Good News
-
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా..
ఉద్యోగపరంగా పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలకు సన్నద్ధమై రాశానని, గ్రూపు–2 స్టేట్ 11వ ర్యాంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా (yadadri bhuvanagiri district) మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. మోత్కూరుకు చెందిన గుర్రం మోహన్‌రెడ్డి స్వరాజ్యం దంపతులకు సాయికృష్ణారెడ్డి, సాయి సుప్రియ సంతానం. సామాన్య రైతు కుటుంబం. మోత్కూరులో కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు.మోత్కూరులోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్లో పదవ తరగతి వరకు, హైదరాబాద్ (Hyderabad) కొత్తపేట నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ పూర్తి చేశారు. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్, సీఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 ర్యాంకు సాధించి స్టేట్ లెవల్ 11వ ర్యాంకు పొందారు.సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పోస్టులు సాధించాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో 4 సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ స్టడీ హాల్‌కు వెళ్లి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా గ్రూపు పరీక్షలకు సిద్ధమై రాశాను. మా పెద్ద తాత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ప్రజాసేవ చేసిన గుర్రం యాదగిరిరెడ్డి (Gurram Yadagiri Reddy) స్ఫూర్తితో నేను రాజకీయాలు కాకుండా ఉద్యోగం ద్వారా పబ్లిక్ సేవ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలు రాస్తున్నాను. రూ.4 లక్షల ప్యాకేజీ జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చాను. ఇందులో ప్రధానంగా నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని అమ్మానాన్న పట్టుబట్టారు.చదవండి: అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాగ్రూప్–4 ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించాను. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్–3 పరీక్ష కూడా రాశాను. త్వరలో ఆ ఫలితాలు కూడా రానున్నాయి. మా చెల్లెలు సాయి సుప్రియ గ్రూపు–4 లో ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది’అని తెలిపారు. -
అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడ్ గ్రామం మాది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మా ప్రాంతంలో అవగాహన అంతంతే. నీళ్లు, నిధులు, నియామకాల అంశంపై సాగిన తెలంగాణ (Telangana) ఉద్యమంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలపై కొంత అవగాహన వచ్చింది.. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) సాధించొచ్చనే నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆరు ఉద్యోగాలు సాధించాను. పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించొచ్చు’ అని అంటున్నారు ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో మూడో ర్యాంక్ (Third Rank) సాధించిన బీర్‌దార్ మనోహర్‌రావు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పండరినాథ్ కీర్తనకారుడు. పండరిపూర్ విఠలేశ్వరుని కీర్తనలు, ప్రవచనాలు బోధిస్తారు. మా ఉజ్జంపహాడ్ గ్రామం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉటుంది. నా భార్య మనీష గృహిణి. కూతురు మనస్విని 3వ తరగతి, కొడుకు మహేశ్వర్ ఒకటో తరగతి చదువుతున్నారు. కుటుంబమంతా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. నేను నిత్యం హనుమాన్‌చాలీసా చదువుతాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కుల్చారం మండలం అంసాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేశాను. ఒక దాని తర్వాత మరోటి ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ కొలువులు ఆరు వచ్చాయి. గురుకుల పాఠశాలలకు సంబంధించి పీజీటీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు (State First Rank) వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌లో రెండో ర్యాంకు, 2016 గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో చేరా. కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో ఆ ఉద్యోగం మానేశా. తిరిగి స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరా. జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, తాజా గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు వచ్చింది. బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమక పత్రం అందుకున్నా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాను.డిప్యూటీ కలెక్టర్ కావాలని ఉంది రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో అత్యున్నతమైనది గ్రూప్–1. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించడమే నా ముందున్న లక్ష్యం. గ్రూప్–1 పరీక్షలు కూడా రాశాను. 430 మార్కులు వచ్చాయి. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడితే గ్రూప్–1 ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: గ్రూప్– 2 టాపర్ హరవర్ధన్రెడ్డిసిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితముండదు నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతానంటే కష్టం. సంబంధిత సబ్జెక్టు మరిచిపోకుండా కనీసం రెండు గంటలైనా చదవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. సిలబస్‌లో లేని అంశాలు చదివితే ఫలితం ఉండదు. పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమయం వృథా చేసుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత సమయం కలిసొస్తుంది. కనీసం 8 గంటలు చదవాలి. -
ఆ ఊళ్లు.. ‘రెండు కళ్లు’
‘మరణించిన వ్యక్తి నేత్రదానం చేయడం ద్వారా వారి కళ్లు జీవించే ఉంటాయి. మరణానంతరం కూడా మన కళ్లు మరో ప్రపంచాన్ని చూస్తాయి. మట్టిలో కలిసిపోయే ముందు మరొకరి జీవితంలో వెలుగు నింపితే.. వారి ఆనందాన్ని మన నయనాలు నింపుకుంటాయి’. అనే సిద్ధాంతంతో ఓ రిటైర్డ్ ఇంజనీరు మొదలెట్టిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్లలో మొదలైన నేత్రదాన ఉద్యమం.. పరకాల డివిజన్ సర్వాపూర్‌కు వ్యాప్తి చెందింది. సాక్షి ప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఈగా పనిచేసిన మండల రవీందర్ 12 ఏళ్ల క్రితం ముచ్చర్లలో నేత్రదాన ఉద్యమం మొదలెట్టారు. ‘అంధులకు కార్నియా ఆపరేషన్లు చేయడం ద్వారా కంటిచూపును ప్రసాదించవచ్చు’ అనే ఉద్దేశంతో చనిపోయిన వారి కళ్లతో సప్తవర్ణాలను చూపేందుకు ఆ రోజే బాటలు పడ్డాయి. ఒక్కరితో మొదలైన బృహత్కార్యంలో గ్రామస్తులు మనసారా భాగస్వాములయ్యారు. నేత్రదానం (Eye Donation) చేస్తామని ప్రతినబూని ముందుకు సాగుతున్నారు. మూడువేల పైచిలుకు జనాభా కలిగిన ముచ్చర్ల (వరంగల్ నగర పాలక సంస్థలో విలీనమైంది)లో ఇప్పటివరకు 46 మంది నేత్రదానం చేశారు. ముచ్చర్ల బాటలో సర్వాపూర్ హనుమకొండ జిల్లా కేంద్రానికి 23.2 కి.మీ. దూరంలో ఉన్న చిన్న గ్రామం సర్వాపూర్‌కు నేత్రదాన ఉద్యమం పాకింది. 630 మంది జనాభా ఉన్న ఆ గ్రామం పరకాల డివిజన్ నడికుడ మండలం కిందకు వస్తుంది. ముచ్చర్లకు చెందిన మండల రవీందర్‌కు బావ వరుసైన తాజా మాజీ వార్డు సభ్యుడు భోగి రాములు నేత్రదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టగా.. సర్వాపూర్ గ్రామస్తులు సైతం సై అన్నారు. సర్వాపూర్‌లో రెండేళ్లలో 12 మంది నేత్రదానం చేయగా.. మరో 8 మంది హామీ పత్రాలు ఇచ్చినట్లు గ్రామస్తులు చెప్పారు. చదవండి: అపురూపాల మంత్రపురిలయన్స్ క్లబ్ హనుమకొండ, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ (వరంగల్)కు సమాచారం ఇస్తే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ నిపుణులు నేత్రాలను స్వీకరిస్తున్నారు. ముచ్చర్లను ఆదర్శంగా తీసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలూ అదేబాటను అనుసరించారు. మృతిచెందిన 15 మంది కళ్లను దానం చేసేందుకు ఆయా గ్రామాల్లో వారి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. పెంబర్తి, నాగారం, పలివేల్పుల, భీమారం, పెగడపల్లి, జమ్మికుంట, బావుపేటలో నేత్రదానంపై అవగాహన సదస్సులు ఉధృతంగా సాగుతున్నాయి.సామాజిక బాధ్యత కూడా.. మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు ఇచ్చిన వారమవుతామని అవగాహన కల్పిస్తూ నేత్రదాన ఉద్యమం చేస్తున్నాం. ఈ మహత్కార్యం సామాజిక బాధ్యత కూడా. మా తల్లిదండ్రుల నేత్రదానం ద్వారా మిగతా వాళ్లలో కూడా అవగాహన కల్పిస్తున్నాం. చాలా పల్లెలకు ఈ ఉద్యమం పాకడం సంతోషంగా ఉంది. – మండల రవీందర్, ఉపాధ్యక్షుడు, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ మా ఆయన కళ్లు దానం చేసినం.. మా ఆయన భోగి కొమురమల్లు (92) రెండేళ్ల కింద చనిపోయిండు. మా ఊళ్లోనే ఉండే భోగి రాములు, ఇంకొంత మంది కళ్ల దానం గురించి చెప్పిండ్రు. ఇంట్లోళ్లం మాట్లాడుకుని కళ్లు వట్టిగ మట్టిల పోవుడు ఎందుకని దానం చేసినం. మా ఊళ్లో ఎవరు చనిపోయినా కళ్లను దానం చేస్తమని ముందుకు వస్త్రను. – భోగి సమ్మమ్మ, సర్వాపూర్ -
అన్నదాత మెచ్చిన రైతుబిడ్డ
పొలాలే బడులుగా రైతులకు సరికొత్త వ్యవసాయ పాఠాలు చెబుతుంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండలంలోని రామవరం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో) కరంటోతు శ్రీలత. ఆమె పాఠాలు వృథా పోలేదు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత నుంచి మల్చింగ్ (mulching) పద్ధతిలో కూరగాయల సాగు వరకు ఎన్నో విషయాలను అవగాహన చేసుకొని కొత్తదారిలో ప్రయాణిస్తున్నారు అన్నదాతలు...అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన శ్రీలతకు ఏఈవో ఉద్యోగం వచ్చినప్పుడు ‘నాకు ఉద్యోగం వచ్చింది’ అనే సంతోషం కంటే ‘ఈ ఉద్యోగం వల్ల ఎంతోమంది రైతులకు సహాయంగా నిలబడవచ్చు’ అనే సంతోషమే ఎక్కువ. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీలతకు రైతుల కష్టాలు, నష్టాలు తెలియనివేమీ కాదు. సాగులో మెలకువలు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. అయితే మెలకువలు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్ల కాదు... అవగాహన లేకపోవడం వల్లే జరుగుతోందని గ్రహించిన శ్రీలత రంగంలోకి దిగింది.ఆమె పొలం దగ్గరికి వస్తే ఎక్కడి నుంచో అగ్రికల్చరల్ ఆఫీసర్ (Agriculture Officer) వచ్చినట్లు ఉండదు. తెలిసిన వ్యక్తో, చుట్టాలమ్మాయో వచ్చినట్లుగా ఉంటుంది. ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకుంటుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీలత కూడా రైతుగా మారిపోతుంది. తానే స్వయంగా ట్రాక్టర్‌తో వరి పొలం దున్నుతుంది. వరిలో కాలిబాటల ప్రయోజనాల గురించి చెబుతుంది. ఎరువులు ఎంత మోతాదులో చల్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను తెలుసుకుంటూ, వాటిని తన క్లస్టర్ పరిధిలోని రామవరం, గండిపల్లి, కుందన్‌వానిపల్లి, మైసమ్మవాగు తండా రైతులకు చెబుతుంటుంది. రసాయనిక మందుల వినియోగం లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేసే విధంగా రైతులనుప్రోత్సహిస్తోంది. గిరిజన గ్రామాల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేసేలా చేస్తోంది. చదవండి: చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులప్రాధాన్యత గురించి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాదు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక వీడియోను తయారు చేసింది. జీవ ఎరువుల వినియోగంపై కూడా ప్రత్యేక వీడియోను తయారు చేసి రైతులకు అవగాహన కలిగిస్తోంది.క్షేత్రస్థాయిలోకి...రైతు అంటే నా దృష్టిలో ఒక పొలానికి యజమాని మాత్రమే కాదు... మన ఇంటి వ్యక్తి. మనకు అన్నం పెట్టే అన్నదాత. రైతుకు మంచి జరిగితే లోకానికి మంచి జరిగనట్లే. నా ఉద్యోగం ద్వారా రైతులకు ఏదో రకంగా మేలు చేసే సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీలత – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట– మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట -
‘సాక్షి’ కలిపింది ఈ ఇద్దరినీ...
రామచంద్రాపురం(పటాన్చెరు): తన చిన్న నాటి స్నేహితుడిని చూడాలని ఉందంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించిన మనోగతాన్ని గతేడాది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రచురించింది. ఆ కథనమే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయి మిత్రుడి ఆచూకీ తెలిసేలా చేసింది. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆ ఇద్దరు మిత్రులు ప్రత్యక్షంగా కలుసుకుని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆగస్టు నెలలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’దిన పత్రికతో 39ఏళ్లుగా తన బాల్యమిత్రుడి కోసం చేస్తున్న అన్వేషణ గురించి వివరించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్న సమయంలో తన బాల్యమిత్రుడైన ఎం.ఆనంద్ గురించి తెలిపారు. అతడిని ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఆ కథనం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైంది. ఆ కథనాన్ని స్నేహితులకు, ఇతర వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దానిని చూసిన ఆయన స్వగ్రామానికి చెందిన స్నేహితులు సైతం అన్వేషణ మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఎం.ఆనంద్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు గుర్తించి అతడిని చిరునామా తెలుసుకున్నారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి సంక్రాంతి పండుగ రోజున తన బాల్యమిత్రుడు ఆనంద్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘సాక్షి’లో వచ్చిన కథనం తన బాల్యమిత్రుడిని కలిసేలా చేసిందని, పత్రికతో పాటు అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత తన బాల్యమిత్రుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..
సాక్షి, హైదరాబాద్: వరదల నుంచి 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు ఒకటి.. కొబ్బరికాయ ముడుపు కడితే వీసాలు ప్రసాదించేది మరో చెట్టు.. చేతులెత్తి మొక్కితే మొండి రోగాలను కూడా నయం చేస్తుందని భక్తులు నమ్మేది ఇంకో చెట్టు.. దోపిడీ దొంగల్ని పట్టించిన మరొక చెట్టు.. ఇలా రాష్ట్రంలో దేనికవే ప్రత్యేకమైన 9 పురాతన వృక్షాలున్నాయి. ఈ చెట్ల పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ‘వట’ ఫౌండేషన్.. ఆయా వృక్షాలకు వారసత్వ సంపద గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దేశంలోని పురాతన చెట్ల చరిత్రను డాక్యుమెంట్ చేయాలనే లక్ష్యంతో ‘వట’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కృష్ణ ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సుమారు 27 వేల కి.మీ. ప్రయాణించారు. అతి పురాతన చెట్లను గుర్తించి, వాటిని గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 150 వృక్షాలను మ్యాపింగ్ చేశారు. మనుగడ కోల్పోయే దశలో ఉన్న వృక్షాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సంస్థలు దత్తత తీసుకోవాలని కోరారు.తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..దొంగల్ని పట్టించిన బావోబాబ్..హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో 600 ఏళ్ల నాటి పురాతన బావోబాబ్ చెట్టు ఉంది. గోల్కొండ కోట గోడను ఆనుకొని ఉన్న ఈ వృక్షపు కాండం ఒక రహస్య గది మాదిరిగా ఉంటుంది. ఇందులో 20 మంది దాక్కునేంత కుహరం ఉంది. దీంతో దొంగలు పగటి పూట ఈ రహస్య గదిలో దాక్కొని రాత్రి సమయంలో కోట పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారు. ఒకరోజు దొంగలు వంట చేస్తుండగా చెట్టు వెనక నుంచి పొగలు రావడం స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని సైనికులకు తెలపడంతోదొంగల గుట్టురట్టయింది.వరదల నుంచి కాపాడిన చింత..ఉస్మానియా ఆసుపత్రిలో చింత చెట్టు ఉంది. 1908, సెప్టెంబర్ 28న మూసీ నది వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దాదాపు 30 వేల మంది మరణించారు. ఆ సమయంలో ప్రాణాలు రక్షించుకునేందుకు 150 మంది ప్రజలు ఈ చింత చెట్టు ఎక్కి రెండు రోజుల పాటు కొమ్మలపైనే ఉన్నారు. ప్రతీ ఏడాది నవంబర్ 30న హాస్పిటల్ డేను ఈ చెట్టు కిందే ఆసుపత్రి సిబ్బందిజరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.చెట్టుకు రాఖీ..నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని చీమ చింత చెట్టు భారీ వర్షానికి నేల కూలింది. 2017లో స్కూల్ యాజమాన్యంతో కలిసి ‘వట’ ఫౌండేషన్ దీనికి తిరిగి జీవం పోసింది. భారీ క్రేన్ సహాయంతో ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. అప్పటినుంచి ఏటా జూన్ 28న విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టకు రాఖీ కడుతూ పండగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.వేయి ఉరుల మర్రి నిర్మల్‌లోని వేయి ఉరుల మర్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రామ్‌జీ గోండు నాయకత్వంలో స్వయంపాలన ప్రకటించుకున్న గిరిజనులను బ్రిటిష్ పాలకులు దారుణంగా అణచివేశారు. రామ్‌జీ గోండును, అతని వేయి మంది సైన్యాన్ని పట్టుకొని ఈ మర్రి చెట్టుకు1860 ఏప్రిల్ 9న అందరినీ ఒకేసారి ఉరి తీసినట్లు జాన పధ కథల్లో చెబుతుంటారు. అందుకే ఈ చెట్టును ‘వెయ్యి ఉరుల మర్రి’గా పిలుస్తుంటారు. అయితే కాలక్రమేణా ఈ వృక్షం నరికివేతకు గురి కావడంతో ఇక్కడ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.రోగాలు మాన్పించే వృక్షం..చేవెళ్లలోని దామరిగిద్దలోఉన్న చింత చెట్టు 600 ఏళ్ల నాటిది.ఈ పురాతన చింత చెట్టుకు ఒక బొరియఉంటుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లలుఈ బొరియ గుండా వెళితే రోగం నయమవుతుందని గ్రామస్తుల విశ్వాసం.పర్యాటక పిల్లలమర్రి..మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి సుమారు 800 ఏళ్ల నాటి భారీ వృక్షం. ఒకప్పుడు 4 ఎకరాల్లో విస్తరించి ఉండేది. కానీ, ఆక్రమణ కారణంగా ప్రస్తుతం 2.5 ఎకరాలకు పరిమితమైపోయింది. ఈ చెట్టును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. భారీ కొమ్మలతో విశాలంగా విస్తరించి ఉండటంతో ఈ ప్రాంతానికే పిల్లల మర్రి అనే పేరు వచ్చింది. వేల కొద్ది మర్రి ఊడల కారణంగా ప్రధాన కాండం ఏదో స్పష్టంగా గుర్తించలేం.వీసాలు ప్రసాదించే మర్రి హిమాయత్‌సాగర్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం ఎలాగైతే వీసా గాడ్‌కు పేరు గాంచిందో.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లోని మర్రి చెట్టు కూడా వీసాల చెట్టుగా గుర్తింపు పొందింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, కార్మికులు ఎరుపు లేదా తెలుపు రంగు గుడ్డలో కొబ్బరికాయ కట్టి ఈ చెట్టుకు ముడుపు కడితే వీసా వస్తుందని స్థానికుల విశ్వాసం. అయితే వడగళ్ల వర్షం కారణంగా ఈ భారీ వృక్షం నెలకొరిగింది. చుట్టుపక్కల నివాసితులకు ముప్పుగా మారడంతో గ్రామస్తులు వృక్షంలోని ఎక్కువ భాగాన్ని నరికివేశారు. కేవలం 15 అడుగుల వరకు విస్తరించి ఉన్న భారీ కాండం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. జహీరాబాద్‌లోని గొట్టిగారిపల్లి గ్రామంలోని చెరువు పక్కన ఉన్న మర్రి చెట్టు, నిజామాబాద్‌లోని ఆర్గుల్ గ్రామంలోనిఒక కొండపై ఉన్న మూడు పురాతన చింత చెట్లు కూడావందల ఏళ్ల నాటి వృక్షాలే. చారిత్రక గుర్తింపుతో ఆయావృక్షాలు పర్యాటకలను ఆకర్షిస్తున్నాయి. -
ఇది కదా అసలైన ప్రేమంటే..
కర్నూలు (టౌన్): కర్నూలు అబ్బాయికి జపాన్ అమ్మాయికి ప్రేమ చిగురించింది. ఇరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లితో సుఖాంతమైంది. కర్నూలు నగర శివారులోని లక్ష్మీపురంలో ఎతిక్స్ హోమ్స్‌లో కోరకోల కిషోర్‌కుమార్, కడపటింటి ప్రేమమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడు కొరకోల కీర్తి కుమార్ ముంబై ఐఐటీలో చదువుకున్నాడు. మూడేళ్ల క్రితం జపాన్‌లో అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇతనికి అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న టోక్యో పట్టణానికి చెందిన మట్ సుమోటో రియోకో, మట్ సుమోటో తఢాక దంపతుల కూతురు మట్ సుమోంటో రింకతో పరిచయం ఏర్పడింది. మూడున్నరేళ్ల వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. రింక అబ్బాయిని తన తండ్రికి పరిచయం చేసింది.ఇరు కుటుంబాలు అంగీకరించడంతో శనివారం కర్నూలులోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చిలో పెళ్లి తంతు నిర్వహించారు. చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి -
కంప్యూటర్ కమాండర్.. సిద్ధార్థ
తెనాలి: ఈ చిన్నోడు సామాన్యుడు కాదు. కంప్యూటర్ లాంగ్వేజెస్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దిట్ట. కంప్యూటర్ సైంటిస్టులకే పాఠాలు చెబుతాడు. ఐఐటీ విద్యార్థులకు (IIT Students) రోల్ మోడల్. కంప్యూటర్ ప్రపంచం మెచ్చిన డేటా సైంటిస్ట్ (Data Scientist). పన్నెండేళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేసిన ఘనుడు. ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన డేటా సైంటిస్ట్‌గా గూగుల్‌తోనే చెప్పించుకున్న తెనాలి చిన్నోడు. పేరు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ (Siddharth Srivastav Pilli). ఇప్పుడు వయస్సు 17 ఏళ్లు. చదువుతున్నది ఇంటర్మిడియట్ ద్వితీయ సంవత్సరం. హైదరాబాద్ ఐఐటీలో (Hyderabad IIT) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగానూ పని చేస్తున్నాడు. వారంలో మూడు రోజులు చదువు.. మూడు రోజులు ఉద్యోగం. ఏడో తరగతి నుంచి ఇదే పని. చిన్నప్పటి నుంచే కంప్యూటర్‌పై పట్టు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో సిద్ధార్థకు చిన్నతనం నుంచీ కంప్యూటర్‌పై బలమైన అభిరుచి కలిగింది. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్పించారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు.సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులూ చేయటంతో ఆత్మవిశ్వాసం కలిగింది. అప్పుడే ఉద్యోగం చేస్తానని తండ్రితో చెప్పాడు. తండ్రి పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మరింత పరిజ్ఞానం కోసం తండ్రి అతడిని ఓ కంప్యూటర్ సంస్థలో చేర్చాలని తీసుకెళ్లగా.. బాలుడన్న కారణంతో చేర్చుకోలేదు. దీంతో తండ్రి ఆన్లైన్ కోర్సుల్లో చేర్పించారు. ఇలా వీడియోలు చూస్తూ స్వయంగా అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై గట్టి పట్టు సాధించాడు. ఉద్యోగ సాధన ఉద్యోగం చేస్తానని మరోసారి చెప్పినా భారత్‌లో సాధ్యం కాదని తండ్రి చెప్పేశారు. పట్టువదలని సిద్ధార్థ తనే ఓ రెజ్యూమె తయారు చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడుతూనే.. వయసు, చదువు తక్కువన్న భావనతో పట్టించుకోలేదు. సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసిన మోంటెగ్న్ కంపెనీ సీఈవో ‘నీతో వండర్స్ చేయిస్తా’ అంటూ ఉద్యోగం ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగకూడదని తండ్రి షరతు విధించడంతో మూడు రోజులు ఉద్యోగానికి ఓకే చేశారు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు.కొద్దికాలంలోనే అదే హోదాతో మరో సంస్థకు మారాడు. నెలకు రూ.45 వేల వేతనంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేశాడు. మూడురోజులు స్కూలుకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులూ నిర్వహించాడీ బాల మేధావి. అవార్డులు, అవకాశాలు.. సిద్ధార్థ ప్రతిభను గుర్తించిన బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ బుడతడిని స్వయంగా ఆహ్వానించి భూకంపాలను ముందుగానే గుర్తించే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును అప్పగించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌లోనే గటిక్ కాలేజిలో ఇంటర్లో చేరాడు. మరోవైపు అక్కడి ట్రిపుల్ ఐటీలో రీసెర్చ్ ఇంజినీరుగానూ పరిశోధన కొనసాగించాడు. ఇంకోవైపు కోడింగ్ క్లాసులూ చెబుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేయసాగాడు. ఇవన్నీ గమనించిన ఐఐటీ–హైదరాబాద్ అతడికి ఆర్టిఫిషియల్ ఇంజినీరుగా ఉద్యోగాన్నిచ్చింది.చదవండి: అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’ప్రస్తుతం సిద్థార్థ ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూనే.. ఏడాదిగా ఐఐటీలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల శాంసంగ్ కంపెనీ జాతీయస్థాయిలో నిర్వహించిన ‘సాల్వ్ ఫర్ టుమారో’ పోటీలో టాప్ టెన్‌లో ఒకడిగా వచ్చాడు. కృత్రిమ మేధలో అతడి నవీన ఆలోచన అందులో ఎంపికైందని సిద్థార్థ తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. 2022–23లో ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డునూ సిద్ధార్థ అందుకున్నాడు. ‘సాక్షి’ మీడియా చైర్పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. జాతీయస్థాయి న్యూస్ ఛానల్స్ ఇతని ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి.ఇదే లక్ష్యం.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవిత చరిత్రలు, బిల్ గేట్స్ మాటలు, స్టీవ్ జాబ్స్ పనితీరుతో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నట్టు సిద్ధార్థ చెప్పాడు. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండాలని, మంచి గేమ్ డిజైన్ చేయాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా చేస్తానని, వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్‌కు రూపకల్పన చేయాలనే ఆశయంతో ప్రతి క్షణం కష్టపడుతున్నట్టు తెలిపాడు. -
25న పేదింటి యువతి వివాహం
ఎలిగేడు(పెద్దపల్లి): ఓ పేదింటి యువతి వివాహం ఈనెల 25న నిశ్చయం కాగా.. చేతిలో చిల్లి గవ్వ లేక దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన చీకటి లక్ష్మి–కీ.శే.రామస్వామిల చిన్న కూతురు ప్రత్యూష వివాహం నరసింహులపల్లి గ్రామానికి చెందిన బుర్ర సతీశ్‌తో ఈనెల 25న బుధవారం జరగనుంది. ప్రత్యూష తండ్రి రామస్వామి పేగు క్యాన్సర్‌తో పదేళ్ల క్రితం మృతిచెందగా.. తల్లి లక్ష్మికి మతిస్థిమితం సరిగా లేదు. అన్న, వదినలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు. వీరి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యూషను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన పెళ్లి కుమారుడు ఆదర్శంగా నిలిచాడు. ఐతే పెళ్లికి కనీసం పుస్తెలు, మట్టెలు, పెళ్లి కానుకలు, ఖర్చులకు చిల్లి గవ్వ లేక ఆ కుటుంబం దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.ఇదీ చదవండి: సొంత తమ్ముడే సూత్రధారి! -
కూతురు పుట్టిందని.. సెల్ఫోన్లు పంచిపెట్టారు!
సారంగాపూర్: కూతురు పుట్టడంతో.. మహాలక్ష్మి పుట్టిందని ఆ దంపతులు సంబరపడ్డారు. తమ సంతోషాన్ని పదిమందితో పంచుకోవాలని సంకల్పించారు. ఈ మేరకు వారు సోమవారం గ్రామంలోని 25 మంది ఆటో డ్రైవర్లకు రూ.3.5 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు బహూకరించారు. మరో 1,500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దీనికి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ వేదికగా మారింది. గ్రామానికి చెందిన ఓగుల అజయ్, అనీల దంపతులకు 18 రోజుల క్రితం కూతురు జన్మించింది. దీంతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆ సంతోషంతో గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు (1,500 మంది మహిళలకు) ఇటీవల చీరలు పంపిణీ చేశారు. తాజాగా ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కటి రూ.14 వేల విలువైన సెల్‌ఫోన్ అందజేశారు.అజయ్ పెళ్లికి ముందు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.30 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. తరువాత స్వదేశానికి వచ్చిన ఆయన.. శ్రీకృష్ణ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుకు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, ఆలయాల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. చదవండి: ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు -
క్యూలైన్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఇదే క్రమాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు. అక్కడ అందరితోపాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. వార్డుమెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.చదవండి: హీరో ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ వద్దు -
వీల్‌చెయిర్ మోటార్బైక్గా మారిపోతే..!
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్... ఎలా పిలిచినా అంగవైకల్యం అనేది జీవితంలో ఎంతో పెద్ద లోటు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా కష్టమే. వైకల్యాన్ని జయించేందుకు ఎంతో మనోస్థయిర్యం అవసరం. వికలాంగుల కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. వికలాంగుల వీల్ చెయిర్‌ను మోటార్బైక్గా మార్చే ఈ టెక్నాలజీ ఓ కొత్త స్టార్టప్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు 5,200 బైకులు కొనుగోలు చేశారని సమాచారం.‘నియోమోషన్’ మోటర్బైక్కొద్ది రోజుల క్రితం జొమాటో డెలివరీ పార్ట్నర్ సయ్యద్ షహజాద్ అలీ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మోటార్బైక్గా మారిపోయిన ఓ వీల్‌చెయిర్‌లో అలీ దిలాసాగా కూర్చుని ఉన్నాడు. ‘‘వైకల్యమనేదే లేదు.. మనం చేయాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అయితే మనం అంకితభావంతో కృషిచేయాలంతే’’ అని అలీ అంటున్నాడు. ఈ కొత్త వీల్చెయిర్బైక్ కి ఆయన ‘నియోమోషన్’ అని పేరుపెట్టాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమి అలీ చెప్పాడు. ఈ వినూత్న సృష్టి.. వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అంటున్నాడు.వైకల్యం ఓ పెద్ద సవాలు.. ఈ వాహనాన్ని తయారుచేసిన ఫౌండర్లలో ఒకరైన సిద్ధార్ధ్ డాగా మాట్లాడుతూ ‘‘నియోమోషన్ వికలాంగుల జీవితాలను సమూలంగా మార్చివేయబోతోంది’’ అన్నారు. నియోమోషన్ ప్రయాణం ఐఐటీ మద్రాస్‌లో ప్రారంభమైంది. ఫైనల్ ఇయర్లో ఉండగా డాగా, ఇంకా ఆయన స్నేహితులను వారి ప్రొఫెసర్ డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ చాలా ప్రభావితం చేశారు. డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ టిటికె సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ విభాగం చూసేవారు. వైకల్యాన్ని అధిగమించే పరికరాలపై వారు చాలా పరిశోధనలు చేసేవారు. ముందు డాగా మిత్రబృందానికి అప్పగించిన పనేమిటంటే... స్విమ్మింగ్‌పూల్‌లో వికలాంగులు సురక్షితంగా దిగడం, బైటకు రావడం, వ్యాయామంగా ఈతను ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలను పరిశీలించమన్నారు. వికలాంగులు ఎదుర్కొనే అనేక సవాళ్లను ఇది వారి కళ్లకు కట్టింది.సౌకర్యవంతంగా.. దృఢంగా..ఆ అనుభవం నుంచే ఈ నియోమోషన్ (వీల్‌చెయిర్ వాహనం) ఐడియా వారికి వచ్చింది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజైన్. మార్కెట్లో దొరికే వీల్చెయిర్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. వైకల్యం ఉన్నవారికి అందరికీ ఒకే రకమైన వీల్‌చెయిర్ పనిచేయదు. కానీ ఈ నియోమోషన్ వీల్‌చెయిర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.గంటకు 50 కి.మీ ప్రయాణంనియోమోషన్ నిజానికి నియోఫ్లై అనే వీల్ చెయిర్, నియోబోల్ట్ అనే మోటార్బైక్గా ఉపయోగపడే పరికరం రెండింటి సమ్మేళనం. నియోబోల్ట్ అనేది లిథియం–అయాన్ బ్యాటరీతో నడిచే విద్యుత్ పరికరం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే 50 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్ కూడా ఉంది.నాణ్యత ఎక్కువ..ధర తక్కువ..అయితే ఎన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నా వికలాంగులకు అందుబాటు ధరలో ఉంటేనే ఉపయోగం. ఎక్కువమంది ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకునే సాధ్యమైనంత తక్కువ ధరకు లభించేలా.. అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నియోమోషన్ను తయారు చేసినట్టు డాగా వివరించారు. ప్రస్తుతం నియోమోషన్ రూ.1,10,000కు లభిస్తోంది. అంతర్జాతీయంగా ఇలాంటి పరికరాలతో పోలిస్తే ఇందులో సౌకర్యాలు ఎక్కువ అని, ధర చాలా తక్కువని డాగా వివరించారు. -
వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!
‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ధర్మతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఒక కాలు సహకరించకపోయినా తాను కల కన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఆటలపై ఆసక్తి పెంచుకున్న కోటేశ్వర్ వీల్ ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నేటి యువతలో క్రీడా స్పూర్తిని నింపుతున్నాడు...నేరేడుగొమ్ములోని గిరిజన హాస్టల్లో ఉండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, దేవరకొండలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సీటీలో పీజీ చేస్తున్న సమయంలో వీల్‌ఛైర్ స్పోర్ట్స్‌లో కోటేశ్వర్ నాయక్ ప్రతిభను కోచ్ గ్యావిన్స్ సోహెల్ ఖాన్ గుర్తించాడు. వీల్‌ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చాడు. గురువు ఇచ్చిన శిక్షణతో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న కోటేశ్వర్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.మెరుగైన ప్రదర్శనతో 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన కోటేశ్వర్ పట్టాయ (థాయ్‌లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్ షిప్లో మన దేశం తరుపున బరిలో దిగాడు. 2022లో నోయిడాలో వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022లో పోర్చుగల్ జరిగిన వీల్ ఛైర్ హాండ్‌బాల్ యూరోపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒక మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2023లో ఏసియా కప్ పోటీలు నేపాల్‌లోని ఖాట్మాండులో జరిగాయి. అందులో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: సెలబ్రిటీలు మెచ్చిన స్టార్గ్వాలియర్లో ఈనెల 9 నుంచి 15 వరకు జరిగిన వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ నాలుగో నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కెప్టెన్ గా కోటేశ్వర్ నేతృత్వంలోని టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కోటేశ్వర్ కెప్టెన్సీలో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.ఒలింపిక్స్ నా లక్ష్యంఒలింపిక్స్లో మన దేశం తరపున ఆడి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇందుకు నిరంతర సాధన, కఠోర శ్రమ అవసరం. దీనికి తోడు పోటీలో రాణించాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వీల్‌ఛైర్ అవసరం తప్పనిసరి. దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి. – కోటేశ్వర్ నాయక్ – చింతకింది గణేష్, సాక్షి, నల్లగొండ -
ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’
స్పెయిన్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో 210 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది జాడ తెలియకుండా పోయారు. ఒక్క వలెన్సియాలోనే 155 మంది చనిపోయారు. సునామీ స్థాయిలో సంభవించిన తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక పనులకు చేపట్టింది. వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించింది. వరదలతో దెబ్బతిన్న వలెన్సియా నగర వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న ప్రజలు..సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో శుక్రవారం వలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కల్చరల్ కాంప్లెక్స్ ఆవరణ కిక్కిరిసిపోయిందిలా..! స్పెయిన్‌ను వణికించిన వరదలుభారీ వర్షంతో ఆకస్మికంగా సంభవించిన వరదలతో స్పెయిన్ అతలాకుతలమైంది. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. తద్వారా భారీ సంఖ్యలో కుటుంబాలు వీధిన పడ్డాయి. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక భారీ వరదలకు మృత్యువాత పడ్డ వారి సంఖ్య 210కి చేరింది. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీయగా, శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు.. గల్లంతు అయిన వారి కోసం బంధువులు పడే ఆందోళనలతో ఎక్కడ చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. -
ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుల తల్లి సుమలతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఫీజు చెల్లించి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీల కూతురు కాట్రోత్ సుమలతకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులతో కూలి పనులకు వెళ్తోందని బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలీ పనులకు’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుమలత, ఆమె తండ్రి శివరాంను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. సుమలత చదువుకు ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్య కళాశాలకు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఇతర ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. సుమలత ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాగా చదివి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రికి సుమలత తండ్రి శివరాం కృతజ్ఞతలు తెలిపారు. సాయం చేస్తే డాక్టర్ అవుతా..బీహెచ్ఎంఎస్ సీటు సాధించిన పేద విద్యార్థి సంతోష్‌కుమార్ ఫీజు కట్టలేని స్థితిలో దాతల చేయూత కోసం ఎదురుచూపు అనంతగిరి: డాక్టర్ కావాలనుకుంటున్న ఆ విద్యార్థి కలకు పేదరికం అడ్డుపడుతోంది. మనసున్న దాతలు ఎవరైనా ఆర్థికంగా చేయూతనందిస్తే.. భవిష్యత్‌లో సమాజ సేవకు పాటుపడతానని చెబుతున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద చెల్మెడ గ్రామానికి చెందిన సంతోష్.. వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివి, 959 మార్కులు సాధించాడు. నీట్‌లోనూ ఉత్తమ ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని రామంతాపూర్ జేఎస్పీఎస్ హోమియో మెడికల్ కాలేజీలో బీహెచ్ఎంఎస్ (బ్యాచ్‌లర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసన్ అండ్ సర్జరీ) సీటు వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఫీజు, వసతి కోసం నవంబర్ 2న లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. అనారోగ్యం బారిన పడిన తండ్రి అశోక్ 11 నెలల క్రితం మృతిచెందగా.. తల్లి పుష్పమ్మ కూలి పనులు చేస్తోంది. తండ్రి మరణంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఫీజు కట్టే స్తోమత లేదని సంతోష్ వాపోతున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు సెల్ నంబర్ 9963870085లో సంప్రదించాలని కోరాడు.చదవండి: ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడుగోండు కళాకారుడికి అవార్డు జైనూర్ (ఆసిఫాబాద్): ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపేలా దండారీ ఉత్సవాల చిత్రాన్ని గీసిన ఆదివాసీ కళాకారుడు మడావి ఆనంద్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా బుధవారం అవార్డు అందుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన మడావి ఆనంద్‌రావు చిత్రకళలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో 13 రోజులుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సంప్రదాయ చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ఆనంద్‌రావు గుస్సాడీ నృత్యాలకు సంబంధించిన చిత్రం గీసి అవార్డు అందుకున్నారు. -
ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడు
మంచిర్యాల జిల్లా( జన్నారం): కష్టపడి చదివితే ఉద్యోగాల సాధన కష్టమేమీ కాదని నిరూపిస్తున్నారు నస్పూరి సంతోష్. ఆయన ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు సాధించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రా మానికి చెందిన రైతు నస్పూరి లచ్చన్న, రాజవ్వ దంప తుల కుమారుడు సంతోష్ పదో తరగతి వరకు తపాల పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. బీఈడీ రాయలసీమ యూనివర్సిటీలో పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డాడు.2023లో రైల్వేలో ఉద్యోగాల ప్రకటన రావడంతో పరీక్షలు రాసి పాయింట్‌మెన్ ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే ఈ ఏడాది గురు కు ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఏకంగా టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యో గాలు సాధించారు. వాటిలో చేరకుండా టీజీపీఎస్సీ వేసిన నోటిఫికేషన్లో జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని చదివారు. ఈ నెల 27న ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. తనను కష్టపడి చదివించిన అమ్మనాన్నల ఆశీర్వాదంతోనే ఇన్ని ఉద్యోగాలు సాధించానని సంతోష్ తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న సంతోష్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగంలో చేరుతానని వెల్లడించారు.చదవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం! -
పేదరికాన్ని అధిగమించి ఉద్యోగం సాధించిన గొర్రెల కాపరి కుమార్తె
వజ్రపుకొత్తూరు: తండ్రి గొర్రెల కాపరి.. కుటుంబానిది అతి సామాన్య నేపథ్యం.. అయినా ఆమె కల లు కనడం మానలేదు. ఎన్ని అడ్డు గోడలు ఉన్నా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టింది. అన్నింటినీ దాటుకుని 19 ఏళ్ల వయసులోనే నేవీ ఉద్యోగం సాధించింది వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన బందాపు శ్రీనిధి. ఆమె సాధించిన ఈ విజయం స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. ఇదీ నేపథ్యం.. శ్రీనిధి తండ్రి బందాపు తేజేశ్వరరావు గొర్రెల కాపరి(పెద్ద కోనారి). తల్లి గౌరి గృహిణి. చెల్లి శ్రీజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదు వుతోంది. శ్రీనిధి మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఆమె పెదనాన్న బందాపు గణపతిరావు ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వహించడం చూసి ఆయనను స్ఫూర్తిగా తీసుకుంది. బాబాయ్ బందాపు తిరుమలరావు ప్రోత్సాహంతో నేవీలో కొలువు సాధించాలని కలలు కన్నది. నేవీ కొలువు అంటే చదువులోనే కాదు శారీరకంగా కూడా చురుగ్గా ఉండాలి. ప్రతి రోజూవెంకటాపురం – పర్లాకిమిడి రహదారిపై పరుగులో సాధన చేసేది. పుష్అప్స్, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇతర ఎక్స్‌ర్‌సైజ్‌లు చేసేది. ఏదైనా సాధిస్తేనే సమాజంలో గౌరవం అని గమనించి పట్టుదలలో ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందింది. ఇటీవల విడుదలైన ఆలిండియా మెరిట్ జాబితాలో ఎంపికై నవంబరు 11న ఒడిశాలోని చిలకలో శిక్షణ తీసుకోనుంది. మరో ఉద్యోగానికి చేరువలో... జూలై 2024లో సీబీటీ పరీక్షలో అర్హత సాధించిన శ్రీనిధి విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ శాతవాహనలో ఆగస్టు 2024లో జరిగిన ఫిజికల్, మెడికల్ పరీక్షల్లో విజేతగా నిలిచింది. పరీక్షల ఫలితాలు ఈ నెలలో విడుదలై నేవీలో జీడీ (ఎస్ఎస్ఆర్) ఉద్యోగానికి ఎంపికైంది. మరో పక్క ఏప్రిల్ 30, 2024న విశాఖపట్నంలోనే జరిగిన ఉమెన్ మిటరీ పోలీస్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ ఉద్యోగానికి కూడా చేరువైంది. నా కాళ్లపై నేను నిలబడాలి నా కాళ్లపై నేను నిలబడాలి. దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో నేవీ ఉద్యోగం సాధించాను. మాది చాలా సాధారణ కుటుంబం. ఏదైనా సాధిస్తేనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అలాగే ఒకే చోట ఉండిపోకూడదు. లక్ష్యం ఏర్పాటు చేసు కుని ప్రతి రోజూ సాధన చేయాలి. మా పెదనాన్న భారత సైన్యంలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆయన నిత్యం ప్రోత్సహించే వారు. మా బాబాయ్ తిరుమల నిత్యం నా వెన్ను తట్టి లక్ష్యం వైపు పయనించేలా సహకరించారు. ఈ విజయం వారికే అంకితం. – బందాపు శ్రీనిధి -
ఉర్దూ టీచర్.. ఈ తెలుగమ్మాయి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్లో చదువుకుంది.ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం. మాస్టారైన గొర్రెల కాపరి.. భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు.పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజా మాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.చదవండి: మీరే మా వారధులు: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్ పట్టుపట్టి.. కొలువు కొట్టి రేగోడ్(మెదక్): ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఓ గిరిజన బిడ్డ. మండలంలోని కాకంచ తండాకు చెందిన రవికుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా జిల్లా మొదటి ర్యాంకు సాధించి బుధవారం నియామకపత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. తన పన్నెండేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పాడు. తన ఇంట్లో పలువురు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. నాన్నకు ప్రేమతో.. రేగోడ్(మెదక్): నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా కావాలన్న కల నెరవేరిందని స్కూల్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందుకున్న జిల్లా మొదటి ర్యాంకు ఉపాధ్యాయుడు రేగోడ్ గ్రామానికి చెందిన మహేశ్ తెలిపారు. 2018లో ఉద్యోగం రాలేదని, పట్టు వదలకుండా చదివి ప్రస్తుతం సాధించానని ఆనందం వ్యక్తం చేశాడు. -
యువత కోసం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకం
న్యూఢిల్లీ: యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చి0ది. ఏటా రూ.66,000 మేర ఆర్థికసాయం అందించనుంది. ఐదేళ్లకాలంలో మొత్తంగా కోటి మంది 21–24 ఏళ్ల యువత ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారని కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.800 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ రెండో తేదీన ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా 1,25,000 మంది లబి్ధపొందే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే యువతకు బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే pminternship.mca.gov.inలో యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.6,000 అదనం నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 ఆర్థికసాయం అందనుంది. దీనికి అదనంగా ఏడాదిలో ఒకసారి రూ.6,000 గ్రాంట్ ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి ప్రతి లబ్ధి దారుడు రూ. 66,000 లబ్ధి పొందనున్నారు. ఈ వెబ్‌పోర్టల్‌లో అక్టోబర్ 12వ తేదీ నుంచి 25వ తేదీలోపు అందుబాటులో ఉన్న సమాచారంతో దరఖాస్తులను నింపొచ్చు. వీటిని అక్టోబర్ 26వ తేదీన షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత అభ్యర్థులను అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీలోపు కంపెనీలు ఎంపిక చేస్తాయి. ఎంపికైన అభ్యర్థు లు తమ నిర్ణయాన్ని నవంబర్ 8–15ల మధ్య తెలపాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా మూడు ఆఫర్స్ ఇస్తారు. టాప్ 500 కంపెనీల ఎంపిక గత మూడేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధి పథకంలో భాగంగా తమ నికరలాభాల్లో కొంతమేర సమాజసేవ కోసం సవ్యంగా ఖర్చుచేసిన టాప్ 500 కంపెనీలను ఈ పథకం కోసం కేంద్రం ఎంపికచేస్తుంది. రిజర్వేషన్లూ వర్తిస్తాయి! అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లనూ వర్తింపజేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అలెంబిక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు 1,077 ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గుడ్‌న్యూస్.. వరద బాధితులకు ఉచితంగా ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. ఇలాంటి వారికి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు/ డూప్లికేట్ సర్టిఫికెట్లు అందించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించినట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృతికా శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐవోలు, డీఐఈవోలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.పదో తరగతి హిందీ సిలబస్ కుదింపుసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లను ప్రభుత్వం స్టేట్ సిలబస్‌లోకి మార్చిన నేపథ్యంలో ఆయా స్కూళల్లో సిలబస్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హిందీ సిలబస్ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని చాప్టర్లను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్కూళ్ల విద్యార్థులకు జూన్– జూలై సిలబస్‌తో ఎఫ్ఏ–1 హిందీ నమూనా పరీక్షను మంగళవారం పూర్తి చేశామని తెలిపారు. అలాగే, కొత్త విధివిధానాల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు హిందీ సిలబస్ అధికంగా ఉన్నందున పద్యభాగ్–7 (ఆత్మత్రాణ్), గద్యభాగ్–11 (తీసరీ కసమ్ కే వశల్ పకార్ శేలేంద్ర), గద్యభాగ్–12 (అబ్ కహా దూస్రోంకే దుఖ్ సే దుఖీ హోనీవాలీ), ఉపవాచక్–3 (టోపీ శుక్లా) పాఠాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదలతాడేపల్లిరూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యావిధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సులకు మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
9న టీచర్ నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2024 కింద ఎంపికయ్యే ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దసరా నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు 65 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని.. విద్యను పేదవాడి ముంగిటకు చేర్చడ మే ధ్యేయంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.తమ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. డీఎస్సీ రాసిన వారి మెరిట్ జాబితాల్లోంచి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తామని.. ఆ జాబితాలను జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి పంపుతామని సీఎం చెప్పారు. అక్కడ తుది ఎంపిక జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. అదీ 7,857 మంది టీచర్లనే నియమించిందని పేర్కొన్నారు. అదే తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పది నెలల్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేశామని చెప్పారు. ఉపాధ్యాయులంటే.. ఓ భావోద్వేగం ఉపాధ్యాయులు అంటే ఉద్యోగి కాదని, ఓ భావోద్వేగమని సీఎం అభివర్ణించారు. కీలకమైన ఈ రంగం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యా రంగానికి భవిష్యత్‌లో మరిన్ని నిధులు ఇస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రా«ధాన్యమిస్తామని ప్రకటించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, వివాదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించామని సీఎం తెలిపారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని చేపడుతున్నామని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.గత పదేళ్లు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ బడులను కొనసాగిస్తామని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తాము జాతీయ నూతన విద్యా విధానం కన్నా.. రాష్ట్ర విద్యా విధానంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తు మ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. -
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
కంగ్రాట్స్.. నిర్మల!
కర్నూలు కల్చరల్/ఆదోని రూరల్: నిర్మల పోరాట యోధురాలుని, ఆ అమ్మాయి దృఢ సంకల్పం, పోరాట పటిమకు సెల్యూట్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రశంసించారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్‌తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిర్మలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బైపీసీ గ్రూప్‌లు ఉన్న 8 కేజీబీవీల్లో నిర్మల టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె నిర్మల గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలకు నిర్మల రోల్‌మోడల్, స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో చదువుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకొని ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతోందన్నారు. విద్యతోనే సాధికారత లభిస్తుందని ఆడపిల్లలు చదువుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కింద నిర్మలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ఇంచార్జ్ ఐసీడీఎస్ పీడీని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థిని ఖాతాలో ఇన్సెంటివ్ జమ చేయడం వల్ల ఇంటర్ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పైచదువులు చదువుకోడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్ చేయించాలని ఆదేశించారు. నిర్మల సాధించిన ప్రగతి గురించి అందరికి తెలిసేలా సమావేశం నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మలను శాలువాతో సన్మానించి స్వీట్స్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి జీవితంలో అనేక విజయాలు సాధించాలని సూచించారు. బైపీసీలో 421 మార్కులు సాధించిన నిర్మలతో జిల్ల్లా కలెక్టర్ సృజన, ఇతర అధికారులు కలెక్టర్ చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను.. గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివి 537 మార్కులు సాధించానని, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో చదువు వద్దని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే తనకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని నిర్మల తెలిపారు. ఈ విషయం ప్రతికల్లో ప్రచురితమై కలెక్టర్ దృష్టికి వెళ్లడం, కలెక్టర్ మేడం వెంటనే స్పందించి కేజీబీవీలో అడ్మిషన్ ఇప్పించారన్నారు. ఈరోజు ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేజీబీవీల్లో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాఽశాఖాధికారి శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ విజయ జ్యోతి, ఇన్‌ఛార్జి ఐసీడీఎస్ పీడీ వెంకట లక్ష్మమ్మ, జీసీడీవో సునీత, కేజీబీవీ ఎస్ఓ శరన్‌స్మైలీ, ఆదోని ఎంఈఓ–2 శ్రీనివాసులు, విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు పాల్గొన్నారు. -
తట్టుపల్లి టు ఢిల్లీ..
కురవి: ఆ విద్యార్థి.. హోమియోపతి వైద్య విద్యనభ్యసిస్తూ మెదడుకు పదును పెట్టాడు.. మిత్రులకన్నా ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చాటుకోవాలనే తపన మొదలైంది. గైడ్‌టీచర్ సహకారంతో నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాడు.. ఎంచుకున్న తన గ్రంథాన్ని పూర్తి చేశాడు.. ఏకంగా రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డును అందుకునే గౌరవం పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లికి చెందిన జంగం సామ్రాజ్యం, రవి దంపతుల కుమారుడు లోహిత్ సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ హోమియోపతి మెడికల్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. షార్ట్‌టర్మ్ స్టూడెంట్‌షిప్ ఇన్ హోమియోపతి విభాగంలో ఆరు నెలలుగా ‘ఆగ్రో హోమియోపతి’ అనే అంశంపై రీసెర్చ్ చేస్తున్నాడు. గైడ్ టీచర్ శ్రీవిద్య సూచనల మేరకు లోహిత్.. రీసెర్చ్ పూర్తి చేశాడు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హోమియోపతి ఆధ్వర్యంలో లోహిత్ గ్రంథానికి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ హోమియోపతి డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతులమీదుగా ఈనెల 10, 11 తేదీల్లో ఢిల్లీలో లోహిత్ అవార్డు అందుకోనున్నాడు. కాగా, ఈ అవార్డు తన తల్లిదండ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, భవిష్యత్‌లో వైద్య విద్యకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులు రూపొందిస్తానని లోహిత్ తెలిపారు. తన కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆనందం కలిగించిందని రవి తెలిపారు. లోహిత్‌కు అవార్డు రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
శభాష్...రేణుక!
పుట్లూరు: రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించక చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం యల్లనూరుకు వెళ్తున్న ఓ మహిళ బైక్‌పై నుంచి జారి పడి మృతి చెందింది. తాడిపత్రి–యల్లనూరు ప్రధాన రోడ్డుపై శనగలగూడూరు వద్ద స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఆ గ్రామ వలంటీర్ రేణుక గమనించింది. ప్రమాదాలను నివారించడానికి తనవంతు ప్రయత్నం చేసింది. తెల్ల పెయింట్‌తో స్లో అని ఆంగ్లంలో అక్షరాలు రాయడంతో పాటు స్పీడ్ బ్రేకర్ కనిపించేలా సూచిక ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శభాష్ రేణుక అని అభినందిస్తున్నారు. -
‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ ఆవిష్కరణ
మణికొండ: పద్నాలుగు ఏళ్ల బాలిక.. కవిత్వాలతో కూడిన పుస్తకం రాయడం అభినందనీయమని ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. కోకాపేట జయభేరి పీక్‌లో ఆదివారం సాయంత్రం ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ కవితా పుస్తకాన్ని ఆయనతో పాటు సైంట్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఏఎస్సీఐ చైర్మన్ కె.పద్మనాభయ్య ఆవిష్కరించారు. ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుతున్న సంజన సోమవరపు ఈ పుస్కకాన్ని రచించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పుస్తకంలోని కవిత్వం కౌమార భావోద్వేగాలు సమ్మిళితమై ఉన్నాయన్నారు. అనంతరం సంజన మాట్లాడుతూ.. తన తాత, రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరిప్రసాద్ నుంచి కవిత్వం రాయాలన్న ప్రేరణ కలిగిందన్నారు. పుస్తకాన్ని తన ఉపాధ్యాయురాలు రోసలిండ్, తన తాతకు అంకితం చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో సంజన తల్లితండ్రులు రేఖ, శశితో వారి పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు. -
NRI: పల్లె నుంచి ప్రపంచస్థాయికి.. కరీంనగర్ వాసి!
కరీంనగర్: తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన ఎన్ఆర్ఐ తన టాలెంట్‌తో విశ్వవేదికపై మరోమారు మెరిశాడు. ఫోర్బ్స్ జాబితాలో అఫీషియల్ ఎగ్జిక్యూటీవ్‌గా స్థానం పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా 160కిపైగా విద్యా విషయక జర్నల్స్ రాసినందుకు ఈ గుర్తింపు లభించింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రకటించింది. చిన్న గ్రామం నుంచి అగ్రరాజ్యానికి.. మక్తపల్లికి చెందిన చింతం రాములు–కనకలక్ష్మి దంపతుల కుమారుడు చింతం నరేందర్. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలో పూర్తిచేశాడు. ఉన్నత విద్య ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ కరీంనగర్లో చదివాడు. 2007లో హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్‌గా కెరీర్.. చదువు పూర్తయిన తర్వాత నరేందర్ బెంగళూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. తర్వాత వత్తిరీత్యా అమెరికా, ఇటలీ, జర్మనీ, లండన్, స్కాట్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పనిచేసి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్‌గా గుర్తింపు పొందాడు. 2015 నుంచి అమెరికాలో స్థిరపడ్డాడు. రీసెర్చ్ పేటెంట్లు.. అమెరికా వెళ్లిన తర్వాత నరేందర్ 55 కీలక అంశాలపై రీసెర్చ్ చేసి ఇన్నోవేటివ్ పేటెంట్లు పబ్లిష్ చేశాడు. తర్వాత ప్రపంచస్థాయి కాన్ఫరెన్సులకు కీనోట్ స్పీకర్‌గా వ్యవహరించాడు. 11 ప్రపంచస్థాయి జర్నల్ సంస్థలకు చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తూ సుమారు 160 ప్రపంచస్థాయి జర్నల్ ప్రచురించాడు. అనేక విద్యాసంస్థల టెక్నికల్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నాడు. నరేందర్‌ను ప్రశంసిస్తూ వచ్చిన లేఖ పత్రం, నరేందర్‌కు వచ్చిన నేషన్ అవార్డు కేంబ్రిడ్జి నుంచి డాక్టరేట్.. నరేందర్ రీసెర్చ్ జర్నల్స్‌ను గుర్తించిన ప్రపంచంలోని అత్యున్నతమైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇటీవల చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా అందజేసింది. అతి తక్కువ సమయంలోనే కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో సీనియర్ ఎంటర్‌ఫ్రైస్ ఆర్కిటెక్ట్ స్థానం సంపాదించాడు. అనేక ఇన్నోవేటివ్ జర్నల్స్ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జర్నల్‌లో అఫీషియల్ ఎక్జిక్యూటీవ్‌గా స్థానం సంపాదించాడు. పిల్లర్ ఆఫ్ ది నేషన్ పురస్కారం! ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నరేందర్‌కు పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రదానం చేసింది. ఈమేరకు స్పీకర్ శ్రీరాం నివాస్‌గోయల్ ఇటీవల అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈమేరకు నరేందర్‌ను ప్రశంసిస్తూ లేఖ కూడా పంపించారు. గ్రామంలో సంబరాలు.. తమ ఊరి యువకుడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మక్తపల్లిలో నరేందర్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు సంబురాలు చేసుకున్నారు. నరేందర్ తల్లిదండ్రులు అందరికీ మిఠాయిలు పంచారు. -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
తండా యువకుడు ఇప్పుడు సివిల్ జడ్జి
హొసపేటె: విజయనగరం జిల్లా కేంద్రం హొసపేటె నుంచి 40 కిలోమీటర్ల దూరంలో హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని ఆనేకల్ తండాకు చెందిన ఎన్.విజయ్‌కుమార్ ఇప్పుడు సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. దీంతో ఆనేకల్ తండాలో ఆనందం నెలకొంది. అవును, భారతరత్న బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం తనను జడ్జి పరీక్ష రాయడానికి ప్రేరేపించింది. దీంతో ప్రేరణ పొంది పట్టుదలతో పరీక్ష రాసి మూడో ప్రయత్నంలో విజయం సాధించిన ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆనేకల్ తండాకు చెందిన బీ.నారాయణ నాయక్, మంజుల దంపతుల కుమారుడు విజయ్‌కుమార్ తండాలోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 10వ తరగతి వరకు వల్లభాపురలోని మొరార్జీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివారు. హగరిబొమ్మనహళ్లిలోని గంగావతి భీమప్ప కళాశాలలో పీయూసీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన బళ్లారిలోని వీఎస్ఆర్ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీలో ఉత్తీర్ణత సాధించారు. మూడుసార్లు న్యాయమూర్తి పరీక్షకు హాజరయ్యారు. ఈసారి పరీక్షలో ఉత్తీర్ణుడై న్యాయమూర్తిగా ఎదిగారు. ఆనేకల్ తండాలో 1,200 ఇళ్లు ఉన్నాయి. తండాలో నలుగురు న్యాయవాదులు ఉన్నారు. జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో తమ పిల్లలను బాగా చదివించేందుకు మరింత చైతన్యం నింపారని తాండా వాసులు తెలిపారు. ప -
సీహెచ్ఓ యామినీకి జాతీయ అవార్డు
లబ్బీపేట(విజయవాడతూర్పు): గ్రామీణ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు గాను కృష్ణాజిల్లా వణుకూరు–2 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్(వెల్నెస్ సెంటర్)లో కమ్యునిటీహెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)గా పనిచేస్తున్న మంత్రిప్రగడ యామినీకి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి జాతీయ అవార్డు లభించింది. ఈ నెల 8న న్యూఢిల్లీలో నిర్వహించిన సుశృత అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా హెల్త్‌కేర్ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 53 మందికి కేంద్ర ప్రభుత్వం సుశృత అవార్డులు అందజేయగా, మన రాష్ట్రం నుంచి యామిని ఒక్కరే ఈ అవార్డును అందుకున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లో మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)/కమ్యూనిటీహెల్త్ ఆఫీసర్(సీహెచ్ఓ) కేటగిరిలో ఈ అవార్డు వరించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు అధునాతన భవన నిర్మాణాలు చేపట్టింది. దీంతో ఇప్పటికే ఆమె పనిచేస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు నేషనల్ క్వాలిటీ ఎస్యురెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేషన్(ఎన్‌క్యూఏఎస్‌ఎస్) లభించింది. ఇప్పుడు అదే సెంటర్లో పనిచేస్తున్న సీహెచ్‌ఓకు జాతీయ గుర్తింపు లభించింది. -
ఆ తల్లికి ముగ్గురు ‘సరస్వతులు’
ఆమెకు ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భర్త విడిచిపెట్టాడు. అయినా, ఆమె కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. వచ్చిన కూలిడబ్బులతో పిల్లలను సాకింది. ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు కుమార్తెలను చేర్పించింది. చదువు విలువ తెలియజేసింది. తల్లి కష్టాన్ని కుమార్తెలు గుర్తించారు. చదువులో రాణించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వేళ పెద్దల అండదండలతో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికకాగా, మరొకరు పీహెచ్డీ చేస్తున్నారు. అమ్మనమ్మకాన్ని గెలిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. శృంగవరపుకోట: శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని. వీరిని విడిచి తండ్రి వెళ్లిపోయాడు. బంగారమ్మే కంటికి రెప్పలా సాకింది. భవన నిర్మాణ పనులు చేస్తూ వచ్చిన కూలి డబ్బులతో చదువులు చెప్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ వరకూ చదివిన 2వ కుమార్తె రేవతిని ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో చదువు మానిపంచాలనుకుంది. టెన్త్‌లో అత్యంత ప్రతిభ చూపిన రేవతికి స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్.సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ లో ప్రవేశం కలి ్పంచారు. అత్యధిక మార్కులు సాధిస్తే భవిష్యత్‌లో కోరిన చదువుకు తనే ఖర్చు భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. రేవతి ఇంటరీ్మడియట్‌లో 984 మార్కులు సాధించింది. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. 2019లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భర్తీచేసిన సచివాలయ ఉద్యోగాల్లో ధర్మవరం సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పోస్టు సాధించింది. అంతటితో వదిలేయకుండా ఏపీపీఎస్సీ పరీక్షలకు సాధన చేసింది. 2023 ఆగస్టులో పరీక్ష రాసింది. నవంబర్‌లో విడుదలైన ఫలితాల్లో విజయం సాధించింది. రేవతికి ప్రస్తుతం జోన్–1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం రేవతి అక్క సరస్వతి ఏలూరులో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తుండగా, చెల్లెలు పావని పీహెచ్డీ చేస్తోంది. ముగ్గురు అమ్మాయిలు చదువులో రాణించడంతో తల్లి బంగారమ్మ సంతోషపడుతోంది. పిల్లలు సాధిస్తున్న విజయాలతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. -
నాడు సర్పంచ్.. నేడు న్యాయమూర్తి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన కర్రి సంతోషలక్ష్మి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సంతోషలక్ష్మి ఇదివరకు సర్పంచ్‌గా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత న్యాయ శాస్త్రం చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే న్యాయమూర్తి కావాలన్న ఆశయంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్త దువ్వాడ వెంకటకుమార్ చౌదరి ప్రోత్సాహంతో ఆమె విజయం సాధించారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడంపై అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వ వీసీ హనుమంతు లజపతిరాయ్, రాజ్యలక్ష్మి, పీఎసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, సర్పంచ్ దువ్వాడ పద్మావతి, ఎంపీటీసీ బమ్మిడి రాజ్యలక్ష్మి, బి.మోహన్‌రావు, దువ్వాడ జయరాం చౌదరి తదితరులు అభినందనలు తెలియజేశారు. -
సూర్య ప్రసాద్‌కు ప్రధాని మోదీ అభినందన
పరిగి: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న ఏపీఆర్ఎస్ కొడిగెనహళ్లి విద్యార్థి రాగే సూర్య ప్రసాద్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ఢిల్లీలో అభినందించారు. ఏపీఆర్ఎస్ కొడిగెనహళ్లిలో 5వ తరగతి చదువుతున్న రాగే సూర్య ప్రసాద్, గతేడాది కిలిమంజారోతో పాటు లద్దాఖ్‌లోని దక్షిణ పుల్లు పర్వతాన్ని అధిరోహించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపిక చేసింది. ఈనెల 22న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు అందజేశారు. 23వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ సూర్యప్రసాద్‌తో పాటు రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపికైన బాలలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సూర్యప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమ పాఠశాల విద్యార్థికి జాతీయ స్థాయి అవార్డు దక్కడం సంతోషంగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్, ఉపాధ్యాయులు అన్నారు. -
బిడ్డ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
అసోం సీఎస్‌గా సిక్కోలు వాసి
శ్రీకాకుళం: సిక్కోలు వాసికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది అసోం ప్రభుత్వం సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి కోత రవి అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. అస్సాం కేడర్ 1993 బ్యాచ్‌కు చెందిన రవి.. గతంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం అస్సాం ప్రభుత్వంలో 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. రవి పనితీరును గుర్తించిన అసోం ప్రభుత్వం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలఖారులో రవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. -
బీకామ్ బ్యాచ్.. పెద్ద సందడి..
అమలాపురం రూరల్: అసలే పెద్ద పండగ. వారంతా పూర్వ విద్యార్థులు. 28 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఇంతకన్నా పెద్ద సందర్భం ఏముంటుంది వారి అల్లరికి? 1993–96 అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల బీకాం బ్యాచ్ వారంతా. చదివింది బీకాం అయినా కామ్‌గా ఉండే బ్యాచ్ కాదది. అటువంటి వారంతా ఆదివారం ఆ కళాశాలలో సమావేశమయ్యారు. కలసిన సమయం అంతా నాటి అల్లర్లలోకి, సరదా కబుర్లలో మునిగి తేలిపోయారు. హైదరాబాద్ జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్ ఈ బ్యాచ్‌లో సభ్యుడే. వారికి తోడు సినీ హీరో నాగార్జున వీడియో ద్వారా తన సందేశాన్ని విద్యార్థులకు పంపుతూ వారి కలయికను అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మా నిమ్మకాయల ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారని నాగార్జున ఆ వీడియోలో ప్రస్తావించారు. దాదాపు 120 మందితో కూడి ఆ బ్యాచ్ కుటుంబ సమేతంగా ఎంతో సందడి చేశారు. వారికి పాఠాలు చెప్పిన అప్పటి అధ్యాపకులు డాక్టర్ పైడిపాల, కనకరాజు, వక్కలంక కృష్ణమోహన్ తదితరులను సాదరంగా ఆహ్వానించి పాదాభివందనాలు చేసి సన్మానించారు. పూర్వపు విద్యార్థులు మున్సిపల్ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్, పిండి శేషు, నల్లా శ్రీధర్, సాపే శ్రీనివాస్ (హైదరాబాద్), కుమారి (గుజరాత్), చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు పూర్వపు విద్యార్థులను సమీకరించి ఈ వేడుకకు ఏర్పాటుచేశారు. చివరగా తమ జ్ఞాపకాలను వారు పదిలం చేసుకుంటూ గ్రూప్ ఫోటో దిగారు. -
ఎందరు ఏమన్నా.. ఎస్ఐ కాబోతున్న భాను!
కరుడు కట్టిన ‘ఖాకీవనం’లోకి అడుగుపెట్టడానికి చాలా మంది యువకులు వెనకడుగు వేస్తారు. కేసులు, కోర్టులు, నేరస్తులతో బెంబేలెత్తిపోతారు. అయితే, ఆత్మవిశ్వాసమే వెన్నుదన్నుగా, అకుంఠిత దీక్షతో భానుప్రసన్న ధైర్యంగా అడుగుపెడుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ర్యాంకు సాధించి పోలీసు డిపార్ట్మెంట్లో చేరాలన్న చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. మార్టూరు: ‘ఆడపిల్లవు నీవు ఎస్ఐ అవుతావా ? ఎందుకమ్మా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోక ! ’ అంటూ అయిన వారి హేళన మాటల్ని ఆమె చాలెంజ్‌గా తీసుకుంది. అనుకున్నది సాధించింది. విజయానికి అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవని నిరూపించింది. అకుంఠిత దీక్ష, పట్టుదలలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచింది బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన శివరాత్రి భాను ప్రసన్న. స్థానిక బీసీ కాలనీకి చెందిన శివరాత్రి శ్రీనివాసరావు, గంగమ్మ దంపతులు తమకున్న ఒకటిన్నర ఎకరా వ్యవసాయ భూమి సాగు చేసుకుంటూ చిన్నపాటి బడ్డీ కొట్టును నడుపుకుంటున్నారు. ఇద్దరు కుమార్తెలను చదివించుకున్నారు. పెద్ద కుమార్తె భాను ప్రసన్న జొన్నతాళి గ్రామంలోని ప్రభుత్వ యూపీ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, మార్టూరు కాకతీయ విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత నర్సరావుపేట కృష్ణవేణి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నిమిత్తం చేరింది. పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించాలనే చిన్ననాటి కల సాకారం కోసం ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. బీటెక్ పూర్తి చేశాక లక్ష్యాన్ని మరింత విస్తృత పరచుకుంది. ఎస్ఐ కావాలనే తలంపుతో ప్రయత్నాలు ప్రారంభించింది. పెళ్లి తన కెరీర్‌కు అడ్డంకిగా మారకూడదని భావించి తల్లిదండ్రులను ఒప్పించింది. చెల్లెలు కోమలికి ముందుగా వివాహం జరిపించింది భాను ప్రసన్న. మగరాయుడులా ప్యాంటు, టీషర్టు వేసుకుని పోలీసు అవుతుందంటా అనే ఇరుగు పొరుగు వారి మాటల్ని ఆమె పట్టించుకోలేదు. కూతురుకు బాసటగా శ్రీనివాసరావు నిలిచాడు. ఆయన నమ్మకం, పట్టుదలను సాకారం చేస్తూ భానుప్రసన్న మొక్కవోని దీక్షతో ఎస్ఐ పోటీ పరీక్షలో విజయం సాధించింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెరుగైన ర్యాంకుతో ఉద్యోగం సాధించి తానేమిటో నిరూపించుకుంది. తమ గ్రామానికి చెందిన ఓ యువతి ఎస్ఐగా ఎంపిక కావడంపై గ్రామస్తులంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుడడం విశేషం. ఎస్ఐతో సరిపెట్టుకోను ఓ పల్లెటూరుకు చెందిన నేను ఎస్ఐగా ఎంపికయ్యే దాకా జరిగిన ప్రయాణంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఈ తరం ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ ఉండబోదని ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నా. నిజాయతీ కలిగిన పోలీసు అధికారిగా పని చేస్తూ మహిళలు ఎదుర్కొనే సమస్యల నుంచి వారికి అండగా ఉంటా. వృత్తిపరంగా మరింతగా ఎదగడం కోసం ప్రస్తుతం కాకినాడలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. నా వెనుక సూటిపోటి మాటలు అన్నవారే నేడు అభినందిస్తుంటే ప్రస్తుతం నాకు ఎంతో అనందంగా ఉంది. నా గ్రామానికీ, నా కుటుంబానికీ మంచి పేరు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా. – భాను ప్రసన్న -
స్కూలుకు వెళ్లకుండానే.. 'ఇండియా బుక్ ఆఫ్ అవార్డ్స్' లో చైత్ర!
నిజామాబాద్: మూడేళ్ల ఆ చిచ్చర పిడుగు స్కూలుకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అరుదైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవర్ అవార్డును సాధించింది. నగరంలోని గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర 17 జాతీయపండుగలు, 12 జాతీయ గుర్తులు, 13 అంతరిక్ష వస్తువులు, 26 శరీర భాగాలు, 26 రకాల జంతువులు, 22 రకాల కూరగాయలు, 21 పండ్లు, 13 రంగులు, 8 రకాల ఆకారాలు (ట్రైయాంగిల్, స్క్వేర్, సర్కిల్ లాంటివి) గుర్తుపట్టడంతో పాటు 26 అల్ఫాబెట్స్కి సంబంధించిన వస్తువుల పేర్లను, 11 ఇంగ్లిష్ రైమ్స్‌ని ధారాళంగా తడబడకుండా చెప్పేస్తుంది. ఈ పాప ప్రతిభను గుర్తించిన ఐబీఆర్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో చైత్ర ధారాళంగా చెప్పిన వాటిని ఆమె ప్రతిభా పాటవాలను ప్రత్యక్షంగా చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ వారు అచీవర్ అవార్డును ప్రదానం చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ అనేది ఇండియాలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ వ్యక్తుల ప్రతిభని, ఒక సంస్థ సాధించిన ప్రగతిని భద్రపరచి భావితరాలకు స్ఫూర్తిని అందించే సంస్థ. దీనిలో భాగంగా రాష్ట్రంలోని నగరానికి చెందిన గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడంపై పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అచీవర్ అవార్డును అందుకోవడం అభినందనీయమంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చైత్రకు ఐబీఆర్లో స్థానం దక్కడంతో ఆమె తల్లిదండ్రులైన బ్యాంక్ ఉద్యోగిని అన్నపూర్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుశీల్ కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. తమ పాప ఇప్పటి వరకు స్కూల్‌కు కూడా వెళ్లలేదని, ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అచీవర్ అవార్డును కైవసం చేసుకుందన్నారు. ఇవి చదవండి: ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! -
అనంత వాసికి అత్యున్నత గౌరవం
అనంతపురం కల్చరల్: గతంలో అనేక సందర్భాలలో అనంత ఖ్యాతిని చాటుతూ జాతీయ వేదికలపై రాణించిన జిల్లాకు చెందిన బిసాటి భరత్ మరో జాతీయ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగే 27వ జాతీయ యువజనోత్సవాల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డునందుకోనున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వం తరఫున యువజన వ్యవహారాల శాఖ సమాచారాన్ని వెలువరించింది. పుట్లూరు మండలం కందికాపులకు చెందిన ఆదినారాయణ, చంద్రికాదేవి దంపతుల కుమారుడు భరత్ పుట్టింది నిరుపేద కుటుంబమే అయినా స్వీయ ప్రతిభతో రాణించి ఎస్కేయూ, ఇందిరాగాంధీ యూనివర్సిటీలలో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్లు పూర్తి చేశారు. 2014 నుంచి ప్రగతి పథం యూత్ అసోసియేషన్ స్థాపించి నెహ్రూ యువకేంద్రం ద్వారా అనేక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ వచ్చారు. మై గవర్నమెంట్ జాతీయ ప్రచారకర్తగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేథప్యంలో ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ అవార్డుతో పాటు మరెన్నో జాతీయ అవార్డులను, రివార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నెహ్రూ యువకేంద్ర డీడీఓ శ్రీనివాసులు, సాహిత్యభారతి గౌరవాధ్యక్షుడు డాక్టర్ పతికి రమేష్ నారాయణ, డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు పండిట్ రియాజుద్దీన్ అభినందించారు. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
మజారె పావ్‌బాజీ.. బిర్యానీ భోజీ
సాక్షి, అమరావతి: దేశంలోని నగరాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో స్థానిక ఆహార పదార్థాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. వీధి చివరిలోని స్టాల్స్ నుంచి ఐకానిక్ హోటళ్ల వరకు నోరూరించే రుచులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై వడాపావ్, చాట్ బఠాణి, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై ఇడ్లీ–దోశ, లక్నో కబాబ్–మొగలాయ్ వంటకాలు ఎల్లలు ఎరుగని ఆహార ప్రేమికులను సొంతం చేసుకుంటున్నాయి. ఒక ప్రాంత సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించడంలో పాకశాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని రుచుల ఎన్‌సైక్లోపిడియాగా పిలిచే ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ పేర్కొంది. తాజాగా ‘ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల’ జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్–100లో భారతదేశం నుంచి ఐదు నగరాలకు స్థానం దక్కింది. టేస్ట్ అట్లాస్ ‘ట్రావెల్ గ్లోబల్ ఈట్ లోకల్’ నినాదంతో ప్రాంతీయ రుచులకు పెద్దపీట వేస్తోంది. తద్వారా వ్యవసాయం, వాణిజ్యాన్ని బలోపేతం చేయొచ్చని భావిస్తోంది. ఇటాలియన్ నగరాలే టాప్ ♦ టేస్ట్ అట్లాస్ నివేదికలో ఇటాలియన్ నగరాల రుచుల హవా కనిపించింది. అగ్రస్థానంలో రోమ్ (ఇటలీ) ఆ తర్వాత బోలోగ్రా, నేపుల్స్ నగరాలు నిలిచాయి. మొత్తం మూడు ఇటాలియన్ నగరాల్లో పాస్తా, పిజ్జా, జున్ను ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందడం విశేషం. ♦ ఉత్తమ రేటింగ్ పొందిన వంటకంగా బ్రెజిలియన్ మీట్ కట్ పికాన్హా, ఆ తర్వాత మలేషియన్ బ్రెడ్ రోటీ కనై , థాయ్ స్టిర్ ఫ్రై రెసిపీలు ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీకి దేశంలో రెండో స్థానం ♦ ప్రపంచ ఉత్తమ ఆహార నగరాల్లో ముంబై (35), హైదరాబాద్ (39) స్థానాలను దక్కించుకున్నాయి. ♦ ఆ తర్వాత ఢిల్లీ (56), చెన్నై (65), లక్నో (92) స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ పావ్ బాజీ, దోశ, వడపావ్, చోలే భాతురే, కబాబ్స్, నిహారీ, పానీ పూరీ, చోలే కుల్చే, బిర్యానీ, వివిధ రకాల చాట్లు కేవలం కడుపునింపే ఆహారంగానే కాకుండా జిహ్వకు సంతృప్తి, అత్యుత్తమ రుచిని అందిస్తాయని నివేదిక పేర్కొంది. ♦ ఉత్తమ రెస్టారెంట్ల విషయంలో భారత్ 4.52 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. ♦ ఉత్తమ ఆహార పదార్థంగా బటర్ గార్లిక్ నాన్ 4.67 స్కోర్‌తో 7వ స్థానం, ముర్గ్ మఖానీ 4.54 స్కోర్‌తో 43వ స్థానం, టిక్కా 4.54 స్కోర్‌తో 47వ స్థానం, తందూరి 4.54 స్కోర్‌తో 48వ స్థానంలో నిలిచాయి. ♦ ఉత్తమ అల్పాహారంగా శనగల కూరతో కూడిన పూరీ 18వ స్థానంలో ఉండగా.. అత్యంత ప్రసిద్ధ ఆహార స్థలాల్లో మంగుళూరులోని పబ్బా ఐస్ పార్లర్‌కు 7వ స్థానం దక్కింది. ప్రపంచంలోని టాప్–10 ఆహార నగరాలు ♦ రోమ్, ఇటలీ ♦ బోలోగ్నా, ఇటలీ ♦ నేపుల్స్, ఇటలీ ♦ వియన్నా, ఆస్ట్రియా ♦టోక్యో, జపాన్ ♦ఒసాకా, జపాన్ ♦ హాంకాంగ్, చైనా ♦ టురిన్, ఇటలీ ♦గాజియాంటెప్, టర్కీ ♦బాండుంగ్, ఇండోనేషియా -
ఈ ఏడాది విచిత్రమైన ఆవిష్కరణలు ఇవే..
ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త సాంకేతిక ఆవిష్కరణలు సృష్టిలోకి వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, వేగంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. మరికొన్ని మరింత ప్రయోగాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని ఆవిష్కరణలు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. వాటిని మనం ఎప్పటికీ ఊహించలేము. అయినా వాటితో సమాజానికి ఉపయోగం ఉంటుంది. ఇలా ఈ ఏడాది వచ్చిన కొన్ని విచిత్రమైన సాంకేతిక ఆవిష్కరణలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హైబ్రిడ్ మొబిలిటీ రోబో(హెచ్ఎంఆర్) రోబోటిక్స్‌లో హైబ్రిడ్ మొబిలిటీ రోబోను టెక్ నిపుణులు ఒక సంచలనంగా చెబుతారు. ఇది బంతిని పోలి ఉండే ఎగిరే పరికరం. బంతిలాగా అన్నివైపులా కదులుతూ ఉంటుంది. అది వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి లేదా నిటారుగా ఉన్న నిర్మాణాలు ఎదురైతే పైకి కిందకు ఎగురుతూ ముందుకు సాగిపోతుంది. హ్యూమని ఏఐ పిన్ హ్యూమని ఏఐ పిన్ను మొదటిసారిగా ఏప్రిల్ 2023లో జరిగిన టెడ్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించారు. ఇది రోజువారి ఫోన్కాల్లు చేయడం, రోజువారి కార్యకలాపాలను విశ్లేషించడం, ఆహార పదార్థాలను స్కాన్ చేయడం వంటి కొన్ని అంశాలను ప్రదర్శించారు. ఈ పరికరం సెప్టెంబరు 2023లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మరోసారి దర్శణమిచ్చింది. ఎయిర్‌బ్యాగ్ జీన్స్ స్వీడిష్ కంపెనీ మోసైకిల్ ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను తయారుచేసింది. మోటార్‌సైకిల్ ఢీకొనేటప్పుడు ఈ జీన్స్ ధరిస్తే కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది. అందులో ఉండే సెన్సార్లు ప్రమాదం జరిగిన వెంటనే జీన్స్‌లో ఉన్న బ్యాగ్‌లో ఓపెన్ అయి ప్రమాదాన్ని కొంత నివారించేలా తోడ్పడతాయి. సాధారణంగా ఆ జీన్స్ ధరిస్తే మాములుగానే కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం బ్యాగ్‌లు ఓపెన్అయి కొంత లావుగా ఉంటుంది. అండర్‌వాటర్ జెట్ప్యాక్ నీటిలో అన్వేషణకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నీటిలో ప్రయాణం క్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సులువు చేసేందుకు అండర్‌వాటర్ జెట్ప్యాక్ అనే పరికరాన్ని తయారుచేశారు. దాన్ని వీపునకు ధరించి నీటిలో ప్రయాణించవచ్చు. రాకెట్ ఎలాగైతే ఆకాశంలో దూసుకుపోతుందో..ఈ పరికరం నీటిలో వర్టికల్‌గా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో.. ఫ్లైయింగ్ జెట్స్కి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. -
పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమానికి చేరింది! ఎలాగంటే..?
కొన్ని వస్తువులు పోతే మళ్లీ మనకు చేరడం అసాధ్యం. ఎవరో కొంతమంది మంచివాళ్లు సదరు యజమానికి అందేలా చేయాలనకుంటే గానీ దొరకదు. అలా సహృదయంతో తిరిగే ఇచ్చివాళ్లు అరుదు. అలాంటిది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమాని తాలుకా కుటుంబసభ్యులను చేరుకుంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలు కళ్ల ముందు ఒక్కసారిగా మెదులుతాయి. ఇలాంటి ఘటన ఎవ్వరికో గానీ జరగదు. అసలు ఆ వాలెట్ ఎలా పోయింది?. ఎవరు ఆ వాలెట్‌ని యజమాని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారంటే.. అట్లాంటాలోని పురాతన ప్లాజా థియోటర్ ఒకటి ఉంది. దాన్ని మరమత్తు చేస్తుండగా ఆ థియోటర్ వెనుకవైపున ఉన్న బాత్రూం గోడ కూలిపోయింది. దీంతో వాలెట్ బయటపడింది. దానిలో కొన్ని మాగ్నటిక్ స్ట్రిప్లేని క్రెడిట్లు, సినిమా టిక్కెట్, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ ధియోటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ సదరు వ్యక్తి కుటుంబానికి ఇప్పటికైన అందేలా చేయాలనుకున్నాడు. అయితే 1959లో చేవ్రోలెట్ సినిమా చూడటాని వచ్చి పోగొట్టుకున్నట్లు వాలెట్లో ఉన్న టికెట్‌ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ వాలెట్ యజమాని లేదా అతడి కుటుంబ సభ్యులకు అయినా దీన్ని అందేలా చేయాలన అనుకుంటాడు క్రిస్. అయితే ఆ కుటుంబం మునుపు ఈ పరిసరాల్లోనే ఉండొచ్చేమో గానీ ఇప్పుడూ చాల ఏళ్లు అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటుందనేది కనిపెట్టడం అసాధ్యంగా అనిపించింది క్రిస్ ఎస్కోబార్‌కి. దీంతో ఆ వ్యాలెట్‌లో ఉన్న లైసెన్స్ కార్డుల ఆధారంగా వ్యాలెట్ పోగొట్టుకున్న వ్యక్తి స్త్రీని అని కనుగొంటారు. ఆమె పేరు ఫ్లాయ్ కల్బ్రేత్గా గుర్తించారు. అయితే ఆ కాలంలో స్త్రీలు తమ భర్తల పేరుతో పిలిచేవారు. దీంతో ఆమె అడ్రస్ కనుగొనడం మరింత కష్టంగా మారింది. దీంతో క్రిస్ తన భార్య సాయం తీసుకుంటాడు. ఆమె ఇంటర్నెట్లో సోధించగా కల్‌బ్రెత్ మరణించినట్లు గుర్తిస్తుంది. దీన్ని బట్టి ఫ్లాయ్ ఆమె పేరు అని అర్థం చేసుకుంటారు ఆ దంపతులు. అంతేగాదు కల్‌బ్రెత్ పేరు మీద కల్‌బ్రెత్ కప్ అనే గోల్ఫ్ టోర్నమెంట్ వెబ్‌సైట్‌ను కనుగొంటారు. అతడి కుటుంబ చిన్నపిల్లలకు వచ్చే మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy) అనే ఛారిటీ సంస్థ కోసం ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకుంటారు. అలా ఫ్లాయ్ కుమార్తె థియా చాంబర్‌లైన్‌ను కనుగొంటారు. ఆమెకు ఈ వ్యాలెట్‌ని అందజేస్తాడు క్రిస్. దీంతో ఆమె ఒక్కసారిగా ఆ వ్యాలెట్‌ని తీసుకుంటూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుందని, మంచి వ్యక్తిత్వం గలదంటూ ఉద్వేగం చెందుతుంది. ఆమె వ్యాలెట్‌లో భీమా కార్డులు, డాక్టర్ అపాయింట్మెంట్ నోట్లు కనుగొంటుంది. ట్విస్ట్ ఏంటంటే థియా చాంబర్‌లైన్‌కు ఇప్పుడు 71 ఏళ్లు. ఈ వ్యాలెట్ పోయినప్పుడు ఆమెకు ఆరేళ్లు. ఈ మేరకు ఆ థియోటర్ యజమాని క్రిస్ మాట్లాడుతూ..తమకు మనవళ్లు, మునివళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ కల్బ్రేత్కు కూడా అలానే ఉంటారు కదా. ఈ వ్యాలెట్ కలెబ్రెత్ జ్ఞాపకాలను ఆ కుటంబంలోని తరతరాలకు తెలియజేస్తుంది కదా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు క్రిస్. (చదవండి: మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!) -
కష్టపడి చదివి.. ఎస్సై పోస్టుకు ఎంపికై ..
కందుకూరు రూరల్: ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. తల్లి కష్టపడి చదివించింది. అతను ఇటీవల విడుదలైన ఎస్సై ఫలితాల్లో 398వ ర్యాంక్ సాధించాడు. వివరాలిలా ఉన్నాయి. వలేటివారిపాళెం మండలం పోలినేనివారిపాళెం గ్రామానికి చెందిన నేలకూరి వెంకటేశ్వర్లు, సుశీల కుమారుడు ఏడుకొండలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 8 నుంచి 10 వరకు కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీటీసీ సింగరాయకొండ పీఎన్‌సీఏలో పూర్తి చేశాడు. ఉపాధ్యాయ పోస్ట్ సాధించాలని కోచింగ్ తీసుకొని రెండుసార్లు డీఎస్సీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం దక్కలేదు. అనంతరం ఆర్థిక పరిస్థితులతో చదువు కొనసాగించలేక, ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాధ్యతంతా తల్లి మీదే పడింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసుకుని కాకినాడలో కోచింగ్‌కు వెళ్లాడు. తల్లి ప్రతి నెలా కోచింగ్, మెస్ ఫీజులకు నగదు పంపేది. ఏడుకొండలు పరిస్థితిని గమనించి గ్రామానికి చెందిన అనుమోలు రవీంద్ర, మాదాల లక్ష్మీనరసింహం ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు. చదువే ఆయుధం కష్టాలు ఉన్నాయని కుంగిపోతే చదువుకోలేం. ఇష్టపడి చదవాలి. తల్లి రెక్కల కష్టం నాకు తెలిసొచ్చింది. అందుకే పట్టుదలతో చదివి ఎస్సై పోస్టు సాధించాను. పేదలకు చదువే ఆయుధం. – నేలకూరి ఏడుకొండలు -
మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!
రక్తదానం చేసి ఇతర కుక్కల ప్రాణాలను కాపాడిన ఇలాంటి కుక్కలు హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఉన్నాయని మీకు తెలుసా?. హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన జంతు ప్రదర్శన పెటెక్స్, హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ముగిసింది. డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్లినందుకు బోబీ చౌహాన్ పెట్టింగ్ మ్యాటర్స్, డాగ్ స్పెషలిస్ట్ కంపెనీ ఈ సందర్భంగా గుర్తించబడింది. అలాగే ఈ డ్రైవ్‌లో రక్తదానం చేసినందుకు అనేక కుక్కలు వాటి యజమానులను కూడా సత్కరించారు. మనుషులు మాదిరిగానే కుక్కలు కూడా..! బాబ్బీ చౌహాన్ ప్రకారం, కుక్కలు, పిల్లులు మనుషుల మాదిరిగానే రక్తదానం చేయవచ్చు. నగరంలో గత ఐదేళ్లలో దాదాపు 200 రక్తదానాలు నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు, పెంపుడు కుక్కలను పెంచుకుంటున్న వారిలో దీనిపై పెద్దగా అవగాహన లేదు. కుక్కలు ప్రతి మూడు నెలలకొకసారి మనుషుల మాదిరిగా రక్తదానం చేయవచ్చు. వీటికి 12 బ్లడ్ గ్రూపులు, 11 క్రాస్ మ్యాచింగ్ గ్రూపులు ఉన్నాయి. నగరంలో కుక్క లేదా కుక్కల బ్లడ్ బ్యాంక్ లేదని ఆయన అన్నారు. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు రక్తదానం చేయడానికి, ఇతర కుక్కలను రక్షించడానికి సిద్ధంగా ఉంటే డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆలోచనతో రోస్టియన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అంతేగాదు వారు నిహిత్ మెషిన్ ఆవిష్కరించారు. ఇది కుక్కలా ఆహరం విక్రయించే వెండింగ్ మెషీన్. ఇది ఉపయోగించిన లేదా వేస్ట్ నీటి బాటిళ్లను తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది వీధి కుక్కల ప్రయోజనం కోసం పెంపుడు జంతువుల ఆహారాన్ని అందించడమే గాక రెండు సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకటి ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను బాధ్యతాయుతంగా పారవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అదే సమయంలో ప్లాస్టిక్ సమస్యకు చెక్‌పెడుతుంది. ఈ యంత్రాన్ని ఎక్స్‌పోలో ప్రదర్శించారు. Pawstive మార్పు తీసుకొద్దాం. అలాగే వెండింగ్ మిషన్‌తో భూమిని కలుషితం కాకుండా చూద్దాం అని వ్యవస్థాపకుడు నొక్కి చెప్పారు. (చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!) -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్‌లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్‌ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్‌తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్‌కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్‌షాప్‌ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్‌కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్‌లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్‌కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్‌షాప్‌కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్‌లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్‌లోని పిల్లల కోసం షెల్ఫ్‌ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
ఎస్ఐగా ఎంపికై న పేదింటి బిడ్డ
అన్నమయ్య : చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు... అమ్మమ్మ దగ్గర పెరిగి అనంతరం హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం సాగించాడు.. డ్రైవర్‌గా పని చేసుకుంటూ తాను కలలు గన్న పోలీస్ ఉద్యోగాన్ని సాధించాడు పేదింటి బిడ్డ మురళీనాయక్. వివరాల్లోకి వెళితే.. కేవీపల్లె మండలం దిగువగళ్ల తాండాకు చెందిన బుక్కే మురళీనాయక్ జన్మించిన నెల రోజులకే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనంతరం అమ్మమ్మ శ్యామలమ్మ కూలి పనులు చేసుకుంటూ మురళీనాయక్‌ను పోషించింది. కేవీపల్లె హాస్టల్లో ఉంటూ 8వ తరగతి వరకు కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. అనంతరం పీలేరులో హాస్టల్లో ఉంటూ పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదివాడు. అనంతరం తనను తాను పోషించుకోవడానికి డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చాడు. మరోవైపు ఎప్పటికై నా పోలీస్ కావాలనే తపనతో ఎస్ఐ రాతపరీక్షకు సిద్ధమయ్యాడు. 167.5 మార్కులు సాధించి ఎస్ఐగా ఎంపికయ్యాడు. చదువుకు, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మురళీనాయక్ మాట్లాడుతూ ఇంతటితో ఆగకుండా ఒక్కో మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. -
తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ
విశాఖపట్నం: పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆ కుటుంబ సభ్యులు. జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గవరపాలెం గ్రామానికి చెందిన వెలమ పూర్ణకుమారి(53) తన కుమారుడుతో ద్విచక్రవాహనంపై ఈనెల 21న విశాఖ వస్తున్నారు. విశాఖ పోర్టు ఫ్లై ఓవర్‌పై వారి ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో కిందపడిన పూర్ణకుమారి తలకు తీవ్రగాయమై అధిక రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను రామ్‌నగర్‌లో కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కేర్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి తలకు శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ ఈనెల 23 రాత్రి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. మంత్రి అమర్నాఽథ్ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయదానం కోసం ప్రోత్సహించగా అంగీకరించారు. జీవన్‌ధాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబుతో మాట్లాడి అవయదాన ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఆమె గుండె, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, లివర్ తొలగించి అవసరమైన వారి కోసం తరలించినట్లు డాక్టర్ రాంబాబు తెలిపారు. అవయదానం చేయడానికి ముందుకు వచ్చిన పూర్ణకుమారి కుటుంబ సభ్యులను డాక్టర్ రాంబాబు అభినందించారు. పూర్ణకుమారికి భర్త జగదీశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
మారుమూల గ్రామ రైతు కొడుకు 'శాస్త్రవేత్తగా'..
భద్రాద్రి: ఓ రైతు కొడుకు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఉండే బెంగళూరులోని సెంట్రల్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(సీఎంటీఐ)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన లావుడ్యా ఆనంద్ ఈ ఘనత సాధించాడు. ఆనంద్ తల్లిద్రండులు లావుడ్యా ఈర్య, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉండగా పెద్ద కుమారుడు ఆనంద్ శాస్త్రవేత్తగా ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు శాస్త్రవేత్తగా ఎంపికైన నేపథ్యంలో గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విద్యాభ్యాసం.. గ్రామానికి చెందిన ఈర్యా, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు ఆనంద్ ఒకటి నుంచి 5 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. చైన్నెలో బీఈ (ఈఈఈ) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు హైదరాబాద్‌లో గేట్ కోచింగ్ తీసుకొని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ (కంట్రోల్ సిస్టమ్స్ విభాగం)లో సీటు సంపాధించాడు. ఎంటెక్ పూర్తయిన అనంతరం 2019 నుంచి 2021 వరకు కరోనా ప్రభావంతో విద్యాభ్యాసానికి కొంచెం బ్రేక్ పడింది. రాజీ లేకుండా శ్రమించి.. కరోనా సమయంలో దొరికిన విరామాన్ని ఆనంద్ వృథాగా వదిలేయకుండా శ్రమించాడు. వివిధ కొలువుల రాత పరీక్షల మూలంగా తొలిసారిగా బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ (బీఈఎల్)లో ట్రెయినీ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. నెల పాటు ఇక్కడ ట్రెయినీ ఇంజనీర్‌గా పనిచేసిన అనంతరం హైదరాబాద్‌లోని డీఆర్డీఓ – రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ‘రీసెర్చ్ ఫెలో’గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సీఎంటీఐలో శాస్త్రవేత్త కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అతను రాత పరీక్ష, మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. సీఎంటీఐలో శాస్త్రవేత్తగా ఎంపికై నట్లు అపాయిమెంట్ లెటర్ రావడంతో తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇవి చదవండి: తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ -
రిక్షానే ఆసరాగా.. 'చినాబ్ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా..
'జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా, పరిమళాలు వెదజల్లే పూలపాన్పులా ఉండదు. తమకున్న వనరులను ఉపయోగించుకుని పైగి ఎదగడానికి ప్రయత్నించి పెద్దవాళ్లు అయిన వాళ్లే ఎక్కువ. వీరు ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మీనాక్షి దేవి. జీవితాన్ని కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోనివ్వకుండా.. ఈ–రిక్షా లాగుతూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఇలా తనకెదురైన కష్టాలకు ఎదురీదుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి దేవి.' జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లా భదర్వా టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మీనాక్షి జీవితం ఏడాది క్రితం వరకు ఆనందంగా సాగింది. భర్త పమ్మి శర్మ, ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఉపద్రవం ఏర్పడింది. మీనాక్షి భర్తకు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్సకోసం అనేక ఆసుపత్రులు తిరిగారు. మెడికల్ బిల్లులు పెరిగాయి కానీ సమస్య తీరలేదు. ఈ క్రమంలో వారు దాచుకున్న డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి. ఉన్న కారు అమ్మేసి, వ్యాపారాన్ని మూసేసి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని అప్పుల భారం అలానే ఉండిపోయింది. ఏ దారీ దొరక్క.. భర్త సంపాదించే స్థితిలో లేకపోవడంతో మీనాక్షి దేవి కుటుంబ పోషణ కోసం పని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ తను చేయగలిగింది దొరకలేదు. ఈఎమ్ఐ ద్వారా కొన్న ఆటో ఒకటి ఇంట్లో ఉండడంతో అప్పుడప్పుడు పమ్మిశర్మ మీనాక్షికి సరదాగా ఆటో నేర్పించేవాడు. అప్పటి డ్రైవింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుచుకుని ఆటో నడపాలనుకుంది మీనాక్షి. ఆమె కోరిక మేరకు ఆటో నడపడాన్ని పూర్తిస్థాయిలో నేర్పించాడు ఆమె భర్త. ఆ తరువాత సబ్సిడీలో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోని, దాన్ని నడపడం ప్రారంభించింది మీనాక్షి. దానిమీద వచ్చిన డబ్బులతో భర్త మెడికల్ బిల్స్ కట్టడంతోపాటు, కొడుకులిద్దరి బాగోగులను చూసుకుంటోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన మీనాక్షి దేవి చినాబ్ లోయలోనే తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా నిలవడం విశేషం. మరో ఆప్షన్ లేక.. "ప్రారంభంలో ఆటో నడుపుతానన్న నమ్మకం మీనాక్షికి లేదు. రద్దీగా ఉండే భదర్వా టౌన్లో ఆటో నడపడానికి చాలా భయపడేది. కుటుంబం గడవడానికి మరో గత్యంతరం లేదు. అందుకే ఎంతో కష్టపడి, ధైర్యంగా ఆటో నడపడం నేర్చుకుని అండగా నిలుస్తోంది. మీనాక్షిని చూస్తే నాకు తృప్తిగానే గాక, గర్వంగానూ ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న మెడికల్ బిల్స్ నన్ను తీవ్రంగా కుంగతీసేవి. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై.. పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన పడేవాడిని. నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. ఎంతకాలం ఉంటానో కూడా తెలియని పరిస్థితుల్లో నా భార్య ఆటో నడుపుతూ నాకు మానసిక ప్రశాంతతను కల్పిస్తోంది" అని మీనాక్షి భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘నాలుగు నెలల క్రితం తొలిసారి ఆటోతో ఆటోస్టాండ్‌లో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న మిగతా డ్రైవర్లంతా నన్ను ఒక ఏలియన్లా చూశారు. కొంతమంది అయితే ఈమె కస్టమర్లను భద్రంగా ఇంటికి తీసుకెళుతుందో లేదో అంటూ చెవులు కొరుక్కునేవారు. లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఆటో నడపవద్దు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఇది నా కుటుంబ జీవనాధారం. అందుకే నేను ఎవరి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాను. రోజురోజుకీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నాను’’ అని మీనాక్షి సగర్వంగా చెబుతోంది మీనాక్షి దేవి. ఇవి చదవండి: Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత -
ఎస్సైగా ఎంపికై న వలంటీర్‌కు సన్మానం
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ 6వ సచివాలయంలో వలంటీరుగా సేవలందిస్తూ ఖాళీ సమయంలో ఎస్సై ఉద్యోగానికి సిద్ధమై విజయం సాధించిన వలంటీరు జి.యోగీశ్వరిని శుక్రవారం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బాలమురళీకృష్ణ ఘనంగా సన్మానించారు. కష్టపడితే మంచి ఉద్యోగం సాధించవచ్చని యోగీశ్వరి నిరూపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వలంటీర్‌గా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సహకారం అందించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, ప్రోత్సహించిన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, బత్తుల లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బందికి యోగీశ్వరి ధన్యవాదాలు తెలిపారు. -
ఒకే ఊరు, ఒకే కాలేజ్.. ఎస్సై జాబ్ కొట్టిన రైతుబిడ్డలు
వారిద్దరిదీ ఒకే గ్రామం.. ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఒకేసారి ఎస్సై కొలువు సాధించారు. ఇప్పుడా గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. వారిలో ఒకరు నిరుపేద రైతు కుమారుడైతే.. మరొకరు తన చిన్నతనంలో తండ్రిని కోల్పోయాడు. అయినప్పటికీ పేదరికాన్ని పంటి బిగువన భరించి కష్టాలను శ్రమ అనే నిచ్చెనగా చేసుకుని పట్టుదలతో చదివారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన తుది ఎస్సై మెయిన్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. రావికమతం/నర్సీపట్నం: సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఇద్దరు యువకులు పట్టుదలతో చదివి ఎస్సై కొలువు పట్టారు. రావికమతం మండలం పొన్నవోలు గ్రామానికి చెందిన యువకులు పులిఖండం నాని, కొరసాల దుర్గాప్రసాద్ ఎస్సైలుగా ఎంపిక కావడంతో గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది. వీరు నిరుపేద కుటుంబంలో పుట్టారు. నాని తండ్రి నిరుపేద రైతు.. తన ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించాడు. వీరిలో రెండో కుమారుడు నాని ఎస్సై పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. దుర్గాప్రసాద్ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా, తన అన్నయ్య అంజి ప్రొత్సాహంతో ఉన్నత చదువులు చదివాడు. అతడి ప్రోద్బలంతో దుర్గాప్రసాద్ కష్టపడి ఎస్సై పరీక్షల్లో ప్రతిభ చూపాడు. ఇద్దరు యువకులు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకేసారి ఓపెన్ కేటగిరీలో ర్యాంక్‌లు సాధించి ఎంపిక కావడంపై మండల నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుర్గాప్రసాద్‌కు నాలుగు కొలువులు వచ్చినా.. కె.దుర్గాప్రసాద్, నాని ఎస్సైలు ఎంపిక కావడంతో రిషీ కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. ఇతడికి ప్రభుత్వ కొలువులు నాలుగు వచ్చినప్పటికీ ఎస్సైగా రాణించాలనే సంకల్పంతో వాటిలో చేరలేదు. నాని ప్రస్తుతం తెలంగాణలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు అందుబాటులో లేకపోవడంతో నర్సీపట్నంలో దుర్గాప్రసాద్‌ను కరస్పాండెంట్ కోనా సతీష్, డైరెక్టర్ ఆర్.వై.నాయుడు, ప్రిన్సిపాల్ సిహెచ్.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎ.భాస్కర్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ మురళీకృష్ణ సత్కరించారు. కష్టపడి చదివితే విజయం వరిస్తుందని, దానికి అనుగుణంగా సాధన చేయాలని తోటి విద్యార్థులకు దుర్గాప్రసాద్ సూచించారు. -
గోవా ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికై న శ్రీకాకుళం వాసి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన డాక్టర్ సువ్వారి ఆనందరావు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యో గం సాధించారు. ఆయన స్వస్థలం ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపేట గ్రామం. అత్యున్నత ప్రమాణాలు కలిగిన గోవా ఐఐటీ సంస్థలో ఆర్థిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ ఆనందరావు ఉగ్యోగానికి ఎంపికయ్యాడు. శుక్రవారమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. కమ్మవారిపేటకు చెందిన సువ్వారి నీలాచలం, పద్మావతిలు ఆనంద రావు తల్లిదండ్రులు. పాఠశాల స్థాయి నుంచి ఆనందరావు చదువుల్లో చురుగ్గా ఉండేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఎకనామిక్స్‌పై ఆసక్తితో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఐఎంఏలో చేరి ఉత్తీర్ణులయ్యారు. అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఓ బీమా సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశారు. అయితే పరిశోధనలపై ఉన్న ఆసక్తితో ‘ఎఫీషియన్సీ అండ్ ఫెర్మార్మన్స్ అసెస్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్యూరెన్స్ ఇండస్ట్రీ, సమ్ న్యూ ఎవిడెన్స్ ఫర్ ఇండియా’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తిచేసి చేసి డాక్టరేట్ అందుకున్నారు. అనంతరం ఆయన 2019 జూలై నుంచి 2020 వరకు ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ విభాగంలో అధ్యాపకులుగా పనిచేశా రు. 2020 నవంబరు నుంచి 2023 జనవరి వరకూ ఏపీ ఎస్ఆర్ఎం విశ్వ విద్యాలయంలో సహాయ ఆచార్యునిగా, ఎకనామిక్స్ హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2023 నుంచి హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచే స్తూ.. తాజాగా ప్రతిష్టాత్మక ఐఐటీ గోవాలో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఆయన ప్రచురించిన జర్న ల్స్ అంతర్జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. -
కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా సుమతి..
అన్నమయ్య: కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ మహిళా సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) ఉద్యోగానికి ఎంపికై ప్రశంసలందుకుంటున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు. మదనపల్లె మండలం ఇసుకనూతపల్లెకు చెందిన వేణుగోపాల్, భాగ్యమ్మ దంపతుల కుమార్తె బరినేపల్లె సుమతి(డబ్ల్యూపీసీ1651) మహిళా పోలీస్ కానిస్టేబుల్‌గా నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఎంపిక పరీక్ష తుది ఫలితాల్లో ఆమె ఉద్యోగం సాధించారు. తండ్రి వేణుగోపాల్ కౌలు రైతు కాగా, తల్లి భాగ్యమ్మ పాడిఆవులు పోషించుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా మొదటి కుమార్తె అమరావతికి వివాహం అయింది. కుమారుడు రవికుమార్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. చివరి సంతానమైన సుమతి ప్రాథమిక విద్యాభ్యాసం ఇసుకనూతిపల్లె ఎంపీయూపీ స్కూల్లో నూ, ఉన్నతవిద్య మదనపల్లె జెడ్పీ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియెట్ విశ్వసాధన కా లేజ్‌లో, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో 2017 లో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో విడుదలైన పోలీస్కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డీపీఓ కార్యాలయంలోనూ, నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేశారు. 2022 డిసెంబర్లో విడుదలైన ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా రెండో ప్రయత్నంలో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. తన లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ రాజ్‌కమల్, పోలీసు ఉన్నతాధికారులు సహాయ సహకారాలతోపాటు ప్రోత్సాహం అందించారని సుమతి తెలిపారు. ఎస్ఐ ఉద్యోగం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. -
'చైతన్య'పథం! థర్మకోల్‌తో గ్రీన్ ఇన్నోవేషన్..
'వేడుకలు, స్కూల్ ప్రాజెక్ట్‌లు, ప్యాకింగ్ అవసరాలు.. మొదలైన వాటి కోసం థర్మోకోల్‌ను ఉపయోగిస్తుంటాం. స్టోర్‌రూమ్‌లలో వాడేసిన థర్మోకోల్లు కుప్పలుగా పడి ఉంటాయి. మన అవసరం మేరకు తప్ప వాటి గురించి అంతగా ఆలోచించం. కొత్త విషయాలు తెలుసుకుంటే ఏమొస్తుంది? కొత్తగా ఆలోచిస్తాం. కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది? కొత్తదారులు కనిపిస్తాయి. కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. చైతన్య దూబే కొత్తదారులలో ప్రయాణిస్తున్నాడు. సంప్రదాయ థర్మోకోల్కు భిన్నంగా బయోడిగ్రేడబుల్ థర్మోకోల్ తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.' థర్మోకోల్ నాన్–బయోడిగ్రేడబుల్.. పర్యావరణంపై వాటి ప్రభావం ఎంతగానో ఉంది. థర్మోకోల్కు సూర్యరశ్మి తగిలి హానికరమైన వాయు కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతాయి, థర్మోకోల్ కాల్చడం వల్ల విషపూరిత రసాయన సమ్మేళనాలు విడుదల అవుతాయి. దీని ప్రభావంతో కంటి, ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి విషయాలు తెలుసుకున్న చైతన్య ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి విజయం సాధించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పుట్టి పెరిగిన చైతన్య బెంగళూరులో ఇంజనీరింగ్ చేశాడు. ఎంబీఏ చేసిన తరువాత బెంగళూరులోని ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయాలనుకున్నాడు. అయితే చిన్న బిజినెస్ కోర్స్ ఒకటి చేయడంతో అతడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఉద్యోగం కాదు బిజినెస్ చేయాలి అనుకున్నాడు. ఆ కోర్స్ తన గమనాన్నే మార్చింది. కెరీర్‌కు సంబంధించి ఎన్నో అవకాశాలను పరిచయం చేసింది. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఔషధ పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టాడు.. రకరకాల పుట్టగొడుగుల గురించి తెలుసుకునే క్రమంలో పుట్టగొడుగుల నుంచి లెదర్ తయారుచేసే కాన్సెప్ట్ చైతన్యను ఆకట్టుకుంది. ‘ఇలాంటిదే కొత్తగా ఏదైనా చేయవచ్చా’ అని ఆలోచించి పరిశోధనలు మొదలుపెట్టాడు. పరిశోధనలో భాగంగా ఐఐటీ–కాన్పూర్ వెళ్లి ప్రొఫెసర్లతో మాట్లాడాడు. పుట్టగొడుగులను ఉపయోగించి పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను తయారుచేయాలనే ఆలోచనలో భాగంగా రూపొదించిందే సరికొత్త థర్మోకోల్. పుట్టగొడుగులతో పాటు సహజమైన పదార్థాలతో బయోడిగ్రేడబుల్ థర్మోకోల్‌ను తయారుచేశాడు. ఇది 60 నుంచి 90 రోజుల్లో కుళ్లిపోవడం మొదలవుతుంది. దీన్ని మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ థర్మోకోల్ తయారీకి అయిదు నుంచి ఏడు రోజులు పడుతుంది. ‘మీ అవసరాలకు ఉపయోగించుకున్న తరువాత క్రష్ చేయండి. ఇది మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది’ అంటున్నాడు చైతన్య. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడం, దాని గురించి లోతుగా ఆలోచించడం అంటే చైతన్యకు ఇష్టం. 29 సంవత్సరాల చైతన్య దూబే బయోటెక్ కంపెనీ ‘కినోకో బయోటెక్’ ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. బయోడిగ్రేడబుల్ థర్మోకోల్ దగ్గరే ఆగిపోలేదు చైతన్య దూబే. పుట్టగొడుగుల ద్వారా విగ్రహాల తయారీకి ఉపయోగపడే పదార్థం గురించి పరిశోధనలు చేస్తున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపి)కి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇవి కూడా చదవండి: భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం -
Year End : చలో టూర్
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసికి నయాసాల్ జోష్ వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి వారంలో ఏదో ఒక నచ్చిన ప్రదేశానికి వెళ్లి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికే సిటీజనులు ఈ ఏడాది వేడుకలకు సైతం ‘చలో టూర్’ అంటూ చెక్కేస్తేన్నారు. క్రిస్మస్ సెలవులు కూడా కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకొనేందుకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. ఈసారి గోవాతో పాటు కశ్మీర్‌ను సైతం ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతం కొంత మేరకు కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొడంతో పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. దీంతో సిటీ టూరిస్టులు గోవాతో పాటు కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు బారులు తీరుతున్నారు. మరోవైపు విదేశీ టూర్లలో బ్యాంకాక్, మలేసియా, మాల్దీవులు, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. వారం రోజులుగా సుమారు 20 శాతానికి పైగా విదేశీ ప్రయాణాలు పెరిగినట్లు పలు ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు సైతం బాగా పెరిగినట్లు థామస్ కుక్, కాక్స్ అండ్ కింగ్స్, తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సుమారు లక్ష మంది ప్రయాణికులు అదనంగా బయలుదేరి వెళ్లనున్నట్లు అంచనా. బ్యాంకాక్ వైపు బారులు.. ● నగరం నుంచి సింగపూర్, మలేషియా.మాల్దీవులు, బ్యాంకాక్, దుబాయ్‌లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ ఐదింటిలోనూ బ్యాంకాక్‌కు వెళ్లే వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో చార్జీలు బాగా పెరిగాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండే చార్జీలు ఇప్పుడు ఏకంగా రూ.60 వేల వరకు పెరిగినట్లు ట్రావెల్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వారం. పది రోజుల నుంచే బ్యాంకాక్‌కు బుకింగ్‌లు బాగా పెరిగినట్లు బంజారాహిల్స్‌కు చెందిన ఒక సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘కౌలాలంపూర్ పెట్రోనాట్స్ దగ్గర ఏటా నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. రంగరంగుల బాణాసంచా కాల్చుతారు. దీంతో ఆకాశమంతా హరివిల్లులు విరబూస్తాయి. ఆ వేడుకలను చూసేందుకు ఇంటిల్లిపాది వెళ్తున్నాం’ అని ఎల్బీ నగర్‌కు చెందిన సత్యవతి తెలిపారు. ఒక్కొక్కరికి రూ.70 వేల వరకు ఫ్లైట్ చార్జీలు అయినట్లు చెప్పారు. గతంలో మలేసియాకు వెళ్లి వచ్చేందుకు రూ.39 వేల వరకు మాత్రమే చార్జీలు ఉండేవని విస్మయం వ్యక్తం చేశారు. ● అలాగే హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు కూడా పెద్ద సంఖ్యలోనే వెళ్తున్నారు. దుబాయ్‌కు వెళ్లి రావడానికి ఫ్లైట్ చార్జీలు రూ.75 వేలకు పెరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేవాళ్లు మలేసియాతో పాటు సింగపూర్‌ను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ రెండు దేశాల తర్వాత మాల్దీవులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకల కోసమే చాలామంది మాల్దీవులకు పయనమవుతున్నారు. దుబాయ్‌లో షాపింగ్‌కు ఇది అనుకూలమైన సమయం కావడంతో ఎక్కువ మంది దుబాయ్‌కు వెళ్తున్నట్లు ఐఆర్సీటీసీ అధికారి ఒకరు చెప్పారు. సోలో జర్నీయే సో బెటర్.. మరోవైపు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఒంటరి పర్యాటకుల సంఖ్య కూడా ఈ ఏడాది బాగా పెరిగింది. సుమారు 28 శాతం ఇలా ఒంటరిగా విదేశీ టూర్లకు వెళ్తున్నట్లు అంచనా. తమకు నచ్చిన పర్యాటక స్థలాల్లో ఏకాంతంగా గడపాలనే కోరిక, ఎలాంటి బాదరాబందీ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికై నా తేలిగ్గా ప్రయాణించేందుకు అవకాశం ఉండడంతో చాలా మంది సోలో జర్నీయే సో బెటర్ అనుకుంటున్నారు. సోలోగా వెళ్తున్న వారిలోనూ ఎక్కువ మంది బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్‌లతో పాటు శ్రీలంకకు వెళ్తున్నారు. విదేశాలతో పాటు దేశంలోని బెంగళూర్, గోవా, జైపూర్, కొచ్చిన్, గౌహతి, విశాఖ నగరాలకు సైతం సోలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండడం గమనార్హం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు 20 శాతం అదనంగా పెరిగాయి. ఇందుకు దేశంలోని వివిధ నగరాల్లో ఉడాన్ పథకం కింద ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రావడం, విదేశీ విమాన చార్జీలు కొంతమేర తగ్గుముఖం పట్టడం పర్యాటక ప్రియులకు చక్కటి అవకాశంగా మారింది. శివారులో హుషారుగా.. ఒకవైపు న్యూ ఇయర్ వేడుకలను విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జరుపుకునేందుకు కొందరు నగర వాసులు ఉత్సాహం చూపిస్తుండగా.. మరికొందరు నగర శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లు, రిసార్ట్లు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకుని న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్నారు. పబ్‌లు, క్లబ్‌లలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌పై పోలీసుల పరిమితుల నేపథ్యంలో వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి కొత్త సంవత్సర వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఉన్న శివారు ప్రాంతాల్లోని విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు న్యూ ఇయర్ వేడుకల కోసం అద్దెకు ఇస్తున్నారు. దీంతో చాలా మంది ఫాంహౌస్‌లలో పార్టీలు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటి యజమానులు రోజుకు అద్దె రూ.5 వేలు చెబుతున్నారు. -
Bolarum : రాష్ట్రపతి నిలయంలో మరిన్ని పర్యాటక హంగులు
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో పలు పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానంగా 1948 నాటి ఫ్లాగ్ పోస్ట్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించారు. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన వేడుకల్లో ప్రిన్స్ ఆజం షా నుంచి హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం నియమించిన ఎంకే వెల్లోడి బాధ్యతలు స్వీకరిస్తూ హైదరాబాద్ జెండా స్థానంలో జాతీయ జెండాతో కూడిన ఫ్లాగ్ పోస్ట్‌ను ఆవిష్కరించారు. అయితే కాలక్రమేణా ఆ ఫ్లాగ్‌పోస్ట్ పాడవడంతో 2010లో దాన్ని తొలగించారు. తాజాగా అందుకు ప్రతిరూపంగా నూతనంగా టేకుతో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ పోస్ట్‌ను రాష్ట్రపతి గురువారం ప్రారంభించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మ్యూజికల్ ఫౌంటేన్, చిల్డ్రన్స్ పార్క్, పునరుద్ధరించిన మూడు మెట్ల బావులతోపాటు సంప్రదాయ మోట పద్ధతి ద్వారా నీటిని తోడే వ్యవస్థను సైతం ప్రారంభించారు. అలాగే రాతిపై చెక్కిన శివుడు, నంది శిల్పాల నుంచి నీళ్లు జాలువారే వ్యవస్థను రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లుఅధికారులు తెలిపారు. -
అజేయ సారథికి అత్యున్నత అవార్డు
తెనాలి, మాచర్ల: ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డిని వరించింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ బుధవారం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. జనవరి 9న రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక వేడుకలో రాష్ట్రపతి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు. ఈ గౌరవంతో అజయ్‌కుమార్‌రెడ్డి భారతదేశంలో అర్జున అవార్డుకు ఎంపికై న తొలి అంధ క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. 2010 నుంచి భారత అంధుల క్రికెట్ జట్టు క్రికెటర్‌గా ఆడుతూ అనేక విజయాలను సాధించారు. తన సారథ్యంలో భారత అంధుల జట్టును పలుమార్లు విశ్వవిజేతగా నిలిపారు. 2012లో వైస్‌కెప్టెన్‌గా భారత జట్టు టీ20 వరల్డ్ కప్, 2014లో వన్డే వరల్డ్ కప్‌ను సాధించారు. జట్టు కెప్టెన్‌గా 2017 టీ20 వరల్డ్‌కప్, 2018 వన్డే వరల్డ్ కప్‌ను సాధించి, విజయపరంపరను కొనసాగించారు. తన సారథ్యంలోనే 2016లో ఆసియా కప్ సాధించగా, గత ఆగస్టులో ఐబీఎస్ఏ వరల్డ్ గేమ్స్ పోటీల్లో జట్టు రజత పతకం సాధించింది. వివిధ దేశాలతో జరిగిన సిరీస్‌ల్లో నూ అద్భుత ఫలితాలను సాధించారు. ప్రస్తుతం అర్జున అవార్డుకు ఎంపిక కావటం తన జీవితంలో మధుర క్షణంగా ‘సాక్షి’తో ఫోన్లో చెప్పారు. స్వస్థలం మాచర్ల.. భారత అంధుల క్రికెట్ జట్టును ప్రపంచ విజేతగా నడిపిస్తున్న అజయ్‌కుమార్‌రెడ్డి స్వస్థలం ప్రస్తుత పల్నాడు జిల్లా మాచర్ల. తల్లిదండ్రులు వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి. అన్నయ్య ఆంజనేయరెడ్డి పోలీస్ అధికారి. 2011లో డిగ్రీ పూర్తిచేసిన అజయ్‌కుమార్‌రెడ్డికి క్రీడాకోటాలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగం లభించింది. పదోన్నతిపై అసిస్టెంట్ మేనేజర్ హోదా దక్కింది. భార్య ప్రియ. వీరికో కుమార్తె. ప్రస్తుతం ఆయన బెంగళూరులో స్టేట్‌బ్యాంక్ రీజినల్ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. అజయ్ పుట్టుకతో అంధుడు కాదు. నాలుగేళ్ల వయసులో తలుపు గడియ తగిలి ఎడమ కంటి చూపు పోయింది. అప్పటివరకు సాధారణ స్కూల్లో చదువుకున్నారు. ఆరో తరగతిలో టీచరు బోర్డుపై రాసే అక్షరాలు కనిపించలేదు. కంటి డాక్టరుకు చూపిస్తే, ఇన్ఫెక్షన్తో కుడి కన్ను చూపు దెబ్బతిందని చెప్పారు. ఆయన సలహాపైనే 2002లో నరసరావుపేటలోని అంధుల పాఠశాలలో చేర్చారు. అక్కడే క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. 2010 వరకు చదువుకుంటూనే ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లు ఆడి బహుమతులు గెలుచుకున్నారు. ప్రస్తుతం కేంద్రం అర్జున అవార్డు ప్రకటించిన నేపథ్యంలో మాచర్ల సోమిరెడ్డి బజారులో వారి బంధువులు సంబరాలు జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆరో క్రీడాకారుడు.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అర్జున అవార్డును గెలిచినవారిలో అజయ్‌కుమార్‌రెడ్డి ఆరో క్రీడాకారుడు. గతంలో మొవ్వా శ్యాంసుందరరావు, ఆరికపూడి రమణారావు ఇద్దరూ వాలీబాల్ క్రీడలో అర్జున, ద్రోణాచార్య అవార్డులు రెండింటినీ పొందారు. బ్యాడ్మింటన్‌లో కిడాంబి శ్రీకాంత్, చదరంగంలో పెండ్యాల హరికృష్ణ, ద్రోణవల్లి హారికలు ‘అర్జున’ గౌరవాన్ని స్వీకరించారు. అంధుల క్రికెట్ విజయ సారథి... అంధుల క్రికెట్ విజయసారథి అజయ్‌కుమార్‌రెడ్డి. 2017 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఏపీ, తెలంగాణలో జరిగిన రెండు మ్యాచ్‌లను మేమే స్పాన్సర్ చేశాం. అప్పుడే ఆయనలోని ప్రతిభను, దేశభక్తిని గమనించాను. దేశం కోసం ఆడేందుకు ఎంతైనా కష్టపడటం ఆయన నైజం. భారత ప్రభుత్వం అర్జున అవార్డుకు ఎంపిక చేయటం సముచితం. – జహరాబేగం, చైర్పర్సన్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, ఆంధ్రప్రదేశ్ -
కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు... డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు
హైదరాబాద్: తెలంగాణలో 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో సోమవారం (డిసెంబర్ 18) కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ తదితర సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన సచివాలయం ఉద్యోగిని
కోనసీమ: ఇంజరం సచివాలయ కార్యదర్శిగా సేవలందిస్తున్న గాలిదేవర శివ గంగాదుర్గ థాయిలాండ్‌లో జరిగిన పారా ఒలింపిక్స్ క్రీడల్లో సత్తాచాటింది. డిస్కస్ త్రో, జెవెలెన్ త్రోలలో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. షార్ట్పుట్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పతకాలు అందుకుని తాళ్లరేవు వచ్చిన శివ గంగాదుర్గకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ ఎం.అనుపమ, ఈఓపీఆర్డీ మల్లాడి భైరవమూర్తి, కార్యాలయ ఏఓ చింతా మోహనకృష్ణ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది హారతులిచ్చి స్వాగతం పలికారు. దుశ్శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామానికి చెందిన శివ గంగాదుర్గ 2019లో ఇంజరం సచివాలయం–2లో గ్రేడ్–5 కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి సేవలందిస్తున్నారు. ఆటలపై మక్కువతోనే పారా ఒలింపిక్స్‌కు... శివ గంగాదుర్గకు చిన్నతనం నుంచి ఆటలంటే ఎంతో మక్కువ. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు స్థానికంగా ఉన్న కాన్వెంట్లో చదివి, తరువాత టెన్త్ వరకు హైస్కూల్లో చదివారు. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో పక్షవాతం వచ్చి ఎడమ చేయి పనిచేయకుండా పోయింది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో చదివి ఇంటర్ పూర్తిచేసింది. సుంకరపాలెం రవి కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సీ స్పేస్ ఫిజిక్స్ చేసేందుకు చేరింది. ఆ సమయంలో పారా ఒలింపిక్స్ గురించి తెలుసుకుని, ఎలాగైనా పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని కంకణం కట్టుకుంది. పీజీ పూర్తికాకుండానే సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువు మానేసి ఉద్యోగంలో చేరింది. యానాంలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా ప్రాంగణంలో పారా స్పోర్ట్స్ కోసం ప్రత్యేక తర్ఫీదు తీసుకుంది. 2021లో బిహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్‌లో డిస్కస్ త్రోలో బంగారు పతకం సాధించింది. 2022, 23లలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరచడంతో ఇటీవల థాయిలాండ్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌కు ఎంపికైంది. భారతదేశం నుంచి సుమారు 70 మంది పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్‌నుంచి ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో శివ గంగాదుర్గ డిస్కస్ త్రో, జావెలెన్ త్రోలలో ఎఫ్–35 విభాగంలో బంగారు పతకాలు సాధించింది. మరో క్రీడ షాట్‌పుట్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది. రూ.2 లక్షల బ్యాంకు రుణం తీసుకుని... పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే రూ.2లక్షలకు పైగా ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. శివ గంగాదుర్గ ప్రతిభను గుర్తించిన రిలయన్స్ సంస్థ రూ.50 వేల సహాయం ప్రకటించింది. దీంతో మరో రూ.2 లక్షలు బ్యాంకు రుణం తీసుకుని పోటీ లకు హాజరైనట్లు శివ గంగాదుర్గ విలేకర్లకు తెలిపింది. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, సహచర ఉద్యోగుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగానని తెలి పింది. తన తండ్రి వెంకట్రామయ్య తాను 6వ తరగతి చదివే సమయంలో మృతి చెందారని, అప్పటి నుంచి తల్లి లక్ష్మి టైలరింగ్ చేస్తూ తమ కుటుంబాన్ని పోషించి తనను ఈ స్థాయికి తీసుకువచ్చినట్లు చెప్పింది. తనకు స్పాన్సర్స్ ఉంటే మరిన్ని పతకాలు సాధిస్తానని శివ గంగాదుర్గ తెలిపింది. -
సరోగసీ ద్వారా పుంగనూరు కోడెదూడ జననం
సాక్షి, అమరావతి/ రైల్వేకోడూరు : దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతి కోడెదూడ జన్మించింది. చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయస్సున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్ని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిరావుకు చెందిన నాటు ఆవు గర్భంలో స్థానిక పశువైద్యుడు డాక్టర్ ప్రతాప్ మార్చి 4న ప్రవేశపెట్టగా, మే 25న ఈ నాటు ఆవు చూలు కట్టినట్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఆరీఫ్ నిర్థారించారు. చూలుకాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.2,500 విలువైన దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందించారు. ఈ నాటు ఆవు ఈనెల 17వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో మేలుజాతి పుంగనూరు జాతి కోడెదూడెకు జన్మనిచ్చింది. కోడెదూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశువైద్యులు ధృవీకరించారు. దేశంలోనే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్సఫర్ విధానంలో పుంగనూరు కోడెదూడ జన్మించడం ఇది తొలిసారి. తొలిసారిగా సాహివాల్ దూడకు..: గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించింది. తిరుపతి ఎస్వీ గో సంరక్షణ శాలలో మేలు జాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేసి టీటీడీ గోసాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా సాహీవాల్ దూడకు జన్మనిచ్చేలా చేశారు. ఈసారి ఓ రైతు ఇంట ఓ నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండమార్పిడి చేసి మేలుజాతి పుంగనూరు దూడకు జన్మనివ్వడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో మేలుజాతి దేశీ ఆవుల సంతతిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తామని చింతలదీవి పశు క్షేత్రానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మాటల మాంత్రికులు.. జీవితాలను నిలబెడతారు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వారి మాటలు తీవ్రమైన ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆత్మన్యూనతాభావం నుంచి బయటపడేలాచేస్తాయి. ఇక జీవితం వృథా అనేకునే వారికి మళ్లీ ఆశలు చిగురింప చేస్తాయి. వాళ్లే కౌన్సెలింగ్ సైకాలజిస్టులు ఉరుకుల పరుగుల జీవనంలో మానసిక కుంగుబాటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇలా అనేక కారణాలతో ఆత్మ న్యూనతాభావానికి గురవుతున్నారు. దీంతో ఇప్పుడు వీరి పాత్ర విస్తృతమైంది. ప్రభుత్వం టెలీమానస్ వికాస కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. అక్కడ 24 గంటలు కౌన్సెలింగ్ సైకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే చాలు వారిలోని బాధను పోగొట్టి జీవితంపై ఆశలు వికసింప చేస్తారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని టెలీ మానస్ వికాస కేంద్రం ఇలాంటి సేవలే అందిస్తోంది. 14416 నంబర్‌కు కాల్ చేస్తే చాలు ఈ టెలీ మానస్ వికాస కేంద్రంలో సేవలు పొందాలనుకునే వారికోసం దేశ వ్యాప్తంగా 14416 టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంది. ఆత్మన్యూనతాభావంతో ఉన్న వారు ఆ నంబరుకు కాల్ చేస్తే, మన రాష్ట్రానికి సంబంధించిన వారైతే ఈ కేంద్రానికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ విధులు నిర్వహించే కౌన్సెలింగ్ సైకాలజిస్టులు కాల్ చేసిన వారి సమస్యను తెలుసుకుని వారికి తమ మాటలతో ఉపశమనం కలిగిస్తారు. అలా 15 నుంచి 20 నిమిషాల పాటు వారికి ఫోన్లోనే కౌన్సెలింగ్ ఇస్తారు. కొందరికి 30 నిమిషాల వరకూ కూడా కౌన్సెలింగ్ ఇస్తామని సైకాలజిస్టులు చెబుతున్నారు. మూడు షిఫ్టుల్లో సైకాలజిస్టులు ఈ కేంద్రంలో మూడు షిఫ్టుల్లో సైకాలజిస్టులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి షిఫ్టులో 8 మంది చొప్పున, మూడు షిఫ్టుల్లో 24 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది బెంగళూరులోని నిమ్హాన్స్లో శిక్షణ పొందారు. ఎయిమ్స్ మెంటల్ హెల్త్ సపోర్టుగా వ్యవహరిస్తోంది. ఈ సెంటర్ నుంచి తెలుగు, ఇంగ్లిషుతో పాటు మరో భాషలో కూడా కౌన్సెలింగ్ ఇస్తారు. ఐఐఐటీ వారు టెక్నికల్ సపోర్టు ఇస్తున్నారు. ఆధునిక సమాజంలో..ఉరుకుల పరుగుల జీవనంలో ఒత్తిడిని తట్టుకోలేక మానసికంగా కృంగి, కృశించిపోయే బాధాసర్పదష్టులకు తమ చల్లని వెన్నెల లాంటి మాటలతో ఉపశమనం కలిగించే మాటల మాంత్రికులు వారు. ఆత్మ న్యూనతా భావంతో ఆత్మార్పణకు సన్నద్ధమయ్యే వ్యదార్థ హృదయులకు జీవితంపై కొంగొత్త ఆశలు చిగురింజేసి నూతన జీవితానికి దారి చూపే దేవతలు వారు. సున్నితంగా హితవాక్యాలు పలికే శ్రేయోభిలాషులు వారు. చేయవలసిందల్లా ఒక్కటే 14416 నంబర్‌కు కాల్ చేస్తే చాలు.. ఎంతో ప్రయోజనకరం మానసిక ఒత్తిడులకు గురైన వారికి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేసిన టెలీమానస్ వికాస కేంద్రం ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం సమాజంలో అనేక మంది తీవ్రమైన మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి ఉపశమనం కలిగించేలా ఈ కేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామం. –డాక్టర్ గర్రే శంకరరావు, ఉపాధ్యక్షుడు, ఏపీ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఈ సమస్యలే ఎక్కువ.. కుటుంబ కలహాలతో ఒత్తిళ్లకు గురవుతున్న వారు ప్రేమ విఫలం అయిన వారు అక్రమ సంబంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నం అయినవారు ఆత్మీయ స్నేహితులు, కుటుంబసభ్యులు మరణించినప్పుడు ఒత్తిడికి గురవుతున్న వారు మొబైల్స్‌కు అడిక్ట్ అయి చదువుపై, పనులపై శ్రద్ధ పెట్టలేక పోతున్నవారు ఇలా అనేక సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెందిన వారు టెలీ మానస్ కేంద్రానికి ఫోన్ చేసి ఉపశమనం పొందుతున్నారు. -
13 ఏళ్లకే ‘అత్యంత మేధావి’గా.. తెలంగాణ కొత్తగూడెం మిస్ టీన్!
ఖమ్మం/కొత్తగూడెం: అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న సియాటల్ నగరంలో ఈనెల 16న ‘సామాజిక విద్యాపరమైన సమతుల్యత’ అంశంపై జరిగిన ఈవెంట్లో కొత్తగూడేనికి చెందిన పదమూడేళ్ల బాలిక అవ్యుక్త గెల్లా ప్రతిభ కనబరిచి అత్యంత మేధావి అవార్డుకు ఎంపికైంది. అమెరికాలో ఉంటున్న గెల్లా గణేష్ – రాధిక కుమార్తె అవ్యుక్తతో పాటు 13 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 30 మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ టీన్ విభాగంలో అవ్యుక్త పలు అంశాలపై తన ప్రసంగంతో ఆకట్టుకోగా అవార్డుకు ఎంపిక చేశారు. ఈమేరకు ఆమె తాతయ్య, అమ్మమ్మ అయిన కొత్తగూడేనికి చెందిన వసుంధర వస్త్ర దుకాణం యజమానులు తాటిపల్లి శంకర్‌బాబు – రాజేశ్వరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది! -
శభాష్ .. వెంకటసుబ్బయ్య !
కడప అర్బన్ : ఓ మహిళ ఆటోలో వెళుతూ రూ. 2లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగును మరచిపోయింది. ఆటోలో బ్యాగును గుర్తించిన డ్రైవర్ వెంకట సుబ్బయ్య పోలీస్ స్టేషన్లో అప్పగించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్ నల్లకట్ల వెంకట సుబ్బయ్యకు ప్రశంసాపత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన మేరువ వెంగమ్మ జంగాలపల్లెలోని తన తల్లి ఇంటికి శుభకార్య నిమిత్తం వచ్చింది. ఈనెల 2న కమ్మపల్లెకు వెళ్లి సాయంత్రం ఆటోలో జంగాలపల్లెకు తిరుగు ప్రయాణమైంది. ఈ నేపథ్యంలో ఆటోలో బంగారు నగలున్న బ్యాగును మరిచిపోయింది. బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ వెంటనే సమీపంలోని సిద్దవటం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజుకు అందజేశారు. బాధిత మహిళకు పోలీసులు సమాచారం ఇచ్చి నగలతో కూడిన బ్యాగు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆటో డ్రైవర్‌కు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. -
వితిన్ వన్ మంత్... డాడీ మళ్లీ నవ్వుతాడు!
వరల్డ్ కప్ ఫైనల్ ఫలితం ‘అయ్యయ్యో’ అనిపించింది. కన్నీళ్ల పర్యంతం అయిన రోహిత్‌శర్మను చూసిన తరువాత ఈ ‘అయ్యయ్యో’లు రెట్టింపు అయ్యాయి. ఈ అయ్యయ్యోల సంగతి ఎలా ఉన్నా రోహిత్‌శర్మ కూతురు సమైర వీడియో క్లిప్ ఇంటర్నెట్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో... సమైర తల్లితో కలిసి వస్తుంటే రోహిత్ గురించి ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అని ఎవరో అడిగారు. ‘రూమ్‌లో ఉన్నారు. వితిన్ వన్ మంత్ ఆయన మళ్లీ నవ్వుతాడు’ అన్నది సమైర. ఈ చిన్నారి పెద్దరికానికి నెటిజనులు మురిసిపోతున్నారు. ఇంతకీ ఇది తాజా వీడియో కాదు. గత ఏడాది ఏదో సందర్భంలో ఒక అభిమాని షేర్ చేసిన వీడియో. అయితే మాత్రం ఏమిటీ తాజా పరిస్థితికి జిరాక్స్‌లా ఉంది. The way she answered 🥹❤ Samaira said : He is in a room, he is almost positive & within one month he will laugh again.@ImRo45 pic.twitter.com/yt3iSQa6MP — 46thcenturywhenRohit (@RohitCharan_45) November 23, 2023 -
97 నుంచి 77 కట్ చేస్తే... ఆ కరేజ్ ఇలా ఉంటుంది!
97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్ అడ్వెంచర్’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో పారామోటరింగ్ సాహసం చేసి నెటిజనులు ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్ ఫోర్సు వెటరన్స్ ఆపరేట్ చేసే ఫ్లైయింగ్ రైనో పారామోటరింగ్ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్ వోల్డ్ కరేజ్ అండ్ 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్’ అనే కాప్షన్‌తో ‘ఎక్స్’లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది. ‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది. -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
ప్రపంచం మెచ్చిన సైంటిస్ట్.. రూ.66 కోట్లు గెలుచుకుంది!
‘క్వాంటమ్’ అనే మాటకు ప్రతిధ్వనిగా ‘అంతులేని వేగం’ ‘అపారమైన శక్తి’ అనే శబ్దాలు వినిపిస్తాయి. దేశ పురోగతిని మార్చే శక్తి క్వాంటమ్ సాంకేతికతకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. శాస్త్రవేత్తల విషయానికి వస్తే..ప్రొఫెఫెసర్ ఊర్వశీ సిన్హా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ ఫండమెంటల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్‌లాంటి కట్టింగ్–ఎడ్జ్ టెక్నాలజీలో అందె వేసిన చేయిగా పేరు తెచ్చుకుంది. బెంగళూరులోని రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)లోని క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్‌లో ఊర్వశీ సిన్హా పనిచేస్తుంది. ఈమె పరిశోధనలకు గాను తాజాగా కెనడా ఎక్స్‌లెన్స్ రిసెర్చ్ చైర్ (సీయిఆర్‌సీ) ప్రోగ్రామ్‌కి ఎంపికైన తొలి ఇండియన్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. పరిశోధకులను ప్రోత్సహించడానికి 2008లో సీయిఆర్‌సీ ఏర్పాటైంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 8 సంవత్సరాలకు గాను సిన్హా 8 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 66 కోట్ల 69 లక్షల రూపాయలను గెలుచుకుంది. సంప్రదాయ కంప్యూటర్ సంవత్సరాల్లో చేసే పనిని క్వాంటమ్ కంప్యూటర్ నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తుంది. సూపర్ కంప్యూటర్ కంటే క్వాంటమ్ కంప్యూటర్ ఎన్నోరెట్లు వేగంగా పనిచేస్తుంది. గూగుల్, ఐబీఎం... మొదలైన సాంకేతిక దిగ్గజాలు ప్రత్యేకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. ‘క్వాంటమ్ టెక్నాలజీ’ అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మన దేశం విషయానికి వస్తే క్వాంటమ్ టెక్నాలజీ అనగానే గుర్తు వచ్చే పేరు ఊర్వశీ సిన్హా. లండన్‌లో పుట్టి పెరిగింది సిన్హా. యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో చదువుకుంది. సూపర్‌కండక్టింగ్ డివైజ్‌లపై పరిశోధనలు చేసింది. పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ కోసం కెనడాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్(ఐక్యూసీ)కు వెళ్లింది. క్వాంటమ్ ఆప్టిక్స్‌లో పరిశోధనలకు ఇంటర్నేషనల్ కమీషన్ ఫర్ ఆప్టిక్స్(ఐసీవో) నుంచి అవార్డ్ అందుకుంది. చిన్నప్పుడు కాల్పనిక కథల కంటే శాస్త్రీయ విషయాలు, గణితంపై ఎక్కువగా ఆసక్తి ప్రదర్శించేది. ఒకవిధంగా చెప్పాలంటే సైంటిస్ట్ కావాలని చిన్నప్పుడే డిసైడై పోయింది. తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించేవారు.క్వాంటమ్ ఫిజిక్స్‌పై సిన్హాకు ప్రత్యేక ఆసక్తి. బ్యాచులర్స్, మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ సబ్జెక్ట్‌గా క్వాంటమ్ ఫిజిక్స్‌ను బోధించేవారు. అలా మొదలైన ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయింది. ‘నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అనుకునేది సిన్హా.‘క్వాంటమ్ ఫిజిక్స్‌పై ఆసక్తి అధికమవుతున్న కాలంలో బంగారంలాంటి అవకాశం వచ్చింది. పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్‌లో భాగంగా క్వాంటమ్ ఆప్టిక్స్కు చేరువ కావడం నా కెరీర్‌కు ఎంతో మేలు చేసింది. నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంచింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అంటుంది సిన్హా.. బెంగళూరులోని రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ‘క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్’ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కోసం మన దేశంలో ఏర్పాటు చేసిన తొలి ల్యాబ్. ఈ ల్యాబ్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్‌కు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది సిన్హా.‘మన దేశంలో శాస్త్రీయరంగం పురోగతిని నా కాలేజీ రోజుల నుంచి చూస్తున్నాను. ఉన్నత స్థాయి పరిశోధనలకు ఇప్పుడు తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి. విదేశీ కంపెనీల నుంచి రకరకాల పరికరాలు ఆలస్యంగా అందుతున్నాయనే ఫిర్యాదు ఇప్పుడు వినిపించడం లేదు. స్థూలంగా చెప్పాలంటే శాస్త్రీయ పరిశోధనకు ఇప్పుడు నిధులు అనేవి ప్రధాన సమస్య కాదు. మన సమాజం శాస్త్రీయ సమాజంగా ఎదగాలంటే సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి కనిపించాలి. అందుకు మౌలిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది సిన్హా.బాల్యం నుంచి శాస్త్రీయపథంలో పయనిస్తున్న ఊర్వశీ సిన్హా 34 మంది ప్రముఖ గ్లోబల్ సైంటిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది. Want to know about the first ever experimental evidence of co-existence of wave & particle-like properties of a single #photon? Then check out the new Simply-PHY ep. from QuIC lab, @RRI_Bangalore & their collaborators.https://t.co/QKdNd1Vtvd@IndiaDST @PrinSciAdvGoI… pic.twitter.com/90tZ2TG1MG — Raman Research Institute (@RRI_Bangalore) September 18, 2023 గొప్ప అవకాశం సైన్స్ అనే దానికి సరిహద్దులు లేవు. అది ప్రపంచ భాష. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్లడం ద్వారానే సైన్స్‌ను ముందుకు తీసుకువెళ్లగలం. సైన్స్ పురోగతికి నా వంతు కృషి చేస్తాను... అనే మాటలను సీయిఆర్‌సీ ఇచ్చిన అవకాశం ద్వారా ఆచరణరూపం కల్పించే అవకాశం దొరికింది. ఇండియా, కెనడాలలో సమాంతరంగా క్వాంటమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై కృషి చేయడానికి ఇదొక గొప్ప అవకాశం. – ఊర్వశీ సిన్హా, సైంటిస్ట్ -
Dr. Neelima Arya: ‘షి నీడ్స్’ నీలిమ!
ఉరుకుల పరుగుల జీవితంలో మన ప్రయాసలే కనిపిస్తాయి. ఒకసారి ఆగి చుట్టూ చూస్తే.. ఇన్నాళ్లూ మనం మన కోసమే తప్ప చుట్టూ ఉన్న వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే స్పృహ కలుగుతుంది. కొందరు మనకెందుకులే అని మళ్లీ తమ పనుల్లో మునిగిపోతారు. డాక్టర్ నీలిమా ఆర్య లాంటివాళ్లు మాత్రం సున్నితమైన సమస్యలపై దృష్టి పెట్టి వాటికి సరైన పరిష్కారాలు వెదుకుతారు. హైదరాబాద్ వాసి నీలిమా ఆర్య నిరుపేద అమ్మాయిలకు లో దుస్తులను అందిస్తూ, శుభ్రతపైన అవగాహన కల్గిస్తూ వారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఏడాదిలో రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నీలిమా ఆర్యను కలిసినప్పుడు ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘మా సొంతూరు బాపట్ల. అమ్మానాన్నలకు పెద్ద కూతురిని. ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ చేశాను. మా నాన్నగారు ఆర్మీ ఉద్యోగి కావడంతో నా చదువు అంతా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా భోపాల్‌లో జరిగింది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ పదేళ్లపాటు ఇంగ్లిష్ లెక్చరర్‌గా వర్క్ చేశాను. ఆ తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లాను. అక్కడ నుంచి సౌదీ గవర్నమెంట్‌కు ఆంగ్ల ప్రొఫెసర్‌గా వర్క్ చేశాను. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి, మీడియా రంగంలో ఉండటంతో చాలా సామాజిక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే తపన అప్పుడే మొదలైంది. అమ్మానాన్నల దేశ సేవ స్ఫూర్తి కూడా నాలో ఉండటం అందుకు కారణమై ఉంటుంది. ► ఐదు ప్రాజెక్ట్స్‌తో సేవా రంగం ఐదేళ్ల క్రితం ఐదు ప్రాజెక్ట్స్‌తో ‘యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా’ ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీంట్లో భాగంగా ఎవరూ ఆకలితో పడుకోకూడదు అనే ఆలోచనతో మొదటిది ఫీడ్ ద నీడ్ ప్రాజెక్ట్ చేశాను. రోడ్‌సైడ్ ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసి, నిరుపేదలకు ఆహారం అందేలా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ‘షీ నీడ్’ ద్వారా ముఖ్యంగా గ్రామీణ అమ్మాయిలకు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేశాం. ‘మిషన్ భద్రత’ పేరుతో ఒక్కో సెట్లో ఆరు నాణ్యమైన ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన లో దుస్తులను ఉంచి, ఏడాది నుంచి నిరుపేద అమ్మాయిలకు అందజేస్తున్నాం. వచ్చే ఏడాది వరకు రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రముఖ డిజైనర్ రవిత మేయర్ ఈ లో దుస్తులను డిజైన్ చేస్తున్నారు. కొన్ని సేవాసంస్థల సహకారంతో ఇండియా మొత్తంలో ఎవరికి అవసరం ఉందో గుర్తించి, వారికి లో దుస్తులను అందజేస్తాం. వీటితర్వాత రైతులు, నిరుద్యోగులు, వయసుపైబడినవారి కోసం సాయం అందించాలనేది మా ఉద్దేశ్యం. ► లో దుస్తుల ప్రాముఖ్యత.. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని, వారికి అత్యవసరంగా కావాల్సినవి ఏమిటి అనే ఆలోచనలు ఎప్పుడూ చేస్తుంటాం. షీ నీడ్ ప్రాజెక్ట్ లో భాగంగా భవన నిర్మాణాలు జరిగే చోట, స్లమ్స్‌లలో, కూలీల పిల్లలను చూసినప్పుడు వారికి లో దుస్తుల సమస్య ఉన్నట్టు గుర్తించాం. 3 నుంచి 13 ఏళ్ల అమ్మాయిల వరకు లో దుస్తుల గురించి సరైన అవగాహన చేయగలిగితే వారిలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలం. అలాగే, శానిటరీ ప్యాడ్స్ వాడాలన్నా సరైన లో దుస్తులు ఉండాలి. నిజానికి గ్రామీణ అమ్మాయిలు, మహిళలకు సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్, లో దుస్తులు అందుబాటులో ఉండవు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని పదే పదే ఆ కుటుంబాలకు తెలియజేయడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ►సాధికారతలో భాగంగా.. ఆర్య రసోయి–క్లౌడ్ కిచెన్ ద్వారా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తున్నాను. ఎడ్యుకేటర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా, ఆంట్రప్రెన్యూర్‌గా, ఇద్దరు పిల్లల తల్లిగా నా బాధ్యతలు కొనసాగిస్తూనే సమాజానికి నా వంతు సహకారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగతున్నాను. ధనం కన్నా ముందు జీవితాన్ని క్రమశిక్షణాయుతంగా మలుచుకోవడంలోనే విజయం దాగుంది అని నమ్ముతాను. ఆ క్రమశిక్షణే నన్ను నడిపిస్తుందని నమ్ముతాను’ అని వివరించారు నీలిమా ఆర్య. – నిర్మలారెడ్డి -
ఆ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది! అదే!..ఆర్ట్ ఆఫ్ జోషిగా..
‘ఈ పనికి నేను తగను’ అనుకునే వాళ్లు కొందరు. ‘తగ్గేదే లే’ అని ముందుకు వెళ్లే వాళ్లు కొందరు. రెండో వర్గం వారికి తమ దారిలో అవరోధాలు ఎదురుకావచ్చు. అయితే వారిలోని ఉత్సాహ శక్తి ఆ అవరోధాలను అధిగమించేలా చేసి విజేతను చేస్తుంది. సౌరవ్ జోషి ఈ కోవకు చెందిన కుర్రాడు. 24 సంవత్సరాల జోషి ఫోర్బ్స్ ‘టాప్ డిజిటల్ స్టార్స్–2023’లో చోటు సంపాదించాడు...జోషి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఆల్మోర. హరియాణాలోని హన్సిలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. తండ్రి కార్పెంటర్. తల్లి గృహిణి. ఇంటర్మీడియెట్‌లో ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్లో తన స్కెచ్–మేకింగ్ వీడియోలను పోస్ట్ చేసేవాడు. తొలి రోజుల్లో ‘హౌ ఐ డ్రా యంఎస్ ధోనీ’ టైటిల్‌తో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. మొదట్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే లాక్డౌన్ టైమ్‌లో ఈ వీడియో పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఉత్సాహంతో ‘365 వీడియోస్ ఇన్ 365 డేస్’ ఛాలెంజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జోషి. ఈ చాలెంజ్ అతడి జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. సౌరవ్ జోషిని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఏ వీడియో చేసినా లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం మొదలైంది. పన్నెండు మిలియన్ల సబ్స్క్రైబర్లతో జోషి చానల్ ‘ఫాస్టెస్ట్–గ్రోయింగ్ యూట్యూబ్ చానల్’జాబితాలో చేరింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు జోషి. జోషి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడమే కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరిచాడు జోషి. ‘ఇప్పటికీ ఇది నిజమా? కలా? అని అనుకుంటాను. మొదట్లో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చాలా నిరాశగా అనిపించేది. 365 డేస్ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది’ అంటాడు జోషి. షేడింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్, హౌ టూ డ్రా ఏ పర్ఫెక్ట్ ఐ, హూ టూ యూజ్ చార్కోల్ పెన్సిల్, డ్రాయింగ్ టూల్స్ ఫర్ బిగినర్స్... ఒకటా రెండా జోషి చానల్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు పాపులర్ అయ్యాయి. ఎంతోమందిని ఆర్టిస్ట్‌లను చేశాయి. ‘మీరు వయసులో నా కంటే చాలా చిన్నవాళ్లు. నేను అప్పుడెప్పుడో బొమ్మలు వేసేవాడిని. ఆ తరువాత ఉద్యోగ జీవితంలో పడి డ్రాయింగ్ పెన్సిల్‌కు దూరమయ్యాను. మీ వీడియోలు చూసిన తరువాత మళ్లీ పెన్సిల్, పేపర్ పట్టాను. నేను మళ్లీ ఆర్టిస్ట్‌గా మారడానికి మీరే కారణం’ .....ఇలాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది ఎందుకూ పనికి రాని వీడియో’లాంటి ఘాటైన కామెంట్స్ కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంటాయి. అయితే ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు కృంగిపోవడం అంటూ జోషి విషయంలో జరగదు. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆర్ట్‌లోనే కాదు ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్లోనూ దూసుకుపోతున్నాడు సౌరవ్ జోషి. ఒక్క ఐడియా చాలు మనం వెళ్లగానే ‘సక్సెస్’ వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటాం. అది జరగకపోయేసరికి నిరాశ పడతాం. ‘ఇది మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు’ అని వెనక్కి వెళ్తాం. సక్సెస్ కావడానికి, కాకపోవడానికి అదృష్టం ప్రమేయం ఎంత మాత్రం ఉండదు. మన టాలెంట్ మీద మనకు ఎంత నమ్మకం ఉంది, విజయం కోసం ఎదురుచూడడంలో ఎంత ఓపిక ఉంది అనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. అందరిలాగే నేను కూడా మొదట్లో బాగా నిరాశపడిపోయాను. అయితే వెనక్కి మాత్రం పోలేదు. మరో సారి ట్రై చేసి చూద్దాం...అని ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఐడియాతో నా జీవితమే మారిపోయింది. – సౌరవ్ జోషి (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
మరోమారు ఎమ్మెల్యే రాచమల్లు దాతృత్వం
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని నిరుపేద ఎస్సీ విద్యార్థిని వాత్సల్యశ్రీ రష్యాలో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే ఖర్చు రూ.50లక్షలు తానే వెచ్చిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థినికి పాస్ పోర్టు, వీసాను తెప్పించానన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు బుధవారం మీడియాతో మాట్లాడుతూ పట్నం వాత్సల్యశ్రీకి ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు. విద్యార్థిని కరాటేలో కూడా రాణించిందన్నారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తనకు వివరించడంతో రూ.2లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించానన్నారు. రష్యా ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ సీటు రావడంతో తనను కలిసిందన్నారు. తాను ఏమాత్రం ఆలోచించకుండా ఆరేళ్లు చదవడానికి అయ్యే ఖర్చు రూ.50లక్షలను భరిస్తానని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తనకు కొత్త కాదని, ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తాను సాయం చేశానన్నారు. ఎవరికై నా చదువే రాజమార్గమని చెప్పారు. ఇందు కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందన్నారు. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. విద్యావంతుల కుటుంబంలో జన్మించిన తాను పేదరికంతో కొన్ని రోజులు ఇబ్బంది పడ్డానని, కేవలం విద్య కారణంగానే తన కుటుంబం మళ్లీ యధాస్థితికి వచ్చిందన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగాలంటే విద్య ద్వారానే సాధ్యమని తెలిపారు. విద్యతోనే నాగరికత అలవడుతుందన్నారు. అనంతరం పట్నం వాత్సల్యశ్రీ మాట్లాడుతూ గాడ్ ఫాదర్ లాంటి ఎమ్మెల్యే రాచమల్లుతోనే డాక్టర్ వాత్యల్సశ్రీ అవుతానని అన్నారు. తన తండ్రి శ్రీనివాస్ ఎల్ఐసీ ఏజెంట్‌గా ఉంటూ గుండెపోటుతో మరణించాడని, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు గురించి తెలుసుకుని సంప్రదించానన్నారు. పెద్ద మనసుతో స్పందించిన ఆయన తన చదువుకు సహకారం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, విద్యార్థి తల్లి సునీత పాల్గొన్నారు. -
మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నిరుపేద విద్యార్థిని వాచ్చల్య శ్రీ ఉన్నత చదువు చదుకోవాలనే కోరికను ఎమ్మెల్యే తీర్చారు. రష్యాలో ఎంబీబీఎస్ సీటు వాచ్చల్య శ్రీ సాధించగా, రష్యాలో ఆమె చదువుకయ్యే సుమారు రూ.50 లక్షల ఖర్చును ఎమ్మెల్యే భరించి చదివించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఇదీ చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
నాలుగు నెలల్లో 4 కొలువులు.. అయినా సివిల్స్ లక్ష్యంగా..
మంచి ప్యాకేజీతో వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదనుకున్నాడు. ప్రభుత్వ రంగంలో ప్రజాసేవతో వీలున్న కొలువు కావాలనుకున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ధిక్కరించాడు. లక్ష్య సాధనకు పరాక్రమించాడు. ఏ దశలోనూ నిరాశను దరి చేరనీయరాదనుకున్నాడు. ఆత్మవిశ్వాసమే మార్గమని విశ్వసించాడు. ఫలితంగా ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు గ్రూప్–1 ద్వారా డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చుక్కల సూర్యకుమార్. అయినప్పటికీ అంతిమ లక్ష్యం.. సివిల్స్‌పై గురి వీడలేదు. నిరంతర పరిశ్రమకు చిరునామాగా నిలిచే సూర్యకుమార్‌ను ఒకసారి పలకరిస్తే.. రాజమహేంద్రవరం: మాది మధ్య తరగతి కుటుంబం. సొంత ఊరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ. నాన్న వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు గోవిందరాజు, అక్క స్వాతి ఉన్నారు. తమ్ముడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నాడు. నాకు టెన్తులో మంచి మార్కులొచ్చాయి. స్టేట్‌లో ఆరో ర్యాంకు వచ్చింది. ఆ మార్కులు ఆధారంగా 2008లో నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ నా చదువుకు గట్టి పునాది పడింది. ఇంటర్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ టెన్‌లో ఒకడిగా నిలిచాను. 2014లో బీటెక్ అయ్యాక ఇన్ఫోసిస్ ఉద్యోగానికి క్యాంపస్‌లో సెలక్టయ్యాను. అప్పట్లోనే నాకు వార్షిక జీతం రూ.35 లక్షలు. అందులో కొనసాగి ఉంటే ఇప్పుడు రూ.కోటిన్నరకు చేరేవాడిని. త్రుటిలో చేజారిన అవకాశాలు ఎక్కువ జీతం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు సంతృప్తి కలిగించలేదు. అందులో సంతోషంతో ఇమడలేకపోయాను. రెండేళ్లు పని చేశాను. కానీ పబ్లిక్ సర్వీసుతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయాన్ని నాన్నతో చెప్పాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఇది ఇబ్బందికరమైనా నాన్న నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగుకు జాయినయ్యాను. 2017–20 మధ్య నాలుగుసార్లు రాశాను. ఇంటర్వ్యూ దశకు చేరుకోలేకపోయాను. ఇదే సమయంలో ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల్లో తుది జాబితాలో మిస్సయ్యాను. 2020 గ్రూప్–2లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అవకాశం పోయింది. అదే ఏడాది గ్రూప్–1 మెయిన్‌కు అర్హత సాధించినా ఇంటర్వ్యూ పోయింది. ఎస్సెస్సీ సీజీల్, నాబార్డు, ఆర్బీఐ.. ఇలా నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో విజయం దూరమయ్యేది. ఈ దశలో మానసిక దృఢత్వం కోల్పోతానేమోనని సంశయించాను. అయినా పట్టుదలతో కష్టపడేవాడిని. నిరాశ చెందేవాడిని కాదు. అంతిమ లక్ష్యం సివిల్స్ 2023– ఈ ఏడాది నా జీవితంపై చాలా మంచి ప్రభావం చూపించింది. వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించేలా చేసింది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దేవదాయ శాఖలో ఈఓ పోస్టుకు ఎంపికయ్యాను. కాగ్ అకౌంటెంటుగా సెలక్టయ్యాను. సరదాగా రాసిన గ్రూప్–4 ఉద్యోగమూ వచ్చింది. గ్రూప్–1లో విజేతగా నిలిచాను. జైల్స్ డీఎస్పీగా ఎంపికయ్యాను. ప్రస్తుతానికి దేవదాయ శాఖలో ఈఓ శిక్షణ పొందుతున్నా.. వచ్చే జనవరిలో డీఎస్పీ ట్రైనింగ్ ఆర్డర్ రాగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డీఎస్పీ అయినా నా జీవిత లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలన్నదే. ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది. పేరు : చుక్కల సూర్యకుమార్ తండ్రి : వెంకటరమణ,హెడ్ కానిస్టేబుల్ తల్లి : లక్ష్మి, గృహిణి చదువు : బీటెక్ (ట్రిపుల్ ఐటీ, నూజివీడు) ఎంపిక : గ్రూప్–1లో డీఎస్పీ (జైళ్లు)ప్రస్తుతం ఉంటున్నది : వేమగిరి (తూర్పు గోదావరి) లక్ష్యం నిర్ణయించుకుని శ్రమించాలి జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో మన సామర్థ్యానికి అనుగుణంగా ముందుగానే లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఏదైనా సాధించాలంటే కష్టం తప్ప మరో మార్గం ఉండదని తెలుసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనా ఏ సమయంలోనూ ఆత్మ విశ్వాసాన్ని దూరం చేసుకోకూడదు. నేనైతే ఈ పరీక్షల ప్రిపరేషనులో అన్ని సరదాలు, షికారులు వదులుకున్నాను. ఫెయిల్యూర్స్ వస్తున్నా నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం. – చుక్కల సూర్యకుమార్ -
అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్ టీచర్ సంపత్‌కుమార్ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్) హెల్మెట్ ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్ఎం లక్ష్మి, గైడ్ టీచర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది. -
అవయవదానంతో ఆరుగురికి ఊపిరి
రాంగోపాల్‌పేట్: తను శ్వాసను వదలి పెట్టి..మరో ఆరుగురికి ఊపిరి ఉదాడు. తను తనువు చాలిస్తూ ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపాడు. కొండంత కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు..ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే భర్తను కోల్పోయిన భార్య పెద్ద మనసుతో తీసుకున్న ఆ నిర్ణయం ఆరుగురి ప్రాణాలు నిలబెట్టింది. బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో ఆరుగురు వ్యక్తులకు ప్రాణం పోసేందుకు సికింద్రాబాద్ కిమ్స్ డాక్టర్లు సిద్ధమవుతున్నారు. వివరాలలోకి వెళితే ఏపీలోని నెల్లూరు పట్టణం గౌతంనగర్ ప్రాంతానికి చెందిన అనంతరెడ్డి, సంపూర్ణమ్మల కుమారుడు హనుమాన్‌రెడ్డి (46) హైదరాబాద్‌లో వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భార్య విజయారెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 29వ తేదీన తీవ్రమైన తలనొప్పి రావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. రోగిని పరిశీలించిన వైద్యులు తలలో బ్లడ్ క్లాట్స్ అయ్యాయని గుర్తించారు. అతని ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు మూడు రోజుల పాటు శ్రమించినా మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్‌కు గురి కాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. కిమ్స్‌లోని అవయవదాన సమన్వయకర్తలు మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానం ఆవశ్యకతను వివరించారు. ఆయన మరణించినా మరికొంత మంది ప్రాణాలు నిలబెడతారని వారు వివరించారు. దీంతో కొండంత దుఃఖాన్ని దిగమింగుకుంటూనే తల్లిదండ్రులు, భార్యా, కుమారులు ఓ గొప్ప కార్యానికి అంగీకారం తెలిపారు. దీంతో వైద్యులు ఆయన రెండు కిడ్నీలు, లంగ్స్, లివర్, రెండు కార్నియాలను సేకరించి వారికి అప్పగించారు. వీటిని జీవన్‌దాన్‌లో రిజిస్ట్రర్ చేసుకుని దాతల కోసం ఎదురు చూస్తున్న వారికి అందిస్తామని జీవన్‌దాన్ ప్రతినిధులు తెలిపారు. -
స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మీ సర్టిఫికెట్లు అన్నీ ఇకపై,, 'అపార్' కార్డులోనే..
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రయోజనం ఏమిటి? విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించబడి ఉంటుంది. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు. ‘అపార్’ నిర్వహణ ఇలా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నమోదు ప్రక్రియ.. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్‌లో నిల్వ చేయబడుతుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సౌలభ్యం! విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ -
అర్జీ పెట్టుకున్న గంటలో ట్రై సైకిల్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు గెడ్డం వర్షితకు స్పందనలో దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే విభిన్న ప్రతిభావంతుల శాఖ నుంచి ట్రై సైకిల్ అందజేశామని కలెక్టర్ మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ను శెట్టిపేటకు చెందిన గెడ్డం శైలజ కలిసి తన కుమార్తె వర్షితకు చిన్నప్పటి నుంచి మాటలు రావని, నడవలేదని, రెండు పర్యాయాలు ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స కూడా చేయించామని తెలిపారు. ఇటీవల తన భర్త కిడ్నీ సమస్యతో చనిపోవడంతో వేరే ఆధారం లేదని, తనకు వితంతు పింఛన్లు మంజూరు చేసి, ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే మాధవీలత స్పందించి వర్షితకు మరో పర్యాయం ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించాలని, తల్లి శైలజకు వితంతు పింఛను మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డీఎల్డీఓ వీణాదేవికి సూచించారు. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్పందనలో కలెక్టర్‌తో పాటు జేసీ ఎన్.తేజ్‌భరత్, డీఆర్వో జి.నరసింహులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జగనన్నకు చెబుదాం వెబ్సైట్ ద్వారా 1902 నంబర్‌కు ప్రజలు సమస్యలను తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. స్పందనకు 170 అర్జీలు వచ్చాయన్నారు. కాగా బాల్య వివాహాల నివారణలో భాగంగా సమాచార సేకరణ కోసం జిల్లాలో తొలిసారిగా టోల్ ఫ్రీ నంబరు 18004254156ను ప్రారంభించామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్ స్పందన హాలులో సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ టోల్ ఫ్రీ నంబరును ఆవిష్కరించారు. -
తమ్ముడు నేవీలో.. అన్న పోలీసు ఉద్యోగంలో
సారంగపూర్: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాతమ్ముళ్లు నెలరోజుల వ్యవధిలోనే రెండు ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మాన్పూరి లక్ష్మణ్–లక్ష్మీలకు ముగ్గురు సంతానం. ఇందులో పెద్ద కుమార్తెకు వివాహం కాగా ఇద్దరు కుమారులు లక్ష్మిరాజు, వినేష్ ఉన్నారు. అయితే బీడీ కంపెనీ నిర్వహిస్తూ ఇద్దరు కుమారులను తల్లిదండ్రులూ కష్టపడి చదివించారు. వారి కోరుకున్నట్లే పెద్దవాడైన లక్ష్మిరాజు ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. నెలరోజుల వ్యవధిలోనే రెండురోజుల క్రితం విడుదలైన నావికాదళం(నేవి) ఉద్యోగానికి అతడి తమ్ముడు వినేష్ ఎంపికయ్యాడు. శుక్రవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నాడు. తమ్ముడు దేశ రక్షణ దళంలో, అన్న రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే ఉద్యోగం సాధించడంపై మండల ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తూ శభాష్ సోదరులారా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
శెభాష్.. రెండు చేతుల్లేకపోయినా.. రెండు స్వర్ణాలు.. శీతల్ సరికొత్త చరిత్ర
హాంగ్జౌ: తన వైకల్యమే కుంగిపోయేలా... ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా భారత క్రీడాకారిణి శీతల్ దేవి ఆసియా పారా క్రీడల్లో పతకాల ‘హ్యాట్రిక్’ సాధించింది. కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల ఈ టీనేజ్ ఆర్చర్‌కు రెండు చేతులు భుజాల నుంచే లేవు. మరి రెండు చేతులు తప్పక కావాల్సిన విలువిద్యలో ఆమె పతకాలపై గురిపెట్టడం ఏంటని ఆశ్చర్యం కలుగకమానదు. శీతల్ కాళ్లతో విల్లును నిటారుగా నిలబెట్టి, నోటితో బాణాన్ని లాగిపట్టి... లక్ష్యంపై గురిపెట్టే ఆమె ప్రావీణ్యానికి జేజేలు పలకాల్సిందే! ఆమె ప్రదర్శన ముందు వైకల్యం పూర్తిగా ఓడిపోయింది. ఈ ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో ఆమె ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇంతకుముందు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజతం నెగ్గిన ఆమె రాకేశ్ కుమార్‌తో కలిసి గురువారం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. శుక్రవారం జరిగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి 144–142తో అలీమ్ నూర్ సియాదా (సింగపూర్)పై గెలిచింది. తద్వారా ఒకే ఆసియా పారా ఈవెంట్లో రెండు బంగారు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ఇదే ఈవెంట్లో అంకుర్ రెండు స్వర్ణాలతో పురుష అథ్లెట్‌గా నిలిచాడు. శుక్రవారం పారాలింపిక్ చాంపియన్ అయిన షట్లర్ ప్రమోద్ భగత్, మహిళల్లో తులస్మతి మురుగేశన్, పురుషుల డబుల్స్‌లో నితేశ్–తరుణ్ జోడీ బంగారు పతకాలు సాధించారు. ఒక్క బ్యాడ్మింటన్‌లోనే భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరడం విశేషం. కాగా శనివారం ముగిసిన ఈ క్రీడల్లో భారత్ 111 పతకాలు కైవసం చేసుకుని తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఇందులో 29 పసిడి, 31 రజతాలు, 51 కాంస్యాలున్నాయి. ఇక ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా పారా క్రీడల్లో ఐదో స్థానం సంపాదించింది. Here is the inspirational story of Sheetal Devi. She is crowned as Asian Para games champion. This old video was by @thebeingyou. Watch to believe. pic.twitter.com/Fskqj09tdn — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 27, 2023 -
శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023 'రన్నరప్' గా నిర్మల్ యువతి
సాక్షి, ఆదిలాబాద్: ఫ్యాషన్‌రంగంపై మక్కువతో అందులో ఎదుగుతున్న నిర్మల్ యువతి అరుదైన స్థానంలో నిలిచింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023శ్రీ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన నిషిత తిరునగరి ఒక్క మార్కు తేడాలో రన్నరప్‌గా నిలిచింది. స్థానిక ఈద్గాంకు చెందిన సరళ, మనోహర్‌స్వామి దంపతుల కూతురు నిషిత బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివింది. భవిష్యత్తుపై తనకున్న నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్‌రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 18రాష్ట్రాల మహిళలు, యువతులకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌డిఫెన్స్ కోర్సును నేర్పిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన పోటీల్లో నిషిత రన్నరప్‌గా నిలువడంపై కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని -
చిన్న విషయానికే నన్ను వదిలేసి నా భర్త వెళ్లిపోయాడు
కర్ణాటక: మాసిపోయిన తెల్లగడ్డం, చిరిగిపోయిన బట్టలు, పాత చెప్పులు, భుజంపై పెద్ద మూటతో ఒక వృద్ధుడు నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడు గంజాయిని అమ్ముతున్నాడేమోనని ఓ వ్యక్తి అనుమానంతో డయల్ 112 నంబర్‌కు కాల్చేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్ కాల్ ఒక కుటుంబాన్ని కలిపింది. ఫోన్ చేసిన వ్యక్తి చొరవ, పోలీసుల కృషి దీని వెనుక ఉన్నాయి. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని ఆపి అతడి భుజంపై మోస్తున్న పెద్ద మూటను పరిశీలించగా డబ్బులు కనిపించాయి. అందులో రూ. 50 వేల చిల్లర, నోట్లు ఉన్నాయి. ఈ ఘటన తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా చెన్నరాయనదుర్గ హోబళి సిద్దరబెట్ట గ్రామ పంచాయతీ పరిధిలో మరేనాయకనహళ్లి గ్రామంలో జరిగింది. పదేళ్ల కిందట ఇల్లు వదిలి.. కొంతకాలంగా మరేనాయకనహళ్లి బస్టాండ్‌వద్ద గురుసిద్ధప్ప అనే వ్యక్తి చిరిగిపోయిన దుస్తులు ధరించి మూటతో ఉంటున్నాడు. అతన్ని పోలీసులు విచారించగా తన కథ చెప్పాడు. గుబ్బి తాలూకా చేళూరు హోబళి ఎంహెచ్ పట్న గ్రామ పంచాయతీ పరిధిలోని మాదాపుర గ్రామానికి చెందిన గురుసిద్ధప్ప తన భార్యతో గొడవల కారణంగా పదేళ్ల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చి జీవిస్తున్నట్లు చెప్పాడు. తుమకూరు, గుబ్బి, దేవరాయనదుర్గ, మధుగిరి, పావగడ, కొరటగెరె, సిద్దరబెట్ట తదితర ప్రాంతాల్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బును గోనెసంచిలో భద్రం చేసుకున్నాడు. కుటుంబాన్ని పిలిపించి.. ఏఎస్సై హనుమంతరాయప్ప, హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణయ్య, కొరటెగెరె పీఎస్సై చేతన్‌లు అతని భార్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే భార్య మంగళమ్మ, కుమారుడు ప్రవీణ్ వచ్చారు. గురుసిద్ధప్పను, అలాగే నగదును అందించి మానవత్వం చాటుకున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు ‘చిన్న విషయానికే నన్ను వదిలేసి నా భర్త వెళ్లిపోయాడు. పదేళ్లు అయిపోయింది. కొరటగెరె పోలీసుల సహాయంతో మళ్లీ మాకు దొరికాడు. నా భర్త దాచిన డబ్బులు తిరిగి మాకే పోలీసులు ఇచ్చారు. నా భర్తను తిరిగి అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు.’ – మంగళమ్మ -
అరచేతిలో పంచాయతీ సమాచారం! మళ్ళీ కొత్త హంగులతో..
ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను పంచాయతీ కార్యాలయాలకు వెళ్లకుండానే యాప్ ద్వారా పరిశీలించవచ్చు. పంచాయతీలకు సంబంధించిన పద్దుల వివరాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ యాప్‌ను 2019 లోనే రూపొందించగా కొన్ని కారణాలతో వివరాలన్నింటినీ నిక్షిప్తం చేయలేదు. గతేడాది నుంచి అన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్.. గ్రామపంచాయతీకి సంబంధించిన నిధుల వివరాలే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల సమాచారాన్ని సైతం యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంజూరు చేసే నిధుల వివరాలతో పాటు ఏయే పనులకు ఎంత మొత్తం వెచ్చించారు. పనులు ఏ దశల్లో ఉన్నాయనే సమాచం యాప్‌లో దర్శనమిస్తుంది. జిల్లా - పంచాయతీలు ► ఆదిలాబాద్ - 467 ► నిర్మల్ - 396 ► మంచిర్యాల - 311 ► ఆసిఫాబాద్ - 335 పారదర్శకతకు ప్రాధాన్యం.. పంచాయతీ నిధుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నిక్షిప్తం చేయడంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేపడుతున్నాయనేది ప్రజలు సులువుగా తెలుసుకోవచ్చు. గ్రామంలో చేపట్టే పనులను జీపీఆర్ఎస్ ద్వారా గుర్తిస్తుండడంతో ఒక్కసారి నిధులు మంజూరైన పనికి మరోసారి బడ్జెట్ కేటాయించడానికి వీలుండదు. పద్దుల వివరాలు ప్రజల వద్దకు వెళ్లడంతో పాలకవర్గాలు పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలు ప్రశ్నించవచ్చు. పంచాయతీ వివరాలు ఇలా.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్‌కు వెళ్లి ‘మేరీ పంచాయతీ’ అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తెరవగానే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, పంచాయతీ వివరాలు దర్శనమిస్తాయి. వాటిని నమోదు చేయగానే గ్రామపంచాయతీకి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు లేదా పిన్‌కోడ్‌తో సైతం సంబంధిత పంచాయతీ వివరాలు తెలుసుకోవచ్చు. సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.. గ్రామపంచాయతీలకు సంబంధించిన వివరాలను నెలకోసారి ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షిప్తపరుస్తారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిధుల కేటాయింపు, పనుల వివరాల్లో సందేహాలు ఉంటే గ్రామసభల్లో ప్రశ్నించవచ్చు. – అరుణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర రోడ్లపై విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులు పరుగులు పెట్టే రోజులు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి నుంచి కొండపైకి విద్యుత్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే నెల్లూరు–తిరుపతిల మధ్య ఇవి నడుస్తున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన పెద్ద నగరాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు కొన్నాళ్లుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తొలిదశలో వెయ్యి విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. విశాఖ నగరానికి 200 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమవుతాయని ఆర్టీసీ జిల్లా అధికారులు యాజమాన్యానికి ఇదివరకే ప్రతిపాదనలు పంపారు. ఈ–బస్సుల కొనుగోలు మొదలవుతున్న నేపథ్యంలో.. మరో మూడు నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తాజాగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమే కాదు.. త్వరలోనే కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖకు తొలి విడతలో వీటిలో కనీసం వంద బస్సులనైనా కేటాయిస్తారని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. మలి దశలో మరో వంద విద్యుత్ బస్సులను ఇస్తారని ఆశాభావంతో ఉన్నాయి. సిటీ సర్వీసులుగానే.. విశాఖకు కేటాయించే ఎలక్ట్రిక్ బస్సులను తొలుత సిటీ సర్వీసులుగానే నడపనున్నారు. బ్యాటరీతో నడిచే ఈ–బస్సులు గతంలో 150 కిలోమీటర్లు తిరగడానికి మాత్రమే చార్జింగ్ సరిపోయేది. క్రమంగా వీటిలో సాంకేతికతకను అభివృద్ధి చేస్తుండడంతో ఇప్పుడు వాటి మైలేజి మరింత పెరిగే అవకాశం ఉంది. నగర పరిధిలో ప్రస్తుతం సిటీ బస్సులు రోజుకు 250 నుంచి గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. తొలుత వచ్చే విద్యుత్ బస్సులను తక్కువ కిలోమీటర్ల రూటుల్లో తిప్పాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. మలి విడతలో రానున్న ఎలక్ట్రిక్ బస్సులను అప్పటి పరిస్థితులకనుగుణంగా వివిధ సిటీ రూట్లలో నడపనున్నారు. కొన్నాళ్ల తర్వాత సమీపంలోని పట్టణాలకు రెగ్యులర్ సర్వీసులుగా నడపాలని వీరు భావిస్తున్నారు. సింహపురి, గాజువాక డిపోలు ఎంపిక విద్యుత్ బస్సుల కోసం నగర పరిధిలోని సింహపురి, గాజువాక, వాల్తేరు డిపోలను తొలుత సిఫార్సు చేశారు. చివరకు వీటిలో సింహపురి, గాజువాకలను దాదాపు ఖరారు చేశారు. ఈ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమయ్యే చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. విశాఖలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ కోసం సింహపురి లేఅవుట్లో డిపోతో పాటు గ్యారేజీని కూడా ఏర్పాటు చేయనున్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్సులు విశాఖ నగర పరిధిలోని ఏడు డిపోల్లో ప్రస్తుతం 525 సిటీ బస్సులున్నాయి. వాహనాల తుక్కు విధానంలో భాగంగా 15 ఏళ్లు దాటిన బస్సులను సేవల నుంచి తొలగిస్తున్నారు. ఇలా తొలగించిన డీజిల్ బస్సుల స్థానంలో దశల వారీగా ఈ–బస్సులను సమకూరుస్తారు. విశాఖ జిల్లా ప్రజా రవాణా విభాగంలో ఈ సంవత్సరం 35 ఆర్టీసీ సిటీ బస్సులను తొలగించారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి మరో 150 వరకు సిటీ బస్సులు 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోనుండడంతో వీటిని కూడా సేవల నుంచి తప్పించనున్నారు. విశాఖకు కేటాయించే ఎలక్ట్రిక్ బస్సులను తొలగించిన డీజిల్ బస్సుల స్థానంలో దశల వారీగా భర్తీ చేస్తామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీవో) ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. డీజిల్ బస్సులు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తే నగరంలో కొంతవరకు కాలుష్య నియంత్రణకు వీలు పడుతుందని తెలిపారు. -
విజయవంతంగా గుండెమార్పిడి
సాక్షి, చైన్నె: చైన్నెకు చెందిన 22 ఏళ్ల యువకుడికి తిరుచ్చికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి గుండెను అవయవ మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా అమర్చారు. విజయవంతం కావడంతో ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. సోమవారం చైన్నె గ్లెనెగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోవిని బాల సుబ్రమణియన్ వివరాలను మీడియాకు వివరించారు. చైన్నెకు చెందిన యువకుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం ద్వారా అతడిని చికిత్స నిమిత్తం మే నెలలో గ్లెనెగల్స్కు తరలించారు. ఆర్గాన్ రిజిస్టర్డ్ జాబితా మేరకు తిరుచ్చిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన 30 ఏళ్ల వ్యక్తి గుండెను ఈ యువకుడికి దానం చేశారు. గత నెల 13వ తేదీ ఐదు గంటల పాటుగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. తనకు పునర్జన్మ దక్కడంతో వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు. -
మనిషి అవసరం లేకుండానే.. 24 గంటలూ ‘చాయ్’! మొదటి ‘టీ’ ఏటీఏం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్ ఓపెన్‌క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు. ఈ సందర్భంగా జెమ్ ఓపెన్‌క్యూబ్ సీఈఓ పి.వినోద్ కుమార్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్ టీ, బాదం పాలు, బిస్కెట్లతో సహా మంచి నీటి బాటిల్లను అందించే ‘డిజిటల్ చాయ్’ లేదా ‘చాయ్ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. జెమ్ ఓపెన్‌క్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, ప్రకాష్ వేలుపుల, త్రిలోచన్ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు.. ఒకే ఇంట్లో నలుగురు సెలెక్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ పూర్తైంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్ఎల్పీఆర్బీ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో ఒకే కుటుంబంలో నలుగురికి కొలువులు వచ్చాయి. దీంతో, ఆ కుటుంబ సభ్యులు, అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సిర్దాపూర్ మండలం జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ కొలువులు వచ్చాయి. గ్రామానికి మెగావత్ నెహ్రు నాయక్, మారోని బాయి దంపతుల ఇద్దరు కుమారులు మెగావత్ రమేష్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మలోత్ రోజా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వీరంతా కలిసి పరీక్షలకు సన్నద్ధం కావడంతో విజయం సాధించినట్టు చెప్పుకొచ్చారు. ఇంట్లో నలుగురికి జాబ్ రావడం సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు.. పోలీసు నియామక ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మల్లవరం నుంచి 13మంది కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఉపేందర్, హరీష్, సివిల్‌లో సైదులు, శ్రీకాంత్, ఎఆర్లో తిరుపతిరావు, కటికి ప్రవళిక, టిఎస్ఎస్పీలో రవీందర్,పవన్, దుగ్గిదేవర వంశీ, యర్రి లక్ష్మణరావు, శ్రీహరి, వరుణ్, ఎస్పీఎఫ్ లో రాంమోహన్ లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అలాగే చింతకాని మండలంలో ఏడుగురు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్ సాధించడం పట్ల గ్రామస్థులు అభినందిస్తున్నారు. మునుముందు ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వరంగల్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకబోర్డు విడుదల చేసిన తుది ఫలితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్. ఈయన వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అంజలి. వీరి కుమార్తెలు ప్రత్యూష, వినూష. -
ఒకేసారి అక్కాచెల్లెళ్లిద్దరికి..
వరంగల్: అక్కాచెల్లెళ్లు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మర్థ శ్రీనివాస్–అంజలికి ప్రత్యూష, వినూష కుమార్తెలు ఉన్నారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించి పరీక్షలు రాశారు. ఇందులో ఓపెన్ కేటగిరీలో ఇద్దరు 111 మార్కులు సాధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అభినందించారు. కాగా, మండల పరిధిలో పలువురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. -
మెరి‘సాయి దివ్య’ ప్రయోగాలు
తెనాలి: తెనాలికి చెందిన బుల్లి ఉపగ్రహాల రూపశిల్పి కొత్తమాసు సాయిదివ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాను రూపొందించిన క్యూబ్‌శాట్–బీడబ్ల్యూశాట్‌ను స్పెయిన్ దేశంలో అక్కడి బీ2 స్పేస్ కంపెనీ సాయంతో బుధవారం స్ట్రాటో ఆవరణలోకి ప్రయోగించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంంలో పీహెచ్డీ స్కాలర్ అయిన సాయిదివ్య ప్రయోగించిన పేలోడ్లలో ఇది మూడోది కావటం విశేషం. 280 గ్రాముల ఈ పేలోడ్‌ను ఇక్కడి తన సొంత ‘ఎన్–స్పేస్‌టెక్’ అనే సంస్థలో తన బృందంతో కలిసి ఆమె తయారుచేశారు. ఇదీ నేపథ్యం శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్న కొత్తమాసు సాయిదివ్య బాపట్ల ఇంజినీరింగ్ కాలేజిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేశారు. కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు. తన థీసిస్‌లో భాగంగా తన నివాసంలోనే ‘ఎన్–స్పేస్‌టెక్’ అనే సొంత కంపెనీని ఆరంభించారు. అంతరిక్ష సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావ టం, తక్కువ ఖర్చుతో బుల్లి ఉపగ్రహాల తయారీని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తొలిగా లక్ష్యశాట్ పేరుతో క్యూబ్‌శాట్‌ను తయారుచేసి, గతేడాది మార్చిలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ సహకారంతోనే స్ట్రాటో ఆవరణలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో పంపిన 400 గ్రాముల లక్ష్యశాట్, భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి, స్ట్రాటో అవరణలో కొన్ని గంటల ఉండగలిగింది. ప్రైవేట్ ర్యాకెట్ ప్రయోగంలో భాగస్వామి తర్వాత కొద్దినెలల్లోనే దేశంలో జరిగిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో సాయిదివ్య భాగస్వామి కాగలిగారు. స్కై రూట్ అనే ప్రైవేటు సంస్థ విక్రమ్–ఎస్ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సబ్ ఆర్బిట్‌లోకి ప్రయోగించారు. ఆ రాకెట్ తీసుకెళ్లిన మూడు పేలోడ్లలో తెనాలిలో సాయిదివ్య రూపొందించిన లక్ష్యశాట్–2 పేలోడ్ ఒకటి కావటం గమనించాల్సిన అంశం. స్ట్రాటో ఆవరణలో అధ్యయనానికి బీడబ్ల్యూశాట్ ఆ క్రమంలోనే సాయిదివ్య తమిళనాడుకు చెందిన శక్తిప్రియ, బాపట్ల, కాకినాడలకు చెందిన రెహమాన్, ఉత్తేజ్‌తో కలిసి బీడబ్ల్యూశాట్‌ను తయారుచేశారు. మయన్మార్ దేశంలోని ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు శాటిలైట్ టెక్నాలజీపై వీరు ఇక్కణ్ణుంచే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ బోధనలో భాగంగానే తయారుచేసిన బీడబ్ల్యూశాట్‌ను మయన్మార్ తీసుకెళ్లి అక్కడి విద్యార్థులకు ప్రదర్శించారు. డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అనంతరం బీ2 స్పేస్ కంపెనీ సహకారంతో స్పెయిన్‌లో ప్రయోగించారు. తాజా పేలోడ్‌తో స్ట్రాటో ఆవరణంలోని ఉష్ణోగ్రత, తేమ, ఆల్డిట్యూడ్ ప్రెషర్, యూవీ ఇంటెన్సిటీ, ఎంత వెలుతురు ఉంది అనే డేటా సేకరణ వీలవుతుందని బుధవారం సాయంత్రం సాయిదివ్య స్థానిక విలేకరులకు తెలిపారు. స్కైరూట్ సంస్థతో కలిసి త్వరలో జరగనున్న విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో భాగస్వామ్యం కానున్నట్టు చెప్పారు. రాకెట్లో ప్రయోగించే ఐయూ క్యూబ్‌శాట్ పేలోడ్ రూపకల్పనలో ఉన్నట్టు వివరించారు. తన తొలి పేలోడ్ నుంచి ఇప్పటివరకు తన భర్త రఘురామ్, అత్తమామలు కొత్తమాసు కుమార్, చంపకవల్లి, తండ్రి కేఎన్ ప్రసాద్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. -
అందరివాడు.. ఈ ఆటోవాలా
మదనపల్లె సిటీ: ఆటోజానీ, ఆటో రాజా.. ఇలా రకరకాల పేర్లతో కొందరు హీరోలు సినిమాల్లో ఆటో డ్రైవర్ల పాత్రలో అభిమానులను మెప్పించారు. అయితే నిజ జీవితంలో ఆటో డ్రైవర్ పఠాన్ బాబు సామాన్యులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి ప్రయాణ అవసరాలను తీరుస్తూ అందరివాడిగా నిలుస్తున్నాడు. ►మదనపల్లె పట్టణం సైదాపేటకు చెందిన పఠాన్‌బాబు దాదాపు 35 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ ప్యాసింజర్లను ఆటోల్లో తీసుకెళ్తున్నపుడు గర్భిణులు, బాలింతలు, ఇతర ప్రయాణికులు పడే బాధలు చూసి చలించిపోయాడు. అప్పటి నుంచి తాను సంపాదించిన దాంట్లో కొంత మేరకై నా పేదల కోసం వెచ్చించాలనే తపనతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా దివ్యాంగులు, గర్భిణులను ఉచితంగా ఆటోలో తీసుకెళ్తున్నారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఐదేళ్లుగా తన ఆటోలో శుద్ధజల క్యాన్ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రయాణికులే కాకుండా బెంగుళూరు బస్టాండులో ఆటో కార్మికులు ఈ మినరల్ వాటర్ తాగుతున్నారు. ఈయన సేవలను గుర్తించిన పలువురు అభినందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఆటోలో పార్టీ జెండా గుర్తులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఫొటోలు పెట్టుకున్నాడు. సేవలోనే సంతృప్తి వైఎస్సార్ పార్టీ అంటే ఎనలేని అభిమానం. సమాజ సేవ చేయడంలోనే సంతృప్తి కలుగుతోంది. రోజూ సంపాదనలో కొంత మేరకు ఖర్చు చేస్తా. ఆటో డ్రైవర్లు అంటే మంచి భావన కలిగే విధంగా చేయాలన్నదే ధ్యేయం. ఎంతో మంది గర్భిణులను ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళుతున్నా. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తా. – పఠాన్‌బాబు, ఆటో డ్రైవర్, మదనపల్లె -
పేదల వైద్యుడు.. ఆదర్శనీయుడు ఈసీ గంగిరెడ్డి
పులివెందుల: దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల వైద్యుడిగా పేరు పొంది, ఎందరికో ఆదర్శనీయుడిగా నిలిచారు. ఆయన పులివెందులతోపాటు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20న ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6 నుంచి 8 వరకు పులివెందుల జెడ్పీ హైస్కూలు, 9 నుంచి 10వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో చదివారు. 10వ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఎంబీబీఎస్, పీడీ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. పులివెందులలోని శ్రీనివాస హాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా, ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. ఈ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, పక్క జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వచ్చి వైద్య సేవలు పొందారు. మారుతున్న కాలాన్ని బట్టి భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి) స్థాపించి వైద్య సేవలు అందించారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు తపన పడేవారు. దినేష్ నర్సింగ్ హోం ద్వారా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు సేవ చేశారు. రాజకీయ ప్రస్థానం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2001 నుంచి 2005 వరకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్రజలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. 2003 రబీ సీజన్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదని పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. నేడు ప్రత్యేక ప్రార్థనలు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తృతీయ వర్ధంతి వేడుకలు మంగళవారం పులివెందులలో ఘనంగా జరగనున్నాయి. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద మంగళవారం ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక భాకరాపురంలో గల దినేష్ నర్సింగ్ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న అనంతపురం అమ్మాయి
సాక్షి, అనంతపురం డెస్క్: క్రికెట్లో ఉన్నత స్థాయికి ఎదగడమంటే ఆషామాషీ కాదు. ఎంతో నైపుణ్యంతో పాటు నిలకడగా రాణించాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు అందివస్తాయి. మరీ ముఖ్యంగా మహిళలు ఈ క్రీడలో రాణించాలంటే ఎన్నో సవాళ్లను అధిగమించాలి. అయితే..అన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ క్రికెటర్‌గా సత్తా చాటుతోంది బారెడ్డి అనూష. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం సాఽధించిన భారత మహిళా క్రికెట్ జట్టులో అనూష కూడా సభ్యురాలు కావడం విశేషం. పల్లెటూరి నుంచి... అనూష స్వగ్రామం నార్పల మండలం బండ్లపల్లి. తల్లిదండ్రులు లక్ష్మిదేవి, మల్లిరెడ్డి. వీరిది సాధారణ రైతు కుటుంబం. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న వారు. అయినప్పటికీ కుమార్తె ఆకాంక్షను కాదనలేదు. సాధారణంగా ఆడపిల్లలు క్రికెట్ ఆడతామంటే తల్లిదండ్రులు అంగీకరించరు. అది కూడా గ్రామాల్లో అయితే ‘మగపిల్లల్లా ఏమిటీ ఆటలు’ అంటూ అభ్యంతరం చెబుతారు. కానీ అనూష తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె కూడా పట్టుదలతో రాణించి ఉన్నతస్థాయికి చేరింది. మలుపు తిప్పిన ‘స్పిన్’ అనూష కెరీర్ ప్రారంభంలో ఎడమ చేతి మీడియం పేస్ బౌలింగ్ చేసేది. బంతిని కూడా బాగా స్వింగ్ చేసేది. కానీ పేస్‌బౌలర్‌గా రాణించాలంటే మంచి ఎత్తు అవసరం. అనూషకు అందుకు తగ్గ ఎత్తు లేకపోవడంతో 2018–19 సీజన్లో ఆమె బౌలింగ్ శైలిని మార్చేందుకు కోచ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా మార్పు చేశాడు. ఆ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్ అవసరం ఉండడం, అందుకు తగ్గట్టుగానే అనూష రాణించడంతో ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. అనూష మంచి స్పిన్నర్ మాత్రమే కాదు..అద్భుతమైన ఫీల్డర్. అలాగే డెత్ ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్ చేయగలదు. ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉండడం టీమిండియాలో చోటు దక్కడానికి దోహదపడ్డాయి. ఉమ్మడి జిల్లాలో తొలి ప్లేయర్ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి క్రికెట్ (పురుషులు/మహిళలు)లో ఇదివరకు ఎవరూ అంతర్జాతీయస్థాయికి ఎదగలేదు. రాష్ట్ర, జోనల్ స్థాయికే పరిమితమయ్యారు. కానీ అనూష టీమిండియాలో చోటు సంపాదించి..జిల్లాలో తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రాయలసీమలో అంజలి శర్వాణి (ఆదోని, కర్నూలు జిల్లా) తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్ అనూష కావడం గమనార్హం. ఆర్డీటీ సహకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేకమంది క్రీడాకారులకు రూరల్ డెవలప్మెంటు ట్రస్టు (ఆర్డీటీ) అండగా నిలుస్తోంది. ఈ కోవలోనే అనూషకు కూడా అన్నివిధాలా సహాయ సహకారాలు అందించింది. క్రికెట్లో అనూష నైపుణ్యాన్ని గుర్తించిన ఆర్డీటీ తన అకాడమీలో చేర్చుకుని ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఆంధ్ర క్రికెట్ జట్టు మొదలుకుని టీమిండియాలో చోటు సంపాదించే వరకు..ప్రతి దశలోనూ అండగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని అనుకోలేదు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడతానని ఎన్నడూ ఊహించలేదు. అంకితభావం, నిరంతర కృషితో అవకాశాలు దక్కాయి. అమ్మానాన్న వ్యవసాయంతో పాటు కూలి పనులకు వెళ్తూ నన్ను ఉన్నత స్థానంలో చూడాలని ఆశించారు. వారి ఆకాంక్షను నెరవేర్చడం ఎంతో సంతోషంగా ఉంది. ఆర్డీటీ, అనంతపురం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లు, మా పీఈటీ సార్.. ఇలా ఎందరో ప్రోత్సాహం, సహకారం వల్ల ఈ స్థాయికి రాగలిగాను. అందరికీ కృతజ్ఞతలు. ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన టీమిండియాలో నేనూ ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. మరింతగా రాణించి దేశానికి, జిల్లాకు మంచి పేరు తెస్తాను. –బి. అనూష, భారత క్రికెటర్ -
ఉజ్జయిని ఘోరం.. పోలీసాయన మంచి మనసు
భోపాల్: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మైనర్‌పై లైంగికదాడి ఘటన దేశాన్ని విస్మయానికి గురి చేసింది. దారుణంగా లైంగికదాడికి గురవ్వడం ఒకటైతే.. నెత్తురుతో వీధివీధి తిరిగినా ఆమెకు ఎవరూ సాయం అందించకపోవడం దుర్మార్గమనే కోణంలో చర్చ నడిచింది. అయితే.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపితం అయ్యిందిప్పుడు. ఆ బాలిక తల్లిదండ్రులు ముందుకు రానిపక్షంలో తాను దత్తత తీసుకుంటానని ఓ పోలీసాయన ముందుకు వచ్చారు. ఈ ఘటనలో ఓ పూజారి బాధితురాలిని గుర్తించి.. ఆమెకు దుస్తులు ఇవ్వడంతో పాటు ఆస్పత్రికి తరలించి మరీ పోలీసులకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆస్పత్రిలో ఆమెకు ఇద్దరు పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారన్నది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. ఆమె కోలుకునేంత వరకు చికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు ఆమె చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానంటూ ఓ పోలీస్ అధికారి ముందుకు వచ్చారు. ఉజ్జయిని మహాకాల్ ఇన్స్పెక్టర్ అజయ్ వర్మ పెద్ద మనసు చాటుకున్నారు. ఆమెని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చే క్రమంలో విఫలమైతే.. ఆమెను తాను దత్తత తీసుకుంటానని ముందుకొచ్చారు. ఆస్పత్రిలో ఆ చిన్నారి బాధతో ఏడ్చిన ఏడ్పు తనను కదిలించిందని అంటున్నారాయన. ఆ కేకలు తనతో కన్నీళ్లు పెట్టించాయని, దేవుడు ఇంత చిన్న వయసులో ఆమెకు ఇంత కష్టం ఎందుకు ఇచ్చాడా? అనిపించిందని అంటున్నారాయన. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ముందుకు రావట్లేదేమో అనిపిస్తోంది. వాళ్లు ముందుకు వస్తే.. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా. ఒకవేళ ఆమె కుటుంబం ముందుకు రానిపక్షంలో.. నేనే ఆమెను లీగల్‌గా దత్తత తీసుకుని పెంచుకుంటా అని ఇన్స్పెక్టర్ వర్మ అంటున్నారు. జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ధైర్యం చెప్పా… ‘రక్తమోడుతూ సాయం కోసం అర్థిస్తున్న బాలికను ఆశ్రమం వద్ద చూశా. మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. ఆమె కళ్లు వాచిపోయాయి. నీకేం కాదని ధైర్యం చెప్పా. కొత్త వాళ్లను చూడగానే ఆమె నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది. బాలిక ఏదో చెప్పింది. కానీ నాకు అర్థం కాలేదు. పెన్ను, పేపర్ అందించినా ఏమీ రాయలేదు. దుస్తులు అందించి పోలీసులకు సమాచారం ఇచ్చాను’ అని ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడి అరెస్టు? లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్న బాలికపై అతడు అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వద్ద నుంచి బాలిక దుస్తుల్ని రికవరీ చేసినట్టు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం సంపాదించినట్టు పోలీసులు తెలిపారు. తప్పించుకునేందకు ప్రయత్నించిన అతన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టైఫాయిడ్లోనూ వైద్య సేవలందిస్తూ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతూ చేతికి సెలైన్‌తోనే విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు వైద్యురాలు కృష్ణశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ప్రభ్వుత్వాస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణశ్రీ కొద్దిరోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం అయితే చేతికి సెలైన్ కూడా పెట్టుకున్నారు. అంత అనారోగ్యంలో కూడా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 24 గంటలపాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించారు. ఇన్ పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వారి రికార్డులను పరిశీలించారు. కృష్ణశ్రీ గతంలో వరదల సమయంలో కూడా పేషంట్లకు విశేషమైన సేవలందించిన ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి -
అవయవదానంతో అమరుడయ్యాడు
గుంటూరు: తాను మరణిస్తూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు కట్టా కృష్ణ అనే యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అయిన కృష్ణ అవయవదానంతో అమరుడు అయ్యాడు. పుట్టెడుదుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా కృష్ణ (18) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో అటుగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి కృష్ణను ఢీకొట్టింది. తలకి బలమైన గాయం తగలటంతో చికిత్స నిమిత్తం గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక కృష్ణ ఈనెల 25న బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ముగ్గురి సంతానంలో ప్రథముడైన కృష్ణ మరణాన్ని తల్లిదండ్రులు రాజు, మల్లేశ్వరి జీర్ణించుకోలేక పోయారు. అనంతరం తమ బిడ్డ దూరమైనా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి తమ కుమారుడి అవయ వదానం చేసేందుకు ముందుకు వచ్చారు. కృష్ణ గుండెను తిరుపతికి, కాలేయాన్ని విశాఖపట్నంకు, రెండు కిడ్నీల్లో ఒకటి విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి, రెండోది గుంటూరు రమేశ్ ఆస్పత్రికి, రెండు కళ్లు (ఇద్దరికి అమర్చేందుకు) గుంటూరులోని సుదర్శిని ఆస్పత్రికి తరలించారు. విజయవంతంగా గుండె మార్పిడి తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో గుండెమార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం సుమారు 5.10 గంటలపాటు కష్టపడి గుండెమార్పిడి శస్త్రచికిత్సను చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన కృష్ణ గుండెను కర్నూలుకు చెందిన శ్రీనివాసన్ (33)కు అమర్చారు. శ్రీనివాసన్ గుండె సంబంధిత సమస్యతో మూడు నెలల క్రితం శ్రీపద్మావతి ఆస్పత్రికి వచ్చాడు. అతనికి అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి మార్పిడి అనివార్యమని తేల్చారు. అవయవదాన్ వెబ్సైట్లో నమోదు చేయించారు. ఈ క్రమంలో కృష్ణ అవయవదానంతో శ్రీనివాసన్‌కు చికిత్స చేశారు. విశాఖలో గ్రీన్‌చానెల్.. కృష్ణ కాలేయాన్ని తొలుత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ విమానాశ్రయంకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో గ్రీన్‌చానల్ ద్వారా షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి రోడ్డు మార్గంలో తరలించారు. విమానాశ్రయం నుంచి 6 నిమిషాల్లోనే ఆస్పత్రికి కాలేయాన్ని చేర్చారు. సకాలంలో అంబులెన్స్ ఆస్పత్రికి చేరేందుకు ట్రాఫిక్ పోలీసులు విశేష కృషి చేశారు. సీఎం జగన్ ప్రత్యేక చొరవ.. ఓ ప్రాణం నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతలా ఆతృత పడతారో మరోసారి నిరూపించారు. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సీఎంవోతో చర్చలు జరిపిన నేపథ్యంలో గుండె మార్పిడి అవసరాన్ని ఉన్నతాధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గుండెను పదిలంగా, వేగంగా తరలించేందుకు ప్రత్యేక చాపర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలానే రూ. 13 లక్షలు ఖరీదైన గుండె మార్పిడి వైద్యానికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి నిధులను మంజూరు చేయించారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయంకు గుండెను తరలించి అక్కడి నుంచి ప్రత్యేక చాపర్ ద్వారా తిరుపతి విమానాశ్రయంకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్‌చానల్ ద్వారా 23 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీనికోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
తాను మరణించినా మరో ఐదుగురికి జీవితం...
మరణశయ్యపై అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి కన్నపేగు కదిలి కదిలి కలచివేస్తున్నా.. దుఃఖం పొగిలి పొగిలి తన్నుకొస్తున్నా.. తీరని కడుపుకోత దావానలంలా తనువులను దహించి వేస్తున్నా.. విధిపై ఆక్రోశం కన్నీటిధారలు కడుతున్నా.. అంతరంగాన రేగిన ఆర్తనాదం నిశ్శబ్దంగా దేహాలను కంపింపజేస్తున్నా.. గుండెలను పిండేసే పెనువిషాదాన్ని పంటిబిగువనే భరిస్తూ ఆ తల్లిదండ్రులు కొండంత ఔదార్యం చూపారు. తమ కొడుకు చనిపోయినా మరికొందరికి పునర్జన్మనివ్వాలని తలంచారు. అవయవదానానికి అంగీకరించి ఆదర్శమూర్తులుగా నిలిచారు. గుంటూరు మెడికల్, చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా రాజు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. రాజు తోపుడుబండిపై కూరగాయలు అమ్ముతూ, ఆటో నడుపుతూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ప్రథమ సంతానం కృష్ణ (18) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు సంతోష్ తొమ్మిదో తరగతి, మూడో కుమారుడు అభిషేక్ 8వ తరగతి చదువుతున్నారు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కృష్ణను ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణ తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్ హాస్పిటల్‌కి తరలించారు. కృష్ణకు ఈనెల 25న బ్రెయిన్ డెడ్ అయింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గుండెలవిసేలా రోదించారు. చేతికంది వచ్చిన బిడ్డ తమను చూసుకుంటాడనుకునే సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అంతటి బాధలోనూ తల్లిదండ్రులు గుండెను దిటవు చేసుకుని తమ బిడ్డ మరణం మరికొందరికి జీవితం ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. కృష్ణ ఈనెల 19న తన 18వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న నాలుగురోజుల్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు, స్నేహితులు విలపిస్తున్నారు. ఐదుగురికి పునర్జన్మ కృష్ణ నేత్రాలు గుంటూరు సుదర్శిని కంటి ఆస్పత్రికి, లివర్‌ను విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్‌కు, ఒక కిడ్నీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్‌కు, మరో కిడ్నిని రమేష్ హాస్పిటల్‌కు, గుండెను తిరుపతి పద్మావతి హాస్పిటల్‌కి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా, గ్రీన్‌చానల్‌లో తరలించారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండి అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ఐదుగురికి జీవితాలను ప్రసాదించనున్నట్టు వైద్యులు చెబుతున్నారు. తిరుపతి వ్యక్తికి గుండె ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పందించి తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆగమేఘాల మీద హెలీకాప్టర్‌ను రప్పించి, గ్రీన్ చానెల్ ద్వారా శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు. మరణంలోనూ పరోపకారం కట్టా కృష్ణ నాకు మంచి మిత్రుడు. చిన్ననాటి నుంచి కలుపుగోలు స్వభావం కలిగినవాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. చివరకు మరణంలోనూ ఇతరులకు సహాయపడ్డాడు. మిత్రుడి మరణం తీవ్ర బాధ కలిగిస్తున్నా అతను చనిపోయినా ఇతరులకు ప్రాణదానం చేయడం గర్వంగా ఉంది. – పాలపర్తి మోహనవంశీ, స్నేహితుడు మంచితనానికి మారుపేరు కృష్ణ మంచితనానికి మారుపేరు. బంధువులందరితో కలుపుగోలుగా ఉండేవా డు. ఈనెల 19న సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్నాడు. రోజుల వ్యవధిలోనే అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్లడం మనసును కలచివేస్తోంది. అవయవ దానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితాలు ఇచ్చిన కృష్ణతో స్నేహం, బంధుత్వం పంచుకోవడం గర్వంగా భావిస్తున్నా. – పాలపర్తి నాని, స్నేహితుడు, మేనమామ కుమారుడు -
సైన్స్ సెమినార్లో మార్కాపురం విద్యార్థినికి అవార్డు
మార్కాపురం టౌన్: మార్కాపురం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని వైవిటి చంద్రిక విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్లో ఆరో స్థానంలో నిలిచి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నట్లు హెచ్ఎం శ్రీదేవి తెలిపారు. మిల్లెట్స్ ఏ సూపర్ ఫుడ్ అనే అంశంపై చంద్రిక ప్రదర్శనకు జ్యూరీ అవార్డు వచ్చినట్లు తెలిపారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి. ప్రతాప్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకున్నట్లు చెప్పారు. శనివారం ఒంగోలులో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో చంద్రిక ప్రథమ స్థానం సాధించడంపై పండిత పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర అభినందించారు. -
యాభై ఏళ్లకు.. ఒక్క చోటకు..
తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ గంజ్ హైస్కూల్లో 1973 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లినవారు.. మనవలు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది. మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా గడిపారు. గంజ్ పాఠశాల అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మరణించిన తోటి స్నేహితులు, నాటి ఉపాధ్యాయులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, రాజేశం, రవూఫ్, పూర్వ విద్యార్థులు విశ్వనాథ్ బాలకిషన్, చంద్రమౌళి, సత్యం, గౌరిశెట్టి రాజేందర్, ప్రభాకర్, సోమనాథ్, లక్ష్మారెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు బిడ్డకు విదేశీ విద్యా దీవెన.. జర్మనీలో ఉన్నత చదువులు
పుల్లల చెరువు మండలం సుద్దకురువ గిరిజన తండా నుంచి బనావత్ పవన్‌కుమార్ నాయక్ జర్మనీలో ఉన్నత చదువులు చదివేందుకు అర్హత సాధించాడు. తండ్రి వెంకటేశ్వర్లు నాయక్ రైతు. తనకున్న 35 సెంట్లతో పాటు, ఐదు ఎకరాలు కౌలు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేశాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు కరాళ నృత్యం చేయడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చలేక 2018లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కింది. ఇక పవన్‌కుమార్ చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నా కొడుకు ఆసక్తి గమనించిన తల్లి పద్మావతి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తూ వస్తోంది. పవన్‌కుమార్ కూడా చదువుపై దృష్టిని లగ్నం చేశాడు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికై జర్మనీలో చదువుకుంటున్నాడు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పవనకుమార్ తల్లికి ఇంటి పట్టా ఇచ్చి సొంత ఇంటి కలను కూడా నెరవేర్చింది. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఆమెకు ప్రతి నెలా వితంతు పెన్షన్ రూ.2,750 ఇచ్చి ఆదుకుంటోంది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు పండక అప్పుల పాలయ్యామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకున్నారని, నా బిడ్డను జర్మనీ పంపించి చదివిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది . -
చరిత్ర సృష్టించిన షమీ.. తొలి భారత బౌలర్‌గా! అగార్కర్ రికార్డు బద్దలు
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అదరగొట్టాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఓవరాల్‌గా తన 10 ఓవర్ల కోటాలో 51 పరుగులిచ్చిన షమీ.. 5 వికెట్లు పడగొట్టాడు. షమీకి ఇది తన వన్డే కెరీర్లో రెండో ఐదు వికెట్ల హాల్ కావడం గమానార్హం. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను షమీ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు. ఇక ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. షమీ సాధించిన రికార్డులు ఇవే.. ►స్వదేశంలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. షమీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ పేరిట ఉండేది. జడ్డూ, కుల్దీప్ ఇద్దరూ సంయుక్తంగా ఆసీస్‌పై 24 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరి రికార్డును షమీ బ్రేక్ చేశాడు. ►అదే విధంగా ఓవరాల్‌గా ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. ఇప్పటి వరకు షమీ ఆసీస్‌పై 37 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్, ప్రస్తుత ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(36) రికార్డును షమీ బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(45) తొలి స్ధానంలో ఉన్నాడు. చదవండి: వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. శంకుస్ధాపన చేయనున్న మోదీ -
విధి రాతను ఎదురించి.. విశ్వ వేదికపై నిలిచి..
అతడికి కాళ్లు లేవు.. కానీ కలలు ఉన్నాయి. ఆ కుర్రాడికి కదలడానికి శక్తి లేదు.. అయితేనేం ఎదగాలనే కాంక్ష ఉంది. యువకుడి చుట్టూ కష్టాల చీకట్లు అలముకున్నాయి.. మరేం కాదు రేపటి వెలుగు కోసం వెతకడం అతడికి తెలుసు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని కన్నీళ్లు పెట్టిన దశ నుంచి విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా పట్టుకుని గర్వంగా ఆనంద భాష్పాలు రాల్చినంత వరకు పూర్ణారావు చేసిన ప్రయాణం సాధారణమైనది కాదు. ఒక్క రోడ్డు ప్రమాదం తన బతుకును మార్చేస్తే.. ఆ మార్పును తన కొత్త ప్రస్థానానికి దేవుడిచ్చిన తీర్పుగా చేసుకున్న నేర్పరి అతడు. శ్రీకాకుళం: ఇండోనేషియాలో ఈ నెల 5నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఓ సిక్కోలు కుర్రాడు మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇంత ఘనత సాధించిన ఆ క్రీడాకారుడికి రెండు కాళ్లు పనిచేయవు. అది కూడా పుట్టుకతో కాదు. అందరిలాగానే బాల్యంలో సరదాగా గడిపి, చక్కగా చదువుకుని, విదేశంలో ఓ ఉద్యోగం వెతుక్కుని కుటుంబాన్ని పోషించేంత వరకు అతను అందరిలాంటి వాడే. కానీ ఓ రోడ్డు ప్రమాదం అతడిని దివ్యాంగుడిని చేసింది. పరిపూర్ణంగా చె ప్పాలంటే రోడ్డు ప్రమాదానికి ముందు పూర్ణారావు వేరు. ప్రమాదం తర్వాత పూర్ణారావు వేరు. టెక్కలి మండలం శ్రీరంగం గ్రామంలో ని రుపేద కుటుంబానికి చెందిన చాపరా లక్ష్మణరావు, మోహిని దంపతుల చిన్న కుమారుడు చాపరా పూర్ణారావు. పూర్ణారావు ఇంటర్ పూర్తి చేసి 2015 సంవత్సరంలో సింగపూర్‌లో ఫైర్ సేఫ్టీలో ఉద్యోగంలో చేరాడు. తన తల్లిదండ్రులను చూసేందుకు 2017 సంవత్సరంలో సొంత గ్రామం వచ్చాడు. మరో రెండు రోజుల్లో సింగపూర్ వెళ్లిపోతున్న తరుణంలో వజ్రపుకొత్తూరు మండలం పూండి సమీపంలో ద్విచక్రవాహనంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్రంగా గాయం కావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆ ప్రమాదం పూర్ణారావు బతుకులో చీకట్లు నింపింది. 2020 వరకు ఇంటిలో మంచానికే పరిమితమయ్యాడు. చిన్నపాటి పాన్‌షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పూర్ణారావు పరిస్థితి మరింత ఆవేదనకు గురి చేసింది. ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని.. అప్పుడే ఫేస్బుక్లో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రం గురించి పూర్ణారావు తెలుసుకున్నాడు. స్నేహితుల ఆర్థిక సహకారంతో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రంలో చేరాడు. అక్కడ మనోధైర్యంపై నేర్చుకున్న అంశాలు అతడిని ఒక లక్ష్యానికి దగ్గర చేశాయి. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ సొంతంగా నేర్చుకున్నాడు. తోటి మిత్రులతో కలిసి ప్రతి రోజూ సాధన చేసేవాడు. తొలి ఆటలోనే.. 2020లో కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పూర్ణారావు మొట్టమొదటిగా పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో అతని పట్టుదలకు మెడల్స్ మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఆ తర్వాత భువనేశ్వర్‌లో జరిగిన నాల్గో నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పటికీ ఎలాంటి మెడల్స్ రాలేదు. దీంతో కొంత నిరాశ చెందినప్పటికీ, పూర్ణారావు ఆటను కోచ్ ఆనంద్‌కుమార్ గమనించారు. దీంతో మైసూర్లో 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత లక్నోలో జరిగిన ఐదో నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని క్వార్టర్స్ ఫైనల్ వరకు వెళ్లాడు. 2023 జూలై నెలలో యుగాండాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీలకు సిద్ధమైనప్పటికీ పాస్ పోర్టు సక్రమంగా లేదని ఎయిర్‌పోర్టులోనే ఆపివేశారు. దీంతో పూర్ణారావు తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు. మెడల్స్‌తో ఉత్సాహం తాజాగా సెప్టెంబర్ 5 నుంచి 10 తేదీలలో ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పూర్ణారావు పాల్గొని మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. అతను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను సాధించాడు. కర్ణాటక ఓపెన్ స్టేట్ టోర్నమెంట్లో 2 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2002లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2023లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. వీటితో పాటు 2023 మార్చి నెలలో విశాఖపట్టణంలో జరిగిన ఏపీ నేషనల్ ట్రయల్స్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. పారా ఒలింపిక్సే లక్ష్యం నాకు ఆర్థిక సాయం అందితే పారా ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మరి కొద్ది రోజుల్లో ఖేలో ఇండియా టోర్నమెంట్‌తో పాటు జపాన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నా. – చాపరా పూర్ణారావు -
ఆసియా గేమ్స్‌కు ‘ఇందూరు’ బిడ్డలు!
నిజామాబాద్‌నాగారం : ఆసియా క్రీడల్లో ఇందూరు కీర్తి పతాకం రెపరెపలాడనుంది. జిల్లా క్రీడాకారులు నిఖత్ జరీన్, గుగులోత్ సౌమ్య ఈ మెగా టోర్నీలో ఆడనున్నారు. పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. తనదైన శైలీలో పతకాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నిఖత్.. చిరుతలా పరుగెడుతూ గోల్స్ కొట్టే ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య ఈ టోర్నీకి ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌన్ నగరంలో ఈ క్రీడలు జరగనున్నాయి. మొదటిసారి పాల్గొంటున్నా నేను మొదటి సారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్నా. ఈ టోర్నీలో ఆడటం నా కల. ఇందుకోసం చాలా కష్టపడ్డాను. గతంలో అంతర్జాతీయ టోర్నీల్లో ఆడే అవకాశం వచ్చినా, గాయాలతో ఇబ్బంది పడ్డాను. రెండు, మూడు టోర్నీలు మాత్రమే ఆడాను. ఈ టోర్నీలో సత్తా చాటుతా. – గుగులోత్ సౌమ్య, ఫుట్‌బాల్ క్రీడాకారిణి పతకం సాధిస్తా.. మొదటిసారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్నా. 50 కేజీల విభాగంలో బరిలో దిగుతున్నా. ఈ క్రీడల్లో పతకం సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా. దీనికోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నా. – నిఖత్ జరీన్, -
చైనాలో.. అదరగొట్టనున్న.. తెలంగాణ బిడ్డ! అరుదైన అవకాశం!!
సాక్షి, మహబూబాబాద్: చైనాలోని హాంగ్జౌ వేదికగా శనివారం నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ విభాగంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి సిక్కిరెడ్డి ప్రతిభ కనబర్చనున్నారు. పతకం సాధించి తెలంగాణకు పేరు తేవాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జిల్లాకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి. బాల్యంలో ఇక్కడే ఆటలో ఓనమాలు దిద్దారు. తండ్రి ఉద్యోగరీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లో పని చేయడంతో అక్కడ బ్యాడ్మింటన్‌లో పూర్తి మెలకువలు నేర్చుకున్నారు. ఎడమ చేతివాటంతో చిన్నతనం నుంచి ప్రతిభ కనబర్చిన సిక్కిరెడ్డి 2014 మే నెలలో ఢిల్లీ ఉబర్ కప్‌లో కాంస్యం, 2015లో నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం, కామన్వెల్త్లో కాంస్యం.. ఇలా అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. అరుదైన అవకాశం.. ఆసియా గేమ్స్‌లో 40 దేశాలకు పైగా.. 41 క్రీడాంశాల్లో 655 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 16 మంది పాల్గొంటున్నారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన సిక్కిరెడ్డి ఉండడం గర్వకారణం. -
సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా..
ICC Men's ODI Bowling Rankings: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. మరోసారి ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. తద్వారా మరోసారి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 694 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి దూసుకువచ్చాడు. కాగా శ్రీలంకతో ఆసియా వన్డే కప్ ఫైనల్లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ స్టార్.. మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక కకావికలం సిరాజ్ దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. లంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మియా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కొలంబో మ్యాచ్‌లో మొత్తంగా ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వారించాడు. ఫిట్నెస్ కూడా ముఖ్యమంటూ ట్రైనర్ సూచనలు ఇవ్వడంతో.. అలా సిరాజ్ పేస్ అటాక్‌కు తెరపడింది. లేదంటే.. మరిన్ని వికెట్లు కూల్చేవాడేమో! మొత్తం ఎన్ని వికెట్లంటే? ప్రస్తుతం సిరాజ్ వన్డే వరల్డ్‌కప్-2023కి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగం కానున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సిరాజ్ మొట్టమొదటి సారి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసియా టోర్నీ తాజా ఎడిషన్‌లో సిరాజ్ 12.2 సగటుతో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ సిరాజ్- ఇండియా- 694 పాయింట్లు 2. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు 3. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్- 677 పాయింట్లు 4. ముజీబ్ ఉర్ రెహమాన్- అఫ్గనిస్తాన్- 657 పాయింట్లు 5. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 655 పాయింట్లు. చదవండి: ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే? Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
ఐపీఎల్లో అనంతపురం యువకుడికి బంపర్ ఆఫర్!
అనంతపురం: జిల్లాకు చెందిన వర్ధమాన క్రికెటర్ కేహెచ్ వీరారెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో అత్యుత్తమ ప్రదర్శనతో రాయలసీమ కింగ్స్ జట్టు విజయానికి కారణమైన వీరారెడ్డి.. ఆ టోర్నీలో ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సైతం నెలకొల్పిన ఆయన ఆటతీరుపై ప్రశంసలూ వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తమ జట్టులో ప్రాతినిథ్యం వహించాలంటూ ముంబయి ఇండియన్స్‌తో పాటు రాజస్తాన్ రాయల్స్ నుంచి ఆయనకు పిలుపు అందింది. అయితే నాగపూర్‌లో జరిగే మూడు రోజుల శిక్షణకు హాజరు కావాలన్న రాజస్తాన్ రాయల్స్ పిలుపుపైనే వీరారెడ్డి మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. ఈ అవకాశం దక్కితే అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన తొలి క్రికెటర్‌గా ఆయన ఖ్యాతి గడించనున్నారు. -
కానిస్టేబుల్‌కు అభినందన
ఆసిఫాబాద్‌అర్బన్: ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ గోపిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో ఎస్పీ సురేశ్‌కుమార్ ప్ర త్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ స్పె షల్ పార్టీ విభాగానికి చెందిన పొట్ట గోపి పంజాబ్‌లో ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండి యా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సెపక్ టక్ర క్రీడలో పాల్గొని రెండు కాంస్య పతకాలు సాధించాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సా ధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. అడ్మిన్ ఆర్ఐ పెద్దన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్
న్యూయార్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 - 28) పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటి వరకు తమ గ్రామాలకు పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్) సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని పొందడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడమే కాకుండా, ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సధస్సులో ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో పిల్లలు వివరిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత అద్భుతమైన భాగం ఏమిటంటే, ఈ పిల్లలు చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కొందరు దినసరి కూలీలు కాగా మరికొందరు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్‌లుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. "పేదరికం ఎవ్వరికీ నాణ్యమైన విద్యను దూరం చేయకూడదని విశ్వసించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న వ్యక్తి వల్లే ఈ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు అమెరికాలో జరుగుతున్న అత్యున్నత సధస్సులో పాల్గొంటున్నారు. చదవండి: మానవాభివృద్ధినీ మనం అంగీకరించలేమా? ఈ అంతర్జాతీయ పర్యటన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన పిల్లలకు వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, చర్చించడానికి, వ్యక్తీకరించడానికి, కొత్త ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ప్రపంచ వేదికను అందించడమే. ఈ పర్యటన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా & నమ్మకంతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. మంగా వెంకన్న, సాక్షి ఇదీ చదవండి: ప్రపంచ చోదక శక్తి యువతే -
కాలినడకన వెళ్లి పురుడు పోసిన 108 సిబ్బంది
రాజవొమ్మంగి: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రావడంతో రాజవొమ్మంగికి చెందిన 108 సిబ్బంది కొండపై ఉన్న గ్రామానికి కాలినడక వెళ్లి ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొయ్యూరు మండలం పర్వతప్రాంతంలో గల కొనుకూరులో గ్రామంలో పాంగి కుమారి (36) అనే ఆదివాసీ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సోమవారం ఫోన్ చేశారు. ఆ గ్రామానికి బయలుదేరిన 108 వాహనం మార్గమధ్యంలో ఘాట్ రోడ్డు ఎక్కలేక నిలిచిపోయింది. దీంతో సిబ్బంది అక్కడ నుంచి నాలుగు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి, కుమారికి ఆమె ఇంటి వద్దనే ప్రసవం చేశారు. బిడ్డ మెడకు పేగు చుట్టుకోగా అతి ప్రయాసతో ప్రసవం జరిపి తల్లీబిడ్డలను కాపాడగలిగారు. అనంతరం మెరుగైన చిక్సిత కోసం కొంతదూరం మోటారు సైకిల్‌పై, ఆ తరువాత 108 వాహనంలో మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఈఎంటీ అర్జునబాబు తెలిపారు. పైలెట్ మరణిరాజు, అంగన్వాడీ టీచర్లు బేబీరాణి, కాంతమ్మ, ఏఎన్ఎం కుమారి తమకు సహకరించారని ఆయన చెప్పారు. -
‘సాఫ్ట్’గా ప్రవేశించి.. రికార్డులు లిఖించి
సాఫ్ట్‌బాల్ క్రీడల్లో నాలుగుసార్లు ఆమె అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించినా.. ఆటపై మక్కువ పెంచుకుని మెరికలా మారి నాలుగు సార్లు పతకాలు సాధించింది. వివాహమైనా క్రీడలకు దూరం కాక ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లింది. ఆ క్రమంలోనే ‘లాక్రోస్’ ఆట వైపు దృష్టి సారించింది. అక్కడా సత్తా చాటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్న జట్టుకు ఎంపికై ంది. అనంతపురం: సాఫ్ట్‌బాల్ క్రీడలో నాలుగుసార్లు ఆమె అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించినా.. ఆటపై మక్కువ పెంచుకుని మెరికలా మారి నాలుగు సార్లు పతకాలు సాధించింది. వివాహమైనా క్రీడలకు దూరం కాక అచంచెల ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లింది. ఆ క్రమంలోనే ‘లాక్రోస్’ ఆట వైపు దృష్టి సారించింది. అక్కడా సత్తా చాటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్న జట్టుకు ఎంపికై ంది. పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన జే. రాధిక ఎస్కేయూ పరిధిలో డిగ్రీ పూర్తి చేసింది. సాఫ్ట్‌బాల్ క్రీడలో రాణిస్తూ.. అంచెలంచెలుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి జట్లకూ ఎంపికై ంది. చైనా, అమెరికా దేశాల్లో దేశం తరఫున పాల్గొని రాణించింది. గ్రామీణ ప్రాంతంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఒక్కో మెట్టు ఎక్కింది. ఈ క్రమంలోనే లాక్రోస్ పోటీలపై మక్కువ పెంచుకున్న ఆమె.. ఆ ఆటలోనూ రాణిస్తూ.. అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం దిల్లీలో శిక్షణ తీసుకుంటోంది. కెనడాలో జరగనున్న పోటీలకు బయలుదేరనుంది. చిన్న పాప ఉన్నా.. పాఠశాల స్థాయిలో కబడ్డీ, ఖోఖో ఆడుతున్న రాధిక.. పీఈటీల ప్రేరణతో పదేళ్ల క్రితం సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆర్డీటీ ప్రోత్సాహంతో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో జాతీయ స్థాయి జట్లలో ప్రాతినిథ్యం వహించింది. ఆమె ప్రతిభను మెచ్చిన సెలెక్టర్లు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. చైనాలో రెండు పర్యాయాలు, సింగపూర్, అమెరికాలో ఒక్కసారి చొప్పున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. డిగ్రీ పూర్తికాగానే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత సాధారణంగా మహిళలు క్రీడలకు స్వస్తి పలుకుతారు. అయితే, రాధిక మాత్రం ఇందుకు భిన్నంగా కుస్తీ పోటీల్లో ప్రవేశించింది. రాధిక సాధించిన విజయాలు.. ► సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి రజత పతకం కైవసం చేసుకుంది. ► చైనాలో 2016,2018లో జరిగిన ఆసియా జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్ షిప్, ఆసియా విశ్వవిద్యాలయాల సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొని ఐదో ర్యాంకు పొందింది. ► 2017లో అమెరికాలో జరిగిన జూనియర్ ప్రపంచ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో రాధిక పాల్గొంది. ► 2013 నుంచి 2019 నుంచి వరుసగా 14 సార్లు జూనియర్, సీనియర్ విభాగాల్లో జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తా చాటింది. సత్తా చాటుతా.. అక్టోబర్ 6,7,8 తేదీల్లో లాక్రోస్ టోర్నమెంట్ కెనడాలోని ఓషావాలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం నేపథ్యం నాది. పోటీల్లో పాల్గొనాలంటే రూ.3 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. స్పాన్సర్లు ఆదుకుంటే కెనడా వెళ్లి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా. నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటుతాననే నమ్మకం ఉంది. –జే. రాధిక, క్రీడాకారిణి -
ఆంధ్రాయూనివర్సిటీ టాపర్‌గా గవిడి మానస
చీపురుపల్లి: సాధారణ కుటుంబంలో జన్మించి చదువుల తల్లిగా ఎదిగింది. టాపర్‌గా నిలవడానికి కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్ కాదని, కేవలం కష్టపడి చదవడమేనని రుజువు చేసింది. టాపర్‌గా నిలవడానికి అహర్నిశలు కృషి చేసి ఆంధ్రాయూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచి నేటి యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచింది చీపురుపల్లి పట్టణానికి చెందిన గవిడి మానస. 2020–21 విద్యాసంవత్సరంలో మానస ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసి టాపర్‌గా నిలిచింది. అయితే ఆ విద్యా సంవత్సరానికి మానస యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలవడంతో ఆమెను 18 అవార్డులు వరించాయి. వాటిలో 4 బంగారు పతకాలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వివిధ సంస్థలు పతకాలు, ప్రశంసలు ఇస్తుంటాయి. అందులో భాగంగానే మానసకు 18 అవార్డులు లభించాయి. అయితే గత మూడేళ్లుగా ఆంధ్రాయూనివర్సిటీలో స్నాతకోత్సవాలు జరగకపోవడంతో వరుసగా మూడు స్నాతకోత్సవాలును శనివారం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మానస మెరిట్ ధ్రువీకరణతో బాటు పతకాలు అందుకుంది. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీలోనే భౌతికశాస్త్రంపై మానస పీహెచ్డీ చేస్తోంది. ఇదిలా ఉండగా మానస తండ్రి శాంతారావు ఇందిరక్రాంతి పథం(వెలుగు)లో సీసీ గా విధులు నిర్వహిస్తుండగా తల్లి పైడిరాజు వీఓ ఏగా పని చేస్తోంది. మానస ఒకేసారి 18 అవార్డులు తెచ్చుకోవడం, యూనివర్సిటీ టాపర్‌గా నిలవడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. -
చిన్నారి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు'! మంత్రి హరీశ్‌రావు అభినందన!!
సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మూడేళ్ల ఐదు నెలల వయసు ఉన్న అరుషి తన అద్భుత మేథాశక్తితో ఔరా అనిపిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ, ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి అరుషి ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 5 సెకన్ల సమయంలోనే చకాచకా చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన సురేశ్, కావ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు అరోహి గౌడ, అరుషి గౌడ ఉన్నారు. తండ్రి బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. తల్లి కావ్య ఇంటి వద్ద ఉంటుంది. ఈ ఇద్దరు చిన్నారులు మేథస్సులో దిట్ట. చిన్న పాప అరుషి గౌడ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. అరుషి జ్ఞాపక శక్తిని గుర్తించిన తల్లి ఏదో ఒక అంశంలో ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలని సంకల్పించింది. ప్రతీరోజు 5 దేశాల రాజధానులపై శిక్షణ.. చిన్నారి అరుషిగౌడకు తల్లి కావ్య ప్రతీ రోజు ఐదు దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్ల గురించి ఆడుకునే సమయంలో, అన్నం తినేటప్పుడు ప్రాక్టీస్ చేయించేది. నెలన్నరలో 195 దేశాల రాజధానుల పేర్లు అతి తక్కువ సమయంలో సునాయసంగా చెప్పేలా కంఠస్తం చేయించింది. ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆ ప్రొసీజర్‌ను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంది. వెంటనే మూడేళ్ల 5 నెలల అరుషిగౌడతో 195 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల 5 సెకన్లలో చెప్పేలా ఆన్లైన్ యాప్ ద్వారా వీడియోను చిత్రీకరించి రికార్డు చేసింది. ఆ వీడియోను ఢిల్లీలోని ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు జూలై 31న పంపించారు. ఢిల్లీ కార్యాలయంలో ముగ్గురు జడ్జిల సమక్షంలో ఆ వీడియోను పరిశీలించారు. అరుషిగౌడ ప్రతిభకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కినట్లు చీఫ్ ఎడిటర్ డాక్టర్ బైస్వారూప్ రాయ్ చౌదరి ఆగస్టు 7న ప్రకటించారు. ఈ విషయాన్ని ఫోన్, మెయిల్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇటీవల ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు (2023) పుస్తకం, మెడల్, ప్రశంసా పత్రాలను అరుషి గౌడ తల్లిదండ్రుల అడ్రస్‌కు పోస్ట్ ద్వారా పంపించారు. పెద్ద కూతురు కూడా.. సురేష్, కావ్య దంపతుల పెద్దకూతురు అరోహిగౌడ సైతం మేథస్సులో దిట్ట. ఆ చిన్నారి సైతం 2021లో మూడెళ్ల 9 నెలల వయస్సులో ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 30 సెకన్లలో చెప్పి ఇండియన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. అలాగే భారత దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను 1 నిమిషం, 28 సెకండ్లు, ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లను 4 నిమిషాల్లో చెప్పి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.. పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని ఏనాడూ బాధపడ లేదు. వీరిద్దరూ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడం సంతోషంగా ఉంది. – సురేష్, కావ్య దంపతులు, హుస్నాబాద్ మంత్రి హరీశ్‌రావు అభినందన.. అరుషి గిన్నిస్ బుక్‌లో స్థానం పొందడం పట్ల ఈ నెల 4న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌లు అరుషిగౌడను అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో ఇంకా ఎన్నో మెడల్స్‌ను గెలుచుకోవాలని వారు ఆకాంక్షించారు. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్‌తో పాటు మిజోరాం, నాగాలాండ్‌లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
కాలేయ మార్పిడికి రూ.10 లక్షలు
నగరి : మున్సిపల్ పరిధి 5వ వార్డుకు చెందిన అబ్దుల్ బాషా కుమారుడు హనీఫా (45)కు కాలేయ మార్పిడికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షల ఎల్ఓసీని రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సోమవారం అందజేశారు. 5వ వార్డుకు చెందిన హనీఫాకు ఇటీవల కాలేయ సంబంధిత వ్యాధి సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన కుమారుని పరిస్థితిని అబ్దుల్ భాషా మంత్రి ఆర్కేరోజాకు విన్నవించుకొని ఆర్థిక సాయం అందించాలని కోరాడు. వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కాలేయ మార్పిడి చికిత్స కోసం రూ.10 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. తన నివాస కార్యాలయంలో సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు. వార్డు కౌన్సిలర్ దయానిధి పాల్గొన్నారు. -
పేదింటి బిడ్డకు విదేశీ విద్య.. ‘అమెరికా వెళ్తుందని ఊహించలేదు’
ప్రకాశం: వారిది రెక్కాడితే కానీ.. డొక్కాడని పేద కుటుంబం. తమ కుమార్తె బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు. అయితే ఇంటర్ సెకండియర్లోనే అమెరికా వెళ్లి తమ కుమార్తె చదువుతుందని కలలో కూడా ఊహించలేదు. అమెరికాకు వెళ్లారని ఎవరైనా చెబితే వినడమే తప్ప తమ కుమార్తె స్వయంగా అమెరికాకు వెళ్తుందని కళాశాల ప్రిన్సిపల్ చెప్పేదాకా తెలియదు. రాష్ట్ర విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల చదువుకు, సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా పేదింటి అమ్మాయి అమెరికా చదువుకు ఎంపికై ంది. కెన్నడీ లూగర్ –యూత్ ఎక్సేంజ్ అండ్ స్టడీ (కేఎల్–వైఈఎస్) కార్యక్రమంలో రాష్ట్రం నుంచి మొత్తం ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా అందులో మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థిని దారా నవీన ఎంపికై ంది. పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామానికి చెందిన దారా కేశయ్య, ఆదిలక్ష్మమ్మల కుమార్తె నవీన 1 నుంచి 4వ తరగతి వరకూ స్వగ్రామమైన పుచ్చకాయలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. 5 నుంచి ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ వరకూ రాయవరం సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతోంది. 10వ తరగతిలో 541 మార్కులు రాగా, ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీ విభాగంలో 470 కి గానూ 418 మార్కులు సాధించింది. విదేశీ విద్య పథకం కింద ఎంపికై న నవీన అమెరికాలోని మేరీ ల్యాండ్స్ స్టేట్‌లో డెల్టాస్ విల్ ప్రాంతంలోని హైపాయింట్ హైస్కూల్లో 10 నెలల పాటు చదువుకోనుంది. ఇందుకయ్యే ఖర్చంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష రూపాయల చెక్కుతోపాటు ట్యాబ్, విమాన టికెట్స్‌ను అందించారు. కెన్నడీ లూగర్–యూత్ ఎక్సేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రాంను అమెరికాకు చెందిన సాంస్కృతిక వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికై న విద్యార్థులు 10 నెలల పాటు అక్కడే చదువుకుంటారు. ఒక్కొక్క విద్యార్థికి నెలకు 200 డాలర్లను స్టైఫండ్‌గా అందిస్తారు. రాబోయే పదిరోజుల్లో ఆమెరికాకు వెళ్తారు. వీరికి అవసరమైన నిత్యావసరాలు, బ్యాగ్‌లు, దుస్తులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సమకూరుస్తుంది. దేశవ్యాప్తంగా 30 మంది విద్యార్థులు ఎంపిక కాగా మన రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అమెరికా వెళ్తుందని ఊహించలేదు.. తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, కేశయ్యలు మాట్లాడుతూ తమ కుమార్తె దేశాలు దాటి అమెరికాకు వెళ్తుందన్న ఆలోచనే సంతోషాన్నిచ్చిందని తెలిపారు. పెద్ద చదువులకు అమెరికాకు వెళ్తుంది అనుకున్నామే కానీ ఇంటర్‌లోనే అమెరికాకు వెళ్తుందని ఊహించలేదన్నారు. -
కేంద్రం అనూహ్య నిర్ణయం.. హిస్టరీ క్రియేట్ చేసిన జయవర్మ సిన్హా
ఢిల్లీ: దేశ చర్రితలోనే మొదటిసారిగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా తొలిసారిగా మహిళను నియమించింది. జయవర్మ సిన్హాను కేంద్రం రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. రైల్వే బోర్డు సీఈవో, చైర్‌పర్సన్‌గా జయవర్మ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశ చరిత్రలోనే రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయవర్మనే కావడం విశేషం. కాగా, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన జయవర్మ.. ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా(ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) ఉన్నారు. Congratulations 🌹🎉🙂 Jaya Verma Sinha, Indian Railway Management Services (IRMS), Member (Operations & Business Development), Railway Board appointed as Chairman & Chief Executive Officer (CEO), Railway Board: Govt of India. @RailMinIndia #WomenEmpowerment #RakshaBandangift pic.twitter.com/3kRFq3OesJ — Uppal Shah (@uppalshah) August 31, 2023 ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జయవర్మ సీఈవోగా కొనసాగనున్నారు. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో సిన్హా చేశారు. నార్తర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, ఈస్టర్న్ రైల్వేలో ఆమె పని చేశారు. ఆమె అలహాబాద్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం విశేషం. కాగా, నేటి వరకు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ లహాటీ కొనసాగారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయం సందర్భంగా మహిళల శక్తి గురించి ప్రత్యేకంగా చర్చించారు. మహిళలను అభినందించారు. మహిళల పాత్ర అనిర్వచనీయమని ప్రధాని మోదీ వారిని అభినందించి, మెచ్చుకున్నారు. అలాగే వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. అటు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మహిళా సాధికారతపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయవచ్చు అని చెప్పారు. ఇది కూడా చదవండి: జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో.. -
TSRTC: రాఖీ స్పెషల్.. మహిళా ప్రయాణికులకు బంపరాఫర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో యువతులు, మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బంపరాఫర్ ప్రకటించింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని పేర్కొంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని ప్రకటించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది. ప్రతీ రిజయన్‌లో లక్కీ డ్రా.. వివరాల ప్రకారం.. ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్‌లను ఒక చోటికి చేర్చి.. ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వట్టర్ వేదికగా..‘మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది’ అని తెలిపారు. రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు #TSRTC శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 29, 2023 ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు. ఇది కూడా చదవండి: అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క -
దేశ ప్రజలకు శుభవార్త.. రూ. 200 తగ్గిన గ్యాస్ ధరలు
రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' గ్యాస్ ధర తగ్గింపుపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎల్పిజి సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌పై రూ. 200 తగ్గనుంది. అంతే కాకుండా పీఎంయూవై వినియోగదారులకు ఈ తగ్గింపు వర్తించనుంది. ఫలితంగా పీఎంయూవై వినియోగదారులు ప్రస్తుతం ఉన్న సబ్బిడీతో కొత్త తగ్గింపు పొందుతారు. కావున వీరికి రూ. 400 తగ్గింపు లభిస్తుంది’ అని తెలిపారు. ఎల్పిజి సిలిండర్లపై అదనపు సబ్సిడీ 33 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనకారిగా ఉంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2023-24 సంవత్సరానికి ఎల్పిజి సిలిండర్‌పై రూ. 200 తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 7,680 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతే కాకుండా ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్) కుటుంబాల మహిళల కోసం 50 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్లను పంపిణీ చేయడానికి ప్రారంభించారు. #WATCH | "PM Modi has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders, for all users...this is a gift from PM Narendra Modi, to the women of the country, during the occasion of Raksha Bandhan", says Union Minister Anurag Thakur pic.twitter.com/QTy6YB0x4u— ANI (@ANI) August 29, 2023 -
42 ఏళ్లకు అమ్మను చూశాడు!
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం చిలీలో నెలలు నిండకుండానే జన్మించిన ఓ శిశువు అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు ఆ శిశువును అమెరికాకు చెందిన దంపతులకు దత్తతకిచ్చేశారు. ఇది జరిగి 42 ఏళ్లయింది. ప్రస్తుతం అతడి పేరు జిమ్మీ లిపర్ట్ థైడెన్. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో ఉంటూ లాయర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, 1970, 80ల్లో నియంత ఫినోచెట్ హయాంలో చిలీలో వందలాదిగా శిశువులు అపహరణకు గురయ్యారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో వారిలో కొందరు తిరిగి కన్నవారి చెంతకు చేరుతున్నారనే వార్తను మొన్న ఏప్రిల్‌లో థైడెన్ చూశాడు. ఆ సంస్థను సంప్రదించి తన డీఎన్ఏ వివరాల సాయంతో కన్న తల్లి జాడ కనుక్కున్నాడు. తోబుట్టువులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది? భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని చిలీలోని వల్దీవియాలో ఉండే తల్లి మరియా అంజెలికా గొంజాలెజ్ వద్దకు వెళ్లాడు. ‘హాస్పిటల్ సిబ్బంది నెలలు నిండని నా కొడుకు చనిపోయాడని చెప్పగా విని, గుండెలవిసేలా రోదించాను. నా చిన్నారి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నా. నా ప్రార్థన ఫలించింది’అంటూ ఆమె కొడుకును హత్తుకుంది. తల్లి, కొడుకు కలుసుకున్న వేళ ఆ ఊరంతా పండగ చేసుకుంది. -
ఆటంకాలు అధిగమించి.. పీహెచ్డీ సాధించి..
గుంటూరు: తనకు చదువుల దాహం... సహకరించని ఆర్థిక పరిస్థితులు.. పెళ్లితో డిగ్రీ ఫస్టియర్‌లోనే చదువుకు బ్రేక్ పడింది. ఆటోడ్రైవర్ భర్త భరో సాతో చదువు ఆరంభించినా అదే సమస్యపై మళ్లీ అవాంతరం. అయినా నిరాశతో కుంగిపోలేదు. ఇద్దరి బిడ్డల ఆలనపాలనా చూస్తునే అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ, ఏదొక ఉద్యోగం చేస్తూ డిగ్రీ, పీజీనే కాదు.. ఏకంగా పీహెచ్డీ సాధించింది.అధ్యాపకురాలిగా పనిచేస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం జరిగిన 40వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ను స్వీకరించింది. ఆ మహిళ విజయప్రస్థానమిది... ఆ చదువుల తల్లి పేరు ఈపూరి షీల. తెనాలి రూరల్ మండల గ్రామం పెదరావూరు. చిన్నతనంలోనే తల్లి మరణించారు. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదివింది. తెనాలిలో ఇంటర్ తర్వాత జేఎంజే మహిళా కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుండగా, 2003లో ఆటోడ్రైవర్ రావూరి కరుణాకర్‌తో పెద్దలు వివాహం చేశారు. చదువుకుంటానని అడిగిన భార్య కోరికను మన్నించిన భర్త ప్రోత్సహించాడు. రెండేళ్లు చదివాక ఫైనలియర్లో మళ్లీ ఆర్థిక ఇబ్బందులు సహ కరించ లేదు. ఉపాధికోసం 2004లో అక్షరదీప్తి పథకంలో ప్రేరక్‌గా చేరారు. అయినా చదువు‘కొన’లేకపోయారు. 2008లో ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన కంప్యూటర్ శిక్షణలో చేరి, పీజీడీసీఏ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, డిగ్రీ అర్హత లేకపోవటంతో వెనుదిరగాల్సి వచ్చింది. అర్థం చేసుకున్న భర్త, పిల్లలతోపాటు భార్యనూ చదివించారు. ఫలితంగా 2009లో డిగ్రీ ఫైనలియర్ పూర్తిచేశారు షీల. తెనాలిలో గుప్తా కాలేజీలో కామర్స్‌లో పీజీ చేశారు. ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేస్తే, పీహెచ్డీ తప్పనిసరిగా చెప్పటంతో పీజీ చేసిన కాలేజీలోనే అధ్యాపకురాలిగా పనిచేయసాగారు. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్‌యూఆర్‌సీటీ నోటిఫికేషన్ వచ్చింది. భర్త కరుణాకర్ ప్రోత్సాహంతో దరఖాస్తు చేసింది. యూనివర్సిటీలో డాక్టర్ ఎన్.రత్నకిషోర్ గైడ్‌గా ఫుల్‌టైం రీసెర్చ్ స్కాలర్‌గా చేరారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఆర్థిక సమస్యలతో ఆగిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ 2016లో రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికవటం కలిసొచ్చింది. రోజూ యూనివర్సిటీకి వెళుతూ అక్కడి లైబ్రరీలో చదువుకుంటూ 2016 సెప్టెంబరులో ఏపీసెట్ అర్హత సాధించారు. దూరవిద్యలో మాస్టర్ డిగ్రీ ఎంహెచ్ఆర్ఎంను 2017లో పూర్తిశారు. అదే ఏడాది ఎంఫిల్ నుంచి పీహెచ్‌డీకి కన్వర్షన్ జరిగిందని షీల చెప్పారు. గతేడాది ఆఖరులో ‘సర్వీస్ క్వాలిటీ ఇన్ హెల్త్‌కేర్ సెక్టార్’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఆ థీసిస్‌కు గత జులై 4న పీహెచ్డీ లభించింది. యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో మంగళవారం డాక్టరేట్‌ను అందుకోనున్నారు. ప్రస్తుతం షీల స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో కామర్స్ అధ్యాపకురాలిగా చేస్తున్నారు. ఆగిపోయిన చదువు ఇక్కడిదాకా వస్తుందనీ, డాక్టరేటు సాధిస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలన్నదే తన ఆశయంగా వివరించారు. సందర్భంగా... ‘గమ్యం సాధించాలనుకునే వ్యక్తి అలుపెరగడు. విజయం సాధించాలనుకునే వ్యక్తి నిరాశ చెందడు’. అలాగే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం / ప్రతి నీడకు ఒక వెలుగు / ప్రతి బాధకు ఓ ఓదార్పు ఉంటుంది / కాకపోతే విశ్వాసం కోల్పోకుండా మనవంతు ప్రయత్నం చేయాలి’ అని పెద్దల మాట. ఈ మాటలు చక్కగా అన్వయమవుతాయి పెదరావూరుకు చెందిన ఈపూరి షీల విషయంలో. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో చదువును కొనసాగించింది. తట్టుకోలేని కష్టాలు తారసపడ్డా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న పీహెచ్‌డీని సాధించింది. ‘పాండిత్యం ఉన్నవాడు శిఖరాన్ని చేరతాడు/వ్యక్తిత్వం ఉన్నవాడు శిఖరం మీద చిరస్థాయిగా నిలుస్తాడు’ అని చెప్పినట్లుగా ఆమె ప్రస్థానం అభినందనీయం. ఆమె చేరిన శిఖరం గురించి అందిస్తున్న కథనం. -
Hyderabad Marathon: లింగం.. మారథాన్ సింగం! హార్ట్ పేషెంట్ అయినా..
సాక్షి, హైదరాబాద్: లింగం వయసు 50 ఏళ్లు. ఫుల్ మారథాన్ (42 కిలోమీటర్లు) పూర్తి చేశాడు. ఇది అంత పెద్ద విశేషమేమీ కాదు...కానీ అతను వెల్డింగ్ పనిచేసే సామాన్యమైన కార్మికుడు. అంతేకాదు హార్ట్ పేషెంట్ కూడా. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసించే లింగం ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని ఫుల్ మారథాన్ పూర్తి చేశారు. అయితే ఈ ఘనత సాధించిన హార్ట్ పేషెంట్‌గా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా లింగం, ఆయనకు వైద్యం చేసిన డా.మురళీధర్ బాబీ ‘సాక్షి’తో ఆ వివరాలు పంచుకున్నారు. కరోనా అనుకుంటే... వెల్డర్‌గా పనిచేస్తున్న లింగం రెండేళ్ల క్రితం తీవ్రమైన దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఇఎస్ఐ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఈ సమస్యకు కారణం కరోనా అని కుటుంబసభ్యులు అనుమానించారు. అయితే పరీక్షల అనంతరం వైద్యులు ఇది కరోనా కాదని, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ అని..అప్పటికే లింగంకు తెలియకుండా రెండుసార్లు స్ట్రోక్స్ వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. ఆయనకు కొన్ని మందులు రాసిచ్చి వాడమన్నారు. కొద్దిరోజుల తర్వాత నిమ్స్‌కు రిఫర్ చేశారు. నిమ్స్‌లో యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేసి బ్లాక్స్ లేవని, అయితే ఆయన గుండెకు పంపింగ్ సామర్థ్యం బాగా తక్కువగా..అంటే 18కి దిగిపోయిందని డాక్టర్లు తేల్చారు. రిహాబ్‌తో రీచార్జ్ డాక్టర్ మురళీధర్ నిర్వహించే కార్డియాక్ రిహాబ్ సెంటర్ ప్రోగ్రామ్‌లో లింగం చేరారు. అక్కడ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల మందులు, చికిత్సలతో పాటుగా రెగ్యులర్‌గా ట్రెడ్మిల్ వ్యాయామం, ఆహారంలో రైస్ బాగా తగ్గించి కాయగూరలు, మొలకలు వంటివి బాగా పెంచారు. తద్వారా పంపింగ్ సామర్థ్యాన్ని 53 శాతానికి మెరుగుపరిచారు. ఫలితంగా గత ఏడాదిలో జరిగిన హాఫ్ మారథాన్ పూర్తి చేసిన లింగం...మంచి అలవాట్లు కొనసాగిస్తూ గుండెను మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫుల్ మారథాన్‌ను కూడా పూర్తి చేయగలిగారు. చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు -
మీకు దండం సారూ.. మీ వల్లే నేను ఇప్పుడు బతికున్నా..
హైదరాబాద్: ఆర్పీరోడ్ లోని దర్గా ప్రాంతం..ఆదివారం ఉదయం..కొద్దిసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అక్కడ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం వస్తున్నారు. బందోబస్తులో భాగంగా మహంకాళి ఏసీపీ రవీందర్‌తో పాటు మిగతా పోలీసులు, నాయకులు అక్కడ ఉన్నారు. ఇంతలో ఓ మహిళ దూరం నుంచి పరుగెత్తుకుంటూ..అయాసపడుతూ వారి దగ్గరకు వచ్చింది. పోలీసులతో పాటు అందరూ ఏమైందా, అని కంగారు పడ్డారు. కానీ వచ్చీ రావడంతోనే ఆ మహిళ ఏసీపీ రవీందర్ వద్దకు వెళ్లి ‘మీకు దండం సారూ..మీ వళ్లే నేను ఇప్పుడు బతికున్నా..మీరు చేసిన సహాయం మరచిపోలేను..అప్పుడు ఆపరేషన్ చేయించడం వల్లే ప్రాణాలతో ఉన్నా అంటూ ఆయాసపడుతూ చెప్పింది. వెంటనే అక్కడున్న వాళ్లు ఆమెను కొద్దిసేపు కూర్చోబెట్టి మంచి నీళ్లు తాగించి..ఏమైందంటూ ఆరాతీయగా...తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్న ఆమెకు ప్రస్తుత మహంకాళి ఏసీపీ రవీందర్ సొంత డబ్బుతో ఆస్పత్రిలో చేరి్పంచి ఆపరేషన్ చేయించిన సంగతి చెప్పింది. 2014 సంవత్సరంలో టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లో రవీందర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన కార్వాన్కు చెందిన కవిత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేర్పించి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించగా పూర్తి ఆరోగ్యంతో బయటపడింది. ఆ తర్వాత మళ్లీ ఆయన ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో కలవలేకపోయింది. ఆదివారం ఆమె కార్వాన్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళుతుంది. బస్సులో నుంచి బందోబస్తు విధుల్లో ఉన్న ఏసీపీ రవీందర్‌ను చూసి..గుర్తించి బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరింది. కానీ డ్రైవర్ ఆపకుండా ప్యాట్నీ సిగ్నల్ వరకు వెళ్లాడు. సిగ్నల్ దగ్గర బస్సు ఆగడంతో ఆమె బస్సు దిగి పరుగెత్తుకుంటూ దర్గా వరకు వచి్చంది. వచ్చీ రావడంతో ఆయనకు దండాలు పెడుతూ కన్నీరు పెట్టింది. మీ వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నా సారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు కలుస్తారో లేదో అనుకుంటూ పరుగెత్తుకొచ్చాను అంటూ చెప్పుకొచి్చంది. మీరు ఇంకా పెద్ద పోస్టులోకి రావాలి, ఎమ్మెల్యే అంత ఎదగాలి సారూ అంటూ కృతజ్ఞతాభావాన్ని చాటింది. ‘నా అన్న కోసం వెండి రాఖీ కొని తీసుకుని వచ్చి కడతా’ అంటూ చెప్పింది. అంతే కాకుండా తన ఫోన్లో భద్రపరుచుకున్న ఏసీపీ ఫొటోను చూపించి ఆశ్చర్య పరిచింది. ఈ సంఘటన చూసిన పోలీసులు, మీడియా ప్రతినిధులు, నాయకులు అందరూ ఆ మహిళ కృతజ్ఞతాభావాన్ని, ఏసీపీ మానవతా దృక్పథాన్ని అభినందించారు. -
సత్తాచాటిన కాకినాడ.. స్మార్ట్ సిటీ అవార్డుల్లో రెండో స్థానం
కాకినాడ: పెన్షనర్స్ ప్యారడైజ్‌గా, ప్లాన్డ్ సిటీగా, రెండో మద్రాస్‌గా ప్రాచుర్యం పొందిన కాకినాడ మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును కై వసం చేసుకుంది. మూడేళ్ల క్రితం దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగ రాల్లో (బెస్ట్ లివింగ్ సిటీ) నాలుగో స్థానం సాధించిన కాకినాడ ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డులు–2022 పోటీలో దేశంలోనే కాకినాడ నగరం రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా ప్రత్యే క గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశంలోని 100 స్మార్ట్‌సిటీలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఇండోర్ మొదటి స్థానం సాధించగా.. మిగిలిన నగరాలన్నింటినీ అధిగమించి కాకినాడ రెండో స్థానాన్ని కై వసం చేసుకుంది. వచ్చే నెల 27వ తేదీన ఇండోర్‌లో జరిగే కార్యక్రమంలో కాకినాడ నగరానికి ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డు ఎందుకు దక్కిందంటే.. ► పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలు ఈ గుర్తింపునకు ప్రధాన కారణంగా నిలిచాయి. ► ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, తడి – పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం, ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో చేసిన కృషికి కూడా ఈ గుర్తింపు దక్కడానికి కారణం. ► సాంకేతిక పరంగా కూడా పారిశుధ్య విభాగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. పారిశుధ్య వాహనాల కదలికలను గుర్తించేందుకు జీపీఎస్ విధానం అమలు చేశారు. ► చెత్త సేకరణకు 108 హూపర్, టిప్పర్ వాహనాలు సమకూర్చారు. ► స్మార్ట్ సిటీని 380 మైక్రో ప్యాకెట్లుగా విభజించారు. ప్రతి మైక్రో ప్యాకెట్‌కు ఇద్దరు పారిశుధ్య కార్మికులను కేటాయించి ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరిస్తున్నారు. ► ఇక సేకరించిన చెత్త నుంచి సంపద సృష్టించే లక్ష్యంతో రూ.కోటితో ఇంటిగ్రేటెడ్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వేస్ట్ వంటి పొడి చెత్తను 16 రకాలుగా విభజించి ప్రాసెస్ చేయడం, తడి చెత్త నుంచి ఎరువుల తయారీ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ► ఈ చర్యలన్నీ జిల్లా కేంద్రమైన కాకినాడ స్మార్ట్ సిటీలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు దోహదం చేశాయి. ► పారిశుధ్య నిర్వహణలో ఇటువంటి సంస్కరణలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ►వీటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు స్మార్ట్ సిటీ కమిషనర్, మున్సిపల్ ఆరోగ్య అధికారి (ఎంహెచ్ఓ), పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేశారు. ఇవన్నీ కూడా కాకినాడ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు దోహదపడ్డాయి. ఇది కాకినాడకు దక్కిన గౌరవం ఇండియన్ స్మార్ట్‌సిటీ అవార్డ్స్–2022లో దేశంలోనే కాకినాడ నగరం రెండో స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. గతంలో కూడా బెస్ట్ లివింగ్ సిటీల్లో కాకినాడ 4వ స్థానం సాధించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఇక్కడి అధికారులు చేపట్టిన పాలనా సంస్కరణలు కాకినాడ నగరానికి అరుదైన గౌరవాన్ని, గుర్తింపును తెచ్చి పెట్టాయి. కమిషనర్ నాగనరసింహారావు, ఇతర అధికారులు, పారిశుధ్య కార్మికులు, స్మార్ట్ సిటీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ సిటీ శ్రమకు తగిన గుర్తింపు పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలకు సముచిత గుర్తింపు లభించింది. ఇక్కడి పారిశుధ్య సిబ్బంది, అధికారులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే మంచి ఫలితాన్ని సాధించగలిగాం. జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందగలిగాం. కాకినాడ స్మార్ట్ సిటీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఇదే స్ఫూర్తితో మరింత బాగా పని చేసి, ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందించాలి. – సీహెచ్ నాగనరసింహారావు, కమిషనర్, కాకినాడ సిటీ -
ఆశయం ముందు తలవంచిన అవరోధాలు
కందుకూరు: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆమె చిన్ననాటి ఆశయం ముందు పెళ్లి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం వంటి అవరోధాలన్నీ చిన్నబోయాయి. పట్టుదల, నిరంతర కృషితో ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని నిరూపించింది ఉలవపాడు మండలం బద్దిపూడికి చెందిన చేజర్ల రమ్యరెడ్డి. ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో విజయం సాధించింది. ఎటువంటి కోచింగ్ లేకుండానే తన సొంత ప్రిపరేషన్‌తో రెండో ప్రయత్నంలోనే గ్రూప్–1 ఆఫీసర్‌గా ఎంపికై ంది. పబ్లిక్ సర్వీస్ చిన్ననాటి కోరిక బద్దిపూడికి చెందిన శ్రీనివాసులరెడ్డి, కృష్ణవేణి దంపతుల కుమార్తె చేజర్ల రమ్యరెడ్డి. తండ్రి సాధారణ రైతు కావడంతో రమ్య పాఠశాల విద్యను అమ్మనబ్రోలులోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో పూర్తి చేసింది. విజయనగరం జిల్లా తాటిపూడి రెసిడెన్షిల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసింది. అనంతరం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో బీఫార్మసీ, ఏలూరు జిల్లాలోని నోవా కళాశాలలో ఎంఫార్మసీ పూర్తి చేసింది. ఆ తరువాత రెండేళ్ల పాటు అరబిందో ఫార్మా స్యూటికల్స్లో ఉద్యోగం చేసింది. 2010లో తల్లిదండ్రులు చూసిన సంబంధం మేరకు మాచవరానికి చెందిన వంశీకృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. భర్త మలేసియాలో ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తుండడంతో అక్కడికి వెళ్లారు. ఆ తరు వాత 2018లో స్వదేశానికి వచ్చి కరోనా ప్రభావంతో ఇక్కడే ఉండిపోయారు. రెండో ప్రయత్నంలోనే.. రమ్యరెడ్డి తన రెండో ప్రయత్నంలోనే గ్రూప్–1 ఉద్యోగం సాధించింది. 2018 చివరిలో వెలువడిన గ్రూప్–1 నోటిఫికేషన్ సమయానికి రమ్యకు ఐదేళ్ల కుమారుడితో పాటు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అయినా సరే గ్రూప్–1 పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లింది. ఇంటర్వ్యూలో సరైన మార్కులు రాకపోవడంతో త్రుటిలో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 2022 సెప్టెంబర్‌లో మళ్లీ గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవగా ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధమైంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లు పాసై మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించింది. మెయిన్స్ సమయంలో సైనసైటిస్ మేజర్ ఆపరేషన్‌తో నెల పాటు ప్రిపరేషన్ నిలిచిపోయినా మళ్లీ కోలుకుని పరీక్షలు రాసి విజయం సాధించింది. తాను చిన్ననాటి నుంచి కలలు కన్న ప్రభుత్వ ఉద్యోగం ఆశయాన్ని నెరవేర్చుకుంది. ఇష్టపడి కష్టపడితే ఏదైనా సాధ్యమే చాలా మంది పెళ్లి అయిన తరువాత ఇంకేమి సాధిస్తాం అని చెప్తుంటారు. కానీ సరైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. నా ఉద్యోగ ప్రయత్నంలో నా భర్త వంశీకృష్ణారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. అందుకే నాలుగేళ్ల పాటు పట్టు వదలకుండా నిరంతరం కష్టపడి చదివాను. చివరికి నాకు ఇష్టమైన మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లోనే ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసేందుకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా. – రమ్యరెడ్డి -
అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!
గత మూడు రోజులుగా రెండు దేశాల క్రీడా ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు.. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్తో ప్రజ్ఞానంద ఫైనల్ పోరు.. టైబ్రేక్స్‌లో తేలిన ఫలితం.. ఎట్టకేలకు 18 ఏళ్ల కుర్రాడిపై అనుభవజ్ఞుడైన 32 ఏళ్ల కార్ల్సన్దే పైచేయి అయింది.. జగజ్జేతగా అవతరించిన అతడికే FIDE World Cup దక్కింది. దిగ్గజ ఆటగాడి చేతిలో ఓడితేనేమి.. చిన్న వయసులోనే ఇక్కడి దాకా చేరుకున్న మన ప్రజ్ఞానంద ఎప్పుడో అందరి మనసులు గెలిచేశాడు. పిట్టకొంచెం కూత ఘనం అనే మాటను నిజం చేస్తూ కార్ల్‌సన్‌ను ఢీకొట్టడమే గాక విజయం కోసం చెమటోడ్చేలా చేశాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గెలుపు కోసం నిరీక్షించేలా చేశాడు. ప్రపంచకప్ ఫైనల్లో పోటీ పడిన ఈ ఇద్దరిలోనూ ఓ సారూప్యత ఉంది. కార్ల్సన్ చెస్ లెజెండ్‌గా అవతరించడంలో అతడి తండ్రి పాత్ర ఉంటే.. చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద ప్రయాణం ఇక్కడిదాకా సాఫీగా సాగడానికి ముఖ్య కారణం అతడి తల్లి! PC: @photochess/FIDE Twitter) చెస్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజ్ఞానంద కళ్లు తన తల్లి నాగలక్ష్మి కోసం వెదుకుతాయి. లేనిపోని హంగూ ఆర్భాటాలతో సందడి చేసే వాళ్లలో ఒకరిగా గాకుండా తమ ఇంట్లోనే ఉన్నంత సాదాసీదాగా.. ఏ హడావుడీ లేకుండా ఓ పక్కన నిలబడి ఉంటారామె! నిండైన చీరకట్టులో అందరిలో ప్రత్యేకంగా ఉన్న ఆమె కనబడగానే ప్రజ్ఞానంద ముఖంలో ఎక్కడాలేని సంతోషం.. గెలిచినా.. ఓడినా సరే! పరిగెత్తుకు వెళ్లి తల్లిని హత్తుకోవడం అతడికి అలవాటు. అతడి కళ్లలో భావోద్వేగపు తాలూకు ఛాయలు.. ఆమె ఆప్యాయపు చూపుల ప్రేమతో అలా చెమ్మగిల్లుతాయి. మ్యాచ్ ఫలితం ఏమిటన్న అంశంతో ఆమెకు సంబంధం లేదు. అసలు ఆ విషయం గురించి కొడుకును ఒక్క మాటా అడగరు! గెలుపోటములతో ఆమెకు పని లేదు. చెస్ బోర్డులోని 64 గడులు, వాటితో వేసే క్లిష్టమైన ఎత్తులు, పైఎత్తులు కూడా ఆమెకు పెద్దగా తెలియదు. మేధావులతో ఢీకొట్టే తన చిన్నారి కుమారుడు ఎలా ఆడుతున్నాడు అన్న విషయమూ ఆమెకు పట్టదు. తన కొడుకుతో తను ఉండాలంతే! ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడికి అండగా నిలబడాలి. తనకు నచ్చినా నచ్చకపోయినా.. కొడుకుతో పాటే ప్రయాణాలు చేయాలి. అతడిని కంటికి రెప్పలా కాచుకోవాలి. ఆ తల్లి మనసుకు తెలిసింది ఇదే! గత దశాబ్దకాలంగా.. చిన్నపిల్లాడి నుంచి.. గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి చేరేదాకా ఆ మాతృమూర్తి కొడుకు కోసం తన సమయాన్నంతా కేటాయించింది. కుమారుడి విజయాలకు సాక్షిగా గర్వపడే క్షణాలను ఆస్వాదిస్తోంది. ఎక్కడున్నా సరే.. తన అమితమైన ప్రేమతో పాటు కొడుకుకు ఇష్టమైన సాంబార్, టొమాటో రైస్ వడ్డిస్తూ అతడికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఆ తల్లి తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్లకు.. పరోక్షంగా విన్న వాళ్లకూ ‘‘నా విజయాలకు ముఖ్య కారణం మా అమ్మే’’ అన్న ప్రజ్ఞానంద మాటలు నూటికి నూరుపాళ్లు నిజమే అనిపించడంలో ఆశ్చర్యం లేదు! అక్క చేసిన ఆ పని వల్లే.. చెస్ ప్రపంచంలో భారత్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రజ్ఞానందది సాధారణ కుటుంబం. తండ్రి రమేశ్‌బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి నాగలక్ష్మి ‘గృహిణి’. ప్రజ్ఞానందకు సోదరి వైశాలి ఉంది. ఆమె కూడా చెస్‌లో రాణిస్తోంది. చిన్నతనంలో వైశాలి టీవీకే అతుక్కుపోవడం గమనించిన నాగలక్ష్మి ఆమె ధ్యాసను మళ్లించేందుకు చెస్ బోర్డు కొనిచ్చింది. ఆ సమయంలో నాలుగేళ్లన్నరేళ్ల ప్రజ్ఞా కూడా ఆటపై ఆసక్తి కనబరచడంతో కోచింగ్ ఇప్పించారు ఆ తల్లిదండ్రులు. అలా బాల మేధావిగా పేరొందిన ప్రజ్ఞానంద అంచెలంచెలుగా ఎదుగుతూ పదేళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. కార్ల్‌సన్‌ను ఓడించి ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకుంటూ 16 ఏళ్ల వయసులో మహామహులకే సాధ్యం కాని రీతిలో కార్ల్‌సన్‌ను ఓడించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఏడాది కాలంలో ఏకంగా మూడుసార్లు అతడిపై మూడు సార్లు గెలుపొంది చెస్ ప్రపంచానికి కొత్త రారాజు రాబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. ప్రతిష్టాత్మక టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచినా ర్యాంకింగ్స్‌లో టాప్-10 చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని నమ్మకంగా చెబుతున్నాడు. PC: Amruta Mokal ఆ తల్లికి ‘భయం’.. అందుకే తండ్రి అలా ఇక నార్వే స్టార్ కార్ల్సన్ విషయానికొస్తే.. ప్రజ్ఞాకు తల్లి నాగలక్ష్మి ఎలాగో.. అతడికి తండ్రి హెన్రిక్ అలాగే! మేనేజర్‌గా, మార్గనిర్దేశకుడిగా కార్ల్‌సన్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఎల్లవేళలా కొడుకుతోనే ఉంటూ అతడికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. మాగ్నస్ కార్ల్సన్ తల్లి సిగ్రూన్ కెమికల్ ఇంజనీర్. ఆమెకు చెస్ ఆడటం తెలుసు. కానీ ఎప్పుడూ కొడుకు మ్యాచ్‌లు చూసేందుకు ఆవిడ రాదు. ఒత్తిడిని తట్టుకోవడం... భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సిగ్రూన్ బలహీనురాలు కాబట్టే తానే ఎప్పుడూ కార్ల్సన్ వెంట ఉంటానని ఐటీ కన్సల్టెంట్ అయిన హెన్రిక్ ఓ సందర్భంలో చెప్పాడు. అన్నట్లు ఈ దంపతులకు మాగ్నస్‌తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా పజిల్ ప్రపంచానికి పరిచయస్తులేనండోయ్! -సుష్మారెడ్డి యాళ్ల చదవండి: Minnu Mani: అమ్మానాన్న వద్దన్నారు! పట్టువీడలేదు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్‌కు ఆమె పేరు He said "Your photo on Twitter was huge!" I said, "It is because you ARE huge!" @rpragchess and his lovely mum are IN THE #FIDEWorldCup2023 FINAL ♥️ pic.twitter.com/2bJP21yBGN — PhotoChess (@photochess) August 21, 2023 -
ప్రియాంకకు డాక్టరేట్
కొండాపూర్(సంగారెడ్డి): సంగారెడ్డికి చెందిన నక్క లక్ష్మీ ప్రియాంకకు కేంద్రీ య విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డాక్టరేట్ ప్రకటించింది. సైకాలజీ రంగంలో ఆమె పీహెచ్డీ పూర్తి చేసింది. ప్రొఫెసర్ మీనా హరిహరన్ పర్యవేక్షణలో అడొలిసెన్స్ స్ట్రెస్ స్కేల్‌పై పరిశోధన చేసింది. ఈ పరిశోధన లో ఆడపిల్లలు, మగ పిల్లల కంటే ఎక్కువ మానసిక ఒత్తిడి గురి అవుతున్నారని కనుగొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, ఒత్తిడి దేని వల్లో తెలుసుకొని, స్కూల్స్, కౌన్సెలింగ్ సెంటర్లో వారికి తగిన సహాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. -
అన్న సీఐఎస్ఎఫ్.. చెల్లి సీఆర్పీఎఫ్
కరీంనగర్: వ్యసాయం మీదనే ఆ కుటుంబం ఆధారపడి బతుకుతోంది. కానీ వారి పిల్ల లను మాత్రం కేంద్ర బలగాలకు పంపాలనుకున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు సీఐఎస్ఎఫ్, సీఆర్పీఫ్కు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన పోతుల ప్రభాకర్–రాజమణి కూతురు పోతుల స్రవంతి పదోవ తరగతి వరకు స్థానిక మోడల్ స్కూల్లో విద్యనభ్యసించిది. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఇటీవల సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంది. ఆదివారం విడుదలైన ఫలితాలలో కానిస్టేబుల్‌గా ఎంపికై ంది. అంతకుముందు ఎస్సైకి దరఖాస్తు చేసుకోగా విఫలమైంది. కానీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. అదేవిధంగా పోతుల స్రవంతి చిన్నాన పోతుల చంద్రయ్య–ఇందిరల కుమారుడు పోతుల శ్రావణ్ కూడా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శ్రావణ్ పదో తరగతి వరకు స్థానిక మోడల్ స్కూల్లో చదివాడు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇద్దరు ఒకే కుటుంబం నుంచి కేంద్ర సాయుధ బలగాలకు ఎంపిక అవ్వడం పట్ల గ్రామస్తులు వారిని అభినందించారు. ఇద్దరు ఒకేసారి దరఖాస్తు చేసుకున్నారు, కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఈవెంట్స్‌కు ప్రిపేర్ అయ్యారు. -
డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు సువర్ణ ఎంపిక
శ్రీకాకుళం: వరుసగా రెండో ఏడాది కూడా పరపటి సువర్ణ గ్రూప్–1 పోస్టు కొట్టేశారు. 2022 గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యారో గ్య శాఖ కార్యాలయ పరిపాలనాధికారి (ఏఓ)గా బాధ్యత స్వీకరించి, శిక్షణలో ఉండగానే మళ్లీ తాజా గా ప్రకటించిన గ్రూప్–1 పరీక్షల్లో ఏకంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికై రికార్డు సృష్టించారు. సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన పరపటి ధర్మారావు కుమార్తె సువర్ణ ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీలో పీజీ పూర్తి చేశా రు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా, 2022లో తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1కు అర్హత సాధించారు. అనంతరం మళ్లీ తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. కలెక్టర్‌గా చూడాలన్నది నాన్న కల నన్ను కలెక్టర్‌గా చూడాలన్న నాన్న కల నెరవేర్చుతాను. ప్రస్తుతానికి రెండు సార్లు వరుసగా గ్రూప్–1 పోస్టులు సాధించాను. తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. సివిల్స్ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా చదువుతాను. – సువర్ణ, గ్రూప్–1 విజేత -
పగలు పూజారి.. రాత్రిళ్లు బైక్ రేసర్!
ఒకేసారి రెండూ విభిన్న రంగాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదేమో. కొందరూ మాత్రం వాటిని అలవోకగా సాధిస్తారు. వారు ఉన్న రంగానికి ఎంచుకున్న రంగానికి చాలా తేడా ఉంటుంది. చూసే వాళ్లు సైతం ఇది నిజమా అని ఆశ్చర్యపోయాలా సమర్థవంతంగా దూసుకుపోతారు. అభిరుచిని వదులోకోవాల్సి అవసరం లేదు మనం ఎందులో ఉన్న మన కలను నిజం చేసుకోవచ్చు అని తెలియజెప్పుతారు కొందరూ వ్యక్తులు. ఆ కోవకే చెందుతారు కేరళకు చెందిన ఓ పూజారి. వివరాల్లోకెళ్తే..కేరళలో కొట్టాయం జిల్లాకు చెందిన ఉన్ని కృష్ణన్ పగలు ఆలయంలో పూజరిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతను ఓ సాధారణ పూజరి మాత్రమే కాదు. అతనిలో ఓ రైసర్ కూడా దాగున్నాడు. రాత్రిళ్లు ఎక్స్‌పల్స్ 200 మోటార్ బైక్‌పై రయ్ మంటూ దూసుకుపోతుంటాడు. అతను గ్లోవ్స్, బూట్లు, హెల్మెట్ ధరించి ఓ రైసర్లా దూసకుపోతుంటాడు. అతని గురించి తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఉన్నికృష్ణన్న్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యావంతుడు. Temple priest at dawn, dirtbike racer by dusk.Meet Unnikrishnan (34), melshanti of Pudhukkulamgara Devi temple in Kottayam, Kerala, an avid motorcross rider who recently raced in INRC 2023 in Coimbatore. A former IT engineer, this priest-racer is training for a race in Bengaluru pic.twitter.com/9c3TJ2WtKl— Petlee Peter (@petleepeter) August 14, 2023 2013 వరకు ఐటీ రంగంలో పనిచేశాడు కూడా. ఐతే అతడి మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్తుండటతో ఇక ఈ రంగంలోకి వచ్చేశాడు. అదీగాక 2019లో పూజారి అయిన తన తండ్రి గతించడంతో ఉన్నికృష్ణన్ తన కుటుంబ సంప్రదాయ వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 2021లో అధికారికంగా పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023లో మోటార్ సైక్లింగ్‌లో లైసెన్స్ పొందడమే గాక కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రేసర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. నిజంగా ఉన్ని కృష్ణన్ చూస్తే..అభిరుచికి లిమిట్స్ ఉండవు. మనిషిలో తగినంత సామర్థ్యం, ప్రతిభ ఉంటే ఏ ఫీల్డ్‌లో ఉన్నా గెలుపు తీరాన్ని అందుకోగలడని అవగతమవుతోంది కదూ. (చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీ దుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2021లో రాజమండ్రి ఇంటలిజెన్స్ విభాగంలో ఉత్తమ సేవలను అందించిన ఎస్పీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం మెడల్ అందజేసి అభినందించారు. ఎస్పీ సర్వీసులో కొన్ని ముఖ్యమైన అంశాలు ► సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై లోతైన విచారణ చేశారు. 2019లో మంటూరు (దేవీపట్నం) పడవ ప్రమాదానికి గల కారణాలపై సాంకేతిక విశ్లేషణ, ఉదాసీనత కలిగిన ప్రభుత్వోద్యోగులు, ప్రమాదం సంభవించకుండా ఉండుటలో ప్రధాన పాత్ర పోషించారు. ► గోదావరి జిల్లాల్లోని పేదలకు, రంపచోడవరం చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గిరిజనులకు వైద్య, ఆరోగ్య సదుపాయాలపై విశ్లేషణ, మెడికల్ కాలేజీ, మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ఆవశ్యకతపై చర్యలను ప్రభుత్వానికి సూచించారు. ► అన్నవరం దేవస్థానం పాలనాపరమైన ఆరోపణలపై విచారణ చేశారు. ► గోదావరి జిల్లాల్లో జరుగుతున్న నకిలీ పాస్‌పోర్టు మోసాలపై కొన్ని ఆధారాలతో పాటు ఆధారాలతో అప్రమత్తం చేశారు. ► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్ల్లో ఇసుక రవాణా ప్రధాన సమస్య. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటానికి, పారదర్శకతను కొనసాగించడానికి, ఇసుక రవాణాపై నిశిత నిఘా ఉంచారు. -
అమ్మానాన్న వద్దన్నారు! ఇప్పుడు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్‌కు ఆమె పేరు
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్న మాటను అక్షరాలా నిజం చేసి చూపించింది మిన్ను మణి. కష్టపడితే ఫలితం తప్పక దక్కుతుందడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గిరిజన గూడెంలో పుట్టి.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను మనోబలంతో జయించి.. టీమిండియా క్రికెటర్ స్థాయికి ఎదిగింది. ఆడపిల్లలకు క్రికెట్ ఎందుకని వారించిన అమ్మానాన్నలతో పాటు.. తమ ఊరు మొత్తాన్ని గర్వపడేలా చేస్తోంది. విమర్శించిన నోళ్లే తనను కొనియాడేలా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు-2023కి సన్నద్ధమవుతున్న ఈ ‘మట్టిలో మాణిక్యం’ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం! మగవాళ్ల ఆట మనకెందుకు? కేరళలోని వయనాడ్ జిల్లాలో బ్రహ్మగిరి కొండల అంచున ఉన్న గిరిజన గూడెం మిన్ను స్వస్థలం. ‘కరూచియా’ తెగకు చెందిన ఆమె తండ్రి మణి రోజువారీ కూలీ. ఆయన తెచ్చిన డబ్బుతో ఇంటిని చక్కదిద్దే బాధ్యతలు తలకెత్తుకున్న వసంత మిన్ను తల్లి. చిన్ననాటి నుంచే మిన్నుకు క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. మగపిల్లలతో కలిసి క్రికెట్ ఆడేది. కానీ మిన్నును అథ్లెట్‌గా చూడాలనుకున్న ఆమె తల్లిదండ్రులకు ఇది ఎంతమాత్రం నచ్చలేదు. మగవాళ్ల ఆట మనకెందుకని కూతుర్ని వారించారు. పురుషాధిక్య ప్రపంచంలో మిన్నుకు ఇంటి నుంచే ఇలాంటి పోరు మొదలైంది. పట్టువీడలేదు.. బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయలా! కానీ ఆమె పట్టువీడలేదు. ఎల్సమ్మ బేబీ అనే స్కూల్ పీఈటీ టీచర్‌తో పరిచయం మిన్ను రాతను మార్చింది. ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఎల్సమ్మ.. తల్లిదండ్రులను ఒప్పించి మరీ మిన్ను బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. దగ్గరుండి మరీ మిన్నును కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు తీసుకెళ్లింది. అంచెలంచెలుగా ఎదిగి ప్రతిభావంతురాలైన మిన్ను తన ఆటతో అక్కడున్న వాళ్లను మంత్రముగ్ధులను చేసి.. తొలుత జిల్లా స్థాయి, ఆపై అండర్ 16.. అండర్ 23లో కేరళకు ఆడింది. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత మహిళా అండర్-23, అనంతరం ఇండియా- ఏ జట్టుకు ఎంపికైంది. అయితే, ఆటలో దూసుకుపోతున్నా ‘ఆర్థిక కష్టాల కడలి’ని మాత్రం అంత తేలికగా దాటలేకపోయింది మిన్ను. దశ తిరిగింది.. అదృష్టం వరించింది అలాంటి సమయంలో మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో మిన్నును ‘అదృష్టం’ వరించింది. ఆమె అద్భుత ఆట తీరుకు ప్రతిఫలంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ. 30 లక్షలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. దీంతో మిన్ను కుటుంబానికి కాస్త సాంత్వన లభించింది. అయితే, ఆర్థికంగా కష్టాలు తీరినా.. తనకు ఈ డబ్బు ముఖ్యం కాదని.. ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడటమే తన ప్రధాన లక్ష్యమని చెప్పడం.. మిన్నుకు ఆట పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఆమె ఆశయం గొప్పది.. అందుకే బంగ్లాదేశ్ పర్యటన రూపంలో అవకాశం కలిసివచ్చింది. అరంగేట్రంలోనే సత్తా చాటి.. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడిన టీ20 సిరీస్ సందర్భంగా ఆమెకు అవకాశం వచ్చింది. బంగ్లాతో మొదటి టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో మిన్న మణి అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసిన ఈ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, ఈ సిరీస్‌లో మొత్తంగా ఐదు వికెట్లతో మెరిసిన మిన్ను.. తనదైన ముద్ర వేయగలిగింది. ఆరంభంలోనే అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుని వారం తిరిగే లోపే 19వ ఆసియా గేమ్స్ జట్టులో చోటు సంపాదించింది. చైనా వేదికగా సెప్టెంబరు 23 నుంచి ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక క్రీడల్లో భాగం కానుంది. సమాజం నుంచి ఎన్నో విమర్శలు ‘‘క్రికెట్‌పై నాకు ఆసక్తి ఉందన్న విషయం తెలిసి నా తల్లిదండ్రులతో పాటు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్నా. ఎనిమిదో తరగతికి వచ్చే దాకా నేను లోకల్ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం మా అమ్మానాన్నలకు కూడా తెలియదు. చదువుకుంటూ.. వరి పొలాల్లో పనిచేసుకుంటూ.. నా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేసేదాన్ని. స్థలం కావాలి అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. వయనాడ్ నుంచి ఓ అమ్మాయి టీమిండియాకు ఆడుతోందని చుట్టుపక్కల వాళ్లు గర్వపడుతున్నారు. నాలాగే వాళ్ల కుమార్తెలు కూడా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు’’ అని 24 ఏళ్ల మిన్ను మణి సంతోషం వ్యక్తం చేసింది. తనలాంటి అమ్మాయిలను ప్రోత్సహించేందుకు క్రికెట్ నర్సరీ నిర్మించేలా స్థలం మంజూరు చేయాలని స్థానిక పాలనా అధికారులను కోరినట్లు జాతీయ మీడియాతో తమ మనసులోని మాట బయటపెట్టింది. అరుదైన గౌరవం.. ఆ జంక్షన్‌కు పేరు ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో గల మనంతవాడీ మున్సిపాలిటి మిన్ను మణిని అరుదైన గౌరవంతో సత్కరించింది. మైసూర్ రోడ్డు జంక్షన్‌కు మిన్ను మణి జంక్షన్‌గా నామకరణం చేసింది. మిన్ను ఇంటి నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జంక్షన్ ఉంటుంది. ఊహించని బహుమతి సినీ, రాజకీయ ప్రముఖులకు మాత్రమే సాధారణంగా ఇలాంటి గౌరవాలు దక్కుతాయని తాను భావించానని.. అయితే, స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఇలా తనకు ఊహించని బహుమతి ఇచ్చారని మిన్ను ఆనందంతో ఉప్పొంగిపోయింది. తమ ఇంటి నుంచి ఈ జంక్షన్ వరకు త్వరలోనే రోడ్డు కూడా నిర్మిస్తామని అధికారులు చెప్పారని హర్షం వ్యక్తం చేసింది. మట్టి సువాసనలు పరిమళించగా.. ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుండటం గర్వంగా ఉందన్న మిన్ను.. ఆల్‌రౌండర్‌గా మెగా ఈవెంట్లో సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. బౌలర్‌గా తనకు ప్రాధాన్యం ఉంటుందన్న మిన్ను.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రావొచ్చని చెప్పుకొచ్చింది. మరి లెఫ్టాండ్ బ్యాటర్.. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన మిన్ను మణి ఆసియా క్రీడల్లో టీమిండియా జెర్సీ ధరించి బరిలోకి దిగితే.. ఆమె తల్లిదండ్రులతో కేరళ మొత్తం గర్విస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మట్టి సువాసనలతో పరిమళించిన తమ ఆడబిడ్డను దేశం కూడా విజయోస్తు అని దీవిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా! హ్యాట్సాఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ మిన్ను ‘మణి’!! -సాక్షి వెబ్‌డెస్క్ చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! -
హోం మంత్రి పతకానికి ధనుంజయుడు ఎంపిక
పశ్చిమ గోదావరి: కేంద్ర హోం శాఖ ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇచ్చే కేంద్ర హోం మంత్రి పతకానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి అత్యుత్తమ నేరపరిశోధన చేసిన రాష్ట్రానికి చెందిన ఐదురుగు పోలీసు అధికారులు ఈ పతకానికి ఎంపిక కాగా వారిలో ఒకరు ధనుంజయుడు. నేర పరిశోధనల్లో ఉన్నత ప్రమాణాల్ని ప్రోత్సహించడం కోసం 2018 నుంచి పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఈ పతకాలు అందిస్తోంది. 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ డీఎస్పీగా ధనుంజయుడు పని చేస్తున్న సమయంలో రెండు కీలకమైన కేసులను చేధించడంలో విశేష కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పతకం అందిస్తున్నారు. ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ బాపట్ల జిల్లా చీరాల మండలం చీపురుపాలెం ధనుంజయుడి స్వగ్రామం. చీరాలలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991లో ఎస్సైగా డీటీసీలో శిక్షణ పొందారు. గుంటూరు జోన్ నుంచి ఎంపికై న ఈయన నెల్లూరు జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌కు ఎస్సైగా నియమితులయ్యారు. ఆ తరువాత ఉదయగిరి, కావలి టూటౌన్, సంగం, ఆత్మకూరు పోలీస్స్టేషన్లలో ఎస్సై పనిచేశారు. నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి జరగడంతో ఆ సమయంలో ధనుంజయుడిని అక్కడికి పంపారు. ఆ తరువాతి కాలంలో నెల్లూరు త్రీ టౌన్‌కు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి చెంది విజయవాడలో సీఐడీ విభాగంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం మూడేళ్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా ఇంటిలిజెన్స్ డీఎస్పీగా ఐదేళ్లు పనిచేశారు. అలాగే విశాఖ ట్రాఫిక్ ఏసీపీగా 10 నెలలు పనిచేశారు. సాంకేతిక ఆధారాలతో కేసుల నిరూపణలో ప్రతిభ 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలు దిశ డీఎస్పీగా రెండేళ్లపాటు పనిచేశారు. ఈ సమయంలోనే రెండు కీలకమైన కేసులు చేధించడంలో కీలకంగా పనిచేశారు. గిద్దలూరు మండలం అంబవరంలో ఏడేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఈ కేసును ధనుంజయుడు చాలెంజింగ్ తీసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి గత జనవరిలో కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే కందుకూరులో 15 ఏళ్ల బాలికను నిర్భంధించి వ్యభిచారం కూపంలోకి నెట్టారు. వారం రోజుల పాటు బాలికపై 25 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కూడా చాలెంజింగ్‌గా తీసుకుని సెల్‌ఫోన్, ఫోన్‌పే ఆధారంగా నిందితులను గుర్తించారు. 25 మంది ఆ వారం రోజుల పాటు వినియోగించిన కండోమ్‌లు డీఎస్పీ స్వాధీనం చేసుకుని డీఎన్ఏ పరీక్షలకు పంపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాలికతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు. దీంతో 25 మందిని బాలిక గుర్తించింది. అన్ని ఆధారాలతో ఈ కేసును నిరూపించారు. ఈ కేసును చేధించడంలో సాంకేతిక ప్రమాణాలు పాటించారు. ఈ రెండు కేసులు చేధించడంలో డీఎస్పీ విజయం సాధించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ.. డీజీపీ ద్వారా వీటి వివరాలను కేంద్రానికి పంపారు. నేర పరిశోధనలో అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్రం ధనుంజయుడిని కేంద్ర హోం మంత్రి పతకానికి ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా నుంచి ఆయన తాడేపల్లి సిట్‌కు డీఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ కూడా అత్యంత ప్రతిభ కనబర్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.250 కోట్ల దుర్వినియోగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇటీవల బదిలీల్లో భాగంగా మే నెలలో జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బదిలీపై వచ్చారు. -
పట్టుబట్టి ఎస్ఐ కొలువు సాధించి..
తాండూరు టౌన్: పేదరికాన్ని లెక్క చేయని యువతి కష్టపడి ఉన్నత కొలువును సాధించింది. లక్ష్య సాధనకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో తాండూరు పట్టణం పసారీ వార్డుకు చెందిన వీరేశం, నిర్మల దంపతుల కూతురు దూది కావేరి ఎస్సై (సివిల్) ఉద్యోగం సాధించింది. తండ్రి పట్టణ శివారులోని ఓ స్పిన్నింగ్ మిల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచి చదువుపై మక్కువ చూపే కావేరి పదో తరగతి స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్, ఇంటర్మీడియెట్ తాండూరు చైతన్య కళాశాలలో, డిగ్రీ ఓపెన్‌లో చదివింది. డీఎడ్ చదివి డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఆమె.. హైదరాబాద్‌లో ఎస్సై పరీక్ష కోసం శిక్షణ తీసుకుంది. పట్టుదలతో ఎస్సై కొలువు సాధించింది. దీంతో కావేరిని కుటుంబసభ్యులు, స్నేహితులు అభినందనలతో ముంచెత్తారు. -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్.. 'గమ్యం' యాప్ తో..
వరంగల్: టీఎస్ ఆర్టీసీ.. ప్రయాణికుల ముంగిటకు మరో సాంకేతిక సహకారాన్ని తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన సంపూర్ణ సహకారం అందించే ‘గమ్యం వెహికిల్ ట్రాకింగ్’ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను శనివారం హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవాన్ని ప్రయాణికులు వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులో జీపీఎస్ పరికరాలు బిగించారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ ఆపై బస్సుల్లో మాత్రమే జీపీఎస్ సమాచారం అందుబాటులోకి వచ్చింది. త్వరలో పల్లె వెలుగు బస్సులకు కూడా ఈ సౌకర్యం విస్తరించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. ‘గమ్యం వెహికిల్ ట్రాకింగ్ యాప్’ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌తో బస్సుల సమయం, ఏఏ బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయో, బస్సు ఎక్కడికి వరకు వచ్చింది. బస్ స్టేషన్లు, బస్ స్టేజీల సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్రయాణికులకు ఎంతో దోహదపడుతుందని ఆర్టీసీ అధికారులు చెప్పారు. మహిళల రక్షణకు ప్రాధాన్యం.. మహిళల రక్షణకు యాప్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బస్ స్టేషన్లు, రూట్లు తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం గమ్యం యాప్‌లో ‘ఫ్లాగే బస్సు’ ఆనే ఆప్షన్ కూడా చేర్చారు. యాప్‌లోకి వెళ్లి ఫ్లాగే బస్ అనే చోట నొక్కితే (టచ్ చేస్తే) స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక కలర్ వస్తుంది. ఈ కలర్‌తో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను బస్సు ఎదుటగా చూపిస్తే డ్రైవర్ చూసి బస్సును నిలిపి మహిళలను ఎక్కించుకుంటారు. సమీపంలో ఉన్న బస్ స్టేజీలో దింపుతారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. -
కేంద్ర రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీ.. గద్వాల–డోర్నకల్ వరకు..
వనపర్తి: కేంద్ర ప్రభుత్వం రైల్వేరంగం అభివృద్ధిపై దృష్టిసారించడంతో కొత్త రైల్వేలైన్లపై ఆశలు చిగురిస్తున్నాయి. గద్వాల– డోర్నకల్ (మహబూబాబాద్) మధ్య రైల్వేలైన్ సర్వే కోసం ఆదేశాలు జారీ కావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కావడం పట్ల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. దీనికి సంబంధించి పైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)కు కేంద్ర ప్రభుత్వం రూ.7.40 కోట్లు విడుదల చేసింది. దీంతో 296 కి.మీ., పొడవైన గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట మీదుగా డోర్నకల్ వరకు రైల్వేలైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేల అనంతరం ఇచ్చే నివేదిక ఆధారంగా ఆ మార్గంలో కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా విడుదలైన నిధులతో రైల్వేలైన్‌కు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు గత నెల 26న కేంద్ర రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రాజెక్టుల్లో మౌలిక వసతులు, డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ తదితర పనులకు అనుమతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
మొక్కవోని ధైర్యం.. గడ్డంతో ఆమె గిన్నిస్ బుక్‌లోకి
అమెరికా మిచ్గాన్కు చెందిన ఎరిన్ హనీకట్. వయసు 38 ఏళ్లు. గత రెండేళ్లుగా నాన్‌స్టాప్‌గా గడ్డం పెంచుతూనే ఉంది. అది ఇప్పుడు 30 సెం.మీ. పెరిగి.. గిన్నిస్ బుక్‌లోకి ఆమె పేరును ఎక్కించింది. అందుకు కారణం.. అతిపొడవైన గడ్డంతో భూమ్మీద జీవించి ఉన్న మహిళ ఈమెనే కాబట్టి. ఎరిన్ గడ్డం సహజమైందట. ఎలాంటి హార్మోన్లు, సప్లిమెంట్లు తీసుకోలేదట. ఆమెకు ఉన్న పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్(PCOS) వల్లే ఆమెను ఇలా మార్చేసింది. ఈ సిండ్రోమ్‌తో ఇలా జుట్టు పెరగడం మాత్రమే కాదు.. పీరియడ్స్ సజావుగా రాకపోవడం, బరువు పెరగడం, సంతానలేమి లాంటి సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. పీకోస్ వల్ల 13వ ఏట నుంచే ఆమె ముఖంపై గడ్డం పెరగడం ప్రారంమైందట. షేవింగ్, వ్యాక్సింగ్, అవాంఛిత రోమాల్ని తొలగించే అన్ని పద్ధతుల్ని ఆమె ఉపయోగించారట. ఒక్కోసారి రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయట. అయినా లాభం లేకుండా పోయింది. ఈలోపు ఓ యాక్సిడెంట్లో ఆమె కాలికి తగిలిన గాయంతో ఇన్ఫెక్షన్ సోకి.. కాలిని తీసేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆ ప్రభావం మరికొన్ని అవయవాలపై కూడా పడింది. ఏళ్లు గడిచేకొద్దీ ఆరోగ్యం దిగజారి.. మానసికంగా కుంగిపోతున్న ఆమెకు డాక్టర్లు ఆమెకు ధైర్యం కోసం చెప్పిన మాటలు.. ‘అయ్యేదేదో ఎప్పటికైనా అవుతుంది. సంతోషంగా జీవితంలో ముందుకుసాగిపో అని. ఆ మాటలతో ఆమె తనను తాను మార్చుకుంది. తాను మహిళగా ఉండడం కన్నా.. సంతోషంగా కనిపించాలని నిర్ణయించుకుంది. ఈలోపు మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఆమె చెక్కుచెదర్లేదు. భాగస్వామి సహకారంతో.. మొక్కవోని ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతోంది. ఇప్పుడు పొడవైన గడ్డంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డు అమెరికాకే చెందిన 75 ఏళ్ల వివియన్ వీలర్ పేరిట ఉండేది. -
సీతకు అరుదైన అవకాశం
విజయనగరం ఫోర్ట్: ఢిల్లీలోని ఎర్రకోటలో ఈనెల 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకలను వీక్షించేందుకు చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామానికి చెందిన ఉపాధిహామీ వేతనదారు యందవ సీతకు ఆహ్వా నం అందింది. దేశవ్యాప్తంగా 1800 మందికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తోంది. వీరిలో సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, రైతులు, నర్సులు, మత్య్సకారులు, కూలీలు తదితర వర్గాలకు చెందిన వారు ఉంటారు. ఉపాధిహామీ వేతనదారుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి అవకాశం లభించగా అందులో సీత ఒకరు. ఈ నెల 13వ తేదీన గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. సంతోషంగా ఉంది ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు టీవీలో చూస్తేనే ఎంతో గొప్పగా ఉంటాయి. అలాంటి వేడుకులకు దగ్గరుండి వీక్షించేందుకు అవకాశం లభించడం ఆనందంగా ఉంది. మూడు రోజుల కిందట ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఆ తరువాత జిల్లా అధికారులు ఫోన్ చేశారు. ఈనెల 13న గన్నవరం నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. జీవితంలో మరిచిపోలేని సంఘటన ఇది. డిగ్రీవరకు చదువుకున్నాను. డైట్ శిక్షణ కూడా పొందాను. గత ఏడాది డిసెంబర్ వరకు ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశాను. ఆరోగ్య సమస్య తలెత్తడంతో మానేసి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాను. – యందవ సీత, రామలింగాపురం గ్రామం, చీపురుపల్లి మండలం -
అప్పుడు వాళ్లు అలా! ఇప్పుడు వీరిలా.. తలెత్తుకునేలా చేశారు.. శెభాష్!
Independence Day 2023: ఝాన్సీ లక్ష్మీబాయి.. బేగం హజ్రత్ మహల్.. అనీ బిసెంట్.. కమలా నెహ్రూ.. సరోజిని నాయుడు.. ఇలా ఎంతో మంది వీరవనితలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని మహిళలు ఎవరికీ తీసిపోరని నిరూపించారు. స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు బ్రిటిషర్లతో జరిగిన మహాసంగ్రామంలో తాము సైతం అంటూ ముందడుగు వేసి జాతిని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తితో మరెంతో మంది స్త్రీమూర్తులు వంటింటి నుంచి బయటకు వచ్చి విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో తమ ప్రాతినిథ్యం ఉండేలా అడుగులు వేశారు. అయితే, నేటికీ స్వతంత్ర భారతంలో ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతుండటం విచారకరం. అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని సంతోషంతో స్వాగతాలు పలికేది కొందరైతే.. తల్లి కడుపులో ఉండగానే ఆడ శిశువులను చిదిమేసే కిరాతకులలు ఎందరో! మహిళల ఆహారపుటలవాట్లు మొదలు వస్త్రధారణ, చేయాల్సిన ఉద్యోగం గురించి కూడా తామే నిర్ణయించే ఈ పురుషాధిక్య ప్రపంచంలో.. అసమానతలను అధిగమించి ‘విశ్వవేదిక’పై సత్తా చాటడటమంటే మామూలు విషయం కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి క్రీడల్లో తలమానికమైన ఒలింపిక్స్‌లో భారత జాతి గర్వపడే విజయాలు సాధించిన బంగారు తల్లుల గురించి తెలుసుకుందాం! కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్‌లో మొట్టమొదటి పతకం సాధించిన భారత మహిళగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్- 2000లో వెయిట్‌లిఫ్టింగ్ 54 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. తద్వారా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ప్లేయర్‌గా సైనా నెహ్వాల్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. లండన్ ఒలింపిక్స్-2012లో ఈ మాజీ వరల్డ్ నంబర్ 1.. కాంస్య పతకం గెలిచింది. అంతకు ముందు బీజింగ్-2008, ఆ తర్వాత 2016- రియో ఒలింపిక్స్‌లోనూ ఆమె భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. మేరీ కోమ్ భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్యం అందించింది. బాక్సింగ్‌లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య గెలిచిన విజేందర్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది ఈ మణిపురీ ఆణిముత్యం. పీవీ సింధు ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుది అసాధారణ విజయం. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనలిస్టు అయిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు.. రజత పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ సింధు మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. గతంలో సిల్వర్ గెలిచిన ఆమె.. ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే, ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కడం విశేషం. సాక్షి మాలిక్ 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ భారత్‌కు కాంస్యం అందించింది. 58 కేజీల విభాగంలో మెడల్ గెలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. మీరాబాయి చాను 2016లో నిరాశను మిగిల్చిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో మాత్రం సత్తా చాటింది. 49 కేజీల విభాగంలో వెండి పతకం గెలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో.. సిల్వర్ మెడల్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించింది. లవ్లీనా బొర్గొహెయిన్ అసామీ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచింది. కనీస వసతులు లేని గ్రామం నుంచి వచ్చిన లవ్లీనా తన ప్రతిభతో తమ ఊరి పేరును ప్రపంచానికి తెలిసేలా చేసింది. చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు -
ప్రేమకు రోగాలు అడ్డుకావని నిరూపించారు
తమిళనాడు: ప్రేమకు రోగాలు అడ్డుకావని వినీత –నిత్యానంద జంట నిరూపించారని ఎస్ఆర్ఎంసీ హృద్రోగ వైద్య నిపుణుడు తనికాచలం అన్నారు. తన ప్రియుడికి గుండె సమస్య ఉందని తెలిసినప్పటికీ ఏడేళ్లపాటు నిరీక్షించిన ప్రియురాలు వినీత కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. కడలూరు జిల్లా పలూరు గ్రామానికి చెందిన వినీత నిత్యానందను ప్రేమించింది. అతనికి హృద్రోగ సమస్య ఉందని తెలిసింది. అయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వ్యక్తి దానం చేసిన గుండెను 2015లో నిత్యానందకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. ఏడేళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రసుతం ఆ దంపతులు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత అతను మామూలుగా సంసార జీవితాన్ని సాగించవచ్చని నిరూపించారని తనికాచలం తెలిపారు. హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్ టి.పెరియస్వామితో కూడిన హృద్రోగ వైద్య బృందం నిత్యానంద, వినీత దంపతులను అభినందించారు. -
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొప్పదనానికి వందనం చేయాల్సిందే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన పదవీకాలంలో అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి ఎన్నో చరిత్రాత్మక తీర్పులతో వార్తల్లో నిలిచారు. భారత అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయిన చంద్రచూడ్ నిజజీవితంలో మాత్రం ఎటువంటి ఆడంబరాలకు పోకుండా చాలా సాదాసీదాగా గడుపుతారన్న విషయం కొద్ది మందికే తెలుసు. తాజాగా చంద్రచూడ్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని అప్పుడే అందరికి తెలిసింది. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ గతేడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడే డీవై చంద్రచూడ్. ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో గరిష్టంగా ఏడేళ్ల సుదీర్ఘ కాలం సీజేఐగా పనిచేసిన రికార్డు కూడా ఉంది. అంతే కాదు డీవై చంద్రచూడ్ ఇప్పటికే సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా ఎన్నో కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇందులో అయోధ్య తీర్పుతో పాటు పలు కీలక తీర్పులు ఉన్నాయి. నాణానికి ఒకవైపే.. ఈ విషయాలు తెలుసా? ఆయన తండ్రి గతంలో ఇచ్చిన రెండు తీర్పుల్ని తిరగ రాసిన చరిత్ర కూడా డీవై చంద్రచూడ్‌కు సొంతం. ఇవన్నీ నాణానికి ఒకవైపే. కానీ వ్యక్తిగతంగా చూస్తే ఆయనలో మనకి తెలియని మానవతామూర్తి ఉన్నారు. కన్నబిడ్డలు కాకపోయినా తల్లిలా లాలించే ఆయన మనసు చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ విషయం గురించి విశ్రాంత జస్టిస్ అమర్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని వ్యాఖ్యానించారు. పిల్లలిద్దరూ వికలాంగులే, అయినా దత్తత ఇటీవలే జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఇద్దరు దత్తత కూతుళ్లను సుప్రీంకోర్టుకు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారిలో పెద్దకుమార్తె పేరు ప్రియాంక. చిన్న కూతురి పేరు మహీ. ఇద్దరూ వికలాంగులే. వీల్ ఛైర్లకే పరిమితం. కోర్టు ప్రారంభం కావడానికి అరగంట ముందే సుప్రీంకోర్టుకు వచ్చిన చంద్రచూడ్.. తన ఇద్దరు పిల్లలు ప్రియాంక, మహీలకు చాంబర్, కోర్ట్ హాల్, ఇతర న్యాయమూర్తుల చాంబర్స్ మొదలైనవి స్వయంగా చూపించారు. కోర్టులో న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారు? సాధారణ పౌరులు ఎక్కడ కూర్చుంటారు? మొదలైన విషయాలను వారికి వివరించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి తను కూర్చునే కోర్టు హాల్ వరకు పిల్లలను వెంట తీసుకెళ్లారు. దీంతో పిల్లలిద్దరూ ఎంతగానో సంతోషించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని తెలిసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ ఇద్దరు కూతుళ్లు దివ్యాంగులు కావడం, వాళ్లను చంద్రచూడ్ దంపతులు దత్తత తీసుకొని మరీ కన్నబిడ్డల్లా పెంచుకుంటున్నారని చాలామందికి అప్పుడే తెలిసింది. ఆ పిల్లల సొంత తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో చంద్రచూడ్ దంపతులు వాళ్లను దత్తత తీసుకున్నారట. క్యాన్సర్‌తో మొదటి భార్య మరణం 1959లో జన్మించిన చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుమారు ఏడేళ్ల ఐదు నెలల పాటు సుధీర్ఘకాలం సేవలందించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి కుమారుడు కూడా సీజేఐగా కావడం భారత చరిత్రలో ఇదే తొలిసారి. 2024 నవంబర్ 10 వరకూ చంద్రచూడ్ సీజీఐగా కొనసాగనున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. చంద్రచూడ్ మొదటి భార్య రష్మీ 2007లో క్యాన్సర్‌తో మరణించింది. ఆ తర్వాత కల్పనను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరు మహి, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అప్పటికే మొదటి భార్యతో చంద్రచూడ్‌కు అభినవ్, చింతన్ అనే కుమారులున్నారు. అయనప్పటికీ దివ్యంగులైన ఆడపిల్లలను దత్తత తీసుకొని వాళ్లను కన్నబిడ్డలా చూసుకోవడం అభినందనీయం. -
పట్టుదలతో ప్రయత్నిస్తే.. శిఖరాలే తలవంచేలా..
కొత్తగూడ: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లెబోయిన హేమలత ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన బొల్లెబోయిన పద్మ, కుమార స్వామి దంపతుల పెద్ద కూతురు హేమలత చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులకు చలించిపోయేది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే పట్టుదలతో చదువు కొనసాగించింది. ఈ క్రమంలో ఎస్సై ఉద్యోగానికి ఎంపిది. ఎస్సై పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, తమ కూతురు ఎస్సైగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పద్మ, కుమారస్వామి తెలిపారు. -
ఎస్సైగా ఉపాధ్యాయురాలు ఎంపిక
ఆదిలాబాద్: మండలంలో ని నిగ్వా గ్రామానికి చెందిన జాడే సుస్మిత ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆమె ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సైగా ఎంపికై ంది. తల్లిదండ్రులు మీనాక్షి, నాందేవ్‌లు హర్షం వ్యక్తం చేశారు. -
శభాష్ రోజా
సాక్షి, చైన్నె: మద్రాసు వర్సిటీ నుంచి ఎంఏ తెలుగులో ప్రతిభ చాటిన ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడు అనే మారుమూల గ్రామానికి చెందిన గంధం రోజా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. రోజా పదో తరగతి వరకు స్థానికంగా చదివారు. ఆ తర్వాత కుటుంబ సమస్యల కారణంగా ఆమె కళాశాల జీవితం ఒడిదుడుకులతో సాగింది. కొన్ని సబ్జెక్టుల్లో తప్పడంతో రెండేళ్లు చదువుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు యజ్ఞశేఖర్ సాయంతో చదువు కొనసాగించారు. చైన్నెలో రాణిమేరీ కళాశాలలో బి.ఎ తెలుగులో చేరి గతంలో సీఎం స్టాలిన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ప్రస్తుతం మద్రాసు యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగులో బంగారు పతకం సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తన తల్లి జన్మనిస్తే చదువు పరంగా పునర్జన్మను ఆచార్యులు డాక్టర్ యజ్ఞశేఖర్ ప్రసాదించారని పేర్కొన్నారు. తన చదువు విషయంలో మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షుడు విస్తాలి శంకరరావు, రాణి మేరి కళాశాల డాక్టర్ నళిని కృషికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తన గ్రామంలో ఎం.ఏ వరకు చదివిన మొదటి యువతిని తానేనని, పీహెచ్డీ చేయాలన్నది తన ఆశయమని తెలిపారు. మారుతున్న సమాజంలో మగవారితో పోటీపడి అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ తమ గ్రామంతో పాటు పలు మారుమూల గ్రామాల్లో ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించకుండా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారని, ఈ ధోరణి మారాలని ఆమె ఆకాంక్షించారు. -
అనకాపల్లి కలెక్టర్‌కు గౌరవ డాక్టరేట్
సాక్షి, అనకాపల్లి: పరిపాలనా దక్షతకు గుర్తింపు వచ్చింది. అంకిత భావానికి కితాబు లభించింది. సేవాతత్పరతకు అరుదైన గౌరవం దక్కింది. పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ తొలి గౌరవ డాక్టరేట్‌ను అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టికి ప్రదానం చేసింది. శనివారం విశాఖలో జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మూడో స్నాతకోత్సవంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ గౌరవ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ అర్చన భట్టాచార్య డాక్టరేట్‌ను అందించారు. ఐటీడీఏ పీఓగా, జేసీగా, కలెక్టర్‌గా గిరిజనులకు అందించిన సేవలు, ఆయన హయాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన దక్షతకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. రవి పట్టాన్‌శెట్టి ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘స్వస్థ భారత్’లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అనకాపల్లి జిల్లా నుంచి అందుకున్న అవార్డును కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇనిస్టిట్యూట్ భూ వివాదంపరిష్కారంలో కీలక పాత్ర పెట్రో యూనివర్సిటీ పున:ప్రారంభంలో కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక క్యాంపస్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఉండగా.. సబ్బవరం వంగలి గ్రామంలో వర్సిటీని నిర్మించేందుకు రూ.855 కోట్లు మంజూరయ్యాయి. దీనికోసం 201.08 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేశారు. మధ్యలో సుమారు 20 ఎకరాల వరకు రైతులు తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అనకాపల్లి కలెక్టర్ రవిపట్టాన్ శెట్టి నిర్వాసితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో హైకోర్టు వర్సిటీ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, పెట్రో యూనివర్సిటీకి అవరోధాలు తొలగిపోవడం జరిగింది. 2022 డిసెంబర్ 23న పనులు పున:ప్రారంభించారు. ప్రస్తుతం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. పనులు కూడా జరుగుతున్నాయి. -
మిత్రుడి పేరిట స్కూల్.. హ్యాపీ ఫ్రెండ్సిప్ డే..
కరీంనగర్: పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన యాదిలో చిన్ననాటి మిత్రులు ఏదైనా చేయాలని నిర్ణయించున్నారు. గాజుల శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూఎస్ఏ సిరిసిల్ల పట్టణ శివారులో 22 గుంటల స్థలం కొనుగోలు చేసి, రూ.30 లక్షలతో 2006లో దయానంద్ మెమోరియల్ స్కూల్ స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్నారు. రాజీవ్‌నగర్ కార్మిక క్షేత్రంలోని పేదవాళ్లు తమ పిల్లలను ఇక్కడికి పంపిస్తున్నారు. ప్రస్తుతం 65 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ నిర్వహణకు ఏటా రూ.5 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో ఎక్కువ మొత్తాన్ని శ్రీనివాస్ భరిస్తున్నారు. బోడ రవీందర్, సిరిసిల్ల తిరుపతి, కట్కం గోపి, పయ్యావుల శ్రీనివాస్, బి.రాము, బొడ్డు శ్రీధర్, లింగమూర్తి, సిరిసిల్ల తిరుమలేశ్, వూరడి రవి, కోడం సుధాకర్ పాఠశాల నిర్వహణలో భాగస్వాములవుతూ స్నేహానికి నిజమైన నిర్వచనంగా నిలుస్తున్నారు. -
కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది!
జీవితం సంతోషంగా సాగుతున్న టైంలోనే కదా మనిషికి కష్టాలు వచ్చేవి. అలా ఆమెకూ అనుకోని కష్టం వచ్చి పడింది. హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారినపడ్డ అమిషాకు.. కిడ్నీ జబ్బు ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో ఆమె, ఆమె భర్త జితేష్ కుదేలయ్యారు. పైగా రెండు కిడ్నీలు దెబ్బతిని.. వ్యాధి ప్రాణాంతక దశకు చేరుకుందని.. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తేనే ఆమె బతికేదని తేల్చి చెప్పడంతో.. కుంగిపోసాగారు ఆ భార్యాభర్తలు. ముంబైకి చెందిన అమిషా జితేష్ మోటా(43)కు రెండు కిడ్నీలు దెబ్బతిని.. జబ్బు అడ్వాన్స్డ్ స్టేజీకి చేరిందని డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మారిస్తేనే ఆమె బతుకుతుందన్నారు. అమిషా భర్త జితేష్‌కు అంతకు కొన్నిరోజుల ముందే షుగర్ వచ్చింది. దీంతో ఆయన కిడ్నీ డొనేట్ చేయడం కుదరదని వైద్యులు తేల్చారు. అమిషా తల్లిదండ్రులతో పాటు రక్తసంబంధీకులను ముందుకురాగా.. వైద్య ప్రమాణాల దృష్ట్యా అది వీలుకాలేదని వైద్యులు తెగేసి చెప్పారు. అంతా చీకట్లు అలుముకున్న తరుణంలో.. అనుకోని వ్యక్తి రూపంలో ఓ వెలుగురేఖ కిడ్నీ దానానికి ముందుకొచ్చింది. ఆమె పేరు ప్రభ కంటిలాల్ మోటా. జితేష్ తల్లి.. అమిషా అత్త. కానీ.. ప్రభ వయసు 70 ఏళ్లు. వయసురిత్యా ఆమె కిడ్నీ ఇచ్చేందుకు సరిపోతారా? అనే విషయంలో వైద్యులు తర్జన భర్జనలు చేశారు. ఆశ్చర్యంగా అన్ని టెస్టుల్లోనూ ఆమె ఫిట్‌గా తేలారు. అయినప్పటికీ వైద్యుల నుంచి ఆమెకు చెప్పాల్సింది చెప్పారు. భర్త, ఇద్దరు కొడుకులు వద్దని వారించినా ఆమె వినలేదు. చివరకు.. అమిషా కూడా వద్దని బతిమాలుకుంది. మొండిగా తన కోడలి ప్రాణం కాపాడుకునేందుకే ముందుకు వచ్చారు ప్రభ. ఆ అత్త సంకల్పానికి తగ్గట్లే.. కిడ్నీ కూడా అమిషాకు మ్యాచ్ అవుతుందని వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యం క్షీణిస్తూ అమిషా పడుతున్న బాధను మా అమ్మ చూడలేకపోయింది. అందుకే ఆమెను కాపాడాలనుకుంది. వద్దని నేను, నా సోదరుడు ఆమెను ఎంతో బతిమాలాం. మా నాన్న కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కోడలి కోసం మా అమ్మ సాహసం చేసింది. ‘‘అమిషా నా బిడ్డ లాంటిది.. బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎంతదాకా అయినా వెళ్తుంది కదా’’ అని ప్రభ తేల్చేశారు. కిందటి నెలలో నానావతి ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్ జతిన్ కొఠారి నేతృత్వంలో విజయవంతమైంది. అంతా హ్యాపీస్.. ఆ అత్తాకోడళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. సర్జరీ నుంచి కోలుకున్న ప్రభ.. ఆగష్టు 4వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబం.. చుట్టుపక్కల వాళ్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమిషా తల్లి ఆమెను హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తల్లిగా తాను జన్మ ఇచ్చినప్పటికీ, అత్తమ్మగా.. అదీ కిడ్నీ దానంతో పునర్జన్మ ఇచ్చిందంటూ భావోద్వేగానికి లోనైంది. సమాజంలో అత్తాకోడళ్లంటే.. ఎప్పుడూ కస్సుబుస్సు లాడుతూనే ఉండాలా? కలిసి ‘సెల్ఫీ’లు తీసుకుని ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోతుందా?.. ప్రభ-అమిషా ప్రేమానురాగాల గురించి తెలిశాక ఇది కదా మనకు కావాల్సింది అనిపించకమానదు. -
భూకంప శిథిలాల కింద ఊపిరిపోసుకున్న బిడ్డ ఇప్పుడిలా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటే ఇంకా ఆ దృశ్యాలు కళ్లముందు మెదులుతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ శిథిలాల కిందే ఓ శిశువు ఊపిరి పోసుకుంది. ఆ 'జననం ఓ అద్భుతం' అనే చెప్పాలి. అంతటి విషాదంలో అందరిలో ఓ కొత ఆశను రేకెత్తించినట్లు 'మిరాకిల్‌గా ఆ బేబి' పుట్టడం అందర్ని ఒకింత ఆనందసభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇప్పుడూ ఆ శిశువు ఎలా ఉందంటే? నాటి సిరియా భారీ భూకంపంలో శిథిలాల కింద ఆ పసికందు కనిపించినప్పుడు, ఆమె బొడ్డు తాడు తల్లి నుంచి ఇంకా తెగిపోలేదు. ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి వచ్చిన కాసేపటికే ఆమె తల్లి కన్నుమూసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచాన్ని ఆకర్షించింది. తల్లి లేకపోయిన ఆ చిన్నారి ఆస్పత్రిలో వైద్యుల సాయంతో కోలుకుంది. ఇప్పుడు ఆ శిశువుకి ఆరు నెలలు. చాలా ఆరోగ్యంగా ఉంది. సిరియాలోని జిండిరెస్ పట్టణంలో ఆ చిన్నారి తన మేనత్త, మేనమామ, వారి ఏడుగురు పిల్లల మధ్య పెరుగుతోంది. ఆమె నవ్వుతుంటే వాళ్ల నాన్న, అక్కలే గుర్తుకొస్తున్నారని ఆ చిన్నారి మేనమామ ఖలీల్ అల్ సవాడీ అన్నారు. ఆ విషాద ఘటనలో ఆమె తండ్రి, తల్లి, నలుగురు అక్కలు ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుటుంబంలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి అఫ్రానే. ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఎంతోమంది ముందుకొచ్చారు కూడా. ఆఖరికి అయినవాళ్ల అయిన ఆ చిన్నారి మేనమామ, మేనత్తలకు ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. ఎన్నో టెస్ట్‌లు నిర్వహించిగానీ వారికి ఆ పాపను అప్పగించలేదు ఆస్పత్రి యజమాన్యం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే చేసిన పని ఆ పాపకు కొత్తపేరు పెట్టడమే. ఆ చిన్నారికి ఆమె తల్లి 'అఫ్రా' పేరునే పెట్టారు. నిజానికి ఆ శిశువుని కాపాడిని రెస్క్యూ సిబ్బంది, ఆస్పత్రి యజమాన్యం ఆ చిన్నారికి 'అయా' అని పేరు పెట్టడం జరిగింది. 'అయా' అంటే అరబిక్‌లో అద్భుతం అని అర్థం. ఆమె నా కూతుళ్లలో ఒకత్తని, దాన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేనన్నారు ఆ చిన్నారి మేనమామ ఖలీల్. ఇక జిండిరెస్‌లోని ఖలీల్ ఉంటున్న ఇల్లు కూడా బాగా భూకంపం కారణంగా బాగ దెబ్బతిందని, అందువల్ల తాముఅక్కడే ఎక్కువ కాలం ఉండలేకపోయామన్నారు ఖలీల్. దీంతో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టినట్టయిందని, పిల్లలను స్కూల్‌కి పంపే స్థోమత కూడా లేదని ఖలీల్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఖలీల్ లాగానే ఎన్నో వేల కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్నాయి. అంతేగాదు ఆ విషాద ఘటనలో దాదాపు 50 వేలమంది మరణించారని, మరో 50 వేలమంది నిరాశ్రయులయ్యినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది కూడా. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురికి లండన్‌లో ఉద్యోగం) -
అంతర్జాతీయ ఖోఖోలో.. 'సైరా' అనిపించిన తెలంగాణ సాయిరాజ్..
ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన సాయిరాజ్ అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని బంగారు పతకాన్ని సాధించాడు. ఇటీవల నేపాల్దేశంలో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కోచ్ అన్నపూర్ణ, గ్రామస్తులు అతడిని అభినందించారు. -
చిన్నారి కుటుంబానికి సీఎం జగన్ ధైర్యం.. తక్షణ సాయం
సాక్షి, కృష్ణా: సాయం కోరితే చాలూ.. అప్పటికప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలిగే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆ విషయంలో ఆయన మంచి మనసుకు అద్దం పట్టే సందర్భాలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా విజయవాడలోనూ ఓ నిరుపేద కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. ఆ ఇంటి బిడ్డకు చికిత్స కోసం తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీనివాసరావు-కల్లగుంట శ్యామలాదేవి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు ఓ పాప ఉంది. అయితే 14 నెలల ఆ చిన్నారినిక కంటి క్యాన్సర్ సోకింది. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక భారం ఎక్కువైపోతుండడంతో సీఎంను కలిసి తమ వ్యథను వినిపించాలనుకున్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతున్న సంగతి తెలిసి.. ఏ కన్వెన్షన్ హాల్‌కు వెళ్లారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో.. ఆయన దగ్గరుండి వాళ్లను సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. చిన్నారి స్థితి గురించి తెలుసుకున్న సీఎం జగన్ అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన ప్రక్కనే వున్న ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టరు డా. పి సంపత్ కుమార్ కుమార్ ను తక్షణ ఆర్ధిక సహాయానికి ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో.. జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకుని రూ. లక్ష చెక్కును తక్షణ సాయం రూపంలో అందజేశారు. చిన్నారి చికిత్సకు ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన సాయం అన్నివిధాల అందజేస్తామని హామీ ఇచ్చారు. -
‘థాంక్యూ మోదీజీ’.. కశ్మీర్ యువతి బైక్ రైడ్ వీడియో వైరల్
శ్రీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక, కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL — Nusrat Fatima (@knusrata) August 4, 2023 మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. Action taken under relevant sections of MV Act. Violator also counseled not to repeat such acts. pic.twitter.com/To30U8FaiB — Traffic City Srinagar. (@SSPTFCSGR) August 4, 2023 ఇది కూడా చదవండి: నోర్మూయ్, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్ లొళ్లి -
19 ఏళ్ల యువతికి అరుదైన శస్త్రచికిత్స
నెల్లూరు(బారకాసు) : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో ఓ యువతికి అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని నిప్పోసెంటర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల పావని ఆడుకుంటూ పడిపోయింది. దీంతో ఆమె ఎడమ కాలి తొడ విరిగిపోయింది. వెంటనే పావనిని పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చూపించారు. ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఆమెకు సర్జరీ చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె నడవలేని స్థితికి చేరింది. చివరికి ఆమె తల్లిదండ్రులు జీజీహెచ్‌కు తీసుకొచ్చి ఆర్థోపెడిక్ విభాగంలో చూపించారు. అక్కడి వైద్యులు పావనికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. పావనికి ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ అయిందని గుర్తించారు. యువతి తల్లిదండ్రుల అంగీకారం మేరకు పావనికి నెల క్రితం ఆర్థోపెడిక్ విభాగ వైద్య బృందం ఆపరేషన్ చేసింది. నెల పాటు యువతికి ఆస్పత్రిలోనే మెరుగైన వైద్య సేవలందించి నడిచే స్థితికి తీసుకొచ్చారు. దీంతో పావనిని వైద్యులు గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ మస్తాన్‌బాషా మాట్లాడుతూ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను కార్పొరేట్ హాస్సిటల్లో నిర్వహిస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, అయితే జీజీహెచ్‌లో పూర్తి ఉచితంగా నిర్వహించి విజయవంతం చేశామన్నారు. ఆర్థోపెడిక్ విభాగ ప్రొఫెసర్ రవిశంకర్, ప్రొఫెసర్ చంద్రశేఖర్‌నాయుడు, వైద్యులు మధు, కిరణ్, భాస్కర్, దివ్య, గులాబీ సహకారంతో నాలుగు గంటల పాటు శ్రమించి పావనికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలియజేశారు. అనంతరం పావని తండ్రి సురేష్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి డాక్టర్ కళారాణి పాల్గొన్నారు. -
వైద్య దంపతులకు గోల్డ్ మెడల్స్
చింతల్: కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌రెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి, అల్లుడు యశ్వంత్ రెడ్డి లు వైద్యశాస్త్రంలో తమ ప్రావీణ్యతను చాటారు. మణిపాల్ కస్తూర్బా మెడికల్ కళాశాలలో డాక్టర్ సౌమ్యరెడ్డి ఎం.డి పీడియాట్రిక్ విభాగంలో బంగారు పతకం సాధించగా, ఉస్మానియా మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ విభాగంలో యశ్వంత్ రెడ్డి ఎండీ ఉస్మానియా మెడికల్ ఫలితాలలో ప్రతభ కనబరిచి బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా సౌమ్య తండ్రి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ కూతురు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే తపన ఉండేదని, తమ కుటుంబంలో ఎక్కువగా వైద్య రంగంలో రాణించిన వారే ఉన్నారన్నారు. తన కూతురు బంగారు పతకం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.