
పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి తల్లిదండ్రులూ ఆలోచిస్తారు. ఇందు కోసం ఎంతో కొంత పొదుపు చేయాలని ఆరాటపడతారు. ముఖ్యంగా ఉన్నత విద్య, ప్రత్యేక శిక్షణలు, విదేశీ కోర్సులు వంటి ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగానే వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేస్తే తక్కువ కాలంలోనే వారికి దాదాపు కోటి రూపాయలు కూడబెట్టవచ్చు.
పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేందుకు అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచ్‌వల్ ఫండ్స్, బంగారం, ప్రభుత్వ పొదుపు పథకాల వంటి వివిధ పెట్టుబడి సాధనాల సమ్మిళితంతో పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను సులువుగానే కూడబెట్టవచ్చు. వీటిలో మ్యూచ్‌వల్ ఫండ్స్ సిప్‌లు (SIP) అధిక వృద్ధి అవకాశాలను అందిస్తే, పీపీఎఫ్ (PPF) లాంటి పథకాలు భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. బంగారం పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే సాధనంగా పనిచేస్తుంది.
15 ఏళ్లలో రూ.కోటి కూడబెట్టే ప్రణాళిక
మ్యూచువల్ ఫండ్స్ – సిప్ ద్వారా
- నెలవారీ పెట్టుబడి: రూ.6,000
- ప్రతి సంవత్సరం 10% పెంపు
- రాబడి అంచనా: 12%
- మొత్తం పెట్టుబడి: రూ.22.87 లక్షలు
- అంచనా లాభం: రూ.29.22 లక్షలు
- తుది మొత్తం: రూ.52.10 లక్షలు
బంగారంపై..
- నెలవారీ పెట్టుబడి: రూ.5,500
- రాబడి అంచనా: 10%
- మొత్తం పెట్టుబడి: రూ.9.90 లక్షలు
- అంచనా లాభం: రూ.13.08 లక్షలు
- తుది మొత్తం: రూ.22.98 లక్షలు
పీపీఎఫ్ ద్వారా
- నెలవారీ పెట్టుబడి: రూ.7,500
- వడ్డీ రేటు: 7.1%
- మొత్తం పెట్టుబడి: రూ.13.50 లక్షలు
- వడ్డీ లాభం: రూ.10.90 లక్షలు
- తుది మొత్తం: రూ.24.40 లక్షలు
పై మూడు మార్గాల్లో చెప్పినట్లు ప్రతినెలా 15 ఏళ్లపాటు పొదుపు చేస్తే తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను చేరుకోవచ్చు. ఇది కేవలం ఊహజనిత ప్రణాళిక మాత్రమే. పైన పేర్కొన్న రాబడులు అంచనా మాత్రమే. తల్లిదండ్రులు తమకు అనువైన పెట్టుబడి మార్గాలను ప్రయత్నించవచ్చు.ఘ
👉 ఇదీ చదవండి: కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్‌బీఐ