
ఇన్సురెన్స్, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలి
లారీ తిప్పడం ప్రస్తు తం కష్టంగా మారింది. ఇన్సురెన్స్, గ్రీన్‌ట్యాక్స్‌ను అమాంతంగా పెంచేశారు. ఈ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. జీఎస్టీతో యజమానులపై పెనుభారం పడింది. టోల్‌గేట్ల సంఖ్యను తగ్గించడంతో పాటు కొత్తగా వచ్చే ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ స్టేషన్లను నిలిపేయాలి. రవాణా రంగాన్ని ఆదుకోకపోతే పూర్తిగా విక్రయించే పరిస్థితి వస్తుంది.
– గోపాలనాయుడు, లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి
డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నాలుగు శాతం వ్యాట్‌ను తగ్గించాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దీని ధర ఇక్కడే ఎక్కువగా ఉంది. కిరాయిలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. డ్రైవర్లు దొరకని పరిస్థితి. విడిభాగాల ఖరీదులు బాగా పెరిగాయి. ప్రస్తుత రోజుల్లో పాత లారీని తిప్పే పరిస్థితే లేదు.
– దయాకర్‌రెడ్డి, యజమాని
Comments
Please login to add a commentAdd a comment