SPSR Nellore
-
89 ఎర్రచందనం దుంగల పట్టివేత
రాపూరు : మండలంలోని మద్దెలమడుల చెక్‌పోస్టు వద్ద మంగళవారం 89 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి వైపు అధిక వేగంతో వెళుతున్న తమిళనాడుకు చెందిన మినీ ట్రక్‌ను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. ఎండు గడ్డి లోడ్‌తో ఉన్న ట్రక్‌ను వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. దీంతో వాహనంలో తనిఖీ చేయగా గడ్డి మోపుల కింద రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఎర్రచందనంతోపాటు వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు వెల్లడించారు. తనిఖీల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ వరప్రసాద్, చక్రపాణి, చంద్రశేఖర్, బీట్ అధికారులు షఫీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఫీజులు గుంజుతున్న కార్పొరేట్ యాజమాన్యాలు
ఇంటర్ విద్యలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న నూతన సంస్కరణలు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దన్నుగా మారనున్నాయి. ఈ సంస్కరణలు కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తాజా విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ వారం నుంచే అడ్మిషన్లు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చేసింది. కొత్త సిలబస్‌తోపాటు కోర్సు అమల్లోకి రానున్నాయి. ఇంటర్లో హాజరు అంతంత మాత్రమే.. ● నాలుగైదు కళాశాలల్లోనే మధ్యాహ్న భోజనం నెల్లూరు (టౌన్): గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ తొలి వారం నుంచే జూనియర్ కళాశాలలు ప్రారంభించడంతో విద్యార్థులు తరగతులకు ముఖం చాటేశారు. తొలి రోజు మంగళవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 శాతం మంది మాత్రమే హాజరైనట్లు ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 23 ప్రభుత్వ, 2 ఎయిడెడ్, 1 మున్సిపల్‌తో పాటు ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ తదితరాలు కలిపి మొత్తం 51 జూనియర్ కళాశాలల ఉన్నాయి. వీటిల్లో 6 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ జూనియర్ కళాశాలల్లో 3,350 మంది విద్యార్థులకు తొలిరోజు 500 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీటిల్లో నాలుగైదు జూనియర్ కళాశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం పెట్టారు. మిగిలిన కళాశాలల్లో అమలు చేయకపోవడంతో విద్యార్థులు భోజనానికి ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. జిల్లాలో మిగిలిన కేజీబీవీ, మోడల్, బీసీ వెల్ఫేర్ తదితర కళాశాలల్లో కూడా తక్కువ మొత్తంలో విద్యార్థులు హాజరైనట్లు చెబుతున్నారు. ప్రథమ సంవత్సరంలో సిలబస్ మార్పు జూన్ 2వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఈ నెల 7వ తేదీ నుంచి నూతన అడ్మిషన్లకు అనుమతి కొత్తగా ఎంబైపీసీ కోర్సు ఏర్పాటు నెల్లూరు (టౌన్): ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో నూతన సంస్కరణలు అమలు కానున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సర సిలబస్‌ను పూర్తిగా మార్చేశారు. కొత్త పాఠ్య పుస్తకాలను ముద్రించి ఇవ్వనున్నారు. ఎంపీసీలో ఇంగ్లిషు, ద్వితీయ లాంగ్వేజీతో పాటు మ్యాఽథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు ఉంటాయి. గతంలో మ్యాఽథ్స్ ఏ, మ్యాఽథ్స్ బీ సబ్జెక్ట్‌లు ఉండేవి. వీటికి విడివిడిగా పరీక్షలు నిర్వహించే వారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మ్యాఽథ్స్లో ఒకే పరీక్ష ఉంటుంది. బైపీసీలో ఇంగ్లిషు, ద్వితీయ ల్వాంగేజితో పాటు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జక్టులు ఉంటాయి. ఇప్పటి వరకు ప్రథమ, ద్వితీయ లాంగ్వేజీలతో పాటు బాటని, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు ఉన్నాయి. వీటికి విడివిడిగా పరీక్షలు నిర్వహించేవారు. ద్వితీయ లాంగ్వేజీకి సంబంధించి గతంలో 10 ఆప్షన్లు ఉండేవి. ఈ విద్యా సంవత్సరంలో మరో 14 కలిపి మొత్తం 24 ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఆప్షన్లలో రెండో లాంగ్వేజీగా గ్రూప్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీతో పాటు ఎంబైపీసీతో కొత్త కోర్సు ప్రవేశ పెట్టారు. ఎంబైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాఽథ్స్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఈ కోర్సు విద్యార్థులు నీట్‌తో పాటు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసే విధంగా అవకాశం కల్పించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరంలో సిలబస్‌ను మార్పు చేయనున్నారు. గతంలో పరీక్షల్లో 1 మార్కు ప్రశ్నలు ఉండేవి కావు. ఈ విద్యా సంవత్సరం ప్రథమ సంవత్సర విద్యార్థులకు మొత్తం మార్కుల్లో 10 శాతం మార్కులకు 1 మార్కు ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఆర్ట్స్ గ్రూపులో కేవలం సిలబస్‌ను మాత్రమే మార్పులు చేస్తున్నారు. కోర్సులు మాత్రం అవే ఉంటాయి. కళాశాల వేళలు కూడా మార్పులు చేశారు. గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 7 పీరియడ్లు ఉండేవి. ఈ విద్యా సంవత్సరంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 పీరియడ్లు నిర్వహించాలని నిర్ణయించారు. నూతన సిలబస్‌కు సంబంధించి అధ్యాపకులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ఇంత హడావుడి ఎందుకు? గతంలో పరీక్షల అనంతరం వేసవి సెలవులు ఇచ్చేవారు. జూన్ 1వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలను పునః ప్రారంభించే పరిస్థితి ఉండేది. అయితే ఎన్నడూ లేని విధంగా తాజాగా ఈ నెల 1వ తేదీ నంచే జూనియర్ కళాశాలలను పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు మేలు చేకూర్చేందుకే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే అడ్మిషన్లు, కళాశాలలు ప్రారంభించడం తమపై ఒత్తిడి పెంచడమే అని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాత్కాలిక ఫీజును మాత్రమే వసూలు చేయాలి ఇంటర్లో మంగళవారం నుంచి కేవలం బ్రిడ్జి కోర్సు మాత్రమే చెప్పాలి. అడ్మిషన్లకు సంబంధించి యాజమాన్యాలు నామినల్ ఫీజు వసూలు చేసుకోవచ్చు. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కళాశాలల పునః ప్రారంభంలో రెగ్యులర్ ఫీజును వసూలు చేసుకోవాల్సిందే తప్ప.. ఇప్పుడే పూర్తిగా చెల్లించాలని, సగం చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు. ఈ విషయంపై రెండు రోజుల్లో ఆయా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం. – ఆదూరు శ్రీనివాసులు, ఆర్ఐఓ ప్రస్తుతం నామినల్ ఫీజు వసూలు చేయాలని ఆదేశాలు ప్రథమ సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లను ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వేసవి సెలవులు ఇచ్చేంత వరకు బ్రిడ్జి కోర్సుకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సూచించింది. ఇంటర్లో అమలు చేయనున్న నూతన సంస్కరణలు కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటర్ అడ్మిషన్లు సమయంలో కేవలం ప్రొవిజనల్ అడ్మిషన్ కింద నామినల్ ఫీజును మాత్రమే తీసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. పది ఫలితాలు రావాలంటే మరో 20 రోజులకు పైగా సమయం పడుతుంది. ఈ ఫలితాల్లో ఎంత మంది ఫాస్ లేదా ఫెయిల్ అవుతారో తెలియదు. ఈ ఫలితాలు రాకుండానే ఇంటర్ అడ్మిషన్లు అంటే విద్యార్థుల తల్లిదండ్రులకు గోరు చుట్టుపై రోకలిపోటుగా మారనుంది. ఆయా కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రారంభం నుంచే రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తామని చెబుతున్నాయి. అయితే నామినల్ ఫీజును పక్కన బెట్టి రెగ్యులర్ ఫీజును వసూలు చేస్తున్నారు. మొత్తం ఫీజులో 50 శాతం ఫీజు చెల్లిస్తేనే పర్మినెంట్ అడ్మిషన్ ఇస్తామని చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. వేసవి సెలవుల అనంతరం అడ్మిషన్ అయితే ఫీజు ఎక్కువగా ఉంటుందని చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. చేసేదేమి లేక కొంత మంది 50 శాతం ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఫీజు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
జిల్లాకు చేరిన ఇంటర్ పుస్తకాలు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ద్వితీయ సంవత్సర పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. స్థానిక స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో ఈ పుస్తకాలను భద్రపరిచారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 11 వేల పాఠ్య పుస్తకాలు, 1.19 లక్షల నోటు పుస్తకాలు వచ్చాయి. వీటిని జిల్లాలోని ఆయా ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలకు బుధవారం నుంచి చేరవేయనున్నారు. డైట్లో అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): పల్లిపాడు డైట్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అధ్యాపక ఖాళీలను డిప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు, ఎంఈఓల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోపు పంపాలన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన, 16, 17 తేదీల్లో రాత పరీక్ష ఉంటుందన్నారు. 19న ఇంటర్వ్యూలు నిర్వహించి 21న ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్డర్లు తీసుకున్న ఉపాధ్యాయులు ఈ నెల 22న డైట్ కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉందన్నారు. 30న పాలిసెట్ నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీన పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహించనున్నట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఏసుదాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి విద్యార్థినులకు ఈ నెల 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, దర్గామిట్టలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు ప్రవేశ పరీక్షకు సంబంధించి పుస్తకాలను ఉచితంగా ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 99123 42048 నంబరులో సంప్రదించాలన్నారు. ఏపీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఉదయగిరి: జిల్లాలోని నెల్లూరు (అక్కచెరువు), గండిపాళెం, తుమ్మలపెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి మిగిలి ఉన్న తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ జి.మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశం, మిగిలి ఉన్న, 6,7,8 తరగతుల్లో ప్రవేశం పొందేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 6వ తేదీలోపు దాఖలు చేసుకోవాలన్నారు. వీరికి ఈ నెల 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా జేసీ నెల్లూరురూరల్: పబ్లిక్ లైబ్రరీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల వ్యవహారాలను నిర్వహించడానికి జేసీ కార్తీక్‌ను పర్సన్ ఇన్చార్జిగా నియమిస్తూ గవర్నర్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్ ఇన్చార్జిగా ఆరు నెలల కాలం లేదా కొత్త చైర్మన్ నియామకం అయ్యే వరకు ఈ బాధ్యతలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ ఇళ్లపై టీడీపీ నేతల దాడి
● రేషన్ పంపిణీ విషయమై వివాదం ● ఇళ్లలోని వస్తువులు, సామగ్రి ధ్వంసం కందుకూరు రూరల్: రేషన్ బియ్యం పంపిణీ విషయమై చెలరేగిన వివాదం దాడులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఓగూరు ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగింది. ఓగూరు ఎస్సీ కాలనీలో ఎండీయూ వాహనంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ ఇద్దరు మహిళలు బియ్యం ఇవ్వాలని వాహనం వద్దకు వెళ్లారు. మీరు గ్రామంలో ఉండడం లేదు. మీకు బియ్యం ఇవ్వం, డబ్బులు మాత్రమే ఇస్తామని అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త పి.రఘు దబాయిస్తూ చెప్పాడు. ఈ విషయాన్ని ఆ మహిళలు వైఎస్సార్సీపీ నేత డీ కోటయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వాహనం వద్దకు వెళ్లి వారికి బియ్యం ఇవ్వండని అని ఆపరేటర్ రాజాకు చెప్పాడు. అ పక్కనే ఉన్న రఘు అనుచరుడు పీ రవికిరణ్ నువ్వు ఎవడివి రా అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో కోటయ్య తన కారులో బంధువులను రైలు ఎక్కించేందుకు వెళ్తుంగా రఘు, రవికిరణ్ అనుచరులు కొందరు కారును అడ్డుకున్నారు. అక్కడ ఘర్షణ జరుతుండగా కోటయ్యకు కొందరు మద్దతుగా వచ్చి కారును పంపించారు. దీంతో కోటయ్య, ఆయన కుమారుడు కళ్యాణ్ కుమార్ కారులో వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్త రఘు, రవి కిరణ్‌లతోపాటు వారి అనుచరులు వైఎస్సార్సీపీకి చెందిన కోటయ్యకు మద్దతుగా వచ్చిన వారి ఇళ్ల మీదకు వెళ్లి ఘర్షణకు దిగి దాడి చేశారు. కోటయ్య కుమారుడు ఇంటి వద్దకు ఉన్న దుకాణంలో సామగ్రిని, ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల్లోని నలుగురికి గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీకి చెందిన ఎం.వెంకటేశ్వర్లు, ఎం.వెంకట్రావు గాయపడ్డారు. కందుకూరులో ఉన్న కోటయ్య నివాసానికి టీడీపీ వర్గీయులు వెళ్లారు. సుమారు పది మందికి పైగా బైక్‌లపై వచ్చి సీసీ కెమెరాలు పగులగొట్టి, అసభ్య పదలు తిడుతూ హంగామా సృష్టించి భయాందోళనకు గురి చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడిని నుంచి వెళ్లిపోయారు. కందుకూరు రూరల్ పోలీసులు ఓగూరులో, పట్టణ పోలీసులు కందుకూరులో జరిగిన ఘటను పరిశీలించి ఇరువర్గాలను విచారిస్తున్నారు. -
హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయ్
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇవి గత నెల 17వ తేదీన మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 174 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. చివరిరోజు జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 29,105 మందికి గానూ 28,870 మంది హాజరుకాగా.. 235 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్‌కు సంబంధించి 205 మందికి గానూ 181 మంది హాజరుకాగా.. 24 మంది గైర్హాజరయ్యారు. ఎగ్జామ్స్ ముగియడంతో విద్యార్థులు కేంద్రాల వద్ద ఉత్సాహంగా కనిపించారు. ప్రశ్నపత్రాలను చించి గాల్లోకి ఎగురేసి కేరింతలతో ఆనందాలను పంచుకున్నారు. కేంద్రాల వద్దకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రావడంతో సందడి వాతావరణం నెలకొంది. – నెల్లూరు(టౌన్)నెల్లూరులో పరీక్ష కేంద్రం బయట ఇలా.. -
ఈత కొట్టేందుకు వెళ్లి..
● ఉత్తరకాలువలో కొట్టుకుపోయి యువకుడి మృతి ● మినగల్లులో విషాదంసోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని మినగల్లు గ్రామంలో ఓ యువకుడు ఈతకెళ్లి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ హుస్సేన్, దిల్షాద్ దంపతులకు షేక్ మస్తాన్‌బాషా (21) అనే కుమారుడు ఉన్నాడు. అతను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రంజాన్ సందర్భంగా సోమవారం సాయంత్రం అతను తన స్నేహితులతో కలిసి సోమశిల ఉత్తరకాలువ వద్దకు వెళ్లాడు. సరదాగా ఈత కొడుతుండగా నీట మునిగి కొట్టుకుపోతుండటంతో స్నేహితులు గమనించి రక్షించేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో మస్తాన్ గల్లంతయ్యాడని నిర్ధారించి అనంతసాగరం పోలీసులకు రాత్రి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవాహం అధికంగా ఉందని మస్తాన్ ఆచూకీ దొరకదని భావించారు. జలాశయం నుంచి కాలువకు నీటి విడుదలను ఆపివేయించారు. మంగళవారం ఉదయానికి నల్లరాజుపాళెం రోడ్డు కాలువలో మృతదేహం లభ్యం కాగా దానిని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించామని ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. మస్తాన్‌బాషా మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
మద్యం తాగి.. ప్రాణాలు పోగొట్టుకుని..
కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. కావలి నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కావలి: కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో కావలి – పెద్దపవని రోడ్డులో జలదంకి మండలం లింగరాజు అగ్రహారం గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద ఇటీవల మద్యం షాపు ఏర్పాటు చేశారు. లింగరాజు అగ్రహారం గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (60) అనే దళితుడు మంగళవారం ఆ షాపులో మద్యం తాగి తన టీవీఎస్ మోపెడ్‌పై గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కావలి కాలువపై పిట్టగోడ లేని కల్వర్టు వద్ద వాహనం అదుపు తప్పింది. దీంతో రమణయ్య కాలువలో పడిపోయాడు. అటుగా వెళ్తున్న రైతులు గమనించి కాలువలో దిగి పైకి లేపగా అప్పటికే రమణయ్య మరణించినట్లు గుర్తించారు. మూగజీవాలు మేపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి గ్రామానికి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపు వల్ల ప్రాణాలు కోల్పోయాడని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిగా తాగి.. అల్లూరు: అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన అల్లూరు క్రిస్టియన్‌పేట కాలనీలో మంగళవారం జరిగింది. ఎస్సై కిశోర్‌బాబు కథనం మేరకు.. వాకాడు మండలం నిమ్మవారితిప్ప గ్రామానికి చెందిన దండిపూడి వెంకటేష్ (27), భార్య పావనితో కలి సంవత్సర కాలంగా అల్లూరు క్రిస్టియన్‌పేటలో నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేస్తుంటారు. సోమవారం పావని తన బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని స్వగ్రామానికి వెళ్లింది. మంగళవారం ఉదయం నుంచి వెంకటేష్‌కు అతడి అన్న మోషే ఫోన్ చేస్తున్నాడు. రిసీవ్ చేయకపోవడంతో అమర్ అనే వ్యక్తిని ఇంటికి పంపి చూడగా వెంకటేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయాన్ని మోషేకు చెప్పడంతో అతను వచ్చి చూసి చనిపోయినట్లు గుర్తించి అల్లూరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం ఇచ్చారు. మృతుడి పక్కన మద్యం బాటిళ్లు ఉన్నాయి. వెంకటేష్ అతిగా మద్యం తాగి చనిపోయి ఉండొచ్చని అతడి అన్న పోలీసుకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్తులో కాలువలో పడి ఒకరు అతిగా సేవించి మరొకరు -
రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి స్లాట్ బుకింగ్
నెల్లూరు సిటీ: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని బుధవారం ఆర్ఓ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. జిల్లాలోని ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలాఖరు నాటికి అమలు చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు. కండలేరులో 48.517 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 48.517 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1320, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.జలాశయం (ఫైల్) -
కూటమి గుప్పెట్లో ‘సోషల్ ఆడిట్’
నెల్లూరు(పొగతోట): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం కూటమి నేతల కనుసన్నల్లో నడుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లపై తప్పుడు ఫిర్యాదులు చేయించి రికవరీలు విధించేలా చక్రం తిప్పుతున్నారు. ఇటీవల కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎక్కడంటే.. దగదర్తి మండలంలోని ధర్మవరం, చెన్నూరు, తురిమెర్ల, బోడగుడిపాడు ఫీల్డ్ అసిస్టెంట్లపై టీడీపీ నాయకులు కక్ష కట్టారు. వారితో ఎలా అయినా రాజీనామా చేయించాలని నిర్ణయించుకుని గ్రామసభల్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇటీవల ఆ మండలంలో సోషల్ ఆడిట్ జరిగింది. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండే సర్పంచ్‌లు దీనికి హాజరయ్యారు. అక్కడున్న టీడీపీ నాయకులు మీకేం సంబంధమంటూ వారిని అడ్డుకున్నారు. వెళ్లిపోవాలంటూ హెచ్చరించి గొడవకు దిగారు. ఒక్కోచోట ఇలా.. ఇటీవల ధర్మవరంలో గ్రామ సభ జరిగింది. ఇందులో టీడీపీకి అనుకూలంగా ఉండే వారు పనులకు హాజరైనా రాలేదంటూ ఫీల్డ్ అసిస్టెంట్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సభ జరగక ముందే ఎఫ్ఏను రాజీనామా చేయాలని, లేకపోతే రూ.లక్షల్లో రికవరీలు విధించి కేసులు నమోదు చేయిస్తామంటూ హెచ్చరించి ఉన్నారు. అయితే ఎఫ్ఏ వినకపోవడంతో రూ.2 లక్షలకు పైగా రికవరీ విధించినట్లు సమాచారం. చెన్నూరు గ్రామసభలో సర్పంచ్‌కు బదులు ఆమె భర్త అంతా తానై వ్యవహరించాడు. ఆయనతోపాటు టీడీపీ నాయకుడు వేదికపై కూర్చొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించి టీడీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని నియమించుకునేలా ప్రయత్నించారు. తురిమెర్ల సభలో ఫీల్డ్ అసిస్టెంట్‌పై టీడీపీ నాయకులు తిట్ల పురాణానికి దిగారు. దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. రాజీనామా చేయమంటే చేయవా? అంత అహంకారమా? నీ అంతు చూస్తామంటూ నేతలు బెదిరింపులకు దిగారు. బోడగుడిపాడుకు హౌసింగ్ శాఖ వారు తప్పు చేస్తే రికవరీ మాత్రం ఎఫ్‌ఏపై పడింది. చర్యలు వారిపైనేనా.. సంవత్సరం పాటు ఉపాధి కూలీలు పనిచేసిన రోజులకు సంబంధించి పేమెంట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో జమై ఉన్నాయి. అధికారులు దీనిపై దృష్టి పెట్టకుండా టీడీపీకి అనుకూలంగా ఉండే వారి ఫిర్యాదుల ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.లక్షల్లో రికవరీలు విధిస్తున్నారు. పనులకు రాలేదని సోషల్ ఆడిట్లో చెప్పినంత మాత్రన విచారించకుండా రికవరీలు వేయడంపై ఎఫ్‌ఏలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులకు వచ్చి రాలేదని అబద్ధాలు ఆడిన టీడీపీ మద్దతుదారులపై విచారించి బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఎవరు పొరపాటు చేశారో తెలిసిపోతుంది. అయితే అధికారులు అటువైపుగా ఆలోచన చేయడం లేదు. కూటమి నేతలు చెప్పిందే చేస్తున్నారు. సామాజిక తనిఖీల్లో రికవరీలు విధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, సీఓలు, ఏపీఓలు జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాన అనంతరం ప్రజాప్రతినిధులు చెప్పిన వారిని ఎఫ్‌ఏలుగా నియమించేందుకు సామాజిక తనిఖీల్లో రికవరీలు విధించడం పరిపాటిగా మారింది. ఈ సమస్యను విన్నవించుకునే అవకాశాలను ఇవ్వడం లేదు. వీటి ఫలితంగా వందలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.విచారించి చర్యలు తీసుకుంటాం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సోషల్ ఆడిట్ జరుగుతోంది. అధిక శాతం మండలాల్లో పూర్తయ్యాయి. రికవరీలు విధించిన సిబ్బందిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం. పూర్తి వివరాలను సేకరించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – గంగాభవాని, డ్వామా పీడీ టీడీపీ నేతల ఇష్టారాజ్యం తమకు అనుకూలంగా ఉండే వారితో ఎఫ్ఏలపై ఫిర్యాదు రూ.లక్షల్లో రికవరీలు విధిస్తున్న వైనం ఆవేదన చెందుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు -
250 మంది విద్యార్థుల ఎంపిక
నెల్లూరు(టౌన్): సైంటిఫిక్ ఎక్స్పోజర్ విజిట్‌లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను ఎంపిక చేశామని జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం చెముడుగుంటలోని జిల్లా సైన్స్ కేంద్రంలో విజిట్‌కు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక, సెకండరీ స్థాయికి సంబంధించి ఎంపిక చేసిన 250 మంది విద్యార్థులు బుధవారం చైన్నెలోని పెరియార్ సైన్స్ సెంటర్, గిండి నేషనల్ పార్క్, మద్రాస్ ఐఐటీ సైన్స్ కేంద్రాలను విజిట్ చేస్తారన్నారు. ఉదయం 5 గంటలకు విద్యార్థులతోపాటు గైడ్ టీచర్లు జిల్లా సైన్స్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. -
విద్యుదాఘాతానికి గురై..
● అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి దుత్తలూరు: విద్యుదాఘాతానికి గురై వెంగమాంబ దేవస్థాన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి నర్రవాడలో జరిగింది. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. నర్రవాడకు చెందిన ఉదయగిరి సురేష్ (38) వెంగమాంబ పేరంటాలు ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం రాత్రి ఆలయానికి సమీపంలో ఉన్న కొబ్బరికాయల దుకాణం వద్ద నిర్వాహకులు వెల్డింగ్ పనులు చేయిస్తున్నారు. ఆ సమయంలో సురేష్ అక్కడున్న ఇనుప పైపును పట్టుకుని వెల్డింగ్ పనుల్ని చూస్తున్నాడు. అనుకోకుండా ఆ పైపునకు విద్యుత్ సరఫరా కావడంతో సురేష్ షాక్‌కు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే సురేష్ మృతిచెందినట్లు నిర్ధారించారు. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది. మంగళవారం ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయి ంచి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బలవంతపు వాంగ్మూలంతో కాకాణిపై అక్రమ కేసు: పర్వతరెడ్డి
సాక్షి, నెల్లూరు: టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్టగా తప్పుడు వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉగాది పండగ కోసం తన కుటుంబంతో కలిసి కాకాణి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లినప్పుడు, కావాలనే ఆయన ఇంటికి నోటీసు అంటించి మర్నాడే విచారణకు రమ్మనడం అత్యంత హేయమని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రెస్మీట్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:నెల్లూరులో ఎప్పుడూ చూడని వికృత రాజకీయం:నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా సీనియర్ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ వికృత రాజకీయాలు చూసి అన్ని వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కాలని కూటమి ప్రభుత్వం ఈ వికృత రాజకీయాలకు పాల్పడుతోంది.డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టి మళ్లించాలని ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, వారి ప్రజా వ్యతిరేక పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే ఓర్చుకోలేక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కాకాణి గోవర్దన్‌రెడ్డి కుటుంబం దశాబ్ధాలుగా నెల్లూరు రాజకీయాల్లో ఉంటోంది. అలాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.మూడు నెలలుగా ప్రయత్నం:పొదలకూరు మండలంలో క్వార్ట్›్జ మైనింగ్‌లో మాజీ మంత్రి కాకాణిని ఎలాగైనా ఇరికించి జైల్లో నిర్బంధించాలనే కుట్రతో మూడు నెలలుగా ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. వారం క్రితం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. దాని ఆధారంగా కాకాణిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పైగా ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.దీనిపై కాకాణి గోవర్థన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో, ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ ఉన్న నేపథ్యంలో ఎక్కడ క్వాష్ అవుతుందోననే భయంతో ఆయనపై ఈరోజు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఇంకోపక్క గోవర్ధన్‌రెడ్డి రోజూ పార్టీ ఆఫీసుకే వసున్నా, పరారైపోయారని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. ఏరోజుకారోజు ఈరోజే అరెస్ట్ చేస్తారని కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.దురుద్దేశంతోనే నోటీసుల ప్రహసనం:ఉగాది పండుగను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు కాకాణి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, కావాలనే పండగ రోజు, ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నెల్లూరులో ఆయన ఇంటికి వెళ్లారు. నోటీస్ ఇచ్చే నెపంతో తాళాలు పగలగొట్టి, ఇంటి గోడలు దూకే ప్రయత్నం చేశారు. చివరికి ఇంటి గోడలకు నోటీస్ అంటించి, మర్నాడు (సోమవారం) ఉదయం విచారణకు హాజరు కావాలని అందులో నిర్దేశించారు.నిజానికి శనివారం వరకు ఆయన ఇక్కడే ఉన్నా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులకు తీరిక లేదు. కావాలని పండగ రోజు ఆయన్ను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే హడావుడి చేసి వెళ్లారు. కాకాణి పారిపోయాడని ప్రచారం చేసుకుంటున్న కూటమి నాయకుల నోళ్లు మూయించడానికి ఆయన హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి పండగ చేసుకుంటున్న ఫొటోలను 7.30 గంటలకు అన్ని మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ వెళ్లిన పోలీసులతో బుధవారం తనకి వేర్వేరు పనులున్నాయని, గురువారం వస్తానని చెప్పినా వినుకోకుండా 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు.నోటీసులు గురించి కాకాణిగారితో మాట్లాడినప్పుడు బుధవారం సాయంత్రానికి లేదా గురువారం ఉదయం కల్లా నెల్లూరులో అందుబాటులో ఉంటానని స్పష్టంగా చెప్పారు. కావాలంటే పోలీసులు గురువారం నెల్లూరు రావొచ్చని చెప్పారు. ఇలా అక్రమ కేసులు బనాయించి వైయస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవాలని చూడటం అవివేకమే అవుతుంది. కాగా, తాము ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
కాకాణిపై కొనసాగుతున్న వేధింపులు
నెల్లూరు(క్రైమ్): మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వేధింపులను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆ పార్టీ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో తప్పుడు కేసులతో వేధిస్తోంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని, ఇందులో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, దీనికి ఆయన సహకరించారంటూ 120 (బీ), 447, 427, 379, 290, 506, 109 ఆర్ / డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఏ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21 (1), 21 (4) ఆఫ్ ఎమ్మెమ్డీఆర్ యాక్ట్ కింద నాన్‌బెయిలబుల్ కేసును పొదలకూరు పోలీసులు ఇటీవల నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏ – 4గా ఉన్నారు. కొద్ది రోజులుగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచార నేపథ్యంలో, అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడేదిలేదంటూ తన ఇంట్లోనే ఆయన ఉన్నారు. ఇంటి వద్ద కార్యకర్తలు, అభిమానులు పగలూ, రాత్రీ పహారా కాశారు. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో ఉగాది పర్వదిన నేపథ్యంలో కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు శుక్రవారం వెళ్లి వేడుకలను ఆదివారం జరుపుకొన్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాకాణిని ఇబ్బందులు పెట్టాలంటూ పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులను పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి జారీ చేశారు. ఎస్సై హనీఫ్ తన సిబ్బందితో కలిసి మీడియాను వెంటబెట్టుకొని డైకస్‌రోడ్డులోని కాకాణి ఇంటికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులను అంటించి వెళ్లారు. విచారణకు హాజరుకావాలి విచారణ నిమిత్తం మూలాపేటలోని రూరల్ డీఎస్పీ కార్యాలయానికి సోమవారం ఉదయం 11కు హాజరుకావాలని నోటీసులో పొందుపర్చారు. కాకాణి బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ మంగళవారం జరగనున్న నేపథ్యంలో ఓ పథకం ప్రకారమే నోటీసులను జారీ చేశారు. విచారణకు ఆయన సహకరించడంలేదనే సాకును చూపేందుకే నోటీసులను అంటించారని తెలుస్తోంది. విచారణకు నేడు హాజరుకావాలి ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు -
జిల్లాలో ఇలా..
ఒత్తిళ్లు చేసి రాజీనామా చేయించి.. ఉపాధి కల్పనే ధ్యేయమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కొత్త ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న చిరుద్యోగులపై ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే వివిధ రంగాలపై కన్నేసి తమ పంతం నెగ్గించుకున్న తమ్ముళ్ల కళ్లు తాజాగా వీఓఏలపై పడ్డాయి. తమకు అనుకూలంగా ఉండే వారిని నియమించాలనే లక్ష్యంతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీఓఏలను రోడ్డున పడేస్తున్నారు. ఒత్తిళ్లు తాళలేక.. ఏమి చేయాలో పాలుపోక వీఓఏలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ● రోడ్డున పడేసిన కూటమి నేతలు ● చిరుద్యోగుల పొట్టకొట్టి.. ● అనుకూల వ్యక్తుల నియామకం ● టీడీపీ నేతల కనుసన్నల్లో గ్రామ సమాఖ్యలు నెల్లూరు (పొగతోట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరుద్యోగులపై ఆ పార్టీ నేతల దాష్టీకం పరాకాష్టకు చేరుతోంది. తమ పార్టీలకు మద్దతుగా ఉండే వారిని నియమించాలనే లక్ష్యంతో.. అప్పటికే విధుల్లో ఉన్న వారిని అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ వికటాట్టహాసం చేస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో కొందరు రాజీనామాలూ చేశారు. నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ.. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 36 వేల పొదుపు గ్రూపులున్నాయి. ఇందులో సుమారు 4.2 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 1214 గ్రామ సంఘాలకు గానూ ఒక్కో వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) చొప్పున నియమించారు. ఒక్కో గ్రామంలో వందకుపైగా గ్రూపులుంటే ఇద్దరు వీఓఏలు ఉంటారు. వీరు నిత్యం మహిళలతో సమావేశాలను నిర్వహిస్తూ వారి ఆర్థిక ప్రగతికి బాటలేస్తున్నారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వందలాది మంది వీఓఏలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. గ్రామ సంఘబంధ తీర్మానంతో కోర్టును ఆశ్రయించగా, తొలగించొద్దని ఉత్తర్వులు జారీ చేసినా వాటిని అధికారులు ఏ మాత్రం అమలు చేయడంలేదు. నిబంధనల ప్రకారం అయితే.. నిజానికి స్థానికంగా ఆయా గ్రామాల్లో ఉండే పొదుపు గ్రూపులు తీర్మానం చేసి ఒకర్ని వీఓఏగా నియమించుకుంటారు. ఈ ప్రక్రియలో అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం ఉండదు. తీర్మానానంతరం సదరు కాపీని మండల ఏపీఎంకు పంపుతారు. తదుపరి ఈ పేరును ఆన్లైన్లో నమోదయ్యేలా చర్యలు చేపడతారు. గతంలో వీరికి తక్కువ వేతనం లభించినా, ప్రస్తుతం రూ.ఎనిమిది వేల జీతమొస్తోంది. దీంతో కూటమి నేతలు తమ కార్యకర్తల కుటుంబసభ్యులు, టీడీపీకి అనుకూలంగా ఉండే మహిళలను నియమించుకుంటూ నిబంధనలను అపహాస్యం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో డీఆర్డీఏలో పనిచేస్తున్న ఓ కీలకాధికారి అంతా తానై చూసుకుంటున్నారని సమాచారం. ఆదుకోవాల్సిన అధికారులే తమ మెడపై కత్తిపెట్టి రాజీనామాలు చేయాలని వేధిస్తుండటంతో గోడును ఎవరికి తెలియజేయాలో పాలుపోక మదనపడుతున్నారు. కూటమి నేతలువీఓఏలు కోవూరు మండలం గంగవరం వీఓఏగా శేషమ్మ వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈమైపె కూటమి నేతలు కక్షగట్టారు. రాజీనామా చేయాలని నిరంతరం వేధింపులకు గురిచేయడంతో ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సంగానికి చెందిన రమణమ్మ వీఓఏగా 20 ఏళ్లుగా వ్యవహరిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వందలాది మంది మహిళలను గ్రూపుల్లో చేర్పించి వారి ఆర్థిక ప్రగతికి బాటలేశారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ ఆమైపె పచ్చ నేతలు బెదిరింపులకు దిగారు. కేసులు బనాయించి జైలుకు పంపుతామంటూ వేధింపుల పర్వానికి తెరలేపారు. దీంతో ఉద్యోగాన్ని వదులుకొని, మానసిక క్షోభకు గురవుతున్నారు. పొదుపు సంఘాలు 36,000సభ్యులు 4.2 లక్షలు గ్రామ సంఘాలు 1214 వీఓఏలు 1214 -
రాజీనామా చేయలేదు.. మరొకర్ని నియమించారు
గ్రామంలోని పొదుపు గ్రూపుల సభ్యులు నన్ను వీఓఏగా కొనసాగించాలని తీర్మానం చేశారు. దీనికి సంబంధించిన కాపీని అధికారులకు పంపాం. ఒత్తిళ్లు అధికమయ్యాయి. విధులకెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నా. కూటమి నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి మరో మహిళను వీఓఏగా నియమించారు. ప్రస్తుతం ఆమె పేరే ఆన్లైన్లో కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇలా.. ఎలా నమోదు చేశారో అధికారులకే తెలియాలి. – మానస, విడవలూరు వీఓఏల నియామకాలకు సంబంధించి నిబంధనల మేరకే నడుచుకుంటున్నాం. గ్రామంలో తీర్మానం చేసిన మహిళనే వీఓఏగా స్థానిక ఏపీఎంలు నియమిస్తున్నారు. ఇందులో ఉత్తర్వులను ఉల్లంఘించడంలేదు. కొత్తగా వచ్చిన వీఓఏలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గ్రూపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతున్నాం. – నాగరాజకుమారి, పీడీ, డీఆర్డీఏ నిబంధనల మేరకే.. -
అంతా.. ఆరంభ శూరత్వమే
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు చూస్తున్నారు చెత్త రీసైక్లింగ్ కేంద్ర నిర్వహణ బాధ్యతను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు చూస్తున్నారు. రీసైక్లింగ్ బాధ్యతా వాళ్లదే. కేంద్రాన్ని ఎప్పటి నుంచి నిర్వహణలోకి తీసుకురావాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి చెత్తను గుంటూరు తరలిస్తారనే అంశమై మాకెలాంటి సమాచారం లేదు. – అనూష, మున్సిపల్ కమిషనర్ ‘కందుకూరులో చెత్త అనేదే లేకుండా చేస్తాం.. ఏ రోజు చెత్తను ఆ రోజే రీసైక్లింగ్ చేసి చెత్త నుంచి సంపదను సృష్టించే బాధ్యత నాది’.. అంటూ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఫిబ్రవరి 15న నిర్వహించిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. అదే సమయంలో దూబగుంట వద్ద ఏర్పాటు చేసిన చెత్త రీసైక్లింగ్ కేంద్రాన్నీ ప్రారంభించారు. అయితే ఇది జరిగి 45 రోజులు దాటినా నేటికీ వినియోగంలోకి రాలేదు. కందుకూరు: పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన చెత్త రీసైక్లింగ్ కేంద్రం నిరుపయోగంగా మారింది. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త టన్నూ తొలగలేదు. దీంతో స్వచ్ఛ కందుకూరు అంటూ చేసిన ఆర్భాటం మాటలకే పరిమితమైందే తప్ప చేతల్లో ఏ మాత్రం కానరావడం లేదు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించిన రీసైక్లింగ్ కేంద్రం వినియోగంలోకి రాకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హడావుడి చేయడం మినహా ఎలాంటి ఉపయోగంలేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. తలనొప్పిగా సమస్య కందుకూరు మున్సిపాల్టీకి ప్రస్తుతం చెత్త సమస్య తలనొప్పిగా మారింది. దీని పరిధిలో 25 మెట్రిక్ టన్నుల వరకు చెత్త నిత్యం పోగవుతోంది. అయితే దీన్ని నిల్వ చేసేందుకు సరైన డంపింగ్ యార్డు సౌకర్యం లేదు. పట్టణంలోని యర్రగొండపాళెం సమీపంలో గల యార్డు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. కనీసం లోపలికి తీసుకెళ్లే పరిస్థితే లేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బయటే చెత్తను మున్సిపల్ కార్మికులు పడేస్తున్నారు. మరోవైపు నివాసాల మధ్యలో యార్డు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తకు నిప్పంటుకొని రోజుల తరబడి కాలుతుండటంతో ఆ ప్రాంతాలు పొగతో నిండిపోతున్నాయి. అక్కడి నుంచి తరలించాలనే ప్రతిపాదన ఎంతో కాలంగా ఉన్నా, స్థల సమస్యతో కార్యరూపం దాల్చడంలేదు. టన్ను చెత్తనూ ప్రాసెస్ చేయలేదు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అంటూ కందుకూరు పర్యటనకు ఫిబ్రవరిలో సీఎం వచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా కనిగిరి రోడ్డులోని దూబగుంట వద్ద చెత్త రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు రూ.45 లక్షలను వెచ్చించి యంత్రాలనూ నెలకొల్పారు. నిర్వహణ బాధ్యతను కండి మినరల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించేలా ఒప్పందమూ కుదిరింది. నిత్యం 24 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. అయితే దీన్ని ప్రారంభించి ఇప్పటికి 45 రోజులు దాటుతున్నా, ఒక్క టన్ను కూడా ప్రాసెస్ చేసిన దాఖలాల్లేవు. ఫలితంగా యంత్రాలు అలంకారప్రాయంగా మారాయి. గుంటూరుకు తరలించేలా..? కందుకూరులో ప్రారంభించిన చెత్త రీసైక్లింగ్ కేంద్రం వినియోగంలోకి వచ్చే పరిస్థితే లేదనే వాదనా వినిపిస్తోంది. ఫలితంగా ఇక్కడి నుంచి గుంటూరు తరలించి అక్కడే రీసైక్లింగ్ చేసేలా స్వచ్ఛాంధ్ర అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కందుకూరు నుంచి వాహనాల ద్వారా చెత్తను గుంటూరులోని కేంద్రానికి నిత్యం తరలించాలనే ప్రణాళిక అధికారుల పరిశీలనలో ఉంది. కేవలం సీఎం పర్యటన కోసమే కొన్ని యంత్రాలను అక్కడ పెట్టి, స్వచ్ఛ కందుకూరు అంటూ హడావుడి చేసి చేతులు దులుపుకొన్నారనే విమర్శలూ లేకపోలేదు. వినియోగంలోకి రాని చెత్త రీసైక్లింగ్ కేంద్రం ఫిబ్రవరి 15న ఆర్భాటంగా ప్రారంభించిన సీఎం ప్రజాధనం వృథా కందుకూరులో ఇదీ దుస్థితి -
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ పద్ధతి
నెల్లూరు సిటీ: ఆస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్లకు ఇక స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. నిర్దేశించిన సమయంలో సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిల్లాలోని ఆర్ఓ కార్యాలయంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి దీనిని ప్రారంభించనున్నారు. నెలాఖరు నాటికి దశల వారీగా అన్ని సబ్ రిసిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు పేర్కొన్నారు. ఎలా అంటే.. స్లాబ్ బుకింగ్ విధానంలో గంటకు ఆరు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వినియోగదారులు మంచిరోజు, వారికి అనుకూలమైన రోజులో రిజిస్ట్రే షన్ చేసుకునేందుకు సంబంధిత వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. నిర్దేశించిన సమయానికి కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడు రాలేని పరిస్థితుల్లో తిరిగి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అందుకు గానూ ప్రభుత్వానికి మరో రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.అమలు చేస్తాం స్లాట్ బుకింగ్ విధానాన్ని మొదట నెల్లూరు ఆర్ఓ కార్యాలయంలో వచ్చే నెల 2వ తేదీన ప్రారంభిస్తాం. నెలాఖరుకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తాం. – బాలాంజనేయులు, జిల్లా రిజిస్ట్రార్ 2వ తేదీ నుంచి నెల్లూరులో ప్రారంభం గంటకు ఆరు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం స్లాట్ తేదీల మార్పునకు రూ.200 చెల్లించాల్సిందే.. -
సీసీ కెమెరాల షాపులో అగ్నిప్రమాదం
● రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు విక్రమ్ నగర్‌లోని సీసీ కెమెరాల దుకాణంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక అధికారుల కథనం మేరకు.. నగరానికి చెందిన శ్రీధర్ విక్రమ నగర్‌లోని రెండంతస్తుల భవనంలో కింద పోర్షన్లో కార్యాలయం, పై పోర్షన్లో సీసీ కెమెరాల షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఎప్పటిలాగే పదిగంటల సమయంలో వాటిని మూసివేశాడు. సుమారు 11 గంటల ప్రాంతంలో పైపోర్షన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక అధికారులు, వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు ఏడీఎఫ్‌ఓ ఎస్.వేణుగోపాల్ రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజిన్లతో నీరు వేగంగా కొట్టినా, ఫోమ్‌ను ఉపయోగించినా మంటలను అదుపు చేయలేకపోయారు. దీంతో సిబ్బంది పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల కిటికీలో నుంచి దానికి ఆనుకుని ఉన్న మూడంతస్తుల భవనంపైకి చేరుకుని ఆరుగంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వేదాయపాళెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సహకారం అందించారు. సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లు, బ్యాటరీలు, అడాప్టర్లు ఇలా కాలే సామగ్రి అధికంగా ఉండటంతోనే మంటలు అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. బ్యాటరీలు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
టిప్పర్ చక్రాల కింద పడి వ్యక్తి మృతి
● తమ్ముడికి తీవ్రగాయాలు నెల్లూరు(క్రైమ్): మోటార్‌బైక్‌పై వెళ్తూ టిప్పర్‌ను అధిగమించే క్రమంలో వెనుక చక్రాల కిందపడి అన్న మృతిచెందగా తమ్ముడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం నెల్లూరు బోసుబొమ్మ సమీపంలోని ఆర్కేటీ పెట్రోట్ బంకు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన హరిరామ్కుమార్ (23), సీతారామ్ అనే అన్నదమ్ములు నాలుగు నెలల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చి పొర్లుకట్ట వద్ద నివాసం ఉంటున్నారు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హరిరామ్కుమార్కు తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. ఆదివారం సాయంత్రం అన్నదమ్ములిద్దరూ బైక్‌పై బోసుబొమ్మ వైపునకు బయలుదేరారు. ఆర్కేటీ పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న టిప్పర్‌ను అధిగమించే క్రమంలో బైక్ దానికి రాసుకుంది. దీంతో బైక్ అదుపు తప్పి అన్నదమ్ములిద్దరూ కిందపడ్డారు. టిప్పర్ చక్రాల కిందపడి హరికుమార్ తలపగిలి అక్కడికక్కడే మృతిచెందగా, సీతారామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
ఈద్‌ను సంతోషంగా జరుపుకోవాలి
నెల్లూరు(బృందావనం): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాక్షించారు. ఒకేరోజు 96 రిజిస్ట్రేషన్లునెల్లూరు సిటీ: ఆదివారం సెలవు దినమైనా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జరిగాయి. ఒకేరోజులో 96 రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. రూ.19,65,336 రాబడి వచ్చినట్లు వెల్లడించారు. సోమవారం రంజాన్ పండగా అయినా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వెల్లడించారు.కండలేరులో 48.794 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 48.794 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,320, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.మిద్దైపె వాకింగ్ చేస్తుండగా..● ప్రమాదవశాత్తు కింద పడి మహిళ మృతి నెల్లూరు(క్రైమ్): ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి కిందపడి ఓ మహిళ మృతిచెందిన ఘటన నెల్లూరు అయ్యప్పగుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఎన్జీఓ కాలనీకి చెందిన జ్యోతి (49), పురుషోత్తం దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. జ్యోతి వారంరోజుల క్రితం అయ్యప్పగుడి సమీపంలో నివాసముంటున్న తన తల్లి సరస్వతమ్మ వద్దకు వెళ్లింది. శనివారం రాత్రి ఆమె వాకింగ్ చేసేందుకు మిద్దైపెకి వెళ్లింది. కొద్దిసేపటికి సరస్వతమ్మ వెళ్లి చూడగా కుమార్తె కనిపించలేదు. దీంతో ఆమె కిందకు వచ్చిచూడగా కుమార్తె తలకు తీవ్రగాయమై రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో సరస్వతమ్మ జరిగిన విషయాన్ని తన మనవడు లీలామోహన్కు తెలియజేసింది. అతను వెంటనే ఇంటి వద్దకు చేరుకుని తల్లిని చికిత్స నిమిత్తం జయభారత్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ల సూచన మేరకు నారాయణ హాస్పిటల్‌కు తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుమారుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోడిపందేల స్థావరంపై దాడినెల్లూరు సిటీ: రూరల్ నియోజకవర్గంలో కోడిపందేల స్థావరంపై రూరల్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. వారి కథనం మేరకు.. నారాయణరెడ్డిపేటలోని ఖాళీ స్థలంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.11,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
నాలుగు నెలల్లో ఘాట్ నిర్మాణం పూర్తి
● మంత్రి నారాయణ నెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో ఘాట్ నిర్మాణాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఉగాది సందర్భంగా నారాయణ, రమాదేవి దంపతులు ఆదివారం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులతో కలిసి మంత్రి పెన్నా ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నారాయణ మాట్లాడుతూ 15 రోజుల్లో టెండర్లు పిలిచి నాలుగు నెలల్లో ఘాట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం నారాయణ, రమాదేవి దంపతులు వీఆర్సీ సెంటర్ చాకలివీధిలోని శ్రీమహాలక్ష్మమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. -
పుచ్చసాగుతో నష్టం
నేను పుచ్చ సాగు చేసి నష్డపోయాను. గతంలో కొంతవరకు లాభం రావడంతో మళ్లీ సాగు చేశాను. ఈ పర్యాయం తీవ్రంగా నష్టం వచ్చేలా ఉంది. అధికారులు చొరవ తీసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలి. – జి.హరి, రైతు, నావూరుపల్లి రైతులకు గడ్డుకాలం పుచ్చ సాగు చేసిన రైతులకు గడ్డుకాలం వచ్చింది. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు చేశాం. పెట్టుబడులు వచ్చినా సంతోషమే. రైతులు నేరుగా వెళ్లి బజార్లలో అమ్ముకుంటే కొంతవరకు మేలే. అయితే అందరూ ఆ పని చేయలేరు. – కేతు రామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, దుగ్గుంట ఆదుకోవాలి పుచ్చ సాగు చేసిన రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది దిగుబడి కూడా అంతంతమాత్రమే. పెట్టుబడులు వస్తే ఆదాయం వచ్చినట్లే. దళారులు దారుణంగా అడుగుతున్నారు. – వి.మాలకొండారెడ్డి, రైతు, నావూరు రైతు బజార్లలో అమ్ముకోవచ్చు రైతులు ముందుకొస్తే రైతు బజార్లలో అమ్ము కునే అవకాశం కల్పిస్తాం. నెల్లూరు, కావలి తదితర ప్రాంతాల్లో కాయలను విక్రయించుకోవచ్చు. పుచ్చ ధరలు దారుణంగా పడిపోలేదని భావిస్తున్నాం. మమ్మల్ని సంప్రదిస్తే సలహాలిస్తాం. – సుబ్బారెడ్డి, జిల్లా ఉద్యానాధికారి, నెల్లూరు● -
సీసీ కెమెరాల షాపులో అగ్నిప్రమాదం
● రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు విక్రమ్ నగర్‌లోని సీసీ కెమెరాల దుకాణంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక అధికారుల కథనం మేరకు.. నగరానికి చెందిన శ్రీధర్ విక్రమ నగర్‌లోని రెండంతస్తుల భవనంలో కింద పోర్షన్లో కార్యాలయం, పై పోర్షన్లో సీసీ కెమెరాల షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఎప్పటిలాగే పదిగంటల సమయంలో వాటిని మూసివేశాడు. సుమారు 11 గంటల ప్రాంతంలో పైపోర్షన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక అధికారులు, వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు ఏడీఎఫ్‌ఓ ఎస్.వేణుగోపాల్ రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజిన్లతో నీరు వేగంగా కొట్టినా, ఫోమ్‌ను ఉపయోగించినా మంటలను అదుపు చేయలేకపోయారు. దీంతో సిబ్బంది పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల కిటికీలో నుంచి దానికి ఆనుకుని ఉన్న మూడంతస్తుల భవనంపైకి చేరుకుని ఆరుగంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వేదాయపాళెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సహకారం అందించారు. సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లు, బ్యాటరీలు, అడాప్టర్లు ఇలా కాలే సామగ్రి అధికంగా ఉండటంతోనే మంటలు అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. బ్యాటరీలు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
తలోదారిలో తెలుగు తమ్ముళ్లు
ఉదయగిరి: నియోజకవర్గంలోని పలు మండలాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు బుసలు కొడుతున్నాయి. అంతర్గతంగా ఉన్న విభేదాలు తన్నులాటకు దారి తీస్తున్నాయి. అది కూడా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలోనే ఈ గొడవలు, దెబ్బలాటలు జరుగుతుండటం విశేషం. ముఖ్యంగా కాకర్ల, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు వర్గీయులు మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కాకర్ల తన వర్గీయులను సమర్థిస్తూ తమపైకి ఉసిగొల్పుతున్నాడనే అనుమానం బొల్లినేని వర్గీయుల్లో ఉంది. ఇలా మొదలు సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు సురేష్ సేవా కార్యక్రమాల పేరుతో నారా లోకేశ్ ఆశీస్సులు తీసుకుని ఉదయగిరిలో మకాం పెట్టారు. ఈ పరిణామం అప్పుటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న బొల్లినేనికి నచ్చలేదు. దీంతో కాకర్ల సేవా కార్యక్రమాలకు సహకరించలేదు. లోకేశ్ అండదండలు ఉండటంతో ఇబ్బందులు ఎదురైనా సురేష్ తమ కార్యకలాపాలు ఆపలేదు. గ్రామాల్లో బృందాలను ఏర్పాటు చేసుకుని రామారావు వర్గానికి ధీటుగా నిలిచారు. పార్టీ అధినేత చంద్రబాబు మద్దతు పూర్తిగా తనకే ఉందని బొల్లినేని నమ్మారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి స్వాగతం పలికేందుకు ప్రయత్నించిన సురేష్‌ను బొల్లినేని వర్గీయులు అడ్డుకున్నారు. ఇదంతా గమనించిన లోకేశ్ స్వయంగా సురేష్‌తో మాట్లాడి టికెట్‌పై హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మండలాల వారీగా తనను ఇబ్బంది పెట్టిన బొల్లినేని వర్గీయులను దూరం పెట్టడం ప్రారంభించారు. దీంతో గ్రామాల్లో టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి.ఎమ్మెల్యే సమక్షంలోనే.. ● ఈనెల 26వ తేదీన ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సమక్షంలో రెండు చోట్ల తమ్ముళ్లు తగాదా పడ్డారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై కాకర్ల మౌనం వహించారు. దీంతో చెంచలబాబు మనస్తాపం చెందినట్లు సమాచారం. దీనిపై పోలీసులకు కూడా ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. ● 27వ తేదీ రాత్రి వింజమూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాకర్ల ముందే కొండాపురం టీడీపీ సీనియర్ నేతల మధ్య గొడవ జరిగింది. కాకర్ల వర్గానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దామా మహేశ్వరరావు, బొల్లినేని వర్గానికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు యారవ కృష్ణయ్య మధ్య గొడవ జరిగి చెయ్యి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో యారవ మనస్తాపం చెంది క్యాంప్ కార్యాలయం నుంచి అలిగి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని జిల్లా పార్టీ పెద్దల దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీంతో వారు కాకర్లను పిలిచి మహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్దల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శనివారం రాత్రి ఆ రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు. రాజీ చేసేంందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనూ రెండు వర్గాలు మరోసారి గొడవ పడ్డాయి. కాకర్ల జోక్యం చేసుకుని అంతా మర్చిపోవాలన్నారు. ఇద్దరి చేతులు కలిపి పనిచేయాలని సూచించారు. కాగా ఆరునెలలపాటు కొండాపురం మండలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని దామాను ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో ఆయన, అనుచరులు అలకబూని వెళ్లిపోయారు. ● వరికుంటపాడు మండలంలో టీడీపీలో విభేదాలున్నాయి. ఇక్కడ బొల్లినేని వర్గీయులకు ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తూ.. తమను దూరం పెడుతున్నారనే భావన సురేష్ వర్గీయుల్లో ఉంది. ● దుత్తలూరు మండలంలో తమకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇవ్వలేదనే బాధతో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి మదన పడుతున్నారు. పైగా ఇటీవల బొల్లినేని, కంభం కలిసి కొంతసేపు ముచ్చటించుకోవడం, ప్రస్తుతం ఎమ్మెల్యే పాల్గొంటున్న కార్యక్రమాల్లో కంభం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పూర్తిగా సహకరించిన మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డిలు ఎమ్మెల్యే కాకర్ల పట్ల కినుక వహించారనే ప్రచారం జరుగుతోంది. సీఎంకు ఫిర్యాదు ఇటీవల నియోజవర్గానికి చెందిన కొందరు సీనియర్ నేతలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారంటూ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీని వెనుక బొల్లినేనితోపాటు మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని కాకర్ల అనుమానిస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నానని, కొందరు కావాలని ఫిర్యాదు చేస్తున్నారని ఆయన అధినేతకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉదయగిరి నియోజకవర్గంలో అసమ్మతి సెగలు నానాటికీ పెరుగుతున్న విభేదాలు ఎమ్మెల్యే సమక్షంలోనే కొట్లాట కాకర్లపై సీఎంకు ఫిర్యాదు చేసిన సీనియర్ నేతలు లోకేశ్ అండదండలతో సీరియస్‌గా తీసుకోని శాసనసభ్యుడు -
కాకాణిపై ఆగని కక్ష సాధింపు చర్యలు..
నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను, పార్టీకి అండగా నిలిచే వారిపై రెడ్ బెక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి సంక్షేమ పథకాల్ని గాలికొదిలేసి.. కేవలం కక్ష పూరిత రాజకీయాలను మాత్రమే చేస్తోంది కూటమి సర్కారు. తాజాగా వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది ‘కూటమి’ ప్రభుత్వం. క్వార్జ్ అక్రమ రవాణా కేసులో కాకాణికి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కాకాణితో ఫోన్ లో మాట్లాడేందుకు పొదలకూరు పోలీసులు యత్నించిన తర్వాత ఆయన ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. రేపు ఉదయం గం.11లకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి -
వెట్టిచాకిరి నిర్మూలనకు కృషి
నెల్లూరు రూరల్: వెట్టిచాకిరీని నిర్మూలించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని నెల్లూరు ఆర్డీఓ అనూష కోరారు. నగరంలోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో నెల్లూరు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు శుక్రవారం వెట్టిచాకిరి నిర్మూలన చట్టంపై సాంఘిక సంక్షేమ శాఖ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధులు శ్యామ్, గంటా ప్రియాంక ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, లేబర్, విద్య, వైద్య ఇతర శాఖల సమన్వయంతోనే వెట్టిచాకిరి నిర్మూలన సాధ్యపడుతుందన్నారు. ఇటుకబట్టీలు, రైస్‌మిల్లులు, హోటళ్లు, మద్యం దుకాణాలు, పలు వ్యాపార సంస్థల్లో అధికారులు నిర్వహించే తనిఖీలు ఎంతోమంది అభాగ్యుల జీవితాలను మారుస్తాయన్నారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన వ్యక్తికి కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా రిలీజ్ సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, చైతన్య జ్యోతి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు, పలు వ్యాపార సంస్థలు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. -
రైతులే శాస్త్రవేత్తలుగా మారాలి
● భారత వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుబ్బారావు కందుకూరు రూరల్: ‘రైతులే శాస్త్రవేత్తలుగా మారాలి. నూతన వంగడాలకు రూపకల్పన చేసి వారి పేరు మీదే రిజిస్టర్ చేసుకుని లైసెన్స్, హక్కులు పొందాలి’ అని భారత వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎల్వీ సుబ్బారావు అన్నారు. కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో పంట వంగడాల పరిరక్షణ, రైతు చట్టం 2001 (పీపీవీ అండ్ ఎఫ్ఆర్ఏ) అనే అంశంపై శుక్రవారం ఒకరోజు శిక్షణ నిర్వహించారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ జి.ప్రసాద్‌బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ రైతులు వారి పొలంలో తిరిగే సమయంలో క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక లక్షణాలున్న మొక్కల్ని గుర్తించాలన్నారు. వాటిని వేరు చేసి 2 నుంచి 3 సంవత్సరాలు పండించాలన్నారు. పూర్తి వివరాలతో అథారిటీకి దరఖాస్తు చేసుకుంటే తద్వారా వాటిని పరిశీలించి ఆ రైతుకు హక్కులను ఇస్తారన్నారు. ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ విజయభాస్కర్ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా 8,500 హక్కులను రైతులకు అందించామన్నారు. సీడీఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త అనురాధ మాట్లాడుతూ రైతుల దగ్గర ప్రత్యేక లక్షణాలున్న వంగడాలుంటే కేవీకే దృష్టికి తీసుకురావాలన్నారు. ఔత్సాహికుల ద్వారా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్తమ రైతులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. రైతులతో శాస్త్రవేత్తలు ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు అనసూయ, వ్యవసాయాధికారులు వి.రాము, హేమంత్ భరత్, రైతులు, రైతు మహిళలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాధవ, కృష్ణారెడ్డి, రాజు, ఉద్యాన కళాశాల ఇంటర్న్‌షిప్ విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘నీట్’కు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు రూరల్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్లో శుక్రవారం నీట్‌పై కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే నెల 4వ తేదీన నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పరీక్షను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో సుమారు 4 వేలకు పైగా హాజరుకానున్నారని ప్రభుత్వ విద్యాసంస్థలను మాత్రమే కేంద్రాలుగా ఎంపిక చేయాలన్నారు. నెల్లూరు సిటీకి దగ్గరగా భద్రత, రవాణాకు ఇబ్బందుల్లేకుండా ఉండే కేంద్రాలను రెండు రోజుల్లో ఎంపిక చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డీఈఓ బాలాజీరావు, కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపల్ కె.శంకరయ్య, సీనియర్ ఉపాధ్యాయురాలు దొరసానమ్మ, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓవైపు చదువు.. మరోవైపు బాడీ బిల్డింగ్
కందుకూరు: ఓ యువకుడు బాడీ బిల్డింగ్ పోటీల్లో విశేషంగా రాణిస్తున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొంటూ మిస్టర్ ఆసియా టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కందుకూరు పట్టణంలోని సంతోష్‌నగర్‌కు చెందిన షేక్ కరిముల్లా కుమారుడు షేక్ అలీమ్ ప్రస్తుతం ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బీటెక్ చదివే రోజుల్లో జిమ్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలానికి బాడీ బిల్డింగ్ పోటీలపై ఆసక్తి పెంచుకున్నాడు. 2018 నుంచి తీవ్ర కసరత్తు చేశాడు. 2020లో శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న అలీమ్ 5వ స్థానంలో నిలిచాడు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మిస్టర్ తెలంగాణ పోటీల్లో పాల్గొని టాప్ టెన్‌లో స్థానం సాధించాడు. 2023లో జరిగిన మిస్టర్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని కై వసం చేసుకుని జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగిన జాతీయపోటీల్లో దాదాపు 2,000 మంది పాల్గొనగా టాప్‌టెన్‌లో నిలిచాడు. ఆ టైటిల్ కోసం.. అలీమ్ మిస్టర్ ఆసియా పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించి దేశానికి పేరు తేవడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. దీని కోసం వచ్చే డిసెంబర్ లేదా 2026 ఏడాది ప్రారంభంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో మరోసారి పాల్గొననున్నట్లు తెలిపాడు. దీని కోసం ప్రస్తుతం కఠోరమైన శిక్షణ తీసుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలంటే వరుసగా మూడుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఒకటి లేదా రెండో స్థానంలో నిలవాల్సి ఉందని, ఈ లక్ష్యాన్ని చేరడంతోపాటు, మిస్టర్ ఆసియా టైటిల్ సాధించేందుకు కష్టపడుతున్నట్లు చెప్పాడు. పోటీల కోసం కఠోర సాధన పోటీల కోసం అలీమ్ నెల్లూరులోని ఓ జిమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఓ అంతర్జాతీయ కోచ్ రోజూ ఆన్లైన్లో ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తున్నాడు. పోటీలకు సిద్ధమయ్యే క్రమంలో భిన్నమైన ఆహార అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అలీమ్ ప్రతి నెలా తన ఆహారం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అతనికి పేదరికం పెద్ద సవాల్‌గా మారింది. పోటీలకు శిక్షణ తీసుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కందుకూరులో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే తండ్రి కరిముల్లాకు కుమారుడి శిక్షణకు అవసరమయ్యే మొత్తాన్ని భరించడం కష్టతరంగా మారింది. ఎవరైనా తనని స్పాన్సర్ చేయడానికి ముందుకొస్తే కచ్చితంగా అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పోటీల్లో రాణిస్తున్న కందుకూరు యువకుడు 60 కేజీల విభాగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ మిస్టర్ ఆసియా టైటిల్ అందుకోవడమే లక్ష్యం -
అభ్యర్థులతో అధికారుల ఆటలు
నెల్లూరు(టౌన్): టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో అధికారులు ఆటలాడుకుంటున్నారు. పరీక్ష వాయిదాపై వారికి కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు రూ.వేలు ఖర్చు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చి ఇబ్బందులు పడ్డారు. తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీ కోసం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష వాయిదాపై తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులను అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. శుక్రవారం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు అభ్యర్థులు నెల్లూరు పొట్టేపాళెంలో పరీక్ష కేంద్రమైన అయాన్ డిజిటల్ ఎదుట తమ హాల్‌టికెట్లతో నిరసన వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా.. కస్తూరిదేవి బాలికల ఉన్నత పాఠశాల, గూడూరులోని శ్రీపొట్టి శ్రీరాములు ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం సుమారు 1,600 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. శుక్ర, శనివారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు మెసేజ్‌లు పంపారు. ఆ శాఖ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. అయితే పరీక్షను ఆన్లైన్లో నిర్వహణపై ఆయా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ విషయంపై అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖాధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వాయిదాపై పత్రికా ప్రకటనలు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లో ఉంటున్న అభ్యర్థులకు వాయిదా విషయం తెలియకపోవడంతో నెల్లూరులోని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి సిబ్బంది వారిని లోనికి పంపకపోవడంతో ఆందోళనతో జిల్లా విద్యాశాఖాధికారులను ఫోన్లో సంప్రదించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు. పరీక్ష వాయిదాపై సమాచారం ఇవ్వని విద్యాశాఖ సుదూర ప్రాంతాల నుంచి రాక వాయిదా పడిందని తెలుసుకుని నిరసన తెలిపిన వైనంఆశగా ఎదురు చూశాం పరీక్షలు జరిగి ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందనే ఆశతో ఎదురు చూశాం. ఎంతో దూరం నుంచి ఇబ్బంది పడుతూ నెల్లూరుకు వచ్చాం. ఇక్కడ పరీక్షను నిర్వహించలేదు. అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడటం తగదు. టి.మేరీ, ప్రకాశం జిల్లా -
దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా
కావలి: నియోజకవర్గంలోని దగదర్తి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష పదవికి జరగాల్సిన ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తూ ఎన్నికల అధికారులు నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ పదవికి గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. అయితే గురువారం ఎంపీటీసీ సభ్యులు రాకపోవడంతో శుక్రవారం నిర్వహించేందుకు మరోసారి షెడ్యూల్ ప్రకటించారు. అయితే శుక్రవారం సైతం ఎంపీటీసీ సభ్యులు ఎవరూ హాజరు కాపోవడంతో నిర్దిష్ట సమయం వరకు వేచి చూసిన ఎన్నికల నిర్వహణాధికారులు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మండలంలో 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో శ్రీరామపురం ఎంపీటీసీ సభ్యురాలు పీతల కామేశ్వరమ్మ గతంలో మండల ఉపాధ్యక్షురాలిగా ఉండేవారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైస్ ఎంపీపీ పదవికి గురువారం ఎన్నిక నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు నెల్లూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.సుబ్బరాజును ఎన్నికల అధికారిగా, దగదర్తి ఎంపీడీఓ జి.వెంకటేశ్వర్లు సహాయ ఎన్నికల అధికారిగా నియమించింది. మొదటి రోజు ఎన్నికల షెడ్యూల్ సమయం 11 గంటల వరకు నిరీక్షించినా సమావేశ మందిరానికి ఎంపీటీసీలు ఒక్కరు కూడా రాలేదు. దీంతో ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం మరో గంట సమయాన్ని అదనంగా కేటాయించినా కోరం లేకపోవడంతో ఎన్నికను, శుక్రవారానికి వాయిదా వేశారు. రెండో రోజూ పరిస్థితి అలాగే ఉండడంతో నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అల్లూరు, బిట్రగుంట ఎస్సైలు కె.కిశోర్‌బాబు, భోజ్యానాయక్ ప్రత్యేక పోలీసులతో కలిసి మండల ప్రజా పరిషత్ కార్యాలయ పరిసరాల్లో బందోబస్తు చర్యలు తీసుకున్నారు. -
వృద్ధురాలి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వృద్ధురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరులోని కరెంటాఫీస్ గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై శుక్రవారం జరిగింది. మృతురాలి వయసు 70 నుంచి 75 ఏళ్ల లోపు ఉంటుందని భావిస్తున్నారు. మెడలో ఎర్రని దారం ధరించి ఉంది. మృతదేహానికి సమీపంలో ఎరుపు రంగు దుప్పటి పడి ఉంది. నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.పంటకాలువలో మృతదేహంనెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని ములుమూడి గ్రామానికి సమీపంలోని పంటకాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. మృతుడు బులుగు, నలుపు, ఎరుపు రంగు గడుల ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ధరించి ఉన్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తాళలేక..● వ్యక్తి బలవన్మరణం నెల్లూరు(క్రైమ్): అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని పోలీస్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దర్గామిట్టలోని పోలీస్ కాలనీలో డి.అనిల్ కుమార్ (39), మానస దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనిల్ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను అప్పులపాలయ్యాడు. ఈ విషయమై దంపతుల నడుమ తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల అప్పుల బాధలు అధికమయ్యాయి. గురువారం రాత్రి అనిల్ తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలోకి వెళ్లిన అనిల్ ఎంతకీ బయటకు రాకపోవడంతో భార్యాపిల్లలు తలుపులు బలంగా నెట్టడంతో తెరుచుకున్నాయి. ఫ్యాన్‌కు వేలాడుతున్న అనిల్ కుమార్‌ను కిందకు దించి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడి తల్లి నారాయణమ్మ శుక్రవారం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.వన్యప్రాణులకు తాగునీటి ఏర్పాట్లు ఉదయగిరి: రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్లలో ట్యాంకర్ల ద్వారా నీరు నింపుతున్నట్లుగా జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్‌బాషా తెలిపారు. ‘వన్యప్రాణుల గొంతెండుతోంది’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి ఆయన స్పందించారు. పెంచల నరసింహ వైల్డ్ లైఫ్ అటవీ ప్రాంతంలో ఇప్పటికే వన్యప్రాణులకు నీటివసతి కల్పించినట్లు తెలిపారు. -
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత
నెల్లూరు సిటీ: ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్లలోని ఈవీఎంలు, వీవీ ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనూష, తహసీల్దార్ షఫీమాలిక్, డీటీ అశోక్‌వర్ధన్ పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పదో తరగతి సోషల్ పరీక్ష 1కి వాయిదా నెల్లూరు(అర్బన్): ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ నెల 31న జరగాల్సిన సోషల్ స్టడీస్ పరీక్షను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని కోరారు. పది పరీక్షలకు 28,670 మంది హాజరు నెల్లూరు (అర్బన్): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి శుక్రవారం సైన్సు పరీక్ష జరిగింది. 28, 970 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28,670 మంది హాజరయ్యారు. 300 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 130 మంది హాజరుకావాల్సి ఉండగా 110 మంది హాజరయ్యారు. 20 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ పరీక్షలకు 208 మంది గైర్హాజరు పదో తరగతి ఓపెన్ పరీక్షలకు సంబంధించి శుక్రవారం సోషల్ స్టడీస్ పరీక్ష జరిగింది. 1,506 మంది హాజరు కావాల్సి ఉండగా 1,298 మంది హాజరయ్యారు. మిగతా 208 మంది గైర్హాజరయ్యారు. వైద్యశాఖలో ఎల్టీ పోస్టుల భర్తీకి చర్యలు నెల్లూరు (అర్బన్): జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న ఏడు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నామని డీఎంహెచ్ఓ సుజాత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఏప్రిల్ 4వ తేదీలోపు తమ దరఖాస్తులను డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఎస్పీఎస్నెల్లూరు.ఏపీ.జీఓవీ.ఇన్/నోటీసు/రిక్రూట్మెంట్ అనే వెబ్సైట్లో పరిశీలించుకోవాలని సూచించారు. మాలకొండ హుండీల రాబడి రూ.82 లక్షలు వలేటివారిపాళెం: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. 14 శనివారాలకు వచ్చిన హుండీ ఆదాయం లెక్కించగా రూ.82.44 లక్షలు వచ్చినట్లు ఈఓ కే సాగర్‌బాబు తెలిపారు. 178 గ్రాముల బంగారం, కేజీ ఐదు గ్రాముల వెండి, ఫారిన్ కరెన్సీ యూఎస్ డాలర్స్ 56, యూఏఈ దిర్హమ్ 200, ఉమన్ బైసా 700, ఓమన్ రియాల్ 8, ఇంగ్లాడ్ పౌండ్స్ 20, నేపాల్ కరెన్సీ రూ.50 వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా వీవీఎల్ రవీంద్రనాథ్ వ్యవహరించారు. -
సమన్వయంతో ముందుకు సాగాలి
● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు: నియోజకవర్గంలో పార్టీ నేతలందరూ సమన్వయంతో ముందుకు సాగి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. మండలంలోని పడుగుపాడు సొసైటీ మాజీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి నివాసంలో శుక్రవారం పార్టీ నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతి ఒక్కరూ అందరిని కలుపుకుని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా పని చేయాలని కోరారు. ప్రతి కార్యకర్తకు స్థానికంగా ఉండే మీరు భరోసా కల్పించాలన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా, ఇబ్బంది కలిగినా కమిటీ సభ్యులందరూ వెళ్లి అండగా నిలవాలన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లు జరిగాయని, అలాంటివి ఇక మీదట జరగవన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా తాను ఇకపై జాగ్రత్తలు తీసుకొంటానన్నారు. కమిటీ సభ్యుల నియామకం అత్తిపల్లి అనుప్‌రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కవరగిరి శ్రీలత, శివుని నరసింహరెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, షేక్ జుబేర్, తాటిపర్తి విజయకుమార్ రెడ్డి, నీలపరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి, భీమతాటి శ్రీధర్, యరటపల్లి మీరారెడ్డి, జెట్టి శ్యాంసుందర్‌రెడ్డి, కాటంరెడ్డి దినేష్‌రెడ్డిలను ఏకగ్రీవ తీర్మానంతో ప్రసన్నకుమార్‌రెడ్డి నియమించారు. -
7 నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్
● కలెక్టరేట్ ఏఓ, జిల్లా కో ఆర్డినేటర్‌కు వినతిపత్రాల అందజేత నెల్లూరు (అర్బన్): ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా రోగులకు చికిత్సలు అందించినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ఏప్రిల్ 7వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంపానెల్ కలిగిన ప్రైవేట్, కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు బంద్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, అరవింద్ కిడ్నీ ఆస్పత్రి అధినేత డాక్టర్ డాక్టర్ ఎస్వీఎల్ నారాయణరావు ప్రకటించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం కలెక్టరేట్లో పరిపాలనాధికారి విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యసేవ కింద సుమారు రూ.3,500 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలున్నాయన్నారు. ఆ నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హాస్పిటల్స్ నిర్వహణ అత్యంత భారంగా మారిందన్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వైద్యసేవలు బంద్ గురించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ మురళీశంకర్రెడ్డి, డాక్టర్ హజరత్కుమార్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ జీఎల్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ నెల్లూరు (బారకాసు): మల్టీ ఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ల్లో వాహన పార్కింగ్ ఫీజులను ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు వస్తున్నట్లు కమిషనర్ సూర్యతేజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మల్టీ ఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌లో మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్ పూర్తిగా ఉచితమని తెలిపారు. 30 నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్ చేసిన వ్యక్తులు మల్టీ ఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌లో ఏదైనా వస్తువు కొన్నట్లుగా బిల్లు చూపిస్తే అలాంటి వారికి ఫీజులు వర్తించవని వెల్లడించారు. బిల్లు చూపించకపోతే అలాంటి వారి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయొచ్చని స్పష్టం చేశారు. గంటకుపైగా పార్కింగ్ చేసిన వాహన చోదకులు సినిమా టికెట్, ఇతరత్రా బిల్లులు చూపినట్లయితే ఉచితమని, ఆధారం చూపని వారి నుంచి ఫీజులు వసూలు చేయొచ్చన్నారు. -
నాలుగు రోజుల్లో ఎలా సాధ్యం..?
జిల్లాలో సుమారు 20,04,581 మంది ఉండగా, వీరిలో 18,03,661 మంది ఈ– కేవైసీని నమోదు చేసుకొని ఉన్నారు. మిగిలిన 2,00,920 మంది ఇంకా చేసుకోవాల్సి ఉంది. వాస్తవానికి ప్రతి నెలా ఒకటి నుంచి 17 వరకే రేషన్ సరుకులను ఇస్తారు. ఈ తరుణంలో తమకు అనువైన తేదీలను లబ్ధిదారులు ఎంపిక చేసుకొని ఆ రోజుల్లో వీటిని పొందుతారు. నెలాఖరులో ఈ వ్యవహారాన్నే అసలు పట్టించుకోరు. ఈ క్రమంలో రానున్న నాలుగు రోజుల్లో వీరందరికీ సమాచారమిచ్చి, ప్రక్రియను జరపడం ఎంత వరకు సాధ్యమనే అనుమానం వ్యక్తమవుతోంది. -
అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానే తప్ప భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. డైకస్ రోడ్డులోని తన క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. తన నివాసం వద్ద నాలుగు రోజులుగా రేయింబవళ్లూ తన కోసం రక్షణగా నిలిచిన పార్టీ శ్రేణులను చూస్తే గర్వంగా ఉందని చెప్పారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే సంఘటితంగా అందరూ నిలబడతామనే స్ఫూర్తి నింపిన పార్టీ జిల్లా శ్రేణులకు హ్యాట్సాఫ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్ని.. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని చూస్తే ప్రజలు తిరగబడి రోడ్లపైకి వస్తారన్నారు. తనపై మోపిన అక్రమ కేసు విషయంలో ఇది రుజువైందని చెప్పారు. పోలీసులు రోజుకొకర్ని తీసుకొచ్చి తప్పుడు కేసులు నమోదు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తున్నా, న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తామంటున్నారని, ఈ ఉడత బెదిరింపులకు భయపడేవారెవరూ లేరని చెప్పారు. తనకు అండగా నిలిచిన రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలను తెలియజేశారు. కాకాణితో ప్రసన్న భేటీ కాకాణి గోవర్ధన్‌రెడ్డితో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు తదితరులు భేటీ అయ్యారు. భారీగా మోహరించిన కార్యకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన ఇంటి వద్ద నేతలు, కార్యకర్తలను గురువారం రాత్రి భారీగా మోహరించారు. అక్రమ కేసులో తమ నాయకుడ్ని అరెస్ట్ చేస్తే ఊరుకునేదిలేదని నినాదాలు చేశారు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారనే సంకేతాలతో డైకస్‌రోడ్డు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పొద్దుపోయాక కాకాణి నివాసానికి ఆయా గ్రామాల నుంచి కార్యకర్తలు చేరుకుంటున్నారు. -
తల్లీబిడ్డలపై మమకారం చూపాలి
నెల్లూరు రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు పొందుతున్న తల్లీబిడ్డలపై మమకారం, వాత్సల్యం చూపాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై కలెక్టర్ ఆనంద్‌తో కలిసి కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయ్లెట్ల నిర్వహణలో పురోగతి చూపాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సుపోషిత్ పంచాయతీల్లో నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలను కల్పిస్తే వాటికి గుర్తింపుతో పాటు రూ.లక్ష పారితోషికం లభించనుందని చెప్పారు. గర్భిణులకు నిర్దేశించిన పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించారు. పాఠశాల డ్రాపౌట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కనీసం పదో తరగతి పూర్తిచేసేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గృహ హింస చట్టాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఆత్మసంతృప్తితో పనిచేయండి అంగన్వాడీ కార్యకర్తలు ఆత్మ సంతృప్తితో పనిచేయాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. పిల్లల ఎత్తు, బరువును ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఉదయగిరి కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించిన చెక్క ఆట వస్తువులను ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి తిలకించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్ కోరారు. అనంతరం బాలల న్యాయచట్టం పోస్టర్లను ఆవిష్కరించారు. కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, ఐసీడీఎస్ ఆర్జేడీ జయలక్ష్మి, పీడీ నిర్మలాదేవి, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, ఆర్డీఓలు అనూష, పావని, వంశీకృష్ణ, డీఎస్పీ సింధుప్రియ, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ తదితరులు పాలొన్నారు. రాపూరులో రూ.1.41 కోట్ల దుర్వినియోగం నెల్లూరు (పొగతోట): రాపూరు మండలంలో సంఘబంధం, పొదుపు సంఘాల సభ్యులకు తెలియకుండా రూ.1.41 కోట్లను దుర్వినియోగం చేశారని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో రూ.57 లక్షలను రికవరీ కింద జమ చేశామన్నారు. రూ.84 లక్షలను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి ఏడుగురు సిబ్బందిపై చర్యలకు నిర్దేశించామని, వివరణ అనంతరం తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. -
జిల్లాలో రేషన్‌కార్డులిలా..
కావలి: రేషన్‌కార్డుదారులపై ఈ – కేవైసీ పిడుగు పడింది. పేదల గుర్తింపునకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ తరుణంలో ఇందులో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ నెలాఖరులోపు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా చేయించుకోలేకపోతే వారికి ఇతర సంక్షేమ పథకాలు అందకుండాపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఉగాదిన ప్రారంభించనున్న పీ – 4 కార్యక్రమంలో తొలి ఎత్తు ఇదేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేయించుకోలేదా.. సరుకులు బంద్ ఈ – కేవైసీని చేయించుకోకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి సరుకులను పంపిణీ చేయరనే చర్చా నడుస్తోంది. సర్కార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు పొందే ప్రతి ఒక్కరూ తమ వేలిముద్ర వేసే ఈ – కేవైసీ ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఇది లేకపోయినా, సరుకులు సజావుగా అందేవి. అయితే ఇక నుంచి అలా కుదరదని, ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కార్డుతో అనుసంధానం కాని వారి జాబితాలను సిద్ధం చేసి, డీలర్లకు ఆ సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో దీన్ని చేయించుకోని ఐదేళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారు రేషన్ షాపులకెళ్లి ఈ – పాస్ యంత్రంపై వేలిముద్ర వేసి, డీలర్ లాగిన్‌లో ఈ – కేవైసీని పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉందని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు ఇప్పటికే గ్రామ / వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ.. ఈ – కేవైసీ కోసం వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న చిరుద్యోగులు, కూలీ పనులు చేసుకునే వారు దీనికి దూరమవుతున్నారు. ఈ కసరత్తుతో రేషన్‌కార్డులకు భారీగా కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రక్రియ జరగకపోతే సదరు రేషన్‌కార్డు రద్దు జాబితాలో చేరే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి 7,33,520 ప్రస్తుతం ఉన్నవి 7,21,567 కోతకు గురైనవి 11,953 ప్రతి నెలా సరుకుల పంపిణీ తీరిదీ.. (టన్నుల్లో) బియ్యం – 10,500 కందిపప్పు – 700 చక్కెర – 340 వేలిముద్రలను నాలుగు రోజుల్లో సేకరించాల్సిందే కుటుంబంలోని అందరూ రావాలని హుకుం 31లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం పేదలపై కూటమి ప్రభుత్వ కన్నెర్ర నెలాఖరుకు పూర్తి చేయాల్సిందే జిల్లాలో రేషన్‌్ కార్డుల లబ్ధిదారుల ఈ – కేవైసీ ప్రక్రియను ఈ నెలాఖరుకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందే. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ డీలర్ల వద్దకెళ్లి చేయించుకోవాలి. దీన్ని వేగవంతంగా పూర్తి చేయా లని ఆదేశాలు జారీ చేశాం. – డి.అంకయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
విలువలకు పాతర
ప్రలోభాల ఎర.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల తిరస్కరణకు గురై పెద్ద సున్నాకే పరిమితమైన టీడీపీ.. ప్రస్తుతం అధికార మదంతో విలువలకు పాతరేసి.. ప్రలోభాలను ఎరవేసి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఇలా ఎంపీపీ పదవిని దక్కించుకొని ప్రజా తీర్పును అపహాస్యం చేసింది. ఎంపీటీసీలు వారి స్వలాభం కోసం.. అందలమెక్కించిన తమను నిలువునా మోసం చేశారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నిక నేటికి వాయిదా కావలి: దగదర్తి వైస్ ఎంపీపీ పదవికి గురువారం నిర్వహించాల్సిన ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. మండలంలో 11 మంది ఎంపీటీసీలు ఉండగా, వీరిలో శ్రీరామపురం ఎంపీటీసీ సభ్యురాలు పీతల కామేశ్వరమ్మ వైస్ ఎంపీపీగా ఉండేవారు. మండలంలోని చెన్నూరు సచివాలయంలో విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం రావడంతో తన పదవులకు ఆమె రాజీనామా చేశారు. మండలంలో ప్రస్తుతం పది మంది ఎంపీటీసీలకు గానూ ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ ఉన్నారు. ఖాళీ అయిన రెండో వైస్ ఎంపీపీని మిగిలిన ఎనిమిది మంది ఎన్నుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎన్నికను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి ఎన్నికల అధికారులుగా పంచాయతీరాజ్, నెల్లూరు ఈఈ సుబ్బరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటలు దాటినా ఎంపీటీసీలెవరూ హాజరుకాలేదు. మరో గంటను అదనంగా కేటాయించినా, ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. కావలి రూరల్ సీఐ పాపారావు ఆధ్వర్యంలో దగదర్తి ఎస్సై జంపానికుమార్ తదితరులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ధనాన్ని వెదజల్లి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ ● నాడు తిరస్కరణకు గురై.. సున్నాకే పరిమితం ● ఓట్లేసిన ప్రజలను వంచించిన ఎంపీటీసీలు విడవలూరు: మూడున్నరేళ్ల క్రితం నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేక టీడీపీ చతికిలపడింది. ప్రజాతీర్పుతో కళ్లుబైర్లు కమ్మి.. తమ స్థానమేమిటో తెలుసుకున్న ఆ పార్టీ నేడు అధికార బలంతో విర్రవీగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన ఏడుగురు ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి.. అభివృద్ధిని చూసి తమ వెంట వచ్చారంటూ ఊదరగొట్టి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ ఎన్నిక వింత రాజకీయాలకు వేదికై ంది. ఈ పరిణామాలను చూసి ప్రజలు నివ్వెరబోయారు. నాడిలా.. 2021లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు గానూ 12 స్థానాలను వైఎస్సార్సీపీ, మిగిలిన రెండింటిని సీపీఎం దక్కించుకున్నాయి. విడవలూరుకు చెందిన వేణుంబాక భవానమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఏడాది జనవరి 29న అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. తదనంతరం అదే పార్టీ మద్దతుదారైన ముదివర్తికి చెందిన కాయల సౌందర్య ఇన్చార్జి ఎంపీపీగా వ్యవహరిస్తూ వచ్చారు. పచ్చ కండువాలు కప్పి.. గతేడాది నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతలు టీడీపీ పంచన చేశారు. వీరితో పాటు ఇద్దరు ఎంపీటీసీలూ పచ్చ కండువా కప్పుకొన్నారు. మారిన రాజకీయ పరిణామాలతో ఊటుకూరుకు చెందిన ఏకుల శేషమ్మను తమ అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి వైఎస్సార్సీపీ మద్దతుదారులు, ఇద్దరు సీపీఎం ఎంపీటీసీల మద్దతూ లభించింది. దీంతో వీరు చూపు మిగిలిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై పడింది. వీరిని అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారు. రాత్రికి రాత్రే.. ఈ క్రమంలో బుధవారం రాత్రికి రాత్రే మండలంలోని ఐదుగురు ఎంపీటీసీల ఇళ్ల వద్దకు కార్లు రావడం.. ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిపోవడం వెనువెంటనే జరిగిపోయాయి. మరోవైపు ఎంపీపీ పదవి టీడీపీ కై వసం అనే మెసేజ్‌ను విడవలూరు మండలాధికారులు అనే వాట్సాప్ గ్రూపులో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్ధిగా పోటీ చేసిన బాలకృష్ణ అనే వ్యక్తి పోస్ట్ చేయడం చర్చకు దాతీసింది. అదృశ్యమై.. ఎన్నికకు ముందు ప్రత్యక్షం కనిపించకుండా పోయిన ఎంపీటీసీలు, మరికొందరు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు టీడీపీ నేతలతో కలిసి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకొని, ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీంతో కోరం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. పీఆర్ డీఈఈ మోహన్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, ఎంపీడీఓ నగేష్‌కుమారి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విలువలకు కట్టుబడిన నలుగురు టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, నలుగురు ఎంపీటీసీలు లొంగలేదు. తమకు అవకాశమిచ్చిన వైఎస్సార్సీపీకి.. నమ్మి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేయకుండా విలువలకు కట్టుబడి పలువురి ప్రశంసలను అందుకున్నారు. ఇది తీసుకొని.. మాకు జై కొట్టండి..ఏకపక్షంగా.. పొదలకూరు: మండలంలోని తాటిపర్తి పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు వార్డు సభ్యులు పాల్గొనకపోవడంతో ప్రక్రియను ఏకపక్షంగా పూర్తి చేశారు. తాటిపర్తి సమస్యాత్మక గ్రామం కావడంతో నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 144 సెక్షన్‌ను విధించారు. పంచాయతీ మూడో వార్డు సభ్యురాలు కర్పూరం పెంచలలక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి ఇక్కడ మొత్తం 14 వార్డులుండగా, టీడీపీ మద్దతుదారులు ఐదుగురున్నారు. ఇటీవల టీడీపీ శిబిరంలో ముగ్గురు చేరడంతో వారి బలం పెరిగింది. దీంతో పెంచలలక్ష్మమ్మ ఎన్నిక ఏకగ్రీవమైంది. బందోబస్తును పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై హనీఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రక్రియను పంచాయతీ ఇన్చార్జి సెక్రటరీ సురేష్ నిర్వహించారు. -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం
ఆత్మకూరు రూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఆర్భాటపు ప్రచారానికే పరిమితమైన ప్రభుత్వం, రైతులకు చేయూతనందించడంలో విఫలమైందని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన రైతు సంఘ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకుపైగా వరి సాగైతే, 3.57 లక్షల ఎకరాలకే ఈ – క్రాప్‌ను నమోదు చేశారని ఆరోపించారు. జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రకటించినా, చాలా చోట్ల గోతాలను సైతం ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్టగా అభివర్ణించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పటి వరకు కేవలం 50 వేల పుట్ల ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారని చెప్పారు. ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ మొత్తాన్ని ఇస్తుండటంతో, పది శాతం మంది రైతులే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయానికి మొగ్గుచూపుతున్నారని చెప్పారు. రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మూలె వెంగయ్య, సహాయ కార్యదర్శులు శ్రీనివాసులు, జనార్దన్, ఉపాధ్యక్షుడు లక్కు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సబ్సిడీ జమను పరిశీలించండి నెల్లూరు రూరల్: దీపం – 2 స్కీమ్ కింద లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం జమైందో లేదో పరిశీలించుకోవాలని జేసీ కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోర్టల్‌ను ఓపెన్ చేసి లబ్ధిదారుల 17 అంకెల ఎల్పీజీ గ్యాస్ ఐడీ లేదా రేషన్‌కార్డు నంబర్‌ను నమోదు చేస్తే ఓటీపీ వస్తుందని, దీన్ని ఎంటర్ చేయడం ద్వారా సబ్సిడీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చన్నారు. -
వన్యప్రాణుల గొంతెండుతోంది
●నీటిని నింపుతున్నాం పెంచల నరసింహా వైల్డ్ లైఫ్ ప్రాంతంలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తున్నాం. 400 తొ ట్టెల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. వన్యప్రాణులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మిగతా రేంజ్ పరిధిలో నీటి తొట్టెల్లేవు. ఆ ప్రాంతంలో వాననీరు కుంటల్లో నిల్వ ఉండేలా ప్రయత్నం చేశాం. అటవీ ప్రాంతంలో ఉండే జంతువులు, అరుదైన వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అటవీ ప్రాంతంలో గడ్డికి నిప్పు అంటించడం నేరం. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. – మహబూబ్‌బాషా, జిల్లా అటవీ శాఖాధికారి వేసవి తాపం పెరిగిపోయింది. గతేడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మండుతున్న ఎండలతో వన్యప్రాణులు జీవన్మరణ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడవిలో సహజ సిద్ధంగా ఉండే కుంటల్లో నీటి నిల్వలు లేక దాహార్తి తీర్చుకునేందుకు ప్రాణులు గ్రామాల వైపు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. వేసవి దృష్ట్యా అటవీ శాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఉదయగిరి: జిల్లాలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ వన్యప్రాణులకు నిలయం. ముఖ్యంగా పెంచలకోన, ఆత్మకూరు, ఉదయగిరి అటవీ ప్రాంతాల్లో అరుదైన జంతు, వృక్ష సంపద ఉంది. ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేసవిలో దాహార్తి తీర్చేందుకు అటవీ ప్రాంతంలో ఉండే మడుగులు, చలమల్లో నీటి నిల్వలు అడుగుంటాయి. దీంతో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల వైపు పరుగులు తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. తాగునీటి వనరులను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటవీ ప్రాంతం ఇలా.. నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల సరిహద్దులు ఆనుకుని సుమారు 5.40 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పెంచలకోన అటవీ ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ఆత్మకూరు, ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, నెమళ్లు, కుందేలున్నాయి. ఎలుగుబంట్లు, తోడేళ్లు, నక్కలు, ఉడుములు, కణుతులు కూడా ఉన్నాయి. వేసవిలో ఇబ్బందులు వేసవి వచ్చింటే అటవీ ప్రాంతంలో ఉండే జలాలు పూర్తిగా ఎండిపోతాయి. దీంతో ప్రాణులు నీటి కోసం అటవీ ప్రాంతం వదలి మైదానాల వైపు పరుగులు తీస్తాయి. ఈ క్రమంలో నెల్లూరు – బద్వేలు, కావలి – సీతారామపురం, ఉదయగిరి – నందవరం తదితర రహదారులు, గ్రామాల వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని వేటగాళ్ల బారిన పడుతున్నాయి. కొంతమంది నాటు తుపాకులు, నాటు బాంబులు, పేలుడు పదార్థాలు ఉపయోగించి మట్టుబెడుతున్నారు. మరికొన్ని రోడ్డు ప్రమదాల బారిన పడి మృత్యవాత పడుతున్నాయి. ప్రత్యేక చర్యలు అవసరం వేసవి కాలం ప్రారంభమై ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనుషులే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వన్యప్రాణుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి కోసం వన్యప్రాణులు అటవీ ప్రాంతం వదిలి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించాలి. నిధులు సక్రమంగా ఖర్చు చేసి కుంటల్లో నీరు నిల్వ చేయాలి. ట్యాంకర్లతో తొట్టెల్లో నీరు నింపాలి. అసరమైతే నీటి కుంటలు మరికొన్ని ఏర్పాటు చేయాలి. సహజ సిద్ధంగా ఉన్న కుంటల్లో నీరుండేలా చర్యలు చేపట్టాలి. దీంతో పులులు, జింకలు, చిరుతలు, దుప్పలు తదితర వన్యప్రాణులు అక్కడకి వచ్చి నీరు తాగుతాయి. గ్రామాలవైపు వచ్చే అవసరం ఉండదు. సంరక్షణకు.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతం అనుకుని ఉన్న గ్రామాల్లో ఆ శాఖ అధికారులు కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వేసవిలో అడవుల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవల ఉదయగిరి ప్రాంతంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయి. దీని నివారణకు కళాజాతా బృందాలతో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడవుల్లో అడుగంటిన నీటి నిల్వలు దాహార్తితో గ్రామాల్లోకి వన్యప్రాణులు మృత్యవాత పడుతున్న వైనం రాబోయే రోజుల్లో సమస్య మరింత జటిలం ప్రత్యామ్నాయంపై దృష్టి అవసరం -
జిల్లా జైల్లో న్యాయ విజ్ఞాన సదస్సు
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట సమీపంలో ఉన్న జిల్లా జైల్లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి విచ్చేసి ఖైదీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజన వసతి, వైద్య సదుపాయాల గురించి ఆరాతీశారు. లాయర్ లేనివారికి ఉచితంగా ఆ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా జైల్లో పారా లీగల్ వలంటీర్‌ను నియమించడం జరిగిందని, వారి ద్వారా సమస్యలపై అర్జీలు సమర్పిస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ‘మీరు దగ్గరుంటే ఈత రాదు’ ● కుమార్తెకు స్విమ్మింగ్ నేర్పించేందుకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు ● వారిని పంపించేసిన నిర్వాహకులు ● స్విమ్మింగ్‌పూల్‌లో బాలిక మృతి ● ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘటన నెల్లూరు(క్రైమ్): స్విమ్మింగ్‌పూల్ నిర్వహణలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈత నేర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక మృతిచెందిన ఘటన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జీవీఆర్ఆర్ కళాశాల సమీపంలోని సప్తగిరి లేఅవుట్లో వంశీకృష్ణ, ఆదిలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె, కుమారుడున్నారు. కుమార్తె మనస్వి (9) వెంకటాచలంలోని ఓ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. బాలికకు ఈత నేర్పించేందుకు తల్లిదండ్రులు బుధవారం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఫీజు చెల్లించారు. గురువారం సాయంత్రం మనస్విని స్విమ్మింగ్‌పూల్ వద్దకు తీసుకెళ్లారు. మీరు దగ్గరుంటే నేర్చుకోలేరని సిబ్బంది తల్లిదండ్రులను పంపివేశారు. ఈ క్రమంలో స్విమ్మింగ్‌పూల్‌లో ఏమైందో తెలియదు గానీ సాయంత్రం 6.30 గంటలకు సిబ్బంది మనస్వి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఈత నేర్చుకుంటుండగా బాలికకు ఫిట్స్ వచ్చాయని, శ్వాస తీసుకోలేకపోవడంతో బొల్లినేని ఆస్పత్రికి తీసుకెళుతున్నామని చెప్పారు. వంశీకృష్ణ, ఆదిలక్ష్మి వెంటనే ఆస్పత్రికి వెళ్లేసరికి కుమార్తె మృతిచెంది ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం, పూల్ వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తమ కుమార్తె మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు వారు దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర కమిటీల్లో జిల్లా నేతలకు చోటునెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నేతలకు రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు విభాగం అఫిషియల్ స్పోక్స్‌పర్సన్‌గా బట్టేపాటి నరేంద్రరెడ్డి, సెక్రటరీగా దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా కర్తం శ్రీనివాసులురెడ్డి, కర్తం సురేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ సెక్రటరీగా కొండా వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీలుగా స్వర్ణా వెంకయ్య, కుందుర్తి శ్రీనివాసులు, బద్దేపూడి రవీంద్ర, మందా రవికుమార్, వలంటీర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా కుంచాల సవీంద్రరెడ్డి, సెక్రటరీగా పీర్ల పార్థసారథి, జాయింట్ సెక్రటరీగా ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, బూత్ కమిటీల వింగ్ జనరల్ సెక్రటరీగా యనమాల భగవాన్, జాయింట్ సెక్రటరీలుగా ఎ.రాజశేఖరరెడ్డి, గణేషం గంగిరెడ్డి, మొలకల శ్రీనివాసులురెడ్డి, సోషల్ మీడియా వింగ్ సెక్రటరీగా మహ్మద్ రవూఫ్, వీవర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా కోనం బ్రహ్మయ్య, జాయింట్ సెక్రటరీగా చేబ్రోలు జనార్దన్‌లు నియమితులయ్యారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిసోమశిల: అనంతసాగరం మండలం చిలకలమర్రి సమీపంలో పాతాళపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అనంతసాగరానికి చెందిన షేక్ ఇబ్రహీం కుమారుడు షేక్ హమీద్ (29) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం పని నిమిత్తం అనంతసాగరం నుంచి గోవిందంపల్లికి బైక్‌పై వెళ్తున్నాడు. యాకర్లపాడు నుంచి యోహాన్ అనే వ్యక్తి కలువాయికి బైక్‌పై వెళ్తున్నాడు. పాతాళపల్లి వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తలకు గాయమై హమీద్ అక్కడికక్కడే మృతిచెందాడు. యోహాన్ గాయపడగా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని సోమశిల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలునెల్లూరు రూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా జేసీ కె.కార్తీక్ తెలిపారు. గురువారం 3,088 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.75 సన్నవి : రూ.60 పండ్లు : రూ.35 -
పెళ్లి చేసుకుని మోసం చేశాడు
● భర్త ఇంటి ముందు భార్య ఆందోళన సంగం: వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సహజీవనం చేశారు. వివాహం చేసుకున్నారు. అయితే భార్యను వదిలేసి భర్త స్వగ్రామానికి వచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన గిరిజన యువతి సంగంలో భర్త ఇంటి వద్ద గురువారం ఆందోళన చేసింది. బాధిత యువతి స్థానిక పోలీసులకు తెలిపిన వివరాల మేరకు వివరాలిలా ఉన్నాయి.. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన గిరిజన యువతి లక్ష్మి, సంగంలోని మసీదు సెంటర్‌కు చెందిన షేక్ మన్సూర్ ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. వేర్వేరు చోట్ల పనిచేస్తున్న వీరు ప్రేమించుకున్నారు. సహజీవనం చేశారు. లక్ష్మి ఒత్తిడితో నెలరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మన్సూర్ తల్లిదండ్రులు, అన్న ఒత్తిడి చేయడంతో అతను సంగం వచ్చేశాడు. మరో మహిళతో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న లక్ష్మి బుధవారం హైదరాబాద్ నుంచి సంగం వచ్చింది. మన్సూర్ లేకపోవడం.. అతని తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారి ఇంటి ముందు బైఠాయించింది. తనకు, మన్సూర్‌కు వివాహమైనట్లుగా ఫొటోలు చూపించి కన్నీటిపర్యంతమవుతోంది. గతంలో ఈ విషయమై సంగం, హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని లక్ష్మి చెబుతోంది. అప్పుడు హైదరాబాద్‌లో మన్సూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానని చెప్పి మోసం చేయడంతో సంగం వచ్చానని లక్ష్మి వెల్లడించింది. అతని తల్లిదండ్రులను అభ్యర్థించినా పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరైంది. మన్సూర్ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం ఈ విషయమై ఎస్సై రాజేష్ స్పందిస్తూ మన్సూర్ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. భార్యాభర్తలను కలపాలని సూచించామన్నారు. లక్ష్మిని ఆమె బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. ఈ విషయమై మన్సూర్ తల్లిదండ్రులను విలేకరులు ప్రశ్నించగా వారు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. -
చాపకింద నీరులా క్రికెట్ బెట్టింగ్
నెల్లూరు(క్రైమ్): ‘ఐపీఎల్ ప్రారంభం కావడంతో జిల్లాలో బెట్టింగ్ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ విష వలయంలో చిక్కుకుని యువత జీవితాలను నాశనం చేసుకుంటోంది. బెట్టింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. గురువారం యువజన, విద్యార్థి విభాగాల నేతలు నగర డీఎస్పీ పి.సింధుప్రియను నెల్లూరులోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ బెట్టింగ్ కారణంగా అనేకమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునేందుకు వెనుకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ మాఫియాను కట్టడి చేసేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. పోలీస్ అధికారులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మాఫియా, బెట్టింగ్ యాప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లపై నిఘా పెంచాలన్నారు. నష్టాలను తెలియజేసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు ఆశ్రిత్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో లాడ్జీలు, హోటల్స్, గెస్ట్ఇన్లలో బెట్టింగ్ జోరుగా సాగుతోందన్నారు. సులభంగా నగదు సంపాదించవచ్చని నిర్వాహకులు యువత, విద్యార్థులకు ఆశచూపి బెట్టింగ్ ఊబిలో దించుతున్నారన్నారు. బానిసైన అనేకమంది బయటకు రాలేక నష్టాలను భర్తీ చేసుకోవడానికి, అప్పులు తీర్చుకునేందుకు నేరాలకు పాల్పడుతూ భవిష్యత్‌ను అంథకారం చేసుకుంటున్నారన్నారు. స్పందించిన డీఎస్పీ క్రికెట్ బెట్టింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు గుర్తిస్తే డయల్ 112, 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలు తీసుకోవాలి డీఎస్పీకి వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల వినతి -
కాకర్ల సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట
ఉదయగిరి: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు ముదిరాయి. తమ్ముళ్లు ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలోనే తన్నులాడుకున్నారు. స్థానిక మండ పరిషత్ కార్యాలయం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వచ్చారు. ఈ సమయంలో టీడీపీ మండల నేత మట్ల లక్ష్మయ్య కోడలైన ఎంపీపీ మట్ల శాంతి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియా ఫొటోలు తీసుకునే సమయంలో మాజీ జెడ్పీ చైర్మన్ చెంచలబాబుయాదవ్ మట్ల శాంతి పక్కన ఎమ్మెల్యే వద్ద నిలబడ్డాడు. దీంతో శాంతి వెనక్కి జరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో మట్ల లక్ష్మయ్య చెంచలబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడారు. చెంచలబాబు, పార్టీ మండల కన్వీనర్ బయ్యన్న, మైనార్టీ నేత రియాజ్ లక్ష్మయ్యపై ఘాటుగా స్పందించారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని లక్ష్మయ్యను పక్కకు లాకెళ్లారు. ఆయన పోలీసులను పక్కకు నెట్టేశారు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లక్ష్మయ్యకు సర్ది చెప్పి మండల సమావేశానికి బయలు దేరారు. ఈ క్రమంలో లక్ష్మయ్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడంతో సీఐ సీరియస్ కావడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించే క్రమంలో ఉదయం జరిగిన ఘటన వ్యవహారంపై మరోసారి చెలరేగింది. దీంతో మట్ల లక్ష్మయ్య, చెంచలబాబు వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. లక్ష్మయ్యపై మరో టీడీపీ నేత నల్లిపోగు రాజా చేయికున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని లక్ష్మయ్య బ్రదర్స్‌తో మాట్లాడి సర్దుబాటు చేశారు. -
డీసీపల్లిలో 563 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం 563 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 603 బేళ్లు రాగా 563 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. కిలోకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.260 లభించింది. సగటు ధర రూ.274.20గా నమోదైంది. వేలంలో 75,196 కిలోల పొగాకును విక్రయించగా రూ.20618965.20 వ్యాపారం జరిగింది. వేలంలో 9 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌పై వీఎస్‌యూ అధికారుల విచారణ కావలి: పట్టణంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కేంద్రంలో పనిచేస్తున్న సహాయ ప్రొఫెసర్ పి.గోపికృష్ణపై తీరుపై వీఎస్‌యూ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. పీజీ సెంటర్లో మహిళా అధ్యాపకులు, విద్యార్థినులను గోపీకృష్ణ అనేక రకాలుగా వేధిస్తున్నాడని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఐదుగురు సభ్యులతో కూడిన వర్సిటీ అధికారులు విచారణ చేశారు. విద్యార్థులు, మహిళ అధ్యాపకులు, విద్యార్థినుల విచారించి వీడియో రికార్డు చేశారు. చివరి దశకు ఇంటర్ పరీక్షల మూల్యాంకనం నెల్లూరు (టౌన్): ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి బాటని, జువాలజీ, కామర్స్ సబ్జెక్ట్‌ల ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభించినట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం నిర్వహించే అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ తెలుగు, హిందీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌ల మూ ల్యాంకనం పూర్తనట్లు చెప్పారు. మిగిలిన సబ్జెక్ట్‌లకు సంబంధించి మూల్యాంకనాన్ని వచ్చే నెల తొలి వారంలో పూర్తి కానున్నట్లు పేర్కొన్నారు. మూల్యాంకనంలో 1200 మందికి పైగా అధ్యాపకులు పాల్గొన్నట్లు తెలిపారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫేజ్–2కు ఎంపికై న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాధాన్యత క్రమం వెబ్ ఆప్షన్స్ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖాధికారిణి కె.శోభారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థుల వివరాలు https:// mdfc. apcfss. in, https:// jnanabhumi. ap. gov. in వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి ఈ నెల 28వ తేదీ చివరి గడువని తెలిపారు. ఇతర వివరాలకు 95816 30003 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి మంటలు
● అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ● రూ.30 వేల నష్టం మనుబోలు: రైల్వేస్టేషన్ యార్డులో ఆగి ఉన్న బొగ్గు గూడ్స్ వ్యాగన్ నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో స్టేషన్ మాస్టర్ అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటన బుధవారం మనుబోలు మండలంలోని కొమ్మలపూడి రైల్వేస్టేషన్లో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది కథనం మేరకు.. కృష్ణపట్నం పోర్టు నుంచి చైన్నెకు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు కొమ్మలపూడి స్టేషన్ వద్ద సిగ్నల్ లేకపోవడంతో ఆగింది. ఈ సమయంలో ఎండ తీవ్రత, బొగ్గు మధ్య ఒత్తిడి కారణంగా ఓ వ్యాగన్ నుంచి పొగలు రావడం గమనించిన స్టేషన్ మాస్టర్ రాజేంద్రభగత్ వెంటనే గూడూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన కొమ్మలపూడి రైల్వేస్టేషన్ వద్దకు చేరుకుని వ్యాగన్లో మంటలను ఆర్పి అదుపు చేశారు. బొగ్గు వ్యాగన్లో పాక్షికంగా కాలిపోవడంతో సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ విజయ్‌కుమార్, ఫైర్మాన్లు సంపత్‌కుమార్, ప్రదీప్, శ్రీహరి తదతరులున్నారు. -
ఏపీఐఐసీకి షుగర్ ఫ్యాక్టరీ భూములు
● సీఎంను కోరిన కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కలెక్టర్ ఆనంద్ సీఎం చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లాకు సంబంధించిన అంశాలను సీఎంకు వివరించారు. చాలా ఏళ్లుగా చక్కెర కర్మాగారం మూతబడి ఉందన్నారు. నెల్లూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డునున్న ఈ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాలను పరిశ్రమల స్థాపనకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు అనుమతి మంజూరు చేయాలని విన్నవించారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రైతులు, కార్మికులకు సంబంధించిన రూ.28 కోట్ల బకాయిల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి బకాయిలు చెల్లించి, పరిశ్రమల స్థాపనకు భూమిని ఏపీఐఐసీకి అప్పగించాలని జిల్లా ప్రత్యేకాధికారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ను ఆదేశించారు. సోమశిల ప్రాజెక్ట్ అభివృద్ధి పనుల్ని మొదలుపెట్టినట్లు కలెక్టర్ తెలిపారు. రామాయపట్నం పోర్టు వద్ద పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ ఆగస్ట్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు 500 ఎకరాల భూమి సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు జాలర్ల అక్రమ ప్రవేశాలు, దాడుల సమస్యను కలెక్టర్ సీఎంకు వివరించారు. -
కాకాణి ఇంటి వద్ద హైటెన్షన్
నెల్లూరు (పొగతోట): మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకాణిని ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన నివాసం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. మరో వైపు జిల్లా వ్యాప్తంగా ముఖ్య నేతలు సైతం ఆయన నివాసానికి చేరుకుని జరగబోయే పరిణామాలపై చర్చిస్తున్నారు. మరో వైపు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం ఆయన నివాసం, పార్టీ జిల్లా కార్యాలయం వద్దనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారుల సమాచారాన్ని అందిస్తున్నారు. పొదలకూరు మండలం తాడిపత్రి సమీపంలో రుస్తుం మైన్‌లో లీజు ముగిసినా అక్రమంగా రూ.250 కోట్ల తెల్ల రాయిని దోచేశారంటూ మైనింగ్‌పై పచ్చమీడియా కల్పిత కథనాలు వండి వారుస్తోంది. మరో వైపు మైనింగ్ శాఖాధికారులు సుమారు 60 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా తరలిపోయినట్లు పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో పది మందిపై కేసు పెట్టారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏ–4 గా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ రిమాండ్ రిపోర్టులో రూ.7 కోట్లుగా చూపించారు. ఈ క్రమంలో కాకాణిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారంటూ రెండు రోజుల నుంచి విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. దీంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని కాకాణి అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఇంటి వద్ద భారీ సంఖ్యలో చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు రాత్రి నుంచి కాకాణి నివాసం వద్దే ఉన్నారు. వైఎస్సార్సీపీ నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీ కాకాణితో సమావేశమయ్యారు. పెద్ద ఎత్తున అనుచరులు, నాయకులు, కార్యకర్తలు ఉండడంతో పోలీసులు కాకాణిని అరెస్ట్ చేసేందుకు వెళితే గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకాణికి సంఘీభావంగా మరికొంత మంది నాయకులు ఆయన నివాసానికి చేరుకుని ఆయనతో చర్చించారు. నెల్లూరులో ఏ క్షణం ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలు ముఖ్య నేతలతో భేటీ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వర్గాల నిఘా -
29న నెల్లూరు బార్ అసోసియేషన్ వార్షికోత్సవం
● ముఖ్యఅతిథిగా హైకోర్టు జడ్జి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు(లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమం ఈనెల 29వ తేదీ శనివారం సాయంత్రం 6.30కు జిల్లా కోర్టు ఆవరణలో జరుగుతుందని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుందరయ్య యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసులురెడ్డి, విశిష్ట అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి విచ్చేస్తారన్నారు. న్యాయవాదులు పాల్గొని వేడుకల్ని విజయవంతం చేయాలని కోరారు. 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలునెల్లూరు రూరల్: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కె.కార్తీక్ తెలిపారు. బుధవారం 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా ప్రకటన విడుదల చేశారు. రూ.100.9 కోట్లు రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. పదిమంది విద్యార్థుల ఎంపికవెంకటాచలం: ఈనెల 28వ తేదీన గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయిలో జరిగే వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2025 కార్యక్రమానికి పదిమంది విద్యార్థులను ఎంపిక చేశారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కార్యక్రమంలో 75 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో పదిమందిని ఎంపిక చేయగా బుధవారం వీసీ అల్లం శ్రీనివాసరావు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభినందించారు. -
అంతా గాలి లెక్కలే..
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో అదిగో అభివృద్ధి.. ఇదిగో అభివృద్ధి అంటూ అధికార పార్టీ నాయకులు ఆర్భాటంగా చెబుతున్నారు. కానీ 2025 – 26 బడ్జెట్‌ను చూస్తే అంకెల గారడీ తప్ప ఇంకేం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.695.95 కోట్ల బడ్జెట్ గాలి లెక్కలేనంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిలదీయగా.. టీడీపీకి చెందిన కొందరు కూడా అధికారులను ప్రశ్నించారు. ఇరువర్గాలు ప్రశ్నల వర్షం కురిపించగా అధికారులు లెక్కలను పూర్తి స్థాయిలో వివరించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరపాలక సంస్థలో ఈ పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశమైంది. అడ్డుపడుతూ.. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశం మొదలైంది. మొత్తం బడ్జెట్‌ను రూ.695.95 కోట్లతో రూపొందించగా, ప్రణాళికా వ్యయం రూ.448.52 కోట్లు ఉండగా, ప్రణాళికేతర వ్యయం రూ.247.43 కోట్లుగా ఉంది. సమావేశం ప్రారంభమయ్యాక వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, వేలూరు మహేష్, మొయిళ్ల గౌరీలు ప్రజా సమస్యలపై మాట్లాడే క్రమంలో కొందరు టీడీపీ కార్పొరేటర్లు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉడాయించిన టీడీపీ కార్పొరేటర్లు సమావేశం ప్రారంభమయ్యాక 12 గంటలకు పదిమందికి పైగా టీడీపీ కార్పొరేటర్లు ఉడాయించారు. తమ డివిజన్లలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వారికి ఓపిక లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. జనసేన నేత, కో–ఆప్షన్ సభ్యుడు నూనె మల్లికార్జున్ యాదవ్ సమావేశానికి ఆలస్యంగా వచ్చి కేవలం పదినిమిషాలు మాత్రమే ఉండి అరుపులు, కేకలతో కొంతసేపు హడావుడి చేసి నెమ్మదిగా జారుకున్నారు. కొందరు ఆయన తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. జెరాక్స్‌కు అంత మొత్తమా.. 2024 – 25 సంవత్సరానికి కార్పొరేషన్లో స్టేషనరీ కోసం రూ.రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు బడ్జెట్ లెక్కలు చూపడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిలదీశారు. అంత ఎందుకు అవుతుందని అడగ్గా అధికారులు నీళ్లు నమిలారు. అదేవిధంగా జెరాక్స్ కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కార్పొరేషన్లో జెరాక్స్ మెషీన్లు లేవని, బయట తీసుకుంటున్నామని చెప్పారు. దీంతో కార్పొరేటర్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతుంటే కనీసం జెరాక్స్ మెషీన్లు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారా అని నిలదీశారు. బడ్జెట్లో మేయర్ పేషీకి 2023 – 24లో రూ.2,50,000 ఖర్చు చేసినట్లు చూపారు. 2024 – 25కు వచ్చేసరికి ఆ మొత్తం రూ.8 లక్షలకు పెరిగిందని, అంతలా దేనికి ఖర్చు చేశారని టీడీపీ కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. దీని విషయంలో అధికారులు లెక్కలు చెప్పడంలో తడబడ్డారు. కాగా కర్తం మాట్లాడుతూ తన డివిజన్లో తాగునీటి సమస్య ఉందన్నారు. నగర ప్రజలకు సక్రమంగా తాగునీరు అందించలేకపోతున్న ఇంజినీరింగ్ శాఖపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డు ప్రదర్శించారు. వారు సైతం.. టీడీపీ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి మాట్లాడుతూ పన్ను వసూళ్లలో అధికారుల తీరు బాగోలేదని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పుకొచ్చారు. కార్పొరేటర్ రామకృష్ణ మాట్లాడుతూ వీధిలైట్లు వెలగలేదని ఏఈకి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కర్తం ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పన్ను చెల్లించకపోతే కరెంట్, వాటర్ కట్ చేస్తామని ఉద్యోగులు ప్రజలను బెదిరిస్తున్నట్లు తెలిపారు. మేయర్ పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ పన్ను వసూళ్లలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం బడ్జెట్‌ను ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో కమిషనర్ సూర్యతేజ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.అధికారుల తీరు మారాలి ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. డివిజన్లలో జరిగే అభివృద్ధి పనులను సైతం కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావడం లేదు. అధికారులు తీరు మార్చుకోవాల్సి ఉంది. అదేవిధంగా బడ్జెట్ మొత్తం ఊహాజనితంగా ఉంది. సరైన లెక్కలు చూపలేదు. డిపార్ట్మెంట్ నుంచి కచ్చితమైన లెక్కల్లేవు. గతేడాదితో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ చూపారు. అవినీతి జరిగే అవకాశం ఉంది. – బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గతేడాది రూ.70 లక్షలు ఖర్చుచేసినట్లు చూపారు. రానున్న రోజుల్లో రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. బడ్జెట్లో మాత్రం అంకెల గారడీ చూపారు. 46వ డివిజన్లో ఓ సచివాలయంలో ప్రింటర్ చెడిపోయి మూడు నెలలు గడస్తున్నా పట్టించుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – వేలూరు మహేష్, కార్పొరేటర్ చిరు వ్యాపారులపై భారం రెవెన్యూ అధికారులు చిరు వ్యాపారులపై కమర్షియల్ ట్యాక్స్ పేరుతో భారం మోపుతున్నారు. డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వకుండా పన్నులు చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. బోర్డుల్లేని వ్యాపారులు కూడా ట్రేడ్ లైసెన్స్ కట్టాలని అధికారులు భారం మోపుతున్నారు. – మొయిళ్ల గౌరీ, కార్పొరేటర్ చర్యలు తీసుకోవాలి మందుల కొనుగోళ్లకు గత సంవత్సరం రూ.5 లక్షలు ఖర్చు చేశారు. రానున్న ఏడాదిలో రూ.15 లక్షల ఖర్చు చేస్తామని చూపించారు. పారిశుద్ధ్య కార్మికులకు మందులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి – సత్తార్, కార్పొరేటర్ రూ.695.95 కోట్లతో 2025 – 26 కార్పొరేషన్ బడ్జెట్ తప్పుడు లెక్కలు చూపారని వైఎస్సార్సీపీ నిలదీత అధికార పార్టీ కార్పొరేటర్ల నుంచీ ప్రశ్నల వర్షం నీళ్లు నమిలిన కొందరు అధికారులు మధ్యలో వెళ్లిపోయిన కొందరు టీడీపీ కార్పొరేటర్లు -
కావలిలో పేట్రేగుతున్న గ్రావెల్ మాఫియా
రూ.కోట్లల్లో దందా సాక్షి, టాస్క్‌ఫోర్స్: కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో నాణ్యమైన గ్రావెల్ ఖనిజం విస్తారంగా ఉంది. గ్రావెల్ తవ్వకాలకు మండలానికి ఒక మాఫియా లీడర్‌ను పెట్టుకుని స్వయంగా ఎమ్మెల్యే దగుమాటి గ్రావెల్ దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దగమాటి ఎమ్మెల్యే కాక ముందే జలదంకి మండలం అన్నవరం క్వారీల నుంచి అక్రమంగా కంకర రవాణాలో చేయడంలో అనుభవం ఉండడంతో ఆ అనుభవంతోనే విలువైన సహజ ఖనిజ (గ్రావెల్) సంపదను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హైవే అంచులు మెరక చేసేందుకు, లేఅవుట్ల ఏర్పాటుకు, ఇతర వాణిజ్య అవసరాలకు గ్రావెల్ తరలించేందుకు రాత్రి పగలూ తేడా లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. అందరి నోర్లు నొక్కి.. హైవే ఎక్కి.. గ్రావెల్ అక్రమంగా తవ్వి తరలించేందుకు ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ముందుగానే ఒప్పందాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి చెందిన లోకల్ నాయకులు స్థానిక అవసరాల కోసం గ్రావెల్ తరలించుకునేలా, ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులు బరి తెగించి సహజ వనరుల దోపిడీ చేస్తున్నారు. చెరువు పోరంబోకు భూముల్లో లోకల్ నాయకులు తవ్వుకుంటుంటే, హైవేకు దగ్గరగా ఉండే ప్రభుత్వ, ప్రైవేట్, అటవీ భూముల్లో ఎమ్మెల్యే అనుచరులు తవ్వుకుంటున్నారు. కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్న కీలక నాయకుడు గ్రావెల్ తలింపులో కీలకంగా మారాడు. అక్రమ తవ్వకాలను ఆర్గనైజ్ చేస్తూ గ్రామాలను గుల్లగుల్లగా మార్చేస్తున్నారు. కావలి మండలం రుద్రకోట, బుడమగుంట, ముసునూరు, గౌరవరం, బోగోలు మండలం ముంగమూరు, కొండబిట్రగుంట, పాతబిట్రగుంట, కడనూతల, కోవూరుపల్లి, బోగోలు, కప్పరాళ్లతిప్ప, దగదర్తి మండలం ఉలవపాళ్ల, దామవరం, సున్నపుబట్టి, కౌరుగుంట, అల్లూరు మండలం నార్త్‌ఆములూరు, తదితర ప్రాంతాల్లో ప్రతి రోజూ హిటాచీలు, జేసీబీలు, టిప్పర్లు వినియోగించి తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్వకాలపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నెలవారీ మామూళ్లతో అధికారులు మౌనముద్ర వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గగ్గోలు పెడుతున్న గ్రామస్తులు ఊర్ల చుట్టూ ఉద్యమంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఊరి చుట్టూ తవ్వకాలు చేస్తుండడంతో పచ్చిగడ్డి కూడా మొలవడం లేదని, పశుగ్రాసం కోసం మూగజీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని వాపోతున్నారు. గేదెలను చెరువులోకి తోలుకు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా చెరువుల్లో రెండు నిలువు లోతులో గ్రావెల్ తవ్వేస్తున్నారని మండి పడుతున్నారు. దీంతో పశుపోషణ కూడా కష్టంగా మారి మూగజీవాలను కబేళాలకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉలవపాళ్ల సమీపంలో గని మాదిరిగా తవ్వేస్తున్న గ్రావెల్మైనింగ్ అధికారులు లెక్కల ప్రకారం చూస్తే ఎకరా భూమిలో మీటరు లోతున తవ్వకాలు జరిపితే 4 వేల ఘనపు మీటర్ల ఖనిజం (గ్రావెల్) వెలువడుతోంది. టిప్పర్‌కు నిండుగా నింపితే 12 క్యూబిక్ మీటర్లు పడుతుంది. అంటే ఎకరాకు 400 టిప్పర్లు గ్రావెల్ వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు 4,800 క్యూబిక్ మీటర్లు రవాణా సాగుతోంది. టిప్పర్‌కు రూ.10 వేలు వంతున లెక్క పెడితే ఎకరాలో రూ.4 కోట్ల వరకు వస్తుంది. ఇది ఎకరా భూమిలో మీటరు లోతు తవ్వకాలు చేస్తే మరి పదిహేను మీటర్ల లోతు తీస్తే రూ.కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కావలి నియోజకవర్గంలో దాదాపు వందల ఎకరాల్లో గ్రావెల్ దందా నడుస్తోంది. ఇది దగదర్తి మండలం ఉలవపాళ్లలో జరుగుతున్న గ్రావెల్ దందా..టీడీపీ నేత భారీయంత్రాలు ఉపయోగించి తవ్వకాలు చేయిస్తున్నారు. రోజువారీగా దాదాపు 500 టిప్పులు వరకు గ్రావెల్ తరలించేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేసి గ్రావెల్ తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు.. స్థానికులు అడ్డు చెపితే మాత్రం కేసుల పేరుతో బెదిరిస్తున్నారు. గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోంది. కొందరు అనుచరుల ద్వారా గ్రావెల్ రవాణాకు ఎక్కడా అవాంతరాలు రాకుండా ఉండేలా చేసుకున్నాడు. గ్రావెల్ దందాను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలు చేతులు ముడుచుకుని ఉండి పోయాయి. కావలి సేవకుడిని అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న ఎమ్మెల్యే గ్రావెల్ దందాతో సహజ వనరులను కొల్లగొడుతున్నారు. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కావలి -
రంగస్థల వెలుగులు మాయం
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం నాటకాలంటే పిచ్చినాటకాలంటే పిచ్చి. దశాబ్దాలు నాటకాలు ఆడినా పూట గడవడం కష్టంగా మారింది. ఆ రంగాన్ని ఆదరించే వారు లేకపోవడంతో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నా. ఇప్పటికీ అడపాదడపా నాటకాలాడే ఓపిక ఉంది. – బాబూరావు, నటుడు, బిరదవోలు ఆదరణ లేదునాటక రంగానికి ఆదరణ కరువైంది. సాంఘిక, పౌరాణిక నాటకాలు ఆడేవాడిని. ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నా. టీవీ షోలు, కామిడీ పేరుతో జుగుప్సాకరమైన షోలు తిలకించేందుకే కొందరు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి తరానికి నాటక రంగం గురించి తెలియకపోవడం విచారకరం. – కె.కోటేశ్వరరావు, రంగస్థల నటుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు, పొదలకూరు ● నాటక రంగంలో పొదలకూరుకు ఘన చరిత్ర ● మారిన పరిస్థితులతో తెరమరుగు ● ఒకప్పటి పౌరాణిక నట దిగ్గజం బాబూరావు ● ప్రస్తుతం పురోహితుడిగా జీవనం●పొదలకూరు: టీవీ, సినిమా, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, లైవ్ షోవ్లు నేడు రాజ్యమేలుతున్నాయి. కానీ ఒకప్పుడు నాటక రంగం ప్రజలను కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. దేశంలో ఏ భాషలో లేని పద్య నాటకాలు మన తెలుగులోనే ఉన్నాయి. పౌరాణిక నాటకంలో నటుల హావభావాలు, కంఠస్త పద్యాలు ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. కాలక్రమేణా నాటక రంగం కుదేలైంది. ఆడేవారు లేక, చూసే వారు రాక నిరాదరణకు గురై కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నటనే శ్వాసగా.. పొదలకూరు పట్టణంలో 1976లో అభ్యుదయ కళా సమితిని స్థాపించారు. ఇందులో ఎందరో నటులు సాంఘిక నాటకాలను ఆడి పేరు సంపాదించారు. ఆ నాటకాలను చూసేందుకు సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు పొదలకూరుకు వచ్చేవారు. కాలక్రమంలో నటులు కాలం చేయడం, ఉన్న వారు వృద్ధాప్యంతో నాటకాలు ఆడలేకపోవడంతో సమితి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి వచ్చిన వారిలో ఒకరు బాబూరావు. పౌరాణిక నాటకాల్లో ఆయను మంచి పేరుంది. సుమారు 1,500 పైగా నాటకాలాడారు. బిరదవోలు గ్రామానికి చెందిన గాది సుధాకర్‌బాబు(బాబూరావు) తన నటాభిలాషను పాఠశాల స్థాయి నుంచే పెంచుకున్నారు. 1984లో శ్రీనివాసులు అనే గురువు వద్ద సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడి పాత్ర ద్వారా పరిచయమయ్యారు. అప్పటి నుంచి అభినవ నక్షత్రకునిగా పేరు తెచ్చుకున్నారు. కళా సమితి బి.సంజీవరావు, వీవీ రమణయ్య యాదవ్ ట్రూపులో చేరి నాటకాలాడేవారు. అభినవ గోపాలరావు అనే బిరుదును కూడా నక్షత్రకుని పాత్ర ద్వారా సొంతం చేసుకున్నారు. బాలనాగమ్మలో బాలవ ర్ధిగా, గయోపాక్యానం యుద్ధ సీనులో శ్రీకృష్ణుడిగా, చింతామణి నాటకంలో భవానీశంకర్ పాత్రలను పోషించారు. ఆదరణ లేక.. నాటక రంగానికి ఆదరణ తగ్గిపోవడంతో నటులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లారు. బాబూరావు పౌరోహిత్యం చేసుకుంటున్నారు. కళారంగానికి ఆయన ఎంత సేవ చేసినా చివరకు జీవనం కష్టంగా మారడంతో తన సొంత గ్రామంలో దేవాలయాల అర్చకుడిగా కాలం వెళ్లదీస్తున్నారు. సాంఘిక నాటక రంగంలో దిగ్గజంగా పేరున్న విశ్రాంత ఉపాధ్యాయుడు కె.కోటేశ్వరరావు వ్యవసాయం వైపు దృష్టి సారించారు. పొదలకూరులో అభ్యుదయ కళా సమితికి చెందిన కోటేశ్వరరావు, బాబూరావుతోపాటు వ్యవస్థాపకులు బొల్లినేని గోపాలకృష్ణయ్య, వీవీ రమణయ్య యాదవ్, చిల్లర సుబ్బారావు, చిట్టేటి మీరయ్య, కై తేపల్లి రమణయ్య, సింగ్ తదితరులు ఉండేవారు.కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. పౌరాణిక, సాంఘిక నాటకాలకు ఆదరణ తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్ల యుగంలో ఉన్న ఇప్పటి పిల్లలకు వాటి గురించి పెద్దగా తెలియదు. గతంలో పల్లెవాసులు నాటకాలను తిలకించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లేవారు. నటులకు అరుదైన గౌరవ మర్యాదలు దక్కేవి. కళాకారులకు వీక్షకుల చప్పట్లే కొండంత బలం. అయితే అది ప్రస్తుతం లేకుండాపోయింది. నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
సోమిరెడ్డి ఫిర్యాదుతోనే నాపై అక్రమ కేసు: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో అధికార కూటమి పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. బెదిరిది లేదు.. వెనక్కి తగ్గిదిలేదని స్పష్టం చేశారు. మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి కాకాణి.. తనపై నమోదైన అక్రమ కేసులపై స్పందించారు. ఈ క్రమంలో నెల్లూరులో కాకాణి మీడియాతో మాట్లాడుతూ..‘మైనింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలో తన ప్రమేయం ఉందని ఎక్కడా ప్రస్తావించలేదు. సోమిరెడ్డి ఫిర్యాదు చేశారని.. నాపై పొదలకూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. 16 విచారణలు జరుగుతున్నాయి. ఎనిమిది అక్రమ కేసులు నాపై నమోదు చేశారు. రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కావాలనే క్వార్జ్ అక్రమ రవాణాలో కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో మరిన్ని పోరాటాలు చేస్తాము తప్పా.. రాజీ పడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాను కాబట్టే ప్రభుత్వానికి నేను టార్గెట్ అయ్యాను. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
గిరిజనులకు న్యాయం చేస్తాం
● సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఉలవపాడు: గిరిజనులకు సాగుబడి హక్కులు కల్పి ంచడంలో చట్టప్రకారం న్యాయం చేస్తామని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వీరేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. భూములపై గిరిజనులకు సాగుబడి హక్కు కల్పించడానికి అటవీ శాఖ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2005 గిరిజన చట్టానికి ముందు నుంచి అటవీ భూములు సాగు చేసుకుంటున్నారా? లేక తర్వాత చేపట్టారా? అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పంటలు వేస్తున్నారని వారిని అడిగారు. వీరేపల్లి పరిధిలో 74 మందిని అర్హులుగా గుర్తించినట్లు ఆమెకు రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు. మిగిలిన వారు తమ సాగుబడి గురించి ఆమెకు వినతిపత్రాలు అందించారు. వీరేపల్లి చెరువులో నీరు తాగి గొర్రెలు చనిపోయాయని కొందరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, తాగునీటికి పనికిరావని దండోరా వేశారని గ్రామ మాజీ సర్పంచ్ నన్నం పోతురాజు సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఐటీడీఏ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వీఎస్‌యూలో అంతర్జాతీయ సదస్సు
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో బ్లూ రెవల్యూషన్ ఇన్నోవేషన్స్ ఇన్ మైరెన్ సిస్టమ్స్ (బీఆర్ఐఎంఎస్ – 2025) అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్లూ ఎకానమీ అభివృద్ధికి దోహదం చేసే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సముద్ర పరిశోధన, మత్స్య పరిశ్రమ, బ్లూ ఎకానమీ అభివృద్ధిలో విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం అవసరమని తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఇన్ బ్లూ ఎకానమీ, ఎక్స్పర్టైజ్ ఫ్రాన్స్ ప్రొఫెసర్ మానెల్ జఖారియా, ఎన్ఐఓటీ సభ్యుడు డాక్టర్ ఎన్వీ వినీత్‌కుమార్ తదితరులు సముద్ర సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా బ్లూ ఎకానమీ అభివృద్ధికి కొత్త అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
నెల్లూరు(క్రైమ్): బాత్రూమ్లో జారిపడి గాయాలపాలైన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు శెట్టిగుంటరోడ్డులో కె.కోటేశ్వరరావు (65) కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. సోమవారం తన ఇంట్లోని బాత్రూమ్లో జారిపడి గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి కోటేశ్వరరావు మృతిచెందాడు. మృతుడి కుమారుడు శివ మంగళవారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలునెల్లూరు రూరల్: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కె.కార్తీక్ తెలిపారు. మంగళవారం 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు రూ.96.61 కోట్లను రైతులకు చెల్లించినట్లు తెలియజేశారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.75 సన్నవి : రూ.55 పండ్లు : రూ.30 -
ధాన్యం కొనండి మహాప్రభో..
పొదలకూరు: రోజూ ఇంత మొత్తంలో ధాన్యం కొనుగోలు చేశామని అధికారులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇందుకు ఈ రైతు పడుతున్న ఆవేదనే ఉదాహరణ. మండలంలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన రైతు అరెద్దుల విజయ్‌కుమార్ రబీలో 10.30 ఎకరాల్లో బీపీటీ 5204 రకం వరిసాగు చేపట్టాడు. కోతల అనంతరం ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబెట్టాడు. తాటిపర్తి కేంద్రం వద్దకు వెళ్లి కొనుగోలు చేయాల్సిందిగా కోరాడు. గోతాలు లేవని, ట్రక్ షీట్ ఇచ్చేందుకు మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ లేదని అక్కడి వారు సాకులు చెబుతున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కువ రోజులు ఉంచుకుంటే ధరలు పతనమవుతాయని నేరుగా నెల్లూరుకు సమీపంలోని శ్రీలక్ష్మి రైస్‌మిల్లు వద్దకు వెళ్లాడు. వారు తేమ శాతం సమస్య చెప్పి తీసుకోవడం కుదరదని వెల్లడించారు. దీంతో దిక్కుతోచక రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. అటు దళారులకు అమ్ముకోలేక, ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నాడు. అకాల వర్షం వస్తే ధాన్యాన్ని దాచుకునే వీలు కూడా లేదని ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంతా బాగుందని చెప్పుకొంటోంది. -
కూటమి టార్గెట్ కాకాణి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆ పార్టీ వైఫల్యాలను, తప్పుడు ప్రచారాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కట్టడి చేయాలని ఉద్దేశంతో తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తోంది. కాకాణిపై ఎప్పుడెప్పుడు కేసులు ● గతేడాది గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ సెంట్రల్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెడితే ఆ వార్తను ‘సాక్షి’ కవర్ చేసింది. ఆ పేపర్ కటింగ్‌ను తన వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశాడని వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ● వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్‌మీట్ పెడితే ఆ వీడియో కాకాణి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. ● స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టాడని ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. ● గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయకపోవడంతో భవన కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి వారికి సంఘీభావంగా వెళ్లి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ● గతేడాది డిసెంబర్లో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. పోలీసుల తీరుపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంకటాచలానికి చెందిన టీడీపీ కార్యకర్త నెల్లూరు వేదాయపాళెం పోలీసులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. ● కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం కోళ్లదిన్నెలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. గాయపడిన వారిని పరామర్శించిన కాకాణి అక్కడ మీడియాతో మాట్లా డుతూ పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టి తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించిందని టీడీపీ కార్యకర్త కావలి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ● తాజాగా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్‌లో గత ప్రభుత్వ హయాంలో అనధికారికంగా మైనింగ్ చేసి క్వార్ట్ ్జ మెటల్‌ను తరలించారని, అందుకు కాకాణి తన అనుచరులకు సహకరించారనే కారణం చూపి ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి రిమాండ్ రిపోర్టులో ఎక్కడా కూడా కాకాణి పాత్ర ఉన్నట్లు ధ్రువపరచలేదు. తాము ఆయన అనుచరులమని, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తామని చెప్పడంతోనే అక్రమ మైనింగ్ చేసినట్లు చూపి నాన్‌బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా పోలీసుల కల్పితమే కానీ, ఎక్కడా వీరి పాత్ర కానీ, కాకాణి పాత్ర ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఎవరో ఫిర్యాదు ఇస్తే కేసులా? మాజీ మంత్రి కాకాణి ప్రతి నిత్యం ప్రభుత్వ వైఫల్యాలపైన, సర్వేపల్లిలో జరిగే అవినీతి, అక్రమాలను ఎండ గడుతున్నారు. ఇది రుచించని ప్రభుత్వ పెద్దలతోపాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తమ అనుచర వర్గాలతో ఫిర్యాదులు చేయిస్తూ కేసులు నమోదు చేయిస్తున్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు సైతం ఫిర్యాదు వచ్చిందే తడువుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఏ కేసులో కూడా బాధిత వర్గాలు ఫిర్యాదులు చేయలేదు. టీడీపీ కార్యకర్తలు ఇచ్చే ఫిర్యాదే ప్రామాణికంగా తీసుకుని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 16 విచారణలు గత ప్రభుత్వ హయాంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు విజిలెన్స్ విచారణలు చేయించారు. ఇప్పటికి 16 పర్యాయాలు విజిలెన్స్ అధికారులు విచారణ చేసి అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. దీంతో ఎలాగైనా కాకాణిని జైలుకు పంపేలా ప్రభుత్వ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా ఒంగోలుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసి విచారణలు చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు అక్రమ మైనింగ్‌కు సహకరించారని తాజాగా కేసు ఇప్పటికే 16 విచారణలు.. 8 కేసులు అవినీతి జరగలేదని తేల్చి చెప్పిన విజిలెన్స్ అయినా సిట్ వేసి అక్రమ కేసులతో వేధింపులు నాన్‌బెయిలబుల్ సెక్షన్లతో అరెస్ట్‌కు రంగం సిద్ధం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదంటున్న కాకాణి నెల్లూరు పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రెడ్‌బుక్ కుట్రలో భాగంగా జైలుకు పంపేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని ‘రుస్తుం మైన్స్‌లో’ అక్రమ మైనింగ్ జరిగిందంటూ అందులో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, వారికి ఆయన సహకరించారంటూ నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలోనే స్థానిక ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో చేపట్టిన విజిలెన్స్ విచారణలో అసలు అక్కడ మైనింగే జరగలేదంటూ నివేదిక ఇచ్చినా.. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. తాను కేసులకు భయపడి ప్రశ్నించే విధానాన్ని మాత్రం మానుకోను. ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండగడుతూనే ఉంటా. కూటమి ప్రభుత్వ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేశారు. క్వార్ట్ ్జ కేసులో నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం పశ్నిస్తూనే ఉంటా. సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిని బయట పెడుతూనే ఉంటా. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించను. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో మా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం. అందుకే ఎన్ని కేసులు నమోదైనా జంకే ప్రసక్తేలేదు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి -
28, 29 తేదీల్లో అభ్యర్థులకు పరీక్ష
నెల్లూరు(టౌన్): కస్తూరిదేవి ఎయిడెడ్ బాలికల హైస్కూల్, శ్రీపొట్టి శ్రీరాములు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 28, 29 తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని కస్తూరిదేవి బాలికల హైస్కూల్లో ఎస్ఏ మ్యాథ్స్ – 2, ఎస్ఏ బీఎస్ – 1, ఎస్ఏ పీఎస్ – 1, ఎస్జీటీ – 2, ఎస్ఏ హిందీ – 1, గూడూరులోని శ్రీపొట్టి శ్రీరాములు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ – 1, ఎల్పీ హిందీ – 1, ఎల్పీ తెలుగు – 1 పోస్టులు ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను https://cse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పాఠశాల యాజమాన్యాలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు ఇచ్చిన వారు తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తే జిల్లా విద్యాశాఖ వారు హాల్‌టికెట్ జారీ చేస్తారన్నారు. నెల్లూరులో ఆర్పీఎఫ్ ఐజీనెల్లూరు(క్రైమ్): వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమా సింగ్ నెల్లూరు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. స్థానిక ఆర్పీ ఎఫ్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆమె సిబ్బందికి సూచించారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ట్రాక్టర్ ట్రక్కు కింద సేద తీరుతుండగా.. ● ఒక్కసారిగా వాహనం తీసిన డ్రైవర్ ● ఓ మహిళ మృతి, మరొకరికి గాయాలుబుచ్చిరెడ్డిపాళెం: ఆ మహిళలు ట్రాక్టర్ ట్రక్కు కింద సేద తీరుతున్నారు. దీనిని గుర్తించకుండా ఒక్కసారిగా వాహనాన్ని డ్రైవర్ తీశాడు. దీంతో ఒక మహిళ మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని పంచేడు గ్రామానికి చెందిన పొలాల్లో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. భాస్కర్ అనే వ్యక్తి తన పొలంలో మెషీన్ ద్వారా వరికోతలు చేయిస్తున్నాడు. ధాన్యాన్ని మెషీన్ వద్ద నుంచి బాటపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను కొద్దిసేపు డ్రైవర్ పక్కన నిలిపాడు. గెనాలకు గడ్డి కోసేందుకు నాగూరు ప్రమీలమ్మ (48), మరో మహిళ వచ్చారు. ఎండ అధికంగా ఉండటంతో వీరు సేద తీరేందుకు ట్రాక్టర్ ట్రక్కు కింద కూర్చొన్నారు. ఈ సమయంలో వరికోత మెషీన్ ఆపరేటర్ ట్రాక్టర్ డ్రైవర్‌ను పిలిచి వాహనాన్ని తీసుకురమ్మన్నాడు. డ్రైవర్ ట్రాక్టర్‌ను తిప్పే క్రమంలో మహిళలను గుర్తించకుండా వారిపైకి ఎక్కించి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ప్రమీలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మరో మహిళ గాయపడి పెద్దగా కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి ఆమెను బుచ్చిరెడ్డిపాళెం వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యవెంకటాచలం: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనికేపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనికేపల్లి గ్రామానికి చెందిన వాసిలి కొండస్వామి (46)కి భార్య వెంకట సురేఖ, ఒక కుమారుడు ఉన్నారు. కొండస్వామి మద్యానికి బానిసయ్యాడు. అతను కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొండస్వామి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.నూతన కార్యవర్గ ఎన్నికనెల్లూరు(పొగతోట): పశు సంవర్థక శాఖ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం నెల్లూరులో కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఐ.కృష్ణమౌర్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి.మాధవిలత, ఉపాధ్యక్షులుగా మాలకొండయ్య, శశిధర్, సంయుక్త కార్యదర్శులుగా సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా డాక్టర్ జె.చైతన్య కిశోర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జె.యశోధ, డాక్టర్ బి.సురేష్, డాక్టర్ కె.సురేష్, డాక్టర్ వైవీ కామేశ్వరరావు, డాక్టర్ సీహెచ్ లక్ష్మీశైలజ వ్యవహరిస్తారు. -
కాకాణి ఇంటి వద్దకు నాయకులు, కార్యకర్తలు
నెల్లూరు (పొగతోట): మాజీమంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటి వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా మోహరించారు. పార్టీ జిల్లా కార్యాలయం కాకాణి నివాసానికి సమీపంలో ఉండడంతో కార్యాలయం చుట్టూ, కాకాణి ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీలోని రుస్తుం మైన్‌లో గత ప్రభుత్వంలో అక్రమంగా తెల్ల రాయిని తరలించారని ఫిబ్రవరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో కాకాణిని ఏ–4గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి కాకాణిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పోలీసులు మఫ్టీలో తిరుగుతూ కాకాణి నివాసం వద్ద పరిస్థితిని తెలుసుకుంటున్నారు. -
28లోపు సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28వ తేదీ లోపు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్సైట్, నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పేరు, హోదా, సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ జరిగిందో సంబంధిత ఆధారాలతో చూపించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా శ్రీనివాసులు నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా ఎస్సీ కార్పొరేషన్ పూర్తి అదనపు బాధ్యతల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాలసాని శ్రీనివాసులు మంగళవారం దర్గామిట్టలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాసులు, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ పథకాలను లబ్ధిదారులకు సత్వరమే చేరవేసేందుకు కృషి చేస్తామన్నారు. పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అర్హులు వినియోగించుకునేలా చేస్తామన్నారు. ఐసీడీఎస్ పీడీ బాధ్యతల స్వీకరణ నెల్లూరు (పొగతోట): ఐసీడీఎస్ పీడీ (ఎఫ్ఏసీ)గా నిర్మలారెడ్డిని నియమించారు. ఆమె మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నిర్మలారెడ్డి ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెను ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూగజీవాలపై దూసుకెళ్లిన భారీ వాహనం ● 11 గొర్రెలు మృతి, కాపరులకు తీవ్రగాయాలు మర్రిపాడు: మండలంలోని పొంగూరు కండ్రిక సమీపంలో అచ్చమాంబ ఆలయ సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం ఓ గొర్రెల మందపైకి ఓ భారీ వాహనం దూసుకెళ్లింది. మేత కోసం ఇర్లపాడు నుంచి వెంగంపల్లి సిరివెళ్ల గ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 11 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరి నాగయ్యకు తీవ్రగాయాలు కాగా సన్ను రమణయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీపల్లిలో 461 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 461 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 503 బేళ్లు రాగా 461 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.260 లభించింది. సగటు ధర రూ.278.17 నమోదైంది. వేలంలో 61,006 కిలోల పొగాకును విక్రయించగా రూ.169,70,309 వ్యాపారం జరిగింది. వేలంలో 8 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. -
● డ్వాక్రా మహిళల జీవనోపాధి లక్ష్యం ఆమడ దూరం
పనికి పోతేనే ఇల్లు జరిగేది మాది పేద కుటుంబం. అందరూ ఏదో ఒక పని చేసుకుంటేనే ఇల్లు జరుగుబాటు ఉంటుంది. పొదుపు సంఘంలో 20 ఏళ్లుగా ఉంటున్నా. పొదుపు ద్వారా కుటుంబం జరుగుబాటు కావడానికి ఎలాంటి జీవనోపాధి సమకూరలేదు. అందుకే బతకడానికి కూలి పనులు చేసుకుంటున్నాను. – పానబోయిన శేషమ్మ, అమ్మవారిపాళెం, గుడ్లూరు మండలం ● దశాబ్దాలుగా ఇప్పటికీ కూలీలుగానే.. ● గత ప్రభుత్వంలో వ్యాపారులుగా రాణించిన మహిళలు ● డ్వాక్రా సంఘాలతో సూపర్ మార్ట్ల ఏర్పాటు ● కూటమి ప్రభుత్వం రాగానే కుప్ప కూల్చేసిన వైనం ● రుణాలు లేవు.. ఆర్థిక సాయం లేదు.. పారిశ్రామికవేత్తలు ఎలా..! ● ఈ ఫొటోలో ఉన్న పొదుపు మహిళ పేరు డేగా శాంతమ్మ. కావలి మండలం చలంచర్ల పంచాయతీ పెద్దారం గ్రామం. డ్వాక్రా సంఘాల్లో 15 ఏళ్లుగా సభ్యురాలుగా ఉంది. జీవనోపాధి కోసం కూలి పనులు చేసుకుంటోంది. తమ గ్రామానికి 10 కి.మీ. దూరంలో ఉన్న కొత్తపల్లి గ్రామానికి వచ్చి కూలి పనులు చేస్తోంది. కావలి: ‘‘పొదుపు చేయడంలో మహిళలే మహారాణులు. పొదుపు అనే ఆర్థిక ఉద్యమంలో పేద మహిళలు చైతన్య వంతులైతే వారు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పొదుపు మహిళలను తమ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం.’’ – ఇటీవల డీఆర్డీఏ పీడీల సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలివి. ఇలాంటి మాటలు వినడానికి బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూతనందించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల సృష్టికి తానే ఆద్యుడనని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఆ డ్వాక్రా మహిళల ఎదుగుదలకు ప్రణాళికాబద్ధంగా ఏనాడు చిత్తశుద్ధిగా వ్యవహరించడలేదు. వీరిని దాదాపు 30 ఏళ్లుగా తన ప్రచార సభల్లో జనసమీకరణకు వాడుకున్నారే తప్ప.. వారి అభివృద్ధికి పాటుపడిన చరిత్ర లేదు. పొదుపు మహిళలకు అరకొరగా రుణాలిచ్చి.. వాటిని ఇంటి ఖర్చులకు వాడుకునేలా చేస్తూ.. జీవితాంతం అప్పులు తీర్చుకునే విధంగా వారిని ఆ చట్రంలో బిగించారు. 2014 ఎన్నికల్లో ప్రతి డ్వాక్రా మహిళ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి.. చివరకు పదివేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆనాడు చంద్రబాబు మాటలు విని అప్పులు కట్టకుండా ఉండిపోయి డీఫా ల్టర్లు అయ్యారు. చివరకు వడ్డీలకు చక్రవడ్డీల లెక్కన అప్పులు కట్టారు. నాలుగుసార్లు అధికారంలో ఉండి.. టీడీపీ ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. గతంలో పద్నాలుగేళ్లుగా.. తాజాగా పది నెలలుగా ఎంత మంది మహిళలను పారిశ్రామివేత్తలుగా నిలబెట్టిందో ఈ ప్రభుత్వం చెప్పగలదా?. అధికారం కోసం అమాయక డ్వాక్రా మహిళలను ఆశల పల్లకీల్లో ఊగిసలాడించి పబ్బం గడుపుకోవడం టీడీపీ నైజంగా మారింది. నాలుగు దశాబ్దాల కిందటి నుంచి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటవుతున్నాయి. లక్షలాది మంది మహిళలు ఆయా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి ప్రభుత్వం నుంచి రుణ సాయం పొందుతున్నారు. కొన్ని గ్రూపుల వారు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ ఎంత మంది డ్వాక్రా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు అని ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం సరే.. ఆచరణే కార్యరూపం దాల్చడం లేదు. పొదుపు గ్రూపుల పర్యవేక్షకులు లంచాల దోపిడీతో మహిళలు అనుకున్న స్థాయిలో ఆర్థిక ప్రగతి సాధించలేపోయారనేది జగద్విదితమే. మంత్రి ప్రకటనపై విస్మయం అయితే పాలకులు మాత్రం పొదుపు గ్రూపుల్లో ఉన్న పేద మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామని ప్రకటిస్తుండటం విస్మయ పరుస్తోంది. వాస్తవంగా పొదుపు గ్రూపులో ఉన్న మహిళలు పొదుపు సంఘాలు ద్వారా సమకూరుతున్న అరకొర నగదుతో కొత్తగా వ్యాపారాలు చేయడానికి సాధ్యపడటం లేదు. అప్పటికే కుటుంబం చిరు వ్యాపారాలు, చిరు అమ్మకాలు చేస్తుంటే పొదుపు సంఘాలు ద్వారా వచ్చే నగదును అందులో పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. అలా చేస్తున్న వారినే అధికారులు కూడా పొదుపు మహిళలు ఉపాధి పొందుతున్నారంటూ ఊదరగొడుతున్నారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు కుటుంబానికి స్థోమత ఉంటే గృహిణులుగా స్థిరపడుతున్నారు. కుటుంబానికి స్థోమత లేకపోతే కుటుంబ పోషణ కోసం కూలీలుగా పనులకు కూడా పోతున్నారు.● ఈ ఫొటోలో ఉన్న మహిళ ఆదెమ్మ. ఈమె శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణం నుంచి కావలి పట్టణానికి వచ్చి రోడ్డు మార్జిన్లో కూర్చొని జీడిపప్పు అమ్మకాలు చేస్తోంది. పలాసలోని జీడిపప్పు వ్యాపారులు ఆమెకు రోజుకు రూ.150 కూలి ఇస్తారు. గడిచిన 20 ఏళ్ల నుంచి ఈమె పొదుపు సంఘాల్లో సభ్యురాలిగా ఉంది. కానీ జీవనోపాధి కోసం సొంతూరు నుంచి 700 కి.మీ. దూరంలో ఉన్న కావలికి వచ్చి కూలి పని చేస్తోంది. ● ఈ మహిళ పేరు కాకు పద్మమ్మ. కావలి మండలం పెద్దారం గ్రామం. పొదుపు గ్రూపులో 15 ఏళ్ల నుంచి ఉంటోంది. కుటుంబ జీవనం కోసం కూలి పనులు చేస్తోంది. పొదుపు గ్రూపు ద్వారా ఈమెకు జీవనోపాధి సమకూరలేదు. పొదుపు గ్రూపు మహిళల సమావేశం ధాన్యం ఆరబోసే పనిలో కూలీలుగా పొదుపు మహిళలు వైఎస్సార్సీపీ పాలనలోనే ఆర్థిక స్వావలంబన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు. ఎంతో మంది మహిళలు కుటీర పరిశ్రమల నుంచి చిన్న వ్యాపారులుగా స్వయం ఉపాధిలో ఎదిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదుపుల మహిళ రుణాలను మాఫీ చేసి నాలుగు దఫాలుగా చెల్లించారు. ఈ డబ్బులతోపాటు వైఎస్సార్ చేయూత పథకం, డ్వాక్రా రుణాలు కల్పించి ఈ మొత్తాలకు బ్యాంక్‌ల ద్వారా అదనపు రుణాలు అందించి వారి ఆర్థిక ప్రగతి బాటలు వేశారు. నగరాలు, పట్టణాల్లో డ్వాకా గ్రూపులను సమీకృతం చేసి వారితో సూపర్ మార్టులు ఏర్పాటు చేయించి మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి, వింజమూరు, కందుకూరుల్లోని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన మార్టులు మూతపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం మహిళలను ఏ విధంగా అభివృద్ధి చేస్తోందో తేటతెల్లమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సభ్యులు – 4,00,064 మంది గ్రామీణ ప్రాంతాల్లో గ్రూపులు – 39,249 పారిశ్రామిక, వ్యాపారవేత్తలు – 0 కూలి పనులకు పోతుంటా నేను 25 ఏళ్ల నుంచి పొదుపు గ్రూపులో ఉన్నా. పొదుపు సంఘం ద్వారా నాకు జీవనోపాధి ఏమీ కలగలేదు. కొద్దిగా డబ్బు చేతికందితే అరకొర ఖర్చులకు సరిపోతోంది. మళ్లీ రుణం చెల్లించాలి కాబట్టి కుటుంబ పోషణకు కూలి పనులకు పోతుంటాను. – ఏకుల రమణమ్మ, పొదుపు మహిళ, అల్లూరు మండలం కష్టం చేసుకొని బతకాలి కష్టం చేసి బతుకుతున్నా. పొదుపు గ్రూపులో 16 సంవత్సరాలు నుంచి ఉన్నా. పొదుపు సంఘం ద్వారా బతకడానికి ఎలాంటి అవకాశాలు రాలేదు. ఎక్కడ కూలి పనులు దొరికితే అక్కడికి వెళ్లి కూలి పనులు చేస్తాను. అలా చేసుకుంటేనే ఇల్లు జరుగుతుంది. – మనెమ్మ, పొదుపు మహిళ, చింతగుంట, అల్లూరు మండలం పట్టణ పొదుపు గ్రూపులు – 15,209 జిల్లాలో మొత్తం సభ్యులు – 5,51,166 మంది పాతికేళ్లుగా టీడీపీ ఇదే చెబుతోంది పొదుపు మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానని టీడీపీ పాతికేళ్లుగా ఇదే చెబుతోంది. పొదుపు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుతో పేద వర్గాల మహిళలు ఆర్థికంగా కొద్దిగా ఎదగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాని పొదుపు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కాదు. – సి.శారద, సామాజిక కార్యకర్త, కావలి పట్టణ గ్రూపుల్లోని సభ్యులు – 1,51,102 -
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కూటమి సర్కార్ రాజకీయ కక్ష వేధింపులకు దిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఆయనపై మరో అక్రమ కేసు నమోదైంది. కాకాణి సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాటిపర్తిలో క్వార్జ్ అక్రమ రవాణా అభియోగాల నేపథ్యంలో కేసు నమోదైంది. కాకాణి లక్ష్యంగా కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.అక్రమ కేసులపై కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక కేసు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే నా గళం విప్పుతున్నా. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారు. క్వార్జ్కి సంబంధించి మరో కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేనేమి తప్పు చేయలేదు’’ అని కాకాణి పేర్కొన్నారు.‘‘ఉడత బెదిరింపులకు భయపడను. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను. ఈ కేసు మీద కూడా వేస్తాను’’ అని కాకాణి తెలిపారు. -
మా బిడ్డ ఎప్పుడొస్తుందో..?
ఉలవపాడు: దా దాపు 15 రోజుల క్రితం తప్పిపోయిన వివాహిత ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. కుమార్తె ఆచూకీ లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు శాఖ కేసు నమోదు చేసినా ఇంత వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో ఈ నెల 7వ తేదీన ఈ సంఘటన జరిగింది. వీరేపల్లి అంబేడ్కర్ నగర్‌కు చెందిన చొప్పర వెంకట రమణకు (31) వివాహమైంది. భర్త మరణించడంతో తల్లిదండ్రులు చొప్పర శ్రీను, వరలక్ష్మి వద్ద ఉంటోంది. ప్రతి రోజూ వీరేపల్లి నుంచి ప్రకాశం జిల్లా శింగరాయకొండలోని దేవి సీఫుడ్స్లోకి పనికి బస్‌లో వెళ్లి వస్తుంది. 7వ తేదీ తెల్లవారుజామున గ్రామంలో ఓ వివాహం జరుగుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. తరువాత నుంచి ఇంటికి రాలేదు. ఇంటి దగ్గర లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు వెతుకులాడారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 8న మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు కొంత విచారణ జరిపినా ఫలితం లేకుండా పోయింది. నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు పెళ్లి జరుగుతున్న సమయంలో ఉన్న కొందరిని విచారించారు. ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి విచారించి వచ్చినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై మరింత దృష్టి సారించి తమ కుమార్తె ఆచూకీ తెలపాలని బాధితులు కోరుతున్నారు. -
సహనాన్ని చేతికానితనం అనుకోవద్దు
● తిరగబడే రోజు వస్తుంది ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి, రూరల్ సమన్వయకర్త ఆనం ● కూటమి ప్రభుత్వ అరాచకాలపై ఏఎస్పీకి వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు నెల్లూరు సిటీ: టీడీపీ నాయకులు తమ సహనాన్ని చేతకాని తనం అనుకోవద్దని, తిరగబడే రోజు వస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డిలు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్‌పై స్పష్టమైన ఆధారాలు లేకుండా అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో భయపెట్టాలని అధికార పార్టీ యోచిస్తోందని తెలిపారు. వైకాపా మహిళా విభాగం నేత రమాదేవి ఇంటి మీదకు వెళ్లి టీడీపీ నేతలు దాడి చేస్తే, ఇంత వరకు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. వారి కుటుంబంపై దాడికి సంబంధించిన వీడియోలు బయటపెట్టినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు యంత్రాంగం విఫలం అయిందన్నారు. అధికార పార్టీ పెడుతున్న కేసులకు భయపడి, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొంటామని తాము కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ సహనాన్ని చేతికాని తనం అనుకోవద్దని, త్వరలో తిరగబడే రోజు వస్తుందని పేర్కొన్నారు. నగరంలోని పోలీసు గ్రీవెన్స్‌లో సోమవారం ఏఎస్పీ సౌజన్యకు కాకాణి, ఆనం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్‌లో రౌడీయిజం ఎక్కువైంది. మాట వినకపోతే దాడులు లేదంటే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసి వారి మీదే కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. రూరల్‌లో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. -
మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా
నెల్లూరురూరల్: ‘సార్ మేము ఇక్కడికి వస్తున్నాము.. మీరు మా అర్జీలను కింద స్థాయి అధికారులకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్తే సమాధానం కూడా చెప్పడంలేదు. మీ దగ్గరకు వస్తేనే మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్లాలి. కొంచెం మా పై దయచూపి పరిష్కారం అయ్యేలా చూడండి’ అంటూ బాధితులు కలెక్టరేట్ అధికారులను గద్గద స్వరంలో కన్నీటి పర్యంతమయ్యారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. వినతులు పరిష్కరించాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు. జేసీ కె.కార్తీక్, డీఆర్ఓ ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఊటుకూరు దళితులకు భూములు అప్పగించాలి ● ఎస్. మల్లి, న్యాయవాది, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు విడవలూరు మండలం ఊటుకూరులో దళితుల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని వారి భూములు వారికి అప్పగించాలని న్యాయవాది, దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి జేసీకి వినతిపత్రం అందజేశారు. ఎస్.మల్లి మాట్లాడుతూ 2018లో ఊటుకూరుకు చెందిన పలువురు దళితులకు ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు పథకం ద్వారా సర్వే నంబరు 1288 నుంచి 1294 వరకు 90.26 ఎకరాలు కొని ఇచ్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదన్నారు. స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్ రెండో సారి కూడా అక్కడే పోస్టింగ్ వేయించుకుని భూములను దళితులకు దక్కనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 50 ఎకరాలు భూ కబ్జాదారులు ఆక్రమించుకుని పంటలు పండించుకుంటున్నారన్నారు. అద్దంకి కార్తీక్, పీ పాపయ్య మాట్లాడుతూ దాదాపు రూ.8 కోట్ల విలువైన భూములు 8 ఏళ్లుగా సాగుబడి చేసుకుని లబ్ధిపొందుతున్నారని తెలిపారు. తక్షణం జోక్యం చేసుకుని సర్వే చేసి, హద్దులు చూపించి సాగు చేపట్టేందుకు వీలు కల్పించాలని కోరారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జేసీ కార్తీక్ దళిత నేతలకు హామీ ఇచ్చారు. ఆత్మకూరు కొండయ్య, ఇమ్మానియల్, శివాజీ, జెడ్డా వాసు తదితరులు ఉన్నారు. రాయితీలు త్వరగా ఇవ్వండి అట్రాసిటీకి గురైన బాధితులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు త్వరగా ఇవ్వాలని రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహబూబ్ సోమవారం జేసీకికు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి జిల్లాలో అట్రాసిటీకి గురైన బాధితులకు ఇంత వరకు రాయితీలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బత్తల మధుసూదన్, అరికొండ సురేష్, నిమ్మల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అర్జీలు సకాలంలో పరిష్కరించండి కలెక్టరేట్‌కు 309 ప్రజావిజ్ఞప్తులు ప్రతి వారం వందల సంఖ్యలో అర్జీలు పరిష్కారం కావడం లేదని కన్నీటి పర్యంతరం – జేసీ కార్తీక్ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం 309 అర్జీలు ప్రజల నుంచి వచ్చాయి. ఇందులో అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 138, మున్సిపల్ శాఖవి 33, సర్వేకు 30, పంచాయతీరాజ్ శాఖ 21, స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 9 అర్జీలు అందాయన్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ అధికారులను ఆదేశించారు. నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమణలు కొత్తూరు బిట్–2 సర్వే నంబరు 21, 73, 21, 74లో కండలేరు జలాశయం ముంపు బాధితుల పునరావాస ఆర్అండ్ఆర్ కాలనీలో కె కాంతారావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికుడు వి.రమేష్‌రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 2021లో 150 మందికి పట్టాలు మంజూరు చేసిందన్నారు. ప్రతి 20 కుటుంబాలకు తాగునీటికి ఒక బావి నిర్మించిందన్నారు. కొందరు ఆ బావులను ధ్వంసం చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా బతుకులు అన్నింటికి చెడ్డ రేవడిలా మారాయని డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నామన్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా తమ కేడర్ తెలియక, కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తింపు లేక ఆరోగ్య మిత్రులు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీసు అసోసియేట్లు తదితరులు ఇబ్బంది పడుతున్నామన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎలాంటి బెనిఫిట్లు రావడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవన్నారు. ప్రభుత్వ సైట్లలో ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఉండడం వల్ల సంక్షేమ పథకాలు రావడం లేదన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులకు వినితిపత్రం అందజేశారు. పొలం ఆక్రమించారు నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరులో తనకు రావాల్సిన పొలాన్ని తన మరిది చిరంజీవి ఆక్రమించుకున్నాడని తాడిపర్తి రజనిమ్మ అనే మహిళ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జేసీకి వినతిపత్రం అందజేసింది. తన భర్త చనిపోయిన తర్వాత తన పేరుతో ఉన్న పట్టా భూమిని తనకు తెలియకుండానే వీఆర్‌ఓతో కలిసి అతని పేరు మీదకు 1బీ, అడంగళ్‌లో ఎక్కించుకున్నారని వాపోయారు. నా కూతురు చదువుకునే స్కూల్ దగ్గరకు వెళ్లి బెదిరిస్తున్నాడని తెలిపారు. నాకు ఏమైనా జరిగితే అతనిదే బాధ్యత అని కన్నీటి పర్యంతయ్యారు. -
డాక్టర్ శ్రావణికి ప్రతిష్టాత్మక అవకాశం
వెంకటాచలం: వీఎస్‌యూ పూర్వవిద్యార్థి ని డాక్టర్ బతినపట్ల శ్రావణి ప్రతిష్టాత్మక 74వ లిండౌ నోబెల్ లారియట్ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కడంతో వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. శ్రావణి వీఎస్‌యూలో ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేసి కడపలోని యోగివేమన వర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంకే పోస్ట్– డాక్టోరల్ ఫెలోగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29 నుంచి జూలై 4 తేదీ వరకు జర్మనీలోని లిండౌ నగరంలో జరగనున్న 74వ లిండౌ నోబెల్ లారియట్ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే 600 మంది యువ శాస్త్రవేత్తల్లో ఒకరిగా డాక్టర్ శ్రావణి ఎంపికై ంది. -
మా గోడు విని ఆదుకోండి
● పోలీసు గ్రీవెన్స్‌లో 86 ఫిర్యాదులు నెల్లూరు సిటీ: హనీ ట్రాప్‌తో వేధిస్తునారు.. స్వామీజీ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.. వివాహం చేసుకుంటానని ఓ మహిళ మోసగించిందని, నకిలీ పత్రాలతో స్థలాన్ని కాజేస్తున్నాడంటూ ఇలా.. పలువురు తమ గోడును జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 86 మంది తామెదుర్కొంటున్న సమస్యలను వివరించి ఆదుకోవాలని కోరారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని సంబంధిత ప్రాంతాల పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరురూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఉమెన్ పీఎస్ డీఎస్పీ సీహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు. హనీట్రాప్‌లో రూ.18 లక్షలు తీసుకున్నారు ఆన్లైన్ ద్వారా పరిచయమైన దుర్గాభవాని అనే మహిళ తన స్నేహితులతో కలిసి హనీట్రాప్ చేసి తన నుంచి రూ.18 లక్షలు తీసుకుంది. తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నారని వీకేపాడుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. నా స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించారు నెల్లూరురూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రాంరాజ్ కంపెనీ పేరుతో సతీష్, సురేష్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తనను నమ్మించారు. 67 అంకణాల తన స్థలాన్ని ముత్తుకూరుకు చెందిన శకుంతలమ్మ అనే మహిళకు నకిలీ పత్రాల ద్వారా అమ్మేశారు. తన స్థలంలో గోడ కూడా కట్టారని, విచారించి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. స్వామీజీ పేరుతో వేధిస్తున్నారు కావలి మండలం పూలదొరువులో శక్తి పూజలు చేస్తానని పవన్‌కుమార్, అతని భార్య రజిని కలిసి తనన్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తాము చెప్పింది చేయకపోతే నీ భర్తకు హాని కలిగేలా చేస్తానని బెదిరిస్తున్నారని తెలిపారు. తన నుంచి రక్షించి న్యాయం చేయాలని కోరారు. పెళ్లి చేసుకుంటానని రూ.4.50 లక్షలు తీసుకుంది వేదాయపాళెం పరిధికి చెందిన వ్యక్తి తన భార్య కోవిడ్‌లో మరణించగా, జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనియల్ సైట్లో నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో నంద్యాలకు చెందిన కౌసల్య అనే మహిళ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి అవసరాలకు రూ.4.50 లక్షలు తీసుకొని మోసం చేసిందని, విచారించి న్యాయం చేయాలని కోరారు. ఫిలిప్పిన్స్‌లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని మోసం టీపీగూడూరుకు చెందిన వ్యక్తి తన బిడ్డకు ఫిలిప్పిన్స్‌లో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తానని, ఏజెంట్ రవితేజ తనను నమ్మించి రూ.21లక్షలు నగదు తీసుకొని, కాలేజీలో అసలు ఫీజు కట్టలేదని, మోసపోయామని, విచారించి న్యాయం చేయాలని కోరారు. -
పోస్టును బట్టి నగదు వసూలు
కస్తూరిదేవి బాలికల హైస్కూల్లో ఆ యాజమాన్యం పోస్టును బట్టి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. నిర్వహించే పరీక్ష నామమాత్రంగానే ఉంటుందని పోస్టింగ్ ఇచ్చే బాధ్యత తమదని చెప్పి ముందే కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారన్న ప్రచారం ఉంది. సెకండరీ గ్రేడు టీచరుకు రూ.15 లక్షలు, స్కూల్ అసిస్టెంట్‌కు రూ.25 లక్షలు, పీఈటీకి రూ.10 లక్షలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తే తాము డబ్బులు తీసుకున్న వారికి పోస్టు రాకపోతే పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ఆ యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది. ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించేలా ఎయిడెడ్ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. -
మద్యంలో సరికొత్త డీల్
కందుకూరు: కందుకూరులో మద్యం వ్యాపారం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఆదాయమే పరామావధిగా మందుబాటుల జేబులు గుల్లచేసే సరికొత్త విధానానికి మద్యం వ్యాపారులు తెరతీశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న సామెతగా మద్యంషాపుల యజమానులు, బార్ల యజమానులు ఓ అవగాహనకు వచ్చి భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. దీంతో మందుబాబులు నిలువుదోపిడీకి గురౌతున్నారు. కందుకూరు పట్టణంలో అమలవుతున్న ఈ సరికొత్త విధానంపై మందుబాబు ఇదేం దోపిడీ అంటూ లబోదిబోమంటున్నారు. ఇదీ ఒప్పందం కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 21 ప్రైవేట్ మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో 17షాపులు మద్యం వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే, మరో 4 షాపులు గౌడ కులస్తులకు కేటాయించినవి. అయితే గౌడ కులస్తుల షాపులను కూడా సిండికేట్ వ్యాపారులు స్వాధీనం చేసుకుని నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రధానంగా కందుకూరు పట్టణంలో 7 మద్యం షాపులు ఏర్పాటు చేశారు. మరో మూడు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. మద్యం షాపులకు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే సిండికేట్‌గా ఏర్పడి దక్కించుకుని నిర్వహించుకుంటున్నారు. నిన్నటి వరకు వేళాపాళా లేకుండా ఇష్టం వచ్చినట్లు మద్యంషాపులు నిర్వహించుకుంటూ దోపీడీ చేస్తూ వస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు లూజ్ సేల్స్ చేయడంతో పాటు, సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు, షాపుల యజమానుల మధ్య కొంత వివాదం నడుస్తోంది. అదే సమయంలో మద్యం షాపుల్లో విచ్చలవిడి అమ్మకాల వల్ల పట్టణంలోని బార్ల యజమానులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో మద్యంషాపుల యజమానులు, బార్ల యజమానులు కలిసి ఓ అవగాహనకు వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా మద్యంషాపుల్లో లూజ్ సేల్ విక్రయించకూడదు, అదనపు సిట్టింగ్ రూమ్‌లను ఎత్తివేయాలి వంటి షరతులు ఉన్నాయి. బార్ల యజమానులు చేసిన ప్రతిపాదనకు మద్యంషాపుల యజమానులు అంగీకరించారు. దీనికి ప్రతిఫలంగా బార్లలో మద్యం బాటిల్స్ రేట్లను ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఉదాహరణకు క్వార్టర్ బాటిల్‌పై రూ.60 అదనంగా బార్ యజమానులు వసూల్ చేస్తారు. ఇలా క్వార్టర్ బాటిల్‌పై అదనంగా వసూల్ చేసిన 60 రూపాయల్లో రూ.30 మద్యంషాపుల యజమానులకు ఇచ్చేటట్లు, రూ.30 బార్ల యజమానులు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని గత వారం రోజులుగా పట్టణంలో అమలు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం మద్యంషాపులో లూజ్సేల్ అమ్మకాలు, అదనపు రూమ్‌లను తీసివేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మందుబాబులు కచ్చితంగా బార్లకు వెళ్లాల్సి వస్తోంది. బార్లకు వెళ్లి క్వార్టర్ బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ.60 చెల్లించాల్సి వస్తోంది. ఇలా ప్రతి రోజు పట్టణంలోని మూడు బార్లలో 2వేల క్వార్టర్ బాటిళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. అంటే బార్ యజమానులు ఒక రోజు అదనపు దోపిడీ రూ.1.20 లక్షలు. దీనిలో రూ.60 వేలు మద్యంషాపుల యజమానులకు ఇస్తే, మిగిలిన రూ.60 వేలు బార్ యజమానులకు దక్కుతుంది. అంత ఇచ్చుకోలేం సార్ అదే సందర్భంలో మద్యంషాపుల యజమానులు, ఎకై ్సజ్, పోలీస్‌శాఖల అధికారుల మధ్య కూడా మామూళ్ల విషయంలో పొత్తు కుదరడం లేదని సమాచారం. అధికారులు అడిగినంత ఇచ్చుకోలేక నిబంధనల మేరకు షాపులు నిర్వహించుకునేందుకు మద్యంషాపుల యజమానులు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. నిన్న, మొన్నటి వరకు అదనపు సిట్టింగ్ రూమ్‌లతో పాటు, రాత్రి, పగలు అన్న తేడా లేకుండా అమ్మకాలు సాగించిన పట్టణంలోని మద్యంషాపులు సడన్‌గా రూటుమార్చాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10గంటల వరకు అమ్మకాలు సాగిస్తూ, లూజ్‌సేల్స్, అదనపు రూమ్‌లను పూర్తిగా రద్దు చేశారు. దీనికి ప్రధాన కారణం అధికారులకు ఇచ్చే మామూళ్ల విషయంలో అంగీకారం కుదరలేదని ప్రచారం సాగుతుంది. అధికారులు అడిగినంత ఇచ్చేందుకు షాపుల యజమానులు ససేమిరా అంగీకరించడం లేదు. ఒక్కో షాపుకు నెలకు రూ.25 వేలు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తుండగా, షాపుల యజమానులు మాత్రం రూ.15వేలు ఇస్తామంటూ మొండికేస్తున్నారు. ఈ మామూళ్ల విషయంలో ఇరువర్గాల మధ్య రాజీకుదరకపోవడంతో నిబంధనల ప్రకారం షాపులు నిర్వహించుకునేందుకు పట్టణంలోని మద్యంషాపుల యజమానులు సిద్ధమయ్యారు. అయితే దీనికి బదులుగా బార్ల యజమానుతో కొత్త ఒప్పందం చేసుకుని సరికొత్త దోపీడీకి స్కెచ్ వేశారు. అయితే మొత్తం వ్యవహారంలో మందుబాబులే జేబులు గుల్లచేసుకుంటున్నారు. వందలకొద్దీ బెల్టుషాపులు అయితే కందుకూరు పట్టణం మినహా ఇతర ప్రాంతాల్లోని మద్యంషాపుల్లో ఇష్టం వచ్చినట్లు బెల్టుషాపులు నిర్వహించుకుంటున్నారు. మద్యంషాపుల నుంచే నేరుగా బెల్టుషాపులకు ఆటోలు, కార్ల ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నాలుగు వరకు బెల్టుషాపులు నిర్వహిస్తూ దోపీడీకి పాల్పడుతున్నారు. గుడ్లూరులో రెండు మద్యంషాపులు ఉండగా వీటిలో ఒకటి కేవలం బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసేందుకు కేటాయించినట్లు సమాచారం. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గంలో బెల్టుషాపు లేని గ్రామం లేదంలే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఎకై ్సజ్ అధికారులుగాని, పోలీస్‌శాఖ అధికారులు గాని ఈ బెల్టుషాపుల జోలికి మాత్రం పోవడం లేదు. దుకాణాలు, బార్ల యజమానుల మధ్య కొత్త ఒప్పందం బార్లో క్వార్టర్ బాటిల్‌పై రూ.60 అదనంగా పెంచి విక్రయాలు వచ్చిన ఆదాయంలో చెరిసగం పంచుకునేలా అవగాహన ఇదేం దోపిడీరా బాబూ అంటున్న మందుబాబులు -
టీడీపీ నాయకుల గుండాగిరి
● వైఎస్సార్సీపీ మహిళా నేత కుటుంబంపై దాడి ● కర్రలు, రాళ్లతో స్వైరవిహారం ● భయంతో ఇంట్లో తలదాచుకున్న బాధితులు ● దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ ● స్థల వివాదం ముసుగులో కక్షసాధింపు చర్య ● వేదాయపాళెం పోలీసులకు బాధితుల ఫిర్యాదునెల్లూరు సిటీ: జిల్లాలో అధికార అండతో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో పోతురాజు మురళి, రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఆకాష్, లక్ష్మీదేవి సంతానం. రమాదేవి వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. వీరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేశారు. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు పోతురాజు రవి, అతని అనుచరులు వారిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వనంతోపు సెంటర్‌కు సమీపంలో ఓ స్థలానికి సంబంధించి పోతురాజు గంగయ్య, సునీతలు కొలతలు వేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న టీడీపీ నేత పోతరాజు రవి, అతని బంధువులు గంగమ్మ, రమ, ఓబిలి సుజాత, విజయసారథి, రాజేష్, మురళి, శిరీషలు ఆ స్థలంపై తమకూ హక్కు ఉందంటూ కొలతలు ఆపాలని వారిని అడ్డుకున్నారు. అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ నేత పోతురాజు మురళి దంపతులు గంగయ్యకు మద్దతుగా వచ్చారు. దాంతో టీడీపీ నేత పోతురాజు రవి, అతని వర్గీయులు మురళి కుటుంబంపై దాడికి దిగారు. దాదాపు 20 మంది ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డంతో మురళి, రమదేవిలు గాయపడ్డారు. భయంతో వెంటనే తమ పిల్లలతో సహా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని తలదాచుకున్నారు. దాడి చేసిన వారు వెళ్లిపోయిన తరువాత బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వేదాయపాళెం పోలీసులకు ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శ వైఎస్సార్సీపీ నేత మురళి దంపతులపై టీడీపీ నాయకుల దాడిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డిలు ఖండించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏఎస్పీ సౌజన్యను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. దాడికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
నా మద్యం షాపును హ్యాండోవర్ చేసుకోండి
నెల్లూరు(అర్బన్): ఆమె టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. లాటరీలో ఆమెకు మద్యం దుకాణం వచ్చింది. ఎకై ్సజ్ సీఐ లైసెన్సు ఇవ్వకుండా సొంత పార్టీ వారే అడ్డుకున్నారు. తీవ్ర ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. ఆమె తీవ్రంగా నష్టపోయింది. అప్పులు తీర్చే క్రమంలో తాళిబొట్టు అమ్ముకుంది. చివరికి మద్యం షాపు తనకు వద్దు ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకుని విముక్తి చేయాలని ప్రాధేయపడుతోంది. ఆమె పేరు కడియపు లక్ష్మి. పొదలకూరు మండలంలోని తాటిపర్తి వాసి. సోమవారం కలెక్టరేట్లో జెడ్పీ సీఈఓకి వినతిపత్రం ఇచ్చింది. వివరాలల్లోకి వెళితే.. లక్ష్మి ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయానికి పనిచేశారు. గత సంవత్సరం మద్యం షాపులకు తీసిన లాటరీలోకి ఆమెకు 154 నంబర్ షాపు దక్కింది. పొదలకూరులో దుకాణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తుమ్మల శ్రీనివాసులు అనే వ్యక్తి షాపును అద్దెకు తీసుకుని అడ్వాన్స్ కింద రూ.లక్ష చెల్లించింది. అగ్రిమెంట్ రాసుకున్నాను. అయితే ఎకై ్సజ్ సీఐ, సూపరింటెండెంట్లు లైసెన్సు ఇవ్వలేదు. పైగా అద్దెకు షాపు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాసులును ఆర్అండ్బీ అధికారుల ద్వారా రోడ్డులోకి జరిగి షాపు కట్టావంటూ అధికారపార్టీ నాయకులు బెదిరించారు. ముగ్గురి వద్ద షాపులు అద్దెకు తీసుకుని అడ్వాన్స్‌లు చెల్లించింది. వారిని అలాగే బెదిరించారు. అడ్వాన్స్ రూపంలో చెల్లించిన రూ.3 లక్షలు నగదు కూడా ఇంకా ఆమెకు రాలేదు. లైసెన్సు కోసం ఎకై ్సజ్ కార్యాలయం చుట్టూ తిరిగా.. ఆడ మనిషి అని కూడా చూడకుండా సీఐ ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో నిలబెట్టారు. చివరికి ఆమెకు వ్యాపారం జరగని సూరాయపాళెం గ్రామంలో ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చారు. అక్కడ వద్దని ఎంత చెప్పినా భయపెట్టారు. లక్ష్మి రెండు నెలలకు మద్యం దుకాణానికి ప్రభుత్వానికి ఫీజు కింద రూ.10,83,330 చెల్లించాల్సి ఉంది. ఆమెకు రెండు నెలలకు రూ.3 లక్షలు మాత్రమే వస్తోంది. ప్రభుత్వానికి నగదు ఎలా చెల్లించాలని అడుగుతోంది. ఎకై ్సజ్ సీఐకు చెబితే నేనేమి చేయలేను. అధికారపార్టీ ఒత్తిళ్లు ఉన్నాయని చెబుతున్నాడని ఆమె వాపోతోంది. అప్పులు తీర్చేదానికి తాళిబొట్టు కూడా అమ్మేశాను. ఇప్పటికే రూ.14 లక్షలు నష్టపోయాను. మా పార్టీ వారి వల్లనే ఇలా జరిగింది. అందువల్ల ప్రభుత్వం నా దుకాణాన్ని హ్యాండోవర్ చేసుకోవాలి. లేదంటే పొదలకూరులో లైసెన్స్ ఇవ్వాలి. అలా చేయకపోతే నాకు పురుగు మందే దిక్కు అని వాపోయింది. లైసెన్స్ ఇవ్వకుండా సొంత పార్టీ వారే అడ్డుకున్నారు రూ.14 లక్షలు నష్టపోయా సీఈఓకి టీడీపీ కార్యకర్త కడియపు లక్ష్మి విన్నపం -
మా బిడ్డ ఎప్పుడొస్తుందో..?
● తల్లిదండ్రుల ఆవేదన ● పక్షం రోజులుగా ఆచూకీ లేని మహిళ ఉలవపాడు: దా దాపు 15 రోజుల క్రితం తప్పిపో యిన వివాహిత ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. కుమార్తె ఆచూకీ లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు శాఖ కేసు నమోదు చేసినా ఇంత వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో ఈ నెల 7వ తేదీన ఈ సంఘటన జరిగింది. వీరేపల్లి అంబేడ్కర్ నగర్‌కు చెందిన చొప్పర వెంకట రమణకు (31) వివాహమైంది. భర్త మరణించడంతో తల్లిదండ్రులు చొప్పర శ్రీను, వరలక్ష్మి వద్ద ఉంటోంది. ప్రతి రోజూ వీరేపల్లి నుంచి ప్రకాశం జిల్లా శింగరాయకొండలోని దేవి సీఫుడ్స్లోకి పనికి బస్‌లో వెళ్లి వస్తుంది. 7వ తేదీ తెల్లవారుజామున గ్రామంలో ఓ వివాహం జరుగుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. తరువాత నుంచి ఇంటికి రాలేదు. ఇంటి దగ్గర లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు వెతుకులాడారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 8న మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు కొంత విచారణ జరిపినా ఫలితం లేకుండా పోయింది. నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు పెళ్లి జరుగుతున్న సమయంలో ఉన్న కొందరిని విచారించారు. ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి విచారించి వచ్చినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుపై మరింత దృష్టి సారించి తమ కుమార్తె ఆచూకీ తెలపాలని బాధితులు కోరుతున్నారు. -
మేజర్ మినరల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
నెల్లూరు (టౌన్): జిల్లాలోని మైనింగ్ లీజుదారులు మైనర్ నుంచి మేజర్ మినరల్‌కు మారేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ సీనియర్ జియాలజిస్టు కార్తికేయన్ తెలిపారు. సోమవారం స్థానిక ఆటోనగర్‌లోని జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో మైనింగ్ లీజుదార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్ నుంచి మేజర్‌కు మారేందుకు కావాల్సిన పత్రాలపై లీజుదార్లకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మైనింగ్ లీజుదారుల అసోసియేషన్ అధ్యక్షులు ద్వారకానాథ్‌రెడ్డి, మైనింగ్ డీడీ బాలాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు. డీసీపల్లి వేలం కేంద్రంలో 545 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో సోమవారం 545 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 565 బేళ్లు రాగా వాటిలో 545 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.260 లభించింది. సగటు ధర రూ.274.82గా నమోదైంది. వేలంలో 71,698 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,97,04,072 వ్యాపారం జరిగింది. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి నెల్లూరు రూరల్: జిల్లాలో జరిగే ఏపీపీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్‌రావు తెలిపారు. ఈ నెల 25 నుండి 27 వరకు జరిగే పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డీఆర్ఓ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్‌లోని ఆయాన్ డిజిటల్ సెంటర్, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, కావలిలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల, ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ ప్రతినిఽధి గిరిజారాణి, పరీక్షా కేంద్రాల కళాశాలల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాల్పుల కలకలంలో నిందితుల అరెస్ట్ నెల్లూరు సిటీ: ఆస్తి వివాదం నేపథ్యంలో తన తండ్రి ఇంటికి వెళ్లి తండ్రి, సోదరుడిపై గన్‌తో కాల్చిన ఘటనలో నిందితులను చిన్నబజారు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానిక ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు సమాచారం మేరకు.. నగరంలోని రావూరివారివీధిలో రాజమాల్ జైన్‌కు ఆయన రెండో కుమారుడు హితేష్జైన్ మధ్య ఆస్తి విభేదాలున్నాయి. 22వ తేదీ అర్ధరాత్రి హితేష్ తన స్నేహితులైన గాంధీనగర్‌కు చెందిన వంశీ, మూలాపేటకు చెందిన భరత్, పొదలకూరురోడ్డుకు చెందిన రాజశేఖర్‌రెడ్డి, కోనేటిమిట్టకు చెందిన శేఖర్ సందీప్ అలియాస్ శ్రీనివాస్శేఖర్, కిశోర్‌తో కలిసి తండ్రి ఇంటికి వెళ్లి హితేజ్ తన వద్ద ఉన్న పిస్టోల్‌తో తలుపుపై కాల్పులు జరిపిన విషయం విదితమే. రాజమల్ జైన్ పెద్ద కుమారుడు దిలీప్‌కుమార్ జైన్ ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి పిస్టోల్తోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఇన్స్పెక్టర్, క్రైమ్ పార్టీ ఏఎస్ఐ శ్రీహరి, రవిప్రసాద్, హెచ్‌సీలు సురేష్, నజ్మల్, కానిస్టేబుల్స్ శ్యామ్, సుబ్బారావు, వర్ధన్‌లను ఎస్పీ అభినందించారు. -
ఉమ్మడి జిల్లాలో గూడూరు, నెల్లూరులో ఖాళీ ఎయిడెడ్ పోస్టులు
● 10 టీచర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు ● ఇప్పటికే పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలవసూలు ● ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు ● ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కోర్టుకు వెళ్లిన అసోసియేషన్ నేతలు ● ఈ వారంలో ఎయిడెడ్ పోస్టులకు పరీక్ష జరిగే అవకాశం నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు ఆయా యాజమాన్యాలు భారీ మొత్తంలో బేరం పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పోస్టుల కోసం కొంతమంది వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. అయితే నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్ష నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి ఆయా అభ్యర్ధుల నుంచి పోస్టును బట్టి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తే తమ అభ్యర్థులకు పోస్టులు దక్కే అవకాశం ఉండదేమన్న అనుమానంతో ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని కొన్ని యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. జిల్లాలో 25 ఎయిడెడ్ పాఠశాలలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 23, కందుకూరు డివిజన్లో 3 ఎయిడెడ్ పాఠశాలలు జిల్లా విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. కావలిలోని ఎలిమెంటరీ స్కూల్, డీఆర్ఎల్కేఆర్ వీబీ హైస్కూల్, సమి శేషాచలంశెట్టి విశ్వోదయ గర్ల్స్ హైస్కూల్, అల్లూరులోని ఎఫ్బీసీ యూపీ స్కూల్, రామకృష్ణ జూనియర్ కళాశాల, తలమంచిలోని వీపీసీ యూపీఎస్, నార్తు రాజుపాళెంలోని ఆర్సీసీ ఎలిమెంటరీ స్కూల్, బుచ్చిరెడ్డిపాళెంలోని శ్రీహరనాథ ఎలిమెంటరీ స్కూల్, ఉయ్యాలపల్లిలోని ఎస్ఎంఎస్ ఎలిమెంటరీ స్కూల్, నెల్లూరులోని వేద సంస్కృత హైస్కూల్, వేద సంస్కృత ఎలిమెంటరీ స్కూల్, ఏబీఎం ప్రైమరీ స్కూల్, ఎస్కేడీసీ ఈఎల్ఈ స్కూల్, వెంకటేశ్వరపురంలోని జీఎంఎం ఈఎల్ఈ, సెయింట్ జోసెఫ్స్ బాలికల ఈఎల్ఈ స్కూల్, శ్రీకస్తూరిదేవి బాలికల హైస్కూల్, సెయింట్ జోసెఫ్స్ బాలికల హైస్కూల్, లేగుంటపాడులోని ఎయిడెడ్ ఈఎల్ఈ స్కూల్, గూడూరులోని రాణిపేట్ ఈఎల్ఈ స్కూల్, జీఎం యూపీ స్కూల్, శ్రీ పొట్టి శ్రీరాములు యూపీ స్కూల్, వెంకటగిరిలోని ఆర్వీఎం హైస్కూల్, సూళ్లూరుపేటలోని ఎన్ఎంసీ ఈఎల్ఈ స్కూల్, కందుకూరు డివిజన్ కరేడులోని జీఎస్ఎస్టీ ప్రైమరీ, హైస్కూల్స్ ఉన్నాయి. 10 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచరు పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయా ఎయిడెడ్ పాఠశాలల్లో 20 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. మిగులు ఉపాధ్యాయులను కొరత ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు ఆయా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో నెల్లూరులోని కస్తూరిదేవి బాలికల హైస్కూల్, గూడూరులోని శ్రీ పొట్టిశ్రీరాములు ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కస్తూరిదేవి బాలికల హైస్కూల్లో 7 పోస్టులు, శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్లో 3 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. కస్కూరిదేవి స్కూల్లో పోస్టులకు ఆన్లైన్లో 509, ఆఫ్‌లైన్‌లో 287, ఏడాది క్రితం వచ్చిన దరఖాస్తులు 396 కలిపి మొత్తం 1192 దరఖాస్తులు వచ్చాయి. శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్లో 3 పోస్టులకు ఆన్లైన్లో 337, ఆఫ్‌లైన్‌లో 79 కలిపి మొత్తం 416 దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష ఎపుడంటే.. కస్తూరిదేవి, శ్రీ పొట్టిశ్రీరాములు స్కూల్స్‌లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే కస్తూరిదేవి స్కూల్ యాజమాన్యానికి ఆఫ్‌లైన్ లో వచ్చిన 287 దరఖాస్తులను రిక్రూట్మెంట్ అధికా రి నెల్లూరు డిప్యూటీ డీఈఓకు పంపించాల్సి ఉంది. ఎన్నిసార్లు కబుర్లు పంపినా ఆ దరఖాస్తులు ఇ చ్చేందుకు యాజమాన్యం అంగీకరించలేదని తెలిసింది.యాజమాన్యంఅభ్యర్థులుఈ వారంలో పరీక్ష ఉండే అవకాశం ఎయిడెడ్ స్కూల్స్‌ల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ వారంలో పరీక్ష ఉండే అవకాశం ఉంది. పరీక్షకు సంబంధించి అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను అప్లోడ్ చేసే పనిలో ఉన్నాం. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పరీక్ష నిర్వహిస్తాం. – ఆర్.బాలాజీరావు, డీఈఓ -
‘కూటమి పాలనలో స్కీమ్స్ లేవు.. అన్నీ స్కామ్‌లే’
నెల్లూరు: కూటమి ప్రభుత్వ పాలనలో స్కీమ్స్ అనేవే లేకుండా పోయాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘కూటమి ప్రభుత్వంలో స్కీమ్స్ లేకుండా.. స్కామ్ లే కనిపిస్తున్నాయి.. అభివృద్ది పేరిట అవినీతే ఎక్కువగా కనిపిస్తోంది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రభుత్వం మంగళం పాడుతోంది. కాంట్రాక్ట్ పనులను తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ లో 800 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. 7500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చాం. ఈ విధానాన్ని నీతి అయోగ్ కూడా అభినందించింది. పథకం ప్రకారం చంద్రబాబునాయుడు దోపిడికి పాల్పడుతున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో తన వారికి చంద్రబాబునాయుడు కాంట్రాక్ట్ పనులు అప్పగించాడు. కాంట్రాక్ట్ విధానం లోపబూయిష్టంగా ఉంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని కొనసాగించండి. అమరావతి నిర్మాణం పేరిట అభివృద్దిలో అవినీతి కనిపిస్తోంది. ప్రజాధనం దోపిడికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది’ అని పేర్కొన్నారు. -
ఖోఖోలో చిచ్చర పిడుగులు
● కష్టాలను అధిగమించి.. రాణిస్తూ ● జాతీయ పోటీలకు ఎంపిక తమ ఆశయానికి కష్టాలు ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించారు బీవీనగర్‌కు చెందిన రమ్య, భార్గవి. తల్లిదండ్రులు రోజు వారీ కూలీలైనా.. ఆర్థిక కష్టాలను అధిగమించి ఖోఖోలో రాణిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. స్టేడియం వద్దకు ఉదయం, సాయంత్రం వేళ క్రమం తప్పకుండా వచ్చి సాధన చేశారు. జిల్లా, రాష్ట్ర, సీనియర్స్ జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను మెరుగుపర్చుకున్నారు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తున్నారు. – నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) -
పాలనలో కూటమి ప్రభుత్వం విఫలం
ఉదయగిరి: టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసీరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఉదయగిరిలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సూపర్‌సిక్స్ పేరిట హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్, గంజాయి ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువ అప్పులు చేస్తోందని మండిపడ్డారు. నేతలు అనిల్‌కుమార్‌రెడ్డి, మద్దూరు రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిబద్ధతతో వ్యవహరించండి
నెల్లూరు సిటీ: డాక్యుమెంట్ రైటర్లు నిబద్ధతతో వ్యవహరించి రిజిస్ట్రేషన్లు చేయించాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకటసుబ్బారావు పేర్కొన్నారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం తెలిస్తే మీడియా లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్‌లు ఉన్నప్పుడు ఈ సమస్యే ఉండేది కాదని, అయితే ఇప్పుడు ఎవరుపడితే వారు ముందుకొస్తున్నారని చెప్పారు. ఐకమత్యంతో ఉంటేనే రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానంలో సబ్ రిజిస్ట్రార్ ఓకే చేసే ప్రక్రియకు స్వస్తి పలికేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్‌బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు సీతాపతిరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమమే జగన్ ధ్యేయం
ముత్తుకూరు: ముస్లింల సంక్షేమానికి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముత్తుకూరులోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలను ఆదివారం ఆయన నిర్వహించారు. మైనార్టీ నేత అబ్దుల్ రహీమ్, ఎంపీటీసీ సభ్యుడు నవీద్‌బాషా, బడాభాయ్ తదితరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన కాకాణి మాట్లాడారు. ముస్లింలకు అండగా ఉంటామన్నారు. తొలుత కాకాణికి ఘన స్వాగతం పలికారు. పార్టీ మండలాధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరు శివప్రసాద్, సీపారెడ్డి రామ్మోహన్‌రెడ్డి, దువ్వూరు కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇఫ్తార్ విందుకు హాజరు -
హామీలు మరిచి అవాస్తవాల ప్రచారం
● కూటమి సర్కార్‌పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ధ్వజం నెల్లూరు(బారకాసు): ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా, టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నగరంలోని రాంజీనగర్‌లో ఉన్న సిటీ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 17 మంది వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించి తొలగించిందన్నారు. ఈ విషయంపై తాము ఆధారాలు బయటపెడితే విచారణ జరుపుతామని చెప్పిన మంత్రి లోకేశ్ ఇప్పటికీ విచారణ జరపకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2023–24 సంబంధించి మూడు క్వార్టర్స్ 2024–25 ఏడాదికి సంబంధించి మూడు క్వార్టర్స్ మొత్తం ఆరు క్వార్టర్స్ బకాయిలు రూ.5,252 కోట్లు టీడీపీ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. అలాగే వసతి దీవెనకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఈ బకాయిలన్నీ విడుదల చేయకుండా జగన్మోహన్రెడ్డి మీద అవాస్తవాలు మాట్లాడుతూ కాలయాపన చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ప్రవేశపెట్టి 45 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి భృతి అందిస్తామని చెప్పి ఇప్పుడు వారిని నిలువునా దగా చేసిందన్నారు. పూర్తిగా ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డు పాలు చేశారన్నారు. టీడీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, మరలా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఖోఖోలో చిచ్చర పిడుగులు
● కష్టాలను అధిగమించి.. రాణిస్తూ ● జాతీయ పోటీలకు ఎంపిక తమ ఆశయానికి కష్టాలు ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించారు బీవీనగర్‌కు చెందిన రమ్య, భార్గవి. తల్లిదండ్రులు రోజు వారీ కూలీలైనా.. ఆర్థిక కష్టాలను అధిగమించి ఖోఖోలో రాణిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. స్టేడియం వద్దకు ఉదయం, సాయంత్రం వేళ క్రమం తప్పకుండా వచ్చి సాధన చేశారు. జిల్లా, రాష్ట్ర, సీనియర్స్ జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను మెరుగుపర్చుకున్నారు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తున్నారు. – నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) -
వైఎస్సార్సీపీ హయాంలో పునరుద్ధరించే యత్నం
వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో షుగర్ ఫ్యాక్టరీపై ఆశలు చిగురించాయి. అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రాధాన్యతను, రైతులు, ఉద్యోగుల బకాయిల విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి వివరించారు. దీంతో ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నాహాలు చేశారు. అందులో భాగంగా ఫ్యాక్టరీ స్థితిగతులు తెలుసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఫ్యాక్టరీలోని యంత్రాలను పరిశీలించింది. 2013 నుంచి ఫ్యాక్టరీ మూతపడిపోవడంతో యంత్రాలు వినియోగపడవని నిర్ధారించింది. ఫ్యాక్టరీ పునః ప్రారంభించడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని కమిటీ స్పష్టం చేసింది. -
వీనులవిందుగా గాత్రకచేరి
నెల్లూరు(బృందావనం): పురమందిర ప్రాంగణంలో త్యాగరాజ స్మరణోత్సవాలను భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహిస్తున్నారు. స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో ఆదివారం దర్శనమిచ్చారు. కేరళకు చెందిన విష్ణుదేవ్ నంబూద్రి గాత్రకచేరి వీనులవిందుగా సాగింది. 120 మందికిపైగా స్థానిక ఔత్సాహిక కళాకారులతో గాత్ర, వీణకచేరీలు మధురంగా సాగాయి. స్మరణోత్సవ సభ కమిటీ శాశ్వత కార్యదర్శి యనమండ్ర నాగదేవీప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి ఉదయగిరి: కుక్కలు దాడి చేయడంతో తాగునీటి కోసం జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన మండలంలోని మాసాయిపేటలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి చుక్కల దుప్పి రావడంతో కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు గమనించి దుప్పిని రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించగా, దుప్పి అప్పటికే మృతి చెందిందని గుర్తించారు. అనంతరం గండిపాళెం పశువైద్యశాలకు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. గన్నేపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో దుప్పిని ఖననం చేశారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో.. ముత్తుకూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ముత్తుకూరు – నెల్లూరు రోడ్డులోని తాళ్లపూడి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకొని వెళ్తుండగా, వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. మృతుడికి 50 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పూటుగా మద్యం సేవించి.. నిద్రలోనే కన్నుమూసి నెల్లూరు సిటీ: పూటుగా మద్యం సేవించి నిద్రలోనే వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రామచంద్రాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. రామచంద్రాపురంలో సాయి అనసూయమ్మ ఇంట్లో ఓ గదిని బాడుగకు తీసుకొని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పెద్దబ్బాయి (65) పది నెలలుగా నివాసం ఉంటున్నారు. నగరంలో కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి తన గదిలో శనివారం నిద్రించారు. ఈ తరుణంలో తలుపును యజమాని తట్టగా, తీయకపోవడంతో అనుమానం వచ్చి పగలగొట్టి చూడగా పెద్దబ్బాయి విగతజీవిగా పడి ఉన్నారు. మద్యాన్ని అధిక మొత్తంలో సేవించి అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నవాబుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 49.74 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 7800, లోలెవల్ కాలువకు 30, హైలెవల్ కాలువకు 120, మొదటి బ్రాంచ్ కాలువకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు. నిమ్మ ధరలు పొదలకూరు (కిలో) పెద్దవి: రూ.75 సన్నవి: రూ.55 పండ్లు: రూ.30 -
పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన లారీ
● తప్పిన ఘోర ప్రమాదం సంగం: పెట్రోల్ బంకులోకి లారీ దూసుకెళ్లిన ఘటన సంగం కొండ కూడలి వద్ద గల జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కొండ పైనుంచి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు నుజ్జునుజ్జయ్యాయి. వరికోత యంత్రాలు, బంకు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నాయి. పెను ప్రమాదం తప్పడంతో పలువురు ఊపిరిపీల్చుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని వివరాలను పోలీసులు సేకరించారు. సుమారు రూ.మూడు లక్షల మేర నష్టం వాటిల్లింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొనడంతో వాహనచోదకుడి దుర్మరణం వెంకటాచలం: కారు ఢీకొనడంతో వాహనచోదకుడు మృతి చెందిన ఘటన మండలంలోని గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్‌పై 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత
● ఉద్యోగులు, కార్మికులు, రైతులకు రూ.కోట్లలో బకాయిలు ● 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలో అన్ని బకాయిలు చెల్లింపు ● ఫ్యాక్టరీని పునః ప్రారంభించిన వైనం ● 2013లో మళ్లీ మూతపడిన పరిస్థితి ● ఫ్యాక్టరీని తెరిపిస్తానని యువగళం పాదయాత్రలో లోకేశ్ హామీ ● అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ ఊసే లేదు కోవూరు: జిల్లాలో డెల్టా ప్రాంతమైన కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంలో 1979 ఫిబ్రవరిలో 124 ఎకరాల విస్తీర్ణంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. రోజుకు 1,250 మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ప్రారంభించిన ఫ్యాక్టరీ.. కాలక్రమంలో చెరకు సాగు విస్తీర్ణం పెరగడంతో రోజుకు 2,500 మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యానికి చేరింది. జిల్లాలో కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెంతోపాటు పొదలకూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది రైతులు చెరకు సాగు చేపట్టారు. వందలాది మంది కార్మికులతో రేయింబవళ్లు ఫ్యాక్టరీ వైభవంగా నడిచేది. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ రంగంలోని షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేయాలనే జపంతో వాటి మనుగడను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే 1999లో కోవూరు షుగర్ ఫ్యాక్టరీని మూసివేశారు. అప్పటికే ఫ్యాక్టరీకి చెరకు తొలిన రైతులకు కోట్లాది రూపా యల బకాయిలు పెండింగ్‌లో ఉన్నా.. రూపాయి చెల్లించకుండా మూతవేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ లో శాశ్వత, క్యాజువల్ ఉద్యోగులు, కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. కనీసం వారికి పరిహారం కూడా ఇవ్వకపోడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2004లో పునఃప్రారంభించిన వైఎస్సార్ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే 2004లో క్రషింగ్ సీజన్‌కు ముందే రైతులు, ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించారు. ఫ్యాక్టరీ మెషినరీ తుప్పు పట్టిపోవడంతో నిధులు కేటాయించి పునరుద్ధరణ చేశారు. అప్పటి నుంచి సజావుగా నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీ వైఎస్సార్ అకాల మరణంతో ఒడిదొడుకులకు గురైంది. నష్టాలో ఊబిలో కూరుకుపోవడంతో 2013లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో అర్ధాంతరంగా మూత పడింది. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం 2014 ఎన్నికల ప్రచారంలో కోవూరుకు వచ్చిన చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీని తాను తిరిగి పునరుద్ధరించి రైతులకు, కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీ విషయాన్ని విస్మరించారు. కమిటీల పేరుతో రైతులు, ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లూ కాలయాపన చేశారు. చెరకు సాగు నిలిచిపోవడంతో.. దాదాపు ఏడెనిమిదేళ్లుగా ఫ్యాక్టరీ మూతపడిపోవడంతో జిల్లాలో చెరకు సాగును రైతులు పూర్తిగా మానే శారు. తిరిగి ఫ్యాక్టరీ ప్రారంభించినా చెరకు పంట అందుబాటులో లేని కారణంగా క్రషింగ్ అసాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన నిపుణల కమిటీ నివేదికలో పేర్కొంది. గతంలో చెరకు సాగు చేసిన భూముల్లో ప్రత్యామ్నాయంగా వరి సాగు చేస్తుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేసినా మళ్లీ మూతపడే పరిస్థితి అనివార్యమవుతుందని కమిటీ స్పష్టం చేసింది. యువగళంలో లోకేశ్ హామీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి తిరిగి పూర్వ వైభవాన్ని తెస్తానని లోకేశ్ ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని, ఉద్యోగులు, కార్మికుల వేతనాల బకాయిలు చెల్లిస్తామని గొప్పలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఆ ఊసేలేదు. తాజాగా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫ్యాక్టరీ మూత పడడానికి తాను అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే కారణమని తెలుసుకోకుండా, అధికారంలో ఉండి పది నెలలుగా అసమర్థత ప్రదర్శిస్తూ గత ప్రభుత్వం, పాలకులపై నెపం నెట్టి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవూరు షుగర్ ఫ్యాక్టరీజిల్లాకే తలమానికంగా కో–ఆపరేటివ్ రంగంలో ఏర్పాటైన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ టీడీపీ హయాంలో చంద్రబాబు అందుకున్న ప్రైవేటీకరణ జపంతో మూత పడింది. దీంతో వందలాది ఉద్యోగ, కార్మిక కుటుంబాలు, వేలాది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ వాగ్దానాలు చేశారే తప్ప పట్టించుకోలేదు. తాజాగా అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఆ ఊసే లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు షుగర్ ఫ్యాక్టరీపై అసత్యాలు మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నిబద్ధతతో వ్యవహరించండి
నెల్లూరు సిటీ: డాక్యుమెంట్ రైటర్లు నిబద్ధతతో వ్యవహరించి రిజిస్ట్రేషన్లు చేయించాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకటసుబ్బారావు పేర్కొన్నారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం తెలిస్తే మీడియా లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్‌లు ఉన్నప్పుడు ఈ సమస్యే ఉండేది కాదని, అయితే ఇప్పుడు ఎవరుపడితే వారు ముందుకొస్తున్నారని చెప్పారు. ఐకమత్యంతో ఉంటేనే రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానంలో సబ్ రిజిస్ట్రార్ ఓకే చేసే ప్రక్రియకు స్వస్తి పలికేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్‌బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు సీతాపతిరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
● 6, ఇంటర్ తరగతులకు దరఖాస్తులు దుత్తలూరు: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. 2025–26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి జిల్లా సమగ్ర శిక్షా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తులు చేసుకుని అర్హులైన బాలికలు ఆరో తరగతి, ఇంటర్లో ప్రవేశం పొందవచ్చు. జిల్లాలో 12 కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లు భర్తీ చేయనున్నారు. ఒక్కొక్క కేజీబీవీకి ఒక ఇంటర్ కోర్సును కేటాయించి 40 సీట్లు కేటాయించారు. జిల్లాలోని ఉలవపాడు, కందుకూరు, వలేటివారిపాళెం, సీతారామపురం, కొండాపురం, కావలి కేజీబీవీల్లో ఎంపీసీ గ్రూపు, నందిపాడు, ఏఎస్‌పేట, గుడ్లూరు, లింగసమద్రం కేజీబీవీల్లో బైపీసీ, కలిగిరి, మర్రిపాడు కేజీబీల్లో ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. సమష్టి కృషితోనే వెలుగొండ జలాలు సాధ్యం ఉదయగిరి: నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల ప్రజలు ఉద్యమిస్తేనే వెలుగొండ జలాశయం పూర్తయి సాగు, తాగునీరు అందుతాయని వెలుగొండ ప్రాజెక్ట్ జలాల సాధన సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. స్థానిక షాదీ మంజిల్‌లో ఆదివారం వెలుగొండ ప్రాజెక్టు జలాల సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వెలుగొండ జలాశయం పూర్తయితే మూడు జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతాయన్నారు. 29 ఏళ్ల క్రితం పనులు ప్రారంభమైనా ఇంకా కొనసాగుతుండడం చూస్తే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతోందన్నారు. ఏపీ అంటే ఒక అమరావతో, ఒక పోలవరమో కాదని, అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.7 వేల కోట్లు అవసరం కాగా, ఈ ప్రభుత్వం కేవలం రూ.309 కోట్లు ప్రస్తుత బడ్జెట్లో కేటాయించడం దారుణమన్నారు. కేవలం ఏడు వేల కోట్లతో వెలుగొండ ద్వారా మూడు జిల్లాల మెట్ట ప్రాంతాలకు జలాలు అందించే అవకాశం ఉంటే.. రూ.80 వేల కోట్లు పెట్టి గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు తీసుకొస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం రాజకీయ నేతలు, మేధావులు, రైతులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకతపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసీరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్, ఎం.రమేష్, దామా అంకయ్య, అజయ్‌కుమార్, బసిరెడ్డి మాలకొండారెడ్డి, దస్తగిరి అహ్మద్, ఫడ్స్ రమణయ్య, కామేపల్లి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి నెల్లూరు సిటీ: అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి తన ఇంట్లోనే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్‌లో జరిగింది. పోలీసులకు సమాచారం మేరకు.. బ్లాక్ నంబర్ సీ 28లో సర్దార్ బాషా (32) ఒంటరిగా నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన సర్దార్ బాషా శనివారం రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఆదివారం పక్క ఫ్లాట్‌లోని వ్యక్తి వచ్చి ఎన్నిసార్లు తలుపుతట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే బాషా నోట్లో నుంచి నురగ వచ్చి మృతి చెందాడు. నవాబుపేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే క్షయ.. క్షోభే
ఆరోగ్యం బేజారయ్యే అవకాశం శారీరకంగా, ఆర్థికంగా కుంగుబాటునెల్లూరు(అర్బన్): క్షయతో ఆరోగ్యం గుల్లవుతుంది. చాపకింద నీరులా జిల్లాలో ఇది వ్యాపిస్తుండటం కలవరానికి గురిచేస్తోంది. తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లు పక్కవారిపై పడితే అందులోని సూక్ష్మజీవుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా ఇది రావొచ్చు. జిల్లాలో 16 వేల మంది వరకు రోగులున్నారని ఐఎంఏ లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల ద్వారా గుర్తించిన కేసులే వైద్యశాఖ రికార్డుల్లో ఉంటున్నాయి. అదే ప్రైవేట్ హాస్పిటళ్లలో గుర్తించే కేసుల వివరాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. వ్యాధి విషయాన్ని తెలియకుండా చూడాలని పలువురు రోగులు కోరుతుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. వ్యాధి బారినపడి ఏటా 80 నుంచి 100 మంది వరకు మృత్యువాత పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మొదటికి టీబీ సోకిన వారు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు మందులను వినియోగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధి తగ్గుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. కొంతకాలం మందులు వాడి ఆపేసినా మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. తదుపరి టీబీ ముదిరి, ఏడాది నుంచి రెండేళ్ల పాటు మందులను వాడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అధికారిక లెక్కల మేరకు ప్రస్తుతం 24 మందికి ఇలా మారిందని సమాచారం. ఐదేళ్లలోపు పిల్లలకు సోకితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రోగులకు భరోసాగా.. టీబీ సోకిన వారికి జిల్లా టీబీ నివారణ శాఖ ఆధ్వర్యంలో ఖరీదైన మందులను ప్రతి నెలా క్రమం తప్పకుండా అందజేయడంతో పాటు మింగిస్తున్నారు. వ్యాధికి గురైన వారు పనులకు దూరంగా ఉండాల్సిన తరుణంలో పౌష్టికాహారం కోసం రూ.వెయ్యిని వారి ఖాతాలో ప్రభుత్వం జమచేస్తోంది. రోగిని ప్రైవేట్ డాక్టర్లు గుర్తించి సమాచారమందిస్తే సదరు వైద్యుడికి ప్రోత్సాహకంగా రూ.500ను అందజేస్తున్నారు. చికిత్స పూర్తయ్యాక మరో రూ.500, డాట్ పద్ధతిన రోగితో మందులు మింగించినందుకు ఆరోగ్య కార్యకర్తలకూ ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న రోగులు టీబీ యూనిట్లు 13 గళ్ల పరీక్ష కేంద్రాలు 92 ఇవీ లక్షణాలు.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం రావడం, గళ్ల పడటం, అందులో రక్తపు ఛారలుండటం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలుంటే టీబీగా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి. మెడ, గొంతు, చెంపపై చెవి కింద, చర్మంలోపల గడ్డలుంటే వ్యాధిగా అనుమానించాలి. ఇంట్లో ఎవరికై నా వస్తే, మరొకరికి సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.వ్యాధికి ప్రధాన కారణాలు.. టీబీని మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే సూక్ష్మజీవి కలిగిస్తోంది. హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడేవారు, పౌష్టికాహార లోపంతో బలహీనంగా ఉండే వారు, వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే స్టెరాయిడ్స్‌ను వినియోగించే వారికి ఇది సోకుతోంది. ఊపిరితిత్తులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. మద్యం, ధూమపానం అలావాటుండే వారు, షుగర్ వ్యాధిగ్రస్తులకు త్వరగా వచ్చే అవకాశం ఉంది. సీబీనాట్ / జీన్ ఎక్స్పర్ట్ కేంద్రం 1ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం నేడు జిల్లాలో గతంలో తగ్గుముఖం పట్టిన క్షయ (టీబీ) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆహార లోపంతో బాధపడేవారు, మురికివాడల్లో ఉండే పేదలకు ఈ వ్యాధి వేగంగా సోకుతోంది. ఓ వ్యక్తి నుంచి మరొకరికి అంటువ్యాధిగానూ వ్యాపిస్తోంది. దీని బారినపడిన వారికి రోజూ బలవర్థకమైన ఆహారాన్ని అందించాల్సి ఉండటంతో ఆ కుటుంబంపై ఆర్థిక భారమూ పడుతోంది. ఖరీదైన మందులను ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు క్రమం తప్పకుండా వినియోగించాలి. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, అది ప్రాణాంతకమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిపినవి 13,550 2024లో నిర్వహించిన పరీక్షలు 83,381 పెరుగుతున్న కేసులు జిల్లాలో సుమారు 16 వేల మంది రోగులు ఏటా 80 నుంచి 100 మంది మృతి నాణ్యమైన వైద్యసేవలు టీబీని నివారించడమే లక్ష్యంగా నాణ్యమైన సేవలను ప్రభుత్వం అందిస్తోంది. ఖరీదైన మందులను ఇంటి వద్దే రోగికి అందేలా చూస్తున్నాం. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. – ఖాదర్‌వలీ, జిల్లా టీబీ నియంత్రణాధికారి జాగ్రత్తలు తప్పనిసరి టీబీపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. నాట్ వంటి కొత్త పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ప్రైవేల్ ఆస్పత్రుల్లో కఫం పరీక్షలు చేస్తున్నారు. వ్యాధిగా నిర్ధారణైతే జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడితే నయం చేయొచ్చు. – గౌరీనాథ్, పల్మనాలజిస్ట్, ఎనెల్ స్పెషాల్టీ ఆస్పత్రి, నెల్లూరు -
‘మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక లోకేష్ అబద్ధాలు’
నెల్లూరు: శాసనమండలిలో తమకు సమాధానం చెప్పలేక మంత్రులు తోకముడిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మండలిలో అడుడగడునా ఎండగట్టాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పారు. బీసీల బలవంతపు రాజీనామాలపై సుదీర్ఘంగా చర్చించకుండా లోకేష్ తోకముడిచారు. గత ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఇస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సంతకం పెట్టి.. ఇప్పటివరకూ దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు ఇస్తే కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తీసేస్తోంది.వైఎస్సార్సీపీలో ఉండే ఏ ఒక్కరికి రాజకీయ స్వార్థం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడమే మా అందరి లక్ష్యం. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూసినా.. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పేద ప్రజలకు వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు’ అని ధ్వజమెత్తారు. -
ఐసీడీఎస్‌లోనూ అదే తీరు
పెద్ద మొత్తంలో స్వాహా జిల్లాలో ఐసీడీఎస్, విద్యాశాఖలు అవినీతి మయంగా మారాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్వాడీల విధులను పర్యవేక్షించే అధికారుల నుంచి ప్రాజెక్ట్ కార్యాలయం వరకు అడుగడుగునా ప్రతి బిల్లులో కమీషన్లు కొట్టేస్తున్నారు. ప్రాజెక్ట్ స్థాయి సమావేశాలకు వెళ్లినా.. సెక్టార్ స్థాయి సమావేశాలకు వెళ్లినా కనీసం టీఏ బిల్లులు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు కాజేస్తున్న పరిస్థితి. ఇటీవల అంగన్వాడీలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘జ్ఞానజ్యోతి’, ఐడీసీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఏర్పాటు చేసిన భోజనం, స్నాక్స్ నిధుల్లో ఎంఈఓలు కుక్కుర్తి చూపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శిక్షణకు హాజరైన కొన్ని ప్రాజెక్ట్‌ల అంగన్వాడీలకు ఇంత వరకు టీఏ బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది. నేను తిన్న బిల్లులు అరగడం లేదు ● గత నెలలో అంగన్వాడీలకు ‘జ్ఞానజ్యోతి’ ట్రైనింగ్ ● ఈ నెలలో పోషణ్ భీ, పఢాయి భీ కార్యక్రమం ● భోజనం, స్నాక్స్‌లో కక్కుర్తి ● టీఏ బిల్లులూ అందరికీ చెల్లించని వైనం టీఏ బిల్లులుఉదయగిరి: ఐసీడీఎస్, విద్యా శాఖల్లోని కొందరు అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. గత నెలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘జ్ఞాన జ్యోతి, ఈ నెలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు మంజూరు చేసిన భోజనం, స్నాక్స్, టీఏ, స్టేషనరీ నిధులను భారీగా మెక్కినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యాబోధన కోసం జిల్లా వ్యాప్తంగా సెక్టార్ స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో అంగన్వాడీలకు అందించిన భోజనం, స్టేషనరీ సామగ్రి కొనుగోలు, రవాణా ఖర్చులు (టీఏ), స్నాక్స్ తదితరాల్లో కొంత మంది నిర్వాహకులు చేతివాటం ప్రదర్శించి నిధులు స్వాహా చేశారు. రోజంతా కష్టపడితే అంతంత మాత్రం వేతనాలు వచ్చే చిరుద్యోగుల కడుపు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిఽధిలో 2,934 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చుతోంది. 3 నుంచి 6 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న చిన్నారులకు ఆట, పాటతో కూడిన చదువులు అందించేలా ‘జ్ఞానజ్యోతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంఈఓల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండు విడతలుగా గత నెల 18వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రతి కార్యకర్తకు రోజుకు భోజనం, స్నాక్స్ కోసం రూ.300 కేటాయించింది. టీఏ కింద రూ.50, స్టేషనరీ మెటీరియల్ కోసం మరో రూ.100 కేటాయించారు. అయితే భోజనం, స్నాక్స్ కోసం కేవలం రూ.80 నుంచి రూ.100 వరకే ఖర్చు చేసినట్లు సమాచారం. కొన్ని కేంద్రాల్లో కనీసం మంచినీరు, స్నాక్స్ కూడా ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా అందించారు. అప్పటికప్పుడే చెల్లించాల్సిన టీఏలు ఇంత వరకు ఇవ్వలేదని కొందరు అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ఇక స్టేషనరీ సామగ్రి కొనుగోలు విషయంలోనూ అదే తంతు. ఈ నెలలో మూడు రోజుల పాటు ఐడీసీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ కార్యక్రమాలపై అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చారు. ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కోసం ప్రతి కార్యకర్తలకు రూ.450 ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భోజనం, స్నాక్స్ కోసం రూ.250, సామగ్రి కొనుగోలుకు రూ.50, టీఏ కోసం రూ.150 ఖర్చు చేయాలి. ఈ కార్యక్రమంలో కూడా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. భోజనం, స్నాక్స్ కోసం రూ.80 నుంచి రూ.100 వరకు ఖర్చు చేశారు. టీఏ రూ.150 ఇవ్వలేదు. అంగన్వాడీ కేంద్రంఅయినా భోజనం బిల్లులు కూడా వదలరా మీరు..! ఊరకే వచ్చిన భోజనం బిల్లులు, టీఏ బిల్లులు అంత అతిగా తింటే ఇలానే ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రెండు శాఖల ఆధ్వర్యంలో 2,900 మంది శిక్షణ తీసుకున్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగిన శిక్షణలో ప్రతి కార్యకర్త నుంచి ఒక్క భోజనం కోసమే కేటాయించిన నిధుల్లో రోజుకు రూ.200 లెక్కన స్వాహా చేశారు. ప్రతి రోజు రూ.5.80 లక్షలు, ఆరు రోజులకు రూ.34.80 లక్షలు మింగేశారు. టీఏ కోసం రూ.8.70 లక్షలు కేటాయించగా, ఇంత వరకు చాలా మందికి అందలేదు. కొంతమంది ఎంఈఓలు టీఏలు ఇవ్వగా, మరి కొంతమంది ఆలస్యమైతే మర్చిపోతారులే అని జాప్యం చేస్తూ ఇంకా బడ్జెట్ రాలేందటూ దాటవేస్తున్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో కూడా అదే దందా కొనసాగింది. భోజనం, స్నాక్స్ కోసం రూ.100 ఖర్చు చేసి రూ.150 స్వాహా చేశారు. వింజమూరు ప్రాజెక్ట్‌లో అయితే కనీసం మంచినీరు, స్నాక్స్ కూడా ఇవ్వలేదు. ఇందులో కూడా భోజనంలో రూ.13 లక్షలు స్వాహా చేశారు. టీఏ రూపంలో ప్రతి కార్యకర్తకు రోజుకు రూ.150 లెక్కన రూ.450 ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకు పైసా కూడా ఇవ్వలేదు. ఎవరైనా అడిగితే వేధింపులు తప్పువని ఎవరూ సాహసం చేసి సీడీపీఓలను టీఏ అడగలేకపోతున్నామని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ఇందులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకొని కార్యకర్తలకు రావాల్సిన టీఏలు ఇప్పించాల్సిన అవససరం ఉంది. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా నిబంధనల మేరకే వ్యవహరించామని తెలిపారు. టీఏ విషయంలోనూ, భోజనం ఖర్చు విషయం గురించి సమగ్ర సమాచారం ఇవ్వకుండా దాటవేశారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
● ఆటోను బైక్ ఢీకొని ముగ్గురి దుర్మరణం ● మృతుల్లో ఇద్దరు ఐటీఐ విద్యార్థులు, ఆటో డ్రైవర్ మనుబోలు: నిర్లక్ష్యంగా అతి వేగంతో బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మనుబోలు మండలంలోని గొట్లపాళెం వద్ద శనివారం జరిగింది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన ఆటోడ్రైవర్ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. సైదాపురం మండలం ఊటుకూరు దళితవాడుకు చెందిన నోసిన వెంకటేశ్వర్లు కుమారుడు వరుణ్‌కుమార్ (18), అర్తనపల్లి శంకరయ్య కుమారుడు నందకిశోర్ (18), మరో కుమారుడు అర్తనపల్లి ఈశ్వర్ ముగ్గురు మిత్రులు. వీరిలో వరుణ్‌కుమార్, నందకిశోర్ గూడూరులోని కళ్యాణ్ చక్రవర్తి కళాశాలలో ఐటీఐ చదువుతున్నారు. ఈ ముగ్గురు కలిసి బైక్‌పై నెల్లూరుకు పనిమీద వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గొట్లపాళెంలో ఉంటున్న వరుణ్ అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు నెల్లూరు నుంచి కసుమూరు, వడ్లపూడి మీదుగా వేగంగా వస్తున్నారు. అదే సమయంలో పొదలకూరు నుంచి ప్రయాణికులతో వడ్లపూడి వెళుతున్న ఆటోను ఎదురుగా వచ్చిన బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వరుణ్‌కుమార్, నందకిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ తురకా సురేంద్ర (38) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెనుక ఉన్న ఈశ్వర్‌తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర మృతి చెందాడు. మృతులు ముగ్గురివి పేద కుటుంబాలే. అతి వేగం, నిర్లక్ష్యం మూడు కుటుంబాలను రోడ్డుపాల్జేసింది. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, మనుబోలు ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు కుటుంబాల్లో విషాదం ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఊటుకూరుకు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికంది వచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డున పడిన ఆటో డ్రైవర్ కుటుంబం ఆటో డ్రైవర్ సురేంద్రది పొదలకూరు కాగా అతను వడ్లపూడిలో పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చి ఇక్కడే ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సురేంద్రకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సురేంద్ర మృతి చెందడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయి రోడ్డున పడినట్లు అయింది. ముగ్గురు యువకుల అతివేగం ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఒకే బైక్‌పై మితిమీరిన వేగంతో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు యువకులతోపాటు ఆటో డ్రైవర్ కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. పనిమీద నెల్లూరుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో యువకుల్లో ఒకరి అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. -
ధాన్యం కొను‘గోల్’ తంతు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రైతులకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి సివిల్ సప్లయీస్, కో–ఆపరేటివ్ మార్కెటింగ్ శాఖల ద్వారా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికార యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటించింది. అధికార యంత్రాంగం, మిల్లర్లు మిలాఖత్ అయి నిత్యం పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలు లక్ష్యం ఒక తంతుగా మార్చేశారు. దళారుల ద్వారా మిల్లర్ కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం పీపీసీల లెక్కల్లో వేసి రైతులను దగా చేస్తున్నారు. పీపీసీల ద్వారా ధాన్యం విక్రయించినట్లు నమోదైన రైతులకు మద్దతు ధర ప్రకారం పుట్టికి రూ.19,600 అందించామని అధికారులు నిజాయితీగా గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా?. నిరూపించగలరా?. అంటే ఏదీ చెప్పలేరు. దిగుబడి ఎంత.. కొన్నది ఎంత.. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరం చేశామని నిత్యం ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌కు సంబంధించి సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని వీరే చెబుతున్నారు. కానీ శనివారం నాటికి 33,275 మెట్రిక్ టన్నుల ధాన్యం పీపీసీల ద్వారా కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 60 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. అంటే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. ఇందులో పీసీసీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం 5 శాతం కూడా లేదని అధికారుల ప్రకటన ద్వారానే అర్థమవుతోంది. దిగుబడి వచ్చిన 95 శాతం ధాన్యం నేరుగా మిల్లర్లకు దళారుల ద్వారా విక్రయిస్తున్నారనేది వాస్తవం. అధికార యంత్రాంగం 300 పీపీసీలు ఏర్పాటు చేసినట్లు ఆర్భాటంగా చెబుతున్నా.. జిల్లాలో ఒక్క రైతుకు కూడా న్యాయం జరగడం లేదనేది ఈ లెక్కలే చెబుతున్నాయి. పీపీసీల ద్వారా దళారులే విక్రయాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 33,275 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నా, ఇందులో 90 శాతం దళారుల ద్వారానే జరిగాయని తెలుస్తోంది. వాస్తవానికి రైతులు పీపీసీలను సంప్రదించినా మిల్లరు ధాన్యం కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తేనే గన్నీ బ్యాగ్‌లు ఇస్తారు. ఈ ప్రక్రియ అస్సలు జరగడం లేదు. పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలుకు మిల్లరు సిద్ధపడితే ధాన్యం పట్టుబడి నుంచి మిల్లు వరకు చేర్చే బాధ్యత ఆ రైతుదే. ధాన్యం పట్టుబడి చేయడానికి బస్తాకు రూ.30 కూలి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రైతులే భరించుకోవాలి. 99 శాతం మంది మిల్లర్లు పీపీసీల ద్వారా ధాన్యం విక్రయించుకునే రైతులకు గన్నీ బ్యాగ్‌లు ఇవ్వడం లేదు. రైతులే బస్తాలు, ట్రానన్స్పోర్టు వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తీరా మిల్లరు దగ్గరకు ధాన్యం తీసుకెళ్లితే నాణ్యత లేదని, గడ్డి ముక్క ఉందని, తేమ శాతం అధికంగా ఉందని తరుగు పేరుతో పేచీ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇన్ని ఖర్చులు, ఇన్ని ఇబ్బందులు భరించినా.. చివరకు ఆ రైతుకు పుట్టి ధాన్యానికి దక్కే ధర రూ.15 వేలు కూడా రావడం లేదు. దీంతో రైతులు ఈ తలనొప్పులు ఎందుకుని దళారులనే ఆశ్రయించి అమ్ముకుంటున్నారు. వీరు సదరు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వారి పొలం తాలూకా పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి పీపీసీలో నమోదు చేయించుకుంటున్న విషయం బహిరంగ విషయం. బ్యాంక్ గ్యారెంటీలు అరకొరే జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ రైస్ మిల్లింగ్) చేసే మిల్లులు 103 ఉన్నప్పటికీ వీటిలో కేవలం 50 నుంచి 60 మిల్లులు మొక్కుబడిగా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చాయి. మిగతా మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వకపోయినా.. అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో వారికే తెలియాలి. పీపీసీ ద్వారా ధాన్యాన్ని మిల్లుకు ట్యాగ్ చేయాలంటే.. సదరు మిల్లరు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి ఉండాలి. బ్యాంక్ గ్యారెంటీ లేని మిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని పీపీసీ ద్వారా పంపించడం అసాధ్యం. మిల్లర్లు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోవడంతో పీపీసీలు ఆ మిల్లులకు ధాన్యాన్ని ట్యాగ్ చేయడం లేదు. దీంతో రోజుల తరబడి రైతులు ధాన్యాన్ని నిలబెట్టుకోలేక నేరుగా మిల్లర్లకు దళారుల ద్వారా విక్రయించుకుంటున్నారు.రైతు నష్టపోతున్నదిలా.. జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఇప్పటికే 60 శాతం కోతలు పూర్తి పీపీసీల ద్వారా 33,275 మెట్రిక్ టన్నులే కొనుగోలు 103 రైస్ మిల్లులకు సీఎంఆర్ అనుమతి 50 మిల్లులే రూ.30 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ కల్లాల్లో ధాన్యం కొనడం ఒక ప్రహసనం జిల్లాలో పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలు ఒక తంతుగా సాగుతోంది. దిగుబడికి.. కొనుగోలుకు మధ్య తేడానే ఇందుకు అద్దం పడుతోంది. సీఎంఆర్ అనుమతి ఉన్న రైస్ మిల్లుల్లో సగం మిల్లులు కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదంటే ప్రభుత్వం, రైస్ మిల్లర్లు కలిసి ‘దోపిడీ డ్రామా’ ఆడుతున్నట్లు విస్పష్టమవుతోంది. కల్లాల్లోనే ధాన్యం కొనడం ఒక ప్రహసనంగా సాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు పీపీసీల ద్వారా కొంటున్న ధాన్యం లెక్కలు అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నా.. ఏ రైతు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చేసుకోవడం లేదు. నేరుగా దళారులకే అమ్ముకుంటున్నారనేది నిజం. కొడవలూరు మండలానికి చెందిన ఓ రైతుకు 8 ఎకరాల పొలం ఉంది. ఆయన బీపీటీ 5204 వరి సాగు చేశాడు. పంట కోతకు రావడంతో ఒక దళారీని సంప్రదించాడు. పుట్టికి రూ.17 వేలు మాత్రమే ధర ఉందని చెప్పాడు. దీంతో ఆ రైతు స్థానిక పీపీసీ ద్వారా ధాన్యం విక్రయించడానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాడు. దిగుబడి అంచనాను బట్టి గన్నీ బ్యాగ్స్ ఆ రైతుకు అందజేశారు. వరి కోత కోసి ధాన్యం రాసి పోశాడు. సదరు రైతు ధాన్యం సరఫరా చేయడానికి ట్యాగ్ చేసిన మిల్లర్ అంత ధాన్యం తాము తీసుకోమని, మార్కెట్లో పుట్టి రూ.17 వేలే ఉంటే.. పీపీసీ ద్వారా రూ.19,700 పెట్టి ఎందుకు కొనాలని రైతును ప్రశ్నించాడు. ఇక కూలీలు, రవాణా ఖర్చులు పెట్టుకుని, మిల్లర్ అడిగినంత తరుగు ఇచ్చుకుంటే.. పుట్టికి రూ.16 వేలు కూడా వచ్చేటట్లు లేదని లెక్కలు వేసుకున్న ఆ రైతు ఆలోచనలో పడ్డాడు. అప్పటికే రెండు రోజులు గడిచిపోవడంతో ధాన్యం తడారిపోతుండడంతో నేరుగా మిల్లర్కే దళారీ ద్వారా విక్రయించాడు. కానీ ఈ ధాన్యం పీపీసీ ద్వారా విక్రయించినట్లు ఇటు అధికారులు, అటు మిల్లర్ నమోదు చేసుకున్నారు. -
కీలకమైన రికార్డులు.. అధికారి ఇంటికా..?
కొడవలూరు: డీసీఎమ్మెస్లోని కీలకమైన మినిట్స్ బుక్, డే బుక్, లెడ్జర్లు.. డివిజనల్ కోఆపరేటివ్ అధికారి సుధాభారతి ఇంటికి మార్కెటింగ్ మేనేజర్ ద్వారా బుధవారం వెళ్లాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు ఆరోపించారు. నార్తురాజుపాళెంలోని తన అతిథిగృహ ప్రాంగణంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. రికార్డులను అధికారి ఇంటికి తీసుకెళ్తుండగా, మార్కెటింగ్ మేనేజర్ రవికుమార్‌ను ఓ విలేకరి ప్రశ్నించారని, దీంతో ఆయన తడుముకుంటూ తాను కొత్తగా వచ్చానని, అధికారి సూచనల మేరకే తీసుకెళ్లానని చెప్పారన్నారు. సీసీ పుటేజీల్లో చూసినా ఇదే విషయం బహిర్గతమవుతుందని చెప్పారు. డీసీఎమ్మెస్‌కు పర్సన్ ఇన్చార్జిగా జేసీ ఉన్నారని, ఆయనకు తెలియకుండా రికార్డులను అధికారి ఇంటికి తీసుకెళ్లడం దారుణమని చెప్పారు. అందులో దేన్ని మార్చేందుకు తీసుకెళ్లారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సదరు అధికారిపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలున్నాయని చెప్పారు. డీసీఎమ్మెస్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఆమె ఉన్న సమయంలో సంస్థ రైస్ మిల్లును తన భర్తకు అప్పగించిన అంశాన్ని ప్రస్తావించారు. మిల్లులో అవకతవకలు జరిగి మెషినరీ పనికిరాకుండా పోయిందని చెప్పారు. డీసీఎమ్మెస్‌కు చెందిన బాణసంచా, పుస్తకాలు, వేప పిండి వ్యాపారంలోనూ రూ.నాలుగు లక్షలను స్వాహా చేశారని ఆరోపించారు. ఐసీడీఎస్ పీడీగా నియమించగా, అందులోనూ భారీ అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఆమె తీరే ఇంతని, మరో రెండు నెలల్లో రిటైరవ్వనున్నారని తెలిపారు. ఆమె అవినీతి బాగోతంపై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ జ్యోతి, సర్పంచ్ సుప్రియ, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరిరావు, నేతలు కొండా శ్రీనివాసులురెడ్డి, మాణిక్యరావు, అనపల్లి ఉదయ్‌భాస్కర్, జడ్డా సాయికుమార్, గాలి సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర కల్పనలో విఫలం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు(బారకాసు): రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. డైకస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో వెంకటాచలం మండల పార్టీ నేతలు, కార్యకర్తలతో శనివారం సమావేశమైన ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు గిటుబాటు ధర కల్పించకుండా ప్రకటనలనే పరిమితమవుతున్నారని విమర్శించారు. సోమిరెడ్డి మొక్కుబడిగా జరిపిన గొలగమూడి పర్యటనను చూసి రైతులు ఆవేదనకు గురయ్యారని చెప్పారు. డ్రామాలను ఆపి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ హయాంలో గతేడాది పుట్టి ధాన్యం రూ.25 వేలు పలకగా, ప్రస్తుతం రూ.16 వేలకు పతనమైందని తెలిపారు. రైతుల కు కనీస గిట్టుబాటు ధరగా రూ.19720 కల్పించాల్సి ఉండగా, దళారులు రూ.16 వేలకే దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప, రైతులను ఆదుకునేందుకు యత్నించడంలేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనే అంశాన్ని తన దృష్టికి తీసుకొస్తే న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రైవేట్ కేసులేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు ఏ సమస్యొచ్చినా అండగా నిలిచి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. -
సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ
కావలి: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బక్కాలి నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేపట్టిన సైకిల్ యాత్ర కావలికి శనివారం చేరుకుంది. దేశంలోకి అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ కట్టడి, తీర ప్రాంత రక్షణ తదితరాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో యాత్రను ఈ నెల ఏడున ప్రారంభించారు. మొత్తం 60 మంది సభ్యులు పాలుపంచుకున్న ఈ యాత్ర కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్ వద్ద ముగియనుంది. ఈ – కేవైసీని నూరు శాతం పూర్తి చేయాలి నెల్లూరు (పొగతోట): రేషన్‌కార్డుదారులకు సంబంధించిన సభ్యులందరితో ఈ – కేవైసీని పూర్తి చేయించాలని డీఎస్ఓ అంకయ్య ఆదేశించారు. నగరంలోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో డీలర్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 7.21 లక్షలకుపైగా రేషన్ కార్డులకు గానూ 20 లక్షలకుపైగా సభ్యులున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 18 లక్షల మంది ఈ – కేవైసీని పూర్తి చేశారని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఉందని, ఈ నెల 31లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. బైక్‌ల ఢీ: నలుగురికి గాయాలు ఉదయగిరి: బైక్‌లు ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయగిరికి చెందిన చాంద్‌బాషా, మస్తాన్, కాలేషా బైక్‌పై కృష్ణంపల్లెలోని పొలం వద్దకు బయల్దేరారు. వీరి వెనుకనే బైక్‌పై వస్తున్న పట్టణానికి చెందిన మస్తాన్.. గడ్డంవారిపల్లె సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి ఢీకొన్నారు. ఘటనలో నలుగురూ గాయపడ్డారు. వీరిని 108లో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దుత్తలూరులో పట్టపగలే దొంగతనం ● 11 సవర్ల బంగారు ఆభరణాల అపహరణ దుత్తలూరు: దుత్తలూరు సెంటర్లో శనివారం పట్టపగలే దొంగతనం జరిగింది. వివరాలు.. సెంటర్ సమీపంలోని వెంకయ్యస్వామి మందిర పక్కన చింతనబోయిన నరేష్ నివసిస్తున్నారు. మధ్యాహ్న వేళ ఎవరూ లేని సమయంలో గేట్ తాళాన్ని పగలగొట్టి.. ప్రధాన ద్వార తలుపు, తాళాన్ని ధ్వంసం చేసి లోపలికి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి అందులోని 11 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇంటికొచ్చిన అనంతరం చోరీ విషయాన్ని నిర్ధారించుకున్న బాధితుడు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని ఎస్సై ఆదిలక్ష్మి పరిశీలించారు. వేలిముద్రలను క్లూస్‌టీమ్ సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లాక్ ఫిల్మ్‌పై తనిఖీలు
నెల్లూరు (టౌన్): రవాణా నిబంధనలకు విరుద్ధంగా కార్లు, బైక్‌లకు ఉన్న నంబర్ ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్‌పై ఇన్చార్జి ఆర్టీఓ బాలమురళి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలను శనివారం నిర్వహించారు. ముత్తుకూరు గేట్ సెంటర్లో జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఉన్న 38, బ్లాక్‌ఫిల్మ్ బిగించిన ఐదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న నాలుగు, సరైన పత్రాల్లేకుండా తిరుగుతున్న మూడు.. మొత్తం 50 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఎమ్వీఐలు రఫీ, పవన్ కార్తీక్, ఏఎమ్వీఐలు పూర్ణచంద్రరావు, స్వప్నిల్రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తుదిశ్వాస విడిచాడు. మృతులు ఊటుకూరుకు చెందిన మృతులు వరుణ్ కుమార్(17), నందకిషోర్(18), సురేంద్ర(40)లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రక్షించుకుంటున్నాం
సోమశిల/ఆత్మకూరు: నాలుగునెలల పాటు ఎరువులు, పిండి వేసి ఏపుగా పెంచుకున్న వరి పైరును కంకి దశలో దుప్పులు, అడవి పందులు, కొన్ని గ్రామాల్లో ఎలుగుబంట్లు రాత్రి వేళల్లో తొక్కి నాశనం చేస్తుంటాయి. అవి తిరిగిన మేర పొలంలో పైరు నేలవాలడం, వడ్ల గింజలు రాలిపోవడం జరుగుతుంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతుంటారు. రాత్రి వేళల్లో జంతువుల బారి నుంచి పైర్లను కాపాడుకునేందుకు కాపలా కాయడం కష్టమైన పని. ఆ సమయంలో విష పురుగుల బారిన పడి మృతిచెందిన అన్నదాతలు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితుల నుంచి పైర్లను రక్షించుకునేందుకు అనంతసాగరం మండలంలోని పెన్నాతీరం, కొండ, అటవీ ప్రాంతాల గ్రామాలైన గార్లదిన్నెపాడు, చిలకలమర్రి, పాతదేవరాయపల్లి, శంకరనగరం గ్రామాల రైతులు వినూత్నంగా ఆలోచించారు. ఏం చేస్తున్నారంటే.. రైతులు మైక్‌లను వినియోగిస్తున్నారు. ముందుగానే జంతువులను తరుముతున్నట్లుగా అరవడం, పళ్లెం లేదా డప్పు మోగించడం తదితర శబ్దాలను రికార్డు చేసి ఉంచుతారు. దీనిని ఆన్ చేసి తమకు కావాల్సిన ప్రాంతంలో పెట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. చిన్న రైతులు ఎకరాకు ఒకటి పెడుతుండగా, ఎక్కువ పొలం ఉన్న వారు 4, 5 సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని నుంచి వచ్చే శబ్దాలతో జంతువులు పొలాల్లోకి వచ్చేందుకు భయపడుతున్నాయి. ఆ నాలుగు గ్రామాల్లో రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తుండటంతో వారికి అడవి జంతువుల బాధలు తప్పాయి. అదే విధంగా పగటి వేళల్లో పక్షుల నుంచి పైర్లను రక్షించుకునేందుకు మెరిసే రిబ్బన్లను (అగ్ని రిబ్బన్లు) పొలాల్లో అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్నారు. సూర్యరస్మి రిబ్బన్లపై పడినప్పుడు పక్షుల కళ్లు భ్రమిస్తాయి. దీంతో అవి పైరుపై వాలకుండా వెళ్లిపోతాయి. ఇలా ఓ వైపు తమ పైరును రక్షించుకోవడంతోపాటు మూగ జీవాల ప్రాణాలను రక్షించేలా రైతులు అనుసరిస్తున్న ఈ విధానాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించే పైరు అడవి జంతువుల పాలవుతుంటుంది. రక్షణ కోసం కఠిన పద్ధతుల వల్ల అవి మృతిచెందడమో, గాయపడటమో జరుగుతుంది. ఈ సమయంలో కేసులతో పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొందరు రైతులు తమ వరి పైరును కాపాడుకునేందుకు.. మూగజీవాలకు హాని కలగకుండా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి పైరు రక్షణకు రైతుల చర్యలు అడవి జంతువులకు హాని చేయకుండా.. మైక్‌లను పెడుతున్న వైనం జంతువుల వల్ల పైరు దెబ్బతింటుండేది. నాలుగేళ్ల క్రితం మైక్‌లను పెట్టాం. జంతువులు పొలాల వద్దకు రావడం లేదు. వాటి బారి నుంచి పైర్లను రక్షించుకుంటున్నాం. ఎండ, వాన, మంచు నుంచి మైకులు పాడవకుండా ప్లాస్టిక్ కవర్లు చుట్టి కర్రలకు కట్టి పెడుతున్నాం. – నరేంద్ర, రైతు -
యుద్ధప్రాతిపదికన బకాయిల వసూలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్ ఆదేశించారు. నెల్లూరులోని కోటమిట్టలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఆ శాఖ నెల్లూరు టౌన్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ అదనపు విద్యుత్ లోడును క్రమబద్ధీకరించేందుకు విద్యుత్ శాఖ కల్పించిన 50 శాతం రాయితీని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీని గడువు జూన్ 30వ తేదీతో ముగుస్తుందన్నారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు వినియోగదారులు స్వచ్ఛందంగా లైట్లు ఆపివేసి ఎర్త్‌అవర్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సర్‌చార్జ్ రద్దును వినియోగిం చుకోవాలని ఈ అవకాశం ఏప్రిల్ 17వ తేదీ వరకు ఉంటుందన్నారు. పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నగరంలోని అన్ని సబ్స్టేషన్లలో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్)లో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సైబర్ నేరగాళ్ల నుంచి విద్యుత్ సిబ్బందికి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని వారి వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్, డీఈఈలు కిరణ్, అశోక్, సునీల్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ సురేఖ, ఆశాలత, ఏఈలు కృష్ణవేణి, విజయ్‌కుమార్, దామోదర్‌రెడ్డి, విజయ్, లక్ష్మీనారాయణ, సుధాకర్, నస్రూల్లా, సూర్య గాంధీ, మునిశేఖర్, గోపాలకృష్ణ, జేఏఓ పద్మజ తదితరులు, పాల్గొన్నారు. నేటి రాత్రి గంటసేపు ఎర్త్‌అవర్‌ను పాటిద్దాం సబ్స్టేషన్లలో సిబ్బంది అందుబాటులో ఉండాలి ఎస్ఈ విజయన్ -
చెట్లు ఉండడంతో హద్దులు చూపించలేదు
ఎల్పీ స్కీమ్‌లో ఇచ్చిన భూముల్లో కంప చెట్లు ఉండడంతో వాటికి హద్దులు చూపించలేకపోతున్నాం. ఆ భూముల్లో ఉన్న చెట్లు తొలగించుకుని వస్తే అప్పుడు సర్వే చేసి హద్దులు చూపిస్తాం. – పీ చంద్రశేఖర్, తహసీల్దార్ విడవలూరు హద్దులు చూపించకుంటే ఎలా 2018లో మాకు ఒక్క ఎకరా చొప్పున ప్రభుత్వం మొత్తం 91 ఎకరాల విస్తీర్ణంలో పొలాన్ని ఇచ్చారు. అయితే 91 ఎకరాలకు నాలుగు వైపులా హద్దు రాళ్లను ఏర్పాటు చేయకుండా జంగిల్ క్లియరెన్స్ చేసుకోమంటే ఎలా చేసుకోవాలి. – చనుమూరి సరోజనమ్మ పొలం చూపించలేదు.. లోన్ కట్టాలంట!మాకు మంజూరైన పొలం 8 ఏళ్లుగా ఎక్కడ ఉందో ఇంత వరకు తెలియదు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడేమో లోన్ కట్టాలంటూ మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి నోటీసులు వచ్చాయి. అసలు మా పొలం ఎక్కడుందో మాకు తెలియదంటే లోను కట్టాలంటూ నోటీసులు పంపడం హాస్యాస్పందంగా ఉంది. – కర్లగుంట శీనమ్మ ● -
పచ్చనేతల ‘బరి’ తెగింపు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కావలి మండలం చెన్నాయపాళెంలో అధికార పార్టీ నేతలు పక్కాగా కోడి పందేల బరిని, పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, బెట్టింగ్‌లు నిర్వహించారు. కోడి పందేలు వీక్షించేందుకు రెండు వరుసల్లో గ్యాలరీలు పెట్టి, టికెట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. బరికి ఆనుకుని ఉండే వరుసలో రూ.1,000 కాగా, ఆ తర్వాత వరుసకు రూ.700 టికెట్ ధరలుగా నిర్ణయించారు. బిర్యానీలు, ఇతరాలు అమ్మకాలు చేసేందుకు కొంత నగదు తీసుకుని అనుమతులిచ్చా రు. బరికి సమీపంలోనే మద్యం విక్రయాలు సిద్ధం చేశారు. చెన్నాయపాళెం ఎస్సీ కాలనీ సమీపంలో పుచ్చ తోటల్లో ఈ ఏర్పాట్లు చేసి మూడు రోజుల పాటు నిర్వహించారు. నిర్వాహ కుల మధ్య వివాదాలు రావడం, పోలీసులు హడావుడి చేయడంతో నిలిపి వేశారు. చెన్నాయపాళెం నుంచి పెద్దపట్టపుపాళెం రోడ్డు మీదుగా కోడి పందేల బరికి చేరుకునే విధంగా రోడ్డు వసతి ఉండే విధంగా సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ జూద క్రీడల హడావుడి జరిగినా కనీసం పోలీసులకు సమాచారం లేదంటే నమ్మశక్యంగా కూడా లేదు. కోడి పందేలు బరి.. ప్రచారం మాత్రం క్యాసినో నిర్వాహకులు జూదగాళ్ల జేబులు ఖాళీ చేసి, తమ జేబులు నింపుకోవడానికి విస్తృత ప్రచారం చేశారు. కోడి పందేల కోసమే ఒక బరిని సిద్ధం చేశారు. దీంతో పాటు పేక ముక్కలతో ఆడే వివిధ రకాల ఆటల్లో పాల్గొనే జూదగాళ్ల కోసం‘క్యాసినో’ నిర్వహిస్తున్నట్లు అంతర్గత ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో కార్లు చెన్నాయపాళెంకు చేరు కున్నాయి. కోడి పందేలు చూసేందుకు ప్రేక్షకులు బరి వద్దకు భారీగా తరలి వచ్చారు. ఈ విధంగా మూడు రోజులు ఈ జూద క్రీడలు నిర్వహించారు. పోలీసుల రాకతో నిలిపేశారు. రాబడి పంపకాల్లో విభేదాలు నిర్వాహకులకు భారీగానే రాబడి కూడా వచ్చింది. దీంతో పంపకాల విషయంలో వారి మధ్య గురువారం విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని నిర్వాహకుల్లో వారిలో వారే గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో ఉదయం 8.30 గంటలకు ఒక పోస్టు పెట్టారు. ఈ సమాచారం పోలీసులకు చేరింది. కావలిరూరల్ ఎస్ఐ బాజీబాబు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం 9 గంటలకు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడున్న నిర్వాహకులు, జూదగాళ్లు పొలాల్లో ఎటు పడితే అటు పరుగులెత్తి తప్పించుకున్నారు. పుచ్చ రైతులు అభ్యంతరం చెప్పినా.. ఇదిలా ఉండగా కోడి పందేలు వేయడానికి సిద్ధం చేసిన బరి పుచ్చ తోటలో ఉండడంతో ఆ పంట సాగు చేసిన రైతులు అభ్యంతరం చెప్పారు. పెద్ద సంఖ్యలో తమ పుచ్చ తోటలోకి జనాలు రాకపోకలు సాగిస్తే పుచ్చతోట ధ్వంసం అవుతుందని రైతులు కోడి పందేల నిర్వాహకులకు చెప్పారు. అయినా వారు ఖాతరు చేయలేదు. పంట కాలువపై సెంట్రింగ్ రేకులతో కాలిబాట వేసి జూదగాళ్లు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనాలు రావడంతో పుచ్చతోటలు ధ్వంసం అయ్యాయి. బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు కోడి పందేలు బరి, పేక ముక్కలతో వివిధ రకాల ఆటలు కోసం సర్వం సిద్ధం చేసిన నిర్వాహకులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మూడు రోజులు అక్కడ జూద క్రీడలు జరిగినా పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అధికార పార్టీల ప్రాపకం కోసమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రచ్చకెక్కినా నిర్వాహకులపై కేసు నమోదు చేయకపోగా, నిర్వాహకుల చేతిలో దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు అందజేసినట్లుగా తెలిసింది. ఆస్పత్రిలో ఉన్న బాధితుల కేసు మెడికో లీగల్ కేసు అవుతుంది కాబట్టి, కౌంటర్ కేసుగా ముందస్తుగానే పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు ‘బరి’ తెగించారు. జిల్లాలోని కావలి మండలం చెన్నాయపాళెం వద్ద చట్ట విరుద్ధంగా పక్కాగా కోడి పందేలు, పేకాట బరులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రేక్షకుల కోసం రెండు వరుసల్లో గ్యాలరీలు ఏర్పాటు చేసి టికెట్లు వసూలు చేశారు. సుమారు వెయ్యి మంది వీక్షకులు కూర్చొని చూసే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడే బిర్యానీలు, ఇతర తినుబండారాలు అమ్ముకునేందుకు ‘వేలం’ పెట్టారు. గత మూడు రోజుల పాటు జరిగినా.. ఒక్క పోలీస్ కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిర్వాహకుల మధ్య తలెత్తిన పంపకాల్లో విభేదాల నేపథ్యంలో వారిలో వారే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విధిలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి హడావుడి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు ఓ కుటుంబం సమాచారం అందించినట్లు అనుమానించి వారిపై దాడికి తెగబడ్డారు. పక్కాగా కోడి పందేలు, పేకాట బరులు నిర్వాహకుల మధ్య పంపకాల్లో విభేదాలు వారిలో వారే పోలీసులకు సమాచారం ఖాకీల రాకతో నిర్వాహకులు, పందెం రాయుళ్లు పలాయనం అనుమానంతో ఒక కుటుంబంపై దాడి -
ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశ వర్కర్లను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలన్నారు. ఎన్హెచ్ఎం స్కీం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయినా వారికి కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. విధినిర్వహణలో మృతిచెందిన వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆశాలను రెగ్యులర్‌చేసి హెల్త్ వర్కర్స్‌గా గుర్తించాలన్నారు. పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి మధుసూదన, కల్యాణి, వాణి, జీవా, సునీత, గీత, సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు
నెల్లూరు(క్రైమ్): ఆపరేషన్ గరుడకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో విజిలెన్స్, ఔషధ నియంత్రణ అధికారులు, స్థానిక పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు ఆత్మకూరు పట్టణంలోని రామలక్ష్మణ మెడికల్స్, ఎంఆర్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ, నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని సాయిరేఖ మెడికల్స్, శ్రీనివాస అగ్రహారంలోని అనంత సంజీవిని జనరిక్ మెడికల్ షాప్, ఆచారివీధిలోని గణేష్ మెడికల్స్, బోసుబొమ్మ సమీపంలోని రత్న మెడికల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్లోనాజెపామ్, అల్పాజోలం తదితర డ్రగ్స్‌కు సంబంధించిన క్రయ, విక్రయాలపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఎంత మొత్తంలో మాత్రలు కొనుగోలు చేశారు?, ఎవరికి విక్రయించారు?, వాటికి సంబంధించిన బిల్లులు, వైద్యుడి ప్రిస్క్రిప్షన్ల మేరకే విక్రయించారా? లేదా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. తనిఖీల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. తాళాలు వేసి.. తనిఖీల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని కొందరు వ్యక్తులు తమ దుకాణాలకు తాళాలు వేసేశారు. ఈ సందర్భంగా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ వీరకుమార్ మాట్లాడుతూ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ల లేకుండా మత్తుమాత్రలను విక్రయించరాదన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు కె.నరసింహారావు, ఎ.శ్రీహరి, షేక్ సుభానీ, డీసీటీఓ విష్ణురావు, ఏఓ పి.వేణుగోపాల్‌రావు, ఏఈఈ బి.వెంకటరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఇన్స్పెక్టర్లు కీర్తి పవిత్ర, టి.వెంకటకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మత్తుమాత్రల క్రయ, విక్రయాలపై పరిశీలన -
షుగర్ ఫ్యాక్టరీ మూతకు కారణం టీడీపీనే..
● వైఎస్సార్సీపీ నేతలు కోవూరు: ‘కోవూరు చక్కెర కర్మాగారం మూసివేతకు కారణం టీడీపీ అనే విషయాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుసుకోవాలి. దీనిపై అసెంబ్లీలో అసత్యాలు చెప్పడం దారుణం’ అని డీఏఏబీ మాజీ చైర్మన్ నిరంజన్‌బాబురెడ్డి అన్నారు. కోవూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కలిసి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కోరారన్నారు. దాని స్థితిగతులు తెలుసుకోవాలని నిపుణులతో కూడిన బృందాన్ని జగన్ పంపారన్నారు. వారు పరిశీలించి ఈ కర్మాగారం తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేదని, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారన్నారు. 2013 వరకు ఉద్యోగులు, కార్మికులకు ఉన్న బకాయిలను అప్పటి ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2014 – 19 వరకు టీడీపీ హయాంలో బకాయిలు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విషయాన్ని ప్రశాంతిరెడ్డి తెలుసుకోవాలన్నారు. ఆ మొత్తం రూ.20 కోట్లని అసెంబ్లీ సాక్షిగా ఆమె చెప్పారని, కానీ ప్రస్తుతం రూ.22.30 కోట్లకు చేరుకుందన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలుమార్లు కార్మికుల బకాయిల గురించి లేఖలు రాశారన్నారు. కొన్ని ఫ్యాక్టరీలకు గత ప్రభుత్వం బకాయిలను చెల్లించిందని తెలిపారు. కోవూరు ఫ్యాక్టరీ విషయానికి వచ్చేసరికి ఎన్నికల కోడ్ రావడంతో బకాయిల చెల్లింపు ఆగిందన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని చూస్తారే తప్ప కమీషన్ల కోసం ఎదురు చూడరని తెలుసుకోకుండా అసెంబ్లీలో అసత్యాలు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు అనూప్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల పక్షాన ప్రసన్నకుమార్‌రెడ్డి పోరాటం చేశారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నరసింహులురెడ్డి, కవరగిరి ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూమి కబ్జాకు యత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలోని తోపుగుంట సమీపంలోని పది ఎకరాల అటవీ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. ఆ భూమి సోమశిల అనుసంధానమైన చైన్నె కాలువ సమీపంలో ఉండటం గమనార్హం. రూ.కోట్లు విలువ చేసే భూమిని కలువాయికి చెందిన ఓ వ్యక్తి చదును చేసి సాగు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. అలాగే ఆ భూమి సమీపంలోనే మరో 4.88 సెంట్లు ఓ వ్యక్తికి అసైన్మెంట్ పట్టా ఇవ్వగా.. దానిని కూడా ఆ వ్యక్తి కొనుగోలు చేసి మొత్తంగా సాగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ తంతు సంబంధిత అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. -
జాప్యం లేకుండా పరిశ్రమలకు అనుమతులు
నెల్లూరు రూరల్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు గానూ వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపే అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను వెంటనే పూర్తి చేయాలని కందుకూరు సబ్ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీఓను ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖలు తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రింటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఆమంచర్ల వద్ద కేటాయించిన భూమికి బదులు కేకేగుంట, అనంతరం వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఉన్న భూమిని పరిశీలించి అప్పగించాలని సూచించారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పీఎంఈజీపీ రుణాలను విరివిగా మంజూరు చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెస్సెమ్‌ఈ పార్కుల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి నివేదిక పంపాలని ఏపీఐఐసీ అధికారులను సూచించారు. నారంపేట మెగా ఇండస్ట్రియల్ పార్కు వద్ద విద్యుత్, తాగునీటి ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీపీ రుణాల మంజూరు తదితర అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్ వివరించారు. జేసీ కార్తీక్, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, డ్వామా పీడీ గంగాభవాని, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, ఎల్డీఎం శ్రీకాంత్ ప్రదీప్, ఇరిగేషన్ ఎస్ఈ దేశ్‌నాయక్, డీటీసీ చందర్, కమిటీ సభ్యులు ఏపీకే రెడ్డి, సతీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఆనంద్ -
సంక్షోభంలో కూరుకుపోతున్న రంగం
యార్డులో నిలిచిన లారీలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది లారీ రవాణా రంగ పరిస్థితి. డీజిల్, ఇన్సురెన్స్, టోల్ట్యాక్స్లు, స్పేర్‌పార్ట్స్ మోతతో ఇప్పటికే చుక్కలు చూస్తుండగా.. తాజాగా కిరాయిలు దొరక్క.. ఏమి చేయాలో పాలుపోక ఆందోళనకు గురవడం లారీ యజమానుల వంతవుతోంది. ఒకవేళ అరకొరగా దొరికినా ఐదేళ్ల క్రితం నాటి ధరలే లభిస్తుండటం వీరిని ఆవేదనకు గురిచేస్తోంది. లీటర్ డీజిల్ ధర రూ.98కి చేరువలో 25 శాతానికి పైగా పెరిగిన టైర్లు, విడిభాగాల ధరలు ఐదేళ్ల క్రితం నాటి కిరాయిలే నేటికీ లోడింగ్ అంతా రైలు వైపే నాడు 30 వేల లారీలు.. నేడు పది వేల్లోపే -
మద్యం మత్తులో వీరంగం
● సచివాలయ అద్దాలు ధ్వంసం అనుమసముద్రంపేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించి సచివాలయ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఏఎస్‌పేటలో చోటుచేసుకుంది. ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఎస్సై సైదులు తెలిపిన వివరాల మేరకు.. ఏఎస్‌పేట దర్గా ప్రాంతంలో షరీఫ్ అనే వ్యక్తి మానసిక రోగులకు ఆశ్రయ కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఇతను బుధవారం రాత్రి పూటుగా మద్యం తాగి ముగ్గురు వ్యక్తులతో కలిసి సచివాలయ అద్దాలను పగులగొట్టాడు. గురువారం పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓకు తెలపడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. -
అటవీ పనుల వేతనాల పెంపు
● జోన్ – 4 పరిధిలోని జిల్లాల అధికారుల సమావేశంలో నిర్ణయం నెల్లూరు(అర్బన్): అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని రకాల పనులకు ఈ ఏడాది 4.36 శాతాన్ని అదనంగా పెంచి వేతనాలివ్వాలని కమిటీ నిర్ణయించిందని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, గుంటూరు కాశీవిశ్వనాథరాజు పేర్కొన్నారు. వేతనాల పెంపుపై జోన్ – 4 పరిధిలోని జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని వేదాయపాళెంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఫారె్స్ట్స్ ఆఫ్ షెడ్యూల్ రేట్స్ కమిటీ చైర్మన్ కాశీవిశ్వనాథరాజు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం డీజిల్ ధర తగ్గిందని, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరగనున్న పనులకు 4.36 శాతం అదనంగా వేతనాలను ఇవ్వనున్నామన్నారు. అడవుల్లో చేపట్టే జంగిల్ క్లియరెన్స్, మొక్కలు నాటడం, కాపలా ఉండే వారికి, ట్రెంచ్‌లను ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లు, రవాణా.. ఇలా అన్ని రకాల వాటికి ఇది వర్తించనుందని వెల్లడించారు. వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు ఏర్పాటు చేయాల్సిన నీటి వనరులపై చర్చించారు. డీఎఫ్ఓ మహబూబ్‌బాషా, అనంతపురం డీఎఫ్ఓ, కర్నూలు ఎఫ్ఏసీ డీఎఫ్ఓ యశోదబాయి, నంద్యాల ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ నుంచి కృష్ణమూర్తి, తిరుపతి అధికారి సెల్వం, రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్, బయోట్రిమ్ తిరుపతి అధికారి నరేంద్రన్, ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా, తిరుపతి సోషల్ ఫారెస్ట్ ఆఫీసర్ఽ ధర్మరాజు, నెల్లూరు సోషల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగార్జునరెడ్డి, సూళ్లూరుపేట వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి హారిక తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనం ప్రారంభం
నెల్లూరు (టౌన్): ఇంటర్‌కు సంబంధించిన ఫిజిక్స్, ఎకనమిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనాన్ని స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా సబ్జెక్టుల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మాట్లాడారు. మూల్యాంకనంలో 750 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు. కెమిస్ట్రీ, హిస్టరీకి సంబంధించిన మూల్యాంకనాన్ని ఈ నెల 24 నుంచి.. బాటనీ, జువాలజీ, కామర్స్ ప్రక్రియను 26 నుంచి ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారానికి పూర్తి చేయనున్నామని ప్రకటించారు.మీటర్ రీడర్ల నిరసననెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్ వద్ద మీటర్ రీడర్లు నిరసనను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిశోర్, మీటర్ రీడర్ల ప్రధాన కార్యదర్శి హజరత్‌వలీ మాట్లాడారు. తమ శ్రమను కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎస్క్రో ద్వారా వేతనాలివ్వాలని ఆదేశాలు జారీ చేసినా, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో పనికరువై మీటర్ రీడర్లు రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళికి వినతిపత్రాన్ని అందజేశారు. మీటర్ రీడర్ల కోశాధికారి బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య, ఫిరోజ్, చెంచురామయ్య, సుబ్బయ్య, రవిచంద్ర పాల్గొన్నారు.డీసీపల్లిలో 245 పొగాకు బేళ్ల విక్రయంమర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 245 బేళ్లను గురువారం విక్రయించారని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 269 బేళ్లు రాగా, వీటిలో 245ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280.. కనిష్ట ధర రూ.270.. మొత్తమ్మీద సగటు ధర రూ.277.19గా నమోదైందని వివరించారు. వేలంలో 32,510 కిలోల పొగాకును విక్రయించగా, రూ.90,11,680 వ్యాపారం జరిగిందని, ఎనిమిది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు.రేషన్ బియ్యం లారీ పట్టివేతకావలి: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని దగదర్తి మండల పరిధిలోని జాతీయ రహదారిపై తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. లారీలో 520 బస్తాలున్నాయని, గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చైన్నెలోని రెడ్‌హిల్స్‌కు వెళ్తుండగా పట్టుకున్నామన్నారు. అనంతరం లారీని దగదర్తి పోలీసులకు అప్పగించారు.ఖజానా శాఖలో పలువురికి ఉద్యోగోన్నతినెల్లూరు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఖజానా శా ఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ అసిస్టెంట్లకు సబ్ ట్రెజరీ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మోహన్‌రావు ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. ఉద్యోగోన్నతులు పొందిన వారిలో ఉస్మాన్, రామారావు, విజయలక్ష్మి, నిజాముద్దీన్, శ్యామల, నాగేశ్వరరావు, నాగరాజు ఉన్నారు. -
టైర్లు కొనలేక బెంబేలు..
అన్నింట్లో మోతే.. ●టైరు ధర మూడేళ్ల క్రితం రూ.16 వేలుంటే, ప్రస్తుతం అది రూ.21,500కు చేరింది. రేడియల్ టైర్లు ఒక్కొక్కటి రూ.22 వేలు ఉంటే, రూ.26 వేలకు ఎగబాకాయి. ఇంజిన్ ఆయిల్‌తో పాటు విడిభాగాల ధరలను 20 శాతం మేర పెంచారు. లారీని బట్టి నిర్వహణ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. అన్ని పత్రాలున్నా పోలీస్, రవాణా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పందే అక్కడి నుంచి పంపే పరిస్థితి లేదు. ● పెరిగిన ఇన్సురెన్స్, టైర్లు, విడి భాగాల ధరలు ఈ రంగాన్ని కకావికలం చేస్తున్నాయి. ● లారీ, దాని విలువ బట్టి థర్ట్ పార్టీ ఇన్సురెన్స్ రెండేళ్ల క్రితం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేది. ప్రస్తుతం ఇది రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు ఎగబాకింది. ● 22 చక్రాల కొత్త లారీకి ఇన్సురెన్స్ రూ.1.25 లక్షల వరకు ఉంది. ● లారీని బట్టి త్రైమాసిక పన్ను రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంది. ● నేషనల్ పర్మిట్‌కు రూ.17 వేలు అదనం. ● ఏడేళ్లు దాటిన రవాణా వాహనానికి ఏటా గ్రీన్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. నెల్లూరు(టౌన్): లారీ ఉందంటేనే అదో ఠీవి. అబ్బో యజమానా.. ఇంకేమిలే అనే మాట తరచూ వినిపించేది. అయితే ఇదంతా గతం. రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ రంగం ప్రస్తుతం కకావికలమవుతోంది. డీజిల్ ధర లీటర్ రూ.98కి చేరువలో ఉండటం.. జాతీయ రహదారిపై ప్రతి 50 కిలోమీటర్లకో టోల్గేట్.. జీఎస్టీ మోతతో ఆదాయం సంగతి దేవుడెరుగు.. కనీస ఖర్చులొస్తే చాలు మహాప్రభో అనే స్థితికి యజమానులు వస్తున్నారు. అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం గతంలో ఉమ్మడి జిల్లాలో 30 వేలకుపైగా లారీలు ఉండేవి. ప్రధానంగా కృష్ణపట్నం పోర్టుకు ఎగుమతులు, దిగుమతులు అధిక సంఖ్యలో జరిగేవి. దీంతో పాటు ఇసుక, సిలికా, క్వార్ట్జ్, ధాన్యం, బియ్యం తదితరాల్లో వీటి పాత్ర కీలకం. లాభాలెక్కువగా ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపేవారు. అయితే కాలక్రమంలో ఇది పతనావస్థకు చేరుతోంది. కొత్తగా కొనుగోలు చేసే వారి సంగతి అటుంచితే.. ఉన్నవి కాపాడుకోవడమే గగనంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో లారీల సంఖ్య పది వేల్లోపే ఉంటాయని సమాచారం. కాలం మారింది.. కిరాయే మారలేదు రవాణా రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా ఐదేళ్లుగా ఉన్న కిరాయే నేటికీ కొనసాగుతోంది. లోడింగూ అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు సరుకుల రవాణాకు ఇటీవలి కాలంలో రైళ్లను ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. రాబడి తగ్గి.. ఖర్చులు అమాంతం పెరగడంతో కొందరు యజమానులు తమ లారీలను విక్రయానికి పెట్టారంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు బయటకొచ్చి ఏ వ్యాపారం చేయలేక అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు. డ్రైవర్లేరీ..? రవాణా రంగ సంక్షోభానికి డ్రైవర్ల కొరతా ఓ కారణమవుతోంది. కొత్తగా ఇందులోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. పైగా వీరికిచ్చే కమీషన్‌ను పది శాతానికి పెంచారు. ఉదాహరణకు కిరాయి రూ.లక్ష ఉంటే అందులో రూ.పది వేలను డ్రైవర్‌కు ఇవ్వాల్సిందే. లోడింగ్, అన్ లోడింగ్ బాధ్యతను యజమానే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మేరకు కిరాయి వస్తే అన్ని ఖర్చులు పోనూ రూ.20 వేలు కూడా మిగలని పరిస్థితి నెలకొంది. -
ఇన్సురెన్స్, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలి
లారీ తిప్పడం ప్రస్తు తం కష్టంగా మారింది. ఇన్సురెన్స్, గ్రీన్‌ట్యాక్స్‌ను అమాంతంగా పెంచేశారు. ఈ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. జీఎస్టీతో యజమానులపై పెనుభారం పడింది. టోల్గేట్ల సంఖ్యను తగ్గించడంతో పాటు కొత్తగా వచ్చే ఆటోమేటెడ్ ఫిట్నెస్ స్టేషన్లను నిలిపేయాలి. రవాణా రంగాన్ని ఆదుకోకపోతే పూర్తిగా విక్రయించే పరిస్థితి వస్తుంది. – గోపాలనాయుడు, లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నాలుగు శాతం వ్యాట్‌ను తగ్గించాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దీని ధర ఇక్కడే ఎక్కువగా ఉంది. కిరాయిలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. డ్రైవర్లు దొరకని పరిస్థితి. విడిభాగాల ఖరీదులు బాగా పెరిగాయి. ప్రస్తుత రోజుల్లో పాత లారీని తిప్పే పరిస్థితే లేదు. – దయాకర్‌రెడ్డి, యజమాని -
గ్రావెల్.. అన్‌స్టాపబుల్
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పచ్చ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నిన్నామొన్నటి వరకు ఇసుకను కొల్లగొట్టి భారీగా వెనుకేసుకున్న వీరి కళ్లు గ్రావెల్‌పై పడ్డాయి. అనుకున్నదే తడవుగా దగదర్తి మండలంలో దీన్ని యథేచ్ఛగా తవ్వుతూ లారీల్లో నిత్యం తరలిస్తున్నారు. విసిగివేసారిన గ్రామస్తులు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. వాహనాలతో తొక్కించి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పరోక్ష సహకారం ఉండటంతో వీరు మరింత చెలరేగిపోతూ సవాల్ విసురుతున్నారు. ప్రమాదాలు జరుగుతాయనే ఆందోళన కాలనీ వెనుక వైపు దాదాపు 40 అడుగుల మేర గోతులు తవ్వారు. వర్షాకాలంలో నీరు నిలిచి పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులు బుట్టదాఖలవుతుండటంతో ఇక తమకు దిక్కెవరని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దగదర్తి ప్రాంతంలోని కేకేగుంట, ఉలవపాళ్ల తదితర గ్రామాల్లోని గ్రావెల్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో కూటమి నేతలు కుమ్మకై ్క తమ పనిని కానిచ్చేస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమ రవాణా ఆగలేదంటే ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారనే అంశం స్పష్టంగా అర్థమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతల ధనదాహం పరాకాష్టకు చేరుతోంది. ఇసుక.. మద్యం.. ఇలా ప్రతి అంశంలో తమ మాటే చెల్లుబాటయ్యేలా వ్యవహరిస్తూ వచ్చిన వీరు.. తాజాగా గ్రావెల్‌ను కొల్లగొట్టడంలో నిమగ్నమయ్యారు. వీరి చేష్టలతో దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల, కేకేగుంట, సున్నపుబట్టి తదితర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ రవాణా రెండు నెలలుగా నిరాటంకంగా జరుగుతోంది. రాత్రయితే హడలే.. ఉలవపాళ్లలో రాత్రి వేళ ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. రెండు పొక్లయిన్లు ఏర్పాటు చేసి రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు వరకు 20 లారీల్లో గ్రావెల్‌ను యథేచ్ఛగా తరలిస్తున్నారు. మండలంలోని చోటా.. నియోజకవర్గ స్థాయి నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోంది. గ్రామస్తులెవరైనా అడ్డుకుంటే తొక్కి చంపేస్తామంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి వేళ వాహన శబ్దాలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఫిర్యాదు చేస్తే కన్నెర్రే..! కాలనీకి వెనుక వైపు ఉన్న ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతోంది. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని సమాచారం. ఒకరిద్దరు సాహసం చేసి వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన.. స్థానిక తహసీల్దార్‌కు ఫోన్ చేసి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఫలితంగా లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే కూటమి నేతల ఒత్తిళ్లతో దీన్ని వదిలేశారు. అదే రోజు రాత్రి నుంచి అక్రమ రవాణా మళ్లీ మొదటికొచ్చింది. ఉలవపాళ్ల, కేకేగుంట, సున్నపుబట్టీలో యథేచ్ఛగా తవ్వకాలు కొల్లగొడుతున్న టీడీపీ నేతలు అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యాలు లారీలతో తొక్కిస్తామంటూ హెచ్చరికలు అధికారుల పరోక్ష సహకారం దగదర్తి మండలంలో ఇదీ తంతు రోడ్లు.. పైప్లైన్లు ధ్వంసమై భారీ వాహనాల పుణ్యమానని గ్రామంలోని రోడ్లు.. తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా గ్రామస్తుల పాట్లు వర్ణనాతీతమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కొడుకు చేతిలో తండ్రి హతం
● మద్యం మత్తులో ఘాతుకం ● ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం మర్రిపాడు: మద్యం మత్తులో తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన మండలంలోని చుంచులూరు గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీలో చిలపోగు చిన్నయ్య (45) నివాసం ఉంటున్నాడు. అతనికి శివకుమార్ అలియాస్ సూరి అనే కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్నయ్య కూలి పనులకు వెళ్తుంటాడు. సూరి మద్యానికి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. బుధవారం రాత్రి చిన్నయ్య ఇంట్లో ఉండగా సూరి మద్యం తాగొచ్చి తండ్రితో గొడవపడి దాడి చేసి హతమార్చాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సబ్బు నీళ్లను చిన్నయ్య నోట్లో పోసి నురగ వచ్చేలా చేశాడు. గురువారం తెల్లవారుజామున ఇంటి పక్కన వారికి తన తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే చిన్నయ్య శరీరంపై గాయాలుండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సూరి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. ఆత్మకూరు సీఐ గంగాధర్, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. కాలనీకి చెందిన కొందరు అటవీ ప్రాంతానికి వెళ్లి సూరి ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: మండల పరిధిలోని కరేడు గ్రామానికి చెందిన కబడ్డీ కోచ్ సాదం శ్రీనివాసరావు నేషనల్ రెఫరీగా ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గురువారం తెలిపారు. బిహార్‌లోని బుద్ధగయలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న సబ్ జూనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఆంధ్రప్రదేశ్ రెఫరీ బోర్డు నుంచి శ్రీనివాసరావును ఎంపిక చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకు సహ కరించిన వ్యాయామ అధ్యాపకులు, బోర్డు కన్వీనర్ రవీంద్రబాబు, అసోసియేషన్‌కు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది ● సినీ నటుడు తనికెళ్ల భరణి సంగం: నెల్లూరు జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి తెలిపారు. అసుర సంహారం అనే సినిమా షూటింగ్ గురువారం మండలంలో జరిగింది. పలు సన్నివేశాలను తెలుగు ఉపాధ్యాయుడు ప్రవీణ్‌కుమార్ నివాసంలో, సంగమేశ్వరాలయంలో చిత్రీకరించారు. తనికెళ్ల భరణిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో 40 ఏళ్ల క్రితం నాటికను ప్రదర్శించానన్నారు. ఇక్కడ అమరావతి కృష్ణారెడ్డి, నందు, హరివిల్లు ఆర్గనైజేషన్ నిర్వాహకులు, పలువురు మిత్రులున్నారని తెలిపారు. నెల్లూరుకు చెందిన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తాను పలు సినిమాల్లో నటించామన్నారు. ప్రతిభ ఉన్నవారిని సినిమా ఇండస్ట్రి ఎప్పుడూ స్వాగతిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నారు. కండలేరులో 49.983 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 49.983 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 580, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 80, మొదటి బ్రాంచ్ కాలువకు 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
రైతులను ఆదుకోకపోతే పోరాటం చేస్తాం
నెల్లూరు(బారకాసు): ‘పంటకు గిట్టుబాటు ధర లేక వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వారిని ఆదుకోకపోతే పోరాటం చేస్తాం’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరు నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యాన్ని ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు విక్రయించుకుంటున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అమరావతిలో సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారే తప్ప ధాన్యం కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించడం లేదన్నారు. జిల్లాలో పుట్టి ధాన్యం రూ.19,720లకు అమ్మాల్సి ఉండగా ప్రస్తుతం రూ.15,500 విక్రయించుకునే పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకురాక, మరోవైపు దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇదే సీజన్లో పుట్టి ధాన్యం రూ.22 వేలకు కల్లాలోనే కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఆరబెట్టిన ధాన్యాన్ని రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు కొనుగోలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆపేశారని దీంతో రైస్‌మిల్లర్లు, దళారులు విజృంభిస్తున్నారని చెప్పారు. దీంతో రైతు ఎకరాకు రూ.40 వేలు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం గన్నీబ్యాగ్‌లు లేవని, రవాణా సౌకర్యం లేదని, కూలీలు లేరని రైతులు వాపోతున్నారన్నారు. ఏప్రిల్ మూడో వారం వరకు ధాన్యం కోతలు ఉంటాయని కాబట్టి, ప్రభుత్వం కళ్లు తెరిచి గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. బ్లాక్మెయిల్ కోసమే.. మిల్లర్లు, దళారులు రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేయడానికి వీలు లేదంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి వాట్సాప్‌లో పోస్టు చేశారని కాకాణి అన్నారు. దీనికి కారణం రైతుల మీద ప్రేమ కాదని కేవలం రైస్‌మిల్లర్లు, దళారులను బ్లాక్మెయిల్ చేసేందుకేనన్నారు. అమరావతిలో కలెక్టర్లు, శాసనసభ్యులతో మాట్లాడటం, ఇక్కడకు వచ్చి రైస్‌మిల్లర్లు, దళారులతో డీల్ కదుర్చుకోవడం చేస్తున్నారన్నారు. గతంలో క్వార్ట్జ్ మైనింగ్ దగ్గరికి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హడావుడి చేశారని.. ఆ తర్వాత వాటి యజమానులను బెదిరించి వాటాలు తీసుకున్న ఘనత సోమిరెడ్డిదన్నారు. వరికి గిట్టుబాటు ధర లేక ఆందోళన పెట్టుబడి కూడా రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్): సదరం క్యాంపునకు వచ్చే దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జరుగుతున్న దివ్యాంగుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ సదరం క్యాంపును కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ను త్వరగా చేసి అదేరోజు వైద్యపరీక్షలు పూర్తి చేసి పంపాలని సూచించారు. సమయం చాల్లేదంటూ దివ్యాంగులను మరోరోజు పిలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగులకు ఐడీ నంబర్ ఇచ్చే ప్రక్రియను ఆన్లైన్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారంటూ సంబంధిత సిబ్బందిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ తాము దూరప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు పడి ఇక్కడికి వస్తున్నామని, వెరిఫికేషన్ ప్రక్రియను ఆత్మకూరు, కావలి, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, డాక్టర్ గంగాధర్, డాక్టర్ మస్తాన్‌బాషా, అడ్మిని స్ట్రేషన్ అధికారులు డాక్టర్ కళారాణి, డా.సుశీల్, ఏడీ ఏడుకొండలు పాల్గొన్నారు. -
డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
నెల్లూరు(టౌన్): మహిళా విద్యకు ప్రాధాన్యమిస్తున్న డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉందని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత అన్నారు. కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సంబరం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు కళాశాల నుంచి కేవీఆర్ సెంటర్ వరకు వజ్రోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం పూర్వ, ప్రస్తుత అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో సెల్ఫీలు తీసుకున్నారు. రిజిస్ట్రార్ సునీత మాట్లాడుతూ రానున్న రోజుల్లో కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చదువుకున్న పాఠశాల, కళాశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉందన్నారు. దొడ్ల కౌసల్యమ్మ మేనల్లుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ డీకేడబ్ల్యూలో చదివిన ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని కొనియాడారు. సినిమా హీరో చిరంజీవి సోదరి విజయదుర్గ మాట్లాడుతూ వజ్రోత్సవ సంబరాలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతోమంది స్నేహితులను కలిసినట్లు చెప్పారు. ఇంకా పూర్వ ప్రిన్సిపల్ మస్తానయ్య, పూర్వ ప్రిన్సిపల్ శైలజ, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సతీమణి, పూర్వ విద్యార్థిని హేమావతి మాట్లాడారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు గంగాధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఏవీ రమణారావు పాల్గొన్నారు. వీఎస్‌యూ రిజిస్ట్రార్ సునీత ముగిసిన వజ్రోత్సవ సంబరంచాలా ఆనందంగా ఉంది డీకేడబ్ల్యూ కళాశాల వజ్రోత్సవాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఆశించిన స్థాయిలో పూర్వ విద్యార్థులు ఈ వేడుకలను తరలివచ్చారు. డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నందుకు గర్వ పడుతున్నా. – జ్యోతిరెడ్డి, అధ్యక్షురాలు, పూర్వ విద్యార్థుల సంఘం విజయవంతానికి కృషి చేశాం డీకేడబ్ల్యూ వజ్రోత్సవానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్నోరోజులు కృషి చేశాం. ఎంతో దూరం నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. సంవత్సరాల తర్వాత అందరం ఒకచోట నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది. – కుసుమకుమారి, కార్యదర్శి, పూర్వ విద్యార్థుల సంఘం -
లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడి అరెస్ట్
వరికుంటపాడు: మండలంలోని వరికుంటపాడులో ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించిన కేసులో గొలపల్లి గురవయ్య అనే వ్యక్తిని గురువారం అరెస్ట్ చేశామని ఎస్సై రఘునాథ్ తెలిపారు. అతడిని ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు.రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతినెల్లూరు(క్రైమ్): రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆకుపచ్చ రంగు హాఫ్ హ్యాండ్ టీ షర్ట్, బులుగు రంగు షాట్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్సై మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఉపాధి కోసం వచ్చి కానరాని లోకాలకు..● గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిమనుబోలు: ఉపాధి కోసం వచ్చి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మనుబోలు – పొదలకూరు రోడ్డు మార్గంలో రాజోలుపాడు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. గురువారం పోలీ సులు వివరాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రానికి చెందిన బల్వీందర్ సింగ్ (30) వరికోత మెషీన్ ఆపరేటర్‌గా ఉన్నాడు. రాజోలుపాడు గ్రామ పొలాల్లో పనిలు చేస్తున్నాడు. సమీపంలోని పెట్రోలు బంక్ వద్ద ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి మూత్రవిసర్జన కోసం అతను రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై శివరాకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.24,289 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు● జాయింట్ కలెక్టర్ కార్తీక్నెల్లూరు రూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 24,289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కార్తీక్ తెలిపారు. గురువారం 3,582 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని ప్రకటన విడుదల చేశారు. రూ.52.10 కోట్లను రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. రైతులు దళారుల మాటలు విని తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని తెలియజేశారు. -
వృద్ధుడికి ఎంత కష్టం వచ్చిందో..
మర్రిపాడు: ఓ వ్యక్తి పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాడు. వారిప్పుడు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. భార్య అనారోగ్యంతో మంచాన పడింది. వృద్ధాప్యంలో ఉన్న అతను ఆమె బాధ చూడలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని రాజులపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బక్కిరెడ్డి (70)కి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలకు వివాహాలై బెంగళూరులో ఉంటున్నారు. మూడేళ్ల క్రితం బక్కిరెడ్డి భార్య పక్షవాతంతో మంచాన పడింది. సంతానం దగ్గర లేకపోవడం.. ఎవరూ పట్టించుకోకపోవడంతో భార్యకు సపర్యలు చేయడం బక్కిరెడ్డికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె పడుతున్న బాధ చూడలేక ఆయన ఎంతగానో ఆవేదన చెందేవాడు. గురువారం బక్కిరెడ్డి గ్రామానికి సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. యువకుడి మృతి
ఆత్మకూరు: మోటార్‌బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గురువారం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. తెల్లపాడు ముస్తాపురం గ్రామానికి చెందిన తాటిపర్తి ఈశ్వర్ (19) కూలి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో కరటంపాడుకు బైక్‌పై వెళ్లి తిరిగి ముస్తాపురానికి వస్తున్నాడు. ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో లారీ బైక్‌ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై ఈశ్వర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం!
కాశినాయన క్షేత్రం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు తొలుత తిరుమల లడ్డూ నాణ్యతపై లేనిపోని విమర్శలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆపై అదే తిరుమలలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో హిందూ వ్యతిరేక చర్యకు నడుం బిగించారు. ఇందుకు కాశీనాయన క్షేత్రం వేదికైంది. దీనులకు దేవాలయం.. అన్నార్తులను ఆదరించి అక్కున చేర్చుకునే అపర అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో కనిపించేదల్లా.. నిత్యాన్నదానం, స్వచ్ఛంద విరాళాల తత్వం, లాభాపేక్షలేని సేవా భావం! పచ్చటి నేలలోని ఆ ప్రశాంత క్షేత్రంలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది. కూటమి సర్కారు వరుసగా కూల్చివేతలు కొనసాగించింది. కాశీనాయన క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాషాయ వ్రస్తాలు ధరించి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తూ పలు ఆలయాలు దర్శించిన, సనాతన ధర్మానికి పరిరక్షకునిగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఆయన మాత్రం దీనిపై నోరుమెదపడంలేదు. ఎన్నో ఏళ్లుగా పేదల కడుపునింపుతున్న ఓ ధార్మీక క్షేత్రంపై కూటమి ప్రభుత్వం ఇలా కత్తిగట్టినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిత్యాన్నదానం, గో సంరక్షణ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసు పల్లి గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మల రెండో సంతానమైన కాశిరెడ్డి యవ్వనంలోనే ఇంటిని వదిలి ఆథ్యాత్మికత వైపు అడుగులు వేశారు. వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ గరుడాద్రి వద్ద తపస్సులో నిమగ్నమయ్యారని, ఆయనకు జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై మార్గ నిర్దేశం చేశారని ప్రతీతి. తన గురువు అతిరాస గురవయ్య ఉపదేశం మేరకు ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. నిత్యాన్నదానం, గో సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 1995 డిసెంబరు ఆరో తేదీ దత్తపౌర్ణమి రోజు మహాసమాధి అయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా 1999లో కలసపాడు, బి.కోడూరు పరిధిలోని పలు పంచాయతీలతో శ్రీ అవధూత కాశినాయన (ఎస్‌ఎకేఎన్) మండలం ఏర్పాటైంది. ఎంతో పవిత్రమైన కాశినాయన క్షేత్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూల్చివేతలు మొదలయ్యాయి. గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, మార్చి 7వతేదీన జ్యోతి క్షేత్రంలోని కుమ్మరి అన్నదాన సత్రం, విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం, గోవుల దాణా షెడ్డు, గోశాల షెడ్డు, మరుగుదొడ్లను కూల్చి వేశారు. జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో శివరంగారెడ్డి నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను కూలగొట్టారు. ఓ వర్గానికి చెందిన వారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ ద్వారా ఈ పని చేయించారనే అనుమానాలు కాశినాయన భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎండలో అలమటిస్తున్న గోవులు వందకు పైగా అన్నదాన సత్రాలురాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కాశిరెడ్డి అవధూత కాశీనాయనగా పూజలు అందుకున్నారు. స్థానిక ప్రజలు ఆయనకు నిత్యం పూజలు నిర్వహిస్తూ 13 హెక్టార్ల పరి«ధిలో గుడి, గోశాల, అన్నదాన సత్రాలు, వసతి గృహాలు నిర్మించారు. పలు నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. కాశీనాయన క్షేత్రాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల్లో కాశీనాయన పేరిట వందకు పైగా అన్నదాన సత్రాలు కొనసాగుతున్నాయి. అటవీశాఖకు 50 ఎకరాలు..నల్లమల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆ గుడి వద్ద అన్నదానం ఏర్పాటుకు చేరుకున్న కాశీనాయన అక్కడే శివైక్యం చెందారు. 1997 నుంచి క్షేత్రం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. అటవీశాఖ తొలుత అటవీప్రాంతంగా, ఆ తరువాత రిజర్వు ఫారెస్టుగా 2000–2003 నుంచి చెబుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని 50 ఎకరాలను క్షేత్రం నిర్వాహకులు అటవీశాఖకు కేటాయింపజేశారు. గతంలో రాష్ట్ర, కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. దానిపై అటవీశాఖ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.అన్నదానసత్రంలో భోజనం చేస్తున్న భక్తులు కొసమెరుపేమిటంటే.. తిరుమల తొక్కిసలాటఘటనపై పవన్ కళ్యాణ్ హడావిడి చేయగా ఇపుడు కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై నారాలోకేష్ తాపీగా రంగంలోకి దిగారు. క్షమాపణలు చెబుతున్నానని, కూల్చిన నిర్మాణాలను పునరి్నర్మీస్తామని చెబుతుండడం ఏదో డ్రామాలా కనిపిస్తున్నదని పలు హిందూ ధార్మీక సంస్థలు విమర్శిస్తున్నాయి.దాతల సహకారం అపూర్వంఎక్కడి నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో మాకే అంతుబట్టదు. దాతల సహకారం మేం ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామంటే పదివేల మందికి సరిపడా సరుకులు స్వచ్ఛందంగా క్షేత్రానికి చేరుతుంటాయి. ఆలయ నిర్మాణానికి కూడా అదేవిధంగా సాయం అందుతోంది. వారి తోడ్పాటుతోనే మహత్తర క్షేత్రం నిర్మితమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భక్త కోటి కోరుకుంటోంది. – బి.చెన్నారెడ్డి, ఆలయ ప్రధాన నిర్వాహకులుధర్మానికి అండగా నిలవండి ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చడం అభ్యంతరకరం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను, ధార్మికవేత్తలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ధర్మ ప్రచారానికి అండగా నిలవాలి.– శ్రీనివాసానందస్వామి, కాశీనాయన క్షేత్రం50 ఎకరాలు ఇచ్చాం..కాశీనాయన క్షేత్రం సుమారు 13 హెక్టార్లలో విస్తరించింది. అభివృద్ధి పనులు కొన్నేళ్లుగా ఆగిపోయాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే 50 ఎకరాలను పెనగలూరు మండలంలో ఇచ్చాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నాం.– జీరయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు -
సోమశిల ఈఈ బాధ్యతల స్వీకరణ
సోమశిల: సోమశిల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా శ్రీనివాస్‌కుమార్ బాధ్యతలను బుధవారం చేపట్టారు. ఆయన్ను డీఈఈ రవీంద్రప్రసాద్, జేఈలు గురుప్రసాద్, పెద్దిరాజు, నిఖిల్, శరత్చంద్ర, రామ్మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలను తెలియజేశారు. రొయ్యల ఫ్యాక్టరీలో తనిఖీలు కొడవలూరు : మండలంలోని పెయ్యలపాళెం రోడ్డులో గల అల్ఫా మైరెన్ రొయ్యల ఫ్యాక్టరీలో బాల కార్మికులతో పని చేయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలను అధికారులు బుధవారం నిర్వహించారు. కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి, వైద్యాధికారి బాలచంద్రబాబు, కార్మిక శాఖ, సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు తనిఖీలను జరిపారు. 18 ఏళ్లలోపు వయస్సున్నట్లు అనుమానం ఉన్న పలువుర్ని గుర్తించారు. వయస్సు నిర్ధారణ నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. 18 ఏళ్లలోపు ఉందని నిర్ధారణ అయితే యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. -
రుణాల మంజూరులో భాగస్వాములవ్వాలి
నెల్లూరు రూరల్: ఎమ్మెస్సెమ్‌ఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, వీటి మంజూరులో ప్రైవేట్ బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జేసీ కార్తీక్ కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులకు రుణాల మంజూరులో ప్రైవేట్ బ్యాంకర్లు వెనుకబడి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సహకారాన్ని అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముద్ర యోజన, పీఎంఈజీపీ, ఎమ్మెస్సెమ్‌ఈ రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను విరివిగా ఇవ్వాలన్నారు. గ్రామాల్లో లబ్ధిదారులతో నిర్వహించే అవగాహన సదస్సులకు బ్యాంక్ అధికారులు హాజరుకావాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీలను త్వరగా మంజూరు చేయాలని కోరారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ మాట్లాడారు. ఈ త్రైమాసికానికి సంబంధించిన రుణాల మంజూరులో మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. నాబార్డు డీడీఎం బాబు, మేనేజర్ రాజేష్, పశుసంవర్థక, మత్స్యశాఖ జేడీలు రమేష్‌నాయక్, నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
3537 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నెల్లూరు రూరల్: జిల్లాలో 3537 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మంగళవారం కొనుగోలు చేశామని జేసీ కార్తీక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.43.3 కోట్లను జమ చేశామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దు నెల్లూరు రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాన్ని మంత్రి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు అందుబాటులో ఐదు లక్షల గోతాలున్నాయని చెప్పారు. దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని కోరారు. ధాన్యం కొనుగోలు విషయమై జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు. మిల్లు వద్ద రెవెన్యూ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టామని, కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమవుతుందని తెలిపారు. అవసరమైతే ప్రకాశం, బాపట్ల, కందుకూరు తదితర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీచైతన్య పాఠశాలకు తాళాలు ● జీఎస్టీ వివాదంలో భవన యజమాని చర్య ● స్కూల్మూతతో వెనుదిరిగిన విద్యార్థులు కోవూరు: పట్టణంలోని శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు భవన యజమాని బుధవారం తాళాలేశారు. యజమాని వినీత్‌రెడ్డికి చెల్లిస్తున్న అద్దెకు సంబంధించిన 18 శాతం జీఎస్టీని పాఠశాల యాజమాన్యం జమచేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే దీన్ని చెల్లించకపోవడంతో వడ్డీ, జరిమానాతో కలిసి ఇది రూ.36.83 లక్షలకు చేరింది. ఈ తరుణంలో జీఎస్టీ, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, నెల్లూరు నుంచి యజమానికి నోటీస్ జారీ అయింది. దీనిపై పలుమార్లు కోరినా స్పందించలేదని, దీంతో తాళాలేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కాగా ఈ పరిణామంతో విద్యార్థులు వెనుదిరిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రంగనాథ్గౌడ్ పాఠశాల వద్దకు చేరుకొని సిబ్బందిని విచారించారు. పది పరీక్షలకు 309 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన హిందీ టెస్ట్‌కు జిల్లాలో 309 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. 28,485 మందికి గానూ 28,176 మంది హాజరయ్యారు. ఆరు కేంద్రాల్లో స్టేట్ అబ్జర్వర్, ఎనిమిది కేంద్రాల్లో డీఈఓ, 56 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ● ఏపీ ఓపెన్ స్కూల్ పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 392 మంది అభ్యాసకులకు గానూ 344 మంది హాజరయ్యారు. -
త్యాగరాజ స్మరణోత్సవాల్లో పాల్గొనడం అదృష్టం
●ప్రముఖ గాయని ఎస్పీ శైలజ నెల్లూరు(బృందావనం): నగరంలో నిర్వహిస్తున్న త్యాగరాజ స్మరణోత్సవాల్లో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ గాయని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. నగరంలోని పురమందిర ప్రాంగణంలో భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన స్మరణోత్సవాలకు ఆమె హాజరయ్యారు. గాత్రకచేరి నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన గాయని చాగంటి రమ్య కిరణ్మయి, త్యాగరాజస్వామి, శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపాలను త్రీడీ కార్డు బోర్డుతో తీర్చిదిద్దిన కళాకారుడు కిడాంబి నరసింహాచార్యులును సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తన తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ, తన తండ్రి ఆప్తమిత్రుడు డాక్టర్ యనమండ్ర వెంకటేశ్వరశాస్త్రి కుటుంబసభ్యులతో కలిసి ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభించిన స్మరణోత్సవాలను కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వీటిని తన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్నేళ్ల పాటు నిర్వహించారన్నారు. ఉ త్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 26న నిర్వ హించనున్న సీతారాములు, శివపార్వతుల కల్యా ణోత్సవాల్లో పాల్గొంటానన్నారు. యనమండ్ర నాగ దేవీప్రసాద్, కమిటీ సభ్యులను అభినందించారు. -
ధాన్యం.. చిత్తశుద్ధి శూన్యం
గోతాలకూ కటకటే సిబ్బంది కొరతా సమస్యే ధాన్యం కొనుగోళ్లలో అధికారులకు చిత్తశుద్ధి కరువవడం.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం రైతుల పాలిట శాపంలా పరిణమించింది. ధరల్లేక.. కొనేవారు కానరాక అన్నదాతలకు ఇబ్బంది తప్పడంలేదు. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు.. నిల్వ చేసేందుకూ సౌకర్యాల్లేవంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కోసిన అనంతరం కల్లాల్లోనే విక్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని ధరలను మిల్లర్లు తగ్గించి వారిని దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా, కర్షకులకు మద్దతు ధర లభించడం గగనమవుతోంది. నెల్లూరు (పొగతోట): అనాలోచిత చర్యలు.. ముందస్తు ప్రణాళికల్లేకపోవడం.. పక్క జిల్లాల మిల్లర్లను రప్పించడంలో అధికార యంత్రాంగం విఫలం కావడం రైతుల పాలిట శాపంలా మారింది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల మధ్య పోటీతత్వం లేకపోవడం.. ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం.. నిల్వ చేసేందుకు రైతులకు సౌకర్యాల్లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీ పర్వానికి తెరలేపారు. గతేడాదితో పోలిస్తే పుట్టికి రూ.పది వేలు తగ్గించి కొంటున్నా చేష్టలుడిగి చూడటం అధికారుల వంతవుతోంది. మద్దతు ధరకు విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని ప్రచారం చేస్తున్నారే తప్ప, మిల్లర్లను కట్టడి చేసి ధరలు పెరిగేలా చూడటంలో విఫలమవుతున్నారు. బ్యాంక్ గ్యారెంటీల సేకరణలో వైఫల్యం వాస్తవానికి జిల్లాలో 120 రైస్‌మిల్లులుండగా, నెల్లూరులోనే 80 ఉన్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను ఆడించేందుకు 103 మిల్లులను గుర్తించారు. వీటికి ధాన్యాన్ని సరఫరా చేయాలంటే బ్యాంక్ గ్యారెంటీలను తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటి సేకరణలోనూ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎంపిక చేసిన వాటిలో కేవలం 50 నుంచి 60 మిల్లులే రూ.30 కోట్లకు గ్యారెంటీలను సమర్పించడం విశేషం. వాస్తవానికి వరికోతలు ప్రారంభం కాక ముందే రైస్ మిల్లర్లతో ఆయా ప్రాంతాల సీఎస్డీటీలు సమన్వయం చేసుకొని.. సమావేశాలను నిర్వహించి వీటిని సేకరించాల్సి ఉంది. అయితే ఇవేవీ జరగకపోవడం రైతులకు అశనిపాతంలా పరిణమించాయి. ఒకే అధికారి.. మూడు విధులు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించే డీఎస్ఓ పోస్ట్ ఖాళీగా ఉంది. నెల్లూరు ఏఎస్ఓ, ఆఫీస్ ఏఎస్ఓ, డీఎస్ఓ.. ఇలా మూడు పోస్ట్‌లను ప్రస్తుత ఇన్చార్జి డీఎస్ఓ అంకయ్య నిర్వహిస్తున్నారు. డీఎస్ఓ లేని సమయాల్లో డిప్యూటీ కలెక్టర్ హోదా స్థాయి అధికారులను ఇన్చార్జిగా నియమించాల్సి ఉన్నా, ఆ యత్నాన్నే చేయకపోవడం గమనార్హం. ప్రతి అంశంలోనూ ఇంతే.. గోతాల్లేక.. బ్యాంక్ గ్యారెంటీలు అందక.. రవాణాకు లారీలు సక్రమంగా పంపక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వీటిని సహాయ పౌరసరఫరాల అధికారులు, సీఎస్డీటీలు పర్యవేక్షించేవారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితే లేదు. ధాన్యం బస్తాలను దించుకుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. కొద్దో గొప్పో సేకరించిన లారీల నుంచి సకాలంలో అన్లోడ్ కావడంలేదు. పుట్టి ధరలు ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకే ఉన్నాయి. కోతలు ముమ్మరం కావడంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్లను పిలిపించి వారితో జేసీ కార్తీక్ సమావేశమై.. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. బ్యాంక్ గ్యారెంటీలిచ్చేందుకు ముందుకు రాని మిల్లర్లు కొనుగోళ్లలో అధికారుల తీరిదీ..జిల్లాలో 103 సీఎమ్మార్ మిల్లులు అన్నదాతల అగచాట్లు సకాలంలో జరగని సమన్వయ సమావేశాలు మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు రైతులు నష్టపోకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రకాశంతో పాటు సమీప జిల్లాల రైస్ మిల్లర్లను సంప్రదించాం. వీరితో ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టాం. రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించేలా చూస్తున్నాం. – అంకయ్య, ఇన్చార్జి డీఎస్ఓ జిల్లా వ్యాప్తంగా సీఎస్‌డీటీ పోస్టులు 11 ఉండగా, అందులో ఆరు ఖాళీగా ఉన్నాయి. కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, ఇందుకూరుపేట, రాపూరు, నెల్లూరు రూరల్, అర్బన్‌లో ఈ పరిస్థితి నెలకొంది. నెల్లూరు రూరల్, అర్బన్‌లో ఎలక్షన్ డీటీలను ఇన్చార్జి సీఎస్డీటీలను నియమించారు. ఇందుకూరుపేట జీపీఏ, సీఎస్‌డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో వరిని అధికంగా పండిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడి సీఎస్డీటీలను ఆయా ప్రాంతాల ఎమ్మెల్‌ఎస్ పాయింట్లకు ఇన్చార్జిలుగా నియమించారు. -
కామధేనులో మూగరోదన
కలవరపెడుతున్న బ్రూసెల్లోస్ వ్యాధి అధికారిక లెక్కల మేరకు 120 గోవులు, గేదెలకు బ్రూసెల్లోస్ వ్యాఽధి సోకింది. వీటిని వేరు చేసి ప్రత్యేకంగా ఉంచారు. ఇది సోకితే నయమయ్యే అవకాశం లేకపోవడంతో ఆహారం, దాణాను తగ్గిస్తున్నారు. దీంతో అనేక మూగజీవాలు చిక్కిశల్యమవుతున్నాయి. ప్రత్యేక షెడ్లో ఉండాల్సిన వీటిలో ప్రస్తుతం 47 మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాటి సంగతి ఏమిటని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదు. మరణిస్తే రికార్డుల్లో నమోదు చేయాలి, అయితే గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీ కార్తీక్ ఇటీవల పర్యటించి ఈ అంశమై అఽధికారుల నుంచి నివేదిక కోరారు. అవసరం లేకపోయినా కొన్ని సాహివాల్ ఆవులు, ముర్రాజాతి గేదెలను కొనుగోలు చేసి కమీషన్లు కోసం నిధులు వెచ్చించారనే ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి అధికారులు ఇక్కడే తిష్ట వేయడంతో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని సిబ్బందే పేర్కొంటున్నారు. సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయమై కామధేను ప్రాజెక్ట్ జేడీ, వెంకటేష్ ను సంప్రదించగా, ప్రాజెక్ట్ సీఈఓ, గుంటూ రు, శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నడు చుకుంటున్నామని చెప్పారు. అనుమానాలు ఉంటే ఆయన్నే సంప్రదించాలని సూచించారు. మరికొన్ని ప్రశ్నలు అడగ్గా, మౌనం వహించారు.ఉదయగిరి / కొండాపురం: కొండాపురం మండలంలోని చింతలదేవి క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రంలో పశువులు మూగవేదనను అనుభవిస్తున్నాయి. సరైన ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. దేశంలో ఉన్న వివిధ రకాల ఆవులు, గేదెల పిండోత్పత్తి చేసి రైతులకు మేలు జాతి సంపదను అందించాలనేది ఈ కేంద్ర ఆశయం. ఇంతటి ప్రాధాన్యమైన ఈ ప్రాజెక్ట్ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇక్కడి పశువులకు అహారం, నీళ్లు, తగిన వసతులు, మెరుగైన వైద్యం అందక మూగరోదనను అనుభవిస్తున్నాయి. విడుదలకు నోచుకోని వాటా.. 2015లో రూ.36.12 కోట్ల అంచనా వ్యయంతో కామధేను ప్రాజెక్ట్ మంజూరైంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.25 కోట్లను మంజూరు చేయగా, రాష్ట్ర వాటాగా రూ.11.12 కోట్లను విడుదల చేయలేదు. ఈ పరిణామంతో కేంద్రమిచ్చిన నిధులతోనే పనులు జరుగుతున్నాయి. చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో 2448 ఎకరాలుండగా, ఇందులో 510 ఎకరాలను దీని కోసం కేటాయించారు. ఇందులో పదెకరాల్లో పశువులు, గోవులకు అవసరమైన నిర్మాణాలు, పరిపాలన భవనాలను నిర్మించారు. పశుగ్రాసానికి 500 ఎకరాలను కేటాయించారు. అయితే ఇక్కడ నీటి పారుదలకు సదుపాయం లేకపోవడంతో వేసవిలో పశుగ్రాస కొరత వెంటాడుతోంది. రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా కోసం నిధులు మంజూరై కొంతమేర పనులూ జరిగాయి. అయితే అక్కడి నుంచి నీటిని తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో నిలిచిపోయాయి. ఇదీ ప్రాజెక్ట్ నేపథ్యం.. ఇక్కడి ప్రాజెక్ట్‌లో దేశంలోని 14 రకాల దేశవాళీ ఆవులు, ఆరు రకాల గేదెలున్నాయి. వీటి ద్వారా మేలు జాతి ఆవులు, గేదెలను పునరుత్పత్తి చేసి రైతులకు అందించాలని, తద్వారా పాల దిగుబడి పెరిగి పశుపోషకుల జీవన ప్రమాణాలు వృద్ధి చెందుతాయనేది లక్ష్యం. దీని కోసం ప్రత్యేకమైన ల్యాబ్‌నూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 14 రకాలకు చెందిన 317 ఆవులు, ఆరు రకాలకు చెందిన 138 గేదెలున్నాయి. వీటికి తోడు మరో 70 వరకు దూడలూ ఉన్నాయి. నిర్లక్ష్యానికి పరాకాష్ట అభివృద్ధి చేసిన పిండాన్ని ఆవు గర్భంలో ప్రవేశపెట్టి వాటి ద్వారా మేలుజాతి సంతతిని రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఈ విధానంలో 11 మాత్రమే జన్మించాయి. వాస్తవానికి వందలాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరాలి. అయితే అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఇది జరగడంలేదు. ఐవీఎఫ్ – వీటీటీ ల్యాబ్‌కు చెందిన డాక్టర్ ఇక్కడ జీతం తీసుకుంటూ చుట్టపు చూపుగా వస్తుండటంతో ఆశించిన ప్రగతి లేదు. అర్థాకలి.. ఈ ప్రాజెక్ట్ మారుమూల ప్రాంతంలో ఉండటంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మూగజీవాలకు అర్థాకలి తప్పడం లేదు. ఎండుగడ్డి, దాణా కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నా, లభించేది అరకొరే. దీంతో లేగ దూడలు బక్కచిక్కుతున్నాయి. ఇక్కడి గేదెలు, ఆవుల ద్వారా పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నా, రికార్డుల్లో మాత్రం కాకి లెక్కలు చూపుతున్నారు. గోవుల కోసం దాతలు ఉచితంగా ఇచ్చే ఎండు గడ్డిని సైతం కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపి నిధులను కాజేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. వేసవిలో సరిపడా నీరు లేక దాహంతో జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసానికి కొరత తాగునీటికీ కటకట బ్రూసెల్లోస్ వ్యాధితో విలవిల్లాడుతున్న మూగజీవాలు రూ.లక్షలు వెచ్చిస్తున్నా, వాటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఇదీ చింతలదేవిలోని కేంద్ర దుస్థితి -
విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులోని మినీబైపాస్ రోడ్డులో రాస్తారోకో జరిగింది. అనంతరం రామ్మూర్తి నగర్ విద్యుత్ సెక్షన్ కార్యాలయం ఎదుట కరెంట్ బిల్లులను నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా, నగర కార్యదర్శులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రూఅప్ చార్జీలు రద్దు చేస్తామని, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు వేయమని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. వీరు అధికారంలో లేనప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పారన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్లో ఒకరు 53 విద్యుత్ యూనిట్లు వాడినందుకు రూ.126 బిల్లు రావాల్సి ఉండగా అదనపు చార్జీలు, ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.687 బిల్లు వచ్చిందన్నారు. ఒక్క యూనిట్ విద్యుత్‌కు వినియోగదాడికి రూ.14 వేస్తున్నారని ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని గతంలో లోకేశ్ పిలుపునిచ్చారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను పగులగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు నరసింహ, మూలం ప్రసాద్, ఎన్వీ సుబ్బమ్మ, జాఫర్, ఫయాజ్, రమణారెడ్డి, చెంగయ్య, శాఖా కార్యదర్శులు సంపూర్ణమ్మ, రాజ్యలక్ష్మి, గడ్డం శ్రీనివాసులురెడ్డి, మురళి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో సబ్‌స్టేషన్ ఎదుట కరెంట్ బిల్లుల దగ్ధం -
డెలివరీ బాయ్‌గా..
పోలయ్య బేల్దారి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పనికి వెళ్లలేకపోయాడు. దీంతో కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత సురేష్‌పై పడింది. అతను క్రీడలను పక్కనపెట్టాడు. 2022లో పోలయ్య మృతిచెందడంతో అప్పటి నుంచి సురేష్ చిన్నపాటి పనులు చేస్తున్నాడు. అన్నకు వివాహమైంది. తమ్ముడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సురేష్ కొంతకాలం సచివాలయ వలంటీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా ఉన్నాడు. మొండి చేతులతో స్కూటీ నడుపుతూ రోజుకు 20కి పైగా అడ్రసుల్లో వస్తువులను డెలివరీ చేస్తుంటాడు. శారీరకంగా కష్టంగా ఉన్నా కుటుంబం కోసం నిత్యం సుమారు వంద కిలోమీటర్ల మేర రాకపోకలు చేస్తున్నాడు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేస్తూనే ఉంటాడు. ఒక్కో డెలివరీకి ఇంత మొత్తంలో అని ఇస్తుండటంతో ఎక్కువగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఎంకామ్ ఫైనలియర్ చదువుతున్నాడు. -
కారుణ్య నియామక పత్రాల అందజేత
నెల్లూరు(అర్బన్): ఐదుగురికి కారుణ్య నియామకాల కింద కలెక్టర్ ఆనంద్ ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను బుధవారం కలెక్టరేట్లో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్‌లు లబ్ధిదారులకు అందించారు. సీహెచ్ రాము హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మృతిచెందగా అతడి కుమారుడు భార్గవ్‌కు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా, కె.జోసఫ్ ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోగా అతని కుమారుడు కుష్వంత్ కల్యాణ్‌కుమార్‌కు పంచాయతీరాజ్ సర్కిల్లో సబార్డినేట్‌గా, గురవయ్య ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ మృతిచెందగా ఆయన కుమారుడు గురుకిషోర్కు పశుసంవర్థక శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా, పి.ఆదినారాయణ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ చనిపోగా అతడి కుమారుడు నవీన్‌కుమార్‌కు రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రేడ్–2 వీఆర్వోగా, యు.శ్రీనివాసులు ఎన్ఫోర్స్మెంట్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మృతిచెందగా ఆయన కుమారుడు సాయిని రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ఈ సందర్భంగా డీఆర్వో ఉదయభాస్కర్‌రావు మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన వారు సర్వీస్‌లో మంచి పేరు తెచ్చు కోవాలని ఆకాంక్షించారు. -
కండలేరులో 50.025 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 50.025 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 580, లోలెవల్ కాలువకు 110, హైలెవల్ కాలువకు 80, మొదటి బ్రాంచ్ కాలువకు 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్● వ్యక్తి మృతి దుత్తలూరు: ఆగి ఉన్న లారీని మోటార్‌బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి నర్రవాడ – తెడ్డుపాడు దారిలో 565వ జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి చెందిన మేలింగి సురేష్ (35) నర్రవాడ నుంచి తెడ్డుపాడు ఎస్సీ కాలనీలోని తన ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. ఈక్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని గమనించలేదు. ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై పి.ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సురేష్‌కు భార్య ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంనెల్లూరు(టౌన్): జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025 – 26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు మే 22వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఉన్నాయన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. జిల్లాలో వలేటివారిపాళెం మండలంలోని చుండి, ఉలవపాడు మండలంలోని వీరేపల్లి, లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాళెం, కందుకూరు మండలంలోని జి.మేకపాడు, కలిగిరి, కావలి మండలంలోని ఒట్టూరు, కొండాపురం, సీతారామపురం, ఏఎస్‌పేట, దుత్తలూరు ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన బడుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ, ఈబీసీలకు రూ.200లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.150లు ఉంటుందన్నారు. పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. చేపలు పట్టేందుకు వెళ్లి..● పెన్నానదిలో పడి యువకుడి మృతి ఆత్మకూరు: పెన్నా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఏలూరు రవీంద్ర అనే గిరిజన యువకుడు నీళ్లలో పడి మృతిచెందిన ఘటన ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. గిరిజన కాలనీకి చెందిన ఏలూరు రవీంద్ర (27) చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని పెన్నానదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతిచెందాడు. స్థానికులు రవీంద్ర బంధువులకు తెలియజేశారు. వారొచ్చి పరిశీలించగా నదిలో రవీంద్ర మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పొగాకు వేలం ప్రారంభం
● గరిష్ట ధర రూ.280కలిగిరి: మండలంలోని కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రారంభమైంది. తొలుత వేలం నిర్వహణాధికారి వి.మహేష్ కుమార్, రైతులు కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు 36 పొగాకు బేళ్లకు తీసుకొచ్చారు. మహేష్ కుమార్ కిలో పొగాకుకు రూ.306తో వేలం ప్రారంభించారు. ఆ ధరతో కంపెనీల ప్రతినిధులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తగ్గిస్తూ వచ్చారు. కిలోకు గరిష్టంగా రూ.280 నుంచి కంపెనీల ప్రతినిధులు కొనుగోలు ప్రారంభించారు. మొత్తం 36 బేళ్లను కిలో ఆ మొత్తానికి కొనుగోలు చేశారు. 6 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనంగా ఉన్నట్లు తెలిపారు. దిగుబడుల్లో 80 శాతం బ్రైట్ (హైగ్రేడ్), మీడియం గ్రేడ్ ఉత్పత్తి వచ్చిందన్నారు. పొగాకుకు మంచి ధరలు లభించే అవకాశం ఉందన్నారు. రైతులు గ్రేడ్ల వారీగా బేళ్లను తయారు చేసుకుని అమ్మకాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది, రైతు సంఘం అధ్యక్షుడు రావూరి శ్రీకాంత్‌బాబు, అన్నదాతలు పాల్గొన్నారు. డీసీపల్లిలో.. మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రారంభించారు. తొలిరోజు 18 బేళ్లు రాగా అన్నింటిని విక్రయించామని వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్ తెలిపారు. గరిష్ట ధర రూ.280 లభించింది. 2,439 కిలోల పొగాకును విక్రయించగా రూ.6,83,144ల వ్యాపారం జరిగింది. 7 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
25న పోలేరమ్మ జాతర తొలి చాటింపు
● మే 6, 7 తేదీల్లో జాతర నాయుడుపేటటౌన్: నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ జాతరకు సంబంధించిన తొలి చాటింపును ఈనెల 25న వేయనున్నట్లు దేవదాయ శాఖ ఈఓ రవికృష్ణ తెలిపారు. ఆ శాఖ అధికారులు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు నానాబాల సుబ్బారావు, ఆకుల కుబేరు మణి, నల్లబోతుల రామారావు, రాగి శేషగిరి బుధవారం విన్నమాలలో ఉన్న ఆలయ పెదకాపు ఆర్వభూమి శ్రీనివాసులురెడ్డి ఇంటికి వెళ్లి సంప్రదాయబద్ధంగా తాంబూలం అందజేశారు. అనంతరం జాతర వేడుకలకు శ్రీకారం చుట్టారు. 25న పోలేరమ్మ మొదటి చాటింపు వేసి జాతర వేడుకలను వేదపండితుల సూచనల మేరకు మే 6, 7, తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పెదకాపు శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా విన్నమాల గ్రామస్తులకు అమ్మవారి తాంబూలం అందజేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది యుగంధర్, నాయకులు దేవత కిశోర్‌శెట్టి, బిరదవాడ నారాయణ, మహేష్‌రెడ్డి, గుంటూరు లక్ష్మయ్య, మదిరి జలంధర్, చిట్టిబాబు, ఆలయ పూజారి రాయపూడి మునిసురేష్, విన్నమాల గ్రామపెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో శిక్షణ
సురేష్ నెల్లూరులోని కేఎన్ఆర్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. అతడికి మొదటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉంది. దీనిని గమనించిన పీఈటీ అజయ్‌కుమార్ శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాడు. సురేష్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి నిత్యం వెళ్లేవాడు. కోచ్‌లు అతడి ఆసక్తిని గమనించి అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ ప్రావీణ్యం సంపాదించాడు. దివ్యాంగులకు నిర్వహించే అనేక క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. 2018లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలు తదితర వాటిల్లో ప్రతిభ చూపాడు. 2021 వరకు క్రీడల్లో రాణించినా పలు కారణాలతో దూరం కావాల్సి వచ్చింది. -
అందొచ్చిన కొడుకు అమ్మ మందులకోసం వెళ్లి.. ఆగం!
వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
లవ్వర్ పిలుస్తోందంటూ.. యువకుని హత్య
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ చింటూ హత్య కేసులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, స్థానిక ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డితో కలిసి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. పాత వేదాయపాళేనికి చెందిన అరవభూమి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ (28) రౌడీషీటర్. అతడిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. చింటూకు ఇందిరాగాంధీనగర్‌కు చెందిన కృష్ణసాయి అలియాస్ కిట్టు స్నేహితుడు. వీరి మధ్య విభేదాలున్నాయి. చింటూ గతంలో కిట్టు ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని అందరిముందు బెదిరించాడు. అవమానంగా భావించిన కిట్టు ఈ విషయాన్ని తన స్నేహితులైన కొత్తూరు రామకోటయ్యనగర్‌కు చెందిన కరిముల్లా, ఇందిరాగాంధీనగర్‌కు చెందిన షేక్ మహ్మద్‌బాబా, వెంగళరావ్‌నగర్‌కు చెందిన జి.పవన్, ఫ్రాన్సిన్ అనిక్రాజ్ అలియాస్ అనిక్రాజ్, మనుబోలు మండలం కోదండరామపురానికి చెందిన కె.సాయితేజకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అందరూ కలిసి చింటూ హత్యకు పథక రచన చేశారు.మాట్లాడాలని పిలిచి..చింటూ ఇందిరాగాంధీనగర్లోని ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కొందరు ఇబ్బందులు పెడుతుండగా ఆ విషయమై మాట్లాడదామని కిట్టు ఈనెల 14వ తేదీ రాత్రి చింటూను ఇందిరాగాంధీనగర్ రెండో వీధికి పిలిచాడు. అక్కడే కాపుకాసిన నిందితులు చింటూ రాగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం వెంగళరావ్‌నగర్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
రథం ఘటనలో కేసు నమోదుపై సందిగ్ధం?
బిట్రగుంట: కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం రథోత్సవం అపశృతి వెనుక కుట్రకోణం ఉందంటూ ఆలయ ఈఓ రాధాకృష్ణ చేసిన ఫిర్యాదుపై సందిగ్ధత నెలకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రథోత్సవం నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథాన్ని ముందుగా పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథోత్సవం ప్రారంభించడంతో 20 అడుగులు కూడా ముందుకు కదలకముందే చక్రాల బేరింగ్ సిస్టంలో సమస్యలు తలెత్తి రథం ఆగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, జిల్లా వ్యాప్తంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో దేవదాయశాఖ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈఓ రాధాకృష్ణ ఆదివారమే బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతోపాటు భక్తులను అలజడికి గురిచేసే సున్నితమైన అంశం కావడంతో మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఉన్నతాధికారుల అనుమతితో కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈఓపైన, కొండపై తిష్టవేసిన అతని సోదరుడిపై దేవదాయశాఖ ఏసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోతే శనివారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 31 వరకు అఫిలియేషన్ల రెన్యూవల్ నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యూవల్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మార్పిడి, కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు, ద్వితీయ భాష, మీడియం మార్పు అనుమతి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కళాశాల తరలింపు, కళాశాల మూసివేత, మూసివేసిన కళాశాల పునః ప్రారంభం, కళాశాలల పేర్లు మార్పు తదితర వాటిని చేసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంఈఓ వ్యవహారంపై డిప్యూటీ డీఈఓ విచారణ ● ఆయన్ను కాపాడే యోచనలో అధికారులు ● విచారణకు వచ్చి ఎంఈఓ పెట్టిన భోజనాన్ని ఆరగించి వెళ్లిన వైనం ఉలవపాడు: ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ శివనాగేశ్వరరావు మద్యం మత్తులో తూగుతున్న వైనంపై కందుకూరు డిప్యూటీ డీఈఓ పీపీ నరసింహారావు మంగళవారం విచారణ చేపట్టారు. సాక్షిలో మంగళవారం ‘మద్యం మత్తులో ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. డిప్యూటీ డీఈఓ పాఠశాలకు వచ్చి శివనాగేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన వివరణ, ఉపాధ్యాయుల వివరణ తీసుకున్నారు. విచారణ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. అయితే మరో ఎంఈఓ, ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావుపై మద్యం తీసుకుంటాడని లిఖిత పూర్వకంగా ఇవ్వలేమని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ డీఈఓ కూడా సదరు ఎంఈఓను మందలించారని సమాచారం. మద్యం తాగుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నా ఎంఈఓను కాపాడే పనిలో విద్యాశాఖ విచారణ జరిగిందని తెలుస్తోంది. విచారణకు వచ్చిన అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓతో భోజనం తెప్పించుకుని అక్కడే తిని వెళ్లడం చూస్తే.. ఈ విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతుంది. -
రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు
ముత్తుకూరు: కూటమి ప్రభుత్వంలో అటు మిల్లర్లు, ఇటు దళారులు రైతుల్ని దోచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని డమ్మాయపాళెంలో మంగళవారం వరి ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పుట్టి (850 కిలోలు) ధాన్యాన్ని రైతులు రూ.25,000లకు అమ్మకం చేసుకోగా, కూటమి ప్రభుత్వంలో రూ.15,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40,000 నష్టపోతున్నారన్నారు. వరి కోతలు ముమ్మరమైతే ధరలు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టపోతుంటే.. కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. దీన్ని బట్టి రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. మిల్లర్లు పుట్టి ధాన్యానికి ధర ఇస్తూ రైతు నుంచి తరుగు పేరుతో అదనంగా 150 కిలోల ధాన్యాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. పేరుకు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఒక్క చోట కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. జిల్లా అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఉత్తుత్తి ప్రకటనలు కట్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలన్నారు. సోమిరెడ్డికి కమీషన్లపైనే దృష్టి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముడుపులు, కమీషన్లు, వసూళ్లపై దృష్టి పెట్టారని, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడని కాకాణి ఆగ్రహం వెలిబుచ్చారు. రైతుల పక్షాన ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, పోచారెడ్డి చెంగారెడ్డి, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, సర్పంచ్ సన్నారెడ్డి హారతి, ఎంపీటీసీ సభ్యులు మూగ కీర్తి, పాముల శ్రీనివాసులు, దువ్వూరు కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనలేదు మా ప్రభుత్వ హయాంలో పుట్టి రూ.25 వేలు కూటమి ప్రభుత్వంలో రూ.15 వేలు మాజీ మంత్రి కాకాణి ధ్వజం -
ధాన్యం కొనుగోళ్లపై చర్చ
● మంత్రి నాదెండ్లతో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ నెల్లూరు రూరల్: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని తన చాంబర్లో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15 వేల టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్నీ బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్‌తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 17–20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. ఏఐ ద్వారా ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబరుకు హాయ్ మెసేజ్ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చనని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కె రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్సూర్ పాల్గొన్నారు. -
ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఇద్దరికి గాయాలు మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పెట్రోల్ బంకు సమీపంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటన మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి ఏఎస్‌పేటకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీపల్లి పెట్రోల్ బంకు సమీపంలో ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లోని ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బతింది. క్షతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబూ.. మహిళలకు పథకాలెప్పుడిస్తారు
నెల్లూరు(బారకాసు): మహిళల కోసం ఎప్పటి నుంచి పథకాలను అమలు చేస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా మహిళా సాధికారత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలవుతున్నా మహిళలకు ఉచిత బస్సు ఊసే ఎత్తడం లేదన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమ లు చేయకుండా నీరుగారుస్తున్నారన్నారు. అలాగే ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. సున్నావడ్డీ రుణాలు ఎప్పుడిస్తారో ప్రకటన చేయాలన్నారు. ఆశావర్కర్లకు జీతాలు పెంచుతామని, పనిభారం తగ్గిస్తామని చెప్పి నిలువునా మోసం చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఆ ఉద్యోగమే లేకుండా చేసి వారి కడుపుకొట్టడం న్యాయమా అని కూటమి నేతల్ని ప్రశ్నించారు. 2014 – 19 మధ్య కూడా చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. జగన్ దిశ యాప్‌ను తీసుకొస్తే, దానిని నేడు శక్తి యాప్ అంటూ హంగామా చేస్తున్నారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన వ్యవస్థలను కాపీ కొడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలిచ్చిందన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయించారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులను కూడా 50 శాతం వారికే ఇచ్చారన్నారు. చంద్రబాబు హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ మహిళా, అంగన్వాడీ, సాంస్కృతిక విభాగాల అధ్యక్షులు బషీర, శాలిని, శారద, కార్యవర్గ సభ్యురాలు ఫరీదా తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళకు అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద -
రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు
ముత్తుకూరు: కూటమి ప్రభుత్వంలో అటు మిల్లర్లు, ఇటు దళారులు రైతుల్ని దోచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని డమ్మాయపాళెంలో మంగళవారం వరి ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పుట్టి (850 కిలోలు) ధాన్యాన్ని రైతులు రూ.25,000లకు అమ్మకం చేసుకోగా, కూటమి ప్రభుత్వంలో రూ.15,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40,000 నష్టపోతున్నారన్నారు. వరి కోతలు ముమ్మరమైతే ధరలు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టపోతుంటే.. కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. దీన్ని బట్టి రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. మిల్లర్లు పుట్టి ధాన్యానికి ధర ఇస్తూ రైతు నుంచి తరుగు పేరుతో అదనంగా 150 కిలోల ధాన్యాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. పేరుకు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఒక్క చోట కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. జిల్లా అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఉత్తుత్తి ప్రకటనలు కట్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలన్నారు. సోమిరెడ్డికి కమీషన్లపైనే దృష్టి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముడుపులు, కమీషన్లు, వసూళ్లపై దృష్టి పెట్టారని, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడని కాకాణి ఆగ్రహం వెలిబుచ్చారు. రైతుల పక్షాన ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, పోచారెడ్డి చెంగారెడ్డి, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, సర్పంచ్ సన్నారెడ్డి హారతి, ఎంపీటీసీ సభ్యులు మూగ కీర్తి, పాముల శ్రీనివాసులు, దువ్వూరు కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనలేదు మా ప్రభుత్వ హయాంలో పుట్టి రూ.25 వేలు కూటమి ప్రభుత్వంలో రూ.15 వేలు మాజీ మంత్రి కాకాణి ధ్వజం -
కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..
కలిగిరి: జిల్లాలోని కలిగిరి, మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో బుధవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. వాటి పరిధిలో 2,963 బ్యారెన్ల ద్వారా 3,469 మంది రైతులు పొగాకు సాగు చేపట్టారు. 2025 – 26 సీజన్‌కు సంబంధించి 12.65 మిలియన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఉంది. పెరిగిన సాగు విస్తీర్ణం, అధిక దిగుబడుల దృష్ట్యా 18.30 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్లో అమ్మకాలు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి పొగాకు గ్రేడింగ్ సమయంలో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉంది. మొత్తం ఉత్పత్తిలో 50 శాతం వరకు మొదటి రకం (బ్రైట్ గ్రేడ్) వచ్చినట్లు రైతులు, అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రేడ్ ఉత్పత్తులు కూడా బాగున్నట్టు తెలుస్తోంది. భారీగా పెరిగిన పెట్టుబడులు ఈ ఏడాది పొగాకు సాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. గత రెండు సంవత్సరాలుగా మంచి ధరలు లభిస్తుండటంతో ఈసారి సాగు చేయడానికి రైతులు అమితంగా ఆసక్తి చూపారు. దీంతో ఈ ప్రాంతంలో పొలాలు, బ్యారెన్ల కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది రూ.లక్ష ఉన్న బ్యారెన్ కౌలు ఈసారి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలికింది. పొలం కౌలు, కూలీల రేట్లు కూడా దాదాపు రెట్టింపయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో బ్యారెన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతం కందుకూరు–1లో వేలం జరుగుతుండగా గరిష్ట ధర కిలోకు రూ.280 పలికింది. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఈ ఏడాది రూ.300 లభించేలా చూడా లని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలోని రైతు లు డిమాండ్ చేస్తున్నారు. రైతులు : 3,469 బ్యారెన్లు : 2,963 బోర్డు అనుమతించిన సాగు విస్తీర్ణం : 9,931 హెక్టార్లు రైతులు సాగు చేసిన విస్తీర్ణం : 9,973 హెక్టార్లు బోర్డు అనుమతించిన ఉత్పత్తి : 12.65 మిలియన్ కేజీలు రైతులు పండించిన ఉత్పత్తి (అంచనా) : 18.30 మిలియన్ కేజీలు సూచనలు పాటించాలి ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రైతు లు అవశేషాలు లేని, హీట్ లేకుండా గ్రేడ్ల ఆధారంగా బేళ్లను తయారు చేసుకోవాలి. పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటిస్తే మంచి ధరలు లభించే అవకాశం ఉంది. – మహేష్ కుమార్, వేలం నిర్వహణాధికారి, కలిగిరి పొగాకు బోర్డు పెట్టుబడులు పెరిగాయి ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరిగాయి. సీజన్ ప్రారంభం నుంచే మంచి ధరలు లభిస్తాయని ఎదురు చూస్తున్నాం. సరాసరిన కిలో రూ.300 తగ్గకుండా ఉంటేనే రైతులు గట్టున పడతారు. – పూసాల అక్కపునాయుడు, రావులకొల్లు, కలిగిరి మండలం నేటి నుంచి కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభం సాగు సమయంలో పెరిగిన పెట్టుబడులు సరాసరిన రూ.300 ఇవ్వాలని రైతుల డిమాండ్ -
తెలుగు అధ్యాపకుల నిరసన
నెల్లూరు(టౌన్): ‘ఇంటర్ బోర్డు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఎప్పటి నుంచో ద్వితీయ భాషగా ఉన్న తెలుగును ఆప్షనల్ చేయడం దారుణం. ఇది ఆ భాషను అవమానించడమే’ అని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో జరుగుతున్న మాల్యాంకనం వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం క్యాంప్ ఆఫీసర్ ఎ.శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్, వెంకట్రావు, పులి చెంచయ్య, శ్రీనివాసులు, ఆశ్వీరాదం, సోమశేఖర్, వనజ, సరళ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ధాన్యం లారీ బోల్తా ఆత్మకూరు: ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు అనంతరాయనియేని గిరిజన కాలనీ వద్ద పొలాల్లో లారీలో ధాన్యం బస్తాలు లోడ్ చేయగా నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో డొంకరోడ్డు కొంతమేర కుంగి ఉండటంతో లారీ అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ గాయపడగా వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ధాన్యం బస్తాలు అన్ని పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో మరో లారీలో లోడ్ చేసి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చి..● రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆటోలో వెళ్తుండగా.. ● కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఉదయగిరి: మండలంలోని సున్నంవారిచింతల సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆటోలో వెళ్తున్న తిరుమలాపురం ఎస్టీ కాలనీకి చెందిన కొండయ్య (48) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
రథం ఘటనలో కేసు నమోదుపై సందిగ్ధం?
బిట్రగుంట: కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం రథోత్సవం అపశృతి వెనుక కుట్రకోణం ఉందంటూ ఆలయ ఈఓ రాధాకృష్ణ చేసిన ఫిర్యాదుపై సందిగ్ధత నెలకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రథోత్సవం నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథాన్ని ముందుగా పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథోత్సవం ప్రారంభించడంతో 20 అడుగులు కూడా ముందుకు కదలకముందే చక్రాల బేరింగ్ సిస్టంలో సమస్యలు తలెత్తి రథం ఆగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, జిల్లా వ్యాప్తంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో దేవదాయశాఖ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈఓ రాధాకృష్ణ ఆదివారమే బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతోపాటు భక్తులను అలజడికి గురిచేసే సున్నితమైన అంశం కావడంతో మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఉన్నతాధికారుల అనుమతితో కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈఓపైన, కొండపై తిష్టవేసిన అతని సోదరుడిపై దేవదాయశాఖ ఏసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోతే శనివారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 31 వరకు అఫిలియేషన్ల రెన్యూవల్ నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యూవల్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మార్పిడి, కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు, ద్వితీయ భాష, మీడియం మార్పు అనుమతి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కళాశాల తరలింపు, కళాశాల మూసివేత, మూసివేసిన కళాశాల పునః ప్రారంభం, కళాశాలల పేర్లు మార్పు తదితర వాటిని చేసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంఈఓ వ్యవహారంపై డిప్యూటీ డీఈఓ విచారణ ● ఆయన్ను కాపాడే యోచనలో అధికారులు ● విచారణకు వచ్చి ఎంఈఓ పెట్టిన భోజనాన్ని ఆరగించి వెళ్లిన వైనం ఉలవపాడు: ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ శివనాగేశ్వరరావు మద్యం మత్తులో తూగుతున్న వైనంపై కందుకూరు డిప్యూటీ డీఈఓ పీపీ నరసింహారావు మంగళవారం విచారణ చేపట్టారు. సాక్షిలో మంగళవారం ‘మద్యం మత్తులో ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. డిప్యూటీ డీఈఓ పాఠశాలకు వచ్చి శివనాగేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన వివరణ, ఉపాధ్యాయుల వివరణ తీసుకున్నారు. విచారణ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. అయితే మరో ఎంఈఓ, ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావుపై మద్యం తీసుకుంటాడని లిఖిత పూర్వకంగా ఇవ్వలేమని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ డీఈఓ కూడా సదరు ఎంఈఓను మందలించారని సమాచారం. మద్యం తాగుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నా ఎంఈఓను కాపాడే పనిలో విద్యాశాఖ విచారణ జరిగిందని తెలుస్తోంది. విచారణకు వచ్చిన అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓతో భోజనం తెప్పించుకుని అక్కడే తిని వెళ్లడం చూస్తే.. ఈ విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతుంది. -
ధాన్యం కొనుగోళ్లపై చర్చ
● మంత్రి నాదెండ్లతో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ నెల్లూరు రూరల్: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని తన చాంబర్లో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15 వేల టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్నీ బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్‌తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 17–20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. ఏఐ ద్వారా ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబరుకు హాయ్ మెసేజ్ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చనని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కె రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్సూర్ పాల్గొన్నారు.