అన్నమయ్య శతగళార్చన | Annamayya Shathagalarchana in Singapore | Sakshi
Sakshi News home page

అన్నమయ్య శతగళార్చన

Published Tue, May 24 2022 3:49 PM | Last Updated on Tue, May 24 2022 4:20 PM

Annamayya Shathagalarchana in Singapore - Sakshi

సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి  వారి ఆధ్వర్యములో ఐదవ అన్నమయ్య శతగళార్చన మొదటి రోజు కార్యక్రమం సింగపూర్‌లో సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియం నుంచి  యూట్యూబ్ లైవ్  ద్వారా ఘనంగా నిర్వహించారు.  మూడుగంటలపాటు నిర్వహించబడిన ఈ ప్రత్యక్ష ప్రసారానికి  యూట్యూబ్ ద్వారా  2000కి పైగా వీక్షణలు వచ్చాయని నిర్వాహకులు తెలియజేశారు.  2022  మే 22 అన్నమయ్య జయంతిన మొదలైన ఈ సాంస్కృతిక కార్యక్రమము, సప్తగిరి సంకీర్తనలు మరియు పిల్లలు పాడిన అన్నమయ్య కీర్తనలతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించింది.  ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలనుండి ఎందరో పిల్లలు పెద్దలు 108కి పైగా పంపిన కీర్తనలను ఈ కార్యక్రమం ద్వారా  వారం రోజులపాటు యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సింగపూర్ లో ఉంటున్న గాయకులు సప్తగిరి సంకీర్తనలను ఆలాపించారు. చిన్నారి ప్రవాసభారతీయులు డెబ్బై మంది పదిహేడు పాటలను అందించారు.  కాపవరపు విద్యాధరి, శేషుకుమారి యడవల్లి , షర్మిల, శ్రీదేవి నాగేళ్ల తదితర సంగీత గురువులు పిల్లలకు తర్ఫీదునిచ్చారు. ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, అనంత్ బొమ్మకంటి, సురేష్ కుమార్ ఆకునూరి వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు.

చదవండి: సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement