breaking news
-
చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన 'అనిల్ రావిపూడి'
'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా హిట్ కావడంతో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండురోజుల్లోనే రూ. 120 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే, సినిమాకు పెద్ద బడ్జెట్ కాకపోయినప్పటికీ చిరంజీవి, నయనతార, వెంకటేశ్ వంటి స్టార్స్ ఉండటంతో వారి రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుందని టాక్.. ఈ మూవీకి నిర్మాతలుగా సాహు గారపాటితో పాటు చిరు కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు. దీంతో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనే ప్రశ్న ఎక్కువమందిలో కలుగుతుంది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాకు గాను తను రెమ్యేనరేషన్ మాత్రమే తీసుకున్నానని అనిల్ రావిపూడి అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను షేర్ ఏమీ తీసుకోవడం లేదన్నారు. చిరంజీవి కూడా సినిమా బడ్జెట్‌ను బట్టి తన పారితోషికం తీసుకున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో నయనతార, వెంకటేశ్ వంటి ఇద్దరు స్టార్స్ ఉన్నారు.. ఆపై ఆయన కూతురు నిర్మాత కాబట్టి ఆమెకు కూడా కాస్త నాలుగు రూపాయలు మిగలాలి కదా అనే దృష్టిలో చిరు ఉన్నారని తెలిపారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని అనిల్ రావిపూడి చెప్పారు.ఎవరికి ఎంత రెమ్యునరేషన్..?చిరంజీవి ప్రతి సినిమాకు రూ. 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ వుంది. అయితే, తన కూతురు నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఇందులో తన పారితోషికాన్ని కాస్త తగ్గించారని సమాచారం. ఇందులో శశిరేఖగా నయనతార ప్రేక్షకులను మెప్పించింది. ఈ పాత్ర కోసం ఆమె ముందుగా రూ. 15 కోట్లు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఫైనల్‌గా రూ. 6 కోట్ల రెమ్యునరేషన్‌తో ఢీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రూ. 9 కోట్లు, అనిల్ రావిపూడి రూ. 25 కోట్లు తమ రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
'ప్రభాస్'ను ఒంటరిని చేశారా..? వాళ్లందరూ ఎస్కేప్
ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'ది రాజా సాబ్'.. జనవరి 9న అందరికంటే ముందే సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే, సినిమాలో కొన్ని సీన్స్ తొలగించి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సన్నివేశాలు ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ కూడా అన్నారు. దీంతో మారుతి వెంటనే సరిచేసి రెండోరోజే రీవర్షన్ చేశారు. దీంతో సినిమాపై మళ్లీ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇంతలో పండగ సినిమాలన్ని వరుసగా వస్తున్నాయి. దీంతో రాజాసాబ్ కొన్ని స్క్రీన్స్ కోల్పోతూ వచ్చింది. అయితే, అడ్వాంటేజ్ ఉన్నప్పుడు సినిమాకు ప్రమోషన్ కరువైంది. సినిమా విడుదల ముందురోజు వరకు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ, పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ లేకపోవడంతో కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. సినిమాకు ఎటూ పాజిటీవ్ వస్తుంది కాబట్టి.. కనీసం ఈ వీకెండ్ వరకు అయినా కాస్త ప్రమోషన్స్ జోష్ పెంచితే బెటర్ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.ప్రభాస్ దర్శకుల స్పందన కరువురాజా సాబ్ రిలీజ్ తర్వాత కేవలం ఓ ప్రెస్ మీట్ పెట్టి చిత్ర యూనిట్ మమ అనిపించింది. ఆ తర్వాత కేవలం సోషల్‌మీడియాకే పరిమితం అయ్యారు. ప్రభాస్ అందుబాటులో లేడు కాబట్టి కనీసం తన పాత దర్శకులతో వీడియో బైట్స్, కామెంట్స్ అయినా చేపించుకోలేకపోయారు. పాన్ ఇండియా రేంజ్లో పేరున్న దర్శకులు రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, సుజీత్ వంటి వారందరికి ప్రభాస్‌తో మంచి స్నేహమే ఉంది. వాళ్లతో కలిసి ఆయన పనిచేశారు కూడా.. కానీ, వాళ్లు కూడా రాజా సాబ్ గురించి ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపారు. రాజా సాబ్ సినిమాను రీకట్ చేసిన తర్వాత చాలా బాగుందని టాక్ వస్తుంది. కామన్ ఆడియన్స్ కూడా ఇదే మాట అంటున్నారు. కానీ, సరైన ప్రమోషన్‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరూ సినిమా గురించి మాట్లాడకపోవడం కాస్త డ్యామేజ్‌ను పెంచాయని ఎక్కువగా వినిపిస్తుంది.ఎస్కేఎన్.. ఎస్కేప్రాజా సాబ్ విడుదలకు నిర్మాత ఎస్కేఎన్ భారీ డైలాగ్స్ పేల్చాడు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తనదైన స్టైల్లో పండగ..పండగ..రాజాసాబ్ పండగ అంటూ హైప్ పెంచాడు. అంతటితో ఆయన ఆగలేదు తన చొక్కా చించి మరీ రాజాసాబ్ పోస్టర్‌ను ఫ్యాన్స్‌కు చూపించి తన భక్తిని చూపించాడు. సినిమా విడుదల తర్వాత కనీసం ఆయన కూడా రాజాసాబ్‌కు దూరంగానే ఉన్నాడు. అయితే, సంగీత దర్శకులు తమన్ గతంలో రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పుడు మూవీ ప్రమోషన్‌కు ఎవరూ రాలేదు. అప్పుడు స్వయంగా తమన్ రంగంలోకి దిగాడు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెబుతూ కాస్త ప్రమోషన్ చేశాడు. ఇప్పుడు కనీసం తమన్‌ను మరోసారి రంగంలోకి దింపినా బాగుండు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్ వరకు అయినా సరే మారుతి, తమన్, ఎస్కేఎన్‌లతో పాటు ముగ్గురు హీరోయిన్లను రంగంలోకి దింపి ప్రమోషన్స్ చేస్తే కాస్త కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాజా సాబ్ రూ. 220 కోట్లకు దగ్గరలో ఉన్నాడు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 93 పరుగులతో సత్తాచాటిన కోహ్లి.. రెండో వన్డేలో మాత్రం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు.29 బంతుల్లో 23 పరుగులు చేసి క్లార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికి ఓ అరుదైన రికార్డు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కింగ్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లి ఇప్పటివరకు కివీస్‌పై వన్డేల్లో 1770 పరుగులుచ చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1750)ను కోహ్లి అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్ధానంలో నిలిచాడు.అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(1,971) కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో కోహ్లి కూడా పలు అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతవేగంగా 28,000 పరుగులు మైలు రాయిని అందుకున్న ప్లేయర్‌గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఇంటర్ననేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027 లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.చదవండి: రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి -
కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్.. అధికారిక ప్రకటన
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్ తలపడనుంది.ఈ సమయంలో జాతీయ విధులు లేకపోవడంతో సిరాజ్ రంజీల్లో ఆడనున్నాడు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతడికి జట్టు పగ్గాలను అప్పగించారు. సిరాజ్ డిప్యూటీగా రాహుల్ సింగ్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు వంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కింది. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్‌రావ్ పేరాల కూడా ఉన్నాడు.హైదరాబాద్ జట్టుమహ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు,కె హిమతేజ, వరుణ్ గౌడ్,ఎం అభిరత్ రెడ్డి, రాహుల్ రాధేష్, అమన్ రావ్, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్, నితీశ్ రెడ్డి, సాయి ప్రగ్నయ్ రెడ్డి,బి పున్నయ్యచదవండి: IND vs NZ: వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో -
..రండి బాబు రండి.. ఒక్క టికెట్ కొనండి.. సంపద పొందండి!!
..రండి బాబు రండి.. ఒక్క టికెట్ కొనండి.. సంపద పొందండి!! -
అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారు
మేము ముగ్గురు సోదరులం. మా తండ్రి పేరు మీద 7.36 ఎకరాల భూమిని మూడు బాగాలుగా చేసుకుని 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. నాకు తెలియకుండా నాకు రావాల్సిన భూమిని నా సోదరులు నర్సిరెడ్డి, యాదగిరిరెడ్డి వారి పేరు మీదకు మార్చుకున్నారు. నాకు 75 సంవత్సరాలు, నడవలేను. ఇద్దరు కూతుళ్లు, పెద్ద కూతురు అంధురాలు, రెండో కూతురికి 23 ఏళ్ల క్రితం వివాహమైంది. నా భార్య కూడా వృద్ధురాలు. నా అంధురాలైన కూతురితో కలిసి వ్యవసాయం చేయించుకుంటున్నా. అధికారులు విచారణ చేసి మాకు న్యాయం చేయాలి. – పబ్బతిరెడ్డి లక్ష్మారెడ్డి, అప్పాజిపేట(మిర్లోనిగూడెం), నల్లగొండ మండలం -
భోగి మంటలు
భోగి మంటలు -
రికార్డు మీద రికార్డు.. రెండు రోజుల్లో రూ.21000 జంప్
గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్‌చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది. అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
సినిమా చూడలేకపోయా.. ఏడ్చేశా : ‘ది రాజాసాబ్’ డైరెక్టర్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 201 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌కి నైజాంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్‌షోకి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా అనుమతి లభించింది. అర్థరాత్రి వరకు జీవీ రాకపోవడంతో..నైజాం ఏరియాలో ప్రీమియర్స్ పడలేదు. మీడియా కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా.. విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. గేట్లు బద్దలుకొట్టుకొని మరీ థియేటర్లోకి చొరబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి.. అందరిని బయటకు పంచింపిన తర్వాత అర్థరాత్రి 12.45 గంటలకు మీడియాకు షో వేశారు. ఈ విషయం తెలిసి చాలా టెన్షన్ పడ్డారట సినిమా దర్శకుడు మారుతి. ఒకవైపు ప్రీమియర్స్ షోకి అనుమతి రాకపోవడం, మరోవైపు మీడియా షో ఆలస్యం అవ్వడంతో టెన్షన్ భరించలేక కారులో కూర్చొని ఏడ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే మీడియాతో చెప్పారు. రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మారుతి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ కెరీర్లోనే అతి పెద్ద సినిమా ది రాజాసాబ్ రిలీజ్ రోజు ఎలా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన మారుతి సమాధానం చెబుతూ.. ‘నా తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ రిలీజ్ రోజు చాలా ఏడ్చేశా. అప్పుడు నాకు ఎదురైన సవాళ్లను చూసి..ఇకపై ఇండస్ట్రీ వైపే రావొద్దనుకున్నా. అలాగే ది రాజాసాబ్ రిలీజ్ రోజు కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఒకవైపు నైజాంలో ప్రీమియర్ షోకి అనుమతి రాలేదు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షోకి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారనే విషయం తెలిసింది. మీడియా వాళ్లు అర్థరాత్రి వరకు వేచి చూశారనే విషయం తెలిసి బాధపడ్డాను. టెన్షన్ తట్టుకోలేక కారులో కూర్చొని ఏడ్చేశా. ఫ్యాన్స్‌కి ప్రీమియర్ షో వేయలేకపోయామనే బాధతో నేను కూడా సినిమా చూడకుండానే వెళ్లిపోయాను’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
లాయర్‌తో వివాహేతర సంబంధం! భర్తను సర్వం దోచేసి..
గుంటూరు రూరల్: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తోందనే మానసిక వేదనకు గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ తెలిపిన, మృతుడు వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం మేరకు.. ఏటీ అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మొదటి భార్య మృత్యువాతకు గురవ్వటంతో అడవితక్కెళ్లపాడు టిడ్కో హౌస్‌లలో నివాసం ఉండే వెంకటరమణను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కుమార్తె లాయర్ డిగ్రీ పూర్తి చేసుకుని వేముల బాలాజీ అనే వ్యక్తి వద్ద ప్రాక్టీస్‌కు చేరింది. కుమార్తె ప్రాక్టీస్‌కు వెళుతున్న సమయంలో ఆమెకు తోడుగా వెళ్లే వెంకటరమణ, బాలాజీ లాయర్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై వెంకటేశ్వర్లు, వెంకటరమణల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి. వివాదాల నేపథ్యంలో వెంకటరమణ, లాయర్ బాలాజీలు ఇరువురు తనపై గతంలో తొమ్మిదికి పైగా అక్రమ కేసులు బనాయించి, తనను జైలుకు కూడా పంపారని వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు చేసిన వీడియో ద్వారా తెలిపాడు. తనపై కేసులు మోపటంతోపాటు తన అన్నదమ్ములు, మొదటి భార్య బిడ్డలపై కూడా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. లాయర్ బాలాజీ అండతో తనను తన భార్య చిత్రహింసలకు గురిచేస్తోందని, తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇంటిని కొనుక్కున్నానని, అయితే అందులోకి కూడా తనను వెళ్లకుండా చేసి ఆ ఇంటిని లాయర్, తన భార్య గెస్ట్ హౌస్‌గా వాడుకుంటున్నారని వీడియో ద్వారా వాపోయాడు. గతంలో తనపై పెట్టిన కేసుల్లో జైలు నుంచి వచ్చాక రాజీ కోసం ప్రయత్నించి తన సొంత ఇంటిని అమ్మి డబ్బులు కూడా తన భార్య వెంకటరమణకు ఇవ్వడం జరిగిందని తెలిపాడు. అనంతరం మళ్లీ తనకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు ఇస్తే డైవోర్స్ ఇస్తాను, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని ఆ లాయర్, తన భార్య వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు కారణం లాయర్ బాలాజీ, భార్య వెంకటరమణలే కారణమని పేపర్‌పై రాసి, వీడియోద్వారా తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనకు కారణమైన వెంకటరమణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. లాయర్ బాలాజీ పరారీలో ఉన్నాడని అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
