ప్రధాన వార్తలు

రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్ జగన్
సాక్షి,చిత్తూరు: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారుమామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చాను. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారు.ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదువరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా?. ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు.కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం?చంద్రబాబు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న.. ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు.నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు?కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు.ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు. 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు.నాడు కిలో రూ.29. మరి నేడు?మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.ప్రభుత్వమే కొనుగోలు చేయాలిఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక.అసలు మీరు మనుషులేనా?ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్ ముందు ఉంటున్నాడు.వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి’అని ముగించారుమార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్‌బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు చేరుకున్న వైఎస్ జగన్‌మామిడి రైతుల సమస్యలను తెలుసుకోనున్న వైఎస్ జగన్‌జనసందోహంగా మారిన మార్కెట్ యార్డ్. పోలీసుల వలయం దాటుకుని మార్కెట్ యార్డుకు రైతులు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చారు. మామిడి రైతుల ఆవేదనమామిడి మార్కెట్ యార్డ్‌కు రాకుండా 25 చెక్‌పోస్టులు పెట్టారు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.అడ్డదారుల్లోపరుగులు పెట్టుకుంటూ యార్డుకు వచ్చాం.కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యింది. వైఎస్ జగన్ పర్యటనపై కూటమి కుట్రలు.. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై ప్రభుత్వం కుట్రలు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం.వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్.పోలీసుల లాఠీచార్జ్‌లో కార్యకర్తకు గాయాలు.గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్‌ను అడ్డుకున్న ఎస్పీ.కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత.రైతులు కూడా బంగారుపాళ్యం రాకుండా బారికేడ్లు.రైతుల సమస్యలు జగన్‌కు చెప్పుకోకుండా చేయాలని కుట్ర. చిత్తూరు జిల్లా పోలీసుల ఓవరాక్షన్అడుగడుగునా పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలుహెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా పోలీసులు, చెక్ పోస్టులుచివరికి వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్న పోలీసులుఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఆపేసిన పోలీసులుYSRCP నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేతహైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయంచిత్తూరు-బెంగుళూరు వైవే మీద ప్రయాణీకులకు ఇబ్బందులుపోలీసులు లాఠీచార్జ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్త తలకు గాయం.వెంటనే ఆసుప్రతికి తరలించిన వైఎస్సార్సీపీ శ్రేణులు. వైఎస్ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం: రైతులుజగన్ మా దగ్గరికి వస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.వైఎస్ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం.జగన్ పాలనలో మాకు గిట్టుబాటు ధర వచ్చింది. యార్డుకు వచ్చిన రైతులు..వైఎస్ జగన్ కోసం భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలుపోలీసులు చెక్‌పోస్టులు పెట్టినప్పటికీ రైతులు యార్డ్‌కు చేరుకున్నారు. వైఎస్ జగన్ కోసమే యార్డ్‌కు వచ్చినట్టు పలువురు కార్యకర్తలు, ప్రజలు తెలిపారు వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు ఆటంకాలు.సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్‌పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు తరలివచ్చిన రైతులు. బంగారుపాళ్యం చేరుకున్న వైఎస్ జగన్ కాసేపట్లో మార్కెట్ యార్డ్‌కు వైఎస్ జగన్‌కూటమి సర్కార్ కుట్రలు, పోలీసులను చేధించిన రైతులుమామిడి మార్కెట్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, ప్రజలువైఎస్ జగన్ కోసం తరలిన అభిమానులు..వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలుఅడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులువైఎస్ జగన్ పర్యటనకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి, చార్జ్‌షీట్ ఓపెన్ చేస్తామంటూ పోలీసుల బెదిరింపులుఅయినా తగ్గిన అభిమానులునడుచుకుంటూ వైఎస్ జగన్‌ని చూడటానికి వెళ్తున్న ప్రజలుబంగారుపాళ్యం వచ్చే రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటువైఎస్సార్‌సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదం.కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్. బంగారుపాళ్యం బయలుదేరిన వైఎస్ జగన్‌కాసేపట్లో మామిడి మార్కెట్ యార్డ్‌కు వైఎస్ జగన్‌గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న రైతులు మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్ చెక్‌పోస్టుల ఏర్పాటు.. తిరుపతి, కర్ణాటక ప్రధాన రహదారి నాలుగు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ఏర్పాటుకర్వేటినగరం, చిత్తూరు మార్గమధ్యంలో రెండు చోట్ల చెక్‌పోస్టులుకొత్తపల్లి మిట్ట, గంగాధర నెల్లూరులో రెండు చెక్ పోస్టులు ఏర్పాటువాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.వైఎస్ జగన్ పర్యటన వచ్చే వాహనాలను సీజ్ చేస్తామంటున్న పోలీసులుఉదయం నుండి వాహనాలలో వస్తున్న అభిమానులు, పార్టీ నాయకులుప్రధాన నాయకులను అనుమతించి, ఇతర నాయకులను దింపేస్తున్న పోలీసులుభారీగా పోలీసుల మోహరింపువైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వ కుట్రలుబంగారుపాళ్యం మామిడి యార్డును ఖాళీ చేయించిన అధికారులురైతులను రానివ్వకుండా యార్డుకు తాళాలురైతులను జగన్ పర్యటనలో పాల్గొననీయకుండా అడుగడుగునా ఆటంకాలుసమీప గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపుఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులుప్రభుత్వ చర్యలపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహంపోలీసుల ఓవరాక్షన్‌బంగారుపాళ్యం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్‌వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులువాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులుకూటమి ప్రభుత్వం, పోలీసుల వ్యవస్థతో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని రైతుల ఆగ్రహంటోల్ గేట్ వద్దకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామినారాయణ స్వామి కామెంట్స్..జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుందివైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం.అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారుచిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రహదారుల్లో అడుగడుగునా ఆంక్షలుపోలీసులు ఆంక్షలు..బంగారుపాళ్యంలో ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులుబంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డుబైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలుబంగారుపాళ్యం మండలం మిట్టపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాతనే అనుమతి చిత్తూరు..వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం జరుగుతోంది.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు.వైఎస్ జగన్ పర్యటన ఇలా... వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.

కేసీఆర్ ఒప్పుకుంటే ఫామ్‌హౌజ్‌లోనే మాక్ అసెంబ్లీ: సీఎం రేవంత్
నేనెవరికీ చాలెంజ్‌లు విసరలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని మాత్రమే పిలిచాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే.. కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయితీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి అంటూ సీఎం రేవంత్ సెటైర్లు సంధించారు. హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్న సవాళ్ల పర్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రాజెక్టులపై చర్చించేందుకు కేసీఆర్‌ను సభను రమ్మనే తాను సూచించానని, తానెవరికీ సవాళ్లు విసరలేదని అన్నారాయన. బుధవారం ప్రగతి భవన్లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర ఏండ్ల పాటు కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ శాఖను చూశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరక్కపోతే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌కు నేనేం సవాల్ విసరలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చట్ట సభల్లో చర్చ జరుపుదాం.. రండి అని అన్నాను అంతే. 👉కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు సభ పెడతాను. ప్రాజెక్టుల పై అసెంబ్లీలో చర్చ జరుపుదాం. ప్రత్యేకమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాజెక్టుల పై అవగాహన ఉన్న నిపుణులను సైతం చర్చకు పిలుద్దాం. అసెంబ్లీ స్పీకర్‌కు కేసీఆర్ లేఖ రాస్తే చర్చకు మేము సిద్ధం. మీరు పదేళ్లలో చేసింది.. ఏడాదిన్నర కాలంలో మేము చేసింది ఏంటో చర్చ పెడదాం. సభలో ఎవరి గౌరవానికి భంగం కలుగకుండా బాధ్యత నేను తీసుకుంటా. సభ ప్రశాంతంగా జరిపేలా నేను చూసుకుంటా. కేసీఆర్ సూచనలు సలహాలు చేస్తే స్వీకరిస్తాం. 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.👉కేసీఆర్ మా సవాళ్లను స్వీకరించాలి. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మా మంత్రుల బృందాన్ని పంపుతాం. కేసీఆర్ ఒప్పుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ పెడతాం. కేసీఆర్ పిలిస్తే నేను సైతం ఫామ్ హౌస్‌కు వస్తాను. డేట్, ప్లేస్ మీరు చెప్పినా సరే.. మేమైనా చెప్తాం. కానీ, క్లబ్ లు, పబ్‌లు అంటే మాకు కష్టం. గతంలో ఎన్నో చాలెంజ్‌లు చేశాం. కానీ, క్లబ్బులు, పబ్బుల కల్చర్‌కు నేను దూరం. నన్ను పిలవొద్దు. 👉ప్రజా భవన్ లో మీటింగ్ పెట్టినా BRS ఒప్పుకోవడం లేదు. ప్రజా భవన్ లో ఎలా పెడతారు? అని హరీష్ రావు అంటున్నారు. ప్రజా భవన్ ప్రజల కోసమే ఉంది..అందుకే ఇక్కడ పెట్టుకున్నాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయతీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి. 👉స్టేక్ ఓల్డర్లతో త్వరలో PPT పెడతాం. ఏపీ సీఎంకు సూచనలు చేస్తున్న. వరద జలాల్లో లెక్కలు తేల్చుకుందాం. వరద జలాల లెక్కలు తేల్చిన తరువాత పైన మేము కట్టుకుంటాం..కింద మీరు కట్టుకోండి. మా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా మిగులు జలాలు అంటే ఎలా?. నికర, మిగులు జలాల పై కేంద్రం వద్ద చర్చ జరుపుకుందాం. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే చూస్తూ ఊరుకోం. మీరు ఎవరు మాకు సలహాలు ఇవ్వడానికి. కృష్ణా, గోదావరి జలాల కోసం కోట్లాడుతాం. కృష్ణా, గోదావరి జలాల పై తెలంగాణను తాకట్టు పెట్టం. తెలంగాణ హక్కుల కోసం దేవుడినైనా ఎదురిస్తాం.👉కొంతమంది పేరును ప్రస్తావించినా నా స్థాయిని తగ్గించుకున్నట్లు అవుతుంది. బేసిన్లు భేషజాలు లేవని.. రాయలసీమకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు లేదు. జూరాల నుంచి నీళ్లు తేవాలని చిన్నారెడ్డి అసెంబ్లీలో అంటే.. కేసీఆర్ ఆయన్ను అవమానించారు. రెండు టీఎంసీ లు ఉన్న పాలమూరు రంగారెడ్డిని ఒక టీఎంసీ కేసీఆర్ తగ్గించారు. కృష్ణాజలాల పై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. 👉ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సీమాంధ్ర నేతలు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ వెయ్యి రెట్లు ద్రోహం చేశారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లను ఏపీ తీసుకుపోతోంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఆయకట్టను కేసీఆర్ ఎందుకు తొలగించారు?. రంగారెడ్డి జిల్లాలో రెండున్నర లక్షలు, నల్గొండ తో కలిపి ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కేసీఆర్ తొలగించారు. కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. గోదావరి జలాలను రంగారెడ్డి, నల్గొండ కు ఎందుకు తేలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. అనాడు రాజశేఖర్ రెడ్డి నీళ్లు తెస్తానని టెండర్లు పిలిస్తే.. కేసీఆర్ ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశారా ? అలాంటప్పుడు బేసిన్లు, భేషజాలు లేవని కేసీఆర్ ఎలా చెప్తారు?. వాస్తవాలు చర్చ జరుపుదాం అంటే కేసీఆర్ రావడం లేదు అని రేవంత్ మండిపడ్డారు.

పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి విరమణ అనంతరం తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(60) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విరమణ అనంతరం అనంతరం భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని అన్నారాయన. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన 'సహకార్ సంభాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అని అన్నారాయన. సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం.. హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని షా సంతోషంగా చెప్పారు. అయితే రిటైర్మెంట్ ఎప్పుడనేది మాత్రం ఆయన చెప్పలేదు. సహకార శాఖ మంత్రిగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు అమిత్ షా తొలి మంత్రిగా నియమితులయ్యారు. సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో ఈ శాఖ గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఈ శాఖ ఏర్పాటునకు ముందు వ్యవసాయ శాఖ సహకార సంఘాల కార్యకలాపాలను చూసుకునేది. అమిత్ షా రాజకీయ ప్రస్థానం.. 1980లలో RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ద్వారా సామాజిక సేవలోకి ప్రవేశించారు. 1983లో ABVP (RSS విద్యార్థి విభాగం)లో చేరారు. 1987లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. యువజన విభాగమైన బారతీయ జనతా యువ మోర్చాలో కీలక పాత్ర పోషించారు. 1997లో గుజరాత్‌లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. గుజరాత్లో 2002–2010 మధ్య హోం, న్యాయ, ట్రాన్స్పోర్ట్, జైలు, నిషేధం వంటి పలు శాఖల మంత్రిగా పనిచేశారు.నరేంద్ర మోదీతో షాకు బలమైన అనుబంధం ఉంది. గుజరాత్ రాజకీయాల్లో మోదీకి అత్యంత విశ్వసనీయుడిగా ఎదిగారు. మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదిగే దారిలో కీలక పాత్ర పోషించారు. 2014లో BJP జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన వ్యూహాలతోనే BJP అనేక రాష్ట్రాల్లో విజయం సాధించింది. 2014 & 2019 లోక్‌సభ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. యూపీలో 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలవడమూ(2014లో 71 సీట్లు) అమిత్ షా వ్యూహాత్మక నాయకత్వ ఫలితమే. 2019లో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దు, CAA వంటి కీలక నిర్ణయాల్లో కీలక భూమిక పోషించారు. 2021లో కేంద్రం కొత్తగా తెచ్చిన సహకార మంత్రిత్వ శాఖకు తొలి మంత్రిగా నియమితులయ్యారు.

మస్క్‌కు బిగ్ షాక్.. ‘ఎక్స్’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ సీఈవో పదవి నుంచి లిండా యాకరినో(Linda Yaccarino) వైదొలిగారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి ‘ఎక్స్’ (అంతకముందు ట్విటర్) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం తెలిసే ఉంటుంది. తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్‌వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈవోగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ‘ఎక్స్’ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ‘xAI’తో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది అని ఆమె పేర్కొన్నారు.After two incredible years, I’ve decided to step down as CEO of 𝕏. When @elonmusk and I first spoke of his vision for X, I knew it would be the opportunity of a lifetime to carry out the extraordinary mission of this company. I’m immensely grateful to him for entrusting me…— Linda Yaccarino (@lindayaX) July 9, 2025xAI అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది Grok(గ్రోక్) అనే చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో Grokపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్ కొత్త తదుపరి సీఈవో ఎవరనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాన్ మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా శబ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర ద్విశతకం(269 పరుగులు), సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా శతక్కొట్టాడు.తద్వారా ఓ టెస్టు మ్యాచ్లోఅత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్(430) నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో గిల్ తన ఆసాధరణ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో కూడా సత్తాచాటాలని గిల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో గిల్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.95 ఏళ్ల రికార్డుపై కన్ను..ఈ మ్యాచ్‌లో గిల్ 225 పరుగులు చేయగలిగితే.. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా వరల్డ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉంది. బ్రాడ్‌మాన్ 1930లో ఇంగ్లండ్‌పై 810 పరుగులు చేశాడు. గిల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే కేవలం రెండు మ్యాచ్‌లలోనే 585 పరుగులు సాధించాడు. లార్డ్స్‌లో బ్రాడ్‌మాన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన మ్యాచ్‌లోనైనా కచ్చితంగా గిల్ అధిగమిస్తాడు.గవాస్కర్ రికార్డుపై గురి..అదేవిధంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచే ఛాన్స్ గిల్ ముంగిట ఉంది. వెస్టిండీస్ దిగ్గజం క్లైడ్ వాల్కాట్ 1955లో ఆస్ట్రేలియాపై ఒకే సిరీస్‌లో ఐదు సెంచరీలు చేశాడు. గిల్ ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు చేయగా.. మరో రెండు చేస్తే వాల్కాట్ సరసన నిలుస్తాడు. అంతేకాకుండా టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్‌గానూ శుబ్‌మన్ నిలుస్తాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ 4 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs ENG: రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్‌గా భారత జట్టుతో ప్రాక్టీస్

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. జగన్‌తోపాటు హెచ్‌సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్‌సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది. హెచ్‌సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. అయితే హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్ఆర్ఎస్ ఆయనకు స్పష్టం చేసింది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్‌కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది.

ఒకప్పటి స్టార్ హీరో.. హెయిర్ కట్కు బ్రాండ్ అంబాసిడర్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్నపిల్లలు, టీనేజ్ యువకులు ఎవరైనా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎక్కువగా హీరోల స్టైల్స్‌నే ఫాలో అవుతుంటారు. ఆ హీరో స్టైల్లో కటింగ్ చేయమని సెలూన్ వాళ్లను అడిగి మరీ తమ అభిమాన హీరోలా తయారవుతారు. అందుకే ఏ సెలూన్ షాప్‌ల ముందైనా హీరోల హెయిర్ కట్స్తోనే పోస్టర్స్ పెడతారు. అలా ఓ హీరోను చూసి ఎంతో యూత్ అచ్చం అలానే ఉండాలని ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. ఆ హీరో ఎవరో మీకు గుర్తున్నారా? 1990ల్లో ఓ యూత్ ఫ్యాన్స్‌లో ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు. ఒకప్పుడు హెయిర్ కట్ స్టెల్‌కు బ్రాండ్‌గా మారిన ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేరేమోనని అనిపిస్తోంది. ఇంతకీ అతనెవరో తెలుసుకోవాలనుందా?అయితే ఈ స్టోరీ చదివేయండి.ఆయనే మరెవరో కాదు.. ప్రేమదేశం హీరో అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1990ల్లో పుట్టిన కుర్రాళ్లను అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అప్పట్లో ఆయన నటించిన సూపర్ హిట్ లవ్‌స్టోరీ మూవీ 'ప్రేమదేశం' చూసి అచ్చం అబ్బాస్ లాగే హెయిర్ స్టైల్ చేయించుకున్నారు యూత్ ఆడియన్స్. అతడిలా ఉండటానికి ఎంతోమంది ట్రై చేశారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వాళ్లు అసలు అబ్బాసేనా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతలా మారిపోయింది మరి ఆయన కటౌట్. తెల్లటి గడ్డం, స్టైలిష్ హెయిర్ లుక్‌లో అచ్చం అప్పటిలాగే ఉన్నప్పటికీ గుర్తుపట్టడానికి కాస్తా టైమ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటి అబ్బాస్ లవర్ బాయ్‌లా ఉంటే.. ఇప్పటి అబ్బాస్ కాస్తా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఏదేమైనా యూత్ హెయిర్ కట్కు బ్రాండ్ అంబాసిడర్ అబ్బాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు..అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్‌లోని కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిలయ్యాడు. అయితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. తెలుగులో నీ ప్రేమకై, రాజా, శ్వేతనాగు, రాజహంస, ప్రియా ఓ ప్రియా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అబ్బాస్ నటించారు.

అత్త పాపిట తిలకం దిద్ది.. !
పాత పరిచయాలు.. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేర్చడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ తరహా నేరాలపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా.. తన బార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని చితకబాది వివాహం జరిపించిన ఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రాక్షస వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం.బీహార్ సుపౌల్ జిల్లాలో దారుణం జరిగింది. తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడ్ని చితకబాది.. అతనితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. పైగా ఆ వివాహం జరిపించింది అతని మామనే కావడం గమనార్హం. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకుడు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భీంపూర్ పీఎస్ పరిధిలో జీవ్‌ఛాపూర్ వార్డు నంబర్ 8కి చెందిన 24 ఏళ్ల మిథిలేష్ కుమార్‌ను జులై 2వ తేదీన కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లారు. మిథిలేష్‌ను తన ఇంటికి తీసుకెళ్లిన మామ శివ్‌చంద్ర తన ఇంట్లో పంచాయితీ పెట్టాడు. శివచంద్రకు భార్య రీటా దేవి, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే రీటాదేవితో వివాహేతర సంబంధం ఉందని చెబుతూ మిథిలేష్‌ను చితకబాదాడు. అదే సమయంలో ..అక్కడికొచ్చిన జనాలు రాడ్లు, కర్రలతో మిథిలేష్‌ను కొట్టారు. మరికొందరు గ్రామస్తులు ఇటు రీటాను చితకబాదారు. ఆపై బలవంతంగా మిథిలేష్‌తో రీటా నుదుట సిందూరం దిద్దించి.. వివాహం జరిగినట్లు శివ్‌చంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు. ఈలోపు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా.. శివ్‌చంద్ర అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. తీవ్ర గాయాలతో మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE— ABP News (@ABPNews) July 8, 2025

పోలీసుల్లారా.. చంద్రబాబు రేపు మిమ్మల్ని మోసం చేయొచ్చు
సాక్షి,చిత్తూరు: బంగారుపాళ్యంలో ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులను ఏదో రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడ్డారాయన.‘రైతుల తలలు పగలకొడతారా? 1,200 మందిని జైల్లో పెడతారా?. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?. కూటమి ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేయొచ్చు. అప్పుడు కూడా నేనే మీ తరుఫున పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి.. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదుప్రతి పోలీసు అధికారికీ ఒకటే చెబుతున్నా. అయ్యా ప్రతి పోలీస్ సోదరుడా.. మీకు కూడా సమస్యలుంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా.. పలికేది ఒక్క జగన్ మాత్రమే. పొగాకు రైతులకు సమస్య అయినా జగనే పలుకుతున్నాడు. మామిడి రైతుల సమస్యల పైనా జగనే పలుకుతున్నాడు. మిర్చి రైతులైనా జగనే పలుకుతున్నాడు. ఉద్యోగుల సమస్యలైనా.. వాళ్లకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలన్నా, వేతనాల సవరణ (పీఆర్సీ) డిమాండ్ చేయాలన్నా, వాళ్లకు కరవు భత్యం (డీఏ) ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబునాయుడు హామీలను నిలదీస్తూ, ఆయన్ను గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ సిక్సు, సూపర్ సెవెన్లు అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టాలన్నా.. జగన్ మాత్రమే ముందుంటాడు. ప్రతి పోలీస్ సోదరుడు దీన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను.అధికారంలో ఉన్న ఆ ఎస్పీలు, డీఐజీలు, సీఐలు వీళ్ల మాటలు వినకండి. వీళ్ల ప్రలోభాలకు లొంగకండి. రేప్పొద్దున మీ సమస్యలపైనా ఇదే మాదిరిగానే చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేస్తే.. అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు వస్తాడు. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవడూ ఉండడు. అసలు సమస్యలే లేనట్లు వక్రీకరిస్తారు. డ్రామాలాడతారు. తప్పుదోవ పట్టిస్తారు. అలా సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అందరూ నష్టపోయే కార్యక్రమం కూడా జరుగుతుందని ప్రతి పోలీస్ సోదరుడికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం. గుర్తుంచుకోండి’’ అని హితబోధ చేశారాయన. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్లో మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారాయన.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా యూటర్న్!
సాక్షి,ఢిల్లీ: రాజకీయ దుమారం రేపిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (rekha gupta) అధికారిక నివాసం రెన్నోవేషన్ (Home Renovation) కాంట్రాక్ట్ పనుల్ని నిలిపివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ఢిల్లీ ప్రభుత్వానికి సమాచారం అందించింది. పునరుద్దరణ పనులను సైతం నిలిపివేసింది. ఇంటి రెన్నోవేషన్ కోసం టెండర్లకు ఆహ్వానించిన మూడు రోజుల తర్వాత పీడబ్ల్యూడీ విభాగం తాజా నిర్ణయం తీసుకుంది.సీఎంగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గంలో రెండు బంగ్లాను కేటాయించింది. వాటిల్లో బంగ్లా వన్‌లో రేఖా గుప్తా తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉండనున్నారు. బంగ్లా 2లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేఖా గుప్తా ఉండనున్న ఇంటికి అధికారులు పునరుద్ధరణ (Renovation) పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలు ఖర్చు కానుంది.అందులో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు, రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు రూ.2 లక్షలతో ఆ ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థ రూ.1.8 లక్షల విలువైన రిమోట్ కంట్రోల్‌తో కూడిన 23 సీలింగ్ ఫ్యాన్లు, రూ.85వేల విలువైన ఓటీజీ (ఓవెన్ టోస్ట్ గ్రిల్), రూ.77 వేల విలువైన ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, రూ.60 వేల విలువైన డిష్వాషర్, రూ.63 వేల విలువైన గ్యాస్ స్టవ్, రూ.32 వేల విలువైన మైక్రోవేవ్, రూ.91 వేల విలువైన ఆరు గీజర్లను ఆ ఇంట్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.6 లక్షల వ్యయంతో ఇంట్లో మొత్తం 115 లైట్లు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేసే పనుల్ని కాంట్రాక్ట్ ఇచ్చేందుకు పీడబ్ల్యూడీ విభాగం టెండర్లకు ఆహ్వానించింది.అయితే, రేఖా గుప్తా నివాసం రెన్నోవేషన్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. శిష్ మహల్ (Sheesh Mahal) అంటూ కేజ్రీవాల్ నివాసంపై విమర్శలు చేసిన బీజేపీ ఇప్పుడు అదే రీతిలో ఖర్చు చేస్తుందా?’అంటూ ఆమ్ ఆద్మీ విమర్శలు గుప్పించింది. ప్రజలు నీటి కొరత, ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఏసీలు,టీవీలు కొనుగోలు చేయడంలో మునిగిపోయిందని కాంగ్రెస్ ద్వజమెత్తింది. ఈ క్రమంలో రేఖా గుప్తా ఇంటి రెన్నోవేషన్ పనుల్ని నిలిపివేస్తున్నట్లు పీడబ్ల్యూడీ విభాగం ప్రభుత్వానికి సమాచారం అందించడం కొసమెరుపు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుంది. అనంతరం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు .ఈ నేపథ్యంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కేటాయించింది. ఆమె సొంత నియోజకవర్గానికి సమీపంలోనే నూతన బంగ్లాను కేటాయించింది. సీఎంకు 1/8, 2/8 నంబర్లతో కూడిన బంగ్లాలను కేటాయించారు.
బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ చిల్.. అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్!
మస్క్‌కు బిగ్ షాక్.. ‘ఎక్స్’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా
KPHB: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయమా?.. ఇక్కడుంది జగన్
రూల్స్ పాటించాల్సిందే.. ఈ-కామర్స్ సంస్థలకు హెచ్చరిక
క్రికెట్ టీమ్‌ను కొన్న చాహల్ గర్ల్ ఫ్రెండ్..?
హోంబలే ఫిల్మ్స్ యానిమేషన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
ఎన్విడియా.. ఎన్ని వందల లక్షల కోట్లయ్యా!!
ఆ 8 మంది ఇక లేనట్లే!
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
టెక్సాస్‌లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
డేట్ ఫిక్స్?
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ చిల్.. అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్!
మస్క్‌కు బిగ్ షాక్.. ‘ఎక్స్’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా
KPHB: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయమా?.. ఇక్కడుంది జగన్
రూల్స్ పాటించాల్సిందే.. ఈ-కామర్స్ సంస్థలకు హెచ్చరిక
క్రికెట్ టీమ్‌ను కొన్న చాహల్ గర్ల్ ఫ్రెండ్..?
హోంబలే ఫిల్మ్స్ యానిమేషన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
ఎన్విడియా.. ఎన్ని వందల లక్షల కోట్లయ్యా!!
ఆ 8 మంది ఇక లేనట్లే!
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
టెక్సాస్‌లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
డేట్ ఫిక్స్?
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
సినిమా

దీపిక, ప్రియాంక కాదు.. దీవిని కొన్న అందాల నటి తెలుసా.. అక్కడ ఏం చేస్తోందో..!
ఇంపోర్టెడ్ కార్లు, ఇంద్ర భవనాలు,నుంచి కళాఖండాలను దాటి క్రికెట్ టీమ్స్ దాకా కాదేదీ అనర్హం. తారల దర్పానికి, స్టార్ డమ్ ప్రదర్శనకి అన్నట్టుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే కార్ల ట్రెండ్ పాతబడుతూ వాటి స్థానంలో ప్రైవేట్ జెట్స్ సైతం సూపర్ స్టార్లకు అలంకారంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌కి చెందిన ఓ అందాల నటి ఏకంగా ఐలాండ్నే కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ వార్త వినగానే మన కళ్ల ముందు మెదిలే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, అలియా భట్, ఐశ్వర్యా రాయ్ వంటివారు ముందుండడం సహజమే.అయితే వీరందరూ కాకుండా.. నిజం చెప్పాలంటే విజయాల్లో వీరి సరసన నిలబడే స్థాయి లేని నటి ఐలండ్ క్వీన్‌గా మారిందనేది తెలుసుకోదగ్గ విశేషమే. ఆమె పేరు గ్లామర్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండెజ్. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి సక్సెస్ అయిన తారల్లో ఒకరు శ్రీలంకకు చెందిన జాక్వలిన్. దాదాపు పాతికేళ్ల క్రితం 2006లో మిస్ యూనివర్స్ పోటీల్లో శ్రీలంకకు సారధ్యం వహించిన ఈ బ్యూటీకి కిరీటం దక్కకపోయినా బాలీవుడ్ ఛాన్సులు దండిగానే దక్కాయి. అలా 2009 నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ అదే పనితో ఆగిపోకుండా రకరకాల వ్యాపారాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. ఇప్పటికే ముంబైలో, శ్రీలంకలో విలాసవంతమైన అపార్ట్మెంట్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు సైతం ఆమె స్వంతం. స్టార్ డమ్‌లో దిగువన ఉన్నా ఇన్ కమ్‌లో ముందున్న ఈ భామ ఆస్తులు దాదాపుగా రూ.100కోట్ల పైమాటే అని సమాచారం.ఈ నేపధ్యంలోనే ఆమె స్వదేశంలో, అంటే శ్రీలంక తీర ప్రాంతంలో ఒక ప్రైవేట్ దీవిని కూడా ఆమె కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇది బహిరంగంగా ఆమె ప్రకటించని విషయమే అయినా, తాజాగా వెలుగులోకి వచ్చింది. జాక్వలిన్ ఈ ప్రైవేట్ దీవిని కుటుంబం కోసం కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగాయో కానీ, అది పూర్తి స్థాయిలో పర్యాటకుల నుంచి దూరంగా, నిశ్శబ్దత నడుమ ఆమె తన కోసం విశ్రాంతి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమని అంటున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడం వల్ల బాలీవుడ్లో జాక్వలిన్ స్థానం, ఆమె సంపద, జీవనశైలి పై కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్లో ఇది అరుదైన విషయమే మరి. నటుల్లో స్వంత దీవిని కలిగిన నటి అనే ఘనతను జాక్వలిన్ ఒక్కరే దక్కించుకుంది.ఎక్కడ? ఎప్పుడు?శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంగా 2012లో సుమారు 4 ఎకరాల ప్రైవేట్ దీవిని సుమారుగా రూ.3కోట్లకు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ దీవి ఖరీదు చేసినప్పుడు, ‘విలాసవంతమైన విల్లా నిర్మాణం‘ ఉండొచ్చని అంచనా వేశారట, అయితే అక్కడ అలాంటి నిర్మాణం జరిగిందా లేదా అనేది స్పష్టంగా వెలుగు చూడలేదు. ఈ దీవి, మాజీ శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కరా కి చెందిన సొంత దీవి దగ్గరనే ఉందని కూడా తెలుస్తోంది.కొసమెరుపు ఏమిటంటే... ఓ నాలుగేళ్ల క్రితం ఈ జాక్వెలిన్ పై మనీ లాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా విచారణకు హాజరైంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఘోస్ట్ సినిమాలో మన కింగ్ అక్కినేని నాగార్జున సరసన తెలుగులో నటించడానికి వచ్చిన ఛాన్స్ చేజారినట్టు సమాచారం.

కుబేర క్రేజీ సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న కుబేర కలెక్షన్ల పరంగా వందకోట్లకు పైగానే రాబట్టింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్ర పోషించారు.తాజాగా ఈ చిత్రంలో క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. అనఅనగా కథ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను కరీముల్లా, హైడ్ కార్తి ఆలపించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.కుబేర కథేంటంటే..'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.

హోంబలే ఫిల్మ్స్ యానిమేషన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ Hombale Films భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థగా అవతరించింది. తాజాగా ఈ సంస్థ సమర్పణలో యానిమేషన్ మూవీని తెరకెక్కించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha) చిత్రం జూలై 25 థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సినిమాను 3డీలో ప్రేక్షకులను అలరించనుంది. ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ట్రైలర్ చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించగా.. హోంబాలే ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు.ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతూ నిర్మాతలు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్‌ను ప్రకటించారు. వారు విడుదల చేసిన క్యాలెండర్లో 2025లో 'మహావతార్ నరసింహ', ఆ తర్వాత 'మహావతార్ పరశురామ్' (2027), 'మహావతార్ రఘునందన్' (2029), 'మహావతార్ ధావకధేష్' (2031), 'మహావతార్ గోకులానంద' (2033), 'మహావతార్ కల్కి పార్ట్ 1' (2035), 'మహావతార్ కల్కి పార్ట్ 2' (2037) ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తండ్రి కాబోతున్న స్త్రీ-2 నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
హిందీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు తెలిపారు. పెళ్లయిన మూడున్నర్ర సంవత్సరాల తర్వాత శుభవార్తను ప్రకటించారు. కాగా.. బాలీవుడ్ నటి పాత్రలేఖను నవంబర్ 15, 2021న రాజ్‌కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 'బేబీ ఆన్ ది వే' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు బాలీవుడ్ దంపతులు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. రాజ్‌కుమార్ రావు గతేడాది సూపర్ హిట్ మూవీ స్త్రీ-2 చిత్రంలో నటించారు. శ్రద్ధాకపూర్ కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది బుల్ చుక్ మాఫ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా రాణించలేకపోయింది. మరోవైపు ఆయన భార్య పాత్రలేఖ గతేడాది వెల్డ్ వైల్డ్ పంజాబ్ అనే మూవీలో నటించింది. ఈ ఏడాదిలో పూలే సినిమాతో అభిమానులను అలరించింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. జగన్‌తోపాటు హెచ్‌సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్‌సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది. హెచ్‌సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. అయితే హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్ఆర్ఎస్ ఆయనకు స్పష్టం చేసింది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్‌కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది.

శ్రీలంకకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆజట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంకకు చెందిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ధ్రువీకరించాడు. మంగళవారం(జూలై 8) బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో హసరంగా తొడ కండరాల గాయం బారిన పడినట్లు తెలుస్తోంది.మ్యాచ్ అనంతరం వనిందును స్కానింగ్ తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ రానిప్పటికి.. సిరీస్ సమయానికి అతడు కోలుకునే అవకాశం లేనిట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో హసరంగా ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో 1.67 బౌలింగ్ సగటుతో 9 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ తొడకండరాల గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. ఇంతకుముందు 2023లో తన గాయానికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. దీంతో వన్డే వరల్డ్‌కప్-2023కు అతడు దూరమయ్యాడు.ఆ తర్వాత తిరిగి కోలుకుని మైదానంలో అడుగుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ అతడి గాయం తిరగబెట్టింది. ఇక బంగ్లా-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. అంతకుముందు బంగ్లాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో లంక కైవసం చేసుకుంది.బంగ్లాతో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమీక కరుణా, చమీక కరుణా ఫెర్నాండో, ఎషాన్ మలింగచదవండి: రిషబ్ పంత్ ఏమి గిల్‌క్రిస్ట్ కాదు.. దయచేసి ఇక ఆపేయండి: అశ్విన్

టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదికగా గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టు కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ బుధవారం ప్రకటించింది.స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 52 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జెర్సీలో కన్పించనున్నాడు. యువ పేసర్ జోష్ టాంగ్ స్ధానంలో ఆర్చర్‌ను తుది జట్టులోకి ఇంగ్లీష్ జట్టు మెనెజ్‌మెంట్ తీసుకుంది. రెండో టెస్టుకు ఆర్చర్ అందుబాటులోకి వచ్చినప్పటికి ఫిట్నెస్ సమస్యల కారణంగా బెంచ్‌కే పరిమితమ్యాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో టీమిండియాపై నిప్పులు చెరిగేందుకు ఈ స్పీడ్‌స్టార్ సిద్దమయ్యాడు. ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ ఒక మార్పు మినహా రెండో టెస్టులో ఆడినే జట్టును ఇంగ్లండ్ కొనసాగించింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ మరో ఛాన్స్ ఇచ్చింది.ఈ మూడో టెస్టు కోసం లార్డ్స్ క్యూరేటర్స్ పచ్చికతో కూడిన పిచ్‌ను తాయారు చేశారు. దీంతో ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు. దీంతో ఈ వికెట్‌పై భారత బ్యాటర్లకు ఆర్చర్ గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రానునుండడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పిచ్ కండీషన్స్ దృష్టా మూడో టెస్టులో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.

రిషబ్ పంత్ ఏమి గిల్‌క్రిస్ట్ కాదు.. దయచేసి ఇక ఆపేయండి: అశ్విన్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దమ్ములేపుతున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతక్కొట్టిన రిషబ్.. రెండో టెస్టులో అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు.దీంతో చాలా మంది పంత్‌ను ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌క్రిస్ట్‌తో పంత్‌ను పోల్చడం మానేయాలని అభిమానులను అశ్విన్ కోరాడు. చాలా ఆంశాల్లో ఆసీస్ దిగ్గజం కంటే పంత్ మెరుగ్గా ఉన్నాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు."రిషబ్ పంత్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతడికి ఉన్న స్పెషల్ స్కిల్స్ మరొకరు వద్ద లేవు. చాలా మంది అతన్ని ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. దయచేసి ఇక పై పంత్‌ను గిల్‌క్రిస్ట్‌తో పోల్చొద్దు. గిల్ క్రిస్ట్ కు అంత మంచి డిఫెన్స్ ఆడే టెక్నిక్ లేదు.అదే రిషబ్ పంత్‌కు డిఫెన్స్ ఆడడంలో అత్యుత్తమ స్కిల్స్ ఉన్నాయి. అయితే నేనేమి గిల్‌క్రిస్ట్‌ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వరల్డ్ క్రికెట్లో అతడికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విధ్వంసానికి మారు పేరు అతడు. గిల్లీ ఒక అద్బుతమైన వికెట్ కీపర్. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు ఎన్నో చారిత్రత్మక విజయాలు అందించాడు. అయితే రిషబ్‌కు గిల్‌క్రిస్ట్‌కు మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. అతడి ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వస్తే.. పంత్ ఐదవ స్దానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ చేసే పనులు మరో బ్యాటర్ చేయలేడు" అని తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ICC Test Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్
బిజినెస్

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.రేంజిబౌండ్ సెషన్ తర్వాత దిశా సంకేతాలు లేకపోవడంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 176.43 పాయింట్లు (0.21 శాతం) క్షీణించి 83,536.08 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.4 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 25,476.10 వద్ద ముగిశాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 1.49 శాతం, 1.4 శాతం, 1.25 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాకు చెందిన వైస్రాయ్ రీసెర్చ్ తన మాతృసంస్థ రుణభారం తగ్గించుకోవడంతో మైనింగ్ దిగ్గజం వేదాంత షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. అదేసమయంలో హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.09 శాతం క్షీణించి 11.9 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఈపీఎఫ్ వడ్డీ జమ.. ఈవారమే
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల ఖాతాల్లో పొదుపు నిధిపై.. 2024–25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ జమను ఈ వారంలోనే పూర్తి చేయనున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ‘33.56 కోట్ల సభ్యులకు సంబంధించిన 13.88 లక్షల సంస్థల వార్షిక అకౌంట్ అప్డేషన్ పూర్తయింది. జులై 8 నాటికి 13.86 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ముగిసింది. అంటే ఇప్పటికే 96.51 సభ్యుల ఖాతాలకు వడ్డీ జమైంది’ అని మంత్రి వివరించారు.గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సభ్యుల నిధిపై, అంతకుముందు ఆర్థిక సంవత్సరం మాదిరే 8.25% వడ్డీ రేటును ఇవ్వాలని ఈపీఎఫ్‌వో ఫిబ్రవరి 28న నిర్ణయించగా.. కేంద్ర ప్రభుత్వం మే 22న ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో జూన్ 6 నుంచే వార్షిక ఖాతాల అప్డేషన్ మొదలైనట్టు తెలిపారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆగస్ట్–డిసెంబర్లో వడ్డీ జమ జరిగింది.వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..స్టెప్ 1: ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ( epfindia.gov.in )సందర్శించండిస్టెప్ 2: అవర్ సర్వీసెస్ > ఫర్ ఎంప్లాయీస్ > మెంబర్ పాస్బుక్కు వెళ్లండిలేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్‌ను క్లిక్ చేయండి.స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.స్టెప్ 5: పాస్‌బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండిపాస్బుక్లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

‘ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదు’
బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కోసం ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల నుంచి ఆధార్‌ను మినహాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ భువనేష్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదని చెప్పారు. ప్రభుత్వ సర్వీసులు సులువుగా పొందేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన కుమార్ నకిలీ ఆధార్ కార్డులను తనిఖీ చేసి వాటిని గుర్తించేందుకు యూఐడీఏఐ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆధార్ కార్డులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటర్నల్ భద్రతా యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. జారీ చేసిన అన్ని కొత్త ఆధార్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉందని, యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ త్వరలో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డులోని వివరాలను క్యూఆర్ కోడ్‌లో పొందుపరిచిన వాటితో సరిపోల్చుకోవచ్చని చెప్పారు. ఎవరైనా నకిలీ ఆధార్ కార్డు చూపిస్తే దీని ద్వారా సులభంగా చెక్ చేయవచ్చని తెలిపారు.ఫొటోషాప్ లేదా ప్రింటెడ్ టెంప్లెట్లను ఉపయోగించి ప్రజలు నకిలీగా ఆధార్ కార్డులను సృష్టిస్తున్న సందర్భాలున్నాయని కుమార్ వివరించారు. కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందని వెల్లడించారు. ‘ఇప్పటికే ఈ యాప్‌కు డెమో నిర్వహించారు. ఇది పురోగతిలో ఉంది. అంతర్గతంగా దాన్ని చెక్ చేస్తున్నారు. ఈ యాప్ ప్రాథమికంగా ఆధార్ నంబర్ హోల్డర్ సమ్మతితో డిజిటల్ పద్ధతిలో ఐడెంటిటీని పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫిజికల్ కాపీలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో మాస్క్డ్ వెర్షన్ కూడా ఉంటుంది’ అన్నారు.ఇదీ చదవండి: అంతా ఫేక్.. నమ్మొద్దు!జూన్ 24న ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జులై 25 నాటికి బిహార్‌లో దాదాపు 8 కోట్ల మంది ఓటర్లలో అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన పౌరుల జాబితానే సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రం అంతటా విస్తృతంగా ఉన్న ఆధార్, ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులను గుర్తింపు రుజువుగా అంగీకరించకపోవడం వల్ల ఓటర్లు అసౌకర్యానికి గురవుతున్నారని రాష్ట్ర అసెంబ్లీలో ఆయన తెలిపారు.

అంతా ఫేక్.. నమ్మొద్దు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను త్వరలో జారీ చేయనున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని యూఏఈ ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఈ కథనాలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశాయి.లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తున్నట్లు రాయద్ గ్రూప్ తెలిపింది. దాంతో చాలా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఇవికాస్తా వైరల్‌గా మారడంతో దుబాయ్ ప్రభుత్వమే రంగంలోకి దిగి స్పష్టతనిచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఇలా వస్తున్న కథనాలను నమ్మకూడదని తేల్చి చెప్పాయి.UAE denies lifetime Golden Visa eligibility for Indians, Bangladeshis; dismisses ₹23 lakh reporthttps://t.co/FcxxTHOnpx— Hindustan Times (@htTweets) July 9, 2025ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఓఓ మనోడే..‘అన్ని గోల్డెన్ వీసా అప్లికేషన్లు అధికారిక యూఏఐ ప్రభుత్వ మార్గాలు, స్పష్టమైన విధానాల ద్వారానే ప్రాసెస్ అవ్వాలి. దరఖాస్తుదారులను నమ్మించేలా, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి లేదా నామినేట్ చేయడానికి ఏ బాహ్య కన్సల్టెన్సీకి లేదా ఏజెన్సీకి అధికారం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల ఆకాంక్షలను దుర్వినియోగం చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఖచ్చితమైన వివరాల కోసం దరఖాస్తుదారులు ఐసీపీ అధికారిక వెబ్సైట్ లేదా 600 522 222 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరింది.
ఫ్యామిలీ

'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!
ఒకప్పుడు సినిమాల్లో చాలా బాగా, బలంగా కనిపించిన డిటెక్టివ్ పాత్రలు.. ప్రస్తుతం తెరపై పెద్దగా కనిపించకపోవచ్చు.. కానీ ఆధునికుల నిజ జీవితంలో మాత్రం కీలకంగా మారాయి. వివాహ పూర్వపు దర్యాప్తుల నుంచి కార్పొరేట్ ఫ్రాడ్స్ వరకూ.. ఎన్నో రంగాల్లో వీరి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, లివిన్ మొదలు ప్రతిదానికీ వీరిపై ఆధారపడుతున్నారు కొందరు.. అయితే అలాంటి ఏజెన్సీలను ఎన్నుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆర్థిక సంస్కరణల ఫలితంగా పలు ప్రైవేటు రంగాలు పుంజుకున్నాయి. దీంతోపాటు వ్యక్తిగత గోప్యత, భద్రత, సత్వర న్యాయం కోసం స్వతంత్ర విచారణలు అవసరమయ్యాయి. అయితే అప్పటికే ముంబయి వంటి నగరాల్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక్కసారిగా డిటెక్టివ్ ఏజెన్సీలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మన నగరంలోనే దాదాపు 30కి పైగా ప్రైవేటు విచారణ సంస్థలు సేవలందిస్తున్నాయి. పెళ్లికి ముందు.. పరిశోధన.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో మోసాలు పెరిగిపోయాయి. దీంతో పాత సంబంధాల సమాచారం దాచిపెట్టడం వంటివి తెచ్చిపెట్టే సమస్యల పరిష్కారంగా డిటెక్టివ్ సేవలు బాగా అవసరం అవుతున్నాయి. కొన్ని మ్యాట్రిమోని సంస్థలు సైతం దీని కోసం డిటెక్టివ్స్‌ను ఆశ్రయిస్తున్నాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు పరస్పరం అనుమానాలతో ఈ సంస్థల సేవల్ని కోరుకుంటున్నారు. నగరంలో ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ఇలాంటి స్వతంత్ర విచారణలు కూడా ఓ కారణమేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సదరు సంస్థలు చేసిన విచారణలో లోపం కారణంగా అందిన నివేదికలతో అనేకమంది విడిపోతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. ప్రేమలు, లివిన్లలోనూ.. ఇక ప్రేమికులు కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. ‘పారీ్టలు, పిక్నిక్లు, కొలీగ్స్‌తో చనువుగా ఉండడం వంటి వన్నీ ప్రస్తుతం తప్పని అవసరం. అయితే ఇవే అనుమానాలకూ దోహదం చేస్తున్నాయి. తమ లవర్స్ మీద అనుమానాలతో మమ్మల్ని నెలకు కనీసం 25 మందైనా సంప్రదిస్తుంటారు’ అంటూ నగరంలో పేరున్న ఓ డిటెక్టివ్ సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రేమికులు కేవలం కబుర్లు, షికార్లతో కాలక్షేపం చేసే కాలం పోయి ఏకంగా లివిన్ రిలేషన్ షిప్స్‌లో ఉండడం సర్వసాధారణం అయ్యింది. ఇలాంటి ట్రెండ్ ఈ పరిస్థితికి దారి తీస్తోందని ఫ్యామిలీ కౌన్సిలర్ సుజాత అంటున్నారు.డివోర్స్‌కు ఫోర్స్.. ‘వివాహేతర సంబంధం కారణంగా విడాకులు ఇవ్వాలంటే మమ్మల్ని కలవాలి. ఆ తర్వాత విడాకులు ఇచి్చన మహిళకు ఆదాయం ఉందని భరణం ఇవ్వనక్కర్లేదని నిరూపించాల్సినప్పుడు కూడా మమ్మల్నే కలవాలి’ అంటూ చెప్పారు నగరంలోని లక్డీకాపూల్‌లో డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న ఓ మహిళ. గతంలో ఈ తరహాలో తమ భార్య/భర్తల నేరాన్వేషణ సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ ఉండేదని, అయితే ప్రస్తుతం దాదాపుగా అన్ని రకాల ఆదాయవర్గాల్లోనూ కనిపిస్తోందని అన్నారామె. కార్పొరేట్ వెరిఫికేషన్ కోసం.. కార్పొరేట్ రంగంలో అవినీతి కార్యకలాపాలను గుర్తించేందుకు కూడా డిటెక్టివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగుల నియామకాల కోసం చేసే బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ నుంచి ఉద్యోగుల వర్గీకరణ, ఇంటర్నల్ లీకులు, మేనేజ్మెంట్ లెవెల్ మోసాల నిర్ధారణకు సంస్థలు ఈ సేవలను వినియోగిస్తున్నాయి. ఎస్సెట్ ట్రేసింగ్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వంటివి వీరు చేస్తున్నారు. అంతే కాకుండా లోన్ రికవరీ/విత్‌హోల్డింగ్ కేసుల్లో ఆస్తుల వివరాల కోసం పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా జై డిటెక్టివ్ అంటున్నారు. ఈజీ..టెక్నాలజీ.. ప్రస్తుతం డిటెక్టివ్ సేవల్లో టెక్నాలజీ కీలక భూమిక పోషిస్తోంది. వాహనాల పర్యవేక్షణ, వ్యక్తుల స్థల నిర్ధారణకు ఆధునిక పరికరాల సహాయంతో ట్రాకింగ్ సులభంగా మారింది. అలాగే సర్వైలెన్స్, డేటా అనాలసిస్ మరింత ప్రభావవంతంగా మారాయి. సోషల్ మీడియా మానిటరింగ్, డిజిటల్ ట్రెయిల్స్ ఆధారంగా వివరాల సేకరణ, ప్రత్యక్ష సాక్ష్యాల కోసం సీక్రెట్ కెమెరాలు, ఆడియో రికార్డర్లు ఉపకరిస్తున్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించేందుకు డేటా అనలిటిక్స్, అనుమతి మేరకు హ్యాకింగ్, బగ్ డిటెక్షన్, మొబైల్ ట్రాకింగ్ వంటివీ చేస్తున్నారు. వ్యవస్థాపకులు వీరే.. చాలా వరకూ ఈ తరహా ఏజెన్సీల స్థాపకులు మాజీ భద్రతా విభాగాలకు చెందినవారే కావడం గమనార్హం. రిటైర్డ్ పోలీస్ అధికారులు, సైనిక లేదా నిఘా విభాగాల మాజీ ఉద్యోగులు, లాయర్లు, క్రిమినాలాజీ విద్యార్థులు ఈ సంస్థల స్థాపన, నిర్వహణల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరికి న్యాయపరమైన అవగాహన, విచారణ పద్ధతులపై ట్రైనింగ్ ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం నగరంలో షార్ప్ డిటెక్టివ్, హైదరాబాద్ డిటెక్టివ్ ప్రై లిమిటెడ్, డీడీఎస్ డిటెక్టివ్, థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్స్, పారామౌంట్, లింక్స్, యారో, రియల్ ఐ, తదితర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త..ఇలాంటి డిటెక్టివ్ ఏజెన్సీల సంస్థల్ని సేవల కోసం ఆశ్రయించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కార్పొరేట్ సంస్థలు, న్యాయవాదులు, బ్యాంకులు వంటి ఆర్గనైజ్డ్ వ్యవస్థలకు ఫర్వాలేదు కానీ.. వ్యక్తిగత అవసరాలకు సంప్రదించేటప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత రహస్యాలను సేకరించిన అనంతరం బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలూ నగరంలో లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

సీత్లా భవాని పండుగ : కాపాడే దేవత
లంబాడీ గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే పండుగే... ‘సీత్లా భవాని’ వేడుక. గిరి జన సంప్రదా యంలో లంబాడీలు చేసుకునే తొలి పండుగ కూడా ఇదే. ప్రకృతిని ఆరాధిస్తూ... పంటలను, పశు సంపదను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడు కుంటారు. ఈ పండుగ, బోనాల వేడుకలు ఒకేకాలంలో రావడం గమనార్హం. వర్షాకాలంలో రక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అటు హిందువులూ, ఇటు లంబాడీ గిరిజ నులూ తమ తమ గ్రామదేవతలకు బోనాలు ఎత్తి పూజించి మొక్కులు చెల్లించుకుంటూ ఆ వ్యాధుల బారిన పడకుండా కాపాడమని వేడుకుంటారు. సీత్లా భవాని కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలనీ; దూడలకు పాలు సరిపోనుఉండాలనీ, తమ పశువులకు గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా వాటిని కాపాడా లనీ, అటవీ సంపద తరగకూడదనీ సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ పండుగను వివిధతండాల్లో ఆ తండా ప్రజలు, పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢ మాసంలో ఏదో ఒక మంగళవారంఎంచుకొని జరుపుతారు. ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం మాత్రమే జరపడం ఆనవాయితీ.ఇదీ చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవాని సాధారణంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. దేవతను పూజించే ప్రక్రియలో తండా పెద్ద మనిషి పూజారిగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.– నరేష్ జాటోత్, నల్గొండ

వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె..!
అనూజ వైద్య మరో రికార్డు సాధించింది. పర్వతారోహకురాలైన అనూజ వైద్య ఇప్పుడు కొత్త రికార్డుల కోసం నీటి మీద దృష్టి పెట్టారు. ఇంటర్నేషనల్ వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె. గుజరాత్ రాష్ట్రం, సూరత్‌కు చెందిన అనూజవైద్య గత నెల (జూన్) 24 నుంచి 29 వరకు థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్ వాటర్ స్కీయింగ్ అండ్ వేక్ బోర్డింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. బాల్యం నుంచి అనూజ స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండేవారు. ట్రెకింగ్, స్విమ్మింగ్‌తోపాటు తండ్రి ప్రోత్సాహంతో తాపి నదిలో వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందారు. ఆమె తల్లి సొంతరాష్ట్రం ఉత్తరాఖండ్. తల్లి ప్రోత్సాహంతో అనూజ ఆమె చెల్లి అదితి ఇద్దరూ పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ పర్వతాన్ని 2019లో తొలి ప్రయత్నంలోనే అధిరోహించి ’ఎవరెస్ట్ సిస్టర్స్’ గా గుజరాత్ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. ఈ సిస్టర్స్ ఉత్తరాఖండ్‌లో ‘గెట్ సెట్ అడ్వెంచర్స్’ పేరుతో అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ స్థాపించారు. ఇదిలా ఉండగా 27 ఏళ్ల అనూజ వైద్య తాజాగా వాటర్ స్కీయింగ్ స్పోర్ట్స్‌లో భారత్ తరఫున పాల్గొన్నారు. రికార్డుల్లో శిఖరాగ్రాన్ని చేరిన అనూజ ప్రస్తుతం నీటి/మీద రికార్డుల బాట పట్టారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ క్రీడ మనదేశ మహిళల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. వీరికంటే ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని హరియాణకు చెందిన తాషి, నున్‌గ్షి మాలిక్‌లు ఎవరెస్ట్‌ను (2023)అధిరోహించారు. సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేసిన తొలి సిస్టర్స్‌గా రికార్డు సొంతం చేసుకున్నారు. అనూజ వేసిన తొలి అడుగుతో కొత్తతరం క్రీడాకారిణులు ఆ దారిలో నడుస్తారని ఆశిద్దాం. (చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..)

కూరగాయ పంటల్లో నెమటోడ్ల బాధలు, నిర్వహణ ఎలా?
టమాటోలు, మిరప తోటల్లో కొన్ని మొక్కలు వాడిపోయి, రంగుమారి ఉంటాయి. ఇతర మొక్కలు బాగున్నా ఇవి పసుపుపచ్చగా వడలినట్లు ఉంటాయి. అవి కొన్నాళ్లకు చని పోతాయి. వాటిని పీకి చూస్తే వాటి వేర్లపై బుడిపెల మాదిరిగా ఉంటాయి. అలా ఉండటానికి కారణం నెమటోడ్లు. నెమటోడ్లు అంటే? మట్టిలో ఉండే నెమటోడ్లు భయంకరమైన సూక్ష్మక్రిములు. అన్ని రకాల మట్టిలో, వివిధ పంటల వేర్లలో, కలుపులో దాగివుండి కూరగాయలు, మిరప తోటలను నాశనం చేస్తుంటాయి. వీటిని నియంత్రించటం కంటే నివారించటమెంతో సులభం. రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల ప్రయోజనం కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. అందుకని వాటి నివారణ ఎలాగో తెలుసుకోవటం అవసరం. వేరుముళ్ల నెమటోడ్లు వేర్లలోకి దూరి బుడిపెలను కలిగిస్తాయి. మొక్కల వేర్ల ద్వారా పోషకాలను పీల్చుకుంటూ జీవనం సాగిస్తాయి. దీంతో నెమటోడ్లు సోకిన మొక్కలు పోషకాలు అందక మొక్క వాడి΄ోయి, ఎండిపోయి, క్రమంగా చనిపోతుంది. నెమటోడ్లు భూమిలో ఎలా ఎదుగుతాయి? నెమటోడ్లు పలు మొక్కల వేర్లలోను, మట్టిలోను జీవిస్తాయి. వీటిని సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలం. వేర్ల పక్కనే ఆడ నెమటోడ్ వెయ్యి గుడ్ల వరకు పెడుతుంది. గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. గుడ్ల పక్కన ఉన్న వేర్ల నుంచి అనుకూల సూచనలు రాగానే గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. వేర్లను చుట్టుకుంటాయి. ఈ చిన్న పురుగులు వేర్లను పొడిచి లోపలికి చేరి, వాటిని తిని కడుపు నింపుకుంటాయి. ఈ క్రమంలో వేర్లకు బుడిపెలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇక మొక్కలకు ఈ వేర్ల ద్వారా పోషకాలు అందవు. దాంతో మొక్కలు కళతప్పి, వాడిపోయి, ఎండి చనిపోతాయి. నెమటోడ్లు అన్ని రకాల మట్టిలోనూ పెరుగుతాయి. చదవండి: Recirculating aquaculture system ఆధునికి చేపల సాగు మిరప, కూరగాయ మొక్కల నారును తెచ్చి నాట్లు వేసే ముందు వాటి వేర్లకు ఏమైనా బుడిపెలు ఉన్నాయా అని పరీక్షించాలి. బుడిపెలు ఉన్న మొక్కల్ని నాటకూడదు. మీ పొలం పరిసరాల్లో మొక్కలకు బుడిపెలు ఉన్నాయేమో చూసి, ఉంటే వాటిని నాశనం చెయ్యండి. మొక్కలు నాటడానికి భూమిని సిద్ధం చేసినప్పుడే పాతమొక్కల వేర్లు పూర్తిగా ఏరేసి, మట్టిని ఎండబెట్టాలి. పోయిన ఏడాది మొక్కలకు నెమటోడ్లు సోకిన చోటే పొలంలో తగలబెట్టే అలవాటు కొన్ని ప్రాంతాల రైతుల్లో ఉంది.నెమటోడ్లను తట్టుకునే ఉపాయాలేమిటి?నెమటోడ్లు సోకిన టొమాటో, మిరప, కూరగాయ పొలాల్లో పంట మార్పిడి చెయ్యటం మంచిది. ఉల్లి, తోటకూర, తులసి, నిమ్మగడ్డి, కర్రపెండలం, పశుగ్రాస పంటలకు నెమటోడ్లు సోకవని చెబుతున్నారు. కాబట్టి, ఈ పంటలు సాగు చేయవచ్చు. ఆరోగ్యకరమైన నారు పెంచుకోవటం. చేనులో, వాటి దరిదాపుల్లో నెమటోడ్ల మూలాన్ని గుర్తించి నాశనం చెయ్యటం మేలు. నెమటోడ్ నిరోధక శక్తి కలిగిన మొక్కలను తెచ్చి నాటుకొని పండించటం ఉత్తమం. ఇతర చేలల్లో నుంచి నెమటోడ్లతో కూడిన మట్టిని, మొక్కల్ని తేకుండా జాగ్రత్తపడటం అవసరం. నెమటోడ్లతో కూడిన మట్టి నాగళ్లు, ట్రాక్టర్లు, పరికరాలు, కూలీల పాదాలకు, వారి చెప్పులకు కూడా అంటుకొని ఒక పొలం నుంచి వేరే పొలంలోకి వ్యాపిస్తాయి. అందుకని శుభ్రం చేసుకున్న తర్వాతే వారిని పొలాల్లోకి రానివ్వాలి. నెమటోడ్ల నిరోధకత కలిగిన నారును, విత్తనాలను వాడాలి. నెమటోడ్లు సోకిన పొలంలో మొక్కలు పీకేసి, వాటి వేర్లన్నిటినీ ఏరి, కాల్చివేయాలి. మట్టిని తిరగేసి బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాతే వేరే పంట వేసుకోవాలి. ప్రవహించే నీటి ద్వారా చేనులోకి నెమటోడ్లు రాకుండా ఉండేలా చేను సరిహద్దుల్లో నిమ్మగడ్డిని కంచె పంటగా పెంచుకోవటం మేలట. ఈ విషయాలను దక్షిణ బెనిన్ రైతుల అనుభవాలను ఉటంకిస్తూ యాక్సెస్ అగ్రికల్చర్ అనే డిజిటల్ అగ్రికల్చర్ విస్తరణ సంస్థ వీడియోను విడుదల చేసింది.చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
ఫొటోలు
అంతర్జాతీయం

జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌కు ఈ మేరకు స్వయంగా లేఖలు కూడా రాశారు. ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్‌లు ఆ మేరకు పెరుగుతాయని అందులో ట్రంప్ హెచ్చరించారు! ఆ లేఖల స్క్రీన్షాట్లను ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ వాపోయారు. ‘‘ఇవి తుది టారిఫ్‌లు కావు. మీ దేశంతో మా సంబంధాలను బట్టి అంతిమంగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చు’’ అన్నారు. టారిఫ్ పెంపుపై భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నట్టు సమాచారం. మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఎద్దేవా న్యూయార్క్: ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడతానన్న ఎలాన్ మస్క్ ప్రకటనను హాస్యాస్పదంగా ట్రంప్ సోమవారం అభివర్ణించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రెండు పారీ్టలతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు మూడో పార్టీని తీసుకురావడమంటే గందరగోళాన్ని సృష్టించడమే’’ అని అన్నారు. తర్వాత తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లోనూ మస్‌్కను విమర్శిస్తూ ట్రంప్ పోస్ట్‌లు పెట్టారు. ‘‘కొన్ని వారాల క్రితం మా స్నేహ రైలుబండ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు మస్క్ పూర్తిగా పట్టాలు తప్పారు. అమెరికాలో మూడో పార్టీ ఏదీ అద్భుతాలు చేయలేదన్న చేదు నిజం తెల్సికూడా మస్క్ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. సక్రమంగా ఉన్న రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి తప్ప మూడోపార్టీ ఎందుకూ పనికిరాదు’’ అని వ్యాఖ్యానించారు.

ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం
రియో డి జనిరో: ‘‘అంతర్జాతీయ సహకారానికి, ఆదర్శ బహుళ ధ్రువ ప్రపంచానికి బ్రిక్స్ కూటమి చక్కని ఉదాహరణగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి. రానున్న రోజుల్లో ఇతర ప్రపంచ దేశాలకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసే దారిదీపం కావాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘‘బ్రిక్స్‌పై దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాటిని నెరవేర్చి నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. పాలన, అభివృద్ధి, పరస్పర సహకారం తదితరాల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుదాం’’ అని సభ్య దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో సభ్య దేశాలన్నింటితోనూ భుజం భుజం కలిపి ముందుకు సాగేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని వక్కాణించారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు ‘భిన్నత్వానికి దన్ను, ఆర్థిక వ్యవహారాలు, ఏఐ’, ‘పర్యావరణం, కాప్–30, ప్రపంచ ఆరోగ్యం’ వంటి అంశాలపై జరిగిన సెషన్లలో మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి బలం దాని భిన్నత్వంలోనే దాగుందని నొక్కిచెప్పారు. కృత్రిమ మేధకు నానాటికీ అపారంగా పెరిగిపోతున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ‘ఏఐ’ ఆందోళనలకు అలా చెక్ ‘‘విద్య నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాల్లోనూ ఏఐని భారత్ చురుగ్గా, విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఏఐపై నెలకొన్న ఆందోళనలకు సమర్థంగా చెక్ పెట్టాలంటే ఇటు పాలనకు, అటు ఇన్నొవేషన్లకు సమ ప్రాధాన్యమివ్వడమే మార్గం. బాధ్యతాయుతమైన ఏఐ మనందరి లక్ష్యం కావాలి’’ అని మోదీ సూచించారు. ఏఐ ప్రభావంపై వచ్చే ఏడాది భారత్ నిర్వహించనున్న శిఖరాగ్ర భేటీలో పాల్గొనాల్సిందిగా బ్రిక్స్ సభ్య దేశాలన్నింటినీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు వీలుగా బ్రిక్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోజిటరీ (బీఎస్ఆర్ఆర్) ఏర్పాటును ప్రతిపాదించారు. అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజాలు సరఫరాకు ఆటంకం లేకుండా చూడటంలో కూటమి కీలకపాత్ర పోషించాలని అభిలíÙంచారు. ఆ వనరులను ఏ దేశమూ స్వీయ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, ఇతర దేశాలపై ఆయుధంగా వాడకుండా చూడాలన్నారు. 18 రకాల కీలక ఖనిజ వనరులకు నిలయమైన చైనా ఇటీవల వాటి ఎగుమతులను బాగా తగ్గించడం తెలిసిందే. పరోక్షంగా దాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కీలక పాలన సంస్కరణలకు బ్రిక్స్ బాటలు పరవాలని సూచించారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. అధినేతలతో భేటీలు బ్రిక్స్ సదస్సు సందర్భంగా సోమవారం పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమితో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మలేసియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీంతో చర్చించారు. వర్తకం, పెట్టబడులు, రక్షణ, విద్య, ఆరోగ్యం, పర్యాటకం తదితరాలపై లోతైన సమీక్ష జరిపారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆల్బర్టో ఆర్స్ కాటకొరా, ఉరుగ్వే అధ్యక్షుడు యమంద్ ఒర్సీతో ద్వైపాక్షిక అంశాలను గురించి మోదీ చర్చలు జరిపారు. యోగాకు ఉరుగ్వేలో నానాటికీ ఆదరణ పెరగుతుండటంపై హర్షం వెలిబుచ్చారు. పర్యావరణ న్యాయం... మాకు పవిత్ర నైతిక విధి పర్యావరణ న్యాయం భారత్ దృష్టిలో పవిత్రమైన నైతిక విధి అని మోదీ ఉద్ఘాటించారు. పారిస్ పర్యావరణ ఒప్పంద ప్రతిజ్ఞలను గడువుకు ముందే నెరవేర్చిన తొలి దేశం భారతేనని గుర్తు చేశారు. ‘‘భూమి ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంది. ఈ విషయంలో సంపన్న దేశాలపై గురుతర బాధ్యత ఉంది’’అన్నారు. ‘‘బ్రిక్స్ సారథిగా మానవత్వం, పర్యావరణ న్యాయం తదితరాలకు భారత్ పెద్దపీట వేస్తుంది. సమర్థ కూటమిగా బ్రిక్స్పనితీరుకే సరికొత్త నిర్వచనమిస్తుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది భారత్ బ్రిక్స్ సారథ్య పగ్గాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఎలాంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందంటూ కరోనా మహమ్మారిని ప్రధాని ఉటంకించారు. ‘‘వైరస్లు వీసాలు తీసుకుని రావని కరోనా నిరూపించింది. వాటి పరిష్కారాలు కూడా పాస్‌పోర్టులను చూసి ఎంపిక చేసుకునేవి కావు’’ అంటూ చమత్కరించారు. వర్ధమాన దేశాలు ఆత్మవిశ్వాసం విషయంలో సంపన్న దేశాలకు ఏ మాత్రమూ తీసిపోవద్దని సూచించారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కి చెందిన కుటుంబం సజీవ దహనం
కుత్బుల్లాపూర్: అమెరికాలోని డాలస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతోపాటు కొడుకు సిద్ధార్థ, కూతురు మృద కాలిపోయారు. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్–గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్‌కు జీడిమెట్లకు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది.పశుపతినాథ్ కొంపల్లి ఎన్‌సీఎల్‌లో నివాసముంటున్నారు. ఉద్యోగ నిమిత్తం మూడేళ్ల క్రితం కుటుంబంతో సహా శ్రీ వెంకట్–తేజస్విని దంపతులు డాలస్‌కు వెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక అట్లాంటాలో ఉండగా, మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టగా మంటలు చెలరేగి నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరితో పాటు ప్రయాణించాల్సిన శ్రీవెంకట్ తల్లిదండ్రులు విమానంలో డాలస్‌కు వచ్చారు. తమ కొడుకు ఇంటికి రాలేదంటూ ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Indonesia: అదృశ్యమైన రైతు.. భారీ కొండచిలువ కడుపులో..
జకార్తా: ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇండోనేషియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పొలంలో అదృశ్యమైన ఒక రైతు 26 అడుగుల భారీ కొండచిలువకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్నేయ సులవేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై సౌత్ బుటన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీపీబీడీ) అత్యవసర, లాజిస్టిక్స్ విభాగం హెడ్ లావోడ్ రిసావల్ మాట్లాడుతూ ఒక రైతు శుక్రవారం ఉదయం తన తోటకు వెళ్లి తిరిగి రాలేదు. తరువాత అతనిని భారీ కొండచిలువ మింగినట్లు స్థానికులు గుర్తించారని తెలిపారు. తోటలో ఆ కొండచిలువ ఇబ్బంది పడటాన్ని చూసి, ఏదో భారీ జంతువును మింగి ఉంటుందని భావించి, దానిని చీల్చివేశారన్నారు. అప్పుడు వారు దాని కడుపులో రైతు మృతదేహాన్ని చూసి షాకయ్యారన్నారు.ఈ ప్రాంతంలో ఒక కొండచిలువ మనిషిని మింగడం ఇదే మొదటిసారని లావోడ్ రిసావల్ తెలిపారు.కాగా 2017లోనూ ఇండోనేషియాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో 23 అడుగుల కొండచిలువ ఉబ్బిపోయి కనిపించడంతో, స్థానికులు దానిని చీల్చి చూడగా, దానిలో 25 ఏళ్ల యువకుని మృతదేహం ఉంది. ఈ తరహా భారీ కొండచిలువలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో కనిపిస్తుంటాయి. ఇవి చిన్నచిన్న జంతువులపై దాడి చేస్తుంటాయి. మనుషులను మింగేందుకు అరుదుగా ప్రయత్నిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.
జాతీయం

పప్పు బాగోలేదని.. శివసేన ఎమ్మెల్యే వీరంగం
ముంబై: శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ నిర్వాహకునిపై తన ప్రతాపం చూపారు. ఈ ఘటన ముంబైలోని ఆకాశవాణి గెస్ట్ హౌస్‌లో చోటుచేసుకుంది. క్యాంటీన్లో తనకు వడ్డించిన ఆహారంలో పప్పు బాగోలేదని, అది తిన్న కొద్దిసేపటికే తనకు అనారోగ్యంగా అనిపించిందని సంజయ్ గైక్వాడ్ చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశంలో సమస్యను లేవనెత్తుతానని ఆయన అన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుల్దానా నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గైక్వాడ్, శాసనసభ్యుల కోసం ప్రభుత్వం కేటాయించిన వసతి గృహం అయిన ఆకాశవాణి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు సమాచారం. వైరల్ అయిన వీడియోలో గైక్వాడ్ షర్టు, టవల్ ధరించి క్యాంటీన్ నిర్వాహకునితో గొడవపడుతున్న దృశ్యం కనిపిస్తుంది. Meet Shah Sena’s MLA Sanjay Gaikwad. Last year he had threatened&announced 11 lakh rupees to anyone who cuts off Sh. Rahul Gandhi’s tongue. Now the man is seen beating up a poor helpless canteen worker. But wait no news TV outrage here since its a BJP ally pic.twitter.com/XVwnEzJFSU— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 9, 2025కొన్ని సెకన్ల తర్వాత ఆ ఎమ్మెల్యే క్యాంటీన్ నిర్వహకునికి ముఖంపై ఒక పిడిగుద్దు కొడతారు. దీంతో అతను కింద పడిపోతాడు. తరువాత అతను లేవగానే మళ్లీ అతని చెంపమీద ఎమ్మెల్యే కొడుతూ నా స్టైల్ ఇదే అంటూ వ్యాఖ్యానించడం వినిపిస్తుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనడం వినిపిస్తుంది. క్యాంటీన్లో ఆహార నాణ్యతపై తాను రెండుసార్లు ఫిర్యాదు చేశానని గైక్వాడ్ పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక తెగ్గోసేవారికి రూ. 11 లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌పై కూడా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

ఒక్కసారిగా కూలిపోయిన వంతెన.. ట్రక్కు, కార్లు నదిలో పడిపోయి..
గాంధీనగర్: గుజరాత్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో దానిపై నడిచే వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కొందరు ప్రయాణీకులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఆనంద్ పట్టణం, వడోదరలను కలుపుతూ మహిసాగర్ నదిపై పద్రా వద్ద గంభీర వంతెన ఉంది. బుధవారం ఉదయం గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే.. సహాయక బృందాలు అక్కడి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించారు. వాహనాల నుంచి ఇప్పటివరకు నలుగురిని రక్షించారని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. Gujarat’s Gambhira Bridge Collapse Kills Nine, Severs Key Vadodara–Anand Routehttps://t.co/aYn6KEELhi— DeepNewz (@deepnewzcom) July 9, 2025 #WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk— ANI (@ANI) July 9, 2025అయితే, వంతెన పాతబడడంతో పాటు.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025#BREAKING 2 people dead in Gujatat bridge collapse A portion of the decades-old Gambhira bridge, connecting Vadodara & Anand near Padra has collapsed over the Mahisagar river The 45yr old structure gave way while vehicles were passing over it, plunging at least four into… pic.twitter.com/VwVJXxym8p— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025

పుల్వామా దాడికి ‘ఈ-కామర్స్’ సాయం.. సంచలన వివరాలు వెల్లడి
న్యూఢిల్లీ: పుల్వామా దాడి(2019)కి పాల్పడిన ఉగ్రవాదులు ఈ-కామర్స్ ప్లాట్ఫారం ద్వారా పేలుడు పదార్థాలను సేకరించడం, తరలించడం చేశారని మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను పర్యవేక్షించే అంతర్ ప్రభుత్వ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) తెలిపింది. ఉగ్రవాద సంస్థలు ఇటీవలి కాలంలో డిజిటల్ సాధనాలను, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాలను విరివిగా వినియోగిస్తున్నాయని, నిధులను సేకరించడం, తరలించడం, నిర్వహించడం మొదలైనవాటికి ఈ-కామర్స్ ప్లాట్ఫారంలను ఉపయోగించుకుంటున్నాయని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది.2019 నాటి పుల్వామా దాడి, 2022 నాటి గోరఖ్ నాథ్ ఆలయ సంఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయని ఎఫ్ఏటీఎఫ్ పేర్కొంది. 2019 పుల్వామా దాడిలో ఈ-కామర్స్ సాయంతో పేలుడు పదార్థాలను సేకరించారని, 2022లో గోరఖ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడి ఘటనలో ఐఎస్ఎస్ నిధులు సమకూర్చడానికి ‘పేపాల్’, వీపీఎన్‌లను ఉపయోగించారని ఎఫ్ఏటీఎఫ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఫుల్వామా ఉగ్రదాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ)ల పేలుడు శక్తిని పెంచడానికి ఉపయోగించే కీలకమైన పదార్థాలను ఉగ్రవాద సంస్థలు ఈ కామర్స్ ప్లాట్ఫారం అమెజాన్ నుంచి తెప్పించుకున్నాయని తేలింది.పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్పడింది.ఈ దాడిలో లాజిస్టిక్స్ కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రత్యేక పాత్ర పోషించాయని పరిశోధకులు చెబుతున్నారు. 2022లో గోరఖ్ నాథ్ ఆలయంపై ఐఎస్ఎస్ ప్రేరేపిత వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితుడు ‘పే పాల్’ సాయంతో రూ. 6.7 లక్షలను విదేశాలకు బదిలీ చేశాడని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. అలాగే నిందితుడు తాను రహస్యంగా ఉండేందుకు వీపీఎన్ సేవలను వినియోగించుకున్నాడని పేర్కొంది.

భగ్గుమన్న బీహార్.. ఒకవైపు బంద్.. మరోవైపు ‘ఇండియా’ నిరసనలు
పట్నా: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో బీహార్ భగ్గుమంటోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణతో పాటు నూతన కార్మిక నియమావళికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు ఏకకాలంలో జరుగుతున్నాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాయి. భారత ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) రూపొందించిన ఎన్నికల జాబితాకు వ్యతిరేకంగా పట్నాలో నిరసనలు మొదలయ్యాయి. VIDEO | Bihar Bandh: Congress workers stage protest on railway tracks at Sachiwalay Halt in Patna.RJD, Congress, and other Mahagathbandhan opposition parties have called for a bandh in protest against the special intensive revision of electoral rolls in the state.(Full video… pic.twitter.com/s2Klx5nyvt— Press Trust of India (@PTI_News) July 9, 2025ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ ఈ నిరసనల్లో పాల్గొననున్నారు. లంబార్లోని ఆదాయపు పన్ను కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు జరిగే నిరసన ప్రదర్శనల్లో రాహుల్ పాల్గొననున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటారు. రాష్ట్రంలోని హాజీపూర్, సోన్‌పూర్‌లలో పోలీసుల సమక్షంలో నిరసనలు జరిగాయి. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా ఆర్జేడీ, ఇతర మహాఘటబంధన్ మిత్రపక్షాలు బీహార్‌లోని రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారులు రోడ్లపై టైర్లను కాలుస్తూ, రహదారులను దిగ్బంధనం చేస్తున్నారు. జెహానాబాద్‌లో ఆర్జేడీ విద్యార్థి విభాగం రైల్వే పట్టాలపై నిరసనలకు దిగింది.VIDEO | Bihar Bandh: Barricades installed and security heightened at the Election Commission Office in Patna in view of a protest by the opposition parties against the special intensive revision of electoral rolls in the state. RJD leader Tejashwi Yadav and Congress MP Rahul… pic.twitter.com/l24KTT9PtO— Press Trust of India (@PTI_News) July 9, 2025లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు సంయుక్తంగా బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. అలాగే ఈ ఇరువురు నేతలు నూతన కార్మిక నియమావళిని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ నిరసనలకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీహార్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎన్ఆర్ఐ

మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్‌లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో విజయగుప్తా అనే భారత సంతతి వ్యక్తి మోదీని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. తాను ప్రధాని మోదీకి హలో చెప్పేందుకే 400 కి.మీ ప్రయాణించి మరి వచ్చానని అన్నారు. ఆయనకు జస్ట్ హలో చెప్పాలనుకున్నా..కానీ నాకు మోదీకే కరచలనం(షేక్‌హ్యాండ్) ఇచ్చే అవకాశం లభించిందంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇదిలా ఉండగా మోదీ ఒక ట్వీట్లో అర్జెంటీనా పర్యటన గురించి పంచుకున్నారు. "నేను ఈరోజు అర్జెంటీనాతో సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించే ద్వైపాక్షిక పర్యటన కోసం బ్యూనస్ ఎయిర్స్లో అడుగుపెట్టాను. ప్రస్తుతం అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి చర్చలు జరిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను" అని ట్వీట్ చేశారు.అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ 57 ఏళ్లలో భారత ప్రధాని అర్జెంటీనాలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని ట్వీట్ చేశారు. కాగా, మోదీ బ్యూనస్ ఎయిర్స్‌లోని హోటల్‌కు చేరుకోగానే 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీ రామ్' అనే నినాదాలతో ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. ఆయన ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలను సందర్శించారు. ఇక ఈ అర్జెంటీనా పర్యటన తదనంతరం బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్నారు.#WATCH | Buenos Aires, Argentina: Vijay Kumar Gupta, a member of the Indian diaspora, says, "I have come here from Rosario, which is 400 kilometres from here, just to say hello to Prime Minister Narendra Modi. I got the opportunity to shake hands with him..." https://t.co/7yZBOqwXFT pic.twitter.com/jS0uoHPGUn— ANI (@ANI) July 5, 2025 (చదవండి: ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం)

ట్రంప్ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్ అలర్ట్
ట్రంప్ కలల బిల్లు.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్‌కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్‌లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్‌లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్‌తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్‌లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్ బ్యూటీఫుల్ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్‌పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్‌లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్‌టైమ్‌పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్‌టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.

ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్‌కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్‌లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.ఎవరీ కమలా పెర్సాద్..కమలా పెర్సాద్ బిస్సేసర్ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్‌పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..)

గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్‌ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్‌కు చేరుకుంది.ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్‌ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. No more vacation…🫣| #ONLYinDADE * Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025
క్రైమ్

దెయ్యం విడిపిస్తానని.. ప్రాణం తీసింది
కర్ణాటక: దెయ్యం పట్టిందని తీవ్రంగా హింసించడంతో ఓ మహిళ మరణించిన ఘటన జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని జంబరగట్టె గ్రామంలో జరిగింది. మృతురాలు గీతమ్మ (55). వివరాలు.. ఆదివారం సాయంత్రం మృతురాలు గీతమ్మ అసహజంగా ప్రవర్తించింది. ఆమె కుమారుడు సంజయ్ అదే గ్రామానికి చెందిన నిందితురాలు ఆశ (45)ను ఇంటికి పిలిపించాడు. గీతమ్మకు దెయ్యం పట్టిందని, విడిపిస్తానని ఆశా చెప్పింది. ఆశా తనకు చౌడమ్మ దేవి పూనిందంటూ గీతమ్మకు పట్టిన దెయ్యం వదిలిపో అంటూ చర్నాకోలు తీసుకుని కొట్టడం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేజంబర ఘట్టె చౌడమ్మ గుడి వరకు ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లింది. అయినా దెయ్యం వదిలిపోలేదంటూ తెల్లవారుజామున 2.30 గంటల వరకు చితకబాదుతూనే ఉంది. దాడితో తీవ్రంగా అస్వస్థురాలైన గీతమ్మ కుప్పకూలింది. దయ్యం వదలడం ఏమో గానీ ఆమె ప్రాణం వదిలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయిందనుకున్న ఆశ.. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది. కళ్లు తెరవకపోవడంతో కొడుకు గీతమ్మను హొళెహొన్నూరులోని సముదాయ ఆస్పత్రికి తరలించగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. గీతమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా గీతమ్మపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆశను అరెస్టు చేశారు.

ఆరుగురిపై న్యూసెన్స్ కేసు నమోదు
కుత్బుల్లాపూర్: ప్రధాన చౌరస్తాల వద్ద భిక్షాటన చేసే వారితో పాటు హిజ్రాల ఆగడాలపై వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. పేట్షిరాబాద్ సీఐ విజయవర్ధన్ సుచిత్ర చౌరస్తాలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు భిక్షాటన చేస్తూ వాహనదారులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని గుర్తించి సుమారు ఆరుగురిని అదుపులో తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూసెన్స్ కేసు కింద ఫైన్ వేశారు. ఇక మీదట రోడ్లపై అడుక్కోరాదని తేల్చి చెప్పారు.

జీవితంపై విరక్తితో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు..!
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడిగినేని చైతన్య (35) సాఫ్ట్వేర్ ఉద్యోగి. గత ఏప్రిల్ 23న నాగ మౌనికతో వివాహమైంది. ఈ దంపతులు కేపీహెచ్‌బీ, 7వ ఫేజ్‌లోని ఎల్ఐజీ–43లో నివాసం ఉంటున్నారు. ఆషాఢ మాసం నేపథ్యంలో జూన్ 21న నాగ మౌనిక పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ప్రతిరోజూ ఆమె ఫోన్లో భర్తతో మాట్లాడుతూ ఉండేది. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్లో అతనితో మాట్లాడింది. అప్పటికే తన భర్త దిగులుగా మాట్లాడటంతో కొద్ది సేపటి తర్వాత ఫోన్ కట్ అయింది. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో చైతన్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు. పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవంతో వెంటనే తన మామకి సమాచారం అందించింది. వెంటనే కింది అంతస్తులోకి వెళ్లి చైతన్యను పిలవగా ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చైతన్య సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే విషయాన్ని మౌనికకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన భర్త జీవితం పట్ల విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్‌బీ పోలీసులు చెప్పారు.

మాజీ మంత్రి ప్రసన్నకుమార్ హత్యకు పక్కా స్కెచ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ మూకలు బరి తెగించాయి. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నెల్లూరు నగరం నడిబొడ్డున గల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి సోమవారం రాత్రి మారణాయుధాలతో టీడీపీ మూకలు, రౌడీలు, పాత నేరస్తులు అక్రమంగా ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రసన్నకుమార్‌రెడ్డిని చంపేస్తామని కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు దాడి ఎంత భయంకరంగా జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ మూకలు, రౌడీలు ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసరచనకు పాల్పడ్డారు. అంతా కుట్ర ప్రకారమే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి సమీపంలోపి బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ జరుగుతోంది. జనసందోహం భారీగా ఉండటంతో ఆ సమయంలో తాము ఏం చేసినా ఎవరూ గుర్తు పట్టే అవకాశం ఉండదని భావించిన టీడీపీ గూండాలు వాహనాల్లో పెద్దఎత్తున సుజాతమ్మ కాలనీకి చేరుకున్నారు. వాహనాలను దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లో లేరనే విషయం తెలిసి బీభత్సం సృష్టించారు. తొలుత దుండగులు ఇంటి ప్రధాన ద్వారంతోపాటు వెనుక వైపు ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించారు. కొందరు ఇంట్లోకి ప్రవేశించగా.. మిగిలిన వారు ఇంట్లోని వారిని బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.దీనిని బట్టి చూస్తే ప్రసన్నకుమార్‌రెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది. దాడి ఘటనపై ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం అర్ధరాత్రి అనుమానితుల పేర్లు ఉటంకిస్తూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లు కూడా పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. పోలీసులొచ్చినా బెదరని మూకలు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న దర్గామిట్ట పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు పదుల సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిబయట ఉన్న దుండగులు పరుగులు తీయగా.. ఇంట్లో విధ్వంసం చేస్తున్న రౌడీమూకలు ఏ మాత్రం బెదరలేదు. దాడి పూర్తయ్యాక తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నా.. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. దాడిని ఆపేందుకు అవకాశం ఉన్నా ఆ పని కూడా చేయలేదు. పోలీసులు అక్కడే ఉన్నా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాల మేరకే దాడి పూర్తయ్యే వరకూ కిమ్మనకుండా ఉండిపోయారు. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు మరో కుట్ర దాడి ఘటనను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఆయన ఇంటిపై మహిళలు దాడి చేశారని, అభిమానులు దాడులు చేశారని, వారే దాడి చేసుకుని ఉండొచ్చనే ప్రచారానికి టీడీపీ నేతలు తెరతీశారు. తద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. అసలు వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు కొందరు దాడి దృశ్యాలను వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం తమకేమీ తెలియదన్నట్టు, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై అసలు దాడే జరగలేదు అన్నట్టు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ప్రసన్నకుమార్ హత్యకు టీడీపీ భారీ కుట్రటీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు మాజీ మంత్రి అనిల్కుమార్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ రౌడీమూకలు భారీ కుట్ర పన్ని మారణాయుధాలతో ఆయన ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డారని మాజీ మంత్రి కె.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో రెచ్చిపోయిన టీడీపీ మూకలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టించారన్నారు. సోమవారం రాత్రి ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడిపై ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీమంత్రులు అనిల్, ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత వీరి చలపతిరావు ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో పచ్చమూకలు దారుణ ఘటనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నల్లపరెడ్డి కుటుంబంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ మూకలు వెళ్లిన సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి షాక్‌కు గురయ్యారని.. ఆమెకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దాడికి పాల్పడిన వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరు పంపించారో అందరికీ తెలుసన్నారు. ప్రనన్నకుమార్ ద్వారా ఇంకేమి నిజాలు బయటకు వస్తాయోనని భయపడి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. డబ్బుందన్న మదంతో డాన్లు కావాలని ఇలాంటి ఆగడాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు పక్కనే ఉన్నా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.నిజమే చెప్పాను.. వెనక్కి తగ్గను: ప్రసన్నకుమార్‌రెడ్డి మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అంతా నిజమే చెప్పానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏడాది కాలంలో ఇప్పటివరకు ఆమె చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఆమె తనపై వ్యక్తిగత విమర్శ చేయడంతోనే నిజాన్ని ప్రజల ముందుంచానని చెప్పారు. మహిళలంటే తమకెంతో గౌరవం ఉందని, ఆమె తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే తాను ఆమె గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పానన్నారు. గంజాయి మత్తులో దాడి చేసిన వారిని, ఈ దాడులకు పురిగొల్పిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేశారు.