breaking news
Jagtial
-
కోట బురుజు కనుమరుగుకు కుట్ర
కోరుట్లలో 3.21 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగి.. చాళుక్య రాజుల వైభవానికి సజీ వసాక్షంగా ఉన్న కోట బురుజు, కోనేరు స్థలా లను కొందరు అన్యాక్రాంతం చేసే కుట్ర చేస్తున్నారు. పాత జీవోలను రద్దు చేసి కోటబురుజు పరిధిని 15 మీటర్లకు కుదిస్తున్నారు. అత్యంత విలువైన కోట బురుజు స్థలాలను అక్రమార్కుల కబంధ హస్తాల నుంచి విడిపించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఆ ప్రదేశంలో ఆహ్లాదకరమైన పార్క్‌తోపాటు కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి ప్రజావసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. – అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు, కోరుట్ల -
ఇంటికి దారి చూపండి
కలెక్టరేట్లో ఇలా నేలపై పడుకున్న వ్యక్తి పేరు మర్రిపల్లి రాజగంగారం. లోకోమోటివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన ఈయన తను నిర్మించుకున్న ఇంటికి అడ్డుగా ఓ వ్యక్తి గోడ నిర్మించి ఇబ్బంది పెడుతున్నాడని గతంలో అధికారులకు ఫిర్యాదు చేయగా తొలగించారు. మళ్లీ గోడ నిర్మించి ఇబ్బంది పెడుతున్నాడని, తన ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని ఇలా నిరసన తెలిపాడు. ఎనిమిదేళ్లుగా ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవోల చుట్టూ తిరుగుతున్నా తన సమస్యను పట్టించుకోవడం లేదన్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు బాధితుడితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ● -
కళాశాల సమీపంలో హాస్టల్ పెట్టండి
జిల్లాకేంద్రంలోని మిషన్ కాంపౌండ్ వెనక అద్దె భవనంలో మా హాస్టల్ ఉంది. కళాశాలకు హాస్టల్ దూరం ఉండటంతో మధ్యాహ్న భోజనానికి వచ్చి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ మిషన్కాంపౌండ్ను ఆనుకుని ఉండటంతో పోకిరీల బెడద ఎక్కువగా ఉంది. పోకిరీలు హాస్టల్‌ల్లోకి వస్తూ విపరీత చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా మార్పులేదు. ఇలాంటి చికాకుతో చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతునానం. హాస్టల్ భవనాన్ని కళాశాల సమీపంలోకి మార్చండి. – ఇంటర్ బీసీ హాస్టల్ విద్యార్థులు -
‘వరద’ పారదు.. చెరువులు నిండవు
కథలాపూర్: తలాపున గోదావరి ఉన్నా పంటలకు నీరులేక ఇబ్బంది పడుతున్నారు ఎస్సారెస్పీ వరదకాలువ సమీపంలో ఉన్న గ్రామాల రైతులు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్‌తో వరదకాలువకు జలకళ వస్తుంది. కాలువకున్న తూములతో దిగువనున్న గ్రామాల చెరువులకు నీళ్లు చేరుతాయి. కానీ వరదకాలువకు ఎగువనున్న గ్రామాల చెరువులకు మాత్రం చుక్కనీరు చేరని పరిస్థితి. వరదకాలువకు ఎగువనున్న గ్రామాల చెరువులకు నీళ్లు ఎప్పుడు వస్తాయోనని కథలాపూర్ మండల రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరదకాలువ ప్రవహించే గ్రామాలివే.. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. సుమారు 84 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఎస్సారెస్పీ వరదకాలువ పెగ్గెర్ల, కథలాపూర్, దుంపేట, దూలూర్, తక్కళ్లపెల్లి వెళ్తుంది. వరదకాలువ నుంచి ఆయా గ్రామాల చెరువులను నింపేందుకు ఇప్పటికే తూములను అధికారులు నిర్మించారు. ఈ తూములు వరదకాలువకు దిగువ భాగాన ఉండటంతో కొన్ని గ్రామాల చెరువుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. ఈ క్రమంలో ఎగువన ఉన్న గ్రామాల చెరువులకు నీళ్లు చేరకపోవడంతో ఎత్తిపోతల ద్వారానే నీళ్లందిస్తామని అధికారులు సర్వే చేసి నెలలు గడుస్తున్నా పనులకు మోక్షం కలగలేదు. ఈ వానకాలం సీజన్లో పంటలకు నీళ్లందడం కష్టమేనని రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతలతో నీళ్లు నింపే చెరువులు వరదకాలువ ఎత్తిపోతలతో చెరువులను నింపేందుకు అధికారులు అప్పట్లో ప్రణాళిక రూపొందించారు. చింతకుంట లక్కాకుల చెరువు, భూషణరావుపేట తుమ్మల చెరువు, బొమ్మెన తుమ్మల చెరువు, బొమ్మెన ప్రాజెక్టు, తాండ్య్రాల ఊర చెరువు, గంభీర్పూర్ తాళ్ల చెరువు, కలిగోట సూరమ్మ చెరువును వరదకాలువ ఎత్తిపోతలతో నింపితే మండలంలోని అన్ని గ్రామాలకు సాగు నీరు అంది భూగర్భజలాలు పెరుగుతాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వరదకాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎగువనున్న గ్రామాల చెరువులను నింపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఎస్సారెస్పీ వరదకాలువ విభాగం ఏఈ పృథ్వీరాజ్ మాట్లాడుతూ... వరదకాలువ ఎత్తిపోతలతో చెరువులు నింపే పనులకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. వరదకాలువ నీటి కోసం ఎదురుచూపు పంటల సాగుపై అన్నదాతల అయోమయంజాప్యం సరికాదు మా భూములకు తుమ్మల చెరువు, రాళ్లవాగు ప్రాజెక్టు ప్రధానం. వర్షం కురిస్తేనే తుమ్మల చెరువు నిండుతుంది. ఊరికి కొద్దిదూరంలోనే వరదకాలువ ఉంది. ఈ సీజన్లో వర్షాలు సరిగా కురవడం లేదు. వరదకాలువ ఎత్తిపోతలతో చెరువులు నింపితే రైతులకు మేలు జరిగేది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులు నింపాలి. – గడ్డం రాజారెడ్డి, రైతు, భూషణరావుపేటతాండ్య్రాల చెరువు నింపాలి తాండ్య్రాల ఊర చెరువులో నీళ్లుంటే ఐదు గ్రామాల పరిధిలో భూగర్భజలాలు పెరుగుతాయి. పంటలకు భరోసాగా ఉంటుంది. ఈ వర్షకాలం వర్షాలు సరిగా కురవడం లేదు. చెరువులో నీళ్లు అడుగంటాయి. ఎత్తిపోతల పనులు చేపట్టాలి. వరదకాలువ ఎగువన ఉన్న గ్రామాల చెరువులు నింపేందుకు ప్రత్యేక దృష్టిసారించాలి. – బాల్క సంజీవ్, రైతు, తాండ్య్రాల -
విజిలెన్స్ విచారణ షురూ..
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో విజిలెన్స్ విచారణ షురూ అయ్యింది. సుమారు 18 మందితో కూడిన విజిలెన్స్ బృందం సోమవారం ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతీ విభాగంలో.. ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి రికార్డును రాసుకున్నారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ పర్మిషన్లు, నిర్మాణాలు, ఇతరత్రా విషయాలపై అత్యధిక ఫిర్యాదులు ఉండటంతో విజిలెన్స్ బృందం దాదాపు 18 భవనాలను పరిశీలించారు. అణువణునా కొలిచి రికార్డులు తయారు చేశారు. గతంలో ఎన్ని భవనాలకు అనుమతులు ఇచ్చారు..? ఏ ప్లానింగ్‌లో ఇచ్చారు..? ఎలా కట్టారు..? అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. విజిలెన్స్ అధికారులకు 2023లో 20 మందికి పైగా కౌన్సిలర్లు టౌన్‌ప్లానింగ్, బిల్డింగ్ అనుమతులు, నిర్మాణాలు, శానిటేషన్ విభాగంలో వాహనాలకు సంబంధించిన మరమ్మతు, వాహనాల మాయం, డీజిల్, ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించి.. అలాగే ఇంజినీరింగ్ సెక్షన్లో వాటర్చార్జీలు, టెండర్లకు సంబంధించి, రెవెన్యూ విభాగంలో ముటేషన్లు, అసెస్మెంట్ కాపీలపై అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించుకుని కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఉదయం పదిన్నరకే.. ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న విజిలెన్స్ అధికారుల బృందం ప్రతి విభాగంలో బృందాల చొప్పున తనిఖీ చేపట్టారు. గతంలో అనేకమంది పలు విభాగాలపై ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్ అధికారులకు మెయిల్ ద్వారా వివరాలు ఇవ్వాలని నివేదిక పెట్టా రు. మున్సిపల్ అధికారులు జవాబులు ఇచ్చి నప్పటికీ ఆశించిన మేరకు లేకపోవడంతో ఏకంగా విజి లెన్స్ అధికారు బృందం తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్, శానిటేష న్, రెవెన్యూ వి భాగాలపైనే దృష్టి సారించినట్లు తెలిసింది. అంతా అవినీతిమయం జగిత్యాల మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్‌గా నిలిచింది. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా ప్రజల సొమ్ము అత్యధికంగా దుర్వినియోగమవుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. టౌన్ ప్లానింగ్‌లో ఇంటి అనుమతులలో చేతివాటం, ఆర్వో సెక్షన్లో ముటేషన్లకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రతి విభాగంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆర్వో విభాగంలో అయితే ఓ భూకబ్జా యత్నంలో మున్సిపల్ కమిషనర్‌తోపాటు అధికారి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల మున్సిపల్ పాలన గాడితప్పిందని ఓ మాజీ కౌన్సిలర్ కలెక్టర్ లేఖ రాశారు. బల్దియాలో అవినీతిపరులుగా ఉన్న వారిని సైతం కీలక బాధ్యతలు అప్పగించడంపై పలు ఆరో పణలు వస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకో వాలని కోరారు. వేటు ఎవరిపైనో..? అవినీతి ఆరోపణలు అత్యధికంగా వెలువడం.. విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టడంతో వేటు ఎవరిపై పడుతుందోనని అక్రమాలకు పాల్పడిన ఆఫీసర్లలో వణుకు పుడుతోంది. 2023 నుంచి ఇప్పటి వరకు జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టి సారించడంతో అప్పట్లో పనిచేసిన అధికారులతో పాటు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ప్రజాప్రతిధుల హస్తం ఉండటంతో అధికారులు తలొగ్గి పనులు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి విభాగం రికార్డుల పరిశీలన భవన నిర్మాణాలూ తనిఖీ ఎవరిపై వేటు పడేనో..?శాఖల మార్పుతో సరి..బల్దియాలో అధికారులపై నేరుగా ఆరోపణలు వస్తున్నా శాఖల మార్పులు చేస్తున్నారే తప్ప చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇటీవల బిల్‌కలెక్టర్ ఏకంగా సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తిపన్నును సొంతానికి వాడుకోగా.. ఇటీవలే సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి. కొన్ని కీలక శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సైతం ఉండటంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
జగిత్యాల: గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గిరిజన తండా, హాస్టళ్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తండాలు, హాస్టళ్లలో చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, హాస్టళ్లలో తాగునీరు, డ్రైనేజీ, సీసీరోడ్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనాభివృద్ధి అధికారి రాజ్‌కుమార్, సంపత్ పాల్గొన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వారితో ఎస్పీ మాట్లాడారు. వారి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ధర్మపురిలో షాపింగ్ కాంప్లెక్స్ గదులకు వేలంధర్మపురి: ధర్మపురిలోని మార్కెట్రోడ్లో నిర్మించిన కాసుగంటి నారాయణరావు (కేఎన్ఆర్) షాపింగ్ కాంప్లెక్స్ గదులకు సీల్డు టెండర్లు, బహిరంగ వేలం వేయనున్నట్లు శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. కాంప్లెక్స్‌లోని గదులకు వచ్చేనెల ఒకటి నుంచి 2028 ఆగస్టు 31వరకు మూడేళ్ల కాల పరిమితితో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 5 నుంచి 18 వరకు ఆన్లైన్ టెండర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీల్డు టెండర్ దాఖలు చేయువారు ఈనెల 6 నుంచి 18 వరకు షెడ్యూల్ పొంది 19న ఆలయ కార్యాలయంలోని సీల్డు టెండర్ బాక్స్‌లో వేయాలని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ఈనెల 19న ఈఎండీ సెక్యూరిటీ డిపాజిట్, ప్రవేశ రుసుం డీడీలు చెల్లించి పాల్గొనాలని కోరారు. అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల ప్రతిభజగిత్యాల: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకేంద్రానికి విద్యార్థులు ప్రతిభ కనబర్చి రెండు బంగారు, కాంస్య పతకాలు సాధించారు. ఈనెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగిన జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–14 బాలికల విభాగంలో జష్ణవి బంగారు పతకం, పురుషుల విభాగంలో రాజు 400 మీటర్ల హార్డిల్స్‌లో బంగారు పతకం, అండర్–20 బాలికల విభాగంలో రష్మిక కాంస్య పతకం సాధించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ముత్తయ్యరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అంజయ్య, కోశాధికారి కొమురయ్య అభినందించారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీకోరుట్లరూరల్: కోరుట్ల మండలం అయిలాపూర్ పీఏసీఎస్‌లో సోమవారం పోలీసు బందోబస్తు మధ్య రైతులకు యూరియా పంపిణీ చేశారు. సొసైటీకి 20 టన్నుల యూరియా వచ్చింది. అప్పటికే రైతులు బారులు తీరడంతో ఉద్రిక్తత చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారి సిఫారసు మేరకు ఎకరానికి ఒక యూరియా బస్తా చొప్పున రైతులకు అందించినట్లు సింగిల్‌విండో చైర్మన్ చింతకుంట సాయిరెడ్డి తెలిపారు. -
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని1, 2, 5, 7, 48, 47 వార్డుల్లో రోడ్ల నిర్మాణ పనులను జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. జగిత్యాలకు అత్యధిక నిధులు తెచ్చామని, పట్టణ ప్రణాళిక మాస్టర్‌ప్లాన్‌కు కొందరు కావాలని అడ్డుపడ్డారని, అభివృద్ధికి ఆటంకం కల్పించారని తెలిపా రు. త్వరలోనే అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తానన్నారు. మోతె చెరువు పారిశుధ్యానికి ఎఫ్ ఎస్టీపీ మంజూరు చేశామన్నారు. కమిషనర్ స్పందన, ఏవో శ్రీనివాస్, డీఈ వరుణ్, ఏఈ చరణ్, మాజీ కౌన్సిలర్ కూసరి అనిల్‌కుమార్ పాల్గొన్నారు. పద్మశాలీ కార్యవర్గ సభ్యులకు అభినంధన రాయికల్: పట్టణ పద్మశాలీ సేవ సంఘం కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అభినందించారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు బోగ రాజేశం, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేశ్, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధర్, కోశాధికారి ఆడెపు నర్సయ్య, నాయకులు మోర రాంమూర్తి, చంద్రతేజ, కట్టెకోల భాస్కర్, దాసరి శ్రీనివాస్, తాటిపాముల విశ్వనాథం పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వండి
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఇటీవల కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పెద్ద ఎత్తున ప్రజావాణికి తరలివచ్చారు. వారితోపాటు జీవన్‌రెడ్డి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నూకపల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంతోపాటు ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి ఇందిరమ్మ కాలనీ నిర్మించిందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ 80 గజాల స్థలానికి ప ట్టాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. పేదలు ఇళ్ల పనులను కొద్దికొద్దిగా పూర్తి చేసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రెండువేల ఇళ్లను కూల్చి 4,520 డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించిందని, 1611 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా వాటి నిర్మాణానికి రూ.52కోట్లు అవసరం అవుతాయని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించా మని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల పేరిట వివిధ దశల్లో ఉన్న వందకు పైగా ఇందిరమ్మ ఇళ్లను బల్దియా అధికారులు కూల్చివేశారని తెలి పారు. ఇలా ఇళ్లు కోల్పోయిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలన్నారు. ఆయన వెంట టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, చంద రాదాకిషన్, రఘువీర్‌గౌడ్, గుండ మధు, లైశెట్టి విజయ్ ఉన్నారు. -
ఆలకించండి.. పరిష్కరించండి
● జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలుజగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. 43మంది బాధితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, జివాకర్, శ్రీనివాస్, డీఆర్డీవో రఘువరణ్, డీపీవో మదన్మోహన్ పాల్గొన్నారు. -
నృసింహునికి దేవాదాయ అదనపు కమిషనర్ పూజలు
పూజలు చేస్తున్న అదనపు కమిషనర్ దంపతులు ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామివారిని ఆదివారం దేవాదాయశాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులున్నారు. కథలాపూర్‌లో కేంద్ర బృందంవివరాలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం అధికారులు కథలాపూర్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025లో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించేందుకు కేంద్రబృందం అధికారులు ఆదివారం పర్యటించారు. పలు వాడల్లో పర్యటించి చెత్త సేకరణ, చెత్త తరలింపు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ఆరా తీశారు. కార్యక్రమంలో కేంద్ర బృందం అధికారులు రాజు, హరిణి, ఎంపీవో రాజశేఖర్, కార్యదర్శి సాయినాథ్, సత్తయ్య, ఇస్మాయిల్, అంగన్వాడీ టీచర్లు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 39.847 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీఎస్సారెస్పీ జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు తాగు, సాగునీరు అందించే ఎస్సారెస్పీ నీటిమట్టం ఆదివారం నాటికి 39.747 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8175 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి 774 క్యూసెక్కుల అవుట్ ఫ్లోగా ఉంది. కాకతీయ మెయిన్ కెనాల్‌కు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. రాయికల్‌లో వైద్య శిబిరంరాయికల్: పద్మశాలీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్, యువజన సంఘ పట్టణ అధ్యక్షుడు సామల్ల సతీశ్, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్, ఎలిగేటి సతీష్ సింగని సతీష్, కోశాధికారి బోమ్మకంటి నవీన్, సహాయ కార్యదర్శి చంద్ర తేజ,గంట్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు -
‘పత్తిపాక’కు అడుగులు
సాక్షి, పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కోసం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడినుంచి నేరుగా కాకతీయ కాలువలోకి పంపిస్తారు. రేవెల్లి సమీపంలోని హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఎస్సారెస్సీ డీ–83, డీ–86 కాలవలకు అందిస్తారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2.40లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాథమిక అంచనాలు సిద్ధం.. ప్రతిపాదిత ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ అధికారులతో కలిసి గతంలోనే పరిశీలించి సమీక్షించారు. రిజర్వాయర్ ఎంత సామర్థ్యంతో నిర్మించాలి..? ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతాయి..? ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఎన్ని..? తదితర అంశాలపై ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే 1,700 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాకు వచ్చారు. ఇందులో 400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉంటుంది. డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశం -
కాసుల కక్కుర్తి..!
● ఆర్టీఏ అధికారుల తీరు ● కనిపించిన వాహనం నుంచి చేతివాటం ● ఏడాపెడా వసూలు.. ఇవ్వకుంటేనే కేసులు కోరుట్ల: జూన్ 19న.. ఇబ్రహీంపట్నం నుంచి కోరుట్ల వైపు వస్తున్న మూడు వాహనాలను ఓ ఆర్టీఏ అధికారి ఆపాడు. అందులో ఓ టిప్పర్, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ మూడు వాహనాల పత్రాలు పరిశీలించి వాటిలో ఓ ట్రాక్టర్‌కు ఫిట్నెస్ లేదని, రూ.10వేలు ఇస్తే వదిలేస్తామన్నాడు. డ్రైవర్ వద్ద డబ్బుల్లేకపోవడంతో జరిమానా విధించారు. – జూలై 2న.. ఉదయం కోరుట్ల మండలం నాగులపేట వద్ద ఓ ఇసుక ట్రాక్టర్ ఆర్టీఏ అధికారులకు కనిపించింది. సదరు అధికారి కొంతదూరం ట్రాక్టర్‌ను తీసుకెళ్లి తరువాత వదిలేసినట్లు సమాచారం. ఏం జరిగిందని ఆరా తీస్తే.. సదరు ట్రాక్టర్ యజమాని రూ. 20వేలు ఇవ్వడంతో ఫైన్ రాయకుండా వదిలేశారట. ఇదీ.. వాహనాల స్థితిగతులను పరిశీలించి అవి సరైన రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన మోటార్ వెహికిల్ శాఖలో ఓ అధికారి తీరు. ప్రతిరోజూ జిల్లాలోని ఏదో ఓ ప్రాంతంలో పర్యటిస్తూ తనకాసుల వసూళ్ల దందాను యథేచ్ఛగా సాగించడం సదరు అధికారికి షరామాములుగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పత్రాలు లేకున్నా సరే సాధారణంగా టిప్పర్లు, ట్రాక్టర్లు, ప్రైవేటు బస్సులు, ఇతరత్రా వాహనాలకు రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్నెస్, ఇన్సురెన్స్, పొల్యూషన్, రోడ్‌టాక్స్, ఓవర్‌లోడ్ వంటి అంశాలతోపాటు ఇంజిన్ కండీషన్‌ను ఆర్టీఏ అధికారులు పరిశీలించాలి. ఫోర్‌వీల్ వాహనాలను తనిఖీలు చేయడం విధుల్లో ఓ భాగం. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ఓ ఆర్టీఏ అధికారి జిల్లాలో పర్యటిస్తూ తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో నిబంధనల ప్రకారం వాహనాలకు ధ్రువీకరణ పత్రాలు లేకుంటే జరిమానా విధించాలి. కానీ.. సదరు ఆర్టీఏ అధికారి కొన్ని సందర్బాల్లో వాహనాలను చెక్ చేసి ధ్రువీకరణ పత్రాలు లేని అంశాన్ని గుర్తించి జరిమానా వేయకుండా అమ్యామ్యాలు దండుకుని వాహనాలను వదిలేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. వదిలేస్తే ప్రమాదమే.. కాసులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో టిప్పర్లు, ట్రాక్టర్ల వంటి పెద్ద వాహనాల పత్రాలు, ఫిట్నెస్, ఇంజిన్ కండీషన్, ఇన్సూరెన్స్ వంటి అంశాలను ఆర్టీఏ అధికారులు పక్కన పెట్టడం ప్రమాదకరం. ఇన్సురెన్స్ లేకుంటే ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎవరైనా చనిపోయినా.. లేదా గాయపడిన వారికి బీమా చెల్లింపు సమయంలో నష్టం వాటిల్లుతుంది. ఫిట్నెస్ లేకుండా.. కాలం చెల్లిన వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు రోడ్లపై తిరుగుతుంటే పట్టుకుని జరిమానా వేయకుండా ‘సొంత లాభం’ చూసుకుంటే సర్కార్ ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఆర్టీఏ అధికారిని వివరణ కోరేందుకు యత్నించగా ఆయన ఫోన్ స్వీకరించలేదు. -
● సంఘం కల్యాణ మండపానికి రూ.20 లక్షలు ● ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: మున్నూరుకాపులతో తనకు విడదీయరాని బంధం ఉందని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేశ్, ప్రధానకార్యదర్శి కాశెట్టి మహేశ్, ఉపాధ్యక్షులు చల్ల రవి, ముత్తినేని లక్ష్మణ్, కోశాధికారి బుక్క మహేశ్ తదితరులను మంత్రి సన్మానించారు. జిల్లాలో అధికంగా మున్నూరుకాపులే ఉన్నారని తెలిపారు. పట్టణంలో సంఘం కల్యాణ మండపానికి రూ.20లక్షలు కేటాయిస్తానని, దశలవారీగా మరిన్ని నిధులు అందిస్తానని తెలిపారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాదినేని రాజేందర్ కల్యాణమండపానికి రూ.లక్ష అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సంగి నర్సయ్య, సంగి సత్తమ్మ, బండి మురళి, ఎస్.దినేష్, జక్కు రవీందర్, సంఘ సభ్యులున్నారు. -
పైకిరాని గంగమ్మ..
● వర్షాలు లేక పెరగని భూగర్భజలం ● ఆందోళనలో అన్నదాతలు ● గతేడాది జూలైతో పోల్చితే 0.65 మీటర్ల లోతుకు ● పంటలు కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు జగిత్యాలఅగ్రికల్చర్:జిల్లాలో గంగమ్మ ఇంకా పైకి రాలేదు. ఎండాకాలంలో సాధారణంగా లోతుకు పడిపోయిన భూగర్భజలం.. నీటిమట్టం వానాకాలంలో కురిసే వర్షాలకు పెరుగుతుంది. కానీ.. ఈ ఏడాది వానాకాలం సీజన్ సమీపించి రెండు నెలలు గడిచినా.. భూగర్భజలాలు ఇంకా పెరగకపోగా.. ఇంకా పడిపోతున్నాయి. లోతుకు చేరిన భూగర్భజలంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటే సాగు చేసిన పంటల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు మండలాల్లో కూడా.. జిల్లాలో ఆయకట్టు మండలాలు 14 ఉన్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఈ మండలాల్లోనూ భూగర్భ నీటిమట్టం పడిపోయింది. దీంతో ఆ యకట్టు రైతులకు ఆందోళన నెలకొంది. బీర్పూర్లో 1.34 మీటర్లు, బుగ్గారంలో 5.26, ధర్మపురిలో 3.30, ఎండపల్లిలో 9.44, గొల్లపల్లిలో 3.59, జగి త్యాల రూరల్‌లో 1.49, జగిత్యాల అర్భన్‌లో 7.45, పెగడపల్లిలో 2.75, రాయికల్‌లో 3.75, సారంగా పూర్లో 5.07, వెల్గటూర్‌లో 4.02, ఇబ్రహీంపట్నంలో 4.64, కోరుట్లలో 8.53, మల్లాపూర్‌లో 5.26 మీ టర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ము న్సిపాలిటీలుగా ఉన్న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, రాయికల్, మెట్పల్లి మండలాల్లో నీటి వినియోగం ఎక్కువ కావడంతో మరింత లోతుకు పడిపోతున్నాయి. మున్సిపాలిటీల దాహార్తిని తీర్చేందుకు ఎస్సారెస్పీ నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు 61 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఆ నీటిని తరలించకుంటే మున్సిపాలిటీలో మరింత లోతుకు భూగర్భజలాలు పడిపోయేవని అధికారులు చెబుతున్నారు. బోర్ల నుంచి నీరు రావడం లేదు భూగర్భజలాలు లోతుకు పడిపోయాయి. బోర్ల నుంచి ఇప్పుడే నీరు సరిగా రావడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. వర్షాలు పడి పుష్కలంగా భూగర్భజలాలు పెరిగితేనే రైతులు పంటలు పండించే పరిస్థితి ఉంది. – కొమ్ముల రాజేందర్ రెడ్డి, బొమ్మెన, కథలాపూర్ నీటిని పొదుపుగా వాడుకోవాలి పట్టణాల్లోనే కాదు.. పల్లె ప్రజలూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రస్తుత వానాకాలం సీజన్లో సరైన వర్షాలు లేక భూగర్భజలాలు పెరగడం లేదు. గతేడాది జూలైతో పోల్చితే ఈ జూలైలో భూగర్భజలాలు లోతుకు పడిపోయాయి. – జి.నాగరాజు, భూగర్భజల అధికారి గతేడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది జూలై నెలలో భూగర్భజలం 0.69 మీటర్ల లోతుకు పడిపోయింది. గతేడాది సగటున 3.96 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఇప్పుడది 4.49 మీటర్లకు పడిపోయింది. అత్యధికంగా కొడిమ్యాల మండలంలో నీటిమట్టం 11.90 మీటర్లకు పడిపోయింది. అత్యల్పంగా బీర్పూర్ మండలంలో 1.34 మీటర్లకు తగ్గింది. నాన్ ఆయకట్టు మండలాలైన మల్యాలలో 5.83 మీటర్లు, భీమారంలో 2.05 మీటర్లు, మేడిపల్లిలో 3.74 మీటర్లు, కథలాపూర్‌లో 2.47 మీటర్లు, మెట్పల్లిలో 5.39 మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి. ఈ ఏడాది జూలైలో వర్షాలు కొంత ఆశాజనంకంగా ఉన్నప్పటికీ.. భూగర్భజలాలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరిగిన దాఖలాలు కనబడటం లేదు. నాన్ ఆయకట్టు మండలాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. ఆ పంటకు నీటి అవసరం ఎక్కువ కావడంతో బోర్లు, వ్యవసాయ బావుల ద్వారా పగలు, రాత్రి తేడా లేకుండా నీటిని తోడుతూనే ఉన్నారు. ఫలితంగా ఆ మండలాల్లో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే మరింత లోతుకు.. -
కేంద్ర పథకాలు ఇంటింటికీ వివరించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు మల్లాపూర్: కేంద్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, రాష్ట్ర నాయకులు రఘు అన్నారు. మండలకేంద్రంతోపాటు ముత్యంపేట, పాతదాంరాజుపల్లి, వాల్గొండలో కుల సంఘాలకు మంజూరైన ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రోసిడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ సుపరిపాలనతో దేశం అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తోందన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వడ్డెపల్లి శ్రీనివాస్, ఎర్ర లక్ష్మీ, పందిరి నాగరాజు, లవంగ శివకుమార్, ఇల్లెందుల కాంతయ్యచారి, గజ్జి శ్రీను, బూత్‌లెవల్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
మూడు పంటలకు సాగునీరు
● రామగుండం ఎత్తిపోతల ప్రారంభం ● అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి కృషి ● మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతల ద్వారా ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ శివారులో రూ.75 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రా వు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆదివారం ప్రారంభించా రు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో రూ.45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పంపుహౌస్‌లను రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించారని, ఒక్క ఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రామగుండాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం సంపూర్ణంగా అమలవుతోందన్నారు. ప్రయాణికుల అవసరం మేరకు మరో 16 బస్సులు కేటాయించాలని మక్కాన్‌సింగ్ కోరగా సానుకూలంగా స్పందించారు. ధర్మారంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్ విన్నపం మేరకు పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మిస్తామని, డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు కేటాయించిందని తెలిపారు. -
పోలీసులా.. కాంగ్రెస్ కార్యకర్తలా
● బాల్కొండ ఠాణాలో కాంగ్రెస్ ప్రెస్‌మీట్ ● కోరుట్లలో బీఆర్ఎస్ ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్నారు ● ‘ఎక్స్’లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ● విచారణ చేయాలని డీజీపీకి ఫిర్యాదు కోరుట్ల: పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం యూరియా సమస్యపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు కోరుట్ల మండలం అయిలాపూర్‌లో ఆదివారం విలేకరుల సమావేశం పెడితే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యూరియా పంపిణీకి జింక్ కొనుగోళ్లకు ముడిపెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం బీఆర్ఎస్ నాయకులకు ప్రెస్‌మీట్ పెట్టుకునే స్వేచ్ఛ లేకుండా అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. ఇదే కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గంలో ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే ప్రెస్‌మీట్ పెట్టడం.. దానికి పోలీసులే ఏర్పాట్లు చేయించడం విడ్డూరమన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివక్ష చూపుతున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల తీరుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న దౌర్జన్యాలను ప్రజలు గమనించాలని కోరారు. ఈ విషయంలో డీజీపి స్పందించి పోలీసు వ్యవస్థను కాపాడాలని కోరారు. -
స్నేహబంధమే శాశ్వతం
సాక్షి, పెద్దపల్లి: స్నేహబంధమే అన్నింటికన్నా శాశ్వతమైనది. నేను ఇప్పటికీ నా స్కూల్‌మేట్స్‌ను కలుస్తుంటా. చిన్నప్పుడు ఖమ్మం పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నం. చదువులు పూర్తయ్యాక చిన్ననాటి మిత్రులందరూ వివిధ దేశాలు, పట్టణాల్లో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, వ్యాపారులుగా స్థిరపడ్డారు. ఎవరెక్కడ ఉన్నా మేమంతా ఒకరికొకరు తోడుగా ఉన్నామన్న భరోసా ఇస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. 30 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతోంది. వాట్సప్ గ్రూప్ ద్వారా నిత్యం టచ్‌లో ఉంటాం. ఏడాదికోసారి ఒకచోట కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లి -
ఆప్తమిత్రుడి స్ఫూర్తితో..
జగిత్యాల: స్నేహబంధం గొప్పది. ఆ బాండింగే వేరు. స్నేహితులు మంచి కోరుతుంటారు. సూచనలు ఇస్తుంటారు. నాకు కడలి జయకృష్ణ మంచి స్నేహితుడు. బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ ఐఏఎస్‌కు ప్రిపేర్ కావాలని సలహాలు, సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర ఉంది. ఐఏఎస్ అయిన తర్వాత ఎంతో మంది స్నేహితుల్లాగా కొలీగ్స్‌గా ఉంటారు. కానీ చిన్నతనంలో ఉన్న స్నేహితులను ఎప్పటికీ మరిచిపోం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాల -
బెస్ట్ ఫ్రెండ్ శివం ఉపాధ్యాయ
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం చాలా కష్టం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కెరీర్లో అనేక మంది ఫ్రెండ్స్ అయ్యారు. నా కంటే సీనియర్ ఆఫీసర్ అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా చాలా క్లోజ్‌గా ఉంటారు. నాకు మంచి ఫ్రెండే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. 2021 ఐపీఎస్ బ్యాచ్మెట్ శివం ఉపాధ్యాయ. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. అతనితో ఐదేళ్లుగా ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. చాలా మంచి సలహాలు ఇస్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏఎస్పీగా పని చేస్తున్నారు. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
నృసింహుని సన్నిధిలో అదనపు జిల్లా జడ్జి
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామిని అదనపు జిల్లా జడ్జి నారాయణ శనివారం దర్శించుకున్నారు. అర్చకులు స్వాగతం పలికి పూజలు చేయించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ జడ్జిని సన్మానించారు. ఆరవెల్లిలో కేంద్ర బృందం పర్యటనపెగడపల్లి: స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్–2025లో భాగంగా కేంద్రబృందం సభ్యులు శనివారం మండలంలోని ఆరవెల్లిలో పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న కేంద్రపథకాలు, చేపట్టిన అభివృద్ది పనులు, ఉపాధిహామీ పనులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీకేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. మరుగుదొడ్ల సదుపాయాలు తెలుసుకున్నారు. పలు వీధుల్లో పర్యటించి పారిశుధ్యం, పరిశుభ్రత, ఇంకుడుగుంతలను పరిశీలించారు. స్థానిక అధికారులు వారిని సన్మానించారు. టీం సూపర్వైజర్ వి.మధూకర్, ఎస్బీఎం కో–ఆర్డినేటర్ చిరంజీవి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. కొండగట్టు పాత కోనేరు పూడ్చివేతకు నిర్ణయంమల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలోని పాత కోనేరును పూడ్చివేయాలని ఆలయ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దశాబ్దాల తరబడిగా భక్తులు ఈ కోనేరులోనే స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం కొత్త కోనేరు అందుబాటులోకి రావడంతో పాత కోనేరు నిరుపయోగంగా మారింది. దానిని పూడ్చి చదును చేయాలని నిర్ణయించగా.. ఆలయ అర్చకులు సమ్మతించినట్లు అఽధికారులు తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయండిజగిత్యాలటౌన్: భవన నిర్మాణదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకేంద్రంలో ప్రభుత్వం తరపున ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. జిల్లాకేంద్రానికి సమీపంలో వాగులు, నదులు లేక ఇసుక లభించడంలేదని, దీంతో భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధిక ధరలు చెల్లించి ఇసుక కొనాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు 20మంది ఎంపికమెట్పల్లి: పట్టణంలోని మినీస్టేడియంలో శనివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంగుల శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. పలు పోటీల్లో 320 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 20మందిని ఈనెల 7న జనగామలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గజెల్లి రాందాస్, రాజు, కార్తీక్, వేణు, సింధుజ, లత, భవాని తదితరులున్నారు. ఏకాగ్రతతో బస్సు నడపాలిజగిత్యాలటౌన్: డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులు నడపాలని, ప్రమాదాలు జరగకుండా చూడాల ని, ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవా లని జిల్లా రవాణా అధికారి భద్రు నాయక్ అ న్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆర్టీసీ జగిత్యాల డిపోలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు దూ రంగా ఉండాలన్నారు. మద్యం సేవించి బస్సులు నడుపొద్దన్నారు. బస్ రివర్స్ తీసుకునే స మయంలో కండక్టర్ సూచనలు పాటించాలని పే ర్కొన్నారు. డీఎం కల్పన మాట్లాడుతూ ప్ర యాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సూ చించారు. ప్రమాదాలు జరగకుండా బస్సు నడిపిన డ్రైవర్లను డిపో మేనేజర్ కల్పన అభినందించారు. కార్యక్రమంలో ఎంవీఐ రామారావు, ప్రమీల, డిపో ఏఈఎం కవిత, సేఫ్టీ వార్డెన్ ఎస్జే.రెడ్డి, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్‌కు శ్రీకారం
సిరిసిల్ల: ‘అరేయ్ మన మిత్రుడు దయానంద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడిని అందరూ గుర్తుంచుకునే విధంగా ఏదైనా చేద్దాం’ అంటూ.. బాల్య స్నేహితులు ఏకమయ్యారు. ఓ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల కిందటే రూ.30లక్షలు వెచ్చించి శాశ్వత భవనాన్ని నిర్మించారు. వందలాది మంది పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నారు. సిరిసిల్లలోని పద్మనగర్‌కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు గాజుల శ్రీనివాస్ యూఎస్ఏ సాప్ట్వేర్ ఇంజినీరు. దయానంద్‌పై ఉన్న అభిమానంతో స్నేహితులతో కలిసి పట్టణ శివారులో 22 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 19 ఏళ్ల కిందట సుమారు రూ. 30 లక్షలు వెచ్చించి స్కూల్‌ను 2006లో స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. రాజీవ్‌నగర్‌లోని పేదలందరూ తమ పిల్లలను దయానంద్ మెమోరియల్ స్కూల్‌కు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా 25 మంది జెడ్పీస్కూళ్లకు వెళ్తున్నారు. నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు ఖర్చవుతోంది. ట్రస్ట్ అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ స్నేహితులు భీమేశ్వర్ అంకతి, రాంబాబు చేబ్రోలు, జి.రాజశేఖర్, ప్రసన్న పోల్సాని, విజయ్‌కృష్ణ భరాతం, మురళీకృష్ణ సింగారం, రవీందర్ నాగంకేరి, రవి వూరడి, గణేశ్ గోసికొండ భాగస్వాములుగా ఉన్నారు. -
స్నేహబంధానికి సార్థకత
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గాజెంగి శ్రీధర్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఈనేపథ్యంలో 1994–95లో తమతో ఆడుతూ పాడుతూ పదో తరగతి చదివి స్నేహబంధాన్ని పెంచుకున్న శ్రీధర్ చనిపోవడంతో అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు కదిలారు స్నేహితులు. ఎవరికి తోచిన రీతిలో వారు డబ్బులు సమకూర్చారు. రూ.లక్ష పోగుచేసి శ్రీధర్ కూతురు పేరిట ఫిక్స్ డిపాజిట్ చేసి అందించారు. స్నేహితుని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆ సమయంలో అందరినీ కలుపుకుని డబ్బులు సమకూర్చడంతో పోతుగంటి శ్రీనివాస్, ఆనంద్, ప్రసాద్ తదితరులు ముందుకు కదిలి స్నేహబంధానికి సార్థకత చేకూర్చారు. ఇలాగే నాలుగేళ్ల క్రితం మరో స్నేహితుడు వాసం విద్యాసాగర్ అనార్యోగంతో చనిపోగా అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు వీరే ముందుకు కదిలి రూ.1.60 లక్షల ఆర్థికసాయం అందించారు. నలభై ఏళ్లుగా.. వెల్గటూర్(ధర్మపురి): వెల్గ టూర్ మండల కేంద్రానికి చెందిన పరకాల రమేశ్, సిరిపురం సత్యనారాయణలు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతితో చదువు మానేసి మండల కేంద్రంలోని టైలరింగ్ షాపులో పని నేర్చుకున్నారు. పనిలో ప్రావీణ్యం సంపాదించాక 22 ఏళ్ల క్రితం 2003లో లక్కీ టైలర్ పేరుతో షాపు ప్రారంభించారు. అనంతరం దినదినాభివృద్ధి చెంది లక్కీ ఫ్యాషన్స్‌గా మారింది. ఇప్పుడు ఇద్దరు స్నేహితులతో పాటు వారి కుటుంబాలు, పిల్లలు కూడా మంచి స్నేహితులుగా మారారు. భవిష్యత్‌లో కూడా ఎలాంటి అరమరికలు లేకుండా కలిసే ఉంటామని పేర్కొన్నారు. రక్తదాన స్నేహితుడు బోయినపల్లి(చొప్పదండి): ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశాక.. వారి కళ్లలో తొణికిసలాడే ఆనందం చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని చెబుతాడు బోయినపల్లి మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన పెరుక మహేశ్. రక్తం పంచుకుని పుట్టినవారే.. రక్తదానం చేసే సందర్భం వస్తే తప్పించుకు తిరుగుతున్న రోజులివి. కానీ, ఏ సంబంధం లేకుండా పలువురికి రక్తదానం చేస్తూ స్నేహానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నాడు మహేశ్. ఇప్పటికి 28 సార్లు, ఇందులో స్నేహితులకు కూడా రక్తదానం చేసినట్లు మహేశ్ తెలిపాడు. -
విద్యార్థులను ప్రోత్సహిస్తూ..
జమ్మికుంట(హుజూరాబాద్): అబాది జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో చదివిన కాటిపల్లి లింగారెడ్డి (అసిస్టెంట్ ప్రొఫెసర్), మార్క విజయప్రతాప్(ఎన్ఆర్ఐ), పింగిళి వెంకట్‌రెడ్డి, అయిత శ్రీనివాస్, అమృత సురేశ్(టీచర్లు) ఐదుగురు స్నేహితుల బృందం ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. తాము చదివిన పాఠశాలలో ఏటా 10వ తరగతిలో ప్రతిభచాటిన విద్యార్థులకు (ముగ్గురు) రూ.10వేలు నగదు పురస్కారం అందజేస్తున్నారు. అలాగే ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బుక్స్, క్యాలెండర్, ఐడెంటిటీ కార్డులు తదితర వస్తువులు అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు. -
పీఎంపీ నిర్లక్ష్యం.. వృద్ధుడికి శాపం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ పీఎంపీ నిర్లక్షం మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు గంగారాంకు శాపంగా మారింది. ఆరోగ్యం బాగాలేదని పీఎంపీతో ఇంజక్షన్ వేయించుకుంటే సెప్టిక్ కావడంతో ఆ వృద్ధుడి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇలా ఎందుకు అయ్యిందని సదరు పీఎంపీ దగ్గరికి వెళ్లి పెద్ద హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుమని గంగారాం కోరగా.. నీ ఇష్టమున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నెల రోజులుగా ఏం చేయాలో తెలియక పెద్ద ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇంట్లోనే ఆ బాధను భరిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని, పీఎంపీపై చర్యలు తీసుకోవాలని వృద్ధుడు గంగారాం వేడుకుంటున్నాడు. నెల రోజులుగా నరకయాతన పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలంటే పట్టించుకోని పీఎంపీ ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరింపులు ఏం చేయలేని నిస్సాయ స్థితిలో నలిగిపోతున్న వృద్ధుడు -
ట్రస్టుతో సేవా కార్యక్రమాలు
ఎలిగేడు(పెద్దపల్లి): మండలకేంద్రంలోని జెడ్పీ స్కూల్లో 1987–88లో పదో తరగతి పూర్తి చేసిన 100 మంది విద్యార్థులు సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో 2003 సెప్టెంబర్ 23న నానేస్తం ట్రస్టు ఏర్పాటు చేశారు. యువతకు కంప్యూటర్, డ్రైవిండ్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికసాయం, పేదలకు వైద్య ఖర్చులు, అనాథలకు ఆర్థికసాయం చేస్తున్నారు. ఎలిగేడులో వైకుంఠరథం, బాడీఫ్రీజర్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు దాదాపు రూ.50లక్షలకు పైగా ఖర్చు చేసి ఏడాదికి ఒకసారి అందరూ కలుసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరం స్పందిస్తాం మా క్లాస్మేట్స్ వంద మంది కాగా ప్రస్తుతం 95మంది ఉన్నా రు. జరిగిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరం స్పందిస్తాం. ఏడాదికోసారి ట్రస్టు ఏర్పాటు చేసిన రోజు కలుసుకుంటూ యోగా క్షేమాలు తెలుసుకుంటాం. ట్రస్టు నిర్వహణపై చర్చించి ముందుకెళ్తాం. – కట్ల సత్యనారాయణ, ట్రస్టు అధ్యక్షుడు -
ఎరువులను అధిక ధరలకు విక్రయించొద్దు
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలఅగ్రికల్చర్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల ముందు ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. నకిలీ విత్తనాలు, పురుగులమందులు విక్రయించొద్దని సూచించారు. దుకాణానికి వచ్చిన రైతులతో ముచ్చటించారు. ఏ పంట వేశారు..? ఏ ఎరువు వేశారు..? ఏ మేరకు వేస్తున్నారు..? ఆ ఎరువు వల్ల పంటకు కలిగే ఉపయోగమేంటి..? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. షాపులోని రికార్డులు పరిశీలించారు. వ్యవసాయాధికారి భాస్కర్, ఏఓ వినీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 7న ఓబీసీ జాతీయ మహాసభ జగిత్యాలటౌన్: ఈనెల 7న గోవాలో ఓబీసీ జాతీ య మహాసభ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండభేరి నరేశ్ తెలిపా రు. జిల్లాకేంద్రంలోని శనివారం చలో గోవా పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన గోవాలోని శ్యాంప్రసాద్‌ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ప దో బీసీ మహాసభకు బీసీలందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 42శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి తెలంగాణ బీసీలకు న్యాయం చే యాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి భూ మి రమణ, నాయకులు ముఖేష్ ఖన్నా, గంగ జల, పెండెం గంగాధర్, వేముల మనోజ్, మానాల కిష న్, గంగిపెల్లి శేఖర్, వేణుమాధవ్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పోలీస్‌యాక్ట్ అమలుజగిత్యాలక్రైం: శాంతిభద్రతల నేపథ్యంలో ఈనెల 31వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకో లు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. -
బడి దోస్తులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హైస్కూల్లో 2004–05లో పదో తరగతి చదివిన విద్యార్థులు 2017లో బడి దోస్తులు గ్రూపుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరి స్నేహితుడు ఇల్లంతకుంటకు చెందిన బండారి రమేశ్ ఆకస్మికంగా మరణించగా రూ.13 వేలు, రోడ్డ శ్రీకాంత్ అనారోగ్యానికి గురికాగా రూ.11 వేలు, కాసుపాక తిరుపతి మృతిచెందగా రూ.11 వేలు, వల్లంపట్ల గ్రామంలో ఎర్రవెల్లి శంకర్ చనిపోగా అతడి కుటుంబానికి రూ.15 వేలు ఆర్థికసాయం అందించారు. అలాగే ముస్కాన్‌పేటలో హరికుమార్, మహేశ్ కుటుంబాలకు.. ఇలా చాలా కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు స్నేహితులంతా ప్రతినెలా కొంత మొత్తం బ్యాంకులో జమ చేస్తుంటారు. ఈ గ్రూపు మాదిరిగానే గాలిపెల్లి, కందికట్కూర్, ఇల్లంతకుంట ఎఫ్‌బీఐ, స్నేహితుల గ్రూపులు కూడా ఉన్నాయి. వీరు కూడా బాధిత కుటుంబాలకు సాయం చేస్తూ, వైద్య శిబిరాలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటారు. -
వాకింగ్ ఫ్రెండ్స్
విద్యానగర్(కరీంనగర్): పదిహేనేళ్ల క్రితం కొత్తపల్లి రతన్, మోటూరి ఆంజనేయులు, తొడుపునూరి శ్రీనివాస్ వాకింగ్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు రోజూ అంబేడ్కర్ స్టేడియంలో వాకింగ్ చేస్తూ ప్రస్తుతం 15 మంది స్నేహితులతో ట్రైగర్స్ వాకింగ్ గ్రూప్ అయ్యారు. వీరిలో కొందరికి కొందరు బంధువులు అయినా స్నేహితులుగానే కలిసి ఉంటారు. ఫంక్షన్లు, ఫిక్నిక్, పుణ్యక్షేత్రాలకు కుటుంబాలతో కలిసి వెళ్తారు. వీరిలో రాచమల్ల ప్రసాద్, శ్రీనివాస్, పల్లేర్ల శ్రీనివాస్, చీకటిమల్ల అశోక్‌కుమార్, తొడుపునూరి వేణుగోపాల్, పడకంటి వినోద్ తదితరుల ఆలోచన మేరకు 2023 జనవరి 2న బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఏర్పాటు చేసి కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాస్పుత్రి, మాతాశిశు కేంద్రంలో చికిత్స కోసం వచ్చినవారికి రోజూ ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనాలు అందిస్తున్నారు. ప్రతీ శనివారం వీక్లీ మార్కెట్లో చిరువ్యాపారులు, గ్రామాల నుంచి వచ్చిన రైతులు, అమ్మకందారులకు, నగునూర్ దుర్గాభవానీ ఆలయంలో ప్రతీ మంగళ, శుక్ర, ఆదివారాలతో పాటు ప్రత్యేక రోజుల్లో భక్తులకు దాత సహకారంతో అన్నప్రసాదం అందిస్తున్నారు. కల్మషం లేని దోస్తీ.. చిన్ననాటి దోస్తుల్లో కల్మషం లేకుండే. కలిసి ఆడిన ఆటలు, కాకి ఎంగిలి చేసి పంచుకున్న పిప్రమేట్లు, జారే నెక్కరు పైకి దోపుకుంటూ గోనె సంచిలో పుస్తకాలు దోపుకుని భుజాల మీద చేతులేసుకుంటూ బడికి పోయిన దోస్తులు ఇప్పుడు కష్టమే. అయినా అక్కడక్కడ ప్రాణమిచ్చే దోస్తులు ఉన్నారు. వారిని జీవితకాలం నిలుపుకోవాలి. – ఎ.కిరణ్‌కుమార్, న్యాయవాది, రాంనగర్, కరీంనగర్ -
స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
జగిత్యాలరూరల్: స్థానిక ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లి, నర్సింగాపూర్, వెల్దుర్తి, గొల్లపల్లి, తిమ్మాపూర్, జాబితాపూర్ గ్రామాల్లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, తర్వాత ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. జగిత్యాల సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచులు రజిత, గంగాధర్, ప్రవీణ్‌గౌడ్, నాయకులు కమలాకర్‌రావు, మల్లేశ్‌గౌడ్, శ్రీనివాస్, గంగారెడ్డి, మహేశ్, రవి, ధర్మయ్య, దశరథం, గంగమల్లు పాల్గొన్నారు. సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వసంత అన్నారు. నర్సింగాపూర్ శివారులో పొలంలో వరినాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు. వర్షాలులేకపోవడం.. సాగునీరు రాకపోవడంతో నాట్లు ఆలస్యం అవుతున్నాయని మహిళలు చెప్పడంతో ప్రభుత్వం తీరు ఇలా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలననే బాగుందని మహిళలు కితాబునిచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడి.. మానసిక స్థితి కోల్పోయి..
గోదావరిఖని: స్థానిక జ్యోతినగర్‌కు చెందిన బండారి రాకేశ్(30) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో హోండా షోరూంలో మెకానిక్‌గా పనిచేసిన రాకేశ్.. ప్రస్తుతం ఏ పనీలేకుండా ఖాళీగా ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మానకస్థితి కోల్పోయాడు. ఇదేక్రమంలో అతడి మేనమామ ఇటీవల మృతి చెందడంతో మానసికస్థితి మరింత క్షీణించింది. అలాగే చెల్లెకు ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ కావడంతో అది మనుసులో పెట్టుకుని మద్యానికి బానిసయ్యాడు. ఇదేక్రమంలో శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. మృతుడి తండ్రి భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన వివరించారు. కాగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుడిని నేత్రాలు సేకరించి హైదరాబాద్ తరలించినట్లు ప్రతినిఽధి వాసు తెలిపారు. రైల్వే పట్టాలపై చిక్కుకున్న కారుకొడిమ్యాల: కొడిమ్యాల శివారు.. గంగాధర సమీపంలో ఉన్న రెల్వేగేట్ మధ్య ఓ కారు చిక్కుకుంది. రైలు వస్తుందన్న సమాచరంతో గేట్మెన్ సిగ్నల్ ఇచ్చి గేట్ క్లోజ్ చేస్తుండగా.. ఆ లోపే మరోవైపు ఉన్న గేట్ ద్వారా కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు డ్రైవర్ దూసుకొచ్చాడు. వెంటనే గేట్మెన్ అప్రమత్తమై సిగ్నల్ అందించి రైలును ఆపడంతో ప్రమాదం తప్పింది. తర్వాత గేట్లు తెరచి కారును బయటకు పంపించారు. లేకుంటే పెను ప్రమాదం సంభవించేంది. గల్ఫ్ ఏజెంట్‌పై ఎస్పీకి ఫిర్యాదుజగిత్యాలక్రైం: జగిత్యాలలో గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ఓ ఏజెంట్ నిజామాబాద్ జిల్లా ఎండపల్లికి చెందిన ఐదుగురి నుంచి రూ.1.75లక్షల చొప్పున తీసుకున్నాడు. వారిని గల్ఫ్ పంపిస్తానని మోసం చేశాడు. దీంతో బాధితులు శనివారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన బాధితులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. సీఐ కరుణాకర్ గల్ఫ్ ఏజెంట్‌ను పిలిపించి సత్వరమే ఎవరి డబ్బులు వారికి చెల్లించాలని ఆదేశించారు. దశలవారీగా ఇస్తనని చెప్పడంతో బాధితులు అంగీకరించారు. సదరు ఏజెంట్ కొద్దిరోజులుగా జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా కార్యాలయానికి వెళ్తే మహిళారిసెప్షన్లతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ● యువకుడి బలవన్మరణం -
గంజాయి ముఠా అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్‌స్టేషన్ పరిధి పూడూరులో గంజాయి విక్రయిస్తున్న గుండుపాషా, బాలె నవీన్, జగిత్యాలలో ఆవునూరి రణదీర్, ఆకుల అమర్నాథ్, రాయారపు మల్లికార్జున్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి 2.250 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన గుండు ప్రశాంత్, మల్యాల మండలం తాటిపల్లికి చెందిన బాలె నవీన్, గంగాధర మండలం వెంకటయ్యపల్లికి చెందిన వంశీ కొద్దికాలంగా నాగ్‌పూర్ ట్రైన్లో వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. పూడూరులో విక్రయిస్తుండగా గుండు ప్రశాంత్, బాలె నవీన్‌ను పట్టుకోగా.. మరో నిందితుడు వంశీ పారిపోయాడు. జగిత్యాల శివారులోని లింగంపేటకు చెందిన రణదీర్, తులసీనగర్‌కు చెందిన అమర్నాథ్, రాయపు మల్లికార్జున్‌ను గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వంశీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయి విక్రేతలను పట్టుకోవడంలో కృషిచేసిన పట్టణ సీఐ కరుణాకర్, మల్యాల సీఐ నీలం రవి, ఎస్సైలు సందీప్, రవికిరణ్‌ను డీఎస్పీ అభినందించారు. ఐదుగురు నిందితుల పట్టివేత 2.250 కిలోల గంజాయి స్వాధీనం డీఎస్పీ రఘుచందర్ -
స్నేహితుడా..
● తోటి మిత్రులకు సాయంగా.. ● దూరమైనవారి జ్ఞాపకంగా.. ● సేవలు చేస్తూ.. అండగా నిలుస్తూ.. ● ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా పలువురు ● నేడు స్నేహితుల దినోత్సవం‘బృందావనంలో గోపాలురతో కన్నయ్య చేసిన దోస్తీ.. కుచేలుడితో కృష్ణుడి స్నేహం.. రామాయణంలో శ్రీరాముడు.. సుగ్రీవుల మైత్రి. అశోకవనంలో కాపలాగా ఉన్న త్రిజట సీతమ్మతల్లికి ఎన్నోవిధాలుగా ఊరడించి స్నేహానికి ప్రతీకగా నిలువగా.. దశరథుడితో ఉన్న మైత్రితో జటాయువు సీతమ్మ తల్లిని రక్షించేందుకు రావణుడితో ప్రాణాలొడ్డి పోరాడింది. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం మంచీ చెడు, విచక్షణ, కీర్తి, అపకీర్తికి తావులేదని మహాభారతం వివరించింది’. స్నేహం.. అనిర్వచనీయం.. అద్వితీయం.. అమ్మ అనే పదం తరువాత ఆత్మీయతను పంచే ఏకై క బంధం స్నేహం. కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉండేది స్నేహం. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం.. ఓదార్పునిచ్చేది నేస్తం.. విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవారు.. విషాదంలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ఓదార్చే నలుగురు స్నేహితులు లేని జీవితాన్ని ఎవరూ ఊహించరు. అందుకే మనిషికి తలా ఓ పేరున్నప్పటికీ.. అందరినీ దగ్గరకు చేర్చేది స్నేహబంధం మాత్రమే. స్నేహంకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. కష్టమైనా.. నష్టమైనా.. మన ఫ్రెండ్ కోసమే కదా అనిపిస్తుంది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేకమంది తమ స్నేహితుల కోసం ఎన్నోరకాల సేవలందిస్తున్నారు. జీవితాలను నిలబెడుతున్నారు. కష్టాల్లో తోడునీడగా నిలుస్తున్నారు. వారి నుంచి దూరమైన స్నేహితుల పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్నేహితుల పేరిట మరికొందరికి సాయంగా నిలుస్తున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!! – విద్యానగర్/సప్తగిరికాలనీస్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100మందిని పలుకరించగా.. అభిప్రాయాలు ఇలా..12స్నేహం అంటే..? అవసరాలు తీర్చేది కల్మషం లేనిది 88ఫ్రెండ్షిప్ కలుషితమైందా? అవును కాలేదు 3862నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు? ఒకరు ఇద్దరికి మించి 72నీ ఫ్రెండ్‌కు ఇచ్చేస్థానం?అమ్మానాన్న తరువాత ఫ్రెండ్ ఫస్ట్ నాన్న తరువాత ఫ్రెండ్, అమ్మ ఫ్రెండ్ తరువాత అమ్మ,నాన్న 582814 -
పదేళ్ల గోస తీర్చిన ప్రజాప్రభుత్వం
వెల్గటూర్: ప్రజాప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రజల పదేళ్ల గోసలు తీరాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1,569 మందికి రేషన్ కార్డులు, 37 మందికి కల్యాణలక్ష్మి, 50 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రేషన్‌కార్డులు పంపిణీ చేయడంతోపాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంపై యుద్ధం చేస్తున్నామని తెలిపారు. స్తంభంపల్లికి చెందిన దివ్యాంగుడికి ఇచ్చిన మాట ప్రకారం స్కూటీ అందించి తన ఉదారత చాటుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసూదన్, ఏఎంసీ చైర్మన్ గోపిక, నాయకులు గోపాల్‌రెడ్డి, శైలేందర్‌రెడ్డి, రాంరెడ్డి, రత్నాకర్, రాంమోహన్‌రావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలే పిల్లలకు బలం బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలే బలమని మంత్రి అన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో కలెక్టర్‌తోపాటు పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తాం గొల్లపల్లి: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి అన్నారు. మంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో ధర్మపురి బార్ అసోసియేషన్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మపురిలో కోర్టు అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సహకరిస్తానని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు అలుక వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడాల శ్రీకాంత్ కుమార్, ఏజీపీ ఇ మ్మడి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు. పాలనలో సంక్షేమానికే ప్రాధాన్యం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ -
ఆపదలో అండగా..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 సింగరేణి స్కూల్లో 1993–94లో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అనే మాటకు నిర్వచనంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రదేశాల్లో స్థిరపడ్డారు. వాట్సాప్ గ్రూప్‌గా ఏర్పడి చిన్ననాటి మిత్రుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం అందించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ స్నేహితుడు యైటింక్లయిన్‌కాలనీకి చెందిన పెండ్యం వీరయ్య కరెంట్ షాక్‌తో రెండు చేతులు కోల్పోగా రూ.4.8 లక్షలు సేకరించి బాధితుడికి అందజేశారు. గోదావరిఖనికి చెందిన బాసాని లక్ష్మయ్య 2018లో అనారోగ్యంతో మృతి చెందగా రూ.1.35 లక్షలు, మరో మిత్రుడు కొండ్ర సురేశ్ 2022లో చనిపోగా రూ.2.55 లక్షలు ఆయా కుటుంబాలకు అందజేశారు. ఇప్పటి వరకు దాదాపు రూ.14 లక్షలు చేయూతనందించారు. -
ఆ రోజు అందరూ ఒకే చోట
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎక్కడ ఉన్నా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితులందరూ ఒకే చోట కలుసుకుంటారు. కుల, మత భేదం.. సీనియర్, జూనియర్ తేడా లేదు. కాల్వశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో 1976–77 విద్యాసంవత్సరం నుంచి చిగురించిన వారి స్నేహంతో వరుసగా రెండు దశాబ్దాలుగా ఒకే చోట చేరుతారు. యోగక్షేమాలు తెలుసుకుంటారు. వివిధ కారణాలతో మృతిచెందిన గురువులు, స్నేహితులకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. అనంతరం అందరూ భోజనం చేస్తారు. తాము చదివిన పాఠశాలలో ప్రతీ విద్యాసంవత్సరం ప్రతిభచాటిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. -
సవాల్‌కు సై అంటే సై
కోరుట్ల/కోరుట్లరూరల్: యూరియా సరఫరాలో కాంగ్రెస్ విఫలమైందన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలు తప్పని.. కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శనివారం బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ సవాల్ విసిరిన క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం అయిలాపూర్ రైతు వేదిక సమీపంలో ఇరువర్గాలు తమ నాయకులు, కార్యకర్తలను మోహరించడంతో ఒక దశలో ఘర్షణ జరిగే పరిస్థితి కనిపించింది. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి తిప్పి పంపడంతో వివాదం సద్దుమణిగింది. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు బహిరంగ చర్చ నేపథ్యంలో వేకువజామున కోరుట్ల మాజీ జెడ్పీటీసీ దారిశెట్టి రాజేశ్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ మారు సాయిరెడ్డి, మాజీ సర్పంచులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సందయ్య, అంజయ్య, బండి భూమయ్య, పట్టణ నాయకులు ఫయీం, అన్వర్, సజ్జు, సత్యం, ఆనంద్, సురేందర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. బహిరంగ చర్చకు రమ్మని పిలిచి తమ పార్టీ శ్రేణులకు ఎదుర్కొవడం చేతకాదని గుర్తించి పోలీసులను అడ్డుపెట్టుకుని ముందస్తు అరెస్టు చేయించారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కోరుట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖాముఖి బహిరంగ చర్చ రచ్చరచ్చ బీఆర్ఎస్ నేతలముందస్తు అరెస్టు -
స్నేహం గొప్ప వరం
సాక్షి, పెద్దపల్లి: మంచి స్నేహం భవిష్యత్‌కు మార్గం చూపిస్తుంది. చెడు అలవాట్లు కలిగినివారికి దూరంగా ఉండాలి. సినిమాలు, షికార్లు అంటూ తిరగకుండా చదువును ప్రోత్సహించే వారే నిజమైన స్నేహితులు. అలాంటివారిని నేను సంపాదించుకున్నా. ఉప్పల్‌లోని స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ టచ్‌లో ఉంటా. ఏటా మేమంతా కలిసి చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తుచేసుకొని సరదాగా గడుపుతాం. అందరం కలిసి కష్టాల్లో ఉన్న స్నేహితులకు చేయూతనందిస్తూ, చదువుకున్న పాఠశాల, ఉపాధ్యాయుల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. – కరుణాకర్, డీసీపీ, పెద్దపల్లి -
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
● ఎస్పీ అశోక్‌కుమార్ జగిత్యాలక్రైం: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడుతాయని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మెగా వాలీవాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. కొన్ని రోజులుగా పోలీస్‌స్టేషన్ సర్కిల్‌స్థాయిలో వాలీబాల్ టోర్నీ నిర్వహించామని, అందులో గెలుపొందిన వారిని జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. యువత తమ ఆలోచనలను సరైన దిశలో వినియోగించుకోవాలని, సామాజిక బాధ్యతతో ముందడుగు వేయాలన్నారు. ప్రతీ క్రీడాకారులు యాంటీడ్రగ్స్ వారియర్‌గా పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో కృషి చేయాలని సూచించారు. అనంతరం గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి తనవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటస్వామి, జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు రఘుచందర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, సైదులు, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, శ్రీనివాస్, కరుణాకర్, సుధాకర్, రాంనర్సింహారెడ్డి, సురేశ్, ఎస్సైలు అనిల్‌కుమార్, సదాకర్ పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
● మందులు అందుబాటులో ఉంచాలి ● సమయపాలన పాటించాలి ● రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్జగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలో వసతులు, రోగులకు మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలు నిత్యం సమీక్షించాలని సూచించారు. ముఖ్యంగా కాలానుగుణంగా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజూ వస్తున్న ఓపీ వివరాలను నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో అందుతున్న ల్యాబ్ సేవలు మెరుగ్గా ఉండాలని తెలిపారు. జగిత్యాల జిల్లా సిజేరియన్లలో 75 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని, దీనిని తగ్గించి సాధారణ ప్రసవాలు అయ్యేలా గర్భిణులను ప్రోత్సహించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, అర్చన, రవీందర్, సత్యనారాయణ పాల్గొన్నారు. మల్యాల పీహెచ్సీ సందర్శన మల్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని –రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్ శుక్రవారం సందర్శించారు. సేవల నాణ్యత, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్య సేవలు, మతా శిశు కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారులు అర్చన, ఏఎంవో సత్యనారాయణ, మండల వైద్యురాలు మౌనిక, తదితరులు పాల్గొన్నారు. -
కోమన్‌పల్లి భూములకు పూర్తిస్థాయి రికార్డులు
సారంగాపూర్: కోమన్‌పల్లి గ్రామ భూములకు ఇప్పటివరకు ఎలాంటి రికార్డులు లేవని, ప్రస్తుతం పూర్తిస్థాయి భూరికార్డులు, నక్షా, సేత్వార్‌ను రూపొందించినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం బీర్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో భూభారతి కింద పునరావాస గ్రామమైన కోమన్‌పల్లిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామంలోని భూములను రీసర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ కోమన్‌పల్లిలో మొత్తం 419 సర్వే నంబర్ల కింద 616 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే చేసి పూర్తిస్థాయి రికార్డులు రూపొందించామన్నారు. దీనిపై రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామశివారులోని భూములను, ఎస్సారెస్పీ కాలువల భూములను ఎస్సారెస్పీ ఈఈ చక్రూనాయక్తో కలిసి పరిశీలించారు. పంచాయతీ రాజ్ అధికారులతో గ్రామంలోని రోడ్ల భూములపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల ఏడీ(సర్వే) వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. కేజీబీవీ సందర్శన సారంగాపూర్ కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం సందర్శించారు.విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని సూచించారు. 8వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్‌తో పాటు బయోలజీ సబ్జెక్టులను బోధించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి ఇచ్చిన సమాధానంతో మరింత వివరించారు. పరిసరాలు, వంట గదిలో నిల్వ ఉన్న స్టాక్‌ను పరిశీలించి భోజనం రుచిగా, శుచిగా ఉండాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి బాగుందని అభినందించారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
వర్షాలు లేక కష్టంగానే ఉంది
ఈ సీజన్లో వర్షాలు కురువకపోవడం, కురిసిన ఒక్కటి, రెండు జల్లులకే పరిమితమవడంతో సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నాలుగైదు రోజులు వర్షాలు పడకపోతే ఆరుతడి పంటలు వాలిపోతాయి. ప్రస్తుతం వ్యవసాయ బావుల్లో ఉన్న నీటితో పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడింది. – రాజేందర్ రెడ్డి, చిట్టాపూర్, మల్లాపూర్(మం) ఇంకా సమయం ఉంది వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల జూలైలో పెద్దగా వర్షాలు కురవలేదు. నైరుతీ రుతుపవనాలకు ఇంకా సమయం ఉంది కాబట్టి అగస్టులో వర్షం పడేందుకు అవకాశాలు ఉన్నాయి. రైతులు వర్షాల గురించి ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ హరీశ్‌కుమార్ శర్మ, వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస -
రాష్ట్రంలో గృహ నిర్మాణానికి ప్రాధాన్యం
● 4లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం ● మాజీ మంత్రి జీవన్రెడ్డిజగిత్యాలరూరల్: రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2025–26 సంవత్సరానికి 4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. దశాబ్దకాలంగా మంజూరు కాని రేషన్‌కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హత ప్రాతిపాదికన మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజంగి నందన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ శీలం సురేందర్, మాజీ ఎంపీపీ మహేశ్, నాయకులు శ్రీరాముల గంగాధర్, మంగళారపు మహిపాల్, సత్తిరెడ్డి, మన్మోహన్, వంశీ, శంకర్, మల్లారెడ్డి, తిరుపతిరావు పాల్గొన్నారు. -
చిరుజల్లులకే పరిమితమైన వర్షాలు
● జిల్లాలోని 20 మండలాల్లో లోటు వర్షాపాతమే.. ● రైతులకు వ్యవసాయబావులే ఆధారం ● రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు అంతంతే.. జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభమై జూన్, జూలై నెలలు గడిచినప్పటికీ చిరుజల్లులకే పరిమితమవుతున్నాయి. ఒక్కటి, రెండు మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ పెద్దగా చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు నిండిన దాఖలాలు లేవు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షంతో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కంది, పెసర పంటలకు కొంతమేర ఉపశమనం కలిగింది. అయితే నాలుగైదు రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఆరుతడి పంటలు సైతం వాలిపోతున్నాయి. ఇక వరి పొలాలు సాగు చేసే రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాబోయే ఐదు రోజుల్లో కూడా వర్షాలు పెద్దగా లేవని, చిరుజల్లులకే పరిమితం కావచ్చని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లా అంతటా లోటు వర్షపాతమే.. ఆగస్టు నెల వచ్చినప్పటికీ ఇప్పటికి జిల్లాలోని 20 మండలాల్లో అంతంటా లోటు వర్షాపాతమే కనిపిస్తోంది. జిల్లాలో ఆగస్టు 1 నాటికి సాధారణ వర్షాపాతం 445.7 మి.మీ ఉండాల్సి ఉండగా.. 331.6 మి.మీ. మాత్రమే కురిసింది. జిల్లా అంతటా సగటున 26 మి.మీ. తక్కువ వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 28 మి.మీ, మల్లాపూర్‌లో 6.0 మి.మీ, రాయికల్‌లో 27.0 మి.మీ, బీర్పూర్లో 27.0 మి.మీ, సారంగాపూర్‌లో 10.0 మి.మీ, ధర్మపురిలో 27.0 మి.మీ, బుగ్గారంలో 35.0 మి.మీ, జగిత్యాల రూరల్‌లో 23.0 మి.మీ, జగిత్యాలలో 30.0 మి.మీ, మేడిపల్లిలో 15.0 మి.మీ, కోరుట్లలో 26.0 మి.మీ, మెట్పల్లిలో 40.0 మి.మీ, కథలాపూర్‌లో 32.0 మి.మీ, కొడిమ్యాలలో 19.0 మి.మీ, మల్యాలలో 26.0 మి.మీ, పెగడపల్లిలో 24.0 మి.మీ, గొల్లపల్లిలో 31.0 మి.మీ, వెల్గటూర్‌లో 35.0 మి.మీ, ఎండపల్లిలో 29.0 మి.మీ, బీమారంలో 16.0 మి.మీ తక్కువ వర్షాపాతం నమోదైంది. వ్యవసాయబావులపైనే ఆధారం జిల్లాలో లోటు వర్షాపాతం ఏర్పడటంతో రైతులు వ్యవసాయబావుల్లో ఉన్న నీటిపై ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో వానాకాలం సీజన్ పంటలన్నీ వర్షాధారంపైనే పండేవి, అవసరమైనప్పుడు బావి ద్వారా ఒక్కటి రెండు నీటి తడులు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు కురువకపోవడంతో పూర్తిగా వ్యవసాయబావులపైనే ఆధారపడుతుండటంతో ఆ బావులు సైతం అడుగంటుతున్నాయి. -
36 మంది బాలకార్మికులకు విముక్తి
● జిల్లాలో ముగిసిన ఆపరేషన్ ముస్కాన్జగిత్యాలక్రైం: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయస్సులో పనిలో మగ్గిపోతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు జూలై1నుంచి 31వరకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. బడిబయట ఉన్న 36 మంది చిన్నారులను గుర్తించిన అధికారులు వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కొంతమంది చిన్నారులు ఆర్థికంగా ఇబ్బందులతో తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి బడికి వెళ్లకుండా వెట్టి చాకిరి చేస్తున్న బాలలకు జిల్లా పోలీసు శాఖ, ఐసీడీఎస్ అధికారులు విముక్తి కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అశోక్‌కుమార్ ఒక సబ్‌డివిజన్ పరిధిలో ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక్క మహిళా కానిస్టేబుల్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రతిరోజూ జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటళ్లు, దాబాలు, దుకాణాల్లో, బేకరీల్లో పనిచేస్తున్న 36 మందిని గుర్తించారు. చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలుజిల్లాలో బడీడు పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జూలై 1నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో 36 మందికి విముక్తి కల్పించాం. పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశాం. – అశోక్‌కుమార్, ఎస్పీ, జగిత్యాల జిల్లా -
ఆస్తిపన్ను పక్కదారి పట్టించిన ఉద్యోగిపై వేటు
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఆస్తిప న్ను డబ్బులు పక్కదారి పట్టించిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఈ విషయమై కమిషనర్ స్పందనను అడుగగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు సొంతానికి వాడుకున్న బిల్‌కలెక్టర్ నర్సయ్యను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆలస్యంగా ఆస్తిపన్నుకు సంబంధించిన డిపాజిట్‌ను మున్సి పల్ అకౌంట్లో జమచేయడంతో మెమో ఇచ్చామని, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సస్పెండ్ చేశామని అన్నారు. తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలిజగిత్యాల: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంక్షేమ అధికారి నరేశ్ అన్నారు. ప్రస్తుతకాలంలో తల్లిదండ్రులు బిడ్డకు సంరక్షణ అందించడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని, ప్రసవం అనంతరం పిల్లల సంరక్షణ ఎంతో ముఖ్యమైందని తెలిపారు. తల్లిపాల గురించి ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ఓపెన్ స్కూల్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపుజగిత్యాల: ఓపెన్ స్కూల్‌కు 2025–26 సంవత్సరానికి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ ప్రవేశాల కోసం నిర్ణీత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18 వరకు గడువు పొడిగించినట్లు డీఈవో రాము తెలిపారు. ఆలస్య రుసుముతో 19నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం అన్ని పత్రాలను విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపుజగిత్యాలఅగ్రికల్చర్: ఉద్యోగులు అంకితభావ ంతో పనిచేస్తేనే సంస్థకు గుర్తింపు వస్తుందని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖలో ఇటీవల బదిలీపై వచ్చిన ఏపీఎంలతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అమలు చేస్తున్న బ్యాంకు లింకేజీ, మార్కెటింగ్, ఫామ్–నాన్ ఫామ్, సీ్త్రనిధి కార్యక్రమాలు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను విజయవంతం చే యాలని కోరారు. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా ను ముందంజలో ఉంచేందుకు కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరిన ఏపీఎంలు డీఆర్డీఏ పీడీ రఘువరణ్‌కు పుష్పగుచ్ఛం అందించారు. ఏపీడీ సునీత, డీపీఎంలు విజయభారతి, నాగేశ్వర్రావు, నారాయణ, పాల్గొన్నారు. మహిళా కళాశాలలో ఏఐ అంతర్జాతీయ ఉచిత శిక్షణజగిత్యాల: ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినులకు విద్యాశాఖ, హైదరాబాద్ ఏఐ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్న శిక్షణను ఆన్లైన్లో మూడు నెలల పాటు కల్పిస్తారన్నారు. ఈ కోర్సుతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 కళాశాలలు ఎంపిక చేయగా.. అందులో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉందని, ఇది మన అదృష్టమని పేర్కొన్నారు. -
‘డబుల్’ అర్హుల సర్వే
జగిత్యాల: పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకేంద్రం శివారులోని నూకపల్లిలో డబుల్బెడ్రూం నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ఇక్కడ 4,520 ఇళ్లు నిర్మించారు. దాదాపు ఇళ్లన్నీ పూర్తయ్యాయి. లబ్ధిదారులను డ్రా పద్ధతిన ఎంపిక చేసి ఇళ్లను కేటాయించారు. ప్రస్తుతం సుమారు 880 వరకు ఇంకా ఖాళీగా ఉన్నాయి. వీటిని లబ్ధిదారులకు కేటాయించేందుకు ఇటీవలే కలెక్టర్ సత్యప్రసాద్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. జగిత్యాలకు చెందిన 1088 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి వివరాలు సేకరిస్తున్న అధికారులు.. అర్హులైన వారికి ఇళ్లు కేటాయించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే చేపడుతున్నారు. ● యాప్‌లో నమోదు చేసిన అధికారులు ● అన్ని అర్హతలుంటేనే ఇల్లు కేటాయింపు ● పకడ్బందీగా చేపడుతున్న అధికారులు48 మందికి కేటాయింపు డబుల్బెడ్రూంల కోసం దరఖాస్తు చేసుకున్న 1088 మందిలో అర్హులెవరు.. అనర్హులెవరూ.. తెలుసుకునేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇందులో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీడీవోలు ఉన్నారు. వీరి పర్యవేక్షణలో సర్వే కొనసాగుతోంది. కచ్చితంగా అర్హులైన వారికే ఇళ్లు దక్కేలా పకడ్బందీగా సర్వే చేపడుతున్నారు. దీనికి 360 డిగ్రీల్లో ఓ యాప్‌ను ఏర్పాటు చేసి అందులో వీరి వివరాలు పొందుపర్చి కలెక్టర్‌కు పంపించనున్నారు. ప్రభుత్వానికి వెళ్లిన అనంతరం అర్హులైన వారి లిస్ట్ గృహ నిర్మాణశాఖకు రానుంది. గతంలో అనేక తప్పిదాలు నూకపల్లిలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లలో గ తంలో అనేక తప్పిదాలు జరిగాయి. ఆ శాఖలో పనిచేసిన ఓ ఉద్యోగి ఏకంగా అనుకూలమైన వ్యక్తులకు కేటాయించడంతో సస్పెండ్ అయ్యారు. ఈ సారి అలాంటిదేమీ చేయకుండా పకడ్బందీగా సర్వే చేపడుతున్నారు. గతంలో డ్రా పద్ధతిలో ఏర్పాటు చేసి మినీస్టేడియంలో అందరిముందే డ్రా తీశారు. డ్రా తీసి జాబితాను రూపొందించారు. ఆ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇతర మండలాలకు చెందిన వారిని కొంత మందిని జాబితాలో చేర్చడంతో అనేకమంది అర్హులు కాని వారికి డబుల్బెడ్రూంలు దక్కాయి. ఈసారి అలాంటివి జ రగకుండా ఉండాలనే ఉద్దేశంతో తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీవోలు మొత్తం 48 మంది సర్వే చేస్తున్నారు. అభివృద్ధికి ఊతం నూకపల్లి సమీపంలో 4520 డబుల్బెడ్రూంల ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో అతిపెద్ద కాలనీగా అవతరించింది. దీనిని మున్సిపాలిటీలో కూడా విలీనం చేశా రు. ఇక్కడే రాష్ట్ర ఆవిర్భావానికి ముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించింది. కానీ.. అవి పునాదుల వరకు.. కొన్ని స్లాబ్ వరకే నిర్మించుకుని వదిలేశారు. తాజాగా డబుల్బెడ్రూం కాలనీ వద్ద అంగన్వాడీ సెంటర్, స్కూల్ బిల్డింగ్, ఆస్పత్రి వంటి సౌకర్యాల నిర్మాణం చేపట్టేందుకు స్థలం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ని ర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కూల్చివేశారు. ఇది వివా దాస్పదంగా మారింది. గతంలో తమకు కేటాయించిన ఇళ్లను కూల్చివేశారంటూ కలెక్టర్‌కు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా ఆ కాలనీని సందర్శించి పేదలకు అన్యాయం చేయొద్దని అధికారులకు సూచించారు. మరోవైపు బాధితులకు డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రకటించారు. అర్హుల ఎంపిక కోసం సర్వేడబుల్బెడ్రూం ఇళ్ల కోసం 1088 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సర్వే చేస్తున్నాం. పక్కాగా అర్హులైన వారికే ఇళ్లు కేటాయిస్తాం. వివరాలన్నీ యాప్‌లో నమోదు చేస్తున్నాం. – రాంమోహన్, అర్బన్ తహసీల్దార్ -
పూర్వ వైభవం దిశగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
జగిత్యాల: పునర్వైభవం దిశగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ముందుకెళ్తున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలను సందర్శించారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అడ్మిషన్లు సాధించడంలో ప్రభంజనం సృష్టించాయని తెలిపా రు. ప్రతీ అధ్యాపకుడు విద్యార్థులకు ఎన్నో సేవలందించడం జరుగుతుందని, విద్యార్థుల సంఖ్య పెరగడమే దానికి నిదర్శనమన్నారు. అధ్యాపకుల సంఘం తరుఫున అడ్మిషన్లతో పాటు, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆడెపు శ్రీనివాస్, కరుణాకర్, తోట మహేశ్, కృష్ణారెడ్డి, పడాల తిరుపతి, గోవర్దన్, మధూకర్, సంగీతరాణి, సుజాత పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకూ ముఖ హాజరు
● విద్యార్థులకు ఉపయోగించే యాప్ వినియోగం ● అన్ని పాఠశాలల్లో అమలు ● తొలిరోజు 70శాతమే నమోదుజగిత్యాల: విద్యార్థులకే పరిమితమైన ముఖ గుర్తింపు హాజరు శుక్రవారం నుంచి ఉపాధ్యాయులకు సైతం అమలవుతోంది. గతంలో విద్యార్థులు పాఠశాలలకు రాకపోవడంతో హాజరు మాత్రం ఉండటంతో డుమ్మా కొట్టే విద్యార్థుల కోసం ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానం(ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేశారు. ఉపాధ్యాయులకు సైతం అమలు చేయడంతో విధులకు డుమ్మా కొట్టే వారికి చెక్ పడే అవకాశం ఉంది. డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ ద్వారా అమలు విద్యార్థులకు ఉపయోగిస్తున్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ యాప్ ద్వారానే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్ టీ చింగ్ సిబ్బంది హాజరు కావాల్సి ఉంటుంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదట పెద్దపల్లి జిల్లాలో చే పట్టగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో చేపడుతున్నారు. తొలిరోజు 70 శాతం ఉపాధ్యాయులకు శుక్రవారం నుంచి ముఖ గుర్తింపు హాజరు అమలు కావడంతో జగిత్యాల జిల్లాలో తొలిరోజు డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా 70 శాతం హాజరు నమోదైంది. 30 శాతం ఉపాధ్యాయుల అటెండెన్స్ నమోదు కాలేదు. సర్వర్ సమస్య: జిల్లాలో ఒకేసారి ఒకే సమయంలో అందరు ఒకే యాప్‌లో నమోదు చేయడంతో సర్వర్ సమస్యగా మారింది. కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు చాలా సేపు ప్రయత్నించినా సర్వర్ సమస్యతో అటెండెన్స్ పడలేదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచే యాప్ అమలులోకి వచ్చినప్పటికీ వారం రోజుల వరకు చూడటం జరుగుతుందని విద్యాధికారులు తెలిపారు. ముఖ హాజరు తప్పనిసరి ఉపాధ్యాయుల ముఖ హాజరు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. తొలిరోజు సర్వర్ సమస్య వచ్చింది. వారం రోజుల పాటు ఇది గమనించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దేలా చర్యలు తీసుకుంటాం. – రాము, డీఈవో -
రేవంత్‌రెడ్డి ఫొటోను తెగవాడేస్తున్న ఉద్యోగులు
సాక్షి, జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగుల హాజరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం యాప్ తీసుకొస్తే.. ఆ యాప్‌ను ఎడాపెడా తమకు ఇష్టానుసారం వాడేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో బయటపడ్డ వ్యవహారం ఉన్నతాధికారుల్నే అవాక్కై నోట మాట రాకుండా చేసింది. జగిత్యాలలో ఓ ఉద్యోగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్న వైనం వెలుగు చూసింది. పంచాయితీ కార్యదర్శుల కోసం ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుంచే అటెండెన్స్ నమోదుకు అవకాశం కల్పించింది. అయితే అందులో కొంత మంది రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో ఓ పంచాయితీ కార్యదర్శి మాత్రం నిత్యం విధులకు రాకుండా ఆ యాప్‌లో సీఎం ఫొటోను అప్లోడ్ చేశాడు. అది చూసి అధికారుల నోట మాట రాలేదు. ఈ సార్‌లాగే.. మరికొందరు చేసినట్లు గుర్తించారు. అంతేకాదు మరికొందరు విధులను ఎగ్గొట్టి ఇతరుల సాయంతో అటెండెన్స్‌ను నమోదు చేసుకుంటున్నట్లు తేలింది. చివరికి.. ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టి అటెండెన్స్ నమోదు చేసుకుంటున్న తీరుపైనా విచారణ కొనసాగుతోంది.ఇదీ చదవండి: హైకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట -
కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు
● శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అభివృద్ధి పనులు షురూ ● హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్, క్యాంపస్‌లో లా కళాశాల ● ఎల్ఎండీ, క్యాంపస్‌లో ఎంసీఏ కోర్సు మంజూరు ● మూడు ఆడిటోరియంల ఆధునీకరణ ● ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని క్యాంపస్ భూముల రక్షణకు ప్రహరీ ● మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి ఈ నెల 4న శంకుస్థాపనసాక్షిప్రతినిధి,కరీంనగర్: గత వైస్ చాన్స్‌లర్ హయాంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాతవాహన యూనివర్సిటీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. కొత్త కళాశాలలు, కోర్సులతో మరింత విస్తరిస్తోంది. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే కొత్త కళాశాలలు, కోర్సులకు అనుమతులు పొందడంతోపాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ, క్యాంపస్‌లో లా కాలేజీతోపాటు ఫార్మసీ కాలేజీలో ఎంఫార్మసీ కోర్సు, క్యాంపస్‌లో ఎంసీఏ కోర్సు, అకడమిక్ బ్లాక్, రెండు కొత్త హాస్టళ్లు మంజూరయ్యాయి. ఇంజినీరింగ్, లా కాలేజీ నిర్వహణకు 120 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ‘బండి’ సహకారంతో లా కాలేజీకి గుర్తింపు ఎస్‌యూ క్యాంపస్‌లో మూడేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులతో లా కాలేజీ ప్రారంభం కాబోతోంది. మూడేళ్ల లా కోర్సులో ఒక్కో సెక్షన్లో 60 అడ్మిషన్ల చొప్పున 120 సీట్లు(2 సెక్షన్లు), ఎల్ఎల్ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా)లో 20 సీట్లు మంజూరు చేశారు. లా కాలేజీలో బోధనకు 14 టీచింగ్, 19 నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు తప్పనిసరి కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో అతి తక్కువ కాలంలో అనుమతులు లభించాయి. ఫార్మసీ కళాశాలకు మహర్దశ ఎల్ఎండీ సమీపంలోని ఫార్మసీ కళాశాలలో ఇ న్నాళ్లు బీఫార్మసీ కోర్సు మాత్రమే ఉండేది. తాజాగా ఎంఫార్మసీ ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆ ఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఫార్మసీ కళాశాలలో పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో చేపట్టిన అకడమిక్ బ్లాక్ నిర్మాణ పనులకు గత నెల 22న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. ఫార్మసీ కళాశాల భూములు ఆక్రమణకు గురికాకుండా రూ.2.85 కోట్ల వర్సిటీ నిధులతో ప్రహరీ పనులు ప్రారంభించారు. సదుపాయాలకు పెద్దపీట వర్సిటీలో సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తకాలేజీలు, హాస్టళ్లు, ఆడిటోరియాలు నిర్మిస్తున్నాం. క్యాంపస్‌లో శాతవాహన విగ్రహం ప్రతిష్టించనున్నాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు యూనివర్సిటీ విషయంలో సానుకూలంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్వరలో వర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – ఉమేశ్ కుమార్, వీసీ, శాతవాహన యూనివర్సిటీహుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరంలో హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం కాబోతోంది. ఇందులో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు మంజూరు చేశారు. ఇందుకోసం 54 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. బీటెక్‌లో ఒక్కోబ్రాంచ్లో 60అడ్మిషన్ల చొప్పున 240 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో ఇప్పటికే 110మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు.మరెన్నో పనులు గోదావరిఖని పీజీ కాలేజీలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఎంబీఏ బ్లాక్ వరకు అప్రోచ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలలో గతంలో ఉన్న పాత సెమినార్ హాల్‌ను సరికొత్త సీటింగ్, సౌండ్ సిస్టంతో ఆధునీకరించి మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీలో కొత్త కంప్యూటర్ ల్యాబ్, అన్ని డిపార్ట్మెంట్లు, ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని పీజీ కాలేజీలో డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేశారు.మరో రెండు కొత్త హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. యూనివర్సిటీలో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్‌లో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని నిర్ణయించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో ఈ హాస్టళ్ల పనులకు ఈ నెల 4న శంకుస్థాపన చేసేందుకు జిల్లా ఇన్చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఆహ్వానించినట్లు వీసీ ఉమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో రూ.18 కోట్లతో లా కాలేజీతో పాటు, సెంట్రల్ లైబ్రరీలో సెమినార్ హాల్ ఆధునీకరణ, పరిపాలన భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న నూతన సెమినార్ హాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. -
సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గొల్లపల్లి: సన్నబియ్యం పేదలకు అందించడం విప్లవాత్మక మార్పు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గొల్లపల్లి మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలానికి మంజూరైన 1,658 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, 67 మందికి రూ.60 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, 55మందికి రూ.18.41 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అర్హుందరికీ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్డులు రానివారు కంగారు పడొద్దని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. కొత్త పేర్లు చేర్చేందుకు అవకాశం కల్పించామన్నారు. మల్లన్నపేటలో బస్సు సేవలు ప్రారంభం మండలంలోని మల్లన్నపేటలో ఆర్టీసీ బస్సు సేవలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల అభీష్టం మేరకు బస్సును పునఃప్రారంభించామన్నారు. బస్సు మల్లన్నపేట, శంకర్రావుపేట, నందిపల్లి, లక్ష్మీపూర్ మీదుగా జగిత్యాల వెళ్తుందని, సేవలు వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లక్ష్మణ్‌కుమార్ విప్‌గా ఉన్నప్పుడు మండలకేంద్రంలో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలని వందమందికి పైగా యువత కోరారు. అప్పుడు మాట ఇచ్చిన అడ్లూరి మంత్రిగా సర్వేనంబరు 735లోని ఆరెకరాల స్థలాన్ని క్రీడామైదానానికి కేటాయిస్తూ.. ప్రొసీడింగ్కాపీ అందించారు. ప్రభుత్వ నిధులతో మైదానాన్ని తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసూదన్, డీఎస్వో జితేందర్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం కల్పన, తహసీల్దార్ వరందన్, ఎంపీడీవో రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిషాంత్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకోవడం తగదు మెట్పల్లి: బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని మంత్రి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, తాము 55వేల కుటుంబాలకు కార్డులను అందించామన్నారు. ధర్మపురి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, నాయకులు ఉన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయం బుగ్గారం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. మండలంలోని పలువురు లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్‌కార్డుల సేవలు పొందవచ్చని తెలిపారు. 21 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. బీసీ సంక్షేమ అధికారి సునీత, తహసీల్దార్ మాజిద్, ఎంపీడీవో అఫ్జల్‌మియా తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
జగిత్యాలరూరల్: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించా రు. మండలంలోని కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ ఎంత అని చూశారు. ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి శానిటేషన్ చేయించాలని అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మసీ రిజిస్టర్ పరిశీలించారు. వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, వైద్యురాలు సౌజన్య, అధికారులు, సిబ్బంది ఉన్నారు. పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం జగిత్యాల: హైదరాబాద్‌లోని బేగంపేట పబ్లిక్ స్కూల్లో 1, రామంతపూర్‌లో ఒకటో తరగతిలో ఒక సీటులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తులను ఈనెల 11న అందించాలన్నారు. ముందుగా అంగన్వాడీ, రెసిడెన్షియల్, గురుకులాలకు కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు తెరిచారు. సఖీ కేంద్రం సేవలు అభినందనీయంజగిత్యాల: సఖీ కేంద్రం సేవలు అభినందనీయమని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ మేజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యశర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని సఖీ సెంటర్‌ను గురువారం తనిఖీ చేశారు. కౌన్సెలింగ్ అర్థమయ్యేలా ఇవ్వాలని, ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. లీగల్ కేసులపై అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లావణ్య పాల్గొన్నారు. విద్యార్థులకు సరళమైన పద్ధతిలో బోధించాలి● డీఈవో రాము జగిత్యాల: విద్యార్థులకు సరళమైన పద్ధతిలో బోధించాలని డీఈవో రాము అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల సులభమైన పద్ధతిలో బోధిస్తేనే అర్థమవుతుందన్నారు. బాధ్యతగా తీసుకుని విద్యార్థులకు మంచి పునాది వేయాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి రాజేశ్ పాల్గొన్నారు. మన ఊరు – మన బడి బిల్లులు చెల్లించండిజగిత్యాలటౌన్: మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా చేసిన పనుల బిల్లులు రాక రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని, వాటిని చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. పలువురు కాంట్రాక్టర్లు కలెక్టరేట్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వక్తం చేశారు. ధర్మపురి జెడ్పీహెచ్ఎస్లో పనులు చేసినా.. బిల్లులు రాక పాత అంజన్న అనే కాంట్రాక్టర్ తీవ్ర ఒత్తిడికి లోనై మరణించాడని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి ఈనెల 10లోపు బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే 15న పాఠశాలలకు తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. -
పథకాలు పేదలకు అందించడమే లక్ష్యం
● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్మల్లాపూర్: ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరాలని, అర్హులకు అందేలా చూస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు గురువారం రేషన్‌కార్డు పత్రాలు పంపిణీ చేశారు. కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, రానివారు మీ సేవలో దరఖాస్తు చేసుకుని రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేక నానా అవస్థలు పడ్డామని, పదేళ్ల కేసీఆర్ పాలనతో 24గంటల విద్యుత్‌తోపాటు సాగునీటి సమస్య తీరిపోయిందన్నారు. అదనపు కలెక్టర్ లత, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, ప్యాక్స్ చైర్మన్లు బద్దం అంజిరెడ్డి, నేరళ్ల మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో.. ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. పథకాలను ప్రజలు విని యోగించుకోవాలన్నారు. సివిల్ సప్లయ్ డీఎం జి తేందర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. పాలిటెక్నిక్ సందర్శన కోరుట్ల: పట్టణ శివారులోని పాలిటెక్నిక్‌ను ఎమ్మెల్యే సంజయ్ సందర్శించారు. విద్యార్థులను గతేడాది హైదరాబాద్‌లోని టీహబ్ సందర్శనకు తీసుకెళ్లామని, ఈ ఏడాది ఆగస్టు 14న వందమంది విద్యార్థులను తీసుకెళ్తామని పేర్కొన్నారు. కళాశాల వద్ద బస్సులు నిలపడం లేదని విద్యార్థులు తెలపగా.. ఆర్ఎంతో మాట్లాడారు. బస్సు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాల ప్రాంగణంలో పలువురు మద్యం సేవిస్తున్నారని తెలపగా ఎస్సైతో మాట్లాడారు. కళాశాల వరకు పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. పిచ్చి మొక్కలు ఉండటంతో క్లీన్ చేయించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. -
ప్లాస్టిక్ నివారణ ఎంతో అవసరం
ప్లాస్టిక్ నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం ఆశించదగిన పరిణామం. ఈ విషయంలో వ్యాపారవర్గాలతో పాటు ప్రజలు తప్పకుండా కలిసిరావాలి. ప్లాస్టిక్‌తో జరుగుతున్న అనర్థాలపై యువజన సంఘాల తరఫున ప్రచారం చేపడతాం. – రమణ, ప్రేరణ యూత్ అధ్యక్షుడు, కోరుట్ల రోగాలు ఇంటికి తెచ్చుకున్నట్లే ప్లాస్టిక్ వాడకంతో నష్టం ఉందని తెలిసినా కొంతమంది చిన్నపాటి నిర్లక్ష్యంతో బట్టసంచులు వాడటం లేదు. ఇప్పటినుంచి బట్ట సంచులు వాడతాం. ప్లాస్టిక్ సంచుల్లో సరుకులు తెచ్చుకుంటే రోగాలు ఇంటికి తెచ్చుకున్నట్లే. – అనితాదేవి, కోరుట్ల -
యువకుడి వైద్యానికి రూ.1.52లక్షల విరాళం
● సామాజిక మిత్రుల ఔదార్యంధర్మపురి:ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి.. వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ యువకుడికి సామాజిక మిత్రులు రూ. 1.52 లక్షలు విరాళాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ధర్మపురికి చెందిన అక్కెనపెల్లి రాజే శం, అంజలి దంపతుల కుమారుడు రాజు (42) ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తల్లిదండ్రులు అప్పు చేసి బ్రెయిన్ సర్జరీ చేయించా రు. అయినప్పటికీ నయం కాలేదు. మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం రాజు తండ్రి చనిపోయా డు. ప్రస్తుతం తల్లి అంజలితో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. సర్జరీ చేయాలంటే రూ.లక్షకు పైగా ఖర్చవుతుండగా.. ఆ మొత్తం లేనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాజు పరిస్థితిని తెలుసుకు న్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ జూలై 4న ఫేస్బుక్లో పోస్టు చేసి సాయం కోరాడు. స్పందించిన ఎన్నారైలు, స్థానికులు అంజలి బ్యాంకు ఖాతాకు రూ.1.52లక్షలు విరాళాల రూపంలో అందించారు. వాటిని స్థానిక సీఐ రాంనర్సింహారెడ్డి ఎస్సై ఉదయ్‌కుమార్, యూనియన్ బ్యాంకు మేనేజర్ మాధవరావుతో కలిసి బాధిత కుటుంబానికి అందించారు. త్వరలోనే రాజుకు ఆపరేషన్ చేస్తారని రమేశ్ తెలిపాడు. -
కోరుట్లలో నో ప్లాస్టిక్!
కోరుట్ల: నో.. ప్లాస్టిక్ నినాదంతో కోరుట్ల బల్దియాలో శుక్రవారం నుంచి ప్రత్యేక కార్యాచరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. కేవలం ప్రచారంతో సరిపెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి గట్టి చర్యలకు ఏర్పాట్లు చేసింది. 15 రోజులుగా మహిళాసంఘాల ద్వారా పట్టణంలోని అన్ని ఇళ్లకు బట్టసంచులు అందేలా చర్యలు చేపట్టింది. ఇక ప్లాస్టిక్ అమ్మకాలపై దృష్టి సారించారు. సగం ప్లాస్టిక్ వ్యర్థాలే.. కోరుట్లకు సంబంధించి కల్లూర్‌రోడ్‌లో డంప్‌యార్డు ఏర్పాటు చేశారు. బల్దియాలోని 33వార్డుల్లో ప్రతిరోజూ సుమారు టన్ను చెత్త వెలువడుతుంది. ఈ చెత్తను వార్డుల వారీగా ఏర్పాటు చేసిన ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. ఇలా తరలిస్తున్న చెత్తలో సగానికి మించి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండటం గమనార్హం. ఇటీవల మున్సిపల్ కమిషనర్ రవీందర్ వేకువజామున డంప్ యార్డుకు వెళ్లి పరిశీలించగా అందులో సగానికి మించి ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండటం..అవి నాశనం కాకపోవడంతో మళ్లీ అదనంగా చెత్త వేయడానికి స్థలం లేకుండాపోవడం సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకుని కాలిపోయి పొగతో పాటు కార్బన్‌మోనాకై ్సడ్ వంటి విషవాయువు విడుదల కావడంతో చుట్టుపక్క ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కమిషనర్ ముందుగా పట్టణంలో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండొద్దన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి కోరుట్ల బల్దియాలో ప్రత్యేక చర్యలు భారీగా జరిమానాలకు రంగం సిద్ధం గోదాముల్లో తనిఖీకి బృందాలు ఇంటింటికీ బట్ట సంచులు పంపిణీఇంటింటికీ బట్ట సంచులు పట్టణంలోని 33వార్డుల్లో సుమారు 27వేల వరకు నివాసాలు ఉన్నాయి. పట్టణంలోని అన్నివార్డుల్లో మహిళాసంఘాల గ్రూపుల్లో పూర్తిస్థాయిలో మహిళల భాగస్వామ్యం ఉంది. వారం క్రితం మహిళాసంఘాల ఆర్పీల ద్వారా గ్రూపుల్లోని అన్ని సంఘాల మహిళకు బట్ట సంచులు అందించారు. అంతేకాకుండా మహిళా సంఘాల సభ్యులతో డంప్‌యార్డు వద్ద ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ పేరుకుపోవడంతో ఏర్పడుతున్న దుర్భర పరిస్థితిపై అవగాహన కల్పించారు. సరుకుల కోసం ప్రతిఒక్కరూ బట్ట సంచులు వాడేలా మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. ప్లాస్టిక్ నివారణకు అన్ని వర్గాలు కలిసిరావాలని ఆటోల ద్వారా వారం రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ప్లాస్టిక్ సంచుల అమ్మకాలు నిలిపేయాలని లేకుంటే రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని వ్యాపారవర్గాలకు సూచించారు. గోదాముల్లో ప్లాస్టిక్ నిల్వలు ఉంచినా చర్యలు తప్పవని ప్రచారం చేశారు. చివరగా శుక్రవారం నుంచి ప్లాస్టిక్ నివారణకు క్షేత్రస్థాయిలో అన్ని వార్డుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గట్టి చర్యలకు సిద్ధం కావడంతో కొంతలోకొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం భూ షణరావుపేటకు చెందిన స ంగెం వినోద్ (30) సౌదీ అరేబియా దేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సంగెం గంగరా జం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వినోద్ పెద్ద కుమారుడు. ఆయన కొంతకాలంగా గల్ఫ్ దేశం వెళ్లి వస్తున్నా డు. ఏడాదిన్నర క్రితం సౌదీ వెళ్లాడు. ఈనెల 22న వినోద్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు బుధవారం ఫోన్లో సమాచారం ఇచ్చారు. వినోద్‌కు ఇంకా పెళ్లి కాలేదు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదుజగిత్యాలక్రైం: భార్యను హత్య చేసిన భర్తకు జీ విత ఖైదుతోపాటు, రూ.2 వేల జరిమానా విధి స్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నారా యణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం యెకిన్పూర్కు చెందిన ఎర్ర చంద్రయ్య, భార్య గంగరాజు కూలీలు. చంద్రయ్య మద్యాని కి బానిసై గంగరాజుతోపాటు కొడుకును వేధించేవాడు. 2022 అక్టోబర్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో భార్యతో ఘర్షణ పడి ఆమెను హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని మూ టకట్టి యెకిన్‌పూర్ శివారులో పడేశాడు. మృతురాలి కుమారుడు సుధీర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షులను హాజరుపర్చారు. దీంతో చంద్రయ్యకు జడ్జి శిక్ష ఖరారు చేశారు. హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థులు● స్థానికులు పట్టుకుని తిరిగి అప్పగింత ● ఘటన ఆలస్యంగా వెలుగులోకి.. మల్యాల: మండలకేంద్రం శివారులోని జగిత్యా ల అర్బన్ గురుకులం విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకులాన్ని గతేడాది జగిత్యాల నుంచి మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 6, 7, 8 తరగతుల విద్యార్థులు 40మంది ఉన్నారు. ఈ ఏడా ది అడ్మిషన్ తీసుకున్న ఇద్దరు ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులు సోమవారం రాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోయారు. వారిని మండలకేంద్రంలో గుర్తించి తిరిగి వార్డెన్‌కు అప్పగించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఇరువర్గాలపై కేసు సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): భూ సమస్యపై గొడవపడగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి, కరీంనగర్ జిల్లా చర్లబూత్కూర్‌కు చెందిన బుర్ర రేణుక, భర్త రాములు, అల్లిపూర్‌కు చెందిన బండ రాణి, భర్త భూమయ్య, రేగడిమద్దికుంటకు చెందిన ముంజాల అశోక్, ఏరుకొండ వినోద్‌తోపాటు మరోవర్గం ముంజల శ్యామల, భర్త సతీశ్ భూసమస్యపై మంగళవారం గొడవ పడ్డారు. ఇదేసమయంలో పెట్రోలింగ్‌కు వెళ్లిన బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని సముదాయించినా వినకుండా పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారం ఇరువర్గాలను సీఐ సుబ్బారెడ్డి ఠాణాకు పిలిపించి నోటీసులు అందించారు. గొడవ పడొద్దని కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఏరుకొండ వినోద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో వినోద్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై సీఐని సంప్రదించగా భూసమస్యపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిగొల్లపల్లి: చదువు ఇష్టం లేక మనస్తాపంతో ఈనెల 25న క్రిమి సంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని గోవిందుపల్లికి చెందిన బోనగిరి సూర్య బుధవారం మృతిచెందినట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. సూర్యను ఇంటర్ చదువు నిమిత్తం తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. అక్కడ చదువుకోవడం ఇష్టం లేక ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో ఈనెల 25న ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సూర్య తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
● జన్నారం కేంద్రంగా కార్యకలాపాలు ● కాంబోడియా దేశం నుంచి సూచనలు ● వివరాలు వెల్లడించిన డీసీపీ భాస్కర్ జన్నారం: జన్నారం కేంద్రంగా సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సైబర్ నేరాలకు వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆయన కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్(వీ) గ్రామానికి చెందిన భావు బాపయ్య 2024 జూలైలో కాంబోడియా దేశానికి వెళ్లి రెస్టారెంట్లో పనికి కుదిరాడు. బాపయ్యకు కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పాలవల్సుల సాయికృష్ణ ఉరఫ్ జాక్ ఉరఫ్ రాజు విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుండగా 2023లోనే ఛండీఘర్‌లో పరిచయమయ్యాడు. 2024లో రాజు కాంబోడియా వెళ్లి బాపయ్యను రెస్టారెంట్లో కలిశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాపయ్య ఇండియాకు తిరిగి వచ్చాడు. ఓ రోజు వాట్సాప్‌లో బాపయ్యను సాయికృష్ణ సంప్రదించి.. జన్నారం ప్రాంతంలో తనకు ఒక అద్దె ఇల్లు కావాలని కోరాడు. దీనికి బాపయ్య తన చెల్లెలి భర్త, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రాజేశ్‌తో కలిసి కలమడుగు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఏడాది మేలో సాయికృష్ణ వాట్సాప్‌లో బాపయ్యను సంప్రదించి.. ఓ వ్యక్తి ద్వారా సామగ్రి పంపిస్తున్నానని, దానిని జగిత్యాల బస్టాండ్‌కు వెళ్లి తీసుకుని అద్దె గదిలో ఉంచాలని సూచించాడు. ఆ సమయంలో బాపయ్య అందుబాటులో లేకపోవడంతో అతడి తమ్ముడు మధుకర్ సామగ్రిని తీసుకెళ్లి కలమడుగులోని అద్దె గదిలో ఉంచారు. తర్వాత నెట్ కనెక్షన్, ఇన్వర్టర్, ల్యాప్‌టాప్ సమకూర్చుకున్నారు. తాను చెప్పినట్లు చేయాలని, ఇందుకు నెలకు రూ.30వేల చొప్పున ఇస్తానని, పైగా వచ్చిన సొమ్ములో వాటా కూడా ఇస్తానని బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్‌ను సాయికృష్ణ పనికి కుదుర్చుకున్నాడు. వీరితోపాటు అప్పటికే ఆన్లైన్ గేమ్స్ ఆడి రూ.లక్షలు పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రాపు కామేశ్‌ను నెలకు రూ.70వేల జీతం, వాటా ఇస్తానని ఉద్యోగానికి కుదుర్చుకున్నాడు. కామేశ్‌కు ఢిల్లీలోని ఓ వీల్స్ కంపెనీలో డీజిల్ సేల్స్‌లో అకౌంట్ కీ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలో బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్, కామేశ్ కలిసి అద్దె గదిలో డీలింక్ రూటర్లు, ల్యాప్‌టాప్, సిమ్ ప్యానల్ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. ఆధారాలు లేని సిమ్‌కార్డులు 350 కొనుగోలు చేశారు. సాయికృష్ణ టెలిగ్రాం యాప్ ద్వారా చెప్పినట్లు ఈ నలుగురు ప్యానెల్లో సిమ్‌లు అమర్చి, కొంత సమయం తర్వాత తీయడం, కొత్త సిమ్‌లు పెట్టడం చేస్తూ ఉండేవారు. సిమ్‌బాక్స్ పరికరాలు ఏర్పాటు చేసి వివిధ రకాలైన ఐఎంఈఐ నంబర్లు, లింకులు తయారు చేసి సైబర్ నేరాలు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. పట్టుబడింది ఇలా.. ఢిల్లీకి చెందిన టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సాంకేతిక పరిజ్ఞానంతో వీరి బండారాన్ని గుర్తించింది. రామగుండం సైబర్ క్రైం, పోలీసులు టెక్నికల్ సహాయంతో బుధవారం కలమడుగు చేరుకుని సోదాలు నిర్వహించారు. సోదాల్లో కామేశ్, భావు బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్ పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి సైబర్ నేరాలకు వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కాల్స్ లింక్స్ ఉన్నందున లోతైన విచారణ చేస్తున్నామని డీసీపీ వివరించారు. నిందితులను పట్టుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సైబర్ క్రైం డీసీపీ వెంకటరమణరెడ్డి, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అలెన్, అనురాగ్, సైబర్ క్రైమ్ సీఐలు కృష్ణమూర్తి, శ్రీనివాస్, ఎస్సైలు గొల్లపెల్లి అనూష, సురేశ్, తహసీనోద్దీన్‌ను రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీ అభినందించారు. -
డాబాపై కూరగాయల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: రసాయనాల నుంచి తప్పించుకునేందుకు చాలామంది పట్టణవాసులు ఇంటిపై.. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పండించుకుంటున్నారు. తద్వారా ఆరోగ్యమైన ఆహారం పొందడంతోపాటు మనస్సుకు ఆనందం, ఆహ్లాదం అందించుకుంటున్నారు. గృహిణులు ఒకప్పుడు ఖాళీ ప్రదేశాల్లో పువ్వులు, అలంకరణ మొక్కలకు ప్రాధాన్యమిస్తే.. ఇప్పుడు రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. ● ఆహ్లాదకర వాతావరణంలో.. కూరగాయలు పండిస్తున్న రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కొందరు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి రసాయనాలు లేకుండా.. ఇంటికి అవసరమైన కూరగాయలను ఇంటి డాబాపై, ఖాళీ ప్రదేశాల్లో పండించుకునేందుకు గృహిణులు ముందుకొస్తున్నారు. ఇంటి వాతావరణం మారిపోవడంతోపాటు చల్లని గాలి, పచ్చని మొక్కల మధ్య సేద తీరుతున్నారు. ● తేలికపాటి కుండీల ఎంపిక డాబాపై కూరగాయల పెంపకానికి తేలికపాటి కుండీలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కుండీలు, పైబర్‌తో తయారు చేసిన గ్రోబ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బకెట్లు, వాటర్ క్యాన్లు, సింక్ తొట్టీలు, పాత టైర్లు.. ఇలా అన్నింటిని కూరగాయల పెంపకానికి ఎంపిక చేసుకుంటున్నారు. నిటారుగా ఉండే అంతస్తుల కుండీలు, వేలాడేదీసే కుండీలను కూడా వాడుకోవచ్చు. ఇనుపకుండీలైతే మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. లోతు వేరు వ్యవస్థ గల మొక్కలకు ఎక్కువ లోతు కుండీలు.. తక్కువ వేరు వ్యవస్థ గల మొక్కలకు తక్కువ లోతు కుండీలను ఎంచుకోవాలి. బొప్పాయి, అరటి వంటి పెద్ద మొక్కలకు పెద్ద పరిమాణం గల ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగించవచ్చు. ● గ్రోబ్యాగ్స్ అనుకూలం గ్రో బ్యాగ్స్.. తక్కువ బరువు ఉండి, డాబాపై కూరగాయల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న మొక్కలకు అనుగుణంగా గ్రోబ్యాగ్స్ వినియోగించాలి. మార్కెట్లో వివిధ పరిమాణాలు, ఆకారాల్లో దొరుకుతాయి. వీటిలో మట్టి పరిమాణం తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. మట్టి మిశ్రమం అధికంగా ఉంటే డాబాపై బరువు పెరుగుతుంది. ఎర్రమట్టి, కోకోపీట్, పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు వంటి తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని కుండీల్లో నింపాలి. మార్కెట్లో రెడీమేడ్ కుండీ మిశ్రమం కూడా దొరకుతోంది. మట్టి మిశ్రమాన్ని నింపేటప్పుడు పైభాగంలో కొంత ఖాళీ వదలాలి, ● మొక్కల ఎంపిక ప్రధానం డాబాపై మొక్కల పెంపకానికి కూరగాయల ఎంపిక ప్రధానం. కాలానుగుణంగా పండే కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. శీతాకాలంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను పండించవచ్చు. వేసవిలో క్యాబేజీ, కాలీప్లవర్, క్యారెట్, ఆలుగడ్డ మినహాయించి మిగతా కూరగాయలు పండించవచ్చు. తీగజాతి వాటికి పందిరి వేసుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి షేడ్‌నెట్ వేసుకోవాలి. ఈ పద్ధతిలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా నాలుగు రకాల కూరగాయలు, రెండు లేదా మూడు రకాల ఆకుకూరలు పండించవచ్చు. ● నీటి యాజమాన్యం కీలకం దాబా తోటల్లో నీటిని క్యాన్ ద్వారా అందించవచ్చు. స్వయంగా మొక్క వయస్సు, ఎదుగుదలను బట్టి ఎంత నీరు అవసరముంటే అంత నీరు ఇవ్వవచ్చు. ఇంట్లోని వ్యర్థాల నుంచి కంపోస్టు తయారు చేసి మొక్కలకు పోషకాలు అందించవచ్చు. మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి చీడపీడలు వస్తే చేతి ద్వారా తీసివేయవచ్చు. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ వస్తే లింగాకర్షక బుట్టలు వాడి నివారించవచ్చు. ఎక్కువ చీడపీడలు వస్తే వేప నూనెను లీటర్ నీటికి 5 మి.లీ పిచికారీ చేస్తే సరిపోతుంది. రసాయనాలు లేని ఆకుకూరలు, కూరగాయలు అవగాహనతో ఆరోగ్యం కాపాడుకుంటున్న జనం కొన్నేళ్లుగా సాగు చేస్తున్న కొన్నేళ్లుగా ఇంటి పరిసరాలతోపాటు డాబాపై కూరగాయలు సాగు చేస్తున్నాను. మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండాపోయింది. పూత నుంచి పిందె, కాత వరకు జరిగే చర్యలు కూడా ఆసక్తికరంగా ఉంటుండటంతో ప్రతిరోజు ప్రతి మొక్కనూ పరిశీలిస్తాను. – సముద్రాల జ్యోతి, గృహిణి, జగిత్యాల చాలా కూరగాయలు పెంచొచ్చు ఇంటి ఖాళీ ప్రదేశాలు, డాబాలపై కూరగాయలు పెంచుకోవచ్చు. ఆసక్తి గల గృహిణులు గ్రూపుగా ముందుకొస్తే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తాం. కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలతోపాటు చిన్నపాటి సంచుల్లో టమాట, మిర్చి వంటి కూరగాయలు సాగు చేయవచ్చు. మా శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నాం. – స్వాతి, ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు
జూలపల్లి(పెద్దపల్లి): తన కొ డుకు, కోడలు మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మనస్తాప ంతో జెన్కో ఉద్యోగి మేడుదుల రాజన్న (49) బుధవారం తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్ర ం లోనే ఉరివేసుకుని ఆత్మ హ త్య చేసుకున్నాడు. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రా జన్న జూలపల్లి మండలం కాచాపూర్ 14వ మైలురా యి వద్ద గల జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు కుమారుడు సాయికుమార్, ఒక కూతురు ఉన్నారు. సాయికుమార్ 2020లో మేకల కావ్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు(3) ఉన్నాడు. అయితే, ఎంబీఏ చదువుకునేందు కు సాయికుమార్ 2022లో యూకేకు వెళ్లాడు. ఆ త ర్వాత ఆయన భార్య కావ్య తనతల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. 2024లో ఇండియాకు తిరిగి వచ్చిన సాయికుమార్.. తన భార్యను కాపురానికి రమ్మని అనేకసార్లు కోరినా ఆమె తిరస్కరించింది. దీంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి పంచాయితీలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తన కుమారుడి సంసారం సాఫీగా సాగడం లేదనే మనస్తాపానికి గురైన తండ్రి రాజన్న.. తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్రంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య జలవిద్యుత్ కేంద్రంలో బలవన్మరణం -
మతోన్మాదం రేపడమే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశంలో మతోన్మాదం రేపుతూ, ఓట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ వి.హన్మంతరావు అన్నారు. బీసీల కులగణన చేయాలని ఉద్యమిస్తున్న రాహుల్‌గాంధీ ఆకాంక్షను హర్షిస్తూ బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తాము ప్రధాని మోదీని కోరినా పట్టించుకోలేదన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరగాలని రాహుల్‌గాంధీ ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా ఉద్యమిస్తున్నారని, ఇందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలో యాభైశాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఇది కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌కు తగ్గట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముస్లిం రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ హిందూదేశంగా మార్చాలని కుట్రపూరితంగా ఉన్నాయన్నారు. బీసీ కులగణన కోసం ఆగస్టులో జంతర్‌మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, సూర్య దేవరాజు, వెలుముల స్వరూపరెడ్డి, బొప్ప దేవయ్య, రాపల్లి కళ్యాణ్, గుండ్లపెళ్లి గౌతమ్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ హనుమంతరావు -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
జగిత్యాలక్రైం: ప్రభుత్వ పనులు చేపట్టిన సివిల్ కాంట్రాక్టర్‌కు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన జగిత్యాల పంచాయతీ రాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీకంట్రోల్ విభాగం ఏఈ అనిల్ బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లికి చెందిన పంచరి వెంకటేశ్ సవిల్ కాంట్రాక్టర్. ఐదేళ్ల క్రితం కోరుట్లలో రూ.13.80 లక్షలతో ఎల్లమ్మ (గౌడ) కమ్యునిటీ హాల్ నిర్మించాడు. ఎంబీ రికార్డు కూడా పూర్తయింది. అలాగే రెండేళ్ల క్రితం రూ.4.50 లక్షలతో చిన్నమెట్‌పల్లిలో హనుమాన్ కమ్యునిటీ హాల్ నిర్మించాడు. కోరుట్లలోని ఆర్డీవో కార్యాలయం ప్రహరీని రూ.5లక్షలతో పూర్తి చేసి ఎంబీ రికార్డు పూర్తి చేయించాడు. మొత్తం మూడు పనులను రూ.23.30లక్షలతో పూర్తి చేశాడు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఏఈ అనిల్‌కుమార్‌ను కొన్నాళ్లుగా కోరుతున్నాడు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చిన అనిల్.. గత శనివారం రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీనికి వెంకటేశ్ రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని అదేరోజు రూ.3వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం కరీంనగర్‌రోడ్‌లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం వద్ద కాపుకాశారు. వెంకటేశ్ నుంచి అనిల్ రూ.7వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. అనిల్‌ను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064లో సంప్రదించాలని డీఎస్పీ వివరించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు పున్నం చందర్, కృష్ణకుమార్, తిరుపతి, సిబ్బంది శ్రీకాంత్, విష్ణు, బాలు, మొగిలయ్య పాల్గొన్నారు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్తో డబ్బుల డిమాండ్ ఏసీడీ డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడి -
ట్రాక్టర్ యజమానుల బైండోవర్
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నగునూరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మహేశ్, అశోక్‌ను బుధవారం తహసీల్దార్ రాజేశ్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. మరోసారి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించేలా సొంత పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సెల్‌ఫోన్ అప్పగింత కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన బోయిని రాజేశ్ పోగోట్టుకున్న సెల్‌ఫోన్‌ను సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా పట్టుకుని బుధవారం బాధితుడికి అప్పగించినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. జనవరి 6న మొగ్ధుంపూర్‌లో రాజేశ్ సెల్‌ఫోన్ పోగొట్టుకోగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్ టెక్నాలజీతో నిజామాబాద్‌లో గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. -
కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు
రాయికల్/సారంగాపూర్: కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పూర్తిగా విఫలమైందని, ఈ విషయాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. బుధవారం సారంగాపూర్ మండలం రేచపల్లిలో రేచపల్లి, మ్యాడారంతండా, లచ్చునాయక్‌తండా, భీంరెడ్డి గూడెంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన పంతెంగి లక్ష్మీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్‌ను అందించారు. వేర్వేరు చోట్ల మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. పార్టీ సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు వొడ్నాల జగన్, బుచ్చిమల్లు, మల్ల య్య, రాయికల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, నాయకులు హన్మండ్ల మహేశ్, మోర వెంకటేశ్వర్లు, సాగర్‌రావు, సత్యంరావు, రాజిరెడ్డి, సాయిరెడ్డి, బక్కన్న, నర్సయ్య పాల్గొన్నారు. -
ఇళ్లు శిథిలం.. పొంచి ఉన్న ప్రమాదం
జగిత్యాల: జిల్లాకేంద్రంలో పాత ఇళ్లు ఎప్పుడు కూలుతాయో తెలియకుండా ఉంది. ఇప్పటికే నాలు గు రోజులుగా ముసురు వర్షం కురుస్తోంది. ఇళ్ల గోడలు తడిచిపోయి ప్రమాదకరంగా మారాయి. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే ఇంటిభాగం కొంతకొంత కూలుతోంది. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇళ్లను విడిచి పెట్టలేకపోతున్నారు అందులో ఉండే ప్రజలు. వందేళ్ల క్రితం నిర్మించిన ఇళ్లలో ఇప్పటికీ అందులోనే జీవనం కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే పెద్దగా ముప్పు ఉండదని, ఇలా ముసురులా పెడితేనే గోడలు తడిచిపోయి కూలే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అది ఏ సమయంలో కూలుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని, ఖాళీ చేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులు పాత ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. గతంలో గాంధీనగర్ సమీపంలో ఓ పాత ఇల్లు కూలిపోయి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. జిల్లాకేంద్రంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ప్రతి వర్షాకాలంలో అధికారులు ఇలాంటి ఇళ్లను గుర్తించి.. ఇళ్లలో ఉండేవారికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే పురాతన ఇళ్లలో ఉంటున్నవారు పేదవారు కావడం.. ఉండేందుకు ఇతర ప్రాంతాల్లో చోటులేకపోవడంతో అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రమాదం జరిగితేనేనా..? శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలకు మరో చోట ఇల్లు కేటాయిస్తే వారు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రమాదం అని తెలిసినా కొందరు ఆ ఇంటిని సర్దుకుంటూ అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరోచోట ఇల్లు కేటాయిస్తే వెళ్లేందుకు కొందరు ఉన్నారు. వర్షం కురిసినప్పుడల్లా ఇళ్లంతా ఉరవడం.. ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు స్పందించి పేదలకు గూడు కల్పించి పాత ఇళ్లను కూల్చివేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాత ఇళ్లపై ఇంటి యజమానులకు అవగాహన కల్పించి కూలితే ప్రమాదం జరుగుతుందని చెప్పి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భవనాలు కూల్చివేత జిల్లా కేంద్రంలోని కొన్ని పాత స్కూళ్లు, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలుంటే వాటిని అధికారులు కూల్చివేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అని ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. ఎక్కడికి పోయేది..?తాత ముత్తాతలు నిర్మించిన వందేళ్లకు పైబడిన ఇళ్లు కావడం.. మరో చోట ఉండేందుకు స్థలం లేకపోవడంతో పేదలు అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా యజమానులు వినిపించుకోవడం లేదని సమాచారం. కూల్చివేస్తే పూర్తిగా గూడు కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అందులో ఉంటే ఏ సమయంలోనైనా ప్రమాదం జరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. గోడలు, పైకప్పు అంతా తడిచి ఒకేసారి కూలే అవకాశాలుంటాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కూలితే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాకేంద్రమైన జగిత్యాలలో పురాతన ఇళ్లు 81 ఉన్నట్లు గుర్తించారు. కోరుట్లలో 50, మెట్పల్లిలో 40కి పైగా ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. స్వతాహాగా కూల్చుకోలేని స్థితి ఉంటే మున్సిపాలిటీకి సమాచారం అందిస్తే కూల్చివేస్తారు. కానీ అలా ఎవరూ ముందుకు రావడం లేదు. నోటీసులు జారీ చేశాం జిల్లా కేంద్రంలోని పాత ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేశాం. ప్రమాదం అని తెలిసినా కొందరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ కూల్చివేసుకునే పరిస్థితి లేకుంటే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, టీపీవో -
నిధులు కేటాయించాలి
అడవుల్లో వర్షం ద్వారా వచ్చే నీటిని ఎక్కడికక్కడే కట్టడి చేసి.. దిగువకు వెళ్లకుండా రాక్‌ఫిల్‌డ్యాంలు, చెక్‌డ్యాంలు నిర్మించాలి. వీటి ద్వారా నీటి నిల్వలు పెరడానికి అవకాశం ఉంటుంది. – పొల్సాని నవీన్‌రావు, కొల్వాయి, బీర్పూర్ మండలం నీటికుంటల సంఖ్య పెంచాలి భూగర్భజలాల పెంపులో నీటి కుంటలు (పర్క్యులేషన్ ట్యాంకు) ప్రధాన పాత్ర పోషిస్తాయి. అడవుల్లో వీటిని మరిన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా అడవులు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. – ఏలూరి రాజిరెడ్డి, సారంగాపూర్ పనులు చేపట్టే అవకాశం రోల్లవాగు ప్రాజెక్టు ద్వారా అటవీశాఖకు కేటాయించే నిధులతో ఈ ఏడాది అడవుల్లో చెక్‌డ్యాంలు, మినీ పిటి, మేజర్ పిటి, రాక్‌ఫిల్ డ్యాంలు, స్టాగర్డ్ ట్రెంచెస్ నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. – రవికుమార్, డిప్యూటీ రేంజర్, జగిత్యాల -
అంజన్నకు పంచామృతాభిషేకం
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారికి శ్రావణ సప్తాహం ఉత్సవాల్లో భాగంగా బుధవారం పంచామృతాభిషేకం చేశారు. ముందుగా స్వామివారి మూలవిరాట్టును తమలపాకులు, పూలతో అలంకరించారు. సాయంత్రం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘు, ఉప ప్రధాన అర్చకులు మారుతీప్రసాద్, రాంచంద్ర ప్రసాద్, అర్చకులు అఖిల్ కృష్ణ, రాంచందర్ పాల్గొన్నారు. మహిళాసంఘాలు ఆదాయంపై దృష్టిసారించాలికథలాపూర్: మహిళాసంఘాల సభ్యులు ఆదాయంపై దృష్టి సారించాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో సునీత పేర్కొన్నారు. బుధవారం కథలాపూర్‌లో సీ్త్రశక్తి భవన్లో వీవోఏలతో సమావేశమయ్యారు. వందశాతం అక్షరాస్యత కార్యక్రమంలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్‌ను నియమించి వారికి చదువు చెప్పిస్తామన్నారు. మహిళలు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. డీపీఎంలు విజయభారతి, రమేశ్, ఏపీఎం నరహరి, సీసీలు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలివెల్గటూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మారం, వెల్గటూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ మద్దుల గోపాల్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వినియోగదారులకు ఇబ్బంది రానీయొద్దుమెట్పల్లిరూరల్: విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు ఇబ్బంది రానీయొద్దని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం అన్నారు. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ సబ్‌స్టేషన్‌లో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన అదనపు 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం ప్రారంభించారు. జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లకు రెండు ప్రత్యామ్నాయ 33 కేవీ అంతర్గత లైన్లు నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు బిగించుకుంటే ఓవర్‌లోడ్, లో–ఓల్టెజీ సమస్య రాదని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉంటాయని తెలిపారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈ మధుసూదన్, ఎమ్మార్టీ డీఈ గోపికృష్ణ, టెక్నికల్ డీఈ గంగారాం, ఏడీఈలు మనోహర్, రాజు, ఏఈలు అజయ్, రహీం, కార్యదర్శి దివ్య, నాయకులు శేఖర్‌రెడ్డి, రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎరువుల నిల్వల తనిఖీ
మేడిపల్లి: మేడిపల్లి, వల్లంపల్లి పీఏసీఎస్‌లో ఎరువుల నిల్వలను డీఏవో భాస్కర్ బుధవారం తనిఖీ చేశారు. ఎకరా ఉన్న రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలని, ఈ–మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపీపై అవగాహన కల్పించాలన్నారు. ఏఓ షాహిద్ అలీ, రవీందర్రావు, ఈఓ తొర్తి గోపి రైతులు పాల్గొన్నారు. బస్తీ దవాఖానాకు డీఎంహెచ్వోధర్మపురి: ధర్మపురిలోని బస్తీ దవాఖానాను బుధవారం డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. టీకాలు సకాలంలో ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ప్రోగ్రాం అధికారి రవీందర్, వైద్యాధికారి వివేక్, సీహెచ్‌వో శాంతి, స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలు తదితరులున్నారు. స్కాలర్షిప్ విడుదల చేయాలిజగిత్యాల: ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కళాశాల యజమానుల సంఘం నాయకులు బుధవారం సంక్షేమాధికారి రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. 2024–25 నుంచి ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తోందని, ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని, అయితే రాష్ట్రం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. జిల్లా డిగ్రీ కళాశాల యజమాన్య సంఘం నాయకులు శ్రీపాద నరేశ్, కొక్కుల రాజేందర్, ప్రవీణ్‌కుమార్, ప్రకాశ్మూర్తి, రాజేందర్ పాల్గొన్నారు. -
నేర పరిశోధన సమర్థవంతంగా చేయాలి
జగిత్యాలక్రైం: పోలీసులు నేర పరిశోధన సమర్థవంతంగా నిర్వహించాలని, పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నేరాలపై సమీక్షించారు. ఆర్నెళ్లలో పోలీస్స్టేషన్ల పనితీరు, కేసుల చేధనలో పురోగతిని పరిశీలించారు. డీఎస్పీలు, సీఐలు తమ పరిధిలో కేసుల స్థితిగతులను సమీక్షించాలన్నారు. మహిళల భద్రత లక్ష్యంగా పనిచేయాలని, వారిపై అసభ్యంగా ప్రవర్తించినా.. దాడులకు పాల్పడినా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. దొంగతనాల నివారణకు స్పెషల్ టీంను నియమించాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు, వాహన తనిఖీలు తప్పకుండా నిర్వహించాలన్నారు. గణేశ్ ఉత్సవాలకు భద్రత గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకునేలా పోలీసులు చూడాలని అధికారులకు సూచించారు. నిర్వాహకులతో సీఐలు, ఎస్సైలు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. నేరాలు చేసేవారిని, నేర స్వభావం కలిగిన వ్యక్తులను బైండోవర్ చేయాలని ఆదేశించారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, వెంకటరమణ, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్‌ఖాన్, శ్రీనివాస్, ఆర్ఐ వేణు, సీఐలు సుధాకర్, కరుణాకర్, రాం నర్సింహారెడ్డి, సురేశ్, ఎస్సైలు, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనలో పోలీసుల పనితీరు అద్భుతం గంజాయి నిర్మూలనలో పోలీసుల పనితీరు అద్భుతమని ఎస్పీ అన్నారు. గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసుల కృషిని గుర్తించి నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శౌండిల్య రివార్డు ప్రకటించి అభినందించారు. జిల్లాలో రవాణా, నిల్వలను గుర్తించడంలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు. పెండింగ్ కేసులు సత్వరం పరిష్కరించాలి ఎస్పీ అశోక్ కుమార్ -
అడవుల అభివృద్ధికి గ్రహణం
● నాలుగేళ్లుగా నిలిచిపోయిన పనులు ● మరమ్మతుకు నోచుకోని చెక్‌డ్యామ్‌లు ● ఈజీఎస్ ద్వారానే సమతుల కందకాలు 2021 వరకు అడవుల్లో భారీగా అభివృద్ధి పనులు ● సారంగాపూర్, బీర్పూర్ మండలాలతోపాటు, ఇతర మండలాల్లోని అటవీప్రాంతంలో 2021 సంవత్సరం వరకు నిరంతరం కంపా నిధులతో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగాయి. ఆ తరువాత నిధుల విడుదల నిలిచిపోవడంతో పనుల్లో పురోగతి లేదు. ● కేవలం ఈజీఎస్ ద్వారా ఉపాధిహమీ కూలీలకు పని కల్పించడంలో భాగంగా అడవుల్లో సమతుల కందకాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇవి ఒక ప్రణాళికాబద్ధంగా లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఏర్పాటు చేసిన సమతుల కందకాలు మరో సంవత్సరం కనిపించడం లేదు. ● బీర్పూర్ మండలం రోల్లవాగు ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న అటవీశాఖ భూములకు రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖకు పరిహారం చెల్లించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పరిహారం సొమ్ముతో ఈ ఏడాది సారంగాపూర్, బీర్పూర్ మండలాలతోపాటు పలు మండలాల్లో అడవుల్లో చెక్‌డ్యాంలు, పెద్ద నీటి కుంటలు, చిన్న నీటి కుంటలు, రాక్‌ఫిల్‌డ్యాంలు, స్టాగర్డ్ ట్రెంచెస్ వంటివి చేపట్టడానికి అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సారంగాపూర్: అడవులను అభివృద్ధి చేసి.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అటవీశాఖ చేపట్టే పనులకు నాలుగేళ్లుగా గ్రహణం పట్టుకుంది. నిధుల లేమితో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటవీశాఖ పరిధిలోని కంపా (కాంపెన్సేటరీ అఫోర్సియేషన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ) ద్వారా వివిధ అభివృద్ధి పనులు 2021 వరకు కొనసాగాయి. అప్పటి నుంచి అటవీశాఖ అటవీప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టడం లేదు. భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టాల్సిన పనులు కూడా నిలిచిపోయాయి. అడవుల్లో అటవీశాఖ చేపట్టిన పనులు జిల్లాలో అడవుల విస్తీర్ణం సుమారు 50 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. ముఖ్యంగా సారంగాపూర్, బీర్పూర్, రాయికల్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో అడవులు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. అడవుల్లో పచ్చదనం పెంచడంతోపాటు, భూగర్భజలాల పెంపుకోసం చాలా కార్యక్రమాలు నిర్వహించి, అందుకు అనుగుణంగా ఫలితాలు సాధించింది. అటవీశాఖ భూగర్భజలాలను పెంచడం, పచ్చదనం కాపాడడం.. అడవుల్లో కలప అక్రమ రవాణాను అరికట్టడం, అరుదైన జాతులకు చెందిన మొక్కలు, వృక్షాలను కాపాడి, అడవుల్లోని ప్రతి వన్యప్రాణిని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు అమలయ్యాయి. ● ఎత్తైన గుట్టల మీదినుంచి వచ్చే వర్షపు నీరు వాగుల ద్వారా గోదావరిలో కలవకుండా ఎక్కడి నీటి చుక్క అక్కడే భూమిలో ఇంకిపోవాలన్న లక్ష్యంతో అటవీశాఖ ఆధ్వర్యంలో రాక్‌ఫిల్ డ్యాంలు (రాతి కట్టడాలు) నిర్మించారు. గుట్టరాళ్లనే అడ్డుగా కట్టి ఎక్కడినీరు అక్కడే ఇంకిపోయేలా నిర్మాణం చేశారు. ● అటవీశాఖ చిన్న మొత్తంలో వాగుల్లోని నీరు కిందికి పోకుండా రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు వెచ్చించి చెక్‌డ్యాంలు నిర్మించింది. ఇది భూగర్భజలాల పెంపులో కీలకంగా మారాయి. ● అటవీప్రాంతాల్లో లోతట్టు మైదానాలు ఉండి.. ఎగువ నుంచి వర్షంనీరు వస్తే ఆ నీటిని అక్కడే నిల్వ చేయడానికి పర్క్యులేషన్ ట్యాంక్‌లు (నీటి నిలువ కుంటలు), మినీ పర్క్యూలేషన్ ట్యాంకులను రూ.2 లక్షల వరకు వెచ్చించి నిర్మించారు. వీటిద్వారా వర్షం నీరు ఆగి అటు వన్యప్రాణులు, భూగర్భ జలాల పెంపునకు తోడ్పడింది. ● స్టాగర్డ్ ట్రెంచెస్ లక్ష్యం కూడా భూగర్భ నీటి నిల్వలను పెంచడానికి చేపట్టారు. ఎక్కడ వీలుంటే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో ఎక్కడి నీటి బొట్టు అక్కడే ఇంకిపోయే విధంగా ఉపయోగపడింది. -
ఎస్కేఎన్ఆర్ కళాశాల వసంతోత్సవానికి రండి
● సీఎంను కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ● ఆడిటోరియం, ఉమెన్స్, మెన్స్ హాస్టల్ మంజూరివ్వాలని వినతిజగిత్యాల: జిల్లాకేంద్రంలోని పురాతన ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాల 60వసంతాల వేడుకకు రావా లని సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆహ్వానించారు. కళాశాలలో ఆడిటోరియం, ఉమెన్స్, మెన్స్ హాస్టల్ మంజూరు చేయాలని కోరారు. 32 ఎకరాల్లో నిర్మితమైన ఈ కళాశాలలో ఎంతోమంది చదువుకుని ప్రముఖులయ్యారని గుర్తు చేశారు. కండ్లపల్లి రెసిడెన్షియల్ స్కూల్, బస్‌షెల్టర్, ప్లేగ్రౌండ్, శానిటరీకి సంబంధించి డైనింగ్‌హాల్, జిమ్ ఏర్పా టు చేయాలని కోరారు. స్పందించిన సీఎం వేడుకలకు వస్తానని, పనుల మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: పరీక్షల్లో తరచూ ఫెయిల్ అవుతున్నాననే మనోవేదనతో ఓ యువకుడు ఉరేసుకున్న ఘటన మండలంలోని పైడిపెల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూన రఘు (22) కరీంనగర్లో ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. డిగ్రీలో మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. పలుసార్లు రాసినా పాస్ కావడంలేదు. మనోవేదనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తండ్రి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
క్యాన్సర్ సోకిందని మహిళ ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల ): క్యాన్సర్ వ్యాధి వచ్చిందనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండలంలోని దుమాలకు చెందిన పిల్లి మానస(38) ఇటీవల అనారోగ్యానికి గురైంది. పలు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. క్యాన్సర్ వ్యాధికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోంది. ఈక్రమంలో మనస్తాపంతో సోమవారం రాత్రి అధిక మొత్తంలో ఐరన్ ట్యాబెట్లు మింగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలి భర్త రామచంద్రం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చికిత్స కోసం ఖర్చులు ఎక్కువగా అవుతుండడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త రామచంద్రం, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ గీత కార్మికుడి మృతిసైదాపూర్: మండలంలోని సోమారంలో తాటిచెట్టు పైనుంచి జారిపడిన గీత కార్మికుడు దాసారపు సదానందం(54) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారంగా.. సదానందం ఈనెల 15న గ్రామపరిధిలో కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..కోరుట్ల: పట్టణంలోని బస్టాండ్ ఇన్ గేట్ సమీపంలో సోమవారం బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డ షేర్దార్ వెంకటేశ్ (44) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం వెంకటేష్ బస్టాండ్ నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా మేడిపెల్లి మండలం వల్లంపెల్లి గ్రామానికి చెందిన ముంజం కార్తీక్ అనే వ్యక్తి తన బైక్‌పై అతి వేగంగా వచ్చి వెంకటేష్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఆయనను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాత్రి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. వెంకటేశ్ తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. పాత నేరస్తుల బైండోవర్జగిత్యాలక్రైం: పట్టణంలోని పాత కేసుల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులను పట్టణ సీఐ కరుణాకర్ మంగళవారం జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణానికి చెందిన కొత్తకొండ వినీత్సాయి, జువ్వాడి దీక్షిత్, మర్రి మల్లికార్జున్, పాల రాజ్‌కుమార్, బుర్ర వినయ్, పూరెల్ల వినయ్ పాత కేసుల్లో నేరస్తులని, ప్రజలను భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వీరిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. యువతి అదృశ్యంకొడిమ్యాల: మండలంలోని బొల్లంచెరువు గ్రా మానికి చెందిన ఓ యువతి (19) సోమవారం రాత్రి తన ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని యువతి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 130 గ్రాముల గంజాయి పట్టివేతధర్మపురి: పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడి వద్ద 130 గ్రాముల గంజాయి పట్టుబడిందని ధర్మపురి ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. స్థానిక పోలీసులు మండలంలోని రాయపట్నం శివారులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద 130 గ్రాముల గంజాయి లభించింది. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపుచొప్పదండి: జవహర్ నవోదయ 2026–27 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువు తేదీని ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
గోదావరిఖని: తనకు రూ.10 లక్షల ఇవ్వాలని వ్యాపారులకు ఫోన్‌చేసి బెదిరించిన యాదనవేని తిరుపతి అనే హమాలీని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక కల్యాణ్‌నగర్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులకు ఈనెల 18న ఫోన్‌చేసి తలా రూ.10లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులకు హాని చేస్తానని తిరుపతి బెదిరించాడు. గతంలో ఓవ్యక్తిని కూడా మర్డర్ చేశానని, మీ ఫ్యామిలీకి కూడా ఇదేగతి పడుతుందని హెచ్చరించాడు. దీంతో బాధితులు ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌కాల్స్ ఆధారంగా ఎస్సై రమేశ్ దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు స్థానిక చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన యాదనవేని తిరుపతిగా గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామం కాన్కూర్‌కు చెందిన తిరుపతి ఐదేళ్లుగా కిరాణాల్లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల చంద్రశేఖర్‌నగర్‌లో ఇల్లు కొనుగోలు చేసి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కిరాణా షాపుల యజమానుల కదలికలు గమనించి సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో బెదిరింపు కాల్స్ చేసినట్లు సీఐ వివరించారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడి -
వీధికుక్కల దాడిలో 200 నాటు కోళ్లు మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల గ్రామంలో వీధికుక్కలు దాడి చేయడంతో 200 నాటు కోళ్లు మృతిచెందాయి. పిట్ల నర్సింలుకు చెందిన కోళ్ల షెడ్లోకి కుక్కల గుంపు చేరి కోళ్లను చంపాయి. తనకు సుమారు రూ.1.50లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గంజాయి ముఠా అరెస్టుకరీంనగర్రూరల్: గంజాయి విక్రయిస్తున్న ముఠాను మంగళవారం అరెస్టు చేశారు. పట్టుబడిన నలుగురులో ఓ మైనర్ ఉన్నాడు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఎస్సై లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ రహదారిలోని ఇరుకుల్ల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న నలుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పట్టుకున్నారు. వారివద్ద 2.30 కిలోల లభించింది. పట్టుబడిన వారిలో మొగ్ధుంపూర్‌కు చెందిన బుర్ర వంశీ(22), దుర్గం హరికృష్ణ(22), సుల్తానాబాద్ మండలం పూసాలకు చెందిన సాయి(21)తోపాటు ఓ బాలుడి ఉన్నాడని, వారినుంచి నాలుగు సెల్ఫోన్లు, రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి
● మంత్రికి ఎమ్మెల్యే సంజయ్ విజ్ఞప్తి జగిత్యాలఅగ్రికల్చర్: ఎస్సారెస్పీలోకి నీరు చేరుతుండడంతో కాకతీయ కాలువకు విడుదల చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ ద్వారా కోరారు. ప్రాజెక్టులో మంగళవారం వరకు 33టీఎంసీల నీరు చేరిందని, ఆ నీటితో ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎగువప్రాంతాల నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నందున కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని కోరారు. ఎస్సారెస్పీకి 67,401 క్యూసెక్కుల వరద నీరుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు సాగు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం 67,401 క్యూసెక్కులు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 734 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1076.30 అడుగులు కాగా.. ప్రస్తుతం 35.777 టీఎంసీలుగా ఉంది. గురుకులం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాంరాయికల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి ఆనందరావు అన్నారు. రాయికల్ మండలం సింగరావుపేటలోని మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో మంగళవారం సభ్యత్వ నమోదు చేపట్టారు. గురుకులం, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు వచ్చేలా కృషి చేస్తామని, హెల్త్ స్కీం వర్తించేలా చూస్తామని పేర్కొన్నారు. పాఠశాలల పనివేళల్లో మార్పునకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వానికి నివేదించారని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్‌కు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పొన్నం రమేశ్, కార్యదర్శి వసంతరావు, మండల అధ్యక్షుడు గంగరాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య పాల్గొన్నారు. ఘనంగా శ్రావణ సప్తాహంమల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం శ్రావణ సప్తాహం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పంచామృతాభిషేకం గావించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు భజనలు చేశారు. అర్చకు ల పూజలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి కి శావ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. భూపతిపూర్‌లో కేంద్ర బృందంరాయికల్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు మధుకర్ సందర్శించారు. గ్రామంలోని చెత్త సేకరణ, ఇంకుడు గుంతలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీవో చిరంజీవి ఉన్నారు. -
మొదట ఎక్కిరించిన్రు
సాక్షి, కరీంనగర్ డెస్క్: మా సొంతూరు ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంం. అమ్మానాన్న అన్నవరం దశరథ–కేదారమ్మ. 1962 అక్టోబర్ 17న పుట్టిన. ఉపాధ్యాయిని ఏదునూరి రాజేశ్వరితో వివాహమైంది. కూతురు స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. పంచాయతీరాజ్‌శాఖ, కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్‌లో చాలా కాలం పనిచేశా. ముస్తాబాద్ మండల ప్రజాపరిషత్‌లో సూపరింటెండెంట్‌గా 2020 అక్టోబర్ 31న ఉద్యోగ విరమణ చేసిన. 1986 ప్రాంతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా కొనసాగుతూ, తెలంగాణ పదాలతో కవిత్వం, రచనలు చేసిన. 25 ఏళ్లుగా వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్న. ఇప్పటి వరకు 12 కవితా సంపుటాలు, రెండు వ్యాస సంకలనాలు వెలువరించా. నా సాహితీకృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి ‘దాశరథి సాహితీ పురస్కారం’ ప్రకటించింది. ఈనెల 22న రవీంద్రభారతిలో దాశరథి శతజయంతి ఉత్సవసభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా పురస్కారం అందుకున్న. ● 2001లో సాహితీ సృజన షురూ.. 2001లో ‘తొవ్వ’తో కవిత్వ రచనకు తొవ్వ దొరికింది. 60 ఏళ్ల కింద ఊరిలో ఉన్న మానవసంబంధాలు, వస్తువు(ఇసిరె)లు ఎలా ఉండే అనే దానిపై మూడేళ్లపాటు కాలమ్స్ రాశా. అన్ని కలిపి ‘తెలంగాణ జీవనచిత్రిక’ అనే ట్యాగ్‌లైన్‌తో పుస్తకం వేసిన. దానికి తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి అవార్డు వచ్చింది. ఓ పత్రికలో మూడున్నరేళ్లపాటు అంతరంగాలు అనే కాలమ్ రాసిన. మనుషులకు సంబంధించిన జీవనచిత్రన రాయగా, దాన్ని కూడా పుస్తకంగా తీసుకొచ్చిన. గిన్నెసాహితీ అకాడమీ వారు కవిసంధి కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించి ఇక్కడ నన్ను ఎంపిక చేశారు. నా కవిత్వ ప్రయాణాన్ని గంట సేపు ప్రసంగం కవిత్వంలో చెప్పాను. ● 12 కవితా సంపుటాలు.. 12 కవితా సంపుటాలు వెలువరించా. ఈ 12 కలిపి రెండు బృహత్ సంకలనాలు తీశాను. మూడు పుస్తకాలు ఇంగ్లిష్‌లోకి అనువాదమయ్యాయి. గతంలో పత్రికల్లో రాసిన వ్యాసాలను కలిపి ‘మరో కోణం’ అనే వ్యాస సంపుటిని తీసుకొచ్చాను. ‘ఊరి దస్తూరి’, ‘అంతరంగం’, ‘సంచారం’ పుస్తకాలు వెలువరించా. నాకు వివిధ ప్రాంతాలను సందర్శించడం అలవాటు. అలా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం గురించి కవిత్వంలో లేదా వ్యాసంలోనైనా రాయడం నాకు అలవాటు. ప్రతీ దాని గురించి రాయడమనేది కవికి, రచయితకు అలవాటుగా ఉండాలి. ఈ అక్టోబర్‌లో నా పుట్టినరోజు సందర్భంగా మరో కవితాసంపుటిని వెలువరిస్తా. 2001 నుంచి ప్రతీ అక్టోబర్‌లో ఒక సంకలనం తీసుకురావాలని నిర్ణయించుకున్నా. అదే కొనసాగిస్తున్న. ● అవార్డులు రావడంపై.. అవార్డులు అనేవి కవి, రచయితకు ప్రోత్సాహకంగా నిలుస్తాయి. మన రచనలను బట్టి అవార్డులు, గుర్తింపు దక్కుతుంది. కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి మా తరానికి ఆదర్శం. ఎప్పుడైనా అవార్డులు బాధ్యతను పెంచుతాయి. దాశరథి సాహితీ పురస్కారం రావడం గౌరవంగా భావిస్తా. ఆయన స్ఫూర్తితోనే నేను రచనలు చేస్తున్నాను. ● ఇంగ్లిష్ ప్రభావంతో.. ఇంగ్లిష్ ప్రభావంతో తెలుగు, తెలంగాణ యాస, భాషలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం కూడా తెలంగాణకు సంబంధించిన పాఠ్యాంశాలను పుస్తకాల్లో పెట్టింది. కానీ మన ప్రజలు మాట్లాడే భాషలో లేదు. వాటిని తెలంగాణ మాండలికంలో తీసుకొస్తే భవిష్యత్ తరాలకు మన భాషను చేర్చినట్లు అవుతుంది. ప్రభుత్వం కూడా ప్రాథమిక స్థాయి వరకు పాఠశాలల్లో తెలంగాణ భాషలోనే బోధించాలి. అదే సమయంలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రోత్సహించాలి. తెలంగాణ పదాలను బతికించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నిత్య అధ్యయనంతోనే కవిత్వం రాయగలం. అంతకుముందు ఉన్న సాహిత్యాన్ని చదవడం వల్లే మళ్లీ కొత్తగా వివిధ అంశాలపై రాయగలుగుతాం. భాష, ఊరు, అణగారిన సామాజిక వర్గాల మీద ప్రేమ ఉండాలి. అప్పుడే కొత్తగా రచనలు చేయగలం. నాకు స్ఫూర్తినిచ్చిన కవులు శ్రీశ్రీ మహాప్రస్తానం చదివిన తర్వాత కవిత్వం రాయాలనే ఆలోచన వచ్చింది. తర్వాత శివసాగర్, వరవరరావు, చెరబండ రాజు, గోపి, సినారె, శివారెడ్డి రచనలు నాపై ప్రభావం చూపాయి. వారి స్ఫూర్తితో నాదైన ప్రత్యేక శైలిలో రచనలు చేశాను. ● మన సంస్కృతిపై ఉత్తారాది దాడి.. బతుకమ్మ, బోనాలలో కొత్తకొత్త సంప్రదాయాలు వస్తున్నాయి. అయితే పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కొత్త పోకడలు వస్తున్నాయి. బతుకమ్మ ఆట ఒకప్పుడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ఆడేవారు. ఇప్పుడు డీజే సౌండ్లతో ఆడుతున్నారు. ఉత్తరాది కల్చర్‌తో మన బతుకమ్మ ఆగమైంది. బతుకమ్మ ఆటపై దాండియా దాడి చేసింది. అలాగే మన వంటలు, తినే ఆహారంలోనూ మార్పు వచ్చింది. ఉత్తరాదికి చెందిన పానీపురి మన ప్రాంతానికి వచ్చింది. మన సర్వపిండి రాజస్థాన్‌లో ఎవరూ తినరు కదా. ఇడ్లీ తమిళనాడు నుంచి వచ్చింది. మనం కొంచెం బానిస మనస్తత్వంతో బతుకుతాం. మనకు తెలువకుండా ఇతరుల సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాం. దీన్ని మనం జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంది. ● పంటలు.. ఉపాధి కారణంగానే.. మన దగ్గర విస్తారమైన పంటలు, ఉపాధి ఎక్కువగా దొరకుతుండడంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. వారి సంస్కృతి, సంప్రదాయాలకు మనవాళ్లు అలవాటు పడుతున్నారు. కానీ, ఇక్కడికి బతకడానికి వచ్చిన మార్వాడీలు, ఉత్తరాది రాష్ట్రాలవారు మన కల్చర్‌ను అలవాటు చేసుకోరు. పత్రికలు కూడా రాజకీయపార్టీల వైపు వెళ్లడంతో సమాజాన్ని అప్రమత్తం చేసే, చైతన్యం చేసే బాధ్యతను మరిచిపోయాయి. పౌరసంఘాలు కూడా తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. -
ట్యాపింగ్!
నీడలా వెంటాడారు.. డ్రైవర్ ఫోనూ ట్యాప్ చేశారు..● సిట్ ముందు గ్రంథాలయ జిల్లా చైర్మన్ మల్లేశ్ వాంగ్మూలం ● ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన ఈటల రాజేందర్ ● బండి సంజయ్, ఆయన పీఆర్వో విచారణ వాయిదా ● త్వరలో చొప్పదండి ఎమ్మెల్యే సత్యంకూ నోటీసులునాలుగున్నరేళ్లపాటుసాక్షిప్రతినిధి,కరీంనగర్●: ‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగున్నరేళ్లపాటు నా ఫోన్ ట్యాప్ అయింది. నాదే కాదు.. నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అనుక్షణం నీడలా వెంటాడారు.. పలుమార్లు మమ్మల్ని అడ్డగించారు.. మా వ్యక్తిగత సమాచారం తస్కరించారు. ప్రతీక్షణం మా మాటలు విన్నారు..’ ఇవీ.. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ ఫోన్‌ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట చెప్పిన మాటలు. ఏడాదిన్నరగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ మంగళవారం హైదరాబాద్‌లోని సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. 3.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ఇద్దరు అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు ఫోన్‌ట్యాపింగ్ ద్వారా ఎదురైన చేదు అనుభవాలు, ఇబ్బందులను పోలీసులకు సత్తు మల్లేశ్ వివరించారు. ఉమ్మడి జిల్లాతో లింకు.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు కరీంనగర్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు బంధువులు కరీంనగర్‌కు చెందిన వారు కావడం, ఈ కేసులో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు పలుమార్లు కరీంనగర్‌కు వచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలడం, అలాగే ఈకేసులో సిరిసిల్ల ఎస్సీఆర్బీ డీఎస్పీగా దుగ్యాల ప్రవీణ్‌రావును సిరిసిల్లలోనే అరెస్టు చేయడం తెలిసిందే. అసలు అతని అరెస్టుతో సిట్ బృందం దర్యాప్తు వేగం పెంచింది. వాస్తవానికి 2021లోనే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై కరీంనగర్‌లోని మైత్రీ హోటల్లో విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు, వేణుగోపాల్‌రావు, దుగ్యాల ప్రవీణ్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ‘బండి’ నుంచి మల్లేశ్ వరకు.. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ సిట్ బృందం ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కు హాజరు కావాలని సిట్ అధికా రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. అయితే.. పార్లమెంటు సమావేశాలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చల కారణంగా బండి సంజయ్ విచారణకు రాలేనని సమాధానమిచ్చారు. బండి సంజయ్ తోపాటు ఆయన ఆంతరంగికుడు ప్రవీణ్‌రావు, ఆయన పీఆర్వో పసూనూరి మధుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయని, వారు కూడా విచారణకు రా వాలని సిట్ కోరిన సంగతి తెలిసిందే. త్వరలోనే బండి సంజయ్ ఆయన అనుచరులు కూడా సిట్ ముందు హాజరై.. వాంగ్మూలం ఇవ్వనున్నారు. ● ఇక కరీంనగర్‌కు చెందిన మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా గత నెలలో సిట్ ఎదుట విచారణకు హాజరై తన అనుభవాలను వివరించారు. ● సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన.. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లేశ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని.. పోలీసులు స్వాధీ నం చేసుకున్న పలు డివైజ్‌ల ద్వారా అప్పట్లోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ● ఇక ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్యం ఫోన్లు కూడా ట్యాపయ్యాయని సమాచారం. త్వరలోనే ఆయనకు కూడా విచారణ కోసం సిట్ నుంచి పిలుపు రావొచ్చని తెలిసింది. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లోని ఎస్ఈ చాంబర్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. విద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా భద్రత పరికరాలు వాడాలన్నారు. లేకుంటే పెనాల్టీ విధించాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒక వేళ కాలిపోతే వెంటనే ఎస్పీఎం సెంటర్‌కు పంపించి రిపేర్లు చేయించాలని సూచించారు. విద్యుత్ మీటర్లను తనిఖీ చేయడంతో పాటు చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. బకాయిలు వసూలు చేస్తూ రెవెన్యూ పెంచాలన్నారు. కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు, డీఈలు ఎం.తిరుపతి, ఎస్.లక్ష్మారెడ్డి, పి.చంద్రమౌళి, రమణారెడ్డి, ఎస్ఏఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
రైతులు ఆయిల్‌పాం సాగు చేయాలి
మల్యాల: రైతులు ఆయిల్ పాం సాగు చేయాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్యాం ప్రసాద్, డీఏవో భాస్కర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఆయిల్ పాం విస్తరణపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్ పాం సాగు వివరాలు, రాయితీ, పంట మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. మూడెకరాలకుపైగా భూ మి ఉన్న రైతులు ఆయిల్ పాం సాగు చేపట్టాలని, ప్రతి నెలా దిగబడితోపాటు అధిక ఆదాయం పొందవచ్చని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతోపాటు కోతుల బెడద లేని పంట అని పేర్కొన్నారు. ఎకరాకు ఏటా రూ.1.50లక్షల ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ పాం సాగు చేస్తున్న రైతు కెంద అంజయ్య తోటను పరిశీలించారు. ఏవో కె.చంద్రదీపక్, లోహియా కంపెనీ ప్రతినిధి అనిల్, ఏఈఓ కారుణ్యకుమార్, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు డీఏవో భాస్క ర్ మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. లైసెన్సులు, బిల్లులను పరిశీలించారు. ఈపీఏఎస్ ద్వారానే ఎరువులు విక్రయించాలని సూచించారు. -
చదువుతోనే మహిళా సాధికారత సాధ్యం
వెల్గటూర్: ఉన్నత చదువులతోనే మహిళా సాధికారత సాధ్యమని మహిళా సాధికారత కేంద్ర జెండర్ స్పెషలిస్ట్ స్వప్న అన్నారు. మండలంలోని స్తంభంపల్లి బీసీ బాలుర గురుకుల హాస్టల్ విద్యార్థులకు బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా అంకురం కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగ వివక్ష, లింగ సమానత్వం ప్రాముఖ్యతను వివరించారు. ఆడపిల్లలకు ఉన్నత చదువులతో కలిగే ప్రయోజనాలను వివరించారు. మహిళల హక్కులు, చట్టాలపై, పోక్సో చట్టం, చైల్డ్ హెల్ప్‌లైన్ సర్వీసెస్, సఖీ కేంద్రంలో అందించే సేవలు, సైబర్ నేరాలు, యాంటీ హూమన్ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ హరిత, కేంద్రం బృందం సభ్యులు స్వప్న, గౌతమి, సఖీ కేంద్రం వర్కర్ భాగ్యలక్ష్మి, తేజస్ ఫౌండేషన్ మెంబర్ రాధ, ఉపాధ్యాయులు రాజ్‌కుమార్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు తేలికపాటి వర్ష సూచనజగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీ లక్ష్మి తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీలుగా.. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
తండ్రిపై కొడుకు హత్యాయత్నం
రాయికల్: రాయికల్ పట్టణంలోని మత్తడివాడకు చెందిన చిట్యాల లక్ష్మీనర్సయ్యపై అతని కుమారుడు రాజేందర్ మంగళవారం రాత్రి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీనర్సయ్య స్థానికంగా హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాపిల్లలు తిండి పెట్టడం లేదు. దీంతో తల్లి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకున్న భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేందర్ తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. మంగళవారం రాత్రి ఇంటికి రాగానే రాజేందర్ తన స్నేహితులతో కలిసి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో లక్ష్మీనర్సయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యుల ద్వారా తెల్సింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సుధీర్‌రావు పరిశీలించారు. రాజేందర్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం -
భారతీయుడి త్రీడీ కళకు దక్కిన గౌరవం
రామగిరి(మంథని): అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, మెకానికల్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఎస్ఆర్ కృష్ణ ఆధునిక పద్ధతులు ఉపయోగించి సృష్టించిన 10 త్రీడి డిజైన్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూకే(యునైటెడ్ కింగ్డమ్)కు చెందిన అధికారిక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్ ఆఫీస్ ఈ 10 త్రీడీ డిజైన్స్ పేటెంట్ హక్కులను కృష్ణ పేరిట నమోదు చేసింది. దాదాపు 14ఏళ్ల నుంచి తాను త్రీడీ కళపై చేస్తున్న కృషికి గుర్తింపుగా యూకే పేటెంట్ హక్కులు రావడం గర్వంగా ఉందని కృష్ణ తెలిపారు. భారతదేశంలో పుట్టిన అనేక సాంకేతిక విజ్ఞానశాస్త్రాల్లో త్రీడీ కళ కూడా ఒకటని, ఈ విజయానికి ఆదినుంచీ సలహాలు ఇస్తూ ప్రోత్సహించిన మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్, మెకానికల్ ప్రొఫెసర్ శ్రీధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్, తోటి ఉద్యోగులకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
సారంగాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. బీర్పూర్ మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. తరగతి గదిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు..? ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా..? అని పరిశీలించారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన ఉండాలన్నారు. ఆరో తరగతికి చెందిన గణేష్, రిశ్వంత్తో హిందీ పాఠ్యపుస్తకం చదవించి, సంతృప్తి వ్యక్తం చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు లైబ్రరీలో ఉండగా.. వారితో మాట్లాడారు. స్టోరీ బుక్కులు చదువుతున్నారా తెలుసుకున్నా రు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాల ని, మెనూ ప్రకారం అందించాలని నిర్వాహకుల కు సూచించారు. అనంతరం ప్రాథమిక ఉప కేంద్రాన్ని సందర్శించారు. వైద్యసిబ్బందితో మాట్లా డి అన్నిరకాల మందులు నిలువ ఉంచాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో డీపీవో మదన్మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీని వాస్, హౌసింగ్ డీఈ భాస్కర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేష్, ఎంఈవో నాగభూషణం ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
భాష.. యాసతోనే గుర్తింపు
● తెలంగాణ ఉద్యమంతో గౌరవం దక్కింది ● సంస్కృతీసంప్రదాయాలకు ప్రాచుర్యం ● ఉత్తరాది కల్చర్ మనపై దాడి చేస్తుంది ● అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ● దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ తెలంగాణ మాండలికం తెలంగాణ మాండలికంలో కవితలు, రచనలు చేయడంతో నన్ను గుర్తించారు. నేను ఎక్కువగా పల్లెటూళ్లు, అక్కడి జీవనవిధానం, పల్లెప్రజలు వాడుకునే పనిముట్లు.. వాటిపైనే ఎక్కువగా రాశాను. తెలంగాణ భాష అనేది నా భాష అని రాసిన. మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైంది. గిదేం భాష అని ఎక్కిరించిన్రు. అయినా మన తాతలు, తండ్రులు మాట్లాడిన భాషలోనే రాసిన. తెలంగాణ ఉద్యమ ఫలితంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు దక్కింది. తెలంగాణ మాండలికంలో వచ్చిన సినిమా పాటలు, జానపద గేయాలు సక్సెస్ అవుతున్నాయి.మొదట ఎక్కిరించిన్రు -
రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఇబ్రహీంపట్నం: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మంగళవారం మండలంలోని 13 గ్రామాల్లో 42మందికి రూ.42,04,8 72 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. వర్షాలు పడుతున్నందున గ్రామాలకే వెళ్లి చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో యూరియా కూడా సరిగ్గా అందించలేకపోతోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం కేంద్రం యూరి యా సరఫరా చేస్తోందని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకరిపైనొకరు నెపం నెట్టుకుంటూ రైతుల ను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా ఎరువుల కోసం లైన్ కట్టలేదని, ఇప్పుడు బస్తా కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశా రు. మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కో–ఆప్షన్ ఎలేటి చిన్నారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎలాల దశరథ్‌రెడ్డి, నాయకులు నేమూరి నరేష్, జేడీ సుమన్, కమటం రమేశ్, రెబ్బటి రాజేందర్ పాల్గొన్నారు. కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి రోడ్డు పనులు చేయని కంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎమ్మెల్యే ఆర్అండ్బీ ఏఈ ఫయజన్ను ఆదేశించారు. మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద పెద్ద గుంతలు పడి రోడ్డుపై నిలిచిన నీటిని చూసి ఆగారు. గ్రామ పంచాయతీ అధికారులు బ్లేడ్ ట్రాక్టర్‌తో చదును చేయిస్తుండడంతో గుంతలు ఎందుకు పూడ్చలేదని ఆర్అండ్బీ అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు రాక పనులు ఆపివేశాడని వారు సమాధానం ఇవ్వడంతో సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ -
భార్యను వదిలేసి.. ట్రాన్స్‌జెండర్ దీపుతో కాపురం
జగిత్యాల జిల్లా: జగిత్యాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి పెళ్లై 10 ఏళ్లు గడిచింది. భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆ భర్త.. భార్యా, పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఇటీవలి కాలంలో రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పర్చుకున్నాడు.ఈ క్రమంలోనే భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య, మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళన కు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కుటుంబ సభ్యులు. రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్ దీపు లను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన పలువురు వీడెక్కడి మొగుడండీ బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
బీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కొడిమ్యాల: బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవే టు ఫంక్షన్ హాల్లో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవి శంకర్‌తో కలిసి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ బీసీల పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇరుపార్టీల ఎంపీలు ఢిల్లీ పెద్దలను ఒప్పించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్ ద్వారా ఆమోదం పొందవచ్చని తెలిపారు. రవి శంకర్ మాట్లాడూతూ.. కాంగ్రెస్ హామీల్లో ఏ ఒ క్కటీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పోయందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ జె డ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్ పాల్గొన్నారు. -
పంచాయతీ రికార్డుల్లో గోల్మాల్
● ఇళ్ల మార్పిడికి బాధితుల దరఖాస్తు ● యజమానుల ప్రమేయం లేకుండానే మరొకరి పేరిట ● బదిలీపై వెళ్లిన కార్యదర్శి చేతివాటం..? ● ఇబ్రహీంనగర్ (శ్రీరాముపల్లి)లో వెలుగులోకిగొల్లపల్లి: గొల్లపల్లి మండలంలోని ఇబ్రహీంనగర్ (శ్రీరాముపల్లి)లో పంచాయతీ రికార్డులకు భద్రత కరువైంది. ఇంటి మార్పిడి కోసం దరఖాస్తు సమర్పిస్తే ఆస్తి మార్పిడి కాపీ ఇచ్చి రికార్డులో నమోదు చేయక చేతివాటం ప్రదర్శించారు ఇక్కడి అధికారులు. డిమాండ్ రిజిస్టర్లో అసెస్మెంట్ల నంబర్లతో ఉన్న యజమానుల పేర్లు.. మరో ఏడాది మరొకరి ఇంటి యజమానుల పేరిట మార్పిడి అయ్యాయి. ఇదంతా ఇళ్ల యజమానులకే తెలియకుండా జరిగిపోవడం గమనార్హం. గతంలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శి చేతివాటంతోనే ఇలాంటివి చోటుచేసుకున్నట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ తతంగాన్ని ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగింది..? ఇబ్రహీంనగర్ పంచాయతీ కార్యదర్శిగా 2021 ఏప్రిల్ 10న మల్లికార్జున్ విధుల్లో చేరారు. 2024 ఫిబ్రవరి 21వరకు పనిచేశారు. ఆ సమయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన ముద్దం భూమయ్య చనిపోగా.. ఆయన కొడుకు మొండయ్య ఇంటినంబర్ 5–3కి మార్పిడికి ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు పెట్టుకున్నాడు. భూమయ్య పేరిటే రికార్డులో రాసి.. మార్పిడి చేసినట్లు ఆస్తిమార్పిడి పత్రం అందించాడు. ఈ విషయం బాధితులకు ఆలస్యంగా విషయం తెలియడంతో న్యాయం చేయాలని 2025 మార్చి 3న ప్రజావాణిలో ఫిర్యాదు చేసాడు మొండయ్య. విచారణ జరిపిన అధికారులు ఆన్లైన్ మార్పిడి చేయకుండా అనుమతి ఇచ్చినట్లు గుర్తించారు. ఫౌల్ట్రీ, ఫర్టిలైజర్, వ్యాపారుల వద్ద కూడా ఇలాగే చేసాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా మోసపోయిన వారు గ్రామంలో 84 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సదరు కార్యదర్శి డిమాండ్ రిజిస్టర్ కూడా మెయింటేన్ చేయలేదనే అధికారులు గుర్తించినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శి ప్రమేయం లేకుండానే.. ప్రస్తుతం కార్యదర్శిగా రాజ్‌కిషన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2024 ఫిబ్రవరి 2న విధుల్లో చేరారు. ఈ ఏడాది మే 30న గ్రామానికి చెందిన బండారి రాజయ్య వచ్చి ఇంటి నంబర్ 1–29 బండారి బాలయ్య పేరు నుంచి బండారి సాయిలు పేరిట మార్పిడి జరిగిందా వాకబు చేశాడు. అలాగే ఏఎంసీ చైర్మన్ రాజిరెడ్డి కూడా కొన్ని వివరాలు అడగడంతో కార్యదర్శి ఈ–పంచాయతీ పోర్టల్‌లోని ఆన్లైన్ డిమాండ్ రిజిస్టర్ పరిశీలించారు. అందులో 2024–25లో ఉన్న ఇంటి యజమానుల పేర్లు.. 2025–26లోని రిజిస్టర్లో చూస్తే 25 మంది పేర్లు వేరుగా ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి ఎవరైనా ఇంటి యజమాని మరణిస్తే పేరు మార్పులు, చేర్పులు, మ్యూటేషన్ ద్వారా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి.. సిటిజన్ సర్వీసెస్ లాగిన్‌లో ఈ–పంచాయతీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత పంచాయతీ కార్యదర్శి ఆన్లైన్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడ మాత్రం పంచాయతీ కార్యదర్శి ప్రమేయం లేకుండానే ఈ–పోర్టల్‌లో పేర్లు మారడం గమనార్హం. ఈ–పంచాయతీ పోర్టల్ లాగిన్ కార్యదర్శి వెబ్సైట్ నుంచి లేదా పంచాయతీ కమిషన్ లాగిన్‌లో తప్ప ఇతరత్రా అవకాశం ఉండదు. కానీ.. 25మంది ఇంటి యజమానుల పేర్లు కార్యదర్శి ప్రమేయం లేకుండానే మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది గతంలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శి పనా..? లేకుంటే సైబర్ నేరగాళ్ల పనా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం.. గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి వల్ల తాము మోసపోయామని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఓ ఉన్నతాధికారి ప్రమేయంతోనే విచారణలో జప్యం జరుగుతోందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డులకే భద్రత లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కరి పేరిటే చేసిండు మేం ఇద్దరం అన్నదమ్ములం. మా అమ్మ లక్ష్మీనర్సు పదేళ్ల కిత్రం చని పోయింది. ఆమె పేరిట ఉన్న ఇంటి ఆస్తిని మా పేరిట చేయాలని అప్పటి కార్యదర్శి మల్లికా ర్జున్ను కోరితే ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని మా అన్న పేరిటే ఉన్నదంతా చేసిండు. ఇప్పుడు మా అన్న ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నడు. నా పేరిట జాగ లేక రాలేదు. ఇప్పటికీ ఆన్లైన్లో మా అమ్మ పేరే చూపిస్తోంది. – పొనగంటి దేవయ్య నా భర్త పేరు తొలగించారు నా భర్త లక్ష్మీరాజం పదేళ్ల కిత్రం చనిపోయిండు. ఇల్లు ఆయన పేరు మీదే ఉంది. ఘ ర్పట్టి కడుతున్నం. మార్చిలో కూడా చెల్లించిన. ఇంటిని నా పేరిట చేయాలని దరఖాస్తు పెట్టలేదు. ఆన్లైన్లో మాత్రం వేరే వ్యక్తి పేరిట చూపిస్తోంది. నాకు న్యాయం చేయాలి. – జుంజుపెల్లి పోశవ్వ, ఇబ్రహీంనగర్ అధికారులకు ఫిర్యాదు చేశా నా ప్రమేయం లేకుండా ఈ–పంచాయతీ పోర్టల్‌లోని ఆన్లైన్ డిమాండ్ రిజిస్టర్ 25 మంది ఇళ్ల యజమానుల పేర్లు మార్పిడి అయ్యాయి. దీనిపై పంచాయతీ శాఖ అధికారులు, పోలీస్, సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశాం. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – రాజ్‌కిషన్, పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు నివేదించా ఆస్తి మార్పిడికి దరఖాస్తు చేసుకుంటే పత్రం ఇచ్చి.. రికార్డులో నమోదు చేయలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు. వారి ఇళ్లకు వెళ్లి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. కార్యదర్శి ఫిర్యాదుతో రిజిస్టర్లను పరిశీలిస్తే 25 మంది పేర్లు మారినట్లు గమనించాం. – సురేష్ రెడ్డి, ఎంపీవో, గొల్లపల్లి -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలింపు
– ఆత్మకూర్ రీచ్ నుంచి 29 ట్రాక్టర్ల తరలింపు మెట్పల్లి రూరల్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేసింది. మెట్పల్లి మండలం ఆత్మకూర్ రీచ్ నుంచి 10 మంది లబ్ధిదారుల కోసం 29 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక తీసుకెళ్లినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇసుక పక్కదారి పట్టకుండా రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. ముందుగా వాగు నుంచి ఇసుక తీయొద్దని కొందరు గ్రామస్తులు అడ్డగించడంతో రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో శాంతించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలియకపోవడంతో ఈనెల 25 న ‘ఇందిరమ్మకు ఉచిత ఇసుక’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో చాలామంది లబ్ధిదారులు పంచాయతీ, రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులు వారికి ఇసుకను సరఫరా చేశారు. -
జనరేటర్‌తో ట్రాఫిక్‌జాం
జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో మంచాల కృష్ణ పెట్రోల్ బంక్ జనరేటర్ రూం రోడ్డుకు అడ్డంగా ఉంది. ట్రాఫిక్‌తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదు. జనరేటర్ రూంను తొలగించాలి. యావర్‌రోడ్డును విస్తరించాలి. – బీజేపీ నాయకులు ఫేక్ డాక్యుమెంట్లతో బెదిరింపులు బీర్పూర్ పరిధిలోని సర్వే నంబర్ 333/1/1, 333/2లోని స్థలాన్ని నిజామాబాద్ జిల్లా నూతిపెల్లికి చెందిన దేవర సంజీవరాజు, తండ్రి రాంజీవన్రావు వద్ద డీ–1ఫాం సర్టిఫికెట్ ఆధారంగా 2009లో 44 మందిమి రెండు గుంటల చొప్పున కొన్నాం. ఆ స్థలంలో రేకుల షెడ్లు నిర్మించుకుని 16 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాం. ఇటీవల వంగపెల్లి చంద్రశేఖర్‌రావు అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లు చూపుతూ ఈ స్థలం తనదని, ఖాళీ చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరిస్తున్నాడు. చంద్రశేఖర్‌రావు నుంచి ఇళ్లు, ప్రాణాలకు రక్షణ కల్పించాలి. – ఎస్సీ కులస్తులు, బీర్పూర్ -
కోడెలను సంరక్షించాలి
భక్తులు సమర్పించే నిజ కోడెలు గోశాలలోనే ఉంచి సంరక్షించాలి. కోట్ల ఆదాయం ఉన్న ఆలయానికి కోడెల సంరక్షణ సమస్య కాదు. వాటి కోసం ప్రత్యేక నిధులు, సిబ్బందిని కేటాయించి వాటి బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. – గడప కిశోర్‌రావు, విశ్వహిందూ పరిషత్ సహాయ కార్యదర్శి, కరీంనగర్ జిల్లా 50 ఎకరాల్లో నిర్మాణం రాజన్న ఆలయానికి ఏటా రూ.123 కోట్ల 76 లక్షల ఆదాయం వస్తుంది. దాదాపు 68 శాతం కోడెమొక్కుల ద్వారా సమకూరుతుంది. కోడెల సంరక్షణకు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మర్రిపల్లి శివారులో గోశాల కోసం 50 ఎకరాల్లో నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. – చిలుక రమేశ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి -
ఆడుకుంటూ వెళ్లి.. నీటిబకెట్‌లో పడి..
జూలపల్లి(పెద్దపల్లి): సరదాగా ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి గుండు సాన్వీ(21నెలలు) నీటిబకెట్‌లో పడి చనిపోయింది. పెద్దపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గుండు సతీశ్ – రవళి దంపతులు. వీరికి ఒక మారుడు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పెద్దవాడు, కూతురు సాన్వీ ఇంట్లో సందడిచేస్తూ ఉండేది. ఈక్రమంలోనే ఈనెల 27న రాత్రి 7.00 గంటల సమయంలో ఇంట్లో ఆడుకుంటోంది. చిన్నారి తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నయ్యారు. అయితే, ఇంట్లో ఆడుకుంటూ క్రమంగా బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ సమీంలోని నీటి బకెట్ వద్దకు చేరుకుంది. అక్కడ నీటిని చేతితో తాకేందుకు యత్నించగా బకెట్లో తలకిందులుగా పడిపోయింది. ఆ వెంటనే గమనించిన చిన్నారి పెద్దనాన్న నరేశ్ కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు. -
ఎస్సారెస్పీపైనే ఆశలు
● భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి నీరు ● 23.866 టీఎంసీలకు చేరిన నీటిమట్టం ● నీరు విడుదల చేయాలని రైతుల డిమాండ్ జగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద చేరుతోంది. ఆయకట్టుకు విడుదల చేసేస్థాయిలో ప్రాజెక్టు నీటిమట్టం పెరగకపోవడంతో, నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. మొన్నటి వరకు వర్షాలు లేక, పంటలు ఎండిపోతుండటంతో నీరు విడుదల చేయాలని జిల్లాలోని కథలాపూర్, మెట్పల్లి రైతులు ఆందోళనకు దిగారు. ● ఎగువప్రాంతాల్లో వర్షాలు అంతంతే ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పెద్దగా లేకపోవడంతో నీరు చేరడం లేదు. రెండేళ్లలో జూలై నెలలోనే ప్రాజెక్టు నిండింది. జిల్లా ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చారు. ప్రాజెక్టుకు చెందిన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలకే కాకుండా వరదకాలువకు సైతం పలుమార్లు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిండిన తర్వాత ఐదారుసార్లు గేట్లు ఎత్తి వరదను గోదావరిలోకి వదిలారు. ● జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో సాగు జగిత్యాల జిల్లాలో వానాకాలం సీజన్లో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. ఇందులో వరి 3 లక్షల ఎకరాల్లో సాగుచేసే అవకాశముంది. వరికి సాగునీటి అవసరం ఎక్కువ. ప్రస్తుతం వ్యవసాయ బావుల్లో ఉన్న నీటితోనే వరి నాట్లు వేస్తున్నారు. ప్రాజెక్టు నిండుతుందనే ఆశతో రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడే వరద వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ బావుల్లో ఉన్న నీరు సైతం ప్రధాన పొలం దున్నేందుకు సరిపోవడం లేదని చెపుతున్నారు. లక్షన్నర ఎకరాల్లో సాగయ్యే మొక్కజొన్న, పసుపు పంటలకు వర్షం నీరు సరిపోతుంది. తప్పని పరిస్థితుల్లో డ్రిప్ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ● ప్రాజెక్టులో 23.866 టీఎంసీలు ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1070.30 అడుగుల నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీ(గతంలో 90.3 టీఎంసీ)లకు ప్రస్తుతం 23.866 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఈ సీజన్లో జూన్ 1 నుంచి 13.045 టీఎంసీల నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సగటున ప్రాజెక్టులోకి 10,484 క్యూసెక్కుల నీరు చేరుతోంది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టు నీటి మట్టం 1073.60 అడుగులు ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం 29.933 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50,503 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 622 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో వెళ్తోంది.కాగా.. కథలాపూర్, మెట్పల్లి ప్రాంత రైతులు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఎదురుచూస్తున్నాం ఎస్సారెస్పీ ప్రాజెక్టు జిల్లాకు వరప్రదాయినీ. ఈ ప్రాజెక్టు ద్వారా జగిత్యాల జిల్లాకే ఎక్కువ నీరు అందుతుంది. ప్రాజెక్టు నీరు రాకపోతే పంటలు సాగుచేయడం కష్టం. చాలామంది వరినాట్లు వేసి ఎస్సారెస్పీ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. – వేముల కరుణాకర్, ధర్మపురి ప్రాజెక్టు నిండాలి ఖరీఫ్ సీజన్‌కు ఆన్, ఆఫ్ పద్ధతిలో ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలి. ఇప్పటి వరకు వ్యవసాయ బావిలో ఉన్న నీటితో నాట్లు వేసుకున్నాం. బావుల్లో సరిపోయేంత నీరు లేదు. ప్రాజెక్టు తొందరగా నిండి, వానాకాలం, యాసంగి పంటలకు నీరు అందించాలి. – నక్కల తిరుపతి రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి -
మురుగుతోనే సావాసం
జగిత్యాల: జిల్లాలో మూడురోజులుగా కురిసిన ముసురువానకే డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. మరోవైపు ఖాళీ స్థలాల్లోకి మురికినీరు చేరింది. డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. సోమవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో మురుగుకాలువల్లో నీరు తగ్గినా.. మురుగు మాత్రమే అలాగే మిగిలిపోయింది. అధికారులు వెంటనే చర్యలు చేపట్టకపోతే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. డ్రెయిన్లు సక్రమంగా లేకపోవడంతో కొట్టుకొచ్చిన చెత్త అంతా నిండిపోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా అందులోనే వేస్తుండడంతో మురికినీరు ముందుకు కదలడం లేదు. వర్షం తగ్గుముఖం పట్టిన క్రమంలో నీరు కొద్దికొద్దిగా వెళ్లిపోయినా మురుగుతో కూడిన చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో దోమలు, ఈగలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్ అహ్మద్ అధికారులతో సమీక్షించి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీల్లో ఆయిల్‌బాల్స్ వేయించాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి జిల్లాకేంద్రంలోని పారిశుధ్యంపై కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం పలు మురికికాలువలను పరిశీలించి వెంటనే చెత్తాచెదారం తొలగించాలని, కాలువల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పిచ్చిమొక్కలు తొలగించాలని సూచించారు. కాలనీల్లో పర్యటించి కాలువలను పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యప్రసాద్ ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి రోడ్లోగల ఆస్పత్రుల సమీపంలో ఉన్న డ్రైనే జీ. సరిగా లేకపోవడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. ఇటీవలి ముసురుతో ఖాళీ స్థలా లు, డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. కాలువులు శుభ్రం చేసి ఆయిల్‌బాల్స్ వేస్తేనే వ్యాధులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని కాలనీవాసులు అంటున్నారు. ఇది జిల్లాకేంద్రంలోని మోతెరోడ్కు వెళ్లే సమీపంలోని డ్రైనేజీ. నీరు సాఫీగా వెళ్లకపోవడంతో మురుగునీరు నిలిచే ఉంటోంది. ఆ నీటిని తొలగించకుంటే దోమలు, పందులు స్వైర విహారం చేస్తాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది బైపాస్‌రోడ్‌లో గల డ్రైనేజీ. అందులో చెత్తాచెదారం పడేయడం స్థానికులకు శాపంగా మారింది. సమీపంలో నివాసాలు, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పిల్లలు, ప్రజలు వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఆ ప్రాంతమంతా క్లోరినేషన్ చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇటీవలి వర్షాలకు సాయిబాబా ఆలయం ఎదుట గల డ్రైనేజీ పూర్తిగా నిండింది. కార్మికులు సిల్ట్ తీసినా నీరు సాఫీగా ప్రవహించడం లేదు. సమీపంలోని ఇళ్లలోకి చేరుతోంది. అధికారులు స్పందించి నీటిని బయటకు వెళ్లేలా చేసి క్లోరినేషన్ చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది గోత్రాలకాలనీకి వెళ్లే రోడ్డు. ఇక్కడ డ్రైనేజీ లేదు. ఆ ప్రాంతమంతా కొట్టుకొచ్చిన చెత్తాచెదారంతో నిండిపోయింది. దుర్వాసన మధ్య కాలనీవాసులు ఉండలేకపోతున్నారు. దోమలు విపరీతంగా వస్తున్నాయి. అక్కడ డ్రైనేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కొన్ని విష పురుగులు వస్తున్నాయంటున్నారు. -
గోశాల.. గోస తీరేనా.!
వేములవాడరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. రాష్ట్రంలోని గోశాలల్లో అధునాతనమైన గోశాలను నిర్మించాలని ఇందుకు 21 ప్రాంతాలను ఎంపికచేసింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న గోశాలను 50 ఎకరాల స్థలంలో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గోవుల పోషణ, సంరక్షణకు పశుసంవర్ధక, రెవెన్యూ, దేవాదాయ శాఖల భూముల్లో ఈ గోశాలను నిర్మించాలని ఇంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాజన్న ఆలయ గోశాల కోసం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని 748 సర్వేనంబర్‌లో 50 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఈ ప్రాంతంలో గోశాల నిర్మించనున్నారు. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం.. రాజన్నకు భక్తులు మొక్కుబడిగా కోడెలు సమర్పిస్తారు. కొందరు ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుంటారు. కోడె మొక్కులతో ఏటా ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతోంది. తిప్పాపూర్‌లో మూడెకరాల స్థలంలో దాదాపు 400 కోడెలు ఉంటాయి. ఆలయంలో భక్తుల మొక్కు చెల్లింపుల కోసం సమీపంలోని గోశాల వద్ద కొన్ని కోడెలు సిద్ధంగా ఉంచుతారు. వీటి సంరక్షణ కోసం ఏఈవో స్థాయి అధికారి పర్యవేక్షణలో కోడెల బాగోగులు చూసుకుంటారు. భక్తులు పశుగ్రాసం వితరణగా అందిస్తారు. ఇటీవల వరుసగా కోడెలు మృత్యువాత పడటంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రత్యేక దృష్టిసారించారు. రాజన్న గోశాల కోసం ప్రత్యేకంగా అధునాతనమైన గోశాల నిర్మించాలని ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ గోశాల కోసం 50 ఎకరాల స్థలం గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ అధికాారులు మర్రిపల్లిని 748 ప్రభుత్వ స్థలాన్ని 50 ఎకరాలుగా గుర్తించి అందులో హద్దులు ఏర్పాటు చేశారు. మర్రిపల్లిలో 50 ఎకరాల్లో గోశాల అనుమతుల రాగానే నిర్మాణ పనులు కేబినెట్ ఆమోదంతో హర్షంవ్యక్తం చేస్తున్న భక్తులు -
సరస్వతీ పుత్రునికి అందిన లక్ష్మీకటాక్షం
తిమ్మాపూర్: కూలిపనులు చేసుకుంటూ బతికే మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ–శంకర్ దంపతుల కొడుకు మహేశ్ గత ఎప్రిల్లో విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 453 (ఎస్సీ విభాగంలో 17)వ ర్యాంకు సాధించాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎన్ఐటీలో ఆర్కిటెక్చర్ సీటు దక్కించుకున్నాడు. ఫీజుకట్టలేని పరిస్థిలో తల్లిదండ్రులు ఉండడంతో మహేశ్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ పీఏ మురళీధర్ రెడ్డి విద్యార్థికి ఎలాగైనా సహాయం చేయాలని తలిచి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, అధికారుల సహకారంతో రూ.3.30 లక్షలు సమీకరించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థి మహేశ్‌కు అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో పేదలకు సాయం చేయాలని, విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన దాతలు అభినందించారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, తహసీల్దార్లు శ్రీనివాసరెడ్డి, విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఎస్ఎల్ గౌడ్, ఒగ్గు దామోదర్, బండారి రమేశ్, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, మోరపల్లి రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పీఏ మురళీధర్ రెడ్డి స్పందించి సాయం చేసిన నేతలు -
● అధికారులు అప్రమత్తంగా ఉండాలి ● గ్రామాలు, పట్టణాల్లో ఫాగింగ్ తప్పనిసరి ● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్ అహ్మద్
జగిత్యాల: గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షించారు. వర్షాలతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, విస్తృతంగా పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. నీరు నిలిచిన చోట వెంటనే ఆయిల్‌బాల్స్ వేయించాలని సూచించారు. తాగునీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, జ్వరాలు వచ్చిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి పరిస్థితుల్లనైనా స్పందించేలా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రవాహం మీదుగా ప్రజల రాకపోకలు సాగించకుండా నిషేదం విధించాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా, టైపాయిడ్, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విస్తీర్ణం అధారంగా ఎరువులు అందించాలి జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు సాగు చేసిన పంటల విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు అందించాలని సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ఎరువులు కొరత లేకుండా సరఫరా చేయాలన్నారు. జిల్లాకేంద్రంలోని ఎరువుల గోదాంను పరిశీలించారు. యూరియా విక్రయాలను పరిశీలించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, ఏడీఏ భాస్కర్, ఆర్డీవో మధుసూదన్ ఉన్నారు. కొడిమ్యాల ఆస్పత్రి సందర్శన కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. రోగుల ఓపీ, ఐపీ వివరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై తీసుకుంటున్న చర్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పనులను ఎప్పటికప్పుడు చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ఎస్‌హెచ్‌వో రాజశేఖర్, స్థానిక వైధ్యధికారులు నరేష్, పరమేశ్వరి, ఆఫీస్ సిబ్బంది ఉన్నారు. -
భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేయండి
మా అమ్మ చనిపోయింది. మా నాన్న విదేశంలో ఉంటున్నాడు. మా బాగోగులు చూడటం లేదు. అక్కా చెల్లెళ్లిద్దరం అమ్మమ్మతో ఉంటున్నాం. మా అమ్మ చావుకు కారణమైన మా తాత, నానమ్మ మా నాన్న వాటా కింద రావాల్సిన భూమిని అక్రమంగా విక్రయించినట్లు మా బంధువుల ద్వారా తెలిసింది. రేచపల్లి శివారులోని సర్వే నంబర్ 5273/2/4/1/1లోని 1.06 ఎకరాలు, సర్వే నంబర్ 530/జి/1లోని 0.374 గుంటల భూమిని మాకు తెలియకుండా అమ్మకానికి పెట్టారు. అమ్మ లేక.. నాన్న పట్టించుకోక అనాథలమైన మాకు ఏకై క జీవనాధారమైన ఆ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోండి. – మౌనిక చైత్ర, ఇయాన్సి, రేచపల్లి -
ఆండాళ్ అమ్మవారికి పంచామృతాభిషేకం
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శావ్రణ సప్తాహంలో భాగంగా సోమవారం ఆండాళ్ తిరునక్షత్రం నిర్వహించారు. గోదాదేవికి పంచామృతాభిషేకం నిర్వహించారు. విశేష భోగాలతో నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు రఘు, ఉప ప్రధాన అర్చకులు మారుతీ ప్రసాద్, రాంచంద్ర ప్రసాద్, అర్చకులు అనిల్‌కుమార్, రాంచందర్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పర్యవేక్షకులు అశోక్ పాల్గొన్నారు. యూరియా కోసం రైతుల తిప్పలు ఇబ్రహీంపట్నం: మొక్కజొన్న రైతులు యూరి యా కోసం తిప్పలు పడుతున్నారు. పంట చివరి దశకు చేరడంతో యూరియా తప్పనిసరి. అయితే ఎరువు దొరక్కపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. మండలకేంద్రంలోని సహజ ఎఫ్‌పీవోకు 450 బస్తాల యూరియా వచ్చింది. ఇందులో 150 బస్తాలను ఇబ్రహీంపట్నం రైతులు, 300 బస్తాలు అమ్మక్కపేట రైతులకు పంపిణీ చేసేందుకు సీఈవో శ్రీధర్ సిద్ధమయ్యారు. అయితే అప్పటికే రైతులు పెద్ద ఎత్తున ఎఫ్‌పీవోకు చేరుకున్నారు. కంెపెనీలో సభ్యత్వం ఉన్నవారికే యూరియా ఇవ్వాలని గొడవకు దిగారు. దీంతో ఒక్కో రైతుకు ఆధార్, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్ తీసుకుని రెండుబస్తాల చొప్పున పంపిణీ చేశారు. కానీ.. చాలామంది రైతులకు యూరియా దొరకలేదు. ఇబ్రహీంపట్నం పీఏసీఎస్‌లో వారం క్రితం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేసిన విషయం తెల్సిందే. ఓ రైతులకు ఎక్కువ బస్తాల యూరియా పంపిణీపై విచారణ కొనసాగుతోంది. ఆ సొసైటీకి యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. హైపటైటీస్ను నివారిద్దాంజగిత్యాల: హైపటైటీస్ నివారణ సాధ్యమేనని, నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. ఐఎంఏ హాల్లో వైద్యులతో సమీక్షించారు. హైపటైటీస్కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరోచనాలు, కంటిభాగంలోని తెలుపు రంగు పసుపుగా మారడం వంటి లక్షణాలుంటాయన్నారు. ఇందులో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలుంటాయని, కొందరిలో ఇవి ఉన్నట్లు కూడా తెలియదన్నారు. ఇది ముదిరితే ఇబ్బందేనని, మొదట్లోనే వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా హైపటైటీస్ను గుర్తించిన వారికి ప్రశంస పత్రాలు అందించారు. ‘మధ్యాహ్న’ బిల్లులను మినహాయించాలిజగిత్యాలటౌన్: మధ్యాహ్న భోజన నిర్వహణ బిల్లుల చెల్లింపులను ఈ–కుబేర్ నుంచి మినహాయించాలని 5నెలల పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సులోచన మాట్లాడుతూ నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కార్మికులకు రూ.పదివేల గౌరవవేతనం అందించాలని, యునిఫాం, ప్రమాదబీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు ముత్యాల గౌరమ్మ, వెల్మలపల్లి వెంకటాచారి, పద్మ, సరిత, గంగవ్వ, రుక్మ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గన్నేరువరం(మానకొండూర్): మండల కేంద్రంలో అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. పబ్బతి చంద్రయ్య(40) ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి ఐదునెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందున్న చెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య ప్రమీల ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. అమెరికాలో సింగరేణి కార్మికుడి మృతి ● ఇండియాకు శవాన్ని తీసుకొచ్చే యత్నంలో బంధువులు గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–3 పరిధిలోని ఓసీపీ–2లో పనిచేస్తు గోదావరిఖనిలో పవర్‌హౌస్ కాలనీలో నివాసముంటున్న పెరక ప్రకాశ్(54) అమెరికాలో ఇటీవల మృతి చెందాడు. ఆయన కూతురు అమెరికాలోని అస్ట్రిన్ నగరంలో ఉండగా.. అక్కడికి వెళ్లి మరణించాడు. మృతదేహాన్ని ఇండియాకు పంపించడానికి అక్కడి బంధువులు గోఫండ్‌మీ పేజీ ఏర్పాటు చేసి సాయంకోసం ఎదురుచూస్తున్నా రు. అక్కడి తానా ప్రతినిధులతో మాట్లాడి శవా న్ని గోదావరిఖనికి తీసుకురావాలనే యోచనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, చిన్న కూతురి వద్దకు వెళ్లిన సమయంలో ఈసంఘటన జరిగింది. గంజాయి తరలిస్తున్న బాలుడిపై కేసువెల్గటూర్: గంజాయి తరలిస్తున్న బాలుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్గటూర్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మండలంలోని మొక్కట్రావుపేట శివారులో పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బాలుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని తనిఖీ చేయగా 110 గ్రాముల గంజాయి దొరికింది. బాలుడిది ముత్తునూర్ గ్రామంగా గుర్తించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఏడుగురిపై..మెట్పల్లి: మెట్పల్లి క్లబ్ సొసైటీ స్థల విక్రయ వ్యవహారంలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ సోమవారం తెలిపారు. క్లబ్ ఆస్తులను గుట్టుగా విక్రయించి మోసానికి పాల్పడుతున్నారని దొంతుల వెంకటేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధ్యక్షుడు చెట్లపల్లి నరేందర్గౌడ్చ గంగుల వివేక్, వేముల కిషన్, దొంతుల సుధాకర్, వేముగంటి భూమేశ్వర్, నీల రాజు, వేముల అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించండి
కరీంనగర్‌టౌన్: పెండింగ్‌లో ఉన్న కరీంనగర్–జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన ఆయన కరీంనగర్–జగిత్యాల విస్తరణ పనులతో పాటు సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ (సీఆర్ఐఎఫ్) మంజూరు అంశాలపై చర్చించారు. కరీంనగర్ నుంచి జగి త్యాల వరకు ఫోర్‌లేన్ విస్తరణకు ఎన్నికలకు ముందే కేంద్రం రూ. 2151 కోట్ల 35 లక్షల నిధులతో ప్రతిపాదనలు రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలు రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) ను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. మొత్తం రూ.113 కోట్లతో కూడిన సీఆర్ఐఎఫ్ ప్రతిపాదనలను గడ్కరీకి సమర్పించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట–ఖాజీపూర్ రోడ్డులో భాగంగా మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జితోపాటు గన్నేరువరం మండలం గుండ్లపల్లి–పొత్తూర్ రోడ్డు విస్తరణ పనులు, చందుర్తి నుంచి మోత్కురావుపేట వరకు వంతెనల నిర్మాణ పనులు, కిష్టంపల్లి వరకు రోడ్డుపై వంతెన నిర్మాణ ం, శంకరపట్నం మండలం అర్కండ్ల (గ్రామం) నుంచి కన్నాపూర్ (గ్రామం) వరకు వరద కాలు వపై హై లెవల్ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ త్వరలోనే సీఆర్ఐఎఫ్ నిధులు విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
మల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. సోమవారం మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం చెప్పే అబద్దాలు, కాంగ్రెస్ మోసపూరిత హామీలపై అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. స్థాని క సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మా జీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మా జీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు. -
పాల ధర తగ్గడంతో నష్టపోతున్న పాడిరైతులు
● పాల ధర తగ్గుతోంది.. దాణా ఖర్చు పెరుగుతోంది ● ఇతర రాష్టాల నుంచి వచ్చే పాలను చెక్ చేయాలి ● మాజీ మంత్రి జీవన్రెడ్డిసారంగాపూర్: పాల ధర తగ్గడంతో పాడి రైతులు నష్టపోతున్నారని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. పశువులకు అందించే దాణాకు మాత్రం ధర భారీగా పెరుగుతోందన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మీదేవిపల్లి, కోనాపూర్ గ్రామాల్లోని రైతుల డెయిరీ ఫాంలను పరిశీలించారు. సారంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి పలు డైయిరీ కంపెనీలు రాష్ట్రానికి పాలు ప్యాకెట్ల రూపంలో తీసుకుంటున్నాయని తెలిపారు. ఇక్కడి కంపెనీలు రైతులకు లీటర్‌కు చెల్లించే ధర కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పాలకు తక్కువ ధర చెల్లిస్తున్నాయని, ఈ క్రమంలో వాటి నాణ్యత చెక్ చేయాలని సూచించారు. లీటర్‌కు రూ.5 ప్రోత్సాహకం అందిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున హామీ ఇచ్చామని, ఇప్పుడు అమలు చేయాలని జీవన్‌రెడ్డి కోరారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రాంచంద్రారెడ్డి, శేఖర్, గంగారాం, మహిపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా మైదానానికి స్థలం కేటాయించండి
జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో క్రీడా మైదానం లేదు. వాకింగ్, క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ ఆడేందుకు మైదానం లేక ఇబ్బంది పడుతున్నాం. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులకు పలుమార్లు విన్నవించాం. మేజర్ పంచాయతీ అయిన చల్గల్లో క్రీడామైదానం ఏర్పాటు చేస్తే మోరపల్లి, చర్లపల్లి, హస్నాబాద్, తాటిపల్లి ప్రజలకు వాకింగ్‌తో పాటు క్రీడలు ఆడేందుకు సౌకర్యంగా ఉంటుంది. – చల్గల్ గ్రామ యువకులు రోడ్లు వేయండి భవానీనగర్ కాలనీని అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షం పడితే రోడ్లన్నీ బురదలా మారుతున్నాయి. కొన్ని కాలనీల్లో రోడ్లు ఉన్న చోటే తిరిగి రోడ్లు వేస్తున్నారు. మా కాలనీలో మాత్రం పట్టించుకోవడం లేదు. వివక్ష లేకుండా మా కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించండి. – భవానీనగర్ కాలనీ, జగిత్యాల -
సర్వేయర్ల పరీక్ష ప్రశాంతం
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం గ్రామపాలన అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా సాగిందని కలెక్టర్ అన్నారు. ఎస్కేఎన్ఆర్ పరీక్షకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లు 148 మందికి 127 మంది హాజరయ్యారని, గ్రామపాలన అధికారులు 29మందికి 21మంది హాజరైనట్లు తెలిపారు. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఆయన వెంట చీఫ్ సూపరింటెండెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోండి● మాజీమంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాలటౌన్: నూకపల్లి అర్బన్ కాలనీలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించగా.. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు కూల్చివేయించారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కూల్చివేతలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వివిధ దశల్లో ఉన్న వందకుపైగా ఇళ్లను ముందస్తు సమాచారం లేకుండా కూల్చడమేంటని ప్రశ్నించారు. ఇళ్ల కూల్చివేతలో గత ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందన్నారు. నష్టపోయిన బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. 2018లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పేరిట తొలగించిన రెండువేల మంది లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని ఆరోపించారు. వారు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో ఇప్పటికే మంజూరైన లబ్ధిదారులుగా చూపిస్తోందని, తద్వారా వారు డబుల్ ఇళ్లకు అర్హత సాధించలేకపోయారని తెలిపారు. 2023లో అప్పటి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వసతులు కల్పించకుండా ఇళ్లు కేటాయించారని, ఆ ఇళ్లలో ఉండేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు. ఇష్టారాజ్యంగా ఇళ్లు కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, తాటిపర్తి విజయలక్ష్మి, జయశ్రీ, ముంజాల రఘువీర్, పద్మ, పిప్పరి అనిత, కోండ్ర జగన్, ఎలిగేటి నర్సయ్య, చాంద్‌పాషా తదితరులు ఉన్నారు. విశ్వబ్రాహ్మణులకు పథకాలు అందించాలి● విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్ మల్లాపూర్ : నిరుపేద విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అందించాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్, మండల అధ్యక్షుడు మానాల నాగయ్య అన్నారు. మండలకేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఆలయ కల్యాణ మండపంలో సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో 90శాతం మంది నిరుపేదలేనని, సీఎం స్పందించి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రూ.వందకోట్లు కేటాయించాలని కోరారు. 4వ కేటగిరీ కింద కరెంట్ మీటర్లు ఇవ్వాలని, చిన్న పరిశ్రమలతో ప్రోత్సాహం అందించాలని కోరారు. లేబర్‌కార్డులు, వాటి ప్రయోజనాలను సంఘ సభ్యులకు వివరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, మండల ప్రధాన కార్యదర్శి కూచనపెల్లి రజనీకాంత్, కోశాధికారి శేఖర్, సభ్యులు మద్దెనపల్లి శ్రీనివాస్, మురళి, సంకోజి రాజేందర్, దొంతి సుధాకర్, సుభాష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతకు ‘జన సురక్ష’
జగిత్యాలజోన్: గ్రామీణ ప్రజలకు బ్యాంకుల సేవలు అందిస్తున్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలపై సరైన అవగాహన లేక ముందుకు వెళ్లలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలనూ సరిగ్గా అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం గ్రామీణ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచేందుకు జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో సదస్సులు నిర్వహిస్తోంది. సదస్సుల్లో మహిళాశక్తి గ్రూపులు, ఆశావర్కర్లు, అంగన్వాడీలను భాగస్వామ్యం చేయాలని సంకల్పించింది. పోస్టర్లు, బ్యానర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ● ప్రతిగ్రామంలో జనసురక్షా క్యాంపులు జిల్లాలో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సెప్టెంబర్ 30 వరకు జనసురక్ష క్యాంపులు కొనసాగనున్నాయి. కేంద్రంలోని ఫైనాన్సియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని బ్యాంకులు గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఆర్థిక అక్షరాస్యత పెంచేందుకు జనసురక్ష క్యాంపులు నిర్వహిస్తోంది. ప్రతిరోజూ రెండుమూడు గ్రామాల్లో సదస్సులు చేపడుతోంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే ఆధార్‌నంబర్, మొబైల్ నంబర్, ఫొటో, బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం చేస్తున్నారు. ● బీమా, పెన్షన్ పథకాలపై ఫోకస్ కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతా ఉన్న ప్రతిఒక్కరికీ బీమా, పెన్షన్ పథకాలను అందించాలని నిర్ణయించింది. కొంతకాలంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్‌జ్యోతి బీమా యోజన పథకాలను తీసుకొచ్చినప్పటికీ.. ఈ పథకాల్లో చేరని వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ఈ పథకాల్లో చేరిన ఖాతాదారులు చనిపోతే రెండు పథకాల కింద రూ.4లక్షల బీమా అందుతుంది. అలాగే గ్రామీణప్రాంత ప్రజలకు పెన్షన్ ఇచ్చేందుకు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చినప్పటికీ.. గ్రామాల్లోని 18 నుంచి 40 ఏళ్ల యువకుల్లో సరైన అవగాహన లేక చాలమంది పథకానికి దూరమవుతున్నారు. ఈ పెన్షన్ పథకం కింద 60 ఏళ్లతర్వాత రూ.5వేల పెన్షన్ వస్తుంది. ● నామినీ విషయాలు తెలియక.. బ్యాంకు ఖాతాదారులు చనిపోయినప్పుడు నామినీ ఎవరూ ఉండకపోవడంతో డబ్బులు బ్యాంకుల్లోనే మురిగిపోతున్నాయి. ఇందుకోసం ప్రతి ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో తన తదనంతరం ఆ డబ్బులు ఎవరికి చెందాలో అనే విషయాలపై వివరిస్తున్నారు. చాలా ఖాతాల్లో నామినీ చనిపోయినప్పటికీ.. ఖాతాదారుడు నామినీని మార్చకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాలను ఉదాహరణలతో చెపుతున్నారు. ఇలా బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినీ విషయాలపై అవగాహన పెంచుతున్నారు. ప్రతి ఖాతాదారుడు పదేళ్ల తర్వాత రీ–కైవెసీ చేయించుకోవాలని.. తద్వారా ఖాతాల లావాదేవీల్లో ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు. ఖాతాదారులు చనిపోతే నామినీలు ఎలా డబ్బులు పొందాలనే విషయంపై బ్యాంకర్లు వివరిస్తున్నారు. ● డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహన బ్యాంకులో ఖాతా ఉన్నప్పటికీ.. డిజిటల్ బ్యాంకు కార్యాకలపాలు ఎలా నిర్వహించాలనే విషయాలు చాలామందికి తెలియడం లేదు. సురక్షితంగా డిజిటల్ లావాదేవీలు ఎలా చేయాలనే దానిపై ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా గుగూల్ పే, ఫోన్‌పే ఎలా వాడాలి..? బ్యాలెన్స్ డబ్బులు ఎలా చూసుకోవచ్చు..? వంటివి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ వ్యవహారాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబర్ సమస్య వచ్చినప్పుడు వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. చాలా విషయాలు తెలియడం లేదు గ్రామీణ ప్రజలకు బ్యాంకులకు సంబంధించిన చాలా విషయాలు తెలియడం లేదు. డబ్బులు వేసుడు, తీసుడు మాత్రమే తెలుసు. బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలపై ప్రజలకు జన సురక్ష క్యాంపుల ద్వారా అవగాహన కల్పించడం మంచి పరిణామం. – ఎల్క కమలాకర్, సంగెంశ్రీరాంపూర్ అవగాహన పెంచుతున్నాం గ్రామీణ ప్రజలకు బ్యాంకు కార్యకలాపాలపై అవగాహన పెంచుతున్నాం. ముఖ్యంగా మహిళలు బ్యాంకుల్లో ఎదుర్కొనే ఇబ్బందులపై చర్చించడంతోపాటు ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నాం. బీమా, పెన్షన్ పథకాలపై పూర్తి స్థాయిలో వివరిస్తున్నాం. – జి.రాంకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ -
గంగపుత్రులకు ఉపాధి
సూరమ్మ ప్రాజెక్టుతో మత్స్య సంపద పెరుగుతుంది. ప్రాజెక్టులో చేపలు పెంచడంతో గంగపుత్రులకు ఉపాధి దొరుకుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే దశలో ఉండటం సంతోషంగా ఉంది. – కల్లెడ గంగాధర్, గంగపుత్ర సంఘం నాయకుడు, కలిగోట 50 వేల ఎకరాలకు నీరు సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల భూసేకరణకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం అనందంగా ఉంది. నాలుగు మండలాల్లో 50 వేల ఎకరాల భూములకు సాగునీరందుతుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాంత రైతుల కల నెరవేరనుంది. పనులు పూర్తి చేసి త్వరగా నీరందించాలి. – అల్లూరి దేవారెడ్డి, రైతు, బొమ్మెన -
సైబర్ నేరాలతో విలవిల
● మోసాలతో రూ.లక్షలు లూటీ చేస్తున్న కేటుగాళ్లు ● పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కేసులు ● రికవరీ చేయడం పోలీసులకు కష్టంగా మారిన వైనం మెట్పల్లి: జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సాధారణ వ్యక్తులే కాకుండా ఉన్నత విద్యావంతులు కూడా వీటి బారిన పడి తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.లక్షల సొమ్మును పోగొట్టుకుంటున్నారు. దొంగతనాలు, దోపిడీల ద్వారా కంటే ప్రస్తుతం సైబర్ నేరాలతోనే పోగొట్టుకునే సొత్తు ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రజలు ఈ తరహా నేరాల బారిన పడకుండా ఉండడానికి పోలీస్ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. మరోవైపు ఈ కేసులను పరిష్కరించడం.. కాజేసిన సొత్తును రికవరీ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఆర్థిక మోసాలే అధికం ● సైబర్ నేరగాళ్లు అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నప్పటికీ ఎక్కువ శాతం ఆర్థిక మోసాలే ఉంటున్నాయి. ● డెబిట్, క్రెడిట్ కార్డుల అప్డేట్, తక్కువ వడ్డీకి రుణాలు, షేర్ మార్కెట్లో పెట్టుబడులకు అధిక లాభాలు, ఉపాధి, ఉద్యోగాల పేరుతో నమ్మించి బ్యాంకు ఖాతాల్లో నుంచి సొమ్మును సులభంగా లూటీ చేస్తున్నారు. కష్టంగా మారిన రికవరీ ● సైబర్ నేరాలను నియంత్రించడం, లూటీ అయిన సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ● సాధారణ దొంగతనాలు, తదితర కేసుల్లో కాజేసిన సొమ్మును రికవరీ చేయడం సులభంగా మారింది. వీటిల్లో నిందితుల ప్రమేయం నేరుగా ఉండడంతో సీసీ పుటేజీలు, వేలిముద్రలతోపాటు ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో చేధిస్తున్నారు. ● సైబర్ నేరగాళ్లు వేర్వేరు దేశాల్లో, రాష్ట్రాల్లో ఉంటూ సాంకేతికంగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో వారిని గుర్తించి పట్టుకోవడం, సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ● ఈ కారణంగానే నమోదవుతున్న కేసుల్లో అతి తక్కువ శాతం మాత్రమే పరిష్కారం అవుతున్నాయి. లబోదిబోమంటున్న బాధితులు.. ● సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులకు ఏళ్లు గడుస్తున్నా తిరిగి అవి చేతికి అందడం లేదు. ● ప్రధానంగా సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. పోయిన సొమ్ము రాకపోవడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● పట్టణానికి చెందిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డుకు సంబంధించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేశారు. ప్రస్తుతం ఆ సొమ్మును తిరిగి చెల్లించడం అతనికి సాధ్యం కావడం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఏమి చేయాలో తెలియడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నాడు. మెట్‌పల్లికి చెందిన బాలచిన్నయ్య మే 16న తన క్రెడిట్ కార్డు లావాదేవీలను తెలుసుకోవడానికి కస్టమర్ కేర్‌గా భావించి ఓ నంబర్‌కు ఫోన్ చేశాడు. ఆ నంబర్ నుంచి మాట్లాడిన వ్యక్తి అతని క్రెడిట్ కార్డు వివరాలను తెలుసుకుని.. ఓటీపీ ద్వారా వెంటవెంటనే రూ.1.66లక్షలు కాజేశాడు. కొద్దిసేపటికే బాలచిన్నయ్య తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రెండు నెలలు గడిచినా ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతీ లేకపోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేరగాళ్లు ఎన్నో విధాలుగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఇవ్వకూడదు. మోసానికి గురైతే తక్షణమే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫోన్ చేసి తెలపడంతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. – కిరణ్‌కుమార్, ఎస్సై, మెట్పల్లి -
మల్లికార్జున స్వామి సన్నిధిలో గండదీపం
మల్లాపూర్: మండలంలోని రత్నాపూర్ శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం అఖండ(గండ) దీపాన్ని అర్చకులు వెలిగించారు. ఏటా శ్రావణమాసం మొదటి ఆదివారం ఆలయంలో దీపం వెలిగిస్తామని, శ్రావణమాసం పూర్తయ్యే వరకు.. పొలాల అమావాస్యదాకా వెలుగుతూనే ఉంటుందని అర్చకులు శివకుమార్ తెలిపారు. దీపం వెలిగినన్ని రోజులు రత్నాపూర్లో ఎవరూ మాంసం తినరు, మద్యం ముట్టరు. ఇది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. శ్రావణమాసంలో ప్రతి ఆదివారం భక్తులు స్వామివారికి భోనాలు సమర్పిస్తారు. పొలాల అమావాస్య రోజు అన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నల్ల నర్సయ్య తెలిపారు. -
అధిక ధరకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలఅగ్రికల్చర్ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. జగిత్యాల సింగిల్ విండోలోని ఎరువుల దుకాణాన్ని ఆదివారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ఎరువుల గోదాంను పరిశీలించి, ఏయే ఎరువులు.. ఏ రేటుకు విక్రయిస్తున్నారు..? అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల బస్తాల వివరాలను ఈ–పాస్‌లో నమోదు చేయాలని సూచించారు. రైతులకు అవసరం మేరకు మాత్రమే విక్రయించాలని, నిల్వ చేయడానికి ఇవ్వొద్దన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి వినీల, ఏఈఓ నాగరాజు, సంఘ సీఈవో వేణు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు. డ్రైనేజీలో ఆయిల్‌బాల్స్ వేయాలి జగిత్యాల: డ్రైనేజీల్లో దోమలు చేరకుండా ఆయిల్ బాల్స్ వేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని 16, 17 వ వార్డుల్లో డ్రైనేజీలను పరిశీలించారు. డ్రైనేజీ పనుల్లో నాణ్యత ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లు, చెత్త డబ్బాలు ఉంటే తొలగించాలని, కాలువను శుభ్రం చేయాలని ఆదేశించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట కమిషనర్ స్పందన, ఏఈ చరణ్ తదితరులు ఉన్నారు. -
పేదలకు నష్టం కలిగించను
● అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాల: పేదలకు ఎప్పుడూ నష్టం కలిగించబోనని, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు వెళ్లబోనని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం జిల్లాకేంద్రంలోని నూకపల్లి సమీపంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4500 ఇళ్లు నిర్మించామని, ప్రస్తుతం లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఇళ్ల వద్ద వసతుల కోసం సీఎంకు విన్నవించగా రూ.20 కోట్లు మంజూరు చేశారని, వాటితో నూకపల్లిలో స్కూల్, ఆసుపత్రి, గుడికి స్థలాలు సేకరించాలని చెప్పానన్నారు. అయితే అక్కడ కొన్ని ఇళ్లు బేస్మెంట్ వరకు నిర్మించి విడిచిపెట్టి ఉన్నాయని, వాటిని తొలగించాల్సి వచ్చిందని, ఎవరికి నష్టం కలిగించకుండా అప్పుడు కట్టకున్న వారికి ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను ఆదేశించానని వివరించారు. దీనిపై కొందరు రాజకీయం చేస్తున్నారని, తెలిపారు. తాను అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని, ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. నష్టపోయిన వారికి తప్పకుండా ఆదుకుంటానని పేర్కొన్నారు. -
నెరవేరనున్న దశాబ్దాల కల
● సూరమ్మ ప్రాజెక్టు మత్తడి నిర్మాణం పూర్తి ● కాలువల భూసేకరణకు రూ.10 కోట్లు మంజూరు ● ఆనందంలో అన్నదాతలు కథలాపూర్: కథలాపూర్, మేడిపెల్లి, బీమారం మండలాల రైతుల దశాబ్దాల కల నెరవేరనుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిగోట శివారులోని సూరమ్మ ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేపట్టింది. అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఇప్పుడు పనులు సాగుతున్నాయి. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం ఫేజ్–2 స్టేజీ–1 పనుల్లో భాగంగా ప్రాజెక్టు నిర్మించి కుడి, ఎడమ కాలువల ద్వారా మెట్టప్రాంతమైన కథలాపూర్, మేడిపెల్లి, బీమారం, రుద్రంగి మండలాల్లో 50వేల ఎకరాలకు సాగు నీరందించడం లక్ష్యం. ప్రాజెక్టు మత్తడి పనులు పూర్తికాగా కాలువలకు తూముల నిర్మాణం చేపడుతున్నారు. మూడు రోజుల క్రితం కాలువ పనుల భూసేకరణకు రూ.10 కోట్లు మంజూరు కావడంతో పంటల సాగుకు తొందరలోనే నీరందుతుందని ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలువ పనులకు 2018లో భూమిపూజ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ పనులకు రూ.204 కోట్లు మంజూరు చేశారు. 2018 జూన్ 22న అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. పనులు చేపట్టకపోవడంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్‌తోపాటు నాలుగు మండలాల కాంగ్రెస్ నాయకులు పలుమార్లు నిరసనలు తెలిపారు. తాము అధికారంలోకొస్తే ప్రాజెక్టును పూర్తి చేసి కాలువ పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే పనులు కావడంతో ఈ ప్రాంత రైతులు ఆనందంలో ఉన్నారు. కాలువల భూసేకరణకు రూ.10 కోట్లు సూరమ్మ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువ పనుల భూసేకరణకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. మూడు నెలల క్రితం రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామసభలు నిర్వహించారు. వారి నుంచి అభిప్రాయాలు కూడా సేకరించారు. భూసేకరణకు రూ.10 కోట్లు కేటాయించడంతో నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే కాలువ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రైతులు అంటున్నారు. ఈ ప్రాంతంలో బీడు భూములు సాగులోకి రానుండగా... చేపలు పెంచడంతో మత్స్యసంపద పెరుగుతుందని రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పూజలకు ప్రత్యేకం
శ్రావణం పూజలకు ప్రత్యేక మాసం. సాక్షాత్తు విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. ఈ నెల రోజుల్లో ప్రతిరోజూ ప్రత్యేకమే. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం దేవతామూర్తులను ఆరాధిస్తూ పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. – చామ కృష్ణవేణి, భారత్ టాకిస్ రోడ్, కరీంనగర్ మంగళదాయకం శ్రావణ మాసం మంగళదాయకమైన మాసం. ప్రతి మహిళ ఈ నెల రోజులు నిష్టతతో పూజల్లో పాల్గొంటుంది. తమ జీవితాల్లో మంచి జరగాలని, అమ్మవారిని వేడుకుంటు పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. – తొడుపునూరి సౌమ్య, జ్యోతినగర్, కరీంనగర్శివుడికి ప్రీతిపాత్రం శ్రావణం విష్ణుమూర్తి జన్మనక్షత్రం. సాక్షాత్తు శివుడు కూడా విష్ణుమూర్తిని పూజించడం ఈ మాసం ప్రత్యేకత. శ్రావణ నక్షత్రానికి ఆధిపతి అయిన శివుడికి శ్రావణ సోమవారాల్లో పూజలు చేయడంతో ఆయన కృపకటాక్షాలు లభిస్తాయి. – వేములవాడ కమల, రాఘవేంద్రనగర్ -
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
వేములవాడ: శ్రావణమాసం ఆరంభం కావడంతో శుక్రవారం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ, గండాదీపంలో నూనె, బద్దిపోచమ్మకు బోనం మొక్కులు పెట్టారు. అనుబంధ దేవాలయమైన మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. జల్సాలకు అలవాటు పడి.. జైలుపాలైన యువకులు● గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు ● 109 గ్రాముల గంజాయి స్వాధీనం ముస్తాబాద్(సిరిసిల్ల): జల్సాలకు అలవాటుపడ్డ ఇద్దరు యువకులు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచా రంతో ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. గూడెంలోని పెద్దమ్మ ఆలయం వద్ద అనుమానితులను పోలీసులు తనిఖీ చేశారు. వారి నుంచి 109 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంకు చెందిన సూర అజయ్(19), సూర ప్రదీప్(18) అనే యువకులుగా గుర్తించారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన అజయ్, ప్రదీప్ ఉన్నత చదువులకు వెళ్లకుండా గంజాయికి, జల్సాలకు బానిసలయ్యారు. డబ్బు కోసం అదే గంజాయిని విక్రయించడం ప్రారంభించారు. పక్క సమాచారంతో పోలీసులు అజయ్, ప్రదీప్‌లను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను అనుక్షణం గమనించాలని సీఐ సూచించారు. మత్తుకు బానిసలుగా మారితే డీ–ఆడిక్షన్ సెంటర్‌కు తరలించి బాగుచేయిస్తామన్నారు. రోడ్డుపై కేజీవీల్స్ ట్రాక్టర్ ఎలిగేడు(పెద్దపల్లి): నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై నడుపుతున్న కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌ను ఎస్సై సత్యనారాయణ పట్టుకున్నారు. సుల్తాన్పూర్ గ్రామంలో శుక్రవారం నత పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో గడ్డం రాంరెడ్డికి చెందిన కేజీవీల్స్ ట్రాక్టర్ రోడ్డుపైకి రావడంతో పట్టుకుని పోలీసుస్టేషన్ తరలించారు. రెవెన్యూ అధికారులకు దానిని అప్పగించడంతో వారు రూ.5వేల జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. -
యూరియాకు ప్రత్యామ్నాయం నత్రజని
● తగ్గుతున్న యూరియా నిల్వలకు చెక్ ● వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు రామగిరి(మంథని): వానాకాలం సాగు ప్రారంభమైంది. రైతులు పంటలు వేయడం, ఎరువులు సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. అయితే, తక్కువ ధరకు లభించే యూరియాను పంట పొలాల్లో కుమ్మరిస్తున్నారు. మరికొందరు రాబోయే అవసరాలకు కూడా ఇప్పుడే అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వచేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరిగి నిల్వలు తగ్గి కొరత సమస్య ఏర్పడుతోంది. అయితే, వాస్తవ అవసరాల మేరకు ఎరువులు వాడితే సత్ఫలితాలు వస్తాయని కృషి రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం మృత్తిక శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ పిల్లి చెబుతున్నారు. మోతాదుకు మించి యూరియా వద్దు యూరియాలోని నత్రజని మిగతా పోషకాల కంటే పంటకు అధికంగా అవసరం. యూరియా పొలంలో వేసిన వెంటనే నీటిలో కరిగి భూమి లోపలి పొరలు, భూగర్భ జలాల్లోకి చేరి వృథా అవుతోంది. మరికొంత ఆవిరైపోతుంది. దీంతో 30 – 35 శాతమే మొక్కకు అందుతుంది. అవసరానికి మించి యూరియా వాడితే మొక్కలు పెలుసుబారి, పురుగులు ఆశించి వ్యాధులు వస్తాయి. పంటలకు యూరియాతోపాటు భాస్వరం, పొటాష్, సూక్ష్మపోషకాలు అవసరం. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే రైతులు వీటి వినియోగానికి ఆసక్తి చూపడం లేదు. ఏ ఎరువైనా ఒకటే అనే మూసలో యూరియా కుమ్మరిస్తున్నారు. ఇవి ప్రత్యామ్నాయం పంటపై పిచికారీ చేసే ఎరువులు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. నానో యూరియా, నానో డీఏపీ నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, రకం కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంధ్ర కలిగిన 13–0–45 (ఏఈ), ద్రవరూప నత్రజని వంటివి ఇందులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసు మేరకు కాంప్లెక్స్ వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువును స్ప్రే చేసుకుంటే తక్కుఖర్చు, తక్కువ ఎరువుల నష్టంతో మంచి ఫలితాలువ స్తాయి. ఉదా : వరిలో పిలకలు పెట్టే దశలో నానో యూరియా, నానో డీఏపీ, ఫార్ములా–4 కలిపి స్ప్రే చేసుకోవచ్చు. చిరుపొట్ట దశలో నానో యూరియా, 13–0–45 కలిపి స్ప్రే చేస్తే ఖర్చు తక్కువ వస్తుంది. చీడచీడల సమస్య తగ్గుతుంది. యూరియా అతిగా వాడితే నష్టాలు ఇవే.. అవసరానికి మించి వేస్తే నేల నిస్సారమవుతుంది పోషకాల సమతౌల్యత దెబ్బతింటుంది. సూక్ష్మపోషకాల లోపాలు అధికమవుతాయి. మొక్కల్లో శాఖీయోత్పత్తి పెరిగి చీడపీడల ఉధృతి పెరుగుతుంది భూగర్భ జలాలు నైట్రేట్, నత్రజనితో కలుషితమవుతాయి. నేలలో ఉండి పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. ఆమ్ల స్వభావం ఉండటంతో అధికంగా వాడితే భూమి ఆమ్ల నేలగా మారే ప్రమాదం ఉంది. -
గురుకులంలో ఎలుకల కలకలం
హుజూరాబాద్: గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది. మున్సిపల్ పరిధి బోర్నపల్లి శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల(సైదాపుర్)లో 8వ తరగతి చదువుతున్న యశ్వంత్, సాయిచరణ్, కౌశిక్, అక్షిత్, శజన్, 9వ తరగతికి చెందిన రక్షిత్‌ను బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికాయి. విద్యార్థులు గురువారం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించారు. పాఠశాల చుట్టూ రైస్ మిల్లులు, పాఠశాలకు ఆనుకునే చెట్ల పొదలు ఉండటంతో విపరీతమైన దోమలతో పాటు, ఎలుకలు తిరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాల్ రాణిని వివరణ కోరగా విద్యార్థులకు ప్రమాదం ఏం లేదని, ఆరుగురిని ఎలుకలు కరిచినట్లు తెలిసిందని, మరో ఇద్దరికి కరిచినట్లు అనుమానం ఉందని తెలిపారు. అందరికి వ్యాక్సిన్ వేయించినట్లు పేర్కొన్నారు. ఎలుకల బోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ గురుకులంను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. -
శ్రావణ సప్తాహ ఉత్సవాలు ప్రారంభం
మల్యాల/ధర్మపురి: కొండగట్టు అంజన్న, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శుక్రవారం శ్రావణ సప్తాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొండగట్టులో ఆంజనేయస్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. సాయంత్రం కుంకుమార్చన, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవ నిర్వహించారు. ఈవో శ్రీకాంత్‌రావు, ప్రధాన అర్చకులు రామకృష్ణ, జితేందర్స్వామి, రఘు, స్థానాచార్యులు తిరుకోవెల కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే ధర్మపురిలో శ్రీయోగా లక్ష్మీనృసింహస్వామి, అనుబంధ ఉగ్ర వేంకటేశ్వర, రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. -
● సీబీఎస్ఈ క్లస్టర్– 7 కబడ్డీ పోటీలు ప్రారంభం ● తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 800మంది క్రీడాకారులు హాజరు ● పోటీలను ప్రారంభించిన కబడ్డీ సంఘం చైర్మన్ వెలిచాల రాజేందర్రావు
కబడ్డీ.. కబడ్డీకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని వివేకానంద సీబీఎస్ఈ పాఠశాల ఆవరణలో శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీబీఎస్ఈ 7వ క్లస్టర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాల్లోని సీబీఎస్ఈ పాఠశాలల నుంచి సుమారు 800మంది క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్ వెలిచాల రాజేందర్రావు హాజరై క్రీడా పతాకాలను ఆవిష్కరించి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కబడ్డీకి కేరాఫ్‌గా కరీంనగర్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో కేట గిరీ 14, 17, 19లో గెలుపొందిన వారికి రూ. 10వేలు, రన్నర్లకు రూ.8 వేలు, మూడో బహుమతిగా రూ.5వేలు ఇస్తానని తెలిపారు. కేటగిరీ 14, 17, 19 విభాగాల్లో రాష్ట, జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసికంగా, శారీరకంగా ఎంతో శక్తిని ఇస్తాయని తెలి పారు. వివేకానంద పాఠశాల అకడమిక్ డైరెక్టర్ టి.లలితాకుమారి మాట్లాడుతూ కబడ్డీ ఉత్కంఠభరితమైన పోటీ క్రీడగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్‌రావు, జిల్లా కార్యదర్శి మల్లేశం గౌ డ్, రెఫరీ బోర్డు చైర్మన్ లక్ష్మీనారాయణ, వివేకానంద సీబీఎస్ఈ హైస్కూల్ చైర్మన్ పోల్సాని సుధాకర్, ప్రిన్సిపాల్ రేణుక, వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత్, హెచ్ఎం అనిత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిత్తరంజన్, అడ్వైజరీ మెంబర్ గండ్ర లక్ష్మణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.సత్యనారాయణ పాల్గొన్నారు. -
అల్ఫోర్స్‌లో శ్రావణమాస ఆరంభ వేడుకలు
కొత్తపల్లి: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో శ్రావణ మాస ఆరంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సరస్వతీ మాత విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి ఈ వేడుకలను ప్రారంభించారు. శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమని, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నవోదయకు దరఖాస్తు చేసుకోవాలి చొప్పదండి: నవోదయలో వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుకు జూలై 29 చివరి తేదీగా ప్రకటించబడిందని ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు లేదా రెసిడెంట్ సర్టిఫికెట్, ఫోటో, పేరెంటు, స్టూడెంట్ సంతకంతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్యతిమ్మాపూర్: ఉద్యోగానికి వెళ్లడం లేదంటూ తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దరిపల్లి సతీశ్ మండలంలోని కొత్తపల్లిలో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కొడుకు అజయ్(23) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా జల్సాలకు అలవాటు పడి ఉద్యోగానికి వెళ్లడం లేదు. సోమవారం ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండడంతో సతీశ్ అజయ్‌ని మందలించాడు. మనస్తాపం చెందిన అజయ్ గ్రామ శివారులోకి వెళ్లి గడ్డిమందు తాగాడు. తరువాత వరసకు చిన్నాన్న అయిన వేణుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అజయ్‌ని 108లో కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రతిరోజూ పండుగే
● శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● నోములు.. వ్రతాలు.. పండుగలువిద్యానగర్(కరీంనగర్): శ్రావణమాసం ప్రత్యేకమైనది. ఈ నెల రోజులు పూజలు, నోములు, ప్రతాలతో ఇళ్లు, గుళ్లు కళకళలాడుతాయి. శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలకు శుభకరం. శుక్రవారం ప్రారంభమైన శ్రావణం ఆగస్టు 23న పోలాల అమావాస్యతో ముగుస్తుంది. ఇవీ పండుగలు ఈనెల 28 సోమవారం నాగ చతుర్థి, 29 మంగళవారం పంచమి, మంగళగౌరీ ప్రతం, 30న బుధవారం కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి, ఆగస్టు 1 శ్రావణ మాసంలో రెండో శుక్రవారం, 5న మంగళవారం ఏకాదశి, 8న వరలక్ష్మి వ్రతం, వారాహి జయంతి ఉంటుంది. 9న రాఖీ పౌర్ణమి, 12న సంకష్ట హర చతుర్థి, 16న శ్రీకృష్ణ జన్మాష్టమి, 19న కామిక ఏకాదశి, 21 గురువారం మాసశివరాత్రి, ఆగస్టు 23న పోలాల అమావాస్యతో శ్రావణం ముగుస్తుంది. ప్రత్యేక పూజలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులు ప్రతి సోమవారం గౌరీదేవి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణం రెండో శుక్రవారం సామూహిక కుంకుమార్చన, మూడో శుక్రవారం మహాలక్ష్మి ఆలయాల్లో లక్ష కుంకుమార్చన, లక్ష్మి సహస్రనామార్చన చేస్తారు. -
శ్మశానవాటికను దున్నిన రైతు
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ శ్మశానవాటిక స్థలం దాని పక్కనే నర్సరీ కేంద్రం పల్లెప్రకృతి వనం, డంపింగ్‌యార్డ్ ఉన్న భూమి తనదేనంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఓ వ్యక్తి దున్నేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వల్లంపట్లకు చెందిన మాజీ నక్సలైట్ కుక్కల మల్లేశం జనజీవన స్రవంతిలో కలిసే సమయంలో 1993లో ప్రభుత్వం మూడెకరాల అసైన్డ్ భూమిని జీవనోపాధి కోసం ఇచ్చింది. దాన్ని సాగుచేయకపోవడంతో నిరుపయోగంగా ఉంది. గ్రామస్తులు ఆ భూమిలోని ఒకటిన్నర ఎకరంలో ఐదేళ్ల క్రితం శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. రెండు రోజుల క్రితం మల్లేశం కొడుకు కుక్కల శ్రావణ్ సదరు శ్మశాన వాటికలో తమ భూమి ఉందంటూ దున్నేశాడు. ఇది గమనించిన గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామపంచాయతీకి శ్రావణ్ పిలిపించగా.. ఇటీవల సర్వేయర్ పంచనామా చేసి ఇచ్చిన రిపోర్టును చూపించాడు. ఇప్పుడు అటువైపు ఎవరూ వెళ్లవద్దని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని కార్యదర్శి తెలిపారు. ఈ విషయంపై శ్రావణ్‌ను వివరణ కోరగా శ్మశానవాటిక, నర్సరీ, డంపింగ్‌యార్డ్ ఉన్న 374/1 సర్వే నంబర్లో తమకు ఎకరంనర స్థలం ప్రభుత్వం ఇచ్చిందేనన్నారు. రికార్డుల్లో తమ పేరు ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని కోరారు. -
పేదల ఆత్మగౌరవం రేషన్‌కార్డు
జగిత్యాలరూరల్/ధర్మపురి: రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలోని బీఎల్ఎన్ గార్డెన్స్, ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్లో కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25 నుంచి ఆగస్టు 10 వరకు కొత్త రేషన్‌కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందన్నారు. రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రానివారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్‌కార్డుల పంపిణీ ఆశించిన మేర జరగలేదని, ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వం అర్హులను గుర్తించి కార్డుల పంపిణీ మొదలు పెట్టిందన్నారు. అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని 124 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ధర్మపురి పట్టణంలో కేఎన్ఆర్ కాంప్లెక్స్ గదులు, నాగమయ్య ఆలయం, పుట్టబంగారం వేదికలను ప్రారంభించారు. అంతకముందు శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మధుసూదన్, జిల్లా పౌరసరపరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, రామ్మోహన్, ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేశ్, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ -
27న లైసెన్స్డ్ సర్వేయర్లకు రాత పరీక్ష
జగిత్యాల: లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఏడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్కేఎన్ఆర్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు పాస్‌పోర్టు సైజు ఫొటోను నిర్దేశించిన ప్రదేశంలో అతికించి జిల్లా సర్వే అధికారితో ధ్రువీకరణ చేయించుకోవాలన్నారు. అలా ధ్రువీకరించిన హాల్ టికెట్స్తోనే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. ఏవైనా సందేహాలుంటే 99669 88002 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష హాల్‌కు రావాలని సూచించారు. ఇద్దరు ఎస్సైల బదిలీజగిత్యాలక్రైం: జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల డీసీఆర్బీ ఎస్సైగా పనిచేస్తున్న రవికిరణ్‌ను జగిత్యాల టౌన్, జగిత్యాల ఎస్బీ ఎస్సై మహేశ్‌ను కోరుట్ల–2 ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విషజ్వరాల కట్టడికి చర్యలు తీసుకోవాలిమల్లాపూర్(కోరుట్ల): గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలంలో విషజ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విషజ్వరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అర్చన, డాక్టర్ రవీందర్, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, జిల్లా పర్యవేక్షకులు మురళి, శ్యామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాత్రివేళ నిరంతర గస్తీ
● ఎస్పీ అశోక్‌కుమార్ జగిత్యాలక్రైం: రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూకోల్ట్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అదనంగా నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చన్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు వారి వేలిముద్రలను సేకరించి, గత నేర చరిత్ర గల నిందితులతో సరిపోల్చడం జరుగుతోందని చెప్పారు. అలాగే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణకు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రజలు ప్రశాంతం ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్పీ వివరించారు. -
గుల్లకోటలో 18.3 మి.మీ వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా ఎండపల్లి మండలం గుల్లకోటలో 18.3 మి.మీ, అత్యల్పం ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 0.5 మి.మీ వర్షం కురిసింది. ఎండపల్లిలో 15.5, బీర్పూర్ మండలం కొల్వాయి 11.5, గొల్లపల్లి 10.5, బుగ్గారం మండలం సిరికొండ 10.5, మిగతా మండలాల్లో 8.5 నుంచి 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. అలాగే, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షంతో పాటు, గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 27–32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ ఉదయం 80–92 శాతం, మధ్యాహ్నం 59–78 శాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలిజగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తుమ్మ గంగాధర్, ఆనందరావు, గొడిశెల గంగాధర్, కమలాకర్, లక్ష్మణ్‌రావు, ప్రవీణ్‌గౌడ్, సాగర్‌రావు, ముత్తయ్య, వెంకటేశ్, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు. ఇంటిపన్ను డబ్బులు పక్కదారి?జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఇంటిపన్ను వసూలు చేసిన డబ్బులు పక్కదారి పట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో పని చేస్తున్న ఓ అధికారి సుమారు రూ.60 వేల వరకు వసూలు చేసి ఆఫీసులో అప్పగించాల్సి ఉండగా, మున్సిపల్ అకౌంట్లో జమచేయనట్లు తెలిసింది. ఈ విషయంపై అధికారులు మెమో సైతం జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై వివరణ కోరేందుకు మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. నానో యూరియాతో మంచి దిగుబడులుజగిత్యాలఅగ్రికల్చర్: నానో యూరియా వాడడం వల్ల పంటల్లో దిగుబడులు పెరుగుతాయని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో శుక్రవారం నానో యూరియా వాడకంపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంప్రదాయ ఎరువులతో పోల్చితే నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు పంటలపై అధిక ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. నానో యూరియాతో పర్యావరణానికి మేలు జరుగుతుందని వెల్లడించారు. రైతులకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ప్రతీ క్లస్టర్ పరిధిలో నానో టెక్నాలజీ ఆధారంగా ఎరువుల వాడకంపై ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని వివరించారు. డీఈగా బాధ్యతల స్వీకరణజగిత్యాల: జగిత్యాల మున్సిపల్ డీఈగా శుక్రవారం ఆనంద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ స్పందన, ఏఈ చరణ్ పాల్గొన్నారు. -
పరిశుభ్రత అందరి బాధ్యత
జగిత్యాల: పచ్చదనం పరిశుభ్రత అందరి బాధ్యతని, ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పరిశుభ్రత వల్ల ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. జగి త్యాల మున్సిపాలిటీలో పచ్చదనాన్ని పెంచి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చూడాలన్నారు. పట్టణ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించ డం జరిగిందని, గ్రీన్ బడ్జెట్లో పచ్చదనానికి ని ధులు కేటాయించడం జరుగుతుందన్నారు. నా యకులు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, పవన్, రాజ్‌కుమార్, రాము, సుధాకర్ పాల్గొన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిరాయికల్(జగిత్యాల): అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.12.50 లక్షలతో వాటర్ సప్లై, రూ.20 లక్షలతో డివైడర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 27 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, 80 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఇటిక్యాలకు చెందిన పంచతి మల్లవ్వ, రాయికల్‌కు చెందిన రవితేజకు దివ్యాంగుల సంక్షేమ శాఖ నుంచి రూ.50 వేలు మంజూరు కాగా అందజేశారు. విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, గండ్ర రమాదేవి, నాయకులు పాల్గొన్నారు. -
పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని, పాఠశాల ఆవరణలో శుభ్రత పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం ముఖాముఖి సంభాషణ జరిపి విద్యార్థులతో పాఠాలు చదివించడమే కాకుండా బోర్డుపై రాయించి వారి విద్యాబోధనస్థాయిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని వంటగది, ఆహార నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు. డీఈవో రాములు, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో గాయత్రి పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
నేటి నుంచి ఎల్‌హెచ్‌బీ బోగీలు
● తిరుపతి– కరీంనగర్ ఎక్స్‌ప్రెస్‌కు మారనున్న బోగీలు ● ఒకప్పుడు నీలి, ప్రస్తుతం పసుపు, రేపటి నుంచి ఎరుపు బోగీలు ● ప్రమాద తీవ్రత తగ్గించేందుకు ఈ బోగీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి నుంచి తిరుపతి– కరీంనగర్ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడవనుంది. శనివారం రాత్రి తిరుపతిలో ఎగువ మార్గంలో ఈ రైలు 12761 ఎల్‌హెచ్‌బీ బోగీలతో మొదటిసారిగా కరీంనగర్ వైపు పరుగులు తీయనుంది. ఆదివారం రాత్రి ఇదే రైలు కరీంనగర్ నుంచి తిరుపతికి 12762 ఇదే బోగీలతో దిగువమార్గంలో నడవనుంది. ఈ అధునాతన ఎల్‌హెచ్‌బీ రైలు బోగీల సంఖ్య మొత్తం 19. ఇందులో ఆరు స్లీపర్ బోగీలు, ఐదు తృతీయ శ్రేణి శీతల బోగీలు, రెండు ద్వితీయ శ్రేణి శీతల బోగీలు, నాలుగు సాధారణ (జనరల్ ) బోగీలు, ఒక వికలాంగుల బోగీలతో నడవనుంది. ఈ రైలుకు 12769/70 తిరుపతి– సికింద్రాబాద్– తిరుపతి సెవెన్ హిల్స్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో రేక్ షేరింగ్ ఉంది. కాగా.. తిరుపత్తి– కరీంనగర్ రైలు ఇప్పటి వరకు పసుపు రంగులో ఉండే 22 బోగీలతో నడిచింది. ఇదే రైలు ప్రారంభించిన కొత్తలో నీలి రంగు బోగీలతో నడిచింది. ఎల్‌హెచ్‌బీ బోగీలు అంటే? ఎల్‌హెచ్‌బీ అంటే లింక్మన్ హాఫ్మన్ బుష్ బోగీలు. ఇవి తేలికపాటి స్టీల్‌తో తయారు చేస్తారు. జర్మన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసినవి. మొట్టమొదటి సారి వీటిని మన దేశంలో తీసుకురావాలని అప్పటి దేశ ప్రధాని పీవీ.నరసింహారావు నిర్ణయించారు. ప్రమాదాలు జరిగినపుడు తక్కువ నష్టం జరిగేలా ఈ కోచ్‌లను రూపొందించారు. తొలుత ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం కేవలం రాజధాని లాంటి ప్రీమియర్ రైళ్లకు మాత్రమే ఉపయోగించింది. -
పల్లెలకు స్వచ్ఛ బృందాలు
● గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన ● జిల్లాలో 20 గ్రామాల ఎంపికరాయికల్:(జగిత్యాల): స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్– 2025లో భాగంగా పారిశుధ్య పరిస్థితిని మెరుగుపర్చేందుకు గ్రామపంచాయతీల్లో కేంద్ర బృందం సర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సంస్థ ప్రతినిధుల పర్యవేక్షణ కొనసాగుతోంది. చెత్త సేకరణ, తరలింపు తీరు, ప్రభుత్వ సంస్థల పనితీరు తదితర అంశాలపై నేరుగా ప్ర జలతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లోని అభివృద్ధి ప నులు తదితర ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. అభివృద్ధి ఆధారంగా మార్కులు పల్లెల్లో అభివృద్ధి పనులు తదితర అంశాలపై సేకరించిన సమాచారం ఆధారంగా స్వచ్ఛ పల్లెలకు మార్కులు కేటాయిస్తారు. జిల్లాలోని పాత 18 మండలాల్లో 380 గ్రామాలు ఉండగా కేంద్ర ప్రభుత్వం 20 గ్రామాల్లో సర్వే చేపట్టనున్నారు. ఆయా గ్రామాల్లో 16 నివాస గృహాలను సందర్శించి వారి అభిప్రాయాలు పరిశీలిస్తారు. మూడు ఎస్సీ, మూడు ఎస్టీ, ఎనిమిది ఇతర కుటుంబాలు, మరో రెండు నివాసాలు అధికారుల నిర్ణయం మేరకు ఎంచుకుంటారు. ఇలా 20 గ్రామాల్లో సుమారు 10 రోజుల పాటు సర్వే చేస్తారు. అనంతరం కేంద్రానికి నివేదిక పంపించి ఆయా గ్రామాలకు ర్యాంకులు ప్రకటిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని జగిత్యాల రూరల్, మల్లాపూర్ మండలాల్లో కేంద్ర బృందం సభ్యులు మధు, జయంత్ సర్వే నిర్వహించారు. వీరి వెంట జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ కోఆర్డినేటర్ చిరంజీవి ఉన్నారు. -
అపోహలు వద్దు
1978 జులై 25న ఇంగ్లండ్‌లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అనే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో జన్మించిన మొదటి బిడ్డ లూయీస్ బ్రౌన్ అయ్యారు. ఈ విజయానికి గుర్తుగా ఏటా జులై 25న ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డేగా జరుపుతారు. ఇప్పటికీ చాలామందికి ఐవీఎఫ్ అంటే తెలియని భయం. సంతానం కలిగేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనప్పుడు మాత్రమే ఐవీఎఫ్ మార్గాన్ని సూచిస్తాం. – డాక్టర్ రేఖారాణి, రేఖాసాగర్ ఐవీఎఫ్ సెంటర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు 30 ఏళ్లు దాటిన మహిళలకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 8 మిలియన్ల మందికి పైగా జన్మించారు. అయితే ఐవీఎఫ్‌పై చాలామందికి అపోహలున్నాయి. ఐవీఎఫ్లోనూ ఐసీఎస్ఐ, ఐవీఎం, ఎగ్‌ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, ప్రీ ఇంప్లాంటేషన్, జనటిన్ టెస్ట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాయి. ఐవీఎఫ్‌లో ఇచ్చే మందులతోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. – డాక్టర్ రజని ప్రియదర్శిని, రజని ఫెర్టిలిటీ సెంటర్ -
కలెక్టర్‌కు కృతజ్ఞతలు
మర్రిపల్లి శివారులో మారుతి రైస్‌మిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారు. ప్రభుత్వ స్థలాన్ని సైతం ఆక్రమించారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్పందించి అనుమతులు రద్దు చేయించారు. రైతులు, గ్రామస్తుల తరఫున కలెక్టర్‌కు కృతజ్ఞతలు. – సంగెం వీరారెడ్డి, మాజీ ఎంపీటీసీ, మల్లారం ఉత్తర్వులు వచ్చాయి మర్రిపల్లి శివారులో నిర్మించిన మారుతి రైస్‌మిల్లు అనుమతులు రద్దు చేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించినట్లు ఫిర్యాదులు రావడంతో ఉత్తర్వులు వచ్చాయి. – అబూబాకర్, తహసీల్దార్, వేములవాడరూరల్ -
సాఫల్యం.. వైఫల్యం!
● జిల్లాలో 20 శాతం మంది బాధితులు ● జీవనశైలి మార్పులే కారణం ● పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు ● నేడు వరల్డ్ ఐవీఎఫ్ డే పెరుగుతున్న సంతానలేమి సమస్య ఇటీవల ఉమ్మడి జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే సంతానలేమితో బాధపడేవారు. ఇప్పుడు ఆసంఖ్య 20శాతం వరకు ఉంటోంది. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుని గర్భం దాలుస్తున్నారు. కొందరు మాత్రం మూఢ నమ్మకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కాలానుగుణంగా ఇప్పుడు వైద్యంపై అవగాహన పెరిగింది. గతంలో హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతాన సాఫల్య కేంద్రాల్లో వైద్యులను సంప్రదించేవారు. ఇప్పుడు కరీంనగర్లో కూడా అలాంటి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో మహానగరాల్లో అందించే వైద్యసేవలు ఇక్కడ అందిస్తున్నారు. కరీంనగర్లో పదికి పైగా ఫెర్టిలిటీ కేంద్రాలు (సంతాన సాఫల్య కేంద్రాలు) ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం రోజూ 30 నుంచి 40 మందిదాకా చికిత్స కోసం వస్తుంటారు. సంతానలేమికి కారణాలివే.. ఇటీవల యువతీ యువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీంతో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, మహిళల్లో పీసీఓడీ (అండాశయంలో తిత్తులు), రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం తదితర కారణాలతో సంతానలేమి సమస్య కలుగుతుంది. ఐవీఎఫ్ అంటే.. చాలామంది సంతానం లేనివారు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తున్నారు. కానీ అక్కడ ఐవీఎఫ్ పద్ధతి గురించి వారికి అవగాహన ఉండదు. ఈ పద్ధతిలో బిడ్డను జన్మనివ్వాలి అనుకునే దంపతులు ముందుగా దాని గురించి అవగాహన ఉండాలి. అప్పుడే భవిష్యత్‌లో వారి మధ్య అపోహలు తలెత్తకుండా ఉంటాయి. సాధారణంగా సీ్త్ర గర్భధారణ కలగాలంటే మగవారి వీర్యకణాలు ఆడవారి అండంతో కలవాలి. అది పిండంగా రూపాంతరం చెందుతుంది. ఈ విషయంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఐవీఎఫ్ విధానంలో ల్యాబ్‌లో అండకణాలను సంగ్రహించడం చేసి స్పెర్మ్ నమూనాను మెరుగుపరుస్తారు. ఐవీఎఫ్ ఎప్పడు అవసరమంటే.. సాధారణంగా సంతానం లేనివారికి ఐవీఎఫ్ అవసరం లేదు. ముందుగా వైద్యులను సంప్రదించి సమస్యను వివరించాలి. దీన్ని బట్టి ముందుగా సహజసిద్ధంగా గర్భం దాల్చేలా తగిన చికిత్స, ఔషధాలు అందిస్తారు. సహజ సిద్ధంగా గర్భధారణ కలిగేందుకు అవకాశం లేకుండా ఉన్నవారికి మాత్రమే ఐవీఎఫ్ చికిత్స ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఆడవారిలో ఫెలోపియన్ నాళాలు మూసుకుపోయినప్పుడు, అండకణాలు తక్కువగా ఉన్నప్పుడు, అండాశయ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు, ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారికి, క్యాన్సర్ రోగులు, మగవారిలో స్పెర్మ్ నాణ్యత తక్కువగా, పూర్తిగా లేనప్పుడు ఐవీఎఫ్ చికిత్స అవసరం ఉంటుంది. కరీంనగర్‌టౌన్: వివాహమైన ప్రతీ సీ్త్ర తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే ఆ యోగ్యత కొందరికి మాత్రం లభించడం లేదు. ఇందుకు ఆమెలో కొన్ని అనారోగ్య కారణాలు, లేదా భర్తలో ఏదైనా లోపమైనా ఉండొచ్చు. వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తూ మహిళలు గర్భం దాలుస్తున్నారు. అమ్మ కల నెరవేర్చుకుంటున్నారు. ఐవీఎఫ్ విధానం ద్వారా చికిత్స తీసుకుంటున్నారు. నేడు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. -
స్వగ్రామం చేరిన సాగర్ మృతదేహం
గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన బత్తుల సాగర్(42) ఈ నెల 22న కువైట్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం మృతదేహం స్వగ్రామం చేరింది. ఉపాధి కోసం సాగర్ మూ డేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. కుటుంబ సభ్యుల రో ధనల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్యగొల్లపల్లి: అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తిర్మాలాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గండికోట రమేశ్ (37) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన సంపాదనతో భార్య మంజుల, ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో రెండేళ్ల క్రితం ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ క్రమంలో అప్పు చేశాడు. పిల్లల్లో ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య ఖర్చులకు మరింత అప్పు చేశాడు. వాటిని తీర్చేదారి లేక జీవితంపై విరక్తి చెంది సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు వచ్చేసరికే చనిపోయాడు. ఇంటి పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. రమేశ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు. వస్తువుల బహిరంగ వేలంకరీంనగర్: నగరంలోని కార్ఖానగడ్డ ప్రభుత్వ దివ్యాంగుల, వయో వృద్ధుల వసతి గృహంలో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్, బీరువాలు, చెక్క కప్‌బోర్డ్స్, ఫిజియోథెరపి చైర్ తదితర వస్తువులను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు వస్తువులను ప్రభుత్వ దివ్యాంగుల, వయో వృద్ధుల వసతి గృహంలో ఈనెల 28వ తేదీ వరకు పరిశీలించుకుని వేలంలో పాల్గొనవచ్చునని అన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పని దినములలో 8096338488, 9492930728 నంబర్లను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. -
వేధిస్తున్నాడని భార్యనే హతమార్చింది !
మల్యాల: రెండేళ్ల క్రితం.. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. గుర్తు తెలియని వ్యక్తిని మెట్‌పల్లికి చెందిన సింగం నడిపి గంగాధర్(40)గా గుర్తించారు. మద్యానికి బానిసై నిత్యం వేధిస్తున్నాడని ఆయన భార్యే మరో నలుగురితో కలిసి హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్యోదంతాన్ని నిందితులు వీడియో చిత్రీకరించారు. గంజాయి కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా ఈ విషయాలన్నీ వెలుగుచూశాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘుచందర్ స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం వెల్లడించారు. ముత్యంపేట శివారులో 2023 మార్చి 14న గుర్తు తెలియని వ్యక్తి కాలిపోయి ఉన్నాడని అప్పటి వీఆర్ఏ అజీమొద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 17న మెట్‌పల్లికి చెందిన సింగం గ్రాహిత్, అబ్దుల్ అప్సర్, చెన్న నిఖిల్‌ను మెట్పల్లి పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేశారు. వారి వద్దనున్న సెల్ఫోన్లు పరిశీలించగా.. హత్యకు సంబంధించిన వీడియో కనిపించింది. దీనిపై వారిని విచారించారు. మెట్‌పల్లికి చెందిన సింగం నడిపి గంగాధర్ మద్యానికి బానిసై నిత్యం భార్య సంధ్య, కుటుంబసభ్యులను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇంట్లో వస్తువులు అమ్ముకుని జూదం ఆడేవాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి హింసించేవాడు. పెద్ద కూతురు వివాహం చేసేందుకూ అడ్డుపడడంతో రూ.10వేలు ఇచ్చి ఒప్పించి.. బిడ్డ వివాహం చేశారు. కూతురి అత్తవారింటికి వెళ్లి అల్లుడితోనూ గొడవ పడేవాడు. ఈ విషయాన్ని సంధ్య గంగాధర్ అన్న కొడుకు గ్రాహిత్, తోటికోడలు మమతకు చెప్పింది. వారు గొడవ చేయవద్దని చెప్పినా గంగాధర్ వినిపించుకోలేదు. అతడిని చంపితేనే తాము సంతోషంగా ఉంటామని నిర్ణయించుకున్న సంధ్య.. గ్రాహిత్‌కు విషయం చెప్పింది. రూ.40వేలు ఇస్తే మరో ముగ్గురిని తీసుకొస్తానని అతడు చెప్పగా ఆ మొత్తం అందించింది. గ్రాహిత్ తన స్నేహితులైన అబ్దుల్ అప్సర్, పవన్ కలిసి గంగాధర్‌ను చంపేందుకు ఒప్పుకున్నారు. 2023 మార్చి 12న కారును అద్దెకు తీసుకుని సంధ్య, గ్రాహిత్, అబ్దుల్ అప్సర్, చెన్న నిఖిల్, పవన్, సింగం మమత కొండగట్టుకు వెళ్దామని చెప్పి గంగాధర్‌ను ఎక్కించుకుని ముత్యంపేట శివారు డంపింగ్‌యార్డు సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ గంగాధర్‌కు మద్యం తాగించారు. సంధ్య, మమత గంగాధర్ కాళ్లు పట్టుకోగా.. గ్రాహిత్, అప్సర్ వైర్‌ను మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశారు. నిఖిల్ ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తూ ఉన్నాడు. గంగాధర్ చనిపోయాడని నిర్ధారించుకుని శవాన్ని ఎవరూ గుర్తించకుండా చెత్తలో వేసి నిప్పంటించారు. ఈ హత్యోదంతాన్ని మొత్తం వీడియోతీశారు. అనంతరం మెట్పల్లి వెళ్లిపోయారు. మార్చి 14న గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గమనించి వీఆర్ఏ అజీమొద్దీన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. గంజాయి కేసు విచారణలో సెల్ఫోన్లో హత్యకు సంబంధించిన వీడియో ఉండడంతో ఘటనలో ఆరుగురు పాల్గొన్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. వీరిలో గ్రాహిత్, అబ్దుల్ అప్సర్, నిఖిల్ ఇప్పటికే గంజాయి కేసులో అరెస్టయి ఉన్నారు. పవన్ మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. మమత మృతి చెందింది. ఏ–1 నిందితురాలైన సింగం సంధ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మిగిలిన వారిని కోర్టు అనుమతితో విచారించి, అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ నీలం, ఎస్సై నరేశ్‌కుమార్ ఉన్నారు. గంజాయి కేసు విచారణతో హత్య కేసు వెలుగులోకి.. మద్యానికి బానిసై వేధిస్తున్నాడని ఐదుగురితో కలిసి అఘాయిత్యం రెండేళ్ల క్రితం కొండగట్టులో దారుణం హత్యోదంతం అంతా సెల్ఫోన్లో చిత్రీకరణ గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసుగా నమోదు నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు -
మారుతి రైస్‌మిల్ అనుమతులు రద్దు
వేములవాడరూరల్: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మిల్లు నిర్మించిన వ్యవహారంపై పలువురి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు సదరు మిల్లు అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి శివారులో సర్వేనంబర్ 750లోని మల్లయ్యకుంటలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రైస్‌మిల్లును కొందరు వ్యాపారులు నిర్మించిన విషయంపై గతంలో మల్లారం మాజీ ఎంపీటీసీ సంగెం వీరారెడ్డితోపాటు పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఎట్టకేలకు ఆ మిల్లును కమర్షియల్ నుంచి అగ్రికల్చర్‌కు మార్పు చేసినట్లు వెల్లడించారు. సర్వేనంబర్ 750లో 18 ఎకరాల 18 గుంటల స్థలంలో దాదాపు 5 ఎకరాలకు మాత్రమే మిల్ యజమానులు నాలా కన్వర్షన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మిల్లు అనుమతులను, నాలా కన్వర్షన్‌ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరుస కథనాలతో కదలిన యంత్రాంగం మర్రిపల్లి శివారులో నిర్మించిన మారుతి రైస్‌మిల్లు నుంచి వస్తున్న వ్యర్థాలు, కలుషితంతో ఆ ప్రాంత రైతులకు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయంపై శ్రీసాక్షిశ్రీలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన అధికారులు గతంలో పలుమార్లు విచారణ చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో మిల్లు నిర్మించినట్లు గుర్తించారు. ఎట్టకేలకు ఆ మిల్లు అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కమర్షియల్ నుంచి అగ్రికల్చర్‌కు మార్పు ఆదేశాలు జారీ చేసిన అధికారులు -
ప్రభుత్వ ఆస్పత్రిలో కత్తిపోట్ల కలకలం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిలో గురువారం కత్తిపోట్ల కలకలం రేపింది. స్థానికులు కథనం.. చొప్పదండి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రావణిని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన పాలకుర్తి మహేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు.కాగా... శ్రావణి ఇటీవలే గర్భం దాల్చగా చికిత్స నిమిత్తం భర్త పాలకుర్తి మహేశ్ కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆమెకు రక్తస్రావం కావడం.. కడుపులో పిండం సరిగా లేకపోవడంతో వైద్యులు అబార్షన్ చేశారు. విషయం తెలుసుకున్న శ్రావణి అన్న అదే ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్ బావ పాలకుర్తి మహేశ్‌పై కత్తితో దాడిచేశాడు. దీంతో ఆయనకు పలుచోట్ల గాయాలయ్యాయి. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వండంతో టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. గాయపడ్డ పాలకుర్తి మహేశ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. -
వార్డెన్‌పై చర్య తీసుకోవాలి
మంథని: మంథనిలో ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహ విద్యార్థులు గురువారం రోడ్డెక్కారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మెనూ ప్రకారం వార్డెన్ సరుకులు ఇవ్వడం లేదని, సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని వాపోయా రు. వారానికి ఒకసారి మాత్రమే వసతి గృహానికి వచ్చి సరుకులు ఇచ్చి వెళ్తున్నారని, అవి సరిపోవడం లేదని పేర్కొన్నారు. టిఫిన్ ఆలస్యమవుతుందని, తమ ఆలస్యంపై ప్రిన్సిపాల్ పలుమా ర్లు హెచ్చరించారని ఆవేదన వెలిబుచ్చా రు. విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు సంఘాల జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, గొర్రంకల సురేశ్ మాట్లాడుతూ, విద్యార్థులకు సమయానికి సరుకులు ఇవ్వకుండా, రోజువారీ మెనూ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ రమేశ్‌పై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. డివిజన్, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో వసతి గృహాల సంరక్షకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. విద్యార్థులు, నాయకులకు పోలీసులు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. రామానుజమ్మకు జాతీయ పురస్కారంసిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రానికి చెందిన వెటరన్ అథ్లెట్ టమటం రామానుజమ్మకు మరో ప్రతిభ పురస్కారం వరించింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ ఎక్సలెంట్ అవార్డులను ప్రదానం చేశారు. సిరిసిల్లకు చెందిన వెటరన్ అథ్లెట్, మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ టమటం రామానుజమ్మను ఎంపిక చేశారు. వైఎంకే అధ్యక్షుడు, సినీ నటుడు భానుచందర్ అవార్డును అందజేశారు. ఏడుపదుల వయసులో జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న రామానుజమ్మను పలువురు అభినందించారు. -
‘ఇందిరమ్మకు’ ఉచిత ఇసుక
● ఒక్కో ఇంటికి 40 టన్నులు ● ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ● పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు ప్రక్రియ ● తహసీల్దార్ అనుమతితో ఇసుక సరఫరా ● ఆత్మకూర్ పెద్దవాగు నుంచి తరలించేలా చర్యలు మెట్‌పల్లిరూరల్: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోంది. ఆ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా వచ్చాయి. ఇసుక కోసం దరఖాస్తుపత్రాలు ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారులు ముందుకు రావాలని.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిలో చాలామంది ఆర్థిక స్థోమత లేనివారే. దీంతో ఇంటి నిర్మాణానికి ముందుకు రావడంలేదు. మరికొందరు అష్టకష్టాలు పడుతూ ఎలాగోల నిర్మాణం చేపడుతున్నారు. వారి పరిస్థితిని క్షేత్రస్థాయిలో గమనించిన ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించాలని, ఒక్కో ఇంటికి సుమారు 40 టన్నులు సరఫరా చేయాలని నిర్ణయించింది. మెట్పల్లి మండలంలో 564 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తమకు కొంతమేర ఆర్థిక భారం తగ్గడంతోపాటు ఆదనంగా ప్రయోజనం కలుగుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇసుక కావాల్సిన లబ్ధిదారులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు ఫారంతోపాటు పంచాయతీ పర్మిషన్ జిరాక్స్‌ను కార్యదర్శులకు అందించాలి. వాటిని పరిశీలించి తహసీల్దార్‌కు నివేదిస్తారు. తహసీల్దార్ పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు. ఆత్మకూర్ రీచ్ నుంచి సరఫరా మెట్పల్లి ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఇసుక సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. గతంలో పెద్దవాగును ప్రభుత్వం రీచ్‌గా గుర్తించింది. ఆ ప్రాంతంలో సుమారు 5,550 టన్నుల ఇసుక తీసుకునే వీలుంది. ఇందులో దాదాపు వెయ్యి టన్నుల ఇసుక సీసీ రోడ్లు, ఇతరత్రా పనులకు తరలించారు. రెండు రోజుల క్రితం మరోమారు పెద్దవాగులో ఇసుక లభ్యతను పరిశీలించిన మైనింగ్ అధికారులు.. దాదాపు 4,550 టన్నుల ఇసుక తీయవచ్చని గుర్తించారు. ఇందుకోసం ఆత్మకూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సాండ్ రీచ్ ఆఫీసర్ (ఎస్ఆర్వో)గా నియమించారు. దరఖాస్తు చేసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 40 టన్నులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో, మెట్పల్లి ఆదేశాలు ఉన్నాయి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. లబ్ధిదారులు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని రెవెన్యూ కార్యాలయంలో అందించాక పరిశీలించి అనుమతులు జారీ చేస్తాం. – నీత, తహసీల్దార్, మెట్పల్లి -
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
సారంగాపూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ అన్నారు. గురువారం బీర్పూర్ మండల కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై సమాయత్త సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగిందన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని, అలాగే బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిచాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సుమన్‌గౌడ్, విండో మాజీ చైర్మన్ మెరుగు రాజేశం, నాయకులు రామన్న, జతేందర్, శ్రీనివాస్, రాంచంద్రం, సుధాకర్, లింగన్న, మల్లేశం, రామయ్య, రాజేష్, మాజీ సర్పంచ్ రవీందర్, మల్లేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కల్లెడలో.. జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో కల్లెడ, తక్కళ్లపల్లి, సంగంపల్లి, సోమన్‌పల్లి, గుల్లపేట, అనంతారం, హబ్సీపూర్, పొలాస, గుట్రాజ్‌పల్లి గ్రామాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వసంత మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించాలన్నారు. కల్లెడ, జగిత్యాల సింగిల్ విండో చైర్మన్లు సందీప్‌రావు, మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. -
ప్రమాద బాధితులకు పరిహారం అందేలా చర్యలు
కోరుట్ల: కోరుట్లలో గతనెల 15న గణపతి విగ్రహం తరలిస్తుండగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితిపై ‘సాక్షి’ ‘పాపం దయనీయం’ శీర్షికన ఈనెల 24న కథనం ప్రచురించింది. ఈ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు అందించామని, చికిత్స పొందుతున్న బాధితులకు వైద్యం వివరాలు సేకరిస్తున్నామని, ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. సంస్థ నిబంధనల ప్రకారం సివిల్ సర్జన్ ర్యాంక్ అధికారి ఇచ్చే డిజెబిలిటీ సర్టిఫికెట్ ఆధారంగా పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలుజగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో జగిత్యాల టౌన్, జగిత్యాల రూరల్, ధర్మపురి సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బందితో సమావేశమయ్యారు. విద్యుత్ ప్రమాదాలు జరగుకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని తెలిస్తే చర్యలు ఉంటాయన్నారు. భద్రత చర్యలు తీసుకోకుండా విధులు నిర్వర్తిస్తే రూ.3వేల జరిమానా విధిస్తామన్నారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. టెక్నికల్ సెఫ్టీ ఆఫీసర్ గంగారాం, జగిత్యాల డీఈ రాజిరెడ్డి, ఏడీఈలు, ఏఈలు, ఏఏఓలు, సబ్ ఇంజినీర్లు, ఓఅండ్ఎం ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా షర్మిలజగిత్యాల: మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా షర్మిల నియమితులయ్యారు. సూపరింటెండెంట్ ఎంజీ.మూర్తి, షర్మిల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ఎంవోలు విజయ్‌రెడ్డి, సుమన్‌మోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధీర్ ఉన్నారు. ఆంక్షలు లేకుండా రైతులకు రుణాలివ్వండిజగిత్యాలటౌన్: బ్యాంకుల ద్వారా రైతులకు ఆంక్షలు లేకుండా రుణాలు ఇచ్చేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్‌కు మాజీమంత్రి జీవన్‌రెడ్డి లేఖ రాశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు తాకట్టు పెట్టుకోకుండా రుణాలివ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకులు పాటించడం లేదని, పాస్ బుక్కులు కలిగిన అసైన్డ్ భూముల రైతులకూ రుణాలు ఇచ్చేలా చూడాలని కోరారు. -
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
గొల్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల కోసమే ఇందిరమ్మ ఇళ్లు అందిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు అత్తెన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లుమంజూరు పత్రాన్ని అందించారు. నిరుపేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు. వసతుల కల్పనకు కృషి గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. మండలకేంద్రంలోని శ్మశా న వాటికకు సరైన రహదారి లేక గ్రామస్తులు ఇబ్బ ంది పడుతున్నారు. వారి సమస్యను మంత్రి గురువారం స్వయంగా పరిశీలించారు. శ్మశాన వాటికకు దారికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. -
పాఠశాలల్లో గ్రంథాలయాలు
● అందుబాటులో బాలసాహిత్య పుస్తకాలు ● ప్రత్యేక పీరియడ్ నిర్వహణకు నిర్ణయం ● మొబైల్ ఫోబియాను తగ్గించడానికే.. జగిత్యాల: నేటి హైటెక్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. పుస్తక పఠనం అనేది మరిచిపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. అలాగే చదువులో నష్టపోతున్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులను చదువుపై మళ్లించాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు. వీటితో విజ్ఞానం పెరగడంతోపాటు సృజనాత్మకత పెంపొందుతుంది. ఇందులో సాహిత్యం, ఇతిహాసం, కార్టూన్లు, పురాణ కథలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని చదివితే సామాజిక స్పృహ అలవాటపడుతుంది. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్ కూడా కేటాయించారు. అధికారులు అప్రమత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠన సామర్థ్యం పెంచడం, వారి జ్ఞానాన్ని పెంపొందించడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలకు బుక్స్ పంపించడమే కాకుండా వీటి కోసం ఒక ప్రత్యేక పీరియడ్ నిర్వహించనున్నారు. పిల్లలే కాకుండా వారి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టీచర్స్ భవన్లో గ్రంథాలయాలపై ఉపాధ్యాయులకు శిక్షణ కల్పిస్తున్నారు. హైటెక్ యుగంలో ప్రపంచం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతీ విషయాన్ని నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పుస్తక పఠనాన్ని విద్యార్థులకు అలవాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైమరీ, యూపీఎస్ స్కూళ్లలో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. 566 స్కూళ్లకు బుక్స్ అందజేత ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 566 స్కూళ్లకు ఇప్పటివరకు బుక్స్‌ను అందించారు. మొదటి విడతలో ఒక్కో స్కూల్‌కు 259 పుస్తకాల చొప్పున అందజేశారు. రెండో విడతలో 113 బుక్స్ అందించారు. ఇందులో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించినవి కూడా ఉన్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా కథనాలు ఉన్నాయి. ప్రతీ కథ 11 పేజీల వరకు ఉంది. మంచిమంచి కథలున్నాయి. పాఠశాలలో విద్యాశాఖ గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నారు. వీటిపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మార్గదర్శకాలను చేశారు. సెల్‌ఫోన్ దృష్టి మళ్లించడానికే.. స్కూల్‌కు వెళ్లినప్పటికీ విద్యార్థులు ఇంటికి రాగానే ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ల మోజులో పడిపోతున్నారు. అందులో ఎక్కువగా గేమ్స్, ఇతరత్రా యాప్‌లు చూస్తు ఉండిపోతున్నారు. కథనాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఫలితంగా వీరిలో పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోతోంది. ప్రస్తుతం స్కూళ్లలో ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతో చిన్నారులకు మంచి చదువుతో పాటు ప్రపంచ విషయాలు తెలుసుకునేలా ఉంటుంది. పాఠశాలల్లో మంచి బలోపేతమైన పుస్తకాలు ఏర్పాటు చేస్తే చదువు ఇంకా ముందుకెళ్తుంది. సెల్ఫోన్లు తగ్గించాలంటే నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం అయితే చిన్నారుల కోసం అనేక కథనాలతో కూడిన పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. శిక్షణ కల్పిస్తున్నాం పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి పాఠశాలకు పుస్తకాలు పంపిణీ చేశాం. పిల్లల వద్దకే పుస్తకాలు తీసుకువచ్చే ప్రణాళిక చేశాం. పుస్తక పఠనం అలవాటు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇది మంచి కార్యక్రమం. – రాము, డీఈవో -
● పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు
బీజేపీ సత్తా చూపాలిరాయికల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు కార్యకర్తలకు సూచించారు. గురువారం రాయికల్ పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీ కన్వీనర్ శ్రీనివాస్, పార్లమెంట్ కో–కన్వీనర్ సదాశివ్, మండల ఇన్చార్జి రాగిల్ల సత్యనారాయణ, సింగిల్ విండో చైర్మన్ ముత్యంరెడ్డి, మహిళామోర్చ జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ, మండల అధ్యక్షుడు మహేశ్, పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు
వెల్గటూర్: యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. వెల్గటూర్ మండలంలో గురువారం పర్యటించిన ఆయన పీఏసీఎస్‌లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో మందుల నిల్వలను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. రోగులకు ఇబ్బంది లేకుండా చికిత్స అందించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, సహకార అధికారి మనోజ్ కుమార్, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో సాయికిరణ్, సంఘ చైర్మన్ రత్నాకర్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ప్రమాదబీమా, లోన్‌బీమా కల్పించామని, ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల పరిహారం అందుతుందని, సహజ మరణం పొందితే సభ్యురాలి పేరిట ఉన్న రుణం గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుందన్నారు. జిల్లాలో 134 మంది మహిళలకు విద్యార్థుల డ్రెస్సులు కుట్టే బాధ్యత అప్పగించి.. వారికి కుటీర వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. మహిళాసంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చామన్నారు. తాటిపల్లి మహిళాసంఘాలకు పైలెట్ ప్రాజెక్ట్ కింద వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామన్నారు. చల్గల్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. వడ్డీమాఫీ కింద 2,670 మంది స్వశక్తి సభ్యులకు రూ.3.11 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. వడ్డీ లేని రుణాలను 123 సంఘాలకు రూ.17 కోట్లు, సీ్త్రనిధి ద్వారా పట్టణ పొదుపు సంఘాలకు రూ.17 లక్షలు అందించారు. డీఆర్డీవో రఘువరణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 20 వేల మందికి నివాసం 20 వేల మంది నివసించేలా అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ ప్రాజెక్ట్ రూపకల్పన చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఇందిరమ్మ కాలనీ వసతులపై సమీక్షించారు. 4,520 ఇళ్లలో నివసించే ప్రజల కోసం వసతులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, కమిషనర్ స్పందన, తహసీల్దార్ రాంమోహన్, సర్వేయర్ విఠల్, డీఈ మిలింద్, ఏఈలు అనిల్, చరణ్ పాల్గొన్నారు. -
శునకాలతో భయంభయం
● మందలుగా తిరుగుతున్న కుక్కలు ● జిల్లాకేంద్రంలోని మూడు వార్డుల్లో ఎమర్జెన్సీ ● రోడ్లవెంట వెళ్తున్నవారిపై దాడులు ● భయాందోళనలో స్థానికులుజగిత్యాల: జిల్లాకేంద్రంలో మళ్లీ కుక్కల బెడద మొదలైంది. రోడ్లపైకి రావాలంటేనే చిన్నారులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని వీధుల్లో కుక్కలు వెంటబడి కరుస్తుండటంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. గతంలో కుక్కల బెడద నుంచి తప్పించాలని అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో హైకోర్టు స్పందించి వెంటనే నివారించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాకేంద్రంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. డంపింగ్‌యార్డు వద్ద యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ జిల్లాకేంద్రంలోని టీఆర్‌నగర్‌లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 36 కన్నెల్స్ను ఏర్పాటు చేసి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టారు. గతంలో టెండర్లు నిర్వహించగా హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీ ఒక్కో కుక్కకు రూ.1450 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. 2024 ఆగస్టు 9న కుక్కలను పట్టేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలో సుమారు రెండు వేల వరకు కుక్కలను పట్టి కు.ని ఆపరేషన్లు చేశారు. దీనికో కమిటీ వేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా చేశారు. చాలావరకు ఆపరేషన్లు చేసి కుక్కలను తిరిగి వీధుల్లో విడిచిపెట్టారు. ఆపరేషన్లు చేసినట్లు గుర్తుగా చెవి కత్తిరించారు. ఏమైందో ఏమోగానీ కు.ని. నిలిపివేయడంతో మళ్లీ మొదటికి వచ్చింది. బిల్లులు విడుదల చేయకపోవడంతో వారు ఆపేసినట్లు తెలిసింది. జనవరి నుంచి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయాయి. అప్పటినుంచి మళ్లీ కుక్కల బెడద ఎక్కువైంది. పెరుగుతున్న కుక్కల దాడులు జనవరిలో నిలిచిపోయిన కుక్కల కు.ని ఆపరేషన్లను ఇప్పటివరకు మళ్లీ చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో దాదాపు ఐదు నుంచి ఎనిమిది వేల కుక్కలు ఉంటాయని అంచనా. జిల్లాకేంద్రంలోని ప్రతి వార్డుల్లో గుంపులుగుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం రోడ్ల వెంటే.. తెల్లారిందంటే చాలు.. ప్రధాన రోడ్ల వెంట మందలుమందలుగా కనిపిస్తున్నాయి. ఉదయంపూట బడికి వెళ్లే విద్యార్థులు, విధులకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే చిన్నారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు వెంటపడుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కొందరు తీవ్రంగా గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కుక్కలకు కు.ని. నియంత్రణ ఆపరేషన్లు నిరంతరం చేపడతామని చెప్పినప్పటికీ అర్ధంతరంగా నిలిచిపోవడంతో మళ్లీ ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మూడు వార్డుల్లో ఎమర్జెన్సీ జిల్లా కేంద్రంలోని మూడు వార్డుల్లో ఎమర్జెన్సీగా కుక్కలను పట్టాలని అధికారులు పేర్కొంటున్నప్పటికీ ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. అధికారులు స్పందించి ఆ మూడు వార్డుల్లో కుక్కలను పట్టేలా ఏజెన్సీ వారితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.మళ్లీ ప్రారంభిస్తాం ప్రస్తుతం నిలిచిపోయినప్పటికీ వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. మూడు వార్డుల్లో ఎమర్జెన్సీ ఉన్నట్లు తెలిసింది. వారితో మాట్లాడి ఆపరేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. – చరణ్, ఏఈ కుక్క కరిస్తే ఇబ్బందులే... సొల్లు కార్చే కుక్క కరిస్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. కాటు వేసిన కొద్ది రోజులకే జ్వరం, తలనొప్పి, కండరాలు బిగుసుకుపోయి విపరీతంగా అలసటకు గురవుతారు. దీంతో సకాలంలో వైద్యం అందకపోతే కుక్కకాటుతో చనిపోయే ప్రమాదం సైతం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. నిత్యం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. -
మెట్పల్లి క్లబ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
మెట్పల్లి: పట్టణంలోని మెట్పల్లి క్లబ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. క్లబ్ స్థలాన్ని విక్రయించడాన్ని నిరసిస్తూ బుధవారం క్లబ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లబ్‌కు చెందిన విలువైన స్థలాన్ని కొందరు సభ్యులు గుట్టుగా విక్రయించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం దీనిని తక్షణమే స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు యామ రాజయ్య, సంగు గంగాధర్, రైసుద్దీన్, పెంట ప్రణయ్, పల్లికొండ ప్రవీణ్, లతీఫ్, రుడావత్ గణేష్ తదితరులున్నారు. -
అంగన్వాడీలకు పక్కా భవనాలు
ఇబ్రహీంపట్నం: ఆంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని తిమ్మాపూర్‌లో రూ.12 లక్షలతో నిర్మించనున్న ఆంగన్వాడీ భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. అద్దె ఇళ్లలో కొనసాగుతున్న కేంద్రాలకు కొత్త భవనాలను నిర్మించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ఆనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కరెంట్ లేని రోజుల్లో దీపాల కింద చదువుకున్నామని, నేడు డిజిటల్ బోధన అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ఎలేటి చిన్నారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.