breaking news
Crime
-
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కూకట్పల్లి సహస్ర హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితమే సహస్ర ఇంటి పక్కన ప్లాట్‌లోకి వచ్చిన బాలుడు కుటుంబ సభ్యులు.. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతున్నారు. బాలుడు స్వస్థలం ఒంగోలు జిల్లా. కొద్దిరోజుల క్రితమే సహస్ర పుట్టిన రోజు వేడుకలు జరగ్గా.. ఆమె బర్త్ డే వేడుకలకు బాలుడు హాజరయ్యాడు. సహస్రకి కేక్ కూడా తినిపించి విషెస్ చెప్పాడు. అయితే, టెన్త్ క్లాస్ విద్యార్థి ఇంత కిరాతకానికి ఎలా తెగించాడు? అనే దానిపై పోలీసులు కూడా షాక్‌కు గురవుతున్నారు.బాలికను హత్య చేసిన బాలుడు సైకో అవతారం ఎత్తాడు. యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి హత్యకు పాల్పడ్డాడు. పక్క పథకం ప్రకారం క్రైమ్ సీన్ రచించిన బాలుడు.. 10వ తరగతి దశలోనే క్రైం చేయడం నేర్చుకున్న బాలుడు.. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. బాలుడిని పదుల సంఖ్యలో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటిలెజెంట్‌గా బాలుడు వ్యవహరించాడు.బాలుడు రెగ్యులర్‌గా కత్తి పట్టుకుని తిరుగుతాడని పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తండ్రి తాగుబోతు, తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగి.. కుమారుడిని సరైన మార్గంలో పెంచలేకపోయారు. కొడుకును పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు క్రైమ్ సీన్లకు అలవాటుపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులను డీసీపీ విచారిస్తున్నారు. ఓటీటీ, యూట్యూబ్ వీడియోలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనడానికి ఇదో ఉదాహరణ.. ఓటీటీలో క్రైం సీరియల్స్ చూసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. హత్యకు రెండు రోజుల ముందే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాలుడు రాసుకున్నాడు.హత్య జరిగిన రోజున కూడా పోలీసులను బాలుడు తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి గట్టిగా అరుపులు వినిపించాయంటూ.. ఏమీ ఎరగనట్లు హత్య జరిగిన రోజున పోలీసులకు చెప్పాడు. బాలుడి మాటలతో ఇతరులు చంపి ఉంటారన్న అనుమానంతో ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను చంపేసాక ఆ బాలుడు గ్యాస్ లీక్ చేయాలనుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. -
సూర్యాపేట జిల్లాలో ముగ్గురిపై హత్యాయత్నం
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మరో సుపారీ మర్డర్‌కు ప్లాన్ చేసిన ఘటన స్థానకంగా కలకలం రేపింది. ఓ బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని హత్య చేసేందుకు ఒక సుపారీ గ్యాంగ్ కారులో వెంబడించింది. దాంతో అప్రమత్తమైన ఆ ముగ్గురు బైక్ దిగి వైన్స్‌లోకి పరిగెత్తడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ ముగ్గురు. సుపారీ గ్యాంగ్‌ను వైన్స్‌లో ఉన్నవాళ్లు వెంబడించడంతో వారు వచ్చిన కారులోనే పరారయ్యారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా, తాజాగా మరోసారి హత్యాయత్నం పథకం జరగడంతో సూర్యాపేటలో కలకలం రేగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అనే ప్రశ్న స్థానికంగా జీవిస్తున్న వారిలో మొదలైంది. -
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్‌లోనే బాలుడు ఉంటున్నాడు. బాలుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడిన బాలుడు.. చోరీ చేశాడు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్న బాలుడు.. ఆ కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు. దొంగతనం ఎప్పుడు? ఎక్కడ ఎలా చేయాలి?. చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో పక్కాగా ప్లాన్ చేసిన బాలుడు.. బాలిక ఇంట్లో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేశాడు. ఇంకా డబ్బులు కాజేసేందుకు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలుడిని చూసి సహస్ర కేకలు వేయడంతో ఆమెపై దాడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని సహస్రపై విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు.హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్‌లో 15 నిమిషాల పాటు బాలుడు దాక్కున్నాడు. ఈ సమాచారాన్ని స్థానికంగా ఉండే ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐటీ ఉద్యోగి సమాచారం ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో బాలుడూ ఎంతకీ నోరు విప్పకపోవడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్‌కు వెళ్లి కూడా ఎస్వోటీ పోలీసులు విచారించారు.ఇక బాలిక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. తనీఖీల్లో బాలుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడి ఇంట్లో జరిపిన సోదాల్లో సహస్రను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్‌లో దొంగతనం ఎలా చేయాలో బాలుడు నేర్చుకున్నాడు. హౌటూ ఓపెన్ డోర్, హౌటూ ఓపెన్ గాడ్ హుండీ ఇలా నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్ మీద రాసుకున్నాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
బంగారు శంఖం అంటూ రూ. 10 లక్షలు కుచ్చు టోపీ
ఒడిశా, జయపురం: జయపురంలో నకిలీ బంగారు శంఖాల మోసం జరిగింది. ఒక నకిలీ బంగారంతో తయారు చేసిన శంఖాన్ని ఒక వ్యాపారికి ఇచ్చి రూ.10 లక్షలు మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. జగత్సింగపూర్ జిల్లా కుజంగ పోలీసు స్టేషన్ గండకిపూర్ వ్యాపారి నిత్యానంద మహాపాత్రోకి బంగారు శంఖం ఇస్తామని కొందరు మోసగాళ్లు నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ వెల్లడించారు. ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్పోలీసు అధికారి వివరణ ప్రకారం నిత్యానంద మహాపాత్రో భువనేశ్వర్‌లో వ్యాపారం చేస్తున్నారు. అతడికి జయపురంలో బంగారు శంఖం ఇస్తానని ఓ వ్యక్తి తెలిపాడు. ఈ నెల 16న స్థానిక ఒక హొటల్కు ఆ వ్యక్తి అతడి అనుచరులు వచ్చారు. మహాపాత్రోకు బంగారంలా కనిపించే ఒక శంఖం ఇచ్చి రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. వ్యాపారికి దుండగులుఇచ్చిన నకిలీ బంగారు శంఖంతర్వాత మహాపాత్రో బంగారు శంఖాన్ని పరీక్షించగా అది ఇత్తడి అని బయట పడింది. వారికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ రాజేంద్ర పంగి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు -
వితంతువుకు నిలువునా మోసం
చిక్కబళ్లాపురం: అండగా ఉంటానని వితంతువును పెళ్లి చేసుకొని గర్భిణిని చేసిన వ్యక్తి మరో వివాహం చేసుకున్నాడు. న్యాయం చేయాలని వెళ్లిన మొదటి భార్యపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. చిక్కబళ్లాపురం నగరంలో నివాసముంటున్న కీర్తి భర్త 2022లో మృతి చెందాడు. ఈ దంపతులకు కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో పనులకు వెళ్లేది. అక్కడ అంబిగానహళ్లికి చెందిన సునీల్‌తో పరిచయమైంది. అనంతరం ఇద్దరూ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. రిజి్రస్టార్ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేయించారు. కొద్ది రోజులు వీరి కాపురం సవ్యంగా సాగింది. అనంతరం సునీల్ గొడవ పడుతుండగా పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు మందలించడంతో కీర్తిని బాగా చూసుకుంటానని హామీ పత్రం రాసిచ్చాడు. ప్రస్తుతం కీర్తి ఎనిమిది నెలల గర్భిణి. అయితే సునీల్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి అంబిగానహళ్లిలోని సునీల్ ఇంటికి వెళ్లగా అతని తల్లిదండ్రులు దాడి చేశారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి కీర్తిని ఆస్పత్రికి తరలించారు. -
మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!
పెద్దపల్లిరూరల్: పరాయి మహిళ మోజులో పడి కట్టుకున్న భార్య, కన్నబిడ్డలను పట్టించుకోని భర్తకు సఖి కేంద్రం నిర్వాహకులు కౌన్సెలింగ్‌కు యతి్నంచినా సహకరించలేదు. ఆగ్రహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాలరావు బుధవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన రవీందర్ (ఓదెల పీహెచ్సీలో ఫార్మసిస్ట్) కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా పరాయి స్త్రీ మోజులో పడిన రవీందర్.. భార్యాబిడ్డల పోషణ పట్టించుకోవడం మానేశాడు. పోషణ భారం కావడంతో ఆయన భార్యాపిల్లలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబంతో కలిసి ఉండేలా చూడాలని జిల్లా సంక్షేమశాఖ, సఖి కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వారు పలుమార్లు కౌన్సెలింగ్ పిలిచినా సహకరించలేదు. ఉద్యోగం చేసే పీహెచ్‌సీకి వెళ్తే.. “మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో సహజీవనం చేస్తే తప్పేంటి’ అని దబాయించాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లొచ్చంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. ఈ వ్యవహారంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించారు. ఆగ్రహించిన కలెక్టర్.. ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి చట్టం ప్రకారం రవీందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
చెన్నూర్ ఎస్బీఐలో కుంభకోణం
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో కుంభకోణం జరిగింది. నగదుతోపాటు ఖాతా దారులు తనఖా పెట్టిన బంగారునగలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. క్యాషి యర్ పెద్దఎత్తున బంగారం, నగదు మాయం చేసిన ట్టు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్ మనోహర్‌రెడ్డి రెండురోజుల సెలవు తర్వాత మంగళవారం విధుల్లో చేరారు. బ్యాంకులోని డబ్బు, ఖాతాదారులు తనఖా పెట్టిన నగల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలి సింది. దీంతో బ్యాంకు అధికారులు ఆడిటింగ్ నిర్వ హించారు. సుమారు 330 మంది ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు విలువైన బంగారు ఆభరణాలు, రూ.80 లక్షల నగ దు లావాదేవీల్లో తేడా వచ్చినట్టు గుర్తించి పోలీసు లకు సమాచారం ఇచ్చారు. జైపూర్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన క్యాషియర్ రెండ్రోజు లుగా బ్యాంకుకు రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతోపాటు బంగారం మాయంలో కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఆడిటింగ్ శుక్రవారం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్యాంక్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
ఆన్లైన్లో పాడిగేదెలు : లక్షల్లో మోసపోయిన డైరెక్టర్
ఆన్లైన్ షాపింగ్ అంటే ఆచి తూచి వ్యవహరించాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అత్యాశకు పోయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. శాండల్‌వుడ్ దర్శకుడు ప్రేమ్ మోసపోయిన తీరు ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తుంది. ఏం జరిగిందంటే...శాండల్‌వుడ్ దర్శకుడు ప్రేమ్ గుజరాత్‌కు చెందిన పశువుల వ్యాపారి చేతిలో రూ. 4.5 లక్షలు మేర దారుణంగా మోస పోయాడు. బ్రహ్మాండమైన రెండు గేదెలను డెలివరీ చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక వ్యాపారి, తీరా డబ్బులు తీసుకొని పత్తా లేకుండా పోయాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రేమ్, పాడి వ్యవసాయాన్ని చేద్దామనుకున్నాడు. ఇందుకోసం పాడిగేదెల్ని కొనేందుకు ఆన్లైన్ వెదికాడు. ఈ క్రమంలో గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన వాఘేలా వనరాజ్భాయ్ శాంతిభాయ్ను సంప్రదించాడు. అధిక పాల దిగుబడి కోసం పెంచిన గేదెలు అంటూ మెరిసే ఫోటోలనను షేర్ చేశాడు. ఫోటోలు చూసి పడిపోయిన ప్రేమ్, రూ.25,000 అడ్వాన్స్‌గా చెల్లించాడు. జంతువులను ట్రక్కులో ఎక్కించి బెంగళూరుకు వెళ్తున్నట్లు వాఘేలా నమ్మబలికాడు. ఇది చూసి మరింత మురిసి పోయిన ప్రేమ్ మరో విడతలవారీగా మొత్తం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ గేదెల డెలివరీ మాత్రం రాలేదు. అటు వాఘేలా కాల్స్ ఎత్తడం మానేశాడు. దీంతో మోస పోయానని గ్రహించి చంద్ర లేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లునిందితుడిఇంటికి తాళం వేసి అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం కూపీలాగుతున్నారు. గేదెలు కాదుకదా, దాని తోక వెంట్రుకలు కూడా రాలేదు అంటూ ప్రేమ్ వాపోయాడు. "ఆ ఫోటోలు నిజమైనవనుకుని నమ్మాం. ట్రక్ వారంలోపు వస్తుందని నిందితుడు చెప్పాడు" అని ప్రేమ్ మేనేజర్ దశవర్ చంద్రు అన్నారు. ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
అహ్మదాబాద్ ఘటన: ‘నేనే చంపాను’.. ‘అజ్ఞాతంలోకి వెళ్లు’ దడ పుట్టిస్తున్న చిన్నారుల ఇన్‌స్టా చాట్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. అదే పాఠశాలలో ఎనిమిది చదువుతున్న విద్యార్థి కత్తితో పొడిచి హత్యచేశాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు.. అతని స్నేహితుని మధ్య జరిగిన ఇన్‌స్టా చాట్ బయటపడింది. దానిలో ఆ బాలుడు నేరం అంగీకరించాడు. తన సీనియర్‌పై కత్తితో దాడికి దారితీసిన పరిణామాలను కూడా నిందితుడు ఆ చాట్‌లో వివరించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పాఠశాల ప్రాంగణంలో నిరసనలకు దారితీసింది.పోలీసులు యాక్సెస్ చేసిన చాట్ ఇలా ఉంది..స్నేహితుడు: భాయ్, ఈరోజు నువ్వు ఏమైనా చేసావా?నిందితుడు: అవునుస్నేహితుడు: నువ్వు ఎవరినైనా పొడిచావా?నిందితుడు: ఎవరు చెప్పారు?స్నేహితుడు: నాకు కాల్ చెయ్యి.. చాట్ వద్దు.నిందితుడు: లేదు, లేదు.స్నేహితుడు: నీ పేరు బయటకు వచ్చింది.. అందుకే నేను అడిగాను.నిందితుడు: మా అన్నయ్య నా పక్కనే ఉన్నాడు. అతనికి తెలియదు. అయినా నీకు ఎవరు చెప్పారు?స్నేహితుడు: బహుశా అతను చనిపోయాడు.నిందితుడు: అవునా... ఇంతకీ అతనెవరు?స్నేహితుడు: నువ్వు అతన్ని పొడిచావా.. అని నేను అడుగుతున్నాను.నిందితుడు: అవును.నిందితుడు: నేను అతన్ని చంపానని వాడికి (ఒక స్నేహితుడు) చెప్పు. అతను నీకు తెలుసు.. ఇప్పుడే చెప్పు.స్నేహితుడు: ఇంతకీ అసలు ఏం జరిగింది?నిందితుడు: అతను నన్ను ‘నువ్వు ఎవరు? నన్ను ఏం చేయగలవు?’ అని అడిగాడుస్నేహితుడు: ఇంతదానికే నువ్వు పొడిచి చంపకూడదు. నువ్వు అతన్ని కొట్టి ఉండాల్సిది.నిందితుడు: ఏది ఏమైనా జరిగిందేదో.. జరిగిపోయింది.స్నేహితుడు: జాగ్రత్తగా ఉండు. కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లు. ఈ చాట్లను డిలీట్ చెయ్యి..నిందితుడు: సరే.ఘటన పూర్వాపరాలివే..గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఏదో వివాదంలో ఎనిమిదో తరగతి.. విద్యార్థి పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడవగా, బాధిత విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం బయటకు పొక్కినంతనే ప్రజాగ్రహం పెల్లుబికి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆగ్రహంతో రగిలిపోతూ కొందరు ఆందోళనకారులు పాఠశాలను ధ్వంసం చేశారు.మణినగర్ ఈస్ట్‌లోని సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చి స్కూల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థి 10వ తరగతి విద్యార్థిని కత్తితో పొడిచాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆ విద్యార్థి మరణించాడు. అనంతరం బాధిత కుటుంబంతో పాటు సింధీ వర్గానికి చెందినవారంతా ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన నిరసనకారులు పాఠశాల సిబ్బందిపై దాడి చేశారు. సమీపంలో పార్క్ చేసిన పాఠశాల బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులతో పాఠశాల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులు పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పాఠశాల వెలుపల రోడ్డును దిగ్బంధించారు.మణినగర్ ఎమ్మెల్యే, డీపీపీ బల్దేవ్ దేశాయ్, ఏసీపీ పరిస్థితిని చక్కదిద్దడాని ప్రయత్నించారు. బజరంగ్ దళ్, బీహెచ్పీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
మియాపూర్‌లో మిస్టరీ డెత్స్.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త,మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతులను కర్ణాటక చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
భర్తకు దూరంగా వివాహిత.. తన ప్రేమకు అడ్డుచెప్పిందని..
సాక్షి, బెంగళూరు: ప్రేమ నిరాకరించినందుకు వివాహితను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. సినీ ఫక్కీలో కారులో ఉంచి చెరువులోకి నెట్టేయడంతో ఆమె జలసమాధి అయ్యింది. ఈ సంచలన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మృతిరాలిని హాసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32)గా గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్వేత కొంతకాలం కిందట భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటోంది. ఆమె హాసన్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన భార్యను విడిచిపెట్టి వస్తానని, తనను పెళ్లాడాలని ఆమెను సతాయించేవాడు. అయితే, అతడి ప్రపోజల్‌ను ఆమె తిరస్కరించింది. దీంతో, ఆవేశానికి గురైన రవి శ్వేతను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.అనంతరం, ఆమెను బయటకు తీసుకెళ్లే క్రమంలో కారులో ఎక్కించుకుని వచ్చాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును ఆపి.. కారులోనే శ్వేతను ఉంచి చెరువులోకి తోసేశాడు. తర్వాత.. కారు అనుకోకుండా చెరువులో పడిందని , అందులో స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా.. రవి నిజం ఒప్పుకున్నాడు. తానే ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. -
డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. ఆనవాళ్లు లేకుండా కాల్చేసి!
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. తనిఖీలో భాగంగా ఆమైపె అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోవేరహట్టి గ్రామానికి చెందిన వర్షిత (19) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఆమె పట్టణంలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం బీఏ డిగ్రీ చదువుతూ ఇక్కడ ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో ఉంటోంది. అయితే, వర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి గుర్తించడానికి వీలు లేకుండా పెట్రోలు పోసి దహనం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వర్షం మొదలవడంతో మంటలు ఆరిపోగా మృతదేహం సగం కాలిపోయింది.అనంతరం, హత్యకు గురైన యువతి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో యువతి చేతికి వేయించుకొన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. ఇక, ఈ కేసులో ఆమెతో స్నేహంగా ఉంటున్న చేతన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. పూర్తి విచారణ తర్వాత మాత్రమే అసలు విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తమ కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కాగా బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.కర్ణాటకలో నిరసనలు..మరోవైపు.. యువతి హత్యను ఖండిస్తూ చిత్రదుర్గలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
పోక్సో కేసులో దోషికి 20 ఏళ్ల జైలు.. ఒంగోలు కోర్టు తీర్పు
ఒంగోలు: ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు న్యాయాధికారి కానుగుల శైలజ బుధవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన బాలిక తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఆదివారం అల్లూరు గ్రామంలో చర్చికి వెళ్లేది. ఆ చర్చిలో మైకు ఏర్పాటుచేసే బత్తుల చంటి అలియాస్ విల్సన్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటర్ చదువుతున్న ఆ బాలికను మభ్యపెట్టి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొన్నాళ్లకు బాలిక అనారోగ్యంగా ఉంటుండడంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక చంటి అలియాస్ విల్సన్ గురించి చెప్పింది. బాలిక తల్లిదండ్రులు 2019 ఆగస్టు 6న కొత్తపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్.ఐ. మేడా శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి నిందితుడు చంటి అలియాస్ విల్సన్‌పై నేరారోపణ రుజువైందని ప్రకటించారు. దీంతో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షలు, ఆమె బిడ్డకు రూ.3 లక్షలు అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు. -
‘లై డిటెక్టర్ టెస్ట్’.. గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి,వైఎస్సార్: విద్యార్థిని హత్య కేసులో ఆమె తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. లైడిటెక్టర్ టెస్టుల్లో పాల్గొనాలని వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యార్థిని హత్య అనంతరం పోలీసులు అన్నీ కోణాల్లో పోలీసులు విచారించారు. ఈ విచారణలో విద్యార్ధిని హత్యలో ప్రేమికుడు ప్రమేయం లేదని గతంలోనే తేల్చారు. కుటుంబ సభ్యులను విచారించారు. కానీ నిందిలు ఎవరనేది పోలీసులు గుర్తించ లేకపోయారు. చివరికి పరువు కోసం కుటుంబ సభ్యులే విద్యార్ధిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజ నిర్ధారణ చేసేందుకు వారికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే..గత జులై నెలలో వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా మారింది.ఘటన జరిగిన రోజు ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేష్‌తో బైక్‌పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్‌కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది.అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్‌పై లోకేష్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?హత్యకు గురైన రోజు ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేష్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జీవ ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
టీచర్‌పై మనసుపడిన విద్యార్థి.. ప్రేమను కాదన్న పాపానికి..
భోపాల్: అతడో విద్యార్థి.. టీచర్స్ చెప్పే పాఠాలు బుద్దిగా వినాల్సింది పోయి.. అనుచితంగా ప్రవర్తించాడు. సదరు మహిళా టీచర్‌ను విద్యార్థి వేధింపులకు గురి చేశాడు. తన ప్రేమను కాదన్నందుకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. నర్సింగ్‌పూర్ జిల్లాలోని ఎక్సలెన్స్ స్కూల్లో నిందితుడిని సూర్యవంశ్ కొచార్(18) చదువుకుంటున్నాడు. అదే పాఠశాలలో బాధిత యువతి(26) గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సదరు టీచర్‌పై సూర్యవంశ్ ప్రేమ పెంచుకున్నాడు. అయితే, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఆ వేడుకలకు బాధిత టీచర్ చీర కట్టుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా టీచర్ చీరపై సూర్యవంశ్ అసభ్యకరమైన కామెంట్లు చేశాడని సమాచారం. దీంతో, ఈ అంశంపై టీచర్ ఫిర్యాదు చేసింది. బాధిత టీచర్ ఫిర్యాదుతో స్కూలు యాజమాన్యం సూర్యవంశ్పై చర్యలు తీసుకుంది.A Class 12 student has been arrested on charges that he set on fire a 25-year-old female teacher who had filed a harassment complaint against him in Madhya Pradesh’s Narsinghpur district, police said.#MadhyaPradesh #Narsinghpur #CrimeNews #TeacherSafety #ViolenceAgainstWomen pic.twitter.com/QOY4x8gMdD— UiTV Connect (@UiTV_Connect) August 20, 2025ఈ క్రమంలో టీచర్‌పై పగ పట్టిన అతను పెట్రోల్ దాడికి ప్లాన్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం టీచర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న టీచర్ ను పిలిచి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై చల్లి, నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో బాధితురాలికి 10 నుంచి 15 శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయమేమీ లేదని పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు.. సూర్యవంశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్థిపై 124ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసి మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలను సంపులో పడేసిన ఓ తల్లి బలవన్మరణానికి ప్రయత్నించింది. పిల్లలు మరణించగా.. ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
‘డ్రమ్ములో కుళ్లిన మృతదేహం’ కేసు: అమ్మ, మామ కలసి.. దడ పుట్టిస్తున్న బాలుని సాక్ష్యం
అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్‌లో చోటుచేసుకున్న ‘డ్రమ్ములో కుళ్లిన మృతదేహం’ కేసు మరోమలుపు తిరిగింది. ఈ ఉదంతంలో మృతుని కుమారుడే కీలక సాక్షిగా నిలిచాడు. ఆగస్టు 15న ఈ ఘటన వెలుగు చూసింది. అల్వార్‌లోని ఒక ఇంటి యజమాని తమ రెండవ అంతస్తులో దుర్వాసన వస్తుండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఒక నీలిరంగు డ్రమ్ములో కుళ్లిన స్థితిలో హన్స్‌రాజ్ అనే వ్యక్తి మృతదేహం బయటపడింది.ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో మరో మలుపు తిరిగింది. మృతుని ఎనిమిదేళ్ల కుమారుడు హర్షల్ కీలక సాక్షిగా నిలిచాడు. తమ ఇంటిలో నీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించే నీలిరంగు డ్రమ్ములో తన తండ్రి మృతదేహాన్ని తన తల్లి, ఆమె ప్రియుడు ఉంచారని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు. మృతుడు హన్స్‌రాజ్ పెద్ద కుమారుడు హర్షల్ తన తండ్రి హత్యకు ముందు, ఆ తరువాత ఇంట్లో ఏమి జరిగిందో పోలీసులకు వివరంగా తెలియజేశాడు.‘ఆరోజు మా నాన్న, అమ్మ, మామ (వారి ఇంటి యజమాని కొడుకు) కలిసి మద్యం సేవిస్తున్నారు. మా అమ్ము రెండు పెగ్గులు మాత్రమే తాగింది. మామ ఫుల్‌గా తాగాడు. నాన్న కూడా మద్యం మత్తులోనే ఉండి, అమ్మను కొట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో మామ జోక్యం చేసుకున్నాడు. అయితే మా నాన్న.. నువ్వు ఆమెను కాపాడితే, నిన్ను కూడా చంపేస్తాను’ అని అరిచాడు. వెంటనే మామ మా నాన్నపై దాడి చేశాడు. ఇంతలో అమ్మ మమ్మల్ని నిద్రపోమని చెప్పింది.కాసేపటికి నేను మేల్కొని చూడగా, అమ్మ, మామ ..మా నాన్న మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో పెట్టి, వంటగదిలో ఉంచారు. అప్పుడు నేను వారిని ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగాను. వారు తన తండ్రి చనిపోయారని చెప్పారు. మా నాన్న అమ్మను తరచూ కొట్టేవాడు. సిగరెట్లతో కాల్చాడు. నన్ను కూడా కొట్టేవాడు. ఆగస్టు 15న బ్లేడుతో నా మెడపై గాయం చేశాడు’ అని హర్షల్ తెలిపాడు.ఈ దారుణ హత్య ఆగస్టు 15న జరిగిందని, ఇంటి యజమాని తమ రెండవ అంతస్తులో దుర్వాసన రావడాన్ని గమనించి ఫిర్యాదు చేసిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు. హన్స్‌రాజ్ భార్య సునీత, ఆమె ప్రియుడు జితేంద్ర శర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. తరువాత హన్స్ రాజ్ మృతదేహాన్ని డ్రమ్ములో ఉంచి, దానిని ఉప్పుతో నింపారని పోలీసులు పేర్కొన్నారు. సునీత, శర్మ నాలుగు నెలలుగా రిలేషన్ షిప్లో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నదని వారు పేర్కొన్నారు. -
విద్యుదాఘాతంతో నలుగురి మృతి
చాంద్రాయణగుట్ట/అంబర్‌పేట/మాచారెడ్డి: వినాయక చవితి ఏర్పాట్లలో ఉండగా...వేర్వేరు చోట్ల జరిగిన విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా, ఒకరు త్రీవంగా గాయపడ్డారు. రామాంతపూర్‌లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో ఐదుగురి మృతి చెందిన ఘటన మరవకముందే మరో నలుగురు మృత్యువాత పడ్డారు. పాతబస్తీలోని పురానాపూల్ చంద్రికాపురం బైరూపియా గల్లీకి చెందిన అఖిల్ గణనాథుడిని ప్రతిష్టించడానికి 15 మంది స్నేహితులతో కలిసి విగ్రహాన్ని తెచ్చేందుకు సోమవారం రాత్రి జల్పల్లి సమీపంలోని లక్ష్మీగూడకు వెళ్లారు. 22 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేసి..తక్కువ ఎత్తులో ఉండే ట్రాలీలో పెట్టి ట్రాక్టర్‌పై తీసుకొస్తున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బండ్లగూడలోని రాయల్ సీ హోటల్ ఎదురుగా వచి్చన సమయంలో రోడ్డుకు అడ్డంగా వెళుతున్న 33 కేవీ హై ఓల్టేజీ విద్యుత్ తీగలు వినాయక విగ్రహ కిరీటానికి తాకాయి. దీంతో కరెంట్ షాక్ తగిలి ట్రాక్టర్ డ్రైవర్ రత్లావత్ ధోని(19), వికాస్ ఠాకూర్(21), అఖిల్‌లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సంతోశ్‌నగర్‌లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ధోని, వికాస్ మృతి చెందారు. అఖిల్ పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన డ్రైవర్ ధోనికి మూడు నెలల క్రితమే దగ్గరి బంధువుల అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉండగానే ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఏర్పాట్లలో ఉండగా... హనుమకొండకు చెందిన నందబోయిన రాజు తన కుటుంబంతో కలిసి బాగ్‌అంబర్‌పేట రెడ్‌బిల్డింగ్ సమీపంలో నివసిస్తున్నాడు. ఇతని కుమారుడు రామ్‌చరణ్ తేజ(18) కొన్నేళ్లుగా స్నేహితులతో కలిసి గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. సోమవారం కామాక్షి అపార్ట్మెంట్ ఎదుట గణేశ్ మండపానికి స్నేహితులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్‌చరణ్ మండపంపైకి ఎక్కి పెద్ద కర్రలు సర్దుతుండగా ఒక కర్ర.. పైనుంచి వెళుతున్న హైటెన్షన్ వైర్లకు తగిలింది. దీంతో అప్పటికే పచ్చిగా ఉన్న కర్రకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి రామ్‌చరణ్ తేజ ఒక్కసారిగా కిందపడిపోయాడు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. పుట్టిన రోజే...: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్‌నగర్‌కు చెందిన 15 మంది యువకులు గణేశ్ విగ్రహం కోసం నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్లో విగ్రహాన్ని తరలిస్తుండగా పాల్వంచ మండలం ఆరెపల్లి స్టేజీ వద్ద ప్రధాన రహదారిపై 11 కేవీ విద్యుత్ తీగలకు విగ్రహానికి సపోర్టుగా కట్టిన ఇనుపరాడ్లు తగిలాయి. దీంతో అక్కడే ఉన్న కొమ్ము లక్ష్మీనారాయణ(19) కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. మరో యువకుడు సాయి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మృతుడు లక్ష్మినారాయణది మంగళవారమే పుట్టిన రోజు. విగ్రహంతో ఇంటికి చేరిన తర్వాత కేక్ కట్ చేసి ఆనందంగా గడపాలని స్నేహితులు అనుకున్నారు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ వైర్లు తగలలేదు: సీఎండీ సంఘటన స్థలాన్ని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. 33కేవీ విద్యుత్ లైన్లు తెగడం గానీ, వేలాడటం గానీ జరగలేదని, ఇందులో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదన్నారు. హైఓల్టేజీ లైన్‌కు రెండు అడుగుల దూరం ఉన్నా, ఇండక్షన్ స్పార్క్ (ప్రేరణ జ్వాల) వస్తుందని, ఆ స్పార్క్ కారణంగానే యువకులు భయపడి కిందకు దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. డ్రైవర్ కిందకు దూకే క్రమంలో టైర్ కింద పడ్డాడని, మరో యువకుడు డివైడర్ వైపు దూకి చనిపోయాడని చెప్పారు. వర్షాకాలంలో విద్యుత్ లైన్లకు ఐదు అడుగుల దూరంగా ఉండాలని సీఎండీ సూచించారు. -
కట్న వేధింపులకు నవ వివాహిత బలి
కర్ణాటక: ఎన్నో ఆశలతో మెట్టినింటికి వెళ్లిన యువతి కొన్ని నెలలకే శవమైంది. కన్నవారికి తీరని కడుపు కోత మిగిలింది. వరకట్న వేధింపులను భరించలేక యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఉద్రిక్తతను కలిగించింది. 40 తులాల బంగారం ఇచ్చి.. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా కూటురు గ్రామానికి చెందిన గోపాలప్ప కూతురు గాయత్రితో హోసూరు గోకుల్‌నగర్‌కు చెందిన మురుగేషన్ కొడుకు కదిరేషన్తో గత 11 నెలల క్రితం పెళ్లి జరిగింది. మురుగేషన్ హోసూరులోని పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో సహాయక ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. వధువు తల్లిదండ్రులు పెళ్లి సమయంలో 40 తులాల బంగారం, రూ. 6 లక్షల నగదును కట్నంగా అందజేశారు. ఈ నేపథ్యంలో ఇంకా కట్నం తీసుకురావాలని భర్త ఇంటివారు తీవ్రంగా వేధించడంతో గాయత్రి కొన్నిరోజుల కిందట పుట్టింటికి చేరుకుంది. భర్త ఆమెకు మాయమాటలు చెప్పి బెంగళూరులో కాపురం పెట్టాడు. 13వ తేదీన గాయత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న రీతిలో శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్తను అరెస్ట్ చేశారు. తమ కూతురిని బలిగొన్న గోపాల్, అతని కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని గాయత్రి తల్లిదండ్రులు సబ్‌కలెక్టర్ ఆక్రితి శెట్టికి కు వినతిపత్రం అందజేశారు. -
ఛలానా వేస్తారని భయపడి.. మహిళా ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లి!
ఆమె విధినిర్వహణలో ఉంది. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోడ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌తో దూసుకొస్తున్నాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోయిందామె. అయితే ఆ డ్రైవర్ ఆగకుండా ఆమెనూ రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సతారా సిటీలో భాగ్యశ్రీ జాదవ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం విధుల్లో ఉండగా.. ఓ ఆటో దూసుకురావడం ఆమె గమనించింది. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ఆటోను పట్టుకుని కిందపడిపోయింది. అది గమనించి.. ఆ ఆటోడ్రైవర్ ఆటోను మరింత వేగంగా పోనిచ్చాడు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోగా.. రోడ్డు మీదే కాస్త దూరం లాక్కెళ్లాడు. ఈలోపు.. స్థానికులు ఆ ఆటో వెంట పరిగెత్తి.. ఆ ఆటోడ్రైవర్‌ను అడ్డుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తాను తాగేసి ఉన్నానని, పోలీసులకు దొరికితే ఛలానా వేస్తారనే భయంతోనే పారిపోయే ప్రయత్నం చేశానని ఆ ్రైవర్ దేవ్‌రాజ్ కాలే చెబుతున్నాడు. ఈ ఘటనలో భాగ్యశ్రీకి గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. Video: Drunk autorickshaw driver drags woman cop trying to stop him in Maharashtra#Maharashtra #Satara #KhandobaMaal #VIDEO #ViralVideos pic.twitter.com/t7pZivZi35— Princy Sharma (@PrincyShar14541) August 19, 2025 -
కూకట్పల్లి బాలిక కేసు.. పోలీసుల అదుపులో అనుమానితుడు!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. అదె బిల్డింగ్‌లోనే అద్దెకు ఉంటున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కూకట్‌పల్లిలోని దయార్గూడలో 11 ఏళ్ల బాలిక సహస్రిని హత్యోదంతం.. రాష్టవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. చివరకు.. ఇది బయటివారి పని కాదని ఓ నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో.. హత్య జరిగిన అదే భవనంలో ఉంటున్న ఓ యువకుడు అక్కడక్కడే సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బడికిపోయి ఉన్నా బతికేదేమో! ‘‘బడికి పోయి ఉన్నా బతికేదేమో.. ఏం చేసిందని నా బిడ్డను ఇలా చంపారు. అందుకేనేమో ఆడపిల్లను కనాలంటే భయపడుతున్నారు’’ అంటూ తల్లి రేణుక గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు దయార్గూడలో ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ సనత్‌నగర్‌లోని బైక్ మెకానిక్‌గా పనిచేస్తుండగా తల్లి రేణుక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నది. వీరికి కుమార్తె సహస్రిని (11), కుమారుడు సాద్విన్ (9) ఉన్నారు. ఇద్దరూ వేర్వేరు స్కూళ్లలో చదువుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. సహస్రినికి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో గత నాలుగు రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు సాద్విన్ చదువుతున్న పాఠశాల నుంచి బాబుకు లంచ్ బాక్స్ తేలేదని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లి రేణుక వేరే వారికి ఫోన్ చేసి లంచ్‌బాక్స్ రెడీ చేసి స్కూల్‌కు పంపాలని కుమార్తెకు చెప్పడానికి పంపించింది. అయితే ఇంటి తలుపు మూసి ఉందని, ఎవరూ లేరని తల్లికి చెప్పటంతో ఆమె కృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మని చెప్పింది. కృష్ణ ఇంటికి వెళ్లి చూడగా కుమార్తె సహస్రిని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో భార్యకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్‌తో వచ్చి పరిసరాలను క్షుణ్ణం పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. సహస్రిని ఎవరితో గొడవలు పెట్టుకోదని, అందరితో కలివిడిగా ఉంటుందని, పాఠశాల దూరంగా ఉండటంతో దగ్గరలో స్నేహితులు కూడా ఎవరూ లేరని తల్లి రేణుక తెలిపింది. నా బిడ్డను ఎందుకు చంపారో..ఏమో అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. -
రోడ్డు ప్రమాదంలో యువతీ యువకుల దుర్మరణం
విశాఖపట్నం : బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో చంద్రంపాలెం జెడ్పీ హైసూ్కల్ ఎదురుగా హైవేపై చోటుచేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. నగర పరిధిలోని జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వాసుపల్లి సతీష్ (19) భవన నిర్మాణ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అప్పుడప్పుడు చేపలుప్పాడ లో ఉంటున్న తాతగారి ఇంటికి వెళ్తుంటాడు. పలాస కు చెందిన ఉష(18)తో యువకుడికి పరిచయం ఉంది. తనను కలుసుకోవడానికి వచ్చిన ఆమెతో బైక్‌పై పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో తాతగారి ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు వీరిద్దరూ బైక్‌పై పరదేశిపాలెం మీదుగా బయల్దేరారు. చంద్రంపాలెం హైసూ్కల్ ఎదురుగా హైవేపైకి వచ్చేసరికి ముందు వెళ్తున్న బస్సు, లారీలను తప్పించబోయి లారీకి బైక్ తగలడంతో కింద పడిపోయారు. ఇద్దరికీ తలకు బలమైన గాయాలై సంఘటనా స్థలిలోనే మరణించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ రాము తెలిపారు. -
హైదరాబాద్ బండ్లగూడలో విషాదం
హైదరాబాద్: రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో విషాద ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన అఖిల్ అనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డుగా ఉన్నాడని భర్తను అంతం చేసింది
హైదరాబాద్: ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన సంఘటనలో భార్యా, ప్రియుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట రెడ్డి, ఎస్ఐ మహ్మద్ మజీద్ ఆలీలు తెలిపిన మేరకు.. రాజీవ్‌గాంధీ నగర్లో మహమ్మద్ షాదుల్, భార్య తబ్సుమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కూతురు. నాలుగు సంవత్సరాల క్రితం తబ్‌సుమ్‌కు మొహమ్మద్ తాఫిక్ అనే వ్యక్తితో అయిన పరిచయం వివాహేతరసంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు. దీంతో భర్త షాదుల్ అడ్డువస్తున్నాడని భావించిన భార్య.. ప్రియుడు మొహమ్మద్ తాఫిక్‌తో కలిసి షాదుల్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం తబ్సుమ్ ప్రియుడితో కలిసి ఆగస్టు 15న ఉదయం షాదుల్ పడుకున్న సమయంలో ఇద్దరూ కలిసి కొట్టి, దిండుతో ముక్కు, నోరు మూసి చంపారు. ఈ సంఘటపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులైన తబ్సుం, ప్రియుడు మొహమ్మద్ తాఫిక్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
గొంతు కోసి.. కడుపులో పొడిచి..
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని దయార్గూడలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొంతుకోసి..కడుపులో కత్తితో పొడిచి చంపేశారు. ఇలా ఎందుకు..ఎవరు ఇంత కసిగా హత్య చేశారో తెలియరాలేదు. కూకట్పల్లి పోలీసులు తెల్పిన మేరకు..సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం, ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు దయార్గూడలో ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ సనత్‌నగర్‌లోని బైక్ మెకానిక్‌గా పనిచేస్తుండగా తల్లి రేణుక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నది. వీరికి కుమార్తె సహస్రిని (11), కుమారుడు (9) ఉన్నారు. సహస్రిని బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. సోమవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. సాది్వన్ పాఠశాలకు వెళ్లాడు. సహస్రినికి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో గత నాలుగు రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. కాగా మధ్యాహ్నం 12 గంటలకు సాద్విన్ చదువుతున్న పాఠశాల నుంచి బాబుకు లంచ్ బాక్స్ తేలేదని తల్లిదండ్రులకు ఫోన్ వచి్చంది. దీంతో తల్లి రేణుక వేరే వారికి ఫోన్ చేసి లంచ్‌బాక్స్ రెడీ చేసి స్కూల్‌కు పంపాలని కుమార్తెకు చెప్పడానికి పంపించింది. అయితే ఇంటి తలుపు మూసి ఉందని, ఎవరూ లేరని తల్లికి చెప్పటంతో ఆమె కృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మని చెప్పింది. కృష్ణ ఇంటికి వెళ్లి చూడగా కుమార్తె సహస్రిని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో భార్యకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్‌తో వచ్చి పరిసరాలను క్షుణ్ణం పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే సహస్రిని ఎవరితో గొడవలు పెట్టుకోదని, అందరితో కలివిడిగా ఉంటుందని, పాఠశాల దూరంగా ఉండటంతో దగ్గరలో స్నేహితులు కూడా ఎవరూ లేరని తల్లి రేణుక తెలిపింది. నా బిడ్డను ఎందుకు చంపారో..ఏమో అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఎవరికి ఏ అపకారం, అన్యాయం చేయని మాకు ఈ కడుపుకోత ఎందుకు అంటూ కన్నీటి పర్యంతమైంది. పాప స్కూల్‌కు వెళ్లినా బతికుండేది కదా అంటూ విలపించింది. సహస్రిని కడుపులో మూడు కత్తి గాట్లు, గొంతు కోసినట్లు గాయాలు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. దొంగతనం కోసం కానీ, మరే కారణంతో కానీ బాలికను చంపి ఉండవచ్చనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకోసం, ఎవరు పాపను చంపారన్న వివరాలు దొరకలేదని, సీసీ కెమెరాలు కూడ సరిగ్గా లేవని, దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తెలిసిన వారి పనే? కాగా కృష్ణ దంపతులు నివసిస్తున్న భవనంలో రెండు అంతస్తులు, ఓ పెంట్ హౌస్ ఉంది. పెంట్‌హౌస్‌లో వీరు నివసిస్తున్నారు. శని, ఆదివారాల్లో సెలవులు కావటంతో సోమవారం పాప ఒక్కతే ఉందన్న విషయం ఎవరికి తెలిసి ఉంటుందోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక ఒంటరిగా ఉందనే విషయం తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటనా స్థలానికి వెళ్లి చిన్నారి తల్లిని పరామర్శించి, ఓదార్చారు. పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, పాప తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. -
ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు.. చనిపోతా!
శ్రీకాకుళం క్రైమ్: ‘‘ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్లే నాకీ పరిస్థితి వచ్చింది. రెండు నెలలుగా రకరకాలుగా ఇబ్బందిపెడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మీడియా ముందుకురావడంతో నాపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. నేను ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో... నన్నే దోషిగా చిత్రీకరిస్తున్నారు. ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. సరిగానే పనిచేస్తున్నానని చెబుతున్నా, అందరితో సంతకాలు పెట్టిస్తూ... నాకు మద్దతిచ్చినవారిని భయపెడుతున్నారు.ఇక పోరాడే శక్తి లేదు. చనిపోదామని నిర్ణయించుకున్నా’’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య వాపోయారు. తన బాధను బయటకు చెప్పడమే తప్పా? అని ప్రశ్నించారు. దళిత మహిళా ఉద్యోగి అయిన సౌమ్య... సోమవారం శ్రీకాకుళం తిలక్‌నగర్‌లోని నివాస గృహంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన, ఆయన అనుచరుల వేధింపులు తాళలేక జీవితాన్ని చాలించాలని అనుకున్నట్లు తెలిపారు. బాధితురాలు సౌమ్య, వారి కుటుంబ సభ్యులు, రిమ్స్ వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం... ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాక బెడ్రూమ్లోకి వెళ్లిన సౌమ్య బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగారు.బయటకు వచ్చిన ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. పనిమనిషి అప్పన్న నీళ్లు తాగమని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్లి చూశారు. మందులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో సౌమ్య తల్లి సద్విలాసిని, డ్రైవర్ శివకు చెప్పారు. రిమ్స్‌లో గైనిక్ ప్రొఫెసర్, సౌమ్య సోదరి రేజేటి శిరీషకు ఫోన్ చేశారు. అప్పన్న, శివ తక్షణమే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలాసేపు అపస్మారక స్థితిలో ఉన్న సౌమ్యకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. స్పృహలోకి వచ్చాక సౌమ్య మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వెళ్లగక్కారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము వెల్లడించారు. ఎమ్మెల్యేతో మాకు ప్రాణహాని సౌమ్యతో పాటు టీడీపీ కార్యకర్త సనపల సురేష్ కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఆస్పత్రిలో సౌమ్యను చూద్దామని వెళ్తే కొందరు వెంబడించారని, తాను తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. సురేష్‌తో పాటు భార్యాపిల్లలు కూడా స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే మనుషులతో తమకు ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు.అమ్మను రాత్రి 10 వరకు ఎమ్మెల్యే ఆఫీస్‌లో ఉంచారు..‘‘రాత్రిళ్లు ఎమ్మెల్యే వీడియో కాల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యే కార్యాలయంలో నా తల్లిని రాత్రి 10 వరకు ఉంచారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుండటంతోనే మా అమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు’’ అని రేజేటి సౌమ్య కుమారుడు రాహుల్ తెలిపారు.నాన్న పోయిన బాధలో ఉంటే..‘‘మా నాన్న రిటైర్డ్ ఎంఈవో. ఆర్నెల్ల క్రితం మరణించారు. పుట్టెడు శోకంలో ఉన్నాం. మా కుటుంబానికి సౌమ్యనే పెద్ద దిక్కు. ఆమె ఆత్మహత్యాయత్నం కలచివేసింది. అమ్మ హెచ్ఎంగా రిటైరయ్యారు. కుటుంబమంతా బాగా చదువుకుని సెటిల్ అయ్యాం. అలాంటి మాపై ఆరోపణలు చేయడం తగదు’’ అని సౌమ్య సోదరి, గైనిక్ ప్రొఫెసర్ శిరీష వాపోయారు. -
మరో దారిలేదు.. చావే శరణ్యం
నరసరావుపేట రూరల్: ‘స్కూల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోండి. ఆ భవనం మాకు ఇచ్చేయండి.’ అంటూ టీడీపీ నాయకులు ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడిని బెదిరించారు. ఏకంగా పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. విజయవంతంగా నడుస్తున్న స్కూలు మూత పడుతోందని నిర్వాహకుడు తట్టుకోలేకపోయాడు. ఇక తనకు మరో దారి లేదని, చావే శరణ్యమని భావించిన ఆ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడు షేక్ బషీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది.బాధితుడి భార్య హేమలత తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన షేక్ బషీర్ సెక్రటరీగా, మరికొందరు సభ్యులుగా పూజిత ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటుకు పట్టణంలోని లింగంగుంట్ల బ్యాంక్ కాలనీలో టీడీపీ నాయకుడు శాఖమూరి రామ్మూర్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. పది సంవత్సరాలు లీజు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రూ.80 లక్షలతో భవనాలు నిర్మించి 2020లో రెయిన్బో స్కూల్‌ను ప్రారంభించారు. బషీర్, ఆయన భార్య హేమలత ఆధ్వర్యంలో ఐదేళ్లుగా స్కూల్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలు... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెయిన్బో స్కూల్ నిర్వాహకులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది నెలల నుంచి పాఠశాలను ఖాళీ చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ‘నా భర్త బషీర్‌ను, నన్ను ఇటీవల టీడీపీ ఆఫీసుకు పిలిపించారు. పాఠశాలను ఖాళీ చేసి భవనాలు వారికి అప్పగించి వెళ్లిపోవాలని టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, శాఖమూరి రామ్మూర్తితోపాటు మరికొందరు బెదిరించారు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించారు. మేం లీజు అగ్రిమెంట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం టీడీపీ నేతలు పట్టించుకోకుండా శనివారం రాత్రి పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. దీనిపై నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోలేదు. ఇక టీడీపీ నాయకులతో పోరాడే శక్తి లేదంటూ నా భర్త బషీర్ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించారు.’ అని హేమలత ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే బషీర్‌ను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. టీడీపీ నాయకుల కుట్రల వల్ల 300మంది విద్యార్థులు, సిబ్బంది రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని హేమలత కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీ నేతల వేధింపులపై ఆమె ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలో మైనర్ బాలిక (12)హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుణ్ని సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు.బాలికను హత్య చేసిన అనంతరం నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాల్ని గమనించారు. అయితే, బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు నిందితుడు ప్రయత్నించాడని.. ఆమె ప్రతిఘటించడంతో దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోమవారం కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్‌నగర్‌లో ఓ మైనర్ బాలిక(12) దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్న బాలికపై నిందితులు ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పీహెచ్డీ చేయాలనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు
నారాయణపేట: అసలు వారణాసిలో ఏమి జరిగిందంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ సీఎస్ రామచంద్రమూర్తిపై గత నెలలో జరిగిన దాడి కేసును వారణాసి పోలీసులు సీరియస్‌గా తీసుకొని .. 15 రోజుల్లోనే చేధించారు. ఈ నేపథ్యంలో అసలు ఏమి జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు కథ ... అంతర్గత వివాదమే దాడికి దారి ప్రొఫెసర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మధ్య జరిగిన వివాదమే దాడికి దారి తీసిందనేది వారణాసి పోలీసుల విచారణలో వెల్లడైంది. కలత చెందిన మాజీ విభాగాధిపతి తెలంగాణకు చెందిన తన ఇద్దరు పూర్వ పరిశోధన విద్యార్థులు భాస్కర్, మోడ్గు కాసిం బాబుకు హెచ్ఓడీ తనను వేధిస్తున్నాడని, తనను పని చేయనివ్వడం లేదని తన బాధను వెలిబుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వారు ప్రయాగ్‌రాజ్‌లోని మహమ్మద్ కాసీం అనే పరిచయస్తుడిని సంప్రదించారు. ఈ ముగ్గురు కలిసి జూలై 25న వారణాసికి చేరుకొని కాంట్రాక్ట్ నేరస్తులను నియమించుకున్న గణేష్‌పాసిని కలిశారు. బీహెచ్‌యూ క్యాంపస్ వెలుపల ప్రొఫెసర్ మూర్తిపై దాడి చేయడమే అసలు పథకం. ముందుగా క్యాంపస్ లోపల దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. కట్‌చేస్తే ఫ్రొఫెసర్‌పై దాడి జరిగిందిలా.. జూలై 28న సాయంత్రం 6:30 గంటకు ప్రొఫెసర్ మూర్తి క్యాంపస్ నుంచి బ్రిజ్‌ఏన్‌క్లేవ్ కాలనీలోని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బిర్లా హాస్టల్ క్రాసింగ్ వద్ద ప్రొఫెసర్‌పై కడ్డీలతో దాడి చేశారు. దాడిలో ప్రొఫెసర్ రెండు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం దుండగులు హైవేపై పారిపోయారు. స్థానికులు గాయపడిన ప్రొఫెసర్‌ను చికిత్స నిమిత్తం బీహెచ్‌యూ ట్రామా సెంటర్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కటకటాల పాలయ్యాడు చిన్నప్పుడే భాస్కర్ తల్లిదండ్రులను కోల్పోయాడు. పెద్దనాన్న కిష్టప్ప పోషణలో పెరిగాడు. పీజీ వరకు టాప్ ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. పీహెచ్డీ ఎంట్రెన్స్‌లో సైతం ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. పీహెచ్డీ పూర్తి చేయాలనుకున్న భాస్కర్ విధి రాత.. ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు పెట్టిన ఆశతో కటకటాల వైపు తీసుకెళ్లినట్లు అవుసలోనిపల్లి గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
HYD: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి నెలకొంది. ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పండుగ వేడుకల్లో ఇలా జరగడంతో స్థానికులు కన్నీటపర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రథాన్ని ఊరేగించారు. రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించడంతో దాన్ని పక్కన నిలిపివేసిన స్థానిక యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ బలంగా కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఒక్కసారిగా కరెంట్ షాక్ ఘటనతో అక్కడంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది.ఈ ఘటనతో వెంటనే తేరుకున్న స్థానికులు.. గాయపడిన తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్(34), శ్రీకాంత్‌రెడ్డి(35), రుద్రవికాస్(39), రాజేంద్రరెడ్డి(45) ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
బరితెగించిన గంజాయి స్మగ్లర్
నెల్లూరు (క్రైమ్): సినీఫక్కీలో ఓ గంజాయి స్మగ్లర్ తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను కారుతో ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరపడంతో కారు వదిలి పరుగుతీశాడు. పోలీసులు వెంబడించి అతడ్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం నుంచి ఓ వ్యక్తి కారులో 22 కిలోల గంజాయిని నెల్లూరులోని విక్రేతలకు సరఫరా చేసేందుకు తీసుకొస్తున్నాడని సమాచారం అందడంతో బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ సీఐ కె.సాంబశివరావు తన సిబ్బంది, ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌తో కలిసి జాతీయ రహదారిపై కాపు కాశారు. గంజాయి తీసుకొస్తున్న కారును గుర్తించి పెన్నా బ్రిడ్జి అవతలి వైపు నుంచి వెంబడించారు. నిందితుడు నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుని అక్కడ ఉన్న ఇద్దరికి గంజాయి ఇచ్చేందుకు కారును స్లో చేశాడు. ఒక్కసారిగా పోలీసులు కారును చుట్టుముట్టగా, గంజాయి తీసుకునేందుకు వచి్చన వ్యక్తులు పారిపోయారు. గంజాయి స్మగ్లర్ తప్పించుకునేందుకు కారును పోలీసులపైకి దూకించి దూసుకువెళ్లాడు. దీంతో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌కు గాయాలయ్యాయి. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు ఆ కారును వెంబడిస్తూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కారు అద్దాలు పగిలిపోయాయి. స్మగ్లర్ ఎన్టీఆర్ నగర్లోకి వెళ్లి అక్కడ కారును వదిలి పారిపోతుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతడ్ని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బీరక ప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్ గా గుర్తించారు. అతని నుంచి కారు, 22 కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను జీజీహెచ్‌లో చేర్పించారు.నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నిందితుడు బీరక ప్రకాష్ కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడని, చాలా ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని వివిధ ప్రాంతాల్లోని విక్రేతలకు సరఫరా చేస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది. అతనిపై నెల్లూరు సంతపేట, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, ఏలూరు ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడని గుర్తించారు. ప్రస్తుతం నెల్లూరులో జాకీరాబీ అనే విక్రేతకు గంజాయి సరఫరా చేసేందుకు వచ్చినట్లు తేలింది. ఈగల్ విభాగం ఐజీ రవికృష్ణ నెల్లూరుకు వచ్చి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఫిరోజ్‌ను పరామర్శించారు. అనంతరం ఘటనాస్థలాన్ని, నిందితుడు ఉపయోగించిన కారును పరిశీలించారు. -
సిల్క్ సిటీలో 'ఉగ్ర' భయం
ధర్మవరం: పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచి ‘సిల్క్ సిటీ’గా పేరొందిన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు బహిర్గతం కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. ధర్మవరంలోని లోనికోటకు చెందిన నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) బృందాలు అప్రమత్తమయ్యాయి. నూర్ మహమ్మద్ ఇంట్లో జరిపిన సోదాల్లో పలు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పలు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. సోదాల్లో ఉగ్ర సాహిత్యం పుస్తకాలు కూడా దర్యాప్తు సంస్థల అధికారులకు లభించాయి. అతడు జిహాద్ పేరుతో వాట్సాప్ ద్వారా నిరంతరం సందేశాలు దేశానికి వ్యతిరేకంగా పంపినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు నూర్ మహమ్మద్‌ను ఉగ్రవాదులు పావుగా వాడినట్టు తెలుస్తోంది.డబ్బు ఆశ చూపి లొంగదీసుకున్నారా! నూర్ మహమ్మద్ కాయగూరల మార్కెట్ వద్ద చిన్నపాటి హోటల్లో పని చేసేవాడు. అరకొర సంపాదనతో ఇబ్బందులు పడుతూ అప్పులు చేసేవాడు. రెండేళ్ల క్రితం వరకు కటిక పేదరికం అనుభవించిన అతడు తల్లి, చెల్లితో పాటు భార్య, నలుగురు పిల్లల్ని పోషించేందుకు చాలామంది వద్ద గతంలో చాలా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య సైతం అతనితో గొడవపడి వేరుగా ఉంటోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడన్న ప్రచారం ఉంది. ఏడాది క్రితం వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఇస్తెమాలకు వెళ్లినప్పటి నుంచి నూర్ మహమ్మద్‌లో మార్పు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ముభావంగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం వంటివి అతనిలో గమనించినట్టు చెబుతున్నారు. రూ.లక్షలతో ఇల్లు ఆధునికీకరణ పేదరికంలో మగ్గుతూ వచ్చిన నూర్ మహమ్మద్ ఉన్నట్టుండి పాత ఇంటిని రూ.50 లక్షలకు పైగా వెచ్చిoచి ఆధునికీకరించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇంటి పైపోర్షన్లోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైన గది నుంచే అర్ధరాత్రి నుంచి సెల్ఫోన్లో గంటల తరబడి మాట్లాడటం చేసేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మరికొందరు అతని దగ్గర శాటిలైట్ ఫోన్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇవన్నీ ఉగ్రవాదుల ఆర్థిక సహకారంతోనే సాకారమైనట్టు తెలుస్తోంది. తాడిపత్రిలో ప్రియురాలు నూర్ మహమ్మద్‌తో భార్య వేరుపడినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరిపినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆమెకు సైతం ఉగ్ర సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. నూర్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతని ప్రియురాలు అదృశ్యమైనట్టు సమాచారం. నూర్ తరచూ వాట్సాప్‌లో ఆమెతో సంభాషించిన ఆధారాలను కుటుంబ సభ్యులు బహిర్గతం చేశారు. ఆమె పట్టుబడితే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.ఇంకా ఎందరుఉన్నారో!ధర్మవరంలోని లోనికోట, లింగశెట్టి పాళ్యం, ఎల్సీకే పురంలో ఉన్న కొన్ని ప్రాంతాలను ప్రజలు పాతబస్తీగా పిలుస్తుంటారు. ఇక్కడ అధిక సంఖ్యాకులు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారే నివసిస్తుంటారు. ఇక్కడ తక్కువ అద్దెకు ఇల్లు దొరకడం, మాస్ బెల్ట్ కావడంతో పేద, మధ్య తరగతి వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. దీంతో నూర్ మహమ్మద్‌తో పాటు ఉగ్ర సంబంధాలు ఉన్నవారు ఇంకా ఎందరు ఉన్నారని ఆరా తీసే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. స్థానికతతో పాటు ఎలాంటి ఆధారమూ లేకుండా ఉండేవారు ఎందరున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఎల్సీకే పురానికి చెందిన ఆటో డ్రైవర్ రియాజ్ తన వాట్సాప్ స్టేటస్‌లో ‘నో ఇండియా.. ఐ లవ్ పాకిస్థాన్’ అనే సందేశాన్ని పెట్టడంతో అతన్ని కూడా దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఒకేరోజు నూర్ మహమ్మద్‌తో పాటు రియాజ్ వ్యవహారం బట్టబయలు కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో ఉగ్ర మూకల్ని కూకటి వేళ్లతో పెకలించాలని ప్రజలు కోరుతున్నారు. ఉగ్ర కార్యకలాపాల నివారణకు ప్రత్యేక బృందాలు పుట్టపర్తి టౌన్: శ్రీసత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలను నివారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రత్న తెలిపారు. ఆదివారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సమాచారం మేరకు ధర్మవరం పోలీసులు ఉగ్రవాద భావాజాలాన్ని అరికట్టే క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారన్నారు. ఈ క్రమంలోనే ఆరు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలులుండి.. వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ, జిహాదీ సిద్ధాంత పుస్తకాలు కలిగిన నూర్ మహమ్మద్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. పాకిస్తాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం ఉన్నట్టు నూర్ మహమ్మద్ అంగీకరించాడని తెలిపారు. ఈ గ్రూపుల ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి, దేశ వ్యతిరేక ప్రచారం, జిహాదీ ప్రేరణ జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాది నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్‌కార్డులు, జిహాదీ భావజాలం, ఉగ్రవాద సంస్థల ప్రచారంతో కూడిన నిషేధిత సాహిత్యం గల పుస్తకాన్ని స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. నూర్ మహమ్మద్‌ను కదిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పారు. అతడి నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక ఇచి్చన వెంటనే ఇతరులతో సంబంధాలు, ఉగ్ర లింకులు తదితర వివరాలన్నీ వెల్లడిస్తామని తెలిపారు. ఎస్పీ వెంట ధర్మవరం ఇన్చార్జి డీఎస్పీ నరశింగప్ప, టూటౌన్ సీఐ రెడ్డెప్ప ఉన్నారు. -
అబార్షన్ చేసి గర్భిణి ప్రాణం తీసిన ఆర్ఎంపీ
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని తుంగతుర్తిలో కొందరు ఆర్ఎంపీలు మాఫియాగా మారి యధేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. తాజాగాఆర్ఎంపీ శ్రీనివాస్ అక్రమాలు వెలుగుచూశాయి. ఓ మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడబిడ్డ అని తేలడంతో అబార్షన్ చేశాడు. అయితే అబార్షన్ వికటించి ఐదు నెలల గర్భిణి విజేత మృతి చెందింది. గత కొంతకాలంగా వైద్యం ముసుగులోఆర్ఎంపీ శ్రీనివాస్ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. బాలాజీ ఆస్పత్రి పేరుతో ఓ కేంద్రం ఏర్పాటు చేసి, కొందరు ఆర్ఎంపీలు కలిసి ఓ మాఫియాలాగా మారారు శ్రీనివాస్. తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో పేద గర్భిణీలే టార్గెట్‌గా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ చేస్తూ ఆడబిడ్డ అని తెలిస్తే కడుపులోనే బిడ్డను చిదిమేస్తున్నారు. వైద్యం ముసుగులో శ్రీనివాస్ ముఠా చేస్తున్న భ్రూణ హత్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుకు సమాచారం ఇచ్చినా కనీసం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వైద్య తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు స్థానికులు. శ్రీనివాస్ ముఠా చేస్తోన్న అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపై రాజకీయ పలుకుబడి ఉపయోగించి బెదిరింపులకు సైతం దిగారని ఆరోపిస్తున్నారు. -
టీచర్‌తో బీజేపీ నేత లవ్ ట్రాక్.. భార్య ఉండగా ఆమెతో రిలేషన్..
జైపూర్: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు ఒకరు దారుణానికి ఒడిగట్టారు. తన ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యనే కిరాతకంగా హత్య చేశారు. అయితే, ఆమెను దొంగలు హత్య చేసినట్టు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన బీజేపీ నాయకుడు రోహిత్ సైనీ. ఆయనకు సంజుతో కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే, రోహిత్‌కు రీతు సైనీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ రెండేళ్లుగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. రీతు సైనీ అప్పటికే వివాహం కాగా.. భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తనకు అడ్డుగా ఉన్న సంజును ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని రీతు సైనీ ప్లాన్ చేసింది. ఆమెను హత్య చేయాలని భర్త రోహిత్, అతడి ప్రియురాలు ప్లాన్ చేశారు.ఇందులో భాగంగా ఆగస్టు పదో తేదీన తమ ప్లాన్ ప్రకారం సంజును వారు హత్య చేశారు. అనంతరం, రోహిత్ సైనీ.. పోలీసులను, కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా.. ఆరోజు రాత్రి తన ఇంట్లో దోపిడీ జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలే.. సంజును హత్య చేశారని తెలిపాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారం, డబ్బులు దొంగతనం చేసి.. సంజును హత్య చేశారని పేర్కొన్నాడు. अजमेर के किशनगढ़ में भाजपा नेता रोहित सैनी ने प्रेमिका के साथ मिलकर पत्नी संजू सैनी की हत्या की थी। प्रेमिका भी मर्डर की प्लानिंग में शामिल थी। प्रेमिका तलाकशुदा है और प्राइवेट स्कूल में टीचर है। उसके एक चार साल की बेटी भी है।एडिशनल एसपी (ग्रामीण) दीपक कुमार ने बताया- शिवाजी… pic.twitter.com/2eqNWhWyrk— Rajasthan One (@rajasthanone11) August 17, 2025దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో రోహిత్, రీతు సంబంధం గురించి బయటకు వచ్చింది. ఈ క్రమంలో తమదైన తీరులో పోలీసులు.. రోహిత్‌ను ప్రశ్నించగా.. అసలు నేరం ఒప్పుకున్నాడు. అనంతరం, రోహిత్, రీతును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరెస్టులను రూరల్ అదనపు ఎస్పీ దీపక్ కుమార్ ధృవీకరించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించామని ఆయన అన్నారు. -
‘ఖజానా’ దోచింది బిహార్ గ్యాంగే!
చందానగర్: సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో బిహార్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా షోరూంలో ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి దొరికినకాడికి వెండి వస్తువులను అపహరించారు. దీన్ని చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి 48 గంటల్లోనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరి టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే...బిహార్‌కు చెందిన ఆశిష్ (22)తోపాటు మరో ఐదుమంది జీడిమెట్లలోని ఆస్టెస్టస్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు. వీరిని బిహార్‌లోని శరణ్, శివాణ్ జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆశిష్ స్నేహితుడు దీపక్ కుమార్ (22) వీరికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటున్నాడు. వీరు ఏ1 మోటార్స్ వద్ద రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆరుగురు మూడు జ్యువెలరీ దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. అయితే ఖజానా జ్యువెలరీ వద్ద భద్రత తక్కువ ఉండటంతో దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.బిహార్‌లోని శరణ్ జిల్లాకు చెందిన ఆశిష్ గ్యాంగ్ టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే. ఒకసారి ఒక నగరంలో దొంగతనం చేస్తే మళ్లీ ఆ నగరానికి రాకపోవడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు బిహార్, రాజస్తాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో దొంగతనాలు చేశారు. ఈ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ చేయడం ఇదే మొదటిసారి. వీరు దోచుకున్న ఆభరణాలను బిహార్, ఢిల్లీలో విక్రయిస్తుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో గ్యాంగ్ ముఖ్యనాయకుడిపై రెండు హత్య కేసులు సహా మొత్తం 10 కేసులుండగా, ఆశిష్‌పై 4 కేసులున్నాయి.దొంగ చిక్కాడు ఇలా....ఖజానాలో చోరీ అనంతరం ఆరుగురు నిందితులు రెండు బైకులపై బీదర్ వైపు వెళ్లారు. ప్రధాన రోడ్లపై కాకుండా గ్రామాల వైపు నుంచి రాష్ట్రాన్ని దాటారు. బైకులను రాష్ట్ర సరిహద్దు వద్ద వదిలేసి ప్రజా రవాణాలో వెళ్లారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు వాడిన సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి బీదర్ నుంచి వారిని వెంబడించారు. వారు బీదర్ వద్ద త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.దీంతో రెండు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లాయి. ఈ క్రమంలో పుణేలో ఆశిష్‌ను పట్టుకున్నారు. తర్వాత వీరికి సహకరించిన దీపక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా వారందరినీ పట్టుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు. ‘జ్యువెలరీ షోరూంల నిర్వాహకులు దుకాణంలో చొరబాటు హెచ్చరిక అలారమ్‌ను బిగించుకోవాలి. ఆ అలారమ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానమై ఉండాలి’ అని చెప్పారు. -
రూ.12 కోట్ల విలువైన బంగారందోపిడీ కేసులో దొంగ అరెస్ట్
హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట ఎస్బీఐ బ్రాంచ్‌లో గత నెల 27వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసులో అనిల్‌కుమార్ పన్వార్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు హరియాణలో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హిందూçపురం డీఎస్పీ కేవీ మహేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ అనంతరం పన్వార్‌ను కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. పన్వార్‌పై 16 కేసులు ఉన్నట్లు సమాచారం. బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో తొలగించి లోపలికి చొరబడిన దొంగలు ఐరన్ లాకర్ డోర్‌ను గ్యాస్‌కట్టర్‌తో కత్తిరించి.. అందులోని సుమారు రూ.12 కోట్ల విలువైన 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ప్రత్యేక పోలీసు బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి, పాత నేరస్తులను విచారించి, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించాయి. చోరీకి గురైన సొత్తు ఆచూకీ ఇంకా తెలియరాలేదని, కోర్టు అనుమతితో పన్వార్‌ను కస్టడీకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి అంతర్ జిల్లా దొంగ పరార్
ప్రొద్దుటూరు క్రైం: జైళ్లలో నిఘా లోపాలను బయటపెడుతున్న వ్యవహారం ఇది. మూడు రోజుల క్రితమే దొంగతనం కేసులో అరెస్టయిన మహమ్మద్ రఫీ అనే అంతర్ జిల్లా దొంగ, వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి పరారయ్యాడు. రఫీపై కడప, కర్నూలు, అనంతపురంసహా వివిధ జిల్లాల్లో 25 చోరీ కేసులు ఉన్నాయి. గతంలో ఒక కేసులో అరెస్టయిన రఫీ, 2021లో జమ్మలమడుగు సబ్ జైలు నుంచి కూడా పరారవడం గమనార్హం. తాజా ఘటనలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో మిగిలిన ఖైదీలతోపాటు కాలకృత్యాల కోసం జైలు గది నుంచి ఆవరణలోకి వచ్చిన రఫీ, అటు తర్వాత తహసీల్దార్ కార్యాలయం వైపు ఉన్న గోడ దూకి పరారయ్యాడు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ పరారైన విషయాన్ని జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు. శుక్రవారం రాత్రి విధుల్లో ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. సమాచారం అందుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, కడప జైలర్ అమర్ బాషా శనివారం ప్రొద్దుటూరు సబ్ జైలుకు వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. దీనిపై తనకు నివేదిక పంపాలని కడప జైలర్ బాషాను డీఐజీ ఆదేశించారు. ఘటనపై ప్రొద్దుటూరు సబ్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించి.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సబ్ జైలు చుట్టూ ఎత్తయిన గోడ ఉంది. ప్రహరీ చుట్టూ విద్యుత్ ప్రవాహ కంచెను ఏర్పాటు చేశారు. అయినా దొంగ పారిపోవడం చర్చనీయాంశంగా ఉంది. -
‘యుపిక్స్’ చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి 183 మంది నుంచి దాదాపు రూ.353 కోట్లు దండుకుని మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరు యుపిక్స్ క్రియేషన్ అనే యానిమేషన్ సంస్థను చూపి, హాలీవుడ్ సినిమాలకు వర్క్‌చేసే ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు పొందొచ్చని అమాయకులకు ఆశ చూపి క్రమేణా రూ.కోట్లలో పెట్టుబడులు రాబట్టారని ఆయన చెప్పారు. మోసం చేసిందిలా.. నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదిశేషయ్య వీధిలో యుపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని 2014లో ఏర్పాటుచేశారు. అనంతరం.. లక్ష్మీకిరణ్‌కు పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వరరెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు అతని కొడుకు మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ తోడయ్యారు. వీరంతా 2018లో ఒక గ్రూప్‌గా ఏర్పడి అమాయకులకు వల వేశారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించి వారి బంధువులు, స్నేహితులకు సక్రమంగా కమీషన్లు చెల్లిస్తూ మరిన్ని డిపాజిట్లు చేయించేలా వారిని ప్రోత్సహించారు. అలా వచ్చిన మొత్తాలను వారి సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. ఇలా దాదాపు 183 మంది నుంచి రూ.353 కోట్లు సేకరించారు. ఇందులో రూ.194 కోట్ల వరకూ వారి సొంత ఖాతాలకు మళ్లించారు.వెలుగు చూసిందిలా.. ఈ సంస్థలో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశారంటూ ఈ ఏడాది ఏప్రిల్ 14న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్‌కుమార్ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో.. డీసీపీ కె. తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్‌తో పాటు మరో నలుగురు ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కమిషనర్ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. దర్యాప్తులో ముఠా మోసాలు బయటపడ్డాయి. అనంతరం.. పక్కా సమాచారంతో ప్రధాన నిందితులు నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ (33)ను విజయవాడలో, మిట్టపల్లి రాజేంద్రబాబు (63), మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ (30)ను నరసరావుపేటలో పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఒక కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లు స్వాదీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలనూ ఫ్రీజ్ చేశారు. నిందితులకు సంబంధించిన సుమారు రూ.23 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పెట్టినట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు. -
సాక్షి ఎఫెక్ట్: కటకటాల్లోకి సీఎంఆర్ఎఫ్ స్కాం నిందితులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడలో సీఎంఆర్ఎఫ్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ముఠా బాగోతాన్ని ఆధారాలతో సహా సాక్షి టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. కోదాడ కేంద్రంగా సాగిన ఈ స్కాంలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఏ1 చెడపంగు నరేష్, ఏ2 మర్ల వీరబాబు, ఏ3 ఉప్పల మధు, ఏ4 సురగాని రాంబాబు, ఏ5 గుంటక సందీప్, ఏ6 రంగశెట్టి వెంకట్రావులను కటకటాల్లోకి పంపించారు.మొత్తం 44 సహాయ నిధి చెక్కులకు గాను 38 చెక్కులను ముఠా విత్ డ్రా చేసింది. మరో ఆరు చెక్కులను విత్ డ్రా చేసేందుకు ప్లాన్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.9.30 లక్షల నగదు, ఆరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వద్ద ఇద్దరు నిందితులు వీరబాబు, మధు పీఏలుగా చేశారు.నరేష్ మల్లయ్య యాదవ్ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్‌గా పనిచేశాడు. సూరగాని రాంబాబు మునగాల మండలం నారాయణపురం స్థానిక నేత. గుంటక సందీప్ శాసనమండలిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. నకిలీ అకౌంట్స్ ద్వారా నగదు కొట్టేసిన ముఠా వాటాలు పంచుకుంది. నకిలీ అకౌంట్స్ దారులకు నిందితులు పర్సంటేజ్ ఇచ్చారు. కాగా, ముఠా సభ్యులు, బాధితులు ఇంకా ఉన్నట్లు సమాచారం.కొద్దిరోజుల కిందట సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా కల్యాణలక్ష్మి చెక్కుల కుంభకోణం బయటపడగా.. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం వెలుగు చూసింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను కొంత మంది ముఠాగా ఏర్పడి పక్కదారి పట్టించారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది.కోదాడ నియోజకవర్గ పరిధిలోని వాయిలసింగారం గ్రామానికి చెందిన గద్దె వెంకటేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని.. నిరుపేద కావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ 2023 లో దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు లక్షా యాభై వేల రూపాయలు మంజూరయ్యాయి. చెక్కును కూడా ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే కార్యాలయానికి పంపింది. కానీ ఎమ్మెల్యే కార్యాలయంలో పని చేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి బాధితుడికి ఈ చెక్కును ఇవ్వకుండా గడ్డం వెంకటేశ్వరరావు అనే మరో వ్యక్తికి ఇచ్చి దానిని ఏపీలోని జగ్గయ్యపేటలో మార్చుకున్నారు.అనంతరం ఆ డబ్బును ముఠాగా ఏర్పడిన వ్యక్తులు పంచుకున్నారు. తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ చెక్కు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు దీనిపై విచారణ చేయగా చెక్కును జగ్గయ్యపేటలో మార్చుకున్నట్లు తేలడంతో కోదాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ముఠా సభ్యులు అదే పేరుతో ఉన్న వ్యక్తులను స్థానికంగా వెతికి పట్టుకునేవారు.చెక్కులపై ఇంటిపేరు పూర్తిగా కాకుండా ఇంగ్లిష్ అక్షరాల్లో వస్తుం డటంతో నిందితులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చెక్కుల మీద బ్యాంక్ అకౌంట్ నంబర్ బాధితులది కాకుండా తాము ఎంపిక చేసిన వ్యక్తుల అకౌంట్ నంబర్ వచ్చే విధంగా హైదరాబాద్ సచివాలయంలో పనిచేసే వ్యక్తి సాయంతో తారుమారు చేసేవారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. -
దొంగతనం కేసులో ఇరికించారని యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా: దొంగతనం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న మనస్తాపంతో గడ్డి మందు తాగిన అయితంపూడికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తి (22) పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. ఆ అభాగ్యుడి మృతితో గుండె మండిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. మూడు నెలల కిందట బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడైన అయితరెడ్డి శివకుమార్‌తోపాటు మృతుడు ముచ్చకర్ల కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ నేరం అంగీకరించినట్టు పోలీసుల కథనం. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులు శివకుమార్, కృష్ణమూర్తిని రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన కృష్ణమూర్తి ఈనెల 4వ తేదీన గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగానే.. తాను దొంగతనం చేయలేదని, అనవసరంగా తనను కేసులో ఇరికించారని, ఇందుకు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బుచ్చెయ్యపేట పోలీసులే కారణమని నోట్ రాశాడు. యువకుడి మరణంతో ఉద్రిక్తత కృష్ణమూర్తి శుక్రవారం కేజీహెచ్‌లో మరణించడంతో.. తన కుమారుడి చావుకు కారణమైన పోలీసులపైన, దొంగతనం కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేయడానికి యతి్నంచారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా సుమారు 50 మంది పోలీసులు బారికేడ్లతో వీరిని అడ్డుకున్నారు. దీంతో కృష్ణమూర్తి తల్లిదండ్రులు ముచ్చకర్ల మహాలక్ష్మి, మంగమ్మ, అన్నయ్య సత్యనారాయణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కృష్ణమూర్తి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని నినాదాలు చేశారు. మృతదేహం అడ్డగింత కృష్ణమూర్తి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విశాఖ కేజీహెచ్ నుంచి వ్యానులో బయలుదేరారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని అయితంపూడి తీసుకురాకుండా బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేయడానికి నిర్ణయించి రాత్రి 7 గంటలకే బుచ్చెయ్యపేటకు మృతుని కుటుంబ సభ్యులు చేరుకున్నారు. స్టేషన్‌కు వెళ్లకుండా వారిని బారికేడ్లతో పోలీసులు అడ్డుకోవడంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం చెందారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో బుచ్చెయ్యపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యాను బుచ్చెయ్యపేట రాకుండా రాజాం మీదుగా పెదమదీన నుంచి అయితంపూడి గ్రామానికి పంపించారు. అయితంపూడి గ్రామంలోకి రాకుండా పైడంపేట వద్దే కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యానును కుటుంబ సభ్యులు అడ్డుకుని బుచ్చెయ్యపేట తరలించడానికి ప్రయతి్నంచారు. పోలీసులు మాత్రం కృష్ణమూర్తి మృతదేహాన్ని బుచ్చెయ్యపేట వెళ్లకుండా అడ్డుకోవడంతో అర్ధరాత్రి కడపటి వార్తలు అందే వరకు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. -
అవకాశాలిప్పిస్తానని పదేళ్ల కిత్రం: నటి అరెస్ట్
చెన్నై: కేరళకు చెందిన మలయాళ సినీ నటి వర్మిని మునీర్, సినిమాల్లో అవకాశం కల్పిస్తాని చెప్పి తన బంధువు అయిన ఓ 14 ఏళ్ల బాలికను కేరళ నుంచి చెన్నైకి తీసుకువచ్చింది. ఆ నటి, ఆ అమ్మాయి తిరుమంగళం ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేస్తున్నారు. ఆ సమయంలో, నటి ఉంటున్న గదికి నలుగురు యువకులు వచ్చారు. వారు బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనికి నటి మిను మునీర్ కూడా సహకరించారని తెలు స్తోంది. దీంతో బాలిక వారి నుంచి తప్పించుకుని కేరళకు వెళ్లిపోయింది. ఈ సంఘటన జరిగి 10 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాధితు రాలు తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించికేరళ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బాలికతో నిర్వహించిన విచారణలో, తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటన చెన్నైలోని తిరుమంగళంలోని ఓ లాడ్జిలో జరిగినట్లు తేలడంతో కేరళ రాష్ట్ర పోలీసులు చెన్నై పోలీసులకు సమాచారం అందించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, తిరు మంగళం మహిళా పోలీసులు, నటి ప్రోద్బలంతో బాలికను లైంగికంగా వేధించిన సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దీని తరువాత, మల యాళ నటి మిను మునీర్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నటిని చెన్నైకి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
సృష్టి కేసులో మరో ట్విస్ట్.. అసలు పేరు నీరజ.. 1988 బ్యాచ్‌తో కలిసి..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. వందల మంది పిల్లలను సరోగసితో పుట్టారని బాధిత దంపతులకు ఇచ్చినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించారు.సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. డాక్టర్ నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ అని విచారణలో వెల్లడైంది. డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ సరోగసి వ్యవహారాలన్నీ నడిపించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆమె మెడిసిన్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే కాలేజీలో 1988 బ్యాచ్ మేట్స్‌తో సైతం ఆమె సరోగసి దందా చేయించినట్లుగా బహిర్గమైంది. నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. 2007లో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించినట్టు తెలిపారు.ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. తమ దగ్గరికి వచ్చిన దంపతుల వద్ద సరోగసి పేరిట రూ.30 లక్షల వరకు వసూలు చేశామని స్టేట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా అబార్షన్ కోసం వచ్చే గర్భిణులను డబ్బు ఆశ చూపామని.. ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా తెలిపింది. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని.. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది. పిల్లల కొనుగోలులో సంజయ్‌తో పాటు.. సంతోషీ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలిపింది. తన రెండో కుమారుడు లీగల్‌గా సహకరించే వాడని నమ్రత వెల్లడించింది. విశాఖపట్నంలో ఆసుపత్రి ప్రారంభించి పిల్లలు లేని దంపతుల నుండి 20-30 లక్షలు వసూళ్లు చేసినట్లు అంగీకరించారు.అయితే, ఇప్పటికే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి నార్త్ జోన్ పోలీసులు బదిలీ చేసిన విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే అట్లూరి నీరజ అలియాస్ నమ్రతపై 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..!
విజయనగరం: మండలంలోని కెరటం గ్రామంలో ఈ నెల 9వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన నిడిగేట్టి కృష్ణ మృతికి గల కారణం ఆయన భార్యకు మేనల్లుడు సాయితో ఉన్న వివాహేతర సంబంధమేనని గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. ఇదే కేసు వివరాలను బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం వెల్లడించారు. మృతుడు నీడిగేటి కృష్ణను నారపాటి సాయి ఈ నెల 9న మద్యం తాగుదామని పిలిచి గ్రామం బయటకు తీసుకుని వెళ్లి అక్కడ అతడి పీక నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సాయి కాగా మృతుడి భార్య రాజు రెండవ నిందితురాలని, మృతుని కొడుకు మైనర్ కూడా హత్యలో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాయిని బిళ్లలవలస వద్ద గురువారం సాయంత్రం పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.పక్కా పథకం ప్రకారం..మౌనిక, ఉదయ్‌కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్‌కుమార్‌ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్‌కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్‌కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్‌కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్‌కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బాటిల్‌ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్‌కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్‌లను అభినందించి, రివార్డులను అందజేశారు. -
ఉప్పల్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై హత్యాచారం
హైదరాబాద్: అభమూ శుభమూ తెలియని ఐదేళ్ల బాలుడిపై ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం హత్య చేసిన దారుణ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్లో నివసించే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న తన కుమారుడు (5) కనిపించడం లేదంటూ ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. అదే టింబర్ డిపోలో పని చేసే కమర్ అనే వ్యక్తి 12వ తేదీన బాలుడికి మాయమాటలు చెప్పి కేసీఆర్ నగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలుడు స్పృహ తప్పిపోగా.. గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. బిహార్‌కు చెందిన కమర్.. బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు చెప్పారు. -
భార్యను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
బంజారాహిల్స్/లంగర్‌హౌస్: భార్యను మోసం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని లంగర్‌హౌస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఫరీసా షాహీన్ 1990లో సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ పాకిస్థానీ జాతీయుడు సాహెద్ అఖిల్‌ను వివాహం చేసుకున్నారు. .వీరికి 1991లో ఫహద్ అఖీల్ గోందల్ జన్మించాడు. భర్త చనిపోయిన తర్వాత ఫరీసా 1998లో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నగరంలోని విద్యనభ్యసించిన ఫహద్ ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో అసోసియేట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గతంలో ఉప్పల్‌లోని సంస్థలో పని చేసినప్పుడు అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన మహిళను వివాహం చేసుకుని లంగర్‌హౌస్ నేతాజీనగర్‌లో నివసిస్తున్నారు. ఫహద్‌కు ఏడాది క్రితం మరో మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దాని తీసింది. వీళ్లిద్దరూ బంజారాహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఫహద్ భార్య తొమ్మిది నెలలుగా దూరంగా ఉంటోంది. గురువారం రాత్రి ఫహద్ ఆ మహిళతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఫహద్‌ను లంగర్‌హౌస్ ఠాణాకు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఫహద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. -
క్యాబిన్లో ఇరుక్కుని..
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం, మొరిపిరాల మధ్యలో జాతీయ రహదారిపై లారీ, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు హనుమకొండనుంచి ఖమ్మం వైపు వెళ్తోంది. ఇదే సమయంలో ప్లాస్టిక్ వస్తువుల లోడ్‌తో ఓ లారీ విజయవాడ నుంచి హనుమకొండ వైపు వస్తోంది. ఈ క్రమంలో మైలారం, మొరిపిరాల మధ్యలో బ్రిడ్జి వద్ద గుంతలను తప్పించుకునే క్రమంలో లారీ, బస్సు ఎదురెదు రుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్పల్ప గాయాలయ్యాయి. అలాగే లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం, వర్ధన్నపేట సీహెచ్‌సీకి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా.. పోలీసులు జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి క్యాబిన్‌ను విడగొట్టి వారిని బయటకు తీశారు. వైద్యంకోసం వీరిని ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటన తో వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్లకు ఫోన్లో ఆదేశించారు. -
తండ్రి డబ్బులివ్వలేదని కుమార్తె కిడ్నాప్!
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. బాలిక తండ్రి తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వట్లేదనే కారణంతో ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాలు.. మువ్వావారిపాలేనికి చెందిన కె.శ్రీనివాసరావు కుమార్తె చీమకుర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తిరుపతికి చెందిన ఈశ్వర్‌రెడ్డి శుక్రవారం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను బయటకు పిలిపించాడు. తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తే కావడంతో.. ఈశ్వర్‌రెడ్డి మాయమాటలు నమ్మిన బాలిక అతని బైక్ ఎక్కింది. అనంతరం తిరుపతి వైపు బయలుదేరిన ఈశ్వర్‌రెడ్డి.. కొద్దిసేపటికి బాలిక తండ్రికి ఫోన్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.5 లక్షలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వనందున.. నీ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నానని చెప్పాడు. దీంతో బాలిక తండ్రి చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సుబ్బారావు వెంటనే కిడ్నాపర్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయించారు. నెల్లూరు జిల్లా కావలి వైపు వెళ్తున్నట్లు గుర్తించి.. సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను కావలి–నెల్లూరు మధ్యలో అదుపులోకి తీసుకొని.. బాలికను రక్షించారు. -
నా కుమారుడిని మంత్రి అనుచరులే పొట్టనపెట్టుకున్నారు..
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుల వల్లే తన కుమారుడు వడ్డే సునీల్(24) చనిపోయాడంటూ తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. గురువారం సాయంత్రం తన కుమారుడిని ఇష్టానుసారం కొట్టి చంపేసి.. చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, నారాయణప్ప దంపతుల కుమారుడు సునీల్.. నెల నుంచి కియా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీ గేటు ఎదురుగా ఉన్న వేపచెట్టుకు ఉరికి వేలాడుతున్న స్థితిలో సునీల్ మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి నారాయణప్ప ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. సునీల్ రొద్దం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను వేధించేవాడని, ఈ క్రమంలో ఆమె సమీప బంధువైన విట్టాపల్లికి చెందిన ఓ వ్యక్తి కలగజేసుకుని పరిగికి చెందిన వ్యక్తితో ఈ విషయంపై చర్చించాడని, దీంతో పరిగికి చెందిన వ్యక్తి గురువారం సాయంత్రం సునీల్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల ఎదుటే మందలించాడని, దీన్ని అవమానంగా భావించిన అతను గురువారం సాయంత్రమే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ చెప్పారు. కాగా, సునీల్తల్లి లక్ష్మీదేవి మాత్రం కియా పరిశ్రమలో డ్యూటీకి వెళ్లిన తన కుమారుడు ఇలా ఉరి వేసుకునేంత తప్పు చేయలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి అనుచరుడు చంద్ర ఇంటి వద్దకు వచ్చి తన కుమారుడిని మందలించాడని, ఆ తర్వాత మరికొందరు కలసి ఇష్టానుసారం కొట్టారని ఆమె తెలిపారు. తన కుమారుడి చావుకు మంత్రి అనుచరులే కారణమని.. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని విన్నవించారు. -
బర్త్ డే వేడుకల్లో భారీగా డ్రగ్స్ .. నైజీరియన్లు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బర్త్ డే పార్టీలో ఉగాండా, నైజీరియాకు చెందిన వారిని పోలీసులు పట్టుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 51 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో 37 మంది మహిళలు, 14 అబ్బాయిలు ఉన్నారు. డ్రగ్స్ పరీక్షల్లో కొంత మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది.ఉగాండాకు చెందిన మమస్ బర్త్ డే పార్టీలో భారీగా మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్స్ పాస్‌పోర్టులు, వీసాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు చెక్ చేస్తున్నారు. ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుపుతున్నట్లు తేలింది. మొయినాబాద్ ఫామ్‌కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు.డ్రగ్ డీటెక్షన్ పరికరాలతో 51మందికి పోలీసులు పరీక్షలు..బర్త్ డే పార్టీలో ఉన్నవారు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి 11గంటలకు ఎస్వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నైజీరియన్స్, పోలీసులు మధ్య రాత్రి వాగ్వాదం జరిగింది. 100 మంది పోలీసులతో ఫామ్‌హౌస్ ముందు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం 51 మంది వీసాలు పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు.. వీసా గడువు ముగిసినా పలువురు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
అర్చన దొరికింది, కానీ..
‘‘ఆంటీ.. భోపాల్ దగ్గర్లో ఉన్నా..’’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఆ తర్వాత పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటూ సివిల్ జడ్జి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అర్చనా తివారీ(28).. రాఖీ పండుగకు ఇంటికి రైలులో బయల్దేరి అనూహ్యరీతిలో అదృశ్యం కావడం మధ్యప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కట్నీకి చెందిన అర్చనా తివారీ.. ఆగస్టు 7వ తేదీన ఇండోర్ నుంచి సొంతూరుకు బయల్దేరేందుకు ఇండోర్-బిలాస్పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరింది. రాత్రి 10.16గం. టైంలో చివరిసారిగా ఆమె తన దగ్గరి బంధువుతో ఫోన్లో మాట్లాడింది. అయితే ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయింది. 👉ఆగస్టు 8వ తేదీ.. తెల్లవారు జామున.. కట్నీ సౌత్ స్టేషన్లో అర్చన రైలు దిగలేదు. కుటుంబ సభ్యులు ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆందోళన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈలోపు ఆమె బంధువు ఒకరు తర్వాతి స్టేషన్ ఉమారియాలో ఆమె బెర్త్ వద్ద బ్యాగ్‌ను గుర్తించారు.👉ఆగస్టు 9-11వ తేదీ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మూడు బృందాలుగా విడిపోయారు. భోపాల్, కట్నీ, ఇండోర్, నర్మదాపురం ప్రాంతాలను రెండ్రోజులపాటు జల్లెడ పట్టారు. చివరిసారిగా ఆమె ఫోన్ సిగ్నల్ నర్మదా రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తించారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్, హోంగార్డుల బృందాలతో నదిలో గాలించారు. 👉ఆగస్టు 12వ తేదీ.. 100 గంటల గాలింపు తర్వాత కూడా అర్చన గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. రాణి కమలపతి స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీల్లో ఆమె కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు సైతం అది అర్చననేని ధృవీకరించలేకపోయారు. ఈలోపు.. అర్చన కేసు సెన్సేషన్ కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం సైతం పోలీస్ శాఖపై ఒత్తిడి పెంచింది. దీంతో అర్చన ఆచూకీ పేరిట పోస్టర్లు వెలిశాయి. 👉ఆగస్టు 13వ తేదీ.. అర్చనా తివారీ మిస్సింగ్ కేసులో ఒక మేజర్ క్లూ దొరికిందని భోపాల్ రైల్వే పోలీసులు ప్రకటించారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డాటా రికార్డులు, కాల్ డిటైల్ రికార్డుల ఆధారంగా ఆమెను ఆచూకీని గుర్తించినట్లు ప్రకటించారు. 👉ఆగస్టు 14వ తేదీ.. నర్మదాపురం పిపరియాలో అర్చనను చూశామంటూ కొందరు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భోపాల్ రైల్వే పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కబురు పంపారు. తమ సోదరి క్షేమంగా ఉండే ఉంటుందని.. ఆమెను వెంట పెట్టుకునే తిరిగి వెళ్తామంటూ ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 👉ఆగస్టు 15వ తేదీ.. అర్చన సొంతూరికి బయల్దేరిన విషయాన్ని ఆమె ఉంటున్న హస్టల్ ఓనర్ ధృవీకరించారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇదివరకే మీడియాకు విడుదల చేసినట్లు గుర్తు చేశాడు. అర్చనా తివారీ దొరికిందని భోపాల్ పోలీసులు ప్రకటించి.. 48 గంటలు గడుస్తోంది. కానీ, ఇప్పటిదాకా ఆ వివరాలేవీ మీడియాకు వెల్లడించలేదు. ఆమె తనంతట తానుగా వెళ్లిందా? ఎవరైనా ఎత్తుకెళ్లారా? అసలు ఆమె ఎలా అదృశ్యమైంది?.. ఈ మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. -
ఆళ్లగడ్డలో ఢీకొన్న రెండు బస్సులు.. పలువురు మృతి
సాక్షి, ఆళ్లగడ్డ: నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు ప్రైవేటు ట్రావెట్స్ బస్సులు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మార్గ మధ్యలో ఆళ్లగడ్డ వద్ద ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఇద్దరు, మరో ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒకరు మృతిచెందారు. మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. మరణించిన వారు ఎవరనేది తెలియాల్సి ఉంది. సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
అజ్ఞాతంలోనే హతం
ఆత్మకూరు రూరల్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామాపురానికి చెందిన మావోయిస్టు సుగులూరి చిన్నన్న (57) మృతి చెందినట్టు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చిన్నన్నకు భవనాశి శంకర్, విజయ్ అనే మారుపేర్లు ఉన్నాయి. చిన్నన్న కర్నూలు జిల్లా వేంపెంట ఘటనతోపాటు కరువు దాడులు, సినిమా థియేటర్ల పేల్చివేత, వాహనం దహనం, సున్నిపెంట పోలీస్ స్టేషన్ పేల్చివేత తదితర ఘటనల్లో నిందితుడిగా రికార్డులకెక్కారు. చిన్నన్న 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. చిన్నన్న అజ్ఞాతంలోకి వెళ్లే నాటికి అతడికి భార్య సరోజ, ఇద్దరు కుమారులు క్రాంతి, రామకృష్ణ ఉన్నారు. -
‘ఖజానా’ దోచిన దొంగ చిక్కాడు!
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో మంగళవారం దొంగతనానికి పాల్పడిన ముఠాలో ఓ దుండగుడు చిక్కాడు. మహారాష్ట్రలోని పుణేలో ఒకరిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ ముఠా బిహార్‌కు చెందినదిగా గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం మహారాష్ట్రతో పాటు బిహార్‌లో ముమ్మరంగా గాలిస్తున్నారు. గంగారంలో నేరం చేసిన తర్వాత ఆరుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై కర్ణాటకకు వెళ్లారు. ఆ రాష్ట్రంలో వాహనాలను వదిలేసి ఎవరికి వారుగా విడిపోయారు. చోరీ సొత్తుతో ఇద్దరు వెళ్లిపోగా... మిగిలిన నలుగురిలో ఒకరు పుణే చేరుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తుచేసిన సైబరాబాద్ పోలీసులు పుణేలో ఉన్న నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకుని ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. దుండగులు వినియోగించినవి బిహార్‌లో తయారైన పాయింట్ 9 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్స్‌గా తేల్చారు. గరిష్టంగా అరగంటలో చందానగర్ చేరుకునే విధంగా ఈ ముఠా ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ‘బిహార్‌కు చెందిన ఈ దోపిడీ, బందిపోటు ముఠాలు దుకాణాలనే టార్గెట్ చేస్తుంటాయి. ఆ షాపు తెరిచేప్పుడు లేదా మూసేటప్పుడు మాత్రమే విరుచుకు పడతాయి. ఖజానా జ్యువెలరీ నుంచి ఎత్తుకుపోయిన వెండి మొత్తం బిహార్ వెళ్లిన వారి వద్దే ఉన్నాయి. అక్కడి ఈ సొత్తును విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకుంటారు’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
బాలికపై హత్యాచారం.. దోషికి ఉరి శిక్ష
రామగిరి (నల్లగొండ): మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషికి ఉరి శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ముకరమ్ నల్లగొండలోని హైదర్‌ఖాన్‌గూడలో ఉంటూ బీఫ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. నల్లగొండలోని మాన్యంచెల్కకు చెందిన 12 ఏళ్ల బాలిక 2013 మే 28న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎవరూ చూడని సమయంలో ముకరమ్ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తలిదండ్రులకు చెబుతుందేమోనని చున్నీని మెడకు బిగించి కిరాతకంగా హత్య చేసి సమీపంలోని డ్రైనేజీలో మృతదేహాన్ని పడేశాడు. బాలిక తండ్రి సాదిక్‌అలీ చాంద్ ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐ లక్ష్మణ్ దర్యాప్తు చేసి నిందితుడు ముకరమ్‌ను అరెస్టు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శ్రీవాణిరెడ్డి, శ్రీవాణి దామోదరం వాదనలతో ఏకీభవించిన కోర్టు ముకరమ్‌ను దోషిగా తేల్చి ఉరి శిక్ష విధించింది. అలాగే, రూ.లక్షా పదివేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.కుమార్తెపై తండ్రి లైంగికదాడినిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటననవీపేట: కంటికి రెప్పలా రక్షించాల్సిన కన్న తండ్రే కూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో తన భార్య లేని సమయంలో 11 ఏళ్ల పెద్ద కూతురుకు ఫోన్లో అశ్లీల సినిమాలు చూపిస్తూ లైంగికంగా వేధించాడు. ఇటీవల రాఖీ పండుగ రోజు తల్లి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. కూతురు భోరున విలపిస్తూ వెళ్లొద్దని వారించింది. తల్లి ఆరా తీయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో విషయం గ్రామపెద్దలకు వివరించగా వారు తండ్రిని హెచ్చరించడంతో భయపడి పరారయ్యాడు. అనంతరం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.7 రోజులు మృత్యువుతో పోరాడి..కామాంధుడి దారుణానికి బలై ప్రాణాలొదిలిన వృద్ధురాలుఆదిలాబాద్ టౌన్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు 78 ఏళ్ల వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడి అనంతరం తోసివేయడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో ఏడు రోజులపాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వృద్ధురాలు భిక్షాటన చేస్తోంది. ఆమెకు కుమారుడు, కోడలు, మనవరాలు ఉన్నారు. పేద కుటుంబం కావడంతో కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 7న ఫుట్‌పాత్‌పై వృద్ధురాలు నిద్రించిన సమయంలో 20 నుంచి 30 ఏళ్లు ఉండే ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఏడు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. కాగా, అదే రోజు అర్ధరాత్రి నిందితుడు రైల్లో మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రిమ్స్‌లోని మార్చురీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి వారికి నచ్చజెప్పారు. -
చక్కని బైకుంది.. పక్కన పిల్ల ఉంది.. సినిమాను మించిన ట్విస్ట్‌లు
రాయ్‌పూర్: ప్రియుడికి బైక్ కొనివ్వడానికి ప్రియురాలు దొంగగా మారిపోయింది. బంధువుల ఇంటిని దోచేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కాంకేర్ జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రియుడు విశ్వకర్శకు బైక్ కొనివ్వడానికి ప్రియురాలు కరుణ పటేల్ పక్కా ప్లాన్ చేసింది. తాళం వేసి ఉన్న బంధువుల ఇంటికి ప్రియుడిని తీసుకెళ్లి రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.95 వేలు నగదును చోరి చేసింది. ఇంటి యాజమాని కన్హయ్య పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రియుడు, ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాంకేర్ జిల్లా జైలుకు తరలించి విచారణ చేశారు. విచారణలో కరుణ పటేల్ అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడికి బైక్ కొనడం కోసమే ఈ పనిచేసినట్లు ప్రియురాలు చెప్పింది. బైక్ కోసం తన ప్రియుడికి డబ్బు ఇచ్చి, ఆభరణాలను తన వద్దే ఉంచుకున్నట్లు పోలీసులకు తెలిపింది.కన్హయ్య పటేల్ సోమవారం మధ్యాహ్నం పని కోసం మార్కెట్‌కు వెళ్లగా.. ఆ రాత్రి తిరిగి వచ్చిన తర్వాత, అతని ఇంటి తాళం పగలగొట్టి, గదులు దోచుకున్నారని. అదనపు ఎస్పీ దినేష్ సిన్హా మీడియాకు తెలిపారు. -
‘నీట్’లో పాస్.. ప్రేమలో ఫెయిల్.. కంటతడి పెట్టిస్తున్న పరువు హత్య
బనస్కాంత: గుజరాత్‌కు చెందిన 18 ఏళ్ల యువతి పరువు హత్యకు గురయ్యింది. అయితే ఈ దారుణానికి కొద్దిసేపటి ముందు ఆమె తన ప్రియునికి పంపిన సందేశం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇటీవలే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, డాక్టర్ కావాలనుకున్న ఆమె పరువు హత్యకు దారుణంగా బలయ్యింది.గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతిని ఆమె తండ్రి, మేనమామ కలిసి దారుణంగా హత్య చేశారు. అప్పటికే లివ్-ఇన్ రిలేషన్లో ఉన్న ఆ యువతి తమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో జీవిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె తన ప్రియునికి ‘రండి.. వచ్చి నన్ను తీసుకెళ్లండి. లేకపోతే నా కుటుంబ సభ్యులు నా ఇష్టానికి వ్యతిరేకంగా మరో వివాహం చేస్తారు. అందుకు నిరాకరిస్తే, నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి’ అంటూ తన ప్రియునికి సందేశం పంపింది. ఇది జరిగిన కొద్ది సేపటికే ఆమె హత్యకు గురయ్యింది.విషయం తెలుసుకున్న మృతురాలి ప్రియుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి తండ్రి సెంధాభాయ్ పటేల్, మేన మామ శివరాంభాయ్ పటేల్ ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు ఆ మేనమామను అరెస్టు చేయగా, మృతురాలి తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసుల దర్యాప్తులో ఆ యువతి శివరాంభాయ్ ఇంట్లో హత్యకు గురయ్యిందని, అక్కడే ఆమెకు నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చి, గొంతు కోసి చంపారని తేలింది. తరువాత నేరాన్ని కప్పిపుచ్చేందుకు అమెకు అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులు తెలిపారు.కాగా ఆమె తన ప్రియునికి చివరి సందేశం పంపినప్పుడు అతను జైలులో, వెంటనే స్పందించలేని స్థితిలో ఉన్నాడు. అయినా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే విచారణ షెడ్యూల్ అయ్యే సమయానికి ఆ యువతి మరణించింది. జూన్ 25న కోర్టులో అతని పిటిషన్ విచారణకు ఉండగా, ముందురోజు అంటే జూన్ 24న రాత్రి ఆమె హత్యకు గురయ్యింది. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఆ మర్నాడు నిర్వహించారు. ఆ యువతి తిరిగి తన ప్రేమికునితో ఎక్కడ వెళ్లిపోతుందనే భయంతోనే ఆమె తండ్రి, మేనమామ ఈ హత్యచేశారని పోలీసులు తెలిపారు. -
నటి శిల్పా శెట్టి దంపతులకు బిగ్ షాక్.. కేసు నమోదు
ఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాక్ తగిలింది. వారిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు.వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి.. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2015-2023 మధ్య కాలంలో శిల్పా శెట్టి దంపతులు.. రూ.60 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యాపార సంస్థలను విస్తరించడానికి తాను ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ.. ఆ నిధులను శెట్టి వ్యక్తిగత ఖర్చుల కోసం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.ఫిర్యాదులో భాగంగా.. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తనకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పరిచయం అయినట్టు కొఠారీ తెలిపారు. ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేవారని, కంపెనీలో దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారు. మొదట 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, కానీ అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తాన్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని తనను ఒప్పించారని కొఠారీ వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.#BREAKING | Legal Trouble For Actress #ShilpaShetty- Shilpa Shetty, Raj Kundra booked.- Businessman claims Rs 60 cr fraud; F.I.R filed.- Businessman alleges cheating in deal, claims Rs 60 cr misused for personal expenses. pic.twitter.com/wTgDZtfu2v— TIMES NOW (@TimesNow) August 14, 2025వారి మాటలు నమ్మి, 2015 ఏప్రిల్‌లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు కొఠారీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఆ తర్వాత, 2017లో మరో ఒప్పందంలో విఫలమవడంతో బెస్ట్ డీల్ టీవీ కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తనకు తెలిసిందని కొఠారీ వాపోయారు. ఇక, కొఠారీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం జరిగిన మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, ఈ కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఈఓడబ్ల్యూకి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. -
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై మానవ మృగాల అకృత్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మరో ఘోరం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువతిపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఒక పార్టీలో 24 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు, వారి కోసం గాలింపు కొనసాగుతున్నదన్నారు. ఆ నలుగురు నిందితులు బాధితురాలిని వాష్రూమ్లోనికి లాకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు తాను పార్టీలో మద్యం సేవించిన తర్వాత నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఆరోపించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.తన స్నేహితుడు తనను సివిల్ లైన్స్‌లోని మరో స్నేహితుని ఇంటికి పార్టీకి ఆహ్వానించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమె తన స్నేహితురాలు, మరొక పరిచయస్తుడు, మరో ఇద్దరు యువకులను కలుసుకుంది. వారంతా మద్యం సేవించి, అర్థరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. తరువాత నలుగురు యువకులు ఆమెను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారు. అలాగే దీనిని వీడియో తీశారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ యువకులు ఆమెను.. ఆమె ఇంటి బయట దింపి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఒక మహిళా అధికారి ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. తరువాత బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బైక్‌తో చేజ్ చేసి, ఎత్తుకెళ్లి..
బలరాంపూర్: ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 21 ఏళ్ల దివ్యాంగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు నివాసముండే ప్రాంతంలోని రహదారిపై ఆమెను వెంబడించి.. కిడ్నాప్ చేసి మరీ దురాగతానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మూడు, నాలుగు బైక్‌లపై ఆమెను వెంబడిస్తుండటం, యువతి రోడ్డుపై పరుగెత్తుతుండటం ఎస్పీ నివాసంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తన ఇంటినుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తన మామ ఇంటికి వెళ్లిన యువతి.. తిరిగి తన ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. దారిలో బైక్ ఆపిన వ్యక్తి ఆమెను వెంబడించారు. తరువాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అయితే యువతి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెదకడం ప్రారంభించారు. చివరకు ఒక పోలీసు పోస్టు సమీపంలో పొదల్లో అపస్మారక స్థితిలో కనిపించింది. స్పృహలోకి వచి్చన యువతి.. బైక్‌పై వచి్చన వ్యక్తులు అత్యాచారం చేశారని వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితులు అంకుర్ వర్మ, హర్షిత్ పాండేలను అరెస్టు చేశారు. -
సుశీల్ మళ్లీ జైలుకు...
న్యూఢిల్లీ: భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్‌పై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్‌కు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చి ంది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో సుశీల్ మళ్లీ జైలుపాలు కానున్నాడు. యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో జైల్లో ఉన్న సుశీల్‌కు ఐదు నెలల క్రితం బెయిల్ లభించగా... దీనిని వ్యతిరేకిస్తూ సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆటగాడిగా సుశీల్ స్థాయి, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన అతను ఘనతలను కూడా ప్రత్యేకంగా ఉదహరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరారీ తర్వాత లొంగిపోయి... కేసు వివరాల్లోకెళితే... 2021 మే నెలలో సుశీల్ కుమార్‌తో పాటు పలువురు రెజ్లర్లు సాధన చేసే ఛత్రశాల్ స్టేడియం ముందు ఈ ఘటన జరిగింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్ తదితరులు కలిసి సాగర్ ధన్కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్ మృతి చెందాడు. దాంతో సుశీల్‌పై కేసు నమోదైంది. దాదాపు ఇరవై రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత చివరకు సుశీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ సందర్భంగా హత్యతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం తదితర అంశాలతో పోలీసులు ఛార్జ్ïÙట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుశీల్‌ను తీహార్ జైలుకు పంపించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేర్వేరు కారణాలతో అతను ఐదుసార్లు స్వల్పకాలిక బెయిల్ పొందాడు. హైకోర్టు తప్పు చేసింది... సుశీల్‌కు గత మార్చిలో ఢిల్లీ కోర్టుపై బెయిల్ మంజూరు చేయడం తనకు తీవ్ర వేదన కలిగించిందని, తనకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుశీల్‌కు బెయిల్ ఇచ్చిన ప్రతీసారి అతను సాక్షులను ప్రభావితం చేశాడని... 35 మంది సాక్షుల్లో 28 మంది ఇప్పుడు గతంలో తాము ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. అనంతరం కేసుపై కోర్టు తమ అభిప్రాయాలు వెల్లడించింది. ‘నిందితుడు అగ్రశ్రేణి రెజ్లర్. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి సమాజంలో కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అతను సాక్షులను, విచారణను ప్రభావితం చేయవచ్చు. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా అతను పరారీలో ఉన్న విషయంలో మర్చిపోవద్దు. అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.కేసు తీవ్రత తగ్గించే విధంగా బెయిల్ ఉండరాదు. సత్ప్రవర్తనలాంటి అంశాలను ఇలాంటి కేసుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కేసులో బెయిల్ ఇచ్చి న ఢిల్లీ హైకోర్టు తప్పుగా వ్యవహరించింది’ అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అయితే బెయిల్ ఇచ్చిన కారణాలను తప్పుగా చూపిస్తూ దీనిని రద్దు చేసిన సుప్రీంకోర్టు... మున్ముందు సుశీల్ కుమార్‌కు కొత్తగా మళ్లీ బెయిల్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చి ంది. -
అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
జగిత్యాల క్రైం: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఓ యువతి.. వీసా రాకపోవడం.. రూ.10 లక్షలు నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కాంగాడిపాలెం గ్రామానికి చెందిన నల్లమోతు శ్రీనివాస్, వెంకటఅరుణ దంపతులు 25 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి వచ్చారు. గ్రామ శివారులో పప్పు మిల్లు లీజుకు తీసుకున్నారు. అలాగే పశువులు పెంచుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె హర్షిత (25) డిగ్రీ పూర్తి చేసి అమెరికా వెళ్లేందుకు గుర్తుతెలియని వ్యక్తికి రూ.10 లక్షలు చెల్లించింది. అతడు వీసా తెప్పించకపోవడంతో కొద్దికాలంగా జర్మనీ వెళ్తానని తండ్రి శ్రీనివాస్‌తో చెబుతోంది. డబ్బు లేదని ఈ ప్రతిపాదనకు తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత ఈనెల 6న పప్పుమిల్లు వద్ద గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడినుంచి కరీంనగర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మంగళవారం వేకువజామున మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. -
మాన ప్రాణాల కోసం పరిగెత్తి..
చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.కొందరు కీచకులు ఓ బధిర యువతిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు.A 21-year-old disabled girl was allegedly gang raped in Balrampur. A video has surfaced before the alleged gang rape, in which the girl is seen running on the road to escape from the accused. 5-6 bikes can be seen coming from behind. Police have now released a statement that they… pic.twitter.com/YPRdsaWodJ— Mohammed Zubair (@zoo_bear) August 12, 2025 -
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
రామగిరి(నల్లగొండ): కన్న కూతురిపై అత్యాచారం జరగడానికి కారణమైన తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ పట్టణంలోని లైన్‌వాడకు చెందిన గ్యారాల శివకుమార్ బీటీఎస్‌కు చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నంచగా తిరస్కరించింది. బలవంతంగా బాలిక దుస్తులు విప్పి వీడియోలు తీసి, శారీరకంగా అనుభవించాడు. శివకుమార్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాధిత బాలిక 2023 మే 8న నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లి యాదమ్మ, శివకుమార్‌పై ఫిర్యాదు చేసింది.పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ.. ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఏ1గా ఉన్న గ్యారాల శివకుమార్ ఉదయం కోర్టుకు వచ్చినట్లే వచ్చి పారిపోయాడు. అతడు కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. తదుపరి కోర్టు ముందు హాజరుపర్చిన రోజు శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. ఏ2 యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. పదేళ్లు జైలు శిక్ష.. రామగిరి(నల్లగొండ), మర్రిగూడ: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన పోలె నరేష్ 2016 ఆగస్టు 22న అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ కె. బలరాం పోలె నరేష్‌పై పోక్సో కేసు నమోదు చేయగా.. అప్పటి నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా జడ్జి రోజారమణి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కారు డ్రైవర్‌కు..కట్టంగూర్: ప్రమాదంలో కారుతో మహిళను ఢీకొని ఆమె మృతికి కారణమైన డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమనా విధిస్తూ నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 మార్చి 18న శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన బట్టా సుమన్ తన బంధువైన మందుల పరిమళను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామం నుంచి అయిటిపాములలో శుభకార్యానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చెర్వుఅన్నారం క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా.. ఖమ్మం జిల్లా వేపకుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ అంగోతు కిశోర్‌కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో అజాగ్రత్తగా, అతివేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మందుల పరిమళ తలకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమన్ తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్ఐ తెలిపారు. అత్యాచారం కేసులో 20 ఏళ్లు..రామగిరి(నల్లగొండ): మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన వీరంశెట్టి సాంబశివ 2017 ఏప్రిల్ 15న అదే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన బాలికను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రోజారమణి నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరించడంలో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులుగా జె. రవీందర్, ఏ. రమేష్‌బాబు, జె. శివకుమార్ వ్యవహరించారు. -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా ఓ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దౌసా-మనోహర్పూర్ రోడ్డులో ఆగి ఉన్న వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది భక్తులు ఖాఠుశ్యామ్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. ఈప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందించారు. ట్విట్టర్ వేదికగా సీఎం శర్మ.. ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక, తమ వారిని కోల్పోయిన కారణంగా మృతుల కుటుంబ సభ్యలు కన్నీటిపర్యంతమవుతున్నారు. #WATCH | Dausa, Rajasthan | Visuals from Shri Ramkaran Joshi Hospital in Dausa, where people injured in the accident between a passenger pick-up and a trailer truck near Bapi have been brought for treatment. pic.twitter.com/0ytIMiV7T8— ANI (@ANI) August 13, 2025 -
30 ఏళ్ల స్నేహం.. చిచ్చు రేపిన ఎఫైర్
కర్ణాటక: వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. 30 ఏళ్ల స్నేహం వారిది. అందులో ఒకరు స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో చిచ్చు రేగింది. ఫలితంగా ఇద్దరు మిత్రుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు హత్య కేసులో ఇరుక్కున్నాడు.విజయ్ కుమార్, ధనంజయ అలియాస్ జే మూడు దశాబ్దాలకు పైగా స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. తరువాత సుంకడకట్టే ప్రాంతానికి మారారు. ధనంజయ ఆటోడ్రైవర్ కాగా, విజయ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆశ అనే యువతిని వివాహం చేసుకుని, కామాక్షిపాల్యలో కాపురం పెట్టాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో ధనంజయ కల్లోలం రేపాడు. విజయ్ భార్య ఆశతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో విజయ్ తన కాపురాన్ని కడబగెరె సమీపంలోని మాచోహళ్లికి మార్చాడు. అయినా ఆశతో ధనంజయ ఎఫైర్ కొనసాగించడంతో పంచాయితీ పోలీసులకు వద్దకు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పి పంపించారు.మరోవైపు తన సంసారంలో నిప్పులు పోసిన ధనంజయ్‌ని చంపేస్తానని విజయ్‌కుమార్ చెప్పుకుని తిరుగుతుండేవాడు. అతడు అన్నంత పని చేస్తాడనే భయంతో విజయ్‌కుమార్‌ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్ వేశాడు. సోమవారం రాత్రి విజయ్‌కుమార్ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్‌తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశాడు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విజయ్‌కుమార్ భార్య ఆశను అదుపులోకి తీసుకున్నారు. ధనంజయ్, అతడి గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.∙ -
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
వికారాబాద్: లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కింది. కలెక్టరేట్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు తన రెండెకరాల అసైన్డ్ భూమికి సంబంధించి రికార్డుల్లో తన తల్లి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్‌ను ఈ– సెక్షన్ నుంచి కలెక్టర్ పేషీకి పంపించాల్సి ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాత ఇందుకోసం రూ.5 వేలు డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని పదిహేను రోజుల క్రితమే రైతు నుంచి గూగుల్ పే చేయించుకుంది. అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వగా.. తిరిగి ఆ కాపీని తహసీల్దార్ ఆఫీసుకు పంపించాల్సిఉంది. రోజులు గడుస్తున్నా ఫైల్ రాకపోవడంతో బాధితుడు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సుజాతను కలిశాడు. దీనిపై స్పందించిన ఆమె ప్రొసీడింగ్ కాపీ తహశీల్దార్ కార్యాలయానికి పంపాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రూ.15,000 బేరం కుదిరిన అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సుజాతకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ– సెక్షన్లో సోదాలు నిర్వహించి, పలు ఫైళ్లను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఈ వ్యవహారంలో మరెవరి పాత్రయినా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్డులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు. లంచం అడిగితే 1064 కాల్ చేయండి.. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని, ఇందుకోసం 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు. -
క్లినికల్ ట్రయల్స్..ఎగ్ డొనేషన్స్!
సాక్షి, హైదరాబాద్: సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఏజెంట్ల నెట్‌వర్క్‌ను నార్త్‌జోన్ పోలీసులు ఛేదించారు. ఈ నెట్‌వర్క్‌కు క్లినికల్ ట్రయల్స్ చేసే క్యాంపులతోపాటు అండాన్ని డొనేట్ చేసే మహిళలే మూలమని గుర్తించారు. డాక్టర్ నమ్రతపై గతంలో 15 కేసులు ఉండగా, తాజాగా 9 కేసులు నమోదైనట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ప్రకటించారు. ఈ కేసుల్లో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేశామని, వీరిలో డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏసీపీ పి.సుబ్బయ్యతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, కొండాపూర్‌లతో పాటు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్‌కతాలో సెంటర్లు నిర్వహిస్తున్న నమ్రత.. దేశవ్యాప్తంగా ఏజెంట్ల నెట్వర్క్ ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఆ క్యాంపుల్లో ఏర్పడిన పరిచయాలతోనే...వివిధ ఔషధాలు, నూతన వైద్య విధానాలపై అధికా రికంగానే క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటాయి. ఇలాంటి క్యాంపులకు వెళ్లే నమ్రత లేదా ఆమె ఉద్యోగులు పురుష వలంటీర్లను ట్రాప్ చేసి ఏజెంట్లుగా మార్చుకున్నారు. అలాగే ఐవీఎఫ్ కేంద్రాల్లో అండం (ఎగ్) డొనేషన్ కోసం వచ్చిన మహిళల్ని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. వీరిని ఏజెంట్లు గా చేసుకుంటున్నారు. నమ్రతకు ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరించిన ధనశ్రీ సంతోషి వివిధ ప్రాంతాల్లో సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. వీరి ద్వారానే పేద గర్భిణులను గుర్తించి నమ్రత వాడుకుంది. నకిలీ డీఎన్ఏ రిపోర్టులు సృష్టించి... ఐవీఎఫ్ కోసం సికింద్రాబా ద్‌లోని సృష్టి సెంటర్‌కు వచ్చే దంపతుల్లో ఖర్చు పెట్టగలిగేవారిని సరో గసీ వైపు మళ్లించే నమ్రత..వారిని విశాఖపట్నం పంపించి పరీక్షలు చేయించేది. వారి అండం, వీర్యంతోనే సరోగసీ జరుగుతున్నట్లు నమ్మించి.. డెలివరీ సమయానికి ఒప్పందం చేసుకున్న పేద గర్భిణులను తీసుకువచ్చి డెలివరీ చేయించి, ఆ శిశువు సరోగసీ ఒప్పందం చేసుకున్న దంపతులకే పుట్టినట్లు నమ్మించి అప్పగించేది. కన్న తల్లిదండ్రులకు నామమాత్రపు మొత్తం చెల్లిస్తూ శిశువును దత్తత ఇస్తున్నట్లు చెప్పేది. ఇందుకోసం నకిలీ డీఎన్ఏ రిపోర్టులు సృష్టించేది. ఈ శిశువుల జనన రిజిస్ట్రేషన్ తదితరాలన్నీ విశాఖలోనే నిర్వహించేవారు. బాధితుల నుంచి నమ్రత రూ.1.6 కోట్లు వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు. సరోగసీ పేరుతో ముగ్గురు శిశువుల్ని విక్రయించిన నమ్రత.. మరో కేసులో మాత్రం డెలివరీ సమయంలో శిశువు చనిపోయినట్లు నమ్మించి ఏమాత్రం సంబంధం లేని మృత శిశువును చూపించింది. మరోసారి సరోగసీ చేయాలంటే అదనంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసింది. ఈ కేసులో మొత్తం 25 మంది అరెస్టు చేశారు. వీరిలో వైద్యులైన నమ్రత, సదానందం, విద్యుల్లత, ఉషా దేవి, రవిపై ఉన్న 9 కేసుల దర్యాప్తును సీసీఎస్ అధీనంలోని సిట్ బదిలీ చేశారు. -
'ఖజానా' కొల్లగొడదామని..
సాక్షి, హైదరాబాద్/చందానగర్: హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూంపై బందిపోటు దొంగలు పంజా విసిరారు. మంగళవారం ఉదయం షాపు తెరిచే సమయంలోనే తుపాకులతో చొరబడిన ముఠా బంగారం కోసం ప్రయత్నించి గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో పరారయ్యింది. ఈ సందర్భంగా దుండగుల కాల్పుల్లో షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ కాలుకి గాయం కాగా.. సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. జిన్నారం మీదుగా పారిపోయిన ఈ ముఠాను పట్టుకోవడానికి 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ప్రకటించారు. మాదాపూర్ డీసీపీ వినీత్, మియాపూర్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఉదయం షోరూమ్ తెరిచీ తెరవగానే.. జాతీయ రహదారిపై గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంను యథావిధిగా మంగళవారం ఉదయం 10.15 గంటలకు తెరిచారు. ఆ సమయంలో విధులకు హాజరైన 25 మంది సిబ్బందితో రోజూ మాదిరిగానే డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ మాట్లాడుతున్నారు. 10.30 గంటల ప్రాంతంలో ఆ షోరూం వద్దకు మాస్క్‌తో వచ్చిన ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా తన ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఐదు నిమిషాలకు రెండు ద్విచక్ర వాహనాలపై మరో ఐదుగురు అక్కడకు చేరుకున్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. ఒకరు షోరూం బయటనే ఆగిపోగా.. మరొకరు ప్రధాన ద్వారం దగ్గర కాపు కాశారు. మిగిలిన నలుగురూ నేరుగా సిబ్బంది ఉన్న ప్రాంతానికి వచ్చారు. మాస్క్‌లు ధరించి ఉన్న దుండగులను వినియోగదారులని ఉద్యోగులు భావించారు. ఏం కావాలని అడగడానికి ఓ ఉద్యోగి వస్తుండగా తుపాకులు ఉన్న ముగ్గురు దుండగలు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ డిప్యూటీ మేనేజర్‌ను లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆయన తన వద్ద తాళాలు లేవని చెప్పడంతో ‘చుప్ బే’అంటూ బెదిరించిన ఓ దుండగుడు అతని ఎడమ కాలుపై కాల్చాడు. షోరూమ్‌లో ఉన్న రెండు సీసీ కెమెరాలను కూడా కాల్చారు. గోల్డ్ కోటెడ్‌వే నిజమైనవి అనుకుని.. ప్రతిరోజూ షోరూమ్ మూసేముందు అదే అంతస్తులోని మెజ్జనైన్ ఫ్లోర్లో ఉన్న లాకర్లో బంగారు ఆభరణాలను భద్రపరుస్తారు. ఉదయం షోరూమ్ తెరిచిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ తాళాలు తీస్తే బంగారు ఆభరణాలను బయటకు తీసువచ్చి కింది ఫ్లోర్లో ఉన్న షో కేసుల్లో సర్దుతారు. అయితే మంగళవారం ఉదయం దుండగులు వచ్చిన సమయానికి అసిస్టెంట్ మేనేజర్ రాకపోవడంతో ఈ బంగారం దోపిడీ దొంగలకు దొరకలేదు. ఈ షోరూమ్‌లో వినియోగదారులకు చూపించడానికి బయటకు తీసి, మళ్లీ లోపల పెట్టడానికి ఉన్న కొన్ని షోకేస్‌లతో పాటు ఆభరణాలను డిస్ప్లే చేయడానికి ఉన్న షో కేసుల్లో గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలను ఉంచుతారు. వీటినే బంగారు ఆభరణాలుగా భావించిన దుండగులు ఆ షోకేసుల్ని ధ్వంసం చేసి అందులో ఉన్న ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకుని వాహనాలపై ఉడాయించారు. ఈ వెండి ఐదు నుంచి పది కిలోల వరకు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ దోపిడీ ముగిసింది. పక్కాగా రెక్కీ చేసిన తర్వాతే నేరం! దుండగులు రెండుమూడు రోజుల పాటు రెక్కీ చేసిన తర్వాతే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి వచ్చిన కమిషనర్ అవినాష్ మహంతి బందిపోటు దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందాలు.. నేరం చేసిన తర్వాత దుండగులు చందానగర్–పటాన్చెరు–కృష్ణారెడ్డిపల్లి–జిన్నారం మీదుగా పరారైనట్లు గుర్తించారు. దుండగుల్లో ఒకడు ‘చుప్ బే’అనే పదం వాడటాన్ని బట్టి.. అది మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షోరూం డిప్యూటీ మేనేజర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. -
చందానగర్: నగల దుకాణంలో దొంగల ముఠా కాల్పులు
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాపు తెరిచిన ఐదు నిమిషాలకే(10.35 గం.ప్రాంతంలో) లోపలికి చొరబడ్డ ఓ ముఠా.. లాకర్ తాళాలు ఇవ్వాలంటూ గన్ చూపించి అసిస్టెంట్ మేనేజర్‌ను బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో.. కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో సిబ్బందిలోని సతీష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాడి సమయంలో నగల షాపులోకి సీసీకెమెరాలను దొంగలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. అయితే.. సిబ్బంది చాకచక్యంగా అందించిన సమాచారంలో పోలీసులు దుకాణం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ముఠా అక్కడి నుంచి పారిపోయింది. దుండగులు ఆర్సీపురం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నగల దుకాణంలోని వెండి సామాన్లను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సీపీటీవీల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డయ్యాయి. మొత్తం పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీపీ అవినాష్ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాకు వివరాలను అందజేశారు. -
ఠాణా మెట్లెక్కించిన సిగరేట్
గోదావరిఖని: సిగరేట్ తాగాలనే తాపత్రయం ఠా ణా మెట్లెక్కించింది. ఇరువర్గాలు రోడ్డుపై కొట్టుకో వడం భయాందోళనకు గురిచేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి 8మందిపై కేసు నమోదు చేశారు. గోదావరిఖనిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులు సిగరెట్ కోసం రాజేశ్ థియేటర్ సమీపంలోని ఓ పాన్‌షాప్ వద్దకు వెళ్లారు. మూడు సిగరెట్లకు డబ్బులు చెల్లించగా రెండు సిగరెట్లే ఇచ్చావని షాపు నిర్వాహకుడిని ప్రశ్నించారు. ఈక్రమంలో ఇరువర్గాల మద్య మాటామాట పెరిగింది. కొట్టు కట్టేసే సమయం అయిపోయిందని, పక్కకు వెళ్లి సిగరెట్ తాగాలని షాపు యాజమాని సూచించాడు. దీంతో ఆయనపై ఇద్దరు మిత్రలు చేయి చేసుకున్నారు. ఈక్రమంలో బాధితుడు తన బందువులకు ఫోన్‌చేసి ముగ్గురిని పిలిపించాడు. సిగరెట్ కోసం వచ్చిన ఇద్దరు యువకులు కూడా ఫోన్‌చేసి మరో ఇద్దరిని పిలిపించుకున్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన 8 మంది నడిరోడ్డుపై కొట్టుకోవడంతో అక్కడ భీతావహ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకవర్గానికి చెందిన కె.ప్రణయ్‌కౌశిక్, మహ్మద్ ఆజీం, బి.ఆదర్శ్, టి.రాహుల్, మరో వర్గానికి చెందిన ఎం.శ్యాంసుందర్, ఎం.అభిలాష్, జి.రాజ్‌కుమార్, సీహెచ్ చంద్రమౌళిగా గుర్తించారు. నడిరోడ్డుపై గొడవకు దిగి శాంతిభద్రతలకు భంగం కలిగించిన నిందితులపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సిగరేట్ కోసం ఠాణా మెట్లు ఎక్కి కేసులో ఇరుక్కోవడం నగరంలో చర్చనీయాంశమైంది. -
దూసుకొచ్చిన మృత్యువు
విశాఖపట్నం: ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాశన వేడుకను సంబరంగా జరుపుకుంది. మరుసటి రోజు ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమైన ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్‌లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాçశన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్‌కు చేరుకుంది. సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బిలి బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్‌ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్‌ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుండగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. బస్సు స్పీడ్‌గా వచ్చేసింది.. నేను అరకు వెళ్లాలి. బస్సు కోసం ఎస్.కోట ప్లాట్‌ఫాం వద్ద సమీపాన కూర్చున్నా... పదడుగుల దూరంలో ఆ మహిళ బ్యాగ్ పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు స్పీడ్‌గా ఆమెను ఢీకొని లోపలికి వచ్చేసింది. చూస్తుండుగానే ఆ మహిళ బస్సుకు అక్కడున్న స్తంభానికి మధ్యలో నలిగిపోయింది. ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. – కమిడి గురు, అరకు, ప్రత్యక్ష సాక్షిడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. -
అల్లుడు.. అత్తకు యముడు
కర్ణాటక: జిల్లాతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి అనేకచోట్ల విసిరివేసిన భయానక హత్యాకాండలో మిస్టరీ వీడింది. సొంత అల్లుడే అత్తను అంతమొందించాడని తేలింది. తుమకూరు సిటీ కువెంపు నగరలో నివాసం ఉంటున్న ఆమె అల్లుడు, దంత వైద్యుడు డాక్టర్. ఎస్.రామచంద్రయ్య (47) సూత్రధారి కాగా, ఊర్డిగెరె సమీపంలో కళ్లహళ్ళివాసి సతీష్ కే.ఎన్.(38), కిరణ్ కే.ఎస్. (32) అనే ఇతర నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ అశోక్ మీడియాతో తెలిపారు. ఏం జరిగిందంటే వివరాలు... తుమకూరు తాలూకాలోని బెళ్ళావి గ్రామానికి చెందిన బసవరాజు భార్య లక్ష్మీదేవమ్మ (42) ఈ నెల 3వ తేదీన కూతురి తేజస్వినిని చూడాలని తుమకూరుకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లేదు. కూతురి ఇంటికి వచ్చిన అత్తను అల్లుడు, ఇతర దుండగులు కిడ్నాప్‌చేశారు. హత్య చేసి సుమారు 10 ముక్కలుగా చేసి చింపుగానహళ్లి పరిసరాలలో పడేశారు. గ్రామస్తుల సమాచారం ఎస్పీ, పోలీసులు గాలింపు జరిపి శరీర భాగాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవమ్మగా భర్త బసవరాజు, పిల్లలు గుర్తించారు. బంధువులను పిలిచి విచారణ చేసే సమయంలో అల్లుడు, డెంటిస్టు రామచంద్ర కనిపించలేదు. ధర్మస్థలలో అల్లుడు అల్లుడు ధర్మస్థలకు వెళ్లాడు. పోలీసులు అక్కడికే వెళ్లి నిర్బంధించి కొరటిగెరె స్టేషన్‌కు వచ్చి గట్టిగా విచారించగా జరిగింది వివరించాడు. తన భార్యను చెడుదారిలో తీసుకెళ్లేందుకు ఒత్తిడి చేసిందని, అందుకే హత్య చేశానని చెప్పాడు. శరీరాన్ని ముక్కలు చేసి 10 చోట్ల పడేశామని తెలిపాడు. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. -
‘నాకు కొడుకే కావాలి’.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి ప్రాణం తీసిన తండ్రి
అగర్తల: కొడుకులకన్నా కూతురు నయం అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్లలపై ఇంకా వివక్ష ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఓ తండ్రి తన కుమార్తెకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన.. విషాద వాస్తవానికి నిదర్శనంగా నిలుస్తోంది.త్రిపుర రాష్ట్రం ఖోవై జిల్లా బేహలాబారి గ్రామంలో దారుణం జరిగింది. త్రిపురా స్టేట్ రైఫిల్స్‌కు చెందిన జవాన్ రతీంద్ర దేవ్‌బర్మా తన ఏడాది కుమార్తెను విషమిచ్చి హత్య చేశారు. అయితే,తండ్రి విషం ఇవ్వడంతో చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం త్రిపురా రాజధాని అగర్తల జీబీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు రతీంద్ర దేవ్ బర్మా త్రిపురా స్టేట్ రైఫిల్స్ పదోవ బెటాలియన్ తరుఫున ఏడీసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రతీంద్రదేవ్ను కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది.కుమార్తె మరణంపై గుండెలవిసేలా రోధిస్తున్న తల్లి మిథాలీ.. తన భర్త రతీంద్రదేవ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కుమార్తెకు బిస్కెట్లు కొనుక్కునే నెపంతో తమ కూతురు సుహాని దేవ్ బర్మా విషం తినిపించాడని ఆరోపించింది. తన భర్తకి ఎప్పుడూ కుమారులే కావాలి. ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చినందుకు తనను నిరంతరం ద్వేషిస్తుండేవారని వాపోయింది. మేం బెహలబరిలోని నా సోదరి ఇంటికి వెళ్తున్నాము. అప్పుడు నా భర్త.. నా కుమార్తెను, నా సోదరి కొడుకుకు బిస్కెట్లు కొనిచ్చేందుకు సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లాడు. వెంటనే, నా సోదరి కొడుకు, నా కుమార్తె వాంతులు,విరోచనాలు చేసుకున్నారు. నా కుమార్తె నోటి వెంట క్రిమిసంహారక మందు వాసన రావడాన్ని గమనించా. ఆస్పత్రికి తరలించా. కుమార్తెకు.. నా భర్త హాని తలపెట్టి ఉంటాడని అనుమానించా. అతడిని నిలదీశా. కుమార్తెకు విషం ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తే తన కుమార్తె సుహాని ప్రాణాలు తీశాడని, అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
తాళి కట్టిన మూడ్రోజులకే..
సాక్షి, రంగారెడ్డి: అంగరంగ వైభవంగా ఆ జంటకు వివాహం జరిగింది. అప్పగింతల తర్వాత బారాత్‌లో అంతా హుషారుగా చిందులేశారు. తెల్లవారు జామున వధువుతో పాటు వరుడు తన ఇంటికి చేరుకున్నాడు. అయితే కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రిలో చేరాడు.వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బడంగ్పేట్ లోని లక్ష్మీ దుర్గ నగర్ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్(26) ఈనెల 7వ తారీఖున వివాహం జరిగింది. ఆ మరుసటిరోజు.. తెల్లవారుజామున వధువుతో ఇంటికి చేరుకోగానే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందడంతో పెళ్ళంట విషాద ఛాయలు అలుముకున్నాయి.భారత్‌లో ఇటీవల ఆకస్మిక మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 18-45 ఏళ్ల యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనల్లో.. కోవిడ్-19 తర్వాత ఆకస్మిక మరణాలు గణనీయంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల లోపు వయస్సు గల వ్యక్తులు, ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం లేకపోయినా, హఠాత్తుగా మరణించడం గమనార్హం. దీంతో.. పోస్ట్ మార్టం నివేదికల (AIIMS లో 50 కేసులు) ఆధారంగా శరీరంలో మార్పులు, గుండె సంబంధిత సమస్యలు, రక్తనాళాల గడ్డకట్టడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. కంట్రోల్ గ్రూప్ ద్వారా ఆరోగ్యవంతుల వివరాలు సేకరించి, మరణించిన వారి లక్షణాలతో పోల్చుతున్నారు.ఆకస్మిక మరణాలకు సాధ్యమైన కారణాలు:గుండెపోటు (Heart Attack) – ముఖ్యంగా నిదానంగా పెరిగిన కొలెస్ట్రాల్, రక్తనాళాల బ్లాక్‌లుArrhythmia – గుండె రిథమ్ సక్రమంగా లేకపోవడంCOVID-19 ప్రభావం – శరీరంలో మైక్రో గడ్డలు, శ్వాసకోశ మార్పులుఒత్తిడి, జీవనశైలి సమస్యలు – నిద్రలేమి, మద్యం, ధూమపానంఅధిక వ్యాయామం లేదా శారీరక ఒత్తిడి – కొన్నిసార్లు వ్యాయామం సమయంలో గుండెపై అధిక ఒత్తిడినివారణకు సూచనలుతరచూ ఆరోగ్య పరీక్షలు తరచుగా చేయించుకోవడంగుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంకోవిడ్ తర్వాత శరీరంలో మార్పులు ఉంటే వైద్య సలహా తీసుకోవడంజీవనశైలిని మెరుగుపరచడం (ఆహారం, వ్యాయామం, నిద్ర) -
ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!
కడప అర్బన్: మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్‌రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు.రామమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్‌ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాంధీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్‌రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్లు స్పష్టమైంది. కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో విధుల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ సోయం సౌమ్య కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రధాన నిందితుడు కశింకోట అనిల్‌కుమార్ ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఇందుకు శరభవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కళ్యాణం ఉమామహేష్, రాగోలు దుర్గావిగ్నేస్ సహకరించారు. వీరు ముగ్గురినీ పోలీసులు వైరామవరం మండలం, పాతకోటలో అరెస్ట్ చేశారు. వీరితోపాటు సౌమ్య కదలికలపై రెక్కీ నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్‌దొర, పూసం పవన్ కుమార్‌లను అదే గ్రామంలో అరెస్టు చేశారు.ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అనిల్ కుమార్‌పై గంజాయి కేసుతో పాటు మరో నాలుగు క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. బాధితురాలిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. ముఖ్యమైన మార్గాలను మూసివేయడం, చెక్‌పోస్టులకు అలర్ట్ ఇవ్వడం, జీపీఎస్ ట్రాకింగ్, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కదలికలను గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. శరభవరంలో సౌమ్యను కిడ్నాప్ చేసిన తరువాత గట్టి నిఘా ఉందని తెలుసుకున్న కిడ్నాç³ర్లు కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాన్ని జగ్గంపేట సమీపంలో నిర్మానుష్య ప్రదేశం వద్ద వదలి, మరో వాహనంలో పాతకోట గ్రామానికి పరారైనట్లు పేర్కొన్నారు. నిందితులు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవడం ద్వారా వారున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించగలిగామని తెలిపారు. -
సై'డర్'..!
మన ఇంట్లో బంగారం పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మన కుటుంబంపై ఎవరైనా దాడికి పాల్పడినా.. ఆడపిల్లలను ఏడిపించినా.. ఎవరైనా మోసగించినా వెంటనే స్పందిస్తాం. అంతేవేగంగా పోలీసులు సైతం విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రూ.కోట్లలో మోసాలకు పాల్పడే కంటికి కనిపించని, పరిచయం లేని సైబర్ మోసగాళ్లపై పరువు అనే సమస్యకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం అంతా వెనకడుగు వేస్తారు.ఎందుకంటే టెక్నాలజీ పరంగా, సామాజిక మాధ్యమాల పరంగా కొన్ని బలహీనతలకు లోబడి చేసే తప్పులు బయటపడితే ఇబ్బందులు వస్తాయని ఆగిపోతున్నారు. కుటుంబంలో తెలిస్తే బాధపడతారని రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. – శ్రీకాకుళం క్రైమ్గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సైబర్ చక్రబంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన సైబరాసురులు హనీట్రాప్, డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్, పార్ట్‌టైం జాబ్‌ల పేరిట రెచ్చిపోతున్నారు. రూ.లక్షల్లో పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులతో సుమారు ఏడెనిమిది కేసులు నమోదయ్యాయని, స్టేషన్ మెట్లెక్కని బాధితులు మరింతమంది ఉండొచ్చని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మోసపోయినవారిలో ఉన్నత ఉద్యోగ వర్గాలే ఉండడం విశేషం. హనీ ట్రాప్‌లో పడి.. జిల్లాకేంద్రం సమీపంలోని సంపన్న వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల ఒక అమ్మాయి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. ప్రొఫైల్ పిక్‌లో అమ్మాయి ఫొటో ఉండడంతో ఆకర్షితమైన సదరు వ్యక్తి వెంటనే హాయ్ అని రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిత్యం చాటింగ్ చేయడం రివాజైంది. కొన్నాళ్లకు వాట్సాప్ కాల్లో మాట్లాడడం.. వీడియో కాల్స్ చేయడం ఆరంభించింది. అలా ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపిన యువతి వీడియో కాల్స్‌లో న్యూడ్ కాల్స్ చేయడం ప్రారంభించింది. కొద్దిరోజులు తానే న్యూడ్‌గా కనిపించి ఆ తర్వాత సదరు వ్యక్తిని సైతం న్యూడ్‌గా కనిపించాలని కోరిక కోరడంతో, అతడు కూడా నగ్నంగా మాట్లాడడం ఆరంభించాడు. దీంతో ఆ వ్యక్తి నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్‌ను రికార్డింగ్ చేసిన ఆ యువతి అక్కడి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించింది.ఆమె తరపున మరికొంతమంది సైతం వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందేమోనని భయపడి, చేసేదేమీలేక వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు దఫదఫాలుగా రూ.28 లక్షల వరకు పంపించేశాడు. అయినప్పటికీ డబ్బుల కోసం పీడిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిజిటల్ అరెస్టు పేరిట.. విశాఖపట్నంలోని ఒక అకౌంటింగ్ సెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీకాకుళం నగరవాసి డిజిటల్ అరెస్టు పేరిట రూ.11 లక్షలను సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. మీ పేరిట కొరియర్లో డ్రగ్స్ ప్యాకెట్ వచ్చిందని.. మీ ఆధార్ లింక్ నంబర్‌తో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ, కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసే వీలుందని ఒక వ్యక్తి బెదిరించడంతో నిజమేనని నమ్మాడు. దీనినుంచి బయటపడాలంటే ముందుగా రూ.30 వేలు తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఉద్యోగి వేశాడు. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్ చేసి పై అధికారులను మేనేజ్ చేయడం కుదరడం లేదని.. వారే మీకు లైన్లోకి రావొచ్చని మెల్లగా జారుకున్నాడు. కొన్ని గంటల్లోనే పోలీసు సెటప్‌తో ఉన్న ఓ రూంలో యూనిఫాంతో ఓ వ్యక్తి వీడియో కాల్లో ప్రత్యక్షమై తాను ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. మేం నిన్ను నమ్మాలంటే మీ బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లు వెరిఫికేషన్ చేయాలన్నాడు. వాటి ఆధారంగా ఇటీవల జరిగిన ఆన్లైన్ లావాదేవీలు పరిశీలించాలని.. కొంత అమౌంట్‌ను కూడా వెరిఫికేషన్‌లో భాగంగా తీయాల్సి వస్తుందని చెప్పాడు. అందులో జెన్యూనిటీ ఉంటే తిరిగి మీ ఖాతాలో అమౌంట్ వేయడం జరుగుతుందని చెప్పడంతో సదరు ఉద్యోగి ఓకే చేశాడు. అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేయడంతో పాటు ఓటీపీలు చెప్పడంతో రూ.11 లక్షలను కొట్టేశారు. దీంతో తాను మోసానికి గురయ్యానని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జేఈ రూ.3 లక్షలు, నగరానికి చెందిన ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రూ.3 లక్షలు పోగొట్టుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ వీరిని సైబరాసురులు అధికారుల పేరిట బెదిరించడం విశేషం.పార్ట్‌టైం జాబ్ ఫ్రాడ్స్.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఇంట్లోనే ఉంటూ పార్ట్‌టైం జాబ్ చేసే వీలుందని చెప్పడంతో నగరంలో నలుగురు చిరుద్యోగులు ఈ ఉచ్చులో పడ్డారు. ముందుగా వారు క్రియేట్ చేసిన గ్రూపుల్లో మెంబర్లుగా చేరారు. మొదటి టాస్‌్కలో రూ.5 వేలుకు రూ.1000లు అదనంగా రూ.6 వేలు, రెండో టాస్‌్కలో రూ.10 వేలకు రూ.2 వేలు అదనంగా రూ.12 వేలు వేయడంతో విత్‌డ్రా చేసుకున్నారు. అనంతరం అత్యాశకు పోయి తర్వాత టాస్క్‌ల్లో రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.1 లక్ష, రూ.2 లక్షలకు అదనపు సొమ్ము ఖాతాల్లో ఉన్న ఆప్షన్లో చూపించినా విత్‌డ్రా చేయడానికి వీలుకాకపోవడం.. ఆ తర్వాత అవతలివాళ్లు వీరి నంబర్లు బ్లాక్ చేయడంతో మోసపోయామని గ్రహించారు. పోలీసులకు ఆసక్తి ఉన్నా.. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నా మోసం చేసే సైబర్ కేటుగాళ్లు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాల్లో సైతం ఉండడం.. తెలియని ప్రాంతాల్లో రిస్క్ చేసి పట్టుకోవడానికి వెళ్లే ఆసక్తి ఉన్నా.. రాను పోను ఖర్చులు, వసతి ఖర్చులకు చేతి చమురు తగులుతుండటం.. ఆపై ఎక్కువ రోజుల సమయం వెచ్చించాల్సి రావడంతో వెనకడుగు వేస్తున్నారు. అలా కేసుల్లో అధికశాతం పెండింగ్ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువలన ప్రభుత్వాలు కాస్తా చొరవ తీసుకుని ఆర్థికంగా చేయూతనిస్తే కేసుల ఛేదన సులభమేనంటూ పోలీసులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడికి టోకరా నగర పరిసరాల్లో ఉండే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఓ నేరం చేశాడని.. సీబీఐ, ఈడీ విభాగాల అధికారులు అరెస్టు చేసే వీలుందని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. దానికి తగ్గ ఆధారాలు తమ వద్దనున్నాయని చెబుతూనే ఫేక్ వివరాలు వాట్సాప్‌లో పంపడంతో ఉపా«ధ్యాయుడు ఖంగుతిన్నాడు. మీ అబ్బాయి నేరం నుంచి బయటపడి, విదేశాల నుంచి రావాలనుకుంటే అధికారులకు అమౌంట్ కట్టాల్సి ఉంటుందన్నారు.పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం బయటకు తెలిస్తే మీ పరువు పోతుందని అనడంతో చేసేదేమీలేక రూ.35 లక్షలు వారు చెప్పిన వివిధ ఖాతాల్లోకి పంపించాడు. ఎక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తాడోనని గంట గంటకు ఉపాధ్యాయునికి వాట్సాప్ వీడియో కాల్ నేరస్తులు చేసేవారు. తర్వాత వాళ్ల నంబర్లకు ఫోన్ కాకపోవడంతో బాధిత ఉపాధ్యాయుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. క్షణాల్లో మోసాన్ని గ్రహించాలి సహజంగా జరిగే చోరీలు.. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న సైబర్ మోసాలను పరిశీలిస్తే 1:10 నిష్పత్తిలో నగదు మోసానికి గురవుతోంది. సైబర్ నేరగాడు బాధితుడి ఆర్థిక స్థితిని చూడడు. అత్యాశనే చూస్తాడు. వారు చేసే మోసాన్ని క్షణాల్లో మనం గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని పూడ్చవచ్చు. ఈవిధంగానే ఇటీవల డిజిటల్ అరెస్టు వలలో పడి రూ.13.5 లక్షల పోగొట్టుకున్న జెమ్స్ వైద్యురాలి కేసు ఛేదించాం. కోచిగూడ్, మైసూర్ వెళ్లి నిందితులను పట్టుకున్నాం. రాష్ట్రంలో రోజుకి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు బాధితులు నష్టపోతున్నారు. – సీహెచ్ పైడపునాయుడు, సీఐ, శ్రీకాకుళం రూరల్ -
ఆరుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
కడప అర్బన్: వైఎస్సార్ కడప, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో ఎర్ర చందనం చెట్లను నరికి.. ఆ దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి 52 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం జిల్లాలోని చాపాడు మండలం ప్రొద్దుటూరు–అన్నవరం మధ్య చిన్నవరదాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఎర్ర చందనం దుంగల్ని రవాణా చేస్తున్న వాహనాలు అటుగా వచ్చాయి. పోలీసుల్ని చూసి నిందితులు పారిపోతుండగా.. ఆరుగురిని పట్టుకున్నారు. నిందితులు అడవిలో ఎరచ్రందనం చెట్లను నరికి, దుంగలుగా మార్చి వాటిని ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ కార్లలో రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బంది గమనించి అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా వెనుక బడా స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్ అయిన వారిలో చాపాడుకు చెందిన ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, పెండ్లిమర్రి మండలానికి చెందిన కాయలి శ్రీనివాసులు, చక్రాయపేట మండలానికి చెందిన బండ్రెడ్డి ఓబులరెడ్డి, పెండ్లిమర్రి మండలానికి చెందిన శనివారపు బాలగంగిరెడ్డి ఉన్నారని ఎస్పీ వివరించారు. వీరిలో ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్. కడప జిల్లాలో ఇతనిపై 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. గతంలో 3 సార్లు పీడీ యాక్ట్ నమోదైంది. ఇతడి భార్య లాలూబీపైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయి జైలులో ఉందని ఎస్పీ చెప్పారు. ఇతని కుటుంబ సభ్యులైన లాలుబాషా, పక్రుద్దీన్, జాకీర్ కూడా పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు. నాగదస్తగిరిరెడ్డి తన అనుచరులైన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, కాయలి శ్రీనివాసులు, ఓబులరెడ్డి, శనివారపు బాలగంగిరెడ్డితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఢిల్లీలో ఉండే సలీం అనే ప్రధాన స్మగ్లర్, ఇతర స్మగ్లర్లు ఢిల్లీలో ఉండే ఒక హవాలా వ్యాపారి ద్వారా హైదరాబాద్‌లో ఉండే విక్రంసింగ్ సోలంకి డబ్బులను హవాలా రూపంలో నాగదస్తగిరిరెడ్డికి అందజేస్తున్నాడన్నారు. విక్రంసింగ్ సోలంకిని కూడా వారం క్రితం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఉమ్మనబోయిన క్రిష్ణయ్యపై కర్నూలు జిల్లాలో 2 ఎర్రచందనం కేసులు, 3 చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన ఆర్ఎస్టిఎఫ్ సీఐ సి.శంకర్‌రెడ్డి, ఆర్ఎస్ టాస్‌్కఫోర్స్ సిబ్బంది, మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యను ఎస్పీ అభినందించారు.ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!» ఎర్ర చందనం కేసులో అరెస్టయిన రామమోహన్ » ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు » రాష్ట్ర మంత్రి లోకేశ్, ప్రవీణ్‌తో చెట్టాపట్టాలుకడప అర్బన్: మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్‌రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు. రామమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్‌ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాం«దీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్‌రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
కన్నతల్లిని కత్తితో నరికి హత్యాయత్నం
కొయ్యలగూడెం: కన్నతల్లిపై కొడుకు నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొయ్యలగూడెంలో జక్కు లక్ష్మీనరసమ్మ (50) రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. వీరికి కొడుకు, కూతురు ఉండగా, కుమార్తెకు వివాహమైంది. కుమారుడు శివాజీ (32)కి వివాహం కాగా, అతను భార్య, ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చియ్యపాలెంలో తాపీమే్రస్తిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు. లక్ష్మీ నరసమ్మ తన సొంత ఇంటిలోనే నివాసముంటోంది. ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ రెండుసార్లు ఆమెపై దాడికి యత్నించాడు. ఆదివారం వారి ఇంటికి సమీపంలో తల్లిని కుమారుడు అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు. లక్ష్మీనరసమ్మకు ఈ దాడిలో తలపై నాలుగు, మెడపై నాలుగు, శరీరంపై మరో రెండు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108 కోసం పలుమార్లు ప్రయత్నించినా స్పందన కనిపించలేదు. దీంతో సురక్ష ఆస్పత్రి అంబులెన్సులో లక్ష్మీనరసమ్మను కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ఆమె పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుల నిరసన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆస్పత్రికి తరలించేందుకు అందుబాటులో ఉండాల్సిన 108 అంబులెన్సు నిరుపయోగంగా పడి ఉండటంపై యువకులు కొయ్యలగూడెంలో నిరసన తెలిపారు. లక్ష్మీ నరసమ్మపై హత్యాయత్నం జరిగిన తరువాత స్థానికులు 108కి ఫోన్ చేసినా కనీస స్పందన రాలేదు. దీంతో స్థానిక యువకులు ఆగ్రహానికి గురై నిరుపయోగంగా ఉన్న 108 అంబులెన్సు వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఈక్వెడార్ నైట్ క్లబ్లో కాల్పులు..8 మంది మృతి
శాంటా లుకా: దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లోని ఓ నైట్ క్లబ్లో ఆదివారం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీరప్రాంత గుయాస్ ప్రావిన్స్‌లోని శాంటా లుకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా 20–40 ఏళ్ల వారేనని పోలీసులు తెలిపారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఒకటిగా దీనికి పేరుంది. రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు వెల్లడించారు. కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇంటర్ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకుమార్తె హేమశ్రీ (16) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్‌కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియోకాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపల్‌తో మాట్లాడతామని చెప్పారు. తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పారు. వారు వచ్చేసరికే ఆమె మరణించింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే హేమశ్రీ మృతిచెందిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిసంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇ¯న్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య హాస్టల్ బాత్రూమ్లను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, హాస్టల్‌ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థిసంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు. -
ఆమెకు 30.. అతనికి 19!
కాటారం: ఆమె వయసు 30.. అతని వయసు 19. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజ్పల్లికి చెందిన దుర్గం సరళ(30).. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల జాడి రాజేశ్ గత జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుతెరువు నిమిత్తం కాటారం మండల కేంద్రానికి వచ్చి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజేశ్ కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. ఈక్రమంలో రాజేశ్‌ను కుటుంబ సభ్యులు ఉసిగొల్పడంతో.. సరళను హింసించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరళ శనివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రియుడ్ని ఇంటికి పిలిచి.. దారుణంగా హత్య చేసిన మహిళ!
సాంభాల్: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాంభాల్‌లో మరో హత్యోందంతం వెలుగుచూసింది. నైతికత మరిచి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ప్రియుడ్ని పక్కా పథకం ప్రకారం అడ్డు తొలగించుకునే యత్నం చేసింది ఓ మహిళ, ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్, ;పట్టకారు సాయంతో హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల అనిష్ అనే వ్యక్తికి సితార అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అతని వద్ద నుంచి రూ. 7 లక్షలను సితార తీసుకుంది. ఆ సొమ్మును ఇవ్వాలని అనిష్ పదే పదే అడగడంతో సితార ప్రణాళిక రచించింది. అప్పు తీసుకున్న విషయం భర్త రాయిస్ అహ్మద్‌కు కూడా తెలిసినదే కావడంతో హత్యా రచన అనేది ఇద్దరూ కలిసే చేశారు. ఈ క్రమంలోనే అనిష్‌ను ఇంటికి పిలిచింది సితార. ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కట్టేసి స్క్రూ డ్రైవర్, ఇంటిలోని ఇతర వస్తువుల సాయంతో అనిష్‌ను హత్య చేశారు. వివాహేతర సంబంధమే కారణం..ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆమె ఇంటికి తరుచు వస్తూ పోతూ ఉండే అనిష్‌ను అడ్డు తొలగించుకోవాలని సితార భావించింది. దీనిలో భాగంగానే ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం అనిష్ హత్య కేసులో నిందితులుగా ఉన్న భార్యా భర్తల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.రూ. 7 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకే..అయితే అనిష్ కుటుంబ సభ్యులు మాత్రం సితారతో వివాహేతర సంబంధం గురించి తమకు తెలియదని అంటున్నారు. ఆమె తమకు తెలుసున్న వ్యక్తి అని, ఆ క్రమంలోనే అనిష్ వద్ద నుంచి రూ. 7 లక్షలను అప్పుగా తీసుకుందని అంటున్నారు. ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడిగినందుకే తన కుమారుడు అనిష్‌ను పొట్టనపెట్టుకున్నారని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. చాలా దారుణంగా తన తనయుడ్ని హత్య చేశారని, డబ్బులు అడిగినందుకే ఇంత ఘోరానికి ఒడిగట్టారని, అంతకుమించి తనకు తెలియదని తండ్రి తెలిపారు. తన కుమారుడి పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఈ క్రమంలోనే ఇచ్చిన అప్పును అడగడానికి వెళుతున్నట్లు తమకు చెప్పాడని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
గచ్చిబౌలి: అదుపు తప్పి కారు పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. చత్తీస్ఘడ్ రాయపూర్‌కు చెందిన రూపక్ త్రిపాఠి(30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కేపీహెచ్బీలో తమ్ముడు శాశ్వత్ త్రిపాఠితో కలిసి నివాసం ఉంటున్నారు. స్నేహితులతో కలిసి ఎర్టిగా కారులో కేపీహెచ్‌బీ నుంచి నాలెడ్జీ సిటీకి వెళుతుండా టీ హబ్ రోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో బెలూన్ తెరుచుకున్నప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న రూపక్ త్రిపాఠి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్‌లోని మెడికొవర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారులో ఉన్న సోదరునితో పాటు స్నేహితులు వైభవ్ పాటిల్, ఇషాన్ త్రిపాఠి, ఎస్ రాజ్ సింగ్‌లు క్షేమంగా బయటపడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఇటీవల రూపక్ త్రిపాఠి మొబైల్ యాప్‌ను డెవలప్ చేశాడు. యాప్‌ను లాంచ్ చేయాల్సి ఉందని చెప్పి చత్తీస్ఘడ్ నుంచి వారం రోజుల క్రితం ముగ్గురు స్నేహితులను పిలిపించుకున్నాడు. తెల్లవారు జామున ఐటీ కారిడార్ చూసేందుకు వెళుతూ కారు అదుపుతప్పడంతో రూపక్ త్రిపాఠి తిరిగి రాని లోకాలు వెళ్లాడు.కారు ముందు చక్రం ఊడిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు మృత దేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎంఆర్ఎఫ్లో బిగ్ స్కాం.. వీళ్లు మామూలోళ్లు కాదు
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా.. డబ్బులు నొక్కేసింది. గతంలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వద్ద పని చేసిన పలువురు ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ డబ్బులను కొట్టేశారు. 2020-21 నుంచి అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం.సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్నవారిని కాదని ఇంటి పేరును పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గతంలో సెక్రటేరియట్లో పనిచేసిన ఓ ఉద్యోగి.. ముఠాకు సహకరించినట్లు తెలిసింది. బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముఠా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు తేలింది.2022లో నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావుకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. సీఎంఆర్ఎఫ్ కోసం బాధితుడు దరఖాస్తు చేశాడు. 2023లో గద్దె వెంకటేశ్వరరావుకు సీఎం సహయనిధి కింద లక్షన్నర మంజూరైంది. గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదును బదిలీ చేశారు. ఏడాదిన్నర అవుతున్నా సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు.. తీరా తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ డబ్బులు మరొకరు డ్రా చేసుకున్నారని తెలియడంతో అవాక్కయ్యాడు. జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వర రావు ఎస్బీఐ ఖాతాకు డబ్బులు రావడం.. డ్రా కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ముఠాలోని మునగాల మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా.. నాలుగేళ్లపాటు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. -
అర్చన ఎక్కడ?.. పోలీసులకు మిస్టరీగా మిస్సింగ్ కేసు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సివిల్ జడ్జి కావడానికి సిద్ధమవుతున్న ఒక యువతి రైలు నుండి అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులైనా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అర్చనా తివారీ(28) సివిల్ జడ్జి కావడానికి పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆగస్టు ఏడో తేదీన ఆమె తన ఇంటికి వెళ్లేందుకు ఇండోర్-బిలాస్పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ-3 బోగీలో కూర్చున్నారు. అయితే, ఆమె దిగాల్సిన స్టేషన్ కట్నీ వద్ద అర్చన కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రైలు వచ్చినప్పటికీ అర్చన మాత్రం రైలు నుంచి దిగలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతుండగానే.. రైలు స్టేషన్ నుంచి వెళ్లిపోయింది.भोपाल में चलती ट्रेन से गायब हो गई 29 साल की लड़की ये घटना सरकार की नीद हराम कर दी है और कानून व्यवस्था पर धब्बा लगा दिया है दरअसल, अर्चना तिवारी नाम की युवती इंदौर से कटनी जाने के लिए निकली थी।वह ट्रेन नंबर 18233 इंदौर-बिलासपुर नर्मदा एक्सप्रेस के बी-3 कोच में सीट नंबर 3 पर… pic.twitter.com/GxCVxaT23A— Pradeep yaduvanshi (@Ritikapradeep94) August 9, 2025దీంతో, కుటుంబ సభ్యులు.. రైల్వే అధికారులను ఆశ్రయించడంతో.. పక్క స్టేషన్ ఉమారియాలో రైలు ఆగిన వెంటనే.. సదరు బోగీలో అర్చన కోసం వెతికినప్పటికీ ఆమె కనిపించలేదు. కానీ, ఆమె బ్యాగు మాత్రం బోగీలో లభించింది. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆరోజు ఉదయం 10:15 గంటల ప్రాంతంలో తాము చివరిసారిగా అర్చనతో మాట్లాడామని.. అప్పుడు రైలు భోపాల్ సమీపంలో ఉందని చెప్పారు. దీని తర్వాత అర్చన ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని చెప్పుకొచ్చారు.అనంతరం, కట్నీ రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మరావి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. భోపాల్‌లోని రాణి కమలపతి స్టేషన్లో అర్చన కనిపించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భోపాల్ స్టేషన్ తర్వాత సహ ప్రయాణికులు ఆమెను చూడలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మూడు రోజులైనా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
ముక్కలుగా నరికి..10 చోట్ల పడేశారు..!
బెంగళూరు: 2022నాటి శ్రద్ధా వాకర్ దారుణ హత్యను తలపించే ఘటన ఒకటి కర్నాటకలో వెలుగు చూసింది. ఈ నెల 7వ తేదీన కొరటగెరె తాలుకాలోని ఓ గ్రామంలో వీధి కుక్క ఒకటి రక్తమోడుతున్న మనిషి చేతిని లాక్కెళుతుండగా చూసి షాక్‌కు గురయ్యారు. మరో చేయి అక్కడికి కిలోమీటర్ దూరంలో గ్రామస్తులకు కనిపించింది. గుర్తు తెలియని మహిళ తల, మొండెం తదితర భాగాలు పది వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండగా గుర్తించారు. సాధారణంగా చోటుచేసుకునే హత్య వంటిది కాదని తేలి్చన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలిని గుర్తించారు. హంతకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. 10 చోట్ల 10 భాగాలు.. ఈ నెల 7వ తేదీ గురువారం ఉదయం చింపుగనహళ్లి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన కుక్క ఒకటి మనిషి తెగిన చేతిని పొదల్లోకి లాక్కెళ్తుండగా స్థానికులు గమనించారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టిన మరో చేయి ఆ సమీపంలోనే వారికి కనిపించింది. మరికొద్ది గంటల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో మరికొన్ని అవయవ భాగాలు కనిపించాయి. లింగపుర రోడ్డు వంతెన వద్ద పేగులు, ఇతర అంతర్గత భాగాలు బెండోన్ నర్సరీకి సమీపంలో, ఒక కాలు రక్తంతో తడిచిన బ్యాగు జోనిగరహళ్లి వద్ద పోలీసులకు దొరికాయి. సిద్దారబెట్ట, నాగాలాల్ మధ్య రోడ్డుపై రెండు బ్యాగుల్లో మరికొన్ని శరీర భాగాలను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం సిద్దారబెట్ట సమీపంలో హతురాలి తల లభ్యమైంది. శరీర భాగాలన్నీకొరటగెరె, కొలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 10 ప్రాంతాల్లో పడి ఉండగా స్వా«దీనం చేసుకున్నారు పోలీసులు. హతురాలి చేతులపై ఉన్న పచ్చబొట్లు, ముఖకవళికల ఆధారంగా ఆమెను తుమకూరు తాలుకా బెళ్లావికి చెందిన లక్ష్మీదేవమ్మ(42)అని గుర్తించారు. ఆగస్ట్ 3వ తేదీన ఉర్దిగెరెలో ఉన్న కుమార్తెను చూసేందుకని వెళ్లిన లక్ష్మీదేవమ్మ కనిపించకుండా పోయిందంటూ ఆమె భర్త బెళ్లావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి, ముక్కలుగా నరికారని, ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకే హంతకులు పలు ప్రాంతాల్లో శరీర భాగాలను పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిందెవరు? కారణాలేమిటో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసిన ఘటన తీవ్ర సంచలనం రేపడం తెల్సిందే. -
సోదరునికి రాఖీ కట్టేందుకు వచ్చి..
సిద్దిపేట కమాన్: సోదరుడికి రాఖీ కట్టేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న యువతికి అదే చివరి రోజు అయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందగా.. తల్లి, మేనమామకు గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనపై సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాలివి. చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన తాళ్లపల్లి పర్షరాములు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలో భార్య పల్లవి, కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వీరి కూతురు తాళ్లపల్లి శృతి (24) ఎం ఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. పర్షరాములు భార్య పల్లవి సిద్దిపేటలోని తమ్ముడు నాగిళ్ల శ్రీనివాస్‌కు రాఖీ కట్టేందుకు.. కూతురు శృతితో కలిసి గజ్వేల్ నుంచి సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తన భార్య, అక్క పల్లవి, మేనకోడలు శృతితో కారులో అల్లీపూర్ గ్రామానికి వెళ్లి భార్యను అక్కడ దింపేశాడు. అనంతరం మహారాష్ట్ర నుంచి వచ్చిన సోద రుడు లింగంకు రాఖీ కట్టేందుకు శృతి.. తన తల్లి పల్లవి, మేనమామ శ్రీనివాస్‌తో కలిసి నంగునూర్ మండలం నర్మెటకు బయలుదేరింది. ఈ క్రమంలో పట్టణ శివారు రాజీవ్ రహదారిపై శ్రీనివాస్ నడుపుతున్న కారు టైరు పంక్చర్ కావడంతో.. నెమ్మది గా రోడ్డు పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు.. వెనుకనుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనక సీట్లో కూర్చున్న శృతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. శృతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్. ఆయన సోదరి పల్లవికి స్వల్ప గాయాలవడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఇంటి పక్కనే ఉంటాడు.. నా భార్యను వేధిస్తున్నాడు..
జంగారెడ్డిగూడెం: తన భార్యను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నారని ఓ భర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు తన కుటుంబసభ్యులతో కలిసి జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నాడు. అయితే తన ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఫిర్యాదుదారిడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని భార్య భర్తకు చెప్పడంతో ఈ నెల 7న రాత్రి ఫిర్యాదుదారుడు ఆ యువకుడిని పిలిచి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ యువకుడు దాడికి యత్నించాడు. దాడి సమయంలో యువకుడి బావమరిది కూడా సహకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ టి.బాబూరావు తెలిపారు. -
వంట బాగోలేదనడం వేధింపెలా అవుతుంది?
వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఈ మధ్య ఆసక్తికరమైన తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నదే. తాజాగా.. బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసును సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కొట్టేసింది. ఈ క్రమంలో భార్య వంట బాగా లేదని, సరైన దుస్తులు ధరించడం లేదని అనడం వేధింపుల కింద రాదని పేర్కొంది. 2022 మార్చిలో ఆ జంటకు వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. ఆమె భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ తరుణంలో తన భర్త, అత్తమామలు, భర్త తరఫు బంధువులపై 498A కింద కేసు పెట్టింది. ఈ కేసు చివరకు బాంబే హైకోర్టుకు చేరింది. వివాహం జరిగిన నెల నుంచే తాను అత్తింట్లో వేధింపులు ఎదుర్కొన్నానని.. తన భర్త తాను వంట బాగా చేయడం లేదని, దుస్తులు సరైనవి ధరించడం లేదని సూటిపోటి మాటలతో వేధించాడని ఆమె కోర్టులో వాపోయింది. పైగా భర్తకు శారీరక, మానసిక సమస్యలు ఉన్న విషయం తన దగ్గర దాచారని, ఇంటి కొనుగోలు కోసం రూ.15 లక్షలు తేవాలని అతని కుటుంబ సభ్యులు.. బంధువులు హింసించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్.. శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తనపై వేధింపులను ఆమె ఏరకంగానూ నిరూపించలేకపోయిందని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘భార్య దుస్తులు సరిగా వేసుకోలేదని.. వంట సరిగా చేయలేదని తిడుతుంటాడని కొందరు భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వీటిని మేం తీవ్రమైన క్రూరత్వంగా, వేధింపులుగా పరిగణించలేం’’ అని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ సంజయ్ ఏ. దేశ్‌ముఖ్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఆమెకు ఇది రెండో వివాహం. 2013లో విడాకులు తీసుకున్న పిటిషనర్.. 2022లో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన నెలకే వైవాహిక జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు "ఓమ్నిబస్" (సారవంతం లేని) విధంగా ఉన్నాయి. తగిన సాక్ష్యాలు లేకపోగా.. ఆమెవన్నీ అతిశయోక్తితో కూడిన ఆరోపణలనే అనే విషయం ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. వివాహానికి ముందు భర్త ఆరోగ్య స్థితి గురించి చెప్పలేదని ఈమె చెబుతోంది. కానీ, ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అలాగే ఇల్లు కొనుగోలు కోసం డబ్బుకై వేధించారని చెబుతోంది. కానీ, అప్పటికే అతనికి ఓ ఇల్లు ఉంది. అలాంటప్పుడ ఇంటి కోసం వేధించాల్సిన అవసరం ఆ భర్తకు ఏముంది?.. వివాహ సంబంధం బలహీనపడినప్పుడే ‘వంట, దుస్తులు బాగోలేవనే..’ అతిశయోక్తులు జోడించబడతాయి. ఇలాంటి సందర్భాల్లో కేసులు వేయడం అంటే.. చట్టాన్ని అడ్డుపెట్టకుని భర్త, అతని కుటుంబాన్ని వేధించడమే అవుతుంది అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సదరు భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
వెంటాడిన వెబ్‌సిరీస్
మొబైల్‌ఫోన్, అందులోని ఇంటర్నెట్, సోషల్ మీడియా, గేమ్స్ అనేవి డ్రగ్స్ మాదిరిగా వ్యసనమవుతున్నాయి. ఎంతోమంది జీవితాలను బలిగొంటున్నాయి. ముఖ్యంగా బాలలు, యువకులు మొబైల్ గేమ్స్ మాయలో పడి విలువైన జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అటువంటి రెండు విషాద సంఘటనలు బెంగళూరులో సంభవించాయి.బనశంకరి: సిలికాన్ సిటీలో చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్ పరిదిలో 14 ఏళ్లుబాలుడు గాంధార్ డెత్‌నోట్‌రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లిదండ్రులు జి.గంగాధర్, సవిత గాన సంగీత కళాకారులు కాగా, ఘటన సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాలుడు పద్మనాభనగరలో ప్రైవేటు స్కూలులో 7వ తరగతి చదివేవాడు. ఇంట్లో ఎలాంటి సమస్య లేదు, తల్లిదండ్రులు, సోదరునితో అన్యోన్యంగా ఉండే గాంధార్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి షాక్ ఇచ్చింది.స్వర్గంలో ఉంటానురాత్రి అందరితో కలిసి భోజనం చేసి తన పెంపుడు శునకంతో నిద్రకు ఉపక్రమించిన గాంధార్ తెల్లవారుజామున తన గదిలో ఉరివేసుకునే ముందు డెత్‌నోట్‌ను రాశాడు. తల్లిదండ్రులను ఉద్దేశించి.. మీరు నన్ను 14 ఏళ్లు బాగా పెంచారు. మీతో చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నేను వెళ్లే సమయం వచ్చింది. మీరు ఈ లేఖ చదివేలోగా నేను స్వర్గంలో ఉంటాను అని రాశాడు. అందులో కొన్ని బొమ్మలను కూడా గీశాడు.ఆ వెబ్ సిరీసే..బాలుడు చిన్న వయసులో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే ప్రశ్న తలెత్తింది. పోలీసులు విచారణ జరపగా కలవరపరిచే అంశాలు బయటపడ్డాయి. గాంధార్ జపనీస్ భాషలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డెత్‌నోట్ వెబ్ సిరీస్‌ను క్రమం తప్పకుండా చూసేవాడు. అంతేగాక వెబ్‌సీరీస్‌లో వచ్చే ఒక పాత్రను గాంధార్ తన రూమ్‌లో గీశాడు. ఈ వెబ్‌సీరీస్‌లో ఒక పాత్ర ఉంది. ఈ పాత్ర చెప్పినట్లు హీరో నడుచుకుంటాడు. ఆ మాయా బుక్‌లో ఎవరిపేరు రాసి వారు ఎలా చనిపోవాలి అనే ఊహించుకుంటే ఆ వ్యక్తి ఆ విధంగా చనిపోతాడు. చెడ్డవారు ఎవరూ కూడా భూమిపై ఉండరాదు, వారందరినీ అంతం చేయాలి అనేది ఈ వెబ్ సిరీస్ కథ. ఈ డెత్‌నోట్ వెబ్‌సిరీస్‌ను నిరంతరం చూసి దీని ప్రభావానికి లోనైన గాంధార్ ఆ మాదిరిగా ప్రాణాలు తీసుకున్నాడనే అనుమానం వ్యక్తమవుతోంది. బాలుని మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు!
కర్నూలు: హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నడుపుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్లైన్లో యువకులకు యువతుల ఫొటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ ఇంట్లో కొన్ని నెలలుగా గుట్టుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా, ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డిలు స్థావరంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అరెస్టయిన వారిలో 9 మంది నిర్వాహకులు, నలుగురు విటులు ఉన్నారు.విజయవాడ, అనంతపురం, హైదరాబాదు, నంద్యాల ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపి వ్యాపారం సాగించేవారు. అమ్మాయిల ఫొటోలను వాట్సాప్‌లో పంపి విటులను ఆకర్షిస్తూ కొంతకాలంగా వ్యాపారం సాగిస్తూ వారిపై వచ్చే ఆదాయాన్ని నిర్వాహకులు వనరుగా మార్చుకున్నారని విచారణలో బయటపడింది. కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్, నందికొట్కూరులోని మద్దూరు సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్, కర్నూలు షరీన్ నగర్‌కు చెందిన ఆరెపోగు శేఖర్, బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన సుజాత, కర్నూలు సంతోష్ నగర్‌కు చెందిన గూగుల్రోజ్ సైలు, నంద్యాల జిల్లా బనగానపల్లె ఈద్గా నగర్‌కు చెందిన షేక్ మాబున్ని, విజయవాడ హనుమాన్ నగర్‌కు చెందిన పులిపాక లక్ష్మి, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన పోలిరెడ్డి భార్య అన్యం నారాయణమ్మ కలసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులతో పాటు విటులు కురువ రవిబాబు, బింగి బాల అంకన్న, జయకృష్ణ, మిఠాయి పరుశురాం లాల్ తదితరులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తారని, ఇంటి యజమానులు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు సాగుతుంటే డయల్ 112 లేదా 91211 01062 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. -
నెల్లూరులో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, చాకిచెర్ల: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుపాన్ వాహనం లారీని ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఉలవపాడు మండలం చాకిచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తుపాను వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, వీరంతా.. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన తనయుడు
కర్నూలు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన ఘటన కర్నూలులో సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. బుధవారపేటలోని కనకదుర్గమ్మ దేవాలయం సమీపంలో రుద్రాక్ష ఎల్లమ్మ(70), కుమారుడు జమ్మన్న నివాసముంటున్నారు. జమ్మన్న వంట మాస్టర్‌గా పనిచేస్తూ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గురువారం రాత్రి తల్లిని వేధించాడు. ఆమె ఇవ్వకపోవడంతో తెల్లవారుజామున ఒంటరిగా పడుకుని ఉన్న తల్లి చెవి కమ్మలను బలవంతంగా లాక్కొన్నాడు. అనంతరం ముక్కు మూసి హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. జమ్మన్న కూతురు జ్ఞానేశ్వరి ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
AP: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్‌రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
వృద్ధుడు.. నలుగురు మహిళలు.. ఇవేం ట్విస్టులు రా సామీ!
ముంబై: సైబర్ నేరాలపై ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. సైబర్ మోసగాళ్ల చేతిలో అమాయకులు సులభంగా మోసపోతునే ఉన్నారు. దేశంలో రోజురోజుకు ఇలాంటివి అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. యువతే కాదు.. వృద్ధులు సైతం వలపు వలలో పడుతున్నారు. వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించి.. సైబర్ మోసానికి గురై రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు.ముంబైకి చెందిన వృద్ధుడు 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఫేస్బుక్లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా.. ఆ రిక్వెస్ట్ అంగీకరించలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత షార్వి ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆ వృద్ధుడు అంగీకరించాడు. ఇద్దరూ చాటింగ్ ప్రారంభించారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు.అప్పుడే అసలు కథ మొదలైంది. తన భర్త నుంచి దూరమై పిల్లలతో ఉన్నట్లు నాటకానికి తెర తీసింది. ప్రస్తుతం తన పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని.. తనకు కొంత డబ్బు అవసరం అంటూ వాపోయింది. దీంతో కరిగిపోయిన ఆ వృద్ధుడు నగదును పంపించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత కవిత అనే మహిళ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది. షార్వి స్నేహితురాలిగా పరిచయం చేసుకున్న ఆమె. ఆ వృద్ధుడికి అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించింది. అనంతరం డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. షార్వి సోదరి నంటూ మరో మహిళా దివాజ్ సందేశాలు పంపించడం మొదలు పెట్టింది. షార్వి చనిపోయిందని.. ఆస్పత్రి బిల్లు చెల్లించాలని స్క్రీన్ షాట్లు కూడా పంపించింది. దీంతో ఆ వృద్ధుడు డబ్బులు పంపించాడు. అనంతరం తిరిగి దినాజ్‌ను డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇదిలా సాగుతుండగా..ఇంతలోనే జాస్మిన్ అనే మరో మహిళ మెసేజ్ పంపించింది. దినాజ్ స్నేహితురాలినంటూ సాయం చేయాలని అభ్యర్థించింది. దీంతో ఆమెకు కూడా ఆ వృద్ధుడు డబ్బు పంపించాడు. ఇలా ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు రూ. 8.7 కోట్లు పంపించాడు. ఇంతటితో ఆ వృద్ధుడు ఆగలేదు.. ఇక ఖాతాలో నగదు అయిపోవడంతో కోడలి దగ్గర రూ.2లక్షలు అప్పుతీసుకున్నాడు. మరింత డబ్బు కావాలంటూ ఆ మహిళలు కోరడంతో కుమారుడి దగ్గర కూడా రూ. 5 లక్షలు అడిగాడు.దీంతో అనుమానం వచ్చి కొడుకు తండ్రిని నిలదీయగా.. ఆ డబ్బు ఎందుకు అవసరమో చెప్పాడు. దీంతో అసలు విషయం బయటపడింది. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఆ వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. మోసంపై జూలై 22న సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వృద్ధుడిని మోసం చేసిన నలుగురు మహిళలు తెలిసిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
భార్యపై ఇన్‌స్టాలో భర్త అసభ్య పోస్టులు.. నవవధువు ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాంగోపాల్‌పేట్: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసికున్నారు. మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఇన్‌స్ట్రాగామ్‌లో అసభ్యంగా పోస్టులు పెడుతుండటంతో మనస్తాపానికి లోనైన నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాంగోపాల్‌పేట్ గైదీన్‌బాగ్‌కు చెందిన కీర్తి, రామంతపూర్‌కు చెందిన భీమ్రాజ్ ప్రేమించుకున్నారు. మే 8న పెద్దలను ఎదిరించి సైదాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే ఇటీవల అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు.ఆ తర్వాత ఆమె మళ్లీ అత్తారింటికి వెళ్లగా మళ్లీ అదే పరిస్థితి ఎదురు కావడంతో ఆమె తిరిగి పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం తాను గర్భవతి అని తెలియడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే ఆ బిడ్డ తనకే పుట్టాడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించడంతో మనస్తాపానికి లోనైన కీర్తి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాంగోపాల్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆటోలో 2 రోజుల్లో 1400 కి.మీ. ప్రయాణం.. ఎందుకంటే? -
సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్.. నాలుగు రోజులుగా రెక్కీ..
రంపచోడవరం: సచివాలయ మహిళా ఉద్యోగిని అపహరించుకెళ్లిన ఘటన అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం శరభవరంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు.. శరభవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సోయం శ్రీసౌమ్య ఉదయం 10.30 గంటలకు రోజూ మాదిరిగా విధులకు హాజరయ్యారు.ఈ క్రమంలో వేటుకూరుకి చెందిన కె.అనిల్‌కుమార్ మరికొందరి సహాయంతో AP31TJ1462 నంబరు గల ఇన్నోవా కారులో ఆమె కార్యాలయానికి వెళ్లి బెదిరించి, బలవంతంగా ఈడ్చుకుంటూ ఎక్కించుకుని పారిపోయాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు నాలుగు రోజులుగా సచివాలయ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు నిందితుడు పట్టపగలే అందరి ముందూ కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. -
విశాఖలో విషాదం
విశాఖ సిటీ: విశాఖ వన్‌టౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ రోడ్డులోని వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విస్ఫోటనం ధాటికి షాపు తునాతునకలైంది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. సున్నపువీధి ప్రాంతంలో నివాసముంటున్న చల్లా గణేష్ (44) 6 నెలల క్రితమే బుక్కావీధి ప్రాంతంలోని ఫిషింగ్ హార్బర్ రోడ్డులో వెల్డింగ్ దుకాణాన్ని ప్రారంభించాడు. వెల్డింగ్, గ్యాస్ కటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ తో పాటు హెల్పర్ శ్రీను, రోజువారీ వేతనం కింద ఎర్ర ఎల్లాజీ (45), డి.సన్యాసిరావు (46) పని చేస్తున్నారు. సాయంత్రం 4.30 సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి వెల్డింగ్ షాపు నామరూపాలు లేకుండాపోయింది. షాపు యజమాని చల్లా గణేష్, హెల్పర్ శ్రీను శరీరాలు ముక్కలై షాపు వెనుక ఉన్న 9 అడుగుల గోడ పైనుంచి ఎగిరి అవతలివైపు పడ్డాయి. వర్కర్లు ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు దాని పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం వద్ద పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు (27), ఇప్పిలి రంగారావు(53)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో వన్‌టౌన్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను ఆటోలో ఎక్కించి కేజీహెచ్‌కు తరలించారు. చింతకాయల ముత్యాలు శరీరం 95 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ సాయంత్రం 7 గంటలకు మరణించాడు. ప్రస్తుతం 95 శాతం కాలిన గాయాలతో ఎల్లాజీ, 75 శాతం గాయాలతో ఇప్పిలి రంగారావు, 18 శాతం గాయాలతో డి.సన్యాసిరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ద్వారా పేలుడుకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ పేలుడుకు వెల్డింగ్ సిలిండర్ కారణమా? లేదా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగంతోనే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. -
తల్లి తీరు నచ్చక కొడుకు ఆత్మహత్య
నెన్నెల: తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ కొడుకు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (21) ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనిల్ తల్లి ఆవుడం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంగళి తిరుపతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై అనిల్ తండ్రి తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. ఈ విషయం తెలిసిన అనిల్ కూడా తల్లిని మందలించాడు. అంతేకాకుండా తిరుపతి ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. అయితే తిరుపతి వినకపోగా, అనిల్‌నే చంపుతానని బెదిరించాడు. తల్లి తీరు మారకపోవడం, తిరుపతి బెదిరింపులతో మనస్తాపం చెందిన అనిల్.. బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుని, మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. వారు అనిల్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువులు గురువారం అనిల్ మృతికి కారణమైన తిరుపతి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి ముందే ఆందోళన చేశారు. తిరుపతి అప్పటికే ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో తాళం బద్దలుకొట్టి సామాగ్రిని ధ్వంసం చేసి కిచెన్‌షెడ్‌కు నిప్పు పెట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, తిరుపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హామీ ఇవ్వడంతో అనిల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
AP: రూ.50 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం
సాక్షి, విజయవాడ: ఏసీబీ అధికారుల వలకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ చిక్కారు. రూ. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. రూ.25 లక్షల లంచం తీసుకొని బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన శ్రీనివాస్.. లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఏపీ ఏసీబీ చరిత్రలో రూ. 25 లక్షల లంచం తీసుకొని నేరుగా పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. -
లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్ల దుర్మరణం
జమ్ము కశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 15 మంది సిబ్బందికి గాయాలతో చికిత్స పొందుతున్నారు.మొత్తం 23 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బంకర్ వాహనం బసంత్‌గఢ్ నుంచి గురువారం ఉదయం తిరుగు పయనం అయ్యింది. అయితే.. 10.30గం. ప్రాంతంలో కాంద్వా వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించగా.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు కన్నుమూశారు. క్షతగాత్రులకు స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. సదరు వాహనం 187వ బెటాలియన్‌కు చెందిందిగా నిర్ధారించారు. ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారాయన. -
మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా..
మదనపల్లె రూరల్ : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి తనువు చాలించింది బీటెక్ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కారి్మకుడైన వెంకట సుధాకర్ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. -
అల్లూరి: కత్తులతో బెదిరించి ఉద్యోగిని కిడ్నాప్
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: దేవీపట్నం మండలంలో కిడ్నాప్ కలకలం రేగింది. సౌమ్య అనే మహిళను కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయారు. శరభవరం సచివాలయంలో ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు వాళ్లనూ బెదిరించి ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌమ్యను ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారు? అనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
హరిత నన్ను క్షమించు..
అనంతపురం: ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి’ అంటూ లేఖ రాసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి..వాటిని తీర్చేమార్గం కానరాక బ్యాంకు బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాలు..కర్నూలు నగరంలోని సీ క్యాంప్‌కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులో అటెండరుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అనంతపురంలో నివాసం ఉంటున్న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లారు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పారు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ ..అటెండర్ రవికుమార్ భార్యకు ఫోన్ చేశారు. బాత్రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడని, పిలిస్తే పలకడం లేదని, మీరు వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్రూం తలుపు పగులగొట్టారు. అప్పటికే బాత్రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకున్న రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు ఎస్.దీక్షిత, ఎస్.వీక్షిత ఉన్నారు.అప్పులే శాపంగా మారాయి..రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే... ‘హరిత క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక..వడ్డీలకు తిరిగి అప్పు చేసి అలా ఒకదానికి ఒకటి తోడయ్యాయి. కరణ్ నన్ను క్షమించరా.. నిన్ను మోసం చేశాను. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. హుస్సేన్.. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినైనా అప్పు అడుగుదామనుకుంటే నా పరిస్థితి బాగోలేదు. హుస్సేన్ నాకో హెల్ప్ చెయ్.. నా తర్వాత హరితకు బ్యాంకుకు సంబంధించి ఏదైనా సహాయం చేస్తావని నమ్ముతున్నాను. గుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరీష్ సారీ రా..నీవు చాలా సార్లు హెల్ప్ చేశావు. నా కోసం చీటీ కూడా ఎత్తేసి డబ్బిచ్చావు. నువ్వు చాలా చాలా హెల్ప్ చేసినా.. నేను నీకోసం ఏమీ చేయలేని పరిస్థితి. కిశోర్ ఇకనైనా లోన్ కట్టుకోరా.. చాలా సార్లు హెల్ప్ చేశాను. కానీ నువ్వు చాలా మోసం చేశావు. హరిత పిల్లలు జాగ్రత్త.. శ్రావణి పిల్లలు జాగ్రత్త..వదిన చిన్నారిని నువ్వే చూసుకో’ అని పేర్కొన్నారు. -
‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి షాక్ తిన్న.. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య మొత్తం 26కి చేరింది.కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. -
సన్నిహిత ఫొటోలతో ప్రియుడు బ్లాక్మెయిల్.. చివరికి..
భువనేశ్వర్: భువనేశ్వర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేంద్రపారా జిల్లాలొ ఇవాళ (బుధవారం) ఉదయం 20 ఏళ్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లో తీవ్రంగా కాలిన గాయాలతో మృతిచెందింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పెట్రోల్ పోసుకుని తానే నిప్పంటించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఆ యువతిని కొంతకాలంగా ఆమె ప్రియుడు వేధించడంతో పాటు ఇరువురు సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంతో వేధింపులు భరించలేక ఆ యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేస్తానని కూడా బెదిరించాడంటూ తండ్రి ఆరోపించాడు. ఆరు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని.. కేసు నమోదు చేయలేదని తండ్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని కేంద్ర పారా ఎస్పీ సిద్ధార్థ్ కటారియా తెలిపారు.కాగా, గత నెల జూలై 12న బాలాసోర్‌లోని ఎఫ్ఎం కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని క్యాంపస్‌లో తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె తన డిపార్ట్మెంట్ హెడ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయగా.. కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. -
మధుకి నరకం చూపించి మరీ..
భర్తలను భార్యలు కడతేర్చడం, భార్యలను భర్తలు హతమార్చడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కాళ్ల పారాణి ఆరకముందే ఈ తరహా నేరాలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది. అయితే.. వివాహం జరిగి ఐదు నెలలు తిరగకుండానే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కుటుంబం గురించి, ఆ వ్యక్తుల నేపథ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ ఘటనపై.. ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఘోరం జరిగింది. మధు సింగ్(32) అనే మహిళ వివాహమైన ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం నడపడమే ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని ఆ భర్త అంటుంటే.. లేదు ఆ భర్తే నరకం చూపించి మరీ చంపేశాడని ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భర్త వేధింపుల పర్వం గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. సింగపూర్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీలో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన అనురాగ్ సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుతో పరిచయం పెంచుకున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. లాంఛనాల కింద రూ.15 లక్షలు అనురాగ్ కుటుంబం డిమాండ్ చేసింది. అయితే మధు తండ్రి ఫతే బహదూర్ సింగ్ అంత ఇచ్చుకోలేమని తేల్చి చెప్పాడు. దీంతో అనురాగ్ కాస్త తగ్గి వివాహానికి అంగీకరించాడు. అయితే.. పెళ్లై నెల తిరగకముందే ఆ కట్నం కోసం మధుపై అనురాగ్ వేధింపులకు దిగాడు. ఆమెను చితకబాది పుట్టింటికి పంపించేశాడు. దీంతో చేసేది లేక ఆ తండ్రి అడిగినంత కట్నం ఇచ్చేశాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లిన అనురాగ్ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అందరితో సరదాగా ఉండే మధుకు ఆంక్షలు పెట్టాడు. పదే పదే ఆమె ఫోన్‌ను తనిఖీ చేస్తూ వచ్చాడు. దీంతో భర్త లేని టైంలోనే ఆమె ఇంట్లో వాళ్లతోనూ ఫోన్లలో మాట్లాడడం ప్రారంభించింది. ఈలోపు.. అకారణంగా మధును అనురాగ్ హింసించడం మొదలుపెట్టాడు. తనతో కలిసి మందు కొట్టాలని వేధించసాగాడు. చివరకు గర్భం దాల్చిన మధుకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై ఓ అడుగు ముందుకేసి తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. జులై 31వ తేదీన ఓ హోటల్లో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు కూడా. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అనురాగ్-మధు మధ్య జరిగింది. అయినా సరే మధు అవన్నీ ఓర్చుకుంది. ఈలోపు.. ఆగస్టు 3వ తేదీన ఇద్దరూ కారులో వెళ్తుండగా గొడవ జరిగింది. వర్షం కారణంగా గుంతలను తప్పించేందుకు ఆమె కారును రోడ్డు పక్కగా తీసుకెళ్లింది. అయితే అనురాగ్ మాత్రం మగవాళ్ల వైపు చూస్తూ నడుపుతోందంటూ కారులోనే మధును చితకబాదాడు. ఈ వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను, మధు వాయిస్ ఆడియో రికార్డింగులను పోలీసులకు సమర్పించారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనురాగ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై వరకట్ననిషేధ చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు అయ్యింది. ముందు వెనుక అనురాగ్ గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోకుండా తన కూతురినిచ్చి వివాహం చేసి గొంతుకోశానంటూ ఆ తండ్రి గుండెలు బాదుకోవడం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తోంది. -
పలమనేరులో మహిళ దారుణ హత్య!
చిత్తూరు జిల్లా: పట్టణ సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌హైవే పనులు సాగుతున్న ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం.. పట్టణ సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయానికి వెనుకవైపు ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటీవల ఆ గుంతల్లో వర్షపునీరు చేరింది. ఓ గుంతలో 30 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరసింహరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు. ఆపై మృతదేహాన్ని వెలికితీసి గమనించగా ముఖంపైన, శరీరంపై పలుచోట్ల రక్తగాయాలు కనిపించాయి. ఆ ప్రదేశానికి పైన గుంత ఒడ్డున ముళ్లపొదలపై మృతురాలి పాదరక్షలు, నైటీ, లోదుస్తులు కనిపించాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పోలికలున్న మహిళ కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో తచ్చాడుతూ ఉండేదని కొందరు చెబుతున్నారు. ఆమెకు మతి బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఘటన జరిగి మూడురోజులైంటుదని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద కేసుగా నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తామని చెప్పారు. -
‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’
పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు.. బీహార్‌లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్‌ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవల రాహుల్ కుమార్‌కు అదే కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్‌లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్‌ను కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రేమ్శంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్‌శంకర్ ఝానే. నా తండ్రి ప్రేమ్‌శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారుకాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితుడు శంకర్‌పై దాడికి దిగారు. రాహుల్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ జగన్నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను, అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. दरभंगा जिला के बेंता थाना क्षेत्र अंतर्गत DMCH में घटित घटना के संदर्भ में अद्यतन घटना का संक्षिप्त विवरण :-दिनांक - 05.08.25 को समय करीब 04:40 PM बजे सूचना मिली कि बेंता थाना क्षेत्र अंतर्गत एक छात्र की गोली मारकर हत्या कर दी गई है। sho and sdpo visited spot and enquired— Darbhanga Police (@DarbhangaPolice) August 5, 2025 -
Cable Bridge: బర్త్ డే రోజే..
హైదరాబాద్: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని హాస్టల్‌కు బైక్‌పై తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కేక్ కట్ చేసిన అరగంటకే యువకుడు మృత్యువాత పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముక్కురాళ్ల గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అనిల్ (23) అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ సమీపంలో ఉన్న మైండ్ మ్యాప్స్ వీఎఫ్ఎక్స్ స్టూడియోస్‌లో ఎడిటింగ్ పనిచేస్తుంటాడు. మంగళవారం పుట్టినరోజు కావడంతో అనిల్ తన స్నేహితులు జాన్‌పాల్, మహేష్ నాగరాజు, వెంకటేష్ భాను తదితరులతో కలిసి బైక్‌లపై సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి వెళ్లారు. తమతో పాటు తెచ్చుకున్న కేక్‌ను అనిల్ కట్ చేసిన అనంతరం స్నేహితులంతా అక్కడే సరదాగా గడిపి తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయలుదేరారు. ఈ క్రమంలో జాన్‌పాల్ బైక్ నడుపుతుండగా అనిల్ వెనుక కూర్చొన్నాడు. మిగతా స్నేహితులంతా ఎవరి బైక్‌లపై వారు అనుసరించారు. అనిల్ ఎక్కిన బైక్‌ను జాన్‌పాల్ అధిక వేగంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 ఫ్లైఓవర్ వైపు దూసుకెళ్తుండగా మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. దీంతో అనిల్ కిందపడగా కొద్ది దూరం వరకు రోడ్డుపై రాసుకుంటూ వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న జాన్‌పాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెనుక వస్తున్న స్నేహితులంతా తల పగిలి రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న అనిల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టినరోజు కావడంతో అంతకు ఆరు గంటల ముందే వీరు హాస్టల్లోనే మద్యం సేవించినట్లు పోలీసుల అదుపులో ఉన్న జాన్‌పాల్ వెల్లడించారు. జాన్‌పాల్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా మద్యం సేవించినట్లుగా నమోదైంది. అర్ధరాత్రి మద్యం మత్తులో అదుపుతప్పిన వేగంతో బైక్‌పై దూసుకెళ్తుండడంతో మలుపు వద్ద కంట్రోల్ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేబుల్ బ్రిడ్జి వద్ద నుంచి బయలుదేరే ముందు అనిల్ తన బర్త్ డే కేక్‌ను చేతిలో పట్టుకొని బైక్‌పై కూర్చోగా ఈ ప్రమాదంలో అనిల్ కిందపడ్డ తర్వాత కేక్ రోడ్డంతా చిందరవందరగా పడిపోయింది. బర్త్ డే రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల రోదనలకు అంతులేకుండాపోయింది. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రమాదానికి కారకుడైన జాన్‌పాల్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తచీర కొనివ్వలేదని ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, విద్యారి్థని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి వద్దంటే వినరా.. టెకీ ఆత్మహత్య
జె.పంగులూరు: ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలంలోని కొండమంజులూరు గ్రామంలో మంగళవారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. కొండమంజులూరు గ్రామానికి చెందిన బొప్పుడి శివయ్య కుమార్తె బొప్పుడి మానస (26) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇది ఆమెకు ఇష్టం లేదు. దీంతో మంగళవారం చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చేశారు. -
రూ.4.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న 847 కిలోల హైగ్రేడ్ (అత్యధిక నాణ్యత) గంజాయిని ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) టీమ్ స్వాదీనం చేసుకుంది. పట్టుబడిన గంజాయి విలువ రూ.4.2 కోట్లు ఉంటుందని ఈగల్ టీం డైరెక్టర్ సందీప్‌శాండిల్య తెలిపారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఉత్తర ప్రదేశ్‌కు భారీ మొత్తంలో గంజాయి సరఫరా చేస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం ఆర్ఎన్సీసీ (రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్), ఈగల్ టీమ్ శంషాబాద్ సమీపంలోని తొండపల్లి వద్ద అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అడ్డగించింది. సోదాలు చేయగా, పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. వాహనంలో ఉన్న మల్కన్‌గిరికి చెందిన ఖిలాధన, రాజేందర్ బజింగ్‌లను అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న రమేశ్ సుక్రి, జగదీశ్ కులదీప్, షిబో అలియాస్ షిబా, బసు, షఫీక్ అలియాస్ షఫీల కోసం గాలిస్తున్నారు. గంజాయిని సరిహద్దు దాటించడంలో ఆ ఇద్దరూ దిట్ట మల్కన్‌గిరికి చెందిన ఖిలాధన, రాజేందర్ బజింగ్లు గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో దిట్ట అని ఈగల్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య తెలిపారు. ఖిలాధన 2019లో 20 కిలోల గంజాయి రవాణా చేస్తూ ఏపీలోని డొంకరాయి వద్ద పోలీసులకు పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైలులో 4 నెలలు ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచి్చన తర్వాతా ఉత్తరప్రదేశ్‌కు ఈ ఏడాదిలో 350 కిలోలు, 500 కిలోలు, 600 కిలోల చొప్పున గంజాయి తరలించిన చరిత్ర ఉంది. పోలీసులకు చిక్కకుండా స్థానిక రోడ్ల మీదుగా దూర ప్రాంతాలకు డ్రైవింగ్ చేయడంలో నిపుణుడు. » మరో నిందితుడు రాజేందర్ బజింగ్ 2023లో 150 కిలోల గంజాయి రవాణా చేస్తూ ఏపీలోని నర్సీపట్నం పోలీసులకు చిక్కాడు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 10 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. గ్రామీణ ప్రత్యామ్నాయ రహదారుల గురించి లోతైన అవగాహన ఉంది. » పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేతలో కీలకంగా వ్యవహరించిన ఆర్ఎన్సీసీ ఖమ్మం బృందం డీఎస్పీ సీహెచ్ శ్రీధర్, ఇన్స్పెక్టర్ విజయ్, ఎస్సై రవిప్రసాద్, సైబరాబాద్ నార్కోటిక్స్ డీఎస్పీ హరీశ్చంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్లు రమేశ్‌రెడ్డి,రామునాయక్, సిబ్బందిని ఈగల్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య అభినందించారు. -
మద్యం తాగించి.. చెవిలో గడ్డి మందుపోసి
కరీంనగర్‌రూరల్: నిత్యం తనపై అనుమానంతో తాగొచ్చి కొడుతున్నాడని, ప్రియుడు, మరోవ్యక్తితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఈ ఘటన జూలై 29న కరీంనగర్ శివారులో చోటు చేసుకుంది. కేసును ఛేదించిన పోలీసులు మంగళవారం ఆ వివరాలు వెల్లడించారు. సీపీ గౌస్ ఆలం కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని సుభాశ్‌నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్ (45) జిల్లా గ్రంథాలయంలో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. జూలై 29న కరీంనగర్ శివారులోని రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్య రమాదేవిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమాదేవికి కిసాన్‌నగర్‌కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది. సంపత్ మద్యానికి బానిసై తరచూ కొడుతుండటంతో భర్తను హత్య చేసేందుకు రాజయ్యతోపాటు దూరపు బంధువు అయిన ఖాదర్గూడేనికి చెందిన కీసరి శ్రీనివాస్‌ను రమాదేవి సంప్రదించింది. ప్రణాళిక ప్రకారం రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్‌ను జూలై 29న బొమ్మకల్ ఫ్లై ఓవర్‌బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించారు. రమాదేవి ఆదేశాల మేరకు మద్యం మత్తులో ఉన్న సంపత్ చెవిలో రాజయ్య, శ్రీనివాస్ గడ్డిమందు పోసి హత్య చేశారు. అనంతరం సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు సంపత్ భార్యను విచారించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గుర్తించారు. నిందితులు కర్రె రాజయ్య, కీసరి శ్రీనివాస్, ఐలవేణి రమాదేవిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు టి.నరేశ్, లక్ష్మారెడ్డిని సీపీ అభినందించారు. -
డాక్టర్ నమ్రతా కస్టడీలో బయటపడ్డ సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీలో పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు. కస్టడీలో డాక్టర్ నమ్రతా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు ముందు ఉంచి నమ్రతాను విచారించిన పోలీసులు.. చైల్డ్ ట్రాఫికింగ్‌తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతాకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.కళ్యాణితో కలిసి ఏజెంట్లు సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు నిర్థారణ అయ్యింది. కస్టడీ విచారణలో భాగంగా ఏజెంట్ల నెట్‌వర్క్‌ను పోలీసులు గుర్తించారు. రేపటితో కళ్యాణి, ధనశ్రీ సంతోషి విచారణ ముగియనుంది. మరికాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరుపర్చనున్నారు.కాగా, సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు మరో డాక్టర్‌ను కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌కు వచ్చిన డాక్టర్ విజ్జు లతను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 15కు చేరింది. మరోపక్క డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందంటూ మరో ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.సరోగసీ కోసం హైదరాబాద్‌లోని సృష్టి సెంటర్‌ను ఆశ్రయించిన వారిని నమ్రత విశాఖపట్నంలోని బ్రాంచ్‌కు పంపేది. అక్కడ కీలకంగా వ్యహరించిన డాక్టర్ విజ్జు లత వారికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం తదితరాలు చేసేది. నమ్రత విచారణలో ఈ విషయం గుర్తించిన దర్యాప్తు అధికారులు విజ్జు లత కోసం గాలించారు. అయితే నమ్రత గ్యాంగ్ అరెస్టు విషయం తెలియడంతోనే ఆమెతోపాటు అనేక మంది ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నమ్రత చేతిలో మోసపోయిన మరో ఐదుగురు బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసుల్లోనే విజ్జు లతను అరెస్టు చేశారు. సరోగసీ పేరుతో ఒప్పందాలు చేసుకున్న నమ్రతకు రూ.11 లక్షలు, రూ.15 లక్షలు, రూ.13 లక్షలు చొప్పున ఆ ముగ్గురు, మరో జంట రూ. 20 లక్షలు చెల్లించినట్టు ఫిర్యాదు చేయగా, కేసులు నమోదు చేశారు. నమ్రతతో పాటు ఇతర నిందితులను ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై అరెస్టు చేయడంతో పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. రాజస్తాన్ మహిళ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఆపై ఇతర కేసుల్లో అరెస్టు, కస్టడీ ప్రక్రియలు చేపట్టనున్నారు.నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్‌తో కథ నడిపించారు.ఈ సూరి శ్రీమతి వయస్సు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆమెకు తెలియకుండానే నమ్రత ఈ పని చేసినట్టు గుర్తించిన గోపాలపురం పోలీసులు ఈ మేరకు వాంగ్మూలాలు నమోదు చేశారు. నమ్రతకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏజెంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి ద్వారానే మగ శిశువును గరిష్టంగా రూ.4.5 లక్షలు, ఆడ శిశువును గరిష్టంగా రూ.3.5 లక్షలకు ఖరీదు చేస్తోందని, వారిని సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఏజెంట్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్
శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది.నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై ఎస్సై రమేశ్‌బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
స్నాప్‌చాట్‌లో పరిచయం.. ప్రేమపేరుతో సహజీవనం
హైదరాబాద్ : యువకుడిపై పోక్సో కేసు నమోదైన సంగటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిన వివరాల ప్రకారం.. మేడిపల్లి కి చెందిన బాలిక(17)ను చిన్నతనంలోనే తన అక్కకు, బావకు పిల్లలు లేకపోవడంతో బాలికను దత్తత ఇచ్చారు. అప్పటినుంచి బాలిక వారితోనే మేడిపల్లిలో పెరిగింది.పెంపుడు తల్లి సంవత్సరం క్రితం జబ్బుపడి మరణించగా అప్పటినుంచి బాలిక చదువు మానేసి తండ్రితోనే ఉంటోంది. ఈ సందర్బంగా బాలికకు ఒక సంవత్సర కాలంగా స్నాప్‌చాట్ అనే యాప్‌లో అలియాబాద్‌కు చెందిన యువకుడు పరిగి రవితేజ్(23)తో పరిచయం ఏర్పడింది. కాగా బాలిక తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అదునుగా చేసుకుని ప్రేమ పేరుచెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకుని గత రెండునెలలుగా బాలిక ఇంట్లోనే సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక కన్నతల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. తల్లి పిర్యాదుమేరకు నిందితుడిపై పోక్సోకేసును నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి తెలిపారు. -
ధర్మస్థళ కేసు: అదే సస్పెన్స్.. తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ!
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్‌తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.జీపీఆర్ టెక్నాలజీతో..2003 సమయంలో కోల్‌కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్‌ను కోరుతున్నారు.జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే.. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్‌పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా.. జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి. తప్పుకున్న జడ్జిజులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఐటీఆర్‌తో గుట్టురట్టుధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
'నాన్న' అని పిలవలేం ..! పాపం అంజలి, అవినాష్..
నాన్న అంటే త్యాగం, బాధ్యత. వాటిని పక్కనపెట్టి తన సౌఖ్యం చూసుకుంటే కుటుంబం ఏవిధంగా చిన్నాభిన్నమవుతుందో అనేందుకు ఉదాహారణే ఈ ఘటన. తండ్రి కుటుంబానికి ప్రధాన ఆధారం అదే గాడి తప్పితే..దాన్ని బేసి చేసికుని ఉన్నవన్ని తునాతునకలేపోతాయి. తండ్రి స్థానం ఎంత బాధ్యతయుతమైనదో..అది దారితప్పితే ఫలితం తట్టుకోవడం అనితరసాధ్యమైనది. ఎంత ప్రయత్నించిన సరిద్దుకోలేని విధంగా ఉంటుంది. 'నాన్న' అని పిలుపుకి దూరమయ్యేలా వ్యధ మిగులుతుంది.ఈ విషాదకర ఘటన ఘజియాబాద్‌లోని గోవింద్పురంలో చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అవినాష్ అతడి సోదరి అంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు 22 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్ కుటుంబ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేని తండ్రి కారణంగా ఆ పిల్లల పడ్డ బాధ కళ్లకు కట్టినట్లు కనిపించింది. అంతేగాదు తమ మరణానికి కన్న తండ్రి, సవతి తల్లి రీతులే కారణమని పేర్కొంది సూసైడ్ నోట్లో. ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్లు గత గురువారం చనిపోగా, వారి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులకు చెప్పారు కుటుంబసభ్యులు. అయితే అనుమానస్పద కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితుల ఇంటిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా, డైరీలో రాసిన 26 పేజిల అంజలి సూసైడ్నటి బయటపడింది. అందులో అంజలి తన వ్యథను వివరించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తన సవతి తల్లి రీతు, తండ్రి సుఖ్వీర్ సింగ్ తమను ఎంతగానో మానసింగా వేధిస్తున్నట్లు తెలిపింది. తన తండ్రి రెండో వివాహం కోసం కన్న పిల్లల గొంతు నొక్కేశాడని, వారిని తన అవసరాలకు వాడుకున్నాడని ఆరోపించింది. అలాగే సవతి తెలివితేలు ముందు సుఖ్వీర్ సింగ్ వివరణ పూర్తిగా నిజాయితీ లేనిదని ఆరోగపించింది. ఆయన తన సవతితల్లినే నమ్ముతాడని కూడా ఫిర్యాదు చేసింది. తన సవతి తల్లి రీతూ తన గురించి తప్పుగా మాట్లాడి అవమానించినట్లు పేర్కొంది. ఆ మాటలను తన తండ్రి ఖండించను లేదు, పైగా తననే తప్పు పట్టడం తట్టుకోలేకపోయానని వాపోయింది. తన సవతి తల్లి నీడలో 16 ఏళ్లు తాను తన సోదరుడు ఎంత నరకయాతన అనుభవించామో చెప్పుకొచ్చింది. తన డైరీలో రాసిన సూసైడ్ నోట్‌ని చింపివేయొద్దని తను ఒంటరిగా చనిపోతే పలు ప్రశ్నలు లెవనెత్తాతారని వేడుకుంది. తన సవతి తల్లి తెలివితేటలు గురించి తెలుసునని అందుకే ముందు జాగ్రత్తగా దీన్ని ఫోటో తీసి వాట్సాప్‌లో చాలామందికి పంపినట్లు తెలిపింది. ఇక తమ మృతదేహాలను తన తండ్రి తాకడానికి వీలు లేదని తన స్నేహితుడు మహీనే తమ అంత్యక్రియలు చేయాలని కూడా చెప్పింది. పైగా తన ఖాతాలో డబ్బు కూడా తీసుకోమని, మిగిలిన డబ్బుని తన కుటుంబసభ్యులకు ఇవ్వమని పేర్కొంది. తన స్నేహితుడు మహీనే తనను అర్థం చేసుకున్నాడని, అందకుగాను తాను ఇస్తున్న చిన్న మొత్తం ఇది అని లేఖలో తెలిపింది. అలాగే ఆ లేఖలో తన మేనమామలు, దేవేంద్ర, అనిల్‌లను ఉద్దేశిస్తూ.. ఇప్పటి వరకు మా బాగోగులు గురించి కనీసం వాకబు కూడా చేయలేదు, మీరు బంధువులేనా అని ప్రశ్నించింది. తన అన్నయ్య, తాను చాలా మానసిక ఒత్తడిలో ఉన్నాం..ఇక భరించలేక ఈ పనికి ఒడిగట్టాం అని లేఖలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ఆ మృతుల తల్లి కమలేష్ కూడా ఇలానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆమె చనిపోయిన ఆరు నెలలకే తన స్నేహితురాలిని పెళ్లిచేసుకున్నాడంటూ బావమరిది సుఖ్వీర్సింగ్పై ఫిర్యాదు చేశారు అంజలి మేనమామలు. ఇక బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్, తన భార్య తాను ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నామని, అదంతా ఎవరికోసం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన పిల్లల మరణంతో చచ్చిన శవంగా అయిపోయానంటూ విలపించాడు. తన కూతురు అంజలి ఇలా తన పరువు తీసేలా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో తనకు తెలియదని చెబుతున్నాడు బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్. ఇక మృతులు అవినాష్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారి కాగా, అంజలి నోయిడాలోని ఎగుమతి సంస్థలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నట్లు మేనమామ దేవేంద్ర వెల్లడించారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై మరింత కూలంకషంగా దర్యాప్తు చేయడమేగాక దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (చదవండి: భారత్ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్..! రష్యన్ మహిళ పోస్ట్ వైరల్) -
నవ వధువు, శ్రీ చైతన్య లెక్చరర్ ఆత్మహత్య.. కారణం అదేనా?
సాక్షి, కృష్ణా: కుటుంబ కలహాల కారణంగా నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివాహం జరిగిన ఐదు నెలలకే తమ బిడ్డ చనిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్యతో అరుణ్ కుమార్ వివాహం జరిగింది. ఐదు నెలల క్రితమే ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. శ్రీవిద్య(24) ఉయ్యూరులోని శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అరుణ్ కుమార్ కలాపాములు గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా ఉన్నారు. అయితే, వీరికి వివాహం జరిగిన నాటి నుంచే అత్తరింట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆమె.. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. ఇక, వివాహం జరిగిన ఐదు నెలలకే ఇలా తమ కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు.. కన్నీటి పర్యంతమవుతున్నారు. -
బీఈడీ స్టూడెంట్ కేసు.. ఏబీవీపీ నేత అరెస్ట్
ఒడిశా బీఈడీ స్టూడెంట్ బలవన్మరణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్, వేధింపులకు పాల్పడిన హెచ్‌వోడీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒకరు ఏబీవీపీ నేత ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఫ్యాకల్టీ వేధింపులు తాళలేక ఒడిశాలో 20 ఏళ్ల బీఈడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని కాలేజీ ఆవరణలోనే నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. జులై 13వ తేదీన జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 90 శాతం కాలిన గాయాలతో రెండు రోజుల తర్వాత ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో.. వేధింపులకు పాల్పడ్డ ఫ్యాకల్టీ సమీర్ రంజన్ సాహోతో పాటు ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఏబీవీపీ లీడర్ సుభాత్ సందీప్ నాయక్ కూడా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు బలవనర్మణానికి పాల్పడే సమయంలో సందీప్ నాయక్ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు అయ్యాయన్నది తెలియరావాల్సి ఉంది.తన కోరికె తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ సమీర్ రంజన్ సాహో సదరు విద్యార్థిపై బెదిరింపులకు దిగాడు. లైంగిక వేధింపులను ఆమె కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా అతనిపై చర్యలేవీ తీసుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. పైగా.. తనకు చావే గతంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే ఘటన జరిగిన రోజు.. ప్రిన్సిపాల్‌ను కలిసిన కాసేపటికే ఆమె ఒంటికి నిప్పటించుకుందని పోలీసులు చెబుతున్నారు. హెచ్‌వోడీపై ఫిర్యాదు నేపథ్యంతో ఆరోజు ప్రిన్సిపాల్ గదిలో సమావేశం జరిగింది. సమీర్‌పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారని, కొంతమంది విద్యార్థులతో సదరు విద్యార్థిపై ఆ హెచ్‌వోడీ తప్పుడు ప్రచారం చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. తాజా అరెస్టుల నేపథ్యంలో దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
భర్త స్నేహితుడితో భార్య వివాహేతర సంబంధం.. కుటుంబ సభ్యుల ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కారణంగా.. నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మహిళ, ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో మనోహర్ లోధీ, ద్రౌపది భార్యభర్తలు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, మనోహర్ బాల్య స్నేహితుడైన సురేంద్రతో ద్రౌపదికి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఒక రోజు.. తన తల్లిని సురేంద్రతో అభ్యంతరకర స్థితిలో చూసిన కూతురు శివాని, ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. అనంతరం, ద్రౌపదిని ఈ సంబంధం ముగించాలని భర్త సహా కుటుంబం కోరింది. అయితే, తాను మాత్రం సురేంద్ర లేకుండా జీవించలేనని ద్రౌపతి కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పింది. తనపై ఒత్తిడి తీసుకువస్తే, వరకట్న వేధింపులు కేసు పెడతాను అంటూ వారినే బెదిరించింది. దీంతో, ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాకయ్యారు.ఆమె ప్రవర్తనతో విసుగు చెందిన భర్త మనోహర్.. తన భార్యతో సంబంధం పెట్టుకోవద్దని స్నేహితుడు సురేంద్రను అభ్యర్థించారు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో ఉద్రిక్తతలు, గొడవలు జరిగాయి. ద్రౌపది ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో.. కలత చెందిన కుటుంబ సభ్యులు.. ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మనోహర్ భార్య ద్రౌపదిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య
సామర్లకోట: వివాహిత, ఇద్దరు బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కథనం మేరకు.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో ములపర్తి ధనుప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. ధనుప్రసాద్ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు.ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపులు తెరవలేదు. ఏసీ పని చేస్తూనే ఉంది. దీంతో, అతడు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే అతడి భార్య మాధురి (30), కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన (6) చనిపోయి ఉన్నారు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు కృష్ణభగవాన్, శ్రీనివాస్, తదితరులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి, ఆధారాలు సేకరించారు. హతురాలు మాధురి తల నుజ్జునుజ్జయ్యింది. తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తుఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ధనుప్రసాద్ ఇంటి వెనుక తలుపు నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వద్ద ఉండాల్సిన 2 ఉంగరాలు, 2 సెల్ ఫోన్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ధనుప్రసాద్ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్వైజర్ చెప్పారని సమాచారం. ఈ హత్యలు వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. -
లారీ బీభత్సం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి సాయి కుమార్(22) హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా, సాయికుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం భువనగిరి పట్టణంలోని సంతోషనగర్లో నిశ్చితార్థం వేడుకకు బంధువులతో కలిసి వచ్చారు. నిశ్చితార్థం జరుగుతున్న క్రమంలో స్వీట్స్ కోసం రామకృష్ణ, సాయికుమార్ ఇద్దరూ కారులో పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాకు బయలుదేరారు. కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి షాపు దగ్గరకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీ ఉత్తరప్రదేశ్ నుంచి జగదేవ్‌పూర్ రోడ్డు మార్గం నుంచి చెన్నైకు వెళ్తున్న లారీ వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న పాదచారులు, ద్విచకవ్రాహనదారులను ఢీకొట్టింది. దీంతో అక్కడే నిలబడి ఉన్న రామకృష్ణ మృతి చెందగా, సాయికుమార్‌తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీమారి శివసాయికుమార్, లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సాయికుమార్‌తో పాటు శివకుమార్‌ను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయికుమార్ మృతి చెందాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతుడు రామకృష్ణకు భార్య ఇద్దరు కుమార్తెలు, సాయికుమార్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ధ్వంసమైన షాపులు, బైకులులారీ వేగంగా దూసుకురావడంతో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, పాన్ షాప్‌లు, అక్కడే ఉన్న మూడు బైకులు ధ్వంసమయ్యాయి. మృతుడు లారీ, గోడ మధ్యన ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఇష్టపడిన వ్యక్తిపై కక్షగట్టిన భగ్నప్రేమికురాలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని వివిధ సంస్థలకు 22 బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన కేసులో నిందితురాలు రినే జోషిదా ఆద్యంతం చాలా తెలివిగా వ్యవహరించింది. తాను ఇష్టపడిన వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకోవడంతో కక్షగట్టిన రినే అతడి పేరునే వినియోగించింది. డార్క్ వెబ్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సహాయంతో తన ఆచూకీ బయటపడకుండా ఐదు నెలల పాటు పోలీసులను పరుగులు పెట్టించిన రినే.. ఆమెకు తెలియకుండా జరిగిన వైఫై కనెక్టివిటీతో చిక్కింది. ఇటీవల అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఈమెను శంషాబాద్ అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి శనివారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్య.. ఎమ్మెన్సీ ఉద్యోగం.. చెన్నైకి చెందిన రినే జోషిదా తొలుత ఇంజినీరింగ్, ఆపై రోబోటిక్స్‌లో అడ్వాన్డ్స్ కోర్సు చేసింది. ఈమె ప్రతిభకు మెచ్చిన మల్టీ నేషనల్ కంపెనీ (ఎమ్మెన్సీ) డెలాయిట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా తమ సంస్థలో ఉద్యోగం ఇచి్చంది. ఆ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేసిన రినే తన సహోద్యోగి దివిజ్ ప్రభాకర్‌ను ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె అందమైన జీవితాన్ని ఊహించుకుంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఈమె ప్రేమను తిరస్కరించిన ప్రభాకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో అతడిపై కక్షకట్టిన రినే కటకటాల పాలు చేయడం ద్వారా భార్య నుంచి విడగొట్టాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడం కోసం పక్కా పథకం ప్రకారం కథ నడిపింది. ప్రభాకర్ పేరుతో మెయిల్ ఐడీలు.. తొలుత రినే తన ల్యాప్‌టాప్ నుంచి డార్క్వెబ్ను యాక్సస్ చేసింది. దాని ద్వారానే తన వివరాలు పొందపరచకుండా ప్రభాకర్ పేరు, వివరాలతో ఈ–మెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. వీపీఎన్ ద్వారా ఇంటర్నెట్ను యాక్సస్ చేసే రినే.. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలు, కార్పొరేట్ స్కూళ్లు, ఆస్పత్రులకు 22 బెదిరింపు మెయిల్స్ పంపింది. ఒక ప్రాంతానికి పంపిన మెయిల్లో మరో ప్రాంతంలో ఓ నేరం జరిగినట్లు, దాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడానికే బాంబు పెట్టినట్లు రాసింది. అహ్మదాబాద్‌కు పంపిన ఓ ఈ–మెయిల్లో ‘2023లో హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్లో బాలికపై అత్యాచారం చేసిన రేపిస్ట్ విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడానికి మీ స్కూల్లో బాంబు పేల్చబోతున్నారు’ అంటూ ప్రస్తావించింది. వీటిలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు మెయిల్ కూడా ఉంది. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న ఆయా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రమాదం తర్వాత తీవ్రంగా పరిగణించి.. ఇలా రినే తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, హరియాణా, గుజరాత్‌ల్లోని వివిధ సంస్థలకు మెయిల్స్ పంపినా ఆమె ఆచూకీ పోలీసులకు చిక్కలేదు. పోలీసులు ప్రభాకర్‌ను అనుమానితుగా భావించడం, విచారణ అనంతరం వదిలేయడం జరిగాయి. అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆ మర్నాడు అదే కాలేజీకి పాక్ ఉగ్రవాదుల పేరుతో మెయిల్ పంపిన రినే మరోసారి విధ్వంసం తప్పదని హెచ్చరించింది. దీంతో రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. అప్పటి వరకు 12 రాష్ట్రాలకు వచి్చన 22 ఈ–మెయిల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అధ్యయనం చేసింది. ఆ పొరపాటుతో ఆమె ఆటలకు చెక్... ఈ ఏడాది ఏప్రిల్‌లో అహ్మదాబాద్‌లోని ఓ స్కూల్‌కు రినే ఇలానే బెదిరింపు మెయిల్ పంపింది. ప్రతి సందర్భంలోనూ డార్క్‌వెబ్ ద్వారా, వీపీఎన్ నెట్వర్క్ వాడటంతో ఆమె వివరాలు పోలీసులకు చిక్కలేదు. ఆయా సందర్భాల్లో వైఫై ఆఫ్ చేసి ఉండే రినే.. మొబైల్ డేటా ద్వారానే హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకుని, వీపీఎన్‌ను యాక్టివేట్ చేసింది. అయితే ఏప్రిల్‌లో మెయిల్ పంపుతున్న సందర్భంలో పొరపాటున రినే ల్యాప్‌టాప్ ఆమె నివసిస్తున్న వైఫైకి కనెక్ట్ అయింది. దీంతో ఆ మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ రికార్డుల్లో నమోదైంది. ఈ వివరాలను సాంకేతికంగా సేకరించిన గుజరాత్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా రినే ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు లోకేషన్ సంగ్రహించారు. గత వారం చెన్నైలోని ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. -
భర్తను కడతేర్చిన భార్య.. పోలీసులే షాకయ్యేలా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
దిస్పూర్: ముందు గుండెపోటన్నారు. ఆ తర్వాత దొంగతనమన్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులు కంగుతిన్నారు. చివరకు తమ్ముడొచ్చి తన అన్నది సహజ మరణం కాదని, హత్య జరిగిందనే ఆధారాలు బయటపెట్టడంతో అస్సాం వ్యాపారవేత్త హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఉత్తమ్ గోగోయ్ హత్య కేసులో అయన భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె, ఇద్దరు మైనర్ యువకులు అరెస్టు అయ్యారు.అస్సాంలోని లాహన్ గావ్ ప్రాంతంలో 38 ఏళ్ల వ్యాపారవేత్త ఉత్తమ్ గొగోయ్ అలియాస్ శంకై తన నివాసంలో మృతదేహంగా కనిపించిన కేసులో అతని భార్య, మైనర్ కుమార్తెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు దీబ్రుగఢ్ జిల్లా సీనియర్ ఎస్పీ వీవి రాకేశ్ రెడ్డి తెలిపారు. గొగోయ్ కుమార్తె 9వ తరగతి విద్యార్థిని. తండ్రి హత్యలో తన పాత్ర ఉన్నదని నేరం అంగీకరించిందని చెప్పారు. మరో సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. గొగొయ్‌ను హత్య చేసేందుకు అతని భార్య,కుమార్తె గతంలో పలు మార్లు ప్రయత్నించారు. తాజాగా, అతని ప్రాణాలు తీశారు. ఈ ఘటన వెనుక అసలు మోటీవ్ ఏమిటన్నది ఇంకా దర్యాప్తులో ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హత్య చేయడానికి ఇద్దరు మైనర్ కాంట్రాక్ట్ కిల్లర్లకు భార్య, కుమార్తె కలిసి లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.గొగొయ్ హత్య జూలై 25 ఉదయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే కుటుంబ సభ్యులు గుండెపోటుతో గొగోయ్ మరణించాడని పేర్కొన్నారు. కానీ, మృతదేహంపై గాయాలు ఉందని మృతుని సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. గొగోయ్ సోదరుడు మాట్లాడుతూ.. ఉదయం 8:30 ప్రాంతంలో ఇంటికి వెళ్లాను. అప్పటికే ఉత్తమ్ చనిపోయి ఉన్నాడు. చెవిపై గాయాలున్నాయి. మొదట దొంగతనంగా భావించాం. గుండెపోటుతో మరణిస్తే ఈ గాయాలు ఎలా వస్తాయి? ఇది ముందుగా పథకం వేసిన హత్యే. దోషులకు కఠిన శిక్ష వేయాలి" అని చెప్పారు.ఈ అరెస్టుల నేపథ్యంలో బర్బరూ ప్రాంతంలో ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం చేయాలని, హత్యకేసులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చేవెళ్లలో కలకలం.. ఫాంహౌస్‌లో ఐటీ ఉద్యోగుల డ్రగ్స్ పార్టీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరీన్ ఆచార్జ్ ఫాంహౌస్‌లో బర్త్‌డే వేడుకలు పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో హంగామా చేస్తుండగా.. ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. బర్త్‌డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫాంహౌస్‌ను బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫాంహౌస్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారంతో ఫాంహౌస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. ఐటీ ఉద్యోగుల నుంచి రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లగ్జరీ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్‌ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
ఏకాంత సేవలో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఉన్న సమయంలో సదరు మహిళ భర్త వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం, కుటుంబ సభ్యులు, స్థానికులు వారిద్దరినీ స్థంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం నాయకుని తండాలో వివాహిత, రమేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ గమనించిన సదరు మహిళ భర్త.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం, సదరు భర్త స్థానికుల సాయంతో.. విద్యుత్ స్తంభానికి కట్టేసి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఒడిశా బాలిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్
భువనేశ్వర్: 70 శాతం కాలిన గాయాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన ఒడిశా బాలిక నిన్న(శనివారం, ఆగస్టు 2వ తేదీ) మృతిచెందింది. గత నెల 19 వ తేదీన కాలిన గాయాలతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్లోచికిత్స అందించిన ఆ బాలికను ఆపై ఎయిర లిఫ్ట్ చేసి ఢిల్లీ ఎయిమ్స్‌కు మార్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి ఆపై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారని తొలుత భావించిన పోలీసులు.. ఇప్పుడు మాట మార్చారు. ఇందులో ఎవరు ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఈ కేసు విచారణ తుది దశకు వచ్చిందని ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇది సున్నితమైన అంశమని, లేనిపోని కామెంట్లు చేసి ఇరకాటంలో పడొద్దని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఆ బాలిక ఘటన అనంతరం ఒడిశాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యంలో ఈ కేసు రాజకీయ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ స్పందించారు. ఆ యువతిని కాపాడటానికి తీవ్ర ప్రయత్నం చేశామని, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా బ్రతికించలేకపోయామని సీఎం మాఝీ తెలిపారు ఇదొక దురదృష్టకర ఘటన అని ఆయన పేర్కొన్నారు. అంటించలేదు.. అంటించుకుంది..!తన కూతురు మృతిపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘ నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మానసిక స్థితి బాలేని కారణంగానే ఆమె ఇలా చేసింది. నా కూతుర్ని కాపాడటానికి ఒడిశా ప్రభుత్వం చాలానే చేసింది.. ఫలితం లేకుండా ప్యోఇంది. దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. అదే నా కూతురి ఆత్మకు శాంతి చేకూర్చినట్లు అవుతుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఎత్తున ఆందోళనజూలై 19 వ తేదీన ఆ బాలిక 70 శాతం గాయాల బారిన పడింది. దీనిపై ఆ సమయంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం దీనిపై ఆందోళన చేపట్టారు. ఒడిశాలో బాలికలపై ఈ తరహా దాడులు అధికమవుతున్నా పట్టించుకునే వారే లేరంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.ఒడిశాలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు కూడా రోడ్లపైకి రావడంతో ప్రతిపక్షాలకు బలం చేకూరునట్లయ్యింది. అయితే ఆ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు, ఆమె తండ్రి చెప్పడంతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. బాలిక వాంగ్మూలం రికార్డు చేశారు..ఆమెను ఆస్పత్రిలో చేర్చిన క్రమంలోనే వాంగ్మూలం కూడా తీసుకున్నారు పోలీసులు. దానిలో భాగంగానే ముగ్గురు యువకుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఆ బాలిక మృతి చెందిన రోజు వ్యవధిలోనే ఇందులో ఎవరి ప్రమేయ లేదని తేల్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బావ సాయంతో భర్తను కడతేర్చిన భార్య.. ఏడాది తర్వాత..
న్యూఢిల్లీ: భర్తను తన బంధువు(బావ) సాయంతో అత్యంత పాశవికంగా హత్యచేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఢిల్లీలోని అలీపూర్ నివాసి సోనియా (34), సోనిపట్‌కు చెందిన రోహిత్(28)గా గుర్తించామని, ఈ కేసులో మరో కీలక నిందితుడు విజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) హర్ష్ ఇండోరా మీడియాకు తెలిపారు.మృతుడు ప్రీతమ్ ప్రకాష్ (42) అలీపూర్కు చెందిన చరిత్రకారుడు. 2024, జూలై 5న ప్రీతమ్ ప్రకాష్ సోనిపట్‌లోని గన్నౌర్లో సోదరి ఇంటిలో ఉంటున్న సోనియాను తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే ఏదో విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రీతమ్ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్తపై ఆగ్రహంతో ఉన్న సోనియా తన బంధువు(బావ) విజయ్‌కి రూ. 50 వేలు ఇచ్చి, భర్తను హత్యచేయాలని కోరింది. ఇంతలో ప్రీతమ్ ప్రకాష్ తిరిగి వచ్చి, సోనియాను ఇంటికి రమ్మని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రీతమ్ ప్రకాష్ టెర్రస్‌పై పడుకున్నాడు. ఇదే సమయంలో విజయ్ అతనిని హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహాన్ని ఒక పథకం ప్రకారం అగ్వాన్పూర్ సమీపంలోని కాలువలో పడేశాడు.జూలై 20న, సోనియా తన భర్త అదృశ్యమైనట్లు ఆలీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాది తర్వాత ప్రీతమ్ ప్రకాష్ ఉపయోగించిన ఫోన్ యాక్టివ్ మోడ్‌లోకి రావడాన్ని పోలీసులు గుర్తించారు. సోనిపట్‌లోని రోహిత్ ఆ ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నించగా, అతను తొలుత దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించాడు. అయితే ఆ తరువాత నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అలాగే తనకు సోనియాతో సంబంధం ఉన్నదని, సోనియా, విజయ్‌లు ప్రీతమ్‌ను చంపడానికి కుట్ర పన్నారని రోహిత్ పోలీసులకు తెలిపాడు. భర్తను హత్యచేసేందుకు సోనియా.. విజయ్‌కు డబ్బులు ఇచ్చిందన్నాడు.ప్రీతమ్ ప్రకాష్ హత్య తరువాత సోనియా అతని ఫోన్‌ను రోహిత్‌కు ఇచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా సోనియాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె ప్రీతమ్‌ను ప్రేమించి, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. అనంతరం వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే ఇదే సమయంలో సోనియా, రోహిత్‌లు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కాగా రోహిత్‌పై గతంలో హత్య, ఆయుధాలు కలిగి ఉండటం తదితర నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రీతమ్ ప్రకాష్‌ను హత్యచేసిన విజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని,అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ ఇండోరా తెలిపారు. -
ప్రజ్వల్‌కు జీవితఖైదు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌కు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్‌పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు. పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్‌హౌస్‌లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్‌ను అరెస్ట్చేయడం తెల్సిందే. కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యారి్థని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి. బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్ïÙట్ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు. బాధితురాలికి హ్యాట్సాఫ్: సీఐడీ చీఫ్ వ్యాఖ్య బనశంకరి: ఈ కేసులో ఎన్ని బెదిరింపులు ఎదురైనా బాధితురాలు ధైర్యంగా ఎదుర్కొన్నారని సీఐడీ అదనపు డీజీపీ బిజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘కేసు నమోదైన 16 నెలల్లో తీర్పు రావడం నిజంగా ప్రత్యేకం. లైంగిక వేధింపుల వీడియోలో ఉన్నది ప్రజ్వల్ అని కోర్టుకు నిరూపించడానికి సిట్ ఎంతో శ్రమించింది. నేర నిరూపణకు బాధితురాలి ధైర్యమే కారణం. ఆమెకు ఈ విషయంలో సీఐడీ నిజంగా ధన్యవాదాలు తెలుపుతోంది. ఈమె నిరుపేద కావడంతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాబల్యం కలిగిన వ్యక్తి కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు’’అని బిజయ్ అన్నారు. ఎప్పుడేం జరిగిందంటే? → 2024 ఏప్రిల్ 22: ప్రజ్వల్ రేప్ వీడియోలు వైరల్ → ఏప్రిల్ 25 : అశ్లీల వీడియోలపై దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి లేఖ → ఏప్రిల్ 26–27: జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ → ఏప్రిల్ 28 : ప్రజ్వల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు → ఏప్రిల్ 28 : అశ్లీల దృశ్యాలు కలిగిన పెన్‌డ్రైవ్ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం → ఏప్రిల్ 30: జేడీఎస్ పార్టీ నుంచి ప్రజ్వల్‌ను సస్పెండ్ చేస్తూ జేడీఎస్ నిర్ణయం → మే 1 : ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదు → మే 30: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ప్రజ్వల్ అరెస్టు → సెప్టెంబర్ 9 : 113 సాక్షులతో కూడిన 1,632 పేజీల రెండో చార్జ్ïÙట్ దాఖలు → నవంబర్ 11 : ప్రజ్వల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు → 2025 జూలై 18 : విచారణ పూర్తి చేసి జూలై 30న తీర్పు వెలువరిస్తామని చెప్పిన కోర్టు → జూలై 30: ఆగస్టు 1కి తీర్పు వాయిదా → ఆగస్టు 1: ప్రజ్వల్‌ను దోషిగా తేలి్చన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం → ఆగస్టు 2: ప్రజ్వల్‌కు జీవిత ఖైదు విధింపు -
ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లి..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆవుల దొంగతనం కలకలం రేపుతోంది. మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండిమెట్ రెండో బజార్లో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బండిమెట్ ప్రాంతంలో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇన్నోవా కారులో వెనుక భాగంలో వేసుకొని యువకులు పారిపోయారు.ఈ నెల 27 న రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకువెళ్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులను తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ యువకులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా మారేడుపల్లి పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.Shocking Incident of Cow Theft in #Bandimet Area Of #SecunderabadA disturbing case of cow theft has come to light in the Bandimet area, where a gang of youths allegedly stole cows by injecting them with anesthetics.According to eyewitnesses, the accused arrived in a luxury… pic.twitter.com/wfIa4EF6lA— BNN Channel (@Bavazir_network) August 2, 2025 -
ఆ భార్య బారి నుంచి దేవుడే రక్షించాడేమో!
ఆ జంటకు పెళ్లై 16 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంతూరిలో ఇల్లు ఉండి కూడా.. సిటీలోనే కాపురం పెట్టాలన్న ఆమె కోరికను తీర్చాడా భర్త. అయినా ఎందుకనో ఆమె భర్తపై చంపేయాలన్నంత కసి పెంచుకుంది. భర్త హత్యకు గుండాలకు సుపారీ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో.. భర్త బతికిపోగా, ఆమె ప్లాన్ బయటపడింది.భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య ఉదంతంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని ఓ ఆస్పత్రిలో రాజీవ్ పని చేస్తున్నాడు. జులై 21వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అతనిపై గుంపుగా వచ్చిన 11 మంది దాడి చేసి చితకబాదారు. అతని కాళ్లు, చేతులు విరగొట్టి కార్లలో సీబీ గంజ్ ఏరియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కనీసం సాయం కోసం అరవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు రాజీవ్. అక్కడే సజీవంగా పాతేయాలని గొయ్యి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు ఆ గుండాలు. ఇంతలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. ఆ బ్యాచ్‌ను చూసి గట్టి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. కంగారుపడిపోయిన ఆ దుండగులు రాజీవ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆపై ఆంబులెన్స్‌కు కాల్ చేసిన ఆ అపరిచితుడు.. రాజీవ్‌ను ఆస్పత్రిలో చేర్పించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజీవ్.. కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు. బహుశా.. దేవుడే ఆ ఆజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి తనను రక్షించి ఉంటాడని కన్నీటి పర్యంతం అవుతున్నాడు రాజీవ్.రాజీవ్ తండ్రి ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాడి చేసిన 11 మందిలో రాజీవ్ సొంత బావమర్దులే ఐదుగురు ఉండడం విశేషం. రాజీవ్ భార్య సాధన ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. గత కొంతకాలంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే ఆమె భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలియాల్సి ఉంది. స్థానికులు ఆ భార్యభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధన, ఆమె సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదీ చదవండి: కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!ఇదీ చదవండి: పడక సుఖం ఇవ్వని భర్తను ఆ భార్య ఏం చేసిందంటే.. -
పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తారా?
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్‌కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్‌కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్‌కు వచ్చిన అనిల్‌ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థళలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానని (Mass Burial Case) ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. అతడు చూపించినట్లు 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 6వ పాయింట్లో మానవ అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడిందని భావించారంతా. ధర్మస్థళ(Dharmasthala) కేసులో ఇవాళ ఐదో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావళి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో.. 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ ఐదు స్పాట్లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ ప్రత్యక్ష సాక్షిని అధికారులు విచారిస్తారని సమాచారం. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం గురువారం(జులై 31వ తేదీ) ఆరో పాయింట్లో ఓ చోట కొన్ని అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అయితే ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. అయితే.. ఆరో పాయింట్ తప్ప.. ఇప్పటిదాకా అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. అవి వరదలతో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో మానవ కంకాళాలు(ఎముకలు) కొట్టుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. అటవీ ప్రాంతంలోని మిగతా పాయింట్ల మీద దృష్టి సారించారు. పైగా ఈ ప్రాంతాల్లోనే సామూహికంగా తాను శవాలను పాతిపెట్టానని అతను చెబుతున్నట్లు కర్ణాటకకు చెందిన కొన్ని వార్తా చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ కథనాలు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఐదు ప్రాంతాలు ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ధర్మస్థళ.. ఉష్ గప్‌చుప్!జనాలు రాకుండా.. గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని(మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని) వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు. గుంతలు తవ్వేందుకు 20 మంది కార్మికులు, బుల్డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికం, మంగళూరు కేఎంసీ వైద్యులు, ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రవతీ నది ఒడ్డున సిట్ తవ్వకాలు జరుపుతుండడంతో జనం ఆ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే.. ఏంటీ మిస్టరీ కేసు..దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక (Karnataka) ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు(62).. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్‌కు ఇటీవల ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం క్లుప్తంగా.. ‘‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా. 1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’’2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అతనికి రక్షణ కల్పించారు. మరోవైపు.. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థళ పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు ఆ వ్యక్తి లేఖలో పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.వందల మంది మిస్సింగ్?దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో.. ధర్మస్థళ, బెళ్తంగడి, ఉజిరె పీఎస్‌ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థి(20)ని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందినవారు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బాధితురాలి తల్లి సుజాత భట్ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: ధర్మస్థళ కేసు.. పురుషుల మృతదేహాలు కూడా?!మీడియాకు ఊరటధర్మస్థళలో ఏం జరుగుతోందంటూ.. గత కొన్నిరోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు పెద్దలు ధర్మస్థళ పేరును చెడగొడుతున్నారంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సామూహిక ఖననాలకు సంబంధించిన వేలకొద్దీ కథనాల లింకులను తొలగించాలని, అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు సూచిస్తూ న్యాయస్థానం గాగ్ ఆర్డర్‌ను ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆ గాగ్ ఆర్డర్‌ను కొట్టేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. -
వర్కవుట్లు చేస్తుండగా ఆగిన గుండె
హఠాన్మరణాల గణాంకాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. చిన్న వయసులో గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి వర్కౌట్ చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోగా.. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణేలోని పింప్రీ-చిన్చ్వడ్‌లో మిలింద్ కులకర్ణి అనే వ్యక్తి వర్కౌట్ అనంతరం నీరు తాగుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది జిమ్‌లోని CCTV కెమెరాలో రికార్డైంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. గుండెపోటు కారణంగా కులకర్ణి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. కులకర్ణి భార్య వైద్యురాలు. గత ఆరు నెలలుగా అతను జిమ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పర్యవేక్షణతో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిమ్‌లో ఆకస్మిక మరణాల కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే.. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM).. ఇది వంశపారంపర్యంగా వచ్చే గుండె కండరాల లావుదల, వ్యాయామ సమయంలో గుండె చలనం ఆగిపోయే ప్రమాదం ఉంది. కార్డియాక్ అరెస్ట్.. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండటం వల్ల గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అలాగే.. తిన్నాక వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఒత్తిడి వచ్చి ప్రమాదం కలగొచ్చు. ఇంతేకాదు.. స్టెరాయిడ్ వినియోగం.. కొంతమంది స్టెరాయిడ్లు(అనధికారిక) వాడటం వల్ల గుండె కండరాలు అధిక ఒత్తిడికి గురై, వ్యాయామ సమయంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం గండె సంబంధిత సమస్యలే కాదు.. వర్కౌట్లు చేసే సమయంలో బ్రెయిన్ ఎటాక్ (aneurysm rupture) వల్ల కూడా మరణాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్థితిలో మెదడులో రక్తనాళాలు పగిలి మరణించే అవకాశం ఉంటంది. జిమ్.. జాగ్రత్తలుజిమ్లకు వెళ్లేవాళ్లు.. వెళ్లాలనుకుంటున్నవాళ్లు.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదికుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉంటే, మరింత జాగ్రత్త అవసరం.ఆహారం తర్వాత తక్షణం వ్యాయామం చేయకూడదు.అనధికారిక స్టెరాయిడ్లు, అధిక బరువులు ఎత్తడం వంటి చర్యలు నివారించాలి. #Maharashtra #Pune के पिंपरी चिंचवड में जिम में वर्कआउट के दौरान एक शख्स को आया हार्ट अटैक; अस्पताल पहुंचने से पहले हुई मौत..पूरी घटना CCTV में कैद..37 साल के शख्स की हुई मौत..@TNNavbharat @PCcityPolice pic.twitter.com/X7Nun52YpZ— Atul singh (@atuljmd123) August 2, 2025 -
వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురు!
నాగ్‌పూర్: ఆమె వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురి అవతారం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుని లక్షల్లో దోచేసింది. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పోలీసుల్ని సైతం షాక్ గురి చేసింది. గత 15 ఏళ్లలో భర్తలను మారుస్తూ ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా ధనం గుంజేసింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీరా ఫాతిమా అనే మహిళ తన నెక్స్ టార్గెట్ తొమ్మిదో వరుడు కోసం అన్వేషిస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‘పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. వారి వద్ద నుంచి ఎంత దొరికితే అంత దోచేస్తుంది. ఇదొక ముఠాగా ఏర్పడి చేస్తున్న పని. ఆమె వృత్తి రీత్యా టీచర్. బాగా చదువుకుంది. కానీ డబ్బు ఆశతో ఇలా పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడుతోంది. ధనవంతుల్నే టార్గెట్‌గా ఎంచుకుంటుంది. అందులోనూ ముస్లిం కమ్యూనిటీలోని వారినే పెళ్లిళ్లు చేసుకుంటుంది. ఆమె చేసుకున్న ఒక భర్త నుంచి రూ. 50 లక్షలకు పైగా దోచేసింది. ఇంకొకరి నుంచి రూ. 15 లక్షలను దోపిడీ చేసింది. ఇలా మరొకర్ని మోసం చేస్తూ పోతోంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. ఇందుకోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా తదితర మార్గాల ద్వారా వరుల కోసం అన్వేషిస్తుంది. వారికి కట్టుకథలు చెబుతూ బురిడీ కొట్టించి వలలోకి దింపుతోంది.’ అని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
యువతిని మోసం చేసిన కేసు.. టీడీపీ నేత తనయుడి అరెస్ట్
కృష్ణాజిల్లా: యువతిని మోసం చేసేన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని మోసం చేసి పెళ్లికి మొహం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజులుగా దీనిపై హైడ్రామా నడిపారు జిల్లా టీడీపీ పెద్దలు. రాజీ కుదిర్చే యత్నం చేసి అభివన్‌ను తండ్రి పల్లపాటి సుబ్రహ్మణ్యంను కాపాడేయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రలు.. తమ కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావడంతో అభినవ్‌ను అరెస్టు చేసిన చిలకలపూడి పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అభినవ్‌కు 14 రోజులు రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి.. -
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్
బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(35)కు భారీ షాక్ తగిలింది. పని మనిషిపై లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ నేతను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.హాసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో 2021 COVID లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్లో వీడియో తీసి విషయం బయటకు చెప్పనీయకుండా బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అదే సమయంలో..ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ ఆరోపణలను ప్రజ్వల్ పేరెంట్స్ ఖండించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగగా.. బెయిల్ కోసం ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. ఇదీ చదవండి: ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ??ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు. CID-SIT దర్యాప్తులో DNA, ఫోరెన్సిక్, 26 మంది సాక్షుల వాంగ్మూలాలు, 2,000 పేజీల చార్జ్‌షీట్ సమర్పించారు. ఈ కేసులో 26 మంది సాక్షులను కోర్టు విచారించి.. దోషిగా ప్రకటించింది.#BreakingA Special court in Bengaluru has convicted Janata Dal (Secular) leader and former MP Prajwal Revanna, in the first rape case registered against him at the Holenarasipura Rural Police Station of Hassan District. #PrajwalRevanna #Rape pic.twitter.com/fnzxJUp2Sc— Live Law (@LiveLawIndia) August 1, 2025ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ?ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్‌లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్లో లోపాల కారణంగా(రూ.24 కోట్ల లెక్కను చూపించకపోవడం) కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్ ఆయన్ని సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కుఅశ్లీల వీడియోల కలకలంపని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్‌పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్‌లోని ఫామ్‌హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్‌పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది. ఇందులో స్వయంగా ప్రజ్వల్ చాలావరకు వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాల్లో దర్యాప్తు అధికారులు పేర్కొనడం గమనార్హం.ఇదీ చదవండి: అసహజ లైంగిక దాడి కేసులో పటుత్వ పరీక్షలు -
‘ఎవరిని పెళ్లి చేసుకున్నా చంపేస్తా..’
సాక్షి, సనత్‌నగర్: ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని చంపేస్తానంటూ ఓ యువతిని బెదిరించిన ఆమె మాజీ ప్రియుడి బెదిరించిన ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు అతడిపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్ ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన యువతికి రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో, పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే రవికుమార్ కొన్నాళ్లుగా ఆమెను వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా ఇరువురూ మళ్లీ కలవబోమని అంగీకరించారు.ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్.. వరుడికి ఫోన్ చేసి ఆమె గురించి చెడుగా చెప్పాడు. అంతేకాకుండా బాధితురాలికి ఫోన్ చేసి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అతడిని చెంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగాల్లో బంగ్లాదేశీ నటి, మోడల్ అరెస్ట్.. కారణం ఇదే..
కోల్‌కతా: దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్ శాంతా పాల్(28)ను పశ్చిమ బెంగాల్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. శాంతా పాల్‌ను బంగ్లాదేశ్‌లోని బారిసల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే, ఆమె.. నకిలీ ఆధార్ కార్డులతో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. బంగ్లాదేశీ మోడల్ శాంతా పాల్ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించింది. దీంతో రంగంలోకి దిగిన బెంగాల్ పోలీసులు.. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె వద్ద వేర్వేరు అడ్రస్‌లతో రెండు నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఆమె పేరుపై బంగ్లాదేశీ పాస్‌పోర్టులు చాలా ఉన్నట్లు బయటకు వచ్చాయి. వాటన్నింటిని సీజ్ చేశారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన రెజెంట్ ఎయిర్వేస్లో ఉద్యోగిగా పేర్కొంటా ఆమె పేరుతో ఉన్న ఐడీ కార్డును, ఢాకాలో సెకండరీ విద్య అభ్యసిస్టున్నట్లు జారీచేసిన అడ్మిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా కోల్‌కతా జాయింట్ కమిషనర్ (క్రైమ్) రూపేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆమె 2024 చివరి నుంచి అక్కడ ఉంటుందని తెలిపారు. ఓ వ్యక్తితో కలిసి అక్కడి వచ్చిందని చెప్పారు. భారత్‌లో ఉండటానికి చెల్లుబాటు అయ్యే వీసాను చూపించలేదని వెల్లడించారు. కోల్‌కతా, బుద్వాన్ అడ్రస్‌లతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఎలా పొందిందనే విషయమై ఆమెనుప ప్రశ్నిస్తున్నామన్నారు. అయితే విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులు ఎలా ఇచ్చారనే విషయమై యూఏడీఏఐకి, ఓటరు, రేషన్ కార్డుల విషయమై ఎన్నికల కమిషన్, బెంగాల్ ఆహార మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్టు తెలిపారు.మరోవైపు, విశ్వసనీయ సమాచారం మేరకు శాంతా పాల్ బంగ్లాదేశ్‌లో పలు సినిమాల్లో నటించినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా టీవీ చానల్స్, పలు కార్యక్రమాలకు యాంకర్‌గా, పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.Shanta Pal, 28, Bangladeshi model, arrested in Kolkata on July 31 for staying illegally with fake Aadhaar, voter & ration cards. Lacked valid visa. Police custody till Aug 8.Source: India TodayFollow @theGreenLine_#FakeID #IllegalStay #Kolkata pic.twitter.com/h0p5WbZmjk— The Green Line (@theGreenLine_) July 31, 2025 -
హైదరాబాద్ పబ్‌లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్‌కు చెందిన సచిన్‌దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్‌లకు వెళ్లే అతడికి కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌యాదవ్‌తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్‌దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్‌ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్‌లో పబ్‌కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్‌యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్‌ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్‌ను తాను బైక్‌పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్‌కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్‌ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్‌ను అత్తాపూర్‌లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్‌పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్‌కుమార్‌యాదవ్ గతంలో అదే పబ్‌లో బౌన్సర్‌గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్‌కు మకాం మార్చి అంబర్‌పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్‌ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్‌యాదవ్, పవన్‌కుమార్‌యాదవ్‌తో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్‌నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్‌లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులు
సాక్షి టాస్క్‌పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్‌లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్‌కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు. -
వాటిని తెరిస్తే తంటాలే..!
సోంపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి వారం రోజుల కిందట ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్. ఏపీకే అనే లింకు వాట్సాప్ ద్వారా వచ్చింది. దీంతో క్లిక్ చేసి అన్ని లాంఛనాలు పూర్తి చేసి లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక ఓటీపీ అడగడం, ఓటీపీ ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తన ఫోన్ సిమ్ పనిచేయకపోవడం.. కొన్ని గంటల్లోనే తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవ్వడం చకచకా జరిగిపోయాయి. దాదాపు రూ.7లక్షలు పోయినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. కాశీబుగ్గకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఇదే లింకుపై క్లిక్ చేశాడు. అంతే పై మాదిరిగానే సైబర్ కేటుగాళ్లు రూ.10 లక్షలకు పైగా తన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును లాగేసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే.. శ్రీకాకుళం జిల్లాను దాదాపు నెల రోజులుగా వణికిస్తున్న లింకు ఇది. బండిపై ఎంత చలానా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే గత 20 రోజుల్లో దాదాపు 12 కేసులు దీనిపైనే నమోదయ్యాయి. పైగా దీని బాధితులంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం. మోసపోతున్నారిలా.. » ముందుగా ‘ఆర్టీఓ టిఆర్ఏఎఫ్ఎఫ్ఐసి సిహెచ్ఏఎల్ఎల్ఏఎన్.ఎపికె’ ఫైల్ మెసేజ్ లింక్ రూపంలో వస్తుంది. » మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని వస్తుంది. అయ్యాక వెంటనే ఓటీపీ అడుగుతుంది. » ఓటీపీ ఎంటర్ చేశామా ఇక అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల మెసేజ్ ఇన్‌బాక్స్‌లో మన ఫోన్ నంబర్ చేరుతుంది. » వెంటనే మన ఫోన్ నంబర్ ఉన్న సిమ్‌ను అదే నంబర్‌తో ఎలక్ట్రానిక్ సిమ్గా మార్చుతారు. » మన ఫోన్‌పై ఉన్న స్క్రీన్ వారి ఆ«దీనంలోకి వెళ్లిపోతుంది. » మన ఫోన్ పనిచేయక తికమక పడుతున్న ఆ క్షణాల్లోనే సిమ్ అప్డేట్ అవ్వాలంటే మన మెయిల్ అడ్రస్ యాడ్ చేయాలని అందులో వస్తుంది. » మనం మెయిల్ అడ్రస్ యాడ్ చేసిన వెంటనే సిమ్ ఛేంజెస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఐదు, పదినిమిషాల్లో ఓ క్యూఆర్‌కోడ్ రావడం.. మన ఫోన్ నంబర్‌తో ఉన్న సిమ్‌కార్డు సైబర్ నేరస్తుడి మొబైల్ నుంచి యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. » వెంటనే సైబర్ నేరగాడు ఎమ్.ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి మన ఫోన్ నంబరే కావడంతో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసి బయోయెట్రిక్ లాక్ చేసేస్తాడు. దాంతో మనం సిమ్ కొనాలని షాపులకు వెళ్లినా.. ఆధార్ అవసరంతో బ్యాంకు, రిజి్రస్టేషన్, ఇతర ఏ పనుల్లో మనం బయెమెట్రిక్కు థంబ్ వేయాలని అనుకున్నా అది లాక్ చేయడంతో కుదరదు. ఇక మనకు సిమ్ దొరకదు. » ఈ లోగా సైబర్ నేరగాడు మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌తో ఇంటర్నెట్ త్రూ డెబిట్ కార్డ్ లోన్స్, లోన్ యాప్స్, పేయింగ్ యాప్స్ (ఫ్లిప్‌కా ర్ట్, అమెజాన్, మీషో, పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే) తదితర మార్గాల్లో వస్తువులు కొనేయ డం,డబ్బులు మాయంచేసి మన బ్యాంకు ఖాతా లను కొల్లగొట్టేయడమే కాక రూ.లక్షల్లో లోన్లు వాడేసి మనకు రుణ భారాన్ని మిగుల్చుతారు. » ఇదే తరహాలో సోంపేట ఉపాధ్యాయునికి జరగడం, చాలా రోజుల వరకు తన నంబర్ ఉన్న సిమ్ రాకపోవడంతో తన వేలి ముద్రలు పనిచేయడం లేదని పాత (మాన్యువల్) పద్ధతిలోనే సిమ్‌ను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి మోసాలు అత్యధికంగా కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురంలోనే జరిగాయని, చేసే సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులకే బురిడీసైబర్ మోసాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసుల్ని సైతం ఇదే తరహా లింక్‌తో సైబర్‌కేటుగాళ్లు మోసం చేశారు. జిల్లాలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్ఐలకు ఈ అనుభవం ఎదురైంది. జేబులు కూడా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గానే తీసుకుంది.ఎం.పరివాహన్ యాప్‌లోనే కట్టాలి.. వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆదీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్‌స్టేషన్‌లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్‌లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్‌లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్ -
ఇంజినీ‘రింగ్ రింగ’
తెనాలిరూరల్: ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి అమ్మకాల్లో భాగస్తులై కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల వరుసగా గంజాయి కేసుల్లో స్టూడెంట్లు అరెస్టు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గురువారం గంజాయి అమ్ముతున్న, తాగుతున్న 13 మందిని గుంటూరు జిల్లా కొల్లిపర, తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 5.2 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హం. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం మాల డొంక ప్రాంతంలో కొల్లిపరకు చెందిన మల్లోల శోభన్ బాబు, పాముల రుషిబాబు, మండ్రురాజ్ కుమార్, ఆరే ఆదిత్య, అమిరే ఆనంద్ కిషోర్ గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోకూరి శ్రీను, కాజా గ్రామానికి చెందిన కారంకి నిఖిల్‌కుమార్, అత్తోటకు చెందిన యర్రు శశికుమార్, దాసరి చేతన్, రేపల్లెకు చెందిన కొసరాజు రోహిత్, కుంచవరానికి చెందిన గరిక గోపినాథ్, మేడా ప్రవీణ్, విశాఖపట్నంకు చెందిన కొచ్చర్ల సత్యసాయి చక్రవర్తి గంజాయి తాగుతున్నారని డీఎస్పీ వివరించారు. ఈ ముఠా విశాఖ జిల్లా పాడేరుకు చెందిన పరమేశ్వరన్ వద్ద గంజాయిని చౌకగా కొని తెనాలి పరిసర ప్రాంతాలలో 20 గ్రాములు రూ.500 చొప్పున అమ్ముతున్నట్టు తేలిందని వెల్లడించారు. నిందితులలో 9 మందిపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇటీవలే 21 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేశామని, ఇప్పుడు మరో 13 మంది గంజాయి కేసులో అరెస్టు అయ్యారని డీఎస్పీ వివరించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి విక్రేతలు పదిమందిపై పీడీ యాక్టు ప్రయోగించబోతున్నామని పేర్కొన్నారు. నిందితుల్లో ఇంజినీరింగ్ స్టూడెంట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోందని, తల్లిదండ్రులు విద్యార్థులను కనిపెడుతుండాలని, లేకుంటే వారి జీవితాలు నాశనం అవుతాయని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర ఎస్ఐ పి.కోటేశ్వరరావు, తెనాలి రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడేళ్ల చిన్నారిపై సామూహిక లైంగిక దాడి
మహబూబ్ నగర్ జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జడ్చర్లలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జడ్చర్లలోని 167 నంబర్ జాతీయ రహదారిని ఆనుకునిఉన్న ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నాడు. మూడు రోజుల క్రితం (ఆదివారం) పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, మరో నలుగురు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. అత్యాచారం జరిగిన తరువాత చిన్నారితో సహా అందరూ ఏమీ తెలియనట్లు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆరోజు నుంచి బాలికకు కడుపునొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురికావడంతో బుధవారం సాయంత్రం చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్ పరిశీలించి లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని విచారించగా.. తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో తన సొంత అన్న, స్నేహితులు కలిసి తనకు తెలియకుండానే ఏదో చేశారని చిన్నారి పోలీసుల ముందు అమాయకంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి పంపారు. మైనర్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసుల వేధింపులతో.. కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్. చిన్నబాలయ్య (45) స్థల వివాదం విషయంలో పోలీసుల వేధింపులు తాళలేక మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా కోర్టు ఆవరణలోనే ఆయన ఈ అఘాయిత్యానికి యత్నించడంతో ఆయన్ను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. అక్కడ న్యాయమూర్తి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం.. కడప వన్‌టౌన్ పోలీసులు బాధితుడు, అతని బంధువుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థలాల ఆక్రమణకు పోలీసుల యత్నం.. అతడి సోదరులు ఏసన్న, బాలయ్య మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో 2007లో సుగుమంచిపల్లె ఆర్ అండ్ ఆర్‌లో ఒకొక్కరికి ఐదుసెంట్ల చొప్పున ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచి్చందన్నారు. తమ సోదరుడు చిన్నబాలయ్యకు ఇచ్చిన స్థలాన్ని, ఇంకా కొందరి స్థలాలను ఆక్రమించుకునేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా.. హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జునరెడ్డి.. కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవరెడ్డి, తుంగ జగదీశ్వర్‌రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాలగంగిరెడ్డి వేధిస్తున్నారని.. వీరికి తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరాముడు వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తలమంచిపట్నం, తాళ్ల ప్రొద్దుటూరు, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లలో చిన్నబాలయ్యపై దొంగతనాల కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేయాలని తాము పోలీసులను కోరామన్నారు. అయితే, జడ్జి స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసి ఇస్తామని పోలీసులు తెలిపినట్లు బాధితుడి సోదరులు చెప్పారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచి్చబౌలి/మణికొండ: కుమార్తెలను స్కూల్ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, కొండముదుసుపాలెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్ వెళ్లగా వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు. కుమార్తెలను తీసుకొని శాలిని సోమవారం రాత్రి మణికొండకు వచ్చింది. భారతీయ విద్యాభవన్‌లో పెద్ద కుమార్తె సుదీక్ష 9వ తరగతి, చిన్న కుమార్తె సహస్ర 4వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉదయం స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్‌లో బస్సు ఎక్కించింది. ఉదయం 8.45 గంటలకు స్కూటీపై తిరిగి వస్తుండగా మణికొండలోని సుందర్ గార్డెన్ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టింది. కిందపడిపోయిన శాలిని తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా ట్యాంకర్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని మృతురాలి సోదరుడు లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.