annamayya
-
అన్నమయ్య ‘టీడీపీ’ అతిథి గృహం!
రాజంపేట : అధికార దుర్వినియోగం అంటే ఇదేనేమో..ఏకంగా రాజంపేట పట్ట నడిబొడ్డులో ఉన్న అన్నమయ్య అతిథి గృహం కాస్త తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్నమయ్య అతిథి గృహం రోడ్లు, భవనాల శాఖ నిర్వహిస్తోంది. ఎన్నికలకు ముందు ఐఏఎస్ అధికారులు వస్తారనే ఉద్దేశ్యంతో కలెక్టర్ ప్రత్యేక నిధులు వెచ్చించి అతిథి గృహం తీర్చిదిద్దారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ టీడీపీ నియోజకవర్గనేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈ అతిధి భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఆయన నేరుగా తన వాహనంలో ఆర్అండ్బీ అతిథి గృహం చేరుకోగా, వెనువెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరారు. ఇంకేముంది ఏకంగా.. సమావేశాలు, మంతనాలు కొనసాగించారు. ప్రోటోకాల్ పరంగా కూడా ఆర్అండ్బీ గదిని కేటాయించే వీలులేదు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రితోపాటు ప్రజాప్రతినిధులకు కోరిన మేరకే గదిని కేటాయిస్తారు. అయితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఆర్అండ్బీ అధికారులు సుగవాసికి గదిని ఏ విధంగా అనుమతించారో తెలియడంలేదని స్థానికులు పెదవివిరిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారులు కూడా వచ్చి బొకేలు, సన్మానాలు చేసి పోవడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.కారు ఢీకొని ఒకరు మృతికురబలకోట : మండలంలోని కంటేవారిపల్లె వద్ద బుధవారం రాత్రి మోటార్ సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..వినాయక చవితి విగ్రహాల కొనుగోలుకు తంబళ్లపల్లె మండలం కొటాలకు చెందిన నాని(22) మరొకరితో కలిసి మోటార్ సైకిల్‌పై బుధవారం రాత్రి కంటేవారిపల్లెకు వచ్చారు. విగ్రహాలను చూసిన అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో బి.కొత్తకోట వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో నాని అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు రఘునాయక్ (21) పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కృష్ణా జట్టు ఘనవిజయంకడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్–19 అంతర్ జిల్లాల మల్టీ డేస్ క్రికెట్ టోర్నమెంట్లో కృష్ణా జట్టు విజయం సాధించగా, నెల్లూరు–కడప, చిత్తూరు–పశ్చిమగోదావరి మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 122 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కృష్ణా జట్టు 57.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 179 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జట్టులో నిఖిల్ 62, ధనుష్ 56 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు 36.5 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో థామస్ రామ్ 39, రోహిత్ కుమార్ 33 పరుగులు చేశారు. కృష్ణా బౌలర్ రాజేష్ 7 వికెట్లు తీయగా, సాయిప్రకాష్ 2 వికెట్లు తీశాడు. దీంతో కృష్ణా జట్టు 122 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కృష్ణా జట్టు 219 పరుగులు చేయగా, శ్రీకాకుళం జట్టు 137 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.నెల్లూరు, కడప మ్యాచ్ డ్రా..కేఓఆర్ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 334 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన నెల్లూరు జట్టు 98 ఓవర్లలో 415 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని మన్విత్‌రెడ్డి 193 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కడప బౌలర్లు ధీరజ్ 3, ఆర్ధిత్రెడ్డి 2, నాగకుల్లాయప్ప 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 42 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. జట్టులోని గురుచరణ్ 45, సాయిచేతన్ 54 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్ మోహన్ 2, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. -
కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా సుమతి..
అన్నమయ్య: కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ మహిళా సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) ఉద్యోగానికి ఎంపికై ప్రశంసలందుకుంటున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు. మదనపల్లె మండలం ఇసుకనూతపల్లెకు చెందిన వేణుగోపాల్, భాగ్యమ్మ దంపతుల కుమార్తె బరినేపల్లె సుమతి(డబ్ల్యూపీసీ1651) మహిళా పోలీస్ కానిస్టేబుల్‌గా నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఎంపిక పరీక్ష తుది ఫలితాల్లో ఆమె ఉద్యోగం సాధించారు. తండ్రి వేణుగోపాల్ కౌలు రైతు కాగా, తల్లి భాగ్యమ్మ పాడిఆవులు పోషించుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా మొదటి కుమార్తె అమరావతికి వివాహం అయింది. కుమారుడు రవికుమార్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. చివరి సంతానమైన సుమతి ప్రాథమిక విద్యాభ్యాసం ఇసుకనూతిపల్లె ఎంపీయూపీ స్కూల్లో నూ, ఉన్నతవిద్య మదనపల్లె జెడ్పీ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియెట్ విశ్వసాధన కా లేజ్‌లో, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో 2017 లో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో విడుదలైన పోలీస్కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డీపీఓ కార్యాలయంలోనూ, నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేశారు. 2022 డిసెంబర్లో విడుదలైన ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా రెండో ప్రయత్నంలో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. తన లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ రాజ్‌కమల్, పోలీసు ఉన్నతాధికారులు సహాయ సహకారాలతోపాటు ప్రోత్సాహం అందించారని సుమతి తెలిపారు. ఎస్ఐ ఉద్యోగం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. -
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంత్యుత్సవం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో శనివారం అన్నమయ్య 615వ జయంత్యుత్సవం వైభవంగా జరిగింది. గోవిందనామ సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మారుమోగింది. ఈ సందర్భగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకులు గరిమెళ్ళ అనీల్ కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాసన్, వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన గోష్టిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా చిత్ర కళాకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం ఆశ్చర్యానందాలను కలిగించింది. అనంతరం సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు చిత్రాకారుడు కూచిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సారాలుగా అన్నమయ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరిలో వీణ విద్వాంసులు ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, వారి కుమార్తె పద్మిని పసుమర్తి తమ వీణా నాదాలతో ఆకట్టుకున్నారు. వీరికి కలైమామణి రమేష్ శ్రీనివాసన్ మృదంగ సహకారం అందించారు. తరువాత జయప్రద రామమూర్తి వాయులీన గానంతో అలరించారు. వారికి అనూరాధ శ్రీధర్ వయలిన్, శ్రీరామ్ బ్రహ్మానందం మృదంగ సహకారాన్ని అందించారు. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించారు. చివరిగా గరిమెళ్ళ అనీల కుమార్ గారి గాత్రంతో స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం అందరికీ భోజన ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు వంశీ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం, జయంతి కోట్ని, శాంతి కొండ, ఉష మాడభూషి, మమత కూచిభొట్ల, విజయసారథి మాడభూషి, యేడిది శర్మలకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఎన్నికల పరిశీలకుడికి ఘనస్వాగతం
రాయచోటి: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ కాటమనేనికి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లో ఘనస్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం రాయచోటికి చేరుకున్న ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీషా పీఎస్ పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్ఓ సత్యనారాయణ ఎన్నికల పరిశీలకుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో ఎన్నికల వ్రవర్తన నియమావళి అమలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు భాస్కర్ కాటమనేని జిల్లా అధికారులకు సూచించారు. -
టమాట..ఇక లాభాల బాట
మదనపల్లె : టమాటా పంటను రైతులు లాటరీ పంటగా పిలుస్తుంటారు. ఒక సీజన్లో ధర ఆకాశాన్నంటితే.. మరో సీజన్లో నేల చూపులు చూడటం, పెట్టుబడులు అధికమై గిట్టుబాటు ధర రాలేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేయడం, పంటను పశువులకు మేతగా వదిలేయడం గతంలో జరిగేది. ఇకపై అలాంటి కష్టాలు ఉండవు. మార్కెట్లో ధరలు తగ్గినా..రైతుకు కనీస గిట్టుబాటు ధర లభించేలా, సాధారణ సాగుకంటే అధిక దిగుబడులు వచ్చేలా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ టమాటా రకాలను పండించేలా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అన్నమయ్య జిల్లాలో ప్రయోగాత్మకంగా నిమ్మనపల్లె, మదనపల్లె మండలాల్లో రబీ సీజన్లో రైతులతో సాగుచేయించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కోలార్, సీడ్ కాయగా రైతులు పిలుచుకునే ప్రాసెసింగ్ టమాటా రకాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రత్యేక కథనం.. అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా సాగయ్యే ఉద్యాన పంటల్లో టమాటా ఒకటి. జిల్లాలో సాధారణ పరిస్థితుల్లో రబీ సీజన్‌కు 12,500 ఎకరాలు టమాటా సాగవుతుంటే ప్రస్తుతం 3,950 ఎకరాల్లో సాగుచేశారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 10 వరకు టమాటా విరివిగా సాగుచేస్తారు. సంబేపల్లె, సుండుపల్లె, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలోనూ, గుర్రంకొండ, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అధికంగా సాగు చేస్తారు. బి.కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం మండలాలు జిల్లాలోనే టమాటా అత్యధికంగా సాగుచేసే ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో రైతుకు అండగా నిలిచేందుకు, కనీస గిట్టుబాటు ధర పొందేందుకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్(ఏపీఐఎల్‌ఐపీ) ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రాసెసింగ్‌కు అనువైన టమాటా రకాలపై రైతులకు అవగాహన కల్పించాలని, మదనపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో ప్రయోగాత్మకంగా సాగుచేసేందుకు సంకల్పించింది. ప్రాసెసింగ్ టమాటా రకాలు కర్ణాటకలోని కోలార్, చింతామణి జిల్లాల్లో అక్కడి రైతులు అధికంగా సాగుచేస్తున్నారు. ఈ రకంలో విత్తనాలు తక్కువగా, కండశాతం ఎక్కువగా ఉండటం వల్ల జ్యూస్, సాస్ తయారీకి అనుకూలంగా ఉంటాయి. సాధారణ వాడకానికి ఉపయోగపడుతాయి. దీనిని అక్కడి రైతులు వాడుకభాషలో కోలార్ కాయ, సీడ్కాయ, జ్యూస్కాయగా పిలుస్తుంటారు. సాధారణ టమాటా రకాలతో పోలిస్తే దాదాపు 25శాతం అధిక దిగుబడులు, ఎక్కువ కాలం మన్నిక, మంచి రంగు, సైజు దీని ప్రత్యేకత. ప్రయోగాత్మకంగా సాగు.. మదనపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో ప్రాసెసింగ్ టమాటా ప్రయోగాత్మక సాగుకు ఉద్యానశాఖ అధికారులు 185 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంటే 65 ఎకరాల్లో సాగుచేసేందుకు రైతులు ముందుకొచ్చారు. ఈ రకం సాగుచేసినందుకు రైతుకు పెట్టుబడి రాయితీగా ఒక ఎకరాకు రూ.21,400 సబ్సిడీ ఇస్తారు. కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాసెసింగ్ రకాలైన సింజంటా–6242, అన్సోల్, జివెల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఒక మొక్క విలువ రూ.1.25పైసలు అయితే ప్రభుత్వ సబ్సిడీ రూ.1 పోనూ 0.25 పైసలకు సరఫరా చేస్తున్నారు.మల్చింగ్ పేపర్‌కు రూ.6,400, ఐపీఎం కింద ఎకరాకు రూ.2,000, కాయలు వచ్చాక మార్కెట్‌కు తరలించేందుకు వీలుగా ఒకొక్కటి రూ.120 చొప్పున ఎకరాకు 40 ప్లాస్టిక్ క్రేట్ల వరకు రాయితీపై అందిస్తున్నారు. ఒక ఎకరాకు 8,000 మొక్కలు అవసరమవుతాయి. వీటిలో జివెల్ రకానికి అధికంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ రకాలను కోలార్, చింతామణి మార్కెట్లలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి తరలించేందుకు వీలుగా ప్లాస్టిక్ క్రేట్లను రైతులకు రాయితీపై అందిస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. రైతుకు గిట్టుబాటు ధర .. టమాటాను సాగుచేసిన రైతు నష్టపోకూడదని, మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నా గిట్టుబాటు ధర పొందాలనే ఉద్దేశంతో ప్రాసెసింగ్ రకాలను ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడు ప్రాసెసింగ్ టమాటాను కనీసధర రూ.4–6 కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడి నష్టపోకుండా కొద్దిపాటి లాభాలతోనైనా రైతు ఊరటచెందే వీలుంటుంది. ఫిబ్రవరి 25 నుంచి నిమ్మనపల్లె, మదనపల్లె మండలంలో రైతులకు నారు సరఫరా చేస్తున్నాం. – ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి, ఉద్యానశాఖ అధికారి, మదనపల్లె దిగుబడులు అధికంగా వస్తాయి.. ప్రాసెసింగ్ టమాటా రకాలు సాధారణ పంటతో పోలిస్తే అధిక దిగుబడులు వస్తాయి. గత ఏడాది సీజన్లో వీటిని ప్రత్యేకంగా కోలార్ నుంచి తెప్పించి ఎకరా భూమిలో సాగుచేశాను. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చు వచ్చింది. సుమారు 2,500 బాక్స్‌ల(ఒకొక్కటి 30కిలోలు) కాయ వచ్చింది. కోలార్ మార్కెట్‌కు తీసుకెళితే కిలో రూ.25 నుంచి 45 వరకు ధర పలికింది. పెట్టిన పెట్టుబడికి మూడురెట్లకు పైగా ఆదాయాన్ని పొందగలిగాను. ప్రస్తుతం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రాయితీపై సాగుచేసేందుకు ప్రోత్సాహకాలు అందించడం సంతోషంగా ఉంది. – సుధాకర్‌రెడ్డి, మన్యంవారిపల్లె, నిమ్మనపల్లె మండలం -
పరిహారం.. దరహాసం
జమ్మలమడుగు: ఉక్కు నగరానికి బీజం పడింది. 16 ఏళ్ల నాటి కల సాకారం దిశగా అడుగులు పడ్డాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ గ్రూప్ సారథ్యంలో ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిందాల్ కంపెనీ ఎండీ సజ్జన్ జిందాల్ చేతుల మీదుగా స్టీల్‌ప్లాంట్ పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. భూములు కొల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ జరిగింది. దీంతో భూనిర్వాసితుల మోములో ధరహాసం తొణికిసలాడుతోంది. ఇప్పటికే రెండు ఎకరాల భూములు కొల్పోయిన రైతులకు పరిహారం అందించారు. ఎకరా భూమి కొల్పోయిన రైతుల ఖాతాల్లో సైతం డబ్బులు జమ అయ్యాయి. స్టీల్ ప్లాంట్ కోసం పూర్తిగా భూములు కొల్పోయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. 2019 డిసెంబర్లో శంకుస్థాపన.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన ఆరునెలల్లోనే జమ్మలమడుగు మండలం కన్యతీర్థం వద్ద 2019 డిసెంబర్ 23 వతేదీన శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. వెంటనే 3148 ఎకరాలు, మరో 409 ఎకరాల డీకేటీ భూమిని కేటాయించారు. వైఎస్సార్స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డీకేటీ భూములు కొల్పోయిన 178 మంది రైతుల వద్ద నుంచి 391.44 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరాకు 7.5 లక్షల వంతున 29కోట్ల 35 లక్షల రూ.80వేలు రైతుల ఖాతాల్లో గతేడాది సెప్టెంబర్‌లోనే జమ చేశారు.దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కేబినెట్ సబ్‌కమిటీ ఆమోదంతో మరి కొందరికి... మండలంలోని రైతులకు 7వ అసైన్డ్ కమిటీలో భూములు కేటాయించారు. అయితే వారికి ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. తమకు కూడా పరిహారం ఇప్పించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే మూలె సుధీర్‌రెడ్డిల వద్ద మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో లబ్ధిదారులకు సైతం పరిహారం అందించేందుకు కెబినెట్ సబ్ కమిటీ అమోదం తెలిపింది. పట్టాలు లేకపోవడంతో వారికి 50శాతంతో పరిహారం అందించాలని నిర్ణయించింది. ప్రతి రైతుకు 3.75లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 7వ విడతలో 379 మంది రైతులకు 3.75 లక్షల వంతున రూ. 14కోట్ల,56లక్షల 46వేల పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే 250 మందికిపైగా ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో 3.75 లక్షల వంతున డబ్బులు జమ అయ్యాయి. -
నామినేషన్ వేసి టీడీపీ నాయకులు నవ్వుల పాలయ్యారు
కడప సిటీ : టీడీపీ నాయకులు కొంతమంది స్వతంత్య్ర అభ్యర్థితో నామినేషన్ వేయించి నవ్వుల పాలయ్యారని స్థానిక సంస్థల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం జమ్మలమడుగు వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే తమ పార్టీపై పోటీ చేయాలని, స్వతంత్య్ర అభ్యర్థితో నామినేషన్ దాఖలు చేయించి అమాయక ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడుచుకుపోయిందని తెలిపారు. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా నామినేషన్ వేయించి నవ్వుల పాలయ్యారన్నారు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి దొంగ సంతకాలు పెట్టించారని, ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ విలువలతో కూడిన టీడీపీని స్థాపిస్తే, చంద్రబాబు పార్టీని భ్రష్టు పట్టించారన్నారు. గతంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను టీడీపీలోకి తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని వదిలాక ఆ మాజీమంత్రి నామరూపాల్లేకుండా పోయారని విమర్శించారు. ధైర్యంగా నామినేషన్ వేసే పరిస్థితి టీడీపీకి లేదని, దొంగ సంతకాలతో రూఢీ అయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తన తండ్రి వైఎస్సార్ ఆశయాల సాధన కోసం వ్యతిరేకించి పది సంవత్సరాలపాటు ప్రజల మధ్యనే గడిపారన్నారు. తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు సాధించుకుని రికార్డు సృష్టించారని అన్నారు. అన్ని రంగాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంతకంటే భారీ మెజార్టీ వస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని లోకేష్ ప్యాలెస్ పిల్లి అని పదేపదే మాట్లాడే అర్హత లేదని తెలిపారు. పాదయాత్రకు జనం లేకపోవడంతో డీలా పడి ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని అన్నారు. పులిపులిగా, పిల్లి పిల్లిగానే ఉంటుందని గుర్తించుకోవాలన్నారు. తమకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దాం
రాయచోటి: ఎమ్మెల్యే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని పోలీస్, సెక్టోరల్ అధికారులకు కలెక్టర్ గిరీషా పీఎస్ సూచించారు.శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజుతో కలిసి పోలీస్, సెక్టోరియల్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్, సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించాలన్నారు. ఓటర్లపై అధికంగా ప్రభావం చూపే సమస్యాత్మక ప్రాంతాలను పోలీసుల సహకారంతో గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. ఎన్నికల విధుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు.పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్ఓ సత్యనారాయణ, ఆర్డీఓలు, డీఎస్పీలు, పోలీస్, సెక్టోరియల్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పకడ్బందీగా అమలుపరిచి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఫ్యామిలీ డాక్టర్, అనీమియా తదితర అంశాలపై మెడికల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి ముంగిటే వైద్యసేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలుచేస్తోందని కలెక్టర్ అన్నారు. డాక్టర్లు ఇంటి దగ్గరకు వెళ్లి రోగులకు వైద్యసేవలు అందిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలు అనీమియా బారినపడకుండా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కంటి వెలుగు స్క్రీనింగ్ పక్కాగా జరగాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీషా పీఎస్ -
వైభవం..పార్వేట ఉత్సవం
రాయచోటిటౌన్ : రాయచోటి శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు అశ్వవాహనంపై పారువేటకు వెళ్లారు. శుక్రవారం ఆలయ పాలక మండలి అధ్యక్షులు పోలంరెడ్డి విజయ, ఈవో డీవీ రమణారెడ్డి, మున్సిపల్ వైఎస్ చైర్మన్ పోలంరెడ్డి దశరథరామిరెడ్డిల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంలో కొలువుదీర్చారు. పారువేటలో భాగంగా స్వామి వారు ఆలయ మాడవీధులలో ఊరేగారు. రవిహాల్ వెనుక భాగాన ఉన్న నాలుగు కాళ్ల మండపం వద్ద సంప్రదాయంగా కుందేలు విడిచి స్వామి వారు వేటాడినట్లుగా సంప్రదాయాన్ని పూర్తి చేస్తారు. పార్వేట ఉత్సవానికి స్థానిక భక్తులు, కన్నడ భక్తులు తరలి వచ్చారు. అంతకు ముందు ఆలయంలో వేదపండితులు రాచరాయ యోగీ స్వామి, కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి ఆధ్వర్యంలోమహా సరస్వతీ పూజ నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. -
షోలాపూర్–తిరుపతి రైళ్ల గడువు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్: షోలాపూర్–తిరుపతి–షోలాపూర్ (01437/38) స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించామని చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ ఉమర్‌బాష తెలిపారు. ఈ రైలు ఈనెల 17వ తేదీ వరకు రాకపోకలకు గడువు ముగిసిందని, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గడువును పొడిగించారని తెలిపారు. షోలాపూర్ జంక్షన్లో గురువారం రాత్రి 9.40 గంటలకు బయలుదేరి శుక్రవారం చేరుకుని, అదేరోజు రాత్రి 9.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా షోలాపూర్‌కు చేరుతుందని వివరించారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ ఆర్ఐవో రమణరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది కూడా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నాన్ జంబ్లింగ్ విధానంలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు రెండు దశల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగుతాయన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14,541 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారన్నారు. ఇందులో ఎంపీసీకి సంబంధించి 9648 మంది, బైపీసీకి సంబంధించి 4893 మంది రాయనున్నారన్నారు. ఇందుకోసం ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 101 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగుతాయని చెప్పారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రాక్టికల్స్ మొదటి విడత ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు, రెండో విడత మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు సెలవు దినాల్లో కూడా జరుగుతాయన్నారు. ఆర్ఐవో కార్యాలయంలో కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేశామన్నారు. సమస్యలుంటే 08562 244171 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆర్ఐవో తెలిపారు. -
ఎంత పని చేశావ్.. అమ్మా!
ప్రొద్దుటూరు క్రైం: వారిది చిన్న కుటుంబం.. భార్యా భర్తలు పని చేసుకొని జీవనం సాగించేవారు. ఏడాది వయస్సు గల పాపతో వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సంతోషాలకు నిలయమైన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కుమార్తెను చంకనెత్తుకున్న ఆ తల్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని మోడంపల్లెలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. నాసిర్ మైదుకూరు రోడ్డులోని ఒక సూపర్మార్కెట్లో పని చేస్తున్నాడు. అతనికి రెండేళ్ల క్రితం అనంతపురానికి చెందిన ఆయిషాతో వివాహం అయింది. వారికి 13 నెలల అలీషా అనే కుమార్తె ఉంది. పెళ్లి అయిన నాటి నుంచి భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఈ క్రమంలో గురువారం రాత్రి నసీర్ సూపర్‌మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాడు. భోజనం తిన్న తర్వాత భార్యాభర్తలు పడుకున్నారు. కొంత సేపటి తర్వాత ఆయిషా తన కుమార్తెను ఎత్తుకొని మొదటి అంతస్తునున్న గదిలోకి వెళ్లింది. అక్కడే ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి మంటలు రావడంతో భర్త గట్టిగా కేకలు వేశాడు. స్థానికుల సహకారంతో భార్యా, కుమార్తెలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యుడు వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. అయితే కొద్ది సేపటి తర్వాత ఆలీషా (13 నెలలు) మృతి చెందింది. ఆయిషా శరీరం కూడా పూర్తిగా కాలిపోయింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటన జరిగిన వెంటనే భర్త నాసిర్‌ను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై అతన్ని ప్రశ్నించారు. తన భార్య ఎందుకు ఇలా చేసిందో తెలియదని చెబుతున్నాడు. తమకు ఎలాంటి సమస్యలు లేవని, గొడవలు కూడా తమ మధ్య ఉండేవి కావని అతను పోలీసులకు తెలిపాడు. కాగా పోలీసులు నాసిర్ నివాసం ఉంటున్న మోడంపల్లెకు వెళ్లి విచారించారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని చెప్పారు. నాసిర్‌ను చాలా ఏళ్ల చూస్తున్నామని, మంచివ్యక్తి అని వారు పోలీసులతో అన్నారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయిషా తన భర్త దేవుడు లాంటి వాడని పోలీసులకు తెలిపింది. తనను ఏమీ అనొద్దని, అతను మంచివాడని చెప్పింది. అనంతపురంలో ఉన్న ఆయిషా తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన ఎందుకు జరిగిందో అర్థం కాక పోలీసులు సతమతమవుతున్నారు. టూ టౌన్ సీఐ ఇబ్రహీం శుక్రవారం ఉదయం రిమ్స్‌కు వెళ్లి పరిశీలించారు. -
మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు..!
మదనపల్లె : మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలతో శుక్రవారం ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన వెంకటేష్ భార్య లోకేశ్వరి మూడు నెలల కిందట జిల్లా ఆస్పత్రిలో మొదటి కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఐదు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కసారిగా ఊపిరాడకపోగా పరిస్థితి విషమంగా మారడంతో ఇంజెక్షన్ చేశారు. అయినా ఎలాంటి మార్పు రాకపోగా, మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇక్కడి వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలతో బాధి తులు ఘర్షణకు దిగారు. చికిత్సలో తమ తప్పు లేదని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో.. చేసేదిలేక విషణ్ణవదనంతో బిడ్డను తీసుకుని ఇంటికెళ్లిపోయారు. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
రైల్వేకోడూరు : నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఫ్ఆర్వో రఘునాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. గాదెల సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని చూసి కొందరు ఎర్రచందనం దుంగలను వదిలేసి, పరారయ్యారు. అక్కడున్న 6 ఎర్రచందనం దుంగలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్ఆర్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్వో మహేష్‌కుమార్, ఎఫ్‌బీవో దేవేంద్రరెడ్డి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్పత్రి వద్ద బాధితుల ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కుమారుడిని చూడకనే కన్నుమూసింది. మహిళా పోలీసు స్వర్ణకుమారి (33) ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించి కొద్ది సేపటి తర్వాత మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులు, ఆస్పత్రి వర్గాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన బాబు చేనేత పని చేసుకొని జీవనం సాగించేవాడు. ఆయన భార్య స్వర్ణకుమారికి 2019లో కొండాపురం మండలంలోని చౌటపల్లె సచివాలయంలో మహిళా పోలీసుగా ఉద్యోగం వచ్చింది. దీంతో వారు కొండాపురం మండలానికి కాపురం మార్చారు. వారికి మొదటి కాన్పులో మగబిడ్డ జన్మించాడు. రెండో కాన్పు కోసం గురువారం ప్రొద్దుటూరులోని కాత్యా నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. డాక్టర్ సిజేరియన్ చేశాడు. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆమెకు అధిక రక్తస్రావం జరిగింది. ముగ్గురు వైద్యులు కలిసి చికిత్స చేయడంతో రక్తస్రావం ఆగింది. కొద్ది సేపటి తర్వాత రెండో సారి బ్లీడింగ్(రక్తస్రావం) కావడంతో ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. రెండు ఆపరేషన్ల కోసం సుమారు ఏడు యూనిట్ల రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. మూడో సారి రక్తస్రావమైతే ప్రమాదకరమని భావించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లాలని సూచించారు. గురువారం రాత్రి బెంగళూరుకు వెళ్తున్న సమయంలో పులివెందుల సమీపంలోకి వెళ్లగానే మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌లో ఉంటున్న తమ బంధువుల ఇంటికి తీసుకొచ్చారు. స్వర్ణకుమారి బంధువులు శుక్రవారం ఉదయం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆరోపించారు. విషయం తెలియడంతో వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మా నిర్లక్ష్యం లేదు స్వర్ణకుమారి ఏడవ నెల వరకు వేరే ఆస్పత్రిలో చూపించుకున్నట్లు డాక్టర్ కాత్యా తెలిపారు. ఎనిమిదవ నెలలో తమ ఆస్పత్రికి వచ్చిన ఆమెను పరీక్షించగా మాయ కిందికి ఉండటంతో రిస్క్ ఎ క్కువగా ఉంటుందని ముందే తెలిపామన్నారు. సిజేరియన్ చేసిన తర్వాత అధిక రక్తస్రావం కా వడంతో, రెండో సారి ముగ్గురు వైద్యులు ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించామన్నారు. మూ డోసారి బ్లీడింగ్ అయితే ప్రమాదకరమని భావించి ముందు జాగ్రత్తగా బెంగళూరుకు వెళ్లాలని సూచించామని తెలిపారు. అక్కడికి వెళ్తున్న సమ యంలో మార్గంమధ్యలో గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకునే ఆపరేషన్ చేశామని వివరించారు. -
మామిడి తోట దగ్ధం
సంబేపల్లె : మండలంలోని గురిగింజకుంట పంచాయతీ దిన్నెపల్లెకు చెందిన నారాయణరెడ్డి అనే రైతు మామిడి తోట దగ్ధమైంది. నారాయణరెడ్డి సర్వే నంబర్ 448–2లో 5 ఎకరాల్లో మామిడి తోట సాగు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి తోటకు నిప్పంటించారు. ఎకరాన్నరలోని 85 మామిడి చెట్లు, 20 టేకు చెట్లు, డ్రిప్ వైరు 30 కట్టలు కాలిపోయాయి. బాధితుడు శుక్రవారం సంబేపల్లె పోలీసులు, రెవెన్యూ సి బ్బందికి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నష్టం అంచనా వేస్తున్నట్లు వారు తెలిపారు. కొండకు ఆకతాయిలు నిప్పు సిద్దవటం : సిద్దవటం రేంజ్‌లోని మద్దూరు, సిద్దవటం బీట్ల పరిసర ప్రాంతాల్లో కొండకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. చెట్లు, వన్య ప్రాణులు చనిపోకుండా కాపాడే యత్నం చేశారు. శుక్రవారం రాత్రి వరకు మంటలు కొనసాగాయి. శనివారం కూడా వెళ్తామని రేంజర్ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ కె.ఓబులేస్, బీటు, అసిస్టెంటు బీటు అధికారులు, ప్రొటెక్షన్ వాచర్లు, బేస్‌క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. కంచెకు నిప్పు.. ఓబులవారిపల్లె : మండల పరిధి గాడివారిపల్లె సమీపంలోని తోట కంచెకు నిప్పు అంటుకోవడంతో 7 ఎకరాల్లో అరటి, మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. గురువారం సాయంత్రం కంచెకు ఎవరో నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి తోటలకు వ్యాపించాయి. గ్రామంలోని వీసీ వెంకటసుబ్బారెడ్డికి చెందిన 3.5 ఎకరాలు, వీసీ రామసుబ్బారెడ్డికి చెందిన 3.5 ఎకరాలు, ముక్కా యల్లారెడ్డి నాగమణెమ్మకు చెందిన 1.54 ఎకరాల్లో తోటలు కాలిపోయాయి. దాదాపు వెయ్యి అరటి, యాబై మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె : వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దమండ్యం మండలం బండమీదపల్లెకు చెందిన మల్లికార్జున(38), రమణమ్మ(33) దంపతులు శుక్రవారం సొంత పనులపై ద్విచక్ర వాహనంలో పెద్దమండ్యంకు వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా దారిలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పీటీఎం మండలం కాట్నగల్లుకు చెందిన చెన్నకేశవులు(50) ప్యాసింజర్ ఆటోలో మదనపల్లెకు వస్తూ, దారిలో పట్టుతప్పి కిందపడ్డాడు. ఆయన తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాల వాహనం పెద్దమండ్యం: ద్విచక్ర వాహనాన్ని పాల వాహనం ఢీకొనడంతో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దమండ్యం మండలంలో జరిగింది. పాపేపల్లి పంచాయతీ వెలిగింటివారిపల్లెకు చెందిన ఓ.అక్కులప్ప(52), ఎం.వెంకటయ్య(60), ఆర్.వెంకటరమణ(50) భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పనుల అనంతరం ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంలో పాపేపల్లెకు బయలుదేరారు. మార్గంమధ్యలో పెద్దమండ్యం పోలీస్‌స్టేషన్ వద్ద ఎదురుగా వచ్చిన జెర్సీ ప్రైవేట్ డెయిరీ పాల వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో అక్కులప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. -
దేవదాయ భూముల లెక్క పక్కాగా ఉండాలి
కడప కల్చరల్ : జిల్లాలోని దేవదాయ భూముల విషయంలో సర్వే లెక్కలు పక్కాగా ఉండాలని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సి.శంకర్‌బాలాజీ అన్నారు. శుక్రవారం కడపలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన తనిఖీ అధికారులు, మండల కార్యనిర్వహణాధికారులు, కో ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 36 మండలాల్లో దేవదాయశాఖ భూములు సుమారు 14,596.53 ఎకరాలు ఉన్నాయన్నారు. భూ సర్వేలో భాగంగా మండల కార్యనిర్వాహణ అధికారులు, మండల కో ఆర్డినేటర్లు దేవాలయాలకు సంబంధించిన అన్ని భూముల వివరాలు సంబంధిత మండల తహసీల్దార్‌కు ఫారం–ఏ ద్వారా అందజేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దేవదాయశాఖకు సంబంధించిన భూముల విషయంలో అన్ని మండలాల తహసీల్దార్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యనిర్వాహణ అధికారులు సంబంధిత మండల తహసీల్దార్లకు ఫారం–ఏ రూపంలో జిల్లాలోని దేవదాయశాఖకు చెందిన అన్ని భూములు, తగిన రికార్డులు అందజేయాలన్నారు. -
వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!
అదిగో అల్లదిగో.. అంటూ శ్రీవారిని స్మరిస్తూ.. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితాపితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట అది. ఇది వెయ్యేళ్ల కిందటి మాట. ఆహ్లాదరకమైన దట్టమైన అటవీమార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ రోజుల్లో పూర్వీకులు వేలసంఖ్యలో వెళ్లేవారు. అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచివెళ్లారు. టీటీడీ అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి నడుం బిగించి భక్తులను ఆనందపరవశులను చేస్తోంది. రాజంపేట: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా శ్రీవారిభక్తులు భావిస్తున్నారు. ఆ కాలిబాటలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి.. గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. అప్పట్లో వైఎస్సార్ స్పందించి టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి అమోదం తెలిపింది. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో టీటీడీ నిమగ్నమైంది. 18న ఆకేపాటి అన్నమయ్య కాలిబాటలో.. ఈనెల 18న శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి 20వసారి వేలాదిమందితో అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను చేపట్టి ఏడుకొండలకు చేరుకోనున్నారు. ఈయనతో పాటు అనేకమంది గోవిందమాలలు ధరించి అన్నమయ్య కాలిబాటలో వెళ్లనున్నారు. ఉదయం ఆకేపాటి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కాలిబాట స్వరూపం.. ► మామండూరు–బాలపల్లె మధ్య స్వామిపాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది. ► అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. ► సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. ► పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలిబాటకు వెయ్యేళ్లు... రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన కాలిబాట నేడు శిథిలమైంది. వెయ్యేళ్ల క్రితం ఉన్న రహదారి అభివృద్ధికి టీటీడీ దృష్టి సారించింది. ఈ బాట ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచి భక్తులు గోవిందనామస్మరణాలు చేసుకుంటూ శ్రీవారిసన్నిధికి చేరుకుంటూనే ఉన్నారు. ఉత్తర, దక్షిణ భారతీయులకు అనుకూలం... పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధికసంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. అయితే తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు. స్వామి సన్నిధికి చేరుకునే పుణ్యపవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరుగుతోంది. కాలిబాటలో శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం.. పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఇప్పటికే అనేకమంది భక్తులు గోవిందమాల ధరించి ఆ మార్గంలో కొండకు చేరుకుంటున్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ ముందుకు రావడం శుభపరిణామం. జడ్పీచైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కాలిబాటలో వేలాదిమంది భక్తులతో కొండకు 20వ సారి వెళుతున్నారు. – చొప్పా ఎల్లారెడ్డి, వైస్‌చైర్మన్, ఎఐటీఎస్, రాజంపేట అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి ఆకేపాటి కృషి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఎంతగానో కృషిచేసారు. దివంగత సీఎం, ప్రస్తుతం సీఎం, టీటీడీ చైర్మన్ దృష్టికి కాలిబాట అంశం అనేకసార్లు తీసుకెళ్లారు. ఫలితంగా ఇప్పుడు అన్నమయ్య కాలిబాట అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేసింది. అన్నమయ్య కాలిబాటలో వెళ్లే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ కూడా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉంటారు. – పిల్లిపిచ్చయ్య, అధ్యక్షుడు, రాజంపేట తాలుకా పెన్షనర్ల సంఘం -
సింగర్ శ్రావణి భార్గవి ఆడియో లీక్
-
అన్నమయ్య శతగళార్చన
సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో ఐదవ అన్నమయ్య శతగళార్చన మొదటి రోజు కార్యక్రమం సింగపూర్‌లో సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియం నుంచి యూట్యూబ్ లైవ్ ద్వారా ఘనంగా నిర్వహించారు. మూడుగంటలపాటు నిర్వహించబడిన ఈ ప్రత్యక్ష ప్రసారానికి యూట్యూబ్ ద్వారా 2000కి పైగా వీక్షణలు వచ్చాయని నిర్వాహకులు తెలియజేశారు. 2022 మే 22 అన్నమయ్య జయంతిన మొదలైన ఈ సాంస్కృతిక కార్యక్రమము, సప్తగిరి సంకీర్తనలు మరియు పిల్లలు పాడిన అన్నమయ్య కీర్తనలతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలనుండి ఎందరో పిల్లలు పెద్దలు 108కి పైగా పంపిన కీర్తనలను ఈ కార్యక్రమం ద్వారా వారం రోజులపాటు యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో ఉంటున్న గాయకులు సప్తగిరి సంకీర్తనలను ఆలాపించారు. చిన్నారి ప్రవాసభారతీయులు డెబ్బై మంది పదిహేడు పాటలను అందించారు. కాపవరపు విద్యాధరి, శేషుకుమారి యడవల్లి , షర్మిల, శ్రీదేవి నాగేళ్ల తదితర సంగీత గురువులు పిల్లలకు తర్ఫీదునిచ్చారు. ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, అనంత్ బొమ్మకంటి, సురేష్ కుమార్ ఆకునూరి వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. చదవండి: సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు -
ఆహారం మిగిలిందా... మాకివ్వండి
సాక్షి,మదనపల్లె సిటీ: శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి.. మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నారు మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. పేదల ఆకలిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. ’ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. ఈ కేంద్రాన్ని గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వాలో అమరులైన జవానుల జ్ఞాపకార్థం హెల్పింగ్‌మైండ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వాతాతలు, దివ్యాంగులు, అనాథల కడుపులు నింపుతున్నాయి. సంస్థ సభ్యులు ప్రతి రోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తారు. ప్రధానంగా ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి ఇందులో ఆహారపొట్లాలను పెడుతున్నారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్‌ల్లో భద్రపరచడం, పేదలకు అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ సహకారం అందిస్తున్నారు పేదలకు గుప్పెడు అన్నం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అందరూ సహకరిస్తున్నారు.మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రానికి అందజేయాలి. –అబూబకర్‌సిద్దిక్, హెల్పింగ్‌మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె -
పుట్టినరోజు వేడుక ఆనందం..కాసేపటికే అంతులేని విషాదం
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆనందం క్షణాల్లో ఆవిరైంది. కన్నబిడ్డలతో కలిసి బయలుదేరిన తల్లి, ఇద్దరు బిడ్డలు, సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలిగొన్న సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాక్షి, మదనపల్లె టౌన్: తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం తానామిట్ట వద్ద బైకును లారీ ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. తంబళ్లపల్లె మండలం ఎద్దురరిపళ్లెకి చెందిన ఆటో డ్రైవర్ షంషీర్ భార్య హాజిరా(25), కుమార్తె జోయా(10), కొడుకు జునేద్(07)లతో కలిసి మదనపల్లె పట్టణం కరవంకలో ఉన్న అక్క రీమా కూతురు పుట్టిన రోజు వేడుకలకు సో మవారం వచ్చింది. సాయంత్రం వరకు పుట్టిన రోజు వేడుకల్లో ఆనందంగా గడిపారు. హాజిరా తమ్ముడు ఖా దర్బాషా(19), తన బైకులో అక్క, పిల్లలను తీసుకుని ఎద్దులవారిపల్లెకు వెళ్తుండగా మార్గమధ్యంలో కురబలకోట మండలం ముదివేడు అంగళ్లు తానామిట్ట వద్ద ఎ దురుగా వచ్చిన లారీ బైకును ఢీకొని దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఖాదర్‌బాషా, జోయా, జునేద్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన హాజిరాను 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జి ల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతుల కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వారి రోదన ప్రతి చూపరులను కలచి వేసింది. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఎద్దులవారిపల్లెలో విషాద ఛాయలు ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో ఏ పూటకు ఆపూట ఆనందంగా జీవనం సాగిస్తున్న షంషీర్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీఐ అశోక్‌కుమార్, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే -
సచివాలయ సేవలు దేశానికే ఆదర్శం
సాక్షి,ఒంటిమిట్ట: రాష్ట్రంలో సచివాలయాల సేవలు దేశానికే ఆదర్శమని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని భారత ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, ఆకాంక్ష జిల్లాల కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన...ఆదివారం జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్ వర్మతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సచివాలయ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను కలెక్టర్, జేసీలు ఆయనకు వివరించారు. గ్రామ సచివాలయ భవనంలో ప్రదర్శించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2021–2022 సంక్షేమ క్యాలెండర్లను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయ బోర్డు సలహా మండలి సభ్యులు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జెడ్పీసీఈవో సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, కడప తహసీల్దార్ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక మున్సిపల్, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నమయ్య సంకీర్తనలో పులకించిన సప్తగిరులు
-
అన్నమయ్య జిల్లాపై పచ్చ పాలిట్రిక్స్
టీడీపీ నాయకులు ఆ పార్టీ అధినేత కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. ఆయన రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రసిద్ధి చెందితే వీరు ప్రాంతానికో పాత్ర వేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. అక్కడో మాట.. ఇక్కడో మాట.. పూటకో మాట.. మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటుపై పాలి‘ట్రిక్స్’ చేస్తున్నారు. వీరి వ్యవహారం ఇపుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మదనపల్లె కేంద్రంగా జిల్లా కావాలని, రాజంపేట కేంద్రంగా ఉండాలని, రాయచోటి ఎంపిక సరైనదంటూ ఆయా ప్రాంతాల్లో పాలిట్రిక్స్ చేస్తున్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాజంపేట: అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన సౌలభ్యత.. భౌగోళిక పరిస్ధితులు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే అజెండాగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించింది. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా శాస్త్రీయ అధ్యయనాలతో పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో రాజంపేట లోక్‌సభ పరిధిలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లతో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల పేరిట జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో విషం కక్కుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రజలను రెచ్చగొట్టేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరు..ఎలా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనపై రాజంపేట పార్లమెంటరీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి తదితర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట టీడీపీ ఇన్చార్జి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అండ్ కో ఉద్యమం ముసుగేసుకొని రాజకీయచలి కాచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అలాగే మదనపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి కూడా జిల్లాల పునర్విభజనపై టీడీపీ ట్రిపుల్ యాక్షన్ ఎపిసోడ్లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఒక నిర్ణయమంటూ లేకుండా, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వీరు వ్యవహరించడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఒక్కో చోట.. ఒక్కో మాట.. రాజకీయ పార్టీలు కీలక విషయాలకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకుంటారు. ఆ పార్టీ నిర్ణయం మేరకు శ్రేణులు కట్టుబడతాయి. కానీ చంద్రబాబు సంగతి అలా కాదు. ఆయన ఒకే విషయంపై పలు రకాలుగా స్టాండ్ తీసుకుంటారు. రాజకీయలబ్ధి కోసం ఎలాంటి ప్రకటనలకైనా తెగబడిపోతారు. బాబుస్ఫూర్తితో ఆయనను మించి టీడీపీ నేతలు ప్రాంతానికి తగ్గట్టు స్వరాలను మారుస్తున్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మదనపల్లెలో జిల్లా కేంద్రం ఉండాలని అక్కడి తెలుగుదేశం నేతలు, రాజంపేటను కేంద్రంగా చేయాలని ఇక్కడి టీడీపీ శ్రేణులు నానా యాగీచేస్తున్నారు. రాయచోటిలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేయడమే కాకుండా సంబరాలు జరుపుకుంటున్నారు. వీరి తీరును పలువురు విమర్శిస్తున్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వ్యవవహరిస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీ వైఖరి స్పష్టంచేయాలి అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి. ఆ నేతల తీరు అనుమానంగా ఉంది. ఒక పక్క రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నారు. మరోపక్క మదనపల్లెలోనూ అదే పాట పాడుతున్నారు. ఇంకోపక్క రాయచోటిలో ఆపార్టీ వారే కృతజ్ఞతలను తెలుపుతున్నారు. రాజకీయపార్టీలు స్పష్టమైన వైఖరి లేకుండా మాట్లాడటం సరైన విధానం కాదు. –మేడా విజయశేఖర్‌రెడ్డి, జేఏసీ నాయకుడు, రాజంపేట ఒకే నిర్ణయానికి కట్టుబడాలి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కాకుండా అన్నమయ్య జిల్లాపై టీడీపీ స్పష్టమైన వైఖరి తెలపాలి. రాజకీయపార్టీల నాయకులు ఒకే నిర్ణయానికి కట్టుబడాలి. మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న టీడీపీ తీరును ప్రజలు గుర్తించాలి. –దాసరి చిదానందగౌడ్, రాష్ట్రబీసీ సంక్షేమసంఘం నేత, రాజంపేట