కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా సుమతి.. | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా సుమతి..

Published Sat, Dec 23 2023 12:50 AM

- - Sakshi

అన్నమయ్య: కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ) ఉద్యోగానికి ఎంపికై ప్రశంసలందుకుంటున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు. మదనపల్లె మండలం ఇసుకనూతపల్లెకు చెందిన వేణుగోపాల్‌, భాగ్యమ్మ దంపతుల కుమార్తె బరినేపల్లె సుమతి(డబ్ల్యూపీసీ1651) మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌గా నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఎస్‌ఐ ఎంపిక పరీక్ష తుది ఫలితాల్లో ఆమె ఉద్యోగం సాధించారు. తండ్రి వేణుగోపాల్‌ కౌలు రైతు కాగా, తల్లి భాగ్యమ్మ పాడిఆవులు పోషించుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా మొదటి కుమార్తె అమరావతికి వివాహం అయింది. కుమారుడు రవికుమార్‌ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. చివరి సంతానమైన సుమతి ప్రాథమిక విద్యాభ్యాసం ఇసుకనూతిపల్లె ఎంపీయూపీ స్కూల్‌లో నూ, ఉన్నతవిద్య మదనపల్లె జెడ్పీ హైస్కూల్‌లోనూ, ఇంటర్మీడియెట్‌ విశ్వసాధన కా లేజ్‌లో, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో 2017 లో డిగ్రీ పూర్తి చేసింది.

2018లో విడుదలైన పోలీస్‌కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికై అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డీపీఓ కార్యాలయంలోనూ, నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేశారు. 2022 డిసెంబర్‌లో విడుదలైన ఎస్‌ఐ పోస్టుల నోటిఫికేషన్‌ ద్వారా రెండో ప్రయత్నంలో ఎస్‌ఐ ఉద్యోగం సాధించింది. తన లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు అన్నమయ్య జిల్లా అడిషనల్‌ ఎస్పీ డాక్టర్‌ రాజ్‌కమల్‌, పోలీసు ఉన్నతాధికారులు సహాయ సహకారాలతోపాటు ప్రోత్సాహం అందించారని సుమతి తెలిపారు. ఎస్‌ఐ ఉద్యోగం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement