breaking news
Personal Finance
-
పోస్టాఫీసు స్కీములు.. వడ్డీ రేట్ల ప్రకటన
పోస్టాఫీసుల ద్వారా నిర్వహిస్తున్న పలు పొదుపు స్కీములకు సంబంధించిన వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎసీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి సాధనాలపై ఆధారపడిన పొదుపుదారులకు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వారి రాబడిలో ఎలాంటి మార్పులు కనిపించవు.పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పొదుపు సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ మద్దతు పథకం పీపీఎఫ్ గత త్రైమాసికంలో మాదిరిగానే వడ్డీ రేటును కొనసాగిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎసీఎస్ఎస్), సుకన్య సమృద్ధి సమృద్ధి స్కీమ్‌లకు ఆకర్షణీయమైన వార్షిక రేటును 8.2% కొనసాగుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో ఇన్వెస్టర్లు 7.7 శాతం, పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవోఎంఐఎస్) 7.4 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) కూడా మారలేదు. ఇది 115 నెలల మెచ్యూరిటీ వ్యవధితో 7.5% రేటును అందిస్తుంది.ఇక పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. క్రమం తప్పకుండా నెలవారీ పొదుపునకు అవకాశం ఉండే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం 6.7% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలు గ్యారంటీ రాబడులను అందిస్తాయి, ఎంచుకున్న పథకం ఆధారంగా నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని జతచేస్తాయి.ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్న ఈ చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన, స్థిర-ఆదాయ రాబడిని కోరుకునే లక్షల మంది భారతీయులకు కీలక పెట్టుబడి సాధనాలు. శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫారసు చేసిన విధంగా ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడులకు సంబంధించిన ఫార్ములాను ఉపయోగించి ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వాటి రేట్లను సమీక్షిస్తుంది. అయితే మార్కెట్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఈ రేట్లను స్థిరంగా ఉంచాలని కేంద్రం నిర్ణయించింది.పథకంవడ్డీ రేటుపోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్4%పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్6.7%పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్7.4%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం)6.9%ప్రస్థితి పోస్ట్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు)7%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు)7.1%పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు)7.5%కిసాన్ వికాస్ పత్ర (కేవీయపీ)7.5%పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)7.1%సుకన్య సమృద్ధి యోజన8.2%నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్7.7%సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)8.2% -
‘ఇండియాలో సమయం విలువ తెలియని వారే ఎక్కువ’
ఆన్లైన్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ క్రెడ్ వ్యవస్థాపకులు, సీఈఓ కునాల్ షా ఇటీవల ‘డబ్బు-సమయం’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఫోర్బ్స్ తో మాట్లాడుతూ చాలా మంది భారతీయులకు డబ్బుకు సంబంధించి సమయం విలువ తెలియదని షా అన్నారు.‘మిలియన్ డాలర్లు సంపాదించే అమెరికన్లు తమ గంట వేతన విలువను సరిగ్గా అర్థం చేసుకుంటారు. అదే భారతదేశంలో ఎవరినైనా గంటకు తమ జీతం ఎంత అని అడిగితే.. వారికి ఎలాంటి క్లూ ఉండదు’ అని షా అన్నారు. ఈ ధోరణి దీర్ఘకాలంలో భారీ మొత్తం నష్టపోయేందుకు దారితీస్తుందని చెప్పారు. భారత్‌లో చాలామంది సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తున్నట్లు తెలిపారు. ‘గంటకు రూ.10వేలు సంపాదించే వారు విమాన టికెట్‌పై రూ.500 ఆదా చేసుకోవడానికి మరో గంట సమయం వెచ్చిస్తున్నారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్మహిళా భాగస్వామ్యం అంతంతే..‘భారత్‌లో కాకుండా నేను వెళ్లిన ప్రతి మీటింగ్‌లోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండేవారు. ముఖ్యంగా ప్రొడక్ట్ టెక్ కంపెనీల్లో ఆర్థిక పరమైన అంశాలపై ఇతర ప్రాంతాల్లో మహిళలదే పైచేయి. కానీ భారత్‌లో వీరి సంఖ్య చాలా పరిమితంగా ఉంది. ఈ స్పష్టమైన వ్యత్యాసం దేశ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. శ్రామిక శక్తిలోనూ మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. పురుషులే పనిచేస్తే భారత్ తలసరి ఆదాయం పెరగదు. మహిళలకు ప్రాతినిథ్యం పెరగాలి’ అని చెప్పారు. -
‘మెట్రో నగరాల్లో రియల్టీ మార్కెట్ ఓ ట్రాప్’
దేశంలోని మెట్రో నగరాల్లో రియల్టీ మార్కెట్‌ను ఉద్దేశిస్తూ ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ తాను గమనించిన అత్యంత అవినీతి రంగాల్లో రియల్ఎస్టేట్ మార్కెట్ ఒకటని చెప్పారు. ఈ రంగం నల్లధనంతో కుదేలైందని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో వాస్తవ గృహ డిమాండ్ ద్వారా కాకుండా అక్రమ పెట్టుబడి ప్రవాహాల వల్ల పట్టణ ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు.రిగ్గింగ్ గేమ్సంపన్న పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్‌ను ఆసరాగా చేసుకొని పన్ను చెల్లించని డబ్బును నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజలను ఉద్దేశించి ‘మీరు వాస్తవంగా రియల్టీ పెరుగుదలను పరిగణించి ఆస్తులు కొనుగోలు చేయడం లేదు. రిగ్గింగ్ గేమ్‌లో వాటిని కొంటున్నారు’ అని అన్నారు. తన వాదనను మరింత సమర్థించేలా ముంబయిలో 20 శాతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో తొమ్మిది కుటుంబాలదే పైచేయని తెలిపే డేటాను ఎత్తి చూపారు.ఇదీ చదవండి: లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్ఖర్చుతో మానసిక సౌకర్యంస్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ మెట్రో నగరాల్లో అద్దె రాబడులు మాత్రం 2–3% వరకు ఉంటున్నాయని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్‌ను ఉత్పాదక ఆస్తిగా కాకుండా, అనుమానాస్పద ఆర్థిక స్థితిలోని నెట్టివేస్తుందని తెలిపారు. మెట్రో నగరాల్లో ఇల్లు ఉండడం ఆర్థిక ఖర్చుతో కూడిన మానసిక సౌకర్యాన్ని అందిస్తుందని చెప్పారు.కొనుగోలుదారులకు సలహాలు..అద్దె రాబడులు మొత్త ఆస్తి విలువలో ఏటా 4% మించకపోతే కొనుగోలు చేయవద్దని శ్రీవాస్తవ అన్నారు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేమని సేల్స్ ఒత్తిడికి లోనవ్వకూడదు. ఆర్థికంగా అన్ని చూసుకోవాలి.మెట్రోలకు బదులుగా టైర్-2, 3 నగరాలపై ఓ లుక్కేయండి. -
ఐటీ రిటర్నులు ఎవరు ఫైల్ చేయాలి..?
ఇదొక ప్రశ్నా..? అనుకోకండి... ఆదాయం అంటే నికర ఆదాయం లేదా టాక్సబుల్ ఇన్‌కం బేసిక్ లిమిట్ దాటిన ప్రతి వ్యక్తీ, ప్రతి ఏటా విధిగా, కచ్చితంగా సకాలంలో రిటర్నులు దాఖలు చేయాలి. ఇదొక ప్రాథమిక సూత్రం. ఫాలో అవ్వండి. చట్ట ప్రకారం, వ్యక్తులకు ఎటువంటి ఆదాయం లేకపోయినా బేసిక్ లిమిట్ పరిధిలోకి వస్తారు. టాక్స్‌బుల్ ఇన్‌కం ఉంటే ఆదాయపు పన్ను రిటర్నులు చేయాల్సిందే. ఇటువంటి వ్యక్తులు ఎవరు? ఏమిటా సందర్భము? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..మీరు ఒక సంవత్సరం కాలం, అంటే ఓ ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి రూపాయిలు దాటి బ్యాంకులో డిపాజిట్ చేశారనుకొండి. మీరు రిటర్ను వేయాల్సిందే. అమెరికా నుంచి మీ అబ్బాయి రూ.కోటి దాటి పంపితే, అది మీ అకౌంటులో జమ కాబట్టి మీరు రిటర్ను వేయాలి. సాంకేతికంగా ఒక సలహా.. మీ అకౌంట్లో కోటి లోపు, మీ జీవిత భాగస్వామి అకౌంట్లో కోటి లోపు వేసినట్లయితే ఈ బాధ్యత నుంచి బయట పడవచ్చు. ఇటువంటి బదిలీల వలన మీకు ఎటువంటి పన్ను భారం మాత్రం ఉండదు.మీరు ఓ కంపెనీకి డైరెక్టర్ అనుకోండి. లేదా లిమిటెడ్ పార్టనర్ షిప్లో భాగస్వామి అనుకోండి. జీతం/పారితోషికం/కమీషన్ ఏమీ తీసుకోకపోయినా రిటర్ను వేయాల్సిందే. దగ్గరి వారో లేదా మిత్రులో.. ప్రోద్బలం వల్ల కంపెనీ పెట్టవచ్చు. లిమిటెడ్ పార్టనర్‌షిప్‌లో చేరవచ్చు. మీకు ఎటువంటి బరువు, బాధ్యతలు ఉండకపోవచ్చు. కానీ రిటర్ను మాత్రం వేయాలి. మీకు చెప్పుకుండా మీ పేరు కూడా వాడుకోవచ్చు. తగిన జాగ్రత్త వహించాలి.విదేశీయానం మీద రూ.2 లక్షలు దాటి పెట్టారనుకోండి. మీరు రిటర్ను దాఖలు చేయాలి. అలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందీ, పన్ను భారం ఉండకపోవచ్చు. మీ అబ్బాయో/అమ్మాయో టికెట్ కొనమనండి. ఆ డబ్బుల్ని వారిని చెల్లించమనండి.మీకు కరెంట్ బిల్లు సంవత్సరంలో రూ.ఒక లక్ష దాటింది అనుకొండి. ఆ షాక్‌తో పాటు రిటర్ను దాఖలు షాక్ కూడా మీ నెత్తిన పడుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో మీ పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయనుకోండి. అన్నీ కలిపి మీ పేరు మీద బిల్లు రూ.లక్ష దాటింది అనుకోండి. మీకు ఈ బాధ్యత వర్తిస్తుంది. కరెంటు బిల్లు.. ఇంటికి, బిల్డింగ్‌కి, అపార్ట్మెంట్కి, కమర్షియల్ ప్రాపర్టీకే కాదు ఒక వ్యక్తికి వస్తుంది. ఇలాంటి జాబితాలో చాలామంది ఉంటారు. ఉన్నారు. ప్రస్తుతం సమాచార సమన్వయం లేకపోవడంతో వీళ్లు తప్పించుకుంటున్నారు. కానీ కృత్రిమ మేథస్సు వలన ఇవన్నీ బయటపడతాయి.మీ విషయంలో టీడీఎస్ రూ.25,000 లేదా ఆపైన జరిగిందనుకోండి. సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ లిమిట్ రూ.50,000గా ఉంటుంది. వీరు రిటర్ను వేయాల్సిందే. వెంటనే ఫారం 16/ఫారం 16ఏ చెక్ చేసుకోండి. ‘నిప్పు లేనిదే పొగరాదు’ మాదిరిగా ఏదొక వ్యవహారం జరగనిదే టీడీఎస్ కోత తప్పదు. ఈ వ్యవహారాన్ని బయట పెట్టే సందర్భమే... ఈ రిటర్ను వేయడం.మీ వ్యాపారం/బిజినెస్/వసూళ్లు/ అమ్మకాలు సంవత్సర కాలంలో రూ.60 లక్షలు దాటాయనుకోండి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇది బయటపడుతుంది. అలాగే వృత్తి పరంగా వచ్చే ఆదాయం ఏటా రూ.10 లక్షలు దాటిందంటే రిటర్ను వేయాలి. ఈ రెండు కేసుల్లోనూ నికర ఆదాయంతో సంబంధం లేదు. లాభనష్టాలతో అసలు పనేంలేదు. రిటర్ను వేయాలి.టీడీఎస్ జరిగింది.. ఆదాయం టాక్స్‌బుల్ ఇన్‌కం లోపల ఉన్నా, ఆదాయం ఏమాత్రం లేకున్నా, పన్ను భారానికి మించి టాక్స్ కట్ చేసినా రిఫండ్ పొందాలి. రిఫండ్ కోసం రిటర్ను వేయాల్సిందే.ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలుచివరిగా, మీకు రుణాల మంజూరు, విదేశీ ప్రయాణాలకు వీసాలు లాంటి విషయాల్లో .. గౌరవం, పరపతి, గుర్తింపు ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి రిటర్నులు వేయడంపై దృష్టి పెట్టండి. ఎగవేత మార్గాన్ని ఎంచుకోకండి. -
స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు
నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలమైన సాధనాలు ఏవి? – నళినీ ప్రకాశ్స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. స్వల్పకాల పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. సేవింగ్స్ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి కంటే ఎఫ్‌డీలోనే అధికంగా లభిస్తుంది. కచ్చితమైన రాబడి కావాలని కోరుకునే వారికి ఎఫ్డీ కంటే మెరుగైన సాధనం లేదు. బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్‌పై బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. ఒకవేళ బ్యాంకు సంక్షోభంలో పడినా రూ.5 లక్షల వరకు ఒక వ్యక్తికి భరోసా ఉంటుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్డీపై రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే కనుక ఎఫ్డీ ద్వారా వచ్చే నికర ఆదాయం పెద్దగా ఉండదని అర్థం చేసుకోవాలి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చు. ఫండ్స్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్ ఫండ్‌లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభం అని లేదు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత కాలంలో విక్రయించినట్టయితే వచ్చే మూలధన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఏ శ్లాబు పరిధిలో ఉండే ఆ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇన్వెస్టర్లు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వీటిల్లో అనుకూలమైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మంచి ఎంపిక. అంతకుమించిన కాలానికి అయితే షార్ట్ డ్యురేషన్ ఫండ్ అనుకూలం. డెట్ ఫండ్స్ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్‌డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో మెరుగైన రేటింగ్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌లో రాబడులతో పాటు రిస్క్ కూడా ఎక్కువ. డిపాల్ట్ రిస్క్ ఉంటుంది. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి కదా.. వీటి నుంచి మంచి పథకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? – వెంకటస్వామిఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ట్రాకింగ్ ఎర్రర్‌ను కూడా గమనించాలి.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనఒక ఇండెక్స్ ఫండ్.. అది పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది తెలియజేస్తుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోండి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వ్యాల్యూ రీసెర్చ్. -
రాబడుల తీరుతెన్నులే పోర్ట్‌ఫోలియోకు కీలకం..
పెట్టుబడులకు సంబంధించి ఏ పోర్ట్ఫోలియోకైనా రాబడుల ధోరణే కీలకంగా ఉంటుంది. ఉదాహరణకు ఓ సందర్భాన్ని ఊహించుకోండి. మీకు ఇష్టమైన క్రికెట్ టీమ్ భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ప్రారంభంలోనే ఓ అయిదు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బాగానే ఆడినా, మ్యాచ్ పూర్తయ్యేంతవరకు టీమ్‌పై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. అలా కాకుండా, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ప్రారంభంలోనే భారీ స్కోర్ చేస్తే టీమ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. గెలిచే అవకాశాలూ కాస్త మెరుగ్గా ఉంటాయి. దీన్నే ఇన్వెస్టింగ్ కోణంలో ఒకసారి చూద్దాం. రాము, కృష్ణ ఇద్దరూ ఒకేసారి ఒకే తరహాలో రూ. 1 కోటి కార్పస్‌తో రిటైరయ్యారు.ఏటా రూ. 5 లక్షల చొప్పున విత్‌డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే పదేళ్లలో రూ. 50 లక్షలు విత్‌డ్రా చేసుకున్నారు. పోర్ట్‌ఫోలియోలో బ్యాలెన్స్‌లపై వచ్చే రాబడులతో పదేళ్ల తర్వాత, రాము నిధి రూ. 37.32 లక్షలు పెరగ్గా, కృష్ణ నిధి రూ. 58.52 లక్షలు పెరిగింది. రెండింటి మధ్య వ్యత్యాసం ఏకంగా 36 శాతం ఏర్పడింది. నిర్దిష్ట వ్యవధిలో మొత్తం విత్‌డ్రా చేసుకున్నది, ఆఖర్లో ఉన్న బ్యాలెన్స్‌ను కలిపితే రాము మొత్తం రూ. 87.32 లక్షలు ఆర్జించినట్లు కాగా, కృష్ణ రూ. 1.08 కోట్లు (రూ. 50 లక్షలు + రూ. 58.52 లక్షలు) ఆర్జించినట్లయింది. 2015–19 మధ్య కాలంలో వరుసగా అయిదేళ్ల పాటు నెగటివ్ రిటర్న్స్ నమోదై, రూ. 50 లక్షలు విత్‌డ్రా చేసుకున్నప్పటికీ కృష్ణ నిధి అసలు మొత్తం మీద మరో రూ. 8.52 లక్షల మేర పెరిగింది. పదేళ్లలో రాము రాబడులనేవి –5%, –6%, –15%, –8%, –4%, 5%,7%,9%,11%, 9%గా నమోదయ్యాయి. అదే సమయంలో దీనికి భిన్నంగా కృష్ణ రాబడులు 9%, 11%, 9%, 7%,5%,–4%, –8%, –15%, –6%, –5%గా నమోదయ్యాయి. రాము బేర్ ఫేజ్‌లో పెట్టుబడులు ప్రారంభించగా, కృష్ణ బుల్ ఫేజ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇలా పెట్టుబడులు పెట్టే సమయమనేది పోర్ట్‌ఫోలియోపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ఇద్దరు ఇన్వెస్టర్లు తమ సేవింగ్స్ నుంచి ఒకే స్థాయిలో విత్‌డ్రా చేస్తున్నా, అసలు మొత్తం భిన్నంగా ఉండటం వల్లే ఇద్దరి రాబడుల్లో అంతరానికి కారణమైంది. ఉదాహరణకు తొలి ఏడాది మార్కెట్లు 5 శాతం పడి, రూ. 5 లక్షలు విత్‌డ్రా చేసుకున్నప్పుడు రాము కార్పస్ రూ. 90 లక్షలకు తగ్గిపోయింది. కానీ కృష్ణ కూడా అంతే మొత్తం విత్‌డ్రా చేసుకున్నప్పటికీ తొలి ఏడాదిలో 9 శాతం రాబడి రావడంతో ఆయన బ్యాలెన్స్ రూ. 1.04 కోట్లకు పెరిగింది. కృష్ణ పెట్టుబడులపై ఆరో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు నెగటివ్ రాబడులే వచి్చనప్పటికీ, చివరికి వచ్చే సరికి రాము స్థాయి ప్రతికూల ప్రభావం కృష్ణపై పడలేదు. తొలి ఐదేళ్లలో రాము పెట్టుబడులపై రాబడులు క్షీణించడంతో పాటు ఏటా రూ. 5 లక్షలు వెనక్కి తీసుకుంటూ ఉండటమనేది అతని పోర్ట్‌ఫోలియో విలువపై బాగా ప్రతికూల ప్రభావం చూపింది. రాబడులు వచ్చే తీరుతెన్నులు ఏ విధంగా పోర్ట్‌ఫోలియోను ప్రభావితం చేస్తాయనేది ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడే రిటైరీలకు ఇది మరీ ముఖ్యమైన విషయం. ఈ కాన్సెప్టు థియరీ ప్రకారం కరెక్టే అయినప్పటికీ .. సరైన సమయంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమనేది ఎవరికైనా కష్టమే. ముఖ్యంగా రిటైరీలకు మరింత సమస్యగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రస్థానంలో రిటర్న్ రిసు్కల సీక్వెన్స్‌ను పరిగణనలోకి తీసుకుని ప్లానింగ్ చేసుకోవడం కీలకంగా ఉంటుంది.‘బకెటింగ్’తో రిసు్కలకు చెక్.. చారిత్రకంగా సెన్సెక్స్ వరుసగా రెండేళ్ల పాటు 1986–87, 1995–97, 2000–01లో క్షీణించింది. అయితే, మరింత లోతుగా పరిశోధిస్తే (నెలవారీ లేదా రోజువారీ రిటర్నులు) ఇలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. బకెటింగ్ విధానంతో ఇన్వెస్టర్లు ఇలాంటి రిస్కులను అధిగమించవచ్చు. ఈ విధానంలో కార్పస్‌ను స్వల్పకాలికం (ఫిక్సిడ్ ఇన్‌కం పోర్ట్‌ఫోలియో), మధ్యకాలికం (హైబ్రిడ్), దీర్ఘకాలిక (ఈక్విటీ) ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి, అదనంగా మరో ఆదాయ మార్గాన్ని కూడా ఏర్పర్చుకుంటే, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు బఫర్‌గా పని చేస్తుంది.ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు తమ విత్‌డ్రాయల్ రేటును తగ్గించుకుని, ఏదైనా ఫిక్సిడ్ యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేయొచ్చు లేదా డెట్, బంగారం, రీట్లు, ఇంటర్నేషనల్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించవచ్చు. తద్వారా మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టపోయే అవకాశాలను తగ్గించుకోవచ్చు. కార్పస్ ఫండ్ నుంచి విత్‌డ్రా చేసుకునే యోచనతో, భారీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను రూపొందించుకుంటున్నప్పుడు, రాబడుల తీరుతెన్నులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. భారీ టార్గెట్‌ను ఛేదించేటప్పుడు ప్రారంభంలోనే వేగంగా స్కోర్ చేస్తే గెలిచే అవకాశాలు ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో, పెట్టుబడుల ప్రస్థానంలో తొలినాళ్లలో మెరుగైన రాబడులు రావడం వల్ల మీ పోర్ట్‌ఫోలియో తుది విలువపై సానుకూల ప్రభావం ఉంటుంది. - అజిత్ మీనన్ ,సీఈవో, పీజీఐఎం ఇండియా ఎంఎఫ్ -
రూపాయి లేకపోయినా.. యూపీఐ చెల్లింపులు!
ప్రీతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వేతనంతోపాటు ఖర్చులూ ఎక్కువే. దీంతో క్రెడిట్ కార్డును వినియోగిస్తోంది. దీనిపై రివార్డు పాయింట్లతో పాటు, తర్వాత చెల్లించే వెసులుబాటు ఆమెకు సౌకర్యంగా అనిపించింది. కానీ, చిన్న చిన్న చెల్లింపులకు, కొన్ని షాపుల్లో క్రెడిట్ కార్డు స్వైప్నకు అవకాశం ఉండకపోవడం అసౌకర్యంగా భావించింది. ఇదే సమయంలో రూపే కార్డు గురించి విన్న ఆమె వెంటనే దానికి దరఖాస్తు చేసుకుంది.రూపే క్రెడిట్ కార్డు అయితే యూపీఐకి లింక్ చేసుకుని సులభంగా చెల్లించడం ప్రీతిని ఎంతగానో ఆకర్షించింది. ఇప్పుడు దాదాపు అన్ని చెల్లింపులను రూపే కార్డు నుంచే చేస్తోంది. నిజమే సాధారణ క్రెడిట్ కార్డులతో పోల్చితే.. రూపే క్రెడిట్ కార్డుతో ఎక్కడైనా యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులకు అవకాశం ఉండడం ఎంతో మందికి అనుకూలించే అంశం. ఇందుకు ఆర్బీఐ ఎప్పుడో అవకాశం కల్పించింది. ఈ కార్డ్‌తో వచ్చే ప్రయోజనాలు, రిస్‌్కల గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. – సాక్షి, బిజినెస్ డెస్క్అన్ని క్రెడిట్ కార్డుల మాదిరే యూపీఐ కార్డు కూడా పనిచేస్తుంది. ఒక్క రూపే క్రెడిట్ కార్డ్‌ను మాత్రం యూపీఐతో లింక్ చేసుకుని సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తూ 2022 జూలైలోనే ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. నాన్ రూపే క్రెడిట్ కార్డులకు ఈ వెసులుబాటు లభించలేదు. దాంతో రూపే క్రెడిట్ కార్డులు ఆకర్షణీయంగా మారాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డులకు బ్యాంకులు అదనపు (యాడ్–ఆన్) రూపే కార్డులను ఇవ్వడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు నేరుగా కో–బ్రాండెడ్, సొంత రూపే కార్డులనే కొత్త కస్టమర్లకు జారీ చేస్తున్నాయి. సాధారణంగా యూపీఐ చెల్లింపులు ఏ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసినా.. బ్యాంక్ ఖాతా నుంచే ఆ మొత్తం వెళుతుంది. రూపే క్రెడిట్ కార్డును అనుసంధానం చేసుకుంటే.. యూపీఐ చెల్లింపుల సమయంలో బ్యాంక్ ఖాతా లేదంటే రూపే క్రెడిట్ కార్డును ఎంపిక చేసుకుని లావాదేవీలను పూర్తి చేయొచ్చు. అనుకూలతలు రూపే క్రెడిట్ కార్డుతో ఉన్న ప్రధాన సౌకర్యం.. కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చెల్లింపుల సమయంలో స్వైప్ చేయాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది. యూపీఐ యాప్‌నకు ఒక్కసారి లింక్ చేస్తే చాలు. భౌతిక కార్డు లేకుండానే లావాదేవీ ముగించొచ్చు. పీవోఎస్పై క్రెడిట్ కార్డు స్వైప్నకు కొందరు వర్తకులు అంగీకరించరు. మర్చంట్ డిస్కౌంట్ రేటు చెల్లించాల్సి వస్తుందని సుముఖత చూపించరు. రూపే క్రెడిట్ కార్డు విషయంలో యూపీఐ ద్వారా చెల్లిస్తారు కనుక ఈ ఇబ్బంది ఉండదు. ఒక రూపే క్రెడిట్ కార్డును ఒకటికి మించి యూపీఐ యాప్‌లపై లింక్ చేసుకోవచ్చు.బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ లేని సందర్భాల్లోనూ రూపే క్రెడిట్ కార్డు సాయంతో చెల్లింపులు చేయొచ్చు. ఎంత చిన్న మొత్తం అయినా క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేసి చెల్లించొచ్చు. దీనివల్ల ప్రతీ లావాదేవీ బ్యాంక్ ఖాతాలో బదులు క్రెడిట్ కార్డు, యూపీఐ ప్లాట్ఫామ్లో నమోదవుతుంది. బ్యాంక్ ఖాతాలో చిన్న చిన్న లావాదేవీలు లేకుండా చేసుకోవచ్చు. యూపీఐ క్రెడిట్ కార్డుపై ఇప్పుడు చాలా బ్యాంక్‌లు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్నా యి. వీటన్నింటినీ పరిశీలించాక మెరుగైన ప్రయోజనాలతో కూడిన కార్డ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బ్యాంకుల మధ్య ఈ ప్రయోజనాలు, ఫీజులు వేర్వేరుగా ఉన్నాయి. ప్రతి రూ.100 వ్యయంపై సాధారణంగా ఒక పాయింటు రివార్డుగా లభిస్తుంది. ఉదాహరణకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అయితే.. ‘ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు’పై రూ.2,000 లావాదేవీపై రూ.60 రివార్డు పాయింట్లను ఆఫర్ చేస్తోంది.ఈ రివార్డు పాయింట్లతో బహుమతులు కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే డిస్కౌంట్ పొందొచ్చు. కొన్ని బ్యాంక్‌లు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. సకాలంలో బిల్లు చెల్లింపులు చేయడం ద్వారా క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో రుణాలను సులభంగా చౌక రేటుకే పొందొచ్చు. రోజువారీ యూపీఐ చెల్లింపులు చేసే వారికి రూపే క్రెడిట్ కార్డు ఎంతో సౌకర్యం, అనుకూలం. ఒక యూపీఐ యాప్‌పై ఎన్ని రూపే క్రెడిట్‌కార్డులను అయినా లింక్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. పరిమితులు⇒ రూపే క్రెడిట్ కార్డుతో ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా నగదు బదిలీకి అవకాశం లేదు. ⇒ క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ యాప్ నుంచి చెల్లింపులకు పిన్ తప్పనిసరి. పిన్ లేకుండా చెల్లింపులు కేవలం యూపీఐ లైట్ ద్వారానే సాధ్యం. యూపీఐ లైట్లో బ్యాలన్స్ లోడ్ చేసుకోవడం అన్నది రూపే క్రెడిట్ కార్డుతో సాధ్యపడదు. కేవలం యూపీఐ లింక్డ్ సేవింగ్స్ ఖాతా నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. ⇒ యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డు నుంచి ఒక రోజులో గరిష్టంగా రూ.లక్ష వరకే చెల్లించగలరు. ఎందుకంటే దాదాపు అన్ని యూపీఐ యాప్‌లు, బ్యాంక్‌లు రోజువారీ యూపీఐ పరిమితి రూ.లక్షగానే అమలు చేస్తున్నాయి. విడిగా రూపే క్రెడిట్ కార్డు రోజువారీ లిమిట్ ఇంకా తక్కువ ఉండొచ్చు. రూ.లక్షకు మించి ఉన్నప్పటికీ యూపీఐ ద్వారా రూ.లక్ష వరకే చెల్లింపులు చేయగలరు. ⇒ విద్య, ఆరోగ్యం, బీమా తదితర కొన్ని విభాగాల చెల్లింపులకు రోజువారీ యూపీఐ పరిమితి రూ.లక్షకు బదులు రూ.2 లక్షలుగా ఉంటుంది. ⇒ విదేశీ ప్రయాణాలు చేసే వారికి రూపే క్రెడిట్‌కార్డు కంటే రెగ్యులర్ కార్డులు అనుకూలం. ⇒ రూపే క్రెడిట్ కార్డుతో ఫ్యుయెల్ స్టేషన్లలో చెల్లింపులు చేస్తే సర్‌చార్జీ పడుతుంది. చాలా బ్యాంక్‌లు వీటిని మాఫీ చేస్తున్నాయి. క్రెడిట్ లిమిట్ కార్డు వినియోగ పరిమితి (రుణం) వ్యక్తిగత రుణ చరిత్ర, ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో రెగ్యులర్ క్రెడిట్ కార్డులకు వర్తించే నిబంధనలే వీటికీ అమలవుతాయి. కొన్ని బ్యాంక్‌లు ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తాయి. వినియోగ తీరు, చెల్లింపుల ఆధారంగా భవిష్యత్తులో ఈ లిమిట్‌ను క్రమంగా పెంచుకునేందుకు అనుమతిస్తుంటాయి. కొన్ని భద్రతా చర్యలు ⇒ రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులను ప్రతి రోజూ ఒకసారి పరిశీలించుకోవాలి. కార్డు స్టేట్మెంట్ను చూడడం వల్ల ఏవైనా మోసపూరిత లావాదేవీలు ఉంటే వెంటనే గుర్తించొచ్చు. ⇒ యూపీఐ యాప్‌లకు తప్పకుండా ఫింగర్‌ప్రింట్ లేదా పిన్ నంబర్ పెట్టుకోవాలి. పిన్ అయితే ఊహించడానికి సులభంగా ఉండకూడదు. ⇒ యూపీఐ చెల్లింపులకు పేరొందిన గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం, బ్యాంక్ యూపీఐ యాప్‌లను వినియోగించడం మంచిది. చార్జీలు⇒ రూపే కార్డుతో చేసే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీల్లేవు. కానీ, కొన్ని యూపీఐ ప్లాట్‌ఫామ్‌లు రూపే కార్డు ఆధారిత యూపీఐ చెల్లింపులు, రీచార్జ్‌లపై కనీ్వనియెన్స్ చార్జీలు విధించొచ్చు. ⇒ క్రెడిట్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే లేట్ పేమెంట్ చార్జీలు పడతాయి. గడువులోపు చెల్లించని మొత్తంపై వడ్డీ 18 శాతం నుంచి 48 శాతం మధ్య పడుతుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అయితే క్రెడిట్ స్కోరు ఆధారంగా 9 శాతం రేటును కూడా ఆఫర్ చేస్తోంది. అదే యాక్సిస్ బ్యాంక్ అయితే నెలవారీ 45 శాతం వడ్డీ రేటును యూపీఐ క్రెడిట్‌పై అమలు చేస్తోంది. ⇒ కొన్ని చెల్లింపులను ఈఎంఐ కింద మార్చుకునేందుకు బ్యాంక్‌లు అనుమతిస్తుంటాయి. అలాంటి సమయంలో రెగ్యులర్ క్రెడిట్‌కార్డుల మాదిరే ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. ⇒ కొన్ని బ్యాంక్‌లు జీవితకాలం పాటు ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా రూపే కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని వార్షిక చార్జీలు అమలు చేస్తున్నాయి.కార్డులు – ప్రయోజనాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్⇒ పేజాప్ (హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్), గ్రోసరీలు, సూపర్ మార్కెట్, డైనింగ్, యూపీఐ లావాదేవీలపై 3 శాతం క్యాష్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. నెలవారీ గరిష్ట పాయింట్లు 500. ⇒ యుటిలిటీ చెల్లింపులపై 2 శాతం క్యాష్ పాయింట్లు (నెలకు గరిష్టంగా రూ.500), ఇతర వ్యయాలపై 1 శాతం క్యాష్ పాయింట్లు (నెలవారీ గరిష్ట పాయింట్లు 500) లభిస్తాయి. ⇒ ఏడాదిలో కార్డుపై వ్యయం కనీసం రూ.25వేలు చేస్తే వార్షిక ఫీజు మాఫీ అవుతుంది.మింత్రా కోటక్ క్రెడిట్ కార్డు⇒ మింత్రాపై రూ.750 వరకు లావాదేవీలపై 7.5 శాతం తగ్గింపు లభిస్తుంది. ⇒ స్విగ్గీ, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, పీవీఆర్, క్లియర్‌ట్రిప్, అర్బన్ కంపెనీ ప్లాట్‌ఫామ్‌లపై నెలలో రూ.1,000 వరకు చేసే వ్యయాలపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ⇒ ఇతర లావాదేవీలపై 1.25 అపరిమిత క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ⇒ త్రైమాసికంలో కార్డుపై వ్యయం రూ.50,000 తక్కువ కాకుండా ఉంటే, రెండు పీవీఆర్ టికెట్లు (ఒక్కోటీ రూ.250 చొప్పున) ఉచితంగా లభిస్తాయి. యస్ బ్యాంక్ పైసా బజార్ పైసాసేవ్ క్రెడిట్ కార్డు⇒ ఆన్లైన్ కొనుగోళ్లపై 3 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు (నెలకు గరిష్టంగా 5,000 పాయింట్లు) అందుకోవచ్చు. 5,000 పాయింట్ల పరిమితి తర్వాత చేసే చెల్లింపులపై 1.5 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు వస్తాయి. ⇒ ఇతర చెల్లింపులు, యూపీఐ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు లభిస్తాయి. ⇒ ఈ పాయింట్లను క్రెడిట్ బిల్లులో సర్దుబాటు చేసుకోవచ్చు. ⇒ ఏడాదిలో రూ.1.2 లక్షల వ్యయం చేస్తే రెన్యువల్ ఫీజు రూ.499 మాఫీ అవుతుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు⇒ జాయినింగ్ ఫీజు రూ.200, రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు రూ.199 అమలవుతుంది. ⇒ రూ.2,000లోపు యూపీఐ చెల్లింపులపై ఒక శాతం రివార్డులు, రూ.2,000 మించి చేసే చెల్లింపులపై 3 శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి. ⇒ అన్ని యుటిలిటీ, బీమా చెల్లింపులపై ఒక శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి. -
వడ్డీ సొమ్ము వచ్చిందా.. ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూసుకున్నారా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఈపీఎఫ్ ఖాతాల్లో 8.25 శాతం వార్షిక వడ్డీ సొమ్మును జమ చేయడం ప్రారంభించింది. మీరు ఈపీఎఫ్ మెంబర్ అయితే మీ పాస్‌బుక్ ద్వారా ఆన్లైన్లోనే అప్డేట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోయినా కంగారు పడకండి. దీనికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ఓ ఇంకా ఎటువంటి అధికారిక ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ పంపలేదు. కానీ చాలా మందికి ఇప్పటికే తమ పాస్ బుక్‌లో వడ్డీ సొమ్ము జమ అయినట్లు కనిపిస్తోంది.వడ్డీ రేట్లకు ఆర్థిక శాఖ ఆమోదంగత ఫిబ్రవరిలో జరిగిన ఈపీఎఫ్ఓ సీబీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్) సమావేశంలో ఈపీఎఫ్‌పై ప్రతిపాదించిన 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది. ఈ ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో సుమారు 8 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి.వడ్డీని ఎలా లెక్కిస్తారు?ప్రతి నెలా ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చేస్తారు. ఉద్యోగి మూల వేతనంలో 12 శాతం కంట్రిబ్యూషన్ చేస్తారు. యజమాని వాటా కూడా 12 శాతం ఉంటుంది. అయితే ఇది పెన్షన్ పథకానికి 8.33%, ఈపీఎఫ్ ఖాతాకు 3.67% చొప్పున జమ చేస్తారు. ఈపీఎఫ్ఓ నెలవారీ వడ్డీని లెక్కిస్తుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే జమ చేస్తుంది. చక్రవడ్డీని ఉపయోగించి వడ్డీని లెక్కిస్తారు. ఇది ఉద్యోగి, యజమాని కంట్రిబ్యూషన్స్ రెండింటికీ వర్తిస్తుంది (పెన్షన్ భాగం మినహా). సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య వడ్డీ జమవుతుంటుంది.వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..స్టెప్ 1: ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ( epfindia.gov.in )సందర్శించండిస్టెప్ 2: అవర్ సర్వీసెస్ > ఫర్ ఎంప్లాయీస్ > మెంబర్ పాస్బుక్కు వెళ్లండిలేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్‌ను క్లిక్ చేయండి.స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.స్టెప్ 5: పాస్‌బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండిపాస్బుక్లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోతే..కొన్నిసార్లు వడ్డీ జమ అయిన తర్వాత కూడా పాస్ బుక్‌లో ప్రతిబింబించడానికి సమయం పడుతుంది. కొన్ని రోజులు వేచి చూసి మళ్లీ తనిఖీ చేయండి. అప్పటికీ కనిపించకపోతే ఆన్లైన్లో లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. -
ఇక ఏడాదికి ఇన్నే ఆడిట్లు.. సీఏలకు కొత్త రూల్
వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థలో భాగస్వామిగా గానీ చార్టర్డ్ అకౌంటెంట్లు సంవత్సరానికి ట్యాక్స్ ఆడిట్లు 60 మాత్రమే చేసేలా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇనిస్టిట్యూట్ ఐసీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ పరిమితి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పుడు కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ, పార్ట్నర్స్ కోసం కూడా ఆడిట్ నిర్వహించేందుకు వెసులుబాటు ఉంది.తాజాగా ప్రతిపాదించిన పరిమితిలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఐసీఏఐ ప్రెసిడెంట్ చరణ్‌జోత్ సింగ్ నందా తెలిపారు. అవకతవకలు జరగకుండా చూసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూడీఐఎన్) సిస్టంను ప్రవేశపెట్టినట్లు వివరించారు.యూడీఐఎన్ అనేది ప్రాక్టీస్ చార్టర్డ్ అకౌంటెంట్ చేత సర్టిఫై చేసిన లేదా ధృవీకరించిన ప్రతి డాక్యుమెంట్ కోసం జనరేట్ చేసే ఒక ప్రత్యేక సంఖ్య. దేశీయ చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలకు విదేశీ నెట్వర్కింగ్ మార్గదర్శకాల ముసాయిదాపై అభిప్రాయాలను సమర్పించడానికి గడువును జూలై 16 వరకు పొడిగించింది. -
మనీ రూల్స్ మారుతున్నాయ్.. జూలైలో కొత్త మార్పులు
జూన్ నెల ముగుస్తోంది.. ఇక జూలై నెల ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సంబంధిత నిబంధనలు కొన్ని మారుతున్నాయి.. కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు మొదలుకొని పెద్ద వ్యాపార సంస్థల వరకూ ప్రభావితం చేసే అవకాశం ఉంది.సవరించిన యూపీఐ చార్జ్ బ్యాక్ నిబంధనలు, కొత్త తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ నిబంధనలు, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ అవసరం వంటి కొన్ని మనీ రూల్స్, మార్పులు జూలై నుంచి అమలవుతున్నాయి.యూపీఐ ఛార్జ్ బ్యాక్ నిబంధనలుఈ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇటీవల యూపీఐ ఛార్జ్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు ప్రకటించింది.ప్రస్తుత విధానం ప్రకారం, ఛార్జ్ బ్యాక్ అభ్యర్థన తిరస్కరణకు గురైనప్పుడు, చట్టబద్ధమైన సందర్భాల్లో కూడా యూపీఐ రిఫరెన్స్ కంప్లయింట్స్ సిస్టమ్ (యూఆర్సీఎస్) ద్వారా కేసును వైట్‌లిస్ట్ చేయడానికి బ్యాంక్ ఎన్పీసీఐని సంప్రదించాల్సి ఉండేది.జూన్ 20న చేసిన ప్రకటన ప్రకారం.. ఇటువంటి సందర్భాల్లో ఇకపై ఎన్పీసీఐ జోక్యం అవసరం లేదు. ఎన్పీసీఐ నుండి అనుమతి కోసం వేచి ఉండకుండా ఆర్థిక సంస్థలు నేరుగా ప్రామాణిక తిరస్కరణకు గురైన ఛార్జ్ బ్యాక్ లను రీప్రాసెసింగ్ కు అర్హులుగా వర్గీకరించవచ్చు.కొత్త పాన్ కార్డులకు ఆధార్ తప్పనిసరిజూలై 1 నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇంతకుముందు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఏదైనా చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డ్, జనన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోయేది. కానీ జూలై 1 నుంచి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్జూలై నుంచి పలు తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. జూలై 1 నుండి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా దాని మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ రైలు టిక్కెట్లకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.జూలై 15 నుంచి తత్కాల్ రైలు టికెట్ బుకింగ్స్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అవసరం. అంటే టికెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారుల ఫోన్లకు ఒక కోడ్ వస్తుంది. కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్లలో బుక్ చేసుకునే తత్కాల్ టికెట్లకు కూడా ఓటీపీ అథెంటికేషన్ అవసరం.తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అధీకృత టికెటింగ్ ఏజెంట్లకు భారతీయ రైల్వే సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. బుకింగ్ విండో తెరిచిన మొదటి 30 నిమిషాలు వారు టికెట్లు బుక్ చేయలేరు. ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 10:00 గంటల నుంచి 10:30 గంటల వరకు, నాన్ ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 11:00 గంటల నుంచి 11:30 గంటల వరకు పరిమితి ఉంటుంది.జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ నిబంధనలుజూలై నుండి నెలవారీ జీఎస్టీ చెల్లింపు ఫారం జిఎస్టిఆర్ -3 బి ఎడిట్ చేసేందుకు వీలుండదని జీఎస్టీఎన్ జూన్ 7న ప్రకటించింది. అలాగే గడువు తేదీ నుంచి మూడేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయడానికి కూడా అవకాశం ఉండదని జీఎస్టీఎన్ తెలిపింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఫీజు, రివార్డు మార్పులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌కు కొత్త క్రెడిట్ కార్డు ఫీజులు, అప్డేట్లను ప్రకటించింది. ఇవి జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. రూ.10,000 కంటే ఎక్కువ నెలవారీ ఖర్చులపై 1% రుసుము, రూ .50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, రూ .10,000 కంటే ఎక్కువ ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు, అద్దె చెల్లింపులు, రూ .15,000 ఇంధన చెల్లింపులు, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే విద్య సంబంధిత చెల్లింపులు ఈ మార్పులలో ఉన్నాయి. ఈ ఛార్జీలను గరిష్టంగా రూ.4,999గా నిర్ణయించారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు. బీమా రివార్డ్ పాయింట్లపైనా నెలవారీ పరిమితి ఉంటుంది. -
ఆచితూచి రుణం..!
ముంబై: యువత రిటైల్ రుణాల విషయంలో అప్రమత్తత వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024–25 క్యూ4) రిటైల్ రుణాల మంజూరులో కేవలం 5 శాతం వృద్ధి నమోదైనట్టు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) రిటైల్ రుణాల్లో వృద్ధి 12 శాతంగా ఉండడాన్ని ప్రస్తావించింది. రిటైల్ రుణాల వృద్ధి గణనీయంగా తగ్గడంలో కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు, క్రెడిట్ కార్డు వినియోగం ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో యువత వీటిని ప్రధానంగా వినియోగిస్తుండడం తెలిసిందే. రిస్క్ అధికంగా ఉండే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో దూకుడు వద్దంటూ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు 2023 చివర్లో ఆర్బీఐ సూచనలు చేయడాన్ని సిబిల్ నివేదిక గుర్తు చేసింది. క్రెడిట్ కార్డు, పర్సనల్ రుణాల్లో వృద్ధిని మోస్తరు స్థాయికి తీసుకురావడమే ఈ చర్యల ఉద్దేశ్యంగా పేర్కొంది. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి.. → క్రెడిట్ కార్డుల జారీ సంఖ్య 2023–24 జనవరి–మార్చి త్రైమాసికంలో సున్నాగా ఉంటే, 2024–25 సంవత్సరం చివరి త్రైమాసికంలో మైనస్ 32%గా (తగ్గిపోవడం) నమోదైంది. → వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 6 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 13 శాతం వృద్ధి నమోదైంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు 2024–25 క్యూ4లో 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో వృద్ధి 19 శాతంగా ఉంది. → రుణ వినియోగదారుల్లో వృద్ధి 8 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 15 శాతం. → కొత్త వారికి రుణ వితరణలో వృద్ధి క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చతే 3 శాతం తక్కువగా 16 శాతానికి పరిమితమైంది. → గృహ రుణ విభాగంలో వితరణలు (సంఖ్యా పరంగా) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 7 శాతం తగ్గిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ గృహ రుణాల్లో రూ.కోటికి మించిన మొత్తాల్లో మాత్రం 9 శాతం వృద్ధి కనిపించింది. → ఆటో విభాగంలోనూ పెద్ద మొత్తం రుణాలకు డిమాండ్ కనిపించింది. → క్రెడిట్ కార్డులు మినహా రిటైల్ రుణాల్లోని అన్ని విభాగాల్లోనూ 90 రోజులకు పైగా చెల్లింపులు చేయని వాటి విషయంలో మెరుగుదల నమోదైంది. క్రెడిట్ కార్డుల్లో మాత్రం 0.28% పెరిగి ఇవి 2%కి చేరాయి. → రుణాలను మొదటిసారి తీసుకునే వారిలో వృద్ధి తగ్గడం ఆందోళనకరమని.. అందరికీ ఆర్థిక సేవల విస్తృతికి ఈ విభాగం కీలకమని సిబిల్ ఎండీ భవేష్ జైన్ పేర్కొన్నారు. లఘు సంస్థలకు తగ్గిన కొత్త రుణాలు ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కొత్త రుణాలు (ఆరిజినేషన్) నెమ్మదించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో (2023–24) పోలిస్తే 2024–25లో విలువ 7.4 శాతం మేర క్షీణించి, రూ. 39.9 లక్షల కోట్ల నుంచి రూ. 36.9 లక్షల కోట్లకు తగ్గింది. రూ. 1 కోటి లోపు మైక్రో లోన్స్ ఇచ్చేందుకు రుణదాతలు దూరంగా ఉండటం ఇందుకు కొంత కారణంగా నిల్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రో సెగ్మెంట్ రుణాలు రూ. 18.2 లక్షల కోట్లుగా ఉండగా 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.8 లక్షల కోట్లకు తగ్గాయి. పరిమాణంపరంగా చూస్తే మాత్రం ఎంఎస్ఎంఈలకు కొత్త రుణాల సంఖ్య 64.7 లక్షల నుంచి 75.8 లక్షలకు పెరిగింది. విలువ కోణంలో చూస్తే, రూ. 1–50 కోట్ల వరకు విలువ చేసే రుణాలు గణనీయంగా పెరిగాయి. క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.మరిన్ని వివరాలు.. → చిన్న సంస్థల సెగ్మెంట్లో (రూ. 1–10 కోట్లు) రుణాలు రూ. 11 లక్షల నుంచి రూ. 12.1 లక్షల కోట్లకు పెరిగాయి. అలాగే మీడియం సెగ్మెంట్లో (రూ. 10–50 కోట్లు) లోన్లు రూ. 10.7 లక్షల కోట్ల నుంచి రూ. 13 లక్షల కోట్లకు ఎగిశాయి. → ఈ మార్పులనేవి, రుణదాతలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే సెగ్మెంట్ వైపు మళ్లుతుండటాన్ని సూచిస్తున్నాయి. → రుణ బాకీల పోర్ట్‌ఫోలియో రూ. 33.6 లక్షల కోట్ల నుంచి రూ. 40.4 లక్షల కోట్లకు చేరింది. → 91–180 రోజుల కాలవ్యవధిలోని మొండి బాకీల పరిమాణం 1.3 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది. -
మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..
డబ్బుకు సంబంధించిన పాఠాలు నిత్యం చాలామంది చెబుతూంటారు. ‘ఎక్కువ పొదుపు చేయండి..తక్కువ ఖర్చు పెట్టండి..’ వంటి సలహాలను తరచుగా వింటుంటారు. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్‌గా వాటి అర్థం ఏమిటో కొందరు మాత్రమే చెబుతారు. డబ్బు నిర్వహణ అంటే బడ్జెట్‌ను తయారు చేయడం మాత్రమే కాదు, ఏది అవసరమో..ఏది కాదో తెలుసుకుని మసులుకోవడం అని నిపుణులు చెబుతున్నారు. సీఏ నితిన్ కౌశిక్ 30 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన డబ్బు పాఠాలను తెలిపారు.నితిన్ తన లింక్డ్ఇన్లో రాసిన వివరాల ప్రకారం..‘ఎవరూ మీకు బోధించని 8 కఠినమైన డబ్బు సత్యాలు (అయితే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల లోపు తప్పకుండా నేర్చుకోవాలి)ఇవి. డబ్బు ఆదా చేయడం అంటే ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. తర్కంతో ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంది ఆలస్యంగా నేర్చుకునే నిజమైన వివరాలు ఇవి. కాబట్టి మీరు 30 ఏళ్లు దాటడానికి ముందే తెలుసుకోవాల్సిన ఎనిమిది కఠినమైన, నిజమైన డబ్బు పాఠాలను చూద్దాం’ అంటూ నితిన్ రాసుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే క్వాలిటీ వస్తువులపై పెట్టుబడులు పెట్టాలి. చీప్‌గా వస్తుందని కొనుగోలు చేస్తే ఎక్కువసార్లు దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది.ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు భారీ ఫర్నిచర్ కొనవద్దు. ఎందుకంటే తరలింపు ఖర్చులు భారంగా మారుతాయి. దీర్ఘకాలిక ఖర్చులకు దారితీస్తూ, స్వల్పకాలిక పొదుపును నివారించే వాటికి దూరంగా ఉండాలని దీని ఉద్దేశం.ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీ జీతంలో కనీసం 5 శాతాన్ని నగదు రూపంలో పొదుపు చేయండి. ఫిజికల్ మనీ మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేసేలా చేస్తుంది.ఫోన్ ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు లేటెస్ట్, ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీ పనులకు నిజంగా ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేయండి. అంతకు మించి వద్దు. ఖరీదైన గాడ్జెట్లు త్వరగా వాటి విలువను కోల్పోతాయి.చాలా మంది యువకులు తాము ఫిట్‌గా ఉన్నామని భావించి ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు కనీసం ఆరు నెలల పొదుపును తుడిచివేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు. ఊహించని ఖర్చుల నుంచి రక్షణ పొందడం అని గుర్తించాలి.ఇదీ చదవండి: బంగారం కంటే వెండి ముద్దుఅనారోగ్యకరమైన ఆహార విధానం మీ శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా వైద్య బిల్లులను పెంచుతుంది. చక్కెర, పామాయిల్ తగ్గించాలి. అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి.క్రెడిట్ కార్డు అనే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ మీరు దీన్ని మీ ఆదాయ వనరుగా భావిస్తే అప్పుల్లో పడతారు.డబ్బును గౌరవించే వారితో స్నేహం చేయండి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారితో సావాసం చేయాలి. డబ్బును అర్థం చేసుకోని వ్యక్తితో ఉంటే జీవితం దారుణంగా మారుతుంది. ప్రేమ ఒక్కటే ఉంటే ఈఎంఐలు చెల్లించలేరు. -
బంగారం కంటే వెండి ముద్దు
విలువైన లోహంలో ఒకటిగా ఉన్న బంగారం ధరలు ఇటీవల కాలంలో 10 గ్రాములు రూ.1లక్షకుపైగా చేరింది. ఇంకోవైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో వీటి ధరలు ఆకాశాన్నంటినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడిపెట్టే వారికి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సూచనలు చేశారు.ఇప్పటికే బంగారం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సమయంలో పుత్తడి కంటే వెండిపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని కియోసాకి తెలిపారు. బంగారంతోపాటు బిట్‌కాయిన్ ధరలు పెరిగిన తరుణంలో అవి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాతే వాటిని కొనుగోలు చేస్తానని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బంగారం, బిట్‌కాయిన్ ధరలు ఎప్పుడు పడుతాయోనని వేచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు సొంతంగా రిసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు.FYI: Silver is the best investment today….june 2025. Gold and Bitcoin are high and I am waiting for gold and Bitcoin to crash before I add to my position.That’s what I think.Do your own research.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: టూవీలర్లపై టోల్ ఛార్జీలు..?ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి ఇటీవల సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ ‘నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం’ అని అభివర్ణించారు. -
మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మోతే.. ఈ బ్యాంకులో కొత్త ఛార్జీలు
కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహణ ఛార్జీలను తొలగిస్తున్నప్పటికీ మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఖాతాదారులపై కనీస బ్యాలెన్స్ ఛార్జీలను మోపుతున్నాయి. తాజాగా డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) ఇండియా సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్‌ను నిర్వహించకపోతే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 1 నుండి బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్‌ను నిర్వహించకపోతే ఎంత అయితే లోటు ఉంటుందో దానిపై 6% రుసుము చెల్లించాలి. డీబీఎస్ బ్యాంక్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.. బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు లోటులో 6% ఉంటాయి. ఇది గరిష్టంగా రూ .500 ఉంటుంది. డీబీఎస్ బ్యాంక్ రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) రూ .10,000 నిర్వహించాల్సి ఉంటుంది.కాగా డీబీఎస్ బ్యాంక్ ఇప్పటికే ఏటీఎం నగదు ఉపసంహరణ రుసుమును పెంచింది. ఉచిత పరిమితికి మించి ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలకు గరిష్టంగా రూ .23 వసూలు చేయడానికి బ్యాంకులను అనుమతించే ఆర్బీఐ నోటిఫికేషన్ తరువాత, డీబీఎస్ బ్యాంక్ తన రుసుమును అప్డేట్ చేసింది. మే 1 నుండి ఉచిత పరిమితికి మించి నాన్ డీబీఎస్ బ్యాంక్ ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలపై రూ.23 వసూలు చేస్తోంది. అయితే డీబీఎస్ బ్యాంక్ ఏటీఎంలలో ఎటువంటి రుసుము లేకుండా అపరిమితంగా నగదును ఉపసంహరించుకోవచ్చు.👉 ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు 👈 -
ఇవిగో ఈ తప్పులు చేశారో.. ఐటీ రిటర్న్ కొత్త రూల్స్..
దేశవ్యాప్తంగా పన్నుచెల్లింపుదారులు ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలులో తలమునకలై ఉన్నారు. ఐటీఆర్ ఫైలింగ్‌కు సాధారణంగా జూలై 31 చివరి తేదీ కాగా ఈ ఏడాది దీన్ని సెప్టెంబర్ 15 వరకూ పొడిగించారు. ట్యాక్స్ ఫైలింగ్‌లో సమ్మతి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.తప్పుడు మినహాయింపులు క్లయిమ్ చేసినా, ఆదాయాన్ని దాచినా పన్ను చెల్లింపుదారులకు కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టింది. "పన్ను బకాయిలో 200% వరకు జరిమానా, 24% వార్షిక వడ్డీ, సెక్షన్ 276 సి కింద ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవచ్చు" అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఈ పరిణామాలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.కొత్త నిబంధనలు.. కీలకాంశాలుకఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.రివైజ్డ్ రిటర్న్‌తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్‌లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.తప్పు క్లెయిమ్‌లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్‌లు జరిమానాలకు దారి తీస్తాయి.పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు. -
యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్‌వో చందాదారులకు శుభవార్త. ఏటీఎంలు, యూపీఐ తదితర మాధ్యమాల ద్వారా తమ ఖాతాల నుంచి ఈపీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలను ఈపీఎఫ్‌కు అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ఈపీఎఫ్‌లో నిర్దిష్ట నిష్పత్తిలో కొంత భాగాన్ని పక్కన పెట్టి, మిగతా మొత్తాన్ని విత్‌డ్రాయల్‌కు అందుబాటులో ఉంచుతారని పేర్కొన్నాయి.ఏటీఎం డెబిట్ కార్డులు, యూపీఐలాంటి మాధ్యమాల ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని వివరించాయి. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రస్తుతం సాఫ్ట్వేర్పరమైన సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. ఈపీఎఫ్‌వోకి బ్యాంకింగ్ లైసెన్సులు లేనందువల్ల ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా ఉపసంహరించుకునేందుకు వీలుండదని సంబంధిత వర్గాలు చెప్పాయి.మరోవైపు, ఆటో–సెటిల్మెంట్ విధానం కింద విత్‌డ్రాయల్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఆటో–సెటిల్మెంట్ విధానంలో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల వ్యవధిలోనే క్లెయిమ్ విత్‌డ్రాయల్ ప్రక్రియంతా ఎలక్ట్రానిక్ విధానంలో సెటిల్ అవుతుంది. కోవిడ్ సమయంలో అవసరార్థులకు ఆర్థికంగా తక్షణ సాయం అందాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. -
ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి వ్యాఖ్యలు
ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలుతుందని చెబుతూ.. పెట్టుబడిదారులు ఏం చేయాలో సూచించారు. అధిక రుణ భారం కారణంగా ప్రభుత్వ ఫియట్ కరెన్సీ(కరెన్సీ నోటుకు ప్రభుత్వం ఆపాదించే విలువ)లపై ఆధారపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొన్నారు. కాబట్టి బిట్‌కాయిన్(బీటీసీ)ను కొనుగోలు చేయాలని చెప్పారు.GLOBAL MONETARY COLLAPSE COMING?Will you be richer or poorer when biggest debt bubble in history bursts.I recommend owning gold, silver, and BITCOIN if you want to be richer when the Global Debt Bubble bursts.BIGGEST LOSERS will be savers of fake fiat money and especially…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..ముందస్తు హెచ్చరికరాబర్ట్ కియోసాకి చాలాకాలంగా ఫియట్ ద్రవ్య వ్యవస్థ, ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. నియంత్రణలేని ద్రవ్య ముద్రణ కారణంగా అమెరికా డాలర్ వంటి కరెన్సీలు విలువను కోల్పోతాయని అభిప్రాయపడుతున్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ (బీటీసీ) వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ఫియట్ కరెన్సీలు పతనమవుతున్న కొద్దీ వీటి విలువ పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు. డబ్బును పొదుపు లేదా బాండ్లలో మాత్రమే ఉంచవద్దని కియోసాకి సలహా ఇచ్చారు. ఈ సంప్రదాయ మార్గాలపై ఆధారపడే వారు భారీ నష్టాలను చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. -
మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?
ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు తాత్కాలికంగా సిమ్‌కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్కార్డులే ఉండాలి. కాబట్టి అనవసరమైన సిమ్‌కార్డులను నిలిపేయాలంటే మార్గం ఉంది. దాంతోపాటు అసలు మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు రిజిస్ట్రర్ అయ్యాయో తెలుసుకువాలంటే కింది సమాచారం తెలుసుకోవాల్సిందే.ప్రభుత్వ వెబ్సైట్ సంచార్‌సాతి వెబ్సైట్ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్‌కార్డులను నేరుగా ఆన్లైన్లో ద్వారా నిలిపేసే సౌకర్యం ఉంది. అది ఎలాగో చూద్దాం.ఇదీ చదవండి: యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణతముందుగా ఆన్లైన్లో బ్రౌజర్ ద్వారా https://sancharsaathi.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి.కింద సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కేటగిరీలో ‘Know Your Mobile Connections’పై క్లిక్ చేయాలి. ఈ సర్వీస్‌ను టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్‌సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌నంబర్‌ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. ‘వాలిడేట్ క్యాప్చా’ బటన్ ప్రెస్ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్‌లో ఎంటర్‌చేసి లాగిన్ అవ్వాలి. మీ పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది.ఒకవేళ ఏదేని నంబర్‌ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా లాగ్అవుట్ చేయడం మరిచిపోకూడదు. -
ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు
దేశంలో అత్యధికంగా ఉపయోగించే హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు సంబంధించి భారీ మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు వంటివి జరిపే వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. నిర్దిష్ట రకాల అధిక-విలువ లావాదేవీలపై కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టడం, సవరించిన రివార్డ్ పాయింట్ విధానాలు, అనేక కేటగిరీలలో ఫీజుల పరిమితి వంటివి ఈ మార్పులలో ఉన్నాయి.కొత్త మార్పులు.. ఛార్జీలుఆన్లైన్ గేమింగ్: నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు). రివార్డ్ పాయింట్లు లభించవు.వాలెట్ లోడింగ్: పేటీఎం (PayTM), మొబీక్విక్ (Mobikwik) వంటి డిజిటల్ వాలెట్లలో రూ.10,000 కంటే ఎక్కువ లోడ్ చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు).యుటిలిటీ బిల్లులు: వినియోగదారుల కార్డులకు రూ.50,000, బిజినెస్ కార్డులకు రూ.75,000 దాటితే 1% ఫీజు (రూ.4,999 వరకు). ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఫీజు లేదు.లావాదేవీ ఫీజు పరిమితి: రెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ చెల్లింపులకు గరిష్టంగా రూ.4,999 ఫీజు. ఫ్యూయల్ కోసం రూ.15,000 లేదా రూ.30,000 దాటితే మాత్రమే ఫీజు వర్తిస్తుంది.ఇన్సూరెన్స్ లావాదేవీలు: రివార్డ్ పాయింట్లు లభిస్తాయి కానీ కార్డు రకాన్ని బట్టి పరిమితి ఉంటుంది. ఇన్ఫీనియా, ఇన్ఫీనియా మెటల్ కార్డులకు రూ.10,000, డైనర్స్ బ్లాక్, డైనర్స్ బ్లాక్ మెటల్, బిజ్ బ్లాక్ మెటల్, కార్డులకు రూ.5,000, మిగిలిన కార్డులకు రూ.2000 నెలవారీ పరిమితి ఉంటుంది.యువ ప్రొఫెషనల్స్‌కు క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ కీలకంఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి. మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి. వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది. రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
మెరుగైన రాబడులకు వేదిక.. ఈ మ్యూచువల్ ఫండ్..
ఇటీవలి కాలంలో మార్కెట్లలో దిద్దుబాటు నెలకొన్నప్పటికీ.. స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో వ్యాల్యూషన్లు (కంపెనీల విలువలు) సౌకర్యంగా లేవని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చిత పరిస్థితులను చూస్తున్నాం. ఇరాన్–ఇజ్రాయెల్, ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాలు.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల పెంపు వంటి ఎన్నో ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ అనుకూలమన్నది నిపుణుల సూచన. మెజారిటీ ఇన్వెస్టర్లకు వ్యతిరేకమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడమే కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్. ఎక్కువ మంది అమ్మేస్తుంటే ఈ ఒత్తిడికి కొన్ని స్టాక్స్ (ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా కానీ) ధరలు అధికంగా పడిపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా కాంట్రేరియన్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ స్థిరమైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం రాబడుల పరంగా మెరుగైన పనితీరు చూపిస్తోంది. ఏడాది కాలంలో 17.3 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు అందించింది. మూడేళ్ల పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 25.4 శాతంగా ఉంది. ఐదేళ్లలో 28.4 శాతం, పదేళ్లలో 17.6 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2013 నుంచి 2025 మధ్య ఐదేళ్ల కాల రోలింగ్ రాబడులు బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. నెలవారీ సిప్ రాబడులు పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 19.2 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల విధానం.. ఈ పథకం కాంట్రేరియన్ విధానం ఒక్క దానినే పూర్తిగా అనుసరించదు. రంగాల వారీ కేటాయింపుల పరంగా వివేకంతో వ్యహరిస్తుంటుంది. స్టాక్స్ ఎంపికకు మల్టీక్యాప్ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్‌లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కరోనా క్రాష్ తర్వాతి కాలంలో లార్జ్‌క్యాప్‌నకు 70 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత ఈ కేటాయింపులను తగ్గించుకుంది. తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 3–4 శాతం మంచి నగదు నిల్వలను కలిగి ఉండదు. ఎప్పటికప్పుడు రంగాల వారీ వస్తున్న మార్పులను గమనించి, వేగంగా తన పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటుంది. దీంతో మెరుగైన రాబడులు ఇవ్వడం, రిస్క్ తగ్గించే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. కాంట్రేరియన్ విధానం మధ్యలో కొంత కాలం పాటు మెరుగైన రాబడులు ఇవ్వకపోవచ్చు. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసమే (5–7 ఏళ్లకు మించి) కాంట్రా ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం సూచనీయం.పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.18,398 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.45 శాతం మేర స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. 0.55 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పెట్టుబడులను గమనిస్తే 69.36 శాతం మేర లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 26.90 శాతం ఇన్వెస్ట్ చేసింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 3.74 శాతానికి పరిమితమయ్యాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 81 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 33 శాతం మేర పెట్టుబడులు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 16 శాతం మేర పెట్టుబడులు కేటాయించింది. హెల్త్ కేర్ కంపెనీల్లో 14 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..
ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు సిద్ధం కావాలి. చాలా మంది ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఐటీఆర్ ఫైల్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కింద తెలుసుకుందాం. సరైన ధ్రువపత్రాలు, తగినంత శ్రద్ధ పెడితే ఎలాంటి అవకతవకలు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.ముందుగా కొత్త విధానమా, పాత విధానమా ఎంచుకోవాలి. మీరు చేయాల్సినది ఏమిటంటే రెండు విధానాల్లోనూ ఆదాయాన్ని లెక్కించండి. ఆదాయపు పన్ను భారాన్ని లెక్కించండి. ఎందులో తక్కువగా భారం ఉంటుందో దాన్ని ఎంచుకోవడం ఒక పద్ధతి. సెక్షన్ 80సీ మొదలైన వాటి కింద సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఖర్చులు కంపల్సరీగా ఉన్నా ఈ విధంగా చేయొచ్చు. ముందుగా మీకు క్లారిటీ ఉంటే వేరే చెప్పనవసరం లేదు.ఏఐఎస్, ఫారం 26 ఏఎస్.. ఈ రెండింటినీ డౌన్లోడ్ చేసుకోండి. వీటి ద్వారా టీడీఎస్, టీసీఎస్, మీరు చెల్లించిన ట్యాక్సులు అంటే అడ్వాన్స్ ట్యాక్స్, ఇవన్నీ కచి్చతంగా తెలుస్తాయి. ఏవైనా తేడాలు, హెచ్చుతగ్గులుంటే, మీ యజమానిని/ డిడక్టర్లను/ బ్యాంకులను వెంటనే సంప్రదించండి.అన్ని కాగితాలను సమకూర్చుకుని వాటిని పరిశీలించండి. ఫారం 16, ఫారం 16ఏ, బ్యాంకు స్టేట్మెంట్, పాస్‌బుక్‌లు, వడ్డీకి సంబంధించిన సర్టిఫికెట్లు, రసీదులు, గత వారం చెప్పిన విధంగా ప్రతి డిడక్షన్‌కి సంబంధిత కాగితాలు పూర్తి వివరాలతో ఉండాలి. వాటిని చదవండి. అర్థం చేసుకోండి. ఇది బ్రహ్మవిద్యేమీ కాదు.ప్రీ–ఫిల్డ్ ఫారంలలో సాధారణంగా తప్పులు ఉండవు. అయినా ఏదైనా అప్డేట్ చేయకపోయినా, చేర్చకపోయినా అవి అప్డేట్ కావు. ఉదాహరణకు ఇంటి అడ్రెస్లాంటివి. మీరు ఇల్లు మారొచ్చు. మీ బ్యాంకు ఖాతాలు మారి ఉండొచ్చు. అలాగే మీ సెల్ నంబర్లు. ఇలా ప్రతి అంశం కరెక్టేనా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి.ఇక ఏయే ఫారం వాడాలో తెలుసుకోండి. ఎంచుకోవడమనేది మీ ఇష్టం కాదు. 1,2,3,4,5,6,7.. ఇలా మొత్తం ఏడు ఫారంలు ఉన్నాయి. మీకు నచ్చినది.. మీకు ఇష్టమైనది ఎంచుకోవడానికి వీల్లేదు. మీ ఆదాయాన్ని బట్టి ఫారంలు వర్తిస్తాయి. గతంలో ఎన్నో సార్లు తెలియజేశాం. కావాలంటే వెబ్సైట్లో వివరాలు ఉంటాయి. సాధారణంగా ఏ ఫారానికీ ఎటువంటి కాగితమూ జతపర్చనక్కర్లేదు. డాక్యుమెంట్లలోని అంకెలను చెక్ చేసుకుని, వాటిని కరెక్టుగా ఎటువంటి తేడాలు రాకుండా/లేకుండా నింపాలి. గడువు తేదీ లోపల ఈ ఫైల్ చేయండి. 2025 జులై 31 నుంచి 2025 సెప్టెంబర్ 15 వరకు గడువు తేదీని పొడిగించారు. తేదీ దాటితే లేటు ఫీజు పడుతుంది. నష్టాన్ని సర్దుబాటు చేయరు. ఇది చాలా పెద్ద నష్టం. అంతే కాకుండా డిడక్షన్లు, మినహాయింపులు ఇవ్వరు. గతంలో లేటుగా చేస్తే ఇన్ని నష్టాలు ఉండేవి కావు. అందుకని ఎలాంటి ఆలస్యం చేయొద్దు.ఇదీ చదవండి: నన్ను తొలగిస్తే నీ భాగోతం బయటపెడుతా!ఈ–ఫైలింగ్ తర్వాత వెరిఫై చేయాలి. పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసిన వారికి సులువుగా ఈ–వెరిఫై అయిపోతుంది. మాన్యువల్‌గా చేసే వారు అక్నాలెడ్జ్మెంట్ కాపీ తీసుకుని, సంతకం పెట్టి, ఈ ఫారం ఐటీఆర్– Vని సకాలంలో బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కి స్పీడ్ పోస్టులో పంపాలి. అలా పంపకపోతే రిటర్ను వేయనట్లే. జాగ్రత్త వహించండి. ఏ ఫారం దాఖలు చేయాలన్న విషయాన్ని హెల్ప్‌డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చు.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త విధానం కంపల్సరీ. అయితే, మీరు ప్రతి సంవత్సరం విధానాన్ని మార్చుకోవచ్చు. ఆన్లైన్లో నింపేటప్పుడు వర్తించే విషయాలకు YES అని, వర్తించని వాటికి NO అని రాయాలి.అన్ని ఫారంలలో కొత్త షెడ్యూల్స్‌ను పొందుపర్చారు. వీటి వల్ల అదనపు సమాచారం ఇవ్వాలి. అయితే, ఇది ఇవ్వటానికి సరైన కాగితాలు ఉండాలి. పెద్ద కష్టమేమీ కాదు. గతంలో అబద్ధం/తప్పు/ఎక్కువ/తక్కువ/పొరపాటుకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకవు. అలాగని భయపడిపోవాల్సిన పని లేదు. తగినంత శ్రద్ధ పెడితే.. ఇదేమీ కష్టమైన పని కాదు. -
స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?
నా వయసు 30. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఒక మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు తగ్గింది. ఈ పెట్టుబడులను విక్రయించి టాప్ స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక ప్రస్తుత పథకం నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో వెనక్కి తీసుకుని వేరొక పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? – రాజ్దీప్మ్యూచువల్ ఫండ్స్‌లో 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ తగ్గడం ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్ చార్జీలు పడుతుంటే లేదా ప్రస్తుత పథకంలో పెట్టుబడులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కారణంగా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చినట్లయితే అప్పుడు.. క్రమానుగతంగా (సిస్టమ్యాటిక్‌గా) వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. ఇదీ చదవండి: ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుని కొత్తగా ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మార్గమే. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం పన్ను వర్తించని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. -
ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?
నా వయసు 74 ఏళ్లు. ఫిక్స్డ్ డిపాజిట్ త్వరలోనే గడువు తీరనుంది. దీని ద్వారా రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్)లో నాకు పెట్టుబడులు ఉన్నాయి. – నదీమ్మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో అంత అస్థిరతలు ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్, ఆర్బిట్రేజ్ అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్‌లోనూ రిస్క్ ఎక్కువే. కాకపోతే ఐదేళ్లు అంతకుమించిన కాలంలో రిస్క్ చాలా తక్కువ. ఇదీ చదవండి: ‘19 ఏళ్ల కిందట భూమి అమ్మారు.. నాకేం తెలియదు’షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మరోక ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్ పథకాల్లో మీకు ఇప్పటికే పెట్టుబడులు ఉన్నాయి. వీటి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడిని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ . ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. -
స్థిరమైన ఆదాయానికి.. ఎస్‌డబ్ల్యూపీ మంత్ర!
సంపాదనకు గుడ్‌బై చెప్పిన తర్వాత విశ్రాంత జీవనం సాఫీగా సాగిపోవాలంటే స్థిరమైన ఆదాయ వనరు తప్పనిసరి. అప్పటి వరకు చేసిన పెట్టుబడులు, రిటైరయ్యాక స్థిరమైన ఆదాయానికి దారి చూపాలి. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయ ప్రణాళిక విషయంలోనే గందరగోళానికి గురవుతుంటారు. ఈక్విటీల్లో లేదా డెట్‌లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నది అంత సులభంగా తేల్చుకోలేరు. అప్పటి వరకు పొదుపుతో సమకూర్చుకున్న విలువైన వనరులను వివేకంగా వినియోగించుకోవడం ఎలానో తెలియని వారే ఎక్కువ. రిటైర్మెంట్ తర్వాత ఒకట్రెండు దశాబ్దాల పాటు జీవిత అవసరాలను గట్టెక్కడం అంత సులువేమీ కాదు. ‘కూర్చుని తింటే కొండలైనా కరుగును’ అన్నట్టు.. కష్టార్జితంతో కూడబెట్టుకున్న నిధిని మిగిలిన జీవిత కాలం పాటు పొదుపుగా వాడేందుకు సమర్థవంతమైన ప్రణాళిక తప్పకుండా ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది చేసే తప్పు.. తమవద్దనున్న నిధులన్నింటినీ తీసుకెళ్లి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో, లేదా ఇతర డెట్ సాధనాల్లోనో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్థిరమైన రాబడి, భద్రత దృష్ట్యా ఇలా చేయడం గమనించొచ్చు. కానీ, వీటి నుంచి వచ్చే రాబడులు ద్రవ్యోల్బణాన్ని మించి ఏమంత గొప్పగా ఉండవు. దీర్ఘకాలంలో సగటు ద్రవ్యోల్బణం 6 శాతం అనుకుంటే, వీటిల్లో రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుంది. కనుక ఇలాంటి సాధనాలను ఎంపిక చేసుకోవడం వల్ల.. అక్కడి నుంచి పదేళ్ల కాలంలో కరెన్సీ విలువ తగ్గిన మేర వారి పెట్టుబడి వృద్ధి చెందదు. అందుకే పెట్టుబడుల్లో ఈక్విటీలకూ చోటివ్వడం ఎంతో అవసరం. ఈక్విటీ ఫండ్స్‌లో నిరీ్ణత కాలానికోసారి పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఎలా అయితే ఉపకరిస్తుందో.. ఈక్విటీ పెట్టుబడుల నుంచి క్రమానుగతంగా కొద్ది మొత్తం చొప్పున ఉపసంహరించుకునేందుకు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనుకూలిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఈ మార్గంలో అందుకోవచ్చు. స్థిరమైన ఆదాయం పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుందన్నది నిపుణుల విశ్లేషణ. రిటైర్మెంట్ తర్వాత కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు. ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కనుక పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి. పెట్టుబడి కరగకూడదు.. పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం.. కచి్చతంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది. ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్‌లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. కనుక ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటు లో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పన్ను ప్రయోజనాలు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. అదే ఈక్విటీ ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల మొత్తంపై పన్ను లేదు. డెట్ సాధనాలపై రాబడి వ్యక్తిగత వార్షిక ఆదాయానికి కలిపి, ఏ శ్లాబు పరిధిలో వస్తే ఆ మేరకు పన్ను రేటు చెల్లించాలి. అదే ఈక్విటీ రాబడులపై పన్ను విడిగా ఉంటుంది. రూ.1.25 లక్షలు మించిన దీర్ఘకాల రాబడిపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే చాలు. కేవలం మొదటి ఏడాది ఉపసంహరణ మొత్తంలో రాబడిపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది తర్వాత నుంచి రాబడి దీర్ఘకాల మూలధన లాభాల పరిధిలోకే వస్తుంది. నగదు ప్రవాహాలపై సౌలభ్యత ఎస్‌డబ్ల్యూపీతో నెలవారీ ఎంత అవసరమో అంతే వెనక్కి తీసుకోవచ్చు. తమ అవసరాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు. నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి చొప్పున వెనక్కి తీసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్ సంక్షోభాలను ఎదుర్కొంటుంటే..వాటి నుంచి ఉపసంహరణను గణనీయంగా తగ్గించుకోవడం లేదంటే తాత్కాలికంగా నిలిపివేసి.. డెట్ పెట్టుబడుల నుంచి ఉపసంహరణతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీలోనూ రకాలున్నాయి. కోరుకున్నంత స్థిరంగా ఉపసంహరించుకోవడం ఇందులో ఒకటి. క్యాపిటల్ అప్రీసియేషన్ ఎస్‌డబ్ల్యూపీలో అయితే.. పెట్టుబడుల వృద్ధి వరకు (రాబడి) వెనక్కి తీసుకోవచ్చు. అసలు పెట్టుబడి అలాగే కొనసాగుతుంది. అస్థిరతల్లో పరిష్కారం.. రాబడి ఒక్కటే కాదు పెట్టుబడిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈక్విటీలు దిద్దుబాటుకు గురైనప్పుడు అందులోని పెట్టుబడుల విలువ క్షీణిస్తుంటుంది. కనుక ఆ సమయంలో ఈక్విటీ పెట్టుబడుల నుంచి ఉపసంహరణ ఎప్పటి మాదిరిగా కొనసాగించకపోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఈక్విటీల్లో దిద్దుబాటు ముగిసే వరకు గట్టెక్కేందుకు డెట్ పెట్టుబడులను వినియోగించుకోవాలి. దీనివల్ల తిరిగి ఈక్విటీలు ర్యాలీ చేసిన సమయంలో పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందేందుకు వీలుంటుంది.డెట్ పెట్టుబడులూ అవసరమే విశ్రాంత జీవనంలో అవసరాలకు పూర్తిగా ఈక్విటీలపై ఆధారపడడం రిస్క్ నిర్వహణ పరంగా మెరుగైన నిర్ణయం కాబోదు. ఈక్విటీ, డెట్ కలబోతగా ఉండాలి. ఎస్‌డబ్ల్యూపీ కోసం ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ సాధనాలను ఎంపిక చేసుకున్నప్పటికీ అదే సమయంలో విడిగా డెట్ సాధనాలనూ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఈక్విటీ పతనాల్లో ఎస్‌డబ్ల్యూపీని తాత్కాలికంగా నిలిపివేయాల్సి రావచ్చు. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో బేరిష్ దశలోకి వెళ్లినప్పుడు డెట్ పెట్టుబడులు ఆదుకుంటాయి. రిస్క్‌ను వైవిధ్యం చేసుకున్నట్టు అవుతుంది. ఇన్వెస్టర్ల వద్దనున్న మొత్తం పెట్టుబడి, ఆదాయ అవసరాలు, రాబడి అంచనాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ కేటాయింపులు ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. ఎవరికి అనుకూలం..? ఎస్‌డబ్ల్యూపీ రిటైర్మెంట్ తీసుకున్న వారికోసమే అనుకోవద్దు. పెట్టుబడిపై స్థిరమైన నగదు ప్రవాహాలు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ ప్లాన్ మెరుగైనదన్నది నిపుణుల సూచన. రిటైర్మెంట్ తీసుకున్న వారు, రిటైర్మెంట్ సమీపంలో ఉన్న వారు, అదనపు ఆదాయం కోరుకునే వారికి ఇది అనుకూలమని బంధన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సేల్స్ హెడ్ గౌరబ్ పరిజ తెలిపారు. ‘‘ఇప్పట్లో పదవీ విరమణ తీసుకోని వ్యక్తులు సైతం, జీవన అవసరాలకు వీలుగా అదనపు ఆదాయం కోసం ఎంపిక చేసుకోవచ్చు. జీవితంలోని వివిధ దశల్లో అదనపు ఆదాయం కోసం ఇదొక పరిష్కారం. కాకపోతే రిటైర్మెంట్ తీసుకున్న వారు ఎక్కువగా దీన్ని వినియోగిస్తుంటారు’’ అని వివరించారు. పొరపాట్లకు చోటివ్వొద్దు.. → ఎస్‌డబ్ల్యూపీ అన్నది చాలా శక్తివంతమైన సాధనం. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం లేదా నిపుణుల సూచన లేకుండా చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. → అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోవద్దు. అతి రాబడుల అంచనాలు విశ్రాంత జీవనంలో బెడిసి కొడతాయి. ముఖ్యంగా మార్కెట్ ఆటుపోట్లలో మోస్తరు రాబడులకే పరిమితం కావాలి. → నిపుణుల సూచనకు మించి అధిక మొత్తాన్ని వెనక్కి తీసుకోకపోవడమే మంచిది. ఎప్పుడో ఓసారి తప్పిస్తే.. అవసరాలకు చాలడం లేదని ప్రణాళికకు మించి ఉపసంహరణ బాట పడితే పెట్టుబడి వేగంగా క్షీణిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడి విలువ ఏటా ఎంతో కొంత వృద్ధి చెందడమే కాదు.. అదే ద్రవ్యోల్బణం కారణంగా పెరిగే జీవన అవసరాలకు వీలుగా నగదు ఉపసంహరణ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. సరైన ప్రణా ళికతోనే ఇది సాధ్యమని గుర్తుంచుకోవాలి. సిప్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిప్ ద్వారా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధిని సమకూర్చుకోవచ్చు. కాంపౌండింగ్ మహిమతో కొద్ది పెట్టుబడి దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గంత నిధిగా సమకూరుతుంది. 25 ఏళ్ల వయసు నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఈక్విటీ ఫండ్‌లో సిప్ ప్రారంభించి, 60 ఏళ్లు వచ్చే వరకు 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే.. 12% వార్షిక రాబడి అంచనా మేరకు చివర్లో సమకూరే మొత్తం రూ.5.51 కోట్లు. ఇందులో పెట్టుబడి రూ.42 లక్షలు కాగా, మిగిలినదంతా కాంపౌండింగ్‌తో వృద్ధి చెందిన సంపద. కొంచెం ఆలస్యంగా 30 ఏళ్ల నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసినా 60 ఏళ్లకు రూ.3.08 కోట్లకు సమకూరుతుంది. ఎస్‌డబ్ల్యూపీ సిప్ ద్వారా ఈక్విటీల్లో చేసిన పెట్టుబడి 60 ఏళ్లకు పెద్ద మొత్తమే సమకూరుతుంది. వృద్ధాప్యానికి వచ్చామని చెప్పి ఈక్విటీ పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోనక్కర్లేదు. కనీసం 50–70 శాతం మేర ఈక్విటీల్లో అలాగే కొనసాగించి, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా కావాల్సినంత ఉపసంహరించుకోవచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడి ఇతర సాధనాల కంటే మెరుగ్గా వృద్ధి చెందుతుంది. రిటైర్మెంట్ అనంతరం అదే ఫండ్ నుంచి ప్రతి నెలా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడులు అన్నింటినీ విక్రయించడం వల్ల దీర్ఘకాల మూలధన లాభాలపై (రూ.1.25 లక్షలు దాటిన మొత్తంపై) 12.5% పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీని బదులు 50–70% ఈక్విటీల్లోనే కొనసాగిస్తే పన్ను భారం తగ్గుతుంది. ఎస్‌డబ్ల్యూపీ వ్యూహం→ రిటైర్మెంట్ ఫండ్‌ను మూడు భాగాలుగు చేసుకోవాలి. → ఇందులో కోర్ భాగం ఒకటి. దీర్ఘకాలం పాటు ఇది మెరుగ్గా వృద్ధి చెందేందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలిస్తాయి. → బఫర్ పేరుతో రెండో భాగంలో.. 3 నుంచి 5 ఏళ్ల పాటు ఆదాయ అవసరాలకు సరిపడా మొత్తాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. → లిక్విడ్ పేరుతో మరొక భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తక్షణ అవసరాల్లో వెనక్కి తీసుకునేందుకు వీలుగా లిక్విడ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. → తమ పెట్టుబడిని ఇలా వేర్వేరు భాగాలు చేసుకోవడం ద్వారా రిస్క్‌ను వైవిధ్యం చేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..
పని ఒత్తిడి పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు 60 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వడం అనేది పెద్ద సవాలుగా మారుతుంది. అలా అని ముందే ఉద్యోగం మానేస్తే ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయనే భయాలున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారు సరైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకుని, దాన్ని పాటిస్తే 40 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చాలా మంది తమ కెరియర్ పీక్కు చేరుకున్నప్పుడు 40 ఏళ్లలో పనిచేయడం మానేసి మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. బాస్‌లు ఉండరు.. సోమవారం వచ్చిందంటే మళ్లీ ఆఫీస్‌కు వెళ్లాలా అనే బెంగా ఉండదు.. వీకెండ్ కోసం ఎదురుచూడటం అవసరం లేదు. అయితే నిజంగా 40 సంవత్సరాల వయసులో ఉద్యోగం మానేసి జీవితాంతం సౌకర్యవంతంగా జీవించవచ్చా? అనే అనుమానం ఉందా. అయితే కింది విషయాలు తెలుసుకోవాల్సిందే.40 ఏళ్లకే రిటైర్ కావడం సాధ్యమేనా?కొంతమంది ఆర్థిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది సాధ్యమే. కానీ చాలా సవాలుతో కూడుకున్నది. ముందే రిటైర్ అవ్వడాన్ని ప్రధానంగా.. మీరు ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నారు.. కాలక్రమేణా మీ పెట్టుబడులు ఎలా పెరుగుతాయి.. అనే అంశాలు కీలకంగా మారుతాయి. 20-25 ఏళ్ల వయసు ఉన్నవారు 40 ఏళ్లకు రిటైర్ కావాలనుకుంటే ఆదాయంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత ప్రస్తుత వార్షిక ఖర్చులకు 79 రెట్లు పొదుపు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?ఫిన్నోవేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నేహాల్ మోటా మాట్లాడుతూ.. ‘40ల్లో రిటైర్ అవ్వడం సాధ్యమే. కానీ అధిక ఆర్థిక క్రమశిక్షణ, పక్కా ప్రణాళిక ఉండాలి. ఎక్కువ సంపాదించడంపైనే కాకుండా, అధికంగా పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. మధ్యతరగతి వేతనం పొందుతున్న వారు కూడా తమ ఆదాయంలో 50 శాతానికి పైగా పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెడితే త్వరగానే రిటైర్ అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలి?ఉదాహరణకు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్న వ్యక్తిని తీసుకుందాం. నెలకు రూ.50,000 ఖర్చులు ఉన్నాయనుకుంటే 40 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల పదవీ విరమణలో మంచి కార్పస్ రావాలంటే నెలకు రూ.18,080 ఆదా చేయాల్సి ఉంటుంది. 20-25 ఏళ్ల వ్యక్తి 40 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనుకుంటే తాను నెలకు రూ.35000 వేతనంతో ఉద్యోగం సాధించినప్పటి నుంచి నెలవారీ ఆదాయంలో 60-70% లేదా అంతకంటే ఎక్కువ పొదుపు చేయాలి. అంటే దాదాపు నెలకు రూ.20,000 పొదుపు చేయాలి. ఉద్యోగం వచ్చి, పెళ్లి కావాడానికి ముందు పొదుపును మరింత పెంచాలి. ఈ మొత్తాన్ని 20-25 ఏళ్ల కాలానికి 10-12 శాతం వార్షిక రాబడి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. కాలక్రమేణా ఇది 40-45 ఏళ్ల వయసు నాటికి రూ.2–2.5 కోట్ల కార్పస్ క్రియేట్ అవుతుంది. -
టర్మ్ ప్లాన్ సమగ్రంగా ఉండాలి..!
పుణె: మహిళల ఆర్థిక ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నట్టు బజాజ్ అలియాన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ‘‘ఉమెన్ టర్మ్ సర్వే 2025’’లో వెల్లడైంది. పిల్లల భవిష్యత్తు, వారి విద్య, ఆరోగ్య పరిరక్షణకు వారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి విషయంలో ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. పిల్లల భద్రత దృష్ట్యా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా, 53 శాతం మహిళలు అనుకోని వైద్య ఖర్చులు తమ కుటుంబ పొదుపులపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే 87 శాతం మహిళలు క్రిటికల్ ఇల్నెస్ కవర్’ను అత్యంత అవసరంగా భావిస్తున్నారు. అంతేగాక, 50 శాతం మంది మహిళలు టర్మ్ ప్లాన్‌లో ఆరోగ్య సేవలు కూడా ఉండాలని సర్వేలో తెలిపారు. దీనికితోడు తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్యా అవసరాలను తీర్చే రక్షణ కూడా టర్మ్ ప్లాన్లలో భాగంగా ఉండాలని మహిళలు భావిస్తున్నారు. సర్వేలో ముఖ్యాంశాలు → ఏవైనా ఊహించని పరిస్థితులు ఎరురైతే పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని 61 శాతం మంది మహిళలు భావిస్తున్నారు. → 61 శాతం మంది ఆదాయ స్థిరత్వానికి, 53 శాతం మంది వైద్య వ్యయాలకు, 54 శాతం మందికి రిటైర్మెంట్ ప్రణాళిక, 57 శాతం మంది మహిళలు విద్యకు తొలి ప్రాధాన్యమని సర్వేలో చెప్పారు. → 46 శాతం మంది మహిళలు పిల్లల భవిష్యత్ భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. → 87 శాతం మహిళలు క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను అత్యవసరంగా భావిస్తున్నారు. → 93 మంది టర్మ్ ప్లాన్‌లో ‘పిల్లలకు ఆదాయ భద్రత’ సదుపాయాన్ని ఆకర్షణీయంగా చూస్తున్నారు. → 51 శాతం మహిళలు జీవిత బీమా కవరేజీ పెంచుకునే సదుపాయాన్ని కోరుకుంటున్నారు. → 33 శాతం పిల్లల విద్యా భవిష్యత్తుకు సంబంధించిన ప్రయోజనాలు టర్మ్ ప్లాన్‌లో తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు. → బీమా కవరేజీని సవరించుకునే సౌలభ్యం లేకపోవడాన్ని లోపంగా చూస్తున్నారు. సమగ్ర పరిష్కారంగా చూస్తున్నారు.. టర్మ్ ఇన్సూరెన్స్‌ను కేవలం జీవిత బీమా రక్షణగానే మహిళలు చూడడం లేదని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. తమ ఆర్థిక ప్రాధాన్యతలకు సరితూగే సమగ్రమైన పరిష్కారంగా చూస్తున్నారు. మహిళల అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆవిష్కరించే దిశగా ఈ సర్వే ఫలితాలు మాకు ప్రేరణనిస్తాయి. – తరుణ్ ఛుగ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో -
బ్యాంక్ బ్యాలెన్స్.. బ్యాడ్ న్యూస్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీనికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా ప్రధాన బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లోని బ్యాలెన్స్‌పై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో పొదుపు ఖాతాదారులు తక్కువ రాబడిని చూస్తారు. ఈ ఏడాది క్యుములేటివ్ రేటు కోత ఇప్పుడు 1 శాతంగా ఉంది. పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకే విధమైన తక్కువ రేట్ల విధానానికి మారడంతో డిపాజిటర్లపై ప్రభావం పడుతోంది.వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన పొదుపు ఖాతా వడ్డీ రేటును జూన్ 15 నుండి అన్ని బ్యాలెన్స్‌లకు సంవత్సరానికి 2.5 శాతానికి సవరించింది. గతంలో రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌లపై 2.7 శాతం, రూ.10 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3 శాతం వడ్డీని ఆఫర్ చేసేది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పొదుపు రేట్లను జూన్ 10 నుండి ఫ్లాట్ 2.75 శాతానికి సర్దుబాటు చేసింది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్‌లపై 2.75 శాతం, రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3.25 శాతం వడ్డీని ఆఫర్ చేసింది.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన వడ్డీ రేటును 2.75 శాతానికి సవరించింది. ఇది జూన్ 12 నుండి వర్తిస్తుంది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్‌లపై 2.75 శాతం, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3.25 శాతం వడ్డీని అందించేది.రాబడి పెంచుకోండి..యువత బ్యాంక్ బ్యాలెన్స్‌పైనే దృష్టి పెట్టకుండా దాన్ని రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల వైపు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు ఖాతా మీ డబ్బును సురక్షితంగా ఉంచుతుంది. కానీ ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాని విలువను తినేస్తుంది. మరోవైపు, పెట్టుబడి మీ డబ్బును కాంపౌండింగ్ శక్తి ద్వారా కాలక్రమేణా పెంచుతుంది. ఎక్కువ వడ్డీనిచ్చే పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ లు లేదా స్టాక్స్ లోని ఫ్రాక్షనల్ షేర్లతో చిన్నగా ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి మీరు ధనవంతులు కానవసరం లేదు. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ ఆర్థిక పునాది బలంగా మారుతుంది. -
నెలకు రూ.10,000 జీతం.. సెకండ్ హ్యాండ్ ఫోన్
ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ డబ్బు పొదుపునకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన వార్షిక ఆదాయంలో 95% ఆదా చేస్తున్నట్లు చెప్పారు. తన ఆర్థిక క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అక్షత్ ఎక్స్‌లోని వివరాల ప్రకారం.. తాను నెలకు కేవలం రూ.10,000 సంపాదనతో కెరియర్ ప్రారంభించారు. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ సెకండ్ హ్యాండ్ ఫోన్ వాడుతూ, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోకుండా ఇంట్లో తయారు చేసిన భోజనం తింటూ నెలకు రూ.1,000-2,000 పొదుపు చేయగలిగాడు. అప్పులు చేయలేదు.. అనవసరమైన ఖర్చులు లేవు. మొదటి నుంచి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చిన్నమొత్తంలో స్థిరంగా పొదుపు చేస్తూ వచ్చారు.కొన్నేళ్ల తర్వాత రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరారు. తర్వాత అతని పొదుపు అలవాట్లు కూడా పెరిగాయి. ఏడాదికి కనీసం రూ.20 లక్షలు పొదుపు చేస్తూ అప్పులేని జీవనం కొనసాగించారు. అందులో ఎక్కువ భాగాన్ని అధిక వృద్ధి పెట్టుబడులకు మళ్లించారు. కాలక్రమేణా ఆ పెట్టుబడులు సొంత ఆదాయాన్ని సృష్టించడం ప్రారంభించాయి. దాంతో రిటైర్మెంట్ కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేశారు.[1] When I started my career: my salary was 10K, I used to live with my parents; used a 2nd hand mobile phone. Ate home cooked meals (almost all the time). I was not married/had kids, took no debt. And, still saved 1-2K/month. [2] Fast forward a few years: I got a good…— Akshat Shrivastava (@Akshat_World) June 15, 2025ఇదీ చదవండి: ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్..ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు, ప్రపంచ ప్రయాణాలు చేస్తూ ఖరీదైన నగరంలో నివసిస్తున్నప్పటికీ అక్షత్ తన పొదుపు రేటు ఇప్పటికీ 95% కొనసాగిస్తున్నారు. జీవనశైలి మారుతున్నా పొదుపు మాత్రం మరవకూడదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి తనకు మార్గనిర్దేశం చేసిన నియమాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘మీరు ఏదైనా రెండుసార్లు కొనగలిగితే తప్పా దాన్ని ఒకసారి కొనవద్దు. మీ నైపుణ్యాలు మెరుగుపడే పనికి మాత్రం ఖర్చు చేసేందుకు వెనుకాడవద్దు’ ఇది తెలిపారు. -
SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్.. జూలై 15 నుంచి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Card) నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తోంది. కనీస మొత్తం బకాయిలు (మినిమమ్ అమౌంట్ డ్యూ- ఎంఏడీ) లెక్కింపు పద్ధతిని సవరించింది. క్రెడిట్ కార్డు హోల్డర్ డిఫాల్ట్ అవ్వకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎంఏడీ అంటారు. ఎంఏడీ లెక్కింపులో చేసిన ఈ సర్దుబాటుతో మినిమమ్ డ్యూ కట్టేద్దాంలే.. అనుకునే పెద్దమొత్తంలో బకాయిలున్న కొంతమంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇక కాస్తంత ఎక్కువ మినిమమ్ డ్యూ చెల్లించాల్సి రావచ్చు.ఎందుకంటే కొత్త ఎంఏడీ ఫార్ములా ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు ఫీజులను పూర్తిగా చెల్లించేలా చేస్తుంది. వాటిని పూర్తిగా చెల్లించకుండా లేదా ఏదో కొంత మొత్తం చెల్లించి తర్వాత పొడిగించుకుందామంటే కుదరదు. పెరిగిన ఎంఏడీ చెల్లింపు కొంతమందికి ప్రత్యేకించి రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ రుణం ఉన్నవారికి భారంగా అనిపించినప్పటికీ అది మంచిదే. క్రెడిట్ కార్డ్ రుణాన్ని రివాల్వింగ్ చేయడం అంటే సరళంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు బకాయిని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించేసి కొత్త కొనుగోళ్ల కోసం మిగిలిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం అన్నమాట.ఏం మారిందంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల కొత్త మినిమమ్ డ్యూ (MAD) ఫార్ములా, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్‌ను ఎస్బీఐ కార్డ్ తమ వెబ్సైట్లో వివరించింది. జూలై 15 నుంచి కొత్త ఎంఏడీ లెక్కింపులో 100% జీఎస్టీ, 100% ఈఎమ్ఐ మొత్తం, 100% ఫీజులు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం, మిగిలిన బ్యాలెన్స్ బకాయిలలో 2% ఉంటాయి. ఇంతకుముందు ఈఎంఐ, ఛార్జీల్లో కొంత భాగాన్ని మాత్రమే చేర్చేవారు. వినియోగదారులు కాస్త మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వీలుండేది.ఇక పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే.. కార్డుదారుడి బకాయిపై అందుకున్న చెల్లింపులను 100% జీఎస్టీ, 100% ఈఎంఐ మొత్తం, 100% ఫీజు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్‌తో సర్దుబాటు చేయాలని పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ పేర్కొంది. ఈ సవరించిన క్రమం వడ్డీ,పెనాల్టీ పడే భాగాలను మొదట క్లియర్ చేసేలా చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా కార్డుదారులకు వడ్డీ పెరుగుదలను తగ్గిస్తుంది.యువతా.. క్రెడిట్ కార్డు భారం పెంచుకోవద్దుఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం.పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి.మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి.వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి.కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?
రిచ్‌డాడ్ పూర్‌డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రతిఒక్కరి భవిష్యత్తు కోసం ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడు చేయాలో తెలిపారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈమేరకు కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. దాంతో ఈ పోస్ట్ కాస్తా వివిధ సోషల్‌మీడియా ప్లాట్ఫామ్ల్లో వైరల్‌గా మారింది.ఎక్స్ వేదిక రాబర్ట్ కియోసాకి తెలిపిన పోస్ట్‌లో..‘మీ భవిష్యత్తు ఈ రోజే నిర్ణయించబడుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. దయచేసి దాన్ని వృథా చేయకండి. ఈ రోజు నేను మరింత బిట్ కాయిన్ కొనుగోలు చేస్తున్నాను. దాంతోపాటు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించి కొత్త పుస్తకంపై పనిచేస్తున్నాను. ఈ రోజు మీరు మీ భవిష్యత్తు కోసం ఏమి చేస్తున్నారు..? దయచేసి మీ ఈ రోజును గొప్ప రోజుగా మలుచుకోండి. జాగ్రత్త’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపుYOUR FUTURE is decided TODAY!!!Saying it another way:“TODAY is the most IMPORTANT DAY of YOUR LIFE. Please do not waste it.”TODAY I am buying more BITCOIN and working on a new book on ENTREPRENEURSHIP.What are you doing today….for your future?You are important. Your…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 11, 2025 -
పీఎఫ్ సేవల కోసం ఏజెంట్ల సాయం తీసుకోవద్దు
న్యూఢిల్లీ: పీఎఫ్ క్లెయిమ్‌లు, ఆన్లైన్ సేవల విషయంలో ఏజెంట్ల సాయం తీసుకోవద్దంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన సభ్యులకు కీలక సూచన చేసింది. తమ భవిష్యనిధికి సంబంధించి సేవల కోసం ఆన్లైన్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని సూచించింది. దీనివల్ల వ్యక్తిగత వివరాలు రిస్క్ లో పడకుండా ఉంటాయని పేర్కొంది. వేగవంతమైన, పారదర్శకమైన సేవలు, వినియోగ అనుకూలమైన ఎన్నో సంస్కరణ చర్యలను ఈపీఎఫ్‌వో అమలు చేసినట్టు కేంద్ర కారి్మక శాఖ సైతం గుర్తు చేసింది. ఈపీఎఫ్‌వో సభ్యులు ఉచితంగా పొందాల్సిన సేవలపై సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్‌టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. సభ్యులు నేరుగా ఉచితంగా వినియోగించుకోతగిన ఈపీఎఫ్‌వో ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్‌ను ఈ ఆపరేటర్లు వినియోగిస్తున్నట్టు పేర్కొంది. మూడో పక్ష కంపెనీలు లేదా ఏజెంట్లను ఆశ్రయించడం వల్ల సభ్యుల సున్నితమైన ఆర్థిక డేటా లీకయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. సీపీజీఆర్ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్స్‌లో ఫిర్యాదు చేయొచ్చని, సకాలంలో పరిష్కారమయ్యేంత వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. క్లెయిమ్ దాఖలు, నిధుల బదిలీ, కేవైసీ అప్డేషన్, ఇతర ఏ ఫిర్యాదు అయినా ఉచితమేనని.. వీటి కోసం ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏవైనా సమస్యలు ఉంటే ఈపీఎఫ్‌వో హెల్ప్ డెస్క్‌లు లేదా ప్రాంతీయ కార్యాలయాల్లో పీఆర్వోలను సంప్రదించొచ్చని సూచించింది. ఈపీఎఫ్‌వో పరిధిలో 7 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. -
ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!
ఆదాయం అస్సలు సరిపోవడం లేదు.. నెలాకరు రాకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయి.. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.. సగటు మధ్యతరగతి జీవి తరచూ చెప్పుకొనే మాటలివి. నిజమే.. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కొన్ని వ్యయాలు మన అదుపులో ఉండవు. కానీ నిశ్శబ్దంగా, తెలియకుండానే జేబులు ఖాళీ చేసే ఖర్చులు కొన్ని ఉన్నాయి. సబ్స్క్రిప్షన్లు, చిన్న రోజువారీ కొనుగోళ్లు లేదా రుసుములు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ ఖర్చులను తెలుసుకోవడం, తగ్గించడం వల్ల మీరు తీవ్రమైన జీవనశైలిలో మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా మీ పొదుపును చాలా వరకు పెంచుకోవచ్చు.సబ్స్క్రిప్షన్ ఆడిట్అనవసరమైన సబ్స్క్రిప్షన్ లను గుర్తించండి. చాలా మంది తాము అరుదుగా ఉపయోగించే సేవలకు సబ్ స్క్రైబ్ చేసుకుంటుంటారు. అన్ని యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ లను జాబితా రాసుకుని వాటి అవసరాన్ని అంచనా వేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్ ఆడిట్ నిర్వహించండి. పనికిరాని లేదా అరుదుగా ఉపయోగించే వాటిని రద్దు చేయండి. ఈ చిన్న నని మీకు ప్రతి నెలా చాలా డబ్బును ఆదా చేస్తుంది. దీన్ని మరింత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు.రోజువారీ ఖర్చులపై పర్యవేక్షణరోజువారీ చేసే చిన్న చిన్న కొనుగోళ్లను పర్యవేక్షించండి. రోజువారీ చిరు ఖర్చులు అంటే కాఫీ, స్నాక్స్ వంటి కోసం చేసేవి. ఇవి తక్కువే కదా అనిపించవచ్చు. కానీ నెలాఖరున లెక్కిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది. ఈ ఖర్చులను ఒక వారం పాటు తనిఖీ చేయండి. అవి మీ బడ్జెట్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడండి. అలా అని సరదా విషయంలో రాజీపడాల్సిన పని లేదు. ఈ ఖర్చులను తగ్గించడానికి ఇంట్లో కాఫీ, స్నాక్స్ చేసుకుని ఆస్వాదించవచ్చు.అనవసర షాపింగ్ వద్దుషాపింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ కొంత మంది తరచూ షాపింగ్‌కు ప్రేరేపితం అవుతుంటారు. ఈ ప్రేరేపిత కొనుగోలు అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయిస్తుంది. బయటకు వెళ్ళే ముందు షాపింగ్ జాబితాలను తయారు చేయడం లేదా అత్యవసరం కాని వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ సెట్ చేయడం వంటి వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా, మీరు ఆకస్మిక నిర్ణయాలను నియంత్రించగలుగుతారు. బదులుగా మీ ఆర్థిక ప్రాధాన్యతలకు సరిపోయే ఆలోచనాత్మక కొనుగోళ్లు చేయగలరు.ఛార్జీలపై అవగాహనబ్యాంకు ఫీజులు, ఛార్జీలను సమీక్షించుకోవడం అవసరం. ఇవే నిశ్శబ్దంగా వచ్చే ఖర్చులు. వీటిని అవగాహన, అప్రమత్తతో తగ్గించుకోవచ్చు. మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా ఏటీఎం ఫీజులు వంటి ఏదైనా పునరావృత రుసుము కోసం బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా సమీక్షించండి. తక్కువ ఖర్చులు లేదా ఎటువంటి రుసుము లేని ఖాతాల కోసం ఎంపికలను అన్వేషించండి. బ్యాంకులు లేదా ఖాతా రకాలను మార్చడం కాలక్రమేణా గణనీయమైన పొదుపునకు దారితీస్తుంది.వినియోగ సామర్థ్యంయుటిలిటీ బిల్లులు మన అసమర్థ వినియోగ అలవాట్ల కారణంగా నిశ్శబ్ద ఖర్చుల ఉచ్చులో పడే మరొక ప్రాంతం. గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లను ఆపివేయడం. విద్యుత్తును తక్కువ వినియోగించే ఉపకరణాలను ఉపయోగించడం లేదా థర్మోస్టాట్ సెట్టింగులను సర్దుబాటు చేయడం వంటి సాధారణ చర్యలు ఇంట్లో సౌకర్య స్థాయిలతో రాజీపడకుండానే కాలక్రమేణా యుటిలిటీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఒక్క నెల ఇవన్నీ ప్రయత్నించి చూడండి. మీ ఖర్చుల్లో ఎంత మార్పు వస్తుందో మీరే తెలుసుకుంటారు. -
బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్.. పదే పదే కుదరదు
యూపీఐ లావాదేవీల విషయంలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. యూపీఐ చెల్లింపులకు ప్రతిస్పందన సమయాన్ని 10 సెకన్లకు తగ్గిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం (జూన్ 16) నుండి యూపీఐ ద్వారా లావాదేవీలు మరింత వేగవంతం కానున్నాయి.యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అనేది మొబైల్ ఫోన్ల ద్వారా అంతర్-బ్యాంకు లావాదేవీలను సులభతరం చేయడానికి ఎన్పీసీఐ అభివృద్ధి చేసిన రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ. ఎన్పీసీఐ ఇటీవలి సర్క్యులర్ ప్రకారం నగదు బదిలీ, స్టేటస్ చెక్స్, రివర్సల్స్తో సహా లావాదేవీలు ఇక 10 నుంచి 15 సెకన్లలో పూర్తవుతాయి. ఇంతకు ముందు దీనికి 30 సెకన్ల వరకూ సమయం పట్టేది. బ్యాలెన్స్ చెకింగ్‌పై పరిమితిఎన్పీసీఐ మరో సర్క్యులర్ ప్రకారం, వినియోగదారులు తమ యూపీఐ యాప్‌ల ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోగలరు. ఇంతకు ముందు దీనిపై ఎలాంటి పరిమితి ఉండేది కాదు. రోజులో ఎన్ని సార్లైనా ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉండేది. సిస్టమ్ సామర్థ్యం, లోడ్‌ను సులభతరం చేయడానికి ఎన్పీసీఐ బ్యాలెన్స్ చెక్‌పై పరిమితి విధించినట్లు తెలుస్తోంది.మే నెలలో యూపీఐ ద్వారా లావాదేవీల సంఖ్య 33 శాతం పెరిగి 1,868 కోట్లకు చేరుకోగా, వాటి విలువ 23 శాతం పెరిగి రూ.25.14 లక్షల కోట్లకు చేరింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నట్లు వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్‌లు లావాదేవీల కోసం అంతిమ లబ్ధిదారుని పేరును మాత్రమే ప్రదర్శించాలని ఎన్పీసీఐ ఇదివరకే ఆదేశించింది. -
యువతకు బెస్ట్ పెట్టుబడి మార్గాలు
పెట్టుబడి విషయానికి వస్తే యువతకు, వయసుపైబడిన వారికి మధ్య ఉన్న తేడా ఇన్వెస్మెంట్లను ముందుగా ప్రారంభించడం. యువతకు దీర్ఘకాలంలో ఇది ఎంతో కలిసొస్తుంది. 40-45 ఏళ్లు దాటిన వారితో సమానంగా యువత ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టి ఒకే సమయంలో ఉపసంహరించుకుంటే కచ్చితంగా యువతకు ఎంతో లాభం చేకూరుతుంది. అయితే ఎలాంటి పథకాల్లో పెట్టుబడి ప్రారంభించాలో స్పష్టత ఉండడంలేదు. యువకులు క్రమశిక్షణతో, ఆర్థిక నిపుణుల సలహాతో మంచి పథకంలో పెట్టుబడి ప్రారంభిస్తే ఆకర్షణీయ రాబడిని అందుకోవచ్చు. మార్కెట్లోని కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.పొదుపు ఖాతాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు (సీడీలు)పొదుపు ఖాతా అనేది డబ్బును నిర్వహించేందుకు సరళమైన, అత్యంత రిస్క్ లేని మార్గం. అయితే ఇందులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఖాతాలు సురక్షితమైనవి. మరోవైపు సీడీలు మీ డబ్బును నిర్ణీత కాలానికి (6 నెలలు లేదా ఒక సంవత్సరం) లాక్ చేస్తాయి. అందుకు కొంత అధిక మొత్తంలో రాబడిని అందిస్తాయి.స్టాక్ మార్కెట్స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉంటుంది. మంచి కంపెనీని ఎంచుకొని పెట్టుబడి కొనసాగిస్తే కాలక్రమేణా అధిక రాబడిని అందించగలవు. అయితే ఇవి అస్థిరంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వీటిలో రిస్క్ అధికంగా ఉంటుందని మరిచిపోకూడదు.ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్ స్టాక్స్‌లో నిర్ణీత షార్ట్టర్మ్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ లాంగ్‌టర్మ్‌లో మంచి రాబడిని అందిస్తాయి. అయితే ఇందుకు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఈటీఎఫ్‌లు(కొన్ని స్టాక్స్ కలిపి ఉన్న ఫండ్) మార్కెట్లో నేరుగా లైవ్‌లో ట్రేడవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా సెక్టార్ వారీగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాటిని నిత్యం ఫండ్ మేనేజర్ నిర్వహిస్తుంటారు.బాండ్స్బాండ్లు అంటే కాలానుగుణ వడ్డీ చెల్లింపుల కోసం కంపెనీలు లేదా ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు. ఇవి స్టాక్స్ కంటే సురక్షితమైనవి. కానీ, తక్కువ రాబడిని అందిస్తాయి.రియల్ ఎస్టేట్ (ఆర్ఈఐటీ)రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు) యువ పెట్టుబడిదారులను భౌతిక ఆస్తిని కొనుగోలు చేయకుండానే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి డివిడెండ్ సంపాదించడానికి వీలు కల్పిస్తాయి. వీటిని చాలా బ్రోకరేజీ ఖాతాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి ఇది మంచి మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?విద్య, నైపుణ్యాలువిద్య, సర్టిఫికేషన్లు లేదా అధిక ఆదాయాన్ని సమకూర్చే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం (కోడింగ్, డిజైన్ వంటివి) కోసం పెట్టుబడి పెట్టడం అన్నింటికంటే మంచి ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే కెరియర్లో అంత ప్రయోజనం పొందుతారు. -
కోతల రాయుళ్లకు వాతలు తప్పవు!
ఐటీఆర్ 1, ఐటీఆర్ 4లలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ మీరు ఐటీఆర్ దాఖలు చేసే 2024–25 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. ఈ మార్పుల ప్రకారం క్లెయిం చేసే ప్రతి డిడక్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలి. ఇన్నాళ్లు డిడక్షన్ ఎంతో రాసిస్తే వదిలేసేవారు. ఇక నుంచి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే. దీని ప్రకారం ఒక్కొక్క డిడక్షన్, దానికి సంబంధించిన కాగితాలు/వివరాలు ఏమిటో తెలుసుకుందాం. మీ దగ్గర పూర్తి వివరాలు లేనిదే ఫారం నింపలేరు. ఇంటి అద్దె అలవెన్సు.. బేసిక్ జీతం. ఇంటి అద్దె అలవెన్సు ఎంత చేతికి వచ్చింది. మీరు అద్దె ఎంత చెల్లించారు. అద్దె ఎవరికి ఇచ్చారు. ఎలా ఇచ్చారు. అంటే నగదా..? బ్యాంకు ద్వారానా..? రశీదులు మొదలైనవి.80 సీ.. ఇంతకుముందే తెలుసుకున్నాము. ఈ సెక్షన్ క్రింద ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా పాలసీ నెంబరు చెప్పాలి. అలాగే మిగతా ఇన్వెస్ట్మెంట్లకు, డాక్యుమెంటు ఐడెంటిఫికేషన్ నెంబరు రాయాలి. మిగతా వాటి గురించి ఇక్కడ ప్రస్తావించలేదు కానీ క్లెయిం చేసే ముందు కాగితాలు సిద్ధంగా పెట్టుకోవాలి. చెల్లింపు తేదీలు, అది ఏ సంవత్సరానికి సంబంధించినదో చాలా ముఖ్యం. ఈ సెక్షన్లో డిడక్షన్లు చెల్లింపు జరిగిన సంవత్సరంలోనే బెనిఫిట్ ఇస్తారు.80 డీ.. ఇది మెడికల్ ఇన్సూరెన్స్‌కి సంబంధించినది. ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ నెంబరు వివరాలు ఇవ్వాలి. 80 ఈ... ఇది విద్యా రుణానికి సంబంధించినది. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు..? లోన్ అకౌంటు నెంబరు.., మంజూరు తేది .. ఎంత రుణం తీసుకున్నారు.. ఇంకా ఎంత రుణం చెల్లించాలి .. ఇలా వివరాలన్నీ తెలియపరచాలి. 80 ఈఈ... ఇంటి కోసం రుణం తీసుకుంటే కొన్ని షరతులకు లోబడి రూ.50,000 డిడక్షన్ ఇస్తారు. ఈ రుణానికి సంబంధించి బ్యాంకు, లోన్ అకౌంటు నెంబరు, మంజూరు లెటర్ తేదీ, ఎంత రుణం తీసుకున్నారు..? ఇంకా ఎంత రుణం మిగిలి ఉంది. ఇవన్నీ వివరాలు చెప్పాలి. 80 ఈఈబీ... ఇది ఎలక్ట్రిక్ వెహికల్ లోన్‌కి సంబంధించినది. బ్యాంకు పేరు ఏమిటి..? లోన్ అకౌంటు నెంబరు, లోన్ ఎంత, వెహికల్ రిజి్రస్టేషన్ నెంబరు, లోన్ మొత్తం ఎంత..? మొదలైన వివరాలు ఇవ్వాలి.80 డీడీబీ... ఇది కొన్ని నిర్దేశిత జబ్బుల ట్రీట్మెంట్కి సంబంధించినది. ఆ నిర్దేశిత జాబితాలోంచి ఏ జబ్బు వచ్చింది? దానికైన ఖర్చు.., హాస్పిటల్‌కి చెల్లించిన మొత్తం ఎంత? తదితర పూర్తి వివరాలు తెలిపాలి. ఈ మార్పులతో అన్ని విషయాలు సేకరిస్తున్నారన్నమాట. ఒకప్పుడు మన మీద అభిమానం, నమ్మకం, మంచి విశ్వాసంతో మొత్తాన్ని తెలియజేయమనేవారు. దీనిని ఆసరా తీసుకుని అన్ని సెక్షన్ల ప్రకారం అర్హత ఉన్నంత క్లెయిమ్‌ల కోసం జనాలు ఎగబడుతున్నారు. అద్దె ఇంట్లో లేకుండా అద్దె క్లెయిమ్ చేసే ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు. భార్యభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ విడిగా వారి వారి అస్సెస్మెంట్లలో హెచ్ఆర్ఏ క్లెయింలు చేసే ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్స్’ ఎంతోమంది ఉన్నారు. ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..ఒక్క హెచ్ఆర్ఏ విషయంలోనే డిపార్ట్మెంట్ వారు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే కొంప కొల్లేరు అయిపోతుంది. అలాగే దొంగ స్కూల్ ఫీజుల రశీదులు .. పిల్లలు లేని వారు కూడా దొంగ రశీదులు పెడుతున్నారు. జీవిత బీమా చెల్లించకపోయినా ప్రీమియంలు చెల్లించినట్లు రాయడం, లేని చెల్లింపులు, లేని ఇన్వెస్ట్మెంట్లు, లేని అంగవైకల్యం దొంగ పత్రాలు సృష్టించి తద్వారా క్లెయిమ్‌లు పొందడం లాంటివి చేసేవారున్నారు. డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్‌గా ఉందని తిట్టి, ప్రచారం చేసి డిపార్ట్మెంట్ వారి మీద అపవాదాలు వేసి, పిడివాదన చేసి, వాదనలు, ప్రతివాదనలు చేసి, పన్నుభారం తగ్గించుకునే కోతరాయుళ్లకి వాతలు తప్పవు.కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్యట్యాక్సేషన్ నిపుణులు -
‘ఫండ్స్’ను బహుమతిగా ఇవ్వొచ్చా..?
ఈఎల్ఎస్ఎస్ పథకాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయా..? – వివేక్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలు పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను ఆదా ప్రయోజనం కలిగినవవి. ఈ పథకాల్లో రాబడులు దీర్ఘకాలంలో సగటున 15–20% మధ్య ఉంటాయి. ఈ విభాగంలో బలహీన పనితీరు చూపించిన పథకాన్ని గమనించినా.. పీపీఎఫ్ కంటే అధిక రాబడులు కనిపిస్తాయి. కాంపౌండింగ్ (వడ్డీపై వడ్డీ జమ కావడం) ప్రయోజనంతో పెట్టుబడి వృద్ధి చెందుతుంది.మంచి పథకాన్ని ఎంపిక చేసుకుని, అది అన్ని కాలాల్లోనూ మంచి పనితీరు చూపిస్తుంటే దానితోనే కొనసాగొచ్చు. మార్కెట్‌తో అనుసంధానమైన సాధనాల్లో పెట్టుబడులు ఆటుపోట్లకు గురువుతుంటాయి. కనుక వాటి పనితీరును కాలానుగుణంగా పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే కొంత కాలం పాటు మంచి పనితీరు చూపించినవి, ఆ తర్వాత చెత్త పథకాలుగా మారొచ్చు. అందుకే పెట్టుబడులను సమీక్షించుకోవడమనే సూత్రాన్ని అనుసరించాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్ఎస్ఎస్ పథకం పనితీరు ఆశాజనకంగా లేకపోతే, దాని నుంచి మూడేళ్ల తర్వాత బయటకు వచ్చేయవచ్చు. ఎందుకంటే మూడేళ్లకు పెట్టుబడుల లాకిన్ ముగిసిపోతుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మారిపోయి ఉంటే అలాంటి వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ బదులు రిస్క్, కాల వ్యవధి, రాబడుల అంచనాలకు అనుగుణంగా ఫ్లెక్సీక్యాప్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ తదితర పథకాలను పరిశీలించొచ్చు.మ్యూచువల్ ఫండ్స్‌లో నా పెట్టుబడులను మరొకరికి బహుమతిగా ఇవ్వడం ఎలా? – నీరజ్ ప్రసాద్మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలన్నా కుదరదు. పిల్లల కోసం అయితే వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది.ఇదీ చదవండి: ఇండియాలో స్టార్‌లింక్ సేవలకు డేట్‌ఫిక్స్?పిల్లలు మేజర్ అయ్యే వరకు (18 ఏళ్లు నిండే వరకు) తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులకు సంరక్షకులు అధికారం కలిగి ఉంటారు. పిల్లల బర్త్ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. పిల్లలు కాకుండా వేరొకరికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఇవ్వాలనుకుంటే ముందుగా వాటిని విక్రయించాలి. అలా వచ్చిన నగదును బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి బదిలీ చేయాలి. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
నేటి నాన్నకు.. ‘మల్టీ అసెట్’ బాసట
నేటి తరంలో తండ్రులు ఏకకాలంలో అనేక పాత్రలను పోషించాల్సి వస్తోంది. కుటుంబం.. ఉద్యోగ బాధ్యతలను చూసుకోవడం, పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రణాళికలు వేస్తూనే ఆర్థిక భద్రతకు ప్లానింగ్ చేయడం, మరో ఇంటిని కొనుగోలు చేయడం, విహారయాత్రల ప్లానింగ్, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం, రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు వేసుకోవడం ఇలా అనేకానేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. ఇలాంటి వైవిధ్యమైన అవసరాలను తీర్చాలంటే సంప్రదాయ పద్ధతిలో పొదుపు చేస్తే సరిపోదు.దీని కోసం నిర్దిష్ట లక్ష్యంతో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఫాదర్స్ డే సందర్భంగా తమకిష్టమైన వారి భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో ఆధునిక తండ్రులకు బాసటగా ఉంటున్న మల్టీ అసెట్ ఫండ్స్‌పై ఒకసారి దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. నేటి తరం తండ్రుల్లో ఈ కేటగిరీ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణాలేమిటంటే.. వైవిధ్యం వివిధ బాధ్యతలు తలో వైపునకు లాగేసే పరిస్థితుల్లో వివిధ సాధనాలవ్యాప్తంగా తమ పెట్టుబడులను రీబ్యాలెన్స్ చేసుకునేందుకు లేదా వేర్వేరు ఫండ్స్‌ను నిర్వహించుకునేందుకు నాన్నలకు తగినంత సమయం ఉండటం లేదు. మల్టి–అసెట్ ఫండ్స్ ఈ విధులను ఆటోమేటిక్‌గా నిర్వహిస్తాయి. దీనితో పెట్టుబడుల కేటాయింపు, రిసు్కల సర్దుబాటు సముచితమైన విధంగా ఉంటుంది. డైనమిక్‌గా కేటాయింపులు మల్టీ అసెట్ ఫండ్స్ కూడా క్రియాశీలకంగా ఉంటాయి. స్థూల ఆర్థిక సూచీలు, మార్కెట్ సెంటిమెంట్, వేల్యుయేషన్లను బట్టి చాలా మటుకు ఫండ్స్ మేనేజర్లు వ్యూహాత్మకంగా కేటాయింపులను మారుస్తూ ఉంటారు. వృద్ధి, మందగమన దశల్లో ఇన్వెస్టర్లు సమర్ధవంతంగా ముందుకెళ్లేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది. సరళతరంగా ప్రణాళికలు పదేళ్ల తర్వాత పిల్లల చదువుల కోసం పొదుపు చేయడం కావచ్చు లేదా ముందస్తుగానే రిటైర్ అయ్యేందుకు అవసరమైన నిధి సమకూర్చుకో వడం.. లక్ష్యం ఏదైనా సరే సరళతరమైన పెట్టుబడి మార్గాన్ని ఈ ఫండ్స్ అందిస్తాయి. ఒక్కో లక్ష్యం కోసం అనేకానేక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించుకోవాల్సిన బాదరబందీ లేకుండా, తమ రిస్కు సామర్థ్యాలు, కాలవ్యవధిని బట్టి వైవిధ్యమైన ఒకే సాధనంలో సిప్ చేయడం సులభతరంగా ఉంటుంది. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం.. రిస్కులను అధిగమించడం ఈక్విటీ ఆధారిత వ్యూహాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. డెట్ ఆధారిత పోర్ట్ఫోలియోలనేవి ద్రవ్యోల్బణానికన్నా తక్కువగా రాబడులు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక పుత్తడిని తీసుకుంటే ఎక్కువగా సంక్షోభ సమయాల్లోనే మాత్రమే మెరుస్తుంది. కానీ వీటన్నింటినీ సమతూకంలో మేళవించి, సరిగ్గా నిర్వహించుకోగలిగితే, దీర్ఘకాలంలో అర్ధవంతమైన రాబడులను అందిస్తాయి. షాక్‌లు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా ఆర్థిక స్థిరత్వ సాధనను లక్ష్యంగా పెట్టుకున్న వారు రిస్కులకు తగ్గ వృద్ధి అవకాశాలను పొందేందుకు ఈ వ్యూహం అనుకూలంగా ఉంటుంది. అనిశ్చితిలోనూ నిశ్చింత పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో సముచిత స్థాయిలో వైవిధ్యంగా ఉండటంతో పాటు ప్రొఫెషనల్స్ నిర్వహణలో ఉంటుందనే విషయం తెలియడం వల్ల ఎంతో నిశ్చింతగా ఉంటుంది. ఫండ్ మేనేజర్లు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తూ, లోతైన పరిశోధనలు చేస్తూ, ఆర్థిక ధోరణులను విశ్లేíÙస్తూ, రిసు్కలను తగ్గించి రాబడులను పెంచే విధంగా పోర్ట్‌ఫోలియోను క్రియాశీలకంగా రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు.దీనితో వివిధ రకాల పెట్టుబడులను వేర్వేరుగా పరిశోధించి, ఎంచుకుని, ఇన్వెస్ట్ చేసేందుకు బోలెడంత సమయం వెచి్చంచాల్సిన భారం తండ్రులకు కాస్త తగ్గుతుంది. ఇటు కెరియర్లు అటు కుటుంబ బాధ్యతల మధ్య నిరంతరం పరుగులు తీసే తండ్రులకు ఈ విధానం ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మార్కెట్ హడావుడి గురించి ఆందోళన చెందకుండా వారు ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా, తమ పిల్లల క్రికెట్ గేములు.. సైన్స్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టేలా మల్టి–అసెట్ ఫండ్స్ సహకరిస్తాయి. నేటి నాన్న ఏదో కాస్త పొదుపు లేదా ప్యాసివ్ ఇన్వెస్టింగ్‌కి మాత్రమే పరిమితం కావడం లేదు. కుటుంబం నేటి ఆనందాలను కోల్పోకుండా చూసుకోవడంతో పాటు భవిష్యత్తులోనూ సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని విషయాలూ తెలుసుకుని, చురుగ్గా వ్యవహరిస్తూ, తగిన పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు సన్నద్ధంగా ఉంటున్నారు. మల్టీ అసెట్ ఫండ్స్ ఇలాంటి సమతూకాన్నే ప్రతిఫలిస్తాయి. సంరక్షకుడిగా, ప్రణాళిక కర్తగా, భాగస్వామిగా, అన్నింటికీ మించి ఒక పేరెంట్‌గా వివిధ పాత్రలను పోషించే తండ్రులకు సమగ్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన పెట్టుబడి ఆప్షన్‌గా మల్టీ అసెట్ ఫండ్స్ ఉపయోగపడతున్నాయి. ఇలా తమ కోసమే కాకుండా రాబోయే తరాల కోసం కూడా ఆర్థికంగా కొత్త బాటలు వేస్తున్న తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే! మల్టీ–అసెట్ ఫండ్స్ అంటే .. ఇవి కనీసం మూడు వేర్వేరు ఆర్థిక సాధనాల్లో, అంటే ఈక్విటీలు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, పసిడిలాంటి కమోడిటీల మేళవింపులో ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని కొంత వరకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) లేదా ఇంటర్నేషనల్ ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక్కడ డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ కీలకాంశం. -
ఆస్తుల బదిలీ సాఫీగా.. సులభంగా!
సుధాకర్ (71) తన మరణానంతరం తనకున్న ఏకైక ఇల్లు ఇద్దరు కుమారులకు సమానంగా చెందుతుందని వీలునామా రాశాడు. అనారోగ్యంతో సుధాకర్ 2022లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. మూడేళ్లు గడుస్తున్నా కానీ సుధాకర్ కోరిక నెరవేరలేదు. ఆ ఇంటి కోసం సోదరులిద్దరి మధ్య అంగీకారం కుదరడం లేదు. ఇంటిని విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకుందామని ఒకరు అంటుంటే.. మరొకరు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదు. దేశంలో వారసత్వ వివాదాల్లో ఎక్కువగా ఇళ్ల గురించే ఉంటున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. – సాక్షి, బిజినెస్ డెస్క్బెంగళూరు సంస్థ ‘దక్ష్’ 2017లో చేపట్టిన అధ్యయనం ప్రకారం.. దేశంలో మూడింట ఒక వంతు వివాదాలు భూమి, ఇంటి గురించే ఉంటున్నాయి. ఇందులో 80 శాతం వారసత్వ హక్కులకు సంబంధించినవే కావడం గమనార్హం. 2016 నాటి ఒక సర్వే ప్రకారం చూసినా 66 శాతం సివిల్ వివాదాలు భూమి, ఇల్లు గురించే ఉన్నాయి. ఒకరికి మించిన వారసుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, వీలునామాలో ఆస్తుల పంపకం అసమంజసంగా ఉండడం, వీలునామాల ఫోర్జింగ్, ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలన్నీ కోర్టుల్లో న్యాయపోరాటాలకు దారితీస్తున్నాయి.ఆస్తుల పంపకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వివాదాలను సాధ్యమైన మేర తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘చట్టపరమైన సంక్లిష్టతలు, పరిపాలనా ప్రక్రియలకు దూరంగా ఉండడం అసాధ్యం. అయినప్పటికీ, ఆస్తులను ఎప్పుడు, ఎలా బదిలీ చేయాలన్నది నిర్ణయించడం ద్వారా వీటిని పరిమితం చేయొచ్చు’’అని 5నాన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్ రోహిరా సూచించారు. అందరికీ ఒక్కటే పరిష్కారం కాదు.. బ్యాంక్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులు తదితర ఆర్ధిక ఆస్తుల బదిలీ ఎంతో సులభం. వీటి విలువను ఏరోజుకారోజు సులభంగా లెక్కించొచ్చు. కనుక వీటిని ఎంత మంది వారసుల మధ్య అయినా సులభంగానే పంపిణీ చేయొచ్చు. స్థిరాస్తులైన భూమి, ఇల్లుతోపాటు ఆభరణాలు, పెయింటింగ్‌లు, కళాకృతుల పంపిణీ సవాళ్లతో కూడుకున్నదే.వీటి అసలైన విలువను అంచనా వేయడంలోనే సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఒకే ఇంటిని ఒకటికి మించి భాగాలుగా పంచే విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అది న్యాయవివాదానికి దారితీయవచ్చు. కనుక ఈ విషయంలో సాధ్యమైన మేర వివాద రహితంగా పరిష్కారాన్ని చూడాల్సి ఉంటుంది. వీలునామా, ట్రస్ట్, గిఫ్ట్ డీడ్, ఆస్తులను విక్రయించి పంచడం.. ఆస్తుల బదిలీకి ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో సానుకూలతలే కాదు, ప్రతికూలతలూ ఉన్నాయి. తమకు అత్యంత అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. జీవించి ఉండగా /మరణానంతరం..జీవించి ఉండగా ఆస్తుల బదిలీకి గిఫ్డ్‌డీడ్ చేయడం, ఫ్యామిలీ ట్రస్ట్‌కు బదిలీ చేయడం తదితర మార్గాలున్నాయి. ఆస్తులను విక్రయించి అందిరికీ సమానంగా పంచొచ్చు. లేదా హెచ్‌యూఎఫ్‌కు గిఫ్ట్‌డీడ్ చేయొచ్చు. మరణానంతరం ఆస్తులు ఎవరికి చెందాలన్నది వీలునామా ద్వారా నిర్దేశించొచ్చు. ఆస్తుల విక్రయం తమ తదనంతరం ఆస్తుల పంపకంలో సమస్యలు వస్తాయని సందేహించే వారు జీవించి ఉండగానే వాటిని విక్రయించి వారసులకు బదిలీ చేయడం ఒక పరిష్కారం. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన పిల్లలు కలిగిన వారికి ఇది మరింత అనుకూలం. అనవసర ప్రక్రియలను నివారించి, సమయాన్ని ఆదా చేస్తుంది. న్యాయ వివాదాలకు ఆస్కారం ఉండదు. స్వార్జితం అయితే తమకు నచ్చిన విధంగా పంపకాలు చేసుకోవచ్చు.వీలునామా తన మరణానంతరం ఆస్తుల సాఫీ బదిలీకి వీలునామా ఉపకరిస్తుంది. చట్టబద్ధమైన వారసులు కాని వారికి సైతం ఆస్తుల పంపకాన్ని వీలునామా ద్వారా నిర్ణయించొచ్చు. ఆస్తులను ఎలా పంచాలనే విషయంలో ప్రత్యేక సూచనలు ఇవ్వొచ్చు. మైనర్ పిల్లల కోసం సంరక్షకులను నియమించొచ్చు. వీలు నామా రాసినా కానీ, ఆ ఆస్తులపై జీవించి ఉన్నంత కాలం యజమానికే హక్కు, అధికారం ఉంటాయి. వీలునామాను ఎప్పుడైనా సమీక్షించొచ్చు. సులభంగా తిరగరాయొచ్చు. కానీ, అస్పష్టతకు తా విస్తే భవిష్యత్తులో కోర్టు వివాదాల చిక్కు ఇందులో ఎక్కువ. వీలునామా ద్వారా ప్రైవేటు ట్రస్ట్‌ను సైతం ఏర్పాటు చేసి, మరణానంతరం అమల్లోకి వచ్చేలా నిర్ణయించొచ్చు. గిఫ్ట్ డీడ్ బహుమతి కింద ఒక వ్యక్తి తన స్థిర, చరాస్తులను స్వచ్ఛందంగా బదిలీ చేయడానికి గిఫ్ట్ డీడ్ అనుకూలిస్తుంది. జీవించి ఉండగా బదిలీ చేస్తున్నారు కనుక, తమ తదనంతరం న్యాయపరమైన, వారసత్వ వివాదాలకు అవకాశాలు చాలా తక్కువ. స్వీయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే గిఫ్ట్ డీడ్ అనంతరం ఆ ఆస్తులపై బదిలీ చేసిన వారు హక్కును కోల్పోవడం ఇందులో ఉన్న ప్రతికూలత. ఫ్యామిలీ/ప్రైవేటు ట్రస్ట్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, 1882 కింద ఫ్యామిలీ లేదా ప్రైవేటు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి వాటికి ఆస్తులను బదిలీ చేయడం ఒక పరిష్కారం. ఇదొక చట్టబద్దమైన సంస్థ. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఎవరికి ఏ మేరకు ఆస్తుల ప్రయోజనాలు అందించాలో ఇందులో పేర్కొనొచ్చు. ట్రస్టీల బాధ్యతలు, లబ్ధి్దదారులు, అస్తుల నిర్వహణ గురించి స్పష్టంగా ట్రస్ట్ డీడ్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, వారసులు, ఇతరులు చట్టపరంగా సవాలు చేయడాన్ని నిరోధిస్తుంది. లబ్ధిదారులకు రుణ దాతల నుంచి రక్షణనిస్తుంది.ఇందులో ఉన్న ప్రతికూలత ఆస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేసిన తర్వాత వాటిపై స్వీయ నియంత్రణ కోల్పోతారు. హక్కులన్నీ ట్రస్టీ చేతుల్లోకి వెళతాయి. కాకపోతే ఆ ఆస్తుల హక్కుదారులను నిర్ణయించే అధికారం ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటుకు ఎంతో సమయం తీసుకుంటుంది. నిర్వహణ కూడా సంక్లిష్టమైనది. కొన్ని ఆస్తులు కాకుండా పెద్ద మొత్తంలో ఆస్తులున్న వారికి ఇది అనుకూలిస్తుంది. ట్రస్ట్ తరఫున ప్రత్యేక రికార్డుల నిర్వహణ, రిటర్నుల దాఖలు తప్పనిసరి. దీని సవరణ, రద్దు అన్నది ఎంతో కష్టమైనది. సెటిల్మెంట్ డీడ్ ఆస్తుల పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అంగీకార పత్రం ఇది. కనుక న్యాయవివాదాలకు ఆస్కారం తక్కువ. దీన్ని రిజిస్టర్ చేసుకోకపోయినా కోర్టుల ముందు ఆధారంగా నిలుస్తుంది. రిజిస్టర్ చేసుకుంటే మంచిది. నిపుణుల సహకారంతో శ్రద్ధగా డ్రాఫ్టింగ్ చేసుకోవడం ద్వారా న్యాయవివాదాలను నివారించొచ్చు. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే తిరిగి కోర్టు అనుమతి లేకుండా రద్దు చేసుకోవడం కుదరదు. దీన్ని కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చు. ఉమ్మడి యజమాని మరొకరితో ఉమ్మడిగా ఆస్తులను కలిగి, సరై్వవర్షిప్ హక్కుతో ఉంటే.. అప్పుడు ఒకరి మరణానంతరం మరొకరికి ఆస్తులు బదిలీ అయిపోతాయి. నామినేషన్, బెనిఫీషియరీ (లబ్దిదారు) నమోదు చేస్తే, మరణానంతరం ఆస్తులను వారు క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించినట్టు అవుతుంది. ఈ విధానంలో వివాదాలకు అవకాశాలు ఎక్కువ.నామినేషన్ ఉంటే ఆస్తులపై హక్కులు వారసులకు ఆలస్యంగా బదిలీ అవుతాయని గుర్తుంచుకోవాలి. బెనిఫీషియరీ నమోదు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే సరైన లబ్ధిదారులకు ఆస్తుల బదిలీ జరగకపోవచ్చు. ఆస్తుల బదిలీ ఏ రూపంలో చేస్తున్నా.. దీనికంటే ముందు న్యాయ నిపుణుల సహకారం తీసుకోవడం ద్వారా సాధ్యమైన మేర వివాదాలు తలెత్తకుండా నివారించొచ్చు. ప్రాపర్టీ పంపకం సంక్లిష్టం చేయొద్దు..ఒక్కరే వారసులు ఉన్న సందర్భాల్లో ఆస్తుల బదిలీకి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవు. ఒకరికి మించి వారసుల మధ్య ఆస్తుల బదిలీయే సంక్లిష్టం అవుతుంది. ఒక ఇల్లు ఉంటే సమానంగా పంచుకోండంటూ చెప్పడం సులభమే. కానీ, ఈ విషయంలో వారసుల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే వివాదాలతో విలువైన సమయం హరించుకుపోతుంది. రెండు ఇళ్లు ఉంటే ఇద్దరు వారసులకు చెరొకటి పంచడం కూడా అంత సులభమేమీ కాదు. రెండూ ఒకే ప్రాంతంలో, ఒక్కటే విస్తీర్ణంతో ఉంటే ఫర్వాలేదు. వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు వాటి విలువ ఒకే రకంగా ఉండదు.ఇద్దరు వారసులూ ఒకే ప్రాపర్టీ కోరుకోవచ్చు. వారసుల్లో ఒకరు విదేశాల్లో ఉండి, ఒకరు ఇక్కడే స్థిరపడొచ్చు. విదేశాల్లో స్థిరపడిన వారు భారత్‌లో ఆస్తుల పట్ల ఆసక్తి చూపించరని, వాటి నిర్వహణ, పన్నుల చెల్లింపు వారికి భారంగా మారొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. కనుక విదేశాల్లో స్థిరపడిన వారికి భౌతిక ఆస్తుల కంటే ఆరి్థక ఆస్తుల రూపంలో పంపకం మెరుగైన మార్గం అవుతుంది. ఒక్కటే ఇల్లు లేదా ఫ్లాట్ కలిగి, మరే ఆస్తుల్లేని వారు.. తమ తదనంతరం ఆ ఇంటిని విక్రయించి, వ చ్చిన మొత్తాన్ని వారసులకు సమానంగా బదిలీ చేయాలంటూ వీలునామా రాసుకోవడం మంచి ఆలోచన అని నిపుణుల సూచన. అంతేకానీ, ఒకే ప్రాపర్టీకి సమాన హక్కులు చెందేలా రాసినట్టయితే ఏకాభిప్రాయం కుదరని సందర్భాల్లో వివాదాలకు తావిచ్చినట్టు అవుతుంది. అన్నీ ఆలోచించాకే అడుగు..⇒ ఆస్తులను పోగేసి వారసులకు పంచిపెట్టాలా? అన్నది పూర్తిగా వ్యక్తిగత ఎంపికే. వారసుల కంటే ముందు తమ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. జీవితకాలం కష్టార్జితం వృద్ధాప్యంలో మెరుగైన జీవనానికి భరోసా ఇవ్వాలి. తమ అవసరాలకు పోను మిగిలినది తమ తదనంతరం వారసులకు పంపిణీ చేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ముఖ్యంగా పిల్లల చదువులకు ఉన్నదంతా ఖర్చు చేసి.. వారికి మెరుగైన భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులు మిగిలిన కొద్ది ఆరి్థక వనరులు/ఆస్తులను తమ కోసమే వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ తమ అవసరాలకు మించి అదనంగా కలిగి ఉంటే అప్పుడు జీవించి ఉండగానే బదిలీ చేయడాన్ని పరిశీలించొచ్చు. ⇒ కొందరు పిల్లలకు ఆస్తులను పంపిణీ చేసే సందర్భంలో జీవిత భాగస్వామిని విస్మరిస్తుంటారు. ముందుగానే ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసిన తర్వాత.. దంపతుల్లో ఒకరు ముందుగా కాలం చేస్తే అప్పుడు రెండో వ్యక్తి యోగ క్షేమాలను పిల్లలు పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. కనుక జీవిత భాగస్వామికి ఈ విషయంలో భరోసా కల్పించాలి. ⇒ పిల్లల్లో ఒకరిద్దరు గొప్పగా స్థిరపడి.. ఎవరో ఒకరు వైవాహిక జీవితం విచి్ఛన్నం కారణంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉండొచ్చు. అలాంటి ప్రత్యేక కేసుల్లో వారు జీవితాంతం అదే ఇంట్లో నివసించే హక్కు (రైట్ టు రిసైడ్)ను వీలునామా ద్వారా కల్పించొచ్చు. ⇒ ఆస్తుల పంపకంలో పిల్లల ఆసక్తులను పట్టించుకోవాలి. వారికి ఇష్టం లేని ఆస్తులు, వ్యాపారాలను విడిచిపెట్టడం మంచి నిర్ణయం కాబోదు. అలా ఇ చ్చిన వ్యాపారాలు, ఇంటి నిర్వహణను వారు పట్టించుకోకపోతే కొంత కాలానికి వాటి విలువ క్షీణిస్తుంది. ⇒ ముఖ్యంగా మైనర్ పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే వారి కోసం సంరక్షకులను వీలునామా ద్వారా నియమించుకోవచ్చు. లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించొచ్చు. ఇలాంటి వారికి ఆస్తుల బదిలీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల సాయంతో వారికి జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడంపై దృష్టి పెట్టాలి. ⇒ ఆస్తుల బదిలీకి అనుకూలమైన చట్టబద్ధమైన ప్రక్రియలు, పన్ను బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు ఆస్తులను బదిలీ చేస్తుంటే.. వారు తమ దేశాల్లో పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కనుక వీటి గురించి ముందే పిల్లలతో చర్చించాలి. ⇒ ఆస్తుల పంపకం అసంబద్ధంగా ఉంటే అది న్యాయ వివాదాలకు దారితీయవచ్చు. దీనివల్ల ఎన్నో ఏళ్ల విలువైన కాలంతోపాటు న్యాయపోరాటానికి ఎంతో వ్యయం చేయాల్సి వస్తుంది. ఆస్తుల బదిలీలో సాధ్యమైన మేర పారదర్శకతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ పిల్లలు ఇతర పట్టణాలు, విదేశాల్లో స్థిరపడినప్పుడు వారసత్వ ఆస్తుల పరిష్కారానికి తరచూ రావాల్సి వస్తే అది కష్టంగా మారుతుంది. ⇒ సక్సెషన్ సర్టిఫికెట్, చట్టబద్ధమైన వారసులేనన్న ధ్రువీకరణ, లెటర్ ఆప్ అడ్మిని్రస్టేషన్ పొందాలంటే వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలి. వీటికి కూడా ఎన్నో సార్లు తిరగాల్సి వస్తుంది. ⇒ తల్లిదండ్రుల పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఇతర పెట్టుబడులు పిల్లలకు తెలియకపోవచ్చు. వీటి వివరాలను పిల్లలతో పంచుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన. ⇒ ఆస్తుల బదిలీ విషయంలో కొంత ఫీజు చెల్లించి నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడొద్దు. -
పాన్ కార్డు అలాగే వాడుతున్నారా? కట్టండి రూ.10వేలు!!
పాన్ కార్డు, ఆధార్ లేకుండా నేటి కాలంలో ఆర్థికపరమైన ఏ పనినీ పూర్తి చేయడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాన్, ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికీ చాలా మంది తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోలేదు. అలాంటి వారి పాన్ కార్డులు ఇనాక్టియావ్‌గా మారాయి. అయినప్పటికీ కొందరు ఆర్థిక లావాదేవీల్లో ఇనాక్టివ్ పాన్ కార్డులను అలాగే ఉపయోగిస్తున్నారు.ఇలాంటి వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఒక్కో లావాదేవీపై రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలలో ఇనాక్టివ్ పాన్ ఉపయోగిస్తే ప్రతి సందర్భంలో ప్రత్యేక జరిమానా విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా నిర్వహించడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి.👉 ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్లైన్రెండు పాన్ కార్డులున్నా తప్పే..ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఇలాంటి వారు రెండింటిలో ఒక పాన్ కార్డును సరెండర్ చేయాలి. అలా చేయకుండా పట్టుబడితే ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొంతమందికి రెండు పాన్ కార్డులు ఉండవచ్చు. ఉదాహరణకు పాన్ కార్డు వివరాల్లో తప్పులున్నప్పుడు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు కోసం కొత్త పాన్ కార్డు తీసుకొని ఉండవచ్చు. ఇలా రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేస్తారు. అదే ఉద్దేశపూర్వకంగా రెండు పాన్‌కార్డులు పెట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు. కాబట్టి ఎవరి దగ్గరైనా రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే సరెండర్ చేయడం మంచిది. -
ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్‌లైన్
ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల అప్డేట్కు గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరోసారి పొడిగించింది. ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు గడువు జూన్ 14న ముగియాల్సి ఉండగా యూఐడీఏఐ ఈ సదుపాయాన్ని మరో ఏడాది పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించింది. ఈ మేరకు ‘ఎక్స్’(ట్విటర్) ద్వారా యూఐడీఏఐ వెల్లడించింది.ఆధార్‌ను ఎవరు అప్డేట్ చేసుకోవాలంటే..ఆధార్ అప్డేట్కు గడువు పొడిగింపుతో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు ఉపశమనం కలగనుంది. ఈ ఉచిత సేవ మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్ చేయించుకుని ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోని వారు ఆధార్ అప్డేట్ చేయాలని యూఐడీఏఐ కోరింది. వివాహం, బదిలీ లేదా ఇతర కారణాల వల్ల పేరు, చిరునామా లేదా మరేదైనా సమాచారం మారితే అప్డేట్ చేసుకునేందుకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఈ ఆన్లైన్ సర్వీసుకు రూ.50 ఫీజు వసూలు చేసేవారు. డిజిటల్ మార్గాల ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ప్రోత్సహించడానికి యూఐడీఏఐ ఈ ఛార్జీని తొలగించింది. అయితే ఫిజికల్ ఆధార్ అప్డేట్ సెంటర్లలో చేసే అప్డేట్కు మాత్రం ఇంకా రుసుం వసూలు చేస్తున్నారు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..🔹యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ( https://myaadhaar.uidai.gov.in ) సందర్శించండి.🔹ఆధార్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వండి.🔹సమాచారాన్ని సరిచూసుకుని 'ఐ వెరిఫై...'పై క్లిక్ చేయండి.🔹ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (PoI) ఎంచుకుని 2MB కంటే తక్కువ పరిమాణంలో (JPEG/PNG/PDF) డాక్యుమెంట్ కాపీని అప్లోడ్ చేయండి.🔹డాక్యుమెంట్ ఆఫ్ అడ్రస్ (PoA) సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ కాపీని అప్లోడ్ చేయాలి.🔹అగ్రీ అండ్ సబ్మిట్పై క్లిక్ చేయండి.🔹రసీదును డౌన్ లోడ్ చేసుకోండి. -
డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచన
‘స్మార్ట్’ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక కలలను నిజం చేస్తుంది. కొందరు మంచి కారు కొనాలనుకుంటారు.. కొందరికి ఖరీదైనా ఫోన్ కావాలనిపిస్తుంది.. ఇంకొందరు కాలేజ్ ఫీజు కోసం పొదుపు చేస్తారు.. ఇలా ఒక్కొక్కరి ఆర్థిక అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే వారి ఆర్థిక లక్ష్యాలను సరైన మార్గంలో సెట్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు పడ్సాలిందేనని నిపుణులు చెబుతున్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ‘స్మార్ట్(SMART)’ పద్ధతులను అవలంభించాలని సూచిస్తున్నారు. కొత్తగా ఉద్యోగం సాధించిన యువత కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే తప్పకుండా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారని తెలుపుతున్నారు.స్మార్ట్ లక్ష్యాలుSMARTSpecificMeasurableAchievableRealisticTime-boundనిర్దిష్ట లక్ష్యాలు(Specific): మీకు ఆర్థికంగా ఏమి కావాలో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. ‘నేను డబ్బు ఆదా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పడానికి ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. ‘నేను దేని కోసం పొదుపు చేస్తున్నాను? నాకు ఎంత డబ్బు అవసరం?..’ అనే అంశాలపై స్పష్టత ఉండాలి.కొలవదగినదై ఉండాలి..(Measurable): మీ లక్ష్యాలను మీ ఆదాయంతో పోల్చి చూసుకొని ఖర్చులు, ఆదాపై పురోగతిని ట్రాక్ చేయాలి. తక్కువ జీతంల ఉన్నవారు ఆచరణ సాధ్యం కాని భారీ లక్ష్యాలను పెట్టుకోవడంలో అర్థం ఉండదు.సాధించేదిగా ఉండాలి..(Achievable): మీ ఆదాయం లేదా ఖర్చుల ఆధారంగా లెక్కలు పక్కాగా చూసుకుంటూ..లక్ష్యాన్ని సాధించాలి. లెక్కల విషయంలో నిజాయితీగా ఉండాలి. అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నిరాశకు దారితీస్తుంది.ఇదీ చదవండి: పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!వాస్తవికతకు దగ్గరగా..(Realistic): మీ లక్ష్యం మీ ప్రస్తుత జీవిత పరిస్థితికి సరిపోయేలా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఆర్థిక లక్ష్యానికి కట్టుబడి ఉండేలా స్వీయ క్రమశిక్షణతో మెలగాలి.కాలపరిమితి(Time-bound): ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా కాలపరిమితిని నిర్ధారించుకోవాలి. డెడ్ లైన్ ఉంటే మరింత మెరుగ్గా పొదుపుపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. -
నేహా చెప్తే వింటారు! మనీ డీలింగ్.. మాస్ ఫాలోయింగ్
నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.దేశ పర్సనల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్‌లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్‌ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?వివిధ ప్లాట్‌ఫామ్‌లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్ కంటెంట్ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు. -
ఈపీఎఫ్ క్లెయిమ్‌లకు వేగంగా ఆమోదం
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) క్లెయిమ్‌ల పరిష్కారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత వేగాన్ని సంతరించుకుంది. క్లెయిమ్ దరఖాస్తుల్లో 50 శాతాన్ని (ప్రధానంగా ఉపసంహరణ) మూడు రోజుల్లోనే పరిష్కరించినట్టు ఓ అధికారి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇలా మూడు రోజుల్లోనే పరిష్కరించిన క్లెయిమ్‌లు 39 శాతంగా ఉన్నట్టు చెప్పారు.2025 ఏప్రిల్ నుంచి జూన్ 5 మధ్య 68.96 లక్షల క్లెయిమ్‌లకు మూడు రోజుల్లో పరిష్కారం లభించింది. ప్రస్తుతం రూ.లక్ష వరకు క్లెయిమ్‌లకు ఆటోమేటెడ్ పరిష్కారం అమల్లో ఉండగా, ఈపీఎఫ్‌వో త్వరలోనే రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లకు ఈ పరిమితిని పెంచనుంది. దీంతో మరిన్ని క్లెయిమ్‌లకు వేగంగా పరిష్కారం లభించనుందని ఆ అధికారి తెలిపారు. ఈ పరిమితి పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం అవసరం లేదన్నారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇందుకు అనుమతించొచ్చని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!అనారోగ్యం, విద్య, ఇంటి నిర్మాణం/కొనుగోలు, వివాహ అవసరాలకు సంబంధించిన క్లెయిమ్‌లు రూ.లక్ష వరకు ఉండి, దరఖాస్తుదారులకు అర్హతలు ఉంటే వాటికి మూడు రోజుల్లోనే క్లెయిమ్ మొత్తం మంజూరవుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 2012కు ముందు చేరిన సభ్యుల క్లెయిమ్‌ల ధ్రువీకరణకు సమయం తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ ఉపసంహరణలు అన్నింటినీ 72 గంటల్లోనే పరిష్కరించాలన్నది ఈపీఎఫ్‌వో లక్ష్యమని.. ఈ దిశగా ఈపీఎఫ్‌వో కృషి చేస్తున్నట్టు చెప్పారు. -
కేవైసీ అప్డేషన్ ఇక ఈజీ!
ముంబై: కాలానుగుణంగా కేవైసీ అప్డేషన్ను మరింత సులభతరం చేసే దిశగా ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ అప్డేషన్ సేవలను బిజినెస్ కరస్పాడెంట్ల ద్వారా (బీసీలు) చేపట్టేందుకు అనుమతించింది. కస్టమర్లకు నిర్ణిత గడువుతో ముందస్తు నోటీసులు/సమాచారం ఇవ్వాలంటూ బ్యాంక్‌లతోపాటు తన నియంత్రణల పరిధిలోని ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తదితర) ఆర్బీఐ కోరింది. ‘‘ఖాతాల కేవైసీ అప్డేషన్ విషయంలో పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్నట్టు గమనించాం. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం, స్కాలర్ షిప్ ప్రయోజనాల కోసం తెరిచిన ఖాతాలు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది’’అని ఆర్బీఐ ఆదేశాల్లో పేర్కొంది. కస్టమర్ల సౌకర్యం దృష్ట్యా బిజినెస్ కరస్పాడెంట్ల (బీసీలు)ను కేవైసీ అప్డేషన్ పనుల నిర్వహణకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, బ్యాంక్ శాఖలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల కస్టమర్లకు సైతం కేవైసీ అప్డేషన్ సులభతరం కానుంది. ఇందుకు వీలుగా సవరించిన కేవైసీ ఆదేశాలను జారీ చేసింది. 3 పర్యాయాలు సమాచారం ఇవ్వాల్సిందే.. కాలానుగుణ కేవైసీ అప్డేషన్ విషయంలో కస్టమర్లకు బ్యాంక్‌లు ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. కనీసం మూడు పర్యాయాలు కస్టమర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక్కసారి లేఖ ద్వారా తెలియజేయాలని ఆర్బీఐ పేర్కొంది. ప్రతి ఇంటిమేషన్/రిమైండర్‌ను నమోదు చేయాలని కూడా ఆదేశించింది. కేవైసీ వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోతే కస్టమర్ నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకుంటే సరిపోతుంది. తక్కువ రిస్క్ లో ఉన్న కస్టమర్లు గడువులోపు కేవైసీ అప్డేట్ చేయకపోయినప్పటికీ.. అప్పటి నుంచి ఏడాది పాటు లేదా 2026 జూన్ 30 వరకు వారి ఖాతాల్లో అన్ని లావాదేవీలను అనుమతించాలని ఆర్బీఐ కోరింది. కేవైసీ అప్డేషన్ విషయంలో క్యాంపులు నిర్వహించి కస్టమర్లలో అవగాహన కల్పించాలని సూచించింది. -
ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!
ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) పన్ను నియమాలు పాటించకపోవడాన్ని గుర్తించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. భారత పన్ను అధికారులు అన్ని ఆర్థిక లావాదేవీలపై నిఘాను గణనీయంగా పెంచారు. అద్దె ఆదాయం నుంచి పాత పొదుపు ఖాతాల వరకు అన్ని అంశాలకు సంబంధించి స్క్రీనింగ్ చేసి పన్ను నోటీసులు జారీ చేస్తున్నారు.నోటీసులకు కొన్ని కారణాలు ఇవి..ఆదాయపు పన్ను శాఖ డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత ట్రాకింగ్ ద్వారా పన్ను దారులను గుర్తిస్తోంది. అందులో భాగంగా ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఎలాంటి సందర్భాల్లో పన్ను నోటీసులు అందుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం.నివేదించని అద్దె ఆదాయం: ఇండియాలో ఆస్తిని కలిగి ఉండి దానిపై అద్దెను ఆదాయం ఇండియన్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంటే మాత్రం చట్ట ప్రకారం పన్ను పరిధిలోకి వస్తారు.పాత పొదుపు ఖాతాలు: పరిమితికి మించి డిపాజిట్లు ఉన్న నిద్రాణమైన ఎన్ఆర్ఓ ఖాతాలుంటే పన్ను అధికారులు పరిశీలిస్తారు.అధిక విలువ కలిగిన లావాదేవీలు: పెద్ద మొత్తంలో రెమిటెన్స్‌లు, ఆస్తి అమ్మకాలు లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులను తప్పకుండా తెలియజేయాలి. ట్యాక్స్ డిక్లరేషన్లను సరిగ్గా దాఖలు చేయకపోతే చర్యలు తప్పవు.ఇదీ చదవండి: ఎస్పీఎంసీఐఎల్కు త్వరలో నవరత్న హోదా!మూలధన లాభాలు: భారతదేశంలో స్థిరాస్తి లేదా ఈక్విటీలను విక్రయించడం.. ఇక్కడి డబ్బును విదేశాలకు బదిలీ చేసినా పన్నులు వర్తిస్తాయి.వ్యాపార ఆదాయం: దేశీయ ఆధారిత వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఎన్ఆర్ఐలు ఆదాయపు పన్ను నిబంధనలకు కట్టుబడి ఉండాలి.విదేశీ ఆదాయాన్ని బహిర్గతం చేయకపోవడం: భారతీయ పన్ను చట్టాల ప్రకారం కొన్నిసార్లు ఎన్ఆర్ఐలు తమ మొత్తం ఆదాయాన్ని బహిర్గతం చేయవలసి ఉంటుంది. ఇది పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు. -
30 ఏళ్ల నాటి షేర్లు.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?
అదృష్టం ఎవరి జీవితంలో ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. 1990వ దశకంలో తన తండ్రి కొన్న షేర్లు ఇప్పుడు కొడుక్కి జీవితం మారిపోయే అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. అప్పట్లో తన తండ్రి కేవలం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన పాత జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్ సర్టిఫికెట్లు అనుకోకుండా ఇటీవల కొడుక్కి దొరికాయి. వాటి విలువ ఇప్పుడు కొన్ని పదుల కోట్ల రూపాయలు.రెడిట్‌లో తన దృష్టికి వచ్చిన ఈ కథను ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా ‘ఎక్స్’ పోస్ట్ లో వివరించారు. ‘ఓ రెడిట్ యూజర్ తన తండ్రి 1990లలో రూ.1లక్షకు కొన్న జేఎస్‌డబ్ల్యూ షేర్లను ఇటీవల కనుగొన్నాడు. ఇప్పుడు వాటి విలువ రూ.80 కోట్లు. సరైన సమయంలో కొనడం, అమ్మడానికి ఉన్న శక్తి ఇదే’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు సౌరవ్ దత్తా.ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొన్న షేర్ల విలువ ఇప్పుడు కోట్లలో ఉండటంతో ఇప్పుడు ఒక తరానికే సంపదను సృష్టించాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ఉన్న శక్తి ఏంటో తెలియజేస్తున్నాయి. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతూ ఈ పోస్ట్‌కు ప్రతిస్పందించారు. ఇక రిటైర్ అయి ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చని ఒకరు.. ఇది కేవలం పెట్టుబడి కాదు.. వారసత్వ సృష్టి.. అంటూ పలు విధాలుగా కామెంట్లు చేశారు.జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ దేశంలో ప్రముఖ ఉక్కు తయారీదారు. బలమైన మార్కెట్ ఉనికితో ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ షేరు ధర రూ.1004.90 వద్ద ఉండగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.37 లక్షల కోట్లుగా ఉంది. జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి.👉ఇది చదివారా? జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడుల ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరి కెరియర్ను ప్రారంభించిన యువత సేవింగ్స్‌పై ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలి. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్‌కు, ఇన్వెస్ట్‌మెంట్‌కు తప్పనిసరిగా కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పసి మనసులకు కావాలి ఆర్థిక పాఠాలు
మనీ మేనేజ్మెంట్ ఒక కళ. జీవితంలో సరైన సమయంలో సరైన ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సబ్జెక్టును పిల్లలకు దురదృష్టవశాత్తు పాఠశాలల్లో చాలా అరుదుగా నేర్పిస్తారు. పిల్లలు కూడా మనకెందుకులే ఇప్పుడే నేర్చుకోవడం అనే ధోరణితో ఉన్నారు. కానీ అది సరికాదు. పాఠశాలల్లో వీలుకాని ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్చుకోవాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కలిగి ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న వయసులో పిల్లలు నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.డబ్బు సంపాదనపై స్పష్టతజీవితంలో డబ్బు పాత్ర ఎమిటో వివరంగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎలా ఈ డబ్బు సంపాదిస్తారో స్పష్టత ఏర్పరుచుకోవాలి. అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారో ముందే అవగాహన కల్పించుకోవాలి. ఈ దశలోనే అవసరాలు, సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి.పొదుపుతో లాభాలురూపాయి ఖర్చు చేయడం మానేస్తే.. రూపాయి సంపాదించినట్లే.. ఈ సూత్రం పిల్లలు ఎప్పుడూ గుర్తించుకోవాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకోవాలి. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తున్నప్పుడు అమ్మానాన్నలు వచ్చే మనీని పొదుపు చేసి అత్యవసరమైన వస్తువులను వీరిపై ఆధారపడకుండా కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు డబ్బు విలువ అర్థం అవుతుంది.పెట్టుబడులపై అవగాహనపొదుపు, ఖర్చుపై అవగాహన వచ్చాక మెల్లిగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసేలా పిల్లల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పథకాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవరుచుకోవాలి.ఆర్థిక ప్రణాళికఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలన్న సూత్రాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో నేర్చుకోవాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. వంటి విషయాల్ని అవగాహన చేసుకోవాలి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలుఅప్పు గురించి తెలుసుకోవాలి..ఇంట్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాల కోసం తీసుకునే రుణాలకు సంబంధించిన వివరాలను పిల్లలు తెలుసుకోవాలి. ఎలాంటి సమయంలో అప్పు చేయాలి? అప్పు చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి.. అప్పు చేయకుండా ఉండాలంటే ఎలా మెదలాలి.. వంటి అంశాలను తెలుసుకోవాలి. -
ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలు
అందరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి అన్ని రకాలుగా సన్నద్ధులైన వేళ.. గవర్నమెంటు వారు రాతపూర్వకంగా గడువుతేదీని పొడిగించినట్లు సెలవిచ్చారు. ట్యాక్స్ ఆడిట్ కాని అన్ని కేసులకు గడువు తేదీ 2025 జులై 31. అన్ని ఫారాలను వరుసగా నోటిఫై చేశారు. నోటిఫై చేసిన తర్వాత తీరా రిటర్న్ ఫైల్ చేద్దామని వెళితే.. అంతా రెడీగా లేదు. అందరి ఉత్సాహం నీరుకారింది. అటు అసెస్సీలకు, ఇటు వృత్తి నిపుణులకు అసహనం, అనుమానం రెండూ ఏర్పడ్డాయి. అంతలోనే ఈ పొడిగింపు వార్త వచ్చింది. ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకు పొడిగించారంటే..1. ఫారాలు నోటిఫై చేశారు కానీ అప్డేటెడ్ ఫారాలు చాలా లేటుగా వచ్చాయి. 2. ఫైలింగ్ చేయడానికి ఉండే యుటిలిటీలు రెడీగా లేవు.3. ఇక్కడ చేయవలసింది పొడిగింపు కాదు. ఈ చర్య అనివార్యం కాదు. దానికి బదులుగా యుటిలిటీలను రెడీ చేయాల్సింది. ఎన్నో విషయాలు చకచకా చేసే ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబించిందో అంతుపట్టడం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి పొడిగింపు ఇవ్వకుండా/లేకుండా ఒక నిశ్చితమైన, నిర్దిష్టమైన వైఖరితో ఉంటూ ప్రభుత్వం ఒక మంచి సంప్రదాయాన్ని సృష్టించింది. అందరూ ఈ వైఖరిని మొదట్లో మెచ్చుకోక పోయినా, తర్వాత సర్దుకుని సద్దుమణిగారు. ఒక ముఖ్యమైన పని సకాలంలో జరిగిపోతుంది కదా అని సరదాపడ్డారు. యుటిలిటీని ఎనేబుల్ చేసి, అసెస్సీలను ఆకట్టుకుంటే ఎంతో బాగుండేది. ఒక సత్సంప్రదాయాన్ని మూడోసారి ముచ్చటగా కొనసాగించిన ఘనత దక్కించుకునే పరిస్థితుల్లో.. ఏకంగా 45 రోజులు పొడిగించారు. కొంత మంది సంతోషపడ్డారు. మరికొందరు సంబరపడ్డారు. కానీ పొడిగింపు అనేది పరిష్కారం కాదు. పని అలస్యం అవుతుందే తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు. పొడిగింపు అనగానే అందరు అసెస్సీలు ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుని పోస్ట్‌పోన్ చేస్తారు. ఆటోమేటిక్‌గా అన్నీ పోస్ట్‌పోన్ అయిపోతాయి. గత రెండు నెలల్లో చేయలేని యుటిలిటీలను ఎప్పుడు రెడీ చేస్తారు? ఎన్ని రోజుల్లో రెడీ చేస్తారు? డెవలప్మెంట్కి, ఇంటిగ్రేషన్‌కి, టెస్టింగ్‌కి వ్యవధి కావాలని సెంట్రల్ బోర్డ్ చెప్తోంది. అంటే వారికి నిర్దిష్టమైన ప్లాన్ ఉన్నా ఎప్పుడు రెడీగా ఉంటారో తెలియదన్నమాట.సాధారణంగా మే 31 తర్వాత టీడీఎస్ స్టేట్మెంట్లలో అన్ని పద్దులు కనిపిస్తాయి. అవి ఆలస్యం అవుతాయి. ఒకవేళ కనిపించినా, సిస్టమ్స్ రెడీగా లేవు. ఇంకో సమస్య ఏమిటంటే, ట్యాక్స్ ఆడిట్‌కి గడువు తేదీ 2025 సెప్టెంబర్ 30. ఈ గడువు తేదీని కూడా పొడిగిస్తారా అనేదానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వృత్తి నిపుణులు జులై 31 తర్వాత ట్యాక్స్ ఆడిట్ కేసులను చేపడతారు. ఇప్పుడు రెండు గడువు తేదీలకు పదిహేను రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీని వల్ల పని ఒత్తిడి. మానసిక ఒత్తిడి. టైం చాలకపోవడం.. తప్పులు దొర్లే అవకాశం.. ఇలా ఎన్నో ఉన్నాయి.ఇదీ చదవండి: సెబీ పేరుతో మోసాలుట్యాక్స్ ఆడిట్ కేసుల విషయంలో పొడిగింపు లేదు. విద్యార్థులు పరీక్షలు నిర్వహించే తేదీ పొడిగించగానే ముందు సంతోషిస్తారు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. నిజానికి ఆ పొడిగింపు వల్ల వారి శ్రమ రెట్టింపైందని. ఈ పొడిగింపు కూడా అలాంటిదే. గడిచిన సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని ఎంత కాలం సేకరిస్తూ కూర్చుంటారు. తినగ తినగ వేము తియ్యనుండులాగా ఇదేమీ పరిపక్వతకు సంబంధించిన విషయం కాదు. నైపుణ్యాలు, నాణ్యత పెరగవు. కానీ మీరు మాత్రం రెడీగా ఉండక తప్పదు. యుటిలిటీలు రెడీ కాగానే ఫైల్ చేయండి. వారు అడుతున్న సమాచారం మీ చేతిలో ఉందని బలమైన నమ్మకంతో ఉండండి. -
భారీ ఏయూఎం ఉన్న స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ఒక స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) భారీ స్థాయికి చేరితే.. అది పనితీరును ప్రభావితం చేస్తుందా? ఏయూఎం ఏ స్థాయి వరకు ఉంటే సురక్షితం? – రజత్స్మాల్క్యాప్ పథకాలు పెద్ద స్థాయికి చేరితే పెట్టుబడుల ఆలోచనల పరంగా సమస్యను ఎదుర్కొంటాయి. స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ల నిర్వహణ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వేర్వేరు మేనేజర్లు నిర్వహించే వివిధ లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలిస్తే వాటి పోర్ట్‌ఫోలియోలో ఏకరూపత 80 శాతం మేర ఉంటుంది. ఎందుకంటే లార్జ్‌క్యాప్ ఫండ్స్ ప్రధానంగా టాప్–100 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌తో మరో వెసులుబాటు ఏంటంటే లిక్విడిటీ సమృద్ధిగా ఉంటుంది. ఒకే రోజు రూ.100–200 కోట్ల పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించినా గానీ పెద్దగా వ్యయ ప్రభావం పడదు. స్మాల్‌క్యాప్ విషయంలో ఈ సానుకూలతలు ఉండవు. ఎందుకంటే చాలా స్మాల్ క్యాప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,000–1,500 కోట్ల స్థాయిలోనే ఉంటుంది. రూ.100–200 కోట్ల నిర్వహణ ఆస్తులు నిర్వహించే ఫండ్స్ ఈ తరహా చిన్న కంపెనీల్లో చెప్పుకోతగ్గ మేర వాటాను తీసుకోగలవు.కానీ ఎక్కువ స్థాయిలో ఏయూఎం ఉన్న స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు చిన్న కంపెనీలో 5 శాతం వాటా తీసుకోవడం సాధ్యపడదు. అంతేకాదు ఆ వాటాలను విక్రయించడం కూడా సమస్యగా మారుతుంది. కనుక స్మాల్‌క్యాప్ పథకంలో పెట్టుబడుల నిర్వహణ చాలా కష్టం. ఒక్కసారి ఏయూఎం పరంగా స్మాల్‌క్యాప్ ఫండ్ పెద్దగా మారిపోతే.. అప్పుడు ఎన్నో కొత్త ఆలోచనలు చేయాల్సి వస్తుంది. లిక్విడిటీ పరంగా చూసినా ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అన్ని కంపెనీలను గుర్తించడం కూడా సవాలే. వ్యాల్యూయేషన్లు ఖరీదుగా లేని కంపెనీలను గుర్తించడం కోసం ఎంతో శ్రమించాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో విజేతలైన పథకాలకు పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతుంటుంది. స్మాల్‌క్యాప్ ఫండ్ మంచి రాబడులను చూపిస్తే అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో ఏయూఎం ఇంకా పెద్దది అవుతుంది. పనితీరుపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.ఇదీ చదవండి: చదువు కొంటున్నారా?ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో ఏది మెరుగైనది? – దినేష్ జనార్దన్వ్యయాల పరంగా చూస్తే ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) పథకాలకు అనుకూలత ఎక్కువ. 5–7 బేసిస్ పాయింట్లకే ఈటీఎఫ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో 10–15 బేసిస్ పాయింట్ల ఎక్స్పెన్స్ రేషియోకి సేవలు అందించే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు సైతం ఉన్నాయి. వ్యయాల పరంగా ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. లిక్విడిటీ పరంగా చూస్తే, ఇండెక్స్ ఫండ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈటీఎఫ్‌ల విషయంలో లిక్విడిటీ వివిధ పథకాల మధ్య కొంత భిన్నంగా ఉండొచ్చు. కొన్ని పథకాలు రోజువారీగా అధిక వ్యాల్యూమ్ (పరిమాణం)లో ట్రేడ్ అవుతుంటాయి. కనుక ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆయా పథకాల ట్రేడింగ్ పరిమాణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఈటీఎఫ్ కోసం తెరవాల్సిన శ్రమ తప్పుతుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలున్న వారికి ఈటీఎఫ్‌లు కూడా మెరుగైన ఎంపికే అవుతుంది. -
జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..
సాంకేతిక పురోగతి, మారుతున్న సంస్థల అవసరాలతో ఉద్యోగ అన్వేషణ తీరులో వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలను నిర్ణయించడానికి కంపెనీలు రెజ్యూమెలు, ఇంటర్వ్యూలను దాటి వెతుకుతున్నాయి. చాలా సంస్థలు ఇప్పుడు అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాన్ని అంచనా వేయడానికి వారి క్రెడిట్ స్కోర్‌ను కూడా తనిఖీ చేస్తున్నాయి. ఇది నేరుగా ఉద్యోగ పనితీరుతో సంబంధం లేనప్పటికీ, అభ్యర్థి ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు సూచికగా క్రెడిట్ స్కోర్‌ను యాజమాన్యాలు పరిగణిస్తున్నాయి.అయితే ప్రతి కంపెనీ ఉద్యోగార్థుల క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేయదు కానీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం ఈ వైఖరిని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటే నియామక ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలు అభ్యర్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ కసరత్తును నిర్వహించడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలను సైతం నియమించుకుంటున్నాయి.జాబ్ అప్లికేషన్‌పై క్రెడిట్ స్కోర్ ప్రభావంక్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య, దీనిని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి తరచుగా ఉపయోగిస్తాయి. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అనుకూలమైన వడ్డీ రేటుతో రుణాలు త్వరగా ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇది మీ రుణ అర్హత గురించి రుణదాతకు హామీ ఇస్తుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తిరిగి చెల్లంచగలరు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులను మిస్ అయ్యారని, అవసరానికి మించి అప్పు తీసుకున్నారని లేదా రుణాలను డిఫాల్ట్ చేశారని చూపిస్తుంది. దీని వల్ల డబ్బు దొంగిలించడం, డేటా లీక్ చేయడం లేదా మోసానికి పాల్పడటం వంటి విషయాలకు మీరు ఎక్కువగా గురవుతారని కంపెనీ యజమాన్యం అనుకోవచ్చు.ఒక కంపెనీ మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేసిందంటే.. మీరు రుణాలు, క్రెడిట్ కార్డులు, బిల్లు చెల్లింపులను ఎంత బాగా నిర్వహించారు వంటి మీ గత ఆర్థిక ప్రవర్తనను చూస్తోందని అర్థం. మీరు అప్పుల్లో ఉంటే, మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడం లేదని ఇది సూచిస్తుంది.👉ఇదీ చదవండి: టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!తక్కువ క్రెడిట్ స్కోర్ మీరు పనిలో చాలా పరధ్యానంలో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇది తప్పులు చేయడానికి, గడువులను కోల్పోవటానికి దారితీస్తుంది. ఆర్థిక విషయాలను నిర్వహించే పాత్రలకు, మీరు సరైన వ్యక్తి కాదని కంపెనీలు భావించవచ్చు.క్రెడిట్ స్కోరు మీ ఉద్యోగ దరఖాస్తును నేరుగా ప్రభావితం చేయదు కానీ, కొన్నిసార్లు ఇది కొన్ని రంగాలలో నియామక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సున్నితమైన ఆర్థిక విషయాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని భరోసా ఇవ్వడానికి తమ క్రెడిట్ స్కోర్‌ను షేర్ చేయాలని కంపెనీలు అడగవచ్చు. -
టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!
దేశంలో టీనేజర్లు అప్పులు చేస్తున్న ధోరణి ఇటీవల పెరుగుతోంది. భారత యువత ముఖ్యంగా టీనేజర్లు అప్పుల కోసం డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు, క్రెడిట్ కార్డులు, ఇతర అనధికారిక మార్గాలను ఆశ్రయిస్తున్నారు. రుణ ప్రాప్యత ఆర్థిక సౌలభ్యాన్ని అందించినప్పటికీ, ఆర్థిక అవగాహన అంతగా లేని యువ రుణగ్రహీతలకు ముప్పును కూడా కలిగిస్తుంది.పైసాబజార్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మూడు తరాలలో మొదటిసారి అప్పు తీసుకునే సగటు వయస్సు 21 సంవత్సరాలకు తగ్గింది. చాలా ఆలస్యంగా రుణాలు తీసుకోవడం ప్రారంభించిన మునుపటి తరాలతో పోలిస్తే, నేటి యువత ఇప్పుడు వారి క్రెడిట్ ప్రయాణాలను 20 ల మధ్యలో ప్రారంభిస్తున్నారు. "బై నౌ, పే లేటర్" వంటి పథకాలు, స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు పెరగడం వల్ల రుణాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఏదేమైనా, భారతీయ యువతలో ఆర్థిక అవగాహన తక్కువగా ఉంది, రుణ నిర్వహణపై చాలా మందికి ఆచరణాత్మక పరిజ్ఞానం లేదు.రిస్క్‌లు, పర్యవసానాలురుణ ఉచ్చులు: అధిక వడ్డీ రేట్లు, దాచిన రుసుములు దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి.ఆర్థిక ఒత్తిడి: పేలవమైన ఆర్థిక ప్రణాళిక, అధిక రుణాలు ఆందోళనకు కారణమవుతాయి. మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి.క్రెడిట్ స్కోర్ డ్యామేజ్: తప్పిన చెల్లింపులు క్రెడిట్ స్కోర్లను దెబ్బతీస్తాయి. ఇది భవిష్యత్తు ఆర్థిక అవకాశాలను ప్రభావితం చేస్తుంది.మితిమీరిన రుణాలు: అనియంత్రిత రుణాలు వ్యక్తులకు, ఆర్థిక పరిశ్రమకు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి.బాధ్యతాయుతమైన రుణం.. జాగ్రత్తలుఫైనాన్షియల్ ఎడ్యుకేషన్: బాధ్యతాయుతమైన రుణాలు, ఆర్థిక నిర్వహణపై పాఠశాలలు, తల్లిదండ్రులు టీనేజర్లకు అవగాహన కల్పించాలి.బడ్జెట్ నైపుణ్యాలు: ఖర్చులను ట్రాక్ చేయడానికి, వాస్తవిక తిరిగి చెల్లించే ప్రణాళికలను సెట్ చేయడానికి యువ రుణగ్రహీతలను ప్రోత్సహించడం.రుణ నిబంధనలను అర్థం చేసుకోవడం: రుణం తీసుకునే ముందు, టీనేజర్లు వడ్డీ రేట్లు, ఫీజులు, తిరిగి చెల్లించే పరిస్థితులను క్షణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి.రుణాన్ని పరిమితం చేయండి: అవసరమైనప్పుడు మాత్రమే రుణం తీసుకోండి. ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోవడం మానుకోండి.మార్గదర్శకత్వం పొందండి: ఆర్థిక సలహాదారులు లేదా మార్గదర్శకులను సంప్రదించడం టీనేజర్లకు సమాచారంతో కూడిన రుణ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. -
గోల్డ్ లోన్ కొత్త రూల్స్ ఖరారు..
బంగారు, వెండి వస్తువులు, ఆభరణాల తాకట్టుపై ఇచ్చే రుణాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖరారు చేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలకు తుది మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు (పేమెంట్ బ్యాంకులు మినహా), సహకార బ్యాంకులు (అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌ఎఫ్‌సీలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.నూతన మార్గదర్శకాలు ఇవే.. బ్యాంకులు, రుణ సంస్థలు గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) యూనిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణాన్ని మంజూరు చేయకూడదు.బంగారం యాజమాన్యం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు దానిపై రుణాలు మంజూరు చేయకూడదు. బంగారం సదురు వ్యక్తిదేనా అని రుజువు చేసే డాక్యుమెంట్ గానీ, డిక్లరేషన్ గానీ రుణగ్రహీత నుంచి తీసుకోవాలి.ఇప్పటికే తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండిపై మళ్లీ రుణాలు మంజూరు చేయకూడదు.వాల్యుయేషన్ విషయానికి వస్తే, పూచీకత్తుగా స్వీకరించిన బంగారం లేదా వెండిని దాని వాస్తవ స్వచ్ఛతకు (క్యారెట్లు) సంబంధించిన రిఫరెన్స్ ధర ఆధారంగా అంచనా వేయాలి. ఇందుకోసం బంగారం లేదా వెండి తాకట్టుకు వచ్చిన మునుపటి 30 రోజుల సగటు ముగింపు ధర లేదా క్రితం రోజు ముగింపు ధరను పరిగణనలోకి తీసుకోవచ్చు.ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజేఏ) లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రించే కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రచురించిన విధంగా దీనిని ఉపయోగించాలి.ఇక బంగారంపై ఎంత అప్పు ఇవ్వచ్చన్న దానికి సంబంధించి గరిష్ట లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తుల విషయానికి వస్తే.. రూ.2.5 లక్షలు, అంత కంటే తక్కువ రుణం తీసుకునేవారికి తాకట్టు పెట్టే బంగారం విలువలో 85 శాతం లోన్‌గా ఇస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలు దాటితే 75 శాతం రుణంగా ఇస్తారు.తాకట్టుగా తీసుకునే బంగారం ఆభరణాల రూపంలో అయితే 1 కేజీ, కాయిన్ల రూపంలో అయితే 50 గ్రాములు మించకూడదు.ఒకవేళ రుణం తిరిగి చెల్లించని పక్షంలో సెక్యూరిటీగా తీసుకున్న బంగారం, వెండి వస్తువులు వేలం వేసే ప్రక్రియ గురించి రుణ గ్రహీతకు ముందే తెలియజేయాలి.రుణం తిరిగి చెల్లించిన వెంటనే తాకట్టులో ఉన్న బంగారం, వెండి వస్తువులను రుణగ్రహీతకు అప్పగించాలి. 7 పని దినాల్లో వస్తువులు విడుదల చేయకపోతే రోజుకు రూ.5000 చొప్పున పెనాల్టీని రుణగ్రహీతకు చెల్లించాలి. -
వెర్రి పనులు చేస్తారు.. కానీ వెర్రి ఉండదు
డబ్బుతో కొంత మంది వెర్రిపనులు చేస్తారు. కానీ ఎవరికీ వెర్రి ఉండదు. కొందరు అప్పు చేసి మరీ మనీని లగ్జరీ వస్తువులకు వాడుతుంటారు. ఖరీదైన వాహనాలు, బట్టలు, పర్యటనలు.. ఇలా అన్నింటిని అప్పుతో కానిచ్చేస్తుంటారు. ఇంకొందరు ఎంత మిగులు డబ్బున్నా ఆర్భాటాలకు పోకుండా పొదుపుపైనే దృష్టి సారిస్తూ అత్యవసరం అయితే తప్పా డబ్బును ఖర్చు చేయకుండా జాగ్రత్త పడుతారు. తర్వాతి తరాలకు సంపదను పోగు చేసి ఇస్తారు. పొదుపు, ఖర్చులకు సంబంధించి మనుషుల్లో విభిన్న మనస్తత్వాలుంటాయి. అందుకు చాలా కారణాలున్నాయి.వివిధ తరాల మనుషులు వేర్వేరు ఆదాయాలు, విభిన్న విలువలు, వేరైన పరిస్థితుల్లో పెరిగిన వారు ఉంటారు. వాళ్ళందరూ ప్రపంచంలో విభిన్న ప్రదేశాలకు చెందినవారు. వేర్వేరు ఆర్థిక పరిస్థితుల్లో జన్మించినవారు. వారి ఉద్యోగ, సామాజిక స్థితులు భిన్నంగా ఉండవచ్చు. దానితోపాటు వారికి కలిగే ప్రేరణలు, అవకాశాలు కూడా విభిన్నంగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో వారు నేర్చుకునే జీవిత, ఆర్థిక పాఠాల్లో చాలా తేడాలుంటాయి.ప్రపంచంలో డబ్బుకు సంబంధించి ప్రతి ఒక్కరి అనుభవం విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఎవరో చెబితే విన్నదానికంటే ప్రత్యక్ష అనుభవానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బు విషయంలో ప్రత్యేకమైన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నాం. ఒకరి అభిప్రాయాలకు మరొకరి అభిప్రాయాలతో పొంతన ఉండకపోవచ్చు. ఎదుటివారి పనులు చాలా మందికి తలతిక్కగా కనిపించవచ్చు. అయితే డబ్బు విషయంలో అంతిమంగా వ్యక్తులు ఎంత పోగు చేస్తున్నారు.. ఎంత ఖర్చు చేస్తున్నారనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒకటో తేదీ వచ్చిందంటే వణుకుస్వీయ అనుభవంతోనే అంతా నేర్చుకోవాలని చూస్తే జీవితకాలం సరిపోదని గుర్తుంచుకోవాలి. డబ్బుకు సంబంధించి ఎదుటి వ్యక్తుల అనుభవాలు, అందుకు మీ పొదుపు ఆలోచనలు జోడించి ముందుకు సాగాలని సూచిస్తున్నారు. డబ్బును గౌరవించి సమర్థంగా పొదుపు, ఖర్చు చేస్తేనే అది కాపాడుతోందని చెబుతున్నారు. -
కుర్రకారూ.. పడొద్దు బోల్తా..!
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపులు భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ చెల్లింపులదే ఆధిపత్యం. ముఖ్యంగా టీనేజర్లు, కుర్రకారు ఎక్కువగా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. దాదాపు అందరికీ యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసు. కానీ మోసాలకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై చాలా మంది దృష్టి పెట్టడం లేదు. ఆన్లైన్ లావాదేవీలను లక్ష్యంగా చేసుకునే మోసాలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.తాజా నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ప్రకారం, 15-29 సంవత్సరాల వయసువారిలో దాదాపు 99.5 శాతం మందికి యూపీఐ లావాదేవీలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఇది డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా స్వీకరించడాన్ని హైలైట్ చేస్తున్నప్పటికీ, స్కామర్లు సైతం తమ వ్యూహాలను అమాయక యూజర్లను మోసం చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.యూపీఐ లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?మోసాన్ని నివారించడానికి వినియోగదారులు ఈ భద్రతా ప్రోటోకాల్స్ పాటించాలని అధికారులు, ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.యూపీఐ పిన్ షేర్ చేయకండి: సైబర్ నేరగాళ్లు తరచూ బ్యాంకు అధికారులు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ వినియోగదారులను మోసం చేస్తుంటారు.లావాదేవీ లింక్‌లను సరిచూసుకోండి: స్కామర్లు చట్టబద్ధమైన ప్లాట్ ఫారమ్ లను అనుకరించే నకిలీ యూపీఐ చెల్లింపు లింక్ లను పంపవచ్చు. లావాదేవీలను ఆమోదించడానికి ముందు ఎల్లప్పుడూ క్రాస్ చెక్ చేయండి.పేమెంట్ రిక్వెస్ట్‌ల పట్ల జాగ్రత్త: తెలియని వ్యక్తుల నుంచి పేమెంట్ రిక్వెస్ట్‌లు వచ్చినప్పుడు వాటికి స్పందించే ముందు సోర్స్‌ను చెక్ చేసుకోండి.అధికారిక యాప్‌లు, ప్లాట్ ఫామ్ ఉపయోగించొద్దు: భద్రతా ప్రమాదాలను తగ్గించడానికి ధ్రువీకరించిన బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరిగేలా చూసుకోండి.అకౌంట్లో ఏం జరుగుతోందో చూసుకోండి: యూపీఐ లావాదేవీలను ట్రాక్ చేయడం అనధికార చెల్లింపులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. -
వెండిపై ‘రిచ్‌డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి సంచలనం
బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా తారా స్థాయికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 13 ఏళ్ల తర్వాత వెండి ధర ఔన్స్‌కు కొత్త గరిష్టం 35 డాలర్లు దాటింది. 2012 ఫిబ్రవరి తర్వాత వెండి ధర ఇదే అత్యధికం. శుక్రవారం (జూన్ 6) 36 డాలర్లకు పైగా ట్రేడ్ అయిన వెండి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రిచ్‌డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై సంచలన అంచనాను వెల్లడించారు.వెండి ధర అకస్మాత్తుగా పెరగడానికి కారణమేమిటో ప్రస్తుతానికి తెలియలేదు. కానీ చాలా మంది మార్కెట్ విశ్లేషకులు, పరిశ్రమ నిపుణులు ఇది పూర్తిగా 'నిష్పత్తి ట్రేడింగ్' అని పిలుస్తున్నారు. అంటే బంగారం-వెండి నిష్పత్తి 100కు దిగువకు రావడమే వెండి ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.బంగారం-వెండి నిష్పత్తి అంటే.. ఒక ఔన్స్ బంగారంతో ఎన్ని ఔన్సుల వెండి కొనొచ్చే తెలిపే ఆర్థిక ప్రమాణాన్ని బంగారం-వెండి నిష్పత్తిగా పేర్కొంటారు. దీని దీర్ఘకాల సగటు 70 కాగా జనవరి నుంచి 100 వద్ద ఉంటూ వస్తోంది. నేడు (జూన్ 6న) బంగారం-వెండి నిష్పత్తి 93.33 వద్ద చలించింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్స్‌కు 3,360 డాలర్లు, వెండి ధర 36 డాలర్లుగా ఉంది. బంగారం-వెండి నిష్పత్తిలో ఈ భారీ పతనమే ఇప్పుడు వెండి ధరలను ప్రేరేపించిందని తెలుస్తోంది.రాబర్ట్ కియోసాకి ఏమన్నారంటే.. తన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా ప్రసిద్ధి చెందిన రచయిత, ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి వెండి, బంగారంపై పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ మధ్య బిట్ కాయిన్లపై ఇన్వెస్ట్ చేయడాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ప్రస్తుతం వెండి ధర ఔన్స్‌కు 35 డాలర్లను తాకిన తరుణంలో రాబర్ట్ కియోసాకి ఓ సంచలన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "వెండి ఈ రోజు ఉత్తమ బేరం అని నేను నమ్ముతున్నాను. సిల్వర్ ఈ ఏడాది డబుల్ అంటే 70 డాలర్లు కావొచ్చని భావిస్తున్నాను'' అని ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్‌లో పేర్కొన్నారు.ఒక్క రోజే రూ.4వేలు పెరిగిన వెండిదేశంలో వెండి ధరలు అమాంతం ఎగిశాయి. శుక్రవారం (జూన్ 6) ఒక్కరోజే వెండి ధర కేజీకి రూ. 4వేలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో కేజీ వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. మరోవైపు హైదరాబాద్ ప్రాంతంలో కేజీ వెండి రూ.4వేలు ఎగిసి రూ.1,17,000లను తాకింది. -
ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇక నేరుగా లోన్లు..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి రిజర్వ్ బ్యాంక్ నుంచి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) లైసెన్సు లభించింది. ఈ ఏడాది మార్చిలో ఆర్బీఐ దీన్ని మంజూరు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్ దీన్ని ధ్రువీకరించినప్పటికీ, ఇతర వివరాలను వెల్లడించలేదు.ఎన్బీఎఫ్సీ లైసెన్సు లభించడంతో ఇకపై కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ నేరుగా రుణాలు అందించేందుకు వీలు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కి ప్రస్తుతం 80 శాతం వాటాలు ఉన్నాయి. త్వరలో ఐపీవోకి వచ్చే యోచనలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ తమ హోల్డింగ్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.ఈ ఎన్బీఎఫ్సీ లైసెన్సు ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్థిక సేవల రంగంలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. ముఖ్యంగా డిజిటల్ రుణాలు, క్రెడిట్ ఉత్పత్తులు, కస్టమర్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు సౌలభ్యం కల్పిస్తుంది. భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఈ లైసెన్సు ఫ్లిప్‌కార్ట్‌కు పోటీలో ముందంజలో ఉండటానికి, వినియోగదారులకు సమగ్ర సేవలను అందించడానికి సహాయపడుతుంది. -
ఏడిపించే ఏడు ఆర్థిక సమస్యలు
ఆర్థిక స్వాతంత్ర్యం చాలా మంది యువకుల కల. కానీ సమర్థమైన డబ్బు నిర్వహణ అలవాట్లు కొరవడడంతో సంపాదన మొదలుపెట్టిన ప్రాథమిక దశలోనే యువతకు ఆర్థిక కష్టాలు తప్పడంలేదు. అయితే సరైన ప్రణాళికతో ఈ ఇబ్బందులను గట్టెకవచ్చని నిపుణులు చెబుతున్నారు. సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. యువత సాధారణంగా ఎలా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారో.. దాని నుంచి ఎలా బయటపడవచ్చో కింది ఏడు సమస్యలు-పరిష్కారాల ద్వారా తెలుసుకుందాం.1. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడంచాలా మంది యువతకు బడ్జెట్, రుణ నిర్వహణ, పెట్టుబడి వంటి ముఖ్యమైన ఆర్థిక నైపుణ్యాలు ఉండవు. అవకాశం ఉన్నా వాటిని నేర్చుకోవాలనే స్పృహ ఉండదు. పాఠశాలలు, కళాశాలల్లోనూ నిజ జీవితంలోని ఆర్థిక పరమైన సమస్యలపై అరుదుగా బోధిస్తారు. దానికితోడు యువత స్థిరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతుంది.పరిష్కారం: టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వివిధ మాధ్యమాల ద్వారా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్, ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి... వంటి చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో మంచి పుస్తకాన్ని ఎంచుకొని ప్రాథమికంగా అందులోని అంశాలను నేర్చుకోవాలి.2. అధిక వ్యయం, జీవనశైలి ద్రవ్యోల్బణంసామాజిక మాధ్యమాలతో లాభాలున్నట్లే నష్టాలున్నాయి. యువత ప్రధానంగా ప్రస్తుతం అనుసరిస్తున్న సోషల్ మీడియా అకౌంట్ల్లో తోటివారిలాగా తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి బట్టలు, ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు.. వంటివి కొనుగోలు చేస్తున్నారు. తోటివారి నుంచి ఏర్పడే పరోక్ష ఒత్తిడి ద్వారా శక్తికి మించి ఖర్చు చేయడానికి సోషల్ మీడియా అవకాశం కల్పిస్తుంది.ఉదా: రూ.30,000 సంపాదించే వ్యక్తి సోషల్‌మీడియా ప్రభావం ద్వారా రూ.25,000 ఖర్చు చేసే అవకాశం ఉంది. దాంతో పొదుపునకు పరిమిత అవకాశం ఉంటుంది.పరిష్కారం: 50/30/20 నియమాన్ని అనుసరించాలి. అంటే అవసరాలకు 50%, కోరికలకు 30%, పొదుపునకు 20% ఖర్చులతో బడ్జెట్ రూపొందించుకోవాలి.3. నియంత్రించలేని రుణం, క్రెడిట్ కార్డు దుర్వినియోగంక్రెడిట్ కార్డులు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి. కానీ వాటి దుర్వినియోగం అధిక వడ్డీలకు కారణం అవుతుంది. సులభంగా ఉన్నట్లు కనిపించే ‘బై నౌ, పే లేటర్ (బీఎన్‌పీఎల్)’ పథకాలు యువతను ఖర్చుల వైపు లాగేస్తున్నాయి. నెలల తరబడి చెల్లించని రూ.50,000 క్రెడిట్ కార్డు బిల్లు అధిక వడ్డీ కారణంగా రూ.70,000 అయ్యేందుకు అవకాశం ఉంటుంది.పరిష్కారం: ప్రణాళికాబద్ధమైన ఖర్చులకు మాత్రమే క్రెడిట్ కార్డులను ఉపయోగించాలి. వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి ప్రతి నెలా బిల్లులను పూర్తిగా చెల్లించాలి. అత్యవసరమైతే తప్ప బీఎన్‌పీఎల్‌కు దూరంగా ఉండాలి.4. పొదుపు చేయకపోవడంఅత్యవసర నిధి లేకుండా యువకులు వైద్య బిల్లులు, ఉద్యోగం కోల్పోవడం లేదా అత్యవసర ప్రయాణం వంటి ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు. వాటిని పూడ్చేందుకు చాలా మంది అప్పులు చేయడం లేదా ఖరీదైన రుణాలు తీసుకోవడం చేస్తుంటారు.పరిష్కారం: కనీసం 3-6 నెలల సరిపడా ఖర్చులను ప్రత్యేక అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. అవసరం లేని కొనుగోళ్ల కోసం అప్పుల్లో మునిగిపోవద్దు.5. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లేకపోవడంచాలా మంది యువత మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి సంపదను పెంచే అవకాశాల్లో పెట్టుబడి పెట్టడానికి బదులు డబ్బును పొదుపు ఖాతాలు, ఇతర సాధానాల్లో ఉంచుతారు. ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం వల్ల కాలక్రమేణా కాంపౌండింగ్ ప్రయోజనాలు తగ్గుతాయి.పరిష్కారం: దీర్ఘకాలిక వృద్ధి కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించాలి. స్టాక్స్, ఈటీఎఫ్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులను వైవిధ్యపరచాలి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు రిస్క్, రిటర్న్‌లపై స్పష్టత ఉండాలి.6. స్కామ్‌ల బారిన పడడంవేగంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువ పెట్టుబడిదారులు తరచుగా పోంజీ పథకాలు(మోసపూరిత స్కీమ్‌లు), క్రిప్టో స్కామ్‌లు, నకిలీ స్టాక్ చిట్కాలకు మొగ్గుచూపుతారు. సరైన పరిశోధన లేకుండా కష్టపడి సంపాదించిన పొదుపును కోల్పోతున్నారు.పరిష్కారం: పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లను సరిచూసుకోవాలి. ఆథరైజ్డ్ ఆర్థిక నిపుణుల సలహాలు పాటించి సొంతంగా నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యా7. పన్ను ప్రణాళికలు విస్మరించడంచాలా మంది ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పన్ను ఆదా పథకాలను ఉపయోగించకపోవడం వల్ల అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఆదాయం తగ్గుతుంది.పరిష్కారం: పొదుపు, పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి సెక్షన్ 80 సీ ఆప్షన్లను ఉపయోగించాలి. పన్నులను కచ్చితంగా సమయానికి దాఖలు చేయాలి. -
ఆర్బీఐ ఒక్క నిర్ణయం.. హోమ్‌లోన్ ఈఎంఐ తగ్గింపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. తర్వాత మరోసారి ఏప్రిల్‌లో మరో 25 పాయింట్లు కోత విధించింది. తాజాగా శుక్రవారం 50 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.గృహ రుణంపై ఊరట ఎంతంటే..?ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.5 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.21,696 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ అర శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.20,911కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.785 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.1,88,299 మిగులుతుంది. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యారెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. -
ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలు
పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత నేర్పించడం చాలా ముఖ్యం. ఈ వేసవి సేలవుల్లో తల్లిదండ్రులు విభిన్న వయసు కలిగిన పిల్లలు, యువతకు వైవిధ్యంగా, ఆకర్షణీయంగా డబ్బుకు సంబంధించిన అంశాలను తెలియజేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో మనీ మేనేజ్మెంట్ విషయాలపై బలమైన పునాది నిర్మిస్తే పొదుపు, దీర్ఘకాలంలో సమకూరే ప్రయోజనాలపై స్పష్టత ఏర్పడుతుంది. వయసు వారీగా పిల్లలకు ఎలా డబ్బు అంశాలు తెలియజేయాలో చూసేద్దాం.వయసు 3–5 ఏళ్లునాణేలు, కరెన్సీని గుర్తించడంపై అవగాహన కల్పించాలి. డబ్బు ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చని అర్థం చేయించేలా అవసరాలు, ఆ అవసరాల మధ్య తేడాను గుర్తించేలా చెప్పేందుకు ప్రయత్నించాలి. కథలు చెప్పడం, ఆడించడం లేదా నాటకం రూపంలో దుకాణంలో వస్తువులను కొనుగోలు చేయడం, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం.. వంటి వాటిని తెలియజేయాలి.వయసు 6–13పొదుపు చేయడం, ఖర్చు చేయడం, ఈ రెండింటి మధ్య తేడాలు, ఖర్చు అధికమైతే కలిగే నష్టాలను చెప్పాలి. బేసిక్ బడ్జెటింగ్ సూత్రాలు చెప్పాలి. పిల్లలు ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బు ఎలా వస్తుందో చెబుతూ.. ఇంట్లో చిన్నచిన్న పనులు చేయమని చెప్పాలి. అందుకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వండి. దాంతో రెండు ప్రయోజనాలుంటాయి. డబ్బు సంపాదించేందుకు ఎంత కష్టపడాలో తెలుస్తుంది. దాన్ని ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తారు. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేసిన తర్వాత ఏదైనా అత్యవసర సమయాల్లో మనీ కావాలంటే మళ్లీ కష్టపడాల్సి వస్తుందనే భావనను తెలియజేయాలి. పొదుపుపై అవగాహన పెంచాలి. డబ్బును కిట్టీ బ్యాంకులో జమ చేయడం అలవాటు చేయాలి.టీనేజ్ (14+)క్రెడిట్, వడ్డీ, పెట్టుబడి, పన్నుల గురించి చర్చించాలి. బ్యాంక్ స్టేట్మెంట్ చదవడం లేదా యాప్‌లు, స్ప్రెడ్ షీట్లను ఉపయోగించి ఖర్చులను ట్రాక్ చేయడం ఎలాగో నేర్పించాలి.షాపింగ్ వెళ్తున్నారా..వేసవి సెలవులు ఇంకొన్ని రోజుల్లో ముగుస్తాయి. పుస్తకాలు, బట్టలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు పిల్లలు తల్లిదండ్రులతో షాపింగ్‌మాళ్లకు వెళ్తుంటారు. దుకాణాల వద్ద ధరలను గమనించాలి. డిస్కౌంట్లను చర్చించాలి. బ్రాండ్లలో ఉండే తేడాలు పరిశీలించాలి. లోకల్ షాపులోనూ అదే తరహా వస్తువులు లభిస్తాయి. కానీ రెండింటి మధ్య తేడాలేమిటో అడిగి తెలుసుకోవాలి. ఇతర దేశాల వస్తువులపై ఏమేరకు పన్నులు విధిస్తున్నారో తెలుసుకోవాలి. ఆ పన్నుల వల్ల కంపెనీలు, వినియోగదారులపై కలిగే ప్రభావాలను గమనించాలి.ఇదీ చదవండి: బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులుపిల్లలు బడ్జెట్ తయారు చేసుకోవాలి. బడ్జెట్ సమయంలో 50-30-20 నియమాన్ని పాటించాలి. అంటే నిత్యం అవసరాల కోసం చేసే తప్పనిసరి ఖర్చుకు మొత్త రాబడిలో 50 శాతం, కోరికల కోసం 30 శాతం, పొదుపునకు మరో 20 శాతం కేటాయించాలి. కుటుంబ బడ్జెట్ రాసేప్పుడు పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం కావాలి. -
బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులు
చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించిన కొద్ది నెలల్లోనే బ్యాంకు సిబ్బంది ఫోన్ చేసి ‘సర్.. క్రెడిట్ కార్డు తీసుకుంటారా? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైఫ్ టైమ్ ఫ్రీ.. మీ శాలరీ బేస్ చేసుకుని కార్డు ఇస్తున్నాం’ అని చెబుతుంటారు. డబ్బు అవసరం లేనివారికి ఈ కార్డు ఒక వనరుగా పనిచేస్తే.. మనీ నిత్యం అవసరం ఉండేవారికి మాత్రం ఇదో సంకటంగా మారతుందనే వాదనలున్నాయి. ఏదేమైనా క్రెడిట్ కార్డు వాడుతుంటే రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ రూపంలో ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఎలాంటి ప్లాయింట్లు అందిస్తున్నాయో తెలుసుకుందాం.క్యాష్ బ్యాక్ & రివార్డు పాయింట్లుఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్: ఆన్ లైన్ ఖర్చులపై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది.అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ప్రైమ్ మెంబర్లకు 5% క్యాష్ బ్యాక్‌తో ఎలాంటి ఛార్జీలు లేకుండా లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డు.హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు: షాపింగ్, డైనింగ్‌పై క్యాష్ పాయింట్స్ అందిస్తుంది.ట్రావెల్ & లాంజ్ యాక్సెస్ కార్డులుహెచ్డీఎఫ్సీ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్: అపరిమిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, అధిక రివార్డు పాయింట్లు అందిస్తుంది.యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డు: అపరిమిత దేశీయ, అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్ ఇస్తున్నారు.యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్: ప్రయాణ ఖర్చుల్లో రాయితీలు పొందవచ్చు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!ప్రీమియం, లైఫ్స్టైట్ కార్డులుహెచ్డీఎఫ్సీ గోల్డ్ క్రెడిట్ కార్డు: ఎంపిక చేసిన బ్రాండ్లపై ఐదు రేట్లు రివార్డ్ పాయింట్లు అందిస్తుంది.అమెక్స్ ప్లాటినం ట్రావెల్ కార్డ్: ప్రత్యేక ప్రయాణ ప్రయోజనాలు, హోటల్ మెంబర్షిప్ పొందవచ్చు. -
ఈ-ఆధార్‌తో తత్కాల్ టికెట్ల బుకింగ్.. అమలు ఎప్పుడంటే..
తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ కోసం భారతీయ రైల్వే తప్పనిసరి ఈ-ఆధార్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నెలాఖరులో కొత్త విధానం అమల్లోకి రానుందని అధికార వర్గాలు తెలిపాయి. తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఈ కోటా కింద నిజమైన ప్రయాణికులకు రైలు టికెట్లను అందించడమే ఈ చర్యల లక్ష్యమని రైల్వేశాఖ తెలిపింది. రైలు టికెట్ బుకింగ్‌లను ఈ-ఆధార్ వెరిఫికేషన్‌తో అనుసంధానం చేయడం ద్వారా మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా టికెటింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికల కోసం ఉద్దేశించిన తత్కాల్ టికెట్లను కొందరు ఏజెంట్లు అన్యాయమైన మార్గాలను ఉపయోగించి హోర్డింగ్, ఆటోమేటెడ్ బుకింగ్‌లకు తెరతీస్తున్నారని వాదనలున్నాయి. కొత్త ఈ-ఆధార్ ధృవీకరణ ద్వారా ప్రయాణీకులు బుకింగ్ సమయంలో వారి గుర్తింపును డిజిటల్‌గా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది మోసపూరిత బుకింగ్‌లను అరికట్టడానికి, ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వేకు తోడ్పడుతుంది.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!‘తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి భారతీయ రైల్వే త్వరలో ఈ-ఆధార్ ధ్రువీకరణను ఉపయోగిస్తుంది. ఇది నిజమైన వినియోగదారులు అత్యవసర సమయంలో టికెట్లను పొందడానికి సహాయపడుతుంది’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సాధారణంగా ప్రయాణికులు సీట్ల లభ్యతను బట్టి 60 రోజుల ముందుగానే రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తర్వాతి రోజు బయలుదేరే రైలు టికెట్ బుకింగ్ కోసం ఏసీ క్లాసులు (1ఎ, 2ఎ, 3ఎ, సిసి, ఇసి, 3ఇ)కు ఈరోజు ఉదయం 10:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. నాన్-ఏసీ తరగతుల (ఎస్ఎల్, ఎఫ్‌సీ, 2ఎస్) టికెట్ బుకింగ్ కోసం ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. బుకింగ్‌లను అనుమతించే తత్కాల్ పథకం ద్వారా 20% టికెట్లు విక్రయిస్తారు. -
ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్ గడువు పెంపు
ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకానికి సంబంధించి ముఖ్యమైన చర్యల గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మరోసారి పొడిగించింది. ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను యాక్టివేట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోసుకునేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగించింది.యూఏఎన్ అంటే..యూఏఎన్ అనేది వేతన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఇచ్చే 12 అంకెల సంఖ్య. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది. వ్యక్తి ఉద్యోగం మారినప్పటికీ ఒకేలా ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను ఆన్లైన్లో సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి, నిర్వహించడానికి యూఏఎన్ సహాయపడుతుంది.యూఏఎన్ యాక్టివేట్ చేయడం ఎలా?ఉద్యోగులు ఆధార్ ఆధారిత ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) ఉపయోగించి తమ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలాగో చూడండి..ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌ను సందర్శించండి."ఇంపార్టెంట్ లింక్స్" విభాగం కింద "యాక్టివేట్ యూఏఎన్" పై క్లిక్ చేయండి.యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్‌కు పర్మిషన్ ఇవ్వడానికి 'అగ్రీ' క్లిక్ చేయండి.మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావడానికి "గెట్ ఆథరైజేషన్ పిన్" పై క్లిక్ చేయండి.యాక్టివేషన్ పూర్తి చేయడానికి ఓటీపీ ఎంటర్ చేయండి. మీ యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పాస్వర్డ్ వస్తుంది. -
పన్ను ఆదా కోసం ఫేక్ చేస్తే.. కొత్త రూల్స్‌తో కొరడా
ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు సీజన్ నడుస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు సాధారణంగా జూలై 31 వరకూ ఉండగా ఈసారికి ఆ గడువును సెప్టెంబర్ 15కు పెంచింది ప్రభుత్వం. ట్యాక్స్ ఫైలింగ్ అంటేనే అందరి దృష్టి ట్యాక్స్ డిడక్షన్లపైనే ఉంటుంది. అయితే కొంతమంది పన్ను ఆదా కోసం తప్పుడు ట్యాక్స్ డిడక్షన్లతో మోసానికి పాల్పడుతున్నారు.ఆదాయపు పన్ను శాఖ ఇటీవల చేసిన దర్యాప్తులో 90,000 మందికి పైగా వేతన జీవులు తప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేసినట్లు తేలింది. ఇది దేశ పన్ను ఖజానాకు రూ .1,070 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈసారి ఫైలింగ్ ప్రక్రియను కఠినతరం చేసింది. మోసపూరిత పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయడం ఇప్పుడు అంత సులువు కాదు. నవీకరించిన ఆదాయపు పన్ను రిటర్న్ యుటిలిటీలు ఐటీఆర్ -1, ఐటీఆర్ -4 ఇప్పుడు ఆదాయపు పన్ను చట్టంలోని కీలక విభాగాలలో మినహాయింపులకు బలమైన రుజువును కోరుతున్నాయి.ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబడులను కవర్ చేసే సెక్షన్ 80సీ కింద చేసే క్లెయిమ్‌లలో పాలసీ నంబర్లు లేదా డాక్యుమెంట్ ఐడీలు ఉండాలి. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం, పన్ను చెల్లింపుదారులు బీమా కంపెనీ పేరు పాలసీ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. రుణాలపై కోరే మినహాయింపులనూ ప్రభుత్వ కఠినతరం చేసింది. సెక్షన్ 80ఈ, 80ఈఈ, 80ఈఈఏ కింద క్లయిమ్ చేసే ఎడ్యుకేషన్, హోమ్ లోన్ బెనిఫిట్స్ కు బ్యాంకుల పేర్లు, లోన్ అకౌంట్ నంబర్లు, మంజూరు తేదీలతో సహా సవివరంగా వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈబీ కింద ఎలక్ట్రిక్ వాహనాల మినహాయింపుల కోసం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా వెల్లడించాలి.200 శాతం జరిమానాట్యాక్స్ ఫైలర్లు చేసిన క్లెయిమ్‌లను క్రాస్ చెక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్) ను ఉపయోగించుకుంటుంది. నకిలీ క్లెయిమ్‌లను అరికట్టడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ద్వారా సమ్మతిని పెంచడం ఈ కఠిన నిబంధనల లక్ష్యం. కాబట్టి పన్ను చెల్లింపుదారులు తాము చేసే ప్రతి మినహాయింపునకు సరైన డాక్యుమెంటేషన్‌తో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే పన్ను బకాయిపై 200 శాతం జరిమానాను 24 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. సెక్షన్ 276సీ కింద దర్యాప్తును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
బ్యాంకు అకౌంట్లో పైసా లేకపోయినా పర్లేదు..!
బ్యాంక్ అకౌంట్.. దేశంలోని ప్రతి పౌరుడికీ కనీస అవసరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం అందరూ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. కానీ ఆ బ్యాంకు అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచడం పేదలు, సామాన్యులకు భారంగా మారింది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీల పేరుతో బ్యాంకులు బాదేస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే సామాన్యులకు ఉపశమనం కల్పిస్తున్నాయి.తాజాగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు జూన్ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని, తక్కువ లేదా జీరో బ్యాలెన్స్‌కు ఎటువంటి జరిమానాలు విధించని జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను మరికొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇలాంటి అకౌంట్లను ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి.. ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.. ఈ కథనంలో తెలుసుకోండి...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ)ను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ యాక్టివేట్ చేయడానికి లేదా అకౌంట్ క్లోజర్‌కు ఎలాంటి ఛార్జీలు ఉండవు.వడ్డీ రేటు: రూ .10 కోట్ల వరకు సంవత్సరానికి 2.70%అర్హత: భారతీయ నివాసితులు; చెల్లుబాటు అయ్యే కేవైసీ (ఆధార్, పాన్ మొదలైనవి) అవసరం.అదనపు గమనికలు: గరిష్ట బ్యాలెన్స్ పై గరిష్ట పరిమితి లేదు; ఏటీఎం లేదా బ్రాంచీల వద్ద విత్ డ్రా ఫారాల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్:జూన్ 1 నుండి, కెనరా బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ జరిమానాలను తొలగించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా మార్చింది.ఫీచర్లు: తక్కువ లేదా జీరో బ్యాలెన్స్ లకు ఛార్జీలు ఉండవు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను ప్రోత్సహిస్తాయి.సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ ఎస్బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.ఇండియన్ బ్యాంక్:బీఎస్‌బీడీఏ, మైనర్ల ఖాతాలు వంటి నిర్దిష్ట జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను అందిస్తుంది (గరిష్టంగా రూ. 2,00,000 ఉన్న ఖాతాలకు కనీస బ్యాలెన్స్ లేదు).ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్‌బుక్, ఇంటర్నెట్ / మొబైల్ బ్యాంకింగ్ (అభ్యర్థనపై).వడ్డీ రేటు: సంవత్సరానికి 2.75% –2.90% (2024 లో బ్యాలెన్స్ ఆధారంగా).గమనిక: సాధారణ పొదుపు ఖాతాలకు రూ .500 (చెక్‌బుక్ లేకుండా) లేదా రూ. 1,000 (చెక్‌బుక్‌తో) కనీస బ్యాలెన్స్ అవసరం, కానీ ఈ ఖాతాలలో ఈ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోయినా ఎటువంటి జరిమానాలు ఉండవు. నిర్దిష్ట పథకాలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.యాక్సిస్ బ్యాంక్:ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, బేసిక్ బ్యాంకింగ్ సేవలు (డిపాజిట్లు/ ఉపసంహరణలు), ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% –3.5% (బ్యాలెన్స్ ఆధారంగా).బ్యాంక్ ఆఫ్ బరోడా:ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో కూడిన బరోడా రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్, జీరో బ్యాలెన్స్‌కు ఎలాంటి పెనాల్టీలు ఉండవు.వడ్డీ రేటు: మారుతుంది (సాధారణంగా సంవత్సరానికి 2.75%–3.25%).హెచ్డీఎఫ్సీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్‌బీడీఏను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, అపరిమిత ఏటీిఎం ఉపసంహరణలు, ఉచిత నెట్ / మొబైల్ బ్యాంకింగ్, ఎల్పీజీ సబ్సిడీలు, డీబీటీ వంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు ప్రాప్యత.వడ్డీ రేటు: ఏడాదికి 3 శాతం (రూ.50 లక్షలలోపు బ్యాలెన్స్‌లకు), 3.5 శాతం (రూ.50 లక్షలకు మించిన బ్యాలెన్స్‌లకు).ఐసీఐసీఐ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్‌బీడీఏ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, 15,000+ ఏటీఎంలకు యాక్సెస్, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్‌బుక్, ఆప్షనల్ ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% (ప్రారంభ రేటు).కోటక్ మహీంద్రా బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా కోటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది.ఫీచర్లు: 811 యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తక్షణ ఖాతా తెరవడం, ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు (సంవత్సరానికి రూ.199 వద్ద ఫిజికల్ కార్డు), అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, డెబిట్ కార్డు చెల్లింపులపై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 4% వరకుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్:కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ప్రథమ్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు (మైక్రో ఏటీఎంలతో సహా), ఉచిత నెట్/ మొబైల్ బ్యాంకింగ్, నెలవారీ వడ్డీ క్రెడిట్లు, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. రూ.35 లక్షల ప్రమాద బీమా, డైనింగ్ డీల్స్).వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు (లిస్టెడ్ బ్యాంకుల్లో అత్యధికం).ఆర్బీఎల్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు (విత్ డ్రా లిమిట్ రూ.50,000/రోజు), ఉచిత అన్ లిమిటెడ్ నెఫ్ట్/ఆర్టీజీఎస్, ఉచిత నెట్/మొబైల్/ఫోన్ బ్యాంకింగ్, షాపింగ్/డైనింగ్ పై డిస్కౌంట్లు.వడ్డీ రేటు: ఏడాదికి 7.5% వరకు.యస్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత అంతర్జాతీయ డెబిట్ కార్డు, యెస్ బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు, ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్/ ఐఎంపీఎస్, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. యాక్సిడెంటల్ డెత్ కవర్).వడ్డీ రేటు: ఏడాదికి 2.75% (రూ.50 లక్షల వరకు), 3.25% (రూ.40 కోట్ల వరకు).డీసీబీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత ఏటీఎం కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఉచిత నెట్/ మొబైల్/ ఫోన్ బ్యాంకింగ్, ఫిజికల్/ ఈమెయిల్ స్టేట్మెంట్లు.వడ్డీ రేటు: వనరులలో పేర్కొనబడదు, కానీ సాధారణంగా పోటీ.ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:సెల్ఫీ సేవింగ్స్ అకౌంట్ (జీరో బ్యాలెన్స్, యువతను లక్ష్యంగా చేసుకుని) అందిస్తోంది.ఫీచర్లు: నో మినిమమ్ బ్యాలెన్స్, ఉచిత డెబిట్ కార్డు, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, కాంపిటీటివ్ వడ్డీ రేట్లు.వడ్డీ రేటు: పరిశ్రమలో అత్యధికం (క్రెడిట్ త్రైమాసికం).ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, రూ .5,000 వరకు కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు. -
ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్కార్డులపై కొత్త చార్జీలు.. జూలై 1 నుంచి..
ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ రెండూ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించాయి. కొత్త చార్జీలను ప్రవేశపెడుతున్నాయి. ఇవి జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కస్టమర్లకు ఆయా బ్యాంకులు నోటిఫికేషన్లు పంపించాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్పులివే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించింది. గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ ఛార్జీలపై జూలై 1 నుండి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టింది. డ్రీమ్ 11, రమ్మీ కల్చర్, జంగ్లీ గేమ్స్ లేదా ఎంపీఎల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే 1% ఛార్జీ వర్తిస్తుంది. ఇది గరిష్టంగా రూ.4,999గా ఉంటుందని, ఆన్ లైన్ గేమింగ్ లావాదేవీలపై ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవని బ్యాంక్ తెలిపింది.క్రెడిట్ కార్డును ఉపయోగించి పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ లేదా ఓలా మనీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడింగ్ చేస్తే 1% చార్జీ వసూలు చేస్తారు. నెలకు మొత్తం వాలెట్ లోడింగ్ ఖర్చుకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. గరిష్టంగా రూ .4,999 ఉంటుంది.క్రెడిట్ కార్డులతో నెలకు రూ.50,000 లకు మించిన యుటిలిటీ లావాదేవీలపై 1% ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు మొత్తం యుటిలిటీ ఖర్చులకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఇది రూ .4,999 వరకు ఉంటుంది. అయితే బీమా లావాదేవీలను యుటిలిటీ లావాదేవీలుగా పరిగణించబోమని, అందువల్ల వీటిపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని బ్యాంక్ స్పష్టం చేసింది.👉ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్‌వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులురెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ కేటగిరీలకు సంబంధించి ఒక్కో లావాదేవీకి గరిష్ట ఛార్జీని రూ.4,999గా నిర్ణయించారు. ప్రస్తుతం రూ .15,000 మించిన ఇంధన లావాదేవీలపై మాత్రమే 1% ఛార్జీ వసూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి అన్ని అద్దె లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అయితే కాలేజీ/స్కూల్ వెబ్సైట్లు లేదా వాటి పీఓఎస్ మెషీన్లలో థర్డ్ పార్టీ యాప్ చెల్లింపుల ద్వారా చేసే విద్యా లావాదేవీలకు మాత్రం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలుడీడీ (డిమాండ్ డ్రాఫ్ట్), పీవో (పే ఆర్డర్), ఏటీఎం ఇంటర్చేంజ్, ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డు ఫీజులను ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. నగదు డిపాజిట్, చెక్కు, డీడీ, పీవో బదిలీకి ఛార్జీలను ప్రతి రూ.1000కు రూ.2గా సవరించింది. ఇది కనిష్ఠంగా రూ.50, గరిష్టంగా రూ.15 వేలు ఉంటుంది. గతంలో రూ.10,000 వరకు అయితే రూ.50, రూ.10,000 దాటితే ప్రతి రూ.1000కు రూ.5 చొప్పున జనరల్ చార్జీలు వసూలు చేసేవారు.ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ లావాదేవీలకు 3 మూడు దాటితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఆర్థికేతర లావాదేవీకైతే రూ.8.5 లుగా బ్యాంకు సవరించింది. ఇవి గతంలో వరుసగా రూ.21, రూ.8.5లుగా ఉండవి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు 5 దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. డెబిట్ కార్డు వార్షిక ఫీజును రూ.200 నుంచి రూ.300కు, రీప్లేస్ మెంట్ కార్డు ఫీజును రూ.200 నుంచి రూ.300కు పెంచారు. -
ఇంటి పొదుపు రూ.22 లక్షల కోట్లు..! ఎస్బీఐ అంచనా
కోల్‌కతా: గృహాల నికర పొదుపులు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) రూ.22 లక్షల కోట్ల మేర ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తన అంచనాలు ప్రకటించింది. జాతీయ స్థూల ఖర్చు చేయతగిన ఆదాయం (జీఎన్‌డీఐ)లో ఇది 6.5 శాతానికి సమానమని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గృహ నికర పొదుపులు జీఎన్‌డీఐలో 5.1 శాతంగా ఉంటే, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో 4.9 శాతం మేర పెరిగినట్టు తెలిపింది.ఆర్థిక పొదుపులు పెరగడం అన్నది ప్రభుత్వం, కార్పొరేట్ నిధుల లోటును భర్తీ చేసేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎంతో కీలకమని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్బీఐ మిగులు నిల్వలను ప్రస్తావించింది. రూపాయి అస్థిరతల కట్టడికి సెంట్రల్‌బ్యాంక్ తీసుకునే చర్యలు ఈ పరిమాణాన్ని నిర్దేశిస్తాయని తెలిపింది. 2024–25లో ఆర్బీఐ బ్యాలన్స్ షీటు 8.19 శాతం విస్తరించగా.. అదే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.ఆర్బీఐ మిగులు నిల్వలు రూ.2.69 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయడం (డివిడెండ్) ద్రవ్య వెసులుబాటును ఇస్తుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మోసాల కేసులు తగ్గినప్పటికీ.. మోసపోయిన మొత్తం మూడు రెట్లు పెరిగి రూ.36,014 కోట్లకు చేరినట్టు గుర్తు చేసింది. -
గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వం
దేశంలో బంగారు రుణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అత్యవసర నగదు అవసరాల కోసం లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి గోల్డ్ లోన్లే ఆధారం. అయితే, గోల్డ్‌లోన్ మంజూరుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రతిపాదించిన నిబంధనల మార్పులు తీవ్రమైన చర్చకు దారితీశాయి. చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే గ్రహీతలపై తీవ్ర ప్రభావం పడనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది.కఠిన నిబంధనలుగోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. వీటిలో..లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని 75 శాతానికి పరిమితం చేయడం అంటే రుణగ్రహీతలు తమ బంగారం మార్కెట్ విలువలో 75% వరకు మాత్రమే రుణంగా పొందవచ్చు.బంగారు రుణాలకు నిజమైన, ధ్రువీకరించదగిన ఆస్తుల మద్దతు ఉందని నిర్ధారించడానికి కఠినమైన పూచీకత్తు అవసరం.రుణ మంజూరులో మరింత పారదర్శకత కోసం బ్యాంకులు, రుణ సంస్థలపై పర్యవేక్షణ పెంచడం.ప్రభుత్వ జోక్యంఅయితే, కొత్త నిబంధనలు చిన్న రుణగ్రహీతలను, ముఖ్యంగా వ్యవసాయ వర్గాలను దెబ్బతీస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది.కఠినమైన నిబంధనల నుంచి రూ.2 లక్షల లోపు రుణాలను మినహాయించడం ద్వారా చిన్న రుణగ్రహీతలకు సులభంగా రుణాలు అందుతాయి.కొత్త నిబంధనలకు సజావుగా మారడానికి బ్యాంకులు, రుణ సంస్థలకు తగినంత సమయం ఇవ్వడానికి వాటి అమలును 2026 జనవరి 1 వరకు వాయిదా వేయాలని ఆర్బీఐకి ఆర్థిక శాఖ సూచించింది. -
EPFO గుడ్‌న్యూస్.. ఇక అలాంటి రిజెక్షన్స్ ఉండవు
ఉద్యోగాలు మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బదిలీ ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తొలగించింది. వివిధ సంస్థల్లో పనిచేసిన సందర్భంలో సర్వీస్ వ్యవధులు సరిపోలని కారణంగా పీఎఫ్ బదిలీ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీనిపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు కొత్త వివరణ ఇచ్చింది. ఇలాంటి సాంకేతికతల కారణంగా ఆలస్యాన్ని ఎదుర్కొన్న వేతన జీవులకు ఇది ఉపశమనం కలిగిస్తుంది.పీఎఫ్ బదిలీ క్లెయిమ్స్ ఎందుకు స్తంభిస్తున్నాయంటే..ఇటీవలి కొన్ని నెలలుగా అనేక ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలు (ఆర్పిఎఫ్ఓలు) పీఎఫ్ బదిలీ అభ్యర్థనలను తిరస్కరించడమో లేదా తిరిగి పంపడమో చేస్తున్నాయి. ఒక ఉద్యోగాన్ని అధికారికంగా విడిచిపెట్టడానికి ముందే కొత్త ఉద్యోగంలో చేరినవారి విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. రెండు సంస్థలలో ఏక కాలంలో పనిచేసినట్లు ఉండటంతో ప్రాసెసింగ్ ఆలస్యం అవుతోంది.👉 ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్‌వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులుఈపీఎఫ్వో తాజా ఆదేశాలుపీఎఫ్ బదిలీ క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరించడానికి సర్వీసు వ్యవధిని కారణాలుగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలోని ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం మే 20న ఒక సర్క్యులర్ జారీ చేసింది. పెన్షన్ డివిజన్ గతంలో జారీ చేసిన సర్క్యులర్‌ను కూడా ఇందులో ప్రస్తావించింది. ఎక్కువ ఖాతా నంబర్లున్న సందర్భాల్లో ఈపీఎస్ ప్రయోజనాలను ఎలా నిర్వహించాలో ఆ సర్క్యులర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగి రికార్డులో సర్వీస్ ఓవర్ ల్యాప్ ఉన్నప్పటికీ పీఎఫ్ బదిలీ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయాలని అన్ని బదిలీ కార్యాలయాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. -
ఆధార్ లాక్.. డేటా సేఫ్: ఇదిగో టిప్స్
డిజిటల్ ప్రపంచంలో.. సైబర్ మోసగాళ్లు ఎప్పుడు మన డేటా దొంగలిస్తున్నారో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు, ఫేస్ స్కాన్ వంటి సున్నితమైన సమాచారంతో అనుసంధానించబడి ఉండటంతో.. చిన్న లోపం కూడా పెద్ద దుర్వినియోగానికి దారితీస్తుంది. ఆధార్ కార్డు భద్రత కోసం బయోమెట్రిక్ లాక్ చాలా ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆధార్ బయోమెట్రిక్‌ను ఆన్లైన్లో లాక్ చేయడం ఎలా?మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయాలనుకుంటే.. మీకు ముందుగా వర్చువల్ ఐడీ (VID) అవసరం. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో 'వర్చువల్ ఐడి జనరేటర్' ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు.వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకున్న తరువాత.. ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఆన్లైన్లో లాక్ చేయడం కోసం కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి..➤యూఐడీఏఐ మైఆధార్ పోర్టల్‌కి వెళ్లండి.➤ఆధార్ సర్వీస్ విభాగంలో కనిపించే 'లాక్/అన్‌లాక్ ఆధార్' ఆప్షన్ క్లిక్ చేయండి.➤అక్కడ కనిపించే సూచనలను జాగ్రత్తగా చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.➤సూచనల తరువాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే.. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వర్చువల్ ఐడీ నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీ ఆధార్ బయోమెట్రిక్ విజవంతంగా లాక్ అవుతుంది. అన్‌లాక్ చేయడానికి కూడా ఇదే దశలను 'అన్‌లాక్ ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తిచేయాలి.బయోమెట్రిక్ లాకింగ్ ఉద్దేశ్యం ఆధార్ లాక్‌ని యాక్టివేట్ చేస్తే.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించలేరు. గుర్తింపు ధృవీకరణ, ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డ్ జారీ కోసం అయినా, మీ ఆమోదం తప్పనిసరి అవుతుంది.ఆధార్‌ను పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఓటరు ఐడీలు (కొన్ని రాష్ట్రాల్లో), రేషన్ కార్డులు, మొబైల్ నెంబర్ల వంటి కీలక డాక్యుమెంట్లకు లింక్ చేస్తున్నారు. ఈ అనుసంధానం.. గుర్తింపు ధృవీకరణను క్రమబద్ధీకరించడానికి, మోసాన్ని తగ్గించడానికి, అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు లేదా సబ్సిడీలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి అలాంటి ఆధార్ డేటాను కొందరు సైబర్ నేరగాళ్లు.. మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆధార్ లాక్ చాలా అవసరం.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..ఆధార్ లాక్ చేస్తే.. మీ అనుమతి లేకుండా వేలిముద్రలు & ఐరిస్ స్కాన్ వంటి వాటిని ద్రువీకరించలేరు. మీరు అన్‌లాక్ చేయనంత వరకు మీ ప్రమేయం లేకుండా ఆధార్ వివరాలు భద్రంగా ఉంటాయి. -
‘రూ.50 లక్షలు సంపాదించాను.. ఏం చేయాలి..?’
నా వయస్సు 55 సంవత్సరాలు. నేను వివిధ పెట్టుబడి మార్గాల ద్వారా రూ.50 లక్షలు సంపాదించాను. బ్యాంకు డిపాజిట్ రేట్లు పడిపోవడం, మార్కెట్లు అస్థిరంగా ఉన్నందున ఈ నిధులను పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన మార్గం ఏమిటి? ఈ ఏకమొత్తం ద్వారా కనీసం ఐదేళ్లలో ఎంత సంపాదిస్తాను? దినేశ్, విజయవాడమీ వయసురీత్యా సంపద భద్రంగా ఉండాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం మేలు. అయితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడిని సృష్టించడానికి ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కొంత రిస్క్‌తో కూడిన అంశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ వయసు, ఐదేళ్ల టైమ్ పరిధిని దృష్టిలో ఉంచుకుని, కొంత రిస్క్ తీసుకోవడానికి అంగీకరిస్తే ఈక్విటీలో 25-30% రాబడితో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ (హైబ్రిడ్ ఫండ్స్) లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. తక్కువ అస్థిరతతో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందేందుకు ఈ ఫండ్లు సహాయపడతాయి. ఈక్విటీ పొదుపు ఫండ్లను పన్ను ప్రయోజనాల కోసం పరిశీలించవచ్చు.ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంవీటన్నింటికంటే ముందు మీ వయసురీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఆరోగ్యబీమా పథకం తీసుకోనట్లయితే వెంటనే ఆర్థిక సలహాదారున్ని సంప్రదించి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఏదైనా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తితే మీ సంపద అంతా హరించుకుపోతుంది. -
కొత్త ఈపీఎఫ్‌వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు
మే నెల ముగింపునకు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతోంది. దేశంలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇవి మీ పొదుపు, క్రెడిట్ కార్డు వాడకం, ప్రావిడెంట్ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి. జూన్ 1 నుంచి ఏయే మార్పులు అమల్లోకి రానున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ఓ 3.0ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) జూన్ 1 నుంచి అప్‌గ్రేడ్ చేసిన నూతన ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. పీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేయడం, కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం. ఈపీఎఫ్ నిధులను సులభంగా, వేగంగా పొందేందుకు వీలుగా ఏటీఎం తరహా కార్డులను ప్రవేశపెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ.క్రెడిట్ కార్డ్ రూల్స్🔸యాక్సిస్ బ్యాంక్ జూన్ 20 నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది. రివార్డ్ పాయింట్లు, ఫీజు మినహాయింపులు ఏ లావాదేవీలకు వర్తిస్తాయో కొత్త అప్ డేట్ స్పష్టం చేస్తుంది.🔸కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లు, ఫీజులలో జూన్ 1 నుండి మార్పులను అమలు చేస్తుంది. ఖర్చు కేటగిరీలలో సంపాదించిన రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులు రానున్నాయి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్ ఫీజులు పెరుగుతాయి. ఇవి కార్డు రకాన్ని బట్టి మారుతాయి. సవరించిన బెనిఫిట్ లు, ఖర్చులకు అనుగుణంగా కార్డుదారులు తమ కార్డు వినియోగాన్ని మార్చుకోవాలి.ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను తగ్గించాయి. మరిన్ని బ్యాంకులు జూన్ 1 నుండి వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ప్రస్తుత రేట్లు 6.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉన్నందున, రేట్ల కోతకు ముందు అధిక రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ఇప్పుడే లాక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.సెబీ మ్యూచువల్ ఫండ్ కటాఫ్ టైమింగ్ మార్పులుసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జూన్ 1 నుండి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ (ఎంఎఫ్ఓఎస్) కటాఫ్ సమయాలను సవరించనుంది. ఈ మార్పు క్లయింట్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్ స్ట్రీమింగ్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఒక రోజులో మెచ్యూరిటీ అయ్యే రిస్క్ లేని ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఓవర్‌నైట్ ఫండ్లు సర్దుబాటు చేసిన రిడంప్షన్, లావాదేవీ సమయాలను కలిగి ఉంటాయి. ఇది నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవీ) లెక్కలను ప్రభావితం చేస్తుంది. -
ఐటీఆర్ గడువుపై బిగ్ అప్డేట్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26కు సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌లు) దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు ఏటా పన్ను రిటర్నుల దాఖ లుకు జూలై 31 తుది గడువుగా ఉంటోంది.సాంకేతిక సమస్యలు, ఇతరత్రా ప్రతికూల పరిస్థితుల్లో ఈ గడువును ఆదాయపన్ను శాఖ పొడిగిస్తుంటుంది. ఈ ఏడాది ఐటీఆర్‌లో మార్పులు చేయడంతో.. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు, ఐటీఆర్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీబీటీ తెలిపింది. -
80సి డిడక్షన్లు.. ట్యూషన్ ఫీజు..
80సిలో 20 అంశాలు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్లు, కొన్ని సేవింగ్స్, కొన్ని ఖర్చులు, కొన్ని ఆస్తుల కొనుగోలుకు సంబంధించినవి వీటిలో ఉన్నాయి. వీటిలో ట్యూషన్ ఫీజు విషయానికొస్తే .. ఇది చాలా పెద్ద ఖర్చు. ప్రతి సంవత్సరం తప్పనిసరి. చాలా మంది తమ పిల్లలను చదివిస్తున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ఈ అంశాన్ని చేర్చారు. చదువుకు ప్రాముఖ్యత ఇచ్చే తల్లిదండ్రులు, అలాగే ఈపీఎఫ్, జీపీఎఫ్ కంపల్సరీ కాని వర్గాలు (వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, ఆర్టిస్టులు, కళాకారులు.. ఇలా సొంత కాళ్ల మీద నిలబడేవారికి) పిల్లల చదువు కోసం చేసే ఖర్చుతో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇద్దరు పిల్లల చదువు కోసం చెల్లించే ఫీజుకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ముగ్గురు లేదా నలుగురు పిల్లలున్న పక్షంలో ట్యాక్స్ ప్లానింగ్‌లో భాగంగా ఇద్దరి ఖర్చును తల్లిదండ్రుల్లో ఒకరు, మిగతా వారి ఖర్చును మరొకరు చూపించి, మినహాయింపును పొందవచ్చు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా లేక ఈపీఎఫ్ కంపల్సరీగా ఉండే ఉద్యోగం చేస్తున్నా .. ఈ అంశం వల్ల అదనంగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తప్పనిసరిగా చెల్లించే ఈపీఎఫ్, జీపీఎఫ్‌ల మొత్తం ఒక్కొక్కరికి రూ. 1,50,000 దాటితే, స్కూల్ ఫీజుల మినహాయింపులపరంగా ఎటువంటి ప్రయోజనం దక్కదు. అయితే, స్థూలపరిమితి అయిన రూ. 1,50,000 నుంచి పీఎఫ్ నిమిత్తం వార్షికంగా పోతున్న మొత్తాన్ని తీసివేయగా, ఏదైనా మిగిలితే, దానికి స్కూల్ ఫీజు కింద మినహాయింపు పొందవచ్చు. ఈ కింది ఉదాహరణలు గమనించండి.. 🔸 రత్నాకర్, అతని భార్య.. ఇద్దరిదీ ప్రైవేట్ ప్రాక్టీసు. ఈపీఎఫ్, జీపీఎఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఇద్దరు పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నారు. ఫీజులు భారీగానే కడతారు. ఇద్దరూ అస్సెస్సీలే. ఒకరి అసెస్మెంట్లో అబ్బాయి స్కూల్ ఫీజును, మరొకరి అసెస్మెంట్లో అమ్మాయి స్కూల్ ఫీజును చూపించి మినహాయింపు పొందుతారు. 🔸 విజయకిరణ్కి కన్సల్టెన్సీ సంస్థ ఉంది. భార్య సింధు వ్యాపారం చేస్తుంది. ఒక్కడే కొడుకు. స్కూల్ ఫీజు భారీగానే ఉంటుంది. భార్యకి సంబంధించిన ఇన్‌కం ట్యాక్స్ అసెస్మెంట్లో కొడుకు స్కూల్ ఫీజును క్లెయిమ్ చేశారు. విజయకిరణ్ కూడా తన ఇన్‌కం ట్యాక్స్ అసెస్మెంట్లో కొడుకు స్కూల్ ఫీజును క్లెయిమ్ చేస్తాడు. చట్టంలో స్పష్టత లేనందున ఇద్దరూ ఒకే సంతానం మీద చెల్లించే స్కూల్ ఫీజుకి మినహాయింపు పొందుతున్నారు. 🔸 కుటుంబరావుగారు, ఆయన భార్య సంతానానికి గంపెడు పిల్లలేమీ లేరు. కానీ రెండు సార్లు కవలలు కా>వడంతో.. మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన లంకంత ఇల్లు ఉంది. ఇద్దరూ లాయర్లుగా బాగా సంపాదిస్తున్నారు. భర్త తన అసెస్మెంట్లో ఇద్దరు పిల్లల ఫీజులను, భార్య తన అసెస్మెంట్లో మిగతా ఇద్దరి పిల్లల ఫీజులను క్లెయిమ్ చేస్తారు. 🔸 అనంత మూర్తి, భార్య శారద.. ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే. ఒక్కర్తే ఆడపిల్ల. ఒకరి అసెస్మెంట్లో పిల్ల స్కూల్ ఫీజును క్లెయిమ్ చేస్తారు. మరొకరు కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా.. ఈపీఎఫ్, వీపీఎఫ్‌లో జమ చేస్తారు. 🔸 గురునాధ్, సావిత్రికి ముగ్గురు పిల్లలు. గురునాధ్ ఇద్దరు పిల్లల చదువుల ఫీజులను క్లెయిమ్ చేస్తారు. సావిత్రి బొటిక్ నడిపిస్తుంది. తన అసెస్మెంట్లో మూడో సంతానం చదువులకయ్యే ఫీజులను క్లెయిమ్ చేస్తోంది. పాత కాలంలోలాగా గంపెడు పిల్లలు ఉంటే ఏం చేయలేం కానీ.. నలుగురి వరకు స్కూల్ ఫీజులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీజుల మీద మినహాయింపు వస్తుంది. డొనేషన్లు, క్యాపిటేషన్, డెవలప్మెంట్ నిమిత్తం ఇస్తే ఎలాంటి మినహాయింపు రాదు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. మీకు ఏది సూట్ అవుతుంది. ఏది అనుకూలంగా ఉంటుందో అది చేయండి. ఏదైనా చట్టానికి లోబడి చేయాలి సుమా!! పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఇన్వెస్ట్మెంట్ కోసం ఇల్లు కొనడం మంచి నిర్ణయమేనా?
అంతర్గతంగా విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – కపిల్ శర్మవాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించం అన్నది ఒక కళ. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో గుర్తించి, ఆ మేరకు చెల్లించేందుకు ముందుకు రావడం. ఇక్కడ ఎన్నో అంశాలు లెక్కించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అనే అంశాన్ని కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మెరుగ్గా వినియోగిస్తున్నార? ప్రమోటర్లు విశ్వసనీయత కలిగిన వారేనా? ఆయా రంగంలో కంపెనీకి వృద్ధికి అవకాశం ఉందా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, ఎంపిక చేసుకున్న మెరుగైన కంపెనీల గురించి వచ్చే ప్రతికూల వ్యాఖ్యానాలను విశ్లేషించుకునే సామర్థ్యం.. తటస్థ వైఖరి కావాలి. నేను పెట్టుబడి దృష్ట్యా ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. ఇది మెరుగైన ఎంపికేనా? – శివమ్ ఇల్లు అన్నది కేవలం నివాసం కోసమే. రాబడి దృష్ట్యా కాకుండా దీర్ఘకాలంలో భూముల ధరలు పెరుగుతాయన్న అంచనాలతో చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఒక కుటుంబ నివాస అవసరాలకే ఇల్లు. దీన్ని పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అదే పెట్టుబడి కోణం నుంచి చూస్తే రియల్ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అధిక మొత్తంలో పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో సవాళ్లూ ఉంటాయి. ప్రాపర్టీని అద్దెకు ఇస్తే కిరాయిదారు రూపంలో ఆదాయం వస్తుంది. అలా చూస్తే చాలా మందికి ఇల్లు మంచి పెట్టుబడిగా కనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. 20 ఏళ్లు గడిచిన తర్వాత పాతదిగా మారడంతో అద్దెకు డిమాండ్ తగ్గుతుంది. అప్పటి వరకు వసూలు చేసినంత అధిక అద్దెకు కిరాయిదారులు ముందుకు రాకపోవచ్చు. మెరుగైన అద్దెతో అధునికమైన, కొత్త ఇంటికి వారు మొగ్గు చూపించొచ్చు. ప్రాపర్టీ విలువ పెరిగినా, అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.సమాధానాలు: ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
స్థిరమైన ఆదాయం కోసం కొత్త ఫండ్
ముంబై: యూనియన్ మ్యూచువల్ ఫండ్ ‘యూనియన్ ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్‌వోఎఫ్’ను ప్రవేశపెట్టింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్). వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో పన్ను ప్రయోజనకరమైన ఆదాయాన్నిచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది.జూన్ 5 వరకు పెట్టుబడులకు ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) అందుబాటులో ఉంటుంది. ఆర్బిట్రేజ్, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుంది.రెండేళ్లకు మించి పెట్టుబడులు కలిగి ఉన్న వారికి ఈక్విటీ ఆధారిత పన్ను ప్రయోజనాలు వర్తించేలా ఈ పథకం ఆర్బిట్రేజ్ పెట్టుబడుల విధానాన్ని అనుసరిస్తుంది. సంపద సృష్టించడమే కాకుండా దాన్ని కాపాడుకోవడం అన్నది అస్సెట్ అలోకేషన్‌కు కీలకంగా యూనియన్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. -
ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..!
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. నెల రోజుల క్రితం అయితే ఏకంగా రూ.లక్షను దాటేసింది. ఆ తర్వాత కాస్త తగ్గినా ఇప్పటికీ రూ.లక్షకు చేరువలోనే ఉంది. దీంతో బంగారం కొనుక్కోవాలని ఆశ ఉన్నప్పటికీ సామాన్యులు మనం కొనలేములే అని ఆగిపోతున్నారు.సాధారణంగా బంగారం అంటే ఆభరణాల రూపంలోనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అసలే పెరిగిపోయిన ధరకు తోడు ఆభరణాలకు విధించే తరుగు, తయారీ చార్జీలతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. దీంతో కాస్తంత బంగారం కొనాలన్నా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు.అధిక బంగారం ధర ద్రవ్యోల్బణం వంటిది. డబ్బులు అవే కానీ వాటికి వచ్చే వస్తు ప్రతిఫలం తగ్గిపోతుంది. 2020లో మీ దగ్గర రూ.50,000 ఉంటే పది గ్రాముల బంగారాన్ని కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు 5 గ్రాములు మాత్రమే వస్తుంది. బంగారం కొనడం అనేది ఒక్కసారి చేసే వ్యాయామం కాదు. ఆర్థిక ప్రణాళికలో భాగంగా కాలక్రమేణా దానిని కూడబెట్టుకుంటూ ఉండాలి.అయితే బంగారాన్ని ఎందుకు కొనాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. అంటే పెట్టుబడి ప్రయోజనాల కోసమా లేదా నగల కోసమా లేకుంటే వివాహ నిమిత్తమా అన్నది ఎరుక ఉండాలి. బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటే 5 నుండి 20 శాతం 'మేకింగ్ ఛార్జీలు' ఉంటాయి. అదే నాణేల రూపంలో కొంటే ఈ అనవసరమైన భారం ఉండదు.బంగారు నాణేలు కొంటే ప్రయోజనాలు🔸బంగారు నాణేలు ధ్రువీకరించిన స్వచ్ఛతతో వస్తాయి. సాధారణంగా ఇవి 24 కేరట్లు (99.99 శాతం స్వచ్ఛత)లలో లభిస్తాయి.🔸కావాల్సినప్పుడు అమ్మి నగదుగా మార్చుకోవచ్చు. వీటిని సులువుగా విక్రయించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వీటిని తీసుకుంటారు.🔸బంగారం ఆభరణాలతో పోలిస్తే వీటిని భద్రపరచుకోవడం సులువు.🔸బంగారు నాణేలు ధ్రువీకరణతో రావడం వల్ల స్వచ్ఛత, బరువుకు సంబంధించి ఎలాంటి భయం ఉండదు.🔸ఆర్థిక అనిశ్చితి సమయాలలో బంగారం విలువకు ఢోకా ఉండదు.🔸బంగారు నాణేలు అర గ్రాము నుంచి 100 గ్రాముల వరకు వివిధ బరువుల్లో లభిస్తాయి. కాబట్టి స్తోమతను బట్టీ ఎవరి ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు.🔸నగల దుకాణాలు, ప్రభుత్వ సంస్థల నుంచి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. -
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్. జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంత వరకూ అప్డేట్ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్‌ను అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)అవకాశం కల్పించింది. ఇందుకోసం గతేడాది గడువును విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ 14 వరకు గడువు విధించారు. ఆ తర్వాత రూ .50 రుసుమును చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు (పీఓఐ), చిరునామా రుజువు (పీఓఏ) అప్డేట్ చేసుకోవాలి. రెగ్యులర్ అప్డేట్లు ఆధార్ లోని సమాచారం, ప్రస్తుత డాక్యుమెంటేషన్‌కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.ఆధార్‌ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు, బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్‌లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది. తద్వారా దుర్వినియోగాలు, మోసాలు నివారించడంతోపాటు ప్రజా సేవల్లో జాప్యాలు, తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది.ఆన్లైన్లో ఏమేమి అప్డేట్ చేయవచ్చు?ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ అందిస్తున్నప్పటికీ, ఆధార్‌లోని కొన్ని రకాల వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. యూఐడీఏఐ ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తోంది. అవి ఏమిటంటే..🔹పేరు (చిన్న మార్పులు చేసుకోవచ్చు)🔹పుట్టిన తేదీ (కొన్ని పరిమితులున్నాయి)🔹చిరునామా🔹జెండర్🔹భాష ప్రాధాన్యతలుబయోమెట్రిక్ సమాచారం మారదుఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసేందుకు వీలులేదు. ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ (కనుపాప) స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే, భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధ్రువీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఇలా..👉అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ను సందర్శించండి.👉"లాగిన్" బటన్ పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.👉రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి దానిని నమోదు చేయండి.👉లాగిన్ అయిన తర్వాత పేజీ పై కుడివైపున ఉన్న 'డాక్యుమెంట్ అప్డేట్'పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువును ధ్రువీకరించి అప్డేట్ చేస్తారు.👉డ్రాప్‌డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకుని స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఫైళ్లు JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో, 2MB కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోండి.👉వివరాలన్నీ సరిచూసుకుని డాక్యుమెంట్ లను సబ్మిట్ చేయండి. తర్వాత మీకొక సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు (SRN) వస్తుంది. దీనితో అప్డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
ఆరోగ్య బీమా లేకపోతే పేదరికం తప్పదా?
మారుతున్న జీవనశైలితో అనారోగ్య పరిస్థితులు పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రి ఖర్చులు అధికమవుతున్నాయి. వీటివల్ల మధ్య తరగతి ప్రజలు పేదరికంలోకి వెళుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ ఆరోగ్య బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేవారికి సాధారణంగా కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఉంటాయి. వాటిలో కొన్నింటికి కింద సమాధానాలు తెలియజేశాం.ఆరోగ్య బీమా ప్రాథమిక ఉద్దేశం ఏమిటి?ఆసుపత్రిలో చేరడం, డాక్టర్ సంప్రదింపులు, చికిత్సలు, శస్త్రచికిత్సలు వంటి వైద్య ఖర్చులను కవర్ చేయడం ద్వారా ఆరోగ్య బీమా ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇది ఊహించని ఆరోగ్య సంరక్షణ ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఏమిటి?ఆరోగ్య బీమా ప్రీమియం అనేది ఆరోగ్య కవరేజీని నిర్వహించడానికి బీమా కంపెనీకి చెల్లించే మొత్తం. పాలసీ నిబంధనలను బట్టి నెలవారీగా, త్రైమాసికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు.నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఏమిటి?నెట్వర్క్ ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను అందించడానికి బీమా సంస్థలతో ఒప్పందం కలిగి ఉంటాయి. అంటే పాలసీదారుడు ముందస్తుగా వైద్య ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా బీమా సంస్థ నేరుగా ఆసుపత్రితో బిల్లులను సెటిల్ చేస్తుంది.క్యాష్ లెస్ క్లెయిమ్ అంటే ఏమిటి?క్యాష్ లెస్ క్లెయిమ్ ద్వారా పాలసీదారులు ముందుగా ఖర్చులు చెల్లించకుండానే నెట్ వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. బీమా సంస్థ నేరుగా వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. ఇది వైద్య ప్రక్రియకు అంతరాయం లేకుండా చూస్తుంది.హెల్త్ ఇన్సూరెన్స్‌లో ప్రీకండిషన్ షరతులు ఏమిటి?ప్రీకండిషన్ పరిస్థితి అనేది పాలసీని కొనుగోలు చేయడానికి ముందు నిర్ధారణ అయిన ఏదైనా అనారోగ్యం లేదా వైద్య పరిస్థితిని సూచిస్తుంది. కొన్ని బీమా సంస్థలు ఈ వైద్య పరిస్థితులకు చికిత్సను కవర్ చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్లను విధిస్తాయి.హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటి?వెయిటింగ్ పీరియడ్ అనేది కొన్ని అనారోగ్యాలు లేదా చికిత్సలు కవర్ చేయలేని సమయం. ఉదాహరణకు పాలసీదారులు తమ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ముందు ప్రసూతి కవరేజీకి 2-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు.ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏమిటి?ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో ఓకే పాలసీ ద్వారా కుటుంబ సభ్యులకు బీమా సదుపాయం కల్పిస్తారు. దీని ప్రీమియం వ్యక్తిగత పాలసీల కంటే ఎక్కువ ఉంటుంది.ఇదీ చదవండి: పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!వ్యక్తిగత, కమ్యునిటీ ఆరోగ్య బీమా మధ్య తేడా ఏమిటి?వ్యక్తిగత ఆరోగ్య బీమా ఒక వ్యక్తికి కవర్ ఇస్తుంది. అయితే కమ్యునిటీ ఆరోగ్య బీమా విభిన్న వ్యక్తులకు కవరేజీని అందిస్తుంది. తరచుగా ఈ పాలసీలను కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు అందిస్తాయి.నో క్లెయిమ్ బోనస్ అంటే ఏమిటి?ఏడాదిలో పాలసీని క్లెయిమ్ చేయని పాలసీదారులకు నో క్లెయిమ్ బోనస్ రివార్డుగా అందిస్తారు. ఇది డిస్కౌంట్ ప్రీమియంలు లేదా తదుపరి రెన్యువల్లో బీమా పెంపు వెసులుబాటు రూపంలో ఇస్తారు.మెడికల్ హిస్టరీని బహిర్గతం చేయడం ఎందుకు ముఖ్యం?వైద్య చరిత్రను వెల్లడించడంలో విఫలమైతే క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. కవరేజీ అర్హతను నిర్ణయించడానికి బీమా సంస్థలకు కచ్చితమైన ఆరోగ్య సమాచారం అవసరం. -
బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..
బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారమే రూ.లక్ష వరకూ పలుకుతోంది. బంగారం సాధారణంగా చాలా మంది దగ్గర ఆభరణాల రూపంలోనే ఉంటుంది. వీటిని ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగిలిన సమయాల్లో పెద్దగా ధరించరు. ఈ నగలను ఇంట్లోని బీరువాల్లోనే భద్రపరుచుకుంటుంటారు. అయితే విలువైన బంగారు ఆభరణాలను ఇలా ఇంట్లో పెట్టుకుంటే వల్ల చోరీకి గురవుతాయేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంటుంది. అందుకే అనేక బ్యాంకులు బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు సేఫ్ డిపాజిట్ లాకర్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.ఈ సేఫ్ డిపాజిట్ లాకర్లలో బంగారం, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు బ్యాంకులు కొంత చార్జీలను వసూలు చేస్తాయి. లాకర్ పరిమాణం, బ్రాంచ్ లొకేషన్ (గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ లేదా మెట్రో), బ్యాంక్ అంతర్గత విధానాల ఆధారంగా ఈ లాకర్లకు అద్దె ఛార్జీలు మారవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని నాలుగు టాప్ బ్యాంకులలో సేఫ్ డిపాజిట్ లాకర్ల చార్జీలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాకర్ పరిమాణం, స్థానాన్ని బట్టి మారుతూ ఉండే అంచెల ధరల నిర్మాణాన్ని అందిస్తుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు వర్తిస్తుంది. ఇది చిన్న, మధ్యతరహా లాకర్లకు రూ .500, పెద్ద, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు రూ .1,000. వీటికి జీఎస్టీ అదనం.వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా):చిన్న లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.1,000 అర్బన్/ మెట్రో: రూ.1,500మీడియం లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్/ మెట్రో: రూ.3,000పెద్ద లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.5,000అర్బన్/ మెట్రో: రూ.6,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్/ మెట్రో: రూ.9,000పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేఫ్ లాకర్ల కోసం అందుబాటు చార్జీలను వసూలు చేస్తోంది. కొన్ని నిర్దిష్ట మెట్రో శాఖలలో 25% ప్రీమియం వర్తిస్తుంది. కస్టమర్లు సంవత్సరానికి 12 సార్లు ఉచితంగా తమ లాకర్‌ను సందర్శించవచ్చు. ఆ తర్వాత ప్రతి అదనపు సందర్శనకు రూ .100 వసూలు చేస్తారు.వార్షిక ఛార్జీలు ఇలా.. (జీఎస్టీ కాకుండా)చిన్న లాకర్లు: రూరల్: రూ.1,000 సెమీ అర్బన్/ అర్బన్: రూ.1,250 అర్బన్/ మెట్రో: రూ.2,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,200 సెమీ అర్బన్/ అర్బన్: రూ.2,500 అర్బన్/ మెట్రో: రూ.3,500పెద్ద లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.3,000 అర్బన్/ మెట్రో: రూ.5,500ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.6,000 అర్బన్/ మెట్రో: రూ.8,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: అన్ని ప్రాంతాల్లో: రూ.10,000ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): చిన్న లాకర్లు: గ్రామీణం: రూ.1,200 సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్: రూ.3,000 మెట్రో: రూ.3,500 మెట్రో+: రూ.4,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,500 సెమీ అర్బన్: రూ.5,000 అర్బన్: రూ.6,000 మెట్రో: రూ.7,500 మెట్రో+: రూ.9,000పెద్ద లాకర్లు: గ్రామీణం: రూ.4,000 సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్: రూ.10,000 మెట్రో: రూ.13,000 మెట్రో+: రూ.15,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: గ్రామీణం: రూ.10 వేలు సెమీ అర్బన్: రూ.15,000 అర్బన్: రూ.16,000 మెట్రో: రూ.20,000 మెట్రో+: రూ.22,000హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): ఎక్స్ట్రా స్మాల్ లాకర్లు: మెట్రో: రూ.1,350 పట్టణ: రూ.1,100 సెమీ అర్బన్: రూ.1,100 గ్రామీణం: రూ.550చిన్న లాకర్లు: మెట్రో: రూ.2,200 పట్టణ: రూ.1,650 సెమీ అర్బన్: రూ.1,200 గ్రామీణం: రూ.850మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,000 అర్బన్: రూ.3,000 సెమీ అర్బన్: రూ.1,550 గ్రామీణం: రూ.1,250ఎక్స్ట్రా మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,400 పట్టణ: రూ.3,300 సెమీ అర్బన్: రూ.1,750 రూరల్: రూ.1,500పెద్ద లాకర్లు: మెట్రో: రూ.10,000 అర్బన్: రూ.7,000 సెమీ అర్బన్: రూ.4,000 గ్రామీణం: రూ.3,300ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: మెట్రో: రూ.20,000 పట్టణ: రూ.15 వేలు సెమీ అర్బన్: రూ.11,000 గ్రామీణం: రూ.9,000🔶 లాకర్ సదుపాయాన్ని ఎంచుకునేటప్పుడు ధర మాత్రమే ముఖ్యం కాదు. లభ్యత, ఎంత దగ్గరలో ఉంది, లాకర్ పరిమాణం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ముందస్తు సరెండర్ పాలసీలు లేదా రిజిస్ట్రేషన్ ఫీజులు వంటివి ఏవైనా అదనపు నిబంధనలు ఉన్నాయేమో చూసుకోవాలి. -
యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..
దేశంలో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అత్యధికం యూపీఐ (UPI) ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి అనేక యూపీఐ యాప్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో లోపాల ద్వారా వినియోగదారులు డబ్బులు పోగుట్టుకుంటున్న సంఘటనలూ అక్కడక్కడా జరగుతున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు త్వరలో రానున్నాయి.యూపీఐ లావాదేవీలో డబ్బులు అంతిమంగా ఎవరికి చేరుతున్నాయన్నది తప్పనిసరిగా ప్రదర్శించాలని యూపీఐ పేమెంట్, భారత్ బిల్ పే, రూపే కార్డ్‌లతోపాటు దేశంలోని అన్ని రిటైల్ చెల్లింపులను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.అంతిమ లబ్ధిదారు ఎవరన్నది పేయర్ యాప్‌లో అలాగే లావాదేవీ స్టేట్మెంట్, హిస్టరీలోనూ ప్రదర్శించాలని ఎన్పీసీఐ సర్క్యులర్‌లో తెలిపింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నామని వినియోగదారుల్లో విశ్వాసం కలిగించడానికి, సంభావ్య ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్‌లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.చేయాల్సిన మార్పులివే..యూపీఐ యాప్‌లు లావాదేవీకి ముందు వివరాల పేజీలో డబ్బు ఎవరికి వెళ్తుందో అంతిమ లబ్ధిదారుని పేరు (ధ్రువీకరించిన ఏపీఐ అడ్రెస్ ద్వారా సంగ్రహించిన లబ్ధిదారు బ్యాంకింగ్ పేరు) మాత్రమే వినియోగదారునికి కనిపించాలి. అలాకాకుండా క్యూఆర్ కోడ్ ల నుంచి సేకరించిన పేర్లు, చెల్లింపుదారు నిర్వచించిన పేర్లు లేదా మరే ఇతర పేర్లను యూపీఐ యాప్ లో పేయర్ కు ప్రదర్శించకూడదు.యాపీఐ యాప్‌లలో లావాదేవీలకు బెనిఫీషియరీ పేరును మార్చేందుకు వీలు కల్పించే ఫీచర్లు ఉంటే వాటిని తప్పనిసరిగా తొలగించాలి. ఆయా యూపీఐ యాప్‌లన్నీ జూన్ 30 నాటికి ఈ మార్పులు అమలు చేయాలి. లేకుంటే నిబంధనల ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకుంటామని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్-యూ (అప్డేటెడ్ రిటర్న్) ఫైలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించడానికి అధిక సమయం ఇస్తుందని తెలిపింది. అదే సమయంలో ఆలస్యంగా సమర్పించిన రిటర్న్‌లపై భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను సమ్మతిని మెరుగుపరచడం, మోసపూరిత ఫైలింగ్‌లను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.సవరణలు ఇలా..అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటివరకు అసెస్మెంట్ ఇయర్ నుంచి 24 నెలలు గడువు ఉండేది. దాన్ని తాజాగా 48 నెలలు (4 సంవత్సరాలు)కు పెంచారు. ఇది వ్యక్తులు, వ్యాపారాలకు రిటర్న్‌ల సమయంలో తప్పులను సరిదిద్దుకోవడానికి, గతంలో ఫైల్ చేయని ఆదాయాన్ని నివేదించడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లను ఫైలింగ్ చేయడాన్ని కట్టడి చేసేందుకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.మదింపు సంవత్సరం ముగిసిన 12 నెలలలోపు ఐటీఆర్-యూ దాఖలు చేస్తే 25 శాతం పన్ను విధిస్తారు.12 నుంచి 24 నెలల్లోపు అయితే 50 శాతం పన్ను చెల్లించాలి.మూడో సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.నాలుగో సంవత్సరంలో ఫైల్ చేస్తే 70 శాతం పన్ను వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్మెంట్ ఇయర్) మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫారాలకు సంబంధించిన ఈ-ఫైలింగ్ సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. రెగ్యులర్ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025-26) గడువు 2025 జులై 31గా ఉంది. -
అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..
అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సాధారణంగా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్లు జరుగుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని 'గుల్జార్‌హౌస్'లో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎలాగో పూడ్చలేరు. కానీ ఆస్తి నష్టాన్ని ముందుగానే తీసుకున్న ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాబీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మీ బీమా ప్రొవైడర్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. భీమా కంపెనీ స్పందించడానికి ముందే.. రిపేర్ చేయడం వంటి చేయకూడదు.క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్లైన్లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు & వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా.. వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్లు, ఫైర్ బ్రిగేడ్ నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?సర్వేయర్‌తో సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. సర్వేయర్‌కు పూర్తిగా సహకరించండి. వారికి అవసరమైన సమాచారం & పత్రాలను అందించండి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి వారికి అనుమతి ఇవ్వండి.క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. అయితే చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీ విధానాలు కొద్దిగా మారవచ్చు. కాబట్టి, మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. -
అలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం మధ్య ఏ ఫండ్స్ మెరుగైనవి? – వీణారాణి దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనూ మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యాప్ మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛతో ఉంటుంది. మార్కెట్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంలో పెట్టుబడుల ద్వారా దీన్ని చక్కగా అధిగమించగలరు. నేను అధిక పన్ను శ్లాబులోకి వస్తాను. ఎఫ్డీలపై ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. అత్యవసర నిధిని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – జగన్నాథ స్వామిమీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. అత్యవసర నిధిని మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొదటి భాగం అత్యవసర నిధిని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోవచ్చు. లేదా వెంటనే నగదుగా మార్చుకోగలిగిన మరొక సాధనంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగా ప్రత్యేక అనుకూలతలు ఏవీ లేవు. ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా.. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ ఆదాయాన్ని పన్ను చెల్లింపుదా రు తన వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ 2023 ఏప్రిల్ 1 తర్వాత చేసిన పెట్టుబడులను విక్రయిస్తే.. ఎంతకాలం అన్నదానితో సంబంధం లేకుండా లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఈ ఆదాయంపైనా మీరు గరిష్ట పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులిస్తాయి. కానీ, డెట్ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి ఒక్కో ఇన్వెస్టర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల పెట్టుబడికి బీమా రక్షణ హామీ కూడా ఉండదు. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పదేళ్ల చరిత్ర.. సెక్షన్ 80Cలో ఎన్నో ఆప్షన్లు
ఈ సెక్షన్ 80Cలో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, ఖర్చులు ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్‌కు పదేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు గరిష్ట పరిమితి రూ.1,00,000 ఉండేది. తరువాత రూ.1.50 లక్షలకి పెంచారు. అనంతరం ఎటువంటి మార్పులేదు. ఎప్పుటికప్పుడు ఈ పరిమితిని పెంచుతారని వదంతులు, పుకార్లు, ఎదురుచూపులు.. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఈ లక్షన్నర లిమిట్ ప్రస్తుతానికి అక్కడే ఆగిపోయింది. కారణం ఏమిటంటే ఈ సెక్షన్ పాత పద్ధతిలో పన్ను భారాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. కొత్త విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.పాతవిధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే 80C లో ఉన్న ఆప్షన్లు వర్తిస్తాయి. అవేమిటంటే ... 🔸 తన పేరు మీద, జీవిత భాగస్వామి .. పిల్లల పేర్ల మీద చెల్లించే జీవిత బీమా 🔸 డిఫర్డ్ యాన్యుటీ కోసం చేసిన చెల్లింపులు 🔸 ఈపీఎఫ్/జీపీఎఫ్/ సూపర్ యాన్యుయేషన్ ఫండ్‌కి చెల్లింపులు 🔸 సుకన్య సమృద్ధి అకౌంటులో డిపాజిట్లు 🔸 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో VIII, IX ఇష్యూలు 🔸 అయిదేళ్ల పైబడి కాలవ్యవధి కలిగిన డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్లు 🔸 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమలు 🔸 సీనియర్ సిటిజన్స్ స్కీము 2024లో పెట్టుబడులు 🔸 యూటీఐ యూలిప్ పాలసీ 1971కి జమలు, ఎల్ఐసీ జమలు 🔸 ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్‌కి జమలు 🔸 ఎల్ఐసీ యాన్యుటీ ప్లాన్/ ఇతర సంస్థల యాన్యుటీ ప్లాన్, కొత్త జీవన్‌ధార, కొత్త జీవన్ అక్షయ ఐఐ, ఐఐఐ ప్లాన్లు, జీవన్‌ధార అక్షయ 🔸 యూటీఐ స్కీం 1992/1999/2005కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ 🔸 నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) వారికి చేసిన చెల్లింపులు 🔸 బ్యాంకు/ఎల్ఐసీ/ఎన్‌హెచ్‌బీ/ ఇతర కంపెనీల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు 🔸 పిల్లల స్కూల్ ఫీజు చెల్లింపులు (ఇద్దరికి మాత్రమే) 🔸 ఈక్విటీ షేర్లు/డిబెంచర్ల కోసం చెల్లింపులు 🔸 షెడ్యూల్డ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో అయిదేళ్ల కాలవ్యవధితో చేసిన డిపాజిట్లు 🔸 నాబార్డు వారు జారీ చేసిన బాండ్ల కొనుగోళ్లు 🔸 ఇన్యూరెన్స్ పాలసీ (డిఫర్డ్ యాన్యుటీ పాలసీ మినహా) 🔸 ఇంటి రిజిస్టేషన్ కోసం చెల్లించే రిజిస్టేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లింపులు. ఇలా సెక్షన్ 80Cలో 20 అంశాలు ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటికి షరతులు విధించారు. షరతులకు లోబడితేనే ఆయా అంశాల ప్రకారం మినహాయింపు ఇస్తారు. ఇతరత్రా విషయాలు.. 🔸 ప్రావిడెండ్ ఫండ్‌కి చేసే చెల్లింపులు, లోన్ రీపేమెంట్లకు ఎటువంటి మినహాయింపు రాదు. 🔸 ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో వాటా కోసం చెల్లింపు, డిపాజిట్, ఇంటికి మార్పులు, రెనోవేషన్, రిపేరు ఖర్చులకు మినహాయింపు ఇవ్వరు. 🔸 ట్యూషన్ ఫీజుకే మినహాయింపులు. డెవలప్మెంట్, డొనేషన్స్ నిమిత్తం చెల్లించినందుకు మినహాయింపులు ఇవ్వరు. 🔸 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మీద ఆంక్షలున్నాయి. ఏడాది చెల్లింపులు సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం దాటకూడదు. 🔸 సుకన్య సమృద్ధి అకౌంటు డిపాజిట్ల మీద వడ్డీ మినహాయింపు ఉంది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
EPFOలో ఐదు కీలక మార్పులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది.. తన చందాదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవన్నీ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కథనంలో ఈపీఎఫ్ఓలో 2025లో జరిగిన ఐదు కీలక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.ప్రొఫైల్ అప్డేట్ఈ ఏడాది ఈపీఎఫ్ఓలో జరిగిన ప్రధానమైన మార్పులలో ప్రొఫైల్ అప్డేట్ ఒకటి. ఈ అప్డేట్ ద్వారా.. ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరమైపోయింది. మీ యూఏఎన్ నెంబర్.. ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం, నేషనాలిటీ, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు.పీఎఫ్ బదిలీగతంలో, ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం.. చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. ఇప్పుడిది.. చాలా సులభమైపోయింది. పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీంతో పీఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు వేగంగా.. సులభంగా బదిలీ అవుతుంది.జాయింట్ డిక్లరేషన్జనవరి 16, 2025 నుంచి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్‌గా మారింది. మీ యూఏఎన్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. జాయింట్ డిక్లరేషన్‌ను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు.పెన్షన్ పేమెంట్స్ఈపీఎఫ్ఓ జనవరి 1, 2025 నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS)ను ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు పెన్షన్ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ప్లాట్‌ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీని వల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈ విధానం పూర్తిగా రద్దు అయింది.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'జీతంపై పెన్షన్ ప్రక్రియఅధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం.. ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, దానిపై పెన్షన్ కోరుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనితో పాటు, ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని లేదా వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. -
అమెరికాలో కొత్త ట్యాక్స్.. అమలైతే ఎన్ఆర్ఐల జేబులు ఖాళీ!
అమెరికాలో మరో కొత్త రకం పన్నుకు ట్రంప్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇది గనుక అమలులోకి వస్తే అక్కడ నివస్తున్న ప్రవాస భారతీయులపై (NRI) తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించి అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్‌లో మే 12న ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌పై 5 శాతం పన్ను విధించనున్నారు.స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచడం ద్వారా 2017 పన్ను కోతలు, ఉద్యోగాల చట్టాన్ని శాశ్వతం చేయాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండోసారి అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఈ చట్టాన్ని 'గ్రేట్' అని అభివర్ణిస్తూ, రిపబ్లికన్లు దీనిని ఆమోదించేలా చూడాలని కోరారు. మే 26 మెమోరియల్ డే నాటికి బిల్లును ఆమోదించాలని సభ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అది సెనేట్‌కు వెళుతుంది. జూలై 4వ తేదీలోగా చట్టంగా మార్చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.కొత్తగా వసూలు చేసే 5 శాతం రెమిటెన్స్ పన్నును పన్ను విరామాలకు నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు. ఇది యూఎస్ ట్రెజరీకి బిలియన్లకొద్దీ ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాటిని తమ దేశాల్లోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావంభారత్లోని తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు ఈ పన్ను తీవ్ర ఆర్థిక ప్రభావాలను కలిగిస్తుంది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్‌కు ఏటా 8,300 కోట్ల డాలర్ల రెమిటెన్స్ లు పంపుతుండగా, అందులో ఎక్కువ భాగం అమెరికా నుంచే అందుతున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ కుటుంబాలకు పంపే ప్రతి లక్ష రూపాయలకు రూ.5,000 పన్ను రూపంలో యూఎస్ ప్రభుత్వానికి వెళ్తుంది. -
ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంచుతున్న ఫండ్స్ ఇవి..
అగ్రెస్సివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా గడిచిన ఏడాది కాలంలో ఈ విభాగంలో కొత్తగా 3.5 లక్షల మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. దీంతో 2025 ఏప్రిల్ నాటికి హైబ్రిడ్ ఫండ్స్ పరిధిలోని మొత్తం ఇన్వెస్టర్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 58 లక్షలకు చేరాయి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ సైతం 12 శాతం పెరిగి రూ.2.26 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 ఏప్రిల్ నాటికి ఈ మొత్తం రూ.2.02 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.అగ్రెస్సివ్ హైబిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలతోపాటు డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈక్విటీలకు 65–80 శాతం మధ్య.. మిగిలిన మేర డెట్‌కు కేటాయింపులు చేస్తుంటాయి. తద్వారా పెట్టుబడుల వృద్ధితోపాటు, స్థిరత్వానికి ఇవి ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈక్విటీ పెట్టుబడుల అస్థిరతలను కొంత తగ్గించుకోవాలని చూసే వారికి ఇవి అనుకూలం. గతేడాది కాలంలో ఈక్విటీల్లో ఆటుపోట్లు పెరిగిపోయిన తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల ప్రాధాన్యం పెరిగినట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ 9 శాతం రాబడులను ఇవ్వగా.. రెండేళ్ల కాలంలో వార్షిక రాబడి 20 శాతం, మూడేళ్లలో 15 శాతం, ఐదేళ్లలో సగటున 21 శాతం చొప్పున ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఇవి అనుకూలమని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ సూచించారు.ఇదీ చదవండి: పేటీఎమ్‌లో రూ.2,104 కోట్ల బ్లాక్డీల్భవిష్యత్కు అనుకూలం..రానున్న కాలానికి పెట్టుబడుల కోసంయాక్టివ్ నిర్వహణలోని అగ్రెస్సివ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ మొత్తంగా కాకుండా.. రంగాల వారీ, స్టాక్స్ వారీ కదలికలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. చురుకైన విధానంతో నడిచే అగ్రెస్సివ్ ఫండ్స్ మెరుగైన అవకాశాలను సొంతం చేసుకోగలవన్న అభిప్రాయాన్ని జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ వ్యక్తం చేశారు. సెబీ ఎఫ్‌అండ్‌వో నిబంధనలను కఠినతరం చేయడంతో కొందరు ఇన్వెస్టర్లు పన్ను ఆదా, బ్యాలన్స్డ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలున్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 18.5–24 శాతం మధ్య ఉంది. ఈ తరహా ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను నిపుణులు సూచిస్తున్నారు. -
అన్ని ఐటీఆర్ పత్రాలు నోటిఫై
ఆదాయపన్ను శాఖ మొత్తం ఏడు ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) పత్రాలను నోటిఫై చేసింది. తద్వారా రిటర్నుల దాఖలుకు ఇవి అందుబాటులోకి వచ్చినట్టయింది. గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను జులై 31లోగా దాఖలు చేయాల్సి ఉంది. వ్యక్తులు, ఖాతాల ఆడిటింగ్ లేని వారికి ఈ గడువు వర్తించనుంది.ఐటీఆర్ 2, 3, 5, 6, 7లో మూలధన లాభాల స్థిరీకరణకు సంబంధించి మార్పు చోటుచేసుకుంది. దీనికింద పన్ను చెల్లింపుదారులు తమ మూలధన లాభాలను 2024 జులై 23కు ముందు, ఆ తర్వాత అని రెండు భాగాలుగా చూపించాల్సి ఉంటుంది. అలాగే, ఐటీఆర్ 1, 4కు సంబంధించి కూడా మరో మార్పు జరిగింది. వేతన జీవులు రూ.1.25 లక్షలు మించని దీర్ఘకాల మూలధన లాభం కలిగినప్పుడు ఐటీఆర్ 1 లేదా 4 ఎంపిక చేసుకోవచ్చు. గతంలో వీరు ఐటీఆర్ 2 దాఖలు చేయాల్సి వచ్చేది. వేతనంతోపాటు దీర్ఘకాల మూలధన లాభాలు రూ.1.25 లక్షలకు మించితే అప్పుడు ఐటీఆర్ 2ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలువ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025ఆడిట్ అవసరమయ్యే వ్యక్తులు, వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025కంపెనీలు: అక్టోబర్ 31, 2025 -
అమ్మ నేర్పించే పెట్టుబడి పాఠాలు
మాతృమూర్తుల ప్రపంచం చాలా అసాధారణంగా, అద్భుతంగా ఉంటుంది. ఇల్లు, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలను మాతృమూర్తులు చక్కబెట్టే తీరును ఒకసారి పరిశీలిస్తే వారు ఎంత ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారనేది అర్థమవుతుంది. పరిమిత వనరులతోనే అన్ని అవసరాలను చక్కబెట్టడం నుంచి దీర్ఘకాలిక కోణంలో పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలు వేసి, అమలు చేయడం వరకు అమ్మ ఎంతో ఓర్పుగా, క్రమశిక్షణగా అనుసరించే విధానం ఒక మాస్టర్‌క్లాస్‌గా ఉంటుంది. ఇన్వెస్టర్లకు కూడా ఇదే ఓరిమి, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృక్పథాలు ఉంటే సంపద సృష్టికి దోహదం చేస్తాయి. డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, మనకు ఎంతో ఇష్టమైన వారి జీవితాలను తీర్చిదిద్దే నిర్ణయాలకు ఎలా కట్టుబడి ఉండాలనే విషయాలకు సంబంధించి అమ్మ నుంచి ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఓర్పు: ప్రక్రియను విశ్వసించడం ఒకసారి చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకోండి. పిల్లలు మొదటి మాట పలకడం కావచ్చు, మొదటి అడుగు వేయడం కావచ్చు ప్రతీ దాని కోసం అమ్మ ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంది. తొందరపడదు. పిల్లలు తప్పకుండా సాధిస్తారు, వారిలో ఆ సామర్థ్యం ఉంది అని గట్టిగా నమ్ముతుంది. పెట్టుబడులు కూడా ఇందుకు భిన్నమైనవి కావు. మార్కెట్లు పెరుగుతాయి, పడతాయి. కానీ పెట్టుబడులను అలా కొనసాగించడం వల్ల కాంపౌండెడ్ ప్రభావంతో సంపద స్థిరంగా వృద్ధి చెందుతుంది. స్వల్పకాలిక ఒడిదుడుకుల ప్రభావాలకు మనం సులభంగా భయపడిపోవచ్చేమో. కానీ చిన్ననాటి మైలురాళ్లలాగే, ఆర్థిక మైలురాళ్లను సాధించడానికి కూడా సమయం పడుతుంది. నిలకడగా, చిన్న మొత్తాలను పెట్టుబడులు పెడుతూ సంవత్సరాలు గడిచే కొద్దీ పెద్ద నిధిని సమకూర్చుకునేందుకు సిప్‌లు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) చక్కని సాధనాలుగా నిలుస్తాయి. రూపీ కాస్ట్ యావరేజింగ్, కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందుతూ కాలక్రమేణా సంపదను పెంచుకునేందుకు ఇవి తోడ్పడతాయి. క్రమశిక్షణ: చిన్న చిన్న పనులు, భారీ ఫలితాలు అమ్మ రోజువారీ దినచర్యే మనకు క్రమశిక్షణ పాఠంగా నిలుస్తుంది. పేరెంటింగ్ కావచ్చు, ఇన్వెస్టింగ్ కావచ్చు క్రమం తప్పకుండా, తరచుగా చేసే పనులు చిన్నవిగానే కనిపించినా భవిష్యత్తును తీర్చిదిద్దే పెద్ద ఫలితాలనిస్తాయి. ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలిగే సామర్థ్యాలనిస్తాయి. మార్కెట్లు పతనమైనప్పుడైనా లేక వ్యక్తిగతంగా ఆటంకాలు ఏర్పడిన కష్ట పరిస్థితుల్లోనైనా సిప్ల ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడం వల్ల ఆర్థిక సామర్థ్యం బలపడుతుంది. సిప్‌ను మధ్య మధ్యలో మానేసినా ఫర్వాలేదని అప్పుడప్పుడు అనిపించినప్పటికీ, అలా చేయడం వల్ల, దీర్ఘకాలిక లక్ష్యాలకు హాని కలుగుతుంది. పేరెంటింగ్లాగే ప్రతి విషయంలోనూ నిలకడగా ఉండటం ముఖ్యం.సిప్‌లు: అమ్మ స్టయిల్లో పెట్టుబడులు పెట్టడం మాతృమూర్తులు కేవలం నేటి గురించే కాదు, భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు. పిల్లల చదువుల కోసం పొదుపు చేయడం కావచ్చు లేదా డబ్బు విలువ గురించి నేర్పించడం కావచ్చు, వారు నిలకడగా చేసే చిన్న చిన్న పనులే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. సిప్‌లు కూడా ఇలాగే ఉంటాయి. ఆలోచనాత్మకంగా, నిలకడగా పని చేస్తాయి. క్రమశిక్షణతో క్రమం తప్పకుండా చేసే పెట్టుబడులే, అమ్మ కృషిలాగే, పెరిగి పెద్దయి, మంచి ఫలితాలనిస్తాయి. సత్వర లాభాల వెంటబడకుండా, అనిశ్చితుల్లోనూ పెట్టుబడులకు కట్టుబడాలి. ఫలితాలు వచ్చేందుకు తగిన సమయం ఇవ్వాలి. అమ్మలాగా పెట్టుబడి పెట్టడమంటే, సహన శక్తిపై నమ్మకం ఉంచడం. ప్రణాళికలు పట్టాలు తప్పకుండా చూసుకోవడం. సురక్షితమైన, స్వతంత్రమైన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. ఇది స్మార్ట్ ఇన్వెస్టింగ్ మాత్రమే కాదు, దీర్ఘకాలిక దృక్పథంతో నెమ్మదిగా, అర్థవంతమైన విధంగా సంపదను పెంపొందించుకోవడం కూడా. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం ఎంచుకున్న మ్యుచువల్ ఫండ్ స్కీములో క్రమం తప్పకుండా (సాధారణంగా నెలవారీగా), ఇంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేసేందుకు సిప్ ఉపయోగపడుతుంది. ఈ విధానంతో మూడు శక్తివంతమైన ప్రయోజనాలు ఉన్నాయి: రూపీ–కాస్ట్ యావరేజింగ్: మార్కెట్ హెచ్చుతగ్గులను అధిగమించేందుకు సిప్‌లు ఆటోమేటిక్‌గా సహాయపడతాయి. మార్కెట్లు పడినప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్లు పెరిగినప్పుడు కాస్త తక్కువ యూనిట్లు వస్తాయి. క్రమేణా కొనుగోలు ధర, నిర్దిష్ట సగటు స్థాయిలో ఉండటం వల్ల కాస్త అదనపు ప్రయోజనాలు చేకూరతాయి.అలవాటు ఏర్పడటం: మాతృమూర్తుల దినచర్య ఎలాగైతే ఉంటుందో, సిప్‌లు కూడా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ప్రతి నెలా సిప్ కట్టడమనేది ఒక అలవాటుగా మారుతుంది. దీర్ఘకాలిక పొదుపునకు దోహదపడుతుంది. సరళత్వం: తక్కువ మొత్తాలతోనే పెట్టుబడులను పెట్టడాన్ని ప్రారంభించేందుకు సిప్‌లు ఉపయోగపడతాయి. యువ ఇన్వెస్టర్లకు లేదా వివిధ బాధ్యతలున్న కుటుంబాలకు ఇలాంటి విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతల్లో మార్పులు, ఆదాయం పెరిగే కొద్దీ, పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. దీర్ఘకాలిక విజన్: భారీ లక్ష్యాలపై దృష్టిమాతృమూర్తులు కేవలం ఇవాళ్టి గురించే ఆలోచించరు. రాబోయే రోజుల గురించి కూడా ముందు నుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు. స్కూలు ఫీజుల కోసం పొదుపు చేయడం దగ్గర్నుంచి పిల్లల పెళ్ళిళ్ల ఖర్చుల వరకు ప్రతి విషయం గురించి ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ఆలోచిస్తారు. పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ఈ దీర్ఘకాలిక విజన్ ఉండటం చాలా ముఖ్యం. సంపద సృష్టి అనేది కేవలం ట్రెండ్ల వెంట పరుగెత్తడం ద్వారా కాదు, ప్రణాళికలు పట్టాలు తప్పకుండా చూసుకోవడం ద్వారానే సాధ్యపడుతుంది. పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు లేదా రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడం ఇలా లక్ష్యాల ఆధారితమైనదిగా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి.-రోహిత్ మట్టూ, నేషనల్ హెడ్ (రిటైల్ సేల్స్), యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ -
జీతాలు.. పన్ను భారం.. జాగ్రత్తగా లెక్కించాలి
మొత్తం ఆదాయలన్నింటిని 5 శీర్షికలుగా విభజించారు. అందులో మొదటిది జీతాలు. ఈ వారం జీతాలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీతం అనే ఆదాయాన్ని పొందే వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 🔸 ప్రభుత్వ ఉద్యోగులు 🔸 ప్రైవేటు సెక్టార్ ఉద్యోగులు 🔸 క్యాజువల్ లేబర్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు ఇలా.. పెద్ద జాబితా తయారవుతుంది. ప్రైవేటు సెక్టార్ పరిధిలో కంపెనీలు, సంస్థలు .... ఇదొక జాబితా. ఈ రెండూ కాకుండా క్యాజువల్‌గా పనిచేసే కార్మికులు, పనివారు. ఉద్యోగులు .. అంటే ప్రస్తుతం పని చేసేవారే కాకుండా రిటైర్ అయిన వారు పదవీ విరమణ తర్వాత డ్రా చేసే ఫైనాన్స్‌ని కూడా ‘జీతం’గానే పరిగణిస్తారు.ఫ్యామిలీ ఫైనాన్స్‌ని మాత్రం ఇతర ఆదాయంగా పరిగణిస్తారు. డబ్బులు ఇచ్చే వ్యక్తికి, ఆ డబ్బులు పుచ్చుకునే వ్యక్తికి మధ్య యజమాని–సేవకుడు అనే సంబంధం ఉంటేనే ఈ వ్యవహారాలను జీతంగా పరిగణిస్తారు. ఎటువంటి ఉద్యోగం..? ప్రైవేటా... ప్రభుత్వమా.., ఫుల్టైమా.., పార్ట్టైమా.., రెగ్యులరా..? పర్మినెంటా..? తాత్కాలికమా..? క్యాజువలా..? ఇటువంటి విషయాలతో నిమిత్తం లేదు. సెక్షన్ 15, సెక్షన్ 17లోని అంశాలు పరిశీలిస్తే జీతాల పరిధిని, నిర్వచనాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేశారనిపిస్తుంది. నిర్ధిష్టంగా, సంక్షిప్తంగా, క్లుప్తంగా నిర్వచించే సందర్భాల్లో... ఒక జాబితా తయారు చేసి ఇందులో అంశాలన్నీ ‘జీతం’ అని అంటారు. చెల్లించవల్సిన జీతం టాక్సబుల్, చెల్లించకపోయినా టాక్సబుల్. ప్రస్తుత యజమాని, పూర్వపు యజమాని .. ఎవరు ఇవ్వాల్సినా, దాని మీద పన్ను పడుతుంది. చెల్లించిన జీతాల గురించి చెప్పక్కర్లేదు. ఎరియర్స్ జీతాల మీద పన్ను పడుతుంది. ‘డ్యూ’ జీతం, చెల్లించిన జీతం... ఏది ముందు జరిగితే దానికి టాక్స్ వర్తింపచేస్తారు. అడ్వాన్స్ జీతం చెల్లించిన సంవత్సరంలో టాక్స్ వర్తింపచేస్తారు. జీతం... అంటే వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, అడ్వాన్స్ జీతం, కమీషన్, ప్రావిడెంట్ ఫండ్ క్రెడిట్ ద్వారా ప్రతి సంవత్సరం వచ్చి చేరే మొత్తం, న్యూ పెన్షన్ స్కీంలో చేసే చెల్లింపులు లాంటివన్నీ దీని పరిధిలోకి వస్తాయి. విదేశాల నుంచి జీతం వస్తే దాన్ని మన కరెన్సీలోకి మార్చి ఆ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. బోనస్ ఏ సంవత్సరం చేతికొచ్చిందో ఆ సంవత్సరం టాక్స్ వేస్తారు. గత సంవత్సరాల జీతాలు ‘ఎరియర్స్’ ప్రస్తుత సంవత్సరం వస్తే మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి.మొదటిది ఏంటంటే మొత్తాన్ని కరెంట్ సంవత్సరంలో వచ్చినట్లు లెక్కించడం లేదా రెండో ఆప్షన్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి సర్దుబాటు చేయడం వలన రిలీఫ్ వస్తే దాన్ని పొందడం. వదులుకున్న జీతం మీద టాక్సు పడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి వదిలేసిన జీతం మీద పన్ను భారం లేదు. జీతాలు విదేశాల్లో చెల్లించినా ఇండియాలోనే టాక్స్ వేస్తారు. డిప్యుటేషన్ మీద విదేశాలకు వెళ్లిన వారు ఇండియాలోనే పన్ను చెల్లించాలి. ఇక పెర్క్స్, పెర్క్విజిట్స్.. ఇదొక జాబితా.. రెంట్, ఫ్రీ వసతి, రాయితీ మీద ఇల్లు ఇవ్వడం, ఇతర సదుపాయాలు.. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఎంత మొత్తం మీద పన్ను పడుతుందనేది వాల్యుయేషన్ చేయాలి. రూలు 3 ప్రకారం... టాక్సు వర్తించే అంశాన్ని, దాన్ని ఎలా వాల్యూ చెయ్యాలో విశదీకరించారు. పెర్క్స్ తర్వాత చెప్పుకోదగినది జీతానికి బదులుగా ఇచ్చే మొత్తం. ఈ మొత్తం మీద కూడా పన్ను భారం పడుతుంది. ఉదాహరణకు పరిహారం.ఇక కొన్ని అలవెన్సులు మీద మినహాయింపు ఉంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యూటీ, ఇంటి అద్దె అలవెన్సు మొదలైనవి ఇంకా ఎన్నో ఉంటాయి. పన్ను భారం తగ్గించుకోవడానికి అనేక ఇన్వెస్ట్మెంట్ పద్దతులున్నాయి. ఇవే 80 ఇ నుంచి మొదలయ్యే అంశాలు ఉన్నాయి. ఇదోక పెద్ద జాబితా. జీతం ఒక చిన్న పదం. దాని పరిధిలో ఎన్నో అంశాలు ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా పన్ను భారాన్ని లెక్కించాలి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
కొత్త ఫండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
నా వద్దనున్న పెట్టుబడుల్లో 60% బ్యాంకు ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన 40% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాను. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ బాగా పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో నేను ఏం చేయాలి? – మనోజ్ సిన్హామీరు ఈక్విటీకి 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయింపులతో అస్సెట్ అలోకేషన్ విధానాన్ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మీ మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ వాటా 80%కి చేరి డెట్ పెట్టుబడులు 20%గా ఉన్నాయని అనుకుంటే.. పోర్ట్‌ఫోలియో పరంగా రిస్క్ పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులు ఈక్విటీల్లో ఉండడంతో మార్కెట్ల ఆటుపోట్ల ప్రభావం పెట్టుబడుల విలువపై అధికంగా పడుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు.రిస్క్ ఎక్కువగా తీసుకోకూడదన్నది మీ అభిప్రాయం అయితే.. ఈక్విటీ పెట్టుబడులను తిరిగి 60%కి తగ్గించుకుని, డెట్ పెట్టుబడులను 40%కి పెంచుకోవాలి. దీన్నే అస్సెట్ రీఅలోకేషన్తో లేదా అస్సెట్ రీబ్యాలన్స్గా చెప్పుకోవచ్చు. అస్సెట్ రీబ్యాలన్సింగ్తో ఉన్న మరో ప్రయోజనం.. అధిక స్థాయిల్లో విక్రయించి, తక్కువలో కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. అంటే విలువ గణనీయంగా పెరిగిన చోట విక్రయించి.. అదే సమయంలో పెద్దగా పెరగని చోట కొనుగోలు చేస్తాం.ఉదాహరణకు పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా పెరిగితే.. ఈక్విటీలు బాగా ర్యాలీ చేశాయని అర్థం. దాంతో అస్సెట్ రీబ్యాలన్స్లో భాగంగా అధిక వ్యాల్యూషన్ల వద్ద పెట్టుబడులు కొంత వెనక్కి తీసుకుని డెట్‌కు మళ్లిస్తాం. తరచూ కాకుండా.. ఏడాదికి ఒకసారి పెట్టుబడులను సమీక్షించుకుని అస్సెట్ రీబ్యాలన్స్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక సాధనంలో (ఈక్విటీ లేదా డెట్) పెట్టుబడుల విలువ మీరు నిర్ణయించుకున్న పరిమితికి మించి 5 శాతానికి పైగా పెరిగిపోయిన సందర్భాల్లోనూ రీబ్యాలన్స్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ప్రకటనలు తరచూ కనిపిస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? లేక ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫండ్స్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నవి ఎంపిక చేసుకోవాలా? – జైరూప్కొత్త పథకాల పట్ల, మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినప్పుడు ఆసక్తి ఏర్పడడం సహజమే. పెట్టుబడుల ప్రపంచంలో కొత్త అంటే అది మెరుగైనదని కాదు. చాలా వరకు ఎన్‌ఎఫ్‌వోలు ఇన్వెస్టర్ల కోసం కొత్తగా తీసుకొచ్చేదేమీ ఉండదు. ఇప్పటికే గొప్పగా నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ వ్యూహాలను పోలినవే ఎక్కువ సందర్భాల్లో ఎన్ఎఫ్వోలుగా వస్తుంటాయి. ఇప్పటికే ఉన్న పథకాల మాదిరి కాకుండా.. ఎన్‌ఎఫ్‌వోలకు గత పనితీరు చరిత్ర ఉండదు.సదరు ఎన్ఎఫ్వో ఫండ్ మేనేజర్ మార్కెట్ సైకిల్స్, రిస్క్‌ను సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారన్నది తెలియదు. కొత్త ఫండ్ అని ఎంపిక చేసుకోవడం అంటే.. మంచి ట్రాక్ రికార్డు ఉన్న క్రికెటర్లను కాదని, అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడం వంటిదే. కొత్త ఆస్సెట్ క్లాస్ లేదా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేయకుండా, అప్పటికే ఉన్న పథకాల పెట్టుబడుల వ్యూహాలకు నకలుగా వచ్చే ఫండ్‌ను ఎంపిక చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వేల్యూ ఇన్వెస్టింగ్‌కి పెరుగుతున్న ప్రాధాన్యత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వేల్యూ ఇన్వెస్టింగ్‌కి ప్రాధాన్యత పెరుగుతున్నట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ సోనమ్ ఉదాసీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌లోకి రూ. 884 కోట్లు రాగా, ఏయూఎం రూ. 8,004 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.సాధారణంగా నెగెటివ్ మార్కెట్ సెంటిమెంట్ వంటి అంశాల వల్ల ఉండాల్సిన దానికన్నా తక్కువ విలువకి ట్రేడవుతున్న స్టాక్స్‌లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయని వివరించారు. టారిఫ్‌లపరంగా కఠినతర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్, యుటిలిటీస్, ఇంధన, సిమెంట్, పెట్రోకెమికల్స్, సర్వీసెస్ వంటి దేశీ పరిస్థితుల ఆధారిత రంగాలు ఆకర్షణీయంగా ఉండొచ్చన్నారు. -
ఏంజెల్ వన్ నుంచి రెండు కొత్త ఫండ్స్..
ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఈటీఎఫ్ పేరిట రెండు ప్యాసివ్ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. మే 16 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ రూపంలోనైతే రోజువారీ, వారంవారీ, పక్షానికోసారి, నెలవారీ, త్రైమాసికాలవారీగా రూ. 250 నుంచి రూ. 3,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి రెండూ నిఫ్టీ 50 సూచీని ట్రాక్ చేస్తాయి. నాణ్యమైన లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడుల ప్రయోజనాలను పొందాలనుకునే ఇన్వెస్టర్లు వీటిని ఎంచుకోవచ్చని సంస్థ ఈడీ హేమేన్ భాటియా తెలిపారు. బరోడా బీఎన్పీ పారిబా నుంచి..ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) పేరిట న్యూ ఫండ్ ఆఫర్‌ను బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీపీఎంసీ Baroda BNP Paribas) ఆవిష్కరించింది. ఇది మే 21న ముగుస్తుంది. రిస్కులను అంతగా ఇష్టపడకుండా.. మూలధన వృద్ధి, మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనువైనదిగా ఉంటుంది. బీబీపీఎంసీకి చెందిన డెట్ ఆధారిత ఫండ్స్‌లో 50–65 శాతం నిధులను, ఆర్బిట్రేజ్ పథకంలో 30–50 శాతం, మిగతా మొత్తాన్ని మనీ మార్కెట్ సాధనాల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. -
మిస్ సెల్లింగ్.. బుట్టలో పడకూడదంటే..?
ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రకాష్ (60)కు వివిధ ప్రయోజనాల రూపంలో రూ.40 లక్షలు సమకూరాయి. వీటిని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ) దానిపై ప్రతి నెలా ఆదాయం తీసుకోవాలని భావించాడు. సీనియర్ సిటిజన్స్‌కు అర శాతం అదనపు రేటు కూడా అతన్ని ఆకర్షించింది. తీరా బ్యాంక్‌కు వెళ్లిన తర్వాత అక్కడి రిలేషన్ షిప్ మేనేజర్ (ఆర్ఎం) సూచనలతో మరింత రాబడి కోసం ‘స్పెషల్ ఎఫ్డీ’లో ఇన్వెస్ట్ చేశాడు.అది కాస్తా యులిప్ ప్లాన్ అని తర్వాత తెలియడంతో ఎవరికి చెప్పుకోలేక లోలోపలే ఆవేదన చెందాడు. గత రాబడుల గురించి గొప్పగా చెప్పడంతో ఆర్ఎం మాటలతో బోల్తా పడ్డాడు. 55 ఏళ్ల నారాయణ మూర్తి చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఒక్కతే కుమార్తె. ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపాడు. ఇటీవలే ఊళ్లో భూమిని విక్రయించగా రూ.20 లక్షలు చేతికి వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడి మేనేజర్ ఎఫ్డీ కంటే మంచి రాబడి వస్తుందంటూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయించాడు. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురుకావొచ్చు. అవగాహనతోనే ఇలాంటి వాటికి చెక్ పెట్టడం సాధ్యపడుతుంది. తిరుచ్చిరాపల్లికి చెందిన నారాయణస్వామి దంపతులకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. గడువు తీరిన ఎఫ్డీని రెన్యువల్ చేద్దామని బ్యాంక్‌కు వెళ్లగా.. దానికి బదులు యులిప్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్న సూచన బ్యాంక్ నుంచి వచ్చింది. దీంతో వారు ఫైనాన్షియల్ అడ్వైజర్ (ఆర్థిక సేవల సలహాదారు)ను సంప్రదించారు. యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండాలన్న సూచనతో ఎఫ్డీ రెన్యువల్‌కే మొగ్గు చూపించారు. బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడి సాధనాలను తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీన్నే మిస్ సెల్లింగ్‌గా చెబుతున్నారు. బ్యాంక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు, బీమా ఏజెంట్ల బుట్టలో పడకుండా ఉండాలంటే కావాల్సింది అవగాహన, స్వీయ జాగ్రత్తలే. ఇలాంటి సందర్భాల్లో కార్యాచరణ ఎలా ఉండాలన్నది చూద్దాం. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఐఆర్డీఏఐ గణాంకాల ప్రకారం బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,27,378 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 50 శాతం జీవిత బీమా కంపెనీలు మిస్ సెల్లింగ్ విధానాలకు వ్యతిరేకంగా దాఖలైనవే ఉన్నాయి. బ్యాంకింగ్ ఉత్పత్తుల కంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించి విక్రయించడం అతిపెద్ద సమస్యగా ఉన్నట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ వివేక్ అయ్యర్ తెలిపారు. ‘‘బ్యాంకుల ఉత్పత్తులు సులభంగా, సరళంగా ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ అన్నవి మార్కెట్ రిస్క్‌లు, షరతులతో ముడిపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నిపుణులకు సైతం వీటి గురించి చెప్పడం కష్టంగానే ఉంటుంది’’ అని వివరించారు. బ్యాంకుల ద్వారా ఎక్కువ మిస్ సెల్లింగ్ అవుతున్నది బీమా ఉత్పత్తులేనని ఆర్థిక సర్వే 2024 సైతం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యస్ బ్యాంక్ ఉదాహరణ గురించి కూడా చెప్పుకోవాలి. లోగడ యస్ బ్యాంక్ సిబ్బంది ఎఫ్‌డీల పేరుతో ఏటీ–1 బాండ్లను కస్టమర్లకు విక్రయించారు. నిజానికి అవి పర్పెచ్యువల్ బాండ్లు. ఈ విషయం తమకు చెప్పనేలేదని కస్టమర్లు ఆరోపించడం గమనార్హం. ఏటీ–1 బాండ్లకు మెచ్యూరిటీ ఉండదు. నిర్ణీత కాలానికోసారి వడ్డీ చెల్లింపులు చేస్తారు. ఎఫ్‌డీల కంటే వీటిపై అధిక రేటు ఉంటుంది. బ్యాంక్ నష్టపోతే వీటికి ఎలాంటి చెల్లింపులు చేయరు. వాటిని రద్దు చేయొచ్చు కూడా. 2020లో యస్ బ్యాంక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు రూ.8,400 కోట్ల ఏటీ–1 బాండ్లను రద్దు చేసింది.మార్కెటింగ్ లక్ష్యాలు.. → బీమా ఉత్పత్తులను ఎఫ్‌డీల కంటే అధిక రాబడులను ఇచ్చే సాధనాలుగా బ్యాంక్ ఆర్ఎంలు విక్రయిస్తుండడం తరచుగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో మూడు నుంచి ఐదేళ్ల కాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలుగా వాటిని బ్యాంక్ సిబ్బంది విక్రయిస్తున్నట్టు డెలాయిట్ ఇండియా ఇన్సూరెన్స్ సెక్టార్ లీడర్ దేవాశిష్ బెనర్జీ తెలిపారు. → బ్యాంక్ రుణం మంజూరునకు, లాకర్ల సదుపాయం తెరవాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి అని కొన్ని బ్యాంకులు షరతు పెడుతున్నాయి. → యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (యులిప్‌లు), డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు (ఇన్వెస్ట్ చేసిన కొంత కాలం తర్వాత నుంచి దానిపై ఆదాయం చెల్లించేవి), గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్లు సైతం తçప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నారు. → రిస్క్ అంతగా తీసుకునే సామర్థ్యం లేని సంప్రదాయ ఇన్వెస్టర్లకు అధిక రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను విక్రయిస్తున్నారు. → పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సరీ్వసెస్ (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు)ను తరచుగా మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైనవంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. → కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా కస్టమర్లతో రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎఫ్డీ ప్రారంభిస్తే తక్కువ రేటుపై పర్సనల్ లోన్ ఇస్తామంటూ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ సిబ్బంది కస్టమర్లను కోరుతున్నారు. తమకు విధించిన లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా బ్యాంక్ సిబ్బంది ఇలాంటి ఉత్పత్తులను ఏదో ఒక రకంగా కస్టమర్లతో కొనిపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. → 1 ఫైనాన్స్ మ్యాగజైన్’ 2024 అక్టోబర్ సర్వే నివేదిక ప్రకారం.. లక్ష్యాలను చేరుకోకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో బ్యాంక్ ఆర్ఎంలలో 57 శాతం మంది ఆర్థిక ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు.అవగాహనతోనే నివారణ ఏ ఉత్పత్తిని అయినా కొనుగోలు చేసే ముందు పూర్తి పరిశీలన అవసరం. దాని గురించి సమగ్రంగా తెలుసుకుని, అవగాహన ఏర్పడిన తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. బ్యాంక్‌లు విక్రయిస్తున్నవన్నీ తప్పుదోవపట్టించి అంటగట్టేవిగా చూడడం సరికాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ జీవిత, ఆరోగ్య బీమా అవసరం. ఇప్పుడు చాలా బ్యాంక్‌లు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని నాన్ గ్రూప్‌తో పోలి్చతే తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక బ్యాంక్‌ల్లో అందుబాటులో ఉండే ఉత్పత్తుల్లో కొన్ని ప్రయోజనకరమైనవీ ఉంటాయన్నది మర్చిపోవద్దు. ముఖ్యంగా అధిక రాబడుల కాంక్షతో పెట్టుబడి సాధనాలను కొనుగోలు చేయడం సరికాదు. ఇంటర్నెట్లో సంబంధిత ఉత్పత్తి గురించి శోధిస్తే సమగ్ర సమాచారం చిటికెలో లభిస్తుంది. ‘‘ఏజెంట్‌ను గుడ్డిగా నమ్మకుండా కస్టమర్లు తమ పరిశోధన తర్వాత సహేతుక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి రోజూ ఎన్నో కొత్త ఉత్పత్తులు వస్తుండడంతో బ్యాంక్ ఆర్ఎంలపై లక్ష్యాల భారం పడుతోంది. ఈ ఒత్తిడితో ఆయా సాధనాల గురించి కస్టమర్లకు వివరంగా చెప్పకుండానే తప్పుడు మార్గాల్లో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ వివేక్ అయ్యర్ తెలిపారు.మోసపోతే ఏం చేయాలి? → ఇప్పటికే బ్యాంక్ నుంచి ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసి, అది తమ అవసరాలను సరిపడదని గుర్తిస్తే దీనిపై చర్యలు చేపట్టొచ్చు. బ్యాంక్ కస్టమర్ సేవల విభాగం లేదా ఆర్ఎం వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. ఫలితం రాకపోతే అదే బ్యాంక్‌లో ఫిర్యాదుల పరిష్కార విభాగం దృష్టికి తీసుకెళ్లాలి. → బ్యాంక్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే లేదా సంతృప్తికరమైన ఫలితం రాకపోతే అప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ‘‘సంబంధిత లావాదేవీని రద్దు చేయాలని అంబుడ్స్‌మన్ ఆదేశించగలదు. లేదా పరిహారం ఇప్పిస్తుంది. లేదా దిద్దుబాటు చర్యలకు ఆదేశిస్తుంది. ఇదొక సమర్థవంతమైన పరిష్కార యంత్రాంగం. దీనికి న్యాయపరమైన ప్రతినిధి అవసరం లేదు’’అని ఢిల్లీకి చెందిన న్యాయవాది నిషాంత్ దత్తా సూచించారు. → బ్యాంక్, అంబుడ్స్‌మన్ స్థాయిల్లో పరిష్కారం రాకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (వినినయోగదారుల ఫోరమ్) వద్ద కేసు దాఖలు చేయాలి. → చివరిగా కోర్టును ఆశ్రయించడం ద్వారా న్యాయం కోసం ప్రయత్నించొచ్చు. గతంలో పలు హైకోర్టులు, సుప్రీంకోర్టుల వరకు ఇలాంటి మిస్ సెల్లింగ్ కేసులు వెళ్లాయి. ఆ సమయంలో కోర్టులు సైతం కఠినంగా స్పందించాయి. → వీరేంద్ర పాల్ కపూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో.. రాబడులపై తప్పుడు సమాచారంతో పాలసీని విక్రయించిన బీమా సంస్థ అందుకు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది. బ్యాంక్ సిబ్బంది చర్యలకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సైతం 2013లో ఓ కేసు సందర్భంగా స్పష్టం చేసింది. → మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు లేదా ఏజెంట్లు ఉత్పత్తులను తప్పుగా అంటగడితే సెబీ వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. → బీమా ఏజెంట్ల కారణంగా తమకు అనుకూలం కాని ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టయితే బీమా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాలి. ప్రయోజనాలు.. రిస్క్ లు చూడాలి... బ్యాంక్ ఆఫర్ చేస్తున్నఉత్పత్తిలోని ప్రయోజనాలు, రిస్క్‌లు, అవి తమకు ఏ మేరకు అనుకూలమన్నది ప్రశి్నంచాలి. అర్థవంతమైన వివరణ అనంతరం సరైన నిర్ణయం తీసుకోవాలి. రుణం మంజూరు కావాలంటే దానికి అనుబంధంగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలని కోరొచ్చు. అవసరం లేకపోతే అదే విషయం తేలి్చచెప్పండి. తమకు అప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ లేకపోతే కొనుగోలును పరిశీలించొచ్చు. సంతకాలు చేసే ముందు ఆయా పత్రాలను వివరంగా చదివి అర్థం చేసుకోవాలి. గ్యారంటీడ్ (హామీతో కూడిన) రాబడుల పేరుతో ఏదైనా ఉత్పత్తిని విక్రయించే ప్రయత్నం చేస్తుంటే.. అది డెట్ సాధనమే అయి ఉండాలి. అధిక రాబడులు వస్తాయంటుంటే అది ఈక్విటీ సాధనమైనా అయి ఉండొచ్చు. గత రాబడులు భవిష్యత్ పనితీరుకు హామీ కాదు. ఉత్పత్తి ఏదైనా సరే తమ అవసరాలకు సరితూగే విధంగా ఉండాలి. ఉదాహరణకు 60 ఏళ్లు నిండిన వారికి జీవిత బీమా కవరేజీ అవసరం ఉండదు. కనుక వారు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. యులిప్‌లు అయినా, ఈక్విటీలు అయినా అధిక రిస్క్‌తో కూడినవి. వృద్ధాప్యంలో మెజారిటీ మొత్తం సురక్షిత సాధనాల్లోనే ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. సెబీ, యాంఫి, ఆర్బీఐ, ఐఆర్డీఏఐ ఇప్పటికే తమ నియంత్రణల పరిధిలో సంస్థలకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేశాయి. → మీ అవసరాలను, ఆర్థిక లక్ష్యాలను ముందుగా తేల్చుకోవాలి. ఆ తర్వాత అందుకు అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడుల పత్రాలను సమగ్రంగా చదివి, సందేహాలను తీర్చుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. → రిస్క్ తీసుకోలేని వారు అధిక రాబడులను ఆశించడం సరికాదు. అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఎలాంటి హామీ ఉండదు. → పెట్టుబడులు, రక్షణ కలసిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఈ రెండింటినీ వేర్వేరుగా తీసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలు
ఆదాయపు పన్ను దాఖలుకు సమయం రానే వచ్చింది. ఐటీఆర్ దాఖలుకు చివరితేదీని ప్రభుత్వం జులై 31గా నిర్ణయించింది. చివరి నిమిషంలో గందరగోళంగా పన్ను రిటర్న్‌లు ఫైల్ చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుని వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి దాఖలుకు ఎలాంటి ధ్రువపత్రాలు సమకూర్చుకోవాలి.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుందాం.అవసరమైన డాక్యుమెంట్లు: పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫారం 16 (వేతన జీవుల కోసం), బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం: మీ ఆదాయ వనరు ఆధారంగా తగిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాన్ని ఎంచుకోవాలి. ఉదా. వేతన జీవులు ఐటీఆర్ -1, వ్యాపార యజమానులు ఐటీఆర్ -3 తీసుకోవాలి.పన్ను లెక్కలు: మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, మినహాయింపులు, చెల్లించాల్సిన మొత్తం పన్నును లెక్కించాలి. ఈ వివరాలు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఎంతో ఉపయోగపడుతాయి.ఆన్లైన్లో ఐటీఆర్ దాఖలు: ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి మీ వివరాలను నమోదు చేయాలి. మీ వద్ద ఉన్న ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలతో రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు.ట్యాక్స్ రిటర్న్ వెరిఫై: ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి లేదా మీరు సంతకం చేసిన ఫిజికల్ కాపీలో వివరాలు నమోదు చేసి ఇన్కమ్ ట్యాక్ విభాగానికి పంపడం ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది దీన్ని విస్మరిస్తారు. కేవలం ఐటీఆర్ ఫైల్ చేయడంతోనే ప్రక్రియ పూర్తి అయిపోతుందని అనుకుంటారు. కానీ కచ్చితంగా ట్యాక్స్ రిటర్న్‌లను వెరిఫై చేయాలి. అప్పుడే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.ఇదీ చదవండి: ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలువ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025ఆడిట్ అవసరమయ్యే వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025కంపెనీలు: అక్టోబర్ 31, 2025 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈఎంఐలు తగ్గుతాయ్...
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లోన్ కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అంటే 0.15% తగ్గించింది.ఈ సవరణ తరువాత,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు రుణ కాలపరిమితిని బట్టి 9 శాతం నుంచి 9.20 శాతం వరకు ఉంటుంది. ఇది ఇంతకు ముందు 9.10 శాతం నుంచి 9.35 శాతం ఉండేది. సవరించిన రేట్లు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో తరువాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ఎంసీఎల్ఆర్లో మార్పులు చేసింది. 2025 ఫిబ్రవరి నుండి రెపోరేటు మొత్తం తగ్గింపు 50 బేసిస్ పాయింట్లకు చేరుకుంది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు. ఇది తగ్గితే సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో రుణ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకులు తక్కువ రుణ రేట్ల ద్వారా తక్కువ ఫండింగ్ ఖర్చుల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.రుణగ్రహీతలకు ఏంటి ప్రయోజనం?ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం ఒక ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రత్యేకంగా ఆర్బీఐ సవరిస్తే తప్ప ఇదే రేటును బ్యాంకులు అమలు చేస్తాయి. 2016లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఎంసీఎల్ఆర్ను గృహ, వ్యక్తిగత, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్ రేట్ రుణాలకు ఉపయోగిస్తారు. ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణం ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడిన రుణ ఈఎంఐలు తగ్గుతాయి లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుఓవర్నైట్: 9.00%1 నెల: 9.00%3 నెలలు: 9.05%6 నెలలు: 9.15%1 సంవత్సరం: 9.15%2 సంవత్సరాలు: 9.20%3 సంవత్సరాలు: 9.20% -
ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?
2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.ఫారం 16 అంటే ఏమిటి?యజమాని తన దగ్గర చేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జారీ చేసేది ఫారం 16. ఇందులో మొదటి భాగంలో ఉద్యోగులు, యజమాని ప్రాథమిక వివరాలు ఉంటాయి. రెండో భాగంలో జీతభత్యాలకి సంబంధించిన పూర్తి వివరాలు .. అంటే జీతాలు, అలవెన్సులు, టాక్సబుల్ ఇన్‌కం వివరాలు, మినహాయింపులు, తగ్గింపులు, డిడక్షన్లు, నికరజీతం లేదా ఆదాయం, టీడీఎస్ వివరాలు ఉంటాయి. ‘సులభతరం, పారదర్శకత, స్పష్టత’ అనే లక్ష్యాలతో ఫారం 16 రాబోతోంది.ఫారం 16 చాలా ముఖ్యమైంది..రిటర్నులు వేయడానికి మొదటగా చూసే డాక్యుమెంటు ఇదే. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు ఈ ఫారంనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఈ ఫారంతో ఉద్యోగి ‘రుణ స్తోమత’ నిర్ధారిస్తారు. దీంతోనే పన్ను భారం, చెల్లింపులు నిర్ధారించవచ్చు. రీఫండు కోసం కూడా ఇదే ఫారంని ‘బేస్’గా తీసుకుంటారు. ఎందుకంటే, పన్ను వసూలు చేయడం, దాన్ని ప్రభుత్వానికి చెల్లించడాన్ని దీని ద్వారానే నిర్ధారించుకుంటారు. ఇవే అంశాలు 26ఏఎస్‌లో ఉంటాయి.ప్రతి మూడు నెలలకు సమ్మరీ, జీతం, టీడీఎస్ చెల్లించినది, గవర్నమెంటుకు ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, ఏ తేదీన కట్టారు, చలాన్ నంబరు ఎంత వగైరా వివరాలన్నీ ఉంటాయి. జీతం, అలవెన్సులు, బోనస్‌లు, ఏరియర్స్, సెక్షన్ 10 ప్రకారం మినహాయింపులు, ఇంటి అద్దె అలవెన్సు, గ్రాట్యుటీ మొదలైన అన్ని డిడక్షన్లు 80 C నుంచి 80 TTA వరకు ఉంటాయి. ఆ తరువాత పన్ను భారం లెక్కింపులు, స్టాండర్డ్ డిడక్షన్లు ఉంటాయి. 89(1) రిలీఫ్ కూడా ఉంటుంది. వచ్చిన మార్పులు ఏమిటంటే..80 ఇఇఏ ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కి ఇచ్చిన విరాళాలకు సంబంధించిన మినహాయింపు ఉంటుంది. జీతాలకు సంబంధించిన అంశాలు వర్గీకరిస్తారు. హెచ్ఆర్ఏకి సంబంధిత వివరాలుంటాయి. అలాగే రెంట్‌ఫ్రీ వివరాలు, ఇతర ప్రిరిక్వజిట్లు, ప్రతి డిడక్షన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు పొందుపరుస్తారు. కొత్త కాలమ్ ద్వారా టీడీఎస్, టీసీఎస్కి సంబంధించిన వివరాలు తెలిసేలా, సరి చేసుకునే వీలు కల్పించడానికి ఫారం 24 Q టీడీఎస్/టీసీఎస్ రిటర్నులు కనిపించేలా చేస్తారు. దీనివల్ల 26 Aను అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్మీరు చేయాల్సిందేమింటంటే..ఫారం 16 యజమాని ఇచ్చే సర్టిఫికేట్. ఇది విలువైంది. ఎందుకంటే ఇది మీ టీడీఎస్, టీసీఎస్ రికవరీ అయినట్లు... చెల్లించినట్లు. గవర్నమెంటు చేతికందినట్లూ. మీ ఖాతాలో జమ అయినట్లు ధృవీకరించే ఏకైక పత్రం. అయితే ఇందులో ప్రతి అంశాన్ని మీరే సరి చూసుకోవాలి. నెలసరి శాలరీ స్లిప్పులతో మినహాయింపు, తగ్గింపులు... మొదలైనవి చెక్ చేసుకోవాలి. మీరు ఇచ్చే ఆదాయపు వివరాలు ఉన్నాయా లేదా ఎక్కువ పడ్డాయా చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాగితాలు భద్రపరుచుకోవాలి. మీరు కొత్త రెజీమ్‌లో ఉన్నారా లేక పాత పద్ధతిలో ఉన్నారో చెక్ చేసుకొండి. మీరు సంవత్సరంలో ఉద్యోగం మారితే రెండు ఫారం 16లు ఉంటాయి. అప్పుడు రిపోరి్టంగ్లో హెచ్చు తగ్గులు... డబుల్ క్లయిమ్/తప్పుడు క్లయిమ్ ఉండొచ్చు. చెక్ చేసుకోండి. యజమానికి అంటే ‘డిస్బర్సింగ్’ అధికారి ఇవన్నీ అదనపు భాద్యతలు... తగిన జాగత్ర వహించాలి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు కొత్త ఫారమ్ 16 వల్ల రావని ఆశిద్దాం! ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!
మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలానే కారణాలుండొచ్చు.. అయితే దాంపత్య జీవితంలో భాగస్వామికి డబ్బు లేకపోవడం, అప్పులుండడం, ఖర్చు చేయలేకపోవడం.. వంటివి కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెడుతోంది. కలకాలం సంతోషంగా జీవించాల్సిన జంటను ఈ డబ్బు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిస్తోంది. విడిపోయే జంటల జీవితాలను మనీ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.రుణాలు..కొత్తగా పెళ్లయిన జంటను స్థిరమైన ఆర్థిక ఒత్తిళ్లు వేరు చేస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లికి చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. సంపన్నులకు డబ్బు ఖర్చయినా తిరిగి సంపాదిస్తారు. పేదవారు కూడా ఉన్నంతలో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిస్తారు. కానీ సమస్య అంతా మధ్య తరగతి ప్రజలతోనే. బంధువుల్లో గొప్ప కోసమో.. మళ్లీ చేయని కార్యక్రమం అనో.. పెళ్లికి బాగానే డబ్బు ఖర్చు చేస్తారు. మధ్య తరగతివారికి సరైన సంపాదన ఉండకపోవడంతో దీనికోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం కోసం భాగస్వామిపై వేదింపులు సాగిస్తారు. అది చివరకు విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.ఆర్థిక అస్థిరతపెళ్లైనప్పటి నుంచి వధువరులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి తర్వాత పిల్లలు, వారి చదువులు, వాహనాల కొనుగోలు, ఆస్తులు కూడబెట్టడం.. వంటి కార్యకలాపాల కోసం చాలామంది అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించలేక మానసిక ఒత్తిడితో భాగస్వామితో సఖ్యతగా నడుచుకోకుండా చివరకు కాపురాన్ని కూల్చుకుంటున్నారు.దుబారా ఖర్చులు..పెళ్లికి ముందు చాలా మందికి దుబారాగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. వివాహం తర్వాత కూడా అది కొనసాగితే అప్పులు తప్పవు. సంపాదన భారీ మొత్తంలో ఉన్న కుటుంబాలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలపై ఈ వ్యవహార శైలి తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది దంపతుల మధ్య గొడవలు జరిగేందుకు కారణమవుతుంది. ఇది కూడా విడాకులకు దారితీస్తుంది.ఇదీ చదవండి: వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలుమరేం చేయాలి..జల్సాలకు, దుబారా ఖర్చులకు అలవాటుపడే వారు, పెళ్లి కోసం అనాలోచితంగా చేసే భారీగా ఖర్చు చేసేవారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఆ దంపతులు తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు చాలాసార్లు కారణమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సవాళ్లు అనివార్యమైనప్పటికీ సరైన ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ వల్ల సమస్యలను గట్టెక్కవచ్చు. ఆ దిశగా దంపతులు ఆలోచించాలి. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేయకుండా పెట్టుబడి, పొదుపుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరెన్సీ నోటు కాపురాలను కలకాలం నిలబెడుతుంది.. అదే కాపురాలను చిదిమేస్తుందని గుర్తుంచుకోవాలి. -
అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయని విన్నాను. ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్ పరిమితుల్లోనూ మార్పులు చేసినట్టు తెలిసింది. సీనియర్ సిటిజన్‌గా (60 ఏళ్లకు పైన) నాకు డెట్ సాధనాలపై వస్తున్న వడ్డీ ఆదాయమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఆదాయపన్ను మార్పుల ప్రభావం నాపై ఏ మేరకు ఉంటుంది? – వినోద్ బాబుకొత్త విధానం కింద ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయన్నది నిజమే. టీడీఎస్ పరిమితిని సీనియర్, నాన్ సీనియర్ సిటిజన్లకూ (60 ఏళ్లలోపు) తగ్గించారు. సీనియర్ సిటిజన్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఉంది. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఆదాయం ఈ లోపు ఉంటే టీడీఎస్ వర్తించదు. నాన్ సీనియర్ సిటిజన్స్‌కు రూ.40,000గా ఉన్న పరిమితి రూ.50,000కు పెరిగింది. అంటే వడ్డీ ఆదాయం రూ.50వేలు మించినప్పుడే టీడీఎస్ వర్తిస్తుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్ అమలును రూ.2.4 లక్షల పరిమితి నుంచి రూ.6లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అంటే ఫండ్స్ నుంచి డివిడెండ్ ఆదాయం రూ.10,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను శ్లాబుల్లోనూ మార్పులు జరిగాయి. మొత్తం ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటే సెక్షన్ 87ఏ కింద రాయితీ ప్రయోజనంతో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే మూలధన లాభాలు కూడా రూ.12 లక్షల ఆదాయంలోపే ఉన్నప్పటికీ.. మూలధన లాభాలపై విడిగా పన్ను చెల్లించడం తప్పనిసరి. ఇదీ చదవండి: రేట్ల తగ్గింపు ప్రతికూలం!మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – ఉషమార్కెట్లలో అస్థిరతలు సహజమే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆటుపోట్లను చూశాం. భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. వీటిని ఎదుర్కొనే విధంగా ఇన్వెస్టర్ల పెట్టబడుల ప్రణాళిక ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాల్సి ఉంటుంది. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య రక్షణ కలి్పంచుకోవాలి. ఊహించని అవసరాలు ఏర్పడితే ఈక్విటీ పెట్టబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి అయి ఉండాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అస్థిరతల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్ కరెక్షన్లలో మంచి పెట్టుబడుల అవకాశాలు వస్తుంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌక ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబడులను పెంచుకోవచ్చు.ధీరేంద్ర కుమార్సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పోస్టాఫీస్ స్కీములకు కొత్త విధానం
పోస్టాఫీస్ పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఈ స్కీములు మారుమూల గ్రామీణులకు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని తెరిచేందుకు అనుసరించే పేపర్ వర్క్ సామాన్యులకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన పొదుపు పథకాలను తెరవడానికి తపాలా శాఖ ఇప్పుడు పూర్తి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), టైమ్ డిపాజిట్ (టీడీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) వంటి పొదుపు పథకాలను తెరవడానికి పేపర్లతో పనిలేకుండా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తపాలా శాఖ అమలుచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా, వేగంగా ఉంటుంది. ఫిజికల్ డిపాజిట్ స్లిప్ అవసరం ఉండదు.మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలను తెరవడానికి ఆధార్ ఆధారిత వీ-కేవైసీ ప్రక్రియను ఏప్రిల్ 23 నుండి తపాలా శాఖ అమలు చేస్తోంది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు తెరవడం, నిర్వహించడం కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని ఇదివరకే జనవరి 6 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు డిపాజిట్ వోచర్లు, భౌతిక ఫారాలు నింపే సాంప్రదాయ పద్ధతి కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు.ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఖాతా మూసివేత, ఖాతా బదిలీలు, నామినేషన్ అప్డేట్స్ వంటి ఫీచర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఈ సేవలు సంప్రదాయ ప్రక్రియలోనే కొనసాగుతాయి. పేపర్‌లెస్ కేవైసీ ప్రక్రియను కొత్త కస్టమర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఖాతాదారులందరూ వినియోగించుకునేలా చూడాలని అన్ని సర్కిళ్ల సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
అ(త)ప్పు చేయకూడదంటే....
కష్టాలు చెప్పి చెప్పి రావు... కష్టాలు చుట్టాల్లా వచ్చి పలకరిస్తాయి...పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదురా నాయనా...ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో...మనం తరచుగా వినే మాటలే ఇవి.ఒక్కొక్కరి కష్టాలు ఒక్కో రకంగా ఉండొచ్చు.. ఇతరత్రా కష్టాలని కాసేపు పక్కన పెట్టేసి... ఆర్ధిక కష్టాల గురించి ఈ ఆర్టికల్ లో మాట్లాడుకుందాం... మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందనేది వాస్తవం. మరి ఈ డబ్బుని ఎంత పద్ధతిగా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అంత సురక్షితంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలంటే ప్రతి వ్యక్తికీ సరైన ఆర్ధిక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకపోతే జీవితం అధోగతి పాలవుతుందనేది నిర్వివాదాంశం. కాబట్టి మీరు సంపాదన మొదలు పెట్టిన తొలినాళ్లలోనే పక్కా పకడ్బందీ ప్రణాళికతో సాగాలి. ఇందుకు ప్లాన్-1, ప్లాన్-2, ప్లాన్-3, ప్లాన్-4 అనే అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి.ప్లాన్-1 చేతిలో ఎప్పుడూ తగినంత నగదు ఉంచుకోవాలి. ఉదాహరణకు: మీకు నెలకు అన్ని ఖర్చులూ పోగా సగటున రూ. 2000 అవసరమవుతోంది అనుకోండి. మీ చేతిలో దానికి అయిదు రెట్లు... అంటే రూ.10,000 ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అది నగదు రూపంలోనైనా సరే.. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లోనైనా సరే. ఆరోగ్యపరంగా కావచ్చు... ఏదైనా ఫంక్షన్స్ రావొచ్చు.. అప్పటికప్పుడు అత్యాసర పని మీద ఏదైనా ఊరు వెళ్లాల్సి రావొచ్చు.. కారణం ఏదైతేనేం... చేతిలో కొంత నగదు అట్టేపెట్టుకోవడం ప్లాన్-1 లో ప్రథమ లక్షణం. ఇలా చేయడం వల్ల అప్పుకు ఎవరి దగ్గరికీ పరిగెత్తాల్సిన పరిస్థితి తలెత్తదు.ప్లాన్-2 బ్యాంకులో డిపాజిట్లు తప్పనిసరి. మీరు ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేసే రికరింగ్ డిపాజిట్ అయినా.. కొంచెం పెద్ద మొత్తంలో దాచుకున్న ఫిక్సడ్ డిపాజిట్ అయినా... మీకు సమయానికి ఉపయోగపడుతుంది. అత్యవసర సందర్భాల్లో ఎవరి దగ్గరా చెయ్యి చాచనక్కర్లేకుండా .. ఈ డిపాజిట్లను విత్ డ్రా చేసుకుని అవసరాన్ని నెరవేర్చుకోవచ్చు. మరో విషయం: ఈ ఆర్డీ, ఎఫ్డీ లను మధ్యలోనే విత్ డ్రా చేయడం వల్ల మీరు ఆశించిన వడ్డీ రాదు, కొన్ని సందర్భాల్లో మీరు పెనాల్టీ కూడా కట్టాల్సి రావచ్చు. అయినప్పటికీ... మీరు అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడదు. అదే సమయంలో ఒకర్ని సాయం చేయమని అడిగే పరిస్థితి తలెత్తదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆత్మాభిమానం దెబ్బ తినదు. ఒకవేళ మీరు చెప్పిన టైం కి బాకీ తీర్చలేకపోతే అవతలి వ్యక్తులు అనే మాటలు పడాల్సిన అవసరం ఉండదు. అప్పిచ్చినవాడు ఎప్పుడు మీద పడతాడో అని నిత్యం నలిగిపోతూ బతకక్కర్లేదు. కాబట్టి... ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్లాన్-2 అనేది తప్పనిసరి.ప్లాన్-3 లిక్విడ్ పెట్టుబడులుప్రతి వ్యక్తి ఆర్ధిక జీవితంలోనూ ఇదొక అత్యంత కీలకాంశం. ఈ మూడో మార్గంలో మిమ్మల్ని ఆదుకునేది మీరు చేసే చర పెట్టుబడులే. అవును.. ఇది నిజమే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బంగారాల్లో చేసిన పెట్టుబడుల్ని మూడో అంచె మిత్రులుగా చెప్పుకోవచ్చు. ఈ మూడింటిలోనూ పెట్టుబడి పెట్టడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జోలికి పోకండి. కేవలం పెట్టుబడులపైనే దృష్టి పెట్టండి.షేర్ల విషయానికొస్తే... తప్పనిసరిగా ఫండమెంటల్స్ బాగుండే ప్రధాన కంపెనీలనే ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల... పెద్ద కంపెనీల షేర్లు మార్కెట్ ఒడుదొడుకుల్లో క్షీణించినప్పటికీ... మళ్ళీ సత్వరమే కోలుకునే సత్తా వీటికి ఉంటుంది. కాబట్టి భయపడిపోయి మార్కెట్ కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. పైగా మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బాగా దూసుకెళ్ళేవి కూడా ఈ షేర్లే. మీరు ఎంచుకునే షేర్లను బట్టే మీకొచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో కనీసం మూడేళ్లకు తగ్గకుండా.. దీర్ఘకాలిక దృక్పథంతో చేసే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు కూడా అవసరానికి ఆదుకునే లక్షణం ఉంది. (వివరాలు మరో ఆర్టికల్ లో చర్చిద్దాం).ఇక బంగారంలో పెట్టుబడి మూడోది. ఈవేళ బంగారం ధర లక్షకు చేరుకుంది. మీకు తెలియకుండానే అప్పుడో కొంత.. ఇప్పుడో కొంత చొప్పున బంగారం కొంటూ వచ్చినా.. లేదంటే.. గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడుతూ వచ్చినా.. మీకు మంచి ప్రయోజనమే ఉంటుంది. తాకట్టు పెట్టుకుంటే దాని విలువలో దాదాపు 80% అప్పు దొరుకుతుంది. అది కూడా తక్కువ వడ్డీకే. మళ్ళీ మీరు శక్తియుక్తులు కూడదీసుకున్నాక దాన్ని విడిపించుకోవచ్చు.పై మూడు పెట్టుబడుల్లోనూ ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే... మన అవసరాలకు తక్షణమే పెద్ద మొత్తంలో నగదు కావాల్సి వచ్చినపుడు ఈ మూడూ ఆదుకుంటాయి. అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, బంగారాల్లో పెట్టుబడులు సమయానికి అక్కరకొస్తాయన్న మాట. ఇవన్నీ తక్షణ లిక్విడిటీ ఉన్న పెట్టుబడులు.ప్లాన్-4 స్థిరాస్తులపై పెట్టుబడిభూములు, ఆస్తులు, భవనాలపై పెట్టుబడులను ఈ కేటగిరీలోకి తీసుకోవచ్చు. ఇవి ఖరీదైనవే కావచ్చు..వీటిని సమకూర్చుకోవడం అందరివల్లా కాకపోవచ్చు. కానీ ప్రతి మనిషీ తన జీవితంలో ఒక సొంత ఇల్లు సమకూర్చుకోవాలి అనుకోవడం సహజమే కదా..మరికొందరు రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతో కొంత భూమి కొనుక్కుంటారు. అలా సమకూర్చుకున్న సొమ్మే ఆపదలో ఆదుకుంటుంది (ఇల్లు అమ్ముకోమని కాదు. ఇదొక మార్గం కూడా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం).ముగింపు అనుకోకుండా తలెత్తే ఖర్చులను తట్టుకోవడానికి ప్రతి మనిషి జీవితానికీ నాలుగు దశల ఆర్ధిక ప్రణాళికలు ఉండాలి. మొదటిది చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడితే..రెండోది ఇంకొంచెం పెద్ద సమస్యలను దీటుగా గట్టెక్కడానికి దోహదపడుతుంది. మూడోది ఎలాంటి పరిస్థితులనుంచి అయినా బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది.పీకల మీదకి వచ్చి... విధిలేని పరిస్థితుల్లో తోడ్పడేది నాలుగోది. ఈ నాలుగు పాటించిన వాళ్ళ జీవితం నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేసిన వారి జీవితం నిత్యం యాతనతో సతమతమవుతూనే ఉంటుంది. నిర్ణయం మీచేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాస రావు, ఆర్ధిక నిపుణులు -
ఏటీఎం కొత్త ఛార్జీలు.. రేపటి నుంచే..
ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్‌డ్రావల్ కొత్త ఛార్జీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ రుసుములో ఏటీఎం కొనుగోలు, నిర్వహణ, ఇతర బ్యాంకుల కస్టమర్లకు సేవలను అందించడానికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది.సవరించిన ఏటీఎం ఛార్జీలు ఇవే..మే 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమ ఉచిత ఉపసంహరణ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.2 అదనంగా రూ .23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ .21 ఉండేది. దీన్ని 2022 నుంచి అమలు చేస్తున్నారు.ఉచిత లావాదేవీలుఏటీఎం ఛార్జీల పెంపు ఉన్నప్పటికీ ఉచిత లావాదేవీ పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు. సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు 5 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే.. మెట్రో గరాల్లో అయితే 3 లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిఫారసుల మేరకు ఆర్బీఐ సవరణలో భాగంగా ఏటీఎం ఫీజులను పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, బ్యాంకులు ఈ పెంపునకు మొగ్గుచూపుతున్నాయి.చిన్న బ్యాంకులపై ప్రభావంలావాదేవీ రుసుముల పెరుగుదల చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటికి తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు నగదు ఉపసంహరణ కోసం పెద్ద బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కస్టమర్లు అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. -
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
భారత్‌లో బంగరానికి ఉన్న విలువ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తరాలుగా పసిడి సంపదకు గుర్తుగా ఉంటోంది. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఆరోజు పసిడి కొంటే ఆ ఏడాదంతా సంపద సొంతం అవుతుందని అనుకుంటారు. రేపు అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. అయితే బంగారాన్ని కేవలం నగల రూపంలోనే కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ మార్కెట్లో వివిధ మార్గాల ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)ఫిజికల్ గోల్డ్ సొంతం చేసుకోవాలనే ఇబ్బంది లేకుండా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మంచి ఎంపిక. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్ ధరను ట్రాక్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. షేర్ల మాదిరిగానే వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారం లేదా దానిలో కొంత భాగాన్ని సూచిస్తుంది. వీటివల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనడం, విక్రయించడం చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ మాదిరిగా కాకుండా మేకింగ్ ఛార్జీలు లేదా నిల్వ ఖర్చులు ఉండవు. ధరలు నేరుగా బంగారం రేట్లతో ముడిపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా పెట్టుబడికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది. మార్కెట్లో చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.డిజిటల్ గోల్డ్ (Digital Gold)డిజిటల్ గోల్డ్ అనేది భౌతికంగా బంగారాన్ని సొంతం చేసుకోకుండా అందులో పెట్టుబడి పెట్టడానికి ఒక ఆధునిక మార్గం. ఇది ఆన్లైన్లో బంగారాన్ని కొనడానికి, విక్రయించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసే బంగారానికి సురక్షితమైన వాల్ట్‌ల్లో నిల్వ చేసిన భౌతిక బంగారం మద్దతుగా నిలుస్తుంది. కనీసం రూ.10 నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారం నాణ్యతకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ డిజిటల్ గోల్ట్కు బీమా చేసిన వాల్ట్‌ల ద్వారా భద్రత కల్పిస్తారు. దాంతో దొంగతనం జరుగుతుందేమోనని ఆందోళన చెందనవసరం లేదు. అవసరమైనప్పుడల్లా డిజిటల్ బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ లేదా క్యాష్‌గా మార్చుకోవచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్‌ఫామ్‌లతోపాటు ప్రముఖ బ్యాంకులు ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్గోల్డ్ ఆగ్మాంట్ గోల్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ పెట్టుబడులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ గోల్డ్ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు లోబడి ఉంటుంది.ఇదీ చదవండి: భగ్గుమంటున్న పసిడి ధరలు! తులం ఎంతంటే..చివరగా.. అప్పు చేసి వద్దు!అక్షయ తృతీయ మంచి రోజు.. ఏది కొన్నా కలిసి వస్తుందని భావించి అప్పులు చేసి మరీ బంగారం కొనేవారూ ఉన్నారు. కానీ అప్పు చేసి కొంటే రుణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనకపోయినా పర్లేదు.. ఉన్నంతలో ఆ రోజున నలుగురికి సాయపడితే.. అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు! అప్పు మాత్రం చేయకండి. -
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నగదు .. అంటే కరెన్సీ నోట్లను బ్యాంకు అకౌంటులో జమచేయడం మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. » పాన్ నెంబర్ వేయకుండా, అంటే అవసరం లేకుండా ఒక వ్యవహారంలో రూ.50,000 దాటకుండా డిపాజిట్ చేయవచ్చు. » అలా అని ఒకరోజు మొత్తంలో రూ. 2 లక్షలు దాటి తీసుకోరు. » ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు డిపాజిట్లు చేసారంటే మీరు జాగ్రత్త పడాలి.ఈ పరిమితిని ఒక ఆంక్షలాగే భావించాలి. మొదటగా పాన్ నెంబర్ ఇవ్వాలి. అంతేకాకుండా సదరు బ్యాంకు బ్రాంచి ఏ పొదుపు ఖాతాలో నగదుగా రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువగా డిపాజిట్ అయ్యిందో, వారి అకౌంటు వివరాలు... సంవత్సర కాలంలో నగదు మొత్తం ఎంత జమ అయ్యిందో, సమాచారం తెలియజేస్తారు. ప్రతి బ్యాంకుకి వారి వారి పాలసీలు కూడా అమలులో ఉన్నాయి. ఈ క్రింది కేసులు/వ్యవహారాలు గమనించండి.ఈశ్వరరావు పాలబూత్‌లో కార్డులు, అరువులు కాకుండా రోజూ నగదు రూపేణా రూ.20 వేల అమ్మకాలు ఉండేవి. రోజూ ఉదయం బ్యాంకు తెరవగానే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసేవాడు. ఏడాదికి గాను రూ.72 లక్షలు డిపాజిట్ అయ్యాయి. నోటీసులు వచ్చాయి. నగదుగా చేసిన డిపాజిట్ నుంచి సరఫరా చేసే డైయిరీఫాం వారికి పెద్ద పెద్ద మొత్తాలు చెక్కు/డీడీ రూపంలో చెల్లించేవాడు. డిపాజిట్ చేసిన మొత్తం పాల విక్రయం ద్వారా ఏర్పడింది. కానీ అది నూటికి నూరు పాళ్ళు ఆదాయం కాదు. లాభమూ కాదు. నోటీసులకు జవాబులిచ్చి బయటపడేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. ఇలా కొన్ని వ్యాపారాలు/వృత్తుల్లో ప్రైవేటు హాస్పిటల్స్, సినిమా పరిశ్రమ, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌లో నగదు వస్తుంటుంది. తగిన జాగ్రత్త వహించాలి. అలాగే గుడి, గోపురాల్లో కూడా.దామోదర్ రెడ్డికి నగరశివార్లలో ఒక పెద్ద కాంప్లెక్స్, 12 ఫ్లాట్లు ఉన్నాయి. అద్దెలు వస్తున్నాయి. వయస్సు పెద్దది. సమయం, ఓపిక లేదు. అందరూ నగదే చెల్లిస్తున్నారు. అందరిని తన పొదుపు ఖాతాలోకి నగదు రూపంలో డిపాజిట్ చేయమనేవాడు. వారందరూ మాట ప్రకారం అకౌంట్లోనే జమచేసేవారు. లక్షల్లో తేలేది అద్దె ఆదాయం. నోటీసులు తథ్యం. అకౌంటు చేయక తప్పలేదు. వీరభద్రానికి పెద్ద ఇల్లు. నలుగురు పిల్లలు. భారీ సంపాదన. అంతా చెక్కు రూపంలోనే స్వీకరించేవారు. నగదు విత్‌డ్రా చేయడం ఖర్చులన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని నగదు ద్వారా బ్యాంకులో డిపాజిట్ చేసేవారు. ఇలా చేసిన డిపాజిట్లు రూ.10 లక్షల దాటాయి. నోటీసులు... కథా కమామీషు.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాహస్తవాసి ఉన్న డాక్టర్ ఆనంద్‌రావు ఖాతాలు, ఎన్నో గుళ్లు గోపురాలు ప్రతిష్ట చేసిన బ్రహ్మ గారి ఖాతాలు, లంచాలు లాగి.. లాగి అమాయకంగా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసిన లంచావతారం ఖాతాలు, అదర్శ రైతు అవార్డు పొందిన రైతుగా తన వ్యవసాయ ఆదాయాన్ని బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేసిన నాగయ్య, ఎన్నో ఇళ్లు కట్టిన మేస్త్రిగా మంచి పేరు పొందిన కొండయ్య, బొటిక్ పెట్టి మంచి పేరుతో డబ్బులు సంపాదించి బ్యాంకులో డిపాజిట్ చేసిన రాణి, కేటరింగ్‌తో లక్షలు సంపాదించి నగదు డిపాజిట్ చేసిన శ్రీను.. ఇలా ఎందరో నగదు డిపాజిట్‌దారులు.. ఎన్నెన్నో కథలు. ప్రయివేటు చిట్టీల్లో వచ్చిన మొత్తాలు... భూములు, పొలాలు, ఇండ్లు అమ్మగా వచ్చిన మొత్తాలు... స్నేహితులు, చుట్టాలు ఇచ్చిన రుణాలు... అప్పులు... ఇలా ఎంతమందినైనా చెప్పవచ్చు. ఎన్నో వ్యవహారాలు ప్రస్తావించవచ్చు. అన్నీ డిపాజిట్ల ఆదాయం కాకపోవచ్చు. సరైన, సమగ్రమైన, సంతృప్తికరమైన వివరణ ఇస్తే బయపడవచ్చు. లేదంటే ఈ డిపాజిట్లలో నగదును ఆదాయంగా భావించే ప్రమాదం ఉంది. 1.4.2024 నుంచి 31.3.2025 మధ్య ఇటువంటి డిపాజిట్లు ఉంటే విశ్లేషించుకోండి. విషయాన్ని బయటపెట్టండి. ::కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుపన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
నా బడ్జెట్‌కు 50-30-20 రూల్ సరిపోతుందా?
మూడు నుంచి ఐదేళ్ల కాలానికి.. కార్పొరేట్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్, పీఎస్‌యూ ఫండ్స్‌లో ఏది అనుకూలం? – మంజునాథ్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్ 80 శాతం అధిక క్రెడిట్ రేటింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ 80 శాతం బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటితోపాటు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్ని రకాల పరిస్థితుల్లోనూ అనుకూలమైనవి. దీర్ఘకాలంలో వీటిలోని రిస్క్–రాబడులు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి.ఇన్వెస్టర్లు రెండు కారణాల దృష్ట్యా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వివిధ రకాల డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వైవిధ్యం ఎక్కువ. మెచ్యూరిటీ కాలంపై స్పష్టత ఉంటుంది. ఏడాది కాలానికి మించిన లక్ష్యాల కోసం, డెట్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.ఇంటి బడ్జెట్ విషయంలో 50–30–20 ఆర్థిక సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక అంశాలకు ఇది మంచి సూత్రమేనా? – కరణ్ రాథోడ్మీ నెలవారీ ఆదాయాలను ఏ రకంగా వర్గీకరించాలన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఆదాయంలో 20 శాతాన్ని అవసరాల కోసం కేటాయించాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 50 శాతానికే పరిమితం కావాలి. ఆదాయంలో 30 శాతాన్ని కోరికల కోసం కేటాయించుకోవచ్చు. అంటే రెస్టారెంట్లలో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్, ఇతర హాబీల కోసం కేటాయింపులు 30 శాతం మించకూడదు. ఇక మిగిలిన 20 శాతాన్ని పొదుపు కోసం కేటాయించాలి.మీ ఆర్థిక అంశాలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది అనుకూలిస్తుంది. ముఖ్యంగా వేతన జీవులు, అప్పుడే కెరీర్ ఆరంభించిన వారికి ఇది ఎంతో సులభం. కాకపోతే ఇదొక సాధారణ సూత్రమే కానీ, అందరికీ అనుకూలమని చెప్పలేం. వ్యక్తిగత ఆదాయం, జీవన వ్యయాలు, బాధ్యతలు ఇవే ఒకరి బడ్జెట్‌ను నిర్ణయించేవి.ఉదాహరణకు ఒక నగరానికి చెందిన యువ ఉద్యోగి నెలకు రూ.40,000 సంపాదిస్తున్నాడని అనుకుందాం. పెద్ద నగరం కావడంతో అద్దెకు, రవాణా కోసమే నెల జీతంలో సగం ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు కోరికలు, పొదుపు కోసం మిగిలేదేమీ ఉండదు. అదే రూ.2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి అయితే ఆదాయంలో 30–35 శాతంతోనే అవసరాలను తీర్చుకోవడం సులభం. అప్పుడు పొదుపు చేయడానికి 30–40 శాతం మిగులు ఉంటుంది. కనీసం 20 శాతం పొదుపు ఎవరైనా సరే బడ్జెట్ ఆరంభించేందుకు 50–30–20 సూత్రం మంచి ఫలితమిస్తుంది. మీ జీవన అవసరాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. అలాగే, ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేయాలి. కోరికల విషయంలో కొంత రాజీ పడినా సరే పొదుపును కొనసాగించాలి.ఎలా ఆరంభించాలో తెలియకపోతే అప్పుడు ఆదాయంలో 20 శాతాన్ని పెట్టుబడులకు మళ్లించే విధంగా ఆటోమేట్ చేసుకోవాలి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్లేలా సిప్ పెట్టుకోవాలి. మొదట పొదుపు, పెట్టుబడి తర్వాతే ఖర్చులకు వెళ్లాలి. స్థిరమైన పొదుపు, వివేకంతో చేసే ఖర్చుతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
వేతన జీవుల్లో అధిక శాతం మందికి నెలవారీ ఖర్చులు ఆదాయాన్ని మించుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణాలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితమే పర్సనల్, క్రెడిట్ కార్డ్, బంగారం రుణాలు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పెరిగిపోవడం చూస్తున్నాం. కానీ, ఒక్కసారి ఈ రుణ చక్రంలోకి దిగితే.. అది అంత తొందరగా విడిచిపెట్టదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఇటీవలి కాలంలో వేతన జీవుల నుంచి భవిష్యనిధి క్లెయిమ్‌లు పెరగడం చూస్తున్నాం. అత్యవసరాల్లో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకుంటున్నారు. నిర్దేశిత అర్హతలు, నిబంధనల మేరకే ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోగలరు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిపుణులు అందిస్తున్న సమాచారం ఇది... ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్’ (ఈపీఎఫ్) వేతన జీవుల భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనం అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, వైద్య అవసరాల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. కానీ, ఆర్థిక, అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించినప్పుడు.. రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కలిగిన వారు.. విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అవసరాల్లో ఈపీఎఫ్ క్లెయిమ్‌ను పరిశీలించొచ్చు. అలాంటి సందర్భాల్లో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు? అర్హతల గురించి ఉద్యోగులకు తప్పక అవగాహన ఉండాలి. ఏ అవసరానికి ఎంత? వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎఫ్ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం ఏడేళ్ల పాటు ఈపీఎఫ్ సభ్యుడు/సభ్యురాలిగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రావిడెంట్ ఫండ్ మాజీ ప్రాంతీయ కమిషనర్ సంజయ్ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్ తేదీకి ఏడేళ్ల ముందు అయి ఉండాలన్నారు. ఈ నిబంధనలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్విస్ మొత్తంలో ఉన్నత విద్య (పదో తరగతి తర్వాత చదువులు), వివాహ అవసరాల కోసం కలిపి మూడు పర్యాయాలు ఉపసంహరణకు వెళ్లొచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్విస్తో సంబంధం లేకుండా క్లెయిమ్‌కు వెళ్లొచ్చు. గరిష్టంగా క్లెయిమ్ ఇన్ని సార్లు అన్న పరిమితి అయితే లేదు. వివాహం ఉద్యోగి తన సొంత వివాహం కోసం, తన తోడ బుట్టిన వారి వివాహం కోసం, తన పిల్లల వివాహాల కోసం పీఎఫ్ నిధిని పొందొచ్చు. కనీసం ఏడేళ్ల సర్వీస్ ఉండాలి. ఉద్యోగి వాటాల రూపంలో జమలు, వడ్డీ నుంచి 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. వైద్యం సభ్యుడు, అతను/ఆమె జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీస్ నిబంధన వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి లేదు. ఉద్యోగి స్వీయ జమల రూపంలో పోగైన మొత్తం, వడ్డీ లేదా.. నెలవారీ మూలవేతనం, డీఏకి ఆరు రెట్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. ఇల్లుప్లాట్ కొనుగోలు లేదా ఇల్లు/ఫ్లాట్ నిర్మాణం, కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్లొచ్చు. కనీసం ఐదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలసి జాయింట్‌గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరి. ప్లాట్ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రెట్లు.. ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం అయితే నెలవారీ జీతానికి 36 రెట్లు.. లేదా ఉద్యోగి, యాజమాన్యం జమలు, వీటిపై వడ్డీ మొత్తం.. లేదా కొనుగోలు/నిర్మాణ వ్యయం.. ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. గృహ నవీకరణ ఇల్లు నిర్మించుకున్న ఐదేళ్ల తర్వాత అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూలవేతనం, డీఏకి 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమలు, వాటిపై వడ్డీ.. లేదా నవీకరణకు అయ్యే వ్యయం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్నే అనుమతిస్తారు. గృహ రుణం తీర్చివేసేందుకు కనీసం మూడేళ్ల సర్విస్ పూర్తి చేసి ఉండాలి. బ్యాలన్స్ నుంచి 90% వెనక్కి తీసుకోవచ్చు. విద్య తన కుమారుడు లేదా కుమార్తెల ఉన్నత విద్య కోసమే భవిష్య నిధి నుంచి పాక్షిక ఉపసంహర ణకు అనుమతిస్తారు. కనీసం ఏడేళ్ల సర్విస్ ఉండాలి. ఉద్యోగి జమలు, వడ్డీ మొత్తం నుంచి 50 శాతాన్ని తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో.. ఒకచోట ఉద్యోగం కోల్పోవడం లేదంటే మానివేసి.. నెల రోజులకు పైగా మరో ఉపాధి లేని పరిస్థితుల్లో పీఎఫ్ బ్యాలన్స్ నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉపాధి లేకుండా రెండు నెలలు దాటిపోతే అప్పుడు మిగిలిన 25 శాతాన్ని కూడా వెనక్కి తీసేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగం మానేశామన్న కారణంతో పీఎఫ్ ఖాతాను ఖాళీ చేయాలనేమీ లేదు. మరో సంస్థలో చేరిన తర్వాత పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తద్వారా అందులో ప్రయోజనాలను అలాగే కొనసాగించుకోవచ్చు.ఉపసంహరణ ఎలా..? ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియను ఈపీఎఫ్‌వో ఎంతో సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఇండియా పోర్టల్‌కు వెళ్లి కుడి భాగంలో పైన కనిపించే ‘ఆన్లైన్ క్లెయిమ్స్’ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక విండో తెరుచుకుంటుంది. అక్కడ ‘యూఏఎన్’ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ పూర్తయిన తర్వాత పైన కనిపించే ఆప్షన్లలో ‘ఆన్లైన్ సర్విసెస్’ సెక్షన్లో ‘క్లెయిమ్ ఫారమ్’ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడ పీఎఫ్ అడ్వాన్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలక్ట్ సర్వీస్ దగ్గర పనిచేస్తున్న సంస్థను ఎంపిక చేసుకోవాలి. దాని కింద క్లెయిమ్ దేనికోసమన్న కారణాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ కోరిన వివరాలు ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి. చివరిగా మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన అనంతరం అది విజయవంతంగా దాఖలవుతుంది. క్లెయిమ్ దరఖాస్తు పురోగతిని సైతం ఇదే మాదిరి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. పరిశీలన కోసం చెక్ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావచ్చు. కనుక ముందే సిద్ధం చేసుకోవాలి. సంబంధిత చెక్ లీఫ్‌పై సభ్యుడి పేరు, బ్యాంక్ ఖాతా తదితర వివరాలు ఉండాలి. ఉమంగ్ యాప్ నుంచి కూడా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. అదే ఆఫ్‌లైన్‌లో క్లెయిమ్ దరఖాస్తు సమర్పించేందుకు, కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అక్కడ విత్‌డ్రాయల్ ఫారమ్ పూరించి, వారు కోరినట్టు డాక్యుమెంట్లను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు 3–4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. క్లెయిమ్ రూ. లక్ష లోపు ఉంటే ఆటోమేటిక్‌గా అనుమతి లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో ఇందుకు 10–20 రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకున్న నిధులను, రుణం కాదు కనుక తిరిగి జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఈపీఎఫ్ బ్యాలన్స్‌పై ఎలాంటి రుణ సదుపాయం లేదు. → క్లెయిమ్ భారీగా ఉంటే అప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు లేదా వైద్య డాక్యుమెంట్ల కాపీలు అప్లోడ్ చేయాల్సి రావచ్చు. → అర్హతలు, పరిమితులను ఒక్కసారి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన అవసరాల్లోనే ఈపీఎఫ్‌ను వివేకంగా ఉపయోగించుకోవాలన్నది నిపుణుల సూచన. → ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్లే ముందు తమ కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయేమో ఒక్కసారి సరిచూసుకోవాలి. అంటే బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, పాన్ వివరాలు నమోదు చేసి, ధ్రువీకరించి ఉండాలి. దీనివల్ల క్లెయిమ్ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది. 54 ఏళ్లు నిండితే..54 ఏళ్లు నిండిన తర్వాత, ముందస్తు పదవీ విరమణ/వయోభారం రీత్యా విరమణ చేసిన వారు 58 ఏళ్లు రాకముందే మొత్తం పీఎఫ్ బ్యాలన్స్‌లో 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు.పన్ను భారం? ఈపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత ఉపసంహరణకు వెళితే ఆ మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ సర్విస్ ఐదేళ్లలోపు ఉండి, ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే అప్పుడు దీనిపై 10 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. పాన్ నంబర్ ఇవ్వకపోతే 20 శాతం టీడీఎస్ పడుతుంది. ఐదేళ్లలోపు రూ.50 వేలకు మించి ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాకపోతే, పీఎఫ్‌పై మినహాయించిన టీడీఎస్‌ను రిఫండ్ కోరొచ్చు. ఒకవేళ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురై లేదా కంపెనీ మూసివేసిన కేసుల్లో ఉద్యోగులు పీఎఫ్ నిధిని ఉపసంహరించుకుంటే, అప్పుడు సర్విస్ ఐదేళ్లలోపు ఉన్నా సరే ఆ మొత్తం పన్ను పరిధిలోకి రాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి
సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి. -
రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!
ఆరుపదుల వయసులో రిటైర్ అవ్వాలంటే భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎంత కార్పస్ కావాలో తెలుసా? పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ తగ్గడం, ఖర్చులు పెరగడం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా ఇటీవల లింక్డ్ఇన్ పోస్ట్‌లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రిటైర్మెంట్ ప్లాన్‌కు సరిపడా డబ్బుకు సంబంధించి ఆన్లైన్లో అందుబాటులో ఉండే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.‘ఈ రోజు ఇండియాలో రిటైర్ కావడానికి ఎంత డబ్బు అవసరమో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో చాలా రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియోలు ఈక్విటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే ఉంటున్నాయి. కొందరు దీన్ని తొందరగా క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌ల్లోకి మళ్లిస్తున్నారు. ఈక్విటీ నుంచి 12–14 శాతం, డెట్ నుంచి 5–7 శాతం కలిపి ఏడాదికి 10% మిశ్రమ రాబడిని అంచనా వేస్తున్నారు. క్రమంగా పన్నులు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడి ఆదాయంపై 20 శాతం పన్ను విధించడం, ద్రవ్యోల్బణం ఏటా మరో 6 శాతం ఉంటుండడంతో వాస్తవ రాబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రిటైర్మెంట్ ఫండ్‌పై కేవలం 2% నికర రియల్ రిటర్న్ మాత్రమే వస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్‘భారత్‌లో పదవీ విరమణ పొందిన తర్వాత సౌకర్యవంతమైన జీవనశైలి కోసం ప్రస్తుతానికి నెలకు కనీసం రూ.1.5 లక్షలు అవసరమవుతాయి. ఏటా మీకు రూ.20 లక్షలు అవసరం. 2% రియల్ రిటర్న్స్ అంటే.. మీ రిటైర్మెంట్ కార్పస్ కనీసం రూ.10 కోట్లు ఉండాలి. మీరు లగ్జరీగా జీవించాలంటే ఇది ఏమాత్రం సరిపోదు. హాయిగా బతకాలనుకుంటే ఇంకా ఎక్కువ లక్ష్యం పెట్టుకోవాలి. మీ రిటైర్మెంట్ ఫండ్ వార్షిక ఖర్చుకు 50 రెట్లు ఉండాలి. అంటే మీ కుటుంబం ఏటా రూ.10 లక్షలు ఖర్చు చేయాలంటే రూ.5 కోట్లు కావాలి. ఏడాదికి రూ.20 లక్షలు అంటే రూ.10 కోట్లు అవసరం’ అని తెలిపారు. -
బాలికల ప్రత్యేక స్కీమ్.. వడ్డీ రేటు మారిందా?
సుకన్య సమృద్ధి యోజన (SSY) దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఆడపిల్లల చదువు, వివాహం కోసం పొదుపు చేసే తల్లిదండ్రులకు ఈ పథకం అధిక వడ్డీ ఇస్తుంది. వచ్చే రాబడులపై కూడా పన్ను ఉండదు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఈ పథకానికి సార్వభౌమ గ్యారంటీని అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజన వడ్డీ తగ్గిస్తున్నారా?సుకన్య సమృద్ధి యోజన సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారిందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. కానీ సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పథకం కింద డిపాజిట్లపై సంవత్సరానికి 8.2 శాతం లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. ఈ పథకానికే కాదు ప్రస్తుత త్రైమాసికంలో ఏ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్హం.గరిష్ట, కనిష్ట డిపాజిట్లు..సుకన్య సమృద్ధి యోజన కింద, డిపాజిట్లు నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. కనీసం రూ.250 ప్రారంభ డిపాజిట్‌తో ఈ ఖాతాను తెరవవచ్చు. కాబట్టి ఇది ఎక్కువ కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 అయినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సానికి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిటర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాల ద్వారా పొదుపు జమ చేసుకోవచ్చు.విత్‌డ్రా ఎప్పుడు?సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. ఈ సమయంలో ఖాతాను క్లోజ్ చేసి, వడ్డీతో సహా పూర్తి బ్యాలెన్స్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, అమ్మాయి వివాహం తర్వాత లేదా ఆమెకు 18 ఏళ్లు వచ్చాక ఖాతాను మూసివేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాతే నిధులు తీసుకునేందుకు వీలున్నప్పటికీ బాలిక చదువు కోసం అంతకుముందే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది.బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏది ముందయితే అది కొంత మేర నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ మొత్తం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌లో 50% వరకు ఉంటుంది. దీన్ని వన్ టైమ్ ఏకమొత్తంగా లేదా ఐదేళ్లకు మించకుండా సంవత్సరానికి ఒకటి చొప్పున వాయిదాల్లో పొందవచ్చు. -
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: ఒక సంస్థలో ఉద్యోగం వీడి, మరో సంస్థలో చేరిన సందర్భాల్లో భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాను ఆన్లైన్లో సులభంగా బదిలీ చేసుకునే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని రకాల అనుమతులను తొలగించింది.‘‘ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా బదిలీ రెండు ఈపీఎఫ్ కార్యాలయాలతో ముడిపడి ఉండేది. ఇందులో ఒకటి పీఎఫ్ జమలు జరిగిన (సోర్స్) ఆఫీస్. ఈ మొత్తం మరో ఈపీఎఫ్ కార్యాలయం పరిధిలో (డెస్టినేషన్ ఆఫీస్)కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో క్లెయిమ్‌ల బదిలీకి డెస్టినేషన్ ఆఫీస్ అనుమతుల అవసరాలను తొలగించాం. ఇందుకు సంబంధించి పునరుద్ధరించిన ఫామ్ 13 సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చాం. ఇక నుంచి క్లెయిమ్‌లకు సోర్స్ ఆఫీస్ నుంచి అనుమతి లభించగానే, సభ్యుడి/సభ్యురాలి పీఎఫ్ ఖాతా ప్రస్తుత కార్యాలయం పరిధిలోకి మారిపోతుంది’’అని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. -
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
గడిచిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఆన్లైన్ ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రిటర్న్స్ ఎప్పుడు దాఖలు చేయాలి, గడువు ఎప్పుడు, రిఫండ్‌ను ఎప్పుడు పొందే అవకాశం ఉందనే అంశాల గురించి తెలుసుకుంది.ఐటీఆర్‌ను ఎప్పుడు ఫైల్ చేయవచ్చు?ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 2025-26 మదింపు సంవత్సరానికి మీ ఐటీఆర్‌ను సమర్పించవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ధ్రువీకరణ తేదీని అధికార వర్గాలు వెల్లడించలేదు. అయినప్పటికీ ఆదాయ పన్ను శాఖ సాధారణంగా ఏటా ఏప్రిల్ నాటికి ఐటీఆర్ ఫారాలను అందుబాటులో ఉంచుతుంది. ఫారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేయడం ప్రారంభించవచ్చు.ఐటీఆర్ నమోదు చేయడానికి చివరి తేదీ ఏమిటి?గత ఏడాది షెడ్యూల్ ప్రకారం జరిమానా లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2024గా నిర్ణయించారు. జరిమానాలతో ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు అనుమతించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన రాలేదు.రిఫండ్లు ఎప్పుడు పొందవచ్చు?రిఫండ్ ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ మరింత సులభతరం చేసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ దాఖలు చేసిన వారం నుంచి 20 రోజుల్లో వారి రిఫండ్లను పొందేందుకు వీలు కల్పిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి దోషాలు ఉండకూడదు. ఫైలింగ్ సమయంలో ఆధార్ ఓటీపీతో ధ్రువీకరించాలి. బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేసి పాన్‌తో లింక్ చేసుకోవాలి.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!కీలక డాక్యుమెంట్లు ఏమిటి?మీ రిటర్న్‌ను సజావుగా, వేగంగా దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సేకరించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు పని చేస్తున్న యజమాని నుంచి ఫారం 16, వేతన స్లిప్పులు, మీ బ్యాంకు నుంచి ధ్రువీకరణ పత్రాలు, ఏదైనా మూలధన లాభాల వివరాలు ఉంటే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఆదాయం పొందినట్లయితే దానికి రుజువులను కూడా జత చేయాల్సి ఉంటుంది. -
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత పొదుపు చేయాలని అందరూ అనుకుంటారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద బహుశా కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. మనదేశంలో ముఖ్యంగా.. ఆడపిల్లల గురించి ఆలోచించేవారి సంఖ్య కొంత ఎక్కువే. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఆలోచించేవారు ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఎంచుకోవచ్చు. ఇందులో రోజుకు రూ. 121 పొదుపు చేస్తే.. పెళ్లి చేసే నాటికి రూ. 27 లక్షలు చేతికి వస్తాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రవేశపెట్టిన 'ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ'.. తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో మీరు రోజుకు 121 రూపాయలు డిపాజిట్ చేస్తే.. నిర్దిష్ట సమయం తరువాత రూ. 27 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చేతికి అందుతాయి. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు, వచ్చే బోనస్ ఎంత అనేదానిపై ఆధారపడి ఉంటుంది.➤కనీస రోజువారీ పెట్టుబడి: రూ. 121➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 27 లక్షల వరకు (ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు & బోనస్ ఆధారంగా)➤పాలసీ కాలపరిమితి: 13 నుంచి 25 సంవత్సరాలుఇదీ చదవండి: ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?ఉదాహరణకు.. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మీరు రోజుకు రూ. 121 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. అలా మీరు 25 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే.. వచ్చే ఎల్ఐసీ ద్వారా బోనస్‌లు, లాయల్టీ వంటి వాటితో కలిపి మీ మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 27 లక్షలు దాటవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారు తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు, కుమార్తె వయస్సు కనీసం ఒక సంవత్సరం ఉండాలి.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ అనేది ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కిందికి వస్తుంది. కాబట్టి వినియోగదారులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీదారు స్కీమ్ మెచ్యూరిటీ కాలానికి ముందే కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల మరణిస్తే.. కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు అందుతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం గడువు ముగిసిన తరువాత మొత్తం రూ. 27 లక్షలు నామినికీ అందిస్తారు.ఎల్ఐసీ కన్యాదాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి.. ఐడెంటిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ఋజువు, కుమార్తె బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటివి అవసమవుతాయి. ఈ పథకం గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లేదా సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. -
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
దేశంలో కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 115BAC కింద దీన్ని ప్రవేశపెట్టారు. ఇది తక్కువ పన్ను రేట్లతో సరళమైన పన్ను నిర్మాణాన్ని అందిస్తుంది. కానీ పాత విధానంతో పోలిస్తే డిడక్షన్లు, మినహాయింపులు తక్కువ ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2026-27) కోసం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే ఐదు ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1.పన్ను రహిత ఆదాయ పరిమితి ఎక్కువ రూ .12 లక్షల మినహాయింపు పరిమితి, రూ .75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా వేతన జీవులకు రూ .12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మునుపటి రూ .7.5 లక్షల పన్ను రహిత పరిమితి (రూ .7 లక్షలు + రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్) కంటే గణనీయమైన పెరుగుదల. ఇది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.2.అన్ని స్లాబ్‌లలో తక్కువ పన్ను రేట్లుకొత్త విధానంలో రాయితీ పన్ను రేట్లతో ఏడు స్లాబ్‌లు ఉన్నాయి. ఇవి రూ.4 లక్షల వరకు ఆదాయానికి 0% నుండి ప్రారంభమై, రూ.24 లక్షలకు పైబడిన ఆదాయానికి 30% వరకు ఉన్నాయి. ఈ విధానం ముఖ్యంగా రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి, పెద్దగా డిడక్షన్లు క్లెయిమ్ చేయని వారికి, పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. తద్వారా చేతికందే జీతం ఎక్కువౌతుంది.3.సరళమైన పన్ను ఫైలింగ్.. తక్కువ కంప్లయన్స్తక్కువ డిడక్షన్లు, మినహాయింపులతో (ఉదా., HRA, LTA, లేదా సెక్షన్ 80C ప్రయోజనాలు లేకపోవడం), కొత్త విధానం డాక్యుమెంటేషన్, కంప్లయన్స్ ఇబ్బందులను తగ్గిస్తుంది. దీంతో ఈ విధానం యువ ప్రొఫెషనల్స్ లేదా పాత విధానం డాక్యుమెంటేషన్ భారంగా భావించే వారికి అనువుగా ఉంటుంది.4.లిక్విడిటీ.. ఆర్థిక సౌలభ్యంతప్పనిసరి పన్ను ఆదా పెట్టుబడుల అవసరాన్ని (ఉదా., PPF, ELSS, లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంలు) తొలగించడం ద్వారా కొత్త విధానం ఖర్చు, ఆదా, లేదా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి డబ్బు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. ఇది కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులకు లేదా లిక్విడిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.5.మెరుగైన స్టాండర్డ్ డిడక్షన్.. ఇతర ప్రయోజనాలుజీతం పొందే వ్యక్తులు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ (గతంలో రూ.50,000 ఉండేది) క్లెయిమ్ చేయవచ్చు. ఫ్యామిలీ పెన్షనర్లు అయితే రూ.25,000 డిడక్షన్ (గతంలో రూ.15,000) పొందవచ్చు. అదనపు డిడక్షన్లలో యాజమాన్యం (పని చేస్తున్న కంపెనీ) ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ (సెక్షన్ 80CCD(2)), అద్దెకు ఇచ్చిన ఆస్తులపై హోమ్ లోన్ వడ్డీ, అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు విరాళం వంటివి ఉన్నాయి. ఇవి సంక్లిష్ట పెట్టుబడులు లేకుండా కొంత పన్ను ఉపశమనం అందిస్తాయి.ఎవరికి ఎక్కువ ప్రయోజనం?- పెద్దగా డిడక్షన్లు లేకుండా రూ.12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు.- పన్ను ఆదా సాధనాలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టని యువ ప్రొఫెషనల్స్ లేదా కొత్తగా సంపాదించేవారు.- దీర్ఘకాలిక, లాక్-ఇన్ పెట్టుబడులు కాకుండా సరళత, సౌలభ్యాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు.గమనించవలసినవి..కొత్త విధానం ఈ ప్రయోజనాలను అందించినప్పటికీ, ఇది అందరికీ సరిపోకపోవచ్చు. మీకు గణనీయమైన డిడక్షన్లు (ఉదా., రూ.30 లక్షలకు పైబడిన ఆదాయాలకు రూ.3.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ, HRA, సెక్షన్ 80C, లేదా హోమ్ లోన్ వడ్డీతో సహా) ఉంటే, పాత విధానం తక్కువ పన్ను బాధ్యతకు దారితీయవచ్చు. మీ ఆదాయం, డిడక్షన్లు, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా రెండు విధానాలను ఆదాయ పన్ను కాలిక్యులేటర్‌ను ఉపయోగించి పోల్చుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. -
ఇక మైనర్లే బ్యాంక్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు: ఆర్బీఐ
ముంబై: పిల్లలు బ్యాంక్ సేవింగ్స్/డిపాజిట్ ఖాతాల ప్రారంభం, నిర్వహణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదేళ్లు నిండిన వారు (మైనర్లు) బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, సొంతంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్‌లకు ఆర్బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ దిశగా సవరించిన నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది.ఏ వయసు మైనర్లు అయినా తమ తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల ద్వారా సేవింగ్స్, టర్మ్ డిపాజిట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు వాణిజ్య బ్యాంక్‌లు, కోపరేటివ్ బ్యాంక్‌లకు జారీ చేసిన సర్క్యులర్‌లో ఆర్బీఐ పేర్కొంది.బ్యాంక్‌లు తమ రిస్క్ నిర్వహణ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పదేళ్లు నిండిన మైనర్లు సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరిచి, స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు అనుమతించొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలను ఖాతాదారులకు ముందుగానే తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్ కార్డులు, చెక్‌బుక్ సదుపాయాలను సైతం మైనర్ ఖాతాదారులకు ఆఫర్ చేయొచ్చని తెలిపింది. -
విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?
ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణం ఏదైనా విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. డివోర్స్ తీసుకుంటే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉన్నా.. క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఈ కథనం చదివితే.. తప్పకుండా మీకే అర్థమవుతుంది.భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు (ఉద్యోగం చేసే వారైతే).. జాయింట్ అకౌంట్స్ మీద హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి తీసుకుని ఉంటే.. విడాకులు తరువాత ఈ ఖాతాలను క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎలా అంటే.. జాయింట్ అకౌంట్స్ కింద తీసుకున్న లోన్‌కు ఇద్దరూ బాధ్యత వహించాలి. ఆలా కాకుండా అకౌంట్ క్లోజ్ చేస్తే లేదా లోన్ చెల్లింపులు ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.కలిసి ఉన్నప్పుడు ఇద్దరి సంపాదన తోడవుతుంటుంది. విడాకుల తరువాత ఎవరి దారి వారిదే. అలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీ ఈఎంఐల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్‌తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?విడాకులు మంజూరు చేసే సమయంలో లోన్స్ క్లియర్ చేయాల్సిన బాద్యతను మీ భాగస్వామికి కోర్టు అప్పగించినప్పటికీ.. లోన్ అగ్రిమెంట్స్ మీద ఇద్దరి సంతకాలు ఉంటాయి. అలాంటి సమయంలో మీ భాగస్వామి చెల్లింపులను ఆలస్యం చేస్తే.. ఆ ప్రభావం ఇద్దరిపైన పడుతుంది. ఇది సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది.జాయింట్ అకౌంట్స్ లేదా క్రెడిట్ కార్డులను విడాకులు తీసుకున్న వెంటనే క్లోజ్ చేసుకున్నట్లయితే.. అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విడాకులు తీసుకున్న తరువాత కూడా ఇలాంటి ఆర్ధిక సంబంధ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు. -
ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి మనిషి తన సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా దాచుకోవాలి. లేకుంటే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాలలో సేవింగ్ చేసుకుంటుంటే.. మరికొందరు పిల్లల చదువులకు, వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి.. ఇలా కొంత పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారికి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్' మంచి ఎంపిక అవుతుంది.5 సంవత్సరాల్లో 20 లక్షలు ఇలా..ఐదేళ్లలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ. 20లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 28,100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్లు ఈ పథకంలో డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇది త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా ఉంటుంది. అంటే.. వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ మొత్తం పెట్టుబడిన కొంత పెంచుతుంది.➤మొత్తం పెట్టుబడి (రూ. 28100 x 60 నెలలు): రూ. 16,86,000➤మీ పెట్టుబడికి వడ్డీ: రూ. 3,19,382➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 20,05,382ఇదీ చదవండి: నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి: ప్లాన్ వివరాలివిగో..రిస్క్ లేకుండా పొదుపు చేయడానికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమమైన మార్గం. ఈ ప్లాన్‌ను మీరు నెలకు 100 రూపాయల పెట్టుబడితో కూడా ప్రారభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో ఉంటుంది, కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. వడ్డీ రేట్లలో మార్పులు ప్రతి మూడు నెలలకు సమీక్షించబడతాయి. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు అందరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. -
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
యూపీఐ లావాదేవాల మీద ప్రభుత్వం జీఎస్టీ విధించనుందని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కేద్రం క్లారిటీ ఇచ్చింది. రూ. 2వేలు కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే 18 శాతం జీఎస్టీ విధిస్తారని ప్రచారమవుతున్న వార్తా అబద్దమని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు చేస్తే జీఎస్టీ విధిస్తారని కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..యూపీఐ అందుబాటులోకి వచ్చిన తరువాత.. చాలామంది జేబులో డబ్బులు పెట్టుచుకోవడమే మరచిపోయారు. ప్రతి చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా.. ఆన్లైన్లో పే చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లావాదేవీలమీద జీఎస్టీ విధిస్తారని వస్తున్న వార్తలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. -
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. తొమ్మిది కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడానికి 'ఈపీఎఫ్ఓ 3.0' ప్రారంభించనుంది. ఈ కొత్త వెర్షన్ 2025 మే లేదా జూన్ నాటికి ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా చందాదారులు వేగంగా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్స్, డిజిటల్ కరెక్షన్స్, ఏటీఎం ద్వారా విత్‌డ్రా వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయని మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ఈపీఎఫ్ఓ 3.0 తీసుకురావడానికి ప్రధాన కారణం.. చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే అని ఆయన అన్నారు.ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అమలులోకి వచ్చిన తరువాత.. ఫామ్ ఫిల్లింగ్ ప్రక్రియలు, క్లెయిమ్‌ల కోసం లేదా కరెక్షన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఓటీపీ ద్వారానే ఏపీఎఫ్ఓ ఖాతాలను అప్డేట్ చేసుకోవచ్చు. క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడం వల్ల, నిధులు చందాదారుల బ్యాంకు ఖాతాలో త్వరగా జమ అవుతాయని మన్సుఖ్ అన్నారు.ఏఈఎఫ్ఓ మొత్తం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను కలిగి ఉంది. దీనికి ప్రభుత్వ హామీతో పాటు 8.25 శాతం వడ్డీ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అమలులో ఉన్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్లు పొందేందుకు వీలు కల్పిస్తూ 78 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నామని ఆయన అన్నారు.పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడానికి, బలోపేతం చేయడానికి అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ ధన్ యోజనతో సహా వివిధ సామాజిక భద్రతా పథకాలను ఏకీకృతం చేయడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు.ఇదీ చదవండి: కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!కార్మికులకు ఆరోగ్య సంరక్షణను పెంచే ప్రయత్నంలో భాగంగా.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కింద ఉన్న లబ్ధిదారులు త్వరలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉన్న ఆసుపత్రులలో ఉచిత వైద్య చికిత్స పొందగలరని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి ఎంపిక చేసిన ఛారిటీలు నడిపే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా దీని పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. -
ITR: తొలిసారి ట్యాక్స్‌పేయర్స్‌కు 5 కీలక విషయాలు
కొత్తగా ట్యాక్స్ పేయర్స్ అవుతున్నవారికి మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ సులభం అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ (AY) 2025-26, ఫైనాన్షియల్ ఇయర్ (FY) 2024-25కి సంబంధించి, మొదటిసారి పన్ను చెల్లించేవారు గుర్తుంచుకోవలసిన ఐదు కీలక అంశాలు ఇక్కడ అందిస్తున్నాం.సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోండిమీ ఆదాయ వనరులు, నివాస స్థితి, మొత్తం ఆదాయం ఆధారంగా సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ITR-1 (సహజ్) అనేది జీతం, ఒక ఇంటి ఆస్తి, లేదా ఇతర వనరుల నుండి (ఉదా., వడ్డీ) రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న నివాసిత వ్యక్తులకు సరిపోతుంది. ITR-2 అనేది క్యాపిటల్ గెయిన్స్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తులు ఉండి వ్యాపార ఆదాయం లేనివారి కోసం ఉద్దేశించింది.ITR-3 లేదా ITR-4 ఫారాలు ప్రొఫెషనల్స్ లేదా ప్రిసంప్టివ్ టాక్సేషన్ కింద ఉన్నవారికి వర్తిస్తాయి. తప్పు ఫారమ్ ఉపయోగిస్తే రిటర్న్ తిరస్కరణకు గురికావచ్చు. కాబట్టి మీ ఆదాయ వనరులను జాగ్రత్తగా అంచనా వేయండి. ఆదాయపు పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ సరైన ఫారమ్‌ను నిర్ణయించడానికి ఒక సాధనాన్ని అందిస్తుంది. తప్పులు జరగకుండా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండిపాత, కొత్త పన్ను విధానాలను అర్థం చేసుకోండిఅసెస్మెంట్ ఇయర్ 2025-26 కోసం, కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుంది. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ తక్కువ డిడక్షన్లు ఉంటాయి. ఇందులో జీతం పొందే వ్యక్తులకు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 87A కింద రూ.60,000 వరకు రిబేట్ ఉంటాయి. దీనివల్ల రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. పాత విధానం సెక్షన్ 80C, 80D, లేదా 24(b) (హోమ్ లోన్ వడ్డీ కోసం) వంటి ఎక్కువ డిడక్షన్లను అనుమతిస్తుంది కానీ ఎక్కువ పన్ను రేట్లను కలిగి ఉంటుంది.మొదటిసారి ఫైలర్లు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి రెండు విధానాలనూ పోల్చాలి. నాన్ బిజినెస్ పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఫైలింగ్ గడువు (ఆడిట్ లేని కేసులకు జూలై 31) లోపు ఎంపిక చేయాలి. గడువు మిస్ అయితే, ఆలస్య ఫైలింగ్ కోసం కొత్త విధానంలోనే ఉండాల్సి వస్తుంది.అన్ని ఆదాయ వనరులను నివేదించాలిమీ మొత్తం ఆదాయం పన్ను విధించే పరిమితి (60 ఏళ్లలోపు వ్యక్తులకు కొత్త విధానంలో రూ.3 లక్షలు) కంటే తక్కువ ఉన్నప్పటికీ, అన్ని ఆదాయ వనరులను నివేదించాలి. ఇందులో జీతం, సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ, అద్దె ఆదాయం, పెట్టుబడుల నుండి క్యాపిటల్ గెయిన్స్, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు కూడా ఉంటాయి.ఫారమ్ 16 (యజమానుల నుండి), ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS) వంటి డాక్యుమెంట్లు ఆదాయం, టీడీఎస్ వివరాలను ధృవీకరించడానికి సహాయపడతాయి. ఏ ఆదాయాన్ని నివేదించకపోతే, ఆదాయపు పన్ను విభాగం నుండి పరిశీలన లేదా నోటీసులు రావచ్చు. ఈ డాక్యుమెంట్ల రికార్డులను భవిష్యత్తు అవసరాల కోసం దగ్గర ఉంచుకోండి. అయితే వీటిని ఐటీ రిటర్నుకు జోడించాల్సిన అవసరం లేదు.గడువులను పాటించండి.. ఈ-వెరిఫై చేయండిఆడిట్ లేని పన్ను చెల్లించేవారికి ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు జూలై 31. ఈ గడువు మిస్ అయితే రూ.5,000 జరిమానా (ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే రూ.1,000) చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు చెల్లించని పన్నుపై సెక్షన్ 234A కింద నెలకు 1% వడ్డీ విధిస్తారు. మీరు డిసెంబర్ 31, 2025 వరకు ఆలస్య రిటర్న్ లేదా నాలుగు సంవత్సరాలలోపు (మార్చి 31, 2029 నాటికి) అప్డేటెడ్ రిటర్న్ (ITR-U) దాఖలు చేయవచ్చు కానీ జరిమానాలు ఉంటాయి.ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత, 30 రోజులలోపు ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ లేదా ఈవీసీ ఉపయోగించి ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. మీ పాన్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఇనాక్టివ్ పాన్ కార్డుల వల్ల రిఫండ్లు లేదా ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చు. ఏప్రిల్ లేదా మేలో ముందుగానే ఐటీఆర్ దాఖలు చేస్తే, AIS/ఫారమ్ 26ASతో వివరాలు సరిపోలితే, ఒక వారంలో రిఫండ్లు వస్తాయి.👉 ఇదీ చదవండి: ‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..డిడక్షన్లను క్లెయిమ్ చేయండి.. తప్పులు చేయొద్దుపాత విధానంలో, సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షలు (ఉదా., PPF, ELSS), సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షలు, లేదా సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ వంటి డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. కొత్త విధానంలో డిడక్షన్లు పరిమితం, కానీ స్టాండర్డ్ డిడక్షన్, ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ వర్తిస్తాయి.AIS, ఫారమ్ 26ASతో క్రాస్-చెక్ చేసి ఖచ్చితత్వాన్ని నిర్ధారించండి, లేకపోతే తప్పులు ప్రాసెసింగ్‌ను ఆలస్యం చేయవచ్చు లేదా నోటీసులకు దారితీయవచ్చు. ఇక్కడ తప్పులు అంటే తప్పుడు వ్యక్తిగత వివరాలు, ఆదాయం దాచడం, తప్పు విధానం ఎంచుకోవడం వంటివి అన్నమాట. 80DD లేదా 80U వంటి డిడక్షన్లు క్లెయిమ్ చేస్తే, ఫారమ్ 10-IA దాఖలు చేయండి. ప్రక్రియను పూర్తి చేయడానికి వెంటనే ఈ-వెరిఫై చేయండి.అదనపు చిట్కాలుAIS, ఫారమ్ 26AS నుండి డేటాను ఆటో-ఫిల్ చేసే సదుపాయం ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఉంది. ఉపయోగించండి. మీ ఆదాయం ఎక్సెంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉన్నప్పటికీ, రూ.1 కోటి కరెంట్ ఖాతాలలో డిపాజిట్ చేయడం, రూ.2 లక్షలు విదేశీ ప్రయాణంలో ఖర్చు చేయడం, లేదా రూ.25,000 కంటే ఎక్కువ TDS/TCS ఉన్నట్లయితే ఐటీఆర్ దాఖలు చేయండి. క్యాపిటల్ గెయిన్స్ వంటి సంక్లిష్ట ఆదాయ వనరులకు సంబంధించి సందేహం ఉంటే టాక్స్ ప్రొఫెషనల్‌ను సంప్రదించండి. -
చిన్న చిన్న పెట్టుబడులు.. రూ.40,000 కోట్లు అవుతాయ్!
నెలవారీ క్రమానుగత పెట్టుబడులు (సిప్) వచ్చే 18–24 నెలల్లో రూ.40,000 కోట్లకు పెరగనున్నట్టు యూనియన్ ఏఎంసీ సీఈవో మధు నాయర్ అంచనా వేస్తున్నారు. ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతుండడం సిప్ పెట్టుబడులను ఇతోధికం చేస్తుందన్నది ఆయన విశ్లేషణ.ఈ ఏడాది మార్చి నెలలో సిప్ రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.25,925 కోట్లుగా ఉంటే.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు సిప్ పెట్టుబడులు రూ.24,113 కోట్లకు పెరగడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి నెలవారీ రూ.16,602 కోట్లుగా ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు 2024 మార్చి నాటికి ఉన్న రూ.10.71 లక్షల కోట్ల నుంచి 2025 మార్చి నాటికి రూ.13.31 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి.బడ్జెట్లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, మార్కెట్ విలువలు ఆకర్షణీయంగా మారడం సిప్ పెట్టుబడులను పెంచేందుకు సానుకూలిస్తాయని నాయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు యూనియన్ మ్యూచువల్ ఫండ్ తన తాజా త్రైమాసికం నివేదికలో భారత ఈక్విటీ మార్కెట్లను ‘ఆకర్షణీయ జోన్’కు అప్‌గ్రేడ్ చేసింది. అంతకుముందున్న మోస్తరు ఖరీదు నుంచి మెరుగుపడడం గమనార్హం. ఇటీవలి స్టాక్స్ దిద్దుబాటుకు తోడు, కంపెనీల ఆదాయాలు కాస్త మెరుగుపడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు.. దీర్ఘకాల పెట్టుబడులకు ఉన్న ప్రాధాన్యాన్ని మధు నాయర్ గుర్తు చేశారు. స్వల్పకాల ప్రభావాన్ని అతిగా ఊహించుకోవడం, దీర్ఘకాల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయడం ఇన్వెస్టర్లలో సాధారణంగా కనిపించేదిగా పేర్కొన్నారు. వచ్చే 10–15 ఏళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరు చూపిస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. -
ఐసీఐసీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటు తగ్గింపు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్ (సేవింగ్స్ ఖాతాల్లోని బ్యాలెన్స్)పై వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించింది. సేవింగ్స్ ఖాతాల్లో బ్యాలెన్స్ రూ.50 లక్షల వరకు ఉన్న వారికి ఇక మీదట 2.75 శాతం రేటు అమలవుతుంది. అదే మాదిరి రూ.50 లక్షలకు పైన బ్యాలెన్స్ ఉన్న వారికి 3.25 శాతం రేటు లభిస్తుంది.బుధవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ఎస్బీఐ సైతం సేవింగ్స్ డిపాజిట్లపై 2.70 శాతం రేటు అమలు చేస్తుండడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా తాజాగా సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25% తగ్గించి 2.75% చేసింది. రూ.50 లక్షలకు మించిన మొత్తంపై వడ్డీ రేటు 3.5% ఉండగా 3.25 శాతానికి తగ్గించింది. -
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ పాత పన్ను విధానంలో కొనసాగాలా లేక కొత్త విధానంలోకి వెళ్లాలా అనేది ఎంచుకునే పనిలో ఉన్నారు. డిడక్షన్లు, మినహాయింపులకు ప్రసిద్ధి చెందిన పాత పన్ను విధానం గణనీయమైన పెట్టుబడులు, ఖర్చులు ఉన్నవారికి ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగా ఉంది. కానీ దీనికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట అవసరాలు ఉన్నాయి.జీతం పొందే ఉద్యోగులుపాత పన్ను విధానం కింద ట్యాక్స్ పేయర్స్ సుమారు 70 డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. వీటిలో సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు, గృహ రుణ వడ్డీకి రూ.2 లక్షల వరకు, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) కోసం మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఈ విధానాన్ని ఎంచుకోవడానికి త్వరపడాల్సిన అవసరం ఉంది. జీతం పొందే ఉద్యోగులు తాము ఈ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నట్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తమ యజమానులకు తెలియజేయాలి. తద్వారా టీడీఎస్ (TDS) సరిగ్గా లెక్కించేందుకు వీలుంటుంది. ఈ సమాచారం ఇవ్వకపోతే యజమాన్యాలు కొత్త విధానాన్ని డిఫాల్ట్‌గా అప్లయి చేస్తారు. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ డిడక్షన్లు తక్కువగా ఉంటాయి.వ్యాపారులువ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియ మరింత కఠినంగా ఉంటుంది. వారు పాత విధానాన్ని ఎంచుకోవడానికి ఐటీఆర్ గడువు జూలై 31 లోపల ఫారం 10-IEA ను ఆన్లైన్లో దాఖలు చేయాలి. ఈ ఫారాన్ని ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారిని పాత విధానంలో లాక్ చేస్తుంది. కొత్త విధానానికి తిరిగి మారడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. గడువు తప్పడం లేదా ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి డీఫాల్ట్‌గా వెళతారు. ఇది వారికి విలువైన డిడక్షన్లను కోల్పోయేలా చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..పన్ను ప్రణాళిక సౌలభ్యంపాత విధానం ఆకర్షణ దాని పన్ను ప్రణాళిక సౌలభ్యంలోనే ఉంది. ముఖ్యంగా హెచ్ఆర్ఏ లేదా సెక్షన్ 80సీ పెట్టుబడుల వంటి సంవత్సరానికి రూ.2.5 లక్షలకు మించిన డిడక్షన్లు ఉన్న అధిక ఆదాయ వ్యక్తులకు ఇది అనువుగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు కూడా ఎక్కువ మినహాయింపు పరిమితుల (60–79 సంవత్సరాల వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షలు) నుండి ప్రయోజనం పొందుతారు. అయితే, ఇది అదనపు డాక్యుమెంటేషన్, ఉదాహరణకు అద్దె రసీదులు, పెట్టుబడి రుజువులు, ఐటఆర్ దాఖలు సమయంలో లేదా ఆడిట్ సమయంలో ధ్రువీకరించడానికి అవసరం.రెండూ పోల్చుకోండి..ఆదాయపు పన్ను విభాగం ఆన్లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి రెండు పన్ను విధానాలనూ పోల్చిచూసుకోవాలని ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాత విధానం ప్రయోజనాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడతాయి. కొత్త విధానం డిఫాల్ట్‌గా ఉన్నందున, పాత విధానం ప్రయోజనాలను పొందడానికి పన్ను చెల్లింపుదారులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. -
ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..
ఏప్రిల్‌లో అడుగుపెట్టామంటే రెండు ఆలోచనలు వస్తాయి. మొదటిది 2025 మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి సిద్ధమవడం. రెండోది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) పన్ను ప్రణాళికలను తయారు చేసుకోవడం. అందరూ కొత్త విధానానికి మొగ్గుచూపుతున్న పరిస్థితుల్లో పెట్టుబడులు/సేవింగ్స్పరంగా ప్లానింగ్‌కి తక్కువ అవకాశాలున్నాయి. అందుకని 2025 ఆర్థిక సంవత్సరానికి రిటర్ను వేయడానికి ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసుకుందాం. 1. మీకున్న అన్ని బ్యాంకుల ఖాతాలకు సంబంధించి స్టేట్మెంట్లు/పాస్బుక్స్లని అప్డేట్ చేయించండి. 2. ప్రతి బ్యాంకు అకౌంట్ సేట్ట్మెంటుని తెచ్చుకొండి. 3. గత ఆర్థిక సంవత్సరం తొలి రోజు (1.4.2024) నుంచి చివరి రోజు (31.3.2025) వరకు బ్యాంకులోని జమలు పరిశీలించండి.పతి జమకు వివరణ రాసుకొండి. అంటే నగదు ద్వారా, చెక్కు ద్వారా, బదిలీ ద్వారా, గూగుల్ ద్వారా వచ్చిందా? మీరే స్వయంగా నగదు డిపాజిట్ చేసారా అని తెలుకొండి. ఆదాయమా.. అప్పు తీసుకున్నారా..? మీకు ఎవరైనా అప్పు చెల్లించారా? డివిడెండా.. వడ్డీనా .. జీతమా.. ఇంటి కిరాయా .. వ్యాపార ఆదాయమా.. షేర్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయమా? క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిన ఆదాయమా.. స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమా? పీఎఫ్ విత్‌డ్రా ద్వారా వచ్చినదా.. ఎన్ఎస్సీ లేదా ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ ద్వారా వచ్చినది డిపాజిట్ చేశారా..? అలాగే చిట్‌ఫండ్ పాట ద్వారా వచ్చిందా? మన కుటుంబ సభ్యులు పంపించారా.., మన దేశం నుంచి వచ్చిందా.., విదేశాల నుంచి వచ్చిందా అనే దానిపై కచ్చితమైన అవగాహన ఉండాలి.వీటిలో కొన్నింటిపై పన్ను ఉంటుంది. కొన్ని పన్ను భారానికి గురికావు. కొన్ని ఆదాయ పరిధిలోకి వస్తాయి. కొన్నింటికి మినహాయింపు ఉంటుంది. ఇవి నిర్ధారించాలంటే మనకు ఎవరిచ్చారో కచ్చితంగా తెలియాలి. ఇచ్చిన వ్యక్తి పేరు, చిరునామా, పాన్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. దేని నిమిత్తం వచ్చిందో రాసుకోవాలి. ప్రతిదానికి రుజువులు ఉండాలి. ఇలా అన్ని అకౌంట్లలో అన్ని జమలకు వివరణ ఉండాలి. ఎందుకంటే ఈ వివరణ మీదే మీ పన్ను భారం ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ సైడు ... రెండో కాలమ్.. ఖర్చు కాలమ్. డెబిట్లోని పద్దులు/ఎంట్రీలు .. ఈ వ్యవహారాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి ఖర్చులే కదా అని అశ్రద్ధ వహించకండి. ఖర్చులు/డెబిట్లు మీ ఆదాయాన్ని నిర్ధారిస్తాయి. ఉదాహరణకు ఆదాయానికి మించిన ఖర్చులుంటే వాటికి తగిన ‘మార్గాలు’ లేకపోయినా .. లేదా మీరు ఇవ్వకపోయినా ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు. ఖర్చు దేని మీద చేసారు? ఏ నిమిత్తం చేసారు అనేది మీకు డెబిట్. మరో అకౌంట్లో జమ అంటే క్రెడిట్. అది మీకు ఆదాయం కాదంటే, అటువైపు వ్యక్తికి ఆదాయం కావచ్చు/కాకపోవచ్చు. దీన్ని నిరూపించాలి.అంటే ఈ మేరకు మీరు స్వయంగా ‘కన్ఫర్మ్’ చేయాలి. అందుకని డెబిట్‌ను విశ్లేషించండి. కొన్ని చెల్లింపుల్లో ఆదాయపన్ను చట్టప్రకారం మీరే బాధ్యులుగా ఉంటారు. ఉదాహరణకు మీరు జీతం ఇస్తారనుకుందాం... టీడీఎస్ తీసేశారా (కట్ చేశారా).., కమీషన్ ఇస్తే టాక్స్ రికవరీ చేశారా.., షేర్లు కొంటే వాటి మీద డివిడెండ్ ఎంత? ఎవరికైనా అప్పు ఇస్తే వడ్డీ వచ్చిందా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద ఆదాయమెంత, ఏవైనా స్థిరాస్తులు కొంటే దాని మీద ఆదాయమెంత? ఈ స్థిరాస్తి కొనేందుకు ఎంత అయ్యింది? ఎలా ఖర్చు పెట్టారు .. సోర్స్ ఏమిటి? ఇలా ప్రతి బ్యాంకు అకౌంటులో జమలు/ఖర్చులు విశ్లేషించాలి. వివరణలు రాసుకోవాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
అప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పడుతుంది?
మ్యూచువల్ ఫండ్స్‌లో నా పెట్టుబడులను విక్రయించేందుకు గత ఆర్థిక సంవత్సరం చివరి రోజైన 2025 మార్చి 31న ఆర్డర్ పెట్టాను. నాకు చెల్లింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో వచ్చాయి. ఇక్కడ ఆర్థిక సంవత్సరం మారిపోయింది. అప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంలో నా మూలధన లాభాలను పరిగణనలోకి తీసుకుంటారు? – చరణ్దాస్ఇన్వెస్టర్లలో ఆర్థిక సంవత్సరం చివర్లో సాధారణంగా కనిపించే అయోమయమే ఇది. పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన తేదీ ఆధారంగానే మూలధన లాభాలపై పన్నును పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకానీ, మీరు విక్రయ అభ్యర్థన ఎప్పుడు పెట్టారన్నది కాదు. సెబీ నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉపసంహరణకు కటాఫ్ టైమ్ పనిదినాల్లో మధ్యాహ్నం 3 గంటలు.మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థన సమర్పించినట్టయితే అదే రోజు నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) ఆధారంగా ఆ లావాదేవీ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత సమర్పించినట్టయితే తర్వాతి పనిదినం రోజు ఎన్ఏవీ ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. మీరు 2025 మార్చి 31న సెల్ ఆర్డర్ పెట్టారు. ఆ రోజు మార్కెట్లకు సెలవు. కనుక మీ అభ్యర్థనను ఏప్రిల్ 1న ప్రాసెస్ చేయనున్నారు. కనుక పెట్టుబడుల విక్రయంపై వచ్చిన లాభాన్ని 2025–26 ఆర్థిక సంవత్సరం మూలధన లాభాలు కింద పరిగణనలోకి తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు వారసత్వంగా వచ్చినప్పుడు వాటిపై పన్ను ఎలా అమలవుతుంది? మూలధన లాభాల లెక్కింపునకు వాటి అసలు కొనుగోలు తేదీని పరిగణనలోకి తీసుకుంటారా లేక వారసులకు బదిలీ అయిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారా? – జె.తిరుమలరావు అసలు పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు వారసులకు బదిలీ అయితే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పెట్టుబడులు మరొకరి పేరిట బదిలీ అయ్యాయే కానీ, విక్రయించలేదు. ఇక మూలధన లాభాలపై పన్ను లెక్కింపునకు మొదట పెట్టుబడి పెట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. బదిలీ అయిన రోజును కాదు. ఈక్విటీ ఫండ్స్: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై (ఏడాదికి మించిన పెట్టుబడులు) పన్ను లేదు. అంతకుమించిన మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. అదే స్వల్పకాల మూలధన లాభాలపై (ఏడాదిలోపు విక్రయించినవి) 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డెట్ ఫండ్స్: 2023 ఏప్రిల్ 1 తర్వాత పెట్టుబడి పెట్టి.. విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ లేదా వారి వారసుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ అసలు పెట్టుబడిని 2023 ఏప్రిల్ 1లోపు చేసి.. వాటిని రెండేళ్లలోపు విక్రయిస్తే లాభం మొత్తం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై నికరంగా 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఉదాహరణకు 2019 జనవరి 1న ఈక్విటీ ఫండ్స్‌లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. 2024 జనవరిలో ఇన్వెస్టర్ కాలం చేశారు. ఈ పెట్టుబడులను వారి వారసులు 2025 మార్చిలో రూ.12 లక్షలకు విక్రయించారు. ఏడాదికి మించిన పెట్టుబడి కనుక దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. అసలు పెట్టుబడి రూ.5 లక్షలు మినహాయించగా నికర లాభం రూ.7 లక్షలు అవుతుంది. ఇందులో రూ.1.25 లక్షలపై పన్ను లేదు. రూ.5.75 లక్షలపై 12.5 శాతం ప్రకారం రూ.71,875 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మహిళలకు ప్రత్యేక బీమా పాలసీలు
మహిళ ఆరోగ్యం ఒక కుటుంబానికి ఎంతో అవసరం. ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సాఫీగా ముందుకునడుస్తుంది. అయితే మహిళల ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రసూతి సంబంధిత ఖర్చులు, గైనకాలజీ సమస్యలు, రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలు వంటి ప్రత్యేకమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలకు ఆరోగ్య బీమా ఒక కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.అందుకే దేశంలోని అనేక బీమా ప్రొవైడర్లు ఇప్పుడు ఈ అవసరాలను తీర్చే మహిళల కోసమే ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెస్తున్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఉమెన్ స్పెసిఫిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, అవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ ప్లాన్క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కూడా కవరేజీ లభించేలా మహిళల కోసం బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు ’బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ (ఎస్‌డబ్ల్యూటీ) ప్లాన్’. ఇది సంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన బెనిఫిట్స్, ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ మొదలైన వాటితో ఆర్థిక భద్రతను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ స్మార్ట్ ఉమెన్ ప్లాన్ » గర్భధారణ సంబంధిత సమస్యలను కవర్ చేస్తుంది.» క్లిష్టమైన అనారోగ్యాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.టాటా-ఏఐజీ వెల్సూరెన్స్ ఉమెన్ పాలసీ» హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది.» క్యాన్సర్, స్ట్రోక్ వంటి క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేస్తుందిస్టార్ వెడ్డింగ్ గిఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి, వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ నవ వధూవరుల కోసం రూపొందించిన ప్రత్యేక పాలసీ ఇది.రెలిగేర్ జాయ్ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ» ప్రసూతి ప్రయోజనాలు, నవజాత శిశువుల సంరక్షణపై దృష్టి పెడుతుందిన్యూ ఇండియా ఆశా కిరణ్ పాలసీ» మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్లాన్ వారికి పూర్తి ఆరోగ్య కవరేజీని కల్పిస్తుంది.రిలయన్స్ హెల్త్ పాలసీ» అదనపు వెల్ నెస్ లక్షణాలతో సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.సరైన ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?ఉత్తమ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.కవరేజ్: పాలసీలో మీకు సంబంధించిన ప్రసూతి, క్రిటికల్ ఇల్ నెస్ కవర్ అయ్యేలా చూసుకోండి.ప్రీమియం ఖర్చు: ఖర్చు, ప్రయోజనాల ఆధారంగా విభిన్న ప్లాన్లను పోల్చి చూడండి.వెయిటింగ్ పీరియడ్: ప్రసూతి కవరేజీ, ముందుగా ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్ చెక్ చేయండి.అదనపు ప్రయోజనాలు: వెల్నెస్ కార్యక్రమాలు, నివారణ సంరక్షణ, ఆసుపత్రిలో చేరిక ప్రయోజనాల కోసం చూడండి. -
బీమాతో సైబర్ మోసాలకు చెక్!
ఐటీ ఉద్యోగి వంశీరామ్ (32) మొబైల్‌కు ఒక సందేశం వచ్చింది. విద్యుత్ బిల్లు గడువు ముగిసిపోయిందని.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ నిలిపివేస్తామని అందులో ఉంది. వెంటనే లింక్‌పై క్లిక్ చేసి చెల్లించేశాడు వంశీ. కానీ, ఖాతా నుంచి రూ.80,000 డెబిట్ అయిపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. ఇలాంటివి రోజుకు వేలాది ఘటనలు జరుగుతున్నాయి. గ్రోసరీ షాపింగ్, సోషల్ మీడియా ముచ్చట్లు, వర్తకులకు క్యూఆర్ కోడ్ చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు, బ్యాంకింగ్ సేవలు.. నేడు లావాదేవీలన్నీ మొబైల్ ఫోన్ల నుంచే. దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలు డిజిటల్ రూపంలోకి మళ్లాయి. సౌకర్యంగా ఉండడంతో అందరూ స్మార్ట్‌ఫోన్ నుంచే కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ఇది సైబర్ మోసాలకు అడ్డాగా మారిపోయింది. ఏటా 15 లక్షల సైబర్ మోసాలు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించుకోవడంపై తప్పకుండా దృష్టి సారించాలి. దీని గురించి అవగాహన కల్పించే కథనం ఇది... 2018లో సైబర్ నేరాలు 2.08 లక్షలు కాగా, ఇప్పుడు ఏటా 15 లక్షలకు చేరాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. బాధితులు అందరూ బయటకు చెప్పుకోలేరు. కనుక, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. సైబర్ నేరాలతో ఆర్థికంగా నష్టపోవడమే కాదు, మానసికంగా ఎంతో వేదనకు గురికావాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి ఆదుకునేదే సైబర్ ఇన్సూరెన్స్. దేశంలో 84 శాతం ఇంటర్నెట్ యూజర్లు ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. షాపింగ్, బ్యాంకింగ్ లేదా సోషల్ మీడియా చాటింగ్, ఆన్లైన్ కార్యకలాపాలు ఏవైనా సరే... ఇంటర్నెట్తో అనుసంధానమైన ప్రతి ఒక్కరికీ డేటా లీకేజీ, సైబర్ దాడులు, మోసాల రిస్క్ ఉంటుంది. సైబర్ నేరస్థులు డీప్‌ఫేక్ టెక్నాలజీ, ఏఐ తదితర అత్యాధునిక టెక్నాలజీలతో దాడులకు దిగుతున్నారు. ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్‌ను సైతం తప్పుదోవ పట్టించి.. నకిలీ లింక్ ద్వారా బ్యాంక్ ఖాతా ఊడ్చేస్తున్న ఘటనలు వింటున్నాం. టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం లేని విశ్రాంత జీవుల నుంచి జీవితకాల పొదుపు నిధులను మాయం చేస్తున్నారు. నేడు ప్రపంచం మొత్తం డిజిటల్‌గా అనుసంధానమై ఉంది. దీంతో నేరగాళ్లు ఏదో ఒక దేశంలో ఉండి, మరో దేశంలోని వారిని సులభంగా మోసం చేయగలుగుతున్నారు. ఒకవైపు సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. చాలా మందికి దీని గురించి అవగాహన లేకపోవడం ఒకటి అయితే, తాము జాగ్రత్తగా ఉంటామన్న ధీమా కొందరిని బీమాకు దూరంగా ఉంచుతోంది. సైబర్ రక్షణ...సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాన్ని పాలసీదారులకు సైబర్ ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు సమ్ అష్యూర్డ్ (బీమా) తీసుకోవచ్చు. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం సుమారు రూ.600 వరకు.. రూ.కోటి కవరేజీకి రూ.25,000 వరకు ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి దురి్వనియోగం చేయడం, సైబర్ వేధింపులు, బెదిరింపులు, వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం వంటి కేసుల్లో.. చట్టపరమైన చర్యలకు అయ్యే వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. మాల్వేర్, రాన్సమ్వేర్ రక్షణ కూడా ఉంటుంది. మాల్వేర్ దాడుల కారణంగా సర్వర్, నెట్వర్క్, కంప్యూటర్లకు వాటిల్లే నష్టానికి పరిహారం లభిస్తుంది. సైబర్ నేరస్థులు డివైజ్‌ను (మొబైల్ లేదా పీసీ/ల్యాప్‌టాప్) హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో డేటా రికవరీకి, డివైజ్ రిపేర్ వ్యయాలను బీమా కంపెనీ భరిస్తుంది. డేటా చోరీతో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఆన్లైన్ బ్లాక్ మెయిల్, సైబర్ బుల్లీయింగ్ తదితర ఘటనల్లో న్యాయపరమైన చర్యలకు, సాంకేతిక సాయానికి అయ్యే వ్యయాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. సైబర్ ఇన్సూరెన్స్‌లోనూ విభిన్న ప్లాన్లు ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయి. మొబైల్ వాలెట్లకూ రక్షణ కల్పించుకోవచ్చు. ఈమెయిల్ స్పూఫింగ్ దాడి వల్ల ఎదురయ్యే ఆర్థిక నష్టం, నేరస్థులపై చర్యలకు అయ్యే వ్యయాలకూ చెల్లింపులు ఉంటాయి. సందేశాలు పంపడం, ఫోన్ కాల్స్, నకిలీ వెబ్సైట్ల ద్వారా సున్నితమైన డేటాను పొందడం ద్వారా ఆర్థికంగా నష్టం కలిగించడం వంటి ఫిషింగ్ దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. ఎంత కవరేజీ అవసరం? కంపెనీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి ఫైర్‌వాల్స్ వంటి సాఫ్ట్వేర్ టూల్స్‌తో సైబర్ దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అదే మాదిరి వ్యక్తులు సైతం తమ వంతుగా సైబర్ బీమా రక్షణను తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ముందుగా బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్, క్రెడిట్ కార్డ్ లిమిట్, ఈ–వ్యాలెట్ ఇలా సైబర్ దాడుల రిస్క్ ఉన్న పెట్టుబడుల విలువను ఒకసారి పరిశీలించాలి. మీ లిక్విడ్ అసెట్స్ విలువకు సరిపడా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తరచూ, అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి అధిక కవరేజీ అవసరం. వీటికి కవరేజీ రాదు.. సైబర్ ఇన్సూరెన్స్‌లో మినహాయింపులు కూడా ఉంటాయి. వీటి గురించి పాలసీదారులు ముందుగానే సమగ్రంగా తెలుసుకోవాలి., చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా చేసే వ్యవహారాలు, లావాదేవీలు, ఉద్దేశపూర్వక ఉల్లంఘనల కారణంగా జరిగే నష్టానికి ఇందులో పరిహారం రాదు. వాణిజ్య రహస్యాలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించి ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలకూ ఇందులో మినహాయింపులు ఉన్నాయి. యుద్ధం, సైబర్ యుద్ధం, సహజ ప్రమాదాల కారణంగా వాటిల్లే నష్టానికీ రక్షణ ఉండదు. క్రిప్టో పెట్టుబడులు, గ్యాంబ్లింగ్, మోసపూరిత చర్యలు, అనధికారికంగా డేటా సమీకరించడం, నిషేధిత సైట్లలోకి ప్రవేశించడం వల్ల వాటిల్లే నష్టం తదితర వాటికి సైబర్ బీమాలో కవరేజీ ఉండదు. వెంటనే రిపోర్ట్ చేయాలి.. మోసపూరిత లావాదేవీలు జరిగాయంటే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వాటి ఖాతా/క్రెడిట్/డెబిట్‌కార్డుల యాక్సెస్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయించాలి. వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాలి. 1930కు కాల్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత బీమా కంపెనీకి సమాచారం అందించాలి. పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం, ఆ కాపీ తీసుకుని బీమా కంపెనీ వద్ద నిబంధనల మేరకు క్లెయిమ్ దాఖలు చేయాలి. బ్యాంక్/ఎన్బీఎఫ్సీ వద్ద ఫిర్యాదుకు సంబంధించి రుజువులను జత చేయాలి. జరిగిన నష్టానికి సంబంధించి ఆధారాలూ సమర్పించాలి. సైబర్ టిప్స్.. → చాలా మంది ఆన్లైన్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం సైబర్ దాడులకు అవకాశం ఇచి్చనట్టు అ వుతోంది. ప్రతి ఒక్కరూ తమవంతు రక్షణ చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. → స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లలో సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. → తెలియని వెబ్సైట్లను యాక్సెస్ చేయకుండా ఉండాలి. → గూగుల్ సెర్చ్‌లో శోధించే క్రమంలో ఎదురయ్యే వెబ్ పోర్టళ్లు, కాంటాక్టుల వివరాలు, చిరునామాలు నిజమైనవేనా? అన్న పరిశీలన తర్వాతే ముందుకు వెళ్లాలి. → డొమైన్ చిరునామాలో హెచ్‌టీటీపీఎస్ లేకపోతే యాక్సెస్‌కు దూరంగా ఉండాలి. → బలహీన పాస్వర్డ్లు కాకుండా.. స్మాల్, క్యాపిటల్ లెటర్లు, స్పెషల్ క్యారెక్టర్లు, నంబర్లతో కూడిన పటిష్ట పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవాలి. → పబ్లిక్ వైఫై, ఉచిత నెట్ వర్క్‌ల యాక్సెస్‌కు దూరంగా ఉండాలి → టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఏ)ను ఎనేబుల్ చేసుకోవాలి. → ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎప్పుడూ అప్డేటెడ్గా ఉంచుకోవాలి. → సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను కొత్తవారు యాక్సెస్ చేయకుండా నియంత్రణలు పెట్టుకోవాలి. → మెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే యూఆర్ఎల్ లింక్‌లపై క్లిక్ చేయొద్దు. అవి విశ్వసనీయ సంస్థల నుంచి వచి్చనవేనా అన్నది ధ్రువీకరించుకోవాలి. → పేమెంట్ యాప్‌లు సహా అన్ని ముఖ్యమైన యాప్‌లకు ఫింగర్ ప్రింట్ లాగిన్ ఎనేబుల్ చేసుకోవాలి. → ఎప్పటికప్పుడు ముఖ్యమైన డేటాను క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి బ్యాకప్ తీసుకోవాలి. → ఓటీపీలు, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా, చిరునామా, ఫోన్ నంబర్లు ఇలా కీలక వివరాలను ఫోన్లో, ఆన్లైన్లో ఎవరితోనూ పంచుకోరాదు. → ఈ జాగ్రత్తలతోపాటు తగినంత రక్షణ కవరేజీతో సైబర్ బీమా తీసుకోవడం మరవొద్దు. హెచ్ఏఎల్కు నేరగాళ్ల బురిడీప్రభుత్వరంగ రక్షణ ఉత్పత్తుల కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ను సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించడం గమనార్హం. కంపెనీ కాన్పూర్ శాఖను తప్పుదోవ పట్టించి రూ.55 లక్షలు కాజేశారు. యూఎస్‌కు చెందిన పీఎస్ ఇంజనీరింగ్ ఐఎన్‌సీ నుంచి హెచ్ఏఎల్ విడిభాగాలు కొనుగోలు చేయాలనుకుంది. కంపెనీ అధికారిక ఈ మెయిల్‌తో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ రెండు సంస్థల మధ్యలో సైబర్ నేరగాళ్లు ప్రవేశించారు. యూఎస్ కంపెనీ పీఎస్ ఇంజనీరింగ్ అధికారిక ఈమెయిల్ చిరునామాలో ఒక ఇంగ్లిష్ ‘ఇ’ తొలగించి, మిగిలిన అక్షరాలన్నీ ఉండేలా ఈమెయిల్ ఐడీ సృష్టించి హెచ్ఏఎల్తో సంప్రదింపులు చేశారు. రూ.55 లక్షల అడ్వాన్స్‌ను తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. జరిగిన మోసాన్ని హెచ్ఏల్ ఆలస్యంగా గుర్తించింది. అలాగే, ఆ మధ్య ఓ ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కీలక డేటా లీక్ అయ్యింది. 68,000 డాలర్లు చెల్లించాలంటూ హ్యాకర్ డిమాండ్ చేశాడు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వాయిదాలపై చెల్లిద్దాం..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో మూడింట ఒక వంతు రుణ ఆధారితమేనని ‘ఫి కామర్స్’ సంస్థ వెల్లడించింది. 2024 సంవత్సరంలో 20,000 మర్చంట్ లావాదేవీలను అధ్యయనం చేసి ఈ వివరాలు విడుదల చేసింది. ప్రతి మూడు డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో క్రెడిట్‌కార్డు, వడ్డీతో కూడిన ఈఎంఐలు ఒకటి ఉండడం గమనార్హం. మొత్తం లావాదేవీల్లో యూపీఐతో చేసినవి 65 శాతంగా ఉన్నట్టు ఫి కామర్స్ తెలిపింది. స్వల్ప, మధ్య స్థాయి చెల్లింపులను ఎక్కువగా యూపీఐ సాయంతో చేస్తుంటే, పెద్ద లావాదేవీలు క్రెడిట్ కార్డులు, ఈఎంఐల రూపంలో ఉంటున్నాయి. ఫీజుల చెల్లింపులు, వైద్య పరమైన చెల్లింపులకు క్రెడిట్‌కార్డులను ఉపయోగిస్తున్నారు. పండుగల సందర్భంగా కొనుగోళ్లు, స్కూళ్లలో ప్రవేశాలు, సీజన్ వారీ అవసరాలకు రుణాలనే నమ్ముకుంటున్నారు. అంటే స్వల్పకాల రుణాలకు వినియోగదారులు క్రెడిట్ కార్డులు, రుణ ఈఎంఐలపై ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యా సంబంధిత చెల్లింపులకు 10 శాతం, హెల్త్‌కేర్ చెల్లింపులకు 15 శాతం, ఆటో విడిభాగాల కొనుగోళ్లకు 15 శాతం మేర రుణ సాధనాల ఆధారితంగానే చెల్లిస్తున్నారు. ఒకేసారి చెల్లింపుల కంటే రుణ ఆధారిత చెల్లింపులకు ఆసక్తి చూపిస్తున్నట్టు.. వినియోగదారుల ధోరణిలో మార్పునకు ఈ ఫలితాలు నిదర్శమని ఈ నివేదిక పేర్కొంది. -
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రత్యేక 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందులో 7.30% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చే వివిధ ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితులపై బ్యాంక్ వడ్డీ రేట్లను విస్తృతంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.సవరించిన రేట్ల ప్రకారం 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లకు 4.25 శాతం, 180 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లకు 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఏడాది మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 7.05 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ అందిస్తుంది.రూ .3 కోట్ల నుండి రూ .10 కోట్ల లోపు డిపాజిట్లకు సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. 91 నుండి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.75%, 180 నుండి 210 రోజులకు 6.25%, 211 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితికి 6.50%. ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 7.05 శాతంగా, ఏడాది కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.70 శాతంగా ఉంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ వ్యవధితో రూ .3 కోట్ల లోపు డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది.మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అందించే వడ్డీ రేటుకు సంబంధించిన వివరాలను ప్రకటనలో వెల్లడించలేదు. అయితే ఫిక్స్డ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్స్ కోరుకునే కస్టమర్లకు బ్యాంక్ ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తూనే ఉంది. దేశంలోని రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ అధిక వడ్డీ పథకాలను ఉపసంహరించుకోవడం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ మార్గదర్శకాలకు ప్రతిస్పందనగా వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది -
యూపీఐ సేవల్లో అంతరాయం: స్పందించిన ఎన్పీసీఐ
దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మధ్యాహ్నం 12:43 గంటకు సమస్య తీవ్రతరం అయిందని, 2,000 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వినియోగదారులు యూపీఐ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. సుమారు 79 శాతం మంది వినియోగదారులు చెల్లింపులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నారు. 19 శాతం మంది నిధులను బదిలీ చేయలేకపోయారు. మరో 2 శాతం ఫిర్యాదులు UPI ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను నివేదించారు.యూపీఐ సేవల్లో అంతరాయాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 26న, ఏప్రిల్ 2న కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి.టెక్నికల్ సమస్యల కారణంగా ఈ యూపీఐ సేవల్లో అంతరాయం జరిగినట్లు అప్పుడు ఎన్పీసీఐ వెల్లడించింది. కాగా ఇప్పుడు మరోమారు ఈ సమస్య తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్సీటీసీ క్లారిటీస్పందించిన ఎన్పీసీఐకొన్ని సాంకేతిక సమస్యల కారణంగా లావాదేవీలకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని ఎన్పీసీఐ ట్వీట్ చేసింది.NPCI is currently facing intermittent technical issues, leading to partial UPI transaction declines. We are working to resolve the issue, and will keep you updated. We regret the inconvenience caused.— NPCI (@NPCI_NPCI) April 12, 2025 -
ప్రయాణంలో రైలు టికెట్ చిరిగిపోతే ఫైన్ కట్టాలా?
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కారణాలతో ప్రయాణికుల టికెట్ చిరిగిపోతూ ఉంటుంది. లేదా ఇంకొన్ని సందర్భాల్లో టికెట్ ఎక్కడో పడిపోతుంది. అలాంటప్పుడు వేరే టికెట్ తీసుకోవాలా? లేదా అప్పటికే ప్రయాణంలో ఉంటే రైలు నుంచి దింపేస్తారా? అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. అయితే రైల్వే నిబంధనల ప్రకారం అలాంటి సందర్భంలో టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో.. ప్రయాణికులు అందుకు అనుగుణంగా ఎలా స్పందించాలో కింద తెలుసుకుందాం.టికెట్ లేకుండా ప్రయాణం చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ అసలు టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేసీ టీటీఈకి పట్టుబడితే పూర్తి టికెట్ ఛార్జీతో పాటు అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కనీసం రూ.250 లేదా టికెట్ మొత్తానికి రెట్టింపు ఉంటుంది. ఒకవేళ ఆ మొత్తం చెల్లించలేకపోతే టీటీఈ తదుపరి స్టేషన్లో దింపి రైల్వే పోలీసులకు అప్పగించే అధికారం ఉంది. కొన్నిసార్లు ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత టికెట్ కొనాలనుకుంటారు. ఇది సాధ్యమే, కానీ ఖాళీ సీటు అందుబాటులో ఉండాలి. అందుకోసం సాధారణ ఛార్జీల కంటే అదనంగా రుసుము వసూలు చేస్తారు.పోయిన లేదా చిరిగిన టిక్కెట్లుప్రయాణంలో మీ టికెట్ పోయినట్లయితే లేదా చిరిగిపోతే మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించరు. మీరు టీటీఈ నుంచి డూప్లికేట్ టికెట్ పొందవచ్చు. కానీ అప్పటికే మీరు పోయిన టికెట్‌కు డబ్బు చెల్లించినప్పటికీ కొత్తగా తీసుకునే టికెట్‌ను ఉచితంగా అందించరు. అందుకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి. వెరిఫికేషన్ కోసం మీ ఐడీని చూపించాల్సి ఉంటుంది. మొబైల్లో ఆన్లైన్ టికెట్ అందుబాటులో ఉంటే డూప్లికేట్ టికెట్ అవసరం లేదు. మొబైల్లో మీ ఈ-టికెట్‌ను టీటీఈకి చూపించవచ్చు. అది చెల్లుబాటు అవుతుంది.ఇదీ చదవండి: పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్రైలు ఆలస్యమైతే రీఫండ్భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మీరు ప్రయాణించాలనుకున్న రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే టికెట్ ఛార్జీలు రీఫండ్ పొందవచ్చు. ఇందుకోసం టీడీఆర్ (టికెట్ డిపాజిట్ రసీదు) దాఖలు చేయాలి. రైలు ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి (దొంగతనం లేదా దాడి వంటివి) జరిగితే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేయవచ్చు లేదా టీటీఈ లేదా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. -
పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
అనవసరంగా ఖర్చు చేయడం, తర్వాత అప్పులు చేయడం వంటి తప్పిదాలు చేయకూడదని జెరోధా సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే ఎలాంటి షార్ట్కట్లు లేవని, స్థిరమైన అలవాట్లు, సహనం ద్వారానే నిజమైన సంపద సృష్టించవచ్చని అన్నారు. తనను తరచుగా స్టాక్స్ చిట్కా కోసం చాలా మంది అడుగుతుంటారని ఎక్స్ ఖాతాలో తెలుపుతూ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో సీక్రెట్ రివీల్ చేశారు.‘ధనవంతులు కావడానికి షార్ట్ కట్లు లేవు. దీనికి మంచి అలవాట్లు, సహనం అవసరం. మీకు అవసరం లేని వస్తువులను కొనడం లేదా వాటిని కొనడానికి అప్పు చేయడం వంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య బీమా లేకపోవడం కూడా చాలా మందిని పేదరికంలోకి నెట్టివేస్తుంది’ అన్నారు. ఎక్కువ సంపాదించడం అంటే ఎక్కువ పొదుపు చేయడం మాత్రమే కాదనే సందేశంతో కూడిన వీడియోను కామత్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఇదీ చదవండి: ఆన్లైన్లో ఈజీగా హైసెక్యూరిటీ ప్లేట్లు‘వాస్తవానికి చాలామంది తరచుగా గాడ్జెట్లు, దుస్తులు, ఫ్యాన్సీ భోజనం..వంటి వాటికోసం అధికంగా ఖర్చు చేస్తుంటారు. ఇందులో ఎక్కువ భాగం ఈఎంఐ (సులభమైన నెలవారీ వాయిదాలు)లపైనే కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇంకా సంపాదించని డబ్బు ఇప్పటికే ఖర్చు చేసి ఉంటారు. జీతం రాకముందే దేనికి వెచ్చించాలో కమిట్ అయిపోతారు. దాంతో పేదరికంలోకి వెళుతున్నారు. మీ సంపాదనలో నెలకు రూ.50,000 ఖర్చు చేస్తారని భావిస్తే కేవలం 1% అంటే రూ.500 నుంచి ఆదా చేసేందుకు ప్రయత్నించండి. కేవలం ఒక ఆన్లైన్ ఆర్డర్‌ను దాటవేయడం వల్ల దీన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని 10-12% సీఏజీఆర్ రాబడి ఉన్న ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు భావిస్తే కాలక్రమేణా ఆ చిన్న పొదుపు అధిక రాబడిని అందిస్తుంది’ అన్నారు. -
ట్యాక్స్ పేయర్లకు లాస్ట్ ఛాన్స్: ఆ స్కీమ్ తుది గడువు ప్రకటించిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి తీసుకువచ్చిన వివాద్ సే విశ్వాస్ పథకానికి ఆదాయపన్ను శాఖ తాజాగా తుది గడువును ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు 2025 ఏప్రిల్ 30లోగా పథకాన్ని వినియోగించుకునేందుకు డిక్లరేషన్‌ను సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. తద్వారా 2024 అక్టోబర్1న ప్రవేశపెట్టిన ఈ పథకానికి తొలిసారి తుది గడువును సీబీడీటీ నోటిఫై చేసింది.పన్ను సంబంధ బకాయిలపై ప్రత్యక్ష పన్నుల పథకాన్ని ఆశ్రయించేవారు ఈ నెల 30లోగా డిక్లరేషన్‌ను ఇవ్వవలసి ఉంటుందని ఆదాయపన్ను శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పన్ను సంబంధిత వివాదాలు లేదా వివిధ అప్పీళ్లలో భాగమైన పన్ను చెల్లింపుదారులు పథకాన్ని తుది గడువులోగా వినియోగించుకోవచ్చునని వివరించింది.సుమారు 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్ల ద్వారా రూ. 35 లక్షల కోట్లు వివిధ వివాదాలలో నమోదైన నేపథ్యంలో పథకానికి ప్రాధాన్యత ఏర్పడింది. పన్ను చెల్లింపుదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలంటే.. వివాదంలో ఉన్న పన్నుపై 110 శాతాన్ని చెల్లించవలసి ఉంటుంది. 2024 వివాద్ సే విశ్వాస్ పథకానికి 2024–25 బడ్జెట్లో తెరతీశారు. 2024 అక్టోబర్ 1న నోటిఫై చేశారు. -
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల (credit card) వినియోగం బాగా పెరిగింది. దీంతో ఖర్చుల మీద నియంత్రణ లేక క్రెడిట్ కార్డుల బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలా వచ్చిన భారీ మొత్తం బిల్లులను ఒకేసారి కట్టడానికి కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందు కోసమే దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది.క్రెడిట్ కార్డు పెద్ద మొత్తం బిల్లుల నిర్వహరణను ‘ఎస్బీఐ కార్డ్ ఫ్లెక్సీపే’ సదుపాయం సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కార్డుదారులు పెద్ద కొనుగోళ్లను సులభమైన నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చుకోవచ్చు. తద్వారా ఒకేసారి ఏకమొత్తం చెల్లించాల్సిన ఇబ్బందిని లేకుండా చేసుకోవచ్చు. అసలేంటీ ఎస్బీఐ ఫ్లెక్సీపే ఫీచర్.. అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఎస్బీఐ ఫ్లెక్సీపేఫ్లెక్సీపే అనేది ఎస్బీఐ కార్డ్ అందించే ఫీచర్. ఇది మీ లావాదేవీలను సులభమైన వాయిదాలుగా మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రూ.500 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఇది మూడు, ఆరు, తొమ్మిది, 12, 18, 24 నెలలు వంటి రీపేమెంట్ కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది.ఇక రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకు 36 నెలల ఈఎంఐ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఫ్లెక్సీపే కోసం కనీస బుకింగ్ మొత్తం రూ .2,500, అయితే ఇది ఆఫర్ల ఆధారంగా మారవచ్చు. అలాగే, గత 30 రోజుల్లో చేసిన లావాదేవీలను ఫ్లెక్సీగా మార్చుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐలను మార్చుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.ఈఎంఐలుగా మార్చుకోండిలా..ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు తమ ఎస్బీఐ కార్డ్ ఆన్లైన్ ఖాతాలోకి లాగిన్ అయి, 'ఈఎంఐ అండ్ మోర్' విభాగానికి వెళ్లి 'ఫ్లెక్సీపే' ఎంచుకోవచ్చు. మార్చాలనుకుంటున్న లావాదేవీని, తగిన కాలపరిమితిని ఎంచుకుని అభ్యర్థనను ధృవీకరించండి.అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఎస్బీఐ కార్డ్ కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్‌కు కూడా కస్టమర్లు కాల్ చేసి కస్టమర్ సపోర్ట్ టీమ్ సహాయంతో ఈఎంఐ మార్పిడిని అభ్యర్థించవచ్చు. వాళ్లు మీకు ప్రక్రియపై మార్గనిర్దేశం చేస్తారు.అలాగే వినియోగదారులు ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోనూ ఫ్లెక్సీపే ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. అవసరమైతే లావాదేవీ మొత్తాన్ని సవరించి, కాలపరిమితిని ఎంచుకుని అప్లయి చేయవచ్చు. -
ఆర్బీఐ తాజా నిర్ణయం.. గృహ రుణంపై ఊరట
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. మరోసారి తాజాగా మరో 25 పాయింట్లు తగ్గుస్తున్నట్లు తెలిపింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.గృహ రుణంపై ఊరట ఎంతంటే..?ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.75 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,093 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.21,696కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.397 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.95,280 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఇదీ చదవండి: ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయంరెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. -
ముద్రా యోజనకు పదేళ్లు: రూ.20 లక్షల వరకు ఈజీ లోన్స్
ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎమ్ఎమ్వై) పథకం ఈ రోజుకు (ఏప్రిల్ 8) పదేళ్లను పూర్తిచేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి.. భారతదేశం అంతటా 52 కోట్లకు పైగా లబ్ధిదారులకు రూ. 33 లక్షల కోట్లకు పైగా పూచీకత్తు లేని రుణాలను పంపిణీ చేసింది.పీఎమ్‌ఎమ్‌వైస్క్రీన్ పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ముద్రా యోజన పథకం ఎంతో మందికి.. వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలను కల్పించింది. ఈ పథకం ద్వారా మేలుపొందిన కొంతమందితో మాట్లాడాను. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.Mudra Yojana has given opportunities to countless people to showcase their entrepreneurial skills. Interacted with some of the beneficiaries of the scheme. Their journey is inspiring. #10YearsOfMUDRA https://t.co/QcoIK1VTki— Narendra Modi (@narendramodi) April 8, 2025ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకంవ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభమైన ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం.. ఎంతోమంది ఎగడానికి ఆర్థికంగా ఉపయోగపడింది. గతంలో ఈ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షలు లోన్ ఇచ్చేవారు. అయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ఈ పథకం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?శిశు: చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి రూ. 50000 వరకు లోన్ అందిస్తారు.కిషోర్: వ్యాపారంలో కొంత స్థిరపడిన తరువాత.. దానిని మరికొంత విస్తరించుకోవడానికి రూ. 50వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది.తరుణ్ & తరుణ్ ప్లస్: వ్యాపారాలను మరింత విస్తరించాలనుకునేవారికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది. -
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
దేశంలోని రుణగ్రహీతలకు శుభవార్త. అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ఎంసీఎల్ఆర్ (వడ్డీ రేటు)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంటుంది. సవరించిన రేట్లు ఏప్రిల్ 7 నుంచి వర్తిస్తాయి.ఎంసీఎల్ఆర్.. దాని ప్రభావంమార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్దేశిస్తుంది. ఆర్బీఐ 2016లో ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది.గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఈ ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణ ఈఎంఐలు లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలికంగా రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ ప్రయోజనం పరిధి, సమయం రుణ ఒప్పందంలో పేర్కొన్న రీసెట్ క్లాజ్‌పై ఆధారపడి ఉంటుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ రేట్లుఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ కాలపరిమితిని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.20 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ను 9.30 శాతం నుంచి 9.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఏడాది, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 9.45 శాతం నుంచి 9.35 శాతానికి తగ్గించింది. -
ష్.. ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి!
పని ప్రదేశాల్లో వీలు దొరికినప్పుడల్లా చిట్‌చాట్ చేస్తూంటారు. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవడం మంచిదే. అంతమాత్రానా తోటి ఉద్యోగులతో అన్ని విషయాలు పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలు, విశ్వాసాలు, ఆరోగ్య విషయాలు.. వంటి కొన్ని అంశాలను తోటి ఉద్యోగులతో చర్చించకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఒకవేళ వారితో ఆయా విషయాలను చర్చిస్తే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జరిగే మేలు కంటే చేటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తోటి ఉద్యోగులతో పంచుకోకూడని కొన్ని అంశాలను నిపుణులు తమ మాటల్లో తెలియజేస్తున్నారు.వ్యక్తిగత, ఆర్థిక సమాచారంమీ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచాలి. మీరు పొందుతున్న జీతం, అప్పులు, పెట్టుబడులు కార్యాలయంలో అనవసరమైన ఒత్తిడి, పోటీని సృష్టిస్తాయి. మీ జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలపై తోటి ఉద్యోగులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా నష్టం జరగవచ్చు.ఆరోగ్య సమస్యలుసెలవులు తీసుకోవడానికి, టార్గెట్లు తప్పించుకోవడానికి తరచూ చాలామంది ఆఫీస్‌లో ఆరోగ్య సమస్యలున్నట్లు చెబుతారు. అందుకు బదులుగా మీకు నిజంగా ఏదైనా సమస్యలుంటే దాన్ని ఎలా అధిగమిస్తున్నారో హెచ్ఆర్, మేనేజర్‌కు మాత్రమే చెప్పండి. భవిష్యత్తులో మీరు సెలవు అడిగినప్పుడు మీ సమస్యపై వారికి అవగాహన ఉంది కాబట్టి అనుమతించే అవకాశం ఉంటుంది. తోటి ఉద్యోగులకు చెప్పడం వల్ల మీరు టార్గెట్లు తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయవచ్చు.రాజకీయ, మత విశ్వాసాలుపని ప్రదేశంలో విభిన్న విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు. మీ రాజకీయ, మత విశ్వాసాలను వారిపై రుద్దడం కంటే అసలు ఆ ప్రస్తావన లేకుండా వృత్తి జీవితం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలి.సహోద్యోగులు, మేనేజ్మెంట్పై కామెంట్లుసహచరులు / మేనేజ్మెంట్ గురించి తోటి ఉద్యోగులతో చెడుగా మాట్లాడటం లేదా గాసిప్‌లు క్రియేట్ చేయడం ఆపేయాలి. సంస్థకు సంబంధించిన మీ అభిప్రాయాలు సరైనవే అయినా ఇతరులతో పంచుకోకూడదు. మీ విమర్శలు ఏవైనా ఉంటే నేరుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.ఇదీ చదవండి: వైద్య రంగంలో గేమ్ ఛేంజర్‌గా కృత్రిమేమేధభవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలుమీరు అధికారిక ప్రకటన చేయకుండా కంపెనీ మారే ఆలోచనను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ భవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ఉత్తమం. ఈ విషయాన్ని ముందుగానే చెబితే ప్రస్తుత మీ స్థానానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. -
బీమాతో ధీమా.. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోండిలా
'ఆరోగ్యమే మహాభాగ్యం'.. ఈ మాటను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ కొంత పెద్దయిన తరువాత మహాభాగ్యం అంటే మిద్దెలు, మెడలు అనుకున్నాం. నిజానికి మనిషి ఆరోగ్యంగా లేకపోతే.. ఎంత సంపాదించినా అది వ్యర్థమే. కాలం మారిపోయింది.. ఎప్పుడు ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితిలో బతుకుతున్నాం.చరిత్ర చదువుకేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చదువుకున్నట్లు.. ఆరోగ్యం అంటే కరోనా ముందు, కరోనా తరువాత అన్నట్లు అయిపోయింది. కోవిడ్ మహమ్మారి ప్రజల జీవితాలను అంతలా తలకిందులు చేసింది. చేతిలో డబ్బులు లేక.. ఆసుపత్రులలో ఖర్చులు పెట్టుకోలేక పడ్డ ఇబ్బందులు కోకొల్లలు. ఆ తరువాత చాలామంది కళ్ళు తెరిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు. అవసరానికి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయం బహుశా అందరికీ తెలిసి ఉన్నప్పటికీ.. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' సందర్భంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎలా ఎంచుకోవాలనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం..హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. ఆరోగ్య స్థితిని బట్టి మాత్రమే కాకుండా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎలాంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవానుకుంటున్నావు అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో నివసిస్తున్న అనేక మధ్యతరగతి కుటుంబాలకు..హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 5 లక్షలు సరిపోదని స్పష్టమైపోయింది. చాలా మంది ఆర్థిక సలహాదారులు, ఆరోగ్య బీమా నిపుణులు సైతే కనీసం రూ. 10 లక్షల కవరేజ్ సిఫార్సు చేస్తున్నారు.నాణ్యమైన ఆరోగ్య సేవల కోసంతగినంత పెద్ద కవరేజ్ ఉండటం వల్ల.. మీరు మీకు నచ్చిన ఆసుపత్రులు చికిత్స తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందటానికి ఉత్తమమైన మార్గం వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ. వయసులో ఉన్నప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువే అయినప్పటికీ.. వయసు మీదపడే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.35 ఏళ్ల వ్యక్తి కనీసం రూ. 10 లక్షల కవర్‌తో ఇన్సూరెన్స్ ప్రారంభించడం ఉత్తమం. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అవసరం అయినప్పుడు లేదా తరచూ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళకు ఇంకా పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. కాబట్టి వ్యక్తి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. పాలసీ ఎంచుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: బంగారం కొనడానికి ఇదే మంచి సమయం.. మరింత తగ్గిన రేటుమెట్రో నగరాల్లో నివసించేవారికిచిన్న పట్టణాలలో నివసిస్తున్న వారితో పోలిస్తే.. మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారికి పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. ముంబై వంటి మహానగరాల్లో, ఇండోర్ వంటి టైర్-II నగర్లో నివసిస్తున్న వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాలంటే.. కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు కవరేజ్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మీ నగరంలోని ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.కుటుంబంలో ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే.. కనీసం రూ. 20 లక్షల కవర్‌తో ప్రారంభించడం ఉత్తమం. ఆర్థిక స్థోమత అడ్డంకి కాకుండా ఉండాలంటే.. ఆరోగ్య సమస్యలను నుంచి బయట పడాలంటే.. బీమా తీసుకోవాల్సిందే. -
రుణ వేధింపులకు చెక్ పెడదాం..!
ఢిల్లీకి చెందిన అనుజ్ (35) వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తాను తీసుకున్న వ్యక్తిగత రుణం ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో రుణ వసూళ్ల ఏజెంట్ల బృందం ఆయన ఇంటి ముందు వాలిపోయింది. నినాదాలూ చేస్తూ, ఆ దారిలో వెళ్లే ఒక్కొక్కరిని పిలిచి అనుజ్ రుణం ఎగ్గొట్టాడంటూ దు్రష్పచారం మొదలు పెట్టారు. తద్వారా అనుజ్‌కు పరువుపోయినట్టయింది. ఇది అనుజ్ ఒక్కడి సమస్యే అనుకుంటే పొరపాటు. ఏటా లక్షలాది మంది ఇలా రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురవుతున్నవారే. వీటిని భరించలేక బలవన్మరణానికి పాల్పడిన వారూ ఉన్నారు. రుణ గ్రహీతలకూ కొన్ని హక్కులు ఉన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రుణం చెల్లించకపోతే వసూలు చేసుకునే విషయంలోనూ బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు/వాటి ఏజెంట్లకూ నిర్దేశిత నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. వాటిని హద్దుమీరి వ్యవహరిస్తుంటే సహించక్కర్లేదు. అనుచిత చర్యల నుంచి రక్షణ కోరడమే కాదు, ఉపశమనం పొందొచ్చు. ఈ విషయమై సమాచారం అందించే కథనమే ఇది. గతంతో పోల్చితే నేడు రుణాలు ఎంతో సులభంగా లభిస్తున్నాయి. దీంతో రుణ ఎగవేతలు కూడా పెరిగాయి. సూక్ష్మ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల్లో ఇటీవలి కాలంలో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని వర్గాల రుణ గ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ప్రభావం బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల పాటు వసూలు కాకుండా ఉండిపోయిన రుణాలను మొదట బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు తమ రుణ రికవరీ బృందాలకు అప్పగిస్తాయి. లేదా రుణ రికవరీ ఏజెన్సీలకు అప్పగిస్తుంటాయి. ఫలితం లేకపోతే అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్‌సీలు) విక్రయిస్తాయి. రుణ రికవరీ ఏజెన్సీలు రుణం వసూలు చేసినందుకు ఇంత చొప్పున తీసుకుంటాయి. ఏఆర్‌సీలు అయితే మొండి బాకీలను తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, వాటిని వసూలు చేసుకునేందుకు చర్యలు మొదలు పెడతాయి. ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో కనిపించేది.. రుణం తీసుకున్న వారిని నయానో, భయానో నానా రకాలుగా వెంటపడి, వేధించి వసూలు చేసుకోవడమే ఏజెంట్ల పని. స్పష్టమైన నిబంధనలు రుణ వసూళ్లకు రుణదాతలు కఠిన చర్యలకు పాల్పడుతున్న విషయం ఆర్బీఐ దృష్టికి రావడంతో.. రుణ రికవరీ ఏజెంట్ల నియంత్రణ విషయమై, వారి నడవడికపై లోగడే సమగ్రమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ తర్వాత పలు విడతలుగా వాటిని మెరుగుపరుస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది. రుణ గ్రహీతలకు ఉన్న హక్కులను గౌరవిస్తూనే, నైతిక విధానాల్లో వసూలుకు నిబంధనలు అమల్లో పెట్టింది. వీటి ప్రకారం.. రుణాన్ని పారదర్శకమైన విధానాల్లోనే వసూలు చేసుకోవాలి. మాటలతో లేదా చేతలతో వేధింపులకు దిగకూడదు. రుణానికి సంబంధించి, రుణ గ్రహీతకు సంబంధించి గోప్యత, గౌరవాన్ని కాపాడాలి. వారి పరువు నష్టానికి భంగం కలిగించకూడదు. బెదిరించకూడదు. రుణం చెల్లించలేదంటూ నోటీసు జారీ చేసి చట్టబద్ధమైన మార్గాల్లోనే వసూలుకు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు రుణ గ్రహీతకు కాల్స్ చేయడం కూడా ఉదయం 8 గంటల తర్వాత, రాత్రి 7గంటల్లోపేనని నిబంధలు చెబుతున్నాయి. రుణం చెల్లింపులు ఆగిపోయిన అన్ని కేసుల్లోనూ ఉద్దేశపూర్వకమని చెప్పలేం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురుకావడం వంటివి చోటు చేసుకోవచ్చు. కనుక చెల్లింపులు చేయని రుణ గ్రహీతలు అందరినీ ఒకే గాటన కట్టడాన్ని సమర్థించలేం. గుర్తింపును ధ్రువీకరించుకోవాలి..నేడు సైబర్ మోసాలు పెరిగిపోయాయి. తమకు వస్తున్న కాల్స్ అన్నీ రుణం వసూలు కోసమని భావించడానికి లేదు. అందులో సైబర్ మోసగాళ్ల కాల్స్ కూడా ఉండొచ్చు. అందుకని రుణం విషయమై వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తి బ్యాంక్ అదీకృత ఉద్యోగియేనా? లేదంటే సంబంధిత వ్యక్తికి బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ధ్రువీకరణ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి. వారి గుర్తింపు కార్డ్‌ను చూపించాలని కోరాలి. ఆ ఐడీ కార్డ్ మీరు రుణం తీసుకున్న బ్యాంక్ లే దా ఎన్బీఎఫ్సీ జారీ చేసిందేనా? అని పరిశీలించాలి. సరైనదని భావిస్తేనే వారితో వివరాలు పంచుకోవచ్చు. లేదంటే నేరుగా బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సిబ్బందితోనే డీల్ చేసుకుంటామని తెగేసి చెప్పేయాలి.నిబంధనలు పాటించాల్సిందే.. ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, కోపరేటివ్ బ్యాంక్‌లు అన్నీ కూడా ఆర్బీఐ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ విషయంలో ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, వారి ప్రవర్తనకు బ్యాంక్‌లే బాధ్యత వహించాలని ఆర్బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంక్‌లు తమ వెబ్సైట్లలో రికవరీ ఏజెన్సీల వివరాలను వెల్లడించాలి. ఫలానా రికవరీ ఏజెంట్ లేదా ఏజెన్సీకి రుణ వసూలు బాధ్యత అప్పగించామని రుణగ్రహీతకు బ్యాంక్ ముందస్తు సమాచారం ఇవ్వాలి. బ్యాంక్ అదీకృత లేఖ, బ్యాంక్ నోటీసును ఏజెంట్లు చూపించాలి. ఒకవేళ ఏజెంట్ల నుంచి అనుచిత, అనైతక తీరును ఎదురైతే అప్పుడు రుణ గ్రహీతలు తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాల్స్ చేసి వేధించినట్టయితే కాల్ రికార్డులను భద్రపరుచుకోవాలి. ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల రూపంలో వేధిస్తే వాటిని సైతం జాగ్రత్త పరుచుకోవాలి. ఇంటికొచ్చి వేధిస్తుంటే వీడియో తీసి సేవ్ చేసుకోవాలి. ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. స్పందన లేకపోతే అప్పుడు ఆర్బీఐని ఆశ్రయించొచ్చు.ఇలా చేస్తే నయం.. → ఆర్బీఐ రిజిస్టర్డ్ సంస్థల నుంచే రుణాలను తీసుకోవాలి. ఒకవేళ సమస్య ఎదురైతే పరిష్కరించుకోవడం సులభం. → రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడానికి సహేతుక కారణాలను బ్యాంక్ సిబ్బందికి తెలియజేసి, తగిన సమయం కోరొచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికను సమరి్పంచొచ్చు. → రుణం తీసుకునే ముందు ఒప్పందం నిబంధనలను, తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వేధింపులపై చర్యలు → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులకు సంబంధించి ఆధారాలను సేకరించాలి. వీటిని బ్యాంక్ లోన్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలి. → స్పందన లేకపోతే, వేధింపులు ఆగకపోతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. → బ్యాంక్ సేవలపై కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు దాఖలును పరిశీలించొచ్చు. → వేధింపుల నుంచి ఉపశమనం కోసం స్థానిక కోర్టులో సివిల్ వ్యాజ్యం దాఖలు చేసి ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందొచ్చు. → తమ ఆందోళనలను బ్యాంక్ పట్టించుకోకపోతే అప్పుడు ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ ప్రాంతానికి ప్రత్యేక అంబుడ్స్‌మన్ ఉంటారు. వారి చిరునామా, కాంటాక్ట్ వివరాలను ఆర్బీఐ వెబ్సైట్ నుంచి పొందొచ్చు. → వేధింపులకు సంబంధించి ఆధారాలకు దొరకకుండా ఉండేందుకు రికవరీ ఏజెంట్లు గుర్తించడానికి వీల్లేని ఫోన్ నంబర్లు లేదా వాట్సాప్ ద్వారా సంప్రదింపులు చేసే అవకాశం లేకపోలేదు. అలా గుర్తించినట్టయితే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. → రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీత కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల నంబర్లకు కాల్ చేసి బెదిరిస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలా చేసినా లేదా పనిచేసే కార్యాలయం, నివాస సమీపంలో సమస్యలు సృష్టించినట్టయితే వారిపై పరువునష్టం కేసు దాఖలు చేయొచ్చు. → అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించినట్టయితే కోర్టులో కేసు వేయొచ్చు. → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులపై న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహా మేరకు సరైన చర్యలు చేపట్టొచ్చు.ఆర్బీఐ కఠిన చర్య హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై ఆర్బీఐ ఇటీవలే రూ.కోటి జరిమానా విధించింది. రికవరీ ఏజెంట్లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో కఠినంగా వ్యవహరించింది. అది కూడా నిర్దేశించిన వేళల్లో (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు) కాకుండా ఇతర సమయంలో కాల్స్ చేసి రుణ గ్రహీతలను వేధించినట్టు బయటపడింది. రుణ వసూళ్లలో పేరున్న సంస్థలు సైతం ఎలా వ్యవహరిస్తున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. కఠిన చట్టాలు...సూక్ష్మ రుణ గ్రహీతల కోసం కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఓ సంచలనాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలకు ఇందులో చోటు కల్పించింది. రాష్ట్రంలో రుణ వసూళ్ల ఆగడాలు పెరిగిపోవడంతో ఇలాంటి చర్యకు దిగింది. సూక్ష్మ రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఆర్బీఐ నిర్దేశించిన రుణ వసూలు నిబంధనలను ఉల్లంఘించే రుణ రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్ కంపెనీ యజమానులపై సుమోటో కేసులు నమోదు చేసేందుకు, హెల్ప్‌లైన్ ఏర్పాటుకు ప్రతి జిల్లా స్థాయిలో చర్యలకు ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి
ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలని చూస్తారు. అయితే డబ్బు సురక్షితంగా ఉంటాలంటే?, మంచి రాబడి పొందాలంటే?.. తప్పకుండా పోస్టాఫీస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇందులో ఒకటి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్'. ఈ స్కీమ్ ద్వారా ఎంత వడ్డీ వస్తుంది. ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు నెలకు 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 8 లక్షల రిటర్న్స్ పొందవచ్చు. ఎలా అంటే.. మీరు నెలకు రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే.. ఏడాదికి రూ. 60వేలు అవుతుంది. మీకు ఈ స్కీములో 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇలా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేస్తుంటే.. మీ మొత్తం రూ. 3లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ కింద రూ. 56,830 లభిస్తాయి.మీరు ఈ స్కీమ్ కింద రూ. 5000.. పదేళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. ఈ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ మొత్తం రూ. 2,54,272 అవుతుంది. దీని ప్రకారం 10 సంవత్సరాల కాలంలో మీ మొత్తం డిపాజిట్ చేసిన మొత్తం రూ. 8,54,272 అవుతుంది. ఇలా పదేళ్లలో రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తూ రూ. 8లక్షల కంటే ఎక్కువ పొందువచ్చు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్గత సంవత్సరం 2023లో.. ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ పెరగడం వల్ల పెట్టుబడిదారులకు లభించే రిటర్న్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ చివరి సవరణ 29 సెప్టెంబర్ 2023న జరిగింది.50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చుమీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు, కానీ మీరు ఈ వ్యవధి పూర్తయ్యేలోపు ఖాతాను మూసివేయాలనుకుంటే.. క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ అకౌంట్ ఒక ఏడాది పాటు యాక్టివ్‌గా ఉన్న తరువాత.. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ రేటు 2 శాతం కంటే ఎక్కువ. -
అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ నిలిపేసిన ఎస్బీఐ
డబ్బు పొదుపు చేసుకోవాలనుకునేవారు సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనే చూస్తారు. అందులోనూ కొంత ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు ఎమున్నాయా అని వెతుకుతారు. అలాంటి వారికోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) అందిస్తున్న 'అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్' స్కీమ్ నిలిపివేసింది.గతంలో ఎస్బీఐ.. తన అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ గడువు ముగిసినప్పటికీ దానిని పొడిగించింది. అయితే ఇప్పుడు గడువును పొడిగించకపోగా.. స్కీమును ఏప్రిల్ 1 నుంచి నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అధిక వడ్డీ ఇచ్చే ఈ పథకాన్ని బ్యాంక్ నిలిపివేసింది.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా.. సాధారణ పెట్టుబడిదారులకు సంవత్సరానికి 7.10 శాతం వడ్డీని, 400 రోజుల డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని అందించింది. ఇకపై ఈ స్కీమ్ అందుబాటులో ఉండదని తెలియడంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. -
EPFO కీలక మార్పులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి రెండు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు ఈపీఎఫ్ సభ్యులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని, కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తాయని, ఆలస్యాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.డాక్యుమెంట్ అప్లోడ్ అవసరం లేదుఫిర్యాదులను తగ్గించడానికి, క్లెయిమ్‌లను దాఖలు చేసే సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలో భాగంగా ఆన్లైన్ క్లెయిమ్ చేసేటప్పుడు సభ్యులు చెక్ లీవ్స్ లేదా ధ్రువీకరించిన బ్యాంక్ పాస్‌బుక్ వివరాల స్కాన్ చిత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. గతంలో ఈ డాక్యుమెంట్లను నాసిరకంగా అప్లోడ్ చేయడం వల్ల చాలా క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యేవి. ఈ ఆవశ్యకతను తొలగించడం ద్వారా, ప్రక్రియ సులభతరం కావడం కాకుండా క్లెయిమ్ ఆమోదం వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది.కంపెనీ ఆమోదం అక్కర్లేదు సభ్యుల బ్యాంకు ఖాతాలను వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్లతో (యూఏఎన్) అనుసంధానించే ప్రక్రియలో యజమాన్యం (కంపెనీ) అనుమతి అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. యూఏఎన్‌కు బ్యాంకుల ఖాతాల లింక్ కోసం సభ్యులు పెట్టుకున్న వినతులకు అనుమతులివ్వడంలో కొన్నిసార్లు యాజమాన్యాల వద్ద జాప్యం జరుగుతోంది. దీంతో క్లెయిమ్‌లు, ఇతర వాటి కోసం సభ్యులు సభ్యులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు తాజా మార్పుతో సభ్యులు ఇబ్బందులు తొలగుతాయి.Under the leadership of PM Shri @narendramodi ji, EPFO continues its reform journey! Two major reforms have been introduced to make the claim settlement process simpler, faster, and hassle-free for crores of EPF members & employers:✅ No need to upload image of cheque leaf/… pic.twitter.com/YScWOkw0gn— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 3, 2025