SPSR Nellore District Latest News
-
స్టేట్ పబ్లిసిటీ వింగ్‌లో జిల్లా నేతల నియామకం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో వివిధ హోదాల్లో నియమించారు. అందులో భాగంగా స్టేట్ పబ్లిసిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా చేజర్ల సుబ్బారెడ్డి, జనరల్ సెక్రటరీగా వంగాల శ్రీనివాసులురెడ్డి, సెక్రటరీలుగా కరేటి దైవాదీనం, బొర్రా సుబ్బిరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా చెరుకూరి బ్రహ్మయ్య, అశోక్‌రెడ్డిలను నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో మే 1న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ఆర్డీఓ బి.పావని, మున్సిపల్ కమిషనర్ సి గంగాప్రసాద్, చైర్పర్సన్ వెంకటరమణమ్మతో కలిసి బైపాస్ రోడ్డులోని హెలిప్యాడ్ ప్రాంతం, బీసీ బాలికల గురుకుల పాఠశాల, ఎంఎస్ఎంఈ పార్కుల వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు వద్ద రోడ్లు, విద్యుత్ సరఫరా, తదితర మౌలిక వసతులను పరిశీలించారు. ఆయన వెంట అన్ని శాఖల అధికారులు, స్థానిక పార్టీ నాయకులు, ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి చెప్పినా.. కేసులు కట్టించి..
కాకర్లపోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ‘ఆనం’కే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల ఝలక్ ఇచ్చారు. ఎవరైతే నాకేంటి.. నా నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యేను, నేనే మంత్రి..ఎవరి మాట వినాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడంతో విభేదాలకు కుంపటి రాజేసినట్లు అయ్యింది. వింజమూరు మండలం నల్లగొండ్లలో అక్రమ గ్రావెల్ తరలింపు రవాణా వ్యవహారం ఎమ్మెల్యే, మంత్రికి మధ్య అగాధాన్ని సృష్టించింది. ● నల్లగొండ్ల గ్రావెల్ రవాణాదారుడు ఆనం అనుచరుడు ● కేసులు పెట్టొద్దని ఎమ్మెల్యేకు చెప్పినా బేఖాతరు ● అయినా నమోదు చేయించిన వైనం సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉదయగిరి నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో పతాక స్థాయికి చేరింది. మట్టి, గ్రావెల్, క్వార్ట్ ్జ, ఇసుక ఏదైనా సరే ఆయనకు కప్పం కట్టందే.. ట్రక్కు కూడా కదలని పరిస్థితి. తన వాటా చెల్లించకపోతే.. మనోడైనా.. పగోడైనా ఎవడైతే నాకేంటి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లాకు చెందిన ఓ మంత్రి ముఖ్య అనుచరుడికే చుక్కలు చూపించాడు. గ్రావెల్, రఫ్ స్టోన్ రవాణా చేస్తున్న సదరు కాంట్రాక్టర్ వాహనాలను పోలీసుల ద్వారా నిలువరించారు. ఈ విషయంలో సదరు మంత్రి స్వయంగా ఫోన్ చేసి ఎమ్మెల్యేకి చెప్పినా వినిపించుకోలేదు. మంత్రి అండతో భారీగా తరలింపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కుల ఆగడాలకు అంతేలేదు. ఇష్టానుసారంగా పేట్రేగిపోతున్నారు. అందిన మేరకు ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి ముఖ్య అనుచరుడైన కాంట్రాక్టర్ అత్మకూరు నియోజవర్గంలో రూ.9 కోట్లతో రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ను పొందాడు. ఈ రోడ్డు నిర్మాణానికి గ్రావెల్, రఫ్ స్టోన్ అవసరం కావడంతో సదరు కాంట్రాక్టర్ కన్ను వింజమూరు మండలం నల్లగొండ్ల సర్వే నంబరు 36 (పాత నంబరు) ఎల్పీఎం 2169లో 67.36 ఎకరాల ప్రభుత్వ భూమి మీద పడింది. ఇందులో నాణ్యమైన గ్రావెల్‌తోపాటు, రఫ్ స్టోన్ కూడా లభిస్తోంది. ప్రత్యేకంగా మెటల్ (కంకర) కొనుగోలు చేయకుండానే ఇక్కడి మెటల్ ఉపయోగపడుతుందని, దగ్గరగా ఉంటుందని సదరు కాంట్రాక్టర్ సంతోష పడ్డాడు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పుకుండా కొన్ని నెలల నుంచి అప్పనంగా దోచేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎమ్మెల్యే ఆగమేఘాల మీద క్వారీల వద్దకు వెళ్లి తవ్వకాలను నిలిపివేసి, వాహనాలను అధికారులకు అప్పుగించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు నిలకడపై సందిగ్ధత ఈ కేసులో ఒక వైపు మంత్రి, మరో వైపు ఎమ్మెల్యే ఉండడంతో కేసు దర్యాప్తు సజావుగా సాగేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఓ మాజీ మంత్రిపై అక్రమ గ్రావెల్ తరలింపు కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా కూటమి ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్ రవాణా వాహనాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీని వెనుక ప్రమేయం ఉన్న వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాలి. కానీ అలా జరగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే X మంత్రి మైనింగ్ అధికారులవి కాకి లెక్కలేనా! అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తి మంత్రి అనుచరుడు కావడం, ఎమ్మెల్యే సదరు వ్యక్తిపై సీరియస్‌గా ఉండడంతో మంత్రి కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి మైనింగ్ అధికారులకు ఫోన్ చేసి కాస్త అనుకూలంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా మైనింగ్ అధికారి తాను రాకుండా తన కార్యాలయ సిబ్బందిని పంపించారు. భారీ స్థాయిలో గ్రావెల్, రఫ్ స్టోన్ తరలించి ఉన్నా, కేవలం 3500 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వకాలు జరిపినట్లు లెక్కలు తేల్చారు. ఈ వ్యవహరంపై సదరు కాంట్రాక్టర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనే స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి కాంట్రాక్టర్ మనోడే వదిలేయాలని చెప్పడంతోపాటు మన పార్టీ నాయకుడిపైనే కేసులు పెడుతావా అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్ ఇల్లీగల్ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడం లేదు కదా! అంటూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాలతో వింజమూరు తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు మేరకు స్థానిక ఎస్సై తొమ్మిది వాహనాల యజమానులు, గ్రావెల్ తోలిస్తున్న వ్యక్తి, వాహనాల నడుపుతున్న డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. ఈ వాహనాలు ప్రస్తుతం పోలీసుల ఆదుపులో ఉన్నాయి. -
సమగ్రశిక్ష.. పట్టించుకునే దిక్కేది!
విద్యాశాఖలో ఎంతో కీలకమైన సమగ్రశిక్షలో పాలన అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది కొరత ఆ శాఖను పట్టిపీడిస్తోంది. నాడు – నేడు నుంచి రకరకాల శిక్షణల వరకు దాని ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. ఇంకా భవిత, ప్రత్యామ్నాయ స్కూల్స్, కేజీబీవీలు తదితరాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటుంది. అయితే ఆ శాఖలో ప్రధాన విభాగాల్లోని పోస్టులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తీవ్రంగా వేధిస్తున్న సిబ్బంది కొరత ● రెగ్యులర్ ఈఈ, నలుగురు డీఈల పోస్టులు ఖాళీ ● ఐఈ కో–ఆర్డినేటర్, ఏఎల్ఎస్, ఏఎంఓ, ఏఎస్ఓలు కూడా.. ● ఆ శాఖ పర్యవేక్షణలోనే నాడు – నేడు పనులు ● ఇంకా పట్టు సాధించని ఏపీసీనెల్లూరు(టౌన్): కూటమి ప్రభుత్వం విద్యాశాఖను గాలికొదిలేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మనబడి నాడు – నేడు పనులు చాలావరకూ శరవేగంగా జరిగాయి. చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో అవి అసంపూర్తిగానే ఉన్నాయి. నాడు – నేడుకు సంబంధించి ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. పైగా సమగ్రశిక్షలో ఖాళీ పోస్టుల భర్తీపై కూడా దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏపీసీగా వెంకటసుబ్బయ్య మూడు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇంకా ఆయన ఈ శాఖపై పట్టు సాధించలేదని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారారు. మెజార్టీ పోస్టుల ఖాళీ సమగ్రశిక్షలో మెజార్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఇంజినీరింగ్ విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. అయితే అక్కడ సిబ్బంది లేని పరిస్థితి. రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉండాల్సి ఉండగా ఎఫ్ఏసీపై ఆయన రెండు చోట్ల పనిచేస్తున్నారు. నలుగురు రెగ్యులర్ డివిజనల్ ఇంజినీర్లకు గానూ ఒకరు కూడా లేరు. కనీసం డిప్యూటేషన్‌పై ఇతర శాఖల నుంచి ఒకరినైనా ఇక్కడికి పంపించలేదు. ఏఈలు పూర్తి స్థాయిలో ఉన్నా వారిని పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అదే విధంగా జిల్లాలోని భవిత కేంద్రాలను పర్యవేక్షించాల్సిన ఐఈ కో–ఆర్డినేటర్ పోస్టు ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. దీనిని గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి మమతకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమె రెండు విభాగాల్లో పర్యవేక్షించలేని పరిస్థితి ఉండటంతో భవిత కేంద్రాల నిర్వహణ దారుణంగా మారింది. బడి బయట పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ స్కూల్స్‌ను పర్యవేక్షించాల్సిన ఏఎల్ఎస్ పోస్టు 6 నెలలుగా ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి సీఓంఓకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంకా ఏఎస్ఓ, ఎంఐఎస్ ప్లానింగ్ కో–ఆర్డినేటర్, ఉర్దూ ఏఎంఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా సమగ్రశిక్ష కార్యాలయం పర్యవేక్షణ అంతంతమాత్రమే.. పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆయా విభాగాలపై పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉందనే విమర్శలున్నాయి. ఏపీసీ ప్రధానంగా నాడు – నేడు, కేజీబీవీ, భవిత, ఆల్ట్రనేటివ్ స్కూల్స్ తదితర విభాగాలను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. జిల్లాలో వైఎస్సార్సీపీ హయాంలో రెండో విడత కింద 1,356 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, డైట్, బీఈడీ కళాశాలల్లో నాడు – నేడు పనులు మొదలుపెట్టారు. నిధులు మంజూరు కాగా 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత దీని గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. జిల్లా ఉన్నతాధికారులు ఈ శాఖపై దృష్టి సారించి సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ అనుమతితో నియామకాలు సమగ్రశిక్షలో ఖాళీ పోస్టుల్లో సిబ్బందిని నియమించేందుకు కలెక్టర్‌ను అనుమతి కోరుతాం. ఇందుకు సంబంధించి ఫైల్‌ను సిద్ధం చేశాం. ఆయన నుంచి అనుమతి వచ్చిన తర్వాత అన్ని ఖాళీ పోస్టుల్లో సిబ్బంది నియమిస్తాం. అప్పటి వరకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటాం. – వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్ష -
పోలీస్ అధికారి బంధువు పేరుతో..
సాక్షి టాస్క్‌ఫోర్స్: కావలి– ముసునూరు మధ్య ప్రధాన రహదారి పక్కనే రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు కనుమరుగై పోతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కావలి సమీపంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నంలో పోర్టు నిర్మాణంతో చుట్టు పక్కల పరిసరాల్లో భూముల విలువలకు రెక్కలొచ్చాయి. పట్టణ పరిధిలో ప్రైవేట్ స్థలాలు దొరకడం గగనంగా మారింది. ఈ క్రమంలో కావలి– ముసునూరు మధ్య ప్రధాన రహదారి పక్కన కమర్షియల్ మార్కెట్ కాంప్లెక్స్‌లు విస్తరించాయి. ఇదే సమయంలో ప్రభుత్వ స్థలాలపై కూటమి నేతల కన్ను పడింది. ఆ స్థలాలపై టీడీపీ నేతలు రాబందుల్లా వాలిపోతున్నారు. తాజాగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఆక్రమణలు చేసి విక్రయించుకుంటున్నారు. కావలి మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి వెంబడి ముసునూరులోని అయ్యప్పగుడి వద్ద ఖరీదైన స్థలాన్ని పలువురు రాజకీయ దళారులు కాజేశారు. సర్వే నంబర్ 911–1, 2, 3 భిన్నాల్లో ప్రభుత్వ అనాధీనం, పోరంబోకు భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఆ సర్వే నంబర్లో ఉన్న దాదాపు 150 అంకణాలు రూ.5 కోట్లు విలువ చేసే స్థలాన్ని కొందరు రాజకీయ నాయకులు రెవెన్యూ రికార్డులనే తారు మారు చేసి విక్రయించడం కలకలం రేపుతోంది. ప్రధాన రహదారి పక్కనే రూ.5 కోట్ల స్థలం హాంఫట్ ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేసి కబ్జా పోలీస్ అధికారి బంధువు పేరుతో మార్పిడి రాత్రికి రాత్రే గదుల నిర్మాణం ఆ ఖరీదైన స్థలాన్ని కావలిలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి సమీప బంధువు పేరుతో రికార్డులు మార్చేసినట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రధాన రహదారి వెంబడి ఖరీదైన ఆ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో కాపాడుకుంటూ వచ్చారు. ఎవరి ఆక్రమణలోకి వెళ్లకుండా కాపు కాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రికార్డులే తారుమారు చేసి స్థలాన్ని కాజేయడంపై కావలి వాసులు మండి పడుతున్నారు. అధికారులు సైతం కళ్ల ముందే దురాక్రమణ జరుగుతున్నా కబ్జాదారులతో కుమ్మకై ్క వారికి తమ వంతు సహకారం అఽందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ దురాక్రమణ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లినట్లు తెలుస్తోంది. -
ఆన్లైన్లో పాలిసెట్ హాల్‌టికెట్లు
నెల్లూరు (టౌన్): పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసినట్లు ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్లను polycetap. nic. in వెబ్సైట్ ద్వారా ఈ నెల 30వ తేదీలోపు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పోస్టు ద్వారా ఎవరికి రావన్నారు. 470 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 470 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి జీ రాజశేఖర్ తెలిపారు. వేలానికి 643 బేళ్లు రాగా 470 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 60487.9 కిలోల పొగాకును విక్రయించగా రూ.15435796.70 వ్యాపారం జరిగింది. కిలో గరిష్ట ధర రూ.280 కాగా కనిష్ట ధర రూ.215 లభించింది. సగటున రూ.255.19 ధర నమోదైంది. వేలంలో 10 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్‌ఐఓగా వరప్రసాద్‌రావు బాధ్యతల స్వీకరణ నెల్లూరు (టౌన్): ఇంటర్మీయట్ బోర్డు జిల్లా రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్ఐఓ) (ఎఫ్ఏసీ)గా టి. వరప్రసాద్రావును నియమిస్తూ ఇంటర్మీ డియట్ విద్యా మండలి కార్యదర్శి కృతిక శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్టోన్‌హౌస్‌పేటలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరప్రసాదరావు ప్రస్తుతం వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఆయన 2021 నుంచి 2022 వరకు ఆర్‌ఐఓగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలలు నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావును పలువురు కాంట్రాక్ట్ అధ్యాపక అసోసియేషన్ నాయకులు, కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 28న కందుకూరులో జాబ్‌మేళా నెల్లూరు (పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా ఈ నెల 28న కందుకూరులోని ఎంఆర్ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారన్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9848050543, 7286822789 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పింఛన్ దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిశీలించండి నెల్లూరు (పొగతోట): వితంతువులకు పింఛన్ మంజూరు కోసం ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి అప్లోడ్ చేయాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం డీఆర్డీఏ కార్యాలయం నుంచి ఎంపీడీఓలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పీడీ మాట్లాడారు. పింఛన్ వస్తూ భర్త మరణిస్తే ఆ పింఛన్‌ను భార్యకు వితంతు పింఛన్‌గా మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అటువంటి పింఛన్ల దరఖాస్తులు మాత్రమే స్వీకరించాలన్నారు. పింఛన్ల పంపిణీ శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. -
అదనంగా నగదు వసూలు చేయొద్దు
● జేసీ కార్తీక్ నెల్లూరు(అర్బన్): గ్యాస్ సిలిండర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా వినియోగదారుల నుంచి డెలివరీ బాయ్స్ అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసినట్టు వస్తున్న ఫిర్యాదులపై స్పందించని ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ బుకింగ్ చేసిన వెంటనే వారికి సకాలంలో సిలిండర్ డెలివరీ చేయాలని సూచించారు. వినియోగదారులందరూ సంబంధిత గ్యాస్ ఏజెన్సీల్లో ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని కోరారు. అనంతరం ఐవీఆర్ఎస్ సర్వే గురించి సమీక్షించారు. కార్యక్రమంలో డీఎస్ఓ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీ
తోటపల్లిగూడూరు: మండలంలోని కో డూరు పంచాయతీ మహాలక్ష్మీపురం గ్రామంలో పొలాల్లో అమర్చిన రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికు ల కథనం మేరకు.. గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రైతులకు సంబంధించి పొలాల కు విద్యుత్ సరఫరాకు కొన్నేళ్ల క్రితం ట్రాన్స్‌కో రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. దీని వల్ల సుమారు 50 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతోంది. రెండురోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పూర్తిగా చోరీ చేశారు. మరో దానిని పగులగొట్టి రాగివైరును ఎత్తుకెళ్లారు. దీనిని గుర్తించిన స్థానిక రైతులు కోడూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఓ ప్రతాప్‌కు సమాచారం అందించారు. ఏఈ శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ.లక్షకు పైగా ఉంటుందని తెలిపారు. ఆయన తోటపల్లిగూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్ ట్రెజరీ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తాం రాపూరు: జిల్లా కేంద్రమైన నెల్లూరులో నూతన సబ్ ట్రెజరీ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని జిల్లా ఖజానా కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ డి.గంగాద్రి తెలిపారు. రాపూరులోని సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలాగే కావలి, ఆత్మకూరు, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాల్లో కూడా నూతన భవనాలు పూర్తయినట్లు వెల్లడించారు. కోవూరులో నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, బుచ్చిరెడ్డిపాళెంలో స్థల పరిశీలన జరుగుతోందన్నారు. పొదలకూరులో రీటెండర్లు జరిపి నిర్మాణాన్ని చేపడతామన్నారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆయన వెంట ఉపఖజానాధికారి అబ్దుల్ అలీమ్, సిబ్బంది వెంకటకృష్ణ, అమీర్‌బాషా, సుబ్బరాయులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. యువకుడిపై పోక్సో కేసు దొరవారిసత్రం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన అందలమాల శివ అనే యువకుడిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద గురువారం రాత్రి కేసు నమోదు చేయగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వారి కథనం మేరకు.. మండలంలోని కట్టువాపల్లిలో బంధువుల ఇంటికి నెల్లూరు నుంచి ఓ బాలిక వచ్చింది. ఆమెతో గ్రామానికి చెందిన శివ మూడు రోజుల క్రితం అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాలిక సమీప బంధువులు ఫిర్యాదు చేశారు. ఎస్సై అజయ్‌కుమార్ యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 45.541 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 330, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు పది క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
రేషన్ ఇవ్వలేదని మహిళల నిరసన
కొండాపురం: ఈనెలకు సంబంధించిన రేషన్‌ను ఇంతవరకు ఇవ్వలేదని మండలంలోని వెలిగండ్ల, చింతలదేవి పంచాయతీల్లోని బసిరెడ్డిపల్లి, బగాదిపల్లి గ్రామాలకు చెందిన కొందరు మహిళలు వాపోయారు. బసిరెడ్డిపల్లిలో వారు శుక్రవారం నిరసన తెలిపి మాట్లాడారు. షాపు నంబర్లో 20 నుంచి ప్రతి నెలా తమకు వెహికల్ ద్వారా రేషన్ బియ్యం అందించేవారన్నారు. ఏప్రిల్ నెలాఖరు వస్తున్నా 84 మంది కార్డుదారులకు రేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్‌ను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. తమకు బియ్యం ఇవ్వడం ఎందుకు నిలిపేశారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులను అడిగితే సరైన సమాధానం రావడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి బియ్యం అందించాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలోని అన్ని రేషన్ షాపులకు సంబంధించి ఈ నెలలో బియ్యం తక్కువగా వచ్చిందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నెలాఖరులోగా ప్రతి లబ్ధిదారుకు బియ్యం అందిస్తామని తెలిపారు. -
కొవ్వొత్తులతో న్యాయవాదుల ప్రదర్శన
నెల్లూరు (లీగల్): కశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కరులు సాగించిన ఉన్మాద కాల్పుల్లో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఉగ్ర చర్యలను నిరసిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణ నుంచి కొవ్వొత్తులతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుందరయ్యయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో బార్ అసోసియేషన్, జాయింట్ సెక్రటరీ పీవీ వరప్రసాద్, కోశాధికారి దన్పాల్ రమేష్, వీ శ్రీనివాసరావు, అయ్యప్పరెడ్డి, నక్క నాగరాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు
నెల్లూరు రూరల్: ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రతిభ చూపిన జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కలెక్టర్ ఒ.ఆనంద్ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. నెల్లూరు సాంఘిక సంక్షేమ కేంద్ర ప్రభుత్వ హాస్టల్ విద్యార్థిని యాదల సంగీత ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఎంపీసీలో 961 మార్కులు, బద్దిపూడి మేఘన సీఈసీలో 927 మార్కులు సాధించారు. పదో తరగతిలో వింజమూరు సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థిని ఎ.నందిని 574 మార్కులు, ఉలవపాడు సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థిని ఎన్.కాజోల్ లక్ష్మీ అగర్వాల్ 568 మార్కులు, ఆత్మకూరు సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ విద్యార్థి ఒంటేరు సాయిధనుష్ 565 మార్కులు సాధించారు. వారిని శుక్రవారం నెల్లూరులోని తన కార్యాలయంలో కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి శోభారాణి పాల్గొన్నారు. -
జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామ్యకం
● కలెక్టర్‌కు జర్నలిస్టుల ఐక్య వేదిక వినతి నెల్లూరు రూరల్: విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులపై దాడులు చేయడం అప్రజాస్వామ్యక చర్య అని, దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాల ఐక్య వేదిక నాయకులు శుక్రవారం కలెక్టర్ ఓ ఆనంద్‌ను కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఏలూరులోని ‘సాక్షి’ కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన రౌడీ మూకలతో కలిసి దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. తొలుత కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు జయప్రకాష్, మస్తాన్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉండే జర్నలిస్టులపై దాడులు విపరీతం అయ్యాయన్నారు. సాక్షిలో వార్తలు తమకు వ్యతిరేకంగా వచ్చాయని ఆ కార్యాలయంపై దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. వార్తలో వాస్తవం లేకుంటే దానికి వివరణ ఇవ్వాలని, చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు. సమాజంలో ఎవరు తప్పు చేసినా, పొరపాట్లు చేసిన ఎత్తి చూపించడం పత్రికల బాధ్యత అన్నారు. తప్పుడు వార్తలుగా భావిస్తే నిరసన తెలియజేసేందుకు ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతులను రాజకీయ నాయకులు పాటించాలన్నారు. జర్నలిస్టులపై దాడులు నిరోధించేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఎవరున్నా ఏ పార్టీ నాయకత్వం వహించినా ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడులు జరిగితే ఏపీయూడబ్ల్యూజే ఖండిస్తుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తుందన్నారు. ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. -
మద్యం పాలసీపై బాబుది బూటకపు ప్రచారం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): గత సీఎం జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులతో తీసుకొచ్చిన మద్యం పాలసీపై చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసి, అక్టోబర్‌లో 20 డిస్టిలరీలపై దాడులు జరిపి ఎనిమిది నెలల పాటు సీఐడీ విచారణ జరిపినా ఒక్క సాక్ష్యాన్ని సైతం సంపాదించలేకపోయారని చెప్పారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌రెడ్డి వద్ద తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేసి, వాటి ఆధారంగా కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇదే వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో నాటి టీడీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో చంద్రబాబును ఏ – 3గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసును పక్కదోవ పట్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 43 వేల బెల్టుషాపులను తమ ప్రభుత్వ హయాంలో రద్దు చేశారని గుర్తుచేశారు. అప్పట్లో పారదర్శకంగా విక్రయాలు జరిగాయని, ఈ వివరాలు ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఉన్నా, ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి 20 వేల మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. నూతన మద్యం పాలసీలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడటమే కాకుండా విక్రయాలను విచ్చలవిడి చేసిందని ఆరోపించారు. దీని వల్ల రాష్ట్రంలో శాంతిభద్ర తలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేపట్నుంచి స్లాట్ బుకింగ్ నెల్లూరు సిటీ: జిల్లాలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ శనివారం నుంచి ప్రారంభంకానుందని జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రక్రియ ఈ నెల నాలుగున ప్రారంభమైందని, తాజాగా మిగిలిన కార్యాలయాల్లోనూ షురూ కానుందని చెప్పారు. కొవ్వొత్తుల ర్యాలీ నెల్లూరు( వీఆర్సీసెంటర్): కశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 27 మంది పర్యాటకులను బలి తీసుకోవడం అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీని సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేతలు మూలం రమేష్, మోహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు, అజయ్‌కుమార్, గోగుల శ్రీనివాసులు, చెంగయ్య, రెహనాబేగం, కొండా ప్రసాద్, నాగేశ్వరరావు, మస్తాన్‌బీ తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యాలతో కలాలకు కళ్లెం వేయలేరు మనుబోలు: దాడులు, దౌర్జన్యాలతో జర్నలిస్టుల కలాలకు కళ్లెం వేయలేరని గూడూరు ప్రింట్ మీడియా డివిజన్ ఉపాధ్యక్షుడు బాబు మోహన్‌దాస్ పేర్కొన్నారు. ఏలూరులోని సాక్షి కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు మంగళవారం దాడికి పాల్పడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన ఘటనపై నిరసనను గురువారం వ్యక్తం చేశారు. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ బషీర్‌కు మనుబోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తమకు నచ్చిన విధంగా వార్తలు రాయలేదనే కారణంతో జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం రాజకీయ నేతలు, వారి అనుచరులకు పరిపాటిగా మారిందని చెప్పారు. సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియా ప్రతినిధులు జగదీష్‌బాబు, సుధాకర్, శ్రీనివాసులు, బాషా, శంకర్, సాయి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కావలి కన్నీటిసంద్రం
కావలి: విహారయాత్ర నిమిత్తం కుటుంబసమేతంగా కశ్మీర్‌లోని పహల్గామ్ వెళ్లి ఉగ్రవాదుల తూటాకు బలైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయం కావలికి గురువారం ఉదయం చేరుకుంది. శ్రీనగర్ నుంచి విమానంలో చైన్నె ఎయిర్‌పోర్టుకు తెల్లవారుజామున మూడు గంటలకు.. ఆపై రోడ్డు మార్గంలో అంబులెన్స్ ద్వారా పట్టణంలోని ఆనాలవారి వీధిలోని స్వగహం వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, తో బుట్టువులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. పార్థివదేహ పేటికను ఇంట్లోకి పో లీస్ అధికారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి భుజాలపై మోసి చేర్చా రు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. పార్థివదేహంపై జాతీయ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబీకులను ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఓదార్చారు. కన్నీటిపర్యంతం కావలిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మధుసూదన్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయులు విలపించారు. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. మృతుడి భార్య, పిల్లలు రోదన అక్కడి వారిని కలిచివేసింది. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ నివాళులర్పించారు. పేద కుటుంబం నుంచి ఉన్నతంగా ఎదిగి.. మంచి వ్యక్తిత్వం గల మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరమని ఎమ్మెల్యే చెప్పారు. మంత్రుల నివాళులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కావలి చేరుకొని మధుసూదన్ భౌతికకాయానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి.. ధైర్యంగా ఉండాలని సూచించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతిమయాత్ర పట్టణంలోని ఆనాలవారి వీధిలోని తల్లిదండ్రుల నివాసం నుంచి మధుసూదన్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. నాలుగు కిలోమీటర్ల దూరంలోని బుడంగుంట శ్మశాన వాటిక వరకు సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పార్థివదేహాన్ని ఉంచారు. అశ్రునయనాల మధ్య మధుసూదన్ అంతిమయాత్ర నివాళులర్పించిన ప్రజానీకం -
సహకార రంగంలో కొనసాగించాలి
కోవూరు: కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో కొనసాగించాలని పలువురు నాయకులు కోరారు. గురువారం కోవూరు చక్కెర కర్మాగారం గేట్ ముందు అఖిల భారత చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో ఆ సంఘ ప్రధాన కార్యదర్శి రవీంద్రన్ మాట్లాడుతూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సహకార రంగంలోని చెరకు ఫ్యాక్టరీలను కేంద్రమిచ్చే ఆర్థిక సహకారంతో నడుపుతున్నారని, కానీ ఇక్కడ ప్రభుత్వం సహకార రంగంలోని ఫ్యాక్టరీలను అమ్మేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు. చెరకుకు మద్దతు ధర ఇవ్వాలని అడుగుతుంటే కేంద్రం అంగీకరించడం లేదన్నారు. తమిళనాడు రైతు సంఘం కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రైతులు ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో నేతలు గండవరపు శ్రీనివాసులు, అప్పారావు, సూర్యనారాయణ, రఘురామయ్య, వెంకమరాజు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సంతపేట పోలీస్‌స్టేషన్‌లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ స్థానిక ఇన్స్పెక్టర్ జి.దశరథరామారావుతో కలిసి వివరాలను వెల్లడించారు. ఇటీవల నెల్లూరు నగరంలో మత్తులో నేరాలు జరుగుతుండటంతో ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈక్రమంలో పొర్లుకట్ట నుంచి పెన్నా నదికి వెళ్లే రహదారిలో ఈనెల 23వ తేదీన గంజాయి విక్రయాలు సాగుతున్నాయని ఇన్స్పెక్టర్కు సమాచారం అందింది. ఆయన, ఎస్సై బాలకృష్ణ, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన రంజిత్ నాయక్, భానుప్రకాష్, నెల్లూరు ప్రగతినగర్ తొమ్మిదో వీధికి చెందిన పాత నేరస్తుడు షేక్ హుస్సేని అలియాస్ హుస్సేన్, ప్రగతి నగర్ ఐదో వీధికి చెందిన పాత నేరస్తుడు షేక్ రఫీ అలియాస్ గాంధీ, వెంకటేశ్వరపురానికి చెందిన పి.వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా విక్రయాల గుట్టును వెల్లడించారు. వ్యసనాలకు బానిసై.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపూర్ గ్రామానికి చెందిన రంజిత్ నాయక్ కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. నారాయణరెడ్డిపేటలో ఉంటూ రైస్‌మిల్లుల్లో కూలి పనులు చేసేవాడు. అతడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో డబ్బు కోసం గంజాయి విక్రయాలకు తెరలేపాడు. ఒడిశా రాష్ట్రంలో కేజీని రూ.5 వేలకు కొనుగోలు చేసి నెల్లూరుకు తీసుకొచ్చి తనకు తెలిసిన వారైన హుస్సేని, రఫీ, భానుప్రకాష్, వంశీకృష్ణకు రూ.20 వేల చొప్పున విక్రయించేవాడు. వారు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కోదానిని రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. వారికి ఒక కేజీపై రూ.30 వేల వరకు లాభం వచ్చేది. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో గట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. నిందితులు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. హుస్సేని, రఫీలు పాతనేరస్తులని, వారిపై పలు కేసులున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్, ఎస్సై, ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెచ్‌సీలు సుబ్బారావు, మల్లికార్జున, విజయమోహన్, పీసీలు అల్లాభక్షు, ఎం.వెంకటేశ్వర్లు, జి.గోపీలను ఆమె అభినందించారు. ఒడిశా నుంచి దిగుమతి చిన్న ప్యాకెట్లు చేసి విక్రయాలు -
మలేరియాతో ఆరోగ్యానికి ముప్పు
నెల్లూరు(అర్బన్): దోమ కాటు వల్ల వచ్చే మలేరియా అనే జబ్బుతో ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. చలి, వణుకుతో కూడిన జ్వరం రావడమే కాకుండా కొన్ని సందర్భాల్లో మెదడుకి పాకి ప్రాణాంతకంగా మారుతోంది. దీంతో రోగి వైద్యానికి ఒక్కో దఫా రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది ఏప్రిల్ 25వ తేదీన అన్ని దేశాల్లో జరుపుకోవాలని పిలుపునిచ్చింది. మలేరియా అంతం మనతోనే అనే థీమ్‌ను ఈ సంవత్సరం ప్రకటించింది. శుక్రవారం జిల్లాలో వైద్యులు, వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. జిల్లాలో వందలాది కేసులు కొన్ని సంవత్సరాల నుంచి మలేరియా కేసులు తగ్గాయి. అయినా వందలాదిగా కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. ప్రధానంగా రాపూరు, సీతారామపురం తదితర ప్రాంతాల్లో గతంలో ఎక్కువగా వచ్చాయి. నెల్లూరు నగరంలోనూ మలేరియా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. వైద్యశాఖలో పరిశీలిస్తే జిల్లాలో మలేరియా కేసులు దాదాపు లేవనేది అధికారుల మాట. అయితే ఉదాహరణకు నెల్లూరు విజయమహల్ గేట్ సమీపంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరిశీలిస్తే గణాంకాల్లో తేడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కచోటే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో లెక్కలు తీస్తే వందలాది కేసులుంటాయి. అయితే వైద్యశాఖ మాత్రం జిల్లా అంతటా కలిపి రెండో, మూడోగా నిర్ధారణ చేయడం దారుణమనే వాదన ఉంది. చాలా డేంజర్ ప్లాస్మోడియం వైవాక్స్ కన్నా ప్లాస్మోడియం ఫాల్సీపరం అనే పరాన్న జీవి ద్వారా వచ్చే మలేరియా డేంజర్. ఒక్కోదఫా మెదడుకు కూడా వ్యాపించి మనిషి మరణించిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. రక్తపరీక్షలో వైవాక్స్ మలేరియా అయితే రెండు వారాలు పూర్తిగా చికిత్స తీసుకోవాలి. ఫాల్సీఫారం మలేరియా అయితే 3 రోజులు ఏసీటీ చికిత్స తీసుకోవాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ చికిత్సను ఉచితంగా పొందవచ్చు. మలేరియా రాకుండా ఉండాలంటే దోమలు పుట్టకుండా.. కనీసం కుట్టకుండా చూసుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సకాలంలో చికిత్స తప్పనిసరి నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం డ్రైడేను పాటించాలి ఇంటి లోపల బిందెలు, తొట్టెల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వారానికి ఒకరోజును డ్రైడేగా పాటించి నీటి తొట్టెలను, పాత్రలను శుభ్రపరిచి ఎండబెట్టాలి. అలాగే ఇంటి పరిసరాల్లో ఉండే ప్లాస్టిక్ మూతలు, రబ్బర్ టైర్లు, టెంకాయ చిప్పలు లాంటి వాటిలో కూడా కొద్దిపాటి నీరు కూడా నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలి. అప్పుడు దోమల నియంత్రణ జరుగుతుంది. అలాగే దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలి. – ఈ.హుస్సేనమ్మ, జిల్లా మలేరియా నివారణాధికారిణి -
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
నెల్లూరు రూరల్: జిల్లాలోని 95 వేలకుపైగా ఉన్న నోషనల్ ఖాతాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శుక్రవారం నుంచి నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జేసీ కార్తీక్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 1,84,298 సర్వే నంబర్లలో 95,060 నోషనల్ ఖాతాలున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అసైన్మెంట్ భూములు, రిజిస్టర్ భూములు, చుక్కల భూములు, పౌతి (మరణించిన వారి సంబంధించిన) సాదాబైనామా సంబంధించిన ఖాతాలను పరిశీలించి రెగ్యులర్ చేస్తామన్నారు. 2,37,000 మంది రైతుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలిరోజు పైలట్ ప్రాజెక్ట్‌గా ఎనిమిది మండలాల నేషనల్ ఖాతాలను పరిశీలిస్తామన్నారు. -
పీహెచ్సీలో డబ్ల్యూహెచ్ఓ నిపుణుల సందర్శన
సోమశిల: అనంతసాగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమ నిపుణుడు భవానీ రామకృష్ణ గురువారం సందర్శించారు. టీబీ యూనిట్, ట్రూనాట్ ల్యాబ్‌లో పరికరాల పనితీరును పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న క్షయ పరీక్షలపై వైద్యాధికారి శ్రీకాంత్‌రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పీహెచ్సీ పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తుల రికార్డులను పరిశీలించారు. అనుమానిత రోగుల నుంచి సేకరించిన గళ్ల నమూనాలను తనిఖీ చేశారు. టీబీ వ్యాధిగ్రస్తురాలిని పరిశీలించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయనే అంశాన్ని ఆరా తీశారు. డాక్టర్ శ్రావణి, ల్యాబ్ టెక్నీషియన్ మీరాన్, హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బ్లేడుతో భార్య గొంతు కోసి..
● సైదాపురం మండలంలో ఘటన సైదాపురం: భార్యాభర్తల మధ్య విభేదాలతో ఓ వ్యక్తి బ్లేడుతో భార్య గొంతు కోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. సైదాపురం ఎస్సై క్రాంతి కుమార్ కథనం మేరకు.. కడప పట్టణంలోని శివానందపురానికి చెందిన ఊటుకూరు విష్ణుకు సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామానికి చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. ప్రస్తుతం వారు కలిచేడు గ్రామంలో కాపురం ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. విష్ణు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈనెల 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో విష్ణు బ్లేడుతో భార్య గొంతుపై, గడ్డంపై, కుడిచేయి భుజంపై కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసును నమోదు చేసి పరారీ ఉన్న విష్ణు కోసం గాలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
ఇంజినీర్లకు సన్మానం
రాపూరు: కండలేరు జలాశయంలో ఇంజినీర్లుగా పనిచేస్తూ పదోన్నతి పొంది బదిలీ అయిన ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించారు. ఏఈగా పనిచేస్తున్న రేవతికి డీఈఈగా పదోన్నతి కల్పించి ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. మరో ఏఈ శ్రీనివాసరావుకు డీఈఈగా పదోన్నతి కల్పించి పులివెందులకు బదిలీ చేశారు. కండలేరులో డీఈఈగా పనిచేస్తున్న విజయరామిరెడ్డిని తిరుపతికి బదిలీ చేశారు. దీంతో అధికారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు అనిల్‌బాబు, అనిల్‌కుమార్, హర్షవర్థన్, తిరుమలయ్య, నాగయ్య, రమేష్‌బాబు, ఎన్జీఓ అధ్యక్షుడు తోట మల్లికార్జున, సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా తిరుగుతుండగా..
పొదలకూరు: పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, వారి వెంట ఉన్న ఆటో డ్రైవర్‌ను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. బుధవారం నెల్లూరుకు చెందిన సుహాసిని, రత్తాలు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేంద్రసింగ్ కలిసి ఆటోలో బయలుదేరి తిప్ప వద్దకు చేరుకున్నారు. కొండపై అనుమానాస్పదంగా సంచరించడమే కాక వారి వద్ద చిన్నపాటి గునపాలు, తాళాలు, చైనా కత్తులు ఉండటంతో స్థానికులు భయపడి అటకాయించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తాము రంగురాళ్లు సేకరించేందుకు వచ్చామని వారు పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఆటో డ్రైవర్ మాత్రం తనకు బాడుగ అదనంగా ఇస్తామంటే వచ్చానని, ఎలాంటి వివరాలు తెలియదని వాపోయాడు. -
బావిలో ఈతకెళ్లి..
● ఫార్మసీ విద్యార్థి మృతి ● మృతుడు అనంతపురం జిల్లా వాసి కొడవలూరు: సరదాగా బావిలో ఈతకెళ్లి ఫార్మసీ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని రేగడిచెలికలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నార్తురాజుపాళెం శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గొళ్ల గ్రామానికి చెందిన కురుబన్ అంజన్‌కుమార్ (20) ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం 3డే ఫెస్ట్ విజయోత్సవాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న అంజన్‌కుమార్ అనంతరం తన నలుగురు స్నేహితులతో కలిసి రేగడిచెలికలోని బావి వద్ద వెళ్లాడు. అంజన్, ఇద్దరు బావిలో ఈతకు దిగారు. ఇద్దరు మాత్రం ఈత రాదంటూ బయటే ఉండిపోయారు. కాసేపటికి ఇద్దరు విద్యార్థులు బయటకు రాగా అంజన్ పైకి రాలేదు. దీంతో ఆందోళన చెందిన వారు కళాశాల యాజమాన్యానికి తద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఈత తెలిసిన వారితో బావిలో వెతికించారు. సుమారు 40 అడుగుల వరకూ నీళ్లు ఉండటం, అడుగున బురద ఉండటంతో అందులో కూరుకుపోయిన అంజన్‌ను వెలికి తీసేందుకు వీలు కాలేదు. ఎస్సై పి.నరేష్, కళాశాల యాజమాన్యం గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు మృతదేహం కాలికి తాడు కట్టి వెలికి తీశారు. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడ పిల్లల తర్వాత అంజన్ మూడో సంతానమని ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు. -
ముష్కరులది పిరికి పంద చర్య
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కశ్మీర్లో పర్యాటకులపై ముష్కరులు సాగించిన మారణకాండ పిరికి పంద చర్య అని ఎమ్మెల్సీ, నెల్లూరుసిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఖండించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇదే అన్నారు. టెర్రరిస్టుల ఉన్మాదం హేయం నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కశ్మీర్లో టెర్రరిస్టులు సాగించిన ఉన్మాద చర్య అత్యంత హేయమని మాజీ ఎంపీ, నెల్లూరు పార్లమెంటరీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ దాడిలో ఇద్దరు ఆంధ్రా వాసులు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 19 నుంచి పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నెల్లూరు (టౌన్): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ లోపు సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి ఫీజు చెల్లించాల్సి ఉంది. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం వచ్చే నెల 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రీకౌంటింగ్‌కు సబ్జెక్ట్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్ట్‌కు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంది. 16 జెడ్పీ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత ● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యా జమాన్య పరిధిలో 16 పాఠశాలల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణులయ్యారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ బుధవారం ఒక ప్రకటనలో శుభాశీస్సులు తెలిపారు. 10,211 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరైతే 7,414 మంది ఉత్తీర్ణులు కాగా 73.62 ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. 595 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచి పూజిత, 594 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన ఎండీ జువేది, 593 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచిన జి.జ్ఞాపిక, జి. భార్గవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 100 మంది విద్యార్థులు 575 మార్కులకు పైగా సాధించారని, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించిన విజయదీపిక స్టడీ మెటీరియల్ మంచి ఫలితాలకు దోహదపడిందన్నారు. పొగాకు గరిష్ట ధర రూ. 280 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో బుధవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 543 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 350 పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 193 బేళ్లను కొనుగోలుకు తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి నివేశ్కుమార్పాండే మాట్లాడుతూ కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.210 లభించగా, సగటున రూ. 252.29 ధర లభించిందన్నారు. -
కళ్లెదుటే.. కర్కశంగా..
కశ్మీర్ నరమేథం కావలిలో విషాదాన్ని మిగిల్చింది. ముష్కర ఉన్మాదంలో కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ బలయ్యాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన మధుసూదన్ కష్టపడి బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఐబీఎం సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తండ్రి అరటి కాయల హోల్‌సేల్ వ్యాపారి. తల్లి గృహిణి. తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలతోపాటు మధుసూదన్ ఒక్కడే వారసుడు. భార్యాబిడ్డల కళ్ల ముందే అతన్ని అతి సమీపం నుంచి కాల్చి చంపారు. కశ్మీర్ ఘటనలో కావలి వాసి మృతి చెందాడనే విషయం ఆలస్యంగా తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. కావలి: కశ్మీర్ అందాలను ఆస్వాదించాలని భార్యాపిల్లలతో కలిసి వెళ్లిన కావలికి చెందిన ఓ టెకీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఉగ్ర ముష్కరులు కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ (46)ను భార్యా పిల్లల కళ్లెదుటే కాల్చి చంపారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలోని పచ్చని మైదానంలో మధుసూదన్ భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం మధ్యాహ్నం విహరిస్తుండగా ఈ దారుణంగా జరిగింది. మధ్య తరగతి నుంచి సాఫ్ట్‌వేర్‌గా.. సోమిశెట్టి మధుసూదన్ మధ్య తరగతి కుటుంబం నుంచి ప్రతిష్టాత్మకమైన ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌గా విధులు నిర్వర్తించే స్థాయికి చేరాడు. కావలి పట్టణంలోని ఆనాలవీధికి చెందిన సోమిశెట్టి తిరుపాలు, పద్మావతి దంపతులకు కుమారుడు మధుసూదన్‌తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి తిరుపాల్ స్థానికంగా మేదరబజార్‌లో అరటికాయలు హోల్‌సేల్ వ్యాపారం చేస్తుంటారు. మధుసూదన్ పట్టణంలోని విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, జవహర్ భారతిలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇంజినీరింగ్ (బీటెక్)ను పూర్తి చేశారు. నెల్లూరుకు చెందిన కామాక్షితో వివాహం అనంతరం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేరారు. మధుసూదన్ ఐబీఎంలో పని చేస్తుండగా, భార్య కామాక్షి టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 15 ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడిన మధుసూదన్ దంపతులకు ఇంటర్మీడియట్ చదివే కుమార్తె మేధు, ఎనిమిదో తరగతి చదువుతున్న దత్తు అనే కుమారుడు ఉన్నారు. తన ఇద్దరు చెల్లెళ్లు కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడేలా చేసిన మధుసూదన్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ, దగదర్తి మండలం చెన్నూరుకు చెందిన వారితో వివాహాలు చేశాడు. కశ్మీర్ అందాలను చూడాలని.. మధుసూదన్ భార్య, పిల్లలతో కలిసి పర్యాటక ప్రాంతం పహల్గాంకు వెళ్లారు. ప్రకృతి కనువిందు చేసే బైసారన్ లోయ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ఉగ్రవాదులు భార్య, పిల్లల కళ్లెదుటే మధుసూదన్‌ను కర్కశంగా తుపాకీతో కాల్చుతుంటే దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఈ హఠాత్ పరిణామంతో వారు హతాశులయ్యారు. భార్య, పిల్లలను మాత్రం ఉగ్రవాదులు విడిచి పెట్టారు. మధుసూదన్ ఉగ్ర ముష్కరులు జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పో యారని తెలిసి స్థానికంగా వారి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు నివ్వెరపోయారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి రావడంతో కావలిలో విషాదం నెలకొంది. మధుసూదన్ తల్లిదండ్రులకు హృద్రోగ సంబంధిత సమస్యలు (గుండె జబ్బులు) ఉండడంతో బంధువులు ఈ విషయాన్ని తెలియకుండా కుటుంబ సభ్యులు, బంధువులు జాగ్రత్త పడ్డారు. అమ్మా నాన్నలకు ఏమని చెప్పను మా అన్న మా కుటుంబాన్ని చక్కగా చూసుకొనే వాడు. కశ్మీరును చూడాలని చాలా కాలం నుంచి చెబుతుండేవాడు. బెంగళూరులోని స్నేహితులతో కలిసి కశ్మీర్ యాత్రకు వెళ్లారు. అందరితో చాలా కలివిడిగా ఉంటాడు. మా అమ్మ, నాన్నలు హార్ట్ పేషెంట్లు. వాళ్లకు మా అన్న చనిపోయాడని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. – విజయలక్ష్మి, మధుసూదన్ చెల్లెలుభార్య, పిల్లలతో మధుసూదన్ (ఫైల్) భార్యాపిల్లలతో కలిసి పహల్గాం వెళ్లిన వైనం దంపతులిద్దరూ ఐటీ ఉద్యోగులు భార్య, పిల్లల కళ్ల ముందే దారుణహతం కావలికి భౌతికకాయం మధుసూదన్ భౌతికకాయం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి చైన్నెకు విమానం ద్వారా పంపే ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. చైన్నె విమానాశ్రయం నుంచి మధుసూదన్ స్వస్థలం కావలి పట్టణానికి చేర్చే ఏర్పాట్లు చేశారు. చైన్నె విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో గురువారం తెల్లవారుజాముకు చేరుకునే అవకాశం ఉంది. -
ఉపాధి కూలీలకు బీమా సౌకర్యం
● డ్వామా పీడీ గంగా భవాని పొదలకూరు: ఎన్ఆర్ఈజీఎస్ జాబ్‌కార్డులున్న కూలీలకు రెండు రకాల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని డ్వామా పీడీ గంగా భవాని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో బుధవారం రాపూరు, పొదలకూరు, సైదాపురం, కలువాయి మండలాల ఉపాధి సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను కేంద్రం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కమిషనర్ ఆదేశాల మేరకు వాటిని కూలీలకు వర్తింపజేసేందుకు క్షేత్రస్థాయిలో ఎఫ్‌ఏలు, టీఏలు, ఏపీఓలు కృషి చేయాలన్నారు. జిల్లాలో 4.82 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారని వీరందరికీ బీమా సౌకర్యం కల్పించాల్సిందిగా పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 75 వేలమంది పనులకు హాజరవుతున్నారని ఈ సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. మండలానికి 250 కుంటలను మంజూరు చేసినా పురోగతి లేదన్నారు. 2023 – 24కు సంబంధించి అన్ని మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేశామని, త్వరలో 2024 – 25 ఆడిట్‌ను కూడా చేపడతామన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
నెల్లూరు(క్రైమ్): ‘జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. కేసుల్లో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షలు పడేలా చేయాలి’ అని ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి పోలీస్ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎస్పీ జి.కృష్ణకాంత్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐజీ రాజకుమారి సమావేశంలో పాల్గొన్నారు. స్టేషన్ల వారీగా గ్రేవ్, నాన్‌గ్రేవ్, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళల కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలన్నారు. గ్రామాలను (విలేజ్ విజిట్) సందర్శించి ప్రజలతో మమేకమై సమాచార వ్యవస్థ పటిష్టం, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాన్నారు. వేసవిలో దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలతో పాటు వాహన తనిఖీలు పెంచాలన్నారు. పోక్సో, లైంగికదాడి కేసుల్లో పక్కా సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించి నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు సంబంధించి ఫిర్యాదులపై అలసత్వం ప్రదర్శించరాదన్నారు. అనంతరం ఎస్పీ ఈగల్ టీమ్ ప్లకార్డులను ఆవిష్కరించి రేపటి తరం భవిష్యత్ మాకు ముఖ్యం.. డ్రగ్స్ రహిత రాష్ట్రం మా లక్ష్యం.. మనమందరం కలిసి పోరాడదామం.. మత్తుపదార్థాల వ్యసనం నుంచి మన పిల్లల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. నేరస్తులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ ఐజీ రాజకుమారి -
ఉగ్రదాడిపై కొవ్వొత్తులతో నిరసన
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్లో పాకిస్తాన్ డౌన్‌డౌన్, టెర్రరిజం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఉగ్ర ఉన్మాదాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్చార్జి కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు జరపడం పిరికిపందల చర్య అన్నారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకూడదన్నారు. నవవధూవరులని కూడా చూడకుండా భర్తను చంపడం కుటుంబంలో భర్తను చంపిన తర్వాత మమ్మల్ని కూడా చంపమని భార్య, పిల్లలు అడిగితే వెళ్లి మోదీకి చెప్పుకోమనడం అమానీయం అన్నారు. దేశం మొత్తం ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మందల వెంకట శేషయ్య, రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ హంజా హుస్సేనీ, రాష్ట్ర మేధావుల పోరం అధికార ప్రతినిధి సమీర్‌ఖాన్, యువజన విభాగ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ సిద్ధిక్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి , కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసులు యాదవ్, మొయిళ్ల గౌరి, వేలూరు మహేష్, గుంజి జయలక్ష్మి, కరిముల్లా, కామాక్షి దేవి, నాయకులు మహమ్మద్ రవూఫ్, నేతాజీ సుబ్బారెడ్డి, పిచ్చిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, మున్వర్, నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
పెళ్లికి నిరాకరించడంతో..
● మనస్తాపంతో యువతి ఆత్మహత్య కొడవలూరు: ప్రేమించిన వ్యక్తి పెళ్లి నిరాకరించాడని మనస్తాపం చెంది క్షణికావేశంలో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని నార్తురాజుపాళెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు, స్థానికులు వివరాలు వెల్లడించారు. స్థానిక టపాతోపు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన సునీత యాలం (21) కొన్నేళ్లుగా పని చేస్తోంది. అక్కడ పనిచేసే బిట్టూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. కొన్నినెలల క్రితం యువతి పని మానేసి సొంతూరికి వెళ్లింది. అక్కడి నుంచి బిట్టూతో ఫోన్లో మాట్లాడుతుండేదని ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు. బిట్టూ కూడా మూడు నెలల క్రితం పని మానేసి వెళ్లిపోయాడు. సునీత వారంరోజుల క్రితం తిరిగి ఫ్యాక్టరీలో పనికి చేరింది. ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న గదుల్లో యాజమాన్యమే వసతి కల్పిస్తోంది. సునీత అక్కడ ఉంటూ రెండురోజులుగా బిట్టూతో ఫోన్లో సంభాషిస్తూ కన్నీరు పెట్టుకుంటోందని రూమ్మేట్స్ పోలీసులకు తెలిపారు. మంగళవారం రాత్రి 11 గంటల వరకూ అతడితో మాట్లాడినట్లు చెప్పారు. ఆ తర్వాత అందరూ నిద్రపోయాక మెట్లపైన ఉన్న కిటికీ రంధ్రాలకు ఉరేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం అందించిన సమాచారం మేరకు ఇన్చార్జి ఎస్సై పి.నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలి ఫోన్‌ను స్వాధీ నం చేసుకున్నారు. ఆమె స్నేహితులు తెలిపిన వివరాలు, ఫోన్ సంభాషణల ఆధారంగా బిట్టూ పెళ్లికి నిరాకరించడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సోమా ఎక్స్‌క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ ప్రారంభం
● సింహపురిలో సందడి చేసిన హీరోయిన్ శ్రీదేవి నెల్లూరు(బృందావనం): అక్షయ తృతీయ సందర్భంగా మాగుంట లేఅవుట్లో సీఎంఆర్ జ్యువెలరీ ప్రత్యేక విభాగంలో ‘సోమా ఎక్స్‌క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ’ని కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిలు బుధవారం ప్రారంభించారు. శ్రీదేవి మాట్లాడుతూ సిల్వర్ జ్యువెలరీలో కొరియన్ కలెక్షన్స్ ఎంతో యునీక్‌గా ఉండటమే కాకుండా ఫ్యాక్టరీ ధరలకే కొనుగోలుదారులకు అందజేయడం విశేషమన్నారు. నెల్లూరుకు తొలిసారిగా వచ్చిన తాను కారందోశె రూచి చూశానన్నారు. తమిళంతోపాటు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని శ్రీదేవి చెప్పారు. కోర్టు సినిమాలోని పాటలతో అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. సీఎంఆర్ జ్యువెలరీ అఽధినేత మావూరి శ్రీనివాసరావు, సంతోష్, గణేష్ మాట్లాడుతూ బంగారు ధరలు పెరుగుతున్న కారణంగా సిల్వర్ పూతపై బంగారు పూత, జెర్కాన్స్తో తయారు చేసిన సోమా ఎక్స్‌క్లూజివ్ జ్యువెలరీని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మేనేజర్లు వాసు, ప్రసాద్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు. ● షోరూంలో పోలీస్ శాఖకు చెందిన శక్తి యాప్ పోస్టర్‌ను శ్రీదేవి ఆవిష్కరించారు. -
పదిలో ఉత్తీర్ణతా శాతం ఢమాల్
ఐఐటీలో చేరడమే లక్ష్యం జి. దీక్షిత ప్రియ ఏసీనగర్‌కు చెందిన తండ్రి గోపాల్, తల్లి ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 598 మార్కులు సాధించి జిల్లాలో ప్రఽథమ స్థానంలో నిలిచింది. ఐఐటీలో చదవాలన్నదే లక్ష్యంగా చెబుతుంది. సివిల్స్ చేయాలని ఉంది బీవీనగర్‌కు చెందిన సాయ చారిణి తండ్రి శివకుమార్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి వసంతకుమారి గృహిణి. కేఎన్నార్ స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. పదిలో 596 మార్కులు సాధించింది. సివిల్‌కు ప్రిపేర్ అయి ఎంపిక కావాలన్నదే లక్ష్యంగా చెబుతుంది. ఐఐటీ చేరుతాను నెల్లూరు కేఎన్నార్ మున్సిపల్ స్కూల్ విద్యార్థిని కీర్తిపాటి హిమవర్షిణి తండ్రి వెంకటరాజు ప్రైవేట్ ఉద్యోగి. తల్లి విజయ గృహిణి. పది ఫలితాల్లో 594 మార్కులు సాధించింది. ఐఐటీలో చేరాలన్నదే లక్ష్యంగా చెబుతుంది. ● గతేడాది 88.17, ఈ ఏడాది 83.58 ● రాష్ట్రంలో జిల్లాకు 13వ స్థానం ● ఫలితాల్లో బాలుర కంటే బాలికలే టాప్ ● 28,275 మందికి 23,633 మంది ఉత్తీర్ణత ● జిల్లాలో అత్యధికంగా 598 మార్కులు నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ఉత్తీర్ణతా శాతం పడిపోయింది. గత విద్యా సంవత్సరంలో 88.17 శాతం రాగా ఈ విద్యా సంవత్సరంలో 83.58 శాతం మాత్రమే 4.59 శాతం ఫలితాలు తగ్గాయి. రాష్ట్రంలో జిల్లాకు 13వ స్థానం దక్కింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 73.71 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేట్ పాఠశాలల్లో 94.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, ఇంగ్లిష్ మీడియం, సరిపడా ఉపాధ్యాయులు, టోఫెల్ పరీక్ష విధానం తదితర వాటితో విద్యార్థులకు బోధన ఉండేది. టీడీపీ పాలనలో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్యార్థులకు సరిపడా సబ్జెక్ట్ టీచర్లు లేని పరిస్థితి ఉంది. పరీక్షలు కేవలం 3 నెలల ముందు జిల్లా వ్యాప్తంగా మొత్తం 500 మందికి పైగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన పరిస్థితి. గతంలో ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్ష నిర్వహించగా, ఈ విద్యా సంవత్సరం ఇంగ్లిష్ లేదా తెలుగు మీడియంలో పరీక్ష రాయొచ్చని ఆప్షన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురైనట్లు చెబుతున్నారు. బాలికలే టాప్ పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమసత్తా చాటారు. పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం బాలురు 14,142, బాలికలు 14133 మంది కలిపి 28,275 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో బాలురు 11,510 మంది, బాలికలు 12,123 మంది కలిపి 23,633 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 81.39 శాతం, బాలికలు 85.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో జిల్లా వ్యాప్తంగా 83.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఫస్ట్ క్లాస్‌లో 19,745 మంది, సెకండ్ క్లాస్‌లో 2,622, థర్డ్ క్లాస్‌లో 1,266 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 598 మార్కులు అత్యధిక కటాఫ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో అత్యధికంగా 600 మార్కులకు 598 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులే ప్రతిభ చాటారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి గొల్ల దీక్షితప్రియ 598 మార్కులు, కాట్రగడ్డ కుందన వర్షిత 597, ఇనమురి తన్వి 597 కంచిబొట్ల సాయి బిల్వేష్ 597, పల్లంరెడ్డి ఇందుప్రియరెడ్డి 597, బండ్ల రోహన్ వరుణ్ 597, కోటపాటి జీతు 596, వాకా ప్రలేఖ్యారెడ్డి 596, షేక్ సుమైరా 596 మార్కులు సాధించారు. ప్రభుత్వ యాజమాన్యాల్లో భాగంగా కేఎన్నార్ మున్సిపల్ స్కూల్ విద్యార్థి సాయిచారణి 596, కృష్ణానగర్ జెడ్పీహెచ్ విద్యార్థి మల్లెల పూజిత 595, బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి కీర్తిపాటి హిమవర్షిణి 594, నవలాకులతోట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి మహమ్మద్ జువేరియా 594, బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి పోతురాజు జెస్సికా షారాన్ 593, కేఎన్నార్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి దువ్వూరి సిగ్ధ్న 593, నవాబుపేట్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి కండే సూర్య 593 మార్కులు సాధించారు. జిల్లాలో 106 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో 106 పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీటిల్లో ఏపీ మోడల్స్–2, ఏపీఆర్ఎస్–1 ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్–1, కేజీబీవీ–3, జిల్లా పరిషత్ –16, ప్రైవేట్ పాఠశాలు–83 ఉన్నాయి. -
ఆశ పెట్టి.. నగదు వసూలు చేసి..
రూ.21 లక్షలిచ్చా కావలి: కావలిలో వైట్‌కాలర్ నేరాలు పెరుగుతున్నాయి. పోలీసులే పాత్రధారులుగా ముసునూరులో రూ.కోట్ల కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రూ.కోట్లు కొల్లగొట్టిన పాతనేరస్తుడు, అతడికి సహకరించిన పోలీసులు అందరూ బాగానే ఉన్నా.. డబ్బులు కట్టిన బాధితులు మాత్రం వీధినపడ్డారు. ఇదే తరహాలో మరో భారీ ఆర్థిక నేరం వెలుగు చూసింది. కలిగిరి మండలం కమ్మవారిపాళేనికి చెందిన ఆలూరి ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య మాధవి, కుమార్తెతో కలిసి 2021లో మానస థియేటర్ సమీపంలో అద్దెకు దిగాడు. షేర్లు, తూర్పుగోదావరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు స్థానికులను నమ్మించాడు. లగ్జరీ లైఫ్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. షేర్లలో అధిక లాభాలు వస్తున్నాయంటూ పెట్టుబడుల పేరుతో స్థానికుల నుంచి భారీ మొత్తంలో వడ్డీకి నగదు తీసుకున్నాడు. రూ.100కు నెలకు రూ.7 నుంచి రూ.20 వడ్డీ చెల్లిస్తూ అతి తక్కువ కాలంలోనే రూ.కోట్లలో అప్పుల రూపంలో వసూలు చేశాడు. ఆ తర్వాత పాతూరుకు ప్రసాద్ కుటుంబం మకాం మార్చింది. అక్కడ కూడా కొత్త కార్లు, పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తూ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నట్లు నమ్మించాడు. ప్రతి నెలా రెండు, మూడు రోజుల ముందే వడ్డీ డబ్బులు చెల్లిస్తుండటంతో స్థానికులు, పట్టణ ప్రజలతోపాటు చీరాల, కందుకూరు నుంచి కూడా బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరి రెండో వారం వరకూ చెల్లింపులు చేసిన ప్రసాద్ అనంతరం షేర్ మార్కెట్లో నష్టాలు వస్తున్నాయంటూ డబ్బులివ్వడం ఆపేశాడు. మోసపోయినట్లు గుర్తించి బాధితులు కావలి వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వారు పది రోజుల నుంచి గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పాపం బాధితులు కావలిలో టీస్టాల్ నడిపే వ్యక్తి స్నేహితులు, బంధువులతో కలిసి మొత్తం రూ.23 లక్షలు ప్రసాద్‌కు వడ్డీకి ఇచ్చినట్లు తెలిసింది. అదే విధంగా స్థానికంగా చిల్లర దుకాణం నిర్వహించే కుటుంబం రూ.32 లక్షల వరకూ ప్రసాద్‌కు పెట్టుబడుల రూపంలో ఇచ్చినట్లు సమాచారం. ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం రూ.25 లక్షల వరకూ కట్టినట్లు తెలిసింది. డబ్బులిచ్చిన వారికి ష్యూరిటీగా సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు.కావలిలో మరో భారీ ఆర్థిక మోసం షేర్లు, అధిక వడ్డీ పేరుతో డబ్బు తీసుకున్న వ్యక్తి ఫిబ్రవరి నెలాఖరు నుంచి నిలిచిపోయిన చెల్లింపులు లబోదిబోమంటున్న బాధితులు షేర్ మార్కెట్లో బాగా లాభాలు వస్తుండటంతో అధిక వడ్డీ ఇస్తున్నానని ప్రసాద్ చెప్పడంతో నమ్మాను. ఇంట్లో ఉన్న బంగారం, బంధువుల బంగారం కుదువ పెట్టి రూ.21 లక్షలిచ్చాను. వడ్డీ డబ్బులివ్వక పోగా, అసలు కూడా ఇవ్వడం లేదు. రెండు నెలల నుంచి ప్రసాద్ సక్రమంగా ప్రవర్తించడం లేదు. భయం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశా. న్యాయం చేస్తామని చెప్పారు. – పమిడిమర్రి నాగమణి, బాధితురాలు, కావలి -
● వ్యాపారాన్ని ఆధీనంలోకి తీసుకున్న అధికార పార్టీ నేతలు
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో పాత, కొత్త వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రభుత్వం తమదేనంటూ అధికార పార్టీ నాయకులు బియ్యం వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. దానిని దెబ్బతీసేందుకు కొందరు పాత వ్యాపారులు ప్రయత్ని ంచి భంగపడుతున్నారు. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో బియ్యం వ్యాపారుల మధ్య జరుగుతున్న పోరు చర్చనీయాంశంగా మారింది.కందుకూరు: లింగసముద్రం మండలం పెదపవని గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని అధికార పార్టీ నాయకులు భారీగా బియ్యం వ్యాపారం చేస్తున్నారు. ప్రతి నెలా రేషన్ డీలర్ల దగ్గర సేకరించిన బియ్యాన్ని నేరుగా గ్రామంలోని మిల్లుకు తరలించి అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టు, చైన్నె ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. ఇందుకోసం నియోజకవర్గంలో మండలానికి ఒక నాయకుడిని నియమించారు. అక్కడ బియ్యం వ్యాపారం మొత్తం వీరి కనుసన్నల్లోనే జరిగేలా అధికార పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గంలో పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయకుండానే నేరుగా బ్లాక్‌మార్కెట్‌కు తరలించేస్తున్నారు. డీలర్లు ఒక కేజీని రూ.12 లెక్కన జనాల వద్ద కొనుగోలు చేస్తారు. తర్వాత వాటిని రూ.16 లెక్కన డీలర్ల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు పంపుతారు. వందల టన్నుల బియ్యాన్ని అసలు రేషన్ షాపులకు చేర్చకుండానే సివిల్ సప్లయ్స్ గోదాము నుంచి నేరుగా తరలిస్తున్నారు. నెలలో కనీసం 18వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. ఒకటి, రెండు తేదీల్లోనే సరుకుని తరలించిన అనంతరం లబ్ధిదారుల వద్ద వేలిముద్రలు తీసుకుని డబ్బులిచ్చి పంపుతున్నారు. ఈ ప్రక్రియలో బియ్యం వ్యాపారం చూస్తున్న అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగానే డీలర్లు వ్యవహరించాలి. వారికి తప్ప బియ్యాన్ని మరొకరికి అమ్మడానికి వీల్లేదు. దీంతో దశాబ్దాల తరబడి ఇదే వ్యాపారం చేస్తున్న బియ్యం వ్యాపారుల ఆదాయానికి గండి పడింది. పోలీసుల వేధింపులు తమను వ్యాపారం చేసుకోనివ్వడం లేదంటూ పాత వ్యాపారులు ఒక జట్టుగా ఏర్పడ్డారు. అధికార పార్టీకి చెందిన నేతల వ్యాపారాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారు బియ్యం నిల్వ చేసే స్థావరాలపై, రవాణా చేసే వాహనాలపై నిఘా ఉంచి అధికారులకు సమాచారం ఇవ్వడం ప్రారంభించారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని, మిల్లులో భారీ ఎత్తున నిల్వ చేసి ఉన్నారని అధికారులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల పెదపవని కేంద్రంగా నడుస్తున్న మిల్లుపై నిఘా ఉంచి జిల్లా ఉన్నతాధికారుల దగ్గర నుంచి స్థానిక అధికారుల వరకు ఫోన్లు చేశారు. అయితే దాడులు చేసేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు. అధికార పార్టీకి చెందిన వ్యవహారం కావడంతో వెనుకంజ వేస్తున్నారు. పైగా కొందరు ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది బియ్యం వ్యాపారులకు తెలియజేస్తున్నారు. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు నేతలు చర్యలు ప్రారంభించారు. పోలీసులను రంగంలోకి పాత వ్యాపారులు బియ్యం తరలించే వాహనాలను పట్టుకోవడం, కేసులు నమోదు చేయించడం, వారిని స్టేషన్‌కు పిలిపించి వేధించడం పరిపాటిగా మారిపోయింది. ఇటీవల ఉలవపాడు స్టేషన్లో చోటు చేసుకున్న ఉదంతమే ఇందుకు నిదర్శనం. సింగరాయకొండకు చెందిన ఒకతను కందుకూరు ప్రాంతంలో బియ్యం కొని వ్యాపారం చేస్తుంటాడు. ఈ వాహనాన్ని పట్టుకున్న ఉలవపాడు పోలీసులు అతడిపై వేధింపులకు దిగారు. పాత కేసులను ఆసరాగా చేసుకుని సస్పెక్ట్ షీట్‌ను కూడా తెరిచారు. అలాగే లింగముద్రం మండలం వీఆర్ కోటకు చెందిన మరో వ్యాపారిపై కూడా గుడ్లూరు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న బియ్యం వ్యాపారానికి అడ్డు తగులుతుండటమే వీరిపై వేధింపులకు కారణం. దీంతో కొందరు వ్యాపారం మానుకోగా, మరికొందరు అధికార పార్టీ వ్యాపారులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. చర్యలు లేకపోవడంతో.. సాధారణంగా ప్రతినెలా ఒకటి నుంచి 18వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా నెల మొదటి వారంలోనే రేషన్‌షాపుల నుంచి బియ్యం మొత్తం బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తోంది. ఇటీవల ఇలాంటి ఘటన పట్టణంలోని ఉప్పుచెరువు రోడ్డులో సబ్‌కలెక్టర్ సాక్షిగా వెలుగు చూసినా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. దీంతో తమ ఇష్టారాజ్యంగా బియ్యాన్ని తరలించేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరూ ఆ బిజినెస్ చేయరాదంటూ హుకుం ఎదురు తిరుగుతున్న పాత వ్యాపారులు గుట్టు రట్టు చేసేందుకు జట్టు కట్టిన వైనం అడ్డు తగులుతున్న వారిపై కేసులతో వేధింపులు -
విద్యుత్ మోటార్ల దొంగల అరెస్ట్
● రూ.5.5 లక్షల విలువైన 25 మోటార్ల స్వాధీనం తోటపల్లిగూడూరు: ఇనుప వ్యాపారం పేరుతో పగటి పూట గ్రామాల్లో తిరుగుతూ రాత్రి వేళల్లో పొలాల్లో మోటార్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ సౌజన్య వివరాలు వెల్లడించారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం గ్రామానికి చెందిన కత్తుల బాబీ, పొట్లూరు పూర్ణచంద్రరావు, చౌటూరు శ్రీను ముఠాగా ఏర్పడి విద్యుత్ మోటార్లు చోరీ చేస్తున్నారు. తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, వెంకటాచలం, నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలో నాలుగు నెలల్లో వీరిపై 11 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి రూ.5.5 లక్షల విలువైన 25 మోటార్లను రికవరీ చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కాగా ఐదునెలల కాలంలో నెల్లూరు సబ్ డివిజన్లో చోరీకి గురైన 103 మోటార్లను రికవరీ చేశామని ఏఎస్పీ వెల్లడించారు. కేసులను ఛేదించి మోటార్లను రికవరీ చేయడంతోపాటు నిందితులను పట్టుకున్న పలు స్టేషన్ల పోలీస్ అధికారులు, సిబ్బందికి ఏఎస్పీ రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, కృష్ణపట్నం పోర్టు స్టేషన్ల ఎస్సైలు వీరేంద్రబాబు, విశ్వనాథరెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల్లో పురోగతి, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మొదలైన అంశాలను పరిశ్రమల శాఖ జీఎం ప్రసాద్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువు కంటే ముందుగా అనుమతి ఇవ్వాలన్నారు. ప్రింటింగ్, రెడీమేడ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అధికారులు మహబూబ్‌బాషా, వెంకటరమణ, గంగాభవాని, అశోక్ కుమార్, కమిటీ సభ్యులు ఏపీకే రెడ్డి, ఒమ్మిన సతీష్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంజాయి విక్రయాలపై పోలీసుల దాడులు ● అదుపులో ఐదుగురు వ్యక్తులు నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయాలపై నెల్లూరు సంతపేట పోలీసులు దాడులు చేసి ఐదుగురు విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అధిక శాతం నేరాలు మత్తులో జరుగుతుండటంతో నగర పోలీస్ అధికారులు దీనిపై దృష్టి సారించారు. పొర్లుకట్ట పెన్నానది సమీపంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయని మంగళవారం సంతపేట పోలీసులకు పక్కా సమాచారం అందింది. వారు వెంటనే అక్కడికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన ఐదుగురు విక్రేతలు పరారవుతుండగా వెంబడించి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు భగత్‌సింగ్ కాలనీ టిడ్కో గృహ సముదాయంలో ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు. నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించేందుకు ఎస్పీ జి.కృష్ణకాంత్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. మంగళవారం నగర డీఎీస్పీ పి.సింధుప్రియ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి టిడ్కో ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇంటి యజమానితోపాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు. వాహన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేని 54 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, రెండు కార్లను స్వాధీనం చేసుకుని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నలుగురు పాతనేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్డన్ సెర్చ్ నిర్వహణ ముఖ్య ఉద్దేశాన్ని డీఎస్పీ స్థానికులకు తెలియజేశారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర ఇన్స్పెక్టర్లు కె.సాంబశివరావు, జి.దశరథరామారావు, రోశయ్య, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు, చిన్నారుల గృహ నిర్బంధం
తోటపల్లిగూడూరు: బాకీ వసూలు విషయంలో మహిళలు, చిన్నారులను ఐదురోజులుగా గృహ నిర్బంధంలో ఉంచిన ఘటన మండలంలోని చింతోపు గ్రామంలో జరిగింది. లేబూరు కల్యాణి, లేబూరు మేఘ వర్షిత మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమ మామ లేబూరు మల్లికార్జున్ చింతోపు పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నాడన్నారు. ఆయన గ్రామానికి చెందిన గండవరం అనిల్ – సంధ్యకు నగదు బాకీ ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందన్నారు. మామ, ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం చూసి ఐదు రోజులుగా అనిల్ – సంధ్య, మరికొందరు తమ ఇంటి వద్ద టెంట్ వేసి నిరసనకు దిగారన్నారు. తమను, పిల్లల్ని ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారన్నారు. కేసు కోర్టులో ఉంది కదా అనడిగితే తిడుతున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. మల్లికార్జున్ వైఎస్సార్సీపీ మద్దతు సర్పంచ్ కావడంతో రాజకీయంగా వేధిస్తున్నట్లు వాపోయారు. -
ఉప్పు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
● రాష్ట్ర సాల్ట్ సొసైటీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణరాజు కావలి: జిల్లాలో ఉప్పు సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర సాల్ట్ సొసైటీ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరాజు బాలకృష్ణరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కావలిలో మీడియాతో మాట్లాడారు. ఉప్పు సాగు చేసే రైతులకు భూమిపై హక్కు లేదని, ప్రభుత్వ భూమి కావడంతో బ్యాంక్ రుణాలు మంజూరు కావడం లేదని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులు వద్ద అప్పు దొరక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2008లో అల్లూరు ఎమ్మెల్యేగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నప్పుడు సీఎం వైఎస్సార్‌ను కలిసి ఉప్పు రైతుల కష్టాలను తెలియజేసినట్లు చెప్పారు. ఆయన స్పందించి విద్యుత్ యూనిట్ రూ.4ను రూ.1కే ఇస్తానని చెప్పారన్నారు. తాము అడిగిన నాటికి మూడు నెలల ముందు నుంచే యూనిట్ రూ.1కే అందించేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు దీనిని రద్దు చేయడంతో మళ్లీ రైతులు విలవిల్లాడిపోయారన్నారు. నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉప్పు భూములకు పట్టాలివ్వాలని, రవాణా వసతులు, తాగునీటి వసతులు కల్పించాలని రైతులు కోరారన్నారు. రైతులు, కూలీలు సుమారు 10,000 మందికి పైగా ఉప్పు సాగుపై ఆధారపడి బతుకుతున్నారని తెలియజేశారు. అధికారంలోకి రాగానే అవసరమైన చర్యలు తీసుకుని మేలు చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. అయితే నేటికీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. ఉప్పును భద్రపరుచుకోవడానికి వసతుల్లేవని చెప్పారు. అసలు ధర ఎంత అనేది రైతులకు తెలికపోవడంతో వ్యాపారులు, దళారులు ఎంత ధర చెబితే అంతకే అమ్మకాలు చేస్తున్నారన్నారు. బీమా సౌకర్యం కల్పిస్తే వర్షమొస్తే రైతులకు నష్టశాతం కొంత వరకై నా తగ్గుతుందన్నారు. ఒక్క అల్లూరు మండలంలోని గోగులపల్లి, ఇస్కపల్లి గ్రామాల్లోనే 5,000 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి లోకేశ్ మాటను నిలుపుకొని అండగా ఉండాలని కోరారు. -
చంపేస్తాడన్న భయంతోనే..
● సుల్తాన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): పెన్నా నది వద్ద జరిగిన సుల్తాన్ హత్య కేసులో నిందితులను నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నగర డీఎస్పీ పి.సింధుప్రియ తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. జాకీర్‌హుస్సేన్ నగర్‌కు చెందిన షేక్ సుల్తాన్ (38) బేల్దారి పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసైన అతను పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలువురిని బెదిరించి నగదు దోచుకుని మద్యం తాగేవాడు. సుల్తాన్ హత్యపై బాధిత తల్లి కరిమున్నీసా ఫిర్యాదు మేరకు నవాబుపేట ఇన్చార్జి ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు నేతృత్వంలో ఎస్సైలు రెహమాన్, శివయ్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను జాకీర్‌హుస్సేన్ నగర్ న్యూకాలనీకి చెందిన షేక్ సలీం అలియాస్ కలీమ్, మైపాడు రోడ్డు సింహపురి కాలనీకి చెందిన ఎం.నాగరాజుగా గుర్తించారు. మంగళవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈనెల 16వ తేదీన మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని సలీంను సుల్తాన్ అడగ్గా అతను లేవని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన సుల్తాన్ డబ్బులివ్వకుండా ఎలా బతుకుతావో చూస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన సలీం ఈ విషయాన్ని తన స్నేహితుడైన నాగరాజుకు తెలియజేశాడు. సుల్తాన్ చంపేందుకు వస్తే ఇద్దరం కలిసి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు రాత్రి సలీం, నాగరాజు న్యూకాలనీ సమీప పెన్నా నది వద్ద ఉండగా సుల్తాన్ వెళ్లి గొడవపడి దాడి చేశాడు. వారు కర్రలతో సుల్తాన్ తలపై కొట్టగా మృతిచెందాడు. నిందితులను అరెస్ట్ చేసిన ఏఎస్సై బీవీ నరసయ్య, హెచ్‌సీ ఎస్.ప్రసాద్, కానిస్టేబుళ్లు ఆర్వీ రత్నయ్య, సురేంద్రబాబు, గౌస్, మస్తానయ్య, వేణును డీఎస్పీ అభినందించారు. -
30 నుంచి వీఎస్‌యూలో సాఫ్ట్‌బాల్ పోటీలు
● వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో ఈనెల 30 నుంచి మేనెల 8 తేదీ వరకు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ (మహిళలు, పురుషులు) టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం కాకుటూరులో ఉన్న వర్సిటీలో వీసీ అల్లం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 93 మహిళా జట్లు 30 నుంచి మే నెల 3 తేదీ వరకు పాల్గొంటాయని తెలిపారు. మేనెల 4 నుంచి 8 తేదీ వరకు 95 పురుషు జట్లు పోటీ పడతాయన్నారు. వీఎస్ యూ క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హనుమారెడ్డి, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ సీహెచ్ వెంకట్రాయులు, పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణ అక్షరాస్యతకు సమష్టిగా కృషి
● కలెక్టర్ ఓ ఆనంద్ కోవూరు: జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ఒక నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ప్రణాళిక చేపట్టామని, అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చొరవతో ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేశామని తెలిపారు. మంగళవారం కోవూరు ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 22,000 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కాకుండా, ఎంపిక చేసిన వారికి నేరుగా పనుల్లో మస్టర్ వేసే విధానం, బ్యాంకింగ్ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యక్రమాల విధివిధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. 90 రోజుల ప్రణాళికలో భాగంగా అక్షరాలు నేర్పించడమే కాకుండా ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతలో మెళకువలు నేర్పిస్తామన్నారు. ఇందుకోసం 2,500 మంది స్వచ్ఛంద ఉపాధ్యాయులను నియమించామన్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. నిరక్షరాస్యులకు వారి రోజువారి పనులకు ఆటంకం కలగకుండా వారికి అనువైన సమయంలోనే అక్షరాలు నేర్పిస్తామన్నారు. ఇందుకోసం గుర్తించిన కమ్యూనిటీ మొబిలైజర్లు తమ వంతు కృషి చేసి ప్రతి ఒక్కరు ప్రతి రోజు హాజరయ్యే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. విజయవంతం చేయండి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం చైతన్య వంతమైందని, గతంలో చేపట్టిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు విజయవంతంగా జరిగాయన్నారు. తాజాగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఇందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య డీడీ మహమ్మద్ ఆజాద్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని, డీఈఓ బాలాజీ రావు, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, కోవూరు సర్పంచ్ విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న లేఅవుట్ల ఆక్రమణకు యత్నం
జలదంకి: మండలంలోని రామవరప్పాడులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లను ఆక్రమించేందుకు ఆ గ్రామానికి చెందిన ఓ చోటా టీడీపీ నేత ప్రయత్నాలు ప్రారంభించాడు. నాలుగు రోజులుగా లేఅవుట్ల స్థలాల హద్దురాళ్లను తొలగించారు. అక్కడ నివేశన స్థలాల అభివృద్ధి పనులకు సంబంధించి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల ఆ లేఅవుట్లో పెరిగిన చిల్లచెట్లను సైతం నరికేసి సుమారు రూ.3 లక్షల మేర సొమ్ము చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా, పంచాయతీ అధికారులు సైతం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2.3 ఎకరాల విస్తీర్ణంలో 64 మంది నిరుపేదలకు నివేశన స్థలాలు మంజూరు చేసి, ఇంటి పట్టాలను అందజేసింది. ఆ స్థలాలను దౌర్జన్యపూరితంగా ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. వీఆర్‌కు కలువాయి ఎస్ఐ నెల్లూరు (క్రైమ్): విధుల్లో నిర్లక్ష్యం, పలు కారణాల నేపథ్యంలో కలువాయి ఎస్ఐ సుమన్‌ను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ జి. కృష్ణకాంత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ఫీజు గడువు పెంపు విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలన్నారు. అదనపు కమిషనర్‌కు ఎఫ్ఏసీ బాధ్యతలు నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా ఉన్న వైఓ నందన్‌ను ఇన్చార్జి కమిషనర్‌గా నియమించిన ప్రభుత్వం, తాజాగా పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో నందన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలి
● కలెక్టరేట్ ఎదుట ధర్నా నెల్లూరు (అర్బన్): దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, తమ సర్వీస్ ను క్రమబద్ధీకరించాలని కోరుతూ జిల్లాలోని కమ్యూ నిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌ఓలు) మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమహేష్, కృష్ణవేణి మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల్లో జిల్లాలో 497 మంది పని చేస్తున్నామన్నారు. నాలుగున్నరేళ్ల పాటు బీఎస్సీ నర్సింగ్, మరో రెండేళ్ల పాటు ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసి వైద్యశాఖలో చేరామన్నారు. నడవలేని వృద్ధులు, పక్షవాతం పెషేంట్ల ఇళ్ల వద్దకే వెళ్లి 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు గ్రామీణ స్థాయిలో అందిస్తున్నామన్నారు. తమకు ప్రభుత్వం కేవలం రూ. 25 వేలను మాత్రమే జీతంగా ఇస్తుందన్నారు. తమకు వచ్చే జీతంలోనే సొంత ఖర్చులు పెట్టుకుంటూ వివిధ రకాల శిక్షణలకు, ఆరోగ్య కార్యక్రమాలకు హాజరవుతున్నామన్నారు. ఆస్పత్రులకు తరలించే మెటీరియల్‌ను జిల్లా కేంద్రాల నుంచి తమ సొంత ఖర్చులతోనే తీసుకెళ్తున్నామన్నారు. క్లినిక్‌ల అద్దెలు కూడా ప్రభుత్వం 10 నెలలుగా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల యజమానుల ఒత్తిడి తట్టుకోలేక సీహెచ్‌ఓలే క్లినిక్‌ల అద్దెలు కూడా చెల్లిస్తున్నారన్నారు. రకరకాల కారణాలు చెప్పి ఇన్సెంటివ్స్కు కూడా కోత వేశారన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, ఆయుష్మాన్ భారత్ కింద ఉద్యోగ భద్రత కల్పించాలని, జాబ్ చార్ట్ ప్రకారమే విధులు కేటాయించాలని కోరారు. ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలని, సీహెచ్ఓలకు ఎఫ్ఆర్ఎస్ హాజరు మినహాయింపు నివ్వాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఆ సంఘం నాయకులు ఆదిల్, రెబికా, సుమాంజలి, రమ, అన్ని మండలాల నుంచి వచ్చిన సీహెచ్‌ఓలు పాల్గొన్నారు. -
ప్రాథమిక పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు
నెల్లూరు (టౌన్): వార్షిక వర్క్ ప్లాన్ బడ్జెట్ 2024–25లో భాగంగా పలు ప్రాథమిక పాఠశాలల్లో అదనపు గదులు నిర్మాణాలు, టాయిలెట్స్, ప్రహరీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో 19 అదనపు గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఒక్కో గదికి రూ.13.05 లక్షలు నిధులు మంజూరైనట్లు వివరించారు. 15 బాలుర, 10 బాలికల టాయిలెట్స్ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఒక్కో టాయిలెట్‌కు రూ.3.80 లక్షలు నిధులు మంజూరైనట్లు చెప్పారు. జిల్లాలోని 23 పాఠశాలల్లో ప్రహరీలు నిర్మించనున్నామని, ఒక్కో స్కూల్ల్లో 125 మీటర్లు చొప్పున ప్రహరీ నిర్మాణాన్ని చేపడుతామన్నారు. ఒక్కో స్కూల్‌కు రూ.9.31 లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. జిల్లాలోని సాయిపేట, వడ్డిపాళెం ఎంపీపీఎస్‌ల్లో రూ. 12 లక్షలతో మేజర్ వర్క్స్‌ను చేపట్టనున్నట్లు వివరించారు. పంచేడు, పల్లిపాడు ఎంపీపీఎస్‌ల్లో రూ.3 లక్షలతో ఎలక్ట్రికల్ పనులు చేపడుతున్నామన్నారు. మనబడి మన భవిష్యత్‌లో భాగంగా జిల్లాలోని 10 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్య కోసం భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ఒక్కో కేజీబీవీలో 6 అదనపు గదులు, 10 టాయిలెట్స్‌తో పాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్కో కేజీబీవీకి రూ.2.55 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆయా కేజీబీవీల్లో మిగిలిన నాడు–నేడు పనులను సమగ్రశిక్ష ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. 10 కేజీబీవీల్లో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్ సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య -
మత్స్య సంపదను వేలం వేయొద్దు
కనిగిరి రిజర్వాయర్‌లో మత్స్య సంపదను వేలం వేయొద్దంటూ కలెక్టర్‌కు యానాదుల సంక్షేమ సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. వేలం వేస్తే యానాదుల కుటుంబాలు వీధిన పడతాయన్నారు. మత్స్య శాఖకు లీజు చెల్లించేందుకు కొంత సమయం ఇప్పించాలని కోరగా సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్రాధ్యక్షుడు కేసీ పెంచలయ్య, చెంబేటి ఉష, పొట్టేళ్ల నాగరాజు, శివనాగమణి, పొట్లూరు నాగరాజు, ఏకొల్లు శీనయ్య, బాలు, వెంకటేష్, సొసైటీ డైరెక్టర్లు బంగారయ్య, యల్లంపల్లి శీనయ్య, నరసయ్య, కత్తి బాలయ్య పాల్గొన్నారు. -
దుర్నీతి పాలనకు వడ్డీతో సహా చెల్లిస్తాం
● వైఎస్సార్సీపీ ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్నీతి పాలనకు తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కూటమి నేతలు తమ పలుకుబడి ఉపయోగించి బెయిల్ రాకుండా కుట్రలు పన్నడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాలన అందించడం మానేసి అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కాకాణి రైతుల సమస్యలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బలంగా వినిపిస్తున్నారని, ఆయన గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు పెట్టారన్నారు. కూటమి దుర్నీతిపై ఎవరు గొంతెత్తినా ఆ గొంతులు నొక్కాలని పనిగా పెట్టుకున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి ఇప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పాలన విస్మరించి అక్రమ కేసులతో అందరిని భయ పెట్టాలంటే కుదరదని, ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
మా భూములిచ్చే ప్రసక్తే లేదు
● సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద కరేడు గ్రామస్తుల ధర్నా కందుకూరు: ‘ప్రభుత్వం మా జీవనాధారమైన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చే ప్రసక్తే లేదు’ అని కరేడు గ్రామస్తులు అన్నారు. బీపీసీఎల్, సోలార్ ప్లాంట్ల కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ సారవంతమైన భూములను తీసుకుంటే ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. వెంటనే భూసేకరణ ప్రక్రియను నిలిపి వేయాలన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎస్ఏ గౌస్ మాట్లాడుతూ గతంలో అనేక ప్రాంతాల్లో భూసేకరణ చేశారని, ఇప్పటివరకు నిర్వాసితులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని వివరించారు. అనంతరం సబ్‌కలెక్టర్ తిరుమణి శ్రీపూజను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కుంకాల రామసుబ్బారెడ్డి, దారం శ్రీనివాసులు, కె.రమణయ్య, లింగారెడ్డి రామకోటిరెడ్డి, గంజి రామకోటయ్య, సీపీఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్, ఎస్కే మున్వర్ సుల్తానా, నాదెండ్ల కోటేశ్వరరావు, ఎస్కే మల్లిక, ఎం.పద్మ, ఎస్.పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మే 1న సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండండి
నెల్లూరు సిటీ : సీఎం చంద్రబాబు మే 1న ఆత్మకూరులో పర్యటిస్తారని, అధికారులందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ సీఎం పర్యటనలో భాగంగా ఆత్మకూరు పరిధిలో పింఛన్ల పంపిణీలో పాల్గొంటారని, నారంపేట ఎంఎస్ఎం పార్కు ప్రారంభోత్సవం, పార్టీ కార్యకర్తల సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని, డీఎస్పీ వేణుగోపాల్, ఆర్అండ్బీ ఎస్ఈ గంగాధర్, ఈఈ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ పాల్గొన్నారు. డీఐఈఓగా వీవీ సుబ్బారావు నెల్లూరు (టౌన్): బాపట్ల జిల్లా అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా చేస్తున్న వీవీ సుబ్బారావుకు పదోన్నతి కల్పిస్తూ నెల్లూరు డీఐఈఓ (డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్)గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్తులు జారీ చేశారు. ప్రస్తుతం ఎఫ్ఏసీగా పని చేస్తున్న మధుబాబును ఇనమడుగు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా వెనక్కి పంపించారు. సుబ్బారావు విజయవాడలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో ఎఫ్ఏసీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా, ఆర్ఐఓ (రీజనరల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్)గా పనిచేస్తున్న ఎ.శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఓగా పదోన్నతి కల్పించి కడప ఆర్జేడీగా అదనపు బాధ్యతలు కల్పించారు. ప్రస్తుతం ఆర్‌ఐఓగా, డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఎవరిని నియమించలేదు. 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీబీఎస్ఈ, ఐబీ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి 5 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. అర్హులైన విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. జూన్ 20న బార్ అసోసియేషన్ ఎన్నికలు నెల్లూరు (లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఖరారైంది. మే 20న నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ప్రారంభమై 26న ముగుస్తుందని, 27న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ప్రక్రియలు ఉంటాయి. జూన్ 20న ఓటింగ్ జరుగుతుందని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శి ఉమామహేశ్వర్ రెడ్డి, సుందరయ్యయాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవు ● జేసీ కార్తీక్ నెల్లూరురూరల్: వివిధ సర్వేల్లో వ్యతిరేకత వ్యక్తమైన అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రెండో దశ రీసర్వేపై గ్రామ సభలు వెంటనే పూర్తి చేయాలన్నారు. నోషనల్ ఖాతాల విషయంలో ఈ నెల 25 నుంచి మండలాల వారీగా షెడ్యూల్ చేసి సమీక్షిస్తామన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లోని ఆర్ఓ ప్లాంట్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పూర్తయిన టాయిలెట్లకు డోర్లు, కిటికిలు బిగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సిటిజన్, రైస్ కార్డ్స్ ఈకేవైసీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ లు వేగవంతంగా చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ ఉదయభాస్కర్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగాభవాని, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు విజయన్, వెంకటరమణ, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
అధికారులే సపోటా తోటను ధ్వంసం చేశారు
● రైతు చిమ్మిరి బ్రహ్మయ్య ఆవేదన ఉలవపాడు: సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం అవసరమని, తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తన 35 సెంట్ల సపోటా తోటను ప్రభుత్వ అధికారులు అక్రమంగా సోమవారం జేసీబీతో ధ్వంసం చేశారని మండలంలోని మన్నేటికోటకు చెందిన రైతు చిమ్మిరి బ్రహ్మయ్య రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం పొలంలోకి విద్యుత్, పంచాయతీ అధికారులు వచ్చిన సమయంలో ఎందుకు కొలతలు వేస్తున్నారని అడిగానన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడానికి చేస్తున్నామని చెప్పడంతో, తన పొలంలో ఎలా నిర్మిస్తారని, వెంటనే సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆమె తహసీల్దార్‌ని పిలిచి రైతుతో మాట్లాడి న్యాయం చేసి భూమి తీసుకోమని చెప్పారన్నారు. అయితే సోమవారం ఎలాంటి నోటీసు, సమాచారం లేకుండా తన పొలాన్ని ధ్వంసం చేశారన్నారు. దాదాపు 40 ఏళ్ల నుంచి ఉన్న సపోటా చెట్లు, వాటి కాపును కూడా జేసీబీతో తొలగించారని వాపోయారు. -
ఉద్యోగాల పేరిట మోసం
నెల్లూరు(క్రైమ్): ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు తీసుకున్నారు. తక్కువ ధరకే బంగారం పేరిట మోసగించారు, కుమార్తె మృతికి అల్లుడు, అత్తింటివారు కారణం, కొడుకు, కోడలు ఆస్తి రాయించుకుని ఇంట్లో నుంచి తరిమేశారు, కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబాన్ని చక్కదిద్దాలి.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ. విచారించి న్యాయం చేయాలని బాధితులు ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నెల్లూరు ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా వ్యాప్తంగా 119 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలని ఆయా ప్రాంత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీటీసీ డీఎస్పీ గిరిధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 119 ఫిర్యాదులు -
మా భూములు బీపీసీఎల్‌కు ఇవ్వం
● ఆర్డీఓకు రైతులు స్పష్టం కావలి: ‘మా భూములను ఎట్టి పరిస్థితుల్లో బీపీసీఎల్ కంపెనీకి ఇవ్వబోమని కావలి మండలం ఆనెమడుగు పంచాయతీకి చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు తదితరులు సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయ ఏఓకు స్పష్టం చేశారు. సీపీఎం నేత తాళ్లూరు మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నేత పేముల సీతారామయ్య, ఆనెమడుగు పంచాయతీకి చెందిన మందా చిన్నయ్య, ఆర్.జయరామిరెడ్డి, కె.రవీంద్ర సోమవారం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్థానిక రైతుల అభిప్రాయంగా తెలియజేశారు. ఆనెమడుగులోని మా భూములను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌తో కలిసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేస్తుందని, భూములు తీసుకుంటే మా బతుకుదెరువు బుగ్గిపాలవుతుందని పేర్కొన్నారు. మేము మా భూము లను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని మీ ద్వారా కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నట్లు ఆ లేఖలో వివరించారు. ఒక వేళ మా పొలాలు బలవంతంగా తీసుకోవాలనుకుంటే తాము ప్రాణాలు అర్పించే దానికై నా సిద్ధమేనని, ఇప్పటికే మా నిర్ణయాన్ని కలెక్టర్‌కు, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, ఆర్డీఓకు అర్జీలిచ్చి ఉన్నామన్నారు. -
సిలబస్‌ను తగ్గించాలి
మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో అర్హతలకు కొర్రీలు పెట్టడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నాళ్లగానో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు కుమ్మరించింది. డీఎస్సీ పరీక్షలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్యను తగ్గించాలనే కుతంత్రంతో కొత్త కొత్త నిబంధనలతోపాటు ఏపీపీఎస్సీ పరీక్షలు జరిగే సమయంలో షెడ్యూల్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ విడుదలపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ఒకే సమయంలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళన ● ఇంటర్, డిగ్రీలో 50 శాతం, పీజీలో 55 శాతం మార్కుల నిబంధన ● పరీక్షలకు సమయం 45 రోజులే ● ఆన్లైన్ పరీక్ష నిర్వహణపై సందేహాలు ● జిల్లాలో పోస్టులు 673.. అభ్యర్థులు 25 వేలకు పైగానే డీఎస్సీ పరీక్షకు సిలబస్‌ను తగ్గించాలి. ఎన్నడూ లేని విధంగా ఈ డీఎస్సీలో ఇంటర్ సిలబస్‌ను చేర్చడం తగదు. దీని వల్ల అభ్యర్థులు ఎక్కువ అవకాశాలు కోల్పోతారు. ఇంటర్, డిగ్రీల్లో 50 శాతం మార్కులు ఉంటేనే అర్హులని ప్రకటించడం దారుణం. ఈ నిబంధనలతో అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ నెల్లూరు (టౌన్): డీఎస్సీ నోటిఫికేషన్ రెండుసార్లు వాయిదా వేసిన టీడీపీ ప్రభుత్వం ఎట్టకేలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 673 పోస్టులు ఉండగా, సుమారు 25 వేల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో కేవలం 115 ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి. ఈ పోస్టులకే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 673 స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు లెక్కలు తేల్చారు. ఇందులోనే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు హిందీ–1, ఇంగ్లిష్–1, మ్యాథ్స్–1, ఎస్జీటీలు–2 పోస్టులు ఉన్నాయి. ఒకే సమయంలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలు డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షలు జూన్ 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా పాలిటెక్నిక్, జూనియర్ అధ్యాపకులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల భర్తీ నిర్వహించనున్నారు. తాజాగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులే డీఎస్సీ పరీక్షకు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు. రెండు పరీక్షలను ఏక కాలంలో నిర్వహించడం వెనుక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యను తగ్గించే కుట్ర దాగి ఉందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీ పరీక్షల్లో నిబంధనల కొర్రీ డీఎస్సీ నోటిఫికేషన్లో రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టి భావి ఉపాధ్యాయుల కలలను కల్లలు చేసింది. ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం మార్కులు, స్కూల్ అసిస్టెంట్లు పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పీజీలో 55 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన పెట్టారు. ఈ నిబంధనలతో సగమంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసే అర్హత కోల్పోతారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఈడీలో చేరే సమయంలో డిగ్రీలో 40 శాతం మార్కులు అర్హతగా ఉంటే డీఎస్సీ పరీక్షకు 50 శాతం అర్హత మార్కులు పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు ఇంటర్ సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ప్రస్తుత ఇంటర్ సిలబస్‌పై అవగాహన లేదు. గతంలో పదో తరగతి వరకు ఉన్న సిలబస్‌లోనే పరీక్ష నిర్వహించే వారు. డీఎస్సీ పరీక్షలను నెల రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. భారీ సంఖ్యలో హాజరుకానున్న డీఎస్సీ పరీక్షకు అన్ని కంప్యూటర్లను ఎక్కడి నుంచి తేగలరని ప్రశ్నిస్తున్నారు. 2018లో టీడీపీ హయాంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు తగిన కంప్యూటర్లు లేకపోవడంతో ఎక్కువ మంది అభ్యర్థులకు పొరుగు రాష్ట్రాలైన చైన్నె, ఒడిశా, తెలంగాణ, కర్ణాటకలో సెంటర్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లలేక కొందరు అభ్యర్థులు పరీక్ష రాయకుండా ఆగిపోయారు. ఆన్లైన్ పరీక్షల్లో తప్పులు దొర్లే అవకాశం ఉందని చెబుతున్నారు.పరీక్షకు సమయం తక్కువ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి పరీక్ష తేదీకి కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో పరీక్ష నిర్వహిస్తే ఏ విధంగా రాయగలమని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గతంలో డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో వేల రూపాయిలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నామని, కాలయాపన చేసి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కోచింగ్‌కు మళ్లీ ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ సమయం కేటాయించాలి డీఎస్సీ నోటిఫికేషన్‌కు, పరీ క్షల తేదీకి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. కేవలం 45 రోజుల వ్యవధి మాత్రమే ఉండడం వల్ల పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండదు. గతంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో ప్దె మొత్తాల్లో ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకున్నారు. ఇప్పుడు హడావుడి చేయడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. – లీలామోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ -
దళితులపై కేసులు ఎత్తేయాలంటూ ధర్నా
నెల్లూరు(అర్బన్): సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూస్వాములపై చర్యలు చేపట్టి, దళితులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని అఖిల భారత రైతు – కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డీపీ పోలయ్య డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన పలువురు దళితులు సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోలయ్య మాట్లాడుతూ సర్వే నంబర్ 356, 359లో 400 ఎకరాల ప్రభుత్వ భూములను పెత్తందారులు ఆక్రమించారన్నారు. ఇందుకు తహసీల్దార్, మైనింగ్ అధికారులు సహకరించారన్నారు. సెంటు భూమిలేని నిరుపేద దళితులు కూడా ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్నారన్నారు. అయితే వారిపై మైనింగ్, రెవెన్యూ అఽధికారులు కలిసి కేసులు పెట్టారని తెలిపారు. కేసులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ 359 సర్వే నంబర్లో 60 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజు కోసం దరఖాస్తు చేసిందన్నారు. ఆ కంపెనీకి ఈసీ కూడా ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. ఆ సర్వే నంబర్లో భూమిని సాగు చేస్తున్న దళితులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. గతంలో కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇవ్వగా న్యాయం చేసేందుకు పూనుకున్నారన్నారు. అయితే రాజకీయ నేపథ్యంలో తహసీల్దార్ అక్రమాలకు పాల్పడుతున్నాడన్నారు. జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి బంజరు, మిగులు, పోరంబోకు భూములను దళితులకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రమేష్, ప్రగతి శీల మహిళా సంఘం నాయకులు మమత, నాగమణి, వెంకటరమణమ్మ, సంఘం నాయకులు కోటయ్య, శ్రీను, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వణుకుతున్న తీర గ్రామాలు
సముద్ర మట్టానికి కంటే తక్కువ లోతులో ఇసుక తవ్వేసిన దృశ్యంసముద్రపు ఇసుకనూ వదలని తమ్ముళ్లు ● చెలియకట్టలు ధ్వంసం చేస్తున్న వైనం ● మత్స్యకార గ్రామాలు, పోర్టు, హార్బర్లకు పెనుముప్పు సాక్షి ప్రతినిఽధి నెల్లూరు: జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో 140 కి.మీ. వరకు తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఆ తీరం వెంబడి 98 మత్స్యకార గ్రామాలున్నాయి. సముద్రంలో చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకార గ్రామాల వినాశనానికి టీడీపీ నేతలు తెగించారు. ప్రధానంగా కావలి, కందుకూరు నియోజకవర్గాల్లోని సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఇసుక కోసం మత్స్యకారుల జీవితాలనే పణంగా పెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో వారి అనుచరవర్గం బరితెగించి ప్రకృతితోనే చెలగాటం ఆడుతోంది. ‘ఇసుక మేట దిబ్బలు’ తవ్వేసి.. తీరం వెంబడి సముద్రపు అలలు తాకే ప్రాంతంలో వేసే ఇసుక మేట దిబ్బ (చెలియకట్ట)ను తవ్వేసి ఇసుకాసురులు అక్రమ రవాణా సాగిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని టెక్కాయచెట్లపాళెం నుంచి అలగాయపాళెం తీరం వరకు, కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రం, అన్నగారిపాళెం పంచాయతీ ఒట్టూరు, లక్ష్మీపురం పరిధి తీర ప్రాంతంలో జేసీబీలను ఏర్పాటు చేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళల్లో ఈ ఇసుకను తరలిస్తున్నారు. హేచరీలు, పరిశ్రమల నిర్మాణం, అపార్ట్మెంట్ల నిర్మాణంలో బేసిమట్టం మధ్యలో ఎత్తులేపడానికి ఈ ఇసుకను తరలిస్తున్నారు. లవణ స్వభావం ఉండే ఈ ఇసుకను వాడడం వల్ల నిర్మాణాల మనుగడకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పట్టించుకోని అధికారులు ఇసుక కోసం సముద్ర తీరం ధ్వంసం అవుతున్నా.. అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మత్స్య, అటవీశాఖలకు సంబంధించిన అధికారులెవరూ ఇసుక అక్రమ రవాణా విషయాన్ని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. చెలియకట్ట రెవెన్యూశాఖ పరిధిలో ఉంటుంది. ఈ భూమిలో మొక్కలు నాటి పెంచే బాధ్యత అటవీశాఖది. తీరం కాపాడడం మత్స్యశాఖ బాధ్యత. వీరందరూ తమ బాధ్యతలను మరిచిపోయారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపు జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తీరప్రాంత భద్రత కోసం ఏర్పాటు చేసిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ వ్యవస్థ సైతం తీరం ధ్వంసం అవుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రామాయపట్నం, జువ్వలదిన్నె హార్బర్‌కు పెనుముప్పు పారిశ్రామికంగా అభివృద్ధితోపాటు మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు నింపే రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బర్‌తోపాటు మత్స్యకార గ్రామాలకు భవిష్యత్ కాలంలో పెనుముప్పు వాటిల్లే పరిణామాలు కనిపిస్తున్నాయి. రూ.288 కోట్లతో వైఎస్సార్సీపీ హయాంలో జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం పూర్తి చేశారు. ఆ నిర్మాణ కాంట్రాక్టర్‌గా స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించారు. హార్బర్ నిర్మాణంలో కూడా సముద్రపు ఇసుక వాడారన్న అనుమానాలు లేకపోలేదు. ఆ పనులపై ఇప్పటికి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. సముద్ర తీరంలో ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ ఆనంద్‌కు జాతీయ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నపూడి తాతారావు ఇటీవల ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇప్పటికై నా కలెక్టర్ సముద్ర ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మత్స్యకార గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తమ్ముళ్ల ధనాశ.. తీరం వినాశనానికి దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సహజ వనరుల దోపిడీతోపాటు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాలు, సునామీ వంటి విపత్తుల్లో రాకాసి అలలను అడ్డుకునే ‘ఇసుక దిబ్బ’ (చెలియకట్ట)లను సముద్ర ఇసుక కోసం తవ్వేస్తుండడంతో భవిష్యత్‌లో ప్రళయాలు సంభవించే అవకాశం లేకపోలేదు. కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో కడలి తీరం విధ్వంసంతో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్‌తోపాటు మత్స్యకార గ్రామాలకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరాన్ని ధ్వంసం చేసి భారీగా ఇసుక తరలిస్తుండంతో భారీ ముప్పు పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికల నేపథ్యంలో తీర గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సముద్ర మట్టం కన్నా ఎక్కువ ఎత్తుగా ఉండే ఈ భూమి నుంచి ఇసుకను సముద్ర మట్టం కన్నా తక్కువ చేయడం వల్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఉంది. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాల సమయంలో గాలులు విసురుగా వీచినప్పుడు సముద్రంలోని అలలు గ్రామాలపైకి చేరి ముంచెత్తే అవకాశం ఉంది. 2004 డిసెంబర్ 26న వచ్చిన ‘సునామీ’ తీర గ్రామాలను వణికించింది. చాలా గ్రామాలను ఈ చెలియకట్టలే కాపాడాయి. గతంలో సముద్రానికి, మత్స్యకార గ్రామాల మధ్య ఇసుక తిన్నెలతోపాటు అటవీశాఖ నాటిన చెట్లు అధికంగా ఉండడం వల్ల నీరు పొంగినా గ్రామాలపైకి చేరే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇసుక తిన్నెలు, చెట్లు కనుమరుగు కావడం వల్ల సముద్రం మట్టంతో గ్రామాలు సమానంగా చేరడం వల్ల పెను ముప్పు వాటిల్లే పరిణామాలు ఉన్నాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
ముగిసిన చెస్ ర్యాంకింగ్ పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): తెలుగు రాష్ట్రాల ఓపెన్ చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. ముత్తుకూరు రోడ్డులోని సద్గురు సిల్వర్ ఓక్స్ స్కూల్లో జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ఫన్ పార్క్ ఎండీ సాయి పొత్తూరి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతపురానికి చెందిన శామ్యూల్ స్టీఫెన్ మొదటి ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన అక్షయ్ కుమార్ రెండో ర్యాంక్, నెల్లూరుకు చెందిన హరిరామ్ సాయికృష్ణ మూడో ర్యాంక్, రామ్‌లిఖిత్ నాలుగో ర్యాంక్, గిరిబాబు ఐదో ర్యాంక్ సాధించారు. వ్యాపారవేత్త పచ్చిపులుసు శ్రీరాములు, ఘుమఘుమలు రెస్టారెంట్ అధినేత ఎస్.కల్యాణ్, చెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై.సుమన్‌లు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్, స్కూల్ డైరెక్టర్లు షణ్ముకచారి, వెంకటాద్రి నాయుడు, శ్రీఆనంద్ వింగ్స్ చెస్ అకాడమీ డైరెక్టర్ ఎం.గోపీనాథ్, కోచ్ డాక్టర్ మధుసూదన్, జేసీస్ జోనల్ వైస్ చైర్మన్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
బిట్రగుంట: బోగోలు మండలం తాళ్లూరుకు చెందిన రైతు ఏసుపోగు మొలకయ్య (47) ఆర్థిక ఇబ్బందులతో శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లూరులో తనకున్న రెండు ఎకరాల భూమిలో మెట్ట పంటలు సాగు చేస్తూ జీవనం సాగించే మొలకయ్య ఇటీవలే తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పిల్లల పెళ్లిళ్లకు చేసిన అప్పులతోపాటు నీటి వసతి లేని పొలంలో బోరు వేయించేందుకు ఇటీవల తెలిసిన వారి వద్ద కొంత అప్పు చేశాడు. బోర్లలో నీళ్లు పడకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో శనివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తొలుత నెల్లూరుకు, అనంతరం చైన్నెకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు బిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. 44వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నగరంలోని డీఎస్ఆర్ ఇన్‌లో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎం.రామకృష్ణ, కార్యదర్శిగా కె.శ్రీనివాసులురెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఎం.మస్తానయ్య, కోశాధికారిగా ఎం హజిత్ యాదవ్, కౌన్సిలర్‌గా అనిల్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు క్రికెట్ సంఘం ఎన్నికల అధికారి బి.వెంకటస్వామి ప్రకటించారు. జిల్లా క్రికెట్ సంఘ గేమ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్‌గా పి.భానుప్రకాష్‌రెడ్డిని 31 మంది క్రికెట్ సభ్యులు ప్రత్యేకంగా ఎన్నుకొన్నారు. ఈ సమావేశాన్ని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కేర్ టేకర్ డి.శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. బీచ్ కబడ్డీ జిల్లా పురుషుల జట్టు ఎంపిక చినగంజాం: ఉమ్మడి ప్రకాశం జిల్లా బీచ్ కబడ్డీ పురుషుల జట్టు ఎంపిక ఆదివారం స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగింది. మే 2వ తేదీ నుంచి కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొననున్నట్లు అంతర్జాతీయ క్రీడాకారుడు, కోచ్ ఎం.గిరిబాబు తెలిపారు. పోటీల్లో పాల్గొనే జట్టుల ప్రయాణ, ఇతర ఖర్చుల మొత్తాన్ని చంద్రశేఖర్‌రెడ్డి అందజేశారు. చినగంజాంలో గత 15 ఏళ్లుగా స్వచ్ఛందంగా కబడ్డీ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్న బాలకోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు మరపాల గిరిబాబు, క్లబ్ కార్యవర్గ సభ్యులను ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అభినందించింది. బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ ఎన్.చంద్రమోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్ కుర్రా భాస్కరరావు, కార్యదర్శి వై.పూర్ణచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, ట్రజరర్ డీ రమేష్, మేనేజర్ బీ నాగాంజనేయులురెడ్డి పాల్గొన్నారు. పురుషుల జట్టు గాలి లక్ష్మారెడ్డి, జీ సమరసింహారెడ్డి, జీ బాలకృష్ణారెడ్డి, కే వెంకటేష్, వై రాజశేఖరరెడ్డి, కే ప్రసాద్‌రెడ్డి, బీ భరత్ రెడ్డి, కే హరిప్రసాద్‌రెడ్డి, కే రామాంజిరెడ్డి, జీ లక్ష్మారెడ్డి, పీ బ్రహ్మారెడ్డి, బీ సురేష్ రెడ్డి, ఎన్ ఉమామహేశ్వరరావు, పీ వినీత్‌రెడ్డి, కే బ్రహ్మయ్యతో జట్టు ఏర్పాటు చేశారు. -
మా భూములిచ్చే ప్రసక్తే లేదు
● ఉప్పరపాళెం ఎస్సీ, ఎస్టీల ఏకగ్రీవ తీర్మానం ఉలవపాడు: ఇండో సోలార్ కంపెనీకి కారు చౌకగా ఎస్సీ, ఎస్టీల భూములు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, కానీ మా భూములిచ్చే ప్రసక్తే లేదని కరేడు రెవెన్యూ పరిధిలోని ఉప్పరపాళెం ఎస్సీ, ఎస్టీ రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం స్థానిక ఎంపీపీ స్కూల్లో రామకృష్ణాపురం, ఉప్పరపాళెం, పొట్టేనుగుంట రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నేత కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణపై ఎస్సీ, ఎస్టీలకు ఉన్న భయాందోళనలను అధికారులు తొలగించాలని కోరారు. పరిశ్రమల పేరుతో బలవంతంగా భూసేకరణ చేస్తే ఎలా అన్నారు. భూములు, ఇళ్లు పోతే నిరాశ్రయులుగా మారుతారన్నారు. తక్షణమే బలవంతపు సేకరణ ఆపి ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితుల సమన్వయ కమిటీ తరఫున గంజి యలమంద, సుదర్శి మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు రామలక్ష్మమ్మ, సీఐటీయూ నాయకులు గంజి శ్రీనివాసులు, రామకోటయ్య, గిరి, విజయ్, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నాగార్జున, సుజాత, అంకమ్మరావు, ఐద్వా నాయకులు లలితమ్మ, పెంచలమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● చెట్టును ఢీకొట్టిన మోటార్‌బైక్ ● ఘటనా స్థలంలో యువతి, చికిత్స పొందుతూ యువకుడి మృతి మర్రిపాడు: పెంచలకోనకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా మోటార్‌బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో యువతి ప్రమాద స్థలంలోనే మృతిచెందగా.. యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని కదిరినాయుడుపల్లి వద్ద జాతీయ రహదారి – 67పై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన మల్లి నరసింహులు (26) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. పట్టణంలోని రూపరాంపేటకు చెందిన యాడగాలి ఝాన్సీ (26) కూడా అక్కడే పనిచేస్తోంది. ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం బద్వేలు నుంచి బైక్‌పై పెంచలకోనకు వెళ్లారు. అక్కడ దైవ దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం బద్వేలుకు బయలుదేరారు. కదిరినాయుడుపల్లి సమీపానికి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వెనుక కూర్చొన్న ఝాన్సీ అక్కడికక్కడే మృతిచెందింది. నరసింహులును 108 అంబులెన్స్‌లో బద్వేలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మర్రిపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాటా మ్యాజిక్‌ను ఢీకొన్న టిప్పర్ వింజమూరు(ఉదయగిరి): మండలంలోని చంద్రపడియ సమీపంలో ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాలేషా తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆత్మకూరు – వింజమూరు రోడ్డు మార్గంలో అధికలోడుతో టిప్పర్లు ఇసుకను తరలిస్తున్నాయి. అతివేగంగా రాకపోకలు సాగిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు ముమ్మరం
నెల్లూరు(క్రైమ్): ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు లాడ్జీల్లో తనిఖీలు చేశారు. వాహనదారుల పత్రాలను పరిశీలించి నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేశారు. జరిమానాలు విధించారు. జిల్లా వ్యాప్తంగా 96 లాడ్జీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బస చేసిన వ్యక్తులు వివరాలను తెలుసుకున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, బస చేసిన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అందజేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జీ పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 30 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 70 మందికి రూ.43,080 జరిమానాలు విధించారు. రికార్డులు, నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. వివరాల సేకరణ నెల్లూరు నగరంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ పి.సింధుప్రియల పర్యవేక్షణలో అధికారులు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఫిన్స్ సహాయంతో వేలిముద్రలను పరిశీలించారు. మందుబాబులు, అల్లరిమూకలపై కొరడా ఝళిపించారు. అర్ధరాత్రి పలువురు బైక్‌లపై వెళ్తుండగా ఆపి వివరాలు సేకరించారు. అనవసరంగా రాత్రివేళల్లో రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, దుకాణాలు నిర్ణీత వేళల్లోనే మూసివేయాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా ఏఎస్పీ తెలిపారు. నెల్లూరు నగరంలో చిన్నబజారు, సంతపేట, దర్గామిట్ట, బాలాజీనగర్, సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, దశరథరామారావు, రోశయ్య, సాంబశివరావు, వెంకటరెడ్డి, ఎస్సైలు, సిబ్బంది తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. డ్రోన్లతో నిఘా డ్రోన్లతో నెల్లూరు శివారు ప్రదేశాలను పరిశీలించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న 70 మందిపై కేసులు నమోదు చేశారు. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాల్లో డ్రోన్లతో నిత్యం నిఘా ఉంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, నదీ తీరాల్లో డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. ఓపెన్ డ్రింకింగ్, పేకాట, మత్తు పదార్థాల వినియోగంపై చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. -
అన్నింటికీ రైతుపైనే భారం
ప్రకృతిని పరవశించే పచ్చని పంట పొలాలు. ఊరూరితో మమేకమైన పల్లెసీమలు. తొలిపొద్దు అక్కడి నుంచి ప్రారంభమైనట్లు కనిపించే సముద్రం. అలల సవ్వడితో పరవశించే ‘తీరం’లో పెట్రో పిడుగు పడనుంది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగితే ఇప్పుడు కనిపించే సుందర, మనోహర దృశ్యాలు ఇక కనిపించవు. వ్యవసాయం, పాడి, కల్లుగీత పనుల్లో నిమగ్నమైన పల్లె జనం. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పూలు, వేరుశనగ, చేమ, మామిడి తోటలతో అలరారే మండలంలోని చెన్నాయపాళెం, ఆనెమడుగు, సర్వాయపాళెం, పెద్దపట్టపుపాళెం గ్రామ సీమలు కనుమరుగు కానున్నాయి. భూసేకరణ చేసే గ్రామాల్లో ఉన్న పచ్చని పొలాలు రైతులకు వాటాలివ్వాలి బీపీసీఎల్ ప్రాజెక్ట్ కోసం కావలి మండలంలో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణలో భూమి కోల్పోయే రైతులకు పరిశ్రమల్లో వాటాలు ఇవ్వాలి. బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ సంస్థ అంటే ప్రజలదే. అదే ప్రజలకు ప్రాజెక్ట్‌లో వాటాలు ఇవ్వడానికి అభ్యంతరాలు ఎందుకు. ఇవి ఎలాగో చేయరు. కాబట్టి మార్కెట్ ధర కన్నా పది రెట్లు ఎక్కువ ఇవ్వాలి. భూసేకరణ మొత్తం రహస్యంగా సాగుతోంది. ఇందులో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశాలు లేవు. – దామా అంకయ్య, సీపీఐ కార్యదర్శి, నెల్లూరు జిల్లా కావలి: కావలికి సమీపంలోని రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా సముద్ర తీరం వెంబడి ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను బీపీసీఎల్ చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఏటా తొమ్మిది మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదించింది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం మహారాష్ట్రలోని రత్నగిరిలో రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 60 మిలియన్ టన్నుల మెగా ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భావించింది. కానీ భూ సేకరణ సమస్య కారణంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్‌ను రామాయసట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, స్థల పరిశీలన, భూసేకరణ, పర్యావరణ ప్రభావం, ఇంజినీరింగ్ డిజైన్లు తదితర కార్యక్రమాలకే సుమారు రూ.6,100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. వచ్చే డిసెంబర్లో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), ఫీడ్ బ్యాక్, అధ్యయనాల నివేదికలు వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు ఎంత ఉంటుందో అంచనాకు రానున్నారు. జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని బీపీసీఎల్ పరిశీస్తోంది. తుది ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత 48 నెలలకు ప్రాజెక్ట్‌లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సుమారు 6 వేల ఎకరాల భూమి అవసరం అవసరం కానుండడంతో ఈ మేరకు భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చాపకింద నీరులా చేస్తోంది. ఇందుకు అవసరమైన భూముల్లో సుమారు 4 వేల ఎకరాలు పట్టా భూములు, 2 వేల ఎకరాలు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు కలిపి సేకరించే పనిలో ఉంది. భూసేకరణే అసలు సమస్య మహారాష్ట్రలో భూసేకరణలో ఎదుర్కొన్న అనుభావాలను దృష్టిలో పెట్టుకుని బీపీసీఎల్ కావలి మండలంలో భూసేకరణకు అవరోధాలు తలెత్తకుండా చేయాలని భావిస్తోంది. ఆ మేరకు ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకు నష్టపరిహారంగా చెల్లించడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. అయితే తద్వారా ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరు రంగ ప్రవేశం చేశారు. భూసేకరణలో కుయుక్తులు పన్నుతున్నాయి. ఎకరాకు ప్రభుత్వ ధరకు అటు ఇటుగా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర నష్టపరిహారం చెల్లించి మిగతాది తమ జేబుల్లో వేసుకునేందుకు సదరు వ్యక్తులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే రైతులు మాత్రం ఎకరాకు రూ.50 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చినా తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. 1,348 కోట్ల లీటర్ల నీరు అవసరం ఆయిల్ రిఫైనరీకి నీటి అవసరం అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంత రైతులకు అవసరమైన సాగు నీటిని అందించడానికి తరతరాలుగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు ఆగమేఘాలపై సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా చేస్తామని ప్రకటించింది. చమురు శుద్ధి కర్మాగారం/ పెట్రోలియం శుద్ధి కర్మాగారం అనేది ఒక పారిశ్రామిక/రసాయన ప్రాసెసింగ్ ప్లాంట్. ఇక్కడ ముడి చమురును పెట్రోల్, గ్యాసోలిన్, డీజిల్ ఇంధనం, తాపన నూనె, కిరోసిన్, గ్యాస్, జెట్ ఇంధనంగా మారుస్తారు. ఆయిల్ శుద్ధి కర్మాగారాలు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయి. సాధారణంగా ఒక బ్యారెల్ (159 లీటర్లు) ముడి చమురును ప్రాసెస్ చేయడానికి 1.5 బ్యారెళ్ల నీరు అవసరం. ఈ ఆయిల్ శుద్ధి కర్మాగారంలో 9 మిలియన్ టన్నుల ఆయిల్ శుద్ధికి సుమారుగా 1,348 కోట్ల లీటర్లు అవసరం అవుతుంది. ఒక టీఎంసీ (2,831 కోట్ల లీటర్లు). అంటే ఇక్కడి వినియోగానికి ఏటా సుమారుగా అర టీఎంసీ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కావలిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. తుమ్మలపెంట, మన్నంగిదిన్నె పంచాయతీల్లోని గ్రామాల్లో 3,500 ఎకరాలు భూసేకరణ చేయాలని తలపోసింది. రామాయపట్నం ఓడరేవుతో అనుసంధానించబడిన ప్రధాన పరిశ్రమలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా, కీలకమైన ఎగుమతి ద్వారంగా అభివృద్ధి చేయడంతోపాటు దేశీయ, అంతర్జాతీయ వాణిజ్యం కోసం సమర్థ వంతమైన లాజిస్టిక్స్‌పై ఆధారపడే పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రధాన ప్రదేశంగా మారుతుందని బ్లూ ప్రింట్ తయారు చేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా కాలుష్యభూతమైన పెట్రో శుద్ధి కర్మాగారం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి భూసేకరణ చేస్తున్నారు. వాయు, జల కాలుష్యం తప్పదా?ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్‌లో రసాయన ప్రక్రియలు ఉంటాయి. ఇవి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. రసాయన ఉద్గారాలతో విడుదలయ్యే విష వాయువుల కారణంగా వాయు, జల కాలుష్యానికి కారణమవుతాయి. ఈ వాయువులు హానికరం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కాలుష్యం కారణంగా ఈ గ్రామాల సమీపంలో ఉండే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పిల్లలకు శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా సోకుతాయి. రామాయపట్నంలో ఆయిల్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సన్నాహాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నిజమేనా? 6 వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియ ఈ ప్రాజెక్ట్‌లో పచ్చని పొలాలు, నివాసాలు గల్లంతు మార్కెట్ ధర చెల్లించేందుకు బీపీసీఎల్ సిద్ధం ప్రభుత్వ విలువ చెల్లించి మిగతా కాజేసేందుకు కొందరు పన్నాగాలు రైతులకు, గ్రామాల్లో నివసించే ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ గ్యారెంటీ లేదు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో కొందరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించమని నవయుగ నిర్మాణ సంస్థను ఆ ప్రాంత ఎమ్మెల్యే అడిగితే వీలుపడదని తెగేసి చెప్పినట్లు సమాచారం. సుశిక్షతులైన కార్మికులు, ఉద్యోగులు తమకు అందుబాటులో ఉన్నారని, స్థానికులకు ఈ పనుల్లో అవగాహన లేదని, అందుకే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేమని ఎన్సీసీ ప్రతినిధులు స్పష్టం చేశారంట. అలాంటి బీపీసీఎల్‌లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయనే ప్రచారం ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. -
పశువైద్యులకు క్రీడా పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం పశువైద్యులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆ శాఖ జిల్లా జేడీ రమేష్ నాయక్ పోటీలను ప్రారంభించారు. ప్రపంచ పశువైద్యుల దినోత్సవ నేపథ్యంలో వీటిని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్చరీ, వాలీబాల్, త్రో బాల్, టెన్నిస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ తదితర పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ నాగమణి, డాక్టర్ శ్రీధర్, రాష్ట్ర పశువైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.జయప్రకాష్, డాక్టర్ కృష్ణమౌర్య, డాక్టర్ బొడ్డు ప్రసాద్, డాక్టర్ చైతన్య కిశోర్, డాక్టర్ కె.అరుణ, డాక్టర్స్ ఫార్మా ఎండీ డాక్టర్ సి.చలమయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వెంకటగిరికి చేరిన రవితేజ పార్థివదేహం
వెంకటగిరి రూరల్: అమెరికాలో గత ఆదివారం మృతి చెందిన వెంకటగిరి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సాయివరప్రసాద్ కుమారుడు రవితేజ (35) పార్థివదేహం ప్రత్యేక విమానంలో చైన్నె ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు వెంకటగిరికి తీసుకొచ్చారు. వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి అనూష, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు గల్లా సుదర్శన్, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు ప్రాంతాల్లోని పలువురు న్యాయవాదులు వెంకటగిరికి చేరుకుని రవితేజ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబ్జి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం
రాపూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని రాపూరు ఆర్టీసీ డిపో ఎస్టీఐ బహీర్ అహ్మద్ అన్నారు. రాపూరు ఆర్టీసీ డిపో నుంచి వెంకటగిరి, గూడూరు మార్గంలో రాకపోకలు సాగించిన ప్రయాణికులకు సంబంధించి లక్కీ డ్రా తీశారు. విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బస్సు దిగే సమయంలో టికెట్‌పై ఫోన్ నంబర్, చిరునామా రాసి బాక్స్‌లో వేస్తే 15 రోజులకు లక్కీ డ్రా తీసి నలుగురిని ఎంపిక చేసి బహుమతులు అందిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. కండలేరులో 45.838 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 45.838 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,040, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.కాలువలోకి దూసుకెళ్లిన కారు ● ఐదుగురు ప్రయాణికులు సురక్షితం మనుబోలు: మండల పరిధిలోని వడ్లపూడి గ్రామ సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి కనుపూరు కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ రాజుపాళెం గ్రామానికి చెందిన అట్ల రమణారెడ్డి మూడు రోజుల క్రితం కొత్త కారు కొనుగోలు చేశాడు. శనివారం కుటుంబ సభ్యులతో గొలగమూడికి వెళ్లి పూజ చేయించాడు. రాత్రి నిద్ర చేసిన కుటుంబం ఆదివారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరింది. వడ్లపూడి మలుపులో పిట్టగోడ లేని వంతెన వద్ద కారు అదుపుతప్పి కనుపూరు కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్రేన్‌తో కారును బయటకు తీశారు. ప్రజలకు నిజాల్ని వివరించాలి● ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి నెల్లూరు రూరల్: ‘ప్రధాని నరేంద్రమోదీ పాలనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పి కొట్టాలి. ప్రజలకు నిజాలు వివరించాలి’ అని ఆదోని ఎమ్మెల్యే, బీజేపీ నేత డాక్టర్ పీవీ పార్థసారథి అన్నారు. నెల్లూరు నగరంలోని గోమతి నగర్లో ఉన్న ఇంద్రావతి మినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం మేధావుల సదస్సు నిర్వహించారు. భారతరత్న అంబేడ్కర్ జయంతిని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. కాంగ్రెస్ న్యాయవ్యవస్థను తమ స్వప్రయోజనాలకు వాడుకుందన్నారు. నిజాయితీ గల న్యాయమూర్తులను బదిలీల పేరుతో వేధించిందన్నారు. నేతలు వంశీధర్‌రెడ్డి, సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కందికట్ల రాజేశ్వరి, విల్సన్, ఏవీ రెడ్డి, సందీప్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి
నెల్లూరు (బృందావనం): హిందుస్థాన్‌గా పిలవబడే భారతదేశంలో హిందువులు ప్రాణ భయంతో పారిపోయే దుస్థితి రావడం చాలా బాధాకరమని, హిందువులపై జరుగుతున్న దాడులు దారుణమని ఛత్రపతి శివాజీసేన అధ్యక్షుడు కాకు మురళీరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం నగరంలోని ట్రంకురోడ్డు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఛత్రపతి శివాజీసేన, హిందూసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాకు మురళీరెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ చట్టంపై నిరసనలకు హిందువుల ఇళ్లపై దాడులు చేయడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ పాకిస్తాన్ కన్నా ప్రమాదకరమైన ప్రాంతంగా మారిందన్నారు. హిందువుల ధన, మాన ప్రాణాలపై దాడు లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులను ఇంటి నుంచి బయటకులాగి హతమార్చడం, మహిళలపై అత్యాచారాలు, ఆస్తులు లూటీ చేయడం చేస్తుంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందువులలో ఐక్యత లేనందునే మొన్న బంగ్లాదేశ్‌లో నిన్న బెంగాల్లో దాడులు జరిగాయన్నారు. హిందువులు సంఘటితం కాకున్నా, మేల్కోనకుంటే ఈ ఉన్మాద దాడులు దేశమంతా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. మతఛాందస వాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఛత్రపతి శివాజీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. శివాజీ సెంటర్లోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో శివాజీసేన గౌరవ అధ్యక్షుడు బత్తిన సాయికుమార్‌రెడ్డి, కార్యదర్శి మధురెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్‌చౌదరి, సభ్యులు పెరుమాళ్, స్వామి, మోహన్‌రెడ్డి, హిందూ చైతన్య వేదిక నాయకులు నాగ శ్రీనివాస్, పీజీ మహేష్, సొల్లేటి వెంకటేశ్వర్లు, యశ్వంత్, సుధీర్, మహిళా నాయకులు లక్ష్మి, కృష్ణవేణి, మాధవి, వీహెచ్‌పీ నేతలు, హిందూ సంఘాల నేతలుపాల్గొన్నారు. -
డీసీపల్లిలో 524 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 524 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 745 బేళ్లు రాగా 524 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 68174.7 కిలోల పొగాకును విక్రయించగా రూ.17928524.40 వ్యాపారం జరిగింది. కిలో గరిష్ట ధర రూ.280 కాగా, కనిష్ట ధర రూ.220 లభించింది. సగటు ధర రూ.262.98గా నమోదైంది. వేలంలో 11 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. బ్యారేజీ పెండింగ్ పనులకు ప్రతిపాదనలు పంపండి సంగం: సంగం బ్యారేజీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్‌రావు, ఎస్ఈ దేశ్‌నాయక్ సూచించారు. శనివారం వారు బ్యారేజీని సందర్శించి మిగిలిన పనుల గురించి ఆరా తీశారు. అవి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈలు అనిల్ కుమార్‌రెడ్డి, నాగరాజు, డీఈలు విజయరామిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, పెంచలయ్య, ఏఈలు వినయ్, మల్లికార్జున, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. బయో మైనింగ్ యూనిట్ ప్రారంభం నెల్లూరు సిటీ: జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన బయో మైనింగ్ యూనిట్‌ను మంత్రి నారాయణ శనివారం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్‌లో చెత్తను ఈ ప్రక్రియ ద్వారా వేరు చేయడం సాధ్యపడుతుందన్నారు. అనంతరం అల్లీపురం డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్‌రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల విస్తృత తనిఖీలు నెల్లూరు (క్రైమ్): నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసులు నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు ప్రధాన కూడళ్లతోపాటుగా జాతీయ రహదారి ప్రవేశ, నిష్క్ర మణ, శివారు ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు, నంబరు ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్లకు తరలించారు. మద్యం మత్తులో నేరాలు, ప్రమాదాలు జరుగుతుండడంతో అన్ని కూడళ్లల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి నిబంధనలు పాటించని వాహనదారులపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. బహిరంగంగా మద్య సేవనం చేస్తున్న మందుబాబులపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వేలి ముద్రలను పోలీసు డేటాబేస్‌తో పరిశీలించడంతోపాటు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ పాతనేరస్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచామన్నారు. నేర నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు నగర ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో చిన్నబజారు, సంతపేట, దర్గామిట్ట, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, దశరథరామారావు, రోశయ్య, కె.సాంబశివరావు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్‌లో ‘నారాయణ’ విజయకేతనం
నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయకేతనాన్ని ఎగురవేశారని విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నగరంలోని కళాశాలలో శనివారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో పూర్వజ్ 337, హేమంత్‌సాయి 815, మధుకిరణ్‌రెడ్డి 1021, భానురిషిక్ 1216, అఖిలేష్ 1415, సంతోష్ 2004, వెంకట ఆకాష్ 2091, యశ్వంత్బాబీ 2417, సాయిశ్రీధన్రెడ్డి 2870, శశిజ్ఞాన కౌశిక్‌రెడ్డి 2950, ఆశ్రిత 3426, నరసింహతేజ 3651, వెంకటభరత్కుమార్రెడ్డి 4957 ర్యాంకులను సాధించారని వివరించారు. ‘విశ్వసాయి’ విజయదుందుభి నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను మాగుంట లేఅవుట్లోని కళాశాలలో శనివారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో రామ్రుత్విక్ 208, శ్రావణ్‌కుమార్‌రెడ్డి 356 ర్యాంకులను సాధించారని వివరించారు. 57 మంది విద్యార్థులు ర్యాంకులను సాధించారన్నారు. ‘కృష్ణచైతన్య’ సత్తా నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కృష్ణచైతన్య జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారని కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ రాణాప్రమోధ్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కళాశాలలో విద్యార్థులను శనివారం అభినందించిన అనంతరం వారు మాట్లాడారు. జాతీయ స్థాయిలో నిర్మల్తేజ 274వ ర్యాంక్‌ను సాధించారని చెప్పారు. అభినవ్‌రెడ్డి 98.75, అజోసైఫీ 98.23, సాయికేతన్రెడ్డి 96.76, మౌనిక 96.44 పర్సంటైల్‌ను సాధించారన్నారు. ‘శ్రీచైతన్య’ హవా నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని ఏజీఎం శ్రీరామ్ తెలిపారు. అన్నమయ్య సర్కిల్లోని కళాశాలలో విద్యార్థులను శనివారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయస్థాయిలో స్వరూప్ 99.71, సౌమ్యశ్రీ 98.81, ఉషశ్రీ 95.10, పవన్ 93.48, దినేష్ 93.08 పర్సంటైల్‌ను సాధించారని వెల్లడించారు. మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ముత్తుకూరు: మండలంలోని నేలటూరులో గల దామోదరం సంజీవయ్య ఏపీ జెన్కో ప్రాజెక్ట్‌లో మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతోందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు శనివారం తెలిపారు. మూడు యూనిట్లలో వరుసగా 260.. 270.. 245 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. ఆగ్రహానికి గురై చేతి కడియంతో దాడినెల్లూరు(క్రైమ్): వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై కేసును సంతపేట పోలీసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. సంతపేటలోని బుజ్జమ్మరేవులో నివాసం ఉంటున్న కమల్.. పాలిష్ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మద్యాన్ని ఎందుకు తాగుతున్నారంటూ ఆయన్ను భార్య గురువారం రాత్రి నిలదీశారు. ఇంతలో అటుగా వెళ్తున్న చలం, గొడవలేంటి అని ప్రశ్నించగా, అక్కడి నుంచి వెళ్లాలని కమల్ సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు చేతి కడియంతో కమల్‌పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిమ్మ ధరలు పెద్దవి: రూ.90 సన్నవి: రూ.65 పండ్లు: రూ.40 పౌల్ట్రీ ధరలు బ్రాయిలర్: రూ.105 లేయర్ రూ.100 బ్రాయిలర్ చికెన్: రూ.194 స్కిన్లెస్ చికెన్: రూ.214 లేయర్ చికెన్: రూ.170 -
బధిరుల సంఘ జిల్లా సమావేశం
నెల్లూరు(బృందావనం): జిల్లాలో బఽధిరుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని బధిరుల సంఘ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు తెలిపారు. నగరంలోని పురమందిరంలో బధిరుల సంఘ జిల్లా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం పలు అంశాలను లిఖితపూర్వకంగా ఆయన తెలియజేశారు. బధిరులకు సేవలను విస్తృతంగా అందిస్తున్నామని వివరించారు. సంఘం ఏర్పడి 35 ఏళ్లయిన సందర్భంగా సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. నూనె మల్లికార్జునయాదవ్, మన్నేపల్లి పెంచలరావు, గాదిరాజు రామకృష్ణ, చిలకా రామకృష్ణ, కుమార్, మల్లికార్జున, సంఘ నేతలు మస్తానయ్య, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
పన్నుల ఆదాయం.. అభివృద్ధికే
నెల్లూరు సిటీ: రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వెచ్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకు ర్యాలీని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలకో థీమ్‌తో ముందుకెళ్తున్నామని, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనేదే లక్ష్యమని చెప్పారు. రానున్న అక్టోబర్ నాటికి చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ స్రవంతి, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
యాదవ ఎంప్లాయీస్ సొసైటీ భవన ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): మినీబైపాస్‌లోని పూలే సెంటర్ వద్ద యాదవ ఎంప్లాయీస్ సొసైటీ నూతన భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా ఏపీ స్టేట్ గెజిటెడ్ జేఏసీ అధ్యక్షుడు కృష్ణయ్య, అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్‌బాబు, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ హాజరయ్యారు. అనంతరం కృష్ణసాయి కన్వెన్షన్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, దయాకర్, గురుప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రవీణ్‌కుమార్, వినయ్, సురేష్‌బాబు, బలరామ్, శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులుగా మురళి, సుకుమార్, జగదీష్, కొండయ్య, గురవయ్య, కార్యాలయ ఇన్చార్జిలుగా కేశవకుమార్, జయరామయ్య, లోకేశ్ తదితరులను ఎన్నుకున్నారు. వెంకన్నపాళెం తీరంలో షిప్ పరికరంతోటపల్లిగూడూరు: మండలంలోని వెంకన్నపాళెం సముద్ర తీరానికి గురువారం రాత్రి షిప్ పరికరం కొట్టుకొచ్చింది. దీనిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు జేసీబీతో ఒడ్డుకు చేర్చారు. భారీ స్థాయిలో ఉన్న దానిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. సమాచారం అందుకున్న మైరెన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అది షిప్‌కు ఇంధనం ఎక్కించే ఆయిల్ ట్యాంకర్‌గా వారు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా మైరెన్ పోలీసులు మాట్లాడుతూ రాకెట్ శకలమంటూ పుకార్లు వచ్చాయని, అందులో వాస్తవం లేదన్నారు. ఉన్నతాధికారుల సూచనలతో దానిని జిల్లా కేంద్రానికి తరలిస్తామన్నారు. పాతకక్షలతో వ్యక్తిపై దాడి పొదలకూరు: పట్టణానికి సమీపంలోని లింగంపల్లి తోపులో ఓ వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన వారు పాతకక్షలను మనసులో పెట్టుకుని కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారు. పోలీసులు, బాధితుడి కథనం మేరకు వివరాలు.. గురువారం రాత్రి పిల్లిపోగు పెంచలయ్య భోజనం చేసి ఇంటి బయట తిరుగుతుండగా చిన్నా, సంపూర్ణ దంపతులు పథకం ప్రకారం కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారు. అల్యూమినియం బీడింగ్తో తలపై కొట్టడంతో పెంచలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్కే హనీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలుఅల్లూరు: మండలంలోని అల్లూరుపేట సత్రంలో ఉన్న గంగమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్ల ఉత్సవం సందర్భంగా పీజీఎం యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలను శుక్రవారం అల్లూరులో నిర్వహించారు. కోవూరుకు చెందిన శ్రీచెన్నకేశవ స్వామి ఎడ్లు మొదటి బహుమతి, పొట్టేపాళెం గ్రామానికి చెందిన వరసిద్ధి వినాయక స్వామి ఎడ్లు రెండో బహుమతి, కోవూరుకు చెందిన కర్లగుంట ప్రభాకర్ ఎడ్లు మూడో బహుమతి, పాటూరు గ్రామానికి చెందిన ఎడ్లు నాలుగో బహుమతి, యల్లాయపాళెం గ్రామానికి చెందిన ఎడ్లు ఐదో బహుమతిని గెలుచుకున్నాయి. ప్రథమ బహుమతి రూ.25,116లను చిల్లంకూరు చంద్రశేఖరరెడ్డి, ద్వితీయ బహుమతి రూ.20,116లను కడివేటి హజరత్‌రెడ్డి, మూడో బహుమతి రూ.15,116లను వేగూరు అన్వేష్, నాలుగో బహుమతి రూ.10116లను అళహరి రామారావు, ఐదో బహుమతి రూ.7,116లను గుండాల గోపాలయ్య అందజేశారు. కార్యక్రమంలో అల్లూరుపేట సత్రం ఎడ్ల బండ్ల కమిటీ సభ్యులు, పీజీఎం యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆహారం విషయంలో జాగ్రత్త
జిల్లాలో ఇలా.. సమతుల్య ఆహారం తీసుకోవాలి ఆహారం ద్వారానే ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ప్రాసెస్డ్, ఫ్రిడ్జ్‌లో ఉంచే ఆహారం, బేకరీ ఫుడ్స్ మానాలి. చిన్నపిల్లలకు మంచి ఆహారంపై అవగాహన కల్పించాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఓ) సూచించిన ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. హెపటైటిస్ సీకి ఇప్పుడు వైద్యం ఉంది. పెద్దాస్పత్రిలో చికిత్స పొందిన వారందరూ కోలుకున్నారు. హెపటైటిస్ బీకి పూర్తి చికిత్స లేకున్నా నియంత్రణకు నాలుగు సంవత్సరాలు మందులు వాడాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. – డాక్టర్ సునీల్, అసోసియేట్ ప్రొఫెసర్, హెపటైటిస్ నోడల్ ఆఫీసర్, సర్వజన ఆస్పత్రి ● ఊబకాయం, మారిన ఆహార అలవాట్లు, జీవనశైలితో పొంచిఉన్న ముప్పు ● జిల్లాలో 3 లక్షల మందికి ఏదో ఒక రకమైన సమస్య ● హెపటైటిస్ బీ, సీ వైరస్‌లతో మరింత డ్యామేజీ ● 2025 సంవత్సర థీమ్ ‘ఆహారమే ఔషధం’ నెల్లూరు(అర్బన్): కాలేయం (లివర్).. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఆహారం జీర్ణమై చివరికి పిండి పదార్థాలుగా, కొవ్వు ఆమ్లాలుగా, ప్రోటీన్లుగా మారి రక్తంలో కలవాలంటే ఇది సక్రమంగా పని చేయాలి. అయితే మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల లివర్ అనారోగ్యానికి గువుతోంది. హెపటైటిస్ బీ, సీ వైరస్ల వల్ల కూడా పాడువుతోంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్గా మారితే రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేసి కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయించు కోవాలి. దానం చేసే వారు కూడా అందుబాటులో ఉండాలి. లేదా బ్రెయిన్ డెడ్ అయ్యి అవయవ దానం చేసేవారు ఉండాలి. లేకుంటే ప్రాణాలు పోతాయి. ఈ పరిస్థితిని గుర్తించి ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీని కాలేయ దినోత్సవంగా ప్రకటించింది. శనివారం జిల్లాలో వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాలేయం శరీరంలో అతి పెద్ద గ్రంధి. మెదడు తర్వాత అతి ప్రధానమైన అవయవం. రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో సాయపడటం, విటమిన్ డీని శరీరానికి అందేలా చూడటం, చక్కెర స్థాయిని సమతుల్యం చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, ఖనిజ లవణాలను, విటమిన్లను నిల్వ చేయడం లాంటి పనులు చేస్తోంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే హెపటైటీస్, సిర్రోసిస్, కామెర్లు, కేన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల లివర్‌ను మంచి ఆహారపు అలవాట్లతో కాపాడుకోవాలి. 60 మందికి పైగా లివర్ మార్పిడి జిల్లాలో లివర్ డ్యామేజైన వారు ఇప్పటికే 60 మందికి పైగా దాతల సాయంతో మార్పిడి చేయించుకుని జీవిస్తున్నారు. కాలేయం కొంచెం దానం చేస్తే సరిపోతుంది. మళ్లీ పూర్తి స్థాయిలో ఏర్పడుతుంది. అందువల్ల లివర్ మార్పిడిపై అపోహాలు వీడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇటీవల కూడా పలువురు రక్త సంబంధీకుల ద్వారా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి ఆయన తమ్ముడు లివర్‌ను దానం చేశాడు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఏసీనగర్‌కు చెందిన ఓ మహిళకు ఆమె కుమార్తె, పొదలకూరు దగ్గర నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి ఆయన భార్య లివర్‌ను దానం చేశారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. జిల్లాలో సుమారు 30 లక్షల జనాభా ఉండగా అందులో వివిధ రకాల కాలేయ సమస్యలతో బాధపడేవారు సుమారు 3 లక్షల మంది ఉన్నట్లు అంచనా. అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, కుర్చీలకు పరిమితమై పనులు చేస్తున్న వారికి ఊబకాయం వస్తోంది. ఇలా ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ సమస్యలున్నాయి. ఇది ఉన్నట్టు చాలామందికి తెలియదు. తక్కువ మందిలో జన్యుపరమైన అంశాలు కూడా ఫ్యాటీ లివర్‌కు కారణమవుతున్నాయి. స్కానింగ్ చేయించుకుంటేనే తెలుస్తుంది.పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పులు, పాలు తీసుకుంటే మంచిది. మితంగా భుజించాలి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్, బీపీ ఉన్న వారు అప్పుడప్పుడూ లివర్ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహాలు పాటించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ఆహారమే ఔషధం అనే థీమ్‌ను ప్రకటించింది. -
తాళం వేస్తే.. ఇల్లు గుల్లే
నెల్లూరు(క్రైమ్): పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు విజృంభిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనానికి కాదేది అనర్హమంటూ దేవాలయాలు, బడులను సైతం వదలకుండా అందినకాడికి దోచేస్తున్నారు. కొందరి నిర్లక్ష్యమూ దొంగలకు కలిసొస్తోంది. జిల్లాలో ఐదు సబ్డివిజన్లు, 12 సర్కిల్స్ పరిధిలో 52 పోలీస్స్టేషన్లు, 11 అర్బన్ పోలీస్స్టేషన్లున్నాయి. వీటి పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో రోజూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, పాతనేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, దొంగతనాలను కట్టడి చేయాలని జిల్లా పోలీస్ బాస్ పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఆయన ఆదేశాల అమలు నామమాత్రంగానే ఉంది. క్రైమ్పార్టీలూ మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యాయి. ఇదే అదునుగా భావిస్తున్న దుండగులు అందినకాడికి దోచేస్తున్నారు. చిన్నపాటి ఆధారం దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలు సైతం జిల్లాలో తలదాచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నాయి. గొలుసు దొంగతనాలు పెరుగుతున్నాయి. నెలన్నర వ్యవధిలో రూ.1.50 కోట్లకు పైగా సొత్తును దుండగులు అపహరించారు. తాజాగా కావలిలో పట్టపగలే దొంగలు విజృంభించారు. ఇలా చేస్తే.. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు వెళ్లే సమయంలో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచరాదు. తెలిసిన వారిని ఇంట్లో ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. కుదరని పక్షంలో దొంగతనాల నియంత్రణకు పోలీస్ శాఖ రూపొందించిన ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ సేవలను వినియోగించుకోవాలి. చాలా సందర్భాల్లో పోలీస్ అధికారులు సూచనలిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం దొంగతనాలు జరిగేందుకు ఆస్కారమవుతోంది. పోలీసులూ స్పందించాలి పోలీస్ అధికారులు నేరాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ల పరిధిలో విజిబుల్ పోలీసింగ్ పెంచాలి. పగలు, రాత్రి బీట్లను పటిష్టంగా అమలు చేయాలి. పాతనేరస్తులతోపాటు జైలు నుంచి విడుదలైన వారు ఎక్కడున్నారు?, ఏం చేస్తున్నారు? అనే వివరాలు సేకరించి వారి కదలికలపై నిఘా ఉంచాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా? అనే సమాచారాన్ని తెలుసుకోవాలి. నిరంతర వాహన తనిఖీలు నిర్వహించాలి. శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో గస్తీని పెంచాలి. దొంగతనాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలనూ భాగస్వాములను చేయడం ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే స్థానిక పోలీసులకు, 112కు సమాచారం అందించాలి. నెలన్నర వ్యవధిలో.. జిల్లాలో పెరిగిన చోరీలు నిర్లక్ష్యమూ కొంతమేర కారణమే.. నెలన్నర వ్యవధిలో రూ.1.50 కోట్లకు పైగా అపహరణ వరుస ఘటనలతో జనం బెంబేలు కావలి పట్టణంలోని నాలుగు గృహాల్లో సుమారు 59 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.55 వేల నగదు, 750 గ్రాముల వెండి వస్తువులను దోచుకెళ్లారు. కందుకూరు పట్టణం వాసవీనగర్‌లో తాళం వేసిన ఇంట్లో 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదు, కొంత వెండి చోరీ చేశారు. నారాయణ ఆస్పత్రి ప్రాంగణంలోని వైద్యుల క్వార్టర్స్‌లో 9 సవర్ల బంగారం, ఒకట్నిర కేజీ వెండి వస్తువులు, రూ.20 వేల నగదు దోచేశారు. ఆత్మకూరు పట్టణంలో రమణమూర్తి అనే వ్యక్తి బ్యాగ్‌లోని 100 గ్రాముల బంగారం, వెండిని గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. దుత్తలూరులో నరేష్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు 11 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బుజబుబజనెల్లూరు ఆర్టీసీ కాలనీలో రాజ్కిశోర్రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 10 సవర్ల బంగారు ఆభరణాల చోరీ జరిగింది. -
ముస్లింల ద్రోహి చంద్రబాబు
కందుకూరు: ఎన్నికల ముందు ముస్లింలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ అబద్ధపు హామీలివ్వడం. ఆ తర్వాత ముస్లిం సమాజాన్ని మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిద్ధిఖ్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు విషయంలో ముస్లింలపై చంద్రబాబు వైఖరి మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబుకు ముస్లింలు అంటే గిట్టదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారని చెప్పారు. చంద్రబాబు మద్దతు లేకపోతే ఈ బిల్లు ఆమోదం పొందేది కాదన్నారు. అదే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ తరఫున బిల్లును వ్యతిరేకించి ముస్లింలకు అండగా నిలిచారన్నారు. సుప్రీంకోర్టులో చట్టానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారని గుర్తు చేశారు. వక్ఫ్ చట్టంపై సుప్రీంలో న్యాయం వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా దేశం మొత్తం ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయని, సుప్రీం కోర్టులో ముస్లింలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని విధాలా ముస్లింలను మోసం చేస్తున్న చంద్రబాబును ముస్లిం సమాజం పూర్తిగా వ్యతిరేకించాలన్నారు. ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముస్లింలకు అండగా నిలవలేదని గుర్తు చేశారు. అదే జగన్మోహన్రెడ్డి హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ. 83 వేల ఆర్థిక సాయం అందించారని, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించి అన్ని విధాలా అండగా నిలిచారని వివరించారు. చట్టాన్ని ప్రతి ముస్లిం వ్యతిరేకించాలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫజుల్ మాట్లాడుతూ పార్లమెంట్లో సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చిందని, వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వల్ల ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని వివరించారు. జగనన్నకు కృతజ్ఞతలు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం విషయంలో కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఇప్పటికై నా ముస్లింలు కూటమి ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లింలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ సంధాని, సుల్తాన్, రహీం, ఖాదర్‌బాషా, జుబేర్, దస్తగిరి, బాబు, అన్వర్, మస్తాన్లి, మునీర్, షాకీర్, ఖాజాహుస్సేన్, అయూబ్‌ఖాన్, జిలాని, కరిమున్నీషా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకొస్తారు ముస్లింలకు అండగా నిలిచిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిద్ధిఖ్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం -
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
● ప్రత్యేకాధికారి డాక్టర్ ఎన్ యువరాజ్ నెల్లూరు రూరల్: వినూత్న ఆలోచనలు, టీం వర్క్‌తో జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎన్ యువరాజ్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు నియమించిన జిల్లా ప్రత్యేకాధికారి, పరిశ్రమ లు, వాణిజ్యశాఖల కార్యదర్శి యువరాజ్ శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఓ ఆనంద్ వివిధ రంగాల్లో జిల్లా పురోగతిని వివరించా రు. ప్రత్యేక అధికారి యువరాజ్ మాట్లాడుతూ జిల్లా లో వనరులను, ప్రజావసరాలను గుర్తించి అన్ని స్థాయిల్లో డేటాను అనుసంధానం చేసి అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం దొరు కుతుందన్నారు. కింది స్థాయిలో అధికారులు చేసిన ప్రయోగాల ద్వారా మాత్రమే ఉన్నతంగా తీర్చదిద్దుతాయన్నారు. జిల్లాలోని అధికారులతో స్ట్రాటజిక్ కోర్ గ్రూప్‌ను తయారు చేసి ప్రజావసరాలను తెలుసుకుని, అందుబాటులో ఉన్న వనరులతో జిల్లాను అన్ని రంగాల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. టూరిజం పరంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, బీచ్, ఇతర ప్రముఖ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ టూరిజం ప్యాకేజీ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. నేటి యవత ట్రెక్కింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న దృష్ట్యా అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఎంటర్ ప్రెన్యూర్‌గా మారేందుకు తోడ్పాటు అందించాలన్నారు. జిల్లా జీడీపీ పెరిగేందుకు సర్వీస్ సెక్టార్‌లోని అగ్రికల్చర్, హార్టికల్చర్ తదితర రంగాల్లో వృద్ధి సాధించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తూ, వెనుకబడిన వాటిని ప్రోత్సహించాలన్నారు. టిడ్కో గృహాల్లో ఎక్కువ మంది చేరే విధంగా, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మహిళలు రోటిన్‌గా చేసే ఉత్పత్తులు కాకుండా కొత్త ఉత్పత్తులపై దృష్టి పెట్టే విధంగా మెప్మా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ కె కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, డీఆర్ఓ ఉదయభాస్కర్‌రావు, ఆర్డీఓలు అనూష, వంశీకృష్ణ, పావని, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నగర పాలక సంస్థలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ అడ్డాగా ప్రజాప్రతినిధుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అధికారులకు శిరోభారంగా మారింది. ఆధిపత్యం, స్వలాభం కోసం మంత్రి, ఎమ్మెల్యే మధ్య అధిపత్య పోరుకు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తన ఆదేశాలు పాటించాలంటూ మున్సిపల్ శాఖ మంత్రి.. తన నియోజకవర్గానికి సంబంధించిన కార్యకలాపాల్లో తన పెత్తనమే కొనసాగాలని ఎమ్మెల్యే మంకుపట్టు పడుతున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థలో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడలకు అధికారులు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ‘విడవ మంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం’ అన్నట్లుగా ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరులో అధికార యంత్రాంగం నలిగిపోతోంది. ఎవరికి వారే నా మాటే చెల్లుబాటు కావాలంటూ పొలిటికల్ గేమ్ ఆరంభించడంతో విసిగిపోయిన కమిషనర్ బతుకు జీవుడా అంటూ బదిలీపై వెళ్లాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలోపే యువ ఐఏఎస్ అధికారిని బలిపశువు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకీ ఆధిపత్యం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నగర నియోజకవర్గంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా సమాన ప్రాతినిధ్యం ఉంది. ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ శాఖ మంత్రిగా, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నారాయణ మాటే ప్రస్తుతానికి చెల్లుబాటు అవుతోంది. మంత్రి నారాయణ కార్పొరేషన్‌ను పూర్తి స్థాయిలో తన స్వాధీనంలోకి తీసుకుని అధికారుల బదిలీల నుంచి ప్రతి విషయంలో తల దూర్చుతున్నారు. ఈ పరిణామాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రుచించడం లేదు. కార్పొరేషన్లో కర్ర పెత్తనం కోసం ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. ప్రతిదీ కార్పొరేషన్‌తో ముడిపడి ఉంటుంది. ఆర్థిక అవసరాలు కూడా కార్పొరేషన్ ద్వారానే సమకూరుతాయి. ప్రధానంగా తమ తమ నియోజకవర్గాల పరిధిలో నగరాభివృద్ధి తమ కనుసన్నల్లోనే జరగాలని ప్రజాప్రతినిధులు భావిస్తారు. తద్వారా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు దక్కించుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం నగరాభివృద్ధి మొత్తం శివారు ప్రాంతాల్లోనే జరుగుతోంది. రియల్ వెంచర్లు, భవన నిర్మాణాలకు అనుమతులు అన్నీ కార్పొరేషన్ కనుసన్నల్లోనే జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్ర పెత్తనం మంత్రి తీసుకోవడంతో ఈ పరిణామాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారాయి. ఏ పనుల విషయంలో కూడా ఎమ్మెల్యే మాట సాగడం లేదు. గతంలో ఎమ్మెల్యే అనుచరులు, ఆయన కనుసన్నల్లోనే అనధికార లేఅవుట్లు వేశారు. దీంతో మంత్రి నారాయణ అనధికార లే అవుట్లపై కన్నెర్ర చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే ఇలాంటి లేఅవుట్లు 230 వరకు ఉన్నాయని తేల్చారు. అప్రూవల్ లే అవుట్లను ఆన్లైన్లో ఉంచుతామని, వాటినే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కొత్తగా నుడా చైర్మన్ అయిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ‘నా సంగతేంటి అంటూ అనధికార లే అవుట్ల యజమానులకు సందేశాలు పంపుతున్నారు. నా సంగతి చూడకుంటే.. మీ లేఅవుట్ల భరతం పడతానంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈ పరిణామాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తలనొప్పి పుట్టిస్తున్నాయి. దీంతో మంత్రి నారాయణ తీరును పలుమార్లు బహిరంగం గానే ఎండగట్టారు. మా జోలికోస్తే రోడ్డెక్కుతానని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి నారాయణ మాత్రం కోటంరెడ్డి మాటలను పెద్ద గా పట్టించుకోవద్దని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీనికి తోడు షాడో మంత్రిగా వ్యవ హరిస్తున్న ఓ నేత కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో తలదూర్చుతున్నాడు. ప్రతిదీ తనకు తెలపాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారని సమాచారం. ఏడాది కంటే ఎక్కువ లేని కమిషనర్లు 2014–19 మధ్య ఐదేళ్ల కాలంలో నాలుగేళ్ల వ్యవధిలో 9 మంది కమిషనర్లు బాధ్యతలు స్వీకరించడం, ఏడాది తిరగకుండానే బదిలీ అయిపోవడం జరిగింది. ఈ పరిణామాలు అప్పట్లో ఐఏఎస్ల్లోనే చర్చనీయాంశమైంది. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్లుగా వచ్చేందుకు ఎవరూ మొగ్గు చూపేవారు కాదు. అనివార్య పరిస్థితుల్లో వచ్చినా.. కొద్ది రోజులకే చివరాఖరుకు అప్రాధాన్యం పోస్టుల్లోకి వెళ్లడానికి కూడా వెనుకాడే వారు కాదు. తాజాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత కమిషనర్‌ను బదిలీ చేసింది. ఆ స్థానంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సూర్యతేజ తొమ్మిది నెలలు తిరగకుండానే బదిలీపై వెళ్లిపోవడంతో చర్చనీయాంశమైంది. నెల్లూరు రూరల్ అభివృద్ధి పనులకు నిధులు నెల్లూరురూరల్ పరిధిలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బడ్జెట్ కేటాయింపులు, కౌన్సిల్ అనుమతి లేకుండానే 302 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా పనులకు కార్పొరేషన్ జనరల్ ఫండ్ ద్వారా దాదాపు రూ.26 కోట్లు మంజారు చేసేలా ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నారు. అన్ని పనులు ఒకే సారి చేస్తున్నట్లు రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయించాడు. అదే కార్పొరేషన్లో ఉండే నగర నియోజకవర్గంలో మాత్రం జనరల్ ఫండ్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు జరగడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఆ శాఖ మంత్రిగా ఉండి కూడా అభివృద్ధి పనులు జరగకపోవడంపై పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల చెత్త ఎత్తుకెళ్లేట్రాక్టర్లకు రూ.కోట్ల రూపాయలతో టెండర్లు జరిగాయి. ఆయా టెండర్లలో కూడా షాడో మంత్రి సూచించిన వారికే ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అడ్డుపడి తన నియోజకవర్గంలో తన అనుచరుడికి ఇప్పించాడు. కార్పొరేషన్లో శాఖాపరమైన బదిలీల వ్యవహారంలో కూడా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే వార్ నడిచింది. ఇందులో కూడా కమిషనర్ నిలిగిపోయాడు. నిత్యం ఆ ఇద్దరి ప్రజాప్రతినిధులతో పాటు షాడో మంత్రి మధ్య నిలిగిపోయిన కమిషనర్ మానసిక వేధన భరించలేక బదిలీ చేయమని గతంలో మంత్రి వద్ద వాపోయిన విష యం తెలిసిందే. అప్పట్లో ‘సాక్షి’లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘అధికారులు ఆర్తనాదాలు’ శీర్షికతో కథనం ప్రచురితం కావడం పెద్ద సంచలనమే రేగింది. అప్పట్లో రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. తాజాగా కమిషనర్ బదిలీతో ఆ కథనం వాస్తవమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ టీడీపీ పాలనలో నాలుగేళ్లలో 9 మంది బదిలీ తాజాగా 9 నెలలకే ఒక కమిషనర్ ఔట్ ఎమ్మెల్యే, మంత్రి మధ్య పోరులో నలిగిపోయిన వైనం బదిలీ చేయాలని మంత్రికి మొరపెట్టుకున్న పరిస్థితి నాడు సాక్షి కథనం.. నేడు నిజం అధికార పార్టీలో రాజకీయ క్రీడలకు అధికారులు బలి అయిపోతున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థను అడ్డాగా చేసుకుని అవినీతి, అక్రమాలు సాగించేందుకు సాగిస్తున్న కుటిల కుతంత్రానికి అధికారులు ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. కమిషనర్లుగా వచ్చే ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పినట్లు అడ్డంగా చేసేందుకు సిద్ధంగా ఉండకపోవడంతో వారి ఆగ్రహానికి గురికాక తప్పడం లేదు. టీడీపీ హయాంలో గతంలోనూ, ఇప్పుడూ ఏ కమిషనర్ కనీసం ఏడాది పాటు కూడా పనిచేయలేక పారిపోతుండడం గమనార్హం. -
హోటల్ ఫుడ్.. రోగం ఫ్రీ
ఘుమఘుమలాడే వాసన, ఆకర్షించే రంగులతో వండి వార్చిన చికెన్, మటన్, చేపలు కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తింటాం. బిర్యానీ ప్రేమికులు ఇంకాస్త ఎక్కువ. హోటల్లో తిన్న పాపానికి హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తోంది. హోటల్ బిల్లు ఒక షాక్ అయితే, ఆస్పత్రి బిల్లు ఇంకో షాక్. హోటళ్లలో వాడుతున్న నాసిరకం ఆహార పదార్థాల ముడిసరుకులు, అపరిశుభ్రత వాతావరణం, మంచి నీళ్లు వాడకపోవడం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పదార్థాలు వండడం వంటి కారణాలతో ఫుడ్ పాయిజినింగ్ కేసులు తీవ్రమవుతున్నాయి. నెల్లూరు (బారకాసు): జిల్లాలో పెద్ద హోటళ్లు వందకు పైగా ఉన్నాయి. చిన్న చిన్నవి మరో 200కు పైనే ఉంటాయి. వీధుల్లో అమ్ముతున్న ఆహార బండ్లకు లెక్కేలేదు. ఇక్కడ వాడే నూనెలు, కూరల్లో వేసే రంగులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ప్రధానంగా మాంసం, చికెన్, చేపలు, రొయ్యలు వంటి పదార్థాలు నాలుగైదు రోజులైనా నిల్వ ఉంచి వినియోగదారులకు పెడుతున్నారు. హోటల్ ఫుడ్ తింటే.. రోగం ఫ్రీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. చాలా హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు లైసెన్స్‌లు లేకపోవడం గమనార్హం. కేసులు, జరిమానాలు.. అయినా మార్పేది? జిల్లాలోని నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న హోటల్స్‌పై ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేసి వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. అందులో నగరంలోని ఓ హోటల్లో తయారీ, ఎక్స్పైరీ తేదీలు లేకుండా వినియోగదారుడికి ఐస్‌క్రీం అందిస్తున్నట్లు గుర్తించి రూ.10 వేలు జరిమానా విధించారు. ఆత్మకూరులో ఓ రెస్టారెంట్‌లోని వంట గదిలో ఏ విధమైన తయారీ, ఎక్స్పైరీ తేదీలు లేని నూడిల్స్ విక్రయిస్తుండగా రూ.10 వేలు, పలు రకాలైన బ్రాండ్లతో గోళీసోడాలు తయారు చేస్తూ ఏ విధమైన తేదీలు, బ్యాచ్ నంబర్లు లేకుండా ప్రజలకు విక్రయిస్తున్న నాలుగు గోలీసోడా యూనిట్ల యజమానులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు, నగరంలోని మాగుంటలే అవుట్లో కాంఫెక్టనరీ షాపులో సబ్‌స్టాండర్డ్ కోకోనట్ మిల్క్ ను విక్రయిస్తున్నందుకు రూ.25 వేలు, స్టోన్‌హౌస్‌పేటలో నాణ్యతలేని సబ్ స్టాండర్డ్ కారంపొడి విక్రయిస్తున్న షాపు యజమాని, తయారీదారుడికి రూ.10 వేలు, వంట నూనె లూజుగా విక్రయిస్తున్న 3 షాపుల యజమానులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధించారు. 12 శాంపిళ్లు అనారోగ్యంగా గుర్తింపు గడిచిన ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్స్‌లో తనిఖీ చేపట్టి మొత్తం 290 శాంపిల్స్‌ను సేకరించారు. వీటిని ల్యాబ్‌కు పంపించగా 12 శాంపిల్స్ ఆరోగ్యానికి హానికరమని, అలాగే 22 నాణ్యత లేని ఆహారంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఏ హోటల్లో అయితే గడువు ముగిసిన, నిల్వ ఉంచిన ఆహారా పదార్థాలను అధికారుల తమ పరిశీలనలో గుర్తించారో అటువంటి హోటల్స్‌పై మొత్తం 15 క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రూ.1.45 లక్షలు జరిమానా విధించారు. నాణ్యత లేని, నిల్వ పదార్థాలతో ఆహారాలు తయారీ పదే పదే నూనెలు మరిగిస్తూ ఆరోగ్యంతో చెలగాటం కంపు కొడుతున్న కిచెన్లు.. ఫుడ్ పాయిజనింగ్తో బెంబేలు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా మార్పేదీ? 290 శాంపిళ్లు టెస్ట్ చేయగా 12 శాంపిళ్లు హానికరమని వెల్లడి నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఓ చిన్న రెస్టారెంట్‌కు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇటీవల కుటుంబంతో కలిసి వెళ్లి భోజనం చేశారు. ఇంటికొచ్చిన గంటన్నరకే కడుపులో వికారం. కొద్ది సేపటికే వాంతులు, విరేచనాలు. దీంతో ఆస్పత్రికి పరుగు తీయగా, ఫుడ్ పాయిజనింగ్ అని డాక్టర్ తేల్చి చెప్పారు. నగరానికి చెందిన మురళి కావలిలోని మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ నాన్‌వెజ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. చికెన్ తిన్న అతనికి నాలుగు గంటల తర్వాత తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. వెంటనే నెల్లూరులోని పొగతోటలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకంటే కానీ పరిస్థితి కుదుట పడలేదు. ఇటీవల ఓ వ్యక్తి అల్పాహారం తినేందుకు నగరంలోని ప్రముఖ హోటల్‌కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఆ ప్లేటులో బొద్దింక ఉండడాన్ని కస్టమర్ గుర్తించి సర్వ్ చేసిన వ్యక్తితోపాటు హోటల్ నిర్వాహకుడిని ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. -
కేసులు ఎత్తేయాలని ధర్నా
సైదాపురం: ఊటుకూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, దళితుల భూములకు యాజమాన్య హక్కులు కల్పి ంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ డీపీ పోలయ్య డిమాండ్ చేశారు. ఆయన గురువారం దళితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊటుకూరు సమీపంలో సర్వే నంబర్ 359, 356లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే భూస్వాములు, పెత్తందారుల ఆక్రమణలో ఉన్న బంజరు, మిగులు, పోరంబోకు భూములను స్వాధీ నం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై పెట్టిన కేసులు ఎత్తి వేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రమేష్, వెంకటయ్య, మమత, కోటయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
గనుల్లో ఇష్టానుసారంగా మైనింగ్
నెల్లూరు రూరల్: సైదాపురం మండలంలో అనుమతి లేని క్వార్ట్ ్జ గనుల్లో ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తున్నారని రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష విమర్శించారు. గురువారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న వెంకటగిరి రాజా, మరొకరికి సంబంధించిన మైన్స్‌ను మూసి వేయించారన్నారు. లీజు గడువు ముగిసి పర్యావరణ అనుమతుల్లేని పద్మావతి మైన్స్, సిద్ధి వినాయక మైన్స్‌కు స్టాక్ పాయింట్లు ఇచ్చారన్నారు. రూల్స్ ప్రకారం 50 సంవత్సరాలు ముగిశాక ఆక్షన్ పద్ధతిలో టెండర్లు పిలవాల్సి ఉండగా జిల్లా అధికారులు అలా చేయకుండా దరఖాస్తును డీఎంజీకి పంపారన్నారు. కానీ ఐఏఎస్ అధికారుల నిజాయితీ వల్ల అప్పట్లో తిరస్కరించారన్నారు. పద్మావతి మైన్స్పై రూ.32 కోట్లు డిమాండ్ నోటిసు ఉందని తెలిపారు. వీటికి స్టాక్ పాయింట్ల నుంచి మెటీరియల్‌ను తరలించడానికి అధికారులు ఎలా అను మతి ఇచ్చారో చెప్పాలన్నారు. రూ.32 కోట్లను ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారో డీడీ బాలాజీ నాయక్ చెప్పాలన్నారు. అప్పట్లో విజిలెన్స్ ఏడీగా ఉన్న బాలాజీ నాయక్, మరో అధికారి సుధాకర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ల తో కలిసి పద్మావతి మైన్స్‌లో గత మేలో 38 వేల టన్నుల మెటీరియల్ ఉందని పంచనామా నిర్వహించారన్నారు. ఈ ఫిబ్రవరిలో 1.55 లక్షల స్టాక్ ఉందని అంటున్నారని, మూసివేసిన గనుల్లో ఇదెలా సాధ్య మని ప్రశ్నించారు. పద్మావతి మైన్స్ డైరెక్టర్ శోభారాణి జనవరి 20న స్టాక్ పాయింట్ తరలించాలని డీఎన్డీకి పర్మిషన్ పెట్టారన్నారు. 22వ తేదీన వారు రిజెక్ట్ చేశారన్నారు. కానీ విచిత్రంగా అదే డీఎంజీ ఫిబ్రవరి 26న ఎలా పర్మిషన్ ఇచ్చిందో అర్థం కావడం లేదన్నా రు. సైదాపురం మండలంలో వెంటనే అనుమతులు ఉన్న గనులను తెరిపించాలన్నారు, లేనిపక్షంలో ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
నెల్లూరు(బృందావనం) : చైత్రమాసం సందర్భంగా నగరంలోని వివిధ ఆలయాల్లో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో పరిసమాప్తమయ్యాయి. ● ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని కోదండరాముని దేవస్థానంలో స్వామివారికి గురువారం రాత్రి పుష్పయాగం నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణ, ఏకాంతసేవ జరిపించారు. ఉభయకర్తలుగా సరాబు హజరత్తయ్య– జానకి, పేరేపు గోపాలకృష్ణమూర్తి– లలిత, సంతోష్‌కుమార్– మధురిక దంపతులు, కుటుంబసభ్యులు వ్యవహరించారు. ఈఓ జి.దర్గయ్య పర్యవేక్షించారు. ● మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉదయం చక్రస్నానం, రాత్రి ఏకాంతసేవ వేడుకగా నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, పాలకమండలి చైర్మన్ మజ్జిగ చంద్రమౌళిరెడ్డి, ఈఓ జంజం శ్రీనివాసరావు పాల్గొని పర్యవేక్షించారు. ● నవాబుపేటలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఏకాంతసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉభయకర్తలుగా గుండ్లపల్లి అరవింద్‌కుమార్ వ్యవహరించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈఓ బి.మల్లికార్జునరెడ్డి పాల్గొని పర్యవేక్షించారు. -
‘జన్మదిన్’ పాఠ్యాంశంపై షార్ట్ ఫిల్మ్
కొడవలూరు: మండలంలోని గండవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి హిందీ పాఠ్య పుస్తకంలోని ‘జన్మదిన్’ పాఠ్యాంశాన్ని హిందీ పండిట్ జి.నాగభూషణం దర్శకత్వంలో విద్యార్థులే నటులుగా షార్ట్ ఫిల్మ్‌ను గురువారం చిత్రీకరించారు. ఈ సందర్భంగా హిందీ పండిట్ మాట్లాడుతూ పాఠ్యాంశాన్ని దృశ్య రూపకంలో చూడడం వల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడంతో పాటు భాషా సామర్థ్యం పెరుగుతుందన్నారు. అంతేకాకుండా ఎక్కువ కాలం గుర్తిండిపోతుందన్నారు. దీనిని యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థిని చిత్ర పుట్టినరోజును నిర్వహించారు. హెచ్ఎం జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందీ పండిట్ ఇప్పటికే అనేక హిందీ పాఠ్యాంశాలను దృశ్య రూపకంతో అందుబాటులోకి తెచ్చారన్నారు. -
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ఏర్పేడు(రేణిగుంట): 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్, తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.అరవింద్ పనగారియా అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని ఆయన గురువారం సందర్శించారు. ‘భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం’ అనే అంశంపై ఆయన ఐఐటీ హ్యూమానిటీస్ – సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఆయనకు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ స్వాగతం పలికి 3వ జనరేషన్ ఐఐటీగా తిరుపతి ఐఐటీ ప్రస్థానం గురించి, పదేళ్లలో సాధించిన ప్రగతిని గురించి ఆయనకు వివరించారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు, ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ పాండా, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రొఫెసర్ అరవింద్ పనగరియా మాట్లాడుతూ రెండు దశాబ్దాల్లో భారత్ ఎన్నో సంక్షోభాలను అధిగమించి 8 – 9 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వెల్లడించారు. అటల్ సేతు, కొత్త పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులు దేశ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయన్నారు. రాబోయే దశాబ్దంలో భారతదేశం 9 – 10 ట్రిలియన్ ఎకానమీగా మారే అవకాశం ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో జరుగుతున్న మార్పులు, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకున్న మూడో తరం ఐఐటీ పురోగతిని వివరించారు. విద్యార్థుల్లో మూడో వంతు మంది పీహెచ్డీ ప్రోగ్రాంలలో ఉన్నారని, అధ్యాపకులు 200కి పైగా పరిశోధన ప్రాజెక్టుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. -
కావలిలో చెలరేగిన దొంగలు
కావలి: కావలిలో దొంగలు చెలరేగిపోయారు. గురువారం ఉదయం పది నుంచి 12 గంటల్లోపు నాలుగిళ్లలో తాళాలను తొలగించి చోరీలు చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు సభ్యుల గల ముఠా ఈ చోరీలకు పాల్పడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలు.. పట్టణంలోని కరెంటాఫీస్ వెనుక వీధిలో ఉన్న సురే మాలకొండారెడ్డి నివాసంలో 37 సవర్ల బంగారం, రూ.40 వేలు.. వెంగళరావునగర్‌లో ఊడల ప్రతాప్ ఇంట్లో 650 గ్రాముల వెండి, ఒక సవరు బంగారం.. జనతాపేటలో అంతోట శోభన్‌బాబు నివాసంలో తొమ్మిది సవర్ల బంగారాన్ని చోరీ చేశారు. ఇందిరానగర్‌లో అద్దూరి లలిత నివాసంలో చోరీకి పాల్పడగా, విలువైన వస్తువులు అపహరణకు గురికాలేదని బాధితురాలు చెప్పారు. ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన దొంగల ముఠా కారులో పట్టణానికి చేరుకొని తాళాలను తొలగించి ఇళ్లలోకి ప్రవేశించారు. చోరీ అనంతరం అదే కారులో వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ అధికారులు అప్రమత్తమై అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా ప్రొద్దుటూరు దొంగల ముఠా కోసం కొంత కాలంగా ప్రకాశం జిల్లా పోలీసులు వెతుకులాటలో ఉన్నారు. జిల్లా పోలీసుల నుంచి సమాచారం అందుకున్న వారు అప్రమత్తమై ప్రొద్దుటూరు పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో ముఠా సభ్యుల్లో ఒకర్ని వారు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. చోరీ బాధితుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు కాగా, ఒకరు రైతు. కావలి డీఎస్పీ శ్రీధర్, వన్ టౌన్ సీఐ ఫిరోజ్ బాధితులతో మాట్లాడి వివరాలను సేకరించారు. వేలిముద్రలను క్లూస్‌టీమ్ సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగిళ్లలో చోరీ కారులో వచ్చి దొంగతనం చేసి.. పరార్ ప్రొద్దుటూరు ముఠాగా గుర్తించిన పోలీసులు -
మూడు లక్షల ఎకరాలకు సాగునీరు
నెల్లూరు (పొగతోట): సోమశిల జలాశయంలో 56.268 టీఎంసీల నీటి లభ్యత ఉందని, రెండో పంటలో మూడు లక్షల ఎకరాలకు 41 టీఎంసీలను మే ఐదు నుంచి విడుదల చేసేలా సాగునీటి సలహా మండలిలో తీర్మానం చేశామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఐఏబీ సమావేశాన్ని కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. డెడ్ స్టోరేజ్, నీటి ఆవిరి, మంచినీటి అవసరాల కోసం 12.5 టీఎంసీలు అవసరమని, ఇవి పోనూ 43 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తక్కువ నీటితో సాగుకు సన్నద్ధం కండి రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటిని సాగుకు వినియోగించేలా రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. లష్కర్లకు రూ.4.68 కోట్ల వేతన బకాయిలున్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గత సీజన్‌కు సంబంధించి 1.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.190 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రకటించారు. పంట నష్టంపై అంచనాలు వర్షాలు, గాలులకు పంట నష్టం సంభవించిందని, దీనిపై అంచనాలను రూపొందించి నివేదికలను అందజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతికి ఎప్పుడైనా నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. తాగునీటి అవసరాల నిమిత్తం చైన్నెకు 15 టీఎంసీలను విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో తాగునీటి అవసరాలను గుర్తించి నీటి నిల్వలను పెంచాలని సూచించారు. ప్రతిపాదనలు ఇలా.. పెన్నార్ డెల్టా ఆయకట్టు రెండు లక్షల ఎకరాలు.. కనుపూరు కాలువ 25 వేలు.. సోమశిల ప్రాజెక్టు కాలువ కింద 1.44 లక్షల ఎకరాలు.. మొత్తం 3.69 లక్షల ఎకరాలకు 43.42 టీఎంసీల నీటి కేటాయింపునకు అధికారులు ప్రతిపాదించారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాల అధ్యక్షులు తదితరుల ఆమోదం మేరకు రెండో పంటలో సుమారు మూడు లక్షలకుపైగా ఎకరాలకు 41 టీఎంసీలను కేటాయించామని తెలిపారు. కాలువల పనులకు రూ.18 కోట్లు జిల్లాలో మేజర్, మైనర్ ఇరిగేషన్ కాలువ పనుల కోసం రూ.18 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జిల్లాలో రూ.38 కోట్ల నీటి పన్ను బకాయిలున్నాయని, వీటిని వసూలు చేస్తే ఆయా నియోజకవర్గాల్లో కాలువల మరమ్మతులకు వినియోగించొచ్చని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇరిగేషన్ అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో మైనర్ ఇరిగేషన్ కాలువల పనులను చేపట్టాలని సూచించారు. గోశాలలో సహజ మరణాలు తిరుమల గోశాలలో గోవుల మరణాలు సహజమైనవేనని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలు.. సర్వేపల్లి నియోజకవర్గంలో రెండో పంటకు రైతులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేరని, సర్వేపల్లి కాలువకు కేటాయించిన నీటిని తగ్గించేలా.. అవసరమైన ప్రాంతాల్లో పంటల సాగుకు వినియోగించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. కనిగిరి రిజర్వాయర్, జాఫర్ సాహెబ్ కాలువ పూడికతీత పనులను చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. దగదర్తి మండలానికి సంబంధించిన డీఆర్ ఛానల్ పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు సాగునీటిని విడుదల చేసే ముందే కాలువ పనులను జరపాలని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. గండిపాళెం ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధతో పాటు సోమశిల జలాలను ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరారు. కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, ఆత్మకూరు ఆర్డీఓ పావని, ఇరిగేషన్ అధికారులు దేశ్‌నాయక్, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, ఏపీఎమ్మైడీపీ పీడీ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కల్యాణ్ చక్రవర్తి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండో పంటకు మే ఐదున విడుదల 41 టీఎంసీల కేటాయింపు ఐఏబీ సమావేశంలో మంత్రి రామనారాయణరెడ్డి -
ఎస్పీఎల్ విజేత లయన్స్ జట్టు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సింహపురి ప్రీమియర్ లీగ్ టీ – 20 క్రికెట్ చాంపియన్‌గా నెల్లూరు రూరల్ లయన్స్ జట్టు నిలిచింది. బుజబుజనెల్లూరులోని సీఐఏ క్రీడా మైదానంలో హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లూరు రూరల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గూడూరు రాయల్ చాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 196 పరుగులకే పరిమితమైంది. దీంతో నెల్లూరు రూరల్ లయన్స్ జట్టు విజేతగా నిలిచింది. జట్టులోని పూర్ణ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు. విజేతలకు బహుమతులను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అందజేశారు. కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కేర్‌టేకర్ శ్రీనివాసులురెడ్డి, సంయుక్త కార్యదర్శి మునిగిరీష్, సభ్యులు శ్రీనివాసులు, రాజశేఖర్‌రెడ్డి, నిర్వాహక కమిటీ చైర్మన్ వంశీకుమార్, నవాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రుస్తుం మైన్ రికార్డుల పరిశీలన పొదలకూరు: మండలంలోని రుస్తుం మైన్ రికార్డులను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ గిరిధర్‌రావు గురువారం పరిశీలించారు. మైన్‌కు సంబంధించిన సర్వే నంబర్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏ – 4గా చేర్చడం, ఎస్సీ, ఎస్టీ కేసును ఇంప్లీడ్ చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో రికార్డుల పరిశీలన ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు దర్యాప్తులో భాగంగానే రికార్డులను పోలీస్ అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. తహసీల్దార్ శివకృష్ణయ్య వద్ద స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. మర్యాదపూర్వకంగా.. నెల్లూరు (లీగల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ను కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కోర్టులోని ఆయన చాంబర్లో కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు. ఇద్దరు పంచాయతీ సెక్రటరీల సస్పెన్షన్ నెల్లూరు(పొగతోట): నిధుల దుర్వినియోగం తదితర అంశాల్లో అక్రమాలకు పాల్పడిన మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ కార్యదర్శి ఆదిలక్ష్మి, బోగోలు మండలం నాగులవరం పంచాయతీ సెక్రటరీ భాస్కర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను డీపీఓ శ్రీధర్‌రెడ్డి గురువారం జారీ చేశారు. గ్రామ పంచాయతీ పనుల నిమిత్తం వచ్చిన ప్రజల నుంచి నాగులవరం పంచాయతీ సెక్రటరీ నగదును డిమాండ్ చేయడం, వసూలు చేసిన ఇంటి పన్ను రూ.23593ను జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ సస్పెన్షన్ వేటేశారు. వీరంపల్లి సెక్రటరీ పంచాయతీకి సంబంఽధించిన సాధారణ నిధులు రూ.1,04,650, 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.ఐదు వేలను దుర్వినియోగం చేశారు. సాధారణ నిధుల నుంచి రూ.21,290, 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.32990ను నిబంధనలు పాటించకుండా డ్రా చేయడంతో సస్పెండ్ చేశారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.280 ధర గురువారం పలికిందని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 760 బేళ్లు రాగా, 521 బేళ్లను కొనుగోలు చేశామని చెప్పారు. కిలో పొగాకు గరిష్టంగా రూ.280, కనిష్టంగా రూ.220, సగటున రూ.256.41 ధర పలికిందని వివరించారు. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. -
అత్యాధునిక పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారీ
కావలి: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారవుతుందని సేల్స్ ఆఫీసర్ (మార్కెటింగ్) బాబ్ జాన్ తెలిపారు. అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో లక్ష్మి ఏజెన్సీ సహకారంతో భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టడాలు పూర్తి నాణ్యతతో దీర్ఘకాలం ఉండేందుకు భారతి సిమెంట్ దోహదపడతుందని చెప్పారు. ఈ సిమెంట్‌తో వేసిన శ్లాబుల్ని ఏడు రోజుల అనంతరం తమ కంపెనీ ప్రతినిధులు వచ్చి నాణ్యత పరీక్షలు చేస్తారన్నారు. ఇందుకోసం డీలర్ ద్వారా తమకు సమాచారం అందించాలని కోరారు. మేసీ్త్రలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించి బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో పవన్ ఆదిత్య హార్డ్‌వేర్ షాపు యాజమాని పవన్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ రాపూరు: ‘ఆర్టీసీలో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి’ అని ఎన్ఎంయూఏ జోనల్ కార్యదర్శి లుక్సన్ డిమాండ్ చేశారు. రాపూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ర్యాలీ, గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 సర్క్యులర్‌ను అమలు చేయాలన్నారు. పదోన్నతులు కల్పించాలన్నారు. నైటవుట్ అలవెన్స్ రూ.400 ఇవ్వాలని, గ్యారేజ్‌లో సరైన స్పేర్‌పార్టులు అందించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి రమణయ్య, గ్యారేజ్ కార్యదర్శి సుధాకర్, అధ్యక్షుడు హరిబాబు, సీసీఎస్ డెలిగేట్ నిస్సార్ అహ్మద్, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అందజేసే పద్మ – 2026 అవార్డుల కోసం క్రీడాకారులు, క్రీడా ప్రోత్సాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యతిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు www. padmaawards.gov.in వెబ్సైట్లో పొందుపరిచిన మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను నింపి వర్డ్, పీడీఎఫ్‌లను ఫార్మాట్లలో sportsinap@gmail.com, incentives. schemes@gmail.comకు మే 26వ తేదీలోగా ఈమెయిల్ పంపాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్నెల్లూరు రూరల్: రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్ నుంచి జేసీ కె.కార్తీక్ ఇతర అధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలను తనిఖీలు చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ ఎస్ఈలు వెంకటరమణ, విజయన్, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు దాటుతుండగా..● బొలెరో ఢీకొని వ్యక్తి మృతి మర్రిపాడు: మండలంలోని బాట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లిపోగు చెన్నయ్య (55) అనే వ్యక్తి మృతిచెందాడు. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. చెన్నయ్య రోడ్డు దాటుతుండగా బొలెరో వేగంగా వెళ్తూ ఢీకొట్టింది. దీంతో అతను చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీనివాసరావు వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని బ్రాహ్మణపల్లి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. -
ఇంటూరి.. ఏంటిది..?
ఉలవపాడు: ఇసుక.. గ్రావెల్.. ప్రకృతి వనరులను కొల్లగొట్టి తమ అస్మదీయులకు కట్టబెట్టడంలో నిమగ్నమైన టీడీపీ ప్రజాప్రతినిధుల కళ్లు తాజాగా దేవదాయ భూములపై పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సదరు భూముల కౌలు వేలాన్ని తమ ఇష్టానుసారంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో గురువారం జరిగిన ఈ ఉదంతానికి ఉలవపాడులోని వేణుగోపాలస్వామి దేవస్థాన ఆవరణ వేదికై ంది. నిబంధనలు తుంగలో.. నిబంధనలను తుంగలో తొక్కి వేలాన్ని ఎమ్మెల్యే జరిపించారు. వాస్తవానికి ఉలవపాడులోని వేణుగోపాలస్వామి దేవస్థానానికి సంబంధించి కందుకూరు మండలం గోపాలపురంలో 172.48 ఎకకాల భూమిని కౌలుకిచ్చేందుకు బహిరంగ వేలాన్ని నిర్వహించారు. గతంలో ఈ భూమిని సాగు చేసుకుంటున్న రైతులు, నూతనంగా చేసుకోవాలనుకునే వారు దరావతును చెల్లించారు. అయితే కూటమి ప్రభుత్వం తాము అనుకున్న విధంగా తమకు నచ్చినవారికే వేలం వచ్చేలా చూడాలని నిర్ణయించుకున్నారు. దీనికి గానూ పోలీసులను భారీగా మోహరించారు. వీటిని దక్కించుకోవాలనే లక్ష్యంతో అరాచకంగా వ్యవహరించారు. అంతా ఏకపక్షం.. వేలాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి మరీ అరాచకంగా నిర్వహించారు. వేలం ప్రారంభమవ్వగానే తొలుత ఎవరైనా పాట పాడితే నగదు విలువ చెప్పారు. ఇలా ప్రారంభమైన వెంటనే తమకు నచ్చిన వారు రావడం, వెంటనే మూడు సెకన్లలో మూడు సార్లు పలకడం, ఆపై పేరును ఖరారు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే, వెంటనే వచ్చి కూర్చోండి ఆ బిట్ అయిపోయింది, తర్వాత వేలం జరుగుతుందని పోలీసులు చెప్పారు. మొత్తం 48 పొలం బిట్లకు వేలం జరగ్గా, తొలుత నాలుగు బిట్లకు నిర్వహించిన తీరుతోనే ప్రక్రియ మొత్తం అర్థమైపోయింది. ఎమ్మెల్యే చెప్పిన పేర్లను ప్రకటించడం తప్ప వేలం సక్రమంగా జరగలేదని నిర్ధారించుకున్నారు. రూ.ఐదు వేల దరావతు చెల్లించి వేలానికి హాజరైన ఎక్కువ మంది రైతులు బయటకొచ్చేశారు. ఆపై అధికారులు, కూటమి నేతలు ఎమ్మెల్యే సమక్షంలో కూర్చొని నచ్చిన పేర్లకు కౌలు వచ్చేలా చూశారు. పాత్రికేయులకు బెదిరింపులు ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం బాధాకరమని పలువురు రైతులు వాపోయారు. అప్రజాస్వామికంగా జరగడంతో తాము బయటకొచ్చేశామని చెప్పారు. లోపలికెళ్లిన పాత్రికేయులను సైతం ఎందుకొచ్చారు.. బయటకెళ్లిపోండి.. ఫొటోలు, వీడియోలు తీయొద్దు.. తర్వాత ఈఓ చెప్తారంటూ కందుకూరు రూరల్ ఎస్సై మహేంద్ర బెదిరించి బయటకు పంపారు. ఓ పత్రిక విలేకరిని దగ్గరుండి బయటకు సాగనంపారు. గతేడాది 172.48 ఎకరాల భూమికి రూ.7.78 లక్షల కౌలు రాగా, ప్రస్తుతం రూ.18 లక్షలు లభించింది. 128 మంది రైతులు వేలానికి హాజరయ్యారు. ఈఓలు నరసింహదాసు, రవీంద్రనాథ్, సునీల్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయంగా దేవదాయ భూముల వేలం కూటమి నేతలకు కట్టబెట్టిన వైనం దగ్గరుండి మరీ ఎమ్మెల్యే అరాచకం పోలీసులు, అధికారుల సహకారంతో బరితెగింపు బహిష్కరించిన అధిక శాతం రైతులు -
నదిలోకి రోడ్డు
ఇసుకాసురుల ధనదాహానికి పెన్నమ్మ విలవిల్లాడుతోంది. ఇచ్చిన అనుమతుల గడువు పూర్తయినా ఒకరు తవ్వకాలు సాగిస్తుండగా, సంగం బ్యారేజీకి అతి సమీపంలో ఇబ్బడిముబ్బడిగా మరొకరు తోడేస్తున్నారు. దీనిపై రైతులు ప్రశ్నిస్తే, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు అక్రమ కేసులు బనాయిస్తారనే భయంతో వీరు మిన్నకుండిపోతున్నారు. డ్రెడ్జింగ్ పేరుతో యంత్రాలను వినియోగించి ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నా, చోద్యం చూడటం అధికారుల వంతవుతోంది. చెలరేగిపోతున్న ఇసుకాసురులు ● ఇష్టానుసారంగా తవ్వకాలు ● డ్రెడ్జింగ్ పేరుతో యంత్రాలు ● అనుమతుల్లేకపోయినా యథేచ్ఛగా.. ● బ్యారేజీకి సమీపంలోనూ దందా ● చోద్యం చూస్తున్న అధికారులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పెన్నా.. కడుపు కోతతో అల్లాడుతోంది. నది లోపలికి రోడ్డును నిర్మించి మరీ ఇసుకను తోడేస్తున్నారు. డ్రెడ్జింగ్‌కు కాంట్రాక్టర్లకు అనుమతిస్తే, యంత్రాలను వినియోగించి కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం సూరాయపాళెం రీచ్‌లో నిబంధనలను పాటించే నాథుడే కరువయ్యారు. ఇతర రాష్ట్రాలకు రవాణా నాకింత, నీకింత అనే రీతిలో ఇసుకను తోడేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. మైనింగ్, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం.. పర్యావరణ ముప్పు ఏర్పడటంతో పాటు బ్యారేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లగొడుతూ.. పొదలకూరు మండలం సూరాయపాళెం పరిధిలోని పెన్నాలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తోడుతున్నారు. వాస్తవానికి ఇక్కడి రెండు రీచ్‌లకు డ్రెడ్జింగ్ అనుమతులు జారీ చేశారు. దీని పేరుతో ఇష్టానుసారం కొల్లగొడుతూ పెద్ద లారీ లు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా రు. నిబంధనలకు విరుద్ధంగా నది లోపలికి వెళ్లి డ్రెడ్జింగ్‌తో పాటు యంత్రాలను పెడుతున్నారు. ఒక రీచ్‌కు ఇచ్చిన అనుమతి గత నెల్లోనే ముగిసినా, తవ్వకాలు ఏ మాత్రం ఆగడంలేదు. మే నెలాఖరు వరకు పొడిగించారని అధికారులు చెప్తున్నారు. అనుమతులు పూర్తయిన సమయంలోనూ రాత్రివేళ నదీ గర్భంలోకి వెళ్లి మరీ తోడేశారు. నిబంధనలు బేఖాతర్ సంగం ఆనకట్టకు దగ్గర్లోనే ఇసుకను తోడేయడంతో బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల మేరకు బ్యారేజీకి 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలు లేదా డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే 250 మీటర్లలోపే ప్రక్రియను యథేచ్ఛగా జరుపుతున్నారు. మరోవైపు నది ఒడ్డున ర్యాంప్‌ను ఏర్పాటు చేసి, పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి బయట నిల్వ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇలాంటివేవీ కానరావడంలేదు. పర్యావరణానికి ముప్పు ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా.. లోతుగా తోడేయడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పక్క గ్రామం విరువూరులో ఈ పరిస్థితి ఏర్పడింది. చెంతనే పెన్నా ఉన్నా బోర్లు వేస్తే సక్రమంగా నీరు పడటంలేదు. దీనికి తోడు రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సంగం బ్యారేజీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అతి సమీపంలో ఇసుక తవ్వకాలతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదు. కాగా పర్యావరణ ముప్పుపై ఇసుక కాంట్రాక్టర్లతో సూరాయపాళేనికి చెందిన కొందరు రైతులు ఇటీవల మాట్లాడారు. బ్యారేజీకి దూరంగా తవ్వకాలు చేసుకోవాలని, ఇలానే వ్యవహరిస్తే లారీలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. టిప్పర్‌లో ఇసుకను లోడ్ చేస్తున్న యంత్రం భారీ లారీలో ఇసుక తరలింపు నదిలోకి అర కిలోమీటర్ మేర గ్రావెల్ రోడ్డును నిర్మించి భారీ యంత్రాలను దింపి ఇసుకను తవ్వుతున్నారు. రీచ్‌ల నుంచి నిత్యం సుమారు 600 టన్నులను తరలిస్తున్నారు. అయితే గత నెల వరకు ఐదు వేల టన్నులనే ఇక్కడి నుంచి తరలించారంటూ అధికారులు లెక్కలు చూపుతున్నారు. టన్నుకు రూ.250 వసూలు చేస్తూ, ప్రభుత్వానికి సీనరేజ్ ద్వారా రూ.78నే చెల్లిస్తున్నారు. అనుమతులను పొడిగించాం డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ పొందిన రీచ్ – 1 కాంట్రాక్టర్‌కు అనుమతులను మే వరకు పొడిగించాం. అక్రమ తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదు. ఆధారాలను సమర్పిస్తే చర్యలు చేపడతాం. – రవికుమార్‌రెడ్డి, ఇరిగేషన్ ఇన్చార్జి డీఈ, పొదలకూరు -
కల్వర్టును ఢీకొని..
సంగం: మండలంలోని సంగం – కలిగిరి రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కలిగిరి నుంచి నెల్లూరు వెళ్తున్న కారు సంగం మలుపు వద్ద అతివేగంతో కల్వర్టును ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు స్పందించి అందులో ఉన్న నలుగురిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. బాధితులను నెల్లూరుకు చెందిన క్రాంతికుమార్, రేవంత్, జస్వంత్, అజయ్‌కుమార్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దగ్ధమైన కారును ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.రాములు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడిన కారు మంటలు చెలరేగి నలుగురికి గాయాలు -
నా మాటంటే విలువ లేదా?
● దివ్యాంగుడికి ట్రై సైకిల్ ఇచ్చి తీసేసుకుంటారా ● ఫొటోకు ఫోజులివ్వడానికేనా ● సమగ్ర శిక్ష అధికారులపై జెడ్పీ చైర్పర్సన్ అసహనంనెల్లూరు(పొగతోట): ‘ఓ దివ్యాంగుడికి ట్రై సైకిల్ ఇవ్వాలని సమగ్ర శిక్ష జిల్లా అధికారులకు చెప్పాను. వాళ్లు దానిని అందించి ఫొటోలు తీసుకున్నారు. మళ్లీ ఆ సైకిల్‌ను వెనక్కు తీసేసుకున్నారు. అధికారులకు నా మాటంటే విలువ లేదా?, ఆ మాత్రానికి ఇస్తామని చెప్పడం ఎందుకు?, అవమానించడం ఎందుకు?’ అని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. గురువారం నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. ఇందులో అరుణమ్మ మాట్లాడారు. అధికారులు ట్రై సైకిల్ ఇచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి అనంతరం దానిని తిరిగి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చైర్పర్సన్ ఇచ్చిన మాటకే విలువ లేకుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సమావేశాలకు రావడం, పేపర్లలో ఉన్నది చదివి వినిపించి వెళ్లిపోవడం జరుగుతోందన్నారు. మా మాటలకు విలువలేని దానికి సమావేశాలు నిర్వహించడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లిగూడూరు మండలంలో శిఽథిలావస్థలో ఉన్న పాఠశాలను త్వరగా కూల్చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌కు సంబంధించి అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు పూర్తి చేయాలి వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు సచివాలయ, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఉపాధి హామీకి సంబంధించి రెండు నెలలకు పైగా పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదన్నారు. చైర్పర్సన్ స్పందిస్తూ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. వాటర్ ట్యాంక్‌లను సకాలంలో శుభ్రం చేస్తూ నీటిని విడుదల చేయాలని తెలిపారు. పొదుపు గ్రూపు మహిళలకు సకాలంలో రుణాలు అందించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అర్హులైన వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విద్యారమ, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా చెరువు మట్టి తరలింపు
ఆత్మకూరు: ఆత్మకూరు మేజర్ చెరువు నుంచి మట్టి తోలకాలు గురువారం నుంచి మళ్లీ మొదలయ్యాయి. మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే జేసీబీతో పదుల కొద్ది ట్రాక్టర్లతో ప్లాట్లు, పొలాలకు మట్టిని తరలిస్తున్నారు. చెరువు పైభాగంలోని జంగాలపల్లి, రావులకొల్లు, అల్లీపురం ప్రాంతాల్లో లోతుగా తవ్వకాలు చేపట్టారు. దీంతో చెరువులోని తుమ్మచెట్లు సైతం నేలవాలుతున్నాయి. మట్టి తరలింపులో స్థానిక టీడీపీ నాయకుల పాత్ర ఉన్నట్లుగా సమాచారం. ఈ విషయమై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరు(క్రైమ్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలను మార్ఫి ంగ్ చేసి కించపరిచేలా అసభ్యకర పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా సెక్రటరీ ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆదిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మేధావి విభాగం అధ్యక్షుడు చంద్రమౌళి, పబ్లిక్ సిటీ అధ్యక్షుడు వినోద్, 30వ డివిజన్ నాయకులు అక్కి చంద్రారెడ్డి, 31వ డివిజన్ నాయకులు శేఖర్‌రెడ్డిలు వేదాయపాళెం పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. -
హిమోఫీలియాపై అప్రమత్తంగా ఉండాలి
కావలి: పట్టణంలోని రెడ్‌క్రాస్ తలసేమియా డే కేర్ సెంటర్లో ప్రపంచ హిమోఫీలియా దినాన్ని గురువారం నిర్వహించారు. తలసేమియా డే కేర్ సెంటర్ వైద్యాధికారులు మనోహర్‌బాబు, శ్రీధర్ మాట్లాడుతూ హిమోఫిలియా అనేది రక్తం గడ్డకట్టే సామర్థ్యం తక్కువగా ఉండే జన్యుపరమైన రుగ్మత అని, దీన్ని తెలుగులో రక్తస్రావ వ్యాధిగా పిలుస్తారని తెలిపారు. ఈ రుగ్మత ఉన్నవారిలో గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. దెబ్బపైకి కనపడకపోయినా అంతర్గత రక్తస్రావం జరుగుతుందని, ఒకవేళ తలలో అంతర్గత రక్తస్రావం జరిగితే కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కావలి రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ మాట్లాడుతూ హిమోఫీలియా ఉన్నవారికి రెడ్‌క్రాస్ రక్తకేంద్రాల్లో ఉచితంగా రక్తం అందజేస్తారని తెలిపారు. అనంతరం తలసేమియా డే కేర్ సెంటర్లో సేవలు అందిస్తున్న వైద్యులు మనోహర్‌బాబు, శ్రీధర్, రమ్య, స్టాఫ్‌నర్స్ శేషమ్మను ఘనంగా సత్కరించారు. రెడ్‌క్రాస్ చైర్మన్ డీ రవిప్రకాష్, వైస్‌చైర్మన్ కే హరినారపరెడ్డి, కోశాధికారి అరికట్ల మధుసూదన్‌రావు, కార్యదర్శి బీఎస్ ప్రసాద్, పాలకమండలి సభ్యులు ఓరుగంటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి మనోరమ, ఎన్ ప్రణీత్, సభ్యులు కల్లయ్య, హరిచందన, జిల్లా పాలకమండలి సభ్యులు కలికి శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీనాథ సాహిత్యంపై ఉపన్యాసం రేపునెల్లూరు(బృందావనం) : పురమందిరం ప్రాంగణంలోని వర్ధమాన సమాజం హాల్లో చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7 గంటలకు ‘శ్రీనాథ మహాకవి సాహిత్యం, జీవనం’ అనే అంశంపై ఉపన్యాసం జరుగనుందని సంస్థ నిర్వాహకులు ఎం.సుబ్రహ్మణ్యం, వై.శేషగిరీశం గురువారం తెలిపారు. కవి, కథా రచయిత, వ్యాసకర్త సీహెచ్‌వీ బృందావనరావు వక్తగా వ్యవహరించనున్నారన్నారు. ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. -
జీవితాలను అర్ధాంతరంగా ముగించి..
ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరో యువతి ఎన్నో ఆశలతో వివాహం చేసుకుని సొంతూరిని విడిచి భర్తతో నెల్లూరుకు వచ్చింది. అయితే వివిధ కారణాలతో ఇద్దరూ జీవితాలను అర్ధాంతరంగా ముగించారు. కులం తక్కువదానివంటూ అత్తింటి వారు అవమానించడంతో ఒకరు, భర్తతో విభేదాల నేపథ్యంలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.● అత్తింటి అవమానాలు తట్టుకోలేక..నెల్లూరు సిటీ: వారిద్దరి మతాలు వేరు. పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కులం తక్కువంటూ అత్తింటి వారు యువతిని అవమానించసాగారు. దీంతో వివాహమై ఏడునెలలు గడవకముందే మనస్తాపంతో ఆమె బలవన్మరణానికి పాల్పడిన ఘటన నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముదివర్తిపాళేనికి చెందిన ఎం.స్మైలీ (23) అనే దళిత యువతి నెల్లూరులోని ఓ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఇందుకూరుపేటకు చెందిన నాగూర్‌బాబు, స్మైలీ ప్రేమించుకున్నారు. మతాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడో మైల్లో ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా నాగూర్‌బాబు కుటుంబ సభ్యులు తక్కువ కులానికి చెందినదంటూ స్మైలీని అవమానిస్తూ వచ్చారు. ఆమె భరిస్తూ వచ్చింది. అయితే వేధింపులు అధికం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్మైలీ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటికి సమీపంలోని వారు తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూశారు. స్మైలీ ఉరేసుకుని కనిపించగా నాగూర్‌బాబుకు సమాచారమిచ్చారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రూరల్ తహసీల్దార్ లాజరస్, రూరల్ సీఐ వేణు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్మైలీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు
నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి, యష్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి పోలీసు అధికారులను కోరారు. మంగళవారం వారు నెల్లూరులోని బాలాజీనగర్ ఎస్సై విజయ్ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. వాటిపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారాలు చేయిస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు, నేతల, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో.. నెల్లూరు సిటీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచేలా సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్త పోస్టు పెట్టారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం పోలీస్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ ఫొటోను మార్ఫింగ్ చేశారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. మహిళలను కించపరిచేలా ఐటీడీపీ వ్యవహరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్‌రావు, రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శ్యామ్ సింగ్, వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ – పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు కనకట్ల మోహన్‌రావు ముదిరాజ్, 26వ డివిజన్ నాయకుడు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై చర్యలకు వినతి -
ముస్లింల ద్రోహి చంద్రబాబు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘వక్ఫ్ సవరణ చట్టం విషయంలో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సీఎం చంద్రబాబు ముస్లింలను నిలువునా ముంచారు. ఆయన ముస్లింల ద్రోహి’ అని వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్‌ఖాన్ అన్నారు. మంగళవారం నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమీర్‌ఖాన్ మాట్లాడుతూ అబద్ధపు హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ముస్లింలను వెన్నుపోటు పొడిచాడన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ముస్లింలందరూ గమనిస్తున్నారని, అవకాశం వచ్చినప్పుడు గుణపాఠం చెబుతారన్నారు. టీడీపీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్‌తోపాటు ఏ ఒక్క నాయకుడు కూడా ముస్లింలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోవడం దురదృష్టకరమన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని అజీజ్ ముస్లింల అండతో తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప వారి కోసం పాటుపడిన దాఖలాల్లేవన్నారు. ముస్లిం నాయకులు నిజాయితీగా రాజీనామాలు చేసి ఉంటే చంద్రబాబు వెనక్కి తగ్గేవాడని తెలిపారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. అందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు జగనన్నకు రుణపడి ఉన్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ ముస్లిం, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హంజా హుస్సేనీ మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు వేసిన ప్రజలకు అన్యాయం చేయడం దురదృష్టకరమన్నారు. ముస్లిం ఆస్తులను దోచే వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆపగల శక్తి ఉన్నా చంద్రబాబు అలా చేయలేదన్నారు. ఆయన్ను ముస్లిం సమాజం క్షమించదన్నారు. సమావేశంలో జిల్లా ముస్లిం, మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ సిద్ధిఖ్, కార్పొరేటర్ సత్తార్, షాకీర్‌బాబా, రజాక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇటీవల జరిగిన ఘటనలు
● కుమార్తెనిచ్చి వివాహం చేయలేదని జాకీర్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన మహబూబ్‌బాషా అనే వ్యక్తిని షాహీద్ దారుణంగా హత్య చేశాడు. ● పాతకక్షల నేపథ్యంలో ఉడ్‌హౌస్ సంఘంలో పెయింటర్ కల్యాణ్ అలియాస్ చిన్నాను నిందితులు దారుణంగా చంపారు. ● ఇందిరాగాంధీ నగర్లో రౌడీషీటర్ సుజన్‌కృష్ణ అలియాస్ చింటూను స్నేహితులు కిరాతకంగా హత్య చేశారు. ● మాగుంట లేఅవుట్లో ఖుద్దూస్‌నగర్‌కు చెందిన ఆసిఫ్‌పై మద్యం మత్తులో షఫీఉద్దీన్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ● సంతపేట పరిధిలోని ఓ వైన్ షాపులో స్వీపర్‌గా పని చేస్తున్న మహిళపై స్నేహితుడు దాడి చేసి గొంతు కోశాడు. ● ఇటీవల కారు డ్రైవర్ వాసును ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. -
‘చాలా సంతోషంగా ఉంది’
నెల్లూరు(లీగల్): ‘ఇక్కడ పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కేసుల పరిష్కారంలో సహకారం అందించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు’ అని బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని, ఆరో అదనపు జిల్లా (ఫ్యామిలీ) కోర్టు న్యాయమూర్తి వెంకట నాగపవన్ తెలిపారు. మంగళవారం వారు జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయన్ని సందర్శించారు. న్యాయవాదులతో మాట్లాడారు. కార్యక్రమంలో పలు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, బార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఉమ మహేశ్వర్‌రెడ్డి, సుందరయ్య యాదవ్, జాయింట్ సెక్రటరీ వరప్రసాద్‌రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనావాసాల్లోకి జింకబుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలో మంగళవారం జింక ప్రత్యక్షమైంది. వేసవి నేపథ్యంలో దాహార్తి తీర్చుకునేందుకు జనవాసాల్లోకి వచ్చింది. ఓ థియేటర్లోకి వెళ్లగా అక్కడి సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బీట్ ఆఫీసర్ పెంచలయ్య జింకను పట్టుకున్నారు. దానిని అడవిలో వదిలి పెడతామని ఆయన వెల్లడించారు. నేటి నుంచి క్రికెట్ పోటీలు నెల్లూరు(అర్బన్): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ పురుషుల క్రికెట్ పోటీలు బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు నారాయణ వైద్యసంస్థల ప్రాంగణంలో జరుగుతాయని నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని కళాశాలలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని 38 మెడికల్, డెంటల్ కళాశాలలకు చెందిన సుమారు 800 మంది ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈనెల 20వ తేదీన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. సమావేశంలో వైద్య విద్యాసంస్థల కో–ఆర్డినేటర్ డాక్టర్ బిజూ రవీంద్రన్, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ స్కంద గోపాలకృష్ణ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెల్వి బాబు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారం కోసం పోరాటం
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఆప్కాస్ ఉద్యోగులు, కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించారు. తెల్లవారు జామున 5.30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ప్లకార్డులు, సీఐటీయూ జెండాలు చేతపట్టి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. పోలీసుల జోక్యంతో అడిషనల్ కమిషనర్ నందన్ కార్యాలయానికి చేరుకుని యూనియన్ నాయకులు, కార్మికులతో చర్చించారు. అనంతరం కమిషనర్ సూర్యతేజతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించేందుకు నెలరోజులు గడువు ఇవ్వాలని అధికారులు కోరారు. దీంతో నాయకులు, కార్మికులకు ఆందోళనను విరమించారు. ● ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షుడు, సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పలు దఫాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 60 సంవత్సరాల వయసు నిండిందంటూ 93 మంది కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ఏ రకమైన సమాచారం లేకుండా పనిలో నుంచి ఆపేయడం సరైన చర్య కాదన్నారు. చనిపోయిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. దుస్తులు, సబ్బులు నూనె, చెప్పులు కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు పూడికలు తీయడం, ట్రాక్టర్లకు ఎక్కించడం లాంటి పనులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ వర్తించని కార్మికులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికై నా చర్యలు తీసుకోకపోతే నిరవధిక ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, సీఐటీయూ నెల్లూరు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, రూరల్ కార్యదర్శి కె.పెంచలనరసయ్య, రాష్ట్ర నాయకులు పి.సూర్యనారాయణ, మాలకొండయ్య, సుధాకర్, మహిళా సంఘం నాయకులు షేక్ మస్తాన్‌బీ, కత్తి పద్మ, షేక్ షంషాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అశోక్, మట్టిపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. విధులు బహిష్కరించిన ఉద్యోగులు, కార్మికులు ఎన్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా కమిషనర్ హామీతో విరమణ -
పచ్చదండు బరితెగింపు
వింజమూరు (ఉదయగిరి): మండలంలోని కాటేపల్లి గ్రామ రెవెన్యూలో ప్రభుత్వ భూములపై పచ్చదండు కన్ను పడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి చదును చేశారు. గ్రామ అవసరాల కోసం ఉపయోగించే మందబయలు, పశువులు పోరంబోకు భూమిని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తమ అనుచరులతో కలిసి కబ్జా చేస్తున్న విషయం తెలియడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై గ్రామస్తులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు చర్యలు తీసుకునేందుకు ముఖం చాటేశారనే ప్రచారం జరుగుతోంది. కాటేపల్లి రెవెన్యూ పరిధిలోని 277, 278, 282, 288 సర్వే నంబర్లలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అఽధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ కుటుంబ సభ్యులు ఈ నెల 9వ తేదీన కొంత భూమి ఆక్రమించి యంత్రాలతో చదును చేశారు. వింజమూరు–గొట్టిగుండాల మార్గంలో తారు రోడ్డుకు అతి సమీపంలో ఉన్న భూమి కావడంతో ఎకరం రూ.లక్షల్లో ఉంది. దీంతో ఈ భూమిపై కన్నేసిన నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆక్రమణకు స్కెచ్ వేశారు. ఈ విషయం అధికార పార్టీలో ఇతరులకు తెలిసి గ్రామ అవసరాల కోసం ఉపయోగించే ఈ భూమి కబ్జా చేస్తే ఇబ్బందిగా ఉంటుందని అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో కొంత కాలంగా మౌనంగా ఉన్న సదరు నేత తాజాగా తన ప్రయత్నాలకు పదును పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 9న కొంత భూమి ఆక్రమించారు. మళ్లీ 13వ తేదీ రాత్రి మరికొంత భూమి ఆక్రమించారు. ఈ భూమికి సంబంధించిన సర్వే నంబర్లపై 145 సెక్షన్ అమల్లో ఉండడం గమనార్హం. మంగళవారం గ్రామ సర్పంచ్ మరి కొంత మంది గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి తహసీల్దార్ హామీద్‌కు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఆయన స్పందించకపోవడంతో కార్యాలయం బయట కొద్ది సేపు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా వృక్ష సంపద తొలగించి, యంత్రాలతో చదును రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
గ్రావెల్ టిప్పర్లు పట్టుకున్నారు.. వదిలేశారు
పొదలకూరు : మండలంలోని మరుపూరు పొలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సోమవారం రాత్రి తహసీల్దార్ బి.శివకృష్ణయ్య సీజ్ చేశారు. వాటిపై ఎలాంటి చర్యలు లేకుండా కొద్ది సేపటికే వదిలేశారు. కొంతకాలంగా ప్రైవేట్ భూముల్లో గ్రావెల్‌ను తవ్వి నెల్లూరు నగరంలోని లేఅవుట్లు, ఇతర అవసరాలకు తరలిస్తున్నారు. సుమారు నెల రోజులుగా మరుపూరు నుంచి నెల్లూరు నగరం చుట్టు పక్కల ప్రాంతాలకు అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల సమాచారం మేరకు తహసీల్దార్ తన సిబ్బందితో కలిసి గ్రావెల్ తరలిస్తున్న మొత్తం నాలుగు టిప్పర్లను సీజ్ చేశారు. వాటిలో మూడింటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించి మరొక టిప్పర్ రిపేరు ఉండడంతో అక్కడే సీజ్ చేసి ఉంచారు. అయితే ఏం జరిగిందో తెలియదు. సీజ్ చేసిన టిప్పర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విడుదల చేయడంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ అధికారులకు సైతం ఎలాంటి సమాచారం అందించలేదని తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌లో అప్పగించిన టిప్పర్లను మంగళవారం విడుదల చేశారు. మరుపూరు ప్రైవేట్ భూముల్లో గ్రావెల్ తవ్వి తరలిస్తున్న వారికి మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ విషయమై తహసీల్దార్ శివకృష్ణయ్య మాట్లాడుతూ సీజ్ చేసిన టిప్పర్ల విషయాన్ని దాటవేస్తూ.. అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటామని, టిప్పర్లను సీజ్ చేశామని మైనింగ్‌కు సమాచారం అందిస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● జేసీ కార్తీక్ నెల్లూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నెల్లూరు నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత రోడ్డు ప్రమాదా ల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను ఆర్అండ్బీ ఎస్ఈ గంగాధర్ కమిటీ సభ్యులకు వివరించా రు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న దృష్ట్యా ఏసీ కూరగాయల మార్కెట్ సెంటర్, జిల్లా పోలీసు కార్యాల యం సెంటర్, కేవీఆర్ జంక్షన్, కనకమహల్ సెంటర్, రామలింగాపురం, వీఆర్సీ ప్రధాన కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థను మే మొదటి వారంలోగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుజబుజనెల్లూరు నుంచి కోవూరు వరకు జాతీయరహదారిపై ప్రమాదాలు జరుగుతు న్న 11 ప్రాంతాల్లో సోలార్ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. జాతీయరహదారిపై వాహనదారులు విశ్రాంతి తీసుకునేందుకు మనుబోలు సమీపంలో సర్వే ల్యాండ్ రికార్డుల అధికారి కొన్ని ప్రదేశాలను ఎంపిక చేశారని, వీటిలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి వాహనదారుల విశ్రాంతి కోసం అన్ని మౌలిక వసతులతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, పెయింటింగ్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పొదలకూరురోడ్డు వద్ద డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారిపై మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో రద్దీ ప్రాంతాల్లో రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, ఇతర ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులతో కలిసే పంచాయతీరాజ్ రహదారుల వద్ద ప్రమాదాల నివారణకు 52 ప్రాంతాల్లో భద్రతా చర్యల కోసం రూ.1.68 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు జేసీకి వివరించారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి ప్రమాదభరిత ప్రాంతాల్లో రూ.1.20 కోట్లతో భద్రతా చర్యలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎస్ఈ తెలిపారు. నెల్లూరు నగరంలో 3,200 లైట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పగా, ఇంకా అవసరమైన ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో నెల్లూరు, ఒంగోలు ఎన్హెచ్ఏ పీడీలు ఎంకే చౌదరి, ఎం. విద్యాసాగర్, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ నాగశేఖర్, డీఎస్పీ జి. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ కె రామకృష్ణ, మున్సిపల్ ఎస్ఈలు రామ్మోహన్రావు, జానీ తదితరులు పాల్గొన్నారు. -
చంటి బిడ్డలకు మత్తు మందు ఇచ్చి మహిళలతో యాచన
● ఇందిరమ్మ కాలనీకి చెందిన (పేరు మార్పు) నారాయణ, అంకమ్మ దంపతులు వృత్తి రీత్యా గ్యాస్ రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు. వీరంతా బడీడు పిల్లలే. భార్యాభర్తలకు గొడవలు కావడంతో భర్త భార్యాబిడ్డలను వదిలేసి వెళ్లాడు. దీంతో బతుకుదెరువు పేరుతో పిల్లల అమ్మమ్మ వారిని తీసుకెళ్లి మార్కెట్ సెంటర్, వీఆర్సీ సెంటర్లో భిక్షాటన చేయిస్తోంది. ● ఇందిరమ్మ గిరిజన కాలనీకి చెందిన నాగవేణి, వెంకయ్య తమ ముగ్గురు పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు. వచ్చిన డబ్బుతో మద్యం తాగి జల్సాలు చేస్తున్నారు. ● అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన నర్సింహులు, లక్ష్మీదేవి ముగ్గురు పిల్లలను తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నారు. నర్సింహులు దివ్యాంగుడు కావడంతో పిల్లలు తీసుకొచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలాంటి వారు నగరంలో చాలా మందే ఉన్నారు. నెల్లూరు (పొగతోట): నెల్లూరు నగరంలో బెగ్గింగ్ మాఫియా రోజు రోజుకు విస్తరిస్తోంది. రద్దీ కూడళ్లు, బస్టాండ్ సెంటర్లలో పసి పిల్లలు, చంకలో చంటి బిడ్డలతో మహిళలతో భిక్షాటన చేయిస్తూ ఆ సొమ్ములో వారికి భిక్షం వేస్తున్నారు. పడారుపల్లి, ఇందిరమ్మ కాలనీలో కొన్ని ముఠాలు ఈ తరహా వ్యాపారం చేస్తున్నాయి. ఈ ముఠాలు చంటి బిడ్డలను కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన వారితోపాటు సంచార గిరిజనులు, పూటగడవని పేదల పిల్లలను అద్దెకు తీసుకువచ్చి ఈ బెగ్గింగ్ మాఫియాను నడుపుతున్నట్లు సమాచారం. సంచార జాతులకు చెందిన కొందరు యువతుల నుంచి నడి వయస్సు మహిళలకు ఈ చంటి బిడ్డలను ఇచ్చి యాచన చేయిస్తున్నారు. ఆ బిడ్డలు వీరి ఒడిలో ఉన్నంత సేపు ఏడవకుండా వారికి మత్తు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అత్యంత దారుణం. ఇదే విషయం ఇటీవల ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం) అధికారుల విచారణలో బయటపడింది. 200 మందికిపైగా మహిళలతో.. నగరంలో సుమారు 200 మందికి పైగా మహిళలు చంటి బిడ్డలతో, వందల సంఖ్యలో బడీడు పిల్లలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు యాచించడం చేయిస్తున్నారు. ఈ బెగ్గింగ్ మాఫియా ఎంతటి దారుణానికి తెగిస్తుందంటే.. చంటి బిడ్డలు మహిళల జోలిలో నిద్రపోయే విధంగా మత్తులో ఉండేటట్లు వారికి పాలల్లో మత్తు కలిపి ఇస్తున్నారు. దీంతో వీరు సాయంత్రం వరకు ఆకలి వేసినా ఉలకరు. పలకరు. మానవత్వం మరిచి చంటి బిడ్డలకు మత్తును ఇస్తున్నారని ఐసీపీఎస్ అధికారులకు తెలిసినా మొక్కుబడిగా కేసులు పెట్టి వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలనీ ప్రాంతాల నుంచి మహిళలు పసి పిల్లలను తీసుకువచ్చి భిక్షాటన చేస్తున్నారు. వీరి వెనుక మాఫియా వ్యక్తులు ఉన్నారు. వీరు యాచించిన మొత్తం తీసుకుని ఆ మహిళలకు కొంత ఇస్తున్నట్లు సమాచారం. మహిళలు తీసుకు వస్తున్న పసి పిల్లల్లో అధిక శాతం మంది బయట ప్రాంతాల నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్ల్లు సమాచారం. కొంత మంది తమ సొంత పిల్లలను సైతం తీసుకువచ్చి బెగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. నగరంలో అయ్యప్పగుడి దగ్గర నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు యాచించే మహిళలు అధికంగా ఉన్నారు. ఇటీవల ఐసీపీఎస్ అధికారులు భిక్షాటన చేస్తున్న కొందరు పిల్లలను పట్టుకు ని వారితో భిక్షాటన చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. పిల్లలను హోమ్‌లో చేర్పించి వారికి విద్యా బుద్ధులు, మంచి దుస్తులు, ఆహారం అందిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన పసి పిల్లలు మహిళలు పసిపిల్లలను తీసుకు వచ్చి నగరంలో బెగ్గింగ్ చేయించే క్రమంలో ఇటీవల అనారోగ్య కారణాలతో ఇద్దరు పసి పిల్లలు మరణించినట్లు సమాచారం. ఆ పిల్లలు అనాథలు కావడంతో ఈ విషయం బయటకు రాలేదు. కేసులు పెట్టినా మారని మహిళలు మహిళలను యాచక వృత్తి నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు పసి పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు బాలల సంరక్షణ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పసి పిల్లలకు మత్తు మందు ఇచ్చి బెగ్గింగ్ చేయిస్తున్న మహిళలపై కేసులు నమోదు చేశారు. కోర్టులో విచారణ జరుగుతోంది. కేసులు నమోదు చేసినా మహిళల్లో ఎటువంటి మార్పురావడం లేదు. యాచక వృత్తిలో ఈజీగా మనీ వస్తుండడంతో దానిని వదిలి మహిళలు బయటకు రాలేకపోతున్నారు. రద్దీ ప్రదేశాల్లో యథేచ్ఛగా.. ఆర్టీసీ బస్‌స్టేషన్, ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లు, స్టోన్‌హౌస్‌పేట, రైల్వేస్టేషన్, వేదాయపాళెం, అయ్యప్పగుడి, మినీబైపాస్, మాగుంట లేఅవుట్ తదితర ప్రాంతాల్లో మహిళలు పసి పిల్లలను తీసుకొచ్చి యాచిస్తున్నారు. ఆగి ఉన్న బస్సుల్లోకి మహిళలు ఎక్కి ప్రయాణికుల నుంచి నగదు అడుగుతున్నారు. ప్రధాన కూడళ్లు, హోటళ్లు, టీ షాపులు, ఇతర దుకాణాల వద్ద మహిళలు చిన్న పిల్లలు బెగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. నెల్లూరులోని బస్టాండ్ సెంటర్లు, రద్దీ ప్రదేశాల్లో కొందరు ఆడ, మగ పసిపిల్లలు ఒక చేయి చాచి మరో చేయిని కడుపుపై పెట్టుకుని దీనంగా యాచిస్తుంటారు. మరి కొన్ని చోట్ల యువతుల నుంచి నడివయస్సు మహిళల వరకు జోలి కట్టుకుని అందులో చంటి బిడ్డలను పెట్టుకుని భిక్షాటన చేస్తుంటారు. అయ్యో.. పసి పిల్లలు, చంటి బిడ్డలతో ఉన్న మహిళలు కదా అని ఎవరైనా జాలిపడి ఐదో.. పదో ఇస్తారు. ఇదంతా వారి కోసం వారు భిక్షాటన చేయడం లేదు. వీరితో ఈ విధంగా బెగ్గింగ్ మాఫియా చేయిస్తోంది. వీరిని పర్యవేక్షిస్తున్న బృందం ఎప్పటికప్పుడు వచ్చిన కలెక్షన్ మొత్తం తీసుకుంటుంటారు. సాయంత్రానికి వీరికి పదో పరకో ఇచ్చి పంపిస్తుంటారు. పసి పిల్లలతోనూ ఇదే పని చేయిస్తున్న వైనం పడారుపల్లి, ఇందిరమ్మకాలనీల్లో పాగా వేసిన ముఠాలు భిక్షాటన చేసే మహిళల పర్యవేక్షణకు ప్రత్యేక బృందం కేసులు పెట్టినా మార్పు రావడం లేదు నగరంలో పసిపిల్లలు, బడీడు పిల్లలతో బెగ్గింగ్ అధికంగా జరుగుతోంది. రెండు నెలల కాలంలో బెగ్గింగ్‌కు పాల్పడుతున్న మహిళలపై కేసులు నమోదు చేశాం. అయినా వారిలో మార్పు రావడం లేదు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మహిళలకు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి యాచక వృత్తిని మాన్పించేలా చర్యలు తీసుకుంటాం. – సురేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
మాకొద్దు
వక్ఫ్ సవరణ చట్టం నెల్లూరు (బృందావనం): కేంద్రం మొండిగా అమల్లోకి తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమంటూ ముస్లింలు గర్జించారు. వక్ఫ్‌బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ, వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నెల్లూరు నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దేశాన్ని కాపాడతామంటూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలను అణచివేయడానికి వక్ఫ్‌బోర్డు చట్టాన్ని సవరించిందని మండిపడ్డారు. ఒకరి ఇంట్లోకి బలవంతంగా దూరి ఆ ఇంట్లో వారిని రక్షిస్తామన్న విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ధ్వజమెత్తారు. నగరంలోని కోటమిట్ట షాదీమంజిల్ నుంచి బయలుదేరిన ఈ భారీ ర్యాలీ గాంధీబొమ్మ వరకు భావోద్వేగపూరితంగా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వక్ఫ్ చట్ట సవరణలో జరిగిన అన్యాయాలపై ఎలుగెత్తి చాటుతూ నినాదాలు చేస్తూ ర్యాలీగా కొనసాగారు. గాంధీబొమ్మ సెంటర్‌ను దిగ్బంధించారు. ఈ సందర్భంగా కొందరు ముస్లిం నేతలు మాట్లాడారు. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వక్ఫ్‌బోర్డు చట్టాన్ని ఒప్పుకోబోమని భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మౌలానా మొహ్మద్ ఇలియాస్ స్పష్టం చేశారు. ఇతర మతస్తులను వక్ఫ్ బోర్డులో నియమించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముస్లింలను అణగ దొక్కేందుకే ఈ చట్టాన్ని తెచ్చిందన్నారు. తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రబాబు ముస్లింల ద్రోహి సీఎం చంద్రబాబు ముస్లింల ద్రోహి అని, లక్షలాది మంది ముస్లింలు ఓట్లేస్తే గెలిచి దొంగబుద్ధితో ముస్లింలను రోడ్డు మీదకు లాక్కొచ్చాడని వైఎస్సార్సీపీ మైనార్టీ నేత సమీర్‌ఖాన్ మండిపడ్డారు. ఓటేసిన వారికి ఇలా ద్రోహం చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ దేశం మొత్తం మీద ముస్లింలపై కుట్రలు చేస్తున్నారన్నారు. నల్ల చట్టాలకు కాలం చెల్లిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ముస్లిం వ్యతిరేక చట్టాలకు రూపకల్పన చేస్తోందని విమర్శించారు. హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే కేంద్రం అమల్లోకి తెచ్చిన వక్ఫ్ చట్టంతో అన్నదమ్ములుగా ఉన్న హిందువులు, ముస్లిం మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు పెట్టిందని బారాషహీద్ దర్గా ఇమామ్ సయ్యద్ అబూబకర్ అష్రఫి ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర పూరితంగా ముస్లింల హక్కులను కాలరాస్తూ, వారికి చెందిన ఆస్తులను ఆక్రమించుకోవడానికి చేస్తున్న కుట్రగా ఉందన్నారు. 1995 వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ అభివృద్ధి పేరుతో ఈ నల్లచట్టాన్ని తయారు చేసిందన్నారు. హడావుడిగా ఆమోదించడం, ముస్లిం సమాజ అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గం, విచారకరమన్నారు. వెంటనే రద్దు చేయాలి ముస్లిం సమాజానికి నష్టం కలిగించే ఈ వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం సమాజానికి ప్రమాదకరమని హాజీ ఇంతియాజ్ అన్నారు. ఈ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లింల వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన విధంగానే ఇతర మతాల ఆస్తులకు సంబంధించి రాజ్యాంగ బద్ధమైన అనుమతి ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకుండా ముస్లింల వక్ఫ్ ఆస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుందన్నారు. మిత్రపక్షాల మౌనం సరికాదు ముస్లిం సమాజానికి ద్రోహం చేసే వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షాలు మద్దతు పలకడం సరికాదని జేఏసీ కమిటీ సభ్యులు సయ్యద్ నవీద్‌అహ్మద్, జాకీర్, షకీల్, సర్దార్, అబ్దుల్గని, అన్వర్‌బేగ్, అబ్దుల్కరీం విచారం వ్యక్తం చేశారు. 11 మంది ముస్లిం సభ్యు లు ఉండాల్సిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఏడుగురు ముస్లిమేతరులు సభ్యులుగా ఉండడం దారుణమన్నారు. మిగిలిన నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు ముస్లిం పురుషులు సభ్యులుగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇది వినాశకరమైన చట్టమన్నారు. కేంద్రం పునరాలోచన చేసి ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో ముస్లింల భారీ ర్యాలీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు గాంధీబొమ్మ సెంటర్ దిగ్బంధం -
రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి
● తిరుపతి ఎంపీ గురుమూర్తి నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలువుతుందని, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న పాలకులు, పోలీసులకు రాబోయే రోజుల్లో అది వారి మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌తో కలిసి ఎంపీ గురుమూర్తి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండానే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. గిరిజనులను బెదిరించి కాకాణిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉందని కాకాణి కోర్టును ఆశ్రయిస్తే ఈలోపు ఈ పాలకులు తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అసలు టీడీపీ నేతలే పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తూ రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారన్నారు. ఏపీలో పరిశ్రమలు మూత పడడానికి ఈ ప్రభుత్వ సంస్కరణలే కారణమన్నారు. అక్రమ కేసులకు, నిర్బంధాలకు వైఎస్సార్సీపీ క్యాడర్, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. టీటీడీ గోశాల ఆవుల మృతిపై విచారణ జరపాలి తిరుపతిలోని టీటీడీ గోశాలలో ఉన్న గోవుల మృతిపై మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పినవన్నీ వాస్తవాలేనన్నారు. టీటీడీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి గోశాలలను పరిశీలించేందుకు అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ప్రధాన పూజలు అందుకునే గోవు, దూడలు, ఎద్దు మృతి చెందాయన్నారు. సాక్షాత్తు సీఎం ఎదుటే టీటీడీ ఈఓ, చైర్మన్ వాదులాడుకుంటుంటే అక్కడ ఏ మాత్రం పాలన ఉందో అర్థమవుతుందన్నారు. భూమన హిందువో, నాస్తికుడో తెలియాలంటే ఆయన ఇంటికి వెళ్తే తెలుస్తుందని, ఈ అంశంపై వాదనలు అనవసరమన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రతిపక్షంపై దుష్ప్రచారాలు చేస్తోందన్నారు. అన్ని అంశాలపై అఖిల పక్షంను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
● 10 సవర్ల బంగారం, 5 కిలోల వెండి, రూ.3 లక్షల నగదు అపహరణ కందుకూరు: పట్టణంలోని వాసవీనగర్‌లో తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడి సమాచారం మేరకు.. వాసవీనగర్‌కు చెందిన మోటుమర్రి కోటేశ్వరరావు మ్యారేజ్ మీడియేటర్‌గా పనిచేస్తున్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకునే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. 10 సవర్ల బంగారం, 5 కిలోల వెండి, రూ.3 లక్షల నగదు అపహరించినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. వెబ్సైట్లో సీనియార్టీ జాబితా నెల్లూరు (టౌన్): జిల్లాలో సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ తుది జాబితాను డీఈఓ వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్ పదోన్నతి కోసం జాబితాను కూడా వెబ్సైట్లో ఉంచినట్లు చెప్పారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17వ తేదీలోపు తగిన ధ్రువపత్రాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. -
ఎస్టీ వర్గీకరణతోనే యానాదుల ప్రగతి
నెల్లూరు(బృందావనం): ఎస్టీ వర్గీకరణతోనే యానాదుల అభివృద్ధి సాధ్యమని యానాది రిజర్వేషన్ పోరా ట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు చినపెంచలయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యానాదుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా యానాదులు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ తప్పదన్నారు. యానాదుల ఎస్టీ వర్గీకరణ చేపట్టాలంటూ సోమవారం నెల్లూరు నగరంలో ‘ఎస్టీ వర్గీకరణ భేరీ’ చేపట్టారు. సుబేదారుపేట నుంచి పురమందిరం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. చినపెంచలయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా యానాదుల బతుకుల్లో ఎటు వంటి మార్పు రాలేదన్నారు. విద్య, ఉద్యోగ, రాజ కీయ రంగాల్లో యానాదులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 37 లక్షల గిరిజన జనాభాలో 10 లక్షల మందికిపైగా యానాదులు ఉన్నారన్నారు. వారికి బడ్జెట్లో కనీస కేటాయింపులు జరగడం లేదని వివక్షకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఉమ్మడి ఎస్టీ రిజర్వేషన్లను కూడా తక్షణమే వర్గీకరించి యానాదులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జూన్‌లో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభించి రాష్ట్రమంతటా పర్యటించి అమాయక ఆదిమ జాతి గిరిజనులైన యానాదులను చైతన్యవంతం చేస్తామన్నారు. యానాది రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చేవూరు సుబ్బారావు సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో యానాది సంఘం రాష్ట్ర నేతలు మేకల శ్రీనివాసులు, చలంచర్ల పెద్దబ్రహ్మయ్య, బాపట్ల బ్రహ్మయ్య, పొన్నూరు అంకమ్మరావు, చందేటి ఉష, పోట్లూరు హనుమంతరావు, రాపూరి కృష్ణయ్య, మురళి, రవీంద్ర, వరలక్ష్మి వివిధ జిల్లాలకు చెందిన ఆ సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యానాదుల నేతలు పాల్గొన్నారు. వెన్నెలకంటికి నివాళి తొలుత నక్కలోళ్ల సెంటర్లో ఉన్న వెన్నెలకంటి రాఘవయ్య భవన్‌లోని వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీ పురమందిరం వరకు సంప్రదాయ డప్పునృత్యాలు, కీలుగుర్రాల ఆటలతో, జానపద గీతాలతో వందలాదిగా యానాదులు తరలివచ్చారు. పురమందిరంలోని వెన్నెలకంటి రాఘవ య్య, బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సింహపురిలో కదంతొక్కిన యానాదులు యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావం సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లూరు చినపెంచలయ్య -
ప్రజా చైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ
● జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి నెల్లూరు(క్రైమ్): ప్రజా చైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి వి.శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు రైల్వేఫీడర్స్ రోడ్డులోని జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో సోమవారం వారోత్సవాలను డీఎఫ్ఓ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అజాగ్రత్తతోనే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ప్రమాదాలపై సమాచారం అందిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విధి నిర్వహణలో ఏ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినా జరిగే నష్టం స్వల్పంగా ఉంటుందని, తాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ నష్టం జరుగుతుందన్న విషయాన్ని నిత్యం గమనంలో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈనెల 20వ తేదీ వరకు అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, థియేటర్లు, ఎల్పీజీ గోదాములు, పెట్రోల్ బంక్‌లు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. అగ్నిమాపక శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఎక్విప్మెంట్ స్టాల్‌ను సీనియర్ లీడింగ్ ఫైర్మెన్లు మస్తానయ్య, హరిబాబు, వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్వో జె.ఉదయ్‌భాస్కర్‌రావు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు వారోత్సవాల వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓ ఎస్.వేణుగోపాలరావు, అధికారులు, సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి. విద్యార్థులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మంచి చేయాలి’ అని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహ సముదాయంలో అంబేడ్కర్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆనంద్, జేసీ కార్తీక్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 62 హాస్టళ్లల్లో రూ.9.32 కోట్లతో మరుగుదొడ్లు, మరమ్మతులు, ఇతర వసతుల కల్పనకు పనులు ప్రారంభించామన్నారు. అనంతరం రిటైర్డ్ ప్రొఫెసర్ కుసుమ కుమారి, రిటైర్డ్ ఏఎస్డబ్ల్యూఓ ఖాసిం గుడ్డ సంచులను, పెన్నులను విద్యార్థులకు పంపిణీ చేశారు. అంబేడ్కర్ జీవిత చరిత్రపై భారత్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, ఏఎస్డబ్ల్యూఓ హజరత్తయ్య పాల్గొన్నారు. ఇలాగేనా చేసేది? అంబేడ్కర్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్ ఇరుకుగదిలో తూతూమంత్రంగా నిర్వహించారని విమర్శలు వెల్లువెత్తాయి. మహోన్నత వ్యక్తి జయంతిని చిన్నపాటి స్టడీహాల్‌లో నిర్వహించడాన్ని పలువురు తప్పు పట్టారు. బహుమతులు తీసుకోవడానికి వెళ్లేందుకు విద్యార్థులు కష్టపడాల్సి వచ్చింది. కార్యక్రమానికి వచ్చిన వారిలో కొందరు గది బయటే ఉన్నారు. దీనికితోడు ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు నిధులు ఇవ్వలేదంటూ వార్డెన్ల వద్ద డబ్బులు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. హాస్టల్ వెలుపల విశాలమైన స్థలం ఉన్నా అక్కడ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వ ఆదేశాలంటూ నామమాత్రంగా హాల్లో కార్యక్రమాన్ని జరిపించడం ఏమిటంటూ ప్రజా సంఘాల నాయకులు బాహాటంగా విమర్శించారు. -
కుమారుడిని కాలేజీలో వదిలి ఇంటికెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం ● భార్యకు తీవ్రగాయాలుపొదలకూరు: ఆ దంపతులిద్దరూ తమ కుమారుడిని నెల్లూరులోని శ్రీచైతన్య కాలేజీలో వదిలిపెట్టి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన బండి రామయ్య (35), బండి శ్రీవాణి దంపతులకు ఇద్దరు సంతానం రామయ్య ఊర్లో చేనేత మగ్గం నేస్తూ ఇటీవల బ్రాందీ షాపులో పనికి చేరి జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు ఇంటర్ పరీక్షలు రాశాడు. ఫలితాల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో ఇంప్రూవ్మెంట్ రాయాలనుకున్నాడు. తల్లిదండ్రులు, కుమారుడు మోటార్‌బైక్‌పై నెల్లూరుకు వచ్చారు. కుమారుడిని కాలేజీలో వదిలిన ఆ దంపతులు ఇతర పనులు చక్కబెట్టుకుని ఇంటికి బయలుదేరారు. పొదలకూరు మీదుగా చిత్తలూరు వెళ్తుండగా పట్టణానికి సమీపంలో స్వర్ణ లేఅవుట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ధాన్యం లోడుతో పొదలకూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ రామయ్య దంపతులను ఢీకొంది. దీంతో రామయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా శ్రీవాణి తలపై తీవ్రగాయమైంది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ వచ్చి ఆమెను స్థానిక సీహెచ్‌సీకి తరలించింది. మరో గంటలో ఇంటికి చేరాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. రామయ్య హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై ఎస్కే హనీఫ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలి. ఇందుకు సరైన రాజకీయ వ్యవస్థ అవసరం’ అని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. గురుమూర్తి, పార్టీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కలిసి బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అంబేడ్కర్ దేశానికి ధృడమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనను అమలు చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. వారి అరాచకం ఎంతోకాలం సాగదన్నారు. కండలేరులో 46.661 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 46.661 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. -
రాష్ట్ర కమిటీలో జిల్లా ఉద్యోగులు
నెల్లూరు(క్రైమ్): ఆంధ్రప్రదేశ్ ప్రాహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కానిస్టేబుల్స్ అండ్ హెడ్‌కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాలోని ముగ్గురికి చోటు దక్కింది. ఆదివారం గుంటూరులోని ఎన్జీఓ కల్యాణ మండపంలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు ఎకై ్సజ్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఎం.కృష్ణయ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, ఎస్కే అజీజ్‌బాషా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, గూడూరు కానిస్టేబుల్ ఎ.శ్రీరాములు జోనల్ సెక్రటరీగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారెళ్ల కృష్ణయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికై న సిబ్బందిని ఎకై ్సజ్ అధికారులు అభినందించారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.105 సన్నవి : రూ.80 పండ్లు : రూ.50 నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 117 లేయర్ (లైవ్) : 100 బ్రాయిలర్ చికెన్ : 210 బ్రాయిలర్ స్కిన్లెస్ : 232 లేయర్ చికెన్ : 170 -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని..
● బాలుడి మృతి దుత్తలూరు: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన దుత్తలూరు సెంటర్ సమీపంలోని రెస్ట్ ఏరియా ప్రాంతంలో 565వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. దుత్తలూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత అన్నంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి – జ్యోతి దంపతుల పెద్ద కుమారుడు అన్నంరెడ్డి చేతన్‌రెడ్డి (13) దుత్తలూరు గ్రామం నుంచి రెస్ట్ ఏరియా ఎదురుగా తన తండ్రి నిర్వహిస్తున్న కేఫ్ వద్దకు స్కూటీపై బయలుదేరాడు. జాతీయ రహదారి దాటే క్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా స్కూటీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని అంబులెన్స్‌లో ఉదయగిరి ప్రభుత వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. -
దూసుకొచ్చిన మృత్యువు
● కారు ఢీకొని ఇద్దరి మృతి ● రాపూరులో విషాదంరాపూరు: కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. ఈ ఘటన రాపూరులో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. రాపూరుకు చెందిన గంధం సరస్వతమ్మ (46) సోమవారం తమ తోట వద్ద వదిలిపెట్టాలని గార్లపాటి సురేష్ (26)ను కోరింది. దీంతో ఇద్దరూ మోటార్‌బైక్‌పై తోట వద్దకు వెళ్లారు. అక్కడ బైక్ దిగుతుండగా కారు వేగంగా వచ్చి వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో పారిపోతుండగా స్థానికులు పట్టుకుని అప్పగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. వారిని రాజంపేట విద్యానగర్‌కు చెందిన రామచంద్ర, మల్లికార్జునగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకట్రాజేష్ తెలిపారు. -
జిల్లాలో ఇదీ పరిస్థితి
నెల్లూరు(అర్బన్): వేడిగాలులతో జిల్లా ఉడికి పోతోంది. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటనలో తెలియజేశారు. లేదంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శనివారం జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత వేడి సాధారణంగా మే నెలలో నమోదవుతుంటుంది. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే 41 డిగ్రీలకు ఎండలు చేరడంతో మే నెల వస్తే ఇంకెంత సెగ తగులుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. మండే ఎండలకు ప్రజలు బయటకు రావాలంటే హడలిపోతున్నారు. ఉదయం 11 గంటలకే రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. వైద్యశాఖాధికారులు, జిల్లా అధికారులు కూడా ఉదయం ప్రజలు తమ పనులు చూసుకుని 11 గంటలలోపు ఇళ్లకు చేరాలని సూచిస్తున్నారు. సాయంకాలం 4 గంటల తర్వాతనే బయటకు రావాలని పేర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితి అయితే ప్రజలు గొడుగులు వేసుకుని బయటకు రావాలని పేర్కొంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల మరిన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా మంచినీరు, నిమ్మరసం, పండ్లరసాలు, పలుచటి మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు. శీతల పానీయాల జోలికి వెళ్లవద్దంటున్నారు. తేదీ ఉష్ణోగ్రత 7 38.0 8 36.6 9 36.1 10 38.4 11 37.8 12 41.0 13 38.9 సుర్రుమంటున్న సూరీడు మే నెల రాకముందే తీవ్ర ఎండలు వేడిగాలులు, ఉక్కపోత బయటకు రావాలంటే జంకుతున్న జనం -
టీవీ మెకానిక్ కుమారుడికి అత్యధిక మార్కులు
పొదలకూరు: పొదలకూరు పట్టణానికి చెందిన టీవీ మెకానిక్ కొడుకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మంచి మార్కులు సాధించాడు. పట్టణంలోని బుడేసాహెబ్ వీధిలో నివసిస్తున్న యజ్ధానీబాషా టీవీలను రిపేర్లు చేస్తుంటారు. ఈయనకు ఇద్దరు కుమారులు. వారిలో తన్వీర్ బాషా ఎంపీసీ గ్రూపులో 1000కు 992 మార్కులు సాధించాడు. తన్వీర్ బాషా నెల్లూరు నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌లో విజేతగా నిలిచి పేదల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపాడు. పెండింగ్ బకాయిల కోసం పోరుబాట నెల్లూరు(అర్బన్): అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను జేఏసీ ఆధ్వర్యంలో సాధించుకునేందుకు పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఎన్జీఓ అసోసియేషన్ భవన్‌నందు ఆ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం జరిగింది. సభకు అధ్యక్షత వహించిన చంద్రశేఖర్ మాట్లాడుతూ పని భారాన్ని తగ్గించేందుకు ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంఘం నాయకులు, ఉద్యోగులు జేఏసీ నాయకులతో కలిసి సమన్వయం చేసుకుంటూ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ మన్నేపల్లి పెంచలరావు మాట్లాడారు. జిల్లా కార్యదర్శి గాదిరాజు రామకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడు నందిమండలం ఆంజనేయవర్మ, నగర అధ్యక్షుడు చిలకా రామకృష్ణారెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు సందీప్ చక్రవర్తి, సాగర్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీఎస్ సాయిరాం, ప్రధాన కార్యదర్శి సుబ్బనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీచ్ వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్టుకు 3వ స్థానం నెల్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలలో నెల్లూరు జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి 3వ స్థానం సాధించింది. దీంతో జట్టుకు కప్పు, రూ.5వేలు నగదు బహుమతిని అందజేశారు. ఈ పోటీలలో మొత్తం 13 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. అనంతపురం జిల్లా మొదటిస్థానం, పశ్చిమ గోదావరి జిల్లా రెండవ స్థానం గెలుచుకున్నాయి. విజేతలకు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు చేతుల మీదుగా ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. నేటి పీజీఆర్ఎస్ రద్దు నెల్లూరు(క్రైమ్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉమేష్‌చంద్ర కాన్ఫెరెన్స్ హాలులో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈదురు గాలులతో వర్షం దుత్తలూరు: దుత్తలూరు మండలంలోని పలు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు వీచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఏలూరు, కావలి, ఆత్మకూరు డివిజన్లలోని కొన్ని ప్రాంతాలలో కూడా వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడిన ప్రజలకు ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో కాస్త ఉపశమనం కలిగింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరులో పలు చోట్ల గాలులకు హోర్డింగులు ఊడిపడ్డాయి. -
నాణ్యతలేక నిలువునా చీలింది
రోడ్డుపై రోడ్డేశారు ఉదయగిరి: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి.. సొంత పార్టీ నేతల కడుపు నింపేందుకు కూటమి ప్రభుత్వం పచ్చ బాటేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను తమ్ముళ్లకు పంచడమే లక్ష్యంగా పల్లెల్లో సీసీరోడ్లు వేసేందుకు కోట్లాది రూపాయల నిధులు కట్టబెట్టింది. ఇదే అదనుగా వారు అధికారుల అండతో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి పనులను తూతూమంత్రంగా చేపడుతూ నిధులను స్వాహా చేస్తున్నారు. దోపిడీ ఇలా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీరోడ్ల నిర్మాణం పేరుతో ఉపాధి నిధులు కొల్లగొట్టేందుకు టీడీపీ నేతలు వ్యూహం రచించారు. పల్లె పండగ పేరుతో గతేడాది అగస్టులో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి తెలుగు తమ్ముళ్లకు పనులు కట్టబెట్టారు. అక్టోబరులో పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం నాణ్యతకు నీళ్లొదిలి నామమాత్రంగా పనులు చేపట్టి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచేశారు. నాణ్యత ప్రశ్నార్థకం జిల్లాలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద సామగ్రి పనులకు రూ.160 కోట్లు మంజూరయ్యాయి. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గానికి 435 పనులకు గాను రూ.26.57 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 422 పనులను పూర్తిచేసి రూ.25.81 కోట్ల చెల్లింపులు చేశారు. నియోజకవర్గంలో జరిగిన సీసీరోడ్డు పనుల్లో నాణ్యత పూర్తిగా లోపించింది. పెన్నానది ఇసుకను ఉపయోగించి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా స్థానికంగా వాగులు, వంకల్లోని మట్టితో కూడిన ఇసుకను వాడారు. సిమెంట్‌ను ప్రమాణాల మేరకు ఉపయోగించలేదు. క్యూరింగ్‌ను సైతం సక్రమంగా చేపట్టలేదు. పనులపైన ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేదు. దీంతో నాణ్యత లోపంతో ముణ్నాళ్లకే రోడ్లపై పగుళ్లు రావడం కనిపించింది. ఇష్టారాజ్యంగా పనులు సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, వింజమూరు మండలాలకు సంబంధించి వింజమూరు పంచాయతీరాజ్ ఏఈ తిరుమలయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మండలాల్లో జరిగిన సీసీరోడ్ల పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ మండలాల్లో పనులు ఒకచోట మంజూరు చేయగా మరోచోట పనులు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ లేఅవుట్లు, జనావాసాలు లేని ప్రాంతాల్లో రోడ్లు వేయడం, గతంలో వేసిన సీసీరోడ్ల పైనే మళ్లీ వేయడం వంటి ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఏఈ పర్యవేక్షణ లేకుండా పనులు జరిగినా, ఎంబుక్ చేసేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి. ఆ సమయంలో అక్రమాలు బయటపడతాయి. సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించినా ఎంబుక్ చేసి నిధులు స్వాహా చేయడం వెనుక ఇంజనీరింగ్ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ కాంట్రోల్ అధికారులు నమూనాలు తీసి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వక ముందే బిల్లులు పెట్టారనే ఆరోపణలు కూడా ఏఈ తిరుమలయ్యపై ఉన్నాయి. ఈ పనులను స్వయంగా చూసి చెక్ మెజర్ చేయాల్సిన డీఈ గుడ్డిగా బిల్లులు ఎలా పాస్ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. జలదంకి, కొండాపురం మండలాల పంచాయతీరాజ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వాణి పేరుకే ఇంజనీర్ అయినప్పటికి, ఆమె భర్త అన్నీ తానై వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణతో వాస్తవాలు ఉదయగిరి నియోజకవర్గంలో సీసీరోడ్లు పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. అప్పడే రోడ్ల నిర్మాణంలో డొల్లతనం బయటపడుతుంది. కోట్లాది రూపాయల ఉపాధి నిధులతో చేపట్టే పనుల్లోని అక్రమాలను కొంతమేర అరికట్టవచ్చు. సిమెంట్ రోడ్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు నాణ్యతకు తిలోదకాలు టీడీపీ నేతల జేబుల్లోకి ప్రజాధనం అధికారుల అండదండలు ఈ చిత్రంలో కనిపిస్తున్న సీసీరోడ్డును జలదంకి మండలం కొత్తపాళెం గ్రామంలో రైసుమిల్లు నుంచి బోడగుడిపాడు వరకు రూ.10 లక్షల అంచనా వ్యయంతో 260 మీటర్ల మేర నిర్మించారు. ఫిబ్రవరిలో రోడ్డును నిర్మించగా రెండు నెలలు కూడా పూర్తికాక ముందే నాణ్యత లోపంతో సుమారు 30 మీటర్ల మేర మధ్యలో నిట్టనిలువుగా పగిలిపోయింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డును దుత్తలూరు మండలం నర్రవాడ పొలాల్లోకి వెళ్లే మార్గంలో నిర్మించారు. ఉపాధి నిధులు సుమారు రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. నిబంధనల ప్రకారం జనావాసాలు ఉన్న చోట రోడ్డు వేయాలి. కానీ అందుకు భిన్నంగా పొలాల్లోకి వెళ్లే మార్గంలో గ్రామదేవత గుడి వరకు తూతూ మంత్రంగా రోడ్డును నిర్మించారు. ఏదైనా గ్రామంలో సీసీరోడ్లు వేసేందుకు అవకాశం లేకపోతే ప్రజలకు ఉపయోగపడే వేరే పనులు చేపట్టే అవకాశం ఉంది. కానీ ఊరు బయట ఎలా రోడ్డు వేసినా అడిగేవారు ఉండరనే ఉద్దేశంతో నాసిరకంగా నిర్మించి నిధులు స్వాహా చేశారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న సీసీరోడ్డు దుత్తలూరు మండలం నందిపాడు బీసీ కాలనీలోనిది. గత ప్రభుత్వ హయాంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో 125 మీటర్ల మేర రోడ్డును నిర్మించారు. ఇటీవల దానిపైనే టీడీపీ నాయకులు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో మళ్లీ రోడ్డు వేశారు. గతంలో రోడ్డు వేసి కనీసం నాలుగేళ్లు కూడా పూర్తి కాలేదు. రోడ్డు ఎక్కడా కూడా దెబ్బతినలేదు. అదే రోడ్డుపై రూ.5 లక్షల వ్యయం చేసి మళ్లీ తూతూ మంత్రంగా రోడ్డు వేసి నిధులు కాజేశారు. విచారణ చేపట్టి చర్యలు నియోజకవర్గంలో జరిగిన సీసీ రోడ్లు పనులకు సంబంధిచి అవినీతి అక్రమాలు జరిగి ఉంటే విచారణ చేసి సంబంధిత అఽధికారులపై చర్యలు తీసుకుంటాం. ఉదయగిరిలో ఏఈలు కొరత ఉన్నందున ఎక్కువ మండలాలకు ఒకే ఏఈకి అదనపు బాధ్యతలు ఇవ్వాల్సి వచ్చింది. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగినా తగిన చర్యలు తీసుకుంటాం. – పంచాయతీరాజ్ ఎస్ఈ -
కావలి డీఎస్పీ వైఖరి సిగ్గుచేటు
కావలి: స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వద్ద మీడియా ముసుగులో ఉన్న బ్రోకర్‌కు కావలి డీఎస్పీ శ్రీధర్ భయపడటం పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యే అరాచకాలపై వార్తలు రాసేవారిపై పోలీసుల ద్వారా అక్రమంగా కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వద్ద ఉన్న ఓ మీడియా బ్రోకర్ పోలీస్ శాఖనే శాసిస్తూ ఆదేశాలివ్వడం దారుణమన్నారు. సదరు వ్యక్తి తనపై అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో కావలి డీఎస్పీని కలిశానని, అయితే తనపై ఒత్తిళ్లు ఉన్నాయని, ఏమీ చేయలేనని, ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి వైఖరితో ఉన్న డీఎస్పీని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కావలిలో మనీ స్కీమ్ పేరుతో రూ.100 కోట్లకుపైగా దోచేశారని, ఇందులో కొందరు పోలీసుల పాత్రా ఉందన్నారు. ఇప్పటి వరకు కేసు విచారణ ఏమైందో.. రికవరీ చేసిన కోట్లాది రూపాయలు ఎక్కడికెళ్లాయో పోలీసులు వెల్లడించలేదని ఆరోపించారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా పత్రిక స్వేచ్ఛను హరించేలా దిగజారి ప్రవర్తిస్తుండటం బాధాకరమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొత్తగా నిధులు తీసుకొచ్చి.. చేసిందేమీ లేదని, తన హయాంలో మంజూరైన పనులనే చేస్తూ, వాటిని తాను చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రుద్రకోటలో భారీ ఎత్తున గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుంటే గ్రామస్తులు ప్రశ్నించగా, మీ సంగతి చూస్తామని బెదిరించారని, ఈ విషయంలో ఓ విలేకరిని సైతం కట్టేసి కొట్టారని ఆరోపించారు. కావలిలో జరుగుతున్న దురాగాతాలపై కలెక్టర్, ఎస్పీ దృష్టి సారించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి -
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
కలిగిరి: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన కావలి ముస్తాపురంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. జామాయిల్ పొలంలో వ్యవసాయ పనులను రైతు నంబూరి చెంచునాయుడు (60) చేయసాగారు. ఈ క్రమంలో ఆయన చేతిలోని చలగపార విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. చెంచునాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి సంగం: సంగంలో అపస్మారక స్థితికి చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక సంగమేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాల సందర్భంగా ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి శనివారం నిద్రించారు. ఆదివారం ఉదయం 10 గంటలకూ నిద్ర లేవకపోవడాన్ని స్థానికులు గమనించారు. అపస్మారక స్థితిలో ఉండటంతో 108లో ఆత్మకూరులోని వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి 45 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. స్కూటీని ఢీకొన్న కారు ● వ్యక్తి మృతి జలదంకి: స్కూటీని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని జమ్మలపాళెం ఎస్వీఆర్ కల్యాణ మండప సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జలదంకి పోలీసుల వివరాల మేరకు.. జమ్మలపాళేనికి చెందిన తన్నీరు మాల్యాద్రి (50) కావలి నుంచి తన గ్రామానికి స్కూటీపై బయల్దేరారు. ఈ సమయంలో కావలికి చెందిన దాసరి మాధవరావు జమ్మలపాళెం వైపు కారులో వస్తూ స్కూటీని వెనుక వైపు నుంచి ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన మాల్యాద్రిని చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. ఎస్సై లతీఫున్నీసా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంబేడ్కర్ జయంత్యుత్సవం నేడు నెల్లూరు రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని నగరంలో సోమవారం నిర్వహించనున్నామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాలంకారం, తదుపరి మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ సాంఘిక బాలికల వసతిగృహంలో జయంతి వేడుకలను నిర్వహించనున్నామని వివరించారు. కార్యక్రమాలకు తరలిరావాలని కోరారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 46.81 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1380, పిన్నేరుకు ఐదు, లోలెవల్‌కు 50, హైలెవల్‌కు 30, మొదటి బ్రాంచ్ కాలువకు పది క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు. పౌల్ట్రీ ధరలు బ్రాయిలర్: రూ.117 లేయర్ రూ.100 బ్రాయిలర్ చికెన్: రూ.210 స్కిన్లెస్ చికెన్: రూ.232 లేయర్ చికెన్: రూ.170 -
చేపల వేటకు విరామం
● రేపట్నుంచి 61 రోజుల పాటు అమల్లో ● మత్స్యకార భృతిపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆపన్నహస్తం కావలి: సముద్రంలో చేపల వేటకు 61 రోజుల విరామాన్ని పాటించనున్నారు. మంగళవారం నుంచి జూన్ 14 వరకు వేట నిషేధిస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిబంధన మేరకు సముద్ర జలాల్లో మెకనైజ్డ్, మోటార్ బోట్ల ద్వారా వేటను సాగించరాదు. వీటిని ఉల్లంఘిస్తే బోట్ల యజమానులు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం – 1994, సెక్షన్ (4) మేరకు శిక్షార్హులు కానున్నారు. వారి బోట్లు, అందులో ఉన్న మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని జరిమానా విధించనున్నారు. ఒడ్డుకు చేరిన బోట్లు వాస్తవానికి ఏడాదిగా సముద్రంలో చేపలు పడక మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు చేపల వేటపై నిషేధంతో జిల్లాలోని ఉలవపాడు, గుడ్లూరు, కావలి రూరల్, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూగూరు, ముత్తుకూరు మండలాల్లోని తీర గ్రామాల్లో ఉన్న బోట్లు ఒడ్డుకు చేరాయి. దీంతో తీర ప్రాంతాలు ప్రస్తుతం బోసిపోయాయి. నిషేధం ఎందుకంటే..? తొలుత నెల రోజులే ఉండే ఈ నిషేధాన్ని క్రమంగా పెంచారు. ఏపీ మైరెన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ – 1995 మేరకు సముద్రంలో చేపల వేటకు సంబంధించి పలు ఆదేశాలున్నాయి. ఈ చట్టం 1997 నుంచి ఆచరణలోకి రాగా, 2007 నుంచి అమలవుతోంది. వేసవిలో గుడ్లు పెట్టే దశలో వేట కారణంగా పునరుత్పత్తి పడిపోతుంది. దీంతో అరుదైన మత్స్య జాతులు కనుమరుగవుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటపై నిషేధాన్ని విధించడం ద్వారా, సముద్రజీవులు గుడ్లు పెట్టే సమయంలో ఎలాంటి ఆటంకం ఉండదు. తొలుత రాష్ట్రంలో మొదలైన దీన్ని తీర ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మత్స్యకార భరోసాతో ఖుషీఖుషీ 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక వీరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని సంకల్పించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎగ్గొట్టిన బకాయిల చెల్లింపుతో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఆ సంవత్సరం మొదలుకొని 2023 వరకు దీన్ని దిగ్విజయంగా అమలు చేసి, మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. హామీ.. గాలి మూటేనా గత ఎన్నికలకు ముందు హామీల వర్షాన్ని టీడీపీ కురిపించింది. మత్స్యకారులకు రూ.20 వేలను ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 12,444 మందికి రూ.20 వేల చొప్పున రూ.24.89 కోట్లను ఇవ్వాల్సి ఉంది. అయితే దీనిపై నేటికీ స్పష్టత లేదు. సాధారణంగా మత్స్యకార మహిళలు సముద్రం నుంచి వచ్చిన చేపలను మార్కెట్ చేసుకుంటూ పొట్ట నింపుకొంటారు. రెండు నెలల పాటు వేట లేకపోవడంతో వీరి ఉపాధికి గండిపడనుంది. హామీ మేరకు భృతిని మంజూరు చేసి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.సముద్రతీరం 110 కిలోమీటర్లు మత్స్యకార కుటుంబాలు 1.5 లక్షలు సముద్రంపై ఆధారపడిన వారు 53,541 మంది మెకనైజ్డ్ బోట్లు 2,950 మోటరైజ్డ్ బోట్లు 3,704 దీన స్థితిని పట్టించుకోవాలి చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారుల దీన స్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలి. వేట విరామం జీవనోపాధికి పెద్ద సమస్యగా మారుతుంది. మేలో చేపలు బాగా పడతాయి. వర్షాలు ప్రారంభమయ్యాక పెద్దగా దొరకవు. వేట లేకపోవడం, మరో పనిరాకపోవడంతో రెండు నెలల పాటు ఖాళీగా గడపాల్సి ఉంటుంది. – తిరుపతి, మత్స్యకారుడు, ఇస్కపల్లి, అల్లూరు మండలం కుటుంబపోషణకు అవస్థ పడాలి వేట జరిగితే ఎంతో కొంత దొరికిన చేపలను అమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటాం. ఆ సమయంలో మాకు చేతినిండా పని ఉంటుంది. వేటకు విరామ సమయంలో మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబ పోషణకు అవస్థలు తప్పవు. – రత్నమ్మ, మత్స్యకార మహిళ, తుమ్మలపెంట, కావలి రూరల్ మండలం భృతి మాటేమిటీ..! వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా అందించడంలేదు. 2014 – 19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తూతూమంత్రపు చర్యలు చేపట్టింది. ఆ సమయంలో తొలి రెండేళ్లు రూ.రెండు వేల చొప్పున, మూడు, నాలుగో సంవత్సరాల్లో రూ.నాలుగు వేలను ఇచ్చి చివర్లో విస్మరించింది. జిల్లాలో ఇలా.. -
పెన్నాను కుళ్లబొడుస్తూ..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇసుకను భారీ యంత్రాలతో తోడేస్తుండటంతో పెన్నానది ఓపెన్ కాస్ట్ మైన్లను తలపిస్తోంది. ఎక్కడికక్కడ సుమారు 20 అడుగుల మేర లోతులో తవ్వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు సోమశిల జలాశయానికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పర్యావరణ, జలసంరక్షకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగురాయపురం, రాజుపాళెం రీచ్‌ల నుంచి నిత్యం 200కుపైగా వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోందని తెలుస్తోంది. దీన్ని తమిళనాడు, బెంగళూరుతో పాటు ప్రకాశం జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దుర్భరంగా రహదారులు తెలుగురాయపురం అనధికార రీచ్ నుంచి భారీ వాహనాలతో ఇసుకను అక్రమార్కులు తరలిస్తుండటంతో ఆ ప్రాంత రహదారులు ఛిద్రమవుతున్నాయి. ఒక్కో టిప్పర్ సామర్థ్యం 40 టన్నులైతే.. దాదాపు 60 టన్నుల మేర తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రహదారులన్నీ సింగిల్ రోడ్లు కావడంతో భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్నాయి. కూలిన వంతెన తాజాగా తెలుగురాయపురం నుంచి కలువాయి మీదుగా లోడ్‌తో వెళ్లే వాహన ధాటికి నూకనపల్లి వద్ద వంతెన కూలిపోయింది. మొత్తం 57 టన్నుల బరువు గల వాహనం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా తెలుగురాయపురం, నూకనపల్లి, కొలవపల్లి, ఇస్కపల్లి గ్రామాల మధ్య సుమారు ఆరు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో ప్రైవేట్ స్కూల్‌కు విద్యార్థులు శనివారం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాహనం నిలిచిపోవడంతో ఎండలోనే కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లారు. స్థానికులే వంతెనకు ఇసుక వేసి తాత్కాలికంగా రాకపోకలకు మార్గం చేసుకున్నారు. అధికారుల పరిశీలన నూకనపల్లి వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో సంబంధిత ఆర్ అండ్ బీ ఈఈ మురళి, జేఈ జ్ఞానేశ్తో పాటు మైనింగ్ ఆర్ఐ స్వాతి, ఎస్సై సుమన్ పరిశీలించారు. భారీ వాహనాల రాకపోకలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపించారు. అధికార పార్టీ నేతల ప్రమేయంతో ఇసుకాసురులు బరితెగించి అక్రమ రవాణా చేస్తున్నా, పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహంతో రగలిపోయారు. అప్పటికే అధికారులపై రాజకీయ ఒత్తిడి రావడంతో అక్కడి నుంచి జారుకున్నారు. వంతెన కూలిన విషయమై ఆర్ అండ్ బీ ఈఈ మాట్లాడుతూ.. నూతన రహదారి విస్తరణకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. కలువాయి మండలంలోని రాజుపాళెం, తెలుగురాయపురంలో ఇసుక తోడేళ్లు.. పెన్నానదిని చెరపట్టి తోడేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అక్రమార్కులు రాత్రీ పగలనే తేడా లేకుండా పర్యావరణానికి తూట్లు పొడుస్తూ యంత్రాలతో తీరాన్ని కుళ్లబొడుస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు ఛిద్రమవుతున్నాయి. పరిసర గ్రామాల ప్రజలకు ఈ రహదారుల్లో ప్రయాణం నరకాన్ని చూపిస్తోంది. విధ్వంసం సృష్టిస్తున్న ఇసుక తోడేళ్లు మైన్లను తలపిస్తున్న నదీ తీరం నూకనపల్లి వద్ద వాహనాల తాకిడితో కూలిన బ్రిడ్జి ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న మాఫియా రాజుపాళెం, తెలుగురాయపురంలో తమ్ముళ్ల బరితెగింపు -
నేత్రపర్వం.. రథోత్సవం
నెల్లూరు(బృందావనం) : బాలాజీనగర్‌లోని సీతారామస్వామి మందిరంలో అనంత కోదండరామస్వామి రథోత్సవం ఆదివారం నేత్రపర్వంగా నిర్వహించారు. నయనానందకరంగా తీర్చిదిద్దిన రథంపై సీతా లక్ష్మణ హనుమంత సమేత అనంత కోదండరామస్వామివారు సర్వాలంకారశోభితంగా కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ప్రధానార్చకుడు బృందావనం శ్రీనివాసదీక్షితులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు మూలవర్లు, ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు, తిరుమంజనాన్ని జరిపించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి ఉప్పు, మిరియాలను రథచక్రాలపై జల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. రథోత్సవం గౌడ హాస్టల్ సెంటర్, ఉగాది సెంటర్, ఏసీనగర్ మెయిన్‌రోడ్డు, బాలాజీనగర్ మెయిన్‌రోడ్డు మీదుగా మందిరానికి చేరింది. ఉభయకర్తలుగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి– సంధ్య దంపతులు వ్యవహరించారు. మందిర కమిటీ నిర్వాహకులు తన్నీరు మస్తాన్‌రావు, సోమిశెట్టి వెంకటరత్నం, కొప్పరపు శివప్రసాద్, మట్టా ప్రసన్నాంజనేయులు, అమరా మోహన్‌రావు, వీఎస్.ప్రసాద్‌రావు, స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యల ప్రాసెస్ కంపెనీలో గ్యాస్ లీక్
నెల్లూరు ఆస్పత్రిలో బాధితులకు చికిత్స తోటపల్లిగూడూరు: తోటపల్లిగూడూరు మండలం అనంతపురం గ్రామం వాటర్ బేస్ కంపెనీలో శనివారం అమ్మోనియా గ్యాస్ లీకై పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, కంపెనీ యాజమాన్యం కథనం మేరకు వివరాలు.. వాటర్ బేస్ కంపెనీలో రొయ్యల ప్రాసెస్ నిర్వహిస్తుంటారు. షిఫ్ట్‌కు సుమారు 2 వేల మంది వరకు ఇక్కడ పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే కంపెనీ మిషన్ రూమ్‌లో అమ్మోనియా గ్యాస్ లీకై అక్కడే ఉన్న పదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఆపరేటర్ ఎం.సురేష్ లీకేజీని ఆపే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన వారితో పాటు సురేష్‌ను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు ప్రకటన చేస్తూ.. అయితే కంపెనీకి చెందిన సీఈఓ రమాకాంత్ ఆకుల, ఎండీ వరుణ్ థాపర్ ప్రమాదంపై ప్రకటన విడుదల చేశారు. ఆపరేటర్ వావిళ్లపాటి సురేష్‌పై కంప్రెషర్ ఆయిల్ పడడం వల్ల బొబ్బలు అయినట్టు ప్రకటించారు. అదే క్రమంలో లీకేజీ వల్ల ఎమర్జెన్సీ అలారం మోగిందని ఒకే సమయంలో కార్మికుల బయటకు వచ్చే క్రమంలో తోపులాట వల్ల అసోంకు చెందిన మీనా(25), ఒడిశాకు చెందిన బాషా(24) కళ్లు తిరిగి పడ్డట్టు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న నెల్లూరు ఆర్డీఓ అనూష వివరాలు సేకరించారు. గ్యాస్ లీకేజీ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వాటర్ బేస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకేజీపై ఆరా తీశారు. గ్రామస్తుల భయాందోళన కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకవడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన వారు మాస్కులు ధరించారు. రొయ్యలను ప్రాసెస్ చేసే క్రమంలో కంపెనీ అమ్మోనియం గ్యాస్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఎక్కడో పొరపాటు జరిగి గ్యాస్ లీకై నట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. వెంటనే సైరన్ మోగించడంతో మిగతా కార్మికులు బయటకు పరుగులు తీసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆపరేటర్ సురేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. పదిమంది కార్మికులకు అస్వస్థత ఒకరి పరిస్థితి ఆందోళనకరం -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చిన్నారికి తీవ్రగాయాలు
అల్లూరు: విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఓ బాలిక తీవ్రగాయాలు పాలైన ఘటన ఉద్దీపగుంట కొత్తకాలనీలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. కోనేటి హరికృష్ణ, హనీతల కుమార్తె హవిలా 3వ తరగతి చదువుతోంది. ఇటీవల కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్ రోడ్డుపైనే నిర్లక్ష్యంగా వదిలి వెళ్లారు. గురువారం స్తంభాల వద్ద పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు హవిలా స్తంభాల మధ్యలో పడిపోయి కాళ్లు ఇరుక్కుపోయాయి. ఒక కాలు విరిగి పోగా మరొక కాలు నరాలు తెగిపోయాయి. నెల్లూరులోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.లక్షకు పైగా ఖర్చయింది. కూలీ చేసుకుంటే కానీ పూట గడవని ఆ కుటుంబానికి చిన్నారి వైద్యం భారంగా మారింది. ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా వారిని ఎవరూ పట్టించుకోలేదు. -
కుటుంబానికి గ్రామ బహిష్కరణ
విడవలూరు: వరకట్న వేధింపుల నేపథ్యంలో సుగుణ ఆత్మహత్యకు కారకులైన కుటుంబానికి గ్రామ బహిష్కరణ విధిస్తూ మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార కాపులు చర్యలు తీసుకున్నారు. సుగుణ ఆత్మహత్య విషయాన్ని గ్రామ కాపులు తీవ్రంగా పరిగణించారు. ఆత్మహత్య చేసుకున్న సుగుణ పిల్లలకు గ్రామస్తులు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. కల్లాపి రంగు పొడిని నీటిలో కలిపి తాగి వివాహిత సుగుణ గురువారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ మేకల పోలయ్య, పెద్దకాపు కొండూరు చిరంజీవి, నడింకాపు అక్కయ్యగారి నరసింహం, చిన్నకాపు శ్రీహరికోట నాగభూషణం శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ గ్రామంలో ఒక ఆడ బిడ్డ ప్రాణాలు కోల్పోయేంతలా హింసించిన బుచ్చింగారి హరికృష్ణ, నాగూరు, నరసమ్మలను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు వాళ్ల నాన్న, తాతల పేరు మీద ఉన్న ఇల్లు, పొలం ఇతర ఆస్తులను బాండ్ రూపంలో అందించడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామంలో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే సుగుణ భర్త హరికష్ణ, మామ నాగూరు ఈ బెట్టింగ్‌ల్లో సుమారు రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నారని, ఆ డబ్బు కోసమే సుగుణను అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం విచారకమన్నారు. గ్రామంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు మా దృష్టికి వస్తే వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో దండోరా నిర్వహించి ఇకపై క్రికెట్ బెట్టింగ్‌లు జరగకుండా తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. పోలీసులు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్‌లపై నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో గ్రామంలోని కాపులతోపాటు, మత్స్య కార నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సుగుణ మృతికి కారకులపై గ్రామ కాపులు చర్యలు క్రికెట్ బెట్టింగ్‌లే సుగుణ మృతికి కారణం తల్లిని కోల్పోయిన పిల్లలకు గ్రామస్తుల అండ -
తప్పుడు కేసులతో ఎవరినీ వేధించడం లేదు
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వానికి తప్పుడు కేసులు పెట్టి ఎవరినీ వేధించాల్సిన అవసరం లేదని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నగరంలోని ఆయన నివాసంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీతో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లు నాస్తికులు రాష్ట్రాన్ని పరిపాలించారని, వారి కారణంగా ఆలయ వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. దేవుడు ముందు ఎవరూ తప్పించుకోలేరన్నారు. 16 లోపు అభ్యంతరాలు తెలపాలి నెల్లూరు (టౌన్): జోన్–3 పరిధిలోని ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ (ప్రభుత్వ), నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 16వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. బీసీ హాస్టల్ విద్యార్థులు 83 శాతం ఉత్తీర్ణత నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు 83.21 శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి. వెంకటలక్ష్మమ్మ శనివారం తెలిపారు. ప్రభుత్వ బీసీ హాస్టళ్లలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు 250 మంది పరీక్షలకు హాజరు కాగా 233 మంది ఉత్తీర్ణులై 83.21 ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షకు 358 మంది హాజరు కాగా 195 మంది ఉత్తీర్ణులై 54.47 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అత్యుత్తమ మార్కులు ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లో బీసీ హాస్టల్స్‌లో వింజమూరు హాస్టల్ విద్యార్థి జి.వెంకటసుశాంక్ 962 మార్కులు సాధించి ప్రథమ స్థానం సాధించారన్నారు. ఫస్టియర్ ఫలితాల్లో కావలి బీసీ హాస్టల్‌కు చెందిన పి.సుష్మిత 468 మార్కులు సాధించి జిల్లా బీసీ హాస్టళ్ల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్): దంపతుల నడుమ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కిసాన్‌నగర్‌లో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కిసాన్‌నగర్‌కు చెందిన వెంకటరమణ, కృష్ణవేణి (35) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటరమణ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దంపతుల నడుమ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. శనివారం ఇద్దరికి గొడవ జరిగింది. వెంకటరమణ ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త తలుపు తీసే ప్రయత్నం చేయగా రాలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపు పగుల గొట్టి చూడగా భార్య ఉరేసుకుని ఉండడంతో ఆమెను కిందకు దించి చికిత్స నిమిత్తం నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటరమణ ఈ విషయాన్ని తోటపల్లిగూడూరులో ఉంటున్న అత్త (మృతురాలి తల్లి) నరసమ్మ, కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు హాస్పిటల్‌కు చేరుకుని కృష్ణవేణి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. నరసమ్మ నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
వైఎస్సార్సీపీ పీఏసీలో అనిల్, ప్రసన్నలకు చోటు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పూర్తిగా వ్యవస్థీకరించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు చోటు లభించింది. వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్, కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలను పీఏసీలో నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఽశనివారం ఆదేశాలు జారీ చేసింది. మద్యానికి బానిసలవ్వొద్దు ● డీపీఈఓ శ్రీనివాసులునాయుడు నెల్లూరు(క్రైమ్): మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) ఎ.శ్రీనివాసులనాయుడు ప్రజలకు సూచించారు. శనివారం నగరంలోని కొండాయపాళెం గేటు వద్ద భవన కార్మికులకు ఎకై ్సజ్ అధికారులు మద్యానికి బానిలవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ మద్యానికి బానిసలైన వారు ఎవ్వరైనా ఉంటే తమకు తెలియజేయాలని, వారిని డీ అడిక్షన్ కేంద్రాల్లో చేర్పిస్తామని సూచించారు. అనంతరం కొండాయపాలెం గేటు నుంచి బొల్లినేని ఆస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్, కోవూరు, ఇందుకూరుపేట సీఐలు వై.వెంకటేశ్వర్లు, పి.అనిత, ఐ.శీనుబాబు, ఎస్ఐలు ఎస్.ప్రభాకర్‌రావు, డి.శ్రీధర్, జీకేవీఎన్ మురళీకృష్ణ, సీహెచ్ పూర్ణకుమార్, కె.హరిబాబు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. రాత్రివేళల్లో భీకర అరుపులు దుత్తలూరు: గ్రామ సమీపాన గల అటవీ ప్రాంతం నుంచి అర్ధరాత్రి తరువాత భీకర అరుపులు వస్తున్నాయి. దాంతో బయటకు రావాలంటే భయమేస్తోందని కొత్తపేట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామ సమీపంలో వాగు వద్ద చిరుతపులి సంచరించడాన్ని గ్రామస్తుడు గుర్తించిన విషయం విదితమే. శనివారం డీఆర్వో మురళి, ఎఫ్బీఓ ప్రసాద్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాత్రి సమయంలో భీకర అరుపులు వినిపిస్తున్నాయని, ఆ అరుపులతో కుక్కలు సైతం మొరుగుతున్నాయని అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు వాగు ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ అడవిపందులు సంచరించినట్లు ఆనవాళ్లు గుర్తించారు. ప్రజలు అధైర్యపడవద్దని సూచించారు. మాలకొండ మాల్యాద్రికి రూ.14.07 లక్షల ఆదాయం వలేటివారిపాలెం: మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామికి శనివారం ఒక్క రోజు ఆదాయం రూ.14.07 లక్షలు వచ్చినట్లు ఉప కమిషనర్ కేవీ సాగర్‌బాబు తెలిపారు. అష్టోత్తరం ద్వారా రూ.8,650, కుంకుమార్చన రూ.21,240, వివాహాలు రూ.14,000, తలనీలాలు రూ.42,925, వాహన పూజలు రూ.3,440, ప్రత్యేక దర్శనం రూ.3,31,800, రూము అద్దెలు రూ.33,410, కవర్లు రూ.8,400, లడ్డూ ప్రసాదాలు 2,47,080, అన్నదానం రూ.2,80,658, విరాళాలు రూ.4,15,000, స్థల పురాణం ద్వారా రూ.1,000 ఆదాయం వచ్చినట్లు వివరించారు. పరీక్ష ఫెయిలై విద్యార్థి బలవన్మరణం నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌లోని ఓ కుటుంబం చింతారెడ్డిపాళెంలో నివాసం ఉంటోంది. వారి కుమారుడు రామలింగాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. శనివారం ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఆ విద్యార్థి ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
సంగంలో వైభవంగా సంగమేశ్వరుడి రథోత్సవం
సంగం: సంగంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సంగమేశ్వరస్వామి రథోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అలంకరించి రథం మీద కొలువుతీర్చారు. అనంతరం గ్రామ పురవీధుల్లో భక్తుల హరహర మహాదేవ నామస్మరణ మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆత్మకూరు సీఐ గంగాధర్, సంగం, ఏఎస్‌పేట, చేజర్ల ఎస్సైలు దగ్గరుండి పర్యవేక్షించారు. రథోత్సవానికి కోటు దయాకర్‌రెడ్డి, కోటు కరుణాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. -
ప్రభుత్వ దృష్టికి రెవెన్యూ సమస్యలు
నెల్లూరు రూరల్: రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న రెవెన్యూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జేసీ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, డీఆర్వో ఉదయభాస్కరరావు, ఆర్డీఓలతో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. పలు పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపు, ప్రైవేట్ పట్టా భూములను నిషేధిత 22 ఏ జాబితా నుంచి తొలగించడం తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. వీటిపై చర్చించి పరిష్కారానికి తగు సూచనలు చేశారు. జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డుల ఏడీ నాగశేఖర్, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, వంశీకృష్ణ, పావని పాల్గొన్నారు. -
ఫీజుల దోపిడీని అరికట్టాలి
కార్పొరేట్ యాజమాన్యాల ఫీజు దోపిడీని అరికట్టాలి. లక్షల్లో వసూలు చేస్తున్నా, బోధన, వసతులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ ●ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి. ధరల పట్టికను నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాల్సి ఉన్నా, ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. – లీలామోహన్, రాష్ట్ర కార్యదర్శి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ నామినల్ ఫీజులనే వసూలు చేయాలి నామినల్ ఫీజులనే వసూలు చేయాలని యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌కు జూమ్ మీటింగ్ ద్వారా ఆదేశాలు జారీ చేశాం. రెగ్యులర్ తరగతులను జూన్ రెండు నుంచి నిర్వహించాలి. ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులొస్తే చర్యలు చేపడతాం. – ఆదూరు శ్రీనివాసులు, ఆర్ఐఓ -
పట్టించుకోని అధికారులు..
● ఇంటర్లో కోర్సును బట్టి ఫీజులు ● అడ్మిషన్ కావాలంటే 50 శాతాన్ని చెల్లించాల్సిందే ● కొత్త పేర్లు పెట్టి నయా దోపిడీ ● పుస్తకాలకు అదనంగా వసూళ్లు ● ఎటూ తేల్చుకోలేకపోతున్న తల్లిదండ్రులు విద్యార్థి భవిష్యత్తుకు ఇంటర్ విద్య ఎంతో కీలకం. తమ పిల్లలు ఇందులో మంచి మార్కులు సాధిస్తే వారి భవితకు ఢోకా ఉండదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంటున్నారు. దీన్నే కార్పొరేట్ యాజమాన్యాలు చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రథమ సంవత్సర అడ్మిషన్లు సోమవారం ప్రారంభం కావడంతో కోర్సులు, ఫీజులపై కళాశాలల ప్రతినిధులను సంప్రదిస్తుండగా, వారు చెప్పే రేట్లు విని గుడ్లు తేలేయడం పేరెంట్స్ వంతవుతోంది. పుస్తకాలకు రూ.10 వేలు – రూ.12 వేలు నెల్లూరు(టౌన్): ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభయ్యాయో లేదో ఫీజుల దోపిడీకి కార్పొరేట్ యాజమాన్యాలు తెరలేపాయి. వాస్తవానికి ఇందులో ఎంపీసీ, బైపీసీ కోర్సులంటే యమ క్రేజ్. వీటికి రకరకాల పేర్లు తగిలించి ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నారు. డే స్కాలర్‌కు రూ.90 వేల నుంచి రూ.1.65 లక్షల వరకు.. అదే హాస్టల్ వసతి కూడా కలిపితే రూ.రెండు లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే వీరి ధనదాహం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేస్తోందనే ఆరోపణలూ లేకపోలేదు. నియంత్రణ.. డొల్ల జిల్లాలో 136 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో ఏటా 23 వేల మందికిపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు సోమవారం.. ద్వితీయ సంవత్సర తరగతులు ఈ నెల ఒకటిన షురూ అయ్యాయి. ఈ నెల 23 వరకు బ్రిడ్జి కోర్సులనే నిర్వహించాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. 24 నుంచి జూన్ ఒకటి వరకు వేసవి సెలవులు.. మరుసటి రోజున కళాశాలలను పునఃప్రారంభించాలని ఆదేశించారు. అడ్మిషన్ల సమయంలో తాత్కాలిక ఫీజులనే వసూలు చేయాలనే ఆదేశాలు ఉన్నా, నియంత్రణ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. సిలబస్‌ను ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నామనీ చెప్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఎటూ తేల్చుకోలేని సందిగ్థంలో తల్లిదండ్రులున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు సైతం కార్పొరేట్ యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజులను వసూలు చేస్తున్నా, వీటి వివరాలను నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించకపోయినా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రికి సంబంధించిన విద్యాసంస్థలే అధికంగా ఉండటంతో అటు వైపు అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవు. మరోవైపు ఆయా కశాశాలలు నిర్వహిస్తున్న హాస్టళ్లకు ఎలాంటి అనుమతులూ ఉండవు. ఎంఈడీ చేసిన అధ్యాపకులు ఉండాల్సి ఉన్నా, డిగ్రీ, పీజీ వారితోనే బోధన చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. అంతంతమాత్రంగా మారిన వసతులతో పాటు భోజనం నాసిరకంగా ఉంటోందని విద్యార్థులే చెప్తున్నారు. ఇప్పటికై నా వీరి దోపిడీని అరికట్టేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సగం చెల్లిస్తేనే ఖరారు కోర్సు, బ్రాంచీలను బట్టి ఫీజులను నిర్ణయించారు. ఐఐటీ, నీట్, ఎంసెట్‌లో ర్యాంకులంటూ రకరకాల కోర్సులను ప్రవేశపెట్టారు. ఎంపీసీలో స్టార్ సూపర్ చైనా, సీఓ సూపర్ చైనా, ఎన్ 120, సీఓ స్పార్క్, స్పార్క్, నీట్ తదితర పేర్లను ఖరారు చేసి ఫీజులను నిర్ధారించారు. అడ్మిషన్ సమయంలో మొత్తం ఫీజులో 50 శాతాన్ని చెల్లిస్తేనే ఖరారవుతుందని యాజమాన్యాలు చెప్తున్నాయి. వేసవి సెలవులయ్యాక ఇప్పటి ఫీజు ఉండదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫీజులో రూ.10 వేల నుంచి రూ.15 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. -
మందులతో నియంత్రణ
నెల్లూరు(అర్బన్): కొంతమంది చేతులు, లేదా మెడ నిరంతరం వణుకుతూ ఉంటాయి. మరికొందరికి తల ఊగిసలాడుతుంది. పలువురు కనీసం గ్లాసును గట్టిగా పట్టుకోలేక మంచినీరు తాగలేక ఇబ్బందులు పడుతుంటారు. వణుకుతూ భోజనం తినాల్సిందే. సమాజంలో ఇలాంటి వారు అరుదుగా కనిపిస్తారు. పార్కిన్సన్స్ (వణుకుడు రోగం) అనే జబ్బు వల్ల ఇలా జరుగుతుంది. ఇది ఒకసారి వస్తే జీవితాంతం బాధపడాల్సిందే. అందువల్లే.. మెదడులో సబ్స్టాంటియా నిగ్రా అనే భాగంలో నాడీ కణాలు కోల్పోవడం వల్ల పార్కిన్సన్స్ అనే వణుకుడు జబ్బు వస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన న్యూరో డీజెనరేటివ్ వ్యాధి ఇది. సోకిన ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడతారు. ఈ జబ్బున్న వారు తమ శరీరమంతా అలసిపోయినట్టు భావిస్తారు. చేతులు, కాళ్లు వణుకుతుంటాయి. తల తిరగడం, బ్యాలెన్స్ తప్పిపోవడం, నిద్రలేమి, మతిమరుపు, కన్ఫ్యూజన్, వాసన అనే లక్షణం కోల్పోవడం జరుగుతుంది. కొంతమందికి మలబద్ధకం ఉంటుంది. మరికొందరు మానసికంగా కుంగుబాటుకు లోనవుతారు. నిధానంగా నడుస్తుంటారు. మాట కూడా నిధానమవుతుంది. అప్పుడప్పుడు బిగుసుకు పోతుంటారు. ఒక్కోదఫా పట్టుతప్పి (బ్యాలెన్స్ కోల్పోయి) పడిపోతుంటారు. తినేందుకు, మంచినీరు తాగేందుకు సైతం ఇబ్బంది పడాల్సిందే. జిల్లాలో ఇలా.. జిల్లాలో పాత, కొత్త కేసులు కలిపి సుమారు 5 వేల మందికి పైగా రోగులన్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనా వేసింది. సంవత్సరంలో ప్రతి లక్ష మందిలో సుమారు 40 మంది వరకు ఈ వ్యాధికి గురవుతున్నట్లు చెబుతున్నారు. ఒక్కోసారి ఈ జబ్బుకు గురైతే జీవితాంతం వెంటాడుతుంది. బీపీ, షుగర్ వచ్చిన వారిలా నిత్యం మందులు వాడాల్సిందే. జిల్లాలో పెరుగుతున్న పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ఏటా కొత్త కేసుల నమోదు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే.. లేకుంటే ముప్పు నేడు ప్రపంచ పార్కిన్సన్స్ (వణుకుడు రోగం) నివారణ దినోత్సవం పార్కిన్సన్స్కు గురయ్యే వారికి పూర్తిస్థాయి చికిత్స లేదు. అయితే మందులతో జబ్బును నియంత్రించవచ్చు. అవసరమైన వారికి డీ బ్రెయిన్ స్టిములేషన్ అనే చిన్న ప్రొసీజర్ (సర్జరీ లాంటిది) చేస్తారు. దీంతో జబ్బు నియంత్రణలోకి వస్తుంది. అందువల్ల జబ్బున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. డాక్టర్‌ను సంప్రదించాలి ప్రధానంగా చేతులు, మెడ వణుకుతున్న లక్షణాలు ఒకటి, రెండుసార్లు కనిపించినప్పుడు న్యూరాలజీ డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి. పరీక్షలు చేసి పార్కిన్సన్స్ అనే జబ్బు అవునో.. కాదో నిర్ణయిస్తారు. ఒకవేళ ఉంటే ప్రాథమిక దశలోనే చికిత్స చేయడం వల్ల ఆ జబ్బు ముదరకుండా పూర్థి స్థాయి నియంత్రణలో ఉంచవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర సమతుల్యతను కాపాడుకునేందుకు వీలవుతుంది. మాత్రలు వాడటం ద్వారా మిగిలిన వారిలా సాధారణ జీవితం గడపొచ్చు. – డాక్టర్ ఫణికుమార్, న్యూరో ఫిజీషియన్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు మంచి ఆహార అలవాట్లు తప్పనిసరి వ్యాధి రాకుండా ఉండేందుకు మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం, బ్రెయిన్‌కు ఒత్తిడి లేకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా బ్యాలెన్స్డ్ ఆహారం వల్ల జబ్బు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు. – డాక్టర్ దీక్షాంతి నారాయణ్, మెడికవర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నెల్లూరు -
సముద్రంలో యువకుడి గల్లంతు
ఉలవపాడు: సముద్రంలో యువకుడు గల్లంతైన ఘటన మండల పరిధిలోని కరేడు తీరంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కరేడు చైతన్యనగర్‌కు చెందిన శింగోతు హేమంత్ ఇటీవల ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాశాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు మిత్రులతో కలిసి తమ కాలనీకి అర కిలోమీటర్ దూరంలో ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లాడు. హేమంత్ అలల తాకిడికి లోపలికి వెళ్లిపోయాడు. స్నేహితులు గ్రామంలో సమాచారం అందించడంతో అక్కడివారొచ్చి వెతికారు. అయితే ఉపయోగం లేకుండా పోయింది. ఎస్సై అంకమ్మ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుమారుడు గల్లంతవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
ఆత్మకూరు: ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేశామని ఆత్మకూరు సీఐ జి.గంగాధర్ తెలిపారు. తన కార్యాలయంలో గురువారం ఎస్సైలు ఎస్కే జిలానీ, బి.సాయిప్రసాద్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు మండలం దేపూరు గ్రామానికి చెందిన తూమాటి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు గతేడాది ఆగస్ట్ 13వ తేదీన సొంత పని నిమిత్తం జంగాలపల్లి గ్రామానికి వెళ్లింది. పని చూసుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో బస్‌షెల్టర్ వద్ద నిలబడింది. కోవూరు స్టౌ బీడీ కాలనీకి చెందిన పఠాన్ రహీం, దేవరకొండ శివ అనే పాత నేరస్తులు సోమశిల నుంచి మోటార్‌బైక్‌పై లక్ష్మమ్మ వద్దకు వచ్చారు. రేవూరుకు ఎలా వెళ్లాలని అడుగుతూ ఆమె మెడలోని సరుడు లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నెల్లూరుపాళెం వద్ద పఠాన్ రహీం, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పఠాన్ రఫీ అనే ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్సై ఎస్కే జిలానీ వారిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణలో పఠాన్ రహీం అప్పట్లో వృద్ధురాలి మెడలో సరుడును శివతో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించాడు. మరో దొంగతనం చేసేందుకు రఫీతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చానన్నాడు. శివ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగంతో కక్షసాధింపు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. రాజకీయ కక్షసాధింపులకే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని విక్రమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్ తదితరులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న ఆయనపై రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారని మండిపడ్డారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కథనాన్ని ప్రచురించిన ఈనాడు దినపత్రిక.. ఆయన్ను దోషి అని తేల్చేసిందని విమర్శించారు. ఒకవేళ ఇదే నిజమైతే వారి వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు ఎందుకు ఇవ్వలేదని, ఇది కుట్ర కాదానని ప్రశ్నించారు. తొలుత ఆరోపణలు చేయడం, దాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆపై కేసులు నమోదు చేయించడం వంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయొద్దంటూ ఓ సభలో సీఎం చంద్రబాబే చెప్పారని, తమ పార్టీకి 40 శాతం మంది ఓట్లేశారని, ప్రభుత్వం నుంచి వీరు ఎలాంటి లబ్ధి పొందకూడదానన్నారు. జిల్లాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అమలు చేస్తే పది నెలల వ్యవధిలో ఇసుక, మైనింగ్, మట్టి ఇలా అన్ని అంశాల్లో జరుగుతున్న అవినీతి బయటపడుతుందని తెలిపారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా పాలన సాగించాలని సూచించారు. బలంగా గొంతు వినిపిస్తే కేసులే ప్రతిపక్ష పార్టీలో ఎవరైతే బలంగా గొంతు వినిపిస్తున్నారో వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పోలీస్ శాఖను ప్రభుత్వం ఎలా వాడుకుంటోందనేందుకు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై జరుగుతున్న వేధింపులే ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాకాణి, ఆయన కుటుంబసభ్యులపై కేసులు పెట్టి వేధించడాన్ని ఖండించారు. ఇలా వ్యవహరిస్తే తమ పార్టీ శ్రేణులు భయపడతారనుకుంటే అది భ్రమేనన్నారు. కావలి నియోజకవర్గంలో బెట్టింగ్‌లు, క్యాసినో తదితరాలను ఎలా ఆడిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి ఓటేసి జగన్మోహన్రెడ్డికి అన్యాయం చేశామనే పశ్చాత్తాపం గ్రామాల్లో మహిళల నుంచి వ్యక్తమవుతోందని వివరించారు. టీడీపీ నేతల ఒత్తిడితో మీరు చేసే పనులు శాపాలుగా మారకుండా చూసుకోవాలని హితవు పలికారు. పార్టీ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, అశ్రిత్‌రెడ్డి, మండల కన్వీనర్లు పిచ్చిరెడ్డి, శంకర్‌రెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పార్టీ నేతల విలేకరుల సమావేశం -
ఉన్నతాధికారి టు కాంట్రాక్టర్
● ఇరిగేషన్లో అవినీతి పర్వం ● బినామీ పేర్లతో నిధుల స్వాహా ● గండిపాళెం జలాశయ మరమ్మతుల్లోనూ ఇదే తీరు ● సదరు ఆఫీసర్ అవినీతిపై విజిలెన్స్‌కు ఫిర్యాదు ఉదయగిరి: మండలంలోని గండిపాళెం జలాశయ మరమ్మతు పనుల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి. 2022లో జరిగిన ఈ వ్యవహారంలో డొల్లతనం ఆర్టీ యాక్టు ద్వారా బట్టబయలైంది. పెయింటింగ్, కొత్త లైట్లను అమర్చడం, రేడియల్ గేట్స్, మోటార్ రిపేర్లకు గాను సదరు అధికారి తన బినామీ కాంట్రాక్టర్‌గా నెల్లూరుకు చెందిన అనుచరుడు హేమంత్ వర్మను నియమించుకున్నారు. ఇంకేముంది తూతూమంత్రంగా పనులు చేసి రూ.12 లక్షలను కాజేశారనే ఆరోపణలున్నాయి. స్వాహాకు కేరాఫ్ జలాశయ ప్రధాన కాలువ మరమ్మతుల కోసం రూ.4.5 లక్షలను కేటాయించగా, పనులు చేయకుండానే నిధులను కాజేశారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పాత ఇనుప సామగ్రిని 2022లో రహస్యంగా వేలం వేయించి, తమ బినామీ హేమంత్ ద్వారా స్వాహా చేశారు. వేలాన్ని ఎప్పుడు.. ఎక్కడ నిర్వహించారు.. ఎంతమంది పాలుపంచుకున్నారు.. ఎంత వచ్చిందనే అంశం పెరుమాళ్లకే ఎరుక. అదే ఏడాది జలాశయంలో ఉన్న రూ.లక్షల విలువజేసే కర్రతుమ్మ చెట్లను వేలం వేయకుండానే విక్రయించారని తెలుస్తోంది. ఎవర్నీ వదలరు.. ఆత్మకూరు డివిజన్లో జరిగిన పలు పనులకు సంబంధించి ముందే తన అనుకూల ట్రేడర్లకు జీఎస్టీ బిల్లులు జమ చేసి సుమారు రూ.కోటి మేర స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఉదయగిరిలో ప్రస్తుతం జరుగుతున్న పలు ఇరిగేషన్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే బిల్లులు చేస్తూ కాంట్రాక్టర్ల వద్ద అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. గండిపాళెం జలాశయంలో చేపలు పెంచి, పట్టుకునే మత్స్య సొసైటీ సభ్యుల నుంచి కిలో చేపలకు రూ.పది వంతున వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విసిగివేసారి విజిలెన్స్‌కు.. అత్మకూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై పలు అవినీతి ఆరోపణలు చేస్తూ గండిపాళెం ప్రాజెక్ట్‌కు చెందిన పలువురు ఆయకట్టు రైతులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గండిపాళెం జలాశయం అక్రమ పంథాను కొనసాగించడం ఇరిగేషన్ శాఖలో ఓ కీలక అధికారికి వెన్నతో పెట్టిన విద్య. ఆత్మకూరు డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఈయన ఆక్రమ కార్యకలాపాలను సాగిస్తూ పెద్ద మొత్తాన్ని తన జేబులో వేసుకుంటున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ఇరిగేషన్ పరిధిలో గతంలో జరిగిన, ప్రస్తుతం చేపట్టిన పనుల్లో బినామీ కాంట్రాక్టర్లను నియమించుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి 21న పరీక్ష
నెల్లూరు (టౌన్): రానున్న విద్యాసంవత్సరంలో ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఈ నెల 21న నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 20న నిర్వహించాలని తొలుత నిర్ణయించినా, ఈస్టర్ కావడంతో దాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారన్నారు. హాల్‌టికెట్లను cse. ap. gov. in లేదాలేదా apms. apcfss. in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఇంటర్లో సంస్కరణలపై అవగాహన కల్పించాలి నెల్లూరు (టౌన్): రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంటర్లో చేపట్టిన సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రిన్సిపల్స్‌తో సమావేశాన్ని నగరంలోని డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల షెడ్యూల్, అకడమిక్ క్యాలెండర్, సిలబస్ మార్పు, కొత్త సబ్జెక్టుల కాంబినేషన్, మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రాల డిజైన్ మార్పు, పని గంటల పెంపు తదితరాలను తెలియజేశారు. డీవీఈఓ మధుబాబు, సమగ్రశిక్ష ఏఎంఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. డీటీసీ డీఎస్పీ బదిలీ నెల్లూరు(క్రైమ్): రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులను డీజీపీ గురువారం జారీ చేశారు. ఇందులో భాగంగా నెల్లూరు డీటీసీ డీఎస్పీ గిరిధర్‌రావును ఏసీబీకి బదిలీ చేశారు. విధుల నుంచి రిలీవై బదిలీ అయిన ప్రాంతంలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్పీ కృష్ణకాంత్‌కు అస్వస్థత నెల్లూరు(క్రైమ్): ఎస్పీ కృష్ణకాంత్ అస్వస్థతకు గురై నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్యాంప్ కార్యాలయంలో విధులను గురువారం నిర్వర్తిస్తుండగా, సొమ్మసిల్లారు. గమనించిన కుటుంబసభ్యులు, పోలీస్ అధికారులు ఆయన్ను హుటాహుటిన కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. వివిధ పరీక్షలను వైద్యులు నిర్వహించారు. వేసవి తీవ్రతతో డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురయ్యారని, ప్రమాదమేమీలేదని తెలిపారు. కాగా ఎస్పీ ఆరోగ్య పరిస్థితిపై హోంమంత్రి అనిత ఆరాతీశారని సమాచారం. పలువురు పోలీస్ అధికారులు పరామర్శించారు. ఘనంగా భగవాన్ మహావీర్ జయంతి నెల్లూరు(బృందావనం) : నగరంలో భగవాన్ మహావీర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీజైన్ శ్వేతాంబర్మూర్తి పూజక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జైన మత గురువులు పన్యాస్ సమర్పణప్రభ, మునిరాజ్ ధ్యానప్రభ, దేవోదయప్రభ కార్యక్రమాన్ని జరిపించారు. తొలుత మండపాలవీధిలోని శ్రేయాన్ష్నాథ్ ఆలయంలో భగవాన్ మహావీర్ విగ్రహానికి అభిషేకం చేశారు. మండపాల వీధిలో ఉన్న జైన దేవాలయం నుంచి నగరోత్సవం ప్రారంభమై చిన్నబజార్, పెద్దబజార్, ఆచారివీధి, కాపువీధి మీదుగా మండపాలవీధికి చేరుకుంది. కిశోర్‌కుమార్ లుంకడ్ తన సంగీత స్వరంతో అలరించారు. చిరుత సంచారం..? దుత్తలూరు: మండలంలోని కొత్తపేట సమీపంలో చిరుత సంచారాన్ని ఓ వ్యక్తి గుర్తించారు. వివరాలు.. గ్రామానికి చెందిన నరసింహరావు కొత్తపేట సమీపంలోని వాగు వద్దకు బహిర్భూమికి వెళ్లారు. అక్కడ చిరుత కనిపించడంతో భయంతో పరుగులు తీసి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేశారు. దీనిపై జిల్లా అటవీ అధికారి మహబూబ్‌బాషాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉదయగిరి రేంజ్ అధికారి కుమార్‌రాజాను వెళ్లి పరిశీలించి నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ తరుణంలో డీఆర్వో మురళి, ఎఫ్బీఓ ప్రసాద్, అటవీ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని వాగు ప్రాంతంలో పాదముద్రల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా ఆనవాళ్లు కనిపించలేదు. గడ్డి బాగా పెరిగి ఉండటంతో పాదముద్రలు కనిపించలేదని, గ్రామస్తులు చెప్పే ఆనవాళ్ల బట్టి అడవిపిల్లిగా అనుమానిస్తున్నట్లు అటవీ అధికారులు చెప్పారు. -
పోలీసులకు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
ఉలవపాడు: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గురువారం ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించి వివాదాలు సృష్టించే విధంగా ఉన్న ఈ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు పోతురాజు, సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడు మధుసూదన్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నవీన్, ఐటీ వింగ్ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, నాయకులు దస్తగిరి, సుధాకర్, అమ్మనబ్రోలు బ్రహ్మయ్య, సురేంద్ర, తాటిపర్తి రమేష్‌లున్నారు. -
కారు డ్రైవర్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): ఓ కారు డ్రైవర్‌ను కొందరు దారుణంగా హత్య చేశారు. మృతదేహం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు తొలుత శ్మశానంలో పూడ్చిపెట్టాలని చూశారు. వీలుకాకపోవడంతో చెత్తకుప్పలో పడేసి గోతాన్ని కప్పి పరారయ్యారు. ఈ ఘటన నెల్లూరు ప్రగతినగర్ ఏ బ్లాక్‌లో చోటుచేసుకుంది. గురువారం పోలీసులు, బాధితులు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం తిరిగలదిన్నె గ్రామానికి చెందిన మాధవ, జ్యోతి దంపతులకు వాసు (23), వాసవి సంతానం. మాధవ కుటుంబం సుమారు 11 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరానికి వలసొచ్చింది. వారు ప్రస్తుతం ప్రగతినగర్ ఏ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. మాధవ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వాసు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పలువురితో అతడికి గొడవలున్నాయి. హత్య చేశారిలా.. పని ఉందంటూ వాసు బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఏడు గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి పనిమీద ఉన్నానని ఇంటికి రావడం ఆలస్యమవుతందని చెప్పాడు. అర్ధరాత్రి ఓ యువకుడిపై వాసు కత్తితో దాడి చేశాడు. సదరు యువకుడు ఈ విషయాన్ని అప్పటికే వాసు వల్ల ఇబ్బందులు పడుతున్న వినయ్, మణికంఠ, లోకేశ్ అలియాస్ ఛత్రపతి, తేజ, సంతోష్‌తోపాటు మరికొందరికి తెలియజేశాడు. అందరూ కలిసి వాసును ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుకుని ప్రగతినగర్ ఏ బ్లాక్ పదో వీధిలోని దర్గా వద్దకు తీసుకొచ్చారు. దర్గా ఎదురుగా ఉన్న రోడ్డుపై అతడిని తీవ్రంగా కొట్టి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వెంగళరావ్‌నగర్ సమీప చెరువులో పూడ్చిపెట్టేందుకు తీసుకెళ్లగా అక్కడ జనసంచారం ఉండటంతో ప్రగతినగర్ పదో వీధి కింద చెరువు సమీపంలోని చెత్తకుప్పలో పడేశారు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకు పెద్ద చెత్తమూటను పైన వేసి పరారయ్యారు. గుర్తించిన స్థానికులు గురువారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు చెత్తకుప్పలో మృతదేహం ఉండటాన్ని గమనించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే మృతుడి స్నేహితులు లోకేశ్, బాదుల్లా ఈ విషయాన్ని బాధిత తల్లిదండ్రులకు తెలియజేశారు. నగర డీఎస్పీ పి.సింధుప్రియ, దర్గామిట్ట ఇన్స్పెక్టర్ రోశయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఛాతి, పొట్ట, గొంతు ఇలా అనేక చోట్ల పెద్దసంఖ్యలో కత్తిపోట్లు ఉన్నాయి. పేగులు సైతం బయటకు వచ్చి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మాధవ, జ్యోతి విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా రోదించారు. మాధవ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సాంకేతికత ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. వాసు కనిపించిన ప్రతిఒక్కరితో గొడవలు పడుతుండేవాడు. నిందితుల్లో పలువురితో పాతకక్షలున్నట్లు విచారణలో వెల్లడైంది. మూడునెలల క్రితం సారాయంగడి సెంటర్లో ఓ స్వీట్ షాపు వద్ద జరిగిన వివాదం కూడా హత్యకు మరో కారణంగా తెలుస్తోంది. పోలీసులు నిందితుల్లో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఓ రౌడీషీటర్ ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసిన వైనం పోలీసుల అదుపులో నిందితులు -
తమ్ముళ్లకు ఇసుకాసులు
పొట్టేపాళెం రీచ్‌లో జేసీబీలతో తవ్వకాలు నెల్లూరు సిటీ: ఇసుక ఉచితమని ప్రభుత్వం ఊదరగొట్టినా, క్షేత్రస్థాయిలో అదంతా వట్టిదేనని తేలిపోతోంది. క్షేత్రస్థాయిలో ఇసుకాసురులు చెలరేగిపోతూ నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో తవ్వకాలు సాగిస్తూ ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాళెం అరుంధతీయపాళేనికి సమీపంలోని పల్లెపాళెం వద్ద గత కొన్ని వారాలుగా జేసీబీలతో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ కరకట్టను తొలగించి తమ పనిని కొనసాగిస్తున్నారు. ఆ ఇద్దరి కనుసన్నల్లోనే.. టీడీపీ రూరల్ నియోజకవర్గ ముఖ్యనేతకు అనుచరులైన కాంట్రాక్టర్లు అచ్యుత్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో వ్యవహారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ఇద్దరూ పొట్టేపాళెంపై దృష్టి సారించారు. గతంలో రాత్రి వేళే తంతు సాగిస్తుండగా, ప్రస్తుతం పగలూ నిరాటంకంగా సాగుతోంది. దారుల ఏర్పాటు పొట్టేపాళెం వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన రీచ్ నుంచి నిత్యం 20 ట్రాక్టర్లలో 250కుపైగా ట్రిప్పులను తరలిస్తున్నారు. నెల్లూరు – పొట్టేపాళెం ప్రధాన రోడ్డు నుంచి అంజనీ వనం లేఅవుట్ మీదుగా దారులను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి అరుంధతీయవాడలోని ఓ చిన్న వీధి మీదుగా ఇవి వేగంగా వెళ్తున్నాయి. బయటవారు రాకుండా నిఘా ఇసుక తవ్వకాలు సాగించే ప్రాంతానికి మైనింగ్, రెవెన్యూ అధికారులు, మీడియా ప్రతినిధులు రాకుండా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. అరుంధతీయవాడ వద్ద పల్లెపాళెం కరకట్టను తొలగించి, ఆ ప్రాంతానికి బైక్‌లు, కార్లు రాకుండా ఇసుకను అడ్డంగా వేశారు. ట్రాక్టర్లు మాత్రమే తిరిగేలా, ఇతర వాహనాలు వస్తే ఇరుక్కుపోయేలా ఏర్పాట్లు చేశారు. రీచ్ రహదారి వెంబడి నిఘా నిమిత్తం నలుగుర్ని ఏర్పాటు చేశారు. ఎవరు లోపలికొచ్చినా ఫోన్ల ద్వారా సమాచారం చేరవేసేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించడంలేదు. సమీపంలోని పల్లెపాళెం వద్ద కరకట్టను ధ్వంసం చేసి.. అడ్డదారిలో తరలింపు రోజూ 20 ట్రాక్టర్లలో 250 ట్రిప్పులకుపైగా రవాణా అధికారులు, మీడియా ప్రతినిధుల రాకపోకలపై నిఘా -
నేరాల కట్టడికి చర్యలు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు సబ్ డివిజన్లో రైల్వే పోలీస్ సిబ్బంది కొరత వెంటాడుతోంది. 151 మందికి గానూ 60 శాతం మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరిగింది. నేర నియంత్రణ, కేసుల పరిష్కారం వారికి తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ప్రయాణికుల భద్రతపై దృష్టిసారించలేకపోతున్నారు. బీట్ వ్యవస్థ నామమాత్రంగా మారింది. ఇది నేరగాళ్లకు కలిసొస్తోంది. ఇటీవల అంతర్రాష్ట్ర ముఠా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీకి పాల్పడింది. దీనికితోడు వేసవిలో రైళ్లల్లో దోపిడీలు, దొంగతనాలు అధికంగా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. చర్యలిలా.. సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వేసవి ముగిసేంత వరకూ తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని కేటాయించాలని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. దీంతో జిల్లా పోలీస్ శాఖ నుంచి 33 మంది సిబ్బందిని కేటాయించారు. అందులో 20 మంది రైల్వే డీఎస్పీ వద్ద ఇప్పటికే రిపోర్ట్ చేశారు. మరో 13 మంది నేడో, రేపో రిపోర్ట్ చేయనున్నారు. వేసవి నేపథ్యంలో రైల్వే ప్లాట్‌ఫాంలపై నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే అన్ని రైళ్లల్లో సాయుధ పోలీసులతో బీట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దష్ట్యా బీట్ సిబ్బంది వద్ద ఉన్న పుస్తకంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే ప్రయాణికులు ఉన్నతాధికారులకు, రైల్వే, స్థానిక పోలీసులకు సమాచారం చేరవేసేలా చర్యలు చేపట్టారు. దొంగతనాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేస్తున్నారు. 20 బీట్లు గతంలో పది బీట్లు ఉండగా వాటిని 20కు పెంచారు. రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు జిల్లా మీదుగా రాకపోకలు సాగించే రైళ్లల్లో గస్తీని పెంచారు. ఒక్కో బీట్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటున్నారు. ఒక కానిస్టేబుల్ వద్ద తుపాకీ, లాఠీ, రెండు టార్చ్లైట్లు, విజిల్స్ ఉంటాయి. వీరు నిందితులను గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతోపాటుగా అదుపులోకి తీసుకుంటారు. నిందితులు ప్రతిఘటిస్తే కాల్చేందుకు వెనుకాడబోరు. క్రైమ్ పార్టీలు రైళ్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వీక్లీ, స్పెషల్ రైళ్లల్లో ఆర్పీఎఫ్ సిబ్బంది బీట్లు నిర్వహిస్తున్నారు. ప్లాట్‌ఫాంలపై సిబ్బంది పోలీస్ మఫ్టీలో ఉంటున్నారు. వీరు రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు అక్కడ విధులు నిర్వహిస్తూ నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైళ్లల్లో సాయుధ గస్తీ జిల్లా పోలీస్ శాఖ నుంచి 33 మంది దొంగతనాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో పికెట్లు నేరస్తులను కాల్చేందుకు వెనుకాడొద్దని ఆదేశాలునెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో నేరాల నియంత్రణకు ఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సహకారంతో చర్యలు చేపట్టాం. బీట్ వ్యవస్థను పటిష్టం చేశాం. నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నాం. పాతనేరస్తులు, అంతర్రాష్ట్ర ముఠాల కదలికలపై నిఘా పెంచాం. అన్ని రైళ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. దొంగలు కనిపిస్తే కాల్చేయమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలి. – ఎ.సుధాకర్, నెల్లూరు రైల్వే సీఐ -
నోషనల్ ఖాతాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు
నెల్లూరు రూరల్: జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో రైతుల భూములకు సంబంధించి రికార్డుల్లో నోషనల్ ఖాతాలుగా నమోదై, వివాదాలు లేని పట్టా భూములను రెగ్యులర్ ఖాతాగా మార్చేందుకు ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు డీఆర్వో ఉదయభాస్కర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాదారులు ఎవరైనా తమ భూములకు నోషనల్ ఖాతా నమోదైనట్లు ఉంటే వారు తగిన రికార్డులతో సంబంధిత తహసీల్దారు, ఆర్డీఓకు సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటితో పది జవాబుపత్రాల మూల్యాంకనం ముగింపు నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన పది పరీక్షలు 31వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 3 నుంచి ప్రారంభించి 9వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే సోషల్ సబ్జెక్ట్‌కు సంబంధించి జవాబు పత్రాలు జిల్లాకు ఆలస్యంగా వచ్చాయి. దీంతో పది మూల్యాంకనం గురువారం మధ్యాహ్నానికి పూర్తి చేయనున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 1,92,920 జవాబు పత్రాలను మూల్యాకనం చేశారు. మూల్యాకనంలో 1,076 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 174 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 348 మంది స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. పది ఫలితాలను ఈ నెల 15వ తేదీలోపు విడుదల చేసేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశా ఖాధికారులు చర్యలు ప్రారంభించారు. -
శ్రీవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
రాపూరు: మండలంలోని పెంలచకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వసంతోత్సవాలకు బుధవారం రాత్రి వేదపండితులు అంకురార్పణ చేశారు. శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. దేవస్థాన ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి మాట్లాడుతూ స్వామి వారికి వేసవి తాపాన్ని తగ్గించేందుకు చైత్రమాసం వసంత రుతువులో స్వామివారికి వసంతోత్సవాలు నిర్వహించడం ఆచారమన్నారు. శ్రీవారి వసంతోత్సవాలు విజయవంతమయ్యేందుకు వేదపండితులు నందనవనంలోని పుట్టమట్టిని తీసుకువచ్చి అందులో నవధాన్యలు కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం అనుజ్ఞ, విశ్వక్సేనారాదన, పుణ్యాహావచనం, రక్షాబంధనం, మత్సంగ్రహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అంకురార్పణ కార్యక్రమాన్ని తిలకించేదుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతలు వేధిస్తున్నారు
● సజ్జలకు వివరించిన రవీంద్రారెడ్డి సోమశిల: టీడీపీ నేతలు అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అనంతసాగరం మండల పరిధిలోని రేవూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త బోయిళ్ల రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని రవీంద్రారెడ్డి బుధవారం కలిశారు. ఏదో ఒక కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని రవీంద్రారెడ్డి చెప్పారు. ఈ విషయాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని సజ్జల భరోసా ఇచ్చారు. -
పెండింగ్ బిల్లులు సిద్ధం చేయండి
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: జిల్లాలో డ్వామా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి పెండింగ్ బిల్లుల వివరాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందింలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 2017–18, 2018–19 సంవత్సరాల కాలంలో డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కాంక్రీట్ పనులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, అప్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలపై కలెక్టర్ చర్చించారు. ఈ శాఖలకు సంబంధించి గతంలో చేపట్టిన పనులు, రివైజ్డ్ ఎస్టిమేట్లు, పెండింగ్ బిల్లుల పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రూ.38 కోట్ల నీటి తీరువా పన్నుల బకాయిలు ఉన్నాయని, సాగునీటి కాలువల పరిధిలోని నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు రైతులకు అవగాహన కల్పించి పన్నులు చెల్లించేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ దేశ్‌నాయక్, సోమశిల ఎస్ఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్‌కుమార్, డ్వామా పీడీ గంగాభవాని, ఈఈలు నాగరాజు, మల్లికార్జున, ఐ శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, డీఐ కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రిన్సిపల్స్‌తో సమావేశం నేడు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో గురువారం సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక డీకేడబ్ల్యూలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో కళాశాలల యూడైస్ ప్లస్ డేటా, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కళాశాలల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయడం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో ప్రవేశ పెడుతున్న సంస్కరణలు, అడ్మిషన్లు, అకడమిక్ షెడ్యూళ్లను అమలు చేయడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలన్నారు. డీసీపల్లిలో 405 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం 405 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలి పారు. వేలానికి 472 బేళ్లు రాగా వాటిలో 405 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 53285.5 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,39,64,286 వ్యాపారం జరిగింది. కిలోకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.230లుగా లభించింది. సగటున రూ.262.07 ధర నమోదైంది. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 కలిగిరి: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్ రైతులు 267 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 214 పొగాకు బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 53 బేళ్లను కొనుగోలుకు తిరస్కరించారు. వేలం నిర్వహాణాధికారి వి.మహేష్‌కుమార్ మాట్లాడుతూ కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.230, సగటున కిలోకు రూ.258.89 ధర లభించిందన్నారు. వేలంలో 10 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. మున్సిపాలిటీల్లో పార్కుల అభివృద్ధి ● మంత్రి నారాయణ నెల్లూరు సిటీ: గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పార్కులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మున్సిప ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఆధునికీకరించిన మహబూబ్‌ఖాన్ పార్కును బుధవారం నారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 23 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఆ లోపుగా నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న మంచినీటి వసతి సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను రూ.165 కోట్ల నిధులతో ఆరు నెలల లోపు పూర్తి చేస్తామన్నారు. ఉయ్యాల కాలువ, జాఫర్‌సాహెబ్ కాలువలకు ఇరువైపులా గోడలు నిర్మించి, స్లాబ్ వేసేందుకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం వీఆర్ హైస్కూల్ ఆధునికీకరణ పనులు మంత్రి నారాయణ పరిశీలించారు. వీఆర్ హైస్కూల్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసి రాబోవు విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, అదనపు కమినర్ నందన్, హెల్త్ ఆఫీసర్ చైతన్య, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. వాహనం ఢీకొని జింక మృతి వెంకటాచలం: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన ఘటన మండలంలోని సరస్వతీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. దాహార్తి కోసం రోడ్డు దాటుతున్న జింకను గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్లే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే జింక మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇద్దరు విద్యార్థుల డిబార్ వెంకటాచలం: వీఎస్‌యూ అనుబంధ కళాశాలల్లో బుధవారం నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని ఎగ్జామ్స్ నిర్వహణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. మొత్తం 8,464 మంది విద్యార్థులకు 7,940 మంది హాజరు కాగా 524 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. నెల్లూరు నగరంలోని వివేకనందా, జెనెక్స్ డిగ్రీ కళాశాలలకు చెందిన ఒక్కో విద్యార్థి డిబార్ అయ్యారని వివరించారు. -
తగ్గేదేలే.. ఆపేదేలే
జిల్లాకు భారీగా డంప్ అవుతున్న చికెన్ వ్యర్థాలు ‘ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా పాలు కల్తీ, చేపల చెరువుల్లో మేతగా వేసే చికెన్ వ్యర్థాల వినియోగంతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని సభ్యులు ప్రస్తావన తేవడంతో స్వయంగా అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.’ అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ఆదేశించినా జిల్లాలో మాత్రం కోళ్ల వ్యర్థాల మాఫియా మాత్రం తగ్గేదేలే అంటోంది. స్థానిక పోలీస్ అధికారుల సహకారంతో రెచ్చిపోతోంది. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వేసవి నేపథ్యంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ విజయన్ అన్నారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా సర్కిల్లో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసుల్ని మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. వేసవి నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురయితే వెంటనే మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక విద్యుత్ లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్రాన్స్ఫార్మర్స్ లోడ్ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను ముద్రిస్తున్నామని, ఫోన్‌పే, గూగుల్‌పేలో బిల్లులు చెల్లించే సౌకర్యం ఉందన్నారు. ఈ అవకాశం ప్రస్తుతానికి నెల్లూరు నగర విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉందన్నారు. అడిషనల్ లోడ్‌ను క్రమబ ద్ధీకరిస్తే 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. జూన్ 30వ తేదీ లోపు దీనిని వినియోగించుకోవాలని కోరారు. పెండింగ్ వ్యవసాయ సర్వీసుల మంజూరు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ విజయన్ -
కిలో పొగాకు గరిష్ట ధర రూ.280
కలిగిరి: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 365 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 300 పొగాకు బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 65 బేళ్లను కొనుగోలుకు తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి వి.మహేష్ కుమార్ మాట్లాడుతూ కిలో పొగాకుకు గరిష్ట ధర రూ. 280, కనిష్ట ధర రూ. 230 లభించగా, సగటున రూ.262.74 లభించిందన్నారు. వేలంలో 10 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఇద్దరు విద్యార్థుల డిబార్ వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) అనుబంధ కళాశాలల్లో మంగళవారం నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని వీఎస్‌యూ ఎగ్జామ్స్ నిర్వహణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. మొత్తం 7,961 మంది విద్యార్థులకు 7,410 మంది హాజరు కాగా, 551 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. రూ.300 కోట్ల సీ్త్రనిధి రుణాలు ● తక్కువ వడ్డీతో అందించేలా చర్యలు ● సీ్త్ర నిధి ఏజీఎం కామాక్షయ్య నెల్లూరు (పొగతోట): ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంత స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు తక్కువ వడ్డీతో రూ.300 కోట్ల మేర సీ్త్రనిధి రుణాలు అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు సీ్త్రనిధి ఏజీఎం కామాక్షయ్య తెలిపారు. మంగళవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో సీ్త్రనిధి పరపతి సహకార సమాఖ్య 19వ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఏజీఎం మాట్లాడుతూ పట్టణ ప్రాంత స్వయం సహాయక మహిళలు బకాయిలు అధికంగా ఉండడంతో సీ్త్రనిధి రుణాలు ఇవ్వడం నిలిపి వేశామన్నారు. ఈ నెల నుంచి తిరిగి సీ్త్రనిధి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీ్త్రనిధి రుణాలు దోహద పడతాయన్నారు. సున్నా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం ప్రభుత్వం దృిష్టిలో ఉందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేస్తే సీ్త్రనిధి రుణాలు వడ్డీ లేకుండా మంజూరు చే యడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు. క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించాలి● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్హాల్లో సబ్‌కలెక్టరు, ఆర్డీఓలు, మున్సిప ల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2019 అక్టోబర్ 10వ తేదీ కంటే ముందు భూమిని ఆక్రమించుకుని ఆర్సీసీ స్లాబు లేదా రేకులతో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉండేవారు ఆ ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేరుతో జారీ చేసి రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై అధికారులు అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని, భూ వివాదాలను ప్రతి నెల మొదటి శనివారం తహసీల్దారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొంత సమయం కేటాయించి పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో వేసవి కాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్‌కార్డులు లేక ఎటువంటి ప్రభుత్వ రాయితీలు పొందలేకపోతున్న ఎస్టీల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కె కార్తీక్, డీఆర్ఓ ఉదయభాస్కర్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్ఈలు విజయన్, వెంకటరమణ, అశోక్‌కుమార్, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
పీఎంజేఏవై కార్డులతో ఉచిత వైద్యం
నెల్లూరు(అర్బన్): 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీం (పీఎంజేఏవై), ఎన్టీఆర్ వైద్యసేవ సంయుక్త కార్యక్రమం ద్వారా సంవత్సరానికి రూ.5 లక్షల ఉచిత వైద్యం అందుతుందని ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లా మేనేజర్ వెంకట మురళితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కార్డు పొందేందుకు ఆదాయంతో పని లేదన్నారు. దేశంలో ఎక్కడైనా నెట్వర్క్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం పొందవచ్చన్నారు. కార్డులను పొందేందుకు క్షేత్రస్థాయిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఈకేవైసీ చేస్తున్నారన్నారు. ప్రజలు సహకరించి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. డబ్లూడబ్లూడబ్లూ.పీఎంజేఏవై, జీఓవీ.ఇన్ అనే వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ పథకంలో పేర్ల నమోదులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఈ స్కీంలోకి రారన్నారు. 70 ఏళ్లు నిండిన వారు కార్డులు తీసుకోవాలి ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ సుధీర్‌కుమార్ -
ఓటు వేస్తే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా చూడాలి
● హైకోర్టులో రిట్ పిటిషన్నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రోగ్రెస్ కార్డును, ఓటు హక్కు వినియోగించుకుంటే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు విజయమహల్ గేట్ సమీపంలోని వెంకటరామపురానికి చెందిన అలహరి వెంకటేశ్వర్లు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ తదితర 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. యాప్‌లో ఓటర్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేస్తే ఓటు వేసి ఉంటే ఫొటో డిస్ప్లే అయ్యేలా చూడాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచే మద్యాన్ని నిషేధించాలన్నారు. ఓటు హక్కు గురించి అవగాహన కల్పిస్తూ హైస్కూ ల్ స్థాయిలోనే పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.మిద్దైపె నుంచి పడివ్యక్తి మృతిసీతారామపురం: మండలంలోని గంగవరం గ్రామంలో చిన్న ఓబయ్య (48) అనే వ్యక్తి మిద్దైపె నుంచి కింద పడి మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రాత్రి ఓబయ్య నిద్రపోవడానికి మిద్దైపెకి వెళ్లాడు. మంగళవారం వేకువజామున మూత్రవిసర్జనకు వెళ్తూ ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి కింద పడి చనిపోయాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.యువతి అదృశ్యంనెల్లూరు(క్రైమ్): ఫోన్ ఎక్కువగా చూస్తున్నావని తల్లిదండ్రులు మందలించడంతో యువతి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. కిసాన్ నగర్లో సురేష్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది. అతడి కుమార్తె నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ఎక్కువగా ఫోన్ చూస్తుండటంతో ఇటీవల తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లోంచి వెళ్లిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు గాలించారు. జాడ తెలియకపోవడంతో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా తెలిపారు.పాముకాటుకువార్డు మెంబర్ బలిమనుబోలు: మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన వార్డు మెంబర్ వెంకటరమణమ్మ (40) పాముకాటుతో మంగళవారం మృతిచెందింది. స్థానికుల కథనం మేరకు.. కొమ్మలపూడి పంచాయతీ 7వ వార్డు మెంబర్ వెంకటరమణమ్మ తన భర్త ఆదిశేషయ్యతో కలిసి పొలం పనులకు వెళ్లింది. గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు లోనైన వెంకటరమణమ్మను చికిత్స నిమిత్తం బంధువులు నెల్లూరుకు తరలిస్తుండగా దారిలో మరణించింది. రమణమ్మ మృతితో దళితవాడలో విషాదం నెలకొంది. రమణమ్మకు కుమార్తె ప్రతిమ, కుమారుడు సతీష్ ఉన్నారు. -
50 నుంచి 100 కౌంట్ వరకు ఇతర దేశాలకు ఎగుమతులు
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ట్రంప్ సుంకం దెబ్బకు ధరలు భారీగా పతనం అమెరికాలో 20, 30, 40, 50 కౌంట్లకే మార్కెట్ టన్నుపై రూ.40 వేల నుంచి రూ.80 వేలు తగ్గింపు రొయ్య పిల్లల ధరలు, ఫీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు నిలకడగా ఉండేలా, ధర గిట్టుబాటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది జనవరిలో 30 కౌంట్ రొయ్య ధర కిలో రూ.600 వరకు ఉంది. తర్వాత క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.400 స్థాయికి చేరింది. సగటున కిలో రూ.200 తగ్గింది. 50 కౌంట్ రొయ్యలకు ఇప్పుడు రూ.300 మాత్రమే దక్కుతోంది. – సొలా మహేష్, ఆక్వా రైతు, అల్లూరు కావలి: జిల్లాలో ఆక్వాకు గడ్డు పరిస్థితులు ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం రొయ్యల ఎగుమతి ధరపై పడింది. 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.240 నుంచి రూ.200కి తగ్గిపోయింది. వాస్తవానికి అమెరికా ప్రజలు 50, 40, 30, 20 కౌంట్ ఉండే రొయ్యలను కొనడానికి ఇష్టపడతారు. ఆ కౌంట్లలోని రొయ్యలనే అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ట్రంప్ సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై కిలోకు రూ.40 నుంచి రూ.80 వరకు తగ్గించారు. టన్నుపై రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు ధరలు పతనమయ్యాయి. చైనా మార్కెట్‌పై దృష్టి అమెరికా సుంకాలను దృష్టిలో పెట్టుకుని 50 కౌంట్ కంటే తక్కువ కౌంట్ ఉన్న రొయ్యల కొనుగోలును ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, ఎగుమతిదారులు నిలిపివేశారు. 50 కౌంట్ కంటే ఎక్కువ కౌంట్ ఉన్న రొయ్యలకు ఇతర దేశాల్లోనూ మార్కెట్ ఉండడంతో ప్రధానంగా చైనా మార్కెట్‌పై ఎగుమతిదారులు దృష్టి పెట్టారు. కిలోకు 50, 60, 70, 80, 90, 100 కౌంట్ ఉన్న రొయ్యలను ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. కిలోకు 100 కౌంట్ రూ.240 ఉండగా రూ.200లకు తగ్గించారు. 60 కౌంట్ ధర రూ.330 ఉండగా రూ.250కు తగ్గించేశారు. 50 నుంచి 100 కౌంట్ ఉన్న రొయ్యలకు చైనా మార్కెట్లో డిమాండ్ ఉంది. ఏటా 2.25 లక్షల టన్నుల ఎగుమతి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 110 కి.మీ. సముద్ర తీరం వెంబడి ఉలవపాడు, గుడ్లూరు, కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు తదితర 9 మండలాల పరిధిలో 55,000 మంది మత్స్యకారులు సముద్రంలో వేట సాగిస్తున్నారు. 30,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. సముద్రం వేట ద్వారా లభించే రొయ్యలు, సాగు ద్వారా లభ్యమయ్యే రొయ్యలు వెరసి ఏటా 2.25 లక్షల టన్నులు ఎగుమతి అవుతాయని అంచనా. అమెరికా, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు, జపాన్ తదితర దేశాలకు జిల్లా నుంచి రొయ్యలు ఎగుమతులు అవుతుంటాయి. వైజాగ్, కృష్ణపట్నం, కాకినాడ, చైన్నె పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. జిల్లా పరిధిలో ఏడాదికి సుమారు 10 లక్షల టన్నుల మత్స్య సంపద వస్తుంటే, అందులో సుమారు 4 లక్షల టన్నులు స్థానికంగా విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన 6 లక్షల టన్నులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో చేపలు మాత్రం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ దెబ్బ.. మన రొయ్యకే అమెరికా మార్కెట్లో మన దేశం రొయ్యలతోపాటు ఈక్వెడార్ దేశం నుంచి వచ్చే రొయ్యలకే అత్యధిక డిమాండ్ ఉంది. అయితే మన దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే రొయ్యలపై 26 శాతం సుంకం విధించిన ట్రంప్ ఈక్వెడార్ దేశం నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై 10 శాతం మాత్రమే సుంకం విధించడం గమనార్హం. అమెరికా మార్కెట్లో మన దేశం రొయ్యల ధరలు అధికంగా ఉంటే, ఈక్వెడార్ దేశం రొయ్యలు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ఈ పరిణామంతో అమెరికా మార్కెట్ నుంచి మన దేశం రొయ్యలు కొనుగోలు చేసే పరిస్థితి తగ్గిపోతోంది. రొయ్యలుఆర్థికంగా చితికి పోతున్నాం అసలే ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఆక్వా రంగాన్ని అమెరికా సుంకం మరింత దెబ్బతీసింది. రొయ్యల ధరలు భారీగా పతనమయ్యాయి. మన దేశానికి సంబంధించి ఆక్వా ఉత్పత్తులు అమెరికాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. కానీ ఒక్క అమెరికా సుంకం సాకు చూపించి అన్ని కౌంట్లపై భారీగా ధరలు తగ్గించడంతో ఆక్వా రైతులు విలవిలలాడుతున్నారు. ప్రధానంగా అమెరికాలో భారత్‌తోపాటు ఈక్వెడార్ రొయ్యలకే డిమాండ్ ఉంది. మన దేశ ఉత్పత్తులపై 26 శాతం సుంకం విధిస్తుండగా, ఈక్వెడార్ ఉత్పత్తులపై 10 శాతమే సుంకం విధిస్తుండడం గమనార్హం. అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రొయ్యలకు సరైన ధర లభించకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నాం. ఫీడ్ ఖర్చు పెరిగింది. విద్యుత్ బిల్లులూ తడిసి మోపెడవుతున్నాయి. కిలో రొయ్యల ఉత్పత్తికి సగటున రూ.300 పెట్టుబడి అవుతుంది. అమ్మకం ద్వారా సగటున కిలోకు రూ.250 నుంచి రూ.270 మాత్రమే వస్తోంది. అంటే కిలోకు రూ.40 చొప్పున నష్టపోతున్నాం. మరో వైపు జనవరి నుంచి రొయ్యల ధరలు తగ్గాయి. – వెంకటేష్, ఆక్వా రైతు, అల్లూరు -
వంటింట్లో మోదీ మంట
సామాన్యుడి వంటింట్లో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ మంట పెట్టింది. కొన్ని రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం తాజాగా గృహ వినియోగదారులకు వాత పెట్టింది. పేద, సామాన్య కుటుంబాలకు గ్యాస్ ధర గుదిబండగా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడిపై మరో భారం పడింది. సీతారామపురం: కేంద్రం పేద, సామాన్య కుటుంబాల్లో గ్యాస్ మంటలు రేపింది. గృహ వినియోగ సిలిండర్ ధర రూ.840 ఉండగా తాజాగా కేంద్రం మరో రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై ఈ పెంపు మరింత భారం కానుంది. ఈ క్రమంలో ఉజ్వల పథకం లబ్ధిదారులను సైతం ప్రభుత్వం వదల్లేదు. వారికి కూడా ఈ పెంపు వర్తింప చేసింది. ఇకపై ప్రతి 15 రోజులకు లేదా నెలకోసారి ధరలపై సమీక్షిస్తామని ప్రకటించడంతో భవిష్యత్‌లో గ్యాస్ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇవ్వకనే ఇచ్చినట్లు అయింది. నెలకు రూ.3.92 కోట్లకు పైగా భారం జిల్లా వ్యాప్తంగా వినియోగదారులపై నెలకు రూ.3.92 కోట్ల మేర అదనపు బాదుడు పడనుంది. జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 7,87,484 గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో 2,616 మాత్రమే వాణిజ్య పరమైనవి. మిగిలిన 7,84,867 కనెక్షన్లకు ధరల పెంపు వర్తించనుంది. ఈ లెక్కన జిల్లాలోని వినియోగదారులపై రూ.3,92,43,350 అదనంగా భారం పడింది. ప్రస్తుతం జిల్లాలో గ్యాస్ సిలిండ ధర రూ.840 ఉండగా ఇకపై రూ.890 కానుంది. నిబంధనలకు విరుద్ధంగా రవాణా చార్జీల పేరుతో వసూలు చేస్తున్న మొత్తం అదనం కానుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజెన్సీల పరిధిలో ఐదు కి.మీ.లోపు అదే ధరకు వినియోగదారులకు ఇవ్వాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు. ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు జిల్లా ప్రజలపై నెలకు రూ.3.92 కోట్ల మేర అదనపు భారం ధరల పెంపుతో తప్పని తిప్పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను పెంచుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఒక వైపు కూరగాయల ధరలు భగ్గుమంటూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో, మరొక వైపు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు స్పందించి ధరలను అదుపు చేసి, పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – కోడె రమాదేవి, గృహిణి, పడమటి రొంపిదొడ్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు సామాన్య ప్రజలకు, మహిళలకు భారమవడమే గాక పేద, మధ్య తరగతి ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కొనలేని స్థితిలో ఉన్న గ్యాస్ సిలిండర్ ధర మరింత పెరగడం గృహిణులను ఆవేదనకు గురి చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ సిలిండర్ ధరలతోపాటు, నిత్యావసర సరుకుల ధరలను సైతం నియంత్రించాలి. – పిడుగు నీలవేణి గృహిణి, సీతారామపురం