేటాయించారు. అధికారులు వ్యాపారులతో కుమ్మకై అగ్రిమెంట్ గడువు ముగిసినా...తక్కువ అద్దె వసూలు చేస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. అగ్రిమెంట్ గడువు ముగిసినందున అద్దె పెంచాలని 2016లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు ఇటీవల డిమాండ్ చేయగా వెంటనే మున్సిపల్ అధికారులు రూ.600 ఉన్న అద్దెను రూ.2,500కు పెంచిన విషయం తెలిసిందే. బహిరంగ వేలంలో రూ.5వేలు అద్దె కొత్తగా టెండర్ పిలిచి వేలం పాట ద్వారా దుకాణాలను కేటాయించాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో అప్పట్లో మున్సిపల్ అధికారులు వ్యాపారులచేత దుకాణాలను ఖాళీ చేయించారు. దెబ్బతిన్న దుకాణాలకు రూ.లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించారు. అనంతరం షాపింక్ క్లాంపెక్స్ దుకాణాలను అద్దె కోసం బహిరంగ వేలం వేశారు. రూ.5 వేల కంటే తక్కువ కాకుండా అద్దె నిర్ణయించారు. 52 దుకాణాలకు గాను ప్రతీ నెల మున్సిపల్‌కు సుమారు రూ.2.60 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వేలం పాటలో దుకాణాలను చేజిక్కించుకున్న కొంతమంది షాపులను స్వాధీనం చేసుకున్నారు. అయితే దుకాణాల అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. రూ.లక్షల ఆదాయం వచ్చే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌పై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అద్దె వసూలు చేస్తున్నాం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలకు సంబంధించి అద్దె వసూలు చేస్తున్నాం. వ్యాపారులకు కేటాయించిన వాటికి అద్దె తీసుకుంటున్నాం. కొన్ని దుకాణాలు దెబ్బతినగా ఖాళీగా ఉన్నాయి. మరమ్మతులు చేపట్టి ఎవరైనా ముందుకు వస్తే కేటాయిస్తాం. ఇటీవలే కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించా. పూర్తి విషయాలు తెలుసుకుని కాంప్లెక్స్ దుకాణాలపై దృష్టి పెడతాం. – ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్, జహీరాబాద్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్అద్దె వసూళ్లలో జాప్యం అధికారులు అలసత్వంప్రదర్శిస్తున్నారని విమర్శలు -
మల్లన్న ఆలయంలో వేలం పాటలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆలయ ఈఓ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పలు వేలం పాటలు నిర్వహించారు. ఆలయ పరిసరాలలో కొబ్బరికాయలను విక్రంచుకునే హక్కును రూ.48.50 లక్షలకు కొమురవెల్లికి చెందిన తిరుపతి, కొబ్బరి ముక్కలను పోగుచేసేకునే హక్కును రూ.75,00,116లకు పోతిరెడ్డిపల్లికి చెందిన మహేందర్, ఒడిబియ్యం, వస్త్రాలు, పసుపును పోగుచేసుకునే హక్కును రూ.73.50 లక్షలకు ఉప్పల వంశీకృష్ణ, ఎల్లమ్మ ఆలయం వద్ద వస్త్రాలు, ఒడిబియ్యం, పసుపు సేకరించే హక్కును రూ.23.30 లక్షలకు ఎస్.వెంకటేశ్, కోరమీసాలు విక్రయించుకునే హక్కును రూ.17.31 లక్షలకు ఎక్కాలదేవి అరుణ దక్కించుకున్నారు. అలాగే బ్యాగులు, పాదరక్షలు భద్రపర్చుకునే హక్కును రూ.18,00,116లకు నెహూర, మూడు టాయిలెట్ బ్లాక్‌ల నిర్వహణ హక్కును రూ.5.25 లక్షలకు హైదరాబాద్‌కు చెందిన మిశ్రా ఎంటర్ప్రైజెస్ దక్కించుకున్నాయి. ఈ టెండర్ల ద్వారా ఆలయానికి మొత్తం 2 కోట్ల, 64 లక్షల 32 రూపాయలు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో డబ్బులు చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మండల పరిధి పిల్లుట్లకు చెందిన ముండ్రాతి భాస్కర్ గురువారం నర్సాపూర్‌లో తన వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి రూ.20 వేలు తీసుకున్నాడు. నర్సాపూర్ బస్టాండ్‌లో గజ్వేల్ బస్సు ఎక్కి శివ్వంపేటకు వెళ్తుండగా.. చిన్నగొట్టిముక్ల వద్ద తన జేబులోని డబ్బులు లేకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు శివ్వంపేట వద్ద బస్సుని నిలిపి ప్రయాణికులను తనిఖీ చేశారు. అయినా డబ్బులు లభ్యం కాలేదు. నర్సాపూర్‌లో బస్సు ఎక్కే క్రమంలో రద్దీ ఉండడంతో అక్కడే గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు చోరీ చేసి ఉండొచ్చని ప్రయాణికులు తెలిపారు. అప్పు చెల్లించేందుకు బంగారం తాకట్టు పెట్టి తెస్తున్న డబ్బులు చోరీకి గురికావడంతో బాధితుడి రోదన ప్రయాణికులను కంటతడి పెట్టించింది. తాళం వేసిన ఇంట్లో చోరీ కౌడిపల్లి(నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడి వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశారు. గురువారం స్థానిక ఎస్ఐ అమరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పీర్లతండా పంచాయతీ పరిధిలోని కొయ్యగుండుతండాకు చెందిన కాట్రోత్ రాజు, అతని భార్య, కొడుకు ఇంటికి తాళం వేసి పొలం పనులు, సొంత పనులపై బయటకు వెళ్లారు. మధ్యాహ్నం అతని కొడుకు ఇంటికి వచ్చిచూడగా ఇంటితాళం, బీరువా తాళం పగులగొట్టి కనిపించింది. బీరువాలోని 20తులాల వెండి పట్టగొలుసులు, రూ.10వేలు నగదుతో పాటు ఎస్బీఐ గోల్డ్‌లోన్ పత్రాలు, బైక్ ఆర్సీ ఇతర పత్రాలను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
సీట్లు లేవు
నారాయణఖేడ్: పాఠశాలలు పునఃప్రారంభమైన మూడు రోజుల్లోనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక రెండు నెలల అనంతరం ఈ బోర్డు ఏర్పాటు చేసేవారు. ఈసారి మాత్రం బడులు ప్రారంభమైన మూడు రోజుల్లోనే విద్యార్థులు భారీగా చేరగానో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. గతేడాది 880మంది విద్యార్థులు అడ్మిషన్లు జరగగా గదుల్లో చాలా ఇబ్బందులు పడుతూ విద్యభ్యాసం కొనసాగించారు. టెన్త్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులై 165మంది విద్యార్థులు వెళ్లిపోగా పాఠశాలల పునఃప్రారంభం రోజుకు 715మంది విద్యార్థులున్నారు. బడులు ప్రారంభం అయ్యాక మూడు రోజుల్లోనే 120మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. విద్యార్థులకనుగుణంగా ఏ, బీ సెక్షన్లను ఏర్పాటు చేసినప్పటికీ గదులు అందుబాటులో లేని కారణంగా ఆరవ తరగతి ఇంగ్లిష్ మీడియంలో కొంతమంది విద్యార్థులు మినహాయించి ఇతర తరగతుల్లో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని నో అడ్మిషన్ల బోర్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొత్తగా చేరిన 120 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 835మంది విద్యార్థులకు చేరింది. తెలుగు, ఇంగ్లీష్ మీడియం కలిపి టెన్త్ వరకు ఉన్న ఈ పాఠశాలలో 13 మాత్రమే గదులు ఉండగా 22మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. 2022–23వ సంవత్సరంలో 756మంది విద్యార్థులు, 2023–24లో 800 మంది, 2024–25లో 880మంది విద్యార్థులు చేరారు. ఖేడ్ సర్కారీ బడిలో బోర్డు ఏర్పాటు బడులు ప్రారంభమైన మూడు రోజులకే పూర్తయిన అడ్మిషన్లు -
తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం
డీడీఎస్ ఈడీ దివ్య, కేవీకే శాస్త్రవేత వరప్రసాద్ జహీరాబాద్: తేనెటీగల పెంపకంతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని డీడీఎస్ ఈడీ దివ్య, కేవీకే శాస్త్రవేత్త వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల కేవీకేలో తేనెటీగల పెంపకంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తేనెటీగల పెంపకం చేపట్టడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. యువతీయవకులు సైతం ముందుకొచ్చి ఈ రంగంపై ఆసక్తి చూపాలన్నారు. రసాయనిక మందులను వాడడంతో తేనెటీగలు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. తేనెటీగలు లేకపోతే పరపరాగ సంపర్కంపై ప్రభావం చూపించి పంట దిగుబడులు పడిపోతాయన్నారు. దీంతో ఆహారం కొరత ఏర్పడి మానవ మనుగడకు ముప్పువచ్చే పరిస్థితి కలుగుతుందన్నారు. కావున వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తేనెటీగల పెంపకం ద్వారా అనేక లాభాలు పొందవచ్చన్నారు. తేనెతో పాటు మైనం, పుప్పడి, రాజహారం, ప్రొపొలిస్, తేనె ముల్లు విషం కూడ తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఉద్యాన శాఖ అధికారి పండరి మాట్లాడుతూ తేనెటీగల శిక్షణ పొందిన తర్వాత డీఆర్డీఏ పథకం ద్వారా తేనెపట్టును 40 శాతం సబ్సిడీతో బాక్సులను రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత స్నేహలత, నిపుణులు పరిపూర్ణ, కీపర్, రైతులు, యువతీ యువకులు పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనల్లో నలుగురు అదృశ్యం
తల్లి, కుమారుడు.. పటాన్చెరు టౌన్: తల్లి, కుమారుడు అదృశ్యమైన సంఘటన పటాన్చెరులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకి చెందిన పవన్ బతుకుదెరువు కోసం వలస వచ్చి, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో నివాసముంటున్నాడు. అక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం అతని భార్య మొని, కుమారుడు దేవజిత్ ఇద్దరూ ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. రాత్రి ఇంటికి వచ్చిన పవన్.. భార్యాపిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది, స్థానికంగా, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో భార్య, కుమారుడి అదృశ్యంపై భర్త పవన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లిన వివాహిత... పటాన్చెరు టౌన్: మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధానూర్కు చెందిన రత్నకుమారి(23) బుధవారం బీహెచ్ఈఎల్ మార్కెట్లో చేపలు విక్రయించే తన తల్లి కోటమ్మ వద్దకు వెళ్లేందుకు బస్సు లో బయలుదేరింది. అయితే బీహెచ్ఈఎల్ మార్కెట్‌కు వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన బంధువులు, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే ఆమె భర్త కోటేశ్వరరావు గురువారం బీడీఎల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు... రామచంద్రాపురం(పటాన్చెరు): ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన బెల్ టౌన్షిప్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బెల్ కాలనీలో నివాసం ఉండే 65ఏళ్ల బాబురావుకు మతిస్థిమితం సరిగా లేదని, బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదన్నారు. అయితే అతని కోసం ఆరా తీసిన ఆచూకీ లభించలేదన్నారు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికను వేధించిన యువకుడి అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): బాలికను వేధించిన కేసులో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మద్దూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహ్మద్ ఆసీఫ్ కథనం ప్రకారం... ఈనెల 16న బాలికతో చిలుక రాజశేఖర్ అనే యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడమే గాక, వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై ఫోక్సో కేసు నమోదైంది. ఈ మేరకు అతడ్ని కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు కొమురవెల్లి(సిద్దిపేట): వ్యక్తిపై పలువురు ఆకతాయిలు దాడి చేశారు. ఏఎస్ఐ సత్యనారాయణ రెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ బుధవారం మధ్యాహ్నం సొంత పనిపై కుటుంబంతో కలిసి తన కారులో చేర్యాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గురుజకుంట వాగు సమీపంలో అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన యువకులు సురేశ్, రాంబాబు, కర్ణాకర్ వాహనాన్ని అజాగ్రత్తగా , వేగంగా వాహనం నడుపడంతో శ్రీనివాస్ తన వాహనాన్ని సడన్‌గా నిలిపాడు. దీంతో వాహనం నుంచి దిగి యువకులను అతివేగంగా వాహనం నడపవద్దు అని మందలించాడు. దీంతో ఆ యువకులు కోపంతో అతనిపై దాడి చేశారు. వెంటనే బాధితుడు కొమురవెల్లి పోలీస్‌స్టేసన్ ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేశారు. రామాయంపేట(మెదక్): గంజాయి తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ నరేందర్ కథనం ప్రకారం... మెదక్ పట్టణానికి చెందిన చింతకుంట ప్రేంకుమార్, కెంద్రె నిఖిల్ బుధవారం స్కూటీపై 140 గ్రాముల ఎండు గంజాయితో వస్తుండగా, అక్కన్నపేటవద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీఐ నరేందర్‌తోపాటు డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ గోపాల్, ఎస్ఐలు హరీశ్, బాలయ్య, షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు. మెదక్‌జోన్: కళాకారుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడిగా గూడాల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని కళాభారతిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీల నియామక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా అధ్యక్షుడిగా తనను ఎంపిక చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం 14 ఏళ్లపాటు అలుపెరగని పోరాటంలో కళాకారుల పాత్ర సింహాభాగం అన్నారు. గత ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కళాకారులను ఆదుకోవాలని ఆయన కోరారు. -
యువకుడు అదృశ్యం
తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం... చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయికిరణ్‌కు తూప్రాన్‌కు చెందిన శోభతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద మిర్చిబండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో నిత్యం సాయికిరణ్ బాధపడేవాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. సెల్‌ఫోన్‌ను తన మిత్రునికి ఇచ్చి చేగుంటలో గ్యాస్ కేవైసీ చేయించాల్సి ఉందని వెళ్లాడు. కానీ సాయంత్రం వరకు తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో భార్య శోభ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని ఆయా మండలాలకు, పట్టణాలకు ఇటీవల నియమితులైన అధ్యక్షులు, వారి అనుయాయులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీ భవన్‌కు వెళ్లి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ షెట్కార్, జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఎ.చంద్రశేఖర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నిన్న అసమ్మతి వాదులు, నేడు మద్దతు దారులు జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిపోయింది. పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయం తమకు తెలియకుండా అధిష్టానవర్గం చేత చంద్రశేఖర్ మమ అనిపించి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఈనెల 15న అసమ్మతివాదులు గాంధీ భవన్‌కు వెళ్లి నిరసన తెలిపిన విషయం విదితమే. దీంతో ఆందోళనకారులను అధిష్టానవర్గం శాంతింపజేసింది. తిరిగి ఎన్నికలు నిర్వహించేలా చూస్తామని బుజ్జగించడంతో అసమ్మతివాదులు చల్లబడిన సంగతి తెలిసిందే. ఎన్నికై న కాంగ్రెస్ మండలాధ్యక్షులు అధిష్టానానికి కృతజ్ఞతలు -
పరిహారం కోసం రోడ్డెక్కి..
● వర్గల్ కమాన్ వద్ద మృతురాలి కుటుంబీకుల రాస్తారోకో ● న్యాయం చేయాలని పట్టువర్గల్(గజ్వేల్): పరిహారం ఇప్పించి తమకు న్యాయం చేయాలని రోడ్డు ప్రమాద మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు బుధవారం వర్గల్ కమాన్ సమీప రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం వర్గల్ కమాన్ వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ వేములఘాట్‌కు చెందిన ఆటోడ్రైవర్ భార్య కొరివి లక్ష్మి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని ఆమె కుటుంబీకులు, గ్రామస్తులు వర్గల్ కమాన్ సమీపంలో రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దాదాపు అరగంట పాటు రాస్తారోకోతో రాజీవ్ రహదారి ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా, గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, గౌరారం ఎస్ఐ ఆరోగ్యం వారికి నచ్చజెప్పినా వినలేదు. దీంతో వారిని చెదరగొట్టి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం న్యాయం జరిగేలా చూస్తామని పోలీసుల హామీతో వారందరూ వెళ్లిపోయారు. 11 మందిపై కేసు.. కారు డ్రైవరు నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని, రాజీవ్ రహదారిపై అడ్డుగా కూర్చొని రాకపోకలు నిలిపేసిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు గౌరారం ఎస్ఐ ఆరోగ్యం తెలిపారు. -
పాఠశాల నిర్మాణ పనులు వేగిరం
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో అనేకమంది విద్యకు దూరమవుతున్నారు. మరికొందరు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో హైదరాబాద్ రౌండ్ టేబుల్ ఎన్జీఓ సంస్థ ముందుకు వచ్చి వీఎస్టీ పరిశ్రమకు చెందిన రూ.5కోట్ల సీఎస్ఆర్ నిధులతో పాఠశాల భవన నిర్మాణం మొదలుపెట్టారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకోరావాలన్న లక్ష్యంతో పనులను మొదలుపెట్టారు. అయితే పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భవన నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి పేద విద్యార్థులు పడుతున్న కష్టాలను చూసి ఉన్నతాధికారులు స్పందించి వచ్చే విద్యా సంవత్సరానికై నా పాఠశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం..
గజ్వేల్‌రూరల్: ఆత్మహత్యకు యత్నించిన మహిళను ఓ వ్యక్తి కాపాడాడు. ఈ సంఘటన బుధవారం గజ్వేల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని కోటమైసమ్మ ప్రాంతంలో నివాసముండే డప్పు మైసమ్మ(65)కు భర్త, పిల్లలు లేరు. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెంది గజ్వేల్‌లోని బరి చెరువులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సమయంలో చేపలు పట్టేందుకు వచ్చిన మర్కూక్ మండలం పాతూరులోని డబుల్ బెడ్రూమ్కు చెందిన మహ్మద్ తకియొద్దీన్ గమనించి ఆమెను కాపాడాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో తకియొద్దీన్ను సన్మానించారు.కాపాడిన వ్యక్తిని సన్మానించిన పోలీసులు -
896 క్వింటాళ్లు.. 33.14 లక్షలు
రూ.జిల్లాలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాల్లో కొన్ని అక్రమాలకు అడ్డాలుగా మారాయి. తరుగు తీయకూడని జొన్నల్లో కూడా బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీస్తూ ఆయా కేంద్రాల నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారు పర్యవేక్షణ లేకపోవడంతో నిజాంపేట్ మండలంలోని బాచేపల్లి పీఏసీఎస్ పరిధిలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో తరుగు దోపిడీని యథేచ్ఛగా సాగిస్తున్నారు. నారాయణఖేడ్: బాచేపల్లి సొసైటీ పరిధిలో బాచేపల్లి, మాసాన్‌పల్లి, దేవునిపల్లి, ఖానాపూర్ (బి), రాంరెడ్డిపేట్, దామర్‌చెరువు, మీర్ఖాన్పేట్, రాపర్తి, అలికాన్పల్లి, మునిగేపల్లి, నాగ్‌ధర్ గ్రామాలు వాటి పరిధిలోని తండాలున్నాయి. ఈ చిన్న సొసైటీలో సుమారు 45 వేల బస్తాలు..22,400 వేల పైచిలుకు క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశారు. కల్హేర్ మండలంలో కల్హేర్తోపాటు బీబీపేట, నిజాంపేట్ మండల కేంద్రంలో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. పై కేంద్రాలన్నింటికంటే ఈ ఒక్క కేంద్రంలోనే భారీగా కొనుగోళ్లు చేపట్టడం విస్మయానికి గురిచేస్తోంది. సొసైటీ పరిధిలోని నిజాంపేట్ మండలంలో 3,114 ఎకరాలు, ప్రక్కనే ఉన్న కల్హేర్ మండలంలో 7,721 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. వాస్తవానికి ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలి. రూ.33.14లక్షల తరుగు దోపిడీ బాచేపల్లి సెంటర్‌తోపాటు నాగ్‌ధర్, రాపర్తి, దేవునిపల్లి, బల్కంచెల్క తండాల్లో ఉపకేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రాల్లో ఒక్కో బస్తా వద్ద 2 కిలోల తరగు పేర క్వింటాల్‌కు 4కిలోలు తరగు పేరిట దోపిడీ చేసేశారు. క్వింటాల్‌కు 4కిలోల తరుగు తీస్తే సొసైటీలో కొన్న 22,400 క్వింటాళ్లకు 896 క్వింటాళ్ల వరకు తరుగు తీశారు. ఈ లెక్కన క్వింటాల్‌కు ప్రభుత్వ ధర రూ.3,699 చొప్పున మొత్తం రూ. 33,14,304లు రైతుల వద్ద నొక్కేశారు. కాగా, కేంద్రానికి కర్ణాటక ప్రాంతం నుంచి సైతం జొన్నలు తెచ్చి దళారులు రైతుల పేర విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి. జొన్నలకు తరుగు తీయకూడదు కదా అని ప్రశ్నిస్తే కొంత ఎక్కువ తక్కువగా తీశామని, బస్తాలు చిరిగి ఉండటంతో బస్తాకు 2కిలోల చొప్పున తరుగు తీశామని కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు విఠల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. దళారులు, వ్యాపారుల సరుకు కొనుగోలు చేశారనే ఆరోపణలపై బాచేపల్లి సెంటర్ ఇన్చార్జి నరేందర్‌ను ప్రశ్నించగా కొందరు తెలిసిన వారు, బంధువుల పేర్లపై తూకం వేయించారని సమాధానమిచ్చారు.తరుగుపేరిట జొన్న రైతులను నిలువు దోపిడీ బాచేపల్లి సొసైటీలో జొన్నలకొనుగోళ్ల తీరు క్వింటాలుకు 4కిలోల తరుగు కొనుగోలు కేంద్రంపై కొరవడిన నిఘా -
సాగులో సేంద్రియ పద్ధతులు
పల్లె జీవనోపాధి కేంద్రంలో అద్దెకు యంత్రాలు హుస్నాబాద్‌రూరల్: వ్యవసాయ సాగులో సేంద్రియ పద్ధతులను పాటిస్తే పెట్టుబడుల భారం తగ్గి దిగుబడులు పెరుగుతాయని అదనపు డీఆర్డీఓ రొనాల్డ్ సుధీర్‌కుమార్ అన్నారు. బుధవారం మీర్జాపూర్ క్లస్టర్లో పల్లె మహిళా జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె మహిళా జీవనోపాధి కేంద్రాలను తీసుకొచ్చిందన్నారు. సాగుపై ఆసక్తి కలిగిన మహిళలను ప్రోత్సహిస్తే బంగారు పంటలు పండిస్తారనే నమ్మకంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. పంటల సాగులో రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడితే ఆరోగ్యంతో జీవిస్తామని తెలిపారు. మహిళ జీవనోపాధి కేంద్రంలో అద్దెకు వ్యవసాయ యంత్రాలు దొరుకుతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆమోదం ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలని ఆత్మకమిటీ చైర్మన్ అయిలయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ నవీన్‌కుమార్, ఎంపీడీఓ సతీశ్, ఏపీఎం తిరుపతి, మార్కెట్ వైస్‌చైర్మన్ చందు, సర్పంచ్‌లు సంపత్, జవహర్, రాజేశ్వరి పాల్గొన్నారు. -
ఆగింది టీకా.. అవగాహన లేక!
పటాన్చెరు టౌన్: ప్రాణాంతకంగా మారే గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్‌ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హ్యుమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం ఉచితంగా టీకా అందిస్తున్నప్పటికీ తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలు, అవగాహన లోపం, సంప్రదాయ భావజాలం కారణంగా టీకా వేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 14–15 ఏళ్ల మధ్య వయసు బాలికలు 12,635 ఉండగా ఇప్పటివరకు 2,988 మంది బాలికలు మాత్రమే టీకాలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ పద్ధతులను అనుసరించే కుటుంబాలను టీకాలు తీసుకునేందుకు ఒప్పించడం ఆరోగ్య శాఖకు మరింత సవాలుగా మారింది. పటాన్చెరులో కొంత మెరుగ్గా.. పటాన్చెరు పట్టణ ప్రాంతంలో పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉండటంతో కొంతమంది తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ కుమార్తెలకు టీకా వేయిస్తున్నారు. దీంతో స్పందన కాస్త సానుకూలంగా కనిపిస్తోంది. కార్యక్రమం ప్రారంభమిలా... గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8న 14–15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో టీకా పంపిణీ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది. సాధారణంగా ఈ టీకాను ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు వేల రూపాయలు ఖర్చవుతుంది. మొత్తం ప్రక్రియకు సుమారు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వ్యయం అవుతుంది. అలాంటి విలువైన టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నప్పటికీ, ప్రజల్లో అవగాహన పెరగకపోవడం వల్ల లక్ష్యానికి అనుగుణంగా ప్రయోజనం చేకూరడం లేదని పలువురు పేర్కొంటున్నారు. టార్గెట్ పూర్తి కాకపోవడానికి కారణాలు టీకా ప్రారంభంలో బాలికలకు పదో తరగతి పరీక్షల్లో బిజీగా ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదు. పరీక్షల తర్వాత పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించే బాధ్యత ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తల్లో చాలామంది జనగణన విధులు అప్పగించారు. పెళ్లి తర్వాత గర్భధారణ సమస్యలు వస్తాయనే అపోహతో చాలామంది తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు.టీకా తప్పనిసరి 14 నుంచి 15 ఏళ్ల వయసు గల బాలికలు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టే లక్ష్యంతో ఈ టీకాను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు బాలికలకు వేయించాలి. – నేత్రవతి, వైద్యాధికారి, పటాన్చెరు లక్ష్యానికి దూరంగాహెచ్పీవీవీ కార్యక్రమం జిల్లాలో 12,635 మంది బాలికలను గుర్తించిన అధికారులు వారిలో టీకాలు తీసుకున్నవారు 2,988 మందే -
అర్హులైన వారికి రుణాలు
సంగారెడ్డి జోన్: ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం రుణాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ...జిల్లాలో పంట రుణాల లక్ష్యం రూ.3,499.21 కోట్లకు గాను 90.66%, మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.6,816.57 కోట్లకు గాను 87.16%, అడ్వాన్సుల లక్ష్యం రూ.23,438.93 కోట్లకుగాను 92.81% సాధించినట్లు వివరించారు. వివిధ రంగాలు, పరిశ్రమల అభివృద్ధికి అవసరం మేరకు రుణాలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్, ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మేనేజర్ తుల్జానాయక్, తదితరులు పాల్గొన్నారు.ఉపాధ్యాయుల బోధనలతోనే భవిష్యత్తు జోగిపేట(అందోల్): ఉపాధ్యాయుల విద్యాబోధనతోనే సమాజంలో విద్యార్థులు భావి పౌరులుగా ఎదుగుతారని అదనపు కలెక్టర్ ఆర్.పాండు పేర్కొన్నారు. అందోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.చెన్నయ్య పదవీవిరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో పీఆర్టీయూ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని, ఉద్యోగ జీవితంలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయన్నారు. మండలంలో ఉపాధ్యాయుడు పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. తాను ఆర్డీఓగా పనిచేసిన సమయంలో వారి సేవలను దగ్గరుండి పరిశీలించినట్లు తెలిపారు. జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు ఎ.మాణయ్య మాట్లాడుతూ..ఉపాధ్యాయుడిగా చెన్నయ్య అందించిన సేవలు మరువలేనివని, తమ పిల్లలను కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. అనంతరం పీఆర్టీయూ ఆధ్వర్యంలో చెన్నయ్యను సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎ.చిట్టిబాబు, జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రభు, ఎంఈఓ కృష్ణ, పీఆర్టీయూ అర్బన్ అధ్యక్షుడు నరోత్తం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.అనిల్‌కుమార్, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ ప్రసాద్, హెచ్ఎం నరేశ్కుమార్లతోపాటు పలువురు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పాండు -
బ్లాక్స్పాట్లను గుర్తించండి
జోగిపేట/వట్పల్లి(అందోల్): అత్యధికంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే స్థలాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. జోగిపేట, వట్పల్లి పోలీస్ స్టేషన్లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పెండింగ్ కేసులను, నేరస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు. పరిసరాలలో మొక్కలను నాటారు. వట్పల్లి పోలీస్ స్టేషన్ భవనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ..పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వారి సమస్యను పరిష్కరిస్తామన్న భరోసాను కల్పించాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహనను పెంచాలని, దాబాలు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా యజమానులకు సూచించాలని చెప్పారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచిస్తూ, హెల్మెట్ ధరించని సిబ్బందిని విధుల్లోకి అనుమతించకూడదని ఆదేశించారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్, వట్పల్లి ఎస్సై శ్రీహరి, జోగిపేట్ ఎస్సై శ్రీకాంత్‌తోపాటు సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. ఎస్పీ పరితోశ్ పంకజ్ జోగిపేట, వట్పల్లి పోలీస్ స్టేషన్లఆకస్మిక తనిఖీ -
పుల్కల్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్ఓ
పుల్కల్(అందోల్): పుల్కల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నూతన భవనాన్ని జిల్లా వైద్యాధికారి లలితాదేవి బుధవారం సందర్శించారు. నూతన భవనంలో మౌలిక సౌకర్యాలను, పీహెచ్సీలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గొంగ్లూర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించారు. 22 నుంచి రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు సంగారెడ్డి టౌన్: కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను ఈ నెల 22 నుంచి రెండు రోజులపాటు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూల నుంచి కల్లు గీత కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రామాగౌడ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యాదగౌడ్, సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా నాయకులు ప్రవీణ్‌గౌడ్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సు సీజ్ చేస్తాంఎంవీఐలు చంద్రశేఖర్, జయప్రకాశ్‌రెడ్డి పటాన్చెరు టౌన్: విద్యాసంస్థల బస్సులను నిబంధనలను విరుద్ధంగా నడిపితే సీజ్ చేస్తామని పటాన్చెరు ఎంవీఐ చంద్రశేఖర్, జయప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. పటాన్చెరు, బీరంగూడ, అమీనన్పూర్ జాతీయ రహదారిపై బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఏడు బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా వారం రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు కొనసాగనున్నట్లు వెల్లడించారు. బాగారెడ్డికి ఘనంగా నివాళులుజహీరాబాద్: మాజీ ఎంపీ ఎం.బాగారెడ్డికి ఆయా పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం 96వ జయంతిని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి విగ్రహానికి ఆయా పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు సదుద్దీన్గౌరి, శివాజీపాటిల్, సతీశ్‌రెడ్డి, భాస్కర్, ఎం.పాండురంగారెడ్డి, జగన్నాథ్, బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రెండో రోజు ‘టెట్’ ప్రశాంతం సిద్దిపేటఅర్బన్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) పరీక్ష రెండో రోజు బుధవారం ప్రశాంతంగా కొనసాగింది. పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహించారు. ఉదయం సెషన్‌కు 50 మందిని కేటా యించగా 36 మంది హాజరయ్యారు. మధ్యా హ్నం సెషన్‌కు 50 మందికి గాను 46 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. -
బైక్ కొనేందుకు డబ్బులివ్వలేదని..
యువకుడి ఆత్మహత్య దుబ్బాకటౌన్: బైక్‌ను కొనుగోలు చేసిన తరువాత తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని యువకుడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయపోల్ మండలం రామారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కే.మానస కథనం ప్రకారం... చిన్న మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన గూని కిరణ్ కుమార్ (22) డ్రైవర్‌గా పని పనిచేస్తున్నాడు. వారం రోజుల నుంచి రామారంలోని అక్క బావ వద్ద ఉంటూ తన అశోక్ లేలాండ్ వాహనం నడిపాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గజ్వేల్‌కు వెళ్లి వస్తానని అక్కకు చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం నిన్నటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతికారు. బుధవారం ఉదయం కిరణ్ కుమార్ బావ వ్యవసాయ పొలంలో ఉరివేసుకున్నాడు. కాగా కొన్ని రోజుల క్రితం కిరణ్ కుమార్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. దానికోసం రూ.45 వేలు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగితే కొన్ని రోజుల తర్వాత ఇస్తామన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఎల్లం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
తాపీ మేసీ్త్రలకూ ప్రమాద బీమా పత్రాలు
సంగారెడ్డి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా వికాట్ గ్రూపుకి చెందిన భారతి సిమెంట్ ఎదుగుతుందని ఆ సంస్థ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ అన్నారు. చౌటకూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు సోమవారం సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికాట్ గ్రూప్ కంపెనీస్ ప్రపంచంలో 12 దేశాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్‌తో పొలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్‌తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. అనంతరం డీలర్ అభిలాష్ మాట్లాడుతూ భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుందని, అధికంగా సేల్స్ అవుతుందని తెలియజేశారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని తెలిపారు. ఇంటి నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా పత్రాలను ఆ సంస్థ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ అందజేశారు. ఈ సమావేశంలో భారతి సిమెంట్ డీలర్ అభిలాష్, ట్రేడర్స్ యజమాని, 50 మంది తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. -
ట్రక్కు ఢీకొని ఒకరు మృతి
న్యాల్కల్(జహీరాబాద్): అతి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామ శివారులో బీదర్–జహీరాబాద్ రోడ్డుపై సోమవారం చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం... కర్నాటక, బీదర్ పట్టణానికి చెందిన రెహమాన్(22), చిన్నాన్న హజ్మత్ హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం బైకుపై బీదర్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామ శివారులో నారింజ వాగు వద్ద అతివేగంగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో రెహమాన్ ట్రక్కు టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. హజ్మత్కు తీవ్ర గాయాలు కాగా బీదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. బాధిత కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కొంతకాలంగా బీదర్–జహీరాబాద్ రోడ్డు అధ్వానంగా ఉందని ఖలీల్పూర్, మిర్జాపూర్(బి), కోత్తూర్, రేజింతల్ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ హన్మంత్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. ● మరొకరికి తీవ్ర గాయాలు ● ఖలీల్పూర్ గ్రామ శివారులో ఘటన -
మోగిన బడి గంట
● తొలిరోజు అంతంత మాత్రమే హాజరు ● అంగన్వాడీల్లో స్వాగత తోరణాలు ● చిన్నారులకు పూలతో టీచర్లు స్వాగతం ● విద్యార్థులకు పుస్తకాల అందజేతసంగారెడ్డి ఎడ్యుకేషన్: వేసవి సెలవుల అనంతరం సోమవారం బడులు తెరుచుకున్నాయి. తొలిరోజు పాఠశాలకు అంతంతమాత్రమే విద్యార్థులు హాజరయ్యారు. చాలారోజుల తర్వాత పాఠశాలకు రావడంతో చిన్నారులు కొంతసేపు ఏడుస్తూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత మిగతా చిన్నారులతో కలిసి ఆడుకుంటూ మధ్యాహ్నం వరకు హాయిగా గడిపారు. కొద్దిమంది చిన్నారులు తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకొని వచ్చారు. చాలాచోట్ల తొలిరోజే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పుస్తకాలను అందజేశారు. అమావాస్య ప్రభావం! తమ చిన్నారులను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సోమవారం పెద్దగా ముందుకురాలేదు. అమావాస్య రోజున బడులు ప్రారంభం కావడంతోనే పిల్లల్ని బడుల్లో చేర్పించేందుకు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా తక్కువ మొత్తంలో అడ్మిషన్లు వచ్చినట్లు సమాచారం. మంగళవారం నుంచి పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. అంగన్వాడీల్లో స్వాగత తోరణాలు జీవితంలో మొదటిరోజు బడికి వస్తున్న చిన్నారులకు ఆహ్లాదకరమైన పండుగ వాతావరణం నెలకొనే విధంగా ఏర్పాట్లు చేశారు. కొండాపూర్ మండలం హరిదాస్పూర్, గొల్లపల్లితోపాటు చాలా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అనంతరం పాఠశాలకు విచ్చేసిన చిన్నారులకు పూలను అందజేసి స్వాగతం పలికారు. -
గ్రామాభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగు, బొంతపల్లి గ్రామాల్లో న్యూలాండ్ ఫౌండేషన్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 8 గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 14 బయోగ్యాస్ యూనిట్లు, రూ.6 లక్షల వ్యయంతో 16 వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, రాజారెడ్డి, కృష్ణ, చక్రపాణి, కుమార్ గౌడ్, జైపాల్ రెడ్డి, నాయకులు మహేష్, శేఖర్ రెడ్డి, హుస్సేన్, న్యూలాండ్ ఫౌండేషన్ ప్రతినిధులు సిఎస్ఆర్ హెడ్ రవి, ప్రతాప్ సింగ్, హెచ్ఆర్ హెడ్ సూర్యభగవాన్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ
జోగిపేట(అందోల్): పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు పంపిణీ చేసినట్లు అందోలు ఎంఈఓ బండి కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నరేష్ కుమార్, ఉపాధ్యాయులు మాణయ్య, మంజ్యా నాయక్, రాములు, త్రినాధ్ రావు, అనిల్ కుమార్, నరోత్తం కుమార్, లక్ష్మణ్, సీహెచ్ చంద్రశేఖర్, రజినీ కాంత్, వీబీ శ్రీనివాస్, రవికుమార్, వెంకటేశం, చంద్రశేఖర్, మజీద్ పాల్గొన్నారు. వైభవంగా లక్ష్మీ సుదర్శన యాగం నారాయణఖేడ్: ప్రేమ, భక్తితోనే మాన జీవితానికి మోక్షం లభిస్తుందని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాదవానంద సరస్వతీస్వామి తెలిపారు. పట్టణంలోని మహతి జ్యోతిష్యాలయంలో సోమవారం నిర్వహించిన లక్ష్మీ సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంజీవరెడ్డి హాజరై మాట్లాడారు. యాగం ద్వారా దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఎమ్మెల్యే, అనుపమారెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి వినోద్ పాటిల్, మహతి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు గురురాజ్శర్మ పాల్గొన్నారు. ముమ్మరంగా పూడికతీత పనులు జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ప్రధాన మురుగు కాల్వల్లో పూడికతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. వరద ముంపు నివారణతో పాటు దోమలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా చర్యగా జేసీబీలతో పనులు చేపడుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ సోమవారం పనులను పర్యవేక్షించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భగవద్గీతపై ప్రచారం జిన్నారం (పటాన్చెరు): మండలంలోని జంగంపేట, లక్ష్మీపతిగూడెంలలో సోమవారం త్రైత సిద్ధాంత భగవద్గీతతో పాటు అనుబంధ గ్రంథాల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ గిరి, ఎన్ఎస్ కుమార్, మధు, నరసింహాచారి, నర్సింహరావు, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ శ్రేష్టి, జస్విత్, అంజి, ప్రదం, సైదులు, మహేశ్, గోపాల్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
పటాన్చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమ వారం స్థానిక డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో అమీన్ పూర్, పటాన్ చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు సర్కిళ్ల పరిధిలోని 9 డివిజన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రధానంగా నూతన కాలనీల్లో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున.. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బొల్లారం స్టేడియం, పాటి వివేకానంద స్టేడియంల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు సర్కిళ్లకు సంబంధించిన రూ.250 కోట్ల నిధులు తిరిగి డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కేటాయించాలని ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్ కుమార్, జ్యోతి రెడ్డి, డీఈ వెంకటరమణ, ఏఈలు ఫైజాన్, లావణ్య పాల్గొన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
బురదయాతన..!
● చెరువులను తలపిస్తున్న రహదారి గుంతలు ● ప్రయాణికులకు తప్పని తిప్పలుకంది (సంగారెడ్డి): మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన పైప్‌లైన్ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. కొంతకాలంగా ఈ రహదారికి మరమ్మతులు చేపట్టకపోవడంతో కంకర తేలి, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఇటీవల కురిసిన వర్షాలకు ఈ గుంతలన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 38 ఏళ్ల క్రితం మంజీరా పైపులైను వెంట ఈ రహదారిని ఏర్పాటు చేశారు. అప్పట్లో వేసిన ఈ రోడ్డు ప్రస్తుతం సంరక్షణ కరువై పూర్తిగా పాడైపోయింది. ఈ రహదారి వెంట నిత్యం కోతలాపూర్, మక్తఆల్లూర్, కలివేముల, చెర్లగూడెం, జుల్కల్, ఎద్దుమైలారం తదితర గ్రామాల ప్రజలు తమ నిత్య అవసరాల కోసం, ఉద్యోగాల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే, చుట్టుపక్కల ఉండే పొలాలకు వెళ్లే రైతులు కూడా నిత్యం ఈ రహదారి వెంటనే ప్రయాణించాల్సి వస్తోంది. కష్టాల్లో వాహనదారులు, రైతులు: రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. బురద రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నడపడం అత్యంత కష్టంగా మారిందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ దారిలోనే ప్రయాణించే రైతులు సైతం తమ వ్యవసాయ సామగ్రిని, పంటలను తరలించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పైప్‌లైన్ రోడ్డును పాలకులతో పాటు అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
నేటి నుంచి ఆటో చార్జీల పెంపు
ఆటో యూనియన్ నాయకుల వెల్లడి సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం నుంచి ఆటో చార్జీలు పెంచుతున్నట్లు సంగారెడ్డి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ వెల్లడించింది. యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాయార్ పాషా, టౌన్ ప్రెసిడెంట్ బాబా మాట్లాడుతూ..ఓల్డ్ బస్టాండ్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు, బసవేశ్వర విగ్రహం వరకు రూ.15 నుంచి రూ.20పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఓల్డ్ బస్టాండ్ నుంచి మల్కాపూర్, చింతల్, కంది వరకు రూ.25నిర్ణయించారు. ఓల్డ్ బస్టాండ్ నుంచి ఫసల్వాది, ఎమ్మెన్నార్ చౌరస్తా వరకు రూ.20 తీసుకోనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు రూ.10 చొప్పున తీసుకుంటామని తెలిపారు. క్షయ వ్యాధిని నిర్మూలించాలి: డీఎంహెచ్ఓసంగారెడ్డి: సమాజంలో క్షయ (టీబీ)వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి స్పష్టం చేశారు. జిల్లాలోని టెస్టింగ్ సెంటర్లు, పీల్స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు సూచనలు సలహాలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రిలో నమోదయ్యే టీబీ కేసులు తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలిసేలా నిఘా పెట్టాలన్నారు. కార్యక్రమంలో టీబీ జిల్లా అధికారి అరుణకుమారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాత శిశు మరణాలు తగ్గించాలిజిల్లాలో మాత శిశు మరణాల రేటు పూర్తిగా తగ్గించాలని డీఎంహెచ్ఓ సూచించారు. హత్నూర, దౌల్తాబాద్, కసర్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నమోదైన మాతా మరణాల కేసులను సమీక్షించారు. అధిక ప్రమాద గర్భిణీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచి, రిఫరల్ వ్యవస్థను పటిష్టం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతి మరోమారు భగ్గుమంది. మండలాల పార్టీ అధ్యక్షుల నియామకాలతో రేగిన అసమ్మతి సోమవారం గాంధీభవన్‌కు చేరింది. నియామకాలు ఏకపక్షంగా జరిగాయంటూ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు 300 మంది వరకు గాంధీభవన్‌కు తరలివెళ్లి ఆయా మండలాల అధ్యక్షుల నియామకాల పట్ల అభ్యంతరం తెలిపారు. పార్టీ సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరమే అధ్యక్షులను నియమించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఏకపక్షంగా ప్రకటించడం ఏమిటని పార్టీ పెద్దలను నిలదీశారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి, కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యనేతల భేటీ అసమ్మతి సెగ గాంధీభవన్ చేరడంతో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి పార్టీ ముఖ్య నేతలను గాంధీభవన్‌కు పిలిపించి సమావేశమయ్యారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు అజ్మత్లతోపాటు జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలకు చెందిన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించకుండా, అభిప్రాయాలు సేకరించకుండా పార్టీ అధ్యక్ష పదవులను ఎలా ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు సమావేశంలో నిలదీయడంతో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల పార్టీ అధ్యక్ష పదవుల నియామకాలను నిలిపివేస్తున్నట్లు అజ్మత్ ప్రకటించారు. తిరిగి వారం రోజుల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అధ్యక్షుల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. దీంతో పార్టీ శ్రేణులు శాంతించాయి. పార్టీలో రెండేళ్లుగా అసమ్మతి రాగం జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం అసంతృప్తి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. పార్టీ మండలాల అధ్యక్షుల ఎన్నికల సందర్భంగా తిరిగి భగ్గుమన్నాయి. పార్టీలో నాలుగు గ్రూపులు కొనసాగుతున్నట్లు పార్టీ నేతలు, కార్యకర్తలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. గాంధీభవన్ సాక్షిగా ఇది నిజమే అని మరోమారు రుజువైంది. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, పార్టీ కార్యకర్తలకు ఉన్న స్వేచ్ఛతోనే తమ బాధను చెప్పుకున్నారని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఆయా మండలాల పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసి గ్రూపు రాజకీయాలను, అసమ్మతిని పార్టీ పెద్దలు ఎలా తెరదించుతారో వేచి చూడాల్సిందే. మండలాల అధ్యక్షుల ప్రకటనతో వెల్లువెత్తిన అసమ్మతి జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల నియామకాల నిలిపివేత గాంధీభవన్‌లో నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం -
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంతోపాటు డివిజన్ స్థాయిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు సంబంధిత అధికారులకు పంపించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ ప్రతీక్ జైన్ -
అక్రమ చెరువులు ధ్వంసం
వట్పల్లి(అందోల్): అనుమతుల్లేకుండా సింగూరు ప్రాజెక్టు శివారు ప్రాంతంలోని అక్రమంగా తవ్విన చేపల చెరువులను సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. ఈ అక్రమ చేపల చెరువుల ఏర్పాటుపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 14 అక్రమ చెరువులను గుర్తించింది. దీంతో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన అధికారులు మండలంలోని ఖాదిరాబాద్ శివారు ప్రాంతాలకు చేరుకుని 14 చెరువులను జేసీబీలతో ధ్వంసం చేశారు. అటు తర్వాత ఉసిరికపల్లి గ్రామంలో అక్రమ చెరువులను కూడా ధ్వంసం చేశారు. ఇరిగేషన్‌శాఖ ఈఈ భీమ్, సింగూరు ప్రాజెక్టు డీఈ మధుసూధన్, ఏఈ పరుశరాం, డిప్యూటీ ఈఈ రవికుమార్, అందోలు ఏఈ రోహిత్ విశ్వశర్మలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాళ్లా వేళ్లా పడ్డ నిర్వాహకులు ఈ క్రమంలో చేపలు పూర్తిస్థాయిలో పెరగకముందే మధ్యలోనే చెరువులను ధ్వంసం చేయడంపై చెరువుల నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. తమ భార్యల బంగారం తాకట్టుపెట్టి రూ.లక్షల వ్యయంతో చేపల చెరువుల తవ్వించామని, వాటిలో చేపలను మరోచోటకు తరలించేందుకు మూడు రోజులు గడువు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువులను ధ్వంసం చేసేశారు. సింగూరు శివారులో 14 చేపల చెరువులు స్థానికుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం -
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు
జహీరాబాద్ టౌన్: నిబంధనలు ఉల్లంఘిస్తే స్క్రాప్ దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని మున్సిపల్ చైర్మన్ యూనూస్, కమిషనర్ ప్రభాకర్ హెచ్చరించారు. మున్సిపల్ సమావేశ మందిరంలో పట్టణంలోని స్క్రాప్ దుకాణాల యాజమాన్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్, చైర్మన్లు మాట్లాడుతూ స్క్రాప్ దుకాణాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దుకాణాల వస్తువులు రహదారులు, ఫుట్‌పాత్‌పైకి రాకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్, రసాయనాలు, పెట్రోల్, డీజిల్ లాంటి మండే స్వభావం ఉన్న వ్యర్థాలను నిల్వ చేయరాదన్నారు. అనంతరం ఎస్ఐ లవకుమార్ మాట్లాడుతూ దొంగలించిన వస్తువులను కొనుగోలు చేయరాదన్నారు. అలాగే లైసెన్స్‌లు తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. -
రా‘బడి’దారిలో అడ్మిషన్ల వేట
ప్రైవేటు టీచర్లపై యాజమాన్యాల ఒత్తిడి ● విద్యార్థుల్ని చేర్పించకపోతే కొలువుపై వేటుకార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి బతక లేక బడిపంతులుగా మారింది. ప్రతీరోజు 14 గంటలు పని చేస్తున్నా వారికి కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా అమలు కావడం లేదు. ఐఐటీ, సీబీఎస్ఈ సిలబస్ బోధించడంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులపై కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇచ్చే అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించలేక, మరో ఇతర పనిని చేయలేక ఉపాధ్యాయ వృత్తిలో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రతీ ఏటా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. దీంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు మరో కొత్త పంథాను ఎంచుకున్నాయి. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం మొదలు విద్యార్థుల్ని పాఠశాలల్లో చేర్పిస్తేనే ఉద్యోగం భద్రంగా ఉంటుంది లేదంటే కొత్త వారికి అవకాశం కల్పిస్తామంటూ ఉపాధ్యాయులకు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు అడ్మిషన్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ఇళ్లకు చేరుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పాఠశాలలో జాయిన్ అయితే ఫీజు తగ్గిస్తామంటూ తల్లిదండ్రులను బుజ్జగించి మరీ అడ్మిషన్లు చేయిస్తున్నారు. రోజుకో కొత్త పుస్తకం కొన్ని పాఠశాలలు సెంట్రల్ సిలబస్, మరి కొన్ని పాఠశాలలు స్టేట్ సిలబస్, ఇంకొన్ని పాఠశాలలు ఐఐటీ, సీబీఎస్ఈ సిలబస్ అంటూ నిత్యం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఒత్తిడిలోకి నెట్టుతున్నారు. మార్కెట్లోకి ఏ పుస్తకాలు వచ్చినా ముందుగా బోధించేది ఉపాధ్యాయులే. వాటిని అర్థం చేసుకుని విద్యార్థులకు చెప్పేందుకు ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ముందురోజు ప్రిపేర్ కాకపోతే తర్వాత రోజు పిల్లలకు బోధించడం కష్టమే. దీంతో చాలామంది ఉపాధ్యాయులు మానసికంగా కుంగిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.విద్యార్థుల్ని చేర్పిస్తేనే ఉద్యోగం సంగారెడ్డిలోని ఓ కార్పోరేట్ స్కూల్లో ఇంగ్లీషు సబ్జెక్టు బోధించాను. వేతనం చాలా తక్కువ. అడ్మిషన్లు తీసుకువస్తేనే మీ ఉద్యోగం ఉంటుంది అని యాజమాన్యం చెబుతోంది. మనం తీసుకొచ్చిన విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ ఫీజు విద్యార్థి చెల్లించలేకపోతే ఉపాధ్యాయుడు వేతనం నుంచి కట్ చేస్తారు. – శ్రవణ్‌కుమార్ (పేరు మార్చాం), ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు, సంగారెడ్డికొత్త సిలబస్‌తో తప్పని ఇబ్బందులు ర్యాంకుల కోసం స్టేట్, సెంట్రల్ సిలబస్ అంటూ ప్రతీ ఏటా కొత్త సిలబస్‌ను తీసుకువస్తున్నారు. కొత్తగా వచ్చే సిలబస్ ఎంతో కఠినంగా ఉండటంతో ముందుగా ఒక రోజు ప్రిపేర్ కావాల్సిందే. – హరినాథ్ గౌడ్ (పేరు మార్చాం), ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడుచాలీ చాలని జీతం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. నర్సరీలోనే రూ.25 వేలకు పైగా వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలు మాత్రం రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపు ఉందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజులను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులకు వేతనాలు అందించేలా ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
నారాయణఖేడ్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ మేరకు పదిమంది తమ సమస్యలపై అందించిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వాటిని నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు పంపించారు. పరిష్కారానికి అనువుగా ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఆరోగ్య, విద్య, వైద్య, సివిల్ సప్లై, సోషల్వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడికి క్రేజ్
● ఉత్తమ బోధనతోనే భారీగా అడ్మిషన్లు ● ప్రతీ యేటా ఇదే సీన్నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సీటుకోసం పోటీ నెలకొనడంతోపాటు కొన్ని రోజుల్లోనే అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డు తగిలిస్తారు. ఉన్న తక్కువ గదుల్లోనే టీచర్లు అత్యుత్తమ బోధన చేపడుతుండటంతో ఈ పాఠశాలకు క్రేజ్ నెలకొంది. తల్లిదండ్రులు ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు పోటీపడతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పదోతరగతి వరకు బోధన జరుగుతుండగా 880 మంది విద్యార్థులు చదువుతున్నారు. 13 గదులు ఉండగా 22మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2022– 23లో 756, 2023– 24లో 800, 2024–25లో 880మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. గత ఏడాది 100మంది పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి చేరారు. కాగా గతేడాది జులైలోనే అడ్మిషన్లు పూర్తి చేసి సుమారు 200మంది పైగా విద్యార్థులను వెనక్కి పంపించారు. ఈ ఏడు జులై మొదటి వారంలోనే 350పైగా అడ్మిషన్లు రాగా అందులో 150పైగా అడ్మిషన్లు ప్రైవేట్ పాఠశాలల నుంచే వచ్చాయి. ఉన్న గదులు, సదుపాయాల మేరకు దాదాపు పూర్తి స్థాయిలో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. చాలా గదుల్లో విద్యార్థులు పట్టక ఇరుకుగా కూర్చుంటున్నారు. పాఠశాలలో చదువుతోపాటు యోగా, క్రీడలు, బ్యూటీషియన్, సంగీతం, కంప్యూటర్ లాంటి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. ప్రతీ ఏడు ట్రిపుల్ఐటీ బాసరకు పలువురు విద్యార్థులు ఎంపికవుతుంటారు. పాఠశాలకు దాతల సహకారం కూడా బాగానే ఉంది. సేవోద్గం ఫౌండేషన్, డిగ్నిటీ ఫౌండేషన్ల ద్వారా హిందీ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సహకారంతో పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, విద్యార్థులు అందరికీ బ్యాగులు, విద్యాసామగ్రి, ఇతర సదుపాయాలు ప్రతీ ఏడు కల్పిస్తున్నారు. -
అర్ధరాత్రి చైన్ స్నాచింగ్
మహిళ మెడలోంచి తస్కరణ దొంగల కోసం గాలిస్తుండగా.. శివ్వంపేట(నర్సాపూర్): అర్ధరాత్రి దొంగలు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును చోరీ చేశారు. ఈ ఘటన మండల కేంద్రమైన శివ్వంపేటలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన మినంచంపేట జ్యోతికి మాటలు రావు. భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రోజువారిగానే మొదటి అంతస్తులో తల్లిదండ్రులు లక్ష్మి, నర్సింహులుతో కలిసి జ్యోతి పడుకుంది. మొదటి అంతస్తులో టాయిలెట్స్ లేకపోవడంతో జ్యోతి బాత్రూం కోసం అర్ధరాత్రి కిందకి దిగింది. ముఖాలకు మాస్క్‌లు వేసుకొని ఉన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోతుండటంతో ఆమె అరిచింది. ఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడు, పైఅంతస్తులోని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు లేచి దొంగల కోసం గాలించగా కొద్ది దూరంలో చోరీ చేసిన బంగారు గొలుసు కిందపడి ఉంది. కాగా చోరీ అనంతరం జ్యోతి అరవడంతో దొంగలు హడావిడిలో వెళ్తున్న క్రమంలోనే బంగారు గొలుసు కిందపడి ఉండవచ్చని కాలనీవాసులు తెలిపారు. అర్ధరాత్రి దొంగల కోసం గాలించినా దొరకలేదు. నార్లాపూర్ గ్రామంలో.. నిజాంపేట(మెదక్): మహిళ మెడలో బంగారు పుస్తెలతాడును స్కూటీపై వచ్చిన వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన అంబటి పెంటమ్మ తన ఇంటి ముందు కూర్చుంది. కాగా తెలుపు రంగు స్కూటీపై గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అడ్రస్ అడిగినట్లు నటించి మెడలోని బంగారు పుస్తెలతాడును లాగుతుండగా.. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించింది. దీంతో సుమారు అర తులం బంగారు పుస్తెను లాక్కొని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్సు ఢీకొని విద్యార్థి మృతి సంగారెడ్డి : కొన్ని గంటలైతే బర్త్ డే పార్టీలో అనందంగా గడపాల్సిన విద్యార్థినిని మృత్యురూపంలో ఆర్టీసీ బస్సు కబలించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ కథనం ప్రకారం... సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పుర్ర వైష్ణవి(13) ఏడో తరగతి పూర్తయింది. ఆదివారం పుల్కల్ మండలం మీన్‌పూర్ గ్రామం అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర తన మామ కూతురు పుట్టినరోజు వేడుకకు వచ్చింది. కాగా గ్రామంలోని పక్కింట్లో ఉన్న రమ్యశ్రీ సల్వాది విద్యాపీఠంలో భరతనాట్యం నేర్చుకుంటుండగా, ఆమెతో కలిసి వైష్ణవి, రమ్యశ్రీ తండ్రి బైక్‌పై పసల్ వాదికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జోగిపేట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు శివంపేట టోల్ ప్లాజా దాటిన తర్వాత హోన్నపూర్ శివారులో బైకును వెనక నుంచి ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వైష్ణవి రోడ్డుపై పడటంతో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఆమె పైనుంచి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడిపిస్తున్న బాలరాజ్, అతని కూతురు గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పుల్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా వైష్ణవి మృతితో పుల్కల్, సదాశివపేట మండలాల్లో విషాదం నెలకొంది. వైష్ణవి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్ సిద్దిపేటఅర్బన్: సామాన్య ప్రజలకు దూరమవుతున్న విద్య, వైద్యంను అందుబాటులోకి తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ డిమాండ్ చేశారు. కార్మిక, కర్షక భవన్లో జరుగుతున్న సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు రెండోరోజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధిక ఫీజులు, డొనేషన్ల రూపంలో వేలాది కోట్లు కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు దండుకుంటున్నాయన్నారు. శిక్షణ తరగతుల్లో సీపీఎం నాయకులు మల్లారెడ్డి, గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, కృష్ణారెడ్డి, వెంకట్, రవికుమార్, యాదగిరి పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
పటాన్చెరు టౌన్: బయటకు వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్‌కు చెందిన గౌరమ్మ (70) శనివారం ఇంట్లో వారికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి అదృశ్యంపై కూతురు లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పనికి వెళ్లిన వ్యక్తి.. పనికి వెళ్తున్నానని చెప్పిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి చెందిన సురేంద్ర ప్రసాద్ (33) మే 22న కూలి పని కోసం వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అయితే గతంలో కూడా ఇలాగే ఇంటి నుంచి వెళ్లి కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. రోజులు గడిచినా కుమారుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి నిరంజన్ ప్రసాద్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వర్గల్ మండలంలో మహిళ.. వర్గల్(గజ్వేల్): మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది. గౌరారం ఏఎస్ఐ పోచగౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లపురం రామయ్యకు భార్య బుచ్చమ్మ(55), ఇద్దరు కుమారులున్నారు. ఈ నెల 9న ఇంట్లో గొడవ జరగగా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో భర్త రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
బైక్ ఢీకొని కార్మికుడికి తీవ్ర గాయాలు
హత్నూర(సంగారెడ్డి): నడుచుకుంటూ వస్తున్న కార్మికుడిని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సంగారెడ్డి దౌల్తాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన ఠాగూర్ గుండ్ల మాచునూరు గ్రామ శివారులోని కోవలెంట్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. పరిశ్రమ నుంచి అద్దె గదికి వెళ్తున్న క్రమంలో కొండాపూర్‌కు చెందిన శివ, ప్రసాద్ ఇద్దరు బైకుపై ఏడుపాయల ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఠాగూర్‌ను ఢీకొట్టారు. దీంతో కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో పాటు కాలు విరిగింది. తోటి కార్మికులు గమనించి వెంటనే బైక్‌తో పాటు ఇద్దరు యువకులను తీవ్రంగా మందలించారు. అంబులెన్స్‌లో గాయపడిన కార్మికుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సైతం పరిశీలించారు. -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
నిజాంపేట(మెదక్): మద్యానికి బానిసై మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పరిధిలోని కల్వకుంట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కల్వకుంట గ్రామానికి చెందిన రావిపల్లి ప్రభాకర్ రెడ్డి(72) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన పాత ఇంట్లో ఉన్న దూలానికి దోతి సహాయంతో ఉరివేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్లో మద్యపానానికి బానిసై కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని రాశాడు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి.. నర్సాపూర్ రూరల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పారట్ల కుమార్ (30) గ్రామ సమీపంలోని నీలగిరి చెట్లలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో మహిళ.. చేగుంట(తూప్రాన్): కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మాసాయిపేట మండలం పులిగుట్ట తండాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... తండాకు చెందిన మాలోత్ సోనీ(50) తన భర్త కాశీరాంలు శనివారం రాత్రి గొడవపడ్డారు. ఈ క్రమంలో అదే రాత్రి సోనీ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగింది. ఆదివారం సమీప రైతులు పొలంలో పడిపోయి ఉన్న సోనీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తండాకు చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మానసిక ఆందోళనతో మనస్తాపానికి గురై.. జిన్నారం (పటాన్చెరు): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి కథనం ప్రకారం... శివంపేట్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన రాజు(50) గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగులో నివాసం ఉంటూ ఓ పరిశ్రమలో ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో పాటు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భార్యతో గొడవపడి భర్త.. హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ మండలం తిమ్మానగర్‌లో ఆదివారం వెలుగు చూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన గడ్డి మైసయ్య(55)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలు మైసయ్య, కంసమ్మలు వేరుగా నివాసముంటున్నారు. సంసారం విషయంలో రెండు రోజుల క్రితం గొడవపడి భార్య మెదక్‌లో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన మైసయ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. గమనించిన కుమారులు తలుపులు తీసి చూసేసరికి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు.. వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో ఓ బావిలో శవమై తేలింది. ఈ ఘటన మండలంలోని శేరీల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చిన్నింగి వెంకమ్మ(75) రెండేళ్ల క్రితం కాలు విరగడంతో నడవలేని స్థితిలో ఉంది. రోజూ మాదిరిగా కోడలు లక్ష్మి శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం ఇచ్చి తన గదిలో నిద్రించింది. ఆదివారం ఉదయం చూసేసరికి వెంకమ్మ తన గదిలో లేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. ఆందోళన చెందిన కోడలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామస్తులతో కలిసి పోలీసులు శివారులో వెతుకుతుండగా ఓ బావిలో శవమై కనిపించింది. వృద్ధురాలి ఒంటిపై ఉండే బంగారు నగల కోసం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు మొదట అనుమానించినా, మృతదేహంపై నగలు ఉన్నాయి. దీంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు బావి వద్దకు ఎలా వెళ్లింది? ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అంతర్జాతీయ భాగస్వామ్యంతో పరిశోధనలు
● కావేరి వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ ప్రవీణ్‌రావు ● వర్సిటీని సందర్శించిన బ్రెజిల్ విద్యావేత్త డాక్టర్ ఫ్లావియో మైడెరోస్ వర్గల్(గజ్వేల్): బ్రెజిల్‌లోని లావ్రాస్, కావేరి వర్సిటీల మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులకు ప్రపంచస్థాయి అవకాశాలతోపాటు, పరిశోధన, ఆవిష్కరణలకు మరింత బలం చేకూరుతుందని కావేరి వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం లావ్రాస్ ఫెడరల్ యూనివర్సిటీ (యూఎఫ్ఎల్ఏ) ప్లాంట్ పాథాలజీ విభాగం ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ డాక్టర్ ఫ్లావియో మైడెరోస్ గౌరారంలోని కావేరి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు వీసీ స్వాగతం పలికారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయంలోని ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన క్షేత్రాలు, సమగ్ర పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. విద్యా, పరిశోధన సదుపాయాలు అభినందనీయమని ప్రశంసించారు. విద్యార్థుల మొబిలిటీ కార్యక్రమాలు, విద్యాపరమైన సహకారం, పరిశోధనలు, అవుట్‌రీచ్ కార్యక్రమాలు, అధ్యాపకుల అభివృద్ధి తదితర రంగాల్లో రెండు వర్సిటీల పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ బీ.శ్రీనివాసులు, డీన్ డాక్టర్ ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు వారితో అంతర్జాతీయ విద్య, పరిశోధన, అకాడమిక్ సహకార అవకాశాల పై విస్తృతంగా చర్చించారు. -
మద్యం మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి
పరిస్థితి విషమం నర్సాపూర్ రూరల్: మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన మన్నే రమేశ్, చెన్నం రెడ్డి గ్రామంలోని బెల్ట్ షాపు వద్దకు ఆదివారం మద్యం కోసం వెళ్లారు. తాగిన మత్తులో బెల్ట్ షాపు ఎదురుగా ఉన్న పాన్‌షాప్ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చెన్నం రెడ్డి , రమేశ్‌పై కత్తితో పలుచోట్ల దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. రమేశ్ భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న చెన్నం రెడ్డిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
వర్ష బీభత్సం
కొండాపూర్(సంగారెడ్డి)/నారాయణఖేడ్: మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోనే కొండాపూర్‌లో అత్యధికంగా 11.4 వర్షపాతం నమోదైంది. దీంతో గ్రామాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తినష్టం వాటిల్లింది. విద్యుత్ స్థంభాలు నేలకొరగడం, విద్యుత్ వైరులు తెగిపోవడంతో చాలా గ్రామాలు శనివారం రాత్రి అంధకారంలోనే ఉన్నాయి. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. చెర్ల గోపులారంలో రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాత్రంతా ఆ గ్రామం అంధకారంలోనే ఉంది. అదే గ్రామానికి చెందిన బాల్రాజ్గౌడ్కు సంబంధించిన భవనంపై గోడ కూలిపోయింది. మరో ముగ్గురికి సంబంధించిన రేకుల ఇల్లు నేల మట్టమయ్యాయి. ఇదే కాకుండా గిర్మాపూర్‌లో కూడా రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గొల్లపల్లిలో గౌరమ్మ, నడిమింటి స్వరూపలకు సంబంధించిన రేకుల షెడ్డు పూర్తిగా గాలికి కొట్టుకుపోయాయి. వీరికి సంబంధించిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఆదివారం సంఘటన స్థలాన్ని తహసీల్దార్ అశోక్ పరిశీలించి వారికి పునరావసం కల్పించారు. నెలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని డీలర్‌ను ఆదేశించారు. వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చూస్తానని భరోసా కల్పించారు. అదేవిధంగా మండల కేంద్రమైన కొండాపూర్, అలియాబాద్ గ్రామాల్లో కూడా రేకుల షెడ్డు పూర్తిగా గాలికి కొట్టుకుపోయింది. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలకు విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలుగడంతో మనూరు మండలం బోరంచ ఇన్‌టెక్‌వెల్ నుంచి పలు గ్రామాలకు తాగునీటి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
ఐక్యంగా ఉద్యమిద్దాం
తపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు సంగారెడ్డి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని తపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని మాధవసదన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న వేతన, సర్వీస్ నిబంధనలు, ఉద్యోగ భద్రత, పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు తపస్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, రాష్ట్ర కార్యదర్శి రమేష్, చంద్రశేఖర్, విజయ్‌కుమార్, నరసింహులు, తుక్కప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు రూ.15 వేలు పింఛన్రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ పటాన్చెరు టౌన్: తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు రూ.15 వేలు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం దివ్యాంగులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్‌లో 80% పైగా వైకల్యం కలిగిన వారికి దాదాపు రూ.15 వేలు పెన్షన్ అందిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి తీవ్ర వైకల్యం కలిగిన వారు 4 నుంచి 5 వేల మంది మాత్రమే ఉంటారని, వారికి రూ.15 వేలు చొప్పున పెన్షన్ ఇచ్చినా ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో రవికుమార్, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్జహీరాబాద్ టౌన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ తుది దశ ప్రక్రియ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రంజోల్ శ్రీసంగమేశ్వర ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మునిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొదటి దశలో హాజరుకాని అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ 15న స్లాట్ బుకింగ్, 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20న సీట్ల కేటాయింపు చేపట్టి 23 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాలిసెట్ పరీక్షలకు హాజరై ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు త్వరగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో సంప్రదించాలని మునిగుప్తా పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలేస్కూల్ బస్సు డ్రైవర్ల సమావేశంలో డీఎస్పీ జహీరాబాద్ టౌన్: విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ బస్సు డ్రైవర్లకు డీఎస్పీ సైదానాయక్ హెచ్చరించారు. పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్లో స్కూల్ బస్సు డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపరాదన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడటం, మేసేజ్‌లు పంపడం చేయరాదని సూచించారు. ప్రధాన కూడళ్ల వద్ద ర్యాష్ డ్రైవింగ్, అతివేగంగా వెళ్లడం వంటివి చేయవద్దని స్పష్టం చేశారు. విద్యార్థులను ఎక్కించేటప్పుడు..దింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, ఎస్సైలు లవకుమార్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇక పంచాయతీల విభజన
● ఆదాయం ఆధారంగా గ్రేడింగ్ ● కార్యదర్శుల పదోన్నతులకు అవకాశం ● బలోపేతం కానున్న పంచాయతీలుసంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీ పాలన మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందులోభాగంగా పంచాయతీలను ఆదాయం ఆధారంగా విభజించనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఆదాయం ఆధారంగా నాలుగు గ్రేడ్లు గ్రామ పంచాయతీల వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయించారు. రూ.19 లక్షల కంటే ఎక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్–1గా, రూ.13 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉన్న వాటిని గ్రేడ్–2, రూ.7 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్–3, రూ.7 లక్షల కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్–4గా విభజించనున్నారు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా, 46 జీపీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడంతోపాటు కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 12 కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 613 పంచాయతీలున్నాయి. గ్రేడ్– 1 పరిధిలోకి 40, గ్రేడ్–2 లోకి 53, గ్రేడ్ –3 లోకి 164, గ్రేడ్–4 లోకి 356 గ్రామపంచాయతీలను విభజించనున్నారు. పదోన్నతులకు అవకాశం గ్రామ పంచాయతీల గ్రేడింగ్లుగా విభజన ప్రక్రియ పూర్తయితే జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు లభించనున్నాయి. గ్రేడింగ్ విభజనతో క్యాడర్ స్ట్రెంత్ ప్రక్రియను సైతం సవరణ చేయనున్నారు. మెరుగుపడనున్న పంచాయతీ పాలన గ్రేడింగ్ విధానం అమలుతో పంచాయతీల పాలన వ్యవస్థ మెరుగు పడనుంది. ప్రస్తుతం జిల్లాలో ఇష్టారీతిగా కార్యదర్శులకు పంచాయతీలను కేటాయించారు. ఔట్ సోర్సింగ్, జూనియర్ కార్యదర్శులకు అధిక ఆదాయం వచ్చే పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, పంచాయతీల గ్రేడింగ్ వ్యవస్థను కార్యదర్శులు స్వాగతిస్తున్నారు.జిల్లాలో గ్రేడ్ల వారీగా విభజన కానున్న గ్రామ పంచాయతీలుగ్రేడ్ రకం పంచాయతీలుగ్రేడ్–1 40 గ్రేడ్–2 53 గ్రేడ్–3 164 గ్రేడ్–4 356 -
బుల్లెట్ రైల్ కోసం మంత్రి దామోదరకు వినతి
మెదక్ ఎంపీ రఘునందన్తోనూ ఎమ్మెల్యే భేటీ జహీరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబైకు మంజూరైన బుల్లెట్ రైలును జహీరాబాద్ మీదుగా నడిపేలా డీపీఆర్‌ను రూపొందించేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను అఖిలపక్షం నాయకులు కోరారు. ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డిల ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు మంత్రి దామోదర రాజనర్సింహను ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మొదటి విడత డీపీఆర్ అలైన్మెంట్లో బుల్లెట్ రైలు మార్గాన్ని జహీరాబాద్ మీదుగా ఖరారు చేసినప్పటికీ ఇటీవల ఆమోదం పొందిన తుది డీపీఆర్‌లో ఆ మార్గాన్ని కోకాపేట్, శంషాబాద్, వికారాబాద్‌ల మీదుగా మార్చడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారనుందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఇదిలాఉంటే మెదక్ ఎంపీ రఘునందన్‌రావుతో సైతం భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు రఘునందన్‌రావు స్పందిస్తూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్, బీజేపీ నాయకులు పాండురంగారెడ్డి, సుభాష్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. -
రైతన్నకు దిక్సూచి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రతీ ఏటా అకాల వర్షాలు అతివృష్టి, అనావృష్టితో రైతుల పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని దిక్కుతోచని పరిస్థితి. వరుణుడి కోసం ఎదురుచూస్తూ పంటల సాగును చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రైతులకు చల్లని కబురు తీసుకొచ్చింది. సకాలంలో రైతులకు వాతావరణ సూచనలు, వర్షాలు, పిడుగుల సమాచారాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలు ఐఎండీ, ఐకార్ సహకారంతో పలు రకాల యాప్‌లను రూపొందించింది. ఇందులోభాగంగా మేఘ్‌దూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దామిని యాప్‌లను రూపొందించి, రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ల ద్వారా రైతులు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో కొన్ని యాప్‌లు ముందస్తు సమాచారాన్ని కూడా అందిస్తున్నాయి. మేఘ్దూత్లో ముందస్తు సమాచారం మేఘ్‌దూత్ యాప్‌లో రానున్న నాలుగు రోజుల వాతావరణ సమాచారాన్ని రైతులు ముందే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌లో వారం క్రితం నాటి సమాచారంతోపాటుగా ప్రస్తుత సమయంలో ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం సమాచారాన్ని పొందవచ్చు. ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా ఈ యాప్ ద్వారా ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వర్ష సూచనలను నిరంతరం తెలుసుకునేందుకు రెయిన్ అలారం, కిసాన్ సువిధ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. వాతావరణంతోపాటుగా మార్కెట్ ధరలు, పంటల భీమా సమాచారం, విత్తనాలు,ఎరువులు,నీటి నిర్వహణపై పలు సూచనలు ఈ యాప్‌లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. అన్ని భాషలతోపాటుగా తెలుగు భాషలోనూ రైతులకు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లను రైతులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. దామిని యాప్‌లో పిడుగుల సమాచారం ఉరుములు, మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని దామిని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులు ఎక్కడ పడే అవకాశం ఉందో ఈ యాప్ రైతులకు సూచిస్తూ ప్రాణాలను కాపాడుతుంది. పిడుగు పడే సమయంలో రైతులు తగు జాగ్రత్తలను తీసుకుని రక్షణ పొందవచ్చు.సద్వినియోగం చేసుకోవాలి రైతుల ఉపయోగార్థం ప్రభుత్వం రూపొందించిన మేఘ్ధూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దామిని యాప్‌లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ యాప్‌లతో పంటల సాగులో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా రైతులకు ప్రాణ రక్షణకు దోహదపడుతుంది. – వెంకటలక్ష్మి, ఏడీఏ సంగారెడ్డి -
స్నేహితులను కలుసుకోవడం భలే ఉండేది
సంగారెడ్డి టౌన్: వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడం మొదటిరోజే బడికి వెళ్లి తోటి స్నేహితులను, ఉపాధ్యాయులను కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చేది. పాత ఉపాధ్యాయుల దీవెనలు, కొత్త తరగతి ఉపాధ్యాయుల పరిచయం, వారి పాఠాలు మొదలయ్యే విధానం అన్నీ ఒక మధురమైన జ్ఞాపకం. పాఠశాలకు హాజరయ్యే పిల్లలకు స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకునేలా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. – సౌజన్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి -
ఉత్సాహంగా.. భయం భయంగా
సంగారెడ్డి జోన్: నా చిన్నతనంలో తొలి రోజు పాఠశాలకు చాలా ఇష్టంగా వెళ్లేదాన్ని. కొత్త స్నేహితులు, ఉపాధ్యాయులు కలుసుకుంటారని సంతోషం ఉండేది. మొదటి రోజు పాఠశాల అంటే ఏ విధంగా ఉంటుందోననే భయంతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లేదాన్ని. సెలవుల తర్వాత స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తుంటే అదో మధురానుభూతి. కొత్త పుస్తకాలు, బ్యాగు, షూస్ వేసుకుని అందరితో వెళ్లేవాళ్లం. పుస్తకాలకు ర్యాపర్స్ వేసుకుని వాళ్లం. ప్రతీ ఒక్కరు బాగా చదువుకోవాలి. ఉన్నత లక్ష్యాలను నిర్దేషించుకుని, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. – టీఎల్. సంగీత, అదనపు కలెక్టర్, సంగారెడ్డి -
ఓటరు జాబితాతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
నారాయణఖేడ్: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల జాబితా సక్రమంగా ఉండటం ఎంతో కీలకమని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సంవత్ పేర్కొన్నారు. ఖేడ్ పట్టణంలోని జీవన్ ఫంక్షన్హాల్లో ఆదివారం నియోజకవర్గంలోని బూత్‌స్థాయి ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఓటుహక్కు రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన విలువైన ప్రజాస్వామ్య హక్కన్నారు. 18 ఏళ్లు నిండిన వారిపేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని సూచించారు. వలసలు, మరణాలు, చిరునామా మార్పులవంటి అంశాలపై పూర్తి సమాచారంతో ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని చెప్పారు. ప్రజల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని పిలుపునిచ్చారు. అర్హుల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రక్రియకు సంబంధించిన బుక్లెట్లను ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, జిల్లా ఇన్చార్జి ఫయీమ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బడి గంటకు వేళాయె..
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● విద్యార్థులకు స్వాగతం పలకనున్న ఉపాధ్యాయులు ● ఈ సారి 130 స్కూళ్లల్లో ప్రీ ప్రైమరీ వేసవి సెలవులతో బిజీబిజీగా గడిపిన చిన్నారులు సోమవారం నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. స్కూళ్లను అందంగా అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలనున్నారు. ప్రభుత్వ బడుల్లో 1వ తరగతి నుంచి ప్రారంభమవుతుండటంతో గ్రామాల్లో చిన్నారులను తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్:పాఠశాల మొదటి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. అయితే కొన్ని పాఠశాలలకు ఇంకా పుస్తకాలు చేరుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 7,14,660 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 6,95,220 పుస్తకాలు వచ్చాయి. ఇప్పటివరకు 5,90,000 పుస్తకాలను ఆయా మండలాలకు సంబంధించిన ఎంఆర్సీ కార్యాలయాలకు పంపిణీ చేశారు. 7వ తరగతికి సంబంధించిన హిందీ పుస్తకాలు మాత్రమే రాలేదు. అవి కూడా రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. జిల్లాకు 7,76,658 నోట్ బుక్‌లు అవసరం కాగా కొండాపూర్, మనూర్, నాగలిగిద్ద, నిజాంపేట, మొగుడంపల్లి మండలాలకు మినహా మిగతా అన్నిచోట్లకు నోట్‌పుస్తకాలు అందాయి. ఎంఆర్‌సీలోనే పాఠ్యపుస్తకాలు గత మూడేళ్లుగా ప్రవేశాలిలా.. సంవత్సరం 1వ తరగతి 6వ తరగతి 2023–24 10,647 11,4002024–25 11,105 9,7282025–26 11,230 10,438 -
అంత్యక్రియలకు ఆపన్నహస్తం
● బాలసదనంలో కన్న పిల్లలు ● అనారోగ్యంతో తండ్రి మృతి ● ఆఖరి క్రతువుకు అండగా నిలిచిన దాతసిద్దిపేటజోన్: తండ్రి అంత్యక్రియల ప్రక్రియ జరిపించలేని చిన్నారులకు దాత ఆపన్నహస్తం అందించారు. జిల్లా అధికారుల సమక్షంలో దాత సహాయంతో అంత్యక్రియల క్రతువు పూర్తయింది. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి శివ, అంజలి దంపతులు నలుగురు పిల్లలతో బతుకుదెరువు కోసం సిద్దిపేటకు వలస వచ్చారు. రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని జీవనం సాగించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో 2018లో పిల్లలను బాలసదనం అక్కున చేర్చుకుంది. ఈ నేపథ్యంలో తల్లి అంజలి మూడేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి చిన్న చిన్న పనులు చేస్తూ పట్టణంలో ఫుట్‌పాత్, బస్టాండ్ ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాడు. అనారోగ్యం, మద్యానికి బానిసై దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ శుక్రవారం రాత్రి పట్టణంలో ఫుట్‌పాత్‌పై శివ చనిపోయాడు. విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి రాము శవాన్ని మార్చురీకి తరలించారు. శివ పిల్లలకు సమాచారం అందించారు. ఆపన్నహస్తం కోసం.. కన్న తల్లి చనిపోయి, ప్రస్తుతం తండ్రి అనాథ శవంగా మార్చురీలో ఉండడం, బంధువులు, ఆప్తులు ఎవ్వరూ లేకపోవడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. కాగా దహన సంస్కారాల నిర్వహణ ప్రశ్నగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న ఆర్య వైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐతా రత్నాకర్ సాయం చేశారు. దీంతో శ్రీరామకుంట శ్మశానవాటికలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. -
నేడు ’సర్’పై అవగాహన సదస్సు
నారాయణఖేడ్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్)పై ఆదివారం ఉదయం 10గంటలకు పట్టణంలోని జీవన్ ఫంక్షన్‌హాలులో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. తనతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, ముఖ్య శిక్షకులు రాజీవ్ పాల్గొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై, బూత్ స్థాయి ఏజెంట్లు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని బూత్ స్థాయి ఏజెంట్లు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల బాధ్యులు, గ్రామస్థాయి యువ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. త్వరలో ఆర్టీసీలో ఎన్నికలురీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ సంగారెడ్డి టౌన్: త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై సంబంధించిన అన్ని సాంకేతిక ,ఆర్థిక పరిపాలనపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో భక్తజన సందడి శివ్వంపేట(నర్సాపూర్): చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు అభిషేకం అనంతరం సత్యనారాయణస్వామి మండపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. మండల పరిధిలోని ఉసిరికపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారావు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి భక్తులు వస్తు, ధన రూపంలో సహాయం అందించాలని ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ కోరారు. ఈకేవైసీ తప్పనిసరి నెలాఖరుతో ముగియనున్న గడువు గ్యాస్ లబ్ధిదారులు సైతం.. -
మహిళలు స్వశక్తితో ఎదగాలి
సంగారెడ్డి: స్వశక్తితో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదిగాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆమె సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అమ్మవారి గెటప్, భారతమాత గెటప్‌తో పాటు వివిధ సాంప్రదాయ అలంకరణలతో శిక్షణార్థినులు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రతి మహిళ స్వయం శక్తితో ఎదిగి ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ప్రశ్నించాలని, తమ హక్కుల కోసం నిలబడాలని సూచించారు. మధ్యలో వదిలేయకుండా నిరంతరం సాధన చేస్తూ స్వయం ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. డైరెక్టర్ ఎం.రాజేష్ కుమార్ సంస్థ కార్యకలాపాలు, శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవీందర్ నాయక్, సంస్థ కో–ఆర్డినేటర్లు శివశంకర్, నర్సింలు, జేఆర్పీ లక్ష్మిప్రియ, దుర్గ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
మెదక్‌లో 50 మంది ప్రాణదాతలు
మెదక్ జిల్లా వ్యాప్తంగా 50 మంది రక్తదాత లు ఉండగా 49 మంది పేర్లు వారి(బ్లడ్‌గ్రూప్), ఫోన్ నంబర్ల వివరాలను అధికారులు భద్రపరిచారు. ఎవరికై నా రోడ్డు ప్రమాదం జరిగి రక్తం కావాల్సి వస్తే వెంటనే వారికి ఫోన్ చేస్తే వచ్చి స్వచ్ఛందంగా రక్తాన్నిచ్చి ప్రాణదాతలుగా నిలు స్తున్నారు. జనాభాలో 50 శాతానికిపైగా ప్రజలకు ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాగా జిల్లాలో తలసేమి యా వ్యాధితో బాధపడే వారిలో ఎక్కువగా ఓ పాజిటివ్ వారు ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు. మెదక్ రక్తనిధి సెంటర్ -
మంచుకొండల్లో తెలంగాణ రుచులు
● 15వ సారి అమర్నాథ్ యాత్రికులకు అన్నదానం ● ఈ నెల 15న సరుకులతో వెళ్లనున్న లారీలు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మంచు కొండల్లో తెలంగాణ రుచులను అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు అందించనున్నట్లు, అమర్నాథ్ అన్నదాన సేవా సంస్థ చైర్మన్ మధు, అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మంచుకొండల్లో అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు 15వ సారి దక్షిణాది రుచులను అందించడానికి ఈనెల 15న సరుకుల లారీలు వెళ్తున్నట్లు తెలిపారు. భక్తులకు బాల్తాల్, పంచతరని, అమర్నాథ్ గుహల వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామని వివరించారు. సరుకుల లారీలను 15న సిద్దిపేట శరబేశ్వర ఆలయంలో శివకల్యాణం అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్‌కుమార్, శ్రీనివాస్, కాశీనాథం, రమేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలి
రాష్ట్ర గురుకుల స్పోర్ట్స్ ఆఫీసర్ నర్సాపూర్: ఓరియంటేషన్ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గురుకుల స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్ సూచించారు. శనివారం స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో గురుకులాలకు చెందిన పీఈటీ, పీడీలకు రెండు రోజుల ఓరియంటేషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేర్చుకున్న అన్ని అంశాలను విద్యార్థులకు నేర్పించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలని సూచించారు. కోతుల దాడిలో ఇద్దరికి గాయాలు నర్సాపూర్: పలు చోట్ల కోతుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నర్సాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో, నాల్గవ వార్డులో ఇద్దరు బాలురను కోతులు కరిచాయి. కోతుల దాడిలో పిల్లలకు చేతులకు ,కాళ్లకు, తలపై గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యం చేసి ఇంటికి పంపించారు. మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేగుంట(తూప్రాన్): మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన చేగుంటలో శనివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... చేగుంటకు చెందిన అల్లెంకి ధనలక్ష్మి ప్రతి రోజూ బస్టాండ్ సమీపంలో వెంచర్లో మార్నింగ్ వాక్ చేస్తుండేది. శనివారం మార్నింగ్ వాక్ చేస్తున్న క్రమంలో ఆమె వద్దకు వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి అడ్రస్ అడుగుతున్నట్లు నటించి మెడలోని బంగారు గొలుసును బలంగా లాగడంతో ధనలక్ష్మి గొలుసును గట్టిగాపట్టుకుంది. దీంతో పెనుగులాటలో సగం గొలుసు దొంగ చేతికి చిక్కి మిగతా సగం ఆమె చేతిలో మిగిలింది. మరో వ్యక్తి బైక్ నడుపుతుండగా గొలుసు దొంగిలించిన వ్యక్తి ఇద్దరు బైక్‌పై పారిపోయారు. ఐదు తులాల గొలుసులో సుమారు మూడు తులాల గొలుసు చోరీ అయిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. పేకాట స్థావరంపై దాడులు 9 మంది పై కేసు నమోదు పటాన్చెరు టౌన్: పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ చెరువు పక్కన ఖాళీ స్థలంలో శుక్రవారం రాత్రి జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి రూ. 10,200 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
సంగారెడ్డి టౌన్: విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామానికి చెందిన తలారి రంజిత్ కుమార్(34) ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన గౌండ్ల భర్తయ్య పొలంలోని ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోయిందని సమాచారం అందడంతో వెళ్లాడు. ఈ క్రమంలో ఫ్యూజ్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి 11 కేవీ విద్యుత్ లైన్‌కు కుడి చేయి తగలడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధి నిర్వహణలో ఉండగానే జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. కంది మండలంలో యువకుడు.. కంది(సంగారెడ్డి): విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన కందిలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం... పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ (23) శనివారం మోటారు ఆన్ చేసి నీటితో వాకిలిని శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో పని పూర్తయ్యాక మోటారు నుంచి వైరును తీస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అందరితో కలిసి మెలిసి ఉండే ఆరిఫ్ మృతి చెందడం అందరిని కలచివేసింది. లక్ష్మీనగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అమృత్ పథకం పనుల్లో జాప్యం
● నిధుల లేమితో సమస్యలు ● గడువులోపు పూర్తికాని పనులుజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను మెరుగుపర్చడానికి చేపడుతున్న అమృత్ తాగునీటి పథకం పనుల్లో జాప్యం జరుగుతోంది. చేపట్టిన పనులు నత్తనడక సాగుతున్నాయి. రెండు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వేసవిలో ప్రజలు తాగు నీటి కోసం తంటాలు పడక తప్పలేదు. జహీరాబాద్ మున్సిపాలిటీ జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. పట్టణం చుట్టూ ఉన్న పస్తాపూర్, అల్లీపూర్, చిన్న హైదరాబాద్, రంజోల్, హోతి(కె) ఐదు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో జనాభా సుమారు 1.25 లక్షలకు చేరుకొగా వార్డుల సంఖ్య 24 నుంచి 37 వార్డులకు పెరిగింది. ప్రజల నీటి అవసరాలు కూడా పెరిగాయి. పట్టణ ప్రజలకు ప్రతి రోజు 1.70 కోట్ల లీటర్ నీటి అవసరం కాగా మిషన్‌భగీరథ పథకం కింద సుమారు 80 లక్షలు, బోరు మోటార్ల ద్వారా మరో 20 లక్షల లీటర్లు నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. కానీ పలు కారణాల వల్ల 70 లక్షల లీటర్ల నీటి సరఫరా కూడా జరగడం లేదు.రూ.66 కోట్లు మంజూరు పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో అమృత్ 2.0 పథకం కింద రూ. 66 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రాయికోడ్ మండలంలోని ఇటికెపల్లి వద్ద గల మంజీరా నది నుంచి అమృత్ పథకం పైపులైన్ పనులు ప్రారంభించారు. సుమారు 50 కిలో మీటరు మేర కొత్త పైపులైన్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సగం పనులు మాత్రమే పూర్తిచేయడం జరిగింది. ఇంకా పైపులైన్, ట్యాంక్‌ల పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు కొరత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనుల అమలులో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి, ఇప్పటికై నా అధికారులు స్పందించి అమృతి పథకం పనులు పూర్తి చేయాలిని ప్రజలు కోరుతున్నారు. -
కొండాపూర్‌లో కుండపోత
రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీ రికార్డు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో వానసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీల వర్షపాతం రికార్డు అయింది. దీంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచలో 4.7 సెం.మీలు, పుల్కల్ 3.4 సెం.మీలు, మునిపల్లిలో 3.2 సెం.మీలు, రామచంద్రాపూరం బీహెచ్ఈఎల్లో 3.0 సెం.మీలు, సదాశివపేటలో 2.3 సెం.మీలు, రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లో 1.5 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో వర్ష పాతం రికార్డు అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి వరకు ముసురు పెట్టింది. అలాగే పటాన్చెరు, తెల్లాపూర్, అమీన్‌పూర్‌లలో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడగా, మరోవైపు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. న్యాల్కల్(జహీరాబాద్): జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. వర్షం వల్ల వేసిన పంటలకు ప్రాణం పోసినట్లు కాగా, వేసే పంటలకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది 7,62,580 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 3,82,511 ఎకరాల్లో పత్తి, 1,59,070 ఎకరాల్లో వరి, 75,557 ఎకరాల్లో కంది, 61,312 ఎకరాల్లో సోయాబీన్, 27,986 ఎకరాల్లో చెరకు, 56,144 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికంగా పత్తి విత్తనాలను విత్తారు. ముందుగా విత్తుకున్న విత్తనాలు సైతం మొలకెత్తాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవకపోడంతో మొలకెత్తిన పంట దెబ్బతింటుంది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. బోరు బావులు ఉన్న రైతులు స్ప్రీంకర్ల ద్వారా పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో సాగు చేసుకున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. పంటలు వేసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ధాన్యం.. దైన్యం
హవేళిఘణాపూర్(మెదక్): ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. లారీల కొరత.. ధాన్యం తరలింపులో కాలయాపనతో వడ్లు కల్లాల్లోనే మూలుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తూకం వేసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల బస్తాల కిందకు నీరు చేరడంతో రంగుమారి మొలకలు వచ్చాయి. మెదక్, హవేళిఘణాపూర్ మండలాలకు సంబంధించిన ధాన్యం మంభోజిపల్లి ఎన్డీఎస్ఎల్ గోదాంకు తరలిస్తున్నారు. అక్కడ అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలిచిపోయాయి. హమాలీల సంఖ్య పెంచి అన్లోడింగ్ త్వరగా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
చెట్లు తెంచిన తంటా
పవర్ వర్సెస్ ఫారెస్ట్‌శాఖ హవేళిఘణాపూర్(మెదక్): చెట్ల కొమ్మలను తొలగించే విషయం విద్యుత్, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణకు దారి తీసింది. మండల పరిధిలోని జక్కన్నపేట– బూర్గుపల్లికి సరఫరా అయ్యే విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను శనివారం విద్యుత్‌శాఖ అధికారులు నరికివేస్తుండగా, తమ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారంటూ అటవీశాఖ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
చెరువులో మునిగి వ్యక్తి మృతి
నిజాంపేట(మెదక్): చెరువులో స్నానం చేస్తుండగా కాలుజారి నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బచ్చురాజ్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... బచ్చురాజ్‌పల్లి గ్రామానికి చెందిన బోడపట్ల మల్లయ్య (48) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఇటీవల మరణించిన కులస్తుడి దశదిన కార్యక్రమం నిమిత్తం మల్లయ్య స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ అందరితో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి వారు వెంటనే చెరువులో గాలించారు. దురదృష్టవశాత్తు అప్పటికే మల్లయ్య ప్రాణాలు కోల్పోవడంతో అతని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బుల్లెట్ రైలు నడపాలి
జహీరాబాద్: బుల్లెట్ రైలు మార్గం ఏర్పాటుకు జహీరాబాద్ అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ మీదుగా కాకుండా వికారాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది సరైంది కాదన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో 12వేల ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోందని, దీంతో భారీ పారిశ్రామిక ప్రాంతంగా రూపుదిద్దుకోనుందన్నారు. ప్రాజెక్టు సాధనలో భాగంగా ఈనెల 15వ తేదీన జహీరాబాద్ ఎంపీ సురేష్‌శెట్కార్ ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహాలను కలిసి వినతి పత్రాలను ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఢిల్లీ స్థాయిలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అనంతరం రైల్వే స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి స్టేషన్ మేనేజర్ మాధవకృష్ణకు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో ఐడీసీ మాజీ చైర్మన్ ఎండీ తన్వీర్, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్, మున్సిపల్ చైర్మన్ యూనుస్ తదితరులు పాల్గొన్నారు.


